Assembly elections
-
అసెంబ్లీలో అప్పు లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల | మధ్య వాగ్వాదం
-
ఎన్నికల షెడ్యూల్ రాకుండానే ఢిల్లీలో ఆప్ దూకుడు
-
UP By Election: వరుస వీడియోలతో పోలీసులపై సమాజ్‌వాదీ మండిపాటు
అంబేద్కర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ నేటి (బుధవారం)ఉదయం ఏడు గంటల నుంచి కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. मुजफ्फरनगर की मीरापुर विधानसभा के किथोड़ा में बूथ संख्या 178, 179 पर पुलिस द्वारा मतदाताओं को वोट डालने से रोका जा रहा है।संज्ञान ले चुनाव आयोग, निष्पक्ष मतदान सुनिश्चित हो।@ecisveep @ceoup @DmMuzaffarnagar pic.twitter.com/u9QUq2Pov1— Samajwadi Party (@samajwadiparty) November 20, 2024ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఒక వీడియోను షేర్ చేసింది. దానిలో బురఖా ధరించిన ఒక మహిళ తనను ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించింది. బూత్ వద్ద తన ఐడీని చూపించినప్పటికీ తనకు ఓటు వేసేందుకు అనుమతినివ్వలేదని ఆమె పేర్కొంది. ఈ వీడియో కింద.. అంబేద్కర్ నగర్‌లోని కతేహరి అసెంబ్లీలోని బూత్ నంబర్ 65లో ఓటు వేయకుండా బురఖా ధరించిన మహిళను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల సంఘం దీనిపై దృష్టి సారించి, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా చూడాలి’ అని సమాజ్‌వాదీ పార్టీ రాసింది.अम्बेडकर नगर की कटेहरी विधानसभा के बूथ संख्या 65 पर पुलिस द्वारा मतदाताओं को वोट डालने से रोका जा रहा है।संज्ञान ले चुनाव आयोग, निष्पक्ष मतदान सुनिश्चित हो।@ecisveep @ceoup @AmbedkarnagarDM pic.twitter.com/tYi9h8XSXo— Samajwadi Party (@samajwadiparty) November 20, 2024ఇదేవిధంగా కాన్పూర్‌లోని సిసామావు అసెంబ్లీ ఓటింగ్‌కు సంబంధించిన వీడియోను సమాజ్‌వాదీ పార్టీ షేర్ చేస్తూ, ఓటు వేయకుండా ఓటర్లను పోలీసులు అడ్డుకుంటున్నారని, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తూ వారిని వేధిస్తున్నారని ఆరోపించింది. ఎన్నికల సంఘం దీనిని గమనించాలని కోరింది.अंबेडकरनगर की कटेहरी विधानसभा के बूथ संख्या 120, 121 पर पूर्व सांसद रितेश पांडे के समर्थकों द्वारा बूथ पर भाजपा का झंडा लगाकर किया जा रहा कब्जा।संज्ञान ले चुनाव आयोग, निष्पक्ष मतदान सुनिश्चित हो।@ecisveep @ceoup @AmbedkarnagarDM pic.twitter.com/sIh4tMcnGN— Samajwadi Party (@samajwadiparty) November 20, 2024ఇదేవిధంగా ముజఫర్గర్లోని మీరాపూర్ స్థానానికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఎస్పీ, ముజఫర్‌నగర్‌లోని మీరాపూర్ అసెంబ్లీ కితోడాలో బూత్ నంబర్ 178, 179లో ఓటర్లు ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని రాసింది. మొరాదాబాద్‌లోని కుందర్కి అసెంబ్లీలోని బూత్ నంబర్ 162 వద్ద ఓటర్ల స్లిప్పులను పోలీసులు లాక్కుంటున్నారని ఆరోపించింది.ఇది కూడా చదవండి: UP By Election: అల్లరి మూకలకు అఖిలేష్ హెచ్చరిక -
Rajasthan By-Election: ‘ఫలితాల’తో నాలుగు నిర్ణయాలకు ముడిపెట్టి..
జైపూర్: రాజస్థాన్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు నేడు (బుధవారం) ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇది కూడా ఈ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షరాష్ట్రంలో జరిగిన ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ పరీక్షను రద్దు చేయాలా వద్దా అనే దానిపై న్యాయ మంత్రి జోగారామ్ పటేల్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. దీనిని సీఎం భజన్‌లాల్ శర్మకు అందించింది. దీనిపై సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నివేదికపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.కొత్త జిల్లాలపై నిర్ణయంగత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన 17 కొత్త జిల్లాల భవిష్యత్తుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ నివేదిక రూపొందించింది. ఐదు చిన్న జిల్లాలను మళ్లీ పాత జిల్లాల్లో కలపవచ్చని సమాచారం. డిసెంబరు 31లోగా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనుంది.గత ప్రభుత్వ నిర్ణయాలు రద్దు గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు వైద్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వసర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నివేదికను రూపొందించింది. దీనిని త్వరలో ప్రభుత్వానికి సమర్పించనుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న భూకేటాయింపులతోపాటు పలు నిర్ణయాలను కమిటీ పరిశీలించింది.ఒకే రాష్ట్రం- ఒకే ఎన్నికలురాష్ట్ర ప్రభుత్వం కూడా వన్ స్టేట్- వన్ ఎలక్షన్‌కు సంబంధించి నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ నిర్ణయానికి ప్రభుత్వానికి కొంత సమయం అవసరం ఉంటుంది. దీనిపై చర్చించేందుకు ఒక కమిటీని నియమించి. ఆ తర్వాత ఒక రాష్ట్రం- ఒక ఎన్నికల అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రధాని మోదీ అభ్యర్థన -
భారీగా నగదు, బంగారం, మద్యం పట్టివేత
దాదర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్రమ డబ్బు రవాణాపై వివిధ శాఖల అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాయి. అందులో భాగంగా అక్టోబరు 20వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ముంబై, ఉప నగరాలు సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ శాఖ, ఆదాయ పన్ను శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సంయుక్తంగా తనిఖీలు, నాకా బందీలు నిర్వహించారు. ఇందులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు, విదేశీ డాలర్లు, బంగారు, వెండి ఆభరణాలు, మద్యం పట్టుకున్నారు. అయితే ఈ సొత్తు ఎవరిది..? ఎవరికి అందజేయడానికి వెళుతున్నారనే సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. రూ.187 కోట్ల విలువైన నగదు స్వాధీనం ఎన్నికలు సమీపించడంతో వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి అక్రమంగా డబ్బు, మద్యం రవాణా కావడం పరిపాటిగా మారింది. నాకాబందీలు, తనిఖీలు నిర్వహించినప్పటికీ పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా డబ్బు, మద్యం రవాణా అవుతూనే ఉంది. అయినప్పటికీ పోలీసులు, వివిధ శాఖల అధికారులు డేగ కళ్లతో కాపుకాస్తూ కోట్లలో అక్రమ డబ్బు, డ్రగ్స్, మద్యాన్ని పట్టుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచి్చన తరువాత వివిధ శాఖల పోలీసులు, అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఇప్పటి వరకు ఏకంగా రూ.187.88 కోట్లు విలువచేసే సొత్తు హస్తగతం చేసుకున్నారు. ఇందులో రాష్ట్ర పోలీసు శాఖ ద్వారా రూ.75 కోట్లు, ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.60 కోట్లు, ఆదాయ పన్ను శాఖ ద్వారా రూ.11 కోట్లు, మిగతా ఎన్నికల అధికారుల ద్వారా పట్టుకున్న సొత్తు ఉంది. అలాగే అక్రమంగా మద్యం తరలిస్తున్న, విక్రయిస్తున్న వారిపై 2,637 కేసులు నమోదు చేశారు. అందుకు బాధ్యులైన 2,460 నిందితులపై చర్యలు తీసుకున్నారు.అలాగే రూ.9.61 కోట్లు విలువచేసే మద్యం నిల్వలను జప్తు చేశారు. జప్తు చేసిన మద్యంలో విదేశీ, దేశీ, నాటుసారా, తెల్లకల్లు ఉన్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు తాము ప్రయతిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అప్పర్ కమిషనర్ ప్రసాద్ సుర్వే అన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలను, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా మద్యం వినియోగించే అవకాశాలుంటాయి. దీంతో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు దాడులు, తనఖీలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రహస్య పార్టీలపై నిఘా.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పరితపిస్తున్నారు. అందుకు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు. కార్యకర్తలు సహా ఓటర్లను సంతోష పెట్టేందుకు రహస్యంగా మద్యం పారీ్టలు ఇస్తున్నారు. అంతేగాకుండా ఇంటింటికి వెళ్లి మద్యం బాటిళ్లు, డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు పంచుతుంటారు. దీంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ఇలాంటి రహస్య పారీ్టలపై నిఘా వేస్తున్నారు. అందుకు 56 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న 164 మంది కార్యకర్తలను అదపపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణాకు చెక్ పేట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో 25 పరి్మనెంట్ చెక్ పోస్టులు, 26 తాత్కాలిక చెక్ పోçస్టులను ఏర్పాటు చేశారు. టోల్ నాకాల వద్ద కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అహిల్యనగర్–పుణే జాతీయ రహదారిపై పార్నెర్ తాలూకా హద్దులో ఎన్నికల అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో ఓ వాహనంలో సుమారు రూ.25 కోట్లు విలువచేసే బంగారం పట్టుకున్నారు. అయితే కార్టన్ బాక్స్‌లో ప్యాకింగ్ చేసిన ఈ బంగారం ఎవరిచ్చారు..? ఎవరికిచ్చేందుకు తీసుకెళుతున్నారనే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. వాహనంలో డ్రైవర్, మరో ఇద్దరు వ్యక్తులున్నారు. అనుమానం వచ్చి వాహనాన్ని మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేయగా 45 కేజీల వెండి కడ్డీలు లభించాయి. దర్యాప్తు పూర్తయితే తప్ప పూర్తి వివరాలు బయటపడవని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో 160 చెరుకు క్రషింగ్ ఫ్యాక్టరీలు, 36 దేశీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు, 45 బీరు తయారుచేసే ఫ్యాక్టరీలు, 65 వైనరీ, 48 విదేశీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు అలాగే 216 నాటుసారా విక్రయించే షాపులు, 262 విదేశీ మద్యం విక్రయించే షాపులు, 1,734 వైన్ షాపులు, 4,155 దేశీ మద్యం విక్రయించే షాపులున్నాయి. దీంతో ఓటింగ్, కౌంటింగ్ తంతు పూర్తయ్యేంత వరకు హోల్‌సెల్, రిటైల్ మద్యం షాపులపై సీసీ టీవీ కెమరాల ద్వారా నిఘా వేయనున్నారు. ప్రభుత్వ వాహనాలనూ వదిలిపెట్టొద్దు.. ఎన్నికలకు ముందు విచ్చల విడిగా అక్రమంగా డబ్బు రవాణా జరుగుతుంది. అందుకు సొంత, అద్దె వాహనాలతోపాటు పోలీసు వ్యాన్లను కూడా వినియోగించే ప్రమాదం లేకపోలేదు. అధికార దురి్వనియోగానికి పాల్పడుతూ కొందరు నేతలు పోలీసు జీపులు, వ్యాన్లలో డబ్బు రవాణా చేసే ఆస్కారముంది. దీంతో రాష్ట్ర సరిహద్దుల్లో, నగరాలు, పట్టణాల్లో నాకాబందీలు, తనిఖీలు చేసే సమయంలో పోలీసు వాహనాలతోపాటు ప్రభుత్వ వాహనాలను కూడా తనిఖీ చేయకుండా వదిలిపెట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. -
సుందరీకరణ ప్రాజెక్ట్ : ఎన్నికల్ని బహిష్కరిస్తాం.. ఓటర్ల హెచ్చరిక
దాదర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శివాజీపార్క్ మైదానంలో పేరుకుపోయిన ఎర్రమట్టిని తొలగించే అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. పర్యావరణానికి అలాగే తమకు ఆరోగ్యపరమైన సమస్యలు, ఇబ్బందులు సృష్టిస్తున్న ఈ ఎర్రమట్టిని తొలగిస్తారా..? లేదా..? అని ప్రజలు స్ధానిక ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపకుంటే నవంబరు 20న జరిగే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో పోటీచేస్తున్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్ధులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు ఓటు వేయాలని తమను బలవంతం చేసినా లేదా ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చినా..? నన్ ఆఫ్ ఎబౌ (నోటా) మీటను నొక్కుతామని స్పష్టం చేశారు.శివాజీపార్క్ మైదానం బీఎంసీకి చెందిన జీ–ఉత్తర వార్డు పరిధిలోకి వస్తుంది. ఈ వార్డు అసిస్టెంట్ కమిషనర్ అజీత్‌కుమార్ ఆంబీని సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహానికి గురైన మైదానం చుట్టుపక్కల ప్రజలు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని, కుదరని పక్షంలో నోటాపై నొక్కాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ ప్రాంతం నుంచి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధులు ఆందోళనలో పడ్డారు. సైలెన్స్ జోన్లో ఉన్నా...షరతులతో అనుమతి.. నగరం నడిబొడ్డున దాదర్ ప్రాంతంలో 98 వేల చదరపు మీటర్ల స్ధలంలో చారిత్రాత్మక శివాజీపార్క్ మైదానం విస్తరించి ఉంది. బ్రిటీష్ హయాంలో స్వాతంత్య్ర పోరాటం సహా అనేక పోరాటాలకు ఈ మైదానం వేదికైంది. అంతేకాదు గతంలో సునీల్ గవాస్కర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అనీల్ కాంబ్లే వంటి దిగ్గజాలు సహా అనేకమంది క్రికెటర్లు క్రికెట్ ఆటను ఈమైదానంలో సాధన చేసేవారు.ఇక లోక్‌సభ, అసెంబ్లీ, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు వచ్చాయంటే చాలు వివిధ రాజకీయ పార్టీలు ప్రచార సభలతో ఈ మైదానం హోరెత్తుతుంటుంది. ఈ మైదానం సైలెన్స్ జోన్లో ఉన్నప్పటికీ కొన్ని షరతులతో అనుమతి ఇవ్వక తప్పకపోవడంతో వీటన్నిటి నేపథ్యంలో మైదానంలో పెద్దఎత్తునఎర్రమట్టి పేరుకుపోతోంది. ఫలితంగా చుట్టపక్కల నివాసముంటున్న వేలాది కుటుంబాలు ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కుంటున్నాయి. తమ సమస్య పరిష్కరించాలని ఏళ్ల తరబడి బీఎంసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగలడంతో తమ సమస్యను పరిష్కరించాలని కాలుష్య నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేస్తూ పలుమార్లు లేఖలు కూడా రాశారు. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించకపోవడంతో అనేక ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఏడాది మే లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా స్ధానికులు ఈ అంశాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చారు. తమ సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీంతో ఒక మెట్టు దిగివచ్చిన ప్రభుత్వం మైదానంలో పేరుకుపోయిన మట్టిని తొలగించడం ప్రారంభించింది.కానీ జూన్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి. దీంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది.మైదానంలో ఉదయం, సాయంత్రం అనేక మంది వ్యాయామం చేస్తారు. కొందరు మార్నింగ్, ఈవ్నింగ్ వాక్కు వస్తుంటారు. మరికొందరు పిల్లపాపలతో సరదాగా గడిపేందుకు, మరికొందరు కాలక్షేపం కోసం వస్తుంటారు. దీంతో స్ధానికులతోపాటు ఇక్కడకు వచ్చినవారంతా శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్‌ను అమల్లో ఉందంటూ బీఎంసీ అధికారులు పనుల కొనసాగింపును వ్యతిరేకిస్తున్నారు. కాగా మట్టిని తొలగించడానికి ఎన్నికల కోడ్‌కు సంబంధమేమిటని శివాజీపార్క్ రహివాసీ సంఘటన సభ్యులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
అసెంబ్లీ ఎన్నికలో ఉత్సాహంగా ఓటేస్తున్న కశ్మీరీలు
-
తండ్రికి వెన్నుపోటు పొడవడం తగదు : డిప్యూటీ సీఎం
మీ రాజకీయ లబ్ధి కోసం తండ్రికి వెన్నుపోటు పొడవడం తగదు అంటూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మరోసారి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా అజిత్ పవార్ జన సమ్మాన్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ యాత్రలో..రాష్ట్ర మంత్రి ధర్మారావు బాబా ఆత్రం, ఆయన కుమార్తె భాగ్యశ్రీ గురించి మాట్లాడారు. భాగ్యశ్రీ తండ్రి ప్రత్యర్ధి పార్టీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పి)లోకి వెళ్తున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతేకాదు తండ్రి ధర్మారావు బాబా ఆత్రంపై కుమార్తె భాగ్యశ్రీ పోటీ చేస్తుందన్న ప్రచారం మొదలైంది. ఆ ప్రచారంపై అజిత్ పవార్ స్పందించారు. ‘ తండ్రిపై కుమార్తె పోటీ చేయడం ఎంత వరకు కరెక్ట్. కూతురిని తన తండ్రి కంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించరు. పెళ్లి చేసుకుని భాగ్యశ్రీ బెల్గాం వెళ్లినప్పటికీ..గడ్చిరోలిలో ఆమెకు (తండ్రి ఆత్రం) అండగా నిలిచి జిల్లా పరిషత్ అధ్యక్షురాలిని చేశారు. ఇప్పుడు మీరు (భాగ్యశ్రీ) మీ తండ్రికి వెన్నుపోటు పొడిచి ఆయన మీదే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మీ నిర్ణయం సరైందేనా? అని ప్రశ్నించారు. ‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మీ తండ్రికి మద్దతు ఇవ్వండి. అతనిని గెలిపించండి. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం , సంకల్పం ఆయనకు మాత్రమే ఉంది. కుటుంబంలో చీలికలు రావడాన్ని సమాజం అంగీకరించదు. నా విషయంలోనూ ఇదే జరిగింది. లోక్ సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి తన సోదరి సుప్రియ సూలేపై తన భార్య సునేత్ర పవార్‌ను పోటీకి దింపి ఉండాల్సింది కాదు. నేను తప్పు చేశా. చేసిన తప్పును ఇప్పుడు ఒప్పుకుంటున్నా’ అని అన్నారు.అజిత్ పవార్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది రెండో సారి. కొద్ది రోజుల క్రితం ఇలాగే మాట్లాడారు. ఇటీవల మహరాష్ట్ర లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో శరద్ పవార్ తన అనుభవాన్ని రంగరించి, తన వర్గం ఎన్సీపీ (ఎస్పీ) పోటీ చేసిన 10 సీట్లలో ఎనిమిది స్థానాలను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఆ ఎన్నికల్లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి శరద్ పవార్ ఎన్సీపీ తరుఫున సుప్రీయా సూలే బరిలో దిగగా..అదే స్థానంలో సుప్రియా సూలేపై అజిత్ పవార్ ఎన్సీపీ తరుఫున ఆయన భార్య సునేత్ర పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సునేత్ర రాజ్యసభకు నామినేట్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మహరాష్ట్ర అధికార కూటమి నుంచి అజిత్ పవార్‌ను బీజేపీ పక్కన పెట్టేస్తుందంటూ వ్యక్తమవుతున్న అభిప్రాయాల నడుమ అజిత్ పవార్ ఇలా మాట్లాడుతుండడం గమనార్హం. -
రేవంత్ అక్బర్ మధ్య నవ్వులే నవ్వులు
-
అనుకున్నట్లే అయింది.. ఏపీలో కూటమిని ముంచేసిన..
అనుకున్నట్లే అయింది. ఏపీలో కూటమిని కుమ్ములాటలు పూర్తిగా ముంచేసాయి. సఖ్యత లేని కారణంగానే పార్టీల మధ్య ఓటు బదిలీ జరగలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఓటు షేర్ బదిలీ కాకపోవడం ఆయా పార్టీలను కలవరపరుస్తోంది. టిడిపి, బిజెపి, జనసేన పార్టీ నేతల్లో గెలుపుపై ధీమా లేక డీలా పడిపోయారు. పోలింగ్ పూర్తయ్యాక బిజెపి, జనసేన నేతలెవరూ మీడియా ముందుకు రాకపోవడం పరిస్ధితికి అద్దం పడుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య అసలేం జరిగిందో చూద్దాం.కూటమిగా జతకడితే విజయం ఖాయమనుకున్న టిడిపి, బిజెపి, జనసేనలలో పోలింగ్ తర్వాత అయోమయం కనిపిస్తోంది. లెక్కలు తేలిన తర్వాత ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి ఓటు షేర్ బదిలీ కాలేదని అర్థం కావడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. 2014లో టిడిపి, బిజెపి, జనసేనలతో జట్టుకట్టి బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో టిడిపి, బిజెపికి మద్దతు పలికిన జనసేన బరిలోకి దిగలేదు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలన్న ఉద్దేశంతో జనసేన విడిగా పోటీ చేసింది. కాని జనసేన ఒక సీటు గెలుచుకోగా..టీడీపీకి 23 మాత్రమే దక్కాయి. 152 సీట్లతో వైఎస్ఆర్సీపీ విజయఢంకా మోగించింది.మళ్ళీ తాజా ఎన్నికలలో ఎట్టి పరిస్ధితుల్లోనైనా వైఎస్సార్ సిపి గెలుపును అడ్డుకోవాలని కుట్రలు, కుతంత్రాలతో 2014లో మాదిరిగా మూడు పార్టీలు మరోసారి కూటమి కట్టాయి. మూడు పార్టీలు కలిస్తే 2019 వచ్చినట్టుగా ఓటు షేర్ దాదాపుగా 50 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. అయితే మూడు పార్టీల అంచనాలు పూర్తిగా తలక్రిందులయ్యాయి.ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కూటమిలో కుమ్ములాటలు పోలింగ్ రోజున దెబ్బేసాయి. కనీసం సగం సీట్లలలోనైనా పోటీ చేస్తుందని భావించిన జనసేన పార్టీ నేతల్ని పవన్ తీరు పూర్తిగా నిరాశపరిచింది. కేవలం 21 అసెంబ్లీ సీట్లకి, రెండు పార్లమెంట్ సీట్లకి జనసేన పరిమితం కావడం ఆ పార్టీ నేతలను పూర్తిగా నైరాశ్యంలోకి నెట్టింది. దీనికి తోడు మొదట నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని చివరి నిమిషంలో పలువురు టీడీపీ నేతల్ని జనసేనలో చేర్చుకుని టిక్కెట్లు ఇవ్వడం పార్టీ సీనియర్ నేతలకి ఆగ్రహం కలిగించింది. గోదావరి జిల్లాల్లో అయితే నియోజకవర్గ ఇన్ చార్జిలకి వెన్నుపోటు పొడుస్తూ జనసేనకు బలం ఉన్న సీట్లను టిడిపికి త్యాగం చేయడం అక్కడి కేడర్‌ను నిరాశలోకి నెట్టింది. దీంతో పలువురు నేతలు జనసేనకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ సిపిలో చేరారు. సీట్ల పంపకాల సమయంలోనే సొంత పార్టీలోనే పవన్ నిప్పు రాజేసుకున్నారు. దీనికి తోడు జనసేన పార్టీ నేతలకి టీడీపీ నుంచి పూర్తి సహకారం లభించలేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో టీడీపీ నేత వర్మ చివరి నిమిషం వరకు కంట్లో నలుసుగానే కొనసాగారు. పవన్ కళ్యాణ్ గెలుపొందితే శాశ్వతంగా పిఠాపురం నుంచి తాను దుకాణం సర్ధుకోవాల్సి ఉంటుందనే భయంతో వర్మ తన క్యాడర్ ని పవన్ కి పూర్తిగా సహకరించనివ్వలేదని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో పవన్ తో పాటే వర్మ తిరిగినా టిడిపి ఓటు షేర్ జనసేనకి పూర్తిగా బదిలీ కాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో 21 అసెంబ్లీ స్ధానాలలో ఎన్ని సీట్లలో గెలుస్తామనేది జనసేన చెప్పలేకపోతోంది. ఎన్డీఎ కూటమి గెలుస్తుందంటూ పవన్ పోలింగ్ ముగిసిన తర్వాత కేవలం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. చాలా బలంగా ఉన్నామని చెప్పుకున్న గోదావరి జిల్లాలలోనూ కాపు ఓట్లు తప్పితే బిజెపి, టిడిపి ఓట్లు జనసేనకి పడలేదని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు.ఇక బిజెపి కూడా అదే విధమైన అయోమయంతో ఉంది. వాస్తవానికి ఈ పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలు గెలుపుపై ధీమా లేకుండా చేశాయి. బిజెపి సీనియర్లెవరికీ ఇష్టం లేకపోయినా చివరి నిమిషంలో టిడిపి, జనసేన కూటమితో జతకట్టి పది అసెంబ్లీ స్ధానాలకి, ఆరు పార్లమెంట్ స్ధానాలకి పరిమితం కావడం పార్టీలో సీనియర్లకి మింగుడుపడలేదు. దీంతో పాటు బిజెపిలో మొదట నుంచి ఉన్న వారికి, సీనియర్లకి టిక్కెట్ల కేటాయింపు కోసం సీనియర్లు ఎంత ప్రయత్నించినా..రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి కుతంత్రాలతో ఒరిజినల్ బిజెపి కాస్తా తెలుగు బిజెపిగా మారిపోయింది. ఇక్కడ కూడా విశాఖపై పట్టున్న జివిఎల్ కి టిక్కెట్ రాకుండా తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కోసం పురందేశ్వరి చేసిన కుట్రలతో జీవీఎల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అలాగే రాజమండ్రి నుంచి పోటీ చేయాలని ఆశించిన సోము వీర్రాజుకి టిక్కెట్ ఇవ్వకపోవడం, హిందూపూర్ ఆశించిన విష్టువర్ధన్ రెడ్డికి టిక్కెట్ రాకుండా పురందేశ్వరి అడ్డుపడ్డారు.ఈ నేపధ్యంలో బీజేపీ అసలు నేతలంతా ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. అదే సమయంలో టిడిపి నుంచి బిజెపిలో చేరిన, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నవారికే టిక్కెట్లు దక్కడం బిజెపిలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా లాంటి నేతలు వచ్చినపుడు తప్పితే మిగిలిన సమయాలలో పార్టీ అభ్యర్థులకు సొంత పార్టీ నేతలు సహకరించలేదని తెలుస్తోంది. దీనికి తోడు టిడిపి, జనసేన నుంచి కూడా ఓటు బదిలీ కాలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని బిజెపి అభ్యర్ధులు వాపోతున్నారు. జనసేన, టిడిపి ఓట్లు తమకు బదిలీ కాకపోవడం చాలా దెబ్బేసిందని వారు చెబుతున్నారు. దీంతో పాటు పోల్ మేనేజ్ మెంట్ లో పూర్తిగా విఫలమయ్యామని రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్నారు.సొంత పార్టీ నేతలకంటే బిజెపి, జనసేనను నమ్ముకుని పూర్తిగా మునిగిపోయామని టిడిపి నేతలు భావిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటే జనసేన, బిజెపి ఓట్లు తమకు పడకపోవడంపై నైరాశ్యంలో ఉన్నారు. గాజు గ్లాజు గుర్తు ఉన్న చోట మాత్రమే ఓట్లు పడ్డాయని...టిడిపి అభ్యర్ధులు ఉన్న చోట జనసేన ఓట్లు వేయలేదని..చాలా చోట్ల తమకి నచ్చిన పార్టీకి...నేతకి ఓటు వేసుకున్నారని గోదావరి జిల్లాకి చెందిన ఓ టిడిపి నాయకుడు చెబుతున్నారు. గోదావరి జిల్లాలలో టిడిపి, జనసేన కలిస్తే క్లీన్ స్వీప్ అవుతాయని భావించామని కానీ బిజెపితో కలవడం బాగా దెబ్బ కొట్టిందని అంటున్నారు. దీనికి తోడు జనసేన పార్టీ ఓట్లు తమకు పడలేదని..గాజు గ్లాసు లేని చోట పలువురు వైఎస్సార్ సిపికి ఓటు వేయడంతో తమ విజయవకాశాలను దెబ్బ కొట్టిందంటున్నారు. కొన్ని చోట్ల గత అయిదేళ్లగా పార్టీ కోసం కష్టపడిన నేతలని పక్కన పెట్టడం కూడా టిడిపికి మైనస్ అయింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుని కాదని వైఎస్సార్ సిపి బహిషృత నేత రఘరామకృష్ణంరాజుకి ఇవ్వడం జిల్లా వ్యాప్తంగా మైనస్ గా మారిందంటున్నారు.దీనికి తోడు టిడిపి రెబెల్ గా ఉండి నుంచి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు బరిలో ఉండటం కూడా పూర్తిగా వ్యతిరేకమైందంటున్నారు. ఇలా పలు నియోజకవర్గాలలో సొంత పార్టీ నేతలని కాదని బయట పార్టీ వారికి ఇవ్వడం కూటమి అభ్యర్ధుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు. టిక్కెట్ రాని నేతలంతా చివరి నిమిషంలో కూటమి నేతలకి షాక్ ఇచ్చారని చెబుతున్నారు. మరోవైపు జనసేన, బిజెపి ఓట్లు కూడా పూర్తిగా టిడిపికి పడలేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే గెలుపుపై టిడిపి ధీమా కోల్పోయి..ఓటమి ఖాయమై నేతలంతా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. -
‘మహాఘట్ బంధన్’లో సీట్ల చిచ్చు.. కోరుకున్న స్థానాలపై లాలూ పేచీ
సాక్షి, పాట్నా: త్వరలో జరగనున్న బీహార్‌లోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల సీట్ల కేటాయింపుల్లో మహాఘటబంధన్ కూటమిలో ప్రతిష్టంభన నెలకొన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), లెఫ్ట్ పార్టీలు పోత్తు కుదుర్చుకున్నాయి. ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. అయితే, లోక్‌సభ సీట్లను కేటాయించినట్లుగా అసెంబ్లీ స్థానాల అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయానికి రావడం లేదని, ఫలితంగా నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. బీహార్ అసెంబ్లీ నియోజవర్గాలైన ఔరంగాబాద్, బెగుసరాయ్, కతిహార్, పూర్ణియా, శివన్ స్థానాల్లో కూటమి పార్టీల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఔరంగాబాద్‌తో పాటు బెగుసరాయ్ సీటులోనూ కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య వివాదం నెలకొంది. ఇటీవల సీపీఐ సీట్ల కేటాయింపులో కూటమిలోని పార్టీ పెద్దల్ని సంప్రదించ కుండానే ఔరంగాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా అవదేశ్ రాయ్‌ను ప్రకటించింది. శివన్ బీహార్ అసెంబ్లీ మాజీ స్పీకర్ అవద్ బిహారీ చౌదరికి టికెట్ ఇవ్వాలని లాలూ ప్రసాద్ ఆర్జేడీ డిమాండ్ చేస్తోంది. సీపీఐ, సీపీఐ(ఎంఎల్)లు కూడా శివన్ సీటు కోసం ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. కతిహార్ నియోజకవర్గం నుంచి తారిఖ్ అన్వర్‌ను పోటీకి దింపాలని కాంగ్రెస్ భావిస్తుంటే.. అదే సీటు తమకే కావాలంటూ ఆర్జేడీ పట్టుబడుతుంది. దీంతో అసెంబ్లీ సీట్ల కోసం అయా పార్టీల నేతల సిగపట్లతో కార్యకర్తలు విస్తుపోతున్నారు. -
దేశ చరిత్రలో నిలిచే రోజు..!
-
ఇది ఫిక్స్...! సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు?
-
'ఏళ్లుగా సాగతున్న సంప్రదాయానికే కట్టుబడిన రాజస్థాన్'! సీఎం ఎవరంటే..?
రాజస్థాన్ ఎన్నికల పరంగా సాగుతున్న సంప్రదాయాన్ని మార్చి చరిత్ర తిరగరాయాలనుకున్న కాంగ్రెస్ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ అనూహ్యంగా ఆధిక్యం చూపింది. కాంగ్రెస్ నమ్ముకున్న గ్యారంటీ హామీ గేమ్ కంటే బీజేపీ స్ట్రాటజీనే గెలించిందన్నట్లుగా ఓట్ల ఆధిక్యం చూపిస్తోంది. రాజస్థాన్ కాంగ్రెస్ సాగించిన పాలనపై విమర్శలు కురిపిస్తూ అవి ప్రజల్లోకి వెళ్లే దిశగా చేసిన ప్రచార స్ట్రాటజీ ఫలించింది. ఇక ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నాం 1.00 గంట బీజేపీ కాంగ్రెస్ ఇతరులు 111 72 02 దీంతో బీజేపీ కార్యాలయాల్లో 'మోదీ'..'మోదీ' అంటూ నినాదాలు మిన్నంటాయి. ఈ ఎన్నికల్లో మహిళల అంశమే కీలకపాత్ర పోషించదని అన్నారు ముఖ్యమంత్రి అభ్యర్థి దియా కుమారి అన్నారు. బీజేపీ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మహిళలకే పెద్ద పీఠం వేస్తూ.. లడో ప్రోత్సాహన్ యోజన కింద ఆడపిల్ల పుట్టినప్పుడు రూ. 2 లక్షల పొదుపు బాండ్, లక్షపతి దీదీ పథకం కింద దాదాపు ఆరు లక్షల మంది గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ప్రతిభావంతులైన బాలికలకు స్కూటర్లు, కేజీ నుంచి ఉచిత విద్య కల్పిస్తామని కూడా బీజేపీ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఎవరంటే..? ఇక బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు అధిష్టానం నిర్ణయానికే వదిలేశామని చెప్పారు. కాగా, రాజస్తాన్‌లో మూడు దశాబ్దాలుగా ఒకసారి కాంగ్రెస్ మరోసారి బీజేపీ అంటూనే సాగినప్పటికీ 2018లో ఏ పార్టీకి మెజారిటీ రాకుండా ఆశ్చర్యపరిచింది. దాదాపు 200 మంది సభ్యులుండే సభలో 101 మందికి ఒక్కటి తక్కువ ఉన్న కాంగ్రెస్, మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. (చదవండి: రాజస్థాన్ ఎన్నికల కౌంటింగ్ లైవ్ అప్డేట్స్) -
ప్రస్తుతానికి ఓటర్ల నుంచి మంచి స్పందన ఉంది: CEO
-
నాగర్ కర్నూల్ జిల్లా వంకేశ్వరం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
-
ఖమ్మం జిల్లా రాజులపాలెం గ్రామంలో ఓటర్ల నిరసన
-
15 సీట్లు గెలిస్తే చాలు.. సీఎం బఘేల్
రాయపూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 55 సీట్లు గెలుస్తామని మాజీ సీఎం రమణ్ సింగ్ చేసిన వ్యాఖ్యపై బఘేల్ స్పందిస్తూ.. ఇది ఆయన చేసిన బూటకపు ప్రకటన అని కొట్టిపారేశారు. రమణ్ సింగ్ వ్యాఖ్యలపై బఘెల్ మాట్లాడుతూ ‘రమణ్ సింగ్ ప్రజాదరణ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడే 52 సీట్లను అధిగమించలేదు. ఇప్పుడు 55 సీట్లు గెలుస్తారని ఎలా అనుకుంటున్నారు? ఆయన ఇదంతా తమ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని పెంచడానికే చెబుతున్నాడు. కనీసం 15 సీట్లయినా సాధిస్తారో లేదో ఫలితాలు వచ్చాక అందరికీ తెలిసిపోతుంది’ అన్నారు. నవంబర్ 7న మొదటి దశ ఎన్నికల తర్వాత మాజీ సీఎం రమణ్ సింగ్ రాష్ట్రంలో బీజేపీ విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ‘మొదటి దశ ఎన్నికలు ముగిశాయి. 20 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఈ 20 సీట్లలో బీజేపీ కనీసం 14 స్థానాలను గెలుచుకుంటుంది" అని రమణ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో 90 నియోజకవర్గాలు ఉండగా నవంబర్ 7న తొలిదశ, నవంబర్ 17న రెండో దశతో ఎన్నికలు ముగిశాయి. ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. -
పక్క సీఎం అవుతా!..రేవంత్ రెడ్డి ఓపెన్ డిబేట్
-
సీఎం శివరాజ్ సింగ్ మంచి నటుడు: కమల్‌నాథ్
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రజలు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కమల్‌నాథ్ అన్నారు. అయితే సీఎం కుర్చీపోయినా శివరాజ్‌సింగ్ చౌహాన్ ఉద్యోగానికి ఢోకా లేదని నాథ్ చెప్పారు. శివరాజ్‌సింగ్ మంచి నటుడని, సీఎం పదవి పోయిన తర్వాత ముంబై వెళ్లి సినిమాల్లో ట్రై చేసుకోవచ్చని కమల్‌నాథ్ చమత్కరించారు. సాగర్ జిల్లాలోని రేహ్లీ అసెంబ్లీ స్థానంలో ప్రచారం సందర్భంగా కమల్‌నాథ్ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఇంటికెళ్లడానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉందన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన శివరాజ్‌సింగ్ కనీసం బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా నింపలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల వేళ మళ్లీ శివరాజ్‌సింగ్ చౌహాన్ హామీల మెషీన్ డబుల్ స్పీడ్‌తో పనిచేస్తోందని, దీనిని ప్రజలు గమనించాలని కమల్‌నాథ్ కోరారు.మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. గతంలో సీఎంగా పనిచేసిన కమల్‌నాథ్ కాంగ్రెస్ తరపున మళ్లీ సీఎం అభ్యర్థిగా ఉన్నారు. ఇదీ చదవండి..కుప్పకూలిన చార్దామ్ టన్నెల్..చిక్కుకున్న 40 మంది -
ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం ఆస్తులు రూ.447 కోట్లు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి ఈనెల 17న రెండో విడత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 253 మంది కోటీశ్వరులు. ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్ రూ.447 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు. మొత్తం 958 మందికిగాను 953 మంది అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించిన ఆస్తుల వివరాలను విశ్లేషించినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్(ఏడీఆర్)తెలిపింది. అభ్యర్థుల ఆస్తుల సరాసరి రూ.2 కోట్లని తెలిపింది. అత్యంత ధనికులైన ముగ్గురు అభ్యర్థులు కూడా కాంగ్రెస్‌కు చెందిన వారేనని పేర్కొంది. సుర్‌గ్రుజా రాచకుటుంబ వారసుడైన టీఎస్ సింగ్ దేవ్ రూ.447 కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో ఉన్నారు. అంబికాపూర్ నుంచి పోటీ చేస్తున్న ఈయన 2018 ఎన్నికల సమయంలో రూ.500 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత మణేంద్రగఢ్ స్థానంలో పోటీ చేస్తున్న రమేశ్ సింగ్ రూ.73 కోట్ల పైచిలుకు ఆస్తులు, రజిమ్‌లో పోటీ చేస్తున్న అమితేశ్ శుక్లా రూ.48 కోట్ల పైచిలుకు ఆస్తులున్నట్లు ప్రకటించారని వెల్లడించింది. కాంగ్రెస్‌కు చెందిన 70 మంది అభ్యర్థుల్లో 60 (86%)మంది, బీజేపీకి చెందిన 70 మంది అభ్యర్థుల్లో 57 (81%)మంది, జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జే)కి చెందిన 62 మందిలో 26 (42%) మంది, ఆప్‌నకు చెందిన 44 మందిలో 19 (43%) మంది అభ్యర్థులు రూ.1 కోటి కంటే ఎక్కువ ఆస్తులున్నట్లు ప్రకటించారని వివరించింది. ఆస్తులే లేవన్న ముగ్గురు అభ్యర్థులు భట్గావ్ సీటుకు పోటీ చేస్తున్న కళావతి సార్థి, బెల్టారాలో పోటీ చేస్తున్న గౌతమ్ ప్రసాద్ సాహు అనే స్వతంత్ర అభ్యర్థులు, ఖర్సియాలో పోటీలో ఉన్న జోహార్ ఛత్తీస్‌గఢ్ పార్టీకి చెందిన యశ్వంత్ కుమార్ నిషాద్ తమకు ఎలాంటి ఆస్తులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నట్లు ఏడీఆర్ తెలిపింది. అదేవిధంగా, రెండో విడత ఎన్నికల బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు అతి తక్కువగా ఆస్తులున్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. ముంగేలి ఎస్సీ రిజర్వుడు సీటుకు పోటీ చేస్తున్న నేషనల్ యూత్ కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌రత్న ఉయికే తన వద్ద కేవలం రూ.500 ఉన్నట్లు తెలిపారు. రాయ్‌గఢ్‌లో ఆజాద్ జనతా పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్న కాంతి సాహు రూ.1,000 మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా, బెల్టారా బరిలో నిలిచిన ఆజాద్ జనతా పార్టీకే చెందిన ముకేశ్ కుమార్ చంద్రాకర్ రూ. 1,500 ఉన్నట్లు వెల్లడించారని ఏడీఆర్ తెలిపింది. సీఎం బఘేల్‌కు అత్యధిక ఆదాయం ఆప్ అభ్యర్థి విశాల్ కేల్కర్, కాంగ్రెస్ నేత, సీఎం భూపేశ్ బఘేల్, బీజేపీ నేత ఓపీ చౌధరి తమకు అత్యధిక ఆదాయం వస్తున్నట్లు అఫిడవిట్లో వెల్లడించారని ఏడీఆర్ పేర్కొంది. కేల్కర్ తన మొత్తం ఆదాయం రూ.2 కోట్లుగా, సీఎం బఘేల్, చౌధరిలు రూ.కోటికి పైగా ఆదాయం ఉన్నట్లు చెప్పారు. 52 శాతం మంది 12వ తరగతిలోపే మొత్తం అభ్యర్థుల్లో 499(52 శాతం) మంది తమ విద్యార్హతలను 5 నుంచి 12వ తరగతి మధ్య ఉన్నట్లు తెలపగా మరో 405(42%)మంది గ్రాడ్యుయేషన్ ఆపైన చదువుకున్నట్లు వెల్లడించారని ఏడీఆర్ విశ్లేషించింది. 19 మంది అక్షరాస్యులమని మాత్రమే తెలపగా, ఆరుగురు నిరక్షరాస్యులమని తెలిపారు. ముగ్గురు అభ్యర్థులు విద్యార్హతలను పేర్కొనలేదు. -
పేదలకు కోట్ల ఇళ్లు కట్టించాను..
ఛత్తర్పూర్/సత్నా/నీముచ్(మధ్యప్రదేశ్): దేశంలోని పేదలకు తమ ప్రభుత్వం నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇచి్చందని, తన కోసం ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌ని ఒక్కో ఓటు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు, కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి బలాన్నిచ్చేందుకు, అవినీతి కాంగ్రెస్‌ను మరో 100 ఏళ్లపాటు అధికారానికి దూరం ఉంచేందుకు ఉపయోగపడే ‘త్రిశక్తి’ వంటిందని పేర్కొన్నారు. దేశాభివృద్ధిని వెనక్కి నడిపించడంలో కాంగ్రెస్‌కు మంచి నైపుణ్యం ఉందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అందుకే, అవినీతి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్పూర్, సత్నా, నీముచ్లలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘మా ప్రభుత్వం దేశంలోని పేదలకు నాలుగు కోట్ల పక్కా గృహాలను నిర్మించి ఇచి్చంది. కానీ, నేను ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేకపోయాను’అని ఆయన చెప్పారు. ‘వాహనం మనల్ని రివర్స్‌గేర్‌లో వెనక్కి తీసుకెళ్లినట్టుగానే కాంగ్రెస్ పారీ్టకి సుపరిపాలనను రివర్స్‌గేర్‌లో దుష్పరిపాలనగా మార్చడంలో నైపుణ్యం ఉంది. 100 ఏళ్ల క్రితమే గొప్ప నీటి వనరులున్న బుందేల్‌ఖండ్‌లో నీటి సమస్యలను తీర్చేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. దీంతో, ఇక్కడి ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. అందుకే, ఆ పారీ్టకి కనీసం 100 ఏళ్లపాటు అధికారం ఇవ్వరాదు. అప్పుడే అభివృద్ధి సాధ్యం’అని ప్రజలను కోరారు. బానిస మనస్తత్వంతో కూడిన కాంగ్రెస్ దేశ అభివృద్ధిని పట్టించుకోలేదు, దేశ వారసత్వంతోనూ ఆ పారీ్టకి సంబంధం లేదని మోదీ అన్నారు. ‘కాంగ్రెస్‌కు ఒక పంజా ఉంది. పేదల వద్ద ఉన్న వాటిని గుంజుకోవడానికే దానిని వాడుతుంది. అలాంటి కాంగ్రెస్ పంజా బారి నుంచి మధ్యప్రదేశ్‌ను మనం కాపాడు కోవాల్సిన అవసరం ఉంది’అంటూ ఆ పార్టీ ఎన్నికల గుర్తు హస్తంను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నకిలీలను తొలగించాం ప్రభుత్వ పథకాల ద్వారా పేదల ధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు లూటీ చేశాయని విమర్శించారు.కాంగ్రెస్ జమానాలో డబ్బంతా ఎక్కడికి చేరుతుందో ప్రజలకు అర్థమయ్యేది కాదు. 2జీ, కోల్, కామన్వెల్త్, హెలికాప్టర్ల కుంభకోణాల రూపంలో లక్షల కోట్లు దారి మళ్లాయి. వీటన్నిటినీ మోదీ ప్రభుత్వం ఆపు చేసింది. అప్పట్లో దళారులదే రాజ్యంగా ఉండేది. మోదీ ప్రభుత్వం వారి దుకాణాలను మూసివేయించింది. అధికారంలోకి వచి్చన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాలు సృష్టించిన దేశంలోని ప్రభుత్వ పథకాల 10 కోట్ల నకిలీ లబి్ధదారులను తొలగించి ప్రజాధనాన్ని కాపాడామన్నారు. పదేళ్ల కాలంలో రూ.33 లక్షల కోట్లను నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు వివరించారు. ఇందులో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టలేదని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో పేదల పిల్లలు ఆకలితో అలమటించకుండా చేయగలగడం కేవలం మోదీ వల్ల కాదు, మీ అందరివల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఓటుతో ప్రజలిచి్చన అధికారం వల్లనే పేదల ఆకలి తీర్చగలిగినట్లు చెప్పారు. -
పరామర్శకైనా పనికిరామా?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న క్రమంలో బీజేపీలో టికెట్ల చిచ్చు రగులుతోంది. రెండు జాబితాల్లో కలిపి 53 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాక, నవంబర్ 1న మూడో జాబితా వెలువడనున్న నేపథ్యంలో బీజేపీ టికెట్లు ఆశించి భంగపడిన పలువురిలో అసంతృప్తి వ్యక్త మౌతోంది. మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో కనీసం 60–70 చోట్లయినా సీరియస్‌గా టికెట్ ఆశిస్తున్న వారు ఇద్దరు, ముగ్గురున్నప్పుడు అభ్యర్థిత్వం ఖరా రుకాని వారిని పిలిచి మాట్లాడే పరిస్థితి పార్టీలో లేకపోవడాన్ని తప్పుబడు తున్నారు. గతంలో టికెట్ రాని వారికి నచ్చజెప్పి పార్టీ కోసం పని చేసేలా ఒప్పించిన పరిస్థితులుండగా ఇప్పుడు జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు పట్టించుకోక పోవడం సరికాదని మండిపడుతున్నారు. కనీసం బుజ్జగింపులు, నచ్చజెప్ప డాలు వంటి వాటికి కూడా తాము నోచుకోలేదని పలువురు బీజేపీ నేతలు వాపోతున్నారు. పరామర్శకైనా తాము పని కిరామా అని ఆవేదన చెందుతున్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే పార్టీ విజయం సాధ్యమనే విష యాన్ని నాయకులు విస్మరించారని అంటున్నారు. గుర్తింపుపై భరోసా ఏదీ? ఇప్పుడు వివిధ సమీకరణల మధ్య టికెట్ ఇవ్వలేక పోయామని, భవిష్యత్‌లో గుర్తింపు లభిస్తుందని భరోసా కల్పించకపోవడంపైనా పలువురు కమలనాథులు రుసరుసలాడుతున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్టులు ఇస్తామనే హామీ కూడా ఇవ్వకపోవడం దేనికి సంకేతమని అంటున్నారు. అలాంటప్పుడు ఆశావహుల నుంచి దరఖాస్తులు కోరాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని నాయకత్వం కోరడంతో రికార్డు స్థాయిలో 6,003 దరఖాస్తులు వచ్చాయి. వారిలో తొలి జాబితాలో టికెట్లు దక్కని వారిని పార్టీపరంగా అనునయించే ప్రయత్నమేదైనా జరిగిందా అని నిలదీస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి వెంటనే అవకాశం కల్పించి, ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరిస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాజీనామా చేస్తానని ప్రకటించినా... ముథోల్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి రాజీనామా చేస్తానని ప్రకటించాక కూడా ఎవరూ సర్దిచెప్పే ప్రయత్నం చేయలేదనే చర్చ పార్టీ వర్గాల్లో సాగు తోంది. తొలిజాబితాలో తనకు ఆందోల్ టికెట్‌ను ప్రకటించకపోవడంపై మాజీ మంత్రి బాబూ మోహన్ ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేశారు. ఏదైనా భరోసా దొరుకుతుందేమోనని ముఖ్యనేతలకు ఫోన్ చేసినా వారి నుంచి స్పందన కరువైందని ఆయన వాపోయారు. వరంగల్(పశ్చిమ) నుంచి రావు పద్మకు టికెట్ కేటాయించడంతో... టికెట్ ఆశించి భంగపడిన అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి రెబెల్‌గా పోటీచేస్తానని ప్రకటించారు. అయినా ఆయనను నచ్చజెప్పేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే తరహా పరిస్థితులు మరికొన్ని నియోజక వర్గాల్లోనూ ఉన్నాయి. తదుపరి జాబితా ప్రకటించే సమయంలోనైనా టికెట్లు ఆశిస్తున్న ముఖ్యనే తలతో పార్టీ పెద్దలు మాట్లాడాలని ఓ ముఖ్యనేత సాక్షితో చెప్పారు. -
తోకముడిచిన టీడీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తోక ముడిచింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ చేతులెత్తేసింది. ఈ మేరకు తెలుగు తమ్ముళ్లకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌లు చావు కబురు చల్లగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎదుర వుతున్న పరిస్థితులను తట్టుకుని నిలబడేందుకే తమకు సమయం సరిపోతుందని, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేంత స్థాయిలో తాము దృష్టి కేంద్రీకరించలేమని, ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. తండ్రీ కొడుకుల ప్రయోజనాల కోసం తెలంగాణలో పార్టీని నమ్ముకుని ఉన్న నేతలను నట్టేట ముంచారంటూ తమ్ముళ్లు ఆందోళనకు గురవుతు న్నారు. కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్న లోపాయి కారీ ఒప్పందంలో భాగంగానే ఆ పార్టీకి మేలు చేసేందుకు తమను బలిపశువులను చేశార ని ఆవేదనకు గురవుతున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసి తీరతామని, బీఫారాలు ఇవ్వకుంటే స్వతంత్రంగా పోటీ చేస్తామని తెలుగుదేశం అధినాయకత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. లోకేశ్‌తో మాట్లాడుకోవాలన్న బాబు తెలంగాణలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై తెలుగుదేశం పార్టీ చాలా రోజులుగా నాన్చుతూ వస్తోంది. అన్నిచోట్లా పోటీ చేయకపోయినా, బలమున్న చోటయినా పోటీకి దిగుదామని పార్టీ నేతలకు చెప్పుకుంటూ వచ్చింది. కాగా ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పోటీ విషయమై తేల్చుకునేందుకు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇటీవల చంద్రబాబు నాయుడితో రాజమండ్రి జైల్లో ములాఖాత్ అయ్యారు. అయితే తెలంగాణలో పోటీ చేసే విషయం తాను మాట్లాడలేనని, లోకేశ్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని జ్ఞానేశ్వర్‌కు చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జ్ఞానేశ్వర్ అధ్యక్షతన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌కు రావాల్సిందిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు ఆహ్వానం పంపారు. అయితే లోకేశ్ హాజరు కాకుండా.. తెలంగాణలో పోటీ చేయడం లేదనే సమాచారాన్ని పంపించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడాల్సి వచ్చింది. తాము ఖచ్చితంగా పోటీ చేయాల్సిందేనని, బలమున్న నియోజకవర్గాల్లో నైనా పోటీకి అంగీకరించాలని డిమాండ్ చేశారు. కానీ లోకేశ్ ససేమిరా అనడంతో సమావేశానికి వచ్చిన నేతలు అక్కడే ఆందోళనకు దిగారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారంటూ మండిపడ్డారు. తండ్రీకొడుకుల కోసం తాము త్యాగాలెందుకు చేస్తామని ప్రశ్నించిన నేతలు.. కాంగ్రెస్ పార్టీకి లాభం చేయాలన్న ఆలోచనతోనే తెలంగాణలో పోటీని విరమించుకున్నారంటూ బహిరంగ ఆరోపణలకు దిగారు. స్వతంత్ర అభ్యర్థు లుగానైనా బరిలోకి దిగుతామంటూ సమావేశంలో తీర్మానం చేశారు. -
మూడో జాబితాపై ముమ్మర కసరత్తు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాపై రాష్ట్ర బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. శనివారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్, పార్టీ నేతలు కె.లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపాలనే చర్చ జరిగినట్టు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని సీట్లపై చర్చలో భాగంగా.. సనత్‌నగర్ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, జూబ్లీహిల్స్ విక్రమ్‌గౌడ్, ముషీరాబాద్ నుంచి గోపాల్‌రెడ్డి/ బండారు విజయలక్షి, అంబర్‌పేట నుంచి బండారు విజయలక్షి / ఎన్.గౌతమ్‌రావు, సికింద్రాబాద్ నుంచి బండ కార్తీకరెడ్డి, మల్కాజ్గిరి నుంచి ఆకుల రాజేందర్, రాజేంద్రనగర్ నుంచి తోకల శ్రీనివాస్‌రెడ్డి అభ్యర్థిత్వాలను పరిశీలించినట్టు సమాచారం. ఎల్బీనగర్ సీటు కోసం సామ రంగారెడ్డి, వంగ మధుసూదన్‌రెడ్డి, గంగిడి మనోహర్‌రెడ్డి ఆశలు పెట్టుకోగా.. ఉప్పల్ నుంచి ఎనీ్వఎస్‌ఎస్ ప్రభాకర్‌తో పాటు వీరేందర్‌గౌడ్, మేడ్చల్ నుంచి విక్రమ్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ రెండో జాబితా కూడా వెలువడిన నేపథ్యంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పారీ్టల్లోని అసంతృప్తులను చేర్చుకుని, టికెట్ ఇచ్చే అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. త్వరలోనే జాబితా విడుదల ఆదివారంగానీ, సోమవారంగానీ బీజేపీ రాష్ట్ర నేతలు ఢిల్లీ వెళ్లి మూడో జాబితా ముసాయిదాను పార్టీ పెద్దలకు అందజేయనున్నట్టు తెలిసింది. వచ్చే నెల 1న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ జాబితాపై చర్చించి.. సుమారు 40– 45 మంది పేర్లతో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆ రోజున ఆలస్యమైతే రెండో తేదీన విడుదల చేయవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మిగిలిన సీట్లలో పదిచోట్ల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉందని, వాటి విషయాన్ని చివర్లో తేల్చాలని భావిస్తున్నట్టు సమాచారం. జనసేనకు కేటాయించే సీట్లపైనా చర్చించారని, ఈ విషయంలో పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమైందని తెలిసింది. -
ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్.. ఆత్మవిశ్వాసమా.. అత్యుత్సాహమా..?
-
BRS Party: కారు చివరి సీట్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ముందుగానే ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి పెండింగ్‌లో ఉన్న మిగతా స్థానాల అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేసింది. మల్కాజిగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో అక్కడ కొత్త అభ్యర్థికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పెండింగ్ అభ్యర్థులతో త్వరలోనే రెండో జాబితాను ప్రకటించే అవకాశముంది. ఇదిలా ఉంటే విపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు కూడా అభ్యర్థుల ఎంపిక కసరత్తును ప్రారంభించిన నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులపై స్పష్టత వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గతంలో ప్రకటించిన తొలి జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీల్లోని కీలక అసమ్మతి నేతలను ఎన్నికల నాటికి బీఆర్ఎస్ గూటికి చేర్చే వ్యూహానికి పార్టీ అధినేత కేసీఆర్ పదును పెడుతున్నట్లు సమాచారం. ముగ్గురికి పచ్చజెండా బీఆర్ఎస్ గత నెల 21న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకే మరోసారి అవకాశం ఇచ్చింది. అయితే ఆయన కాంగ్రెస్ గూటికి చేరడంతో, ఈ నియోజకవర్గంతో పాటు గతంలో పెండింగులో పెట్టిన జనగామ, నర్సాపూర్, గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. వారు క్షేత్ర స్థాయిలో పని చేసుకునేందుకు పచ్చజెండా ఊపారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ), సునీత లక్ష్మారెడ్డి (నర్సాపూర్), మర్రి రాజశేఖర్‌రెడ్డి (మల్కాజిగిరి), నందకిషోర్ వ్యాస్ బిలాల్ (గోషామహల్) పేర్లను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇక నాంపల్లి నియోజకవర్గం అభ్యర్థి విషయంలో కసరత్తు కూడా ఒకటి రెండు రోజుల్లో కొలిక్కిరానుంది. గులాబీ గూటి నుంచి బయటకు.. బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడిన పలువురు ముఖ్య నేతలకు సర్ది చెప్పేందుకు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావుతో పాటు పార్టీ అధిష్టానానికి సన్నిహితం ఉండే నేతలు చేస్తున్న ప్రయత్నాలు కొన్నిచోట్ల ఫలించడం లేదు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండటంతో ఆయా పార్టీల టికెట్ ఆశిస్తూ బీఆర్ఎస్ను వీడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వివిధ కారణాలతో ఇప్పటివరకు సుమారు 20 మంది ముఖ్య నేతలు పార్టీని వీడారు. మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), తుమ్మల నాగేశ్వర్ రావు (పాలేరు) లాంటి వారు ఇందులో ఉన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా ఇటీవల అసంతృప్తి రాగం అందుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కేవలం మూడు నెలల కాలంలోనే మనసు మార్చుకుని తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. పలువురు ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు కూడా.. బీఆర్ఎస్ టికెట్ దక్కని ఎమ్మెల్యేలు రేఖా నాయక్ (ఖానాపూర్), రాథోడ్ బాపూరావు (బోథ్)తో పాటు టికెట్ దక్కినప్పటికీ మైనంపల్లి హన్మంతరావు (మల్కాజిగిరి) పార్టీని వీడారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు (చెన్నూరు), ఆరేపల్లి మోహన్ (మానకొండూరు), వేముల వీరేశం (నకిరేకల్), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట) కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య (భద్రాద్రి కొత్తగూడెం), నల్లాల భాగ్యలక్ష్మి (మంచిర్యాల), సరిత (గద్వాల) కూడా వేర్వేరు సందర్భాల్లో కారు దిగేశారు. పదవులు, బుజ్జగింపులతో కట్టడి యత్నం ఎన్నికల సమయంలో నేతలు పార్టీలు మారడం అత్యంత సహజమని చెప్తూనే అసంతృప్తులకు కళ్లెం వేసేందుకు బీఆర్ఎస్ మరింత ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో పాటు ప్రవీణ్ (బెల్లంపల్లి), నరోత్తమ్ (జహీరాబాద్), గోలి శ్రీనివాస్‌రెడ్డి (కల్వకుర్తి), బక్కి వెంకటయ్య (దుబ్బాక) తదితరులకు ఇటీవల ప్రభుత్వ పదవులను అప్పగించారు. టికెట్ దక్కని ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (జనగామ), తాటికొండ రాజయ్య (స్టేషన్ ఘనపూర్)కు కూడా కీలక పదవులు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే టికెట్ దక్కని ఎమ్మెల్యే బేతి సుభా‹Ùరెడ్డి (ఉప్పల్)తో పాటు నేతలు గడ్డం అరవింద్ రెడ్డి (మంచిర్యాల), నీలం మధు (పటాన్చెరు), మన్నెం రంజిత్ యాదవ్, బుసిరెడ్డి పాండురంగారెడ్డి (నాగార్జునసాగర్) చందర్రావు (కోదాడ) తదితరులు అభ్యర్థులను మార్చాలని ఒత్తిడి పెంచుతుండటం గమనార్హం. -
తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మంది ఓటర్లుగా చేరారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించామని వెల్లడించారు. వచ్చే నెల 3,4,5 తేదీల్లో తెలంగాణలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తుందని తెలిపారు. ఈ పర్యటనలో దాదాపు 20 ఏజెన్సీలతో సమావేశాలు ఉంటాయని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. తుది ఓటర్ల జాబితా తర్వాత జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఈవీఎంల చెకింగ్ జరుగుతోందని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. అధికారిక పార్టీ పూర్తి అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. కాంగ్రెస్, బీజేపీ కూడా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్నాయి. ఇదీ చదవండి: మీడియా కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్ నేతల రచ్చ -
ఇండియా కూటమికి ఎదురుదెబ్బ.. ఆప్ కీలక నిర్ణయం
ఢిల్లీ: ఇండియా కూటమి ఐక్యతను దెబ్బతీసేలా!.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్‌లో పోటీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆప్ జనరల్ సెక్రటరీ సందీప్ పాఠక్ సమావేశం నిర్వహించారు. 2025లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ నెలఖరున ముంబయిలో ఇండియా కూటమి నిర్వహించనున్న కీలక సమావేశానికి ముందు ఆప్ నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బిహార్‌లో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయాలని సందీప్ పాఠక్ నాయకులకు సూచించారు. నీచరాజకీయాల కారణంగానే బిహార్ ముందుకు పోవడం లేదని ఆరోపించారు. ఆప్ తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తుందని, అంతకుముందే పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. ప్రతి గ్రామంలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని నాయకులను కోరారు. ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ బిహార్ ఇంఛార్జీ అజేష్ యాదవ్‌లు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. గుజరాత్లో మాదిరిగానే బిహార్‌లోనూ పూర్తి స్థాయిలో పోటీ చేస్తామని పాఠక్ అన్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయగానే తదుపరి ప్రణాళికలను వెల్లడిస్తామని చెప్పారు. బిహార్‌లో పంచాయతీ ఎన్నికల్లో మొదట పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. దేశం కఠిన సమయంలో ఉందని పాఠక్ అన్నారు. ప్రధాని మోదీ ఈ తొమ్మిదేళ్లలో ప్రసంగాలు ఇవ్వడం తప్పా.. ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇండియా కూటమి పరిస్థితిపై ప్రశ్నించినప్పుడు.. 'పార్టీల అభిప్రాయాలు వేరు.. దేశమే ప్రధానం.. కూటమిలు తర్వాత' అని పాఠక్ చెప్పారు. ఆప్ జాతీయ పార్టీ.. ఎక్కడైనా పోటీ చేయవచ్చని అన్నారు. జేడీయూ, ఆర్జేడీ రియాక్షన్.. ఆప్ నిర్ణయంపై ఆర్జేడీ నాయకుడు, ఎంపీ మనోజ్ స్పందించారు. 'ఇండియా కూటమిని నిర్మించేప్పుడే కొన్ని కట్టుబాట్లను పెట్టుకున్నాం. ఈ విధివిధానాలపై సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆప్ కూటమి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి'అని ఆయన సూచించారు. పార్టీని విస్తరించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని జేడీయూ నాయకుడు నీరజ్ కుమార్ అన్నారు. తాము కూడా ఇతర రాష్ట్రాల్లో విస్తరిస్తామని చెప్పారు. కూటమి పార్టీలన్నీ ఏకంగా పోటీచేస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సహా ఇతర నాయకులు చెప్పారు. అంతర్గత అభిప్రాయ భేదాలు క్రమంగా పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ నోట బ్రియాన్ డి ఖర్ప్రాన్ పేరు.. ఎవరీయన? -
TS Election 2023: 'భారత రాష్ట్ర సమితి'లో.. ముగ్గురు కొత్తవారు!
కరీంనగర్: భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) తన అభ్యర్థులను ప్రకటించింది. 13 అసెంబ్లీ స్థానాలున్న విశాల ఉమ్మడి జిల్లా అభ్యర్థుల జాబితాను సోమవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించగానే.. పాత జిల్లాలో గులాబీ శ్రేణుల సంబురాలు మొదలయ్యాయి. ఇటీవల జాబితాలో ఉమ్మడి జిల్లాలో భారీగా మార్పులు ఉంటాయని ప్రచారం జరిగిన నేపథ్యంలో సీఎం జాబితాపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ.. పాత జిల్లాలో పదిమందిని పాత వారిని, ముగ్గురు కొత్తవారి పేర్లు ప్రకటించి సీఎం.. అందరి అంచనాలను తలకిందులు చేశారు. అంతా ఊహించినట్లుగా వేములవాడ అభ్యర్థిని అందరి కంటే ముందే మారుస్తున్నామని సీఎం ప్రకటించారు. పౌరసత్వం వివాదంలో ఆయన మార్పు అనివార్యమైందని వివరించారు. ఆయన స్థానంలో చెలిమెడ లక్ష్మీనర్సింహారావు పేరును ఖరారు చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు కుమారుడు డాక్టర్ కె.సంజయ్‌ను ప్రకటించారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న విద్యాసాగర్‌రావు కోరిక మేరకు సంజయ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇక హుజూరాబాద్‌లో అంతా అనుకున్నట్లుగా ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిని ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు సిట్టింగులను మార్చగా ఇందులో జిల్లాకు చెందినవారే ఇద్దరు కావడం విశేషం. పదిమంది పాతకాపులే.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మూడుస్థానాల్లో అభ్యర్థులు మారగా, మిగిలిన 10 స్థానాల్లో సీనియర్లే ఉన్నారు. అందులో సిరిసిల్ల నుంచి మంత్రి కేటీఆర్, కరీంనగర్ నుంచి మంత్రి గంగుల కమలాకర్, ధర్మపురి నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీచేస్తారు. చొప్పదండి నుంచి సుంకె రవిశంకర్, మానకొండూరు నుంచి రసమయి బాలకిషన్, హుస్నాబాద్ నుంచి సతీశ్‌బాబు, జగిత్యాల నుంచి సంజయ్, పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్‌రెడ్డి, రామగుండం నుంచి కోరుకంటి చందర్, మంథని నుంచి పుట్ట మధు బరిలో దిగనున్నారు. ఇందులో సిరిసిల్ల, కరీంనగర్, హుస్నాబాద్, మానకొండూరు, జగిత్యాల మినహా మిగిలిన చొప్పదండి, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథనిలో ఎమ్మెల్యేలకు వ్యతిరేక పవనాలు వీచాయి. మంత్రి ఈశ్వర్ పెద్దపల్లి పార్లమెంటుకు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అదే సమయంలో చొప్పదండి, రామగుండం, మంథని, పెద్దపల్లి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా స్థానిక నేతలు తిరుగుబాటు చేశారు. మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ఈశ్వర్‌ల చొరవతో అవన్నీ సద్దుమణిగాయి. కులాల వారీగా.. 13 అసెంబ్లీ స్థానాల్లో ఏడుగురు ఓసీ అభ్యర్థులు ఉన్నారు. ముగ్గురు బీసీలు, ముగ్గురు ఎస్సీలకు అవకాశం దక్కింది. ఇందులో కేటీఆర్, డాక్టర్ సంజయ్, డాక్టర్ కె.సంజయ్‌కుమార్, చలిమెడ లక్ష్మీనర్సింహరావు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి, హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్‌ది రెడ్డి సామాజిక వర్గం. హుస్నాబాద్ నుంచి సతీశ్‌బాబు బ్రాహ్మణ(కరణం) కాగా, కరీంనగర్ నుంచి కమలాకర్, రామగుండం నుంచి కోరుకంటి చందర్, మంథని నుంచి పుట్ట మధు.. ఈ ముగ్గురూ మున్నూరుకాపు సామాజికవర్గం వారు కావడం విశేషం. సుంకె రవిశంకర్(చొప్పదండి), రసమయి బాలకిషన్(మానకొండూరు) మాదిగ, కొప్పుల ఈశ్వర్(ధర్మపురి) మాల సామాజిక వర్గానికి చెందివారు కావడం గమనార్హం. ఏడుగురు మూడోసారి.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాతజిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల్లో ఏడుగురు నాయకులు బీఆర్ఎస్ టికెట్‌పై మూడోసారి పోటీ చేస్తున్నారు. అందులో కేటీఆర్(సిరిసిల్ల), సతీశ్‌బాబు(హుస్నాబాద్), మనోహర్‌రెడ్డి(పెద్దపల్లి), పుట్ట మధు(మంథని), గంగుల కమలాకర్ (కరీంనగర్), కొప్పుల ఈశ్వర్(ధర్మపురి), రసమయి బాలకిషన్ (మానకొండూరు) ఉన్నారు. డాక్టర్ సంజయ్(జగిత్యాల), సుంకె రవిశంకర్(చొప్పదండి) రెండోసారి బీఆర్ఎస్ టికెట్‌పై బరిలోకి దిగనున్నారు. ఇక మిగిలిన నలుగురు లక్ష్మీనర్సింహారావు(వేములవాడ), పాడికౌశిక్‌రెడ్డి(హుజూరాబాద్), డాక్టర్ కె.సంజయ్ (కోరుట్ల), కోరుకంటి చందర్(రామగుండం) తొలిసారిగా బీఆర్ఎస్ బీఫాం మీద పోటీ చేయనున్నారు. -
TS Election 2023: ‘కారు’ టిక్కెట్లు ఖరారు! 'అల్లోల' కి చాన్స్.. జాన్సన్‌కు జాక్‌పాట్..
నిర్మల్: కొన్నిరోజుల నుంచి ఊహిస్తున్నట్లే కారు పార్టీ టికెట్లు ఖరారయ్యాయి. సీనియారిటీతోపాటు ప్రజల్లో ఉన్న పాపులారిటీని పరిగణనలోకి తీసుకుని బీఆర్ఎస్ సోమవారం తమ అభ్యర్థులను ప్రకటించింది. నిర్మల్ సీటు మళ్లీ ఇంద్రకరణుడినే వరించింది. అసమ్మతిరాగం వినిపించినా ముధోల్ టికెట్ విఠల్‌రెడ్డికే దక్కింది. కొంతకాలంగా ఊహిస్తున్నట్లుగానే ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు షాక్ తప్పలేదు. ఆ స్థానాన్ని మారుస్తూ మంత్రి కేటీఆర్ మిత్రుడైన భూక్య జాన్సన్‌నాయక్‌కు ఇచ్చారు. మొత్తం మీద మూడు నియోజకవర్గాల్లో గులాబీశ్రేణులు ఆశించినట్లుగానే పార్టీ అధిష్టానం సీట్లు ఖరారు చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ, కేసీఆర్, కేటీఆర్‌లకు పాలాభిషేకాలు చేస్తూ, స్వీట్లు పంచుతూ సంబురాలు చేశారు. అడ్డులేని ‘అల్లోల’.. నిర్మల్ నియోజకవర్గం నుంచి ఎలాంటి పోటీ, అసమ్మతి వర్గాలు లేకుండా ఉన్న అల్లోలకే మళ్లీ పార్టీ పట్టం కట్టింది. రానున్న ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ఇంద్రకరణ్‌రెడ్డిని ఖరారు చేసింది. సుదీర్ఘ రాజకీయ అనుభవంతోపాటు ఇప్పటికీ ప్రజల్లో ఆయనపై అభిమానం, విశ్వసనీయత ఉండటంతో పార్టీ అల్లోలకే టికెట్ ఇస్తోంది. వ్యక్తిగతంగా వయసు మీద పడుతున్నా.. ఇప్పటికీ ఎక్కడా తగ్గకుండా నిత్యం ప్రజల్లో ఉండటం, సమస్యల పరిష్కారంలోనూ చురుకుగా ఉంటారన్న పేరు రావడం, వీటన్నింటికీ తోడుగా అ టు సీఎం కేసీఆర్, ఇటు మంత్రి కేటీఆర్‌తోనూ సత్సంబంధాలు కలిగి ఉండటం అల్లోలకు కలిసివచ్చాయి. గడ్డిగారికే మొగ్గు.. సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి టికెటిస్తే తామంతా పనిచేసేది లేదని కొంతకాలంగా ముధోల్‌లో అసమ్మతి రగులుతున్నా.. బీఆర్ఎస్ మాత్రం మళ్లీ గడ్డిగారివైపే మొగ్గు చూపింది. వరుసగా రెండుసార్లు గెలువడం, నియోజకవర్గంలో ఇప్పటికీ ఆయనపై నమ్మకం ఉండటం కలిసివచ్చింది. ఓసీ వర్గాలతో పాటు బీసీల్లో ప్రధానంగా మున్నూరుకాపులు సైతం ఆయనకు మద్దతు పలకడంతో పార్టీ విఠల్‌రెడ్డికే సీటిచ్చింది. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ దండె విఠల్‌తోపాటు సీనియర్లు రాజేశ్‌బాబు, సూర్యకాంత్‌రావు తదితరులు టికెట్ ఆశించారు. ప్రస్తుత బీజేపీ ప్రభావిత పరిస్థితుల్లో ముధోల్‌లో కొత్తప్రయోగం చేసే ఆలోచన పార్టీ చేయలేదన్నది స్పష్టమైంది. సౌమ్యుడిగా పేరున్న విఠల్‌రెడ్డి వైపే బీఆర్ఎస్ మొగ్గు చూపింది. జాన్సన్‌కు జాక్‌పాట్.. ఖానాపూర్ నియోజకవర్గంలో అడుగుపెట్టిన అతితక్కువ సమయంలోనే భూక్య జాన్సన్‌నాయక్ జాక్‌పాట్ కొట్టేశారు. తను అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీటు దక్కించుకున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై తీవ్రంగా ఉన్న వ్యతిరేకతే ఆయనకు పార్టీ పరంగా బలంగా మారింది. జగిత్యాల జిల్లా కు చెందిన జాన్సన్ మంత్రి కేటీఆర్‌కు దగ్గరి మిత్రుడు కావడం, ఆయన సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఖానాపూర్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటం కలిసి వచ్చింది. ప్రధానంగా మంత్రి కేటీఆర్ సపోర్ట్‌తోనే ఆయనకు టికెట్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. -
TS Election 2023: ఎవరి కుర్చీ పదిలం..!? తుదిజాబితా కోసం ఉత్కంఠ!
కరీంనగర్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల కేటాయింపు తలనొప్పిగా తయారైంది. సొంత పార్టీలో అసమ్మతి నేతలు వేర్వేరు కుంపట్లు పెట్టి సిట్టింగ్‌లకు సీట్లు ఇస్తే సహకరించేది లేదని, తమలో ఒకరికి ఇస్తే కలిసి పనిచేస్తామని అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు. రోజుకో నియోజకవర్గంలో అసమ్మతివాదుల సంఖ్య పెరుగుతుండడం.. ఏకంగా పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేయడం, శుభ, అశుభ కార్యక్రమాలకు వెళ్తూ ప్రజలతో మమేకమవుతుండడంతో క్షేత్రస్థాయి క్యాడర్ అయోమయానికి గురవుతోంది. పార్టీ అధిష్టానం నుంచి రెండు, మూడు రోజుల్లో మొదటి విడత జాబితా వస్తుందంటూ వస్తున్న సంకేతాలతో ఉన్న సీటు ఉంటదా..? ఊడుతుందా..? అనే సందిగ్ధంలో ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉన్నారు. ద్వితీయశ్రేణి నాయకులు మాత్రం టికెట్ తమకే అంటూ ఎవరి స్టైల్లో వారు నియోజకవర్గకేంద్రాలు, మండలాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు పార్టీలో జరుగుతున్న తతంగంపై పార్టీ అధిష్టానం ఒకింత దృష్టి సారిస్తూనే అసమ్మతివాదులను బుజ్జగిస్తూ.. వివాదాలు లేకుండా చేసే ప్రయత్నంలో ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీట్ల కేటాయింపు విషయానికి వస్తే వేములవాడ, రామగుండం, మంథని, పెద్దపల్లి, చొప్పదండి తదితర నియోజకవర్గాలలో సొంత పార్టీ నుంచే తీవ్ర అసమ్మతిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది సీట్ల కేటాయింపులో పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. జగిత్యాల జిల్లా.. ► జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌కు టికెట్ కేటాయించే విషయంపై పార్టీలో కొంత అసమ్మతి నెలకొంది. టీఆర్ఎస్ సీనియర్ నేతలు ఓరుగంటి రమణారావు, పి.జితేందర్రావులు టికెట్ కోసం పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ► కోరుట్ల ఎమ్మెల్యేగా ఉన్న విద్యాసాగర్‌రావు అభ్యర్థిత్వాన్ని వీలైతే మార్చి అతని కుమారుడు డాక్టర్ సంజయ్‌ని బరిలో దింపే అవకాశాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ► ధర్మపురి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ప్రస్తుత ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను పార్టీ అధిష్టానం తాను కోరుకుంటే తప్ప అభ్యర్థిత్వాన్ని మార్చబోదని సమాచారం. పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ అభ్యర్థిత్వాన్ని పార్టీ పరిశీలిస్తే ధర్మపురిలో ఎమ్మెల్యే అభ్యర్థి మారే అవకాశాలు ఉండనున్నాయి. కరీంనగర్ జిల్లా.. ► చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను మార్చాల్సిందేనంటూ ఆ నియోజకవర్గానికి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు ఇటీవల కరీంనగర్‌లోని ఓ హోటల్లో సమావేశమై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలోనే తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. వారి అసమ్మతిని చల్లార్చేందుకు మంత్రి గంగుల మంతనాలు జరుపుతున్నారు. అక్కడి నుంచే టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య సొంత పార్టీలోనే రోజురోజుకూ పెరుగుతోంది. మాజీ ఆర్డీవో బైరం పద్మయ్య, కరీంనగర్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, కత్తెరపాక కొండయ్య, బండపల్లి యాదగిరి, గంట కళ్యాణిశ్రీనివాస్ పార్టీ అధిష్టానం వద్ద అభ్యర్థనలు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు. ► మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతున్నా మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఓరుగంటి ఆనంద్ పార్టీ అధిస్టానం వద్ద ప్ర యత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ► హుజూరాబాద్ సీటు కేటాయింపు విషయంలో గతంలోనే జమ్మికుంటలో జరిగిన బహిరంగ సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు తదితరులు ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డికి టికెట్ ఖాయమని సంకేతాలు ఇచ్చారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వొడితెల సతీష్‌బాబు సైతం హుజూరాబాద్ నుంచి పోటీ చేసే విషయంలో ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. హుస్నాబాద్ సీటును పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయిస్తే సతీష్‌బాబు హుజూరాబాద్‌కు రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇటీవలే అక్క డి పార్టీ నేతలు పొనగంటి మల్లయ్య, తుమ్మేటి సమ్మిరెడ్డి అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. అక్క డి నుంచే ఇటీవల పోటీ చేసి ఓడిపోయిన పర్యాటక సంస్థ అబివృద్ధి చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ సతీమణిని సైతం బరిలో దించే అవకాశాలను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ► కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మరోసారి టికెట్ దక్కించుకుని నాలుగో సారి ఎమ్మెల్యేగా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పార్టీలో అసమ్మతి ఏమీ లేకపోవడంతో టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి జిల్లా.. ► రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని ఏకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు నియోజకవర్గకేంద్రంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అసమ్మతివాదులంతా ఏకమై పోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మి నారాయణ, బొగ్గుగని కార్మిక సంఘం నేత మిర్యాల రాజిరెడ్డి తదితరులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వేరుకుంపటి తయారు చేసి తమ పనిలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న కోరుకంటి చందర్ ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. తాజాగా బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి కౌశిక హరిని శుక్రవారం హైదరాబాద్ తీసుకెళ్లి ప్రగతిభవన్‌లో పార్టీ అధిష్టానంతో మాట్లాడించడంతో హరి చేరిక ఖాయమైంది. ఈ పరిణామంతో రామగుండం రాజకీయం రసకందాయంలో పడింది. ► మంథని నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకు టికెట్ కేటాయించవద్దని ఇటీవలే ఆ ప్రాంత మాజీ ప్రజాప్రతినిధులు నాగినేని జగన్మోహన్రావు, మైదం భారతివరప్రసాద్, బందం వసంతరెడ్డి తదితరులు తేల్చిచెప్పడంతో పార్టీ అధిష్టానం మంథనిపై ఫోకస్ పెట్టింది. కాటారం మాజీ జెడ్పీటీసీ చల్ల నారాయణరెడ్డి సైతం టికెట్ రేస్‌లో ఉన్నట్లు వినికిడి. జెడ్పీ చైర్మన్‌గా ఉన్న పుట్ట మధు మాజీ ఎమ్మెల్యే కావడం.. పార్టీలో బలమైన నాయకుడు కావడంతో టికెట్ ఆయనకే దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ► పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి మరోసారి టికెట్ కేటాయింపు వద్దని మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్.రాజయ్య నిరసన వ్యక్తం చేసి ఏకంగా పార్టీకి గుడ్‌బై చెప్పారు. వారంతా ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. నల్ల మనోహర్‌రెడ్డి, బొద్దుల లక్ష్మణ్ సైతం పార్టీ అధిష్టానం వద్ద తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరినట్లు వినికిడి. నియోజకవర్గవ్యాప్తంగా ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. టికెట్ కేటాయింపు వ్యవహారం ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. సిరిసిల్ల జిల్లా.. ► వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేశ్ అభ్యర్థిత్వం ఈసారి మార్పు తప్పదంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. పౌరసత్వ వివాదం తేలకపోవడం.. ప్రజలకు అందుబాటులో ఉండరనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో బీఆర్ఎస్లో చేరిన చల్మెడ లక్ష్మీనరసింహారావుకు టికెట్ కేటాయింపు ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు పార్టీ అధిష్టానం సూచనతోనే ఎన్నికల కార్యాలయం ఓపెన్ చేసి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆ ప్రాంతానికి చెందిన ఏనుగు మనోహర్‌రెడ్డి, ఎన్ఆర్ఐ డాక్టర్ గోలి మోహన్ కూడా పార్టీ అధిష్టానం వద్ద తన పేరు పరిశీలించాలని కోరుతున్నట్లు సమాచారం. ► సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు టికెట్ ఖాయం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పేరిట జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ మరోసారి విజయఢంకా మోగించేందుకు తనదైన శైలిలో ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. -
ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు
-
‘డబుల్’ ఇళ్లు పూర్తయ్యేదెప్పుడో..! ఆరేళ్లుగా సాగుతున్న పనులు
బెల్లంపల్లి: పేదల సొంతింటి కల సాకారం చేయాలనే లక్ష్యంతో బెల్లంపల్లిలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. పనులు నత్తనడకన సాగుతున్నాయి. కన్నాల శివారు జాతీయ రహదారిని ఆనుకుని 2017 జూన్ 10న ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై ఆరేళ్లు కావస్తుండగా ఇప్పటికీ పూర్తి కాలేదు. అనేక అవరోధాలతో అపసోపాలు పడుతూ ప్రస్తుతం సగానికి పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తుది దశకు చేరాయి. రూ.968 లక్షల అంచనాతో 160 2బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. నిర్మాణ వ్యయం యేటా పెరుగుతుండగా ఇప్పటికే పూర్తి కావాల్సిన ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశతో లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. తుది దశలో పనులు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన పైపులైన్ పనులు కొనసాగుతున్నాయి. మరోపక్క పైపులైన్ పనులు నిర్వహిస్తున్నారు. కొన్ని ఇళ్లకు తలుపులు, కిటికీలు బిగించాల్సి ఉంది. ఆయా పనులు పూర్తయితే దాదాపు ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లే. 160 ఇళ్లకు గాను పైపులైన్ పనులు 100 ఇళ్ల వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్‌కు గత రెండేళ్లుగా బిల్లులు చెల్లించపోవడంతో ఆలస్యం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కేటాయిపులపై ఆశలు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ వరకు జరిగే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తంతు ప్రారంభం కాకముందే పెండింగ్ పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందస్తుగానే అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను పేదల పరం చేసి ఎన్నికలకు వెళ్లాలనే ధృడ సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బెల్లంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులు తుది దశలో ఉండడంతో పేదలు ఆశలు పెంచుకుంటున్నారు. నోటిఫికేషన్ వచ్చేలోగానే అర్హులకు కేటాయించే అవకాశాలు ఉంటాయని చర్చించుకుంటున్నారు. గృహలక్ష్మి వైపు చూపులు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఈసారి కూడా పూర్తికాని పరిస్థితులు ఏర్పడితే లబ్ధిదారులు గృహలక్ష్మి పథకం వైపు దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంతింటి స్థలం ఉన్న లబ్ధిదారులకు నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించడంతో పేదల్లో ఆశలు రేకేత్తిస్తున్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో ప్రభుత్వ, సింగరేణి లీజు భూములు ఉన్నాయి. ఇటీవలనే ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు పట్టాలు కూడా జారీ చేస్తున్నారు. మున్సిపాలిటీ వ్యాప్తంగా 10 వేల మందికి ఇళ్లపట్టాలు వచ్చే అవకాశాలు ఉండగా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తికాని పక్షంలో నివేశన స్థలం ఉన్న పేదలు గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సమాలోచనలు చేస్తున్నారు. పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్లాస్టరింగ్ పనులు నిర్వహిస్తున్నారు. కొన్ని ఇళ్లకు పైపులైన్ పనులు నిర్వహిస్తున్నారు. వీలైనంత త్వరగా ఇళ్లనిర్మాణ పనులు పూర్తి చేయించడానికి చర్యలు తీసుకుంటున్నాం. పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపాం. బిల్లుల చెల్లింపు అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. – పెద్దయ్య, ఆర్అండ్బీ ఇంచార్జి ఈఈ, మంచిర్యాల -
తనువు బీఆర్ఎస్.. మనసు కాంగ్రెస్
బీఆర్ఎస్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి వలస నాయకులే ఎక్కువగా ఉన్నారు. పార్టీలో ఉన్నప్పటికీ తమకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని ఆవేదన చెందుతున్నారు. తమకు ప్రాధాన్యత ఇవ్వని పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు. సన్నిహితుల వద్ద తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఆయా నియోజకవర్గాలు, మండలాల్లో అధికారం కొద్దిమంది నాయకుల చేతుల్లోనే కేంద్రీకృతం అయిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులైతే తమకు ఏమాత్రం న్యాయం జరగడం లేదని బాహాటంగానే అంటున్నారు. బీఆర్ఎస్లో ఉన్న పలువురు నాయకులు, సీనియర్ కార్యకర్తలు మాత్రం పార్టీ మళ్లీ గెలవాలనే ఆకాంక్షను మనస్ఫూర్తిగా వ్యక్తం చేయకపోతుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : శాసనసభ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో అన్ని వర్గాల్లో రాజకీయ చర్చలే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్లో పనిచేస్తున్న అన్ని మండలాలు, మున్సిపల్ డివిజన్ల పరిధిలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల మధ్య రానున్న ఎన్నికల ఫలితాల విషయమై ఎడతెగని విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులు, శ్రేణులు మాత్రం ఎలాగైనా వచ్చేసారి తాము గెలవాలనే లక్ష్యంతో బహిరంగంగా మాట్లాడుతున్నారు. అయితే బీఆర్ఎస్లో ఉన్న పలువురు నాయకులు, సీనియర్ కార్యకర్తలు మాత్రం మళ్లీ గెలవాలనే ఆకాంక్షను మనస్ఫూర్తిగా వ్యక్తం చేయకపోతుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. వీళ్లంతా సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండి క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన వారు కావడం గమనార్హం. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నప్పటికీ తమకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని ఆవేదన చెందుతున్నారు. తమకు అత్యంత నమ్మకమైన వారి వద్ద సదరు నాయకులు బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే తమకు ఏమాత్రం ప్రాధాన్యత దక్కదని, అందుకే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నట్లు చెబుతుండడం విశేషం. అంటే ఇక్కడ మనిషి ఒకచోట, ఆలోచన ఒకచోట అన్నమాదిరిగా.. బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటుండడం గమనార్హం. కాంగ్రెస్, టీడీపీల్లో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో స్థానికంగా వెలుగు వెలుగుతూ అందరికీ అందుబాటులో ఉన్నామని, మళ్లీ అలాంటి పరిస్థితి రావాలంటే తాము ఉన్న బీఆర్ఎస్ గెలవకూడదని కోరుకుంటుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. తమకు ప్రాధాన్యత దక్కనప్పుడు ఇందులో ఉండి ఏం లాభమని అంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఆయా నియోజకవర్గాలు, మండలాల్లో అధికారం కొద్దిమంది నాయకుల చేతుల్లోనే కేంద్రీకృతం అయిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైరవీలు, భూదందాలు సహా తదితర వ్యవహారాల్లో ఆయా మండలాల్లో ఒకరిద్దరు నాయకులదే హవా నడుస్తోందని అనేకమంది నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. ఇక స్థానిక ప్రజాప్రతినిధులు అయితే తమకు ఏమాత్రం న్యాయం జరగడంలేదని బాహాటంగానే అంటున్నారు. జిల్లాలో పలువురు సర్పంచులు బిల్లులు రావడంలేదని ఆత్మహత్యాయత్నాలకు సైతం పాల్పడిన ఘటనలు ఉన్నాయి. జిల్లాలో కల్లెడ సర్పంచ్ లావణ్య ప్రసాద్‌గౌడ్ దంపతులపై కేసులు పెట్టిన వైనంపై స్థానిక ప్రజాప్రతినిధులు గుస్సాగా ఉన్నారు. ఇక జిల్లాలో వివిధ మండలాల్లో బీఆర్ఎస్లో వర్గాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు కొన్ని వర్గాలను ప్రోత్సహించి తమ విషయంలో పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు వివిధ అంశాల్లో నటిస్తున్నారని, తాము కూడా నటించాల్పి వస్తోందని పలువురు బీఆర్ఎస్ నాయకులు సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారని సమాచారం. మరోవైపు తమను గాలికి వదిలేసిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకుల్లో కొందరికి అన్నిరకాలుగా సహకరిస్తూ కోవర్టు వ్యవహారాలు నడపడం పట్ల బీఆర్ఎస్లో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్లో ఆది నుంచి ఉన్న ఉద్యమకారులు మాత్రం తమ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందని చెబుతున్నారు. రైతు రుణమాఫీ విషయంలో ఈసారి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పలువురు బీఆర్ఎస్ నాయకులే అంటుండడం గమనార్హం. ఇందులో భాగంగా పలువురు రుణాలను సైతం ఎక్కువ మొత్తంగా తీసుకుంటుండడం విశేషం. కాంగ్రెస్ వస్తే రుణమాఫీ వస్తుందని రైతులతో పాటు సదరు బీఆర్ఎస్ నాయకులు సైతం విశ్వసిస్తుండడం ఆలోచింపజేస్తోంది. మరోవైపు ధరణి సమస్యల విషయంలోనూ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. డబుల్ ఇళ్ల విషయమై నిలదీయాలని ప్రజలను ప్రోత్సహిస్తుండడంతో పాటు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయమై ఆలోచించాలని యువతకు చెబుతున్నారు. మొత్తంమీద గతంలో కాంగ్రెస్, టీడీపీల్లో సుదీర్ఘకాలం పాటు పనిచేసి ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ గెలవాలంటూ వివిధ చర్చల్లో ఆకాంక్షలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. -
పోచారంకు సీఎం కేసీఆర్ గట్టిగా చెప్పారా? అందుకే నిర్ణయం మార్చుకున్నారా?
స్పీకర్ గా పని చేసిన వారు ఓడిపోతారనే సాంప్రదాయానికి ప్రస్తుత సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా చెక్ పెట్టాలని చూస్తున్నారు సీఎం కేసీఆర్. ఇద్దరు తనయులలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఇప్పుడు తన పంథాను మార్చుకున్నారా అంటే ఔననే చెప్పాలి. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. జోరుగా రిటైర్మెంట్పై చర్చ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయరని రిటైర్మెంట్ ప్రకటిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఒకవేళ కచ్చితంగా పోటీ చేయాల్సి వస్తే జహీరాబాద్ పార్లమెంట్ కు పోటీ చేస్తారని, తనయులకు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తారని చర్చ జోరుగా సాగింది. ఆ ఊహాగానాలకు తెర దించుతూ రాబోయే ఎన్నికల్లో ఆరో సారి పోటీ చేయడం ఖాయమని తాజాగా ఆయన చేసిన ప్రకటన పుకార్లకు ఫుల్ స్టాఫ్ పెట్టినట్లయింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో ఈ దఫా స్పీకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయరనే ప్రచారం జోరుగా సాగింది. అందుకు అనుగుణంగా కామారెడ్డి జిల్లాలోని పాత రెండు మండలాల బాధ్యతలను ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డికి, నిజామాబాద్ జిల్లాలోని పాత రెండు మండలాలను తనయుడు సురేందర్ రెడ్డికి అప్పగించారు. రెండు జిల్లాల్లో విస్తరించిన నియోజకవర్గ బాధ్యతలను వారే చూసుకునేవారు. చదవండి:వరంగల్: చెప్పులతో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు! ఈ నియోజక వర్గంలో సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గిరిజన లంబాడా తండాలు కూడా బాగా ఉంటాయి. రెండు జిల్లాల పరిధిలో నియోజక వర్గం ఉంటుంది. అయితే సీనియర్ ఎమ్మెల్యే గా మంత్రిగా స్పీకర్ గా బాధ్యతలు చేపట్టి ఎదురులేని లీడర్ గా ఎదిగారు పోచారం. సభాపతిగా హైదరాబాద్ కు పరిమితమవడం, వయస్సు మీద పడడంతో కొంత ఇబ్బంది పడి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని చర్చ జరిగింది. 2018లోనే తనకు టికెట్ వద్దని కోరినప్పటికీ కేసీఆర్ వినకుండా పోచారానికే టికెట్ ఇవ్వడంతో తప్పనిసరిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం ఆ తర్వాత ఆయనకు సభాపతి బాధ్యతలను అప్పగించారు. సభాపతి కావడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నా.. పోచారం ఇటీవల కాలంలో మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో, ఆత్మీయ సమ్మేళనాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సర్వేల్లో ఏం తేలింది? సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో చేసిన సర్వేల్లో నాలుగు నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందని సర్వే రిపోర్టులు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే క్యాండేట్ మారితే ఓడిపోయే నియోజకవర్గాల్లో బాన్సువాడ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఈసారి కూడా పోచారంనే పోటీ చేయాలని కోరినట్లు తెలిసింది. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనయుల భవిష్యత్తు గురించి బాధ్యత తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి పోటీకి సిద్దమయ్యారు. సై అనక తప్పలేదా? బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ క్యాండిడెట్ గా ప్రకటించిన మల్యాద్రి రెడ్డికి సెటిలర్ల మద్దతు దొరికిందని తెలుస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ పోచారంతోనే పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారనే వాదనలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేసినా వారి పోటీ వల్ల బీఆర్ఎస్ కే బలం చేకూరుతుందనే వాదనలు లేకపోలేవు. బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండటం పోచారం కు ప్లస్ పాయింట్. పైగా సమస్యలను ఓపిగ్గా విని పరిష్కరిస్తారని, నియోజకవర్గంలో పనులు కూడా చేస్తారని పోచారానికి మంచి పేరుంది. కానీ, ఈసారి కుమారులు పోటీ చేస్తే జనాల నుంచి మద్దతు పూర్తి స్థాయిలో దొరకదనే విషయం సర్వేలో తేలినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ దఫా గెలిచి తరవాత వారసత్వానికి బాధ్యతలు అప్పగించే ఆలోచనతో పోటీకి సై అనాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. చదవండి:కేసీఆర్ సర్కార్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం -
బెంగళూరులో పెరిగిన ఓటింగ్ శాతం
-
కర్ణాటక పోలింగ్ గురించి ఇన్ఫోసిస్ సుధా మూర్తి మరియు గాలి లక్ష్మి అరుణ
-
కలి‘విడి’గానే! చర్చనీయాంశంగా కారు – కామ్రేడ్ల స్నేహబంధం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికల కార్యాచరణను అమలు చేస్తున్నాయి. కానీ ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు. అయినప్పటికీ అధికార బీఆర్ఎస్ – వామపక్షాల పొత్తు అంశం మాత్రం గత కొన్నాళ్లుగా చర్చనీయాంశమవుతోంది. ఆ పార్టీల నేతలు పోటీలు పడుతూ దీన్ని తెరపైకి తెస్తున్నారు. తాజాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నియోజకవర్గంలో చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేస్తాయని, ఈ అవగాహనలో భాగంగా తాము అడిగే మొదటి స్థానం పాలేరేనని, ఇక్కడ తాము పోటీ చేస్తే మంచోళ్లంతా తమకే ఓట్లు వేయాలని ఆయన కోరారు. పొత్తు చర్చలు ప్రారంభం కాకుండానే ఆయన సీపీఎం పోటీ చేసే స్థానాలపై మాట్లాడటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ఓ సభలో కూడా ఇక్కడి నుంచి సీపీఎం కచ్చితంగా పోటీ చేస్తుందంటూ తమ్మినేని చెప్పుకొచ్చారు. తమ్మినేని మాత్రమే కాదు.. తాము కచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్న అసెంబ్లీ స్థానాల పరిధిలోని సీపీఎం, సీపీఐ నేతలు కూడా ఆయా సందర్భాల్లో బీఆర్ఎస్తో పొత్తు, తాము పోటీ చేసే నియోజకవర్గాలను ప్రస్తావిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని, కొత్తగూడెం నుంచి తాను తప్పనిసరిగా పోటీ చేస్తానని పార్టీ కేడర్‌కు చెపుతున్నారు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ ఆలోచన ఏ విధంగా ఉందన్నది బయటపడక పోవడంతో.. మునుగోడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ పార్టీల మధ్య ఏర్పడిన స్నేహ బంధం ఎంత దూరం కొనసాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. గౌరవప్రదమైన స్థాయిలో అంగీకారం! వామపక్ష పార్టీల్లో జరుగుతున్న చర్చల ప్రకారం.. బీఆర్ఎస్తో పొత్తు కుదిరితే మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు అడగాలని సీపీఎం, సీపీఐలు నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. పాలేరు, వైరా, మధిర, భద్రాచలం, ఖమ్మం, నకిరేకల్, మిర్యాలగూడ, నల్లగొండ, ఇబ్రహీంపట్నం స్థానాలు కావాలని సీపీఎం అడిగే అవకాశం ఉండగా కొత్తగూడెం, దేవరకొండ, హుస్నాబాద్, బెల్లంపల్లి, వైరా, ఇల్లందు, మునుగోడు నియోజకవర్గాలను సీపీఐ కోరే అవకాశముంది. అయితే కోరినన్ని స్థానాలు ఇవ్వకపోయినా గౌరవప్రదమైన స్థాయిలో పొత్తును అంగీకరించే యోచనలో రెండు పార్టీలూ ఉన్నట్టు సమాచారం. కనీసం మూడు అసెంబ్లీ సీట్లు, ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సభ్యత్వం కోసం బీఆర్ఎస్ను కోరే విషయమై సీపీఎం నేతలు అంతర్గతంగా చర్చించికుంటున్నట్టు తెలుస్తోంది. ఇక సీపీఐ కూడా కనీసం మూడు అసెంబ్లీ స్థానాలు కావాల్సిందేనని పట్టుబట్టే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ, ఇతర పదవుల గురించి కూడా చర్చించాలనే యోచనలో సీపీఐ పెద్దలున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా పొత్తు విషయంలో తగ్గేదేలేదని ఆ పార్టీలు చెబుతున్నాయి. తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నందున ఆ రెండు నియోజకవర్గాల తర్వాతే ఏ స్థానం గురించైనా చర్చ జరుగుతుందని వామపక్ష పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పెద్దల మదిలో ఏముందో? కామ్రేడ్ల ఆలోచనలు ఎలా ఉన్నా.. వారితో తమ అనుబంధంపై బీఆర్ఎస్ పెద్దల మదిలో ఏముందన్నది అంతు పట్టడం లేదు. పలు సందర్భాల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం తెరపైకి వస్తున్నప్పటికీ ఆ పార్టీ కీలక నేతలెవరూ ఎక్కడా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయడం లేదు. సీఎం కేసీఆర్ గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశాన్ని కనీస మాత్రంగా కూడా ప్రస్తావించడంలేదు. అయితే వామపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇప్పిస్తామని, ఆయా స్థానాల్లో తామే పోటీ చేస్తామని స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వామపక్ష పార్టీల నేతలకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అంశం కూడా ఎక్కడా చర్చకు రావడం లేదు. ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం! వామపక్ష పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతాయి కానీ, అధికారికంగా పొత్తు కుదిరే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తుండటం సందిగ్ధతకు తావిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకోలేదని, ఆ రెండు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, 2023లో లెఫ్ట్‌తో కలిసి వెళితే తాము గతం కంటే బలహీనపడ్డామని తామే అంగీకరించినట్టు అవుతుందనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో లెఫ్ట్ నాయకుల్లో ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారని, వారు కోరుతున్న స్థానాలను వదులుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధంగా లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ స్థానాల్లో కేడర్‌ను నిలబెట్టుకునేదెట్టా? లెఫ్ట్‌తో పొత్తు అంశం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వామపక్షాలు ఖచ్చితంగా అడుగుతాయని భావిస్తున్న స్థానాల్లో భద్రాచలం మినహా మిగిలిన చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆయా స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కందాల ఉపేందర్‌రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రవీంద్రనాయక్, వనమా వెంకటేశ్వరరావు తదితరులకు తమ నియోజకవర్గాల్లో కేడర్‌ను నిలబెట్టుకోవడం కత్తిమీద సాములా మారుతోంది. ఆయా స్థానాలు లెఫ్ట్ పార్టీలకు వదిలివేస్తారనే సంకేతాల నేపథ్యంలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎక్కడ జారిపోతుందోననే ఆందోళన స్థానిక బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. పలువురు కమ్యూనిస్టు నాయకులకు ఏకంగా సీఎం కేసీఆర్ స్థాయిలో హామీ లభించిందన్న ప్రచారం కూడా వారికి మింగుడు పడడం లేదు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదాస్పద ప్రకటనలకు కూడా సిద్ధమవుతున్నారు. కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా కొద్దిరోజుల క్రితం.. అక్కడ జూలకంటి రంగారెడ్డి సీపీఎం తరఫున పోటీ చేస్తే గెలుపు బాధ్యతలు తీసుకోవాలని చెప్పినా, ఆ తర్వాత సీపీఎం నేతలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగూడెంలో అయితే వనమాతో పాటు జలగం వెంకట్రావు, గడల శ్రీనివాసరావు తదితరులు తమకంటే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. మొత్తంమీద లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఆశావహులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కోరే విషయమై సీపీఎం నేతలు అంతర్గతంగా చర్చించికుంటున్నట్టు తెలుస్తోంది. ఇక సీపీఐ కూడా కనీసం మూడు అసెంబ్లీ స్థానాలు కావాల్సిందేనని పట్టుబట్టే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ, ఇతర పదవుల గురించి కూడా చర్చించాలనే యోచనలో సీపీఐ పెద్దలున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా పొత్తు విషయంలో తగ్గేదేలేదని ఆ పార్టీలు చెబుతున్నాయి. తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నందున ఆ రెండు నియోజకవర్గాల తర్వాతే ఏ స్థానం గురించైనా చర్చ జరుగుతుందని వామపక్ష పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం! వామపక్ష పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతాయి కానీ, అధికారికంగా పొత్తు కుదిరే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తుండటం సందిగ్ధతకు తావిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకోలేదని, ఆ రెండు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, 2023లో లెఫ్ట్‌తో కలిసి వెళితే తాము గతం కంటే బలహీనపడ్డామని తామే అంగీకరించినట్టు అవుతుందనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో లెఫ్ట్ నాయకుల్లో ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారని, వారు కోరుతున్న స్థానాలను వదులుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధంగా లేదని, స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ స్థానాల్లో కేడర్‌ను నిలబెట్టుకునేదెట్టా? లెఫ్ట్‌తో పొత్తు అంశం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వామపక్షాలు ఖచ్చితంగా అడుగుతాయని భావిస్తున్న స్థానాల్లో భద్రాచలం మినహా మిగిలిన చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆయా స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కందాల ఉపేందర్‌రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రవీంద్రనాయక్, వనమా వెంకటేశ్వరరావు తదితరులకు తమ నియోజకవర్గాల్లో కేడర్‌ను నిలబెట్టుకోవడం కత్తిమీద సాములా మారుతోంది. ఒకవేళ ఆయా స్థానాలు లెఫ్ట్ పార్టీలకు వదిలివేస్తే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎక్కడ జారిపోతుందోననే ఆందోళన స్థానిక బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదాస్పద ప్రకటనలకు కూడా సిద్ధమవుతున్నారు. కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. మిర్యా లగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా కొద్దిరోజుల క్రితం.. అక్కడ జూలకంటి రంగారెడ్డి సీపీఎం తరఫున పోటీ చేస్తే గెలుపు బాధ్యతలు తీసుకోవాలని చెప్పినా, ఆ తర్వాత సీపీఎం నేతలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగూడెంలో అయితే వనమాతో పాటు జలగం వెంకట్రావు, గడల శ్రీనివాసరావు తమకంటే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. మొత్తంమీద లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఆశావహులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. -
కర్ణాటకలో కాంగ్రెస్‌దే హవా! శరద్ పవార్
కర్ణాటకలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా అని ధీమాగా చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇటర్వ్యూలో మాట్లాడుతూ..కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసే గెలుస్తుందని నమ్మకంగా చెప్పారు. ఐతే ఈ ఎన్నికలను వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల కోణంలో చూడలేం. కానీ బీజేపీ మాత్రం ఎన్నికల ప్రచారంలో జాతీయ అంశాలను రాష్ట్ర సమస్యలతో ముడిపెట్టే యత్నం చేస్తోంది. నా అంచనా ప్రకారం కర్ణాటకలో రెండు రకాలు ఎన్నికలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఇవి జాతీయ ఎన్నికలు కానీ రాష్ట్రాలకు సాధారణ ఎన్నికలే. ఐతే రాష్ట్ర ఎన్నికల్లో వేరే గేమ్ స్ట్రాటజీ ఉంటుంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో బీజేపీ ప్రభుత్వాలు కావు అందువల కర్ణాటకలో కచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే రాష్ట్రాలలో బీజేపీయేతర పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలుపొందాయో అందరికీ తెలుసు కాబట్టి రాష్ట్ర ఎన్నికల విషయానికి వస్తే వాస్తవ పరిస్థితులను విభిన్నంగా ఉంటాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ఎమ్మెల్యేలు విడిపోయి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి అనేక రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలే అధికారంలో ఉన్నాయి. వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల గురించి ప్రతిపక్షాలు కలిసి ఏదో ఒకటి చేయాలని లేకుంటే బీజేపీని ఓడించడం కష్టం. అందరూ ఐక్యంగా ఉండి చేస్తే గానీ బీజేపీని మట్టికరిపించలేం అని పవార్ అన్నారు. కాగా, ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. 2008లో దేశంలో దక్షిణాది ప్రాంతంలో తొలిసారిగా అధికారంలోకి రావడంతో అదే రాష్ట్రంలో మరో దఫా విజయం సాధించాలని బీజేపీ గట్టిగా యత్నిస్తోంది. (చదవండి: కర్ణాటక ఎన్నికల్లో పన్నీరు శిబిరం) -
ఆకాశంలో సగమెక్కడ?
మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప దాటడం లేదనడానికి ఇది అత్యుత్తమ ఉదాహరణ. మహిళా సాధికారికత, స్త్రీ–పురుష సమానత్వం గురించి గొప్పలు చెప్పే మన ప్రజాస్వామ్య దేశంలో శాసన నిర్మాణ వ్యవస్థలో స్త్రీల భాగస్వామ్యం ఇప్పటికీ అతి తక్కువగానే ఉంది. పార్లమెంట్ శీతకాల సమావేశాల సాక్షిగా ఇది మరోసారి వెల్లడైంది. మన పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళా ఎంపీల వాటా 15 శాతం లోపలే. ఇక, దేశవ్యాప్తంగా రాష్ట్రాల శాసనసభల్లో మహిళా ఎమ్మెల్యేల సగటు సంఖ్య 8 శాతమే. ఇటీవలి గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లోనూ ఇదే కథ పునరావృతమైంది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును మరోసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కేంద్ర సర్కార్ సమాధానం కోసం సుప్రీమ్ కోర్ట్ ఎదురుచూస్తున్న వేళ తాజా పరిణామాలు చట్టసభల్లో స్త్రీల ప్రాతినిధ్యంపై చర్చ రేపుతున్నాయి. న్యాయశాఖ మంత్రి లోక్‌సభలో వెల్లడించిన గణాంకాలు రాజకీయ పార్టీల చిత్తశుద్ధి లేమిని కళ్ళకు కడుతున్నాయి. జనాభాలో సగం ఉన్న మహిళా లోకానికి చట్టసభల్లో 33 శాతం కనీస రిజర్వే షన్ల చట్టం చేయడానికి రాజకీయ నేతలు ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. నిజానికి, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారిగా 1996లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అనేక పరిణామాలు, అపరిమిత ఆలస్యం తర్వాత 2010లో బిల్లును రాజ్యసభ ఆమోదించింది. అయితే, నాటి 15వ లోక్‌సభ కాలపరిమితి తీరిపోవడంతో ఆ బిల్లు మురిగి పోయింది. కొత్తగా మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లు తేవాలని ఇటీవల సైతం తృణమూల్ సహా పలు పార్టీలు ప్రభుత్వాన్ని కోరాయి. లైంగిక సమన్యాయానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతున్న ఢిల్లీ పెద్దలు పార్లమెంట్లో బిల్లు తేవడానికి మాత్రం పార్టీల మధ్య ఏకాభిప్రాయం కావాలనే సాకుతో తాత్సారం చేస్తున్నారు. మహిళల అభ్యున్నతి, సంక్షేమం గురించి గొప్పగా చెప్పే మన రాజకీయ పక్షాలు వాస్తవంలో అందుకు తగ్గట్టుగా వ్యవహరించడం లేదనేది నిష్ఠురసత్యం. ఇటీవల గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికైనవారిలో 8.2 శాతమే మహిళలు. ఇక, 68 మంది సభ్యుల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ మాటకొస్తే ఆ రాష్ట్రంలోని మొత్తం 412 మంది నామినీల్లో కేవలం 24 మందే మహిళా అభ్యర్థులు. అంటే, బరిలోకి దిగిన స్త్రీలు 6 శాతమే. చదువులో, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు, మహిళా పారిశ్రామికవేత్తలకు వడ్డీ లేని రుణాలు, చదువుకొనే ఆడపిల్లలకు ఉచితంగా సైకిళ్ళు – స్కూటర్లు, నెలవారీ భత్యం – ఇలా ఎన్నికల్లో వాగ్దానాల వర్షానికి అంతు లేదు. పార్టీల టికెట్ల పంపిణీలో మాత్రం మగాళ్ళకే పెద్ద పీట. బీజేపీ ఆరుగురు, ఆప్ అయిదుగురు, కాంగ్రెస్ ముగ్గురు స్త్రీలనే బరిలోకి దింపాయి. చిత్రంగా హిమాచల్‌లో ఓటేసినవారిలో పురుషుల కన్నా స్త్రీలే అధికం. ఓటర్లలో దాదాపు సగం స్త్రీలే ఉన్న గుజరాత్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడ బరిలో మహిళా అభ్యర్థులు 9 శాతమే. బీజీపీ 18 మందినీ, కాంగ్రెస్ 14 మందినీ పోటీలో పెట్టాయి. చివరకు గత అసెంబ్లీలో రికార్డు స్థాయిలో 17 మంది మహిళా ఎమ్మెల్యేలుంటే, తాజా అసెంబ్లీలో ఆ సంఖ్య 14కు పరిమితమైంది. ఈ ధోరణిని మార్చడానికి జరుగుతున్న కృషి అంతంత మాత్రమే. లోక్‌సభలో, శాసనసభల్లో మూడింట ఒక వంతు స్థానాలను స్త్రీలకే రిజర్వ్ చేయడానికి ఉద్దేశించినదే – 2008 నాటి 108వ రాజ్యాంగ సవరణ బిల్లు. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ పైకి సూత్రప్రాయంగా అంగీకరిస్తు న్నాయి. తీరా సభలో ఆమోదానికొచ్చేసరికి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. బలహీన వర్గా లకూ, స్త్రీలకూ తగు ప్రాతినిధ్యం కల్పించినప్పుడే ప్రజాస్వామ్యం పటిష్ఠమవుతుంది. కానీ ప్రపంచ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాల్లో అతిపెద్దదైన భారత్‌లోనే పరిస్థితి తద్భిన్నంగా ఉండడం శోచనీయం. స్త్రీ పురుషులిరువురూ సమానులే అన్నది రాజ్యాంగ అభిభాషణ. కానీ, భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలంటూ గుండెలు చరుచుకుంటున్న నాటికి కూడా అది వాస్తవంలోకి రాలేదన్నది విషాదం. దేశజనాభాలో సగం ఉన్నవారికి శాసన నిర్మాణంలో అతి తక్కువ స్థానమివ్వడం ఏ రకంగా సబబు? ప్రపంచ పటంపై ఏ రకంగా శోభస్కరం. 2022 మే లెక్కల ప్రకారం అమెరికా, ఐరోపా, సహారా ఎడారికి దక్షిణాన ఉండే సబ్–సహారా ఆఫ్రికా ప్రాంతంలో సైతం జాతీయ పార్లమెంటుల్లో మహిళా ప్రాతినిధ్యం ప్రపంచ సగటు (26.2 శాతం) కన్నా ఎక్కువే. చివరకు నేపాల్ (34 శాతం), బంగ్లాదేశ్ (21), పాకిస్తాన్ (20), భూటాన్ (17)లు సైతం మనకన్నా మెరుగ్గా ఉన్నాయి. సైనికోద్యోగాల నుంచి ప్రపంచదేశాల ఆధిపత్యం దాకా అన్నిటా మహిళలు ముందున్న రోజుల్లో మన చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉందంటే తప్పు మనదే! సమాజంలో, రాజకీయాల్లో పాతుకుపోయిన పురుషాధిపత్యానికీ, లింగ దుర్విచక్షణకూ అది ప్రతీక. ఇప్పటికీ రిజర్వేషన్ల బిల్లు తేవడానికీ, చట్టం చేయడానికీ ఏకాభిప్రాయమంటూ ఏళ్ళూపూళ్ళూ చేయడం సరికాదు. అసలంటూ మహిళా సాధికారికత పట్ల అంకితభావం ఉంటే, దానికి చట్టం కోసం చూడాల్సిన పనీ లేదు. మనసుంటే మార్గాలెన్నో! పార్టీలన్నీ పెద్ద సంఖ్యలో మహిళలకు టికెట్లిచ్చి, చట్టసభలకు ఎన్నికల బరిలో దింపితే కాదన్నది ఎవరు? ఇన్నేళ్ళలో ఇప్పటికి దేశంలో రెండోసారి ఓ మహిళ రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించారు. ఆకాశంలో సగమంటూ మాటల్లో మనం కీర్తిస్తున్న ఆడవారికి చట్టసభల్లోనూ సముచిత ప్రాధాన్యం ఇవ్వడానికి ఇంతకు మించిన సమయం, సందర్భం మరొకటి ఉండదేమో! -
హిమాచల్ ఫలితాలు: కాంగ్రెస్ విజయంపై స్పందించిన ఖర్గే
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్ అప్డేడ్ 07: 00PM హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ముగిసింది. హిమాచల్‌లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. మొత్తం 68 సీట్లకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ఫిగర్ 35ను దాటేసింది. మొత్తం 40 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీజేపీ 53 స్థానంలో గెలుపొందింది.. ఇతరులు మూడు సీట్లను గెలుచుకున్నాయి. అప్డేడ్ 06: 30PM హిమాచల్ ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం వెనక శ్రమించిన కార్యకర్తలు, పార్టీ నేతలకు కృతజ్ఙతలు తెలిపారు. వారి కృషి వల్లే ఈ ఫలితం లభించిందన్నారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా తమకు సహకరించిందని తెలిపారు. సోనియా గాంధీ ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయన్నారు. ఈ విజయం క్రెడిట్ తను తీసుకోవడం లేదని, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సాధారణమని తెలిపారు. हिमाचल प्रदेश की जनता को इस निर्णायक जीत के लिए दिल से धन्यवाद। सभी कांग्रेस कार्यकर्ताओं और नेताओं को हार्दिक बधाई। आपका परिश्रम और समर्पण इस विजय की शुभकामनाओं का असली हकदार है। फिर से आश्वस्त करता हूं, जनता को किया हर वादा जल्द से जल्द निभाएंगे। — Rahul Gandhi (@RahulGandhi) December 8, 2022 కాగా హిమాచల్ ఎన్నికల్లో విజయం అందించినందుకు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.ఔ అప్డేడ్ 06: 00PM బీజేపీపై ఉన్న అభిమానానికి, పార్టీకి అందించిన మద్దతుకు హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చేందుకు, రాబోయే కాలంలో ప్రజల సమస్యలను లేవనెత్తేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. I thank the people of Himachal Pradesh for the affection and support for the BJP. We will keep working to fulfil the aspirations of the state and raise people’s issues in the times to come. @BJP4Himachal — Narendra Modi (@narendramodi) December 8, 2022 అప్డేడ్ 04: 15PM హిమాచల్ ప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించనుందని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ తెలిపారు. ప్రియాంక గాంధీ 10 పాయింట్ల మ్యానిఫెస్టో అక్కడ పనిచేసిందన్నారు. అయితే గుజరాత్ ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. ప్రచార సమయంలో పరిస్థితి భిన్నంగా ఉందని, బీజేపీకి ఊహించని విజయమని అన్నారు. 2012, 2017, 2022 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. అప్డేడ్ 03: 45PM కాంగ్రెస్ విజయం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 సీట్లకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ఫిగర్ 35ను దాటేసింది. ఇప్పటికే 40 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీజేపీ 53 స్థానంలో గెలుపొందింది.. ఇతరులు మూడు సీట్లను గెలుచుకున్నాయి. అప్డేడ్ 03: 15PM సీఎం జైరాం ఠాకూర్ రాజీనామా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్‌కు పంపినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల తీర్పును శిరసావహిస్తానని తెలిపారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజల హామీలను నెరవేర్చాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. కాగా మండీ జిల్లాలోని సిరాజ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై జైరాం ఠాకూర్ గెలుపొందినప్పటికీ రాష్ట్రంలో బీజేపీ ఓటమి చెందడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. కసుంప్టి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ నేత అనిరుధ్ సింగ్ మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి(బీజేపీ), రాష్ట్ర మంత్రి సురేష్ భరద్వాజ్‌పై 8,655 ఓట్ల తేడాతో గెలుపొందారు. అప్డేట్ 3: 00PM హిమాచల్ ప్రదేశ్ మంత్రి రామ్ లాల్ మార్కండ ఓటమి చెందారు. లాహౌల్ &స్పితి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రవి ఠాకూర్ చేతిలో 1,616 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. అప్డేట్ 2: 300PM హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్పూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి(బీజేపీ రెబల్) అభ్యర్థి ఆశిష్ శర్మ విజయం సాధించారు. అప్డేట్ 2: 00PM కాంగ్రెస్ దూకుడు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే 24 సీట్లలో విజయం సాధించగా.. మరో 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 35ను చేరుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు.. బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించింది. మరో 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేదు. అప్డేట్ 1: 10PM ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్ ధీమా హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోందని, కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌కు తీసుకురాబోమని, కానీ, వారిని కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు బీజేపీ ఏదైనా చేస్తుంది, ఏ స్థాయికైనా వెళ్తుందన్నారు. అప్డేడ్ 11: 25AM ఆధిక్యంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్.. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం 36 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు.. బీజేపీ 28 సీట్లు, ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అప్డేడ్ 11: 05AM రెబల్స్‌తో బీజేపీ చర్చలు హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. మొత్తం 68 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 35 అవసరం. ఈ క్రమంలో ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టింగి బీజేపీ. రెబల్స్‌తో చర్చలు చేపట్టింది. అందుకోసం వినోద్ తావ్డేను హిమాచల్‌కు పంపించినట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ 32, కాంగ్రెస్ 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇరు పార్టీల మధ్య స్వల్ప తేడానే ఉండే అవకాశం ఉన్నందున రెబల్స్‌ను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఈ క్రమంలో ఆపరేషన్ లోటస్ నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేపట్టింది కాంగ్రెస్ అప్డేట్ 10:30AM ► శాసన సభ ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్లు పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలు తలో 32 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అప్డేట్ 9:50AM ► అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలు తలో 33 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఆప్ ఇంకా ఖాతా తెరవలేదు. అప్డేట్ 9:25AM ► హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ 34, బీజేపీ 33, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరలవలేకపోయింది. అప్డేట్ 8:55AM ► పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ ముందంజలోకి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ 33, బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ► హిమచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ 22, కాంగ్రెస్ 22 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ► హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్స్‌లో బీజేపీ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ 17, కాంగ్రెస్ 13 స్థానాల్లో కొనసాగుతున్నాయి. సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్‌లో 68 స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. 11 గంటలకు ఫలితాలపై ఒక అంచనా వస్తుంది. హిమాచల్‌లో మొత్తం 68 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో కొత్త రికార్డులు నెలకొల్పాలని కమలనాథులు తహతహలాడుతున్నారు. ఈ హోరాహోరీ పోరులో గెలుపెవరిదనే ఉత్కంఠ నెలకొంది. డబుల్ ఇంజన్ నినాదం, ప్రధాని మోదీ చరిష్మాతో చరిత్ర సృష్టించాలని బీజేపీ.. అధికార వ్యతిరేకత, ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చే దశాబ్దాల సంప్రదాయం కొనసాగుతుందన్న విశ్వాసంతో కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ పడ్డాయి. తొలిసారి బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుందోనన్న ఆందోళన నెలకొంది. 68 స్థానాలున్న అసెంబ్లీకి నవంబర్ 12న జరిగిన ఎన్నికల్లో 412 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 55 లక్షలకు పైగా ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇదీ చదవండి: ఎంసీడీ.. ఆప్, బీజేపీ మధ్య అధికార పోరుకు కొత్త వేదిక -
.. అయితే మోదీని మార్చడం కష్టమంటారా!
.. అయితే మోదీని మార్చడం కష్టమంటారా! -
బీజేపీని గుజరాత్ ఎన్నికల్లో గట్టేక్కించేది కాంగ్రెసే ...కేజ్రీవాల్ సెటైర్
అహ్మదాబాద్: గుజరాత్లో ఎన్నికల వేళ ఈసారి ఇబ్బందుల్లో ఉన్న బీజేపీ వాహనాన్ని కాంగ్రెస్ బయటకు లాగేందుకు సహకరిస్తోందా? అని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ సెటైర్ వేశారు. 182 స్థానాలున్న గుజరాత్లో డిసెంబర్ 01, 5 తేదిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ఎన్నికల ప్రచార ర్యాలీ సమావేశాల్లో బిజీగా ఉన్నాయి. ఈ మేరకు బీజేపీ పోస్టర్లతో కూడిన ప్రచార ర్యాలీ వాహనం బురదలో ఇరుక్కుపోయింది. దీంతో ఈ వాహనాన్ని కాంగ్రెస్ ప్రచార వాహనం సాయం అందించి బయటకు తీసేందుకు యత్నించింది. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ఎన్నికల్లో ఇరుక్కుపోయిన బీజేపీకి కాంగ్రెసే దిక్కు అంటూ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల ఐఎల్‌యూ-ఐఎల్‌యూ(వాహనాల)ల కథ అంటూ కామెంట్లు చేస్తూ... ఆ ఘటనకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశారు. गुजरात में भाजपा की अटकी हुई चुनावी गाड़ी को बचाने में पूरा ज़ोर लगाती कांग्रेस.. ये है चुनावों में BJP और Congress के ILU-ILU की कहानी 🫶🏻💕 pic.twitter.com/nbBu7GjW6i — AAP (@AamAadmiParty) November 12, 2022 (చదవండి: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. టవర్ ఎక్కి ఆప్ నేత ఆత్మహత్యాయత్నం!) -
అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా.. మోదీ పర్యటనపై బీజేపీ శ్రేణుల్లో చర్చ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సంసిద్ధం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన ఉండనుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి నుంచే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని.. అధికార టీఆర్ఎస్పై దూకుడుగా పోరాడాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారని వివరిస్తున్నాయి. శనివారం రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ తొలుత బేగంపేటలో స్వాగత సభలో, తర్వాత రామగుండం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇందులో బేగంపేట కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ అనుసరిస్తున్న తీరుపై ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తద్వారా ముందస్తుగానే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టవచ్చని అంటున్నాయి. ‘డబుల్ ఇంజన్’ పిలుపుతో కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే.. తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని ఇప్పటికే కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు చెప్తూ వస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని నొక్కి చెప్పే అవకాశ ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ప్రయోజనాలు, కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారని అంటున్నాయి. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మరింత కష్టపడాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాలని పిలుపు ఇవ్వనున్నారని వివరిస్తున్నాయి. ఇంతకుముందు భిన్నంగా.. ఈ ఏడాది మే నెలలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) స్నాతకోత్సవానికి వచ్చిన మోదీ.. బేగంపేట ఎయిర్‌పోర్టులో స్వాగత సభలో మాట్లాడుతూ, టీఆర్ఎస్ వారసత్వ రాజకీయాలు, ప్రభుత్వ అవినీతి, నియంత, అప్రజాస్వామిక పాలన సాగుతోందంటూ విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మూఢ నమ్మకాలతో వ్యవహరిస్తోందనీ ఆరోపించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీకి వచ్చిన మోదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సభలో మాట్లాడారు. కానీ టీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్‌లపై విమర్శలేవీ చేయకుండా.. కేవలం బీజేపీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. శనివారం మాత్రం ఇందుకు భిన్నంగా తనదైన శైలిలో మోదీ రాజకీయ ప్రసంగం చేయవచ్చని అంటున్నారు. ఇక రామగుండం సభలో కేంద్ర పథకాలు, అభివృద్ధిని వివరించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టవచ్చని చెప్తున్నారు. భారీగా కార్యకర్తలను రప్పించేలా.. శనివారం బేగంపేట సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సమీకరించాలని బీజేపీ నిర్ణయించింది. ప్రధానంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి పార్టీ శ్రేణులను తరలించనుంది. ఈ ఏడాది మేలో ఓవైపు ఎండ తీవ్రతతోపాటు ప్రధాని అనుకున్న సమయం కంటే ముందే రావడంతో కార్యకర్తలు సభాస్థలికి చేరుకోవడం ఆలస్యమైంది. ఈసారి ముందుగానే అంటే మధ్యాహ్నం 12 గంటలలోపే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ మేరకు ఏర్పాట్లపై శుక్రవారం రాత్రి బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, నేతలు చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఎన్.రామచంద్రరావు, ఎస్.ప్రకాశ్‌రెడ్డి తదితరులు సమావేశమై సమీక్షించారు. బేగంపేటలో మోదీకి స్వాగతం, వీడ్కోలు, రామగుండంలో స్వాగతం, వీడ్కోలు సందర్భంగా మోదీని కలుసుకునేలా పార్టీలోని వివిధ స్థాయిల నాయకులతో లైనప్‌లను ఏర్పాటు చేశారు. చదవండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక.. -
హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరోసారి ఎన్నికల నగరా మోగింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఢిల్లీలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. వీటి ప్రకారం నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఒకే విడతలో జరుగుతాయి. ♦ మొత్తం నియోజకవర్గాలు: 68 ♦ నోటిఫికేషన్ : అక్టోబర్ 17 ♦ నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 25 ♦ నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 27 ♦ నామినేషన్ల ఉపసంహరణ : అక్టోబర్ 29 ♦ పోలింగ్ : నవంబర్ 12 ♦ ఫలితాలు : డిసెంబర్ 8 ♦ హిమాచల్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య : 55,07,261 ♦ ఓటర్లు పురుషులు – 27,80,208 ♦ మహిళలు – 27,27,016 ♦ మొదటిసారి ఓటర్లు – 1,86,681 ♦ 80+ వయస్సు ఉన్న ఓటర్లు – 1,22,087 ♦ వందేళ్లపై ఉన్న ఓటర్లు – 1,184 ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు కరోనా గురించి ఆందోళన అవసరం లేదని, కానీ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈమేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8తో ముగియనుంది. గుజరాత్ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 18తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం అధికారులు ఈ రెండు రాష్ట్రాల్లో ఇటీవలే పర్యటించారు. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించారు. అనంతరం కొద్ది రోజుల తర్వాత హిమాచల్ షెడ్యూల్ ప్రకటించారు. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీనే అధికారంలో ఉంది. 2017లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలుకు బీజేపీ 99 కైసవం చేసుకొని మరోసారి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 77 స్థానాలకే పరిమితమైంది. హిమాచల్ ప్రదేశ్‌లో 68 స్థానాలకు బీజేపీ 45 సీట్లు గెలవగా.. కాంగ్రెస్ 20 స్థానాల్లో గెలుపొందింది. అయితే ఈసారి ఈ రెండు రాష్ట్రాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆప్, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయతిస్తున్నాయి. 1985 నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో ఏ పార్టీ వరుసగా రెండుసార్లు గెలువలేదు. చదవండి: జ్ఞానవాపీ మసీదు కేసులో శివలింగంపై కోర్టు కీలక తీర్పు -
వలస వచ్చి మామీద పెత్తనమా.. ఎచ్చర్లలో ఎల్లో ఫైట్!
ఆయనో సీనియర్ నేత. మాజీ మంత్రి.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేశారు. ఇదంతా గతం. ఇప్పుడు సీన్ మారింది. మీరొద్దు, మీ పెత్తనం వద్దంటూ అంతా సైడ్ అయిపోతున్నారు. అయినా ఆయన మాత్రం మళ్లీ తనకే టికెట్ కావాలంటూ తనదైన శైలిలో పావులు కదుపుతుండడం పచ్చ పార్టీలో చిచ్చు రేపుతోంది. కిమిడి కళా వెంకటరావు వ్యవహారశైలి ఎప్పుడూ వివాదస్పదమే. సూపర్ సీనియర్ జాబితాలో నెట్టుకొస్తున్నారు తప్పితే క్షేత్ర స్థాయిలో కేడర్‌తో నిత్యం వివాదాలే. 2009లో రాజాం నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో ఎచ్చర్ల నియోజకవర్గానికి కళా వెంకటరావు వలస వెళ్లారు. ఆ ఎన్నికలో పీఆర్పీ తరఫున పోటీచేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరి 2014లో మరోసారి పోటీచేసి విజయం సాధించారు. అయితే వలస నేత కావడంతో.. ఆయనకు, స్థానిక నేతలకు ఏ దశలో పొసగలేదు. ఫలితంగా 2019లో ఘోర ఓటమి చవిచూశారు. 2024లో ముచ్చటగా మూడోసారి ఎచ్చర్ల నుంచి పోటీకి తహతహలాడుతున్నా.. చెప్పుకోదగ్గ నేతలెవరూ ఆయన వెంట లేకపోవడం చర్చనీయాంశమైంది. ఎచ్చర్ల మండలంలో జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, జి.సిగడాం మాజీ ఎంపీపీ బొమ్మన వెంకటేశ్వరరావు, లావేరు మండంలో అలపాన సూర్యనారాయణ, రణస్థలం మండలంలో కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు కళాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించకపోవడం విభేదాలను తేటతెల్లం చేస్తోంది. దాంతో కొత్త టీమ్‌ను తయారు చేసుకునేందుకు కళా వెంకటరావు శ్రమిస్తున్నా ఓ స్థాయి నేతలు వెంట రావడానికి ఆసక్తి చూపడం లేదట. దాంతో ఎవరికి తెలియని నేతలు ఇప్పుడు ఆయన వెంట దర్శనమిస్తున్నారు. ఈసారి ఎలాగైనా టికెట్ సాధించాలనే పట్టుదలతో కళా ఉన్నా.. వ్యతిరేక వర్గీయులు ఆయన్ను లైట్ తీసుకుటుండడం కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. కళాను వ్యతిరేకిస్తున్న నేతలంతా ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎక్కడి నుంచో వలస వచ్చి పెత్తనం చేయాలనుకుంటే కుదరదని, వలస నేత పెత్తనం ఇంకా ఎంత కాలమని కొందరు నేతలు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. మరికొందరు కళా వెంకటరావు పనైపోయింది.. ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని బహిరంగానే ప్రకటిస్తున్నారు. అయినా అవేమీ పట్టించుకోకుండా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మాజీ మంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన తనను కాదని, వేరే వారికి చంద్రబాబు టికెట్ ఇచ్చే అవకాశమే లేదని ఆయన అంటున్నారట. అయితే క్యాడర్ మాత్రం ఈసారి కళాను పక్కన పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తుండడం స్థానిక టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో.. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి ఇద్దరు సీనియర్ నేతలు!
గాంధీనగర్: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ వేడి మొదలైంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇద్దరు ప్రముఖ నేతలు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలనుకుంటున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వం చర్యలతో నిరాశకు లోనయ్యామని, తాము సంతోషంగా లేమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధి అజెండా నచ్చి వచ్చే నెలలో బీజేపీ తీర్థ పుచ్చుకోనున్నట్లు స్పష్టం చేశారు. విజయ్‌పుర్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి నరేశ్ రావల్ ఈ మేరకు ప్రకటన చేశారు. ‘పార్టీతో నాకు చాలా సమస్యలు ఉన్నాయి. అయితే వాటి గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదు. కానీ, పార్టీకి జైహింద్ చెప్పాలని నిర్ణయించుకున్నా. త్వరలోనే బీజేపీలో చేరతాను. పార్టీ నాయకత్వం ఏ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా నిర్వర్తిస్తాం.’ అని పేర్కొన్నారు. మరోవైపు.. ఇలాంటి ప్రకటనే చేశారు కాంగ్రెస్ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ రాజు పార్మర్. ‘గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నాను. పార్టీపై నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. కానీ, దురదృష్టవశాత్తు అధిష్టానం కొత్త వారికి ప్రాధాన్యం ఇవ్వటం ప్రారంభించింది. నేనెప్పుడూ ఏ పదవులు కోరలేదు. కొద్ది రోజుల్లో చాలా మంది సీనియర్లు పార్టీని వీడతారు.’ అని తెలిపారు. ‘ఇరువురు నేతలు పార్టీకి సీనియర్లు. నరేశ్ రావల్ గతంలో ప్రతిపక్ష నేతగా, సహాయ మంత్రిగా చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజు పార్మర్ మూడు సార్లు రాజ్యసభకు వెళ్లారు. ఎస్టీ కమిషన్‌కు ఛైర్మన్‌గా చేశారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీతో చర్చించాలి. వారి నిర్ణయం పార్టీకి తీరని నష్టాన్ని మిగుల్చుతుంది. ’ అని పేర్కొన్నారు పార్టీ సీనియర్ నేత అర్జున్ మోధ్వాడియా. ఇదీ చదవండి: మోదీ అడ్డాలో పాగాకు కేజ్రీవాల్ పక్కా ప్లాన్! 300 యూనిట్ల ఉచిత కరెంటు, బకాయిల రద్దు హామీ -
రాజస్థాన్ పీఠంపై బీజేపీ కన్ను.. ఎన్నికల సన్నద్ధత షురూ!
జైపుర్: దేశంలోని ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ తన ప్రబల్యాన్ని విస్తరించుకుంటోంది భారతీయ జనతా పార్టీ. తాజాగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే 2023లో శాసనసభ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో పాగా వేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జులై 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో సమావేశం కానున్నట్లు పేర్కొన్నాయి. రానున్న ఎన్నికల్లో విజయం సాధించేలా పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ క్యాంప్‌కు హాజరయ్యే జాతీయ స్థాయి నాయకులు ఎన్నికల వ్యూహాలను వివరించనున్నారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా వారికి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ శిబిరం ప్రారంభానికి ఒక రోజు ముందే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ జైపుర్ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ట్రైనింగ్ క్యాంప్ అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతు తెలిపిన హిందూ వ్యక్తి హత్యకు గురైన విషయం, ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులపై ఈ భేటీలో చర్చించనున్నారు. శిక్షణ శిబిరానికి వచ్చే నేతలెవరు? రాజస్థాన్‌లో మూడు రోజుల పాటు నిర్వహించి ట్రైనింగ్ క్యాంప్‌కు పలువురు జాతీయ స్థాయి నేతలు హాజరుకానున్నారు. అందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు వీ సతీశ్, బీఎల్ సంతోష్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా, కేంద్ర మంత్రులు.. కైలాశ్ చౌదరి, అరుణ్ రామ్ మెఘ్వాల్, గజేంద్ర సింగ్ శేఖావత్, ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా, మాజీ ముఖ్యమంత్రి వసుందర రాజే సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. చదవండి: మేడమ్ టుస్సాడ్స్ నుంచి రోడ్డుపైకి బోరిస్ మైనపు విగ్రహం -
గులాబీకి గుడ్‌బై.. హస్తం గూటికి చేరే దిశగా అడుగులు!
సాక్షి, హైదరాబాద్: గ్రూపు రాజకీయాలతో విసిగిపోయిన గులాబీ నేతలు ఆ పార్టీకి షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హస్తం గూటికి చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపిన నేతలు.. కారు దిగడానికి దాదాపుగా ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన సమీకరణలతో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. టీఆర్ఎస్ కండువా కప్పుకొన్న నేతలు తాజాగా సొంతగూటికి వెళ్లడానికి పావులు కదుపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం గులాబీదళంలో చేరిన కార్పొరేటర్లు కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. తాజాగా బడంగ్‌పేట నగర పాలక సంస్థ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు టీఆర్ఎస్కు ఝలక్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చారు. ఈ మేరకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసి సంప్రదింపులు కూడా జరిపారు. ఆరుగురు కార్పొరేటర్లతో కలిసి ఒకట్రెండు రోజుల్లో హస్తం గూటికి చేరేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరేకాకుండా.. గతంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మరో నేత కూడా గులాబీకి గుడ్‌బై చెప్పనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరంతా హస్తినలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి గెలిచిన అనంతరం టీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి చేజిక్కించుకున్న సబితా ఇంద్రారెడ్డితో పొసగని నేతలు పక్క చూపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతుండటం అధికార పార్టీని ఇరకాటంలో పడేస్తోంది. ఎల్బీనగర్లోనూ... ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కీలక నేత కూడా సొంతగూటి వైపు చూస్తున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది, ఆ తర్వాత అధికార పార్టీలో చేరారు. దీంతో అప్పటి నుంచి ఆయన అధికార టీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజా రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. హస్తం గూటికొ ప్పుడు చేరనున్నారనే అంశంపై ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. టీకేఆర్ను బుజ్జగించిన కేటీఆర్ గత ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన తీగల కృష్ణారెడ్డి రెడ్డి సైతం కారు దిగేందుకు దాదాపు సిద్ధమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఇటీవల ఆయన నివాసానికి చేరుకుని పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా సన్నిహితులు, వర్గీయులతో ప్రత్యేకంగా సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. ఆయన కోడలు తీగల అనితా హరినాథ్‌రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీగల కృష్ణారెడ్డిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు. రాజకీయ వారసత్వ విషయంలో ఆయనకు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఆయన పార్టీని వీడే యోచన నుంచి వెనక్కి తగ్గినట్లు సమాచారం. మేయర్ సహా ఇద్దరు కార్పొరేటర్లపై వేటు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు సహా 23వ డివిజన్ కార్పొరేటర్ రాళ్లగూడెం శ్రీనివాసరెడ్డి, 20వ డివిజన్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్‌రెడ్డిలను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శనివారం రాత్రి ప్రకటించారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి, పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. (చదవండి: ‘మేం బ్యాంకుల్ని మాత్రమే.. మీరు దేశాన్నే దోచుకుంటున్నారు’) -
కేజ్రీవాల్ సంచలన నిర్ణయం
ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెంచారు. ఇప్పటికే గుజరాత్లో పర్యటించిన కేజ్రీవాల్.. అక్కడ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ.. గుజరాత్లో తన అన్ని రాజకీయ సంస్థలను రద్దు చేసింది. ఇందులో అన్ని సంస్థలు, విభాగాలు, మీడియా బృందం ఉన్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహకానికి సంబంధించి పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా కొత్త సంస్థను ఏర్పాటు చేయనుంది. ఇక, గుజరాత్లో గెలుపే లక్ష్యంగా.. ఆప్ కొత్త ప్రణాళికలను రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం జిల్లా అధ్యక్షుడిని మార్చాలని ఆప్ భావిస్తున్నట్టు సమాచారం. గుజరాత్‌లోని 33 జిల్లాల అధ్యక్షులతో సహా దాదాపు 50 స్థానాల్లో కొత్త నియామకాలను చేపట్టనున్నట్టు తెలుస్తోంది. వీటిలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జి తదితర పదవులు ఉండనున్నాయి. ఇది కూడా చదవండి: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్ -
కేజ్రీవాల్ ‘క్రేజీ’ ఆఫర్.. టార్గెట్ ఫలిస్తుందా..?
సిమ్లా: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచిన కేజ్రీవాల్.. శనివారం హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్ తలిపెట్టిన ర్యాలీలో కేజ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజలను, ఆమ్ ఆద్మీపార్టీని చూసి బీజేపీ భయపడుతోందని అన్నారు. అందుకే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే ఓ కొత్త హిమాచల్‌ను ఆవిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని కేజ్రీవాల్ తెలిపారు. ఆప్‌కు ఒక్క ఛాన్స్ ఇస్తే సరికొత్త హిమాచల్‌ను చూపిస్తామని ప్రజలకు కోరారు. అలాగే, కాంగ్రెస్, బీజేపీ నేతలకు కేజ్రీవాల్ ఆఫర్ ఇచ్చారు. ఆయా పార్టీల్లో ఉన్న సచ్ఛీలురందరూ వెంటనే ఆప్‌లో చేరిపోవాలని కోరారు. BJP हिमाचल और गुजरात में आम आदमी पार्टी से डरी हुई है। असल में ये AAP से नहीं, जनता से डरे हुए हैं। BJP ने तय किया है कि Himachal और Gujarat के चुनाव जल्द कराएंगे। BJP चुनाव जब मर्ज़ी कराए, सत्ता आम आदमी के हाथ में आनी चाहिए। -CM @ArvindKejriwal #HimachalMeinBhiKejriwal pic.twitter.com/8jvySkuvEr — AAP (@AamAadmiParty) April 23, 2022 మరోవైపు.. హిమాచల్‌లో ప్రత్యామ్నాయంగా పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని దోచుకున్నాయని అన్నారు. ఇప్పుడు తనను టార్గెట్ చేస్తున్నాయన్నారు. ఢిల్లీలో ప్రవేశపెట్టిన పథకాలకు హిమాచల్ ప్రదేశ్ సీఎం జయరాం ఠాకూర్ కాపీ కొడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో తాము 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అని ప్రకటించగానే.. హిమాచల్ సీఎం ఠాకూర్ ఇక్కడ 125 యూనిట్ల వరకూ ఉచితమంటూ ప్రకటించారని అన్నారు. ఇది చదవండి: పంజాబ్ సీఎం మరో కీలక నిర్ణయం.. -
యూపీలో మూడో దశ పోలింగ్ ప్రారంభం
-
కాంగ్రెస్‌కు అవే చివరి ఎన్నికలు.. దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
భోపాల్: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో 2023 ఎన్నికలే కాంగ్రెస్ పార్టీకి చివరి అసెంబ్లీ ఎన్నికలు అవుతాయంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. దిగ్విజయ్ సింగ్ శనివారం రత్లాం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. అది జరగని పక్షంలో 2023 ఎన్నికలే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చివరి ఎలక్షన్స్ కావచ్చు అంటూ వారిని హెచ్చరించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు నిజాయితీగా లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయవద్దని సూచించారు. వారి వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రాదు. అలాంటి వారికి కార్యకర్తలు మద్దతివ్వరూ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కాంగ్రెస్‌కు ఆ పార్టీ ఫొటో కాపీ : ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఛండీగఢ్ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పంజాబ్‌లో పోరు రసవత్తరంగా మారింది. పోలింగ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరును పెంచాయి. ఈ ఎన్నికల్లో కమలం జెండా ఎగురువేయాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తుండగా మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇక, మొదటిసారిగా పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తమ వినూత్న ప్రచారంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో బుధవారం పఠాన్‌కోట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఆప్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు నేరాల్లో భాగస్వాములు అవుతున్నాయని ఆరోపించారు. ఆప్ పార్టీని కాంగ్రెస్ ఫొటోకాపీ అని అభివర్ణించారు. అయోధ్య రామ మందిర నిర్మాణం, భారత సైన్యం తమ ప్రతిభను చాటిచెప్పినప్పుడు వీరు సంతోషంగా లేరని విమర్శలు గుప్పించారు. ఒక పార్టీ పంజాబ్‌ను పూర్తిగా దోచుకుంది.. మరోపార్టీ ఢిల్లీలో అవినీతి చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆప్.. కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుందని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లో ఈసారి ప్రభుత్వం కచ్చితంగా మారాలి (iss baar pakka parivartan) అని పంజాబీలు నిర్ణయించుకున్నారని ప్రధాని ఆశాభావం వ్యక్తపరిచారు. 2016 పఠాన్‌కోట్ దాడిలో మరణించిన సైనికుల త్యాగాలను కాంగ్రెస్ తక్కువ చేసి అవమానించిందని మోదీ ఆరోపించారు. దాడికి కాంగ్రెస్ పార్టీ తప్ప దేశమంతా కలిసికట్టుగా ఉందన్నారు. దాడులపై కాంగ్రెస్ పార్టీ..సైనికుల త్యాగాలను తక్కువ చేసిందని విమర్శించారు. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో కూడా రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించడాన్ని ప్రధాని తప్పుబట్టారు. 1965లో కాంగ్రెస్ ప్రయత్నించి ఉంటే గురునానక్ జన్మస్థలం(కర్తార్‌పూర్ గురుద్వారా) భారతదేశంలో ఉండేదని ప్రధాని మోదీ తెలిపారు. -
ఎన్నికల వేళ యూపీలో టిక్కెట్ల లొల్లి
-
డిసెంబర్ 31 న అమిత్ షా అయోధ్య పర్యటన!
Amit Shah Ayodhya Campaign 2021 లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి కాషాయ పార్టీ సిద్ధమైంది. డిసెంబర్ 31న అయోధ్యాలో జరగనున్న ఎన్నికల ర్యాలిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్లొననున్నారు. పర్యటనలో భాగంగా అక్కడి రామ్లాల, హనుమాన్ గర్హి ఆలయాలను సందర్శించనున్నారు. ఈమేరకు షా అయోధ్య పర్యటనకు భాజపా సన్నాహాలు చేస్తోంది. మరోవైపు అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై ప్రతిపక్షాలు, అధికార బీజేపీ మధ్య వాగ్వాదం నడుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అయోధ్య కేంద్రంగా మారనుంది. కాగా హోంమంత్రి అయోధ్య పర్యటన రాష్ట్రంలో రాజకీయ రగడను మరింత పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. డిసెంబర్ 31న షా అయోధ్య పర్యటనపై సోమవారం కూడా బీజేపీ సమావేశం నిర్వహించింది. ఒకవైపు అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధి పనులకు యూపీలోని యోగి ప్రభుత్వం, కేంద్రంలోని మోదీ సర్కార్ బాధ్యతవహిస్తుందనే సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు అందించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే అయోధ్యను సాకుగా చూపి బీజేపీ మత పరమైన రాజకీయాలు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చదవండి: వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఒమిక్రాన్ కాటుకు బలి! మొదటిసారిగా.. -
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ సమయం గంట పొడిగింపు! దేశంలోనే తొలిసారిగా..
ఉత్తరాఖండ్: వచ్చే ఏడాది ఉత్తరాఖండ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్‌కు గంటపాటు ఆదనంగా సమయాన్ని కేటాయిస్తున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుషీల్ చంద్ర శుక్రవారం ప్రకటించారు. కరోనా ఉధృతి కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చెందిన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం కష్టతరంగా మారిందని, అందుకే దేశంలోనే తొలిసారిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరాఖండ్‌లో అసెంట్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే! ఐతే ఓటింగ్ సమయాన్ని గంటపాటు పొడిగిస్తున్నట్లు ఈ రోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుషీల్ చంద్ర మీడియాకు తెలిపారు. దీనితో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. కాగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర రెండు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్నారు. చంద్ర వెంట ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే ఉన్నారు. ఐతే రాష్ట్రవ్యాప్తంగా 601 మైదానాలు, 277 భవనాలను గుర్తించామని, వీటిల్లో సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎన్నికల సమావేశాలు నిర్వహించవచ్చని ఆయన తెలిపారు. అభ్యర్థులు వాటిని బుక్ చేసుకునేందుకు వీలుగా, వీటికి సంబంధించిన వివరాలు త్వరలో ఆన్లైన్లో అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ బుకింగ్‌లు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన మాత్రమే చేయబడతామని సుషీల్ చంద్ర సూచించారు. చదవండి: Hyderabad: పబ్బుల యాజమాన్యాలకు సీపీ సీరియస్ వార్నింగ్!! -
యూపీ అసెంబ్లీ ఎన్నికలు, అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని సోమవారం ప్రకటించారు. రానున్న అసెంబ్లీ పోరులో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డి)తో పొత్తును ఖరారు చేసిన ఆయన సీట్ల పంపకంపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని తాజాగా చెప్పారు. అయితే యూపీ ముఖ్యమంత్రి బరిలో ఉంటారని భావిస్తున్న తరుణంలో అఖిలేష్ ప్రకటన సంచలనం రేపింది. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాను సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూతో పోల్చడం దుమారాన్ని రాజేస్తోంది. గత ఎస్పీ ప్రభుత్వం చేపట్టిన పనుల పేరు మార్చడం, యూపీ ప్రభుత్వం కొత్తగా చేసేందీమీ లేదు, 'బాబా ముఖ్యమంత్రి' అంటూ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆతిద్యనాథ్పై అఖిలేష్ మండిపడ్డారు. ఆదివారం జరిగిన ర్యాలీలో అఖిలేష్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. జిన్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో పోల్చడం సిగ్గుచేటని యూపీ సీఎం స్పందించారు. ఇది విభజనను నమ్మే తాలిబానీ మనస్తత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేశారు. ప్రస్తుతం ప్రధాని మోదీ నేతృత్వంలో ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ నిర్మాణ కృషి జరుగుతోందని యోగి పేర్కొన్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో తమ అధికార పీఠాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ భారీ ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు తమ చేజారిపోయిన కంచుకోటను ఎలాగైనా దక్కించు కోవాలని కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో ముఖ్యంగా లఖీంపూర్ ఖేరీ హింస తరువాత కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా సుడిగాలి పర్యటనలతో సందడి చేస్తున్నారు. మహిళలకు 40 శాతం రిజర్వేషన్, అమ్మాయిలకు స్కూటీలూ లాంటి వాగ్దానాలతో తన వేగాన్ని పెంచిన సంగతి తెలిసిందే. -
సీఎం మీద పోటీకి సిద్ధమవుతున్న మాజీ ఐపీఎస్ అధికారి
లక్నో: వచ్చేఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎలక్షన్ బరిలో తాను నిలబడనున్నట్లు ప్రకటించారు మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్. పోలీసు ఉద్యోగానికి ముందస్తు పదవీవిరమణ చేసిన అమితాబ్ ఠాకూర్.. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీద పోటీ చేస్తారని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. యోగి ఆదిత్యనాథ్ ఎక్కడి నుంచి బరిలోకి దిగితే.. అమితాబ్ ఠాకూర్ కూడా అక్కడే పోటీ చేస్తారని ప్రకటించారు. ఏకంగా సీఎం మీదనే పోటీకి సిద్ధమవతున్న అమితాబ్ ఠాకూర్ నిర్ణయం దేశరాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీసుకున్న ఓ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమితాబ్ ఠాకూర్ ఈ ఏడాది మార్చి 23న ఉద్యోగానికి రాజీనామా చేశారు. వాస్తవంగా ఆయన సర్వీసు 2028 వరకు ఉన్నప్పటికి ప్రజాశ్రేయస్సు కోసం ఏడేళ్ల ముందుగానే పదవీవిరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అమితాబ్ ఠాకూర్ భార్య మాట్లాడుతూ.. ‘‘యూపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ అనేక అప్రజాస్వామిక, అక్రమ, నిర్బంధ, వేధింపు, వివక్ష చర్యలకు పాల్పడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సీఎం అక్రమాలకు.. అమితాబ్ నమ్మిన ఆదార్శలకు మధ్య జరుగుతున్న పోరాటం. ఇందుకోసం యోగి ఆదిత్యనాథ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే.. అమితాబ్ కూడా అక్కడే బరిలో నిలుస్తారు’’ అని తెలిపారు. 2017 లో, అమితాబ్ ఠాకూర్ తన కేడర్ని వేరే రాష్ట్రానికి మార్చమని కేంద్రాన్ని కోరారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ములాయం సింగ్ యాదవ్ తనను బెదిరించారని ఆరోపించిన కొన్ని రోజుల తర్వాత, అమితాబ్ ఠాకూర్‌ని జూలై 13, 2015 న సస్పెండ్ చేశారు. ఆయనపై విజిలెన్స్ విచారణ కూడా ప్రారంభమైంది. -
సాగర్ ఉపఎన్నిక: ఏడ్చుకుంటూ ప్రచారం చేసిన బీజేపీ అభ్యర్థి
సాక్షి, నాగార్జున సాగర్: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. ప్రచార పర్వంలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం మండలంలో శుక్రవారం టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధులు ప్రచారం చేయగా పెద్దవూర మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే, త్రిపురారం మండలం పలుగు తండాలో ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్ధి రవినాయక్ కంటతడి పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పలుగు తండా రవినాయక్ సొంత గ్రామం కావడంతో అతను గ్రామస్తులను హత్తుకుని ఏడ్చుకుంటూ ఓటు అడిగారు. ఎమ్మెల్యే అభ్యర్ధి ఒక్కసారిగా కంటతడి పెట్లుకొని ఓటు అభ్యర్ధించడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. ఇదిలా ఉండగా, బీజేపీ అసమ్మతి నేత కంకణాల శ్రీధర్ రెడ్డి కూడా ఈరోజు ప్రచారంలో పాల్గొన్నారు. -
పెట్రోలు ధర రూ. 5 తగ్గించిన బీజేపీ సర్కార్
గువహటి : పెట్రోల్, డీజిల్ ధరలను ఆకాశాన్నంటుతున్న తరుణంలో అసోం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోలుపై లీటరుకు 5 రూపాయలు తగ్గిస్తూ అక్కడి బీజీపే సర్కారు వాహన దారులకు భారీ ఊరట నిచ్చింది. అలాగే మద్యంపై సుంకాన్ని 25 శాతం తగ్గించినట్లు అసోం ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. (Petrol Diesel Prices : వాహనదారులకు చుక్కలే!) సవరించిన ఈ రేట్లు ఈ రోజు అర్ధరాత్రి నుండి అమలులోకి వస్తాయని ఆర్థిక మంత్రి హిమంత బిస్వాస్ అసెంబ్లీలో ప్రకటించారు. కోవిడ్-19 విస్తరణ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, మద్యంపై అదనపు సెస్ విధించాం..కానీ ఇప్పుడు, రోగుల సంఖ్య బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో తాజా రేటు కోతను ప్రకటించామన్నారు. దీంతో పెట్రోలుపై లీటరుకు 5 రూపాయల భారం తగ్గుతుందని, తద్వారా లక్షలాది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఇంధన ధరలు కొత్త గరిష్టాలను తాకిన సమయంలో ఈ తగ్గింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా అసోంలో అసెంబ్లీ ఎన్నికలు మార్చి-ఏప్రిల్‌లో జరగనున్నాయి, ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకోవాలని భారీ కసరత్తు చేస్తోంది. -
'అధికారంలోకి వస్తే మధురై రెండో రాజధాని'
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్టు మక్కల్ నీది మయ్యం నేత, నటుడు కమలహాసన్ ప్రకటించారు. అయితే ఏ నియోజకవర్గం అనే విషయం త్వరలో ప్రకటిస్తానని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కమల్ మదురై వేదికగా ఆదివారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రెండో రోజు అలగర్ కోయిల్ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సభలకు పోలీసులు అనుమతి ఇవ్వని దృష్ట్యా ప్రచారం రోడ్ షో రూపంలో సాగించాల్సిన పరిస్థితి. అలాగే ప్రైవేటు స్థలాల్లో విద్యార్థులు, యువతతో చర్చకార్యక్రమాలు, వ్యాపారులు, రైతులతో సమావేశాలతో ముందుకెళుతున్నారు. మదురై పర్యటనతో తేని, దిండుగల్ వైపుగా ప్రచారానికి వెళ్తూ మీడియాతో కమల్ మాట్లాడారు. చదవండి: (గర్భగుడిలో గుప్తనిధి.. రంగంలోకి అధికారులు..) పోటీ తథ్యం.... అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం పోటీ చేస్తుందని, తాను కూడా బరిలో ఉంటానని ప్రకటించారు. నిజాయితీ, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకెళతామని తెలిపారు. రాష్ట్రంలో మూడో ఫ్రంట్ సాధ్యమేనని, త్వరలో ఇందుకు తగ్గ ప్రకటన వెలువడుతుందన్నారు. రజనీకాంత్ ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూద్దామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రజనీని తాను తప్పకుండా కలుస్తానని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మార్పు నినాదంతో మక్కల్ నీది మయ్యం ముందుకు సాగుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే మదురై కేంద్రంగా రెండో రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అనుమతులు ఇవ్వడం లేదని పేర్కొంటూ, తాము చట్టానికి, నిబంధనలకు కట్టుబడి ప్రచారం చేసుకుంటున్నామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ముగించారు. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలను గెలిచి ఊపు మీదున్న హైదరాబాద్‌కు చెందిన ఏఐఎంఐఎం పార్టీ మక్కల్ నీది మయ్యంతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలు వెలువడటం గమనార్హం. -
బిహార్ ఎన్నికలు.. ఆర్జేడీకి భారీ షాక్
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లలూప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లపై హత్యకేసు నమోదైంది. వీరితో పాటు ఆర్జేడీ నేతలు అనిల్ కుమార్ సాధు, కలో పాస్వాన్లతో పాటు ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్జేడీ ముఖ్య నేతలపై హత్యారోపణలు రావడం ఆ పార్టీవర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. అక్టోబర్ 4న (నిన్న) బిహార్ లోని పూర్నియా జిల్లాలోని మాలిక్ (37) ఇంట్లోకి చొరబడిన దుండగులు అతన్ని కాల్చి చంపారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన మాలిక్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఉదంతం వెనుక కుట్రకోణం దాగుందని, దీన్ని రాజకీయ హత్యగా మాలిక్ భార్య ఆరోపించారు. ఇంతకుముందు ఆర్జేడీ నుంచి మాలిక్‌ను సస్పెండ్ చేసిన కారణంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. (బిహార్: ప్రతిపక్షపార్టీ నాయకుడిగా తేజస్వీ యాదవ్) పార్టీ టికెట్ కేటాయించడానికి ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ రూ.50 లక్షలు డిమాండ్ చేసినట్లు కొన్ని రోజులక్రితం మాలిక్ ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తనను కులం పేరిట తేజశ్వి యాదవ్ దూషించినట్లు సైతం మాలిక్ వీడియోలో వెల్లడించారు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని అనుకున్న తురణంలోనే ఇలా హత్యకు గురికావడం పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. మాలిక్ హత్యకేసులో త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ విశాల్ శర్మ తెలిపారు. మాలిక్ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోయాయని, సంఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కాగా బిహార్ ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రతిపక్ష నాయకుడు తేజశ్వి యాదవ్ తన అసలు రంగు బయటపెట్టాడని జేడీ(యు) ఆరోపించింది. (బిహార్ ఎన్డీఏ నుంచి ఎల్జేపీ ఔట్) -
విజయం సాధించేనా.. ఓటమి తప్పదా..!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ మరో ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నూతన సంవత్సరం (2020) స్వాగతం పలుకుతోంది. మరో రెండు నెలల్లో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరుగునున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎత్తుగడలు, వ్యూహాలు రచించేందుకు పార్టీ నేతలు కసరత్తులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలపై నేతలతో చర్చించారు. గత ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు ఆప్ 67 స్థానాలను గెలుచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ నేతలకు మరోసారి కేజ్రీవాల్ గుర్తుచేశారు. గత ఎన్నికల ఫలితాలను పునరావృత్తం చేసే విధంగా పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. గడిచిన ఐదేళ్ల అభివృద్ధి.. భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం అనే నినాదంతో ముందుకు సాగాలని సీఎం సూచించారు. కాగా 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన రీతిలో విజయాన్ని నమోదు చేసిన ఆప్.. ఆ తరువాత రాజకీయంగా దిగజారుతూ వచ్చింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కనీసం ఒక్కస్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. ఒకవైపు కాంగ్రెస్‌తో కయ్యం, బీజేపీతో సిద్ధాంతపరమైన పోరాటంతో ఆప్ ఏటూ తేల్చుకోలేని స్థితిలో నిలిచింది. మరోవైపు కీలక నేతలు పార్టీని వీడటం, బయటకు వెళ్లి కేజ్రీవాల్‌పై బహిరంగ విమర్శలకు దిగాటం ఆ పార్టీకి మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. ఇక దేశ వ్యాప్తంగా బలమైన శక్తిగా ఎదిగిన బీజేపీ ఢిల్లీ పీఠంపై జెండా ఎగరేయాలని కమలనాథులు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఏ మేరకు ప్రభావం చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. -
ఓట్ల పండుగ వచ్చేసింది
సాక్షి, శ్రీకాకుళం : సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు మొదటి విడతగా ఏప్రిల్ 11న పోలింగ్ జరిపేందుకు ఎన్నికల కమిషన్ మూహూర్తం నిర్ణయించింది. ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో మరింత వేగం చేస్తున్నారు. జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం ఉంది. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, వీటిలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నంలు ఉన్నాయి. అరకు పార్లమెంటు నియోజకవర్గంలో పాలకొండ అసెంబ్లీ నియోజవర్గం ఉండగా, రాజాం, ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు (మండలాల వారీగా) శ్రీకాకుళం : శ్రీకాకుళం అర్బన్, శ్రీకాకుళం రూరల్, గార ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట పలాస : పలాస, మందస, వజ్రపుకొత్తూరు టెక్కలి: టెక్కలి, కోటబోమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం నరసన్నపేట: నరసన్నపేట, జలుమూరు, పోలాకి, సారవకోట ఆమదాలవలస: ఆమదాలవలస, పొందూరు,బూర్జ, సరుబుజ్జిలి పాతపట్నం: పాతపట్నం, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, మెళియాపుట్టి, కొత్తూరు పాలకొండ : పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని రాజాం: రాజాం, సంతకవిటి, వంగర, రేగిడి ఆమదాలవలస ఎచ్చెర్ల: ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి.సిగడాం జిల్లాలో ఓటర్లు 20,64,330 మంది.. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14,57,096 మంది ఓటర్లు ఉండగా, జిల్లా నుంచి అరకు పార్లమెంటుకు పాలకొండ నియోజకవర్గం నుంచి 1,74,219 మంది ఓటర్లు ఉన్నారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గానికి ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల నంచి 4,33,015 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 20,64,330 మంది కాగా, వీరిలో పురుషులు 10,35,623 మంది, స్త్రీలు 10,28,460 మంది, ఇతరులు 247 మంది ఉన్నారు. ఇంకా ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 40 వేల మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరో వారం రోజుల పాటు నమోదుకు గడువు ఉంది. ప్రసుతం ఉన్న ఓటర్లకు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. అన్ని నియోజకవర్గాల్లోనూ కొత్తగా ఓటర్లు చేరే అవకాశం ఉంది. సిక్కోలు నైసర్గిక స్వరూపం.. జిల్లా 5,837 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన, ఉత్తరాన ఒరిస్సా రాష్ట్ర సరిహద్దు, దక్షిణాన విజయనగరం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. భౌగోళికంగా ఒడిశాకు దగ్గరలో ఉన్నందున భిన్న సంస్కృతులు కలిగి ఉంది. ప్రధానంగా వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర తనయ నదులు ఉన్నాయి. మూడు రెవెన్యూ డివిజన్లు, 38 మండలాలు ఉన్నాయి. జనాభా.. జిల్లాలో ప్రస్తుత జనాభా సుమారు 30 లక్షల మంది ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా 27,03,114 మంది ఉన్నారు. వీరిలో 13,41,738 పురుషులు ఉండగా, 13,61,376 మంది మహిళలు ఉన్నారు. జిల్లాలో 62.3 శాతం మంది అక్షరాష్యులు ఉన్నారు. సమస్యాత్మక పోలింగ్స్టేషన్లు.. జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2084 ప్రాంతాల్లో 2908 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, వీటిలో 1025 ప్రాంతాల్లో 1523 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. వీటి పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా తగు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోనే ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్ధను కాపాడేవారికే ఓటు సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేవారికే ఓటు వేయాలి. దేశ భవిష్యత్‌ను మార్చగలిగే సత్తా మన ఓటుకు ఉంది. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలి. ఎన్నికల సమయంలో ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. మరో నెల రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో అర్హులైనవారినే ఎన్నుకుందాం. – దత్తి మురళీకృష్ణ, ప్రైవేటు వైద్యుడు, వీరఘట్టం -
టీఆర్ఎస్ విజయానికే రేవంత్ నిర్బంధం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో సాయం చేయాలన్న ఉద్దేశంతోనే పోలీసులు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించారని ఆయన సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. చివరకు పోలీసుల సహకారంతో అధికార పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధించారన్నారు. పోలీసుల చర్యను తీవ్రంగా పరిగణించాలని, భవిష్యత్‌లో ఏ అధికారి కూడా ఇలా చేయకుండా కఠినంగా శిక్షించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ శిక్ష మిగిలిన పోలీసులకు ఓ పాఠం కావాలన్నారు. ప్రచారం ముగింపు ముందు రోజు రేవంత్‌ను పోలీసులు నిర్భంధించారని, దీని ఫలితంగా అతను ఎన్నికల్లో ఓడిపోయారని తెలిపారు. రేవంత్ నిర్భంధం వ్యవహారంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరించారని హైకోర్టుకు నివేదించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీసులు అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి రేవంత్‌ని అక్రమంగా నిర్భంధించి, గుర్తు తెలియని ప్రాంతానికి తరలించిన నేపథ్యంలో నరేందర్‌రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం, రేవంత్ నిర్భంధం విషయంలో పోలీసుల తీరును తప్పుపట్టింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అప్పటి వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఆమె కౌంటర్ దాఖలు చేయగా, దీనికి తిరుగు సమాధానం ఇవ్వాలని నరేందర్‌రెడ్డికి ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు ఆయన సమాధానం ఇచ్చారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని రేవంత్‌ది అక్రమ నిర్భంధంగా ప్రకటించాలని కోర్టును కోరారు. ఈ వ్యవహారంపై హైకోర్టు జనవరి 22న విచారణ జరపనుంది. -
‘వారు బిర్యాని తినిపిస్తే.. మేం తూటాలు తినిపించాం’
జైపూర్ : కాంగ్రెస్ ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టి పోషించింది కాబట్టే దేశంలో 26/11 దాడులు జరిగాయంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మండిపడ్డారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్రానాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న యోగి.. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోంది. అందువల్లే దేశంలో ఉగ్రవాదం పెరిగిపోయిందని ఆరోపించారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులకు బిర్యాని పెట్టి పోషిస్తే.. నేడు తాము అదే ఉగ్రవాదుల చేత తూటాలు తినిపించామని యోగి తెలిపారు. Congress has done divisive politics. As a result of that, terrorism was at its peak in the country. Today you can see that the terrorists which were fed Biryani by Congress are now being fed bullets by us: UP CM Yogi Adityanath in Makrana, Rajasthan pic.twitter.com/TEhaGf2a1r — ANI (@ANI) November 26, 2018 ముంబైలో 26/11 మరణహోమం జరిగి నేటికి పదేళ్లు పూర్తయ్యాయి. పలు ముఖ్యమైన ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో దాదాపు 175 మంది మరణించారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో అజ్మల్ కసబ్ ఒక్కడే పోలీసులకు ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఈ కేసు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వాల్ నికామ్, ముంబై జైళ్లో ఉన్నప్పుడు కసబ్ ప్రతిరోజు బిర్యాని కావాలని అడిగినట్లు పేర్కొన్నాడు. దాంతో అప్పట్లో ఈ విషయంపై పెద్ద వివాదమే చేలరేగింది. దాంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఉజ్వాల్ వివరణ ఇస్తూ కసబ్‌కు అనుకూలంగా ఏర్పడిన సానుకూల వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసేందుకు గాను తాను ఇలాంటి వ్యాఖ్యలు చేశానని వెల్లడించారు. అంతేకాక ప్రభుత్వం కసబ్‌కు ఎప్పుడు బిర్యానీని అందించలేదని కూడా వివరించారు. ముంబై 26/11 కేసులో దోషిగా నిర్ధారించబడిన కసబ్‌ను 2012 నవంబర్‌లో ఉరి తీశారు. -
ఉద్యమ సారథికి ప్రభుత్వ పగ్గాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు రెండు వారాల ముందు 2014 ఏప్రిల్–మే మాసాల్లో రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. లోక్‌సభతోపాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా ప్రాంతీయపక్షాలే అధికారంలోకి వచ్చాయి. సాంకేతికంగా పాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పేరుతోనే ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఉమ్మడి ఏపీలోని 294 సీట్లలో 175 ఏపీలో, 119 తెలంగాణలో చేరాయి. ఈ జమిలి ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ రెండు రాష్ట్రాల్లో పోటీచేసింది. ఏపీలో 101 సీట్లు గెలిచి, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ 67 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షమైంది. టీడీపీ మిత్రపక్షం బీజేపీ 4 సీట్లు గెల్చుకుని చంద్రబాబు కేబినెట్లో చేరింది. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నడిపిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 63 సీట్లు కైవసం చేసుకోగా కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ఆవిర్భావ దినం నాడే తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తెలంగాణలో టీడీపీకి 15, బీజేపీకి 5 సీట్లు దక్కాయి. 21 సీట్లతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైంది. ఎంఐఎం 7, బీఎస్పీ 2 సీట్లు గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా దొంతి మాధవరెడ్డి (నర్సంపేట) ఎన్నికయ్యారు. ఏపీలో మూడు ప్రధాన పార్టీలకే ప్రాతినిధ్యం ఏపీలో మాత్రం అసెంబ్లీలో మూడు ప్రధాన పార్టీలకే ప్రాతినిధ్యం లభించింది. చీరాల నుంచి నవతరం పేరుతో స్వతంత్ర అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ గెలుపొందారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పులివెందులలో విజయం సాధించారు. అనంతపురం మినహా మిగిలిన రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది. సీఎం చంద్రబాబు కుప్పం నుంచి గెలుపొందారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు (టీడీపీ) సత్తెనపల్లి నుంచి ఎన్నికయ్యారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డలో గెలుపొందారు. రెండుచోట్ల నుంచి కేసీఆర్.. టీఆర్ఎస్ నేత కేసీఆర్ మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి అసెంబ్లీకి, మెదక్ నుంచి పార్లమెంటుకు పోటీచేసి ఘన విజయం సాధించారు. అనంతరం మెదక్ ఎంపీ సీటుకు రాజీనామా చేశారు. టి.హరీశ్‌రావు (సిద్దిపేట), కె.తారకరామారావు (సిరిసిల్ల), జి.జగదీశ్‌రెడ్డి (సూర్యాపేట), పి.మహేందర్‌రెడ్డి (తాండూరు), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్స్వాడ), జోగు రామన్న (ఆదిలాబాద్) తెలంగాణ తొలి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నిర్మల్ నుంచి బీఎస్పీ టికెట్‌పై గెలిచిన ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి తర్వాత టీఆర్ఎస్లో చేరి కేసీఆర్ మంత్రివర్గంలో చేరారు. కాంగ్రెస్‌కు మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువ (12) అసెంబ్లీ సీట్లు లభించాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు కె.జానారెడ్డి (నాగార్జునసాగర్), ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్నగర్), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్లగొండ), డీకే అరుణ (గద్వాల్), చల్లా వంశీచంద్‌రెడ్డి (కల్వకుర్తి), టి.జీవన్‌రెడ్డి(జగిత్యాల), జె.గీతారెడ్డి (జహీరాబాద్) విజయం సాధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ (ముషీరాబాద్), ఇంకా బీజేపీ తరఫున జి.కిషన్‌రెడ్డి (హిమాయత్‌నగర్), చింతల రామచంద్రారెడ్డి (ఖైరతాబాద్) కూడా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి ఎ.రేవంత్‌రెడ్డి (కొడంగల్), టి.ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), తలసాని శ్రీనివాస్‌యాదవ్ (సనత్‌నగర్) విజయం సాధించారు. చాంద్రాయణగుట్ట నుంచి గెలిచిన అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి ఎంఐఎం శాసనసభ పక్ష నేత అయ్యారు. హస్తం గోడు.! 2014 ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో 42 సీట్లలో కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితమైంది. అవి కూడా తెలంగాణలోనే గెలిచింది. నల్లగొండ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ (ఎస్సీ) నుంచి నంది ఎల్లయ్య గెలుపొందారు. టీడీపీకి 16 సీట్లు రాగా తెలంగాణలో ఒక్కటే దక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 9 సీట్లు గెలుచుకోగా అందులో తెలంగాణలోని ఖమ్మం లోక్‌సభ సీటు ఒకటి. బీజేపీకి మూడు సీట్లు వచ్చాయి. తెలంగాణలోని మొత్తం 17 సీట్లలో టీఆర్ఎస్ 11 సీట్లను గెలుచుకుంది. ఏపీ నుంచి 2004 ఎన్నికల్లో 29, 2009 ఎన్నికల్లో 33 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించి కేంద్రంలో యూపీఏ 1, 2 ప్రభుత్వాల ఏర్పాటులో డా.వైఎస్ రాజశేఖరరెడ్డి కీలకపాత్ర పోషించారు. 2014లో అందుకు పూర్తి విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. కేంద్ర మంత్రులు సూదిని జైపాల్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఓటమి పాలయ్యారు. తొలి గెలుపు.. మొదటిసారి ఎంపీలైన వారిలో వైఎస్సార్సీపీ నుంచి వై.వి.సుబ్బారెడ్డి (ఒంగోలు), వైఎస్ అవినాష్‌రెడ్డి (కడప), పి.వి.మిథున్‌రెడ్డి (రాజంపేట), వెలగపల్లి వరప్రసాదరావు (తిరుపతి), పీ.శ్రీనివాసరెడ్డి (ఖమ్మం), టీడీపీ నుంచి పి.అశోకగజపతిరాజు(విజయనగరం), కె.రామ్మోహన్నాయుడు (శ్రీకాకుళం), మాగంటి మురళీమోహన్ (రాజమండ్రి). ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అనకాపల్లి), గల్లా జయదేవ్ (గుంటూరు) బీజేపీ నుంచి కె.హరిబాబు (విశాఖపట్నం), గోకరాజు గంగరాజు (నరసాపురం), టీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి (వరంగల్), బి.బి.పాటిల్ (జహీరాబాద్), బాల్క సుమన్ (పెద్దపల్లి), బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి), కొండా విశ్వేశ్వరరెడ్డి (చేవెళ్ల), అజ్మీరా సీతారాం నాయక్ (మహబూబాబాద్) ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో దాదాపు 310 మంది మహిళలు వివిధ పార్టీల తరఫున, స్వతంత్రులుగానూ పోటీచేశారు. తెలంగాణ నుంచి 120 మంది పోటీ చేయగా 9 మంది (టీఆర్ఎస్–6, కాంగ్రెస్–3) గెలుపొందారు. కోస్తా, రాయలసీమ నుంచి 190 మంది పోటీ చేయగా, 18 మంది (టీడీపీ–10, వైఎస్సార్ కాంగ్రెస్–8) గెలిచారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 24 ఎంపీ సీట్లలో మొత్తం 43 మంది మహిళా అభ్యర్థులు పోటీచేశారు. వీరిలో తెలంగాణలో నిజామాబాద్ స్థానం నుంచి కల్వకుంట్ల కవిత (టీఆర్ఎస్), రాయలసీమలోని కర్నూలు నుంచి బుట్టా రేణుక (వైఎస్సార్సీపీ), ఉత్తరాంధ్రలోని అరకు (ఎస్టీ) సీటు నుంచి కొత్తపల్లి గీత (వైఎస్సార్సీపీ) తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. -
ఎన్నికల్లో బీఎల్ఎఫ్ను గెలిపించాలి
సాక్షి,హుజూర్నగర్ : రాష్ట్రంలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో బీఎల్ఎఫ్ను గెలిపించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శీతల రోశపతి అన్నారు. గురువారం స్థానిక అమరవీరుల భవనంలో అక్టోబర్ విప్లవం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టులు మాత్రమే ప్రజా పోరాటాల్లో, సమస్యల పరిష్కారంలో ప్రజలకు అండగా ఉంటున్నారన్నారు. ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ మహాకూటములను ఓడించాలన్నారు. కార్యక్రమంలో సోమయ్య, కనకయ్య, సీతయ్య, శ్రీను, వెంకటేశ్వర్లు, వెంకన్న, వీరయ్య, లక్ష్మీనారయణ ,చిన్నా ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బీఎల్ఎఫ్ గెలిస్తే బహుజనుల రాజ్యం మేళ్లచెరువు : బీఎల్ఎఫ్ గెలిస్తే బహుజనుల రాజ్యం వస్తుందని, బీఎల్ఎఫ్ బలపర్చిన సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌ను గెలిపించాలని కోరుతూ చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల జనరల్‌బాడీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి వట్టెపు సైదులు మాట్లాడుతూ.. గిరిజనులకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు, డబుల్బెడ్రూం, మూడు ఎకరాల భూ పంపిణీ వంటి హామీల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయిందన్నారు. పార్టీ అభ్యర్థిని చట్ట సభల్లోకి పంపినట్లయితే పేదలకు పక్ష పాతిగా సమస్యల పరిష్కారానికి కృషిచేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె వెంకటరెడ్డి, చింతలపాలెం మండల కార్యదర్శి కందుల సుందరమౌళేశ్వరరెడ్డి, కె.వెంకన్న, వెంకటేశ్వర్లు, భూలక్ష్మి, మరియమ్మ, నారాయణరెడ్డి, సైదా, శ్రీను, వీరబాబు పాల్గొన్నారు. బీఎల్ఎఫ్ అభ్యర్థిని గెలిపించాలి: నేరేడుచెర్ల: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఎల్ఎఫ్ బలపర్చిన సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావును గెలిపించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి ఆనగంటి మీనయ్య కోరారు. గురువారం ఆయన పార్టీ ఆధ్వర్యంలో నేరేడుచర్లలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కుంకు తిరపతయ్య, చిన్నయ్య, ఎడ్ల సైదులు, శ్రీను, రంజాన్, వరలక్ష్మి, ఏసు, లలిత, నాగేశ్వరరావు, రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ ప్రభంజనానికి ఎదురొడ్డి..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : కాంగ్రెస్ (ఐ)లో అంతర్గత విభేదాలతో 1978-83 మధ్య కాలంలో ఏకంగా నలుగురు ముఖ్యమంత్రులు మారడంతో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో సినీ హీరో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. పార్టీని ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూలు వెలువడింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రమంతటా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వీచింది. అయితే రాష్ట్ర ఆవిర్భావం నుంచి మెదక్ జిల్లాలో పట్టు నిలుపుకుంటూ వచ్చిన కాంగ్రెస్ ఎన్టీఆర్ ప్రభంజనానికి ఎదురొడ్డి మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. జిల్లాలోని అన్నీ అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం పోటీ చేసినా కేవలం మెదక్, నారాయనఖేడ్ నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. గజ్వేల్, సంగారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దొమ్మాట, సిద్దిపేట, జహీరాబాద్ నియోజకవర్గాల్లో మాత్రమే తెలుగుదేశం బలమైన పోటీ ఇచ్చి రెండో స్థానానికి పరిమితమైంది. కేసీఆర్ అరంగేట్రం... తెలంగాణ ఉద్యమనేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏడో శాశనసభ ఎన్నికల్లో తొలిసారిగా రంగంలోకి దిగారు. యువజన కాంగ్రెస్ నేతగా ఉన్న కేసీఆర్ సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 1970లో జరిగిన ఉప ఎన్నిక మొదలుకొని 1978 వరకు వరుస విజయాలు సాధించి, కీలకమైన శాఖలకు మంత్రిగా వ్యవహరించిన ఎ. మదన్మోహన్ నాలుగో పర్యాయం కాంగ్రెస్ నుంచి సిద్దిపేట ఎన్నికల బరిలో నిలిచారు. తన రాజకీయ గురువుగా చెప్పుకొనే మదన్మోహన్పై పోటీ చేసిన కేసీఆర్ కేవలం 887 ఓట్ల తేడాతో పరాజయం పొందాడు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలకుగాను 201 స్థానాలు సాధించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీ కేవలం 60 స్థానాలకు పరిమితం కాగా, సిద్దిపేట నుంచి వరుసగా నాలుగో పర్యాయం గెలుపొందిన మదన్మోహన్ అసెంబ్లీలో శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. 1984 ఆగస్టులో తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభంలో తెలుగుదేశం పార్టీ పక్షాన గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ వైపే ఉన్నారు. నెల రోజుల తర్వాత తిరిగి ఎన్టీఆర్ సీఎం పదవి చేపట్టగా మదన్మోహన్ స్థానంలో జహీరాబాద్ ఎమ్మెల్యే బాగారెడ్డిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా నియమించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త ముఖాలు రాజకీయ తెర మీదకు రాగా, మెదక్ జిల్లాలో మాత్రం ఒకరిద్దరు మినహా అన్నీ నియోజకవర్గాల్లో కాపులే తలపడ్డారు. 1972లో ఇండిపెండెంట్‌గా, 1978లో కాంగ్రెస్ (యు) అభ్యర్థిగా మెదక్ నుంచి పోటీ చేసిన కరణం రామచంద్రరావు టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే శేరి లక్ష్మారెడ్డిపై విజయం సాధించారు. 1981 ఉపఎన్నికలో రామాయంపేట నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండో పర్యాయం విజయం సాధించారు. దొమ్మాట నుంచి ఐరేని లింగయ్య వరుసగా రెండోసారి విజయం సాధించగా, ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన దొమ్మాట రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తలపడ్డారు. 1970లో జరిగిన ఉప ఎన్నిక నుంచి వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న ఎ. మదన్మోహన్ సిద్దిపేటలో వరుసగా నాలుగో పర్యాయం గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రసమితి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా 1983 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 1972లో ఇండిపెండెంట్‌గా, 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా గజ్వేల్ నుంచి పోటీ చేసి వరుస ఓటమి చవిచూసిన అల్లం సాయిలు మరోమారు ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. వరుసగా నాలుగు పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధిస్తూ వస్తున్న గజ్వెల్లి సైదయ్య విజయ పరంపరకు చెక్ పెట్టారు. నర్సాపూర్‌లో తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి చిలుముల విఠల్‌రెడ్డి (సీపీఐ)పై సీ.జగన్నాధరావు గెలుపొందారు. సంగారెడ్డిలో 1962 నుంచి వరుస ఎన్నికల్లో పోటీ చేస్తూ గెలుపోటములను చవిచూసిన పీ. రామచంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. 1972లో ఇండిపెండెంట్తగా విజయం సాధించి, 1978లో కాంగ్రెస్ (యు) అభ్యర్థిగా ఓటమి చవిచూసిన ఎం. వెంకటరెడ్డి 1983 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి బరిలో నిలిచి గెలుపొందారు. 1957లో జహీరాబాద్ నుంచి విజయాల పరంపర ప్రారంభించిన ఎం. బాగారెడ్డి వరుసగా ఆరో పర్యాయం (డబుల్ హ్యాట్రిక్) జహీరాబాద్ నుంచి విజయకేతనం ఎగురవేశారు. -
‘నెల్లికల్’ను నేనే ప్రారంభిస్తా
తిరుమలగిరి (నాగార్జునసాగర్) : నెల్లికల్ లిఫ్టును పూర్తిచేసే దమ్ము టీఆర్ఎస్ నాయకులకు లేదని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో తన చేతులమీదుగానే లిఫ్టుకు శంకుస్థాపన చేసి ప్రారంభిస్తానని తెలిపారు. సోమవారం తిరులమగిరి మండలంలోని ఎర్రచెరువుతండా, నెల్లికల్, జాల్‌తండా, బట్టువెంకన్నబావితండా, సఫావత్తండా, నాయకునితండా, చింతలపాలెం గ్రామాల్లో తనయుడు రఘువీర్‌రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ నెల్లికల్ లిఫ్టును జనవరిలో ప్రారంభించి ఊగాదినాటికి పూర్తిచేస్తామని కొంత మంది నాయకులు చెబుతుంటే లిఫ్టు ఇరిగేషన్‌పై ఏమాత్రం అవహన ఉన్నదో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. నెల్లికల్ లిఫ్టు ఏర్పాటుకు సహకరించాలని తాను ఢిల్లీ ప్రభుత్వాన్ని గతంలోనే కోరినట్లు తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనుమతులు రావడానికి ఆరు నెలల సమయం పడుతుందని మూడు నెలల్లో ఎలా లిఫ్టును ఏర్పాటు చూస్తారని ప్రశ్నించారు. నెల్లికల్ లిఫ్టు పూర్తయ్యేసరికి ఇంకా మూడు సంవత్సరాలు పడుతుందని తెలిపారు. లిఫ్టు అనుమతుల కోసం ఎంపీ సుఖేందర్‌రెడ్డి ఢిల్లీలో జరిగిన సమావేశానికి వెళితో అక్కడి అధికారులు సమావేశానికి రానివ్వకుండా గెంటేశారని, అలాంటి నాయకుడు లిఫ్టును ఎలా తీసుకువస్తాడని ప్రశ్నించారు. నెల్లికల్ రైతులకు సాగుటిని అందించాలనేదే తన జీవితాశయమని అందులో భాగంగానే తన సొంత ఖర్చులతో 12సార్లు సర్వేలు చేయించి, రూ. 50 కోట్లను విడుదల చేయించినట్లు తెలిపారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భవనం వెంకట్రాంరెడ్డి తన ప్రాంతానికి నీటికి అందించాలంటనే నానా అవస్థలు పడ్డాడని సీఎం కేసీఆర్ ఎలా ప్రాజెక్టులను పూర్తిచేస్తాడని ప్రశ్నించారు. తునికినూతల, చింతలపాలెం, జమ్మనకోట గ్రామాల్లో ఉన్న లిఫ్టుల మరమ్మతులకు గురై రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని నాయకులను ప్రజలు ఎలా నమ్ముతారని అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి 1.5లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత జానారెడ్డిదేనని పేర్కొన్నారు. 1975 సంవత్సరంలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రవేశ్ రాష్ట్రంలోని గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. ఇంధిరాగాంధీ ప్రవేశపెట్టిన రిజర్వేషన్లతో ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 2లక్షల రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రూ.లక్ష రుణం, ఉచితంగా సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు, ఉచితంగా సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. ఒకసారి సమితి అధ్యక్షుడిగా, ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన మీరు ఈ ఎన్నికల్లో కూడా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, తిరుమలగిరి మండల అధ్యక్షుడు ఆంగోతు భగవాన్ నాయక్, నాయకులు రిక్కల ఇంద్రసేనారెడ్డి, కృష్ణారెడ్డి, తునికినూతల మాజీ సర్పంచ్ రమావత్ లాలు నాయక్, రమావత్ శంకర్ నాయక్, బూడిద ఏడు కొండలు, బొడ్డు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
పాసవుతామా..!
జనామోదం ఉన్నవారికే టికెట్లు ఇస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ప్రకటన ఆ పార్టీ ఎమ్మెల్యేలలో గుబులు రేకెత్తిస్తోంది. 2014లో అధికారం చేపట్టనప్పటి నుంచి ఇప్పటివరకు తొమ్మిదిసార్లు సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి.. శాసనసభ్యుల పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. సర్వే ఫలితాలను ఎమ్మెల్యేలకు వివరిస్తూ పనితీరులో వెనుకబడ్డవారికి క్లాస్ తీసుకుంటున్నారు. అలాగే పాస్‌మార్కులకు దగ్గరగా ఉన్నవారికి పలు సూచనలు చేస్తున్నారు. ఏయే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏమిటి? శాసనసభ్యుడి పనితీరు పట్ల ప్రజాభిప్రాయం ఎలా ఉంది? ప్రభుత్వ పాలన, సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజానాడి ఎలా ఉంది? అనేది విశ్లేషించనున్నారు. దీనికి అనుగుణంగా లభించే మార్కుల మేరకు అభ్యర్థిత్వాలు ఖరారయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎమ్మెల్యేల పనితీరుపై, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. సామాజికవర్గాల వారీగా ప్రజల మనోగతం తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి.. ప్రైవేటు ఏజెన్సీల నుంచే కాకుండా నిఘా వర్గాలు ఇచ్చే సమాచారాన్ని కూడా క్రోడీకరించుకుంటున్నారు. దీనికి అనుగుణంగానే మూడు నెలలకోసారి శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తూ సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల జట్టు కూర్పుపై కసరత్తు చేస్తున్న గులాబీ అధిష్టానం చివరి సర్వేను వారం రోజుల్లో ప్రకటించే దిశగా ఆలోచన చేస్తోంది. వాస్తవానికి ఈ నెల 17న ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మరణంతో ఈ సమావేశాన్ని రద్దుచేసింది. ‘ముందస్తు’ సంకేతాలతో.. షెడ్యూల్ కంటే ముందుగానేఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ తరహా సంకేతాలివ్వడం.. సెప్టెంబర్ నెలలోనే 80శాతం టికెట్లను ప్రకటిస్తామనడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. అంతేగాకుండా సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ నిర్వహించాలని నిర్ణయించడం.. 25 లక్షల మందితో ఈ సభ జరపాలని భావిస్తుండడం చూస్తే ఈ బహిరంగ సభలోనే ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సభలో మెజార్టీ టికెట్లను ప్రకటిస్తామని చేసిన ప్రకటన అధికార పార్టీలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. డిసెంబర్‌లోపు శాసనసభ ఎన్నికలను పూర్తిచేయడమే లక్ష్యంగా పావులు కదుపుతుండడం.. నియోజకవర్గాలకే పరిమితం కావాలని ఎమ్మెల్యేలకు సూచిస్తుండడంతో గులాబీ దళంలో ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో పెండింగ్ పనులను పూర్తిచేసేందుకు ప్రజాప్రతినిధులు యంత్రాంగంపై ఒత్తిడి పెంచారు. ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లనున్నందున ప్రజావ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఫైనల్ సర్వే ఇదే..? త్వరలో జరుగనున్న శాసనసభాపక్ష సమావేశంలో సర్వే వివరాలను ముఖ్యమంత్రి వెల్లడించే అవకాశముంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన పక్షంలో ఇదే సర్వే కానుంది. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా ప్రజాభిప్రాయం సేకరించిన ముఖ్యమంత్రి.. ఫలితాలను మదింపు చేశారు. దీనికి అనుగుణంగా ఆయా నియోజకవర్గాల రాజకీయ భవిష్యత్తును నిర్దేశించనున్నారు. ఈ సర్వేలో మెరుగైన ఫలితాలు కనబరిచిన వారి టికెట్లకు ఢోకాలేకున్నా వెనుకబడ్డవారికి రిక్తహస్తమే మిగలనుంది. సర్వే నివేదిక ఆధారంగా ఏయే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాగుంది? శాసనసభ్యుడి పనితీరు పట్ల ప్రజాభిప్రాయం ఎలా ఉంది? ప్రభుత్వ పాలన ముఖ్యమంత్రి సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజా నాడి ఎలా ఉంది? అనేది విశ్లేషించనున్నారు. దీనికి అనుగుణంగా లభించే మార్కుల మేరకు అభ్యర్థిత్వాలు ఖరారయ్యే ఛాన్స్ ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ పాస్ మార్కులు కూడా లభించని శాసనసభ్యులకు టికెట్టు ఎందుకు నిరాకరించదలిచామో విడమరిచి చెప్పే అవకాశంలేకపోలేదని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరి అభ్యర్థిత్వాలపై మరో నెల రోజుల్లో క్లారిటీ రానుంది. ఈ వారంలో జరిగే ఎల్పీ మీటింగ్ వచ్చే ఎన్నికలకు నాంది పలికే అవకాశం కనిపిస్తోంది. ఎందుకు ముందుగా రణక్షేత్రంలోకి వెలుతున్నామనే అంశంపై కూడా స్పష్టత ఇచ్చే వీలుంది. -
పొలిటికల్ జోష్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీల్లోనూ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనే విధంగా అధికార టీఆర్ఎస్ సిద్ధమవుతుండగా.. సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారం మరింత వేడి పుట్టిస్తోంది. ఉమ్మడి జిల్లాలో మరింత పట్టు సాధించేందుకు టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఇప్పటికే రాజకీయంగా ఆయా నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ఎమ్మెల్యేలు సమస్యలపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించేలా ప్రణాళికలు రూపొందించడంతోపాటు నియోజకవర్గ పర్యటనను విస్తృతం చేసేలా పార్టీ ఆదేశాలు జారీ చేసింది. 15 రోజులుగా ఉమ్మడి జిల్లాలో మంత్రి తుమ్మలతోపాటు టీఆర్ఎస్కు చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు నియోజకవర్గ రాజకీయ కార్యకలాపాలపై, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశాలు నిర్వహించడం.. గ్రామాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, పార్టీలో ఆది నుంచి ఉంటూ.. అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాంనాయక్ సైతం నియోజకవర్గాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఆయా నియోజకవర్గాల్లో పర్యటించడంతోపాటు ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన పనుల పురోగతి, కేంద్ర పథకాల ద్వారా జిల్లాకు వచ్చిన సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారులకు చేరుతున్న తీరు.. ఇంకా నిధులు తెచ్చేందుకు గల అవకాశాలపై ఆరా తీసే పనికి పూనుకున్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జిల్లాలో దాదాపు ఏటికి ఎదురీదాల్సి వచ్చింది. పది నియోజకవర్గాల్లో రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన టీఆర్ఎస్.. కేవలం కొత్తగూడెం శాసనసభ స్థానాన్ని.. అలాగే ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే మహబూబాబాద్ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుంది. కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు, మహబూబాబాద్ ఎంపీగా సీతారాంనాయక్ విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో అగ్రనేతగా ఉన్న జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేసి.. 2014, సెప్టెంబర్ 4న టీఆర్ఎస్లో చేరారు. ఆయనతోపాటు పలువురు ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులతోపాటు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డీసీఎంఎస్ చైర్మన్ అంజయ్య తదితరులు చేరగా.. వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలుగా గెలిచిన బానోత్ మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు ఆయా సందర్భాల్లో గులాబీ గూటికి చేరారు. నాలుగింట్లో కాంగ్రెస్.. గత ఎన్నికల్లో రాష్ట్రమంతటా టీఆర్ఎస్ గాలి వీచినా.. జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పది శాసనసభ స్థానాలకు.. నాలుగు స్థానాల్లో గెలుపొందింది. ఆ తర్వాత ఇల్లెందు, ఖమ్మం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. పాలేరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నికల్లో అప్పటివరకు ఎమ్మెల్సీగా ఉంటూ.. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మల్లు భట్టి విక్రమార్క జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక ఎన్నికల తరుణం ముంచుకొస్తుండటంతో ఇటు అధికార, అటు ప్రతిపక్ష పార్టీల నేతలు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటూ.. సీట్లు మావే, గెలుపు మాదే అంటూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏడుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు టికెట్ ఖాయమనే ధీమాతో ఉండగా.. ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలకు సైతం టీఆర్ఎస్ అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలు అందాయని ప్రచారం జరుగుతోంది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గాలవారీగా కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భద్రాచలం నుంచి సీపీఎంకు చెందిన సున్నం రాజయ్య, మధిర నుంచి కాంగ్రెస్‌కు చెందిన మల్లు భట్టి విక్రమార్క, సత్తుపల్లి నుంచి టీడీపీకి చెందిన సండ్ర వెంకటవీరయ్య ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అక్కడ దీటైన అభ్యర్థులను బరిలోకి దిచేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఉమ్మడి జిల్లాలోని పది ఎమ్మెల్యే స్థానాలతోపాటు రెండు ఎంపీ స్థానాలను గెలిపించే బాధ్యత తానే తీసుకుంటానని ఇటీవల టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన సభలో మంత్రి తుమ్మల ప్రకటించడంతో ఎన్నికల హడావుడి ప్రారంభమైనట్లయింది. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పట్టున్న వాటిపై దృష్టి.. సీపీఐ, సీపీఎం సైతం వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు తమకు పట్టున్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టాయి. అయితే ఎన్నికల నాటికి ఎవరితో పొత్తు ఉంటుందనే అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇక టీడీపీ జిల్లాలో ఒకవైపు ఉనికి కోల్పోవడమే కాకుండా.. మరోవైపు సంస్థాగత సమస్యలతో సతమతమవుతోంది. పదవులను భర్తీ చేయడంలో పార్టీ వైఖరిని నిరసిస్తూ ద్వితీయ శ్రేణి నేతలు సాక్షాత్తూ టీడీపీ జిల్లా కార్యాలయం ఎదుటే ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అలాగే సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తమకు పట్టున్న ఇల్లెందు నియోజకవర్గంపై ఈసారి పూర్తిస్థాయి దృష్టి సారించి.. ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక బీజేపీ సైతం కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉండటం.. అనేక పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుండటంతో వాటిని క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం ద్వారా జిల్లాలో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేసే పనిలో నిమగ్నమైంది. బీజేపీ జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను నియమించడంతో ఆ పార్టీ వర్గాల్లో నూతనోత్తేజం నెలకొంది. క్షేత్రస్థాయికి వైఎస్సార్ సీపీ.. ముఖ్యంగా గత ఎన్నికల్లో మూడు ఎమ్మెల్యే స్థానాలతోపాటు ఒక పార్లమెంట్ స్థానాన్ని గెలుపొందిన వైఎ స్సార్ సీపీ ఈ ఎన్నికల్లో సైతం తన సత్తా చాటేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వేర్వేరుగా అధ్యక్షులను సైతం నియమించి.. కార్యకలాపాలను వేగవంతం చేసింది. ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు కొల్లు వెంకటరెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాతో దివంగత నేత వైఎస్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం, ఆయన అభిమానులను ఏకతాటిపై చేర్చి.. పార్టీ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. -
టీఆర్ఎస్ అభ్యర్థులకు ‘సెప్టెంబర్’ ఫీవర్ !
సాక్షిప్రతినిధి, కరీంనగర్: చరిత్రలో సెప్టెంబర్ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది ఈ మాసంలోనే.. ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా సెప్టెంబర్‌నే కీలక మాసంగా ప్రకటించారు. ‘ముందస్తు’ ఎన్నికలు డిసెంబర్లో వస్తాయంటూ ఈనెల 13న కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన, సెప్టెంబర్‌లోనే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇదే సమయంలో దాదాపుగా ‘సిట్టింగ్’లకే అవకాశం కల్పిస్తామన్న గులాబీ దళనేత, సర్వే నివేదికలు, స్క్రీనింగ్ కమిటీల సిఫారసులను కూడా ప్రామాణికంగా తీసుకోనున్నామన్నారు. ఇదివరకే నాలుగున్నరేళ్లలో ఐదు సర్వేలు చేయించిన ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నలుగురైదుగురు ఎమ్మెల్యేలకు పాస్ మార్కులు రాలేదని చెప్పారు. మూడు నెలల కిందట కూడా ఆయన ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా జిల్లాలో నలుగురైదుగురు ‘డేంజర్‌జోన్’లో ఉన్నట్లు కూడా హెచ్చరించారు. ఇదే సమయంలో ఈనెల 13న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన జిల్లా అధికార పార్టీలో గుబులు పుట్టిస్తోంది. ఇన్నాళ్లు సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని పదేపదే చెప్పిన కేసీఆర్ ఈసారీ అదే ప్రకటన చేసినా.. సర్వే ఫలితాలు, స్క్రీనింగ్ కమి టీల రిపోర్టులు ఆధారంగానే అభ్యర్థుల ఖరారు ఉంటుందని మెలిక పెట్టడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. సెప్టెంబర్‌లో అభ్యర్థుల ప్రకటన..? పార్టీ నేతలు అప్రమత్తం.. అనుకున్నట్లుగానే ఎన్నికలు వస్తే సెప్టెంబర్‌లోనే తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 2న హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించే భారీ బహిరంగ సభలోనే అభ్యర్థుల ప్రకటనపై స్పష్టత ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ముఖ్యమంత్రి స్ప ష్టం చేయడంతో ఇక పొత్తుల బెడద తప్పినట్లేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ‘ముందస్తు’ ప్రకటన నేపథ్యంలో జిల్లాలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలను అంచనా వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో ఏ పార్టీ జత కట్టే అవకాశం ఉంది? అది తమకు ఎలా కలిసి వస్తుంది? అనే అంశాలను బేరీజు వేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాలకు స్క్రీనింగ్ కమిటీలు వేసి అభ్యర్థుల ఎంపికలో వారి పాత్రను కీలకం చేయనున్నట్లు కూడా అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా గులాబీ నేతలు అప్రమత్తం అవుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లోని తాజా పరిస్థితులను అంచనా వేసుకుంటున్నారు. కులాలు, సామాజికవర్గాల వారీగా ఓటర్ల జాబితాపై ఆరా తీస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని తొమ్మిది స్థానాల నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సిట్టింగ్‌లు ప్రజల్లో తమ బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నాలు చేస్తూనే అధినేత ఆశీస్సుల కోసం ఆరాటపడుతున్నారు. ఆశావహుల్లో సర్వేలు, స్క్రీనింగ్‌ల దడ.. మంత్రి కేటీఆర్ ప్రకటనతో ఊరట.. టీఆర్ఎస్ శాసనసభ్యులుగా ఎన్నికైన తరువాత 2015–16 సంవత్సరంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ మొదట సర్వే జరిపించారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి వరకు మరో రెండు విడతల సర్వే నిర్వహించారు. మొదటి, రెండో విడతల ఫలితాలు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఆ సమావేశంలోనే ర్యాంకులు, మార్కులను ప్రకటించారు. తొలి సర్వేలో మంచి మార్కులు కొట్టిన్న వారు కూడా రెండో, మూడో సర్వే నాటికి వెనుకబడిపోగా, మరికొందరు మెరుగుపర్చుకున్నట్లు తేల్చారు. ఆ తర్వాత నాలుగో విడత, ఇంటెలిజెన్స్‌ల ద్వారా కూడా జరిగినప్పటికీ గోప్యంగా వ్యవహరించిన అధినేత.. సర్వే ఫలితాలను ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా వివరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన తొలి, రెండో సర్వేలో హుజూరాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రజలు ఫస్ట్ ర్యాంకు ఇచ్చారు. తొలి సర్వేలో మంత్రి 73.50 శాతంగా ఉంటే.. రెండో సర్వే నాటికి ఆయన పనితీరు 89.90 శాతానికి పెరిగింది. ఆ తర్వాత ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తొలి సర్వేలో 42.60 శాతం మార్కులు రాగా, రెండో సర్వేలో 47.30 శాతానికి పెరిగింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ 70.60 శాతం నుంచి 60.40 శాతానికి తగ్గి, ఆ తర్వాత భారీగా పెరిగినట్లు అధినేత వెల్లడించారు. తొలి, రెండో, మూడో సర్వేలకు పోలిస్తే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాలుగు శాతం పెరగగా, మూడు, నాలుగో విడతలకు మిగతా ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేష్, సోమారపు సత్యనారాయణ, పుట్ట మధు, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, రసమయి బాలకిషన్, వొడితెల సతీష్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే శోభ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి గ్రాఫ్ మొదటి, రెండు సర్వేలకంటే పెరిగినట్లు ప్రకటించారు. చివరకు మొత్తంగా 13 మందిలో ఇద్దరు, ముగ్గురు ఇంకా డేంజర్‌జోన్‌లో ఉన్నారని పేర్కొనడం అప్పట్లో పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఇదే సమయంలో ‘ముందస్తు’ నేపథ్యంలో సెప్టెంబర్‌లో అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీఆర్ ప్రకటించడం పలువురిలో ‘సెప్టెంబర్’ ఫీవర్ పట్టుకుంది. ఇదిలా వుంటే ఇటీవల కరీంనగర్లో ప్రకటించిన మంత్రి కేటీఆర్ ‘నాకంటే, మంత్రి ఈటల రాజేందరన్న కంటే, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ కంటే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు’ అంటూ చెప్పకనే చెప్పారు. ‘మళ్లీ ఈ జిల్లాలో ఇప్పుడున్న మేమే పోటీ చేస్తాం.. మేమే గెలుస్తాం’ అని మాట్లాడటం ‘సిట్టింగ్’లకు ఊరట కలిగించింది. అసెంబ్లీ స్థానాల రేసులో ఎంపీల పేర్లు.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు జి.వివేక్ సిట్టింగ్ ఎంపీగా ఉండి 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఆయనే పోటీ చేస్తారని అందరూ ఆశించారు. కానీ.. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో వివేక్ అనూహ్యంగా మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో అప్పటివరకు చొప్పదండి అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న బాల్క సుమన్ పెద్దపల్లి అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బాల్క సుమన్ విజయం సాధించా రు. కాగా.. గతేడాది మాజీ ఎంపీ జి.వివేక్ మళ్లీ టీఆర్ఎస్లో చేరడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. వివేక్ తిరిగి టీఆర్ఎస్లోకి రావడంతోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో బాల్క సుమన్ ఇటు ఉమ్మడి కరీంనగర్, అటు ఉమ్మడి అదిలాబాద్‌లోని ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాలపై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలోనూ నిజామాబాద్ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరగ్గా, ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. అక్కడి నుంచి డాక్టర్ సంజయ్‌కుమార్ పేరు ఖాయంగా చెప్తున్నారు. రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణమాలు, సమీకరణల నేపథ్యంలో ఏ మార్పులైనా సంభవించవచ్చన్న చర్చ కూడా రాజకీయవర్గాల్లో సాగుతోంది. -
సెప్టెంబర్ 2న అభ్యర్థుల ప్రకటన: కేసీఆర్
అధికార టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓ వైపు ముందస్తు, మరోవైపు జమిలి ఎన్నికల ప్రచారం జరుగుతుండగా, సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ చేసిన సంచలన ప్రకటన కలకలం రేపుతోంది. సోమవారం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియా సమావేశంలో చేసిన కీలక ప్రకటనలు పార్టీలో ఎన్నికల వాతావరణానికి తెర తీశాయి. ఇదే సమయంలో సెప్టెంబర్ 2న హైదరాబాద్ శివారు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ‘ప్రగతి నివేదిన సభ’ పేరిట భారీ బహిరంగసభ.. అదే రోజు అభ్యర్థులను ప్రకటిస్తా మని పేర్కొనడం పార్టీలో హీట్‌ను పెంచింది. అభ్యర్థుల ప్రకటనకు సర్వేలే ప్రాతిపదకని చెప్పిన కేసీఆర్.. సెప్టెంబర్ 2న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని కీలక ప్రకటన చేయడం కలకలం రేపుతోంది. టికెట్ ఆశిస్తున్న వారిలో ‘ఏం జరుగుతుంది’ అన్న ఆందోళన మొదలైంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: సీఎం, టీఆర్ఎస్ అధినేత ప్రకటన మేరకు అభ్యర్థుల ప్రకటనలో తాను స్వయంగా చేయించిన సర్వేలే కీలకం కానున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని కేసీఆర్ కూడా మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. చాలా వరకు సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని పలుమార్లు చెప్తున్న ఆయన.. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అంతేగాకుండా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా గతంలో కేసీఆర్ నియోజకవర్గం, జిల్లా బాధ్యులను నియమించారు. పార్టీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శి, సహాయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి హోదాలలో ఉన్న పలువురు సీనియర్లకు అవకాశం కల్పించారు. జిల్లాకు చెందిన సీనియర్లు ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించిన కేసీఆర్, పొరుగు జిల్లాకు చెందిన సీనియర్‌ను జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించారు. మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్యను పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలకు నలుగురు బాధ్యులను నియమించారు. మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌తోపాటు హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల ఇన్చార్జి బాధ్యతలను పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తకు అప్పగించారు. ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్‌రావుకు సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల అర్బన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్‌కు కరీంనగర్, చొప్పదండి, ధర్మపురి, కర్ర శ్రీహరికి పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల ఇన్‌చార్జీలుగా నియమించారు. సెప్టెంబర్ 2న ప్రకటించే అభ్యర్థుల జాబితాలో సర్వేలతోపాటు ఈ కమిటీలు, కొత్తగా వేసే మూడు నియోజకవర్గాలకో ‘స్క్రీనింగ్’ కమిటీలు కూడా కీలకం కానున్నాయని చెప్తున్నారు. ఒంటరిపోరుకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్.. నేతల్లో మొదలైన టిక్కెట్ల టెన్షన్.. సోమవారం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో సెప్టెంబర్ 2న భారీ ఎత్తున ప్రగతి నివేదన సభ నిర్వహణ, అభ్యర్థుల ప్రకటనపై కూడా స్పష్టత ఇచ్చారు. ఇదే సమయంలో ‘ఈ మధ్య పేపర్లలో ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పొత్తులు ఉండవు. ఇది పార్టీ ఏకగ్రీవ నిర్ణయం’ అంటూ కుండబద్దలు కొట్టారు. సెప్టెంబరులోనే ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తామని, మూడు నియోజకవర్గాలకు ఒకటి చొప్పున స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తామని కూడా సీఎం తెలిపారు. నాలుగేళ్లలో ఐదారు సర్వేలు నిర్వహించిన ఆయన చాలా మంది పనితీరును మార్చుకోవాలని పలువురు ఎమ్మెల్యేలకు సూచించారు. ఎమ్మెల్యేల పనితీరుకు మార్కులు, గ్రేడింగ్ కూడా ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చాలావరకు అవకాశం ఇస్తామన్న ఆయన సర్వేలను కూడా ప్రామాణికంగానే తీసుకుంటామని కూడా పలుమార్లు పార్టీ కీలక భేటీల్లో వెల్లడించారు. ఇదే సమయంలో సోమవారం సెప్టెంబర్‌లో అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని కీలక ప్రకటన చేయడంపై పలువురు ఎమ్మెల్యేలు, ఆశావహుల్లో టిక్కెట్ల టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్‌లకు ఎంతమందికి మళ్లీ టిక్కెట్లు దక్కుతాయి? కొత్తగా ఎంతమంది చాన్స్ దొరుకుతుంది? ఒకవేళ పాతవారిని మార్చాల్సి వచ్చినా, కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సి వచ్చినా వారిని అధినేత ఏ విధంగా సంతృప్తి పరుస్తారు? అన్న పలు కోణాల్లో రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఈశాన్య రాష్ట్రాలలో మొదలైన ఓట్ల లెక్కింపు
-
అప్పుడే టికెట్ల గొడవ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్‌లో సీట్ల లొల్లి తారాస్థాయికి చేరింది.నియోజకవర్గస్థాయి రాజకీయాలు చినికి చినికి గాలివానలా మారి గాంధీభవన్‌కు చేరాయి. ఎన్నికలకు ఏడాది ముందే వర్గ కుమ్ము లాటలు జోరందుకున్నాయి. నేతల మధ్య సిగపట్లు ఆ పార్టీని అంతర్గతంగా కుదిపేస్తున్నాయి. తాజాగా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాన్ని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌కు కేటాయించినట్లు జరుగుతున్న ప్రచారంతో రగిలిపోతున్న వైరివర్గం నాయకులు గాంధీభవన్ వద్ద పంచాయతీ పెట్టారు. వచ్చే ఎన్నికల్లోనూ క్యామ మల్లేషే బరిలో ఉంటారని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ప్రకటించినట్లు వార్తలు రావడంతో.. ఇదే సీటును ఆశిస్తున్న మల్రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డిలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మల్రెడ్డి సోదరులు, అనుచరులు కార్యకర్తలను తప్పుదోవ పట్టించేలా పార్టీ అధ్యక్షుడు చేసిన ప్రకటనపై తాడోపేడో తేల్చుకోవాలని అనుచరవర్గంతో గాంధీభవన్‌కు తరలివచ్చారు. ఈ పరిణామంతో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో గురువారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఇటీవల ప్రకటనపై వాకబు చేశారు. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి క్యామ మల్లేష్ అభ్యర్థిత్వమే కారణమని, మరోసారి అలాంటి పొరపాటు చేయవద్దని సూచించారు. టికెట్టుపై కార్యకర్తల్లో అయోమయం సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. ఉత్తమ్ మాత్రం గెలుపుగుర్రాలకే సీటు కేటాయిస్తామని, టికెట్ల ఖరారు వ్యవహారంపై అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇటీవల ఇతర పార్టీల నేతలు కొందరు పార్టీలో చేరిన సమయంలో అన్యాపదేశంగా క్యామకు టికెట్ అన్నానే తప్ప... ఖరారైందని తాను అనలేదని ఉత్తమ్ మల్రెడ్డి వర్గీయులతో అన్నట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే ఉప్పు..నిప్పులా ఉన్న పట్నం రాజకీయాలు తాజా పరిణామాలతో మరింత చిటపటలాడుతున్నాయి. క్యామ వల్లే భువనగిరిలో ఓడిపోయాం: మల్రెడ్డి ఓడిపోయేవారికి టికెట్లు ఇవ్వడం వల్లే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. క్యామ మల్లేష్‌కు ఇబ్రహీంపట్నం టికెట్ వచ్చినట్లు ప్రచారం చేసుకోవడంతో కార్యకర్తలు ఆందోళన చెంది గాంధీ భవన్‌కు వచ్చారని తెలిపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారానికి దూరం కావడానికి ఇలాంటి వాళ్లే కారణమన్నారు. గెలిచే వారికే టికెట్లు ఇస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారని, మల్లేష్ మాత్రం టికెట్ వచ్చిన్నట్టు అబద్దపు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. క్యామ మల్లేష్‌కు ఇవ్వడం వల్ల భువనగిరి పార్లమెంటు సీటు ఓడిపోయామని, తమకే గనక పట్నం టికెట్ ఇచ్చి ఉంటే.. భువనగిరి పార్లమెంటు సీటు గెలిచే వాళ్లమని చెప్పారు. అధిష్టానం మాటే శిరోధార్యం : క్యామ మల్లేశ్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా. గెలుపోటములకు అతీతంగా పార్టీ కోసమే పనిచేస్తున్నా. పార్టీని బలోపేతం చేయడమే నా లక్ష్యం. మల్రెడ్డి సోదరులు కార్యకర్తలను ఏనాడూ పట్టించుకోలేదు. అధికారం పోగానే కనుమరుగైన నేతలు ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో కార్యకర్తలకు తెలుసు. ఎన్నడు కూడా ఏఐసీసీ, పీసీసీ నేతలను గౌరవించలేదు. స్థానికంగా వేసిన ఫ్లెక్సీల్లో కూడా నేతలను విస్మరించారు. నాకు టికెట్ ఇవ్వనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎక్కడా ఖండించలేదు. వీరే కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తున్నారు. -
ఏం చేస్తారో..? ఆ నలుగురు
భువనేశ్వర్: బిజేపూర్ ఉపఎన్నికకు అధికార పక్షం బిజూ జనతా దళ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికలో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రత్యర్థుల వ్యూహాత్మకచర్యల్ని పటిష్టంగా ఎదుర్కొనేందుకు బిజూ జనతా దళ్ పకడ్బందీ సన్నాహాలు చేస్తోంది. ఉప ఎన్నిక ఆద్యంతాల్లో ప్రత్యర్థులు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడి ఓటరును తప్పుదారి పట్టించకుండా చేసేందుకు పార్టీ వ్యూహాత్మక కార్యాచరణ ఖరారు చేసింది. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయిన నాటినుంచి ఎంటి మీద కునుకు లేకుండా అధికార పార్టీ వర్గాలుశ్రమిస్తున్నాయి. బిజేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌ను సొంతం చేసుకునేందుకు బీజేడీ యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో 3 అంచెల్లో పరిశీలకులు, పర్యవేక్షకుల్ని నియమించింది. అసెంబ్లీ, సమితి, పంచాయతీ స్థాయిలో పర్యవేక్షక బృందం కృషి చేస్తోంది. వీరితో పాటు ఒక్కో స్థానిక నాయకుడు ప్రతి 10 కుటుంబాలకు బాధ్యత వహించేందుకు వ్యూహాత్మక పరిశీలన ఏర్పాట్లను బీజూ జనతా దళ్ పూర్తి చేసింది. ఈ వ్యవహారాలకు పార్టీ నుంచి ఎంపిక చేసిన నలుగురు ప్రముఖుల్ని బీజేడీ ఖరారు చేసింది. వీరిలో సుశాంత సింగ్,సంజయ్ కుమార్ దాస్ వర్మ, ప్రణబ్ ప్రకాశ్ దాస్, నిరంజన్ పూజారి ఉన్నారు. మంత్రి సుశాంత్ సింగ్, ప్రణబ్ ప్రకాశ దాస్ బిజేపూర్ సమితి వ్యవహారాల్ని పర్యవేక్షిస్తారు. బర్పాలి సమితిబాధ్యతల్ని మాజీ మంత్రి సంజయ్ కుమార్ దాస్ వర్మకు కేటాయించగా గైసిలేట్ సమితి బాధ్యతల్ని మంత్రి నిరంజన్ పూజారికి కేటాయించారు. ఎంఎల్‌ఏలకూ పనే వీరితోపాటు పార్టీ ఎమేల్యేలంతా వరుస క్రమంలో బిజేపూర్ నియోజకవర్గాన్ని ప్రత్యేక్షంగా సందర్శించేందుకు పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశించారు. వీరంతాఅసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ప్రతి పంచయతీని సందర్శిస్తారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆధీనంలో కొనసాగిన బిజేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పాగా వేసేందుకు కాంగ్రెస్‌తో ఉభయ బిజూజనతా దళ్, భారతీయ జనతా పార్టీలు ప్రకటించాయి. కాంగ్రెస్ ఇంతవరకు తమ అభ్యర్థిని ఖరారు చేయలేదు. గాలింపు కొనసాగిస్తోంది. ప్రతి పంచాయతీపై గట్టి నిఘా బిజేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రతి పంచాయతీపై ఎమ్మెల్యేలంతా గట్టి నిఘా వేయాలని పార్టీ అధ్యక్షుడు ఆదేశించారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 59 పంచాయతీలు ఉన్నాయి.ఒక్కో పంచాయతీ బాధ్యతను ఒక్కో ఎమ్మెల్యేకి కేటాయించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ప్రతి పంచాయతీని ప్రత్యక్షంగాసందర్శించేందకుకార్యక్రమం ఖరారు చేశారు. -
బాలయ్యకు బాబు చెక్!
సాక్షి, అమరావతి: బావమరిది నందమూరి బాలకృష్ణకు చెక్ పెట్టేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారా? వచ్చే ఎన్నికల్లో బాలయ్యకు ఎమ్మెల్యే టికెట్ డౌటేనా? తెలుగుదేశం పార్టీలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే నిజమేనని స్పష్టమవుతోంది. బాలయ్యను రాజకీయాల నుంచి పూర్తిగా పక్కన పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ ప్రజాప్రతినిధిగా ఉంటే ఎప్పటికైనా తన కుటుంబానికి ఇబ్బందులు తప్పవని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటినుంచే ఆయనను పక్కకు తప్పించే వ్యూహాన్ని అమలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అందులో భాగంగానే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ వెనుకపడిందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. బాలయ్య పోటీచేస్తే ఓటమి ఖాయం 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అసలు బాగోలేదని, సర్వేల్లో ఈ నియోజకవర్గాలు పూర్తిగా వెనుకపడిపోయాయని చంద్రబాబు ఇటీవల తరచూ పార్టీ సమావేశాల్లో చెప్పుకొస్తున్నారు. ఆ 40 నియోజకవర్గాల్లో హిందూపురం కూడా ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈసారి అక్కడ బాలకృష్ణ పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమనే లీకులు టీడీపీ నుంచి బయటకు వస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదని, అక్కడి ప్రజల్లో అసంతృప్తి ఎక్కువగా ఉందని, దీనికంతటికీ ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడమే కారణమని చెబుతున్నారు. ఇతర నాయకులకే వ్యవహారాలన్నీ అప్పగించి అప్పుడప్పుడూ బాలయ్య తన నియోజకవర్గంలో తూతూమంత్రంగా తిరగడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే టికెట్ బాలయ్యకు దక్కకపోవచ్చని చెబుతున్నారు. బాబు వ్యూహంలో భాగంగానే.. బాలయ్యకు వ్యతిరేకంగా బయటకొస్తున్న లీకులు, ప్రచారం అంతా చంద్రబాబు వ్యూహంలో భాగమేననే వాదన వినిపిస్తోంది. మళ్లీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా బాలకృష్ణ క్రియాశీల రాజకీయాల్లో ఉంటే తన కుమారుడు లోకేశ్‌కు అడ్డంకిగా మారుతాడని బాబు నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. అందుకే బాలయ్యకు పొగ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి హిందూపురం నుంచి లోకేశ్‌ను రంగంలోకి దించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్పటివరకూ బావకు విధేయుడిగానే ఉంటున్న బాలకృష్ణ తాజా పరిణామాలపై ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సి ఉంది. -
బలంగా వీచిన వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గాలి
* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి నాలుగేళ్లు కూడా నిండకుండానే సార్వత్రిక ఎన్నికలలో తొలిసారిగా పోటీ చేసి తన సత్తా చాటింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన కొద్ది కాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికలలోనూ, సార్వత్రిక ఎన్నికలలోనూ తొలిసారి పోటీ చేసి మంచి ఫలితాలను సాధించింది. దేశంలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభంజనం ముందు అనేక పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయి. దశాబ్దాల చరిత్రగల పార్టీలు ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలుచుకోలేక ఘోర పరాభవాన్ని చవిచూశాయి. వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గాలి బలంగా వీచి మోడీ ప్రభంజనాన్ని తట్టుకొని నిలబడగలిగింది. రాష్ట్రంలో బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, సినిమా హీరో పవన్ కళ్యాణ్‌ను వెంటబెట్టుకొని తిరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, నాయకురాలు షర్మిలలు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి గణనీయమైన ఫలితాలు సాధించారు. వారి శ్రమకు ఫలితం దక్కింది. గ్రామీణ ప్రాంతాల ఓట్లర్లు ఆ పార్టీ పట్ల మంచి ఆదరణ చూపారు. * 2014 స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రంలోని 2571 మునిసిపల్ వార్డులకు ఎన్నికలు జరిగాయి. సుదీర్ఘ కాలంగా రాజకీయాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 53 వార్డులను, సిపిఐ 16, బిజెపి 12, సిపిఎం 8, బిఎస్పి 5 వార్డులను మాత్రమే గెలుచుకోగా, తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసిన వైఎస్ఆర్ సిపి 942 వార్డులను గెలుచుకుంది. టిడిపి 1428 వార్డులను గెలుచుకుంది. * కార్పోరేషన్లలో అయితే టిఆర్ఎస్ 48, బిజెపి 4, కాంగ్రెస్ 2, సిపిఎం 3, సిపిఐ 2, బిఎస్పి ఒక్క స్థానంలో మాత్రమే గెలవగా, వైఎస్ఆర్ సిపి 124 స్థానాలను గెలుచుకుంది. మునిసిపల్ ఎన్నికలలో పోలైన ఓట్లలో టిడిపికి 45.18 శాతం ఓట్లు పోల్ కాగా, వైఎస్ఆర్ సిపికి 40.54 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ రెండు పార్టీల మధ్య 4.64 శాతం ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. * ఈ ఎన్నికలలో 130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయింది. 30 ఏళ్ల అనుభవం గల టిడిపి 5,216 ఎంపిటిసి స్థానాలను, 373 జడ్పిటిసి స్థానాలను గెలుచుకోగా, తొలిసారి పోటీ చేసిన వైఎస్ఆర్ సిపి 4,199 ఎంపిటిసి స్థానాలను, 275 జడ్పిటిసి స్థానాలను గెలుచుకుంది. ఇంత చేసి ఈ రెండు పార్టీలకు పోలైన ఓట్ల మధ్య వ్యత్యాసం 3.07 శాతం మాత్రమే. * పార్టీ ఆవిర్భవించి కొద్ది కాలమే అయినా ఈ ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి క్రమశిక్షణ గల పార్టీగా పేరు తెచ్చుకుంది. ఎటువంటి గొడవలకు తావులేకుండా లోక్‌సభ, శాసనసభ సీట్లను కేటాయించింది. కొత్తవారికి అనేకమందికి టిక్కెట్లు ఇచ్చినా ఎటువంటి వివాదాలకు తావులేకుండా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ అభ్యర్థులకు సహకరించారు. టిక్కెట్ల కేటాయింపు విషయంలో టిడిపి, బిజెపిలలో వివాదాలు చెలరేగాయి. ఈ పార్టీల తరపు తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేశారు. ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో టిడిపి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. * వైఎస్ఆర్ సిపి విద్యావంతులకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు అన్ని వర్గాల టిక్కెట్లు ఇచ్చింది. తిరుపతి, కుప్పంలలో మాజీ ఐఏఎస్ అధికారులను, మల్కాజ్‌గిరిలో మాజీ ఐపిఎస్ అధికారిని, అరకులో మాజీ గ్రూప్1 అధికారిని నిలిపింది. ఇంకా పిహెచ్డి, పిజి చేసిన అనేక మంది విద్యావంతులకు అవకాశం ఇచ్చింది. * టిక్కెట్ల కేటాయింపులో అన్ని వర్గాల వారికి ప్రధాన్యత. కాపులకు, బిసిలకు, మైనార్టీలకు తగిన స్థాయిలో అవకాశం. * కొత్తవారికి, యువతకు అవకాశం ఇచ్చింది. ఎంపిలుగా గెలిచిన 9 మందిలో ఏడుగురు కొత్తగా లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. శాసనసభకు ఈ పార్టీ తరపున 45 మంది కొత్తవారు ఎన్నికయ్యారు. వీరిలో 12 మంది గతంలో ఇతర పార్టీల తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్ సిపి తరపున నిలిచి గెలిచారు. అటువంటి వారిలో సినీనటి రోజా, విశ్వేశ్వర రెడ్డి, బుడ్డా రాజశేఖర రెడ్డి వంటి వారు ఉన్నారు. * పార్టీ కోసం శ్రమించిన శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డలో నామినేషన్ దాఖలు చేసిన తరువాత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పార్టీ తరపున మరో వ్యక్తిని నిలబెట్టే అవకాశం లేకపోవడంతో బ్యాలెట్ పేపర్లో ఆమె పేరునే ఉంచారు. మరణించినా జనం ఆమెనే 17,928 ఓట్ల మెజార్టీతో ఎన్నుకొని ఘన నివాళులర్పించి దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించారు. * ఏపిలో అత్యధిక స్థానాలు గెలుచుకొని ముఖ్యమంత్రి కాబోతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ సిపి అధిక స్థానాలను గెలుచుకోవడం విశేషం. ఆ జిల్లాలో మొత్తం 14 శాసనసభ స్థానాలు ఉండగా, 8 స్థానాలలో వైఎస్ఆర్ సిపి విజయం సాధించింది. బిజెపి మొదటి సారి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. 30 ఏళ్ల తరువాత ఇప్పుడు ఆ పార్టీ 282 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. 2001లో ప్రారంభమైన టిఆర్ఎస్ 2004లో ఎన్నికలలో పోటీచేసి 26 శాసనసభ స్థానాలను, 5 లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి ఎన్నికలలో పోటీచేసి 16 శాసనసభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగారు. ఆర్ఎస్ వంటి పార్టీ 63 స్థానాలను గెలుచుకొని అధికారంలోకి రావడానికి 14 ఏళ్లు పట్టింది. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వేవ్‌లో 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క లోక్‌సభ సీటును గానీ, ఒక్క శాసనసభ స్థానాన్ని గానీ గెలుచుకోలేకపోయింది. ఉభయ కమ్యూనీస్టు పార్టీలు, లోక్‌సత్తా పార్టీ పరిస్థితి కూడా అంతే. అవి ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయాయి. ఇటు దక్షిణాదిలో డిఎంకె(ద్రవిడ మున్నెట్ర కజగం), అటు ఉత్తరాదిలో బహుజన సమాజ్‌వాది పార్టీ, ఆస్సాం గణపరిషత్, నేషనల్ కాన్షరెన్స్ పార్టీలు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక ఘోర పరాభవానికి గురయ్యాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాది పార్టీ కేవలం 5 స్థానాలతో, బీహార్‌లో అధికారంలో ఉన్న జెడి(యు) 2 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో కొత్తగా సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించింది. టిడిపికి గట్టి పోటీ ఇచ్చి 70 శాసనసభ స్థానాలను, 9 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. నాలుగేళ్లు (29.11.2010) కూడా నిండని వైఎస్ఆర్ సిపి అనతి కాలంలోనే ఇంతటి పోటీని తట్టుకొని ఇన్ని స్థానాలను గెలుచుకోవడం గొప్ప విజయంగా భావించవచ్చు. మోడీ గాలిలో కూడా ప్రజలు ఈ పార్టీని ఇన్ని స్థానాలతో గెలిపించి బలమైన ప్రతిపక్షంగా నిలిపారు. -
ఉత్తరాంధ్రలో మారిన లెక్కలు!
ఓటరు నాడి ఓ పట్టాన చిక్కదనడానికి తాజాగా జరిగిన స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిని బట్టి విశదమవుతోంది. ఓటరు తీర్పు ఎప్పటికప్పుడు విలక్షణంగానే ఉంటుందనేది మరోసారి విస్పష్టమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫలితాలను లోతుగా అధ్యయనం చేస్తే పలు ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పది, విజయనగరం జిల్లాలో 9, విశాఖపట్నం జిల్లాలో 15 మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో విశాఖపట్నం జిల్లాలోని విశాఖ పశ్చిమ, ఉత్తరం, దక్షిణం, తూర్పు, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల మినహా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలను బేరీజు వేచి చూడగా పలు ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా ఉత్తరాంధ్రలోని 29 నియోజకవర్గాల ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. మున్సిపల్, జెడ్పీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస, నరసన్నపేటల్లోనే ఆధిక్యం కనిపించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందడం గమనార్హం! అయితే, ఈ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్, జెడ్పీ ఎన్నికల ఫలితాల్లో వెనుకబడిన పాతపట్నం, పాలకొండ, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగురవేయడం విశేషం! ఆమదాలవలస పరిధిలో స్థానిక ఎన్నికల్లో 5,229 ఓట్ల ఆధిక్యం కనిపించినా, అసెంబ్లీకి వచ్చేసరికి ఈ నియోజకవర్గం నుంచి కూన రవికుమార్ (టీడీపీ) తన సమీప ప్రత్యర్థి తమ్మినేని సీతారాం (వైఎస్సార్సీపీ)పై ఐదు వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక నరసన్నపేటలో స్థానిక ఎన్నికల్లో 3,260 ఓట్ల ఆధిక్యాన్ని వైఎస్సార్సీపీ కనబరిచినా, అసెంబ్లీ ఫలితాల్లోకి వచ్చేసరికి ఇక్కడ బగ్గు రమణమూర్తి (టీడీపీ) సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ (వైఎస్సార్సీపీ)పై 4,889 ఓట్ల మెజారిటీ సాధించారు. పాతపట్నం పరిధిలో స్థానిక ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే, వైఎస్సార్సీపీకి ప్రత్యర్థి టీడీపీ కన్నా 1317 ఓట్లు తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ అసెంబ్లీ అభ్యర్థి కలమట వెంకటరమణ (వైఎస్సార్సీపీ) తన సమీప ప్రత్యర్థి, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (టీడీపీ)పై 3,865 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం. పాలకొండలో స్థానిక ఎన్నికల్లో టీడీపీకి 3,504 ఓట్ల ఆధిక్యం వచ్చినా, అసెంబ్లీ స్థానాన్ని మాత్రం వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై 1620 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజాంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ 4289 ఓట్ల ఆధిక్యం కనబరిచినా, అసెంబ్లీ ఫలితం వచ్చేసరికి కంబాల జోగులు (వైఎస్సార్ సీపీ) మాజీ స్పీకర్ ప్రతిభాభారతి (టీడీపీ)పై 512 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఈ జిల్లాలోని ఇచ్చాపురం, పలాస, ఎచ్చెర్ల, టెక్కలి, శ్రీకాకుళం స్థానాలు స్థానిక, సార్వత్రిక ఫలితాల్లో ఆధిక్యత కనబరిచిన టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. విజయనగరం జిల్లా ఫలితాలను విశ్లేషిస్తే.. స్థానిక ఫలితాల్లో వైఎస్సార్ సీపీ ఆధిక్యం కనబరిచిన బొబ్బిలి సెగ్మెంట్లో ఆ పార్టీయే గెలుపొందింది. స్థానిక ఫలితాల్లో వైఎస్సార్సీపీకి 6384 ఓట్ల ఆధిక్యం రాగా.. అసెంబ్లీ అభ్యర్థి సుజయ్ కృష్ణరంగారావు టీడీపీ అభ్యర్థి లక్ష్మునాయుడుపై 7330 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ జిల్లాలో మరోరెండు స్థానాలను వైఎస్సార్సీపీ గెలుపొందింది. కురపాంలో స్థానిక ఎన్నికల ఫలితాల్లో 525 ఓట్లు తగ్గినప్పటికీ అసెంబ్లీకి వచ్చేసరికి పి.పుష్పశ్రీవాణి టీడీపీ అభ్యర్థి జనార్థన్ థాట్రాజ్‌పై 19వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం! సాలూరులో స్థానిక ఫలితాల్లో టీడీపీ 1654 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచినా, అసెంబ్లీకి వచ్చేసరికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి రాజన్నదొర టీడీపీ అభ్యర్థి భాంజ్దేవ్పై సుమారు ఐదు వేల ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగించారు. ఈ జిల్లాలో మిగిలిన పార్వతీపురం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట సెగ్మెంట్లలో స్థానిక, సార్వత్రిక ఫలితాల్లో టీడీపీదే పైచేయిగా ఉంది. ఇక విశాఖపట్నం జిల్లా ఫలితాల సరళిని చూస్తే.. స్థానిక ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం కనబరిచిన పాడేరు (9282), అరకులోయ (21824), మాడుగుల (45) సెగ్మెంట్లలో ఆ పార్టీనే విజయం సాధించింది. అయితే స్థానిక ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఆధిక్యం కన్నా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో పాడేరులో జి.ఈశ్వరి పాతికవేలకు పైగా, అరకులోయలో కిడారి సర్వేశ్వరరావు 33వేల పైగా, మాడుగులలో బూడి ముత్యాలనాయుడు ఐదు వేలపైగా ఓట్ల మెజారితో విజయం సాధించారు. ఉత్తరాంధ్రలో స్థానిక ఫలితాల సరళిని బట్టి చూస్తే ఆరు నియోజకవర్గాల్లో ఆధిక్యం కనబరిచిన వైఎస్సార్ సీపీ అసెంబ్లీ ఎన్నికల్లో 9 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. -అవ్వారు శ్రీనివాసరావు -
ఆంధ్రప్రదేశ్ విజేతలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో టిడిపి మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీనే ఇచ్చింది. ఇప్పటివరకు ఫలితాల వివరాలు ఈ దిగువన ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు గెలిచిన వారు నియోజకవర్గం గెలిచిన పార్టీ అభ్యర్ధి పేరు మెజార్టీ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం టిడిపి బి.అశోక్ 25,038 పలాస టిడిపి గౌతు శ్యామసుందర శవాజి 17,495 టెక్కలి టిడిపి కింజరాపు అచ్చన్నాయుడు 8,387 పాతపట్నం వైఎస్ఆర్ సిపి రమణ మూర్తి 3,812 శ్రీకాకుళం టిడిపి గుండా లక్ష్మీ దేవి 24,065 ఆముదాలవలస టిడిపి కూన రవికుమార్ 5,475 ఎచ్చెర్ల టిడిపి కిమిడి కళా వెంకట్రావు 4,787 నరసన్నపేట టిడిపి బగ్గు రమణమూర్తి 4,589 రాజాం వైఎస్ఆర్ సిపి కంబాల జోగులు 512 పాలకొండ వైఎస్ఆర్ సిపి పి.కళావతి 1553 విజయనగరం జిల్లా విజయనగరం టిడిపి గీత 15,404 కురుపాం వైఎస్ఆర్ సిపి పాముల పుష్పశ్రీవాణి పార్వతీపురం టిడిపి బొబ్బలి చిరంజీవులు 5,861 సాలూరు వైఎస్ఆర్ సిపి పి .రాజన్న దొర 4,997 బొబ్బిలి వైఎస్ఆర్ సిపి వెంకట సుజయ కృష్ణ రంగారావు 7,044 చీపురుపల్లి టిడిపి కిమిడి మృణాళిని 20,812 గజపతినగరం టిడిపి కొండపల్లి అప్పలనాయుడు 19,421 నెల్లిమర్ల టిడిపి పత్తివాడ నారాయణ స్వామి నాయుడు 6,669 శృంగవరపుకోట టిడిపి కె. లలిత కుమారి 28,572 విశాఖపట్నం జిల్లా భీమిలి టిడిపి గంటా శ్రీనివాస రావు 37186 విశాఖ తూర్పు టిడిపి వెలగపూడి రామకృష్ణా రెడ్డి 48000 విశాఖ దక్షిణం టిడిపి గణేష్ కుమార్ 19000 విశాఖ ఉత్తరం బిజెపి విష్ణు కుమార్ 3408 విశాఖ పశ్చిమం టిడిపి గణ వెంకట రెడ్డి 30866 గాజువాక టిడిపి పల్లా శ్రీనివాస్ 21767 చోడవరం టిడిపి కెఎస్ఎన్ రాజు 915 మాడుగుల వైఎస్ఆర్ సిపి ముత్యాల నాయుడు 4737 అరకు వైఎస్ఆర్ సిపి సర్వేస్వర రావు 33648 పాడేరు వైఎస్ఆర్ సిపి జి.ఈశ్వరి 26141 అనకాపల్లి టిడిపి పైలా గోవిందు 22437 పెందుర్తి టిడిపి బండారు సత్యనారాయణమూర్తి 18506 యలమంచిలి టిడిపి రమేష్ బాబు 8478 పాయకరావుపేట టిడిపి వంగలపూడి అనిత 2819 నర్సీపట్నం టిడిపి చింతకాయల అయ్యనపాత్రుడు 2338 తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వైఎస్ఆర్ సిపి వి.రాజేశ్వరి 8,243 తుని వైఎస్ఆర్ సిపి దాడిశెట్ట రాజా 88,573 ప్రత్తిపాడు వైఎస్ఆర్ సిపి వరుపుల సుబ్బారావు 3,421 పిఠాపురం స్వతంత్ర అభ్యర్థి ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ 46,997 కాకినాడ రూరల్ టిడిపి పిల్లి అనంత లక్ష్మి 8,732 కాకినాడ సిటీ టిడిపి వనమాడి వెంకటేశ్వర రావు 24,259 పెద్దాపురం టిడిపి నిమ్మకాయ చిన రాజప్ప 10,694 అనపర్తి టిడిపి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి 1513 ముమ్మిడివరం టిడిపి దాట్ల సుబ్బరాజు 29,552 అమలాపురం టిడిపి ఐతంబత్తుల ఆనందరావు 12,413 రాజోలు టిడిపి గొల్లపల్లి సూర్యారావు 4807 పి.గన్నవరం టిడిపి పులపర్తి నారాయణ మూర్తి 13,556 కొత్తపేట వైఎస్ఆర్ సిపి చీర్ల జెగ్గిరెడ్డి 567 మండపేట టిడిపి వి.జోగేశ్వర రావు 36,014 రాజానగరం టిడిపి పెందుర్తి వెంకటేష్ 8,887 రాజమండ్రి బిజెపి ఆకుల సత్యనారాయణ 25,000 రాజమండ్రి రూరల్ టిడిపి గోరంట్ల బుచ్చియ్య చౌదరి 18,613 జగ్గంపేట వైఎస్ఆర్ సిపి జ్యోతుల నెహ్రూ 16,080 పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు టిడిపి కే.ఎస్.జవహర్ 12600 ఆచంట టిడిపి పితాని సత్యనారాయణ 3871 పాలకొల్లు టిడిపి నిమ్మల రామానాయుడు 6383 నర్సాపురం టిడిపి బండారు మాధవనాయుడు 21,148 భీమవరం టిడిపి రామాంజనేయులు 13,653 నిడదవోలు టిడిపి బూరుగుపల్లి శేషారావు 6,359 ఉండి టిడిపి రామరాజు (రాము) 25,000 తణుకు టిడిపి అరిమిల్లి రాధాకృష్ణ 30,933 తాడేపల్లిగూడెం బిజెపి పి.మాణిక్యాలరావు 14,070 ఉంగుటూరు టిడిపి గన్ని వీరాంజనేయులు 9000 దెందులూరు టిడిపి సి.ప్రభాకర్ 17,713 ఏలూరు టిడిపి బడేటి కోటరామారావు 23,000 గోపాలపురం టిడిపి ఎం.వెంకటేశ్వరరావు 11,300 పోలవరం టిడిపి ఎం.శ్రీనివాస రావు 15,737 చింతలపూడి టిడిపి పీతల సుజాత 15,156 కృష్ణా జిల్లా గన్నవరం టిడిపి వల్లభనేని వంశీ మోహన్ 9400 జగ్గయ్యపేట టిడిపి రాజగోపాల్ శ్రీరాం 1850 న్యూజివీడు వైఎస్ఆర్ సిపి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు 13,500 తిరువూరు వైఎస్ఆర్ సిపి కె.రక్షణ నిధి 2086 విజయవాడ తూర్పు టిడిపి గద్దే రామమోహన రావు 8,562 అవనిగడ్డ టిడిపి మండలి బుద్దప్రసాద్ 5800 గుడివాడ వైఎస్ఆర్ సిపి కొడాలి నాని 11,785 కైకలూరు బిజెపి కామినేని శ్రీనివాస్ 7807 మచిలీపట్నం టిడిపి కొల్లు రవీంద్ర 15,203 మైలవరం టిడిపి దేవినేని ఉమ 7580 నందిగామ టిడిపి టి..ప్రభాకర రావు 6008 పామర్రు వైఎస్ఆర్ సిపి ఉప్పులేటి కల్పన 1069 పెడన టిడిపి కాగిత వెంకట్రావు 14587 పెనమలూరు టిడిపి బోడే ప్రసాద్ 31,450 విజయవాడ సెంట్రల్ టిడిపి బి.ఉమామహేశ్వరరావు 27,340 విజయవాడ పశ్చిమ వైఎస్ఆర్ సిపి జలీల్ ఖాన్ 2000 గుంటూరు జిల్లా పెదకూరపాడు టిడిపి కొమ్మలపాటి శ్రీధర్ 10121 తాడికొండ టిడిపి తెనాలి శ్రావణ్ కుమార్ 7380 మంగళగిరి వైఎస్ఆర్ సిపి ఆళ్ల రామకృష్ణా రెడ్డి 12 పొన్నూరు టిడిపి దూళిపాళ నరేంద్ర 7829 వేమూరు టిడిపి నక్కా ఆనందబాబు 24484 రేపల్లె టిడిపి అనగాని సత్యప్రసాద్ 18,022 తెనాలి టిడిపి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 19,065 బాపట్ల వైఎస్ఆర్ సిపి కోన రఘుపతి 5813 ప్రత్తిపాడు టిడిపి రేవల కిషోర్ బాబు 7352 గుంటూరు పశ్చిమ టిడిపి మోదుగుల వేణుగోపాల్ 17,770 గుంటూరు తూర్పు వైఎస్ఆర్ సిపి ముస్తఫా 3100 చిలకలూరిపేట టిడిపి పి.పుల్లారావు 10,460 నరసరావుపేట వైఎస్ఆర్ సిపి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి 15,575 సత్తెనపల్లి టిడిపి కోడెల శివప్రసాద రావు 16000 వినుకొండ టిడిపి జివి ఆంజనేయులు 20,900 గురజాల టిడిపి వై.శ్రీనివాస రావు 6200 మాచర్ల వైఎస్ఆర్ సిపి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ సిపి పాలపర్తి డేవిడ్ రాజు 19,150 దర్శి టిడిపి సిద్ధా రాఘవరావు 1374 పర్చూరు టిడిపి ఏలూరి సాంబశివరావు 10,653 అద్దంకి వైఎస్ఆర్ సిపి గొట్టిపాటి రవికుమార్ 4235 చీరాల స్వతంత్ర ఆమంచి కృష్ణ మోహన్ 10,121 సంతనూతలపాడు వైఎస్ఆర్ సిపి ఏ.సురేష్ 1631 ఒంగోలు టిడిపి దామచర్ల జనార్ధన రావు 13,922 కందుకూరు వైఎస్ఆర్ సిపి పోతుల రామారావు 3806 కొండేపి టిడిపి వీరాంజనేయులు 5523 మార్కాపురం వైఎస్ఆర్ సిపి జంకే వెంకటరెడ్డి 9802 గిద్దలూరు వైఎస్ఆర్ సిపి అశోక్ రెడ్డి 12643 కనిగిరి టిడిపి కదిరి బాబు రావు 7207 నెల్లూరు జిల్లా కావలి వైఎస్ఆర్ సిపి ప్రతాప్ కుమార్ 5260 ఆత్మకూరు వైఎస్ఆర్ సిపి మేకపాటి గౌతం రెడ్డి 31,412 కోవూరు టిడిపి టి.శ్రీనివాసులు రెడ్డి 7937 నెల్లూరు సిటీ వైఎస్ఆర్ సిపి పి.అనీల్ కుమార్ 18,860 నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సిపి కె.శ్రీధర్ రెడ్డి 28,653 సర్వేపల్లి వైఎస్ఆర్ సిపి కోకాని గోవర్ధన రెడ్డి 5239 గూడూరు వైఎస్ఆర్ సిపి పి.సునీల్ కుమార్ 9088 సూళ్లూరుపేట వైఎస్ఆర్ సిపి సంజీవయ్య 3726 వెంకటగిరి టిడిపి కె.రామకృష్ణ 5560 ఉదయగిరి టిడిపి బి.వెంకట రామారావు 3612 వైఎస్ఆర్ జిల్లా బద్వేలు వైఎస్ఆర్ సిపి టి.జయరాములు 9561 రాజంపేట టిడిపి మేడా వెంకట మల్లికార్జున రెడ్డి 11617 కడప వైఎస్ఆర్ సిపి అంజద్ బాషా 44,245 రైల్వే కోడూరు వైఎస్ఆర్ సిపి కోరుముట్ల శ్రీనివాసులు 19,072 రాయచోటి వైఎస్ఆర్ సిపి శ్రీకాంత్ రెడ్డి 34,738 పులివెందుల వైఎస్ఆర్ సిపి వైఎస్ జగన్మోహన రెడ్డి 75,243 కమలాపురం వైఎస్ఆర్ సిపి పి.రవీంద్రనాథ్ రెడ్డి 5345 జమ్మలమడుగు వైఎస్ఆర్ సిపి సి.ఆదినారాయణ రెడ్డి 12,167 ప్రొద్దుటూరు వైఎస్ఆర్ సిపి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 13025 మైదుకూరు వైఎస్ఆర్ సిపి రఘురామి రెడ్డి 11386 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సిపి శోభానాగిరెడ్డి 18000 శ్రీశైలం వైఎస్ఆర్ సిపి బుద్దా రాజశేఖర రెడ్డి 4500 నందికొట్కూరు వైఎస్ఆర్ సిపి ఐజయ్య 20,279 కర్నూలు వైఎస్ఆర్ సిపి సి.మోహన రెడ్డి 3479 పాణ్యం వైఎస్ఆర్ సిపి గౌరు చరితారెడ్డి 11600 నంద్యాల వైఎస్ఆర్ సిపి భూమా నాగిరెడ్డి 5000 బనగానపల్లె టిడిపి జనార్ధన రెడ్డి 17160 డోన్ వైఎస్ఆర్ సిపి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 11152 ప్రత్తికొండ టిడిపి ఏదిగ కృష్ణమూర్తి 7686 కొడుమూరు వైఎస్ఆర్ సిపి మణి గాంధీ 52,384 ఎమ్మిగనూరు టిడిపి జయనాగేశ్వర రెడ్డి 3601 మంత్రాలయం వైఎస్ఆర్ సిపి బాలనాగిరెడ్డి 7424 ఆలూరు వైఎస్ఆర్ సిపి గుమ్మనూరు జయరాం 1986 ఆదోని వైఎస్ఆర్ సిపి వై.సాయి ప్రసాద్ రెడ్డి 16809 అనంతపుం జిల్లా రాయదుర్గం టిడిపి కాలువ శ్రీనివాసులు 2029 ఉరవకొండ వైఎస్ఆర్ సిపి వై.విశ్వేశ్వరరావు 4000 గుంతకల్లు టిడిపి జితేంద్ర గౌడ్ 5094 తాడిపత్రి టిడిపి జెసి ప్రభాకర రెడ్డి 21772 శింగనమల టిడిపి బి.యామిని బాల 5202 అనంతపురం అర్బన్ టిడిపి ప్రభాకర్ చౌదరి 9225 కళ్యాణదుర్గం టిడిపి హనుమంతరాయ చౌదరి 21,510 రాప్తాడు టిడిపి పరిటాల సునీత 8023 మడకశిర టిడిపి వీరన్న 14493 హిందూపురం టిడిపి బాలకృష్ణ 16,397 పెనుకొండ టిడిపి పార్ధసారధి 16,648 పుట్టపర్తి టిడిపి పల్లె రఘునాథ రెడ్డి 6964 ధర్మవరం టిడిపి వరదాపురం సూరి కదిరి వైఎస్ఆర్ సిపి అక్తర్ చంద్ బాషా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె టిడిపి జి.శంకర్ 9106 పీలేరు వైఎస్ఆర్ సిపి చింతల రామచంద్రా రెడ్డి 16,339 మదనపల్లె వైఎస్ఆర్ సిపి దేశాయ్ తిప్పారెడ్డి 16,429 పుంగనూరు వైఎస్ఆర్ సిపి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 31,731 చంద్రగిరి వైఎస్ఆర్ సిపి చెవిరెడ్డి భాస్కర రెడ్డి 4518 తిరుపతి టిడిపి ఎం.వెంకట రమణ 40,794 శ్రీకాళహస్తి టిడిపి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి 7452 సత్యవేడు టిడిపి తలారి ఆధిత్య 2864 గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ సిపి నారాయణ స్వామి 2565 చిత్తూరు టిడిపి డి.ఏ.సత్యప్రభ 6814 పూతలపట్టు వైఎస్ఆర్ సిపి సునీల్ కుమార్ 982 పలమనేరు వైఎస్ఆర్ సిపి అమరనాథ్ రెడ్డి 2890 కుప్పం టిడిపి చంద్రబాబు నాయుడు 47,121 నగరి వైఎస్ఆర్ సిపి ఆర్.కె.రోజా 926 లోక్ సభకు గెలిచినవారు నియోజకవర్గం గెలిచిన పార్టీ అభ్యర్థి పేరు మెజార్టీ ఒంగోలు వైఎస్ఆర్ సిపి వైవి సుబ్బారెడ్డి 15,535 అనంతపురం టిడిపి జెసి దివాకర రెడ్డి 61,991 నరసరావుపేట టిడిపి రాయపాటి సాంబశివరావు 2890 శ్రీకాకుళం టిడిపి కింజరాపు రామ్మోహన్ నాయుడు 122007 చిత్తూరు టిడిపి శివప్రసాద్ 41,257 నంద్యాల వైెెఎస్ఆర్ సిపి ఎస్.పి.వై.రెడ్డి లక్షా 20వేల ఓట్లు కర్నూలు వైఎస్ఆర్ సిపి బుట్టా రేణుక 44,486 తిరుపతి వైఎస్ఆర్ సిపి వరప్రసాద రావు 35,958 కాకినాడ టిడిపి తోట నరసింహం 3672 రాజమండ్రి టిడిసి మురళీమోహన్ 138000 మచిలీపట్నం టిడిపి నారాయణ 74,000 హిందూపురం టిడిపి నిమ్మల కిష్టప్ప 100000 అరకు వైఎస్ఆర్ సిపి కొత్తపల్లి గీత 17,543 నర్సాపురం బిజెపి గోకరాజు గంగరాజు 86,000 కడప వైఎస్ఆర్ సిపి అవినాష్ రెడ్డి 188323 రాజంపేట వైఎస్ఆర్ సిపి మిధున్ రెడ్డి 152264 నెల్లూరు వైఎస్ఆర్ సిపి మేకపాటి రాజమోహన రెడ్డి 20,000 విజయనగరం టిడిపి అశోక్ గజపతిరాజు 106554 విశాఖపట్నం బిజెపి హరిబాబు 51,036 అనకాపల్లి టిడిపి ఎం.శ్రీనివాస రావు 6589 అమలాపురం టిడిపి పి.రవీంద్ర బాబు 120676 ఏలూరు టిడిపి మాగంటి వెంకటేశ్వర రావు 15,015 విజయవాడ టిడిపి కేశినేని శ్రీనివాస్ (నాని) గుంటూరు టిడిపి గల్లా జయదేవ్ 24,815 బాపట్ల టిడిపి మాల్యాద్రి శ్రీరామ్ 10,500 -
పిసిసి అధ్యక్షులు, మాజీ అధ్యక్షుల ఓటమి
హైదరాబాద్: ఈ సార్వత్రిక ఎన్నికలలో దేశవ్యాప్తంగానే కాకుండా, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం చవిచూడవలసి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి అక్కడ లబ్దిపొందుదామని చూసింది. అక్కడ కూడా చావుదెబ్బతింది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే చావు దెబ్బతింది. అటు తెలంగాణలో ఇటు ఏపిలో పిసిసి అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రులు ఓడిపోయారు. పిసిసి మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అందరూ కట్టగట్టుకొని ఓటమిని చవిచూశారు. రఘువీరా రెడ్డిది దయనీయ స్థితి. ఆయన మూడవ స్థానానికి పరిమితమయ్యారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ స్థానంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి శ్రీనివాస్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్థన్పై 20 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా జనగామ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విజయం సాధించారు. మరో పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి కిమిడి మృణాళిని చేతిలో ఓడిపోయారు. ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అనంతపురం జిల్లా పెనుకొండలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ టిడిపి అభ్యర్థి పార్ధసారధి విజయం సాధించారు. రఘువీరా రెడ్డి మూడవ స్థానానికి వెళ్లారు. -
ఓటర్లు ఏకపక్షం !
జిల్లాలో ఫ్యాన్ హోరు వైఎస్ఆర్సీపీకి విశేష జనాదరణ సాక్షి ప్రతినిధి, తిరుపతి: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జిల్లాలో ఏకపక్షంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటర్లు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. టీడీపీ వారు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఓటు మాత్రం జగన్కేనంటూ పలు సందర్భాల్లో నినదించారు. జిల్లాలో ఎక్కడ వైఎస్ఆర్సీపీ సభ లు, సమావేశాలు ఏర్పాటుచేసినా వేలాదిగా జనం తరలివచ్చారు. ఈ జిల్లాను వైఎస్ఆర్సీపీ స్వీప్ చేస్తుందనే ప్రచారం అప్పుడే సాగింది. ఆ తరువాత జరిగిన కొన్ని సర్వేలు చిత్తూరు జిల్లాలో అత్యధిక సీట్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని తేల్చా యి. అయితే చివర్లో సర్వేలు చేసిన కొన్ని సంస్థలు కుప్పంలో కూడా చంద్రబాబుకు ఎదురుగాలి వీస్తోందని తేల్చాయి. వెంకటరమణ మైనస్‌లే కరుణాకరరెడ్డికి ప్లస్ తిరుపతి అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే కరుణాక రరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లిన వెంకటరమణకు ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. పదవికోసమే ఆయన పార్టీ మారారనే ఆరోపణలు వచ్చాయి. నగరంలో భూకబ్జాలు చేసి కోట్లు సంపాదించారని, చంద్రబాబుకు 45కోట్లు ఇచ్చి టికెట్ కొనుక్కున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌నేతలు ఆయనతో వెళ్లకపోగా, టీడీపీ వారు ఆయనను స్వాగతించడం లేదు. ఇవన్నీ కరుణాకరరెడ్డికి కలిసొచ్చే అంశాలుగా పలువురు ఓటర్లు చెబుతున్నారు. సౌమ్యుడని చెవిరెడ్డికి ఓటు - గల్లాకు భూముల ఎఫెక్ట్ చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సౌమ్యుడు, అడిగిన వెంటనే సాయం చేసే మనస్తత్వం ఉన్నవాడనే భావన జనంలో ఉంది. తుడా చైర్మన్‌గా తిరుపతితో పాటు తిరుపతి రూరల్, చుట్టుపక్కల మండలాల్లోని పలు గ్రామాలను అభివృద్ధి చేసిన వ్యక్తిగా మంచిపేరు తెచ్చుకున్నారు. ైదెవభక్తి ఎక్కువగా ఉన్న భాస్కర్‌రెడ్డిని గెలిపించుకోవడం తమ బాధ్యత అనే భావన తిరుపతి రూరల్ మండల ఓటర్లలో బలంగా ఉంది. ఈ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పోటీ చేస్తున్నారు. ఈమె ఇటీవలి వరకు కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నారనే విషయాన్ని గమనించిన ఆమె టీడీపీలో చేరి తనకు చంద్రగిరి అసెంబ్లీ, తన కుమారునికి గుంటూరు పార్లమెంటు టికెట్లు సంపాదించారు. ఇద్దరి టికెట్ల కోసం చంద్రబాబుకు వీరు కోట్లాది రూపాయలు ఇచ్చారనేది జనంలో మాట. కోట్లకు కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు తక్కువ డబ్బులు చెల్లించి వారి భూములు కొనుగోలు చేసి అందులో పలు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. చంద్రగిరి నుంచి వైఎస్ఆర్ చలవతో పలుసార్లు గెలిచిన గల్లాను చూసి ఓటర్లు ఓట్లు వేయలేదని, పెద్దాయన వైఎస్ఆర్ను చూసి వేశారని, ఇప్పుడు ఆయన కొడుకు పెట్టిన పార్టీ నుంచి పోటీలో ఉన్న భాస్కర్‌రెడ్డిని తమ నాయకుడిగా భావించి ఆయనకే ఓట్లు వేస్తామని బహిరంగంగా చెబుతున్నారు. ‘గాలి’కి ఎదురుగాలి - తిరుగులేని ‘రోజా’ నగరి నుంచి పలుసార్లు గెలిచిన టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుకు ఈ సారి ఎదురుగాలి వీస్తోంది. ఫ్యాన్‌గాలి దెబ్బకు ఆయనకు దిమ్మతిరగటం ఖాయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యరి ఆర్కే రోజా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. గతంలో ఇక్కడి నుంచి ఒకసారి ఆమె టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. వైఎస్ఆర్ హయాంలోనే కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తరువాత ఆ పార్టీలో ముఖ్య నాయకురాలుగా పనిచేస్తున్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తూనే పలు సందర్భాల్లో నగరి నియోజకవర్గ సమస్యలపై గళమెత్తారు. పైగా ఈమె సామాజిక వర్గానికి చెందిన వారు నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. ఈ సారి వీరంతా రోజానే బలపరుస్తున్నారు. దీంతో రోజా బంపర్ మెజారిటీతో గెలుస్తారనేది ఇక్కడి ఓటర్ల అభిప్రాయం. ముద్దుకృష్ణమ నాయుడు అనేకసార్లు ఇక్కడి నుంచి గెలిచినా నియోజవకర్గానికి ఏమీ చేయలేదని, నగరిని మునిసిపాలిటీగా చేసిన తరువాత తిరిగి పంచాయతీగానే మార్పిస్తానని ‘గాలి’ మాట చెప్పారని ప్రజలు నిర్ధారించుకున్నారు. ఈసారి ఆయనకు ఓటుతో సమాధానం చెప్పనున్నారు.ఈ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీకి తిరుగేలేదు, చిత్తూరు పార్లమెంట్ స్థానంతోపాటు చిత్తూరు, పలమనేరు, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు, గంగాధరనెల్లూరు, సత్యవేడు, మదనపల్లె నియోజకవర్గాల్లో ఓటర్లు ఏకపక్షంగానే ఓటు వేసేందుకు నిర్ణయించారనేది పలు సర్వే సంస్థల వాదన. ఈ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి తిరుగులేని మెజారిటీ వస్తుందని, మదనపల్లెలో బీజేపీ పోటీ కూడా నామమాత్రమేననే ప్రచారం సాగుతోంది. తమకు వస్తుందనుకున్న సీటు దక్కకుండా పోయిందని, జిల్లాలో బీజేపీ వారికి ఎంత పట్టు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని తిరుపతి, రాజంపేట పార్లమెంటు స్థానాలు కూడా బీజేపీ వారు లాక్కుని ఎటూ కాకుండా చేశారని టీడీపీ వారు విమర్శిస్తున్నారు. తిరుపతి, రాజంపేటలోనూ ఎలాగూ గెలిచే అవకాశాలు లేవని, తాము ఓటు వేయకుండా ఉంటే డిపాజిట్లు దక్కకుండా పోవడం ద్వారా తమ సత్తా ఏమిటో చూపుతామని పలువురు టీడీపీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోటీలో ఎవ్వరూ సాటిరారని, వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీ వస్తుందని పలువురు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
టిడిపి రెబల్ అభ్యర్థిపై దాడి
గుంటూరు: గుంటూరు తూర్పు శాసనసభ నియోజకవర్గం టీడీపీ రెబల్ అభ్యర్థి అల్లా బక్ష్పై గుర్తు తెలియని కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో అల్లా బక్ష్ తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు వెనక నుంచి వచ్చి దాడి చేసి పరారయ్యారు. గాయపడిన అల్లా బక్ష్‌ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దుండగులు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉండగా, ఈ నియోజకవర్గంలో టిడిపి తరపున మద్దాల గిరిధర్ పోటీలో ఉన్నారు. అల్లా బక్ష్ టిడిపి టికెట్ తనకే లభిస్తుందని ఆశించారు. తనకు రాకపోవడంతో రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇక్కడ వైఎస్ఆర్ సిపి తరపున ముస్తఫా పోటీలో ఉన్నారు. -
పులివెందుల టీడీపీలో బయటపడిన విభేదాలు
కడప: వైఎస్ఆర్ జిల్లా పులివెందుల టీడీపీలో ఎన్నికలు సమీపించిన సమయంలో విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ అభ్యర్థి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి ప్రచార వాహనాన్ని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దాంతో ప్రచారం మధ్యలోనే సతీష్‌రెడ్డి వెనుదిరిగి వెళ్లిపోయారు. పులివెందులలో వైఎస్ఆర్ సిపి తరపున ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున కొనిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
ప్రజల సైగలతో బాలయ్యకు షాక్!
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం చలివెందులలో టిడిపి అభ్యర్ధి బాలకృష్ణకు చుక్కెదురైంది. ప్రజల సైగలు ఆయనకు షాక్ ఇచ్చాయి. చలివెందుల గ్రామంలో టిడిపికి ఓటు వెయ్యాలని బాలయ్య విక్టరీ సింబల్ చూపించారు. అందుకు ప్రతిగా అక్కడ గుమిగూడిన జనం ఫ్యాన్ తిరుగుతున్నట్లు చేతితో సైగలు చేశారు. చేతులు తిప్పుతూ ఫ్యాన్ తిరిగినట్లు చూపారు. దాంతో బాలయ్యకు మతిపోయినట్లు అయింది. ఆ గ్రామంలో వైఎస్ఆర్ సిపి అభిమానులు అధికమంది ఉన్నట్లున్నారు. అందుకే వారు ఆ పార్టీ గుర్తు ఫ్యాన్ తిరుగుతున్న సైగలు చేశారు. అంతేకాకుండా బాలయ్య సమక్షంలో జగన్ జిందాబాద్ అని కూడా వారు నినాదాలు చేశారు. -
టిడిపి అభ్యర్థి అనుచరుల దౌర్జన్యం
గుంటూరు: వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవీఎస్ ఆంజనేయులు అనుచరులు సాక్షి సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థి విందు రాజకీయాలు చేస్తున్నారు. ఆ దృశ్యాలను చిత్రీకరించడానికి సాక్షి సిబ్బంది ప్రయత్నించారు. అభ్యర్థి అనుచరులు సాక్షి సిబ్బందిపై దాడి చేశారు. కెమెరాను ధ్వంసం చేశారు. -
అక్కడ ఒకసారి గెలిస్తే అంతే!
ఎన్నికలు వచ్చాయంటే కొన్ని నియోజకవర్గాలలో సెంటిమెంట్లు, అక్కడ జరిగిన వింతలు, విశేషాలు ఒక్కొటొక్కటిగా వెలుగులోకి వస్తుంటాయి. కొన్ని కొన్ని నియోజకవర్గాలలో కొన్ని సంఘటనలు ఒకే రకంగా జరుగుతుంటాయి. విశాఖ నగరంలోని నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో ఉత్తర నియోజకవర్గం ఆ కోవకు చెందినదే. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒక్కసారి గెలిచినవారు మాజీలుగా మిగిలిపోవలసిందే. ఆ సెంటిమెంటే ఇక్కడ కొనసాగుతోంది. ఎక్కువగా ఇక్కడ కొత్త మొఖాలే పోటీలో కనిపిస్తుంటాయి. ఒక్కసారి గెలిచినవారికి టికెట్ రాకపోవడమో లేక పరాభవం పొందడమో జరుగుతుంటుంది. ఇదీ ఇక్కడ రికార్డ్. ఆనవాయితీగా ఈ సారి కూడా కొత్తవారే ఎన్నికల బరిలో నిలిచారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఇది విశాఖ -1నియోజకవర్గంగా ఉందేది. 2009 ఎన్నికలకు విశాఖ నగరంలోని రెండు నియోజకవర్గాలను నాలుగుగా విడదీశారు. ఉత్తర నియోజక వర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎస్.రంగరాజు, పిన్నింటి వరలక్ష్మి, పల్లా సింహాచలం, రాజాన రమణి మరోసారి గెలవలేదు. చాలామందికి టిక్కెట్లే రాలేదు. గత ఎన్నికల్లో రంగరాజుకు కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ ఇవ్వలేదు. అతని స్థానంలో తైనాల విజయ్ కుమార్ ఎమ్మల్యే అయ్యారు. ప్రస్తుతం తైనాల విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ సిపికి మద్దతు ప్రకటించారు. ప్రతి ఎన్నికల్లో సాదారణంగా కాంగ్రెస్ - టీడీపీల మధ్య పోటీ జరుగుతుండేది. ఈ సారి రాజకీయ ముఖచిత్రంపైకి కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. టిడిపి - బిజెపి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బిజెకి కేటాయించారు. ఇక్కడి నుంచి బిజెపి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు రంగంలో ఉన్నారు. వైఎస్ఆర్ సిపి తరపున చొక్కాకుల వెంకటరావు పోటీపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నా పోటీ ఇచ్చే స్థితిలో లేరు. చొక్కాకుల వెంకటరావు రాజకీయాలకు కొత్త అయినా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రభంజనంతో అతను ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఆయన ధాటికి మిగిలినవారు చతికిలబడిపోయారు. బిజెపి అభ్యర్ధి విష్ణుకుమార్ రాజు ఆర్థిక బలంతో టిక్కెట్ సంపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. బిజెపి సీనియర్ నేతలు ఎందరో ఉన్నా, వారిని కాదని విష్ణుకుమార్ రాజుకు టిక్కెట్ కేటాయించడం వెనుక పెద్ద కధే నడిచినట్లు సమాచారం. బిజెపి సీమాంధ్ర అధ్యక్షుడు, ఇక్కడ లోక్‌సభ అభ్యర్థి కంభంపాటి హరిబాబు ఎన్నికల ఖర్చు అంతా తానే భరిస్తానని మాట ఇవ్వడం వల్లే విష్ణుకుమార్ రాజుకు టిక్కెట్ ఇచ్చారని సొంత పార్టీ నేతలే విమర్సిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత చలపతిరావు తనయుడు పివిఎన్ మాధవ్ టిక్కెట్ ఆశించారు. సీనియార్టీ ని పక్కన పెట్టి సిద్దాంతాలను గాలికొదిలేసి ఎక్కడో ఉన్న విష్ణు కుమార్ రాజుకు బిజెపి టిక్కెట్ ఇవ్వడం పట్ల ఆ పార్టీ శ్రేణులే వ్యతిరేకంగా ఉన్నాయి. బిసి వర్గాలను పక్కన పెట్టడం, వారిని చిన్నచూపు చూడటం బిజెపి అభ్యర్ధికి ప్రతికూలంగా మారింది. దానికి తోడు టిడిపి నేతలు అందరూ బిజెపి అభ్యర్ధి తీరుపై మండిపడుతున్నారు.ఆర్ధిక పరమైన గొంతెమ్మ కోరికలు కోరుతుండటంతో ఈ రెండు పార్టీల మధ్య ఆర్ధిక పరమైన గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రతిదానికి టిడిపి శ్రేణులు అలుగుతుండటంతో ఇదెక్కడి గొడవరా బాబూ అంటూ బిజెపి అభ్యర్ధి లబోదిబో మంటున్నారు. దాంతో ఇక్కడ బిజెపి పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జగన్‌పై జనం పెట్టుకున్న ఆశలు, విజయమ్మ పోటీ చేయడం అన్నీ వెంకట రావుకు బాగా కలిసి వచ్చాయి. దాంతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని భావిస్తున్నారు. -
బాలయ్యకు కోపం వచ్చింది - కాలితో తన్నారు!
హిందూపురం: సినిమా హీరో నందమూరి బాలకృష్ణకు కోపం వచ్చింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానన్న విషయం కూడా మరిచిపోయి ఆగ్రహంతో రెచ్చిపోయారు. ప్రజాప్రతినిధిగా పోటీ చేస్తున్న విషయం మరచిపోయారు. జనం చూస్తుండగానే తన అసిస్టెంట్‌ను కాలితో తన్నారు. బాలకృష్ణ హిందూపురం శాసనసభ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా ఆయన గ్రామగ్రామాన రోడ్డు షో నిర్వహిస్తున్నారు. అయితే ఆయన షోలకు జనం పలచగా హాజరవుతున్నారు. దాంతో ఆయన మంచి కాకమీద ఉన్నారు. సినిమా సీన్ చూపించారు. లేపాక్షి మండలం సిరివరం గ్రామంలో రోడ్డుషో నిర్వహించే సమయంలో పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు బాలకృష్ణ కారు ఎక్కడానికి వచ్చారు. బాలకృష్ణ అసిస్టెంట్ అతనిని కారులో ఎక్కడానికి అనుమతించారు. కారు తలుపు కూడా తెరిచాడు. కారుపై కూర్చున్న బాలకృష్ణ అందుకు నిరాకరించారు. రంగనాయకులుని తన కారులోకి ఎక్కవద్దని హుకుం జారీ చేశారు. కారు తలుపు తెరిచినందుకు తన అసిస్టెంట్‌ను అందరూ చూస్తుండగానే కాలితో తన్నారు. ఈ సంఘటనతో రంగనాయకులు చిన్నబుచ్చుకున్నారు. ఈ సంఘటన ప్రజల మధ్యలో జరినందున అందరికీ తెలిసింది. బయటకు తెలియని ఇటువంటి అనేక సంఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు చెబుతున్నారు. -
హుజూర్నగర్ నుంచే ఓదార్పు యాత్ర : వైఎస్ జగన్
నల్లగొండ: రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచే తన సోదరి షర్మిల ఓదార్పు కార్యక్రమం మొదలుపెడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి చెప్పారు. హుజూర్‌నగర్‌లో జరిగిన వైఎస్ఆర్ జనభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ సిపికి మద్దతు ఇవ్వండి, వైఎస్ఆర్ సువర్ణయుగం తెచ్చుకుందాం అని పిలుపు ఇచ్చారు. సిఎం అంటే ఇలాగే ఉండాలని దేశానికి చాటి చెప్పిన వ్యక్తి ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతాలు వైఎస్ఆర్ చూడలేదన్నారు. ప్రతి పేదవాడి మనసు ఎరిగి ఆయన పాలన చేశారని చెప్పారు. రాష్ట్రాలు విడగొట్టారు కానీ తెలుగు జాతిని, తెలుగు ప్రజలను విడగొట్టలేదన్నారు. మీకు ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. రాజకీయం అంటే విశ్వసనీయత ఉండాలన్నారు. రాజకీయం అంటే ప్రతి పేదవాడి మనసు తెలుసుకోవాలని చెప్పారు. కానీ నేటి రాజకీయాలు పూర్తీగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు ఒక చదరంగంలా మారిపోయాయన్నారు. ప్రజల భావోద్వేగాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారన్నారు. విశ్వసనీయత, నిజాయితీ ఒక వైపున ఉన్నాయని, కుళ్లు,కుతంత్రాలు మరో వైపున ఉన్నాయని అన్నారు. -
బరి నుంచి తప్పుకున్న ముక్కు కాశిరెడ్డి
ఒంగోలు: ప్రకాశం జిల్లా కనిగిరి శాసనసభ స్థానం ఎన్నికల బరిలో నుంచి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముక్కు కాశిరెడ్డి తప్పుకున్నారు. వైఎస్ఆర్ సిపి రెబల్ అభ్యర్థిగా కాశిరెడ్డి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ వైఎస్ఆర్ సిపి తరపున మధుసూదన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఈ రోజు ఆయన తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. పార్టీ ఆదేశాలను శిరసావహిస్తానని కాశిరెడ్డి చెప్పారు. -
దారిలోకొచ్చిన కేసిఆర్
అనేక విషయాలలో చెప్పిన మాట తప్పాడని టిఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర రావు(కెసిఆర్)పై ఎడాపెడా విమర్శల దాడి జరుగుతోంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగే సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలుత దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కెసిఆర్ చెప్పారు. ముస్లీంలను ఆకట్టుకోవడం కోసం ముస్లీంని ఉప ముఖ్యమంత్రిని చేస్తానని కూడా చెప్పారు. మరో ముఖ్య అంశం ఏమిటంటే తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఆ ఊసులేమీలేవు. కాంగ్రెస్‌లో విలీనం గానీ, ఆ పార్టీతో పొత్తుగానీ లేకుండా టిఆర్ఎస్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగింది. దళిత ముఖ్యమంత్రి అంశమే ప్రస్తావించడంలేదు. కాంగ్రెస్‌లో విలీనం ప్రసక్తేలేదని, స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు కెసిఆర్ ప్రకటించారు. తెలంగాణ పునర్మిర్మాణంలో తాము ప్రధాన భాగస్వాములుకావాలన్నది తమ ఆకాంక్షగా చెప్పారు. ఉద్యమం ఇంతటితో ఆగలేదని, పునర్మిర్మాణం ప్రధానమైనదన్నారు. దళిత ముఖ్యమంత్రి మాట గాలికి వదిలేశారు. ఈ నేపధ్యంలో కెసిఆర్‌పైన, టిఆర్‌ఎస్‌పైన తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. దాదాపు అందరూ ఆయనపై ధ్వజమెత్తారు. కెసిఆర్ మాటమీద నిలబడరని తేల్చారు. ఈ పరిస్థితులలో ఇలా అయితే కెసిఆర్ కష్టమనుకున్నారో ఏమో తెలియదు. తాను అన్న మాటలు అక్షరాల నిజం. ఆ అంశాలను ఎత్తని మాట కూడా నిజమే. ఎన్నికల సమయం గదా జాగ్రత్తగా ఉండాలనుకున్నట్లు ఉన్నారు. చివరకు తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవి ముస్లీలకు ఇస్తామని ఈ రోజు కరీంనగర్ సభలో కెసిఆర్ ప్రకటిచారు. విమర్శల దాటికి తట్టుకోలేక కనీసం ఏదో ఒక్క మాటైనా నిలబెట్టుకోవాలని అనుకున్నారో ఏమో ఈ ప్రకటన చేశారు. ఆ రకంగా ఆయన కొంతలో కొంత దారిలోకి వచ్చినట్లుగా భావిస్తున్నారు. -
డిఎన్ఆర్ 30వేలు, రామప్రసాద్ అయితే 50 వేలు...
విజయవాడ: తాను పోటీ చేస్తే 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిచేవాడినని, ఇప్పుడు తాను మద్దతు ఇచ్చే ఉప్పల రామ ప్రసాద్ 50 వేల మెజార్టీతో గెలుస్తారని వైఎస్ఆర్ సిపి నేత దూలం నాగేశ్వరరావు (డిఎఎన్ఆర్) చెప్పారు. కృష్ణా జిల్లా కైకలూరు శాసనసభ స్థానానికి తొలుత దూలం నాగేశ్వరరావుని అనుకున్నారు. అయితే బిసిలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ స్థానాన్ని ఉప్పల రామప్రసాద్కు కేటాయించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో అందరూ ఒకే మాట చెప్పారు. అభ్యర్థి ఎవరైనా వైఎస్ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి కావడం తమకు ముఖ్యం అని చెప్పారు. దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ రామ ప్రసాద్‌ను 50 వేల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. జగన్ సిఎం కావాలని, ప్రజా సమస్యలు తీరాలని అన్నారు. కొల్లేరు ప్రజల సమస్యలు తీరాలంటే వైఎస్ఆర్ సీపీని గెలిపించాలని ఆయన కోరారు. వైఎస్ఆర్ సీపీ విజయాన్ని ఏ ఒక్క శక్తి ఆపలేదని నాగేశ్వరరావు అన్నారు. -
జానారెడ్డిపై ఎన్నికల సంఘానికి నోముల ఫిర్యాదు
హైదరాబాద్: నాగార్జున సాగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నోముల నరసింహయ్య తన ప్రత్యర్థి మాజీ మంత్రి జానారెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జానారెడ్డి సాగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జానారెడ్డి డబ్బు ప్రభావంతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జానారెడ్డి ఓటర్లను ప్రలోభ పెడ్తున్నాడని నోముల ఫిర్యాదు చేశారు. -
ఏనాడైనా ఉద్యమంలో పాల్గొన్నావా..?
మహబూబ్‌నగర్ అర్బన్,న్యూస్‌లైన్: చం ద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వనందుకు తెలంగాణ పల్లవి ఎత్తుకున్న కేసీఆర్ ఏనాడూ ఉద్యమంలో పాల్గొనలేదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దుయ్యబట్టారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జిల్లాకు 21న రానున్న నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలనకు పట్టణానికి వచ్చిన పొన్నాల శనివారం స్థానిక షాలీమార్ ఫంక్షన్హాల్లో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సాగర హారం, మిలియన్‌మార్చ్, సకల జనుల సమ్మెలో పాల్గొనకుండా ఫామ్‌హౌజ్‌లో ఉండి ఏం చేశావని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పాటు ఎందుకు గుర్తుకు రాలేదని ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచి ఇక్కడి ప్రజలను విస్మరించిన కేసీఆర్ కనీసం లోక్‌సభలో కూడా వారి సమస్యల గురించి ప్రస్తావించలేదని అన్నారు. పార్లమెంటు ఒక్కో ఎంపీ సగటున 76 శాతం హాజరైతే నీవు 13 శాతమే రోజులు మాత్రమే ఎందుకు వెళ్ళావని దెప్పి పొడిచారు. ఐదేళ్ళలో 2జీ స్ప్రెక్ట్రమ్‌పై ఒక సారి, ఓ మంత్రిపై దాడి జరిగిందని ఒకసారి మాత్రమే మాట్లాడారని వివరించారు. తెలంగాణను అడుగడుగునా అడ్డుకున్న టీడీపీ నాయకులను చే రదీసి ఉద్యమకారులను కించపరుస్తున్నారని అన్నారు. ‘దళితుణ్ణి సీఎం, మైనార్టీలను డిప్యుటీ సీఎం చేస్తానని ప్రగల్భాలు పలికిన నీ పార్టీ నుంచి ఆయా వర్గాల నేతలు విజయరామారావు,చంద్రశేఖర్ అతాస్ రెహమాన్,సయ్యద్ ఇబ్రాహీంలను ఎక్కడికి పంపావని’ అన్నారు. ముఖ్యమంత్రి కావాలన్న దురాశతో సోనియాగాంధీపై విమర్శలు చేస్తున్నారని,వాస్తవాలు మాట్లాడుతున్న తనపై కూడా వ్యక్తిగత దూషణలు చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వద్దని అన్న నరేంద్రమోడీ ఏం మొఖం పెట్టుకొని ఈ ప్రాంతంలో ప్రచారానికి వస్తున్నారన్నారు. అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి,ఐఏసీసీ కార్యదర్శి ఆర్సీ కుంతియా, మాజీ మంత్రులు డీకే అరుణ, పి.చంద్రశేఖర్, నాయకులు కొత్వాల్, విఠల్రారావు తదితరులు పాల్గొన్నారు. -
దటీజ్ జేసీ మార్క్..
అనంతపురం కైం, న్యూస్‌లైన్ : ‘అనంత’లో జేసీ దివాకరరెడ్డి తన శైలి రాజకీయాన్ని ప్రదర్శించారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ బలిజలపై సవతి ప్రేమ చూపుతోందన్న వాదనకు బలం చేకూరింది. కేవలం ఓట్ల కోసం వారిని వాడుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. అనంతపురం అర్బన్ టికెట్‌పై చాన్నాళ్లుగా ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం అర్థరాత్రి ఈ స్థానానికి ప్రభాకర్ చౌదరి పేరును ఖరారు చేశారు. ఈ వ్యవహారంపై బలిజ సామాజిక వర్గం పెద్దలు పెదవి విరుస్తున్నారు. అనంతపురం లోక్‌సభకు టీడీపీ తరఫున బరిలో నిలిచిన జేసీ దివాకరరెడ్డి వేసిన ప్లాక్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం ప్రభాకర్ చౌదరి ఇంటికి జేసీ దివాకరరెడ్డి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అనంతపురం టికెట్ వచ్చేలా చేస్తానని జేసీ.. చౌదరికి హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ సమయంలోనే రాజకీయ కుట్రకు వారిద్దరూ తెరలేపినట్లు సమాచారం. ఇందులో భాగంగా అసెంబ్లీ టికెట్ రాన్నట్టుగా అందరినీ నమ్మించి.. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, అనంతపురం సీటు ఆశిస్తున్న మహాలక్ష్మి శ్రీనివాస్‌ను ముగ్గులోకి దించారు. అనంతరం ఇద్దరూ కలిసి పోయామంటూ మహాలక్ష్మితో కలిసి పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. కొంత సేపు అసమ్మతి నాటకమాడారు. చివరకు మహాలక్ష్మి శ్రీనివాస్‌కు మొండి చేయి చూపి టికెట్‌ను సాధించుకుని అటు బలిజలను, ఇటు ముస్లింలను మోసం చేశారు. మొన్నటి ఉప ఎన్నికలో మహాలక్ష్మి శ్రీనివాస్ తనకు ఇష్టం లేదని చెప్పినా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక నీకే అవకాశం ఇస్తామంటూ హామీ కూడా ఇచ్చారు. ఆ హామీ నిజమని నమ్మిన మహాలక్ష్మీ శ్రీనివాస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేశారు. తీరా ఇప్పుడు ప్రభాకర్‌చౌదరికి అవకాశమిచ్చారు. ఈ వ్యవహారంలో జేసీ బ్రదర్స్ పాత్ర కీలకమని, ఈ ఎన్నికల్లో వారికి సహకరించేది లేదని బలిజ సామాజిక వర్గం నేతలు చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీలో బలిజలకు పెద్ద పీట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలిజలకు పెద్ద పీట వేసిందని ఆ వర్గం నేతలు చెబుతున్నారు. అనంతపురంలో మేయర్ స్థానంతో పాటు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తమ వారికే ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ఉన్న బలిజ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించనుందని సమాచారం. -
'ఫ్యాను గాలికి నిప్పు తోడైంది'
ఖమ్మం: వైఎస్ఆర్ సీపీ ఫ్యాన్ గాలికి సీపీఎం నిప్పు తోడైందని, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ-సీపీఎం కూటమిదే విజయం అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పాలేరు నియోజకవర్గంలో సీపీఎం, వైఎస్ఆర్ సీపీల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ పాలేరు శాసనసభ స్థానంలో తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న పోతినేని సుదర్శనరావు విజయం తథ్యం అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం నారాయణపురంలో ఆగస్టు 8, 1965లో జన్మించిన సుదర్శన్ రావు 2006లో ఖమ్మం జిల్లా సిపిఎం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1992లో చిన్నబీరవల్లి ఎంపిటిసిగా ఎన్నికయ్యారు. 1995 నుండి 2000 వరకు బోనకల్ మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా, కొంతకాలం ఎంపిపిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. -
టిడిపి తిరుగుబాటు అభ్యర్థులు
హైదరాబాద్: సీమాంధ్రలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గట్టం ముగిసింది. సీమాంధ్రలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో అత్యధికంగా టిడిపి తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించిన స్థానాల్లో కూడా టిడిపి రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టిడిపి తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన స్థానాలు: గుంటూరు జిల్లా: ప్రత్తిపాడు - వీరయ్య సత్తెనపల్లి - నిమ్మకాలయ రాజనారాయణ నర్సరావుపేట - సింహాద్రి యాదవ్ మాచర్ల - నలుగురు రెబల్స్ నామినేష్ పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు - టి.వి రామారావు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం - మైలా వీర్రాజు నామినేషన్ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం - ఆరుగురు నామినేషన్ దాఖలు నెల్లూరు జిల్లా గూడూరు - మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు చిత్తూరు జిల్లా సత్యవేడు - తలారికృష్ణ, ఆదిత్య విశాఖపట్నం జిల్లా యలమంచిలి - సుందరపు విజయ్ కుమార్ బిజెపికి కేటాయించిన ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు, వైఎస్ఆర్ జిల్లాలలోని కడప స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులకు టిడిపి బిఫారాలు ఇచ్చింది. అనంతపురం జిల్లా గుంతకల్లు స్థానం బీజేపీకి కేటాయించారు. టీడీపీ తరఫున జితేంద్రగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే టీడీపీ టికెట్ల కేటాయింపు విషయంలో నామినేషన్ల తుదిరోజు వరకు హైడ్రామా నడిచింది. చివరి నిమిషంలో కూడా టిడిపి అభ్యర్థులను మార్చింది. అరకు అసెంబ్లీ స్థానంను తొలుత కుంభా రవిబాబుకు కేటాయించారు. ఈరోజు సోముకు టికెట్ ఇచ్చారు. మాచర్ల అసెంబ్లీకి సంబంధించి శ్రీనివాస యాదవ్ స్థానంలో చలమారెడ్డికి టికెట్ ఇచ్చారు. శింగనమల అసెంబ్లీ స్థానంను రవికుమార్‌కు కేటాయించి, ఆ తరువాత మాజీ మంత్రి శమంతకమణి కుమార్తె పామిడి యామిని బాలకు టికెట్ ఇచ్చారు. మళ్లీ ఈరోజు మాజీ మంత్రి శైలజానాథ్ కూడా టిడిపి తరపున నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం వరకు గడువు ఉంది. ఆ రోజున ఎవరు బరిలో ఉంటారో, ఎవరు విరమించుకుంటారో తేలుతుంది. -
ఎట్టకేలకు నామినేషన్ దాఖలు చేసిన చిరంజీవి
(ఎన్.నాగరాజు-మంగళగిరి) గుంటూరు జిల్లా మంగళగిరిలో టిడిపి అభ్యర్థి గంజి చిరంజీవి ఎట్టకేలకు పోలీసుల అండతో ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా తులసీ రామచంద్ర ప్రభు పేరును టిడిపి నిన్న ప్రకటించింది. అతని ఎంపిక పట్ల వ్యతిరేకత రావడంతో పార్టీ నియోజకవర్గ బాధ్యుడు పోతినేని శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది. ఈ రోజు నామినేషన్ వేస్తున్నట్లు కూడా అతను ప్రచారం చేసుకున్నారు. చివరకు తెల్లవారుఝామున 3 గంటలకు గంజి చిరంజీవికి పార్టీ బిఫాం ఇచ్చారు. ఉదయం నామినేషన్ వేయడానికి ర్యాలీగా బయలుదేరిన చిరంజీవిని పోతినేని శ్రీనివాస్ వర్గీయులు అడ్డుకున్నారు. చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోతినేని అనుచరులు అతనిని నిర్భంధించారు. చివరకు అతనిపై దాడికి కూడా దిగారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చిరంజీవిని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయాలనుకున్న చిరంజీవి ఇంత గొడవ జరగడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. పోలీసుల రక్షణతో బయటపడిన చిరంజీవి ర్యాలీ లేకుండా నామినేషన్ కేంద్రానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా, మంగళగిరి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఆరుద్ర అంకవరప్రసాద్ కూడా రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ విధంగా మంగళగిరిలో టిడిపి నాయకులు, కార్యకర్తలు విడిపోయి ఘర్షణ పడే స్థితికి చేరుకున్నారు. -
చంద్రబాబు చంద్రబాబే!
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బిజెపి పట్ల తన కుయుక్తులు మరోసారి ప్రదర్శించారు. పొత్తు ధర్మం తప్పారు. కమలనాథులకు షాక్ ఇచ్చారు. ముందు కేటాయించిన ఒక శాసనసభ స్థానం వదులుకొని బిజెపి ఎంత సామరస్యంగా వ్యవహరించినప్పటికీ చంద్రబాబు చంద్రబాబే అనిపించుకున్నారు. బిజెపికి కేటాయించిన స్థానాల్లో పోటీకి దిగిన ఇద్దరు టిడిపి అభ్యర్థులకు చంద్రబాబు పార్టీ బిఫారాలు ఇచ్చారు. టిడిపి నేతలకు దిమ్మతిరిగిపోయింది. టిడిపి-బిజెపి పొత్తులో భాగంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, వైఎస్ఆర్ జిల్లా కడప శాసనసభ స్థానాలను బిజెపికి కేటాయించారు. బిజెపి సంతనూతలపాడు స్థానం దారా సాంబయ్యకు, కడప స్థానం కె.హరినాథ్‌రెడ్డికి కేటాయించింది. ఆ రెండు స్థానాల్లో టిడిపి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారికి టిడిపి బిఫారాలు కూడా ఇచ్చేశారు. చంద్రబాబు వైఖరిపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిడిపితో పొత్తు వద్దని స్థానిక నేతలు చెబుతున్నప్పటికీ బిజెపి అధిష్టానం వారి మాటలను పెడచెవిన పెట్టింది. నామినేషన్లు వేసే సమయంలో పొత్తు బెడిసి కొట్టింది. బిజెపితో పొత్తులేదని నిన్న, మొన్న టిడిపి నేతలు ప్రచారం చేశారు. నిన్న రాత్రి మళ్లీ ఇరు పార్టీ నేతల మధ్య చర్చలు జరిగాయి. ఇచ్ఛాపురం శాసనసభ స్థానంను బిజెపి వదులుకొని టిడిపికి కేటాయించింది. బిజెపి 4 లోక్‌సభ, 13 శాసనసభ స్థానాలకే పరిమితమైంది. నరసరావుపేట, కోడుమూరులలో అభ్యర్థులను మార్చడానికి కూడా బిజెపి అంగీకరించింది. మళ్లీ పొత్తు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. తెల్లారిన తరువాత మళ్లీ కథ మొదలు. చంద్రబాబు తన నైజం చూపారు. బిజెపి అంత దిగి వచ్చినా ఆయన తన శైలి మార్చుకోలేదు. చంద్రబాబు చంద్రబాబే అనిపించుకున్నారు. -
తెలుగు తమ్ముళ్ల ఓవరాక్షన్
పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరులో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అతిగా ప్రవర్తించారు. వారి దుందుడుకు వ్యవహారం పోలీసులు లాఠీఛార్జి చేసుకునేవరకు వెళ్లింది. తెలుగు తమ్ముళ్లు మూకుమ్మడిగా నామినేషన్ కేంద్రంలోకి చొచ్చుకువెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో తెలుగు తమ్ముళ్లు పోలీసులపై చెప్పులు విసిరారు. దాంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. -
మొదట హరికృష్ణ, ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్...
మొదట అన్నగారి కొడుకు హరికృష్ణను వాడుకున్నారు. ఆ తరువాత అందలం అందీ అందగానే ఆయనను అటకెక్కించారు. తర్వాత అబ్బాయ్ జూనియర్ ఎన్టీర్ను వాటేసుకున్నారు. సుబ్బరంగా ప్రచారం చేయించేసుకున్నారు. తర్వాత సేమ్ సీన్ రిపీట్. గతంలో తండ్రిని ఏ విధంగా పక్కన పెట్టారో కొడుకునూ ఇప్పుడు అదే విధంగా సైడ్ చేశారు. మళ్లీ తాజాగా తండ్రికి మరోసారి హ్యాండిచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. టీడీపీలో హరికృష్ణ-జూనియర్ ఎన్టీఆర్లకు ప్రాధాన్య ఇవ్వడంలేదని తెలుగు తమ్ముళ్లు తెగ బాధపడిపోతున్నారు. అన్నగారు స్థాపించిన పార్టీలోనే అన్నగారి కొడుకుకు, మనవడికి చెప్పుకోలేని కష్టం వచ్చిందని గుసగుసలాడుతున్నారు. ముఖ్యంగా సీటు విషయంలో సీతయ్యతో బావ చంద్రబాబు ఓ రేంజ్లో ఆడుకుంటున్నారని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కుంటున్నాయి. హరికృష్ణ మొదట హిందూపురంపై మనసు పడ్డారు. ఆ విషయాన్ని పొలిట్‌బ్యూరో సమావేశంలోనే ఆయన చెప్పారు. అయితే అదే స్థానాన్ని తమ్ముడు బాలకృష్ణ కొట్టుకుపోయారు. ఆయన అట్టహాసంగా నామినేషన్ కూడా వేసేశారు. హిందూపురం పోవడంతో హరికృష్ణ కన్ను ఈసారి కృష్ణా జిల్లాపై పడింది. అక్కడ ఏదో ఒక నియోజవకర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. పెనమలూరు నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. అదీ కూడా అందని ద్రాక్షే అయింది. హరికృష్ణ సీటు అడగలేదు, అడిగితే ఇచ్చేవాళ్లమే... అంటూ టీడీపీ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఈ వ్యాఖ్యలపై సీతయ్య మండిపడ్డారు. హిందూపురం లేదా పెనమలూరు ఇవ్వాలని పాదయాత్ర సమయంలోనే బాబును అడిగానని కుండబద్దలు కొట్టారు. ఈ వ్యాఖ్యలు టీడీపీలో కలకలం సృష్టించాయి. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేపట్టిన చంద్రబాబు విజయవాడ తూర్పు లేదా నూజివీడు స్థానాల్లో ఏదో ఒకటి ఇస్తానంటూ హరికృష్ణను బుజ్జగించేప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఐతే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. నూజివీడులో ముద్రబోయిన వెంకటేశ్వరరావు నామినేషన్ వేశారు. ఇక విజయవాడ తూర్పు స్థానం నుంచి సీనియర్ నేత గద్దె రామ్మోహన్ తన తరపున భార్య అనూరాధతో నామినేషన్ వేయించారు. ఈ నేపథ్యంలో సీతయ్యకు సీటు కేటాయింపు పెద్ద సస్పెన్స్‌గా మారింది. ఇదిలా ఉంటే, గత ఎన్నికలలో ఉధృతంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అవసరానికి బాగా వినియోగించుకున్న పార్టీ ఇప్పుడు ఆయనను పట్టించుకునే పరిస్థితిలేదు. అంతే కాకుండా టీడీపీ తరపున ప్రచారం చేయమని ఎవరినీ బొట్టుపెట్టి పిలవాల్సిన అవసరం లేదని బాబాయి బాలకృష్ణ అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. -
అవినీతిపై విచారణకు సిద్ధమా?: వైఎస్ విజయమ్మ
చంద్రబాబుకు వైఎస్ విజయమ్మ సవాల్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘తన హయాంలో ప్రజలకు తినడానికి తిండి కూడా పెట్టని చంద్రబాబు ఇప్పుడు జనానికి అన్నీ చేసేస్తానని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. తొమ్మిదేళ్ల పాలనలో తాను చేసిన స్కాములపై విచారణ జరక్కుండా కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుని బతుకుతూ ఎదుటివారిపై ఆరోపణలు చేస్తున్నాడు’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల్లో నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ సభ ల్లో ఆమె మాట్లాడారు. చంద్రబాబు నిక్కర్లు వేసుకున్నప్పుడే హైదరాబాద్ నగరం దేశంలో మూడో స్థా నంలో ఉందని.. కానీ తానే హైదరాబాద్‌ను నిర్మించానని చెబుతూ అందరినీ మభ్యపెట్టాలని చూస్తున్నాడని విమర్శించారు. ‘‘చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనంతా స్కాములమయం కాదా? ఆ స్కాముల కేసుల్లో నువ్వు స్టేలు తెచ్చుకుని బతకట్లేదా? ఆ కుంభకోణాలు, నీ అవినీతిపై విచారణకు సిద్ధమా చంద్రబాబూ? ఏలేరు కుంభకోణం, మద్యం, స్కాలర్‌షిప్‌ల కుంభకోణాలు, నకిలీ స్టాంపులు, నీరు-మీరు పథకం.. ఇలా ప్రతి దానిలో అవినీతికి పాల్పడిన ఘనుడవు నీవు. వేల కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని నీ బినామీలకు చెందిన ఐఎంజీకి అతి తక్కువ ధరకే కట్టబెట్టావు. 850 ఎకరాల భూమి అప్పట్లోనే రూ.1650 కోట్లు ఉంటే.. నేడు అది రూ.16 వేల కోట్ల విలువకు చేరింది. అటువంటి భూమిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ నీ ఇష్టారాజ్యంగా బినామీలకు ఇచ్చేశావు. నీ హయాంలో 54 ప్రభుత్వ కంపెనీలను నష్టాల్లోకి నెట్టేసి ఆ కంపెనీలను తెలుగు తమ్ముళ్ళకు అప్పజెప్పావు. ఆఖరికి ఆయా కంపెనీల్లో పనిచేసే 26 వేల మంది ఉద్యోగులు, కార్మికుల కు టుంబాలను రోడ్డున పడేసిన ఘనుడవు నీవు. అని విజయమ్మ విమర్శించారు. విశాఖలో నేడు విజయమ్మ నామినేషన్ అనకాపల్లి: వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విశాఖ లోక్‌సభ స్థానానికి గురువారం నామినేషన్ వేస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ చెప్పారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి మధ్యాహ్నం రెండు గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు. -
నేను పోటీ చేయను
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహార తీరుపై కలత చెందిన మాజీ మంత్రి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జరగబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తనకు నెల్లూరు రూరల్ టికెట్ కావాలని ముందే అడిగినా బీజేపీకి కేటాయించడంపై ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ సారి ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయనని జిల్లాలో పార్టీ ప్రచార బాధ్యతలు మాత్రమే తీసుకుంటానని ఆయన చంద్రబాబుకు స్పష్టం చేశారని తెలిసింది. ఈసారి ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి కాకుండా నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయాలని ఆరు నెలలుగా సోమిరెడ్డి ఆశపడుతూ వచ్చా రు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటూనే చంద్రబాబుకు తన కోరికను విన్నవించారు. కోవూరు టికెట్ తన మద్దతుదారుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి ఇవ్వాలని పార్టీ అధిష్టానంపై సోమిరెడ్డి తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఈ వివాదాన్ని పరిష్కరించే క్రమంలో భాగంగా చంద్రబాబు సోమిరెడ్డికి నెల్లూరు రూరల్ టికెట్ ఇవ్వడానికి సరేనన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల నెల్లూరులో జరిగిన ప్రజాగర్జన సభకు జన సమీకరణ అంశాలపై చర్చించడానికి జిల్లాకు వచ్చిన ఎంపీ సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు నెల్లూరు రూరల్ నుంచి సోమిరెడ్డే పోటీ చేస్తాడని పార్టీ నేతలకు బహిరంగంగానే చెప్పారు. దీంతో సోమిరెడ్డి రూరల్ నియోజకవర్గంలో పర్యటనలు చేయడంతో పాటు పార్టీ కేడర్స్‌తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ సారి తాను నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తానని, సర్వేపల్లి నుంచి కొత్త వ్యక్తికి ఎవరికైనా అవకాశం వస్తుందని సోమిరెడ్డి తన సన్నిహితుల వద్ద ఆఫ్‌ది రికార్డ్ వ్యాఖ్యలు చేశారు. అయితే టీడీపీ, బీజేపీ ఎన్నికల పొత్తుల చర్చల్లో నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించడానికి చంద్రబాబు అంగీకరించారు. ఈ విషయం గురించి జిల్లా పార్టీ నాయకులతో గాని, టికెట్ ఆశిస్తున్న సోమిరెడ్డితో గాని చంద్రబాబు మాట మాత్రం గా కూడా చర్చించలేదు. మీడియా ద్వారా అసలు విషయాన్ని తెలుసుకున్న సోమిరెడ్డి అప్పటికప్పుడే పార్టీ అధినేత చంద్రబాబు, ఎంపీ సుజనా చౌదరితో ఫోన్లో మాట్లాడి తన నిరసనను తెలియజేశారు. రూరల్‌కు బదులు సర్వేపల్లి, లేదా గూడూరు అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించాలని సూచించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో చంద్రబాబును కలుసుకుని ఈ ప్రతిపాదన గురించి మరోసారి ఒత్తిడి తెచ్చారు. బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వంతో మాట్లాడి సీటు సర్దుబాటు చేయాలని కోరారు. తాను బీజేపీ నాయకులతో మాట్లాడుతానని సోమిరెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చా రు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే రోజుకు (12వ తేదీకి) ఈ సమస్య సర్దుబాటు అవుతుందని సోమిరెడ్డి భావించారు. అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సంబంధించి రెండు జాబితాలు విడుదలైనా సోమిరెడ్డి గోడు చంద్రబాబు పట్టించుకోలేదని తెలిసింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన సోమిరెడ్డి ఈసారి ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయనని పార్టీ అభ్యర్థుల విజయం కోసం జిల్లా అంతటా ప్రచారం చేస్తానని పరోక్షంగా చంద్రబాబుకు తన నిరసన తెలియచేశారు. సర్వేపల్లి నుంచి తన పేరు ప్రకటించినా తాను నామినేషన్ వేసేది లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో శని, ఆదివారాల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, పార్టీకి చెందిన ఇతర ముఖ్యనాయకులు హైదరాబాద్‌లో సోమిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను అనేక రకాలుగా బుజ్జగించారు. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే పార్టీకి మంచిది కాదని ఈ అసంతృప్తి పార్టీ కేడర్ మీద కూడా పడుతుందని ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడుతున్నా, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి మీద తీవ్ర స్థాయిలో యుద్ధం చేస్తున్నా చంద్రబాబు తనను పట్టించుకోలేదని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది. ఈ వివాదాన్ని చంద్రబాబు ఏ విధంగా పరిష్కరిస్తారోనని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే సోమవారం చంద్రబాబుతో మరోసారి సమా వేశమై సీటు బీజేపీ అంగీకరించకపో యినా నెల్లూరు రూరల్ నుంచి సోమిరెడ్డిని స్నేహపూర్వక పోటీ పేరుతో బరిలో దించాలని జిల్లా నాయకులు భావిస్తున్నారు. -
అవినీతి పాలనను అంతమొందించాలి
హుజూర్నగర్, న్యూస్‌లైన్,నియోజకవర్గంలో రాజ్యమేలుతున్న అవి నీతి పాలనను అంతమొందించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కంకణబద్ధులు కా వాలని హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి పట్టణంలోని స్వర్ణవేదిక ఫంక్షన్హాల్లో జరిగిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో సీటు సంపాదించి గెలుపొందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయన ఆశయాలకు తూట్లు పొడిచారని తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు అందజేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరితేనే పథకాలు వర్తింపజేస్తామంటూ పార్టీ ఫిరాయింపులకు పా ల్పడ్డారని మండిపడ్డారు. పేదవాడి పొట్ట నింపాలనే సదుద్దేశంతో వైఎస్సార్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టగా.. కాంగ్రెస్ నేతలు నియంతల్లా వ్యవహరిస్తూ పేదల పొట్టగొట్టారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కార్యకర్తలే మనుషులని, ప్రతిపక్షాల వారు మనుషులు కాదంటూ ఆటవిక సంస్కృతికి ఆజ్యం పోశాడన్నారు. ఎదురుతిరిగిన వారిపై అక్ర మ కేసులు పెడుతూ చివరకు మహిళలను సైతం బెదిరింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశా రు. గ్రామాలో పెంట దిబ్బలు, మరుగుదొడ్లు, ఇం దిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, పింఛన్లు తదితర పథకాలను వ్యాపారాలుగా మార్చి ప్రతిదానికి కమీషన్లు వసూలు చేసిన కాంగ్రెస్ నాయకులను నిల దీయాలని కోరారు. అకాల వర్షాలకు పంటలు దె బ్బతిని రైతులు కన్నీరు పెడుతుంటే మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వారిని పరామర్శించకుం డా సన్మానాలు చేయించుకుంటూ ఊరేగారని విమర్శించారు. రైతులను పరామర్శించేందుకు ని యోజకవర్గ పర్యటనకు బయలు దేరిన వైఎస్విజయమ్మను అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డుకోవడం శోచనీయమన్నారు. శుభకార్యంలో పాల్గొనడానికి సొంత పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి రాగా రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. వై ఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు తనపైనా అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు గురి చేసినా ఎదుర్కొన్నామని చెప్పారు. కాంగ్రెస్‌పై చేస్తున్న యుద్ధం ముగింపు దశకు వచ్చిందన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేసి పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనకోసం స్థాపించబడిందే వైఎస్సార్ సీపీ : గున్నం నాగిరెడ్డి దివంగత ముఖ్యమంత్రి ఆశయ సాధనకోసమే వైఎస్సార్సీపీ స్థాపించబడిందని ఆ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి గున్నం నాగిరెడ్డి అన్నారు. వైఎ స్సార్ కలలుగన్న సంక్షేమ రాజ్యం స్థాపించేందుకు పార్టీ ఆధ్వర్యంలో నిరంతరం పాటుపడుతామని పేర్కొన్నారు. వైఎస్సార్ కుటుంబ సభ్యులు నిరంతరం ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ మహానేత ఆశయ సాధనకోసం ముం దుకు సాగుతున్నారని తెలిపారు. వైఎస్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులను గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చిందో ప్రజలంతా గమనించారని అన్నారు. ప్రాంతాలకతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. అందుకే తెలంగాణలో కూడా కోట్లాది ప్రజల హృదయాల్లో వైఎస్సార్ దైవంగా నిలిచారని చెప్పారు. కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ కీలకంగా మారడం ఖాయమని.. మన ప్రాంతాభివృద్ధికి కావాల్సినన్ని నిధులు మంజూరు చేయిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధాలను, వైఎస్సార్ సంక్షేమ పథకాలను గడప గడపకు వివరిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలలో వైఎస్సార్సీపీ మొట్టమొదటిగా గెలుచుకునేది హుజూర్నగర్ నియోజకవర్గమేనన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పోతుల జ్ఞానయ్య, కోడి మల్లయ్యయాదవ్, పెదప్రోలుసైదులుగౌడ్, జిల్లా బీసీసెల్ ప్రధాన కార్యదర్శి బుడిగె పిచ్చయ్య, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శిసాముల ఆదినారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, హుజూర్నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల, మఠంపల్లి మండల అధ్యక్షులు వేముల శేఖర్‌రెడ్డి, బొల్లగాని సైదులుగౌడ్, పోరెడ్డి నర్సిరెడ్డి, జాల కిరణ్‌యాదవ్, నాయకులు కుందూరు సత్యనారాయణరెడ్డి, చింతరెడ్డి కృష్ణారెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి,పులిచింతల వెంకటరెడ్డినాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రెబల్స్, రెబల్స్ ...
హైదరాబాద్: రెబల్స్, రెబల్స్, రెబల్స్... ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప అన్ని పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఎక్కువగా ఉంది. అన్ని పార్టీలకు పలు ప్రాంతాలలో రెబల్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్, టిడిపి, బిజెపిలకు పొత్తుల వల్ల కొన్ని స్థానాలు కోల్పోవడంతో తిరుగుబాటు అభ్యర్థులు ఎక్కువయ్యారు. టిఆర్ఎస్కు ఎవరితోనూ పొత్తులేకపోయినా దానికీ తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పలేదు. తెలుగుదేశం పార్టీ : ఎల్బీనగర్ టీడీపీ టికెట్ ఆర్.కృష్ణయ్యకు కేటాయించడంతో టిడిపి నేతలు తిగురుబాటు చేశారు. ఎల్బీనగర్ టిడిపి ఇంచార్జ్ కృష్ణప్రసాద్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎల్బి నగర్ స్థానానికే టీడీపీ నేత సామరంగారెడ్డి కూడా స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ స్థానానికి టీడీపీ రెబల్ అభ్యర్ధిగా లంకల దీపక్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీకి రాజీనామా చేసిన పి.ఎల్.శ్రీనివాస్ తిరుగుబాటు అభ్యర్థిగా సికింద్రాబాద్ శాసనసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్లో టీడీపీ రెబల్ అభ్యర్థిగా గుర్రం వెంకటేశ్వర్లు నామినేషన్ వేశారు. కాంగ్రెస్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా గీట్ల ముకుందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. హుజురాబాద్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పరిపాటి రవీందర్‌రెడ్డి నామినేషన్ వేశారు. కరీంనగర్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా దువ్వాడి నరసింగరావు నామినేషన్ వేశారు. సిపిఐకి కేటాయించిన మహేశ్వరం అసెంబ్లీ స్థానానికి మల్రెడ్డి రంగారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి సబిత సహకారంతో మల్రెడ్డి నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్ధిగా కృష్ణారావు నామినేషన్ దాఖలు చేశారు. వికారాబాద్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా మాజీ మంత్రి చంద్రశేఖర్, చేవెళ్ల కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా వెంకటస్వామి నామినేషన్ దాఖలు చేశారు. మునుగోడులో ఎంపీ పాల్వాయి కూతురు స్రవంతి రెబల్‌గా బరిలో దిగారు. దేవరకొండలో ఎమ్మెల్యే బాలూ నాయక్ రెబల్‌గా బరిలో దిగారు. మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ రెబల్‌గా నామినేషన్ వేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు మాధవరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బిజెపి: సూర్యాపేటలో బీజేపీ రెబల్ అభ్యర్థిగా సంకినేని వెంకటేశ్వర రావు నామినేషన్ వేశారు. ఇబ్రహీంపట్నంలో బీజేపీ రెబల్‌గా అర్జున్‌రెడ్డి బరిలోకి దిగారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ రెబల్ అభ్యర్థిగా డాక్టర్ విజయేందర్‌రెడ్డి నామినేషన్ వేశారు. మెదక్ జిల్లా పటాన్చెరు అసెంబ్లీ స్థానానికి బీజేపీ రెబల్ అభ్యర్థిగా అంజిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. టిఆర్ఎస్: టిఆర్ఎస్లో కూడా సీట్ల కేటాయింపు విషయమై తీవ్ర అసంతృప్తి నెలకొంది. కేసీఆర్ అభిమాన సంఘం అధ్యక్ష పదవికి వెంకటేశ్‌గౌడ్ రాజీనామా చేశారు. వరంగల్ జిల్లా పరకాలలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా భిక్షపతి నామినేషన్ దాఖలు చేశారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా సామ్యెలు నామినేషన్ దాఖలు చేశారు. ఎల్బీనగర్లో సత్యనారాయణ, నకిరేకల్‌లో రాజేశ్వరి బాలరాజు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. -
బిజెపి రెబల్ అభ్యర్థిగా అంజిరెడ్డి నామినేషన్
హైదరాబాద్: పటాన్చెరు శాసనసభ నియోజకవర్గానికి బీజేపీ రెబల్ అభ్యర్ధిగా ఎస్ఆర్ ట్రస్టు ఛైర్మన్ సి.అంజిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పొత్తులో పటాన్చెరు స్థానం టీడీపీకి కేటాయించారు. దాంతో అంజిరెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంజిరెడ్డి వైఎస్ఆర్ సిపి నుంచి జనవరిలోనే భారతీయ జనతాపార్టీలో చేరారు. -
సీపీఐ రాజీ రాగం
కాంగ్రెస్‌తో పొత్తులో దక్కిందే చాలనుకుంటున్న వైనం తెలంగాణలో ఏడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికే పరిమితం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే స్థానాలతోనే సర్దుకుపోవాలని సీపీఐ నిర్ణయానికొచ్చింది. పొత్తులో దక్కిందే చాలనుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. తెలంగాణలో కాం గ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సీపీఐకి తొమ్మిది అసెంబ్లీ, ఓ లోక్‌సభ సీటును కేటాయించేందుకు కాంగ్రెస్ మొదట హామీ ఇచ్చింది. ఇందులో కూడా సీపీఐ పట్టుబట్టిన స్థానాలు కాకుండా కాంగ్రెస్‌కు నచ్చిన స్థానాలిస్తామన్నా.. కమ్యూనిస్టులకు మరో గత్యంతరం లేకపోయింది. తీవ్ర తర్జనభర్జన అనంతరం సీట్ల సర్దుబాటుకు సరేనన్నారు. ఈమేరకు సీపీఐ తన వాటా సీట్లకు అభ్యర్థులనూ ప్రకటించింది. అయితే వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ సీటును సీపీఐకి కేటాయించి.. ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించడంతో కామ్రేడ్ల కళ్లు బైర్లుకమ్మాయి. అలాగే నల్లగొండ జిల్లా కోదాడలోనూ కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణికి అవకాశమిచ్చి సీపీఐని ఏడు సీట్లకే కాంగ్రెస్ పరిమితం చేసింది. దీంతో ఆ పార్టీ పెద్దలను నిలదీయాలని సీపీఐ అగ్రనాయకత్వం మొదట భావించింది. టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాలను ఫోన్లో సంప్రదించినా ఫలితం లేకపోయింది. ‘నా చేతిలో ఏం లేదు. మీ ఇష్టం’ అని పొన్నాల చేతులెత్తేసినట్టు సమాచారం. దీంతో కుదేలయిన కామ్రేడ్లు.. దక్కిన వాటితోనే సంతృప్తి పడదామన్న భావనకు వచ్చారు. బలమున్న స్థానాలకు తిలోదకాలు! కాంగ్రెస్‌తో పొత్తు కోసం సీపీఐ తనకు బలమున్న స్థానాలను వదులుకుంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, మెదక్ జిల్లా నర్సాపూర్లను కేటాయించాలని కామ్రేడ్లు పట్టుబట్టారు. కాంగ్రెస్ మాత్రం ససేమిరా అని తోసిపుచ్చింది. చివరికి బెల్లంపల్లి, మునుగోడు, దేవరకొండ, కొత్తగూడెం, వైరా, పినపాక, మహేశ్వరం అసెంబ్లీ సీట్లతోనే సీపీఐ సరిపెట్టుకుంటోంది. ఇక, కోదాడ సీటుకు సంబంధించి నల్లగొండ జిల్లా సీపీఐ నేతలతో కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంతనాలు జరిపినట్టు సమాచారం. కోదాడలో పోటీ చేయనున్న తన సతీమణికి మద్దతివ్వాలని ఆయన కోరారు. దీనికి సీపీఐ నేతలు అయిష్టంగానే తలూపినట్టు సమాచారం. -
బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: బిజెపి-తెలుగుదేశం పొత్తు వ్యవహారం ఇరు పార్టీలకు ఇబ్బందిగానే ఉంది. పొత్తు ప్రకటన అధికారికంగా వెలువడి తరువాత రెండు పార్టీలకు చెందిన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు తీవ్రస్థాయిలో బహిరంగంగానే విమర్శిస్తుంటే, కొందరు తిరుగుబాటు చేస్తున్నారు. మరికొందరు ఏకంగా రెండు పార్టీలకు రాజీనామాలు చేస్తున్నారు. ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన సంకినేని వెంకటేశ్వర్లుకు సూర్యాపేట శాసనసభ స్థానానికి పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆయన అనుచరులు డిమాండ్ చేశారు. కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. కొందరు కార్యకర్తలు అక్కడే ఆత్మహత్యయత్నం చేశారు. అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంకినేని వెంకటేశ్వరరావు 2004లో నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో రాంరెడ్డి దామోదరరెడ్డిపై టిడిపి తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత డీలిమిటేషన్‌తో తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయింది. దాంతో ఆయన కన్ను సూర్యాపేటపై పడింది. 2009 ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా సూర్యాపేట స్థానం టిఆర్ఎస్కు కేటాయించారు. అప్పటికే సూర్యాపేట నుంచి పోటీ చేయడానికి బి ఫారం తీసుకున్న సంకినేని దానిని చంద్రబాబుకు వెనక్కి ఇచ్చేశారు. ఆ తరువాత నియోజకవర్గం నేతలతో విభేదాలు ఎదురవడంతో 2012లో టిడిపికి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సిపిలో చేరారు. ఆ పార్టీలో కూడా ఎక్కువ కాలం ఉండలేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో బిజెపిలో చేరారు. బిజెపిలో అయితే సూర్యాపేట టిక్కెట్ తప్పక లభిస్తుందని భావించారు. దానిపై ఎన్నోల ఆశలు పెట్టుకున్నారు. బిజెపి-టిడిపి పొత్తుతో కథ అడ్డం తిరిగింది. సూర్యాపేట టిడిపికి కేటాయించారు. ఇప్పుడు ఆయనకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. -
టీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలెవరూ నమ్మరు
ఢిల్లీ: టీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలెవరూ నమ్మరని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) తెచ్చిన ఘనత తమదేనని చెప్పారు. తెలంగాణ ప్రజలు తిరిగి కాంగ్రెస్‌కే అధికారం ఇస్తారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2, 3 రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. -
టాప్‌గేర్‌లో కారు
లోక్‌సభ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు పెండింగ్‌లో ఐదు అసెంబ్లీ స్థానాల అభ్యర్థిత్వాలు సాక్షిప్రతినిధి, నల్లగొండ, టీఆర్ఎస్ మరో జాబితా విడుదల చేసింది. జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలు నల్లగొండ, భువనగిరితోపాటు కోదాడ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. డాక్టర్స్ జేఏసీ చైర్మన్‌గా పనిచేసిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్‌ను భువనగిరి లోక్‌సభ స్థానానికి, మూడు నాలుగు రోజుల కిందటే పార్టీలో చేరిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని నల్లగొండకు ప్రకటించింది. కోదాడఅసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా అక్కడి ఇన్చార్జ్ శశిధర్‌రెడ్డి పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గత ఏడాది టీఆర్ఎస్లో చేరారు. డాక్టర్స్ జేఏసీ చైర్మన్‌గా పనిచేసిన ఆయనకు భువనగిరి లోక్‌సభ సీటును కేటాయిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పార్టీలో చేరి పనిచేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు నర్సయ్యగౌడ్ పేరును కనీసం ఇన్ చార్జ్‌గా కూడా పేర్కొనని టీఆర్ఎస్ నాయకత్వం చివరకు టికెట్ ఖరారు చేసింది. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన భువనగిరిలో అవకాశం కల్పించడం కష్టమని భావించి ఇన్నాళ్లూ ఎదురుచూసినట్లు చెబుతున్నారు. ఇక, పొత్తు లేనట్టేనని భావించడం వల్లే భువనగిరికి నర్సయ్య గౌడ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. మూడు నాలుగు రోజుల కిందటి దాకా నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.అయితే, కోదాడలో విద్యా సంస్థలు ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి నల్లగొండ లోక్‌సభ సీటును ఆశించే టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన రోజు ఎలాంటి హామీ ఇవ్వని కేసీఆర్ శనివారం మాత్రం రాజేశ్వర్‌రెడ్డి పేరును నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఖరారుచేశారు. కోదాడ అసెంబ్లీ నియోజకవ ర్గ ఇన్చార్జ్ కె.శశిధర్‌రెడి అభ్యర్థిత్వం కూడా ఖరారైంది. పార్టీలో చాలా కాలంగా కొనసాగతున్న శశిధర్‌రెడ్డికి రెండో జాబితాలో టికెట్ ఓకే కావడంతో ఆయన అనుచర వర్గంలో ఆనందం వ్యక్తం అవుతోంది. -
పొత్తులు...కత్తులు
* టీడీపీ- బీజేపీ పొత్తులపై ఇరుపార్టీల్లో ఆందోళన * అవసరమైతే రెబల్స్‌గా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్న నేతలు * గ్రేటర్ పరిధిలో పరిస్థితి తీవ్రం.. మిగతా జిల్లాల్లో కూడా అదే తీరు * దాదాపు 25 నియోజకవర్గాల్లో కుదరని సయోధ్య * తాము పోటీ చేయకపోతే ఓడిస్తామంటున్న తమ్ముళ్లు పోలంపెల్లి ఆంజనేయులు: తెలుగుదేశం, బీజేపీ దోస్తీ ఖరారైనట్టే! తెలంగాణ లోని 119 సీట్లలో బీజేపీ అటు ఇటుగా 48 నుంచి 50 శాసనసభ, 8 లోకసభ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. ఏయే సీట్లలో ఎవరు పోటీ చేయాలన్న విషయంపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. బీజేపీ పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాల్లోని దాదాపు 25 సీట్లలో తామే బలంగా ఉన్నామని తెలుగు తమ్ముళ్లు బల్లగుద్ది చెపుతున్నారు. 2004లో పొత్తుతో తెలంగాణలోని 15 సీట్లలో పోటీ చేసి కేవలం ఒక్కసీటు గెలుచుకున్న బీజేపీకి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ధ్వజమెత్తుతున్నారు. హైదరా బాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, సీబీఐ మాజీ డెరైక్టర్ కె. విజయరామారావు వంటి నేతలు కూడా చంద్రబాబు పొత్తు ఎత్తులపై చిర్రెత్తుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసు కోవచ్చు. ఢిల్లీలో చక్రం తిప్పడమే ధ్యేయంగా బీజేపీకి తలొగ్గి మరీ పొత్తులకు తెరదీసిన బాబు ఇవేవీ పట్టించుకోవడం లేదు. అదే సమయంలో బీజేపీ నేతలు సైతం టీడీపీతో పొత్తు వల్ల తమ ఉనికి కోల్పోతుందన్న ఆందోళనలో ఉన్నారు. బీజేపీ- టీడీపీ పోటీ చేసే సీట్లపై నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి. ఆ వెంటనే పొత్తుల పై కత్తులు దూసేందుకు అనేక నియోజక వర్గాల్లో టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా..? తెలంగాణలో బీజేపీ దాదాపు 50 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నా... 48 సీట్లు బీజేపీకి ఖరారయ్యే అవకాశం ఉంది. ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితా కూడా సిద్ధం చేశారు. అయితే ఈ సీట్లన్నీ గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన సీట్లో, లేక ఆపార్టీ అంతో ఇంతో బలంగా ఉన్న నియోజకవర్గాలే కావడం గమనార్హం. గ్రేటర్‌లోనే అసలు గొడవ హైదరాబాద్ జిల్లాలోని అంబర్‌పేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఉన్నారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ విజయం సాధించిన సి. కృష్ణయాదవ్ టీడీపీ టిక్కెట్టు కోసం పోటీ పడుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు పోటీ చేసే అవకాశం ఉన్నందున టీడీపీ వదులుకున్నా, కార్యకర్తల యంత్రాంగం పనిచేసే పరిస్థితి లేదు. ముషీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ పోటీ పడనున్నారు. ఈ సీటు కోసం టీడీపీ నుంచి ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు, ముఠా గోపాల్ దశాబ్ధాల కాలంగా వేచి చూస్తున్నారు. టీడీపీకి సీటివ్వకపోతే రెబల్‌గా రంగంలోకి దిగాలని ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు సిద్ధపడు తున్నారు. గోషామహల్ సీటు నుంచి టీడీపీ తరపున ప్రేంకుమార్ ధూత్ పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ ఈ సీటును కోరుతున్నా, అభ్యర్థి విషయంలో ఇంకా ఏకాభిప్రాయం లేదు. మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్, నందకిషోర్ వ్యాస్, కార్పొరేటర్ రాజు సింగ్‌లలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. అయితే టీడీపీ యంత్రాంగం బీజేపీకి సహకరించకపోగా అవసరమైతే రెబల్‌గా పోటీలో నిలవాలని యోచిస్తోంది. ఎల్బీనగర్ నుంచి టీడీపీ తరపున ఎస్.వి. కృష్ణప్రసాద్ పోటీకి సిద్ధపడుతుండగా, ఆ సీటును బీజేపీ గట్టిగా కోరుతోంది. సీటు బీజేపీకి వస్తే ఎవరో ఒకరు అభ్యర్థిగా నిలపాలని ఆ పార్టీ యోచిస్తుంది. అయితే ఎల్బీ నగర్‌ను వదులు కునేది లేదని టీడీపీ నేతలు తెగేసి చెపుతున్నారు. చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళనకు కూడా దిగారు. సికింద్రాబాద్ నుంచి టీడీపీ తరుపున తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇప్పటి వరకు మూడుసార్లు గెలుపొందగా, ఇప్పుడు ఆయన సనత్‌నగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దాంతో సికింద్రాబాద్ సీటును బీజేపీ కోరుతోంది. అయితే ఇక్కడ టీడీపీ నుంచి పి.ఎల్. శ్రీనివాస్, పవన్‌కుమార్ గౌడ్లు టీడీపీ టికెట్టు తమకే కేటాయించాలని పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. అలాగే ఖైరతాబాద్ నుంచి గతంలో టీడీపీ తరుపున గెలిచిన కె. విజయ రామారావు మరోసారి పోటీ చేయాలనుకుంటుంటే బీజేపీ పీటముడి వేస్తోంది. చింతల రామచంద్రారెడ్డి కోసం త మకే ఆ సీటు కావాలని పట్టుపడుతోంది. ఇక్కడ టీడీపీ పోటీ చేయకపోతే రెబల్‌గా బరిలో నిలిచే విషయాన్ని పరిశీలిస్తామని ఓ నాయకుడు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని మల్కాజిగిరి నుంచి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పోటీకి సిద్ధపడుతుండగా, ఆ సీటును బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డికి ఇప్పించాలనే ప్రయత్నంలో బీజేపీ ఉంది. అయితే మైనంపల్లి ఇప్పటికే ప్రచారంలో దిగారు. ఈ సీటు విషయంలో రెండు పార్టీల మధ్య గొడవ తప్పనిసరి కానుంది. ఉప్పల్ నుంచి టీడీపీ అగ్రనేత దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ పోటీకి సిద్ధమవుతుంటే ఆ సీటును కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మహేశ్వరంలో పోటీ చేయడం ద్వారా తన ఎమ్మెల్యే కలను నిజం చేసుకోవాలని మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ప్రయత్నిస్తుంటే ఈ సీటును కూడా బీజేపీ కోరుతూ ఆయనకు ఆందోళన కలిగిస్తోంది. దీంతో తీగల గురువారం నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లి తన అనుయాయులతో ఆందోళనకు దిగడం గమనార్హం. శేరిలింగం పల్లిలో కూడా టీడీపీ తరుపున మొవ్వా సత్యనారాయణ, ఎ. గాంధీ, బండి రమేష్ తదితరులు టిక్కెట్టు కోసం పోటీ పడుతుంటే తమకు కేటాయించాల్సిన సీటులో దాన్ని కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకొంది. ఇతర జిల్లాల్లోనూ అదే సీను - భూపాలపల్లి నుంచి బీజేపీ నుంచి నరహరి వేణుగోపాలరెడ్డి, నాగపూర్ రాజమౌళి, మాజీ ఎంపీ సి. జంగారెడ్డి కుటుంబం గట్టిగా బీజేపీ టిక్కెట్టు కోరుతుండగా, ఈసీటును వదులుకొనేది లేదని, తానే టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటానని గండ్ర సత్యనారాయణ రావు పేర్కొంటున్నారు. - వరంగల్ తూర్పు నుంచి మాజీ మేయర్ రాజేశ్వర్ రావు బీజేపీ టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, దేశం తరుపున పార్టీ ఎంపీ గుండు సుధారాణి తన భర్త ప్రభాకర్‌కు టిక్కెట్టు ఇప్పించుకునే పనిలో ఉన్నారు. - వరంగల్ పశ్చిమ నుంచి బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు బరిలో నిలిచేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారు. - మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పోటీకి సిద్ధమవుతుండగా, ఈ సీటును కూడా బీజేపీ కోరుతోంది. ఇది టీడీపీ నేతలకు రుచించడం లేదు. - మెదక్ జిల్లా పటాన్చెరులో టీడీపీ కార్పొరేటర్ సఫాన్దేవ్ పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేయాలని బీజేపీ యోచిస్తోంది. అయితే సఫన్‌దేవ్ ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేసి విజయం సాధిస్తానన్న ధీమాతో ఉన్నారు. - అదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో టీడీపీ 2009లో విజయం సాధించింది. తరువాత ఇక్కడి ఎమ్మెల్యేలు జోగు రామన్న, నగేష్‌లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని ఆపార్టీ నుంచి పోటీ చేస్తుండగా, అదే అదనుగా బీజేపీ ఈ సీట్లు కోరుతోంది. - నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మునుగోడు, నాగార్జున సాగర్, సూర్యాపేట నియోజకవర్గాలను బీజేపీ కోరుతున్నప్పటికీ, ఆ జిల్లాలో బీజేపీకి అంత బలం లేదు. నాగార్జున సాగర్‌లో పేరా చిన్నపరెడ్డి టీడీపీ తరుపున 2009లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆయన మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. మునుగోడు, నల్లగొండ, సూర్యాపేటల్లో కూడా టీడీపీ ఆశావహులు కర్నాసి వెంకటేశం, కె. భూపాల్‌రెడ్డి, పాల్వాయి రజనీదేవి బీజేపీ పొత్తు పట్ల తమ అసంతృప్తి బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. -
సమప్రాధాన్యతతోనే సామాజిక తెలంగాణ
న్యూఢిల్లీః తెలంగాణ రాష్ట్రంలో అన్నివర్గాలకు సమప్రాధాన్యం కల్పిస్తేనే సామాజిక తెలంగాణ సాధ్యమవుతందని మాజీ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ చైర్మన్ చిత్తరంజన్‌దాస్ అన్నారు. ఏపీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ శాససన సభ సీట్ల కేటాయింపులో ఒక్కో జిల్లాకు నాలుగు చొప్పున కనీసం 40 సీట్లు ఓబీసీలకు కేటాయించాలని కాంగ్రెస్‌పార్టీ అధిష్టానానికి ఆయన విజ్ఞప్తి చేశారు. సామాజిక తెలంగాణలో ఓబీసీలందరికీ న్యాయం జరుగుతుందన్న ఆశతో బీసీలు ఉన్నారన్నారు. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం జరుగుతున్న సీట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరుగుతుందన్న భయాందోళనలు ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించాలన్నా, రాహూల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి సీట్లు కేటాయించడం సరైంది కాదన్నారు. ఓవైపు బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బీసీ నినాదంతో వస్తున్నారని, తెలంగాణలో బీసీనే ముఖ్యమంత్రిని చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌పార్టీలోనూ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు. నాలుగు శాతంలో ఉన్న అగ్రకులాలకు అధిక సీట్లు కేటాయించి, 56 శాతం ఉన్న బీసీలకు జిల్లాకు ఒక సీటు ఇస్తే ఆ ప్రభావం ఓటర్లపై పడుతుందని హెచ్చరించారు. చెన్నారెడ్డి తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతూ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియాగాంధీని, రాహూల్ గాంధీని నేరుగా కలిసే అవకాశం లేకపోవడంతోనే మీడియా ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. పార్టీ అధిష్టానం స్పందించి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు సమప్రాధాన్యం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే దీనిపై దిగ్విజయ్‌సింగ్‌కి కలిసి చెప్పినట్లు తెలిపారు. గెలవగలిన శక్తి ఉన్న ఓబీసీ నాయకులను ఎంపిక చేసి అత్యధిక మందికి సీట్లు కేటాయించాలన్నారు. సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలతో అధికారంలోకి రాలేమని, సామాజిక న్యాయమూ ముఖ్యమే అని ఆయన సూచించారు. -
వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ల నియామకం
హదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి, శాసనసభ నియోజకవర్గాలకు పార్టీ కోఆర్డినేటర్లను నియమించింది. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి మీసాల రాజారెడ్డిని కో ఆర్డినేటర్‌గా నియమించారు. హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గానికి సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డిని, ధర్మపురికి అక్కెనపల్లి కుమార్‌ను, మానకొండూరుకు సొల్లు అజయ్వర్మను, సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గానికి వి.శ్రీధర్‌రెడ్డిని కో ఆర్డినేటర్లుగా నియమించారు. -
'అధిష్టానం ఎంపిగా పోటీ చేయమంది'
గుంటూరు: పార్టీ మారడంపై వచ్చిన వార్తలను మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. అధిష్టానం తనని లోక్‌సభకు పోటీ చేయమని చెప్పారు. అయితే తాను శాసనసభకు పోటీ చేస్తానని చెప్పానని, అధిష్టానం అందుకు అంగీకరించిందన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని కన్నా చెప్పారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కన్నా లక్ష్మీనారాయణ సీనియర్‌గా ఉన్నారు. ఆయన వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా జిల్లాలో ఆయన సీనియర్ మంత్రిగా కూడా వున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు ఆ పదవికి, ఆ తరువాత సీమాంధ్ర పిసిసి అధ్యక్ష పదవికీ కన్నా పేరు ప్రముఖంగా వినవచ్చింది. -
ఏకాభిప్రాయం కుదిరిన తరువాత జాబితా:అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: ఎన్నికల పొత్తుపై టిడిపితో చర్చలు కొనసాగుతున్నాయని బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ చెప్పారు. చర్చలు ఇంకా ఒక కొలిక్కిరాలేదన్నారు. అందుకే అభ్యర్థుల జాబితా ప్రకటించలేదని చెప్పారు. రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తరువాత జాబితా విడుదల చేస్తామని జైట్లీ చెప్పారు. బిజెపితో పొత్తు కోసం మొదటి నుంచి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర బిజెపి నేతలు టిడిపితో పొత్తుకు సుముఖంగా లేరు. ఆ పార్టీ అధిష్టానం మాత్రం పొత్తు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఉంది. సీట్ల సర్ధుబాటు విషయంలో వారి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ముఖ్యంగా బిజెపి తెలంగాణలో ఎక్కువ సీట్లు అడుగుతోంది. బిజెపి అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి టిడిపి సుముఖంగాలేదు. దాంతోనే పేచీ వచ్చింది. -
తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక పూర్తి
ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి అయింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి చేసినట్లు చెప్పారు. 10 నుంచి 15 సీట్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. పెండింగ్ సీట్లు ఖరారు చేసేందుకు మరింత హోంవర్క్ చేయవలసి ఉందని చెప్పారు. టిఆర్ఎస్తో పొత్తుకు ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. మరో రెండ్రోజుల్లో మళ్లీ సమావేశమవుతామని చెప్పారు. సీమాంధ్రలో పార్టీ చేపట్టిన బస్సుయాత్ర ముగియగానే అక్కడ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. ఈ నెల 28న అభ్యర్థుల మొదటి జాబితాను హైదరాబాద్ లో విడుదల చేస్తామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. -
రఘువీరా.. అస్త్ర సన్యాసం!
అనంతపురం: యుద్ధభేరి మోగక ముందే సీమాంధ్ర పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అస్త్ర సన్యాసం చేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రఘువీరాకు ఎదురుగాలి వీస్తోంది. దీంతో పుట్టపర్తి, పెనుకొండల్లో సర్వేలు చేయించుకున్నారు. సర్వేల్లోనూ ప్రతికూలంగా ఉండటంతో సరి కొత్త వాదన అందుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పీసీసీ చీఫ్ హోదాలో రాష్ట్ర వ్యాపంగా కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిన పరిస్థితుల్లో తాను పోటీకి దూరం గా ఉంటానని రఘువీరా తన సన్నిహితులతో స్పష్టీకరించారు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ చెవిలో శనివారం వేశారు. దిగ్విజయ్‌కు స్పష్టం చేసిన రఘువీరా సీమాంధ్ర పీసీసీ చీఫ్ పదవిని అనూహ్యంగా దక్కించుకున్న మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో శనివారం బాధ్యతలు స్వీకరించారు. దిగ్విజయ్‌సింగ్ నేతృత్వంలో సీమాంధ్ర పీసీసీ కాంగ్రెస్ కమిటీ, ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాలు పూర్తయిన తర్వాత తాను ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని దిగ్విజయ్‌సింగ్‌కు రఘువీరా స్పష్టీకరించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సిన దృష్ట్యా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానన్న ఆయన అభిప్రాయంతో దిగ్విజయ్‌సింగ్ ఏకీభవించినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయక ముందే రఘువీరా అస్త్ర సన్యాసం చే యడంపై కాంగ్రెస్ వర్గాల్లో రసవత్తరమైన చర్చ సాగుతోంది. పలు సర్వేల అనంతరం పోటీకి దూరంగా.. నియోజకవర్గాల పునర్విభజనలో సొంత శాసనసభ స్థానం మడకశిర ఎస్సీలకు రిజర్వు అయ్యింది. దాంతో.. 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రఘువీరా వలస వెళ్లారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో టీడీపీకి కంచుకోట అయిన కళ్యాణదుర్గం నుంచి రఘువీరా ఘన విజయం సాధించారు. రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై సీమాంధ్ర ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజాగ్రహం దెబ్బకు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ సాహసించని దుస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన పరిణామాలకు ముందే.. సహకార, పంచాయతీ ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుదారులు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే సురక్షిత స్థానం కోసం జిల్లా వ్యాప్తంగా సర్వేలు చేయించారు. పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాల్లో విస్తృతంగా సర్వేలు చేయించారు. అక్కడ కూడా తనకు ప్రతికూల పరిస్థితులే ఉంటాయని వెల్లడవడంతో రఘువీరా తీవ్రంగా ఆందోళన చెందుతూ వచ్చారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటం ద్వారా ఓటమిని తప్పించుకోవాలని భావిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ పదవి దక్కడంతో రఘువీరా ఊపిరిపీల్చుకున్నారు. -
సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు!
దిగ్విజయ్ హామీ ఇచ్చారంటున్న ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ హామీ ఇచ్చినట్టు మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు పి.కిష్టారెడ్డి, ముత్యంరెడ్డి, అబ్రహం, ప్రతాప్‌రెడ్డి, కె.శ్రీధర్, మాలోతు కవిత, మిత్రసేన తదితరులు గాంధీభవన్‌లో దిగ్విజయ్‌ను కలిశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ లభిస్తుందో లేదోననే భయంతోనే ఇతర పార్టీల్లోకి వెళుతున్నారని, పటాన్చెరువు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ అందుకు నిదర్శనమని ఆయనకు వివరించారు. మిగిలిన ఎమ్మెల్యేల్లోనూ ఆ భయం నెలకొందని, ఈ నేపథ్యంలో తగిన హామీ ఇవ్వాలని కోరారు. అనంతరం కేఎల్లార్ మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తికి దిగ్విజయ్ సానుకూలంగా స్పందించారని, సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. అయితే పీసీసీ వర్గాలు మాత్రం అలాంటి హామీ ఇవ్వలేదని చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు దిగ్విజయ్‌ను కలిసిన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితరులు అక్కడే ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టిక్కెట్లు ఇస్తామని హామీతో కూడిన ప్రకటన చేయాలని ఆయా ఎమ్మెల్యేలు కోరగా.. ‘‘అలా ఎలా ప్రకటిస్తాం. దీనికో సిస్టమ్ ఉంది కదా! అభ్యర్థుల ఎంపికను ఏఐసీసీ స్రీనింగ్ కమిటీ చూస్తుంది. నేనే ప్రకటిస్తే ఆ సిస్టమ్ ఎందుకు? అయినా టికెట్లు రావని మీరెందుకు భయపడుతున్నారు? మీకు ఓడిపోతామనే భయం ఉందా?’’ అని దిగ్విజయ్ ప్రశ్నించారు. దీంతో సదరు ఎమ్మెల్యేలు అలాంటిదేమీ లేదని, సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని ప్రకటిస్తేనే బాగుం టుందని, దానివల్ల వలసలు ఆగుతాయని అభిప్రాయపడ్డారు. ‘‘నేనైతే అలాంటి ప్రకటన చేయలేను. కావాలంటే మీరు వెళ్లి సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు ఇస్తామన్నారనే మాటను మీడియాకు చెప్పుకోండి. నాకేమీ అభ్యంతరం లేదు’’ అని డిగ్గీ పేర్కొన్నారు. -
మాకు పది శాతం సీట్లివ్వండి
దిగ్విజయ్‌ను కోరిన ఓయూ, తెలంగాణ విద్యార్థి జేఏసీ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తమకు 10 శాతం సీట్లు కేటాయించాలని తెలంగాణ విద్యార్థుల జేఏసీ, ఓయూ జేఏసీ.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పరిశీల కులు దిగ్విజయ్‌సింగ్‌ను కోరింది. శనివారం గాంధీభవన్‌కు భారీగా తరలివచ్చిన విద్యార్థి నేతలు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సహా నేతలందరికీ విజ్ఞప్తులందించారు. తెలంగాణ నిర్మాణంలో తాము కూడా కీలక పాత్ర పోషిస్తామని, అందుకోసం ఎమ్మెల్యే/ఎంపీసీట్లలో తమకు పదిశాతం కేటాయిం చాలని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో విద్యార్థులు జెతైలంగాణ, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో పొన్నాల అటుగా వస్తుంటే విద్యార్థులు ఆయన్ను చుట్టుముట్టారు. తమడిమాండ్లను ఏకరువు పెట్టారు. ఇందుకు పొన్నాల స్పందిస్తూ టికెట్ల విషయంలో విద్యార్థి నేతల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుంటామని మీడియాకు తెలిపారు. విజ్ఞప్తులు అందజేసిన వారిలో విద్యార్థి జేఏసీ చైర్మన్ యల్లన్న, అధికార ప్రతినిధిబాలలక్ష్మి, కన్వీనర్ దుర్గం భాస్కర్, వేల్పుల సంజయ్, రాములు తదితరులున్నారు. దిగ్విజయ్ అసహన ం: పది శాతం సీట్ల డిమాండ్‌తో విద్యార్థి నేతలు గాంధీభవన్ ఎదుట నినాదాలు చేపట్టారు. అదే సమయంలో దిగ్విజయ్‌సింగ్ అటుగా రావడంతో ఆయన్ను చుట్టుముట్టేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో డిగ్గీ అసహనానికి గురై వినతిపత్రం తీసుకోకుండానే లోపలకు వెళ్లిపోయారు. పొన్నాల దృష్టికి కూడా ఈ విషయం రావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కొద్దిసేపటి తరువాత పోలీసుల సహాయంతో విద్యార్థుల్ని లోపలికి అనుమతించిన పొన్నాల వారితో మాట్లాడారు. -
ఖమ్మం టీడీపీలో సీట్ల లొల్లి
ఖమ్మం: ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అగ్గి రాజుకుంది. ఖమ్మం జిల్లాలో పార్టీలోని రెండు వర్గాల నేతలతో పాటు.. వారి అనుచరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గతంలో అంతర్గతంగా ఉన్న వైరం ఈ ఎన్నికలతో ఖమ్మం జిల్లాలో బయటపడుతోంది. ఎమ్మెల్యే టికెట్లు మొదలు మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కేటాయింపులో ఎవరికివారు తమ అనుచరులకు హామీలు గుప్పిస్తున్నారు. వరుసగా ఎన్నికలన్నీ ఒకేసారి రావడంతో ఖమ్మం జిల్లాలో పార్టీని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ఇదే సమయమని ఇటు ఎంపీ నామా నాగేశ్వరరావు, అటు ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు తమ వ్యూహాలకు పదును పెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని పైకి ప్రకటించి చివరకు రెండువర్గాలు ఒకరిని మరొకరు దెబ్బ తీసేందుకు ఎత్తులు వేయడం అప్పట్లో క్యాడర్లో చర్చనీయాంశమైంది. పాలేరు, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఖమ్మంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి వర్గాన్ని దెబ్బతీయడమే ధ్యేయంగా కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులకు సహకారం అందించడంలో కూడా వెనుకాడలేదు. డీసీసీబీ ఎన్నికల్లో కూడా ఇరువురు నేతలు తమ అనుచరునికే పీఠం దక్కాలని ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని తుమ్మల, ఖమ్మం జిల్లాలో తుమ్మల తనకు కొరకరాని కొయ్యగా మారాడని నామా... ఎవరికి వారు ప్రత్యర్థి వర్గం బలాన్ని దెబ్బతీసేందుకు ఎత్తులు వేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో ఇదే అదునుగా ఇరువర్గాల నేతలు వార్డు సభ్యుని నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే టికెట్ వారు తమ అనుచర నేతలతో మీకే సీట్లు అంటూ హామీలిస్తున్నారు. ఎన్నికల విషయంలో ఇద్దరు నేతలు ఒకే వేదిక పైకి రాకుండా ఎవరికి వారు తమ అనుచర నేతలకు హామీలిస్తుండడంతో అసలు ఎవరికి ఏ స్థానం దక్కుతుందో, ఏది దక్కదో ప్రత్యామ్నాయం చూసుకోవాలా.. వద్దా..? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి తెరలేవగా.. ఇరువురి అనుచరులు వార్డుల్లో నామినేషన్ వేయడానికి సై అంటే సై అంటున్నారు. అలాగే వీలైనన్ని ఎక్కువ జెడ్పీటీసీలు తమ వర్గమే దక్కించుకోవాలని, అలా అయితే జెడ్పీ పీఠం తమదేనన్న యోచనలో ఇరువురు నేతలు ఉన్నారని పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది. ఎంపీటీసీల విషయంలో కూడా మండల స్థాయిలో పట్టుకోసం ఇదే సీన్ నెలకొంది. అంతేకాకుండా ఇక అసలు తమ వర్గం నేతగా చెప్పుకోవడానికి ఇరువురు నేతలు అసెంబ్లీ టికెట్ల కేటాయింపుపై దృష్టి పెట్టారు. తుమ్మల పాలేరు పయనమెందుకు..? ఖమ్మం నుంచి తుమ్మల పాలేరు పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం పార్టీలో చర్చనీయాంశమైంది. తాను ఈసారి ఖమ్మం నుంచే పోటీచేస్తానని స్పష్టంగా చెప్పకపోవడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోందని అంటున్నారు. పాలేరు నియోజకవర్గ నేతలతో కూడా ఆయన రహస్యంగా సమావేశాలు నిర్వహించి అక్కడి నుంచి పోటీచేస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నట్లు సమాచారం. అసలు ఖమ్మం నుంచి ఆయన పాలేరు వెళ్లేందుకు ఎందుకు సిద్ధమవుతున్నారు..అక్కడ నామా వర్గం సహకరిస్తుందా..? అన్నది ఇప్పుడు ఆ పార్టీలో కొనసాగుతున్న చర్చ. గతంలో తన అనుచర ప్రధాన నేత ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఈ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో.. బాలసాని, ఆ నియోజకవర్గ ఇన్చార్జి మద్దినేని బేబి స్వర్ణకుమారి అనుచరులు ఎవరికివారు తమ నేతలను వెనకేసుకు వస్తూ విమర్శలకు దిగారు. ఇప్పుడు తుమ్మల.. బాలసాని పేరును ఖమ్మంకు ప్రస్తావిస్తుండడం, పాలేరుకు ఆయన పయనమవుతుండడం పార్టీ నేతలకు కూడా అంతుబట్టడం లేదు. గత ఎన్నికల్లో ఖమ్మంలో తుమ్మల ఓటమి అంచువరకు వెళ్లి బయటపడడం, స్థానికంగా వ్యతిరేకత ఉందా..? అందుకే పాలేరుకు వెళ్తున్నారా..? అనే చర్చ కూడా పార్టీ క్యాడర్లో జరుగుతోంది. తుమ్మల పట్టు.. నామా బెట్టు ఈసారి తుమ్మల ఖమ్మం కాదని పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. అయితే తాను ఎమ్మెల్యేగా గెలిచిన స్థానాన్ని తన అనుచరుడు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు ఇవ్వాలని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లినట్లు సమాచారం. తుమ్మల అనుచరునికి ప్రత్యామ్నాయంగా అదే సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తిని నామా ఇటీవల తెరపైకి తెచ్చారు. జిల్లాలో దమ్మపేట మండలానికి చెందిన కందిమళ్ల నాగప్రసాద్ నామా హామీతోనే ఇటీవల పార్టీ తీర్థం పుచ్చుకున్నారని.. ఈయనకు ఖమ్మం నుంచి టికెట్ ఇప్పించేందుకు నామా తీవ్ర ప్రయత్నాల్లో మునిగినట్లు తెలిసింది. తుమ్మలకు చెక్ పెట్టాలని నామా.. నామా దూకుడుకు అడ్డుకట్ట వేయాలని తుమ్మల..ఇలా ఇరువురు నేతలు వ్యూహంలో మునిగారు. బాలసానికే టికెట్ ఇవ్వాలని, నిన్నగాక మొన్న వచ్చిన నేతలకు ఎలా టికెట్ ఇస్తారు..? అని తుమ్మల,బాలసాని అనుచరులు ఇటీవల రాజధానిలో పార్టీ నేతల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలా ఇరువురు నేతలు ఖమ్మం సీటు పైనే బెట్టుగా ఉండడంతో ఈ సీటు ఎవరికి దక్కనుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది. -
బొత్స పలాయన మంత్రం
శ్రీకాకుళం: తమ ఘనకార్యాలతో సొంత జిల్లాలో ‘రచ్చ రచ్చ’అయిన బొత్స సత్యనారాయణ కుటుంబం ప్రత్యామ్నాయ స్థానాల కోసం వెతుకులాట ప్రారంభించింది. విజయనగరం జిల్లాలో ప్రజాగ్రహం వ్యక్తమవుతుండటంతో పక్కనున్న శ్రీకాకుళం జిల్లాపై కన్నేసింది. ఈ జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని బరిలో నిలపాలని బొత్స నిర్ణయించారు. అందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడుకు పొగ పెట్టేశారు. అనంతరం తామే ఎచ్చెర్ల నుంచి పోటీ చేస్తామని ఆ నియోజకవర్గ నేతలకు స్పష్టం చేశారు. విజయనగరంలో సీన్ కాలిపోయింది... విజయనగరం జిల్లాలో పదేళ్లుగా బొత్స కుటుంబం సాగిస్తున్న ఆగడాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొన్ని నెలల క్రితం సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా భారీ సంఖ్యలో విద్యార్థులు, మహిళలు బొత్స ఇంటిని ముట్టడించారు. జిల్లాను ఏలుతున్న బొత్స కుటుంబాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. దాంతో తమ కుటుంబంపై ప్రజల్లో వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకత ఏమిటో బొత్సవారికి తెలిసొచ్చింది. రానున్న ఎన్నికల్లో జిల్లాలో పరాభవం తప్పదని బొత్స ఆనాడే నిర్ధారణకు వచ్చేశారు. ప్రస్తుతం బొత్స కుటుంబం నుంచి నలుగురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. వచ్చే ఎన్నికల అనంతరం కనీసం ఒక్కరైనా చట్టసభ సభ్యుడిగా ఉండాలంటే ఏం చేయాలా? అని మథనపడుతున్న బొత్స కన్ను పొరుగున ఉన్న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంపై పడింది. ‘మీసాల’కు పొగ ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానం విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం విజయనగరం ఎంపీగా బొత్స భార్య ఝాన్సీ ఉన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా సీనియర్ నేత మీసాల నీలకంఠం ఉన్నారు. వాస్తవానికి బొత్స రాజకీయ వైభవానికి మీసాల ప్రధాన కారకుడు. ప్రస్తుతం బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గాన్ని ఆయన 2004లో బొత్సకు త్యాగం చేశారు. ఆయన స్వచ్ఛంద అంగీకారంతోనే ఆ నియోజకవర్గాన్ని అప్పట్లో బొత్సకు కేటాయించారు. అనంతరం బొత్స రాష్ట్ర మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. తన రాజకీయ ఉన్నతికి కారకుడైన నీలకంఠం నాయుడుకే ఇప్పుడు బొత్స పొగ బెట్టారు. వ్యూహాత్మకంగా నీలకంఠానికి వ్యతిరేకంగా అసమ్మతిని ప్రోత్సహించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కథను క్లైమాక్స్‌కు తీసుకువచ్చారు. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను ఎచ్చెర్ల నియోజకవర్గ నేతలను విజయనగరంలోని తన నివాసానికి బుధవారం పిలిపించుకున్నారు. నీలకంఠం అయితే ఎన్నికల్లో ఓడిపోతారనే వాదనను కూడగట్టారు. అనంతరం కాసేపటికే బొత్స సత్యనారాయణ అక్కడికి చేరుకున్నారు. అసలు విషయం చెప్పకుండా పథకం ప్రకారం బొత్స వారిని ఒప్పించారు. వారి సమక్షంలోనే ఎచ్చెర్ల ఎమ్మెల్యే నీలకంఠం నాయుడుకు ఫోన్ చేశారు. ‘మీపట్ల నేతలు, కార్యకర్తలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంత ఖర్చు చేస్తారు?.. పరిస్థితి ఏమీ బాగా లేదు..’అని నిందాపూర్వకంగా మాట్లాడారు. దాంతో నీలకంఠం నాయుడు తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. పరిస్థితి గ్రహించిన ఆయన బొత్స కుటుంబానికి దారిచ్చేశారు. ‘వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను. మీ ఇష్టం. ఎవరినైనా చూసుకోండి’అని చెప్పేశారు. ‘మేమే పోటీ చేస్తాం...’ అనంతరం బొత్స ఎచ్చెర్ల నియోజకవర్గ నేతలతో అసలు విషయం చెప్పారు. ‘మీలో ఎవరైనా ఎచ్చెర్ల నుంచి పోటీ చేస్తారా?’అని మొదట అడిగారు. చేయలేమని వారు చెప్పారు. అలా అయితే తమ కుటుంబం నుంచే ఒకరు పోటీ చేస్తారని బొత్స వెల్లడించారు. అదే విధంగా విజయనగరం ఎంపీగా కూడా తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారు కాబట్టి అందరూ తమ మాటకు కట్టుబడాలన్నారు. కానీ ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తారు?... విజయనగరం ఎంపీగా ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించకుండా జాగ్రత్తపడ్డారు. ఎన్నికల నాటి పరిస్థితిని బట్టి ఎచ్చెర్ల నుంచి తానుగానీ, తన భార్య ఝాన్సీగానీ పోటీ చేయాలన్నది బొత్స వ్యూహంగా ఉంది. అంతవరకు తన మేనల్లుడు చిన్న శ్రీనుతో ఎచ్చెర్లలో పార్టీ వ్యవహారాలను నడిపించాలన్నది ఆయన ఆలోచన. అందుకే ఎచ్చెర్ల అభ్యర్థి ఎవరన్నది ముందే ప్రకటించకుండా జాగ్రత్త పడ్డారు. బెడిసికొట్టిన పన్నాగం ఎంత పక్కాగా కథ నడిపించినప్పటికీ బొత్సకు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన మెజార్టీ నేతలు తాము కాంగ్రెస్‌లో కొనసాగలేమని తేల్చిచెప్పారు. వైఎస్ఆర్సీపీలో చేరాలనుకుంటున్న విషయాన్నీ స్పష్టం చేశారు. లావేరు మాజీ ఎంపీపీ దన్నాన రాజి నాయుడు తదితరులు తాము కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తామన్నారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, ఏఎంసీ చైర్మన్ తదితరులు కూడా తాము బొత్స తో కలసి పనిచేయలేమని చెప్పారు. ఎచ్చెర్ల నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఒకటి రెండు రోజుల్లో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవాలని భావిస్తున్నారు. దీంతో బొత్స కుటుంబీకులు ఇక్కడి నుంచి పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని తెలుస్తోంది. -
దేశం.. నిస్తేజం
అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో కొరవడిన స్పష్టతఎమ్మిగనూరు, మంత్రాలయంలో గందరగోళం మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో నాయకత్వలోపం అభ్యర్థుల ఎంపికలో ‘టీజీ’ నిర్ణయానికి ప్రాధాన్యం తేలని మాజీ మంత్రి బీవీ తనయుడి భవితవ్యం ‘మంత్రాలయం’ కోసం మండల నాయకుల పోటీ ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్: ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీలో నిస్తేజం నెలకొంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించినా.. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల విషయంలో స్పష్టత కరువైంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు ఎమ్మిగనూరులో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో నడిపించే నాయకుడు ఎవరో తెలియక శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఎమ్మిగనూరు అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మంత్రి బి.వి.మోహన్‌రెడ్డి కుమారుడు జయనాగేశ్వరరెడ్డిని ప్రకటిస్తారని అందరూ భావించినా.. మారుతున్న పరిణామాలతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజులుగా ఆయన హైదరాబాద్‌లో తిష్ట వేసినా పార్టీ అధినేత స్పందించకపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఆ తర్వాత కలిసినా.. మొదట మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకుంటే ఆ తర్వాత చూద్దామనే అధినేత మాటలను బీవీ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో బాబు ఆదేశాలతో ఇటీవల ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న టీజీ వెంకటేష్ ఎమ్మిగనూరు రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. ఈయన చిన్ననాటి మిత్రుడు, రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి శివశంకర్ సతీమణిని చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీ తరఫున పోటీ చేసేందుకు ముందుకొచ్చే అభ్యర్థులకు కూడా టీజీయే ఆర్థిక వనరులను సమకూరుస్తున్నట్లు చర్చ జరుగుతోంది. చేసేది లేక బీవీ అభ్యర్థులచే నామినేషన్లు వేయించడం, వారి తరఫున ప్రచారం చేయడంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఎమ్మిగనూరు నుంచి పోటీకి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు ప్యాలకుర్తి తిక్కారెడ్డి, వై.రుద్రగౌడ్లతో పాటు నంద్యాల డివిజన్‌కు చెందిన ఇరువురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రాలయంలో అనిశ్చితి నియోజకవర్గ అభ్యర్థిగా ఇప్పటి వరకు ఎవరినీ ప్రకటించకపోవడం ప్రాదేశిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక్కడి నుంచి మండల స్థాయి నాయకులు అసెంబ్లీ టిక్కెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంత్రాలయం మండలం నుంచి మాధవరం రామిరెడ్డి, కోసిగి మండలం నుంచి బి.టి.నాయుడు, కౌతాళం మండలం నుంచి ఉలిగయ్య, చందాఖాన్, పెద్దకడబూరు మండలం నుంచి గుడిసె కృష్ణమ్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరి పట్లా అధినేత ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది. కర్నూలు లోక్‌సభ అభ్యర్థిగా బీసీ వర్గీయులకు అవకాశం కల్పిస్తే.. మంత్రాలయం రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలని బాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇటు మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలవడం.. పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న తరుణంలోనూ అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో టీడీపీ వేచి చూసే ధోరణి శ్రేణులను కలవరపరుస్తోంది. -
ఎన్నికలకు 800 కోట్లు!
* కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన సీఈవో * ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు * 4.50 లక్షల మంది సిబ్బంది వినియోగం.. 69 వేల కేంద్రాల్లో వీడియోగ్రఫీ.. * డబ్బు, మద్యం పంపిణీ అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు * ఎన్నికల వ్యయంపై 5న రాజకీయ పార్టీలు, మీడియాతో ఈసీ సమావేశం సాక్షి, హైదరాబాద్: ఈసారి రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ వ్యయం భారీగా పెరగనుంది. డబ్బు, మద్యం, అధికారబలాలకు అతీతంగా మరింత పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనుండటంతో ఈ వ్యయం కూడా పెరుగుతోంది. ఈనెల 10న ఎన్నికల నిర్వహణపై రాష్ట్రాల సీఈవోలతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎన్నికల వ్యయంపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రూ.800 కోట్ల వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ మొత్తం వ్యయంలో కేంద్రం సగం, రాష్ట్రం సగం భరించాల్సి ఉంటుంది. పోలింగ్ నిర్వహణకు రాష్ట్రంలో ఏకంగా 4.50 లక్షల మంది సిబ్బందిని వినియోగించనున్నారు. అలాగే 69 వేల పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీని ఏర్పాటు చేయనున్నారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దులతో పాటు, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా నిరోధించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. చెక్ పోస్టులతో పాటు సంచార బృందాలను ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు ఎవరు పాల్పడకుండా గట్టి నిఘా పెడతారు. ప్రధానంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు అధికార బలంతో ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడకుండా అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. గతంలో నెల్లూరు పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నిక నిర్వహణకు రూ.13 కోట్ల వ్యయం అయింది. దీని ఆధారంగా త్వరలో జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అంచనా వేసింది. ‘పెయిడ్’పై ప్రత్యేక దృష్టి: వచ్చేఎన్నికల్లో రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయం పరిమితికి మించకుండా, అలాగే పెయిడ్ న్యూస్ వంటి ఇతర మార్గాల్లో ప్రచారం నిర్వహించడాన్ని నిరోధించాలని కమిషన్ నిర్ణయించింది. దీనిపై అవగాహన కల్పించేందుకు ఈనెల 5న కమిషన్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, మీడియా ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వొద్దు ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వద్దని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ మేరకు గుర్తింపు పొందిన అన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీల ప్రతినిధులకు ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యదర్శి కె.అజయ్‌కుమార్ లేఖలు రాశారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలో సంక్షేమ కార్యక్రమాల హామీలను ఇవ్వొచ్చని, అయితే అవి ఎన్నికల స్ఫూర్తిని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బలహీనపరిచేలా ఉండరాదని సూచించింది. రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలకు విశ్వసనీయత ఉండాలని, అలాగే ఆర్థికపరంగా ఆచరణ సాధ్యం అయ్యేవిగా ఉండాలని పేర్కొంది. -
ఢిల్లీ బరిలో పెరిగిన నేరగాళ్లు!
న్యూఢిల్లీ: దేశంలోని ఇత ర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాల్సిన రాజధాని ఢిల్లీ నేరగాళ్లకు అడ్డాగా మారుతోందని, మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న 129 మంది నేరగాళ్లు పోటీలో ఉన్నారని అధ్యయనాలు ఢంకా బజాయిస్తున్నాయి. 2008తో పోల్చుకుంటే ప్రస్తుత ఎన్నికల్లో పోటీ పడుతున్న నేరగాళ్ల సంఖ్య 14 నుంచి 16 శాతానికి పెరిగిందని పేర్కొంటున్నాయి. ఈ మేరకు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్), ఢిల్లీ ఎలక్షన్ వాచ్(డీఈడబ్ల్యు)లు బరిలో నిలిచిన అభ్యర్థుల అఫిడవిట్ల ఆధారంగా వెల్లడించాయి. వీటి కథనం మేరకు, ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ పడుతున్న వివిధ పార్టీలకు చెందిన మొత్తం 796 మంది అభ్యర్థుల్లో 129 మంది వివిధ కేసులు ఎదుర్కొంటుండగా 93మందిపై హత్య, దొమ్మీ, మహిళలపై వేధింపులు వంటి అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి రంగంలోకి దిగిన అభ్యర్థుల్లో 46 మంది ఈ జాబితాలో ఉండగా, బీఎస్పీ నుంచి 14, చిన్నా చితక పార్టీలు సహా స్వతంత్ర అభ్యర్థులు 64 మంది ఈ జాబితాలో ఉండడం గమనార్హం. ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ అభ్యర్థుల్లో ఐదుగురిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని అధ్యయనం బట్టబయలు చేసింది. -
అర్హులనే ఓటర్లుగా చేర్పించండి: బాలినేని శ్రీనివాసరెడ్డి
ఒంగోలు, న్యూస్‌లైన్: అసెంబ్లీ, పురపాలక ఎన్నికలు ఏవి ముందొచ్చినా..ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, అన్ని అర్హతలున్నవారినే గుర్తించి ఓటర్లుగా చేర్పించాలని వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి నగర పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఉదయం 11 గంటలకు నగర స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలనుద్దేశించి బాలినేని మాట్లాడుతూ గత ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. కేవలం తనను లక్ష్యంగా చేసుకుని అర్హులైన 40 వేల ఓట్లను దొంగ ఓట్ల పేరుతో ప్రభుత్వం తొలగించిందన్నారు. 40 వేల దొంగ ఓట్లను చేర్చుకోగలిగే సత్తా తనకే ఉంటే దేశంలో ఎక్కడైనా పోటీ చేసి సునాయాసంగా గెలవవచ్చన్నారు. శివారు ప్రాంతాలు, దళితవాడలనే లక్ష్యంగా చేసుకుని ఓట్లు తొలగించారని, వారంతా తమ ఓట్లు తొలగించారని చెబుతుంటే చాలా బాధ కలిగిందని బాలినేని పేర్కొన్నారు. మనం చేసిన మంచే మనల్ని గెలిపించిందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. నిజమైన ఓటర్లను చేర్పించేందుకు బూత్ కమిటీలు పటిష్టంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు చాలా మంది ఆశావహులున్నారని, వారు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు ఆదివారం అందుబాటులో ఉంటారని, లేనిపక్షంలో బూత్‌లెవల్ కమిటీ సభ్యులు, అభ్యర్థుల దరఖాస్తులను సంబంధిత బూత్‌లెవల్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నారో తెలుసుకొని అందజేయడంతో పాటు తప్పకుండా రసీదు తీసుకోవాలని సూచించారు. పదిహేను రోజులు బాగా కష్టపడండి..ఆ తరువాత మీ కోసం నేను కష్టపడతా అని బాలినేని కోరారు. తాను కుటుంబం కన్నా..కార్యకర్తల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటానని, కార్పొరేషన్లను గెలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. మహిళలు కూడా బూత్ కమిటీలు వేసుకుని ఇందుకు సిద్ధం కావాలని బాలినేని పిలుపునిచ్చారు. జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ వాసన్న రాష్ట్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నందున పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త, నాయకుడు నూతన ఓటర్లను చేర్పించే బాధ్యతను స్వీకరించాలన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశం విషయాలను బాలాజీ వివరించారు. బూత్‌ల వారీగా ఎక్కడెక్కడ ఎటువంటి సమస్యలున్నాయనే వాటిని గుర్తించి బాలినేని దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీలు ఇష్టారీతిగా దుష్ర్పచారం చేస్తున్నాయని వాటిని తిప్పికొట్టాలన్నారు. నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలినేని చేసిన అభివృద్ధి గురించి విసృ్తతంగా ప్రచారం చేయాలన్నారు. కనీసం ఎమ్మెల్యే తెచ్చిన నిధుల్ని సైతం వినియోగించుకోకుండా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న అధికార పార్టీ నాయకుల చర్యలను, వారికి వత్తాసు పలుకుతున్న టీడీపీ నాయకుల చర్యలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధులు కొఠారి రామచంద్రరావు, నరాల రమణారెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, నరశింగరావు, వివిధ విభాగాల జిల్లా కన్వీనర్లు కఠారి శంకర్, వేమూరి బుజ్జి, పోకల అనూరాధ, కంచర్ల సుధాకర్, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, షేక్ ఖాజా, యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, పార్టీ అనుబంధ సంఘాల నగర కన్వీనర్లు నెరుసుల రామకృష్ణ, బొప్పరాజు కొండలరావు, యరజర్ల రమేష్, ముదివర్తి బాబూరావు, కావూరి సుశీల, కంకణాల వెంకట్రావు, నగర అధికారప్రతినిధి రొండా అంజిరెడ్డి, పార్టీ నాయకులు సింగరాజు వెంకట్రావు, కత్తినేని రామకృష్ణారెడ్డి, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, ఎస్వీ రమణయ్య, జమ్ము రత్తయ్య, జాజుల కృష్ణ, వెలనాటి మాధవరావు, ప్రసాదరెడ్డి, రాయని వెంకట్రావు పాల్గొన్నారు.