collectorate
-
పత్తి మానుకొని.. సిరిధాన్యాల సాగు!
ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తి సాగులో, అందునా విత్తనోత్పత్తిలో నైపుణ్యం సాధించిన సీనియర్ రైతు కందిమళ్ల వేణుబాబు(52) ఆరేళ్ల క్రితం తన దృష్టిని సిరిధాన్యాల వైపు మళ్లించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వేణుబాబు మూడు దశాబ్దాల క్రితం కర్నూలు జిల్లాకు వలస వచ్చి స్థానికంగా దేవాలయ భూములను కౌలుకు తీసుకొని విత్తనోత్పత్తి లక్ష్యంగా పత్తి సాగు చేస్తుండేవారు. మరో 8 మంది రైతులతో కలసి ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘాన్నిప్రారంభించారు. ఈ నేపథ్యంలో తన తల్లికి కేన్సర్ వ్యాధి సోకటంతో ఆరోగ్యదాయకమైన సిరిధాన్యాల గురించి ఆలోచించారు. కర్నూలులో డాక్టర్ ఖాదర్‌వలి సభకు హాజరై సిరిధాన్యాల ఆహారంలో ఔషధ గుణాల గురించి తెలుసుకున్నారు. అప్పటికే పత్తి విత్తన రంగంలో ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా పత్తి సాగుకు స్వస్తి చెప్పి సిరిధాన్యాల సాగు వైపు పూర్తిగా దృష్టి మళ్లించారు.32 ఎకరాల్లో సిరిధాన్యాల సాగు 2019లో తొలిసారి ఏడు ఎకరాల్లో కొర్రలు, అండుకొర్రల సాగుకు శ్రీకారం చుట్టారు. క్రమంగా సాగు విస్తీర్ణాన్ని పెంచారు. కల్లూరు మండలం పందిపాడు గ్రామంలోఒకే చోట 25 ఎకరాల దేవాలయ భూములను కౌలుకు తీసుకొని వర్షాధారంగా ఖరీఫ్‌లో సిరిధాన్యాలతో పాటు అంతర పంటగా కంది సాగు చేస్తున్నారు. నీటి సదుపాయం గల మరో 7 ఎకరాల్లో ఖరీఫ్‌లో అండుకొర్ర పండిస్తున్నారు. రెండో పంటగా కంది, దోస సాగు చేస్తున్నారు. నల్లరేగడి నేలలో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు వేస్తారు. వేస్ట్ డీ కంపోజర్‌ను 4 సార్లు, పుల్ల మజ్జిగను రెండు సార్లు ట్రాక్టర్ స్ప్రేయర్‌తో పిచికారీ చేయిస్తారు. 8 క్వింటాళ్ల కొర్రలతో పాటు ఎకరానికి 5 క్వింటాళ్ల కంది దిగుబడి పొందుతున్నారు. కందులతో పాటు ఎకరానికి అరికలైతే 7 క్వింటాళ్లు, సామలు 3 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తోందని వేణుబాబు తెలిపారు. మిషన్‌తో పంట కోయిస్తే ఎకరానికి రూ. 10 వేలు, కూలీలతో కోయిస్తే రూ. 15 వేల వరకు సాగు ఖర్చవుతుందని ఆయన తెలిపారు.సొంతప్రాసెసింగ్ సొంతప్రాసెసింగ్ యూనిట్యూనిట్సిరిధాన్యాలను పండించి టోకుగా అమ్మటం కన్నా బియ్యంగా మార్చి రిటైల్‌గా అమ్మటం ద్వారా అధికాదాయం వస్తుందని తొలిదశలోనే గుర్తించిన వేణుబాబు రూ. 15 లక్షలతో సొంతప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తాను పండించిన సిరిధాన్యాలతో పాటు ఇతర రైతులు పండించినవి కూడా కొని, మరపట్టించి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. పురుగుల బెడద లేకుండా వ్యాక్యూమ్ ΄్యాకింగ్ చేసి ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘం బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారు. సుమారు 3 వేల మందికి నేరుగా సిరిధాన్యాల బియ్యం, రవ్వను అమ్ముతున్నారు. సాగు చేసి అమ్మటమే కాదు కుటుంబ సభ్యులంతా చిరుధాన్యాల ఆహారమే తీసుకుంటుండటం విశేషం. ఈ ఆహారంతో తాను బరువు తగ్గి చాలా ఆరోగ్యంగా ఉన్నానని వేణుబాబు సంతోషిస్తున్నారు. వినియోగ దారుల ఆదరాభి మానాలు పొందాలంటే రాళ్లు, ఇసుక రాకుండా సిరిధాన్యాల బియ్యం, రవ్వను అందించటం చాలా ముఖ్యమన్నారు.కలెక్టరేట్లో మిల్లెట్ కేఫ్చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ సృజన కలెక్టరేట్ ఆవరణలో మిల్లెట్ కేఫ్ప్రారంభానికి వేణుబాబుకు అవకాశం ఇచ్చారు. సిరిధాన్యాల భోజనంతో పాటు జావ, లడ్డూలు, మురుకులు, బ్రెడ్ తదితర ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. తమ వద్ద రోజువారీగా సిరిధాన్యాల ఆహారం తినే వారిలో 60% మంది యువతేనని ఆయన చెబుతున్నారు. క్వింటా రూ.4 వేలకు ప్రభుత్వం కొనాలిసిరిధాన్యాలకు గత ఏడాది మంచి ధర రావటంతో సాగు ఈ ఏడాది 50% పెరిగింది. గత సంవత్సరం కొర్ర ధాన్యం క్వింటా రూ. 5–6 వేలు పలికితే, ఈ ఏడాది 2,500కి పడిపోయింది. అండుకొర్రలు గత ఏడాది క్వింటా రూ. 8 వేలు పలికితే ఈ ఏడాది రూ.3,500కి పడిపోయింది. ఏ రకం సిరిధాన్యమైనా క్వింటా రూ. 4 వేలైతేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. సిరిధాన్యాల సాగు విస్తీర్ణం స్థిరంగా పెరగాలంటే ప్రభుత్వం రూ. 4 వేల చొప్పున కొనాలిæలేదా మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. దీంతో పాటు.. మినీ హార్వెస్టర్లను రైతులకు సబ్సిడీపై అందించాలి. వీటితో రైతులే స్వయంగా పంట కోసుకోవచ్చు. మహిళలు కూడా వీటిని ఉపయోగించగలుగుతారు. సిరిధాన్యాల వినియోగం కూడా క్రమంగా పెరుగుతోంది. మా దగ్గర ఇద్దరు ఆయుర్వేద వైద్యులు రోగులకు విధిగా సిరిధాన్యాల ఆహారాన్నే సూచిస్తున్నారు. వారి కోసం అర కేజీ ΄్యాకెట్ల కిట్లను అందిస్తున్నాం. సిరిధాన్యాల సాగుకు పెట్టుబడి తక్కువ.. నికరాదాయం ఎక్కువ. పూర్తి సంతృప్తి ఉంది. మా ఇంట్లోనూ సిరిధాన్యాలనే తింటూ ఆరోగ్యంగా ఉన్నాం. – కందిమళ్ల వేణుబాబు (94408 61443), చిరుధాన్యాల రైతు, కర్నూలు – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు -
రంగారెడ్డి కలెక్టరేట్లో మోహన్‌బాబు, మనోజ్ విచారణ
-
YSRCP Poru bata: విశాఖ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
విశాఖపట్నం, సాక్షి: కూటమి సర్కార్‌పై పోరుబాటలో భాగంగా.. ఇవాళ అన్నదాతకు అండగా కార్యక్రమం నిర్వహిస్తోంది వైఎస్సార్సీపీ. ఈ క్రమంలో రాష్ట్రమంతా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చింది. అయితే.. కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.విశాఖ కలెక్టరేట్ వద్దకు వైఎస్సార్సీపీ నేతలతో పాటు భారీగా రైతులు చేరుకున్నారు. అయితే లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తోపులాట జరగ్గా.. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య గాయపడ్డారు. ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తోంది.మరోవైపు.. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ దాకా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ క్రమంలో డీఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు ఆ పార్టీ నేతలు. ‘‘ ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించాం.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. తక్షణమే.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి... సూపర్ సిక్స్ అని చెప్పి కూటమి ప్రభుత్వం డక్ ఔట్ అయింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏడాదికి రూ.20,000 ఇవ్వాల్సిందే. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 18 ఏళ్ల నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ హామీలన్నీ నెరవేర్చాల్సిందే అని గుడివాడ అన్నారు. -
సీపీఐ,సీపీఎం ఆందోళన..అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
సాక్షి,అనంతపురం: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలను అమలు చేయాలని సీపీఐ,సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు,కార్మికులు అనంతపురం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కలెక్టర్ వినోద్‌కుమార్ వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆందోళకారులు కలెక్టర్ వాహనాన్ని అరగంట సేపు దిగ్భందించారు.ఈ సందర్భంగా పోలీసులు,ఆందోళకారులకు మధ్య వాగ్వాదం,తోపులాటజరిగింది. హామీల అమలులో టీడీపీ,బీజేపీ, జనసేన విఫలమయ్యాయని సీపీఎం నేతలు మండిపడ్డారు. చంద్రబాబు కు రైతుల ఆత్మహత్యలు పట్టవా అని వారు ప్రశ్నించారు.రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతుకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం ఎందుకివ్వలేదో చెప్పాలని నిలదీశారు.వైఎస్సార్ వాహనమిత్ర ఇవ్వకపోవడం వల్ల ఆటో,ట్యాక్సీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: Andhra Pradesh: ఆందోళనలతో అట్టుడికిన రాష్ట్రం -
చేతిలో సంచి.. అందులో కత్తి.. పుట్టపర్తి కలెక్టరేట్‌కు మహిళ!
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా): అచ్చం ఫ్యాక్షన్ సినిమా మాదిరిగానే ఉంది తాజా ఘటన. చేతిలో సంచి.. అందులో కత్తి పెట్టుకుని ఒక మహిళ ప్రభుత్వ కార్యాలయానికి రావడం ఫ్యాక్షన్ సినిమాను తలపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పుట్టపర్తి కలెక్టరేట్‌కు ఓ మహిళ కత్తితో రావడం తీవ్ర కలకలం రేపింది. చేతిలో సంచి పట్టుకుని అందులో కొన్ని డాక్యుమెంట్స్‌తో పాటు కత్తిని తీసుకుని కలెక్టరేట్‌కు రావడం చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా తనకున్న భూ సమస్యతో ఆమె కలెక్టరేట్‌కు వచ్చారు. అయితే తన భూ సమస్యకు సంబంధించి డాక్యుమెంట్స్ ను సంచిలో తీసుకొచ్చింది ప్రేమలత అనే మహిళ.అయితే సంచిలో కత్తి కూడా ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. కలెక్టరేట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కర్నీ తనిఖీలు చేసే క్రమంలో ఆమెను కూడా తనిఖీ చేయగా కత్తి బయటపడింది. దాంతో అక్కడున్న పోలీస్ సెక్యూరిటీ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది. అసలు ఆమెను కత్తిని ఎందుకు తీసుకొచ్చావ్ అని ప్రశ్నించగా, ఆత్మరక్షణ కోసం అంటూ సమాధానమిచ్చింది. దాంట్లో ఎంత వరకూ వాస్తవం ఉందని పదే పదే ప్రశ్నించిన పోలీసులు.. ఆమెను విడిచిపెట్టి కత్తిని మాత్రం స్వాధీనం చేసుకున్నారు. -
అర్జీలన్నీ అట్టపెట్టెల్లోకే..!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద బాధితుల అర్జీల పరంపర శుక్రవారం కూడా అనేక ఇక్కట్ల మద్య కొనసాగింది. కలెక్టరేట్‌కు వేలాదిగా బాధితులు శుక్రవారం కూడా అర్జీలతో చేరుకున్నారు. మధ్యాహ్నం వరకూ వీరెవర్నీ కలెక్టరేట్‌లోకి అనుమతించలేదు. రోజూలాగే మండుటెండలో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లపై, మురుగుకాల్వగట్లపై అవస్థలు పడ్డారు. దీంతో మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకోవడంతో అధికారులు చేసేదిలేక హడావుడిగా బాధితులను లోపలికి అనుమతించారు. అయితే, శుక్రవారం కౌంటర్లలో అర్జీలు తీసుకోబోమని తెగేసి చెప్పారు. అట్టపెట్టెలు ఏర్పాటుచేసి ఎవరికి వారు తమ అర్జీలను అందులో పడేసి వెళ్లిపోవాలన్నారు. మరోవైపు.. అప్పటివరకూ ఎండనపడి వచ్చిన బాధితులు చెట్ల నీడలో సేదతీరుతుండగా పోలీసులొచ్చి వారిని కనికరం లేకుండా తరిమేశారు. తమతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని వారంతా మండిపడుతూ.. సర్కారుకు శాపనార్ధాలు పెడుతూ వారంతా ఉసూరుమంటూ బయటకొచ్చారు. -
డిక్లరేషన్ కోసం ఢీ
జగిత్యాల టౌన్: జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం రైతులు వివిధ డిమాండ్లతో ఆందోళనకు దిగారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ప్రకటించిన విధంగా షరతుల్లే కుండా రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మద్దతు ధర, బోనస్, మూతపడిన చక్కర ఫ్యాక్టరీని తెరిపించాలన్న డిమా ండ్లతో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. జిల్లా నలు మూలల నుంచి వేలాదిమంది రైతులు తరలిరాగా.. నిజా మాబాద్ రోడ్డులోని మార్కెట్ యార్డు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్, పటేల్‌చౌక్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు.దాదాపు 4 గంటల పాటు ఆందో ళన నిర్వహించారు. కథలాపూర్‌కు చెందిన ఒక రైతు సొమ్మ సిల్లి పడిపోవడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని కలె క్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించి న కలెక్టర్ సత్యప్రసాద్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.అనంతరం రైతు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రూణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్య క్రమంలో రైతు వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు మిట్టపల్లి తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి కర్నె రాజేందర్, బందెల మల్లన్న, బద్దం మహేందర్, వందలాది మంది రైతులు పాల్గొన్నారు. -
వరద సాయం అందక రెండోరోజు విజయవాడ కలెక్టరేట్‌కు పోటెత్తిన బాధితులు (ఫొటోలు)
-
సాయం అందక.. నిస్సహాయంగా
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) / విజయవాడ స్పోర్ట్స్: ‘‘ఇప్పటికి ఎనిమిది సార్లు అర్జీలు ఇచ్చా.. సచివాలయాల చుట్టూ తిరుగుతున్నాం.. ఇంకెక్కడికని తిరగాలి..? ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నీళ్ల నుంచి బయటపడ్డాం. సర్వం కోల్పోయాం. మాకు నష్ట పరిహారం రాలేదు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వక పోవడం ఏమిటి..? ఈ వయసులో పడుతూలేస్తూ కలెక్టరేట్‌కు వచ్చాం. ఇదేం ఖర్మ..? రోగాలతో ఆసుపత్రుల పాలవుతున్నాం. ఆయన (సీఎం చంద్రబాబు) వచ్చి న్యాయం చేయాలి కదా..?’’ విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన వరద బాధితురాలు నక్కా రమాదేవి కన్నీటి వేదన ఇదీ! సరిగ్గా నెల క్రితం బుడమేరు వరద నగరంపై విరుచుకుపడింది. జీవిత కాలం కష్టార్జితం అంతా నీటి పాలైంది. పది రోజులకుపైగా వరద, బురదలోనే బాధితులు మగ్గారు. కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో నివ్వెరపోతున్నారు. పొంతన లేని విధంగా సర్వే వివరాలున్నాయి. కొందరి పేర్లు జాబితాలో ఉన్నా పరిహారం అందలేదు. సచివాలయాలకు వెళ్లి అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయమంటున్నారని, ఎమ్మెల్యే కార్యాలయంలోనూ అర్జీలు అందచేసినా కనీస స్పందన లేదని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మండిపడ్డ బాధితులు సోమవారం విజయవాడ కలెక్టరేట్‌కు పోటెత్తారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, ఒంటరి మహిళలు, బాలింతలు చంటి బిడ్డలను చంకనేసుకుని వేల సంఖ్యలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వరద నీటిలో చంటి బిడ్డలను పెట్టుకుని పది రోజులు గడిపామని.. కనీసం పిల్లల ముఖాలు చూసైనా పరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నారు.చివరి రోజు కావడంతో..బాధితుల ఖాతాల్లో పరిహారం జమ చేస్తామని సెప్టెంబర్ 25న ప్రభుత్వం ప్రకటించింది. 30వతేదీ లోగా బాధితులందరి ఖాతాల్లో నగదు జమ అవుతుందని పేర్కొంది. అయితే గడువు ముగుస్తున్నా తమ ఖాతాల్లో డబ్బులు పడకపోవడం.. సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌కు వస్తున్నారని ప్రచారం జరగడంతో బాధితులంతా కలెక్టరేట్‌కు పోటెత్తారు. ఉదయం 9 గంటలకు పెద్ద ఎత్తున చేరుకుని పడిగాపులు కాసినా సీఎం చంద్రబాబు రాలేదు. చివరి రోజు కావడంతో దరఖాస్తుల కోసం బాధితులు పరుగులు తీశారు. ఓవైపు మండే ఎండ.. మరోవైపు కనీస సౌకర్యాల లేక వృద్ధులు, బాలింతలు, దివ్యాంగులు, గర్భిణులు నానా ఆగచాట్లు పడ్డారు.జాబితాలో చిత్ర విచిత్రాలు..‘‘ప్రియమైన పైడి సాయిదీపక్...! మీ బ్యాంకు ఖాతా ఆధార్ నంబరుతో లింక్ కాకపోవడం వల్ల వరద నష్ట పరిహారం ఖాతాలో జమ కాలేదు. వెంటనే మీ బ్యాంకు అధికారులను సంప్రదించి ఖాతాను ఆధార్‌తో లింకు చేసుకోవాలి..!’’ ఓ బాధితుడి మొబైల్‌కు ప్రభుత్వం పంపిన సందేశం ఇదీ! చిత్రమేమిటంటే సాయిదీపక్ వయసు 8 ఏళ్లు. ఆ చిన్నారికి బ్యాంకులో ఖాతా లేదు. ఇక ఆధార్ లింక్ అయ్యే అవకాశమే లేదు. నష్ట పరిహారం జాబితాలో తప్పులు దొర్లాయనేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనమని దీపక్ తండ్రి వాపోయాడు. ఇలాంటి సందేశమే ఐదేళ్ల మరో బాలికకు కూడా వచ్చింది.పొంతన లేని లెక్కలు..ప్రభుత్వం 90 శాతం మందికి నష్ట పరిహారం అందజేసినట్లు ప్రకటించింది. మిగిలిన 10 శాతం మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సమస్యలున్నట్లు తేల్చింది. అయితే ప్రభుత్వం చెబుతున్న వివరాలు కాకి లెక్కలేనని స్పష్టమవుతోంది. కలెక్టరేట్‌కు వచ్చిన బాధితుల్లో ఏ ఒక్కరినీ కదిలించినా తమకు పరిహారం అందలేదని.. ప్రభుత్వం నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో పేర్లు ఉన్నా.. బ్యాంకు ఖాతా వివరాలు సరిగానే ఉన్నా.. పరిహారం అందలేదని చెబుతున్నారు.జగన్ ప్రభుత్వమే ఉంటే..కలెక్టరేట్‌కు వచ్చిన పలువురు బాధితులు గత ప్రభుత్వ పాలన, వలంటీర్ల సేవలను గుర్తు చేసుకుని చర్చించుకోవడం కనిపించింది. ‘‘కరోనా లాంటి విపత్తులోనూ ఇంటింటికీ తిరిగి సేవలందించారు. ఏరోజూ మాకు ప్రభుత్వ సాయం అందలేదని రోడ్డెక్కలేదు. ఇప్పుడు వరదల్లో సర్వం కోల్పోయి పరిహారం కోసం కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తోంది. అదే వైఎస్ జగన్ ప్రభుత్వమే ఉండి ఉంటే మాకీ దుస్థితి వచ్చేది కాదు. పారదర్శకంగా అందరికీ సాయం అందేది..’’ అంటూ మహిళలు పెద్ద ఎత్తున చర్చించుకోవడం గమనార్హం.అమ్మకు రిక్త హస్తం..వాంబే కాలనీ హెచ్ బ్లాక్‌లో ఉంటున్నాం. నా భర్త కూలీ. వరద నష్టం అంచనా వేసేందుకు వచ్చిన అధికారులకు అన్ని వివరాలు ఇచ్చాం. జాబితాలో నా పేరుకు బదులు మా ఐదేళ్ల పాప ఉషశ్రీ పేరు వచ్చింది. పాప పేరుతో బ్యాంకు ఖాతా లేనందున డబ్బులు రాలేదు. కలెక్టరేట్లో అడుగుతుంటే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. – కురిటి సుజాత, వాంబే కాలనీగతంలో ప్రతిదీ ఇంటి వద్దే..జగన్ ప్రభుత్వమే ఉంటే కష్ట కాలంలో మాకు అండగా నిలిచేది. ఆఫీసుల చుట్టూ తిరగకుండా గతంలో ప్రతిదీ ఇంటి వద్దే అందజేశారు. కరోనా లాంటి కష్టంలోనూ ఇబ్బందులు పడనివ్వలేదు. వలంటీర్ల ద్వారా అన్నీ అందించారు. ఇవాళ ఈ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది. కాళ్లు అరిగేలా సచివాలయాలు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాం. ఈ ప్రభుత్వం పెడుతున్న కష్టాలు చూస్తుంటే.. జగనన్న ప్రభుత్వం ఉంటే బాగుండేదని అనిపిస్తోంది. – పాముల పద్మ, వాంబే కాలనీఇదిగో.. అదిగో అంటున్నారుప్రకాష్ నగర్లో అద్దెకు ఉంటున్నా. వరదతో ఇంట్లో సామాన్లు మొత్తం పోయాయి. అధికారులు ఇంటికి వచ్చి రాసుకుని ఫోటోలు తీసుకున్నా డబ్బులు పడలేదు. సచివాలయం చుట్టూ ఇప్పటికి పది సార్లు తిరిగాను. ఇదిగో పడతాయి.. అదిగో పడతాయని ఆశ పెట్టి రోజూ తిప్పుకుంటున్నారు. కలెక్టరేట్లో అర్జీ ఇద్దామని వచ్చా. – షేక్ ఫాతిమా, ప్రకాష్నగర్ఏ ఒక్కరూ పట్టించుకోలేదు..కూలీ పనులు చేసుకుని బతికే వాళ్లం. కనీసం సొంత ఇల్లు లేదు. వాంబే కాలనీలో అద్దెకు ఉంటున్నాం. వరద వల్ల చాలా నష్టపోయాం. అపరిశుభ్రతతో పిల్లలు జ్వరాల బారిన పడ్డారు. పూట గడవని పరిస్థితిలో ఉన్నాం. ఆదుకోవాలని నాయకుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. మాలాంటి వాళ్లకు సాయం అందకుండా చేశారు. కాస్తయినా కనికరించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. – ఏల్చూరు సతీష్, మల్లీశ్వరి దంపతులుకాళ్లు అరిగేలా తిరిగా..పరిహారం కోసం సచివాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగా. ఇదిగో అదిగో అంటూ రోజుకు నాలుగైదు సార్లు తిప్పారు. ఈ రోజు ఆఖరు తేదీ కావడంతో కలెక్టరేట్లో అర్జీ ఇచ్చేందుకు వచ్చా. సచివాలయంలో ఇప్పటికి పది అర్జీలు ఇచ్చా. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – వెంకాయమ్మ, పైపుల రోడ్డుఈ ఫొటోలో కనిపిస్తున్న వై.సీతకు కళ్లు కనిపించవు. ఆమె భర్త కూడా అంధుడే. గత ఆగస్టు 25న ఇందిరా నాయక్‌నగర్ కాలనీలోని కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేశారు. 30వతేదీన ఆ ఇంటిని వరద ముంచెత్తింది. ఇద్దరు పిల్లలతో కలసి మూడు రోజుల పిల్లలతో పాటు నీళ్లలోనే గడిపారు. చుట్టుపక్కల వారి సాయంతో ఎట్టకేలకు బయట పడ్డారు. పది రోజులు నీళ్లలో నానడంతో ఇంట్లో వస్తువులన్నీ పాడయ్యాయి. కొత్త ఇంటికి డోర్ నెంబర్ లేదని పరిహారం ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి ఇంటి డాక్యుమెంట్స్ సమర్పించినా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో అర్జీ ఇచ్చేందుకు భర్తతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చారు. -
భార్యను స్వదేశానికి తీసుకురావాలంటూ వేడుకోలు
అమలాపురం రూరల్: బెహ్రయిన్‌లో తన భార్య ఇబ్బందులు పడుతోందని, స్వదేశానికి తీసుకురావాలంటూ ఓ వ్యక్తి కలెక్టర్‌ను వేడుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం నడిపూడికి చెందిన దుక్కిపాటి పావని ఓ ఏజెంట్ ద్వారా గత నెల 25న బెహ్రయిన్లోని ఓ ఇంట్లో పని నిమిత్తం వెళ్లింది. అక్కడ అనేక అవస్థలు పడుతున్నట్లు ఆమె ఫోన్లో ఆడియో రికార్డింగ్ ద్వారా కుటుంబ సభ్యులకు సందేశం పంపింది. అక్కడికి వెళ్లినప్పటి నుంచి తిండి, నీరు లేక అలమటిస్తున్నానని ఆమె పేర్కొంది. తన ఆరోగ్యం క్షీణించిందని తనను ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావాలని పావని వేడుకుంది. ఈ మేరకు భార్య ఆడియో రికార్డింగ్‌తో భర్త దుర్గాప్రసాద్, ఇద్దరు పిల్లలతో వచ్చి సోమవారం అమలాపురం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ మహేష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తన భార్యను ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకురావాలని కలెక్టర్‌ను కోరారు. -
కలెక్టర్, పీవో అడవిబాట
దుమ్ముగూడెం: ఇద్దరు ఐఏఎస్‌లు.. వారిలో ఒకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జితేష్ వి.పాటిల్, మరొకరు భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్. పోడు సాగు అంశంపై హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు సూచనలతో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అడవిబాట పట్టారు. వాహనాలు వెళ్లే మార్గం లేకపోవడంతో రానుపోను 10కి.మీ. నడిచారు. సమస్య ఏంటంటే...భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం గౌరారం అటవీ రేంజ్ పరిధిలో పలువురు రైతులకు కొన్నాళ్ల క్రితం పోడు పట్టాలు అందాయి. అయితే, ఈ భూమిలో అటవీ అధికారులు తమను సాగు చేసుకోనివ్వడం లేదని, పంటలను ధ్వంసం చేస్తున్నారంటూ 23మంది గిరిజన రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న కోర్టు సూచనలతో కలెక్టర్ పాటిల్, పీవో రాహుల్ మంగళవారం అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దుమ్ముగూడెం మండలంలోని ములకనాపల్లి ప్రధానరహదారి వరకు మాత్రమే రహదారి ఉండడంతో వాహనాల్లో వెళ్లారు.అక్కడినుంచి దట్టమైన అడవిలో రెవెన్యూ, అటవీ అధికారులతో కలిసి కాలిబాటన వాగులు, వంకలు దాటుతూ గౌరారం వరకు 5 కి.మీ. వెళ్లి సమస్యపై రైతులు, అటవీ అధికారులతో మాట్లాడారు. అడవిని నరికారని అధికారులు వివరించారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించగా, ఫారెస్ట్ భూమిని కొందరు ఆక్రమించినట్టు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ పాటిల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ హక్కు పత్రాల్లో ఉన్నంత మేరకు భూమి సాగు చేసుకోవాలని సూచించారు. మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న సమయాన అటవీ ప్రాంతంలో ఇద్దరు ఐఏఎస్‌లు పర్యటించడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సెల్యూట్ కొట్టలేదని.. నెలరోజుల జీతం కోత
ఒంగోలు: చదువు సంస్కారాన్ని నేర్పిస్తుందంటారు.. కానీ ఆ ఉన్నతాధికారి తన హోదాను మరచి వ్యవహరించారు. కలెక్టరేట్లో ఒక ఉన్నతాధికారి కారిడార్‌లో వెళ్తుండగా మరో విభాగం కార్యాలయ అటెండర్ దాన్ని గమనించలేదు. తాను వస్తుంటే అటెండర్ లేచి సెల్యూట్ కొట్టకపోవడంతో సదరు ఉన్నతాధికారి భగ్గుమన్నారు. అటెండర్ పనిచేసే విభాగం ఉన్నతాధికారిని ఉద్దేశించి ఏకవచనంతో సంబోదిస్తూ ఎక్కడికెళ్లారంటూ హూంకరించారు. 10.40 గంటలు దాటినా ఎందుకు రాలేదంటూ మహిళా అధికారులను సంబోధించిన తీరుకు అక్కడివారు అవాక్కయ్యారు.అటెండర్‌ను చూపిస్తూ ‘‘వీడికి పనీపాటా లేదు.. వీడెందుకు ఇక్కడ.. నెలరోజుల జీతం కోత వేయండి’’ అంటూ కార్యాలయ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అయితే సదరు విభాగానికి చెందిన మహిళా అధికారిణి ఒకరు అప్పటికే అధికారిక విధుల్లో ఉండగా మరో ఉన్నతాధికారి విజయవాడలో ఆన్‌డ్యూటీలో ఉన్నారు. ఇవేమీ గమనించకుండా ఇంత పెద్ద ఎత్తున ఆగ్రహానికి కారణం ఆ ఉన్నతాధికారిని అటెండరు గుర్తించి సెల్యూట్ కొట్టకపోవడమేనన్న చర్చ నడుస్తోంది. చివరకు అక్కడకు వచ్చిన విజిటర్స్‌ను సైతం మీకు ఇక్కడేం పని అంటూ భగ్గుమన్నారు. ఈ సన్నివేశం ఇలా జరుగుతున్న సమయంలో ఆ మార్గంలో వెళుతున్న మరో విభాగపు ఉద్యోగిపైనా మండిపడ్డారు.నేను ఇక్కడ మాట్లాడుతుంటే మా మధ్యగుండా వెళతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఆ ఉద్యోగి నీళ్లు నమిలాడు. చివరకు ఆ తంతును గమనిస్తున్న మీడియా ప్రతినిధిపై కూడా ఐడీ కార్డు చూపించాలని, లేకుంటే ఇక్కడనుంచి వెళ్లాలంటూ హెచ్చరించడం కొసమెరుపు. ఇటీవల జరుగుతున్న సమావేశాలన్నింటిలో ఇదే విధంగా ఆయన దూషణలకు దిగుతున్నారంటూ ప్రభుత్వ విభాగాల్లోని పలువురు అధికారుల మధ్య చర్చ సాగుతోంది. -
'30వ తేదీన ఏముంది?' అందరికీ గుర్తుండేలా ‘స్వీప్’ హోర్డింగ్‌లు!
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసే దిశగా ప్రజలను సన్నద్ధం చేసేందు కోసం స్వీప్ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన వినూత్న ప్రచారం అందరిని ఆలోచింపజేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే తేదీని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో 30వ తేదీన ఏముంది.. అనే శీర్షికన స్థానిక కలెక్టర్‌చౌక్, ఎన్టీఆర్‌చౌక్, రిమ్స్ వంటి ప్రధాన కూడళ్లలో అధికార యంత్రాంగం భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేసింది. వీటిని చూసిన ప్రతి ఒక్కరూ ఆ తేదీన ఏముందని చర్చించుకుంటూ పోలింగ్ తేదీని గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజున తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని భావిస్తుండటంతో ఈ ప్రచారానికి స్పందన లభిస్తోంది. ఇవి కూడా చదవండి: 'కారు పార్టీ' స్టీరింగ్ ఓవైసీల చేతుల్లోనే.. : రాజా సింగ్ -
మహేశ్వరంలో ఉద్రిక్తత.. సబితా క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ యత్నం
► సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం నేతృత్వంలో బీజేపీ ధర్నా చేపట్టింది. కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాంచాలంటూ కలెక్టరేట్ ముట్టడించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ►లక్డికాపూల్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా చేపట్టింది. బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ►రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లెలగూడలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ముట్టడికి మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్‌ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ సహా బీజేపీ నాయకులు యత్నించారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కార్యాకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. క్యాంప్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ►సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ శ్రేణులు ముట్టించాయి. మంత్రి కార్యాలయంలోకి కాషాయ పార్టీ కార్యకర్తలు చొచ్చుకెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలతో తోపులాట జరిగింది. పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. సాక్షి, మెదక్: ప్రజా సమస్యలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి నేడు (శుక్రవారం) తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలో మాజీ ఎంపీ విజయశాంతి ధర్నాలో పాల్గొననున్నారు. సిద్ధిపేట జిల్లాలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొననున్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి బాబు మోహన్ ధర్నాలో కూర్చోనున్నారు. ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చలంటూ బీజేపీ పిలుపునిచ్చిన కలెక్టరేట్ ముట్టడికి వెళ్లకుండా హుజూరాబాద్‌లోనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. -
కలెక్టరేట్లకు సౌర సొబగులు
జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో సోలార్ పార్కింగ్ షెడ్ల ఏర్పాటు దిశగా తెలంగాణ రెడ్కో (రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్) అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా సోలార్ పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేయగా తాజాగా ఇతర జిల్లాల్లోనూ వాటి ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సూర్యా పేట, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ల క్యాంపస్‌లలో సోలార్ పార్కింగ్ షెడ్ల నిర్మాణం పూర్తయింది. 20న సూర్యాపేట ప్లాంటును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.– సాక్షి, హైదరాబాద్ ఖమ్మంలో 200 కేవీ సామర్థ్యంతో.. ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 200 కేవీ (కిలోవాట్ల) గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్ ప్లాంటును తెలంగాణ రెడ్కో ఏర్పాటు చేసింది. పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకొనేలా పార్కింగ్ ప్రాంత పైభాగంలో సోలార్ ప్యానల్స్‌ను అమర్చింది. ప్రస్తుతం కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో హైటెన్షన్ సర్వీస్‌లో నెలకు 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. లోటెన్షన్ సర్వీస్‌లో మరో 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్ ఖర్చవుతోంది. తాజాగా 200 కేవీ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో 24 వేల యూనిట్ల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరగనుంది.దీనివల్ల రెండు సర్వీసుల్లో కలిపి నెలకు 4–5 వేల యూనిట్ల వరకు మాత్రమే గ్రిడ్ నుంచి వినియోగించుకున్నా సరిపోనుంది. అంతమేర మాత్రమే విద్యుత్ బిల్లు చెల్లించాల్సి రానుంది. ప్రస్తుతం నెలకు రూ. 1.80 లక్షల వరకు విద్యుత్ బిల్లులను కలెక్టరేట్ కార్యాలయాలు చెల్లిస్తుండగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో 80% వరకు విద్యుత్ బిల్లు తగ్గనుంది. సోలార్ విద్యుత్ వినియోగం వల్ల ఏటా రూ. 20 లక్షల వరకు చార్జీల భారం తగ్గనుంది. ఈ లెక్కన 200 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు ఆరున్నరేళ్లలో తీరనుంది. మరో రెండు జిల్లాల్లో... రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో 100 కేవీ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్, కామారెడ్డి కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో 100 కేవీ సామర్థ్యంగల ప్లాంట్ పనులు పురోగతిలో ఉన్నాయి. మరోవైపు ఇతర కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చొరవ చూపా లని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి సూచించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి వల్ల జరిగే కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు. ప్లాంట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూడా గరిష్టంగా ఆరున్నర ఏళ్ల లో తిరిగి వస్తుందన్నారు. ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్య తను 20 ఏళ్లపాటు తెలంగాణ రెడ్కో పర్యవేక్షించనుంది. సూర్యాపేటలో 100 కేవీ సామర్థ్యంతో.. సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 100 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏటా 1.44లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా ఏటా రూ.11.23లక్షల మేర ఆదా కానున్నట్లు రెడ్కో అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అయిన వ్యయం ఐదున్నర ఏళ్లలో తీరనున్నట్లు వివరిస్తున్నారు. -
కరెంట్ ఇచ్చే పార్కింగ్ షెడ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం(ఐడీవోసీ–కలెక్టరేట్)లో మొదటగా ఖమ్మంలో సోలార్షెడ్ ఏర్పాటు చేశారు. ఐడీవోసీలో 38కిపైగా శాఖల ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుండగా వారి వాహనాల పార్కింగ్‌కు ఎలాంటి సౌకర్యం లేదు. దీంతో అధికారులు సోలార్ ప్యానళ్లతో కూడిన పార్కింగ్ షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.1.78 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు ఇప్పటికే పూర్తికాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించనున్నారు. 200 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఈ సోలార్ ప్యానళ్ల ద్వారా రోజుకు 800 నుంచి వెయ్యి యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతోంది. ఈ మొత్తాన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేసి కలెక్టరేట్ అవసరాలు పోగా మిగిలిన విద్యుత్‌కు మాత్రమే బిల్లు చెల్లించనున్నారు. సోలార్ షెడ్‌తో నెలకు సుమారు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు విద్యుత్‌చార్జీలు ఆదా కావడమే కాక ఉద్యోగులకు చెందిన వందలాది వాహనాల పార్కింగ్‌కు సౌకర్యం కల్పించినట్లవుతోంది. సోలార్ ప్లాంట్‌తో ఐడీవోసీ భవనమంతా గ్రీన్ బిల్డింగ్‌గా మారనుంది. ఈవిధంగా రాష్ట్రంలోనే తొలి కలెక్టరేట్‌గా ఖమ్మం ఐడీవోసీ నిలుస్తోంది. -
రైతు రుణమాఫీ కోసం కలెక్టరేట్ల ఎదుట బీజేపీ ఆందోళనలు
-
తీవ్ర ఉద్రిక్తత.. పేదల గుడిసెలు కూల్చివేత
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కలెక్టరేట్ సమీపంలో ప్రభుత్వ భూమిలో వెలసిన గుడిసెలను అధికారులు తొలగించారు. 255/1 సర్వే నెంబర్ లోని పదెకరాల భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తొలగింపును అడ్డుకునేందుకు పేదలు యత్నించడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో అధికారులతో గుడిసెవాసుల వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వెళ్ళిపోవాలంటూ గుడిసె వాసుల ఆందోళన చేపట్టారు. గుడిసె వాసులను బలవంతంగా పోలీసులు నెట్టివేసి గుడిసెలు తొలగించారు. కాగా అధికారులు పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు ప్రక్రియ చేపట్టడం ఇది నాలుగోసారి. -
అలా వెళ్లి.. కుడి వైపు తిరగండి!
ఖమ్మం: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఏ విభాగం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఇబ్బంది పడకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఏ అంతస్తులో ఏ శాఖ ఉంది, ఎలా వెళ్లాలనేది బోర్డుల్లో పేర్కొన్నారు. కింది అంతస్తుల్లో ప్రతీ అంతస్తులోని విభాగాల వివరాలతో బోర్డు ఏర్పాటుచేయగా.. అన్ని అంతస్తుల్లో అక్కడి విభాగాల వివరాలు పొందుపర్చిన బోర్డులు ఏర్పాటుచేశారు. అలాగే, కలెక్టరేట్ రాగానే సమావేశ మందిరానికి వెళ్లే వైపు ఇన్‌వార్డు, ధరణి విచారణ కేంద్రానికి బోర్డులు పెట్టారు. ఇక ప్రభుత్వ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు, ఫొటోలను టీవీల్లో ప్రదర్శిస్తున్నారు. -
‘ధరణి’ని కాదు.. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేయాలి: సీఎం కేసీఆర్
సాక్షి, నిర్మల్: ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ అవాకులు చవాకులు పేలుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని.. ధరణి పోర్ట్‌లను బంగాళాఖాతంలో వేస్తామన్న దుర్మార్గులను బంగాళా ఖాతంలో పడేయాలని ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం ఎల్లపెల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరుపై ధ్వజమెత్తారు. ధరణి ఉండలా, వద్దా? ధరణి తీసేస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు ఎలా పడతాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వం బ్యాంకులో వేస్తే.. బ్యాంకు నుంచి మీకు మెస్సేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. రైతు చనిపోతే ఏవిధంగా రైతు బీమా వస్తుందని నిలదీశారు. అందుకే ధరణి పోర్టల్ ఉండలా, వద్దా మీరే చెప్పండంటూ ప్రజలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. గతంలో రెవెన్యూ శాఖలో భయంకరమైన దోపిడీ జరిగేదని ఎవరి భూమి ఎవరి చేతుల్లో ఉండేదో తెలిసేది కాదన్నారు. నిన్న ఉన్న భూమి తెల్లవారే సరికి పహనీలు మారిపోయేవన్నారు. వరాల జల్లు నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకు భారీగా నిధులు మంజూరు చేశారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయితీలకు రూ 10 లక్షలు ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ఇవి కాకుండా నిర్మల్ జిల్లాలో 19 మండల కేంద్రాలకు రూ. 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. చదవండి: నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ నిర్మల్‌కు ఇంజనీరింగ్ కళాశాల బాసరా సరస్వతి దేవాలయాన్ని పెద్దగా అభివృద్ధి చేసుకుందామని, అద్భుత ఆలయం నిర్మించుకుందామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఓ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తున్నట్లు పేర్కన్నారు. ఒకనాడు మారుమూల జిల్లా, అడవి జిల్లా అని పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని కొత్తగా మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయి. 8న చెరువుల పండగ ‘కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రాంరాం చెబతారు. కాంగ్రెస్ పాలన మనం చూడలేదా. ధరణి పోర్టల్‌ను తీసేస్తే మళ్లీ ఎన్ని రోజులు తిరగాలి. మనకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. రైతు బంధు, దళిత బంధు రాంరాం అనే వాళ్లు కావాలా? ఒకప్పుడు కరెంట్ ఎప్పుడ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు. ఇప్పుడు రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్. సాగు, తాగు నీరుసమస్య తీర్చుకున్నాం. ఈనెల 8న చెరువుల పండగ జరుపుకోవాలి. దేశంలోనూ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ రావాలి ఫుడ్ ప్రాసెసింగ్‌పై ఫోకస్ మహారాష్ట్ర రైతులు మన దగ్గర అర ఎకరం కొని వాళ్ల పొలాలకు నీళ్లు తీసుకెళ్తున్నారు. మహారాష్ట్రలో కూడా కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుతున్నారు. అధికారానికి దూరమైన వాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారు. త్వరలోనే ఎస్ఆర్ఎస్పీ ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లు అందిస్తాం. ఎన్నికల తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్‌పై ఫోకస్ పెడతాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రం ఇలాగే సుభిక్షంగా ఉండాలంటే మీ ఆశీస్సులు కావాలి. -
మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న టెన్షన్
-
ప్రజావాణి: ఈ మహిళ పేరు స్వప్న.. తాగడానికి నీరు దొరకలేదు
ఈ మహిళ పేరు స్వప్న. వెల్గటూర్ మండలం ముంజంపల్లి స్వగ్రామం. ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లోని ప్రజావాణి వేదిక వద్దకు చేరుకుంది. తాగడానికి సమీపంలో ఎక్కడా నీరు దొరకలేదు. దాహంతో తపించిపోయింది. జగిత్యాల: అసలే ఎండాకాలం. ఎండలు మండిపోతున్నాయి. దాహం కోసం ప్రజలు తపిస్తున్నారు. అయినా, కలెక్టరేట్లో సోమవారం చేపట్టిన ప్రజావాణిలో కనీస సౌకర్యాలు కల్పించలేదు. కలెక్టరేట్ మొత్తంగా పచ్చదనం పర్చుకుని, ఆహ్లాద వాతావరణం పంచుతూ ఉన్నా.. మౌలిక వసతులు లేవు. దీంతో ప్రజావాణికి హాజరైన అభాగ్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్టాండ్ నుంచి దాదాపు కి.మీ. దూరం కలెక్టరేట్ ఉంది. అక్కడిదాకా ఆటోలు, ప్రైవేట్ వాహనాలు తప్ప ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. అధిక వ్యయ ప్రయాసలకోర్చి ప్రజావాణికి చేరుకున్నా తాగేందుకు చుక్కనీరు లభించని పరిస్థితి నెలకొంది. సమస్యలు పరిష్కరించండి ప్రజావాణి ద్వారా స్వీకరించే అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. ప్రజా వాణి ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభాగ్యుల నుంచి 54 ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. అడిషనల్ కలెక్టర్ లత, అధికారులు పాల్గొన్నారు. ధాన్యం తూకంలో మోసాలు.. ధాన్యం తూకంలో మోసాలు చోటుచేసుకుంటున్నాయని, కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. ప్రజావాణిలో వారు ఒక వినతిపత్రం అందజేశారు. ఒక్కో కొనుగోలు కేంద్రంలో ఒక్కో విధంగా ధాన్యం తూకం వేస్తున్నారని ఆరోపించారు. మిల్లుకు చేరాక ధాన్యంలో మళ్లీ కోత విధిస్తున్నారని వారు ఆరోపించారు. ఇలాంటి మోసాలను అరికట్టి, కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి, మోహన్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, జలేందర్, కంచర్ల అఖిల్, రాకేశ్, తిరుపతిరెడ్డి, రాజు పాల్గొన్నారు. రైతులను ఆదుకోండి ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు, రైస్‌మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని, అన్నదాతలను ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు జరుగుతున్న నష్టాలపై వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా నిర్వాహకులు కొనుగోలు చేయడంలేదని ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్‌కుమార్, మ హిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సిరాజొదీ్దన్ మన్సూర్, నాయకుడు వాకాటి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చాలని ‘కలెక్టరేట్’ ఎక్కిన రైతులు
సిద్దిపేట రూరల్: సిద్దిపేట కలెక్టరేట్, కమిషనరేట్ల నిర్మాణంలో భాగంగా భూములు ఇచ్చిన రైతులు తమకు ప్రభుత్వం చేసిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చాలని కోరుతూ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన సుమారు 100 మంది బాధిత రైతులు తమ గోడును విన్నవించేందుకు ప్రజావాణికి వచ్చారు. అయితే బాధితులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. వారితో మాట్లాడి గొడవ కాకుండా సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమను లోపలికి అనుమతించకపోవడంతో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తామని చెప్పిన రైతులు, ఒక్కసారిగా కార్యాలయ భవనంపైకి ఎక్కి న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని భవనంపైనుంచి కిందకి తీసుకువచ్చారు. అనంతరం బాధిత రైతులు మాట్లాడుతూ కొండపాక మండలం దుద్దెడ, రాంపల్లి గ్రామాలకు చెందిన 663, 143 సర్వే నంబర్లలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 165 మంది రైతులకు 365 ఎకరాల భూమిని పంపిణీ చేసిందన్నారు. ఐదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తం భూమిని సిద్దిపేట కలెక్టరేట్, కమిషనరేట్ నిర్మాణానికి సేకరించిందని, భూమికి నష్టపరిహారంగా రూ. 20 లక్షలు, కలెక్టరేట్ వద్ద 200 గజాల ఇంటి స్థలం అందిస్తామని అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి హామీ ఇచ్చారని వెల్లడించారు. తమలో కొంతమందికి డబ్బులు ఇచ్చి.. ఇంటిస్థలం పట్టా సర్టిఫికెట్ మాత్రం ఇచ్చారని, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం చేయడంలేదని చెప్పారు. ఈ విషయంపై ఎన్నోసార్లు కలెక్టర్‌కు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదని, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసినా అధికారుల్లో మార్పు రాలేదని విచారం వ్యక్తంచేశారు. అనంతరం రైతులను ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి వద్దకు అనుమతించగా బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్.. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వారంలోపు సమావేశం నిర్వహించి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. బాధితులు బయటకు వచ్చాక భవనంపైకి ఎక్కిన ఘటనలో పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
నిరసనలు, ముట్టడి ఇకపై కష్టమే!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎదురైన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో రూ.1,581.62 కోట్లతో 26 కొత్త సమీకృత జిల్లా కలెక్టరేట్, కార్యాలయాల భవన సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అన్ని కలెక్టరేట్లకు ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచి నివేదికల ఆధారంగా భద్రత చర్యలు చేపడుతున్నారు. ప్రధాన ద్వారం ఎదు రుగా, ప్రహరీపైన, చుట్టూ ప్రత్యేక ఇనుప ముళ్లకంచెలను అధికారులు ఏర్పాటు చేస్తుండడంతో సమై క్యాంధ్రలో తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కార్యాలయంలోనూ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నిరసనలను అడ్డుకునేందుకేనా..? ప్రభుత్వ విధానాలపై కొన్ని వర్గాల ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవడం సర్వసాధారణం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలనో, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలనో, ఏకపక్షంగా ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలనో బాధితులు కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలకు పాల్పడుతుంటారు. ఒక్కోసారి కలెక్టరేట్‌ను ముట్టడించి.. లోపలికి చొరబడి సమస్య తీవ్రతను చాటి చెప్పాలనుకుంటారు. దీంతో ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టేందుకు హనుమకొండ, జనగామలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎత్తయిన ప్రత్యేక ఇనుప కంచెలను నిర్మిస్తుండడం ప్రతిపక్షాలు, ఆందోళనకారుల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కలెక్టర్ కార్యాలయాలకు ఇనుప ముళ్లకంచెలు.. మూడంచెల భద్రత జనవరి 5న మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనమయ్యే గ్రామాల రైతులు తమ కుటుంబ సభ్యులతో సహా భారీ ఎత్తున తరలివచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. వారంతా కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయతి్నంచడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. నిజామాబాద్ కలెక్టరేట్లో జనవరి 30న నందిపేట గ్రామ సర్పంచ్ సాంబారు వాణి, ఆమె భర్త తిరుపతితో కలసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. బిల్లులపై ఉప సర్పంచ్సంతకాలు పెట్టడంలేదని, దీనితో రూ.2 కోట్లకుపైగా ఆగిపోయాయని వారు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం కలెక్టరేట్లో కలకలం రేపింది. ఫిబ్రవరి 13న జనగామ కలెక్టరేట్ భవనం పైకెక్కి నిమ్మల నర్సింగరావు, ఆయన భార్య ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యతి్నంచారు. జనగామ మండలం పసరమడ్లకు చెందిన ఈ దంపతులు.. తమ భూమిని తహసీల్దార్ ఇతరులకు అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ ఈ ఘాతుకానికి ఒడిగట్టగా, పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. -
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో సిబ్బంది నిర్లక్ష్యం
-
చిత్తూరు కలెక్టరేట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్
-
సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం
సుభాష్‌నగర్ (నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ జిల్లా నందిపేట్ సర్పంచ్ సాంబారు వాణి, ఆమె భర్త తిరుపతి సోమవారం కలెక్టరేట్లో ఆత్మహత్యకు యత్నించారు. బిల్లుల(ఎంబీల)పై ఉప సర్పంచ్ సంతకాలు పెట్టడంలేదని, దీనితో రూ.2 కోట్ల కుపైగా ఆగిపోయాయంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. సమీపంలో ఉన్నవారు వెంటనే దంపతుల నుంచి అగ్గిపెట్టెను లాక్కొని విసిరేశారు. బీజేపీ మద్దతుతో వాణి సర్పంచ్‌గా గెలుపొందడంతో సాకులు చూపి వేధింపులకు గురి చేస్తున్నారని, పంచాయతీ నిధులు మింగేశామని ఆరోపిస్తూ సస్పెండ్ చేశారని తిరుపతి కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ మారినా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బిల్లులు, చెక్ పవర్ ఇప్పించ లేకపోయారని పేర్కొన్నారు. బిల్లులు రాక గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టలేక ప్రజలకు ముఖం చాటేయాల్సి వస్తోందన్నారు. వడ్డీ సహా మొత్తం రూ.4 కోట్ల వరకు అప్పులు అయ్యాయని.. ఈ దిగులుతో తన భార్య, సర్పంచ్ వాణి ఆస్పత్రి పాలైందన్నారు. అయితే కలెక్టర్ వచ్చే వరకూ కలెక్టరేట్ నుంచి కదిలేది లేదంటూ వాణి, తిరుపతి అక్కడే బైఠాయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీపీవో జయసుధ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. ఉప సర్పంచ్ సంతకాలు పెట్టకపోవడంపై విచారణ చేపడతామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
వాళ్లు చెప్పినట్టు వింటే.. తాలిబన్ రాజ్యమే
దేశాన్ని రక్షించేందుకు తెలంగాణ బిడ్డలు ముందుకు రావాలి ప్రజలు అభివృద్ధి వైపు సాగాలంటే సమాజంలో శాంతి, సహనం అవసరం. మతపిచి్చ, కులపిచ్చి పెంచి విద్వేషాలు రెచ్చగొడితే దేశం తిరోగమనం వైపు పయనిస్తుంది. మేధావులు, యువత దీనిపై ఆలోచన చేయాలి. మన చుట్టూ ఏం జరుగుతోందో పరిశీలన చేయాలి. మనం బాగున్నాం కదా, పొరుగింటోళ్లు ఏమైపోతే ఏమిటని అనుకుంటే, ఓ రోజు మనకూ ప్రమాదం వస్తుంది. అందువల్ల ఉద్యమ పంథా, పోరాట రక్తమున్న తెలంగాణ బిడ్డలు ఈ దేశాన్ని రక్షించడానికి ముందుకు రావాలి. – సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి, మహబూబాబాద్/భద్రాద్రి కొత్తగూడెం: ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. వారి ప్రయత్నాలు ఫలిస్తే రాష్ట్రంలో అశాంతి పెరిగిపోతుంది. సమాజం మరో తాలిబన్లా మారిపోతుంది. ఇక్కడికి పెట్టుబడులు రావు. ఉద్యోగాలు, ఉపాధి లభించవు. మన చుట్టూ జరుగుతున్న విద్వేష రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోవాలి. దీనిపై సమాజంలో చర్చ జరగాలి..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. గురువారం మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నూతన కలెక్టరేట్లను, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆయా చోట్ల కలెక్టర్లను వారి చాంబర్లలోని కుర్చీల్లో కూర్చోబెట్టి అభినందించారు. తర్వాత రెండు చోట్ల నిర్వహించిన సభల్లో ప్రసంగించారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవు. దేశానికే మార్గదర్శకంగా నిలిచాం. దీనికి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. రెండు రోజులు చెప్పినా అవి ఒడవవు. తెలంగాణలో గతంలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇప్పుడు 33 జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ధైర్యం చేసి తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం. ప్రజలు సంక్షేమ పథకాల జాతరను అనుభవిస్తున్నారు. గతంలో 600 ఫీట్లు బోరు వేసినా నీరు ఉండేది కాదు. ప్రస్తుతం సమృద్ధిగా నీరు,కరెంట్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి జిల్లాలో ప్రజలకు, ఉద్యోగులకు సౌకర్యంగా ఉండేలా సమీకృత కలెక్టరేట్లను నిర్మించుకుంటున్నాం. ఇతర రాష్ట్రాల్లో మంత్రుల చాంబర్ కంటే తెలంగాణలో కలెక్టర్ చాంబర్ అద్భుతంగా ఉందని పంజాబ్ మంత్రి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్ర అసమర్థత వల్లే తగ్గిన ఆదాయం తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.5లక్షల కోట్లు ఉండేది. ఇప్పుడు రూ.11.54 లక్షల కోట్లకు చేరింది. మనస్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేసి ఉంటే రాష్ట్ర జీఎస్డీపీ రూ.14.5 లక్షల కోట్లకు చేరేది. కేంద్ర అసమర్థ పనితీరు వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రానికే దాదాపు రూ.3 లక్షల కోట్ల నష్టం జరిగింది. అన్ని రాష్ట్రాలను కలిపితే ఈ నష్టం మరెంతో ఉంటుంది. జల వివాదాలు తీర్చడం లేదు దేశవ్యాప్తంగా నదుల్లో సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్నా.. రైతుల పొలాల వద్దకు రావు. కృష్ణానదిపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ 19 ఏళ్లు గడిచినా తీర్పు ఇవ్వలేదు. మనం మొండి పట్టుదలతో తెగించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నాం. నీటి సమస్య లేకుండా చేసుకున్నాం. దేశంలో సమృద్ధిగా నీటి వనరులున్నా నదులపై ఉన్న వివాదాలను తేల్చకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం తాగునీటి సమస్య తీరలేదు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తాగునీటి ఎద్దడి ఇంకా ఉండటం ఏమిటి? 10 రోజులకోసారి నీళ్లు సరఫరా చేసే దుస్థితికి కారణాలేమిటి? ఇప్పటివరకు కేంద్రాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్‌ల అసమర్థత, తప్పుడు విధానాల ఫలితమే ఇది...’’ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బిజీ బిజీగా కార్యక్రమాలు సీఎం కేసీఆర్ తొలుత హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబాబాద్‌కు చేరుకున్నారు. అక్కడ నూతన కలెక్టరేట్‌ను, జిల్లా గ్రంధాలయాన్ని, బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ సమీపంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. తర్వాత హెలికాప్టర్ ద్వారా కొత్తగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్.. తొలుత కొత్తగూడెం–పాల్వంచ మధ్యలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అక్కడే నిర్వహించిన సభలో మాట్లాడారు. తర్వాత రోడ్డు మార్గంలో కొత్తగూడెం వెళ్లి బీఆర్ఎస్ జిల్లా ఆఫీసును ప్రారంభించారు. అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట మంత్రులు సత్యవతిరాథోడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్, బానోతు హరిప్రియ, చల్లా ధర్మారెడ్డి, యాదగిరిరెడ్డి, టి.రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నూకల రాంచంద్రారెడ్డి విగ్రహాలు పెడతాం: కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన ఆదర్శ నాయకుడు నూకల రాంచంద్రారెడ్డి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. తొలి ఉద్యమ సమయంలోనే ఆయన తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. చాలామంది నాయకులకు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు గురువు అయితే.. పీవీకి గురువు నూకల రాంచంద్రారెడ్డి అన్నారు. అలాంటి నేత గురించి ఈ తరం యువతకు తెలపడం ప్రభుత్వ బాధ్యత అని.. మహబూబాబాద్, వరంగల్ పట్టణాల్లో ప్రభుత్వ ఖర్చులతో రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏదైనా ఒక ఇనిస్టిట్యూట్‌కు ఆయన పేరు పెడతామన్నారు. రెండు జిల్లాలకు వరాలు మహబూబాబాద్‌కు కొత్తగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నామని.. వచ్చే విద్యా సంవత్సరంలోనే తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక అభివృద్ధి పనుల కోసం మహబూబాబాద్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, జిల్లాలోని మిగతా 3 మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున నిధులు ఇస్తున్నట్టు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి సీఎం ప్రత్యేక నిధులనుంచి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 481 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రత్యేక నిధిని మంజూరు చేస్తున్నామని సీఎం చెప్పారు. జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలకు రూ.40 కోట్ల చొప్పున.. ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు ఇస్తున్నట్టు ప్రకటించారు. పాలనలో ఉద్యోగుల భాగస్వామ్యం పెంచుతాం: సీఎస్ శాంతికుమారి రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని, పరిపాలనా ఫలాలను ప్రజలకు చేర్చేందుకు ఉద్యోగుల భాగస్వామ్యం పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. తాను జిల్లాలో పనిచేసినప్పుడు కలెక్టర్ కార్యాలయాలు ఇరుకు గదులతో టాయిలెట్స్ కూడా సరిగాలేక ప్రజలు ఇబ్బంది పడేవారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు సమీకృత కలెక్టరేట్లు ఇంద్ర భవనాల్లా ఉన్నాయని, వీటిని చూస్తే అసూయగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అడగకుండానే వరాలిచ్చే కేసీఆర్: మంత్రి ఎర్రబెల్లి అడిగితే వరాలు ఇచ్చేవాళ్లు ఉంటారేమోగానీ.. సీఎం కేసీఆర్ మాత్రం అడగకుండానే కష్టాలను అర్థం చేసుకొని వరాలు ఇచ్చే పేదల ఆరాధ్య దైవమని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. ఇదే తరహాలో ఆయన మానుకోట ప్రజలపై చల్లని చూపు సారించాలని కోరారు. సీఎం ఆశీస్సులతో మానుకోట అభివృద్ధిలో బంగారు కోట కావాలని ఆకాంక్షించారు. -
మహబూబాబాద్‌లో సీఎం కేసీఆర్.. కొత్త కలెక్టరేట్ ప్రారంభం
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ భవనాన్ని, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కాగా, జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించగా తర్వాత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం, సీఎం కేసీఆర్.. భదాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లనున్నారు. కొత్తగూడెం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. -
మానుకోటకు సీఎం కేసీఆర్.. నిఘా పెంచిన పోలీసులు
సాక్షి, మహబూబాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నూతన జిల్లాగా ఏర్పడిన తరువాత నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంతోపాటు, సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీ శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఎం పర్యటించే ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మరమ్మతుల పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్‌లతోపాటు మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావులతో సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్, కలెక్టర్ కార్యాలయాల ప్రారంభంతోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కో–ఆర్డినేటర్లు, ఇతర ముఖ్య నాయకులు, అధికారులు మొత్తం 10వేల మందితో సీఎం సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సమావేశానికి ఎవరెవరిని ఆహ్వా నించాలి, ఏ మండలం నుంచి ఎంత మంది వస్తున్నారనే విషయంపై మంత్రులు, అధికారులు చర్చించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం మహబూబాబాద్‌లో గడపనున్నారు. అనంతరం సీఎం మహబూబాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడం జిల్లాకు వెళ్లనున్నారు. పోడు భూములకు పట్టాలిచ్చే విషయంలో జాప్యం చోటుచేసుకోవడం, గిరిజనేతరులకు పట్టాల పంపిణీ విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేకపోవడం, నారాయణపురం గ్రామంలోని కొందరు కైతులకు పట్టాలు ఇవ్వని విషయంపై ఆందోళనలు, నిరసలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు వారిపై గట్టి నిఘా పెట్టారు. -
కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్ అరెస్ట్
సాక్షి, కామారెడ్డి జిల్లా: కామారెడ్డి కలెక్టరేట్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు యత్నించారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు-పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బండి సంజయ్‌ను కామారెడ్డి పీఎస్‌కు తరలించారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో బారికేడ్లు ఎత్తిపడేశారు. బండి సంజయ్‌ను తరలిస్తున్న వాహనంపై రాళ్ల దాడి చేశారు. పోలీస్ వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆందోళనకారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు. -
కామారెడ్డిలో రైతుల ఆందోళనపై స్పందించిన కేటీఆర్
-
మనకు మనమే సాటి.. ఎవరూ లేరు పోటీ: సీఎం కేసీఆర్
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక అన్ని వర్గాలకు మేలు జరిగేలా కార్యక్రమాలు రూపొందించామని తెలిపారు. అనేక రంగాల్లో ఇప్పటికే తెలంగాణ దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. వ్యవసాయం చేస్తున్న రైతుల్లో ధీమా వచ్చేలా చేశామని కేసీఆర్ తెలిపారు. దేశానికే ఆదర్శంగా అనేక పనులుచేసి చూపించామన్నారు. గురుకుల విద్యలో మనకు మనమే సాటి, ఎవరూ లేరు పోటీ అని పేర్కొన్నారు. ఎన్నో అద్భుత విజయాలు సాధించామని, మనందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి హెలికాప్టర్ ద్వారా జగిత్యాల చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను ఎగుర వేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రమంతా గులాబీమయమైంది. ఎటు చూసినా సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ పెద్ద ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ పర్యటనతో మేడిపల్లి జగిత్యాల మధ్య భారీగా టట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జగిత్యాలలో జరిగే సీఎం సభకు బస్సులు, వాహనాల్లో భారీగా జనాలు తరలివస్తుండటంతో అయిదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. -
పింఛన్ తొలగించారని.. దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం
సాక్షి, యాదాద్రి/ కొండపాక(గజ్వేల్)/ సాక్షి, రంగారెడ్డిజిల్లా /మంచిర్యాల అగ్రికల్చర్: పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇతర పథకాలు అందడం లేదంటూ.. అధికారులు ఇబ్బందిపెడుతున్నారంటూ.. బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. తమ బాధలు చెప్పుకొనేందుకు కలెక్టరేట్లలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాలకు వస్తున్నారు. తమ సమస్య ఎప్పుడు తీరుతుందోననే మనస్తాపంతో ఆత్మహత్యా యత్నాలు చేస్తున్నారు. సోమవారం పలు జిల్లా కలెక్టరేట్లలో నలుగురు ఇలాంటి ప్రయత్నాలు చేయడం కలకలం రేపింది. పింఛన్ తొలగించారంటూ.. దివ్యాంగుడు.. యాదాద్రి భువనగిరి జిల్లా హన్మాపురం గ్రామానికి చెందిన నాగపురి యాదగిరికి ఆగస్టులో ప్రభుత్వం వికలాంగుల పింఛన్ మంజూరు చేసింది. ఒక నెల పింఛన్ తీసుకున్న యాదగిరికి తర్వాతి నెలలోనే ఆపేశారు. తాను కృత్రిమకాలుతో నడుస్తున్నానని, భార్య కూలి పనిచేసి పోషిస్తోందని, తనకు పింఛన్ పునరుద్ధరించి ఆదుకోవాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే యాదగిరి సోమవారం కలెక్టర్‌లో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పింఛన్ పునరుద్ధరించడం లేదంటూ వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోబోయాడు. ఇది గమనించిన కలెక్టర్ సీసీ సోమేశ్వర్, సిబ్బంది ఆయనను ఆపారు. ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించిన అనంతరం యాదగిరికి కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు. అయితే యాదగిరి కుమారుడికి ట్రాక్టర్ ఉండటంతో పింఛన్ తొలగించినట్టు అధికారులు చెప్తున్నారు. భూమిని తమకు కాకుండా చేస్తున్నారంటూ.. మహిళ అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లికి చెందిన బి.జయశ్రీ తండ్రి సుర్వి భిక్షపతికి ఇదే రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 67లో 1.35 ఎకరాల భూమి ఉంది. ఆయన భూమిని ముగ్గురు కుమార్తెలకు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే తమ భూమిపై రెండు రియల్ ఎస్టేట్ సంస్థలు కన్నేశాయని.. తాము విక్రయించబోమని చెప్తున్నా తహసీల్దార్ అనితారెడ్డితో కలిసి తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయని జయశ్రీ అనే మహిళా రైతు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు మార్చి కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తహసీల్దార్ అనితారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బ్లేడుతో చేతులు కోసుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు, కాంగ్రెస్ నేతలు ఆమెను అడ్డుకుని.. అదనపు కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ అంశాన్ని పరిశీలించి, న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్ తిరుపతిరావు హామీ ఇచ్చారు. దుకాణం ఖాళీ చేయాలని వేధిస్తున్నారంటూ.. యువకుడు మంచిర్యాల అగ్రికల్చర్: అద్దె దుకాణం తొలగించొద్దని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సంతోష్ సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై అతడిపై నీళ్లు పోశారు. బాధితుడి వివరాల ప్రకారం.. చెన్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని దుకాణ సముదాయంలో ఓ షటర్‌ను పదేళ్లుగా అద్దెకు తీసుకుని టైర్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణం తొలగించాలని మూడు నెలల క్రితం ఎంపీడీవో, ఎంపీపీలు షటర్‌కు తాళం వేయించారు. ఎంపీ, ఎమ్మెల్యేకు గోడు వినిపించినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నాడు. సోమవారం సాయంత్రానికి ఖాళీ చేయాలని చెప్పడంతో కలెక్టరేట్‌కు వచ్చానని తెలిపాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు నీళ్లు చల్లి అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేశారు. సంతోష్‌పై నీళ్లు పోస్తున్న పోలీసులు ఇల్లు మంజూరైన అడ్డుకుంటున్నారని ఆత్మహత్య పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో సిద్దిపేట జిల్లాలో కలకలం కొండపాక(గజ్వేల్): డబుల్ బెడ్ రూం ఇళ్ల అర్హుల జాబితాలో పేరు వచ్చాక కూడా కేటాయించకుండా అడ్డుకుంటున్నారని మనస్థాపానికి గురైన ఆటో డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కలెక్టరెట్ కార్యాలయం ఆవరణలో సోమవారం చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని గణేశ్ నగర్లో నివాసం ఉంటున్న శీలసాగరం రమేశ్ ఆటో డ్రైవర్. పట్టణ శివారులో నిర్మించిన డబుల్ ఇల్లు కోసం భార్య లత పేరిట దరఖాస్తు చేసుకున్నాడు. మూడు పర్యాయాలు లబ్ధిదారుల జాబితాలో లత పేరు వచ్చింది. అయినా ఇల్లును కేటాయించలేదు. ఈ విషయమై పలుమార్లు అధికారులను అడిగినా ఫలితం లేకుండాపోయింది. దీంతో సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అర్హుల జాబితాలో పేరు ఉన్నా.. 26వ వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ ఇల్లు రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తూ పురుగుల మందు తాగుతున్న సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలోనే కలెక్టరెట్ ఆవరణలో ఉన్న వాహనాల పార్కింగ్ వద్ద పడిపోయాడు. వెంటనే అక్కడున్న స్థానికులు 108 అంబులెన్స్ సిబ్బంది మహేందర్, శ్రీనివాస్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న రమేశ్‌ను అంబులెన్సులో సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడని అంబులెన్సు సిబ్బంది మహేందర్ తెలిపారు. మృతుడి భార్య లత ఇల్లు మంజూరైనా పట్టా ఇవ్వకుండా కౌన్సిలర్ ప్రవీణ్ అడ్డుకుంటుడటంతో డబ్బులు కూడా ఇచ్చామని ఆరోపించింది. తన భర్త మరణానికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వేడుకుంది. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ భాను ప్రకాష్ తెలిపారు. -
ప్రజావాణిలో ఆందోళనల పెట్రోల్!
గద్వాల రూరల్/ జనగామ/ జనగామరూరల్/ దురాజ్‌పల్లి (సూర్యాపేట)/ కరీంనగర్ అర్బన్: అవి జిల్లా పరిపాలనకు కీలకమైన కలెక్టరేట్లు.. జనం సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది.. ఇంతలో కలకలం.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. మరోచోట ఇంకో రైతు కలెక్టరేట్ భవనం ఎక్కి దూకేందుకు సిద్ధమయ్యాడు.. ఇంకోచోట ఓ యువతి, మరో యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. తమ చావుతోనైనా అధికారులు కళ్లుతెరుస్తారేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజున 3 జిల్లా కలెక్టరేట్లలో జరిగిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. భూమిని వేరేవారి పేరిట మార్చారంటూ ‘‘మా పెద్దల నుంచి వచ్చిన భూమిని గ్రామానికి చెందిన కొందరు కాజేశారు. దీనిపై కలెక్టర్‌కు ఎనిమిది సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. నేను చనిపోయాక అయినా కళ్లు తెరవండి..’’అంటూ జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట లోకేశ్ అనే రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకుని అగ్గిపెట్టె లాక్కున్నారు.నీళ్లు చల్లి, దుస్తులు మార్చారు. జిల్లాలోని మానవపాడు మండలం కలుకుంట్లకు చెందిన లోకేశ్‌కు వారసత్వంగా ఐదు ఎకరాల భూమి వచ్చింది. కానీ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, కొందరు అధికారులు కుమ్మక్కై ఆ వ్యక్తి పేరిట పట్టా చేశారని లోకేశ్ పేర్కొన్నారు. తహసీల్దార్‌కు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ సమయంలో కలెక్టరేట్లోనే ఉన్న మానవపాడు తహసీల్దార్ యాదగిరి వచ్చి బాధిత రైతుతో మాట్లాడారు. లోకేశ్ భూమి పొరపాటున మరొకరి పేరు మీద మారిందని.. ధరణిలో మార్చే ఆప్షన్ రాగానే భూమిని లోకేశ్ పేరిట నమోదు చేసి పాస్‌బుక్ ఇస్తామని చెప్పారు. ఎనిమిది సార్లు ఫిర్యాదు చేసినా.. తన తాత పేరిట ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తుల పేరిట అక్రమంగా పట్టా చేశారని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. నిమ్మల నర్సింగరావు అనే రైతు జనగామ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం చేశారు. జనగామ మండలం పసరమడ్లకు చెందిన నర్సింగరావు తాత నిమ్మల మైసయ్య పేరిట 8 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. కొన్నేళ్ల కింద నర్సింగరావు బతుకుదెరువు కోసం ములుగు జిల్లా ఎల్బాకకు వలస వెళ్లారు. దీన్ని అలుసుగా తీసుకుని 2017లో అప్పటి తహసీల్దార్ జె.రమేశ్, వీఆర్వో క్రాంతికుమార్, అదే గ్రామానికి చెందిన ఇద్దరు కుమ్మక్కై తమ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని నర్సింగరావు ఆరోపించారు. అప్పటి నుంచీ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదన్నారు. దీనిపై సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే.. అది తమ పరిధిలో లేదని, కోర్టుకు వెళ్లాలని సూచించారు. ఆందోళన చెందిన నర్సింగరావు.. కలెక్టరేట్‌పైకి ఎక్కి ఒంటిపై డీజిల్ పోసుకున్నారు. ఆర్డీవో మధుమోహన్, ఇతర అధికారులు నచ్చజెప్పడంతో సుమారు రెండు గంటల తర్వాత కిందికి దిగాడు. నర్సింగరావు దగ్గర ఉన్న పత్రాలను పరిశీలించిన అధికారులు.. దీనిపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అయితే భూమి సమస్యపై నర్సింగరావు 2021 డిసెంబర్లో కూడా ఇదే కలెక్టరేట్‌పై ఆత్మహత్యాయత్నం చేశాడని.. అయినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు చెబుతున్నారు. కరీంనగర్ ప్రజావాణికి గట్టి బందోబస్తు ప్రజావాణి సందర్భంగా రైతులు, ప్రజలు పురుగుల మందు, పెట్రోల్ వంటి వాటితో ఆందోళనలకు దిగుతుండటంతో.. కరీంనగర్ జిల్లాలో ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి సందర్భంగా ప్రధాన ద్వారంతోపాటు ఆడిటోరియం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అర్జీదారులను తనిఖీ చేశాకే లోపలికి పంపారు. సూర్యాపేట కలెక్టరేట్లో ఇద్దరి ఆత్మహత్యాయత్నం అధికారులు తమ భూసమస్యలు పరిష్కరించడం లేదని, పైగా తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారని సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ఇద్దరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మలచెర్వుకు చెందిన మీసాల అన్నపూర్ణ, ఆమె కుమార్తె స్వాతి కలిసి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. తన భర్త జానయ్య పేరిట ఉన్న 5 గుంటల భూమిని బెజ్జం వెంకన్న అనే వ్యక్తి ఆక్రమించారని.. తన పేరిట ఉన్న 34 గుంటల భూమిని, కుమార్తె స్వాతి పేరిట ఉన్న 25 గుంటల భూమిని సైదులు అనే వ్యక్తి కబ్జా చేశారని అన్నపూర్ణ ఆరోపించారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, పైగా తమపైనే అక్రమ కేసులు బనాయించారని వాపోయారు. ఇక ఇదే గ్రామానికి చెందిన పున్న వీరమ్మ తన కుమారుడు పున్న సైదులుతో కలిసి ప్రజావాణికి వచ్చారు. తమకు 2 ఎకరాల 20 గుంటల భూమి ఉందని.. అందులో సాగు చేయకుండా బెజ్జం పిచ్చయ్య, బెజ్జం దాసు, శెట్టిపల్లి కృష్ణ, శెట్టిపల్లి రాముడు అనే వ్యక్తులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. అయితే ఈ రెండు ఫిర్యాదుల విషయంలో పోలీసులను ఆశ్రయించాలని అదనపు కలెక్టర్ సూచించారు. దీనితో ఆవేదన చెందిన మీసాల స్వాతి తొలుత ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. సిబ్బంది ఆమెను అడ్డుకోగా.. పక్కనే ఉన్న పున్న సైదులు ఆ పెట్రోల్ బాటిల్‌ను తీసుకుని ఒంటిపై పోసుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. వారిని కోదాడ డీఎస్పీ వద్దకు పంపారు. -
నిజామాబాద్‌కు సీఎం కేసీఆర్
సాక్షి,సుభాష్‌నగర్(నిజామాబాద్): సీఎం కేసీఆర్ సోమవారం నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కొత్త కలెక్టరేట్), టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవాలతోపాటు ఇక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. హెలికాప్టర్లో నిజామాబాద్ పోలీస్‌పరేడ్ మైదానానికి మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చేరుకుంటారు. 2.10 గంటలకు ఎల్లమ్మగుట్టలోని టీఆర్ఎస్ భవన్‌ను, 2.40 గంటలకు కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. 3.05 గంటలకు జీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుని ప్రసంగిస్తారు. సాయంత్రం 4.00 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు. వాతావరణం అనుకూలించని పక్షంలో చివరి క్షణంలోనైనా మార్పులు, చేర్పులకు అవకాశముంటుందని అధికారులు తెలిపారు. సీఎం రాక నేపథ్యంలో నిజామాబాద్ నగరం ఇప్పటికే గులాబీయమమైంది. నగరాన్ని టీఆర్ఎస్ జెండాలు, తోరణాలతో అలంకరించారు. నగరంతోపాటు జాతీయ రహదారి పొడవునా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. -
పెద్దపల్లి జిల్లా: నూతన కలెక్టరేట్ ఆఫీసును ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
మళ్లీ జిల్లా పర్యటనలకు సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మళ్లీ జిల్లాల పర్యటనలకు వెళ్లనున్నారు. కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాలను ఆయన ప్రారంభించనున్నారు. ఈనెల 25న గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 29న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని, సెప్టెంబర్ 5న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని, సెప్టెంబర్ 10న జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు ఖరారైనట్లు సీఎంవో కార్యాలయం వెల్లడించింది. -
మేడ్చల్ నూతన కలెక్టరేట్ ను ప్రారంభించిన కేసీఆర్
-
తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంతి కె చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. అంతాయిపల్లిలో 30 ఎకరాల స్థలంలో రూ.56.20 కోట్ల వ్యయంతో ఈ కార్యలయాలను ఏర్పాటు చేశారు. భవనంలో విశాలమైన 55 గదులను నిర్మించడం తోపాటు కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు, డీఆర్వో , ఏవో, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులకు ప్రత్యేక గదులు కేటాయించారు. జిల్లా మంత్రికి ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేశారు. 250 మంది కూర్చునేలా సమావేశమందిరాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ మైదానంలో హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టారు. కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. మేడ్చల్ జిల్లా అవుతుందని ఎవరూ ఊహించలేదు. తెలంగాణ ఏర్పాటు వల్లే ఇది సాధ్యమైంది. పరిపాలన భవనాన్ని గొప్పగా నిర్మించుకున్నాం. పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే అంత అభివృద్ధి. కేవలం 6 నెలల వ్యవధిలో భవనాలు నిర్మించాం. తెలంగాణ వచ్చాక ఎన్నో మంచి పనులు చేసుకున్నాం. ఇప్పుడున్న 36 లక్షల పెన్షన్లకు తోడు.. మరో పది లక్షల కొత పెన్షన్లు ఇస్తున్నాం. అందరికీ కొత్త కార్డులు ఇస్తున్పాం. 11 వేలకు పైగా క్రీడా ప్రాంగణాలు సిద్ధమవుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అంకిత భావం ఉంటే ఏదైనా సాధ్యమే రాష్ట్రంలో అన్ని రంగాలకూ 24 గంటలూ కరెంట్ అందిస్తున్నాం. హైదరాబాద్‌లో కరెంట్ పోదు కానీ.. ఢిల్లీలో 24 గంటలు కరెంట్ ఉండదు. దేశంలో 75 ఏళ్ల నుంచి జరుగుతున్న అసమర్థ పరిపాలన, చేతకాని, తెలివి తక్కువతనం పరిపాలన వల్లే ఈ ఇబ్బందులు. దేశంలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణనే. అంకిత భావం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. తెలంగాణపై పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్) ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే తెలంగాణలో చాలా నిధులు ఉన్నాయి. మన రాష్ట్రం ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే. గతంలో తెలంగాణలో తలసరి ఆదాయం రూ.లక్ష మాత్రమే. ప్రస్తుతం తెలంగాణలో తలసరి ఆదాయం రూ.2,78,500. దేశంలోనే తెలంగాణ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు అందుతున్నాయి. ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం. చేనేత కార్మికులకు కూడా పింఛన్లు అందిస్తున్నాం. రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందిస్తున్నాం. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగాసంక్షేమ పథకాలు అందిస్తున్నాం. దేశంలోనే అత్యధిక గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గురుకుల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్ల కొరత తీర్చుకున్నాం. జాతీయ రాజకీయాల్లో మార్పు రావాలి భవనం కట్టాలంటే చాలా కష్టం, కూలగొట్టాలంటే చాలా ఈజీ. మతం, కులం పేరిట దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఏ రకంగానూ మంచిది కాదు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పురావాలి. ఒకసారి దెబ్బతిన్నామంటే మళ్లీ ఏకం కావడం అంత ఈజీ కాదు. చైనా సింగపూర్, కొరియా దేశాల తరహాలో కుల మతాలకు అతీతంగా పనిచేయాలి' అని సీఎం కేసీఆర్ అన్నారు. -
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
సాక్షి, మేడ్చల్ జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇకపై మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభంతో పరిపాలన అంతా ఒకే చోట నుంచి కొనసాగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి 2016 అక్టోబర్ 11న మేడ్చల్–మల్కాజిగిరి ,వికారాబాద్ జిల్లాలు ఏర్పాటయ్యాయి. దాదాపు ఆరేళ్లుగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిపాలన కీసర మండల కేంద్రం సమీపంలోని అద్దె భవనం నుంచి కొనసాగుతోంది. దీంతో కొన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రజలకు పారదర్శక పాలన, పరిపాలన సులభతరం.. అధికారుల్లో జవాబుదారీ తనం పెంచటం.. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లడమే లక్ష్యంగా 2017 అక్టోబర్ 11న శామీర్‌పేట మండలం, తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయిపల్లిలో జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పునాది వేసిన సంగతి తెలిసిందే. ఎన్నో ప్రత్యేకతలు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయాల కార్యాలయాన్ని అంతాయిపల్లిలో 30 ఎకరాల స్థలంలో రూ.56.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. భవనంలో విశాలమైన 55 గదులను నిర్మించడం తోపాటు కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు, డీఆర్వో ,ఏవో, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులకు ప్రత్యేక గదులు కేటాయించారు. జిల్లా మంత్రికి ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేశారు. 250 మంది కూర్చునేలా సమావేశమందిరాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ మైదానంలో హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టారు. -
Telangana: అన్ని జిల్లా కలెక్టరేట్లలో పాపన్న జయంతి వేడుకలు: శ్రీనివాస్ గౌడ్
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: బహుజనుల కోసమే పుట్టిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ నెల 18న అన్ని జిల్లా కలెక్టరేట్లలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జరుగుతాయని, రవీంద్ర భారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం, తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో, చిక్కడపల్లిలోని కల్లు కంపౌండ్ వద్ద తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ... సర్వాయి పాపన్న కులవృత్తులను ఏకం చేసిన గొప్ప వ్యక్తని కొనియాడారు. కేంబ్రిడ్జి వర్సిటీలో పాపన్న విగ్రహాన్ని పెట్టారని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. పాపన్న జయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ నెల 18న ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో జయంతి వేడుకలను నిర్వహిస్తుందని చెప్పారు. సర్వాయి పాపన్న పేరున భవనం త్వరలో ప్రారంభం అవుతుందన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. బహుజన విప్లవకా రుడు సర్వాయి పాపన్న స్ఫూర్తితో బహుజనులంతా ఏకమై రాజ్యాధికారం కోసం పయనించాలని పిలుపునిచ్చారు. జయంతి వేడుకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించటం గొప్ప పరిణామన్నారు. కార్యక్రమాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎంపీలు మల్లు రవి, వి.హన్మంతరావు, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్కుమార్గౌడ్, విప్లవ గాయని విమలక్క, కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, ఎంవి.రమణ, బెల్లయ్యనాయక్, తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలరాజ్‌గౌడ్, గౌడ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
వికారాబాద్‌లో సీఎం కేసీఆర్.. కలెక్టరేట్, టీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం
సాక్షి, వికారాబాద్: వికారాబాద్‌లో పర్యటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వికారాబాద్ పట్టణానికి చేరుకున్నారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ఉస్మానియా మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేసీఆర్. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. శాఖలన్నీ ఒకే గూటికి.. వాస్తవానికి కలెక్టరేట్ భవనం ఏడాది క్రితమే పూర్తయ్యింది. సీఎంకు సమయం కుదరకపోవడంతో ప్రారంభోత్సవం కోసం ఇన్నాళ్లు వేచి చూడాల్సి వచ్చింది. తాజాగా రూ.42 కోట్ల వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కలెక్టరేట్ భవనం అందుబాటులోకి వచ్చింది. దీంతో జిల్లా కేంద్రంలో శాఖలన్నీ ఒకే గూటికి చేరుకున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టరేట్ భవనంలో కేవలం డజన్ శాఖలు మాత్రమే ఉండగా కీలక శాఖలన్నీ బయటే కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: Hyderabad: పోలీసు ఫోన్ నెంబర్లు మారాయి.. కొత్త నెంబర్లు ఇవే -
నేడు తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ నిరసన
-
చిన్నారిని ఇంత వరకు దత్తత తీసుకోలేదు : కరాటే కల్యాణి
అక్రమంగా చిన్నారిని దత్తత తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కరాటే కల్యాణి హైదరాబాద్ కలెక్టర్ కార్యాయలంలో విచారణకు హాజరయ్యింది. కల్యాణీతో పాటు చిన్నారి తల్లిదండ్రులు కూడా సీడబ్లూసీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం కరాటే కల్యాణి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారికి సంబంధించి ఇంత వరకూ ఎలాంటి దత్తత జరగలేదని పేర్కొంది. ఇదే విషయాన్ని కలెక్టర్ ముందు కూడా చెప్పామని వివరించింది. 'ఆర్థికంగా చిన్నారి తల్లిదండ్రులకు అండగా ఉన్నాను. నాపై బురద జల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు' అంటూ కరాటే కల్యాణి చెప్పుకొచ్చింది. కాగా యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డితో వివాదం, ఆ తర్వాత చిన్నారి దత్తత విషయం హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచిందని కరాటే కల్యాణిపై ఫిర్యాదు రావడంతో చైల్డ్ లైన్ అధికారులు కరాటే కల్యాణి ఇంట్లో సోదాలు నిర్వహించారు. నోటీసులకు స్పందిచకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిణామాల అనంతరం కరాటే కల్యాణి అఙ్ఞాతంలోకి వెళ్లడం, ఆమె ఫోన్ స్విచ్చాఫ్ కావడం వంటి నాటకీయ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. -
భూమి కబ్జా చేశారంటూ..
ఆదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధురాలు పెట్రోల్ బాటిల్ వెంట తెచ్చుకోవడం కలకలం రేపింది. తన భూమిలో కొందరు అక్రమంగా ఉంటూ కొట్టం నిర్మిస్తున్నారని, తన చేను తనకు దక్కేలా చూడాలని కోరుతూ దరఖాస్తు రాసుకుని ఆదిలాబాద్ పట్టణం బొక్కలగూడకు చెందిన కొమ్ము నాగమ్మ ప్రజావాణికి వచ్చింది. ముందుగా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను కలసి అర్జీ అందజేసింది. అది చదివిన కలెక్టర్ ‘మీ భూమిని మీరే కాపాడుకోవాలి..’అని చెప్పి పంపించారు. దీంతో నిరాశకు లోనైన నాగమ్మ బయటకు వచ్చి అక్కడున్న వారందరికీ తన సమస్య తెలిపింది. ఆమెతో వచ్చిన మరో ఇద్దరు కూడా నాగమ్మ సమస్య పరిష్కరించాలని కోరారు. లేకుంటే ఇక్కడే చనిపోయేందుకు పెట్రోల్ బాటిల్ తెచ్చుకుందని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. నాగమ్మకు నచ్చజెప్పారు. దాంతో ఆమె మళ్లీ కలెక్టర్‌ను కలిసేందుకు లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా నాగమ్మ తన సమస్యను పూర్తిగా వివరించింది. ‘నాకు ఖానాపూర్ శివారులో సర్వే నంబర్ 68/93లో 1.05 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి శిరీష అనే మహిళ అధీనంలో ఉండేది. 2021 జూన్‌లో శిరీష చనిపోయింది. ఆమె బతికి ఉన్నప్పుడే ఈ భూమిని నాకు ఇచ్చేసింది. నేను భూమి పట్టా బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చుకుని ఎవుసం చేసుకుంటున్నా. అయితే శిరీష బంధువులు పోయిన డిసెంబర్లో నా భూమిని కబ్జా చేసుకున్నరు. అక్రమంగా కొట్టం కడుతున్నరు. నేను చేనుకాడికి పోతే చంపుతామని బెదిరిస్తున్నరు. నా భూమి నాకు ఇప్పించుండ్రి’ అని నాగమ్మ వివరించింది. సమస్యను గుర్తించిన కలెక్టర్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
చదివింపులు.. రూ. అరకోటి!
‘‘రాజుగారింట్లో పెళ్లి.. ప్రజలంతా వెళ్లి కానుకలు సమర్పించాలి’’ అంటూ అప్పట్లో రాజ్యంలో దండోరా వేయించేవారు. ఒకప్పుడు రాజరికంలో ఇవన్నీ చెల్లుబాటు అయ్యాయి. కానీ.. ఇదే పద్ధతి ఇప్పుడూ నడుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కరీంనగర్ కలెక్టరేట్లోని ఓ ప్రభుత్వ విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తున్న అధికారి కూడా తన ఇంట్లో జరిగే పెళ్లికి కానుకల సేకరణకు ఇలాగే దాదాపుగా దండోరా వేయించినంత పనిచేశారు. అసలే జిల్లాలో ఓ శాఖకు విభాగాధిపతి.. పైగా అతని ఇంట్లో పెళ్లి.. సిబ్బంది కానుకలు సమర్పించి స్వామి భక్తి చాటుకునేందుకు.. ఇదే అద్భుత అవకాశమని ప్రచారం చేయించారు. ఈ వార్త వినగానే.. 15 మండలాలు, 313 గ్రామపంచాయతీల్లో కలకలం రేగింది. దీనిపై సిబ్బందిలో మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఇదే మంచి తరుణమని తమ స్వామి భక్తి ప్రదర్శించేందుకు సమాయత్తమవగా.. మరికొందరు ఇదెక్కడి తలనొప్పిరా బాబూ అంటూ తల పట్టుకున్నారు. తగ్గేదేలే..! ► సదరు అధికారి ఇంట్లో పెళ్లి వేడుకకు ముందే.. కొందరు ఉద్యోగులు వసూలు చేసే బరువు బాధ్యతలను తమ భుజాలకు ఎత్తుకున్నారు. ► తొలుత జిల్లా కేంద్రంలో లిస్టు రెడీ చేసి ఆ మేరకు నగదు కానుకలను వసూలు చేశారు. ► ఆ తరువాత జిల్లాలోని ఆ విభాగానికి సంబంధించిన 15 మండలాల అధికారులకు, 313 గ్రామపంచాయతీ స్థాయిలో పనిచేసే తమ సిబ్బందికి తలా ఇంత అన్న టార్గెట్ విధించారు. ► కొందరు ససేమీరా అని ఇవ్వలేదు. మండలస్థాయి అధికారుల్లో కొందరు తలా తులం బంగారం ఇచ్చుకోగా.. మిగిలిన గ్రామస్థాయిలో నాలుగుదశల్లో పనిచేసే సిబ్బంది ప్రతీ మనిషి రూ.1000 నుంచి రూ.5000 వరకు సమర్పించుకున్నారు. ► కొందరు గ్రామీణ నేతలు, ప్రజాప్రతినిధులు, చోటా కాంట్రాక్టర్లు సైతం ఈ చదివింపుల మేళాలో పాలుపంచుకోవడం విశేషం. ► కొందరైతే విందుకోసం మేకలు, గొర్రెలు కూడా ఉడతాభక్తి కింద ఇచ్చినట్లు తెలిసింది. ► ఈ క్రమంలోనే కొన్నిచోట్ల సిబ్బంది నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనట్లు తెలిసింది. ఎవరో ఇంట్లో పెళ్లికి తామెందుకు డబ్బులు ఇవ్వాలంటూ ఎదురు తిరగడంతో వసూల్ రాజాలు వెనుదిరిగినట్లు సమాచారం. వేధింపులు మొదలు..! ఈ వేడుకకు సహకరించని వారిపై సదరు విభాగాధిపతి కక్షసాధింపులకు దిగినట్లు తెలిసింది. వారి సర్వీసు రికార్డులు తీసి మరీ వేధింపుల పర్వానికి తెరతీసినట్లు సిబ్బంది వాపోతున్నారు. సదరు అధికారి వాస్తవానికి ఈ పాటికే రిటైర్డ్ కావాల్సి ఉంది. కానీ.. ఇటీవల ఉద్యోగ విరమణ వయసును ప్రభుత్వం పెంచడంతో మూడేళ్ల సర్వీసు కలిసి వచ్చింది. దీంతో అదనంగా కలిసి వచ్చిన అవకాశాన్ని ఇలా అక్రమార్జనలకు వాడుతున్నారని సిబ్బంది మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ పలువురు సిబ్బందిని సంప్రదించగా.. చాలామంది వెల్లడించేందుకు జంకి వెనకడుగువేశారు. కొందరు మాత్రం నిజమేనని ధ్రువీకరించారు. అయినా.. సదరు అధికారికి వ్యతిరేకంగా తాము ఎలాంటి ప్రకటనా చేయలేమని వాపోయారు. వాస్తవానికి కరీంనగర్ పట్టణంలో ఇలాంటి తంతు కొత్తదేం కాదు, గతేడాది కూడా ఓ నాయకుడి ఇంట్లో పెళ్లి సమయంలోనూ దాదాపుగా ఇదే జరిగింది. ప్రతీ సిబ్బంది తాము నిర్ణయించినంత మొత్తాన్ని వెంటనే అందజేయాలని కొందరు గ్రూపులీడర్లు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసిన ఆడియో సందేశం అప్పట్లో వైరల్‌గామారిన సంగతి తెలిసిందే. చదవండి: అనూహ్యం: డీజీపీని తప్పించిన సీఎం యోగి! కారణం ఏంటంటే.. -
మాజీ జవాన్ నిర్వాకం.. మద్యంమత్తులో కలెక్టరేట్‌కి వచ్చి..!
వేలూరు: వేలూరు కలెక్టరేట్లో ప్రజా విన్నపాల దినోత్సవాన్ని కలెక్టర్ కుమరవేల్ పాండియన్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఇందులో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఓ మాజీ ఆర్మీ జవాన్ తన భార్యతో కలెక్టరేట్‌కు చేరుకొని కలెక్టర్ వద్దకు వెళ్లి.. మద్యం మత్తులో సెల్‌ఫోన్‌ను చూస్తూ నిలుచున్నాడు. ఆ సమయంలో వినతిపత్రం ఇవ్వాలని కలెక్టర్ మాజీ జవాన్‌ను కోరగా అందుకు ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. గమనించిన జిల్లా అధికారులు వెంటనే పోలీసులను రప్పించి అతన్ని బయటకు తీసుకొచ్చారు. అక్కడ మద్యం మత్తులో అతను కింద పడి పోయాడు. అనంతరం పోలీసులు విచారణ జరపగా అతను వేలూరు జిల్లా కన్నియంబాడికి చెందిన మాజీ జవాన్ వేల్మురుగన్ తేలింది. ఇతని కుటుంబ ఆస్తి సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినట్లు తేలింది. దీంతో పోలీసులు చేసేది లేక అతన్ని కారులో ఇంటికి పంపించి వేశారు. -
గోడు చెప్పుకోవడానికొచ్చి.. ఉసురు తీసుకోబోయారు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్)/వరంగల్: నిజామాబాద్, వరంగల్ జిల్లాల కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో కలకలం చెలరేగింది. తమ సమస్యలు పరిష్కరించడం లేదని ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు. నిజామాబాద్‌లో ఇద్దరు, వరంగల్‌లో ఒకరు ఈ అఘాయిత్యానికి యత్నించగా అధికారులు, పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. ఓ మహిళ ఫినాయిల్ తాగగా వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. లైంగికంగా వేధిస్తున్నారని.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్‌కు చెందిన నాగలక్ష్మి తన కూతురితో కలసి కలెక్టరేట్‌కు వచ్చింది. నామ్‌దేవ్, ఎర్రం గణపతి అనే వ్యక్తులు లైంగికంగా వేధిస్తున్నారని, తన ఆత్మహత్యకు వారే కారణమని సూసైడ్ నోట్ రాసుకుంది. వెంట తెచ్చుకున్న ఫినాయిల్ తాగేసింది. భర్త లేని తనకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ వారు ఆశచూపినా లొంగకపోవడంతో మంత్రాలు చేస్తున్నానని కాలనీలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే నాగలక్ష్మిని జిల్లా ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం నుంచి బయటపడింది. వేధించినవారిని విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. భూమిని కబ్జా చేశారని.. ప్రభుత్వం తనకు ఇచ్చిన మూడెకరాల వ్యవసాయ భూ మిని కబ్జా చేసిన పెద్దోళ్ల గంగారెడ్డిపై అధికారులు చర్య లు తీసుకోవడం లేదంటూ జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌కు చెందిన మేకల చిన్న చిన్నయ్య అనే దళిత రై తు నిజామాబాద్ ప్రజావాణికి వచ్చాడు. ఉన్నట్టుండి ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించగా పోలీసులు వారించారు. గంగారెడ్డి గతేడాది జూన్‌లో తన భూమిని ఆక్రమించి దున్నాడని, ప్రశ్నించినందుకు చం పుతానని బెదిరిస్తున్నాడని చిన్నయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. చిన్నయ్యను పోలీసులు కలెక ్టర్ వద్దకు తీసుకెళ్లి ఫిర్యాదు ఇప్పించారు. భాగస్వాములు మోసం చేశారని.. వరంగల్ నగరానికి చెందిన జిన్నింగ్ మిల్స్ వ్యాపారి రఘునందన్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు వచ్చారు. తన వ్యాపార భాగస్వాములు లెక్కల్లో మోసం చేసి కేవలం రూ.40 లక్షల వరకు బకాయి పడినట్లు చూపుతున్నారని కలెక్టర్‌కు వివరిస్తూ వినతిపత్రం అందించారు. ఆ వెంటనే పెట్రోల్‌ను ఒంటిపై పోసుకోవడంతోనే అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని, ఇది ప్రైవేటు సమస్య అయినందున సీపీకి సిఫారసు చేస్తున్నానని తెలిపారు. తర్వాత సుబేదారి పోలీసులు రఘునందన్‌ను బయటకు తీసుకెళ్లారు. -
4 సెక్షన్లుగా కలెక్టరేట్ పాలన
ఏలూరు(మెట్రో): ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో, ప్రజల పనులు జరిగేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో జిల్లా కలెక్టరేట్ కీలక పాత్ర పోషిస్తోంది. కలెక్టరేట్ అంటే కేవలం కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో మాత్రమే అనుకుంటారు. అయితే కలెక్టర్ కార్యాలయంలో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జీ, హెచ్ అనే 8 సెక్షన్లు ఉంటాయి. ప్రజలకు ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య పరిష్కరించాలన్నా ఈ సెక్షన్లు కీలక పాత్ర పోషిస్తాయి. పథకాలు, సేవలపై ప్రజలు కలెక్టర్‌కు ఏం విన్నవించినా.. వాటిని కలెక్టర్ ఆయా సెక్షన్లకు పంపిస్తారు. పూర్తిస్థాయిలో ఆ ఫిర్యాదు, వినతికి ఒక రూపం తెచ్చాక జాయింట్ కలెక్టర్, కలెక్టర్ ఆమోదముద్ర వేస్తారు. ఈ సెక్షన్లే జిల్లాకు కీలకం.. ప్రస్తుతం జిల్లాల విభజనలో భాగంగా ఇంత వరకు కలెక్టర్ కార్యాలయంలోని 8 సెక్షన్లను నాలుగింటిగా కుదించి పరిపాలన సాగించేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పురపాలన అందించేందుకు ప్రస్తుతం 8 సెక్షన్లను నాలుగింటిగా విభజించారు. ఎస్టాబ్లిష్మెంట్, అకౌంట్స్ అండ్ ఆడిట్ విభాగాలు గతంలో ఏ, బీ సెక్షన్లుగా ఉండేవి. ప్రస్తుతం ఆ రెండు సెక్షన్లను ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్‌గా మాత్రమే ఉంచారు. అలాగే ఆఫీస్ ప్రొసీజర్, ఎస్టాబ్లిష్మెంట్ అండ్ సర్వీస్ మేటర్, డిసిప్లీనరీ యాక్షన్స్, అకౌంట్స్, ఆడిటింగ్, శాలరీస్, పర్చేజ్, మెయింటెనెన్స్ శాఖలను దీనిలో కలిపారు. అదేవిధంగా ఈ, జీ, ఎఫ్ లలో నిర్వహించే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ ఎక్విజేషన్, ల్యాండ్ రీఫారŠమ్స్ సెక్షన్లను ల్యాండ్ మ్యాటర్ సెక్షన్లుగా ఏర్పాటు చేశారు. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, అసైన్మెంట్, అవుట్‌సైడ్, ప్రొహిబిడెడ్, 22ఏ రిజిస్ట్రేషన్, ఫిషరీస్, సెటిల్మెంట్ రెగ్యులరైజేషన్స్, ఆల్ కోర్ట్ కేసెస్, ఫారెస్ట్ సెటిల్మెంట్స్, ఆర్ అండ్ ఆర్ అంశాలు, ల్యాండ్ రిలేటెడ్ మ్యాటర్స్ దీనిలో విలీనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేవలం సి సెక్షన్‌ను మాత్రం ఉంచి సి పేరు తొలగించి మెజిస్టీరియల్ సెక్షన్‌గా ఏర్పాటు చేశారు. ఈ సెక్షన్లో గతంలో సి సెక్షన్లో నిర్వహించే మెజిస్టీరియల్, సినిమాటోగ్రఫీ, కాస్ట్ వెరిఫికేషన్, లా అండ్ ఆర్డర్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, లోకాయుక్త, హెచ్ఆర్సీ, ఎన్హెచ్ఆర్సీ, ఆర్టీఐ వంటివి నిర్వహించనున్నారు. డీ, హెచ్ సెక్షన్లను విలీనం చేసి కోఆర్డినేషన్ సెక్షన్‌గా ఏర్పాటు చేశారు. డి, హెచ్లో ఉన్న పనులు నేచురల్ కలామిటీస్, వాటర్ ట్యాక్స్, వెబ్లాండ్ ఇస్యూస్, ఆర్వోఆర్, కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, ఈ–గవర్నెన్స్, ఆల్ ఎలక్షన్ వర్క్స్, ప్రొటోకాల్, గ్రీవెన్సెస్, స్పందన, సీఎంపీ వంటి అంశాలను ఏర్పాటు చేసి ఈ సెక్షన్లో పొందుపరిచారు. ఆయా సెక్షన్లలో ఇక నుంచి విధులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విభజనలో భాగంగా ఈ ఏర్పాట్లు చేశాం ఇంతవరకు 8 సెక్షన్లుగా ఉన్న జిల్లా పరిపాలనను ప్రస్తుతం నాలుగు సెక్షన్లుగా ఏర్పాటు చేశాం. ప్రభుత్వం ఈ మేరకు జీవో సైతం విడుదలైంది. ఇక నుంచి 4 సెక్షన్ల ద్వారా ప్రజలకు అందాల్సిన అన్ని సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటాం. నాలుగు సెక్షన్లకు సూపరింటెండెంట్లను నియమించి ఆయా సెక్షన్ల ద్వారా కలెక్టరేట్ పరిపాలన చేపడతాం. – ప్రసన్న వెంకటేష్, కలెక్టర్ -
నాటకాలు ఆపి ధాన్యం కొనండి
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, విద్యుత్ చార్జీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు బుధవారం ఆందోళనలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ నాయకులు బైఠాయించారు. అసలు సమస్యను పక్కన పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయని నాయకులు ధ్వజమెత్తారు. నిజామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆపి ధాన్యం కొనాలని, పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న కార్యకర్తలు.. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. ఖమ్మం, వరంగల్, సిరిసిల్ల కలెక్టరేట్లలోకి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వరంగల్‌లో కొందరు కార్యకర్తలు గాయపడ్డారు. మహబూబాబాద్‌లో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, ములుగు జిల్లా మంగపేటలో ఎమ్మెల్యే సీతక్క, వనపర్తిలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీసీసీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. పెంచిన ధరలు తగ్గించాలంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్నిచోట్ల జాతీయ రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. ఉమ్మడి మెదక్, నల్లగొండ జిల్లాల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. -
కలెక్టరేట్ ఎక్కడనే నిర్ణయం ప్రభుత్వానిదే
సాక్షి, ఢిల్లీ: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కలెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు చేయాలన్న నిర్ణయం అభివృద్ధి అడుగుగానే భావించాలని అభిప్రాయపడింది. చిత్తూరు జిల్లా తిరుచానూరులోని పద్మావతి నిలయాన్ని బాలాజీ జిల్లా కలెక్టరేట్‌గా మార్చాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను బుధవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆధ్యాత్మిక భవనాన్ని కలెక్టరేట్‌కు ఇవ్వడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని పిటిషనర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు తెలిపారు. ‘కలెక్టర్ ఎక్కడ కూర్చోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోబోం. కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలి కదా. రాష్ట్ర విభజన అయిందంటే కొత్త రాష్ట్రంలో హైకోర్టు ఎక్కడ పెట్టాలి? సెక్రటేరియట్ ఎక్కడ నిర్మించాలి అని చూస్తాం కదా? ఆ ప్రాంతంలో ప్రజల నివాసానికి అనుగుణంగా ఉండాలి కదా? దీనికి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలి. పద్మావతి నిలయాన్ని ప్రభుత్వం అద్దె ప్రాతిపదికనే తీసుకుంది. ఉచితంగా ఏం తీసుకోలేదు కదా? కలెక్టర్ కార్యాలయం వచ్చిందంటే ఆ ప్రాంతం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. కలెక్టర్ ఎక్కడ కూర్చోవాలి.. చెట్టు కింద కూర్చొని పనిచేయి అని మేం చెప్పలేం కదా. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలివేయాలి. ప్రజా ప్రయోజనాల అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పులో జోక్యం చేసుకోం. ఈ పిటిషన్ కొట్టివేస్తున్నాం..’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. చదవండి: కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. అవతరణకు ముహూర్తం ఖరారు -
‘మన ఊరు–మన బడి’కి ఇక్కడి నుంచే శ్రీకారం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు–మన బడి’కి లాంఛనంగా ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. వనపర్తిలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ ఇందుకు వేదిక కానుంది. దీంతోపాటు వనపర్తి మండలంలోని చిట్యాలలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డు, నాగవరంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, పట్టణంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే నాగవరంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు. కాగా, కలెక్టరేట్ ప్రాంగణంలోనే కర్నెతండా ఎత్తిపోతల పథకం, వేరుశనగ పరిశోధన కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, నీటిపారుదల శాఖ సీఈ కార్యాలయానికి శంకుస్థాపన చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నూతన కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన తర్వాత సాయంత్రం మెడికల్ కాలేజీకి కేటాయించిన స్థలంలో జరగనున్న బహిరంగ సమావేశంలో సీఎం ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. పోలీసుల పటిష్ట బందోబస్తు సీఎం పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి వనపర్తికి చేరుకోనుండగా.. సాయంత్రం 5.30 గంటలకు తిరుగు పయనం కానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. ఎనిమిది మంది ఎస్పీల పర్యవేక్షణలో 1,840 మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారు. ఉమ్మడి పాలమూరు నుంచి సుమారు లక్ష మందిని బహిరంగసభకు తరలించేలా ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. -
జనగామకు సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హెలికాప్టర్లోహైదరాబాద్ నుంచి బయలుదేరి 11.35 గంటలకు జనగామ కలెక్టరేట్ ప్రాంగణంలో దిగుతారు. 11.45 గంటలకు కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని ప్రారంభించి, అక్కడే అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.05 గంటలకు వరంగల్–హైదరాబాద్ హైవే పక్కన యశ్వంతాపూర్ శివారులో టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 3.30 గంటలకు అదే ప్రాంతంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు ప్రసంగం ముగింపు ఉంటుంది. 5.15 గంటలకు హెలికాప్టర్లో సీఎం హైదరాబాద్‌కు తిరిగి వెళతారు. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు గురువారం బహిరంగ సభాస్థలిని, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. జన సమీకరణపై కసరత్తు చేశారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న కలెక్టరేట్ సముదాయం, పార్టీ కార్యాలయాన్ని కలెక్టర్, పోలీసు కమిషనర్లతో కలిసి సందర్శించారు. సీఎంకు ఘనస్వాగతం పలకాలి: మంత్రులు కరువు జిల్లాగా ఉన్న జనగామను సస్యశ్యామలం చేసి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకాలని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటుపై అక్కసు వెళ్లగక్కిన నేపథ్యంలో మండిపడుతున్న తెలంగాణ ప్రజలు శుక్రవారం జరిగే సభకు భారీ ఎత్తున పోటెత్తనున్నారని చెప్పారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం, టీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించిన తర్వాత, పార్టీ జిల్లా అధ్యక్షులు పదవీ బాధ్యతలు చేపడతారని, అనంతరం సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. -
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు!
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రధానమైన జిల్లా కార్యాలయాలన్నింటినీ ఒకేచోట ఏర్పాటుచేయడం ద్వారా వాటిని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చినట్లవుతుందని భావిస్తోంది. దీనివల్ల భూమి అవసరం, వ్యయం కూడా చాలావరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఏర్పాటుచేసిన కొత్త జిల్లాల్లో పలుచోట్ల ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు నిర్మించారు. ఇతర రాష్ట్రాల్లో మరికొన్నిచోట్ల ఇలాంటివే ఉన్నాయి. వాటన్నింటినీ పరిశీలించి మన రాష్ట్ర పరిస్థితులు, అవసరాలను బట్టి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ఎలా ఏర్పాటుచేయాలనే దానిపై ఒక అవగాహనకు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గ్రామ, వార్డు సచివాలయాల తరహాలో.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో అన్ని సేవల్ని ఒకేచోట నుంచి అందిస్తున్నారు. గ్రామ పరిపాలన వ్యవస్థ అంతా అక్కడే కేంద్రీకృతమైంది. ఇదే తరహాలో కొత్త జిల్లాల్లో పరిపాలన విభాగాలాన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకురావాలని భావిస్తున్నారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంతోపాటు డీఈఓ, వ్యవసాయ శాఖ జేడీ, సంక్షేమ శాఖల కార్యాలయాలు వందకు పైనే జిల్లా కేంద్రాల్లో పనిచేస్తాయి. ప్రస్తుతం ఉన్న జిల్లా కేంద్రాల్లో అవన్నీ వేర్వేరుచోట్ల ఉన్నాయి. బ్రిటీష్ కాలంలో ఏర్పాటైన కలెక్టరేట్లు, కలెక్టర్ బంగ్లాలు, ఎస్పీ కార్యాలయాలు భారీ విస్తీర్ణంలో ఉన్నాయి. అదే తరహాలో కొత్త జిల్లాల్లో విడివిడిగా కార్యాలయాలు ఏర్పాటుచేస్తే ఎక్కువ భూమి అవసరమవుతుంది. నిర్మాణ వ్యయం కూడా భారీగా ఉంటుంది. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో భూమి లభ్యత చాలా తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఒకేచోట కార్యాలయాలన్నీ ఏర్పాటుచేస్తే భూమి సమస్య ఉండదు. అధికారుల క్వార్టర్లు, సమావేశపు గదులు, వాహనాల పార్కింగ్ అంతా ఒకేచోట ఉండాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 13 జిల్లా కేంద్రాలు మినహాయిస్తే కొత్తగా ఏర్పాటుచేసే 13 జిల్లా కేంద్రాల్లో ఈ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు ఏర్పాటుచేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాల్లో ఇందుకు అవసరమైన భూమిని గుర్తించినట్లు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సిఫారసులు చేసేందుకు ఏర్పాటైన కమిటీల్లో రవాణా, ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లకు సంబంధించి సవివర నివేదిక ఇచ్చినట్లు సమాచారం. -
మాకొద్దీ 317 జీఓ
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు కదం తొక్కాయి. జీఓలోని లోపాలను సవరించాలని, స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆందోళనకు దిగాయి. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయులు ధర్నాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హక్కులను కాలరాసే జీవో ప్రభుత్వం 317 జీవో ద్వారా ఉపాధ్యాయుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఎలాంటి సం ప్రదింపుల్లేకుండా జీవోను అమలు చేయడం ఘోరమన్నారు. ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరి పాలేరు తీరులా ఉందని విమర్శించారు. జీవోను సవరించాలంటూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. సొంత జిల్లాలో ఉద్యోగం చేసేందుకు అవకాశం లేకుండా జీవో ఉందని కోదండరాం విమర్శించారు. జిల్లాల వారీగా పెద్ద మొత్తంలో ఖాళీలున్నాయని, ఉద్యోగులను సొంత జిల్లాలకు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒంటరి మహిళలు, వికలాంగులకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి న్యాయం చేయాలని కోరారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నల్లగొండ కలెక్టరేట్ ఎదుట నిరసన.. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు హైదరాబాద్‌లో టీచర్ల ఆందోళన జిల్లాల్లో ఆందోళనలు ఇలా.. ♦నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయాల ముందు ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. నిజామాబాద్‌లో కలెక్టర్ నారాయణ రెడ్డికి, కామారెడ్డిలో కలెక్టర్ కార్యాలయ ఏవోకు వినతిపతం సమర్పించారు. బాన్సువాడలో ఉపాధ్యాయుల సంతకాల సేకరణ చేపట్టారు. ♦కరీంనగర్ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చలో కలెక్టరేట్ నిర్వహించారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ♦రంగారెడ్డి కలెక్టరేట్, వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఉద్యోగుల అభ్యంతరాలను పట్టించుకోకుండా కేటాయింపులు జరపడంతో పలువురు శాశ్వతంగా స్థానికతను కోల్పోయారని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ దామాషాలను ఒక్కో జిల్లాలో ఒక్కోలా పాటించారన్నారు. ♦హనుమకొండ, మహబూబాబాద్, జనగామ కలెక్టరేట్ల ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. హనుమకొండలో జరిగిన నిరసనలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొన్నారు. ♦సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు అశోక్ కుమార్ నేతృత్వంలో నిరసన తెలిపారు. మెదక్‌లో కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపి అదనపు కలెక్టర్ రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ♦ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టరేట్ల వద్ద టీచర్లు ఆందోళన చేపట్టారు. సమస్యల పరిష్కారం కోసం చేసిన అప్పీళ్లను కూడా పరిశీలించడం లేదని విమర్శించారు. ♦ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ల ఎదుట కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట కలెక్టరేట్ల ఎదుట టీచర్లు ధర్నా చేశారు. యూటీఎఫ్‌తో పాటు టీఈజేఎస్, కాంగ్రెస్, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. ♦ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్, డీఈఓ కార్యాలయాల వద్ద ఉపాధ్యాయులు ఆందోళనలు నిర్వహించారు. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. -
సీనియారిటీకీ చెల్లుచీటీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల విభజన, సీనియారిటీ ప్రక్రియ మంటలు రేపుతోంది. జిల్లా కేటాయింపులు, ఆప్షన్లలో హేతుబద్ధత లోపించిందని... భజనపరులు, పైరవీకారులకే సీనియారిటీ జాబితాలో చోటు లభించిందని ఆరోపిస్తూ ఉపాధ్యాయులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద టీచర్లు ధర్నా చేయడంతోపాటు కలెక్టర్‌ను కాసేపు అడ్డుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. వరంగల్ కలెక్టరేట్లోనూ టీచర్లు నిరసన గళం వినిపించారు. సీనియారిటీకి చెల్లుచీటీ ఇచ్చి అడ్డగోలుగా విభజన చేశారని మండిపడ్డారు. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కలసి క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించారు. సమగ్ర పరిశీలన తర్వాతే జాబితా ప్రకటించాలని కోరారు. మరోవైపు సంఘాల ప్రతినిధులతో మంగళవారం చర్చలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన అంగీకరించారు. ఈ నేపథ్యంలో విభజన ప్రక్రియలో జాప్యం అనివార్యమని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఇదీ జరిగింది... ♦వాస్తవానికి కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజన ప్రక్రియ సోమవారంతో పూర్తై కేటాయింపుల ఉత్తర్వులు సైతం సోమవారమే వెలువడాల్సి ఉంది. అయితే ఒకట్రెండు జిల్లాలు మినహా మిగతా చోట్ల ఎక్కడా సోమవారం అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. కానీ కేటాయింపు జాబితా అన్ని చోట్లా ఉద్యోగులకు తెలిసిపోయింది. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం సీనియారిటీ అంశమే తీవ్ర వివాదమైంది. జాబితాలో జూనియర్లు కూడా ముందు వరుసలో ఉన్నట్లు తేలడంతో టీచర్లు ఇప్పుడివి సరిచేయకుంటే తాము శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అధికారుల వల్లే తప్పులు... హడావుడిగా విభజన చేయడంలో అధికారులు పొరపాట్లు చేశారు. ఉద్యోగంలో చేరిన తేదీ, పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకున్నారు. ర్యాంకు రికార్డును పరిగణనలోకి తీసుకొని ఉంటే న్యాయం జరిగేది. ఉద్యోగులు ఎప్పుడు, ఏ ర్యాంకులో కొనసాగారనేదే అసలైన సీనియారిటీ. ఈ వివరాలు ఆన్లైన్లో నమోదు చేయకుండా హడావిడిగా విభజన ప్రక్రియ చేపట్టడం వల్లే జాబితాలు తప్పులతడకగా మారాయి. – చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఇదీ బాధితుల వాదన.. ♦వరంగల్ జిల్లాకు చెందిన తూహిద బేగంకు సీనియారిటీ ఉంది. కానీ తనకన్నా జూనియర్లకు ప్రాధాన్యం ఇచ్చారని ఆమె తెలిపింది. తనను ములుగు జిల్లాకు బదిలీ చేశారని ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే జిల్లాలో పనిచేస్తున్న అనిత సీనియారిటీలో రెండో స్థానం. కానీ ఆమెకన్నా తక్కువ సీనియారిటీ ఉన్న మరో టీచర్ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ♦హన్మకొండ జిల్లాకు చెందిన పి శంకర్ ఎస్సీ ప్రాధాన్యత క్రమంలో జయశంకర్ భూపాలపల్లి వస్తుందని ఆశించాడు. సీనియారిటీ ప్రకారం ఇది సాధ్యమేనని చెబుతున్నాడు. కానీ ఇప్పుడు తనకన్నా జూనియర్‌కు ఈ స్థానం కేటాయించారని తెలిపాడు. భూపాలపల్లికి చెందిన మహేందర్ సీనియారిటీ ఉన్నా... అతన్ని సిద్ధిపేటకు కేటాయించారు. తనకన్నా జూనియర్లకు ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించాడు. ♦కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న టి సరిత భర్త ములుగు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి. ఈ కారణంగా తనను ములుగుకు పంపాలని ఆప్షన్ ఇచ్చింది. తనకన్నా జూనియర్‌కు ఆ స్థానం ఇచ్చి, తనకు అన్యాయం చేశారని ఆమె ఖమ్మం కలెక్టర్ వద్ద మొరపెట్టుకుంది. -
అమ్మ.. భారం కాదు బాధ్యత
సాక్షి, నిజామాబాద్: కనిపెంచిన తల్లి ఎప్పటికీ భారం కాదు. వృద్ధాప్యంలో ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం తనయుల బాధ్యత. తన తల్లికి వృద్ధాప్య పింఛన్ అందడం లేదని ఓ కొడుకు ఆమెను భూజాలపై ఎత్తుకొని కలెక్టరేట్‌కు వచ్చాడు. కానీ సోమవారం ప్రజావాణికి లేనందున అధికారులు ఫిర్యాదులు స్వీకరించకపోవడంతో వారు నిరాశతో ఇలా వెనుతిరిగారు. కోటగిరి మండలానికి చెందిన శాంతబాయి అనే వృద్ధురాలికి గత 14 సంవత్సరాలుగా పెన్షన్ రావడం లేదు. దీంతో ఆమె కొడుకు ఎన్నో సార్లు అధికారులను కలిసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రజావాణిలో తన గోడును వెళ్లబోసుకుందామని వచ్చాడు. కానీ ప్రజావాణి రద్దుతో నిరాశ చెందారు. చదవండి: శభాష్ ఎస్సై నాగరాజు.. ఆకలి తీర్చి.. ఆరాతీసి -
ఆ అటెండర్ అంధుడే.. కానీ పనిలో మాత్రం మిస్టర్ పర్ఫెక్ట్
సాక్షి,కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మధు. పుట్టుకతోనే అంధుడు. కలెక్టరేట్లోని సీపీఓ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను విధుల నిర్వహణలో పర్ఫెక్ట్ అండ్ షార్ప్. కొన్ని సందర్భాల్లో కళ్లున్న అటెండర్లు ఫైల్ ఎక్కడ పెట్టారో మర్చిపోవచ్చు కానీ మధు మాత్రం మరచిపోడు. మధు డ్యూటీలో ఉన్నాడంటే పైఅధికారులు అడిగిన తక్షణం ఫైల్ టేబుల్‌పై ఉంటుంది. కార్యాలయం ఉద్యోగులు ఎవరు ఏ ఫైల్ అడిగినా క్షణాల్లో అతని టేబుల్ మీదకు చేరుస్తాడు. కళ్లు కనబడని వ్యక్తి విధులు ఎలా నిర్వర్తిస్తారని పలువురు ఆశ్చర్యపడుతున్నారు. కళ్లు కనిపించని వారికి మనోనేత్రం ఉంటుందనడానికి మధుయే సమాధానం. ఏది ఏమైనా సకలాంగులు చేయలేని పని మధు చేస్తున్నందున అతనికి పలువురు హాట్సాప్ చెబుతుండటం విశేషం. చదవండి: ఎందరికో ఆదర్శం ఈ పట్టభద్రుడు -
దళితుల ఆవేదన.. మృతదేహంతో కలెక్టరేట్‌కు
సాక్షి, మండ్య(కర్ణాటక): అణగారిన వర్గాలు తనువు చాలిస్తే అంత్యక్రియలకు శ్మశానం లేదనే ఆక్రోశంతో మండ్య తాలూకాలోని హుళ్ళెనహళ్ళి గ్రామస్తులు సోమవారం మృతదేహంతో ధర్నా చేశారు. గ్రామవాసి సిద్దాచార్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా అంత్యక్రియలు చేయడానికి శ్మశానం లేకపోయింది. దీంతో బంధువులు, గ్రామస్తులు కలిసి శవాన్ని మండ్యకు తీసుకొచ్చి ఏకంగా కలెక్టరేట్ ముందు పెట్టుకొని ధర్నా నిర్వహించారు. తమ గ్రామంలో దళితుల చనిపోతే అంత్యక్రియలు చేయడానికి రుద్రభూమి లేదని వినతిపత్రం అందజేశారు. దీంతో కలెక్టర్ ఎస్.అశ్వతి, తహసీల్దార్‌తో కలిసి గ్రామానికి వెళ్ళి స్మశానస్థలి కోసం పరిశీలించారు. దాంతో గ్రామస్తులు శాంతించి శవాన్ని తీసుకొని వెళ్లారు. -
కలెక్టరేట్ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, సూపర్‌బజార్(ఖమ్మం): రాజకీయ అండతో తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకునే యత్నం చేస్తున్నారనే ఆవేదనతో కొత్తగూడెంలోని కలెక్టరేట్ ఎదుట సోమవారం ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో పక్కనే ఉన్నవారు గుర్తించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. యువతి బండి హైమావతి తల్లి సరళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెంలోని రామవరం 7వ నంబర్ బస్తీకి చెందిన సరళ భర్త మృతి చెందగా, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తోంది. వీరి ఇంటిపక్కనే ఉన్న వంద గజాల స్థలాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుడు మోత్కూరి ధర్మారావు అండతో అజయ్‌సింగ్ అనే వ్యక్తి ఆక్రమించే యత్నం చేస్తుండగా, రామవరంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఎలాంటి న్యాయం జరగకపోగా మళ్లీ స్థల ఆక్రమణకు యత్నించడంతో సోమవారం కలెక్టర్‌లో ప్రజావాణికి సరళ తన చిన్నకుమార్తె హైమావతితో వచ్చింది. అప్పటికి ప్రజావాణి ప్రారంభం కాకపోగా ఆవేదనతో హైమావతి తన వెంట తెచ్చుకున్న హెయిర్ డై తాగింది. దీంతో అక్కడే ఉన్న ఆరోగ్య కార్యకర్త, మరికొందరు ఆమెను ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా, కొత్తగూడెం తహసీల్దార్ రామకృష్ణ ఆస్పత్రికి చేరుకుని యువతితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. చదవండి: ఏడు రోజుల్లో పెళ్లి.. బండరాయితో కొట్టుకొని పెళ్లి కొడుకు ఆత్మహత్య -
చెప్పిన పని చేయలేదని గ్రామం నుంచి వెలివేశారు
సాక్షి, తిరువొత్తియూరు( చెన్నై): కట్ట పంచాయితీ చేసి గ్రామం నుంచి వెలివేశారని ఆరోపిస్తూ నాలుగు కుటుంబాలకు చెందిన 16 మంది బుధవారం నాగై కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆత్మాహుతికి యత్నించడం కలకలం రేపింది. సంబంధన్ పేటకు చెందిన పళణి (43), సోదరుడు కందన్ (40), అదే గ్రామానికి చెందిన కరుప్పన్న స్వామి (32), అశోక్ (26) కుటుంబ సభ్యులు కలెక్టరేట్ ఎదుట ఆత్మాహుతికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. విచారణలో పళని తమ్ముడు ముత్తు (38) భార్య ప్రియ (30) మధ్య విభేదాలు వచ్చినట్లు.. కలిసి ఉండాలని గ్రామ పెద్దలు చెప్పినా ముత్తు నిరాకరించాడని.. దీంతో పంచాయితీ పెట్టి రూ.16 లక్షలు ప్రియకు చెల్లించాలని తీర్పు చెప్పినట్లు తెలిసింది. ముత్తు అదృశ్యం కావడంతో తమ కుటుంబాలను గ్రామం నుంచి వెలివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
దూరం నుంచి చూస్తే రైలు..తీరా దగ్గరకు వచ్చి చూస్తే..
సాక్షి, నవరంగపూర్( భువనేశ్వర్): కొంతమంది కళాకారులు తమ చేతి నైపుణ్యం, పనితనంతో చిత్రాలకు ప్రాణం పోస్తారంటారు. ఇలాంటి అనుభూతి కొన్ని సందర్భాల్లోనే మనకి కలుగుతుంది. ప్రస్తుతం ఓ గోడ మీద వేసిన బొమ్మను చూసి ఇలాంటి అనుభూతి కలిగిందని అంటున్నారు ఓ ప్రాంత ప్రజలు. వివరాల్లోకి వెళితే.. నవరంగపూర్ జిల్లా కలెక్టరేట్ ప్రహరీగోడపై వేసిన రైలు బొమ్మ నగరవాసులను ఇట్టే ఆకట్టుకుంది. అచ్ఛం రైలుబండి లాగానే వేసిన పెయింటింగ్ అద్భుతంగా ఉంది. ఆ బొమ్మ ఎలా ఉందంటే.. దూరం నుంచి చూసిన వారికి... నవరంగపూర్‌కు రైలు ఎప్పుడు వచ్చిందోనని ఆశ్చర్యం కలగక మానదు. తీరా దగ్గరకు వచ్చి చూడగా, అది రైలుకాదని కేవలం చిత్రమని తెలిసి చాలమంది అచ్చెరువొందారు. శుక్రవారం నగరవాసులు రైలుబొమ్మతో సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది. -
సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన.. ఆ రోజే అన్ని ప్రారంభోత్సవాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో సిద్దిపేట పర్యటించనున్నారు. సిద్దిపేట జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయంతోపాటు పోలీస్ కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యలాయాలు ప్రారంభోత్సవం చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు, పోలీస్ యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత సీఎం సిద్దిపేటకు వస్తుండడంతో అధికారులతోపాటు మంత్రి హరీష్ రావు కూడా ఏర్పాట్లపై దృష్టి సారించారు. సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కాగా జూన్ 20న సీఎం వస్తారని ఇటీవల మంత్రి హరీష్ రావు ప్రకటించిన వెంటనే భవనాలను పరిశీలించడంతో భవనాల ప్రారంభం కూడా త్వరలోనే ఉంటుందని తెలుస్తుంది. అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్ ఇక సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఉన్నతాధికారుల ఛాంబర్లు, వివిధ శాఖలకు గదుల కేటాయింపు కొలిక్కి వచ్చింది. ఫర్నిచర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి..తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత విశాలంగా సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ భవనా నికి పేరు దక్కనున్నది. నాలుగెకరాల విస్తీర్ణంలో 62.60 కోట్లతో ఈ నూతన భవన సముదాయాన్ని నిర్మించారు. రెండంతస్తుల భవనంలో 600 మంది ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు వసతులు కల్పించారు.. 40 శాఖలకు 100 గదులను కేటాయించారు. కలెక్టర్ ఆడిషనల్ కలెక్టర్, డీఆర్వోతో పాటు పలువురు జిల్లా స్థాయి అదికారులకు ప్రత్యేక చాంబర్లను నిర్మించారు. సుందరంగా నూతన పోలీస్ కమిషనరేట్.. అత్యాధునిక వసతులతో, సాంకేతికతతో నూతన పోలీస్ కమిషనరేట్ సిద్ధమవుతుంది. దుద్దెడ గ్రామ శివారులో 29 ఎకరాల్లో రూ.19 కోట్లు వెచ్చించి జిల్లా పోలీస్ కమిషనరేట్ నిర్మించారు. అత్యాధునిక హంగులతో, సాంకేతికత, వసతులతో ఈ భవనాన్ని నిర్మించారు.. నూతన కమిషనరేట్ ప్రాంగణంలోనే సీపీ,ఆడిషనల్ డీసీపీలు స్థానిక ఎసీపీకి ప్రత్యేక చాంబర్లు నిర్మించారు. అదే విధంగా సిద్దిపేట పట్టణంలో నూతనంగా ఎమ్మెల్యే క్యాంపును నిర్మించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ నెల 20న ప్రారంభించడానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. -
సమీకృత కలెక్టరేట్ల నిర్మాణ ప్రక్రియ కొలిక్కి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యా లయాలు ఒకేచోట అందుబాటులో ఉండేందుకు వీలుగా 2017 అక్టోబర్ నుంచి మొదలుపెట్టిన కలెక్టరేట్ భవనాల నిర్మాణం... ఒకట్రెండు చోట్ల మినహా అన్ని జిల్లాల్లో దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుంది. ఈ నెలలో సిద్దిపేట, నిజామాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల కలెక్టరేట్ భవనాలు ప్రారంభానికి సిద్ధంకాగా మరో 6 జిల్లాల్లో వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన కేంద్రాల్లోనూ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, చిన్నచిన్న పనులే పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి ప్రారంభించిన ఏడాదిన్నర లోపే ఈ భవన నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా స్థల సేకరణలో వివాదాలు, భూసేకరణ, కాంట్రాక్టు పనులకు బిల్లుల మంజూరు, కరోనా లాక్డౌన్, కూలీల కొరత తదితర కారణాల వల్ల జాప్యం జరిగింది. మొత్తంమీద సమీకృత కలెక్టరేట్ భవనాలు త్వరలోనే అందు బాటులోకి రానుండటంతో ప్రజలకు పాలనా సౌలభ్యం కలగనుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. కలెక్టరేట్ భవనాల నిర్మాణంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసం నుంచి అధికారులతో సమీక్షించారు. పెండింగ్ పనులను పూర్తి చేసి త్వరగా ఈ భవనాలనుప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చదవండి: (ఐటీ ఉద్యోగులు స్కై వాక్ చేస్తూ ఆఫీస్‌లకు..) రాష్ట్రవ్యాప్తంగా సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణ పురోగతి ఇలా... ►సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ల పనులకు 2017 అక్టోబర్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 2020 డిసెంబర్10న సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. కానీ చివరి నిమిషంలో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ జిల్లా భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ►సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్ భవనానికి 2017 అక్టోబర్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 2018లో పనులు ప్రారంభించగా 2019 అక్టోబర్‌లో పనులు పూర్తి కావాలి. కానీ నిర్మాణ స్థలం లోతట్టు ప్రాంతం కావడంతో మట్టి ఎక్కువగా నింపాల్సి వచ్చింది. రూ. 30 కోట్ల వ్యయ అంచనాతో ప్రారంభమైన ఈ భవనం నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. చదవండి: (రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ వస్తుందిలా.. ) ►జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో 2017 అక్టోబర్‌లో నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. 25.34 ఎకరాల విస్తీర్ణంలో రూ. 30 కోట్లతో చేపట్టిన కలెక్టరేట్ నిర్మాణం 6 నెలల కిందటే పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ►వరంగల్ అర్బన్ కలెక్టరేట్ కొత్త భవనం మొత్తం మూడంతస్తుల్లో అన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు ఒకేచోట ఉండేలా డిజైన్ చేశారు. సుమారు రూ. 45 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు 99 శాతం పూర్తయ్యాయి. ►కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ పనులు పూర్తయ్యాయి. 2017 అక్టోబర్ 10న దీనికి శంకుస్థాపన జరగ్గా అన్ని పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ►పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు 2018 అక్టోబర్ 11న అప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. రూ. 36.60 కోట్ల అంచనాలతో పనులు చేపట్టారు. ఇప్పుడు 95 శాతం పనులు పూర్తయ్యాయి. ►నిజామాబాద్ రూరల్ మండలం ఖానాపూర్ శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్‌ను 2017, అక్టోబర్ 11న అప్పటి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 62 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం భవన నిర్మాణం మొత్తం పూర్తయింది. ఆఫీసుల్లో ఫర్నిచర్ పనులు, అదనపు పనులు, అంతర్గత రోడ్డు పనులు, మొక్కలు నాటడం, ఇతర చిన్నపాటి పనులు కొనసాగుతున్నాయి. మొత్తం పనులు పూర్తి కావడానికి మరో నెల నుంచి 45 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ►వనపర్తి జిల్లా కేంద్రంలో 2017 అక్టోబర్ 11న నూతన కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు 85 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం 17 ఎకరాల్లో రూ. 51.7 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సీలింగ్, ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నారు. ►గద్వాల కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 36.80 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు రూ. 28 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూన్ నాటికి పనులన్నీ పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. ►ఖమ్మం జిల్లాలో రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ భవన నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు 70 శాతం పనులు పూర్తయ్యాయి. ►జనగామ నూతన కలెక్టరేట్ భవన నిర్మాణం పనులను 2017 డిసెంబర్ మాసంలో ప్రారంభించారు. ఇందుకోసం రూ. 42 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఏప్రిల్ మొదటి వారానికల్లా 100 శాతం పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ►మహబూబాబాద్ జిల్లాలో అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 2018 ఏప్రిల్ 4న ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం నాలుగు బ్లాకులుగా రూ. 43 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఏ,బీ బ్లాకులు చివరి దశలో ఉండగా, మిగిలిన రెండు బ్లాకులు స్లాబ్ దశలో ఉన్నాయి. ►మంచిర్యాల జిల్లాలో 2018 ఫిబ్రవరి 27న నస్పూర్ లో ప్రారంభించారు. నస్పూర్‌లో 26.27 ఎకరాల స్థలంలో, 41.54 కోట్ల నిధులు కేటాయించారు. ఇప్పటికి సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. ►భూపాలపల్లి జిల్లాలో 2017 అక్టోబర్ 11న రూ. 30.80 కోట్లతో అప్పటి స్పీకర్ మధుసూదనాచారి శంకుస్థాపన చేశారు. మూడేళ్లు గడిచినా ఇక్కడ నిర్మాణం పిల్లర్ల దశలోనే ఉంది. స్థల వివాదంతో పాటు కోర్టు కేసులు, నిర్మాణ స్థలం చెరువులో ఉండడంతో డిజైన్మార్చాల్సి రావడంతో తాత్కాలికంగా పనులకు బ్రేక్ పడింది. ►ములుగు జిల్లా కలెక్టరేట్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. ములుగు మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో రెవెన్యూ అధికారులు 70 ఎకరాల స్థలాన్ని గుర్తించినా స్థలం అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం కొనసాగుతోంది. ►సూర్యాపేట జిల్లా నూతన కలెక్టరేట్ భవనానికి 2018 మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ. 47.85 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం శ్లాబు పనులు పూర్తవగా ఇంటీరియర్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ►మెదక్ పట్టణ శివారులో కొత్త కలెక్టరేట్ కార్యాలయ భవన నిర్మాణానికి 2018 మే 9న సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో రూ. 48.62 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టారు. ఈ ఏడాది మార్చి వరకు పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ►నిర్మల్ జిల్లా కేంద్రం శివారులోని నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి రూ. 40 కోట్లు కేటాయించారు. 2018 సెప్టెంబర్‌లో భీమన్న గుట్టపై స్థలాన్ని కేటాయించగా అక్కడ నిర్మాణం చేయవద్దంటూ ప్రతిపక్ష పార్టీలతోపాటు స్థానికులు ఆందోళన నిర్వహించారు. దీంతో వేరే చోట 25 ఎకరాలను కేటాయించినా అక్కడ కూడా సమస్య ఉండటంతో తిరిగి 15 ఎకరాల్లోనే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పరిపాలన సులభతరానికే..: మంత్రి ప్రశాంత్‌రెడ్డి పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగానే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి నూతన సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సమీకృత కలెక్టరేట్ల భవన నిర్మాణ పనుల పురోగతిపై ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెలలోనే సీఎం చేతుల మీదుగా 10 కలెక్టరేట్లను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ నెల మొదటి వారంలో సిద్దిపేట, నిజామాబాద్, రెండో వారంలో కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, మూడో వారంలో వరంగల్, జనగాం, పెద్దపల్లి, నాలుగో వారంలో వికారాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టరేట్లను ప్రారంభిస్తామని, అన్ని పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని కోరారు. వనపర్తి, మహబూబాబాద్, మెదక్, నాగర్‌కర్నూల్, ఖమ్మం, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల కలెక్టరేట్ల పనుల్లో వేగం పెంచాలని, వచ్చే నెలలో వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, ఎస్ఈలు, ఈఈలు, వాస్తు నిపుణుడు సుధాకర్‌తేజ పాల్గొన్నారు. -
కరోనాపై కృష్ణాజిల్లా కలెక్టర్ పేరడి పాట
సాక్షి, విజయవాడ: కరోనాపై ప్రజలు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండి వైరస్‌ను నియంత్రించాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. కోవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సినిమా పాటకు కలెక్టర్ ఇంతియాజ్ పేరడి పాటను రాయగా ఆ పాటను చంద్రిక పాడారు. ఈ పాటను శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 36 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. వైరస్‌పై ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా నిర్లక్ష్యంగా ఉంటే దాని బారిన పడతారన్నారు. కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పారు. ఈనెల 30 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ కోవిడ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చదవండి: ఎమ్మెల్యే వంశీకి పాజిటివ్ విజయదశమి శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే విజయదశమి అని, ఈ పండుగ ప్రజలందరికి విజయాలు చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు. -
కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల నిరసన
సాక్షి, ఆదిలాబాద్: కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్సీ, పదోన్నతులు, బదిలీలు తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఫైన్డ్ పెన్షన్ స్థానంలో సీపీఎస్‌ను పార్లమెంట్ ఆమోదం లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ప్రవేశపెట్టిందన్నారు. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం రద్దు చేసి నూతన పెన్షన్ విధానాన్ని అమలు పరుస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో పాత పెన్షన్ విధానం అమలు చేసే అవకాశమున్నా.. ఏకపక్షంగా సీపీఎస్‌నే అమలు చేస్తామంటూ పీఎఫ్ఆర్డీఏతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ పథకంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు రిటైర్డ్ అయినా.. చనిపోయినా.. వారి కుటుంబాలకు నెలకు రూ.2 వేల కంటే తక్కువ మొత్తంలో పింఛన్ అందుతుందన్నారు. ఉద్యోగులకు నష్టం కలిగించే విధంగా ఉన్న సీపీఎస్‌ను రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగుల ఐక్యవేదిక నాయకులు వెంకట్, శ్రీనివాస్, నరేందర్, అశోక్, దిలీప్, సురేఖ, వెంకటేశ్, స్వామి, మనోజ్, వృకోధర్, తదితరులు పాల్గొన్నారు. -
రొయ్యల క్రయవిక్రయాలపై ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, అమరావతి: రొయ్యల క్రయ విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. క్రయవిక్రయాలు రెవెన్యూ, మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణలో జరగాలని ఆదేశిస్తూ అధికారులు పాటించాల్సిన అంశాలపై మార్గదర్శకాలను విడుదల చేసింది. వారం రోజులుగా హేచరీస్ నిర్వాహకులు, ఎగుమతిదారులు కొనుగోళ్లు నిలిపివేయడం, ఒకవేళ కొనుగోలు చేసినా కిలోకు రూ.80 వరకు తక్కువ రేటును చెల్లిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని కొందరు రైతులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం.. ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్న ప్రాంతాలకు ఇద్దరేసి అధికారులను నియమించింది. వారి మొబైల్ నంబర్లు రైతులకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేసింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కలెక్టర్ కార్యాలయాల్లోని కంట్రోల్ రూమ్‌లు పనిచేయనున్నాయి. రైతులు తమ సమస్యలను ఈ కంట్రోలు రూమ్‌లకు తెలిపితే అధికారులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన రేట్లకే ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు రొయ్యలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
ఐఏఎస్ అధికారిపై అత్యాచార ఆరోపణలు
రాయ్‌పూర్ : ఉన్నతమైన పదవిలో ఉండి పలువురికి ఆదర్శంగా మెలగాల్సిన జిల్లా కలెక్టరే వక్రబుద్ది చూపించాడని ఓ మహిళ ఆరోపించడం ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపింది. సాక్షాత్తూ కలెక్టరేట్లోనే ఐఏఎస్ అధికారి తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపించడం పెను దుమారం రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్తను డిస్మిస్ చేస్తానని బెదిరించి తనపై జంజ్‌గిర్-చంపా జిల్లా మాజీ కలెక్టర్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ జనక్ ప్రసాద్ పాథక్ అత్యాచారానికి పాల్పడ్డాడని 33 ఏళ్ల మహిళ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నాళ్లుగా తనకు అశ్లీల సందేశాలు పంపిస్తూ లైంగింగా వేధిస్తున్నాడని, మే 15న తనపై కలెక్టరేట్లోనే అత్యాచారం చేశాడని జిల్లా ఎస్పీ పారుల్ మాధూర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. పాథక్ తనకు పంపిన ఫోన్ సందేశాలు, ఫొటోలకు పోలీసులకు ఆమె అందజేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ పారుల్ తెలిపారు. నిందితుడిపై ఐపీసీ 376, 506, 509 బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అత్యాచార ఆరోపణలు రావడంతో సదరు కలెక్టర్ జనక్ ప్రసాద్‌ను ఛత్తీస్గడ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టరుగా మే 26న ప్రభుత్వం బదిలీ చేసింది. తనపై వచ్చిన అత్యాచార ఆరోపణలపై స్పందించేందుకు కలెక్టర్ అందుబాటులోకి రాలేదు. అయితే ఇప్పటివరకు కలెక్టర్‌ని అరెస్ట్ చేయకపోవడంతో పెద్ద ఎత్తున మహిళా సంఘాలు నిరసనలు చేపట్టాయి. -
కుటుంబంతో వచ్చి కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నం
నెల్లూరు (పొగతోట) : కలెక్టరేట్‌కు బుధవారం కుటుంబంతో కలిసి వచ్చిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. జిల్లాలోని సూళ్లూరుపేటకు చెందిన అరిగెల నాగార్జున రెవెన్యూ అధికారులు తనకు న్యాయం చేయడం లేదని కుటుంబం సహా కలెక్టరేట్‌కు వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నానని అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చాడు. అన్నట్లుగానే భార్య భవానీ, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో కలెక్టరేట్‌కు వచ్చి ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పటించుకునే ప్రయత్నం చేశాడు. పెట్రోలు బాటిల్, అగ్గిపెట్ట స్వాధీనం చేసుకునే సమయంలో పోలీసులకు అతనికి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, చుట్టుపక్కల ఉన్న వారు నాగార్జునపై నీళ్లు పోశారు. డీఆర్ఓ, పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని నాగార్జునను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నాగార్జున ఏం చెబుతున్నాడంటే.. మాది చిట్టమూరు మండలం చిల్లమూరు. 110 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాలు మంజూరు చేయించేందుకు రైతుల నుంచి రూ.1.20 కోట్లు డబ్బులు వసూలు చేసి అప్పటి తహసీల్దార్ చంద్రశేఖర్‌కు విడతల వారీగా అటెండర్, వీఆర్ఓల ద్వారా ఇచ్చాను. నగదు ఇచ్చినట్లు నా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లాలకు బదిలీపై వెళ్లి తిరిగి వచ్చి సైదాపురంలో పని చేస్తున్నాడు. ఈ విషయమై అనేక పర్యాయాలు అడిగిన సరైన సమాధానం చెప్పలేదు. ఇంటిపైకి ఇతర వ్యక్తులను పంపించి దౌర్జన్యం చేయించాడు. ఈ విషయంపై జిల్లా అధికారులకు వినతి పత్రం సమర్పించినా ఫలితం లేదు. గత్యంతరంలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను. విచారిస్తాం: డీఆర్ఓ దీనిపై డీఆర్ఓ మాట్లాడుతూ నాగార్జున ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాన్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన నాగార్జునపై కేసు నమోదు చేస్తామన్నారు. కాగా నాగార్జున చేస్తున్నవి నిరాధార ఆరోపణలని సైదాపురం తహసీల్దార్ చంద్రశేఖర్ ఖండించారు. గతంలో ఇదే విధంగా బెదిరిస్తే సబ్‌కలెక్టర్‌కు విషయం చెప్పి 15 రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. -
ఇలా వచ్చారు.. అలా వెళ్లారు!
సాక్షి, ఆదిలాబాద్: కొత్త జిల్లా కలెక్టర్ దేవసేన సోమవారం సాయంత్రం 7గంటల తర్వాత బాధ్యతలు స్వీకరించాక కొద్దిసేపు మాత్రమే జిల్లాలో ఉన్నారు. అనంతరం ఆమె తిరుగు ప్రయాణం అయ్యారు. రెండుమూడు రోజుల పాటు కలెక్టర్ జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండరని కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది పేర్కొంటున్నారు. సాధారణంగా కొత్త కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మరుసటి రోజు వివిధ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలుస్తారు. అయితే మంగళవారం అందుబాటులో లేకపోవడంతో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎలాంటి సందడి కనబడలేదు. సోమవారం రాత్రి కొద్దిసేపు మాత్రమే జిల్లాలో ఉన్న ఆమె హైదరాబాద్‌కు పయనమయ్యారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బదిలీల కంటే ముందు ఆమె హైదరాబాద్‌కు బదిలీ కోసం ప్రయత్నించారని సమాచారం. అయినప్పటికీ ఆదిలాబాద్‌లో పోస్టింగ్ ఇవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా బదిలీ అయిన కలెక్టర్లు వెనువెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఆమె సోమవారం సాయంత్రమే ఇక్కడికి వచ్చి విధుల్లో చేరారు. హైదరాబాద్‌కు చెందిన అల్లమరాజు దేవసేన పరిపాలన విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించడంతోపాటు ప్రజాసమస్యలు నేరుగా తెలుసుకొని పరిష్కరించగల తత్వం కలిగి ఉన్నారు. 1997లో గ్రూప్–1కు ఎంపికయ్యారు. హైదరాబాద్ ఆర్డీఓగా, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. 2008లో కన్ఫర్డ్ ఐఏఎస్ అయ్యారు. అటుపై సెర్ప్ డైరెక్టర్‌గా, ఎన్నికల కమిషన్ డిప్యూటీ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత కరీంనగర్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. జిల్లాల పునర్విభజనతో కొత్త జిల్లాగా ఏర్పడిన జనగామ జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు. అక్కడ ఏడాదిపైగా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. జనగామ కలెక్టర్‌గా ఉన్న సమయంలో భూ సంబంధిత వ్యవహారాల్లో అక్కడి అధికార పార్టీ ప్రజాప్రతినిధిని ఎదురించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారనే పేరుంది. దేవసేన 2018 జనవరిలో పెద్దపల్లి కలెక్టర్‌గా వెళ్లారు. అక్కడ ఏడాదికిపైగా పనిచేశారు. ఆమె కృషి ఫలితానికి మూడు జాతీయ అవార్డులూ వరించాయి. -
మచిలీపట్నం కలెక్టరేట్లో కలకలం
జిల్లా పాలనా కేంద్రమైన కలెక్టరేట్ ప్రాంగణం.. సోమవారం కావడంతో ఉదయం నుంచి ‘స్పందన’కు వచ్చిపోయే అర్జీదారులతో కిటకిటలాడుతోంది. కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జేసీ మాధవీలత, డీఆర్వో ప్రసాద్ తదితర జిల్లా అధికారులంతా అర్జీదారుల నుంచి వినతులు స్వీకరిస్తూ బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కలెక్టరేట్లో కీలక విభాగాధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఇదే ప్రాంగణంలో ఉన్న ఇతర శాఖల కార్యాలయాలకు చెందిన పలువురు సిబ్బంది గతంలో ఏసీబీకి చిక్కినప్పటికీ, జిల్లా ఉన్నతాధికారులు కార్యాలయంలో ఉండగానే కలెక్టరేట్‌కు చెందిన ఓ అధికారి.. ఏసీబీకి చిక్కడం సంచలనం రేపింది. సాక్షి, మచిలీపట్నం/చిలకలపూడి: మచిలీపట్నం కలెక్టరేట్లో భూసంస్కరణల విభాగం అధీకృత అధికారి(ఏఓ)గా పనిచేస్తున్న దాసరి ప్రశాంతి ఓ రైతు నుంచి రూ.3లక్షలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కారు. పట్టాదార్ పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ కోసం రూ.6లక్షలు డిమాండ్ చేసిన ప్రశాంతి.. తొలివిడతగా రూ.3లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ ఏఎస్పీ కేఎం మహేశ్వర రాజుతో పాటు బాధిత రైతు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన మోకా రామలింగేశ్వరరెడ్డి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు వద్ద 4.53 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. పసుపుకుంకుమ కింద వచ్చినట్టుగా కోర్టు నుంచి పొందిన ఆర్డర్ ఆధారంగా కృష్ణకుమారి అనే ఆమె నుంచి ఈ భూమిని కొనుగోలు చేసి 2.53 ఎకరాలు తన పేరిట, మరో ఎకరం తన తల్లి మోకా జయలక్ష్మి, ఇంకో ఎకరం భూమి తన సోదరి ఆళ్ల జానకీదేవి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పట్టాదార్‌పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్స్ కోసం 2016లో ఏ.కొండూరు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేయగా, ఆ భూమి ల్యాండ్ సీలింగ్‌లో ఉన్నట్టుగా స్థానిక అధికారులు చెప్పారు. దీంతో నూజివీడు ఆర్డీఓను ఆశ్రయించగా, అక్కడ నుంచి కలెక్టరేట్‌కు ఫైల్ చేరింది. అప్పట్లోనే ఈ పని నిమిత్తం రూ.5 లక్షలు ముట్టజెప్పిన రామలింగేశ్వర రెడ్డి 2017 నుంచి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం ఫైనల్ నోటీసులు జారీ చేస్తున్న సమయంలో ఏఓ ప్రశాంతి బాధిత రైతునకు సమాచారం పంపారు. మీ చేతికి పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ కావాలంటే కనీసం రూ.6లక్షలు ఖర్చవుతాయని అందుకు సిద్ధమైతే కలెక్టరేట్ రావాలని సూచించారు. దీనిపై రైతు రామలింగేశ్వరరావు తాను రూ.6 లక్షలు ఇవ్వలేనని స్పష్టం చేయడంతో.. ముందు మీ దగ్గర ఎంత ఉంటే అంత పట్టుకురండి మిగిలిన డబ్బుల సంగతి ఆ తర్వాత చూద్దామని సూచించారు. దీంతో ఆమె అడిగిన డబ్బులు ఇచ్చినా పని అవుతుందో లేదోనన్న ఆందోళనతో రామలింగేశ్వరారవు విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశారు. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు రూ. 10లక్షలు ఇవ్వాలంటూ.. ఏసీబీ ఏఎస్పీ మహేశ్వరరాజు సూచన మేరకు రూ.3లక్షలు కవర్లో పెట్టి నేరుగా కలెక్టరేట్ పై అంతస్తులో ఉన్న భూసంస్కరణల విభాగానికి సోమవారం మధ్యాహ్నం 1గంట సమయంలో చేరుకున్న రామలింగేశ్వరరెడ్డి సెక్షన్లో అందరూ చూస్తుండగానే డబ్బులతో ఉన్న కవర్‌ను ఆమెకు అందజేసి ఇందులో రూ.3 లక్షలున్నాయి, ఇక ఇవ్వలేను తీసుకుని మా భూమికి పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ ఇప్పించాలని వేడుకున్నారు. రూ.3లక్షలు కాదు కదా, రూ.6లక్షలు ఇచ్చినా కుదరదు. కనీసం రూ.10 లక్షలు ఇస్తే కాని మీ పని అవదు గుర్తించు కోండి అని బదులిచ్చింది. ఈ డబ్బులేమైనా నా ఒక్కదానికే అనుకున్నారా? కలెక్టర్‌ట్‌లోని ఓ ఉన్నతాధికారితో పాటు సంబంధిత విభాగాల అధికారులకు కూడా ముట్టజెప్పాలి తెలుసా అని చెప్పుకొచ్చారు. కవర్ సొరుగులో వేస్తుండగా.. కవర్లో ఉన్న సొమ్ములను తన టేబుల్ సొరుగులో వేస్తుండగా ఏసీబీ ఎఎస్పీ మహేశ్వరరాజు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. టేబుల్ సొరుగులో ఉన్న నగదును స్వా«దీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఏఓ ప్రశాంతిని అదుపులోకి తీసుకున్నారు. పట్టాదార్‌పాస్ పుస్తకం, టైటిల్ డీడ్స్ జారీ కోసం తనను చాలా ఇబ్బంది పెడుతున్నారని, రూ.6లక్షలు డిమాండ్ చేశారని చెప్పడంతో తాము వలపన్ని డబ్బులు సొరుగులో వేసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా మని ఏసీబీ ఏఎస్పీ మహేశ్వరరాజు మీడియాకు తెలిపారు. అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు çపర్చనున్నట్టు చెప్పారు. ఐదేళ్లు నరకం చూశా.. పట్టాదార్ పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ కోసం గడిచిన ఐదేళ్లుగా చెప్పులరిగేలా తిరిగా. గతంలో రూ.5 లక్షలు ఇచ్చా. మళ్లీ రూ.6లక్షలు డిమాండ్ చేశారు. ఇక చేసేది లేక ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చా. రెవెన్యూలో సామాన్యులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. – మోకా రామలింగేశ్వరరెడ్డి, బాధిత రైతు గతంలో పట్టుబడినా.. మారని తీరు తహసీల్దార్‌గా ఏ.కొండూరులో పనిచేసిన సమయంలో ఇదే రీతిలో చేతివాటం ప్రదర్శించి ఏసీబీ అధికారులకు దొరికిపోయినా ఆమె తీరులో మాత్రం మార్పు రాలేదు. రేపూడి తండా గ్రామానికి చెందిన బి.గోలిరాజు అనే గిరిజన రైతు తనకు చెందిన రెండెకరాల వ్యవసాయ భూమికి పట్టాదార్‌పాస్‌పుస్తకం జారీ కోసం రూ.8వేలు లంచం తీసుకుంటూ డగా 2014 మే 5వ తేదీన ఏసీబీ అధికారులకు చిక్కి సస్పెన్షన్‌కు గురయ్యారు. కొంతకాలం ఏ పోస్టింగ్ లేకుండా ఉన్న ఆమె టీడీపీ ప్రజాప్రతినిధులతో పైరవీలు చేయించుకుని కలెక్టరేట్లోని కీలక విభాగమైన భూసంస్కరణల ఏఓగా పోస్టింగ్ పొందారు. -
ఆరోగ్య సిద్దిపేట లక్ష్యంగా..
సిద్దిపేట జోన్: ‘స్వచ్ఛ సిద్దిపేట లక్ష్యంగా మరో ముందడుగుకు ఇదొక ప్రయత్నం. ప్రజలకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించి ఆరోగ్య సిద్దిపేటగా మార్చే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒకేసారి సిద్దిపేటలో రెండు వేల మందికి ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ద్వారా శిక్షణ ఇచ్చి కొత్త ఒరవడితో చరిత్ర సృష్టిద్దాం’అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎన్జీవో భవన్లో తినుబండారాల విక్రయాలు, ఆహార నాణ్యతపై పాటించాల్సిన నిబంధనలపై శిక్షణ పూర్తి చేసుకున్న 800 మందికి సామగ్రి, పరికరాలను ఉచితంగా అందజేశారు. మిగతా 1,200 మందికి కూడా శిక్షణ పూర్తి చేసి చరిత్ర సృష్టిద్దామన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణాన్ని పరిశుభ్రతలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపే క్రమంలో దశలవారీగా ప్రగతిని సాధించామన్నారు. దీంతోనే సిద్దిపేటకు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయన్నారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పరిశుభ్రమైన వాతావరణంలో రుచిని, శుచిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి ఆహార నాణ్యతలో శిక్షణ ఇచ్చామని తెలిపారు. దేశంలోనే తొలి సారిగా ఒక పట్టణంలో వందశాతం ఆహార విక్రయ యాజమానులకు, కార్మికులకు శుచి, శుభ్రతలపై శిక్షణ ఇచ్చి సిద్దిపేట పట్టణం కొత్త ఒరవడికి నాంది పలికిందన్నారు. జనవరి 15 నుంచి మార్చి 15 వరకు మున్సిపల్ అధికారులు స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేట వాలంటీర్లు తినుబండారాల విక్రయశాలలను, హోటళ్లను సందర్శించి పనితీరును పరిశీలిస్తారని తెలిపారు. 20 సూత్రాలలో కనీసం 17 సూత్రాలను అమలు చేసే వారికి గ్రీన్‌కలర్ చిహ్నంతో కూడిన ఓ కార్డును పంపిణీ చేస్తామన్నారు. శిక్షణ పొందిన వారికి డ్రెస్‌కోడ్, ఇతర పరికరాలను, శిక్షణ ధ్రువీకరణ పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఎన్జీవో భవన్ నుంచి పట్టణంలో యూనిఫాం ధరించిన ఆహార విక్రయశాలల ప్రతినిధులతో కలిసి మంత్రి హరీశ్‌రావు చైతన్య ర్యాలీలో పాల్గొన్నారు. కాగా కొండపాక మండలం దుద్దెడ శివారులో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ఫిబ్రవరి నెలఖారులోగా పూర్తిచేయాలని అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. దీన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టరేట్లో నిర్మాణ పనులను హరీశ్ ఆకస్మికంగా తనిఖీచేశారు. -
అసలేం జరుగుతోంది?
సాక్షి, ఇందూరు (నిజామాబాద్): జిల్లాలో స్త్రీనిధి రుణాల మంజూరు, రికవరీ తీరుపై కలెక్టర్ రామ్మోహన్రావు అసహనం వ్యక్తం చేశారు. గత సంవత్సరాల్లో స్త్రీనిధి రుణాల మంజూరు, రికవరీలో ముందున్న జిల్లా... కొన్ని నెలులుగా ఎందుకు ఒక్కసారిగా వెనుకబడి పోయిందని ఆరా తీశారు. రుణాల ప్రగతి ఇంతగా పడిపోవడానికి గల కారణాలేంటని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో డీఆర్డీఏ, మెప్మా అధికారులు, సిబ్బందితో స్త్రీనిధి రుణాల ప్రగతిపై ఆయన సమీక్షించారు. స్త్రీనిధి పథకం కింద ఈ ఏడాది రూ.207 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు రూ.135 కోట్ల రుణాలు మహిళా సంఘాల సభ్యులకు మంజూరు చేయాల్సి ఉండగా, కేవలం 19 శాతంతో రూ.39 కోట్లు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బ్యాంకుల అశ్రద్ద ఉంటే వాటి వివరాలు తెలుపాలని, వారానికోసారి సమీక్షించుకుని సమస్య ఎక్కడుందో దృష్టి పెట్టి రుణాల పురోగతిని సాధించేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. వచ్చే జనవరిలో అభివృద్ధి కనిపించాలని, నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. మహిళా సంఘాల బలోపేతానికి, మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడే స్త్రీనిధి రుణాల లక్ష్యానికి అనుగుణంగా మంజూరు చేయాలన్నారు. మంజూరు చేసిన రుణాలకు రికరీకి ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. డీఆర్డీవో రమేశ్ రాథోడ్, మెప్మా పీడీ రాములు, స్త్రీనిధి ఆర్ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తహసీల్దార్ న్యాయం చేయడం లేదు..ఉరేసుకుంటున్నా!
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): ‘తహసీల్దార్ నాకు న్యాయం చేయడం లేదు.. అందుకే ఉరివేసుకుంటున్నా..’ అని ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. కలెక్టరేట్ ఆవరణలో ఉన్న చెట్టెక్కి ఉరేసుకునేందుకు యత్నించడం కలకలం సృష్టించింది. ధర్పల్లి మం డలం దుబ్బాక గ్రామానికి చెందిన అక్కం గంగాధర్‌కు రేకులపల్లిలో వ్యవసాయ భూమి ఉంది. గంగాధర్ తమ్ముడు సంతోష్ పొలం కూడా పక్కనే ఉంది. సంతోష్ తన పొలంలో బోరు వేసినప్పటి నుంచి గంగాధర్ బోరులో నీళ్లు రావడంలేదు. దీనిపై తహసీల్దార్‌కు ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదులు చేశానా న్యాయం జరగడం లేదనే ఆవేదనతో గంగాధర్ సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తాడుతో ఉరి వేసు కునేందుకు యత్నించాడు. ప్రజావాణికి వచ్చిన వారంతా చెట్టె క్కిన గంగాధర్‌ను ఎంత సముదాయించినా కిందికి దిగలేదు. గంగాధర్‌కు తెలియకుండా చెట్టు ఎక్కిన ఓ వ్యక్తి గంగాధర్‌ను పట్టుకుని తాడును విప్పాడు. గంగాధర్‌ను కిందికి దింపి నిజామాబాద్ ఆర్డీఓ వద్దకు తీసుకెళ్లి సమస్య ఏంటో తెలుసుకున్నారు. ధర్పల్లి తహసీల్దార్‌తో మాట్లాడిన ఆర్డీఓ బుధవారం విచారణకు వస్తున్నానని, అందుబాటులో ఉండాలని ఆదేశించారు. -
కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మికుల బైఠాయింపు
-
గ్రామసభల్లో ఇళ్లపట్టాల అర్హుల జాబితా
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో గ్రామసభలు నిర్వహించి ఇళ్లపట్టాలకు అర్హులైన వారి జాబితాలను ప్రచురించనున్నట్లు జాయింట్ కలెక్టర్ మార్కండేయులు తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి జిల్లావ్యాప్తంగా ఈనెల 15 వరకు గ్రామసభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇళ్లు లేని వారికి ఇళ్ల పట్టాలను అందజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు గుర్తించిన అర్హుల జాబితాను గ్రామసభల్లో ప్రచురించనున్నట్లు తెలిపారు. ప్రచురించిన అర్హుల జాబితాలో ఏవైనా పొరపాట్లు, అభ్యంతరాలు, అర్హుల పేర్లు నమోదు కాకపోయినా తెలియజేసేందుకు అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. జిల్లాలోని 1,542 రెవెన్యూ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తహసీల్దార్, ఎంపీడీవో, ఇతర శాఖల అధికారులతో సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇళ్లు లేనివారు లక్ష మంది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 60 వేలు, పట్టణ ప్రాంతాల్లో 40 వేలు ఇళ్లు లేని వారు ఉంటారని జేసీ తెలిపారు. వారందరికీ ఉగాది నాటికి ఇళ్లపట్టాలు అందజేయనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని 60 వేల మందిలో 47 వేల మందికి, అర్బన్‌లోని 40 వేల మందిలో 15 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భూమిని గుర్తించినట్లు తెలివారు. పట్టణ ప్రాంతాల్లో స్థలం కొరత ఉందన్నారు. 570 ఎకరాలు కొనాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఏప్రిల్ నుంచి సన్న బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. -
మూడేళ్లయినా ఖరారు కాని జిల్లా కేంద్రం
సాక్షి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటై ఈ దసరాతో మూడేళ్లవుతున్నా.. జిల్లా కేంద్రం ఎక్కడ అనేది ఖరారు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటైన జిల్లాలకు కలెక్టరేట్ సముదాయాలు చివరి దశలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా రూరల్ జిల్లా కేంద్రం ఉండటంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. -
13 వరకు సెలవులో సిద్దిపేట కలెక్టర్
సాక్షి, సిద్దిపేట: జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఈ నెల 13 వరకు సెలవులో ఉండనున్నారు. చెవినొప్పి ఎక్కువ కావడంతో మరో 11 రోజుల సెలవు కావాలని కోరుతూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధార్ సిన్హాను కోరారు. పరిశీలించిన ఆయన 13 వరకు సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి వరకు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణబాస్కర్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
సంక్షేమం.. పారదర్శకతే లక్ష్యం
‘ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు చేర్చేందుకు కృషి చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్న పథకాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రస్తుతం రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక సర్వే కొనసాగుతోంది. స్పందనలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా చేస్తున్నాం. భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. ఇసుక కొరతను అధిగమించేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం’ అని కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనందకుమార్ చెప్పారు. ఆయన ‘సాక్షి’తో మంగళవారం ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి : ఇసుక కొరతను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? కలెక్టర్: జిల్లాలో ఎన్జీటీ తీర్పుతోపాటు కృష్ణానదికి వరద రావడంతో కొంత మేర ఇసుక కొరత తలెత్తింది. దీన్ని అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో మరో తొమ్మిది కొత్త రీచ్‌లకు కూడా ప్రతిపాదనలు పంపాం. ఐదు స్టాక్ యార్డులను సిద్ధం చేస్తున్నాం. మున్నంగిలో వే బ్రిడ్జితో అన్ని ఏర్పాట్లు చేశాం. కృష్ణా నదిలో ప్రవాహం తగ్గగానే స్టాక్ యార్డులకు ఇసుక తరలించి, అవసరమైన వారికి సరఫరా చేస్తాం. ప్రజలకు కోరినంత ఇసుకను పారదర్శకంగా అందిస్తాం. సాక్షి : రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక సర్వే ఎలా సాగుతోంది? కలెక్టర్: జిల్లాలో రైతు భరోసా పథకం లబ్ధిదారుల గుర్తింపునకు సంబంధించి గ్రామస్థాయిలో ప్రత్యేక బృందాల ద్వారా సర్వే చేస్తున్నాం. ప్రధాన మంత్రి కిసాన్ యోజనకు ఎంపికైన లబ్ధిదారుల జాబితాలను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తాం. అనర్హులను తొలగిస్తాం. అర్హులై ఉండి పీఎం కిసాన్ జాబితాలో చోటు చేసుకోని వారికి చోటు కల్పిస్తాం. రైతు భరోసా ద్వారా భూమి లేని కౌలు రైతులకు ఎంతో మేలు చేకూరనుంది. దీని ద్వారా జిల్లాలో నాలుగు లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతాయి. రైతు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.12,500 అందించనున్నాం. సాక్షి : సచివాలయాల ఏర్పాటు వివరాలు ఏమిటి? కలెక్టర్: అక్టోబర్ 2వ తేదీన జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ అందుబాటులోకి రానుంది. జిల్లాలో 57 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున గ్రామ సచివాలయాలను ప్రారంభించేం దుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. నగర, పట్టణాల్లో ఒక వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో మోడల్ గ్రామ పంచాయతీగా బొల్లాపల్లి మండలంలోని మూగచింతల గ్రామాన్ని ఎంపిక చేశాం. జిల్లా ఇన్చార్జి మంత్రి పేర్ని వెంకట్రామయ్య, జిల్లా మంత్రులతో అక్కడ లాంఛనంగా మోడల్ సచివాలయాన్ని ప్రారంభిస్తాం. సచివాలయాలకు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్లను అందుబాటులో ఉంచాం. గ్రామ, నగర, పట్టణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలను గుర్తించాం. నవంబర్ నాటికి పూర్తి స్థాయిలో గ్రామ సచివాలయాలను ప్రారంభిస్తాం. సాక్షి : ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందా? కలెక్టర్: పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలు అవసరమైన లబ్ధిదారుల ఎంపిక ముమ్మరంగా జరుగుతోంది. గ్రామ వలంటీర్లు, రెవెన్యూ సిబ్బంది ద్వారా నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు, ఇంటి స్థలాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకున్నాం. ప్రజా సాధికారిక సర్వే ప్రకారం ఆరు స్థాయిల్లో జాబితాను పరిశీలిస్తున్నాం. 2.12 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, పక్కాఇళ్లు అందించేందుకు అవసరమైన స్థలాలను గుర్తించే పనిలో రెవెన్యూ శాఖ పూర్తిస్థాయిలో నిమగ్నమైంది. సాక్షి : ఆర్థిక సాయం కోసం ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు? కలెక్టర్: జిల్లాలో ట్యాక్సీ, ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈనెల 25వ తేదీ వరకు అర్హులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అందిన దరఖాస్తులను ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తాం. అక్టోబర్ నాల్గో తేదీ నుంచి సహాయం అందిస్తాం. జిల్లాలో ఇప్పటి వరకు 9,200 దరఖాస్తులు వచ్చాయి. సాక్షి : జిల్లాలో పంటల సాగు పరిస్థితి ఎలా ఉంది? కలెక్టర్: జిల్లాలో పశ్చి డెల్టా, నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా ఆయకట్టుకు సాగు నీరు పుష్కలంగా అందిస్తున్నాం. ఎన్ఎస్పీ పరిధిలో అన్ని చెరువులనూ పూర్తిగా నింపాం. ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు, పురుగు మందులు అందిస్తున్నాం. నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే వ్యాపారులకు, వ్యవసాయ అధికారులను హెచ్చరించాం. కృష్ణానది వరదతో వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.13.5 కోట్ల పంట నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదిక పంపాం. సాక్షి : స్పందనలో వచ్చిన దరఖాస్తులను ఎలా పరిష్కరిస్తున్నారు? కలెక్టర్: స్పందనలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. స్పందన కార్యక్రమంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్పందనలో ఫిర్యాదుచేస్తే తమ సమస్య పరిష్కారం అవుతుందనే భరోసాను ప్రజలకు కల్పించగలిగాం. సాక్షి : భూ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? కలెక్టర్: జిల్లాలో ఎక్కువ శాతం భూ సమస్యలే ఉన్నాయి. ప్రస్తుతం రెవెన్యూ రికార్డులను ఆధునికీకరణ చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశాం. ఆయా గ్రామాల్లో సర్వే చేసి రికార్డులను ప్రక్షాళన చేయనున్నాం. దీని ద్వారా ఎక్కువ శాతం రెవెన్యూ సమస్యలు పరిష్కారం కానున్నాయి. గ్రామ సచివాలయాల్లో కొత్తగా వచ్చే సర్వే అసిస్టెంట్ల ద్వారా అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చి ఇందులో వారిని భాగస్వాములను చేస్తాం. సాక్షి : పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? కలెక్టర్ : జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వారికి తగు సూచనలు, సలహాలు ఇస్తూ పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం. -
ని‘వేదన’
చాలా రోజులుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పలువురు ప్రజలు కలెక్టర్‌కు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చి అర్జీలు సమర్పించారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రేషన్‌కార్డులు వంటి అంశాలను గ్రామ వలంటీర్లకు అప్పగించడంతో ఫిర్యాదుదారుల సంఖ్య కొంత తగ్గింది. ప్రధానంగా భూ సంబంధమైన సమస్యలపై అర్జీలు సమర్పించారు. మొత్తం మీద వినతులు వెల్లువెత్తాయి. సమస్యలు సావధానంగా విన్న జిల్లా అధికారులు పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. – కడప సెవెన్‌రోడ్స్ సర్వే చేయించాలి గ్రామ ఫీల్డ్ నంబరు 312లో 0.59 సెంట్ల రస్తా పోరంబోకు ఉంది. దాన్ని నేను సాగు చేస్తుం డే వాడిని. అయితే అది తన పట్టా భూమి అంటూ పోలా నారాయణరెడ్డి అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2008లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆ స్థలం రస్తా పోరంబోకు గనుక తమదేనంటూ కోర్టుకు వెళ్లగా తీర్పు వారికి అనుకూలంగా వచ్చింది. అయితే ఇప్పుడు మండల సర్వేయర్ అది నారాయణరెడ్డి పట్టా భూమి అని చెబుతున్నారు. జిల్లా సర్వేయర్‌తో సర్వే చేయించి ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. – ఎం.జయన్న, పాలెంపల్లె, కడప నా భూమి ఇతరులకు ఆన్లైన్ చేశారు సర్వే నంబరు 133/3సీలో 16.50 సెంట్లు, 133/3బీలో 26 సెంట్ల నా భూమిని పల్లపు నాగమ్మ అనే మహిళ పేరుతో అక్రమంగా ఆన్లైన్ చేశారు. నేను ఆ భూమిని నాగన్న అనే వ్యక్తి నుంచి 1999లో కొనుగోలు చేశాను. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పట్టాదారు పాసుపుస్తకం, ఈసీ, లింకు డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. కానీ రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. – పల్లపు వెంకటరమణ, గరుగుపల్లె, రాయచోటి మండలం గృహాలు మంజూరు చేయాలి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో మా గ్రామంలోని 40 మంది ఎస్సీ కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. అవి చౌడుమిద్దెలు కావడంతో పాతబడిపోయి వర్షానికి ఉరుస్తున్నాయి. కనుక కొత్తగా పక్కా గృహాలు మంజూరు చేసి ఆదుకోవాలి. – కమ్ములూరి వెంకటేశు, బక్కన్నగారిపల్లె, వేంపల్లె మండలం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వాలి నా భర్త పాలగిరి ఓబుల సుబ్బయ్య మూడు నెలల కిందట మరణించాడు. నాకు ఫ్యామిలీమెంబర్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. దీనిపై విచారణ చేసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ నా పేరిట జారీ చేసి ఆదుకోవాలి. – పవిత్ర కల్యాణి, అల్మాస్‌పేట, కడప న్యాయం చేయాలి సర్వే నంబరు 1771లో నాకు 0.47 సెంట్ల భూమి ఉంది. సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని చలానా కట్టినా ఇంత వరకు ఫలితం లేదు. జిల్లా సర్వేయర్‌తో సర్వే చేయించి న్యాయం చేయాలని కోరేందుకు వచ్చాను. – వెంకట సుబ్బయ్య, గంగాయపల్లె, మైదుకూరు మండలం -
నిర్లక్ష్యాన్ని సహించబోం
బోధనలో నిర్లక్ష్యం వహించినా, మధ్యాహ్న భోజనం రుచిగా లేకపోయినా సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం ఆయన రాప్తాడులో ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అడిగిన పలు ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు చెప్పలేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. బోధన విధానం బాగోలేదన్నారు. సాక్షి, రాప్తాడు : విద్యా బోధనలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం రాప్తాడు ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయుల హాజరుపట్టిక, మధ్యాహ్న భోజన వివరాలు పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు సమాధానం చెప్పలేక తడబడ్డారు. మరి కొంతమంది విద్యార్థులను సైన్సు, గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టులలో ప్రశ్నలు అడగడంతో వారు కూడా చెప్పలేకపోయారు. ఉపాధ్యాయుల బోధన తీరు బాగలేదంటూ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువు విషయంలో ఎవరు అశ్రద్ధ చేసినా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఉత్సుకత, ప్రేరణ కలిగించేలా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల్లో ఆలోచన, పరిశీలనాశక్తి పెగిగేలా సైన్సు ఎగ్జిబిషన్లు, క్విజ్ పోటీలు, ప్రయోగాలు నిర్వహించేలా చూడాలని డీఈఓ శామ్యూల్‌కు సూచించారు. విద్యార్థులు కూడా బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా రీడీంగ్, రైటింగ్, కమ్యూనికేష్‌న్స్ స్కిల్స్‌లో ప్రావీణ్యత సాధించాలన్నారు. భోజనం రుచిగా లేకపోతే చర్యలు మధ్యాహ్న భోజనం రుచిగా లేకపోతే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సాంబారులో ప్రతి 30 మందికి కేజీ చొప్పున ఆరు కేజీలు కంది పప్పు వాడాల్సి ఉండగా ఐదు కేజీలే వాడినట్లు తెలుసుకున్న కలెక్టర్ సదరు ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంబారులో కూడా కాయగూరలు తక్కువగా ఉన్నాయన్నారు. మరొకసారి పాఠశాలను తనిఖీ చేస్తానని, ఆ రోజు ఇదే విధంగా మధ్యాహ్న భోజనం ఉంటే ఏజెన్సీని బాధ్యతల నుంచి తప్పిస్తామని స్పష్టం చేశారు. మెనూ ప్రకారం భోజనం ఉండేలా పర్యవేక్షించాలని హెచ్ఎం నరసింహులును ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రామాంజనరెడ్డి పాల్గొన్నారు. -
కొత్త భవనాలొస్తున్నాయ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పురుడుపోసుకున్న కొత్త జిల్లాలకు కలెక్టరేట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మూడేళ్ల క్రితమే భూమి పూజలు పూర్తయిన కలెక్టరేట్ కాంప్లెక్స్‌ల నిర్మాణ పనులు గాడిన పడ్డాయి. కొన్ని జిల్లాల కలెక్టరేట్లు మాత్రం ఈ ఏడాది చివరి నాటికి పూర్తికానున్నాయి. గతేడాది కొత్తగా ఏర్పడ్డ ములుగు, నారాయణపేట, వరంగల్ గ్రామీణ జిల్లాల్లో మాత్రం కలెక్టరేట్లను ఎక్కడ నిర్మించాలనే దానిపై స్పష్టత రాలేదు. 2016 దసరా రోజున రాష్ట్ర ప్రభుత్వం.. నూతన కలెక్టరేట్ భవన సముదాయాలకు శంకుస్థాపన చేసింది. వీటిని ఏడాది లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. భూసేకరణ సమస్యలు, ప్రజాప్రతినిధుల అభ్యంతరాలతో పనుల్లో జాప్యం జరిగింది. ఈ బాలారిష్టాలను దాదాపుగా అధిగమించడంతో కొంతకాలంగా ఈ కాంప్లెక్సుల నిర్మాణ పనుల్లో స్పీడు పెరిగింది. ఈ క్రమంలోనే రంగారెడ్డి, జనగామ, కామారెడ్డి, ఆసిఫాబాద్, మేడ్చల్, వికారాబాద్, వనపర్తి జిల్లాల కలెక్టరేట్ కాంప్లెక్సులు ఈ ఏడాది చివరినాటికి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే శ్లాబులు కూడా పూర్తయిన ఈ భవనాల్లో పనులు చకచకా జరుగుతున్నాయి. 962 కోట్లతో నిర్మాణాలు రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 26 జిల్లాల్లో మాత్రమే కొత్త కలెక్టరేట్లు అవసరమని గుర్తించిన ప్రభుత్వం.. వీటి నిర్మాణానికి రూ.962 కోట్లను కేటాయించింది. ఈ మేరకు 2017లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాల విస్తీర్ణం, వనరులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 1.20 లక్షల చదరపు అడుగుల భవన విస్తీర్ణాన్ని నిర్దేశించింది. నిజామాబాద్, వరంగల్ (పట్టణ), కామారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాత్రం 1.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమని గుర్తించింది. దీని ఆధారంగానే భవన నిర్మాణ పనులను చేపట్టింది. ఏడాదిలోపే ఈ భవనాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో పనులను 11 ప్యాకేజీలుగా విభజించి.. కాంట్రాక్టర్లకు అప్పగించింది. అయితే, స్థలాల ఎంపికలో పేచీలు, ఒక్కో కాంట్రాక్టర్‌కు రెండేసి, మూడేసి భవనాలను కేటాయించడంతో పనుల వేగం మందగించింది. కాగా ప్రస్తుతం నీటిపారుదల శాఖ భవన సముదాయంలో కొనసాగుతున్న వరంగల్ (గ్రామీణ) జిల్లా కలెక్టరేట్‌పై మాత్రం సందిగ్ధత వీడలేదు. ఎంపిక చేసిన స్థలం పట్టణానికి దూరంగా ఉండడంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్న ప్రభుత్వం యూనివర్సిటీలో కొత్త భవనాన్ని నిర్మించే అంశాన్ని పరిశీలిస్తోంది. మరోవైపు స్థల వివాదంతో పెండింగ్‌లో పడ్డ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ భవన పనులు ఇటీవల ఊపందుకున్నాయి. రంగారెడ్డిలోకి హైదరాబాద్! రాజధాని నగరంలో కొనసాగుతున్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ త్వరలోనే కొత్త భవనంలోకి మారనుంది. ఈ భవనంలోకి హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను వేరేచోటికి తరలించనున్నారు. కాగా, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాలో ఇప్పటికే ఉన్న కలెక్టరేట్ల భవన సముదాయాలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ గతంలో నిర్మించిన భవనాలు.. అవసరాలకు సరిపడా ఉండడంతో వాటినే కొనసాగించనుంది. మరికొన్ని కొత్త భవనాల తాజా పరిస్థితి! సూర్యాపేట కలెక్టరేట్ భవన నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలం కొనుగోలు విషయంలో వివాదం ఏర్పడింది. దీంతో సుమారు 6 నెలల పాటు పనులు ప్రారంభించలేదు. భూ వివాదం సమస్య తీరిన తర్వాత పనులు ప్రారంభించినప్పటికీ వేగంగా సాగడం లేదు. రెండు బ్లాకుల్లో మూడు ఫ్లోర్లలో మాత్రమే స్లాబ్‌ల నిర్మాణం అయింది. ఒక బ్లాక్ పూర్తిగా పిల్లర్ల దశలోనే ఉంది. ఇంకా ఈ పనులు పూర్తికావడానికి 6నెలలకు పైగా పడుతుందని అధికారులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాలో భవనం నిర్మాణం వేగంగా జరుగుతోంది. నిర్మాణ పనులు శ్లాబ్ లెవల్‌కు చేరుకున్నాయి. నిజామాబాద్ కలెక్టరేట్ పనులు 70% వరకు పూర్తయ్యాయి. ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్ పనులు కొనసాగుతున్నాయి. వైరింగ్, లాన్ల ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాల పనులు జరగాల్సి ఉంది. భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలో 75% పనులు పూర్తి అయ్యాయి. లోపల ఎలక్ట్రికల్, ఇంటీరియర్ పనులు, బయట పార్కింగ్ ఏరియా, ప్రహరీ పనులు మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్‌లో చేపట్టిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు దాదాపు 80% పూర్తయ్యాయి. అన్ని అంతస్తుల శ్లాబులు పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్‌లోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని రామాయంపేట–మెదక్ ప్రధాన రహదారిలో ఔరంగాబాద్ శివారులోని దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో రూ.48.62 కోట్ల వ్యయంతో సమీకృత కలెక్టరేట్ నిర్మాణం పనులు 50% వరకు పూర్తయ్యాయి. మంచిర్యాల జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయం నస్పూర్ మునిసిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్నారు. పనులను ప్రారంభించి ఏడాది పూర్తవుతున్నప్పటికీ.. కొంతమేర పిల్లర్ల దశలోనే ఉంది. మరికొంత శ్లాబ్ వేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తాలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులు 10% కూడా పూర్తి కాలేదు. పునాదుల వరకే పరిమితమై ఆ తర్వాత నిలిచిపోయాయి. కొన్ని చోట్ల పిల్లర్లు వేశారు. సిరిసిల్ల కలెక్టరేట్ నిర్మాణం పనులు 75% పూర్తయ్యాయి. దసరా నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జగిత్యాల కలెక్టరేట్ నిర్మాణ పనులు 60% పూర్తయ్యాయి. మరో 3నెలల్లో భవన నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. పెద్దపల్లి కలెక్టరేట్ నిర్మాణ పనులు మరో 4నెలల్లో పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. మరో 15 రోజుల్లో కలెక్టర్, జేసీ భవనాల ఇంటీరియర్ పనులు పూర్తవుతాయి. కామారెడ్డి కలెక్టరేట్ పనులు చివరి దశకు చేరాయి. భవనాల్లోని అంతర్గత పనులు కూడా పూర్తి కాగా, ఎలివేషన్ పనులు జరుగుతున్నాయి. -
సీఎం ఆశయాలకు అనుగుణంగా..
సాక్షి, అనంతపురం అర్బన్: గత ప్రభుత్వ హయాంలో ప్రజాసమస్యల పరిష్కారం కే వలం ‘కాగితాల్లో’నే కనిపించేది. ఒకే సమస్యపై మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ప్రజలు కాళ్లరిగేలా తిరిగినా పరిష్కారం లభించేది కాదు. దీంతో విసిగివే సారి చివరకు అధికారులకు చెప్పుకోవడమే మానేశారు. తాజాగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అధికారుల పనితీరులో మార్పు వచ్చింది. నిర్ధేశించిన గడువులోగా ప్రజల సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపించే దిశగా జిల్లా యంత్రాగం పనితీరులో వేగం పెరిగింది. ప్రజాసమస్యల పరిష్కారం లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. సమస్యలపై వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిలిస్తున్నారు. అర్హమైన వాటిని మాస్టర్ రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. సమస్య పరిష్కార వివరం గురించి ప్రజలకు ఎండార్స్మెంట్ ఇస్తున్నారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది. గతంలో కాగితాల్లోనే పరిష్కారం గత ప్రభుత్వ హయాంలో ప్రజాసమస్యలపై వచ్చిన అర్జీల పరిశీలన, పరిష్కారం క్షేత్రస్థాయిలో కాకుండా ‘కాగితాల్లో’ కనిపించేది. ఆ ప్రభుత్వ పనితీరుకు అనుగుణంగానే అధికారులూ తప్పుడు నివేదికలు ఇచ్చేవారు. ఇప్పుడా తీరు పూర్తిగా మారింది. సమస్య పరిష్కారం విషయంలో కచ్చితమైన విధానం పాటిస్తున్నారు. అర్జీదారునికి రశీదు ఇస్తూ అందులో పరిష్కార గడువును నమోదు చేస్తున్నారు. ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి అక్కడిక్కడే చర్యలు తీసుకుంటున్నారు. మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకూ నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజల నుంచి పింఛన్లు, ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు, రేషన్ కార్డులకు దరఖాస్తులు అధికారులకు అందుతున్నాయి. వీటిని పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో విచారణ చేసి అర్హులను గుర్తిస్తున్నారు. ఆర్థికపరమైన, ప్రభుత్వపరంగా రావాల్సినవి కావడంతో ప్రత్యేకంగా మాస్టర్ రిజిస్టర్‌ను ఏర్పాటు చేసి అందులో నమోదు చేస్తున్నారు. అర్జీదారులకు అదే విషయాన్ని తెలియజేస్తూ ఎండార్స్మెంట్ ఇస్తున్నారు. ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే చాలు పింఛన్లు, ఇళ్ల స్థలాలు, పక్కాగృహాలు, రేషన్ కార్డుల కోసం అర్హులైన ప్రజలు గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా పదేపదే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు జరిగే ‘స్పందన’ కార్యక్రమంలో ఎక్కడైనా ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే చాలు. దరఖాస్తును అధికారులు పరిశీలిస్తారు. అనర్హమైన వాటిని తిరస్కరిస్తారు. అర్హత ఉన్న వాటిని మాస్టర్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. నిర్ధేశిత గడువులోగా సమస్య పరిష్కారం అవుతుందని వివరం తెలియజేస్తున్నారు. -
‘భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలి’
సాక్షి, ములుగు: భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రజాప్రతినిధుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా.. డీజీపీ కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఉదయం నుంచి ఏడు గంటలపాటు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టుల కదలికలపై పోలీసులు, నిఘావ్యవస్థను అప్రమత్తం చేస్తూ సూచనలు ఇచ్చారు. ఈ నెల 28 నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 2020లో మేడారం జాతర ఏర్పాట్లు, వీఐపీల భద్రతపై డీజీపీ ఈ అంతర్గత సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షలో వరంగల్ పోలీస్ కమిషనర్, మూడు జిల్లాల ఎస్పీలు, ఆరు జిల్లాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
పీలేరు బీసీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు
-
ఎన్నికల సామగ్రి ఎత్తుకెళ్లారు!
ఒక రూపాయి.. రెండు రూపాయలు కాదు.. కోట్ల విలువ చేసే ఎన్నికల పరికరాలను దోచుకెళ్లారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఎన్నికల వస్తువులను కలెక్టరేట్లోని ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న అధికారులు గుట్టుచప్పుడు కాకుండా తమ ఇళ్లకు మోసుకెళ్లారు. ఎవరికీ అనుమానం రాకూడదని అదే సెక్షన్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా కొన్ని పంచిపెట్టారు. గత కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ గిరీషా ఆధ్వర్యంలో వాటిని కొనుగోలు చేశారు. వారు బదిలీ కావడంతో ఇదే అదనుగా భావించిన ఎన్నికల విభాగం అధికారులు కోట్ల విలువ చేసే వస్తువులను మాయంచేశారు. ఈ అక్రమ దోపిడీ తతంగంపై కలెక్టరేట్లోని సహచర ఉద్యోగులు కోడై కూస్తున్నారు. అక్రమాలపై ఇప్పటికే పలువురు కలెక్టరేట్ ఉద్యోగులు రాష్ట్ర ఎన్నికల అధికారికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : ఆదర్శంగా ఉండాల్సిన అధికారులు అక్రమ దోపిడీకి తెరలేపారు. ఈ వ్యవహారం కలెక్టరేట్లోని అన్ని శాఖల్లో దుమారం లేపుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఆ బడ్జెట్లో జిల్లా స్థాయిలో అవసరమైన సామగ్రి, విలువైన వస్తువులను అధికారులు కొనుగోలుచేశారు. వాటిని రికార్డుల్లో నమోదు చేసి కార్యాలయ పనులకు, రాబోయే ఎన్నికలకు వినియోగించాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో జిల్లా ఎన్నికల అధికారిగా పనిచేసిన ప్రద్యుమ్న, డిప్యూటీ ఎన్నికల అధికారిగా పనిచేసిన గిరీషా బదిలీ అయ్యారు. ఇదే అదునుగా భావించిన కలెక్టరేట్ ఎన్నికల విభాగంలోని కొందరు అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. కలెక్టరేట్లో ఉండాల్సిన విలువైన వస్తువులను మాయం చేసి ఇళ్లకు తీసుకెళ్లారని తెలిసింది. బిల్లులన్నీ తారుమారు ఎన్నికల కసరత్తుకు చేపట్టిన పనులకు ఇచ్చిన బిల్లుల్లో అన్నీ తారుమారు చేశారని తెలిసింది. ఎన్నికల్లో నిర్వహించిన పనులకు పర్సంటేజీలు అధికంగా నగదు నమోదుచేసి దొంగ బిల్లులు పెట్టారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రూ. 57 కోట్లు బడ్జెట్ కావాలని జిల్లా యంత్రాంగం ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపింది. అందులో ఇప్పటివరకు రూ.22 కోట్ల బడ్జెట్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అందులో ఖర్చుచేసిన నిధులకు ఆడిట్ లేకపోవడంతో ఆ విభాగం అధికారులు చేతివాటం ప్రదర్శించారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. మాయమైన వస్తువులు ఇవే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం ఎంసీఎంసీ సెల్, కాల్‌సెంటర్, సీ–విజిల్, కమాండ్ కంట్రోల్ రూం, ఎన్నికల విభాగంలో కొన్ని వస్తువులను కొనుగోలుచేశారు. ఆ వస్తువులు ప్రస్తుతం కనిపించలేదని తెలిసింది. 1. కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన ఎంసీఎంసీ సెల్లో రూ.50 వేలు విలువ చేసే ఎల్ఈడీ టీవీలు 10 కొనుగోలు చేశారు. 2. ఎన్నికల పర్యవేక్షణకు వచ్చిన అబ్జర్వర్లు 45 మందికి రూ. 30 వేలు విలువ చేసే ఆండ్రాయిడ్ ఫోన్లను కొనుగోలుచేశారు. జిల్లాలోని 14 నియోజకవర్గ ఆర్వోలకు మొబైల్ ఫోన్లను కొని ప్రత్యేక సిమ్‌ను వేసిచ్చారు. 3. సీ విజిల్, 1950 కాల్ సెంటర్‌కు ఫోన్లు ల్యాప్‌టాప్‌లు, నెట్ మోడెమ్‌లు దాదాపు 20 వరకు కొనుగోలుచేశారు. 4. కమాండ్ కంట్రోల్ రూం పర్యవేక్షణకు రూ.70 వేలు విలువ చేసే ల్యాప్‌టాప్‌లు 80 వరకు కొనుగోలు చేశారు. 5. ఎన్నికల్లో మోడల్ కోడ్ వయోలేషన్, ప్రచారాల ఫొటోలు తీయడానికి రూ.50 విలువ చేసే డిజిటల్ కెమెరాలు 20 వరకు కొనుగోలు చేశారు. ఇలా ఎన్నికలకు కొనుగోలు చేసిన విలువైన వస్తువుల్లో చాలావరకు ప్రస్తుతం కలెక్టరేట్లో లేకపోవడంతో కలెక్టరేట్లో ఎన్నికల విభాగంలో విధులు నిర్వహించిన అధికారులపై విమర్శలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పుమంటున్నాయి. -
ధర్నాలతో దద్దరిల్లిన కాకినాడ కలెక్టరేట్
సాక్షి, కాకినాడ సిటీ: టీడీపీ ప్రభుత్వంలో ఎదురైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పలు వర్గాల సోమవారం ఆందోళనలు చేయడంతో కాకినాడ కలెక్టరేట్ దద్దరిల్లింది. ఆందోళన చేసిన వారు కలెక్టరేట్లో వినతిపత్రాలు అందజేశారు. ఇసుక మాఫియాను అరికట్టి, ఇసుకను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దాపురం డివిజన్లో నీరు–చెట్టు పథకం పనులు కొందరు తీసుకున్నారని, వాటిలో తమకు అప్పగించిన 90 శాతం పనులు చేసి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామంటూ చిన్న కాంట్రాక్టర్లు ఆందోళన చేశారు. గత టీడీపీ పాలకులు కొందరు అవకతవకలకు పాల్పడ్డారని, అప్పులు చేసి ఈ పనులు చేశామని, వారి వల్ల తమకు అన్యాయం చేయవద్దని వారు విన్నవించుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలో తొమ్మిది నెలలకు రావాల్సిన గౌరవ వేతనాలు, పారితోషికాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలోనూ, పారిశుద్ధ్య కార్మికులకు రూ.18 వేలు వేతనాన్ని ఇస్తున్న మాదిరిగా గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా అదే వేతనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవ్వాలని కోరుతూ జిల్లా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోనూ, గత ఎన్నికల విధుల కోసం వాడుకున్న వాహనాలకు కిరాయిలు చెల్లించలేదంటూ ఏపీ టాక్సీ ఓనర్లు, డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మోటారు వాహన చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ట్రాన్స్‌ఫోర్టు సంఘాల కార్మికులు ఆందోళన చేశారు. ఇసుక మాఫియాను అరికట్టి.. ఇసుక మాఫియాను అరికట్టి, ఇసుకను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కొత్త పాలసీ కోసం ఇసుకను ఆపేయడంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఉచితంగా నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక పేరిట ఇసుకను దోచుకుందని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నిర్వాకంతో భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. జగన్ ప్రభుత్వం నూతన విధానాన్ని అమలుజేసి కార్మికులకు ఉపా ధి కల్పించాలని కోరా రు. ఇసుక మాఫీయాను అరెస్ట్ చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ మంజూరు చేయాలని కార్మికులు నినాదాలు చేశారు. తొలుత బాలాజీ చెరువు సెంటర్ నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు పీఎస్ నారాయణ, టి.అన్నవరం, భానుప్రకాష్, నారాయణమూర్తి, పి.సత్యనారాయణ, జి.లోవరత్నం, సాయిబాబు, పెంటకోట సత్తిబాబు, శివకోటి రాజు వీవేణి, చిట్టిబాబు పాల్గొన్నారు. ఎన్నికల కిరాయి చెల్లింపు కోసం ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ, సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం ఉపయోగించుకున్న మోటారు రవాణా వాహనాలకు కిరాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ టాక్సీ ఓనర్లు, డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికలు పూర్తయి నాలుగు నెలలైనా కిరాయిలను చెల్లించలేదన్నారు. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని, వాహనదారులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ కష్టార్జితాన్ని తక్షణం చెల్లించాలని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవస్థలు పడుతున్న మోటారు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. నాలుగు చక్రాల వాహనాన్ని కార్మికుల వృత్తి సాధనంగా భావించాలని, వీరికి తెల్ల రేషన్‌కార్డును రద్దు చేస్తామని చెబుతున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం వాస్తవిక దృష్టితో ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముచ్చకర్ల సత్యనారాయణ, కర్రి విష్ణురెడ్డి, నామా ప్రసాద్, కొక్కిరిమెట్ల దుర్గారావు, పి.చిన్నయ్య, కె. భాస్కరరావు, బి.విజయ, ఎన్.వెంకటేశ్వరరావు, కె.రాంబాబు, బొర్రా గణేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
స్పందనకు ప్రత్యేక కౌంటర్లు
సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలి. చిరునవ్వుతో స్పందించి ప్రజల సమస్యలు పరిష్కరించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యలను వెంట నే పరిష్కరించడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపొందించిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభించారు. గత వారం జరిగిన స్పందన కార్యక్రమానికి కలెక్టరేట్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. స్పందనలో గత వారం అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని అర్జీలను అందజేశారు. కలెక్టరేట్ వెనుకభాగంలో కౌంటర్లు కలెక్టరేట్ వెనుకభాగంలో రశీదు కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ప్రజలు వస్తుండడంతో గతంలో ఉన్న స్థలం ఇబ్బందికరంగా ఉండేది. దీంతో కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తా స్పందన కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయించారు. కలెక్టరేట్ వెనుకభాగాన ఉన్న విశాలమైన బహిరంగ ప్రదేశంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయించారు. అధికారులు ఆదివారం కలెక్టరేట్ వెనుక భాగాన ఉన్న ప్రాంతాన్ని జేసీబీతో చదును చేసి, ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఎండవేడిమి తగలకుండా ప్రత్యేకంగా షామియానాలను ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో కూడా ఫిర్యాదులు స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యను అర్జీ రూపంలో ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేసేలా ప్రభుత్వం సౌకర్యాన్ని› కల్పించింది. ప్రజల సమస్యలను అర్జీ రూపంలో వెబ్సైట్లో రాయవచ్చు. ఈ వెబ్సైట్ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తుంది. ఎక్కడ నుంచైనా సమస్యను రాసి పంపే సౌకర్యాన్ని కల్పించారు. దీనికి 24 గంటలపాటు పనిచేసే కాల్‌సెంటర్‌ను అనుసంధాం చేయనున్నారు. స్పందన కోసం కొత్తగా 1800–425–4440 టోల్ ఫ్రీ నెంబర్, spndana.ap@gmail.com మెయిల్ ను కేటాయించారు. కేవలం ఫిర్యాదులే కాదు, వివిధ విషయాలపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు కూడా చేయవచ్చు. ప్రజలు http:// spandana.ap.gov.in/ వెబ్సైట్ లో అర్జీలను పంపవచ్చు. అర్జీతో పాటు ఆధార్ తప్పనిసరి స్పందన కార్యక్రమంలో బాధితుల అర్జీతోపాటూ ఆధార్ కార్డు జిరాక్స్‌ను జరచేయాల్సి ఉంటుంది. అర్జీదారులు మొదట కలెక్టరేట్లోని వెనుకభాగంలో ఉన్న ప్రత్యేక కౌంటర్లలో అర్జీలు ఇచ్చి రశీదు పొందాలి. అనంతరం ఉన్నతాధికారులకు అందజేయాల్సి ఉంటుంది. స్పందన కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు జరుగుతుంది. ప్రతి అర్జీని పరిష్కరించాలి ప్రజలు స్పందన కార్యక్రమంలో అందజేసే ప్రతి అర్జీని ఆయా శాఖల అధికారులు కచ్చితంగా పరిష్కరించాల్సిందే. స్పందన కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. స్పందన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పక హాజరుకావాల్సిందే. ఎవరైన గైర్హాజరైతే చర్యలుంటాయి. – నారాయణ భరత్‌గుప్తా, జిల్లా కలెక్టర్ రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ స్పందన కార్యక్రమానికి రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. భూ తగాదాలు, కబ్జాలు తదితర సమస్యలు ఉన్నట్లు ప్రజలు అర్జీలు ఇస్తున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని ఆయా తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చాం. రెవెన్యూ ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నాం. – మార్కండేయులు, జాయింట్ కలెక్టర్ -
‘వంట’బట్టించుకోండి
సాక్షి, కారంపూడి(గుంటూరు) : స్థానిక బాలయోగి గురుకుల పాఠశాల, కళాశాలను శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాయంత్రం ఆరు గంటలకు పాఠశాలకు వచ్చిన కలెక్టర్ రాత్రి 8.45 వరకు పరిశీలించారు. విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఆహారం బాగోలేదని విద్యార్థులు చెప్పడంతో క్యాటరింగ్ వారిపై మండిపడ్డారు. అనంతరం పాఠశాల వేదిక వద్ద విద్యార్థుల అకడమిక్ ప్రగతిని పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలడిగిన కలెక్టర్ ఇంగ్లిషు మీడియంలో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. తాను పదో తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నానని, గురుకులాలలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. తరగతి గదులు తక్కువగా ఉన్నాయని కలెక్టర్‌కు ప్రిన్సిపల్ గిరికుమారి విన్నవించారు. వసతులలేమిపై ఆరా .అనంతరం స్టాఫ్‌తో సమీక్ష నిర్వహించారు. 1983లో స్థాపించిన పాఠశాల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతి సమకూరలేదని, స్టాఫ్‌కు క్వార్టర్స్ లేవని ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల ముందు శిథిల భవనాలు ప్రమాదభరితంగా ఉన్నాయని, లైట్లు, ఫ్యాన్లు సక్రమంగా లేవని, వెంటనే వాటిని వాటిని ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్‌ను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ మురళి స్థానిక అధికారులు ఉన్నారు. -
విడిదిలో వింతలు!
సాక్షి, మచిలీపట్నం(కృష్ణా ): దేవుడు వరమిచ్చినా.. పూజారి కనికరించలేదన్న చందంగా మారింది ఉన్నతాధికారుల క్యాంపు కార్యాలయాల పరిస్థితి. కిందిస్థాయి సిబ్బంది వింత పోకడల వల్ల కలెక్టర్, జేసీ క్యాంపు కార్యాలయాలతో పాటు కలెక్టరేట్లో పాలన గాడి తప్పుతోంది. ప్రభుత్వ విడిది కార్యాలయాల్లోని కొందరు సిబ్బంది వింత పోకడలు పోతున్నారు. అధికారులు ఎంత మంది మారినా మేం మాత్రం ఇక్కడే ఉంటామనే రీతిలో తిష్ట వేస్తున్నారు. ఏళ్ల తరబడి ఆయా కార్యాలయాల్లో పని చేస్తున్న సీసీ (క్యాంప్ క్లర్క్) లు విధులు నిర్వహిస్తూ అక్కడే పాతుకుపోతున్నారు. దీంతో ఏ అధికారి వచ్చినా, సమస్యలపై వచ్చే ప్రజలైనా ముందుగా సీసీలను ప్రసన్నం చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. సీసీల అనుమతి లేనిదే ఉన్నతాధికారిని కలిసే ప్రసక్తే లేదని పలువురు జిల్లా అధికారులే బాహాటంగా చెప్పుకుంటున్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో డీటీ కేడరు, సీనియర్ అసిస్టెంట్ కేడరులోని సీసీలు ఉన్నప్పటికీ డెప్యూటీ తహసీల్దార్ కేడర్‌లో ఉన్న ఓ సీసీ మాత్రం క్యాంపు కార్యాలయానికే పరిమితమై తనదైన శైలిలో విధులు నిర్వహిస్తున్నారు. జేసీ విడిది కార్యాలయాల్లో ఇద్దరు డీటీలు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు సీసీలుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఎందరు మారినా వీరు మాత్రం అక్కడే పాతుకుపోయారు. కొత్తగా వచ్చిన అధికారికి, వెళ్లిపోయిన ఆఫీసర్‌తో సిఫార్సు చేయించుకుని తమదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. జిల్లా అధికారులకూ తప్పని తిప్పలు.. ఉన్నతాధికారులను కలవాలంటే జిల్లా అధికారులైనా ముందుగా సీసీలకు ఫోన్ చేసి వారు రమ్మంటేనే వెళ్లి కలవాల్సిన పరిస్థితి ఉంది. ఈ సీసీలను ప్రసన్నం చేసుకోకపోతే సార్ బిజీగా ఉన్నారని సమాధానం చెబుతున్నారు. లేదా మీటింగ్‌లో ఉన్నారనే సమాధానం వస్తోంది. ఆ జిల్లా అధికారికి ముఖ్యమైన సమస్యపై చర్చించాల్సి ఉన్నా వేచి ఉండక తప్పడం లేదు. అంతేకాకుండా క్యాంపు కార్యాలయాల ‘నిర్వహణ’పేరుతో జిల్లా అధికారులకు ‘ఇండెంట్లు’కూడా తప్పటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కలెక్టరేట్లోనూ ఇదే పరిస్థితి.. క్యాంప్ కార్యాలయాలతోపాటు కలెక్టరేట్లో కీలక విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కొందరు ఏళ్ల తరబడి పాతుకుపోయారు. వీరి వల్ల అధికారులు, ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల పరిపాలన సక్రమంగా నిర్వహించాలంటే వీరి విధి నిర్వహణ మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. క్యాంప్ కార్యాలయంలో ఉన్న సిబ్బందితో పాటు కలెక్టరేట్లోని ముఖ్య విభాగమైన ‘ఎ’సెక్షన్లో ఎ–3 గా పని చేసి ఎంయూడీఏ కార్యాలయానికి బదిలీ అయినప్పటికీ ఇంకా ఆ సీటుతోనే సంబంధాలు పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఉద్యోగపర్వం మొత్తం ఇదే సెక్షన్లో కొనసాగటం గమనార్హం. అయితే ఇటీవల బదిలీ అయినప్పటికీ సదరు ఉద్యోగి ఎ–3 సీటు వ్యవహారాలను చక్కబెడుతున్నారని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. అటెండర్, వీఆర్ఏ, వీఆర్వో స్థాయి ఉద్యోగుల వ్యవహారాలు చూసే ఏ–7 సీటులో ఇంత వరకు పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడంతోనూ ఆయా క్యాడర్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, నూతన జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే మాధవీలత, డీఆర్వో ఎ. ప్రసాద్ దృష్టి సారించి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమవుతోంది. మార్పులు చేస్తాం.. ప్రజలు, అధి కారులు వచ్చి ప్రతి సమస్యను నాకు వివరించటం జరుగుతోంది. అయితే కొంత మేర సమస్య ఉన్నట్లు నా దృష్టికి కూడా వచ్చింది. దీనిపై మరింత దృష్టి సారించి త్వరలో మార్పులు చేస్తాను. – ఏఎండీ ఇంతియాజ్, జిల్లా కలెక్టర్ -
అభివృద్ధి పథం...
సాక్షి, ఆదిలాబాద్: జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ వల్లకొండ శోభరాణి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా జిల్లాకేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో ఆదివారం జరిగిన సంబరాల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్, జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ కృష్ణా, గోదావరి జలాలను వినియోగించుకోవడానికి అనువుగా ప్రాజెక్టుల నిర్మాణం గతంలో జరగలేదని, ఈ నీటి వాటాను సమర్థవంతంగా వినియోగించుకొని రాష్ట్రంలో కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం రూపురేఖలే మారిపోనున్నాయని పేర్కొన్నారు. గడిచిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రైతులకు మరోమారు రూ.లక్ష వరకు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని తెలిపారు. పంట కాలంలో పెట్టుబడి కోసం రైతులు ఎవరి వద్ద చేయి చాచకుండా ఉండేందుకు అందిస్తున్న రైతుబంధు పథకం, మరణించిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు అమలు చేస్తున్న రైతు బీమా పథకాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయని అన్నారు. రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు ఎకరానికి ఏడాదికి రెండు దఫాలుగా అందిస్తున్న రూ.8వేల మొత్తాన్ని రూ.10వేలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు 6వేల కుటుంబాలకు రైతుబీమా పథకం కింద సహాయం అందించినట్లు తెలిపారు. మైక్రో ఇరిగేషన్, వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం భారీ సబ్సిడీలు అందిస్తుందన్నారు. సామాజిక పింఛన్లను రెట్టింపు చేస్తున్నట్లు వివరించారు. అన్నిరకాల పింఛన్లను రూ.2016కు పెంచుతున్నట్లు తెలిపారు. వికలాంగులకు ఇచ్చే పింఛన్లను రూ.3016కు పెంచడం జరిగిందని, వృద్ధాప్య పింఛన్ కనీస అర్హత వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా అనేక మంది అర్హులకు న్యాయం జరుగుతుందన్నారు. జూలై 1 నుంచి పింఛన్ల పెంపు.. పెంచిన పింఛన్లను జూలై 1 నుంచి లబ్దిదారులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. 1281 ఆవాస ప్రాంతాల్లోని షెడ్యూల్డ్ ఏరియాలను, జనాభా ఆధారంగా మరో 688 గ్రామాలను ఎస్టీలకు రిజర్వ్‌గా చేసి మొత్తంగా 3146 మంది ఎస్టీలను సర్పంచులను చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని తెలిపారు. తద్వారా అట్టడుగు వర్గాలను పాలనలో భాగస్వాములను చేసి దేశ చరిత్రలో ఆదర్శంగా నిలుస్తున్నామని వివరించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి బీసీలకు మరో 119 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విదేశీ విద్య కోసం వెళ్లే అన్నివర్గాల వారికి రూ.20లక్షల వంతున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. గ్రామ స్వరాజ్యాన్ని అమలులోకి తెచ్చే వ్యూహంలో భాగంగా అమలుపరుస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మకంగానే కాకుండా మిగితా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. టీఎస్ ఐపాస్ సింగల్‌విండో విధానం ద్వారా 15 రోజుల్లో పరిశ్రమల స్థాపనకు అన్నిరకాల అనుమతులు లభిస్తుండడంతో పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారని తెలిపారు. దీంతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చి, వైద్య సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 12086 మంది గర్భిణీలు ప్రసవించగా, అందులో అర్హులైన 7,314 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లను అందించినట్లు వివరించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల సంఖ్య పెరగడంతో పాటు శిశు మరణాల రేటు కూడా తగ్గించగలిగామని వివరించారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 18 బృందాలచే 3,49,373 మందికి పరీక్షలు నిర్వహించి 54,379 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 36,472 మందికి ప్రత్యేక కంటి శస్త్ర చికిత్సల కోసం సిఫార్సు చేయడం జరిగిందని తెలిపారు. దేశానికి ఆదర్శం మన పథకాలు.. దేశానికే మన రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆమె అన్నారు. మిషన్ భగీరథ, చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ, నిరుపేదలకు ఉచితంగా నిల్వ నీడ కల్పించే డబుల్బెడ్రూం ఇల్లు, రైతుబంధు, రైతుబీమా, హరితహారం, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు తదితర పథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. గ్రామపంచాయతీలను క్రియాశీలం చేసేందుకు నూతన పంచాయతీరాజ్ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేసినట్లు తెలిపారు. పంచాయతీరాజ్ సంస్థలకు నిర్దిష్టమైన విధులు, బాధ్యతలను నిర్దేశిస్తూ కావాల్సిన నిధులను క్రమంతప్పకుండా ప్రభుత్వం సమకూర్చుతుందని వివరించారు. జిల్లాలోని రైతులకు సాగునీరు అందించేందుకు పెన్‌గంగ ప్రాజెక్టు నిర్మాణాన్ని రూ.1594 కోట్ల వ్యయంతో మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు కోర్టా–చనాఖా బ్యారేజీ పైపులైన్లు, పంప్‌హౌజ్ వంటి పనులు రూ.438 కోట్ల వ్యయంతో చేపట్టడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి 51వేల ఆయకట్టుకు సాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. మిషన్ కాకతీయ పథకం కింద జిల్లాలో మొదటి మూడు దశలో ఇప్పటివరకు 288 చెరువు పనులు చేపట్టి రూ.94కోట్లతో 32,576 ఎకరాల ఆయకట్టు అభివృద్ధి పర్చడం జరిగిందన్నారు. నాలుగో దశలో 22 చెరువు పనులు ప్రారంభించామని అన్నారు. జిల్లా ఉద్యాన కార్యక్రమాల కింద 3093 మంది లబ్ధిదారులకు రూ.835 లక్షలతో సమగ్ర ఉద్యాన అభివృద్ధి సూక్ష్మసేద్యం, ఆదివాసీలకు బిందుసేద్యం పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. రహదారుల అభివృద్ధి రహదారులు, భవనాల శాఖ ద్వారా జిల్లాలో రూ.350 కోట్లతో ఒక వరుస రహదారులను రెండు వరుస రహదారులుగా మార్చేందుకు నిధులు మంజూరై పనులు జరుగుతున్నాయని అన్నారు. రూ.30కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు, రూ.66 కోట్లతో వంతెనల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా వివిధ పథకాల కింద 177 పనులకు గాను రూ.166 కోట్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. 5 మండల పరిషత్ భవనాలకు గాను రూ.5కోట్లు మంజూరు కాగా, పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి రూ.156 లక్షలతో 24 అంతర్గత రోడ్లు, తాగునీటి వసతి, మురుగు నీటి కాల్వలు, కల్వర్టుల నిర్మాణాలు, మరమ్మతులకు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి 82 పనులకు రూ.170లక్షలతో గ్రామీణ రోడ్లు, జిల్లా పరిషత్ పాఠశాల భవనాల నిర్వహణ పనులకు చేపట్టేందుకు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడం, ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. వివిధ విభాగాల్లో ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీల కారణంగా 420 మంది విద్యావాలంటీర్లను నియమించామన్నారు. జిల్లాకు మొదటి విడతలో 6 ఆదర్శ పాఠశాలలు, 17 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో 13 భవిత విలీన విద్యా కేంద్రాలు పనిచేస్తున్నట్లు వివరించారు. 275 మంది విద్యార్థులు ప్రత్యేక అవసరాలు గల వివిధ రకాల వైకల్యం గల పిల్లలుఇందులో విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. ఆదిమ గిరిజనుల అభ్యున్నతి.. ఆదిమ గిరిజనుల అభివృద్ధికి సీసీడీపీ కింద 2013–14 నుంచి 2016–17 సంవత్సరం వరకు సుమారు రూ.27కోట్లు మంజూరు కాగా, వివిధ పనులు ఎంపిక చేసి 12 గిరిజన గ్రామాల్లో అమలుపర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. గిరిజనుల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన చర్యలు చేపడుతూ వైద్యసేవలు అందిస్తున్నట్లు వివరించారు. 6,342 మంది గిరిజన విద్యార్థులకు రూ.1248 లక్షల పోస్టుమెట్రిక్, ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ద్వారా ఇప్పటివరకు 430 పనులు పూర్తి చేసి సుమారు రూ.47 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. 2018–19 సంవత్సరానికి 1545 యూనిట్ల స్థాపనకు రూ.27.38 కోట్ల విలువ గల ప్రతిపాదనలు ట్రైకార్ ఎండీ ఆమోదం కోసం పంపించడం జరిగిందన్నారు. 756 మంది గిరిజన యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. కోటి 63 లక్షల మొక్కలు.. జిల్లాలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కోటి 63లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక చేసినట్లు పేర్కొన్నారు. నర్సరీల్లో డిమాండ్‌కు అనుగుణంగా పువ్వులు, పండ్లు, ఇతర జాతుల మొక్కలను పెంచడం జరుగుతుందన్నారు. ఆదిలాబాద్ హరితవనంలో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. ఆదిలాబాద్ సరిహద్దు మహరాష్ట్ర బార్డర్ నుంచి నిర్మల్ జిల్లా సరిహద్దు వరకు జాతీయ రహదారి నం.44కు ఇరువైపులా మొక్కలు నాటడం జరుగుతున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు అగ్రో ఫారెస్ట్రిని పెద్ద ఎత్తున అమలు చేసేందుకు ప్రణాళిక తయారు చేయడం జరిగిందన్నారు. మొదట జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జెడ్పీ చైర్పర్సన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారి కవాతు ఆకట్టుకుంది. అమరవీరుల కుటుంబ సభ్యులకు సన్మానం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు మైమరిపించాయి. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనిషా, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ పాల్గొన్నారు. -
మహబూబ్‌నగర్ కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యయత్నం
-
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ భూ నిర్వసుల నిరసన
-
బ్యాడ్మింటన్ ఆడతా..
ఆయన జిల్లాకు బాస్. ప్రతిరోజు అధికారిక విధుల్లో బిజిబిజీగా గడుపుతుంటారు. అయినా ఇంటికొచ్చాక మాత్రం ముద్దుల కూతురుతో కాసేపు గడపనిదే నిద్రపోరు. రోజువారీ కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా గడిపే జీవితం నుంచి కాసేపు అలా కుటుంబంతో సేద తీరుతారు. ఎప్పుడూ సాదాసీదా వ్యక్తిలా కనిపించే ఆయన.. నిత్యం వివిధ శాఖల అధికారులకు పాలనపరంగా ఆదేశిలిస్తుంటారు. పాలనలో తనదైన ముద్ర వేస్తున్న ఆయనే కుమురం భీం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు. రోజంతా జిల్లా అధి కారులతో సమీక్షలు, సమావేశాలు, పర్యటనలతో బిజిబిజీగా ఉం డే ఆయనను ‘సాక్షి పర్సనల్ టైం’ లో కాసేపు గడిపి ఆయ న వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సాక్షి, ఆసిఫాబాద్ : మాది శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ. అమ్మ వనజాక్షి స్కూల్ టీచర్. నాన్న క్రిష్ణారావు రిటైర్డ్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి. మా సోదరి రజని. ప్రస్తుతం యూఎస్‌లో న్యూరాలజీ చేస్తున్నారు. నా విద్యాభాస్యం విషయానికి వస్తే పొలాకిలో ఎనిమిదో తరగతి వరకు, పలాసలో ఇంటర్మీడియెట్, వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) పూర్తిచేశా. క్యాంపస్ ఇంటరŠూయ్వలో ఉద్యోగం వచ్చినా చేరకుండా.. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యాను. అలా మొదటిసారి 2010లో ఐఆర్‌టీఎస్‌కు ఎంపికయ్యా. 2012లో ఐఏఎస్‌కు ఎంపికయ్యా. ఇంట్లో అమ్మనాన్నలిద్దరూ కూడా విద్యావంతులే. ఉద్యోగస్తులు కావడంతో చిన్నప్పటి నుంచి నాకు అన్నింటా ప్రోత్సాహాం ఉండేది. నాకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఇక నాపేరు విషయానికి వస్తే మా తాతకు గాంధీ కుంటుంబంపై అభిమానం ఎక్కువ. అందుకే నాకు రాజీవ్‌గాంధీ అని పేరు పెట్టారు. హన్మంతు మా ఇంటి పేరు. విజయలక్ష్మీతో వివాహం.. నేను ఐఆర్‌టీఎస్‌కు ఎంపికైన మరుసటి ఏడాది 2011లో విజయలక్ష్మీతో నా వివాహం జరిగింది. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. తను ఎల్ఎల్బీ పూర్తిచేశారు. ఆమెకు దైవభక్తి ఎక్కువ. మా కూతురు ప్రేరణదేవి. ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ చదువుతోంది. అధికారిక విధుల్లో రోజులో ఎక్కువ టైం గడిచిపోతోంది. మా పాపతో ఎక్కువగా గడపలేకపోతుంటాను. ఈ లోటును మా ఆవిడ భర్తీ చేస్తారు. మా కూతురు పెంపకం బాధ్యత మొత్తం ఆమె చూసుకుంటారు. కాసేపు మా పాపతో.. నిత్యం విధి నిర్వహణలో బిజిబిజీగా రోజంతా గడిచిపోతోంది. ఇంటికి వెళ్లాక మాత్రం కాసేపు తప్పకుండా మాపాప ప్రేరణతో గడుపుతుంటాను. దీంతో పనిఒత్తిడి నుంచి కాస్తా రిలాక్స్‌గా అనిపిస్తుంది. బుక్స్ చదువుతా.. ఐఏఎస్ ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ బాగే ఆడేవాడిని. కొత్తగూడెం కలెక్టర్‌గా ఉన్నప్పు డు కూడా తీరిక సమయంలో ఆడేవాడిని. ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్టు లేకపోవడంతో కుదరడం లేదు. తీరిక సమయాల్లో పుస్తకాలు చదువుతా. చేపలు, రొయ్యలు ఇష్టంగా తింటా. చిన్నప్పటి నుంచి కోస్తా తీరంలోని సముద్ర తీరం ప్రాంతంలో పెరగడంతో సీ ఫుడ్ బాగా అలవాటు అయింది. నాన్‌వెజ్‌లో చేపలు, రొయ్యలు ఇష్టంగా తింటా. అక్క నా మార్గదర్శి.. చిన్నప్పటి నుంచి మా అక్క రజని అంటే నాకు ఎంతో ఇష్టం. నాకు అన్ని విషయాల్లో మార్గదర్శంగా ఉండేది. వైజాగ్‌లో నేను ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ చేస్తున్న సమయంలో తను అదే యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేసేది. నా సివిల్స్ ప్రిపరేషన్ సమయంలోనూ ఎంతగానో తోడ్పాటునందించింది. అయితే ప్రస్తుతం ఆమె యూఎస్‌లో ఉంటుంది. అక్క మాకు దూరంగా ఉంటుందనే బెంగ ఉంటుంది. పీహెచ్డీ చేయాలి... నేను బీటెక్ వరకే చదివి సివిల్స్‌కు ఎంపికవడంతో అక్కడికే నా చదువు ఆగిపోయింది. ఐఏఎస్‌లకు విదేశాల్లో చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం వస్తే విదేశాల్లో ఉన్నత చదువులు చదివి పీహెచ్డీ పూర్తి చేయాలని ఉంది. ఆ రెండు సంతృప్తినిచ్చాయి.. నేను భద్రాద్రి కొత్తగూడెంలో కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రతిష్టాత్మక సీతారామ ప్రాజెక్టు (దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం) భూ సేకరణ విజయవంతంగా పూర్తి చేశాను. అది నాకు ఎంతోగానో సంతృప్తినిచ్చింది. అంతకు ముందు అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు వరంగల్‌లో ఆడపిల్లల అమ్మకంపై మీడియాలో వచ్చిన ఆ కేసును నేనే డీల్ చేశా. ఆ ఆసుపత్రిని సీజ్ చేశా. కారకులను పట్టుకుని శిక్షించాం. ఇక్కడి వాతావరణం నచ్చింది.. ఇక్కడి వాతావరణం నాకు బాగా నచ్చింది. చిన్నప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పెరిగినందున నాకు పెద్దపెద్ద మెట్రో నగరాల కంటే భద్రాచలం, ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాలంటేనే ఇష్టం. ఇక్కడ విధులు నిర్వహించడం నాకో ఎంతో సంతృప్తినిస్తోంది. -
ఫణిని ఎదుర్కొందాం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ‘ఫణి’ తుపాను ప్రభావంతో ఎదురయ్యే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్నిశాఖలు సమన్వయంతో సమాయత్తం కావాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశిం చారు. కలెక్టరేట్లో శనివారం ఫణి తుపాను ముందస్తు జాగ్రత్తలపై సంబంధిత అధికా రులతో ఆయన సమీక్షించారు. జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం, భీమవరం, కాళ్ల మండలాల్లోని 30 నివాసిత ప్రాం తాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. మచిలీపట్నానికి 1,460 కిలోమీ టర్ల తూర్పుదిశగా తుపాను కేంద్రీకృతమైనందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను గమనాన్ని రాష్ట్రంలో ఆర్టీజీఎస్, ఐఎండీ నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడూ ప్రత్యేక బులిటెన్లు విడుదల చేస్తాయని, వాటిని గమనిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు అధికారులు చేపట్టాలన్నారు. ఫణి తుపాను ప్రభావం గమనంపై సోమవారం నాటికి స్పష్టత వస్తుందని ఆరోజు క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి అవసరమైన ఆదేశాలు ఇస్తామని చెప్పారు. రానున్న 48 గంటల్లో నిత్యావసర వస్తువులను ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి చౌక ధర దుకాణాలకు తరలించాలని పౌరసరఫరాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని 15 తుపాను రక్షణా కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. ఈదురుగాలుల కా రణంగా విద్యుత్ అంతరాయం కలిగే సమయాలను మండలస్థాయిలో అధికారులకు సమాచారం అందించాలని, తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. జలవనరుల శాఖ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, మత్స్య, అగ్నిమాపక, పోలీస్, ఆర్టీసీ తదితర శాఖాధికారులు తుపాను హెచ్చరికలను ఎప్పటికప్పుడూ గమనిస్తూ అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ రక్షణ తదితర చర్యలు చేపట్టాలన్నారు. రైతులను అప్రమత్తం చేయండి జిల్లాలో ధాన్యం సేకరణ జరుగుతున్న దృష్ట్యా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకో వడం ద్వారా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని వ్యవసాయాధికారులను కలెక్టర్ ఆదేశించారు. తుపాను ప్రభావం మూలంగా రైతులు నష్టపోకుండా అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. పశువులకు అవసరమైన ఎండిగడ్డి కొరత లేకుండా చూడటంతో పాటు వ్యాక్సిన్లు కూడా సిద్ధం చేయాలని పశుసంవర్థకశాఖ జేడీని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. ఈవీఎం గోడౌన్లకు రెయిన్ ప్రూఫ్ సాధారణ ఎన్నికల ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల కిటికీలకు రేయిన్ ప్రూఫ్ ఏర్పాట్లు చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఫణి తుపాను హెచ్చరికల దృష్ట్యా వర్షాలు కురిసే అవకాశం ఉన్నం దున ఈవీఎంలకు సమస్యలు లేకుండా జిల్లాలో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను రిటర్నింగ్ అధికారులు తనిఖీ చేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఫణి తుపాన్ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని కమ్యూనికేషన్ సిస్టమ్‌కు ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో వివిధ సెల్ కంపెనీల టవర్స్ వద్ద ఉన్న జనరేటర్లు వినియోగంలో ఉండేలా చూడాలన్నారు. సముద్ర తీర మండలాల్లో రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుతామన్నారు. ఫణి తుపాను మూ లంగా ప్రాణ, ఆస్తి నష్టాలను జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకాధికారులు.. కంట్రోల్ రూమ్ తుపాను హెచ్చరికల దృష్ట్యా కలెక్టరేట్లో 1800– 233–1077 టోల్ ఫ్రీ నెంబర్‌తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. అదేవిధంగా తీర ప్రాంతంలోని ఏడు మండలాలకు జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామన్నారు. మొగల్తూరు మండలానికి జెడ్పీ సీఈఓ వి.నాగార్జునసాగర్ (94937 42399), నరసాపురం మండలానికి కేఆర్ పురం ట్రైబల్ వెల్ఫేర్ ఎస్డీసీ జి.దేవసహాయం (70932 65495), భీమవరం మండలానికి డ్వామా పీడీ సీహెచ్ మాలకొండయ్య (90001 20789), కాళ్ల మండలానికి ఇందిరా సాగర్ ప్రాజెక్టు ఆర్ఎంసీ కరుణకుమారి (70934 71333), పాలకొల్లు మండలానికి జిల్లా సహకార శాఖాధికారి భగవాన్ (91001 09176), యలమంచిలి మం డలానికి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ (9849905963), పోడూరు మండలానికి ఆత్మాపీడీ హరి (88861 14334)ను నియమించామన్నారు. డీఆర్ఓ ఎన్.సత్యనారాయణ, జెడ్పీ సీ ఈఓ వి.నాగార్జునసాగర్, నరసాపురం ఆర్డీఓ సలీమ్‌ఖాన్, డీఆర్డీఏ పీడీ గణేష్ కుమార్, డీఎంహెచ్ఓ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ సత్యనారాయణ, డీపీఓ ఆర్.విక్టర్, మత్స్య, వ్యవసా య, పశుసంవర్ధక శాఖ జేడీలు అం జలి, గౌసియా బేగం, శ్రీనివాస్, జలవనరుల శాఖ ఎస్ ఈ రఘునాథ్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ మాలకొండయ్య, డీఎస్ఓ మోహనబాబు, ఫైర్ ఆఫీసర్ శంకరరావు పాల్గొన్నారు. -
నేడు కలెక్టరేట్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు
-
గిట్టుబాటు కోసం రైతుల కలెక్టరేట్ ముట్టడి
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): ఎర్రజొన్న, పసుపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ సోమవారం రైతులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. సుమారు రెండు వేల మంది రైతులు తరలిరాగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. చివరకు కొంత మంది రైతు సంఘం నాయకులను లోనికి ప్రవేశం కల్పించడంతో వారు కలెక్టర్ రామ్మోహన్‌రావును కలసి వినతిపత్రం సమర్పించారు. ఎర్రజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేసి క్వింటాలుకు రూ.3,500 చెల్లించాలని, పసుపు క్వింటాలుకు రూ.15,000 ధర ఇప్పించాలని కోరారు. ప్రభుత్వం ఆదుకోకపోతే పెట్టిన పెట్టుపడి కోల్పోయి అప్పులపాలయ్యే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కమిటీ వేస్తున్నట్లు కలెక్టర్ రామ్మోహన్రావు రైతులకు హామీ ఇచ్చారు. కాగా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించుకున్న రైతులు, ఈ నెల 20న ఎమ్మెల్యేలను కలసి సమస్యను విన్నవించాలని, వారు స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించారు. -
రహదారుల దిగ్బంధం
ఆర్మూర్: పసుపు, ఎర్రజొన్న రైతులు పోరుబాట పట్టారు. వారం రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలతో తమ నిరసన తెలుపుతున్న అన్నదాతలు.. శనివారం రహదారుల దిగ్బంధనం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంత రైతాంగం శనివారం 44వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించింది. ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులో, జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో రోడ్లపై బైఠాయించారు. వంటావార్పుతో నిరసనను హోరెత్తించారు. జక్రాన్‌పల్లిలో పెద్ద సంఖ్యలో మహిళా రైతులు ధర్నాలో పాల్గొన్నారు. అయితే ఆందోళనలను నియంత్రించడంలో భాగంగా నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 14 గ్రామాల్లో రెండు రోజుల పాటు 144 సెక్షన్‌ను విధించారు. అర్ధరాత్రి రైతు నాయకులను అరెస్టు చేసి ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయినా రైతులు నిషేధాజ్ఞలను లెక్కచేయకుండా పోరుబాట పట్టారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఎర్రజొన్న పంటకు క్వింటాలుకు రూ. 3,500, పసుపు పంటకు రూ.15 వేల గిట్టుబాటు ధర కల్పించి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ట్రాఫిక్ మళ్లింపు పోలీసు యంత్రాంగం అప్రమత్తమై.. ట్రాఫిక్‌ను దారి మళ్లించింది. జాతీయ రహదారిపై నుంచి వస్తున్న వాహనాలను ఇతర మార్గం ద్వారా డైవర్ట్ చేశారు. దీంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాలేదు. ధర్నా విరమించాలని సీపీ కార్తికేయ, ఆర్మూర్ ఏసీపీ రాములు రైతులను కోరినా వినిపించుకోలేదు. కలెక్టర్ రామ్మోహన్రావు స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఆందోళనను శనివారం రాత్రి 9 గంటలకు విరమించారు. జక్రాన్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై వంటావార్పులో పాల్గొన్న మహిళా రైతులు రేపు కలెక్టరేట్ ముట్టడి రాత్రి సమావేశమైన రైతులు.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అధికారులు అందుబాటులో ఉండరని భావించిన రైతులు.. సోమవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. -
బైరటీస్ ఖనిజానికి కాళ్లొచ్చాయ్..!
ఖమ్మంఅర్బన్: నగరంలోని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందిన భూమిలో తవ్వకాల్లో బయటపడిన బైరటీస్ ఖనిజాలను రాత్రికి రాత్రే అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్టు తెలిసింది. ఆ ఖనిజాలను ముందుగా సమీపంలోని రహస్య ప్రదేశంలో నిల్వ చేస్తున్నారని, రాత్రి వేళ తరలిస్తున్నారని సమాచారం. మూడేళ్ల క్రితం కూడా ఇదే తరహాలో పుట్టకోట సమీపంలోని రైతుల పొలాల్లో దొరికిన బైరటీస్ ఖనిజాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా ఎగు మతి చేశారు. దీనిపై అందిన ఫిర్యాదులతో అప్ప ట్లో సంబంధిత అధికారులు దాడులు చేశారు. నిల్వలను స్వాధీనపర్చుకున్నారు. తాజాగా, అదే ప్రాం తంలోని రియల్ ఎస్టేట్ వెంచర్లో బైరటీస్ ఖనిజం బయటపడింది. దానిని నూతన కలెక్టరేట్ సమీపం లోని భూముల్లో నిల్వచేసి, రాత్రివేళ లారీల ద్వారా తరలిస్తున్నట్టు తెలిసింది. ఈ ఖనిజం ధర నాణ్యతనుబట్టి 700 నుంచి 2000 రూపాయల వరకు పలుకున్నట్టు సమాచారం. ఇప్పటికే 10నుంచి 15లారీలలో ఖనిజం నిల్వలను తరలిం చినట్టుగా తెలిసింది. ప్రస్తుతం అక్కడ ఒక లారీ బైరటీస్ గనినిల్వలు ఉన్నాయి. బైరటీస్ వ్యాపారు లే ఈ రాయిని తరలిస్తున్నారని, వెంచర్ నిర్వాహకు లకు కొంత ముట్టజెబుతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ ఖనిజాన్ని ఏం చేస్తారంటే... ఈ బైరటీస్ ఖనిజాన్ని కెమికల్స్‌లో, సిమెంట్ తయారీలో ఎక్కువగా వాడుతుంటారు. కోదాడ సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఖనిజాన్ని కోదాడ సమీపంలోగల ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్టు తెలిసింది. మాకు తెలియదు... దీనిపై మైనింగ్ ఏడీ నరసింహారెడ్డి, రాయల్టీ ఇన్స్పెక్టర్ రాజారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘బైరటీస్‌ను అక్రమంగా తరలిస్తున్న విషయం మా నోటీసుకు రాలేదు. వెంటనే పరిశీలిస్తాం’’ అని అన్నారు. -
‘ప్రజావాణి’ పరిష్కారమేది?
జగిత్యాల టౌన్: సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’కి వచ్చిన అర్జీలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. దీంతో అర్జీలు ఇచ్చినవారే అదే సమస్యపై పదేపదే వస్తున్నారు. పరిష్కారం విషయంలో అధికారులు మాత్రం అలసత్వం వీడడంలేదు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో జేసీ రాజేశం పాల్గొన్నారు. అర్జీదారుల నుంచి 69 దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో భాగంగా రెవెన్యూ, పింఛన్, వివిధ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. డబుల్బెడ్రూం కోసం అర్బన్‌లో 3,రూరల్‌లో 7 దరఖాస్తులు స్వీకరించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 7 మంది వివిధ సమస్యలపై ఫోన్ ద్వారా సమస్యలను విన్నవించుకున్నారు ఖబ్రస్తాన్ ప్రహరీ పూర్తి చేయాలి మా గ్రామంలో ఉన్న ఖబ్రస్తాన్ ప్రహరీ నిర్మాణం కోసం ఏడాదిన్నర క్రితం ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరయ్యాయి. నిధులతో ఖబ్రస్తాన్ గోడ నిర్మాణం చేపట్టి కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశాడు. అధికారులు స్పందించి నిర్మాణం పూర్తిచేయాలించాలి. - ముస్లిం కమిటీ సభ్యులు, అర్పపల్లి, సారంగాపూర్ మండలం సబ్సిడీ వాహనాలు అందలేదు ప్రభుత్వం గంగపుత్ర సంఘం సభ్యులకు అందజేసిన సబ్సిడీ వాహనాల కోసం 24 మంది దరఖాస్తులు చేసుకున్నాం. దరఖాస్తుతోపాటు సంబంధిత సొమ్మును డీడీల రూపంలో చెల్లించాం. మూడు నెలలు అవుతున్నా ఎలాంటి స్పందన లేదు. డీడీలు అందజేసిన వారికి వాహనాలు అందించాలి. - గంగపుత్ర సంఘం సభ్యులు, కొడిమ్యాల ఈ ఫొటోలోని బాలుడిపేరు కాముని నవీన్. రాయికల్ మండలం కుమ్మరిపల్లికి చెందిన లక్ష్మి–నర్సయ్యల కుమారుడు. కొన్నేళ్లుగా వెన్నుపూస సమస్యతో బాధపడుతున్నాడు. రెండేళ్ల క్రితం వికలాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సదరెం క్యాంప్‌లో అందజేసిన సర్టిఫికెట్ తీసుకురావాలని కోరడంతో క్యాంప్‌కు హాజరయ్యా డు. ఇలా ఆరుసార్లు సదరెం క్యాంప్‌నకు హా జరైనా అధికారులు సర్టిఫికెట్ ఇవ్వలేదు. అసలే పేద కుటుంబం.. ఆపై కుమారుడి వైకల్యంతో తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం అందించే పింఛన్ అందకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సదరెం సర్టిఫికెట్ జారీ చేసేలా చూడాలని సోమవారం కూడా జేసీకి దరఖాస్తు ఇచ్చారు. -
గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగుల ధర్నా
-
దీపావళికి కొత్త కలెక్టరేట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుకు కసరత్తులు ముమ్మరం చేస్తున్న దరిమిలా తన పథకాల్లో దూకుడు పెంచింది. ఎన్నికల కోసం వెళ్లేలోగా ఇచ్చిన హామీల్లో దాదాపు అన్నీ పూర్తిచేసి చూపించే వెళ్లాలన్న పట్టుదలతో ఉంది. అందుకే, కీలక పథకాలు వేగిరపరచాలని సీఎం పేషీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో కొత్త జిల్లాల కలెక్టరేట్ భవనాలు కూడా ఉన్నాయి. 2016లో దసరాకు కొత్త జిల్లాల ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ ఉమ్మడి 10 జిల్లాలను 31 జిల్లాలకు పెంచిన సంగతి తెలిసిందే. వీటిలో మొత్తం 27 కలెక్టరేట్లకు కొత్త భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్మాణ బాధ్యతలను ఆర్ అండ్ బీ చూస్తోంది. సీఎం పేషీ నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అధికారులు చురుగ్గా కదులుతున్నారు. దీపావళికి ప్రారంభమయ్యేవి ఇవే.. వాస్తవానికి 2017లోనే ఈ భవనాల నిర్మాణాలు మొదలయ్యాయి. వీటిలో జగిత్యాల, ఆసిఫాబాద్, కొత్తగూడెం, మేడ్చల్ కలెక్టరేట్ల నిర్మాణాలు కొలిక్కి వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దీపావళికి ఈ నాలుగు భవనాలను ప్రారంభించి, మిగిలినవి ఎన్నికల నాటికి ప్రారంభించాలని సీఎం పట్టుదలతో ఉన్నారని సమాచారం. ఈ మేరకు ఆర్ అండ్‌బీ పనులు పూర్తి చేసేందుకు సమాయత్తమైంది. కాగా వికారాబాద్, యాదాద్రి, రంగారెడ్డి, కామారెడ్డి, సిద్ధిపేట, జనగాం, వనపర్తి జిల్లాల భవనాల నిర్మాణాలు వేగంగానే సాగుతున్నాయి. వాటిని డిసెంబరులో లేదా మార్చిలో ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ ఏడు జిల్లాల కొత్త భవనాలు ఎన్నికలకు ముందే అందుబాటులోకి వస్తాయని అధికారులు అంటున్నారు. మందకొడిగా నడుస్తున్నవి ఇవే..! మరోవైపు మిగిలిన కలెక్టరేట్ భవనాలు ఇంకా నత్తనడకన సాగుతుండటం అధికారులను కలవరపెడుతోంది. వాస్తవానికి ఇవన్నీ బహుళ అంతస్తులు. వీటిని ఏడాదిలోపు పూర్తి చేయాల్సి రావడం కష్టమే. పెద్దపల్లి, నిజామాబాద్, వరంగల్ అర్బన్, సూర్యాపేట, మెదక్, మహబూబ్‌నగర్, భూపాలపల్లి, నిర్మల్, గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, సిరిసిల్ల, మంచిర్యాల, ఖమ్మం మొత్తం 14 జిల్లాల భవనాల పనులు మందకొడిగా సాగుతున్నాయి. వీటికి స్థలసేకరణ, టెండర్ల ఖరారు ఇతర సాంకేతిక కారణాలు ఉన్నాయి. దీంతో ఈ పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పనులే మొదలు కానివి.. సాంకేతిక కారణాలతో వరంగల్ రూరల్ కలెక్టరేట్ భవన నిర్మాణం ఇంకా మొదలు కాలేదు. కరీంనగర్ కలెక్టరేట్‌కు ఇంకా స్థలం కేటాయింపు ఖరారు కావాలి. దీంతో ఈ రెండు జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణాలు చాలా వెనకబడి ఉన్నాయి. -
కడప జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఎం మహ గర్జన
-
సీపీఎస్ అంతం..మా పంతం
ఒంగోలు: ఫ్యాప్టో (ఫెడరేషన్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం స్థానిక కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన పిలుపునకు స్పందించి ఉద్యోగ జేఏసీ కూడా సంఘీభావం ప్రకటించింది. మరో వైపు వేలాదిమంది ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా సెలవులు పెట్టుకొని ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో సివిల్ పోలీసులతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు కూడా ప్రకాశం భవనం వద్ద పెద్ద ఎత్తున మొహరించారు. మహిళా ఉపాధ్యాయినులు ఎక్కువగా హాజరుకావడంతో పోలీసులు సైతం ఏం చేయాలో అర్థంకాక ఒక వైపు బ్యారికేడ్లు ఏర్పాటుచేసి ప్రకాశం భవనం ముందు ఉన్న రెండు రోడ్లలో ఒక రోడ్డును పూర్తిగా బ్లాక్ చేశారు. దీంతో ఉపాధ్యాయులు చేపట్టిన ముట్టడి కార్యక్రమం విజయవంతం అయింది. 9 గంటలకే తరలి వచ్చిన ఉపాధ్యాయులు: ఉద్యోగులు 10 గంటలకల్లా ప్రకాశం భవనంలోకి చేరుకుంటారని, అందుకు అనుగుణంగా 9 గంటలకే పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు చేరుకున్నారు. ప్రకాశం భవనం రెండు గేట్ల వద్ద బైఠాయించి సీపీఎస్ రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. పదిగంటలైనా ఒక్క ఉద్యోగి కూడా కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా ప్రకాశం భవనం అన్ని గేట్ల ముందు ఉపాధ్యాయ సంఘాలు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఆందోళనకు ఉద్యోగ జేఏసీ కూడా సంఘీభావం ప్రకటించింది. ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మికుల భద్రతకు సవాల్‌గా మారిందన్నారు. పెన్షన్ అనేది ప్రభుత్వం భిక్ష కాదని, అది ఉద్యోగుల సామాజిక హక్కు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గోపాల్‌రెడ్డి ఇచ్చిన తీర్పును ఉదహరించారు. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండూ సీపీఎస్ కొనసాగించేందుకు మొగ్గు చూపుతూ ఉద్యోగులను దగా చేస్తున్నాయంటూ మండిపడ్డారు. 5వ తేదీ చలో పార్లమెంట్ కార్యక్రమం ద్వారా సీపీఎస్ రద్దుకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఉపాధ్యాయులు మిక్కిలిగా కదలిరావాలన్నారు. 22వ తేదీ తరువాత దశలవారీ కార్యాచరణ కూడా ప్రకటిస్తారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దుచేస్తే సరి..లేదంటే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎన్జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శరత్‌బాబు మాట్లాడుతూ ఎంఎల్ఏ, ఎంపీలుగా ఒక్కసారి ఎన్నికైన వారికి జీవితాంతం పెన్షన్, ఆరోగ్య భద్రతతోపాటు అనేక రకాలైన ప్రయోజనాలను ప్రభుత్వం కల్పిస్తుందని, కానీ 30 నుంచి 40 సంవత్సరాల ప్రభుత్వ సర్వీసులో కొనసాగిన వారికి మాత్రం పెన్షన్ ఇవ్వకపోవడంలోని ఆంతర్యం ఏమిటో ప్రభుత్వాలు స్పష్టం చేయాలన్నారు. సీపీఎస్ రద్దుకు ఏ పార్టీలు, ఏ ప్రభుత్వాలు అయితే ముందుకు వస్తాయో వారికే భవిష్యత్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మూడు గంటలపాటు ప్రకాశం భవనం గేట్ల వద్దే బైఠాయింపు: ప్రాథమిక సమాచారం ప్రకారం 14 వేల మంది ఉపాధ్యాయులకుగాను దాదాపు 5 వేల మందికిపైగా ఉపాధ్యాయులు శనివారం సెలవు పెట్టారు. అందులో దాదాపు మూడు వేలమంది ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ముట్టడి కార్యక్రమానికి హాజరయ్యారు. మూడు గంటలు దాటినా ఉపాధ్యాయులు ఆందోళన విరమించకపోవడంతో ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు, టూటౌన్ సీఐ సురేష్‌రెడ్డి, రూరల్ సీఐ మురళీకృష్ణలు ఫ్యాప్టో నాయకులతో చర్చించారు. ఆందోళన విరమించాలని సూచించారు. ఈ క్రమంలో అరెస్టులకైనా సిద్ధమే అని, అంతే తప్ప ఆందోళన విరమించేది లేదంటూ టీచర్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆందోళనలో పాల్గొన్న సగం మంది ఉపాధ్యాయులు చర్చిసెంటర్లో మానవహారం చేపట్టారు. సీపీఎస్ వ్యవస్థకు పాడె కట్టడమే తమ లక్ష్యం అంటూ శవం మాదిరిగా ఒక ఉపాధ్యాయుడ్ని మోస్తూ ప్రదర్శన నిర్వహించారు. సీపీఎస్ అంతం ...మా పంతం అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో చర్చిసెంటర్లో దాదాపు గంటపాటు ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. ఈ క్రమంలో పోలీసుల సూచనతో ఫ్యాప్టో నాయకులు, ఉద్యోగ జేఏసీ నాయకులు వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరి ఆందోళన విరమించేందుకు ఉపాద్యాయులతో మాట్లాడారు. అయితే ఉపాధ్యాయులు ఎక్కువ మంది వారి ప్రతిపాదనను తిరస్కరించారు. కలెక్టర్ వచ్చి తమతో మాట్లాడాలని పట్టుబడితే మరికొంతమంది అయితే మాత్రం సీపీఎస్‌పై స్పష్టమైన హామీ కావాలని, లేదా అరెస్టులకైనా సిద్ధమే అంటూ ప్రకటించారు. ఈ క్రమంలో కొద్దిసేపు వారి మధ్యనే కొంత వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళన విరమించేందుకు ముందుకు రాకపోవడంతో పోలీసులు బలవంతంగా అరెస్టులకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో పలువురు నాయకులను అరెస్టుచేసి పోలీసు వాహనంలో స్టేషన్లకు తరలిస్తుండగా పెద్ద ఎత్తున ఉద్యోగులు అడ్డంపడ్డారు. చివరకు పోలీసులు బలవంతంగా పలువురిని టూటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. మా ధర్నా సీసీఎస్ రద్దు కోసమే: ఇదిలా ఉంటే రెండోవిడత మరికొంతమంది నాయకులను అరెస్టు చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు యత్నించగా మహిళా ఉపాధ్యాయినులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. వారిని బలవంతంగా మహిళా పోలీసులు తొలగించేందుకు చేసిన యత్నం ఫలించలేదు. దీంతో టూటౌన్ సీఐ జోక్యం చేసుకుంటూ మహిళా ఉపాధ్యాయినులతో మాట్లాడారు. సీపీఎస్ «ఆందోళన ఇందాకే ముగిసింది. ఇప్పుడు మీరు చేస్తున్న ఆందోళన పోలీసులకు వ్యతిరేకంగా అంటూ మండిపడ్డారు. అయితే ఈ సమయంలో మహిళా ఉపాధ్యాయినులు కూడా ఏమాత్రం బెదరకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీసుల ఐక్యత వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పోలీసుల్లో కూడా సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారని, వారి సంక్షేమం కూడా తమకు ముఖ్యమే అంటూ తిరుగు సమాధానం ఇచ్చారు. దీంతో పోలీసులు నిరసనకారులను తాలూకా పోలీసుస్టేషన్‌కు, అనంతరం వన్‌టౌన్ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఈ ధర్నాలో ఫ్యాప్టో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా శ్రీనివాసరావు, పిల్లి రమణారెడ్డి, ఫ్యాప్టో నాయకులు మీగడ వెంకటేశ్వరరెడ్డి, రవిచంద్ర, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శీనయ్య, ఏపీటీఎఫ్ నాయకులు విజయసారథి, రఘుబాబు, మంజుల, బీటీఏ నాయకులు పర్రె వెంకట్రావు, శరత్చంద్ర, స్కూల్ అసిస్టెంట్స్ యూనియన్ నాయకులు శరత్‌బాబు, సాయి, రమణకుమార్, ఎస్టీయూ నాయకులు ప్రసాద్, ఎర్రయ్య, హెడ్మాస్టర్స్ అసోసియేషన్ నాయకులు వై.వెంకట్రావు, తెలుగు పండిట్స్ అసోసియేషన్ నాయకులు రమేష్, వెంకటేశ్వర్లు, ఎస్సీ, ఎస్టీ యూనియన్ నాయకులు చిరంజీవి, ఏపీటీఎఫ్ 1938 నాయకులు కీర్తి, మాధవరెడ్డి, పి.వి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు కలెక్టరేట్ వద్ద కరువు పై వైఎస్సార్ సీపీ పోరు
-
సూర్యాపేట కలెక్టరేట్‌పై ముగిసిన వాదనలు
సాక్షి, హైదరాబాద్: కొందరు ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే సూర్యాపేట జిల్లాలో కలెక్టరేట్ నిర్మాణానికి ప్రభుత్వం భూ సేకరణ చేస్తోందంటూ హైకోర్టులో దాఖలైన పిల్‌పై మంగళవారం వాదనలు ముగిశాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. సూర్యాపేటలో ప్రభుత్వ భూమి ఉన్నా..పట్టణానికి దూరంగా కుడకుడ, బీబీగూడెం గ్రామాల పరిధిలోని ప్రైవేటు భూముల్లో కలెక్టరేట్ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీహెచ్.రాజేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మంత్రి జగదీశ్‌రెడ్డికి చెందిన వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ప్రైవేట్ భూముల్లో కలెక్టరేట్‌ను నిర్మిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇరువురి వ్యాజ్యాలపై వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. -
కడప విద్యార్థి JAC కలెక్టరేట్ మట్టడిలో అపశృతి
-
హైదరాబాద్ కలెక్టరేట్ ముందు వైఎస్సార్ సీపీ నిరసన
-
ఆ నిర్మాణాలకు మినహాయింపు ఉంది
సాక్షి, హైదరాబాద్: ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన నిర్మాణాల నుచేపట్టేటప్పుడు 2013 భూసేకరణ చట్ట నిబంధనల ప్రకారం సామాజిక ప్రభావ అంచనా నుంచి ఆ నిర్మాణాలను మినహాయించే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తెలిపింది. సామాజిక ప్రభావ అంచనా వేయకుండానే ఖమ్మం జిల్లాలో కలెక్టరేట్ భవనాన్ని నిర్మిస్తున్నారంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టరేట్ అన్నది ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన నిర్మాణమని ధర్మాసనం తెలిపింది. 2013 భూసేకరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఖమ్మం కలెక్టరేట్ భవనాన్ని నిర్మిస్తున్నారంటూ ఎం.విజయభాస్కర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.పవన్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. భూసేకరణ చట్టంలోని సెక్షన్ 10 కింద సామాజిక ప్రభావ అంచనా నుంచి తప్పించి కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. మౌలిక సదుపాయాల కల్పన కోసం చేపట్టే నిర్మాణాలను ఈ చట్టం కింద మినహాయించవచ్చని నిబంధనలు చెబుతున్నాయని, ప్రభుత్వం ఇక్కడ అదే చేసిందని, అందులో తప్పులేదని స్పష్టం చేసింది. కలెక్టరేట్ జిల్లాలో అత్యంత ముఖ్యమైన కార్యాలయమని, అందువల్ల మౌలిక సదుపాయాల కింద చేపట్టే నిర్మాణమే అవుతుందని తేల్చి చెప్పింది. కాబట్టి ఖమ్మం కలెక్టరేట్ నిర్మాణం విషయంలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. -
అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, అనంతపురం : జిల్లాలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. తాడిపత్రి గెర్దావ్ ఫ్యాక్టరీ ఘటనకు జేసీ నైతిక బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు రూ. 25లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితులు చేయిదాటిపోయే అవకాశం ఉండటంతో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో వామపక్షాలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. -
ఉడత బెదిరింపులకు బెదరం
నెల్లూరు(పొగతోట):జిల్లా అధికారులు, అధికారపార్టీ నాయకుల ఉడత బెదిరింపులకు బెదిరే వ్యక్తి ని కాదని వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో జేసీ 2 కమలకుమారిని ఎమ్మెల్యే కలసి జిల్లా అధికారులు ఇచ్చిన పత్రికా ప్రకటనకు సంబం ధించి సాక్ష్యాలు చూపించారు. నిరాధారమైన ఆరోపణలు చేశారని అధికారులు ఇచ్చిన ప్రకటనకు ప్రతి అంశానికి సంబంధించి ఆధారాలను జేసీ2కి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ ‘నేను అడిగిన దానికి జిల్లా అ ధి కారులు ఇచ్చిన సమాధానాలకు పొంతన లేదు.. నేను ఒకటి అడిగితే వారు మరొకటి చూపించి ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు అవాస్తవని పత్రికా ముఖంగా ప్రకటిస్తే ప్రజ లు ఏమనుకుంటారు’ అని జేసీ2ని ప్రశ్నించారు. కలెక్టర్ టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆ రోపించారు. టీడీపీ నాయకులకు కలెక్టర్ కొమ్ముకాస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ తీసుకుంటున్న నిర్ణయాల వలన పాలన కుంటుపడుతోందన్నా రు. ‘నేను చేసిన విమర్శలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీ సుకోకుండా టీడీపీ నాయకులను, జిల్లా అధికారులను నాపైకి ఎదురుదాడికి దిగేవిధంగా కలెక్టర్ ఉసిగొల్పారు’ అని పేర్కొన్నారు. ఇది ఎంత వరకు సబబని ప్రశ్నిం చారు. పసుపు కుంభకోణంలో జిల్లా కలెక్టర్ అధికారపార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారన్నారు. వీఆర్ఓలను సస్పెండ్ చేసి అధికారపార్టీ నాయకులను వదిలేశారన్నారు. పసుపు కుంభకోణానికి సంబంధించి రికవరీ చేయలేదన్నారు. తమకు అనుకూలంగా పనులు చేయమని టీడీపీ నాయకులు కిందిస్థాయి ఉద్యోగులపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. తప్పు చేసిన ఉద్యోగులపై చర్యలు తీసుకునే కలెక్టర్.. అధికారపార్టీ నాయకులకు ఎందుకు కొమ్ముకాస్తున్నారని ప్రశ్నించారు. రామదాసుకండ్రిగకు సంబంధించి పట్టాల్లో పేర్లు మార్పు చేసి మంత్రి సంతకంతో అధికారులకు చేరిందన్నారు. దీనిపై పేర్లు మార్పునకు సంబం ధించిన వ్యక్తులపై చర్యలు తీసుకోమని డిమాండ్ చేశామన్నారు. దానిని పక్కన పెట్టి రామదాసుకండ్రిగకు సంబంధించి ఎవరికీ నష్టపరిహారం ఇవ్వలేదని అధికారులు వివరణ ఇచ్చారన్నారు. ప్రొటోకాల్ పాటించడంలేదని అధికారులకు ఫిర్యాదు చేస్తే తనపై విమర్శలు చేశారన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కుమారుడు ఏ హోదాలో అధికార కార్యక్రమాలకు హాజరవుతున్నారని ప్రశ్నించారు. మంత్రి కుమారుడు కార్యక్రమాలకు అధికారులు ఏ విధంగా హాజరవుతున్నారన్నారు. ఈ విషయాలపై ప్రశ్నిస్తే నాపై ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో నిర్వహించే అధికార కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేను ఎందుకు ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు. మంత్రి తన సొంత డబ్బన్నట్లు లబ్ధిదారులను, అధికారులను గెస్ట్‌హౌస్‌కు పిలిపించుకుని చెక్కులు ఏ వి«ధంగా పంపిణీ చేస్తారని నిలదీశారు. ఇలాంటి విషయాలను ప్రశ్నిస్తే తాను జిల్లా కలెక్టర్‌పై అనుచితంగా మాట్లాడుతున్నానని అధికా రుల చేత ఎదురుదాడి చేయిస్తారన్నారు. పంచా యతీ కార్యాలయంలో తనను ఐదు గంటల అక్కడే ఓ అధికారి కుర్చోపెట్టి ఆయన ఎక్కడికో పోతే.. అధికారిని నేను బంధించారని ప్రచారం చేస్తారన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాలో రూ. కోట్ల అవినీతి జరిగిందన్నారు. గ్రామాలు కంపు కొడుతున్నాయన్నారు. స్వచ్ఛభారత్‌లో జిల్లాకు అవార్డు తీసుకొచ్చిన కలెక్టర్ నిర్మల్ గ్రామీణ పురస్కారం ఒక్క మండలానికి ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. స్వచ్ఛభారత్ అవార్డు వచ్చిన సందర్భంగా టీడీపీ కార్యకర్తలకంటే అధికంగా ఫ్లెక్సీలు కలెక్టర్ వేయించుకోవడం సబబుగా ఉందా అని ప్రశ్నిం చారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో న్యాచురల్ లీడర్లు దోచుకుతున్నారన్నారు. దానికి సం బంధించిన వారిని వదిలేసి ఉద్యోగులపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. పంచాయతీల్లో అక్రమాలు జరిగాయని కలెక్టర్‌కు ఏడాది కిందట ఫిర్యాదు చేస్తే ఇంత వరకు చర్యలు తీసుకోలేదన్నారు. వైఎ స్సార్‌సీపీకి సంబంధించిన సర్పంచ్‌లపై మాత్రం వెంటనే చర్యలు తీసుకుంటున్నారన్నారు. వీటిని ప్రశ్నించినందుకు తనపై ఎదురుదాడిగా ఎమ్మెల్యేవి నిరాధారమైన ఆరోపణలని సమాధానం ఇస్తారా అని ప్రశ్నించారు. గతంలో ఉద్యోగులపై కలెక్టర్ చర్యలకు పూనుకుంటే వారికి అండగా నిలిచానని, ఈ విషయాన్ని వారు మరిచి పోయారన్నారు. అధికా రులను కలెక్టర్ తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. నేను వ్యక్తిగత విషయాలు, పనులు చేసి పెట్టమని కలెక్టర్, అధికారుల వద్దకు ఎప్పుడూ వెళ్లలేదన్నారు. ప్రజల సమస్యలపై మా త్రమే అధికారులను కలిశానని తెలిపారు. ప్రతి పక్ష శాసనసభ్యుని విషయంలో మంత్రి సోమిరెడ్డి దిగజారి ప్రవర్తిస్తున్నారని చెప్పారు. కలెక్టర్ అధి కారపార్టీకి అండగా ఉండకుండా ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేయాలని తెలిపారు. తాను చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాల ను, సాక్ష్యాలను అధికారులకు అందజేశా ను.. ఏమి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ప్ర శ్నిం చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ పి.శిరీషా, వెంకటాచలం జెడ్పీటీసీ సభ్యుడు ఎం.వెంకట శేషయ్య తదితరులు పాల్గొన్నారు. -
అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
-
కడప కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
-
కడప కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, కడప: జిల్లాలోని కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని హౌసింగ్ శాఖ ఇన్స్పెక్టర్లు ఆందోళనకు దిగారు. కలెక్టర్ కార్యాలయం ఎక్కి నిరసన తెలిపారు. నిరసన కారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కొంతమంది హౌసింగ్ శాఖ ఇన్స్పెక్టర్లు కలెక్టర్ కార్యాలయం ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హౌసింగ్ శాఖ ఇన్స్పెక్టర్లు మీడియాతో మాట్లాడుతూ..వేతనాలు సమయానికి ఇవ్వడంలేదని వాపోయారు. వేతనాలు అడిగితే కేసులు పెడుతున్నారంటూ ఆవేదన వక్యం చేశారు. -
కలెక్టరేట్లో దళిత ఉద్యోగిని ఆత్మహత్య
-
కదిలిస్తే కన్నీరు..!!
కలెక్టరేట్ ప్రవేశ ద్వారం వద్ద పడుకుని..లేవలేక ఇబ్బంది పడుతున్న ఈమె పేరు చెప్పలి సుబ్బమ్మ. దాదాపు 80 ఏళ్ల వయస్సు. చెన్నూరు గ్రామం. ఏళ్ల తరబడి అక్కడి రెవెన్యూ కార్యాలయంలో స్వీపర్‌గా నెలకు రూ. 500 జీతంతో కాలం వెల్లదీస్తోంది.దాదాపు నాలుగైదు నెలలకు సంబంధించి ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వకపోవడంతో అధికారులను కలవాలని వచ్చింది. భర్త పెద్ద యల్లయ్య, కుమారులు రామసుబ్బయ్య, చిన్న యల్లయ్యలు నాలుగేళ్ల క్రితం చనిపోయారు. ఎన్నిమార్లు చెన్నూరు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకునే వారు లేక పెద్ద సార్‌ను కలవాలని వచ్చింది. కలెక్టర్ సారూ లేరని తెలిసి..పాదరక్షలు కూడా లేని వృద్ధురాలు. బయటికి నడవలేక అక్కడే మెట్లపైనే కూర్చుంది. కడపకు ప్రతి సోమవారం మీ కోసం కార్యక్రమానికి ఎందరో ఇలాంటి సమస్యలతోనే వస్తున్నారు. కనీసం ఇలాంటి వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి వెంటనే పరిష్కారానికి చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. – సాక్షి, కడప 50 సార్లు తిరిగా.. నా పేరు అంకాలమ్మ. మాది రాజంపేట సమీపంలోని బోయనపల్లె. నా బిడ్డ అంజిని ఎత్తుకుని ప్రతిసారి ఇక్కడికి వస్తున్నా. రానుపోను ఛార్జీలు రూ. 80 అవుతున్నాయి. గుడిసెల్లో ఉంటున్నాం. ఇల్లు కావాలని ఎన్నిమార్లు మొరపెట్టుకుంటున్నా మా బాధ వినే వారు లేరు. పప్పులు, ఎర్రగడ్డలు, ఇనుప, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుని ఊరూరా తిరుగుతూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పటికి కడపలోని కలెక్టర్ దగ్గరకు మూడుసార్లు వచ్చినా ఇంతవరకు ఇంటికి సంబంధించి ఏమీ చెప్పలేదు. ఎప్పుడు కలిసినా ఇస్తామంటున్నారు. కానీ ఇవ్వలేదు. రాజంపేట తహసీల్దార్ ఆఫీసుకు 50 సార్లకు పైగా పోయి బాధ చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. పింఛన్ ఇప్పించండి మహాప్రభో... నా పేరు ఇమాంబీ. మాది రాయచోటి మాసాపేట. నాకు 70 ఏళ్లు. నేనొక్కదాన్ని రాలేక మా బంధువుల పాప హసీనాను వెంట బెట్టుకుని వచ్చాను. ఇటీవలె కంటి ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఫించన్ కోసం తిరుగుతూనే ఉన్నా. ఎప్పుడిస్తారో తెలియదుగానీ అవస్థలు మాత్రం పడుతూనే ఉన్నాం. పలుమార్లు ఎమ్మార్వో ఆఫీసులో ఇచ్చాం. ఇక్కడ కూడా ఇద్దామని కలెక్టరేట్‌కు ఇచ్చా. మామిడి చెట్లు ఎండిపోతున్నాయి... నాపేరు రామచంద్రయ్య. మాది చిట్వేల్ మండలం కేసీ ఆగ్రహారం. నాకు 4.99 ఎకరాల పొలం ఉంది. నాకు ఎస్సీ కార్పోరేషన్ తరుపును ప్రభుత్వం బోరు మోటారు మంజూరు చేసింది. కానీ అధికారులు వచ్చి సర్వే చేసి పక్క పొలంలో ఉన్న బోరుకు మీ బోరుకు తక్కువ దూరం ఉందని వెళ్లిపోయారు. దీంతో నా పంట పొలంలోని మామిడిచెట్లు ఎండిపోతున్నాయి. సంబంధిత విషయం గురించి అధికారుల దృష్టికి తెచ్చేందుకు వచ్చాను. సబ్సిడీ మంజూరు కాలేదని రుణానికి కొర్రీ.. నా పేరు ఎం. నరసింహులు. నాది రామాపురం మండలం. నేను జీవనాధారం కోసం అంగడి ఏర్పాటు చేసుకోవడానికి స్టేట్ బ్యాంకులో లక్ష రూపాయల రుణాన్ని మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాను. బీసీ కార్పొరేషన్ నుంచి సగం సబ్సిడీ వస్తుంది. మార్చి 29వ తేది బీసీ కార్పొరేషన్ అధికారులు సబ్సిడీ మొత్తాన్ని స్టేట్ బ్యాంకుకు పంపించారు. ఈ మేరకు నాకు సమాచారం వచ్చింది. అయితే బ్యాంకు అధికారులు మాత్రం సబ్సిడీ మొత్తం తమకు అందలేదని రుణం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చేందుకు ఇక్కడికి వచ్చాను. పెన్షన్ మంజూరు చేయాలి.. నాపేరు విజయలక్ష్మి. నాది సీకే దిన్నె మండలం. నా భర్త సంవత్సరం క్రితం మరణించాడు. నాకు ఇద్దరు ఆడపిల్ల లు ఉన్నారు. నేను కూలీనాలీ చేసుకుంటూ జీవనం గడుపుతున్నాను. కుటుంబ యజమాని మరణించినప్పటికీ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ఆర్థిక సహాయం రాలేదు. మాకు ఇంటి స్థలం కూడా లేదు. ప్రభుత్వం వితంతు పింఛన్ మంజూరు చేస్తే మా కుటుంబానికి కొంత ఆసరాగా ఉంటుంది. నా స్థలం అమ్ముకున్నారు.. నాపేరు రామక్రిష్ణయ్య. మాది మాధవరం మండలం ఉప్పరపల్లె గ్రామం. నాకు ప్రభుత్వం 5 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చింది. దానిని వేరే వాళ్లు అమ్ముకున్నారు. దానిని గురించి అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే లేరు. దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చాను. అడంగల్‌లో పేరున్నా అడ్డుకుంటున్నారు.. నాపేరు సి. ఈశ్వరయ్య. బి.మఠం మండలంలోని నరసన్నపల్లెలో 189 సర్వే నెంబర్లలో నాకు 17 సెంట్ల స్థలముంది. అందుకు సంబం ధించి నా పేరు మీద అడంగల్ కూడా అయితే, అక్కడ సర్వే జరగకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు. 10 నుంచి 15 సార్లు ఇక్కడికి వచ్చాను. అయితే అధికారులు విచారణ చేయడం లేదు. ఎన్నిసార్లు తిరగాలి.. నా పేరు సిట్టేలుగాళ్ల గంగమ్మ. మాది మైదుకూరు మండల పరిధిలోని నంద్యాలంపేట పంచాయతీలోని కొత్త విపురాపురం. ప్రభుత్వం నాకు, నా చెల్లెలుకు మూడు ఎకరాల భూమిలో బోరు వేశారు. కానీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని సంబంధిత ట్రాన్స్‌కో, ఇతర కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇవ్వలేదు. ఇప్పటికి కలెక్టర్‌కు చెప్పడానికి పదిసార్లు వచ్చాను. భూమి కొనుగోలు చేసి అందించాలి... నా పేరు ఓబయ్య. నాది దువ్వూరు. మా మండలంలోని గొల్లపల్లెలో భూమి ఎస్సీలకు కేటాయించారు. అధికారికంగా కేటాయించాల్సి ఉంది. అందుకు అధికారులు ఈరోజు, రేపు వచ్చి పరిశీలిస్తామంటున్నారు. ఇంతవరకు రాలేదు. హద్దుల వద్ద జెండాలు కూడా నాటారు. కానీ ఇంతవరకు అధికారులు వచ్చి పరిశీలించకపోవడంతో ఎప్పుడు భూమి ఇస్తారో తెలియడం లేదు. సీఎం సహాయ నిధి ఇచ్చి ఆదుకోండి... నాపేరు ప్రకాశం. మాది కమలాపురం మండలం పైడికాల్వ గ్రామం. నేను ఇటీవలే తిరుపతిలోని స్విమ్స్‌లో ఊపిరితిత్తుల ఆపరేషన్ చేయించుకున్నారు. దానికి అయిన ఖర్చుల గురించి సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇంకా డబ్బులు రాలేదు. సంబంధిత విషయం గురించి అ«ధికారులను పలుమార్లు అడిగినా పట్టించుకోవడం లేదు. దీనిపై ప్రజావాణికి వచ్చి అర్జీ ఇచ్చాను. సిమెంట్ ఇవ్వకపోవడం ఏమిటి... నాపేరు పెంచలయ్య. మాది రాజంపేట మండలం పోలీ పంచాయతీ చిండ్రిగాయపల్లె గ్రామం. నాకు ప్రభుత్వ ఎన్టీఆర్ గృహ పథకం కింద ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసింది. ప్రస్తుతం ఇంటికి స్లాబ్‌ను వేసుకునేందుకు 35 బస్తాల సిమెంట్‌ను మంజూరు అయ్యింది. సంబంధిత సిమెంట్‌ను గోడౌన్ ఇన్చార్జు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడు. స్లాబ్ నిలిచిపోయింది. ఇలా చాలామందికి సిమెంట్ ఇవ్వడం లేదు. పరిహారం ఎంత ఇస్తారో చెప్పడం లేదు.. నాపేరు వెంకటరమణారెడ్డి, వేంపల్లి మండలం ఆలిరెడ్డిపల్లె ఎంపీటీసీని. మాగ్రామ పొలాల్లో నుంచి కడప నుంచి బెంగుళూరుకి వెళ్లే రైల్వేట్రాక్ మంజూరైంది. కానీ మా పొలాలకు రైల్వేశాఖ ఎంతనష్టçపరిహారం ఇస్తుందో అర్థం కావడం లేదు. సర్వే కోసం వచ్చిన అధికారులు కూడా చెప్పడం లేదు. మా పంట పొలాలు మూడు కార్లు పండుతాయి. దీంతోపాటు మార్కెట్ విలువ కూడా ఎక్కువగా ఉంది. మరి రైల్వేశాఖ వారు నష్టపరిహారం కింద ఎంత డబ్బులిస్తారో అర్థం కావడం లేదు. ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజావాణికి వచ్చా. భూమి అభివృద్ధికి చేయూత ఇవ్వండి.. నాపేరు పెద్ద సుంకన్న. నాది మైలవరం మండలం. తొర్రివేముల గ్రామ పొలం సర్వే నెంబరు 679–2బిలో నాకు ప్రభుత్వం మూడు ఎకరాల వ్యవసాయ భూమి పట్టాగా మంజూరు చేసింది. ఆ భూమిని వ్యవసాయానికి యోగ్యంగా చదువును చేసుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా తలమంచిపట్నం చెరువు నుంచి 500 ట్రిప్పుల మట్టి అవసరమవుతుంది. అధికారులు చెరువుమట్టిని ఉచితంగా నా భూమికి తోలించాలి. కంపచెట్లు తొలగించేందుకు ఆర్థికంగా చేయూతనివ్వాలి. 500 ఎకరాల భూమి అంతా ఆక్రమణలే! నా పేరు బి.వెంకట సుబ్బారెడ్డి. బద్వేలు పరిధిలోని భాకరాపేట మా ఊరు. 1914లో సుమారు 547 ఎకరాల భూమి మా అబ్బబ్బ గారి పేరుమీద రిజిష్టర్లు ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1956లో చాలా భూమిని డీకేటీగా మార్చారు. తర్వాత అంతో ఇంతో మిగిలిందంతా కూడా ఆక్రమణలు అయిపోయింది. నా భూమి సర్వే చేయించాలని సీఎం చంద్రబాబుతోసహా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా. 2000 నుంచి ఇప్పటివరకు నా పోరాటం ఆగలేదు. కనీసం ఒక ఎకరా అయినా చూపించాలని మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆన్లైన్లో కనిపించడం లేదు.. మా పేర్లు వై.లక్ష్మి దేవి, సి.సునీత. మాది చెన్నూరు. మా అమ్మ పద్మావతి రుద్రభారతి పేటలో 1.14 సెంట్ల భూమిలో కూతుర్లు అయిన మా ఇద్దరికీ ఎకరా...మరో 14 సెంట్లు కుమారుడికి ఇచ్చింది. అందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి. పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆన్లైన్లో చేర్చాలని ఎన్నిమార్లు తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదు. -
కలెక్టరేట్ నిర్మాణంలో కుంభకోణం
సూర్యాపేట: కొత్తగా ఏర్పడ్డ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ నిర్మాణంలో రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం వారు ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ‘పేట’పేరు వింటేనే ముందుగా గుర్తొచ్చేది పోరాటాలని, అలాంటి పోరాటాల గడ్డలో జగదీశ్‌రెడ్డి అనే చీడ పురుగు ప్రజలను మోసం చేసేందుకు.. ముసుగు తగిలించుకొని వస్తున్నారని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చుట్టూ కిలోమీటర్ నుంచి రెండున్నర కిలోమీటర్ల పరిధిలో సుమారు 300 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా.. ప్రైవేటు భూములను ముందుగానే బినామీల పేరుపై కొనుగోలు చేసి వాటిల్లో కలెక్టరేట్ నిర్మాణం చేయడంలో ఆంతర్యమేమిటన్నారు. ప్రైవేటు భూములను దళితుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి వారిని మోసం చేశారన్నారు. ఈ భూములను 2016లోనే కొనుగోలు చేయడంలో కుట్ర దాగి ఉందని విమర్శించారు. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండగా మంత్రి ప్రైవేటు భూములపై ఎందుకు అంత ప్రేమ చూపుతున్నారో ప్రజలకు అర్థమైపోయిందన్నారు. జిల్లా కలెక్టర్ 671 సర్వేనంబర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిలో కలెక్టరేట్ నిర్మాణం చేస్తే బాగుంటుందని సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదనలు పంపించినప్పటికీ.. మంత్రి అవేమీ పట్టించుకోకుండా తనకు అనుకూలమైన ప్రైవేటు భూముల్లో కలెక్టరేట్ నిర్మాణం చేయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కలెక్టరేట్ నిర్మాణం వ్యవహారంలో హైకోర్టుకు వెళతామని వారు అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగదీశ్‌రెడ్డికి 2వేల ఓట్లు కూడా రావన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన మంత్రే అవినీతికి పాల్పడటం బాధ కలిగిస్తోందని అన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలసి నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్‌ను దారుణంగా హత్య చేయించారన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడిన కాల్డిటెయిల్స్ కూడా తీయిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి, మరో నేత కొప్పుల వేణురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అందుకే శాసనసభ సభ్యత్వం రద్దు: కోమటిరెడ్డి
సాక్షి, సూర్యాపేట : మంత్రి జగదీష్ రెడ్డిపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సూర్యపేటలో పర్యటించిన ఆయన.. ప్రజల సొమ్ము దోచుకోవడంలో మంత్రి జగదీష్ రెడ్డి స్టూవర్టుపురం దొంగలను మించి పోయారని విమర్శించారు. నూతన కలెక్టరేట్ స్థలం ఎంపికలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. సుమారు 200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. కలెక్టరేట్ విషయంలో దళితులను దారుణంగా మోసం చేశారని తక్కువ ధరకే బినామీలతో భూములు కొనిపించారని అన్నారు. ఏతప్పు చేయని రాజయ్యను బర్తరఫ్ చేసిన ముఖ్యమంత్రి, మంత్రి జగదీష్ రెడ్డి విషయంలో మాత్రం ఎందుకు స్పందించడంలేదంటూ ప్రశ్నించారు. కలెక్టరేట్ కుంభకోణంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తామని కోమటిరెడ్డి అన్నారు. భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన జగదీష్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదంటూ జోష్యం చెప్పారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. ప్రజలందరికీ అందుబాటులోనే కలెక్టరేట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజలు కొత్త కలెక్టరేట్ ప్రాంతంలో స్థలాలు కొనొద్దంటూ సూచించారు. ప్రజలను పట్టించుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దారుణంగా విఫమైందని.. వారి అక్రమాలు, వైఫల్యాలను బయటపెడతామనే భయంతోనే తన శాసనసభ సభ్యత్వం రద్దు చేశారని కోమటి రెడ్డి ఆరోపించారు. -
శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి
మెదక్‌రూరల్: ఫీల్డ్అసిస్టెంట్లకు అసిస్టెంట్లకు శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా పిల్లికోటల్ వద్ద జిల్లాకు చెందిన ఫీల్డ్అసిస్టెంట్లు విధులు బహిష్కరించి ఒక్కరోజు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ధార్మారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ హమీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్అసిస్టెంట్లకు అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శిగా హోదా కల్పించాలని, పెరిగిన నిత్యవసర ధరలకు అనుగునంగా ప్రస్తుతం ఉన్న రూ. 8900 వేతనాన్ని రూ. 20వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్‌అసిస్టెంట్ల కుటుంబాలకు ఆరోగ్య భద్రత కార్డులు ఇవ్వాలని, వేతనం పై 20 శాతం ఇంక్రిమెంట్ సౌకర్యం కల్పించడంతో పాటు డబుల్ బెడ్రూం ఇళ్ళను ఇవ్వాలన్నారు. వికలాంగులైన ఫీల్డ్అసిస్టెంట్లకు అలవెన్స్ ఇవ్వాలని తెలిపారు. సీనియర్ మేట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ కేటగిరి లిస్టు 1, 2 ,3గా కాకుండా గతంలో మాదిరిగానే కొనసాగించాలని కోరారు. , నూతనంగా ఏర్పాటుచేస్తున్న మున్సిపాలిటీలో, నగర పంచాయతీలలో పనిచేస్తున్న ఫీల్డ్అసిస్టెంట్లను యదావిధిగా ఉపాధిహామీలోనే ఉద్యోగ అవకాశం కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు రవి, పోచయ్య, శ్రీశైలం, ప్రసాద్, శేఖర్, రాములు, దామోదర్, సిద్దిరాములు పాల్గొన్నారు. -
మా కుటుంబానికి న్యాయం చేయండి
కాకినాడ రూరల్: తన భర్త సకురు రాంబాబును హత్యచేసిన వ్యక్తులను కాపాడుతున్న అన్నవరం ఎస్సై, ప్రత్తిపాడు సీఐలపై చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతుడు రాంబాబు భార్య సకురు లక్ష్మి తన పిల్లలు, బంధువులతో కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరాహారదీక్ష చేపట్టారు. తన భర్త మేకలను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నాడని, అతడి మరణానికి నాలుగు రోజుల ముందు శంఖవరం మండలం వజ్రకూటం గ్రామానికి చెందిన సకురు ధర్మరాజు పోడుభూమి వ్యవహారంలో తన భర్తను చంపి కాల్చేస్తానంటూ బెదిరించాడన్నారు. ఫిబ్రవరి 23న వజ్రకూటానికి చెందిన ధర్మరాజు, అతను పురమాయించుకున్న కిరాయి మనుషులు కర్రి సోమరాజు, దేశలింగ రాంబాబు, అమలకోటి సూరిబాబు, అతడి అల్లుళ్లు గోపు సురేష్, కేళంగి జగ్గారావు, మేనల్లుడు గంగుమళ్ల అప్పారావు తన భర్తను హత్య చేసి కాల్చేశారని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. అన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తన భర్తను చంపిన వ్యక్తులపై కేసులు పెట్టాలని కోరుతుంటే.. అన్నవరం పోలీసులు తమ కుటుంబాన్ని బెదిరించి, తప్పుడు కేసులు పెడుతున్నారని లక్ష్మి విలపించింది. తన కుటుంబానికి అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఎస్సై, సీఐలపై చర్యలు తీసుకోవాలని, అదే విధంగా తన భర్తను హత్యచేసిన ధర్మరాజు అతడి మనుషులను అరెస్టు చేయాలంటూ లక్ష్మి డిమాండ్ చేసింది. ఈ దీక్షల్లో సకురు త్రిమూర్తులు, సకురు రోజామణి, సకురు వెంకటలక్ష్మి, సకురు విష్ణుమూర్తి, పెదిరెడ్డి మంగ, సకురు నాగేశ్వరరావు తదితరులు కూర్చొని తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
పదే పదే ఒకే అర్జీ..!
‘మీ కోసం..’ ప్రతి సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లో జిల్లా అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండే వేదిక. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను నేరుగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామన్న ఆశతో వందల మంది జిల్లా కేంద్రానికి వస్తుంటారు. కానీ జిల్లా అధికారులు ఆ అర్జీని మళ్లీ ఆయా మండలాల అధికారులకే సిఫార్సు చేసి సమస్య పరిష్కారమైనట్లు లెక్కల్లో చూపిం చేస్తున్నారు. కానీ సదరు అర్జీలు మండల కార్యాలయాల్లో బుట్టదాఖలవుతున్నాయి. ఫలితం..ఒకే సమస్యపై పదేపదే అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. లెక్కల్లో మాత్రం వచ్చిన అర్జీలన్నీ దాదాపు పరిష్కరించేశామని ఉన్నతాధికారులు చెప్పుకుంటున్నారు. సాధారణ ప్రజలు మాత్రం సమస్య పరిష్కారం కాక..ఇంక ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమాన్ని ‘సాక్షి’ బృందం పరిశీలించగా బాధితుల వేదన వెలుగులోకి వచ్చింది. ఒంగోలు టౌన్: ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ప్రతి సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహిస్తారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నిర్వహించిన మీకోసంలో జిల్లా వ్యాప్తంగా 2,77,889 మంది బాధితులు అర్జీలను అందించారు. వాటిలో 2,77,276 అర్జీలు పరిష్కరించినట్లు జిల్లా యంత్రాంగం ఘనంగా ప్రకటించుకొంది. పరిష్కరించిన వాటిలో 1,76,116 అర్జీలు ఆర్ధికపరమైనవి ఉండగా, 37,481 అర్జీలు ఆర్ధికేతరమైనవి ఉన్నాయి. కేవలం 613 అర్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు తేల్చింది. అంటే మీకోసంలో వచ్చిన ప్రతి రెండు అర్జీల్లో ఒకదానిని పరిష్కరించినట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. వచ్చిన అర్జీలన్నింటికీ పరిష్కారం లభిస్తుంటే బాధితులు ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో బారులు తీరి ఎందుకు ఉంటున్నారు? పనులు మానుకొని సుదూర ప్రాంతాల నుంచి ఎందుకు వస్తున్నారు? చేతిలో చిల్లి గవ్వ లేకున్నా అప్పు తీసుకొని ఎందుకు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ జిల్లా యంత్రాంగమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రెవెన్యూ బాధితులే ఎక్కువ: మీకోసం కార్యక్రమంలో వచ్చే అర్జీల్లో ఎక్కువ భాగం రెవెన్యూ బాధితులకు సంబంధించినవి ఉంటున్నాయి. మండలాల్లో రెవెన్యూ అధికారుల మాయాజాలానికి భూములు గల్లంతవుతున్నాయి. భూమిపై ఒకరు ఉంటుండగా, అదే భూమికి సంబంధించిన వెబ్‌ల్యాండ్‌లో మరొకరు కనిపిస్తుంటారు. దీంతో భూ వివాదాలు పెరిగిపోతున్నాయి. బాధితులు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తమకు జరుగుతున్న గోడు అధికారులకు చెప్పుకున్నా వారిది అరణ్యరోదనే అవుతోంది. ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడికే వెళ్లి తన సమస్య చెప్పుకున్నా ఫలితం కనిపించడం లేదు. దాంతో బాధితులు జిల్లా కేంద్రంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నిర్వహించే మీకోసం కార్యక్రమానికి ఆర్ధిక వ్యయ ప్రయాసలకోర్చి వస్తే ఎక్కడైతే న్యాయం జరగలేదో తిరిగి అక్కడికే పంపిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులను కలిసిన తరువాత వారు ఇచ్చే రసీదును తీసుకొని మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళితే సమాధానం చెప్పేందుకు కూడా కొంత మంది తహసీల్దార్లు ఇష్టపడటం లేదు. సౌకర్యాలు నిల్:మీకోసం కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారు గంటలకొద్దీ క్యూలో నిల్చొని అర్జీల అందించాల్సి ఉంటుంది. ఆ సమయంలో అత్యవసరంగా కాలకృత్యాలు తీర్చుకోవాలంటే బాధితులు పడే అవస్థలు వర్ణనాతీతం. ముఖ్యంగా మహిళలు అయితే వారి అవస్థలు చెప్పనలవిగా ఉంటాయి. సీపీఓ కాన్ఫరెన్స్ ఎంట్రెన్స్‌లో మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని బాధితులు కోరుతున్నారు. తమ సమస్యల పరిష్కారం మాటేమోగాని అత్యవసర పరిస్థితుల్లో కాలకృత్యాలు తీర్చుకోవాలంటే తాము ఎటు వెళ్లాలో తెలియడంలేదని వారు వాపోతున్నారు. వాళ్లకేమో రాగి జావ.. వీళ్లకేమో నీటి కరువు:మీకోసం కార్యక్రమంలో పాల్గొనే జిల్లా అధికారులు, సిబ్బందికి ప్రతి సోమవారం యంత్రాంగం రాగి జావ అందిస్తోంది. ఏసీ గదుల్లో కూర్చొని రాగి జావ తాగుతూ అధికారులు రిలాక్స్ అవుతుంటే, ఎర్రటి ఎండల్లో వచ్చిన బాధితులకు గుక్కెడు నీరు ఇచ్చేవారు కరువయ్యారు. గతంలో చల్లటి నీటిని ఏర్పాటు చేసిన యంత్రాంగం ప్రస్తుతం చల్లటి నీరు కాదుగదా గొంతు తడుపుకునేందుకు ఏర్పాట్లు చేయడం లేదు. తాజాగా సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి 276 అర్జీలు వచ్చాయి. సామాజిక పరమైన అర్జీలు అందించే సమయంలో పదుల సంఖ్యలో బాధితులు వస్తుంటారు. అంటే వారందరికీ నీటిని అందించే ఏర్పాట్లు చేయడంలో యంత్రాంగం విఫలమైంది. సోమవారం కేవలం రెండు బబుల్స్‌ను మాత్రమే ఏర్పాటు చేశారు. కొద్దిసేపటికే ఆ రెండు బబుల్స్ ఖాళీ అయ్యాయి. -
అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి
నెల్లూరు(పొగతోట): వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇళ్ల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నేత వీ రామరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీగూడూరు మండలంలో మరుగుదొడ్లు, ఇళ్ల నిర్మాణాల్లో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. అర్హులకు బిల్లులు మంజూరు చేయకుండా గతంలో నిర్మించిన మరుగుదొడ్లు, ఇళ్లకు బిల్లులు చేస్తున్నారని తెలిపారు. ముడుపులు ఇచ్చిన వారికి సకాలంలో బిల్లులు చెల్లిస్తూ, ఇవ్వని వారిని అధికారులు తిప్పుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా అధికారులు విచారణ జరిపి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ ఆర్ ముత్యాలరాజుకు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో రైతు సంఘ నాయకుడు షాన్వాజ్, ప్రసాధ్, పీ మల్లి, సుందరం, వజ్రమ్మ, మమత, తదితరులు పాల్గొన్నారు. చెరువుకు నీరు విడుదల చేయాలని డిమాండ్ ప్రజల, పశువుల దాహార్తిని తీర్చేం దుకు చాగణం చెరువుకు తెలుగుగంగ కాలువ నుంచి నీటిని విడుదల చేయాలని సైదాపురం మండలం చాగణం గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వర్షాలు లేని కారణంగా భూగర్భజలాలు అడగంటి పోయాయన్నారు. తానీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెనిద్రలో భాగంగా గ్రామానికి వచ్చిన కలెక్టర్‌కు తాగునీటి సమస్యను విన్నవించగా తెలుగుగంగ కాలువ నుంచి చెరువుకు నీరు సరఫరా చేసేలా కాలువ పనులు ప్రారంభించారని తెలిపారు. ప్రస్తుతం కాలువ పనులు నిదానంగా సాగుతున్నాయన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని కాలువ పనులు పూర్తి చేసి తెలుగుగంగ కాలువ నుంచి చెరువుకు నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ ఆర్ ముత్యాలరాజుకు వినతి పత్రం అందజేశారు. -
హోదా సాధిద్దాం
ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 6 వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు రూపొందించింది. ఇందులో భాగంగా గురువారం ఒంగోలులో కలెక్టరేట్ వద్ద ఆ పార్టీ నాయకులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు, రైతులు పాల్గొని ప్రత్యేక హోదా...ఆంధ్రుల హక్కంటూ నినాదాలు చేశారు... ఒంగోలు: రాష్ట్రం అభివృద్ధి సాధించాలన్నా, పరిశ్రమలతో కళకళలాడాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కాలన్నా ప్రత్యేక హోదా తోనే సాధ్యమని, దానిని సాధించుకునేందుకు నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాకు బాలినేని అధ్యక్షత వహించారు. ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక హోదా... ఆంధ్రుల హక్కంటూ నినాదాలు చేశారు. కార్యక్రమానికి ఆరంభంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగపండు ఉష ఆధ్వర్యంలో హోదాపై వారు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఉద్యమ స్ఫూర్తిని రగిల్చాయి. శిబిరం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం బాలినేని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వెంకన్న స్వామి సాక్షిగా మోసం: ‘‘ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ అంటే, కాదు పదేళ్లు అని వెంకయ్యనాయుడు, కాదు కాదు 15 ఏళ్లు కావాలంటూ మోదీ సమక్షంలో చంద్రబాబు నినదించారు. ఇదంతా ఎన్నికలకు ముందు మాటలు. కానీ అధికారంలోకి రాగానే రూటుమార్చి అర్ధరాత్రి కనీసం రాష్ట్ర ప్రజానీకానికి ఏమాత్రం వివరాలు చెప్పకుండా ప్యాకేజీ కోసం ఒప్పందం చేసుకొని తిరుమల వెంకన్నస్వామి సాక్షిగా ఇచ్చిన హోదాకు తూట్లు పొడిచి రాష్ట్ర ప్రజానీకాన్ని నిలువునా మోసం చేశారు’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే జేబులు నింపుకునేందుకు, పనుల పేరుతో పర్శంటేజీలు కొట్టేసేందుకే కేంద్రం తో ప్యాకేజీ ఒప్పందం కుదుర్చుకున్నార ని దుయ్యబట్టారు. ఇటీవల బాబు నిర్వహించిన సర్వేలో జనం ఇచ్చిన దిమ్మతిరిగే తీర్పుతో బాబు మాట మార్చి ప్రత్యేక హోదా అంటున్నారన్నారు. బాబు నైజం మోసం చెయ్యడమే అనే విషయం ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగాలు పెరుగుతాయని, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రత్యేక హోదా కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్, మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ బాచిన చెంచుగరటయ్య, పిడతల సాయికల్పనా రెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు ఐవి.రెడ్డి (గిద్దలూరు), తూమాటి మాధవరావు (కందుకూరు), బుర్రా మధుసూదన్ యాదవ్ (కనిగిరి), బాదం మాధవరెడ్డి (దర్శి), వరికూటి అశోక్‌బాబు (కొండపి), యడం బాలాజి (చీరాల), రావి రామనాథంబాబు (పర్చూరు), వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, వెన్నా హనుమారెడ్డి, కాకుమాను రాజశేఖర్, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, నాయకులు కేవీ రమణారెడ్డి, వేమూరి సూర్యనారాయణ, చుండూరి రవిబాబు, వై.వెంకటేశ్వరరావు, పటాపంజుల శ్రీనివాసరావు, వరికూటి కొండారెడ్డి, ధూళిపూడి ప్రసాద్‌నాయుడు, చావలి శివాజి, డీఎస్ క్రాంతికుమార్, పోకల అనూరాధ, పురిణి ప్రభావతి, కావూరి సుశీల, షేక్ సుభాని, యనమల నాగరాజు, నెరుసుల రామకృష్ణ, మిడసల వెంకట విశ్వేశ్వరరావు, మాలే విజయశంకరరెడ్డి, బడుగు కోటేశ్వరరావు, అన్నెం వెంకట్రామి రెడ్డి, కటారి ప్రసాద్, పందిళ్ల రాధ, లంకపోతు అంజిరెడ్డి, దాసరి గోపాల్ రెడ్డి, రాయపాటి అంకయ్య, వీఆర్సీ రెడ్డి, పల్లపోలు మల్లిఖార్జున రెడ్డి, ఆళ్ల రవీంద్రారెడ్డి, అంచిపోగు రమేష్‌బాబు, గంగాడ సుజాత, బడుగు ఇందిర, కఠారి రామచంద్రరావు, గంటా వెంకట రామానాయుడు, కఠారి శంకరరావు, సయ్యద్ జలీల్, కర్నేటి వెంకటప్రసాద్, రేలా అమర్నాథ్రెడ్డి, రాయని వెంకట్రావు, కంకణాల వెంకట్రావు, ఎం.వి.విఎస్ వేణుగోపాల్, మారెడ్డి రామకృష్ణారెడ్డి, చిన్నపరెడ్డి అశోక్‌రెడ్డి, బడుగు ఇందిర, బైరెడ్డి అరుణ, చింతంగుంట్ల సువర్ణ, మొహమ్మద్ చాంద్‌బాషా, తానిపర్తి బ్రహ్మారెడ్డి, పల్లా అనూరాధ, కాకుమాను సునీల్‌రాజ్, గాంట్ల యశ్వంత్‌వర్మ, పి.గోవర్ధనరెడ్డి, వల్లెపు మురళి, పోలూరి కిశోర్, పమ్మి శేషిరెడ్డి, షేక్ మీరావలి, పెద్దిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, అనంతలక్ష్మి, శ్యామల భాస్కరరెడ్డి, పి.రత్నరాజు, టి.యలమంద, పి.అంజిరెడ్డి, ఇంతిజార్బాషా, జాని, పార్టీ నాయకులు పి.అక్కిరెడ్డి, పి.అశోక్ కుమార్, జజ్జర ఆనందరావు, టి.సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలను మోసపుచ్చడమే బాబు నైజం ముఖ్యఅతిథిగా వచ్చిన ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ మాయమాటలతో ప్రజలను మోసపుచ్చడమే చంద్రబాబు నైజం అన్నారు. 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వడానికి వీల్లేదనడం, నీతిఅయోగ్ సాంకేతికంగా కుదరదని చెప్పడంతోనే తాము ప్యాకేజీకి అంగీకరించినట్లు చంద్రబాబు చెప్పడం ముమ్మాటికీ మోసం అన్నారు. 14వ ఆర్థిక సంఘం ఏర్పాటైంది 2015 మార్చిలో అని, అప్పటి వరకు చంద్రబాబు హోదా కోసం ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదో సమాధానం చెప్పాలన్నారు. తాను రాసిన లేఖకు 14వ ఆర్థిక సంఘం స్పష్టమైన జవాబు ఇచ్చిందని, అందులో ఎక్కడా హోదా ఇవ్వవద్దని కానీ, ఇవ్వాలని కానీ తాము సూచించమని, ఆ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అని స్పష్టంగా చెప్పారన్నారు. కేవలం సొంత స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరంలో ముడుపులు దండుకునేందుకు కాంట్రాక్టర్‌గా కూడా మారారంటూ విమర్శించారు. ఓటుకు నోటు కేసు ఎక్కడ మెడకు చుట్టుకుంటుందో అనే భయంతోనే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని భగ్గుమన్నారు. నాలుగేళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద, గుంటూరులో 8 రోజుల ఆమరణ దీక్షతోపాటు ప్రత్యేక హోదా అంటే ఏంటి, దాని వల్ల రాష్ట్ర అభివృద్ధికి ఎలా నిధులు వస్తాయి, యువతకు ఎలాంటి ఉపయోగం ఉంటుందనే అంశాలపై ప్రజలను, యువతను చైతన్యవంతులను చేశారన్నారు. రాష్ట్ర లోటు బడ్జెట్ రూ.15,690 కోట్లు ఉంటే 2014 మొదలు 2017 వరకు కేవలం రూ.3,900 కోట్లు ఇచ్చిన అరుణ్‌జైట్లీ ఇక కేవలం వందో, రూ.150 కోట్లు మాత్రమే లోటు బడ్జెట్ ఇవ్వాలని పేర్కొంటుంటే బాబు మౌనం వహించడానికి గల కారణాలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికే పార్లమెంట్లో తన పేరుమీద ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు బిల్లుతో పాటు 184 కింద నోటీసు కూడా ఇచ్చామన్నారు. ఈ రెండింటి ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో ఓటింగ్ కోసం అన్ని రాష్ట్రాల ఎంపీల మద్దతు కూడగడతామని చెప్పారు. అప్పటికీ కేంద్రం ముందుకు రాకపోతే మోదీపై అవిశ్వాసానికి సైతం సిద్ధంగా ఉన్నామని, ఇదే వైఎస్సార్ సీపీ విశ్వసనీయత అంటూ ప్రకటించారు. -
నేడు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
-
మంచంపై కలెక్టరేట్‌కు..
నల్లగొండ: తిప్పర్తి మండలం జంగారెడ్డిగూడానికి చెందిన కొత్త రమేష్‌గౌడ్ తాటిచెట్టుపై నుంచి కింద పడడంతో రెండు కాళ్లు విరిగాయి. దీంతో భార్యే కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యింది. తనకున్న మూడెకరాల భూమి పక్కన ఉన్న పొలం రైతు మరో బోరు వేశాడు. దీంతో తన బోరు వట్టిపోయి పొలం ఎండిపోయింది. దీనికి ఆర్థికభారం తోడుకావడంతో తిప్పర్తి అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని రమేష్ తెలిపాడు. దీంతో లక్ష్మి తన భర్తను మంచంపై పడుకోబెట్టి ముగ్గురు కూతుళ్లతో కలిసి సోమవారం కలెక్టరేట్‌కు తీసుకువచ్చింది. న్యాయం చేయాలని డీఆర్ఓ కీమ్యానాయక్కు వినతిపత్రం అందజేసింది. – కంది భజరంగ్‌ప్రసాద్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ -
కేబుల్ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో కలెక్టర్ కె.ధనంజయరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఎక్కువగా వ్యక్తిగత వినతులు అందాయి. కార్యక్రమంలో జేసీ కె.వి.ఎన్.చక్రధరబాబు, జేసీ–2 పి.రజనీకాంతారావు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ వారం అందిన వినతులు కొన్ని పరిశీలించగా... ♦ కేబుల్ ఆపరేటర్లకు ఏపీఎస్ ఫైబర్ లిమిటెడ్ కనెక్షన్ ఇవ్వాలని, కేబుల్ ఆపరేటర్లకు అన్యాయం జరగకుండా చూడాలని రణస్థలం మండలానికి చెందిన కే బుల్ ఆపరేటర్లు లంక రమణ, జి.జనా ర్దనరావు, కె.గణపతిరావు, ఎస్.ఖాన్, ఎస్.సూర్యనారాయణ తదితరులు వినతి పత్రం అందించారు. ♦ తనకు రేషన్ కార్డు, ఆధాఆర్ కార్డు, ఇల్లు స్థలం ఉన్నా పక్కా ఇల్లు మం జూరు చేయడం లేదు. పలుమార్లు ప్రజాపతినిధులను, అధికారులను కోరి నా ఫలితం లేదు. తనకు ఇల్లు మం జూరు చేయాలని రేగిడి మండలంలోని బూరాడ గ్రామానికి చెందిన వంజరాపు రమేష్ కోరారు. ♦ ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చినా, సంతకవిటి మండలంలోని మందరాడ, కాకరాపల్లి, చేనేత సొసైటీకి రుణం మాఫీ కావడం లేదని, అక్కడ బ్యాంకర్లు సహకరించడం లేదని ఆ సొసైటీ సభ్యులు ఎన్.ధర్మారావు, బి.సత్యం, కె.మహేష్, కె.నీలయ్య తదితరులు కోరారు. ♦ శ్రీకాకుళం నగరంలోని పశు సంవర్థ క శాఖ జేడీ కార్యాలయం ప్రాంగణంలో గత 30 సంవత్సరాలుగా చెప్పులు కుట్టికొని, చిల్లర వ్యాపారాలు చేనుకొని చిరు దుకాణాలు నడుపుకుంటూ జీవి స్తున్నాం. అయితే అక్కడ కమర్షియల్ కాం ప్లెక్స్‌ను నిర్మించారని, అందులో తమకు షాపులు ఇవ్వాలని అన్నారు. అయితే అధికార పార్టీ నాయకులు ఈ షాపులను అడ్డగోలుగా అమ్మకాలు చేస్తున్నట్టు తెలుస్తోందని, దీనిపై అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కె.శంకరరావు, ఎం.వెంకట్రావు, వి.శంకరరావు తదితరులు కోరారు. ♦ జలుమూరు మండలంలోని శ్రీముఖలింగంలో ముఖలింగేశ్వర దేవాల యం అభివృద్ధి చేయాలని, ఈ ప్రాంతా న్ని పర్యటక రంగంలోకి తీçసుకొని అన్ని వసతులు కల్పించాలని, భక్తులకు వస తి గృహాలు, ఇతర సదుపాయాలు కల్పించాలని ఆ గ్రామానికి చెందిన నాయుడుగారి రాజశేఖర్ వినతి పత్రం అందించారు. ♦ జిల్లాలోని తహసీల్దారు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు శిక్షణ పొందిన లైసెన్సుడు సర్వేయర్లు 78 మంది పనిచేస్తున్నారని, వీరికి ఇప్పటివరకు జీతాలు, గౌరవ వేతనం లేదని, ఇకనుంచైనా గౌరవ వేతనం కల్పించాలని సీహెచ్ ధనరాజ్, కమల్, సీతామహాలక్ష్మి, శరణ్య, రాజు, శ్రీను తదితరులు కోరారు. ♦ ఒకే మరుగుదొడ్డికి రెండు సార్లు బిల్లులు చేశారని, గతంలో ఒకరి పేరిట ఎన్ఆర్ఈజీఎస్ కింద, రెండో సారి మరొకరి పేరిట స్వచ్ఛ భారత్ కింద బిల్లులు పెట్టి చెల్లింపులు చేసి సంబంధిత శాఖ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని లావేరు మండలంలోని నక్కపేట గ్రామానికి చెందిన కొన్ని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. -
లాయర్స్ వర్సెస్ పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, కర్నూలు: కలెక్టరేట్ ముందు న్యాయ వాదుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత కొద్దిరోజులుగా ఆందోలనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు కలెక్టరేట్ వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు కలెక్టరేట్లో సమీక్షా సమావేశాలకు వస్తున్న వారిని న్యాయవాదులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు న్యాయవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో జరిగిన తోపులాటలో పలువురు న్యాయవాదులకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడ్ని ఆసుపత్రికి తరలించారు. -
‘మీ కోసం’లో వినతుల వెల్లువ
అనంతపురం అర్బన్ : సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ జి.వీరపాండియన్‌కు ప్రజలు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జరిగిన మీ కోసంలో ప్రజల నుంచి కలెక్టర్‌తో పాటు జేసీ రమామణి, జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డీఆర్ఓ ఎస్.రఘునాథ్, జేడీఏ శ్రీరామ్మూర్తి, ఐసీడీఎస్ పీడీ వెంకటేశం, డీఆర్డీఏ పీడీ కె.ఎస్.రామారావు అర్జీలు స్వీకరించారు. అర్జీల్లో ఏ సమస్యలున్నాయంటే...: ♦ రోడ్డు స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని రుద్రంపేట పంచాయతీకి చెందిన జి.రామాంజనేయులు ఫిర్యాదు చేశాడు. రోడ్డు స్థలంలో కట్టడాలు తొలగించాలని కోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదని ఫిర్యాదు చేశాడు. ♦ రేషన్ కార్డు ఉన్న బధిరులకు కూడా 35 కేజీలు బియ్యం ఇవ్వాలని బధిరుల సంఘం ప్రధాన కార్యదర్శి బి.రాఘవేంద్ర మీకోసంలో విన్నవించాడు. ♦ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న కాం ట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరి ష్కరించాలని సంఘం అధ్యక్షుడు కె.విజయ్, ఇతర నాయకులు కోరారు. ♦ ఎస్ఎస్ఏలో వివిధ విభాగాల్లోని ఉద్యోగులకు విద్యాశాఖలో విలీనం చేయాలని ఎస్ఎస్ఏ ఉద్యోగుల రిజిష్టర్డ్ యూనియన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సాజిద్‌బాషా, కార్యదర్శి హాజీమాలిక్, నాయకురాళ్లు నాగరత్నమ్మ, కల్పన, సుమలత, రాజమ్మ, భావన, ఇందిరా విన్నవించారు. ♦ బుక్కరాయసముద్రం మండలం అమ్మవారిపేట, రేకులకుంట, కొండాపురం, ఓబుళాపురం గ్రామాల్లో అధికంగా రజక కుటుంబాలు ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో ధోబీఘాట్ నిర్మించాలని రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు లింగమయ్య, నాయకులు హరికృష్ణ, రజకులు కోరారు. అయ్యా..నాళుగేళ్లగా తిరుగుతున్నాం అయ్యా.. మా అబ్బాయి తరుణ్‌రెడ్డి (12) బుద్ధిమాద్యంతో ఎదుగుదలలేకుండా పోయింది. పింఛను కోసం నాలుగేళ్లగా తిరుగుతున్నాం. రేషన్ కార్డు మీద వేరొకరు పింఛను తీసుకుంటున్నట్లుగా ఆన్లైన్లో చూపుతోందని అధికారులు చెప్తున్నారు. మార్పు చేయించుకుపోయినా పింఛన్ రాలేదు. ఎంపీడీఓను అడిగితే ఎమ్మెల్యే చెప్పిన వారికే పింఛన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలున్నాయని సమాధానం ఇస్తున్నారు. మాలాంటి పేదోళ్లకు న్యాయం చేయండి అంటూ గుంతకల్లు మండలం అయ్యవారిపల్లికి గ్రామానికి చెందిన వి. శివరామిరెడ్డి కలెక్టర్‌కు విన్నవించుకున్నాడు. ఇలా ఎందరో వివిధ సమస్యలపై కలెక్టరేట్లో వినతులు అందజేశారు. -
అనంత కలెక్టరేట్లో మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలకలం రేగింది. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవిన్స్‌లో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. జిల్లాలోని గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన హరిత అనే మహిళ భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదును పోలీసులు పట్టనుంచుకోలేదని ఆమె ఆరోపిస్తోంది. దీంతో తనకు న్యాయం జరగలేదని మనస్ధాపంతో గ్రీవెన్స్‌లో ఆత్మహత్యకు యత్నించినట్టు బాధితురాలు తెలిపింది. -
కలెక్టరేట్లలో ముగ్గురు రైతుల ఆత్మహత్యాయత్నం
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులు, టీడీపీ నేతల తీరుతో విసిగి వేసారిన ముగ్గురు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. అప్పుల బాధతో మరో అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా కలెక్టరేట్ల ఆవరణల్లోనే కిరోసిన్, పెట్రోల్ పోసుకొని ప్రాణాలు తీసుకోబోయారు. ఇక పత్తికి గిట్టుబాటు ధరల్లేక, అప్పులు తీరేదారి కనిపించక అనంతపురం జిల్లాలో నరసింహులు పురుగు మందు తాగి తనువు చాలించాడు. డిగ్రీ చదివి వ్యవసాయం: గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం బుక్కాపురానికి చెందిన మాడా శివ ప్రసన్న బాబు డిగ్రీ వరకూ చదివాడు. గత పదేళ్లుగా తనకున్న రెండెకరాలతో పాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. నకిలీ విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలతో అరకొర పంట చేతికందుతుండటం.. గిట్టుబాటు ధరల్లేక రూ.8లక్షల వరకు అప్పులపాలయ్యాడు. దీంతో సాగు మానేసి.. డెయిరీ పెట్టుకోవాలనుకున్నాడు. రుణం కోసం మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. వారు పట్టించుకోకపోవడంతో.. 4 నెలల కిందట సీఎం చంద్రబాబును కలిశాడు. ఆయన స్పందిస్తూ డెయిరీ పెట్టుకోవడానికి రుణం మంజూరు చేయిస్తానని, రూ.25 వేలు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇవ్వడంతో.. ప్రసన్నబాబు మళ్లీ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నాడు. సోమవారం జెడ్పీలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో జేసీ క్రితికా శుక్లాకు వినతిపత్రం అందించాడు. ఆ వెంటనే పెట్రోల్ బాటిల్ బయటకు తీసి శరీరంపై పోసుకొని నిప్పంటించుకోబోయాడు. అప్రమత్తమైన సిబ్బంది ప్రసన్నను పక్కకు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న కలెక్టర్ కోన శశిధర్ ప్రసన్నను మళ్లీ లోపలికి పిలిపించుకొని మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు బాధితుడు చెప్పాడు. కలెక్టర్ వెంటనే నాబార్డు ద్వారా ఐదు గేదెలు కొనుగోలు చేయడానికి రుణం మంజూరు చేయాలని ఆదేశించారు. పాసు పుస్తకం కోసం: చిత్తూరు జిల్లా వీకోట మండలం దొడ్డిపల్లెకు చెందిన ఉదయ్‌కుమార్ 15 ఏళ్లుగా 2.45 ఎకరాల డీకేటీ భూమిలో సాగు చేసుకుంటున్నాడు. అనాథ యువతి వివాహానికి సాయం చేసినందుకు గానూ గ్రామస్తులు ఈ భూమిని ఉదయ్‌కుమార్‌కు గతంలో అప్పగించారు. ఈ భూమికి సంబంధించిన పట్టా పుస్తకాలు ఇప్పించాలని జన్మభూమి సభలో అధికారులను కోరాడు. అయితే ఆ భూమి లక్ష్మమ్మ అనే మహిళ పేరుతో ఉందని తెలపడంతో ఉదయ్‌కుమార్.. జిల్లా కలెక్టర్‌ను కలసి సమస్య పరిష్కరించాలని కోరాడు. వారు పట్టించుకోకపోవడంతో ఇటీవల సీఎం దృష్టికి తీసుకెళ్లాడు. సీఎం ఆదేశాల మేరకు తహసీల్దార్ దొడ్డిపల్లె గ్రామానికి వెళ్లి విచారించగా.. ఆ భూమి ఉదయ్ ఆధీనంలోనే ఉందని తేలింది. తర్వాత కూడా సమస్య కొలిక్కి రాకపోవడంతో ఉదయ్ కుమార్ భార్య, పిల్లలతో కలసి సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌కు వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. టీడీపీ నేతలు వేధిస్తున్నారంటూ: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువకు చెందిన టంకాల మోహనరంగకు ఎకరాన్నర భూమి ఉంది. సాగు కోసం బోరు బావి వేయించుకునేందుకు విద్యుత్ కనెక్షన్ కావాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కూర్మారావు అడ్డుపడుతున్నాడు. రియల్ ఎస్టేట్ చేస్తున్న కూర్మారావు కన్ను మోహనరంగకు చెందిన భూమిపై పడింది. అది తనకు రాసివ్వాలంటూ మోహనరంగపై ఒత్తిడి చేస్తున్నాడు. మోహనరంగ ససేమిరా అనడంతో విద్యుత్ కనెక్షన్ మంజూరు కాకుండా అడ్డుపడుతున్నట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన మోహనరంగ సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి.. శరీరంపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. -
కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ ధర్నా
టవర్‌సర్కిల్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌చేస్తూ ఎమ్మార్పీఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం చాకలి ఐలమ్మ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. స్వల్ప తోపులాట అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం 23 ఏళ్లుగా పోరాడుతున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, పైగా నాయకులను అరెస్టులు చేయిస్తున్నాయని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధ కోసం సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఉపవాస దీక్షకు కూర్చున్న నేతను అరెస్ట్ చేయడం సామాజిక ఉద్యమాలను అణచివేయడమేనన్నారు. మందకృష్ణను విడుదల చేయకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో రేణికుంట్ల సాగర్, గోష్కి అజయ్, గోష్కి శంకర్, జనగామ నర్సింగ్, మాతంగి రమేశ్, గసిగంటి కుమార్, కొయ్యడ వినోద్, సుంచు నరేష్, కొంకటి దేవరాజ్, కనకం నర్సయ్య, చంటికుమార్,రాములు, బాబు, చంద్రశేఖర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న అన్నీ ఇచ్చిండు
పెద్దపల్లిఅర్బన్: ముఖ్యమంత్రిగా పాలనలో తనదైన ముద్రను వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి ప్రజల్లో ఆదరణ తగ్గలేదు. ఆయన సేవల్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు. పెద్దపల్లి కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణికి వచ్చిన పెద్దపల్లి మండలం రాగినేడుకు చెందిన యేల్పుల ఎల్లయ్య(80) దివంగత రాజశేఖరరెడ్డి పేదలకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వృద్ధాప్య పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరిగి వేసారి కలెక్టర్‌కు మొర పెట్టుకుందామని వచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నీ ఇచ్చిండు.. అడుగుడు ఆలస్యంలేదు పని చేసి పెట్టిండు..దొర ఎక్కడున్న సల్లంగుండాలే.. మల్ల గసొంటోడు రావాలె.. నాడు నెలనెలా ఠంచన్‌గా పింఛన్ అచ్చేది’అని దివంగత నేతను తలచుకుని కన్నీరుపెట్టుకున్నాడు. ‘కేసీఆర్ అచ్చి ఏం చేయలేదు.. బ్యాంకుల ఖాతా కావాలంటే తెరిచినా..అయినా పింఛన్ రాలే.. తెలంగాణ అచ్చిన మొదటి నుంచి న్యాయం జరగలేదు’అని అక్కసును వెల్లగక్కాడు.. అనంతరం కలెక్టర్ శ్రీదేవసేనకు వినతిపత్రం అందించాడు. -
‘ఆత్మరక్షణ కోసం కత్తి తెచ్చుకున్నా’..
సాక్షి, అన్నానగర్: తిరుచ్చి కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేలో వినతి అందజేసేందుకు వృద్ధురాలు కత్తితో రావడం సంచలనం కలిగించింది. తిరుచ్చి కాట్టూరు బిలోమినాల్ నగర్‌కు చెందిన పదవీ విరమణ పొందిన నర్సు మేరి(68). ఈమె సోమవారం గ్రీవెన్స్‌డేలో పాల్గొనేందుకు కలెక్టరేట్ చేరుకుంది. భద్రతా అధికారులు ఆమె వద్ద ఉన్న సంచిలో తనిఖీ చేయగా అందులో కత్తి లభించింది. ఆత్మరక్షణ కోసం తాను కత్తిని వెంట తెచ్చుకున్నట్టు వృద్ధురాలు తెలిపింది. పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మేరి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. అందులో.. తనకు చెందిన స్థలాన్ని ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. రాత్రి సమయంలో కొంతమంది వచ్చి ఇంటిని కూల్చేస్తామని, హత్యా బెదిరింపులు చేస్తున్నట్టు వివరించింది. దీనిపై విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
కలెక్టరేట్లో నిప్పుపెట్టుకున్న కుటుంబం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరునెల్వేలి కలెక్టర్ కార్యాలయం ఎదుట దారుణం చేసుకుంది. కలెక్టర్ తమ విన్నపం పట్టించుకోవటం లేదంటూ సోమవారం ఉదయం ఒక కుటుంబం నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది. ఎన్నిసార్లు విన్నవించినా కలెక్టర్ తమ సమస్యను పరిష్కరించడం లేదన్న ఆగ్రహంతో, ఆవేదనతో కలెక్టరేట్ ఆవరణలో ఇసక్కిముత్తు, ఆయన భార్య సుబ్బలక్ష్మి, వారి కుమార్తెలు మదు శరణ్య, అక్షయ పూర్ణిమ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే మంటలను ఆర్పి, తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇసక్కిముత్తు సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ కి వస్తున్న విషయం అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాలేదని తెలుస్తోంది. -
కలెక్టరేట్లో నిప్పుపెట్టుకున్న కుటుంబం
-
కలెక్ట‘రైట్’
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నూతన కలెక్టరేట్‌ను రఘునాథపాలెం మండలం వీ.వెంకటాయపాలెం(వీవీ.పాలెం) సమీపంలో నిర్మించనున్న క్రమంలో భూసేకరణ ప్రక్రియ చకచకా సాగి, చివరి దశకు చేరింది. ఇక్కడ 26 ఎకరాల 16 కుంటల భూమిని 20 మంది రైతుల వద్ద నుంచి సేకరించనున్నారు. ఒక్కో ఎకరానికి రూ.కోటి చొప్పున చెల్లించనుండగా.. రైతులు సహకరించి తమ భూములను కలెక్టర్ కార్యాలయ సముదాయ నిర్మాణానికి ఇస్తామంటూ.. మంగళవారం అధికారుల సమక్షంలో అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో కలెక్టరేట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణలో ఎదురైన అవాంతరాలు, ఆటంకాలు దాదాపు తొలగిపోయినట్లేనని అధికారులు భావిస్తున్నారు. భూముల నష్టపరిహార చెల్లింపుకు సంబంధించిన ఫైల్‌ను అధికారులు ఆఘమేఘాల మీద సిద్ధం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు త్వరితగతిన పరిహారం చెల్లించేందుకు జిల్లా అధికారులు.. ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాసి నిధులు తెప్పించే పనిలో నిమగ్నమయ్యారు. రెండు, మూడు రోజుల్లో ఈ నిధులు వచ్చేలా.. కసరత్తు చేస్తున్నారు. ఆఘమేఘాల మీద కసరత్తు.. మూడు రోజుల క్రితం వరకు కలెక్టరేట్‌ను ఎక్కడ నిర్మిస్తారన్న అంశంపై పలు ఊహాగానాలు, విమర్శలు చోటుచేసుకున్న నేపథ్యంలో సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం తొలుత జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ ప్రకారం రైతులను భూసేకరణకు ఒప్పించడంతో వీవీ.పాలెం వద్దే కలెక్టరేట్ నిర్మాణం ఖాయమైంది. ఎకరానికి రూ.కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వడానికి జిల్లా రెవెన్యూ అధికారులు అంగీకరించడం, వెనువెంటనే సదరు స్థలాన్ని ఆర్అండ్బీ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్‌తేజ పరిశీలించడం వంటి పనులు ఆఘమేఘాల మీద జరిగిపోయాయి. 26.16 ఎకరాల భూమి సేకరణ.. కొత్త కలెక్టరేట్ కోసం వి.వెంకటాయపాలెం సమీపంలో 26 ఎకరాల 16 కుంటల భూమిని 20 మంది రైతుల నుంచి సేకరించనున్నారు. నష్ట పరిహారం రూపంలో రూ.26.6కోట్లు, భూసేకరణ చేయడానికి జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి పబ్లిషింగ్ వ్యయంతో కలిపి రూ.27కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి పంపిన లేఖలో కలెక్టర్ పేర్కొన్నట్లు సమాచారం. కలెక్టర్ లేఖకు స్పందించిన ప్రభుత్వం.. సంబంధిత ఉన్నతాధికారులు, రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేయగానే.. రైతులకు నష్టపరిహారం చెల్లించి, భూమిని తొలుత రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. ఆ వెంటనే కార్యాలయ సముదాయ నిర్మాణానికి రహదారులు భవనాల శాఖకు అప్పగించనున్నారు. సీఎం చేతుల మీదుగా శ్రీకారం..? ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసే అవకాశం ఉన్న ఈశాన్య ప్రాంతాన్ని రెవెన్యూ అధికారులు ఇప్పటికే పరిశీలించి, సదరు రైతుల నుంచి అంగీకార పత్రాలను తీసుకున్నట్లు సమాచారం. భూ సేకరణ ప్రక్రియ, నష్టపరిహారం చెల్లింపు వ్యవహారం అంతా వారం రోజుల్లో ముగియనుంది. సీఎం ఖమ్మం జిల్లా పర్యటన ఎప్పుడు ఖరారైనా వి.వెంకటాయపాలెంలో కలెక్టరేట్ సముదాయ నిర్మాణానికి భూమి పూజ చేయించడానికి అవకాశం ఏర్పడుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
ప్రజాధనాన్ని స్వాహా చేసేందుకే కలెక్టరేట్ తరలింపు
ఖమ్మంమయూరిసెంటర్: ప్రజలకు అందుబాటులో ఉన్న కలెక్టరేట్‌ను నగరానికి దూరంగా తరలించి ప్రజాధనాన్ని స్వాహా చేయాలని ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు కుట్రపన్నుతున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం అన్నారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ కార్యాలయాన్ని తరలించడం వల్ల ప్రజ లు ఇబ్బందులు పడతారని, ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఇప్పటికే కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు ఆందోళనలు చేపట్టాయని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ప్రజల అభిప్రాయం మేరకు, మంత్రితో మా ట్లాడి ఎన్‌ఎస్‌పీలోనే కలెక్టరేట్ నిర్మాణం జరిగేలా చూస్తానని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని పేర్కొన్నారు. వెంకటాయపాలెం రైతులు రూ.కోటికి భూమి ఇచ్చేందుకు సిద్ధమయ్యారని, అక్కడే కలెక్టరేట్ నిర్మించనున్నట్లు ప్రకటనలు వస్తున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యే అవగాహన లేకుండా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం నగరంలోని త్రీటౌన్ ప్రాంతంలోని మార్కెట్, వన్‌టౌన్ ప్రాంతంలోని బస్టాండ్, కలెక్టరేట్ లాంటి ప్రభుత్వ కార్యాలయాలను తరలించి నగరాభివృద్ధి జరగకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉన్న కలెక్టరేట్‌ను తరలిస్తే సహించేది లేదని, అన్ని పార్టీలను కలుపుకొని కలెక్టరేట్ తరలింపును అడ్డుకునేందుకు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కలెక్టరేట్ తరలింపుపై రెండు రోజుల్లో భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో జిల్లా నాయకులు కొత్తపల్లి సీతారాములు, వడ్డెబోయిన నర్సింహారావు, తిలక్, తాజు ద్దీన్, ఫజల్, మల్లేశ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
కొత్త కలెక్టరేట్ల నిర్మాణం.. కమీషన్ల కోసమే
రాజేంద్రనగర్/మణికొండ: ఉద్యోగస్తులను నియమించకుండానే ప్రభుత్వం కమీషన్ల కోసం కలెక్టరేట్ భవనాలను నిర్మిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సామాజిక తెలంగాణ సమగ్రాభివృద్ధి పోరుబాట యాత్ర గురువారం రాజేంద్రనగర్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరింది. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా, మంచిరేవులలో సభలు నిర్వహించారు. ఈ సభల్లో ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతుంటే ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్ని రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. గత ఎన్నికల ముందు జీహెచ్ఎంసీలో లక్ష ఇళ్లు కట్టిస్తామని తెలిపిన ప్రభుత్వం సంవత్సరంన్నర అవుతున్నా ఒక్క ఇంటినీ నిర్మించి అందించలేదని వెంకట్‌రెడ్డి అన్నారు. నగరాన్ని డంపింగ్ యార్డుగా మార్చిందని ఆరోపించారు. ఎక్కడ చూసినా ప్రజల నివాసాల మధ్యనే డంపింగ్ యార్డులు కనిపిస్తున్నాయన్నారు. వరద వెళ్లేందుకు సరైన మార్గం లేక ఇళ్లల్లోకి వస్తుందన్నారు. చెరువుల్లో ఇళ్లు నిర్మించిన వారిని విడిచిపెట్టి నాలాల పక్కన నిరుపేదలు వేసుకున్న గుడిసెలు, నిర్మాణాలను ప్రభుత్వం కూల్చి వేస్తుందన్నారు. కేంద్రంలో ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్‌ల కనుసన్నుల్లో పరిపాలన కొనసాగిస్తున్న మోడీ ప్రభు త్వం మతోన్మాదాన్ని ప్రొత్సహిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జిల్లా కార్యదర్శి నర్సింగ్‌రావు, నాయకులు బాలమల్లేష్, పద్మ, యూసుఫ్, సృజన, పాండురంగాచారి, రాము లు యాదవ్, హరినాథ్, భూపాల్‌రెడ్డి, రామేశ్వర్రావు, రాజ్‌కుమార్, కృష్ణాగౌడ్, సాయిలు, అంజయ్య, లక్ష్మీనారాయణ,నర్సింహ, శ్రావణి పాల్గొన్నారు. -
విభజన రేఖ
కొత్త కలెక్టరేట్ విషయంపై అధికార పార్టీ నాయకులు రెండుగా విడిపోయారు. మరో 48 గంటల్లో నూతన కలెక్టరేట్‌కు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో గులాబీ ప్రజాప్రతినిధుల మధ్య విభజన ఏర్పడడం చర్చనీయాంశమైంది. కొంగరకలాన్ వైపు కొందరు, రావిర్యాల వైపు మరికొందరు మొగ్గుచూపడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. కలెక్టరేట్ స్థలం విషయమై నాయకులు మంగళవారం సీఎంను కలవనున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నూతన కలెక్టరేట్ నిర్మాణం కోసం ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్, మహేశ్వరం మండలం రావిర్యాలలోని రెండు స్థలాలతో కూడిన తుది జాబితాను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి సమర్పించింది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం కొంగరకలాన్‌లో గతంలో రైస్‌హబ్‌కు కేటాయించిన 300 సర్వే నంబర్లోని 40 ఎకరాలను కలెక్టర్ కార్యాలయ భవన సముదాయానికి కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని మొదట్నుంచి వ్యతిరేకిస్తున్న రాజేంద్రనగర్, షాద్‌నగర్, చేవెళ్ల, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కొంగరలో కలెక్టరేట్‌ను నిర్మించాలనే నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం సీఎం అపాయింట్మెంట్ కోరారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుందని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఔటర్ రింగ్‌రోడ్డుకు రెండు కిలోమీటర్ల దూరంలో కలెక్టరేట్‌ను నిర్మించడం వల్ల పరిపాలనాపరంగా మంచిదికాదనే వాదనను సీఎం దగ్గర వినిపిస్తామని ఓ ఎమ్మెల్యే ‘సాక్షి’కి తెలిపారు. కాగా, జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నందున.. కలెక్టరేట్ అంశంపై కలిసి వస్తారా? ప్రభుత్వ నిర్ణయానికి తల ఊపుతారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కాగా, ప్రజాప్రతినిధుల బృందానికి తాను నాయకత్వం వహిస్తున్నట్లు వస్తున్న ప్రచారం సరికాదని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్ అంశంపై చర్చించిన మాట వాస్తవమే అయినా సీఎం అపాయింట్మెంట్ విషయం తనకు తెలియదని, ఇంతకంటే తానేమీ మాట్లాడనని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. సీఎం ఇష్టంతోనే... కొత్త జిల్లాలు పురుడుపోసుకొని బుధవారం నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం లక్డీకాపూల్‌లో కొనసాగుతున్న కలెక్టరేట్‌ను పునర్విభజనకు అనుగుణంగా భౌగోళికంగా జిల్లాలోనే నిర్మించాలని ప్రభుత్వం గతేడాది నిర్ణయించింది. అందుకనుగుణంగా పలు చోట్ల స్థలాలను పరిశీలించినప్పటికీ ఏ ఒక్కదానిపైనా జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో స్థల ఖరారు అంశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పగించారు. ఆయన కూడా కొన్ని స్థలాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వీటిపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో స్థల ఖరారు వ్యవహారం ముఖ్యమంత్రికే వదిలేశారు. అధికారయంత్రాంగం చాంతాడంత జాబితా సమర్పించినా ముఖ్యమంత్రి మాత్రం వీటిని పట్టించుకోలేదు. అధికారులు నివేదించిన జాబితా కాకుండా రైస్‌హబ్ స్థలానికి ప్రాధాన్యం ఇచ్చారు. వాస్తవానికి ఈ స్థలం పరిశీలనకు కూడా నోచుకోలేదు. రింగ్‌రోడ్డుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉండడం, రవాణాపరంగా ఇబ్బంది ఉన్న దృష్ట్యా స్థలాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, అంతర్గత సంభాషణల్లో ముఖ్యమంత్రి కేసీఆర్... కొంగరలోని రైస్హబ్లో కలెక్టరేట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంతరంగాన్ని వెల్లడించారు. అంతేగాకుండా గూగుల్‌లో స్థలాన్ని కూడా వీక్షించారు. దీంతో ముఖ్యమంత్రి మనోగతానికి అనుగుణంగా వ్యవహరించడం మంచిదని భావించిన యంత్రాంగం.. గతంలో రైస్‌మిల్లర్ల కోసం కేటాయించిన 300 ఎకరాల్లో 40 ఎకరాలను కలెక్టరేట్ నిర్మాణానికి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతోపాటు రింగ్‌రోడ్డు సమీపాన ఉన్న రావిర్యాల సర్వే నం.18 స్థలాన్ని కూడా ప్రభుత్వానికి నివేదించింది. అయితే, ఈ రెండింట్లో రైస్‌హబ్ స్థలానికే మొగ్గు కనిపిస్తున్నా... సగం మంది ఎమ్మెల్యేలు దీన్ని వ్యతిరేకిస్తున్నందున అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటే స్థలం మారే అవకాశంలేకపోలేదు. ముహూర్తం దగ్గరపడుతున్నా స్థలాన్ని ఖరారు చేయకపోవడంతో ఆర్అండ్బీ అధికారులకు టెన్షన్ పట్టుకుంది. శిలాఫలకంపై ఎవరి పేర్లను ముద్రించాలో.. ఏ నియోజకవర్గ పరిధిలో వస్తుందో తెలియక జుట్టుపీక్కుంటున్నారు. -
కలెక్టరేట్లకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల కలెక్టరేట్లకు ఎట్టకేలకు సొంత భవనాలు సమకూరనున్నాయి. పాత జిల్లాల్లో కూడా అవసరమైన చోట్ల కొత్త భవనాలు రానున్నాయి. గతేడాది దసరా రోజున ఒకేసారి అన్ని జిల్లాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తరహాలోనే ఈ నెల 11, 12 తేదీల్లో కొత్త కలెక్టరేట్ భవనాలకు భూమి పూజ చేయబోతున్నారు. కలెక్టర్, జేసీ, ఇతర ఉన్నతాధికారుల నివాస భవనాలకు కూడా శంకుస్థాపనలు చేస్తారు. సిద్దిపేటలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా, మిగతా జిల్లాల్లో మంత్రులు ఈ పనులు ప్రారంభిస్తున్నారు. 26 కలెక్టరేట్ భవనాల నిర్మాణానికి టెండర్లు, కాంట్రాక్టర్లతో ఒప్పందం ఖరారయ్యాయి. వీటిలో 21 చోట్ల అధికారుల గృహ సముదాయాల నిర్మాణమూ చేపట్టనున్నారు. వాటిలో భూ సేకరణ పూర్తైన 18 చోట్ల ప్రస్తుతం శంకుస్థాపన జరుగుతోంది. ఈ జాబితాలో సిద్దిపేట, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్ పట్టణ, జనగామ, వికారాబాద్, మేడ్చల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నిజామా బాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూలు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేటల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఖమ్మం, మెదక్, కొత్తగూడెంలలో స్థలాలను గుర్తించి భూ సేకరణ జరుపుతున్నారు. మంచిర్యాల, నిర్మల్, వరంగల్ గ్రామీణ, మహబూబాబాదుల్లో గుర్తించిన స్థలాలు బాగాలేక ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించాలని నిర్ణయించారు. విశేషాలు... ♦ పనులు చేపట్టబోయే భవనాల నిర్మాణానికి 1,032 కోట్లు ఖర్చవుతుందని అంచనా. పర్యావరణ హితంగా వీటిని నిర్మిస్తారు. ♦ వరంగల్ పట్టణ, రంగారెడ్డి, సిద్దిపేట సహా కొన్ని కలెక్టరేట్లు లక్షన్నర చదరపు అడుగుల్లో, మిగతావి 1.2 లక్షల చ.అ.ల్లో నిర్మితమవుతాయి. కలెక్టర్ల నివాసాలు 6,000 చ.అ., జేసీల గృహాలు 3,000 చ.అ., జిల్లా రెవెన్యూ అధికారుల గృహాలు 2,500 చ.అ., ఇతర జిల్లా అధికారులకు 148 గృహాలను 1,500 చ.అ.ల్లో నిర్మిస్తారు. ♦ అన్ని నిర్మాణాలను ఏడాదిలోగా పూర్తి చేసి వచ్చే దసరా నాడు గృహప్రవేశాలు జరపాలన్నది లక్ష్యం. -
ఫిర్యాదుల వెల్లువ
ప్రజావాణికి 61 వినతులు ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 61 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇన్చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో గోవింద్, కలెక్టరేట్ ఏవో శ్రీధర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సిఫారసు చేశారు. రైతు సమన్వయ కమిటీని రద్దు చేయాలి.. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన రై తు సమన్వయ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిరికొండ మండలం హుస్సేన్‌నగర్ గ్రామా భివృద్ధి కమిటీ సభ్యులు కలెక్టరేట్ ఎదుట ధర్నా ని ర్వహించారు. ఇష్టానుసారంగా రైతు సమన్వయ క మిటీని ఏర్పాటు చేశారని, ఇందులో అధికార పార్టీ నాయకులే ఉన్నారని తెలిపారు. పంచాయతీ, గ్రా మాభివృద్ధి కమిటీ సభ్యులను సంప్రదించకుండా నే రైతు కమిటీని ఏర్పాటు చేశారని, రైతుల మేలు కోరి ఏర్పాటు చేస్తున్న రైతు సమన్వయ సమితుల్లో అర్హులకు చోటు కల్పించేలా కొత్త కమిటీని ఎన్నుకోవాలని కోరారు. వీడీసీ సభ్యులు మల్లేశ్, గంగారె డ్డి, రాజేందర్, రామస్వామి, రాజన్న, శ్రీనివాస్ త దితరులు పాల్గొన్నారు. గీత కార్మికులకు లైసెన్సులివ్వాలి ఈత చెట్లు గీయడానికి తమకు లైసెన్సులు ఇప్పించాలని కోరుతూ ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లికి చెందిన పలువురు కల్లుగీత కార్మికులు కలెక్టరేట్‌కు వచ్చారు. గ్రామంలో 30కి పైగా కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. ఈత చెట్లు గీసి కల్లును విక్రయించడానికి లైసెన్సులు ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ అధికారులను చాలాసార్లు విన్నవించామని, ఒకరిద్దరికి మాత్రమే లైసెన్సులు ఇచ్చి మిగతా వారికి ఇవ్వడం లేదన్నారు. తమకు కూడా లైసెన్సులు ఇప్పించి ఆదుకోవాలని గంగాగౌడ్, నారాగౌడ్, గంగాధర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, శంకర్‌గౌడ్ తదితరులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. గొర్రెల పంపిణీలో అన్యాయం జరిగింది.. గొర్రెల పంపిణీలో తమకు అన్యాయం చే శారంటూ జ క్రాన్‌పల్లి మం డలం కొలిప్యాక్కు చెందిన లబ్ధిదారులు భోజేం ధర్, లలిత ఇన్చార్జి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. త మకు శ్రీ కృష్ణ యాదవ సొసైటీలో సభ్యత్వం ఉందని, సొసైటీ సభ్యులు లక్కీ డ్రా ద్వారా గొర్రెలను పంపిణీ చేయకుండా ఇష్టానుసారంగా పంచుకున్నారని తెలిపారు. అయితే, తమకు వచ్చిన గొర్రె లు ఇవ్వలేదని సభ్యులను ప్రశ్నించినందుకు కుల బహిష్కరణ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతు న్నారని వాపోయారు. దీనిపై మండల, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని, గొర్రెల పంపిణీలో జరిగిన అన్యాయంపై విచారణ చేయించి న్యాయం చేయాలని కోరారు. ట్రై సైకిల్ కోసం రెండేళ్లుగా.. నడవ లేని స్థితిలో ఉన్న తన కొడుకు గంగాప్రసాద్‌కు ట్రై సైకిల్ ఇవ్వాలని రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాల్కొండ మండలం బోదెపల్లికి చెందిన సహదేవ్ వాపోయాడు. ట్రై సైకిల్ కొరకు వికలాంగుల శాఖ కార్యాలయంలో చాలాసార్లు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అధికారులు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ట్రై సైకిల్ ఇప్పించి ఆదుకోవాలని అధికారులకు వినతిపత్రం అందజేశాడు. ఆర్థికంగా ఆదుకోండి.. షుగర్ వ్యాధితో రెండు కాళ్లు కోల్పోయిన తనకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరుతూ మాక్లూర్ మండలం ముల్లంగి గ్రామానికి చెందిన వెంకటరమణ కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. తనది పేద కుటుంబమని, ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, కాళ్లు కోల్పోవడంతో కుటుంబాన్ని పోషించడానికి వీలు లేకుండా పోయిందన్నారు. కుటుంబాన్ని పోషించడానికి ఆర్థికంగా సాయం చేయడంతో ట్రై సైకిల్ ఇప్పించాలని అధికారులకు విన్నవించాడు. -
కలెక్టరేట్లో శాశ్వత ఆధార్ కేంద్రం
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లో శాశ్వత ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ ఈ నెల 7వ తేదీ ఆదేశాలు జారీ చేశారు. మీ కోసం కౌంటర్లలో రెండు గదుల్లో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆధార్‌కార్డుల్లో తప్పులు సరిచేయడంతోపాటు కొత్త ఆధార్‌కార్డుల కోసం వివరాలు నమోదు చేసుకునే సౌలభ్యం కూడా కల్పించాలన్నారు. దీంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే ఆధార్‌కార్డుల్లో తప్పులను సరి చేస్తామని, లేకపోతే కుదరదని ఆ విభాగం అధికారులు చెబుతున్నారు. -
తాగు, సాగునీరివ్వాలని ధర్నా
అనంతపురం అర్బన్: తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని గ్రామాలకు తాగు, సాగు నీరివ్వాలని అక్కడి గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది. ఈ క్రమంలో తాడిపత్రి పరిధిలోని మండలాలకు చెందిన రైతులు, ప్రజలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గత 50 ఏళ్లగా తమ ప్రాంతాలకు మొదటి విడతలో నీరు ఇవ్వడం లేదన్నారు. రెండో విడతలో అరకొరగా ఇస్తుండటంతో చివరగా ఉన్న చెరువులకు నీరు చేరడం లేదన్నారు. దీంతో తాగు, సాగు నీటికి ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. ఈ సారైనా తమకు ముందుగా నీటిని ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు వెంకటేశ్వర్లు, మల్లికార్జున, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
చలో కలెక్టరేట్ ఉద్రిక్తం
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు - విద్యా రంగంలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ - అడ్డుకున్న పోలీసులు ∙ ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థుల అరెస్టులు - పోలీసుల తీరు, అరెస్టులకు నిరసనగా నేడు విద్యా సంస్థల బంద్‌కు పిలుపు సాక్షి నెట్వర్క్: విద్యారంగంలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించాలంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఏబీవీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్లను ముట్టడించారు. అనుమతి లేని కార్పొరేట్ విద్యా సంస్థలను సీజ్ చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పలు చోట్ల విద్యార్థులు, ఆందోళనకారులు కలెక్టరేట్ల లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో ఆందోళనకారులను, ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసుల వైఖరికి, అరెస్టులకు నిరసనగా గురువారం విద్యాసంస్థల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా.. బుధవారం ఉదయమే హైదరాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడు మట్ట రాఘవేందర్ ఆరోపించారు. విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమిస్తుంటే.. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం 30 యా క్ట్ను తెచ్చిందని మండిపడ్డారు. దానిని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్, నిర్మల్, రంగారెడ్డి తదితర జిల్లాల్లోనూ కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు హాజరయ్యారు. ఖమ్మం జిల్లాలో పెవిలియన్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. వరంగల్ జిల్లాలో కలెక్టరే ట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. హన్మకొండలో ని ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థు లు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కొందరు విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపో యేందుకు ప్రయత్నించగా.. వారికి, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బంగారు తెలంగాణ ఇదేనా? రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైఫల్యం కారణంగా గ్రూప్–2, ఎస్సై, గురుకుల ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతోందని ఆందోళనల సందర్భంగా విద్యార్థులు మండిపడ్డారు. కమిషన్ చైర్మన్ చక్రపాణిని పదవి నుంచి తొలగించాలని.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందని కారణంగా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు గుర్తింపు లేకుండా బ్రాంచిలను నడుపుతూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటే విద్యార్థులు వర్షంలో తడుస్తూ ఆందోళనలు చేయడమేనా అని ప్రశ్నించారు. -
10న ఎస్సీఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్
అనంతపురం రూరల్: ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ ఈ నెల 10న కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహిస్తున్నట్లు జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్ తెలిపారు. అధికారులందరూ తప్పక హాజరవాలవ్వలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ‘మీ కోసం’ కార్యక్రమంలో అధికారులతో మాట్లాడారు. ప్రత్యేక గ్రీవెన్స్‌కు హాజరు విషయంలో ఏ అధికారికీ మినహాయింపు లేదన్నారు. ఈ నెల 12 నుంచి 14 వరకు వరస సెలవులు ఉన్నందున ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లును ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవార్డుల కోసం ఉద్యోగుల వివరాలను అన్ని శాఖల అధికారులు వెంటనే ఇవ్వాలని, మంగళవారం వాటిని పరిశీలించి జాబితాను సిద్ధం చేస్తామన్నారు. -
కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
-
కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
కరీంనగర్: విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లడానికి యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకునే క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. దీంతో పలువురు విద్యార్థులు, మహిళా కానిస్టేబుళ్లు కిందపడి తొక్కిసలాట జరగడంతో.. ముగ్గురు విద్యార్థులతో పాటు ఓ మహిళా కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కించారు. అరెస్ట్‌లను నిరసిస్తూ విద్యార్థులు పోలీసు వాహనాల్లో గాలి తీసేశారు.