India vs Srilanka
-
Asia Cup Final: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్లు ఇవే..!
మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో ఇవాళ (జులై 28) భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక ఓ మార్పు చేయగా.. భారత్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. లంక జట్టులో అచిని కులసూర్య స్థానంలో సచిని నిసంసల తుది జట్టులోకి వచ్చింది. కాగా, సెమీఫైనల్లో భారత్.. బంగ్లాదేశ్‌పై, శ్రీలంక.. పాకిస్తాన్‌పై విజయాలు సాధించి ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే.తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమారి అటపట్టు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్‌కీపర్), హాసిని పెరీరా, సుగందిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసలభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్‌కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్ -
మీరు చూశారా? తీవ్ర అసహనానికి గురైన అయ్యర్.. అంత కోపమెందుకో?
ICC WC 2023- Ind vs SL- Shreyas Iyer: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. తన బ్యాటింగ్ తీరును ఉద్దేశించి ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో అయ్యర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఓపెనర్ శుబ్‌మన్ గిల్(92), వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(88) టీమిండియా భారీ స్కోరుకు పునాది వేయగా.. అయ్యర్ ఆ పని పూర్తి చేశాడు. వాంఖడేలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ నలువైపులా షాట్లు బాదుతూ చూడముచ్చటైన ఆటతో ఆకట్టుకున్నాడు. ముంబై మ్యాచ్‌లో మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న ఈ నాలుగో నంబర్ బ్యాటర్ 3 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో ఏకంగా 82 పరుగులు రాబట్టాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో తనదైన షాట్లు బాదుతూ సొంతమైదానంలో ప్రేక్షకులకు కనువిందు చేశాడు శ్రేయస్ అయ్యర్. View this post on Instagram A post shared by ICC (@icc) గత మ్యాచ్‌లో 4 పరుగులకే అవుటై తీవ్ర విమర్శలపాలైన అతడు గురువారం నాటి మ్యాచ్‌లో తిట్టిన నోళ్లతోనే ప్రశంసించేలా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో లంకపై ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన శ్రేయస్ అయ్యర్‌కు.. ‘‘ఈ వరల్డ్‌కప్ ఆరంభం నుంచి షార్ట్‌బాల్ ఎదుర్కోవడంలో మీరు ఇబ్బంది పడుతున్నారు కదా?’’ అని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. ప్రాబ్లం అంటే అర్థం ఏమిటి? ఈ ప్రశ్నను మధ్యలోనే కట్‌చేసిన అయ్యర్.. ‘‘షార్ట్‌బాల్స్ ఎదుర్కోవడం ప్రాబ్లం అంటే అర్థం ఏమిటి? ’’ అని ఎదురు ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా.. అది సమస్య అని చెప్పడం లేదు కాదు.. ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నా అని సదరు జర్నలిస్టు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) మీరు చూశారా? ఎందుకీ ప్రచారం? దీంతో తీవ్ర అసహనానికి గురైన అయ్యర్.. ‘‘నేను ఎన్నిసార్లు పుల్‌షాట్లు ఆడాను.. ముఖ్యంగా ఆ తరహాలో ఎన్ని ఫోర్లు కొట్టాను మీరు చూశారా? బంతిని బాదాలని ఫిక్స్ అయితే.. అది షార్ట్బాలా లేక ఇంకేదైనానా అని చూడను. హిట్ చేయాలనుకుంటే చేస్తానంటే.. ఆ క్రమంలో ఓ రెండు మూడుసార్లు నేను బౌల్డ్ అయితే.. ఇక అప్పటి నుంచి.. ‘‘ఇతడు ఇన్‌స్వింగింగ్ బాల్ ఆడలేడు.. కట్ షాట్ ఆడలేడు..’’ అంటూ ప్రచారాలు మొదలుపెడతారా? ఆటగాళ్లుగా పరిస్థితులను బట్టి ఎప్పుడు ఎలా ఆడాలో మాకు తెలుసు. కానీ మీరు ఇలా.. ‘‘అయ్యర్ షార్ట్ బాల్ ఆడలేడు’’ అంటూ ఇష్టారీతిన మీకు నచ్చినట్లు రాసేస్తారు. మిమ్మల్ని చూసి మరికొంత మంది ఇలాగే మాట్లాడతారు’’ అని కౌంటర్ ఇచ్చాడు. నిజమే కదా! నిజానికి అయ్యర్ షార్ట్ బంతులను ఎదుర్కోవడంలో గతంలో చాలాసార్లు విఫలమయ్యాడు. అయితే, వాంఖడేలో లంకతో మ్యాచ్‌లో మాత్రం షార్ట్ బంతులను కూడా షాట్లుగా మలిచాడు. ఈ నేపథ్యంలో తన ఆట తీరును సమర్థించుకున్న శ్రేయస్ అయ్యర్.. ఇకపై ఇలాంటి ప్రచారాలు మానేయాలంటూ మీడియాకు విజ్ఞప్తి చేశాడు. మీకు ఇబ్బంది.. నాకు కాదు ‘‘షార్ట్ బాల్స్ ఆడే క్రమంలో కొన్నిసార్లు అవుటైన కారణంగా మీరలా భావిస్తున్నారే తప్ప.. నాకు మాత్రం పెద్దగా ఇబ్బంది లేదు’’ అని పేర్కొన్నాడు. అయితే, అయ్యర్ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు.. ‘వాస్తవాలు మాట్లాడితే అంత కోపమెందుకు అయ్యర్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో లంకను 302 పరుగుల తేడాతో చిత్తు చేసి టీమిండియా సెమీస్ చేరిన విషయం తెలిసిందే. చదవండి: అధికారికంగా అర్హత సాధించాం.. అతడు అద్భుతం.. వాళ్ల వల్లే ఇలా: రోహిత్ శర్మ View this post on Instagram A post shared by ICC (@icc) -
Asian Games 2023: బోణీలోనే బంగారం
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో గతంలో రెండుసార్లు (2010, 2014) మాత్రమే క్రికెట్ క్రీడాంశంగా ఉంది. అయితే ఆ రెండుసార్లూ భారత క్రికెట్ జట్లు బరిలోకి దిగలేదు. దాంతో మహిళల విభాగంలో పాకిస్తాన్ రెండుసార్లు స్వర్ణం సాధించగా... పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ (2010), శ్రీలంక (2014) ఒక్కోసారి బంగారు పతకం గెల్చుకున్నాయి. మూడోసారి మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మనసు మార్చుకొని ఆసియా క్రీడల్లో భారత జట్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ భారత మహిళల జట్టు బరిలోకి దిగిన తొలిసారే బంగారు పతకాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు చాంపియన్‌గా అవతరించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంకతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో గెలిచింది. రెండు మ్యాచ్‌ల నిషేధం ముగియడంతో ఫైనల్లో రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సారథ్యంలో భారత్ పోటీపడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించింది. స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బారెడ్డి అనూష సభ్యురాలిగా ఉంది. అయితే ఆమెకు మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. టిటాస్ సాధు కట్టడి... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (45 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 42; 5 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. భారత టీనేజ్ పేస్ బౌలర్ టిటాస్ సాధు 4 ఓవర్లలో 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ తీసింది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టుకు కాంస్య పతకం లభించింది. కాంస్య పతక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) ప్రబోధని (బి) రణవీర 46; షఫాలీ వర్మ (స్టంప్డ్) సంజీవని (బి) సుగంధిక 9; జెమీమా (సి) విష్మీ (బి) ప్రబోధని 42; రిచా ఘోష్ (సి) సంజీవని (బి) రణవీర 9; హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) సంజీవని (బి) ప్రబోధని 2; పూజ వస్త్రకర్ (సి) విష్మీ (బి) సుగంధిక 2; దీప్తి శర్మ (నాటౌట్) 1; అమన్‌జోత్ కౌర్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 116. వికెట్ల పతనం: 1–16, 2–89, 3–102, 4–105, 5–108, 6–114, 7–116. బౌలింగ్: ఒషాది 2–0–11–0, ఉదేశిక ప్రబోధని 3–0–16–2, ఇనోషి 3–1–11–0, సుగంధిక 4–0–30–2, చమరి ఆటపట్టు 2.5–0–19–0, కవిశ 1.1–0–7–0, ఇనోక రణవీర 4–0–21–2. శ్రీలంక ఇన్నింగ్స్: చమరి ఆటపట్టు (సి) దీప్తి (బి) టిటాస్ సాధు 12; అనుష్క సంజీవని (సి) హర్మన్ (బి) టిటాస్ సాధు 1; విష్మీ (బి) టిటాస్ సాధు 0; హాసిని పెరీరా (సి) పూజ (బి) రాజేశ్వరి 25; నీలాక్షి (బి) పూజ 23; ఒషాది (సి) టిటాస్ సాధు (బి) దీప్తి 19; కవిశ (సి) రిచా (బి) దేవిక 5; సుగంధిక (స్టంప్డ్) రిచా (బి) రాజేశ్వరి 5; ఇనోషి (నాటౌట్) 1; ఉదేశిక ప్రబోధని (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–14, 4–50, 5–78, 6–86, 7–92, 8–96. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–25–1, పూజ 4–1–20–1, టిటాస్ సాధు 4–1–6–3, రాజేశ్వరి 3–0–20–2, అమన్‌జోత్ కౌర్ 1–0–6–0, దేవిక వైద్య 4–0–15–1. ఆసియా క్రీడల్లో సోమవారం భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జాతీయ గీతం రెండుసార్లు మోగింది. షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో... మహిళల క్రికెట్లో టీమిండియా స్వర్ణ పతకాలతో సత్తా చాటుకుంది. భారత్‌కు షూటింగ్‌లోనే రెండు కాంస్యాలు, రోయింగ్‌లో మరో రెండు కాంస్యాలు లభించాయి. ఓవరాల్‌గా రెండోరోజు భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి. ఈ మూడు క్రీడాంశాల్లో మినహా ఇతర ఈవెంట్స్‌లో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. క్రికెట్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ సొంతం
ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్ ఈవెంట్లో టీమిండియా మొట్టమొదటి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో ఇవాళ (సెప్టెంబర్ 25) జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వర్ణం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన శ్రీలంక లక్ష్యానికి 20 పరుగుల దూరంలో నిలిచిపోయి రజతంతో సరిపెట్టుకుంది. INDIA Women's Cricket Team wins 𝐆𝐎𝐋𝐃 at the 𝐀𝐬𝐢𝐚𝐧 𝐆𝐚𝐦𝐞𝐬 𝟐𝟎𝟐𝟑🥇 pic.twitter.com/o4NPpbqFix — CricTracker (@Cricketracker) September 25, 2023 కాంస్య పతకం కోసం ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇవాళ ఇది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్ తొలి స్వర్ణం కైవసం చేసుకుంది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ ,ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్లతో కూడిన జట్టు భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది. India women's team defeated Sri Lanka in the Asian Games 2023 final by 19 runs and clinched the Gold medal for the first time.🥇 pic.twitter.com/5Uf3CP1H9Q — CricTracker (@Cricketracker) September 25, 2023 -
'అతడు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్.. చాలా గర్వంగా ఉంది'
ఆసియాకప్-2023ను రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో శ్రీలంకను 10వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. 8వ సారి ఆసియా విజేతగా నిలిచింది. కాగా ఈ టోర్నీలో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో 6 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 302 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో విఫలమైన గిల్.. ఆ తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. కాగా గిల్ ఒక్క టోర్నీలో మాత్రమే కాకుండా అంతకుముందు విండీస్ సిరీస్‌లో కూడా అద్భుతంగా రాణించాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్ 68.33 సగటుతో 1025 పరగులు చేశాడు. ఈ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్‌పై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. గిల్‌ను ఫ్యూచర్ ఆఫ్ భారత్ క్రికెట్ అని కపిల్ దేవ్ అభివర్ణించాడు. "శుబ్‌మన్ గిల్ ఒక అద్భుతం. అతడు భారత్ క్రికెట్ భవిష్యతు. ఈ యువ క్రికెటర్ కచ్చితంగా భారత క్రికెట్‌ను అత్యున్నత స్ధాయికి తీసుకువెళ్తాడు. ఇండియాలో ఇటువంటి అద్భుతమైన ఆటగాడు ఉన్నందుకు చాలా గర్వంగా ఉందంటూ" పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌దేవ్ పేర్కొన్నాడు. చదవండి: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. అశ్విన్ రీఎంట్రీ -
Asia Cup 2023 Final: వన్డే క్రికెట్లో అతి భారీ విజయం
ఓ వన్డే క్రికెట్ టోర్నీ ఫైనల్లో టీమిండియా బంతుల పరంగా అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన 2023 ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు ఈ ఘనతను సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 263 పరుగులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి, వన్డే క్రికెట్ టోర్నీ ఫైనల్స్ చరిత్రలో అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2003 వీబీ సిరీస్ ఫైనల్లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ నిర్ధేశించిన 118 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా మరో 226 బంతులు మిగిలుండగానే ఛేదించింది. టీమిండియాకు అతి భారీ విజయం.. వన్డే క్రికెట్లో టీమిండియా బంతుల పరంగా అతి భారీ విజయాన్ని సాధించింది. శ్రీలంకతో జరిగిన ఇవాల్టి మ్యాచ్‌లో భారత్ 263 బంతులు మిగిలుండగానే, వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌కు ముందు బంతుల పరంగా టీమిండియాకు అతి భారీ విజయం 2001లో కెన్యాపై దక్కింది. నాటి మ్యాచ్‌లో భారత్ 231 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. వన్డే టోర్నీ ఫైనల్స్‌లో మూడవది.. ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. ఓ వన్డే టోర్నీ ఫైనల్స్‌లో ఈ ఘనత (10 వికెట్ల తేడాతో విజయం) మూడో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఓ వన్డే టోర్నీ (కోకో కోలా కప్) ఫైనల్స్‌లో 1998లో భారత్ తొలిసారి 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాటి ఫైనల్స్ భారత్.. జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2003 వీబీ సిరీస్ ఫైనల్లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. కేవలం 129 బంతుల్లో మ్యాచ్ ముగిసింది.. భారత్-శ్రీలంక మధ్య జరిగిన ఆసియాకప్ 2023 ఫైనల్స్ బంతుల పరంగా మూడో అతి చిన్న మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్ కేవలం 129 బంతుల్లో (రెండు ఇన్నింగ్స్) ముగిసింది. శ్రీలంక 15.2 ఓవర్లు.. భారత్ 6.1 ఓవర్లు బ్యాటింగ్ చేశాయి. బంతుల పరంగా అతి చిన్న మ్యాచ్ 2020లో నేపాల్-యూఎస్ఏ మధ్య జరిగింది. ఆ మ్యాచ్ కేవలం 104 బంతుల్లో ముగిసింది. ఇదిలా ఉంటే, 2023 ఆసియా కప్ టైటిల్‌ను భారత్ ఎనిమిదో సారి ఎగరేసుకుపోయింది. ఇవాళ జరిగిన ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్‌మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
Asia Cup 2023 IND VS SL: చరిత్ర సృష్టించిన లంక యువ స్పిన్నర్
20 ఏళ్ల శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే చరిత్ర సృష్టించాడు. లంక తరఫున వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 12) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో దునిత్ ఈ ఘనత సాధించాడు. దునిత్ 20 ఏళ్ల 246 రోజుల్లో ఈ ఘనత సాధించగా.. దీనికి ముందు ఈ రికార్డు చరిత బుద్ధిక పేరిట ఉండేది. బుద్ధిక 2001లో జింబాబ్వేపై 21 ఏళ్ల 65 రోజుల వయసులో 5 వికెట్ల ఘనత సాధించాడు. ఇతనికి ముందు తిసార పెరీరా (21 ఏళ్ల 141 రోజులు), ఉవైస్ కర్నైన్ (21 ఏళ్ల 233 రోజులు) లంక తరఫున పిన్న వయసులో ఐదు వికెట్ల ఘనత సాధించిన వారిలో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో దునిత్ (10-1-40-5) ఐదు వికెట్ల ఘనత సాధించి, టీమిండియా టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ఇతన్ని ఎదుర్కొనేందుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. దునిత్ సంధించిన బంతులకు సమాధానం లేక విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి వారే చేతులెత్తేశారు. యువ కెరటం శుభ్‌మన్ గిల్, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా వెల్లలగే మాయాజాలానికి చిక్క వికెట్లు సమర్పించుకున్నారు. బ్యాటింగ్ హేమహేమీలైన రోహిత్, గిల్, విరాట్, రాహుల్, హార్దిక్‌లను అంతుచిక్కని బంతులు వేసి ఔట్ చేసిన వెల్లలగేపై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో ప్రశంసల వర్షం కురుస్తుంది. దునిత్‌కు మరో స్పిన్నర్ మహీష్ తీక్షణ (8-0-29-4) కూడా తోడవ్వడంతో భారత్ 47 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో వర్షం ప్రారంభంకావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. రోహిత్ శర్మ (53), ఇషాన్ కిషన్ (33), కేఎల్ రాహుల్ (39), శుభ్‌మన్ గిల్ (19), విరాట్ కోహ్లి (3), హార్దిక్ (5), జడేజా (4), బుమ్రా (5), కుల్దీప్ (0) ఔట్ కాగా.. అక్షర్ (15), సిరాజ్ (2) క్రీజ్‌లో ఉన్నారు. -
Asia Cup 2023: లంకేయుల జైత్రయాత్రకు టీమిండియా అడ్డుకట్ట వేస్తుందా..?
వన్డేల్లో వరుసగా 13 విజయాలు సాధించి జోరుమీదున్న శ్రీలంకకు టీమిండియా అడ్డుకట్ట వేస్తుందా అన్న ప్రశ్నపై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ సాగుతుంది. టీమిండియా తాజా ఫామ్‌ను పరిగణలోకి తీసుకుని మెజార్టీ శాతం లంకేయుల జైత్రయాత్రకు బ్రేక్ పడటం ఖాయమని ధీమాగా చెబుతున్నారు. కొందరేమో లంకేయులు హోమ్ అడ్వాంటేజ్ తీసుకుని టీమిండియాకు షాకిస్తుందని అంటుంటే, మరికొందరు శ్రీలంకకు అంత సీన్ లేదని ఆ జట్టును తేలిగ్గా తీసిపారేస్తున్నారు. మరి ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. Can Sri Lanka continue their winning streak against India?#INDvSL pic.twitter.com/wcUfm1yRxJ— CricTracker (@Cricketracker) September 12, 2023 పై పేర్కొన్న అంశంపై మెజార్టీ శాతం అభిప్రాయం మేరకు టీమిండియాకే విజయావకాశాలు అధికంగా ఉన్నప్పటకీ, ఒక్క విషయంలో మాత్రం లంకేయుల విన్నింగ్ ఛాన్సస్ను కొట్టిపారేయడానికి వీళ్లేదు. ఆ విషయం ఏంటంటే.. టీమిండియా ఎంతటి ఫామ్‌లో ఉన్నా, గంటల వ్యవధిలో బరిలోకి దిగాల్సి రావడం (నిన్ననే పాక్‌తో మ్యాచ్) ఆ జట్టుకు పెద్ద ప్రతికూలాంశంగా మారింది. ఎంతటి మేటి జట్టైనా ఇలా గ్యాప్ లేకుండా క్రికెట్ ఆడితే సత్ఫలితాలు రావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైపెచ్చు శ్రీలంకకు హోమ్ అడ్వాంటేజ్ ఉండనే ఉంది. దీనికి తోడు ఆ జట్టు ఇటీవలికాలంలో అద్భుతమైన క్రికెట్ ఆడుతుంది. ప్రస్తుత మ్యాచ్‌లోనూ వారు టీమిండియా టాప్-3 బ్యాటర్లను కేవలం 11 పరుగుల వ్యవధిలో పెవిలియన్‌కు పంపారు. యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే (4-1-10-3) భారత టాపార్డర్‌కు చుక్కలు చూపించాడు. ఇన్ని ప్రతికూలతల నడుమ భారత్ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (53), శుభ్‌మన్ గిల్ (19), విరాట్ కోహ్లి (3) ఔట్ కాగా.. ఇషాన్ కిషన్ (11), కేఎల్ రాహుల్ (7) క్రీజ్‌లో ఉన్నారు. -
వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లి.. టాప్-5లోకి ఎంట్రీ
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అదరగొట్టాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లి.. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 283 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. సిరీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రాబోయే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లి అద్భుతంగా రాణిస్తే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్ డికాక్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్‌ను వెనుక్కి నెట్టి రెండో ర్యాంక్‌కు చేరే అవకాశం ఉంది. టాప్ ర్యాంక్‌లో 887 పాయింట్లతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కొనసాగుతున్నాడు. కాగా కోహ్లి ఖాతాలో ప్రస్తుతం 750 రేటింగ్ ఉంది. విరాట్ ఇదే ఫామ్‌ను మరో ఏడాది పాటు కొనసాగిస్తే బాబర్‌ను అధిగమించడం పెద్ద విషయం ఏమీ కాదు. మరోవైపు మహ్మద్ సిరాజ్ కూడా బౌలర్ల ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌ను సిరాజ్ సాధించాడు. శ్రీలంకపై అద్భుత ప్రదర్శన కనబరిచిన సిరాజ్.. మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. చదవండి: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి టీమిండియా కీలక పేసర్‌గా! ఆ ఒక్క లోటు తప్ప! కెప్టెన్ మాటలు వింటే.. -
మా సంజూ ఎక్కడ? ఇదిగో ఇక్కడ .. శభాష్ సూర్య! వీడియో వైరల్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను తన సొంత రాష్ట్రం కేరళలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేరళలో మ్యాచ్ జరిగిందింటే చాలు సంజూ జట్టులో లేకపోయినా అభిమానుల సందడి మాములుగా ఉండదు. తాజాగా మరోసారి సంజూ అభిమానులు అతడిపై ప్రేమను చాటుకున్నారు. భారత్-శ్రీలంక మధ్య మూడో వన్డే తిరువనంతపురం వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టేడియమంతా సంజూ పేరుతో మార్మోగిపోయింది. ఈ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ను.. మా సంజూ ఎక్కడ? అని అభిమానులు ప్రశ్నించారు. ఈ క్రమంలో సూర్యకుమార్ తన సమాధానంతో అభిమానుల మనసును గెలుచుకున్నాడు. సంజూ మా గుండెల్లో ఉన్నాడంటూ సూర్య సైగ చేశాడు. దీంతో ఒక్క సారిగా అభిమానుల కేకలతో స్టేడియం దద్దరిల్లపోయింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు శాంసన్ భారత జట్టులో చోటుదక్కించుకున్నాడు. అయితే ముంబై వేదికగా తొలి టీ20లో గాయపడిన సంజూ.. సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అనంతరం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఈ కేరళ ఆటగాడికి జట్టు దక్కలేదు. అయితే సంజూను ఎందుకు ఎంపిక చేయలేదన్న సృష్టత బీసీసీఐ ఇవ్వలేదు. కాగా సంజూ ఇంకా మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: Ind Vs SL 3rd ODI: టీమిండియా ప్రపంచ రికార్డుతో పాటు.. ఈ ఘనతలు కూడా! ఆసీస్‌ను దాటేసి.. "Where is Sanju?" and Surya replied "He is in our heart". 😍#SanjuSamson 🤝#SuryakumarYadav pic.twitter.com/CZ3vuDWQRK — Heart Broken 💔 (@Sachin_Gandhi7) January 16, 2023 -
IND vs NZ: హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు.. ఫోటోలు వైరల్
శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఘనంగా ముగించిన టీమిండియా.. ఇప్పుడు మరో కీలకపోరుకు సిద్దమైంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో భారత్ తలపడనుంది. తొలుత వన్డే సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా జనవరి18(బుధవారం)న జరగనుంది. ఈ క్రమంలో భారత జట్టు సోమవారం హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇక రోహిత్ సేన మంగళవారం మధ్యాహ్నం తమ తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. ఇక ఇప్పటికే బాగ్యనగరానికి చేరుకున్న ప్రత్యర్ధి న్యూజిలాండ్ జట్టు ప్రాక్టీస్‌లో మునిగితేలుతుంది. కాగా ఈ సిరీస్‌కు కివీస్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ చాహల్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ వన్డే జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, హెన్రీ సో షిప్లీ చదవండి: IND vs SL: తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు! Virat Kohli Has Arrived In Hyderabad Ahead Of The ODI Series Against NZ.#ViratKohli #INDvNZ @imVkohli pic.twitter.com/RXZuQrbuCu — virat_kohli_18_club (@KohliSensation) January 16, 2023 -
సెంచరీలు మరిగిన 'కోహ్లి' పులి వేట మొదలైంది.. ప్రతి 4-7 రోజులకోసారి వెటాడ్తది..!
Wasim Jaffer On Virat Kohli: తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విధ్వంసకర శతకం బాదిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్న వేల భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ చేసిన కొన్ని ఆసక్తికర ట్వీట్లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వన్డేల్లో 46వ శతకాన్ని, ఓవరాల్‌గా 74వ అంతర్జాతీయ సెంచరీ పూర్తి చేసుకుని, పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లిని ఉద్దేశిస్తూ జాఫర్ ఈ రకంగా ట్వీటాడు. "Tiger hunts every 4-7 days". Must be true as it's been 4 days since this knock 😉 #INDvSL https://t.co/OzhCRl7sGz — Wasim Jaffer (@WasimJaffer14) January 15, 2023 సెంచరీలు మరిగిన 'కోహ్లి' పులి వేట మొదలైంది, ఈ ఏడాది ఈ పులి వేట పెద్ద ఎత్తున సాగుతుంది.. పులి ఏరకంగా అయితే ప్రతి 4-7 రోజులకోసారి వేటాడ్తదో, కోహ్లి కూడా అదే గ్యాప్‌లో తన సెంచరీల దాహాన్ని తీర్చుకుంటాడు.. బహుపరాక్ అని అర్ధం వచ్చేలా జాఫర్ తన ట్వీట్ల ద్వారా ప్రత్యర్ధులను హెచ్చరించాడు. ఈ ట్వీట్లకు కోహ్లి ఫ్యాన్స్ తెగ లైకులు కొడుతూ, కోహ్లి-పులి కామెంట్స్‌ను ఆస్వాధిస్తున్నారు. కాగా, మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన కెరీర్లో 71వ అంతర్జాతీయ సెంచరీ (టీ20 ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్పై) పూర్తి చేసిన కోహ్లి, ఆ తర్వాత మూడు నెలల విరామం తర్వాత బంగ్లాదేశ్‌పై వన్డే సెంచరీ, ఆతర్వాత మూడు వారాల బ్రేక్‌లో శ్రీలంకపై తొలి వన్డేలో సెంచరీ, ఆతర్వాత నాలుగు రోజుల గ్యాప్‌లో మరో సెంచరీ సాధించాడు. మొత్తంగా మూడేళ్ల తర్వాత మునుపటి ఫామ్‌ను అందుకున్న కింగ్ కోహ్లి.. గత 4 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు చేసి, కోహ్లి ఈజ్ బ్యాక్ అని చాటుకున్నాడు. కోహ్లి ప్రస్తుత ఫామ్ చూస్తే.. జనవరి 18 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభంకాబోయే వన్డే సిరీస్‌లోనూ సెంచరీల మోత మోగడం ఖాయమని అర్ధమవుతుంది. -
సంక్రాంతి అంటే కోహ్లికి పూనకాలే.. పండగ రోజు కింగ్ ఎన్ని శతకాలు కొట్టాడంటే..?
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విధ్వంసకర శతకంతో చెలరేగిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (110 బంతుల్లో 166 నాటౌట్; 13 ఫోర్లు, 8 సిక్సర్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు పలు అరుదైన రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. కింగ్ బద్దలు కొట్టిన అరుదైన రికార్డుల జాబితాలో ఓ అసాధారణ రికార్డు దాగి ఉందన్న విషయం మనలో చాలామంది గమనించి ఉండరు. Virat Kohli on 15th January:- In 2017 - 122(102) vs ENG in ODIs. In 2018 - 153(217) vs SA in Tests. In 2019 - 104(112) vs AUS in ODIs. In 2023 - 166*(110) vs SL in ODIs. pic.twitter.com/1e9qG6KoYW — CricketMAN2 (@ImTanujSingh) January 15, 2023 అదేంటంటే.. కింగ్ కోహ్లికి సంక్రాంతి పండుగ వచ్చిందంటే పూనకం వస్తుంది. ఈ పర్వదినాన (జనవరి 15) కోహ్లి ఏకంగా 4 సెంచరీలు బాదాడు. 2017 సంక్రాంతి రోజున ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో 102 బంతుల్లో 122 పరుగులు చేసిన కోహ్లి.. 2018 సంక్రాంతికి సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్‌లో 217 బంతుల్లో 153 పరుగులు చేశాడు. Declare 15th January as "Virat Kohli Day"@imVkohli pic.twitter.com/DVHA476m5E — Pratham. (@75thHundredWhen) January 15, 2023 2019 సంక్రాంతికి ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 112 బంతుల్లో 104 పరుగులు చేసిన కింగ్.. మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ 2023 సంక్రాంతికి సెంచరీ బాది సంక్రాంతి తనకెంత అచ్చొచ్చిన పండగో మరోసారి చాటాడు. యాదృచ్చికంగా చోటు చేసుకున్న ఈ పరిమాణాలను ఓ అభిమాని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరలవుతోంది. A good day on the field and it was wonderful to watch @ShubmanGill & @imVkohli bhai bat today. Congratulations on your 100s and thanks to the almighty for giving me this opportunity to contribute in team’s biggest win. Shukar 🙏🇮🇳 @BCCI pic.twitter.com/ZDAVMRL250 — Mohammed Siraj (@mdsirajofficial) January 15, 2023 సంక్రాంతి రోజు కోహ్లి శతక్కొట్టుడు గణాంకాలను చూసిన అభిమానులు జనవరి 15ను 'విరాట్ కోహ్లి డే' గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. వేదిక ఏదైనా.. ప్రత్యర్ధి ఎవరైనా.. సంక్రాంతి రోజు మ్యాచ్ ఉందంటే కింగ్‌కు పూనకం వస్తుంది.. ఈ రోజు ప్రత్యర్ధులు ఎంతటి వారైనా జాగ్రత్తగా ఉండాలని కోహ్లి ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. Milestone of Virat Kohli today: 46th ODI Hundreds. 74th International Hundred. Most Hundreds in 2023. His 2nd highest score in ODIs. 10th ODI Hundred vs SL, first ever. Highest ever score in Greenfield. Most Sixes in an innings in his ODI career. 2nd Hundred in this series. pic.twitter.com/mES2axrI9N — CricketMAN2 (@ImTanujSingh) January 15, 2023 కాగా, లంకపై సూపర్ సెంచరీతో పలు రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లి.. కెరీర్లో 46వ వన్డే శతకాన్ని, ఓవరాల్‌గా 74వ అంతర్జాతీయ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అలాగే ఈ సెంచరీతో శ్రీలంకపై 10వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి.. ఓ ప్రత్యర్ధిపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి ఈ సెంచరీ సాధించే క్రమంలో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే(12,650)ను వెనక్కు నెట్టి ఐదో స్థానానికి ఎగబాకాడు. ఇదిలా ఉంటే, లంకతో మూడో వన్డేలో కోహ్లి విధ్వంసకర శతకంతో పాటు శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక.. సిరాజ్ (4/32), షమీ (2/20), కుల్దీప్ (2/16) ధాటికి 73 పరుగులకే ఆలౌటై, 317 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే భారీ విజయం. -
సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లి బ్రేక్ చేస్తాడు: సునీల్ గవాస్కర్
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దుమ్మురేపుతున్నాడు. వరుసగా సెంచరీల మోత మోగిస్తున్నాడు. తాజాగా తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో మరో అద్భుతమైన శతకంతో విరాట్ చెలరేగాడు. అతడి గత నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు ఉండడం గమానార్హం. కాగా కింగ్ కోహ్లికి ఇది 46వ వన్డే సెంచరీ. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(49) అత్యధిక వన్డే సెంచరీల రికార్డుకు విరాట్ మరింత చేరువయ్యాడు. మరో నాలుగు సెంచరీలు ఈ రన్‌మిషన్ సాధిస్తే ప్రపంచ వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లి ఎప్పుడు బ్రేక్ చేస్తాడనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌కు ముందు సచిన్ వన్డే సెంచరీల రికార్డును కింగ్ కోహ్లి బ్రేక్ చేస్తాడని గవాస్కర్ జోస్యం చెప్పాడు. అదే విధంగా విరాట్ మరో 5-6 ఏళ్లు ఆడితే సచిన్ 100 సెంచరీల రికార్డును బద్దల కొట్టగలడని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు. "విరాట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌కు ముందు భారత జట్టు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో మూడేసి వన్డేలు ఆడనుంది. ప్రస్తుతం సచిన్ రికార్డును బ్రేక్ చేయడానికి కావల్సిన సెంచరీలు కేవలం మూడు మాత్రమే. కాబట్టి ఐపీఎల్‌కు ముందు సచిన్ వన్డే సెంచరీల రికార్డును కోహ్లి బద్దలు కొడతాడని నేను భావిస్తున్నాను. కోహ్లి విశ్రాంతి తీసుకుని వచ్చినప్పటి నుంచి అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో సచిన్ పలు రికార్డులను కోహ్లి బ్రేక్ చేస్తడనడంలో ఎటువంటి సందేహం లేదని" గవాస్కర్ పేర్కొన్నాడు. అదేవిధంగా సచిన్ 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డు గురించి సన్నీ మాట్లాడుతూ.. ఒక వేళ కోహ్లి మరో 5-6 ఏళ్ల పాటు క్రికెట్ ఆడితే కచ్చితంగా సచిన 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడు సగటున సంవత్సరానికి సెంచరీలు చేసినా సచిన్‌ను ఈజీగా అధిగమిస్తాడు. అతడు తన వయస్సు 40 ఏళ్ల వచ్చే వరకు ఆడితే వచ్చే 5-6 సంవత్సరాలలో మరో 26 సెంచరీలు సాధించగలడు. సచిన్ కూడా 40 ఏళ్ల వరకు క్రికెట్ ఆడాడు. కోహ్లికి కూడా అద్భుతమైన ఫిట్నెస్ ఉంది. కాబట్టి విరాట్ సచిన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది అని అతడు అన్నాడు. చదవండి: Virat Kohli: అరుదైన ఘనతకు చేరువలో! రికార్డుల కోసం వెంపర్లాడేవాడిని కాదు.. అయితే! -
శ్రేయస్ అయ్యర్ సూపర్ బౌలింగ్.. కోహ్లి షాకింగ్ రియాక్షన్! వీడియో వైరల్
శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సరికొత్త అవతారమెత్తాడు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసిన అయ్యర్ అందరిని ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 18 ఓవర్ వేసేందుకు బంతిని కెప్టెన్ రోహిత్ శర్మ అయ్యర్ చేతికి అందించాడు. ఈ క్రమంలో వేసిన తొలి బంతినే అయ్యర్ అద్భుతంగా టర్న్ చేశాడు. అయితే స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్.. అయ్యర్ వేసిన బంతిని చూసి షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా ఒక్క ఓవర్ మాత్రమే వేసిన అయ్యర్ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో లంకపై 317 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన భారత్.. సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. కాగా ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇక శ్రీలంకతో వన్డే సిరీస్‌ను విజయంతో ముగించిన భారత్.. తమ తదుపరి పోరులో న్యూజిలాండ్‌తో తలపడనుంది. జనవరి 18న హైదరాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది. చదవండి: సిరాజ్ లాంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు: రోహిత్ శర్మ Shreyas Iyer's bowling spin and Virat Kohli were surprised that it turned so much😂. PS- He bowls both legs and off-spin#INDvSL #ViratKohli𓃵 #ShreyasIyer pic.twitter.com/RuYJqMfTiC — Gaurav jain (@GauravJ43304117) January 15, 2023 -
సిరాజ్ లాంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు: రోహిత్ శర్మ
వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా ఘనంగా ముగించింది. తిరువంతపురం వేదికగా ఆదివారం లంకతో జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఆఖరి వన్డే విజయంలో భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లి, గిల్, సిరాజ్ కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్‌లో కోహ్లి, గిల్ సెంచరీలతో చెలరేగగా.. అనంతరం బౌలింగ్‌లో సిరాజ్ లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో తన 10 ఓవర్ల కోటాలో సిరాజ్ 32 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. కాగా సిరాజ్ తన తొలి ఐదు వికెట్ల ఘనతను సాధించిడానికి ఆఖరి వరకు ప్రయత్నించాడు. ఇక తన బౌలింగ్‌తో ప్రత్యర్ది బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెట్టిన సిరాజ్‌పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. సిరాజ్ లాంటి టాలెంట్ ఉన్న చాలా అరుదగా ఉంటాడాని రోహిత్ కొనియాడాడు. ఇక ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో 9 వికెట్లు పడగొట్టిన సిరాజ్.. సిరీస్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. "ఇది మాకు అద్భుతమైన విజయం. ఈ సిరీస్‌లో మాకు చాలా పాజిటివ్ ఆంశాలు ఉన్నాయి. బ్యాటింగ్ పరంగా కూడా మేము చక్కగా రాణించాం. అదే విధంగా మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. కీలక సమయాల్లో వికెట్లు సాధించారు. ముఖ్యంగా సిరాజ్ ఈ సిరీస్ అసాంతం అదరగొట్టాడు. గత కొన్ని రోజులుగా సిరాజ్ లో చాలా మార్పు వచ్చింది. అతడు రోజురోజుకూ మరింత రాటుదేలుతున్నాడు. అతడు తన ఇన్‌స్వింగ్ బౌలింగ్‌తో జట్టుకు పవర్ ప్లేలో శుభారంభం అందిస్తున్నాడు. సిరాజ్ లాంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు. అదే విధంగా ఆఖరి మ్యాచ్‌లో సిరాజ్ ఐదు వికెట్లు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. అతడు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భారత జట్టుకు మరింత లాభం చేకూరుతుంది. ప్రస్తుతం మా దృష్టి అంతా న్యూజిలాండ్ సిరీస్‌పై ఉంది. పాకిస్తాన్‌పై చారిత్రాత్మక విజయం సాధించి వచ్చిన న్యూజిలాండ్‌ను ఓడించడం అంత సులభం కాదు"అని పేర్కొన్నాడు. చదవండి: Virat Kohli: అరుదైన ఘనతకు చేరువలో! రికార్డుల కోసం వెంపర్లాడేవాడిని కాదు.. అయితే! Captain @ImRo45 collects the trophy as #TeamIndia seal the @mastercardindia #INDvSL ODI series 3️⃣-0️⃣👏👏 Scorecard ▶️ https://t.co/q4nA9Ff9Q2 pic.twitter.com/KmCAFDfpUe — BCCI (@BCCI) January 15, 2023 -
శ్రీలంక చిత్తు.. వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా (ఫొటోలు)
-
వారెవ్వా సిరాజ్.. శ్రీలంక బ్యాటర్‌కు ఊహించని షాక్! వీడియో వైరల్
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో తన 10 ఓవర్ల కోటాలో సిరాజ్ 32 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక 317 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగా టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శుబ్మాన్ గిల్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. సంచలన రనౌట్‌తో మెరిసిన సిరాజ్.. ఏక పాక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఈ మ్యాచ్‌లో సంచలన రనౌట్‌తో మెరిశాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో నాలుగో బంతిని కరుణరత్నే నాన్‌స్ట్రైకర్ వైపు డిఫెన్స్ ఆడాడు. వెంటనే బంతిని అందుకున్న సిరాజ్ సమయస్ఫూర్తితో రెప్పుపాటులోనే స్ట్రైకర్ వైపు స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అయితే తను క్రీజులో ఉన్నానని భావించిన కరుణరత్నేకు మాత్రం ఊహించని షాక్ తగిలింది. ఎందుకంటే కరుణరత్నే క్రీజుకు కొంచెం వెలుపుల ఉన్నట్లు రిప్లేలో సృష్టంగా కన్పించింది. దీంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND vs SL: ఇదేం ఆనందంరా బాబు.. బంతిని ఫొటో తీసిన ఫ్యాన్! కోహ్లి రియాక్షన్ వైరల్ pic.twitter.com/F3EpqK649o — The sports 360 (@Thesports3601) January 15, 2023 -
ఇదేం ఆనందం.. బంతిని ఫొటో తీసిన ఫ్యాన్! కోహ్లి రియాక్షన్ వైరల్
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగా వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శుబ్మాన్ గిల్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. కోహ్లి 110 బంతుల్లో 166 నాటౌట్ (13 ఫోర్లు, 8 సిక్స్‌లు), గిల్ 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్ అసాంతం రాణించిన కోహ్లికే ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. బంతికి ఫోటో తీసిన ఫ్యాన్ కాగా ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో 45 ఓవర్ వేసిన కరుణరత్నే బౌలింగ్‌లో తొలి బంతిని కోహ్లి లాంగ్ ఆన్ దిశగా స్టాండ్స్‌కు తరిలించాడు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న అభిమాని బంతిని అందుకున్నాడు. అయితే ఆ ఫ్యాన్ బంతిని తిరిగివ్వకుండా ఫోటో తీసుకుంటూ ఉండి పోయాడు. దీంతో తరువాతి బంతిని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్న కోహ్లి.. అభిమాని చర్యను చూసి నవ్వుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి అతడు బంతిని తిరిగి అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND vs SL: ధోనిని గుర్తు చేసిన కోహ్లి.. హెలికాప్టర్ షాట్‌తో భారీ సిక్స్! వీడియో వైరల్ pic.twitter.com/Vn6k6xPwFT — MINI BUS 2022 (@minibus2022) January 15, 2023 pic.twitter.com/PeolYUFd4T — IPLT20 Fan (@FanIplt20) January 15, 2023 -
ధోనిని గుర్తు చేసిన కోహ్లి.. హెలికాప్టర్ షాట్‌తో భారీ సిక్స్! వీడియో వైరల్
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తన అంతర్జాతీయ కెరీర్లో విరాట్‌కు ఇది 46 సెంచరీ. ఈ సిరీస్‌లో కింగ్‌కు ఇది రెండో సెంచరీ. ఓవరాల్‌గా ఇప్పటివరకు విరాట్ కోహ్లి కెరీర్లో ఇది 74 అంతర్జాతీయ సెంచరీ కావడం గమానార్హం. ఇక ఈ మ్యాచ్‌లో 317 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్ అసాంతం రాణించిన కోహ్లికి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. హెలికాప్టర్ షాట్ కొట్టిన విరాట్ ఈ మ్యాచ్‌లో అద్భతమైన హెలికాప్టర్ షాట్ బాదిన విరాట్ కోహ్లి.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని గుర్తు చేశాడు. భారత ఇన్నింగ్స్ 44 ఓవర్ వేసిన కసున్ రజిత బౌలింగ్‌లో నాలుగో బంతిని ఫ్రంట్‌ఫుట్ వచ్చిన విరాట్ లాంగ్ ఆన్ దిశగా 97 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. విరాట్ అద్భుతమైన షాట్ చూసిన అభిమానులు ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND vs SL: గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. విరాట్ ఏం చేశాడంటే? 📹 Mighty Maximum - a 97m SIX from Virat Kohli 👀👀 Live - https://t.co/q4nA9Ff9Q2 #INDvSL @mastercardindia pic.twitter.com/R3CzXTWBT5 — BCCI (@BCCI) January 15, 2023 -
గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. విరాట్ ఏం చేశాడంటే?
తిరువనంతపురం వేదికగా ఆదివారం జరిగిన శ్రీలంక- భారత్ మూడో వన్డే సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్ జరుగుతుండగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి వీరాభిమాని అయిన ఒక వ్యక్తి మైదానంలోకి పరుగులు తీశాడు. నేరుగా కోహ్లి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిన అభిమాని.. విరాట్ కాళ్లకు దండం పెట్టాడు. వెంటనే కోహ్లి అతడిని పైకి లేవదీశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇక శ్రీలంకతో ఆఖరి వన్డేల్లో విరాట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరో సంచలన సెంచరీతో కోహ్లి చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో 317 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్ అసాంతం రాణించిన కోహ్లికే ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. A fan invaded the field and touched Virat Kohli's feet. pic.twitter.com/wualIoFgZ8 — Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2023 చదవండి: IND vs SL: విరాట్ కోహ్లి అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్లో ఏకైక ఆటగాడిగా -
విరాట్ కోహ్లి అరుదైన రికార్డులు.. ప్రపంచ క్రికెట్లో ఏకైక ఆటగాడిగా
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా వన్డేల్లో విరాట్‌కు ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కింగ్ కోహ్లి పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కోహ్లి సాధించిన రికార్డులు ఇవే ►శ్రీలంకపై విరాట్‌కు ఇది 10వ వన్డే సెంచరీ. తద్వారా ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా విరాట్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్‌తో కలిసి విరాట్ సమంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాపై సచిన్ 9 సెంచరీలు చేయగా.. విరాట్ కూడా వెస్టిండీస్‌పై 9 సెంచరీలు చేశాడు. తాజా మ్యాచ్‌లో సెంచరీ చేసిన కింగ్ కోహ్లి(10).. సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. ►ఇక భారత గడ్డపై విరాట్‌కు ఇది 21 వన్డే సెంచరీ. దీంతో స్వదేశంలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో సెంచరీ చేసిన కింగ్ సచిన్‌ను అధిగిమించాడు. ►అదేవిధంగా స్వదేశీ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో 6976 పరుగులతో సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత రికీ పాటింగ్ 5521 పరుగులతో రెండో స్థానంలో నిలవగా.. 5303 రన్స్‌తో కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు. ►అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 259 వన్డే ఇన్నింగ్స్‌లలో 12754 పరుగులు చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే(12650)ను కోహ్లి అధిగమించాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(18426) ఉండగా.. రెండో స్థానంలో శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర(14234)పరుగులతో ఉన్నాడు. చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ప్రపంచ వన్డే క్రికెట్లో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఈ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2008లో ఐర్లాండ్‌పై కివీస్ 290 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే తాజా మ్యాచ్‌తో కివీస్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. చెలరేగిన సిరాజ్, షమీ 391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 22 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 73 పరుగులు మాత్రమే చేసింది. . భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు సాధించారు. లంక బ్యాటర్లలో నువానీడు ఫెర్నాండో 19 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదరగొట్టిన కోహ్లి, గిల్ ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్ కూడా సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేశాడు.అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(33) పరుగులతో రాణించారు. చదవండి: IND vs SL: మూడో వన్డేలో శ్రీలంక చిత్తు.. 317 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం -
మూడో వన్డేలో శ్రీలంక చిత్తు.. 317 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. కాగా ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలోనే పరుగుల తేడాతో ఇదే భారీ విజయం కావడం విశేషం. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. 391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 22 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 73 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక బ్యాటర్ ఆషాన్ బండారకు గాయం కావడంతో బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో 73 పరుగులకే లంక ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు సాధించారు. లంకబ్యాటర్లలో నువానీడు ఫెర్నాండో 19 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్ కూడా సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేశాడు.అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(33) పరుగులతో రాణించారు. ఇక లంక బౌలర్లలో కుమార, రజితా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కరుణరత్నే ఒక్క వికెట్ సాధించాడు. చదవండి: IND vs SL: తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు! -
తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు!
తిరువనంతపురం వేదికగా శ్రీలంక-భారత్ మూడో వన్డే సందర్భంగా ఓ దురదృష్టకర సంఘటన చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆటగాళ్లు అషెన్ బండార, జెఫ్రీ వాండర్సే తీవ్రంగా గాయపడ్డారు. ఏం జరిగిందంటే? భారత ఇన్నింగ్స్ 43వ ఓవర్ వేసిన చమికా కరుణరత్నే బౌలింగ్‌లో విరాట్ కోహ్లి స్క్వేర్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో బంతిని ఆపడానికి వచ్చిన వాండర్సే, బండారా ఒకరిని ఒకరు బలంగా ఢీకొన్నారు. దీంతో వీరిద్దరూ తీవ్రమైన నొప్పితో విలవిల్లాడారు. వెంటనే పరిగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చిన ఫిజియో పరిశీలించాడు. అనంతరం వీరిద్దరిని స్ట్రెచర్‌పై బయటకు తీసుకువెళ్లారు. సెంచరీలతో చెలరేగిన గిల్, కోహ్లి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్ కూడా సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేశాడు.అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(33) పరుగులతో రాణించారు. ఇక లంక బౌలర్లలో కుమార, రజితా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కరుణరత్నే ఒక్క వికెట్ సాధించాడు. -
కింగ్ కోహ్లి అరుదైన ఘనత.. జయవర్ధనే రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 85 బంతుల్లో కోహ్లి తన 46 వన్డే సెంచరీని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. జయవర్ధనే రికార్డు బద్దలు ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కింగ్ కోహ్లి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 259 వన్డే ఇన్నింగ్స్‌లలో 12754 పరుగులు చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే(12650)ను కోహ్లి అధిగమించాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(18426) ఉండగా.. రెండో స్థానంలో శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర(14234)పరుగులతో ఉన్నాడు. అదే విధంగా శ్రీలంకపై అత్యధిక పరుగులు చేసిన రెండో భారత్ బ్యాటర్‌గా కూడా విరాట్ కోహ్లి(2503) నిలిచాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(2383) రికార్డును రన్‌మిషన్ బ్రేక్ చేశాడు. చదవండి: IND vs SL: ఆగని పరుగుల యంత్రం.. మరో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లి -
IND vs SL: శ్రీలంక బౌలర్లకు చుక్కలు.. సెంచరీలతో చెలరేగిన కోహ్లి, గిల్
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా ఈ సిరీస్‌లో ఇది విరాట్‌కు రెండో సెంచరీ కావడం గమానార్హం. కోహ్లితో పాటు యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్ కూడా సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేశాడు. అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(33) పరుగులతో రాణించారు. ఇక లంక బౌలర్లలో కుమార, రజితా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కరుణరత్నే ఒక్క వికెట్ సాధించాడు. చదవండి: IND vs SL: వన్డేల్లో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ధోని రికార్డు సమం -
వన్డేల్లో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ధోని రికార్డు సమం
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును రోహిత్ సమం చేశాడు. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో మూడు సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్ ధోనితో సమంగా నిలిచాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ 73 వన్డేల్లో 123 సిక్సర్లు బాదగా.. ధోని 116 ఇన్నింగ్స్‌లలో 123 సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 49 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 3 సిక్స్‌లు, రెండు ఫోర్లతో 42 పరుగులు సాధించాడు. ఇక ఇదే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 85 బంతుల్లో కోహ్లి సెంచరీ సాధించాడు. అతడి సెంచరీ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. 147 పరుగులతో విరాట్ ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. చదవండి: IND vs SL: ఆగని పరుగుల యంత్రం.. మరో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లి -
ఆగని పరుగుల యంత్రం.. మరో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మరో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో 85 బంతుల్లో కోహ్లి సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ సిరీస్‌లో కోహ్లికి ఇది రెండో సెంచరీ. గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో కింగ్ కోహ్లి అద్భుతమైన శతకం సాధించిన సంగతి తెలిసిందే. కాగా అతడి గత నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు ఉండడం విశేషం. అదే విధంగా వన్డేల్లో విరాట్‌కు ఇది 46 సెంచరీ. ఇక ఓవరాల్‌గా ఇప్పటివరకు విరాట్ కోహ్లి కెరీర్లో ఇది 74 అంతర్జాతీయ సెంచరీ కావడం గమానార్హం. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. రవీంద్ర జడేజా కీలక నిర్ణయం -
IND VS SL 3rd ODI: శతక్కొట్టిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (89 బంతుల్లో 100; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో విరుచుకుపడటంతో టీమిండియా స్కోర్ 31 ఓవర్ల తర్వాత 202/1గా ఉంది. గిల్‌కు జతగా విరాట్ కోహ్లి (48 బంతుల్లో 50; 5 ఫోర్లు) క్రీజ్‌లో ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ 49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి చమిక కరుణరత్నే బౌలింగ్‌లో అవిష్క ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేలు నెగ్గిన భారత్ ఇదివరకు 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా.. 2 మార్పులు, తుది జట్టు ఎలా ఉందంటే..?
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. హార్ధిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్‌లకు రెస్ట్ ఇచ్చిన టీమ్ మేనేజ్మెంట్.. సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లకు అవకాశం కల్పించింది. మరోవైపు శ్రీలంక సైతం రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఆషేన్ బండార, జెఫ్రీ వాండర్సే తుది జట్టులోకి వచ్చారు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తుది జట్లు.. భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ శ్రీలంక: కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ఆషేన్ బండార, జెఫ్రీ వాండర్సే, నువనిదు ఫెర్నాండో, దసున శనక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, లహిరు కుమార, కసున్ రజిత -
లంకతో మూడో వన్డే.. క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి భారత్
తిరువనంతపురం: భారత్, శ్రీలంక మధ్య టి20 సిరీస్‌లోనైనా ఫలితం చివరి మ్యాచ్ వరకు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు వన్డే సిరీస్‌లో మాత్రం రెండో మ్యాచ్‌కే ఫలితం తేలిపోయింది. టీమిండియా 2–0తో సిరీస్ గెలుచుకోగా, చివరి పోరుకు ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే మూడో వన్డేలో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. మరో విజయంతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ భావిస్తుండగా, టి20ల తరహాలో కనీసం ఒక విజయంతోనైనా ముగించి పరువు నిలబెట్టుకోవాలని లంక కోరుకుంటోంది. మార్పు ఉంటుందా... ‘అవసరమైతే తర్వాతి మ్యాచ్‌లో మార్పులు చేస్తాం’... రెండో వన్డే ముగిసిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. సిరీస్ ఇప్పటికే చేతికందడంతో స్వల్ప మార్పులతో రిజర్వ్ ఆటగాళ్లను పరీక్షించాలనేది ఆలోచన. గత రెండు మ్యాచ్‌లలోనూ అవకాశం దక్కకుండా అర్షదీప్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్ బెంచీపై వేచి చూస్తున్నారు. వీరిలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి. ముగ్గురికీ అవకాశం ఇవ్వాలనుకుంటే ఉమ్రాన్, రాహుల్, అక్షర్‌లను పక్కన పెట్టవచ్చు. మరోవైపు భుజం నొప్పితో గత మ్యాచ్‌కు దూరమైన చహల్ పూర్తిగా కోలుకున్నాడు. అతడిని ఆడిస్తారా లేక రెండో వన్డే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ యాదవ్‌ను కొనసాగిస్తారా అనేది ఆసక్తికరం. ఇతరత్రా భారత జట్టుకు ఎలాంటి సమస్యలు లేవు. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లంతా ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ప్రధాన బృందంలో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. వీరంతా తమ స్థాయికి తగినట్లు ఆడితే నిలువరించడం లంకకు చాలా కష్టమవుతుంది. నిసాంక పునరాగమనం... గత మ్యాచ్‌లో భారత బ్యాటింగ్‌ను కాస్త ఇబ్బంది పెట్టి మ్యాచ్‌ను హోరాహోరీగా మార్చగలిగినా... శ్రీలంక అసలు సమస్య బ్యాటింగ్‌లోనే ఉంది. ఆశించిన స్థాయిలో కీలక ఆటగాళ్లు ప్రదర్శన ఇవ్వకపోవడంతో పేలవ స్కోరుకే పరిమితమైన జట్టు ఏమీ చేయలేకపోయింది. అందరికంటే సీనియర్ కుశాల్ మెండిస్ మరింత బాధ్యతాయుతంగా ఆడి భారీ స్కోరు చేయాల్సి ఉంది. గాయంతో రెండో వన్డేకు దూరమైన నిసాంక తిరిగి జట్టులోకి వస్తున్నాడు. అతని స్థానంలో ఆడిన నువనిదు ఫెర్నాండో అరంగేట్ర మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ సాధించడంతో పక్కన పెట్టలేని పరిస్థితి. దాంతో అసలంకను తప్పించవచ్చు. బౌలింగ్‌లో అంతంత మాత్రంగానే ఉన్న లంక భారత బ్యాటింగ్‌ను ఎంత వరకు నిలువరించగలదో చూడాలి. -
పద్మనాభస్వామి ఆశీస్సులు తీసుకున్న భారత క్రికెటర్లు
తిరువనంతపురం వేదికగా ఆదివారం (జనవరి15) శ్రీలంకతో నామమాత్రపు మాడో వన్డేలో టీమిండియా తలపడనుంది. మూడో వన్డేలో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తుంటే.. కనీసం ఆఖరి వన్డేలోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టకోవాలని భావిస్తోంది. ఇక ఇప్పటికే తిరువనంతపురంకు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నాయి. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు కొంతమంది శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు. వారిలో సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. వీరందరూ సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. మూడో వన్డేకు తుది జట్లు(అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్,, కేెెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ షమీ. శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, నువానిడు ఫెర్నాండో, చరిత్ అసలంక, దసున్ శనక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, చమిక కరుణరత్నే, వానిందు హసరంగా, కసున్ రజిత, లాహిరు కుమార, దునిత్ వెలాలెజ్. చదవండి: SL vs IND: శ్రీలంకతో మూడో వన్డే.. గిల్, శ్రేయస్‌కు నో ఛాన్స్! కిషన్, సూర్య ఎంట్రీ -
శ్రీలంకతో మూడో వన్డే.. గిల్, శ్రేయస్‌కు నో ఛాన్స్! కిషన్, సూర్య ఎంట్రీ
తిరువనంతపురం వేదికగా ఆదివారం(జనవరి15)న శ్రీలంకతో మూడో వన్డేలో భారత్ తలపడనుంది. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా.. మూడో వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో వన్డేలో పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు వన్డేలకు దూరమైన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఆఖరి వన్డేకు జట్టులోకి రానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఓపెనర్ శుబ్మాన్ గిల్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మూడో వన్డేకు విశ్రాంతి ఇవ్వాలని జట్టు మెనేజెమెంట్ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తొలి రెండు వన్డేల్లో గిల్ పర్వాలేదనిపించినప్పటికీ.. అయ్యర్ మాత్రం నిరాశపరిచాడు. రెండు వన్డేల్లో కలిపి కేవలం 56 పరుగులు మాత్రమే అయ్యర్ చేశారడు. ఇక ఆఖరి వన్డేలో పలు మార్పులు చేయనున్నట్లు రెండో వన్డే పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్ సందర్భంగా రోహిత్ శర్మ కూడా తెలిపాడు. భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్,మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ చదవండి: బాబర్ ఆజమ్‌పై వేటు, పాక్ కొత్త కెప్టెన్ ఎవరంటే..? -
'జడేజా, చాహల్‌కు నో ఛాన్స్.. వరల్డ్ కప్‌కి ఆ నలుగురు స్పిన్నర్లే బెస్ట్'
వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడుతోంది. ఇప్పటికే వరుసగా రెండు వన్డేలు గెలిచిన భారత్.. 2-0 తేడాతో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. ఇక సిరీస్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్.. వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరుపున బరిలోకి దిగే నలుగురు స్పిన్నర్లరను ఎంచుకున్నాడు. కాగా ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. గంభీర్ స్టార్ స్పోర్ట్ షోలో మాట్లాడుతూ.. "ప్రపంచకప్‌లో మణికట్టు స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు కచ్చితంగా చోటు ఇవ్వాలి. అక్షర్ గత కొన్ని సిరీస్‌ల నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. అదే విధంగా స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులో ఉండాలి. ఇక కుల్దీప్ యాదవ్‌కు స్వదేశంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. భారత్‌లో అతడు బంతితో మ్యాజిక్ చేయగలడు. కాబట్టి కుల్దీప్ కూడా ప్రపంచకప్ భారత జట్టులో అవకాశం ఇవ్వాలి. ఇక ఆఖరిగా యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని జట్టులోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. రవి ప్రస్తుతం భారత్ సన్నాహాకాల్లో లేనప్పటికీ.. ఐపీఎల్లో అద్భుతంగా రాణించి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది" అని పేర్కొన్నాడు. కాగా భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్‌కు గంభీర్ ఎంపిక చేయకపోవడం గమానార్హం. చదవండి: Virat Kohli: 'సచిన్ సాధించిన ఆ రికార్డును కోహ్లి సాధించలేడు' -
వన్డేల్లో శ్రీలంక అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియాతో జరిన రెండో వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంక పరాజాయం పాలైంది. దీంతో అత్యంత చెత్త రికార్డును శ్రీలంక తమ పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల్లో అత్యధిక పరాజయాలు చవిచూసిన జట్టుగా శ్రీలంక నిలిచింది. శ్రీలంక ఇప్పటివరకు 880 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 437 వన్డేల్లో ఓటమిపాలైంది. తద్వారా ఈ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. కాగా ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు టీమిండియా పేరిట ఉండేది. భారత్ ఇప్పటి వరకు 436 వన్డేల్లో ఓటమి చవిచూసింది. తాజా ఓటమితో భారత్‌ను లంక జట్టు అధిగిమించింది. ఇక మూడో 419 ఓటములతో పాకిస్తాన్ మూడో స్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా రికార్డును సమం చేసిన భారత్ ఇక ఇదే మ్యాచ్‌లో టీమిండియా కూడా ఓ అరుదైన రికార్డు సాధించింది. లంకపై రెండో వన్డేలో గెలుపొందిన రోహిత్ సేన.. వన్డేల్లో ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియాతో సంయుక్తంగా నిలిచింది. శ్రీలంకపై అత్యధికంగా 95 వన్డేల్లో భారత్ గెలవగా.. ఆస్ట్రేలియా కూడా న్యూజిలాండ్‌పై ఇప్పటివరకు 95 వన్డేల్లో విజయం సాధించింది. చదవండి: Virat Kohli: ఇషాన్‌తో కలిసి డాన్స్ అదరగొట్టిన కోహ్లి! వీడియో వైరల్ -
టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. సిరీస్ చిక్కింది
భారత్ లక్ష్యం 216 పరుగులే...కానీ ఏమాత్రం బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని పిచ్‌పై షాట్లు ఆడటమే కష్టంగా మారిపోయింది.. ఇలాంటి స్థితిలో విజయం కోసం భారత్ 43వ ఓవర్ వరకు శ్రమించింది... స్వల్ప ఛేదనలోనూ కాస్త తడబడినా, రాహుల్ పట్టుదలగా నిలబడటంతో చివరకు భారత్ గెలుపును అందుకొని సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. అంతకు ముందు సిరాజ్, కుల్దీప్లు చక్కటి బౌలింగ్‌తో ప్రత్యరి్థని కట్టిపడేశారు. దాంతో కనీస స్కోరు కూడా సాధించలేక శ్రీలంక చేతులెత్తేసింది. కోల్‌కతా: టి20 మ్యాచ్‌లోనే 228 పరుగులు నమోదై వారం కూడా కాలేదు. అదే వన్డేలకు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. శ్రీలంక కనాకష్టంగా స్కోరు చేయగా, దానిని ఛేదించేందుకు భారత్ 6 వికెట్లు చేజార్చుకుంది. గురువారం జరిగిన రెండో వన్డేలో భారత్ 4 వికెట్లతో శ్రీలంకను ఓడించింది. మొదట శ్రీలంక 39.4 ఓవర్లలోనే 215 పరుగుల వద్ద ఆలౌటైంది. నువనిదు ఫెర్నాండో (63 బంతుల్లో 50; 6 ఫోర్లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్, సిరాజ్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 43.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (103 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. సిరీస్ 2–0తో భారత్ గెలుచుకోగా, చివరి వన్డే ఆదివారం తిరువనంతపురంలో జరుగుతుంది. భుజం గాయంతో దూరమైన చహల్ స్థానంలో కుల్దీప్ ఈ మ్యాచ్‌లోకి వచ్చాడు. రాణించిన నువనిదు అవిష్క ఫెర్నాండో (20; 4 ఫోర్లు) ఎక్కువ సేపు నిలబడలేకపోగా, అరంగేట్రం చేసిన నువనిదు ఫెర్నాండో పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాడు. తన ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన అవిష్కను సిరాజ్ మరుసటి ఓవర్లో బౌల్డ్ చేశాడు. తర్వాత కుశాల్, నువనిదు ఓవర్‌కు 6 పైచిలుకు రన్‌రేట్‌తో జట్టు స్కోరును వంద పరుగులకు చేర్చారు. అంతలోనే కుశాల్ (34 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్)ను కుల్దీప్ ఎల్బీగా పంపడంతో 73 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత స్పిన్, పేస్‌ల వైవిధ్యం లంకను కుదురుకోనివ్వలేదు. ధనంజయ (0)ను అక్షర్ డకౌట్ చేయగా, అసలంక (15), కెపె్టన్ షనక (2)లను కుల్దీప్ బోల్తా కొట్టించాడు. హసరంగ (21; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటికి ఉమ్రాన్ బ్రేకులేయగా, లోయర్ ఆర్డర్లో దునిత్ వెలలగే (34 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) చేసిన స్కోరుతో లంక కష్టంగా 200 పరుగులు దాటింది. హార్దిక్ సహకారం లక్ష్యం చిన్నదే అయినా గెలుపు సులువుగా ఏమీ రాలేదు. గత మ్యాచ్ ‘టాప్ 3’ రోహిత్ (17; 2 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (12 బంతుల్లో 21; 5 ఫోర్లు), కోహ్లి (4) తొలి పది ఓవర్లలోపే అవుటైతే గానీ పిచ్ సత్తా తెలియలేదు. 62 పరుగులకే వీళ్లంతా పెవిలియన్‌లో కూర్చున్నారు. మిగిలిన ప్రధాన బ్యాటర్స్ ముగ్గురే... అయ్యర్, రాహుల్, పాండ్యా! కానీ లక్ష్యదూరం మాత్రం 154 పరుగులు. కీలక దశలో శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 28; 5 ఫోర్లు) కూడా వెనుదిరిగాడు. అయితే రాహుల్, హార్దిక్ పాండ్యా (53 బంతుల్లో 36; 4 ఫోర్లు) భాగస్వామ్యం జట్టును విజయం దిశగా నడిపించింది. ఈ జోడీ ఐదో వికెట్‌కు 75 పరుగులు జోడించింది. 161 స్కోరు వద్ద పాండ్యా అవుటైనా... రాహుల్ కడదాకా నిలబడ్డాడు. అక్షర్ (21 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్), కుల్దీప్ (10 నాటౌట్; 2 ఫోర్లు)లతో కలిసి జట్టును గెలిపించాడు. 93 బంతుల్లో (3 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: అవిష్క (బి) సిరాజ్ 20; నువనిదు రనౌట్ 50; మెండిస్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 34; ధనంజయ (బి) అక్షర్ 0; అసలంక (సి) అండ్ (బి) కుల్దీప్ 15; షనక (బి) కుల్దీప్ 2; హసరంగ (సి) అక్షర్ (బి) ఉమ్రాన్ 21; దునిత్ (సి) అక్షర్ (బి) సిరాజ్ 32; కరుణరత్నే (సి) అక్షర్ (బి) ఉమ్రాన్ 17; రజిత నాటౌట్ 17; లహిరు (బి) సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (39.4 ఓవర్లలో ఆలౌట్) 215. వికెట్ల పతనం: 1–29, 2–102, 3–103, 4–118, 5–125, 6–126, 7–152, 8–177, 9–215, 10–215. బౌలింగ్: షమీ 7–0–43–0, సిరాజ్ 5.4–0–30–3, పాండ్యా 5–0–26–0, ఉమ్రాన్ 7–0–48–2, కుల్దీప్ 10–0–51–3, అక్షర్ 5–0–16–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మెండిస్ (బి) కరుణరత్నే 17; గిల్ (సి) అవిష్క (బి) లహిరు 21; కోహ్లి (బి) లహిరు 4; అయ్యర్ (ఎల్బీ) (బి) రజిత 28; రాహుల్ నాటౌట్ 64; పాండ్యా (సి) మెండిస్ (బి) కరుణరత్నే 36; అక్షర్ (సి) కరుణరత్నే (బి) ధనంజయ 21; కుల్దీప్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (43.2 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–33, 2–41, 3–62, 4–86, 5–161, 6–191. బౌలింగ్: కసున్ రజిత 9–0–46–1, లహిరు 9.2–0–64–2, కరుణరత్నే 8–0–51–2, హసరంగ 10–0–28–0, దునిత్ 2–0–12–0, షనక 2–0–6–0, ధనంజయ 3–0–9–1. చదవండి: IND vs SL: సహచర ఆటగాడిపై అసభ్య పదజాలం వాడిన హార్దిక్! ఇదేమి బుద్దిరా బాబు.. -
సిరాజ్ సూపర్ డెలివరీ.. దెబ్బకు ఎగిరిపోయిన మిడిల్ స్టంప్! వీడియో వైరల్
శ్రీలంకతో తొలి వన్డేలో అదరగొట్టిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్.. కోల్‌కతా వేదికగా రెండో వన్డేలో కూడా సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో 5.4 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో లంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండోను సిరాజ్‌ను ఓ సంచలన బంతితో పెవిలియన్‌కు పంపాడు. ఫెర్నాండోను సిరాజ్ అద్బుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. శ్రీలంక ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో సిరాజ్ వేసిన ఆఖరి బంతిని ఫెర్నాండో కవర్ డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి స్వింగ్ అయ్యి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో అవిష్క ఫెర్నాండో ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారత బౌలర్లు చెలరేగడంతో 215 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెరో మూడు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ ఒక్క వికెట్ సాధించారు. చదవండి: IND vs SL: సహాచర ఆటగాడిపై అసభ్య పదజాలం వాడిన హార్దిక్! ఇదేమి బుద్దిరా బాబు.. Timber Strike, the @mdsirajofficial way 👌👌 Relive how he dismissed Avishka Fernando 🔽 Follow the match 👉 https://t.co/MY3Wc5253b#TeamIndia | #INDvSL pic.twitter.com/ZmujAITsco — BCCI (@BCCI) January 12, 2023 -
సహచర ఆటగాడిపై అసభ్య పదజాలం వాడిన హార్దిక్! ఇదేమి బుద్దిరా బాబు..
కోల్‌కతా వేదికగా శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన సహానాన్ని కోల్పోయాడు. శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా వాటర్ బాటిల్ అందించడం ఆలస్యం కావడంతో హార్ధిక్.. సహచర సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ ఒకరిపై గట్టిగా అరుస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. హార్దిక్ ఆడిన మాటలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. ఈ సంఘటన శ్రీలంక ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఆఖరిలో చోటు చేసుకుంది. ఇక హార్దిక్ వాయిస్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఈ క్రమంలో హార్దిక్ తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. కేవలం వాటర్ కోసం సహచర ఆటగాడిని అలా దుర్భాషలాడం మంచి పద్దతి కాదని అభిప్రాయపడుతున్నారు. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో 215 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెరో మూడు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ ఒక్క వికెట్ సాధించారు. ఇక లంక బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు నువానీడు ఫెర్నాండో(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కుశాల్ మెండిస్(34), డివెల్లలాగే(32) పరుగులతో రాణించారు. చదవండి: Virat Kohli: ఇదెలా సాధ్యమైంది? కోహ్లి షాకింగ్ ఎక్స్ప్రెషన్.. వైరల్ Hardik Pandya said "paani manga tha last over gaa*d marwa rahe ho udhar" 😂🤣🤣🤣 btw to whom he said these beautiful words 😂😂#HardikPandya#INDvsSL #HardikPandya #viratkholi pic.twitter.com/4NDLR2H8lg — 𝓚𝓪𝓹𝓲𝓵𝓮𝓷𝓭𝓻𝓪 𝓓𝓪𝓼 (@KapilendraDas3) January 12, 2023 -
వారెవ్వా అక్షర్! గాల్లోకి డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో.. కరుణరత్నే పాయింట్ దిశగా కట్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ ఎడమవైపు డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 17 పరుగులు చేసిన కరుణరత్నే నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం అక్షర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో 215 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెరో మూడు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ ఒక్క వికెట్ సాధించారు. ఇక లంక బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు నువానీడు ఫెర్నాండో(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కుశాల్ మెండిస్(34), డివెల్లలాగే(32) పరుగులతో రాణించారు. Sharp catch alert 💥@akshar2026 dives to his left and takes a fine catch as @umran_malik_01 gets his second wicket 👌👌#TeamIndia | #INDvSL | @mastercardindia pic.twitter.com/R4bJoPXNM3 — BCCI (@BCCI) January 12, 2023 చదవండి: Virat Kohli: ఇదెలా సాధ్యమైంది? కోహ్లి షాకింగ్ ఎక్స్ప్రెషన్.. వైరల్ -
Team India: స్వదేశంలో బెబ్బులి.. మరి విదేశాల్లో, మెగా టోర్నీల్లో..?
స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో, చిన్న జట్లతో జరిగే వన్ టు వన్ సిరీస్‌ల్లో బెబ్బులిలా రెచ్చిపోయే టీమిండియా.. విదేశాల్లో జరిగే సిరీస్‌ల్లో, అలాగే పెద్ద జట్లు పాల్గొనే నాకౌట్ మెగా టోర్నీల్లో చతికిలపడటం చాలాకాలంగా మనం గమనిస్తూనే ఉన్నాం. టీమిండియా ఆటగాళ్లు సొంతగడ్డపై మాత్రమే పులులు అన్న అపవాదును సైతం మనం చాలాకాలంగా మోస్తూనే ఉన్నాం. ధోని హయాంలో, కొద్దికాలం పాటు విరాట్ కోహ్లి జమానాలో ఈ అపవాదు తప్పని నిరూపించుకోగలిగినప్పటికీ, ఇటీవలి కాలంలో మళ్లీ పాత పరిస్థితే ఎదురవుతూ వస్తుంది. రోహిత్ సారధ్య బాధ్యతలు చేపట్టాక ఆడిన రెండు మెగా టోర్నీల్లో రిక్త హస్తాలతోనే ఇంటి ముఖం పట్టిన టీమిండియా.. చిన్న జట్లపై, అలాగే స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మాత్రం రెచ్చిపోతుంది. ఎంతలా అంటే.. డబుల్ సెంచరీలు, సెంచరీలు, 5 వికెట్లు తీసిన ఆటగాళ్లను కూడా బెంచ్‌కు పరిమితం చేసేంతలా సొంతగడ్డపై టీమిండియా దూకుడు ప్రదర్శిస్తుంది. రిజర్వ్ బెంచ్ సైతం ఇంత బలంగా ఉన్న జట్టు విదేశాల్లో, పెద్ద జట్లతో మ్యాచ్‌ల్లో, మెగా టోర్నీల్లో ఎందుకు ఓటమిపాలవుతుందన్న విషయాన్ని బేరీజు వేసుకుంటే, ఒక్క విషయం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. అదేంటంటే.. స్వదేశంలో నాణ్యమైన ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లు లేకపోవడం. ఇక్కడి సంప్రదాయ స్పిన్ పిచ్‌లకు అలవాటు పడి, వీటిపై పరుగుల వరద పారించే మన హీరోలు.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ ట్రాక్‌లపై ఆ దేశ పేసర్లకు దాసోహమైపోతున్నారు. ఇక మెగా టోర్నీల్లో టీమిండియా వైఫల్యాల విషయానికొస్తే.. ఆడిన ప్రతి టోర్నీలో భారీ అంచనాలు జట్టు కొంపముంచుతున్నాయి. 130 కోట్లకు పైగా భారతీయులు ప్రతి మ్యాచ్‌లో జట్టు గెలవాలని కోరుకోవడం, అంచనాలకు తగ్గట్టుగా రాణించాలని ఆటగాళ్లు ఒత్తిడికి లోనవ్వడం సమాంతరంగా జరిగిపోతున్నాయి. విదేశాల్లో, మెగా టోర్నీల్లో టీమిండియా ఓటములకు మరో కారణం బీసీసీఐలో నెలకొన్న రాజకీయాలు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో సెలెక్షన్ కమిటీ కాకుండా స్వయంగా బోర్డు అధ్యక్షుడే జోక్యం చేసుకునేంతలా బీసీసీఐ రాజకీయాలు భ్రష్ఠుపట్టాయి. ఆటగాళ్ల ఎంపికలో, తుది జట్టు కూర్పు విషయంలో బోర్డు పెద్దలు జోక్యం చేసుకోకుంటే.. కోచ్, కెప్టెన్ సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బీసీసీఐ రాజకీయాలు మానుకుని పై పేర్కొన్న మూడు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెడితే స్వదేశంలో, చిన్న జట్లపై బెబ్బులిలా రెచ్చిపోయే టీమిండియా ఆటగాళ్లు.. విదేశాల్లో, పెద్ద జట్లపై, మెగా టోర్నీల్లో తమ ప్రతాపం చూపుతారు. -
లంక యువ సంచలనం.. అరంగేట్రంలోనే అదుర్స్! కానీ పాపం..
India vs Sri Lanka, 2nd ODI- Nuwanidu Fernando: శ్రీలంక యువ ఆటగాడు నువానీడు ఫెర్నాండో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగతున్న వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఫెర్నాండో.. అర్ధ శతకంతో అందరిని ఆకట్టుకున్నాడు. వెన్ను నొప్పి కారణంగా పాతుమ్ నిసాంక దూరం కావడంతో అతడి స్థానంలో నువానీడు ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో 50 పరుగులు చేసిన ఫెర్నాండో దురదృష్టవశాత్తు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 బౌండరీలు ఉన్నాయి. కాగా వన్డే డెబ్యు మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించిన ఆరో శ్రీలంక బ్యాటర్‌గా నువానీడు రికార్డులకెక్కాడు. ఇక తొలి మ్యాచ్‌లోనే అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఫెర్నాండో గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎవరీ నువానీడు ఫెర్నాండో? ఫెర్నాండో అక్టోబర్ 13, 1999న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు. అతడు 2016లో కోలంబో తరపున తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. అదే విధంగా ఫస్ట్-క్లాస్ క్రికెట్లో ఆకట్టుకున్న ఫెర్నాండోకు 2018 అండర్-19 ప్రపంచకప్ శ్రీలంక జట్టులో చోటు దక్కింది. ఈ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన 132 పరుగులతో రాణించాడు. అనంతరం 2019లో లిస్ట్-ఏ క్రికెట్లోకి నువానీడు ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 31 మ్యాచ్‌లు ఆడిన అతడు 1771 పరుగులు సాధించాడు. అదే విధంగా 23 లిస్ట్-ఏ క్రికెట్లో 748 పరుగులు, 34 టీ20ల్లో 760 పరుగులు చేశాడు. కాగా లంక సీనియర్ పేసర్ విశ్వ ఫెర్నాండో సోదరుడే ఈ నువానీడు ఫెర్నాండో కావడం విశేషం. లంక ప్రీమియర్ లీగ్‌లో అదుర్స్ గతేడాది ఆఖరిలో జరిగిన లంక ప్రీమియర్ లీగ్‌లో ఫెర్నాండో అదరగొట్టాడు. గాలే గ్లాడియేటర్స్ తరపున ఆడిన అతడు తొమ్మిది మ్యాచ్‌ల్లో 211 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే భారత్‌తో వన్డేలకు శ్రీలంక జట్టులో ఫెర్నాండోకు చోటు దక్కింది. చదవండి: Prithvi Shaw: నాకు తల పొగరా? హర్ట్ అయ్యాను! పర్లేదు.. పంత్ స్థానంలో నువ్వే! జై షా ట్వీట్ వైరల్ -
శ్రీలంకతో రెండో వన్డే.. టాస్ ఓడిన టీమిండియా, ఒక్క మార్పుతో బరిలోకి..!
కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడి, తొలుత బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఓ మార్పు చేసింది. తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సందర్భంగా గాయపడ్డ చహల్ మ్యాచ్ సమయానికి కోలుకోక పోవడంతో అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు శ్రీలంక రెండు మార్పులతో బరిలోకి దిగింది. పథుమ్ నిస్సంక, మధుశంక స్థానాల్లో నువనిదు ఫెర్నాండో, లహీరు కుమార తుది జట్టులోకి వచ్చారు. కాగా, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. కోహ్లి (113) సెంచరీతో, రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించారు. ఛేదనలో నిస్సంక (72) అర్ధసెంచరీతో, షనక (108 నాటౌట్) సెంచరీతో పోరాడినప్పటికీ శ్రీలంక గెలవలేకపోయింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తుది జట్లు.. భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ శ్రీలంక: కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, నువనిదు ఫెర్నాండో, దసున శనక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, లహిరు కుమార, కసున్ రజిత -
కింగ్ కోహ్లి సెంచరీ కొడితే టీమిండియా గెలవాల్సిందే.. అదీ లెక్క..!
IND VS SL 1st ODI: 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జనవరి 10న శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో శతకం బాదిన విరాట్ కోహ్లి (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్).. ఈ సెంచరీతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 45వ శతకాన్ని, ఓవరాల్‌గా 73వ అంతర్జాతీయ సెంచరీని బాదిన కోహ్లి.. శ్రీలంకపై తన 9వ శతకాన్ని నమోదు చేసి క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును (శ్రీలంకపై 8 శతకాలు) బద్దలుకొట్టాడు. ఈ క్రమంలో శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియాలపై 9 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డులతో పాటు కోహ్లి మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో కింగ్ సెంచరీ చేసిన 37 సందర్భాల్లో (ఓవరాల్‌గా 45 సెంచరీలు) టీమిండియా విజయం సాధించింది. ఈ ఫార్మాట్ చర్రితలో ఇది ప్రపంచ రికార్డుగా నమోదైంది. గతంలో క్రికెట్ దిగ్గజం సచిన్ సెంచరీ చేసిన 35 సందర్భాల్లో (ఓవరాల్‌గా 49 సెంచరీలు) టీమిండియా విజయం సాధించింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే, కోహ్లి సెంచరీ కొడితే టీమిండియా గెలుపు డిసైడ్ అయిపోతుందన్నది సుస్పష్టం అవుతుంది. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. కోహ్లి సెంచరీతో, రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించారు. ఛేదనలో నిస్సంక (72) అర్ధసెంచరీతో, షనక (108 నాటౌట్) సెంచరీతో పోరాడినప్పటికీ శ్రీలంక గెలవలేకపోయింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే కోల్‌కతాలో ఇవాళ (జనవరి 12) జరుగనుంది. -
శ్రీలంకతో రెండో వన్డే.. సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లకు ఛాన్స్.. ఎవరిపై వేటు..?
IND VS SL 2nd ODI: భారత్-శ్రీలంక జట్ల మధ్య కోల్‌కతా వేదికగా రేపు (జనవరి 12) రెండో వన్డే జరుగనున్న విషయం తెలిసిందే. తొలి వన్డేలో లంకపై 67 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించిన భారత్.. రేపటి మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు చేయబోతుందోనని క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత మ్యాచ్‌లో ప్రదర్శనల ఆధారంగా చూస్తే రేపటి మ్యాచ్‌లో ఎవరినీ తప్పించే అవకాశం లేనప్పటికీ.. సూర్యకుమార్ యాదవ్ (లంకతో మూడో టీ20లో మెరుపు శతకం సాధించాడు), ఇషాన్ కిషన్ (బంగ్లాదేశ్‌తో తన చివరి వన్డేలో డబుల్ సెంచరీ బాదాడు) లతో రిజర్వ్ బెంచ్ బలంగా ఉంది కాబట్టి, రొటేషన్ పద్దతిలో వీరిద్దరికి ఛాన్స్ లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ వీరిద్దరికి అవకాశం కల్పిస్తే ఎవరిపై వేటు వేస్తారన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తొలి వన్డేలో కోహ్లి (113), రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) పరుగుల వరద పారించారు కాబట్టి వీరిని కదిలించే అవకాశం లేదు. బ్యాటింగ్ విభాగంలో ఇక మిగిలింది శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లు మాత్రమే. గత మ్యాచ్‌లో వీరిద్దరు కూడా ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికీ, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. శ్రేయస్ 28, రాహుల్ 39 పరగులు చేసి ఔట్ కావడంతో అందరి కళ్లు వీరిద్దరిపై పడ్డాయి. స్కై, ఇషాన్‌లకు ఛాన్స్ ఇవ్వాలంటే వీరిని తప్పించాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. ఇషాన్ ఎటూ వికెట్‌కీపింగ్ చేస్తాడు కాబట్టి రాహుల్ స్థానాన్ని భర్తీ చేస్తాడని, శ్రేయస్ స్థానాన్ని సూర్యకుమార్‌తో ఫిల్ చేయాలని అభిమానుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిస్తున్నాయి. అయితే కేవలం ఒక్క మ్యాచ్‌లో పరుగులు చేయనంత మాత్రానా, జట్టును నుంచి తప్పిస్తారా అని ప్రశ్నించే వారు కూడా లేకపోలేదు. తొలి వన్డేలో శ్రేయస్, రాహుల్ బరిలోకి దిగిన సమయానికి ధాటిగా పరుగులు చేయాల్సి ఉండింది, ఆ క్రమంలోనే వారు ఔటయ్యారు, అలాంటప్పుడు వారిని జట్టు నుంచి తప్పించాలనడం ఎంత మాత్రం సమంజసం కాదని వాదిస్తున్నారు. ఇలా వాదించే వారికి స్కై, ఇషాన్ అభిమానులు కూడా తగు రీతిలో కౌంటర్లు ఇస్తున్నారు. ఇషాన్ తాను ఆడిన ఆఖరి వన్డేలో డబుల్ సెంచరీ, స్కై.. తానాడిన చివరి మ్యాచ్‌లో సెంచరీ చేసినప్పటికీ, జట్టు సమతూకం పేరు చెప్పి వీరిని తప్పించలేదా అని ప్రశ్నిస్తున్నారు. సోషల్‌మీడియాలో ఈ ఆసక్తికర చర్చ నేపథ్యంలో రేపటి మ్యాచ్ కోసం జట్టు మేనేజ్మెంట్ ఎలాంటి మార్పులు చేస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు సొంతం
ICC T20 Rankings: టీమిండియా డాషింగ్ బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్లో భారత్ తరఫున ఎవరికీ సాధ్యం కాని అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో 908 రేటింగ్ పాయింట్స్ సాధించి, పొట్టి ఫార్మాట్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్న స్కై.. 900 అంతకంటే ఎక్కువ రేటింగ్ పాయింట్స్ సాధించిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 45 బంతుల్లోనే విధ్వంసకర శతకం బాదిన సూర్యకుమార్.. తొలిసారి 900 రేటింగ్ పాయింట్స్ మార్కును తాకి, టీ20 ర్యాంకింగ్స్‌లో ఎవరికీ అంతనంత ఎత్తుకు దూసుకెళ్లాడు. టీ20 ర్యాంకింగ్స్ చరిత్రలో గతంలో డేవిడ్ మలాన్, ఆరోన్ ఫించ్‌లు మాత్రమే 900 రేటింగ్ పాయింట్స్‌ను సాధించగా.. తాజాగా స్కై వీరిద్దరి సరసన చేరాడు. తాజా ర్యాంకింగ్స్‌లో స్కై తర్వాత అల్లంత దూరాన పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. రిజ్వాన్.. 836 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత డెవాన్ కాన్వే, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మలాన్, గ్లెన్ ఫిలిప్స్, రిలీ రొస్సో, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్ వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 631 రేటింగ్ పాయింట్స్‌తో 13వ ప్లేస్‌లో నిలిచాడు. టాప్-20లో టీమిండియా తరఫున స్కై, విరాట్లు మాత్రమే ఉన్నారు. కాగా, లంకపై మూడో టీ20లో మెరుపు శతకం బాదిన సూర్యకుమార్‌కు అదే జట్టుతో జరిగిన తొలి వన్డేలో చోటు దక్కకపోవడం విశేషం. ఇప్పటివరకు 45 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 46.41 సగటున 180.34 స్ట్రయిక్ రేట్‌తో 1578 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే టీమిండియా తరఫున 16 వన్డేలు ఆడిన స్కై.. 32 సగటున, 100.5 స్ట్రయిక్ రేట్‌తో 384 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. -
దసున్ షనక సెంచరీ వృధా.. శ్రీలంకపై భారత్ ఘన విజయం
గౌహతి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 67పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేయగల్గింది. లంక కెప్టెన్ దసున్ షనక(108) ఆఖరి వరకు పోరాటం చేసినప్పటికీ తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. లంక బ్యాటర్లలో షనకతో పాటు ఓపెనర్ నిస్సాంక 72 పరుగులతో అకట్టుకున్నాడు. ఇక భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు, షమీ,హార్దిక్, చాహల్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లి(113) అద్భుతమైన సెంచరీ సాధించగా.. రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జనవరి 12న జరగనుంది. చదవండి: IND vs SL: వారెవ్వా.. సిరాజ్ దెబ్బకు బిత్తరపోయిన లంక బ్యాటర్ -
వారెవ్వా.. సిరాజ్ దెబ్బకు బిత్తరపోయిన లంక బ్యాటర్
గౌహతి వేదికగా శ్రీలంకతో తొలి వన్డేలో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన బంతితో మెరిశాడు. శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్‌ను అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ వేసిన బంతిని మెండిస్ కవర్ ఆడే ప్రమత్నం చేయగా.. బంతి ఇన్‌స్వింగ్ అయ్యి వికెట్లను వికెట్లను గిరాటేసింది. దీంతో ఒక్క సారిగా మెండిస్ కూడా బిత్తరి పోయాడు. సిరాజ్ దెబ్బకు మెండిస్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియోను వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు అదిలోనే సిరాజ్ గట్టి షాకిచ్చాడు. లంక ఓపెనర్ల ఇద్దరని సిరాజ్ తొలి ఐదు ఓవర్లలోనే పెవిలియన్‌కు పంపాడు. అనంతరం ఉమ్రాన్ మూడు వికెట్లతో చెలరేగాడు. 41 ఓవర్లు ముగిసే సరికి లంక 8 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. Mohammed Siraj is breathing fire 🔥 pic.twitter.com/ykjPbSSINE — Emon Mukherjee (@EmonMukherjee21) January 10, 2023 చదవండి: IND vs SL: సచిన్‌తో కోహ్లిని పోల్చడం సరికాదు.. గౌతం గంభీర్ సంచలన వాఖ్యలు -
నిప్పులు చెరిగిన ఉమ్రాన్.. ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు నమోదు
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా యువ పేసర్, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. తాను వేసిన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ 14వ ఓవర్) నాలుగో బంతిని ఏకంగా 156 కిమీ వేగంతో విసిరాడు. టీమిండియా చోటు దక్కించుకున్నప్పటి నుంచి నిలకడైన వేగంతో బంతులు సంధిస్తున్న ఉమ్రాన్.. ఈ సిరీస్‌కు ముందు లంకతో జరిగిన టీ20 సిరీస్‌లో 155 కిమీ వేగంతో బంతిని విసిరి టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఉమ్రాన్.. ఐపీఎల్లో సైతం టీమిండియా అత్యంత వేగవంతమైన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో ఈ కశ్మీరీ ఎక్స్‌ప్రెస్ 157 కిమీ వేగంతో బంతిని విసిరాడు. భారత్ తరఫున ఐపీఎల్లో ఉమ్రాన్‌దే రికార్డు. కాగా, లంకతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కోహ్లి సెంచరీతో (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్), రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 29 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతుంది. -
సచిన్‌తో కోహ్లిని పోల్చడం సరికాదు.. గౌతం గంభీర్ సంచలన వాఖ్యలు
కొత్త ఏడాదిని టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో ఆరంభించాడు. గౌహతి వేదికగా శ్రీలంకతో తొలి వన్డేలో విరాట్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 113 పరుగులు చేశాడు. కాగా విరాట్‌కు ఇది 45వ వన్డే సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పలు రికార్డులను కోహ్లి బ్రేక్ చేశాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 12500 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి ఈ మార్కును అందుకునేందుకు 257 మ్యాచ్‌లు అవసరం కాగా.. సచిన్‌కు 310 మ్యాచ్‌లు అవసరమయ్యాయి. అదే విధంగా స్వదేశంలో అత్యధిక సెంచరీల చేసిన సచిన్ రికార్డును కూడా కోహ్లి(20) సమం చేశాడు. దీంతో విరాట్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురిస్తోంది. ఈ క్రమంలో కోహ్లిపై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్‌తో విరాట్ కోహ్లిని పోల్చడం సరికాదు అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. సచిన్ కాలంలో ఫీల్డ్ ఆంక్షలు బ్యాటర్లకు అంత అనుకూలంగా లేనందున పరుగులు చేయడం కష్టమని గంభీర్ తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో గంభీర్ మాట్లాడుతూ.. "కోహ్లిని సచిన్‌తో పోల్చడం సరికాదు. సచిన్ క్రికెట్ ఆడే కాలంలో ఫీల్డ్ ఆంక్షలు చాలా కఠినంగా ఉండేవి. ఫీల్డ్‌లో 30 యార్డ్ సర్కిల్ వెలుపల 5 మంది కంటే ఎక్కువ ఆటగాళ్లు ఉండేవారు. కాబట్టి బౌండరీలు కొట్టడం చాలా కష్టంగా ఉండేది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IND VS SL 1st ODI: రోహిత్.. లంకపై చేసిన హాఫ్ సెంచరీని ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా..? -
రోహిత్.. లంకపై చేసిన హాఫ్ సెంచరీని ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా..?
గౌహతి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత మునపటి టచ్‌లో కనబడిన హిట్ మ్యాన్.. 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా 67 బంతులు ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్.. 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ధాటిగా ఆడిన రోహిత్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మధుశంక బౌలింగ్‌లో బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకోవడంతో రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాక ఆకాశం వైపు చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఎందుకంటే.. నిన్న (జనవరి 9) రోహిత్ అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క మ్యాజిక్ చనిపోయింది. ఈ విషయాన్ని రోహిత్ భార్య రితిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. మ్యాజిక్ లేదన్న బాధలోనే ఈ మ్యాచ్ బరిలోకి దిగిన రోహిత్.. ఫిఫ్టి పూర్తి కాగానే ఆకాశం వైపు చూస్తూ మ్యాజిక్ పేరును స్మరిస్తూ, చాలాకాలం తర్వాత చేసిన కీలక హాఫ్ సెంచరీని మ్యాజిక్కు అంకితమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. Dedicating this 50 for his pet dog who passed away this week. Rohit is an emotion for cricketing fans!! Love this celebration from skipper.#RohitSharma #INDvSL #RohitSharma𓃵 pic.twitter.com/c7EHEmsFjc — sportsbuzz (@cricket_katta11) January 10, 2023 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రోహిత్, శుభ్‌మన్ గిల్ (70)లు హాఫ్ సెంచరీలతో రాణించగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్) శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. View this post on Instagram A post shared by Ritika Sajdeh (@ritssajdeh) -
లంకతో తొలి వన్డే.. సూపర్ సెంచరీతో పలు రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి
IND VS SL 1st ODI: గౌహతి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో సెంచరీ చేయడం ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన కోహ్లి.. వన్డేల్లో 45వ శతకాన్ని, ఓవరాల్‌గా 73వ అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లోనే వన్డేల్లో 12500 పరుగుల మైలరాయిని చేరుకున్న కోహ్లి.. శ్రీలంకపై తన 9వ శతకాన్ని బాదాడు. తద్వారా క్రికెట్ గాడ్ సచిన్ పేరిట ఉన్న ఓ రికార్డును (శ్రీలంకపై 8 శతకాలు) బద్దలుకొట్టి తన పేరిట లిఖించుకున్నాడు. అలాగే సచిన్ పేరిట ఉన్న మరో రికార్డును కింగ్ సమం చేశాడు. స్వదేశంలో సచిన్ 164 మ్యాచ్‌ల్లో 20 సెంచరీలు సాధిస్తే.. రన్‌మెషీన్ కేవలం 101 మ్యాచ్‌ల్లోనే 20 శతకాలు పూర్తి చేశాడు. 1214 రోజుల పాటు సెంచరీ లేక ముప్పేట దాడిని ఎదుర్కొన్న కోహ్లి ఆసియా కప్-2022లో ఆఫ్ఘనిస్తాన్పై టీ20 శతకం తర్వాత వన్డేల్లో వరుస మ్యాచ్‌ల్లో (బంగ్లాదేశ్, శ్రీలంక) శతకాలు బాదాడు. ఈ సెంచరీ ద్వారా కోహ్లి మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియాలపై 9 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. సచిన్ కూడా వెస్టిండీస్, ఆస్ట్రేలియాలపై 9 సెంచరీలు సాధించినప్పటికీ శ్రీలంకపై 8 సెంచరీలతోనే ఆగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 113 పరుగులు చేసిన కోహ్లి.. తన వన్డే కెరీర్లో ఓ జట్టుపై అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. కోహ్లి తన వన్డే కెరీర్లో అత్యధికంగా శ్రీలంకపై 2264 పరుగుల చేయగా.. వెస్టిండీస్‌పై 2261, ఆస్ట్రేలియాపై 2083. సౌతాఫ్రికాపై 1403 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కోహ్లి సెంచరీతో, రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. -
IND vs SL: దుమ్మురేపిన కోహ్లి, రోహిత్.. శ్రీలంక టార్గెట్ 374 పరుగులు
గౌహతి వేదికగా శ్రీలంకతో మొదటి వన్డేలో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 373 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(113) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(83), శుబ్మాన్ గిల్(70) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. విరాట్ కేవలం 80 బంతుల్లోనే తన 45 అంతర్జాతీయ వన్డే సెంచరీని అందుకున్నాడు. విరాట్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి. ఇక శ్రీలంక బౌలర్లలో కుశాన్ రజితా మూడు వికెట్లు పడగొట్టగా..మధుశంక, కరుణరత్నే, షనక తలా వికెట్ సాధించారు. -
IND Vs SL: వారెవ్వా! సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లి..
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది ఆడిన తొలి మ్యాచ్‌లోనే కోహ్లి సెంచరీ సాధించాడు. గౌహతి వేదికగా శ్రీలంకతో మొదటి వన్డేలో కింగ్ కోహ్లి సెంచరీ చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కేవలం 80 బంతుల్లోనే తన 45వ అంతర్జాతీయ వన్డే సెంచరీ అందుకున్నాడు. ఇక ఓవరాల్‌గా విరాట్‌కు ఇది 73వ అంతర్జాతీయ సెంచరీ. ఇక ఈ మ్యాచ్‌లో 87 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 113 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు,ఒక సిక్స్ ఉన్నాయి. కాగా విరాట్‌కు ఇది వరుసగా రెండో వన్డే శతకం కావడం గమానార్హం. గతేడాది ఆఖరిలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో విరాట్ అద్భుతమైన సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం విరాట్‌కు ఇదే తొలి వన్డే. Back to back ODI hundreds for @imVkohli 👏👏 Live - https://t.co/MB6gfx9iRy #INDvSL @mastercardindia pic.twitter.com/Crmm45NLNq — BCCI (@BCCI) January 10, 2023 -
సెంచరీ, డబుల్ సెంచరీ చేసినా టీమిండియాలో చోటుకు దిక్కు లేదు.. ఏంటీ పరిస్థితి..?
IND VS SL 1st ODI: భారత్-శ్రీలంక జట్ల మధ్య గౌహతి వేదికగా ఇవాళ (జనవరి 10) తొలి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70), విరాట్ కోహ్లి (79 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 41 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. కోహ్లికి జతగా హార్ధిక్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ (28), కేఎల్ రాహుల్ (39)లకు కూడా మంచి ఆరంభమే లభించినప్పటికీ.. అనవసర షాట్లకు ప్రయత్నించి ఔటయ్యారు. లంక బౌలర్లలో మధుశంక, దసున్ షనక, ధనంజయ డిసిల్వలకు తలో వికెట్ దక్కింది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టు కూర్పు పలు వివాదాలకు తెరలేపింది. పలువురు ఆటగాళ్లు తమ చివరి మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించినా.. తుది జట్టులో చోటు సంపాదించలేకపోయారు. ఈ విషయమే ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత మ్యాచ్‌లో (లంకతో మూడో టీ20) విధ్వంసకర శతకం సాధించిన సూర్యకుమార్, తానాడిన చివరి వన్డేలో (బంగ్లాతో మూడో వన్డే) ఏకంగా డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్, బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్ (8 వికెట్లు, 40 పరుగులు) లంకతో జరుగుతున్న తొలి వన్డేలో చోటు దక్కించుకోలేకపోయారు. ఆటగాళ్లు అంచనాలకు మించి రాణిస్తున్నా, జట్టు సమతూకం పేరుతో వారిని పక్కకు పెట్టడం ఎంత మాత్రం సమజసం కాదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పెద్దగా ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్ కోసం సూర్యకుమార్ యాదవ్‌ను తుది జట్టు నుంచి తప్పించడం విఢ్డూరంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అలాగే మంచి ఫామ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్‌ను కాదని చహల్‌ను ఆడించడం ఏంటని మేనేజ్మెంట్ను ప్రశ్నిస్తున్నారు. ఇషాన్ కిషన్ విషయంలో జట్టు యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు దారుణమని అంటున్నారు. ఆటగాళ్లు రాణిస్తున్నా ఏదో ఒక కారణం చెప్పి పక్కన పెడితే మిగతా ఆటగాళ్లలో కూడా అభద్రతా భావం పెరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు. -
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లి
గౌహతి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో శతకం దిశగా దూసుకుపోతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (92) క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 12500 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి ఈ మార్కును అందుకునేందుకు 257 మ్యాచ్‌లు అవసరం కాగా.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఈ ఫీట్ సాధించేందుకు ఏకంగా 310 మ్యాచ్‌లు అవసరమయ్యాయి. మరోవైపు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్‌కు 12500 పరుగులు చేసేందుకు 328 మ్యాచ్‌లు తీసుకున్నాడు. కోహ్లి వన్డేల్లో 57.88 సగటున ఈ పరుగులు స్కోర్ చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70), విరాట్ కోహ్లి (92 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 45 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 335 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (28), కేఎల్ రాహుల్ (39), హార్ధిక్ పాండ్యా (14) ఔట్ కాగా.. కోహ్లి జతగా అక్షర్ పటేల్ క్రీజ్‌లో ఉన్నాడు. -
దుమ్ము రేపిన రోహిత్ శర్మ.. అయ్యో! సెంచరీ మిస్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన రోహిత్ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. గౌహతి వేదికగా శ్రీలంకతో తొలి వన్డేలో రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 67 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్.. 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. కాగా ఆరంభం నుంచే ధాటిగా ఆడిన రోహిత్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 83 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ శ్రీలంక పేసర్ మధుశంక బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఓ దశలో 150(డాడీ 100)కి పైగా పరుగులు చేస్తాడని భావించగా.. రోహిత్ ఇలా సెంచరీ చేజార్చుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా.. ‘‘హృదయం ముక్కలైంది’’ అంటూ బ్రేకింగ్ హార్ట్ ఎమోజీలు జతచేస్తున్నారు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం.. ‘‘రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.. కానీ.. డాడీ 100 మిస్ అయ్యాడు’’ అని విచారం వ్యక్తం చేశాడు. భారీ స్కోర్ దిశగా భారత్ ఇక లంకతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 41 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లి(62), హార్దిక్ పాండ్యా(0) పరుగులతో ఉన్నారు. కాగా అంతకుముందు తొలి వికెట్‌కు రోహిత్, గిల్ కలిసి 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో గిల్ 70 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. Vintage Hit-man 🔥🔥🔥#INDvSL #RohitSharma𓃵 pic.twitter.com/JdeqDK3iw3 — Satyan Tripathi (सत्यम) (@AshutoshAbhish8) January 10, 2023 -
India vs Sri Lanka: వన్డేలకు మోగిన విజిల్! లంకకు కష్టమే.. అందరూ అంతంతే!
వన్డే వరల్డ్కప్నామ సంవత్సరమిది... అదీ భారత గడ్డపై... ఈ నేపథ్యంలో అక్టోబరుకు ముందు ఇకపై జరిగే వన్డేలన్నీ భారత్‌కు సన్నాహకాలే... మధ్యలో ఐపీఎల్ రూపంలో టి20లు ఉన్నా, వన్డే జట్టు ఎంపికకు, తుది జట్టు కూర్పు కొరకు ఈ మ్యాచ్‌ల ప్రదర్శనే కీలకం అవుతుందనడంలో సందేహం లేదు. ఆసియాకప్ కాకుండా టీమిండియా కనీసం 15 వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో నేటినుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌లో శ్రీలంకను భారత్ ఎదుర్కొంటుంది. గువహటి: శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకున్న భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టింది. నేడు జరిగే తొలి వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల రాకతో భారత బృందం మరింత పటిష్టంగా మారగా... లంక దాదాపు అదే జట్టుతో మరో పోరాటానికి సిద్ధమైంది. తొలి రెండు టి20లు హోరాహోరీగా సాగినా... చివరి మ్యాచ్‌లో ఏకపక్ష విజయంతో భారత్ తమ స్థాయి ఏమిటో ప్రదర్శించింది. అయితే ఆ సిరీస్‌లో చూపిన ప్రదర్శన లంక జట్టులో ఆత్మ విశ్వాసం పెంచింది. 2017 తర్వాత స్వదేశంలో శ్రీలంకతో భారత్ వన్డే సిరీస్ ఆడుతోంది. ఓపెనర్‌గా గిల్... బంగ్లాదేశ్‌తో చివరి వన్డేలో అద్భుత బ్యాటింగ్‌తో ‘డబుల్ సెంచరీ’ సాధించినా... ఇషాన్ కిషన్‌కు ఈ మ్యాచ్‌లో మాత్రం చాన్స్ లేదు. కెప్టెన్ రోహిత్ రాకతో అతనిపై వేటు ఖాయమైంది. ఇషాన్‌కు అవకాశం ఇవ్వలేమని రోహిత్ స్పష్టం చేసేశాడు కూడా. వన్డేల్లో ఓపెనర్‌గా తనను తాను నిరూపించుకున్న శుబ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ ఓపెనింగ్ చేస్తాడు. టి20ల్లో ఆడని కోహ్లి తనకు బాగా అచ్చి వచ్చిన ఫార్మాట్లో మళ్లీ చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. లంకపై ఏకంగా 8 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు చేసిన ఘనమైన రికార్డు కోహ్లికి ఉంది. గత ఏడాది 55.69 సగటుతో 724 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్‌కు మిడిలార్డర్లో చోటు ఖాయం కాగా... వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ కూడా బరిలోకి దిగుతాడు. దాంతో టి20ల్లో విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్‌కు చోటు కష్టమే. పైగా వన్డేల్లో ఇప్పటి వరకు సూర్య ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. రాహుల్, శ్రేయస్‌లలో ఒకరిని తప్పించి సూర్యను ఆడించే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ఆరో స్థానంలో ఆల్‌రౌండర్‌గా కొత్త వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. బౌలింగ్‌లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో జట్టు కూర్పు ఉండవచ్చు. అక్షర్ పటేల్ ఖాయం కాగా... రెండో స్పిన్నర్‌గా చహల్, కుల్దీప్ యాదవ్‌ల మధ్య పోటీ ఉంది. సీనియర్ పేసర్ షమీ, సిరాజ్‌లతో పాటు మూడో పేసర్‌గా అర్ష్‌దీప్, ఉమ్రాన్‌లలో ఒకరికి చాన్స్ దక్కుతుంది. బంగ్లా చేతిలో సిరీస్ ఓడినా... ఓవరాల్‌పై లంకపై భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది. అందరూ అంతంతే... శ్రీలంక జట్టు గత కొంత కాలంగా వన్డేల్లో కాస్త మెరుగైంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ గెలవడం ఆ జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన. అయితే సమస్యంతా ఒక్కొక్క ఆటగాడి వన్డే రికార్డుతోనే. ప్రస్తుతం ఉన్న జట్టులో అంతా టి20ల్లో ఆకట్టుకున్నవారే అయినా... వన్డేల్లో రెగ్యులర్‌గా తమను తాను నిరూపించుకున్నవారు ఎవరూ లేరు. టి20లతో పోలిస్తే వన్డేల్లో సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో నిలిచి ఇన్నింగ్స్‌ను నిర్మించే సమర్థుడైన బ్యాటర్ గానీ... 10 ఓవర్ల పాటు నిలకడగా ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగల బౌలర్ గానీ జట్టులో కనిపించడం లేదు. టి20ల్లో సత్తా చాటిన షనక వన్డే రికార్డు పేలవం. పైగా అతను ఇప్పటి వరకు భారత గడ్డపై వన్డే ఆడనే లేదు. అదే తరహాలో జట్టు ప్రధాన అస్త్రం హసరంగ కూడా వన్డేల్లో అంతంతే. ఇద్దరు పేసర్లు రజిత, కుమారలు ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోగా, మదుషంక వన్డేలో అరంగేట్రం చేయలేదు. ఇలాంటి స్థితిలో భారత్‌కు లంక ఏమాత్రం పోటీనిస్తుందో చూడాలి. ముఖాముఖి పోరులో 162: ఇప్పటి వరకు భారత్, శ్రీలంక జట్ల మధ్య 162 వన్డేలు జరిగాయి. 93 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. 57 మ్యాచ్‌ల్లో శ్రీలంక నెగ్గింది. ఒక మ్యాచ్ ‘టై’కాగా... 11 మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇక భారత గడ్డపై ఈ రెండు జట్లు 51 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 36 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందగా... 12 మ్యాచ్‌ల్లో శ్రీలంక విజయం సాధించింది. మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. -
శ్రీలంకతో తొలి వన్డే.. డబుల్ సెంచరీ ఆటగాడికి నో ఛాన్స్! క్లారిటీ ఇచ్చిన రోహిత్
స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్ మూడు వన్డేలు ఆడనుంది. జనవరి 10 (మంగళవారం)న గౌహతి వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ తిరిగి వన్డే సిరీస్‌కు జట్టులోకి వచ్చారు. ఇక తొలి వన్డేకు ముందు ఏర్పాటు చేసిన విలేకురల సమావేశంలో రోహిత్ శర్మ జట్టు కూర్పుతో సహా పలు అంశాలపై మాట్లాడాడు. తొలి వన్డేకు భారత తుది జట్టులో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు చోటు దక్కడం కష్టమని రోహిత్ తెలిపాడు. అతడి స్థానంలో మరో యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు హిట్‌మ్యాన్ అన్నాడు. కాగా ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో కిషన్ అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సీనియర్ జట్టులోకి రావడంతో మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. రోహిత్ మాట్లాడుతూ.. "గత కొన్ని సిరీస్‌ల నుంచి గిల్, ఇషాన్ అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే కిషన్ కంటే గిల్‌కు వన్డేల్లో మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి గిల్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాము. అదే విధంగా కిషన్ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించడం అంత సులభం కాదు అని నాకు తెలుసు. ఈ సిరీస్‌లో కిషన్‌కు కూడా తప్పకుండా అవకాశం దక్కుతుంది" అని పేర్కొన్నాడు. కాగా గిల్‌కు వన్డేల్లో అద్భుతమైన రికార్డుఉంది. ఇప్పటి వరకు 13 వన్డే మ్యాచ్‌లు ఆడిన గిల్ 687 పరుగులు సాధించాడు. చదవండి: IND Vs SL: బుమ్రా గాయంపై స్పందించిన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే? View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
బుమ్రా గాయంపై స్పందించిన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే?
స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌ను నెగ్గిన టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా మూడు వన్డేలు పర్యాటక జట్టుతో భారత్ ఆడనుంది. జనవరి 10 (మంగళవారం)న గౌహతి వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. వన్డే సిరీస్‌కు ప్రారంభానికి ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లంకతో వన్డే సిరీస్‌కు ఎంపికైన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోక పోవడంతో ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమయ్యాడు. ఇకగాయం కారణంగా బుమ్రా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడిని తొలుత లంకతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అయితే బుమ్రా ఫిట్నెస్ సాధించాడని భావించిన సెలక్టర్లు అతడిని లంకతో వన్డే జట్టులోకి చేర్చారు. కానీ అతడికి ఇంకా కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్యబృందం భావిస్తోంది. ఈ క్రమంలోనే అతడు వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇక వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం కావడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బుమ్రా వెన్ను గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని రోహిత్ తెలిపాడు. "వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం కావడం చాలా దురదృష్టకరం. అతడు ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే కొన్ని రోజులు కిందట అతడు తన వెన్ను నొప్పి పూర్తిగా తగ్గిందని భావించాడు. ఈ క్రమంలో అతడు బీసీసీఐ మెడికల్ టీంకు కూడా సమాచారం ఇచ్చాడు. కానీ మళ్లీ ఇప్పుడు బుమ్రా తన వెన్ను నొప్పి మొదలైందని తెలియజేశాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ అతడిని వన్డే జట్టు నుంచి తప్పించింది. అతడు మా ప్రధాన బౌలర్. కాబట్టి అతడి ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని భావించాం" అని తొలి వన్డేకు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోహిత్ పేర్కొన్నాడు. చదవండి: IND vs SL: 'అతడిని చూస్తే శ్రీనాథ్ గుర్తొస్తున్నాడు.. చాలా అరుదుగా ఉంటారు' -
'అతడిని చూస్తే శ్రీనాథ్ గుర్తొస్తున్నాడు.. చాలా అరుదుగా ఉంటారు'
టీమిండియా ఎక్స్‌ప్రెస్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్ స్కిల్స్‌తో అందరనీ అకట్టుకుంటున్నాడు. తాజాగా స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఉమ్రాన్ అదరగొట్టాడు. ఈ సిరీస్‌లో 7 వికెట్లతో ఉమ్రాన్ సత్తాచాటాడు. అంతేకాకుండా ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత్ బౌలర్ కూడా ఉమ్రానే కావడం విశేషం. ఇక లంకతో సిరీస్‌లో అదరగొట్టిన ఉమ్రాన్‌పై భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు. భారత దిగ్గజ బౌలర్ జవగల్ శ్రీనాథ్‌తో ఉమ్రాన్‌ను జడేజా పోల్చాడు. ఉమ్రాన్ మాలిక్ వంటి బౌలర్లు చాలా అరుదగా ఉంటారు. భారత్‌లో మాత్రం చాలా కాలం తర్వాత ఉమ్రాన్ వంటి స్పీడ్ స్టార్‌ను చూశాను. గతంలో జావగల్ శ్రీనాథ్ కూడా ఈ విధమైన స్పీడ్‌తో బౌలింగ్ చేసేవాడు. ప్రస్తుతం మాలిక్‌ను చూస్తుంటే నాకు శ్రీనాథ్ గుర్తుస్తున్నాడు. ఉమ్రాన్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి అతడి లాంటి ఆణిముత్యాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉంది. ముఖ్యంగా టెయిలండర్లు క్రీజులో ఉన్నప్పుడు అతడిని బౌలింగ్‌కు తీసుకురండి. ఉమ్రాన్ స్పీడ్‌కు వాళ్లు తట్టుకోలేరు. అతడిని 10 సార్లు తీసుకువస్తే 8 సార్లు వికెట్లు తీయగలడు అని జడేజా క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఉమ్రాన్ మాలిక్ లంకతో వన్డే సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. -
భారత్-శ్రీలంక తొలి వన్డే.. ఏకంగా సెలవిచ్చిన ప్రభుత్వం!
స్వదేశంలో శ్రీలంకతో మరో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్.. ఇప్పుడు మూడు వన్డేల సిరీస్‌లో లంకతో తలపడనుంది. ఇక ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 గౌహతిలోని బర్సపరా స్టేడియం వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని కామ్రప్ మెట్రోపాలిటిన్ జిల్లాలో అభిమానులు మ్యాచ్ చూసేందుకు హాఫ్-డే సెలవు ప్రకటించింది. "బర్సపరా స్టేడియం వేదికగా శ్రీలంక-భారత్ తొలి వన్డే జరగనుంది. ఈ సందర్భంగా కామ్రప్ మెట్రోపాలిటిన్ జిల్లాలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు హాఫ్ డే సెలవు ప్రకటించాం. ఈ నిర్ణయం పట్ల అస్సాం గవర్నర్ కూడా సంతోషం వ్యక్తం చేశారు" అని హిమంత బిస్వా శర్మ సర్కార్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక గతేడాది జూలై తర్వాత తొలి సారి వన్డే సిరీస్‌లో భారత- శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇక ఈ సిరీస్‌కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. అదే విధంగా పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ కూడా వన్డే సిరీస్‌లో భాగం కానున్నారు. చదవండి: IND VS SL ODI Series: టీమిండియాకు భారీ షాక్.. బుమ్రా ఔట్ -
ద్రవిడ్, రోహిత్ కాదు! నా కెప్టెన్సీ సక్సెస్‌కు కారణం అతడే: హార్దిక్ పాండ్యా
టీమిండియా తాత్కాలిక టీ20 కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న హార్దిక్ పాండ్యా విజయపథంలో దూసుకుపోతున్నాడు. తాజాగా శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన హార్దిక్.. తన జట్టుకు 2-1తేడాతో మరో టైటిల్‌ను అందించాడు. కాగా రోహిత్ వారసుడిగా భావిస్తున్న హార్ధిక్ పాండ్యాకు టీ20 కెప్టెన్‌గా స్వదేశంలో ఇదే తొలి సిరీస్ విజయం. ఇక మూడో టీ20 మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్.. తన కెప్టెన్సీ సక్సెస్‌కు గల కారణాన్ని వెల్లడించాడు. టీమిండియా మాజీ బౌలర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా సూచనల వల్లే నేను కెప్టెన్‌గా విజయవంతమయ్యాను అని హార్ది్క్ తెలిపాడు. కాగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్.. అరంగేట్ర సీజన్లోనే తన జట్టుకు టైటిల్‌ను అందించాడు. అదే విధంగా కోచ్‌గా నెహ్రా కూడా జట్టును ముందుండి నడిపించాడు. ఇక పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ మాట్లాడుతూ.."ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా విజయవంతం కావడానికి కోచ్ ఆశిష్ నెహ్రానే కారణం. ఇప్పుడు అతడు సూచనల వల్లే మరింత మెరుగ్గా రాణించగల్గుతున్నాను. నెహ్రా వంటి కోచ్‌తో పని చేయడం నా అదృష్టం. అతడు నా జీవితంలో నేను ఊహించని మార్పులను తీసుకొచ్చాడు. మేమిద్దరం ఒకే విధంగా ఆలోచిస్తాం. అతడితో కలిసి పని చేయడం వల్ల నా కెప్టెన్సీకి విలువ పెరిగింది. అతడు కెప్టెన్‌గా పనిచేయకపోయనప్పటకీ.. పలు విషయాలు ఆశిష్ దగ్గర నేర్చుకున్నాను. అదే విధంగా కెప్టెన్సీ పరంగా కూడా గతంలో నాకు పెద్దగా అనుభవం లేదు. కేవలం అండర్ -16 జట్టులో ఉన్నప్పుడు బరోడాకు సారథిగా ఉన్నాను. ఆ తర్వాత కేవలం నా ఆట మీదే దృష్టి పెట్టాను అని అతడు పేర్కొన్నాడు. కాగా హార్దిక్ తన వాఖ్యలలో ఎక్కడ కూడా ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ పేరులను ప్రస్తావించకపోవడం గమనార్హం. కాగా హార్దిక్ భారత జట్టుతో పాటు ఐపీఎల్లో కూడా రోహిత్ సారథ్యంలో చాలా సీజన్ల పాటు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. -
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. బుమ్రా ఔట్
గౌహతి వేదికగా శ్రీలంకతో రేపటి (జనవరి 10) నుంచి ప్రారంభంకానున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ బౌలర్, పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా జట్టులో చేరకుండానే ఔటయ్యాడు. వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న బుమ్రా.. పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించలేని కారణంగా జట్టు దూరంగా ఉండాలని సూచించినట్లు బీసీసీఐకి చెందిన కీలక ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీంతో బుమ్రా వన్డే జట్టుతో కలవకుండా ఎన్సీఏ (నేషనల్ క్రికెట్ అకాడమీ)లోనే ఉండిపోయాడు. సహచరులు, టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్లు రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే తొలి వన్డేకు వేదిక అయిన గౌహతికి చేరుకున్నారు. కాగా, లంకతో వన్డే సిరీస్ నుంచి బుమ్రాను తప్పించడానికి వేరే కారణాలు ఉన్నట్లు ఎన్సీఏ అధికారుల ద్వారా తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్ నుంచి జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా.. సమీప భవిష్యత్తులో కీలక సిరీస్‌లు (ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్, వన్డే వరల్డ్‌కప్) ఆడాల్సి ఉన్నందున మరోసారి గాయాల బారిన పడకుండా ఉండాలని బీసీసీఐ ఉద్దేశపూర్వకంగా అతన్ని తప్పించినట్లు తెలుస్తోంది. లంకతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో పేసర్ స్థానానికి ఎటూ పోటీ ఉన్నందున రిస్క్ తీసుకోవడం ఎందుకని భావించి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఒకవేళ ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందే బుమ్రాను బరిలోకి దించాలని బీసీసీఐ భావిస్తే.. జనవరి 18 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో అతనికి అవకాశం ఇవ్వవచ్చని తెలుస్తోంది. లంకతో వన్డేలకు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ -
శ్రీలంకతో వన్డే సిరీస్.. టీమిండియాలో ఎవరెవరు ఉన్నారంటే..?
IND VS SL ODI Series: శ్రీలంకపై 2-1 తేడాతో టీ20 సిరీస్ నెగ్గి ఈ ఏడాది (2023) ఘనంగా బోణీ కొట్టిన టీమిండియా రేపటి నుంచి (జనవరి 10) అదే జట్టుతో వన్డే సిరీస్ ఆడనుంది. రేపు గౌహతి వేదికగా తొలి వన్డే ఆడనున్న భారత్.. జనవరి 12న రెండో వన్డే (కోల్‌కతా), జనవరి 15న మూడో వన్డే (తిరువనంతపురం) ఆడుతుంది. టీ20 సిరీస్‌కు రెస్ట్ తీసుకున్న సీనియర్లు వన్డే సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనుండటంతో టీమిండియా మరింత పటిష్టంగా మారింది. సీనియర్ల రాకతో టీ20 జట్టులో ఉండిన రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, ముఖేష్ కుమార్, జితేశ్ శర్మ, శివమ్ మావి, సంజూ శాంసన్ పక్కకు తప్పుకోక తప్పలేదు. వన్డే సిరీస్‌లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి సారధ్య బాధ్యతలు చేపట్టనుండగా.. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలు జట్టులో చేరనున్నారు. వీరిలో బుమ్రా చాలాకాలం తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేస్తున్నాడు. యువ పేసర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో బుమ్రా మునుపటి జోరును కనబరుస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్ క్రమం తప్పకుండా సత్తా చాటుతుండటంతో వెటరన్ పేసర్ షమీకి తుది జట్టులో చోటు దక్కుతుందో లేదోనన్నది అనుమానంగా మారింది. బ్యాటింగ్ విభాగం విషయానికొస్తే.. సీనియర్లు రోహిత్, కేఎల్ రాహుల్ రాకతో యువ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ల స్థానాలు సందిగ్ధంలో పడ్డాయి. రోహిత్, రాహుల్‌ను కాదని వీరికి తుది జట్టులో ఛాన్స్ దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వన్ డౌన్లో కోహ్లి, నాలుగో స్థానంలో భీకర ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్, ఐదో ప్లేస్‌లో మిస్టర్ స్టేబుల్ శ్రేయస్ అయ్యర్, ఆల్‌రౌండర్ల కోటాలో హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో చహల్ లేదా కుల్దీప్, పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, షమీ లేదా సిరాజ్, అర్షదీప్ లేదా ఉమ్రాన్ మాలిక్‌లకు తుది జట్టులో చోటు దొరికే అవకాశం ఉంది. లంకతో వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ -
శివమ్ మావి కళ్లు చెదిరే క్యాచ్.. హార్దిక్ షాకింగ్ రియాక్షన్ వైరల్
రాజ్‌కోట్ వేదికగా శనివారం శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 91 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాడు శివమ్ మావి సంచలన క్యాచ్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 10 ఓవర్లో చాహల్ వేసిన ఫుల్ ఆఫ్‌సైడ్ బంతిని చరిత్ అసలంక భారీ షాట్ ఆడాడు. దీంతో అది బౌండరీ దాటడం ఖాయమని అంతా భావించారు. కానీ స్వీపర్ కవర్లో ఫీల్డింగ్ చేస్తున్న మావి పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అతడి స్టన్నింగ్ క్యాచ్‌కు అందరూ ఫిదా అయిపోయారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం మావి మెరుపు క్యాచ్ చూసి ఆశ్చర్యపోయాడు. మావి క్యాచ్ పట్టిన హార్దిక్ సూపర్ అంటూ వెరైటీ రియాక్షన్ ఇచ్చాడు. ఇక మావి క్యాచ్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత ఇన్నింగ్స్‌ను ఆడిన సూర్యకుమార్ యాదవ్(112 నాటౌట్)కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సిరీస్ టోర్నీ ఆసాంతం అదరగొట్టిన భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ దక్కింది. చదవండి: IND vs SL: డివిలియర్స్, క్రిస్ గేల్‌తో సూర్యకు పోలికా? అతడు ఎప్పుడో మించిపోయాడు ICYMI - A fine running catch by @ShivamMavi23 near the boundary ends Asalanka's stay out there in the middle. Live - https://t.co/bY4wgiSvMC #INDvSL @mastercardindia pic.twitter.com/hwSrjjsalm — BCCI (@BCCI) January 7, 2023 pic.twitter.com/bmQflv7Q9u — IPLT20 Fan (@FanIplt20) January 7, 2023 -
నేను గనుక సూర్యకి బౌలింగ్ చేసే ఉంటేనా: హార్దిక్ పాండ్యా
స్వదేశంలో టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా తొలి టీ20 సిరీస్ విజయాన్ని నమోదు చేశాడు. శనివారం రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 91 పరుగుల తేడాతో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య సెంచరీ సాధిచాడు. ఓవరాల్‌గా 51 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబైకర్.. 9 సిక్స్‌లు, 7 ఫోర్లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం సూర్యకుమార్‌ను భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రశంసలతో ముంచెత్తాడు. పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ మాట్లాడుతూ.. "సూర్యకుమార్ తన విధ్వంసకర ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతడు అంత సులభంగా ఎలా బ్యాటింగ్ చేయగల్గుతున్నాడో అర్ధం కావడం లేదు. ఒక వేళ నేను బౌలర్ అయివుంటే అతడు ఆడే షాట్లకు ఖచ్చితంగా భయపడేవాడిని. ఎందుకుంటే ఈ మ్యాచ్‌లో అతడు ఆడిన షాట్లు అలా వున్నాయి. మైదానం నలుమూలల సూర్య షాట్లు ఆడాడు. అదే విధంగా రాహుల్ త్రిపాఠి కూడా అద్భుతంగా ఆడాడు. తొలుత పిచ్ బౌలర్లకు సహకరించినప్పటికీ.. పవర్‌ప్లేలో త్రిపాఠి చాలా దూకుడుగా ఆడాడు. అనంతరం సూర్య తన పనిని తను పూర్తి చేసుకుపోయాడు" అని పేర్కొన్నాడు. చదవండి: IND vs SL: డివిలియర్స్, క్రిస్ గేల్‌తో సూర్యకు పోలికా? అతడు ఎప్పుడో మించిపోయాడు -
డివిలియర్స్, క్రిస్ గేల్‌తో సూర్యకు పోలికా? అతడు ఎప్పుడో మించిపోయాడు
టీ20ల్లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సూర్య మెరుపు శతకం సాధించాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య తన మూడో అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. ఇక ఓవరాల్‌గా 51 బంతులు ఎదర్కొన్న ఈ ముంబైకర్.. 9 సిక్స్‌లు, 7 ఫోర్లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఈ టీ20 వరల్డ్ నెం1 బ్యాటర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో సూర్యను పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ప్రశంసలతో ముంచెత్తాడు. దిగ్గజ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్‌ను సూర్యకుమార్ మించిపోయాడు అని కనేరియా కొనియాడాడు. "ప్రపంచ క్రికెట్లో కొత్త యూనివర్స్ బాస్ వచ్చాడు. అతడు ఎవరో కాదు భారత విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్. సూర్య ఆట గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. నేను ముందే చెప్పాను ప్రపంచ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో సూర్య లిఖించుకుంటాడని. అతడు ఈ మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే 112 పరుగులు సాధించాడు. సూర్య లాంటి మరో ఆటగాడు ప్రపంచంలోనే ఉండడు. తరుచూ అందరూ సూర్యను డివిలియర్స్, క్రిస్ గేల్‌తో పోలుస్తున్నారు. కానీ, వారిద్దరూ కూడా సూర్య ముందు ప్రస్తుతం తేలిపోతారనడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటికే వారిద్దరిని తన ఆట తీరుతో సూర్యకుమార్ అధిగమించాడు. సూర్య తన విధ్వంసకర ఆటతో టీ20 క్రికెట్‌ను ఇప్పటికే వేరే స్థాయికి తీసుకువెళ్లాడు" అని కనేరియా తన యాట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: IND vs SL: సూర్యకుమార్ చేతికి ముద్దు పెట్టిన చాహల్.. వీడియో వైరల్ -
సూర్యకుమార్ చేతికి ముద్దు పెట్టిన చాహల్.. వీడియో వైరల్
రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన కీలకమైన మూడో టీ20లో 91 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తేడాతో భారత్ సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య భాయ్ సెంచరీ సాధించాడు. ఇక ఓవరాల్‌గా 51 బంతులు ఎదర్కొన్న ఈ ముంబైకర్.. 9 సిక్స్‌లు, 7 ఫోర్లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగల భారీ స్కోర్ సాధించింది. సూర్య భాయ్ ఇన్నింగ్స్‌కు చాహల్ ఫిదా ఇక సూర్య సంచలన ఇన్నింగ్స్‌కు భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఫిదా అయిపోయాడు. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ చేతికి చాహల్ ముద్దుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన అభిమానులు.. సూర్య భాయ్ ఆటకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే అంటూ సోషల్ మీడియలో కామెంట్లు చేస్తున్నారు. ఇక భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే గౌహతి వేదికగా జనవరి 10న జరగనుంది. pic.twitter.com/NeFHhMq35d — Guess Karo (@KuchNahiUkhada) January 8, 2023 చదవండి: AUS vs SA: వైట్‌వాష్ నుంచి తప్పించుకున్న దక్షిణాఫ్రికా.. మూడో టెస్టు డ్రా -
ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడు.. సూర్యకుమార్ యాదవ్
Surya Kumar Yadav: రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో నిన్న (జనవరి 7) జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా 91 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను హార్ధిక్ సేన 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ సునామీ శతకం (51 బంతుల్లో 112 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) ధాటికి నిశ్చేష్టులుగా మిగిలిపోయిన లంకేయులు మ్యాచ్‌లో పాటు సిరీస్‌ను భారత్ చేతికి అప్పజెప్పారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సూర్యకుమార్ యాదవ్ కళ్లు చెదిరే శతకంతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్కై ఆకాశమే హద్దుగా చెలరేగితే శుభ్‌మన్ గిల్ (36 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి (16 బంతుల్లో 35; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (9 బంతుల్లో 21 నాటౌట్; 4 ఫోర్లు) తమ పాత్రలను న్యాయం చేశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులు భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 16.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్ 3 వికెట్లు పడగొట్టగా.. హార్ధిక్, ఉమ్రాన్ మాలిక్, చహల్ తలో 2 వికెట్లు, అక్షర్ పటేల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ విధ్వంసకర శతకం సాధించే క్రమంలో పలు రికార్డులను బద్దలు కొట్టాడు. అవేంటంటే.. పొట్టి క్రికెట్ చరిత్రలో మూడు వేర్వేరు ఖండాల్లో (ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్) శతకాలు సాధించిన అత్యంత అరుదైన ఘనత సొంతం చేసుకున్న సూర్యకుమార్. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు (3) చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ నాలుగు సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. రెండు సెంచరీలతో కేఎల్ రాహుల్ మూడో స్థానంలో ఉన్నాడు. టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ (45 బంతుల్లో) చేసిన రెండో భారత క్రికెటర్‌గా సూర్య కుమార్ యాదవ్ రికార్డుల్లో నిలిచాడు. గతంలో శ్రీలంకపై రోహిత్ శర్మ 35 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ మూడో స్థానంలో (46 బంతుల్లో) ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఐదో ప్లేయర్‌గా సూర్యకుమార్ యాదవ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ జాబితాలో నాలుగు సెంచరీలతో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (3), కొలిన్ మన్రో (3), సబావూన్ డావిజీ (3)లతో కలిసి సూర్య భాయ్ రెండో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన తొలి భారత నాన్ ఓపెనర్‌గా, అలాగే అత్యంత వేగంగా (843 బంతుల్లో ) 1500 పరుగుల మార్కును (బంతుల ప్రకారం) అందుకున్న ఆటగాడిగా సూర్య భాయ్ రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు మ్యాక్స్‌వెల్ పేరిట ఉండేది. మాక్సీ.. 1500 పరుగులు చేసేందుకు 940 బంతులు ఎదుర్కొన్నాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు (9) బాదిన భారత నాన్ ఓపెనర్‌గా రికార్డు. -
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ఆటగాడిగా
శ్రీలంకతో మూడో టీ20లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 112 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో తుపాన్ ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన తొలి భారత నాన్ ఓపెనింగ్ బ్యాటర్‌గా సూర్య రికార్డులకెక్కాడు. సూర్య ఇప్పటివరకు టీ20ల్లో మూడు అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. తొలి సెంచరీ ఇంగ్లండ్‌పై చేయగా.. న్యూజిలాండ్‌పై రెండో సెంచరీ, తాజాగా శ్రీలంకపై తన మూడో సెంచరీ నమోదు చేశాడు. అదే విధంగా టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా ఈ ముంబైకర్ నిలిచాడు. అంతకుముందు 2017లో శ్రీలంకపై రోహిత్ శర్మ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇక ఓవరాల్‌గా టీ20ల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా సూర్య నిలిచాడు. తొలి స్థానంలో నాలుగు సెంచరీలతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఆతర్వాత స్థానాల్లో వరుసగా మ్యాక్స్‌వెల్, మున్రో, డేవిజీ, చెరో మూడు సెంచరీలతో ఉన్నారు. చదవండి: IND vs SL: సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. 45 బంతుల్లోనే సెంచరీ -
సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. 45 బంతుల్లోనే సెంచరీ
శ్రీలంకతో మూడో టీ20లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 45 బంతుల్లోనే సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 112 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి లంక బౌలర్లకు సూర్య భాయ్ చుక్కలు చూపించాడు. ఈ మిస్టర్ 360 మైదానం నలుమూలల షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. ఇక ఓవరాల్‌గా సూర్యకు ఇది మూడో అంతర్జాతీయ సెంచరీ. అయితే మూడు సెంచరీలు కూడా టీ20ల్లో సాధించడం విశేషం. కాగా ఏడాది సూర్యకుమార్‌కు ఇది తొలి సెంచరీ. కాగా సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. -
శ్రీలంకతో మూడో టీ20.. రుత్‌రాజ్‌కు నో ఛాన్స్! గిల్ వైపే మొగ్గు
రాజ్‌కోట్ వేదికగా సిరీస్‌ను డిసైడ్ చేసే మూడో టీ20లో భారత్-శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారత జట్టు ఎటువంటి మార్పులేమిలేకుండా బరిలోకి దిగింది. కాగా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన గిల్ స్థానంలో ఆఖరి టీ20లో రుత్‌రాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ మేనేజ్మెంట్ మాత్రం గిల్ వైపే మొగ్గు చూపింది. ఇక శ్రీలంక మాత్రం ఒక మార్పు చేసింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన రాజపాక్స స్థానంలో అవిష్క ఫెర్నాండో తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక భారత్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ -
లంకతో మూడో టీ20.. భారీ రికార్డుపై కన్నేసిన చహల్
IND VS SL 3rd T20: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 7) జరుగనున్న నిర్ణయాత్మక మూడో టీ20లో చహల్ (73 మ్యాచ్‌ల్లో 88) మరో 3 వికెట్లు తీస్తే, భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది. భువీ.. 87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కివీస్ వెటరన్ పేసర్ టిమ్ సౌథీ (107 మ్యాచ్‌ల్లో 134) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ (109 మ్యాచ్‌ల్లో 128), రషీద్ ఖాన్ (74 మ్యాచ్‌ల్లో 122) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా, శ్రీలంక చెరో మ్యాచ్ గెలువగా, ఇవాళ జరుగబోయే మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. రెండు జట్లు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. తుది జట్ల విషయానికొస్తే.. భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో విఫలమైన శుభ్‌మన్ గిల్, అర్షదీప్ స్థానాల్లో రుతురాజ్, ముకేశ్ కుమార్ ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. లంక విషయానికొస్తే.. రెండో టీ20లో బరిలోకి దిగిన జట్టే యధాతథంగా కొనసాగవచ్చు. తుది జట్లు (అంచనా) భారత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్/శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, అక్షర్ పటేల్, చహల్, ముఖేశ్ కుమార్/అర్ష్‌దీప్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్. శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిసాంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, భనుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మదుషంక, కసున్ రజిత. -
అర్షదీప్‌ను ఇక్కడ ప్రాక్టీస్ చేయించండి.. నో బాల్స్ ఎలా వేస్తాడో చూద్దాం..!
టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్ నో బాల్స్ వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేల ఓ ఆసక్తికర కార్టూన్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. శ్రీలంకతో మొన్న (జనవరి 5) జరిగిన రెండో టీ20లో ఏకంగా 5 నో బాల్స్ వేసి టీమిండియా ఓటమికి పరోక్ష కారణమైన అర్షదీప్‌కు భారత అభిమాని ఒకరు కార్టూన్ ద్వారా ఓ సలహా ఇచ్చాడు. అర్షదీప్ జీవితంలో ఒక్క నో బాల్ కూడా వేయకుండా ఉండాలంటే ఇక్కడ ప్రాక్టీస్ చేయించండి అంటూ ఓ కార్టూన్‌ను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ కార్టూన్లో బౌలర్ పర్వతం అంచున ఉన్న క్రీజ్ గుండా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బౌలర్ క్రీజ్ దాటి నో బాల్ వేస్తే లోయలో పడిపోతాడు. అర్షదీప్ కోసం సరదాగా పోస్ట్ చేసిన ఈ కార్టూన్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇది చూసిన నెటిజన్లు.. అవును ఇది కరెక్టే.. ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తే అర్షదీపే కాదు ప్రపంచంలో ఏ బౌలర్ కూడా క్రీజ్ దాటి నో బాల్ వేసే సాహసం చేయలేడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. This is the Special pitch to practice for #arshdeepsingh #INDvSL #UmranMalik pic.twitter.com/FeqwaZUVeq — Abhijit sarkar (@singlecoreGG) January 6, 2023 కాగా, శ్రీలంకతో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ బౌల్ చేసిన అర్షదీప్ వరుసగా మూడు నోబాల్స్ సంధించాడు. ఆతర్వాత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మరో రెండు నో బాల్స్ వేసి అభిమానులు, సహచరులతో సహా విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 2 ఓవర్లు వేసిన అర్షదీప్ ఏకంగా 37 పరుగులు సమర్పించుకుని టీమిండియా ఓటమికి పరోక్ష కారకుడయ్యాడు. ఇదిలా ఉంటే, లంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైన విషయం తెలిసిందే. 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ మావీ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఇవాళ (జనవరి 7) రాజ్‌కోట్ వేదికగా జరుగనుంది. -
కెప్టెన్‌గా తొలి ఓటమి.. హార్దిక్ పాండ్యాపై గంభీర్ కీలక వాఖ్యలు
పుణే వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 16 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. ఇక టీ20ల్లో భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు ఇదే తొలి ఓటమి కూడా. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కీలక వాఖ్యలు చేశాడు. భారత టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించాడని గంభీర్ కొనియాడాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో గంభీర్ మాట్లాడుతూ.. "హార్దిక్‌కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అయితే ప్రతీ మ్యాచ్ తర్వాత అతడి కెప్టెన్సీ గురించి మనం చర్చించకూడదు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైనంతమాత్రాన హార్దిక్ ఏదో తప్పు చేశాడని భావించడం సరికాదు. అతడు నో-బాల్స్ వేయకుండా బౌలర్లను నియంత్రించలేడు కదా. అది బౌలర్ బాధ్యత. ఇప్పటివరకు అతడు సారథిగా వ్యవహరించినా ప్రతీ మ్యాచ్‌లోనే తన కెప్టన్సీ మార్క్‌ను చూపించాడు. అతడు ఫీల్డ్‌లో చాలా కూల్‌గా ఉంటాడు. హార్దిక్ తన సహాచర ఆటగాళ్లకు మద్దతుగా కూడా ఉంటాడు" అని పేర్కొన్నాడు. ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో టీ20లో శనివారం రాజ్‌కోట్ వేదికగా భారత్, శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. చదవండి: IND Vs SL: శ్రీలంకతో మూడో టీ20.. అర్ష్‌దీప్, గిల్‌కు నో ఛాన్స్! పేసర్ ఎంట్రీ -
శ్రీలంకతో మూడో టీ20.. అర్ష్‌దీప్, గిల్‌కు నో ఛాన్స్! పేసర్ ఎంట్రీ
పుణే వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 16 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో టీ20లో శనివారం రాజ్‌కోట్ వేదికగా భారత్, శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. అయితే కీలకమైన మూడో టీ20లో పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రెండో టీ20లో దారుణంగా విఫలమైన అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో పేసర్ ముఖేష్ కుమార్ అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్ స్థానంలో రుత్‌రాజ్ గైక్వాడ్.. స్పిన్నర్ యజువేంద్ర చాహల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకురావాలని టీమిండియా మేనేజెమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అరంగేట్ర మ్యాచ్‌లో విఫలమైన రాహుల్ త్రిపాఠిని మూడో టీ20లో కూడా కొనసాగించే అవకాశం ఉంది. భారత తుది జట్టు(అంచనా): ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివం మావి, ముఖేష్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ చదవండి: Hardik Pandya: ఓడినా పర్లేదా?! కోహ్లి, రోహిత్.. ఇప్పుడు హార్దిక్ ఎందుకిలా చేస్తున్నారు? డీకే స్ట్రాంగ్ రిప్లై -
అర్ష్‌దీప్ సింగ్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచ క్రికెట్లోనే తొలి బౌలర్‌గా
పుణే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ 37 పరుగులు పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాకుండా ఏకంగా ఐదు నోబాల్స్ వేశాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును అర్ష్‌దీప్ తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక నోబాల్స్ వేసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు అర్ష్‌దీప్ తన టీ20 కెరీర్లో 12 నోబాల్స్ వేశాడు. ఇంతకుముందు ఈ చెత్త రికార్డు పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ(11) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో ఏకంగా ఐదు నో బాల్స్ వేసిన అర్ష్‌దీప్ హసన్ అలీ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌పై 16 పరుగుల తేడాతో లంక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ దషన్ శనక ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. తొలుత బ్యాటింగ్‌లో 56 పరుగులతో పాటు అదరగొట్టిన షనక.. బౌలింగ్‌లో కూడా రెండు వికెట్లు సాధించాడు. ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో టీ20 రాజ్‌కోట్ వేదికగా శనివారం(జనవరి7) జరగనుంది. చదవండి: Rahul Tripathi: వైరల్.. అవుటా? సిక్సరా? ఏంటిది?.. పాపం అక్షర్! -
అర్షదీప్ నో బాల్స్ వ్యవహారంపై మండిపడ్డ గవాస్కర్.. గల్లీ బౌలర్లా అంటూ..!
క్రికెట్‌కు సంబంధించి ఎంతటి వారు తప్పు చేసినా పరుష పదజాలంతో మందలించే లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్.. తాజాగా టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్‌పై ఫైరయ్యాడు. శ్రీలంకతో నిన్న (జనవరి 5) జరిగిన రెండో టీ20లో అర్షదీప్ హ్యాట్రిక్ నో బాల్స్‌తో పాటు మొత్తంగా 5 నో బాల్స్ వేయడంపై సన్నీ ఓ రేంజ్లో మండిపడ్డాడు. ప్రొఫెషనల్ బౌలర్ అయి ఉండి ఇలా చేయడం సరికాదని, పరోక్షంగా గల్లీ బౌలర్ అని అర్ధం వచ్చేలా సంబోధించాడు. నో బాల్స్ వేయకపోవడం అన్నది అంతర్జాతీయ స్థాయి బౌలర్‌కు ప్రాధమిక సూత్రమని, అది మరిచిన బౌలర్ ఈ స్థాయి క్రికెట్‌కు పనికిరాడని ఘాటుగా వ్యాఖ్యానించాడు. బౌలర్ తన బేసిక్స్‌కు స్టిక్ అయి బంతి విసిరిన తర్వాత ఏం జరుగుతుంది, బ్యాటర్ ఏం చేస్తాడన్నది పక్కకు పెడితే.. నోబాల్ వేయకపోవడం అన్నది బౌలర్ బేసిక్స్‌లో భాగమని అర్షదీప్‌ను ఉద్దేశించి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ జరుగుతుండగా లైవ్ కామెంట్రీలోనే గవాస్కర్ అర్షదీప్‌పై విరుచుకుపడ్డాడు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ బౌల్ చేసిన అర్షదీప్ వరుసగా మూడు నోబాల్స్ సంధించాడు. ఆతర్వాత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో బంతినందుకున్న అర్షదీప్.. ఆ ఓవర్లోనూ మరో రెండు నో బాల్స్ వేసి అభిమానులు, సహచరులతో సహా విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 2 ఓవర్లు వేసిన అర్షదీప్ ఏకంగా 37 పరుగులు సమర్పించుకుని టీమిండియా ఓటమికి పరోక్ష కారకుడయ్యాడు. ఇదిలా ఉంటే, లంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైంది. 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ మావీ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 7న రాజ్‌కోట్ వేదికగా జరుగనుంది. -
IND VS SL 2nd T20: అలా చేయడం పెద్ద నేరం, అందువల్లే ఓడాం..హార్ధిక్
పూణే వేదికగా జరిగిన రెండో టీ20లో శ్రీలంక చేతిలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫార్మాట్ ఏదైనా బౌలర్లు నో బాల్స్ వేయడం పెద్ద నేరమని అన్నాడు. ఈ మ్యాచ్‌లో నో బాల్సే తమ కొంపముంచాయని పేర్కొన్నాడు. కేవలం నో బాల్స్ కారణంగా తాము ఓటమిపాలయ్యామని తెలిపాడు. అర్షదీప్ సింగ్ వేసిన నో బాల్స్ (2 ఓవర్లలో 5 నో బాల్స్) వల్లే తాము ఓడామని చెప్పడం తన ఉద్దేశం కాదంటూనే పదేపదే అదే విషయాన్ని ప్రస్తావించాడు. యువకుడైన అర్షదీప్ తన బేసిక్ ఎరర్స్ను సరిదిద్దుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. బౌలింగ్, బ్యాటింగ్ పవర్ ప్లేల్లో కొన్ని అనవసర తప్పిదాలు చేశామని, ఈ స్థాయిలో ఇలా చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. ఆటలో అన్నీ మనం అనుకున్నట్లు జరగకపోవడం వాస్తవమే అయినప్పటికీ.. ప్రాధమిక సూత్రాలు మరవడం క్షమించరాని నేరమని అన్నాడు. అక్షర్, స్కై, శివమ్ మావీల పోరాటపటిమను ఈ పందర్భంగా అభినందించాడు. కాగా, లంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైన విషయం తెలిసిందే. 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ మావీ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 7న రాజ్‌కోట్ వేదికగా జరుగనుంది. -
లంకతో సిరీస్‌కు దూరమవడంపై స్పందించిన సంజూ.. ఏమన్నాడంటే..?
Sanju Samson: గాయం కారణంగా శ్రీలంక సిరీస్ (టీ20) నుంచి మిడిల్ డ్రాప్ అయిన సంజూ శాంసన్ తొలిసారి స్పందించాడు. ఆల్ ఈజ్ వెల్.. సీ యూ సూన్ అంటూ ఇన్‌స్టా వేదికగా తన సందేశాన్ని పంపాడు. సంజూ తన పోస్ట్‌లో తొలి టీ20 సందర్భంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఫోటో షేర్ చేశాడు. సంజూ చేసిన ఈ పోస్ట్‌కు టీమిండియా ప్రస్తుత కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, వన్డే తాత్కాలిక సారధి శిఖర్ ధవన్ స్పందించారు. View this post on Instagram A post shared by Sanju V Samson (@imsanjusamson) హార్ధిక్.. హార్ట్ ఏమోజీతో రిప్లై ఇవ్వగా, ధవన్.. గెట్ వెల్ సూన్ బ్రో అంటూ బదులిచ్చాడు. సంజూ గాయం నుంచి త్వరగా కోలుకుని తిరిగి బరిలోకి దిగాలని అతని అభిమానులు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్నారు. కాగా, లంకతో తొలి టీ20 సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ సంజూ శాంసన్ గాయపడిన విషయం తెలిసిందే. సంజూ గాయం తీవ్రమైంది కానప్పటికీ.. మున్ముందు జట్టు అవసరాల దృష్ట్యా బీసీసీఐ అతన్ని ప్రత్యేకంగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచి విశ్రాంతినిచ్చింది. బీసీసీఐ వైద్యులు తెలిపిన వివరాల మేరకు.. సంజూ ఎడమ కాలి మోకాలి భాగంలో స్వల్ప గాయమైందని, కదలికలో సమస్య ఉన్నట్లు స్కాన్ రిపోర్ట్‌లో గుర్తించినందున కొద్దిరోజుల పాటు విశ్రాంతినివ్వాలని వారు బోర్డుకు సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన బోర్డు తదనుగుణంగానే సంజూకు పాక్షికంగా విశ్రాంతి కల్పిస్తూ.. లంకతో మిగతా టీ20లకు అన్క్యాప్డ్ ప్లేయర్ జితేశ్ శర్మను ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే, తొలి టీ20లో సంజూ బ్యాట్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ దారుణంగా నిరాశపర్చాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని ఈ కేరళ బ్యాటర్.. ఫీల్డింగ్‌లోనూ క్యాచ్‌ను జారవిడిచి విమర్శలెదుర్కొన్నాడు. భారత దిగ్గజ ఆటగాడు, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్.. శాంసన్ చెత్త షాట్ సెలెక్షన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. అమవాస్యకో పున్నానికో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోకుంటే ఎలా అంటూ ఘాటు స్వరంతో వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన సంజూ.. కేవలం ఆరు బంతులు మాత్రమే ఆడి (5 పరుగులు) దారుణంగా నిరాశపరిచాడు. ధనంజయ డిసిల్వ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ మిస్ కావడంతో బతికిపోయిన సంజూ.. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక అదే ఓవర్ ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తేలిపోయిన సంజూ.. ఫీల్డింగ్ చేస్తూ కీలక క్యాచ్ జారవిడిచాడు. లంక ఇన్నింగ్స్‌లో హార్ధిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లో నిస్సంక ఇచ్చిన క్యాచ్‌ను వదిలిపెట్టి కెప్టెన్ ఆగ్రహానికి గురయ్యాడు. -
IND VS SL: రికార్డులతో పాటు అందరి మనసులను కొల్లగొట్టిన అక్షర్ పటేల్
Axar Patel: పూణే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైంది. లంక నిర్ధేశించిన 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 7న రాజ్‌కోట్ వేదికగా జరుగనుంది. కాగా, ఈ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగి అద్భుతమైన పోరాటపటిమ కనబర్చిన అక్షర్ పటేల్ అందరి మనసులను గెలుచుకున్నాడు. ఓటమి ఖాయం అనుకున్న దశలో బరిలో దిగిన ఈ గుజరాత్ ఆల్‌రౌండర్.. పోరాడితే పోయేదేమీ లేదన్న రీతిలో ప్రత్యర్ధులపై విరుచుకుపడి, వారి చేత కూడా శభాష్ అనిపించుకున్నాడు. సూర్యకుమార్ అండతో పేట్రేగిపోయిన అక్షర్ కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి ప్రత్యర్ధి వెన్నులో వణుకు పుట్టించాడు. కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ జట్టును గెలిపించలేనప్పటికీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నాడు. ఈ క్రమంలో అక్షర్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక పరుగులు (65) చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు రవీంద్ర జడేజా (44 నాటౌట్) పేరిట ఉండేది. అలాగే ఈ మ్యాచ్‌లో అక్షర్ బాదిన అర్ధసెంచరీ టీమిండియా తరఫున ఐదో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా (20 బంతుల్లో) రికార్డుల్లోకెక్కింది. దీంతో పాటు భారత్ తరఫున ఏడు అంతకంటే తక్కువ స్థానాల్లో బరిలోకి దిగి అత్యధిక సిక్సర్లు (6) బాదిన రికార్డును కూడా అక్షర్ తన ఖాతాలోనే వేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు దినేశ్ కార్తీక్ పేరిట ఉండేది. డీకే ఏడో స్థానంలో బరిలోకి దిగి 4 సిక్సర్లు బాదాడు. -
అర్ష్‌దీప్ సింగ్ అత్యంత చెత్త రికార్డు.. తొలి భారత బౌలర్‌గా!
పుణే వేదికగా శ్రీలంకతో రెండో టీ20లో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసిన అర్ష్‌దీప్ ఏకంగా 37 పరుగులు పరుగులు సమర్పించుకున్నాడు. పరుగులు విషయం పక్కన పెడితే.. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ ఏకంగా 5 నోబాల్స్ వేశాడు. దీంతో పలు చెత్త రికార్డులను అర్ష్‌దీప్ తన పేరిట లిఖించుకున్నాడు. శ్రీలంక ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ వరుసగా హ్యాట్రిక్ నోబాల్స్ వేశాడు. తద్వారా భారత టీ20 క్రికెట్ చరిత్రలో హ్యాట్రిక్ నోబాల్స్ వేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అదే విధంగా టీ20ల్లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన తొలి భారత బౌలర్‌గా కూడా అర్ష్‌దీప్ చెత్త రికార్డు నెలకొల్పాడు. చదవండి: IND vs SL: భారత్ చెత్త బౌలింగ్.. చితక్కొట్టిన శ్రీలంక బ్యాటర్లు! టార్గెంట్ ఎంతంటే? -
భారత్ చెత్త బౌలింగ్.. చితక్కొట్టిన శ్రీలంక బ్యాటర్లు!
పుణే వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న రెండో టీ20లో భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కెప్టెన్ దసన్ శనక సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బంతుల్లో 6 సిక్స్‌లు, 2 ఫోర్లతో 56 పరుగులు సాధించాడు. అతడితో పాటు ఓపెనర్ కుశాల్ మెండిస్ (52), అసలంక(37) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించారు. భారత చెత్త బౌలింగ్.. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ మినహా మిగితందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ఏకంగా 7 నోబాల్స్ వేశారు. అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే ఐదు నో బాల్స్ వేయడం గమానార్హం. రెండు ఓవర్లు వేసిన అర్ష్‌దీప్ 37 పరుగులు, ఉమ్రాన్ తన నాలుగు ఓవర్ల కోటాలో 48 పరుగులు, శివమ్ మావి తన నాలుగు ఓవర్ల కోటాలో 53 పరుగులు ఇచ్చారు. చదవండి: IND vs SL: ఏంటి అర్ష్‌దీప్ బౌలింగ్ మర్చిపోయావా? ఒకే ఓవర్లో మూడు నో బాల్స్ -
ఏంటి అర్ష్‌దీప్ బౌలింగ్ మర్చిపోయావా? ఒకే ఓవర్లో మూడు నో బాల్స్
యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ దాదాపు రెండు నెలల తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ తర్వాత సెలక్టర్లు అర్ష్‌దీప్ సింగ్ విశ్రాంతి ఇచ్చారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన అర్ష్‌దీప్.. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే అనారోగ్యం కారణంగా తొలి టీ20కు దూరమైన అర్ష్‌దీప్.. రెండో టీ20కు కోలుకున్నాడు. దీంతో జట్టులోకి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ తనదైన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు. శ్రీలంక ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేయడానికి వచ్చిన అర్ష్‌దీప్ తన తొలి ఓవర్లోనే ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ విషయం పక్కన పెడితే.. అర్ష్‌దీప్ అదే ఓవర్లో వరుసగా మూడు నో బాల్స్ వేశాడు. దీంతో తన ఓవర్లో ఏకంగా 9 బంతులు అర్ష్‌దీప్ వేశాడు. ఆఖరి బంతిని పూర్తి చేయడానికి అర్ష్‌దీప్ ఏకంగా 14 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో నెటిజన్లు అర్ష్‌దీప్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఏంటి అర్ష్‌దీప్ బౌలింగ్ మర్చిపోయవా అంటూ ట్విట్లు చేస్తున్నారు. 3 consecutive No Balls by Arshdeep Singh:- pic.twitter.com/lyGJsbj8Yd — Til wali Kanya🌼🇮🇳 (@UPkiKanyaaa) January 5, 2023 are yrr no ball ki hatrick #INDvsSL #arshdeep pic.twitter.com/snjCNb0ykw — Asian Doge (@vvjndr) January 5, 2023 -
శ్రీలంకతో రెండో టీ20.. రాహుల్ త్రిపాఠి అరంగేట్రం
పుణే వేదికగా శ్రీలంకతో రెండో టీ20లో టీమిండియా తలపడేందుకు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అదే విధంగా రాహుల్ త్రిపాఠి ఈ మ్యాచ్‌తో భారత్ తరపున అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు తొలి టీ20కు దూరమైన భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రెండో టీ20కు జట్టులోకి వచ్చాడు. అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి రావడంతో హర్షల్ పటేల్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక శ్రీలంక మాత్రం తొలి టీ20 జట్టుతోనే బరిలోకి దిగింది. తుది జట్లు: శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక భారత్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చదవండి: Abhimanyu Easwaran: తండ్రి కట్టిన స్టేడియంలోనే తనయుడు సెంచరీ! శభాష్ అభిమన్యు -
అపజయమెరుగని హార్ధిక్.. హిట్‌మ్యాన్ రికార్డు బద్దలు
IND VS SL 2nd T20: భారత టీ20 కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత క్రికెట్ చరిత్రలో మరే ఇతర కెప్టెన్‌కు సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత కెప్టెన్‌గా తొలి 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు (న్యూజిలాండ్‌తో మ్యాచ్ టై గా ముగిసింది) సాధించి, అపజయమెరుగని కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో హార్ధిక్.. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్ధలు కొట్టాడు. రోహిత్ కూడా కెప్టెన్‌గా తన తొలి 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించినప్పటికీ.. అతని సారధ్యంలో టీమిండియా మధ్యలో ఓ మ్యాచ్‌లో (5వ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమి) ఓడింది. After 1st 6 T20Is Indian Captain with Most Wins 5 - Hardik Pandya* 5 - Rohit Sharma 4 - Virat Kohli 4 - MS Dhoni#INDvSL — 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) January 3, 2023 అయితే రోహిత్ టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ అయ్యాక వెనుదిరిగి చూడలేదు. శ్రీలంక చేతిలో ఓటమి తర్వాత హిట్‌మ్యాన్ టీమిండియాను వరుసగా 7 మ్యాచ్‌ల్లో విజేతగా నిలిపాడు. ఆ తర్వాత 4 మ్యాచ్‌ల్లో 3 ఓటముల తర్వాత రోహిత్ మళ్లీ పుంజుకన్నాడు. ఈసారి వరుసగా 14 మ్యాచ్‌ల్లో టీమిండియాను విజేతగా నిలిపాడు. టీ20ల్లో వరుస అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా ఈ రికార్డు ఇప్పటికీ హిట్‌మ్యాన్ పేరిటే ఉంది. పూణే వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 5) జరుగనున్న రెండో టీ20, కెప్టెన్‌గా హార్ధిక్‌కు 7వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లోనూ హార్ధిక్ టీమిండియాను విజయపధంలో నడిపిస్తే.. హిట్‌మ్యాన్ వరుస విజయాల రికార్డుకు మరింత చేరువవుతాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ కాకుండానే హార్ధిక్ ఈ రికార్డులు తన ఖాతాలో వేసుకోవడం కొసమెరుపు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో ఇవాళ జరుగనున్న రెండో టీ20లో గెలిచి, మరో మ్యాచ్ మిగిలుండగానే ఎలాగైనా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు లంక సైన్యం సైతం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని భావిస్తుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను సంజూ శాంసన్ దెబ్బేశాడు. గాయం కారణంగా అతను ఈ సిరీస్ మొత్తానికే దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. అతని స్థానంలో కొత్త కుర్రాడు జితేశ్ శర్మ జట్టులో చేరాడు. భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20 రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది. -
శ్రీలంకతో రెండో టీ20.. టీమిండియాలో జరుగబోయే మార్పులు ఏవంటే..?
IND VS SL 2nd T20: పూణే వేదికగా రేపు (జనవరి 5) శ్రీలంకతో జరుగబోయే రెండో టీ20లో టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. వాంఖడేలో జరిగిన తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్ గాయపడ్డాడని, అతని స్థానంలో రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేస్తాడని ఓ ప్రముఖ వెబ్సైట్ పేర్కొంది. ఓపెనింగ్ బెర్తులకు అవకాశం లేకపోవడంతో రుతురాజ్ గైక్వాడ్ పేరును పరిశీలించరని, అందుకే రాహుల్ త్రిపాఠిని ప్రయోగించే ఛాన్స్ ఉంటుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ (7) విఫలమైనప్పటికీ.. అతడిని తొలిగించే అవకాశం లేదు. గత కొంతకాలంగా గిల్ ప్రదర్శన నేపథ్యంలో ఒక్క మ్యాచ్‌కే అతడిని పక్కకు పెట్టే సాహసం టీమిండియా యాజమాన్యం చేయకపోవచ్చు. మరోవైపు బౌలింగ్ విభాగంలోనూ రెండు మార్పులు ఆస్కారం ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తొలి టీ20లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న హర్షల్ పటేల్ స్థానంలో జ్వరం నుంచి కోలుకున్న అర్షదీప్ సింగ్‌కు ఛాన్స్ ఇచ్చే ఆస్కారం ఉందని తెలుస్తోంది. అలాగే తొలి మ్యాచ్‌లో 2 ఓవర్లు వేసి 26 పరుగులు సమర్పించుకున్న స్పెషలిస్ట్ స్పిన్నర్ చహల్ స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు. పై పేర్కొన్న ఒక్క మార్పుతో (సంజూ స్థానంలో త్రిపాఠి) పాటు ఈ రెండు మార్పులు మినహా టీమిండియా మరో మార్పు చేసేందుకు సాహసించకపోవచ్చు. ప్రస్తుత భారత జట్టులో రాహుల్ త్రిపాఠి, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్ మాత్రమే బెంచ్‌పై ఉన్నారు. ఇదిలా ఉంటే, లంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా బ్యాటింగ్‌లో కాస్త తడబడినా బౌలింగ్‌లో పర్వాలేదనిపించి. అరంగేట్ర కుర్రాడు శివమ్ మావి (4/22), కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ (2/27) చెలరేగగా, హర్షల్ పటేల్ (2/41) ఓకే అనిపించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దీపక్ హుడా (41 నాటౌట్, ఆఖరి ఓవర్లో రెండు రనౌట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాట్‌తో పర్వాలేదనిపించిన (31 నాటౌట్) అక్షర్ పటేల్.. కీలక సమయంలో (ఆఖరి ఓవర్) బంతినందుకుని ఓకే అనిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఇషాన్ కిషన్ (37), హార్ధిక్ (29), దీపక్ హుడా (41 నాటౌట్), అక్షర్ పటేల్ (31 నాటౌట్) రెండంకెల స్కోర్లు సాధించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన శ్రీలంక 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటై, 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
లంకతో రెండో టీ20.. సంజూ శాంసన్ ఔట్
IND VS SL 2nd T20: భారత్-శ్రీలంక జట్ల మధ్య పూణే వేదికగా రేపు (జనవరి 5) జరుగబోయే రెండో టీ20 నుంచి వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్ ఔటయ్యాడని తెలుస్తోంది. వాంఖడేలో జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా సంజూ మోకాలికి గాయమైందని, వైద్యుల సలహా తీసుకునే నిమిత్తం అతను జట్టుతో పాటు పూణేకు కూడా రాలేదని ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది. స్కానింగ్‌ల కోసం సంజూ ప్రస్తుతం (జనవరి 4) ముంబైలోనే ఉన్నట్లు సదరు వెబ్సైట్ తెలిపింది. తొలి టీ20 సందర్భంగా ఓ క్యాచ్ కోసం విఫలయత్నం చేసి సంజూ గాయపడ్డాడని, ఆ తర్వాత అతను మ్యాచ్‌లో కొనసాగినప్పటికీ మోకాలి భాగంలో వాపు ఉందని తెలుస్తోంది. కాగా, లంకతో జరిగిన తొలి టీ20లో సంజూ బ్యాట్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ దారుణంగా నిరాశపర్చాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని ఈ కేరళ బ్యాటర్.. ఫీల్డింగ్‌లోనూ క్యాచ్‌ను జారవిడిచి విమర్శలెదుర్కొన్నాడు. భారత దిగ్గజ ఆటగాడు, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్.. శాంసన్ చెత్త షాట్ సెలెక్షన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. అమవాస్యకో పున్నానికో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోకుంటే ఎలా అంటూ ఘాటు స్వరంతో వ్యాఖ్యానించాడు. తొలి టీ20లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన సంజూ.. కేవలం ఆరు బంతులు మాత్రమే ఆడి (5 పరుగులు) దారుణంగా నిరాశపరిచాడు. ధనంజయ డిసిల్వ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ మిస్ కావడంతో బతికిపోయిన సంజూ.. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక అదే ఓవర్ ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తేలిపోయిన సంజూ.. ఫీల్డింగ్ చేస్తూ కీలక క్యాచ్ జారవిడిచాడు. లంక ఇన్నింగ్స్‌లో హార్ధిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లో నిస్సంక ఇచ్చిన క్యాచ్‌ను వదిలిపెట్టి కెప్టెన్ ఆగ్రహానికి గురయ్యాడు. -
సంజూ శాంసన్‌ను ఏకి పారేసిన లిటిల్ మాస్టర్
టీమిండియా వికెట్‌కీపర్ సంజూ శాంసన్‌ను భారత మాజీ కెప్టెన్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఏకి పారేశాడు. ముంబై వేదికగా శ్రీలంకతో నిన్న (జనవరి 3) జరిగిన తొలి టీ20లో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనందుకు గాను శాంసన్‌పై నిప్పులు చెరిగాడు. ఎంత టాలెంట్ ఉన్నా ఏం ప్రయోజనం.. చెత్త షాట్ సెలెక్షన్‌తో మరోసారి వికెట్ పారేసుకున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. అమవాస్యకో పున్నానికో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోకుంటే ఎలా అంటూ ఘాటు స్వరంతో వ్యాఖ్యానించాడు. తొలి టీ20లో శాంసన్ చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్న వెంటనే సన్నీ ఈ రకంగా స్పందించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన సంజూ.. కేవలం ఆరు బంతులు మాత్రమే ఆడి (5 పరుగులు) దారుణంగా నిరాశపరిచాడు. ధనంజయ డిసిల్వ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ మిస్ కావడంతో బతికిపోయిన సంజూ.. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక అదే ఓవర్ ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తేలిపోయిన సంజూ.. ఫీల్డింగ్ చేస్తూ కీలక క్యాచ్ జారవిడిచాడు. లంక ఇన్నింగ్స్‌లో హార్ధిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లో నిస్సంక ఇచ్చిన క్యాచ్‌ను వదిలిపెట్టి కెప్టెన్ ఆగ్రహానికి గురయ్యాడు. ఇదిలా ఉంటే, భీభత్సమైన టాలెంట్ ఉన్నా సంజూ శాంసన్‌కు టీమిండియాలో సరైన అవకాశాలు కల్పించకుండా వివక్ష చూపుతున్నారంటూ గత కొంతకాలంగా అతని అభిమానులు సోషల్‌మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజూపై సునీల్ గవాస్కర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
దీపక్ హుడా, అక్షర్ సూపర్ ఇన్నింగ్స్.. శ్రీలంక టార్గెట్ 163 పరుగులు
ముంబై వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న తొలి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా పర్వాలేదనిపించింది. దీపక్ హుడా(41), ఇషాన్ కిషన్(37), అక్షర్ పటేల్(31) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నస్టానికి 162 పరుగులు చేసింది. కాగా హుడా, అక్షర్ పటేల్ కలిసి 68 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక టీ20లో అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్(7) నిరాశపరిచాడు. అదే విధంగా విధ్వంసకర ఆటగాడు సూర్య కుమార్ యాదవ్(7) కూడా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 29 పరుగులతో రాణించాడు. ఇక శ్రీలంక బౌలర్లలో మధుషంక, థీక్షణ, కరుణరత్నే, డిసిల్వా, హసరంగా తలా వికెట్ సాధించారు. చదవండి: IND vs SL: అతడు ఏం పాపం చేశాడు.. డ్రింక్స్ అందించడానికా సెలక్ట్ చేశారు? -
అతడు ఏం పాపం చేశాడు.. డ్రింక్స్ అందించడానికా సెలక్ట్ చేశారు?
టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న రాహుల్ త్రిపాఠికి మరోసారి నిరాశే ఎదురైంది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు త్రిపాఠికి ఎంపికైనప్పటికీ.. తొలి టీ20 తుది జట్టులో చోటు దక్కలేదు. కాగా ఐర్లాండ్ సిరీస్ నుంచి భారత జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కడం లేదు. సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో కనీసం లంకతో సిరీస్‌లోనైనా చోటు దక్కుతుంది అని అభిమానులు భావించారు. అయితే మరోసారి త్రిపాఠి బెంచ్‌కే పరిమితం కావడంతో జట్టు మేనేజెమెంట్పై అభిమానులు తీవ్ర విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. జట్టులో చోటు ఇవ్వనప్పుడు ఎందుకు ఎంపిక చేస్తున్నారని ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. "డ్రింక్స్ అందించడానికా త్రిపాఠిని సెలక్ట్ చేశారు" అంటూ ఓ అభిమాని ట్విట్ చేశారు. మరి కొంత మంది అయితే కావాలనే జట్టు మేనేజ్మెంట్ ఇలా చేస్తుందిని పోస్టులు పెడుతున్నారు. కాగా ఐపీఎల్‌తో పాటు దేశీవాళీ క్రికెట్లో కూడా ఈ ముంబైకర్‌కు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్లో సన్‌రైజర్స్ జట్టులో కీలక ఆటగాడిగా త్రిపాఠి ఉన్నాడు. ప్రతీ సీజన్లోనూ రాహుల్ మెరుగ్గా రాణిస్తున్నాడు. చదవండి: IND vs SL 1st T20: శ్రీలంకతో తొలి టీ20.. గిల్, మావి అరంగేట్రం -
శ్రీలంకతో తొలి టీ20.. గిల్, మావి అరంగేట్రం
ముంబై వేదికగా శ్రీలంకతో తొలి టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత యువ ఆటగాళ్లు శుబ్మాన్ గిల్, శివమ్ ఈ మ్యాచ్‌తో టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నారు. మరో వైపు యువ సంచలనం అర్ష్‌దీప్ సింగ్ అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. ఇక లంకతో టీ20 సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు. తుది జట్లు: శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక భారత్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్ చదవండి: NZ vs PAK: పాపం బాబర్.. అలా ఔట్ అవుతానని అస్సలు ఊహించి ఉండడు! -
శ్రీలంకతో వన్డే సిరీస్.. జట్టులోకి బుమ్రా.. బీసీసీఐ ప్రకటన
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. గత కొంత కాలంగా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి లంకతో వన్డే సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. కాగా తొలుత వన్డే సిరీస్‌కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో బుమ్రా పేరు లేదు. తాజగా బుమ్రాను వన్డే జట్టులోకి చేర్చినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. "శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టులోకి పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ చేర్చింది" అని బీసీసీఐ ట్విటర్లో పేర్కొంది. కాగా టీ20 ప్రపంచకప్-2022కు ముందు ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా బుమ్రా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో పాటు పొట్టి ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అయితే బుమ్రా ఇప్పుడు పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతడు మళ్లీ మైదానంలో అడుగుపెట్టునున్నాడు. ఇక స్వదేశంలో లంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తలపడనుంది. జనవరి 3 నుంచి 7 వరకు టీ20 సిరీస్ జరగనుండగా.. జనవరి 10 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. లంకతో వన్డే సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ చదవండి: Ind Vs SL: టాప్-5లో వీళ్లే! భువీ అగ్రస్థానానికి ఎసరు పెట్టిన చహల్! అదే జరిగితే.. -
వన్డే ప్రపంచకప్‌ను గెలవడమే మా లక్ష్యం: హార్ధిక్ పాండ్యా
2023 ఏడాదిలో టీమిండియా తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ముంబై వేదికగా జనవరి 3న శ్రీలంకతో తొలి టీ20లో తలపడేందుకు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు తలపడనుంది. ఈ క్రమంలో తొలి టీ20కు ముందు విలేకరుల సమావేశంలో పాల్గొన్న భారత తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడమే ఈ ఏడాది భారత జట్టు లక్ష్యమని హార్దిక్ తెలిపాడు. హార్దిక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. "ప్రపంచకప్‌ను గెలవడమే ఈ ఏడాది మా జట్టు అతి పెద్ద రిజల్యూషన్. నిజంగా ప్రపంచ కప్‌ను గెలవాలనుకుంటున్నాము. అందుకోసం అన్ని విధాల మేము సన్నద్దం అవుతాము. ప్రస్తుతం మా జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. కాబట్టి ఈ ఏడాది ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంటామన్న నమ్మకం నాకు ఉంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో కూడా మేము మా శక్తికి మించి ప్రయత్నించాం. కానీ మేము మా లక్ష్యాన్ని నేరవేర్చుకోలేకపోయాం. దురదృష్టవశాత్తు సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రపంచకప్‌లో కూడా 100% శాతం ఎఫక్ట్ పెట్టేందుకు సిద్దంగా ఉన్నాము. అంతకంటే ముందు శ్రీలంక, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్‌లపై మేము దృష్టి సారించాల్సి ఉంది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. పంత్ దూరం! ఆంధ్రా ఆటగాడు అరంగేట్రం.. -
డబుల్ సెంచరీ చేశాక ఈ చర్చలు ఎందుకు? భారత ఓపెనర్‌గా అతడే సరైనోడు..!
వన్డే ఫార్మాట్లో టీమిండియా ఫస్ట్ ఛాయిస్ ఓపెనర్‌గా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఉండాలని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ జోడిగా కిషన్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని గంభీర్ సూచించాడు. ఇక కిషన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో కిషన్ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తన తొలి అంతర్జాతీయ సెంచరీనే డబుల్ సెంచరీగా మలిచిన ఏకైక ఆటగాడిగా ఈ జార్ఖండ్ డైన్‌మెట్ చరిత్ర సృష్టించాడు. కాగా కిషన్ సంచలన ఇన్నింగ్స్‌తో భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. ఈ క్రమంలోనే శ్రీలంకతో వన్డే సిరీస్‌కు కూడా ధావన్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. దీంతో అతడి అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసినట్టే అని చేప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో గంభీర్ మాట్లాడుతూ.. "ఇషాన్ ఇటీవలే బంగ్లాదేశ్‌పై అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించాడు. అయినప్పటికీ వన్డేల్లో భారత రెగ్యూలర్ ఓపెనర్ ఎవరన్న విషయం గురించి చర్చలు జరగుతుండడం నాకు ఆశ్చర్యంగా ఉంది. బంగ్లాతో వన్డే సిరీస్‌లో భారత బ్యాటర్లు బంగ్లా బౌలర్లను ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడ్డా.. కిషన్ మాత్రం ఆడిన ఒక్క మ్యాచ్‌లోనే చుక్కలు చూపించాడు. అతడు భారత ఇన్నింగ్స్ 35వ ఓవర్ ముగిసే సరికి డబుల్ సెంచరీ మార్క్‌ను సాధించాడు. అతడికి దీర్ఘ కాలం రాణించే సత్తా ఉంది. అదే విధంగా వికెట్ కీపర్‌గా కూడా కిషన్ సేవలు అందించగలడు. నా వరకైతే టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి చర్చ ముగిసింది అని అనుకుంటున్నాను. వన్డేల్లో రోహిత్ జోడిగా ఇషాన్ కిషన్ బరిలోకి దిగాలి. అదే విధంగా విరాట్ కోహ్లి మూడు, సూర్య కుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ రావాలి. ఇక కీలకమైన ఐదో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఉండాలి. ఫినిషర్‌గా హార్దిక్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి" అని అతడు పేర్కొన్నాడు. కాగా గంభీర్ పేర్కొన్న ఆరుగురి ఆటగాళ్లలో స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ పేరు లేకపోవడం గమనార్హం. కాగా శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌కు భారత జట్టులో కిషన్ చోటు దక్కించుకున్నాడు. ఇక స్వదేశంలో భారత జట్టు శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడేందకు సిద్దమవుతోంది. ముంబై వేదికగా భారత్-శ్రీలంక తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో హార్దిక్ పాండ్యా భారత సారథిగా వ్యవహరించనున్నాడు. చదవండి: Umran Malik: నా ధ్యాస మొత్తం దాని మీదే! అక్తర్ రికార్డు బద్దలు కొడతా! అయితే.. -
శ్రీలంకతో తొలి టీ20.. యువ ఓపెనర్ అరంగేట్రం! అక్షర్‌కు నో ఛాన్స్
కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించేందుకు టీమిండియా సిద్దమైంది. స్వదేశంలో శ్రీలంకతో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. తొలుత టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ముంబై వేదికగా జనవరి 3న జరగనుంది. కాగా టీ20 సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. దీంతో ఈ సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. అదే విధంగా యువ ఆటగాళ్లు శివమ్ మావి, ముకేశ్ కుమార్ తొలి సారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు వన్డేలు, టెస్టులలో అదరగొడుతున్న యవ ఓపెనర్ శుబ్మాన్ గిల్‌కు కూడా టీ20 జట్టులో చోటు దక్కింది. కాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు గిల్‌కు చోటు దక్కినప్పటకీ.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కలేదు. టీ20ల్లో గిల్ అరంగేట్రం ముంబై వేదికగా శ్రీలంకతో జరగనున్న తొలి టీ20తో గిల్ పొట్టి ఫార్మాట్లో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. రెగ్యూలర్ ఓపెనర్లు రోహిత్, రాహుల్ దూరం కావడంతో కిషన్‌కు జోడిగా గిల్‌ను పంపాలని మేనేజేమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా యువ పేసర్ శివమ్ మావి కూడా అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మరోవైపు తొలి టీ20కు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్‌ను పక్కన పెట్టాలని టీమ్ మేనేజేమెంట్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారి స్థానంలో వాషింగ్టన్ సుందర్,వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. శ్రీలంకతో తొలి టీ20కు భారత తుది జట్టు(అంచనా): ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ చదవండి: Ind Vs SL 2023: శ్రీలంకతో టీమిండియా సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్, జట్లు, ఇతర వివరాలు -
హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేస్తారా? బీసీసీఐకి వార్నింగ్ ఇచ్చిన ఇర్ఫాన్ పఠాన్
భారత జట్టు టీ20 కెప్టెన్‌గా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను నియమించడానికి బీసీసీఐ సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. కాగా స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహారించనున్నాడు. ఇప్పటికే పలు టీ20 సిరీస్‌లో భారత కెప్టెన్‌గా వ్యవహారించిన హార్దిక్ జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. అదే విధంగా ఐపీఎల్ అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్‌ను అందించాడు. ఈ క్రమంలోనే పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు పాండ్యాకు అప్పజెప్పాలని బీసీసీఐ భావిస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా.. హార్దిక్‌కు భారత జట్టు పగ్గాలు అప్పజెప్పాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తుంటే.. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. హార్దిక్ కెప్టెన్సీ పరంగా రాణిస్తున్నప్పటికీ, పూర్తి స్థాయి బాధ్యతలు అప్పజెప్పేముందు కాస్త ఆలోచించాలని సెలెక్టర్లను పఠాన్ హెచ్చరించాడు. "హార్దిక్‌కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు తన కెప్టెన్సీతో అందరిని అకట్టుకున్నాడు. ఐపీఎల్లో కూడా గుజరాత్ టైటాన్స్‌కు సారథిగా టైటిల్‌ను అందించాడు. అతడి కమ్యూనికేషన్ చాలా బాగుంది. ఫీల్డ్‌లో చాలా చురుకుగా ఉంటాడు. అయితే హార్దిక్‌ను దీర్ఘకాలిక కెప్టెన్‌గా నియమించాలని అనుకుంటే మాత్రం అతని ఫిట్‌నెస్‌పై చాలా దృష్టిసారించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఫిట్నెస్ చాలా కీలకం కానుంది" అని స్టార్ స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు. చదవండి: Ind Vs SL 2023: శ్రీలంకతో టీమిండియా సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్, జట్లు, ఇతర వివరాలు -
కేఎల్ రాహుల్‌కు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. హార్దిక్ పాండ్యాకు ప్రమోషన్!
టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ బీసీసీఐ బిగ్ షాకిచ్చింది. రాహుల్‌ను భారత జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బీసీసీ సీనియర్ సెలక్షన్ కమిటీ తొలిగించింది. అతడి స్థానంలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నియమించింది. స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌తో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. కాగా చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి ఇదే ఆఖరి జట్టు ఎంపిక కావడం గమానార్హం. ఇక టీ20 సిరీస్‌కు భారత రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ దూరమయ్యారు. యువ పేసర్లు ముఖేష్ కుమార్, శివమ్ మావికి తొలి సారి భారత జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా ఈ సిరీస్‌కు రోహిత్ దూరం కావడంతో హార్దిక్ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. అతడికి డిప్యూటీగా సూర్యకుమార్ యాదవ్ ఎంపిక అయ్యాడు. ఇక రోహిత్, విరాట్, కేఎల్ రాహుల్ తిరిగి వన్డే సిరీస్‌కు తిరిగి జట్టులో చేరనున్నారు. అయితే గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు సెలక్టర్లు మొండి చేయి చూపించారు. లంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివం మావి, ముఖేష్ కుమార్ లంకతో వన్డే సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ , ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ చదవండి: సివిల్స్ క్లియర్ చేసిన టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా? -
శ్రీలంకతో టీ20 సిరీస్.. భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా! సూర్యకుమార్‌కు కీలక బాధ్యతలు
స్వదేశంలో శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. లంకతో టీ20 సిరీస్‌కు భారత రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ దూరమయ్యారు. అదే విధంగా యువ పేసర్లు ముఖేష్ కుమార్, శివమ్ మావికి తొలి సారి భారత టీ20 జట్టులో చోటు దక్కింది. ఇక ఈ జట్టుకు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా సూర్యకుమార్ యాదవ్‌ను ఈ సిరీస్‌కు భారత వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ సెలక్షన్ కమిటీ నియమించింది. జనవరి 3న ముంబై వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక వన్డే జట్టు విషయానికి వస్తే.. భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను బీసీసీఐ తొలిగించింది. అతడి స్థానంలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇక లంకతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, రాహుల్, విరాట్ కోహ్లి వన్డే సిరీస్‌కు తిరిగి జట్టులోకి వచ్చారు. కాగా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు టీ20, వన్డే జట్టులో కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. అదే విధంగా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు కూడా వన్డే జట్టులో చోటు దక్కలేదు. లంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివం మావి, ముఖేష్ కుమార్ లంకతో వన్డే సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ , ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ చదవండి: Sarfaraz Ahmed: 'రీఎంట్రీ కదా.. హార్ట్‌బీట్ కొలిస్తే మీటర్ పగిలేదేమో!' -
టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?
భారత టీ20 జట్టులో కీలక మార్పులు చేపట్టేందుకు బీసీసీఐ సిద్దమైంది. ఇందులో భాగంగానే టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించాలి అని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను భారత టీ20 కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బీసీసీఐ ఉన్నత అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దృవీకరించారు. "భారత టీ20 కెప్టెన్సీలో మార్పు చేసే సమయం అన్నమైంది. రోహిత్ కొన్నాళ్ల పాటు భారత కెప్టెన్‌గా కొనసాగాలని కొంత మంది భావిస్తున్నారు. కానీ అతడి వయస్సు దృష్ట్యా అతడి పని భారాన్ని తగ్గించాలి అనుకుంటున్నాము. అతడు మిగితా రెండు ఫార్మాట్ల్లో కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. టీ20 ప్రపంచకప్- 2024 కోసం ఇప్పటి నుంచే మేము సన్నద్దం కావాలి. ఇందుకోసం భారత జట్టు కీలక మార్పులు చేపట్టేందుకు సిద్దమయ్యాము. ఇక టీ20ల్లో కెప్టెన్సీ రోల్‌కు హార్దిక్ పాండ్యా సరైనోడు అని భావిస్తున్నాము. మా తదుపరి టీ20 సిరీస్‌కు ముందు సెలక్షన్ కమిటీ ఓ నిర్ణయం తీసుకుంటుంది" అని బీసీసీఐ అధికారి ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో పేర్కొన్నారు. కాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ అనంతరం వచ్చే ఏదాది జనవరిలో శ్రీలంకతో టీ20లు ఆడనుంది. ఈ మధ్య కాలంలో భారత జట్టు కేవలం వన్డేలు, టెస్టు సిరీస్‌లు మాత్రమే ఆడనుంది. అంటే శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోనుంది. కాగా ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న భారత టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు. చదవండి: India-A vs BAN: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. భారత-"ఏ" జట్టు కెప్టెన్‌గా పుజారా -
టీ20 ప్రపంచకప్‌లో ఆ జట్టుతో జాగ్రత్త! లేదంటే అంతే!
T20 World Cup 2022- Gautam Gambhir Comments: టీ20 ప్రపంచకప్-2022కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఆక్టోబర్ 16న జిలాంగ్ వేదికగా జరగనున్న శ్రీలంక-నమీబియా మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. తొలుత రౌండ్ 1 మ్యాచ్‌లు జరగనుండగా.. ఆక్టోబర్ 22 నుంచి సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఇది ఉండగా.. ఈ పొట్టి ప్రపంచకప్ ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక నుంచి ఇతర జట్లకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది అని గంభీర్ సూచించాడు. కాగా గత నెలలో జరిగిన ఆసియాకప్-2022లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన శీలంక ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. ఆసియాకప్-2022 సూపర్ 4లో భాగంగా కీలక మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఇక ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక తొలుత క్వాలిఫియర్ మ్యాచ్‌ల్లో ఆడనుంది. ఆక్టోబర్ 16న నమీబియాతో జరగనున్న మ్యాచ్‌తో శ్రీలంక తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ 'గేమ్ ప్లాన్'లో గంభీర్ మాట్లాడుతూ.." శ్రీలంక జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా ఆసియాకప్‌లో వారు ఆడిన విధానం అద్భుతమైనది. టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. అదే విధంగా వారి స్టార్ బౌలర్లు దుష్మంత చమీర, లహిరు కుమార తిరిగి రావడంతో జట్టుకు మరింత బలం చేకూరుతుంది. ఈ మెగా ఈవెంట్లో శ్రీలంక నుంచి ఇతర జట్లకు గట్టి పోటీ ఖచ్చితంగా ఎదురు కానుంది. అదే విధంగా ఈ పొట్టి ప్రపంచకప్‌లో ఏ జట్టును కూడా తేలికగా తీసుకోకూడదు" అని పేర్కొన్నాడు. చదవండి: Women Asia Cup Final: ఫైనల్లో శ్రీలంక చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్ -
ఏడో టైటిల్ వేటలో భారత్
సిల్హెట్: ఆసియా కప్ మహిళల టి20 టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఆ హోదాను నిలబెట్టుకుంటూ ఫైనల్ చేరింది. ఇప్పటికే ఆరు సార్లు టైటిల్ గెలుచుకున్న భారత్ మరోసారి ట్రోఫీని అందుకోవడంపై దృష్టి పెట్టింది. జట్టు తాజా ఫామ్, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను బట్టి చూస్తే అది అసాధ్యమేమీ కాదు. ఈ క్రమంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక మహిళల జట్టుతో హర్మన్ సేన తలపడనుంది. తొలి లీగ్ మ్యాచ్‌లో లంకను సునాయాసంగానే భారత్ ఓడించినా... ఆ జట్టు సెమీస్ తరహాలో సంచలనం సృష్టించే అవకాశాలను తక్కువ చేయలేం. ఇలాంటి నేపథ్యంలో నేడు తుది పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. సమష్టి ప్రదర్శనతో... లీగ్ దశలో పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా ఓడిపోవడం మినహా ఓవరాల్‌గా టోర్నీలో భారత్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అన్ని మ్యాచ్‌లు (7) ఆడిన ముగ్గురు ప్లేయర్లలో జెమీమా రోడ్రిగ్స్ అత్యధిక పరుగులు (215) సాధించగా, దీప్తి శర్మ అత్యధిక వికెట్లు (13) తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. షఫాలీ వర్మ కూడా ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు సానుకూలాంశం. స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన (4 ఇన్నింగ్స్‌లలో కలిపి 83 పరుగులు) మాత్రం ఆశించిన రీతిలో ఆడలేకపోయినా, ఫైనల్లోనైనా చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. దీప్తి శర్మతో పాటు స్నేహ్ రాణా, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్‌ల స్పిన్ ఎలాంటి బ్యాటర్లనైనా ఇబ్బంది పెట్టగలదు. దీప్తి సూపర్ ఫామ్‌లో ఉండటంతో ప్రత్యర్థికి ఇబ్బందులు తప్పవు. భారత్‌తో పోలిస్తే చమరి అటపట్టు కెప్టెన్సీలోని శ్రీలంక జట్టు బలహీనమనేది వాస్తవం. అయితే పాక్‌తో సెమీఫైనల్లో ఆ జట్టు చివరి బంతి వరకు కనబర్చిన స్ఫూర్తిదాయక ప్రదర్శన చూస్తే తేలిగ్గా ఓటమిని అంగీకరించే తరహా టీమ్ మాత్రం కాదని తెలుస్తోంది. తుది పోరులో ఆ జట్టు పోరాటం ఎంత వరకు సఫలం అవుతుందనేది చెప్పలేం. -
Womens Asia Cup 2022: ఫేవరెట్‌గా భారత్
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టోర్నీని 2004 నుంచి 2018 వరకు ఏడు సార్లు నిర్వహించారు. ఇందులో ఆరు సార్లు భారతే విజేత. ఈ టోర్నీలో మన ఆధిక్యం ఎలా సాగిందో చెప్పేందుకు ఇది చాలు. వన్డే ఫార్మాట్లో నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన మన అమ్మాయిలు టి20 ఫార్మాట్లో రెండు సార్లు టైటిల్ నెగ్గారు. గత టోర్నీలో మాత్రం అనూహ్యంగా ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి మన జట్టు రన్నరప్‌తో సంతృప్తి చెందింది. ఇప్పుడు మరోసారి తమ సత్తా చాటి ట్రోఫీ గెలుచుకునేందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సిద్ధమైంది. జట్టు తాజా ఫామ్, ఇటీవలి కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం, ఇంగ్లండ్‌పై వన్డేల్లో సాధించిన విజయాలు సహజంగానే భారత్‌ను ఫేవరెట్‌గా చూపిస్తున్నాయి. నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ ఆడుతుంది. ఆ తర్వాత టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌ల్లో వరుసగా మలేసియా (3న), యూఏఈ (4న), పాకిస్తాన్ (7న), బంగ్లాదేశ్ (8న), థాయ్‌లాండ్ (10న) జట్లతో తలపడుతుంది. మొత్తం 7 జట్లు బరిలోకి దిగుతుండగా, భారత్‌తో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, యూఏఈ, మలేసియా, థాయ్‌లాండ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. యూఏఈ తొలిసారి ఆసియా కప్‌లో ఆడనుండగా, పురుషుల ఆసియా కప్‌లో రాణించిన అఫ్గానిస్తాన్‌కు మహిళల టీమ్ లేదు. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ప్రతీ జట్టు ఆరుగురు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్‌లో తలపడుతుంది. టాప్–4 టీమ్‌లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 15న ఫైనల్ నిర్వహిస్తారు. జోరు మీదున్న టీమ్... ఆసియా కప్ చరిత్రలో వన్డేలు, టి20లు కలిపి భారత్ 32 మ్యాచ్‌లు ఆడగా 30 మ్యాచ్‌లు గెలిచింది. ప్రస్తుత టీమ్ అదే తరహాలో పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉంది. హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అద్భుత ఫామ్‌లో ఉండగా ఇప్పుడు జెమీమా రోడ్రిగ్స్ చేరికతో బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారింది. హేమలత, కీపర్ రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా ధాటిగా ఆడగలరు. అయితే కొన్నాళ్ల క్రితం వరకు మెరుపు ఆరంభాలతో ఆకట్టుకున్న షఫాలీ వర్మ ఇటీవలి పేలవ ప్రదర్శనే జట్టును కాస్త ఆందోళనపరుస్తోంది. అయితే ఆమెలో సామర్థ్యానికి కొదవ లేదని, ఒక్క ఇన్నింగ్స్ తో పరిస్థితి మారుతుందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అండగా నిలిచింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి సబ్బినేని మేఘనకు ఎన్ని అవకాశాలు లభిస్తాయో చూడాలి. బౌలింగ్‌లో కూడా భారత్ చక్కటి ఫామ్‌లో ఉంది. పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ నిలకడగా రాణించడం జట్టుకు ప్రధాన బలంగా మారింది. మరో పేసర్ పూజ వస్త్రకర్ ఆమెకు అండగా నిలుస్తోంది. బంగ్లా గడ్డపై ప్రభావం చూపించగల స్పిన్ విభాగంలో మన బృందం మరింత పటిష్టంగా కనిపిస్తోంది. దీప్తి శర్మ, రాధా యాదవ్, ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా సమష్టిగా జట్టును గెలిపించగలరు. గత ఆసియా కప్ ఫైనల్ ప్రదర్శనను పక్కన పెడితే మరోసారి భారత్‌కే టైటిల్ దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. -
దేశం కోసం గెలవాలన్న కసి టీమిండియాలో పోయింది.. ఐపీఎల్ బాయ్‌కాట్ చేస్తేనే..!
ఆసియా కప్ 2022లో టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో భారత అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్-4 దశలో తొలుత పాక్ చేతిలో, తాజాగా శ్రీలంక చేతిలో ఎదురైన ఘోర పరాభవాలను జీర్ణించుకోలేని అభిమానులు భారత ఆటగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. టీమిండియా ప్లేయర్స్ ఇలా తయారవ్వడానికి ప్రధాన కారణం ఐపీఎలేనని విరుచుకుపడుతున్నారు. దేశం కోసం మ్యాచ్‌లు గెలవాలన్న కసి టీమిండియాలో కొరడిందని, జాతికి ప్రాతినిధ్యం వహించేప్పుడు భారీ అంచనాలు పెట్టుకుంటే ఇలాగేనా ఆడేదని ఏకి పారేస్తున్నారు. #boycottipl This is what happens when u have too many expectations on nations match just play ipl and generate money pic.twitter.com/83Ti8JYrmo — NihaL Vaishya 🇮🇳 (@VaishyaNihal) September 6, 2022 వెళ్లి ఐపీఎల్ ఆడి డబ్బు కూడబెట్టుకోండి.. భారత్ గెలిచినా, ఓడినా మీకు పట్టదు అంటూ ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన కనబర్చి టీమిండియా ఓటముల్లో కీలక పాత్రధారిగా మారిన రిషబ్ పంత్‌ను ఎగాదిగా వాయించేస్తున్నారు. పంత్‌కు సీరియస్‌నెస్ అనేదే లేదని, దేశం కోసం ఆడుతున్నాడన్న ధ్యాసే లేదని, ఇతర విషయాలపై ఉన్న శ్రద్ధ క్రికెట్‌పై లేదని మండిపడుతున్నారు. మొత్తంగా భారత క్రికెటర్లు ఇలా తయారవ్వడానికి ఐపీఎలే కారణమని, బీసీసీఐ ఇకనైనా మేల్కొని ఐపీఎల్‌కు అడ్డుకట్ట వేయకపోతే మున్ముందు భారత క్రికెటర్లు జాతీయ జట్టుకు ఆడటమే మానేస్తారని హెచ్చరిస్తున్నారు. #boycottipl the Indian team has lost the will to win matches for the country. Lousy body language. pic.twitter.com/qvpm25592a — स्वतंत्र मैं 🇮🇳 (@anshukumarmish4) September 6, 2022 ఏడాదికి ఓసారి ఐపీఎల్ నిర్వహిస్తుంటేనే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేప్పుడు భారత ఆటగాళ్ల పరిస్థితి ఇలా ఉంటే.. ఏడాదికి రెండు ఐపీఎల్‌లు నిర్వహిస్తే అంతే సంగతులని కామెంట్లు పెడుతున్నారు. జనాలు ఐపీఎల్ చూడటం మానేసినప్పుడే.. భారత ఆటగాళ్లు జాతీయ జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారని అంటున్నారు. ఇలాగే వదిలేస్తే ఆటగాళ్లు జాతీయ జట్టు ప్రయోజనాలు గాలికొదిలేసి, క్యాష్ రిచ్ లీగ్ మాయలో కెరీర్లు నాశనం చేసుకుంటారని బల్ల గుద్ది చెబుతున్నారు. రాబోయే టీ20 ప్రపంచకప్‌లోనూ భారత ఆటగాళ్ల తీరు మారకుంటే జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసి, ఐపీఎల్ ఆడని ఆటగాళ్లను ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. The day from which Indian Public Stop watching IPL the day from. That this Useless team start playing for the country & pride not running for the money Same happens in the T20 WC #boycottipl pic.twitter.com/oOIGpX6XsN — 💫 ͡K͎ ͜ᴀ ʀ ͡ ͜ᴛ ʜ 𝚒 ͡💫🇮🇳 (@its_karthikoff) September 7, 2022 చదవండి: అర్షదీప్‌పై దూషణకు దిగిన గుర్తు తెలియని వ్యక్తి.. ఉతికి ఆరేసిన జర్నలిస్ట్ -
అంతా అయిపోయింది .. వెళ్లి లాగేజీ సర్దుకోండి! టాటా బై బై!
ఆసియాకప్-2022లో భారత్ వరుసగా రెండో ఓటమి చవి చూసింది. సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో. దీంతో ఈ మెగా టోర్నీలో భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. కాగా ఈ మ్యాచ్ భారత బ్యాటర్లు పర్వాలేదనిపించనప్పటికీ.. బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(72) అర్ధసెంచరీతో చేలరేగగా.. సూర్యకుమార్ యాదవ్(34) పరుగులతో రాణించాడు. ఇక 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 19.5 ఓవర్లలో ఛేదించింది. దీంతో ఫైనల్ బెర్త్‌ను శ్రీలంక దాదాపు ఖారారు చేసుకుంది. అయితే లీగ్ మ్యాచ్‌ల్లో దుమ్ము రేపిన భారత్.. కీలకమైన సూపర్-4 దశలో వరుసుగా ఓటముల చవి చూడటం పట్ల అభిమానలు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. #AsiaCupT20 to #india, khatam tata byebye goodbye gyaa #INDvsSL — Abdullah zaka (@Abdullahzaka10) September 6, 2022 సోషల్ మీడియా వేదికగా భారత జట్టును దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 'అంతా అయిపోయింది .. వెళ్లి లాగేజీ సర్దుకోండి' అంటూ ఓ ట్విటర్ యూజర్ పోస్టు చేశాడు. కాగా భారత్ ఫైనల్ చేరాలంటే కొన్ని అద్భుతాలు జరిగాలి. సూపర్-4లో భాగంగా బుధవారం జరగనున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించాలి. అదే విధంగా సెప్టెంబర్ 8న ఆఫ్గానిస్తాన్‌తో జరగనున్న సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించాలి. Indian fans waiting for indian team at Mumbai airport:#INDvsSL #AsiaCupT20 #AsiaCup2022#Goodbye pic.twitter.com/ojuEJ1OyRp — Ahtasham Riaz (@AhtashamRiaz22) September 6, 2022 అంతేకాకుండా సెప్టెంబర్ 9న పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించాలి. ఈ క్రమంలో భారత్, పాక్, ఆఫ్గాన్ జట్లు చెరో విజయంతో సమంగా నిలుస్తాయి. అప్పుడు రన్‌రేట్ ఆధారంగా మూడింటిలో ఒక జట్టు ఫైనల్లో అడుగుపెట్టనుంది. Bhuvi: Yesterday he gave away 19 run in the 19th over and today 14 ..#INDvSL pic.twitter.com/YQYNo6j0zh — Hiesnberg (@MALAYMU96793905) September 6, 2022 చదవండి: పాక్ పేసర్ నసీమ్ షాతో ఉన్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఊర్వశి రౌతేలా -
ఏం చేస్తున్నావు రోహిత్.. ఇదేనా నీ కెప్టెన్సీ? నిజంగా సిగ్గు చేటు!
ఆసియాకప్-2022లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డ్‌లో తన ప్రశాంతతను కోల్పోయాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. పాకిస్తాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో క్యాచ్ జారవిడిచిన అర్ష్‌దీప్ సింగ్‌పై గట్టిగా అరవడం.. అదే విధంగా పంత్ ఔటయ్యాక క్లాస్ పీకడం వంటి సంఘటలను చూశాం. అయితే మరో సారి రోహిత్ సహానాన్ని కోల్పోయాడు. ఆసియాకప్ సూపర్-4లో భాగంగా కీలక మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. అయితే శ్రీలంక విజయానికి అఖరి ఓవర్లో 7 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. రోహిత్ బంతిని అర్ష్‌దీప్ సింగ్ చేతికి ఇచ్చాడు. అయితే అఖరి ఓవర్ వేయడానికి వచ్చిన అర్ష్‌దీప్.. కెప్టెన్ రోహిత్ శర్మకు ఏదో సలహా ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ రోహిత్ మాత్రం అర్ష్‌దీప్ మాటలను పట్టించుకోకుండా ముఖం తిప్పి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో రోహిత్ ప్రవర్తనపై నెటిజన్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఇదేనా యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం, నిజంగా సిగ్గు చేటు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అఖరి ఓవర్లో అర్ష్‌దీప్ అద్భుతమైన యార్కర్లను వేశాడు. అయితే రెండు బంతుల్లో 2 పరుగులు అవసరమవ్వగా.. ఐదో బంతికి బైస్ రూపంలో శ్రీలంకకు విన్నింగ్ రన్స్ వచ్చాయి. Jokes apart but this is how you treat youngsters? Imagine being a captain and insulting your bowler like this during a live and crucial match. Shame on rohit sharma.pic.twitter.com/yoaAR1XWES — Saith Abdullah (@SaithAbdullah99) September 6, 2022 చదవండి: Ravindra Jadeja: జడేజా మోకాలి సర్జరీకి సంబంధించి బిగ్ అప్డేట్ -
చహల్‌ను ముద్దు పెట్టుకున్న విరాట్ కోహ్లి.. వీడియో వైరల్
ఆసియాకప్-2022 సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో భారత్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. కాగా ఈ మ్యాచ్‌లో కూడా భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. స్పిన్నర్లు పర్వాలేదన్పించిన పేసర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు. కాగా శ్రీలంక కోల్పోయిన ఆ నాలుగు వికెట్లు కూడా స్పిన్నర్లు పడగొట్టినవే. అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(72) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(34) పరుగులతో రాణించాడు. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు మెండిస్, నిసంకా అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే శ్రీలంక ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన యజువేంద్ర చాహల్ వరుసగా నిసంకా(52), ఆసలంక(0)ను పెవిలియన్‌కు పంపాడు. అదే విధంగా మళ్లీ 15 ఓవర్ వేసిన చాహల్ మంచి ఊపు మీద ఉన్న కుశాల్ మెండిస్(57)ను ఎల్బీ రూపంలో ఔట్ చేశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. చాహల్‌ను ముద్దుపెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగడం గమనార్హం. #ViratKohli kisses #YuzvendraChahal #INDvsSL pic.twitter.com/5XHuQjfHCf — Cricket fan (@Cricket58214082) September 6, 2022 చదవండి: Asia Cup 2022: 'నీ కీపింగ్‌కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కార్తీక్ బెటర్' -
వరుస ఓటములు.. అయినా భారత్ ఫైనల్‌కు చేరే ఛాన్స్! ఎలా అంటే?
ఆసియాకప్-2022 లీగ్ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన టీమిండియా.. కీలకమైన సూపర్-4 దశలో చేతులెత్తేసింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఓటమి చెందిన భారత్.. శ్రీలంకతో డూ ఆర్ డై మ్యాచ్‌లో కూడా పరాజయం పాలైంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. తద్వారా ఫైనల్‌కు చేరే అవకాశాలను టీమిండియా సంక్లిష్టం చేసుకుంది. అయితే సాంకేతికంగా చూస్తే ఈ మెగా ఈవెంట్లో భారత్ ఫైనల్‌కు చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు. అయితే టీమిండియా భవితవ్యం ఆఫ్గానిస్తాన్ శ్రీలంక జట్టులపై ఆధారపడి ఉంది. భారత్ ఫైనల్‌కు చేరాలంటే ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫైనల్‌కు చేరాలంటే అద్భుతాలే జరగాలి. సూపర్-4లో భాగంగా బుధవారం పాకిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ విజయం సాధించాలి. అదే విధంగా సెప్టెంబర్ 8న ఆఫ్గానిస్తాన్‌తో జరగనున్న సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించాలి. అంతేకాకుండా సెప్టెంబర్ 9న పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించాలి. ఈ క్రమంలో భారత్, పాక్, ఆఫ్గాన్ జట్లు చెరో విజయంతో సమంగా నిలుస్తాయి. అప్పుడు రన్‌రేట్ ఆధారంగా మూడింటిలో ఒక జట్టు ఫైనల్లో అడుగుపెట్టనుంది. కాగా సూపర్-4లో వరుసగా రెండు విజయాలు సాధించిన శ్రీలంక దాదాపుగా ఫైనల్లో అడుగుపెట్టినట్టే. ఇక రన్‌రేట్ విషయానికి వస్తే.. భారత్(-0.126), ఆఫ్గానిస్తాన్(-0.589) కంటే పాకిస్తాన్(+0.126) మెరుగ్గా ఉంది. టీ20 ప్రపంచకప్-2021లో కూడా.. టీ20 ప్రపంచకప్-2021లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌ల్లో వరుసగా పరాజయాలు చవిచూసిన భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించడంపైనే భారత్ సెమీస్ ఆశలు ఆధారపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఆఫ్గాన్ ఓటమిపాలైంది. దీంతో భారత్ టీ20 ప్రపంచకప్ నుంచి ఇంటిముఖం పట్టింది. అయితే ఈసారైనా ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించాలని భారత జట్టుతో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు. Hoping for the best, ready for the worst 🤞🏻#INDvSL #AsiaCupT20 #TeamIndia pic.twitter.com/yRqWCsZgN4 — Sportskeeda (@Sportskeeda) September 6, 2022 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌లో విరాట్ కోహ్లి చెత్త రికార్డు.. తొలి ఆటగాడిగా! -
ఆసియాకప్‌లో విరాట్ కోహ్లి చెత్త రికార్డు.. తొలి ఆటగాడిగా!
ఆసియాకప్-2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఫైనల్ చేరే అవకాశాలను భారత్ చేజార్చుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్‌లో మధుశంక వేసిన ఓ అద్భుతమైన బంతికి కోహ్లి క్లీన్ బౌల్డయ్యాడు. తద్వారా ఆసియాకప్‌లో ఓ చెత్త రికార్డును కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియాకప్ వన్డే, టీ20 ఫార్మాట్లో డకౌటైన తొలి ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(72) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(34) పరుగులతో రాణించాడు. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక మూడు వికెట్లు, షనక, కరుణరత్నే చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 19. 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. భారత బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ సాధించాడు. లంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సాంక(52), కుశాల్ మెండిస్(57) పరుగులతో రాణించగా.. అఖరిలో కెప్టెన్ 33 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #ViratKohli pic.twitter.com/R0buE9Zxd7 — Ehsan ul haq (@the_ehsanulhaq) September 6, 2022 చదవండి: Asia Cup 2022: రోహిత్ సిక్సర్; వెనక తగిలింది కాబట్టి సరిపోయింది.. ముందు తాకుంటే! -
'నీ కీపింగ్‌కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కార్తీక్ బెటర్'
ఆసియాకప్-2022లో టీమిండియా పోరాటం దాదాపు ముగిసింది. సూపర్-4లో భాగంగా దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా భారత్ ఫైనల్‌కు చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(72) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(34) పరుగులతో రాణించాడు. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక మూడు వికెట్లు, షనక, కరుణరత్నే చెరో రెండు వికెట్లు సాధించారు. అదరగొట్టిన శ్రీలంక ఓపెనర్లు ఇక 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు మెండిస్, నిసంకా అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే శ్రీలంక ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన యజువేంద్ర చాహల్ వరుసగా రెండు వికెట్లు పడగొట్టి భారత్‌ను మళ్లీ తిరిగి మళ్లీ పోటీలో నిలబెట్టాడు. అతడితో పాటు మరో స్పిన్నర్ అశ్విన్ 14 ఓవర్లో కీలకమైన గుణతిలక వికెట్ పడగొట్టాడు. అదే విధంగా 15 ఓవర్ తొలి బంతికే మంచి ఊపు మీద ఉన్న కుశాల్ మెండిస్‌ను చాహల్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో క్రీజులో ఇద్దరు కొత్త బ్యాటర్లు ఉండడంతో మ్యాచ్ భారత్ వైపు మలుపు తిరిగేలా కనిపించింది. ఇక 16 ఓవర్‌తో స్పిన్నర్ల నాలుగు ఓవర్ల కోటా పూర్తి అయిపోయింది. విఫలమైన భారత పేసర్లు ఈ క్రమంలో అఖరి నాలుగు ఓవర్లలో లంక విజయానికి 42 పరుగులు అవసరమయ్యాయి. 17 ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ 9 పరుగులు ఇవ్వగా.. 18 ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా 12 పరుగులు ఇచ్చాడు . ఇక అఖరి రెండు ఓవర్లలో లంక విజయానికి 12 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. రోహిత్ భువనేశ్వర్ కుమార్ చేతికి బంతి అందించాడు. అయితే 19 ఓవర్ వేసిన భువీ ఏకంగా 14 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఒక్క సారిగా సమీకరణాలు మారిపోయాయి. #boycottipl India needs a w&k like dhoni #RishabhPant #INDvSL #arshdeepsingh #Dhoni pic.twitter.com/xhiTqLnBr1 — Omkar Upadhyay (@Up03403195Omkar) September 7, 2022 అఖరిలో అర్ష్‌దీప్ అదుర్స్ అఖరి ఓవర్లో 7 పరుగులు అవసరమవ్వగా.. అర్ష్‌దీప్ బౌలింగ్ వేయడానిక వచ్చాడు. తొలి నాలుగు బంతుల్లో ఐదు పరుగులు ఇచ్చి అర్ష్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అఖరి రెండు బంతుల్లో 2 పరుగులు అవసరమవ్వగా.. అర్ష్‌దీప్ వేసిన ఐదో బంతిని షనక మిస్ చేసుకున్నాడు. దీంతో బంతి నేరుగా వికెట్ కీపర్ పంత్ చేతికి వెళ్లింది. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసిన పంత్ ఈ క్రమంలో షనక బై రన్‌కు ప్రయత్నించడంతో.. పంత్ వికెట్లకు త్రో చేశాడు. అయితే బంతి వికెట్లకు తాకకుండా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ చేతికి వెళ్లింది. అర్ష్‌దీప్ కూడా నాన్‌స్ట్రైక్ వైపు త్రో చేశాడు. అప్పడు కూడా బంతి వికెట్లకు తగలకుండా లాంగ్ అన్ వైపు వెళ్లింది. ఈ క్రమంలో బైస్ రూపంలో రెండు పరుగులను లంక బ్యాటర్లు పూర్తి చేశారు. దీంతో 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లంక లక్ష్యాన్ని చేధించింది. లంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సాంక(52), కుశాల్ మెండిస్(57) పరుగులతో రాణించగా.. అఖరిలో కెప్టెన్ 33 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కార్తీక్ జట్టులోఉండాల్సింది! అయితే ఈ మ్యాచ్‌లో కార్తీక్‌ను కాదని పంత్‌ను ఆడించడంపై అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కీలకమైన సమయంలో షనక స్టంపింగ్ ఛాన్స్‌ను కూడా పంత్ మిస్ చేశాడు. అదే విధంగా అఖరి ఓవర్లో రనౌట్ అవకాశాన్ని కూడా మిస్ చేసిన పంత్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కొంచెం ముందుకు వెళ్లి త్రో చేయాల్సిందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది ఈ సమయంలో ధోనిని గుర్తు చేసుకుంటారు. కాగా 2016 టీ20 ప్రపంచకప్ ఓ మ్యాచ్‌లో భారత్‌పై బంగ్లాదేశ్ విజయానికి అఖరి బంతికి రెండు పరుగులు కావల్సిన నేపథ్యంలో.. పాండ్యా వేసిన బంతిని బ్యాటర్ మిస్ చేసుకున్నాడు. అయితే బంతి నేరుగా వికెట్ కీపర్ ధోని చేతికి వెళ్లింది. Why Dhoni is Invaluable . #INDvSL#RishabhPant pic.twitter.com/c949JACXDf — Autumn (@Autumn_streek) September 6, 2022 వెంటనే ధోని ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి వికెట్లను గిరాటేశాడు. దీంతో భారత్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా అభిమానులు ధోనిని గుర్తు చేసుకుంటున్నారు. 'మిస్ యూ' ధోని అంటూ కామెంట్లు చేస్తున్నారు. అదే విధంగా కార్తీక్ జట్టులో ఉండి ఉంటే బాగండేది అని వాపోతున్నారు. బ్యాటింగ్‌లో కూడా పంత్ విఫలమయ్యాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'నీ కీపింగ్‌కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కార్తీక్ బెటర్' అంటూ కామెంట్ చేశాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Asia Cup 2022: రోహిత్ సిక్సర్; వెనక తగిలింది కాబట్టి సరిపోయింది.. ముందు తాకుంటే! -
శ్రీలంక విజయం.. ఆసియాకప్ నుంచి టీమిండియా ఔట్ (ఫొటోలు)
-
Asia Cup 2022: భారత్ కథ ముగిసె!
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్‌కు ఊహించని షాక్! అభిమానుల గుండె పగిలె ఫలితం శ్రీలంక చేతిలోనూ ఎదురైంది. సూపర్ –4లో వరుసగా రెండో ఓటమి. దీంతో ఫైనల్ ఆశలకు దాదాపు తెరపడింది. నేడు పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ అద్భుతం చేస్తే తప్ప మనకు దారే లేదు. మంగళవారం జరిగిన పోరులో 6 వికెట్లతో భారత్‌ను ఓడించిన శ్రీలంక ఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. మొదట టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (41 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. మదుషంక 3 వికెట్లు తీశాడు. తర్వాత శ్రీలంక 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి గెలిచింది. నిసాంక (37 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (37 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన షనకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. కెప్టెన్ ఒక్కడే! గత మ్యాచ్‌కు భిన్నంగా ఆట మొదలైంది. పాక్‌పై ధాటిగా ఆరంభమైన ఓపెనింగ్ మెరుపులు... శ్రీలంకపై కరువయ్యాయి. ఓపెనర్ రాహుల్ (6) రెండో ఓవర్లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. మరుసటి ఓవర్లోనే కోహ్లి (0) డకౌటయ్యాడు. 13 పరుగులకే రెండు టాపార్డర్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ రోహిత్ బాధ్యతగా నడిపించాడు. అసిత ఫెర్నాండో వేసిన ఐదో ఓవర్లో 6, 4 కొట్టి రన్‌రేట్ పెంచాడు. మళ్లీ తనే వేసిన పదో ఓవర్లో మరో సిక్సర్, బౌండరీతో 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లలో భారత్ స్కోరు 79/2. సగం ఓవర్లు అయిపోవడంతో ‘హిట్‌మ్యాన్’ ధాటిని మరింత పెంచాడు. కానీ ఆ క్రమంలోనే వెనుదిరిగాడు. హసరంగ వేసిన 12వ ఓవర్లో 2 సిక్సర్లు, ఓ ఫోర్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. మరుసటి ఓవర్లో కరుణరత్నే స్లో డెలివరీతో రోహిత్‌ను బోల్తా కొట్టించాడు. కాసేపటికి సూర్యకుమార్ (29 బంతుల్లో 34; 1 ఫోర్, 1 సిక్స్)ను స్లో బౌన్సర్‌తో షనక పెవిలియన్ చేర్చాడు. పాండ్యా (17), పంత్ (17) పెద్దగా మెరిపించలేదు. అశ్విన్ (7 బంతుల్లో 15 నాటౌట్; 1 సిక్స్) చేసిన ఆ కాస్త పరుగులతోనే కష్టంగా 170 పైచిలుకు స్కోరు చేయగలిగింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చెలరేగిన ఓపెనర్లు లంక ఛేదన తొలి ఓవర్లో కేవలం పరుగుతో మొదలైంది. తర్వాత ఓవర్ నుంచి ఫోర్లతో, అటు నుంచి సిక్సర్లతో చకచకా సాగిపోయింది. ఓపెనర్లు నిసాంక, కుశాల్ల జోరుతో అర్‡్షదీప్ తేలిపోయాడు. ఐదో ఓవర్లో అతను 18 పరుగులు సమర్పించుకున్నాడు. శ్రీలంక 5.2 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. మరో ఐదు ఓవర్లు... మొత్తంగా సగం ఓవర్లు ముగిసినా భారత బౌలర్లు వికెట్ తీయలేకపోయారు. అవతలివైపు ఓపెనర్లే లక్ష్యంలో సగం స్కోరును (10 ఓవర్లలో 89/0) దాటేశారు. 12వ ఓవర్ వేసిన చహల్ నిసాంకతో పాటు అసలంక (0)ను పెవిలియన్ చేర్చాడు. స్వల్ప వ్యవధిలో గుణతిలక (1)ను అశ్విన్, కుశాల్ మెండిస్‌ను చహల్ అవుట్ చేయడంతో 110 పరుగుల వద్ద 4 వికెట్లను కోల్పోవడంతో భారత శిబిరం ఆనందంలో తేలియాడింది. కానీ రాజపక్స వచ్చీ రాగానే స్పిన్నర్లిదరి ఓవర్లలో సిక్సర్లు కొట్టాడు. తర్వాత కెప్టెన్ షనక కూడా జాగ్రత్తగా ఆడటంతో లక్ష్యానికి చేరువైంది. ఆఖరి అవకాశాన్ని కూడా కీపర్ పంత్, బౌలర్ అర్‡్షదీప్ చేజార్చడంతో లంక మరో బంతి ఉండగానే గెలిచింది. 2 బంతుల్లో 2 పరుగుల సమీకరణం వద్ద ఐదో బంతిని షనక బీట్ అయ్యాడు. పంత్ వికెట్లపై విసరగా తగలకుండా బంతి బౌలర్ అర్‡్షదీప్ చేతుల్లో పడింది. తను పరుగెత్తుకుంటూ వికెట్లను కొట్టకుండా బలంగా విసరడంతో అవుట్ కావాల్సిన చోట ఓవర్‌త్రోతో 2 పరుగులు వచ్చాయి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) తీక్షణ 6; రోహిత్ (సి) నిసాంక (బి) కరుణరత్నే 72; కోహ్లి (బి) మదుషంక 0; సూర్యకుమార్ (సి) తీక్షణ (బి) షనక 34; పాండ్యా (సి) నిసాంక (బి) షనక 17; పంత్ (సి) నిసాంక (బి) మదుషంక 17; దీపక్ హుడా (బి) మదుషంక 3; అశ్వి న్ (నాటౌట్) 15; భువనేశ్వర్ (బి) కరుణరత్నే 0; అర్‡్షదీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–11, 2–13, 3–110, 4–119, 5–149, 6–157, 7–158, 8–164. బౌలింగ్: మదుషంక 4–0–24–3, మహీశ్ తీక్షణ 4–0–29–1, చమిక 4–0–27–2, అసిత ఫెర్నాండో 2–0–28–0, హసరంగ 4–0–39–0, షనక 2–0–26–2. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) రోహిత్ (బి) చహల్ 52; కుశాల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 57; అసలంక (సి) సూర్యకుమార్ (బి) చహల్ 0; గుణతిలక (సి) రాహుల్ (బి) అశ్విన్ 1; రాజపక్స (నాటౌట్) 25; షనక (నాటౌట్) 33; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–97, 2–97, 3–110, 4–110. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–30–0, అర్‡్షదీప్ 3.5–0–40–0, పాండ్యా 4–0–35–0, చహల్ 4–0–34–3, అశ్విన్ 4–0–32–1. భారత్ ఫైనల్ చేరాలంటే... నేడు జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ తప్పనిసరిగా గెలవాలి. అనంతరం గురువారం జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై భారత్ కూడా విజయం సాధించాలి. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై కూడా శ్రీలంక తప్పనిసరిగా నెగ్గాలి. ఇలా జరిగితే శ్రీలంక ఫైనల్ చేరుతుంది. భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ జట్లు రెండు పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఈ మూడు జట్లలో మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు ఫైనల్‌కు వెళుతుంది. ఒకవేళ నేడు అఫ్గానిస్తాన్‌పై గెలిస్తే పాకిస్తాన్ ఫైనల్లోకి అడుగు పెడుతుంది. పాక్ , భారత్‌లపై అఫ్గానిస్తాన్ గెలిచి... లంకపై పాకిస్తాన్ నెగ్గితే... పాక్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ నాలుగు పాయింట్లతో సమంగా నిలుస్తాయి. మెరుగైన రన్‌రేట్ ఉన్న రెండు జట్లు ఫైనల్ చేరుతాయి. -
ఆసియా కప్‌ను పాక్ ఎగరేసుకుపోతుంది..! జోస్యం చెప్పిన సెహ్వాగ్ బాబా
Sehwag Prediction On Asia Cup 2022 Winner: ఆసియా కప్ 2022 విజేత ఎవరనే విషయమై టీమిండియా మాజీ ఓపెనర్, డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సూపర్-4 మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 6) శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా ఓడితే.. దాయాది పాకిస్తాన్‌కు ఆసియా కప్ ఎగరేసుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ భారత అభిమానులకు మింగుడుపడని జోస్యం చెప్పాడు. ఆసియా కప్‌లో చాలాకాలం తర్వాత పాక్ టీమిండియాపై విజయం సాధించిన వైనాన్ని బట్టి చూస్తే.. దాయాదికే ఆసియా ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయంటూ టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేని వ్యాఖ్యలు చేశాడు. సెహ్వాగ్ జోస్యం విషయం అటుంచితే.. శ్రీలంకతో నేడు జరుగబోయే మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైతే ఫైనల్‌కు చేరే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయే మాట వాస్తవమే. ఇదే జరిగితే, సూపర్-4 టేబుల్ టాపర్‌గా శ్రీలంక, మరో మ్యాచ్ ఓడినా టేబుల్ సెకెండ్ టాపర్‌గా పాకిస్తాన్ ఫైనల్స్‌కు చేరతాయి. బలాబలాల విషయంలో లంకతో పోలిస్తే పాక్‌దే పైచేయిగా ఉండటంతో ఫైనల్లో పాక్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఇవాల్టి మ్యాచ్‌లో భారత్ భారీ తేడాతో గెలిస్తే.. సమీకరణలు ఇందుకు విరుద్దంగా మారతాయి. రోహిత్ సేన లంకపై గెలిస్తేనే సరిపోదు, మరో సూపర్-4 పోరులో ఆప్ఘనిస్తాన్‌ను కూడా భారీ తేడాతో మట్టికరిపించాల్సి ఉంటుంది. టీమిండియా ఫైనల్స్‌కు చేరేందుకు రన్ రేట్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదంటే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో భారత్ భారీ విజయాలు సాధించాల్సి ఉంది. ఈ రెండు విజయాలు ఇచ్చే ఊపుతో అలాగే సూపర్-4 దశలో పాక్ చేతిలో ఎదురైన చేదు అనుభవం తాలూకా కసితో టీమిండియా ఫైనల్లో ఎంతటి ప్రత్యర్ధినైనా మట్టికరిపించే అవకాశం ఉంటుంది. మరోవైపు పాక్ తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. వచ్చే ఆదివారం జరుగబోయే ఫైనల్లో దెబ్బతిన్న బెబ్బులి భారత్‌ను ఢీకొట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గ్రూప్ దశలో లంక, బంగ్లా జట్లకు షాకిచ్చిన ఆఫ్ఘాన్.. తమ తదుపరి సూపర్-4 మ్యాచ్‌ల్లో భారత్, పాక్‌లతో తలపడాల్సి ఉంది. ఆఫ్ఘాన్.. ఈ రెండు జట్లలో ఏదో ఒకదానికి షాకిచ్చినా ఫైనల్ బెర్తులు తారుమారవుతాయి. ఏదిఏమైనప్పటికీ ఇవాల్టి మ్యాచ్‌లో లంకను మట్టుబెట్టడమే భారత్ ముందున్న ప్రధమ లక్ష్యం. చదవండి: IND VS SL: లంకతో అంత ఈజీ కాదు.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే..? -
'శ్రీలంకతో మ్యాచ్‌కు అతడిని జట్టులోకి తీసుకురండి'
ఆసియాకప్-2022 సూపర్-4లో భాగంగా డూ ఆర్ డై మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడేందుకు భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా భారత్ తమ సూపర్-4 తొలి మ్యాచ్‌లో పాక్ చేతిలో ఓటమి పాలవ్వడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. భారత్ ఫైనల్‌కు చేరాలంటే వరుసగా శ్రీలంక, ఆఫ్గానిస్తాన్‌పై విజయం సాధించాలి. ఇక గత మ్యాచ్‌లో పాక్‌పై జట్టులో నాలుగు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా.. శ్రీలంకతో మ్యాచ్‌లో జట్టులో ఏమైనా మార్పులు చేస్తుందా లేదా అదే జట్టుతో ఆడుతోందా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ క్రమంలో శ్రీలంకతో కీలక పోరుకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని ఎంపిక చేయాలని భారత మాజీ క్రికెటర్ సబా కరీం సూచించాడు. కాగా ఈ మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు అశ్విన్ కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇండియా స్పోర్ట్స్ న్యూస్‌తో కరీం మాట్లాడుతూ.. శ్రీలంకతో జరిగే కీలక మ్యాచ్‌కు హుడా స్థానంలో అశ్విన్‌ను జట్టులోకి తీసుకోవాలి. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాతో కలిపి ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగాలి. అశ్విన్ అద్భుతమైన ఆఫ్ స్పిన్నర్. అతడికి కీలక సమయాల్లో వికెట్లు తీసే సత్తా ఉంది అని" కరీం పేర్కొన్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌కు భారత తుది జట్టు (అంచనా).. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ చదవండి: Asia Cup 2022: 'శ్రీలంకతో కీలక పోరు.. చాహల్‌ను పక్కన పెట్టి అతడిని తీసుకోండి' -
IND VS SL: లంకతో అంత ఈజీ కాదు.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే..?
ఆసియా కప్ 2022 సూపర్-4 దశ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 6) భారత్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ స్టేజీలో శ్రీలంక ఇప్పటికే ఓ విజయం (ఆఫ్ఘనిస్తాన్పై) సాధించి మెరుగైన రన్‌రేట్‌తో (0.589) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా.. పాక్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొని పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో (-0.126) నిలిచింది. ఫైనల్‌కు అర్హత సాధించాలంటే అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం నమోదు చేయాల్సి ఉంది. మరోవైపు, పసికూనే కదా అని శ్రీలంకను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో లంకేయులు భారీ స్కోర్‌ను అలవోకగా ఛేదించి మాంచి జోష్ మీద ఉన్నారు. శ్రీలంక అదే జోష్‌ను ఈ మ్యాచ్‌లోనూ కంటిన్యూ చేస్తే.. టీమిండియా ఇంటి బాట పట్టక తప్పదు. ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ సైతం ఆసియా కప్‌లో శ్రీలంకను తక్కువ అంచనా వేయొద్దని సూచిస్తున్నాయి. ఈ టోర్నీలో శ్రీలంకకు భారత్‌తో సమానమైన విన్నింగ్ రికార్డు ఉంది. ఆసియా కప్ వన్డే, టీ20 ఫార్మాట్లలో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 20 మ్యాచ్‌లు జరగ్గా.. భారత్ 10, శ్రీలంక 10 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. టీ20ల విషయానికొస్తే.. ఈ ఫార్మాట్లో టీమిండియా లంకేయులపై స్పష్టమైన ఆధిపత్యాన్ని కలిగి ఉంది. ఇరు జట్ల మధ్య మొత్తం 25 టీ20 మ్యాచ్‌లు జరగ్గా భారత్ 17, శ్రీలంక 7 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇరు జట్ల మధ్య తాజాగా జరిగిన 5 టీ20లను పరిశీలిస్తే.. చివరి 3 మ్యాచ్‌ల్లో టీమిండియానే విజయం సాధించినప్పటికీ.. వారి సొంతగడ్డపై జరిగిన 2 టీ20ల్లో లంకేయులే జయకేతనం ఎగురవేశారు. ఓవరాల్‌గా చూస్తే.. లంక జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేనప్పటికీ, వారిదైన రోజున వారిని ఆపడం మాత్రం చాలా కష్టం. బౌలింగ్ పరంగా కాస్త బలహీనంగా కనబడే శ్రీలంక.. బ్యాటింగ్‌లో మాత్రం తగినంత డెప్త్ కలిగి ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ మరోసారి కీ రోల్ ప్లే చేయనుంది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది. తుది జట్ల అంచనా.. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్ శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దసున్ షనక (కెప్టెన్), భానుక రాజపక్సే, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక చదవండి: 'శ్రీలంకతో కీలక పోరు.. చాహల్‌ను పక్కన పెట్టి అతడిని తీసుకోండి' -
'శ్రీలంకతో కీలక పోరు.. చాహల్‌ను పక్కన పెట్టి అతడిని తీసుకోండి'
ఆసియాకప్-2022 సూపర్-4లో భాగంగా శ్రీలంకతో కీలక పోరుకు సిద్దమైంది. దుబాయ్ వేదికగా మంగళవారం జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా తాడోపేడో తేల్చుకోనుంది. సూపర్-4లో భాగంగా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో భారత్‌కు ఎదురైన పరాజయం .. ఫైనల్ రేసును ఆసక్తికరంగా మార్చింది. భారత్ ఫైనల్‌కు చేరాలంటే తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా విజయం సాధించాలి. ఇక శ్రీలంకతో డూ ఆర్‌డై మ్యాచ్‌కు భారత జట్టులో మార్పులు చేయాలని టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ సూచించాడు. దారుణంగా విఫలమవుతున్న యుజ్వేంద్ర చాహల్ స్థానంలో అవేశ్ ఖాన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని గంభీర్ సలహా ఇచ్చాడు. అదే విధంగా భారత లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని అతడు తెలిపాడు. చాహల్‌ను పక్కన పెట్టి అవేష్ ఖాన్‌కు తిరిగి జట్టులోకి తీసుకురావాలి. అదే విధంగా రవి బిష్ణోయ్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వాలి. అతడు పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ టోర్నీలో చాహల్ అంతగా రాణించలేకపోయాడు. కాబట్టి లెగ్ స్పిన్నర్ బిష్ణోయ్‌కు మరిన్ని అవకాశాలు కల్పించే సమయం అసన్నమైంది అని గంభీర్ పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్ జరిగిన మ్యాచ్‌లో బిష్ణోయ్ తన నాలుగు ఓవర్ల కోటాలో 26 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. చాహల్ మాత్రం తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ సాధించాడు. శ్రీలంకతో మ్యాచ్‌కు భారత తుది జట్టు (అంచనా).. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ చదవండి: Asia Cup 2022 IND VS SL Super 4: శ్రీలంకతో కీలక పోరుకు భారత్ 'సై'.. అశ్విన్‌కు చాన్స్ ఉందా? -
శ్రీలంకతో కీలక పోరుకు భారత్ 'సై'.. అశ్విన్‌కు చాన్స్ ఉందా?
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీ తొలి రెండు మ్యాచ్‌లలో భారత్ జోరు చూస్తే పాకిస్తాన్‌పై మళ్లీ గెలవడం ఖాయమనిపించింది. అయితే ఆదివారం పాక్ చేతిలో ఎదురైన పరాజయం ‘సూపర్–4’ దశను ఆసక్తికరంగా మార్చింది. ఫైనల్ చేరాలంటే మూడు మ్యాచ్‌లలో కనీసం రెండు గెలవాల్సి ఉండగా, తొలి మ్యాచ్‌లో ఓటమి టీమిండియాపై ఒత్తి డి పెంచింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలవాల్సిన స్థితిలో నేడు శ్రీలంకతో భారత్ తలపడనుంది. అనుభవం, రికార్డులపరంగా ప్రత్యర్థిపై అన్ని రకాలుగా భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... గత రెండు మ్యాచ్‌లలో లంక అనూహ్య విజయాలు చూస్తే అంత సులువు కాదని అనిపిస్తోంది. అశ్విన్‌కు చాన్స్ ఉందా! టి20 ప్రపంచకప్‌కు ఈ వారంలోనే భారత జట్టును ప్రకటించనున్నారు. ఇలాంటి స్థితిలో ఆసియా కప్‌లో సాధ్యమైనంత ఎక్కువ మందికి అవకాశం ఇస్తూ అన్ని రకాల ప్రత్యామ్నాయాలను భారత్ పరీక్షిస్తోంది. అయితే పాకిస్తాన్ చేతిలో ఓడటంతో మరోసారి తుది జట్టు విషయంలో సందిగ్ధత నెలకొంది. ఓపెనర్లుగా రోహిత్, రాహుల్ గత మ్యాచ్‌లో శుభారంభం అందించడం సానుకూలాంశం. టోర్నీలో రెండో అర్ధ సెంచరీతో కోహ్లి ఫామ్‌లోకి రాగా, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా మరోసారి చెలరేగాల్సి ఉంది. పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్ రెండు విభాగాల్లోనూ నిరాశపర్చాడు. కీపర్ రిçషభ్ పంత్, దినేశ్ కార్తీక్ మధ్య టీమ్ మేనేజ్మెంట్ ఇంకా తేల్చుకోలేకపోతోంది. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో ఇద్దరూ ఆడగా, గత పోరులో కార్తీక్ స్థానంలో బ్యాటర్‌గా దీపక్ హుడా జట్టులోకి వచ్చాడు. హుడాకు మరో అవకాశం ఇస్తారా లేక కార్తీక్‌ను మళ్లీ ఆడిస్తారా చూడాలి. జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్లాంటివాళ్లు లేకపోవడంతో బౌలింగ్‌లో తడబాటు కనిపిస్తోంది. ఎంతో నమ్ముకున్న భువనేశ్వర్ పాక్‌తో మ్యాచ్‌లో 19వ ఓవర్లో భారీగా పరుగులు ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు దానిని అతను సరిదిద్దుకోవాల్సి ఉంది. స్పిన్ విభాగంలో ఒక మార్పు జరగవచ్చు. ఆశించిన స్థాయిలో చహల్ రాణించడం లేదు కాబట్టి సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ అశ్విన్‌కు ఒక అవకాశం ఇవ్వవచ్చు. లేదంటే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతను లేడని ఖాయంగా చెప్పవచ్చు. స్టార్లు లేకపోయినా లీగ్ దశలో అఫ్గానిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో ఓడగానే శ్రీలంక జట్టును అంతా తేలిగ్గా చూశారు. అయితే తర్వాతి రెండు మ్యాచ్‌లలో ఆ జట్టు చూపిన పోరాటపటిమ, యువ ఆటగాళ్ల పట్టుదల అభినందనీయం. ఈ రెండు మ్యాచ్‌లలోనూ ఓటమికి చేరువై గెలుపునకు ఎలాంటి అవకాశం లేని స్థితి నుంచి లంక మ్యాచ్‌లు గెలవగలిగింది. ముందుగా బంగ్లాదేశ్‌ను ఇంటికి పంపిన ఆ జట్టు ‘సూపర్–4’లో గెలుపుతో అఫ్గానిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. బ్యాటర్లు షనక, కుశాల్ మెండిస్, గుణతిలక, రాజపక్స కీలక సమయాల్లో రాణించి జట్టు విజయానికి కారణం కాగా, చివర్లో చమిక కరుణరత్నే కూడా బ్యాటింగ్ చేయగలనని నిరూపించాడు. బౌలింగ్ లో గుర్తింపు ఉన్న పేసర్లు ఎవరూ లేకపోవడం లంక జట్టు బలహీనత. అయితే ఐపీఎల్లో ఆడిన స్పిన్నర్లు మహీశ్ తీక్షణ, హసరంగ భారత్‌పై ప్రభావం చూపగలరు. -
లంకతో సమరం.. పంత్, చహల్‌లను పక్కకు పెట్టడమే ఉత్తమం..!
ఆసియా కప్ 2022 సూపర్-4 దశలో భాగంగా నిన్న (సెప్టెంబర్ 4) పాకిస్తాన్‌తో జరిగిన హైఓల్టేజీ సమరంలో టీమిండియా 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ను టీమిండియా ఆటగాళ్లు చేజేతులా జారవిడిచి ప్రత్యర్ధికి చేతికి అప్పగించారు. తొలుత బ్యాటింగ్‌లో అత్యుత్సాహం (పంత్, హార్ధిక్ చెత్త షాట్ సెలెక్షన్), అనంతరం బౌలింగ్ (భువీ, హార్ధిక్, చహల్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం), ఫీల్డింగ్‌లో (కీలక సమయంలో అర్షదీప్ క్యాచ్ జారవిడచడం) అనవసర తప్పిదాలు టీమిండియా పుట్టి ముంచాయి. పాక్ చేతిలో ఈ ఊహించని పరాభవం నేపథ్యంలో జట్టును ప్రక్షాళన చేయాలని భారత అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సూపర్-4 దశలో తదుపరి జరిగే మ్యాచ్‌ల్లో వికెట్‌కీపర్ రిషబ్ పంత్, స్పిన్నర్ చహల్లపై వేటు వేయడం ఉత్తమమని టీమిండియా యాజమాన్యాన్ని సూచిస్తున్నారు. రేపు (సెప్టెంబర్ 6) శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో పంత్, చహల్‌లను పక్కకు పెట్టి వారి స్థానాల్లో దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్‌లను ఆడించాలని కోరుతున్నారు. లెఫ్ట్ హ్యాండర్ కోటాలో ఎంపిక చేసిన పంత్.. రైట్ హ్యాండర్లా షాట్ ఆడేందుకు ప్రయత్నించి (రివర్స్ స్వీప్) వికెట్ పారేసుకోవడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. చహల్ సైతం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడని మండిపడుతున్నారు. వీరిద్దరిని తీసేసి డీకే, అక్షర్‌లకు అవకాశం ఇస్తే జట్టు సమతూకంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. శ్రీలంకతో మ్యాచ్‌కు భారత తుది జట్టు (అంచనా).. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ చదవండి: Asia Cup 2022 Final: అలా అయితేనే ఫైనల్లో భారత్- పాకిస్తాన్! లేదంటే మనం ఇంటికే! -
టీమిండియాకు షాక్.. మూడో టీ20లో శ్రీలంక ఘన విజయం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత మహిళల జట్టుతో ఇవాళ (జూన్ 27) జరిగిన ఆఖరి టీ20లో ఆతిధ్య శ్రీలంక 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా ఇదివరకే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో నామమాత్రంగా సాగిన ఈ మ్యాచ్‌లో లంక కెప్టెన్ చమారి ఆటపట్టు (48 బంతుల్లో 80 నాటౌట్; 14 ఫోర్లు, సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది. ఫలితంగా శ్రీలంక ఈ సిరీస్‌లో బోణీ కొట్టడంతో పాటు భారత ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేయగా.. లంక మరో 18 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చామరి సహా నిలాక్షి డిసిల్వా (28 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించడంతో శ్రీలంక సునాయస విజయం సాధించింది. భారత బౌలర్లలో రాధా యాదవ్, రేణుక సింగ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు హర్మన్‌ప్రీత్ కౌర్ (39 నాటౌట్), జెమీమా రోడ్రిగెస్ (33) ఓ మోస్తరుగా రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. ఈ పర్యటనలో టీమిండియా జులై 1, 4, 7 తేదీల్లో వన్డేలు ఆడనుంది. చదవండి: IND VS IRE 1st T20: భువీ ఖాతాలో అరుదైన రికార్డు -
India vs Sri Lanka Womens 2nd T20: భారత్‌దే సిరీస్
దంబుల్లా: సమష్టి ఆటతీరుతో రాణించిన భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ఐదు వికెట్లతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు సాధించింది. ఓపెనర్లు విష్మి గుణరత్నే (45; 6 ఫోర్లు), చమరి ఆటపట్టు (43; 7 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 13.5 ఓవర్లలో 87 పరుగులు జోడించారు. పూజా వస్త్రకర్ బౌలింగ్‌లో ఆటపట్టు అవుటయ్యాక లంక పతనం మొదలైంది. చివరి ఆరు ఓవర్లలో లంక 38 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రేణుక సింగ్, రాధా యాదవ్, పూజా వస్త్రకర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి గెలిచింది. స్మృతి మంధాన (34 బంతుల్లో 39; 8 ఫోర్లు), షఫాలీ వర్మ (10 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్), సబ్బినేని మేఘన (10 బంతుల్లో 17; 4 ఫోర్లు) దూకుడుగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మన్‌ప్రీత్ కౌర్ (32 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు) చివరిదాకా నిలిచి భారత్‌ను విజయతీరానికి చేర్చింది. చివరిదైన మూడో టి20 సోమవారం జరుగుతుంది. -
టీ20ల్లో అరుదైన మైలురాయిని అధిగమించిన టీమిండియా బ్యాటర్
INDW VS SLW: టీమిండియా బ్యాటర్ స్మృతి మంధాన పొట్టి క్రికెట్లో ఓ అరుదైన మైలురాయిని అధిగమించింది. శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మంధాన రేర్ ఫీట్‌ను సాధించింది. శనివారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 39 పరుగులు చేయడం ద్వారా పొట్టి ఫార్మాట్లో 2000 పరుగుల (84 ఇన్నింగ్స్‌ల్లో) మార్కును అధిగమించిన ఐదో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. మంధాన కంటే ముందు రోహిత్ శర్మ (125 ఇన్నింగ్స్‌ల్లో 3313 పరుగులు), విరాట్ కోహ్లి (97 ఇన్నింగ్స్‌ల్లో 3297), హర్మన్‌ప్రీత్ కౌర్ (84 ఇన్నింగ్స్‌ల్లో 2372), మిథాలీ రాజ్ (70 ఇన్నింగ్స్‌ల్లో 2364) టీ20ల్లో 2000 మార్కును అందుకున్నారు. ఈ రికార్డుతో పాటు మంధాన మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. టీ20ల్లో వేగంగా 2000 పరుగులు చేసిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఇక ఇదే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఓ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో 31 పరుగులు చేసిన హర్మన్.. మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును (భారత మహిళల క్రికెట్లో) అధిగమించింది. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో భారత మహిళల జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా.. ఛేదనలో భారత్ 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. చదవండి: శ్రీలంకపై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం -
జట్టు నుంచి తప్పించారు.. అప్పుడు రోహిత్, పంత్‌తో మాట్లాడినందుకే ఇలా!
INDW vs SLW 1st T20- Jemimah Rodrigues: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ ఇచ్చిన సలహాలు, సూచనలు తనకెంతగానో ఉపయోగపడ్డాయని భారత మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ పేర్కొంది. తాను పూర్తిగా నిరాశలో కూరుకుపోయిన సమయంలో వాళ్లిద్దరి మాటలు స్ఫూర్తి నింపాయని ఉద్వేగానికి లోనైంది. రోహిత్, పంత్ తనలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించారని వారితో మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. కాగా 21 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ చివరిసారిగా గతేడాది అక్టోబరులో భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత ఇంగ్లండ్ లీగ్ ది హండ్రెడ్‌లో నార్తర్న్ సూపర్చేంజెర్స్కు ప్రాతినిథ్యం వహించి లీగ్ టాప్ స్కోరర్లలో ఒకరిగా నిలిచింది. అంతేగాక ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగ్రేడ్స్కు ఆడి సత్తా చాటింది. అయితే, అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ ముంబై బ్యాటర్‌కు ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్ భారత జట్టులో చోటు దక్కుతుందని భావించినా నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో ఎట్టకేలకు శ్రీలంకతో టీ20 సిరీస్‌కు జెమీమా ఎంపికైంది. మొదటి మ్యాచ్‌లో తుది జట్టులో స్థానం దక్కించుకున్న ఆమె.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. డంబుల్లా వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో 36 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ 138 పరుగుల స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో భారత జట్టు ఆతిథ్య శ్రీలంకపై 34 పరుగుల తేడాతో గెలవడంలో కీలకంగా వ్యవహరించిన జెమీమాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో జెమీమా మాట్లాడుతూ.. శ్రీలంకతో సిరీస్‌కు ముందు తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి గుర్తు చేసుకుంది. ‘‘ఇక్కడికి వచ్చే ముందు వరకు నా ప్రయాణం మరీ అంత సాఫీగా ఏమీ సాగలేదు. నా కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. నిరాశలో ఉన్న సమయంలో రోహిత్ శర్మ, రిషభ్ పంత్‌తో మాట్లాడాను. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కనంత మాత్రాన ప్రతికూల ఆలోచనలతో మనసు పాడుచేసుకోవద్దని, ఇలాంటి సవాళ్లను దాటుకుని ముందుకు వెళ్లడంలోనే అసలైన మజా ఉంటుందని చెప్పారు. ఇలాంటి వాటిని చాలెంజ్‌గా తీసుకోవాలే తప్ప డీలా పడొద్దని సూచించారు. వారితో మాటలు నా ఆలోచనా విధానంపై ప్రభావం చూపాయి. వారిద్దరితో మాట్లాడి మంచి పని చేశాను. ఇప్పుడు నా గేమ్‌ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నాలుగైదు నెలలలుగా నెట్స్‌లో శ్రమించాను. ఎట్టకేలకు జట్టులోకి వచ్చాను’’ అని భావోద్వేగానికి లోనైంది. కాగా జూన్ 25న శ్రీలంకతో భారత్ తమ రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. చదవండి: India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్‌తో భారత్ టీ 20 సిరీస్.. ఇరు జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు! IND vs LEI: రోహిత్ శర్మకు ఏమైంది..? అక్కడ కూడా తీరు మారలేదు..! A vital knock 👍 Last-over blitz 💥 Sensational catch 🙌 Post-match conversations with @JemiRodrigues and @Deepti_Sharma06 as they discuss it all after #TeamIndia's win in the first #SLvIND T20I. 👏 🎥 pic.twitter.com/7SW9t6JJOs — BCCI Women (@BCCIWomen) June 24, 2022 -
చరిత్ర సృష్టించేందుకు మరో 45 పరుగుల దూరంలో ఉన్న టీమిండియా క్రికెటర్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టీ20ల్లో ఓ భారీ రికార్డును తన పేరిట లిఖించుకునేందుకు అత్యంత సమీపంలో ఉంది. శ్రీలంకతో రేపటి నుంచి (జూన్ 23) ప్రారంభంకాబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో హర్మన్ మరో 45 పరుగులు సాధిస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనుంది. 121 టీ20ల్లో 103 స్ట్రయిక్ రేట్‌తో 2319 పరుగులు చేసిన హర్మన్ శ్రీలంకతో సిరీస్‌లో మరో 45 పరుగులు చేస్తే టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక టీ20 పరుగుల రికార్డును (2364) అధిగమిస్తుంది. మిథాలీ రాజ్ 89 మ్యాచ్‌ల్లో 17 అర్ధ సెంచరీల సాయంతో 37.52 సగటున 2364 పరుగులు సాధించగా.. హర్మన 121 టీ20ల్లో సెంచరీ, 6 అర్ధ సెంచరీల సాయంతో 26.35 సగటున పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే, భారత మహిళా జట్టు శ్రీలంక పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే. జూన్ 23, 25, 27 తేదీల్లో డంబుల్లా వేదికగా మొత్తం టీ20లు జరుగనుండగా.. జులై 1, 4, 7 తేదీల్లో పల్లెకెలె వేదికగా వన్డే సిరీస్ జరుగనుంది. చదవండి: మిథాలీరాజ్ రిటైర్మెంట్.. కొత్త కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ -
IND VS SL: పింక్‌బాల్ టెస్ట్‌పై ఐసీసీ తీవ్ర అసంతృప్తి
భారత్-శ్రీలంక జట్ల మధ్య ఇటీవలే బెంగుళూరులో జరిగిన డే అండ్ నైట్ టెస్ట్ (పింక్ బాల్ టెస్ట్)పై ఐసీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్ కోసం వినియోగించిన పిచ్‌పై ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ పెదవి విరిచాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్‌కు బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. చర్యల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియంకు ఓ డీమెరిట్ పాయింట్ ఇచ్చాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం, ఓ వేదిక 5 డీమెరిట్ పాయింట్లు పొందితే, సంవత్సరం పాటు అక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించకుండా నిషేధిస్తారు. కాగా, రిఫరీ జవగల్ శ్రీనాథ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సొంత మైదానం కావడం విశేషం. ఇదిలా ఉంటే, పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా 3 రోజుల్లోనే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి రోజు నుంచే విపరీతంగా టర్న్ అవుతూ బ్యాటర్లను తెగ ఇబ్బంది పెట్టింది. తొలి రోజు ఆటలో రికార్డు స్థాయిలో 16 వికెట్లు పతనమయ్యాయి. అయితే, భారత బ్యాటర్లు, ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలతో టీమిండియాకు 238 పరుగుల భారీ విజయాన్నందించాడు. లంక రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కరుణరత్నే సూపర్ శతకంతో చెలరేగినప్పటికీ, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఇరు జట్లలోని స్పిన్నర్లు ఏకంగా 26 వికెట్లు పడగొట్టగా, టీమిండియా పేసు గుర్రం బుమ్రా నిర్జీవమైన పిచ్‌పై 8 వికెట్లతో (తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు) చెలరేగాడు. చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్.. అరుదైన ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు CHAMPIONS #TeamIndia @Paytm #INDvSL pic.twitter.com/GhLlAl1H0W — BCCI (@BCCI) March 14, 2022 -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. ప్రపంచంలో తొలి బౌలర్‌గా!
టీమిండియా స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సాధించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వంద వికెట్టు తీసిన తొలి బౌలర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో 6 వికెట్లు పడగొట్టడంతో అశ్విన్ ఈ ఘనతను సాధించాడు. గత డబ్ల్యూటీసీ సైకిల్లో 71 వికెట్ల సాధించిన అశ్విన్.. డబ్ల్యూటీసీ 2021-23లో 29 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 100 వికెట్లు సాధించాడు. అదే విధంగా అశ్విన్ తర్వాత ఈ జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 20 టెస్టులలో 93 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో అశ్విన్ ఆరో స్థానంలో ఉన్నాడు. 40 వికెట్లతో జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక ఇదే మ్యాచ్‌లో కపిల్ దేవ్ తో పాటు డేల్ స్టెయిన్ (439 వికెట్లు) రికార్డులను కూడా అశ్విన్ బద్దలు కొట్టాడు. శ్రీలంక బ్యాటర్ ధనంజయ డిసిల్వాను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ టెస్ట్‌ల్లో 440వ వికెట్‌ను పడగొట్టాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన 8వ బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. చదవండి: IPL 2022: హార్దిక్‌కు ఫిట్నెస్ టెస్ట్.. ఐపీఎల్‌కు దూరం కానున్నాడా! -
Ind Vs Sl Test Series: లంకపై విజయఢంకా
11–0 ఇదీ రోహిత్ లెక్క! ఈ ‘హిట్‌మ్యాన్’ పూర్తిస్థాయి జట్టు పగ్గాలు చేపట్టాక... స్వదేశంలో ఇద్దరు ప్రత్యర్థులతో ఆడిన మూడు ఫార్మాట్లలోనూ భారత్ వైట్‌వాష్ చేసింది. వెస్టిండీస్‌తో మూడేసి చొప్పున టి20, వన్డేలు... తర్వాత శ్రీలంకతో మూడు టి20 పోటీలు, ఇప్పుడు రెండు సంప్రదాయ టెస్టులు అన్నింటా భారత్‌దే జయం. పాపం కరీబియన్, లంక జట్లు కనీస విజయం లేక ‘జీరో’లతో ఇంటిబాట పట్టాయి. రెండో రోజే టెస్టులో విజయానికి బాటలు వేసుకున్న భారత్ సోమవారం రెండో సెషన్లోనే లంక ఆటను ముగించడంలో సఫలమైంది. కెప్టెన్ కరుణరత్నే శతకం మినహా లంక ఈ పర్యటనలో చెప్పుకునేందుకు ఏమీ లేక వెనుదిరిగింది. బెంగళూరు: టీమిండియా బౌలింగ్ ఉచ్చులో చిక్కుకున్న శ్రీలంక మూడో రోజు రెండు సెషన్లయినా పూర్తిగా ఆడలేకపోయింది. డేనైట్ టెస్టులో భారత్ 238 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. భారత బ్యాటర్లలాగే బౌలర్లూ శ్రీలంక భరతం పట్టారు. 3 వికెట్లు తీసిన స్టార్ సీమర్ బుమ్రా ఈ టెస్టులో మొత్తం 8 వికెట్లను పడేశాడు. స్పిన్నర్లు అశ్విన్ (4/55), అక్షర్ పటేల్ (2/37) లంక బ్యాటర్స్‌కు ఏమాత్రం అవకాశమివ్వకుండా తిప్పేశారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో వంద పైచిలుకు పరుగులకే ఆపసోపాలు పడిన లంక... కెప్టెన్ దిముత్ కరుణరత్నే (174 బంతుల్లో 107; 15 ఫోర్లు) వీరోచిత సెంచరీ పుణ్యమాని రెండో ఇన్నింగ్స్‌లో 200 పైచిలుకు పరుగులు చేయడమే ఆ జట్టుకు ఊరట. శ్రేయస్ అయ్యర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కగా... 120.12 స్ట్రైక్‌రేట్‌తో సిరీస్‌లో 185 పరుగులు చేసిన రిషభ్ పంత్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ మూడోరోజు 447 పరుగుల లక్ష్యం ఛేదించేందుకు 28/1 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 59.3 ఓవర్లలో 208 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్, కెప్టెన్ కరుణరత్నే... ఇతనితో పాటు ఓవర్‌నైట్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (60 బంతుల్లో 54; 8 ఫోర్లు) ఆడినంత వరకే ఆట కనిపించింది. వీళ్లిద్దరి బౌండరీలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మెండిస్ వన్డేలాగే ధాటైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ కంటే ముందుగా 57 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇద్దరూ ఉన్నంతసేపు 12 ఓవర్ల పాటు బౌండరీలు, పరుగులతో స్కోరుబోర్డు కదిలింది. ఈ జోడీ రెండో వికెట్‌కు 97 పరుగులు జతచేసింది. ఎప్పుడైతే జట్టు స్కోరు 97 వద్ద మెండిస్‌ను అశ్విన్ స్టంపౌట్ చేశాడో 9 పరుగుల వ్యవధిలోనే 3 కీలక వికెట్లు పడ్డాయి. మాథ్యూస్ (1)ను జడేజా బౌల్డ్ చేయగా, ధనంజయ డిసిల్వా (4)ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. డిక్వెలా (12) విఫలమయ్యాడు. మరో వైపు కరుణరత్నే 92 బంతుల్లో (6 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తయింది మరో వికెట్ పడకుండా తొలిసెషన్ 151/4 స్కోరు వద్ద ముగిసింది. రెండో సెషన్ మొదలైన కాసేపటికే డిక్వెలా, అనంతరం అసలంక(5) అక్షర్ పటేల్ ఉచ్చులో పడ్డారు. 166 బంతుల్లో సెంచరీ (14 ఫోర్లు) పూర్తి చేసుకున్న కరుణరత్నే అవుటయ్యాక 4 పరుగుల వ్యవధిలోనే లంక ఆలౌటైంది. స్కోరు వివరాలు భారత్ తొలిఇన్నింగ్స్ 252; శ్రీలంక తొలిఇన్నింగ్స్ 109; భారత్ రెండో ఇన్నింగ్స్: 303/9 డిక్లేర్డ్; శ్రీలంక రెండో ఇన్నింగ్స్: తిరిమన్నె (ఎల్బీ) (బి) బుమ్రా 0; కరుణరత్నే (బి) బుమ్రా 107; మెండిస్ (స్టంప్డ్) పంత్ (బి) అశ్విన్ 54; మాథ్యూస్ (బి) జడేజా 1; ధనంజయ (సి) విహారి (బి) అశ్విన్ 4; డిక్వెలా (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 12; అసలంక (సి) రోహిత్ (బి) అక్షర్ 5; ఎంబుల్డెనియా (ఎల్బీ) (బి) అశ్విన్ 2; లక్మల్ (బి) బుమ్రా 1; ఫెర్నాండో (సి) షమీ (బి) అశ్విన్ 2; జయవిక్రమ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (59.3 ఓవర్లలో ఆలౌట్) 208. వికెట్ల పతనం: 1–0, 2–97, 3–98, 4–105, 5–160, 6–180, 7–204, 8–206, 9–208, 10–208. బౌలింగ్: బుమ్రా 9–4–23–3, షమీ 6–0–26–0, అశ్విన్ 19.3–3–55–4, జడేజా 14–2–48–1, అక్షర్ పటేల్ 11–1–37–2. 442: టెస్టుల్లో అశ్విన్ వికెట్ల సంఖ్య. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన అతను...దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ (439)ను అధిగమించి ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి చేరుకున్నాడు. -
India vs Sri Lanka 2nd Test : శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా
-
చరిత్ర సృష్టించిన రోహిత్.. అరుదైన ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు
Rohit Sharma: శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ (2-0) చేయడం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా అరంగేట్రం సిరీస్‌ల్లోనే (మూడు ఫార్మాట్లు) క్లీన్ స్వీప్ విజయాలు సాధించిన తొలి సారథిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.కోహ్లి నుంచి ఫుల్ టైమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వన్డే (3-0), టీ20 సిరీస్ (3-0)ల్లో వైట్‌వాష్ చేసిన రోహిత్.. తాజాగా శ్రీలంకను టెస్ట్ సిరీస్‌లో 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం సిరీస్‌ల్లో క్లీన్ స్వీప్ విజయాలు సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. Rohit Sharma Created History As Captain Only Captain in the History Of Cricket to have Won his First Series in all three formats by Cleansweep as full Time Captain. Well done, Captain Ro. pic.twitter.com/App7UuFLLw — CricketMAN2 (@ImTanujSingh) March 14, 2022 కాగా, బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు మొహాలీలో జరిగిన తొలి టెస్ట్‌లోనూ లంకపై భారీ విజయం (ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో) సాధించిన రోహిత్ సేన.. టెస్ట్ సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. ఈ భారత పర్యటనలో శ్రీలంక ఒక్క మ్యాచ్ కూడా గెలుపొందలేక రిక్త హస్తాలతో స్వదేశానికి తిరుగు పయనమైంది. రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్ధసెంచరీలతో రాణించిన శ్రేయస్ అయ్యర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. సిరీస్ ఆధ్యంతం రాణించిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లభించింది. Since @ImRo45 became full time Captain: 3-0 vs NZ (T20I) 3-0 vs WI (ODI) 3-0 vs WI (T20I) 3-0 vs SL (T20I) 2-0 vs SL (Tests) #INDvSL pic.twitter.com/ojREzqlA6M — Wasim Jaffer (@WasimJaffer14) March 14, 2022 CHAMPIONS #TeamIndia @Paytm #INDvSL pic.twitter.com/GhLlAl1H0W — BCCI (@BCCI) March 14, 2022 Rohit Sharma as Indian Captain 1st ODI Series - Won 1st T20I Series - Won 1st Test Series - Won*#INDvSL — CricBeat (@Cric_beat) March 14, 2022 రెండో టెస్ట్ సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్ : 252 ఆలౌట్ (శ్రేయస్ అయ్యర్ 92, జయవిక్రమ 3/81) శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 109 ఆలౌట్ ( మాథ్యూస్ 43, బుమ్రా 5/24) భారత్ రెండో ఇన్నింగ్స్ : 303/9 డిక్లేర్ ( శ్రేయస్ అయ్యర్ 67, జయవిక్రమ 4/78) శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 208 (కరుణరత్నే 107, అశ్విన్ 4/55) చదవండి: టెస్ట్ క్రికెట్లో టీమిండియా తిరుగులేని రికార్డు.. ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా..! Spirit of Cricket at its best as #TeamIndia congratulate Suranga Lakmal who played his last international match 🤜🤛 #SpiritOfCricket | #INDvSL | @Paytm pic.twitter.com/aa17CK5hqv — BCCI (@BCCI) March 14, 2022 -
టెస్ట్ క్రికెట్లో టీమిండియా తిరుగులేని రికార్డు.. ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా..!
టెస్ట్ క్రికెట్లో టీమిండియా తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. స్వదేశంలో వరుసగా 15 సిరీస్‌లు గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర పుటల్లో నిలిచింది. సోమవారం (మార్చి 14) శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో (పింక్ బాల్ టెస్ట్) గెలుపొందడం ద్వారా టీమిండియా స్వదేశంలో వరుసగా 15వ టెస్ట్ సిరీస్ విజయం సాధించి, ఇదివరకే తమ పేరటి ఉన్న రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. టీమిండియా చివరిసారిగా 2012 నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇంగ్లండ్‌తో (స్వదేశంలో) జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఓడిపోయింది. నాడు మహేంద్ర సింగ్ ధోని జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పటి నుంచి భారత జట్టు స్వదేశంలో తిరుగులేని అజేయ జట్టుగా కొనసాగుతుంది. India's 15th consecutive series victory at home since losing the series to England in Dec 2012. No other home side has won more than 10 consecutive home series. #IndvSL #IndvsSL#DaynightTestmatch#PinkballTest — Mohandas Menon (@mohanstatsman) March 14, 2022 టీమిండియా తర్వాత స్వదేశంలో అత్యధిక వరుస టెస్ట్ సిరీస్‌లు గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా ఉంది. కంగారూ జట్టు స్వదేశంలో వరుసగా 10 టెస్ట్ సిరీస్‌ల్లో విజయం సాధించింది. ఆసీస్ రెండుసార్లు (నవంబర్ 1994-నవంబర్ 2000 మధ్యలో ఓసారి, జులై 2004-నవంబర్ 2008 మధ్యలో మరోసారి) ఈ ఘనత సాధించడం విశేషం. కాగా, బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో లంకను చిత్తు చేసి 2 మ్యాచ్‌ల సిరీస్‌ని 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లోనూ లంకపై భారీ విజయం (ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో) సాధించిన టీమిండియా.. టెస్ట్ సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. చదవండి: శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం -
శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్టులో 238 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తేడాతో భారత్ కైవసం చేసుకుంది. 447 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ కరుణరత్నే సెంచరీతో మెరిశాడు. కరుణరత్నే 174 బంతుల్లో 107 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. .బుమ్రా మూడు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 252 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ 92 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అదే విధంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగలకే కుప్ప కూలింది. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టి శ్రీలంకను దెబ్బ తీశాడు. ఇక 143 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన 303-9 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ అయ్యర్ 67 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఇక ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన పంత్‌కు మ్యాన్ ఆఫ్‌ది సిరీస్అవార్డు దక్కగా, అయ్యర్ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. కాగా రోహిత్ శర్మకు కెప్టెన్‌గా తొలి టెస్టు విజయం. చదవండి: Ind VS Sl 2nd Test: ఛ.. నాకే ఎందుకిలా జరుగుతోంది? కోహ్లి వీడియో వైరల్ -
కోహ్లితో వ్యవహారం ఇట్లుంటది.. నలుగురు అభిమానుల అరెస్ట్
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లితో సెల్ఫీ దిగేందుకు మైదానంలోకి చొచ్చుకొచ్చిన నలుగురు యువకులు కటకటపాలయ్యారు. భద్రతా నిబంధనలను అతిక్రమించినందుకు గాను వారిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురిలో ముగ్గురు బెంగళూరు వాసులు కాగా, ఒకరు కల్బుర్గి ప్రాంతానికి చెందిన కుర్రాడు. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు ఆటలో ఈ నలుగురు కుర్రాళ్లు సెక్యురిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు కోహ్లితో సెల్ఫీలు దిగగా.. మరో ఇద్దరిని సెక్యూరిటీ సిబ్బంది లాక్కెళ్లారు. Fans entered in the ground to take selfie with #viratkohli #Virat #Kohli #IndvsSL pic.twitter.com/jygYxZhKRR — TRENDING CRIC ZONE (@rishabhgautam81) March 13, 2022 కాగా, లంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా విజయపు అంచుల్లో నిలిచింది. టీమిండియా నిర్ధేశించిన 447 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక మూడో రోజు ఆట ప్రారంభం నుండే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి, వరుసగా రెండో టెస్ట్‌లో ఓటమికి సిద్ధమైంది. కరుణరత్నే(107) శతకంతో ఒంటరిపోరాటం చేయగా, మిగిలిన వారంతా ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరారు. లంక ఇన్నింగ్స్‌లో కరుణరత్నే, కుశాల్ మెండిస్ (54), డిక్వెల్లా (12) మినహా మిగతా ఆటగాళ్లెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్ : 252 ఆలౌట్ (శ్రేయస్ అయ్యర్ 92, జయవిక్రమ 3/81) శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 109 ఆలౌట్ ( మాథ్యూస్ 43, బుమ్రా 5/24) భారత్ రెండో ఇన్నింగ్స్ : 303/9 డిక్లేర్ ( శ్రేయస్ అయ్యర్ 67, జయవిక్రమ 4/78) శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 208/9 (కరుణరత్నే 107, బుమ్రా 3/23) చదవండి: Ind VS Sl 2nd Test: అతడంటే ‘పిచ్చి’.. మైదానంలోకి దూసుకువచ్చి పోలీసులనే.. -
మరో మైలురాయిని అధిగమించిన అశ్విన్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 8వ బౌలర్‌గా..!
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో మైలురాయిని అధిగమించాడు. మూడో రోజు ఆటలో లంక బ్యాటర్ ధనంజయ డిసిల్వాను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ టెస్ట్‌ల్లో 440వ వికెట్‌ను పడగొట్టాడు. తద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ (93 టెస్ట్‌ల్లో 439 వికెట్లు)ను అధిగమించాడు. ప్రస్తుతం 86 టెస్ట్‌ల్లో 440 వికెట్లతో కొనసాగుతున్న అశ్విన్.. ఇదే సిరీస్‌లో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ పేస్ దిగ్గజం రిచర్డ్ హ్యాడ్లీ (86 టెస్ట్‌ల్లో 431), శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరాత్ (93 టెస్టులలో 433 వికెట్లు), భారత లెజెండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ (131 టెస్ట్‌ల్లో 434 వికెట్లు)లను కూడా అధిగమించాడు. లంకతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అశ్విన్ ఇప్పటివరకు 10 వికెట్లు (తొలి టెస్ట్‌లో 6, రెండో టెస్ట్‌లో 4) పడగొట్టాడు. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (133 టెస్ట్‌ల్లో 800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా, ఆసీస్ గ్రేట్ స్పిన్నర్ దివంగత షేన్ వార్న్ (145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు), జేమ్స్ అండర్సన్ (169 టెస్ట్‌ల్లో 640 వికెట్లు), భారత దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (132 టెస్ట్‌ల్లో 619 వికెట్లు), ఆసీస్ మాజీ పేసర్ మెక్‌గ్రాత్ (124 మ్యాచ్‌ల్లో 563 వికెట్లు), ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (152 మ్యాచ్‌ల్లో 537 వికెట్లు), విండీస్ మాజీ పేసర్ వాల్ష్ (132 టెస్ట్‌ల్లో 519 వికెట్లు) వరుసగా రెండు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతానికి అశ్విన్ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పింక్ బాల్ టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా సాగుతుంది. సిరీస్‌లో వరుసగా రెండో విజయానికి 5 వికెట్ల దూరంలో ఉంది. 446 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 180 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. కరుణరత్నే (89), చరిత్ అసలంక (5) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో లంక విజయం సాధించాలంటే మరో 267 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: అశ్విన్ ఖాతాలో మరో మైలురాయి.. కపిల్ దేవ్ రికార్డు బద్దలు -
శ్రీలంకపై దుమ్మురేపాడు..‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా అయ్యర్!
టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అయ్యర్ అద్భుత ప్రదర్శన గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కినట్లు ఐసీసీ పేర్కొంది. ఈ సిరీస్‌లో అయ్యర్ హ్యాట్-ట్రిక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ సిరీస్‌లో అయ్యర్ 204 పరుగులు చేశాడు. శ్రీలంకపై అద్భుత ప్రదర్శనతో అయ్యర్ ఐసీసీ టీ20 ర్యాకింగ్స్లో ఏకంగా 27 స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకున్నాడు. ఇక శ్రీలంకతో జరగుతోన్న టెస్టుల్లోను అయ్యర్ అద్భుతంగా రాణిస్తోన్నాడు. బెంగళూరు వేదికగా జరుగుతోన్న రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోను అయ్యర్ ఆర్ధసెంచరీలు సాధించాడు. మరో వైపు ఫిబ్రవరి నెల మహిళల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమీలియా కేర్ ఎంపికైంది. గత నెలలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కేర్ అద్భుతంగా రాణించింది. చదవండి: IPL 2022: ధోని.. నా ఆలోచనలకు పూర్తి భిన్నంగా చేసేవాడు.. నేనేమీ కోహ్లిని కాదుగా: డు ప్లెసిస్ -
పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
ఛ.. నాకే ఎందుకిలా జరుగుతోంది? కోహ్లి వీడియో వైరల్
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న పింక్‌బాల్ టెస్టులో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి నిరాశ పరిచాడు . రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 36 పరుగులు మాత్రమే చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన కోహ్లి.. దనుంజయ డిసిల్వా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగాడు. నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లోనైనా అద్భుతంగా ఆడాలని భావించిన కోహ్లికి ఆదృష్టం కలిసి రాలేదు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా కోహ్లి వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇన్నింగ్స్ 36 ఓవర్ వేసిన జయవిక్రమ బౌలింగ్‌లో.. నాలుగో బంతికి డిఫెన్స్ కోహ్లి పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి మిస్స్ అయ్యి నేరుగా కోహ్లి ప్యాడ్‌కు తగిలింది. దీంతో లంక ఫీల్డర్లు ఎల్బీగా అప్పీల్ చేశారు. వెంటనే ఆన్-ఫీల్డ్ అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు. దీంతో కోహ్లి తీవ్రంగా నిరాశ చెందాడు. అయితే తన ఔట్‌పై కోహ్లి కోపంగా రియాక్ట్ అవుతాడని అందరూ భావించారు. కానీ దానికి భిన్నంగా అతడు చిన్నగా నవ్వుతూ పెవిలియన్‌కు చేరాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: Ind VS Sl 2nd Test: అతడంటే ‘పిచ్చి’.. ప్లీజ్ ఒక సెల్ఫీ.. మైదానంలోకి దూసుకువచ్చి పోలీసులను పరుగులు పెట్టించారు! -
అనుకున్నదే అయ్యింది.. కోహ్లి అభిమానుల గుండె బద్దలైంది
Virat Kohli: విరాట్ కోహ్లి విషయంలో అతని ఫ్యాన్స్ భయమే నిజమైంది. ఇన్నాళ్లు తమ ఆరాధ్య క్రికెటర్ బ్యాటింగ్ సగటు అన్ని ఫార్మాట్లలో 50కి పైగా ఉందని కాలరెగరేసుకు తిరిగిన టీమిండియా మాజీ కెప్టెన్ అభిమానులకు ఇకపై అలా చెప్పుకుని తిరిగే ఛాన్స్ లేకుండా పోయింది. బెంగళూరు వేదకగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో కోహ్లి రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 36 పరుగులు (23, 13) మాత్రమే చేయడంతో ఐదేళ్ల తర్వాత తొలిసారి అతని బ్యాటింగ్ సగటు 50 దిగువకు పడిపోయింది. దీంతో కోహ్లి ఫ్యాన్స్ గుండె బద్దలైనంత పనైంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి కనీసం 43 పరుగులు (రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి) చేసి ఉంటే అతని సగటు 50కిపైనే కొనసాగేది. అంతకుముందు 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సగటు 50 నుంచి 49.55కి దిగజారింది. ప్రస్తుతం అదే ప్రత్యర్ధితో జరిగిన మ్యాచ్‌లోనే కోహ్లి సగటు మరోసారి 50 దిగువకు (49.95) పడిపోయింది. ప్రస్తుతం కోహ్లి 101 టెస్ట్‌ల్లో 49.55, 260 వన్డేల్లో 58.07, 97 టీ20ల్లో 51.50 సగటుతో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే, బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 143 పరుగుల ఆధిక్యం కలుపుకుని టీమిండియా లంక ముందు 447 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేయగా, శ్రీలంక 109 పరుగులకు ఆలౌటైంది. చదవండి: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు -
శ్రీలంక క్రికెట్‌కు మరో షాకింగ్ న్యూస్
Suranga Lakmal Retirement: వరుస అపజయాలతో సతమతమవుతున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ సురంగ లక్మల్ (35).. బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడు. భారత్‌తో సిరీస్ తనకు ఆఖరిదని ముందే ప్రకటించిన లక్మల్.. తన అంతర్జాతీయ కెరీర్లో చివరి బంతిని వేసేశాడు. పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు ఆటలో లక్మల్ చివరి బంతిని టీమిండియా బ్యాటర్ రవీంద్ర జడేజా ఎదుర్కొన్నాడు. లక్మల్ తన ఆఖరి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా దక్కలేదు. కాగా, కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసం జట్టు నుంచి తప్పుకుంటున్నాని, రిటైర్ అవడానికి ఇదే సరైన సమయమని లక్మల్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీలంక తరఫున 70 టెస్ట్‌ల్లో 171 వికెట్లు పడగొట్టిన లక్మల్.. 86 వన్డేల్లో 109 వికెట్లు, 11 టీ20ల్లో 8 వికెట్లు తీశాడు. టెస్ట్‌ల్లో అతను నాలుగు సార్లు 5 వికెట్లు ఘనతను సాధించాడు. 2018 కాలంలో టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన లక్మల్.. సౌతాఫ్రికాను వారి సొంతగడ్డపై 2-0తో ఓడించి చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే, బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 143 పరుగుల ఆధిక్యం కలుపుకుని టీమిండియా లంక ముందు 447 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో శ్రేయస్ (67), పంత్ (50) హాఫ్ సెంచరీలతో చెలరేగగా, లంక బౌలర్లలో జయవిక్రమ 4, ఎంబుల్దెనియా 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేయగా, శ్రీలంక 109 పరుగులకు ఆలౌటైంది. చదవండి: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు -
శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు
Shreyas Iyer: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు వచ్చి పడింది. పింక్ బాల్‌తో ఆడే డే అండ్ నైట్ టెస్ట్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో (ఒకే టెస్ట్) 50కి పైగా పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో అయ్యర్ తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 64 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. అయ్యర్‌కు ముందు ఈ ఘనతను డారెన్ బ్రావో (87, 116) 2016లో పాక్‌పై, స్టీవ్ స్మిత్ (130, 63) 2016లో పాక్‌పై, మార్నస్ లబూషేన్ రెండు సందర్భాల్లో (2019లో న్యూజిలాండ్‌పై 143, 50.. 2021లో ఇంగ్లండ్‌పై 103, 51) సాధించారు. కాగా, బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. 64 ఓవర్లు ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి ఓవరాల్‌గా 414 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపును ఆపడం దాదాపుగా అసాధ్యం. తొలి రోజు ఆటలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఇదే స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఇన్నింగ్స్ ప్రారంభమైన ఐదు ఓవర్లలోనే మిగిలిన 4 వికెట్లు కోల్పోయి 109 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా (5/24) ఐదేయగా, అశ్విన్ (2/30), షమీ (2/18), అక్షర్ (1/21)లు రాణించారు. చదవండి: టెస్ట్‌ల్లో రిషబ్ పంత్ ఫాస్టెస్ట్ ఫిఫ్టి.. 40 ఏళ్ల కపిల్ రికార్డు బ్రేక్ -
టెస్ట్‌ల్లో రిషబ్ పంత్ ఫాస్టెస్ట్ ఫిఫ్టి.. 40 ఏళ్ల కపిల్ రికార్డు బ్రేక్
Rishabh Pant Scores Fastest 50 For India In Test Cricket: టీమిండియా వికెట్‌కీపర్ రిషభ్ పంత్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టి కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శ్రీలంకతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో పంత్ కేవలం 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు కపిల్ దేవ్ (1982లో పాక్‌పై 30 బంతుల్లో) పేరిట ఉండేది. తాజాగా పంత్ కపిల్ రికార్డును బద్దలు కొట్టాడు. గతేడాది టీమిండియా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ కూడా పంత్ తరహాలో ధనాధన్ ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ 31 బంతుల్లో ఫిఫ్టి బాదాడు. ఇక 2008లో సెహ్వాగ్ ఇంగ్లండ్‌పై 32 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. 47 ఓవర్లు ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి ఓవరాల్‌గా 342 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపును ఆపడం దాదాపుగా అసాధ్యం. తొలి రోజు ఆటలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఇదే స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఇన్నింగ్స్ ప్రారంభమైన ఐదు ఓవర్లలోనే మిగిలిన 4 వికెట్లు కోల్పోయి 109 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా (5/24) ఐదేయగా, అశ్విన్ (2/30), షమీ (2/18), అక్షర్ (1/21)లు రాణించారు. చదవండి: IND VS SL 2nd Test Day 2: ఐదేసిన బుమ్రా.. కుప్పకూలిన శ్రీలంక -
IND VS SL 2nd Test Day 2: ఐదేసిన బుమ్రా.. కుప్పకూలిన శ్రీలంక
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో (పింక్ బాల్ టెస్ట్) శ్రీలంక జట్టు ఓటమి దిశగా సాగుతుంది. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (5/24) ఐదేయడంతో లంకేయులు తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలారు. ఓవర్ నైట్ స్కోరు 86/6 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఇన్నింగ్స్ ప్రారంభమైన ఐదంటే ఐదు ఓవర్లలోనే మిగిలిన 4 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. బుమ్రాకు జతగా అశ్విన్ (2/30), షమీ (2/18), అక్షర్ (1/21)లు రాణించడంతో లంక తొలి రోజు స్కోర్‌కు మరో 23 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన వికెట్లు కోల్పోయింది. ఫలితంగా టీమిండియాకు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కెరీర్లో 29వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బుమ్రా 8వ సారి ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగగా, లంక ఇన్నింగ్స్‌లో ఏంజలో మాథ్యూస్ (43), డిక్వెల్లా (21), ధనంజయ డిసిల్వా (10)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే మయాంక్ అగర్వాల్ (22) వికెట్‌ను కోల్పోయింది. 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసి, ఓవరాల్‌గా 186 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రోహిత్ శర్మ (20), హనుమ విహారి క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: ప్రేక్షకుడి ముక్కు పగలగొట్టిన రోహిత్ శర్మ.. ఆస్పత్రిలో చేరిక! -
ప్రేక్షకుడి ముక్కు పగలగొట్టిన రోహిత్ శర్మ.. ఆస్పత్రిలో చేరిక!
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఓ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన ఓ సిక్సర్.. స్టాండ్స్‌లో కూర్చోని మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుడి ముక్కుకు బలంగా తాకింది. దీంతో అతడికి తీవ్ర గాయమైంది. భారత ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో విశ్వ ఫెర్నాండో వేసిన షార్ట్ పిచ్ బాల్‌కు రోహిత్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో మ్యాచ్ వీక్షిస్తున్న అభిమాని ముక్కుకు బంతి బలంగా తగిలింది. దీంతో అతడికి ముక్కు నుంచి రక్తం కారింది. అయితే వెంటనే అతడిని దగ్గరలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేయగా.. నాసికా ఎముక ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయితే చికిత్స అనంతరం అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 15 పరుగుల మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి 30 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులే చేయగలిగింది. కాగా భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (92) పోరాటంతో భారత్ ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. చదవండి: Ind Vs SL 2nd Test: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డు.. సచిన్, సెహ్వాగ్ సరసన! -
IND VS SL 2nd Test: విజయానికి 9 వికెట్ల దూరంలో..
-
"డియర్ విరాట్! నువ్వు సెంచరీ చేసినా, చేయకపోయినా.. నువ్వే నా హీరోవి"
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా కింగ్ కోహ్లికి అభిమానులు ఉన్నారు. అంతే కాకుండా దాయాది దేశమైన పాకిస్తాన్లో కూడా కోహ్లికు వీరాభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్- ఆస్ట్రేలియా రెండో టెస్టు సందర్భంగా కోహ్లిపై అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ అభిమాని ప్లకార్డు పట్టుకుని మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్లకార్డులో ఏముందంటే.. "డియర్ విరాట్! నువ్వు సెంచరీ చేసినా, చేయకపోయినా, నువ్వే నా హీరోవి" అంటూ పేర్కొన్నాడు. ఇక దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా పాక్- ఆస్ట్రేలియా తొలి టెస్టులో కూడా ఇటువంటి పోస్టర్లు కనిపించాయి. కోహ్లి తన 71వ సెంచరీను పాకిస్తాన్లో సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కాగా విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించి రెండేళ్లు దాటింది. 2019లో చివర సారిగా బంగ్లాదేశ్‌పై కోహ్లి సెంచరీ సాధించాడు. ఇక శ్రీలంకతో జరగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోను కేవలం 23 పరుగులు మాత్రమే చేసి కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. చదవండి: Ind Vs SL 2nd Test: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డు.. సచిన్, సెహ్వాగ్ సరసన! A fan at the National Stadium Karachi showing some support for Virat Kohli #Cricket pic.twitter.com/vrZv2VCyRk — Saj Sadiq (@SajSadiqCricket) March 12, 2022 -
శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డు.. సచిన్, సెహ్వాగ్ సరసన!
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగుతోన్న పింక్ బాల్ టెస్టులో తొలి రోజు టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆటముగిసే సమయానికి 30 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులే చేయగలిగింది. అంతకు ముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా 252 పరుగులు చేయడంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ 98 బంతుల్లో 92 పరుగులు చేశాడు. పిచ్ బౌలర్లకు అనుకూలించడంతో తక్కువ వ్యవధిలో భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో అయ్యర్ అద్భత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. స్పిన్నర్లపై అయ్యర్ విరుచుకు పడ్డాడు. ధనంజయ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లతో అయ్యర్ 54 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 92 పరుగులు చేసి సెంచరీ చేరువగా ఉన్న సమయంలో అయ్యర్ స్టంపౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో అయ్యర్ ఓ అవాంఛిత రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. టెస్టుల్లో 90 పరుగులు దాటాక స్టంపౌటైన నాలుగో భారత ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. దీంతో భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ,వీరేంద్ర సెహ్వాగ్, దిలీప్ వెంగ్‌సర్కార్ సరసన చేరాడు. 2001లో బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 90 పరుగులు చేసిన సచిన్.. నాసిర్ హుస్సేన్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు.. ఇక 2010లో కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో సెహ్వాగ్ 99 పరుగుల వద్ద స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అదే విధంగా 90 పరుగులు దాటాక స్టంపౌటైన తొలి భారత క్రికెటర్‌గా దిలీప్ వెంగ్‌సర్కార్ నిలిచాడు. 1987లో పాకిస్తాన్‌పై 96 పరుగుల వద్ద వెంగ్‌సర్కార్ స్టంపౌటయ్యాడు. చదవండి: Ind Vs SL 2nd Test: చెలరేగిన శ్రేయస్ అయ్యర్.. తొలి రోజు టీమిండియాదే! -
Ind Vs SL 2nd Test: చెలరేగిన శ్రేయస్ అయ్యర్.. తొలి రోజు టీమిండియాదే!
డే–నైట్ టెస్టు మ్యాచ్... గులాబీ బంతి అనూహ్యంగా టర్న్ అవుతూ, అంచనాలకు మించి బౌన్స్ అవుతూ ముల్లులా గుచ్చుకుంటోంది. ఫలితంగా 126 పరుగులకే భారత టాప్–5 పెవిలియన్‌కు... ఇలాంటి సమయంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆట దిశను మార్చాడు. శతకం సాధించకపోయినా ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ను జట్టు పరువు నిలిపాడు. ఆపై రాత్రి వాతావరణంలో మన పేసర్లు బంతితో ‘స్వింగాట’ ఆడించారు. దాంతో 30 ఓవర్లకే శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి అప్పుడే మ్యాచ్‌లో చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. పరిస్థితి చూస్తే ఈ మ్యాచ్ కూడా మూడు రోజుల్లోపే ముగిసేలా ఉంది! బెంగళూరు: శ్రీలంకతో రెండో టెస్టులో భారత్‌కు తొలి రోజే పట్టు చిక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 59.1 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (98 బంతుల్లో 92; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సత్తా చాటగా, రిషభ్ పంత్ (26 బంతుల్లో 39; 7 ఫోర్లు), హనుమ విహారి (81 బంతుల్లో 31; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం లంక ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులే చేయగలిగింది. మాథ్యూస్ (85 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం ఆ జట్టు మరో 166 పరుగులు వెనుకబడి ఉంది. పంత్ ఎదురుదాడి... పిచ్ అనూహ్య రీతిలో స్పందించడంతో భారత బ్యాటర్లు కూడా తడబడ్డారు. ఫలితంగా తక్కువ వ్యవధిలో జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. బౌలర్ ఎల్బీ కోసం అప్పీల్ చేస్తున్న సమయంలో అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి మయాంక్ (4) రనౌట్ కాగా, ఒక్కసారిగా పైకి లేచిన బంతిని ఆడలేక రోహిత్ శర్మ (15) స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. విహారి, విరాట్ కోహ్లి (23) కొద్దిసేపు పట్టుదలగా నిలబడ్డారు. అయితే 47 పరుగుల భాగస్వామ్యం తర్వాత వీరిద్దరు కూడా వరుస ఓవర్లలో వెనుదిరిగారు. ఈ దశలో పంత్ ఎదురుదాడికి దిగాడు. తొలి 7 బంతుల్లోనే 3 ఫోర్లు కొట్టిన అతను టీ విరామం తర్వాత ధనంజయ ఓవర్లో రెండు, జయవిక్రమ ఓవర్లో 3 బౌండరీల చొప్పున బాదాడు. అయితే ఎంబుల్డెనియా బంతికి అతను క్లీన్ బౌల్డ్ కాగా... జడేజా (4), అశ్విన్ (13), అక్షర్ (9) ప్రభావం చూపలేకపోయారు. మరోవైపు నుంచి మాత్రం అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఏ దశలోనూ వెనక్కి తగ్గకుండా ప్రతీ బౌలర్‌పై పైచేసి సాధిస్తూ వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడాడు. ధనంజయ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లతో అయ్యర్ 54 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడి మరో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో అతను సెంచరీకి చేరువయ్యాడు. అయితే ముందుకు దూసుకొచ్చి ఆడే ప్రయత్నంలో స్టంపౌట్ కావడంతో ఆ అవకాశం చేజారింది. టపటపా... ప్రత్యర్థిని కట్టడి చేసిన శ్రీలంకకు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బుమ్రా తన వరుస ఓవర్లలో కుశాల్ మెండిస్ (2), తిరిమన్నె (8)లను అవుట్ చేయడంతో లంక పతనం మొదలైంది. తన మొదటి బంతికే కరుణరత్నే (4)ను క్లీన్ బౌల్డ్ చేసిన షమీ, కొద్ది సేపటికే ధనంజయ (10) పని పట్టాడు. మాథ్యూస్ ఒక్కడే పోరాడే ప్రయత్నం చేసినా చివర్లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా అతని ఆట ముగించడంతో లంక పేలవంగా తొలి రోజును ముగించింది. భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (రనౌట్) 4; రోహిత్ (సి) డిసిల్వా (బి) ఎంబుల్డెనియా 15; విహారి (సి) డిక్వెలా (బి) జయవిక్రమ 31; కోహ్లి (ఎల్బీ) (బి) డిసిల్వా 23; పంత్ (బి) ఎంబుల్డెనియా 39; అయ్యర్ (స్టంప్డ్) డిక్వెలా (బి) జయవిక్రమ 92; జడేజా (సి) తిరిమన్నె (బి) ఎంబుల్డెనియా 4; అశ్విన్ (సి) డిక్వెలా (బి) డిసిల్వా 13; అక్షర్ (బి) లక్మల్ 9; షమీ (సి) డిసిల్వా (బి) జయవిక్రమ 5; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (59.1 ఓవర్లలో ఆలౌట్) 252. వికెట్ల పత నం: 1–10, 2–29, 3–76, 4–86, 5–126, 6– 148, 7–183, 8–215, 9–229, 10–252. బౌ లింగ్: లక్మల్ 8–3–12–1, ఫెర్నాండో 3–0– 18– 0, ఎంబుల్డెనియా 24–2– 94–3, జయ విక్రమ 17.1–3–81–3, ధనంజయ డిసిల్వా 7–1–32–2. శ్రీలంక తొలి ఇన్నింగ్స్: కుశాల్ మెండిస్ (సి) శ్రేయస్ (బి) బుమ్రా 2; కరుణరత్నే (బి) షమీ 4; తిరిమన్నె (సి) శ్రేయస్ (బి) బుమ్రా 8; మాథ్యూస్ (సి) రోహిత్ (బి) బుమ్రా 43; ధనంజయ (ఎల్బీ) (బి) షమీ 10; అసలంక (సి) అశ్విన్ (బి) అక్షర్ 5; డిక్వెలా (నాటౌట్) 13; ఎంబుల్డెనియా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (30 ఓవర్లలో 6 వికెట్లకు) 86. వికెట్ల పతనం: 1–2, 2–14, 3–14, 4–28, 5–50, 6–85. బౌలింగ్: బుమ్రా 7–3–15–3, అశ్విన్ 6–1–16–0, షమీ 6–1–18–2, జడేజా 6–1–15–0, అక్షర్ పటేల్ 5–1–21–1. -
పింక్ బాల్ టెస్ట్‌ల్లో సరికొత్త రికార్డు.. తొలి రోజు ఏకంగా..!
India vs Sri Lanka, pink-ball Test Day 1 highlights: పింక్ బాల్‌తో జరిగే డే అండ్ నైట్ టెస్ట్‌ల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఫార్మాట్లో బెంగళూరు వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆటలో ఏకంగా 16 వికెట్లు నేలకూలాయి. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌ల చరిత్రలో తొలి రోజే ఇన్ని వికెట్లు కూలడం ఇదే ప్రధమం. 2017లో సౌతాఫ్రికా, జింబాబ్వేల మధ్య మ్యాచ్‌లో 13 వికెట్లు, 2018లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్‌లో 13, 2019లో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో 13, 2021 భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌లో 13 వికెట్లు తొలి రోజే పడ్డాయి. ఈ ఐదు సందర్భాల్లో మూడింటిలో టీమిండియా భాగం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్ కాగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (92) ఒంటరి పోరాటం చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. లంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దెనియా, ప్రవీణ్ జయవిక్రమ తలో 3 వికెట్లు, ధనంజయ డిసిల్వా 2, సురంగ లక్మల్ ఓ వికెట్ పడగొట్టారు. మయాంక్ అగర్వాల్ రనౌటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక భారత బౌలర్లు బుమ్రా (3/15), షమీ (2/ 18), అక్షర్ పటేల్ (1/21)ల ధాటికి విలవిలలాడింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఏంజలో మాథ్యూస్ ధాటిగా ఆడి 43 పరుగులు చేయడంతో లంక జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. చదవండి: మాతృదేశంపై సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ అరుదైన ఘనత -
షమీ సూపర్ డెలివరీ.. శ్రీలంక కెప్టెన్‌కు ఫ్యూజ్‌లు ఔట్
బెంగళూరు వేదికగా టీమిండియాతో జరగుతోన్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక బ్యాటర్లు తడుబడుతున్నారు. 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి శ్రీలంక పీకల్లోతు కష్టాలో పడింది. ఇది ఇలా ఉండగా.. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నేను అద్భుతమైన బంతితో మహమ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ 6ఓవర్లో మహమ్మద్ షమీ వేసిన తొలి బంతిని కరుణరత్నే అంచనా వేసే లోపే అది గింగిరాలు తిరుగుతూ వికెట్లపైకి దూసుకుపోయింది. ఆఫ్ స్టంప్ వెలుపల పడిన బంతి టర్న్ అయ్యి నేరుగా వికెట్లు పైకి వచ్చింది. దీంతో బ్యాటర్ ఒక్క సారిగా షాక్ గురయ్యాడు. ఇక నాలుగు పరుగులు చేసిన కరుణరత్నే నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అంతకుమందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (92) ఒంటరి పోరాటం చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (15)తో పాటు విరాట్ కోహ్లి (23), ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (4) మరోసారి నిరాశపరిచారు. లంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దెనియా, ప్రవీణ్ జయవిక్రమ తలో 3 వికెట్లు, ధనంజయ డిసిల్వా 2, సురంగ లక్మల్ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: Ind Vs SL 2nd Test: దటీజ్ అయ్యర్.. బంతి స్టేడియం బయటకు వెళ్లాల్సిందే! Bowled! In his first ball shami you beauty #indvsl 😘😘 pic.twitter.com/XBGdFpsoAW — Cricket Gamee (@cricketgamee62) March 12, 2022 -
దటీజ్ అయ్యర్.. బంతి స్టేడియం బయటకు వెళ్లాల్సిందే!
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగుతోన్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 252 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. మయాంక్ అగర్వాల్(4),రోహిత్(15) పరుగులు మాత్రమే చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి కూడా నిరాశపరిచాడు. కష్టపరిస్ధితుల్లో పడిన జట్టును శ్రేయస్ అయ్యర్ అదుకున్నాడు. అయ్యర్ 92 పరుగులతో ఒంటరి పోరాటం చేయండంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఇది ఇలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో అయ్యర్ తన అర్ధ సెంచరీను భారీ సిక్సర్‌తో పూర్తి చేశాడు. ఆట మొదటి రోజు స్పిన్నర్లపై అయ్యర్ విరుచుకుపడ్డాడు. అయితే ఇన్నింగ్స్ 48 ఓవర్లో ధనంజయ డి సిల్వా వేసిన అఖరి బంతికి శ్రేయస్ అయ్యర్ భారీ షాట్ ఆడగా.. బంతి స్టేడియం బయటకు వెళ్లి పడింది. ఈ సిక్సర్‌తోనే అయ్యర్ తన అర్దసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయ్యర్ సిక్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Ind Vs SL 2nd Test: అయ్యో మా గుండె పగిలింది కోహ్లి! నా పరిస్థితీ అదే ఇక్కడ .. ఏం చెప్పను! pic.twitter.com/objixabHVW — Diving Slip (@SlipDiving) March 12, 2022 -
అయ్యో మా గుండె పగిలింది కోహ్లి! నా పరిస్థితీ అదే ఇక్కడ .. ఏం చెప్పను!
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న పింక్ బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. 48 బంతుల్లో కేవలం 23 పరుగుల మాత్రమే చేసి కోహ్లి పెవిలియన్‌కు చేరాడు. ఇక భారత ఇన్నింగ్స్ 23 ఓవర్ వేసిన ధనంజయ డిసిల్వా బౌలింగ్‌లో.. కోహ్లి డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఒక్క సారిగా టర్న్ అయ్యి బ్యాట్‌కు తగలకుండా అతడి ప్యాడ్‌కు తాకింది. దీంతో లంక ఫీల్డర్లు ఎల్బీగా అప్పీల్ చేశారు. వెంటనే ఆన్-ఫీల్డ్ అంపైర్ వేలు పైకెత్తాడు. కాగా కోహ్లి తను ఔట్‌గా భావించి రివ్యూ అవకాశం ఉన్న తీసుకోలేదు. అయితే ఔటయ్యాక కోహ్లి ముఖం ఒక్క సారిగా మారిపోయింది. బాధపడుతూ కోహ్లి క్రీజులో కొద్ది సేపు టీమిండియా అలా ఉండిపోయాడు. అనంతరం నిరాశగా పెవిలియ్నకు కోహ్లి చేరాడు. కాగా కోహ్లి లూక్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నెటిజన్లు కోహ్లికు మద్దతుగా నిలుస్తోన్నారు. "అయ్యో మా గుండె పగిలింది కోహ్లి.. బంతి అలా టర్న్ అవుతుందని అసలు ఊహించలేదు" అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక భారత తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకి ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(92) తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ అంతగా రాణించలేదు. భారత బ్యాటర్లలో పంత్(39),విహారి(31),కోహ్లి(23) పరుగులు సాధించారు.శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దేనియా, ప్రవీణ్ జయవిక్రమ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ధనంజయ డి సిల్వా రెండు వికెట్లు, లక్మల్ ఒక వికెట్ సాధించాడు. చదవండి: IND VS SL 2nd Test Day 1: శ్రేయస్ ఒంటరి పోరాటం.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ Another heartbreak @imVkohli 🥺💔 The ball literally died after landing. #INDvsSL #ViratKohlihttps://t.co/qI5tLIMA6a pic.twitter.com/5keZcjXG7j — 💫💙Srikanth (@Srikanth_Tweetz) March 12, 2022