prakasam district
-
నల్లమల.. వణ్యప్రాణుల ఖిల్లా
-
ప్రకాశం జిల్లాలో మరోసారి కంపించిన భూమి
ప్రకాశం: ముండ్లమూరు (Mundlamuru)లో తాజాగా, మరోసారి భూప్రకంపనలు (Earthquake) కలకలం సృష్టించాయి. గత డిసెంబర్ నెల మూడు,నాలుగు వారాల్లో ఇదే ముండ్లమూరులో మూడుసార్లు భూకంపించింది. తాజాగా గురువారం మధ్యాహ్నం ఒంటిగంట 43 నిమిషాలకు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో, రెండు నెలల (డిసెంబర్లో మూడు సార్లు,జనవరిలో ఒకసారి) వ్యవధిలో నాలుగు సార్లు భూకంపం సంభవించడంపై ప్రజలు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. -
కూటమిలో కుంపటి.. జనసేన కార్పోరేటర్‌పై టీడీపీ నేతల దాడి
సాక్షి, ప్రకాశం: ఏపీలో కూటమి సర్కార్‌లో నేతల మధ్య కుంపటి రాజుకుంది. తాజాగా జనసేన మహిళా కార్పోరేటర్‌పై టీడీపీ కార్యకర్త దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని కార్పోరేటర్ కామెంట్స్ చేయడం గమనార్హం.వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలో కూటమి నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఒంగోలు నగర 32వ డివిజన్ కార్పొరేటర్‌పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్త తోటకూర కృష్ణమూర్తి.. అర్థరాత్రి జనసేన కార్పోరేటర్ కృష్ణలత దంపతులను మాట్లాడాలని ఇంట్లో నుంచి బయటకు పిలిచారు. అనంతరం, కృష్ణలత దంపతులపై కృష్ణమూర్తి సహా ఆరో ఆరుగురు టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ క్రమంలో వారికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం.అనంతరం, కృష్ణలత దంపతులు మాట్లాడారు. ఈ సందర్బంగా.. టీడీపీ కార్యకర్త కృష్ణమూర్తి తమతో మాట్లాడాలని ఇంట్లో నుంచి పిలిచి మాపై దాడి చేశారని అన్నారు. తన భర్తను కొట్టారని కృష్ణలత తెలిపారు. అలాగే, తనకు, తన భర్త వెంకటేష్‌కు ప్రాణహాని ఉందన్నారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటున్నామన్నారు. -
నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
‘చంద్రబాబుతో, ఎల్లో మీడియాతోనూ యుద్ధం చేస్తున్నాం’
సాక్షి,తాడేపల్లి : చంద్రబాబుతోనే మనం యుద్ధం చేయడం లేదు. ఎల్లో మీడియాతోనూ పోరాటం చేస్తున్నాం’అని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ప్రతీ రోజూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వీళ్లు ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవడానికి ఏమీ లేదు. బురద చల్లడమే పనిగా పెట్టుకున్న వారితో మనం యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలు చెప్పడం, వక్రీకరణ చేయడం, దుష్ప్రచారం చేయడాన్ని ఒక పనిగా పెట్టుకున్నారు. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. పార్టీలో ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియా ఖాతా ఉండాలి. అన్యాయం జరిగితే దాని ద్వారా ప్రశ్నించాలి’ అని సూచనలు చేశారు. కాగా, తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరగుతున్న ఈ సమావేశానికి ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. -
రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఏపీ పోలీసులు
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నివాసానికి ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకున్నారు. విచారణకు రావాలని హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి పోలీసులు వచ్చారు. ఒంగోలు పోలీసు స్టేషన్‌కు విచారణ నిమిత్తం సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే, వర్మ ఒంగోలుకు రావడం లేదని తెలియడంతో పోలీసులే ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసుల విచారణకు సహకరించకుంటే వర్మను అరెస్ట్ చేసి ఒంగోలు తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నవంబర్ 19న పోలీసుల విచారణలో వర్మ పాల్గొనాల్సి ఉండగా.. ఆ సమయంలో తనకు సినిమా షూటింగ్స్ ఉండటం వల్ల హాజరు కాలేదు. ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. వాటికి కూడా వర్మ సమాధానం ఇచ్చారు. డిజిటల్ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇదే విషయాన్ని వాట్సాప్ ద్వారా డీఎస్పీకి సమాచారం అందించామని ఆయన పేర్కొన్నారు. అయినా సరే పోలీసులు వర్మ ఇంటికి రావడంలో కుట్ర కోణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్మ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.విచారణ పేరుతో తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు తనకు ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ వేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపైన కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. అలాగే వర్గాల మధ్య శతృత్వం సృష్టించేలా పోస్టులు చేయలేదని పిటిషన్లో ప్రస్తావించారు. -
ప్రకాశం జిల్లా కామెపల్లిలో తాగుబోతు వీరంగం
-
బరితెగించిన పచ్చ బ్యాచ్.. మహిళలు, చిన్నారులపై దాడి
సాక్షి, ప్రకాశం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో పచ్చ మూక రెచ్చిపోతోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఎల్లో బ్యాచ్ అరాచకం సృష్టించింది.ప్రకాశం జిల్లాలోని పొదిలిలో టీడీపీ కార్యకర్తలు బరితెగించి దాడులు చేశారు. పొదిలిలోని నవామిట్టలో వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబంపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా క్రూరత్వంతో రాళ్లు, కర్రలతో కొట్టారు. పచ్చ మూక దాడిలో కుటుంబంలోని ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో, వారికి వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక, ఈ దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లగా అక్కడ వారిని అడ్డుకొని వీరంగం సృష్టించారు. ఇది కూడా చదవండి: శ్రీవారి లడ్డూపై వివాదం.. బాబు పక్కా స్కెచ్‌తోనే.. -
పలు జిల్లాల వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, గుంటూరు: ప్రకాశం, బాపట్ల జిల్లాల వైఎస్సార్సీపీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల ఎంపిక తదితర అంశాలపై చర్చిస్తున్నారు.కాగా, నిన్న(గురువారం) కూడా పలు జిల్లాల వైఎస్సార్సీపీ నేతలతో జగన్ భేటీ అయ్యారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలతో సమావేశమయ్యారు. జిల్లాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణ విషయాలపై చర్చించారు. వైఎస్సార్సీపీలో పలు కీలక నియామకాలను చేపట్టారు.ఇదీ చదవండి: తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు వైఎస్సార్సీపీశ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా తమ్మినేని సీతారాంను, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులుగా జెడ్పీ చైర్మన్‌గా మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)ను, పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులుగా శత్రుచర్ల పరీక్షిత్రాజులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. -
ప్రకాశం: గుంతలో చిరుత.. అధికారుల పరుగులు
ప్రకాశం, సాక్షి: ప్రకాశం జిల్లాలో గిద్దలూరు మండలం దేవనగరంలో చిరుత పులి కలకలం రేపింది. గుంతలో చిక్కుకొని ఉన్న చిరుత పులిని గ్రామస్తులు గుర్తించారు. చిరుత సంచారంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతపులిని బంధించడానికి వలలు వేసి పట్టుకోవడానికి ప్రయత్నించారు. బుధవారం రాత్రి చీకటి కావడంతో రెస్క్యూకి చర్యలకు అంతరాయం కలిగింది. ఇవాళ తిరుపతి నుంచి వచ్చిన టైగర్ రెస్కూ టీమ్.. చిరుత పులిని బంధించి అడవిలో వదలనున్నారు.ఇదిలా ఉంటే.. నంద్యాల మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత సంచారం భక్తులు, స్థానికుల్లో భయాందోళనకు కారణమైంది. గోశాల, అన్నదాన సత్రం దగ్గర చిరుత సంచరించిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. -
వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!
-
AP: సీఐ తిట్టాడని రాజీనామా.. కట్ చేస్తే సివిల్స్ ర్యాంకర్‌గా ఉదయ్..
తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ పట్టుదలతో ఓ యువకుడు సివిల్స్ ర్యాంకు సాధించాడు. తన కోసం నానమ్మ పడుతున్న కష్టాన్ని గుర్తు చేసుకుంటూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించుకునేందుకు ఎంతో కృషి చేశాడు. తన లక్ష్యసాధనలో సివిల్స్‌లో 780వ ర్యాంకు సాధించాడు. అతనే ప్రకాశం జిల్లాకు చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి. వివరాల్లోకి వెళ్తే.. సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించారు. ఐదేళ్ల వయసులో తల్లి జయమ్మ మృతి చెందారు. తండ్రి శ్రీనివాసులురెడ్డి భరోసా, నానమ్మ రమణమ్మ బాధ్యతలు చూశారు. ఉదయ్ ఇంటర్ చదువుతున్న సమయంలో తండ్రి శ్రీనివాసులు చనిపోయారు. తండ్రి అకాల మరణంతో ఉదయ్, తన సోదరుడు ఎంతో ఆవేదనకు గురయ్యారు. ఆ సమయంలో వారికి నానమ్మ కొండంత అండగా నిలిచారు. నానమ్మ రమణమ్మ అప్పటి నుంచి ఇద్దరు మనవళ్ల చదువు కోసం కష్టపడ్డారు. దీంతో, 2013లో ఉదయ్ మొదట కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. 2018లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌లో ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. మూడు ప్రయత్నాల్లోనూ విఫలమైనప్పటికీ ఆత్మవిశ్వాసం సడలకుండా నాలుగోసారి ఉత్తమ ర్యాంకు సాధించారు. అయితే, తాను కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేయడానికి, సివిల్స్ ప్రేపర్ అవడానికి గల కారణాలను ఉదయ్ వెల్లడించారు. Telugu Police Constable resigns police job after humiliation, cracks UPSC "CI humiliated me in front of 60 policemen. I resigned from the job the same day and started preparing for UPSC Civil Services." - Uday Krishna Reddy (780th rank in 2023 UPSC Civil Services) Uday Krishna… pic.twitter.com/J9AB5diasa — Sudhakar Udumula (@sudhakarudumula) April 17, 2024 కాగా, తాను కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రోజుల్లో ఒక సీఐ తనను అకారణంగా 60 మంది పోలీసుల ముందు తిట్టారని చెప్పుకొచ్చారు. తన తప్పు లేకున్నా అలా తిట్టడంతో అదే రోజున ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు తెలిపారు. దీంతో, అప్పటి నుంచి సివిల్స్‌కు ప్రిపేర్ అయినట్టు స్పష్టం చేశారు. ఐఏఎస్ సాధించాలనే పట్టుదలతో కష్టపడి చదవినట్టు చెప్పారు. ఐఆర్ఎస్ వస్తుందని.. ఆ జాబ్‌లో చేరి ఐఏఎస్ సాధించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఆ సమయంలో సీఐ చేసిన అవమానమే సివిల్స్ సాధించేందుకు దోహదపడిందని చెప్పుకొచ్చారు. -
నేనున్నాను.. నేను విన్నాను
ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో సోమవారం జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా పలువురు అనారోగ్య బాధితులు, ప్రజలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు వచ్చారు. వీరిని చూసి స్వయంగా బస్సు దిగి వచ్చిన సీఎం వారి సమస్యలను సావధానంగా విన్నారు. నేనున్నానని భరోసా ఇచ్చారు. అర్జీలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలు, లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించారు. దీంతో వారంతా ముగ్ధులైపోయారు. ఆనందం వ్యక్తం చేశారు. జై జగన్ అంటూ నినదించారు. – కురిచేడు/మాచవరం / పిడుగురాళ్ల రూరల్/ వినుకొండ(నూజెండ్ల)/నరసరావుపేట రూరల్ దివ్యాంగురాలికి సీఎం ఆరోగ్యరక్ష మా పాప పుట్టిన కొంతకాలానికి మూర్చ వ్యాధి వచ్చింది. సకాలంలో చికిత్స చేయించకపోవడంతో మతిస్థిమితం కోల్పోయింది. ఆ తర్వాత శారీరక వైకల్యమూ శాపంగా మారింది. పాపకు చికిత్స చేయించే స్థోమత లేక ఇబ్బంది పడుతున్నాం. బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మా సమస్యను విన్నవించాం. ఆయన పెద్ద మనసు చూపారు. చికిత్స చేయించేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మాపాలిట ఆపద్బాంధవుడు సీఎం జగన్. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – నాగిశెట్టి రమాదేవి, సత్యనారాయణ, ఎన్ఎస్పీ కాలనీ, కురిచేడు, ప్రకాశం జిల్లా అంధురాలి చదువుకు సీఎం అభయం మా పాప చందన పుట్టుకతోనే అంధురాలు. బిడ్డకు ఇక కళ్లు రావని వైద్యులు చెప్పారు. కనీసం పాపను చదివించేందుకు ప్రభుత్వం తరఫున సాయం అందించాలని బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరాం. వెంటనే స్పందించిన సీఎం పాప చదువుకు అభయమిచ్చారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – చిప్పగిరి పాపయ్య, రమణమ్మ, కురిచేడు, ప్రకాశం జిల్లా జగనన్న ధైర్యమిచ్చారు మా పాప నర్రా వర్షిణి ఆరో తరగతి చదువుతోంది. పుట్టిన 9వ నెల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. ఇప్పటికే లక్షలాది రూపాయలు చికిత్స కోసం ఖర్చు చేశాం. ఫలితం లేకపోయింది. ప్రతినెలా రక్త మార్పిడికి రూ.10 వేలు, వైద్య పరీక్షలు, మందులకు రూ.10 వేలు మొత్తం రూ.20 వేలు ఖర్చు అవుతోంది. నా భర్త ఆటో డ్రైవర్. నేను చిన్న పాటి హోటల్ నిర్వహిస్తున్నా. మా బాధలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు వెళ్లగా, ఆయన బస్సు వద్దకు పిలిపించుకుని మా సమస్యను విని నేనున్నానని భరోసా ఇచ్చారు. మీకు ఇబ్బందులు లేకుండా చూస్తానని ధైర్యం చెప్పారు. ఆపరేషన్ చేయించి మీ కుటుంబం సంతోషంగా ఉండేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. – నర్రా శివ లావణ్య, కళ్యాణిపురం, వినుకొండ పట్టణం, పల్నాడు జిల్లా వెన్నెముక దెబ్బతిన్న యువతికి అభయం నేను ఎం ఫార్మసీ చదివాను. మా గ్రామంలో ప్రభ విరిగి పడడంతో నా వెన్నెముక దెబ్బతింది. కాళ్లు చచ్చుపడ్డాయి. వీల్‌చైర్‌కే పరిమితమయ్యాను. సీఎం బస్సు యాత్రగా వస్తున్నారని తెలిసి బంధువుల సాయంతో వచ్చాను. రోడ్డుపక్కన వేచి ఉన్న నన్ను చూడగానే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు దిగి వచ్చి సమస్య తెలుసుకున్నారు. అండగా ఉంటానని అభయం ఇచ్చారు. తన ముఖ్యకార్యదర్శి హరికృష్ణను కలవాలని సూచించారు. చాలా ఆనందంగా ఉంది. సీఎం స్పందించిన తీరు అద్భుతం. – కొత్త తేజస్వీ, విఠంరాజుపల్లి, వినుకొండ రూరల్, పల్నాడు జిల్లా చిన్నారి వైద్యసాయానికి భరోసా మా బిడ్డ రోహిణికి 12 ఏళ్లు. ఐదేళ్ల నుంచి వెన్నెముక సమస్యతో బాధపడుతోంది. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో చికిత్స చేయించలేకపోయాం. రూ.ఐదు లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. బస్సు యాత్ర సందర్భంగా శావల్యాపురంలో సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించాం. మమ్మలను చూడగానే సీఎం బస్సు దిగి వచ్చి మా సమస్య అడిగి తెలుసుకున్నారు. వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపరేషన్ చేయిస్తానని భరోసా ఇచ్చారు. – పున్నారావు, ఝాన్సీ దంపతులు, శావల్యాపురం, పల్నాడు జిల్లా నా భూమిని మాజీ ఎమ్మెల్యే జీవీ అనుచరులు ఆక్రమించారు నాకు సీతారామపురం గ్రామంలో 2.46 ఎకరాల భూమి ఉంది. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అనుచరులు ఆ భూమిని ఆక్రమించుకున్నారు. కేవలం 80 సెంట్లు మాత్రమే ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో చూపారు. నేను డాక్టర్‌ను. నడవలేని స్థితిలో ఉన్నా. నా సమస్యను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెబుదామని వచ్చాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు ఆపి నా దగ్గరకు వచ్చి సమస్య తెలుసుకున్నారు. పరిష్కరించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. – డాక్టర్ మోదుగుల వెంకటేశ్వరమ్మ, సీతారామపురం, వినుకొండ, పల్నాడు జిల్లా సాగర్ జలాలకు హామీ తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. మా గ్రామ చెరువుకు సాగర్ జలాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని బస్సుయాత్రగా గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరాం. గ్రామ సర్పంచ్ వేమా శివ, మాజీ సర్పంచ్ బత్తుల చిన సుబ్బయ్య, నాయకుడు వేమా చిన్న ఆంజనేయులుతో కలిసి వెళ్లి సీఎంకు వినతిపత్రం ఇచ్చాం. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. – బోధనంపాడు గ్రామస్తులు, కురిచేడు మండలం, ప్రకాశం జిల్లా -
‘కొనకొనమిట్ల’ సభ: సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్ ఇవే
సాక్షి, ప్రకాశం జిల్లా: చంద్రబాబు పెద్ద శాడిస్టు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 10వ రోజు ఆదివారం సాయంత్రం ప్రకాశం జిల్లా జిల్లా కొనకనమిట్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారేనని.. చంద్రబాబు పేరు గుర్తుకొస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలేనని ధ్వమెత్తారు. సీఎం జగన్ స్పీచ్.. హైలైట్స్ వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేస్తున్నాడు అవ్వా తాతలను చంపిన దిక్కుమాలిన హంతకుడు చంద్రబాబు పింఛన్లు ఆపిన శాడిస్టు చంద్రబాబు ఒకరికి మంచి జరుగుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు పేదవాడు పెద్దవాడవుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు పేదలకు స్థలాలిస్తుంటే అడ్డుకునేవాడిని శాడిస్టు అంటారు వ్యవసాయం దండగ అన్న వ్యక్తే శాడిస్టు ఎస్సీ,ఎస్టీ,బీసీలను కించపరుస్తూ మాట్లాడిన చంద్రబాబు శాడిస్టు ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం పెడుతంటే అడ్డుకున్నవాడు శాడిస్టు పేదలకు నగదు అందిస్తే ఏపీ శ్రీలంక అవుతుందన్న బాబు శాడిస్టు కాక ఇంకేంటి వాలంటీర్లను కించపరిచి నీచంగా మాట్లాడిన బాబు అండ్ గ్యాంగ్ మొత్తం శాడిస్టులే మేలు జరిగిందని చెప్పినందుకు గీతాంజలిని సోషల్ మీడియాలో సైకోలతో వేధించిన పెద్ద శాడిస్టు చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా చేసినా ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ గుర్తుకు రాని చంద్రబాబు మనకు ప్రత్యర్థి ఇది మీ బిడ్డ 58 ఏళ్ల పాలన ప్రోగ్రెస్ రిపోర్టు గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్.. మీ బిడ్డ గ్రామగ్రామానా ఫ్యామిలీ డాక్టర్ అంటే మీ జగన్.. మీ బిడ్డ అవ్వాతాతలకు ఇంటికే వచ్చిన రూ.3 వేల పెన్షన్ అంటే మీ జగన్.. మీ బిడ్డ ఇంటింటికి వాలంటీర్ సేవలంటే మీ జగన్..మీ బిడ్డ పగటి పూటే రైతన్నలకు ఉచిత కరెంటు, ఉచిత పంటబీమా అంటే మీ జగన్..మీబిడ్డ ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంటు అంటే మీ జగన్..మీ బిడ్డ అమూల్‌ను తీసుకువచ్చి పాడి రైతులకు ధరలు పెంచింది మీ జగన్.. మీ బిడ్డ వంద సంవత్సరాల తర్వాత భూముల రీ సర్వే చేయిస్తున్నది మీ జగన్..మీ బిడ్డ ఏకంగా 30 లక్షల ఎకరాల మీద సంపూర్ణ హక్కులు కల్పించింది మీ జగన్..మీ బిడ్డ నాడు..నేడుతో ప్రభుత్వ బడులు రూపు రేఖలు మారాయంటే కారణం మీ జగన్..మీ బిడ్డ అమ్మఒడి ఇచ్చింది మీ జగన్.. మీ బిడ్డ పెద్ద చదువుల కోసం విద్యాదీవెన, విద్యావసతి ఇచ్చింది మీ జగన్..మీ బిడ్డ ప్రభుత్వ ఆస్పత్రులు రూపు మారాయంటే కారణం మీ జగన్.. మీ బిడ్డ అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం, కాపు నేస్తం అంటే మీ జగన్ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కారణం మీ జగన్ అక్క చెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్ అంటే మీ జగన్ వాహన మిత్ర అంటే మీ జగన్ లా నేస్తం అంటే మీ జగన్ స్కీములన్నీ గ్రామంలో కళ్లెదుటే కనిపిస్తున్నాయి ఈ కార్యక్రమాలన్నీ మీ బిడ్డ ఎలా చేశాడు..చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు స్కీములన్నీ చూస్తుంటే చంద్రబాబుకు 20 జెలుసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా కడుపుమంట తగ్గట్లేదు ఇందుకే మన జెండా తలెత్తుకోని ఎగురుతూ ఉంది వాళ్ల జెండా 4 జెండాలతో జత కట్టినా కింద పడుతోంది 2014లో చంద్రబాబు ఇదే కూటమితో ముందుకువచ్చారు మళ్లీ అదే చంద్రబాబు,పవన్‌కల్యాణ్, మోదీ వస్తున్నారు హామీల కరపత్రాలను చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు 80 వేల కోట్ల రుణమాఫీ చేశాడా పొదుపు సంఘాల రుణాలు రద్దు చేశాడా ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు..చేశాడా ఇంటింటికి ఉద్యోగమిచ్చాడా..నిరుద్యోగ భృతి ఇచ్చాడా అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం ఇచ్చాడా పక్కా ఇళ్లు నిర్మించాడా ఏపీని సింగపూర్‌గా మార్చాడా ప్రతి నగరాన్ని హైటెక్‌సిటీ చేస్తానన్నాడు చేశాడా ఇప్పుడు మళ్లీ ఇంటింటికి బంగారం,ఇంటింటికి బెంజ్ కారంటూ వస్తున్నాడు చంద్రబాబును నమ్మడమంటే పులినోట్లో తలకాయ పెట్టడమే -
నాడు వైఎస్సార్.. నేడు నేను.. ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్: సీఎం జగన్
Live Updates.. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్ధాల కల నెరవేరింది. టన్నెల్లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించింది. అద్భుతమైన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది. మహానేత వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఆయన కుమారుడిగా ఈ ప్రాజెక్ట్‌ను నేనే పూర్తి చేయడం గర్వంగా ఉంది. ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్. ఈ ప్రాజెక్ట్‌తో 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాం. ఈ టెన్నల్ వల్ల ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. వెలిగొండ ప్రాజెక్ట్‌తో నాలుగు లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. నెరవేరిన 20 ఏళ్ల కల నాడు తండ్రి వైఎస్సార్ శంకుస్థాపన.. నేడు కొడుకుగా సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రారంభోత్సవం వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్ యుద్ధ ప్రాతిపదికన వెలిగొండ ప్రాజెక్ట్ జంట సొరంగాలు పూర్తి ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్ ♦ వెలిగొండ చేరుకున్న సీఎం జగన్ ♦ వెలిగొండ ప్రాజెక్ట్ వద్దకు బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ♦ కాసేపట్లో వెలిగొండ ప్రాజెక్ట్ టెన్నెన్ను జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్. ♦ సీఎం వైఎస్ జగన్ బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేస్తారు. ♦ మొదట దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్‌ను, రెండో టన్నెల్‌ను పరిశీలిస్తారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్.. ♦ 2019లో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గత 58 నెలల పాలనలో దాదాపు రెండేళ్లు కరోనావల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినాసరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిమీల పనులను 2019, నవంబరులో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించారు. 2014–19 మధ్య టీడీపీ సర్కార్ హయాంలో మొదటి సొరంగంలో రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. అలాగే, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదలచేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది పూర్తిచేయించారు. ♦ ఇక రెండో సొరంగం మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వాటిని రద్దుచేసిన సీఎం జగన్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించి టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తిచేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ.ల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. ♦రెండో సొరంగంలో టీబీఎంకు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్ పని జరగడం కూడా కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. మంగళవారం నాటికి రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. 7.685 కి.మీల పొడవున తవ్వకం పనులు, హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చేలోగా టీబీఎంను సొరంగం నుంచి బయటకు తీయనున్నారు. మరోవైపు.. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ హయాంలో రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. ♦ఇక టీడీపీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులను చేపట్టిన సీఎం వైఎస్ జగన్ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయిస్తున్నారు. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించనున్నారు. ♦ ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకూ రూ.978.02 కోట్లను సీఎం వైఎస్ జగన్ ఖర్చుచేశారు. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. శరవేగంగా పూర్తిచేయించారు. నల్లమలసాగర్.. ఓ ఇంజినీరింగ్ అద్భుతం ప్రకాశం జిల్లాలో విస్తరించిన నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా వెలుపల ఉన్న కొండలను వెలిగొండలు అంటారు. వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల (గ్యాప్)ను కలుపుతూ 373.5 మీటర్ల పొడవు, 63.65 మీటర్ల ఎత్తు (సుంకేశుల డ్యామ్)తో.. 587 మీటర్ల పొడవు, 85.9 మీటర్ల ఎత్తు (గొట్టిపడియ డ్యామ్)తో 356 మీటర్ల పొడవు, 57 మీటర్ల ఎత్తు (కాకర్ల డ్యామ్)తో మూడు డ్యామ్‌లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంది. ఇదో ఇంజినీరింగ్ అద్భుతమని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నల్లమలసాగర్ పనులను మహానేత వైఎస్ పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపునున్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3,001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవ్వి.. ఫీడర్ ఛానల్ ద్వారా నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలిస్తారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కి.మీ.ల పొడవున తవ్విన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు కావడం గమనార్హం. -
ఒకే రోజు రెండు ఘోర ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి
సాక్షి, ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే వారిని మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన వారిలో కారులో ప్రయాణిస్తున్న గుంటూరుకు చెందిన రావు నాగేశ్వరరావు రావు వెంకటేశ్వర్లు, ఆటోలో ప్రయాణిస్తున్న మార్కాపురం పట్టణానికి చెందిన షేక్ బాబు, ఆమని గుడిపాడుకు చెందిన ఎనిబెర అభినయ్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.. ఆటోలోని నలుగురికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్న సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నాలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన మంతెన శంకర్ తన కుటుంబ సభ్యులతో వేములవాడ వెళ్తుండగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి వస్తున్న ఇసుక లారీ కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతులను మంతెన కాంతయ్య (7 ), మంతెన శంకర్ (60), మంతెన భరత్ (29), మంతెన వందన (16)గా గుర్తించారు. తీవ్ర గాయాలతో ఎంజీఎం లో చికిత్స పొందుతున్న వారిలో మంతెన రేణుక (60), మంతెన భార్గవ్ (30), మంతెన శ్రీదేవి (50), ఉన్నారు. -
ఆమ్రపాలి మన ఆడపడుచే!
ఒంగోలు: ఆమ్రపాలి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నగర శివారులోని నరసాపురం అగ్రహారం ఆమె స్వగ్రామం. దీనిని స్థానికంగా అగ్రహారం రైల్వే గేటు అని వ్యవహరిస్తారు. రైల్వే గేటు దాటాక రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది ఎన్.అగ్రహారం గ్రామం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (HMDA)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆమ్రపాలి ఒంగోలు వాసికావడం గర్వకారణం. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలి 39వ ర్యాంక్ సాధించి, ఐఏఎస్‌లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ట్రైనీ ఐఏఎస్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, నగర కమిషనర్‌గా పనిచేశారు. 2018లో వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. తండ్రి కాటా వెంకటరెడ్డి ఫ్రొఫెసర్.. ఎన్.అగ్రహారానికి చెందిన ఆమ్రపాలి తండ్రి కాటా వెంకటరెడ్డి చిన్నతనంలో అగ్రహారంలోనే చదువుకున్నారు. మేనకోడలు పద్మావతిని వివాహం చేసుకున్నారు. పద్మావతి స్వగ్రామం టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామం. ఆయన చిన్నతనంలో ఎలిమెంటరీ విద్య ఆలకూరపాడు పాఠశాలలోనే జరిగింది. హైస్కూలు విద్య టంగుటూరు, ఇంటర్మీడియేట్, డిగ్రీ సీఎస్ఆర్ శర్మ కళాశాలలో, పీజీ విద్య విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సీటీలో పూర్తి చేశారు. అదే యూనివర్సిటీలో ఎకనమిక్స్ ఫ్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన సొంత ఇల్లు ఎన్.అగ్రహారంలో ఉంది. కుటుంబమంతా ఉన్నతాధికారులే.. ఆమ్రపాలితో పాటు ఆమె సోదరి కూడా ఐఆర్ఎస్. ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్)కు ఎంపికయిన ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి ప్రస్తుతం కర్ణాటక కేడర్‌లో ఇన్‌కంట్యాక్స్ విభాగంలో పనిచేస్తోంది. మానస గంగోత్రి 2007 ఐఆర్ఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారిణి. ఐఆర్ఎస్లో 184వ ర్యాంక్ సాధించింది. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్. తమిళనాడు ఐఏఎస్ కేడర్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఉమెన్ వెల్ఫేర్‌లో డైరెక్టర్‌గా చేస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత జరిగిన ఉపెన్నికకు రెండు సార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అమ్రపాలి భర్త ఐపీఎస్ అమ్రపాలికి 2018 ఫిబ్రవరి 18న తేదీన వివాహం జరిగింది. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన షమీర్ శర్మ జమ్మూ పట్టణానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతంలో ఎస్సీగా పనిచేస్తున్నాడు -
వారితో మాట్లాడినా.. ఇంటికెళ్లినా జరిమానా..!
సింగరాయకొండ (మర్రిపూడి): మాతమ్మ తిరునాళ్లకు డబ్బులు చెల్లించని ఆ కుటుంబాలతో మాట్లాడినా.. వారి ఇళ్లకు వెళ్లిన వారికి రూ.10 వేలు జరిమానా విధిస్తామని ఆ కాలనీ గ్రామ పెద్దలు దండోరా వేసిన ఘటన సింగరాయకొండ మండలంలోని శానంపూడి పంచాయతీ అరుంధతి నగర్లో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... శానంపూడి గ్రామ పంచాయతీలోని అరుంధతి కాలనీ వాసులు ఇటీవల 5 సంవత్సరాలకు ఒక సారి నిర్వహించే మాతమ్మ తిరునాళ్ల జరిపారు. తిరునాళ్లకు ఆ కాలనీలోని ప్రతి ఇంటి వారు చందాలు వేసుకుంటారు. అయితే ఆ కాలనీలోని 17 కుటుంబాలవారు చందాలు ఇవ్వకపోవడంతో గ్రామ పెద్దలు తీర్మానం చేసుకుని కాలనీలో దండోరా వేయించారు. ఈ 17 కుటుంబాల వారు చర్చికి కూడా వెళ్లడానికి వీలు లేదని ఆదేశించారు. దీనిపై ఆయా కుటుంబాల వారు తమకు న్యాయం కావాలని కోరుతూ పోలీస్, రెవెన్యూ శాఖల వారిని ఆశ్రయించారు. దీనిపై పోలీసులు సమస్య పరిష్కారానికి తహశీల్దార్‌ను కలవాలని సూచించడంతో వారు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో తహశీల్దార్ ఉష.. కలెక్టర్ దినేష్‌కుమార్ పాకల గ్రామానికి వస్తున్నారని, తెలియడంతో అక్కడికి వెళ్లారు. దీంతో కార్యాలయ సిబ్బంది గురువారం తహశీల్దార్‌ను కలవాలని వారికి సూచించారు. -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర.. 11వ రోజు షెడ్యూల్..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. నేడు సామాజిక సాధికార బస్సు యాత్ర పార్వతీపురం మన్యం, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మూడు నియోజకవర్గాల్లో జరుగనుంది. ఇక, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి రాజన్న దొర ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగనుంది. షెడ్యూల్ ఇలా.. పార్వతీపురం మన్యం జిల్లాలో.. ►నేడు 11వ రోజు సామాజిక సాధికార యాత్ర ►సాలూరు, పాలకొల్లు, కనిగిరి నియోజకవర్గాలలో బస్సుయాత్ర ►ఉదయం 10:30 గంటలకు మెంటాడ మండలం పోరాం గ్రామంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ►అనంతరం పోరాం గ్రామంలోని సచివాలయం సందర్శన. ►పెద్దమెడపల్లి, బూసాయవలస, రామభద్రపురం మీదుగా బస్సుయాత్ర ►మధ్యాహ్నం మూడు గంటలకు సాలూరు బోసు బొమ్మ జంక్షన్లో బహిరంగ సభ ప్రకాశం జిల్లాలో.. ►ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►నందన మారెళ్ల సెంటర్ నుండి బస్సుయాత్ర ప్రారంభం ►సురా పాపిరెడ్డి నగర్ దగ్గర లారీ అసోసియేషన్ సభ్యులతో సమావేశం ►వైఎస్సార్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్న నేతలు ►ప్రభుత్వ కాలేజీలో "నాడు-నేడు" కార్యక్రమంపై విద్యార్థులతో సమావేశం. ►వైఎస్సార్‌భవన్‌లో రెండు గంటలకు విలేకర్ల సమావేశం ►సాయంత్రం నాలుగు గంటలకు పామూరు బస్టాండ్ వద్ద బహిరంగ సభ పశ్చిమగోదావరి జిల్లాలో.. ►పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో బస్సుయాత్ర ►శ్రీహరి గోపాలరావు (గోపి) ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►పాలకొల్లు బైపాస్ రోడ్డు రామచంద్ర గార్డెన్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు వైఎస్సార్సీపీ నేతల ప్రెస్ మీట్ ►అనంతరం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వరకు బస్సుయాత్ర ►గాంధీ బొమ్మల సెంటర్లో బహిరంగ సభ -
‘అనారోగ్యం పేరుతో బయటకొచ్చి బాబు ర్యాలీ చేయడం దారుణం’
సాక్షి, ప్రకాశం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ఏపీకి భవిష్యత్తని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఓట్ల కోసమే వెనుకబడిన వర్గాలను వాడుకుందని విమర్శించారు. సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన గొప్పనాయకుడు సీఎం జగన్ అని ప్రశంసించారు. నాలుగున్నరేళ్లుగా జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ప్రకశం జిల్లా మార్కాపురంలో సోమవారం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ బస్సుయాత్ర నిర్వహించారు. 3 గంటలకు కార్యకర్తలతో కలసి పార్టీ నేతల పాదయాత్ర ప్రారంభం కాగా.. పిల్లల పార్కు మీదుగా కంభం సెంటర్ వరకు కొనసాగింది, సాయంత్రం 4:30కి వైఎస్సార్ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి నేతలు ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. అంతకముందు మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సామాజిక సాధికార యాత్రకు భారీగా ప్రజా స్పందన వస్తుందన్నారు. వెనకబడిన వర్గాల నష్టాన్ని, ఇబ్బందలును గుర్తుంచి సీఎం వైఎస్ జగన్ అందుకుంటున్నారని తెలిపారు. గ్రామాలలో గొప్ప సంస్కరణలు తెచ్చిన నాయకుడు వైఎస్ జగన్ అని ప్రశంసించారు. అనారోగ్యం పేరు చెప్పి, జైలు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు విజయోత్సవ ర్యాలీ చేసుకోవడం దారుణమని అన్నారు. జగనన్న పాలనలో రాష్ట్రంలో భారీగా మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయని తెలిపారు. ‘గతంలో చంద్రబాబు 600కు పైగా హామీలిచ్చి ఏదీ నెరవేర్చలేదు. మోసం చేసేందుకు మళ్లీ వస్తున్న దొంగల ముఠాకు ప్రజలు బుద్ధి చెబుతారు. పేదలకు అండగా నిలిచిన గొప్ప నాయకుడు సీఎం జగన్.అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రజలను చంద్రబాబు ఏ రోజూ పట్టించుకోలేదు. అనారోగ్యం పేరుతో చంద్రబాబు బెయిల్ తెచ్చకున్నారు. తీరా బయటకొచ్చాక ఆయనకు ఆరోగ్యం బాగానే ఉంది. అనార్యోగ్యంగా ఉందని చెప్పి చంద్రబాబు ర్యాలీ చేశారు.’ అని మంత్రి ఆదిమూలపు మండిపడ్డారు. -
ప్రకాశం: షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం.. 2కోట్ల నష్టం!
సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. దర్శి పట్టణంలోని అభి షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వివరాల ప్రకారం.. నగరంలోని అభి షాపింగ్ మాల్లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చేలరేగి ఎగిసిపడుతున్నాయి. ఇక, అగ్ని ప్రమాదం సమాచారం అందిన వెంటనే ఫైర్ ఇంజిన్లు అక్కడకి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. ఫైర్ సిబ్బంది గంటకు పైగా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా షాపింగ్ మాల్లోని బట్టలు దగ్దమయ్యాయి. దీంతో, దాదాపు 2కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ఏలూరు జిల్లా టీడీపీ బహిరంగ సభలో అపశ్రుతి -
హైడ్రామా.. నానా యాగీ.. టీడీపీ నేతల శవ రాజకీయం
ఒంగోలు అర్బన్: రాజకీయంగా ఉనికిని కోల్పోతున్న తెలుగుదేశం పార్టీని బతికించుకునేందుకు ఆ పార్టీ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య గొడవను అడ్డుపెట్టుకుని.. నిస్సిగ్గుగా శవ రాజకీయాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెం గ్రామంలో సవలం సుధాకర్ భార్య హనుమాయమ్మ(48) అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. అదే గ్రామానికి చెందిన సవలం కొండలరావు(బుజ్జి) హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. కొన్నేళ్లుగా వీరి మధ్య భూ తగాదా ఉంది. అతను వచ్చినప్పుడల్లా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో హనుమాయమ్మ సోమవారం తన ఇంటి ముందు కూర్చుని ఉండగా.. కొండలరావు తన ట్రాక్టర్ నాగేలు అడ్డతో ఆమెను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆమె కింద పడటంతో వెనుక టైరుతో తొక్కించాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న టీడీపీ నేతలు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి.. హనుమాయమ్మ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఒంగోలు జీజీహెచ్ వద్ద మంగళవారం హైడ్రామా నడిపారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఆదుకోవాలంటూ హడావుడి చేశారు. పాత కక్షలు, కుటుంబ తగాదాలతోనే సదరు మహిళను హత్య చేశారని ఆ గ్రామ ప్రజలంతా స్పష్టంగా చెబుతున్నా, రాజకీయ రంగు పులుముతూ ప్రభుత్వంపై, అధికార యంత్రాంగంపై, పోలీసులపై ఆరోపణలు గుప్పించారు. చదవండి: నిధులు మళ్లించాం.. కానీ ఎక్కడికో తెలియదు ఆందోళన చేస్తున్న వారి వద్దకు స్వయంగా వచ్చిన ఆర్డీవో, టంగుటూరు తహశీల్దార్లు.. మానవతా దృక్పథంతో వీలైనంత మేర ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అయినా టీడీపీ నేతలు వినిపించుకోకుండా నానా యాగీ చేశారు. టీడీపీ నేతల వైఖరిని కళ్లారా చూసిన వారంతా.. ఇదేం రాజకీయం అంటూ ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉండగా, మహిళ మృతదేహానికి రిమ్స్‌లో పోస్టుమార్టం పూర్తయింది. మృతురాలి భర్త తన అన్న భార్యపై కూడా అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తూ.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
ఇంటిముందు మృతదేహం, డబ్బు, లేఖ
పుల్లలచెరువు/యర్రగొండపాలెం: ఒక యువకుడి మృతదేహాన్ని కొందరు వ్యక్తులు కారులో తీసుకొచ్చి అతడి ఇంటిముందు పడేసి వెళ్లిన సంఘటన ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో సంచలనం కలిగించింది. మృతదేహంతోపాటు రూ.35 వేలు, క్షమాపణ లేఖ ఉంచి వెళ్లారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. మృతుడు ఉప్పు శ్రీను (35) భవన నిర్మాణ పనుల్లో కూలీగా చేస్తుంటాడు. పనుల కోసం ముఠావాళ్లతో చెన్నై, తెలంగాణ, ఇతర దూర ప్రాంతాలకు వెళుతుంటాడు. 10 రోజుల కిందట పనులకు చెన్నై వెళ్లాడు. అతడికి నయంకాని వ్యాధి ఉన్నట్లు గుర్తించిన భార్య పిల్లలను తీసుకుని రెండేళ్ల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కొందరు వ్యక్తులు తెల్లటి కారులో శ్రీను మృతదేహాన్ని తీసుకొచ్చి అతడి ఇంటిముందు పడేసి వెళ్లారు. మట్టి ఖర్చులకు రూ.35 వేలు, క్షమాపణ లేఖ అక్కడ ఉంచి వెళ్లారు. ఆ లేఖలో ‘అమ్మా.. పనిచేసే ప్రదేశంలో అందరం కలిసి పనిచేస్తున్నాం. ఈ క్రమంలో మీ అబ్బాయి చనిపోయాడు. మాకు దెబ్బలు తగిలాయి. తల్లి శోకం తీర్చలేనిదని మాకు తెలుసు. కానీ ఏమీచేయలేక పోయాం. మీ అబ్బాయి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.35 వేలు ఇస్తున్నాం. అమ్మా క్షమించండి..’ అని రాసి ఉంది. ఈ లేఖను బట్టి భవన నిర్మాణ పనులు జరిగే సమయంలో తోటి కూలీలతోపాటు శ్రీను కిందపడి ఉంటాడని, ఈ నేపథ్యంలో అతను చనిపోగా మరికొందరికి దెబ్బలు తగిలి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని అప్పజెప్పే తరుణంలో గ్రామస్తులు తమపై దాడిచేసే అవకాశం ఉందని, పోలీసు కేసులు అవుతాయనే భయంతో ఇంటిముందు పడేసి వెళ్లి ఉండవచ్చని అనుకుంటున్నారు. మృతుడి ఇంట్లో దొరికిన మందులు, పరీక్షల రిపోర్టును బట్టి అతనికి నయంకాని వ్యాధి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి సీఐ కె.మారుతీకృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ వై.శ్రీహరి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో రోడ్డు ప్రమాదం
-
ప్రకాశం: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్త్క్షి, త్రిపురాంతకం: జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలోని హైవేపై ఆదివారం రాత్రి 10.15 సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హిందూపురం వెళ్తున్న ఆర్టీ బస్సు వినుకొండ వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన సాయి(26), పిల్లి శ్రీనివాస్(23), చంద్రశేఖర్ (25) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను హైవే అంబులెన్స్, 108లో వినుకొండకు తరలించారు. మార్గంమధ్యలో శకంర్ (24) మృతిచెందాడు. అనంతపురంలో ఒక పెళ్లి మండపం డెకరేషన్ కోసం వెళ్లి విజయవాడ వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు ఎస్సై జీవీ సైదులు తెలిపారు. ఇది కూడా చదవండి: కోటిపల్లి రైల్వేలైన్‌కు కదలిక -
చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్
సాక్షి, ప్రకాశం: చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్ అయ్యారు. బాబు సభకు జనం రాకపోవడంతనే గొడవలు సృష్టించారని ధ్వజమెత్తారు. యర్రగొండపాలెం వైఎస్సార్సీపీ కంచుకోట.. దమ్ముంటే టీడీపీ గెలవాలని సవాల్ విసిరారు. యర్రగొండపాలెంలో టీడీపీ గెలిస్తే రాజకీయాలు శాశ్వతంగా వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు. దళితులపై రాళ్లదాడి పాపం చంద్రబాబుదేనని మంత్రి ఆదిమూలపు విమర్శించారు. చంద్రబాబే దగ్గరుండి తమ కార్యకర్తలపై దాడి చేయించారని మండిపడ్డారు. యర్రగొండపాలెంలో అసైన్డ్ భూముల అక్రమాలు, గంజాయి ఉందంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలను నిరూపించాలన్నారు. చదవండి: ప్రకాశం: చంద్రబాబుకు నిరసన సెగ కాగా, అధికారంలో ఉన్న ఐదేళ్లూ వెలిగొండ ప్రాజెక్టును గాలికొదిలేసిన చంద్రబాబు.. వెలిగొండను తానే పూర్తి చేస్తానని చెప్పడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి దుయ్యబట్టారు. పశ్చిమ ప్రకాశం ప్రజలను మరోమారు మోసం చేసేందుకు వెలిగొండ పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. బాబు మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, అసలు వెలిగొండపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. -
ప్రకాశం: చంద్రబాబుకు నిరసన సెగ
సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనలో దళితులు నిరసనకు దిగారు. దళిత ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్లతో దళితులు నిరసనలు తెలిపారు. దళితులకు క్షమాపణ చెప్పి జిల్లాలో పర్యటించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న దళిత శ్రేణులపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. మంత్రి సురేష్ క్యాంప్ కార్యాలయంపై టీడీపీ మూకలు రాళ్ల దాడికి దిగాయి. రాళ్ల దాడిలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పదేపదే కవ్వింపు చర్యలకు దిగారు టీడీపీ కార్యకర్తలు. ఈ సందర్బంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు దళిత ద్రోహి. చంద్రబాబుకు యర్రగొండపాలెంలో అడుగుపెట్టే అర్హత లేదు. దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ప్రకాశం జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను మా ప్రభుత్వమే పూర్తి చేసింది. శాంతియుతంగా చంద్రబాబుకు నిరసన తెలుపుతున్నాం’ అని అన్నారు. -
వైఎస్సార్ ఈబీసీ నేస్తం: సీఎం జగన్ మార్కాపురం పర్యటన షెడ్యూల్ ఇదే
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని రేపు(బుధవారం)ప్రకాశం జిల్లా మార్కాపురంలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. దీనిలో భాగంగా ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు సీఎం జగన్. 10.15- 12.05 గంటలకు ఎస్వీకేపీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభా వేదిక వద్ద వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు నగదు జమచేయనున్నారు. కార్యక్రమం అనంతరం 12.40 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ►వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్ళలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు (ఈబీసీ) ఏటా రూ. 15,000 చొప్పున అదే అక్కచెల్లెమ్మలకు 3 ఏళ్ళలో మొత్తం రూ. 45,000 ఆర్ధిక సాయం చేస్తూ వారు సొంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా తోడ్పాటు అందిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం. ►ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన 98.44 శాతం హామీలు నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారికి తోడుగా ఉండాలని వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న కానుక – వైఎస్సార్ ఈబీసీ నేస్తం ►నేడు అందిస్తున్న రూ. 658.60 కోట్లతో కలిపి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూ. 1,257.04 కోట్లు. ఒక్కో అక్కచెల్లెమ్మకు ఇప్పటివరకు అందించిన సాయం రూ. 30,000. ►వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు గత 46 నెలల్లో శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన లబ్ధి రూ. 2,25,991.94 కోట్లు (డీబీటీ మరియు నాన్ డీబీటీ) అక్కచెల్లెమ్మలకు ఉద్యోగ, రాజకీయ సాధికారత ►వలంటీర్ ఉద్యోగాలు 2.65 లక్షల మందికి ఇస్తే వీరిలో 1.33 లక్షల మంది మహిళలే, 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో సైతం 51 శాతం మహిళలకే ►రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం మహిళలకే కేటాయింపు, నామినేటెడ్ కార్పొరేషన్ చైర్పర్సన్లుగా 51 శాతం మహిళలకే, డైరెక్టర్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్పర్సన్, రాజకీయ నియామకాల్లో 50 శాతంపైగా పదవులు అక్కచెల్లెమ్మలకే ►శాసనమండలిలో తొలిసారిగా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మహిళకు అవకాశం, కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు అవకాశం ►జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు మెంబర్, మున్సిపల్ చైర్పర్సన్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల్లో 50–60 శాతం పైగా మహిళలకే ►అమ్మ కడుపులోని బిడ్డ నుండి అవ్వల వరకు, అక్కచెల్లెమ్మలకు అన్ని దశల్లోనూ అండగా నిలిచి ఆదుకుంటున్న శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం ►గర్భవతులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కొరకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా సంపూర్ణ పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం పంపిణీ ►మన బడి నాడు నేడు ద్వారా కౌమార బాలికల ఆత్మగౌరవం నిలబెట్టేలా పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు రూపురేఖలు మార్చిన ప్రభుత్వ బడులు ►స్వేచ్ఛ పథకం ద్వారా కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్ కిన్స్ పంపిణీ ►మహిళల భద్రత కోసం దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులు ►వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా ద్వారా ఆర్ధిక సాయం ►అక్కచెల్లెమ్మల పేరు మీదే ఇళ్ళపట్టాలు, ఇళ్ళ రిజిస్ట్రేషన్లు ►జగనన్న అమ్మ ఒడి ద్వారా ఆర్ధిక సాయం ►వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ పెన్షన్ కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా అక్కచెల్లెమ్మలకు, మహిళలకు అండగా నిలుస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం. చదవండి: ముస్లింలపై ‘ఈనాడు’ ద్వంద్వ నీతి!.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా -
పులి.. ఈ పేరు వింటేనే అందరికీ హడల్...
పులి.. ఈ పేరు వింటేనే అందరికీ హడల్. ఇది వన్యమృగం.. అయినా సౌమ్యం వీటి సొంతం. అయితే నల్లమల పులి జీవనం వైవిధ్యం. పులులు సంఘజీవులు కావు. ఒంటరిగా బతికేందుకు ఇష్టపడతాయి. ఇతర జంతువులతో కలవడం చాలా అరుదు. ఇవి ఆహారం కోసం వన్యప్రాణులను వేటాడడం.. పిల్లల్ని కనడం.. వాటికి జీవన మెళకువలు నేర్పడం.. ఆ తర్వాత అరణ్యంలో బతికేందుకు వదిలేయడం అంతా విభిన్నంగా ఉంటుంది. సువిశాల విస్తీర్ణంలో నెలకొన్న ఎన్ఎస్టీఆర్ (నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్ట్)లో ఉంటే పులులతో పాటు ఇతర టైగర్ ఫారెస్ట్‌ల్లో ఉండే వాటికంటే చాలా సౌమ్యంగా ఉంటాయి. బఫర్ ఏరియాలను దాటి జనారణ్యంలోకి తరుచూ వచ్చినా మనుషులపై దాడులు చేసిన ఘటనలు అరుదు. ఇక్కడ ఉండే పులులు సాధువుగా ఉంటాయని అంటున్నారు వన్యప్రాణుల పరిశోధకులు. జీవ వైవిధ్యానికి నెలవుగా ఉండే నల్లమల అభయారణ్యం 3,700 చదరపు కిలో మీటర్ల మేర ఎన్ఎస్టీఆర్ విస్తరించి ఉంది. దేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఇది. దీని చుట్టూ వందలాది గిరిజన గూడేలు ఉన్నాయి. ఇక్కడ నివశించే పులి నల్లమల రాజుగా పేరొందింది. అంతరించిపోతున్న వీటి సంరక్షణకు, వీటి సంతతిని పెంచేందుకు అటవీశాఖ అధికారులు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారికంగా 75 పులులు ఉన్నాయని గుర్తించినా అనధికారికంగా 100కు పైగా ఉన్నాయని అంచనా. ఈ ఏడాది కూడా పులుల గణన ప్రారంభమైంది. ఏప్రిల్ నెల చివరి వరకూ వివిధ దశల్లో వీటిని లెక్కింపు చేస్తారు. మృగమే కానీ.. సాధారణంగా అటవీ ప్రాంతానికి సమీప గిరిజన గూడేలకు మధ్య బఫర్ ఏరియా ఉంటుంది. వన్యప్రాణులు, మృగాలు జనావాసాల వైపు రాకుండా ఉండేలా ఒక అంచనా వేస్తూ బఫర్ ఏరియాలను నిర్ణయించారు. అయితే మనుగడ కోసం గిరిజన ప్రాంతాల్లోని వారు బఫర్ ఏరియాలను దాటి ముందుకు వచ్చేశారు. దీంతో తరుచూ వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. నల్లమల రాజుగా పేరొందిన పులులు ఇతర టైగర్ ఫారెస్టుల్లో ఉన్న పులులు కంటే చాలా సాధుగుణం కలిగి ఉంటాయి. తెలంగాణ, మహారాష్ట్ర బోర్డర్లో ఉన్న తడోబా టైగర్ ఫారెస్టులోని పులులు నిత్యం మనుషులపై దాడులు చేస్తుంటాయి. నెలకు ఒకరిద్దరిని పొట్టన పెట్టుకుంటుంటాయి. ఇలా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఎన్‌ఎస్‌టీఆర్‌లో మాత్రం పులులు తరుచూ జనారణ్యంలోకి వచ్చినా మనుషులపై దాడులు చేయడం చాలా అరుదు. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే 0.001 శాతం మాత్రమే దాడి చేసి ఉంటాయని వన్యప్రాణి నిపుణులు అంటున్నారు. ఎన్‌ఎస్‌టీఆర్‌లో ఒక పులి సంచరించేందుకు 30 నుంచి 40 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం ఉంటుంది. ఇతర వన్యప్రాణులను వేటాడుతూ.. లేదా నీళ్ల కోసం బఫర్ ఏరియాలను దాటి గూడేల వైపు ఇవి వస్తుంటాయి. గత నెలలో గిద్దలూరు అటవీ డివిజన్ పరిధి మాగుటూరు, లక్ష్మీపురం, వెలగలపాయ, శంకరాపురం, కాకర్ల తదితర గ్రామాల పరిధిలోనూ, మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలోని యర్రగొండపాళెం మండలం కొలుకుల గ్రామం పరిధిలో పులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. వీటి దాడిలో ఎద్దులు సైతం మృతి చెందాయి. పులుల సంచారాన్ని గుర్తించేందుకు అధికారులు ట్రాప్ కెమెరాలు అమర్చారు. పెద్దపులి దాడి చేసిన ఎద్దు మృతదేహం వద్దకు వచ్చి కళేబరాన్ని తింటుండటం కెమెరాలో నిక్షిప్తమైంది. ఒక పులి తన పిల్లలతో వచ్చినట్టు కూడా గుర్తించినట్టు సమాచారం. పులుల సంతతి పెరిగేందుకు.. ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులుల సంతతి పెరిగేందుకు ఆగస్టు, సెపె్టంబర్ రెండు నెలల పాటు పర్యాటకుల రాకపోకలను నిషేధించారు. ఆ సమయంలో పులులు స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కలుగుతుంది. మగ పులి, ఆడపులి కలిసేందుకు అది అనుకూలమైన సమయంగా అధికారులు గుర్తించారు. పులులకు సూపర్ సెన్స్ ఉంటుంది. ఆడపులి రాకను మగపులి 30 కిలో మీటర్ల దూరం నుంచే గుర్తిస్తుంది. ఆడపులి ఒక చెట్టును బరకడం, మూత్ర విసర్జన చేస్తుంది. ఆ సమయంలో విడుదలైన రసాయనాల వాసనను మగపులి గుర్తిస్తుంది. ఆడ పులితో మేటింగ్ తర్వాత వారం రోజులు ఉండి మగ పులి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. గర్భం దాల్చిన ఆడపులి 103 రోజుల తర్వాత పిల్లలకు జన్మనిస్తుంది. వాటిని ఇతర వన్యమృగాల బారిన పడకుండా అత్యంత రహస్య ప్రదేశంలో ఉంచి ఆహారానికి వెళుతుంది. అవి కళ్లు తెరిచే వరకు అత్యంత జాగ్రత్తగా ఉంటాయి. ఒక నెల తర్వాత వేటాడడం నేర్పుతోంది. ఇలా 18 నెలల పాటు వాటికి అన్ని రకాల మెళకువలు నేర్పి వదిలేస్తోంది. అలా తల్లి నుంచి వేరైన పులులు సొంతంగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. పిల్లలు తనతో ఉన్నంత వరకు మగపులిని మేటింగ్‌కు ఆహ్వానించదు. అవి పిల్లలతో ఆహారం నిమిత్తం పొరపాటున జనారణ్యంలోకి వచ్చిన సమయంలో పులి కూనలను మనుషులు తాకితే ఇక వాటిని తల్లి పులి దగ్గరకు రానివ్వదు. ఇటీవల నంద్యాల జిల్లాలో పిల్లలతో కలిసి జనారణ్యంలోకి పులి వచ్చింది. నాలుగు కూనలు ఆరు బయట ఉండడంతో వాటిని స్థానికులు పట్టుకుని అటవీశాఖ అధికారులకు వివరాలు అందించారు. ఈ సమయంలో వాటిని మనుషులు ముట్టుకోవడంతో వాటి కోసం తల్లి పులి రాలేదని తెలుస్తోంది. పులుల సంరక్షణకు.. నల్లమల అభయారణ్యంలో నాలుగు డివిజన్లు, 16 నుంచి 20 రేంజ్‌లు ఉన్నాయి. అటవీ సమీపంలో ఉండే చెంచులకు అభయారణ్యంలోని జంతువుల గురించి పూర్తిగా తెలుసు. పెద్ద పులి ఎక్కడ ఉంది.. అది ఏం చేస్తుందనేది దూరం నుంచే పసిగడతారు. మనకంటే వారికే ఎక్కువగా తెలుసు. కొన్ని సందర్భాల్లో అటవీశాఖ సిబ్బందినే గైడ్ చేస్తారు. అందుకే వారిని ప్రొటెక్షన్ వాచర్లుగా, స్ట్రైక్ ఫోర్సులుగా నియమించారు. మొత్తం 600 మందికి ఉద్యోగాలు ఇచ్చి రక్షణగా నియమించారు. వేసవిలో వన్యప్రాణులకు నీటిఎద్దడి లేకుండా అవసరమైన చోట్ల సాసర్పిట్లు ఏర్పాటు చేసి వాటిని ఎప్పటికప్పుడు నీటితో నింపుతున్నారు. పులుల గణన ప్రారంభం ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పులుల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్‌ఎస్‌టీఆర్‌లో ఉండే పులులు శేషాచలం అడవులకు వెళ్లి వస్తున్నాయని అధికారులు గుర్తించారు. వివిధ దశల్లో 80 రోజుల పాటు డేటాను సేకరిస్తారు. ఫిబ్రవరి 20 నుంచి 20 రోజుల పాటు నంద్యాల, పోరుమామిళ్ల, లంకలమల, శేషాచలం కారిడార్‌లో వివరాలు సేకరించారు. మార్చి 11 తర్వాత మిగతా ఏరియాలో కెమెరాలను బిగించి మరో 20 రోజుల పాటు మార్చి 31 వరకు డేటాను సేకరిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి 20 వరకు ఆత్మకూరు, మార్కాపురం డివిజన్లో ఏప్రిల్ 21 నుంచి మే 10 వరకూ డేటాలను సేకరిస్తారు. వీటి ఆధారంగా పులుల సంఖ్యను లెక్కిస్తారు. పక్కాగా గణన పులుల గణన పక్కాగా సేకరిస్తున్నాం. ఎక్కడికక్కడ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశాం. ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రొటెక్షన్ వాచర్లను నియమించాం. వేసవిలో వాటికి నీటి అవసరాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 120 సాసర్ పిట్లు ఏర్పాటు చేసి వాటి నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఉంచాం. – మహ్మద్ హయత్, ఎఫ్ఆర్ఓ, బయోడైవర్శిటీ కేంద్రం, శ్రీశైలం -
తుపాకులు ఇంటిపేరుతో తుపాకీ పడితే ఆ కిక్కే...వేరుకదా
అవి ఆంగ్లేయులు పాలిస్తున్న రోజులు. ఉప్పు మీద ఆంక్షలు కొనసాగుతున్న వేళ.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ సమయంలో ఆంగ్లేయులు మనవాళ్లనే రక్షణ కోసం వాడుకున్నారు. 18 ఏళ్లు దాటి ధృడంగా ఉన్న యువకులను మిలిటరీ, ఉప్పు కొఠార్లు వద్ద జవాన్లుగా ఎంపిక చేశారు. ఆ నాడు అలా రక్షణ కోసం పడిన అడుగులు నేడు దేశ భక్తి వైపు నడిపించాయి. చిత్రమేమిటంటే పూర్వీకుల నుంచి వంశపారపర్యంగా ఈ కొలువులు చేస్తున్న వారి ఇంటిపేరు ‘తుపాకుల’. దశాబ్దాలుగా దేశ రక్షణ వ్యవస్థలోనే అనేక విభాగాల్లో తుపాకుల వంశీయులు స్థిరపడి సేవలందిస్తున్నారు.ఆ వంశీయులే కాకుండా.. వారి అల్లుళ్లు సైతం ఇవే వ్యవస్థల్లో కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు భారతదేశ సరిహద్దుల్లోని ప్రతి బెటాలియన్‌లో తారసపడతారు. ఇంటి పేరును ఆయుధంగా మార్చుకుని వందలాది మంది తుపాకులు చేతపట్టారు. ‘తుపాకుల’ వంశం వివరాలు, వీరి దేశభక్తిని తెలుసుకుందామా మరి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సముద్ర తీరప్రాంత గ్రామం కనపర్తి. దీనికి చారిత్రాత్మక గుర్తింపు ఉంది. పూర్వం ఈ గ్రామాన్ని కనకపురి పట్టణం అనేవారు. కార్తవ రాయుడు పాలించిన గడ్డ ఇది. ముత్యాలు, వజ్రాలు, రత్నాలను కుప్పలుగా పోసి అమ్మేవారని పూరీ్వకుల కథనం. ఇక్కడ పురావస్తు ఆనవాళ్లకు గుర్తుగా నంది విగ్రహాలు, బౌద్ధ మతానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతంపై బ్రిటీష్ వాళ్ల కళ్లు పడ్డాయి. కనపర్తి, పెదగంజాం, దేవరంపాడు ప్రాంతాల్లో ఉప్పు పండించేవారు బ్రిటీష్ పాలకులు. బకింగ్ హాం కెనాల్ నుంచి ఉప్పును తమ దేశానికి తరలించే వారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైంది. ఆ తర్వాత కనపర్తికి పక్కనే ఉన్న దేవరంపాడులో నిర్వహించిన ఉప్పు సత్రాగ్రహానికి మహాత్మా గాంధీ వచ్చి స్వాతంత్య్ర సమర యోధులకు మద్దతు పలికారు కూడా. తమకు రక్షణగా ఉన్న బెటాలియన్లోకి, ఉప్పు పొలాల వద్ద రక్షణగా పనిచేసేందుకు స్థానికంగా ఉన్న తుపాకుల వంశీయులను గార్డులుగా నియమించుకున్నారు. వీరు దృఢంగా, భారీ కాయులుగా ఉండటంతో వారిని ప్రత్యేకంగా ఆ కొలువుల్లోకి తీసుకునేవారు. మరికొందర్ని బలవంతంగా బ్రిటీష్ మిలిటరీలోకి తీసుకెళ్లారు. బ్రిటీష్ హయాంలో కనపర్తిలో సాల్ట్ సూపరింటెండెంట్ కార్యాలయం కూడా ఉంది. ఆ సాల్ట్ కార్యాలయానికి ఎదురుగానే బ్రిటీష పోలీస్ క్వార్టర్స్ కూడా ఉండేవి. పోలీస్ క్వార్టర్స్ ప్రస్తుతం శిథిలమైపోయాయి. సాల్ట్ కార్యాలయం కూడా అవసాన దశకు చేరుకుంది. మిలిటరీ వాళ్లకు పెట్టింది పేరు కనపర్తి పెద్ద ఊరు కనపర్తి తోపు తొలుత మిలిటరీ, ఆ తర్వాత పోలీస్, కాలక్రమేణా ఇతర యూనిఫాం విభాగాల్లో సేవలు అందిస్తే.. కనపర్తి పెద్ద ఊరు మాత్రం మిలిటరీ ఉద్యోగాలకు పెట్టింది పేరు. ప్రస్తుతం 150 మందికిపైగా దేశ సేవలో పునీతులవుతున్నారంటే ఆ ఉద్యోగాలంటే ఎంత మక్కువో అర్థమవుతోంది. ఆ గ్రామం నుంచి నలుగురు మిలిటరీలో కెపె్టన్లుగా పదవీ విరమణ చేసిన వారున్నారు. వారిలో తుపాకుల వంశీయులతో కలిసి పాకిస్థాన్, బంగ్లాదేశ్, బర్మా, చైనా యుద్ధాల్లో పాల్గొన్న వారు కూడా ఉన్నారు. పులుగు వెంకటేశ్వరరెడ్డి, కుక్కల వెంకటేశ్వరరెడ్డి కెపె్టన్లుగా పనిచేశారు. వారు కాలక్రమేణా వయస్సు రీత్యా మృతి చెందారు. ఇకపోతే 33 సంవత్సరాల పాటు సేవలందించిన కుక్కల శివారెడ్డి, సూరిబోయిన వెంకటప్పలనాయుడు కూడా కెపె్టన్లుగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం చాలా మంది బయట ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. మిలిటరీలో తొలి అడుగుతుపాకుల చెన్నయ్య ఆయన సోదరులు 1930 సంవత్సరానికి ముందు తుపాకుల చెన్నయ్య మొదటిసారిగా బ్రిటీష్ మిలిటరీలోకి వెళ్లారు. వాళ్లు నలుగురు సోదరులు. వాళ్లందరూ కూడా మిలిటరీలో దేశానికి సేవచేసిన వారే. తర్వాత ఆయన సంతానం పెద చెన్నయ్య, సోమయ్య, బంగారయ్యలు పోలీసులుగా విధులు నిర్వర్తించారు. ఆయనకు నలుగురు సంతానంలో తుపాకుల సుబ్బయ్య, రంగయ్య, వెంకటేశ్వర్లు, వీర రాఘవయ్యలు. వీళ్లందరూ కూడా పోలీసులే. ఈ నలుగురు సంతానంలో ఒక్కొక్క ఇంట్లో నలుగురు మొదలుకుని ఎనిమిది మంది వరకు పోలీసులుగా ప్రజలకు సేవలు అందించారు. ప్రతి ఇంట్లో పోలీసులే... కనపర్తి తోపు గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో పోలీసులే కనపడతారు. తుపాకులతో పాటు ఆవుల, బొజ్జా అనే ఇంటిపేరు వారు కూడా తుపాకుల వారితో పోటీ పడి మరీ పోలీసులతో పాటు ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ ఇలా యూనిఫాం విభాగాల్లోనే సేవలు అందించారు. కానిస్టేబుల్ మొదలుకుని ఏఎస్పీ వరకు అన్ని హోదాల్లో పనిచేసిన వారు ఇక్కడ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. గ్రామంలో ఎనిమిది వందల గడపలు ఉంటే యూనిఫాం లేని ఇల్లు ఉండదు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఏ నగరంలోనైనా, ఏ జిల్లా కేంద్రంలోనైనా తుపాకుల ఇంటి పేరు ఉన్న వారు పోలీసు కొలువుల్లో కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు. తుపాకులు ఇంటిపేరుతో తుపాకీ పడితే ఆ కిక్కే...వేరుకదా పోలీస్ విభాగంలో ఉత్సాహంగా చేరాం నేను చిన్నతనంలో ఊరికి మిలిటరీ, పోలీస్ డ్రెస్సులు వేసుకుని బంధువులు వస్తుండేవారు. అది చూసి చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలన్న ఆశ ఎక్కువగా ఉండేది. మా ముత్తాతలు మిలిటరీలో పనిచేశారు. ఆ తర్వాత మా తాతలు నలుగురు పోలీసులే. మా నాన్న వీరరాఘవయ్య పోలీస్ విభాగంలో పనిచేశారు. మా పెదనాన్నలు సుబ్బయ్య, రంగయ్య, వెంకటేశ్వర్లు కూడా పోలీస్ విభాగాల్లోనే పనిచేశారు. మా పెదనాన్నల కుమారులు, మా అన్నదమ్ములు పోలీస్ విభాగాల్లోనే పనిచేశారు. నేను ఎక్సైజ్ సెలక్షన్స్‌కు వెళ్లాను. మొదటి ప్రయత్నంలోనే ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ఎక్సైజ్ విభాగంలో ఏడాదిన్నర క్రితం ఎస్సైగా పదవీ విరమణ పొందాను. మా ఇంటి ఆడపిల్లల్ని అందరినీ పోలీస్ విభాగంలో పనిచేసిన వారికే ఇచ్చారు మా తల్లిదండ్రులు. అందరం సంతోషంగా ఉన్నాం. – తుపాకుల చెన్నకేశవరావు, రిటైర్డ్ ఎస్సై, ఎక్సైజ్ విభాగం ఏఎస్పీలుగా ముగ్గురు పదవీ విరమణ కనపర్తి గ్రామానికి చెందిన వారిలో ముగ్గురు ఏఎస్పీలుగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. వారిలో తుపాకుల రామకృష్ణ ఏఎస్పీగా రిటైరై తెనాలిలో కుటుంబంతో స్థిరపడ్డారు. మరొకరు తుపాకుల వెంకటేశ్వరరావు ఏఎస్పీగా రిటైరై గుంటూరులో ప్రస్తుతం న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఇంకొకరు ఆవుల సుబ్బారావు ఏఎస్పీగా రిటైరై కాకినాడలో స్థిరపడగా, తుపాకుల మురళీకృష్ణ డీవైఎస్పీగా తిరుపతిలో పనిచేస్తున్నారు. ఇక సీఐ, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, అటు పోలీస్, ఇటు ఎౖజ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. యూనిఫాం విభాగాలు కాకుండా ఇతర ప్రభుత్వ విభాగాల్లో కూడా పనిచేసిన, చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఆడపిల్లలను పోలీసులకే ఇచ్చి వివాహం మొదటి నుంచి తుపాకుల వంశీయులు మిలిటరీ, పోలీస్ విభాగాల్లో పనిచేస్తున్నప్పటికీ వారి ఇంటి ఆడపడుచులను కూడా ఆయా విభాగాల్లో పనిచేస్తున్న వారికే ఇచ్చి సంబంధాలు కలుపుకున్నారు. ఆ విధంగా పుట్టినిల్లు, మెట్టినిల్లు యూనిఫాంలు ధరించే వారితో కలర్ఫుల్గా ఉండటాన్ని వారు కూడా స్వాగతించారు. మా వంశం మొత్తం మిలిటరీ, పోలీసులుగానే మా వంశం మొత్తం మిలిటరీ, పోలీస్ విభాగాల్లోనే పనిచేశారు. మా ముత్తాత కూడా మిలిటరీలో పనిచేశారని మా తాత చెప్పేవారు. మా తాత రాఘవయ్య బ్రిటీష్ వాళ్ల వద్ద జవానుగా పనిచేశారు. మా నాన్న కోటయ్య 1939లో బ్రిటీష్ వాళ్ల వద్ద జవానుగా పనిచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అర్హతను బట్టి మిలిటరీలోకి, పోలీస్ విభాగంలోకి, ఎక్సైజ్ విభాగంలోకి వేరే ఇతర విభాగాల్లోకి పంపించారు. నేను పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి 2010లో పదవీ విరమణ పొందాను. – బొజ్జా కృష్ణమూర్తి, రిటైర్డ్ ఏఎస్సై, పోలీస్ విభాగం -
కొక్కొరొకో.. ఎంత సొగసో.. అందాల పోటీలకు సై అంటున్న కోడిపుంజులు
‘‘నడత హుందాగా ఉండాలి..నడకలో హొయలొలకాలి..రంగు మెరిపించాలి.. పొంగు భళా అనిపించాలి..’’ ఇవి గ్లామర్ కాంటెస్ట్‌లో పోటీపడే బ్యూటీలకు కావాల్సిన అర్హతలని చదువుతుంటేనే అర్థమైపోతుంది. అయితే ఆ అందం గంప కింద నుంచి రావాలి అనే కొత్త రూల్ చదివితే మాత్రం మైండ్ బ్లాంకైపోతుంది. అవును.. ఆ గంప కింద ఉన్న కోడి ఇప్పుడు అందాల ర్యాంప్‌పైన కూస్తోంది. తోటి కోళ్లతో పోటీపడి మరీ వయ్యారాలొలకబోస్తోంది. అందాల కోడి కిరీటం కోసం ‘సై’ అంటోంది. కోడేమిటి? అందాల పోటీలేమిటి? సమాధానమే ఈ కథనం..ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా మరి.. కొమరోలు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ బాష ..పక్షి ప్రేమికుడు. ఇతని వద్ద రకరకాల పక్షులతోపాటు వివిధ రకాల కోడి పుంజులు, పెట్టలు ఉన్నాయి. ప్రత్యేకంగా కనిపిస్తున్న పుంజుల గురించి అడగగా..ఇవి అందాల పోటీల కోళ్లని చెప్పడంతో ఆశ్చర్యపోయాం.. వాటి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగింది. అందాల పోటీలా? ఎక్కడ జరుగుతున్నాయి..? ఏంటి ప్రత్యేకతలు అని ప్రశ్నించాం.. మనకు సంప్రదాయ బద్ధంగా సంక్రాంతికి గోదారోళ్లు నిర్వహించే కోడి పందేల్లా..తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దాదాపు 50 సంవత్సరాలుగా అందాల పోటీలు నిర్వహిస్తున్నారని చెప్పాడు. జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఈ పోటీలకు హాజరవుతున్నాం. ఈ సారి రాష్ట్రంలోని పెంపకందారులం అందరం కలసి అసోసియేషన్‌గా ఏర్పడ్డాం. అనంతపురం జిల్లాలో తొలిసారిగా సంక్రాంతికి కోడి అందాల పోటీలు నిర్వహించారని చెప్పాడు. తమిళనాడు, కేరళ, కర్నాటక, చత్తీస్ఘడ్, ఒడిసా, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల వారు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు. వయ్యారాలొలకబోసే కోడి పుంజుల ప్రత్యేకతలు తెలుసుకుందాం.. ఆహార్యం..అద్భుతం ఈ పోటీల్లో పాల్గొనే పుంజులు ప్రత్యేక ఆహార్యాన్ని కలిగి ఉండాలి. తల నుంచి బాడీ, తోక, కాళ్ల వరకూ అన్నీ విభిన్నంగా ఉండాల్సిందే. మెడ నిటారుగా 90 డిగ్రీలో బాడీ ఉండాలి. తెల్ల కళ్లు బెస్ట్ క్వాలిటీ..తలపై భాగం జుట్టు ఎర్రగా ఉండి గుండ్రంగా గులాబి రేకుల్లా ముద్దగా పువ్వు అతికించినట్టుగా ఉండాలి. బాడీ దృఢంగా ఉండి కాళ్లు..కాళ్లు మధ్య ఎడం ఉండాలి. బాడీ బిల్డర్ ఎలా నడుస్తాడో అలా నడకలో స్టైల్ ఉండాలి. కాళ్ల వేళ్లు పొడవుగా చక్కగా ఉండాలి. తోక అందంగా ఉండి ఈకలు దుబ్బగా ఉండాలి. తెలుపు, రెడ్, బ్లాక్ కిరీ ఇలా కోడి మొత్తం ఫ్యాన్సీ కలర్లో ఉంటే అందరూ ఇష్టపడతారు. ఎంపిక ఇలా.. అందాల పోటీల ఎంపిక ఇలా ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన కోళ్లను ముందుగా నిర్వాహకులు పరిశీలిస్తారు. అర్హమైన వాటిని గుర్తిస్తారు. వాటికి నంబర్‌తో కూడిన ట్యాగ్లు ఇస్తారు. ఐదుగురు న్యాయనిర్ణేతలు ఉంటారు. అందులో ప్రభుత్వాధికారులు (పశుసంవర్ధకశాఖకు చెందిన) కూడా ఉంటారు. మధ్యలో ఒక టేబుల్ ఏర్పాటు చేస్తారు. నంబర్ ప్రకారం పిలుస్తారు. టేబుల్‌పై ఉంచిన పుంజును జడ్జిలు పరిశీలించి మార్కులు ఇస్తారు. ఒకరు ముక్కు నుంచి మెడ వరకూ ఎంత దూరం ఉంది అని పరిశీలిస్తారు. మరొకరు బాడీ స్టైల్, రంగు, కాళ్లు, కళ్లు ఇలా అన్నీ పరిశీలిస్తారు. ఈ ఐదుగురు ఇచ్చిన మార్కులను కలుపుతారు. అందులో ఎక్కువ మార్కులు వచ్చిన పుంజును విజేతగా ప్రకటిస్తారు. ప్రత్యేక శిక్షణ: పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పోటీలకు మూడు నెలల నుంచి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ శిక్షణ ఇస్తారు. బెదురు పోయేందుకు బాడీని నిమురుతారు. అలాగే నీళ్లతో తడుపుతారు. ఇసుకలో పొర్లిస్తారు. ఇలా చేయడం ద్వారా ఈక ఒత్తుగా ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రెండేళ్లు పెంచుతారు. పోటీలకు సిద్ధమయ్యే పుంజులు ఏడు నుంచి ఎనిమిది కేజీల బరువు ఉండేలా చూసుకుంటారు. డబుల్ బాడీ వచ్చేలా ఫీడింగ్ ఇస్తారు. గంభీరంగా బాడీబిల్డర్‌లా ఉంటుంది. కాళ్లు దృఢంగా, పాదాలు పెద్ద పెద్దగా ఉండేలా చూసుకుంటారు. వీటిని ఎక్కువగా అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పెంచుతారు. పౌష్టికాహారం... ఈ పోటీలకు సిద్ధం చేసే పుంజులకు ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. జొన్నలు, రాగులు, గోధుమలు, సజ్జలు, మొక్కజొన్న, పెసలు, గుడ్డు, ఖర్జూరం, పిస్తా, బాదం, జీడిపప్పు, పండ్లు తినిపిస్తారు. రోజూ మూడు విడతలుగా ఆహారం ఇస్తారు. అరటి, ద్రాక్ష, దానిమ్మ, సమ్మర్లో వేడి తగ్గించేందుకు పుచ్చకాయ పెడతారు. ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది వరకూ కొలత ప్రకారం జొన్నలు, రాగులు, సజ్జ, మొక్కజొన్న, పెసలు, గోధుమలు ఇస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు కోడి గుడ్డు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినిపిస్తారు. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు అరటి, దానిమ్మ, ద్రాక్ష పండ్లు ఇస్తారు. ఇలా క్రమం తప్పకుండా ఆహారం ఇవ్వడంతో శరీరం బలిష్టంగా ఉంటుంది. అందాల పోటీలకు ఒక కోడిని తయారు చేసేందుకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. చిన్నప్పటి నుంచి మంచి ఆహారాన్ని ఇస్తే ఎదుగుదల బాగుంటుంది. క్రాస్ బ్రీడింగ్.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఉండే బ్రీడర్ దగ్గర నుంచి బ్రీడ్ తెచ్చుకుంటారు. ఇక్కడ పెట్టలతో క్రాస్ బ్రీడ్ చేస్తారు. అలా వచ్చిన పుంజులను రెండేళ్లపాటు పెంచుతారు. వీటి గుడ్డు కూడా చాలా విలువైంది. నాణ్యతను బట్టి రేటు ఉంటుంది. మన జిల్లాలో రూ.1000 ఉంటుంది. తమిళనాడులో అయితే రూ.5 వేల వరకూ ఉంటుంది. చిన్న, చిన్న పిల్లలను ఆసక్తి ఉన్నవారికి విక్రయిస్తుంటారు. ఆసక్తితోపాటు ఆదాయం.. చిన్నప్పటి నుంచి పక్షులను పెంచడం హాబీగా ఉండేది. తమిళనాడులో అందాల పోటీలు నిర్వహిస్తున్నారని మిత్రుడు చెప్పాడు. ఒకసారి వెళ్లి చూసి వచ్చిన తర్వాత కోడి పుంజులను పెంచాలన్న ఆసక్తి నెలకొంది. మంచి బ్రీడ్లను తీసుకొచ్చాను. అలా పుంజులను పోటీలకు సిద్ధం చేస్తున్నా. అనంతపురంలో తొలిసారిగా నిర్వహించిన పోటీలకు పుంజును తీసుకువెళ్లా. ఈ పోటీల్లో నాలుగో స్థానం వచ్చింది. వీటిని పెంచి ఆసక్తి ఉన్నవారికి విక్రయించడం ద్వారా ఉపాధి కూడా ఉంటోంది. – సయ్యద్ బాష, రాజుపాలెం, కొమరోలు మండలం చదవండి: బ్రాండెడ్ గుడ్డు గురూ.. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్! -
ఆలిండియా లెవల్లో ప్రకాశం కోడి పుంజు సత్తా
ప్రకాశం: ఆలిండియా చిలకముక్కు కోళ్ల అందాల పోటీల్లో కొమరోలు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన కోడి పుంజు 4వ స్థానంలో నిలిచింది. గ్రామానికి చెందిన కోళ్ల పెంపకందారుడు సయ్యద్ బాషా తన కోళ్లతో సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన కోళ్ల అందాల పోటీల్లో పాల్గొన్నారు. తన కోడికి బహుమతి దక్కడంపై బాషా ఆనందం వ్యక్తం చేశారు. -
రష్యా టూ నల్లమల.. 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి..
సాక్షి, ప్రకాశం: రష్యా నుంచి విదేశీ పక్షులు నల్లమల ప్రాంతానికి వచ్చాయి. రష్యా, మధ్య ఆసియా, ఉజ్బెకిస్తాన్, కజికిస్తాన్ దేశాల నుంచి సుమారు 8 వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ పక్షులు ప్రస్తుతం నల్లమలలో తిరుగుతున్నాయి. పెద్దదోర్నాల, రోళ్లపెంట ప్రాంతాల్లో వీటిని బయోడైవర్శిటీ శ్రీశైలం ఎఫ్ఆర్వో హాయత్ ఫొటోలు తీశారు. ప్రతి ఏడాది డిసెంబర్ మొదటి వారంలో పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి ఫిబ్రవరి నెలలో మళ్లీ సొంత గూటికి చేరతాయన్నారు. అరుదైన ఈ పక్షులు నల్లమలకే అందాలనిస్తున్నాయని చెప్పారు. మన దేశంలో నల్లమలలోని శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులోనే ఈ పక్షులు ఉన్నాయి. గడ్డి మైదానాలకు మాత్రమే ఈ పక్షులు వలస వస్తాయి. మిడతలు, చిన్నచిన్న పురుగులను తిని జీవిస్తాయి. ఈ సమయంలో మధ్య ఆసియాలో ఆహారం దొరకదు. దీంతో విడిది కోసం ఇక్కడికి వచ్చి ఆహారం తింటూ ఎండలు ప్రారంభం కాగానే వెళతాయి. డేగ జాతికి చెందిన ఈ పక్షులలో మాన్టెగ్యూస్ హారియర్, పాలిడ్ హారియర్, ఎరూషియన్ మార్స్ హారియర్ ముఖ్యమైనవి. నెల రోజుల పాటు కష్టపడి వీటి జీవనశైలిని పరిశీలించి ప్రత్యేక కెమెరాలతో ఫొటోలు తీసినట్టు హాయత్ తెలిపారు. -
ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
-
టీడీపీ నాయకుల బరితెగింపు
జరుగుమల్లి: ప్రకాశం జిల్లా గొంగటిరెడ్డిపాలెంలో టీడీపీ నాయకులు మంగళవారం దౌర్జన్యానికి పాల్పడ్డారు. వినాయకుడి నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్తున్న వైఎస్సార్సీపీ వర్గీయులను అడ్డుకొని.. కులం పేరుతో దూషించారు. కారును ఊరేగింపు మీదకు దూకించి.. ముగ్గురిని తీవ్రంగా గాయపరిచారు. వినాయకచవితి సందర్భంగా గొంగటిరెడ్డిపాలెంలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయులు వేర్వేరుగా వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. రెండు రోజుల కిందట టీడీపీ వాళ్లు తమ వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. మంగళవారం వైఎస్సార్సీపీ వర్గీయులు తమ విగ్రహంతో నిమజ్జనానికి బయల్దేరారు. ఇంతలో టీడీపీ నాయకుడు బండి మాలకొండారెడ్డి కుమారులైన కొండారెడ్డి, మాల్యాద్రి రోడ్డుకు అడ్డంగా కార్లు పెట్టి.. ఊరేగింపును అడ్డుకున్నారు. దీంతో ‘మీ బొమ్మను మేము అడ్డుకోలేదు కదా.. మాకెందుకు అడ్డు పడుతున్నారు’ అని వారిని వైఎస్సార్ సీపీ వర్గీయులు ప్రశ్నించారు. కొండారెడ్డి, మాల్యాద్రి వెంటనే తమ కార్లను రోడ్డుపై విచక్షణారహితంగా తిప్పుతూ.. ఒక్కసారిగా ఊరేగింపులో ఉన్న వారి మీదకు దూకించారు. మల్లవరపు పోలయ్య అనే వ్యక్తి కాలు మీదకు కారు ఎక్కించిన కొండారెడ్డి.. అతన్ని కులం పేరుతో దూషిస్తూ, ‘మీకు కూడా వినాయకుడు కావాలా..’ అంటూ హేళన చేశాడు. పోలయ్య, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు ఎదురుతిరిగి పోలీసులకు సమాచారమివ్వడంతో మాల్యాద్రి పారిపోయాడు. కొండారెడ్డి మాత్రం గోడకు తల బాదుకొని.. తనను కొట్టారంటూ పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి కందుకూరు ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. గాయపడిన వారిని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ఎస్ఐ సురేష్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 300 సిలిండర్లున్న లారీలో పేలుడు
ప్రకాశం జిల్లా కోమరోలు మండలం దద్దవాడ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్పీజీ సిలిండర్లతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలాయి. ఈ భారీ శబ్దాలకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగులు తీశారు. కర్నూలు నుండి ప్రకాశం జిల్లా ఉలవపాడుకి వెళ్తున్న ఈ లారీలో మొత్తం 300 సిలిండర్లు ఉన్నట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. మంటలు రావడం గమనించి లారీ నుంచి దిగి ప్రాణాలు దక్కించుకున్నాడు. చదవండి: మార్గదర్శి కేసులో హైకోర్టు స్టే -
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూ ప్రకంపనలు
దుత్తలూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)/ పామూరు: నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో సాయంత్రం 5.10 గంటల ప్రాంతంలో పెద్ద శబ్ధంతో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. ప్రజలు భయాందోళన చెంది ఇళ్లలోంచి పరుగులు తీశారు. కాగా, కలిగిరి మండలంలోని గంగిరెడ్డిపాళెం, తెల్లపాడు, కృష్ణారెడ్డిపాళెం ప్రాంతాల్లో శనివారం రాత్రి 9.11 గంటల సమయంలో నాలుగు సెకన్లపాటు పెద్ద శబ్ధంతో భూమి స్వల్పంగా కంపించింది. పామూరులో.. ప్రకాశం జిల్లా పామూరు తోపాటు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం సుమారు 5.20 గంటల సమయంలో 3 నుంచి 5 సెకన్లపాటు రెండు మార్లు స్వల్పంగా భూమి కంపించింది. ఈ సందర్భంగా పట్టణంలోని ఆకులవీధి, కాపువీధి, ఎన్జీవో కాలనీతోపాటు మండలంలోని ఇనిమెర్ల, నుచ్చుపొద, వగ్గంపల్లె, రావిగుంటపల్లె సహా పలు గ్రామాల్లో భూమి కంపించింది. ఇళ్లలోని వస్తువులు కదిలాయి. ఆకులవీధి, కాపువీధిలోని ప్రజలు భయాందోళనతో రోడ్లపైకి వచ్చారు. -
మూడేళ్లలో 30 ఏళ్ల అభివృద్ధి: ఎమ్మెల్యే బుర్రా
వెలిగండ్ల: రాష్ట్రంలో మూడేళ్లలో 30 ఏళ్ల అభివృద్ధి చేసి చూపించిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, టీటీడీ పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. మండలంలోని హుస్సేన్‌పురం, తమ్మినేనిపల్లి, పద్మాపురం, బొంతగుంట్లపల్లి గ్రామాల్లో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ హుస్సేన్‌పురం గ్రామ సచివాలయంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించనని హెచ్చరించారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ బుక్‌లెట్‌ను పంపిణీ చేశారు. ప్రతి ఇంటికీ చేకూరిన లబ్ధి వివరించారు. హుస్సేన్‌పురంలో మంచంలో నడవలేని స్థితిలో ఉన్న యాదమ్మతో సీఎం జగనన్న మీ కుటుంబానికి మూడేళ్లలో వైఎస్సార్ పింఛన్ కానుక కింద రూ.82 వేలు ఇచ్చారన్నారు. సీఎం వైఎస్ జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ సారికూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే వస్తుందని యాదమ్మ బదులిచ్చారు. పద్మాపురంలో అక్కి యోగమ్మకి సుగర్ కారణంగా రెండు కాళ్లూ తీసివేయడం చూసి ఎమ్మెల్యే బుర్రా చలించిపోయారు. మూడు వేల పింఛన్ తీసుకుంటున్న యోగమ్మకు ఐదు వేల పింఛన్ మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే బుర్రా ఆదేశించారు. తమ్మినేనిపల్లిలో తమ్మినేని పెద్దిరెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఎమ్మెల్యే ఆయన్ను పరామర్శించారు. మెరుగైన వైద్యం సేవలు అందించాలని రిమ్స్ వైద్యులను కోరారు. (క్లిక్: 24 గంటల్లోనే ఆ బాలుడికి పింఛన్..) ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎదురైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎంపీపీ రామన మహాలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు గుంటక తిరుపతిరెడ్డి, ఎంపీడీఓ సుకుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామన తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు డి.జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు సంఘ అధ్యక్షుడు తమ్మినేని శివరామయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు యెలికె రమణయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు టి.దేవసహాయం, వై.నాగూర్‌యదవ్ , పీఏసీఎస్ చైర్మన్ కాకర్ల వెంకటేశ్వర్లు, పొల్లా సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ సీపీ నాయకులు ఉండేల చిన వెంకటరెడ్డి, కర్నాటి చిన వెంకటరెడ్డి, రామకృష్ణ, వెంకటరెడ్డి, కె. వెంకట్రామయ్య, కె.అంకిరెడ్డి పాల్గొన్నారు. (క్లిక్: ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు షాక్) -
టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కీలక నేత రాజీనామా
జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గ్రూపు తగాదాలు.. అన్నదమ్ముల కొట్లాటలు.. పార్టీ పెద్దల తీరుతో ద్వితీయశ్రేణి నేతల తీవ్ర అసంతృప్తులతో సతమతమవుతున్న ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీ కీలక నాయకుడు, దర్శి టీడీపీ ఇన్చార్జి పమిడి రమేష్ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. పార్టీ కోసం తాను ఎంత కష్టపడినా అధినేత గుర్తించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి తాళాలు వేసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దర్శి టీడీపీలో ముసలం మొదలైంది. ఇప్పటికే దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిన ఆ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఇన్చార్జిగా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు పమిడి రమేష్ పరోక్షంగా ప్రకటించడంతోపాటు, అధిష్టానం తాను కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపు లేదనే వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల ఒంగోలు నగర శివారులో జరిగిన మహానాడుతో రాష్ట్రవ్యాప్తంగా పారీ్టలో ఉత్సాహం నింపాలనే టీడీపీ అధినేత చంద్రబాబు విపరీతమైన ప్రచారాలు చేసినా ఫలితాలు ఇవ్వడం లేదన్నది ఈ సంఘటనతో రుజువైంది. జిల్లాలో ఇప్పటికే పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గంలో గ్రూపుల గోల టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. అసలే పార్టీని ప్రజలు విశ్వసించని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పార్టీ అధినేత నుంచి ఇన్చార్జి వరకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ఆందోళనలు చేయకుండా పర్సనల్ విషయాలను తెరపైకి తెచ్చి రాజకీయాలు చేయడం పట్ల ఆ పార్టీలోనే తీవ్ర అసంతృప్తి మొదలైంది. 2020 నవంబరు నుంచి దర్శి నియోజకవర్గ ఇన్చార్జిగా పమిడి రమేష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరిగి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. పార్టీ కార్యక్రమాలకు సొంత డబ్బును ఖర్చు చేస్తూ వచ్చారు. ఇంత చేస్తున్నా పార్టీ అధిష్టానం తనను గుర్తించడం లేదని సన్నిహితుల వద్ద పలు మార్లు వాపోయినట్టు సమాచారం. ఇదిలా ఉండగా మహానాడు తరువాత పారీ్టలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. పార్టీ అధినేత సైతం పట్టించుకోకపోవడంతో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన వర్గీయులు బహిరంగంగానే చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి తాళాలు వేయడంతో ఇక దర్శి నియోజకవర్గంలో టీడీపీ క్లోజ్ అనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. మరో రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ బాధ్యతలు మోసేవారు కరువడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 75 నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్చార్జిలు లేరని స్వయంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్పుకునే నారా లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో దర్శికి కూడా ఇన్చార్జి లేకుండా పోవడం ఆపార్టీ దీన స్థితికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ సీపీలోకి మాజీ ఎమ్మెల్యేలు: దర్శి నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావుతోపాటు, 2012లో దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యరి్థగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు సైతం వైఎస్సార్సీపీలో చేరిపోయారు. దీంతో దర్శిలో టీడీపీకి నాయకత్వం వహించే దిక్కే లేకుండా పోయింది. 2020 నవంబరులో పమిడి రమేష్ టీడీపీ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో గ్రూపుల గోలతో నెట్టుకుంటూ వచ్చారు. అయితే టీడీపీ అధిష్టానం తీరుతో ఆవేదన చెంది ఇన్చార్జి పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆపార్టీ వర్గాల్లో చర్చ నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు, చీరాల, దర్శి, సంతనూతలపాడు, యర్రగొండపాలెం, గిద్దలూరు వంటి నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్చార్జిలు ఉన్నారా.. లేరా అన్నట్లుగా పరిస్థితి నెలకొని ఉంది. మహానాడు సూపర్ హిట్ అంటూ జబ్బలు చరుచుకుంటున్న ఆ పార్టీ.. మహానాడు నిర్వహించిన జిల్లాలోనే కనీస బలం కూడా పెంచుకోకపోవడం గమనార్హం. జిల్లాలో రోజురోజుకూ పార్టీ పరిస్థితి దిగజారిపోతోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శి టీడీపీకి దిక్కెవరు..? దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పమిడి రమేష్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ బాధ్యతలు స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ద్వితీయ శ్రేణి నేతల్లో ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నా గ్రూపు రాజకీయాలకు భయపడి ఎవరూ ముందుకు రావడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. దర్శి టీడీపీలో చెలరేగిన జ్వాలను చల్లార్చాలని ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం. పార్టీ పెద్దల తీరుమారకపోతే సొంతపార్టీ నేతలు, కార్యకర్తలే కాకుండా ప్రజలు సైతం ఛీత్కరించుకుంటున్న పరిస్థితి నెలకొంది. -
పొగాకు రైతుకు కలిసొచ్చిన వేళ
పొగాకు రైతుకు ఈ ఏడాది కలిసొచ్చింది. మార్కెట్లో మంచి రేటు లభించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గత ఏడాదితో పోల్చుకుంటే ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. ఈ ఏడాది కిలో పొగాకు సరాసరి రూ..178 రాగా గత సంవత్సరం సరాసరి రూ.141లు లభించింది. రైతు ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఇదిలా ఉండగా పొగాకు వేలం కూడా ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల రెండో వారంలో వేలం ముగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కందుకూరు/ఒంగోలు సబర్బన్: అంతర్జాతీయంగా డిమాండ్ ఉండడంతో పొగాకు మార్కెట్ ఆశాజనకంగా ఉంది. ఉమ్మడి ప్రకాశం పరిధిలోని అన్ని వేలం కేంద్రాల్లో అన్ని గ్రేడ్ల పొగాకును వ్యాపారుల పోటీపడి మరీ కొనుగోలు చేయడంతో రైతులు ఆశించిన స్థాయిలోనే ధరలు నమోదయ్యాయి. కందుకూరు వేలం కేంద్రాలు బోర్డు పరిధిలో నంబర్ వన్‌గా నిలిచింది. బ్రైట్ గ్రేడ్ కేజీ పొగాకు ధర సీజన్ మొత్తం రూ.186 వద్ద స్థిరంగా ఉండగా, మొదట్లో రూ.120 పలికిన లోగ్రేడ్ పొగాకు చివరికి వచ్చే సరిసరి రూ.110లుగా పలికింది. దీంతో కేజీ పొగాకు సరాసరి ధర ఇప్పటి వరకు కందుకూరు–1లో రూ.178.38, కందుకూరు–2లో రూ.178.46 వచ్చింది. మిగిలిన అన్ని వేలం కేంద్రాల్లోను రూ.167ల నుంచి రూ.174ల పరిధిలోనే ఉన్నాయి. మిగిలిన వేలం కేంద్రాలతో పోల్చుకుంటే కందుకూరు వేలం కేంద్రాల్లో సరాసరి ధరలు రూ.4 నుంచి రూ.11 వరకు అత్యధికంగా నమోదయ్యాయి. దీంతో ఈ ఏడాది మంచి లాభాలతో పొగాకు సీజన్‌ను ముగించేందుకు రైతులు సిద్ధమయ్యారు. మిగిలిన పంటలు దారుణంగా దెబ్బతీసిన నేపథ్యంలో పొగాకు ఈ ఏడాది రైతులను ఆర్థికంగా నిలబెట్టిందని భావిస్తున్నారు. స్థిరంగా మార్కెట్: ఈ ఏడాది వేలంలో భారీ ఒడిదుడుకులు ఏమీ లేకుండా పొగాకు మార్కెట్ స్థిరంగా కొనసాగింది. పొగాకు ఉత్పత్తి తగ్గి రైతులు ఆశించిన స్థాయిలోనే రేట్లు రావడంతో వేలం ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. దీంతో ఎస్ఎల్ఎస్ పరిధిలో వేలం ప్రక్రియ అటూ ఇటుగా రెండు నెలల వ్యవధిలోనే ముగించగలిగారు. ఎస్ఎల్ఎస్ పరిధిలో 39.47 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తులను అమ్ముకునేందుకు బోర్డు అనుమతి ఉండగా దిగుబడి తగ్గడంతో 33.16 మిలియన్ కేజీల ఉత్పత్తి మాత్రమే వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీనికిగాను ఇప్పటికే 32.74 మిలియన్ కేజీల పొగాకు విక్రయాలు పూర్తికాగా ఇంకా 0.78 మిలియన్ కేజీల పొగాకే మిగిలి ఉంది. ఇక కందుకూరు పరిధిలోని వేలం కేంద్రాల్లో మాత్రమే వేలం కొనసాగుతోంది. అత్యధిక పొగాకు ఈ రెండు వేలం కేంద్రాల్లోనే ఉండడంతో వేలం ఆలస్యమవుతోంది. వీటిలో కందుకూరు–1వ వేలం కేంద్రం పరిధిలో 8.03 మిలియన్ కేజీల పొగాకుకు అనుమతి ఉంటే 8.10 మిలియన్ కేజీల ఉత్పత్తి వస్తుందని అంచనా. దీనిలో ఇప్పటి వరకు 7.43 మిలియన్ కేజీలను అమ్మగా, ఇంకా 0.67 మిలియన్ కేజీల ఉత్పత్తులు అమ్మాల్సి ఉంది. ఈనెల 16వ తేదీ నాటికి ముగించనున్నారు. కందుకూరు–2లో 6.80 మిలియన్ కేజీలకు అనుమతి ఉంటే 6.70 మిలియన్ కేజీల ఉత్పత్తి వస్తుందని అంచనా. దీనిలో ఇప్పటికే 6.59 మిలియన్ కేజీలను విక్రయించగా ఇంకా 0.11 మిలియన్ కేజీలు అమ్మాల్సి ఉంది. ఈనెల 6వ తేదీ నాటికి వేలం ముగియనుంది. మొత్తం మీద రెండో వారం కల్లా ఎస్ఎల్ఎస్ పరిధిలోని వేలం కేంద్రాల్లో వేలం ప్రక్రియ పూర్తి కానుంది. చివరి దశలో వేలం.. పొగాకు వేలం పూర్తికావస్తోంది. దక్షిణ ప్రాంత తేలిక నేలల (ఎస్ఎల్ఎస్) పరిధిలో మొత్తం 6 వేలం కేంద్రాలుంటే నాలుగు కేంద్రాల్లో ఇప్పటికే పొగాకు వేలాన్ని ముగించారు. పొదిలి, కనిగిరి, కలిగిరి, డీసీపల్లి కేంద్రాల్లో వేలం ముగియగా కందుకూరు రెండు వేలం కేంద్రాల్లో మరో పది రోజుల్లో వేలం ముగియనుంది. పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో 11 వేలం కేంద్రాల్లో 67.74 మిలియన్ కేజీల పొగాకును కొనుగోలు చేయగా ఇంకా కేవలం 6.27 మిలియన్ కేజీల ఉత్పత్తులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిని ఈనెల మూడోవారంకల్లా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. టంగుటూరు పొగాకు వేలం క్రేందంలో శనివారం 681 పొగాకు బేళ్లు వ్యాపారులు కొనుగోలు చేశారు. కారుమంచికి చెందిన రైతులు 718 బేళ్లు వేలానికి తీసుకురాగా వాటిలో 681 కొనుగోలు చేశారు. 35 బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర రూ.188 కాగా, కనిష్ట ధర రూ.110, సరాసరి ధర రూ.182.70 పలికింది. వేలంలో మొత్తం 17 మంది వ్యాపారులు పాల్గొన్నారని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. కొండపి వేలం కేంద్రంలో శనివారం 731 పొగాకు బేళ్లను కొనుగోలు చేశారు. అనకర్లపూడి, ముప్పరాజుపాలెం, పెరిదేపి, మిట్టపాలెం, అక్కచెరువుపాలెం, గోగినేనివారిపాలెం, చోడవరం, ముప్పవరం, రామచంద్రాపురం, కట్టావారిపాలెం, నర్సింగోలు గ్రామాల నుంచి రైతులు 930 బేళ్లు వేలానికి తెచ్చారు. 731 బేళ్లు కొనుగోలు చేసి, 179 బేళ్లు తిరస్కరించారు. అత్యధిక ధర కేజీ పొగాకు రూ.187 పలకగా, అత్యల్పం రూ.110, సరాసరి ధర రూ.179.17 వచ్చింది. ఎస్బీఎస్ పరిధిలో... ఎస్బీఎస్ పరిధిలో ప్రకాశం జిల్లా పరిధిలోని వెల్లంపల్లి, ఒంగోలు–1, ఒంగోలు–2, టంగుటూరు, కొండపి వేలం కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 41.25 మిలియన్ కేజీల పొగాకుకు అనుమతి ఉండగా 40.50 మిలియన్ కేజీ ఉత్పత్తి వస్తుందని అంచనా. ఇప్పటికే 35.00 మిలియన్ కేజీల ఉత్పత్తుల అమ్మకాలు పూర్తిగా కాగా ఇంకా 5.49 మిలియన్ కేజీల పొగాకును అమ్మాల్సి ఉంది. ఈనెల 20వ తేదీకల్లా పూర్తిగా వేలాన్ని ముగించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పొగాకు సాగే ఈ ఏడాది రైతులను ఆదుకుంది పొగాకు పంట సాగు ఈ సంవత్సరం రైతులకు కలిసొచ్చింది. గతంలో వరుసగా నష్టాలు వచ్చినా ఈ ఏడాది మార్కెట్ బాగుండడంతో మంచి లాభాలు వచ్చాయి. మంచి పొగాకు క్వింటా రూ.18,600ల వరకు వచ్చింది. లోగ్రేడ్ పొగాకు కూడా కాస్త ఆటూ ఇటుగా బ్రైట్ గ్రేడ్‌తో సమానంగా రేట్లు వచ్చాయి. దీని వల్ల యావరేజ్ ధరలు ఎక్కువగా ఉండడంతో రైతులకు మంచి లాభాలు వచ్చాయి. ఈ సంవత్సరం పొగాకు పంటే రైతులకు కాస్త ఆదాయాలు తెచ్చిపెట్టింది. – అనుమోలు రాములు, పొగాకు రైతు,పోలినేనిపాలెం -
ఈతకు వెళ్లి నలుగురు బాలల మృత్యువాత
అక్కచెరువుపాలెం (కొండపి, జరుగుమల్లి)/రణస్థలం: ఈత సరదా నలుగురు బాలల ప్రాణాలను బలిగొంది. ఈతకొట్టేందుకు చెరువులోకి దిగిన ఆరుగురిలో నలుగురు మృత్యువాత పడగా మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం అక్కచెరువుపాలెంలో శనివారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చింతల కౌషిక్ (16), మద్దినేని సుబ్రహ్మణ్యం (16), మద్దినేని చందనశ్రీ (16), చీమకుర్తి మండలం బూసరపల్లికి చెందిన మున్నంగి శివాజీ (12), మున్నంగి చందన (14), దర్శి మండలం బసవన్నపాలెంకు చెందిన అబ్బూరి హరి భగవాన్ నారాయణ (11) శనివారం అక్కంచెరువుపాలెంలోని ఓ భవనం వద్ద ఆడుకున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత గ్రామానికి తూర్పున ఉన్న చెరువు వద్దకు వెళ్లారు. ముందుగా చెరువులో కౌషిక్, సుబ్రహ్మణ్యం, శివాజీ, హరిభగవాన్ నారాయణ దిగారు. ఈతకొడుతున్నట్లుగా ముందుకు పోయారు. వారి తర్వాత చందనశ్రీ,, చందనలు సైతం చెరువులోకి దిగారు. చెరువులో ముందుకెళ్లిన బాలురు లోతులో మునుగుతూ భయంతో కేకలు వేశారు. బాలికలు సైతం మునిగిపోతూ కేకలు వేయటం ప్రారంభించారు. చెరువుకు కూతవేటు దూరంలో చేలో పని చేసుకుంటున్న ప్రసాద్ విషయం గమనించి.. పరుగున చెరువులోకి దిగి ఒడ్డుకు దగ్గరలో ఉన్న బాలికలను రక్షించి బయటకు తీశాడు. ఈతరాని ప్రసాద్ అప్పటికే అలసి కేకలు వేయడంతో గ్రామస్తులు చెరువు వద్దకు పరుగున వచ్చారు. ఈ క్రమంలో చెరువులోకి దిగి బాలురను బయటకు తీయగా అప్పటికే చింతల కౌషిక్, మున్నంగి శివాజీ మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న మద్దినేని సుబ్రహ్మణ్యం, అబ్బూరి హరి భగవాన్ నారాయణను కారులో కందుకూరు వైద్యశాలకు తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన చందనశ్రీ,, చందన ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు బాధిత కుటుంబాలను పరామర్శించారు. సముద్రంలో ముగ్గురు గల్లంతు కాగా, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్‌జీఆర్‌పురం పంచాయతీలో గల పోతయ్యపేట సముద్ర తీరంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. పోలీసులు, స్థానిక మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలానికి చెందిన తిరుపతి గణేష్ శనివారం తన మేనకోడలు దీవెనను తీసుకుని అత్తవారింటికి వచ్చారు. సాయంత్రం పోతయ్యపేట సముద్ర తీరానికి కుటుంబంతో కలిసి వెళ్లారు. అందరూ స్నానాలు చేస్తుండగా గణేష్‌తోపాటు ఆయన కుమార్తె మానస (9), మేనకోడలు దీవెన (18) ఒక్కసారిగా గల్లంతయ్యారు. స్థానిక మత్స్యకారులు పడవలపై వెళ్లి గాలించినా ఫలితం కనిపించలేదు. గాలింపు చర్యలను ఎస్ఐ జి.రాజేష్ పర్యవేక్షిస్తున్నారు. -
సమ్మర్ యాపిల్.. గిరాకీ సూపర్!
ప్రకాశం (కొనకనమిట్ల) : సమ్మర్ యాపిల్‌గా పేరొందిన తాటి ముంజల వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. కొనకనమిట్ల మండలం గొట్లగట్టు, హనుమంతునిపాడు, జె.పంగులూరు, కొత్తపట్నం మండలం ఈతముక్కల తదితర ప్రాంతాల్లో విస్తారంగా ఉన్న తాటి తోపులు వందలాది కుటుంబాలకు ఉపాధినిస్తున్నాయి. కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు, బ్రాహ్మణపల్లి, నాయుడుపేట, చినమనగుండం, వింజవర్తిపాడు, దాసరపల్లి, సలనూతల, మర్రిపాలెం తదితర గ్రామాలకు చెందినవారు తాటి ముంజలు సేకరిస్తూ హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు. గొట్లగట్టు కేంద్రంగా సుమారు 300 కుటుంబాలు ఉపాధి పొందుతుండగా, బ్రాహ్మణపల్లి గ్రామంలో ప్రతి కుటుంబం తాటి ముంజలు సేకరించి విక్రయించడం విశేషం. ఈ గ్రామంలో 14 ఏళ్లలోపు పిల్లలు కూడా హుషారుగా తాటి చెట్లు ఎక్కి అవలీలగా కాయలు దించేయడంలో దిట్టలు. కాయల నుంచి ముంజలు తీస్తూ.. మూడు నెలలే ఉపాధి తాటి ముంజల సేకరణ చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే అలవాటైన పని కావడం, తగిన జాగ్రత్తలు తీసుకుంటుండటంతో పెద్దగా ఇబ్బందేమీ లేదని ముంజల సేకరించేవారు చెబుతున్నారు. వేసవిలో మూడు నెలలపాటు సాగే తాటి ముంజల వ్యాపారంలో ఒక్కో కుటుంబం నెలకు రమారమీ రూ.40 వేలు సంపాదిస్తోంది. తెల్లవారుజామునే తాటి తోపులకు వెళ్లి కాయలు సేకరించడం.. గ్రామాల్లో విక్రయించి సొమ్ము చేసుకోవడం ముంజల వ్యాపారుల దినచర్య. ప్రస్తుతం వీరంతా హోల్‌సేల్‌గా కాయలు విక్రయించేందుకు మొగ్గుచూపుతున్నారు. గొట్లగట్టు బస్టాండ్‌లో ముంజల వ్యాపారం కొందరు చిరు వ్యాపారులు మాత్రం ముంజలు తీసి వినియోగదారులకు అమ్ముతున్నారు. కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, పోరుమామిళ్ల, మార్కాపురం, ఒంగోలు, కొమరోలు, గిద్దలూరు, దొనకొండ ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు గొట్లగట్టు పరిసర ప్రాంతాల్లో ముంజలు హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తున్నారు. కడప జిల్లా నుంచి 20 మంది వ్యాపారులు గొట్లగట్టు నుంచి ముంజలు తీసుకెళ్లి పోరుమామిళ్ల, బద్వేలు, మైదుకూరులో విక్రయిస్తున్నారు.కరోనా నేపథ్యంలో రెండేళ్ల నుంచి తాటి ముంజల వ్యాపారం ఆటోలు, మోటార్ సైకిళ్లపైనే సాగుతోంది. తాటి చెట్టుకు విరగకాసిన కాయలు ఉపయోగాలివే.. ► వేసవిలో ఎన్ని నీళ్లు తాగినా దాహార్తి తీరక త్వరగా అలసిపోయేవారు తాటి ముంజలు తినడం ద్వారా చలాకీగా ఉంటారు. ► ఎక్కువగా ఎండలో తిరిగేవారు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ముంజలు ఎంతగానో ఉపకరిస్తాయి. ► అజీర్తి సమస్యతో బాధపడేవారు లేత ముంజలు తింటే ఎసిడిటీ దూరమవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ► తాటిముంజల్లో ఏ, బీ, సీ విటమిన్లతో పాటు జింక్, పొటాషియం లాంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ► ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి. -
సీఎం జగన్ నెల్లూరు పర్యటన.. ఏర్పాట్లు పరిశీలన
-
అగ్ని ప్రమాదం: 9 బస్సులు దగ్ధం
ప్రకాశం జిల్లా: ఒంగోలు బైపాస్‌లోని ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు దగ్ధమయ్యాయి. పార్క్ చేసి ఉన్న ట్రావెల్ బస్సులలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది బస్సులు దగ్ధమయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనికి షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది. -
ప్రకృతి ఒడిలో.. హాయ్.. హాయ్!
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ప్రకృతి అందాలు వీక్షించేలా అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సహజ త్వంతో కూడిన సుందర దృశ్యాలను తిలకించేందుకు వస్తున్న పర్యావరణ ప్రేమికులకు అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావ రణం నడుమ అడవిలో సఫారీ చేసి రాత్రి బసచేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకోసం నల్లమల అభయారణ్యంలో జంగిల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తోంది. పైలెట్ ప్రాజెక్టుగా తుమ్మ లబైలు ప్రాంతాన్ని ఎంపిక చేసింది. అత్యాధునిక వసతులతో కాటేజీలు, వెదురు గుడిసెలు, టెంట్లను ఏర్పాటు చేయనుంది. ప్రకృతి సిరిసంపదలకు నెలవుగా ఉన్న ఈ ప్రాంతంలోని గిరిజనగూడేల్లో సంస్కృతి, సంప్రదాయాలను నేరుగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించబోతోంది. పెద్దదోర్నాల: దట్టమైన నల్లమల అభయారణ్యంలో శీతోష్ణస్థితి మండలంగా గుర్తింపు పొందిన తుమ్మలబైలు గిరిజన గూడేన్ని అటవీశాఖ అధికారులు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. చెంచు గిరిజనులు నివసించే ప్రాంతంలోనే పర్యాటకులు బస చేసే అవకాశాన్ని కల్పించేందుకు చర్యలు చేప ట్టనున్నారు. నగరాలు, పట్టణాల్లో ఆధునిక జీవితానికి అలవాటు పడిన పర్యావరణ ప్రేమి కులు.. చెంచు గిరిజనుల ఆహారపు అలవాట్లు, జీవన విధానం, వారు నివసించే గృహాలు, వారి కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలను నేరుగా వీక్షించే అవకాశం కల్పించనున్నారు. దీంతో పాటు నల్లమలలోని ఆహ్లాదకరమైన వాతా వరణం, ఎత్తయిన పర్వతాలు, లోతైన లోయలు, ఆకాశాన్ని అందేలా మహా వృక్షాలే కాక జల పాతాలు, సెలయేళ్లు, పచ్చని తివాచీ పరిచిన ట్లుండే అందమైన పచ్చికబయళ్లు, స్వేచ్ఛాయుత వాతావరణంలో సంచరించే పెద్దపులులు, చిరుతలు, జింకలు, దుప్పులు మరెన్నో వన్యప్రాణులు కనిపించనున్నాయి. మానవాళిని అబ్బురపరిచే అందమైన పుష్పజాతులు, పలు రకాల ఔషధ మొక్కలు, ఎన్నో వింతలు విశేషాలను తిలకించడంతో పాటు వాటి విశేషాలను తెలుసుకునే అధ్భుతమైన అవకాశాన్ని పర్యాటకులకు అటవీశాఖ కల్పించబోతోంది. గూడెంలో నివసించే కొంత మంది చైతన్యవంతులైన యువకులను గుర్తించి వారి ద్వారా గూడెంలోని చెంచు గిరిజనులకు జంగిల్ హట్స్, వాటి వలన చెంచు గిరిజనులకు వచ్చే ఆదాయ మార్గాలపై కొందరికి అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో గిరిజన గూడెంలో 10 వరకు జంగిల్ కాటేజీలు ఏర్పాటు చేయ నున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గదులలో సౌకర్యాలు ఇలా... త్వరలోనే జంగిల్ క్యాంపులు మరి కొద్ది రోజుల్లో జంగిల్ క్యాంపులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. పైలెట్ ప్రాజెక్టుగా జంగిల్ సఫారీకి అనుసంధానంగా ఉన్న తుమ్మలబైలు గిరిజన గూడేన్ని గుర్తించాం. తుమ్మలబైలు గిరిజనగూడెంలో జంగిల్ క్యాంపుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎకో డెవలప్మెంట్ కమిటీ ద్వారా కొంత భాగం గూడెం అభివృద్ధికి కూడా ఖర్చు చేస్తాం. జంగిల్ కాటేజీలతో పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలుగుతుంది. – విశ్వేశ్వరరావు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పెద్దదోర్నాల నిర్మాణాలపై అధికారుల దృష్టి... నల్లమల అభయారణ్యంలోని తుమ్మలబైలు గిరిజనగూడెంలో జంగిల్ కాటేజీలు, వెదురు గుడిసెల నిర్మాణాలపై అధికారుల దృష్టి సారించారు. అత్యాధునిక పరిజ్ఞానంతో కాటేజీలలో సకల సదుపాయాలు కల్పించనున్నారు. పర్యాటకుల కోసం ఏర్పాటు చేసే టెంట్లు, కాటేజీలు, వెదురుతో కూడిన గుడిసెల్లో పర్యాటకులకు అవసరమయ్యే సకల సౌకర్యాలను అందుబాటులో ఉంచనున్నారు. జంగిల్ కాటేజీలలో ఒక్కో గదిలో ఇద్దరు సేద తీరడానికి రెండు బెడ్లు, గదికి సీలింగ్, ఆకర్షణీయమైన విధంగా లైటింగ్ సౌకర్యం, విలాసవంతమైన టాయిలెట్లు, రాత్రి పూట కాంప్లిమెంటరీ భోజనం ఏర్పాటు చేయనున్నారు. జంగిల్ సఫారీ చూసిన తర్వాత యాత్రికులు ఇక్కడే బస చేసేలా చర్యలు చేపడుతున్నారు. యాత్రికులు సఫారీతో పాటు రోజంతా నల్లమలలోని అటవీ ప్రాంతంలోనే గడిపే ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ఇందు కోసం రూ.2,500 నుంచి 3,000 వరకు వసూలు చేయనున్నారు. అటవీశాఖ చేస్తున్న ఈ ఏర్పాట్లతో గిరిజనులకు, అటవీశాఖకు మరి కొంత ఆదాయం సమకూరనుందని అధికారులు పేర్కొంటున్నారు. -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం: సెల్ఫీ వీడియోతో
సాక్షి, ప్రకాశం: భర్తతోపాటు అతను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ, ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురు వేధిస్తున్నారంటూ ఓ వివాహిత ఉరేసుకుని అర్ధంతరంగా తనువు చాలించింది. మరణించే ముందు సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమవుతూ తన ఆవేదనను వెలిబుచ్చింది. ఈ ఘటన మంగళవారం కంభం పట్టణంలోని కందులాపురం కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి సోదరుల కథనం మేరకు.. అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామానికి చెందిన దూదేకుల భాను(29)కు పదేళ్ల క్రితం కంభం పట్టణానికి చెందిన నాగూర్‌వలితో వివాహమైంది. వారికి ముగ్గురు కుమారులు. అయితే నాగూర్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ వివాదం జరుగుతోంది. తరుచూ హింసిస్తుండటంతో భాను పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా నాగూర్వలి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో మనస్తాపం చెందిన భాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ నాగమల్లేశ్వరరావు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, తమ సోదరి చావుకు కారణమైన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరులు కోరారు. చదవండి: వివాహేతర సంబంధం: భార్య తల నరికిన భర్త.. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చి.. -
పట్టుబడిన కిరాతకులు
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో రెండుచోట్ల జరిగిన వేర్వేరు జంట హత్యల కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ మలికాగర్గ్ ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 3న రాత్రి టంగుటూరుకు చెందిన బంగారం వ్యాపారి జలదంకి రవి భార్య శ్రీదేవి(43), ఆమె కుమార్తె వెంకట లేఖన (19)లు దారుణహత్యకు గురయ్యారు. పోలీసులు నిఘా పెట్టి టంగుటూరు ఎస్.జంక్షన్ వద్ద ఆదివారం అక్కల శివకోటయ్య, కంకిపాటి నరేష్‌లను అరెస్ట్ చేశారు. గతంలో సంచలనం సృష్టించిన చీమకుర్తి డబుల్ మర్డర్ కేసు కూడా వీరే చేసినట్లు విచారణలో తేలింది. జైలులో పరిచయంతో.. కందుకూరు సాయినగర్‌కు చెందిన అక్కల శివకోటయ్య, జరుగుమల్లి మండలం దావగూడూరుకు చెందిన కంకిపాటి నరేష్‌లకు గతంలో కేసులకు సంబంధించి జైలులో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చాక నరేష్ ఇటీవల టంగుటూరులో మెకానిక్ షాపు తెరిచాడు. తన షాపునకు ఎదురుగా ఉన్న రోడ్డులో జలదంకి రంగాకు చెందిన బంగారం దుకాణంలో గతేడాది జూన్‌లో బంగారం ఎత్తుకెళ్లారు. అనంతరం జలదంకి రవికిషోర్ ఇంట్లోకి వెళ్లి రంగా కుమార్తె లేఖన, భార్య శ్రీదేవిలను హత్య చేసి బంగారు నగలు దోచుకెళ్లారని దర్యాప్తులో తేలింది. చీమకుర్తిలో 2018 సెప్టెంబర్ 18న జరిగిన జంట హత్యల కేసులోనూ అక్కల శివకోటయ్య నిందితుడిగా గుర్తించారు. వెంకటసుబ్బారావుకు చెందిన ఇంట్లోకి ప్రవేశించి ఆయనను ఇనుపరాడ్డుతో హతమార్చాడు. సుబ్బారావు భార్య రాజ్యలక్ష్మిని కూడా ఇనుప రాడ్‌తో హత్యచేసి బంగారంతో ఉడాయించినట్లు తేలింది. విచారణలో నిందితులు మరో మూడు నేరాలు చేసినట్లు తేలింది. మొత్తం రూ.53.48 లక్షల సొత్తు చోరీ కాగా.. నిందితుల నుంచి రూ.32.48 లక్షల సొత్తును పోలీసులు సీజ్ చేశారు. 612 గ్రాముల బంగారం, ఒక ఫోర్డ్‌కారు, రెండు మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. -
ట్రావెల్స్ బస్సు దగ్ధం
పర్చూరు: అకస్మాత్తుగా ఇంజిన్‌లో మంటలొచ్చి ఓ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రకాశం జిల్లాలోని పర్చూరు–చిలకలూరిపేట ఆర్ అండ్ బీ రోడ్డుపై.. పర్చూరు మండలంలోని తిమ్మరాజుపాలెంలో గురువారం వేకువ జామున ఈ ఘటన జరిగింది. ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్‌లోని పఠాన్‌చెరువు నుంచి బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో 20 మంది ప్రయాణికులతో బయలుదేరింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో 11 మందిని, చిలకలూరిపేటలో ఒకరిని దించింది. పర్చూరు, చీరాల మీదుగా గుంటూరు జిల్లా బాపట్లకు బస్సు వెళ్లాల్సి ఉంది. పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వచ్చేసరికి గేర్ రాడ్డు పక్క నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి అందులో ఉన్న మిగిలిన 8 మంది ప్రయాణికులను కిందికి దించాడు. అంతలోనే ఇంజిన్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది. చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రయాణికులతో పాటు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలాన్ని ఆర్డీవో ప్రభాకరరెడ్డి తదితరులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు యద్ధనపూడి ఎస్ఐ రత్నకుమారి చెప్పారు. చదవండి: ఒమిక్రాన్ గుట్టు ‘గాంధీ’లో తేలుస్తారు -
తండ్రి ఆవేదన: కష్టపడి చదివించుకున్నా.. అలా చేస్తుందనుకోలేదు..
సాక్షి, ప్రకాశం: పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెందిన పాలిటెక్నిక్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్త పట్నం మండలం ఈతముక్కల గ్రామం మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో మంగళవారం జరిగింది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా, ఈపూరు మండలం, ఆర్ ముప్పాళ్ళ గ్రామానికి చెందిన మట్టా రామాంజనేయులు కుమార్తె మట్టా దివ్య (17) పాలిటెక్నిక్ కాలేజీలో ఈసీఈ సెకండ్ ఇయర్ చదువుతోంది. సోమవారం సాయత్రం వెలువడిన పాలిటెక్నిక్ మొదటి ఏడాది ఫలితాల్లో ఏడు సబ్జెక్ట్స్గాను అయిదు ఫెయిల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కాలేజీకి వెళ్లొచ్చిన దివ్య హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. మధ్యాహ్నం విద్యార్ధినులు హాస్టల్‌కు వచ్చేసరికి దివ్య ఉరికి వేలాడుతూ కనిపించడంతో కాలేజీ ప్రిన్సిపాల్ సుశీల్ కుమార్ ప్రియకు సమాచారం ఇచ్చారు. ప్రిన్సిపాల్ పోలీసులకు, తల్లిదండ్రులకు ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. చదవండి: (నువ్వురాకపోతే చచ్చిపోతా.. నువ్వు అవి మానేస్తానంటేనే వస్తా..) దివ్య క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్ మార్కులతో వచ్చేవని తోటి విద్యార్థులు చెప్పారు. మంగళవారం ఉదయం అందిరతోపాటే సక్లాస్కు హాజరైన దివ్య తాను పరీక్షలు బాగా రాశానని, రీఎరిఫీకేషన్ పెట్టించాలని చెప్పినట్లు తమతో చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా కాలేజీలో మొదటి ఏడాది విధ్యార్థులు 75 మంది ఉండగా వారిలో 33 మంది విద్యార్థినులు మాత్రమే పాస్ అవ్వడం గమనార్హం. కష్టపడి చదివించుకున్నా నేను ముప్ఫాళ్ల గ్రామంలో కాంట్రాక్ట్ పద్దతిలో స్వీపరగా పనిచేస్తాను. నాకు వచ్చేది రూ.6 వేలు జీతం. ఎల్కేజీ నుంచి పదోవతరగతి వరకు ప్రవేటు స్కూల్లో డబ్బులు ఖర్చు పెట్టి చదివించుకున్నారు. నేను చేసే పని నా కుమర్తె చేయకూడదని కష్టపడి చదివించుకుంటున్నారు. ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటుందని నేను అనుకోలేదని కుమార్తె ముందు కుప్పకూలీ పోయాడు. కేసు నమోదు చేసి పోష్టమార్టన్ నిమెత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. -
గుప్త నిధుల తవ్వకాల కేసులో ఏడుగురు అరెస్టు
పొదిలి(ప్రకాశం జిల్లా): గుప్త నిధుల కోసం చెరువులో తవ్వకానికి పాల్పడిన ఘటనలో ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పొదిలి సీఐ సుధాకర్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. తర్లుపాడు మండలం పోతలపాడు దశబంధు చెరువులో ఆదివారం అర్ధరాత్రి గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు తవ్వకాలు చేపట్టారు. రాత్రి వేళ గస్తీ తిరుగుతున్న గ్రామ రక్షక దళానికి గుప్త నిధుల ముఠా పట్టుబడింది. మొత్తం తొమ్మిది మందిలో ఏడుగురు చిక్కగా మరో ఇద్దరు పరారయ్యారు. పట్టుబడిన వారిని సోమవారం అరెస్ట్ చేశామని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. అరెస్టు అయిన వారిలో నరసరావుపేటకు చెందిన సయ్యద్ ఖరీం, డీకే మీరావలి, ఎస్కే సుభాని, బత్తుల శ్రీనివాసరావు, తమ్మిశెట్టి మణి, గురజాలకు చెందిన మన్నం శ్రీనివాస్, నామనకొల్లు గ్రామానికి చెందిన సయ్యద్‌బాజీ ఉన్నారని సీఐ పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. నిందితుల నుంచి 7 సెల్ఫోన్లు, 2 కార్లు, 2 గడ్డపారలు, 2 చలకపారలు, ఒక బొచ్చె, ఒక పెద్ద సుత్తి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో తర్లుపాడు ఎస్ఐ సువర్ణ, ఎస్బీ సంజయ్, హెడ్ కానిస్టేబుల్ రమేష్, కాశిరెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఒక్క రోజులోనే 663 ఒమిక్రాన్ కేసులు.. ‘ఏప్రిల్ నాటికి వేల సంఖ్యలో మరణాలు’! -
నిద్రమత్తు ముగ్గురిని మింగేసింది
గుడ్లూరు: ఓ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ముగ్గురి ఊపిరి ఆగిపోయింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటన ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని జాతీయ రహదారిపై చేవూరు వద్ద బుధవారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. తిరుపతిలోని వేదిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అగ్నిహోత్రి శ్రీనివాసాచార్యులు తన భర్య రాజ్యలక్ష్మితో కలసి ఒంగోలు నగరంలోని అయ్యప్ప స్వామిగుడిలో జరిగే పవిత్రమాస పూజోత్సవాల్లో పాల్గొనేందుకు తెల్లవారుఝామున 5 గంటలకు కారులో ఒంగోలుకు బయలు దేరారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని జాతీయ రహదారిపై ఉన్న చేవూరు వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి.. తమిళనాడు నుంచి విజయవాడకు వెళ్తున్న రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ లారీని వెనుక వైపు వేగంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలతో శ్రీనివాసాచార్యులు (58), కారు డ్రైవర్ పురుషోత్తమరావు (30) ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. తీవ్రగాయాలైన రాజ్యలక్ష్మి (55)ని 108లో కావలి ఏరియా వైద్యశాలకు తరలించగా అక్కడ మృతి చెందింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. కందుకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీరామ్, ఎస్ఐ మల్లికార్జున ప్రమాద స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. రోడ్ సేఫ్టీ పోలీసులు లారీ కింద ఇరుక్కుపోయిన కారును జేసీబీ ద్వారా బయటకు లాగి మృతదేహాలను తీశారు. జరిగిన దుర్ఘటనపై లారీ డ్రైవర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. మృతుడు శ్రీనివాసాచార్యులుకు ఇద్దరు కుమారులున్నారు. మృతుడి స్వస్థలం కృష్ణాజిల్లా గుడివాడ మండలం దింటకూరు గ్రామం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
103 ఏళ్ల పురాతన చరిత్ర
వేటపాలెం(ప్రకాశం): 103 పురాతన చరిత్ర కల్గిన విజ్ఞాన భాండాగారంగా వేటపాలెం సారస్వత నికేతన్ గంథాలయం గుర్తింపు పొందింది. పాతతరంలో ఎందరినో విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్ధిన ఘనత సారస్వత నికేతన్‌కు ఉంది. 103 ఏళ్ల కిందట స్థాపించబడిన గ్రంథాలయం రాష్ట్రంలోనే ఖ్యాతి గడించింది. గ్రంథాలయంలో ఉన్న గాంధీజీ చేతి కర్ర గ్రంథాలయం ఆవిర్భావం.. 1918 అక్టోబర్ 15న విజయదశమి నాడు గ్రామంలో అభ్యుదయ బావాలు కల యువకులు, ప్రజానేత ఊటుకూరి వెంకట సుబ్బారావు శేష్టి ప్రోత్సా హంతో కొందరు హిందూ యువజన సంఘం పేరుతో గ్రంథాలయాన్ని నెలకొల్పారు. 1923వ సంవత్సరంలో గ్రామం మధ్యలో పెంకుటింటిలో మార్చి అక్కడ కొనసాగించారు. 1924లో నూతన భవనం నిర్మించి గ్రంథాలయాన్ని మార్పు చేశారు. 1929 ఏప్రిల్ 18 తేదీన మహాత్మాగాంధీ గ్రంథాలయం నూతన భవనానికి శంకు స్థాపన చేశారు. ఆ సమయంలో గాంధీజీ చేతికర్రను గ్రంథాలయంలో వదిలివెళ్లారు. నేటీకి అది భద్రంగా ఉంది. 1923లో పెంకుటింటిలో ఉన్న గ్రంథాలయం అమూల్యగ్రంథాలు.. రాష్ట్రంలో నెలకొల్పిన గ్రంథాలయాల్లో ఉత్తమ గ్రంథ సేకరణ, గ్రంథాల ను భద్రపరచడంలో సారస్వత నికేతనం ప్రథమస్థానంలో నిలిచింది. తెలుగులో ముద్రణ ప్రారంభమైన నాటి నుంచి వెలువడిన ఉత్తమ గ్రంథాలలో చాలావరకు తొలి, తుది పుటలతో సహా భద్రపరచబడి ఉన్నాయి. దాదాపు లక్ష పుస్తకాలు ఇక్కడ ఉండగా అందులో 50 వేలు తెలుగు గ్రంథాలు, సంస్కృత గ్రంథాలు, 28 వేల ఇంగ్లీషు గ్రంథాలు, రెండు వేలు హిందీ గంథాలు, వెయ్యి ఉర్దూ తదితర గ్రంథాలు ఉన్నా యి. పత్రికల్ని భద్రపరచటంలో కూడా గ్రంథాలయానికి సమున్నత స్థానం ఉంది. 1942 నుంచి ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ కొత్తగా ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు దినపత్రికలు సంపుటలుగా భద్రపరచడం జరిగింది. గ్రంథాలయంలోని విజిటర్స్ పుస్తకంలో మహాత్మాగాంధీజీ స్వహస్తాలతో రాసిన ఒపీనీయన్ పరిశోధనా కేంద్రం.. తెలుగు భాషా సాహిత్యాలపై పరిశోధన చేసేవారికి సమాచారం అంతా అందుబాటులో ఉంటుంది. శాస్త్ర పరిశోధకులకు ముఖ్యంగా సాహిత్య పరిశోధకులకు బాగా తోడ్పడుతూ వస్తుంది. దేవ వ్యాప్తంగా ఉన్న వివి« ద విశ్వవిద్యాలయాల్లోని పరిశోధకులు సారస్వత నికేతనానికి వచ్చి విష యసేకరణ చేస్తుంటారు. వేటపాలెంలోని సారస్వత నికేతనం గ్రంథాల యాన్ని ఎందరో పండితులు, ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు తరచూ సందర్శించి వెళుతుంటారు. నేటికీ తగ్గని ఆదరణ.. ప్రసార మాధ్యమాలు, ఇంటర్ నెట్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన ఈనాటికీ గ్రంథాలయానికి వచ్చే వారి సంఖ్య తగ్గలేదు. ప్రధా నంగా సివిల్స్ గ్రూప్ పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు, గ్రంథాల యంలో గ్రంథ సేకరణ చేస్తుంటారు. పీహెచ్డీ చేసేవారు ఎక్కువగా ఇక్కడకు వచ్చి విలువైన పుస్తకాలను పరిశీలిస్తుంటారు. రాష్ట్రంలో వేటపాలెం సారస్వత నికేతనం గ్రంథాలయాన్ని వైఎస్సార్ లైఫ్‌టైం ఎచీవ్ మెంట్‌కి ఎంపికచేశారు. -
అమరావతి పరిరక్షణ పేరుతో టీడీపీ డ్రామాలు
-
పారిశ్రామిక ప్రకాశం !
కరువు జిల్లా ప్రకాశం.. పారిశ్రామిక ప్రగతి వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. వ్యవసాయం, పశుపోషణ తప్ప పారిశ్రామిక జాడ లేని జిల్లా నుంచి ఉపాధి కోసం ఏటా వేలాది మంది వలస బాట పడుతుంటారు. వలస జీవితాలకు చెక్ పెట్టేందుకు ఏపీఐఐసీ ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కుల ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రూ.వేల కోట్ల అంచనాలతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు 9 ఇండస్ట్రియల్ పార్కులు, 2 ఎంస్ఎంఈ పార్కులు నెలకొల్పనున్నారు. దీంతో వేలాది మంది ఉపాధికి భరోసా లభించనుంది. ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వేలాది కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీంతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. వెనుకబడిన జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ నిరంతరం ముఖ్యమంత్రితో మాట్లాడుతూ కృషి చేస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఏపీఐఐసీ ద్వారా 9 ఇండస్ట్రియల్ పార్కులు, 2 ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. 9 ఇండస్ట్రియల్ పార్కులు 1753.11 ఎకరాలు, బీపీ సెజ్‌లకు 262.87 ఎకరాలు, 2 ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)కు 99.27 ఎకరాల అంచనాలతో పనులు ప్రారంభించారు. వీటిలో వివిధ కేటగిరీలకు సంబంధించి 1097 యూనిట్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటిలో గ్రానైట్ కటింగ్, పాలిషింగ్, టింబర్ డిపోలు, సా మిల్, ఆటోమొబైల్, సిమెంట్ బ్రిక్స్, రైస్ మిల్లులు, డాల్ మిల్స్, బిల్డింగ్ ప్రోడక్టŠస్తో పాటు మరికొన్ని యూనిట్లు ఉన్నాయి. ఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు రూ.2962.38 కోట్ల అంచనాలతో 34,989 మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. నిరుద్యోగులుగా ఉన్న యువతకు వివిధ వృత్తులకు సంబంధించి నైపుణ్య శిక్షణ కల్పించి ఉపాధి చూపేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. రామాయపట్నం చుట్టూ.. రామాయపట్నం పోర్టుతో పాటు రామాయపట్నం ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ మేరకు ఏపీఐఐసీ ద్వారా హబ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తం 4 నుంచి 5 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాటిలో ఇప్పటికే 2346.36 ఎకరాలు పట్టా భూమి, 554.92 ఎకరాల అసైన్డ్ భూమి, 879.19 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించి రూ.657.59 కోట్లతో భూ సేకరణ ప్రారంభించారు. దొనకొండలో.. జిల్లాలోని దొనకొండ ప్రాంతంలోని 21 గ్రామాల్లో 25,062.84 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దానిలో ఇప్పటికే 2395.98 ఎకరాలు గుర్తించి సేకరిస్తున్నారు. దీనిలో భాగంగా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు దొనకొండ ప్రాంతంలో 43.79 ఎకరాలను అభివృద్ధి చేశారు. దొనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్ కోసం కందుకూరు సబ్ కలెక్టర్ రూ.394.48 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్)ను 6366.66 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ఏపీఐఐసీ అంచనాలు రూపొందించింది. దానిలో ఇప్పటికే ఆరు గ్రామాలకు సంబంధించి 1839.09 ఎకరాలకు కలెక్టర్ అడ్వాన్స్ పొజిషన్ ఏపీఐఐసీకి అందచేశారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు మాలకొండపురంలో 1137.63 ఎకరాలకు 856.67 ఎకరాలు అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చేందుకు కలెక్టర్ వద్దకు దస్త్రం చేరింది. జిల్లాలో ఇప్పటికే ఉన్న పలు పారిశ్రామిక వాడల్లో 574 ప్లాట్లలో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. వాటిలో గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్, ఒంగోలు బీపీ సెజ్, గిద్దలూరు, మార్కాపురం, సింగరాయకొండ ఇండస్ట్రియల్ పార్కులు, నాగరాజుపల్లి ఫుడ్‌పార్కు, ఎంఎస్ఎంఈ మాలకొండాపురం, రాగమక్కపల్లి, చీరాల ఆటోనగర్ ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు పాలు ప్రాంతాల్లో భూములను గుర్తించారు. వాటిలో కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలోని చినలాటరపి గ్రామంలో 53.33 ఎకరాలు, కొండపి నియోజకవర్గంలో చినకండ్లగుంటలో 33.41, పెదకండ్లగుంటలో 29.90 ఎకరాలు, కొత్తపట్నం మండలంలో 50 ఎకరాలు, మార్టూరు మండలంలో 74.18 ఎకరాల భూములను ఎంఎస్ఎంఈ పార్కుల కోసం అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. నిరుద్యోగానికి చెక్ వెనుకబడిన జిల్లా అభివృద్ధే ఏకైక అజెండాగా పనిచేస్తున్నాం. జిల్లాలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను వీలైనంత ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని కృషి చేస్తున్నాం. పరిశ్రమలు ఏర్పడితే జిల్లాలో నిరుద్యోగంలో ఉన్న యువతకు ఉపాధి చూపవచ్చు. అంతేకాకుండా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. పరిశ్రమల ఏర్పాటుతో వలసలను అరికట్టవచ్చు. జిల్లా మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌ల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నాం. పరిశ్రమలు ఒక ప్రాంతంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ మేరకు ఆచరణలో ప్రారంభించి ముందుకెళ్తున్నాం. ఔత్సాహికులైన యువత సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావాలి. -– కలెక్టర్ ప్రవీణ్ కుమార్ -
వందేళ్ల క్రితం కనుమరుగైన గ్రామం.. రికార్డుల్లో మాత్రం సజీవం
వేటపాలెం: సూమారు వందేళ్ల కిందట వేటపాలెం మండలం పరిధిలోని పందిళ్లపల్లి గ్రామానికి తూర్పుగా కొత్తరెడ్డిపాలెం గ్రామానికి దగ్గరలో పుల్లరిపాలెం గ్రామ ఉండేది. అది పూర్తిగా అటవీ ప్రాతంగా ఉండేదని పూర్వికులు చెబుతుంటారు. చాలా ఏళ్ల కిందట ఈ గ్రామంలో ప్లేగు, కలరాలాంటి అంటువ్యాదులు ప్రబలి పెద్ధ సంఖ్యలో గ్రామస్తలు మృత్యువాత పడ్డారు. దీనితో గ్రామంలో మిగిలిన వారు ఇళ్లు వాకిలి వదిలి వలసబాట పట్టారని ఆ ప్రాంతంలోని వృద్ధులు చెబుతుంటారు. ఇలా గ్రామం కనుమరుగైందన్న మాట. ఆ గ్రామానికి చెందిన ఎటువంటి ఆనవాళ్ల ఇప్పడు లేవు. పుల్లరిపాలెం గ్రామం భౌతికంగా కనుమరుగైనా పంచాయతీకి సంబందించిన పరిపాలన గ్రామానికి దగ్గరలోని కొత్తరెడ్డిపాలెంలో ప్రస్తుతం కొనసాగుతుంది. సాధారణంగా ఏ గ్రామ పరిపాలనైనా ఆ గ్రామం పేరు మీదుగానే జరుగుతుంది. గ్రామంలోని ప్రజలు కూడా తాము పలానా ఊరి వారమంటూ రెవెన్యూ సౌకర్యాలు, ఇతరత్రా సదుపాయాలు పొందుతారు. కానీ వేటపాలెం మండంలోని పుల్లరిపాలెం గ్రామం మాత్రం ఇందుకు విబిన్నం. ఎందుకంటే ఎప్పుడో ఒకానోక సమయంలో ఈ ఊరు ఉండేది. ప్రస్తుతం పేరొక్కటే ఉంది. ఈ పేరుమీదనే మండలంలోని ఆ పంచాయతీ కింది ఉన్న కొత్తరెడ్డిపాలెం, పాతరెడ్డిపాలెం, రామాచంద్రాపురం, బచ్చులవారిపాలెం, ఊటుకూరిసుబ్బయ్యపాలెం, సాయనగర్ గ్రామాలకు చెందిన వారు ప్రస్తుతం సదుపాయాలు పొందుతున్నారు. మండలంలో పుల్లరిపాలెం పంచాయతీ తెలియనివారు ఈ ప్రాంతంలో ఉండరు. గ్రామానికి సర్పంచ్, కార్యదర్శి, వీఆర్ఓ, ఎంపీటీసీ సభ్యుడు ఉన్నారు. కానీ భౌతికంగా ఆ గ్రామమే లేదు. ఈ పల్లె గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదు. కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చే అధికారులు సైతం పుల్లరిపాలెం గ్రామం ఎక్కడుందబ్బా అంటూ ఆశ్చర్యానికి గురికావాల్సిందే. ఈ గ్రామ పంచాయతీ కింద ఆరు లామినెటెబ్ గ్రామాలు లబ్దిపొందుతుంటాయి. ఈ ఆరు గ్రామాలకు పుల్లరిపాలెం గ్రామ పంచాయతీ పేరుమీదనే ప్రభుత్వ రికార్డుల్లో పరిపాలన జరుగుతుంది. -
టాప్‌లో ప్రకాశం.. మొత్తం ర్యాంకుల్లో శ్రీకాకుళం
సాక్షి, అమరావతి: ఆర్జీయూకేటీ సెట్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10,389 ర్యాంకులు సాధించగా.. ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు 9,611 ర్యాంకులు వచ్చాయి. 1 నుంచి 5వేల వరకు ర్యాంకుల్లో ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. మొత్తంగా చూస్తే ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులే అత్యధిక ర్యాంకులను సొంతం చేసుకున్నారు. ఈ ఫలితాల్లో ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. 1–1,000 ర్యాంకుల్లో 116 ర్యాంకులతో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. 92 ర్యాంకులతో ద్వితీయ స్థానంలో వైఎస్సార్ జిల్లా నిలిచింది. మొత్తం 20 వేల ర్యాంకుల్లో అత్యధికంగా 1,888 ర్యాంకులతో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో ఉండగా.. 1,793 ర్యాంకులతో వైఎస్సార్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. అత్యధికంగా 11,677 మంది వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఓసీలు 3,725 మంది, ఎస్సీలు 1,889 మంది, ఎస్టీలు 363 మంది ఎంపికయ్యారు. వీరు కాకుండా ఈడబ్ల్యూఎస్ కోటా కిందికి వచ్చే విద్యార్థులు 2,346 మంది ఉన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్’పై ..శాప్ నెట్ చైర్మన్ కృష్ణ చైతన్య ఫైర్ అయ్యారు
-
ఊళ్లో ఉంటే టీడీపీ వాళ్లు బతకనివ్వరు..
లింగసముద్రం : ‘ఊళ్లో ఉంటే గోపాలరావు, అతని అనుచరులు మమ్మల్ని బతకనివ్వరు.. అందుకే ఊరి విడిచి వచ్చాం.. ఎక్కడికెళ్లాలో తెలియడం లేదు.. ’ అంటూ ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు గోపాల్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద తల దాచుకుని భయంభయంగా గడుపుతున్నారు. లింగసముద్రం మండలం మొగిలిచర్లలో గత ఆదివారం దిబ్బ విషయంలో వివాదం చెలరేగి టీడీపీ నేత వేముల గోపాలరావుతో పాటు అతని అనుచరులు చేసిన దాడిలో వైఎస్సార్సీపీ మద్దతుదారు గోరంట్ల గోపాల్ బంధువైన బొల్లినేని లక్ష్మీకాంతమ్మ గాయపడింది. చికిత్స కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం మంగళవారం రాత్రి ఆమె తన ఇంటికి చేరుకుంది. మళ్లీ గోపాలరావు అనుచరులైన చినమాలకొండయ్య, వెంకాయమ్మతో పాటు మరికొందరు మహిళలు బుధవారం ఒక్కసారిగా గోరంట్ల గోపాల్ ఇంటికెళ్లి ఆయన భార్య గీత, అత్త లక్ష్మీకాంతమ్మలపై దాడి చేశారు. అక్కడే ఉన్న ఎస్ఐ రమేష్ తన సిబ్బందితో కలిసి వారిని వారించి అక్కడి నుంచి పంపించేశారు. గ్రామంలో ఉంటే గోపాలరావు, అతని అనుచరులు తమను బతకనివ్వరని గోపాల్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద తల దాచుకుంటున్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారని, భయమేస్తోందంటూ గోపాల్ భార్య కన్నీళ్లపర్యంతమయ్యారు. తాము వైఎస్సార్సీపీకి ఓటు వేయడాన్ని గోపాలరావు జీర్ణీంచుకోలేకపోతున్నాడని చెప్పారు. -
నకిలీ పోలీసుల ముఠా అటకట్టించిన పోలీసులు
-
పసికందును ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని మహిళ
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని మార్కాపురం ఏరియా వైద్యశాలలో దారుణం జరిగింది. నాలుగు రోజుల పసికందును గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాలు.. గుంటూరు జిల్లా కారంపూడి సమీపంలోని బట్టువారిపల్లి కి చెందిన శ్రీ రాములు నాలుగు రోజుల క్రితం తన భార్యను కాన్పు కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో శనివారం డిశ్చార్జి కావలసి ఉండగా అబ్జర్వేషన్ లో ఉంచాలంటూ పాపను ఆస్పత్రి సిబ్బంది ఓ గదిలోకి తీసుకు వెళ్లారు. అనంతరం శ్రీ రాములును భోజనం తెమ్మని చెప్పారు. అయితే, అతడు తిరిగి రాగా పాప కనిపించడం లేదంటూ వైద్య సిబ్బంది తెలపడంతో నిర్ఘాంతపోయాడు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఆధారంగా పోలీసులు, పాపను ఎత్తుకెళ్లిన మహిళ కోసం గాలిస్తున్నారు. చదవండి: సారు పేరులోనే ‘లక్ష్మీ’ కళ.. వసూళ్లలో డిఫరెంట్ స్టైల్ -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడి
సాక్షి,ప్రకాశం: వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. పార్టీ కార్యకర్త విజయరాజు తీవ్రంగా గాయపడగా పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల కేంద్రం చినగంజాం పంచాయతీ మహాలక్ష్మి కాలనీలో గురువారం జరిగింది. వివరాలు.. కాలనీలో ఆరేళ్లుగా పలువురు ఎస్సీలు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. అదే కాలనీలో నివాసం ఉండే టీడీపీ నాయకురాలు చేవూరి రమణమ్మ ఆ స్థలాలన్నీ తన ఆధీనంలో ఉన్నాయని, తనకు రూ. 5 వేలు చొప్పున ఇచ్చి నివాస గృహాలు వేసుకోవాలంటూ వారిపై దౌర్జ్జన్యానికి పాల్పడటమే కాకుండా డబ్బులు కట్టని వారి గుడిసెలు పీకి తగలబెడతానంటూ కొంతకాలంగా బెదిరిస్తోంది. ఈ క్రమంలో చేవూరి రమణమ్మ తన మనుషులతో ఎస్సీల గృహాల వద్దకు వచ్చి పరుష పదజాలంతో బూతులు తిడుతోంది. ఆమె వెంట వచ్చిన మానికల ప్రసాద్, ఏసుబాబులు లింగగుంట యశోధ అనే ఎస్సీ మహిళ జుత్తు పట్టుకొని దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆమెను రక్షించేందుకు వచ్చిన మేకల కమలమ్మను రమణమ్మ, ఆమె చెల్లెలు సామ్రాజ్యం, అంజమ్మలు కర్రలతో దాడికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన మరో మహిళ పీకా రమాదేవిని సైతం రమణమ్మ కుమార్తె ప్రభావతి, మనుమరాలు ఎస్తేరు రాణి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. తన భార్య, బంధువులను అన్యాయంగా కొడుతున్నారంటూ అడ్డుకోబోయిన యశోధ భర్త లింగంగుంట విజయరాజును ప్రసాద్, ఏసుబాబులు కర్రతో తలపై కొట్టడంతో తీవ్ర గాయమైంది. తీవ్రంగా గాయపడిన అతడిని 108లో చీరాల వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. చీరాల ఔట్‌పోస్టు పోలీసులు క్షతగాత్రుల ఫిర్యాదు నమోదు చేసుకొని చినగంజాం పోలీసుస్టేషన్‌కు కేసు రిఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్ఐ అంకమ్మరావు తెలిపారు. చదవండి: కర్నూలు టీడీపీలో నిస్తేజం.. అధినేత వ్యవహారం నచ్చకే! -
చిన్న ముంబైలో పెద్ద మోసం..
చీరాల: జిల్లాలో చిన ముంబైగా పేరుగాంచిన చీరాలలో భారీ బంగారం మోసం వెలుగు చూసింది. మోసగాళ్లు కొందరు బంగారం వ్యాపారులకు బంగారం బిస్కెట్లు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని నిలువునా మోసం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారంలో మోసగాళ్ల ముఠాలోని సభ్యుల మధ్య తలెత్తిన విభేదాలతో విషయం బయటపడింది. సుమారు రూ.35 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ఒక్కో బిస్కెట్ బరువు 100 గ్రాములు. అలాంటివి 700 బంగారం బిస్కెట్ల క్రయవిక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. డబ్బులు ఇచ్చిన కొందరికి బంగారం బిస్కెట్లు ఇవ్వకపోవడంతో విషయం బయటకు పొక్కింది. అందరి ‘బంధువు’గా వ్యవహరించే ఓ వ్యక్తి ప్రస్తుతానికి పరిస్థితిని చక్కదిద్దినట్లు సమాచారం. అంతేకాకుండా ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా సెటిల్మెంట్కు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో పాటు స్వయంగా ఎస్పీ మలికా గర్గ్‌కు ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గోప్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇదీ..జరిగింది గతంలో చీరాల రూరల్ ప్రాంతాల్లో ర్యాప్‌లు (దొంగ బంగారం విక్రయం) జరిగాయి. తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి తీరా డబ్బులు తీసుకుని వారిపైనే దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. ఇటీవల చౌకగా బంగారం దొరుకుతుందని కొందరు ఏజెంట్లు బంగారం వ్యాపారులకు ఆశ కల్పించారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు బంగారం బిస్కెట్లు ఇస్తామని వారిని బురిడీ కొట్టించారు. ఎటువంటి బిల్లులు లేకున్నా వ్యాపారులు కూడా బిస్కెట్ల కోసం డబ్బులు కట్టి ఇప్పుడు నిలువునా మోసపోయారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో కస్టమ్స్ ఆఫీసర్‌గా చెప్పుకున్న వ్యక్తి, ఏజెంట్లు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. -
థాంక్యూ.. సీఎం జగన్ సార్!
సాక్షి, కారంచేడు(ప్రకాశం): సీఎం వైఎస్ జగన్‌కి కారంచేడు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ నర్తు భాస్కరరావు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం వీడియో సందేశం పంపించారు. డాక్టర్ భాస్కరరావు కోవిడ్ విధుల్లో ఉండగా ఏప్రిల్ 24న కరోనా సోకింది. ఆయన భార్య డాక్టర్ బొమ్మినేని భాగ్యలక్ష్మి విజయవాడ, ఆ తరువాత మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటిని మార్చాలని అందుకు రూ.1.50 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం విషయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన మంత్రి బాలినేని విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పడంతో..భాస్కరరావు వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. గత నెల 14న హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తరువాత సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో రికార్డు చేసి దాన్ని భాస్కరరావు ఆయన భార్య డాక్టర్ భాగ్యలక్ష్మితో ‘సాక్షి’కి పంపించారు. వైద్య ఖర్చుల కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
రైలు కింద పడి తల్లి కొడుకు ఆత్మహత్య
సాక్షి, ఒంగోలు: ఏం జరిగిందో తెలియదుగానీ తల్లి, కొడుకు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సమాచారం శనివారం వేకువ జామున 3 గంటల సమయంలో రైల్వే పోలీసులకు అందింది. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటన స్థానిక ఒంగోలు రైల్వే ఫ్లయి ఓవర్ బ్రిడ్జి నుంచి 300 మీటర్ల దూరంలో పోతురాజు కాలువకు సమీపంలో వెలుగు చూసింది. మృతుల వద్ద ఎటువంటి ఆధారాలూ లభించలేదు. తల్లి తలకింద చేతులు పెట్టుకుని మరీ ఆత్మహత్యకు పాల్పడినట్లు కనిపించడంతో చూపరులను కలచి వేస్తోంది. శరీరంలో సగభాగం నుజ్జునుజ్జుగా కాగా కుమారుని కాలు తెగిపోయింది. మృతురాలికి సుమారు 30 ఏళ్లు ఉంటాయి. కుమారుడికి ఆరేళ్లు ఉంటాయని అంచనా. మృతదేహాలను రిమ్స్ మార్చురీకి తరలించిన అనంతరం రైల్వే పోలీసులు ఆ ఫొటోలతో నగరంలోని పలు ప్రాంతాల్లో విచారించినా ఎటువంటి సమాచారం లభించలేదు. మృతులు ఎవరైంది తెలిస్తేగానీ వారి ఆత్మహత్యకు కారణాలు వెలుగు చూసే అవకాశం లేదని రైల్వే పోలీసులు పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో సాంఘిక సంక్షేమ విభాగం గ్రూప్–4 సర్వీస్‌లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 59 ► పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్, అటెండర్, కాపలాదారు, వంట మనిషి. ► అర్హత: చదవడం, రాయడం, ఐదు, ఏడో తరగతి, ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. తెలుగు, ఇంగ్లీష్‌లో టైపింగ్ హయ్యర్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం ఉండాలి. ► వయసు: 18 నుంచి 47ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఉప సంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ, ప్రగతి భవనం, ప్రకాశం జిల్లా చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 21.07.2021 ► వెబ్సైట్: https://www.swpksm.in డీఎంహెచ్‌వో, అనంతపురంలో 16 పీఎంఓ అసిస్టెంట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పారా మెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్(పీఎంఓఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 16 ► అర్హత: ఎంపీసీ/బైపీసీ గ్రూపులతో ఇంటర్మీడియట్‌తోపాటు పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సు/బీఎస్సీ(ఆప్టోమెట్రీ)/డిప్లొమా(ఆప్టోమెట్రిక్)/డిప్లొమా (ఆప్టోమెట్రీ) ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థి ఏపీ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి. ► వయసు: 01.12.2020 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: దీనిని 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 45 మార్కులు విద్యార్హత(ఇంటర్మీడియట్)లో సాధించిన మార్కులకు, మరో 45 మార్కులు టెక్నీషియన్ విద్యార్హతలో సాధించిన మార్కులకు, మిగిలిన 10 మార్కులు వయసుకు కేటాయిస్తారు. రిజర్వేషన్ నిబంధనలను పరిగణ నలోకి తీసుకుంటారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, అనంతపురం, ఏపీ చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తు ప్రారంభ తేది: 15.07.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 21.07.2021 ► వెబ్సైట్: https://ananthapuramu.ap.gov.in -
సీఎం జగన్ దృష్టిలో అన్ని జిల్లాలు సమానమే..
సాక్షి, ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టిలో అన్ని జిల్లాలు సమానమేనని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లాకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రైతుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఏ ప్రభుత్వం చేయని విధంగా మేలు చేస్తోంది. ప్రతి నెలా మూడో శుక్రవారం వ్యవసాయ సలహా మండలి మీటింగ్ ఉంటుంది. టీడీపీ ఎమ్మెల్యేలు సాగర్ నీళ్లపై ముసలి కన్నీరు కారుస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా?. ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేలు రైతుల సమస్యలు గాలికి వదిలేశారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే డ్రామాలు ఆడుతున్నారు. ప్రకాశం నీటి సమస్యపైన చంద్రబాబు ఎందుకు మాట్లాడడు? ఎందుకు స్పందించడు?. ఓటుకి నోటు కేసులో లోపల వేస్తారని భయమా?. నీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము’’ అని అన్నారు. -
రైతులుకు సోలార్ పవర్..
సాక్షి,ఒంగోలు అర్బన్: వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారు. ఇప్పటికే రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాలు, ల్యాబ్‌లు, పాడి రైతుల అభివృద్ధి కోసం అమూల్ సంస్థతో కలిసి పనిచేయడంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి రైతుల వ్యవసాయానికి అవసరమైన నాణ్యమైన విద్యుత్‌ను 9 గంటల పాటు నిరంతరాయంగా అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తొలుత 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించినా కొన్ని సాంకేతిక కారణాలతో తొలి విడతలో 6400 మెగావాట్ల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా జిల్లాకు 1200 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని కేటాయించారు. దొనకొండ మండలం రుద్ర సముద్రం ఆల్ట్రా మెగా సోలార్ పార్కు నుంచి 600 మెగావాట్లు, సీఎస్‌పురం సోలార్ పార్కు నుంచి మరో 600 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. ఆ మేరకు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ జేవీ మురళి భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిరంతరం సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పనులు వేగవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ జీఈసీఎల్) ద్వారా సోలార్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ జీఈసీఎల్ ద్వారా డీఈని నియమించారు. మొదటి దశకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అడిగిన మొత్తం 5930.88 ఎకరాల్లో ప్రభుత్వ భూమి 1558.67 ఎకరాలు, అసైన్డ్ భూమి 2137 ఎకరాలు, పట్టా భూమి సుమారు 300 ఎకరాలను జిల్లా యంత్రాంగం గుర్తించింది. అందులో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, పట్టా భూములు కలిపి మొత్తం సుమారు 4 వేల ఎకరాలు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్‌కు కేటాయించారు. ఎక్కడెక్కడ..ఎంతెంత భూమి.. సీఎస్‌పురం ఆల్ట్రా మెగా సోలార్ పార్కు కోసం 3,363 ఎకరాలు అవసరం కాగా 289 ఎకరాల ప్రభుత్వ భూమి, 1366 ఎకరాల అసైన్డ్ భూమి, 194 ఎకరాల పట్టా భూములను సమకూర్చారు. సీఎస్‌పురం మండలంలోని పెదగోగులపల్లి, దొనకొండ మండలంలోని రుద్రసముద్రం, మంగినపూడి, భూమనపల్లి గ్రామాల్లో భూములు కేటాయించేలా అధికారులు చర్యలు చేపట్టారు. దొనకొండ మండలంలో ఏర్పాటు చేయనున్న ఆల్ట్రా మెగా సోలార్ పార్కుకు సంబంధించి అవసరమైన మొత్తం 2567.88 ఎకరాల్లో ఇప్పటికే 1269.67 ఎకరాల ప్రభుత్వ భూమి, 547 ఎకరాల అసైన్డ్ భూములు అందజేశారు. సోలార్ పార్కు కోసం పట్టా భూములు ఇచ్చిన రైతులకు ఏడాదికి రూ.25 వేల చొప్పున లీజు కూడా చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. లీజుకు చెల్లించే మొత్తానికి రెండేళ్లకు ఒకసారి 5 శాతం చొప్పున పెంచుతూ లీజు చెల్లిస్తారు. -
వారెప్పటికీ అనాథలు కారు..!
రోదన మనోవేదనతో రోడ్డున పడ్డ జీవితాలెన్నో.. చితిమంటల వెలుగులో రక్తతర్పణమాడుతున్న శ్మశానాలెన్నో.. ఆకలి కేకలతో అలమటిస్తున్న ఆర్తనాదాలెన్నో.. కరోనా మనకు మిగిల్చిన మనోవేదన.. మానవ రోదన ఇదీ..! ఈ దయాదాక్షిణ్యం లేని వైరస్ చేతికి చిక్కి ఒంటరైన బతుకులను అక్కున చేర్చుకుంది ప్రభుత్వం. కలలను కబళించి కన్నవారిని కోల్పోయిన ఆ పసి హృదయాలను ప్రేమగా చేరదీసింది. వారెప్పటికీ అనాథలు కాకూడదంటూ ఆర్థిక భరోసాతో ఆ ఆరిపోయే బతుకుల్లో ఓ ఆశా దీపం నింపారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నో జీవితాలకు కొత్త ఆశలు చిగురించేలా చేసి భవిష్యత్‌కు ఓ భరోసానిచ్చింది. జే.పంగులూరు: ఓ కుటుంబాన్ని కరోనా కబళించేసింది. ఏకంగా ఆ కుటుంబంలోని ముగ్గురు కరోనాకు బలవడం.. ఆ ఇంట్లోని ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడం ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తోంది. అమ్మ, నాన్న, నాయనమ్మను కోల్పోయిన ఆ పసిహృదయాల వేదన మనస్సును కలచివేస్తోంది. జే.పంగులూరు మండలం అలవలపాడు గ్రామానికి చెందిన బద్రి శ్రీనివాసరావు తన భార్య స్వరాజ్యలక్ష్మి, తల్లి భాగ్యలక్ష్మి, ఇద్దరు పిల్లలు శేషసాయికుమార్, అరవింద్‌తో ఏ చీకూచింతా లేకుండా జీవిస్తున్నాడు. అయితే ఏప్రిల్ 23వ తేదీన బద్రి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడంతో వాళ్ల అమ్మకి, భార్య, పెద్దబ్బాయి శేషసాయికి పాజిటివ్‌గా తేలింది. దీంతో నలుగురు ఒంగోలు రిమ్స్‌లో చికిత్స నిమిత్తం చేరారు. ఏప్రిల్ 23వ తేదీన ఆస్పత్రిలో చేరిన శ్రీనివాసరావు చికిత్స పొందుతూ మూడు రోజుల్లోనే మృతిచెందాడు. ఆయన చనిపోయిన నాలుగు రోజులకు తల్లి భాగ్యలక్ష్మి చనిపోయింది. శ్రీనివాసరావు చనిపోయిన పదిహేను రోజులకు ఆయన భార్య స్వరాజ్యలక్ష్మి కూడా కరోనాకు బలైంది. నెలరోజుల్లోనే వీరు ముగ్గురూ మరణించడంతో ఆ ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. తల్లిదండ్రులను తమ చేత్తోనే ఖననం చేసి వారి జ్ఞాపకాలతో ఇంటికి చేరిన ఆ పసిహృదయాలను ఓదార్చే వారే కరువయ్యారు. కరోనా భయంతో ఎవ్వరూ దగ్గరకు రాలేదు.. కనీసం పలకరింపులు కూడా దూరమయ్యాయి. ఆ సమయంలో సీఎం జగన్ అభయంతో వారిలో కొత్త ఆశలు చిగురించాయి. వారి భవిష్యత్‌కు పునాదులు పడ్డాయి. పిల్లల్లో పెద్దవాడైన శేషసాయికుమార్ ఇటీవల పదో తరగతి పూర్తి చేసేకోగా, చిన్నబ్బాయి అరవింద్ ఎనిమిదో తరగతి పూర్తి చేసుకున్నాడు. చదవండి: కోవిడ్ కట్టడిలో సీఎం జగన్ చర్యలు భేష్ బాధిత చిన్నారులకు తక్షణమే భరోసా -
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
Ongole: కోవిడ్ కేర్ సెంటర్.. మెనూ అదుర్స్
ఒంగోలు టౌన్: కరోనా బారిన పడినవారు మానసిక ఒత్తిడికి గురికాకూడదు. అదే సమయంలో అధిక పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ఈ రెండింటిని పాటిస్తే రోజుల వ్యవధిలోనే కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉంటారు. ఈ రెండూ ఒంగోలులోని పాత ట్రిపుల్ ఐటీ కాలేజీలోని కోవిడ్ కేర్ సెంటర్లో ఉంటున్న కరోనా బాధితులకు అందుబాటులో ఉంటున్నాయి. ఇక్కడ మొత్తం 500 పడకలను ఏర్పాటు చేశారు. కరోనా లక్షణాలు కలిగి ఉండి హోమ్ ఐసోలేషన్‌లో ఉండేందుకు అవకాశం లేనివారిని ఇక్కడ ఉంచుతున్నారు. ప్రస్తుతం 170 మంది ఈ సెంటర్లో ఉంటున్నారు. వారందరి ఆరోగ్యాన్ని చూసేందుకు 24/7 కింద వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు. అదే సమయంలో వారు మానసిక ఒత్తిళ్లకు గురికాకుండా ఉండేందుకు ఉపశమన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధిక పోషక విలువలు కలిగిన రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. భోజన తయారీలో నాణ్యతకు పెద్ద పీట వేస్తున్నారు. దాంతో రుచికరమైన భోజనాన్ని ఆహారంగా తీసుకుంటూ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. మెనూ అదుర్స్ పాత ట్రిపుల్ ఐటీ కాలేజీలోని కోవిడ్ కేర్ సెంటర్లో ఉండేవారికి నిర్ణీత మెనూ ఉంది. సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 7 గంటలకు బెల్లం, పాలు కలిపిన రాగిజావ అందిస్తారు. 8.30 గంటలకు మూడు పూరి లేదా మూడు చపాతి ఆలుబఠాని కుర్మాతో అందిస్తారు. టీ లేదా కాఫీ ఇస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అన్నం 300 గ్రాములు, చపాతి 150 గ్రాములు, చికెన్ కర్రీ 150 గ్రాములు, వెజ్ కర్రీ 100 గ్రాములు, పప్పుకూర 75 గ్రాములతో పెడతారు. ఆకుకూర కర్రీ 75 గ్రాములు, సాంబారు రైస్ 100 గ్రాములు, రసం 100 గ్రాములు, పెరుగు 100 గ్రాముల చొప్పున ఇస్తారు. వీటితోపాటు ఒక పండు కూడా అందిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు టీ, బిస్కెట్ ఇస్తారు. రాత్రి 7.30 గంటలకు అన్నం 300 గ్రాములు, చపాతి 150 గ్రాములు, ఉడికిన గుడ్లు రెండు, చట్నీ లేదా వెజ్‌కర్రీ 100 గ్రాములు. పప్పుకూర 75 గ్రాములు, ఆకు కర్రీ 75 గ్రాములు, సాంబారు రైస్ 100 గ్రాములు, రసం 100 గ్రాములు, పెరుగు 100 గ్రాముల చొప్పున ఇస్తారు. వారం రోజులపాటు అందించే మెనూలో అల్పాహారం కింద అందించే వాటిలో మాత్రం అక్కడ ఉండేవారి అభిరుచి మేరకు స్వల్ప మార్పులు చేస్తూ ఉంటారు. మంగళవారం ఇడ్లీ రెండు, వడ, బుధవారం ఉప్మా 75 గ్రాములు, వడ రెండు, గురువారం ఉప్మా 75 గ్రాములు, ఊతప్పం, శుక్రవారం కిచిడి, చపాతి చేసి వాటికి ఆలుబఠాని కర్రీ కాంబినేషన్‌గా ఇస్తారు. శనివారం పులిహోర, దానికి కాంబినేషన్‌గా చట్నీ ఇస్తారు. ఆదివారం టమాటా బాత్, పొంగలి ఇస్తారు. మెనూలో రాజీ పడేది లేదు పాత ట్రిపుల్ ఐటీ కాలేజీలోని కోవిడ్ కేర్ సెంటర్లో ఉండేవారికి అందించే మెనూ విషయంలో రాజీ పడేది లేదు. ఇక్కడకు వచ్చేవారికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో, ఆహారం కూడా అంతే ముఖ్యంగా భావించి వాటిని తయారు చేయిస్తున్నాం. కలెక్టర్ పోల భాస్కర్ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకొని రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నాం. ఇక్కడ ఉండేవారి అభిప్రాయాలను కూడా తీసుకొని వారికి అనుగుణంగా రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నాం. ఇక్కడకు వచ్చినవారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వెనుదిరుగుతున్నారంటే అందులో ఇక్కడ అందించే భోజనం ముఖ్య భూమిక పోషిస్తోంది. – ఉపేంద్ర, సెంటర్ నోడల్ అధికారి చదవండి: రాగి జావ.. కొర్ర బువ్వ..జొన్న రొట్టె..! -
స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ మాగుంట
సాక్షి, ఒంగోలు: తమిళనాడు డీఎంకే అధినేత, కాబోయే ముఖ్యమంత్రి స్టాలిన్‌ను చైన్నైలోని ఆయన నివాసంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా మొదటిసారి ఎన్నికైన స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు ఆయన కుమారుడు మాగుంట మాగుంట రాఘవరెడ్డి కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ మాగుంటకు రెండో డోసు వ్యాక్సిన్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి బుధవారం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ రెండో మోతాదు వేయించుకున్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ప్రజలు కూడా వ్యాక్సిన్‌ను వేయించుకుంటూ వైద్యులు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
కళాశాల హాస్టల్లో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
ఒంగోలు: ఇంటర్ విద్యార్థి కళాశాల హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. కొనకనమిట్ల మండలం రేగలగడ్డకు చెందిన దుంపా అంజిరెడ్డి, ఆదిలక్ష్మమ్మ దంపతుల కుమారుడు దుంపా పవన్‌కల్యాణ్ రెడ్డి (19) ఒంగోలు సమీపంలోని పెళ్లూరులోని శ్రీ సరస్వతి జూనియర్ కాలేజీలో ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. స్వగ్రామానికి దూరం కావడంతో కాలేజీ హాస్టల్లోనే ఉంటున్నాడు. శనివారం నిద్రలేచిన సహచర విద్యార్థులకు హాస్టల్ కిచెన్ రూంలో పవన్‌కల్యాణ్ రెడ్డి ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించాడు. విషయాన్ని విద్యార్థులు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లగా అతడు ఇతర సిబ్బందితో కలిసి పవన్‌ను కిందకు దించి ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు రిమ్స్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. కాగా, చదవలేకే పవన్ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని కళాశాల యాజమాన్యం చెబుతోంది. మృతుడి కుటుంబసభ్యులు మాత్రం గతంలో జరిగిన పరీక్షల్లో ఫెయిలయ్యాడని అధ్యాపకులు పవన్‌ను బాగా కొట్టారని, అంతే కాకుండా శుక్రవారం జరిగిన పరీక్షల్లో స్లిప్పులు పెట్టి కాపీ రాస్తూ పట్టుబడటంతో బాగా కొట్టారని చెబుతున్నారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ప్రధాని మోదీకి తెలుగు విద్యార్థిని ప్రశ్న, ఊహించని గిఫ్ట్
సాక్షి, ప్రకాశం: ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడిన పల్లవిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అభినందించారు. ఆమె ఉన్నత విద్యకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. గురువారం మార్కాపురంలోని తన నివాసంలో మంత్రి పల్లవిని సత్కరించారు. తల్లిదండ్రులు మోహనరావు, సంపూర్ణ, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావుతో కలిసి వచ్చిన పల్లవితో ఆయన మాట్లాడారు. ‘‘ఎంతో ధైర్యంగా ప్రశ్న అడిగావు.. ప్రధాని సమాధానం ఇచ్చారు. శభాష్ పల్లవి..’’ అంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. భవిష్యత్తులో ‘‘నీ లక్ష్యం ఏమిటి’’ అని పల్లవిని మంత్రి.. ప్రశ్నించగా తాను డాక్టర్ కావాలనుకుంటున్నట్లు చెప్పడంతో ప్రభుత్వం తరపున ఉన్నత చదువుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. పల్లవి ఆన్లైన్ విద్యాభ్యాసానికి తమ ఇంట్లో టీవీ లేదని చెప్పగా మంత్రి అప్పటికప్పుడు టీవీతో పాటు డిక్షనరీని కూడా బహూకరించారు. ధైర్యంగా ప్రధానిని ప్రశ్నించిన పల్లవి ‘పరీక్షా పే చర్చ' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని పల్లవి ఎంపికై తన సందేహాలను వీడియో ద్వారా ప్రధాని ముందుంచింది. 'కరోనా ప్రభావంతో ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పరీక్షలు దగ్గర పడుతుండటంతో పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నాం. భయాన్ని వీడి ఏకాగ్రతతో పరీక్షలు రాసేందుకు ఉపాయం చెప్పండి' అని పల్లవి కోరింది. ఇందుకు ప్రధాని 'పరీక్షలంటే భయపడవద్దు. మనల్ని మెరుగుపరచుకునేందుకు ఉపకరించేవిగా వాటిని చూడండి. కొన్నిసార్లు సామాజిక, కుటుంబ వాతావరణం కూడా విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తుంది. ఒత్తిడి లేకపోతే విద్యార్థులు పరీక్షలను భారంగా భావించరు. కష్టంగా అనిపించిన సబ్జెక్టుల నుంచి దూరంగా పారిపోవద్దు. నా వరకు నేను కష్టమైన పనిని ఉదయాన్నే చేస్తాను. అప్పుడైతే ప్రశాంతంగా ఉంటుంది. సులభమైన పనుల్ని రాత్రి పొద్దుపోయాక చేస్తుంటాను'' అని సమాధానమిచ్చారు. ( చదవండి: ‘నే ఆటోవాణ్ణి.. పచ్చదనం రూటువాణ్ణి! ) -
ప్రకాశం జిల్లా లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది
-
మైనర్‌పై లైంగిక దాడి.. ఆరు నెలల గర్భం.. ఆపై
సాక్షి, ఒంగోలు: మైనర్‌కు మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి ఆనక ఆరు నెలల గర్భాన్ని గుట్టుచప్పుడు కాకుండా తీయించారు. బాధితురాలి తండ్రి మంగళవారం జిల్లా అదనపు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. కొమరోలు మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక అక్కడి కేజీబీవీలో చదువుతోంది. కరోనా నేపథ్యంలో బడికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటోంది. ఆమెను అదే గ్రామానికి చెందిన కాశీరావు అనే వ్యక్తి మరో మహిళ ద్వారా ఇంటికి రప్పించుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక ఆరు నెలల గర్భం దాల్చింది. నిందితుడు విశ్వరూపం అనే వ్యక్తిని ఆశ్రయించి అతడి ద్వారా సుభానీ అనే ఆర్ఎంపీ వద్ద గర్భం తీసేయించారు. కుమార్తె అనారోగ్యంగా ఉంటుండటంతో పలు ఆస్పత్రుల్లో చూపించారు. ఓ ఆస్పత్రిలో బాలికకు గర్భం తీసేసిన విషయం గుర్తించారు. బాధిత బాలికను బంధువులు గట్టిగా నిలదీయడంతో ఆమె విషయం చెప్పింది. నిందితులు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై అదనపు ఎస్పీ రవిచంద్ర స్పందిస్తూ ఫిర్యాదుపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలంటూ మార్కాపురం డీఎస్పీని ఆదేశించారు. చదవండి: పెళ్లిరోజు వేడుకలు.. అంతలోనే విషాదం! -
చేయి కోసుకొని.. లవర్‌కు వాట్స్‌ప్‌లో ఫొటోలు పెట్టి..
సాక్షి, ప్రకాశం : గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన తిమ్మనపాలెం పొలాల్లో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసుల సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం దిండోరి జిల్లా మెహెన్ద్ మండలం సుక్లోండి గ్రామానికి చెందిన సంజీవన్ (20) ఐదు నెలల నుంచి స్నేహితులతో కలిసి కొరిశపాడు మండలం తిమ్మనపాలెం బీసీ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ మద్దిపాడు గ్రోత్ సెంటర్ అంజలీ గ్రానైట్స్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి పనికి వెళ్లి సోమవారం ఉదయం తిరిగి రూమ్‌కు వచ్చాడు. సోమవారం ఉదయం గది నుంచి బయటకు వచ్చిన సంజీవన్ అదే రోజు రాత్రి చేయి కోసుకొని తన ప్రియురాలికి వాట్స్‌ప్‌లో ఫొటోలు పెట్టాడు. మంగళవారం ఉదయం అటుగా గ్రానైట్‌లో పనికి వెళ్తున్న వారికి సంజీవన్ రక్తపు మరకలతో రాళ్ల దిబ్బపై మృతి చెంది ఉండటాన్ని గమనించారు. స్నేహితులు (తోటి కూలీలు) మేదరమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌కు సమాచారం అందించారు. డాగ్ స్క్వాడ్ వచ్చి మృతదేహం నుంచి గ్రానైట్ కంపెనీ వైపునకు పరుగులు తీసింది. క్లూస్ టీమ్ సభ్యులు మృతదేహంపై ఉన్న వేలిముద్రలు సేకరించారు. డీఎస్పీ ప్రకాశ్‌రావు, సీఐ ఆంజనేయరెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్థానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: చదువులో వెనకబడ్డానని.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య -
ఆస్ట్రేలియాలో ప్రకాశం జిల్లా యువకుడి మృతి
మేదరమెట్ల: ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన రావి హరీష్‌బాబు(31) ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. పూర్ణచంద్రరావు, రమాదేవిల రెండో కుమారుడైన హరీష్‌బాబు ఆరేళ్లుగా ఆస్ట్రేలియాలోని అడిలైడ్ రాష్ట్రంలో ఉంటున్నారు. మేనమామ కూతురినే వివాహం చేసుకున్నాడు. గతేడాది భార్య ప్రసవం కోసం పుట్టిల్లు అయిన ప్రకాశం జిల్లా పేర్నమిట్టకు వచ్చింది. ప్రసవం తర్వాత కరోనాతో విమాన రాకపోకలు లేకపోవడంతో తిరిగి భర్త వద్దకు వెళ్లలేకపోయింది. ఇటీవలే విమాన రాకపోకలను పునరుద్ధరించడంతో ఆస్ట్రేలియా వెళ్లేందుకు శుక్రవారం చెన్నై విమానాశ్రయానికి వెళ్లింది. అక్కడ నుంచి భర్తకు ఫోన్ చేస్తే స్పందన లేకపోవడంతో ఆస్ట్రేలియాలో ఉండే బంధువులకు ఫోన్ చేసింది. దీంతో అక్కడకు వెళ్లిన బంధువులు హరీష్ చనిపోయి ఉండటాన్ని గమనించి భార్యకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న హరీష్‌బాబు ఎలా చనిపోయాడో తెలియక కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. మృతదేహం స్వగ్రామానికి రప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
నిందితుడి కాల్‌డేటాలో విస్తుపోయే నిజాలు!
పెద్దదోర్నాల: ప్రశాంతగా ఉన్న నల్లమలపై మళ్లీ వేటగాళ్ల కన్ను పడింది. కొంతకాలంగా ఎటువంటి అలజడి లేకుండా ఉన్న అభయారణ్యంలో ఓ చిరుతను వేటాడి మరీ దాని చర్మాన్ని అమ్మేందుకు ప్రయత్నించి కొందరు వ్యక్తులు పట్టుబడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. వన్యప్రాణులను వేటాడి వాటి చర్మాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొందరు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో అటవీ శాఖాధికారులు నిర్వహించిన దాడులలో ఓ యువకుడు చిరుత చర్మంతో పట్టుబడ్డాడు. ఈ ఘటనలో కొందరు సిబ్బంది ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం కావటంతో అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణపై చేపట్టారు. అటవీశాఖ సిబ్బంది హస్తంపై అనుమానాలు.. నల్లమలలో దొరికిన చిరుత చర్మం కేసులో అటవీశాఖ సిబ్బంది ప్రమేయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనలో పట్టబడిన నిందితుడు నాగరాజు సెల్‌ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు బయట పడ్డట్టు సమాచారం. అందులో పెద్దదోర్నాల రేంజి అధికారికి జీప్ డ్రైవర్‌కి సంబంధించిన పూర్తి కాల్ డేటా అందుబాటులో ఉన్నట్లు సమాచారం. దీంతో అధికారులు డ్రైవరును అదుపులోకి తీసుకుని పూర్తి స్దాయిలో విచారిస్తున్నారు. జీప్ డ్రైవరుతో పాటు అతనికి సోదరుడి వరుసైన మరో యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో అటవీశాఖాదికారుల అదుపులో ప్రస్తుతం డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నట్లు వి«శ్వసనీయ సమాచారం.(చదవండి: చిరుతపులి పిల్లను చంపి వండుకు తిన్నారు ) స్వార్థానికి మూగజీవాలు బలి.. అడవిలో స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణుల పాలిట కొందరు కాలయముళ్లుగా తయారయ్యారు. జాతీయతకు చిహ్నంగా నిలుస్తున్న పెద్దపులలను సైతం నిర్ధాక్షిణ్యంగా మట్టు పెడుతున్నారు. అమాయక ప్రాణులు వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని అంతరించి పోతున్నాయి. గతంలో మండల పరిధిలోని ఐనముక్కలలో రెండు పులుల చర్మాల దొరికిన సంఘటన మరువక ముందే మరలా చిరుత చర్మాని అమ్మేందుకు ప్రయత్నించి మరి కొందరు పట్టుబడటంతో స్మగ్లర్ల ధన దాహానికి అద్దం పడుతోంది. నిఘా ఉన్నా ఆగని మరణ మృదంగం... వన్య ప్రాణులు, అటవీ సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం 1972లో ప్రత్యేక చట్టం ప్రవేశపెట్టింది. 1973 మార్చి 1న దానిని అమలులోకి తెచ్చింది. అప్పటి నుంచి శిక్షలను కఠినతరం చేస్తూ ప్రత్యేక చట్టాలు అనుసంధానిస్తూ వస్తున్నా, వన్యప్రాణుల మరణాలు మాత్రం ఆగడం లేదు. దీంతో పాటు అక్రమంగా ఆయుధాలను కలిగి అరణ్యంలోకి ప్రవేశించడం, వన్యప్రాణుల ప్రశాంతతకు విఘాతం కలిగించినా సైతం కేసులు నమోదు చేసి శిక్షలు విధిస్తారు. 2002 జీవవైవిధ్య పరిరక్షణ చట్టం ప్రకారం అరుదైన, సంరక్షక వృక్ష, జంతుజాలం సంచరించే ప్రాంతాల్లోకి అనుమతులు లేకుండా వెళ్లినా, వాటికి హాని కలిగించినా శిక్షలు తప్పవు. -
గంటల వ్యవధిలో తండ్రి, కొడుకు మృతి
సాక్షి, బల్లికురవ(ప్రకాశం): కొడుకు అస్వస్థతకు గురి కావడంతో తీవ్ర ఆవేదన చెందిన తండ్రి 15 రోజులుగా మంచం పట్టాడు. ఆ దిగులుతోనే తండ్రి చనిపోగా తండ్రి లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఇప్పటికే తీవ్ర అస్వస్థతతో ఉన్న కుమారుడు గంటల వ్యవధిలో తనువు చాలించాడు. ఈ హృదయ విదారక సంఘటన బల్లికురవ ఎస్సీ కాలనీలో బుధవారం వెలుగు చూసింది. వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే జొన్నలగడ్డ దిబ్బయ్య (72)కు భార్య, కుమారుడు ఉన్నారు. అనారోగ్యంతో భార్య గతంలోనే చనిపోయింది. కుమారుడు బుల్లెయ్య (53), కోడలు దిబ్బయ్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇటీవల బుల్లెయ్యకు ఊపిరి తిత్తులు దెబతినడంతో వైద్యశాలల చుట్టూ తిరగుతున్నాడు. అయినా వ్యాధి తగ్గలేదు. విషయం తెలుసుకున్న తండ్రి మంచంపట్టి ఆ దిగులుతోనే చనిపోయాడు. తనకు జన్మనిచ్చిన తండ్రి ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేని కుమారుడు కూడా తనువు చాలించాడు. బుధవారం ఉదయం తండ్రి అంత్యక్రియులు, ఆ తర్వాత కుమారుడి అంత్యక్రియలు కుటుంబ సభ్యులు ముగించారు. బుల్లెయ్యకు భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుల బంధువుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. (చదవండి: యూపీలో మరో నిర్భయ) -
ముంచిన యాప్: రూ.1.5 కోట్ల మేర కుచ్చుటోపీ!
సాక్షి, కొండపి(ప్రకాశం): మండలంలోని పలువురు యువతకు ఆన్లైన్ మోసకారులు గాలం వేశారు. బీహార్, బెంగళూరు, ముంబాయిల చిరునామాలతో అమాజిన్ ఈ కామర్స్ కంపెనీ లిమిటెడ్ పేరుతో సర్టిఫికెట్ ఆన్లైన్లో పెట్టి యువకులతో చాట్ చేశారు. డబ్బులు డిపాజిట్ చేయించుకుని ఎనిమిది నెలల పాటు ఆటసాగించారు. వారం క్రితం ఒక్కసారిగా యువత డిపాజిట్ చేసిన డబ్బును నొక్కి కుచ్చుటోపి పెట్టిన ఆన్లైన్ మోసం మండలంలోని పెదకండ్లగుంట గ్రామంలోని బాధితుల ద్వారా మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల్లోకి వెళితే..పెదకండ్లగుంట గ్రామానికి చెందిన యువకులకు తమ గ్రామంలోని ఇతర ప్రాంతాల్లోని యువకుల ద్వారా బర్స్ యాప్ గురించి తెలుసుకుని డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ విధంగా గ్రామంలో 30 మందికి పైగా ఆకర్షితులు కావటంతో పాటు కొండపిలో సైతం కొంతమంది ఈయాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. సంస్థ ఇచ్చిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా నూతన ఖాతాలు ఆన్లైన్లోనే తెరచుకున్నారు. వారి బ్యాంక్ అకౌంట్ల నుంచి నేరుగా యాప్‌లో రూ.600 పెట్టుబడి నుండి రూ.30 వేలు, రూ.50 వేల వరకు డిపాజిట్ చేశారు. రూ.600 డిపాజిట్‌కి వచ్చే బబుల్స్ మీద నొక్కితే రూ.2 వరకు కమీషన్ వారి బ్యాంకు ఖాతాలో జమవుతుంది. రోజుకు 30 సార్లు అవకాశం ఇస్తారు. అదే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్ చేస్తే 30 సార్లు వచ్చే బబుల్స్‌ని నొక్కితే రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వస్తుంది. కమీషన్ కింద వచ్చే డబ్బుల్లో 18 శాతం జీఎస్టీ కూడా కట్ చేసి వారి అకౌంట్లలో జమచేస్తారు. ఈ విధంగా బబుల్స్ గేమ్స్ మేనెల నుంచి డిసెంబర్ 25 వరకు ఆడారు. అయితే పది రోజుల నుంచి బబుల్స్ వస్తున్నా..కమీషన్ డబ్బులు పడటం ఆగిపోయాయి. రెండు రోజుల నుంచి పూర్తిగా గేమ్‌తో పాటు లావాదేవీలు సైతం నిలిచిపోయాయి. దీంతో సొంత పెట్టుబడితో పాటు గేమ్ ద్వారా వచ్చిన మొత్తం డబ్బును ఒక్క పెదకండ్లగుంట, కొండపి గ్రామాల్లోనే 30 మందికి పైగా రూ.7 లక్షలకు పైగా నగదు పోగొట్టుకున్నారు. దీంతో లబోదిబోమంటూ బయటకు చెప్పుకుంటే సిగ్గుచేటని కిమ్మనకున్నారు. ఒకరు అర బయటకు వచ్చి తమకు జరిగిన మోసం గురించి బయటపెట్టారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా ఒకరి ద్వారా ఒకరు తెలుసుకుని వందల మంది రూ.1.5 కోట్ల వరకు నష్టపోయి ఉంటారని బాధితులు అంటున్నారు. ఈ విషయమై కొండపి ఎస్ఐ రాంబాబును వివరణ కోరగా దీనిపై తనకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేసి విచారణ చేస్తామని తెలిపారు. (చదవండి: పెళ్లి బస్సు బోల్తా: ఏడుగురు మృతి) మోసపోయాం ఆశకు పోయి ఆన్లైన్ మోసానికి గురయ్యాం. నాతో పాటు కొండపిలో 30 మందికి పైగా రూ.7 లక్షల వరకు నష్టపోయాం. నాకు తెలిసిన ఒంగోలులోని మిత్రుడు రూ.1.5 లక్షల వరకు నష్టపోయాడు. ఇంకా చెప్పటానికి వెనుకంజ వేస్తున్న ఎంతో మంది జిల్లా వ్యాప్తంగా వందల్లో ఉన్నారు. అంతా దాదాపు రూ.1.5 కోటికిపైగా నష్టపోయి ఉంటారు. ఎవరూ ఇటువంటి మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకోవద్దు. - నారాయణ, పెదకండ్లగుంట -
చూపు తిప్పుకోనివ్వని పూల మిద్దె
పేదలు, మధ్య తరగతి వారంతా ‘ఏం తినేటట్లు లేదు.. ఏం కొనేటట్లు లేదు’ అని పాట పాడుకుంటారు’ ఇల్లు ఎలా గడవాలో తెలియక సతమతం అవుతుంటారు. పెరటిలో ఏవైనా మొక్కలు వేసకుందామనుకుంటే.. ఆ రోజులు పోయాయి. అతి తక్కువ స్థలంలోనే ఇళ్లు కట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీనికి పరిష్కార మార్గమే మిద్దె పంట. ఇంటిపై ఎంచక్కా కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలు పెంచుకుంటే వాటిని కొనే బాధ తప్పుతుంది. పర్యావరణంతో పాటు ఆరోగ్యమూ సిద్ధిస్తుంది. సాక్షి, మార్కాపురం: ప్రస్తుతం ఎక్కడ చూసినా హాట్ టాపిక్ ఒక్కటే అదే ఆరోగ్యం. తెలుగు రాష్ట్రాల్లోని వారు అది ఎలా దొరుకుతుందో రీసెర్చిలు మొదలు పెట్టారంటే అతిశయోక్తి కాదు. ఈ కోవకు చెందిన వారే ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగ దంపతులు. తమ ఇంటి మేడనే నందన వనంగా మార్చుకున్నారు. ప్రకృతిని కేవలం ఇష్టపడటమే కాదు.. ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తూ ఆ పంటనే తినాలని ప్రచారం చేస్తున్న ఈ దంపతులు అందరి అభినందనలు అందుకుంటున్నారు. ఒక్క ఆలోచన మార్కాపురం పట్టణంలోని విద్యానగర్‌లో నివాసం ఉండే కేఐ సుదర్శన్‌రాజు యర్రగొండపాలెం వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులుగా, ఆయన భార్య నాగలక్ష్మి తిప్పాయపాలెం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం అంటే ఇద్దరికీ ప్రాణం. ఈయన తన వృత్తిలో భాగంగా సహజంగానే ప్రతి రోజూ పంటల సాగుపై రైతులకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఈనేపథ్యంలో రెండేళ్ల క్రితం మంచి ఆలోచన వచ్చింది. అదే మిద్దె పంట సాగు. ఇలా ఇద్దరూ కలిసి తాము ఉంటున్న ఇంటి పైనే వివిధ రకాల పూలు, పండ్లు, కూరగాయల మొక్కలను సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా బెండ, దొండ, చిక్కుడు, కాకర, టమోటా, సొరకాయతో పాటు ఆకుకూరలైన పాలకూర, చుక్కకూరతో పాటు చిన్న చిన్న పండ్ల మొక్కలను పెంచుతున్నారు. తాము పండించిన మిద్దె పంటతో సుదర్శన్‌రాజు దంపతులు పూలమొక్కలైన మందార, గులాబి, నందివర్దనం, లిల్లీ, తదితర మొక్కలు కూడా సాగు చేస్తున్నారు. దాదాపు ఏదాదిన్నర నుంచి ఆ గృహమంతా కళకళలాడుతుండటంతో రకరకాల పక్షులు కూడా అక్కడకు వచ్చి చేరుతున్నాయి. దీంతో వాటి కోసం గూళ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు చుట్టు పక్కల వారు కూడా మిద్దె పంట సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ‘ప్రస్తుతం కూరగాయల దిగుబడులు వస్తున్నాయి. సాయంత్రం సమయాల్లో గార్డెనింగ్‌లో కూర్చుంటే చల్లటి స్వచ్ఛమైన గాలి వస్తోంది. అందరూ ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఆరోగ్యం వచ్చి తీరుతుంది’ అని చెప్పారు సుదర్శన్‌రాజు, నాగలక్ష్మి. -
నారా లోకేష్ తీరుపై తీవ్ర వ్యతిరేకత
సాక్షి, ప్రకాశం : నారా లోకేష్ తీరుపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రకాశం జిల్లాలో బుధవారం మంత్రి మాట్లాడుతూ.. సాక్షి పత్రిక ప్రతులను తగాలబెడతావా అని లోకేష్‌పై నిప్పులు చెరిగారు. పత్రికలపై గౌరవం ఉన్న వారు ఇటువంటి పని చేయరని పేర్కొన్నారు. అలాగైతే తప్పుడు కథనాలు రాస్తున్న మీ పచ్చ పత్రికను మేమేం చేయాలని ప్రశ్నించారు. దానిని మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మాకు ఏ పథకం అందలేదని కొందరితో చెప్పించి మీ అనుంగు పత్రికలో అబద్దాలు రాయించారని మండిపడ్డారు. వాళ్ళు పొందిన లబ్దికి ఆధారాలు ఉన్నాయని చూపించారు. మీ పత్రికలో రాసిన మేడపి గ్రామ వాసులు రేగుల కాశయ్య, అనురాధ కుటుంబానికి వివిధ పథకాల ద్వారా 2లక్షల 88వేల 545 పాయలు అందాయని స్పష్టం చేశారు. అమ్మఒడి రాలేదని రాసిన రేగుల అనురాధ ఖాతాలో గత ఏడాది రూ 15 వేలు జమ అయ్యిందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా లోకేష్ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. చదవండి: పప్పూ... ఇది తప్పు!! కాగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలో మంగళవారం సాక్షి ప్రతుల్ని చింపి దహనం చేసిన నారా లోకేష్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన్ను చూసి ప్రజాస్వామ్య వాదులు సిగ్గు పడాలని, తెలుగుదేశం పార్టీ తలదించుకోవాలని మండిపడుతున్నారు. ఈయనకు ప్రజాస్వామ్యమన్నా.. దానికి మూలస్తంభాల్లాంటి పత్రికలన్నా ఏ కొంచమైనా గౌరవం ఉందా? ఉంటే ఇలా చేస్తాడా? నిజాలు తనకు నచ్చనంత మాత్రాన ఏకంగా పత్రిక ప్రతులనే తగలబెట్టే సాహసం చేశాడంటే ఈయన రాజకీయాలకు పనికొస్తాడా? అధికారం లేదనే నైరాశ్యంలో.. తమ కుట్రలు బయటపడిపోతున్నాయన్న అక్కసుతో ఇంతకు దిగజారిపోతాడా? అని ప్రశ్నిస్తున్నారు. -
భార్య కాళ్లు పట్టుకుంది.. ప్రియుడు పీకనొక్కాడు
సాక్షి, దర్శి టౌన్ (ప్రకాశం జిల్లా): ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి, ఉరేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందో మహిళ. విచారణలో అసలు విషయం వెల్లడవడంతో నిందితురాలు నేరం అంగీకరించింది. దర్శి డీఎస్పీ కె.ప్రకాశరావు మంగళవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. మండల కేంద్రం సంతమాగులూరుకు చెందిన దంపతులు చెన్నుపల్లి శ్రీనివాసరావు (45), సైదాలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. సైదాలక్ష్మి కూలి పనులకు వెళ్తోంది. 18 నెలల క్రితం గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నల్లగంగుల వెంకటరెడ్డితో పరిచయం ఏర్పడింది. క్రమంగా అది కాస్తాత అక్రమ సంబంధంగా మారింది. విషయం భర్తకు తెలియడంతో ఇంట్లో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. తీరు మార్చుకోవాలని పలుమార్లు ఆమెను భర్త మందలించాడు. దీంతో ఆమె ప్రియుడితో కలిసి భర్తను అంతమెందించాలని పథకం వేసింది. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీ రాత్రి శ్రీనివాసరావు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం ఇంట్లో నిద్రించాడు. ఆ తర్వాత పథకం ప్రకారం ఆమె భర్త కాళ్లు పట్టుకొని కదలకుండా చేయగా ప్రియుడు పీక నొక్కి శ్రీనివాసరావును హతమార్చారు. తర్వాత ఆమె భర్తే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. మృతుడి తమ్ముడు చెన్నుపల్లి వీరయ్య ఫిర్యాదు మేరకు సంతమాగులూరు ఎస్ఐ కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా శ్రీనివాసరావుది హత్యగా నిర్థారించారు. వీఆర్వో వద్ద నిందితురాలు సైదాలక్ష్మి నేరం అంగీకరించింది. దీంతో మంగళవారం నిందితురాలిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. కేసు పరిష్కారంలో ప్రతిభ కనబర్చిన దర్యాప్తు అధికారి, అద్దంకి సీఐ ఐ.ఆంజనేయరెడ్డి, ఎస్ఐ టి.శివన్నారాయణ, హెచ్‌సీలు సురేష్‌రెడ్డి, మస్తాన్‌రెడ్డిలను ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అభినందించినట్లు డీఎస్పీ ప్రకాశరావు వివరించారు. (చదవండి: ఆన్లైన్ గేమ్స్‌కు సీఏ విద్యార్థి బలి) -
నల్లమలలో గుర్తించిన కొత్త జీవరాశులివే..
సాక్షి, పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యంలో జీవ వైవిధ్యంపై శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. సున్నిపెంటలోని బయోడైవర్సిటీ డివిజన్ కార్యాలయం కేంద్రంగా సాగుతున్న జీవవైవిధ్య పరిశోధనలు సత్ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా అంతరించిపోతున్న పులుల సంతతిపై శాస్త్రవేత్తలు దృష్టిసారించడంతోపాటు అరుదైన కొత్త జీవులను సైతం గుర్తిస్తున్నారు. నాగర్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు వేలాది జీవరాశులకు నిలయంగా ఉంది. అటవీశాఖ చేపడుతున్న విప్లవాత్మక చర్యలతో నల్లమలలో గత పదేళ్లుగా వన్యప్రాణుల సంతతి పెరగడమేకాదు దట్టమైన అడవులు విస్తరిస్తున్నాయి. నల్లమలలో ఉన్న జీవజాతులు మరో చోట కనిపించడం అరుదు. నల్లమలలో 55 జాతుల క్షీరదాలు, 200 రకాల పక్షులు, 18 రకాల ఉభయచరాలు, 54 రకాల సరీసృపాలు, 55 జాతుల చేపలు ఉన్నాయి. ఇక వీటికి అదనంగా వివిధ జాతుల కీటకాలెన్నో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ పరిధిలో బయోడైవర్సిటీ ఏర్పాటయ్యాక నల్లమల అటవీ ప్రాంతంలో కొన్ని కొత్తరకం జీవరాశులను కనుగొన్నారు. ఎస్టీఆర్ పరిధిలో ఉండే ల్యాబ్‌లో వన్యప్రాణులు, సరీసృపాలు, క్షీరదాలు, కీటకాలు, వృక్షజాతుల ఫొటో లైబ్రరినీ ఏర్పాటు చేశారు. 2001 డిసెంబర్లో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో ఆయా జాతులకు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరిచారు. నల్లమల అభయారణ్యంలో శాస్త్రవేత్తలు కనుగొన్న గద్ద 2014–15లో నల్లమల అభయారణ్యంలో కనుగొన్న జీవరాసులను పరిశీలిస్తే.. మెటోక్రొమాస్‌టిస్ నైగ్రోఫి యొరేటో, మారస్ శ్రీశైల యెన్సిస్(సాలీడు), నాగార్జునసాగర్ రేజర్(పాము), స్లెండర్ కోరల్ స్నేక్ (పాము), ఫ్రీనికస్ ఆంధ్రాయెన్సిస్(సాలీడు), పోయిసిలోథీరియా నల్లమలైయెన్సిస్(సాలీడు), సిరాప్టిరస్ లాటిప్స్(కీటకాలు), డారిస్తీన్స్ రోస్ట్రాటస్(గొల్లభామ), శ్రీలంకన్ ఫ్లైయింగ్ స్నేక్, స్యాండ్ స్నేక్, వీటితో పాటు కృష్ణానది జలాల్లో టు స్పాటెడ్‌బార్బ్ అనే అరుదైన చేపను కూడా కనుగొన్నారు. వర్షాకాలంలోనూ, వరదలు వచ్చే సమయాన మాత్రమే కృష్ణా జలాల్లో కనిపించే నీటిì æపిల్లులపై కూడా పరిశోధన చేస్తున్నారు. ఆ సమయం వాటి సంతానోత్పత్తికి సంబంధించినదిగా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. జింకలకు ప్రసిద్ధి నల్లమలలో వివిధ రకాల జింకలు ఉన్నాయి. జింకల్లో అతి చిన్నది మూషిక జింక. దీనిని బుర్ర జింకగా, మౌస్ డీర్‌గా అభివరి్ణస్తారు. నల్లమలలో అతి పెద్ద జింక కణితి. దీనిని సాంబార్ డీర్‌గా పిలుస్తారు. కొమ్మలుగా విస్తరించిన భారీ కొమ్ములతో ఉండే కణితులు సుమారు 150 కేజీల బరువు తూగుతాయి. పొడ దుప్పులు.. అందానికి ఇవి ప్రతి రూపాలు. బంగారు వర్ణంలో ఉన్న చర్మంపై నల్లమచ్చలతో ఉండే ఈ జింకలు నల్లమలలో విస్తారంగా ఉన్నాయి. పెద్ద పులి ఆహార మెనూలో ఇవి ప్రధానమైనవి. నిటారు కొమ్ములు కలిగిన జింకల్లో మనిమేగం(నీల్గాయ్) భారీ జంతువు. శ్రీలంకన్ ఫ్లైయింగ్ స్నేక్ పురి తిరిగిన కొమ్ములతో కాల్లలో స్ప్రింగ్‌లున్నాయా అన్నట్లుగా గెంతుతూ స్వేచ్ఛకు ప్రతిరూపంగా కనిపించే కృష్ణజింకలకూ నల్లమలలో కొదవలేదు. ఉత్తర భారతదేశంలో చౌసింగా పేరుతో పిలుచుకునే కొండ గొర్రె(బార్కింగ్ డీర్) అడవి సాంద్రతను కొలిచే జింకగా చెప్పుకుంటారు. కొండ గొర్రె ఏ అటవీ ప్రాంతంలో కనిపించిందంటే ఆ ప్రాంతంలో అడవి దట్టంగా ఉందని అర్థం. నల్లమల అడవుల్లో లోతట్టు అటవీ ప్రాంతంలో కనిపించే కొండ గొర్రె ఈ మధ్య కాలంలో అటవీ ప్రాంత సరిహద్దుల్లో కూడా దర్శనమివ్వడం విశేషం. జీవ వైవిధ్యంతోనే మానవుల మనుగడ జీవ వైవిధ్యంతోనే మానవుల మనుగడ కొనసాగుతోంది. మనిషి తన ప్రతి అవసరానికి ప్రకృతి మీద ఆధారపడుతున్నాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ప్రకృతిలో ప్రతి జీవరాశి ఒక దాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. వీటిలో ఎక్కడ లోపం కనిపించినా జీవ వైవిధ్యం దెబ్బతిని మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి. – మందా రమేశ్, సీనియర్ రీసెర్చి అసిస్టెంట్, బయోడైవర్సిటీ సెంటర్ -
ఘర్షణ: సముద్రంలో ఛేజింగ్!
సాక్షి, ఒంగోలు: సముద్రంలో చేపలు, రొయ్యల విషయంలో చీరాల మండలంలోని పలు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో రెండు గ్రూపులుగా విడిపోయిన పలు గ్రామాల మత్స్యకారులు సముద్రంలో పలుమార్లు చేపల వేట చేసుకుంటూనే గొడవలకు దిగుతూ వచ్చారు. అది కాస్తా చిలికి చిలికి గాలివానలా మారి ఒక గ్రామం మత్స్యకారుల వలలను, బోట్లను మరో గ్రామానికి చెందిన మత్స్యకారులు తీసుకెళ్లడంతో ఘర్షణలు తారస్థాయికి చేరాయి. ఆ తరువాత తీసుకెళ్లిన బోట్లు, వలలకు చెందిన గ్రామస్తులు ఇతర గ్రామాలకు చెందిన బోట్లను, వలలను తీసుకెళ్లడంతో మత్స్యకారుల మధ్య గొడవ కాస్తా గ్రామాల మధ్య గొడవగా మారింది. దీంతో గ్రామాల వారీగా ఒకరిపై ఒకరు చీరాల, ఈపూరుపాలెం పోలీస్స్టేషన్లలో కేసులు పెట్టుకునే స్థాయికి చేరుకుంది. దీంతో గ్రామాల మధ్య నెలకొన్న ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో ఆ గ్రామాల మధ్య పంచాయతీ జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. దీంతో బుధవారం ఒంగోలులోని మత్స్యశాఖ జేడీ కార్యాలయంలో ఓడరేవు గ్రామానికి చెందిన మత్స్యకారులను, రెండవ వర్గానికి చెందిన కఠారివారిపాలెం, రామచంద్రపురం, పొట్టిసుబ్బయపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులతో మత్స్యశాఖ అధికారులు, పోలీసులు సంప్రదింపులు జరిపారు. ఒక గ్రామానికి చెందిన పడవలు, వలలు మరో గ్రామానికి చెందిన వారు తీసుకెళ్లడం, మరో గ్రామాలకు చెందిన పడవలు, వలలను ఇంకొక గ్రామానికి చెందిన మత్స్యకారులు తీసుకెళ్లడం మానుకోవాలని అధికారులు ఆయా గ్రామాల మత్స్యకారులకు సూచించారు. ఘర్షణ వాతావరణం లేకుండా సయోధ్యగా ఉండాలని కూడా ఆయా గ్రామాల మత్స్యకారులకు నచ్చజెప్పారు. అర అంగుళం సైజు కంటే తక్కువ కన్ను ఉన్న వలలను వాడటంతో సముద్రంలో ఉన్న గుడ్లుతో సహా వలల్లో వస్తున్నాయని దీంతో మత్స్యసంపద నశించిపోతుందన్న ఉద్దేశంతో ఘర్షణ వాతావరణం నెలకొందనే ఉద్దేశమని అధికారులు నిర్ధారణకొచ్చారు. దీనిపై మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ఆవుల చంద్రశేఖరరెడ్డి ఆయా గ్రామాల్లో వాడుతున్న వలలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఈలోగా గొడవలు లేకుండమత్స్యకారులు కలిసిమెలిసి ఉండాలని ఆయన సూచించారు. -
పాల ఉత్పత్తిలో దేశాన్ని అగ్ర స్థానంలో..
సాక్షి, ఒంగోలు: దేశంలో క్షీర విప్లవానికి ఆధ్యుడు డాక్టర్ వర్గీస్ కురియన్. పాల ఉత్పత్తిలో భారతదేశాన్ని అంతర్జాతీయంగా అగ్ర స్థానంలో నిలబెట్టిన కురియన్ జయంతి నేడు. 1921 నవంబర్ 26న కేరళ రాష్ట్రంలోని కాలికట్లో జన్మించారాయన. దేశ ప్రజలు పౌష్టికాహర లోపంతో బాధపడకుండా కురియన్ చేసిన సేవలకు మెచ్చిన భారత ప్రభుత్వం.. ఆయన జయంతిని ‘జాతీయ పాల దినోత్సవం’గా నిర్వహిస్తూ గౌరవిస్తోంది. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి సైన్స్‌లోనూ, అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడైన ఆయన.. గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్‌లో ప్రభుత్వ క్రీమరీలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్యలో చేరారు. నేషనల్ డెయిరీ డెవలెప్మెంట్ బోర్డుకు చైర్మన్‌గా పనిచేశారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా పాల వెల్లువకు శ్రీకారం చుట్టారు. రైతుల్ని శక్తి సంపన్నులుగా చేయాలన్న సంకల్పంతో కైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం(ప్రస్తుత అమూల్)ను విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే పాలను పౌడర్‌గా మార్చే యంత్రాన్ని కురియన్ కనుగొనడంతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. వర్గీస్ కురియన్‌కు లెక్కకు మించిన అవార్డులు అందుకున్నారు. అందులో రామన్ మెగసెసే అవార్డు(1963), వాట్లర్ పీస్ ప్రైజ్(1986), వరల్డ్ ఫుడ్ ప్రైజ్(1989), పద్మశ్రీ(1965), పద్మభూషణ్(1966), పద్మ విభూషణ్(1999) ముఖ్యమైనవి. 2012 సెప్టెంబర్ 9న 91 ఏళ్ల వయసులో తనువు చాలించారు. ఆసియాలోనే అతిపెద్ద డెయిరీ.. ఆసియాలో రూ.52 వేల కోట్ల అతిపెద్ద టర్నోవర్ కలిగిన డెయిరీగా అమూల్ రికార్డులకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఏజెంట్ లేదా కంపెనీల నుంచి కాకుండా కేవలం రైతుల నుంచి మాత్రమే 250 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేయడం, ప్రాసెస్ చేయడం దీని ప్రాముఖ్యత. ఇంత పెద్ద డెయిరీ యజమాని ఏ వృత్తి నిపుణుడో కాదు. పేరున్న వ్యాపారవేత్త అంతకంటే కాదు. గుజరాత్ రాష్ట్రంలోని గ్రామాల్లో నివసించే 3.6 మిలియన్ల మంది రైతులే డెయినీ యజమానులు. ప్రతి రైతు తమ గ్రామ డెయిరీ కో ఆపరేటివ్ సొసైటీలో ఒక లీటరు నుంచి 10 వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేయడం ద్వారా అమూల్‌లో సమాన యాజమాన్య వాటా కలిగి ఉంటాడంటే అతిశయోక్తి కాదు. ఈ పాల విప్లవం 74 ఏళ్ల క్రితం 1946లో గుజరాత్లో చిన్నదైన కైరా అనే జిల్లాలో ప్రారంభమైంది. ఏపీలో అమూల్ తరహా ఎంపీయూఎస్ఎస్లు గుజరాత్లో అమూల్ తరహా సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం(ఎంపీయూఎస్ఎస్) ఏర్పాటుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఆ సంఘం ద్వారా 11 మంది సభ్యులతో కూడిన కమిటీని ఎన్నుకుంటారు. ఈ 11 మంది సభ్యుల నుంచి ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. గ్రామ స్థాయి కమిటీ నుంచి జిల్లా స్థాయి కమిటీ ఏర్పడుతుంది. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లా కమిటీలు కలిసి రాష్ట్ర కమిటీ ఏర్పాటవుతుంది. రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా.. రాష్ట్రంలో రైతులను సంపన్నులుగా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. వ్యవసాయానికి ప్రత్యామ్నాయ ఉపాధిగా అనాధిగా ఉన్న పాడి పరిశ్రమను బలోపేతం చేస్తే రైతు లోగిళ్లు సంతోషంగా ఉంటాయని గట్టిగా నమ్మారాయన. అందుకే ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన అమూల్ సంస్థను రాష్ట్రంలో పాల సేకరణకు రంగంలోకి దించారు. మొదటి ఫేజ్‌లో కేటాయించిన మూడు జిల్లాల్లో ప్రకాశం జిల్లాను చేర్చి ఈ నెల 20వ తేదీ నుంచి 201 గ్రామాలను ఎంపిక చేసి ప్రయోగాత్మక పాల సేకరణకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో అమూల్ సంస్థ పాలు సేకరిస్తున్న వైనాన్ని చూస్తున్న ప్రజలు ముఖ్యమంత్రి చర్యలకు జేజేలు పలుకుతున్నారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ డెయిరీలను ఏ విధంగా నిర్వీర్యం చేశారో స్వయంగా ప్రజలు కళ్లారా చూశారు. సొంత డెయిరీ హెరిటేజ్‌ను అభివృద్ధి పథంలో నడిపించి ఒంగోలు డెయిరీ లాంటి ప్రభుత్వ డెయిరీలను నష్టాల ఊబిలోకి నెట్టిన పాపం మూటకట్టుకున్నారు. ఆ పరిస్థితి నుంచి డెయిరీ రంగాన్ని బయటపడేసేందుకే ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. గురువారం నుంచి అమూల్ పాల సేకరణ కేంద్రాలు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా వర్చువల్ విధానంలో ప్రారంభం కానున్నాయి. -
భార్య దారుణ హత్య.. భర్త ఏమయ్యాడు..!
సాక్షి, మార్టూరు : మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన వివాహిత దారుణహత్యకు గురైంది. పోలీసులు, సమీప బంధువుల తెలిపిన వివరాల ప్రకారం..లక్కవరం ఎస్సీ కాలనీకి చెందిన మద్దుమాల పద్మ(38), భాస్కర్‌రావు భార్యభర్తలు. ఉన్నత విద్యావంతులైన వీరు కనిగిరిలో ప్రైవేట్ స్కూల్లో గత కొన్నేళ్లుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా స్వగ్రామంలో ఉంటూ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు చెబుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ శుక్రవారం సాయంత్రం యద్దనపూడి మండలంలోని పూనూరులో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామం బయలుదేరి రాత్రికి ఇంటికి చేరుకోలేదు. కంగారు పడిన బంధువులు అదే రోజు రాత్రి మార్టూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ద్వారా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కోనంకి, లక్కవరం గ్రామాల మధ్య పంట కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉన్నట్లు శనివారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బందితో ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించిన ఎస్సై శివకుమార్ మహిళ మృతదేహం శుక్రవారం రాత్రి కన్పించకుండా పోయిన పద్మదిగా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. అనంతరం శనివారం రాత్రి మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పద్మ మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం చేశారు. ఆచూకీ లేని భర్త ఇదిలా ఉండగా భార్య పద్మతో కలిసి ప్రయాణించిన భర్త భాస్కరరావు ఆచూకీ ఇంత వరకు తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భాస్కరరావు అనుమానంతో భార్య పద్మను తరచూ వేధిస్తూ ఉండేవాడని, అతడే చంపి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నివేదిక, భాస్కరరావు ఆచూకీ తెలిస్తే గానీ హత్యకు గల కారణాలు చెప్పలేమని పోలీసులు అంటున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చీరాల డీఎస్పీ వేణుగోపాల్ సోమవారం సాయంత్రాన్ని సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో పెద్దదోర్నాల: ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న తండ్రీ కొడుకులను ఎట్టకేలకు పోలీసులు అదుపులోనికి తీసుకోవటంతో ఇరు రాష్ట్రాల పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలోని అచ్చంపేటకు మండలం అంకురోనిపల్లెకు చెందిన హరిశంకర్ నాయక్ తన ఇద్దరు కుమారులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నాంటూ హైదరాబాద్ రోడ్డులోని మన్ననూర్ వద్ద అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శనివారం సెల్ఫీ వీడియోను ఫేస్బుక్, వాట్సప్‌లలో అప్లోడ్ చేశాడు. దీంతో తెలంగాణ పోలీసులు శనివారం నుంచి వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు అదుపులోనికి తీసుకున్న తండ్రీ కొడుకులు తెలంగాణలోని దోమలపెంట, ఈగలపెంట తదితర ప్రాంతాలతో పాటు శ్రీశైలం, సుండిపెంట పరిసరాల ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తెలంగాణలోని ఈగలపెంటకు చెందిన ఎస్సై సమాచారం మేరకు పెద్దదోర్నాల ఎస్సై హరిబాబు సైతం వీరి ఆచూకీ కోసం మండల పరిధిలోని చిన్నారుట్ల, శిఖరం తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇద్దరు బాలురతో కలిసి తుమ్మలబైలు వద్దకు వచ్చి వెనుదిరిగి వెళ్లినట్లు తమ్మలబైలుకు చెందిన గిరిజనులు పోలీసులకు సమాచారమందించారు. దీంతో తెలంగాణ నుంచి వచ్చిన పోలీసులు కాల్ డేటా ఆదారంతో హరిశంకర్ నాయక్‌తో పాటు ఇద్దరి కుమారులను మండల పరిధిలోని శిఖరం, చిన్నారుట్ల మధ్యలో అదుపులోనిని తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడేందుకు అటవీ ప్రాంతంలోకి వచ్చి ఉంటాడని పోలీసులు పేర్కొంటున్నారు. -
నీళ్లు అనుకొని శానిటైజర్ తాగిన ఎస్ఐ
సాక్షి, ఒంగోలు: స్థానిక పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ రజాక్ మంచినీరు స్థానే శానిటైజర్ తాగి అస్వస్థతకు గురయ్యారు. స్థానిక కర్నూల్ రోడ్డులోని శ్రీనివాస కాలనీలో నివాసం ఉండే రజాక్ శానిటైజర్ తాగిన వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రోజూ నిద్రలేచిన వెంటనే మంచినీరు తాగడం రజాక్‌కు అలవాటు. ఆ క్రమంలోనే ఆయన శానిటైజర్ కలిసిన నీరు తాగినట్లు ఆలస్యంగా గుర్తించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రజాక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు తాలూకా సీఐ శివరామకృష్ణారెడ్డి తెలిపారు. (శానిటైజర్ కొంటలేరు...) -
మీ పని తీరు బాగుంది: సీఎం జగన్ ప్రశంస
సాక్షి, ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశంసించారు. అధికారుల పనితీరు బాగుందని కితాబిచ్చారు. పత్తి సాగును ఎర్ర రేగడికి కాకుండా నల్లరేగడి నేలకే పరిమితం చేసేలా ప్రకాశం జిల్లా అధికారులు తీసుకున్న చర్యలు అభినందనీయమని, బోర్ల కింద కూడా వరికి ప్రత్యామ్నాయంగా పంటలు సాగు చేసేల రైతులను ప్రోత్సహించాలని సూచించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో సమావేశం ఆయన మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటులో ప్రకాశం యంత్రాంగం పనితీరు బాగుందన్నారు. వీటితో పాటు బియ్యం కార్డులు, పెన్షన్‌కార్డులు, ఇళ్ల పట్టాల కోసం స్థలాల గుర్తింపు విషయంలో చక్కటి పనితీరు కనపరుస్తోందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, నాడు–నేడు క్రింద పాఠశాలల్లో చేపడుతున్న నిర్మాణాలు, వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మన బడి నేడు–నేడు కింద పెండింగ్ బిల్లులు అక్టోబర్ మొదటి వారంలో చెల్లిస్తామన్నారు. పాఠశాలల పునః ప్రారంభాన్ని కోవిడ్ దృష్ట్యా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 2వ తేదీకి వాయిదా వేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని వెల్లడించారు. (కరోనా తగ్గుముఖం) సమావేశంలో జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, సంయుక్త కలెక్టర్ టీఎస్ చేతన్, డీఆర్ఓ వినాయకం, జడ్పీ సీఈఓ కైలాష్ గిరీశ్వర్, పంచాయతీరాజ్ ఎస్ఈ కొండయ్య, వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామమూర్తి, పట్టు పరిశ్రమ ఏడీ రాజ్యలక్ష్మి, పశుసంవర్ధక శాఖ జేడీ రవీంద్రనాద్ ఠాగూర్, జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు, డ్వామా పీడీ శ్రీనారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎలీషా, డీపీఓ నారాయణరెడ్డి, సీపీఓ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బాలు పూర్వీకులు ప్రకాశం జిల్లా వాసులు
ఒంగోలు మెట్రో/కందుకూరు రూరల్: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు ప్రకాశం జిల్లాతో అనుబంధం ఉంది. ఆయన పూర్వీకులు ఇక్కడి కందుకూరు సమీపంలోని మాచవరం గ్రామానికి చెందినవారు. బాలు తండ్రి సాంబమూర్తి మాచవరం శివాలయంలో అర్చకత్వం చేస్తూ స్కందపురి మాధవ విలాస సభ సంస్థ ద్వారా హరికథలు చెబుతూ జీవనం సాగించినట్టు అక్కడి వారు పేర్కొంటున్నారు. బాల సుబ్రహ్మణ్యం పుట్టిన తర్వాత ఆ కుటుంబం నెల్లూరు జిల్లాకు వలస వెళ్లారని గ్రామంలోని పెద్దలు చెబుతున్నారు. కాగా బాలు మేనత్త జిల్లాలోని కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలో ఉండేవారు. ఈ క్రమంలో బాలు అనేకసార్లు ఈతముక్కల, కొత్తపట్నం గ్రామాలకు వచ్చేవారు. సాంబమూర్తి కుటుంబం మాచవరంలో ఇల్లు అమ్మి వలస వెళ్లిన తర్వాత అప్పుడప్పుడు ఊరు వస్తూ ఉండేవారు. 25వ ఏట బాలసుబ్రహ్మణ్యం ఈ గ్రామానికి వచ్చి శివాలయం ఉత్సవాల్లో పాటలు పాడారు. ప్రకాశం జిల్లాకు చెందిన అనేక సాంస్కృతిక, కళాసంస్థలు పలుమార్లు బాలును సత్కరించాయి. -
‘ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి’
సాక్షి, ప్రకాశం జిల్లా: రాష్ట్రంలో చంద్రబాబు.. స్టేబాబులా మారాడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని చంద్రబాబు కోర్టులకు వెళ్ళి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో టీడీపీ కనుమరుగైపోయింది. చంద్రబాబు పార్టీ జామ్ అయిపోయి.. జూమ్ పార్టీలా మారిందని’’ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రబాబు ఎన్ని స్టేలు తెచ్చినా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పాన్ని అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. (చదవండి: కోర్టులు ఎవరి ప్రయోజనాల కోసం?) తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు.. అమరావతి భూముల విషయంలో హైకోర్టు కెళ్ళి స్టే తెచ్చుకున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అలజడులను సృష్టించేందుకే.. ఒక కుట్రపూరితంగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన అవినితీని వెలికితేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. (చదవండి: చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోతారు..) -
త్వరలో నిజాలు నిగ్గు తేలుస్తాం
సాక్షి, ప్రకాశం: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనపై ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ వేసిందని, త్వరలో నిజాలు నిగ్గు తేలుస్తామని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రథం తగలపడటం వెనుక కుట్ర కోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి పక్షాల విమర్శలు చూస్తుంటే.. ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయన్నారు. ఏది ఏమైనా సీబీఐ ఎంక్వైరీలో అన్నీ తేలుతాయని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతర్వేది ఘటనపై సీరియస్‌గా ఉన్నారని చెప్పారు. శుక్రవారం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా పోలీస్ పాసింగ్ పెరేడ్లో సుచరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా వైరస్‌పై సమరంలో పోలీసులు కీలకంగా పనిచేశారని తెలిపారు. వారి కోసం హెల్త్ క్యాంప్‌లు పెడుతున్నామని, దేశంలోనే తొలి సారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. ఏపీ పోలీసులు దేశ వ్యాప్తంగా మన్ననలు పొందుతున్నారని చెప్పారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అమరులైన 50 లక్షల మంది పోలీసులకు భీమా కల్పించడం జరిగిందన్నారు. (అంతర్వేది రథం కేసు సీబీఐకి అప్పగింత) -
కనిగిరిలో స్వల్ప భూకంపం
సాక్షి, కనిగిరి: కనిగిరిలో మంగళవారం రాత్రి 11.09 గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. స్థానిక శివనగర్ కాలనీ, సాయిబాబా దేవస్థానం ప్రాంతాలతో పాటు మండలంలోని పేరంగుడిపల్లి గ్రామంలోనూ రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు వెల్లడించారు. నేత్ర దానానికి అందరూ ప్రతినబూనాలి ఒంగోలు సెంట్రల్: మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ భూనాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ పిలుపునిచ్చారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రతిజ్ఞ పత్రాలను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్నియా దెబ్బతినడం వలన దేశంలో 26 లక్షల మంది అంధత్వంతో బాధపడుతున్నారన్నారు. ప్రతి సంవత్సరం 40 వేలు నుంచి 50 వేల మంది కొత్తగా అంధులవుతున్నారని, దేశ వ్యాప్తంగా కేవలం 30 వేల కార్నియాలను మాత్రమే సేకరించి, అంధులకు అమర్చుతున్నట్టు ఆయన చెప్పారు. ఏ వయస్సు వారైనా, బీపీ, సుగర్ ఉన్న వారైనా నేత్రాలను దానం చేయవచ్చని, మరణం సంభవించిన 6 గంటలలోపు నేత్రదానం చేయాల్సి ఉంటుందని వివరించారు. మరణించిన వ్యక్తి నేత్రదానం చేయకపోయినా కుటుంబసభ్యుల ద్వారా చేయవచ్చన్నారు. నేత్రదానం అనేది కేవలం 15 నిమిషాలలో పూర్తి అయ్యే అతి సామాన్య ప్రక్రియ అన్నారు. గత రెండు సంవత్సరాలలో 279 కార్నియాలను జిల్లా వ్యాప్తంగా సేకరించి, నూతనంగా 162 మందికి కార్నియాలను అమర్చిన్నట్టు కలెక్టర్ వెల్లడించారు. ముందుగా ఆయన ప్రతిజ్ఞ పత్రంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంఘం మేనేజర్ డాక్టర్ శ్రీదేవి ప్రియ, అప్తాల్మిక్ ఆఫీసర్ ఎం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం లేదని.. కాటికి తీసుకెళ్తే..
సాక్షి, కందుకూరు: జీవం లేదు.. వెంటిలేటర్ తీసివేస్తే మహా అయితే రెండు గంటలు ప్రాణం ఉంటుంది.. అని ఒంగోలులోని ఓ కార్పొరేటు వైద్యశాల వైద్యులు చెప్పకొచ్చారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటికి ఎందుకు తీసుకెళ్లడం.. అని కందుకూరులోని శ్మశానానికి తీసుకెళ్లారు. పూడ్చి పెట్టేందుకు గుంత కూడా తీసిపెట్టారు... కానీ అక్కడకు తీసుకువెళ్లిన తరువాత అందరినీ ఆశ్చర్యపరిచేలా కాళ్లు, చేతులు కదిలించాడు. కళ్లు తెరిచి చూశాడు. ఈ సంఘటన చూసి అక్కడి వారందరూ అవాక్కయ్యారు. వెంటనే స్థానికంగా కందుకూరులోని వైద్యులతో మాట్లాడి వైద్యశాలలో చేర్పించారు. తరువాత కాస్త కుదుటపడ్డాడు. మజ్జిగ తాగాడు. మరలా 7 గంటలసేపు మృత్యువుతో పోరాడి మరణించాడు. కందుకూరు పట్టణంలో ఆదివారం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్‌లోని పి.వెంకటేశ్వర్లు (56) టీవీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కాళిదాసువారి వీధిలోని అద్దె ఇంటిలో నివాసం ఉంటాడు. భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. శుక్రవారం ఉదయం బాత్రూంకు వెళ్లి జారిపడి అపస్మారక స్థితిలోనికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు వెంటనే కందుకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యం చేయించుకున్నారు. పరిస్థితి ఫర్వాలేదనడంతో ఇంటికి తీసుకువెళ్లారు. మరలా శనివారం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తరువాత కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. అత్యవసర చికిత్స అవసరం అని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. రిమ్స్ వైద్యులు ఇక్కడ తలకు సంబంధించిన ఆధునిక పరికరాలు లేవు అని చెప్పడంతో ఒంగోలులోని పలు వైద్యశాలకు తీసుకుని వెళ్లినా ఖాళీలు లేక చేర్చుకోలేదు. దీంతో తన కుమారుడు మా నాన్న కు న్యాయం చేయండి.. అని కందుకూరు సామాజిక మాధ్యమాల గ్రూపుల్లో తెలియచేశాడు. దీంతో పాత్రికేయులు, స్థానికులు స్పందించారు. తోచిన విధంగా తెలిసిన వైద్యులతో మాట్లాడారు. శ్మశానంలో గుంత తీస్తున్న బంధువులు చివరగా ఓ కార్పొరేటు వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. కరోనా పరీక్షలు చేసి నెగిటివ్ రావడంతో అక్కడ వైద్యం చేయించారు. వైద్యులు వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించారు. ఆదివారం ఉదయం అక్కడ వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉంది. ఇక్కడ ఉంచి డబ్బులు వృథా చేసుకోవడం ఎందుకు అని సలహాలు ఇచ్చారు. వెంటిలేటర్ తీసి వేస్తే మరో రెండు గంటలు ప్రాణం ఉంటుందని తరువాత ఉండదు అని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్లమని చెప్పారు. కుటుంబ సభ్యులు ఎలాగా జీవం లేదన్నారు. ఇంటికి వెళ్లడానికి సొంత ఇల్లు లేదు. అద్దె ఇంటికి ఎందుకు తీసుకువెళ్లడం అని నేరుగా శ్మశానానికి తీసుకుని వెళ్లారు. అక్కడకు వెళ్లి ఆరామ క్షేత్రంలో ఉంచి.. పూడ్చిపెట్టడానికి గుంట కూడా తీసి పెట్టారు. ఈ తంతు అంతా జరుగుతున్న సమయంలో ఆ వ్యక్తి శరీరంలో మార్పులు వచ్చాయి. కాళ్లు చేతులు కదలడం ఆరంభించాయి. కళ్లు తెరిచి చూశాడు. దీంతో అక్కడివారు అవాక్కయ్యారు. వెంటనే స్థానికంగా కందుకూరులో ఉన్న వైద్యులతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. వైద్యశాలకు తీసుకుని వస్తే వైద్యం చేస్తామని వారు తెలియచేయడంతో నేరుగా శ్మశానం నుంచి కందుకూరు లోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. అక్కడకు వెళ్లి చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. మజ్జిగ కూడా తాగినట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి మెరుగుపడుతుందనుకున్న సమయంలో ఏడుగంటల సేపు మృత్యువుతో పోరాడాడు. రాత్రి 8 గంటల సమయంలో మరణించాడు. ఇందులో నిర్లక్ష్యం ఎవరిది అనేది పక్కనపెడితే కరోనా నేపథ్యంలో వైద్యశాలలు, కుటుంబ సభ్యులు, గ్రామంలోని పరిస్థితుల ఒత్తిడులు ఇలాంటి ఘటనలు జరిగేలా చేస్తున్నాయి. -
శానిటైజర్ తాగి 12 మంది మృతి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/కురిచేడు: ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో పెనువిషాదం చోటుచేసుకుంది. శానిటైజర్‌ను సేవించిన 12 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఇద్దరు గురువారం రాత్రి.. మిగిలిన తొమ్మిది మంది శుక్రవారం మరణించారు. మృతులంతా యాచకులు, రిక్షా పుల్లర్లు, కూలీలే. జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన వివరాలివీ.. కురిచేడు మండల కేంద్రంలో కరోనా కేసులు పెరిగిపోవడంతో అధికారులు గత కొద్దిరోజులుగా లాక్డౌన్ విధించారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను మూసివేయించారు. దీంతో గత 14 రోజులుగా వీరంతా మద్యం దొరక్క శానిటైజర్లకు అలవాటుపడ్డారు. ఈ నేపథ్యంలో.. అనేకమంది చేతులు వణుకుతున్నాయంటూ ఇంట్లో వాళ్లకి నచ్చజెప్పి గురువారం శానిటైజర్ సేవించారు. దీంతో ఈ రెండ్రోజుల్లో మొత్తం కలిపి 12మంది బలయ్యారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని.. తాము అన్యాయమైపోయా మంటూ మృతుల కుటుంబ సభ్యులు చేస్తున్న ఆక్రందనలు కురిచేడులో మిన్నంటాయి. మృతులంతా నిరుపేదలే శానిటైజరు తాగి మృతిచెందిన బాధితులంతా నిరుపేదలే. గురువారం రాత్రి ఇద్దరు..శుక్రవారం మరో 9 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో కోటగిరి రమణయ్య (45), కడియం రమణయ్య (27), గుంటక రామిరెడ్డి (57), మాడుగుల చార్లెస్ (36), రాజారెడ్డి (65), అనుగొండ శ్రీను (30), భోగ్యం తిరుపతయ్య (35), పాలెపోగు దాసు (65), కుండా అగస్టీన్ (42), షేక్ సైదా (30), కనకాల బాబూరావు (49) ఉన్నారు. బొనిగల శ్రీను అనే మరో యువకుడు స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందుతున్నాడు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మృతుల కుటుంబాలను పరామర్శించి సానుభూతి వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్ణకరమన్నారు. ఘటనపై కురిచేడు వీఆర్వో సీహెచ్ వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రే పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. దర్యాప్తునకు ప్రత్యేక బృందం : ఎస్పీ కాగా, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ శుక్రవారం గ్రామంలోని మృతుల కుటుంబాలను పరామర్శించి వివరాలు సేకరించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు మార్కాపురం ఓఎస్డీ చౌడేశ్వరి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. వివిధ మెడికల్ షాపుల్లో అమ్ముతున్న శానిటైజర్లను సీజ్ చేయడంతో పాటు మృతులు తాగిపడేసిన సీసాలను సీజ్ చేసి కెమికల్ ఎనాలసిస్ కోసం ల్యాబ్‌కు పంపుతున్నామని చెప్పారు. రిపోర్టు అందిన తరువాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మద్యానికి అలవాటుపడ్డ వారు ఎలాంటి శానిటైజర్లు, మత్తు పదార్థాలను సేవించవద్దంటూ ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా దీనిపై ప్రత్యేక నిఘా ఉంచుతామని చెప్పారు. మూడు నెలలుగా శానిటైజర్లే గ్రామంలో 30 మందికి పైగా మత్తు కోసం శానిటైజర్లు తాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరందరినీ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు గత మూడు నెలలుగా శానిటైజరు తీసుకుంటున్నట్లు అధికారులు స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. అలాగే, గ్రామంలో ఇంకా ఎంతమంది దీనికి అలవాటుపడ్డారనే దానిపై నిఘా పెట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దొరక్క కొందరు.. మద్యం ధరలు అమాంతం పెరిగిపోవడంతో వాటిని కొని తాగలేక మరికొందరు శానిటైజర్లకు అలవాటుపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ వ్యాపారం కోసం కొందరు మెడికల్ షాపు నిర్వాహకులు వాటిని అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతుల్లో నలుగురికి కరోనా శానిటైజర్ తాగి మృతిచెందిన వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం సందర్భంగా పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. వారి కుటుంబసభ్యులకు శనివారం కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వైద్యాధికారులు సన్నద్ధమవుతున్నారు. -
ముచ్చటగా మూడుపెళ్లిళ్లు
-
లావణ్య అత్తమామలు అరెస్ట్
సాక్షి, ప్రకాశం: భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ లావణ్య లహరి అత్తమామలు, ఆడపడుచులను ప్రకాశం జిల్లాలో శంషాబాద్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. గత నెల 26 శంషాబాద్ పరిధిలోని రాళ్లపల్లిలో భర్త వేధింపులు భరించలేక లావణ్య అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: చచ్చే వరకు ప్రేమించాలనుకున్నా.. అప్పటి నుంచి లావణ్య భర్త, అత్తమామలు, ఆడపడుచులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో భర్త వెంకటేష్, అత్తమామలు సుబ్బారావు, రమాదేవితో పాటు ఆడపడుచులు కృష్ణవేణి, లక్ష్మీ కుమారిలపై కేసు నమోదు అయ్యింది. ఘటన జరిగినప్పటి నుంచి నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడం కోసం శంషాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులు ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం వరిమడుగు గ్రామంలో బంధువుల ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. స్థానిక పోలీసుల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకుని శంషాబాద్ పోలీసులు వారిని హైదరాబాద్ తరలించారు. (వీడియో: పైలట్ మొగుడి పైశాచికం!) -
కొరియో‘గ్రాఫ్’ పడిపోయింది !
ఆడిందే ఆట.. పాడిందే పాట బ్రేక్డ్యాన్సు.. షేక్ డ్యాన్సు.. మిక్స్ చేస్తే బ్రేషే డ్యాన్సు లేదంటే బెల్లీ.. గిల్లీ.. పేరు ఏదైనా డీజే మ్యూజిక్ ప్లే అయితే కాళ్లు, చేతులకు కరెంటు పెట్టినట్లు యమ స్పీడ్‌గా కదులుతాయి చూసేవాళ్లకు కనుల విందు వారిని చూస్తుంటే డ్యాన్సర్లకు పసందు అయితే వారేవా.. అంటూ మోగే చప్పట్లకు ఇప్పుడు లాక్డౌన్ పడింది కొరియోగ్రాఫర్ల ఉపాధి గ్రాఫ్‌కు గండి పడింది! ఇప్పుడు ఓన్లీ ఆడియో ప్లే అవుతోంది వీడియో ఎప్పటికి రిలీజ్ అవుతుందో.. ఈ కళాకారులకు ఉపాధి ఎప్పుడు దొరుకుతుందో!!! ఒంగోలు మెట్రో: గతంలో పెళ్లో మరేదో శుభకార్యమో అయితే అర్కె్రస్టాతో నెట్టుకొచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. డ్యాన్సర్లు ఓ టీంగ్గా ఏర్పడి ఈవెంట్లు చేయడం నడుస్తోంది. ఇలాంటి వారు నృత్యాలు చేసి కూలీతో పొట్టపోసుకుంటారు. అయితే లాక్డౌన్ వల్ల గడచిన మూడు నెలలుగా ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడంతో ఉపాధి లేక కొరియోగ్రాఫర్లు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని నాలుగు డివిజన్లలో వివిధ డ్యాన్స్ ట్రూపులు, గ్రూపుల్లో దాదాపు వెయ్యిమందికి పైగా డ్యాన్సర్లు ఉన్నారు. ఒంగోలులోనే 120 మంది వరకూ ఉన్నారు. ఈవెంట్స్ సమయాల్లో సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటుంటారు. వేర్వేరు తరగతుల నుంచి డ్రాపవుట్లుగా మారి, ఉన్న కొద్దిపాటి అర్హతలకు ఏ ఉద్యోగమూ రాక తమకు వచ్చిన కళతో ఉపాధి పొందుతుంటారు. ఈ క్రమంలో కొందరు తెలివైన వాళ్లు ‘ఈవెంట్ మేనేజ్మెంట్’ సంస్థలు ఏర్పాటు చేసుకుని చిన్నా చితకా డ్యాన్సర్లను ఏకం చేసి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వచ్చే డబ్బులో ఒక్కో డ్యాన్సర్‌కు రు. 500 వరకు ఇస్తారు. పెళ్లి ఫంక్షన్లు, రిసెప్షన్లు తదితర పలు కార్యక్రమాల ఆధారంగా వీరు జీవనం సజావుగా సాగేది. అయితే మార్చి రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా మొదలైన లాక్డౌన్ వీరి పాలిట శాపంగా మారింది. చేద్దామంలే కూలి పనుల్లేక, పోదామంటే ఈవెంట్స్ లేక కష్టాల సుడిగుండంలో బతుకులీడుస్తున్నారు. కళాకారుల పట్ల ఉదారంగా ఉండి ఆదుకుంటున్న అనేక సేవా సంస్థలు వీరి ఊసే మరచిపోయాయి. కళాకారుల గుర్తింపు కార్డులు కూడా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అన్ని వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటున్నట్టుగానే తమనూ ఆదుకోవాలని కోరుతున్నారు. డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోషియేషన్ ప్రతినిధుల కోసం 9391781212 నంబర్‌ను సంప్రదించి ఆదుకోవాలని కోరుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నా డ్యాన్స్ కార్యక్రమాలు లేక కూలీకి వెళ్లాను, అక్కడ కాలుజారి పడిపోయాను. వెన్నెముక సమస్యతో ఇబ్బందులు పడుతున్నా. ప్రభుత్వం దయతో ఆదుకోవాలని విన్నవించుకుంటున్నా. -రఘునాథ్ జగనన్నకు రుణపడి ఉంటాం.. ప్రభుత్వానికి సంబధించి అనేక ఈవెంట్స్ నిర్వహించాం. డ్యాన్స్ ద్వారా ఉపాధి పొందుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ఇప్పుడు అవస్థలు పడుతున్నాం. అన్ని వర్గాల పేద ప్రజలను జగనన్న ఆదుకుంటున్నారు. అలాగే డ్యాన్సర్లుగా ఉపాధి పొందుతున్న మమ్మల్ని ఆదుకుంటే జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – సురేష్ ఆరిగ ప్రభుత్వం ఆదుకోవాలి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార సందర్భాల్లో కూడా మేము ఈవెంట్స్ నిర్వహించాం. అన్ని వర్గాల్లోని పేదలను ఆదుకుంటున్న మాదిరిగానే ప్రభత్వం మమ్మల్ని కూడా ఆదుకుని కాపాడాలి. -వరుణ్ -
తప్పుడు ప్రచారాలు చేస్తే ఖబడ్దార్!
సాక్షి, ప్రకాశం: తప్పుడు రాతల పై వైఎస్సార్సీపీ కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏడాది పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్న ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదని ధ్వజమెత్తారు. సోమవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ, దిగజారుడు రాతలు రాస్తే ఆ పత్రికల యాజమాన్యాల సంగతి తెలుస్తామని హెచ్చరించారు. ఎల్లో మీడియాపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చంచాగిరి చేసే వాళ్లు హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసమ్మతి అంటూ తమ పార్టీ ఐక్యతను, విశ్వాసాన్ని దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతాం అన్నారు. అవసరమైతే ఈ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటం చేస్తామని మహాధర్ రెడ్డి ఎల్లోమీడియాపై నిప్పులు చెరిగారు. (డబ్బా కొట్టి, పత్తా లేకుండా పోయారు!) -
సీఎం జగన్ సంకల్పం అదే..: ఆదిమూలపు
సాక్షి, ప్రకాశం జిల్లా: అధికారంలోకి వచ్చిన ఏడాదికాలంలోనే 90 శాతం హామీలు పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పుల్లల చెరువు మండలం మానేపల్లిలో రైతు భరోసా కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పోలా భాస్కర్, అధికారులు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు మాట్లాడుతూ కుల,మత,పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘ ఏడాది పూర్తి కాగానే సంబరాలు చేసి కోట్లు ఖర్చు చేయలేదు. ‘మన పాలన- మీ సూచన’ వినూత్న కార్యక్రమం చేపట్టి సూచనలు తీసుకుంటున్నామని’’ చెప్పారు. (చంద్రబాబుపై కేసు నమోదు) యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలో నీటి సమస్య అధికమని, కేవలం వర్షాధార పంటలే రైతులు పండిస్తారన్నారు. రైతుల సేవలో రైతు భరోసా కేంద్రాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. తీగలేరు కాలువ పనులు కోసం నిధులు ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించారని.. దీనివల్ల పుల్లల చెరువు మండలంలో 11,500 ఎకరాలు సాగులోకి వస్తాయని తెలిపారు. గతంలో రైతే రాజు అంటూ దివంగత మహానేత వైఎస్సార్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ కూడా రైతును రారాజుగా చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ('టీడీపీ మహానాడు ఓ పెద్ద మాయ') -
శభాష్ కొండమ్మ..
సాక్షి, కనిగిరి : తెల్లవారుజామున గర్భిణికి నొప్పులు రావడంతో దివ్యాంగురాలైన అంగన్వాడీ కార్యకర్త ఆమెను తన ట్రై సైకిల్ స్కూటీపై ఎక్కించుకుని మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి చేర్చిన ఘటన కనిగిరి మండలం నడింపల్లిలో ఆదివారం జరిగింది. నడింపల్లిలో గర్భిణి అయిన బి.ఏసమ్మకు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక అంగన్వాడీ కార్యకర్త అయిన కొండమ్మకు సమాచారం ఇచ్చారు. ఆమె 108 వాహనానికి కాల్ చేసింది. ఈ ప్రాంతంలో ఉన్న రెండు 108 వాహనాల్లో ఒక వాహనం టైరు పంక్చరై ఉండగా, మరొక వాహనంలో ఒక గర్భిణిని తీసుకుని ఒంగోలు తరలిస్తున్నారని, రావడం ఆలస్యమవుతుందని తెలిసింది. చదవండి: సుధాకర్‌కు ఎమ్మెల్యే సీటు ఇస్తామని.. లాక్డౌన్ కావడంతో ఇతర వాహనాలు కూడా అందుబాటులో లేవు. ఈక్రమంలో ఏసమ్మకు నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో దివ్యాంగురాలైన అంగన్వాడీ కార్యకర్త తన ట్రై సైకిల్ స్కూటీపై ఆమెను ఎక్కించుకుని కనిగిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడ పరీక్షించిన వైద్యులు లోపల బిడ్డ పరిస్థితి బాగా లేదని ఒంగోలు తీసుకెళ్లాలని సిఫార్సు చేశారు. గర్భిణి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. ఏసమ్మకు సాధారణ ప్రసవం జరిగి తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సీడీపీవో లక్ష్మీ ప్రసన్న తెలిపారు. అంగన్వాడీ కార్యకర్త చేసిన కృషిని, సేవను గుర్తించిన ఐసీడీఎస్ అధికారులు, గ్రామస్తులు అభినందించారు. చదవండి: లంకె బిందెల పేరుతో లైంగిక దాడి -
రెడ్‌జోన్: చిన్నారుల దీనగాథ
సాక్షి, ఒంగోలు: కరోనా భయాందోళనలు ఓవైపు.. అందరూ ఉన్నా అనాథల్లా జీవించాల్సిన దుస్థితి మరో వైపు ఆ ముగ్గురు చిన్నారుల పరిస్థితి అగమ్యగోచరమైంది. ఏదైనా ఆపద వస్తే గతంలో మేమున్నామంటూ బంధువులు, ఆత్మీయులు ముందుకు వచ్చేవారు. కానీ నేడు కరోన మహమ్మారి దెబ్బకు ఆ పాడు రోగం కబళిస్తుందేమోనన్న భయంతో వారిని చూసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ చొరవతో వారికి ఏ ఇబ్బంది కలగకుండా చూసేందుకు కలెక్టర్ ముందుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలులో ఆదివారం నాటికి 31 పాజిటివ్ కేసులు నమోదైతే వాటిలో 23 కేసులు కేవలం ఇస్లాంపేటకు చెందిన వారివే. దీంతో ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా చేశారు. అక్కడికి ఎవరూ వెళ్లడానికి వీల్లేకుండా, అందులో ఉండేవారు బయటకు రానీయకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ప్రైమరీ కాంటాక్టు కాకుండా సెకండరీ కాంటాక్టులకు సంబంధించి ముందస్తుగా వ్యాధి వ్యాప్తి కాకుండా చాలామందిని క్వారంటైన్‌కు తరలించారు. అందులో ఒకరు ఇస్లాంపేటకు చెందిన అల్లాభక్షు. ఈయన నెల్లూరు జిల్లాలో ఆర్‌అండ్‌బీలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈయనను ఈనెల 10న రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలోని క్వారంటైన్‌కు తరలించారు. మరుసటి రోజు ఆయన కుమారుడ్ని రిమ్స్ క్వారంటైన్‌కు తరలించారు. ఈనెల 26న వారి కోడల్ని కూడా రిమ్స్ క్వారంటైన్‌కు తీసుకువెళ్లారు. అల్లాభక్షు కుటుంబంలో మొత్తం ఏడుగురు ఉంటారు. అల్లాభక్షు భార్య రెండు నెలల క్రితం ఆమె స్వగ్రామం అయిన కాకినాడకు వెళ్లింది. గత నెల 22వ తేదీ నుంచి రాకపోకలు నిషిద్ధం కావడంతో ఆమె తిరిగి ఒంగోలుకు రాలేని పరిస్థితి నెలకొంది. అల్లాభక్షు కొడుకికి ముగ్గురు ఆడపిల్లలు. కుటుంబ సభ్యులంతా క్వారంటైన్లో ఉండటంతో పెద్ద కుమార్తె మదిహ తపస్సు (9), రెండో కుమార్తె ఇస్బా (6), మూడో కుమార్తె హలీనా సాదియా (4) లను పట్టించుకునే వారు కరువయ్యారు. ఆ ఇంట్లో పైభాగంలో అద్దెకు ఉండే ఇల్లాలు ఆ పిల్లల్ని చేరదీసింది. చిన్నారుల పరిస్థితిని గుర్తించిన ‘సాక్షి’ కలెక్టర్ పోల భాస్కర్ దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన ఆయన మాట్లాడుతూ కాకినాడలో ఉన్న అధికారులతో మాట్లాడి వారి నాయనమ్మకు ట్రూనాట్ పరీక్ష చేసి జిల్లాకు రప్పించడం, అదే విధంగా అల్లాభక్షు శాంపిల్‌ను త్వరగా పరీక్ష చేయించి నెగిటివ్ నిర్థారణ అయితే పంపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కాకుండా పిల్లల సంరక్షణ బాధ్యతను కూడా ప్రభుత్వం తరఫున తీసుకునేందుకు చర్యలు చేపట్టి వారికి అండగా ఉంటామన్నారు. -
మాటవినలేదని కుటుంబం వెలివేత
కొత్తపట్నం: ఇంటి స్థల వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఓ కుటుంబాన్ని ఊరంతా వెలేసింది. బాధితుడు తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో పోలీసులు 26 మందిని బైండోవర్ చేశారు. కొత్తపట్నం మండలం కే పల్లెపాలేనికి చెందిన ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య ఇళ్ల స్థలమై వివాదం చోటుచేసుకుంది. బాధితులు సమస్యను గ్రామ కాపులు, పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఇది రెవెన్యూ సమస్యని, తమకు సంబంధం లేదని వారు తేల్చిచెప్పారు. ఈ వివాదం చోటుచేసుకున్న సుమారు 15 రోజుల తర్వాత ఇంటి స్థల వివాదంలోని ఒకరైన వలేటి మనోజ్ విజయ్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బంగారమ్మ దగ్గర మూడేళ్ల కిందట రూ.లక్ష వడ్డీకి తీసుకున్నాడు. నోటు గడువు ముగియడంతో ఆమె అసలు, వడ్డీ ఇవ్వాలని మనోజ్ విజయ్ను అడగడంతో కరోనా వైరస్ ప్రభావంతో తన దగ్గర లేవని చెప్పాడు. దీంతో బంగారమ్మ తనకు న్యాయం చేయాలంటూ గ్రామ పెద్దలు, కాపుల దృష్టికి సమస్యను తీసుకెళ్లింది. కాపులు మనోజ్ విజయ్ను పంచాయతీకి రావాలని పిలిచారు. దీంతో ‘నా ఇంటి స్థలం సమస్యను కాపులు, గ్రామ పెద్దలు పరిష్కరించనప్పుడు వడ్డీ డబ్బుల సమస్య ఏవిధంగా పరిష్కరిస్తారు.. నేను రాను’ అని మనోజ్ చెప్పాడు. కాపుల మాట వినలేదు కనుక ఈ గ్రామంలో అతనితో ఎవ్వరూ మాట్లాడొద్దని, షాపుల్లో సరుకులు కూడా ఇవ్వొద్దని ఆ కుటుంబాన్ని వెలేశారు. అప్పటి నుంచి గ్రామంలో ఎవ్వరూ మాట్లాడటం లేదని, షాపుల దగ్గరకు వెళ్తే సరుకులు ఇవ్వడం లేదంటూ తన దయనీయ స్థితిని బాధితుడు ఫేస్బుక్, యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. వీడియోలను చూసిన తహసీల్దార్ ఉయ్యాల పుల్లారావు, రెండో పట్టణ సీఐ రాజేష్, ఎస్ఐ ఎం.శ్రీనివాసరావు గురువారం గ్రామస్తులను పిలిపించి వెలివేయడం సామాజిక నేరమని, అందరూ ఐక్యంగా ఉండాలంటూ అవగాహన కల్పించారు. అయినా తీరు మారకపోవడంతో శుక్రవారం ఇరువర్గాలను రెండో పట్టణ సీఐ సమక్షంలో విచారించి వారికి చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సారి వెలివేయడం లాంటివి చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిస్తూ 26 మంది గ్రామ పెద్దలు, కాపులను బైండోవర్ చేశారు. అలాగే బంగారమ్మకు ఇవ్వాల్సిన రూ. లక్షకు వడ్డీ కలిపి ఇవ్వాలని మనోజ్ విజయ్‌కు సూచించారు. -
ఏపీలో మరో ఇద్దరు కోలుకున్నారు
-
కరోనా ఎఫెక్ట్: మావీ ప్రాణాలే సారూ..!
సాక్షి, ఒంగోలు: కరోనా..ఆ పేరు చెబితేనే ప్రజలు హడలిపోతున్నారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆమడ దూరంలో ఉంటున్నారు. అటువైపు వెళ్లాలన్నా జంకుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోని పారిశుద్ధ్య కారి్మకులు మాత్రం యధావిధిగా తమ రోజువారీ విధులకు హాజరవుతున్నారు. తాము పనిచేసే ప్రాంతాలు కరోనా ప్రభావితంగా అనుమానిస్తున్నప్పటికీ మా పని మేం చేసుకుంటూ వెళతామంటూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నం అవుతున్నారు. కరోనా వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపించినా పారిశుద్ధ్య కారి్మకులు మాత్రం ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా తమకు కేటాయించిన ప్రాంతాల్లో పనులు చేస్తున్నారు. వారిని చూసిన ప్రజలు ‘అయ్యో పాపం!’ అంటూ నిట్టూరుస్తుంటే సంబంధిత అధికారులకు మాత్రం చీమకుట్టినట్లు కూడా ఉండకపోవడం గమనార్హం. జిల్లా కేంద్రమైన ఒంగోలులోనే పారిశుద్ధ్య కారి్మకులకు కనీస రక్షణ కవచాలు లేకుండా పనిచేస్తున్నారంటే ఇక మిగిలిన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇవి తప్పనిసరి! పారిశుద్ధ్య కారి్మకులు విధులు నిర్వర్తించే సమయంలో మూడు రకాల రక్షణ కవచాలు తప్పనిసరిగా ధరించాల్సి ఉంది. చేతులకు గ్లౌజ్, మూతికి మాస్క్, కాళ్లకు షూస్ ఉండాలి. ఈ మూడు రక్షణ కవచాలను ధరించుకున్న తర్వాతనే పారిశుధ్య పనులు చేపట్టాలి. అయితే ఒంగోలు నగరంలో పనిచేసే పారిశుధ్య కార్మికులకే ఈ మూడింటిలో ఒక్క రక్షణ కవచం కూడా లేదు. ఇక మిగిలిన మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించవచ్చు. ఆరోగ్యాన్ని, ప్రాణాలను ఫణంగా పెట్టి కారి్మకులు పనిచేస్తున్నప్పటికీ అధికారులకు కనీసం జాలి కూడా కలగకపోవడం విచారకరం. జిల్లాలోని ఒంగోలు నగర పాలక సంస్థ, చీరాల, కందుకూరు, మార్కాపురం మునిసిపాలిటీలతోపాటు నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో వేలాది మంది పారిశుద్ధ్య కారి్మకులు పని చేస్తున్నారు. గతంలో పరి్మనెంట్ పారిశుధ్య కారి్మకులు ఉండటం, ఆ తర్వాత వారు ఉద్యోగ విరమణ చేస్తుండటం, కొత్తగా పరి్మనెంట్ కారి్మకులను తీసుకోకపోవడం, కాంట్రాక్టు పద్ధతిన తీసుకుంటుండటంతో వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. పరి్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులకు నామమాత్రంగా వసతులు కలి్పంచేవారు. వారి స్థానాల్లో కాంట్రాక్టు పద్ధతిన వచ్చిన కారి్మకులను అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. సర్క్యులర్ సాధించుకున్నా? కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న పారిశుద్ధ్య కారి్మకులు విధులు నిర్వర్తించే సమయంలో కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత సంబంధిత కమిషనర్లు, అధికారులపై ఉంది. అయితే వారు పారిశుద్ధ్య కారి్మకుల చేత పనులు చేయించుకోవడం తప్పితే రక్షణ బాధ్యత తమది కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు నగరంలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు కొన్నేళ్ల క్రితం మాస్్క, గ్లౌజ్, షూస్ కావాలంటూ పోరాడి సర్క్యులర్ కూడా ఇప్పించుకున్నారు. అయితే ఆ సమయంలో ఉన్న మునిసిపల్ కమిషనర్లు సౌకర్యాలు కల్పిస్తామంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇంతవరకు వారికి మాస్్క, గ్లౌజ్, షూస్ అనేవి లేకుండా పోయాయి. తమ తలరాత ఇంతే అన్నట్లుగా చేతులకు, కాళ్లకు, ముఖానికి ఏమీ పెట్టుకోకుండానే పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. సైడ్ కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా, చేతులకు ఎలాంటి కవర్లు కూడా తగిలించుకోకుండా అలాగే తోడి బయటకు వేస్తున్నారు. నగరంలో ఏమైనా జంతువులు చనిపోతే చేతులకు ఎలాంటి రక్షణ గ్లౌజ్‌లు లేకుండా ఆ కళేబరాన్ని అలాగే పట్టుకొని ట్రాక్టర్లలో వేయడం నిత్యకృత్యమైంది. పారిశుద్ధ్య కారి్మకులు చేస్తున్న పనిని ప్రజలు చూసి జాలి పడుతుంటే, అధికారులకు ఆ మాత్రపు జాలి కూడా కలగడం లేదు. ఒంగోలు నగరంలో కరోనా కేసు నమోదైనందున ఇప్పటికైనా అధికారులు కరుణించి తమకు రక్షణ కవచాలు అందించాలని పారిశుద్ధ్య కారి్మకులు వేడుకుంటున్నారు. ఫేస్ మాస్క్‌లు సిద్ధం ఒంగోలు నగర పరిధిలోని పారిశుద్ధ్య కారి్మకులకు క్లాత్ ఫేస్ మాస్‌్కలు సిద్ధం చేసినట్లు నగర పాలక సంస్థ శానిటరీ సూపర్వైజర్ మోహన్‌రావు తెలిపారు. మొత్తం 786 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని, వీరందరికీ మంగళవారం నుంచి వాటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా షూస్, గ్లౌజ్‌లకు సంబంధించి కొటేషన్ ద్వారా వారికి అందిస్తామని చెప్పారు. – ఎస్ఎస్.మోహన్‌రావు, ఒంగోలు కార్పొరేషన్ శానిటరీ సూపర్వైజర్ -
నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడియత్నం
ప్రకాశం, సంతమాగులూరు: అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగికదాడియత్నంకు పాల్పడిన సంఘటన సంతమాగులూరు మండలంలో మిన్నెకల్లు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. గ్రామానికి చెందిన కోమరగిరి మహాలక్ష్మయ్య ( 20) స్థానిక చెరువు వద్ద కాపాలా ఉంటూ జీవనం సాగిస్తుంటాడు. అయితే చెరువు సమీపంలోనే పల్లెపు నాగరాజు ఆమె భార్య కలిసి జీవిస్తుంటారు. సంఘటన జరిగిన సమయంలో వారు పొలం పనులకు వెళ్లారు. అయితే నాగరాజు, తన తల్లి ఆదిలక్ష్మి వద్ద చిన్నారిని వదిలి వెళ్లారు. చిన్నారితో పాటు ఆదిలక్ష్మి చెరువు పక్కనే పందులు కాసుకుంటున్న సమయంలో ఆమె వద్దకు మహాలక్ష్మయ్య వెళ్లి చిన్నారిని ఆడిస్తానని తీసుకెళ్లి లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. పాప కేకలు వేయడంతో ఆదిలక్ష్మి వెంటనే అక్కడకు వెళ్లి బాలికను రక్షించింది. అనంతరం పొలం నుంచి వచ్చిన చిన్నారి తండ్రి నాగరాజుకు విషయంను చెప్పగావెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మహాలక్ష్మయ్య పరారీలో ఉన్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నషీద్ బాషా తెలిపారు. -
కుమార్తెలే..కుమారులై!
ప్రకాశం, పర్చూరు: ఇద్దరూ ఆడ బిడ్డలే.. అయితేనేం ఆ తండ్రి వారిని రెండు కళ్లనుకున్నారు. ఏ బిడ్డకు చిన్న కష్టమొచ్చినా తట్టుకునే వాడు కాదు. చిన్న తనంలో ఆడుకుంటూ బిడ్డలకు ఎదురుదెబ్బ తగిలితే ఆయన విలవిల్లాడిపోయేవారు. ‘హనుమంతురావు ఇద్దరూ ఆడపిల్లలే కదరా..అని ఎవరైనా అంటే’..అయితేనేం రా..అంటూ గట్టిగా సమాధానం చెప్పేవారు. ఇలా తండ్రి ప్రేమను నిండుగా కలిగిన ఆ కుమార్తెలు.. పెరిగేకొద్దీ ఆయన ఆకాంక్షలు గుర్తించారు. నాన్న కలలను రూపమిస్తూ ఇద్దరూ విద్యావంతులై ఆయన కళ్లలో ఆనందబాష్పాలు నింపారు. వృద్ధాప్యంలోకి వెళ్లిన ఆ తండ్రి ఊపిరి సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు అర్ధంతరంగా ఆగిపోయింది. కర్మకాండలు పూర్తి చేయాలంటే వారసుడు లేరే అంటూ బంధువులు నసుగుతున్నారు. ఆ సమయంలో తండ్రిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కన్న బిడ్డలిద్దరూ ముందుకొచ్చారు. తండ్రికి తామే అంత్యక్రియలు చేస్తామంటూ నడుం కట్టారు. శ్మశాన వాటికలో తండ్రికి తలకొరివి పెడుతున్న కుమార్తె స్పందన ఒక్కొక్క అడుగు పడే కొద్దీ తమను గుండెలపై పెట్టుకుని పెంచిన నాన్న జ్ఞాపకాలు కన్నీటి బొట్లయి రాలుతుండగా.. కుమార్తెలిద్దరూ ఆయన మృతదేహంతో నడిచారు. చివరకు తండ్రికి తలకొరివి పెట్టుకుని జన్మనిచ్చిన రుణం తీర్చుకున్నారు. కొడుకులైనా, కుమార్తెలైనా తల్లిదండ్రుల కన్నపేగు మమకారాన్ని మరువకూడదనే సత్యాన్ని చాటి చెప్పారు. వివరాలు.. పర్చూరు జూనియర్ కళాశాలలో ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందిన అడపాల హనుమంతురావు (64) సోమవారం తన స్వగృహంలో మృతి చెందాడు. ఆయనకు సృజన, స్పందన ఇద్దరు కుమార్తెలు. వీరిని తల్లిదండ్రులు వామపక్ష భావజాలంతో పెంచారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమార్తె సృజన వివాహమై యూఎస్ఏలో ఉంటుండగా చిన్న కుమార్తె స్పందన ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుకుంటున్నది. తండ్రి మరణవార్త విని ఇద్దరూ పర్చూరుకు చేరుకున్నారు. తండ్రికి తలకొరివి పెట్టేందుకు కొడుకుల లేకపోవడంతో తలకొరివి పెట్టడానికి కుమార్తెలు ముందుకొచ్చారు. పెద్ద కుమార్తె దహనక్రియకు ఉపయోగించే నిప్పుల కుంపటి పట్టుకోగా చిన్న కుమార్తె స్పందన పిండం పట్టుకొని తండ్రి పాడె వెంట నడిచారు. అనంతరం స్థానిక శ్మాశాన వాటికలో హనుమంతురావు భౌతిక కాయాన్ని కట్టెల పాడెపై ఉంచగా చిన్న కుమార్తె స్పందన తన తండ్రికి తలకొరివి పెట్టి కొడుకు లేని లోటును తీర్చుతూ తండ్రి రుణం తీర్చుకుంది. -
‘మరుగు’న దోచేశారు !
బేస్తవారిపేట: ప్రతి ఇంటికి ఒక వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించి స్త్రీల ఆత్మ గౌరవాన్ని కాపాడాలనే మహోన్నతమైన ఆశయంతో కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఆ ఆశయానికి అప్పటి టీడీపీ నాయకులు తూట్లు పొడిచారు. వారి అక్రమ వ్యవహారాలకు వ్యక్తిగత మరుగుదొడ్లనూ వదిలిపెట్టలేదు. నిర్మాణం పూర్తి చేయకుండానే మరుగుదొడ్ల బిల్లులు బొక్కేశారు. కొందరు సొంత డబ్బులతో నిర్మాణ పనులు పూర్తి చేసుకుని కార్యాలయాల చుట్టూ బిల్లుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. స్వచ్ఛభారత్ పథకంలో నిర్మించిన మరుగుదొడ్లలో అంతులేని అవినీతి జరిగింది. గ్రామ, మండల స్థాయి టీడీపీ నాయకులు, అధికారులు కుమ్మక్కై అందిన కాడికి దోచుకున్నారు. పలుచోట్ల మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారు. గుంతలు, తలుపులు, సెప్టిక్ ట్యాంకులు లేని అరకొర నిర్మాణాలతో బిల్లులు నొక్కేశారు. అప్పట్లో మరుగుదొడ్ల నిర్మాణానికి చాలా మంది లబి్ధదారులు ముందుకు రాకపోవడంతో నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. అధికార పార్టీ నాయకులు పనులు చేస్తామని అవినీతికి తెరలేపారు. బేస్తవారిపేట మండలంలోని గలిజేరుగుళ్ల పంచాయతీలోని చెన్నుపల్లి, బార్లకుంట, శింగరపల్లి, బాలీశ్వరపురం గ్రామాల్లో 215 మరుగుదొడ్లు నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. 85 శాతం పూర్తి కాకుండానే కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించారు. రూ.లక్షల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరికి గుంతలు తీసి రింగులు వేశారు కానీ నిర్మాణం పూర్తి చేయలేదు. మరి కొన్నిచోట్ల నిర్మాణ పనులే మొదలు పెట్టలేదు. అసలు లబి్ధదారులకు తెలియకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారు. పాతవాటిని కొత్తగా చూపించారు. దొరికినకాడికి దోచుకుని పంచుకు తిన్నారు. కోనపల్లె పంచాయతీలోని పోగుళ్లలో పూరిపాకల్లో జీవనం సాగిస్తున్నారు. ఒక్కటంటే ఒక్క పక్కా గృహం లేదు. 45 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. పొడవు, వెడల్పు తక్కువగా, లోతు తక్కువగా గుంత తీసి తూతూ మంత్రంగా పనులు పూర్తి చేసి బిల్లులు తీసుకున్నారు. గ్రామంలో ఒక్కరు కూడా వ్యక్తిగత మరుగుదొడ్డిని ఉపయోగించే పరిస్థితి లేకుండా పోయింది. అవి నిరుపయోగంగా మారాయి. రూ.లక్షలు ఖర్చుపెట్టిన ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. కాంట్రాక్టర్ జేబులు నింపడానికే పథకం ఉపయోగపడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పంచాయతీల్లో రూ.25 లక్షలుపైగానే అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరుగుదొడ్లను ఉపయోగించే పరిస్థితి లేదు మరుగుదొడ్లను సక్రమంగా నిర్మించలేదు. లోతు తక్కువగా రెండు–మూడు రింగులు వేసి నిర్మాణ పనులు పూర్తి చేశారు. స్నానం చేసేందుకు ఇబ్బందికరంగా ఉన్నాయి. దీంతో నిర్మించిన మరుగుదొడ్లను ఉపయోగించడం లేదు. -దొర తిరుపతమ్మ, పోగుళ్ల నిర్మించకుండానే బిల్లులు తీసుకున్నారు.. వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరైంది. పనులు చేస్తామన్నా కాంట్రాక్టర్ గుంత తీసి రింగులు వేశారు. నిర్మాణ పనులు చేపట్టలేదు. అధికారుల జాబితాలో నిర్మాణం పూర్తయి నిధులు డ్రా చేసినట్లు ఉంది. గలిజేరుగుళ్ల పంచాయతీలో ఎక్కువ శాతం లబి్ధదారుల పరిస్థితి ఇదే. -ముత్తుముల రమాదేవి, శింగరపల్లె పనులు పూర్తి చేయకుండానే రూ.15 వేలు తీసుకున్నారు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పనులు నేనే చేయిస్తానని తెలిపాడు. జేసీబీతో గుంతను తీయించాడు. అందులో రింగులు వేయించాడు. అవసరమైన పత్రాలు, వేలిముద్రలు తీసుకున్నారు. నిర్మాణ పనులు పూర్తి చేయకుండానే వదిలివేశారు. కానీ ఆన్లైన్లో నిర్మాణం పూర్తి చేసి, రూ.15 వేలు చెల్లించినట్లు ఉంది. -గువ్వా రాజమ్మ, శింగరపల్లె లబ్ధిదారులకు న్యాయం చేస్తాం.. నిర్మాణాలు పూర్తి చేయకుండానే నిధులు విడుదల చేయడంపై క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తాం. రెండు గ్రామాల్లో లబి్ధదారుల జాబితా ప్రకారం పంచాయతీ కార్యదర్శితో ఇంటింటి సర్వే చేయిస్తాం. నేను రాకముందు జరిగిన నిర్మాణాలపై పరిశీలించి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. కె.కవితాచౌదరి, ఎంపీడీఓ, బేస్తవారిపేట -
‘వెలిగొండ’ పనులపై సీఎం జగన్ సుదీర్ఘ సమీక్ష
సాక్షి, ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పునరావాసం,హెడ్ రెగ్యులరేటర్, టన్నెల్ తవ్వకాలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారన్నారు. ప్రధానంగా పునరావాసంపై సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. (వెలిగొండ ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం జగన్) మొదటి విడత పనులకు కావాల్సిన నిధులు అవసరం గురించి అధికారుల నుంచి సీఎం అడిగి తెలుసుకున్నారని..మొదటి దశ పనులు పూర్తి కావడానికి రూ.1880 కోట్లు అవసరం ఉందని అధికారులు తెలిపారని వెల్లడించారు. పెండింగ్ బిల్లులు గురించి ముఖ్యమంత్రికి అధికారులు వివరించారని చెప్పారు. మార్చి 31 వరకు రూ.184 కోట్లు అవసరమని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఆగస్టు 31 నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. -
దారుణం: జామాయిల్ తోటలోకి తీసుకెళ్లి..
సాక్షి, ఒంగోలు: ఏకాంతంగా ఉన్న జంటపై ఓ కానిస్టేబుల్ దాడి చేసి యువతిని బలవంతంగా పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండు రోజుల తర్వాత ధైర్యం తెచ్చుకున్న బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చివరకు నిందితుడు కటకటాల పాలయ్యాడు. ఈ అమానుష ఘటన తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదీ..జరిగింది పట్టణానికి చెందిన యువతికి తల్లిదండ్రులు లేరు. ఓ షోరూంలో పనిచేస్తుంటుంది. ఆమెకు వినయ్ అనే యువకుడు స్నేహితుడు. ఇద్దరూ ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మంగమూరు రోడ్డు నుంచి పేర్నమిట్ట మార్గంలోకి వెళ్లారు. ఆ మార్గంలో ఓ జామాయిల్ తోట వద్ద ఆగి మాట్లాడుకుంటున్నారు. అక్కడకు ఓ వ్యక్తి వచ్చాడు. మీకు తోట వద్ద ఏం పనంటూ బెదిరించాడు. మీరెవరని ప్రశ్నించడంతో పాడు యువకుడిపై చేయి కూడా చేసుకున్నాడు. తాను కొత్తపట్నం కానిస్టేబుల్‌నంటూ ఐడీ కార్డు చూపించడంతో జంట నిజంగానే భయపడింది. యువకుడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. అనంతరం ఆమెను ఇంటి వద్ద దించుతానంటూ బెదిరించి మరీ బైకు ఎక్కించుకుని అక్కడి నుంచి ఆమెను మరో రెండు కిలో మీటర్లు తీసుకెళ్లాడు. అక్కడ మరో జామాయిల్ తోటలో బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువకుడు తన స్నేహితులకు ఫోన్ చేసి వారితో కలిసి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టాడు. చివరకు ఆమె నుంచి ఫోన్ రావడంతో హుటాహుటిన అక్కడకు వెళ్లి ఆమెపై అత్యాచారం జరిగిందని తెలుసుకున్నాడు. ఎవరి ఇంటికి వారు చేరుకున్నా కానిస్టేబుల్ వ్యవహారం మాత్రం వారిని మానసికంగా వేధించింది. వారు ధైర్యం చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించడంతో పాటు ఘటనకు కారకుడు కొత్తపట్నం పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ రాజుపాలెం ఆనంద్‌గా గుర్తించి అరెస్టు చేశారు. అతడిపై ఐపీసీ సెక్షన్లు 341, 323, 363, 376 కింద కేసులు నమోదు చేశారు. గతంలోనూ ఇదే తరహా కేసు నమోదు ఆనంద్ 2009 బ్యాచ్ కానిస్టేబుల్. ఇతనిపై 2013లో ఒక కేసు నమోదైంది. ఆ ఘటనలో బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో పోలీసులే అతడిపై సుమోటోగా కేసు నమోదు చేశారు. బీటెక్ చదువుతున్న జంట ఒంటరిగా శివారు ప్రాంతంలో ఉన్న సమయంలో కానిస్టేబుల్ ఆనంద్ ఆ యువతిని తనతో పాటు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడనేది అప్పట్లో వచ్చిన ఆరోపణ. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఒక యువతిని బాధితురాలిగా పేర్కొన్నారు. యువతి తనపై ఎటువంటి దాడి జరగలేదని పేర్కొనడంతో 2015లో కేసు కొట్టేశారు. దీంతో మళ్లీ పోలీసు శాఖలోకి ప్రవేశించాడు. శాఖాపరమైన చర్యలకు ఎస్పీ ఆదేశం ఈ కేసులో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్పందించారు. కానిస్టేబుల్ ఆనంద్‌ను అరెస్టు చేయడంతో పాటు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం వైద్యశాలకు పంపించారు. అంతే కాకుండా ఆనంద్‌పై శాఖాపరమైన చర్యలు చేపట్టేందుకు విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక అనంతరం అతడిని పోలీసు శాఖ నుంచి డిస్మిస్ చేసే అవకాశం ఉంది. -
పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఐపీఎస్‌కు చేదు అనుభవం
ఒంగోలు: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపై వేటు పడింది. సమస్యలు విన్నవించేందుకు పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదుదారుడిపై దురుసుగా ప్రవర్తించడంతోపాటు దుర్భాషలాడి, అవమానించిన నేరానికి రైటర్‌ను సస్పెండ్ చేయడంతోపాటు సీఐ సహా మరో ఆరుగురికి జిల్లా ఎస్పీ ఛార్జి మెమోలు జారీ చేశారు. పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వస్తున్న సామాన్య ప్రజలపై పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాని వస్తున్న ఆరోపణల్లో నిజమెంతో నిగ్గు తేల్చాలని భావించారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. ఓ ట్రైనీ ఐపీఎస్‌ను ఫిర్యాదిదారుగా ఠాణాకు పంపించారు. ట్రైనీ ఐపీఎస్ అక్కడ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఎస్పీకి రాతపూర్వకంగా తెలియజేయడంతో ఆయన చర్యలు తీసుకున్నారు. ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలకం రేపింది. ఏం జరిగిందంటే.. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు ట్రైనీ ఐపీఎస్ జగదీష్ శుక్రవారం ఉదయం సామాన్యులా ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. సివిల్ దుస్తులలో వెళ్ళిన అతనిని స్టేషన్ సిబ్బంది గుర్తించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేసి చేతిలో ఉన్న మొబైల్‌ను లాక్కొని పారిపోయారంటూ జగదీష్ ఇచ్చిన ఫిర్యాదును రిసెప్షన్లో ఉన్న సిబ్బంది తీసుకోలేదు. దీంతో ఆయన అక్కడ ఉన్న కానిస్టేబుళ్లతో మాట్లాడారు. వారి నుంచి స్పందన లభించలేదు. సీఐగారు వచ్చిన తరువాత రమ్మంటూ పంపించేశారు. దీంతో వెనుదిరిగి వెళ్లిన ఆయన మళ్లీ సాయంత్రం మరలా స్టేషన్‌కు వెళ్లాడు. అయినా నో రెస్పాన్స్. చివరకు ఫిర్యాదు తీసుకున్న కానిస్టేబుల్ ఆయనను రైటర్ వద్దకు పంపారు. రైటర్‌ను ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని కోరగా సీఐ వచ్చిన తరువాత విచారించి, చర్యలు చేపడతామన్నారు. తాను అర్జంటుగా గన్నవరం వెళ్లాల్సి ఉందని, కనీసం ఫిర్యాదు చేసినట్లు రశీదు అయినా ఇవ్వాలని కోరారు. దానికి కూడా స్పందించకుండా ఐఎంఈఐ నంబర్లు, ఫోన్ తనవే అన్నట్లుగా రశీదులు తీసుకురావాలంటూ మరో అధికారి సూచించారు. చివరకు వారంతా కలిసి ఫిర్యాదిని ఎస్సై సాంబశివయ్య వద్దకు పంపారు. అక్కడ కూడా ఎటువంటి సమాధానం రాలేదు. ఈ క్రమంలో ఫిర్యాది తక్షణమే ఎఫ్ఐఆర్ కాపీ కావాలని, కనీసం రశీదు అయినా ఇవ్వాలంటూ గట్టిగా అడగడంతో స్టేషన్ సిబ్బంది ఆయన పట్ల అసభ్యంగా మాట్లాడారు. దీంతో తిరుగుముఖం పట్టిన జగదీష్ తాను తాలూకా పోలీసుస్టేషన్‌కు వెళితే జరిగిన అవమానాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. రైటర్ సస్పెన్షన్.. సీఐ సహా ఐదుగురికి ఛార్జి మెమోలు: తాలూకా పోలీసుస్టేషన్లో సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు కావడంతో ఎస్పీ తక్షణమే క్రమశిక్షణా చర్యలకు పూనుకున్నారు. సభ్యత, సంస్కారంలేని మాటలతో ఫిర్యాదిని అవమానపరచడం, దురుసుగా మాట్లాడడంపై ఎస్పీ సీరియస్ అయ్యారు. ఫిర్యాదు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాక అవమానకరంగా మాట్లాడిన స్టేషన్ రైటర్ కె.సుధాకర్‌ను సస్పెండ్ చేశారు. దీంతో పాటు సీఐ ఎం.లక్ష్మణ్, ఎస్సై సాంబశివయ్య, హెడ్ కానిస్టేబుల్ పి.ఏడుకొండలు, కానిస్టేబుల్ ఎంవీ రాజేష్, మహిళా కానిస్టేబుల్ ఎన్.రమ్యకిరణ్మయిలకు పనిష్మెంట్ కింద ఛార్జి మెమోలు జారీ చేశారు. ఏ స్టేషన్లో అయినా ఫిర్యాదిదారులు వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవమానకరంగా మాట్లాడినట్లు తమ దృష్టికి వచ్చినా క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. -
అర్హుల నోట్లో మట్టి!
సాక్షి, బేస్తవారిపేట: చేనేత కార్మికుడికి సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పింఛన్ పథకం అవినీతిమయంగా మారింది. 2017లో టీడీపీ నాయకులు పింఛన్ల కోసం కొత్తమార్గాన్ని ఎన్నుకున్నారు. చేనేత వృత్తి అంటేనే తెలియని వ్యక్తులను పింఛన్ల కోసం చేనేత కార్మికులుగా మార్చేశారు. వృత్తినే నమ్ముకున్న చేనేతలను ఎంపిక చేయాల్సిన అధికారులు టీడీపీ నాయకుల ఒత్తిడితో అనర్హులకు పట్టం కట్టారు. అసలు కథ ఇలా.. బేస్తవారిపేట మండలంలో 2015 ఏడాదికి 208, 2016కు 218 చేనేత పింఛన్లు వస్తుండేవి. 2017 నవంబర్‌లో అప్పటి ప్రభుత్వం జిల్లాకు 1985 చేనేత పింఛన్లను మంజూరు చేసింది. ఆ సమయంలోనే టీడీపీ నాయకులు వక్రమార్గాన్ని ఎంచుకున్నారు. రెండు వందలు వచ్చే పింఛన్లు వక్రమార్గంలో 456 పింఛన్లకు చేరింది. ప్రస్తుతం నెల రోజుల క్రితం ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మండలంలో 66 మందికి మగ్గం ఉన్నట్లు గుర్తించారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కొందరు గ్రామ టీడీపీ నాయకులు చేనేత వృత్తి తెలియని వ్యక్తుల నుంచి వెయి నుంచి రూ.2 వేలు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేయించారు. నెలకు లక్షల్లో వృథా.. టీడీపీ ప్రభుత్వ కాలంలో నెలకు రూ.1000 పింఛన్ ఇచ్చేవారు. అనర్హులైన 220 మందికి నెలకు రూ.2.20 లక్షలు చెల్లించేవారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నెలకు రూ.2,250 ఇస్తుండటంతో నెలకు రూ.5 లక్షలు ఇవ్వాల్సి వస్తోంది. అంటే ఏడాదికి రూ.60 లక్షల ప్రభుత్వ ధనం అనర్హులకు వెళుతోంది. బేస్తవారిపేట మండలంలో 2017 ఏడాది చివరి నుంచి మంజూరు చేసిన పింఛన్ లబ్ధిదారుల్లో చేనేత వృత్తి చేసేవారే లేరు. రాజకీయనాయకులు, బలిజ, దూదేకుల, ఎస్సీ, శెట్టి, ఉప్పర, మంగళి కుటుంబాలకు చెందిన వ్యక్తులకు పింఛన్లు మంజూరు చేశారు. చెరకు రసం, ఇసుక వ్యాపారం, వ్యవసాయం చేసుకునే వారికి, పిల్లలు సాఫ్టవేర్ ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబాలకు పింఛన్లకు అర్హులను చేశారు. సాధారణంగా వృద్ధాప్య పింఛన్‌కు 65 ఏళ్లు ఉండాలి. చేనేత కార్మికుల పింఛన్‌కు 50 ఏళ్లు ఉన్న అర్హులు కావడంతో అడ్డదారి తొక్కారు. బీజేపీ, టీడీపీ నాయకులకు పింఛన్లలో చోటు కల్పించారు. చర్యలు ఏవీ.. పింఛన్ దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, చేనేత సహకార సంఘ సభ్యుని గుర్తింపు కార్డు ఉండాలి. దీంతో నేత వృత్తి తెలియని వందల మందికి చేనేత సొసైటీల నుంచి పుట్టుకొచ్చాయి. గుర్తింపు కార్డులపై చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సంతకం ఉంది. చేనేతలకు గుర్తింపు కార్డును మంజూరు చేసేటప్పుడు మగ్గం ఉందా లేదా, చేనేత వృత్తి చేస్తున్నాడా లేదా అని పరిశీలించి కార్డును మంజూరు చేయాల్సి ఉంది. అయితే ఇవేమి జరగకుండానే సామాజిక పింఛన్ల కోసం వందల సంఖ్యలో అనర్హులకు గుర్తింపు కార్డులు పుట్టుకొచ్చాయి. వీటిని తయారు చేసినవారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఇప్పటికీ నకిలీకార్డులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. అప్పట్లో అనర్హులకు పింఛన్లు వచ్చాయని జిల్లా అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. చేనేత వృత్తి చేయనివారైతే మంజూరైన పింఛన్లను నిలిపివేస్తామని.. నకిలీ కార్డులు తయారు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని చేనేత, జౌలి శాఖ అధికారులు తెలిపారు. పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నవారి గృహ సందర్శనలు చేసి అనర్హులు ఉంటే రద్దు చేస్తామని చేనేత జౌళీశాఖ అధికారులు తెలిపారు. బేస్తవారిపేట ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ నాయకులను పక్కన పెట్టుకుని తూతూమంత్రంగా సర్టిఫికెట్లను పరిశీలించి, వారిచ్చిన ముడుపులు తీసుకుని ఎటువంటి చర్యలు తీసుకోకుండానే వెళ్లిపోయారు. ఇప్పటికీ కొనసాగుతున్న దందా.. కొత్త ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగు నెలల వ్యవధిలో మరో 90 మంది నకిలీ చేనేత గుర్తింపు కార్డులు పెట్టి పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై ఎంపీడీఓకు అనుమానం వచ్చింది. దీనికితోడు వైఎస్సార్సీపీ నాయకులు ఫిర్యాదు చేయడం, ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు అసెంబ్లీలో బోగస్ చేనేత పింఛన్లపై మాట్లాడటంతో ఎంపీడీఓ చర్యలు చేపట్టారు. దరఖాస్తుదారులు పెట్టిన 87 చేనేత గుర్తింపు కార్డులను జిల్లా చేనేత జౌళిశాఖ అధికారులకు పంపారు. అవన్నీ నకిలీవిగా తేలింది. తాము మంజూరు చేయలేదని ఎంపీడీఓకు లెటర్ పంపారు. -
ఆదాయానికి ఐడియా..!
జాతీయ రహదారులపై టోల్ వసూలు తరహాలోనే ఇక గ్రానైట్ ఉత్పత్తులకూ ఇకపై రుసుము వసూలు చేయనున్నారు. అందులో భాగంగా రాయల్టీ వసూళ్లకు టెండర్ల కోసం ప్రకటన కూడా జారీ చేశారు. దీనికి ఈ నెలాఖరు వరకు గడువు విధించారు. గ్రానైట్ గనుల నుంచి పెద్ద మొత్తంలో ముడిరాయి రాయల్టీ చెల్లించకుండానే సరిహద్దు దాటిపోతోందని వివిధ రకాల నిఘా సంస్థలు నివేదికలు ఇచ్చాయి. దీని వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.వందల కోట్లలో ఆదాయానికి గండి పడుతున్న నేపథ్యంలోనే దొంగ చేతికి తాళం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సాక్షి, ఒంగోలు: జిల్లాలో అన్ని రకాల ఖనిజాలకు సంబంధించి మొత్తం ఎనిమిది మైనింగ్ లీజులు, 526 క్వారీ లీజులు ఉన్నాయి. అన్ని రకాల ఖనిజాలకు సీనరేజి వసూళ్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని రకాల ఖనిజాలకు రాయల్టీ వసూలు కొన్ని రకాల శాస్త్రీయ అంశాలను పరిగణనలోకి తీసుకొని పరిశీలించింది. బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, బల్లాస్ట్, మొరం, గ్రావెల్ ఆర్డినరీ ఎర్త్ మినహా అన్ని రకాల మైనర్ మినరల్స్‌కు సీనరేజి రుసుం వసూలు, ఇతర చార్జీలు, పన్నుల వసూలు కోసం టోల్ వసూలు తరహా కాంట్రాక్టర్ల ఎంపికకు బిడ్స్ పిలిచింది. జిల్లా పరిధిలో 272 క్వారీలు జిల్లా పరిధిలో 272 క్వారీల నుంచి వచ్చే ఉత్పత్తులకు ఇక సీనరేజి రుసుం వసూలు ప్రైవేటు వ్యక్తులే చేయనున్నారు. బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ 141 లీజులు, బ్లాక్ గ్రానైట్ క్వారీ లీజులు 60, కలర గ్రానైట్ లీజులు 71 ఉన్నాయి. వీటి ద్వారా ఏటా భూగర్భ గనులశాఖ ఒంగోలు ఏడీ కార్యాలయం పరిధిలో రూ.360 కోట్లు, మార్కాపురం ఏడీ కార్యాలయం పరిధిలో రూ.3 కోట్లు రాయల్టీ ద్వారా ఆదాయం వస్తోంది. వీటికి 20 శాతం అదనంగా చేర్చి టెండర్ బిడ్ పిలిచినట్లు అధికారుల ద్వారా అందుతున్న సమాచారం. జిల్లాలో అత్యధిక రాయల్టీ భూగర్భ గనుల శాఖ ఒంగోలు సహాయ సంచాలకుని కార్యాలయం పరిధిలోనే ఉంది. రాయల్టీ వసూలు ఇక ప్రైవేటు పరం కానున్న నేపథ్యంలో క్లస్టర్లను నిర్ణయించారు. ఒక వేళ జిల్లా మొత్తానికి ఒకే టెండర్ బిడ్ రాకపోతే క్లస్టర్లకు విడివిడిగా టెండర్లను పిలవడానికి వీలుగా క్లస్టర్లను నిర్ణయించారు. ఒంగోలు, మార్టూరు, మార్కాపురం, చీమకుర్తి క్లస్టర్లుగా నిర్ణయించినట్లుగా సమాచారం. గ్రానైట్ నుంచి మాత్రమే సీనరేజి వసూలు చేయాలని నిర్ణయించారు. సీనరేజితో పాటు ఆదాయపన్ను, డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్, నెట్ చార్జీలు కూడా టెండర్ దక్కించుకున్న వారే వసూలు చేయాలి. కాంట్రాక్టర్ల ఎంపిక కోసం పేరొందిన సంస్థలు, వ్యక్తుల నుంచి డిపార్టుమెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజి దరఖాస్తులు ఆహ్వానించింది. ఎలక్ట్రానిక్ వేలం ద్వారా కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తారు. ప్రయోగాత్మకంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాలను ఎంపిక చేశారు. ప్రకాశంలో గెలాక్సీ గ్రానైట్, కలర్, బ్లాక్ గ్రానైట్ ఖనిజాలు ఉన్నాయి. గెలాక్సీ మినహా కలర్, బ్లాక్, చిత్తూరు రెడ్ వంటి రకాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఎంఎస్టీసీ లిమిటెడ్ వెబ్సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంఎస్టిసిఈసిఓఎంఎంఇఆర్సిఇ డాట్ కామ్) లేదంటే డిపార్టుమెంట్ ఆప్ మైన్స్ అండ్ జియాలజి వెబ్సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంఐఎన్ఈఎస్ డాట్ ఏపి డాట్ జీవోవి డాట్ ఇన్)లో వివరాలు పొందు పరిచారు. బిడ్స్ దాఖలు చేసేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉంది. రూ.450 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశం జిల్లాలో చీమకుర్తి, బల్లికురవ, కనిగిరి, మార్టూరు ప్రాంతాల్లో గ్రానైట్ గనులు ఉన్నాయి. ఏటా ఒంగోలు, మార్కాపురం ఏడీ కార్యాలయం పరిధిలో రూ.380 కోట్ల వరకు రాయల్టీ రుసుం వసూలవుతోంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారుల నివేదికలో రాయల్టీ రూపంలో జమవుతున్నదాని కన్నా రెట్టింపు దొడ్డిదారిన పోతున్నట్లు అధికారులు గుర్తించారు. జాతీయ రహదారులపై టోల్ వసూలు విధానం తరహాలోనే గ్రానైట్ రాయల్టీ రుసుం వసూలుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా నుంచి రూ.450 కోట్లకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనాలు నెలకున్నాయి. జిల్లాలో ఇప్పటికే డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ రూ.558 కోట్లు ఉంది. రూ.101.78 కోట్లతో 992 పనులు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 55 శాతం నిధులతో కమ్యూనిటీ బెన్ఫిట్ వర్కులు, 40 శాతం నిధులతో మౌలిక సదుపాయాల కల్పన పనులకు నిధులు కేటాయించారు. కమ్యూనిటీ బెన్ఫిట్ విభాగంలో విద్య, అంగన్వాడీ భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ విభాగానికి, ఆరోగ్యం, తాగునీటి సరఫరాకు, పారిశుద్ధ్య పనులకు నిధులను కేటాయించారు. మిగిలిన 40 శాతం నిధులతో సిమెంట్ రహదారులు, మురుగునీటి పారుదలకు కాలువల నిర్మాణానికి, నీటిపారుదల రంగానికి నిధులు కేటాయించారు. ఇక మీదట డీఎంఎఫ్ చార్జీలు కూడా సంబంధిత కాంట్రాక్టర్లే వసూలు చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో గ్రానైట్ సీనరేజి ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ రంగాల్లోని వ్యాపారులు సీనరేజి వసూలుకు ప్రభుత్వ మార్గదర్శకాల పరిశీలనలో నిమగ్నమయ్యారు. -
ప్రకాశం పోలీస్‌కు మరోసారి అరుదైన గౌరవం
సాక్షి, ఒంగోలు: ప్రకాశం పోలీస్‌శాఖ మరోమారు స్కాచ్ అవార్డుకు ఎంపికైంది. వరుసగా రెండో ఏడాది ఈ అవార్డును దక్కించుకుంది. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘ప్రాజెక్టు జియో’ ఇందుకు ఎంపికైంది. ప్రభుత్వ విభాగాలలో ప్రస్తుతం నడుస్తున్న విధానం కంటే వినూత్నంగా.. సమాజానికి మరింత మేలు కలిగేదిగా ఎవరైనా సాంకేతికతను ఉపయోగించుకుని 60 అంశాలలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరింది. జాతీయస్థాయిలోని పోలీసు విభాగాలతోపాటు అన్ని రాష్ట్రాలకు చెందిన పోలీసు విభాగాలు దాదాపు వెయ్యికిపైగా దరఖాస్తులను పంపుకున్నాయి. వాటిని స్రూ్కటినీ చేసి దాదాపు 100 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. వాటిలో 6 ప్రాజెక్టులు మన రాష్ట్రానికి చెందినవి ఉన్నాయి. వీటిలో ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రారంభించిన జియో ప్రాజెక్టు ఒకటికాగా, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం సిటీ, విశాఖపట్నం రూరల్, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రాజెక్టులు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. ఈ ఆరు జిల్లాల ఎస్పీలు ఈనెల 29న న్యూఢిల్లీలో జరిగే స్కాచ్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌తో కలిసి అవార్డులు అందుకోనున్నారు. గతంలో ప్రకాశం జిల్లాకు రెండు స్కాచ్ అవార్డులు దక్కాయి. భూసారపు సత్యయేసుబాబు జిల్లా ఎస్పీగా పనిచేసిన సమయంలో ఐకాప్ ప్రాజెక్టుకు, క్రైం డేటా ఎనలిటిక్స్ అనే వాటికి సంబంధించి స్కాచ్ అవార్డులు దక్కాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు దక్కడం పట్ల ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
నిరీక్షణ ఉండదిక..
టోల్ రుసుము చెల్లించడానికి ఇకపై వాహనం నిలిపి వరసలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. రుసుము చెల్లించే సమయంలో ఇకపై చిల్లర సమస్య కూడా ఎదురు కాదు. చేతికి వచ్చిన నలిగిన, చిరిగిన నోట్ల గురించి టోల్ ఆపరేటర్లతో గొడవ పడాల్సిన పనీ ఉండదు. రాకపోకలకు తీసుకున్న రశీదు తిరుగు ప్రయాణంలో కన్పించకపోతే ఆందోళన చెందాలి్సన అవసరం లేదు. టోల్ గేటు వద్దకు వాహనం వచ్చిందా.. సెకన్ల వ్యవధిలో స్కానింగ్ పూర్తయిందా.. క్షణాల్లోనే మీ బ్యాంకు ఖాతా నుంచి రుసుము టోల్ ఖాతాకు బదిలీ అయిందా. టోల్ గేటు తొలగిందా.. వెళ్లామా.. ఇంతే... ఇక టోల్ గేట్ల వద్ద అమలు కానున్న ఫాస్టాగ్ పద్దతి ఇదే. సాక్షి, ఒంగోలు: జిల్లాలోని జాతీయ రహదారులపై ఉన్న టోల్గేట్ల వద్ద డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఫాస్టాగ్ సేవలు అమలుకానున్నాయి. మార్టూరు మండలం బొల్లాపల్లి వద్ద, టంగుటూరు వద్ద గల టోల్గేట్ల వద్ద గరిష్ట సమయాల్లో పదుల సంఖ్యలో వాహనాలు టోల్ రుసుం చెల్లించడానికి బారులు తీరుతున్నాయి. ఇలాంటి సమస్య ప్రకాశంలోనే కాదు. జాతీయ రహదారులపై మొత్తంగా ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రయాణంలో కాలహరణం టోల్ వద్ద రుసుం చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యమే. ఈ విషయంపై జాతీయ రహదారుల విభాగం అధికారులు అధ్యయనం చేస్తే సగటున ఒక్కొక్క వాహనానికి కనీసం 15 సెకనులకు తగ్గకుండా రుసుం చెల్లింపునకు సమయం పడ్తుంది. గరిష్టంగా అర్థనిముషం సమయం పడ్తున్నట్లుగా గుర్తించారు. జాతీయ రహదారులపై నిత్యం ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. టోల్ రుసుం చెల్లింపుల్లో జరుగుతున్న అధిక సమయం వల్ల ట్రాఫిక్‌పై తీవ్ర ప్రభావమే చూపుతోంది. దీనిని నివారించడానికి టోల్గేట్ల వద్ద నిరీక్షణ సమయాన్ని కుదించడానికి ‘ఫాస్టాగ్’ విధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నారు. జాతీయ రహదారుల అధీకృత సంస్థ ఉన్నతాధికారుల బృందం మంగళవారం మంగళగిరి వద్ద గల కాజా టోల్‌గేటు వద్ద నుంచి జిల్లాలో బొల్లాపల్లి, టంగుటూరు, కావలి వద్ద గల ముసునూరు టోల్గేట్ల వద్ద జరుగుతున్న లావాదేవీలు పరిశీలించనుంది. అక్కడ వాహనదారులతో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం నెల్లూరులోని నాయ్ కార్యాలయంలో ఫాస్టాగ్ వ్యవస్థ అందుబాటులోకి తీసుకొస్తున్న అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. నగదు రహిత లావాదేవీలే ప్రాధాన్యం నగదు రహిత లావాదేవీలు బాగా పెరిగాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలోనూ ఈ లావాదేవీలు బాగా పెరిగాయి. ఆటోమొబైల్, మాల్ సెంటర్లు, షాపింగ్, వస్త్ర దుకాణాలతో పాటు ఆన్లైన్ బుకింగ్‌ల లావాదేవీలు బాగా పెరిగాయి. గత ఏడాది కేవలం 18 శాతంగానే నగదు రహిత లావాదేవీలు ఉంటే, ఇప్పుడు 42 శాతంగా లావాదేవీలు పెరిగాయి. చిల్లర వర్తకుల వద్ద ఇప్పుడిప్పుడే నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్నాయి. రానున్న కొద్ది నెలల వ్యవధిలోనే డిజిటల్ లావాదేవీలు, నగదు రహిత లావాదేవీల శాతం మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టోల్గేట్ల వద్ద రోజులో భారీగానే నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. రోజుకు 25 వేలకు పైగా వాహనాలు టోల్గేట్ల వద్ద నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం వసూలవుతున్న నగదు బ్యాంకుల్లో తిరిగి కట్టడం, తిరిగి ఇతర లావాదేవీలకు డ్రా చేయడం వంటివి ఇక క్రమంగా తగ్గించనున్నారు. దీనికి గాను నవంబర్ నెలాఖరు డెడ్‌లైన్. డిసెంబర్ ఒకటి నుంచి నగదు రహిత లావాదేవీలు టోల్గేట్ల వద్ద అమలు కానున్నాయి. ఫాస్టాగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. డిసెంబర్ ఒకటి నుంచి ఒక్కలైనులోనే అనుమతి.. డిసెంబర్ ఒకటో తేది నుంచి బొల్లాపల్లి, టంగుటూరు టోల్ గేట్ల వద్ద ఒక్క లైనులోనే మాన్యువల్ చెల్లింపులకు అనుమతిస్తారు. ఇక 12 లైన్లలోనూ ఫాస్టాగ్ సేవలే అందుబాటులో ఉంటాయి. విజయవాడకు వెళ్లే మార్గంలో ఒకటో లైను, నెల్లూరు మార్గంలో 14వ లైనులోనే మాన్యువల్‌గా రుసుం తీసుకుంటారు. కొద్ది నెలల తర్వాత ఈ ఒక్క లైనును తొలగించి ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులను అనుమతిస్తారు. అన్ని టోల్గేట్ల వద్ద ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. ఃమై ఫాస్టాగ్ యాప్’ డౌన్లోడు చేసుకోవాలి. టోల్గేట్ల వద్ద, బ్యాంకుల్లో వారి ఖాతాలకు అనుసంధానించి ట్యాగ్‌లను జారీ చేస్తున్నారు. ముందుగా ట్యాగ్ తీసుకొనే వారు రూ.2 వేల డిపాజిట్ చెల్లించాలి. వాహనంపై ట్యాగ్ అతికించుకోవాలి. వాహనం టోల్‌గేటు వద్దకు రాగానే స్కానర్లు వాహనం అద్దంపై ఉన్న ట్యాగ్‌ను స్కాన్ చేసి బ్యాంకు ఖాతా నుంచి రుసుం డ్రా చేసి టోల్ ఖాతాకు జమచేస్తుంది. సంక్షిప్త సమాచారం ద్వారా ఎంత మొత్తంలో కట్ అయిందో వివరాలు సెల్‌ఫోన్‌కు వివరాలు వస్తాయి. ఇప్పటి వరకు ఒంగోలు–విజయవాడ వెళ్లేవారు బొల్లాపల్లి టోల్‌గేటు వద్ద ఒక వైపునకు రూ.140, రాకపోకలకైతే 24 గంటల వ్యవధిలో రూ.210 చెల్లిస్తున్నారు.అంటే రూ70 వరకు రాయితీ వస్తుంది. ఇప్పుడు ఫాస్టాగ్‌లో ఒక వైపు రూ.140 కట్ అవుతుంది. తిరుగు ప్రయాణం అదే వాహనం 24 గంటల వ్యవధిలోపు వస్తే రూ.210కి సరిపడా అంటే రూ.70 మాత్రమే కట్ అవుతుంది. కొన్ని టోల్గేట్ల వద్ద రాకపోకలకు ఇలాంటి సౌకర్యం అందుబాటులో ఉంది. కొన్నింటికి ఒక వైపే తీసుకుంటున్నారు.అలాంటి టోల్గేట్ల వద్ద ఈ సౌకర్యం వర్తించదు. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్‌గేట్లపై డిసెంబర్ ఒకటి నుంచి ఈ ఫాస్టాగ్ వ్యవస్ధ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో ఫాస్టాగ్ సేవలు ప్రారంభించారు. జిల్లాలోనూ ఫాస్టాగ్ ట్రయల్ రన్ జరుగుతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఫాస్టాగ్ ఏర్పాటు చేశారు. వాహన చోదకులు ఒక సారి నమోదు చేసుకుంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కార్డును జారీ చేస్తారు. ఈ కార్డును వాహనం అద్దంపై అతికించుకొని సంభందిత లైన్లో వెళ్లినప్పుడు రుసుం ఆటోమ్యాటిక్‌గా కట్ అవుతుంది. వాహనదారులకు సంక్షిప్త సమాచారం ద్వారా కట్ అయిన మొత్తం వివరాలు వస్తాయి. సులభతరం కానున్న రుసుం చెల్లింపు.. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా ఫాస్టాగ్ ద్వారా టోల్ రుసుం వసూలు చేసే విధానం రానున్న రోజుల్లో ట్రాఫిక్ నియంత్రణ, కాలహరణం నివారించడం వంటి సౌకర్యాలు కలగనున్నాయి. రాత్రి వేళల్లో టోల్ గేట్ల వద్ద వాహనాన్ని నిలిపి రుసుం చెల్లించాలి్సన అవసరం ఉండదు. జాతీయ రహదారుల అనంతరం రాష్ట్ర రహదారుల్లోని టోల్ గేట్ల వద్ద ఈ విధానమే అమలు చేయనున్నారని అధికారులు అంటున్నారు. -
ఓ మాజీ సైనికుడిని లంచం అడిగితే ఏంచేశాడంటే!!
లంచావతారులు చేయి తడపనిదే ఏ పనీ చేయడం లేదు. పైసలిస్తే కాని ఫైల్ కదిలించడం లేదు. దేశ రక్షణకు పాటు పడే జవానులైనా అందుకు అతీతులు కాదంటున్నారు. కుమార్తె స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ మాజీ సైనికుడిని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి కార్యాలయ ఉద్యోగి లంచం డిమాండ్ చేశాడు. భారత సైన్యంలో పనిచేసిన ఆయన అది సహించలేకపోయాడు. లంచం పేరెత్తగానే ఆయన రక్తం మరిగిపోయింది. ఆ లంచావతారాన్ని రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టించాడు. సాక్షి, ఒంగోలు: ఇంకొల్లు మండలం కొణికి గ్రామానికి చెందిన నీలం ఆంజనేయులు కొంతకాలం భారత సైన్యంలో పనిచేశాడు. రిటైర్మెంట్ తర్వాత గుంటూరు జిల్లా బాపట్లలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం అక్కడే ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని కుమార్తె గుంటూరు జిల్లాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి మాజీ సైనికుడు కావడంతో ప్రధానమంత్రి స్కాలర్షిప్ స్కీము కింద ఆమెకు ఏటా రూ.36 వేలు వస్తుంది. దీని కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మాజీ సైనికుని రికార్డును పరిశీలించి అనెగ్జర్–1 పై జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి సంతకం చేయాలి. దానిని ప్రాసెస్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉపకార వేతనం కోసం సైనిక్ బోర్డుకు నెలరోజుల క్రితం ఆంజనేయులు దరఖాస్తు చేసుకున్నాడు. అందులో వివరాలను జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారులు పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నట్లు నిర్థారించుకుని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి రజనీకుమారి దానిపై సంతకం చేశారు. అడ్డుగా మారిన జూనియర్ అసిస్టెంట్.. అయితే అధికారి సంతకం చేసినా దానిని అప్లోడ్ చేసేందుకు జూనియర్ అసిస్టెంట్ షేక్ ఆర్ జమీర్ అహ్మద్ అడ్డుగా మారాడు. గడువు దగ్గరపడుతోంది. దయచేసి అప్లోడ్ చేయమని ఆంజనేయులు అభ్యర్థించినా పట్టించుకోలేదు. చివరకు బాపట్ల నుంచి సెలవు పెట్టుకుని మరీ వచ్చి ప్రకాశం భవనం ఎదురుగా గల పాత రిమ్స్ భవనంలోని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి కార్యాలయానికి ఉన్నతాధికారిని కలిసేందుకు వచ్చాడు. ఆమె సెలవులో ఉండటంతో అతను జూనియర్ అసిస్టెంట్‌పై ఒత్తిడి తీసుకువచ్చి సకాలంలో అప్లోడ్ కాకపోతే తాను తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందంటూ నచ్చజెప్పేందుకు యత్నించాడు. దీంతో జమీర్ రూ.10వేలు ఇస్తే సరి.. లేకుంటే కుదరదంటూ తేల్చి చెప్పాడు చివరకు కనీసం రూ.8వేలైనా ఇవ్వక తప్పదన్నాడు. స్వాధీనం చేసుకున్న నగదు ఏసీబీకి ఫిర్యాదు.. ఇటువంటి అవినీతిపరుడికి వారికి డబ్బిచ్చి పని చేయించుకునే కంటే కటకటాల వెనక్కు పంపడమే కరెక్ట్ అని భావించిన ఆంజనేయులు ఈనెల 12న అవినీతి నిరోధక శాఖ అధికారులను కలిశాడు. తన సమస్యను రాతపూర్వకంగా తెలియజేశాడు. ఫిర్యాదును రికార్డు చేసుకున్న అధికారులు రెండురోజులపాటు జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి కార్యాలయంపై నిఘా పెట్టారు. తమకు వచ్చిన ఫిర్యాదు వాస్తవమేనని నిర్థారించుకుని ఉన్నతాధికారులకు తెలియపర్చారు. అవినీతి నిరోధక శాఖ గుంటూరు అదనపు ఎస్పీ సురేష్‌బాబు నేతృత్వంలో శుక్రవారం అహ్మద్‌పై వల పన్నారు. ఫిర్యాదిదారుకి పలు సూచనలు చేశారు. ఆయన వెళ్లి సర్టిఫికేట్ అడగడం, జమీర్ అహ్మద్ డబ్బులు డిమాండ్ చేయడం.. ఫిర్యాది ఇచ్చిన సిగ్నల్‌తో రూ.8 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు మధ్యవర్తుల సమక్షంలో నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ దాడులలో ఏసీబీ సీఐలు ఎన్.రాఘవరావు, ఎ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అదనపు ఎస్పీ ఏమంటున్నారంటే.. నిందితుడ్ని అరెస్టు చేసిన అనంతరం అదనపు ఎస్పీ సురేష్‌బాబుతోపాటు మీడియాతో మాట్లాడుతూ సర్టిఫికేట్‌పై సంతకం చేసిన అనంతరం దానిని పద్ధతి ప్రకారం అప్లోడ్ చేయాలి. ఇందుకు జూనియర్ అసిస్టెంట్ జమీర్ అహ్మద్ రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. చివరకు రూ.8వేలు తప్పనిసరి అనడంతో తమకు ఫిర్యాదు వచ్చింది. దీంతో తమ సిబ్బంది నిఘా పెట్టి వాస్తవమే అని నిర్థారించుకున్న అనంతరం రంగంలోకి దిగాం. చివరగా కూడా ఫిర్యాదికి పలు సూచనలు చేశాం. ముందుగా ఎట్టి పరిస్థితులలోను డబ్బులు ఇవ్వొద్దని, సర్టిఫికేట్ గురించి మాత్రమే మాట్లాడమని చెప్పాం. మరలా డబ్బు సంగతి ఎత్తితే అప్పుడు ఇవ్వమంటూ రూ.10 వేలు ఇచ్చి పంపాం. ఫిర్యాది సర్టిఫికేట్ గురించి ప్రస్తావించగానే డబ్బులు తప్పనిసరి అనడం, అతను డబ్బులు ఇస్తూ తమకు సూచన చేయడంతోనే అరెస్టు చేశాం. నిందితుడిని నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం. మాజీ సైనికుని కుమార్తె దరఖాస్తుకు సంబంధించిన ఫైల్‌ను కూడా సీజ్ చేస్తాం. -
శభాష్..సిద్ధార్థ అంటూ సీఎం జగన్ ప్రశంసలు!
సాక్షి, ఒంగోలు: నాడు–నేడు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సమర్థంగా సభ నిర్వహించారంటూ ఎస్పీ సిద్థార్థ కౌశల్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, గుంటూరు రేంజి ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ శభాష్ సిద్ధార్థ..అంటూ ప్రశంసించారు. గురువారం ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కావడం, వేదిక మొత్తం జనంతో కిక్కిరిసి పోయింది. క్రౌడ్ కంట్రోల్ విషయంలో తీసుకున్న చర్యలు బాగున్నాయంటూ సీఎం నుంచి ఎస్పీ ప్రశంసలు అందుకున్నారు. బందోబస్తు పర్యవేక్షించిన ఎస్పీతో పాటు విధుల్లో పాల్గొన్న సిబ్బందిని కూడా జగన్ అభినందించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకున్న చర్యలు బాగున్నాయని ఎస్పీ పలువురి ప్రశంసలు అందుకున్నారు. బారులు తీరిన అభిమానం ఒంగోలు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు రాక సందర్భంగా ఆయన కోసం జనాభిమానం బారులు తీరింది. పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజలు కూడా ఉత్సాహంగా కనిపించారు. గుంటూరు రేంజి ఐజి వినీత్‌బ్రిజ్‌లాల్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌లు సీఎం రాకకు ముందే పోలీసు ట్రైనింగ్ కాలేజీలోని హెలిపాడ్‌ను, సభావేదికను, వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. మన బడి నాడు–నేడు కార్యక్రమ ప్రారంభానికి షెడ్యూలు ప్రకారం సీఎం గురువారం ఉదయం 10.10 గంటలకు చేరుకోవాల్సి ఉండగా 10.25 గంటలకు స్థానిక పోలీసు ట్రైనింగ్ కాలేజీలో హెలికాప్టర్ నుంచి దిగారు. ఆయనతోపాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పినిపె విశ్వరూప్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలు కూడా ఆయన వెంట వచ్చారు. హెలిప్యాడ్ వద్ద సీఎంకు మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు స్వాగతం పలికారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్, డీఎస్పీ జి. నాగేశ్వరరెడ్డి అడుగడుగునా నిఘా నేత్రం: సీఎం సభ ఎటువంటి అంతరాయం లేకుండా సాగేందుకు గుంటూరు రేంజి ఐజీ, జిల్లా ఎస్పీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. వేదిక పక్కనే గ్రీన్‌రూముకు ఆనుకుని కమాండ్ కంట్రోల్ రూమును ఒక దానిని ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ రూములో భారీ సిస్టంలు రెండు ఏర్పాటు చేసి సభాప్రాంగణం, ఆవరణతోపాటు చుట్టుపక్కల రహదారులలో పరిస్థితులను ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీతోపాటు మార్కాపురం డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డిలు పరిశీలిస్తూ తగు ఆదేశాలు జారీచేయడం ప్రారంభించారు. రంగారాయుడు చెరువువద్ద ఉన్న ఫ్యాన్సీ గూడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ వద్దనుంచి కాపు కళ్యాణమండపం రోడ్డు చివరవరకు, ఇటు అంజయ్యరోడ్డులో బ్రిలియంట్ కంప్యూటర్ వరకు రహదారులు కిక్కిరిసిపోయాయి. ఈ సమయంలో స్వాట్ టీం కూడా ప్రాంగణ ముఖద్వారం వద్ద ఉండి అధికారులకు భద్రతా ఏర్పాట్లలో చేయూతనిచ్చి ప్రశంసలు అందుకుంది. ఉన్నది 2.15గంటలే: ఉదయం 10.25కు ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కాలేజీలో దిగిన సీఎం తిరిగి 12.37 గంటలకు హెలిపాడ్ చేరుకున్నారు. 12.40 గంటలకు హెలికాప్టర్ టేకాఫ్ తీసుకుంది. మొత్తం 2.15గంటలపాటు ఆయన ఒంగోలులో ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా పాఠశాలల బస్సులు సైతం సభాప్రాంగణం నుంచి వెళ్లిపోయాయి. ఆ వెంటనే ట్రాఫిక్ మొత్తం క్లియర్ కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో సామాన్య ప్రజలు, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. -
టూరిస్ట్ హబ్ కానున్న ప్రకాశం
సాక్షి, ఒంగోలు మెట్రో: ఎన్నో చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలున్న జిల్లా పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం అసలు పట్టించుకోని పర్యాటక విభాగాన్ని తొలి ఏడాదిలోనే పట్టించుకుని తొలి విడత మూడు ప్రాంతాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. విడతల వారీగా జిల్లాలోని అన్ని చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలను గుర్తించి అభివృద్ధి చేసి జిల్లాను టూరిస్ట్ హబ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. మూడు ప్రాంతాల ఎంపిక.. జిల్లాలో తొలి విడతగా 2019–20 వార్షిక సంవత్సరానికి గాను మూడు ప్రాంతాలను పర్యాటక అభివృద్ధి కోసం ఎంపిక చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రాంతం, దాని సమీపంలోని అన్నంగి ప్రాంతంతో పాటు కొత్తపట్నం సముద్రతీరాన్ని కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సర్వే శాఖ అధికారులను సర్వే చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ ఆదేశించారు. అయితే, ఈ మూడు ప్రాంతాలనూ ప్రభుత్వ ప్రవేటు భాగస్వామ్యంతో ప్రత్యేక కన్సల్టెంట్స్తో అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద బోటు షికారు ఇప్పటికే ఉన్నప్పటికీ అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. తద్వారా పర్యాటకులను ఆకర్షించేందుకు, ఆ ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు త్వరలో చర్యలు చేపట్టనున్నారు. ఇక గుండ్లకమ్మలో బోటు షికారు కోసం బోట్ల సంఖ్య కూడా పెంచనున్నారు. అన్నంగి ప్రాంతంలో 13 ఎకరాలలో ప్రత్యేకంగా పర్యాటక శాఖ సహకారంతో అభివృద్ధి చేసి అన్నంగి కొండ మీద ఒంగోలు గిత్త పెద్ద ప్రతిమను ఏర్పాటు చేసి ఈ ప్రాంత విశిష్టతను పర్యాటకులకు తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి సర్వే చేసి సూచనలు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తపట్నం బీచ్‌లో వసతులు.. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో కొత్తపట్నం బీచ్ ఒకటి. సందర్శకులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించి తీర ప్రాంతం పర్యాటకులకు ఆహ్లాదం కలిగేట్టు తీర్చిదిద్దనున్నారు.కలెక్టర్ సూచనలను అనుసరించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇలా తొలి విడతగా ఈ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసి సందర్శకుల సంఖ్య పెంచటం లక్ష్యంగా తద్వారా పర్యాటక ప్రాంతంగా జిల్లాను తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
హాస్టల్లో ఉన్నారనుకుంటే.. మూసీలో తేలారు!
పొదిలిరూరల్: పాపం ఆ నిరుపేద తల్లిదండ్రుల కష్టం ఎవరికీ రాకూడదు.. తమ పిల్లలు హాస్టల్లోనే ఉన్నారనుకున్నారు.. రోజూ స్కూల్‌కు వెళుతూ చక్కగా చదువుకుంటున్నారనుకున్నారు.. కానీ వారికి తెలియదు.. వారం కిందటే వారు మృత్యుఒడికి చేరారని.. తీరా విషయం తెలిశాక ఆ తల్లిదండ్రులను ఆపడం ఎవరితరం కాలేదు. గుండెలు బాదుకుంటూ రోదించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పొదిలి మండలం ఏలూరు పంచాయతీలోని నల్లారెడ్డిపాలేనికి చెందిన చిన్నపురెడ్డి బ్రహ్మారెడ్డి (13), పొరుగూరు టి.సళ్లూరుకు చెందిన ఇండ్లా సూర్య (12) స్నేహితులు. వీరిద్దరు చీమకుర్తిలోని గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. ఈ నెల 19న తాము ఆధార్‌కార్డు తీసుకోవాలని పాఠశాల ఇన్చార్జికి లెటర్ రాసిచ్చి ఇంటికొచ్చారు. ఆ సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో మూసీ నదికి ఈతకెళ్లారు. పిల్లలు ఇంటికొచ్చిన విషయం రెండు కుటుంబాలకూ తెలియదు. సూర్య తండ్రి ఒంగోలులో ట్రాక్టరు నడుపుతూ ఇంటికి వచ్చిపోతూ ఉంటాడు. ఆయన తన కుమారుడు సూర్యను దీపావళి పండుగకు ఇంటికి తీసుకెళదామని శుక్రవారం సాయంత్రం పాఠశాలకెళ్లాడు. 19వ తేదీనే సూర్యతో పాటు బ్రహ్మరెడ్డి కూడా పాఠశాల నుంచి వెళ్లారని అక్కడి సిబ్బంది చెప్పారు. ఎంత వెతికినా పిల్లల ఆచూకీ దొరక్కపోవడంతో చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూసీనది ఒడ్డున ఇద్దరు పిల్లల దుస్తులున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆ పరిసరాలకు వెళ్లి గ్రామస్తులు వెతకగా దుస్తులున్న ప్రదేశం నుంచి 300 మీటర్లు దూరంలో ఒక మృతదేహం, అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో మరో మృతదేహం కనిపించింది. మృతదేహం చేతికి ఉన్న దారం ఆధారంగా ఒకరిని సూర్యగా తల్లిదండ్రులు గుర్తించారు. పొదిలి సీఐ శ్రీరాం ఆధ్వర్యంలో ఎస్ఐ కె.సురేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అద్దంకి నియోజకవర్గ ఇంచార్జిగా బాచిన కృష్ణ చైతన్య
సాక్షి, ప్రకాశం : గత టీడీపీ హయాంలో నియోజకవర్గానికి కనీసం తాగు నీరు కూడా ఇవ్వలేకపోయారని మంత్రి బాలినేని శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలకు మేరకు అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జిగా బాచిన కృష్ణ చైతన్యను నియమించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గరటయ్య తరఫున ఆయన కుమారుడు కృష్ణచైతన్య కీలకంగా వ్యవహరించారు. తాజాగా ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఈయన నియామకం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి బాలినేని మాట్లాడుతూ.. తమ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒంగోలుకి మంచి నీటి సమస్య లేకుండా చూస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో కేవలం కమీషన్లు మాత్రమే రాజ్యమేలేవని, కానీ నేడు మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం చెప్పటిన జీ ప్లస్ ఇళ్ల నిర్మాణం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నేతృత్వంలో పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు' మంత్రి తెలిపారు. -
గుప్త నిధుల పేరుతో మోసం
సాక్షి, మార్కాపురం: గుప్త నిధుల పేరుతో మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన తన్నీరు శివయ్య పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన గోదా నడిపి అనే వ్యక్తి వద్ద గుప్తు నిధుల సమాచారం చెబుతానని రూ. 1.50 లక్షలు, ఒంగోలుకు చెందిన మాదాల శ్రీదేవి వద్ద రూ. 3.50 లక్షలు, బేస్తవారిపేటకు చెందిన నాగరాజు వద్ద రూ. 2.50 లక్షలు తీసుకున్నారు. వాటితో ఒక కారు కొనుగోలు చేసి ప్రజలను గుప్త నిధుల పేరుతో మోసం చేస్తున్నాడని చెప్పారు. ఈ నేపథ్యంలో పెద్దారవీడు పోలీసులు గోదా నడిపి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తుండగా కుంట జంక్షన్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి రూ. 2.20 లక్షల నగదును, నంబర్ లేని మహీంద్రా కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు మాయమాటలు నమ్మి మోసపోవద్దని డీఎస్పీ తెలిపారు. బంగారం పేరుతో.. అమాయక ప్రజలను బంగారం పేరుతో మభ్యపెట్టి మోసం చేసిన వ్యక్తిని మంగళవారం పట్టణ సమీపంలోని బోడపాడు అడ్డరోడ్డు వద్ద పట్టణ ఎస్సై టి.కిశోర్‌బాబు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. ప్రజల వద్ద నుంచి డబ్బులు తీసుకుని నకిలీ బంగారం ఇచ్చి మోసం చేస్తున్న చీమకుర్తి మండలం తాడిపత్రి గ్రామానికి చెందిన నాగులూరి ప్రకాశం, దోర్నాల మండలంలోని రామచంద్రకోట గ్రామానికి చెందిన కర్రా సుబ్బరాయుడుకు బంగారు చైను ఇస్తానని 55 వేల రూపాయలు తీసుకుని చైను ఇచ్చాడన్నారు. దీనిని సుబ్బరాయుడు బంగారు దుకాణంలో తనిఖీ చేయించగా నకిలీదని తేలటంతో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనితో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా బోడపాడు అడ్డరోడ్డు వద్ద ప్రకాశం ఆటోలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారణ చేసి అతని వద్ద నుంచి రూ. 50 వేల నగదు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన ఎస్సైలు రామకృష్ణ, కిశోర్‌బాబులను దర్యాప్తు చేసిన సీఐ కేవీ రాఘవేంద్రను డీఎస్పీ అభినందించారు. -
బడుగుల నెత్తిన పిడుగు
చీమకుర్తి: రెక్కాడితేగాని డొక్కడని బతుకులు వారివి. బతుకుదెరువు కోసం వ్యవసాయ పనులకు వెళ్లిన విగతజీవులుగా మారారు. జిల్లాలో సోమవారం మధ్యాహ్నం వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో పిడుగుపాటుకు ఓ రైతుతో పాటు మరో ముగ్గురు మహిళా కూలీలు మృత్యువాత పడ్డారు. మరి కొందరు ఆధాటికి స్పృహ కోల్పోయి అపస్మారక స్థితికి చేరారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామానికి చెందిన 11 మంది మహిళా కూలీలు సోమవారం ఉదయం పొరుగూరు మంగమూరులోని పొలాల్లో మిరప నాట్లు కోసం వెళ్లారు. అప్పటి దాకా నాట్లు వేసిన వారంతా మధ్యాహ్నం 2 గంటల సమయంలో భోజనం చేసేందుకు పొలంలోనున్న జమ్మిచెట్టు కిందకు చేరారు. అందరు సరదాగా మాట్లాడుకుంటూ భోజనం ముగించారు. అప్పటికే ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులుతో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా వర్షం వంగకపోవడంతో మళ్లీ నాట్లకు ఉపక్రమించే చెట్టు కింద నుంచి అందరు చేలోకి బయలుదేరారు. అంతలోనే జమ్మి చెట్టు మొదలును చీల్చుకుంటూ పెద్ద శబ్దంతో పిడుగు పడింది. చెట్టు మొదలుకు దగ్గరగా ఉన్న తొండపురెడ్డి కోటేశ్వరమ్మ(33), ఆమెకు పక్కనే ఉన్న మారెళ్ళ శేషమ్మ(65) కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మిగిలిన 9 మంది పిడుగు శబ్దానికి స్ప్రహతప్పి పడిపోయారు. వారు తేరుకొని లేచి చూసేసరికి కోటేశ్వరమ్మ, శేషమ్మ విగత జీవులుగా పడి ఉన్నారు. చెట్టు కింద నుంచి ఒక్క క్షణం ముందు బయటకు వచ్చి ఉంటే వారిద్దరూ కూడా ప్రాణాలతో ఇంటికి వచ్చేవారని తోటి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. పేర్నమిట్టలో విషాదం.. పిడుగు పాటుకు మృతి చెందిన కోటేశ్వరమ్మ, శేష మ్మ ఇద్దరివీ పేద కుటుం బాలకు చెందిన వారే. భర్తలతో కలిసి కూలి పనులు చేసుకుంటేనే వారికి జీవనం గడిచేది. కోటేశ్వరమ్మకు భర్త రవిరెడ్డి, 15 ఏళ్ల కుమారుడు సాయిప్రతాప్‌రెడ్డి, 12 ఏళ్ల కుమార్తె శ్రీజ ఉన్నారు. శేషమ్మకు భర్త నారయ్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతిచెందిన ఇద్దరుతో పాటు మిగిలిన 9 మంది కూడా పేర్నమిట్ట గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదాఛాయలు అలముకున్నాయి. పిడుగు పడిన ప్రాంతాన్ని ఒంగోలు తాలూకా సీఐ ఎం.లక్ష్మణ్, ఎస్సై భవానీ, తహసీల్దార్ ఎం.రాజ్‌కుమార్, ఎంపీడీఓ వై.శ్రీనివాసరావు, ఇతర అధికారులు పరిశీలించారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి మృతదేహాలను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఆదుకుంటుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు హామీ ఇచ్చారు. అరక దున్నుతూ.. ఇంకొల్లు : కారంచేడు మండలం దగ్గుబాడుకు చెందిన రావి మనోహర్ (55) కొంత కాలంగా ఇంకొల్లులో ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే సోమవారం ఉదయం అరక తోలేందుకు సమీపంలలోని హనుమోజిపాలెం వెళ్లాడు. సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురుస్తూ పిడుగు పడటంతో పొలంలోనే మనోహర్ ప్రాణాలు విడిచాడు. పిడుగు ధాటికి ఎడ్లు బెదిరిపారిపోయాయి. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మృత దేహాన్ని స్వగ్రామం దగ్గుబాడుకు తరలించారు. గేదెలను మేపుకునేందుకు పొలానికి వెళ్లిన హనుమోజిపాలెం గ్రామానికి చెందిన బండారు కోటేశ్వరమ్మ అదే సమయంలో పిడుగుపాటుకు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమె మేపుతున్న ఓ పాడి గేదె మృతి చెందింది. గమనించిన స్థానికులు కోటేశ్వరమ్మను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. హనుమోజిపాలెంలో అరక తోలుతూ పిడుగుపాటుకు మృతి చెందిన రైతు మనోహర్ పాపిరెడ్డిపల్లిలో మరో మహిళ.. వెలిగండ్ల: వెలిగండ్ల మండలంలోని పాపిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో పిడుగుపడి ఒక మహిళ మృతి చెందింది. ఆ గ్రామానికి చెందిన కొందరు మహిళా కూలీలు సజ్జ కోసేందుకు గ్రామం సమీపంలోని పొలానికి వెళ్లారు. సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో ఆకాశం మేఘావృతం అయింది. ఆ సమయంలో ఒక్కసారిగా పిడుగుపడి పడింది. పొలంలో గడ్డికోస్తున్న సోము రమణమ్మ(50) పిడుగుపాటుకు కుప్ప కూలిపోయింది. పక్కనే ఉన్న ఇద్దరు మహిళలు మేడం పద్మ, డేగా వరమ్మలు అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్తులు వారిద్దరినీ చికిత్స కోసం కనిగిరికి తరలించారు. -
కాలువలోకి దూసుకుపోయిన స్కూలు బస్సు..
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా దర్శిలో స్కూల్ విద్యార్థులు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. స్థానిక చింతలపాడు రోడ్డులో ఎస్వీఆర్ పాఠశాల బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి పంట కాలువలోకి దూసుకుపోయింది. బస్సు బోల్తా పడటంతో ఆరుగురు చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సులో సుమారు 12 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. విద్యార్థులను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చిన్నారులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
శభాష్ సిద్ధార్థ్ అంటూ సీఎం జగన్ ప్రశంసలు
గ్రామాల్లో భూ వివాదాలతో నిత్యం గొడవలు జరుగుతూ ఉండడం చూస్తున్నాం. రెవెన్యూ అధికారులు చేసిన తప్పులకు నిజమైన భూ యజమానులు పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూనే ఉన్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల్లో సగానికి పైగా భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులే ఉంటున్నాయి. ముఖ్యంగా పోలీస్ గ్రీవెన్స్‌కు వచ్చే ఫిర్యాదుల్లో ఇవే అధికంగా ఉంటున్నాయి. సివిల్ వివాదం కావడంతో ఇప్పటి వరకు పోలీసులు ఇందులో తామేమీ చేయలేమని చెబుతూ వస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ భూ వివాదాలపై దృష్టి సారించడంతో పాటు వాటికి చెక్ పెట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇది పోలీసులతో పాటు ఇతర శాఖల అధికారులతో కూడా సమన్వయంతో కూడి చేయాల్సిన పని కావడంతో స్పందనపై సీఎం నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో తమ ప్రణాళికను సీఎంకు వివరించారు. ఎస్పీ సూచన సరైనదేనని భావించిన సీఎం వైఎస్ జగన్ దానిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆచరణలో పెట్టాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. వెల్డన్ సిద్ధార్థ్ అంటూ ఎస్పీని అభినందించారు. సాక్షి, ఒంగోలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తోంది. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆలోచన వల్ల ఇందులో మరో అడుగు ముందుకు పడింది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్, ఎస్పీ నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో భూ వివాదాలపై వచ్చే ఫిర్యాదులకు ఐదు రోజుల్లో పరిష్కారం చూపించాలని ప్రభుత్వం, అధికారులు ప్రణాళిక రూపొందించారు. మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్ జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా సోమవారం స్పందనలో ఫిర్యాదులు అందిన వెంటనే వాటిలో నుంచి భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను వేరు చేసి మంగళవారం కలెక్టర్ కార్యాలయానికి వాటిని పంపుతారు. కలెక్టరేట్‌కు వచ్చిన ఫిర్యాదులను ఆయా మండలాల తహశీల్దార్ కార్యాలయాలకు బుధవారం చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. గురువారం మండల కేంద్రంలో తహశీల్దార్, స్థానిక పోలీస్ అధికారి, సర్వేయర్, పంచాయతీ అధికారి ఇలా సంబంధిత అధికారులంతా సమావేశమై ఉన్నతాధికారుల నుంచి అందిన భూవివాదాల ఫిర్యాదులను పరిశీలిస్తారు. అధికారులంతా కలిసి శుక్రవారం ఫిర్యాదుదారుడిని పొలం లేదా స్థలం వద్దకు జాయింట్ ఇన్స్పెక్షన్కు వెళ్లి వివాదం ఉన్న వ్యక్తితో పాటు గ్రామ పెద్దలను పిలిపించి దానిపై చర్చిస్తారు. అక్కడికక్కడే పరిష్కారం అయ్యే వాటిని పరిష్కరించి, పెద్ద మనుషుల సమక్షంలో లిఖిత పూర్వక ఒప్పంద పత్రాలు రాయిస్తారు. ఇందులో ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని తేలితే పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. తహశీల్దార్ దీనిపై నోటీసులు జారీ చేస్తారు. నిజమైన భూ యజమానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటారు. ఒక వేళ న్యాయపరమైన చిక్కులు ఉంటే తాత్కాలిక చర్యలు చేపట్టి కోర్టు తీర్పుకు అనుగుణంగా వ్యవహరించేలా చర్యలు చేపడతారు. ఇలా ఐదు రోజుల్లో స్పందనకు వచ్చిన భూ వివాదాల ఫిర్యాదులను పరిష్కరించే దిశగా తొలి అడుగు పడింది. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి వచ్చిన 20 భూ వివాదాల ఫిర్యాదులను కలెక్టర్ కార్యాలయానికి పంపారు. కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌లు వీటిపై మంగళవారం చర్చించారు. బుధవారం నుంచి పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. భూ వివాదాల పరిష్కారం ఇక సులభతరం.. గ్రామాల్లో రైతులు, గ్రామస్థుల మధ్య భూ వివాదాలే ఎక్కువుగా జరుగుతుంటాయి. సివిల్ వివాదాలంటూ పోలీసులు పట్టించుకోక పోవడం... రికార్డుల ఆధారంగా చర్యలంటూ రెవెన్యూ అధికారులు చెబుతుండడం, సర్వే నిర్వహించేందుకు సర్వేయర్లు నిరాకరిస్తుండడంతో ఈ వివాదాలు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. కొంత మంది కోర్టుల చుట్టూ తిరుగుతుండగా మరి కొందరు మాత్రం నిత్యం గొడవలు పడుతూనే ఉన్నారు. స్పందనలో వచ్చే భూ వివాదాలపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కారం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడంతో ఇక భూ వివాదాలకు చెక్‌పెట్టడం సులభతరం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని వల్ల గ్రామాల్లో ప్రజల మధ్య వైషమ్యాలు తగ్గి శాంతి భద్రతలకు సైతం విఘాతం కలగకుండా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఫిర్యాదులు అంటే కింది స్థాయి అధికారులకు పంపి చేతులు దులుపుకోవడం కాకుండా జిల్లా కలెక్టర్, ఎస్పీలు నేరుగా రంగంలోకి దిగి వీటి పరిష్కార దిశగా చర్యలు చేపట్టడంపై అభినందనీయం. -
రాత్రి సీజ్.. పొద్దున్నే పర్మిషన్
సాక్షి, కందుకూరు రూరల్: నిబంధనలకు విరుద్దంగా పబ్లిక్ సెలవు దినాల్లో పాఠశాలలను నడుపుతున్న రెండు ప్రైవేటు పాఠశాలలను శుక్రవారం మండల విద్యాశాఖాధికారి బి.శివన్నారాయణ పరిశీలించి సీజ్ చేశారు. సీజ్ చేసిన తాళాలను జిల్లా విద్యాశాఖాధికారికి శుక్రవారం రాత్రే అందజేశారు. అయితే తెల్లవారే సరికి డీఈఓ నుంచి అనుమతులు వచ్చాయని పాఠశాలలను యథావిధిగా నడుపుకున్నారు. శ్రీ చైతన్య పాఠశాలకు సీజ్ చేసిన తాళాలను తీయకుండా గేటుకు ఉన్న చిన్న గేటు నుంచి పాఠశాలను నడిపారు. నారాయణ పాఠశాల అయితే శనివారం మధ్యాహ్ననాకి డీఈఓ అనుమతులు ఇచ్చారని తాళాలు కూడా ఇచ్చారని మధ్యాహ్నం నుంచి పాఠశాలను ప్రారంభించారు. అయితే శుక్రవారం పాఠశాలలను సీజ్ చేసి ఎంఈఓ రాత్రికి డీఈఓకు తాళాలు అందజేశారు. శనివారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ కార్యాలయాలు తెరచుకుంటాయి. పాఠశాలలను మాత్రం 9 గంటలకే ప్రారంభిస్తారు. అయితే డీఈఓ అనుమతులు ఇచ్చారని సీజ్ చేసిన తాళాన్ని కూడా తీయకుండా శ్రీచైతన్య పాఠశాల తరగతులను నడిపింది. రాత్రికి రాత్రే అనుమతులు డీఈఓ అనుమతులు ఎలా ఇచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం పూట కూడా గడవకముందే అనుమతులు ఇచ్చిన డీఈఓపై పలువురు విద్యావేత్తలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నారాయణ పాఠశాల మధ్యాహ్నం వరకు పాఠశాల తెరవలేదు. మధ్యాహ్నం నుంచి డీఈఓ నుంచి అనుమతుల మేరకు తాళాలు తెచ్చుకున్నామని తాళాలు తెరచారు. విద్యాశాఖాధికారుల మధ్య సమన్వయ లోపం విద్యాశాఖలో మండల అధికారిగా ఉన్న బి.శిన్నారాయణ పాఠశాలను పరిశీలించి నిబంధనలు అతిక్రమించారని పాఠశాలను సీజ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా అధికారికి నివేదించి తాళాలు కూడా అప్పగించారు. అయితే తిరిగి సీజ్ చేసిన పాఠశాలలకు అనుమతులు ఇచ్చేటప్పుటు కనీసం ఎంఈఓకు కూడా తెలియకుండా అనుమతులు ఇవ్వడంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కింద స్థాయి నిబద్ధతతో పని చేయడం... పై అధికారులు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా యాజమాన్యాలకే తాళాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎంఈఓ ఏమన్నారంటే ఎంఈఓ శిన్నారాయణను వివరణ కోరగా సీజ్ చేసి ఉంటే పాఠశాలలు ఎలా తీశారని పాఠశాల ప్రిన్సిపాల్స్‌ను అడగగా డీఈఓ నుంచి అనుమతులు తెచ్చుకున్నామని చెప్తున్నారు. శ్రీచైతన్య అయితే పాఠశాల నడుపుకోండి తర్వాత తాళాలు వచ్చి తీసుకెళ్లండని డీఈఓ చెప్పారని వారు సమాధానం ఇచ్చారని ఎంఈఓ తెలిపారు. సీజ్ చేసిన పాఠశాలలకు అనుమతులు ఇవ్వాలని జిల్లా అధికారి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. డీఈఓ వివరణ ఏంటంటే.. ఈ విషయమై డీఈవో సుబ్బారావును వివరణ కోరగా నిబంధనలకు విరుద్ధంగా పబ్లిక్ సెలవు రోజైన కృష్ణాష్టమి రోజున తరగతులు నిర్వహిస్తున్నందున కందుకూరులోని శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలను శుక్రవారం ఎంఈవో పరిశీలించి సీజ్ చేశారన్నారు. అయితే ఆయా పాఠశాలల నిర్వాహకులు మరోసారి ఇలాంటి పొరపాటు చేయబోమని ప్రాధేయపడటంతో శనివారం స్కూలు నిర్వహించుకోవాలని చెప్పామన్నారు. ఈ విషయాన్ని ఎంఈఓకు తెలియజేయడంలో సమాచార లోపం జరిగిందని పేర్కొన్నారు. -
తెలుగుజాతి కీర్తి ‘ప్రకాశం’
రండిరా యిదె కాల్చుకొండిరాయని నిండు గుండెనిచ్చిన మహోద్దండ మూర్తి సర్వస్వమూ స్వరాజ్య సమర యజ్ఞం నందు హోమమ్మొనర్చిన సోమయాజి... – ప్రకాశం పంతులు గురించి ప్రముఖ కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ప్రశంస ఇది. సాక్షి, కడప : ఆంధ్రకేసరి.. ఆ పేరులోనే ఓ దర్పం.. ఆయన వర్తనలో కూడా తెలుగు పౌరుషం.. నిరాడంబరత.. నిజాయతీ, పట్టుదల, క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదురించే గుణం.. నచ్చని ఏ అంశంపైనైనా నిప్పులు చెరిగేతత్వం.. నిజాయితీకి నిలువెత్తు రూపం.. తన గుండెను తూపాకీ గొట్టానికి అడ్డుపెట్టి తెల్ల దొరలను సైతం తెల్లబోయేలా చేసిన సాహస సింహం, తెలుగు విలువల ప్రతాకం ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా కడపతో ఆయనకు గల బంధం గురించి కొన్ని వివరాలు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నేటి తరానికి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ జిల్లాలోని స్వాతంత్య్ర సమరయోధులు, వారి వారసులు, 80 ఏళ్లకు పైగా వయసు ఉన్న పెద్దలుకు తెలుసు. మొన్నటితరం నేత అయినా ఆయన పేరు వినగానే నిన్నటి తరానికి గర్వంతో గుండె ఉప్పొంగుతుంది. పలువురు పెద్దలు ఆయన గురించి తలుచుకుంటూ.. ప్రతి అడుగు ఓ పిడుగు అని, మాట సింహగర్జన అని, ప్రేమతో పలుకరిస్తే నవనీతంలా ఉంటుందని, ఆగ్రహిస్తే అగ్ని వర్షం కరిసినట్టే ఉంటుందని అభివర్ణిస్తూ మురిసిపోతూ ఉంటారు. వారు అందించిన సమాచారంతోపాటు జిల్లా గెజిట్ ఆధారంగా వివరాలు ఇలా ఉన్నాయి. జీవిత ప్రకాశం ► ప్రకాశం పంతులు 1872 ఆగస్టు 23న జన్మించారు. 1957 మే 20న ఈ లోకాన్ని వీడారు. ఆయన నిరుపేద అయినా బాగా చదువుకుని న్యాయవాదిగా పని చేశారు. 1926లో స్వాతంత్య్ర ఉద్యమంలోకి ప్రవేశించారు. ‘స్వరాజ్య’ దినపత్రికను స్థాపించారు. ► 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటీషు అధికారులు ఆయనను కడపలో నిర్బంధించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఉత్తమమైన పాలన అందించారు. 1972లో ఒంగోలు జిల్లాకు ఆయనపై గౌరవ సూచకంగా ప్రకాశం జిల్లాగా మార్చారు. రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాకు ఒక నాయకుడి పేరు పెట్టడం ఆయనతోనే మొదలైంది. ► కడప నగరంలోని ఏడురోడ్ల కూడలిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశాక ఆ కూడలికి ప్రకాశం సర్కిల్‌గా నామకరణం చేశారు. ఆయనపై గౌరవంతో కడప నగరం దొంగల చెరువులోని ఓ ప్రాంతానికి ప్రకాశం నగర్‌గా పేరు పెట్టారు. కడపలో కొన్నాళ్లు.... 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ప్రకాశం పంతులు తన ఎత్తుగడలో భాగంగా కొన్నాళ్లపాటు మన జిల్లాలో ఉన్నారు. అప్పటి మన జిల్లా నాయకులు కడపకోటిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, బసిరెడ్డి తదితరులతో కలిసి ఇక్కడే రాజకీయ మంతనాలు జరిపారు. బ్రిటీషు వారు కడపలోనే ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నారు. ప్రకాశం పంతులు శతజయంతి ఉత్సవాలను నిర్వహించిన సందర్భంగా కడప నగరంలోని ఏడురోడ్ల కూడలిలో 1976 ఏప్రిల్ 20న ఆయన నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, స్థానిక నాయకులు పి.బసిరెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షులు, నాటి కలెక్టర్ పీఎల్ సంజీవరెడ్డి పాల్గొన్నారు. -
‘రామాయపట్నం పోర్టుకు ఏపీ ప్రభుత్వం సానుకూలం’
సాక్షి, ప్రకాశం : గత టీడీపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లాపై కక్ష సాధించిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీల్ నరసింహారావు విమర్శించారు. శుక్రవారం రామాయపట్నం పోర్టు ఏరియాను పరిశీలించిన జీవీఎల్.. పోర్టు వల్ల జరిగే మంచి చెడుల గురించి గ్రామస్తులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అన్ని అనుకూలంగా ఉన్నా గత టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించలేదని మండిపడ్డారు. పోర్టుపై కేంద్ర ప్రభుత్వం లేఖ రాసినా.. టీడీపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని చెప్పారు. రామాయపట్నం పోర్టుకు సహజ అనుకూలతలు ఉన్నాయని వివరించారు. కానీ ప్రస్తుతం ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోర్టుకు సానుకూలంగా ఉందన్నారు. పోర్టు కోసం తాను కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దీనిపై అవసరమైతే ప్రధానితో కూడా మాట్లాడతానని పేర్కొన్నారు. -
విమానం ఎగరావచ్చు..!
సాక్షి, ఒంగోలు సిటీ: జిల్లాలో మళ్లీ విమానం ఎగరనుందా..? దొనకొండలో ఎయిర్‌పోర్టు అభివృద్ధికి అడుగులు పడుతున్నాయా..? జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆకాశయాన స్వప్నం సాకారం కాబోతోందన్న భావన వ్యక్తమవుతోంది. ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జిల్లాలో విమానం రాకపోకలు సాగించిన ఆనవాళ్లున్నాయి. ఆ తర్వాత పాలకులు విమానాశ్రయం అభివృద్ధికి చర్యలు తీసుకోలేకపోయారు. దొనకొండ కేంద్రంగా విమానాలు ఎగిరిన చరిత్రకు ఆనవాలుగానే మిగిలింది. ఇప్పుడు రవాణా వ్యవస్ధ మరింత అభివృద్ధి చెందింది. సుదూర ప్రాంతాలకు నిముషాలు, గంటల వ్యవధిలోనే చేరుకుంటున్నారు. ఆకాశయానం సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేస్తోంది. టికెట్ ధరలు అంత బరువనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. విమానాలు దిగేందుకు అనువైన నెలవులు ఏర్పడుతున్నాయి. ఒకప్పుడు షిరిడీ వెళ్లాలంటే రెండున్నర రోజులు ప్రయాణం చేసే వారు. రెండు మూడు రైళ్లు, బస్సులు ఎక్కాల్సి వచ్చేది. ఇప్పుడు దగ్గరలోని విమానాశ్రయాల నుంచి షిరిడీ, కాశీ వంటి ప్రదేశాలకు గంట వ్యవధిలోనే ప్రయాణించే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. జిల్లాకు దగ్గరలోని గన్నవరం విమానాశ్రయం నుంచి మహా నగరాలకు, యాత్రా ప్రదేశాలకు విమానయానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక జిల్లాలో విమానం ఎగిరే రోజులు దగ్గర పడ్డాయన్న సంకేతాలు వస్తున్నాయి. త్వరలోనే జిల్లా ప్రజలకు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని అధికారుల సర్వేలే విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. జిల్లాలో దొనకొండ కేంద్రంగా విమానాశ్రయం 1934లో నిర్మించారు. అప్పట్లో బ్రిటిష్ పాలకులు తమ రాకపోకలను వేగంగా నిర్వహించుకొనేందుకు దొనకొండ అనుకూలమని భావించి విమానాశ్రయాన్ని నిర్మించారు. రైల్వే లైన్లను వారి హయాంలోనే అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు నెల్లూరు పరగణాలో దొనకొండ ఉండేది. నెల్లూరు కేంద్రంగా పరిపాలన సాగేది. 1934లో 136.52 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించారు. చిన్న విమానాలు ఇక్కడికి రాకపోకలు సాగించేవి. మహారాష్ట్రలోని మిలటరీ రెజిమెంట్ కొద్ది కాలం ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించుకుంది. రెండో ప్రపంచ యుద్ధం జరిగే రోజుల్లో విమనాలు అధికంగా దొనకొండకు వచ్చాయి. ఇక్కడ విమానాలకు అవసరమైన ఇంధనం నింపుకొనే వారు. బ్రిటీష్ ఉన్నతాధికారులు ఇక్కడే సమావేశాలను నిర్వహించుకొనే వారు. విందులు, వినోదాలు, విహారాలకు దొనకొండకు వచ్చే వారు. 1965–70 ప్రాంతంలో చిన్న విమానాలు రాకపోకలు జరిగాయి. ఆ తర్వాత పాలకులు విమానాశ్రయాన్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా దొనకొండ విమానాశ్రయం నిర్లక్ష్యానికి గురయింది. 1971 తర్వాత విమానాశ్రయం స్ధలం అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఎయిర్‌పోర్టు అధారిటి ఆఫ్ ఇండియా పరిధిలోకి విమానాశ్రయం నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. అయితే అభివృద్ధి విషయంలో పలు మార్లు ప్రభుత్వానికి విన్నవించిన అప్పటి పాలకులు విమనాశ్రయానికి నిధులు ఇవ్వలేదు. స్థలం అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి అధారిటి అధికారులు పంపిన ప్రతిపాదనలపై కేవలం రూ.43 లక్షల నిధులను విడుదల చేసింది. వీటితో విమానాశ్రయం స్థలం అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ఇనుప తీగలతో కంచె ఏర్పాటు చేశారు. ఇంతకు మించి అభివృద్ధిలో అడుగు ముందుకు వేయలేదు. దివంగత నేత వైఎస్సార్ కల.. దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి జిల్లాలో విమానాశ్రయం నిర్మాణానికి సానుకూలంగా ఉన్నారు. అప్పట్లో జిల్లా కేంద్రం వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విమానాశ్రయం నిర్మించాలని తలచారు. ఆయన పాలనలోనే భూసేకరణకు చర్యలు తీసుకున్నారు. జిల్లాకు పలు సందర్భాల్లో పర్యటనకు వచ్చిన వైఎస్సార్ ఒంగోలు కేంద్రంగా విమానాశ్రయం నిర్మించే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. జిల్లా నుంచి పారిశ్రామిక రాబడి అధికంగా ఉంది. గ్రానైట్ ఇతర దేశాలకు ఎగుమతి జరుగుతున్నందున విదేశీ మారకద్రవ్యమే అప్పట్లోనే రూ.2 వేల కోట్ల వరకు ఏటా వచ్చేది. మత్స్య సంపద లావాదేవీలతో ఏటా రూ.1500 కోట్లకుపైగా లాభం వచ్చేది. ఇక వాణిజ్య పంటల ద్వారా రూ.వందల కోట్లలోనే లావాదేవీలు, రాబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా నుంచి ప్రవాసాంధ్రులు పెరుగుతున్నారు. విదేశాలకు వెళ్లే వారు, అక్కడ వ్యాపారాలు చేసేవారు అధికమయ్యారు. దీంతో జిల్లా కేంద్రంగా ఇక్కడ ప్రజలకు అవసరాన్ని తీర్చే విధంగా విమానాశ్రయం నిర్మించాలని వైఎస్సార్ బలంగా ప్రయత్నం చేశారు. పలు జిల్లాల్లోనూ ఆయన పర్యటన సందర్భంగా ప్రకాశంలో విమానాశ్రయంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో ఎయిర్ క్రాఫ్ట్ నిలిచే విధంగా శాశ్వత ప్రాతిపదికన హెలీప్యాడ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. అప్పట్లో ప్రభుత్వ కోటరిలోని ముఖ్యులతో ఈ విషయాలపై చర్చించారు. ఆ తర్వాత దివంగత నేత ప్రతిపాదనలను పాలకులు పక్కన పెట్టేశారు. అయినా పలు దఫాలుగా ఈ అంశం చర్చకు వస్తూనే ఉంది. దఫ దఫాలుగా సర్వేలు.. జిల్లాలో విమానాశ్రయం అంశంపై దఫా దఫాలుగా సర్వే జరిగింది. రెండేళ్ల నుంచి సర్వేలు విపరీతంగా జరిగాయి. దొనకొండ కేంద్రంగా పారిశ్రామికవాడ అభివృద్ధికి ప్రతిపాదనలు ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ ఇప్పటికే ఉన్న విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి సాధ్యాసాధ్యాలపై సర్వేలు చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ డైరెక్టర్ రాజ్‌కిషోర్ నేతృత్వంలో అధికారుల బృందం ఎస్.మకేజా, ఎంజీఎం గుప్తా, ఎంజీఎం సుధీప్వర్మ తదితరుల బృందం పర్యటించింది. ఆదివారం దొనకొండలో తాజాగా ధిల్లిలోని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టరేట్‌లోని అధికారులు, ఎం పవర్ ఇండియా లిమిటెడ్ సంస్థకు చెందిన ప్రతినిధులు బుల్, పవన్ తదితరులు పర్యటించారు. పూర్వం ఇక్కడ నుంచి తయారు చేసిన నివేదికలను స్వయంగా పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి దొనకొండ 103.6 కిమీ దూరంలో ఉంది. కర్నూలు జిల్లాకు 103.8 కిమీ, కడప జిల్లా 133.6 కిమీ, మహబూబ్‌నగర్ జిల్లా 160.9 కిమీ దూరంలో ఉంది. జిల్లాలో బేస్తవారపేటకు 17.1 కిమీ, మార్కాపురం 31.51 కిమీ, నంధ్యాల 59.8 కిమీ, వివిధ తీర ప్రాంతాలు 300 కిమీలోపు ఉన్నాయి. ఒక వేళ దొనకొండ అభివృద్ధికి చర్యలు తీసుకుంటే ప్రయోజనాలు, ఇతర అంశాలపై దృష్టి పెట్టారు. వాన్‌పిక్ పరిధిలో బీరంగుంట స్ధలం.. ఒంగోలుకు దగ్గరంలో విమానాశ్రయం నిర్మాణానికి బీరంగుంటలో భూసేకరణ జరిపారు. అయితే 2009లో వాన్‌పిక్ కోసం సేకరించిన భూమి విస్తీర్ణంలోనే విమానాశ్రయానికి కేటాయించారు. ప్రతిపాదిత స్ధలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఆ తర్వాత వెంటనే విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాల ఎంపికక చర్యలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి వద్ద రుద్రకోట ప్రాంతంలో విమానాశ్రయం వల్ల జిల్లా ప్రజలకు సౌకర్యంగా ఉంటుందా అని పరిశీలించారు. ఆ తర్వాత సర్వే చేసి విరమించుకున్నారు. ఒంగోలు మండంలోని చెరువుకొమ్ముపాలెం, వల్లూరు ప్రాంతంలో ప్రతిపాదించారు. 132 కేవీ విద్యుత్తు లైన్లు పెద్ద పెద్ద టవర్లు ఉన్నందున విమానాలు దిగేందుకు ఇబ్బంది ఉందని ఏవియేషన్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇక్కడ ప్రతిపాదన విరమించుకున్నారు. ఇప్పుడు తిరిగా తాజాగా దొనకొండ విమానాశ్రయం అభివృద్ధి ముందుకు వచ్చింది. కేంద్రం ఇప్పటికే నివేదిక ఇచ్చింది. విమానాశ్రయం నిర్మాణం వల్ల ప్రకాశానికి ప్రయోజనంగా భావిస్తున్నారు. దీంతో కేంద్రం వద్ద విమానాశ్రయ దస్త్రం కదిలింది. త్వరలోనే జిల్లాలో ఎగిరేందుకు రూట్ క్లియర్ కానుందన్న అంచనాలు నెలకున్నాయి. -
ఉసురు తీస్తున్న విద్యుదాఘాతం
సాక్షి, బేస్తవారిపేట: జిల్లాలో వాతావరణ పరిస్థితులు మారిన నేపథ్యంలో వేర్వేరు చోట్ల ఒకేరోజు ముగ్గురు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. పొలానికి పశువుల మేత కోసం వెళ్లగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందింది. ఈ సంఘటన బేస్తవారిపేట మండలం పెంచికలపాడులో శుక్రవారం జరిగింది. కొండసాని సుబ్బమ్మ (40) వేరే వాళ్ల పొలంలోకి పశువుల మేత (గడ్డి) కోసుకునేందుకు వెళ్లింది. ఈ సమయంలో పొలం చుట్టూ వేసిన ఇనుప కంచెకు తగిలి విద్యుదాఘాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఆవుల నల్లపురెడ్డి పొలంలో విద్యుత్ స్టార్టర్ ఉంది. స్టార్టర్కు విద్యుత్ సరఫరా చేసే తీగ తెగి పొలాన్ని ఆనుకుని ఉన్న నర్రా అనంతలక్ష్మి, దొంతా చెన్నయ్యల పొలం చుట్టూ ఉన్న ఇనుప కంచెపై పడింది. సుబ్బమ్మ పొలంలోకి వెళ్లేందుకు ఇనుప కంచెను దాటే సమయంలో విద్యుదాఘాతానికి గురైంది. గట్టిగా కేక పెట్టి అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఆ సమయంలో పొలంలో గడ్డి కోసుకుంటున్న అనంతలక్ష్మి గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అక్కడికి చేరారు. విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి విద్యుత్ సరఫరా నిలిపేయించారు. విద్యుత్ మోటార్ తీగను తొలగించి సుబ్బమ్మ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. బుధవారం రాత్రి వర్షం పడటంతో నీరు, బురద ఉండటంతో రోజూ వెళ్లే మార్గం నుంచి కాకుండా మరో మార్గాన్ని ఎంచుకోవడమే ఆమెకు శాపమైంది. మృతురాలికి భర్త గురువారెడ్డి, కుమారుడు, కుమార్తె ఉంది. సుబ్బమ్మ మృతితో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. ఎస్ఐ రవీంద్రారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు పొలం చూసేందుకు వెళ్లి రైతు.. బొట్లగూడూరు (పామూరు): విద్యుదాఘాతంలో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని బొట్లగూడూరు సమీప పొలాల్లో శుక్రవారం జరిగింది. ఎస్ఐ కథనం ప్రకారం.. మండలంలో గురువారం రాత్రి నుంచి వర్షం పడటంతో బొట్లగూడూరు ఎస్సీ కాలనీకి చెందిన మైదుకూరు పెద అంకయ్య (65) తన పొలం చూసుకునేందుకు శుక్రవారం వేకువ జామున వెళ్లాడు. పొలానికి చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ను పట్టుకున్నాడు. పెద అంకయ్య విద్యుదాఘాతానికి గరై తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి సమీపంలోనే ఉన్న కాలనీ వాసి దాసరి పెద మాల్యాద్రి గమనించి స్థానికులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యురాలు కొండమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ చంద్రశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. టీవీ స్విచ్ వేస్తుండగా మహిళ.. లింగసముద్రం: ఓ మహిళ ఇంట్లో టీవీ స్విచ్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన మండలంలోని మొగిలిచర్ల ఆదిఆంధ్ర కాలనీలో గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కేసరపల్లి జయమ్మ గురువారం రాత్రి 10 గంటల సమయంలో టీవీ స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. దీనికి ముందు స్వీచ్‌పై నీరు పడి ఉండటాన్ని ఆమె గమనించలేదు. దీంతో విద్యుదాఘాతానికి గురై జయమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి కుమార్తె కుట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కందుకూరు సీఐ విజయ్‌కుమార్, వలేటివారిపాలెం ఎస్ఐ హజరత్తయ్య, లింగసముద్రం ఎస్ఐ ఎం.సైదుబాబు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. వీఆర్ఓ గిరి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ట్రిపుల్ఐటీ కళాశాల స్థల పరిశీలన
జిల్లాలో ట్రిపుల్ ఐటీ కళాశాల ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై చర్చించేందుకు రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ చాన్సలర్ కేసీ రెడ్డి శుక్రవారం కలెక్టర్ పోలా భాస్కర్‌తో సమావేశమయ్యారు. వారిరువురూ కలిసి పామూరు మండలం దూబగుంట, ఒంగోలు మండలం యర్రజర్లలో స్థలాలను పరిశీలించారు. వేలాది మంది విద్యార్థులకు వసతులు సమకూర్చేందుకు ఆ ప్రాంతం అనువుగా ఉంటుందా.. అక్కడి నీటి లభ్యత ఎలా ఉంటుందనే అంశాలపై ఆరా తీశారు. సాక్షి, దూబగుంట్ల (పామూరు): మండలంలోని దూబగుంట్లకు మంజూరైన ట్రిపుల్ ఐటీ కళాశాల స్థలాన్ని శుక్రవారం కలెక్టర్ పోలా భాస్కర్, ఆర్జీయూకేటీ చాన్సెలర్, ప్రొఫెసర్ కె.చెంచిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా దూబగుంట్ల వద్ద కళాశాలకు కేటాయించిన 208.45 ఎకరాల స్థలంకు సంబంధించిన వివరాలను కందుకూరు ఆర్డీఓ రామారావును అడిగి తెలుసుకుని మ్యాప్‌ను పరిశీలించారు. నీటి వసతి గురించి దూబగుంట్ల గ్రామస్తులతో మాట్లాడగా నీటి వసతి ఉందని కళాశాలకు కేటాయించిన స్థలానికి సమీపంలోనే బత్తాయి తోటలు సాగుచేస్తున్నామని వారు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణానికి సంబంధించి మౌలిక వసతులు, నీటి వసతి, మొదలైన విషయాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 1000 మంది విద్యార్థులు ఈవిద్యాసంవత్సరంతో కలిపి ప్రస్తుతం మొత్తం 4 వేల మంది విద్యార్థులు కళాశాలలో ఉంటారని తాత్కాలికంగా వీరికి క్లాసులు నిర్వహించేందుకు ఒంగోలు రావు అండ్ నాయుడు కళాశాలలో వసతిని పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నూతనంగా కళాశాల ఏర్పాటు చేస్తే 1000 మంది విద్యార్థులకు గాను రోజుకు కనీసం 70 వేల లీటర్ల నీరు అవసరమవుతుందన్నారు. ఇంతనీటి వసతి ఇక్కడ ఉందా అని ఆర్డీఓను అడిగారు. అదేవిధంగా బోర్లు వేస్తే ఎంతలోతులో నీరు పడతాయని అధికారులను అడగ్గా 100 అడుగులు కావాలని..అయితే నీటిలో ఫోరైడ్ కూడా ఉందన్నారు. ఈ సందర్భంలో కొంతమంది గ్రామస్తులు కలుగజేసుకుని తమకు వెలిగొండ కాలువ సమీపంలో నెల్లూరు జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లె రిజర్వాయర్‌కు వెళ్తుందని, దాని నుంచి పైప్‌లైన్ వచ్చే అవకాశముందని కలెక్టర్ దృష్టికితెచ్చారు. దీంతో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ మరో ఏడాది పడుతుందని, రెండో టన్నెల్ కేవలం 40 మీటర్లే పూర్తయిందని రానున్న జనవరిలో పనులు ప్రారంభించినా కనీసం 2 లేదా 3 సంవత్సరాలు పడుతుందన్నారు. అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తయినా శ్రీశైలం ప్రాజెక్టులో నీరు 854 అడుగులు దాటితేనే అప్పటి పరిస్థితులను బట్టి ప్రాధాన్యాతా క్రమంలో మొదట తాగునీరు, ఆతరువాత సాగునీటికి ప్రాధాన్యం ఇస్తారని దీనికి కొంత సమయం పడుతుందని వివరించారు. అప్పటిదాకా వర్షాధారంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయినా ప్రతిపాదిత ట్రిపుల్ ఐటీ కళాశాలకు నీటి వసతిపై ఇరిగేషన్ అధికారులతో చర్చింది నివేదికను ప్రభుత్వానికి పంపుతామని తెలిపిన ఆయన సీఈతో ఫోన్లో మాట్లాడారు. దూబగుంట్ల వద్ద ప్రతిపాదిత ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రాంతానికి నీటివసతిపై వివరాలు అడిగారు. ఈసందర్భంగా గ్రామస్తులు ట్రిపుల్ ఐటీ కళాశాల తరలిపోతుందా అని ఆందోళన వ్యక్తం చేశారు. వెనుకబడ్డ మాప్రాంతానికి కళాశాల వచ్చిందనే ఉద్దేశంతోనే పశువులకు మేతకోసం ఉన్న భూములను సైతం కళాశాల కోసం ఇచ్చామని కలెక్టర్‌కు వివరించారు. దీంతో అలాంటిది ఏమీలేదని వేలాది మంది విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంకోసం అన్ని రకాల సౌకర్యాల పరిశీలనలో నీటివసతి, రవాణా వంటి అవసరాల కోసం క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి ఇస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వెంకట్రావు, ఇంజినీర్ శాస్త్రి, తహసీల్దార్ దిలీప్‌కుమార్, డీపీఆర్ఓ కె.ఎన్.రెడ్డి, డీటీ నాసరుద్దీన్, సర్వేయర్ విష్ణు, వీఆర్ఓ వెంకటస్వామి పాల్గొన్నారు. ‘రావ్ అండ్ నాయుడు’లో తాత్కాలిక క్యాంపస్ ఒంగోలు టౌన్: ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి స్థానిక దక్షిణ బైపాస్‌రోడ్డులోని రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్న టెంపరరీ క్యాంపస్‌లోని పనులను రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ చాన్సెలర్ కేసీ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఒంగోలుకు ట్రిపుల్ ఐటీ మంజూరైనప్పటికీ ఇడుపులపాడులో తరగతులు నిర్వహిస్తున్నారు. గత మూడు బ్యాచ్‌లకు ఇడుపులపాడులోని ట్రిపుల్ ఐటీ కాలేజీ క్యాంపస్‌లో తరగతులు జరుగుతున్నాయి. నాలుగో బ్యాచ్ అయిన ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ తరగతలు నిర్వహించాలని నిర్ణయించారు. అందుకుగాను స్థానిక దక్షిణ బైపాస్‌రోడ్డులోని రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీలో టెంపరరీ క్యాంపస్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంపస్‌లో 2019–2020 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలి బ్యాచ్‌తోపాటు గత ఏడాదికి సంబంధించిన బ్యాచ్ తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులకు సంబంధించిన డైనింగ్ హాల్, బాత్రూమ్ల పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన వెంటనే ట్రిపుల్ ఐటీ తరగతులు ఇక్కడ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న పనులను చాన్సెలర్ కేసీ రెడ్డి స్వయంగా పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సి. వెంకట్రావు ఉన్నారు. యర్రజర్లలో స్థల పరిశీలన ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఇక్కడికి సమీపంలోని యర్రజర్లలో ఏర్పాటు చేసే విషయమై చాన్సెలర్ కేసీ రెడ్డి అక్కడి స్థలాలను పరిశీలించారు. ట్రిపుల్ ఐటీ కాలేజీ నిర్మాణానికి సరిపడే విధంగా స్థలం ఉందా, విద్యార్థులకు పూర్తి స్థాయిలో వసతులు సమకూర్చేందుకు ఆ ప్రాంతం అనువుగా ఉందా, అక్కడ నీటి లభ్యత ఏవిధంగా ఉందన్న వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్‌తో భేటీ రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ చాన్సెలర్ కేసీ రెడ్డి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్‌తో ఆయన చాంబర్లో భేటీ అయ్యారు. ట్రిపుల్ ఐటీ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయమై కలెక్టర్‌తో చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో పామూరు మండలం దూబగుంట వద్ద ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి స్థలాన్ని సేకరించారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే ప్రాంతంలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేస్తే రవాణా పరంగా, అక్కడ విద్యార్థులకు తాగునీటి పరంగా తలెత్తే సమస్యల గురించి కేసీ రెడ్డి కలెక్టర్‌తో చర్చించారు. యర్రజర్లలో చూసిన స్థలం గురించి కూడా కలెక్టర్‌తో చర్చించారు. -
ఉన్న పరువు కాస్తా పాయే..!
సాక్షి, ఒంగోలు ప్రతినిధి: పాయే.. ఉన్న పరువు కాస్తా పాయే..! ఏదో చేద్దామనుకుంటే మరేదో జరిగింది. టీడీపీ త్రీమెన్ కమిటీ పేరుతో హడావిడి చేయాలని చూసి బొక్కబోర్లా పడ్డారు. పార్టీ జిల్లా శ్రేణుల్లో భరోసా మాట అటుంచితే.. ముఖ్య నేతల్లోనే నమ్మకం కలిగించలేక పోయారు. త్రీమెన్ కమిటీ మొట్టమొదటి సమావేశానికే కమిటీలోని ఒక సభ్యుడు డుమ్మాకొట్టాడు. ఇక జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని సైతం మమః అనిపించేశారు. సమావేశానికి ఇద్దరు నియోజకవర్గ ఇన్చార్జిలు మినహా మిగతా వారంతా మొహం చాటేశారు. పట్టుమని పది మంది ముఖ్యనేతలు కూడా రాకపోవడంతో సమావేశాన్ని పది నిముషాల్లోనే ముగించేశారు. ఇలా వచ్చి అలా వెళ్లారు.. అన్న చందంగా త్రిసభ్య కమిటీ పర్యటన సాగింది. నిన్నమొన్నటి వరకూ పార్టీ జిల్లా నేతలపై ఉన్న చిన్నపాటి నమ్మకం సైతం నేటితో పోయిందని టీడీపీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లాయి. శుక్రవారం జిల్లాకు వచ్చిన త్రిసభ్య కమిటీ విలేకర్ల సమావేశం పెట్టి వైఎస్సార్ సీపీ నేతలను తిట్టడం మినహా కార్యకర్తలకు పార్టీ తరఫున ఎటువంటి భరోసా ఇవ్వకపోవడంపై టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీని బలోపేతం చేయడం మాట అటుంచితే త్రిసభ్య కమిటీ రాకతో జిల్లాలో పార్టీ మరింత దిగజారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... జిల్లాలో టీడీపీ శ్రేణులకు భరోసా కల్పిస్తామంటూ వచ్చిన త్రీమెన్ కమిటీ నిర్వాకంతో పార్టీ పరువు బజారునపడిందని ఆ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు మాజీమంత్రులు, ఓ ఎమ్మెల్సీతో త్రిసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ శుక్రవారం ఒంగోలులో పర్యటించింది. త్రిసభ్య కమిటీ మొట్టమొదటి సమావేశానికి కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డుమ్మా కొట్టారు. మిగతా ఇద్దరు సభ్యులైన దేవినేని ఉమామహేశ్వరరావు, కొత్తపల్లి జవహర్‌లు ఇలా వచ్చి అలా వెళ్లారే తప్ప పార్టీ కార్యకర్తలతో మాట్లాడటంగానీ, వారి సమస్యలను తెలుసుకోవడంగానీ చేయకపోవడంపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. తొలుత ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను పరామర్శించిన నేతలు అనంతరం టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మొహం చాటేసిన టీడీపీ ముఖ్య నేతలు... జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం అంటే జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, టీడీపీ రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు హాజరుకావాల్సి ఉంది. అయితే, శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశానికి పట్టుమని పదిమంది ముఖ్య నాయకులు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి దామచర్ల జనార్దన్, కనిగిరి ఇన్చార్జి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి శిద్దా రాఘవరావు మినహా ఎవరూ హాజరుకాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు నియోజకవర్గ ఇన్చార్జిలు డుమ్మా కొట్టడం చూస్తుంటే.. జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థమవుతోంది. జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి నేతల నుంచి స్పందన కరువవడంతో త్రిసభ్య కమిటీ సభ్యులు పది నిముషాల్లో ముగించి మమః అనిపించేశారు. -
సింగిల్ క్లిక్‌తో జిల్లా సమాచారం
సాక్షి, ఒంగోలు సిటీ: హైస్పీడ్ ఇంటర్నెట్, ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చాక ప్రపంచం అరిచేతిలోకి వచ్చేసింది. ఒక్క క్లిక్ చేస్తే చాలు.. ఎలాంటి సమాచారం కావాలన్నా క్షణాల్లో ప్రత్యక్షమవుతోంది. ప్రస్తుతం ఏ వయస్సు వారైనా అంతర్జాల సేవలను అందిపుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో క్షణ..క్షణం జిల్లా సమగ్ర స్వరూపాన్ని కూడా పౌరులకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. పల్లె నుంచి పట్నం దాకా జిల్లా మొత్తంగా సమాచారాన్ని పౌరుల ముందుకు తీసుకురావడానికి జిల్లా స్థాయిలో చకచకా పనులు జరుగుతున్నాయి. ఇందుకు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (నిక్నెట్) సాంకేతిక సహకారాన్నిస్తోంది. జిల్లాకు సంబంధించి ఎవరికి ఎలాంటి సమాచారం కావాలన్నా ఇట్టే పొందే రోజు అతి దగ్గరలోనే ఉంది. పూర్వపు రోజుల్లో జిల్లా సమగ్ర సమాచారాన్ని జిల్లా ముఖ్య ప్రణాళికా విభాగం పుస్తక రూపంలో ఏటా అందుబాటులోకి తెచ్చేది. గణాంకాధికారులు ఆ శాఖ పరిధిలో ఉన్నందున సమగ్ర సమాచారాన్ని సేకరించి పుస్తకం ముద్రించే వారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ సమాచార పుస్తకం (హ్యాండ్ బుక్) ముద్రణకు నిధులిచ్చేవారు. గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ పుస్తకం ముద్రణకు నిధులు సమకూర్చడం లేదు. 2010 తర్వాత ఒకటీరెండు పుస్తకాలు మినహా హ్యాండ్ బుక్ అందుబాటులో లేకుండా పోయింది. జిల్లా అధికారులకు హ్యాండ్ బుక్ కావాలంటే ప్రణాళికా అధికారులు జెరాక్సు ప్రతులతో సమకూరుస్తున్నారు. రానురానూ జెరాక్స్ పుస్తకాలు కనుమరుగవుతున్నాయి. జిల్లాలోని పౌరులకు వివిధ అంశాలపై సమాచారం కావాల్సి వచ్చినప్పుడు, పోటీ పరీక్షలకు వెళ్లే అభ్యర్థుల నుంచి హ్యాండ్ బుక్ డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రకాశం జిల్లా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం ప్రకాశం వెబ్‌సైట్‌ను సక్రమంగా నిర్వహించలేకపోయింది. దీంతో ఆ వెబ్సైట్ ఆరంభ శూరత్వంగానే మిగిలింది. తాజాగా పౌరుల నుంచి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రకాశం వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కార్యాచరణకు పూనుకుంది. ఆగస్టు 15న ప్రారంభానికి సిద్ధం... ప్రకాశం వెబ్‌సైట్‌ను ఆగస్టు 15న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ పోలా భాస్కర్ నేతృత్వంలో నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధికారులు అందుకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. జిల్లా స్థాయిలో ప్రకాశం వెబ్సైట్లో వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడు చేయడానికి ఒక నోడల్ అధికారిని నియమించనున్నారు. నోడల్ అధికారి అన్ని శాఖల అధికారులు, వివిధ రంగాలలోని వారిని, ముఖ్య ప్రణాళికా విభాగం అధికారులు, ఇతర సమాచార సేకరణ ప్రతినిధులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని ఈ వ్యవస్థను నిర్వహించనున్నారు. పొరుగు సేవల నుంచి కొందరు ఉద్యోగులను ఈ విభాగంలో నియమించుకునే అవకాశం ఉంది. ప్రకాశం వెబ్సైట్ నిర్వహణకు నిధుల కేటాయింపునకు కూడా చర్యలు తీసుకోనున్నారు. కలెక్టర్ కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఈ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా కలెక్టర్ నిర్ణయించారు. ఎలాంటి సమాచారం ఉంటుందంటే... జిల్లాలో ఏ రంగం నుంచైనా ఎలాంటి సమాచారమైనా లభించేందుకు వీలుగా వెబ్‌సైట్‌ను డిజైన్ చేశారు. ‘ప్రకాశం డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్’ వెబ్సైట్ చిరునామాను క్లిక్ చేస్తే చాలు.. అందులోని సమాచార వర్గీకరణను అనుసరించి ఆయా రంగాన్ని ఎంచుకుంటే పూర్తి సమాచారం లభించేలా రూపకల్పన చేశారు. ప్రకాశం జిల్లా చరిత్రకు సంబంధించి జిల్లా ఏర్పడినప్పటి నుంచి పూర్తి వివరాలను పొందుపరుస్తారు. జిల్లా విస్తీర్ణం, పురుషులు, మహిళలు, డివిజన్లు, ప్రజాప్రతినిధులు, లోక్‌సభ, అసెంబ్లీ స్వరూపాలు, పంచాయతీలు, ఓటర్లు ఇతర వివరాలను వెబ్సైట్లో ఉంచుతారు. 1901 నుంచి జనాభా పెరుగుదల, పట్టణాలు, నగరాల్లో జనాభా వివరాలు, గృహస్తులు, మండలాల వారీగా జనాభా వివరాలు ఉంటాయి. ఆరోగ్య రంగంలో ఉన్న సంస్థలు, వైద్యసేవలు, బడ్జెట్, ఆస్పత్రులు, ఉపకేంద్రాలు, సబ్ సెంటర్ల చిరునామాలను అందుబాటులో ఉంచుతారు. నేర విభాగం పరిధిలోని కేసులు, సమాచార హక్కు చట్టం కింద వివరాలు, క్రైం బ్యూరో రికార్డులు, పాత కేసులు, న్యాయశాఖకు సంబంధించిన సమాచారం, పోలీసుస్టేషన్ల ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు కూడా వెబ్సైట్లో ఉంటాయి. వ్యవసాయం, నీటిపారుదల రంగం, పర్యాటక రంగం, పశుసంవర్థక శాఖ వివరాలు, మత్స్య సంపద, అటవీ విస్తీర్ణం, ఇతర వివరాలు, పరిశ్రమలు, రవాణా, గనులు, విద్యుత్, పబ్లిక్ ఫైనాన్స్ ఇతర వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తారు. వివిధ వస్తువుల ధరలను కూడా పొందుపరుస్తారు. ప్రసిద్ధికెక్కిన దేవాలయాలు, విద్యారంగ సమాచారం, స్థానిక సంస్థల సమాచారం, స్త్రీశిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం ప్రభుత్వ కార్యకలాపాలు, జిల్లాకు సంబంధించి విడుదలయ్యే గెజిట్లు, ఎన్నికల సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరుస్తారు. ఇవే కాకుండా జిల్లాలో గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఆ గ్రామ పరిధిలో సమగ్ర సమాచారాన్ని పౌరులకు అందించాలన్నదే లక్ష్యంగా ప్రకాశం వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నారు. కొలిక్కి వచ్చిన సమాచార సేకరణ... జిల్లాలో వివిధ రంగాల నుంచి సమాచారాన్ని మూడొంతుల వరకు ఇప్పటికే సేకరించారు. ఈ వెబ్‌సైట్‌ను నిర్వహించడానికి నిత్యం సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుండాలి. బహుముఖంగా సమాచారాన్ని సేకరిస్తేనే ఈ వెబ్సైట్ విజయవంతమవుతుంది. గత ప్రభుత్వం వెబ్‌సైట్‌ను ప్రారంభించిందిగానీ, అనంతరం పట్టించుకోలేదు. కలెక్టర్, అధికారులు ప్రారంభం నాడు ఇచ్చిన ప్రాధాన్యతను ఆ తర్వాత వెబ్సైట్ నిర్వహణకు ఇవ్వలేదు. దీంతో వెబ్సైట్ క్రమేణా నిలిచిపోయింది. గతంలో చేసిన తప్పిదాలను మళ్లీ చేయకుండా నోడల్ అధికారిని నియమించేందుకు ఈసారి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సమాచార సేకరణ కొలిక్కి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను ఈ వెబ్ పరిధిలోకి తెస్తున్నారు. రెండు మూడు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో సమాచారాన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రకాశం వెబ్సైట్ ప్రారంభానికి సంబంధించి జిల్లా స్థాయిలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రయోగాత్మకంగా ఈ వెబ్సైట్ లావాదేవీలు మొదలయ్యాయి. సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తున్నారు. న్యూస్, చిత్రపటాలు, జిల్లా ముఖ్య పర్యాటక కేంద్రాల వివరాలు, వీడియోలు, షాపింగ్ వివరాలు, విపణి, ఇతర రంగాలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. కలెక్టర్ కార్యాలయం, పరిపాలనా కేంద్రాల్లో జరిగే లావాదేవీలను ఈ వెబ్సైట్లో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
రా‘మాయ’పట్నమేనా..!
సాక్షి, ఉలవపాడు: రామాయపట్నం పోర్టు.. జిల్లా వాసుల కల.. కానీ ఈ కలను నెరవేర్చడం సంగతి పక్కనపెడితే రాజకీయ అవసరాల కోసం ప్రజలను అయోమయంకు గురిచేసిన విషయం ఏదైనా ఉంది అంటే అది ఈ పోర్టుకు సంబంధించిన నిర్ణయాలే. ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. గత ప్రభుత్వం ఎన్నికలు వస్తున్నాయని తెలిసి జనవరి 9న హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం పోర్టు నిర్మిస్తుంది అంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిపూజ చేశారు. రెండు నెలల్లో పోర్టు పనులు ప్రారంభం అవుతాయి అని ఆ రోజు బహిరంగ సభలో చెప్పారు. ఆ తరువాత ఆ విషయమే పట్టించుకున్న దాఖలాలు లేవు. అసలు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అనే అనుమానం కూడా ప్రజల్లో బలంగా ఉంది. ఎన్నికల సమయంలో బాబు చేసిన ఈ భూమిపూజ ప్రభుత్వ అనుమతులతో జరిగిందా లేక పబ్లిసిటీ కోసం చేశారా అనే అయోమయంలో జిల్లా ప్రజలున్నారు. రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు గత పదేళ్లుగా అధికార, ప్రజాప్రతినిధుల ప్రకటనలు ప్రజలను అయోమయానికి గురి చేస్తూనే ఉన్నాయి. రెండు నెలల్లో పనులు ప్రారంభం అవుతాయి అని గత ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో నేటి వరకు ఆ ఊసేలేదు. కనీసం రెవెన్యూ అధికారులు సర్వే కూడా ప్రారంభించలేదు. సర్వే లేకుండా, భూ సేకరణచేయకుండా, పరిహారం గురించి నిర్ణయం తీసుకోకుండా గత ప్రభుత్వం ఎన్నికల వేళ హడావుడిగా భూమిపూజ చేసింది తప్ప పనులు చేయాలన్న ఉద్దేశమే లేదని ప్రజలకు అర్థమైపోయింది. కానీ పోర్టు నిర్మాణం అయోమయాలకు గురి చేస్తున్న పరిస్థితుల్లో నిజం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి ఈ శాసన సభ సమావేశాల్లో రామాయపట్నం పోర్టుపై ప్రశ్నించనున్నారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియచేసి నియోజకవర్గ అభివృద్ధికి పోర్టు ఆవశ్యకతపై మాట్లాడనున్నారు. 2012 జనవరి నుంచి పోర్టు కోసం పరిశీలనలు జరుగుతూనే ఉన్నాయి. పోర్టు నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక బృందంను పరిశీలనకు పంపింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మహీధరరెడ్డి, నాటి కలెక్టర్ కాంతీలాల్ దండే వారికి పరిస్థితిని వివరించారు. వారు ఈ ప్రాంతం అనువుగా ఉందని కూడా తెలిపారు. కానీ తదనంతర పరిణామాలు ప్రకాశం జిల్లా వాసులను ఇబ్బందులకు గురిచేశాయి. దుగ్గరాజుపట్నంకు తరలింపు, తరువాత అక్కడ అనుమతులు లేక నిలుపుదల, ఇక్కడ చిన్నపోర్టు అని ప్రకటన, రాష్ట్రం లేఖ ఇవ్వలేదని కేంద్రం చెప్పడం, కేంద్రం ఇవ్వలేదని రాష్ట్రమే నిర్మిస్తుందని భూమి పూజ చేయడం.. ఇలా అంతా అయోమయంగా నడిచింది. అనుమతులు ఉండే భూమి పూజ చేశారా...? ఈ ఏడాది జనవరి 9న గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రామాయపట్నం వద్ద పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేసింది. కానీ ఈ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పోర్టు నిర్మించాలంటే ముందుగా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నుంచి అనుమతులు రావాలి. ఈ పోర్టు పరిధిలో అటవీశాఖ భూమి ఉంది కాబట్టి అటవీశాఖ నుంచి అనుమతులు రావాలి. ప్రారంభ సమయానికి ఇలాంటి అనుమతులు ఏమీ లేకుండానే భూమి పూజ చేసినట్లు సమాచారం. రామాయపట్నం పోర్టు కు కేంద్రం సుముఖతగా ఉన్నా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇవ్వకుండా తామే భూమి పూజ చేసి నిర్మిస్తున్నామని ప్రకటించారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేసిన ఈ ప్రక్రియ వలన ఉపయోగం ఉందా అనే ఆలోచనలో ప్రజలున్నారు. -
కడలి కెరటాలకు యువకుడి బలి
సాక్షి, కొత్తపట్నం: కడలి కెరటాలకు యువకుడు బలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని కె.పల్లెపాలెం బీచ్‌లో ఆదివారం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. ఒంగోలు నగరం శ్రీనగర్ కాలనీకి చెందిన గోదా మధుసూదన్‌రెడ్డి (25) స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వచ్చాడు. అతడి స్నేహితులు సముద్రం ఒడ్డున కొద్దిసేపు కబడ్డీ ఆడారు. మధుసూదన్‌రెడ్డి ఒక్కడే సముద్ర స్నానం చేస్తున్నాడు. ఒక్క సారిగా అలలు ఉధృతంగా రావడంతో గల్లంతయ్యాడు. అతడిని మిత్రులు కాపాడే ప్రయత్నం చేసినా ఆచూకీ లభించలేదు. సాయంత్రానికి శవమై బయటకు కొట్టుకొచ్చాడు. మిత్రులు మధుసూదన్‌రెడ్డి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన బీచ్‌కు తరలి వచ్చారు. చేతికొచ్చిన కుమారుడు నిర్జీవంగా ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్ఐ ఎం.శ్రీనివాసరావు తన సిబ్బందితో తీరానికి వచ్చి వివరాలు సేకరించారు. తండ్రి మాలకొండారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బీజేపీలోకి ప్రకాశం జెడ్పీ చైర్మన్
సాక్షి, ఢిల్లీ : ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు మంగళవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుమారుడు భరత్ కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హరిబాబు ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి వైఎస్ఆర్ సీపీ వ్యూహాత్మకంగా ఇచ్చిన మద్దతుతో చైర్మన్ గా ఈదర హరిబాబు గెలిచిన విషయం తెలిసిందే. -
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలోని ఓక్లహాం టర్నర్ జలపాతంలో పడి దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన నూనె సురేష్‌బాబు (41) అమెరికాలోని డల్లాస్ రాష్ట్రంలో సింటెల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం భార్య రూప, పిల్లలు గాయత్రీ అక్షయసంధ్య, సాయిమోహనీష్తో కలిసి ఓక్లహాం టర్నర్ జలపాతానికి హాలిడే ట్రిప్‌నకు వెళ్లి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి దుర్మరణం పాలయ్యాడు. ‘రెండు నెలల్లో ఇంటికి వస్తానమ్మా అన్నాడు. కానరాని లోకాలకు వెళ్లాడని తెలిసింది. ఎదిగొచ్చిన కొడుకు చేతికి అందివచ్చాడనుకున్న సమయంలో జరిగిన ఈ దుర్ఘటనను ఎలా జీర్ణించుకోవాలో అర్థం కావడం లేదంటూ’ సురేష్‌బాబు తల్లిదండ్రులు వీరాస్వామి, సుబ్బరత్నం కన్నీరు మున్నీరయ్యారు. కుటుంబ నేపథ్యం ఇదీ.. ఒంగోలు మండలం కొప్పోలు గ్రామ నివాసి నూనె వీరాస్వామి. ఈయన భార్య సుబ్బరత్నం. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వెంకట రమేష్. చిన్న కుమారుడు నూనె సురేష్‌బాబు (41). ప్రస్తుతం ఒంగోలు నగరంలోని రంగుతోట 5వ లైనులో ఉంటున్నారు. సురేష్‌బాబుకు 15 సంవత్సరాల క్రితం నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన రూపతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. పాప గాయత్రీ అక్షయ సంధ్య (13), బాబు సాయిమోహనీష్ (8). మూడేళ్ల క్రితం ఉద్యోగం నిమిత్తం వీరు అమెరికా వెళ్లారు. ఏడాది క్రితం తల్లిదండ్రులను చూసేందుకు వచ్చాడు. ఇటీవలే మరో రెండు నెలల్లో వస్తానని చెప్పాడు. ఈ లోపుగానే విషాద ఘటన సమాచారం అందింది. మృతదేహం తరలించేందుకు తెలుగు సంఘాల కృషి.. సురేష్‌బాబు మృతదేహాన్ని ఒంగోలుకు తరలించేందుకు కుటుంబ సభ్యులకు అండగా అమెరికాలో స్థిరపడ్డ తెలుగు సంఘాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే సురేష్ మృతదేహాన్ని రెస్క్యూ టీం ఆస్పత్రికి తరలించింది. మృతదేహాన్ని డల్లాస్ నుంచి ఇండియాకు తరలించేందుకు 80 వేల డాలర్లు (రూ.53 లక్షలు) వ్యయం అవుతుందని అంచనా. ఈ మొత్తాన్ని ఆ కుటుంబం భరించడం అసాధ్యం అని భావించిన తెలుగు సంఘాలు సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే ఫండ్ రైజింగ్ వెబ్సైట్లో తమవంతు సాయాన్ని వారు అందిస్తున్నారు. -
విత్త మంత్రి సీత కన్ను
సాక్షి, ఒంగోలు సిటీ: కేంద్ర బడ్జెట్‌పై ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. పెండింగ్ ప్రాజెక్టులు ఇతర అంశాలకు ఆర్ధిక ఊరట కలుగుతుందని భావించారు. ఇందుకు భిన్నంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఆశలపై ఒక్క సారిగా నీళ్లు చిలకరించినట్లయింది. కేంద్ర బడ్జెట్ ద్వారా జిల్లాలోని ప్రతిపాదిత నీటిపారుదల, రవాణా ప్రాజెక్టులకు ఊతమిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. విభజన హామీ ప్రస్తావనతో పాటు ఇతర అంశాల ఊసే లేకుండా పోయింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్ధాయి బడ్జెట్‌ను శుక్రవారం కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టారు. తెలుగువారి ఆడపడుచుగా ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపలేకపోయారు. ఆర్ధిక లోటు జిల్లా అభివృద్ధిని నీరుగారుస్తోంది. గత ప్రభుత్వం చేసిన ఆర్ధిక అవకతవకల ఫలితాన్ని ఈ ప్రభుత్వం మోయాల్సి వస్తోంది. ఖజానా ఖాళీ అయ్యింది. వివిధ రకాల లావాదేవీలను నిర్వహించడానికి కొన్ని సందర్భాల్లో కష్టతరమవుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో జిల్లాల అభివృద్ధికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కేంద్రానికి విన్నవించింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపు ఉంటుందని భావించినా నయాపైసా కేటాయింపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆశాభంగం కలిగించింది. సామాన్యులకు ఈ బడ్జెట్ వల్ల ఒరిగిందేమీ లేకపోగా వివిధ రూపాల్లో ఆర్థిక భారం పడే అవకాశాలున్నాయి. ప్రజల సగటు ఆదాయం పెరిగేలా చర్యలు చేపట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం.. అదనపు భారాన్ని పరోక్షంగా మోపింది. రానున్న రోజుల్లో సామాన్యుడి కొనుగోలు శక్తి ఇంకా తగ్గిపోతుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. ప్రతి కుటుంబం కప్పం కట్టాల్సిందేనని, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా బడ్జెట్లోని అంశాలు గుదిబండలు కానున్నాయని చెబుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర బడ్జెట్లోని అంశాలు జిల్లాపై ఎంత మేర ప్రభావం చూపనున్నాయో ఓసారి పరిశీలిద్దాం.. ఐటీ రిటర్నులు ఇవ్వాల్సిందే.. పన్ను చెల్లింపు విధానంలో పారదర్శకతను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి లావాదేవీ బ్యాంకుకు అనుసంధానం కానుంది. రూ.2.5 లక్షల లావాదేవీలు దాటిన వారు రిటర్నులు వేయాల్సిందే. రానున్న రోజుల్లో ఆధార్ కార్డు ఆధారంగా రిటర్నులు వేసే వెసులుబాటు కల్పించారు. బ్యాంకుల్లో నోట్ల చలామణిని తగ్గించనున్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించనున్నారు. నోట్ల చలామణి రానున్న రోజుల్లో బాగా తగ్గుతుంది. కొత్తగా రూ.20 కాయిన్ అందుబాటులోకి తీసుకురానున్నారు. చిల్లర లావాదేవీలే అధికంగా ఉండనున్నాయి. రూ.5 లక్షల వరకు ఆదాయ పరిమితి ఉన్నా లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉండే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే సామాన్యులు సైతం ఇక వారి లావాదేవీలను అనుసరించి కప్పం కట్టాల్సిందే. మెరుగైన రవాణా జిల్లాలోని గ్రామాలు, పట్టణాలకు రహదారుల వ్యవస్థను అనుసంధానం చేసి మెరుగైన రవాణా అందుబాటులో తీసుకురావడానికి సాగర్మాల, భారత్‌మాల కార్యక్రమాలను అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. సాగర్మాల రెండో దశ కింద జిల్లాలో రూ.25 కోట్లతో రహదారి అభివృద్ధి పనులను ప్రతిపాదించారు. జిల్లాలో మూడొంతుల రహదారులు అధ్వానంగా ఉన్నాయి. వంతెనలు దెబ్బతిన్నాయి. సాగర్మాల ప్రాజెక్టు కింద పరిమితంగానే నిధులు విడుదల కానున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల జిల్లాకు కలిగే ప్రయోజనం బహు స్వల్పమే. ప్రతి ఇంటికీ జలశక్తి సాధ్యమేనా? జిల్లాలో 750 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేస్తున్నారు. ఒంగోలులోనూ ఐదు రోజులకు ఒకసారి నీరు ఇస్తున్నారు. అన్ని గ్రామాల్లోనూ తాగునీటి సమస్యతీవ్రంగా ఉంది. వెలుగొండ నీరు విడుదలైతేనే తాగునీటికి ఇబ్బందులు ఉండవంటున్నారు. 2020కి జలశక్తి పథకం కింద ప్రతి ఇంటికీ రక్షిత నీరు అందిస్తామన్న ప్రతిపాదన కార్యాచరణకు నోచుకుంటుందా అనే సంశయం నెలకొంది. ఇప్పటికే రూ.68 కోట్ల తాగునీటి తోలకం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. జలజీవన్ మిషన్ జిల్లాలో సాధ్యపడేది కాదంటున్నారు. ఖేల్ ఇండియా.. నేతి బీరే క్రీడల అభివృద్ధి నేతిబీర చందంగానే ఉంది. జిల్లాలో ఎందరో నైపుణ్యం గల క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం లేక రాణించలేకపోయారు. ఎందరో మాణిక్యాలు మట్టిలో కలిశాయి. క్రీడా దిగ్గజాలు జిల్లా కీర్తిని ప్రపంచ దేశాల్లో ఎగరవేయడానికి తగిన వనరులు లేక జిల్లా వరకే పరిమితమయ్యారు. ఖేల్ ఇండియా ద్వారా క్రీడాకారులకు ప్రోత్సాహం ఏదో మొక్కుబడి కార్యక్రమమే అంటున్నారు. ఖేల్ ఇండియా విధి విధానాలపై బడ్జెట్లో సవిరణ లేకపోవడం గమనార్హం. ఒంగోలులో మినీ స్టేడియం నిర్మాణమే నత్తకు మేనత్తలా కొనసాగుతోంది. జలమార్గం రవాణాకు ప్రాధాన్యం నదీ జలాలను వినియోగించుకుని జల రవాణాను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ కాలుష్యంతో పాటు రవాణా వ్యయం తగ్గుతుందని భావిస్తున్నారు. జిల్లాలో బకింగ్‌హాం కాలువ జల రవాణా వ్యవస్థ ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. రూ.1,400 కోట్లతో ఈ కాలువను ఆధునీకరిస్తే కాకినాడ నుంచి చెన్నై పోర్టు వరకు జల రవాణా మెరుగవుతుంది. పాలకులు ప్రయత్నిస్తే జిల్లాకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఒకే గ్రిడ్ ద్వారా విద్యుత్ జిల్లాలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్లు ఉన్నాయి. దర్శి ప్రాంతంలో హైడల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ గ్రిడ్‌కు కలుస్తోంది. రాష్ట్రంలో రెండు గ్రిడ్లు ఉన్నాయి. ఇక నుంచి దేశవ్యాప్తంగా ఒన్ ఇండియా ఒన్ గ్రిడ్ పథకం కింద.. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఒకే గ్రిడ్‌కు కలిపే విధానం అమలులోకి తీసుకురానున్నారు. విద్యుత్ పంపిణీ ఒకే గ్రిడ్ ద్వారా జరిగే విధానంతో విద్యుత్ కొరత అధిగమించే అవకాశం ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం వివిధ సంస్థల ద్వారా రోజుకు సుమారు 50 మెగావాట్ల వరకు ఉత్పత్తి జరుగుతోంది. జన్‌ధన్ ఖాతాలపై రూ.5 వేల ఓడీ జిల్లాలో 5,62,423 మంది పొదుపు గ్రూపుల మహిళలు ఉన్నారు. వీరిలో జన్‌ధన్ ఖాతాలు ఉంటే వారికి రూ.5 వేల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఇవ్వనున్నారు. బ్యాంకులకు తగిన ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు 3.5 లక్షల మందికి జన్‌ధన్ ఖాతాలు ఉన్నాయి. రూ.5 వేల బ్యాంకు ఓడీని అవసరాలకు తగినట్లుగా వాడుకుని తిరిగి చెల్లించే వెసులుబాటు కలగనుంది. పాలకు మార్కెట్.. పశువుకు దాణా జిల్లాలో మెగా పశుగ్రాస క్షేత్రాలు ఉన్నాయి. వీటి నుంచి 30 వేల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. 1,509 ఎకరాల్లో గ్రాసం పండిస్తున్నారు. వీటితోపాటు ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు, సైలేజి గడ్డి, టీఎంఆర్, కాన్సట్రేట్ ఫీడ్, ఫాడర్ సీడ్ కార్యక్రమాలు అమలులో ఉన్నా సక్రమంగా నిధులు లేక పశుగ్రాసం తగినంత దొరకడం లేదు. ఈ బడ్జెట్ ద్వారా పాడిపరిశ్రమకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పశువులకు దాణా అందుబాటులో ఉంచడంతో పాటు పాల ఉత్పత్తిని పెంచి రైతుకు లాభం చేకూర్చడానికి మార్కెట్ వసతికి ప్రణాళికాబద్ధంగా పని చేయడానికి చర్యలు తీసుకోనున్నారు. పొదుపు గ్రూపులకు ‘ముద్ర’ రుణం జిల్లాలో 57,586 పొదుపు గ్రూపులు ఉన్నాయి. వీటికి ఈ బడ్జెట్లో ముద్ర రుణాలు ఇవ్వడానికి వెసులుబాటు కల్పించారు. గ్రూపుకు రూ.లక్ష లెక్కన ముద్ర రుణం పొందే వీలుంది. రుణ రికవరీల్లో నూరు శాతంగా ఉన్న గ్రూపులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన బ్యాంకర్లకు మార్గదర్శకాలు రానున్నాయి. మహిళల్లో ఔత్సాహికులకు రుణాలు పరిశ్రమల ద్వారా అభివృద్ధి చెందాలనుకునే ఔత్సాహిక మహిళలకు పరిశ్రమల స్థాపనకు బ్యాంకు రుణాలు ఇప్పించడానికి తగిన ప్రొత్సాహం ఇవ్వనున్నాయి. జిల్లాలో 5,800 వరకు చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలను మహిళలే నిర్వహిస్తున్నారు. వీరికి ప్రభుత్వం పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవడానికి బ్యాంకుల నుంచి రుణాలను ఇప్పించడానికి బడ్జెట్లో ఆయా బ్యాంకులకు ఆర్థిక మద్దతు ఇవ్వనుంది. స్టాండప్ ఇండియా వంటి పథకాల ద్వారా హామీ లేని రుణం రూ.కోటి వరకు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకు బ్యాంకు బ్రాంచ్‌లకు లబ్ధిదారుల ఎంపికకు వార్షిక లక్ష్యాలను ఇవ్వనున్నారు. ఎల్ఈడీ.. ఎందుకు ప్రతిపాదించినట్లో? బడ్జెట్లో 35 కోట్ల ఎల్ఈడీ బల్బులు ఇవ్వడానికి ప్రతిపాదించారు. అన్ని ఇళ్లకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని బడ్జెట్లో పెట్టారు. జిల్లాలో 16 లక్షల గృహ విద్యుత్ వినియోగదారులకు ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేశారు. తెల్ల రేషన్ కార్డుదారులు 9,90,528 మంది ఉంటే గ్యాస్ కనెక్షన్లు 8,83,867 మంది కలిగి ఉన్నారు. 74,013 మందికి స్పెషల్ డ్రైవ్ ద్వారా పంపిణీకి చర్యలు తీసుకోగా 73,219 మంది తీసుకున్నారు. దీనదయాల్ పథకం కింద అన్ని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. అన్ని ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు, గ్యాస్ కనెక్షన్లు, ఎల్ఈడీ బల్బుల ప్రతిపాదన జిల్లాకు అంతగా ప్రయోజనం చేకూరే అంశం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రజా రవాణాలో బహుళ ప్రయోజన కార్డులు ప్రయాణాల్లో వేగం పుంజుకుంది. ఇక నుంచి బస్సు, విమానం, రైలు ఇలా ప్రజారవాణా వ్యవస్థల్లో గమ్యస్థానాలకు చేరుకోవడానికి బహుళ ప్రయోజన కార్డులను ప్రవేశపెట్టనుంది. ఇక ప్రజా రవాణా సులభతరం కానుంది. వివిధ ప్రాంతాలకు వెళ్లాలంటే ఒకే కార్డులో నమోదు చేసుకుని ప్రయాణించే సౌలభ్యం అందుబాటులోకి రానుంది. జిల్లాలో పండుగలు, ఇతర ముఖ్యమైన దినాలు, విశేష దినాల్లో రద్దీ వల్ల ప్రయాణల్లో ప్రయాసపడుతున్నారు. ఇకపై ఒకే కార్డులో బహుళ ప్రయోజనం పొందే వెసులుబాటు కలగనుంది. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ జిల్లాలో 1,028 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా పంచాయతీలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. డిజిటల్ ఇండియా నేపథ్యంలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం విస్తరించాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఇంకా ఇంటర్నెట్ లేని గ్రామాలకు ఈ సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకోనున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ అన్ని గ్రామాలకు విస్తరించనున్నారు. వీటికి సంబంధించి యూనిట్లను నెలకొల్పడానికి స్థలాల ఎంపికకు చర్యలు తీసుకుంటారు. ఆశాజనకంగా లేని బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు ఆశాజనకంగా లేదు. కేంద్ర బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి, దేశ ఆర్థికాభివృద్ధికి, దేశ భద్రతకు పెద్ద పీట వేసినా రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించి నిరాశపరిచారు. కొన్ని అంశాలు ఆహ్వానించదగ్గవే అయినా విభజన లోటుతో అల్లాడుతున్న రాష్ట్రానికి అన్యాయం చేశారు. విభజన సమయంలో సహాయం చేస్తానన్న హామీని నిలబెట్టుకోలేదు. విశాఖపట్నం, విజయవాడ మెట్రోల ఏర్పాటుపై బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ప్రత్యేక హోదా సాధన విషయంలో పార్లమెంట్లో సభ్యులందరం కలిసి కేంద్రంతో తప్పక పోరాడతాం. – మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు ఎంపీ రాష్ట్రానికి ఏమాత్రం న్యాయం జరగలేదు కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఏ మాత్రం న్యాయం జరగలేదు. విభజన హామీల ప్రస్తావనే లేదు. ఒకటి రెండు అంశాల్లో సామాన్యులకు మేలు చేసినట్లే చేసి పెట్రో ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరిచారు. సామాన్యులపై వివిధ రూపాల్లో భారాలు మోపారు. విభజన హామీలపై కేంద్రం బడ్జెట్లో ఏమాత్రం ప్రస్తావించలేదు. నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల మంజూరు ఊసేలేదు. ప్రధాని మోదీ పునరాలోచించి నవ్యాంధ్ర ప్రజలకు న్యాయం చేయడానికి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. – బత్తుల బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
వడ్డీ వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యయత్నం
సాక్షి, ప్రకాశం : జిల్లాలో అధిక వడ్డీ వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపుతోంది. ఒంగోలులోని రైల్‌పేటకు చెందిన ఆదిలక్ష్మి అనే మహిళను అక్రమ వడ్డీ వ్యాపారులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఆదిలక్ష్మి ఇప్పటికే తీసుకున్న అప్పులకు అధిక వడ్డీల రూపంలో లక్షల రూపాయలు చెల్లించారు. అయిన కూడా అక్రమ వడ్డీ వ్యాపారులు అసలు చెల్లించాలంటూ ఆదిలక్ష్మిని వేధిసున్నారు. ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టాలని ఆమెను ఒత్తిడికి గురిచేస్తున్నారు. అక్రమ వడ్డీ వ్యాపారుల వేధింపులకు సంబంధించి ఆదిలక్ష్మి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వడ్డీ వ్యాపారుల వేధింపులు ఆగకపోవడంతో ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రవాణాశాఖలో ప్రారంభమైన బదిలీల ప్రక్రియ
సాక్షి, ఒంగోలు: రవాణాశాఖలో బదిలీల ప్రక్రియకు కసరత్తు ప్రారంభమైంది. రవాణాశాఖ ఉన్నతాధికారులు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సీనియర్ అసిస్టెంట్, హెడ్‌కానిస్టేబుల్ వరకు బదిలీలను జోనల్ స్థాయి ఉప రవాణాశాఖ కమిషనర్ నిర్వహిస్తారు. అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, పరిపాలనాధికారి పోస్టులకు సంబంధించి బదిలీల ప్రక్రియను జోనల్ డీటీసీ స్థాయిలో పర్యవేక్షించి అభ్యర్థుల నుంచి ఆప్షన్ ఫారాలను తీసుకుని ప్రధాన కార్యాలయానికి పంపుతారు. వారు వాటిని పరిశీలించి బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు. అందులో భాగంగా శుక్రవారం జోన్ నెల్లూరు ఉప రవాణాశాఖ కమిషనర్ ఎన్.శివరామప్రసాద్ గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులు, సిబ్బందితో కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన కసరత్తును స్థానిక రవాణాశాఖ ఉప కమిషనర్ కార్యాలయంలో చేపట్టారు. ముందుగా రవాణాశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు. ఒకే ప్రాంతంలో 5 సంవత్సరాలు పనిచేసిన వారికి బదిలీలు తప్పనిసరి. కనీసం రెండు సంవత్సరాలు ఒకే ప్రాంతంలో పనిచేసినవారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. స్పౌజ్ కేటగిరీ, దివ్యాంగులకు సంబంధించిన అంశాల్లో మినహాయింపులు వర్తిస్తాయని తెలిపారు. 2020 మార్చి 31 నాటికి రిటైరయ్యే వారికి బదిలీలు నిర్వహిస్తారన్నారు. ప్రతి విభాగంలోను సీనియార్టీ ప్రకారమే బదిలీలు ఉంటాయన్నారు. ఎవరైనా బదిలీకి అర్హులైన, ఆసక్తి ఉన్నవారు తాము పనిచేస్తున్న ప్రదేశం కాకుండా మరో మూడు ప్రాంతాలను ఎంచుకోవాలని సూచించారు. తమ ఆప్షన్లు పూర్తిచేసి సంబంధిత ఆప్షన్ ఫారంను అందజేస్తే ఉన్నతాధికారులకు త్వరగా పంపుతామని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం జారీ చేసిన జూలై 5వ తేదీలోగా బదిలీలు పూర్తి చేస్తారని పేర్కొన్నారు. అయితే మూడు జిల్లాల్లో కలిపి 60 మంది వరకు బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా. సమావేశంలో జిల్లా ఉప రశాణాశాఖ కమిషనర్ సీహెచ్‌వీకే సుబ్బారావు, గుంటూరు ఉపరవాణాశాఖ కమిషనర్ రాజారత్నం, నరసరావుపేట ఆర్టీవో కెవి సుబ్బారావు, ఏపీ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్, గుంటూరు ఆర్టీవో వై.రామస్వామి హాజరయ్యారు. -
సొమ్ము ప్రజలది.. సోకు టీడీపీ నేతలది
సాక్షి, అనకర్లపూడి (ప్రకాశం): మండలంలోని అనకర్లపూడిలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలకు టీడీపీ నాయకులు తమ పేర్లను దర్జాగా వేసుకున్నారు. గ్రామ టీడీపీ నాయకుడు చెప్పినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు సైతం తలూపారు. రూ.లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన శ్మశానాలకు, భవనాలకు సొంత పేర్లు పెట్టుకోవడం సరికాదని అధికారులు చెప్పకపోగా ప్రోత్సహించారు. వివరాల్లోకి వెళితే.. అనకర్లపూడిలో రూ.10 లక్షల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పంచాయతీరాజ్‌శాఖ అధికారులు శివాలయం ఎదురుగా హిందూ శ్మశాన వాటికను రెండేళ్ల క్రితం నిర్మించారు. అదే విధంగా మరో రూ.5 లక్షలకు పైగా నిధులతో పంచాయతీ భవనాన్ని నిర్మించారు. రెండు నిర్మాణాలను గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చేయించాడు. సదరు టీడీపి నాయకుడు స్వామిభక్తి చాటుకోవటానికి ఎమ్మెల్యే వద్ద తన పేరు ఘనంగా ఉండటానికి ప్రధాన ద్వారం వద్ద టీడీపీ ఎమ్మెల్యే స్వామి పేరుతో పాటు తన పేరును కూడా రాయించుకున్నాడు. అదే విధంగా రూ.లక్షల వ్యయంతో నిర్మించిన పంచాయతీ భవనానికి సైతం ఎమ్మెల్యే స్వామి పేరుతో పాటు తన పేరు వేయించుకున్నాడు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలపై టీడీపీ నాయకులు పేర్లు వేయించుకోవడంపై గ్రామస్తులు పంచాయతీరాజ్‌శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిధులతో నిర్మించిన శ్మశాన స్థలం ప్రహరీపై టీడీపీ నాయకుల పేర్లు తీసేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. -
ముగ్గురు పిల్లల గండం!
సాక్షి, చీమకుర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నాయకుల ఆశలను ముగ్గురు పిల్లల గండం వెంటాడుతూనే ఉంది. స్థానిక సంస్థల్లో మూడంచెల వ్యవస్థలైన సర్పంచ్‌లు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లతో పాటు మున్సిపాలిటీల్లో పోటీచేసే అభ్యర్థులకు ముగ్గురు పిల్లల ఆటంకం అడ్డుగా మారిందనే ఆందోళన కొన్నేళ్లుగా పోటీ చేయాలనుకుంటున్న నాయకులకు ఇబ్బందిగా మారింది. 1995 మే 29వ తేదీ తర్వాత నుంచి ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక సంస్థలకు పోటీ చేసేందుకు అనర్హులు. అదే 1995 మే 29కి ముందు ముగ్గురు పిల్లలు కాదుగదా ఎంత మంది ఉన్నా పట్టింపు లేదు. అందుకే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు 1995 మే డెడ్‌లైన్‌గా మారిందనే ఆవేదన పోటీల్లో ఉండే ఔత్సాహికుల్లో వ్యక్తమవుతోంది. ఒక వేళ పోటీ చేయాలనుకున్న వారికి డెడ్‌లైన్ తర్వాత ముగ్గురు పిల్లలు ఉన్నా వారిలో ఒకరు అనుకోకుండా చనిపోతే మళ్లీ వారు పోటీకి అర్హులే. ఇద్దరు పిల్లలు ఉండి పోటీ చేసే సమయానికి భార్య గర్భిణిగా ఉన్నా భర్త అయినా, భార్య అయినా పోటీచేయవచ్చు. స్థానిక సంస్థలపై మక్కువ తీరక కొంతమంది అత్యుత్సాహం చూపించి తమ ముగ్గురు పిల్లల్లో ఒకరిని బంధువులకు దత్తత ఇచ్చినట్లుగా చూపి తమకు ఇద్దరు పిల్లలే అని చెప్తుంటారు. కానీ దత్తత ఇచ్చినా దత్తత బిడ్డను కూడా మూడో బిడ్డగానే పరిగణించి పోటీకి అనర్హులుగానే అధికారులు పరిగణిస్తారు. మరికొంత మంది తమకు పుట్టిన ముగ్గురు పిల్లల్లో తెలివిగా ఒక బిడ్డను వేరే బంధువుల ఇంటి పేరుతో పేరు మార్చి వేరే వారి లెక్కలో పెంచుతారు. అప్పుడు అలా ఇంటి పేరు మార్చిన తర్వాత అధార్ కార్డు, రేషన్‌కార్డులో తమ మూడో బిడ్డను వేరే ఇంటి పేరుతో చూపించి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వివాదాస్పద సంఘటనలు కోర్టుకు వెళ్లి తేల్చుకునే సరికి అడ్డదారిలో తమ బిడ్డ ఇంటి పేరు మార్చి గెలిచిన వ్యక్తి పదవీ కాలం కూడా పూర్తి కావస్తుందనే నమ్మకంతో బరితెగించి ఇలా అడ్డదారుల్లో పోటీకి దిగుతుంటారనే విమర్శలు కొంతమందిలో వ్యక్తం అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం పూర్తయి దాదాపు 6 నెలలు పైనే అయింది. మరో నెల రోజుల్లో మండల పరిషత్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీల అభ్యర్థుల పదవీకాలం పూర్తి కావస్తుంది. ఇప్పటికే చీమకుర్తి మండలంలో 23 పంచాయతీల్లో సర్పంచ్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. సంతనూతలపాడు నియోజకవర్గంలో దాదాపు 85 సర్పంచ్ పదవులు ఖాళీగా ఉన్నాయి. మరో నెల వ్యవధిలో 60 ఎంపీటీసీ సభ్యులు, నలుగురు ఎంపీపీలు, నలుగురు జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలంతో పాటు చీమకుర్తి నగర పంచాయతీలో 20 మంది కౌన్సిలర్ల పదవీకాలం పూర్తికా వస్తోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు పిల్లల గండం స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల్లో మళ్లీ చర్చకు తావిస్తోంది. కొత్తగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జగన్మోహన్రెడ్డి సీఎంగా కొలువుదీరిన నేపథ్యంలో గతంలో 1995లో ఆ నాటి ప్రభుత్వం పెట్టిన జీవోను అలాగే ఉంచుతారా? లేక కొత్త ప్రభుత్వం చేస్తున్న పలు సంస్కరణల నేపథ్యంలో ముగ్గురు పిల్లల గండం జీవోను తొలగిస్తారా..? అనే ఆసక్తికరమైన చర్చ చోటామోటా నాయకుల్లో జరుగుతుంది. రేషన్ డీలర్లు పోటీకి అర్హులే కొన్ని గ్రామాల్లో రేషన్ షాపుల డీలర్లుగా ఉన్న వారు ఎలా పోటీ చేస్తారంటూ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అలజడి రేగింది. ముగ్గురు పిల్లల జీవో ప్రకారం రేషన్ షాపుల డీలర్లు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ షాపులకు రాజీనామా చేయకుండానే పోటీ చేయవచ్చు. అంగన్వాడీ సిబ్బంది, నీటి వినియోగదారుల సంఘాల సభ్యులు పోటీ చేసేందుకు అనర్హులుగా చట్టం చెబుతోంది. స్వచ్ఛంద సంస్థలు, మత సంస్థల చైర్మన్లు, మతిస్థిమితం లేని వ్యక్తులు పోటీకి అనర్హులు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటే వారిపై విధించిన శిక్షాకాలం ఐదేళ్ల లోపు వారు పోటీ చేసేందుకు అనర్హులు. కోర్టు విధించి శిక్షలపై స్టే, బెయిల్ తెచ్చుకున్నా పోటీకి అనర్హులే. ఉద్యోగులు పోటీ చేయాలంటే తమ ఉద్యోగాలకు రాజీనామా చేసిన తర్వాత.. దాన్ని అమోదించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. స్వగ్రామంలో ఓటు ఉంటేనే పోటీకి అర్హులు ముగ్గురు పిల్లల గండాలను అధిగమించి ఆసక్తి కలిగిన అభ్యర్థులెవరైనా పోటీ చేయాలంటే తప్పనిసరిగా వారు పోటీ చేసే పంచాయతీలో ఓటరుగా తమ పేరు నమోదై ఉండాలి. పోటీ చేయడంతో పాటు పోటీ చేసిన వారిని ప్రతిపాదించాలన్నా కూడా ప్రతిపాదించే వారికి కూడా ఓటు హక్కు అదే గ్రామ పంచాయతీలో ఉండాలి. పోటీ చేసే ముందు ముగ్గురు పిల్లల పరిస్థితిని చూసుకోవడమే కాకుండా ఓటరుగా తమ పేరు నమోదై ఉందా..? క్రిమినల్ కేసుల్లో ఎలాంటి చిక్కులు లేకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తేనే స్థానిక సంస్థల్లోలో పోటీచేసేందుకు అర్హులుగా నిలుస్తారు. పోటీ చేసిన అభ్యర్థిపై విజయం సాధించాలంటే విజయ మొక్కటే కాదు ముందుగా ముగ్గురు పిల్లల గండంతో పాటు ఓటు హక్కు, క్రిమినల్ కేసుల గొడవలన్నీ లేకుండా చూసుకుంటేనే స్థానిక సంస్థలకు రారాజులవతారని విశ్లేషకులు తమ అభిప్రారం వ్యక్తం చేస్తున్నారు. -
ఎమ్మెల్యేలు అనే మేము...
సాక్షి, ఒంగోలు : రాష్ట్ర రాజధాని అమరావతిలోని శాసనసభలో బుధవారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైన వారు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారులో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌తో పాటు మరో 10 మంది శాసన సభ్యులతో బుధవారం వెలగపూడి సభలో ప్రొటెం స్పీకర్ శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వీరంతా శాసనసభ వ్యవహారాల సలహాసంఘ సమావేశంలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన 12 మందిలో ఇద్దరు అత్యధికంగా 5 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయిన వారుండగా మరో ఇద్దరు ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మూడోసారి ఒకరు, రెండో సారి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా తొలిసారిగా నలుగురు శాసనసభకు ఎన్నికయినవారున్నారు. ఒంగోలు నుంచి ఐదు సార్లు విజయం.. బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు) అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను... అంటూ ఒంగోలు అసెంబ్లీ నుంచి 5వ సారి శాసన సభకు ఎన్నికైన బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికైన బాలినేని 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. తిరిగి 2019 ఎన్నికల్లో అదేపార్టీ నుంచి పోటీ చేసి ఐదోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. మూడు స్థానాలు ఐదు సార్లు.. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో మార్టూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరాం కృష్ణమూర్తి తొలిసారి శాసన సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985లో మార్టూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989, 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచే అద్దంకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ సారి 2019 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా శాసన సభకు ఎన్నికయ్యారు. ఈ ఇద్దరూ 4వ సారి.. 1989లో కందుకూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మహీధర్‌రెడ్డి తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు.తర్వాత 2004,2009 లలో కాంగ్రెస్ అభ్యర్థిగా శాసన సభకు ఎన్నికయ్యారు.2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 4వ సారి ఎన్నికయ్యారు. 2004లో మార్టూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసారి శాసన సభకు ఎన్నికైన గొట్టిపాటి రవికుమార్ ఆ తర్వాత 2009లో అద్దంకి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా శాసన సభకు ఎన్నిక కాగా 2019 ఎన్నికల్లో అద్దంకి నుంచి టీడీపీ తరుపున శాసన సభకు ఎన్నికయ్యారు. 3వసారి ఆదిమూలపు సురేష్ : 2009లో యర్రగొండపాలెం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదిమూలపు సురేష్ తొలిసారి శాసన సభకు ఎన్నికయ్యారు. 2014లో సంతనూతలపాడు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో తిరిగి యర్రగొండపాలెం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు. ముగ్గురు 2వసారి.. 2009 ఎన్నిలో గిద్దలూరు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీ చేసిన అన్నా రాంబాబు తొలిసారి శాసన సభకు ఎన్నిక కాగా 2019లో వైఎస్సార్ సీపీ తరపున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరోమారు రికార్డు మెజారిటీతో శాసన సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో కొండపి, అద్దంకి నియోజకవర్గాల నుంచి టీడీపీ తరుపున పోటీ శాసన సభకు ఎన్నికైన డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావులు 2019 ఎన్నికల్లోనూ అదే స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులుగా మరో మారు ఎన్నికయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేలుగా.. 2019 ఎన్నికల్లో మార్కాపురం, దర్శి, కనిగిరి, సంతనూతలపాడు నియోజకవర్గాల నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన కుందురు నాగార్జునరెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్, బుర్రా మధుసూదన్‌యాదవ్, టీజేఆర్ సుధాకర్‌బాబులు తొలిసారి శాసన సభకు ఎన్నికయ్యారు. -
వదల బొమ్మాళీ..!
సాక్షి, ఒంగోలు : జిల్లాలో టీడీపీ నేతలు పనులు చేయకుండానే కోట్లాది రూపాయల నిధులు మెక్కారు. పాత గుంతలు చూపించి బిల్లులు దండుకున్నారు. చెరువుల్లో పూడిక తీత పేరుతో మట్టి అమ్ముకున్నారు. కాలువలు, చెరువుల ఆధునికీకరణ పేరుతో పాత పనులు చూపించి కొన్నిచోట్ల నిధులు స్వాహా చేయగా, మరికొన్ని చోట్ల అసలు పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారు. అయిదేళ్ల పాలనలో నీరు–చెట్టులో అవినీతికి అంతు లేకుండా పోయింది. అక్రమాలకు అధికారుల సహకారమూ ఉంది. ఆది నుంచి నీరు –చెట్టు లో అక్రమాలు జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతూనే ఉన్నా చంద్రబాబు పెడచెవిన పెట్టారు. జిల్లాలో రూ. 80 కోట్ల పైనే బకాయిలు జిల్లాలో నీరు–చెట్టుకు సంబంధించి ఇంకా రూ. 80 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చూపిస్తున్నారు. ఒంగోలు డివిజన్లో రూ. 50 కోట్లు, మార్కపురం డివిజన్లో రూ. 16 కోట్లుతో పాటు కందుకూరు, అద్దంకి ప్రాంతాల్లోని బిల్లులతో కలిపితే మొత్తం సుమారు రూ. 80 కోట్లున్నాయి. వైఎస్ జగన్ సర్కార్‌లో ఈ బిల్లులు చెల్లించాలన్నది అధికారుల ఉద్దేశ్యం. అయితే ఎటువంటి పనులు జరగకుండానే టీడీపీ నేతలు అక్రమంగా బిల్లులు చేయించుకున్నారన్నది వైఎస్సార్ సీపీ నేతల ఆరోపణ. క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకునేందుకు సమగ్ర విచారణ జరిపించాలన్నది జగన్ సర్కార్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అందుకే ముందు బిల్లులు నిలిపి వేసి విచారణ అనంతరం తదుపరి చర్యలకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక నీటిపారుదల శాఖలో జరిగిన అవినీతిని వెలికి తీస్తామని, అందుకు కారణమైన ఎవరినీ వదిలేది లేదని ఆ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఇప్పటికే గట్టిగా చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలను వైఎస్ జగన్ సర్కార్ వదిలి పెట్టదని స్పష్టమవుతోంది. అక్రమాలిలా... నీరు–చెట్టులో అధికార పార్టీ నేతలు 50 శాతం పనులను మనుషులతో కాకుండా మిషన్లతో పూర్తి చేశారు. చెరువుల్లో మట్టిని ఒక్కో ట్రాక్టర్ రూ. 300 నుంచి రూ. 800 వరకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. అదే గుంతలు చూపించి పూడికతీత పేరుతో నీరు–చెట్టులో బిల్లులు తీసుకున్నారు. చెక్‌డ్యామ్‌లు నాసిరకంగా నిర్మించి పెద్ద ఎత్తున దండుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 నియోజకవర్గాల్లోని అవినీతికి అంతే లేదు. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలో అక్రమాలకు కొదువలేదు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆర్థిక లబ్ధి కోసమే ఈ పథకం పెట్టినట్లయింది. అధికారులు అందినకాడికి కమీషన్లు పుచ్చుకొని నేతలు, కార్యకర్తలతో కలిసి వాటాలు తీసుకొన్న సంఘటనలు కోకొల్లలు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ డేకు వచ్చే అర్జీల్లో అధిక శాతం వినతులు నీరు–చెట్టు అక్రమాలపైనే ఉండటం గమనార్హం. కొన్ని ఉదాహరణలు : ఒంగోలు శివారులోని కొప్పోలు, చెరువుకొమ్ముపాలెం, పెళ్లూరు చెరువుల నుంచి రోజూ వందల కొద్ది ట్రాక్టర్లు పెట్టి ట్రిప్పు మన్ను రూ. 250 నుంచి రూ. 500 వరకూ విక్రయించారు. అధికార పార్టీ నేతలు ట్రాక్టర్ల వద్ద సైతం ట్రిప్పుకు రూ. 50 చొప్పున కమీషన్లు పుచ్చుకున్నారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని అక్కన్నవారి చెరువు, బుర్రవానికుంట, వలేటివారిపాలెం చెరువు, వరగమ్మ వాగు, ముదిగొండ వాగు, చిన్నచెరువులతో పాటు పలు చెరువులు, వాగుల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని ఉయ్యాలవాడ, గడికోట, తిమ్మాపురం, సంజీవరాయునిపేట, దంతెరపల్లి, రాచర్ల ప్రాంతాల్లో నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. యర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి చెరువు మట్టిని రోడ్డుకు తోలుకొని నీరు–చెట్టు పనుల్లో బిల్లులు తెచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. పుల్లలచెరువు మండలంలోని కాటివీరన్నచెరువు, చేపలమడుగు, పెద్దచెరువు, పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు చెరువులతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. అద్దంకి–నార్కెట్‌పల్లి దారిలో నీరు–చెట్టులో నిర్మించిన చెక్‌డ్యామ్‌లు అప్పుడే శిథిలావస్థకు చేరుకున్నాయి. జె.పంగులూరు మండలం చినమల్లవరం, అరికట్లవారిపాలెం ప్రాంతంతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా జరిగిన నీరు–చెట్టు పనుల్లో అక్రమాలకు కొదువ లేదు. దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు మండలం దొర్నపువాగు పరివాహక ప్రాంతం, తోటవెంగన్నపాలెం, రాజానగరం, కొర్రపాటివారిపాలెం, వీరన్నవాగుతో పాటు పలు ప్రాంతాల్లో నీరు–చెట్టు పనుల్లో అక్రమాలు వెల్లువెత్తాయి. కోమలకుంటచెరువు, ఎర్రచెరువు, తానంచింతం, అబ్బాయిపాలెం, చందలూరు చెరువు పనుల్లోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కందుకూరు నియోజకవర్గంలోని మోపాడు చెరువు, గుడ్లూరు నాయుడుపాలెం చెరువులతో పాటు నియోజకవర్గంలో జరిగిన నీరు–చెట్టు పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. కనిగిరి పరిధిలోని దోమలేరు, గోకులం, జిల్లెళ్ళపాడులతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా జరిగిన నీరు–చెట్టు పనుల్లో అక్రమాలకు కొదువ లేదు. కొండపి పరిధిలోని టంగుటూరు మండలం కొణిజేడు, కొండేపి చెరువుతో పాటు నియోజకవర్గంలో పలు చెరువులు, వాగుల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం చెరువుతో పాటు కొనకనమిట్ల అంబచెరువు, పొదిలి ప్రాంతంలోని అన్నవరం, మల్లవరం, యేలూరు, కొచ్చెర్లకోటతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో అక్రమాలు జరిగాయి. పర్చూరు పరిధిలోని దేవరపల్లి సూరాయకుంట, నూతలపాడులోని బూరాయికుంట, దగ్గుబాడు, నాయుడువారిపాలెం గ్రామాలతో పాటు జరిగిన నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. సంతనూతలపాడు పరిధిలోని మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి ఎండోమెంట్ చెరువులో పెద్ద ఎత్తున మట్టిని తరలించి అక్రమాలకు పాల్పడ్డారు. దొడ్డవరప్పాడు, ముదిగొండ వాగు, జతివారికుంట, పాపాయి చెరువులతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. నీరు–చెట్లు పనుల మంజూరు ఇలా... 2015–16 ఏడాదికిగాను నీరు–చెట్టు కింద జిల్లావ్యాప్తంగా 2,111 పనులు మంజూరు చేశారు. ఇందు కోసం రూ. 124.59 కోట్లు నిధులు కేటాయిం చారు. రూ. 87.24 కోట్లతో 1681 పనులను పూర్తి చేసినట్లు అధికారిక గణాం కాలు చెప్తున్నాయి. 2016–17కు గాను జిల్లావ్యాప్తంగా 3,241 పనులను మంజూరు చేయగా రూ. 201.16 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 1510 పనులు పూర్తి చేసినట్లు లెక్కలు చెప్తున్నాయి. దీని కోసం రూ. 124.22 కోట్లు ఖర్చు చేశారు. అధికారులు మాత్రం 420 లక్షల క్యూ బిక్ మీటర్ల పూడికను తొలగించినట్లు లెక్కలు చూపించడం గమనార్హం. 2017–18కుగాను జిల్లావ్యాప్తంగా 3,513 పనులను మంజూరు చేశారు. దీని కోసం రూ. 278.83 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 1282 పనులు పూర్తి చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఇందుకోసం రూ. 143.98 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా గత నాలుగేళ్లలో జిల్లావ్యాప్తంగా నీరు–చెట్టులో రూ. 840 కోట్లతో దాదాపు వెయ్యి పనులు మంజూరు చేయగా రూ. 450 కోట్లు వెచ్చించి 5 వేల పనులు పూర్తి చేసినట్లు గణాంకాలు చెప్తున్నాయి. -
రోడ్లన్నీ అతుకుల బొంతలే
సాక్షి, చీమకుర్తి(ప్రకాశం) : రూ.25 కోట్లతో 7 కి.మీ దూరం నిర్మించిన ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణం పూర్తయి రెండు మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే పగుళ్లు ఇచ్చాయి. వాటిని కనపడకుండా పైపైన సిమెంట్‌తో మాసికలు వేస్తూ వాటిని క్యూరింగ్ చేసేందుకు గోనెపట్టలతో కప్పేశారు. ఇదీ ఒంగోలు బైపాస్ నుంచి ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపం వరకు కర్నూల్‌రోడ్డులో నిర్మించిన ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణం పరిస్థితి. కర్నూల్ రోడ్డులోని నవభారత్ బిల్డింగ్స్ సమీపంలో 1/750వ కి.మీ రాయి నుంచి 8/250వ కి.మీ రాయి వరకు నిండా 7 కి.మీ కూడా లేని ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణంలో మొదటి నుంచి నాణ్యతా లోపాలు ఉన్నాయి. అంతే కాకుండా ఫోర్‌లైన్ రోడ్డు నిర్మించే సమయంలో రోడ్డు మీదున్న ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ స్తంభాలు, ఆక్రమణలు తీయకుండా వాటిని వదిలేసి మిగిలిన ప్రాంతాల్లో రోడ్డు నిర్మించారు. ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్లు, ఆక్రమణలను తాపీగా తొలగించి ఆయా ప్రదేశాల్లో ముందు వేసిన సిమెంట్ రోడ్డుకు ఆనించి సిమెంట్‌రోడ్డు వేయటం వలన జాయింట్ల వద్ద అతుకులు కలవక పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు రోడ్డు మీద పలు చోట్ల ఉండటంతో రోడ్డు ఫోర్‌లైన్ కొత్తగా వేసినట్లు లేదని, అతుకులు గతుకుల రోడ్డుగా పాత రోడ్డుకు ప్యాచ్ వర్క్ చేసినట్లుగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి తగ్గట్టుగానే రోడ్డు నిర్మాణంలో స్థలాభావంతో పేర్నమిట్టలో ఫోర్‌లైన్ నిర్మించలేదు. అదే విధంగా క్విస్ హైస్కూలు సమీపంలో రోడ్డు మార్జిన్లో స్థలం యజమాని కోర్టుకు వెళ్లటంతో ఫోర్‌లైన్ నిర్మాణానికి సరిపోక డబుల్‌వేతో పరిపెట్టి ఎగువన, దిగువన ఫోర్‌లైన్ నిర్మించి అధికారులు, కాంట్రాక్టర్లు చేతులు దులుపుకున్నారు. డబుల్‌వే వద్ద మాత్రం ఫోర్‌లైన్ నుంచి నేరుగా అదే సెన్స్‌తో వేగంగా వచ్చే వాహనదారులకు ప్రమాదం జరగకుండా రోడ్డు మార్జిన్లో బారికేడ్లను ఏర్పాటు చేసి డేంజర్ సిగ్నల్స్‌ను అమర్చి మీ చావు మీరు చావండన్నట్లుగా అధికారులు వదిలేశారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఒంగోలు నుంచి ఫోర్‌లైన్ ప్రారంభమయ్యే ప్రదేశంలో రోడ్డు మార్జిన్లకు, సైడు కాలువలకు కూడా స్థలం లేకపోవడంతో ఇళ్లను ఆనించి మరీ ఫోర్‌లైన్ నిర్మించారు. రేపు వర్షాకాలంలో వచ్చే వరద నీరు ఎటుపోవాలోనని స్థానికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రోడ్డు నిర్మాణంలో డివైడర్ల ఏర్పాటులో వాస్తవానికి స్థానికంగా దొరికే మట్టితో నింపాలి. మున్సిపల్ కార్పొరేషన్ వారు మంచి మట్టి పోసి చెట్లు పెంచుతామన్నారని చెప్పినట్లుగా సాకుతో డివైడర్ల మధ్య మట్టిపోయకుండా దాదాపు ఏడాదికి పైగా రోడ్డు నిర్మాణం పూర్తయినా అలాగే ఖాళీగా ఉంచారు. ఇలా రూ.25 కోట్లతో నిర్మించిన ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణంలోని అవకతవకలను ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణా లోపం, ప్రభుత్వ ఒత్తిడిల కారణంగానే రోడ్డు నిర్మాణం లోపభూయిష్టంగా ఉందనే విమర్శలు స్థానిక ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. -
ఎనిమిదేళ్లకు బడి తీశారు..!
కార్పొరేట్ హంగులకు ఆకర్షితులైన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతుండటంతో ప్రభుత్వ పాఠశాలలు ఒక్కొక్కటీ మూతపడుతున్నాయి. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం మూతపడిన ఓ పాఠశాల ఉపాధ్యాయుల కృషితో మళ్లీ ఈ ఏడాది పునఃప్రారంభం కాబోతోంది. పిల్లలు లేక తలుపులు మూతపడి బోసిపోయిన పాఠశాల మళ్లీ విద్యార్థులతో కళకళలాడనుంది. సాక్షి,ప్రకాశం : సంతమాగులూరు పరిధిలోని రామిరెడ్డిపాలెం గ్రామంలో 20 సంవత్సరాల కిందట ప్రభుత్వం ఓ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది. అప్పట్లో 28 విద్యార్థులతో కొనసాగిన పాఠశాల... ప్రైవేట్ స్కూళ్ల దెబ్బకు ఏడాది ఏడాది పిల్లల సంఖ్య తగ్గిపోతుండటంతో 2013 లో పాఠశాలను మూసివేశారు. అప్పటి నుంచి బోసిపోయిన పాఠశాల ఈ ఏడాది మళ్లీ తీస్తుండటంతో అటు విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఏడాది 17 మంది విద్యార్థులు ఇటీవల చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా చేరారని ఎంఈవో కోటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ఆదరించండి ప్రైవేట్ పాఠశాలల్లో వేలకు వేలు ఖర్చు చేస్తున్న వారు ప్రభుత్వ పాఠశాలలను కూడా ప్రోత్సహించాలని ఎంఈవో అన్నారు. రెండు నెలల నుంచి ఈ పాఠశాలను మళ్లీ తెరవాలనే ఉద్దేశంతో ఉదయం సాయంత్రం తేడా లేకుండా ఉపాధ్యాయులందరూ రామిరెడ్డిపాలెంలోనే ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ తిరిగి పాఠశాలను తెరవాలని మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. 17 మందితో మళ్లీ ప్రారంభం రామిరెడ్డిపాలెంలోని ప్రభుత్వ పాఠశాలకు మళ్లీ పూర్వవైభవం వచ్చింది. తల్లిదండ్రులు కేవలం మంచి విద్యాబోధన ప్రైవేట్ పాఠశాలల్లో ఉందని అటు వైపు వెళ్లిన వారంతా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటంతో తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలవైపే చొరవ చూపుతున్నారు. దీంతో ఈ సంవత్సరం 17 మంది విద్యార్థులు బడిలో చేరారు. 12వ తేదీ నుంచి ఈ పాఠశాలను తెరుస్తున్నామని ఒక ఉపాధ్యాయుడుతోపాటు వాలంటరీని కూడా ఏర్పాటు చేస్తున్నామని ఎంఈవో తెలిపారు. ఫలించిన ఉపాధ్యాయుల కృషి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలను ఎలాగైనా తెరిపించాలనే లక్ష్యంతో రామిరెడ్డిపాలెం గ్రామంలో రెండు నెలల నుంచి ఉపాధ్యాయులు, ఎంఈవో కలిసి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు ఎట్టకేలకు ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తామని హామీ ఇవ్వటంతో ఉపాధ్యాయుల కృషి ఫలించింది. -
పుట్టిన రోజుకు డబ్బులు ఇవ్వలేదని..
మార్కాపురం: తన పుట్టిన రోజుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని కాల్చుకుంటానని బెదిరిస్తుండగా వారించబోయిన తల్లిదండ్రులకు నిప్పంటుకుని గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం సాయంత్రం పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని ఎస్సీ, బీసీ కాలనీలో జరిగింది. సీఐ శ్రీధర్‌రెడ్డి కథనం ప్రకారం.. కాలనీలో నివాసం ఉండే మురారి గాలెయ్య కుమారుడు ప్రసాద్‌ది గురువారం పుట్టిన రోజు. తాను పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలని డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను కోరాడు. ప్రస్తుతానికి లేవని, తర్వాత ఇస్తానంటూ తండ్రి గాలెయ్య సమాధానం చెప్పడంతో కోపోద్రిక్తుడైన ప్రసాద్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని అగ్గిపుల్ల ముట్టించుకున్నాడు. కుమారుడిని వారించే యత్నంలో గాలెయ్య ప్రసాద్‌ను పట్టుకోగా ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి. వీరిరువురిని కాపాడేందుకు గాలెయ్య భార్య లక్ష్మి, గాలెయ్య తల్లి వెంకమ్మలు ప్రయత్నించగా వారికి కూడా గాయాలయ్యాయి. అందరినీ చికిత్స కోసం జిల్లా వైద్యశాలకు తరలించారు. క్షణికావేశం నలుగురి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. -
ప్రకాశం ప్రథమం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు సిటీ: ప్రకాశం ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతంలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఆరంభంలో యంత్రుడు మొరాయించినా.. పోలింగ్ ఆలస్యమైనా.. భానుడు తన ప్రతాపం చూపినా.. ఉక్కపోత సహనాన్ని పరీక్షించినా ఓటరు వెనక్కి తగ్గలేదు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు క్యూలో ఓపిగ్గా వేచి చూసి మరీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు జిల్లా ప్రజలు. ఓటేయాలన్న సంకల్పం ముందు చిన్నపాటి సమస్యలు ఓడిపోయాయి. గురువారం జరిగిన ఓట్ల పండగలో ఉదయం ఏడు గంటలకే గుంపులు గుంపులుగా పోలింగ్ కేంద్రాలకు చేరారు. ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు సైతం పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పట్టణాలు, పల్లెలు.. చివరికి మారుమూల తండా వాసులు సైతం ఓటేసేందుకు ఉత్సాహం కనబర్చారు. 85.92 శాతం పోలింగ్‌తో ప్రకాశం ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. అద్దంకి నియోజకవర్గంలో పోలింగ్ భారీ ఎత్తున 89.82 శాతంగా నమోదైంది. దర్శిలో 89.62 శాతం నమోదైంది. జిల్లాలోని ఈ రెండు నియోజకవర్గాలు రాష్టంలో ప్రథమ, తృతీయ స్ధానాల్లో నిలవడం గమనార్హం. ఏ నియోజకవర్గంలోనూ 80 శాతానికి తక్కువగా పోలింగ్ నమోదు కాలేదు. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి జిల్లాలోనూ ఓటింగ్ శాతం పెరిగింది. 2014 ఎన్నికలలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 84.25 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకోగా 2019 ఎన్నికల్లో 85.92 శాతం ఓటుహక్కును వినియోగించుకున్నారు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 1.67 శాతం ఓటింగ్ పెరిగింది. విమర్శలకు తావిచ్చిన చంద్రబాబు వ్యాఖ్యలు.. ఓటింగ్ సరళిలో వచ్చిన ఈ మార్పు చూసి టీడీపీకి ముచ్చెమటలు పడుతున్నాయి. దీంతో ఈవీఎంలు సక్రమంగా పనిచేయడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పనిగట్టుకొని విమర్శలు చేయడం ప్రారంభించారు. జిల్లాలోని ఓటర్లందరూ పారదర్శకతతో ఓటు హక్కును వినియోగించుకున్నామని సంబర పడుతుంటే చంద్రబాబు అండ్ కో మాత్రం వీవీఎంలు పనిచేయలేదని, ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోలేదని ఎన్నికల కమిషన్ తో పాటు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుండడం విడ్డూరంగా ఉంది. ఈ ఎన్నికలు ఒక ఫార్స్ అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించి విశ్లేషకులు, మేధావుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆయనే కల్పించుకుంటున్నారు. అసలు సాంకేతికతను తీసుకొచ్చిందే తానని చెప్పే చంద్రబాబు ఈ వీఎంలు, వీవీప్యాట్ల పనితీరుపై పనిగట్టుకొని విమర్శలు చేయడంపై సర్వత్రా విమర్శలున్నాయి. అసలు వేసిన ఓటు ఎవరికి పడిందో ఏమో అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం మరింత దిగజారుడు తనమని పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికలలో ఓటమి భయంతోనే అడ్డగోలు విమర్శలు చేస్తున్నట్లే ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ఈసారి కొత్త టెక్నాలజీ.. 2014లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలలో ఓటింగ్ పెట్టారు. ఓటర్లు నచ్చిన వారికి ఓటేశారు. కానీ వేసిన ఓటు సక్రమంగా పడిందా.. తాము వేసిన వారికి పడిందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. వేసిన ఓటు చూసుకొనే అవకాశమొస్తే బాగుండేదన్న అభిప్రాయం కలిగింది. 2019 ఎన్నికలలో ఆ కోరికా తీరింది. తాము వేసిన ఓటు ఎవరికి వేశామో స్పష్టంగా తెలిసేలా ఎన్నికల అధికారులు వీవీప్యాట్లు ఏర్పాటు చేశారు. ఓటు మీట నొక్కగానే పక్కన స్క్రీన్‌పై ఓటు వేసిన అభ్యర్థి పేరు, ఆ పార్టీ గుర్తుతో సహా కనిపించింది. తాము అనుకున్న వారికి ఓటు వేశామన్న సంతృప్తి ఓటర్లలో కనిపించింది. అందుకే గురువారం నాటి పోలింగ్ లో తొలుత కొన్ని పోలింగ్ బూతులలో వీవీఎంలు మొరాయించినా ఓటర్లు ఓపిగ్గా వేచిఉండి ఓటు వేటేశారు. తాము వేసిన ఓటు ఎవరికి పడిందో చూశామన్న సంతృప్తితో పోలింగ్ కేంద్రాల నుంచి వెనుదిరిగారు. -
టీడీపీకి కొమ్ము కాసిన ఎస్సై
సాక్షి, కె.పల్లెపాలెం (ప్రకాశం): గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక ఎస్సై కొక్కిలగడ్డ విజయకుమార్ ఒక వర్గానికి కొమ్ము కాశారని స్థానిక వైఎస్సార్సీపీ నాయుకులు నిరసన వ్యక్తం చేశారు. ఒక వర్గాన్ని వెనుక వేసుకుని, వారికి అనుకూలంగా వ్యహరించారని వైఎస్సార్సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలను బూత్లోనికి అనుమతించారని, వైఎస్సార్సీపీ నాయకులను లాఠీచార్జి చేస్తూ దూరంగా తరిమి కొడుతున్నారని చెప్పారు. ఈవీఎంలు, ఈవీ ప్యాట్స్ ఆలస్యంగా ప్రారంభిస్తే ఓటు వేయలేక పోయామని ఒక బాధ ఉంటే దీనికి తోడు ఎస్సై ఒక వర్గాన్ని ప్రోత్సహించి ఒకే సామాజిక వర్గానికి ఇద్దరి మధ్య చిచ్చు పెట్టారు. మండలంలో 53 బూత్‌లో ఉంటే కేవలం పల్లెపాలెం కేంద్రంగా తీసుకుని మధ్యాహ్నం నుంచి పల్లెపాలెంలోనే మకాం వేసి టీడీపీ వర్గానికి అనుకూలంగా వ్యహరించారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు వేసిన వారిని ఇంటికి పంపించకుండా ఒక వర్గానికి కొమ్ము కాయడం వల్ల మరొక వర్గం కాపలా కాయడం జరిగే పరిస్థితి నెలకొంది. సంబంధం లేని వ్యక్తులను లోనికి పంపడం వల్ల సైకిల్‌కు ఓటు వేయమని, వేయక పోతే చౌక దుకాణంలో బియ్యం ఇవ్వనని ఓటుకు ప్రలోభాలు పెట్టారన్నారు. ఓటర్లు ఫిర్యాదు చేసిన ఎస్సై పట్టించుకో లేదన్నారు. ఒక వర్గానికి కొమ్ము కాయడం, బూత్‌లో సైకిల్ గుర్తుకు ఓటు వేయమని ప్రచారం చేయడం వల్ల 300 ఓట్లు టీడీపీ పడ్డాయని మాజీ సర్పంచ్ అభ్యర్థి విశనాథపల్లి ఆనంద్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి సురేష్ కూడా పంచాయతీ నిబంధనలు, ఎన్నికల నిబంధనలు అతిక్రమించి ఒక వర్గానికి కొమ్ముకాశారని ఆరోపించారు. బూత్ దగ్గర మంచినీరు, భోజనం ఇతర పనులు చేయడానికి తమ సిబ్బందిని ఉపయోగించుకోకుండా టీడీపీ వ్యక్తులను పెట్టుకున్నారని వారు బూత్‌ల్లో సైకిల్‌కు ఓటు వేయాలని ప్రచారం చేశారు. డీఎల్పీఓకు అర్జీ పూర్వకంగా, ఎస్సైపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
ప్రకాశం ఎస్పీ బదిలీ
ప్రకాశం: జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం చర్యలు తీసుకుంది. అధికార టీడీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించడంతో ఈసీ ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో సిద్ధార్ద్ కౌషిల్‌ను ఎస్పీగా నియమించింది. ఖాకీ బట్టలు తీసేస్తే తానూ రాజకీయ నేతనేనని గతంలో కోయ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న తీవ్ర ఆరోపణలు రావడంతో తాడేపల్లి, మంగళగిరి సీఐలపై కూడా చర్యలు తీసుకుంది. వారిని బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తాడేపల్లి సీఐ వై.శ్రీనివాస్ స్థానంలో సురేష్ కుమార్‌ను నియమించింది. -
అభివృద్ధే నా అజెండా..!
సాక్షి, ఒంగోలు సిటీ: జిల్లా ప్రజలకు వరప్రసాదిని వెలిగొండ ప్రాజెక్టు. అన్ని సమస్యలను ఈ ప్రాజెక్టు తీరుస్తుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఏడాదిలో వెలిగొండ ద్వారా నీళ్లివ్వడానికి చర్యలు తీసుకుంటానని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. తన మనోభావాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. జిల్లాలో వాణిజ్య పంటల రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఫ్లోరైడ్ సమస్య గ్రామాలను పీడిస్తోందని తెలిపారు. రైల్వే పరంగా అనేక సమస్యలున్నాయని అన్నారు. నాగార్జున సాగర్ కాలువల ఆధునికీకరణ పనులతోపాటు సంగమేశ్వర ప్రాజెక్టు పనులను పూర్తి చేసుకోవాల్సి ఉందని అన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్న అనేక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు తాను అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నానని తెలిపారు. ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో రక్షిత నీటిని ఇవ్వడానికి ఆర్వో ప్లాంటులను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాను. వీటితోపాటు కిడ్ని బాధితుల సమస్యలు తీవ్రంగానే ఉన్నాయి. ఒంగోలులో డయాలసిస్ కేంద్రం ఉన్నా రోగులకు సరైన సేవలను అందించలేకున్నాయి. కిడ్నీ బాధితులకు అవసరమైన మేరకు డయాలసిస్ కేంద్రాలతో పాటు ఫ్లోరైడ్ తీవ్రంగా ఉన్న చోట ఆర్వో ప్లాంటులను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటా. వాణిజ్య పంటల రైతులకు గిట్టుబాటు ధరలకు కృషి జిల్లాలో ప్రధానంగా పొగాకు, శనగ, ఇతర వాణిజ్య పంటల రైతులతో పాటు సుబాబుల్, జామాయిల్ రైతులకు గిట్టుబాటు ధరల సమస్య తీవ్రంగా ఉంది. కేంద్ర వాణిజ్య ప్రతినిధుల దృష్టికి వీరి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా. పర్యాటకాభివృద్ధికి చర్యలు జిల్లాలో పర్యాటక అభివృద్ధి వల్ల సందర్శకులకు సౌకర్యాలు ఏర్పడతాయి. మొత్తం 24 ప్రదేశాలలో పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఒంగోలు, కొత్తపట్నం పర్యాటక అభివృద్దితో పాటు భైరవకోన అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. టెంపుల్ కారిడార్ పేరిట దేవాలయాల సందర్శనకు అనుసంధాన కార్యక్రమాలను రూపొందించాలి. ఒంగోలు తీరం వెంట అభివృద్ధికి వివిధ చర్యలు తీసుకోవాలి. అక్కడ పర్యాటక అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటా. ఆక్వా రైతుల సమస్యలకు పరిష్కారం జిల్లాలో ఆక్వా ఎగుమతికి రాష్ట్రంలోనే గుర్తింపు ఉంది. అయితే ఆ రంగంలోని రైతులకు బాగా ఇబ్బందులు ఉన్నాయి. ఆక్వా ఉత్పత్తుల్లో 40 శాతం జిల్లా నుంచే వస్తుంది. రైతులకు సబ్సిడీలపై కరెంటు ఇతర సౌకర్యాలను కల్పించి ఆక్వా సాగు ప్రొత్సాహానికి తగిన చర్యలు తీసుకుంటాను. సాంకేతికంగా అన్ని విధాలుగా ఆక్వా రైతులకు సహకారాన్ని అందిస్తా. పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు తీయిస్తా.. దొనకొండ పారిశ్రామికవాడతోపాటు పామూరు వద్ద నిమ్జ్ అభివృద్ధి వల్ల ఉపాధి మార్గాలు మెరుగవుతాయి. దశలవారీగా పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకుంటా. ఒంగోలు కేంద్రం పరిధిలో రవాణా వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ వర్తక వాణిజ్యపరమైన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వాన్‌పిక్ భూముల్లో ప్రతిపాదించిన విమానాశ్రయం నిర్మాణానికి చర్యలు తీసుకుంటా. రామాయపట్నంలో అదనంగా బెర్తుల కోసం కృషి చేస్తా. బకింగ్‌హాం కాలువ ఆధునికీకరణ మూలనపడింది, దీని ద్వారా ప్రత్యామ్నాయ రవాణా ఉపయోగకరంగా ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. వాటిని పరిశీలించి, కేంద్రం ద్వారా మెరుగైన రవాణాకు బకింగ్‌హాం కాలువ ప్రతిపాదన ముందుకు తీసుకొస్తా. సేవా కార్యక్రమాల కొనసాగింపు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు సొంత నిధులతో అందిస్తున్న సేవా కార్యక్రమాలను కొనసాగిస్తా. తాగునీరు, హెల్త్, విద్య వంటి కార్యక్రమాలను మాగుంట కుటుంబం అనేక సంవత్సరాలుగా కొనసాగిస్తోంది. ఇంకా ప్రజల అవసరాలను గుర్తించి ఈ కార్యక్రమాలను విస్తృతం చేస్తాం. రైల్వే సమస్యలు పరిష్కరిస్తా.. జిల్లాలో రైల్వే పరంగా ఎదుర్కొనే అనేక సమస్యలు ఉన్నాయి. విజయవాడ, గుంటూరు డివిజన్ల పరిధిలో ఇంకా కొన్ని ప్రాజెక్టులు ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే మార్గానికి పనులు వేగవంతం చేయించాలి. గిద్దలూరు ప్రాంతంలోని రైల్వే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి. వివిధ రైల్వే స్టేషన్ల పరిధిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం ఉన్నాయి. కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను వివిధ స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్ధం నిలపాల్సిన పరిస్థితి ఉంది. వీటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరిస్తా. డీకే యాజమాన్య హక్కు మార్పిడికి చర్యలు ప్రధానంగా ఒంగోలులోని ప్రజలు ఈ డీకే యాజమాన్య హక్కు మార్పిడి జరగక ఇబ్బంది పడ్తున్నారు. ఇంటి పన్నులు వారి పేరుపై రావడం లేదు. ఏ సౌకర్యం తీసుకోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు. ఒంగోలుతో పాటు నియోజకవర్గంలోని వివిధ పట్టణాలు, నగర పంచాయతీల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. డీకే పట్టాలు ఉన్న వారికి వారి పేరుపైనే యాజమాన్య హక్కు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాను. అలాగే చుక్కల భూములు, ఇనాం భూముల సమస్య తీవ్రంగా ఉంది. ఈ జిల్లాలో రెవెన్యూ పరంగా ఈ సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాను. ఎన్ఎస్పీ కాలువల ఆధునికీకరణతో గ్యాప్ ఆయకట్టుకు నీరు ఎన్ఎస్పీ కాలువల ఆధునికీకరణ పనుల ద్వారానే జిల్లాలోని కాలువల ద్వారా సాగవుతున్న ఆయకట్టులోని లక్ష ఎకరాల గ్యాప్ ఆయకట్టు సమస్య తీరుతుంది. ఇందు కోసం కావాల్సిన నిధులను తీసుకురావడానికి కృషి చేస్తాను. దీర్ఘకాలం నుంచి సాగర్ కుడికాలువ పొడిగింపు సమస్య అలాగే ఉంది. కాలువ పొడిగింపు వల్ల మరికొన్ని ప్రాంతాలకు సాగు, తాగునీటికి ఇబ్బంది తొలగుతుంది. కొండపి నియోజకవర్గంలో సంగమేశ్వర ప్రాజెక్టు పనులు మధ్యలోనే నిలిచాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్న సమస్యలను తొలగించి సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా ప్రజలకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటాను. ఏడాదిలోగా వెలిగొండ పూర్తికి కృషి వెలిగొండ ప్రాజెక్టుతో సమస్యల పరిష్కారం ముడిపడి ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెలిగొండ విషయంలో ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు. సొరంగం పనులు నెమ్మెదిగా జరుగుతున్నాయి. తాగునీరు, సాగునీటికి వెలిగొండ పూర్తి చేయడం ద్వారానే ఇబ్బందులు తొలగుతాయి. టన్నెల్ పనులు ఇప్పుడు నెమ్మదిగా జరుగుతున్నాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఏడాదిలోగా పనులు పూర్తి చేసి నీళ్లివ్వడానికి చర్యలు తీసుకుంటా.