al-Qaeda
-
ఐసిస్ ఉగ్రభూతం మళ్లీ విజృంభిస్తుందా?
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) ఉగ్రసంస్థ మొదట్నుంచీ సిరియా కేంద్రంగానే తన ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తోంది. బషర్ అల్ అసద్ నియంత పాలనలో ఇన్నాళ్లూ ఉక్కుపిడికిలి కింద నలిగిపోయి కటిక పేదరికంలో మగ్గిపోయిన సిరియన్లు ఇకనైనా మంచి రోజులు వస్తాయని సంబరపడుతున్నారు. అయితే ఈ ఆనందక్షణాలు కలకాలం అలాగే నిలిచి ఉంటాయో లేదోనన్న భయాలు అప్పుడే కమ్ముకుంటున్నాయి.అసద్ పాలన అంతమయ్యాక పాలనాపగ్గాలు అబూ మొహమ్మద్ అల్ జొలానీ చేతుల్లోకి వెళ్తున్నాయి. ఈయన దేశాన్ని కర్కశపాలన నుంచి విముక్తి ప్రసాదించిన నేతగా ప్రస్తుతానికి స్థానికులు కీర్తిస్తున్నా ఆయన చరిత్రలో చీకటికోణాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే జొలానీ మూలాలు అల్‌ఖైదా ఉగ్రసంస్థలో ఉన్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థతో మంచి దోస్తీ చేసి తర్వాత తెగదెంపులు చేసుకున్నా.. ఇప్పుడు మళ్లీ పాత మిత్రులకు ఆహ్వానం పలికితే సిరియాలో ఐసిస్ ఉగ్రభూతం మళ్లీ జడలు విప్పుకుని కరాళ నృత్యం చేయడం ఖాయమని అంతర్జాతీయ యుద్ధ, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జొలానీతో సుస్థిరత పాలన సాధ్యమా?ఉగ్రమూలాలున్న వ్యక్తికి యావత్‌దేశాన్ని పాలించేంత శక్తియుక్తులు ఉన్నాయా? అనే సందేహాలు అందరికీ వస్తున్నాయి. 2011లో వెల్లువలా విస్తరించిన అరబ్ ఇస్లామిక్ విప్లవం ధాటికి ఈజిప్ట్, లిబియా, టునీషియా, యెమెన్లలో ప్రభుత్వాలు కూలిపోయాయి. దేశ మత, విదేశాంగ విధానాలు మారిపోయాయి. ఇప్పుడు హయత్ తహ్రీర్ అల్ షామ్(హెచ్‌టీఎస్) చీఫ్ హోదాలో జొలానీ సిరియాలోని తిరుగుబాటుదారులు, వేర్వేరు రెబెల్స్ గ్రూప్‌లను ఏకతాటి మీదకు తేగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అల్‌ఖైదాతో గతంలో సత్సంబంధాలు ఉన్న హెచ్‌టీఎస్‌ను అమెరికా, ఐక్యరాజ్యసమితి గతంలోనే ఉగ్రసంస్థగా ప్రకటించాయి.ఉగ్రసంస్థగా ముద్రపడిన సంస్థ.. ఐసిస్‌ను నిలువరించగలదా అన్న మీమాంస మొదలైంది. రాజకీయ శూన్యతను తమకు అనువుగా మార్చుకుని ఐసిస్ మళ్లీ చాపకింద నీరులా విస్తరించే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. 2019 నుంచి అమెరికా ఇచ్చిన సైనిక, ఆర్థిక సహకారంతో సిరియాలో పెద్దగా విస్తరించకుండా ఐసిస్‌ను బషర్ అసద్ కట్టడిచేయగలిగారు. సిరియా సామాజిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన అంతర్యుద్ధానికి తెరపడిన నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని మొహమ్మెద్ ఘాజీ జలానీ.. హెచ్‌టీఎస్ చీఫ్ జొలానీతో అధికార మార్పిడికి పూర్తి సుముఖత వ్యక్తంచేశారు.అయితే అధికారం చేతికొచ్చాక రెబెల్స్‌లో ఐక్యత లోపిస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని అంతా భయపడుతున్నారు. దేశం మొత్తమ్మీద జొలానీ పట్టుసాధించని పక్షంలో ఇన్నాళ్లూ దూరం దూరంగా చిన్న చిన్న ప్రాంతాలకు పరిమితమైన ఐసిస్ అత్యంత వేగంగా విస్తరించే సామర్థ్యాన్ని సముపార్జించగలదు. అసద్ పాలన అంతం తర్వాత ఆరంభమైన ఈ కొత్త శకం అత్యంత రిస్క్‌తో, ఏమౌతుందో తెలియని గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యలు చూస్తుంటే క్షేత్రస్తాయిలో పరిస్థితి ఎంతటి డోలాయమానంగా ఉందో ఇట్టే అర్ధమవుతుంది. ఐసిస్ ప్రభావమెంత?బషర్ అసద్ కాలంలోనూ ఆయనకు వాయవ్య సిరియాపై పట్టులేదు. అక్కడ ఐసిస్ ప్రభావం ఎక్కువ. ఈ వాయవ్య ప్రాంతంలో 900కుపైగా అమెరికా సైనికులు ఉన్నా సరిపోవడం లేదు. ఈ జనవరి–జూన్కాలంలో ఇరాక్, సిరియాల్లో ఐసిస్ 153 దాడులు చేసిందని అమెరికా సెంట్రల్ కమాండ్ గణాంకాల్లో వెల్లడైంది. ఐసిస్‌ను అంతమొందించేందుకు అమెరికా తరచూ గగనతల దాడులు చేస్తోంది. ఐసిస్ ఉగ్రవాదులు, సానుభూతిపరులు, స్థావరాలే లక్ష్యంగా ఇటీవలే 75 చోట్ల దాడులుచేసింది. కొన్ని ప్రాంతాలను తుర్కియే దన్నుతో ‘సిరియన్ నేషనల్ ఆర్మీ’ పాలిస్తోంది. అమెరికా నుంచి సాయం పొందుతున్న కుర్ద్‌ల బలగాలు కొన్నిచోట్ల పాలిస్తున్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థ కొంత ప్రాంతాన్ని ఏలుతోంది. హెచ్‌టీ ఎస్ తిరుగుబా టుదారులు, విపక్షాల ఫైటర్లు ఇంకొన్ని ప్రాంతాలను తమ అధీనంలో ఉంచుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ఐసిస్ను ఎలా కట్టడిచేశారు?హెచ్‌టీఎస్ గ్రూప్‌కు మొదట్నుంచీ అల్‌ఖైదాతో సంబంధాలున్నాయి. అయితే 2016లో అల్‌ఖైదాతో హెచ్‌టీఎస్ తెగదెంపులు చేసుకుంది. అయితే 2011 నుంచే సిరియాలో ఐసిస్ విస్తరిస్తోంది. మాస్కులు ధరించిన ఐసిస్ ఉగ్రవాదులు అమాయక బందీలను తల నరికి చంపేసిన వీడియోలు అంతర్జాతీయ మీడియాలో ప్రత్యక్షమయ్యాక ఐసిస్ ఎంత నిర్దయగల సంస్థో ప్రపంచానికి తెలిసివచ్చింది. 2014 నుంచే సిరియాలో ఐసిస్‌ను అంతం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో 2016లో అమెరికా కొంతమేర సఫలీకృతమైంది.కుర్ద్, తుర్కియే బలగాలకు ఆయుధ సాయం అందించి మరింత విస్తరించకుండా అమెరికా వాయవ్య సిరియాకు మాత్రమే ఐసిస్‌ను పరిమితం చేయగలిగింది. 2018లో ఐసిస్ పని అయిపోయిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ 2019లో మళ్లీ దాడులతో ఐసిస్ తనలో చావ చచ్చిపోలేదని నిరూపించుకుంది. అయితే ఐసిస్ ప్రభావం కొనసాగినంతకాలం అంతర్యుద్ధం తప్పదని మేధోసంస్థ గల్ఫ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అబ్దుల్అజీజ్ అల్ సగేర్ వ్యాఖ్యానించారు. 2003లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పతనం, లిబియా నియంత గఢాఫీ 2011లో అంతం తర్వాత ఆయా దేశాల్లో పౌరయుద్ధాలు మొదలయ్యా యని ఆయన ఉదహరించారు.ఐసిస్‌ను నిలువరించే సత్తా జొలానీకి ఉందా?హెచ్‌టీఎస్ వంటి తిరుగుబాటు సంస్థకు నేతృత్వం వహించినా జొలానీ ఏనాడూ హింసాత్మక ఘటనల్లో ప్రత్యక్ష పాత్ర ఉన్నట్లు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. విప్లవయోధుడు చెగువేరా తరహాలో తానూ సిరియా విముక్తి కోసం పోరాడుతున్న ఆధునిక తరం యోధునిగా తన వేషభాషల్లో వ్యక్తంచేసేవారు. అతివాద సంస్థకు నేతృత్వం వహిస్తూనే ఉదారవాద నేతగా కనిపించే ప్రయత్నంచేశారు. ఐసిస్ వంటి ముష్కరమూకతో పోరాడాలంటే మెతక వైఖరి పనికిరాదని విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘ ఐసిస్ అధీనంలోని వాయవ్య సిరియాలో ఎవరైనా తమను విమర్శిస్తే వారిని చిత్రహింసలకు గురిచేయడం, జైళ్లో పడేయడం, చంపేయడం అక్కడ మామూలు.ఈ దారుణాలను సిరియా పగ్గాలు చేపట్టాక జొలానీ నిలువరించగలగాలి’’ అని న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సోఫాన్ గ్రూప్ ఉగ్రవ్యతిరేక వ్యవహారాల నిపుణుడు కోలిన్ అన్నారు. ‘‘ అసద్‌ను గద్దె దింపేందుకు అమెరికా బిలియన్ల డాలర్లను ఖర్చుచేసింది. ఇప్పుడు కొత్త ఆశలు చిగురించినా ఐసిస్ నుంచి సవాళ్లు ఉన్నాయి’’ అని ట్రంప్ అన్నారు. జొలానీ పాలనాదక్షత, అంతర్జాతీయ సమాజం నుంచి ఆర్థిక, ఆయుధ అండదండలు అందితే, వాటిని సద్వినియోగం చేసుకుంటే సిరియాలో మళ్లీ శాంతికపోతాలు ఎగురుతాయి. లేదంటే మళ్లీ ఐసిస్ ముష్కరమూకలు సిరియన్ల కలలను కకావికలం చేయడం ఖాయం. -
ఉగ్ర చీఫ్ నుంచి దేశ సారథి దాకా!
బీరూట్: 14 ఏళ్ల అంతర్యుద్ధాన్ని తట్టుకుని ఎలాగోలా పరిపాలన సాగిస్తున్న అసద్‌ను చావుదెబ్బతీస్తూ దాడులు మొదలెట్టిన కేవలం 11 రోజుల్లో దేశంపై పట్టుసాధించిన అబూ మొహమ్మెద్ అల్ గోలానీ గురించి సర్వత్రా చర్చ మొదలైంది. జిహాదీ ఉగ్రవాదిగా మొదలైన ప్రస్థానం నేడు దేశాధినేత స్థాయిలో కొత్త పంథాలో కొనసాగనుంది. 42 ఏళ్ల గోలానీ 2003లో తొలిసారిగా అల్‌ఖైదాతో చేతులు కలిపారు. ఇరాక్‌లో అమెరికా సేనలకు వ్యతిరేకంగా పోరాడారు. అమెరికాకు చిక్కి ఐదేళ్లు జైలుజీవితం గడిపారు. ఈ సమయంలోనే భావసారుప్యత ముఠాలను ఒక్కతాటి మీదకు తెచ్చి అల్‌ఖైదా.. అబూ బకర్ అల్ బాగ్దాదీ సారథ్యంలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్‌ను స్థాపించింది. 2011లో సిరియాలో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగించాలంటూ అబూబకర్.. గోలానీని సిరియాకు పంపించాడు. అక్కడ అల్‌ఖైదా అనుబంధ నుస్రా ఫ్రంట్‌ను స్థాపించారు. దీనిని ఆనాడే అమెరికా ఉగ్రసంస్థ ముద్రవేసింది. గోలానీని పట్టిస్తే ఒక కోటి డాలర్లు ఇస్తామని నజరానా ప్రకటించింది. 2013లో సిరియాలో అంతర్యుద్ధం మొదలయ్యాక నుస్రా ఫ్రంట్‌ను ‘ఇరాక్ అల్‌ఖైదా’లో కలిపేసి కొత్తగా ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)’ను స్థాపించాని అబూబకర్ సూచించారు. అయితే ఐసిస్ ఏర్పాటు నచ్చక సొంతంగా నుస్రా ఫ్రంట్‌ను గోలానీ కొనసాగించారు. 2013లో గోలానీని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. 2016లో అల్‌ఖైదాతో తెగతెంపులు చేసుకుని సొంతంగా జభాత్ ఫతే అల్–షామ్(ది సిరియా కాంక్వెస్ట్ ఫ్రంట్)ను గోలానీ స్థాపించారు. ఇంకొక ఏడాది తర్వాత దాని పేరును హయత్ తహ్రీర్ అల్ షామ్(సిరియా విమోచన సంస్థ)గా నామకరణం చేశారు. ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో తన పట్టు నిలుపుకున్నారు. స్వతంత్రంగా పోరాటంచేసే వేర్వేరు ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆధిపత్యాన్ని అణచివేసి, వారిని తమలో కలుపుకుని సంస్థను మరింత పటిష్టవంతం చేశారు. తుర్కియే అండతో చెలరేగిపోయిన వేర్పాటువాదుల దాడుల్లో చనిపోయిన కుర్దుల కుటుంబాలను కలిసి మంచివాడిగా పేరుతెచ్చుకున్నారు. 2016లో తొలిసారిగా బహిరంగంగా ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం అమెరికన్ జర్నలిస్ట్‌కు తొలిసారిగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ సంస్థ పశి్చమదేశాలకు వ్యతిరేకంగా పనిచేయబోదని, సిరియాపై ఆంక్షలు విధించడం సబబుకాదని, పరోక్షంగా అమెరికా ఆంక్షలను తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ పశి్చమదేశాల విదేశాంగ విధానాలను విమర్శించిన మాట వాస్తవమే. కానీ మేం అమెరికా, యూరప్ దేశాలతో యుద్ధాలకు దిగాలనుకోవట్లేము. మాకు శాంతిస్థాపనే ముఖ్యం’’ అని గోలానీ గతంలో వ్యాఖ్యానించారు. -
అల్ ఖైదా అనుబంధ గ్రూప్ కీలక నేత హతం
న్యూయార్క్: సిరియాలో జరిగిన దాడుల్లో అల్-ఖైదా అనుబంధ సంస్థ కీలక నేతను హతమార్చినట్లు అమెరికా మిలిటరీ వెల్లడించింది. అల్ ఖైదా కీలక నేత అబూ అబ్దుల్ రెహ్మాన్ అల్ మక్కీని టార్గెట్ చేసి దాడి చేశామని, ఈ దాడుల్లో ఆయన మృతి చెందినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM)సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. రెహ్మాన్ అల్ మక్కీ.. హుర్రాస్ అల్-దిన్ షురా కౌన్సిల్ సభ్యుడు, సిరియా నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.U.S. Central Command Forces Killed Hurras al-Din Senior LeaderEarlier today, U.S. Central Command Forces killed Hurras al-Din senior leader Abu-’Abd al-Rahman al-Makki in a targeted kinetic strike in Syria. Abu-’Abd al-Rahman al-Makki was a Hurras al-Din Shura Council member… pic.twitter.com/eIxqqU1vFq— U.S. Central Command (@CENTCOM) August 23, 2024హుర్రాస్ అల్-దిన్ సిరియాలో ఉన్న అల్-ఖైదా అనుబంధ గ్రూప్ అని అమెరికా తెలిపింది. అమెరికా, పాశ్చాత్య దేశాలే లక్ష్యంగా నిర్వహించటంలో అల్ ఖైదాకు ఈ గ్రూప్ సహాయం చేస్తోందని పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌ను అంతం చేయటం కోసం అంతర్జాతీయంగా ఏర్పాటైన సైన్యంలో 900 మంది అమెరికా సైనికులు ఉన్నారని తెలిపింది. ఇరాక్, సిరియాలోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న అల్-ఖైదా గ్రూప్‌ను ఎదుర్కోవడం కోసం ఈ సైన్యం 2014లో స్థాపింపించారు. -
అనుమానిత ఉగ్రవాది బెంగళూరులో అరెస్టు
సాక్షి, బెంగళూరు: అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి బెంగళూరులో అరెస్టయ్యాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), బెంగళూరు పోలీసులు కలిసి చేపట్టిన ఆపరేషన్‌లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన మహ్మద్ ఆరీఫ్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో థణిసంద్రలోని ఓఇంట్లో ఉన్న ఇతడిని అరెస్ట్ చేశారు. ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న అరీఫ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రెండేళ్లుగా ఉగ్ర సంస్థ అల్‌ఖైదాతో టెలీగ్రాం, డార్క్‌నెట్ ద్వారా సంబంధాలు నెరుపుతున్నట్లు తెలిసింది. ఇతడి కదలికలపై ఎన్ఐఏ కొన్ని రోజులుగా నిఘా ఉంచింది. సిరియా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న ఆరీఫ్‌ను పట్టుకుని, ఒక లాప్టాప్, రెండు హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకుంది. ఈ నెల 13న బెంగళూరులోని ఇంటిని ఖాళీ చేసి యూపీకి వెళ్తున్నట్టు ఇతడు ఇంటి యజమానికి చెప్పాడని పోలీసులు వివరించారు. గత నవంబర్‌లో శివమొగ్గలో ఐఎస్ ప్రేరేపిత ఉగ్ర మాడ్యూల్‌ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. -
అల్ ఖైదా అగ్రనేత అల్ జవహరీని హతమార్చిన అమెరికా
-
హెల్ఫైర్ మిసైల్.. తిరుగులేని మారణాస్త్రం
అల్‌ఖైదా నంబర్ 2గా ఉన్న అహ్మద్ హసన్ అబూ ఖైర్ అల్‌మస్రీని 2017లో సిరియాలోని ఇద్లిబ్ ప్రావిన్స్‌లో విమానం ద్వారా ప్రయోగించిన హెల్ఫైర్ ఆర్9ఎక్స్‌తో చంపింది. దీన్ని ప్రయోగించడం అదే తొలిసారి. 2000లో యెమన్‌లో 17 మంది అమెరికా నావికులను బలి తీసుకున్న బాంబు దాడికి కారకుడైన జమాల్ అహ్మద్ అల్ బదావీని 2019లో హెల్ఫైర్ ఆర్9ఎక్స్‌తోనే సీఐఏ మట్టుబెట్టింది. ఉగ్ర దాడులకు నిధులు సమకూరుస్తున్న మొహిబుల్లా అనే ఉగ్రవాదిని 2019లో హెల్ఫైర్తోనే మట్టుబెట్టింది. 2020లో ఇరాన్‌కు చెందిన మేజర్ జనరల్ ఖాసిం సులేమానీని బలి తీసుకుంది కూడా హెల్ఫైరేనంటారు. ఇది అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఒకదశలో పరిస్థితి యుద్ధం దాకా వెళ్లింది. అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీని మట్టుబెట్టేందుకు సీఐఏ ఉపయోగించిన హెల్ఫైర్ శ్రేణి క్షిపణి అత్యంత అధునాతనమైన మారణాస్త్రం. దీన్ని అమెరికా అమ్ములపొదిలోని రహస్య అస్త్రంగా చెప్పవచ్చు. మిగతా క్షిపణుల్లా ఇది పేలడం, భారీ విధ్వంసం సృష్టించడం వంటివేమీ ఉండవు. కానీ కచ్చితత్వం విషయంలో దీనికి తిరుగు లేదు. నిర్ధారిత టార్గెట్‌ను నిశ్శబ్దంగా ఛేదించడం ద్వారా పని పూర్తి చేస్తుంది. అత్యంత వేగంగా వెళ్తున్న కార్లో కూడా డ్రైవర్‌ను వదిలేసి కేవలం వెనక సీటులో ఉన్న టార్గెట్‌ను మాత్రమే చంపే సత్తా దీనికుందని చెబుతారు. 2011లో ఒబామా హయాంలో అమెరికా రక్షణ శాఖ–సీఐఏ వీటిని సంయుక్తంగా రూపొందించాయి. లాక్‌హీడ్ మార్టిన్–నార్త్రోప్ గమ్మన్ ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించాయి. 2019లో వాల్‌స్ట్రీట్ జర్నల్ బయట పెట్టేదాకా వీటి గురించి బయటి ప్రపంచానికి తెలియదు. అమెరికా పాటిస్తున్న గోప్యత కారణంగా హెల్ఫైర్కు సంబంధించిన సాంకేతిక వివరాలేవీ పెద్దగా అందుబాటులో లేవు. ఇందులో పలు రకాలున్నాయి. జవహరీపై దాడికి వాడింది అమెరికా ఇటీవలే అభివృద్ధి చేసిన ఆర్9ఎక్స్ రకం. ఇది వార్‌హెడ్ వంటిదేమీ లేకుండా ఐదడుగుల పై చిలుకు పొడవు, 45 కిలోల బరువుతో చాలా తేలిగ్గా ఉంటుంది. దీన్ని విమానం నుంచి గానీ, డ్రోన్ నుంచి గానీ ప్రయోగిస్తారు. అత్యంత వేగంతో లక్ష్యాన్ని తాకే సమయంలో దీని ముందు భాగం నుంచి ఆరు అత్యంత పదునైన బ్లేడ్లు బయటికొస్తాయి. దాన్ని పూర్తిస్థాయిలో ఛిద్రం చేస్తూ దూసుకెళ్తాయి. పరిసరాలకు గానీ, పక్కనుండే వారికి గానీ ఎలాంటి నష్టం లేకుండా పని చక్కబెట్టడం వీటి ప్రత్యేకత. దీన్ని నింజా బాంబ్ అని, బ్లేడ్ల కారణంగా ఫ్లయింగ్ జిన్సు అని పిలుస్తారు. అగ్ర స్థాయి ఉగ్రవాద నేతలు తదితరులను ఇతర ప్రాణనష్టం లేకుండా చంపాలనుకున్నప్పుడు మాత్రమే వీటిని ఉపయోగిస్తుంటారు. 2011లో అప్పటి అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ హత్యకు ప్లాన్ బీగా హెల్ఫైర్ క్షిపణులను కూడా సిద్ధంగా ఉంచారట. కానీ హెల్ఫైర్ క్షిపణులæ అవసరం లేకుండానే నేవీ సీల్స్ విజయవంతంగా పని పూర్తి చేశారు. -
9/11 మాస్టర్ మైండ్ జవహరీ హతం.. 15 ఏళ్లకే జవహరీ ఉగ్రబాట
వాషింగ్టన్: అల్–జవహరీ ఈజిప్టు రాజధాని ౖకైరోలో 1951లో ఓ సంపన్న కుటుంబంలో జన్మించాడు. కేవలం 15 ఏళ్ల చిన్న వయసులోనే ‘జమాత్ అల్–జిహాద్’ పేరిట సొంతంగా ఒక సంస్థను స్థాపించాడు. విరోధులను అంతం చేయడమే దీని లక్ష్యం. ఇది ఈజిప్టులో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థగా రూపాంతరం చెందింది. 1981 అక్టోబర్ 6న ఉగ్రవాద దాడుల్లో ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ బలయ్యారు. ఈ దాడుల్లో ‘జమాత్ అల్–జిహాద్’ హస్తం ఉన్నట్లు తేలింది. జవహరీ వైద్య విద్య అభ్యసించాడు. కొన్నాళ్లు సర్జన్‌గా పనిచేశాడు. జీవ ఆయుధాలను అభివృద్ధి చేయడానికి ఒక ల్యాబ్‌ను నడిపించాడు. గతంలో ఓ కేసు విచారణలో భాగంగా జవహరీ కోర్టుకు హాజరయ్యాడు. ‘‘మేము త్యాగాలు చేశాం. ఇస్లాం విజయం సాధించేవరకూ ఎన్ని త్యాగాలు చేయడానిౖకైనా సిద్ధంగా ఉన్నాం’’ అంటూ కోర్టు గదిలో గట్టిగా అరిచాడు. లాడెన్‌కు వ్యక్తిగత వైద్యుడిగా సేవలు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు గాను జవహరీకి మూడేళ్ల జైలు శిక్ష పడింది. జైలు నుంచి విడుదలయ్యాక దక్షిణాసియాకు చేరుకున్నాడు. ఒసామా బిన్ లాడెన్‌కు వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించాడు. 1988లో ఒసామా బిన్ లాడెన్ అల్‌ఖైదాను స్థాపించాక అందులో చేరాడు. చురుగ్గా కార్యకలాపాలు సాగించాడు. 1990 తర్వాత తన ‘జమాత్ అల్–జిహాద్’ సంస్థను అల్‌ఖైదాలో విలీనం చేశాడు. అతి తక్కువ కాలంలోనే లాడెన్‌కు నమ్మిన బంటుగా మారాడు. 1990వ దశకంలో పశ్చిమ దేశాల నిఘా సంస్థలు తొలిసారిగా జవహరీపై దృష్టి పెట్టాయి. అల్‌ఖైదా ముఠాలో అతడి ప్రతిష్ట విపరీతంగా పెరిగిపోయింది. అల్‌ఖైదా నిర్వహించే విలేకరుల సమావేశాల్లో లాడెన్ పక్కనే జవహరీ తప్పనిసరిగా కనిపించేవాడు. 1997లో అఫ్గానిస్తాన్‌లో ఉన్నప్పుడు ఈజిప్టు పర్యాటకులను చంపేందుకు ప్లాన్ చేశాడు. 1998లో లాడెన్ అల్‌ఖైదా ఉప నాయకుడిగా జవహరీ పేరును ప్రకటించాడు. అంటే ఉగ్రముఠాలో లాడెన్ తర్వాతి స్థానం జవహరీదే కావడం గమనార్హం. అణ్వాయుధాలు సంపాదించుకోవాలన్న అల్‌ఖైదా ఆశయం వెనుక జవహరీ ప్రోత్సాహం ఉంది. ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో.. ఆత్మాహుతి దాడులకు వ్యూహాలు రచించడంలో జవహరీ దిట్ట. నిధులు సేకరించడంలోనూ నేర్పరి. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా నిఘా దర్యాప్తు సంస్థ ‘ఎఫ్‌బీఐ’ అల్–జవహరీని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అతడి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. పదేళ్ల క్రితం అమెరికా నేవీ సీల్స్ దాడుల్లో లాడెన్ హతమయ్యాక జవహరీ అల్‌ఖైదా పగ్గాలు తన చేతుల్లోకి తీసుకున్నాడు. చెల్లాచెదురైన అల్‌ఖైదాను బలోపేతం చేసేందుకు ప్రయత్నించాడు. ఇస్లామిక్ దేశాల్లో ఉన్న అల్‌ఖైదా సభ్యులకు సుప్రీంలీడర్‌గా దిశానిర్దేశం చేశాడు. అఫ్గాన్‌పై అమెరికా సేనలు పట్టు బిగించడంతో జవహరీ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. అతడి ఆచూకీ తెలియకుండా పోయింది. వేర్వేరు దేశాల్లో తలదాచుకున్నట్లు వార్తలు వచ్చాయి. జవహరీ చనిపోయాడన్న వాదనలు సైతం వినిపించాయి. కానీ, అమెరికా నిఘా సంస్థలు నమ్మలేదు. ఓపికగా వేట కొనసాగించాయి. చివరకు అఫ్గానిస్తాన్‌లోనే అంతం చేశాయి. అమెరికన్లను హతమార్చడమే లక్ష్యం 1998 ఆగస్టు ఏడో తేదీన టాంజానియా, కెన్యాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై బాంబు దాడులు జరిగాయి. జవహరీ నేతృత్వంలోనే ఈ దాడులకు వ్యూహాలు రూపొందించారు. అప్పుడు అతడి వయసు 47 సంవత్సరాలు. ఇక అగ్రరాజ్యం అమెరికాను వణికించిన ‘2001 సెప్టెంబర్ 11’ దాడుల వెనుక లాడెన్‌తో కలిసి కీలక పాత్ర పోషించారు. ‘‘అమెరికన్లను, వారి మిత్రులను అంతం చేయడమే ప్రతి ముస్లిం వ్యక్తిగత విధి. అమెరికన్లు ప్రపంచంలో ఎక్కడున్నా సరే హతమార్చాలి’’ అని 1998లో తన మేనిఫెస్టోలో జవహరీ స్పష్టంగా రాసుకున్నాడు. ‘సెప్టెంబర్ 11’ దాడుల తర్వాత అమెరికాలో మరిన్ని దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించాడు. అఫ్గానిస్తాన్‌లో జీవ ఆయుధాల తయారీకి శ్రీకారం చుట్టాడు. కానీ, అఫ్గాన్‌పై అమెరికా దండెత్తడంతో అతడి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వారసుడు ఆదెల్? జవహరీ మరణంతో అల్ ఖైదా నాయకునిగా ఈజిప్టు మాజీ సైనికాధికారి మహ్మద్ సలాహ్ అల్ దిన్ జైదన్ అలియాస్ సైఫ్ అల్ ఆదెల్ (60) పేరు గట్టిగా వినవస్తోంది. అల్ ఖైదా అగ్ర నేతల్లో పిన్న వయస్కుడితడే. ఎవరీ ఆదెల్? ఈజిప్టుకు చెందిన ఆదెల్ మాజీ కల్నల్. అల్‌ఖైదా వ్యవస్థాపక సభ్యుడు. అమెరికా, బ్రిటిష్ సైనికులనెందరినో చంపాడు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర రిక్రూట్మెంట్లు, నిధుల కోసం 1980ల్లో ఒసామా బిన్ లాడెన్ నెలకొల్పిన మక్తాబ్ అల్ ఖిద్మత్ (ఎంఏకే)తో కూడా అనుబంధముంది. లాడెన్ సెక్యూరిటీ చీఫ్‌గానూ వ్యవహరించాడు. అప్పుడే జవహరీతోనూ పరిచయమేర్పడింది. 1993లో సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు 19 మంది అమెరికా సైనికులను చంపి మృతదేహాలను వీధుల గుండా ఈడ్చుకెళ్లారు. ఈ దాడి ఆదెల్ కనుసన్నల్లోనే జరిగింది. కెన్యా, టాంజానియాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై 1998లో జరిగిన దాడులు, పెంటగాన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై జరిగిన దాడులతోనూ ఇతడికి సంబంధముంది. దీంతో అమెరికా ఆదెల్ పేరును మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చి అతడి తలపై కోటి డాలర్ల నజరానా ప్రకటించింది. లాడెన్ మరణం తర్వాత కీలక వ్యూహకర్తగా ఎదిగాడు. 20 ఏళ్లుగా ఇరాన్‌లోనే ఉన్నట్టు అనుమానం. సిరియాలోని ఉగ్ర ముఠాలకు టెలిగ్రాం ద్వారా సూచనలిస్తాడని చెబుతారు. లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్‌ను కూడా 2019లో అమెరికా సైన్యం మట్టుబెట్టింది. అల్‌ఖైదా పగ్గాలు ఇతని చేతుల్లోకే వెళ్తాయని మిడిల్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ అంటోంది. -
అమెరికన్లంటే ద్వేషం.. తెరపైకి అల్‌ఖైదా కొత్త చీఫ్ పేరు!
న్యూయార్క్: నిషేధిత ఉగ్రసంస్థ అల్‌ఖైదా చీఫ్ అయ్మన్ అల్ - జవహిరి(71)ని.. ఎట్టకేలకు మట్టుపెట్టగలిగింది అమెరికా. అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ ఇంటిలోనే డ్రోన్ స్ట్రయిక్ ద్వారా అతన్ని నేల కూల్చింది. గతంలో పాక్ భూభాగంలో అల్ ఖైదా ‘ఎమిర్’(చీఫ్ కమాండర్) బిన్‌లాడెన్‌ను ఎలాగైతే మట్టుపెట్టిందో.. ఇప్పుడు ఆ తర్వాతి చీఫ్‌ను సైతం పక్కా దాడితో మట్టుపెట్టి.. ఉగ్ర సంస్థకు నాయకత్వం లేకుండా చేసింది. అయితే.. అమెరికా డ్రోన్ దాడిలో అల్ ఖైదా నాయకుడు హతమై కొన్నిగంటలు గడవక ముందే కొత్త నాయకుడి పేరు తెర మీదకు వచ్చింది ఇప్పుడు. అతని పేరే సైఫ్ అల్-అడెల్. అల్ ఖైదా వ్యవస్థాప సభ్యుడిగా, సీనియర్ మెంబర్‌గా, సంస్థలో నెంబర్ త్రీ పొజిషన్లో ఇంతకాలం ఉన్నాడతను. తర్వాతి నాయకత్వ పగ్గాలు అందుకునే అవకాశాలు ఉన్నాయని మిడిల్ ఈస్ట్ ఇనిస్టిట్యూట్ ఓ కథనం ప్రచురించింది. ► ఎఫ్‌బీఐ రికార్డుల ప్రకారం.. అడెల్ ఏప్రిల్ 11న 1960-63 మధ్యలో జన్మించాడు. ► జవహిరిలాగే.. అడెల్ కూడా ఈజిప్ట్ పౌరుడే. అక్కడి ఆర్మీలో కల్నల్ ర్యాంకుతో పని చేశాడు. ► జవహిరి స్థాపించిన ఇజిప్టియన్ ఇస్లామిక్ జిహాద్లో సైఫ్ అల్-అడెల్ పని చేశాడు. అందులో అతనికి ఎక్స్‌ప్లోజివ్ ఎక్స్‌పర్ట్‌గా పేరు ఉంది. ► 1980లలో ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యా దళాలతో కూడా పోరాడాడు. ► అమెరికన్లనే మాట వింటే చాలు రగిలిపోతాడతను. గతంలో అమెరికన్లను హతమార్చిన ఘటనలు, అమెరికన్లకు చెందిన ఆస్తుల విధ్వంసం, అమెరికా భద్రతా విభాగాల్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం తదితర ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అందుకే ఎఫ్‌బీఐ సైఫ్ అల్ అడెల్‌ను మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించింది. ► 1998లో టాంజానియా, కెన్యాలోని రాయబార కార్యాలయాల్లో బాంబు పేలుళ్ల ద్వారా అమెరికన్లను హతమార్చే యత్నం కింద అతనిపై నేరారోపణలు నమోదు చేసిన అమెరికా.. పట్టించినా, సమచారం అందించిన వాళ్లకు 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. ► 1993 అక్టోబర్‌లో సోమాలియా మోగడిషూ దగ్గర జరిగిన బ్లాక్ హాక్ డౌన్ ఘటనకు మూల కారణం..సైఫ్ అల్-అడెల్. ఆ ఘటనలో అమెరికాకు చెందిన పద్దెనిమిది మంది సర్వీస్‌మెన్ బలయ్యారు. ► ఒసామా బిన్ లాడెన్ సెక్యూరిటీ చీఫ్‌గా పని చేయడంతో సైఫ్ అల్-అడెల్ బాగా ఆప్తుడిగా మెదిలేవాడు. జవహిరి కంటే అడెల్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు లాడెన్. ► 2001 నుంచే ఎఫ్‌బీఐ మోస్ట్-వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. ► బిన్ లాడెన్ మరణించినప్పటి నుండి, అల్-అడెల్ ఒక ముఖ్యమైన వ్యూహకర్తగా మారాడని అనేక వార్తా సంస్థలు తెలిపాయి. అయితే,బ్లాక్ హాక్ డౌన్ తరువాత చాలాకాలం పాటు ఇరాన్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతనెక్కడ ఉన్నాడన్నది మాత్రం తెలియదు!. ► కేడర్ హోదాలో తర్వాతి ఎమిర్ అయ్యే అవకాశాలు సైఫ్ అల్-అడెల్కు ఎక్కువగా ఉన్నాయి. -
ఆమె.. ఒక మిస్టరీ! జిహాదీలకు ఆమె రోల్ మోడలా?
ఆమెను లేడీ అల్‌ఖాయిదా అని పిలిచేవారు మోస్ట్ వాంటెడ్ వుమెన్ జాబితాలో కూడా ఆమె పేరు చేరింది అభిమానులు ఆమెను ఇస్లాం మతాన్ని కాపాడే రాడికల్‌గా భావిస్తే అమెరికా ఆమెపై అల్ ఖాయిదా తొలి మహిళా ఉగ్రవాది అన్న ముద్ర వేసింది అమెరికాలోని టెక్సాస్ జైల్లో మగ్గుతున్న ఆఫియా సిద్ధిఖీ విడుదల కోసం ఇప్పటి వరకు 57 మంది ప్రాణాలు బలయ్యాయి. ఇంతకీ ఎవరీ ఆఫియా సిద్ధిఖీ? ఆమె విడుదల కోసం పాక్‌కి ఎందుకీ ఆరాటం? అమెరికాలోని టెక్సాస్‌లో జనవరి 15న ఒక యూదు ప్రార్థనాలయంలో నలుగురిని బందీలుగా చేపట్టిన ఓ బ్రిటీష్ పాకిస్తానీ యువకుడు వారిని వదిలేయాలంటే, అక్కడికి సమీపంలో జైల్లో మగ్గుతున్న ఆఫియా సిద్ధిఖీని విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. 10 గంటల ఉత్కంఠ తర్వాత అమెరికా పోలీసుల చేతుల్లో హతమయ్యాడు. ► 2011లో అల్ ఖాయిదాలో నెంబర్ 2 ఉగ్రవాది అల్ జవహరి.. ఆఫియాను విడుదల చేస్తే, తమ దగ్గర బందీగా ఉన్న యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఉద్యోగి వారెన్ వీన్స్టెన్ను విడుదల చేస్తామని బేరం పెట్టాడు. ► 2014లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ తమ బందీగా ఉన్న అమెరికా జర్నలిస్టు జేమ్స్ ఫోలేని విడుదల చేస్తామని, బదులుగా ఆఫియాను విముక్తురాలిని చేయాలని డిమాండ్ చేసింది. అమెరికా అంగీకరించకపోవడంతో ఆ జర్నలిస్టు తలనరికి చంపేసింది. ► 2017లో పాకిస్తాన్ ఎన్నికల ప్రచారంలో ఇమ్రాన్‌ఖాన్ తాను అధికారంలోకి వస్తే ఆఫియాను విడుదలకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. వీరే కాదు జీహాది సంస్థలు, సామాన్య జనం, యావత్ ముస్లిం సమాజం ఆఫియా విడుదల కోసం ఎన్నో ప్రదర్శనలు చేశారు. అమెరికాలో ఎవరిని బందీగా తీసుకున్నా ఆఫియా విడుదల కోసమేనా అన్నట్టుగా పరిస్థితులు మారాయి. ఆఫియా చుట్టూ ఆరోపణలు ఆఫియా జీవితమే ఒక మిస్టరీగా మారింది. అమెరికాలో ఉండగా ఆమెపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. 10 వేల డాలర్లతో నైట్ విజన్ గాగుల్స్ కొన్నదని , రక్షణ కోసం కవచాలు, ఒక సైనికురాలిగా స్వీయ శిక్షణ తీసుకోవడానికి అవసరమయ్యే పుస్తకాలు కొనుగోలు చేసినట్టుగా ప్రచారం జరిగింది. సెప్టెంబర్ 11 దాడుల మాస్టర్‌మైండ్ ఖలీద్ షేక్ మహమ్మద్ మేనల్లుడు అమ్మర్ అల్ బలూచిని ఆమె రహస్య వివాహం చేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. 2003లో ఖలీద్ అరెస్ట్ అయిన నెలరోజులకే ఆఫియా కొన్నాళ్లు అదృశ్యమైపోవడం ఆ ఆరోపణలకి ఊతమిచ్చింది. డర్టీ బాంబ్స్ తయారు చేసి అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు సృష్టించడానికి అఫియా కుట్ర పన్నిందన్న ఆరోపణలు వచ్చాయి. జైల్లో ఉన్నప్పటి చిత్రం 2008లో అఫ్గానిస్తాన్‌లో అమెరికా అధికారిపై కాల్పులకు తెగబడిందన్న ఆరోపణలతో ఆమెను అరెస్ట్ చేశారు. 2010లో అమెరికా కోర్టు ఆమెకు ఏకంగా 86 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. అంటే ఆఫియాకి శిక్షా కాలం పూర్తయ్యేటప్పటికీ ఆమె ప్రాణాలతో ఉంటే వయసు 124 ఏళ్లు వస్తాయి. అయితే ఆఫియా సిద్ధిఖీ అమాయకురాలని, ఆమెకు ఆ నేరంతో ఎలాంటి సంబంధం లేదని, అమెరికా మిలటరీయే ఆఫియాని కిడ్నాప్ చేసి నేరాన్ని మోపిందంటూ వాదించేవారూ ఉన్నారు. 2001, సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అగ్రరాజ్యం అమెరికా ఉగ్రవాదంపై పోరాటం పేరుతో అమాయకులపై కూడా టెర్రరిస్టు ముద్ర వేస్తోందని ముస్లిం సమాజం గళమెత్తింది. ఇప్పుడు ఎలా ఉంది ? టెక్సాస్‌లోని ఫోర్ట్‌వర్త్ జైల్లో ఉన్న ఆఫియా సిద్ధిఖీ ప్రాణాలకు ఇంకా ముప్పు పొంచే ఉందని తెలుస్తోంది. ఇటీవల ఆమెపై తోటి ఖైదీలు దాడులకు దిగారని జైలు రికార్డులు చెబుతున్నాయి. పొగలు కక్కే కాఫీని ఆమె ముఖంపై పోయడంతో కాలిన గాయాలయ్యాయి. కళ్లు కూడా తెరవలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెను మరో మహిళా ఖైదీ చితకబాదింది.. ఈ ఘటన వెలుగులోకి వచ్చాక పాకిస్తాన్లో హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆఫియాను విడుదల చేయాలంటూ బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. విదేశీ జైళ్లలో మగ్గిపోతున్న పాకిస్తానీయుల విడుదలకు తాను పాటుపడతానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టెక్సాస్ యూదు ప్రార్థనాలయంలో ఆఫియా విడుదల కోసం ఘటన జరగడంతో మరోసారి ఈ అల్ ఖాయిదా లేడీ ఉగ్రవాదిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విశ్వవిఖ్యాత మసాచుసెట్స్ వర్సిటీలో చదివి.. అపై పీహెచ్డీ చేసి జీవితంపై ఎంతో విశాల అవగాహన ఉన్న ఆఫియా చట్ట వ్యతిరేక ఉగ్రమార్గాన్ని ఎంచుకోవడం ఎప్పటికీ విస్మయపరిచే అంశమే. పెద్దయ్యాక పాశ్చాత్యదేశాల్లో పెరిగింది. ఆ దశలో ఆమెకు ఉగ్రభావాలున్న పరిచయం అయ్యే అవకాశం ఉండదు. అంటే పాక్‌లో సెకండరీ విద్యను అభ్యసించే లోపలే... లేదా సేవా కార్యక్రమాల కోసం ప్రపంచదేశాలు తిరుగుతున్న తరుణంలో ఎవరో ఆమెకు బ్రెయిన్ వాష్ చేసి ఉంటారని అనుకోవచ్చు!. ఎవరీ ఆఫియా సిద్ధిఖీ? ఆఫియా సిద్ధిఖీ పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన న్యూరో సైంటిస్ట్. 1990లో టీనేజ్‌లో ఉండగానే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంది. బ్రాండీస్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేసింది. 1995లో కరాచీకి చెందిన అంజాద్‌ఖాన్‌తో నిఖా జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2002లో భర్తతో విడిపోయింది. అమెరికాలో విద్యార్థిగా ఉండగానే ఆమె మసీదులకి వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చేది. ఇస్లాం మతం సంరక్షణ కోసం ప్రచారం చేసేది. అఫ్గానిస్తాన్, బోస్నియా, చెచన్యాలో సంక్షోభ పరిస్థితులపై ఉద్యమాలు చేసింది. భారీగా విరాళాలు సేకరించి ఆయా దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఆమె తండ్రి మహమ్మద్ సిద్ధిఖీ వైద్యుడు, సామాజిక కార్యకర్త. పాకిస్తాన్ జనరల్ జియా ఉల్ హక్ హయాంలో ఆయనకి అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. దీంతో సిద్ధికీ ఏం చేసినా బాగా ప్రచారం వచ్చేది. ఆమెకి ఎందరో అభిమానులు ఏర్పడ్డారు. పైగా అకర్షణీయమైన రూపం, అత్యంత ప్రతిభావంతురాలు, ఉన్నత విద్యను అభ్యసించి ఉండటంతో... పాక్ సమాజంతో పాటు ఎక్కడికెళ్లినా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉండేది. –నేషనల్ డెస్క్, సాక్షి -
మాలిలో ఉగ్ర దాడి.. 31మంది పౌరులు మృతి
బమాకో: ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 31 మంది అమాయకపౌరులు బలయ్యారు. బండియగర పట్టణ సమీపంలో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. సుమారు 50 మంది పౌరులతో వెళ్తున్న ట్రక్కుపై అల్‌ఖైదా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ట్రక్కులో మంటలు చెలరేగి 31 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువమంది సజీవ దహనమైనట్లు బండియగర మేయర్ హొస్సేనీ తెలిపారు. పలువురు గాయాలపాలయ్యారని, ఇద్దరు గల్లంతయ్యారని ఆయన తెలిపారు. స్థానిక సాయుధ బృందాల హింసాత్మక చర్యల కారణంగా మాలిలో వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. (చదవండి: ఇంటికి కాళ్లుంటే.. అది ఎంచక్కా నడుచుకుంటూ వెళుతుంటే..!) -
సజీవంగానే అల్ జవహిరి
ఐక్యరాజ్యసమితి: అల్–ఖాయిదా అగ్ర నాయకత్వంలో చాలావరకు అఫ్గానిస్తాన్–పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోనే తిష్టవేసి ఉందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇప్పటి వరకు ఆచూకీ దొరకని ఆ సంస్థ నేత అయిమన్ అల్–జవహిరి సజీవంగానే ఉండి ఉండవచ్చని అభిప్రాయపడింది. ‘అల్–ఖాయిదా అగ్రనాయకత్వం పాక్–అఫ్గాన్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. భారత ఉపఖండంలో ఉన్న మిగతా శ్రేణులతో కలిసి పనిచేస్తున్నారు. అంతా కలిపి 500 మంది వరకు ఉండవచ్చు. అతడు అనారోగ్యంతో ఉన్నాడు. అందుకే ప్రచార వీడియోల్లో సైతం కనిపించడం లేదు’ అని ఐరాస ఆంక్షల పర్యవేక్షక బృందం తన 12వ నివేదికలో పేర్కొంది. భారత ఉపఖండంలో అల్–ఖాయిదా కార్యకలాపాలు ప్రస్తుతం ఒసామా మహమూద్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని వెల్లడించింది. అల్–ఖాయిదా శ్రేణుల్లో అఫ్గాన్, పాక్, జాతీయులతోపాటు బంగ్లాదేశ్, భారత్, మయన్మార్ దేశస్తులు కూడా ఉన్నారని పేర్కొంది. -
అల్ కాయిదా నంబర్ 2 హతం
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్‌కాయిదాను అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చావుదెబ్బ కొట్టాయి. అల్‌కాయిదాలో నంబర్–2గా చెలామణి అవుతున్న అబూ మొహమ్మద్ అల్–మాస్రీని ఈ ఏడాది ఆగస్టులో హతమార్చాయి. రహస్యంగా జరిగిన ఈ జాయింట్ ఆపరేషన్ వివరాలను తాజాగా నలుగురు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో దాక్కున్న అల్–మాస్రీ జాడను తొలుత అమెరికా కనిపెట్టింది. ఈ సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు చేరవేసింది. దీంతో ఇజ్రాయెల్ నిఘా సంస్థకు చెందిన కిడోన్ దళం రంగంలోకి దిగింది. టెహ్రాన్‌లో నక్కిన అల్ మాస్రీని విజయవంతంగా మట్టుబెట్టింది. ఆగస్టు 7న పూర్తయిన ఈ ఆపరేషన్‌లో మాస్రీ కూతురు మరియం కూడా చనిపోయింది. మరియం మరెవరో కాదు బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్‌లాడెన్ భార్యే. హమ్జాను అమెరికా దళాలు పాక్–అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉండగా గత ఏడాది హతమార్చాయి. 1998లో కెన్యా, టాంజానియాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై జరిగిన బాంబు దాడుల్లో అల్–మాస్రీ కీలకపాత్ర పోషించాడు. అప్పటినుంచి అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ అతడిని మోస్ట్‌వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఇప్పటికే అల్‌కాయిదా చీఫ్ అల్ జవహరీ జాడ గత కొన్ని నెలలుగా తెలియడం లేదు. -
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం..!
టెహ్రాన్/వాషింగ్టన్: ఉగ్ర సంస్థ ఆల్‌ఖైదా ముఖ్య నాయకుడు అబ్దుల్లా అహ్మద్ అబ్దుల్లా అలియాస్ అబూ మహ్మద్ అల్-మస్రీ హతమయ్యాడన్న న్యూయార్క్ టైమ్స్ కథనంపై ఇరాన్ స్పందించింది. ఇవన్నీ తప్పుడు వార్తలు అని కొట్టిపారేసింది. అసలు తమ భూభాగంలో ఆల్-ఖైదా ఉగ్రవాదులే లేరని స్పష్టం చేసింది. ఇరాన్ ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా వ్యవహరించడం డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి పరిపాటిగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా 1998లో ఆఫ్రికాలోని అమెరికా రాయబార కార్యాలయాల పేలుళ్లకు సూత్రధారిగా భావిస్తున్న ఆల్‌ఖైదా సెకండ్-ఇన్-కమాండ్ మస్రీను ఇజ్రాయెల్ బలగాలు మట్టుబెట్టినట్లు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అగ్రరాజ్యం తరఫున రంగంలోకి దిగిన ఇజ్రాయెల్ సేనలు ఆగష్టు నెలలో అతడిని హతమార్చినట్లు ఇంటలెజిన్స్ వర్గాలు వెల్లడించాయని న్యూయార్క్ టైమ్స్ శుక్రవారం పేర్కొంది. టెహ్రాన్ వీధుల గుండా వెళ్తున్న మస్రీని ఇద్దరు వ్యక్తులు మోటార్‌సైకిలు మీద వెంబడించి తుపాకీతో అతడిని కాల్చినట్లు వెల్లడించింది. మస్రీ వారసుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఐమన్ అల్-జవాహిరి ఇప్పటి వరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాడని తన కథనంలో పేర్కొంది. అయితే మస్రీ కోసం గత కొన్నేళ్లుగా జల్లెడ పడుతున్న అమెరికా, అతడి హతం వెనుక ఎలాంటి పాత్ర పోషించిందన్న అంశంపై స్పష్టత లేదని తెలిపింది. అదే విధంగా ఆల్‌ఖైదా మస్రీ మృతిని ధ్రువీకరించకుండా ఇరాన్ ప్రభుత్వం కట్టడి చేసిందని పేర్కొంది. ఈ కథనాన్ని ఖండిస్తూ ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి సయీద్ ఖతీబ్జదేశ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. (చదవండి: ట్రంప్ నిర్ణయాలన్నీ ‘తలకిందులే’నా?!) ‘‘అలాంటి(ఉగ్రవాద) గ్రూపులతో ఇరాన్ పేరును ముడిపెడుతూ అసత్య కథనాలు ప్రసారం చేసేలా మీడియాకు లీకులివ్వడం ట్రంప్ యంత్రాంగానికి సర్వసాధారణమైపోయింది. నేరగాళ్ల కార్యకలాపాలను కట్టడిచేయలేక, ఇలాంటి ఉగ్రసంస్థల వల్ల చెలరేగుతున్న కల్లోలాన్ని రూపుమాపలేక తమ చేతకానితనాన్ని ఇతరులపై రుద్దుతున్నారు. ఇరాన్‌ను భయపెట్టేందుకు వేసే ఎత్తుగడలు పనిచేయవు’’ అని కౌంటర్ ఇచ్చారు. కాగా ఆగష్టు 7నాటి ఆపరేషన్‌లో మస్రీతో పాటు అతడి కూతురు, ఒసామా బిన్ లాడెన్ కోడలు(హంజా బిన్‌లాడెన్ భార్య) కూతురు కూడా మృతి చెందినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇక మస్రీ 2003 నుంచి ఇరాన్ కస్టడీలోనే ఉన్నాడని, 2015 నుంచి టెహ్రాన్‌లో స్వేచ్చగా జీవించేందుకు అతడికి అవకాశం లభించిందని ఇంటలెజిన్స్ అధికారులు చెప్పినట్లు తన కథనంలో పేర్కొంది. కాగా ఇరాన్ అధికార మీడియా మాత్రం ఆగష్టు 7న దుండగుల దాడిలో మరణించింది లెబనీస్ హిస్టరీ ప్రొఫెసర్ హబీబ్ దావూద్, అతడి కుమార్తె మరియం అని పేర్కొనడం గమనార్హం. -
దేశంలో పాగాకు అల్‌కాయిదా కుట్ర
న్యూఢిల్లీ/కోల్‌కతా: భారత్‌లో వేళ్లూనుకునేందుకు నిషేధిత అల్‌కాయిదా ఉగ్ర సంస్థ పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బట్టబయలు చేసింది. కీలక ప్రాంతాల్లో ఉగ్రదాడులు, కొందరు ముఖ్యులను చంపేందుకు సాగుతున్న యత్నాలను భగ్నం చేసింది. పశ్చిమ బెంగాల్, కేరళలలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిపి ఈ ముఠాలోని 9 మందిని అరెస్ట్‌చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు, రాష్ట్రాలు పోలీసుల సాయంతో 18, 19 తేదీల్లో కేరళ, బెంగాల్‌లలో దాడులు జరిపి 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. ముర్షీద్ హసన్, ఇయాకుబ్ బిశ్వాస్, మొసారఫ్ హొస్సేన్ అనే వారిని కేరళలోని ఎర్నాకులంలోను, నజ్ముస్ సకిబ్, అబూ సుఫియాన్, మైనుల్ మొండల్, లియు ఈన్ అహ్మద్, అల్ మమూన్ కమల్, అటిటుర్ రహ్మాన్లను ముర్షీదాబాద్‌లో అరెస్ట్‌చేశారు. ఈ ముఠాకు హసన్ నేతృత్వం వహిస్తున్నాడని చెప్పారు. కేరళలో పట్టుబడిన వారూ బెంగాల్ వాసులే. 11న అల్‌కాయిదా మాడ్యూల్‌పై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. అరెస్టయిన వారంతా సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తాన్‌లోని అల్ కాయిదా ఉగ్రవాదుల బోధనల ప్రభావానికి లోనయ్యారు. ఢిల్లీ సహా దేశంలోని కీలకప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరిపి భారీగా ప్రాణనష్టం కలిగించేందుకు, ప్రముఖులను చంపేందుకు పథకం వేశారు. ఇందుకు అవసరమైన డబ్బుతోపాటు ఆయుధాలు..ఆటోమేటిక్ రైఫిళ్లు, పిస్టళ్లు, పేలుడు పదార్థాల కోసం కశ్మీర్‌తోపాటు ఢిల్లీ వెళ్లాలని ఈ ముఠా పథకం వేసింది. అంతేకాకుండా, కశ్మీర్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అల్‌కాయిదా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది. టపాసులను ఐఈడీ(ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)గా మార్చేందుకు ఈ ముఠా ప్రయత్నిం చిందని సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న స్విచ్చులు, బ్యాటరీలను బట్టి తేలిందని ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. దాడుల్లో జిహాదీ సాహిత్యం, కొన్ని ఆయుధాలు, దేశవాళీ తయారీ తుపాకులు, స్థానికంగా రూపొందించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, పేలుడు పదార్థాల తయారీని తెలిపే సమాచారం, డిజిటల్ పరికరాలు లభించాయి. ఆరుగురికి 24 వరకు రిమాండ్ పశ్చిమబెంగాల్లో అరెస్టు చేసిన అల్‌కాయిదా ముఠాలోని ఆరుగురు సభ్యులకు కోల్‌కతాలోని స్పెషల్ ఎన్ఐఏ కోర్టు ఈ నెల 24వ తేదీ వరకు రిమాండ్ విధించింది. వీరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. బాంబుల తయారీ కేంద్రం బెంగాల్: గవర్నర్ ధన్కర్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన అల్‌కాయిదా ఉగ్ర ముఠా సభ్యులను ఎన్ఐఏ అరెస్టు చేయడంపై రాష్ట్ర గవర్నర్ ధన్కర్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. బాంబుల తయారీకి రాష్ట్రం కేంద్రంగా మారిందని ధన్కర్ ఆరోపించారు. శాంతి, భద్రతలు దారుణంగా క్షీణించాయన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం, డీజీపీ ఇందుకు బాధ్యత వహించకతప్పదని పేర్కొన్నారు. -
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమ బెంగాల్ అక్రమ బాంబుల తయారీకి నిలయంగా మారిందని గవర్నర్ జగదీప్ దంఖర్ మమతా బెనర్జీ ప్రభుత్వంపై శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం కేరళ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన తొమ్మిది మంది ఉగ్రవాదులను అరెస్టు చేయడంలో ఎన్ఐఏ ఆపరేషన్ విఫలమైన విషయం తెలిసిందే. దీంతో ఈ ఉగ్రవాదుల ద్వారా భారత్‌లో స్థావరం ఏర్పాటు చేయడానికి ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా చేసిన ప్రయాత్నాలకు అడ్డుకట్ట వేయడంలో ఎన్ఐఏ ఆపరేషన్ విఫలమైన అనంతరం గవర్నర్.. దీదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్, కేరళలోని ఎర్నాకుళంలోని పలు చోట్ల శనివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగిన విషయం తెలిసిందే. 'ప్రజాస్వామ్యాన్ని అస్తవ్యస్తం చేసే అక్రమ బాంబుల తయారీకి రాష్ట్రం నిలయంగా మారింది' ఇది ప్రజాస్వామ్యాన్ని కూల్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది అంటూ గవర్నర్ వరుసగా ట్వీట్స్ చేశారు. যা কিছুই ঘটুক না কেন; In service of WB NIA busts Al-Qaeda module in Murshidabad, WB. DGP on this alarming affairs @MamataOfficial to me “West Bengal police firmly adheres to the path laid down by law. There is no discrimination for or against anyone in an extra legal sense” pic.twitter.com/7DCqPyCaz9 — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) September 19, 2020 ప్రతిపక్షాలపైనే దృష్టి పెడుతూ, రాష్ట్రంలోని శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే రాజకీయ తప్పిదాలు చేయడంలో మమతా అధికార పోలీసులు బిజీగా ఉన్నారని గవర్నర్ ఆసహనం వ్యక్తం చేశారన్నారు. పశ్చిమ బెంగాల్లో శాంతిభద్రతల భయంకర క్షీణతకు కారణమవుతున్న రాష్ట్ర ఉన్నతాధికార పోలీసులు వారి జవాబుదారీతనం నుండి తప్పించుకోలేరని' హితవు పలికారు. మరొక ట్వీట్లో పశ్చిమ బెంగాల్ డీజీపీ నిర్లక్ష్యపు వైఖరి బాధాకరమని, రాష్ట్రంలో జరిగే అక్రమాలు పట్టనట్టుగా చూస్తున్న డీజీపీ నిర్లక్ష్యపు వైఖరి నిజంగా ఆందోళన కలిగించే విషయమన్నారు. -
భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ
-
భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఉగ్ర దాడులకు కుట్రపన్నిన ఆల్‌ఖైదా ఆపరేటర్లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఎన్ఐఏ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఈ మేరకు శనివారం ఉదయం బెంగాల్, కేరళలో 11 మంది ఆల్‌ఖైదా ఆపరేటర్లను అరెస్ట్ చేసింది. కేరళ, బెంగాల్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాడికల్స్‌ను అధికారులు విచారిస్తున్నారు. దేశంలోని ముఖ్య పట్టణాల్లో భారీ విధ్వంసం సృష్టించేందుకు ఈ బృందం ప్రణాళికలు రచిస్తున్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. వీరి నుంచి మరింత సమచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. (తృటిలో తప్పిన పుల్వామా తరహా ఘటన!) కాగా శుక్రవారం నాడు కశ్మీర్‌లోని గుడీకల్ ప్రాంతంలో భారీ పేలుడు సామాగ్రీని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడి తరహాలోనే మరోసారి విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని బలగాలు భావిస్తున్నాయి. ఆ ప్రాంతంలో 125 గ్రాముల చొప్పున మొత్తం 416 ప్యాకెట్లలో పేలుడు పదార్థాలు లభించాయని ఆర్మీ వెల్లడించింది. మరిన్ని సోదాలు నిర్వహించగా మరో ట్యాంక్‌లో 50 డిటోనేటర్లు కనుగొన్నామని పేర్కొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో హోంశాఖ అధికారులు అప్రమ్తతమైయ్యారు. -
అల్ కాయిదా టాప్ లీడర్ రిమీ హతం
వాషింగ్టన్: యెమెన్‌లో అమెరికా భద్రతా దళాలు జరిపిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో అల్ కాయిదా ఇన్ అరేబియన్ పెనిన్సులా (ఏక్యూఏపీ) కీలక నేత ఖాసిం అల్ రిమీ (46) హతమ య్యాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ధ్రువీకరించారు. రిమీ మరణంతో అరేబియన్ ద్వీపకల్పంలో అల్‌కాయిదా మరింత బలహీనపడుతుందని, దీంతో జాతీయ భద్రతకు ఉగ్రవాద గ్రూపుల నుంచి ముప్పు తప్పుతుందని పేర్కొన్నారు. తన ఆదేశాల మేరకు యెమెన్‌లోని అమెరికా దళాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ జరిపినట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ ఆపరేషన్ ఎప్పుడు, ఎలా నిర్వహించారో వెల్లడించలేదు. రిమీ 1990 ల్లో అల్‌కాయిదాలో చేరాడని, అఫ్గానిస్తాన్‌లో ఒసామా బిన్ లాడెన్ కోసం పని చేశాడని ట్రంప్ తెలిపారు. రిమీ నేతృత్వంలో అల్‌కాయిదా ఇన్ అరేబియన్ పెనిన్సులా (ఏక్యూఏపీ) గ్రూపు యెమెన్‌లోని సాధారణ పౌరులపై హింసాకాండ జరిపిందని పేర్కొన్నారు. రిమీ మరణంతో అమెరికా ఆశలు, ఆశయాలు భద్రంగా ఉన్నాయన్నారు. అమెరికాకు హాని తలపెట్టాలని చూసే ఉగ్రవాదులను ఏరిపారేసి అమెరికన్ పౌరులను కాపాడుకుంటామన్నారు. కాగా, డిసెంబర్ 6న ఫ్లోరిడాలోని అమెరికా నావల్ బేస్‌లో జరిగిన కాల్పులకు రిమీ నేతృత్వంలోని గ్రూపు తమదే బాధ్యత అని ప్రకటించింది. ఈ ఘటనలో ఓ సౌదీ వాయుసేన అధికారి ముగ్గురు అమెరికా నావికులను చంపాడు. రిమీకి సంబంధించిన సమాచారం ఇచ్చినవారికి కోటి డాలర్లు (10 మిలియన్ డాలర్లు) ఇస్తామని అమెరికా గతంలో ప్రకటించింది. అల్‌కాయిదాకు అల్‌జవహరి వారసుడు రిమీ అనుకుంటారు. గత కొన్ని నెలల్లో అమెరికా చేపట్టిన మూడో పెద్ద ఆపరేషన్ ఇది. గతేడాది అక్టోబర్‌లో ఐసిస్ నేత బగ్దాదీని, ఈ ఏడాది జనవరిలో ఇరానియన్ జనరల్ సులేమానీని అమెరికా దళాలు హతం చేశాయి. -
అతడిని అంతమొందించాం: ట్రంప్
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఆల్- ఖైదా యెమెన్ చీఫ్ ఖాసీం ఆల్- రిమీని హతమార్చినట్లు అమెరికా తెలిపింది. తమ దేశ నావికా దళ అధికారులను బలి తీసుకున్నందుకు గానూ అతడిని మట్టుబెట్టినట్లు పేర్కొంది. యెమెన్‌లో హింసకు కారణమైన అత్యంత ప్రమాదకర వ్యక్తిని అంతమొందించినట్లు వెల్లడించింది. ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా ఆల్- ఖైదా ఇన్ అరేబియన్ పెనిసులా(ఏక్యూఏపీ) కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఈ ఆపరేషన్ నిర్వహించామని తెలిపింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరిట శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. యెమన్‌లో హింసకు పాల్పడి.. ఇక్కడ కూడా ‘‘రిమీ నేతృత్వంలో ఏక్యూఏపీ యెమెన్‌లో తీవ్ర హింస చెలరేగింది. ఎంతో మంది పౌరులను బలిగొన్నారు. ఇప్పుడు అమెరికా పౌరులు, అమెరికా బలగాలపై దాడులు చేసేందుకు ఆ సంస్థ ప్రణాళికలు రచించింది. అందుకే ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా యెమెన్‌లో చేపట్టిన ఆపరేషన్‌లో ఏక్యూఏపీ వ్యవస్థాపకుడు ఖాసీం ఆల్- రిమీని అంతమొందించాం. అతడి చావుతో ఏక్యూఏపీ, ఆల్- ఖైదా ఉద్యమం నీరుగారిపోతుంది. ఇలాంటి ఉగ్రసంస్థల వల్ల మా జాతీయ భద్రతకు భంగం వాటిల్లకుండా ఉంటుంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా గతేడాది డిసెంబరు 6న ఫ్లోరిడాలోని పెన్సాకోలా వద్ద ఉన్న నావల్ ఎయిర్ స్టేషన్‌పై ఓ సౌదీ అధికారి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా... ముగ్గురు అమెరికా సెయిలర్లు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఘటనకు బాధ్యత వహిస్తూ ఏక్యూఏపీ ముందుకువచ్చింది. ఇక ఈ ఘటనపై విచారణ జరిపిన ఎఫ్‌బీఐ.. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని మహ్మద్ అల్శమ్రానీగా గుర్తించింది. అతడు రాయల్ సౌదీ వైమానిక దళానికి చెందినవాడని, ప్రస్తుతం మహ్మద్ అమెరికాలో శిక్షణ పొందుతున్నాడని పేర్కొంది. మహ్మద్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాడని.. ‘‘నేను దుష్టులకు వ్యతిరేకం, అమెరికా ఓ దుష్టశక్తిగా అవతరించింది. కేవలం ముస్లింలకే కాకుండా, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలను ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని ద్వేషిస్తున్నాను’’ అంటూ ఆల్-ఖైదా వ్యవస్థాకుడు ఒసామా బిన్ లాడెన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ అనేక పోస్టులు పెట్టినట్లు గుర్తించింది. ఇదిలా ఉండగా.. మహ్మద్ చర్యను సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ తీవ్రంగా ఖండించారు. హేయమైన నేరానికి పాల్పడిన మహ్మద్ క్షమార్హుడు కాదని పేర్కొన్నారు. కాగా విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్న దాదాపు 5 వేల మంది సౌదీ బలగాల్లో దాదాపు 850 మంది అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నారు. చదవండి: అభిశంసన: ట్రంప్‌నకు భారీ ఊరట..! కాగా మధ్యప్రాచ్య దేశమైన యెమెన్‌పై ఆధిపత్యం సాధించేందుకు ఆల్-ఖైదా సహా పలు ఉగ్ర సంస్థలు ప్రయత్నిస్తుండగా.. అక్కడి ప్రభుత్వానికి సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. 2014లో మొదలైన ఈ యుద్ధంలో తిరుగుబాటుదారులకు ఇరాన్ సహకారం అందిస్తోంది. అంతర్యుద్ధం కారణంగా యెమెన్‌లో ఎంతో మంది పౌరులు దుర్మరణం పాలవుతున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా తినడానికి తిండిలేక చిన్నారులు ఎముకల గూడులా మారి ప్రాణాలు కోల్పోతున్నారు. -
అసెంబ్లీ ఎన్నికలు.. విధ్వంసానికి ఆల్‌ఖైదా ప్లాన్!
సాక్షి, న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో జరగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా కన్నేసిందే. ఎన్నికల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు ఆల్ ఖైదా రచిస్తోందని ఇంటిలిజెన్స్ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆల్ ఖైదా కమాండర్ జాకీర్ ముసాను పంజాబ్ సరిహద్దుల్లో భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. పంజాబ్- పాకిస్తాన్ సరిహద్దు నుంచి భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాది జాకీర్ ముసాను శనివారం బీఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. డిసెంబర్ 7న జరిగే రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అలర్లు సృష్టించేందుకు జాకీర్‌ను ఆల్ ఖైదా పంపిణి దూతగా నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని పంజాబ్, రాజస్తాన్ సరిహద్దుల్లో రక్షణ దళాన్ని అలర్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా సరిహద్దు రాష్ట్రాలైన రాజస్తాన్, పంజాబ్‌లు పాకిస్తాన్‌తో 1090 కి.మీ మెర సరిహద్దును పంచుకుంటున్నాయి. దీంతో సరిహద్దుల్లో హైలర్ట్ ప్రకటించినట్లు రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. -
‘అమెరికాకు పాకిస్తాన్ వెన్నుపోటు’
వాషింగ్టన్: తీవ్రవాదం అంతమొందించే విషయంలో అమెరికాకు పాకిస్తాన్ వెన్నుపోటు పొడించిందని యూఎస్ ఆర్మీ మాజీ కల్నల్ లారెన్స్ సెల్లిన్ ఆరోపించారు. తాలిబన్తోపాటు, ఇతర ఉగ్ర సంస్థలతో పాక్ వ్యవహరించే తీరు పలు అనుమానాలకు తావిస్తుందని ఆయన అన్నారు. అప్ఘనిస్తాన్, ఉత్తర ఇరాక్లలో యూఎస్ ఆర్మీ తరఫున పనిచేసిన సెల్లిన్ తన అభిప్రాయాలను ఓ అర్టికల్‌లో వెల్లడించారు. 2001లో అమెరికా అఫ్ఘనిస్తాన్‌పై దాడులు ప్రారంభించగానే పాక్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) తాలిబన్లకు ఆయుధాలను, పేలుడు పదార్థాలను సరాఫరా చేసిందని తెలిపారు. అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, అప్పటి ఐఎస్ఐ డైరక్టర్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అహ్మద్‌తో పాటు ఇతర ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారని.. ఆ సమావేశంలో తాలిబన్, అల్ఖైదాలకు వ్యతిరేకంగా యూఎస్ జరిపే దాడులకు సహాయం చేయరాదని నిర్ణయం తీసుకున్నట్టు సెల్లిన్ పేర్కొన్నారు. ఇలా 17ఏళ్ల నుంచి పాక్ కపట నాటకం ఆడుతూనే ఉందని విమర్శించారు. ఓ వైపు అమెరికా నుంచి బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం పొందుతూ.. మరోవైపు నెమ్మదిగా అఫ్ఘనిస్తాన్‌లో అమెరికా బలగాలను దెబ్బతీసేందుకు తాలిబన్, హకానీ నెట్వర్క్ గ్రూపులకు సహాయం చేసిందని మండిపడ్డారు. తాలిబన్ గాడ్ ఫాదర్‌గా పేరు గాంచిన పాక్ ఐఎస్ఐ మాజీ చీఫ్ హమీద్ గుల్, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏదో ఒక రోజు ఐఎస్ఐ, యూఎస్ సహాయంతో అఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ బలగాలను బయటకు పంపుతోందని, అలాగే యూఎస్ సహాయంతోనే యూఎస్‌ను అఫ్ఘనిస్తాన్ నుంచి పంపిచి వేస్తామని చేసిన వ్యాఖ్యలను సెల్లిన్ గుర్తుచేశారు. 2001కి ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆయన అన్నారు. ప్రస్తుతం తాలిబన్ బలగాలు పాక్‌లోనే తలదాచుకుంటున్నాయని.. వారికి కావాల్సిన రిక్రూట్మెంట్, ట్రైనింగ్ అంత అక్కడే జరుగుతోందని ఆయన తెలిపారు. ఐఎస్ఐ కూడా ఇందులో కీలక భూమిక పోషించడం బహిరంగ రహస్యమేనని పేర్కొన్నారు. అలాగే చైనా కూడా పాక్‌కు సలహాలు అందజేస్తుందని ఆయన ఆరోపించారు. -
అల్‌ఖైదా ఉగ్రదాడి..11 మంది సైనికుల మృతి
యెమెన్ : ఆర్మీ కాన్వాయ్‌పై అల్ ఖైదా తీవ్రవాదులు మెరుపుదాడి చేయడంతో 11 మంది యెమెన్ సైనికులు మృతిచెందారు. ఈ సంఘటన ఆగ్నేయ హంద్రామౌట్ ప్రావిన్స్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుందని భద్రతాబలగాల అధికారి తెలిపారు. చనిపోయిన సైనికుల్లో అందరూ కొత్తగా రిక్రూట్ అయిన వారే ఉన్నారని చెప్పారు. కొత్తగా నియామకమైన భద్రతా బలగాలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు, ప్రత్యేక భద్రతా బలగాలు కూడా యెమెన్‌లో సహకారం అందిస్తున్నాయి. వివిధ దిశల నుంచి ఒకేసారి కాల్పులు జరపడం వల్ల మృతుల సంఖ్య పెరిగిందని, అందువల్లే కాల్పులను సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోయామని ఓ అధికారి వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా అల్ ఖైదా ఇన్ అరేబియన్ పెనిన్సులా(ఏక్యూఏపీ), ఐసిస్‌తో పాటు పలు ఉగ్రవాద సంస్థలు ఆగ్నేయ ప్రాంతంలో చురుకుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా అల్ ఖైదా, ఐసిస్‌కు చెందిన వారు ఆత్మాహుతి దాడులకు కూడా దిగుతున్నారు. మానవతా సంక్షోభం ఎదుర్కొంటున్న మొదటి దేశంగా ఐక్యరాజ్యసమితి యెమెన్ దేశాన్ని ప్రకటించింది. కరువు, కలరా కారణంగా సుమారు 70 లక్షల మంది పౌరులు నిరాశ్రయులయ్యారు, మరో 2,000 మంది మృతిచెందారు. -
టార్చర్ చూపిస్తున్నారు: 9/11 నిందితుడు
వాషింగ్టన్: తనను మానసికంగా ఎంతగానో వేధిస్తున్నారంటూ 9/11 దాడుల నిందితుడు, ఫ్రాన్స్‌కు చెందిన జకారియస్ మౌసాయ్ ఆరోపించాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం తనను కొలరెడోలోని ఉన్నతస్థాయి సెక్యూరిటీ జైలులో ఉంచారని పేర్కొన్న నిందితుడు నాలుగు పేజీల ఫిర్యాదు లేఖను రాసినట్లు సమాచారం. గత డిసెంబర్లో రాసిన ఈ లేఖ ఇటీవల వెలుగుచూసింది. 'ట్రంప్ ప్రభుత్వం మానసిక వేదనకు గురి చేస్తోంది. నా బాధను బయటి ప్రపంచానికి చెప్పుకోవాలనుకుంటున్నా. లాయర్ ఏర్పాటు చేసుకునే వీలు కల్పిస్తే ఆయన ద్వారా 9/11 దాడుల గురించి కొన్ని నిజాలు చెప్పాలని భావిస్తున్నా. కానీ ట్రంప్ ప్రభుత్వం, అమెరికా జైళ్ల శాఖ అందుకు అనుమతించకుండా నన్ను చిత్ర హింసలు పెడుతోంది. గతంలోనూ దాఖలు చేసుకున్న అన్ని పిటిషన్లను తిరస్కరించిన కోర్టు.. చివరిగా 2006లో కేసు విచారణ తర్వాత నాకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. కానీ 2001 అల్‌ఖైదా ఉగ్రదాడికి సంబంధించి నిజాలు చెప్పేందుకు నాకు అవకాశం ఇవ్వాలంటూ' తన లేఖలో నిందితుడు, 20వ హైజాకర్ అయిన జకారియస్ మౌసాయ్ రాసుకొచ్చాడు. మరోవైపు తాజాగా అతడు రాసిన ఫిర్యాదు లేఖలో సౌదీ అరేబియాకు చెందిన రాజుల కుటుంబాలు ఉగ్రసంస్థ అల్‌ఖైదాకు ఆర్థిక సహకారం అందించాయని ఆరోపించాడు. కాగా, అమెరికా అధికారులు, సౌదీ రాజ వంశీయులు ఆ ఆరోపణల్ని తోసిపుచ్చారు. తాజా పిటిషన్లో తన పేరును 'అల్లాకు బానిస (స్లేవ్ ఆఫ్ అల్లా)' అని నిందితుడు జకారియస్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. విమానాలను హైజాక్ చేసి 2001, సెప్టెంబర్ 11న అమెరికాలోని ట్విన్ టవర్స్‌పై అల్‌ఖైదా ఉగ్రసంస్థ దాడికి పాల్పడ్డ ఘటనలో 3000కు పైగా ప్రజలు మృతిచెందిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల తర్వాత అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా బలగాలు మట్టుపెట్టి ప్రతీకారం తీర్చుకున్నాయి. విచారణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. -
‘అమెరికా గతాన్ని మర్చిపోయింది’
ఇస్లామాబాద్ : అమెరికాపై పాకిస్తాన్ ధిక్కార ధోరణిని ప్రదర్శిస్తోంది. అగ్రరాజ్యం బెదిరింపులు లొంగేది లేదని... పాక్ మరోసారి స్పష్టం చేసింది. మత స్వేచ్ఛ ఉల్లంఘనలు, ఉగ్రవాదం వంటి అంశాలపై అమెరికా చేసిన వ్యాఖ్యలపై పొరుగుదేశం ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. వాషింగ్టన్‌నుంచి వచ్చే ప్రతి ఆదేశాన్ని పాటించలేమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ ముహమ్మద్ ఫైజల్ స్పష్టం చేశారు. ఏకపక్షంగా డెడ్లైన్లను విధించడం, బెదిరింపులకు దిగడం వంటివి ఇరుదేశాల సంబధాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయని ఆయన చెప్పారు. పరస్పర గౌరవం, ఒకరిమీదొకరికి నమ్మకం, నిలకడ, ఓర్పు ఉన్నపుడే దౌత్యసంబంధాలు కొనసాగుతాయని.. అవి లేనప్పుడు బంధం కొనసాగడంలో అర్థం లేదని చెప్పారు. ఉగ్రవాదంపై యుద్ధంలో అమెరికాకు పాక్ సహకరించిందని.. మా దేశం ఎవరిమీద సమయం చేయలేదన్న విషయానని గుర్తుంచుకుని మాట్లాడాలన్నారు. అమెరికా భద్రత కోసం మేం ప్రయత్నించాము.. మా రక్షణ కోసం వాషింగ్టన్ చేసిన ప్రయత్నాలు ఏమీ లేవని ఆయన చెప్పారు. ఆల్‌ఖైదా సహా పలు ఉగ్రవాద సంస్థలను సమూలంగా నాశనం చేయడంతో మేం చేసిన సహాయాన్ని అమెరికా మర్చిపోయిందని ఆయన అన్నారు. మత స్వేచ్ఛకు ఇబ్బంది లేదు: మత స్వేచ్ఛ ఉల్లంఘనల విషయంలో అమెరికా పాకిస్థాన్‌ను ‘ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన జాబితా’లో చేర్చిన విషయం తెలిసిందే. దీనిపై డాక్టర్ ముహమ్మద్ ఫైజల్ అసహనం వ్యక్తం చేశారు. ఏఏ కారణాలతో పాకిస్తాన్‌ను ఈ జాబితాలో చేర్చారో చెప్పాలని ఆయన అన్నారు. మా దేశంలో మత స్వేచ్ఛ ఉంది.. అందువ్లలే అందరూ ఉండగలుగుతున్నారని చప్పారు. ఇదిలావుండగా.. మత స్వేచ్ఛ ఉల్లంఘనల అంశంలో 10దేశాలను అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్ ‘ప్రత్యేక ఆందోళనకర దేశాలు’గా హోదా మార్చారు. -
డ్రోన్ దాడిలో తీవ్రవాదులు హతం
ఎడెన్(యెమెన్): దక్షిణ యెమెన్‌లో అల్‌ఖైదా లక్ష్యంగా జరిగిన డ్రోన్ దాడిలో ఏడుగురు తీవ్రవాదులు హతమయ్యారు. యెమెన్‌పై డ్రోన్ దాడులు జరిపే సత్తా ఒక్క అమెరికా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. షాబా ప్రావిన్స్ నుంచి బేడా ప్రావిన్స్‌కు వెళ్లే మార్గంలో వెళ్తున్న మూడు వాహనాలపై అమెరికాకు చెందిన డ్రోన్ ఒకటి బాంబు దాడి చేసినట్లు తమకు సమాచారం ఉందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దాడిలో ఏడుగురు చనిపోయారని భావిస్తున్నారు. యెమెన్ కేంద్రంగా నడుస్తున్న అల్‌ఖైదా విభాగం ఈ ప్రాంతంలో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తోందని కొంతకాలంగా అమెరికా అనుమానిస్తోంది. ఈ తీవ్రవాదులకు సౌదీ అరేబియా మద్దతు ఇస్తూ స్థానిక హుతి రెబల్స్‌పై ఉసిగొలుపుతోంది. కానీ, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అల్‌ఖైదాపై అమెరికా డ్రోన్ దాడులు సాగిస్తోంది.