Salaries
-
ఎంపీల జీతభత్యాలు పెంచిన కేంద్రం
న్యూఢిల్లీ, సాక్షి: ఎంపీల జీతభత్యాల విషయంలో కేంద్రం సోమవారం కీలక ప్రకటన చేసింది. ఉభయ సభల్లోనూ ఎంపీలకు జీతాలను పెంచుతున్నట్లు సోమవారం అధికారికంగా పార్లమెంట్ వ్యవహారాల శాఖ ఓ నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ పెంపు అమల్లో ఉండడం. ప్రస్తుతం ఎంపీల జీతం రూ. లక్ష ఉండగా.. దానిని లక్షా 24 వేలకు పెంచింది. అలాగే దినసరి భత్యం రూ.2 వేల నుంచి 2,500కు పెంచింది. మాజీ ఎంపీల పెన్షన్ రూ.25 వేల నుంచి 31 వేలకు పెంచినట్లు తెలిపింది. ఈ మేరకు సంబంధిత పార్లమెంట్ యాక్ట్ 1954కు సవరణ చేసింది. అయితే రెండేళ్లుగా ఇది ఆచరణలో ఉన్నప్పటికీ.. చట్టసభ సభ్యులకు పరిహారాన్ని పెంచాలనే ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా ఈ ‘సర్దుబాట్ల’ను అధికారికంగా తెలియజేసిందంతే. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం చట్ట సభ్యుల జీతాలను 100 శాతం పెంచుకుని వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలూ చెలరేగుతున్నాయి. -
జీతాల కోసం రూ.4 వేల కోట్లు అప్పు
అప్పుల భారం, ఇతర కారణాలతో తమ ప్రభుత్వం నగదు కొరతను ఎదుర్కొంటోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్బీఐ నుంచి రూ.4,000 కోట్ల లోన్ తీసుకుని ఉద్యోగులకు జీతాలు చెల్లించగలిగామని తెలిపారు. ఇటీవల శాసనమండలిలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని, నగదు కొరత దృష్ట్యా డియర్నెస్ అలవెన్స్ (డీఏ), ఇతర చెల్లింపులు ఆలస్యమైతే ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగులదేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అన్ని వాస్తవాలు, గణాంకాలను వారి ముందు ఉంచుతామని, తద్వారా చెల్లింపులపై తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని చెప్పారు. డీఏ, ఇతర ప్రయోజనాలు ఉద్యోగుల హక్కు అన్నారు.సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కరవుఈ నెల 12న ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయంలో సింహభాగం ప్రతినెలా జీతాలు, పింఛన్లు, గత బీఆర్ఎస్ పాలనలో చేసిన భారీ అప్పులను తీర్చడానికి వెచ్చిస్తున్నామని తెలిపారు. దాంతో సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించడం సవాలుగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినెలా రూ.18 వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్ల ఆదాయం సమకూరుతుండగా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల కోసం రూ.6,500 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. మరో రూ.6,500 కోట్లు బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులను తీర్చడానికి వినియోగిస్తున్నామని తెలిపారు. దాంతో ప్రభుత్వం వద్ద రూ.5,000 కోట్ల నుంచి రూ.5,500 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. సుమారు 30 ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రతినెలా నిధులు అవసరమవుతాయని, వీటితో పాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ఆర్థిక అవసరాలు కూడా ఉన్నాయన్నారు.రాష్ట్రాలకు ఆర్బీఐ అప్పులు ఇలా..దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు చెల్లించడం వంటి ఆర్థిక బాధ్యతలను నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రుణాలు పొందవచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు రుణ పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులను రాష్ట్ర ఆర్థిక స్థితిని ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నిత్యం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిన అవసరాలకు సంబంధించి నగదు తాత్కాలిక అసమానతలను నిర్వహించడంలో ఆర్బీఐ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ (డబ్ల్యూఎంఏ) ద్వారా స్వల్పకాలిక రుణాలను అందిస్తుంది. ఈ అడ్వాన్సులు రాష్ట్ర ఆదాయ, వ్యయ నమూనాల ఆధారంగా పరిమితులకు లోబడి ఉంటాయి.ఇదీ చదవండి: ఏఐ తోడుంటే.. విజయం మీవెంటే..బాండ్ల జారీతో మార్కెట్ రుణాలు..ఒక రాష్ట్రం తన డబ్ల్యూఎంఏ పరిమితిని దాటితే, అది ఆర్బీఐ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే, దీనికి కఠినమైన షరతులు ఉంటాయి. ఆర్బీఐ ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తూ బాండ్ల జారీ వంటి మార్కెట్ రుణాల ద్వారా కూడా రాష్ట్రాలు నిధులను సమీకరించుకోవచ్చు. ఏదైనా రుణం తీసుకోవాలంటే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఆర్బీఐ రుణాలపై వడ్డీ రేట్లను క్రమంగా చెల్లించాల్సి ఉంటుంది. కాలపరిమితితో సహా నిర్దిష్ట రీపేమెంట్ నిబంధనలు వర్తిస్తాయి. వీటిని రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుంది. -
‘జీతాల తేడాలొద్దు.. ఉద్యోగులను మనుషుల్లా చూడండి’
ఉద్యోగుల మధ్య జీతాల ( salaries ) తేడాల్లేకుండా వారిని మనుషుల్లాగా చూడాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి (Infosys founder Narayana Murthy) వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలకు ఉద్బోధించారు. కారుణ్య పెట్టుబడిదారీ విధానాన్ని అవలంబించడం ద్వారా తక్కువ, ఎక్కువ అనే వేతన వ్యత్యాసాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ‘టై కాన్ ముంబై 2025’ కార్యక్రమంలో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు.ప్రతి కార్పొరేట్ ఉద్యోగి గౌరవాన్ని, హుందాతనాన్ని నిలబెట్టాల్సి ఉందని, ఇందుకోసం ‘ఉద్యోగులను ప్రశంసించేటప్పుడు బహిరంగంగా, వారి లోపాలను చెప్పాల్సినప్పుడు ఏకాంతంగా చెప్పాలి. సాధ్యమైనంత వరకు సంస్థ ఫలాలను కంపెనీ ఉద్యోగులందరికీ న్యాయంగా పంచాలి’ అని నారాయణమూర్తి సూచించారు.దేశంలోని వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారీ విధానాన్ని కరుణతో స్వీకరించినప్పుడే భవిష్యత్ భారత అభివృద్ధి, పేదరిక నిర్మూలన జరుగుతుందని ఆయన అన్నారు. దేశాన్ని గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దేందుకు భారత్ లోని యువత కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన మూర్తి గతంలో వారానికి 70 గంటల పనిపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొన్నారు.టై కాన్ ముంబై 2025లో టై ముంబై మాజీ వ్యవస్థాపక అధ్యక్షుడు హరీష్ మెహతాతో మాట్లాడిన మూర్తి, ప్రస్తుత సోషలిస్టు మనస్తత్వంలో దేశం అభివృద్ధి చెందదని అభిప్రాయపడ్డారు. "పెట్టుబడిదారీ విధానం అంటే సంపదను సృష్టించడానికి ప్రజలు కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చేలా అవకాశం కల్పించడం. ప్రజలకు ఉద్యోగాలు కల్పించి తద్వారా పేదరికాన్ని తగ్గించడం. పన్నుల ద్వారా దేశ అభివృద్ధికి దోహదం చేయడం" అని మూర్తి వివరించారు. -
మన వృద్ధి నమూనా స్థిరమైనదేనా?
హైదరాబాద్ మురికివాడల్లో నివసిస్తున్న కార్మికులతో నా ఇంటర్వ్యూల సందర్భంగా, ఒక సాధారణ విషయం బయటపడింది: అదేమిటంటే వేతనాలు పెరగనందువల్ల రోజు వారీ ఖర్చులను తీర్చుకోవడం వారికి కష్టతరం అవుతోంది. జీవన ప్రమాణాలను మెరుగు పరచుకోవడం గురించి ఇక చెప్పనవసరం లేదు. అనధికారిక కార్మికులు అంటే వారు పెద్ద బహుళజాతి సంస్థలు లేదా మధ్య తరహా సంస్థలలో పనిచేసేవారు అయినా సరే... వారి వేతన పెరుగుదల చాలా తక్కువగా ఉంటోంది లేదా అసలు కనిపించడం లేదు. మరోవైపు జీవన వ్యయం పెరుగుతూనే ఉంది. ఆహార ద్రవ్యోల్బణం ఇప్పుడు 8 శాతం మించిపోవడంతో, ప్రాథమిక అవసరాలు తీర్చు కోవడం కూడా కష్టంగా మారుతోంది.ఈ పరిస్థితి విస్తృత స్థాయి ఆర్థిక సవాలును ప్రతిబింబిస్తుంది. వేతనాలు పెరగనప్పుడు, వృద్ధి నిలిచిపోతుంది. తక్కువ ఆదా యాలు కుటుంబంలో వినియోగాన్ని పరిమితం చేస్తాయి. ఇది తీవ్ర పరిణామాలను కలగజేస్తుంది. మొదటిది, ఇది ఆరోగ్యం, విద్య, పోషకాహారంపై అవసరమైన ఖర్చును ప్రభావితం చేస్తుంది. తద్వారా నేరుగా శ్రేయస్సుపై ప్రభావం చూపుతుంది. తక్కువ వేతన పెరుగుదల ఉన్న వినియోగదారులు తక్కువ ఖర్చు చేస్తారు, ఇది డిమాండ్ తగ్గడానికి దారితీస్తుంది. రెండవది, వినియోగదారుల వైపు నుంచి పడిపోయిన డిమాండ్, వ్యాపార సంస్థలు పెట్టుబడి పెట్టకుండా నిరుత్సాహపరుస్తుంది. మందగించిన ఆర్థిక కార్యకలాపాల చక్రాన్ని బలోపేతం చేస్తుంది. ఈ స్తబ్ధత ఒక క్లిష్టమైన ప్రశ్నను లేవ నెత్తుతుంది. అదేమిటంటే భారతదేశ ప్రస్తుత వృద్ధి నమూనా స్థిరమై నదా, లేదా దానిపై తీవ్రమైన పునరాలోచన అవసరమా?ప్రత్యామ్నాయం ఏమిటి?వేతనాల ఆధారంగా సాగే వృద్ధి వ్యూహం సరళమైనదే కానీ, అది శక్తిమంతమైన సూత్రంపై పనిచేస్తుంది. కార్మికులు ఎక్కువ సంపాదించినప్పుడు, వారు ఎక్కువ ఖర్చు చేస్తారు. డిమాండును, ఆర్థిక విస్తరణను నడిపిస్తారు. కార్పొరేట్ లాభాలు చివరికి కార్మికులకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయని భావించే ‘ట్రికిల్ డౌన్’ నమూ నాల మాదిరిగా కాకుండా, వేతన ఆధారిత వృద్ధి తక్షణ, విస్తృత ఆర్థిక భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తుంది.భారతదేశ ఆర్థిక పథం ఒక వైరుధ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఒకవైపు అధిక జీడీపీ వృద్ధి, మరోవైపు స్తబ్ధుగా ఉన్న నిజ వేతనాలు తీవ్రమైన ఆదాయ అసమానతకు దారితీస్తున్నాయి. ఇది ముఖ్యంగా వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, నిర్మాణం వంటి పరిశ్రమలలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఉత్పాదకత పెరిగింది, అయినప్పటికీ వేతనాలు స్తబ్ధుగా ఉన్నాయి. బలమైన వేతన వృద్ధి లేకపోతే, దేశీయ డిమాండ్ బలహీ నంగా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక ఆర్థిక పురోగతిని అడ్డుకుంటుంది.ఈ వలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వ రంగ జోక్యమే కీలకమైన మార్గం. ఇటీవలి ఆర్థిక విధానాలు ప్రైవేట్ వ్యాపార సంస్థ లకు, వ్యక్తులకు క్రెడిట్ లీడ్ (రుణ ప్రాధాన్యతా) వ్యూహం రూపంలో మద్దతు ఇవ్వడానికి ప్రాధాన్యమిస్తున్నాయి. దీంట్లో రైతులు, వ్యాపా రస్తులు మొదలైన వివిధ రంగాలవారికి క్రెడిట్ కార్డుల రూపంలో సులభమైన రుణ కల్పన చేయడం జరుగుతోంది. కానీ డిమాండ్‌ను తక్షణమే పెంచడానికి ఏకైక ప్రత్యామ్నాయం ప్రభుత్వరంగ పెట్టుబడే. వేతన వృద్ధి కంటే ఖర్చు తగ్గింపునకు, ముఖ్యంగా చౌక శ్రమకు ప్రైవేట్ సంస్థలు ప్రాధాన్యమిస్తాయన్నది తెలిసిందే. దీనికి బదులుగా మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి కార్యక్రమా లలో ప్రభుత్వాలు పెట్టే పెట్టుబడులు నేరుగా ఆదాయాలను పెంచు తాయి; ఇవి ఉద్యోగాలను సృష్టిస్తాయి; దీర్ఘకాలిక ఆర్థిక స్థితిస్థాపక తను పెంచుతాయి.రెండవ ప్రపంచ యుద్ధానంతరం జర్మనీ తన పునర్నిర్మాణంలో గానీ లేదా దక్షిణ కొరియా తన అభివృద్ధి నమూనాలోగానీ వేతన ఆధారిత వ్యూహాలను విజయవంతంగా అవలంబించిన దేశాలు. ఇవి వ్యూహాత్మక రంగాలలో ప్రభుత్వ పెట్టుబడిపై ఆధారపడ్డాయి. 2008 ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కూడా, ఆర్థిక విస్తరణను అనుసరించిన స్వీడన్ వంటి దేశాలు, పొదుపుకు ప్రాధాన్యత ఇచ్చిన వాటి కంటే వేగంగా కోలుకున్నాయి.భారతదేశం అమలుపర్చిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కూడా ఒక గొప్ప కేస్ స్టడీని అందిస్తుంది. సామాజిక సంక్షేమ కార్యక్రమం అయినప్పటికీ, ఇది గ్రామీణ గృహా లలో వేతనాలను ప్రవేశపెట్టింది. దానివల్ల ఆర్థిక వ్యవస్థ అంతటా తీవ్ర ప్రభావాలను ప్రేరేపించింది. అధిక గ్రామీణ ఆదాయాలు వృద్ధికి కీలక చోదకాలైన వినియోగదారీ ఉత్పత్తులు, గృహనిర్మాణం, సేవలు వంటివాటికి డిమాండ్‌ను పెంచాయి. ఇలాంటి ఉపాధి కార్య క్రమాలను, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో విస్తరించడం, బలో పేతం చేయడం కూడా ఇదే విధమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.ముందుకు సాగే మార్గంవేతన ఆధారిత వృద్ధిని విమర్శించేవారు తరచుగా అధిక వేతనాలు ద్రవ్యోల్బణానికీ, ఆర్థిక ఒత్తిడికీ దారితీయవచ్చని వాది స్తారు. అయితే, ముఖ్యంగా పెరుగుతున్న ఉత్పాదకతతో పాటు జీతాల పెంపు ఉన్నప్పుడు, మితమైన వేతన పెరుగుదల తప్పని సరిగా ద్రవ్యోల్బణానికి కారణం కాదు. ఉదాహరణకు, జపాన్‌లో స్తబ్ధతతో కూడిన వేతనాలు ద్రవ్యోల్బణ ప్రమాదాల కంటే ప్రతి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దోహదపడ్డాయి. అంతేకాకుండా, ఆర్థిక లోటుపై ఆందోళనలను వేతన ఆధారిత వ్యూహాల దీర్ఘకాలిక ప్రయోజనాలతో పోల్చి చూడాలి. ప్రభుత్వ రంగ వేతన వృద్ధికి నిధులను అధిక రుణాల ద్వారా కాకుండా, ప్రగతిశీల పన్నులు, మెరుగైన ఆదాయ సమీకరణ ద్వారా వ్యూహాత్మకంగా సమకూర్చుకోవచ్చు. మంచి లక్ష్యంతో కూడిన ప్రభుత్వ పెట్టుబడి... ఆర్థిక బాధ్యత, ఆర్థిక విస్తరణ రెండింటికీ ఉపకరిస్తుంది.వేతన ఆధారిత వృద్ధిని వాస్తవం చేయడానికి, భారతదేశం తన పారిశ్రామిక, కార్మిక విధానాలను పునరాలోచించాలి. కార్మిక రక్షణ లను బలోపేతం చేయడం, అర్థవంతమైన కనీస వేతన సంస్కరణ లను అమలు చేయడం, సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడం ముఖ్యమైన చర్యలు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా న్యాయమైన వేతన ప్రమాణాలను నిర్దేశించాలి, తద్వారా ప్రైవేట్ రంగ యజ మానులు కూడా దీనిని అనుసరించేలా చేయాలి.ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక వ్యూహం ప్రధానంగా క్రెడిట్ విస్తరణ, ప్రైవేట్ ఖర్చులకు ప్రోత్సాహకాల ద్వారా వినియోగాన్ని ప్రేరేపించడం చుట్టూ తిరుగుతోంది. ఇది తాత్కాలికంగా డిమాండ్‌ను పెంచి నప్పటికీ, ఆదాయ స్తబ్ధతకు సంబంధించిన ప్రధాన సమస్యను పరిష్కరించదు. దీనికి విరుద్ధంగా, వేతన ఆధారిత వృద్ధి... కార్మికులు స్థిరమైన కొనుగోలు శక్తిని కలిగి ఉండేలా, స్వయం సమృద్ధ ఆర్థిక వ్యవస్థను సృష్టించేలా మరింత స్థిరమైన మార్గాన్ని అందిస్తుంది.భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా మారాలని కోరుకుంటున్నప్పుడు, విదేశీ పెట్టుబడులు లేదా కార్పొరేట్ ఆధారిత నమూనాలపై మాత్రమే ఆధారపడటం సరిపోదు. ప్రభుత్వ రంగ చొరవల ద్వారా బలోపేతమైన వేతన ఆధారిత వృద్ధి వ్యూహం, ఆర్థిక విస్తరణను వేగవంతం చేయడమే కాకుండా, దాన్ని సమానంగా, స్థిరంగా ఉండేలా చేస్తుంది. అసమానతలు పెరుగుతున్న ఈ కాలంలో, న్యాయమైన వేతనాలకు, బలమైన ప్రభుత్వ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది కేవలం ఆర్థిక అవసరం మాత్రమే కాదు, నైతిక ఆవశ్యకత కూడా!బొడ్డు సృజన వ్యాసకర్త ఆర్థిక శాస్త్ర బోధకురాలు,ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ -
వర్సిటీలకు జీతాల్లేవ్!
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. ఆయన ఆర్భాటంగా ప్రకటించిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వర్సిటీ ఏర్పాటు మాట దేవుడెరుగు ఉన్న వర్సిటీల్లో పని చేస్తున్న ఆచార్యులకే జీతాలు అందని దుస్థితి నెలకొంది. వర్సిటీల్లో ఆచార్యులు, విశ్రాంత ఉద్యోగులకు గత మూడు నెలలకు పైగా ప్రభుత్వం నుంచి చెల్లింపులు నిలిచిపోవడంతో అంతర్గత నిధుల నుంచి అడ్వాన్స్‌ల రూపంలో ఒక నెల జీతాన్ని రెండు విడతలుగా తీసుకుంటున్న దుస్థితి నెలకొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఏకంగా రూ.1.19 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆచార్యులకు జీతాలను మాత్రం చెల్లించలేకపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వర్సిటీలు ఆర్థికంగా పతనమయ్యే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్‌గా విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న ఆచార్యులకు ప్రభుత్వం బ్లాక్‌గ్రాంట్ (సీఎఫ్ఎంస్) ద్వారా జీతాలు చెల్లించాలి. అయితే మూడు నెలలుగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో చరిత్రలో తొలిసారిగా వర్సిటీలు తమ అంతర్గత నిధుల నుంచి అడ్వాన్స్ రూపంలో సగం జీతాలు తీసుకోవాల్సి దుస్థితి నెలకొంది. ‘గత ప్రభుత్వంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. కోవిడ్ సమయంలోనూ మా జీతాలు ఆలస్యం కాలేదు. ఇప్పటికే మూడు నెలలుగా నిధుల విడుదల ఆపేశారు. మరో మూడు నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే మురిగిపోతాయి. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మా వర్సిటీపై రూ.12 కోట్లకుపైగా భారం పడుతుంది. ఇది విద్యార్థులు, ఉద్యోగుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది’’ అని రాయలసీమలోని ఓ వర్సిటీ ఇన్చార్జీ వైస్ చాన్సలర్ ఆవేదన వ్యక్తం చేశారు. » ఏయూలో నవంబర్, డిసెంబర్ జీతాలను వర్సిటీ నిధుల నుంచి అడ్వాన్స్‌గా సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. » ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోని ద్రవిడియన్ వర్సిటీలో గత త్రైమాసికంలో రూ.8 కోట్లు విడుదల చేయాల్సిన ప్రభుత్వం కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికీ డిసెంబర్ జీతాలు అందలేదు.» ఆచార్య నాగార్జున వర్సిటీలో మూడు నెలలుగా ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో వర్సిటీ అంతర్గత నిధుల నుంచి సర్దుబాటు చేసుకుంటున్నారు.» వైఎస్సార్ కడప జిల్లాలోని యోగి వేమన వర్సిటీలో గత మూడు నెలలుగా గ్రాంట్స్ విడుదల కాకపోవడంతో అంతర్గత నిధులను వినియోగిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు అందని దుస్థితి.» తిరుపతి ఎస్వీ వర్సిటీలో చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ప్రతి నెలా జీతాలు తీవ్ర ఆలస్యం అవుతున్నాయి. జూన్, జూలై జీతాలు ఆగస్టు 6న అందగా ఆగస్టు, సెప్టెంబర్ జీతాలు అక్టోబర్ 23న.. అక్టోబర్, నవంబర్ వేతనాలు డిసెంబర్ 5న చెల్లించారు. డిసెంబర్ జీతాలు ఇంకా ఇవ్వలేదు. uశ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోనూ 3 నెలలుగా అంతర్గత నిధులనే జీతాల కోసం వెచ్చిస్తున్నారు. » అనంతపురంలోని జేఎన్టీయూలో నవంబర్ జీతాలను వర్సిటీ అంతర్గత నిధుల నుంచి జనవరి 3న సర్దుబాటు చేశారు. డిసెంబర్ జీతాలింకా ఇవ్వలేదు. » కాకినాడ జేఎన్టీయూలోనూ డిసెంబర్ నెల జీతాల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. వర్సిటీల్లో వర్గ విభేదాలు..రాజ్యాంగబద్ధంగా నియమితులైన వీసీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బలవంతంగా రాజీనామాలు చేయించింది. ఇన్చార్జీ వీసీల పాలనతో చాలా వర్సిటీల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. దీనికి తోడు గత ప్రభుత్వం నియమించిన చిరుద్యోగులను కూటమి సర్కారు పెద్ద ఎత్తున తొలగించింది. శ్రీకాకుళం అంబేడ్కర్ వర్సిటీలో 34 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అర్ధాంతరంగా పంపించేశారు. ఇన్చార్జీ పాలనతో ఏయూ వందేళ్ల ఉత్సవాల్లో నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమ వర్సిటీలో పరీక్షల నిర్వహణ విభాగం పూర్తిగా అదుపు తప్పింది. మార్కుల లిస్టులు, ప్రొవిజినల్ సర్టిఫికెట్లు, కాన్వకేషన్ల కోసం నిత్యం వర్సిటీ చుట్టూ విద్యార్థులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రణాళికలు తలకిందులుఉన్నత విద్యా మండలి పరిధిలోని వర్సిటీల్లో సుమారు 8 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరంతా పెన్షన్‌పైనే ఆధారపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ సకాలంలో అందట్లేదు. అక్టోబర్, నవంబర్ పెన్షన్‌ను ఈ నెల 2న ఇచ్చారు. డిసెంబర్ది పెండింగ్‌లో ఉంది. విశ్రాంత జీవితంలో ఎన్నో ప్రణాళికలను మాకొచ్చే పెన్షన్‌తోనే నెరవేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ తలకిందులవుతున్నాయి. – శివప్రసాద్, ఏపీ వర్సిటీ పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
మా జీతాలు మాకివ్వండి.. స్టీల్ ప్లాంట్ కార్మికుల ధర్నా!
-
పంచాయతీ ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెలనెలా చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 92,351 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెలా రూ.116 కోట్లు జీతాలుగా చెల్లించాల్సి ఉంది. ఈ జీతాల చెల్లింపులో ఆలస్యం జరగకుండా స్పష్టమైన విధానం అనుసరించాలని పంచాయతీరాజ్, ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. గ్రీన్ చానల్ ద్వారా వీరికి జీతాలు చెల్లించాలని సూచించారు. గురువారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టాలిమహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఇచ్చే బిల్లులను సకాలంలో చెల్లించాలని సీఎం ఆదేశించారు. గతేడాది ఏప్రిల్ నుంచి దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని.. వీటికి సంబంధించిన మొత్తం బిల్లులను త్వరగా చెల్లించాలని అధికారులకు సూచించారు. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఉపాధి హామీ, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రాబట్టుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. సమీక్షలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
బాబూ.. జీతాలెప్పుడిస్తారు?
సాక్షి, అమరావతి: కొత్త ఏడాది మొదటి నెలలో ఐదు రోజులు గడిచినా, వేతనాలు అందలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రతి నెల ఒకటవ తేదీనే వేతనాలు చెల్లిస్తామన్న కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన మొదటి నెల తప్ప, మరే నెలలోనూ ఒకటో తేదీన వేతనాలు చెల్లించలేదని గుర్తు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 31నే బిల్లులు రెడీ అయిపోయాయని.. జనవరి 1న వేతనాలు జమ కావడం ఖాయమని ప్రభుత్వం లీకులు ఇచ్చిందని, తీరా 5వ తేదీ దాటినా వేతనాలు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే ప్రతినెలా చెల్లించాల్సిన ఈఎంఐల చెల్లింపులో జాప్యం జరగడంతో తాము డిఫాల్టర్లుగా మారుతున్నామని, చెక్కులు బౌన్స్ అవుతున్నాయని వాపోతున్నారు. సంక్రాంతి పండుగ నెలలో ఇలా జీతాల కోసం ఎదురు చూడటం ఇబ్బందిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు ఇస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.5 వేల కోట్లు అప్పు తెచ్చి కూడా జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం (7వ తేదీ) వరకు జీతాలు పడే అవకాశం లేదని ట్రెజరీ వర్గాలు చెబుతున్నాయని, ఈ లెక్కన కూటమి ప్రభుత్వం చెప్పిన దానికి.. ఇచ్చిన హామీకి.. చేస్తున్న దానికి పొంతన ఉండటం లేదని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి జీతాలివ్వాలి : ఏపీటీఎఫ్ అమరావతి జీవో 58 ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రతి నెలా 1నే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి బడ్జెట్‌లోను వేతనాల కోసం వార్షిక నిధులను కేటాయించాలని కోరారు. వేతనాలు వెంటనే చెల్లించాలి: సీహెచ్‌వో సంఘం గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో సేవలు అందించే తమకు డిసెంబర్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఏపీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్(సీహెచ్‌వో) అసోసియేషన్ ఆదివారం ప్రభుత్వాన్ని కోరింది. పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్ బకాయిలనూ విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఒకే దేశం.. ఒకే జీతం అమలు చేయాలి: ఏఐపీటీఎఫ్ ఉపాధ్యాయులు అందరికీ ఒకే దేశం.. ఒకే జీతం విధానాన్ని అమలు చేయాలని అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఏఐపీటీఎఫ్) తీర్మానించింది. ఆదివారం న్యూఢిల్లీలోని అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ భవన్లో తొలి జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ నుంచి ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు, ఏఐపీటీఎఫ్ కార్యనిర్వహక కార్యదర్శి ఏజీఎస్ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అందని జీతాలు
-
టీచర్ల జీతాల చెల్లింపులో ప్రభుత్వం వివక్ష
సాక్షి, అమరావతి: కూటమి నేతలు తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనూ, వివిధ బహిరంగ సభల్లోనూ హామీలు ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) ఆక్షేపించింది.ఈనెల ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు చెల్లించి, ఉపాధ్యాయులకు మాత్రం చెల్లించకుండా వివక్ష చూపుతోందని సంఘం అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీచర్ల జీతాల చెల్లింపులో వివక్ష చూపడం ఎందుకని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అందని జీతాలు
సాక్షి, విజయవాడ: ఏపీలో ప్రభుత్వ టీచర్ల (Government teachers)కు జీతాలు అందలేదు. 4వ తేదీ వచ్చిన కూడా ఉపాధ్యాయులకు చంద్రబాబు సర్కార్ (Chandrababu Govt) జీతాలు చెల్లించలేదు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు(Salaries) ఇస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ.5 వేల కోట్లు అప్పు తెచ్చి కూడా టీచర్లకి కూటమి ప్రభుత్వం జీతాలు చెల్లించలేదు. ప్రభుత్వ తీరుపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం. దాన్ని ఒక్క నెల ముచ్చటగా మార్చేసింది. తొలి నెల మినహా తర్వాత నెల నుంచి ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు, పెన్షనర్లు అందరికీ పెన్షన్లు జమ చేయడం లేదు. నూతన సంవత్సరంలోనూ నాలుగో తేదీ వచ్చినప్పటికీ వేతనాల కోసం సుమారు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఉపాధ్యాయులతోపాటు పలు శాఖల్లోని ఉద్యోగులకు ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందలేదు.ఇదీ చదవండి: ‘చంద్రబాబుగారూ.. ఇంత ద్రోహమా? ఇంతటి బరితెగింపా?’రెండో తేదీ కొంత మంది ఉద్యోగులకు వేతనాలను ప్రభుత్వం జమ చేయగా, అయితే 4వ తేదీ కూడా ఉపాధ్యాయులు ఎవరికీ జీతాలు అందలేదు. జీతాల కోసం ప్రతి నెలా ఎదురుచూపులు తప్పడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత నెల కూడా ఉపాధ్యాయులకు ఒకటో తేదీన వేతనాలు జమచేయలేదు. ప్రతి నెలా 6, 7 తేదీల వరకు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. -
ఒక్క నెల ముచ్చటేనా?
సాక్షి, అమరావతి: ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు(Salaries), పెన్షన్లు(pensions) చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Govt)... దాన్ని ఒక్క నెల ముచ్చటగా మార్చేసింది. తొలి నెల మినహా తర్వాత నెల నుంచి ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు, పెన్షనర్లు అందరికీ పెన్షన్లు జమ చేయడం లేదు. నూతన సంవత్సరంలోను మూడో తేదీ వచ్చినప్పటికీ వేతనాల కోసం సుమారు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఉపాధ్యాయులతోపాటు పలు శాఖల్లోని ఉద్యోగులకు ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందలేదు. రెండో తేదీ కొంత మంది ఉద్యోగులకు వేతనాలను ప్రభుత్వం జమ చేసింది. అయితే 3వ తేదీ కూడా ఉపాధ్యాయులు ఎవరికీ జీతాలు అందలేదు.జీతాల కోసం ప్రతి నెలా ఎదురుచూపులు తప్పడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత నెల కూడా ఉపాధ్యాయులకు ఒకటో తేదీన వేతనాలు జమచేయలేదు. ప్రతి నెలా 6, 7 తేదీల వరకు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. యూనివర్సిటీల ప్రొఫెసర్లకు కూడా ఈ నెల వేతనాలు ఇంకా అందలేదు. వైద్య ఆరోగ్య శాఖతోపాటు మరికొన్ని శాఖల్లో పెన్షనర్లకు పెన్షన్లు కూడా అందలేదు.ప్రభుత్వం గత నెల 31వ తేదీ మంగళవారం రూ.5,000 కోట్లు అప్పు చేసినప్పటికీ తమకు వేతనాలు ఇవ్వకపోవడం శోచనీయమని ఉపాధ్యాయులు అంటున్నారు. వేతనాలు అందకపోవడంతో పిల్లల ఫీజులు, ఈఎంఐ చెల్లింపులకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఒక నెల మాత్రమే కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, ఆ తర్వాత నుంచి ఏ నెలలో కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లు అందరికీ ఒకటో తేదీన వేతనాలు ఇవ్వలే -
Meetho Sakshi: జీతాలే పెద్ద సమస్య.. ఒక రోజు సెలవు తీసుకుంటే రెండు రోజుల జీతం కట్
-
ప్రభుత్వ బడుల్లో ఆయాల ఆకలికేకలు
కాకినాడ జిల్లా కత్తిపూడి మండలానికి చెందిన వెంకట దుర్గ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆయా (స్కావెంజర్)గా పనిచేస్తోంది. బడి ప్రాంగణాన్ని, గదులు, టాయిలెట్లు శుభ్రం చేస్తుంది. ఆమెకు ప్రభుత్వం ఇచ్చే వేతనం నెలకు రూ.6 వేలు. ఈ చిన్న మొత్తంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆమెకు గత ఐదు నెలలుగా వేతనం రాకపోవడంతో ఆర్థికంగా కష్టాలు పడుతోంది. రెండు నెలలు దుకాణాల్లో సరుకులు అరువు ఇచ్చారు. ఆ తర్వాత అరువు ఇవ్వబోమంటున్నారు. ఈ ఏడాది జూన్ వరకు ఠంచనుగా ఒకటో తేదీన వేతనం అందేది. ఇప్పుడు.. ‘నా జీతం ఎప్పుడు వస్తుంది సారూ..’ అంటూ ఆమె రోజూ స్కూల్లో హెచ్ఎంను దీనంగా అడుతోంది. ఒక్క వెంకటదుర్గదే కాదు.. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లల్లో ఆయాలు, నైట్వాచ్మెన్లుగా పనిచేస్తున్న దాదాపు 52 వేల మంది దుస్థితి ఇది.సాక్షి, అమరావతి: స్కూలుకు ఉపాధ్యాయులు, విద్యార్థులకంటే ముందే వచ్చి ప్రాంగణాన్ని, తరగతి గదులను ఊడ్చి శుభ్రం చేయడం మొదలు... టాయిలెట్లు శుభ్రం చేసి సాయంత్రం అందరికంటే చివరిగా వెళ్లే ఆయాలను చంద్రబాబు కూటమి సర్కారు అష్టకష్టాల పాలు చేస్తోంది. గత ఐదు నెలలుగా వారికిచ్చే రూ.6 వేల స్వల్ప వేతనాన్ని కూడా ఇవ్వకుండా వారి కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచనుగా జీతం అందుకున్న వీరికి... కూటమి సర్కారు ఏర్పడ్డాక వేతనాలు చెల్లించడం నిలిపివేసింది. రెండు నెలల క్రితం స్కావెంజర్లు, నైట్వాచ్మెన్ల వేతనాలకు సుమారు రూ.180 కోట్లు విడుదల చేస్తున్నట్టు కాగితాలపైనే చూపించిన పాలకులు.. డబ్బు మాత్రం విడుదల చేయలేదు. దీంతో రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఆయాలు, నైట్ వాచ్మెన్లుగా పనిచేస్తున్న దాదాపు 52 వేల మంది కుటుంబాలు ఆరి్థకంగా కుదేలైపోయాయి. రోజు గడవడమే కష్టమైపోతోందని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. రోజూ 10 గంటల పాటు శ్రమిస్తున్న వీరికి ప్రతి నెలా చెల్లించే రూ.31.39 కోట్లు లేవంటూ ప్రభుత్వం తప్పించుకుంటోంది. ఐదు నెలలుగా ప్రభుత్వం రూ.157 కోట్లు బకాలు పెట్టింది. రోజూ వేతనం కోసం స్కూల్లో హెచ్ఎంను అడగడం, తెలియదని వారి నుంచి సమాధానం రావడం పరిపాటిగా మారింది. గత టీడీపీ ప్రభుత్వంలోనూ అప్పట్లో రూ.2వేల వేతనంతో పనిచేసిన ఆయాలకు దాదాపు రెండేళ్ల వేతనాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇప్పుడూ అదే పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. 52 వేల మంది కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం గత ఐదేళ్లు వైఎస్ జగన్ సర్కారు... ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చిoది. పేద పిల్లలు చదువుకునే బడులను నాడు–నేడు పథకం కింద అద్భుతంగా తీర్చిదిద్దింది. 45 వేల స్కూళ్లలోను 11 రకాల సదుపాయాలు కలి్పంచింది. ఈ స్కూళ్లు, టాయిలెట్లను శుభ్రం చేసి, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేందుకు విద్యార్థుల సంఖ్యను బట్టి ఒకరు లేదా ఇద్దరు చొప్పున 47,261 మందిని నియమించింది. రాత్రివేళ కాపలా కోసం అవసరమైనచోట 5,053 మంది నైట్ వాచ్మెన్లను నియమించింది. వీరికి ప్రతినెలా రూ.6 వేలు చొప్పున వేతనం అందించేది. గత టీడీపీ ప్రభుత్వంలో కేవలం రూ.2 వేల వేతనంతో నియమితులైన వారికి వైఎస్ జగన్ రూ.6వేలకు పెంచడంతోపాటు చంద్రబాబు పెట్టిన 13 నెలల బకాయిలను సైతం చెల్లించారు. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రావడంతో వేతనాలు ఆగిపోయి ఈ కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. పైగా కూటమి నేతలు రాజకీయ కక్షతో తొలగింపునకు పూనుకుంటున్నారు. ఉపాధ్యాయ సంఘాలు సైతం వీరి సమస్యను పట్టించుకోవడంలేదని టీచర్లే విమర్శిస్తున్నారు. ఆర్థికంగా కష్టాలు పడుతున్నాం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలో 2016 నుంచి ఆయాగా పనిచేస్తున్నా. భర్త వ్యయసాయ కూలి. మా ఇంటిని ఎంత శుభ్రంగా చూసుకుంటామో బడిలోనూ అలాగే పనిచేస్తాం. జగన్ సీఎం అయ్యాక మా వేతనం రూ.6 వేలు పెంచి ప్రతినెలా ఇచ్చేవారు. అంతకు ముందు నెలకు రూ.2 వేలు వేతనం ఆలస్యంగా ఇచ్చేవారు. పైగా 25 నెలల వేతనం ఇవ్వనే లేదు. జగన్ వచ్చాక వేతనం పెంచడంతో పాటు బకాయిలు సైతం ఇచ్చి ఆదుకున్నారు. లోన్ తీసుకుని బిడ్డకు పెళ్లి చేశా. ప్రతినెలా కిస్తీ కట్టాలి. డ్వాక్రా సంఘానికి డబ్బులు చెల్లించాలి. 5 నెలలుగా జీతం రాక అనేక కష్టాలు పడుతున్నాం. – పి.శిరీష, వెంకటాపురం, కృష్ణా జిల్లా జీతం రాక బతుకు కష్టంగా ఉంది కృష్ణా జిల్లా వక్కలగడ్డ ఎలిమెంటరీ స్కూల్లో 2015 నుంచి ఆయాగా పనిచేస్తున్నా. గతంతో పోలిస్తే ఇప్పుడు పని పెరిగింది. గ్రౌండ్ శుభ్రం చేయాలి, రోజూ నాలుగుసార్లు టాయిలెట్లు కడగాలి. మొక్కలకు నీళ్లు పెట్టాలి. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్కూల్లోనే పని. సెలవులు కూడా ఉండవు. ఇన్ని పనులు చేసినందుకు నెలకు వచ్చే రూ.6 వేలే జీవనాధారం. ఐదు నెలలుగా అవీ ఇవ్వడంలేదు. 2019కి ముందు కూడా నాకు 20 నెలల జీతం ఇవ్వలేదు. ఇప్పుడూ అలాగే చేస్తారేమోనని భయంగా ఉంది. జీవనం చాలా కష్టంగా ఉంది. – మట్టా నాగమణి, వక్కలగడ్డ, కృష్ణా జిల్లా -
జీతాలు, పెన్షన్ల కోసం పడిగాపులు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వం మాటలు నీటిమూటలయ్యాయి. తొలి నెల మినహా తరువాత నెలల నుంచి ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వడం లేదు. గత నెల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 10వ తేదీ వచ్చే వరకు జీతాలను చెల్లించలేదు. ఈ నెల కూడా అలాగే చేస్తారనే భయం ఉద్యోగులను వెంటాడుతోంది.రాష్ట్ర సచివాలయంతోపాటు శాఖాధిపతులు కార్యాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు వారి ఖాతాల్లో పడలేదు. ఈఎంఐలు చెల్లించాల్సిన ఉద్యోగులు జీతాల మెసేజ్ కోసం ఎదురుచూస్తున్నారు. గురుకుల ఫాఠశాల్లో పనిచేసే ఉద్యోగులు, గ్రంథాలయ సంస్థల ఉద్యోగులకైతే నెలల తరబడి జీతాలివ్వడం లేదు. మంగళవారం కూటమి ప్రభుత్వం మరో రూ.4,237 కోట్ల అప్పు చేస్తోంది. ఆ నిధులు ఖజానాకు చేరిన తరువాతనైనా జీతాలు, పెన్షన్లు చెల్లిస్తారా.. అనేది ప్రశ్నార్థకంగా మారిందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. -
జైలర్ కన్నా ఖైదీల ఆదాయమే ఎక్కువ!
బ్రిటన్ జైళ్లలో అధికారుల కంటే ఖైదీలే ఎక్కువ సంపాదిస్తున్నారు. రక్షణ కల్పించే అధికారులు, సెకండరీ టీచర్లు, బయో కెమిస్టులు, సైకోథెరపిస్టులు తదితరుల కంటే కూడా వారి ఆదాయం చాలా ఎక్కువట! అక్కడి కొన్ని బహిరంగ జైళ్లలో ఖైదీలను బయటికి వెళ్లి పని చేయడానికి కూడా అనుమతిస్తారు. అలా పనికి వెళ్లిన ఓ ఖైదీ గతేడాది ఏకంగా 46 వేల డాలర్ల (రూ.39 లక్షల) వార్షిక ఆదాయం ఆర్జించి రికార్డు సృష్టించాడు. మరో 9 మంది ఖైదీలు కూడా ఏటా 28,694 డాలర్ల (రూ.24 లక్షల) కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని హోం శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఖైదీలకు పునరావాసంతో పాటు విడదలయ్యాక సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు వీలు కలి్పంచడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. అక్కడి జైళ్లలో ఖైదీలు పలు ఉద్యోగాలు చేస్తారు. లారీ డ్రైవర్లుగా చేసేవారి సంపాదన ఎక్కువ. కొందరు శిక్షాకాలం ముగియకముందే తాత్కాలిక లైసెన్సు సంపాదించేస్తారు. ఈ ఖైదీల్లో పలువురు ఆదాయపన్ను కూడా చెల్లిస్తుండటం విశేషం. కొందరు సేవా కార్యక్రమాలకు విరాళాలూ ఇస్తారు! బ్రిటన్‌లో జైలు గార్డుల సగటు వేతనం 35,000 డాలర్లు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉక్కు కార్మికుల డెడ్‌లైన్
సాక్షి, విశాఖ: విశాఖ ఉక్కు కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డెడ్ లైన్ విధించారు. తమకు చెల్లించాల్సిన జీతాలను వారం రోజుల్లోగా చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. జీతాలు ఇవ్వని పక్షంలో ప్రధాని మోదీ విశాఖలో అడుగుపెట్టేందుకు అర్హత లేదంటూ సీపీఎం నేత కామెంట్స్ చేశారు.విశాఖ ఉక్కు కార్మికుల జీతాల విషయంపై సీపీఎం నేత గంగారావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.. విశాఖ వచ్చే లోపు కార్మికులకు జీతాలు చెల్లించాలి. లేదంటే విశాఖలో కాలుపెట్టే అర్హత లేదు.. అడుగడుగునా ముట్టడిస్తాం. ఉద్యోగుల జీతాల విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకోవాలి.ఉక్కు కార్మికులకు ఇంత అన్యాయం జరుగుతుంటే విశాఖ ఎంపీ ఏం చేస్తున్నారు?. యూనివర్సిటీని నడుపుకోడానికి నిన్ను ఎంపీని చేయలేదు. జీతాలకోసం యాజమాన్యంతో మాట్లాడాలి. ఎంపీ మాట కూడా యాజమాన్యం వినకపోతే ఉద్యమంలోకి రావాలి. ఆయనతో కలిసి మేమంతా ఉద్యమిస్తాం అని చెప్పుకొచ్చారు. -
జీతాల కోసం చకోర పక్షుల్లా..!
సాక్షి, అమరావతి: తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ నెలా ఒకటో తేదీన ఠంచన్‌గా ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు అందిస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం ఓ వైపు గొప్పలు చెబుతోంది. కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే గడిచిన ఐదు నెలల్లో ఏ ఒక్క నెలలోనూ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఒకటో తేదీన పూర్తిస్థాయిలో జమైన దాఖలాలు లేవు. ముఖ్యంగా వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చెందిన ఉద్యోగులకు, పెన్షనర్లకు సకాలంలో అందకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. నవంబర్ మూడో వారం వచ్చినా..నవంబర్ మూడో వారం వచ్చినా.. గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు, యార్డుల్లో పనిచేస్తున్న మార్కెటింగ్ సిబ్బందికి జీతాలు అందని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికిపైగా ఉన్న గ్రంథాలయాల్లో పనిచేస్తోన్న 2,500 మంది ఉద్యోగులకు జీతాలు పడలేదు. ఇదే శాఖకు చెందిన 600 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు జమ కాలేదు. అలాగే మార్కెటింగ్ శాఖకు సంబంధించి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ (ఎఎంసీ), యార్డుల్లో పనిచేస్తున్న వారికి సైతం జీతాలతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు జమ కాలేదు. అప్పులతో గ్రంథాలయ వారోత్సవాలుప్రతీ ఏటా నవంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ వారోత్సవాల నిర్వహణ కోసం గ్రేడ్–1 గ్రంథాలయాలకు రూ.15వేలు, గ్రేడ్–2 గ్రంథాలయాలకు రూ.12వేలు, గ్రేడ్–3 గ్రంథాలయాలకు రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఏటా నిధులు విడుదల చేసేది. అలాంటిది ఈ ఏడాది ఒక్కపైసా కూడా విడుదల చేసిన పాపాన పోలేదు. సకాలంలో జీతాలు ఇవ్వకపోగా, వారోత్సవాలకు నిధులు విడుదల చేయకపోవడంతో గ్రంథాలయాల సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేకపోయినా చేసేది లేక అప్పులు చేసి మరీ ఈ వారోత్సవాలను నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. తక్షణమే జీతాలు, పెన్షన్లు జమ చేయాలి నవంబర్ 17వ తేదీ దాటుతున్నా రాష్ట్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు జమ కాలేదు. అనారోగ్యంతో బాధపడే పెన్షనర్లు ప్రభుత్వ పెన్షన్ అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే వేతనాలు, పెన్షన్లు విడుదల చేయాలి.– కళ్లేపల్లి మధుసూదనరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం -
ఒక నెలతో సరి.. ఒకటో తేదీ జీతాల్లేవ్
సాక్షి, అమరావతి: తమది ఉద్యోగుల ప్రభుత్వమని, అందరికీ ప్రతినెల ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం వేతనాలివ్వడంలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చాక జూలై నెలలో మాత్రమే ఒకటో తేదీన జీతాలిచ్చారని, తర్వాత నెలల్లో ఐదు, ఆరు తేదీల్లోనే వేస్తున్నారని తెలిపారు. ప్రతినెలా మంగళవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు రెండులక్షల మంది ఉపాధ్యాయులకు అక్టోబర్ నెల వేతనాలను నవంబర్ ఒకటో తేదీన ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు జమ చేయలేదు. పెన్షన్లు కూడా అందరికీ అందలేదు. కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని, మొదటి నెలలో మాత్రం ఒకటో తేదీ జీతాలు చెల్లించి, తర్వాత ప్రతినెలా 4, 5, 6 తేదీల్లో జీతాలు ఇస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులు, ఈఎంఐ వంటి అవసరాలతో ఇబ్బందిపడుతున్నామని పేర్కొంటున్నారు. ఒకటో తేదీన వేతనాలు ఇవ్వకపోవడంతో ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక డిఫాల్టర్లుగా మారుతున్నామని ఆవేదన చెందుతున్నారు. పెన్షన్ సొమ్ముతో జీవనం సాగిస్తున్నవారి పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. అప్పు తెచ్చి ఎంతకాలం వడ్డీలు చెల్లించాలి? ఉపాధ్యాయులకు ఇప్పటివరకు పీఎఫ్ లోన్లు, ఏపీజేఎల్‌ఐ లోన్లు, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవులు జమచేయలేదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అశోక్‌కుమార్‌రెడ్డి, గెడ్డం సుదీర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము దాచుకున్న డబ్బును ఇవ్వకపోతే తమ పిల్లల చదువులు ఏం కావాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. డబ్బులు అప్పు తెచ్చి ఎంతకాలం వడ్డీలు చెల్లించాలని ప్రశ్నించారు. తమకు రావాల్సిన పీఎఫ్ లోను బకాయిలు, పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు అండగా ఉంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఇప్పుడు ఉద్యోగస్తులపై కేసులు పెట్టిన వారికి అండగా ఉంటామని మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక చర్యలు మానుకుని, వారి సంక్షేమం కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. -
జీతాల్లేవ్.. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్
సాక్షి, విజయవాడ: చంద్రబాబు పాలనలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఎన్నికల ముందు ఉద్యోగులకు హామీల వర్షం కురిపించిన చంద్రబాబు సర్కార్.. హామీల సంగతి దేవుడెరుగు.. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో నానా ఇబ్బందులకు గురిచేస్తోంది.జీతాలు రాక ప్రభుత ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. 2 వ తేదీ వచ్చినా కానీ కూటమి ప్రభుత్వం.. టీచర్లకు జీతాలు వేయలేదు. 2 నెలలుగా కూడా ఒకటో తేదీన జీతాలు వేయలేదు. పెన్షనర్లకు కూడా ఇంకా పెన్షన్లు జమ కాలేదు.కాగా, చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు వేధింపులే తప్ప ఎలాంటి మేలు జరగటం లేదు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ఐఆర్, పీఆర్సీ సంగతి ప్రభుత్వం గాలికొదిలేసింది. అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్న హామీలు ఏమయ్యాయి? అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.ఇంటి స్థలాలను వెంటనే మంజూరు చేయాలని, పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పది శాతం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని.. జాబ్ కేలండర్‌ను త్వరగా విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.ఇదీ చదవండి: చంద్రబాబూ.. మరి అవన్నీ కుట్రలేనా?: రాచమల్లు -
CJI DY Chandrachud: జూనియర్లకు సరైన వేతనాలివ్వండి
న్యూఢిల్లీ: ‘‘న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి, నైపుణ్యాలు పెంచుకోవడానికి మీ వద్ద పనిచేసే యువతకు సరైన వేతనాలు, పారితోషికాలు చెల్లించడం మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి’’ అని న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సూచించారు. న్యాయవాద వృత్తి చాలా సంక్లిష్టమైందని చెప్పారు. ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న నైపుణ్యాలే యువ న్యాయవాదులను ముందుకు నడిపిస్తాయని, అవి వారికి జీవితాంతం తోడ్పడుతాయని తెలిపారు. పునాది బలంగా ఉండాలని పేర్కొన్నారు. తాజాగా ఆలిండియా రేడియో ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ పలు విషయాలు వెల్లడించారు. ఈ వృత్తిలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు ఉంటాయని, ప్రారంభంలో వేతనాలు ఎక్కువగా ఉండకపోవచ్చని వెల్లడించారు. న్యాయవాద వృత్తిలోకి వచ్చేవారు కష్టపడి పనిచేయాలని, నిజాయతీగా ఉండాలని పేర్కొన్నారు. యువ లాయర్లను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని స్పష్టంచేశారు. జూనియర్లకు సీనియర్ లాయర్లు గురువులుగా కొత్త విషయాలు నేరి్పస్తూనే సంతృప్తికరమైన వేతనాలు చెల్లించడం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. తాను కాలేజీలో చదువుకొనే రోజుల్లో ఆలిండియా రేడియోలో ప్రయోక్తగా పనిచేశానని జస్టిస్ చంద్రచూడ్ గుర్తుచేసుకున్నారు. శాస్త్రీయ సంగీత కళాకారిణి అయిన తన తల్లి తనను ముంబైలోని ఆలిండియా రేడియో స్టూడియోకు తీసుకెళ్తూ ఉండేవారని చెప్పారు. 1975లో ఢిల్లీకి వచ్చాక ఆకాశవాణిలో హిందీ, ఇంగ్లిష్ కార్యక్రమాలు నిర్వహించానని వివరించారు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి రేడియోలో హిందీ, ఇంగ్లి‹Ù, సంస్కృత కార్యక్రమాలు విన్నానని తెలిపారు. దేవకి నందన్ పాండే, పమేలా సింగ్, లోతికా రత్నం గొంతులకు తాను అభిమానినని చెప్పారు. -
ఏఈఈల జీతాల నిలిపివేత.. అలా ఎలా?
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో 500 మందికి పైగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఇటీవల నిర్వహించిన బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడంతో.. వచ్చే నెలలో వారికి జీతాలు నిలిపివేయాలని డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ ఆదేశించింది. కాగా, జీవో నంబర్ 193 ఆధారంగానే తమకు బదిలీలు నిర్వహించారని, జీతాలు నిలిపివేత సరికాదని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సైతం ఇదే తరహాలో వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగం డైరెక్టర్ తమ జీతాలను నిలిపివేశారని వారు ఆరోపిస్తున్నారు. జీతాలు నిలిపివేస్తే వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు.నీటిపారుదల శాఖలో 1,578 ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖలో 1,597 మంది లస్కర్లు, 281 హెల్పర్లు కలిపి.. మొత్తం 1,878 మందిని ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించడానికి అనుమతిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధిత ప్రాంత ఈఎన్సీ/సీఈల నేతృత్వంలో స్థానిక ఎస్ఈ, స్థానిక డీసీఈలతో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.‘గురుకుల’ అభ్యర్థుల ఆందోళనలక్టీకాపూల్ (హైదరాబాద్): గురుకుల నియామక బోర్డు బోధన పోస్టులను నింపే క్రమంలో డిసెండింగ్ విధానం పాటించకపోవడం వల్ల ఒక్కొక్కరికి 2,3,4 పోస్టులు వచ్చాయని, దీని వల్ల 9 వేల పోస్టులలో 3 వేలు మిగిలిపోయాయని తెలంగాణ గురుకుల అభ్యర్థుల (1:2 జాబితా) ప్రతినిధులు ఎండీ ఉస్మాన్, రాజు, టి.ఉమాశంకర్‌లు పేర్కొన్నారు. పోస్టులు నింపే క్రమంలో ముందుగా పీజీటీ, టీజీటీ, జేఎల్, డీఎల్ పోస్టింగ్‌లు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. శుక్రవారం తమకు న్యాయం చేయాలంటూ ప్రజాభవన్ వద్ద అభ్యర్థులు బైఠాయించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి స్పష్టమైన సమాధానం వచ్చేంత వరకు ఇక్కడే ఉంటామంటూ పట్టుపట్టారు. జీవో నం.81ని సడలించి తమకు న్యాయంగా రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.చదవండి: రేవంత్ డౌన్ డౌన్.. బెటాలియన్ పోలీసుల ధర్నా! టీజీఎస్పీ సిబ్బంది సెలవుల్లో మార్పులు నిలిపివేత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బంది సెలవుల్లో మార్పులు చేస్తూ ఈ నెల 10న ఇచ్చిన మెమోను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు నిలిపివేస్తున్నట్లు టీజీఎస్పీ అదనపు డీజీ సంజయ్‌కుమార్ జైన్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సెలవుల అంశంపై ఇచ్చిన ఉత్తర్వులు సిబ్బందిని అయోమయానికి గురిచేసినట్లు తన దృష్టికి రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బెటాలియన్లలో సిబ్బంది సమస్యలను తెలుసుకునేందుకు దర్బార్లు ఏర్పాట్లు చేసి వారితో మాట్లాడాలని, ఆ సమస్యలు తన దృష్టికి తేవాలని అన్ని బెటాలియన్ల కమాండెంట్లను సంజయ్‌కుమార్ జైన్ ఆదేశించారు. బెటాలియన్లలో పనిచేసే సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సిబ్బంది వ్యక్తిగతంగా తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తేవొచ్చని తెలిపారు. అందుకు tgspcontrol@gmail.com లేదా గ్రీవెన్స్ నంబర్ 8712658531కు తెలియజేయాలని స్పష్టం చేశారు. -
జీతాలు నిల్లు..పబ్లిసిటీ ఫుల్లు: విజయసాయిరెడ్డి సెటైర్లు
సాక్షి,తాడేపల్లి:జీతాలు చెల్లించని చంద్రబాబు ప్రభుత్వంపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి మంగళవారం(అక్టోబర్8) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘రూ.400 కోట్లు ఇస్తున్నట్టు జీఓ విడుదల అయింది.ఈ విషయాన్ని కుల మీడియా ఫ్రంట్ పేజీలో తాటికాయంత అక్షరాల్లో రాసింది.టీవీల్లో రోజంతా బ్రేకింగ్ న్యూస్ నడిచాయి.నిధులు మాత్రం హుళక్కయ్యాయి.చంద్రబాబు కుతంత్రాలు ఇలాగే ఉంటాయి.సమగ్ర శిక్షలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు లేవు.ప్రాణాలు రక్షించే 108, 104 సిబ్బంది 6 వేల 500 మందికి జులై నుంచి నయా పైసా విదల్చలేదు.వీరే కాదు అనేక డిపార్టుమెంట్లలో వేల మంది చిరుద్యోగుల జీవితాల్లో దసరా,దీపావళి పండుగలు వస్తున్నా చిమ్మచీకట్లు తొలగిపోలేదు.ఇదీ చంద్రబాబు మార్కు పాలన.దీనిని మార్పు అనాలంట’అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: పవన్‌కల్యాణ్‌పై కేఏ పాల్ ఫిర్యాదు -
మూడు నెలలుగా జీతాల్లేవు!.. నిధులన్నీ వాటికే?
పాకిస్తాన్ క్రికెట్.. గత కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో వరుస వైఫల్యాలు, పసికూనల చేతిలో ఓటములు, టెస్టుల్లో వైట్‌వాష్‌లు, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌లేమి, తరచూ సెలక్టర్లు, కెప్టెన్ల మార్పులు.. వెరసి తీవ్ర విమర్శలు. అసలు దీనంతటికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వైఖరే కారణమంటూ మాజీ క్రికెటర్ల నుంచి ఆరోపణలు.తాజాగా పీసీబీ గురించి మరో విషయం తెరమీదకు వచ్చింది. గత మూడు నెలలుగా పురుష, మహిళా క్రికెటర్లకు వేతనాలు చెల్లించలేదని తెలుస్తోంది. నెలవారీ పేమెంట్లతో పాటు స్పాన్సర్షిప్ షేర్లు ఇవ్వలేదని సమాచారం. దీంతో ఆటగాళ్లంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పాక్ క్రికెట్ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి.కాంట్రాక్టు జాబితా విడుదలలోనూ జాప్యంఅంతేకాదు.. సెంట్రల్ కాంట్రాక్టు జాబితా విడుదలలోనూ బోర్డు జాప్యం చేయడం ఆటగాళ్లను మరింత చికాకు పెడుతోందని పేర్కొన్నాయి. ఇక వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం.. కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియాలను అభివృద్ధి చేసేందుకు పీసీబీ ఉపయోగిస్తోందని తెలిపాయి.తీవ్ర అసంతృప్తిఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నాటికి ఈ మూడు మైదానాలను పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపై పీసీబీ శ్రద్ధ చూపుతోందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, వరుస సిరీస్‌లు ఆడుతున్నా..ఇంకా వేతనాలు చెల్లించకపోవడంతో క్రికెటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. దాని ప్రభావం ఆటపై పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో నెలరోజుల్లోగా బకాయిలన్నీ తీర్చేందుకు పీసీబీ కసరత్తు చేస్తుందని సదరు వర్గాలు వెల్లడించాయి. కాగా గతేడాది వార్షిక కాంట్రాక్టుల విడుదలకు ముందు ఆటగాళ్లతో చర్చించిన పీసీబీ.. జీతాలను పెంచుతూ చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ‘ఎ’ కేటగిరీలో ఉన్న బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిది వంటి వాళ్లకు నెలవారీ 4.5 మిలియన్ల పాక్ రూపాయలతో(టాక్స్ చెల్లింపుల తర్వాత) పాటు.. అదనంగా లోగో స్పాన్సర్షిప్స్ నుంచి పీసీబీకి వచ్చే ఆదాయంలో మూడు శాతం మేర ఇవ్వనున్నట్లు డీల్ కుదిరింది. జీతాల చెల్లింపునకే గతిలేకఅయితే, ఇప్పుడు ఇలా జీతాల చెల్లింపునకే గతిలేక బోర్డు జాప్యం చేయడం గమనార్హం. ఇక టీ20 ప్రపంచకప్-2024 ఆడేందుకు వెళ్లిన పాక్ మహిళా క్రికెటర్లకు కూడా ఇంతవరకు జీతాలు ఇవ్వలేదని సమాచారం.చదవండి: ఇదేం బౌలింగ్?.. హార్దిక్ శైలిపై కోచ్ అసంతృప్తి!.. ఇకపై.. -
మాకు జీతాలేం వద్దు.. సీఎం, మంత్రుల తీర్మానం
రాష్ట్రంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా సీఎం, రాష్ట్ర మంత్రులు, ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శులు (సీపీఎస్), క్యాబినెట్ స్థాయి సభ్యులందరూ రెండు నెలల పాటు జీతాలు తీసుకోరని గురువారం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు.రానున్న రెండు నెలలపాటు జీతాలు, టీడీ, డీఏలు తీసుకోబోమని కేబినెట్లో చర్చించిన తర్వాత మంత్రివర్గంలోని సభ్యులంతా నిర్ణయించారు’ అని సుఖ్వీందర్ సింగ్ సుఖు చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, జూన్-ఆగస్ట్ నెలలో హిమాచల్ ప్రదేశ్‌లో పలు రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి.100 మంది మృతి చెందారు. బ్రిడ్జ్‌లు, రోడ్లు, పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ తరుణంలో మధ్యప్రదేశ్ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు రెండు నెలల పాటు తమ జీత భత్యాల్ని తీసుకోమని తీర్మానించారు. -
ఐటీ ఉద్యోగులకు ‘భారీ జీతాలు’ కొన్నిరోజులే..!
ఇటీవల పెరుగుతున్న లేఆఫ్‌లు, మందగించిన నియామక పరిస్థితులతో ఐటీ రంగం చర్చల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో టెక్, నాన్-టెక్ రంగాలలో అనుభవం ఉన్న ఓ టెక్ నిపుణుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘రెడ్ఢిట్’లో ఐటీ మార్కెట్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందంటూ చర్చను ప్రారంభించారు."డెవలపర్ /ఐటీ మార్కెట్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది" అంటూ పోస్ట్‌ను ప్రారంభించిన ఆ ఎక్స్పర్ట్ త్వరలో ఐటీ పరిశ్రమలో వేతనాలు ఇతర రంగాల్లో జీతాలకు దగ్గరగా కావచ్చని అంటే తగ్గిపోవచ్చని సంకేతాలిచ్చారు. ఈ ప్రకటన భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీ జాబ్ మార్కెట్ ప్రస్తుత, భవిష్యత్తు స్థితికి సంబంధించి చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: అవాక్కయ్యేలా ఐటీ కంపెనీ శాలరీ హైక్!టెక్, నాన్-టెక్ ఉద్యోగుల మధ్య ఉన్న జీతం అంతరాన్ని ఆయన విపులంగా వివరించారు. నాన్-టెక్ ఉద్యోగాలలో నైపుణ్యం కలిగినవారు సగటున ఏడాదికి 10-15 లక్షలు సంపాదిస్తున్నారని, ఇక టెక్ డెవలపర్లు, తక్కువ నైపుణ్యాలు ఉన్నవారు కూడా 30-40 లక్షలు వార్షిక వేతనం అందుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యత్యాసం బుడగ లాంటిదని, ఎన్నో రోజులు ఉండదని రాసుకొచ్చిన ఆయన ఈ భారీ జీతాలు త్వరలో సర్దుబాటు కావచ్చని అభిప్రాయపడ్డారు.ఇక అనేక మంది డెవలపర్లు చాట్ జీపీటీ వంటి సాధనాలను ఉపయోగిస్తున్నందున డెవలపర్ల డిమాండ్ మరింత తగ్గుతుందని సూచించారు. దీని ఫలితంగా వారి పనిభారం 50% తగ్గింది. ఇదే సమయంలో జాబ్ మార్కెట్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లతో నిండిపోయిందని చెప్పుకొచ్చారు. "జనరేటివ్ ఏఐ ఉద్యోగాలను తీసివేయదని కొందరు వాదించవచ్చు, కానీ ప్రభావాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. మా కంపెనీలో ప్రస్తుతం జూనియర్ పాత్రలకు మాత్రమే ఓపెనింగ్లు ఉన్నాయి. సీనియర్ స్థానాలకు కాదు" అంటూ జోడించారు.Posts from the developersindiacommunity on Reddit -
సీఈఓల జీతాలు పెంపు!
ప్రైవేట్ బ్యాంకులకు సారథ్యం వహించే సీఈఓల వేతనాలు గతేడాదితో పోలిస్తే ఈసారి స్వల్పంగా పెరిగాయి. బ్యాంకుల్లో కీలకమైన మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగుల జీతం, బోనస్‌లు, స్టాక్ ఆప్షన్లకు సంబంధించిన వెసులుబాటును పెంచాలంటే ఆర్బీఐ అనుమతులు తప్పనిసరి. ఈ వ్యవహారంపై భారతీయ రిజర్వ్ బ్యాంకు దృష్టి సారించినట్లు మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి.కొన్ని నివేదికల ప్రకారం.. ప్రముఖ బ్యాంకుల సీఈఓల వేతనాలు కింది విధంగా ఉన్నాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్-శశిధర్ జగదీషన్ వేతనం 2024లో రూ.10.77 కోట్లు, 2023లో రూ.10.54 కోట్లు, స్టాక్ ఆప్షన్స్ రూపంలో 2,09,131.ఐసీఐసీఐ బ్యాంక్-సందీప్ భక్షి, 2024లో రూ.9.96 కోట్లు, 2023లో రూ.9.57 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 2,99,100.యాక్సిస్ బ్యాంక్-అమితాబ్ చౌదరి, 2024లో రూ.9.64 కోట్లు, 2023లో రూ.9.75 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 3,13,300.ఇండస్ఇండ్ బ్యాంక్-సుమంత్ కత్పలియా, 2024లో రూ.8.5 కోట్లు, 2023లో రూ.8.5 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 1,98,000.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్-వీ.వైద్యనాథన్, 2024లో రూ.5.3 కోట్లు, 2023లో రూ.4.45 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 30,59,514.యెస్ బ్యాంక్-ప్రశాంత్ కుమార్, 2024లో రూ.3.77 కోట్లు, 2023లో రూ.3.47 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 48,16,490.ఇదీ చదవండి: ఏ ధర ఫోన్లను ఎక్కువగా కొంటున్నారంటే..ప్రైవేట్ బ్యాంకుల మొదటి త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో చాలా బ్యాంకులు వార్షిక సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. అందులో సీఈఓల జీతాల పెంపునకు ఇన్వెస్టర్ల మద్దతు లభించింది. దాంతో వారి వేతనాలు పెరిగినట్లు రెగ్యులేటరీలకు రిపోర్ట్ చేశాయి. ఇదిలాఉండగా, త్రైమాసిక ఫలితాల్లో బ్యాంకులు పెద్దగా లాభాలను పోస్ట్ చేయలేదు. ఇటీవల ఆర్బీఐ మానిటరీ సమావేశంలోనూ రెపోరేటును స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ సెప్టెంబర్‌లో నిర్వహించే ఫెడ్ సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే దేశీయంగా ఆర్బీఐ కూడా వడ్డీరేట్లను తగ్గిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ అనుకున్న విధంగా జరిగితే బ్యాంకులకు సానుకూలంగా మారే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
వేతనాలు లేక.. పదోన్నతులు రాక
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థకు పట్టుకొమ్మలాంటి గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో)ను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి రెండేళ్లవుతోంది. నేటికీ సరిగ్గా వేతనాలు రాక, పీఎఫ్ నిబంధన అమలు కాక, పదోన్నతులకు అర్హత లేక, సీనియార్టీ కోల్పోయి సర్దుబాటు వీఆర్వోలు పడరాని పాట్లు పడుతున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం కొత్త రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టాన్ని అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తున్న నేపథ్యంలో తమ సమస్యలను కూడా పరిష్కరించాలని, వీలైనంత త్వరగా తమను రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని వీఆర్వో సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.రెండేళ్లుగా అవస్థలురాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం ద్వారా 5,400 మందికి పైగా వీఆర్వోలను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసే ప్రక్రియను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. కనీసం తమతో మాట్లాడకుండా, లాటరీ పద్ధతిలో ఇతర శాఖల్లోకి బదలాయించడం పట్ల అప్పట్లోనే వీఆర్వోలు, రెవెన్యూ సంఘాలు అభ్యంతరం తెలిపినా ఖాతరు చేయకుండానే ప్రక్రియ ముగించింది. అప్పటి నుంచీ ఇతర శాఖల్లో సర్దుబాటయిన వీఆర్వోలు పడరాని పాట్లు పడాల్సి వస్తోందని వీఆర్వోల సంఘాలు చెపుతున్నాయి. తమకు 010 పద్దు కింద వేతనాలు రావడం లేదని, జీపీఎఫ్, సీపీఎస్, టీఎస్జీఎల్ఐలు చెల్లించడం లేదని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసే ఐఆర్ పెంపుదల ఇవ్వలేదని, పాత డీఏలు, పీఆర్సీ బకాయిలు రావడం లేదని, కొన్ని సొసైటీలు, కార్పొరేషన్లలో మూడు నెలలకోసారి వేతనాలు ఇస్తున్నారని, గిరిజన సహకార కార్పొరేషన్లో పనిచేస్తున్న 16 మంది వీఆర్వోలకు గత 20 నెలలుగా వేతనాలు కూడా రావడం లేదని వాపోతున్నారు. ఇతర శాఖల్లో బలవంతంగా పంపిన తమకు అర్హతకు అనుగుణంగా ఉద్యోగాలు ఇవ్వలేదని, సీనియార్టీని కూడా కలపకపోవడంతో పదోన్నతులు కోల్పోయామని, స్టోర్ కీపర్లుగా, హాస్టల్ వర్కర్లుగా, తోటమాలీలుగా పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి సమస్యలను పరిష్కరిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత కూడా ఒకట్రెండు సార్లు దీనిపై సానుకూల ప్రకటనలు కూడా చేసింది. కానీ, ఇప్పటివరకు రెవెన్యూశాఖలోకి సదరు వీఆర్వోలను తీసుకురాలేదు. రెవెన్యూ మంత్రిని కలిసిన వీఆర్వో జేఏసీ కొత్త ఆర్వోఆర్ చట్టం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు గాను వీఆర్వో జేఏసీ ఇటీవల రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసింది. జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్, సెక్రటరీ జనరల్ హరాలే సుధాకర్‌రావు, నేతలు పల్లెపాటి నరేశ్, చింతల మురళి తదితరులు సచివాలయంలో రెవెన్యూ మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని వీఆర్వోలను మళ్లీ రెవెన్యూ శాఖలోకి తీసుకువచ్చి కొత్త ఆర్వోఆర్ చట్టం అమలును సులభతరం చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వీఆర్వో జేఏసీ నేతలు మంత్రి పొంగులేటిని కోరారు. జరిగిన అన్యాయాన్ని సరిదిద్దండి గత ప్రభుత్వ హయాంలో వీఆర్వోలకు పూర్తిగా అన్యాయం జరిగింది.. ఈ ప్రభుత్వమైనా మాకు న్యాయం చేయాలి. ఆప్షన్లు ఇచ్చి అందరినీ రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలి.’ –వింజమూరి ఈశ్వర్, తెలంగాణ రీడిప్లాయిడ్ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు -
జీతాలివ్వని ఐటీ కంపెనీ.. ఆందోళనకు దిగిన ఉద్యోగులు
సాక్షి,హైదరాబాద్: మరో సాఫ్ట్వేర్ సంస్థ ఉద్యోగులకు హ్యాండిచ్చింది. హైదరాబాద్ హైటెక్‌సిటీలోని ఆన్ పాసివ్ టెక్నాలజీస్ ఉద్యోగులు సోమవారం(జులై 22) ఆందోళనకు దిగారు. కంపెనీపై మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆరు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని కంపెనీలో పనిచేస్తున్న 200 మంది ఉద్యోగులు పోరుబాట పట్టారు. జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలో పనిచేసే ప్రతి ఉద్యోగికి పది సంవత్సరాల అనుభవం ఉంది. పే స్లిప్, పీఎఫ్ సరిగా లేకపోవడంతో వేరేచోట ఉద్యోగాలు ఇవ్వట్లేదని ఉద్యోగులు వాపోయారు. జీతాలడిగితే కంపెనీ యాజమాన్యం ఈరోజు రేపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. తమ జీతాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతాలు చెల్లిస్తే విధులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తమ డబ్బులు ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. -
350 మందికి రూ.1 కోటికి పైగా వేతనం ఇస్తున్న కంపెనీ
పురాతన సంస్థగా పేరున్న ఇండియా టొబాకో కంపెనీ లిమిటెడ్(ఐటీసీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 68 మంది ఉద్యోగులను కోటీశ్వరులుగా మార్చింది. తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం..ఏటా రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక వేతనం అందుకుంటున్న వారి సంఖ్య 350కు చేరింది. గతంలో ఇది 282గా ఉంది.కంపెనీ ప్రకటించిన లెక్కల ప్రకారం..కోటి రూపాయలు వేతనం తీసుకుంటున్న ఉద్యోగులకు నెలకు దాదాపు రూ.9 లక్షలు జీతం వస్తుంది. 2022-23 ఏడాదికిగాను రూ.1 కోటి వేతన బ్రాకెట్లోని ఉద్యోగుల సంఖ్య 282గా ఉంది. 2021-22 కంటే అదనంగా 62 మంది చేరారు. తాజాగా 68 మంది ఈ బ్రాకెట్లో చేరి మొత్తం 350 మంది రూ.1 కోటికిపైగా వేతనం అందుకుంటున్నారు.ఇదీ చదవండి: ‘థ్యాంక్యూ సర్’ అన్నందుకు విమానం నుంచి దించారు!ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరీ రూ.28.62 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. ఇది గతంలో కంటే 50 శాతం పెరిగింది. కీలక నిర్వహణ సిబ్బంది (కేఎంపీ) వేతనం 59 శాతం పెరిగినట్లు కంపెనీ చెప్పింది. ఏడాదిలో దీర్ఘకాలిక ప్రోత్సాహకాలను చెల్లించడం, మధ్యంతర కాలానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సంఖ్య పెరగడం కూడా దీనికి కారణమని పేర్కొంది. కేఎంపీ మినహా ఉద్యోగుల సగటు వేతనం 9 శాతం పెరిగినట్లు చెప్పింది. మార్చి 31, 2024 నాటికి ఐటీసీలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 24,567కు చేరింది. సిగరెట్లు, ఎఫ్ఎంసీజీ, హోటళ్లు, అగ్రి బిజినెస్, పేపర్‌బోర్డ్‌లు, పేపర్ అండ్ ప్యాకేజింగ్ వంటి అనేక రకాల వ్యాపారాలను కలిగి ఉన్న ఐటీసీ 2023-24లో రూ.76,840.49 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని ఆర్జించింది. -
విశాఖ విమల విద్యాలయం మూసివేత
ఉక్కునగరం/గాజువాక: స్టీల్‌ప్లాంట్ టౌన్షిప్లో గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఉచిత తెలుగు మీడియం పాఠశాల.. ‘విశాఖ విమల విద్యాలయం’ హఠాత్తుగా మూతపడింది. పాఠశాలలు తెరుచుకునే ముందు రోజు పాఠశాల యాజమాన్యం విద్యార్థులు, ఉపాధ్యాయులకు షాక్ ఇచ్చింది. దీంతో సుమారు రెండు వేల మంది విద్యార్థులతో పాటు 70 మంది బోధన, బోధనేతర సిబ్బంది రోడ్డున పడ్డారు. స్టీల్‌ప్లాంట్ టౌన్షిప్లో తెలుగు విద్యార్థులు, నిర్వాసిత ప్రజల పిల్లల సౌకర్యార్థం స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం అభ్యర్థన మేరకు విశాఖకు చెందిన ఆర్సీఎం డయాసిస్ మిషన్ సంస్థ ఈ విద్యాలయాన్ని నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి బిల్డింగ్‌తో పాటు విద్యుత్, మంచినీటి సరఫరా, ఫీజులు, సిబ్బంది జీతాలను ఉక్కు యాజమాన్యమే చెల్లిస్తోంది. ఇందులో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన నిర్వాసితులు, నిత్యం కూలి పనులు చేసుకునే వారి పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి ఐదేళ్లకు ఎంవోయూను రెన్యువల్ చేస్తారు. యాజమాన్యం ఏడాదికి సుమారు రూ.6 నుంచి 7 కోట్లు జీతాల రూపేణా చెల్లిస్తోంది. ఈ ఏడాది మే 31తో ఎంవోయూ గడువు ముగియనున్న నేపథ్యంలో గతేడాది అక్టోబర్ నుంచి మిషన్ ప్రతినిధులు ఎంవోయూ రెన్యువల్ కోసం అభ్యర్థన పంపారు. యాజమాన్యం ఎంవోయూ కొనసాగిస్తుందన్న ధీమాతో పాఠశాల యాజమాన్యం ఈ ఏడాది అడ్మిషన్లు పూర్తి చేయడంతో పాటు పుస్తకాలు, యూనిఫాంల అమ్మకాలు చేసింది. ఈ నెల 11న ఉక్కు యాజమాన్యం నుంచి పిడుగు లాంటి వార్త అందింది. పాఠశాల నిర్వహణకు బిల్డింగ్ ఇస్తామని సొంత ఫీజులతో పాఠశాల నిర్వహణకు సంబంధించి కొత్త ఎంవోయూ చేసుకుందామని తెలిపింది. దీంతో పాఠశాల యాజమాన్యం హడావుడిగా ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు 13 నుంచి పాఠశాలకు రావొద్దని సమాచారం ఇచ్చింది. ఈ విషయం తెలిసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకున్నారు. తమ పిల్లల భవిష్యత్తేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, పల్లా పెంటారావు తదితరులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నచ్చజెప్పారు.సొంతంగా నిర్వహించలేం గత 40 ఏళ్లుగా స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో పాఠశాల నడుస్తోంది. రెన్యువల్ కోసం అభ్యర్థించగా కొత్త ఎంవోయూకు సిద్ధమవమంటున్నారు. ఫీజులు వసూలు చేసుకుని జీతాలు చెల్లించుకోమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలతో సమానంగా చెల్లించే మాకు సొంత ఫీజులతో పాఠశాల నిర్వహించే పరిస్థితి లేదు. – ఫాదర్ రత్నకుమార్, కరస్పాండెంట్ ఆర్సీఎం మిషన్ సీఎండీ బంగ్లా ముట్టడిస్తాం స్టీల్‌ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితుల పిల్లల కోసం నిర్వహిస్తున్న పాఠశాలను మూసివేయడం అన్యాయం. పాఠశాలను వెంటనే తెరిపించకపోతే సీఎండీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. రెండు వేల మంది పిల్లల అంశంపై అడ్మిన్, సీఎండీ బంగ్లాను ముట్టడిస్తాం. – బి.గంగారావు, 78వ వార్డు కార్పొరేటర్ పాఠశాల తెరిపిస్తాం హఠాత్తుగా పాఠశాలను మూసివేస్తే ఉపా«ధ్యాయులు, విద్యార్థులు రోడ్డున పడాల్సి వస్తుంది. ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాల సహకారంతో ఉక్కు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తాం. పాఠశాలను తెరిపించే వరకూ వదిలే ప్రసక్తే లేదు. – పల్లా పెంటారావు, కార్మిక నాయకుడు మా పిల్లల పరిస్థితేంటి? కూలీ, నాలీ చేసుకుని బతుకులు సాగిస్తున్నాం. నా భర్త చనిపోతే నేను కూలి పనిచేసుకుంటూ నా కొడుకుని ఈ పాఠశాలలో చదివిస్తున్నాను. ఇప్పుడు పాఠశాల మూసేస్తామంటే ఎక్కడ చదవాలి? ఎవరు చేర్చుకుంటారు మాలాంటి పేదోళ్లను. – కృష్ణమ్మ, విద్యార్థి తల్లి మా చదువులు ఎలా? నేను పదో తరగతికి వచ్చాను. మేము చాలా పేదోళ్లం. మా తల్లిదండ్రులకు ప్రైవేటు పాఠశాలల్లో చదివించే స్తోమత లేదు. ఇప్పుడు మా పరిస్థితేంటి? మా చదువులు మధ్యలో ఆగిపోవాల్సిందేనా? – 10వ తరగతి విద్యార్థిని ఆందోళన వద్దు ఉక్కునగరంలోని విశాఖ విమల విద్యాలయం పునఃప్రారంభం విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని గాజువాక ఎంఈవోలు ఎం.సునీత, బి.విశ్వనాథం గురువారం ఓ ప్రకటనలో కోరారు. పాఠశాల మూసివేత వ్యవహారాన్ని జిల్లా విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లామని, విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా జిల్లా విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెడుతుందని పేర్కొన్నారు. -
జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ సిబ్బంది సమ్మెను విరమించిన రెండు వారాలలోపే మరో ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. విమానాల ఆలస్యం, రద్దు కారణంగా డిపార్చర్ల సంఖ్య తగ్గడం క్యాబిన్ సిబ్బంది జీతాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యూనియన్ పేర్కొంది.ఎయిర్పోర్ట్ ప్రవేశ పాస్‌లు లేకపోవడంతో 100 మందికి పైగా క్యాబిన్ సిబ్బంది గత రెండు నెలలుగా ఫ్లైయింగ్ డ్యూటీలు లేకుండా ఖాళీగా కూర్చున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ (AIXEU) పేర్కొంది. ఈ యూనియన్ ఎయిర్‌లైన్ క్యాబిన్ సిబ్బందిలోని ఒక విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తోంది.దేశ రాజధాని ఢిల్లీలో మే 9న చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) ఏర్పాటు చేసిన యూనియన్, విమానయాన సంస్థ ప్రతినిధుల సమావేశం తర్వాత క్యాబిన్ క్రూ సమ్మె విరమించింది. ఎయిన్లైన్ యాజమాన్య వైఖరికి నిరసనగా చేపట్టిన ఈ సమ్మె కారణంగా విమాన సర్వీసులకు అంతరాయాలు ఏర్పడ్డాయి.ఎయిర్‌లైన్ షెడ్యూలింగ్ విభాగం కొత్త సాఫ్ట్‌వేర్‌కు మారుతున్న క్రమంలో క్యాబిన్ సిబ్బంది డేటా తొలగిపోయిందని తాజాగా చీఫ్ లేబర్ కమిషనర్‌కు రాసిన లేఖలో యూనియన్ పేర్కొంది. విమానాల రద్దు, ఆలస్యాలను కవర్ చేయడానికి క్యాబిన్ సిబ్బంది బేస్ వారీగా షెడ్యూలింగ్ విభాగానికి మాన్యువల్‌గా సహాయం చేస్తున్నారని యూనియన్ చెబుతోంది.డిపార్చర్ల సంఖ్య తగ్గడం వల్ల క్యాబిన్ సిబ్బంది జీతాలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయని, ఈ విషయంలో కమిషనర్ తక్షణ జోక్యాన్ని యూనియన్ కోరుతోంది. క్యాబిన్ సిబ్బంది ఫ్లైయింగ్ హవర్స్‌తో జీతాలు కూడా ముడిపడి ఉంటాయి. అయితే ఈ అంశంపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక ప్రతినిధి నుంచి ఎటువంటి స్పందనా లేదు. -
స్రీల శ్రమకు అర్థం లేదా..!
మహిళలకు ఉపాధి దానివల్ల వారికి ఆర్థిక స్వావలంబన సమాజంలో లైంగిక వివక్షను చెరపగలదు. కాని స్త్రీ, పురుషులకు ఉపాధి కల్పించడంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. తమ జీతభత్యాల బేరసారాల్లో స్త్రీల గొంతు బలపడుతున్నా వారు పొందుతున్నది తక్కువే. ఇక పనిచోట వారి శ్రమదోపిడి తీవ్రం. తమిళనాడులో విస్తారంగా ఉన్న రెడిమేడ్ దుస్తుల రంగంలో స్త్రీల పని పరిస్థితులు ఒక నమూనా. శ్రమ తప్ప ఆదాయం లేని ఉపాధి స్త్రీలకు కొనసాగాల్సిందేనా? స్త్రీలు ఉపాధి పొందాలంటే అంత సులభమా? చెంగల్పట్టులో ఉన్న అనేక ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ మాన్యుఫ్యాక్చర్ కంపెనీల్లో ఆ చుట్టుపక్కల పల్లెల్లోని స్త్రీలు వేలాదిగా పని చేస్తారు. వారంతా ఉదయం నాలుగున్నరకే లేచి ఇంట్లో వంట చేసి పిల్లలకు క్యారేజీలు కట్టి తాము టిఫిన్, లంచ్ కట్టుకుని ఏడూ ఏడున్నరకంతా కంపెనీ బస్సు కోసం నిలుచోవాలి. 9 గంటలకు ఫ్యాక్టరీలో డ్యూటీ ఎక్కితే తిరిగి సాయంత్రం 6 గంటల వరకూ నిలుచునే పని చేయాలి. మళ్లీ బస్సెక్కి ఇల్లు చేరి రాత్రి వంటకు పూనుకోవాలి. ఇంతా చేసి వారికి నెలకు దక్కేది ఎంతో తెలుసా? 9,500 రూపాయలు. సీనియర్లకైతే 10,500 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ కటింగు, ఫ్యాక్టరీలో ఇచ్చిన టీ, బిస్కెట్ల కటింగు పోను వచ్చే జీతం ఇంతే. కాని వీరు తయారు చేసిన బట్టలు పోలో, ఇండియన్ టెరైన్ వంటి బ్రాండ్లుగా యూరప్, జపాన్, కెనడా, అమెరికాల్లో ఖరీదైన వెలకు అమ్ముడుపోతాయి. తమిళనాడులో గార్మెంట్ ఫ్యాక్టరీల్లో 5 లక్షల మంది స్త్రీలు పని చేస్తున్నారు. మొత్తం ఆ రాష్ట్రంలో 18 లక్షల మంది టైలరింగ్ ఉపాధిలో ఉంటే వారిలో 60 శాతం మంది మహిళలు. తమిళనాడులో వ్యవసాయం తగ్గాక రైతు కూలీలుగా పని చేసే స్త్రీలు ఫ్యాక్టరీల వైపు అడుగులు వేస్తున్నారు. కాని వారి శ్రమను దోచుకునే సమస్త ఏర్పాట్లు ఇదివరకే జరిగిపోయి ఉన్నాయి. అందుకే ఇటీవల చెన్నైలో ఈ ఫ్యాక్టరీలలో పనిచేసే స్త్రీలు నిరసన వ్యక్తం చేశారు. కోర్టులు కూడా వీరి జీతం పెంచమని చెప్పినా తమిళనాడులోని 500 మంది గార్మెంట్ ఫ్యాక్టరీల యజమానులు జీతాలు పెంచితే ఖర్చు పెరిగి ఆర్డర్లు తగ్గుతాయని, దుస్తుల కంపెనీలు ఆర్డర్లను శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలకు చీప్ కూలీల కోసం తరలిస్తాయని అభ్యంతరం చెబుతున్నారు. అయితే ఆ మాటలన్నీ సాకులే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొత్త జీతాలైనా ఎంతని? 15,000 మాత్రమే. ఆ 15 వేలు కూడా ఇవ్వం అంటున్నారు. స్త్రీలు ఉపాధి పొందితే ఆ ఆర్థిక స్వావలంబనతో వారిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు వారి అభిలాషల మేరకు నెరవేర్చుకోవచ్చు. భర్తమీద ఆధారపడవలసిన పని లేకుండా నిర్ణయాలు తీసుకోవచ్చు. కాని వారికి లభిస్తున్న ఉపాధి వారికి ఏ ఆదాయమూ మిగల్చనిది అయితే ఆ శ్రమకు అర్థం లేదు. జీతాలు ఎప్పుడూ పురుషుల కోసమే అనే మైండ్‌సెట్ సమాజంలో పోలేదు. స్త్రీల జీతం కోసం పెంపునకు యోగ్యమైనదే అని గ్రహించినప్పుడే పరిస్థితిలో కొద్దిగానైనా మార్పు వస్తుంది. ఇవి చదవండి: మీ అమ్మాయికి చెప్పండి! -
2024లో జీతం ఎంత పెరుగుతుందో తెలుసా..?
దేశంలో 2024లో వేతనాలు సగటున 9.5% పెరిగే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్ పీఎల్సీ ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా 45 రంగాలకు చెందిన 1,414 కంపెనీల డేటాను విశ్లేషించింది. కరోనా పరిణామాల అనంతరం 2022లో దేశీయంగా అధిక వేతన పెంపు లభించిందని, రానున్న రోజుల్లో గరిష్ఠ స్థాయిలో వేతనాలు పెంపు ఉంటోందని తెలిపింది. సంఘటిత రంగానికి అంచనా వేసిన ఈ వేతన పెంపు.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనుగుణంగా వ్యూహాత్మక సర్దుబాటును సూచిస్తోందని పేర్కొంది. ‘మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలు గణనీయ వృద్ధిని నమోదు చేస్తాయి. కొన్ని రంగాల్లో మరిన్ని పెట్టుబడులు అవసరమవుతాయి’ అని ఎయాన్ ఇండియాలో ట్యాలెంట్ సొల్యూషన్స్‌కు ముఖ్య కమర్షియల్ అధికారిగా ఉన్న రూపాంక్ చౌదరి తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. పటిష్ఠ ఆర్థిక వ్యవస్థగల దేశాల్లో, వేతన పెంపు అధికంగా ఉంటున్న దేశాల్లో భారత్ అగ్రగామిగా కొనసాగుతుందని సర్వే తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్, ఇండోనేషియా ఉన్నాయని పేర్కొంది. 2024లో ఈ రెండు దేశాల్లో సగటు వేతన పెంపు 7.3 శాతం, 6.5 శాతంగా ఉండనుందని పేర్కొంది. మనదేశంలో సిబ్బంది వలసల రేటు 2022లో 21.4% కాగా.. 2023లో 18.7 శాతానికి పరిమితమైందని సర్వే తెలిపింది. ఇదీ చదవండి: సౌరగాలి ప్రభావాన్ని గుర్తించిన ‘పాపా’ ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువగానే ఉందని పేర్కొంది. రంగాలవారీగా చూస్తే.. ఆర్థిక సేవల సంస్థలు, ఇంజినీరింగ్, వాహన, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అత్యధిక వేతన పెంపు ఉండే అవకాశం ఉంది. రిటైల్, టెక్నాలజీ కన్సల్టింగ్, సేవల రంగాల్లో తక్కువ వేతన పెంపు ఉండొచ్చని సర్వే ద్వారా తెలిసింది. -
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త!
న్యూ ఇయర్‌కి ముందే ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జీతాల పెంపుపై ఐదు నెలలుగా వాయిదా వేస్తూ వచ్చిన ఇన్ఫోసిస్ తాజాగా జీతాల పెంపుపై స్పష్టత ఇచ్చింది. త్వరలో శాలరీలను హైక్ చేస్తున్నట్లు తెలిపింది. పెరిగిన జీతాలు నవంబర్ 1 నుంచి అమలు అవుతాయని వెల్లడించింది. అయితే శాలరీ పెంపు ఉద్యోగులందరికి వర్తించదని స్పష్టం చేసింది. 2021 అక్టోబర్ తర్వాత జూనియర్ స్థాయిలో సంస్థలో చేరిన ఉద్యోగులకు, అదేవిధంగా 2021 అక్టోబర్ తర్వాత చేరిన మేనేజర్ స్థాయి సిబ్బందికి శాలరీ పెంపు జాబితాలో చోటు దక్కలేదు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 60 శాతం మంది ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉండగా.. ఈ పెంపు 7 శాతం నుంచి 10 మధ్యలో ఉంటుందని సమాచారం. మిగిలిన ఐటీ కంపెనీల పరిస్థితి ఇది సాధారణంగా, ఐటి కంపెనీలు ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై) వేతనాల్ని పెంచుతాయి. ఏప్రిల్ 1 నుండి పెరిగిన శాలరీ అమల్లోకి వస్తుంది. అయితే, ఈ ఏడాది దాదాపు అన్ని ఐటీ కంపెనీలు ఆ సమయంలో వేతనాల పెంపును వాయిదా వేశాయి. విప్రో మరో టెక్ కంపెనీ విప్రో ఉద్యోగుల జీతాల్ని పెంచుతుండగా.. వారిలో ఇప్పటికే ఎక్కువ జీతాలు తీసుకుంటున్న వారికి కాకుండా.. పనితీరు బాగుండి, తక్కువ వేతనం తీసుకుంటున్న సిబ్బంది జీతాలు పెంపు ఉంటుందంటూ నివేదికలు హైలెట్ చేశాయి. హెచ్‌సీఎల్ జీతాల పెంపు విషయంలో రెండు సార్లు వాయిదా వేసిన హెచ్‌సీఎల్ ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరంలో సీనియర్ ఉద్యోగులకు శాలరీ హైకుల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యాక్సెంచర్ సైతం అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం యాక్సెంచర్ కూడా ఈ ఏడాది భారత్, శ్రీలంకలోని తమ ఉద్యోగులందరికి శాలరీ పెంపు ఉండదని కేవలం కీలక విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఉంటుందని, స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆర్ధిక మాద్యం భయాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఫలితంగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ప్రమోషన్లు, రివార్డుల విషయంలో సంస్థ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. -
ఆ సీఈవో వేతనం రోజూ రూ.5 కోట్లు..!
కార్పొరేట్ సంస్థల్లో చిన్న ఉద్యోగి నుంచి మొదలుకుని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వరకు అందరూ కీలకమే. కానీ వారి బాధ్యతలను అనుసరించి వారికి చెల్లించే వేతనాల్లో తేడా ఉంటుంది. ప్రతి కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (సీఈఓ)ల అత్యంత కీలకం.. కంపెనీ అభివృద్ధి సాధించే వ్యూహ రచనలోనూ, ఆదాయం పెంపులోనూ, సిబ్బంది పనితీరు మెరుగు పర్చడంతోపాటు సాధక బాధకాలు తీర్చడంలోనూ సీఈఓలే కీలకం. ఇక ఐటీ, టెక్ సంస్థల సీఈఓలైతే వేరే చెప్పనక్కర్లేదు. సంస్థ పురోగతి సాధించడంలో ఎంతో ముఖ్య భూమిక పోషించే వారి వేతనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అమెరికాలో 2023 సంవత్సరానికిగాను అత్యధిక వేతనాలు అందుకున్న సీఈఓల్లో సుందర్ పిచాయ్, బ్యారీ మైక్ కార్తీ, టిమ్ కుక్ తదితరులు ఉన్నారు. గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ సుందర్ పిచాయ్ వేతనం అక్షరాల 226 మిలియన్ డాలర్లు(రూ.1800 కోట్లు). దాంతో ఆయన రోజూ రూ.5 కోట్లు వేతనం పొందుతున్నారు. అమెరికాలోని కార్పొరేట్ సంస్థల సీఈఓల వేతనంతో పోలిస్తే సుందర్ పిచాయ్ వేతనం అత్యధికం. అతిపెద్ద కార్ల రెంటల్ కంపెనీల్లో హెర్ట్జ్ ఒకటి. దాని సీఈఓ స్టీఫెన్ స్కెర్ వేతనం 182 మిలియన్ డాలర్లు(రూ.1500 కోట్లు). అమెరికన్ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ కంపెనీ పెలోటాన్ ఇంటర్ యాక్టివ్ సంస్థ సీఈఓగా బ్యారీ మైక్ కార్తీ ఉన్నారు. ఆయన వార్షిక వేతనం 168 మిలియన్ డాలర్లు(రూ.1400 కోట్లు). ఇదీ చదవండి: ‘ఎవరు చనిపోయినా అవి మాత్రం ఆగవు’ అమెరికాలో లైవ్ నేషన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సీఈఓగా మిచెల్ రాపినో పని చేస్తున్నారు. ఆయన వార్షిక వేతనం 139 మిలియన్ డాలర్లు(రూ.1100 కోట్లు). గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పినారెస్ట్ ఒకటి. దీనికి విలియం రెడీ సీఈఓగా పని చేస్తున్నారు. ఆయన వార్షిక వేతనం 123 మిలియన్ డాలర్లు(రూ.1000 కోట్లు). ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టెక్ దిగ్గజం ఆపిల్. దీనికి సీఈఓగా పని చేస్తున్న టిమ్ కుక్ వార్షిక వేతనం 99 మిలియన్ డాలర్లు(రూ.825 కోట్లు). -
IT Jobs: కంపెనీ మారుతున్నారా? హైక్ ఎంతంటే..
చదువు అయిపోయిన వెంటనే జీవితంలో తొందరగా స్థిరపడాలంటే ఐటీ ఉద్యోగమే భేష్ అనే ధోరణి చాలామందిలో ఉంది. కొవిడ్ వల్ల ఐటీ నిపుణులకు ఒక్కసారిగా పెరిగిన గిరాకీ, వారికి లభిస్తున్న అధిక వేతనాలు ఎంతోమందికి కలల ప్రపంచాన్ని చూపించాయి. తర్వాత కొత్త ప్రాజెక్టులు తగ్గడం, ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిణామాల వల్ల ద్రవ్యోల్బణం బాగా పెరిగి, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు ‘ఐటీ రంగం’పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్త భయాలు మరింత ఎక్కువయ్యాయి. ఫలితంగా ఉద్యోగాల మార్కెట్లో నియామకాల వార్తల కన్నా తొలగింపులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు మొదలు అంకురాల వరకూ వ్యయ నియంత్రణ పేరిట అధిక వేతనాలు తీసుకుంటున్న నిపుణులను తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ నిపుణులు ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు. అందులో భాగంగా ఇతర కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. కానీ ఐటీ రంగం అంతటా కాస్ట్‌కటింగ్ సమస్యే ఉంది. దాంతో కొత్తగా చేర్చుకునే వారికి మునుపటిలా భారీగా జీతాలు పెంచి ఉద్యోగాల్లో నియమించుకునే పరిస్థితి లేదు. కంపెనీ మారాలనుకునే వారి పాత జీతంపై కేవలం 18-22శాతం పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఐటీ ఉద్యోగాలు మారాలనుకునే వారికి జీతాల పెంపు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు సగానికి పడిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. మునుపటి కంపెనీలోని జీతంతో పోలిస్తే కేవలం 18-22% పెంపుతో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు. అయితే గతంలో అభ్యర్థులు కనిష్ఠంగా 40%, గరిష్ఠంగా 100-120% వరకు వేతనం పెంచాలనే డిమాండ్ చేసేవారని నివేదిక తెలిపింది. కానీ ప్రస్తుతం ఉద్యోగస్థాయిని ఆ డిమాండ్ 35-40 శాతం వరకు పడిపోయినట్లు సమాచారం. ఉదాహరణకు 2022లో ఫుల్‌స్టాక్ ఇంజినీర్లకు ఏటా రూ.15లక్షలు-రూ.32 లక్షలు వేతనం ఉండేది. ఈ సంవత్సరం సగటున 8%-16% తగ్గించి ఏటా రూ.12లక్షలు-రూ.28 లక్షలు ఆఫర్ చేస్తున్నారు. -
వేతనాల్లో ఇంత తేడానా? పదేళ్లలో పెరిగిన సీఈఓ, ఫ్రెషర్స్ శాలరీ రిపోర్ట్
భారతదేశం ఇతర దేశాలతో పోటీపడాలన్నా, ప్రగతి సాధించాలన్నా.. యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మాటలతో కొందరు ఏకీభవించగా, మరికొందరు వ్యతిరేకించారు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఐఏఎస్ 'అశోక్ ఖేమ్కా' (Ashok Khemka) తాజాగా ఒక ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అశోక్ ఖేమ్కా ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసిన పోస్ట్‌లో ఐటీ కంపెనీలలో పనిచేసే ఫ్రెషర్స్, సీఈఓల శాలరీలలో వ్యత్యాసం చూడవచ్చు. దీని ప్రకారం.. 2012లో రూ. 2.75 లక్షల వేతనం పొందే ఇన్ఫోసిస్ ఫ్రెషర్ శాలరీ 2022 నాటికి రూ. 3.6 లక్షలకు చేరింది. దీన్ని బట్టి చూస్తే 10 సంవత్సరాల్లో ఒక ఫ్రెషర్ జీతం కేవలం రూ. 85,000 మాత్రమే పెరిగింది. అయితే 2012లో రూ. 80 లక్షల వేతనం తీసుకునే సీఈఓ శాలరీ 2022 నాటికి రూ. 79.75 కోట్లకు చేరింది. దశాబ్ద కాలంలో పెరిగిన ఫ్రెషర్ వేతనం, సీఈఓ వేతనాల వ్యత్యాసం ఏ స్థాయిలో ఉందో ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, L & K ఇన్ఫోటెక్, హెచ్‌సీఎల్, మీడియన్ (Median) సంస్థల్లో కూడా ఇదే విధానం కొనసాగుతోంది. సీఈఓల జీతాలు భారీగా పెరుగుతున్నాయి, ఫ్రెషర్ల వేతనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇదీ చదవండి: రూ.76 లక్షల రేంజ్ రోవర్ కేవలం రూ.100కే..! ఎగబడుతున్న జనం.. అశోక్ ఖేమ్కా ఈ పోస్ట్ షేర్ చేస్తూ.. ఇన్ఫోసిస్ సీఈఓ వేతనం ఫ్రెషర్ వేతనానికి 2,200 రెట్లు ఎక్కువ. సీఈఓ, ఫ్రెషర్ వరుసగా వారానికి ఎన్ని గంటలు పని చేస్తారు? వారానికి 168 గంటలు మాత్రమే ఉంటాయని అని వెల్లడించాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. Infosys CEO's pay 2,200 times a fresher's pay. How many hours of work a week does the CEO and a fresher put in respectively? There are only 168 hours in a week. pic.twitter.com/DP1C4ODkAt — Ashok Khemka (@AshokKhemka_IAS) October 29, 2023 -
TCS Recruitment Scam: కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలపై టీసీఎస్ కీలక నిర్ణయం!
దేశంలో అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ టీసీఎస్ (TCS)లో ఉద్యోగాలకు లంచాల కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వేతనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం సిబ్బంది సంస్థలకు చేసే చెల్లింపుల్లో మార్పులు చేసింది. ఇలా చేయడం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. వచ్చే జనవరి నుంచే.. బిజినెస్ వార్తా సంస్థ ‘మింట్’ నివేదిక ప్రకారం.. టీసీఎస్ సవరించిన చెల్లింపు విధానం వచ్చే జనవరి నుంచి అమలులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న వెండర్ (సిబ్బంది సంస్థ) ఒప్పందాలు ఈ ఏడాది డిసెంబర్ వరకూ అమలులో ఉంటాయి. కొత్త ఒప్పందాలు 2024 జనవరి నుంచి వర్తిస్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు, వెండర్ ఖర్చులు, బీమా వంటివన్నీ కంపెనీ చెల్లింపుల్లోనే కలిసి ఉంటాయి. పారదర్శకతను పెంపొందించే ఉద్దేశంతో ఈ ధరల సర్దుబాటు చేసినట్లుగా తెలుస్తోంది. మంచి అర్హత కలిగిన అభ్యర్థులకు కంపెనీని చేరువ చేయడం ద్వారా అటు సిబ్బంది సంస్థలు, ఇటు టీసీఎస్.. రెండింటికీ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. రేట్ కార్డులలో చేస్తున్న మార్పు కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. శాశ్వత ఉద్యోగుల విషయంలో ఎటువంటి మార్పు లేదు. టీసీఎస్ ఉద్యోగుల్లో ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండటం గమనార్హం. లంచాల స్కామ్ ఎఫెక్ట్ టీసీఎస్ నియామక ప్రక్రియలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ధరల విధానాలలో ఈ సర్దుబాటు చేసింది. కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు గానూ నియామక సంస్థల నుంచి కొందరు ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్లు వెలుగులోకి రావడంతో గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో టీసీఎస్ విచారణ చేపట్టింది. ఫలితంగా కంపెనీ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ మాజీ హెడ్ ఈఎస్ చక్రవర్తితోపాటు ఇందులో ప్రమేయం ఉన్న మరో ఎనిమిది మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. అలాగే ఆరు సిబ్బంది సంస్థలను బ్లాక్ లిస్ట్ చేసింది. -
నిఫ్టీ50 కంపెనీల్లో మహిళా ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా..
భారతీయ కంపెనీల్లోని మహిళా ఉద్యోగుల జీతాలు సగటున పురుష ఉద్యోగుల జీతాల కంటే దాదాపు పదో వంతు తక్కువగా ఉన్నాయని కొన్ని కథనాలు ప్రకారం తెలుస్తుంది. నిఫ్టీ50 కంపెనీల్లోని స్త్రీ, పురుష ఉద్యోగుల జీతాలను విశ్లేషించి కొంత డేటాను సేకరించారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. నిఫ్టీ50లోని 31 కంపెనీల్లో మహిళల జీతాల కంటే పురుషుల జీతాలు ఎక్కువగా ఉన్నాయి. సగటు స్త్రీల జీతాలు పురుషుల జీతాల కంటే 9.2% తక్కువగా ఉన్నాయి. ఇది సుమారు సంవత్సరానికి రూ.1.2 లక్షల వేతన వ్యత్యాసానికి సమానం. పురుషుల జీతాలు దాదాపు ఏటా రూ.12.9 లక్షలు అయితే మహిళా ఉద్యోగుల జీతాలు రూ.11.7 లక్షలుగా ఉన్నాయి. టాప్ మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉంది. అధిక కుటుంబ బాధ్యతలు, కెరీర్ బ్రేక్‌లు, కెరీర్ స్విచ్‌లు వంటి అంశాలు ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ మైండ్‌ట్రీ కంపెనీల్లో పురుషుల జీతాలు 30-46% ఎక్కువగా ఉన్నాయి. టాటా కన్జ్యూమర్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా వంటి కంపెనీల్లో మహిళల వేతనాలు 20-73% ఎక్కువగా ఉన్నాయని డేటా తెలుపుతుంది. -
కొలువుల కాలం
భారీ వేతనాలు... సర్వే సంస్థలకు అభ్యర్థులు, పార్టీలు ఇచ్చే మొత్తాన్ని బట్టి ఉద్యోగుల వేతనాలుంటాయి. పలు సర్వే సంస్థల నుంచి అందిన సమాచారం ప్రకారం ఒక్కో ఉద్యోగికి రోజుకు రూ. 3 నుంచి 5 వేల వరకూ చెల్లిస్తున్నారు. కొన్ని సర్వే సంస్థలు స్మార్ట్ సర్వేలూ చేస్తున్నాయి. అభ్యర్థి నియోజకవర్గంలో ఉండే ఓటర్ల సోషల్ మీడియా ఫాలో అప్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సామాజిక మాథ్యమాల్లో అతను చేసే పోస్టింగులను విశ్లేషించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్లను సర్వే సంస్థలు దిగుమతి చేసుకున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్‌లో అనుభవం ఉన్న యువతను ఈ విభాగాల్లో నియమిస్తున్నారు. వీరికి ఎన్నికల సీజన్ వరకూ ఏకమొత్తంగా వేతనాలుంటాయని సర్వే సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌ను డేటా ఎనాలసిస్‌లో అతి తక్కువ సమయంలో పూర్తి చేయగల నైపుణ్యం ఉన్న యువతకూ మంచి గుర్తింపు ఇస్తున్నారు. భారీగానే డబ్బు ఇస్తుండడంతో సర్వేలు చేయడానికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అన్ని రకాల సర్వేలు చేయడానికి కూడా యువత ఆసక్తి చూపుతున్నారు. లింక్డ్ ఇన్... నౌకరీ డాట్ కామ్.. వంటి జాబ్ పోర్టల్స్‌లో మల్టీ నేషనల్ కంపెనీల ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న యూత్‌కు ఎన్నికల సీజన్ వరంలా మారింది. రాష్ట్రంలో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా, మరొకొద్ది నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు.. వరుసగా ఉండటంతో బంపర్ ఆఫర్లు వస్తున్నాయి. ఉద్యోగం తాత్కాలికమే అయినా మంచి వేతనం అంతకు మించిన అనుభవం లభించే వీలుంది. ఎలక్షన్ సర్వేల కోసం ఆయా సంస్థలు యువతీ యువకులను ఏరి కోరి ఎంపిక చేసుకుంటున్నాయి. ఆరు నెలల నుంచి ఈ తరహా ఉపాధి అవకాశాలు జోరందుకున్నాయి. చిన్నా చితకా కలిపి రాష్ట్రంలో వందకు పైగా సర్వే సంస్థలు ప్రస్తుతం ఎన్నికల సర్వేల్లో నిమగ్నమయ్యాయి. ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో ఈ స్పీడ్ మరికొంచెం పెరిగింది. జనం నాడి తెలుసుకునేందుకు, ప్రజల మూడ్‌ను పట్టుకునేందుకు సర్వేక్షణం తోడ్పడుతుందని అన్ని పార్టీలూ, నేతలు నమ్ముతున్నారు. బహుళ జాతి కంపెనీలు ఆర్థిక అనిశి్చతితో కొట్టు మిట్టాడుతున్న తరుణంలో జాబ్ మార్కెట్‌కు ఎలక్షన్ సీజన్ కొంత ఆక్సిజన్ ఇచ్చిందని యువత అభిప్రాయపడుతున్నారు. పుష్కలంగా అనుభవం... రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో సర్వే చేయడానికి కనీసం వెయ్యి మంది అవసరం అని సర్వే సంస్థలు చెబుతున్నాయి. పొలిటికల్ సైన్స్ నేపథ్యం ఉన్న పోస్టు–గ్రాడ్యుయేట్ అభ్యర్థులను నేరుగా ప్రజా క్షేత్రంలోకి పంపుతారు. ప్రజల రాజకీయ అభిప్రాయం, అభ్యర్థి నుంచి ప్రజలు ఏం కోరుతున్నారో ఈ బృందం సేకరిస్తుంది. ఆపై డేటా ఎనలిస్టులు కీలక పాత్ర పోషిస్తారు. టెక్నాలజీ నేపథ్యం ఉన్న యువతను ఈ కేటగిరీలో నియమిస్తున్నారు. వివిధ కేటగిరీల నుంచి వచ్చే పలు రకాల డేటాను అప్లోడ్ చేయడం, అవసరమైన ఫార్మాట్లోకి దీన్ని తేవడం వారి బాధ్యత. ఆ తర్వాత కేటగిరీలో ఎనలిస్టులుంటారు. ఆన్లైన్ నుంచి అందే డేటాను క్రోడీకరించి, ఇందులో అంశాల ద్వారా విశ్లేషణ చేయడం, కచ్చితమైన ప్రజాభిప్రాయ సేకరణ చేయడం వారి విధి. అభ్యర్థి వ్యక్తిగతంగానే కాదు... పార్టీలూ ఈ సర్వే సంస్థలకు ఆహ్వానం పలుకుతున్నాయి. దీంతో ఎన్నికల సీజన్లో కనీసం ఆరు నెలలు సర్వే సంస్థలకు పెద్ద ఎత్తున మానవ వనరులు అవసరం ఉంటుంది. ఇవి తమ వృత్తికి పదును పెట్టే అనుభవంగా కూడా యువత భావిస్తున్నారు. విశ్లేషణలో మానవ వనరులే కీలకం ప్రజల నాడి తెలుసుకునేందుకు రాజకీయ నేతలు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్నికల రణరంగంలో ఈ సర్వేలే కీలకమని భావిస్తున్నారు. వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేయాలంటే వేల సంఖ్యలో వివిధ రకాల విద్యావంతులు అవసరం. తాత్కాలిక ఉపాధే అయినా, వారికి మెరుగైన అనుభవం వస్తోంది. ఈ ఎన్నికల సీజన్లో దాదాపు లక్షకు పైగానే యువత ఎన్నికల సర్వేలో నిమగ్నమైనట్టు అంచనా. –దేశినేని రాజ్‌కుమార్ (హెచ్ఎంఆర్ రీసెర్చ్) మంచి ఉపాధి సర్వే సంస్థలో పనిచేసేందుకు ఉత్సాహం చూపే యువతను గుర్తించి నెల రోజులు సాంకేతికంగా, ఫీల్డ్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. స్కిల్ వెలుగులోకి రావడానికి ఇది తోడ్పడుతుంది. ఈ తక్కువ సమయంలో లభించే వేతనం పోటీ పరీక్షలు, కొన్ని రోజులు ఆర్థికంగా నిలదొక్కు కునేందుకు ఉపయోగపడుతోంది. – శైలజ (సర్వే సంస్థలో ఉద్యోగి) మంచి అనుభవం ప్రజాక్షేత్రంలో ఎన్నికల సర్వే చేపట్టడం ఓ మంచి అనుభవం. ఈ సమయంలో వేతనంతో పాటు ఫీల్డ్‌కు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా టీఏ, డీఏ ఉంటాయి. ఉపాధి పరంగానూ మంచి అవకాశమే. యువత సర్వే చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రజలు కోరుకునేదేంటో నేతల దృష్టికి తీసుకెళ్తున్న తృప్తి ఉంటోంది. – లక్ష్మాగౌడ్ (ఎన్నికల సర్వేలో ఫీల్డ్ సిబ్బంది) -
Fact Check: చిరుద్యోగులపై దొంగ ఏడుపులు
చిరుద్యోగులకు గత సర్కారు హయాంలో జీతాల వ్యయం రూ.1,100 కోట్లు! మరిప్పుడు వారి జీతాల కోసం చెల్లిస్తున్న మొత్తం ఏకంగా రూ.3,300 కోట్లు!! ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చిరుద్యోగుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ అంగన్వాడీల నుంచి 108 డ్రైవర్ల దాకా పలు వర్గాల జీతాలను పెద్ద ఎత్తున పెంచింది. జీతాల ఖర్చు మూడు రెట్లు పెరగడం కళ్లెదుటే కనిపిస్తున్నా చిరుద్యోగులకు దగా చేస్తున్నారంటూ కడుపు నొప్పితో కళ్లనీళ్లు పెట్టుకునే వారిని ఏమనాలి? మరిలాంటి దుష్ప్రచారం ఈనాడులో చేస్తున్నారు కాబట్టి రామోజీనే అనుకోవాలేమో!! జీతాలు పెంచాలని చిరుద్యోగులు గత ప్రభుత్వ హయాంలో గగ్గోలు పెట్టిన విషయం ఆయనకు గుర్తున్నా తెలియనట్లే నటిస్తున్నారు!!– సాక్షి, అమరావతి పారదర్శకంగా నియామకాలు, చెల్లింపులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు, జీతాల చెల్లింపుల్లో పూర్తి పారదర్శకతను తీసుకొస్తూ దళారీ వ్యవస్థ నిర్మూలనకు ఆప్కాస్ కార్పొరేషన్‌ను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రారంభించింది. లంచాల ప్రసక్తే లేకుండా శాశ్వత ఉద్యోగుల కంటే ముందే ఠంచనుగా ప్రతి నెలా ఒకటో తేదీనే వారికి జీతాలిచ్చే పద్ధతిని తెచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్‌ను వర్తింప చేసింది. దీనికి అనుగుణంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను కూడా పెంచారు. వీరికి గరిష్టంగా రూ.28 వేల వరకూ చెల్లిస్తున్నారు. మరి టీడీపీ సర్కారు ఇలాంటి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి చిరుద్యోగులను ఎందుకు ఆదుకోలేదు? వారి పోస్టులకు తగ్గట్టుగా పూర్తి జీతాలను ఎందుకు ఇవ్వలేదు? ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పొట్టగొట్టి ఏజెన్సీ కమీషన్ల పేరుతో జీతాలను గుంజుకుంటే ఈనాడుకు కనపడలేదా? మనసున్న ప్రభుత్వం ఎవరిది? నాలుగున్నరేళ్ల పాటు చిరుద్యోగుల జీతాలను పెంచాలనే ఆలోచన కూడా చేయని చంద్రబాబు సర్కారు గత ఎన్నికలకు ఆర్నెల్ల ముందు అరకొరగా పెంచిన జీతాలను కొందరికి మాత్రమే అమలు చేసింది. మరి కొందరికి పెంపు కాగితాలపైనే పరిమితమైంది. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలను మరింత పెంచి మొదటి రోజు నుంచే అమలు చేసింది. అంగన్వాడీలు, ఆశావర్కర్లు, వీఏవోలు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, శానిటేషన్ వర్కర్లు, గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, హోంగార్డులు, మధ్యాహ్న భోజన పథకం ఆయాలు లాంటి చిరుద్యోగుల విషయంలో సీఎం జగన్ మనసు పెట్టి జీతాలు పెంచారు. గత సర్కారు హయాంలో రూ.1,100 కోట్లు మాత్రమే ఉన్న వారి జీతాల వ్యయం ఇప్పుడు ఏకంగా రూ.3,300 కోట్లకు పెరగడమే అందుకు తిరుగులేని నిదర్శనం. ఉదారంగా అర్హతల సడలింపు ప్రభుత్వ పథకాల అమలులో అర్హతలను సడలిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వక్రీకరిస్తూ ఈనాడు దుష్ప్రచారం చేస్తోంది. పథకాలను మరింత మందికి అందజేయాలనే ఉద్దేశంతో ఆదాయం, భూమి, కరెంటు వినియోగం తదితర అంశాలలో ఉదారంగా వ్యవహరిస్తూ లబ్ధిదారులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. గత ప్రభుత్వంలో పథకాలను పొందేందుకు గ్రామాల్లో నెలకు కనీస ఆదాయ పరిమితి రూ.5 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6 వేలుగా ఉండేది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలను నెలవారీ ఆదాయ పరిమితిగా నిర్ణయించి ప్రభుత్వం మరింత మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చింది. కరెంట్ వినియోగంపై గతంలో 200 యూనిట్ల పరిమితి విధించగా ఇప్పుడు 300 యూనిట్లకు పెంచారు. వివాహాల అనంతరం వేరుగా ఉంటున్న వారిని విడి కుటుంబాలుగా పరిగణిస్తున్నారు. ఆ మేరకు వారికి విడిగా రేషన్ కార్డులను జారీ చేస్తూ వివిధ పథకాలకు అర్హత కల్పిస్తున్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో వేల సంఖ్యలో అందిన ఇలాంటి దరఖాస్తులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించింది. చిరుద్యోగులకు సీఎం జగన్వేతనాలను పెంచారిలా.. ♦ అంగన్వాడీ వర్కర్ల జీతాలు 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు వరకూ రూ.7వేలు ఉంటే ఇప్పుడు రూ.11,500కు పెంచారు. హెల్పర్ల జీతాలు రూ.4 వేల నుంచి రూ.7 వేలకు పెరిగాయి. ♦ గ్రామ సంఘాల సహాయకులు, యానిమేటర్స్ జీతాలను రూ.2 వేల నుంచి ఏకంగా రూ.10 వేలకు పెంచారు. ♦ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు తీసుకుని వెళ్లారు. ♦ ఆశావర్కర్ల జీతాలను రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ♦ గిరిజన సంక్షేమశాఖ కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జీతాలను రూ.400 నుంచి ఏకంగా రూ.4 వేలకు పెంచి అండగా నిలిచారు. ♦ పోలీస్ శాఖలో పనిచేసే హోంగార్డుల జీతాలను రూ.18 వేల నుంచి రూ.21,300కు పెంచారు. ♦ పాఠశాల విద్యాశాఖలో కుక్ కం హెల్పర్లకు చెల్లించే రూ.వెయ్యి గౌరవ వేతనాన్ని రూ.3 వేలకు పెంచారు. ♦ 108 డ్రైవర్ల జీతాలను రూ.13 వేల నుంచి రూ.28 వేలకు పెంచారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల జీతాలను రూ.17,500 నుంచి రూ.20 వేలకు తీసుకుని వెళ్లారు. ♦ 104 డ్రైవర్ల జీతాలను రూ.26 వేలకు పెంచారు. ♦ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.8 వేల నుంచి రూ.16 వేలకు పెంచారు. -
ముకేశ్ అంబానీ బాటలోనే..
న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ బాటలోనే ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తె జీతాలు తీసుకోకుండా బాధ్యతలు నిర్వహించనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు, కమిటీ సమావేశాలలో పాలుపంచుకుంటున్నందుకు ఆకాశ్, ఈషా, అనంత్ ఫీజులు మాత్రమే పొందనున్నారు. అంతేకాకుండా నికర లాభాల నుంచి కమీషన్ అందుకోను న్నారు.ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వాటాదారుల అనుమతి కోరుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఈ అంశాలను వెల్లడించింది. 66ఏళ్ల అంబానీ 2020–21 ఏడాది నుంచి ఎలాంటి జీతాన్ని అందుకోవడంలేదు. అయితే అంబానీ బంధువులు నిఖిల్, హిటల్ వేతనాలతోపాటు.. ఇతర అలవెన్సులు తదితరాలను పొందుతున్నారు. (వాహన స్క్రాపేజీ పాలసీ: కంపెనీలకు నితిన్ గడ్కరీ కీలక సూచనలు) నీతా అంబానీ తరహాలో 2014లో ముకేశ్ భార్య నీతా అంబానీ ఎంపిక తరహాలోనే కవలలు 31ఏళ్ల ఆకాశ్, ఈషా సహా 28ఏళ్ల అనంత్‌ను ఆర్ఐఎల్ బోర్డులో నియమించనున్నారు. 2022–23లో నీతా అంబానీ రూ. 6 లక్షల సిటింగ్ ఫీజు, రూ. 2 కోట్ల కమీషన్ అందుకున్నట్లు ఆర్ఐఎల్ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. గత నెలలో నిర్వహించిన కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్ఐఎల్ బోర్డులోకి ముగ్గురునీ ఎంపిక చేశారు. అయితే ముకేశ్ ఆర్ఐఎల్ చైర్మన్, సీఈవోగా మరో ఐదేళ్లు బాధ్యతలు నిర్వహించనున్నారు. తద్వారా తదుపరితరం నాయకులకు మార్గదర్శకత్వం వహించనున్నారు. కాగా.. ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వీలుగా ఆర్ఐఎల్ పోస్టల్ బ్యాలట్ ద్వారా వాటాదారుల అనుమతి కోరుతోంది. (సీఈవో సంచలన వ్యాఖ్యలు: ఉద్యోగుల నెత్తిన పిడుగు) -
చందమామ రావే! జాబిల్లి రావే! మాకు జీతాలిప్పించి పోవే!!
చందమామ రావే! జాబిల్లి రావే! మాకు జీతాలిప్పించి పోవే!! -
పెళ్లి కార్డులో పేర్ల పక్కన ఐఐటీ.. జీతాలు చెప్పాలంటున్న నెటిజన్లు!
వివాహ సమయంలో డిజైనర్ ఇన్విటేషన్ కార్డ్‌లు చర్చనీయాంశంగా మారుతుంటాయి. కొన్ని పెళ్లి కార్డులలో లగ్జరీ చాక్లెట్లు ఉంటుండగా, మరికొన్ని పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకునేలా బయోడిగ్రేడబుల్ కార్డ్‌లు రూపొందుతాయి. ఇటీవల ఒక వివాహ ఆహ్వాన కార్డ్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇది వధూవరుల చదువులను హైలెట్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఆహ్వానపత్రంలో వరుడి పేరు పక్కన ఐఐటి బాంబే అని, వధువు పేరు పక్కన ఐఐటి ఢిల్లీ అని ఉంది. ఈ పెళ్లి ఆహ్వాన పత్రికను ఎక్స్‌లో షేర్ చేసిన మహేష్.. ‘పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది ప్రేమేనని’ ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. దీనిని షేర్ చేసినప్పటి నుండి ఈ కార్డ్‌కు 53 వేలకు పైగా వీక్షణలు దక్కాయి. 400కి పైగా లైక్స్ లభించాయి. దీనిని చూసిన ఒక యూజర్ ‘కొన్ని దశాబ్దాల క్రితం డిగ్రీ పొందడం కష్టంగా ఉన్నప్పుడు బీఎస్సీ, బీకాం లాంటి డిగ్రీలను గొప్పగా పేర్కొనేవారు. ఈ ఆహ్వాన పత్రంలో ఇంటిపేరు లేకపోయినా వారి విద్యార్హతలు ఉన్నాయి’ అని పేర్కొన్నారు. మరొక యూజర్ ‘ఈ ఆహ్వాన పత్రంలో వధూవరుల జీతం జీతం, లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ను పేర్కొనకపోవడం నిరాశ పరుస్తోంది’ అని రాశారు. ఇంకొక యూజర్ ‘అయ్యో.. ర్యాంక్ రాయలేదే’ అని వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: తొలినాళ్లలో మనిషి ఏనుగులను తినేవాడా? పరిణామ క్రమంలో ఏం జరిగింది? All you need is love to get married pic.twitter.com/sjd4SZSSJR — Mahesh (@mister_whistler) September 12, 2023 -
చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా?
ISRO Employees Salary Structure: ఇస్రో పంపిన చంద్రయాన్-3 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయి భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. ఇప్పటికి కూడా చంద్రుని మీద ఉన్న పరిస్థితులను ఒక్కొక్కటిగా భూమిపైకి చేరవేస్తూనే ఉంది. ఇంత ఘన విజయం సాధించిన చంద్రయాన్-3 సక్సెస్ వెనుక ఎంతోమంది కృషి ఉందని అందరికి తెలిసిందే. చంద్రయాన్ 3 విజయం వెనుక ప్రధానంగా అంతరిక్ష శాఖ కార్యదర్శి అండ్ చైర్పర్సన్ ఎస్ సోమనాథ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వీరముత్తువేల్, డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పన కాళహస్తి ఉన్నారు. కాగా ఈ కథనంలో ఇస్రో ఉద్యోగులు జీతాలు ఎంత? ఎక్కువ జీతం పొందేదెవరు అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఇస్రో శాస్త్రవేత్తలు & ఇతర ఉద్యోగుల జీతాలు ఇలా.. టైమ్స్ నౌ న్యూస్ ప్రకారం.. ఇస్రోలోని ఇంజనీర్లు రూ. 37,400 నుంచి రూ. 67,000 వరకు & సీనియర్ సైంటిస్టులు రూ.75,000 నుంచి రూ.80,000 వరకు జీతం తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఇస్రోకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలకు నెలకు రూ.2 లక్షల జీతం లభించే అవకాశం ఉంది. ఈ జీతాలతో పాటు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. 👉: టెక్నీషియన్-B L-3 (రూ. 21700 - రూ. 69100) 👉: టెక్నికల్ అసిస్టెంట్ L-7 (రూ. 44900 - రూ.142400) 👉: సైంటిఫిక్ అసిస్టెంట్ L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: లైబ్రరీ అసిస్టెంట్ 'A' L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: టెక్నికల్ అసిస్టెంట్ (సౌండ్ రికార్డింగ్) డీఇసీయూ అహ్మదాబాద్ L-7 ( రూ. 44900 - రూ. 142400) 👉: టెక్నికల్ అసిస్టెంట్ (వీడియోగ్రఫీ) డీఇసీయూ అహ్మదాబాద్ L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: ప్రోగ్రామ్ అసిస్టెంట్, డీఇసీయూ అహ్మదాబాద్ L-8 (రూ. 47600 - రూ. 151100) 👉: సోషల్ రీసెర్చ్ అసిస్టెంట్, డీఇసీయూ అహ్మదాబాద్ - ఎల్-8 (రూ. 47600 - రూ. 151100) 👉: మీడియా లైబ్రరీ అసిస్టెంట్-A, డీఇసీయూ అహ్మదాబాద్ - L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: సైంటిఫిక్ అసిస్టెంట్- A (మల్టీమీడియా), డీఇసీయూ అహ్మదాబాద్ - L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: జూనియర్ ప్రొడ్యూసర్ L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: సామాజిక పరిశోధన అధికారి-C L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: సైంటిస్ట్/ ఇంజనీర్-SC - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: సైంటిస్ట్/ ఇంజనీర్-SD - L-11 (రూ. 67700 - రూ. 208700) 👉: మెడికల్ ఆఫీసర్-SC - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: మెడికల్ ఆఫీసర్-SD - L-11 (రూ. 67700 - రూ. 208700) 👉: రేడియోగ్రాఫర్-A - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: ఫార్మసిస్ట్-A L-5 (రూ. 29200 - రూ. 92300) 👉: ల్యాబ్ టెక్నీషియన్-A L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: నర్సు-B L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: సిస్టర్-A L-8 (రూ. 47600 - రూ. 151100) 👉: క్యాటరింగ్ అటెండెంట్ 'A' L-1 (రూ. 18000 - రూ. 56900) 👉: క్యాటరింగ్ సూపర్వైజర్ - L-6 (రూ. 35400 - రూ. 112400) 👉: కుక్ - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: ఫైర్‌మ్యాన్-A - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: డ్రైవర్-కమ్-ఆపరేటర్-A - L-3 (రూ. 21700 - రూ. 69100) 👉: లైట్ వెహికల్ డ్రైవర్-A - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: హెవీ వెహికల్ డ్రైవర్-A - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: స్టాఫ్ కార్ డ్రైవర్ 'A' - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: అసిస్టెంట్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: అసిస్టెంట్ (రాజ్‌భాష) - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: అప్పర్ డివిజన్ క్లర్క్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: స్టెనోగ్రాఫర్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: అకౌంట్స్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: పర్చస్ & స్టోర్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్- L-6 (రూ. 35400 - రూ. 112400) -
ఆర్టీసీ లో ‘ఆగస్టు’ టెన్షన్
ఆ 183 మంది ఆర్టీసీ ఉద్యోగులుగానే రిటైర్మెంట్ తీసుకుంటారా? ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అందే అన్ని రకాల బెనిఫిట్స్ పోయినట్టేనా ? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యే ప్రక్రియ ఆలస్యమవుతున్న కొద్దీ వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. కోరుకున్న అవకాశం అందినట్టే అందిచేజారిపోతుందనే బాధ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఈ నెల నుంచే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించేందుకు సిద్ధమని ఇటీవల ఆర్టీసీ చైర్మన్ స్వయంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులూ వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల వివరాలు, వారు పనిచేస్తున్న విభాగాల వారీగా ఆర్థికశాఖకు వెళ్లాయి. జీతాలు చెల్లింపునకు అంతా సిద్ధమవుతోంది. కానీ, ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టుగా ప్రభుత్వ ఉత్తర్వు మాత్రం జారీ కాలేదు. ఏ తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలో ఆ ఉత్తర్వులో పేర్కొనాల్సి ఉంది. ఆ తేదీ విషయంలో స్పష్టత లేకపోయేసరికి ఇప్పుడు ఆర్టీసీ లో గందరగోళం నెలకొంది. ఆగస్టు నెలాఖరుకు ఆర్టీసీలో 183 మంది పదవీ విరమణ పొందాల్సి ఉంది. రిటైర్మెంట్కు ఇంకా 13 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉత్తర్వు వెలువడకపోవటంతో తాము విలీన ప్రక్రియ కంటే ముందే విరమణ చేయాల్సి వస్తుందేమోనన్న టెన్షన్ వారిలో ఉంది. వాస్తవానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని గత నెల31నే మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. దీంతో తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పదవీ విరమణ చేయొచ్చని ఈ 183 మంది ఆశపడ్డారు. కానీ నెలాఖరు సమీపిస్తున్నా, అసలు తంతు మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉండడంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గవర్నర్ ఆమోదంలో జాప్యంతో..: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లును ఈ నెల 6వ తేదీన శాసనసభ ఆమోదించింది. ఆ వెంటనే బిల్లు గవర్నర్ ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాజ్‌భవన్ దానిపై ఆమోదముద్ర వేయలేదు. పది రోజులు దాటినా గవర్నర్ ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. తాజాగా ఆ బిల్లుపై సందేహాల నివృత్తికి న్యాయశాఖ కార్యదర్శి అభిప్రాయం కోసం పంపినట్టు రాజ్‌భవన్‌వర్గాలు అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి. దీంతో బిల్లుపై గవర్నర్ సంతకం, ప్రభుత్వ ఉత్తర్వు జారీకి మరికొంత సమయంపట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ బెనిఫిట్స్ కోల్పోయినట్టేనా ? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి వస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి సీనియర్ డిపో మేనేజర్ వరకు పెద్దగా ప్రయాజనం లేకున్నా, కిందిస్థాయి ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో మంచి పెరుగుదల ఉంటుంది. గ్రాట్యూటీ, పీఎఫ్ మొత్తం కూడా పెరుగుతుంది. కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెరుగుదల మరింతగా ఉంటుంది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉండగా, ప్రభుత్వంలో అది 61 ఏళ్లుగా ఉంది. దీంతో ఒక సంవత్సరం ఎక్కువగా పనిచేసే వెసులుబాటు కలుగుతుంది. పెరిగిన జీతం 12 నెలల పాటు అందుకునే వీలు చిక్కుతుంది. ఉద్యోగ భద్రతకు భరోసా ఉంటుంది. -
ఆ విషయంలో దిగ్గజ కంపెనీలకు దీటుగా చిన్న సంస్థలు.. అదేమిటంటే?
ఎక్కువ వేతనాలు ఇచ్చే విభాగం ఏది అంటే వెంటనే గుర్తొచ్చేది.. 'ఐటీ' ఫీల్డ్. అయితే గత కొంతకాలంగా ఐటీ సంస్థల ఆదాయం తగ్గుముఖం పట్టింది. దీంతో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు శాలరీలు హైక్ చేయకపోగా.. మరి కొన్ని కంపనీలు ఉద్యోగులను తొలగించాయి. తాజాగా దిగ్గజ కంపెనీల కంటే చిన్న కంపెనీలే ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, దిగ్గజ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా సీఈఓల కంటే కూడా చిన్న కంపెనీల సీఈఓలకు ఎక్కువ శాలరీలు లభిస్తున్నట్లు తెలుస్తోంది. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ 'సందీప్ కల్రా' వేతనం ఏడాదికి రూ. 61.7 కోట్లు, కాగా.. ఎంఫాసిస్ (Mphasis) సీఈఓ జీతం రూ. 59.2 కోట్లు కావడం విశేషం. పెద్ద కంపెనీల జాబితాలో విప్రో సీఈఓ మాత్రమే రూ. 82.4 కోట్లు జీతం తీసుకుంటూ అధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా మొదటిస్థానంలో నిలిచాడు. ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! తొలిసారి కారు వాడకం ఎప్పుడంటే? విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు మినహా నిఫ్టీ కంపెనీలను మించిన వేతనాలు అందుకుంటున్న సీఈఓలలో కోఫోర్ట్ సీఈఓ సుధీర్ సింగ్ ఉన్నారు. ఇక టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ వేతనం రూ. 30 కోట్లు కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో చాలామంది వేతనాలు భారీగా తగ్గినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
ఈ సీఈఓల జీతాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!
ఒకప్పటి నుంచి కూడా చాలామంది ఎక్కువ సంపాదించాలంటే ఐటీ ఫీల్డ్‌లో జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్న సంగతి తెలిసిందే. లక్షల్లో జీతాలు, వీకెండ్ పార్టీలు, టూర్లు, షికార్లు, ఐదు రోజుల పనిదినాలు ఇలా చాలా అద్భుతంగా ఉంటుంది కావున మెజారిటీ యువత ఈ ఉద్యోగంపై ఎక్కువ మక్కువ చూపిస్తారు. అయితే కరోనా మహమ్మారి తరువాత పరిస్థితులు తారుమారయ్యాయి. కరోనా విజృంభణ తరువాత చాలా వరకు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను తొలగించాయి, అదే సమయంలో కంపెనీలు ఆశించిన స్థాయిలో లాభాలను పొందలేకపోయాయి. అయితే సీఈఓలు మాత్రం రికార్డు మొత్తంలో జీతాలు తీసుకుంటున్నారు. మనం ఈ కథనంలో ఎక్కువ జీతాలు తీసుకుంటున్న ఐటీ కంపెనీల CEOల జీతాలను గురించి తెలుసుకుందాం. థియరీ డెలపోర్టే (Thierry Delaporte) ఎక్కువ జీతాలు తీసుకుంటున్న సీఈఓల జాబితాలో విప్రో CEO 'థియరీ డెలపోర్టే' ఉన్నట్లు సమాచారం. ఈయన 2022-23 ఆర్థిక సంవత్సరంలో 10 మిలియన్ డాలర్లను వేతంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 82.2 కోట్లు. సలీల్ పరేఖ్ (Salil Parekh) ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఎక్కువ సాలరీ తీసుకుంటున్నవారి జాబితాలో ఒకరు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 56.4 కోట్లు వేతంగా అందుకున్నట్లు సమాచారం. అంతకు ముందు సంవత్సరంలో ఈయన జీతం ఇప్పటికంటే 21 శాతం ఎక్కువగా ఉండేది. అయినప్పటికీ ఎక్కువ జీతం తీసుకుంటున్న రెండవ సీఈఓగా రికార్డ్ సృష్టిచాడు. ఇదీ చదవండి: మూడు బ్యాంకుల కొత్త ప్రకటనలు.. ఈఎమ్ఐ కట్టే వారికి బిగ్ షాక్! రాజేశ్ గోపీనాథన్ (Rajesh Gopinathan) టీసీఎస్ మాజీ సీఈఓ రాజేశ్ గోపీనాథన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 29 కోట్లు వార్షిక వేతంగా అందుకున్నట్లు సమాచారం. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం కంటే కూడా 13 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఐటీ కంపెనీ ఉద్యోగుల సగటు జీతం కంటే ఇది సుమారు 427 రెట్లు ఎక్కువ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ సీఈఓగా కృత్తివాసన్ కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: ఫ్రెండ్‌షిప్‌డే రోజు మిత్రులకు గిఫ్ట్‌గా ఓ స్మార్ట్‌వాచ్ - ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్! సి విజయ్ కుమార్ (HCL Technologies) 2022-23ఆర్థిక సంవత్సరంలో రూ. 28.4 కోట్లు వార్షిక వేతనం తీసుకున్న హెచ్‌సిఎల్ టెక్ సీఈఓ 'సి విజయ్ కుమార్' మన జాబితాలో ఒకరు. అయితే ఈ యన ఈ సారి తన వేతనం భారీగా తగ్గించుకున్నట్లు సమాచారం. -
18 నెలలుగా పెరగనే లేదు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల సగటు వేతన ఆదాయంలో పెరుగుదల కనిపించడం లేదని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) తెలిపింది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో ముగిసిన 18 నెలల కాలంలో వారి వేతనంలో ఎలాంటి ఎదుగుదల లేదని పేర్కొంది. రూ. 14,700 దగ్గరే ఆగిపోయినట్లు వివరించింది. అయితే పట్టణ ప్రాంతాల్లో సగటు ఉద్యోగి (శాలరీడ్ పర్సన్) నెలవారీ సగటు వేతనం మాత్రం రూ. 20,030 నుంచి 7.5 శాతం పెరిగి రూ. 21,647కు చేరుకున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. పీఎల్ఎఫ్ఐ డేటా ప్రకారం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లోని దినసరి కూలీ లేదా వేతనం 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ. 302తో పోలిస్తే 2023–24 తొలి త్రైమాసికంలో రూ. 368కు పెరిగింది. అదే పట్టణ ప్రాంతాల్లోని క్యాజువల్ లేబర్ రోజుకూలీ రూ. 385 నుంచి రూ. 464కు పెరిగింది. దేశంలోని కార్మికశక్తిలో 46 శాతం మంది వ్యవసాయ దిగుబడులపై ఆధారపడి ఉన్నారని... కానీ ఈ ఏడాది తీవ్ర వాతావరణ మార్పులు వారికొచ్చే నెలసరీ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని నివేదిక అభిప్రాయపడింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో... పట్టణాల్లో ఉత్పత్తి, సర్వీసెస్, ఇతర రంగాల్లో ఉద్యోగులు కేంద్రీకృతమైనట్లు పీఎల్ఎఫ్ఎస్ నివేదిక వెల్లడించింది. ప్రైవేటులో ఉపాధిలేమి.. పట్టణ ప్రాంతాల్లోని ఉద్యోగులు ప్రైవేటు రంగంలోని ఐటీ, స్టార్టప్ సెక్టార్లలో ఎక్కువగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ ఉద్యోగులకు అవకాశాలు దక్కకపోవడంతో ఉపాధిలేమి కూడా వెంటాడుతోందని నిపుణులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ‘నెలవారీ హైరింగ్ ట్రెండ్స్’ దాదాపు 7 శాతం తగ్గిపోయినట్లు ‘ఫౌండిట్ ఇనసైట్స్ ట్రాకర్’ వెల్లడించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్స్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలోని మొత్తం 27 పరిశ్రమల్లో 10 శాతం ఉద్యోగాల కల్పన తగ్గినట్లు ట్రాకర్ పేర్కొంది. ఏయే రంగాల్లో వృద్ధి... ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్ అధ్యయనం ప్రకారం... గతేడాది నుంచి పరిశీలిస్తే కేవలం 9 రంగాల్లో మాత్రమే ఈ–రిక్రూట్మెంట్ కార్యకలాపాలు పెరిగాయి. ఇందులోనూ షిప్పింగ్/మెరైన్ పరిశ్రమ అత్యధికంగా 45 శాతం వృద్ధిని నమోదు చేసింది. డేటా ఆధారంగా వ్యూహాలు రూపొందించుకొనే అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్–పీఆర్ పరిశ్రమలు 28 శాతం రిక్రూట్మెంట్ యాక్టివిటీ పెరుగుదల సాధించాయి. రిటైల్, ట్రావెల్, టూరిజం రంగాలు గతేడాదితో పోచ్చితే 27 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం... దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలతో గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు పెరగట్లేదు. దీంతో ఈ ప్రాంతాల్లోని ఉద్యోగుల నిజ వేతనాలు (రియల్ వేజ్) పెరగక ఇబ్బందిపడుతున్నారు. పట్టణ ప్రాంతాలోన్లూ అదే పరిస్థితి నెలకొంది. పైకి చూస్తే వేతనం ద్వారా నిర్ణిత ఆదాయం వస్తున్నట్లు కనిపిస్తున్నా గత నెలతో పోలిస్తే ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జనం చేతుల్లో డబ్బుల్లేక వారి కొనుగోలు శక్తి తగ్గుతోంది. దీనికితోడు ఉపాధి హామీ పనిదినాలు తగ్గడం గ్రామీణ ప్రాంత దినసరి కూలీలపై మరింత ప్రభావం చూపుతోంది. గ్రామీణ భారతంలో సగటు వేతన జీవులు ఉసూరుమంటున్నారు..అత్తెసరు వేతన ఆదాయంతో బతుకుబండిని భారంగా లాగుతున్నారు..పల్లెల్లో చాలీచాలని ఆదాయంతో సర్దుకుంటున్నారు. కేంద్ర గణాంక శాఖ పరిధిలోని నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సర్వే ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వేతన జీవి సగటు ఆదాయం గత ఏడాదిన్నర నుంచి రూ. 14,700 వద్దే నిలిచిపోయింది. మరోవైపు ఓ ప్రైవేటు సంస్థ చేపట్టిన మరో అధ్యయనం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పట్టణ ప్రాంత ఉద్యోగి సగటు ఆదాయం రూ. 21,647గా నమోదైంది. -
‘మీ థ్యాంక్యూ మాకు అక్కర్లేదు’..సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు!
ఆర్థిక మాంద్యం భయాలు మొదలైనప్పటి నుంచి ఐటీ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. చాలా వరకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. క్లయింట్స్ తగ్గిపోయారు. ఇదే సమయంలో ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గణనీయమైన లాభాల్ని సాధించింది. స్టాక్ మార్కెట్లో కంపెనీ స్టాక్స్ సరికొత్తగా ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. ఫలితంగా కంపెనీ విలువ 2.5 ట్రిలియన్ డాలర్ల వద్దకు చేరుకుంది. కానీ ఉద్యోగులే జీతాలు పెంచడం లేదని సంస్థపై, సంస్థ సీఈవో సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్ సాధించిన ఫలితాలపై సత్య నాదెళ్ల ఉద్యోగులకు ఇంటర్నల్ మెసేజ్ పంపించారు. అందులో ఈ ఏడాదిలో ఉద్యోగుల పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. సంస్థ సాధించిన ఫలితాలకు ఉద్యోగుల వినూత్నం, సృజనాత్మకత వల్లే సాధ్యమైందని కొనియాడారు. క్లయింట్లను, భాగస్వాములను సైతం అభినందనలతో ముంచెత్తారు. వచ్చే ఏడాది సైతం మెరుగైన ఫలితాలు సాధించేలా కలిసి పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ నిర్ధేశించుకున్న లక్ష్యాల్ని అధిగమించేలా అందరూ బాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. థ్యాంక్యూ నోట్‌పై అసహనం సత్యనాదెళ్ల పంపిన ఈ ఇంటర్నల్ మెసేజ్‌ను 2లక్షల మందికి పైగా వీక్షించే అవకాశం ఉంది. అయితే, సీఈవో తమకి అభినందనలు తెలపడంపై 130కి మంది ఉద్యోగులు సానుకూలంగా స్పందించారు. మరికొంత మంది సీఈవో థ్యూంక్యూ నోట్‌పై అసహనం వ్యక్తం చేశారు. కృతజ్ఞతలు తెలపడం అంటే ఇలాగేనా ఉద్యోగుల పట్ల కృతజ్ఞత చూపడం అంటే జీతాలు పెంచకుండా ఉండటం కాదని ఓ ఉద్యోగి అంటుంటే..సంస్థ గడించిన లాభాల గురించి మాట్లాడుతూ.. జీతాలు పెంచకుండా అడ్డుకున్న సీనియర్ స్థాయి ఉద్యోగులపై సదరు ఉద్యోగి విమర్శలు గుప్పించారు. కంపెనీ, ఉన్నతస్థాయి ఉద్యోగులు రికార్డ్ స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నప్పుడు ఉద్యోగులు మాత్రం వేతనాల కోతను ఎదుర్కొంటున్నారని ఓ ఉద్యోగి పేర్కొన్నారు. ఇది సరికాదు, వేరే మార్గం లేదా? అని ప్రశ్నించారు. సంస్థను నమ్ముకుంటే మిగిలేది ఇదే.. పెరగకుండా స్తబ్దుగా ఉన్న వేతనాల గురించి ప్రస్తావిస్తూ మండిపోతున్న ధరలు.. పెరిగిపోతున్న ఖర్చులతో అల్లాడుతుంటే సంస్థ భారీ లాభాల్ని మూటగట్టుకోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కంపెనీ పట్ల అంకితభావంతో ఉన్నప్పటికీ తమకు పెరగాల్సి జీతాలు పెరగలేదని అన్నారు. ‘రికార్డు లాభాలు ఎక్కడ నుండి వస్తాయని ఆశ్చర్యపోతున్నాను? ఇక్కడ (ఆఫీస్‌లో) అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా గంటల తరబడి కష్టపడి పనిచేసినందుకు నాకు ఎలాంటి ప్రతిఫలం దక్కలేదని వాపోయాడు మరో ఉద్యోగి. జాబ్‌కు రిజైన్ చేస్తాం.. సత్యనాదెళ్ల పంపిన థ్యాంక్యూ మెసేజ్‌పై ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేయడంపై మైక్రోసాఫ్ట్ యాజమాన్యం సందిగ్ధంలో పడినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఉద్యోగుల మధ్య జరిగిన ఇంటర్నల్ పోల్ సంభాషణల్లో ఎక్కువ మంది..తాము కోరుకున్న ఉద్యోగం దొరికితే..మైక్రోసాఫ్ట్‌ను వదిలివెళ్లేందుకు సిద్ధపడ్డట్లు నివేదికలు హైలెట్ చేశాయి. అయితే, ఉద్యోగుల అసంతృప్తి, రిజైన్ల అంశంపై మైక్రోసాఫ్ట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. చదవండి👉 ‘అదే నన్ను సాధారణ ఉద్యోగి నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోని చేసింది’ -
జీతాల కోసం హైడ్రామా..
తెయూ(డిచ్పల్లి): జీతాలు ఇచ్చే వరకు విధులు నిర్వహించేది లేదని పేర్కొంటూ తెలంగాణ వర్సిటీ ఔట్సోర్సింగ్ సిబ్బంది చేపట్టిన నిరసన బుధ వారం మూడో రోజూ కొనసాగింది. ఉదయాన్నే పరిపాలనా భవనం వద్ద సిబ్బంది బైఠాయించారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది నిరవధిక ధర్నా వల్ల మంగళవారం మధ్యాహ్నం నుంచి క్యాంపస్ హాస్టల్స్ విద్యార్థులకు భోజనం వండకపోవడంతో పస్తులున్నారు. హాస్టల్స్ చీఫ్ వార్డెన్ రాత్రికి బయట నుంచి భోజనాలు తెప్పించారు. తిరిగి బుధవారం ఔట్ సోర్సింగ్ సిబ్బంది ధర్నా చేపట్టారు. ఉదయం హాస్టల్స్‌లో అల్పాహారం చేయలేదు. చీఫ్ వార్డెన్ సెలవులో ఉండడంతో పట్టించుకునే వారే కరువయ్యారు. విద్యార్థులు పీఆర్వో జమీల్‌కు చెప్పడంతో ఆయన వీసీతో మాట్లాడారు. వీసీ ఆదేశాలతో బయట నుంచి అల్పాహారం తెప్పించారు. ఉద యం 11 గంటలకు వీసీ క్యాంపస్‌కు చేరుకున్నారు. అప్పటికే ధర్నా నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు వీసీ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నా రు. సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతోనే ఈ దు స్థితి తలెత్తిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. జీతాలు ఇచ్చేవరకు తాము విధులు నిర్వహించేది లేదని సిబ్బంది వీసీకి స్పష్టం చేశారు. దీంతో వీసీ బ్యాంకు మేనేజర్‌ను పిలిపించి మాట్లాడారు. హైకోర్టులో కేసు ఉందని అందుకే జీతాల చెక్కును ఆమోదించలేకపోతున్నట్లు మేనేజర్ వివరించారు. ఈ విషయాన్ని మంగళవారం రాత్రే వీసీ రవీందర్, ఇన్చార్జి రిజిస్ట్రార్ కనకయ్యకు ఫోన్లో చెప్పానని పేర్కొన్నారు. వీసీతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు వాగ్వాదానికి దిగడంతో చివరకు మేనేజర్‌తో మాట్లాడి జీతాలు ఇచ్చేలా చూస్తానని చెప్పి వీసీ, ఇన్చార్జి రిజిస్ట్రార్లు బ్యాంకులోకి వెళ్లారు. అదేసమయంలో ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సత్యనారాయణ క్యాంపస్‌కు వచ్చారు. జీతాల చెల్లింపునకు వీసీ నియమించిన ఇన్చార్జి రిజిస్ట్రార్ కనకయ్య సంతకం ఆమోదించాలంటే ఈసీ నుంచి ఎన్వోసీ తేవాలని, ఈసీ నియమించిన రిజిస్ట్రార్ యాదగిరి సంతకం ఆమోదించాలంటే వీసీ ఎన్వో సీ ఇవ్వాలని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. ఈ రెండు కాదంటే హైకోర్టులో కేసు ఉండడంతో జీతాలు ఇవ్వడానికి అభ్యంతరం లేదని మధ్యంతర ఉత్తర్వు లు తేవాలని సూచించారు. దీంతో వీసీ సూచన మేరకు కనకయ్య కొందరు ఈసీ మెంబర్లకు ఫోన్‌చేసి పరిపాలనా భవనానికి రావాలని కోరారు. దీంతో ఈసీ మెంబర్ ఎన్ఎల్శాస్త్రి మాత్ర మే వచ్చారు. బ్యాంకు అధికారుల సూచనలు విన్న ఆయన వీసీ తో మాట్లాడారు. ఫోన్లలో మాట్లాడితే ఈసీ మెంబ ర్లు స్పందించకపోవచ్చని, ఈనెల 17న ఈసీ సమా వేశానికి హాజరైతే సమస్యపై చర్చించవచ్చన్నారు. సమావేశానికి హాజరైతే వీసీ, ఈసీ మధ్య అంతరం తొలిగే అవకాశం ఉంటుందని సూచించారు. ఒక సారి ఈసీ మెంబర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వీసీ పేర్కొన్నారు. అంతకు ముందు వీసీ తన చాంబర్‌కు వెళ్ల డానికి యత్నించగా విద్యార్థులు మెట్లపై ఉన్న పూలకుండీలను పగులగొట్టారు. చాంబర్ తాళం తీయకపోవడంతో చేసేది లేక వీసీ బయటకు వచ్చారు. విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం ఆర్డర్ ఇవ్వగా.. సాయంత్రం 6 గంటలకు రావడంతో ఆకలితో ఉన్న విద్యార్థులు అప్పుడు భోజనాలు చేసి హాస్టల్స్‌కు వెళ్లారు. తమకు కనీసం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా అయినా జీతాలు ఇప్పించాలని ఉద్యోగులు వీసీని కోరారు. దీంతో వీసీ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ వారితో ఫోన్లో మాట్లా డి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని సూచించారు. -
కార్మిక శాఖను ఆశ్రయించిన ఐటీ ఉద్యోగులు..
ప్రసిద్ధ ఐటీ సేవల కంపెనీ హెచ్‌సీఎల్ టెక్(HCLTech)కి వ్యతిరేకంగా ఐటీ ఉద్యోగుల యూనియన్ కార్మిక శాఖను ఆశ్రయించింది. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంగేజ్మెంట్ పెర్ఫార్మెన్స్ బోనస్ (ఈపీబీ) చెల్లింపు విధానాన్ని అప్డేట్ చేసిన హెచ్‌సీఎస్ టెక్ సంస్థపై ఐటీ ఉద్యోగుల యూనియన్ ‘నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్’ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. భారీగా తగ్గిన జీతాలు త్రైమాసిక పనితీరు రేటింగ్ ప్రాతిపదికన ఈపీబీ చెల్లించే విధానాన్ని హెచ్‌సీఎస్ టెక్ ఇటీవల సవరించింది. కోవిడ్ కంటే ముందున్న ఫార్మాట్‌ను అమలు చేస్తోంది. కోవిడ్ సమయంలో ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఉద్యోగులకు రేటింగ్‌తో సంబంధం లేకుండా అందరికీ అంటే బెంచ్ మీద ఉన్న ఉద్యోగులకు కూడా 100 శాతం ఈపీబీని కంపెనీ చెల్లించేది. కానీ దీన్ని పాత విధానంలోనే ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ రేటింగ్‌కు అనుగుణంగా బోనస్ చెల్లించునున్నట్లు కంపెనీ ఉద్యోగులకు తెలియజేసింది. ఏప్రిల్ 1 నుంచే పాత విధానాన్ని అమల్లోకి తెచ్చిన కంపెనీ ఉద్యోగులకు ఒక రోజు ముందు దీని గురించి ఈ-మెయిల్స్ పంపినట్లు తెలిసింది. పాత ఈపీబీ) చెల్లింపు విధానంతో ఉద్యోగుల జీతాలు భారీగా తగ్గాయి. ఉద్యోగుల ఆక్షేపణలు ఇవి.. నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ ‘గత పాలసీ ప్రకారం, ఉద్యోగులు బెంచ్‌లో ఉన్నప్పటికీ, నెలవారీ ప్రాతిపదికన స్థిరమైన రేటుతో ఎంగేజ్మెంట్ పెర్ఫార్మెన్స్ బోనస్ (ఈపీబీ) చెల్లిస్తామని హెసీఎల్ కంపెనీ ఉద్యోగులకు హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈపీబీ చెల్లింపులను నిర్ణయించడానికి త్రైమాసిక పనితీరు సమీక్ష ప్రక్రియను అమలు చేస్తూ కంపెనీ ఆకస్మికంగా పాలసీని మార్చింది’ అన్నారు. మార్చిన విధానం ప్రకారం.. ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఆధారంగా ఈపీబీని కంపెనీ చెల్లిస్తుంది. అంటే అత్యుత్తమ పనితీరు రేటింగ్ ఉన్న వారికి గరిష్టంగా 80-90 శాతం, తక్కువ రేటింగ్ ఉన్నవారికి కేవలం 30-40 శాతం వరకు ఉంటుందని వివరించారు. ఇదీ చదవండి ► ఈ ఐటీ కంపెనీ సూపర్! వెయ్యికిపైగా ఉద్యోగాలు.. 800 మంది భారత్ నుంచే.. -
ఎస్సీ గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు పెంపు
సాక్షి, అమరావతి: ఎస్సీ గురుకులాల్లో పని చేస్తున్న 1791 మంది పార్ట్ టైమ్ టీచర్ల వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. టీచర్లతో పాటుగా వ్యాయామ ఉపాధ్యాయులు, హెల్త్ సూపర్ వైజర్ల వేతనాలను కూడా పెంచామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకులాల్లో పని చేస్తున్న జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, టీజీటీలు, పీఇటీలు, హెల్త్ సూపర్ వైజర్లు వేతనాలను పెంచాలంటూ ఉపాధ్యాయులు చేసిన విజ్ఞప్తి మేరకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నాగార్జున వివరించారు. గతంలో జూనియర్ లెక్చరర్ల (జేఎల్)వేతనం రూ.18 వేలు ఉండగా దీనిని రూ.24,150 లకు పెంచామని చెప్పారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల (పీజీటీ) వేతనం రూ.16,100 ఉండగా దీన్ని కూడా రూ.24,150కు పెంచామని తెలిపారు. ట్రైన్డ్ గ్యాడ్యుయేట్ టీచర్ల( టీజీటీ) వేతనం రూ.14,800 ఉండగా దీన్ని రూ.19,350కు పెంచడం జరిగిందన్నారు. అలాగే వ్యాయామ ఉపాధ్యాయుల (పీఇటీ) వేతనం రూ.10,900 ఉండగా దీనిని రూ.16,350కు, హైల్త్ సూపర్ వైజర్, స్టాఫ్ నర్స్ ల వేతనం రూ.12,900 ఉండగా దానిని రూ.19,350లకు పెంచడం జరిగిందని నాగార్జున వివరించారు. ఈ పెంపుదలతో 1791 మంది పార్ట్ టైమ్ టీచర్లతో పాటుగా ఇతర సిబ్బందికి ప్రయోజనం చేకూరిందని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసామన్నారు. 2019 తర్వాత పార్ట్ టైమ్ టీచర్లు, ఇతర సిబ్బంది వేతనాలను పెంచడం ఇదే ప్రథమం అని మంత్రి చెప్పారు. కాగా తమ కష్టాలను గుర్తించి తమ వేతనాలను పెంచినందుకు గురుకుల విద్యాలయాల సంస్థ ఉద్యోగుల జేఏసీ నేతలు,టీచర్లు శుక్రవారం మంత్రి మేరుగు నాగార్జునను కలిసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగానే మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగానే జేఏసీ ఛైర్మెన్ నాగభూషణం మాట్లాడుతూ, తాము కోరిన వెంటనే బీజీ సమావేశంలో ఈ అంశాన్ని చేర్చి తమకు మంత్రి తమకు న్యాయం చేసారని చెప్పారు. బీసీ వెల్ఫేర్ టీచర్లతో సమానంగా పీజీటీలు, టీజీటీల వేతనాలను పెంచే విషయాన్ని కూడా పరిశీలించాలని మంత్రి నాగార్జునను కోరారు. -
క్యూలో నిలబడినా, నిద్రపోయినా.. ఆఖరికి ఏడ్చినా జీతమిస్తారు..!
పని చేస్తే జీతమిస్తారు ఎక్కడైనా. కానీ.. పరుపులపై నిద్రపోవడం.. క్యూలైన్లో నిలబడటం.. శవం దగ్గర ఏడ్వటం లాంటి పనులు చేస్తే కాసుల వర్షం కురుస్తోంది. వివిధ దేశాల్లో ఇలాంటి చిత్ర విచిత్రమైన పనులెన్నో చేసేస్తూ డబ్బులు గడిస్తున్న వారు చాలామందే ఉన్నారు. ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోకండి. అవేంటో చూసేద్దాం పదండి. కార్యాలయం లేదా పనిచేసే చోట నిద్రపోతే ఉద్యోగం ఊడిపోతుంది. కానీ.. బాగా నిద్రపోయే వారికి మాత్రం అక్కడ జీతాలు ఇస్తారు. ‘ప్రొఫెషనల్ స్లీపర్స్’ పేరిట ఇలాంటి ఉద్యోగాలను పరుపుల తయారీ కంపెనీలు, కొన్ని ప్రముఖ హోటళ్లు సైతం ఆఫర్ చేస్తున్నాయి. ఫిన్లాండ్లోని ఒక హోటల్ ప్రొఫెషనల్ స్లీపర్స్‌ను నియమించుకుంది. ఆ హోటల్లోని బెడ్లలో రోజూ ఏదో ఒక బెడ్‌పై పడుకుని అవి సౌకర్యంగా ఉన్నాయా.. లేదా అనేది చెక్ చేసి నివేదిక ఇవ్వడమే ప్రొఫెషనల్ స్లీపర్ పని. ఇందుకోసం వీరికి నెలకు రూ.లక్షల్లో జీతాలిస్తున్నారు. అంతేకాదు.. బెడ్లు, పరుపుల తయారీ కంపెనీలు సైతం వాటి నాణ్యతను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ప్రొఫెషనల్ స్లీపర్స్‌ను నియమించుకుంటున్నాయి. న్యూయార్క్‌లో పరుపులు తయారు చేసే కాస్పెర్ కంపెనీ బిజినెస్ పెంచుకునేందుకు కొత్తగా ఆలోచించి ‘స్లీపర్స్’ కావాలని ఈ మధ్యే ఒక ప్రకటన చేసింది. తమ కంపెనీ పరుపు మీద పడుకుంటే కంటినిండా నిద్రపడుతుందని చెప్పడం ద్వారా మార్కెట్ పెంచుకునేందుకు ‘ప్రొఫెషనల్ స్లీపర్స్’ కోసం వెతుకుతోంది ఆ కంపెనీ. అభ్యర్థులకు ఎక్కువసేపు నిద్రపోవాలనే కోరిక ఉండాలట. చుట్టూ ఏం జరిగినా ఏమీ పట్టనట్టు హాయిగా పడుకోగలగటం ప్రత్యేకత. జాబ్‌లో చేరిన వారు కాస్పెర్ పరుపుల పైపడుకుని బాగా నిద్రపోవడంతోపాటు వారి అనుభవాలను టిక్‌టాక్ వీడియోలు, రీల్స్, సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని ఆ కంపెనీ నిబంధనలు విధించింది. బెంగళూరులోనూ ఉందో కంపెనీ నిద్రపోతే చాలు జీతమిస్తామంటోంది మన దేశంలోని బెంగళూరుకు చెందిన ‘వేక్‌ఫిట్’ సంస్థ. ‘రోజూ రాత్రి 9 గంటలపాటు శుభ్రంగా పడుకోండి. నెలకు రూ.లక్ష జీతం ఇస్తాం’ అంటోంది. అంతేకాదు.. ఈ జాబ్‌లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు కూడా అవకాశం కల్పించింది. ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనే అభ్యర్థులకు బాగా నిద్రపోయేలా స్లీప్ ఎక్స్పర్ట్స్, న్యూట్రిషనిస్టులు, ఇంటీరియర్ డిజైనర్లు, ఫిట్నెస్ నిపుణులు పలు సూచనలు కూడా ఇస్తారట. అభ్యర్థులందరినీ ఒక ప్రత్యేక వాతావరణంలో ఉంచి వారందరూ గాఢంగా, ఎక్కువ సేపు నిద్రపోయేలా వివిధ రకాల వ్యూహాలను అమలు చేస్తారు. ఇందులో పాల్గొనే వారికి ఏదైనా డిగ్రీ ఉండాలి. బెడ్‌పైకి వెళ్లగానే 10–20 నిమిషాల్లో నిద్రలోకి జారుకునే లక్షణం కలిగి ఉండాలి. క్యూలో నిలబడితే డబ్బిస్తారు క్యూలో గంటల తరబడి నిలబడటం ఎవరికైనా ఇబ్బందే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వయసు పైబడిన వారు, చిన్న పిల్లల తల్లులు, పిల్లలు క్యూలైన్లో నిలబడటం కష్టం. ఇందుకు ప్రత్యామ్నాయంగా అనేక దేశాలు ‘లైన్ స్టాండర్’ పద్ధతిని అనుసరిస్తున్నాయి. లైన్లో మీరు నిలబడలేకపోతే మీకు బదులుగా అక్కడి ఉద్యోగులు నిల్చుంటారు. అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఈ తరహా లైన్ స్టాండర్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా షాపింగ్ మాల్స్‌లో ఫెస్టివల్ ఆఫర్లు ప్రకటించినప్పుడు.. మార్కెట్లో కొత్త ప్రొడక్ట్స్ విడుదలైనప్పుడు వీరికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ప్రయాణికుల్ని తోసేస్తే జీతం పండగలు, పర్వదినాల్లో కిక్కిరిసిన రైలు, బస్సుల్లో జనం గుమ్మాల దగ్గర వేలాడటం చూస్తుంటాం. మెట్రో రైలులో ఇలాంటి పరిస్థితి వస్తే తలుపులు మూసుకోకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు విదేశాల్లో ప్రత్యేకంగా ‘పాసింజర్ పుషర్స్’ను నియమిస్తున్నారు. జపాన్ రాజధాని టోక్యోతోపాటు వివిధ దేశాల్లోని మెట్రో రైళ్లలో ‘పాసింజర్ పుషర్స్’ డ్యూటీలో చేరుతున్నారు. మెట్రో రైలు లోపలికి ప్రయాణికులను నెట్టేసి రైలు తలుపులు మూసుకునేలా చేయడమే వీరి పని. ఇందుకోసం వారికి నెలకు మన కరెన్సీలో చూస్తే రూ.70 వేల నుంచి రూ.75 వేల వరకు జీతం ఇస్తున్నారు. అక్కడ ఏడిస్తే డబ్బులిస్తారు కొన్ని దేశాల్లో ఎవరైనా చనిపోతే ఏడ్చేందుకు వెళ్లి డబ్బులు సంపాదించుకోవచ్చు. చైనా, ఆఫ్రికా, యూకే వంటి దేశాల్లో మతపరమైన సంప్రదాయంలో ప్రత్యేకంగా దుఃఖితులను నియమించుకుని డబ్బులిస్తారు. వీరంతా ఏడవడంతోపాటు బాధిత కుటుంబ సభ్యులను కూడా ఓదారుస్తారు. ఇందుకోసం ఒక్కో ఈవెంట్‌కు సుమారు రూ.9 వేల నుంచి రూ.16 వేల వరకు చెల్లిస్తారు. మరిన్ని చిత్రమైన కొలువులున్నాయ్! ఓటీటీ సంస్థలు ప్రత్యేకంగా మూవీ వాచర్లను నియమించుకుంటున్నాయి. సినిమా ప్రసారం కావడానికి ముందే సినిమా ఎలా ఉంది.. రీచింగ్ బాగా ఉంటుందా.. లేదా.. ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వాలనే దానిపై కొందర్ని నియమించుకుని జీతాలిస్తున్నాయి. విడుదలకు ముందే వెబ్ సిరీస్, మూవీలను చూసి సమీక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే రిలీజ్ ఆధారపడి ఉంటుంది. కాగా, ఇంటికి వేసిన రంగు (కలర్) ఎంత సమయంలో ఆరుతుందో చెప్పడానికి ప్రత్యేకంగా రంగుల తయారీ కంపెనీలు పెయింట్ డ్రైయింగ్ వాచర్ పేరిట సిబ్బందిని నియమించుకుంటున్నాయి. పెయింట్ ఎంతసేపట్లో ఆరుతుంది.. చేతికి అంటుకుంటుందా అనే వివరాలతో రిపోర్ట్ తయారు చేసి మేనేజర్లకు ఇవ్వడమే వీరి పని. కాగా.. గోల్ఫ్ గేమ్‌లో కొట్టిన బంతిని దూరం నుంచి తిరిగి తేవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ సమయాన్ని ఆదా చేసేలా బాల్ డ్రైవర్‌ను నియమించుకుని జీతాలిస్తారు. కాగా, చివరకు కండోమ్ తయారీ సంస్థలు వాటిని మార్కెట్లో విడుదల చేయడానికి ముందు సౌకర్యంగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు కూడా కండోమ్ టెస్టర్స్ను నియమించుకుంటాయి. వారికి జీతం ఏడాదికి ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే.. ఏకంగా రూ.10 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు చెల్లిస్తున్నాయి. -
జీతాలు తక్కువే ఇస్తామంటున్నా.. ఉద్యోగులు ఎగబడుతున్నారు.. కారణం ఇదే!
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం విప్రో తీరు టెక్నాలజీ రంగంలో చర్చాంశనీయంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి, ఆర్థిక మాంద్యం ముందస్తు భయాలు వంటి కారణాలతో ఆయా దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలో విప్రో ఫ్రెషర్స్ నియామకాల్ని 50 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వారి ప్రారంభ వేతనం రూ.6.5 లక్షలుగా నిర్ణయించింది. కొద్ది రోజులకే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ భారీ ఎత్తున జీతాల కోత విధించింది. దీనిపై టెక్నాలజీ రంగ నిపుణులు, ఫ్రెషర్స్ విప్రో తీరును తప్పుబట్టారు. ఉద్యోగుల్ని ఒత్తిడి చేయడం లేదు దీనిపై అయితే, ప్రొడక్ట్‌లు, అవకాశాలు వంటి విషయాల్లో టెక్నాలజీ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని, కాబట్టే ఫ్రెషర్స్‌కు ఇచ్చే వేతనాల్ని తగ్గించి విధుల్లో తీసుకోవాల్సి వచ్చినట్లు విప్రో ఓ ప్రకటనలో తెలిపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ తామెవరినీ తక్కువ ప్యాకేజీలకు ఉద్యోగంలో చేరాలని బలవంతం చేయలేదని, సంస్థ అందించే వేతనం కావాలనుకుంటే ఇప్పటికీ విప్రోలో చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కంపెనీ ఆఫర్‌కే అంగీకారం తాజాగా, సంస్థలోని ఫ్రెషర్ల నియామకాలు, వారికి అందించే జీతభత్యాలపై విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. విప్రోలో 92 శాతం మంది ఫ్రెషర్లు తాము అందించే ఆఫర్‌కు అంగీకరించి ఆయా ప్రాజెక్ట్‌లలో పనిచేసేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. ‘ఫ్రెషర్లకు సంబంధించిన నిర్ణయాలు పూర్తి న్యాయంగా, పారదర్శకతతో తీసుకుంటున్నట్లు జతిన్ దలాల్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వ్యాపార కార్యకలాపాలకు అనుగుణంగా ఫ్రెషర్స్‌ను ఏడాది పొడవునా సంబంధిత ప్రాజెక్ట్‌లలో కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ఆప్షన్లు మాత్రమే ఇస్తాం.. ఉద్యోగులదే తుది నిర్ణయం ఉద్యోగులకు మేం ఆప్షన్లు మాత్రమే ఇస్తాం. కంపెనీలో చేరుతారా? లేదా అనేది వాళ్లు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు సైతం ఉద్యోగుల శ్రేయస్సు కోరే విధంగా ఉంటాయి. కాబట్టే, ఫ్రెషర్లు ఎక్కువ ప్యాకేజీలు తీసుకొని ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురు చూడకుండా.. కంపెనీ ఆఫర్ చేసిన జీతానికి కంపెనీలో చేరాలని నిర్ణయించుకున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్రెషర్స్ వేతనాల తగ్గింపు ఈ ఏడాది మార్చి నెలలో విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసిన ఫ్రెషర్స్‌కు ప్రారంభ వేతనం రూ.6.5 లక్షలు ఇస్తామని తెలిపింది. ఆ తర్వాత రూ.6.5 లక్షల ప్యాకేజీని కాస్త రూ.3.5లక్షలకు కుదించింది. దీనిపై మేం ఇచ్చే ఆఫర్‌కు ఒప్పుకోవాలని ఫ్రెషర్స్‌పై ఒత్తిడి తేవడం లేదు. తక్కువ ఆఫర్‌తో ఆన్‌బోర్డ్‌లోకి బోర్డులోకి వెళ్లాలనుకుంటున్నారా? అని నిర్ణయం తీసుకునేందుకు తగిన సమయం ఇచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కస్టమర్ల అవసరాల్ని గమనిస్తున్నాం మా పరిశ్రమలోని ఇతరుల మాదిరిగానే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, కస్టమర్ అవసరాలను అంచనా వేస్తున్నాం. ఇది మా నియామక ప్రణాళికలకు కారణమవుతుంది. ప్రస్తుతం, మాకు రూ. 3.5 లక్షల వార్షిక వేతనంతో విధులు నిర్వహించే ఇంజినీర్లు అందుబాటులో పొందిన ఫ్రెషర్లకు పంపిన ఇమెయిల్‌లో కంపెనీ పేర్కొంది. చదవండి👉 కంపెనీలను మోసం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ఏరివేసే పనిలో సంస్థలు! -
ఐటీ ఉద్యోగులకు చేదువార్త: వేరియబుల్ పే కట్స్, హైరింగ్‌పై నిపుణుల వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: రెసిషన్ లేదా ఆర్థిక మాంద్యం వచ్చిందంటే చాలు..ముందుగా ప్రభావితమయ్యేది ఐటీ రంగం. ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్థూల ఆర్థిక మందగమనంనేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగాపలు దిగ్గజ టెక్ కంపెనీలు వేలాది ఉద్యోగులను నిరుద్యోగం లోకి నెట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఐటీరంగం, వాటి ఆదాయాలపై కూడా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. (IPL 2023: షారుక్ రైట్ హ్యాండ్, కేకేఆర్ సీఈవో గురించి ఇంట్రస్టింగ్ విషయాలు) ప్రధానంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ వంటి భారతీయ ఐటీ కంపెనీలకు రానున్న ఆదాయాల సీజన్ అగ్నిపరీక్షగా మార నుంది. ప్రస్తుత ప్లేస్మెంట్ సెషన్లో తమ క్యాంపస్ హైరింగ్ డ్రైవ్‌లో అంత యాక్టివ్‌గా లేవు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, ఈ ఏడాది నియామకాలు మందగించాయి. ఫ్రెషర్ ఆన్‌బోర్డింగ్ , వేరియబుల్ చెల్లింపులలో కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. రానున్న (కనీసం స్వల్పకాలమైనా) ఇదే ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా వేరియబుల్ పే చెల్లింపుల్లో ఉద్యోగులకు నిరాశే ఎదురుకానుందని అంనా వేస్తున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో వేరియబుల్ చెల్లింపులు దాదాపు లేనట్టేనని HR సంస్థ అసోసియేట్ శ్రీరామ్ వెంకట్ వ్యాఖ్యలనుబిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది. దిగువ-బ్యాండ్ ఉద్యోగులు కోతల పరిమిత ప్రభావాన్ని ఎదుర్కొంటారని, అయితే వ్యాపార యూనిట్ పనితీరును బట్టి మధ్య నుండి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లకు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. లార్జ్ క్యాప్ ఐటి కంపెనీలలో ఇది 85-100 శాతం వరకు ఉండవచ్చు. ఇది వ్యాపార యూనిట్ పనితీరుపై ఆధారపడి ఉంటుందన్నారు. టీసీఎస్ లాంటి ప్రధాన కంపెనీల్లోతొలి క్యూ3లో హెడ్‌కౌంట్ తగ్గిందని ఇది పరిస్థితి సూచిస్తోంది. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) అలాగే ఉద్యోగ నియామకాల మందగింపు వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత మందగమనం నియామకాలు, విస్తరణపై ఖచ్చితమైన ప్రభావం చూపింది. ఈ ఆర్థిక అనిశ్చితి కారణంగా, కంపెనీలు నియామకాల్లో జాగ్రత్తగా వ్యవహరించడంతో హెడ్‌కౌంట్ వృద్ధి మందగించిందని ఫోర్కైట్స్ (APAC) హెచ్ఆర్ డైరెక్టర్, కళ్యాణ్ దురైరాజ్ తెలిపారు. పరిశ్రమ విస్తృత తొలగింపుల కారణంగా అవకాశాలు లేకపోవడం వల్ల స్వచ్ఛంద అట్రిషన్ మధ్యస్తంగా ఉండవచ్చని నిపుణులు తెలిపారు. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?) కోవిడ్ తర్వాత ఎంట్రీ-లెవల్ టాలెంట్లను నియమించుకున్న కంపెనీలు, ఎంట్రీ లెవల్ టాలెంట్ హైరింగ్స్ పెరిగాయి, కానీ ఖచ్చితంగా ఫ్రెషర్ హైరింగ్, క్యాంపస్ హైరింగ్‌లో తగ్గుదల, ఒత్తిడిని చూస్తామన్నారు క్వెస్ ఐటి స్టాఫింగ్ సీఈవో విజయ్ శివరామ్. కానీ ఇంతకుముందు సంవత్సరాల్లో ఈ పరిస్థితి లేదని చెప్పారు. -
తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ప్రైవేటు కాలేజీల నిర్వహణ కష్టంగా ఉందని ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీసతీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడి సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు స్థాపించిన కాలేజీలపట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. తమ కాలేజీల్లో 9.40 లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. 2021–22 సంవత్సరానికి రూ.86.55 కోట్లు ట్రెజరీకి విడుదలైనా ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వలేదని, 2022–23 సంవత్సరానికి రూ.226 కోట్లు ఇంకా విడుదల చేయలేదన్నారు. దీనివల్ల అధ్యాపకులకు వేతనాలు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక వసతులులేవని వేధించే ప్రభుత్వం, తమకు రావాల్సిన బకాయిలు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. గడచిన ఎనిమిదేళ్లలో కాలేజీలపై వివిధ రకాల ఫీజులను 10 నుంచి 50 శాతం పెంచారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మాత్రం ఆ నిష్పత్తిలో పెంచలేదన్నారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో సంఘం నేతలు ఇంద్రసేనరెడ్డి, ఉస్మాన్, ఎస్ఎన్ రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Fact Check: ‘అంగన్వాడీ’లకు ఫిబ్రవరి వరకు జీతాలిచ్చాం
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కార్యకర్తలకు నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడంలేదంటూ ‘ఈనాడు’ రాసిన కథనం పూర్తిగా అవాస్తవమని మహిళా, అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంచాలకుడు బి.రవిప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వాస్తవాలను వివరిస్తూ ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు ఈ ఏడాది ఫిబ్రవరి వరకు జీతాలు చెల్లించామని వివరించారు. ఎవరికీ ఎటువంటి వేతన బకాయిలు లేవన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు గౌరవ వేతనం కింద ఇప్పటివరకు రూ.1,019 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తిగా అమలు చేసిన కార్యకర్తలకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 చొప్పున అందిస్తున్నామన్నారు. ఇందుకోసం 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.27.80 కోట్లు విడుదల చేసినట్టు రవిప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం కంటే అధికంగా.. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు గత ప్రభుత్వం కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అత్యధిక గౌరవ వేతనం ఇస్తోంది. గత ప్రభుత్వం ఐదేళ్లలో గౌరవ వేతనంగా మొత్తం రూ.2,864.94 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.4,234.93 కోట్లకు పైగా వేతనాల కోసం వెచ్చించింది. అంతేకాకుండా అధికారంలోకి రాగానే అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనాలు పెంచింది. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.11,500, ఆయాలకు నెలకు రూ.7,000 చొప్పున అందిస్తోంది. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలు ఇవి.. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, సహాయకులకు ప్రభుత్వం అనేక ప్రయోజనాలు కల్పించింది. సెలవులు: అంగన్వాడీ కేంద్రాల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి పర్యవేక్షించడంతోపాటు కార్యకర్తలు, సహాయకులకు ఏడాదికి 20 రోజుల వార్షిక సెలవులను ప్రభుత్వం ఇస్తోంది. గరిష్టంగా రెండు పర్యాయాలు 180 రోజులపాటు ప్రసూతి సెలవులు మంజూరు చేస్తోంది. గర్భస్రావం జరిగినప్పుడు 45 రోజులు సెలవు ఇస్తోంది. ఏటా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు 15 రోజులు వేసవి సెలవులు మంజూరు చేస్తోంది. చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ పదోన్నతులు: అర్హులైన అంగన్వాడీ వర్కర్లను సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుల్లో నియమిస్తున్నారు. పరీక్ష ద్వారా 100 శాతం కోటాతో భర్తీ చేస్తున్నారు. అలాగే విస్తరణ అధికారి, గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి వయోపరిమితి 50 ఏళ్ల వరకు ఉండొచ్చని వెసులుబాటు కల్పిస్తూ 2021 డిసెంబర్లో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పదోన్నతులకు వయోపరిమితిని 45 ఏళ్లకు పెంచింది. బీమాతో ధీమా: ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) ద్వారా 18 నుంచి 50 ఏళ్ల వయసు గల అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు రూ.2 లక్షల జీవిత బీమా సదుపాయం ఉంది. ఏదైనా కారణం వల్ల ప్రాణాపాయం, మరణం సంభవించినప్పుడు ఇది వర్తిస్తుంది. అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీఐ) కింద 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న కార్యకర్తలు, సహాయకులకు ప్రమాద మరణానికి, శాశ్వత వైకల్యానికి రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.లక్ష బీమా వర్తిస్తుంది. అంగన్వాడీ కార్యకర్త బీమా యోజన (ఏకేబీవై) కింద 51 నుంచి 59 ఏళ్ల వయసు గల కార్యకర్తలు, సహాయకులు మరణిస్తే రూ.30 వేలు బీమా వస్తుంది. పదవీ విరమణ ప్రయోజనాలు: అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు గరిష్టంగా 60 ఏళ్లు వచ్చే వరకు పనిచేయవచ్చు. 60 ఏళ్ల తర్వాత పదవీ విరమణ చేసే కార్యకర్తలకు రూ.50 వేలు, సహాయకులకు రూ.20 వేలు ప్రభుత్వం అందిస్తుంది. -
జీతాలపై దుష్ప్రచారం చేస్తున్నారు
సాక్షి, అమరావతి: వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఉద్యోగుల జీతాల విషయంలో ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చాక అదనంగా రెండున్నర లక్షలమందికిపైగా ఉద్యోగాలు ఇచ్చిందని, వారంతా ప్రభుత్వంలో కొత్తగా చేరిన విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఆర్టీసీ విలీనం వల్ల వారు ప్రభుత్వ ఉద్యోగులయ్యారని, గ్రామ సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించాయని, వీటివల్ల జీతాల భారం పెరిగిందని వివరించారు. ప్రభుత్వ సొంత ఆదాయం ఏడాదికి రూ.1.25 లక్షల కోట్ల మేర వస్తుంటే, రూ.90 వేల కోట్లు జీతాలకే సరిపోతోందని చెప్పారు. సీపీఎస్ రద్దు అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందన్నారు. ఈ నెలాఖరులోగా ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.3 వేల కోట్లకుపైగా చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. పీఆర్సీ బకాయిల చెల్లింపులపై ఈ నెల 16వ తేదీన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన చర్చల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. కానీ బయటకు వెళ్లాక ఉద్యమాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. -
కృష్ణా బోర్డులో అంత జీతాలా?.. కేంద్రం ఆగ్రహం
కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూలవేతనంపై 25శాతం అధికంగా చెల్లిస్తుండడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అధిక వేతనం చెల్లింపులను నిలుపుదల చేయాలని, ఇప్పటిదాకా అదనంగా చెల్లించిన వేతనాలను తిరిగి వసూలు చేయాలని కృష్ణా బోర్డును ఆదేశించింది. లేకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవి కేంద్ర పాలన పరిధిలోనే.. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖలోని అంతర్రాష్ట విభాగం ఇంజనీర్లకు మూలవేతనంపై 25శాతం అధికంగా చెల్లిస్తుండగా, సమానంగా తమ ఉద్యోగులకు సైతం 25శాతం మూలవేతనాన్ని అధికంగా చెల్లించాలని 2020 అక్టోబర్ 20న కృష్ణా బోర్డు తీర్మానం చేసింది. దాదాపు రెండేళ్ల నుంచి అధిక వేతనాలు చెల్లిస్తూ వస్తోంది. గోదావరి బోర్డు సైతం తమ ఉద్యోగులకు ఇదే తరహాలో అధిక వేతనాలను చెల్లిస్తామని కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదనలు పంపగా, ఈ విషయం కేంద్రం దృష్టికి వచ్చింది. అధిక వేతనాలను నిలిపేయాలని 2021 జూలైలో కృష్ణా బోర్డుకు కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. స్వయంప్రతిపత్తి కలిగి ఉన్న నేపథ్యంలో కేంద్రం ఆదేశాలను అమలు చేయాల్సిన అవసరం లేదని కృష్ణా బోర్డు కేంద్రానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 85(3)ను ప్రయోగిస్తూ తక్షణమే అధిక వేతనాల చెల్లింపులను నిలుపుదల చేయాలని తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా బోర్డును ఆదేశించింది. -
రాత్రికి రాత్రే ఐటీ ఉద్యోగాలు ఊడుతున్న వేళ..టీసీఎస్ గుడ్‌న్యూస్!
ఆర్ధిక మాద్యం ముంచుకొస్తుందన్న భయాలతో ప్రపంచ వ్యాప్తంగా సంస్థల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో టీసీఎస్ సైతం ఉద్యోగుల్ని ఇంటికి సాగంపుతుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికల్ని టీసీఎస్ ఖండించింది. సంస్థలో చేరిన ఉద్యోగి ప్రతిభను తీర్చిదిద్దుతామే తప్పా.. ఉద్యోగుల్ని తొలగించడం లేదని స్పష్టం చేసింది. ఇటీవల టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ పీటీఐకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయనే అంశం చర్చకు వచ్చింది. ఇక, అట్రిషన్ రేటుతో పాటు ఉద్యోగుల తొలగింపులు ఉంటాయా? అన్న ప్రశ్నకు సమాధానంగా మిలింద్ మాట్లాడుతూ.. స్టార్టప్స్‌లో జాబ్ కోల్పోయిన ఉద్యోగుల్ని టీసీఎస్ నియమించుకునే ప్రణాళికల్లో ఉందని వ్యాఖ్యానించారు. సంస్థలోని ఉద్యోగుల ప్రతిభను మాత్రమే తీర్చిదిద్దుతామే తప్పా.. ఉద్యోగుల్ని తొలగించమని అన్నారు. ఆయా సంస్థలు అవసరానికి మించి ఉద్యోగుల్ని నియమించుకున్నాయి. అనిశ్చితి నేపథ్యంలో వారిని తొలగిస్తున్నాయి. కానీ టీసీఎస్ ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. తమ సంస్థలో ఒక్కసారి చేరితే ఉద్యోగుల నుంచి ప్రొడక్టివిటీ, ఉత్పత్తుల తయారీ గురించి మాత్రమే ఆలోచిస్తుందని, లేఆఫ్స్‌పై కాదని పేర్కొన్నారు. ఒకవేళ సంస్థ ఊహించని దానికంటే నైపుణ్యం తక్కువైతే ఉద్యోగికి ట్రైనింగ్ ఇస్తామని.. అవసరం అయితే ఎక్కువ సార్లు ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రాధన్యత ఇస్తామన్నారు. ప్రస్తుతం టీసీఎస్‌లో మొత్తం 6 లక్షల మంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిఏడు ఉద్యోగులకు శాలరీలు ఎలా పెంచుతామో.. ఈ ఏడాది సైతం అలాగే పెంచుతామని మిలింద్ సూచించారు. అనేక స్టార్టప్‌లు ఉద్యోగుల్ని తొలగిస్తున్నందున.. ఎడ్యుకేషన్, టెక్నాలజీ వంటి రంగాలలో పింక్ స్లిప్‌లు తీసుకున్న ఉద్యోగుల్ని టీసీఎస్ నియమించుకోవాలని చూస్తున్నట్లు మిలింద్ చెప్పారు. దీంతో పాటు యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ విభాగాల్లో ప్రతిభ కోసం నిపుణులైన ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్నట్లు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. -
సీఎం సారూ.. మాకెందుకు సారూ జీతాలు పెంచట్లేదు? వెక్కి వెక్కి ఏడుస్తూ వేడుకోలు
హిమాయత్‌నగర్: ‘‘అయ్యా.. సీఎం సారూ.. మిమ్మల్ని గెలిపించినవారిలో మేం కూడా ఉన్నామయ్యా. మీరంటే మాకూ అభిమానం, మా కేసీఆర్ సారు తెలంగాణ సాధించినోడు, ఆయనను సీఎంగా గెలిపించుకోవాలనే ఆశతో మీకు మా ఇంటిల్లిపాదీ ఓట్లు వేసి గెలిపించుకున్నాం సారూ. అందరికీ అన్నీ చేస్తున్నావు సారూ.. మరి మాకెందుకు సారూ జీతాలు పెంచట్లేదు. ఉప్పు, పప్పు, కారం, నూనె.. ఇలా ఏది కొనాలన్నా కొనలేకపోతున్నాం. మాకిచ్చే ఆ రూ.25 వేల జీతాలు చాలక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాం. మాయందు దయ తలచి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి సారూ’అంటూ సెకెండ్ ఏఎన్ఎంలు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రతి ఒక్కరూ వెక్కి వెక్కి ఏడుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభ్యర్థిస్తున్న తీరు చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. ఈ సన్నివేశం గురువారం హిమాయ త్‌నగర్ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. వీరి కన్నీటిబాధను చూసిన వాహన దారులు సైతం సంఘీభావం తెలిపారు. చలో అసెంబ్లీ నిమిత్తం అన్ని జిల్లాల నుంచి వీరు హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ భవన్ వద్దకు తెల్లవారుజామునే చేరుకున్నారు. వీరిలో కొందరు తమ చంటిబిడ్డలను సైతం వెంట తీసు కొనివచ్చారు. పోలీసులకు, సెకెండ్ ఏఎన్ఎంలకు మధ్య పెద్దఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. మగ పోలీసులు పలువురిని ఈడ్చి రోడ్డు పక్కన వేశారు. మహిళా పోలీసులు చాలాసేపు పక్కనే నిలబడి చోద్యం చూస్తూ నిలబడ్డారు. ఈ సందర్భంగా సెకెండ్ ఏఎన్ఎంల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మమత మాట్లాడుతూ 16 ఏళ్లుగా ప్రభుత్వాలు మాతో గొడ్డుచాకిరి చేయిస్తున్నా యన్నారు. కోవిడ్ సమయంలో నేరుగా కోవిడ్ పేషెంట్లకు ఇంజక్షన్లు చేసింది తామే నన్నారు. ప్రభుత్వం ఏ పనిమొదలు పెట్టినా ముందు ఉండి చేసేది తామేనన్నారు. తమను ఇప్పటికైనా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని అభ్యర్థించారు. -
ట్యాక్స్ చెల్లిస్తున్నారా? పన్ను భారం ఇలా తగ్గించుకోండి!
ఫిబ్రవరి 1న పార్లమెంటులో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఒక పక్క విశ్వవ్యాప్తంగా తరుముకొస్తున్న ఆర్థిక మాంద్యం, మరో పక్క అన్ని రంగాల్లో ధరల పెరుగుదల.. పది రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏవో తాయిలాలు ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తున్న వేతన జీవులు .. ఏవేవో ఊహాగానాలు.. ఏమి అవుతుందో తెలీదు..ఏం వస్తుందో తెలీదు. కానీ, ఏ మార్పూ రాదనుకుని వేతన జీవులు పన్ను భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం మీద దృష్టి సారిస్తే.. అదే ఊరట.. ఉపశమనం.. ఉత్తమం! గవర్నమెంటు ఉద్యోగస్తుల విషయంలో జీతభత్యాలు, అలవెన్సులు, షరతులు, నిబంధనలు, రూల్సు, నియమాలు మారవు. మీ మాట చెల్లదు. కానీ ప్రైవేట్ సంస్థల్లో కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. ఆ వెసులుబాటుతో ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవచ్చు. ►కరువు భత్యం, కరువు భత్య అలవెన్సు .. ఈ రెండింటిని బేసిక్ జీతంలో కలిసిపోయేలా ఒప్పందం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇంటద్దె అలవెన్సు, గ్రాట్యుటీ, పెన్షన్ కమ్యుటెడ్ మీద పన్ను భారం తగ్గుతుంది. ►జీతం మీద నిర్ణయించిన కమీషన్ శాతం .. ఫిక్సిడ్‌గా ఉండాలి. కమీషన్ని జీతంలో భాగంగా పరిగణిస్తారు. ►యజమాని సహకరిస్తే కొన్ని చెల్లింపులను బిల్లులు సబ్మిట్ చేసి తీసుకోండి. అంటే.. రీయింబర్స్మెంటులాగా. ►పెర్క్స్ని తీసుకుని లబ్ధి పొందడం చాలా ఉపయోగం. అలవెన్సులు వద్దు. వాటి మీద పన్ను భారం ఉంటుంది. ►పెర్క్స్ అంటే .. ఇంట్లో టెలిఫోన్, ఇంట్లో కంప్యూటర్, పర్సనల్ ల్యాప్‌టాప్, కొన్ని చరాస్తులను ఇంట్లో వాడుకోవడం.. ఆఫీసులో పనివేళలో రిఫ్రెష్మెంట్లు.. మొదలైనవి. వీటి మీద పన్ను భారం ఉండదు. ►ఆఫీసు కారు మీ స్వంత పని మీద వాడుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. అలా అని దుర్వినియోగం చేయవద్దు. ►మీ యజమాని మీ తరఫున చెల్లించే పీఎఫ్ చందా 12 శాతం వరకు ఇవ్వొచ్చు. ►80సీ సేవింగ్స్ మీ ఇష్టం.. మీ వీలును బట్టి చేయండి. ►హెచ్ఆర్ఏ మినహాయింపు కావాలంటే ఇల్లు మీ పేరు మీద కాకుండా, ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద క్లెయిమ్ చేయండి. వారు అసలు ట్యాక్స్ బ్రాకెట్లో లేకపోతే మీకు ఎంతో ప్రయోజనం. ►ఎరియర్స్ జీతాలు చేతికి వచ్చినప్పుడే పన్నుభారం లెక్కిస్తారు. ఫిబ్రవరి 1 నాడు బడ్జెట్ వస్తోంది. 01–04–2023 నుంటి శ్లాబులు మారతాయి అని అంటున్నారు. అలా మారడం వల్ల ఉపయోగం ఉంటే ఎరియర్స్‌ను వచ్చే ఏడాది ఇవ్వమనండి. ►కొన్ని కంపెనీల్లో వారికి మీ సేవలు కావాలి. మీ హోదా.. అంటే మీరు ఉద్యోగా? కన్సల్టెంటా అన్నది ముఖ్యం కాదు. అలాంటప్పుడు కన్సల్టెంటుగా ఉండండి. అప్పుడు 10 శాతం పన్ను డిడక్ట్ చేస్తారు. మీ ఖర్చుల్ని బట్టి మీ నికర ఆదాయాన్ని మీరే లెక్కించుకోవచ్చు. -
జీతాలపై ఎందుకీ దుర్మార్గపు రాతలు?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తేదీనే జీతాలిస్తున్న రాష్ట్రమేదైనా ఉందా? పోనీ మన రాష్ట్రంలో గత ప్రభుత్వాలన్నీ ఇలా 1వ తేదీనే ఇచ్చాయా? ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ అందరికీ 1వ తేదీనే ఇచ్చిన దాఖలాలు లేవు కదా? ప్రభుత్వంలో లక్షల మంది ఉద్యోగులు, వివిధ రకాల విభాగాలు ఉన్నపుడు... వారి బిల్లులన్నీ అప్లోడ్ చేయటం, వాటిని ఆమోదించటం అన్నీ పూర్తయి... అందరికీ 1వ తేదీనే ఇవ్వటం సాధ్యమా? గతంలో కూడా ఇలా ఇవ్వలేనపుడు... ఇప్పుడు మాత్రమే ‘ఈనాడు’ ఎందుకీ వ్యతిరేక కథనాలను వరసగా ప్రచురిస్తోంది? ఎప్పుడో 1977లోనే జీవో అమల్లోకి వచ్చిందని... 1990 నుంచీ చిన్న మార్పు జరిగిందని... కథలు కథలుగా వండి వారస్తున్న రామోజీరావు... 2014 నుంచీ 2019 మధ్య చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నపుడు ఇలా ఠంచన్‌గా 1వ తేదీన ఇవ్వలేదనే సంగతి ఎందుకు ప్రస్తావించరు? ఈనాడే కాదు... బాబు అధికారంలో ఉండగా ఏనాడూ ప్రశ్నించలేదెందుకు? మరీ ఇంత దుర్మార్గపు రాతలా? గతంలోనూ 1– 20వ తేదీ మధ్యనే కదా.. రెగ్యులర్ ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లింపులు జరిగాయి. ఆ విషయాన్నెందుకు ప్రస్తావించరు రామోజీ? మరో ప్రధానాంశమేంటంటే చంద్రబాబు నాయుడి హయాంలో కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీ వర్కర్లు, రిసోర్స్ పర్సన్లు, ఆశా వర్కర్లకు, మధ్యాహ్న భోజన పథకం ఆయాలకు నెలల తరబడి జీతాలు అందేవి కావు. ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. 104, 108 వాహనాల ఉద్యోగులదీ అదే పరిస్థితి. ఆరేడు నెలల పాటు వేతనాలు చెల్లించకపోయినా రామోజీరావు ఒక్క అక్షరం ముక్క కూడా రాయలేదు. వారికి మద్దతు పలకనే లేదు. కానీ ఇప్పుడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, ఆర్పీలు... ఇలా అందరికీ రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఏ నెల వేతనాలు ఆ నెలలోనే చెల్లిస్తున్నారు. అలా చెల్లించడానికి ఒక పెద్ద వ్యవస్థ ఏర్పడింది. ఇదో విప్లవాత్మక మార్పు. కానీ ఈ స్థాయి సానుకూల సంస్కరణను ‘ఈనాడు’ ఒక్కనాడు కూడా ప్రస్తావింలేదు. బాబు హయాంలో దారుణ పరిస్థితుల్ని... ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మంచిని... రెండింటినీ ప్రజలకు చెప్పకపోవటమే రామోజీరావు పాలసీ. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తేదీనే జీతాలు రావటం లేదని రోజూ దారుణమైన అవాస్తవ కథనాలను వండి వారుస్తున్నారు. మెజారిటీ ఉద్యోగులకు నెల తొలినాళ్లలోనే జీతాలు పడుతున్నా... బిల్లుల సమర్పణలో జాప్యం, ఇతరత్రా కారణాల వల్ల కొద్ది మందికి మాత్రం 20వ తేదీ వరకు సమయం పడుతోంది. ‘ఈనాడు’ మాత్రం ఈ వాస్తవాలకు మసిపూసి... ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు హయాంలో ఉద్యోగులకు ఏకంగా 5 డీఏలు బకాయిలు పెట్టినా పట్టించుకోని రామోజీరావు... ఇతర ఎల్లో మీడియా ప్రచురిస్తున్న కథనాలను ఆరి్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తీవ్రంగా తప్పు పట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ‘ఈనాడు’తో పాటు కొన్ని పత్రికలు పనికట్టుకొని తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని, వాటిపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించకుండా వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ రాస్తున్న కథనాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నామంటూ... శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తప్పుడు కథనాలను నమ్మొద్దని, ఉద్యోగుల సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ప్రకటన ముఖ్యాంశాలివీ... 24లోగా బిల్లులు పూర్తి చేయాలని చెప్పాం – రాష్ట్ర విభజన సందర్భంగా ఆరి్థక వనరుల పంపిణీ అశాస్త్రీయంగా ఉండటంతో పాటు కోవిడ్ సంక్షోభం కారణంగా ఆరి్థకంగా తీవ్ర ప్రభావం పడినప్పటికీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తోంది. ఇందుకోసం అనేక చర్యలు తీసుకుంది. – సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి పెన్షన్ బిల్లులను 16వ తేదీ నుంచి ప్రారంభించి 24వ తేదీలోగా పూర్తి చేయాలని డీడీవోలకు ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్లు, జీతాల చెల్లింపును నెల తొలి పని దినం నుంచి ప్రారంభించి.. నెలాఖరులోగా ఆడిట్ పూర్తి చేయాలని ట్రెజరీలకు ఆదేశాలిచి్చంది. – రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లిస్తూనే మరో పక్క ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజనం కుక్ కమ్ హెల్పర్లు, హోంగార్డులు, వీఏవోలు, ఆర్పీలు, గిరిజన సంఘం కార్యకర్తలు, కాంట్రాక్టు ఉద్యోగులకు నెలలో 21వ తేదీలోగా జీతాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. – గతంలో ఈ కేటగిరి ఉద్యోగుల్లో కొంత మందికి నెలల తరబడి జీతాలు అందేవి కావు. ఈ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపునకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ఆప్కోస్ పేరుతో కార్పొరేషన్‌ను సైతం ఏర్పాటు చేసింది. ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం – రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా 2019 జూలై 6న జీవో 60 జారీ ద్వారా 27 శాతం మధ్యంతర భృతి మంజూరు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ సంస్థలు, వర్క్ చార్జ్ ఉద్యోగులు, 2015లో సవరించిన వేతనాలు పొందుతున్న పూర్తి స్థాయి కంటింజెంట్ ఉద్యోగులకు మధ్యంతర భృతి వర్తింప చేసింది. పెన్షనర్లకు కూడా జీవో 61 ద్వారా 27 శాతం మధ్యంతర భృతి మంజూరు చేసింది. మధ్యంతర భృతి ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు 2019 జూలై 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు రూ.17,918 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఇందులో ఉద్యోగులకు రూ.11,984 కోట్లు కాగా, పెన్షనర్లకు రూ.5,933 కోట్లు. – ఉద్యోగులకు 11వ వేతన సవరణ సిఫార్సులు అమలు చేయడం ద్వారా ఏడాదికి అదనంగా 11,707 కోట్లు వ్యయం అవుతోంది. ఈ మేరకు ఉద్యోగులు ప్రయోజనం పొందారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పొడిగించటంతో ప్రస్తుత ఉద్యోగులందరితో పాటు ప్రభుత్వంలో చేరుతున్న ఉద్యోగులకూ ప్రయోజనం కలుగుతోంది. వయోపరిమితి పెంపుతో 26,878 మంది ఉద్యోగులకు తక్షణ లబ్ధి కలిగింది. – కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి కనీస వేతన స్కేళ్లను వర్తింప చేస్తూ 2021 జూన్ 18న జీవో 40 జారీ చేసింది. 2015లో సవరించిన పే స్కేళ్ల ప్రకారం మినిమమ్ టైమ్ స్కేలును ప్రభుత్వంలోని కాంట్రాక్టు ఉద్యోగులకు, యూనివర్సిటీలు, సొసైటీలు, కెజీవీబీ మోడల్ స్కూల్స్‌లో పనిచేసే వారికి వర్తింప చేశారు. ప్రభుత్వ శాఖలు, విశ్వవిద్యాలయాలు, సొసైటీలు, కెజీవీబీ, మోడల్ స్కూల్స్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వివాహిత మహిళా ఉద్యోగులకు మొదటి రెండు శిశు జననాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. – కాంట్రాక్టు ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు, సరీ్వసులో ఉండగా సహజ మరణం అయితే రెండు లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేíÙయా చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్యల వల్ల కాంట్రాక్టు ఉద్యోగులు ఏడాదికి రూ.360 కోట్లు అదనపు ప్రయోజనం పొందుతున్నారు. సవరించిన వేతన స్కేళ్ల ప్రకారం 2022 జనవరి 1 నుంచి కాంట్రాక్టు ఉద్యోగులందరికీ మినిమమ్ టైమ్ స్కేళ్లను వర్తింప చేశారు. – ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న మంజూరైన పోస్టుల రిక్రూట్మెంట్ ప్రక్రియను సమీక్షించడంతో పాటు నోటిఫికేషన్ జారీ చేయడానికి కచి్చతమైన సమయ పాలనను పాటించేలా దశల వారీగా ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంది. అందుకనుగుణంగా 2021–22 లో 10,143 పోస్టుల భర్తీకి వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. 292 గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల భర్తీకి ఆరి్థక శాఖ 2022 మార్చి 31నన జీవో 78 జారీ చేసింది. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో 47 వేల పోస్టులకు పైగా భర్తీ చేసింది. ఇతర శాఖల్లో 1,958 పోస్టుల భర్తీతో కలిపి మొత్తం 23,485 పోస్టుల భర్తీకి అనుమతించింది. – ఆర్టీసీ ఉద్యోగుల కోసం ప్రభుత్వంలో కొత్తగా పబ్లిక్‌ట్రాన్స్‌పోర్టు శాఖను ఏర్పాటు చేసి ఆరీ్టసీకి చెందిన 53,500 మంది ఉద్యోగులను 2020 జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగుల సరీ్వసులోకి తీసుకుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు శాఖలో చేరిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ 2020 జనవరి నుంచి ప్రభుత్వమే వేతనాలను చెల్లిస్తోంది. 2020 జనవరి నుంచి డిసెంబర్ 2021 వరకు ఉద్యోగులకు వేతనాల రూపంలో రూ,5,900 కోట్లు చెల్లించింది. – పౌరుల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలందించేందుకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో కొత్తగా 1.28 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులను నియమించింది. దీనివల్ల ఏడాదికి రూ.2,300 కోట్లు ఆర్థిక భారం పడుతోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పే స్కేళ్లను వర్తింప చేసింది. – ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలో అవినీతి నిరోధించాలనే ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఏజెన్సీల వ్యవస్థకు స్వస్తి పలికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించే అవాంతరాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్స్డ్ సరీ్వసెస్‌ను (ఆప్కోస్) ఏర్పాటు చేసి పూర్తి ప్రైవేట్ ఏజెన్సీలకు తావు లేకుండా చేసింది. ఆప్కోస్ పరిధిలోకి 98,016 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వచ్చారు. వీరందరికి నెలలో తొలి పనిదినం రోజున వేతనాలు చెల్లిస్తున్నారు. వేతనాల రూపంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా రూ.150 కోట్లు చెల్లిస్తున్నారు. ఈపీఎఫ్, ఈఎస్ఐలను వర్తింప చేస్తున్నారు. – ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సరీ్వసు కమిషన్ నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షల్లో ప్రతికూల మార్కుల విధానాన్ని ప్రభుత్వం తొలగించింది. కనీస ఉత్తీర్ణత మార్కులను సక్రమంగా పునరుద్ధరించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ పరీక్షల నిబంధనలు–1965లో సవరణలు తీసుకువస్తూ 2020 సెపె్టంబర్ 25న జీవో 101 జారీ చేసింది. – 1995 నుండి 2011 మధ్య నియమించబడిన వివిధ ఫీడర్ కేటగిరీలకు చెందిన మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ల (ఎంపీడీఓలు) సీనియారిటీని ఖరారు చేయడంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కరించింది. డైరెక్ట్ రిక్రూట్ ఎంపీడీఓల కోసం 5:3:3 నిష్పత్తిలో ఎంపీడీఓలకు ప్రమోషన్ ఛానెల్ ఖరారు చేసింది. – గ్రామ రెవెన్యూ ఆఫీసర్లకు సూపర్ సెషన్లో సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులకు మార్గం సుగమం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీఆర్ఏ కేడర్ నుంచి 3,795 గ్రామ రెవెన్యూ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. – హైదరాబాద్ నుంచి తరలి వచి్చన ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాల అమలును కొనసాగిస్తోంది. – 12 సంవత్సరాల అనంతరం తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఉద్యోగ సంఘాల అసోసియేషన్లతో చర్చల ద్వారా వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంది. – వివిధ శాఖల్లోని 3,01,020 మంది చిరు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలను పెంచింది. ఈ వేతనాల పెంపు వల్ల రూ,1,196 కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు వేతనాలు చేరాయి. వివిధ శాఖల్లోని ఉద్యోగుల జీతాలు ఈ విధంగా పెరిగాయి -
ప్రైవేట్ ఉద్యోగులకు పండగే, ఈ ఏడాది భారీగా పెరగనున్న జీతాలు!
భారతీయ ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది ఏసియా దేశాల్లో భారత్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగులకు జీతాలు 15 శాతం నుంచి 30 శాతం పెరగనున్నట్లు కార్న్ ఫెర్రీ నివేదిక తెలిపింది. సౌత్ ఏసియన్ దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సగటు వేతనం ఈ ఏడాది 9.8 శాతం పెరగనుండగా.. అదే యావరేజ్ శాలరీ గతేడాది 9.4శాతం ఉందని తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా లైఫ్ సైన్స్, టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాలకు చెందిన ఉద్యోగుల యావరేజ్ శాలరీ 10శాతం కంటే ఎక్కువ పెరగనున్నట్లు హైలెట్ చేసింది. 818 కంపెనీలు..8లక్షల ఉద్యోగుల జీతాలను కార్న్ ఫెర్రీ దేశ వ్యాప్తంగా 818 కంపెనీల్లో పనిచేస్తున్న 8లక్షల మంది ఉద్యోగులు, 61శాతం సంస్థలు ఉద్యోగులకు చెల్లించే జీతాలను పరిగణలోకి తీసుకొని ఏ దేశంలో, ఏ రంగంలో ఎంతెంత శాలరీలు పెరుగుతున్నాయనేది స్పష్టం చేసింది. శాలరీ పెంచే అంశంలో భారత్ ముందంజ ఆ లెక్కన భారత్‌లో ఉద్యోగుల యావరేజ్ శాలరీ 9.8శాతం పెరగనుండగా..ఆస్ట్రేలియాలో 3.5శాతం, చైనాలో 5.5శాతం, హాంగ్‌కాంగ్ 3.6శాతం, ఇండోనేషియాలో 7శాతం, కొరియాలో 4.5 శాతం, మలేషియాలో 5శాతం, న్యూజిల్యాండ్‌లో 3.8శాతం, ఫిలిప్పీన్స్‌లో 5.5శాతం, సింగపూర్‌లో 4శాతం, థాయిల్యాండ్‌లో 5శాతం, వియాత్నంలో 8శాతంగా పెరగనున్నాయి. 60శాతం కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే మొగ్గు టైర్ 1 నగరాలుగా పిలువబడే ప్రధాన మెట్రోపాలిటన్ కేంద్రాల్లోని ఉద్యోగులు అధిక వేతనం పొందుతున్నట్లు కార్న్ ఫెర్రీ తెలిపింది. హైబ్రిడ్, రిమోట్ వర్కింగ్ వంటి కొత్త వర్క్ కల్చర్ పుట్టుకొని రావడంతో.. 60 శాతం కంపెనీలు ఉద్యోగుల్ని ఇంటి వద్ద నుంచే పనిచేయిస్తున్నాయి. చదవండి👉 'జీతం తక్కువైతే పిల్లను కూడా ఇవ్వరు!' -
జాబ్‌కు రిజైన్ చేస్తున్నారా? ఆ పని మాత్రం చేయకండి! ఎందుకంటే?
ఉదయం తొమ్మిదింటికల్లా తయారై టిఫిన్ బాక్సు సర్దుకుని ఆఫీసుకు బయల్దేరడం. రాత్రికల్లా ఉసూరంటూ ఇల్లు చేరడం. కుటుంబీకులతో గడపాలన్నా, పెళ్లిళ్ల వంటి వాటికి వెళ్లాలన్నా సెలవు రోజుల్లోనే! ఇదంతా ఒకప్పటి ఉద్యోగి జీవితం. కానీ కరోనాతో అంతా మారిపోయింది. ఇంటినుంచే పని. నచ్చిన ఉద్యోగం. కావాల్సినంత జీతం. ఇంతకంటే ఏం కావాలి’ అంటూ చేస్తున్న ఉద్యోగాలకు ఉన్న పళంగా రాజీనామాలు (ది గ్రేట్ రిజిగ్నేషన్) చేసి కొత్త ఉద్యోగాలు వెతుక్కున్నారు. ఫలితం? ఉద్యోగులు ఊహించింది వేరు. అక్కడ జరుగుతుంది వేరంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. బ్యూరో ఆఫ్ లేబర్ గణాంకాల ప్రకారం.. గతేడాది అమెరికాకు చెందిన 4.7 కోట్ల మంది ఉద్యోగాలు మారారు. ఈ ఏడాది ఒక్క మార్చిలోనే ఏకంగా 45 లక్షల మంది ఉద్యోగాలు మానేశారు. మన దేశంలోనూ ఐటీ, టెలికాం రంగాల్లో ఏకంగా 86 శాతం మంది ఉద్యోగం మారాలనుకుంటున్నారని మైకెల్ పేజ్ సర్వేలో తేలింది! 2022 మార్చి త్రైమాసికంలో టీసీఎస్ కంపెనీలో 17.4 శాతం, హెచ్‌సీఎల్‌లో 21.9 శాతం, విప్రోలో 27.7 శాతం మంది ఉద్యోగులు మానేశారు! నచ్చిన పనివిధానం కోసం జీతం తక్కువైనా, ప్రమోషన్లు లేకున్నా పర్లేదని మన దేశంలో ఏకంగా 61 శాతం మంది ఉద్యోగులు కోరుకుంటున్నారట! చదవండి👉 ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్ అయితే తాజాగా ఉద్యోగుల రిజైన్లపై ఇండీడ్ హైరింగ్ ల్యాబ్ ఎకనామిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ నిక్ బంక్ స్పందించారు. నచ్చిన పనిగంటలు, ఎక్కువ జీతం కోసం ఆశపడి ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన ఉద్యోగులు అసంతృప్తిలో ఉన్నట్లు తెలిపారు. ఎందుకంటే? ఈ ఏడాది జులైలో రిజైన్ చేసి వేరే సంస్థలో చేరిన ఉద్యోగి జీతం వృద్ధి 8.5శాతంగా ఉంది. కానీ మూడు నెలలు తిరక్కుండా ఉద్యోగుల శాలరీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది. ఆగస్ట్‌లో శాలరీ వృద్ధి రేటు ఆగస్ట్‌లో 8.4శాతం, సెప్టెంబర్‌లో 7.9శాతం, అక్టోబర్‌లో 7.6శాతం, నవంబర్‌లో 6.4శాతం కంటే ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. తొందరపడకండి మరోవైపు గ్లాస్‌డోర్ ఎకనమిస్ట్ డేనియల్ జావో మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో దిగ్రేట్ రిజిగ్నేషన్ అంశం ముగియలేదు. జాబ్ మార్కెట్లో ఉద్యోగాల రాజీనామా సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ ఆర్ధిక మాద్యం ముప్పు కారణంగా తగ్గే అవకాశం ఉంది. ఇక జాబ్ మారే ఉద్యోగులు ఇంతకు ముందులా..మాకు ఇంత శాలరీ కావాలని డిమాండ్ చేయడం సాధ్యం కాదన్నారు. అందుకే ఉద్యోగులు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని అన్నారు. వచ్చే ఏడాది వచ్చే ఏడాది ఉద్యోగులపై ఆర్ధిక మాంద్యం ప్రభావం తక్కువే. అయినప్పటికీ ఉద్యోగం చేస్తున్న వారు. లేదంటే ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్న వారికి 2023 కొంచెం గడ్డు కాలమని అని అన్నారు. జాబ్ సెక్యూరిటీ, జీతాల నెగోషియేషన్లు ఉద్యోగికి సంతృప్తిని ఇవ్వకపోవచ్చని తెలిపారు. చదవండి👉 వేలాది మంది ఉద్యోగుల తొలగింపు, ‘యాపిల్ సంస్థను అమ్మేయండి’! -
AP: అక్టోబర్ 1 నుంచే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ పేస్కేల్
సాక్షి, అమరావతి : ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) ఉద్యోగులకు నేటి (అక్టోబరు 1) నుంచి ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించనున్నారు. ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేరుస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని గతంలోనే ప్రభుత్వంలో విలీనం చేశారు. ఫలితంగా ఆర్టీసీపై ఉద్యోగుల జీతాల చెల్లింపు భారం తొలగిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వ పే స్కేల్‌ను కూడా వర్తింపజేయడంతో దాదాపు 52వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలగనుంది. పే స్కేల్ నిమిత్తం ఆర్టీసీ ఉద్యోగుల కేడర్‌ను కూడా ఇప్పటికే ఖరారుచేశారు. ఇక దర్జాగా ప్రభుత్వ జీతాలు ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నప్పుడు ప్రతినెలా ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఉండేది. ఆ అప్పుల మీద వడ్డీ భారమే ఏడాదికి రూ.350 కోట్లు చెల్లించాల్సి రావడంతో ఆర్టీసీ ఖర్చులు తడిసిమోపెడయ్యేవి. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్టీసీని 2020, జనవరి 1 నుంచి ప్రభుత్వంలో విలీనం చేసింది. అప్పటి నుంచి దాదాపు 52 వేలమంది ఉద్యోగుల జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందుకు ప్రభుత్వం నెలకు రూ.300 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3,600 కోట్లు వెచ్చించింది. ఇలా ఇప్పటికి రెండేళ్ల 9 నెలల్లో రూ.9,900 కోట్లను ప్రభుత్వం జీతాల కింద చెల్లించింది. ప్రభుత్వ కొత్త పే స్కేల్ ప్రకారం జీతాల చెల్లింపుతో సర్కారుపై ఏడాదికి రూ.360 కోట్ల అదనపు భారం పడుతుంది. అలాగే, మొత్తం మీద రూ.3,960 కోట్ల ఆర్థికభారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. మరోవైపు.. ప్రభుత్వంలో సంస్థను విలీనం చేయడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే పలు ప్రయోజనాలూ పొందుతున్నారు. చదవండి: ఏపీలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ -
రైల్వే ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్!
ఉద్యోగులకు రైల్వే శాఖ భారీ షాక్ ఇవ్వనుంది. విపరీంగా పెరిగిపోతున్న ఖర్చులపై ఆందోళన చెందుతున్న రైల్వే బోర్డు..ఉద్యోగులకు చెల్లించే భత్యాలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఛైర్మన్ వీకే త్రిపాఠీ ఆధ్వర్యంలో రైల్వే బోర్డ్ ఏడు జోన్లలో రివ్వ్యూ నిర్వహించింది. మీటింగ్‌లో ఈ ఏడు జోన్లకు సంబంధించి ఓవర్ టైం చేస్తున్న రైల్వే ఉద్యోగులకు చెల్లించే అలవెన్స్‌లు, నైట్ డ్యూటీ, ట్రావెల్, ఇంధన వినియోగం, నిర్వహణ ఖర్చుల్ని వీకే త్రిపాఠి ఆరా తీసినట్లు సమాచారం. అయితే ఈ సందర్భంగా గతేడాది కంటే ఈ ఏడాది సాధారణ పని ఖర్చులు ( Ordinary Working Expenses) సగటున 26శాతం పెరిగాయని పీటీఐకి తెలిపారు. ముఖ్యంగా నార్తీస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (37.9 శాతం), నార్తన్ రైల్వే (35.3 శాతం), దక్షిణ మధ్య రైల్వే (34.8 శాతం), సౌత్ వెస్ట్ రైల్వే (33.1 శాతం), నార్త్ వెస్ట్ రైల్వే (29 శాతం), పశ్చిమ రైల్వే (28 శాతం) , ఉత్తర మధ్య రైల్వే (27.3 శాతం) ఉన్నట్లు గుర్తించారు. ఇలా ఖర్చులు కొనసాగితే 2022-2023లో రైల్వే బడ్జెట్ మొత్తం పని ఖర్చులు రూ.2.32లక్షల కోట్లు ఉండొచ్చని రైల్వే బోర్డు అంచనా వేసింది. ప్రస్తుతం ఆడిట్ కంప్లీట్ కాలేదు కాబట్టి అంచనా మాత్రమే చెప్పినట్లు పీటీఐ అడిగిన ప్రశ్నకు రైల్వే విభాగం తెలిపింది. ఈ తరుణంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పినట్లుగానే వ్యయ నియంత్రణ, నిర్వహణపై రైల్వే బోర్డు మార్గదర్శకాలను జారీ చేసినటు తెలుస్తోంది. అంతేకాదు రైల్వే బోర్డు వారి ఖర్చులను తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని జోన్లకు సూచించింది. అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జనరల్ మేనేజర్లను కోరినట్లు వర్గాలు తెలిపాయి. ఓటీ (ఓవర్‌టైమ్), ఎన్డీఏ (నైట్ డ్యూటీ అలవెన్స్), కేఎంఏ (కిలోమీటరేజీ అలవెన్స్) వంటి నియంత్రిత వ్యయాలను చాలా నిశితంగా పరిశీలించాలని రైల్వే బోర్డు జనరల్ మేనేజర్లకు సూచించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదనంగా, తూర్పు రైల్వే (ఈఆర్ ), దక్షిణ రైల్వే (ఎస్ఆర్), నార్త్ ఈస్టర్న్ రైల్వే (ఎన్ఈఆర్), ఉత్తర రైల్వే (ఎన్ఆర్ ) వంటి జోన్లు రైళ్లను నడిపే రన్నింగ్ సిబ్బందికి, సౌత్ ఈస్ట్ సెంట్రల్ అయితే కిలోమీటరు భత్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రైల్వే (ఎస్ఈసీఆర్), ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఈసీఆర్), ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్) నైట్ డ్యూటీ అలవెన్సుపై తమ వ్యయాన్ని తగ్గించాలని కోరింది. -
ఎయిరిండియా ఉద్యోగులకు టాటా గ్రూప్ శుభవార్త!
ఉద్యోగులకు ఎయిరిండియా శుభవార్త చెప్పింది. టాటా గ్రూపులో భాగమైన ఎయిరిండియా సెప్టెంబర్1 నుంచి ఉద్యోగులకు కోవిడ్-19 ముందున్న శాలరీలను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. జీత భత్యాలతో పాటు ఉద్యోగుల తొలగింపు, అలవెన్సులు, భోజన సౌకర్యాలన్నింటిని సవరిస్తున్నట్లు చెప్పింది. దేశీయ విమానయాన రంగంపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపింది. కరోనా విజృంభణ, నమోదైన కేసులు, ప్రయాణికులపై ఆయా దేశాల ఆంక్షల కారణంగా విమానాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. అయితే ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల నుంచి కోలుకుని కోవిడ్ ముందు నాటి స్థాయికి తిరిగి వచ్చాయి. దీంతో కొన్ని ఏవియేషన్ సంస్థలు నష్టాలతో దివాళా తీశాయి. మరికొన్ని సంస్థలు ఛార్జీల్ని పెంచాయి. ఉద్యోగులకు చెల్లించే జీతాలతో పాటు, ఇతర సౌకర్యాల్ని పూర్తిగా తగ్గించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్ ఇండియా ఉద్యోగులకు చెల్లించే జీతాల్ని పునరుద్దరిస్తూ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.విమానయాన రంగం కోవిడ్ ముందు స్థాయికి చేరుకుంటుంది. అందుకే తగ్గించిన ఉద్యోగుల శాలరీలను పెంచే అంశంపై సమీక్షలు జరపడం సంతోషంగా ఉందని ఎయిరిండియా చెప్పిందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 ఎయిరిండియా కొత్త సీఈవోగా క్యాంప్‌బెల్ విల్సన్! -
విప్రో ఉద్యోగులకు శుభవార్త!
సెప్టెంబర్ 1నుంచి ఉద్యోగుల జీతాల పెంపు, హైక్స్‌పై ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో స్పందించింది. ఉద్యోగుల జీత భత్యాల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. ఇప్పటికే తాము తీసుకున్న నిర్ణయంపైనే కట్టుబడి ఉన్నామని తెలిపింది. దేశంలో ఐటీ రంగం రోజురోజుకి వృద్ధి చెందుతుంది. దీంతో అవకాశాలు పెరిగిపోయాయి. అందుకే అట్రిషన్ రేటును నియంత్రించడం, కొత్త టాలెంట్‌ను గుర్తించి వారికి అవకాశాలు కల్పించేలా విప్రో తన ఉద్యోగులకు బోనస్‌లు, ఇంక్రిమెంట్లు భారీగా పెంచే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం ప్రభావం ఉద్యోగుల జీతాలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ మరికొన్ని నివేదికలు హైలెట్ చేశారు. ఈ నేపథ్యంలో జీతాల పెంపులో ఎలాంటి మార్పులు లేవని, సెప్టెంబర్ నుంచి శాలరీ హైక్ అమల్లోకి వస్తాయని విప్రో ప్రకటించింది. జూలై నుండి విప్రో ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడం ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీ తన టాప్ పెర్ఫార్మర్లకు, మిడ్ నేజ్మెంట్ స్థాయి వరకు ప్రమోషన్లను అందించాలని నిర్ణయించుకుంది. సెప్టెంబర్‌లో ఆ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది' అని విప్రో తెలిపింది. -
1న జీతాలివ్వకపోవడం అసమర్థతే
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఉద్యోగులకు 1 వ తారీఖునే జీతాలివ్వలేకపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వం అసమర్థ పాలనకు నిదర్శనంగా నిలుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. వచ్చే నెల నుంచి అయినా ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు అందేలా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. 2014లో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రాన్ని నేడు అప్పులపాలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. ఉద్యోగులు, పింఛనుదారులు ప్రతీనెలా 15 తేదీవరకు జీతాల కోసం ఎదురుచూసే దౌర్భాగ్యస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు సకాలంలో వేతనాలు చెల్లించæనిపక్షంలో వారి జీవించేహక్కును కాలరాయడమేనని స్పష్టం చేసిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు. -
కిటికీ అద్దాలు తుడిస్తే చాలు..కోటి రూపాయిల జీతం!
శానిటైజేషన్ వర్క్‌ర్ల(పారిశుధ్య కార్మికులు)కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో ఆయా కంపెనీలు పోటీ పడి మరి భారీ ఎత్తున జీతాల్ని చెల్లిస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డాక్టర్లకు చెల్లించే జీతం కంటే ఎక్కువగానే ఆఫర్ చేస్తున్నాయి. ఇంతకీ శానిటైజేషన్ వర్కర్లకు చెల్లించే జీతం ఎంతో తెలుసా? అక్షరాల కోటి రూపాయిలు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా..ఆ పనికి ఉన్న డిమాండ్ దృష్ట్యా సదరు సంస్థలు వేతనాల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేడయం లేదని పలు నివేదికలు చెబుతున్నాయి. సాధారణంగా డాక్టర్లు, ఇంజినీర్ల శాలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇందుకు భిన్నంగా ఆస్ట్రేలియాలో క్లీనింగ్ సర్వీస్ కంపెనీలు..క్లీనింగ్ చేసే ఉద్యోగులకు గంటల వ్యవధిలో భారీ ఎత్తున ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. 2021 నుంచి దేశం మొత్తం క్లీనింగ్ విభాగంలో డిమాండ్ ఎక్కువైంది. గతంలో అంటే 2021 ముందు క్లీనింగ్ చేసే ఉద్యోగులకు గంటకు రూ.2700 ఇస్తే ఇప్పుడు రూ.3600వరకు చెల్లిస్తున్నాయి. అంతేకాదు అత్యవసర సమయాల్లో గంటకు రూ.4700 చెల్లించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని సిడ్నీకి చెందిన అబ్సిల్యూట్ డొమెస్టిక్ (Absolute Domestics) సంస్థతో పాటు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇళ్లలో ఉండే చిన్న చిన్న కాలువలు మొదులుకొని, కిటికీలు శుభ్రం చేసే ఉద్యోగులకు చాలా కంపెనీలు గంటల వ్యవధికి శాలరీలు ఇస్తుంటాయి. ఆ లెక్కన ఉద్యోగులు ప్రతి నెలా సగటున రూ. 8లక్షల జీతం పొందేవారు. ఆశ్చర్యకరంగా దేశంలో ఉద్యోగుల కొరతతో వారి సగటు జీతం ప్యాకేజీ రూ. 72లక్షల నుండి రూ.80లక్షల వరకు చేరింది. అయితే చాలా కంపెనీలు ఆ వేతానాల్ని రూ.98 లక్షల పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని కంపెనీలైతే ఏకంగా రూ.కోటి ఇస్తున్నాయి. కాగా, ఆస్ట్రేలియాలో శానిటైజేషన్ సిబ్బంది పరిస్థితి ఇలా ఉంటే..బ్రిటన్‌కు చెందిన క్లీనింగ్ ఉద్యోగుల శాలరీలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. అక్కడ క్యాబేజీని పండించిన ఉద్యోగులకు సంవత్సరానికి రూ.65లక్షల జీతం ఇస్తున్నారు. -
ఆన్లైన్లో వైద్య సిబ్బంది వేతనాలు
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖలో హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్‌తోపాటు డైట్, పారిశుద్ధ్య, ఇతర కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, నర్సుల వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం జరగకుండా శాశ్వత పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు మాన్యువల్ బిల్లుల విధా నంద్వారా చెల్లింపులు జరుగుతుండటంతో కొంత ఆలస్యమవుతోంది. బిల్లులను స్క్రూటినీ చేయడం, ఉన్నతాధికారులకు పంపడం, ప్రభుత్వం ఆమోదం తీసుకోవడం లాంటి పద్ధతుల వల్ల జాప్యం జరుగు తున్నట్లు గుర్తించారు. దీన్ని నివారించేందుకు ఆన్లైన్ విధానంలో చెల్లింపులు చేయాలని అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ రూపొందించాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిష నర్ శ్వేత మహంతి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ సంబంధిత అధికారులతో గురువారం బీఆర్కే భవన్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది, హౌస్ సర్జ న్లు, జూనియర్, సీనియర్ రెసిడెంట్ల వేత నాల చెల్లింపులో ఆలస్యం జరగ కూడదని ఆదేశించారు. వైద్యులకు సెల్యూట్.. ఈ భూమిపై ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడగలిగే శక్తి వైద్యులకు మాత్రమే ఉందని, అందుకే వాళ్లు మనకు కనిపించే దేవుళ్లు అని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వైద్యసిబ్బంది చూపిన తెగువను ఎప్పటికీ మరిచిపోలేమని పేర్కొన్నారు. దీనికి ‘థ్యాంక్యూ డాక్టర్’అని చెబితే సరిపోదని, వారి త్యాగాలను గౌరవించాలని సూచించారు. -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ జీవో విడుదల
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన జీవోను శనివారం విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 5ను జారీ చేసింది. అలాగే.. సచివాలయ ఉద్యోగుల పే స్కేల్ ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. పంచాయతీ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీ లకు బేసిక్ పే రూ. 23,120 నుంచి రూ. 74,770 ఖరారు చేయగా.. ఇతర సచివాలయ ఉద్యోగులకు బేసిక్ పే రూ. 22,460 నుంచి రూ. 72,810 ఖరారు చేసింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి.. కేవలం 4 నెలల్లోనే వాటి భర్తీ ప్రక్రియను పూర్తి చేశారు. ఉద్యోగాలు పొందిన వారిలో నిబంధనల ప్రకారం అర్హులైన వారికి జూన్ నెలాఖరు కల్లా ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి చేసి, జూలై నెల(ఆగస్టు 1న చెల్లించే)కు పెరిగిన జీతాలు అమలు చేయాలని సీఎం జగన్ ఈ ఏడాది జనవరిలోనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మధ్య ఆత్మకూరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడటంతో గత నెల రోజులుగా నెల్లూరు జిల్లా అంతటా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యం అయ్యింది. -
Breaking News: టాలీవుడ్లో షూటింగ్‌లు బంద్..!
-
హోంగార్డుల వేతన వెతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నెలలో పదిహేను రోజులు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకు జీతాలు అందకపోవడం ఆ కుటుంబాలు తీవ్ర ఒత్తిడిలోకి లోనవుతున్నాయి. రోజువారీ ఖర్చులకు సైతం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల స్కూళ్లు ప్రారంభంకావడంతో పుస్తకాలు, యూనిఫామ్‌ల ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని యూనిట్లు, జిల్లాల్లో హోంగార్డులదీ ఇదే పరిస్థితి. ఇక్కడ ఇలా.. అక్కడ అలా.. రాష్ట్రవ్యాప్తంగా 16460 మంది హోంగార్డులు పోలీస్ శాఖలో పని చేస్తున్నారు. ప్రభుత్వం వీరికి కొద్ది రోజుల క్రితమే వేతనాలు పెంచింది. ప్రతి నెలా రూ.26వేల చొప్పున చెల్లిస్తోంది. అయితే హైదరాబాద్ కమిషనరేట్‌లో పని చేస్తున్న వారికి ఈ నెల 4నే వేతనాలు బ్యాంకు ఖాతాలో జమచేశారు. మిగిలిన కమిషనరేట్లు, జిల్లాల్లో ఇప్పటివరకు వేతనాలు అందలేదు. నెలలో 15వ తేదీ సమీపించినా జీతాలు రాకపోవడంతో అప్పులు చేస్తున్నట్టు హోంగార్డులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారికి వేతనాలు అందాయని, తమకు ఇంకా రాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకారణంగా రూ.10వేల కోత... ఎలాంటి కారణం చెప్పకుండానే ఏప్రిల్ నెల వేతనంలో రూ.10వేల కోత విధించినట్టు తెలిసింది. కరోనా సమయంలో కూడా వేతనాలు చెల్లించిన పోలీస్ శాఖ ఇప్పుడు ఏ కారణంతో రూ.10వేల కోత విధించిందో తెలియడం లేదని, మే నెల జీతమైనా సమయానికి వస్తుందిలే అనుకుంటే అదీ ఇంకా అందలేదని వారు వాపోతున్నారు. ఈ నెలలో కూడా కోత పెడితే తమ పరిస్థితి అగమ్యగోచరమేనని అంటున్నారు. అసోసియేషన్లు ఎక్కడున్నాయి... తమ సంక్షేమం కోసం ఏర్పడిన అసోసియేషన్లు ఈ సమస్యను ఏమాత్రం పట్టించుకోవడం లేదని హోంగార్డులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక అసోసియేషన్‌గా ఏర్పడి, ఇప్పుడు రెండు మూడు సంఘాలుగా విడిపోవడంతో అసలు అసోసియేషన్లు ఉన్నాయా, లేవా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు అందించింది ఏపీ ప్రభుత్వం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతకం చేశారు కూడా. ఒకటి, రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇక సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం తాజా ఆదేశాలతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పెరిగినట్లు అయ్యింది. -
తెలంగాణ ప్రభుత్వం జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది: భట్టి విక్రమార్క
-
ఎక్కడి జీతాలు అక్కడే..
మహారాణిపేట (విశాఖ దక్షిణ): జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఉద్యోగులకు అక్కడే జీతాలు ఇచ్చే పద్ధతికి అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాను విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిలాల్లగా విభజించి పాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. జిల్లా కలెక్టరేట్‌తోపాటు ఎస్పీ, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు రెండు నెలలుగా విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఈనెల నుంచి స్థానిక ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కొత్తగా ఏర్పడిన జిల్లాల ట్రెజరీలకు కోడ్ కేటాయించారు. ఆ కోడ్ ప్రకారం వచ్చే బిల్లులను ట్రెజరీ సిబ్బంది సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేశారు. మంగళవారం నాటికి అన్ని బిల్లులు అప్లోడ్ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాగా ఉన్న సమయంలో మొత్తం 91 ప్రభుత్వ శాఖలు ఉండేవి. ఇందులో మొత్తం 33,718మంది ఉద్యోగులు, అధికారులు పనిచేసేవారు. 1299 మంది డీడీఓలు జీతాల ప్రక్రియ బిల్లులు పూర్తి చేసి ట్రెజరీకి పంపేవారు. అనకాపల్లి జిల్లాలో 38 ప్రభుత్వ శాఖల్లో 2800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 38 ప్రభుత్వ శాఖల్లో 2100 మంది పనిచేస్తున్నారు. విభజన జిల్లాల్లోని ఉద్యోగులు, అధికారుల జీతాల బిల్లులు అక్కడే ఇవ్వగా, రిటైర్ అయిన ఉద్యోగుల పింఛన్లు మాత్రం ఉమ్మడి జిల్లా నుంచి ఇస్తున్నారు. విశాఖ జిల్లాకు 0201, అనకాపల్లి జిల్లాకు 90000039469, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 90000039468 కోడ్ నంబర్లుగా కేటాయించారు. సబ్ ట్రెజరీలు ఇవే.. విశాఖ జిల్లాలో సీతమ్మధార, భీమునిపట్నంలలో సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి ఈస్టు, అనకాపల్లి వెస్టు, చోడవరం, యలమంచిలి, కోటవురట్ల, మాడుగుల, నక్కపల్లి, నర్సీపట్నం సబ్ ట్రెజరీలు ఉన్నాయి. అల్లూరి జిల్లా పరిధిలో పాడేరు, అరకు, చింతపల్లి, అడ్డతీగల, రంపచోడవరం, చింతూరు సబ్ ట్రెజరీలు ఉన్నాయి. కొత్త జిల్లాల్లో అక్కడే జీతాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రకారం ఈ నెల నుంచి జీతాలు వస్తాయని విశాఖపట్నం జిల్లా ట్రెజరీ అధికారి టి.శివరామ ప్రసాద్ చెప్పారు. (చదవండి: అడ్డాకులకు అదిరే ధర) -
వేతనాల పెంపునకు రంగం సిద్ధం.. అందులో హైదరాబాద్..
ముంబై: ఉద్యోగుల సగటు వేతనాల పెంపు ఈ ఏడాది 8.13 శాతంగా ఉండొచ్చని టీమ్‌లీజ్ సంస్థ అంచనా వేసింది. కరోనా లాక్డౌన్ల నుంచి పరిస్థితులు కుదుటపడినట్టు పేర్కొంది. ‘జాబ్స్ అండ్ శాలరీ ప్రైమర్ రిపోర్ట్ 2021–22’ పేరుతో టీమ్‌లీజ్ తన వార్షిక నివేదిక విడుదల చేసింది. గత రెండేళ్ల మాదిరిగా కాకుండా, అన్ని రంగాల్లోనూ ఎక్కువ విభాగాల్లో వేతనాల పెంపు ఉంటుందని ఈ నివేదిక తెలియజేసింది. ఈ నివేదికలో భాగంగా 17 రంగాల్లోని పరిస్థితులను సమీక్షించింది. అన్నింటిలోనూ వేతనాల పెంపు ఒక అంకె స్థాయిలో ఉంటుందని అంచనా వేసింది. ‘‘వేతనాల పెంపు డబుల్ డిజిట్‌ను చేరుకోవాల్సి ఉంది. గత రెండేళ్లలో చూసిన వేతనాల క్షీణత, స్తబ్ధత అన్నవి ముగింపునకు రావడం సంతోషకరం’’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకురాలు రితూపర్ణ చక్రవర్తి తెలిపారు.త్వరలోనే ఇంక్రిమెంట్లు కరోనా ముందు నాటికి చేరుకుంటాయన్నారు. తొమ్మిది పట్టణాల్లోని 2,63,000 మంది ఉద్యోగులకు చేసిన వేతన చెల్లింపుల ఆధారంగా టీమ్‌లీజ్ ఈ నివేదికను రూపొందించడం గమనార్హం. కొత్త తరహా ఉద్యోగాలకు డిమాండ్ నెలకొన్నట్టు రీతూపర్ణ తెలిపారు. ‘‘2020–21లో 17 రంగాలకు గాను ఐదు రంగాల్లోనే హాట్ జాబ్ రోల్స్ ఏర్పాటయ్యాయి. కానీ, 2021–22లో తొమ్మిది రంగాల్లో కట్టింగ్ ఎడ్జ్ (కొత్త తరహా రోల్స్) ఉద్యోగాలు ఏర్పాటు అయ్యాయి’’అని రీతూ పర్ణ చెప్పారు. ఇక్కడ అధికం.. ఈ ఏడాది 12 శాతానికి పైగా వేతనాల పెంపును చేపట్టే వాటిల్లో హైదరాబాద్, ముంబై, పుణె, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ పట్టణాలు ఉన్నాయి. ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు, హెల్త్‌కేర్, అనుబంధ రంగాలు, ఐటీ, నాలెడ్జీ సర్వీసెస్ రంగాలు అధిక వేతన చెల్లింపులకు సముఖంగా ఉన్నాయి. చదవండి: టెక్ మహీంద్రా ఉద్యోగులకు శుభవార్త.. వేతనాల పెంపు ఎంతంటే? -
15 నెలలుగా రాని వేతనాలు.. మేమెలా బతకాలి
సాక్షి,ములుగు: నిత్యావసర ధరలు పెరుగుతుండడంతో రోజువారీగా ఖర్చులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక నెల వేతనం రాకపోతేనే వేలకు వేలు ప్రభుత్వ వేతనాలను తీసుకుంటున్న ఉద్యోగులు సైతం ఉద్యమాలు చేసి వారి సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగులు కాబట్టి ప్రభుత్వం వారికి తలవంచుతుంది. అలాంటిది అరకొర వేతనాలను అందుకుంటున్న పోస్ట్ మెట్రిక్ హాస్టల్(పీఎంహెచ్)లో ఔట్ సోర్సింగ్ కాంటిజెంట్ సిబ్బందికి ఏకంగా 15 నెలలుగా వేతనాలు అందటం లేదు. నిరసనలు తెలి పితే ఫీల్ట్ అసిస్టెంట్ల మాదిరిగా ఎక్కడ తమని తొలగిస్తారోఅనే అభద్రతభావంలో ఉండిపోతున్నారు. 15ఏళ్లుగా చేస్తున్న వంట జిల్లాలోని ఐటీడీఏ ఏటూరునాగారం పరిధిలోని పీఎంహెచ్ హాస్టల్స్‌లో 20మంది కాంటిజెంట్ వర్కర్లు 15 సంవత్సరాల నుంచి వంటలు చేస్తున్నారు. ఏనాడు వారికి సక్రమంగా వేతనాలు అందిన పరిస్థితి లేదు. దీంతో కుటుంబాలను పోషించలేక ఇబ్బందులు పడుతున్నారు. 2020వ సంవత్సరంలో మూడు నెలలు, 2021లో 10 నెలలు, 2022లో రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో కాంటిజెంట్ సిబ్బందికి నెలకు రూ. 10వేల వేతనం అందించడానికి ప్రభుత్వం తరఫున అధికారంగా అనుమతులు వచ్చాయి. కాని అవి కాగితాలకే పరిమితం అయ్యాయని సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటి వరకు ఒక్కో సిబ్బందికి రూ. 1.50లక్షల వేతనాలు అందాల్సి ఉంది. ఎమ్మెల్యేకు విన్నవించుకునేందుకు.. తమకు రావాల్సిన వేతనాల విషయంలో జరుగుతున్న అన్యాయంపై ములుగు ఎమ్మెల్యే సీతక్కను కలిసి విన్నవించుకునేందుకు కాంటిజెంట్ వర్కర్లు సిద్ధం అవుతున్నారు. వీలైతే సీతక్కతో కమిషనర్ కార్యాలయానికి వెళ్లడానికి కార్యచరణ చేస్తున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్న సిబ్బంది వేతనాల చెల్లింపుల విషయంలో కొన్ని నెలలుగా ఉన్నతాధికారులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని కాంటిజెంట్ సిబ్బంది వాపోతున్నా రు. అడిగిన ప్రతీసారి పైనుంచి నిధులు రాలేదని ఒకరు, వచ్చేంత వరకు వేచి చూడాలని మరొకరు చెబుతున్నారు.. తప్పా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ ఉన్నతాధికారిని కలవడానికి వెళితే విద్యార్థులకు వంటలు చేయడం మాని వేతనాల కోసం వచ్చారా అని గద్దిరించారని తెలుస్తుంది. అదే అధికారికి 15 నెలల వేతనం రాకపోతే ఇలాగే స్పందిస్తారా అని సీఐటీ యూ, ఇతర సంఘాల సభ్యులు ప్రశ్నిస్తున్నారు. నెలవారీగా వేతనాలు ఇవ్వాలి పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న కాంటిజెంట్ వర్కర్లకు నెల వారీగా వేతనాలు అందించాలి. 15 నెలలుగా వేతనాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఐటీడీఏ అధికారులు, కలెక్టర్‌ను కలిసి వినతులు అందించాం. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయంలో అధికారులు తక్షణం స్పందించి వేతనాలు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలి. – రత్నం రాజేందర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రెండు, మూడు రోజుల్లో అందజేస్తాం పీఎంహెచ్ హాస్టల్స్‌లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న కాంటిజెంట్ వర్కర్లకు వేతనాలు రావడం లేదనే విషయం నా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. రెండు, మూడు రోజుల్లో వేతనాలు అందజేస్తాం. వర్కర్లు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటాం. – దేశిరాం, ఐటీడబ్ల్యూఓ -
బాడీగార్డ్‌కు అత్యధిక జీతం ఇస్తున్న హీరో ఎవరో తెలుసా ?
Bollywood Celebrities And Their Bodyguards Salaries: సినిమాల్లో హీరోయిన్స్ తమ అందచందాలతో, గ్లామర్‌తో కట్టిపడేస్తుంటారు. అందుకే వారి వెంట విలన్లు వెంటపడుతుంటారు. ఆ విలన్ల నుంచి కాపాడుతూ హీరోలు ఎప్పుడూ హీరోయిన్లను ప్రొటెక్ట్ చేస్తుంటారు. ఇది సినిమా వరకే. మరీ రియల్ లైఫ్‌లో.. నిజ జీవితంలో హీరోయిన్లను ప్రతీక్షణం కాపాడేందుకు హీరోలకు బదులు బాడీగార్డ్లు ఉంటారు. అభిమానులు సెల్ఫీలు తీసుకునే దగ్గరి నుంచి పెద్ద పెద్ద గుంపుల్లో ఆకతాయిలు చేసే అల్లరి పనుల వరకు వారి వెంట ఉండి ప్రొటెక్ట్ చేస్తారు. హీరోయిన్లే కాదు హీరోలు సైతం తమ రక్షణార్థం బాడీగార్డ్‌లను పెట్టుకుంటారు. బాడీగార్డ్‌లను ఊరికే పెట్టుకోరుగా.. వారికి సాలరీస్ కూడా ఇవ్వాలి. ప్రస్తుతం బాలీవుడ్ హీరోహీరోయిన్ల బాడిగార్డ్స్ జీతాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ హీరోహీరోయిన్లు వారి బాడీగార్డ్స్‌కు ఏకంకా కోట్లలోనే సాలరీస్ ఇస్తున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దామా. 1. కంగనా రనౌత్-కుమార్ (90 లక్షలు) 2. దీపికా పదుకొణె-జలాల్ (కోటి) 3. కత్రీనా కైఫ్-దీపక్ సింగ్ (కోటి) 4. అనుష్క శర్మ-ప్రకాష్ సింగ్ (1.2 కోట్లు) 5. అక్షయ్ కుమార్-శ్రేయసే తేలే (1.20 కోట్లు) 6. అమితాబ్ బచ్చన్-జితేందర్ షిండే (1.5 కోట్లు) 7. సల్మాన్ ఖాన్- షెరా (2 కోట్లు) 8. అమీర్ ఖాన్- యువరాజ్గోర్పడే (2 కోట్లు) 9. షారుక్ ఖాన్ -రవి సింగ్ (2.6 కోట్లు) -
సమ్మెకు ముందే ఉద్యోగుల సహాయ నిరాకరణ సరికాదు..
సాక్షి, విజయవాడ: చర్చలతో ఉద్యోగులు సమస్యలు పరిష్కరించుకోవాలని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి హితవు పలికారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సమ్మెకు ముందే ఉద్యోగుల సహాయ నిరాకరణ సరికాదన్నారు. కొత్త పీఆర్సీతో ఏ ఒక్క ఉద్యోగికి కూడా జీతం తగ్గలేదన్నారు. పే స్లిప్‌లో ఉద్యోగుల జీతం వివరాలు స్పష్టంగా ఉన్నాయని.. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని గౌతమ్‌రెడ్డి అన్నారు. చదవండి: ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదు: ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి -
సమ్మెకు దిగి ఉద్యోగులు ఏం సాధిస్తారు?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: సమస్యల పరిష్కారానికి నేరుగా చర్చలు జరుపుదామని ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సమస్యలుంటే పాయింట్ల వారీగా చెప్పాలని.. మీరు చెప్పే వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. చదవండి: ఏపీ ప్రయోజనాలు విస్మరించిన కేంద్రం ‘‘సమ్మె అవసరం లేకుండా సమస్య పరిష్కారం చేద్దామని చెప్పాం. ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే పట్టుబడుతున్నాయి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్యలను జఠిలం చేసుకోవద్దని చెప్పాం. కరోనా నేపథ్యంలో ఆందోళన వద్దని’’ సజ్జల విజ్ఞప్తి చేశారు. బల ప్రదర్శన చేద్దామని చూడ్డం సరికాదన్నారు. కొత్త పీఆర్సీతో ఎవ్వరి జీతాలు తగ్గలేదని.. ఉద్యమాలతో ఉద్యోగులకు నష్టం చేయవద్దని సజ్జల కోరారు. సమ్మెకు దిగి ఉద్యోగులు ఏం సాధిస్తారు?. ఉద్యోగుల కార్యాచరణను పక్కన పెట్టాలని చెప్పాం. సమ్మెకు వెళ్లకముందే రోడ్డు ఎక్కడం సరికాదని’’ సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు. -
ఎవ్వరికీ జీతాలు తగ్గలేదు.. ఆ ఆలోచనను విరమించుకోండి: సీఎస్ సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు సీఎం ఏమి చెయ్యగలరో అన్నీ చేస్తారని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్నారు. ఈ మేరకు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐఆర్ ఉన్నా.. ఐఆర్ లేకున్నా ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ఎవ్వరికీ జీతం తగ్గకూడదని సీఎం చెప్పారు. గత పీఆర్సీ నుంచి ఇప్పటి పీఆర్సీ వరకు చూస్తూ ఎక్కువ పెరుగుదల ఉంది. ఐఆర్‌తో కలిపినా పెరుగుదల ఉంది. ఎవ్వరికీ జీతాలు తగ్గలేదు. ఈ రోజు రాత్రికి అందరికీ జీతాలు వచ్చాక తెలుస్తుంది. ఉద్యోగులు ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ప్రతి ఏటా 15 శాతం ఆదాయం పెరగాలి. పీఆర్సీకి అదనంగా గ్రాట్యుటీ, హౌసింగ్ స్కీమ్ వలన అదనపు ప్రయోజనం ఉంది. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగం. ప్రతి పీఆర్సీ అప్పుడు చర్చల కమిటీ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగులు ఏ సమస్య ఉన్నా చర్చించుకుందాం. సమ్మె ఆలోచనను విరమించుకోండి. మనమంతా ఒక కుటుంబం. హెచ్ఆర్ఏ లాంటివి మాట్లాడుకుందాం రండి. ఉద్యోగులను చర్చలకు రమ్మని కోరుతున్నాను' అని సీఎస్ సమీర్ అన్నారు. చదవండి: (కేంద్ర బడ్జెట్ నిరుత్సాహపరిచింది: ఎంపీ విజయసాయిరెడ్డి) ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ.. ఆర్థిక శాఖ నుంచి ఉద్యోగులను.. మంత్రులు, అధికారులతో చర్చలకు రమ్మని కోరుతున్నాను. ఉద్యోగులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం. ఒకటో తేదీన జీతాలు వెయ్యడం ప్రభుత్వ బాధ్యత. 3.69లక్షల సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు జీతాలు వేశాము. 1.75 లక్షల ఇతర ఉద్యోగులకు జీతాలు వేశాము. 94,800 ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు జమచేశాము. 3.3 లక్షల మంది పెన్షనర్లకు జమచేశాము. 3,97,564 రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు కూడా వేశాము. వారికి శాలరీ బ్రేక్ అప్ కూడా పంపాము. ప్రతి ఉద్యోగి వారి జీతాల పెరుగుదలను తెలుసుకునేలా బ్రేక్ అప్ ఇచ్చాము అని ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్ అన్నారు. -
జూనియర్లకు లక్షల్లో జీతాలు.. నెంబర్ వన్ స్థానానికి పోటీ పడుతున్న హైదరాబాద్
చారిత్రాత్మక కాస్మోపాలిటన్ నగరం హైదరాబాద్ వేలాది మంది నిరుద్యోగుల కలల స్వప్నం. దేశం నలుమూలల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి చాలా మంది వస్తుంటారు. ఇందులో చాలా మంది లక్ష్యం ఐటీ సెక్టార్లో కొలువు సంపాదించడమే. ఇలా ఉద్యోగన్వేషలో వచ్చే వారికి పెద్ద మొత్తంలో జీతాలు ఆఫర్ చేస్తున్నాయి నగరంలో కోలువైన కంపెనీలు. జీతాలు ఎలా ఉన్నాయి ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ సెక్టార్లలో సీనియర్, మిడ్ లెవల్, జూనియర్ కేటగిరీల్లో జీతాలు ఎలా ఉన్నాయమనే అంశంపై రాండ్‌స్టాండ్ సంస్థ ఇటీవల సర్వే చేపట్టింది. రాండ్‌స్టాండ్ నివేదికను పరిశీలిస్తే.. ఐటీ సెక్టార్లో హైదరాబాద్ నగరం నంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతోందని తెలుస్తోంది. దేశంలో ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, కోలక్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పూనే నగరాల్లో ఐటీ పరిశ్రమ ఎక్కువగా నిలదొక్కుకుంది. ఈ నగరాల డేటాను పరిశీలిస్తే ఐటీ ఎంప్లాయిస్‌కి ఎక్కువ జీతాలు ఇవ్వడంలో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా హైదరాబాద్ సెకండ్ పొజిషన్లో ఉంది. జీతాల తీరు ఇలా ఇక ఐటీ సెక్టార్లో సీనియర్, మిడ్ లెవల్, జూనియర్ కేటగిరీల్లో జీతాలను పరిశీలిస్తే.. ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరుకి హైదరాబాద్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఐదేళ్ల అనుభవం ఉన్న జూనియర్ లెవల్‌కి సంబంధించిన ఉద్యోగులకు హైదరాబాద్‌లో వార్షిక వేతనం రూ.5.93 లక్షలుగా ఉండగా బెంగళూరులో ఇది రూ. 6.71 లక్షలుగా ఉంది. 6 నుంచి 14 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న మిడ్ లెవల్ కేటగిరిలో హైదరాబాద్‌లో వార్షిక వేతనం 17.71 లక్షలు ఉండగా బెంగళూరులో రూ.18.06 లక్షలుగా ఉంది. 15 ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ ప్రొఫెషనల్స్ కేటగిరిలో హైదారాబాద్‌లో యాన్యువల్ శాలరీ రూ. 29.78 లక్షలు ఉండగా బెంగళూరులో రూ. 34.47 శాతంగా ఉంది. స్వల్ప తేడా ఐటీ సెక్టార్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న బెంగళూరు, హైదరాబాద్‌లలో చెల్లిస్తున్న జీతాలను పరిశీలిస్తే.. జూనియర్ కేటగిరికి సంబంధించి బెంగళూరు, హైదరాబాద్‌ల మధ్య వ్యత్యాసం 11.6 శాతం ఉండగా మిడ్ లెవల్ కేటగిరిలో ఇది 2 శాతానికే పరిమితమైంది. సీనియర్ కేటగిరిలో మాత్రం హైదరాబాద్ కంటే బెంగళూరులో ఉన్న ఉద్యోగికి 16 శాతం అధికంగా వేతనం అందుతోంది. నవంబర్ వన్ రేసులో గడిచిన పదేళ్లుగా భారీ కంపెనీలను ఆకర్షించడంలో బెంగళూరుతో పోటీ పడుతోంది హైదరాబాద్. అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు గమ్యస్థానంగా హైదరాబాద్ మారింది. అంతేకాదు ఇటీవల కాలంలో స్టార్టప్‌ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ విధానం ఖరారైంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే జూనియర్, మిడ్ కేటగిరిల్లో బెంగళూనును హైదరాబాద్ దాటవచ్చనే అంచనాలు ఉన్నాయి. చదవండి: ఎక్సెల్లో కొత్త ఫీచర్లు.. చిరకాల డిమాండ్ నెరవేర్చిన మైక్రోసాఫ్ట్ -
ఏపీలో ఉద్యోగుల జీతాలు, వాస్తవాలు
-
ఓలా, ఉబెర్.. మరీ ఇంత వరెస్టా?
Ola And Uber Down In Fairwork India Rankings 2021: దేశంలోనే యాప్ యూజర్లకు ప్రయాణ సౌకర్యాలు అందించే అతిపెద్ద ప్లాట్‌ఫామ్‌లుగా ఓలా, ఉబెర్‌లకు పేరుంది. అయితే చాలాసార్లు యూజర్లను ఇవి ముప్పుతిప్పలు పెడుతున్నాయనే ఫిర్యాదులు అందుతుంటాయి. అయితే ఇప్పుడు ఉద్యోగుల వెర్షన్లోనూ ఈ రెండింటికి ఎదురుదెబ్బ తగిలింది. ఫెయిర్‌వర్క్2021 ర్యాంకింగ్స్‌లో ఈ రెండు స్టార్టప్‌ల రేంజ్ సున్నాకి పడిపోయింది. కిందటి ఏడాది ఫెయిర్‌వర్క్2021లో ఓలాకు రెండు, ఉబెర్‌కు ఒక పాయింట్ రేటింగ్ దక్కింది. ఈ ఏడాది ఏకంగా ఈ రెండూ జీరోకి చేరుకోవడం విశేషం. గిగ్ ఎంప్లాయిస్ పట్ల ఈ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనమే ఈ రేటింగ్. అందుకే ఈ ఎదురుదెబ్బ తగిలింది. చాలామంది కంపెనీలు తమకు అందిస్తున్న కమిషన్, బెనిఫిట్స్, ఇతర సౌకర్యాలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు ఫెయిర్‌వర్క్ నివేదిక వెల్లడించింది. కొన్నిచోట్ల కనీసం వాళ్లను మనుషుల్లా చూడట్లేదన్న ఫీడ్‌బ్యాక్ ఎదురైందని తెలిపింది. ఇక ఈ లిస్ట్‌లో ఫ్లిప్‌కార్ట్ ఏడు పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. కిందటి ఏడాది 8 పాయింట్లతో టాప్‌లో నిలిచిన అర్బన్ కంపెనీ.. ఉద్యోగులకు(భాగస్వాములతో) నష్టం చేకూర్చే నిర్ణయం, వాళ్లను రోడ్డుకు ఎక్కించడం, నోటీసులు పంపడం లాంటి చేష్టలతో 5 పాయింట్లతో రెండో స్థానానికి దిగజారింది. ఇక స్విగ్గీ(కిందటి ఏడాది 1) ఈ వియంలో 3 పాయింట్లు మెరుగుపడి ఏకంగా 4 పాయింట్లు దక్కించుకుంది. జొమాటో(కిందటి ఏడాది 1) రెండు పాయింట్లు మెరుగుపర్చుకుని 3 పాయింట్ల రేటింగ్ దక్కించుకుంది. ఫ్లిప్‌కార్ట్, ఉబెర్, ఒలా, జొమాటో, స్విగ్గీ.. ఇలాంటి డిజిటల్-స్టార్టప్ బేస్డ్ కంపెనీల్లో పని చేసే వాళ్లను గిగ్ వర్కర్స్‌గా గుర్తిస్తారు. వీళ్లలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉండొచ్చు. వీళ్లకు ఆయా కంపెనీలు ఎలా పట్టించుకుంటున్నాయే స్కేలింగ్ ఆధారంగా లేబర్ స్టాండర్డ్స్ ఆధారిత వెబ్సైట్ ఫెయిర్ డాట్ వర్క్ ప్రతీ సంవత్సరం రేటింగ్ ఇస్తుంటుంది. ఈ స్కేలింగ్ పదిపాయింట్లకు ఉంటుంది. ఈ లిస్ట్‌లో డెలివరీ యాప్ కంపెనీ డుంజో కిందకి దిగజారగా.. అమెజాన్ 2 పాయింట్ల నుంచి 1 పాయింట్‌కు దిగజారింది. అందుతున్న జీతాలు.. ఇతర బెనిఫిట్స్, పని పరిస్థితులు, కాంట్రాక్ట్‌లు, మేనేజ్మెంట్ తీరు, ప్రాతినిధ్యాలు, ఇతర సౌకర్యాలు.. వీటి ఆధారంగా ఈ స్కేలింగ్‌ను నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా గిగ్ ఉద్యోగులు 50 లక్షల మందికి పైనే ఉన్నట్లు ఒక అంచనా. ఆయా కంపెనీల నుంచి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కలిగించాలంటూ గిగ్ ఎంప్లాయిస్ యూనియన్లు తరచూ కోర్టు మెట్లు ఎక్కుతున్నా.. ఫలితం లేకుండా పోతోంది. చదవండి: మీరు పార్ట్నర్స్.. మీరే లొల్లి చేయడమేంది? -
వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతాలు..?! సర్క్యులర్ జారీ.. అంతలోనే..
సాక్షి, చెన్నై: డిసెంబర్ నెల జీతం పొందడానికి కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా తీసుకోవాలంటూ తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మూడు రోజుల కింద సర్క్యులర్ జారీ చేసింది. అయితే దీనిపై ఉద్యోగులు ఆగ్రహం వ్యకం చేయడంతో సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంది. టీకాలు వేసుకునే నిర్ణయాన్ని వ్యక్తి విచక్షణకు వదిలివేయాలని, ఎవరినీ బలవంతం చేయకూడదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. కాగా సోమవారం, తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ (మధురై) ఉమాదేవి.. ఉద్యోగులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, లేని పక్షంలో వారి డిసెంబర్ జీతం నిలివేయాలని సర్క్యులర్‌లో ఆదేశించారు. నవంబర్ 26న చైర్మన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సర్య్కులర్‌లో పేర్కొన్నారు. వైద్య కారణాల వల్ల ఎవరైనా ఉద్యోగి వ్యాక్సిన్ తీసుకోలేకపోతే, దానిని నిర్ధారిస్తూ వైద్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. చదవండి: (Omicron: భారత్‌లో ఒమిక్రాన్ బయటపడింది ఇలా..!) దీనిపై తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డ్ ట్రేడ్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ జనరల్ సెక్రటరీ ఆర్ ముత్తులింగం మాట్లాడుతూ, 'వ్యాక్సిన్ తీసుకున్న చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సిన్ కరోనా వ్యాప్తిని అడ్డుకుంటుందని ఎటువంటి ఆధారం లేదు. కార్మిక చట్టాలను ఉల్లంఘించినపుడు లేదా ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించినప్పుడు మాత్రమే జీతాన్ని నిలిపివేసే అవకాశం ఉంద'ని అన్నారు. తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఎండీ రాజేష్ లఖానీ మాట్లాడుతూ.. 'ఉద్యోగులు ప్రజలతో మమేకమవుతున్నందున టీకాలు వేయించుకోమని మాత్రమే అధికారులను కోరినట్లు చెప్పారు. 'చీఫ్ ఇంజనీర్ ఉమాదేవి అత్యుత్సాహంతో ఆ సర్క్యులర్ జారీ చేశారు. జీతాలను నిలిపివేయడం సమావేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. ఇప్పుడు, ఆ సర్క్యులర్ రద్దు చేశాము. కేవలం రెండు డోసులను తీసుకోవాలని ఉద్యోగులను అభ్యర్థిస్తూ కొత్త సర్క్యులర్ జారీ చేయబడింది' అని రాజేష్ లఖానీ అన్నారు. -
దేశంలో అత్యధిక జీతాలు ఇస్తోంది తెలంగాణనే: మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్: ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేశారో సమాధానం చెప్పాలని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. అసలు హుజూరాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారో చూపించాలని అన్నారు. ఆదివారం హుజూ రాబాద్ పట్టణంలోని వెంకటసాయి గార్డెన్లో పీఆర్డీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించినందుకు కృతజ్ఞతసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ హుజూరాబాద్ అభివృద్ధిని మరిచారని అన్నారు. నియోజకవర్గానికి వైద్య కళాశాల కోసం రాజీనామా చేశారో.. పీజీ కళాశాల కోసం రాజీనామా చేశారో ప్రజలకే సమాధానం చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో త్వరలో 60 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వబోతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏదైనా మంచి పనిచేసినప్పుడు కృతజ్ఞతతో ఉండడం అనేది మంచి దృక్పథమని హితవు పలికారు. అలాంటివి చేసినప్పుడు రాజకీయ నాయకులకు కొంత ప్రోత్సాహం ఇచ్చినట్లుగా అవుతుందన్నారు. (చదవండి: కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టేది హుజురాబాద్ ఎన్నిక) పీఆర్టీయూ లక్ష్యం.. ప్రభుత్వ లక్ష్యం ఒకటనని.. రాష్ట్రంలోని ఉద్యోగులను సీఎం కేసీఆర్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు అతి తక్కువ వేతనం ఇచ్చేది బీజేపీ పాలిత గుజరాత్ అని, అత్యధిక జీతాలు ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమే అన్నారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండి టీఆర్ఎస్ను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, జనార్దన్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ బీరెల్లి కమలాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, జిల్లా అధ్యక్షుడు పొలంపల్లి ఆదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ముస్కు తిరుపతిరెడ్డి, నాయకులు రవికుమార్, రాధాకృష్ణ, శివారెడ్డి, మధు, తిరుపతి, లక్ష్మారెడ్డి, రాజేంద్రప్రసాద్, మల్లేశ్, ప్రభాకర్‌రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు. చదవండి: రైతు ‘ఐడియా’ అదిరింది.. సమస్య తీరింది -
ఇది తెలుసా? పబ్లిక్ హాలిడే అయినా జీతం పడుతుంది
ఒకటో తారీఖున ఆదివారామో, సెలవు రోజో వస్తే వేతన జీవులకు గండమే. సెలవు కావడంతో బ్యాంకులు జీతాలు జమ చేయవు. మరుసటి రోజు వరకు ఎదురు చూడాల్సిందే. అయితే ఇకపై ఈ ఇక్కట్లకు చెల్లు చీటి రాసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సండేలతో పాటు ఇతర పబ్లిక్ హాలిడేస్‌లో కూడా బల్క్ పేమెంట్ చేసేందుకు, ఖాతాదారులు చేసే కీలక చెల్లింపులు స్వీకరించేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఎన్ఏసీహెచ్చ్ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ (NACH) పథకాన్ని ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ప్రకారం ఇకపై ఆదివారాలు, అధికారిక సెలవు రోజుల్లో కూడా శాలరీస్, డివిడెండ్లు, పెన్షన్లు తదితర చెల్లింపులు జరుగుతాయి. చెల్లింపులకు ఓకే వేతనాలు, పెన్షన్ల చెల్లింపులతో పాటు కరెంటు, గ్యాస్, టెలిఫోన్, వాటర్ బిల్లులు, ఈఎంఐ, ప్రీమియం వంటి చెల్లింపులను బ్యాంకులు తీసుకుంటాయి. వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించే ప్రక్రియలో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న మరికొన్ని మార్పులు - భారత తపాల శాఖ ఆధీనంలోని పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇప్పటి వరకు ఉచితంగా అందించిన డోర్ స్టెప్ సర్వీసెస్‌ని నిలిపేసింది. ఇకపై ఇంటి వద్దకు వచ్చి పోస్టల్ బ్యాంక్ సర్వీసెస్ అందిస్తే రూ. 20 ప్లస్ జీఎస్టీని వసూలు చేయనుంది. - పరిమితి మించిన తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఇప్పటి వరకు రూ. 15 సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తుండగా ఇప్పుడా మొత్తాన్ని రూ. 17కి పెంచారు. -
ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!
మీరు ఎక్కువగా బ్యాంకు సంబంధిత లావాదేవీలు చేస్తుంటారా? అయితే, మీకు ఒక ముఖ్య గమనిక. ఆగస్టు 1 నుంచి బ్యాంకుకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల సామాన్యుల మీద ఎక్కవగా భారం పడనుంది. ఏటీఎం లావాదేవీలు, ఎల్పీజీ ధరలు, వేతనాలు, పెన్షన్లు ఇలా చాలా అంశాలకు సంబంధించి కొత్త మార్పులు ఆగస్టు 1 నుంచి చోటు చేసుకొనున్నాయి. సాధారణంగా ప్రతీ నెల ప్రారంభంలో కొత్త నిబందనలు అమల్లోకి వస్తుంటాయి. మరి ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఏంటీ? అవి మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయనున్నయో? తెలుసుకోండి. వేతనం, ఈఎమ్ఐ చెల్లింపులు: నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనలలో ఆర్బీఐ మార్పు చేయడం వల్ల సెలవు రోజుల్లో కూడా విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, నీరు, జీతం, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ సంబంధిత లావాదేవీలు సెలవు రోజుల్లో కూడా జరగనున్నాయి. ఈ కొత్త మార్పులు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(ఆర్ టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలు 24ఎక్స్7 అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. ఎన్ఏసీహెచ్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) చేత నిర్వహించబడుతుంది. ఎటిఎమ్ క్యాష్ విత్ డ్రా: జూన్ నెలలో ఆర్బీఐ తీసుకొచ్చిన మరో ఆర్డర్ ప్రకారం, ఆగస్టు 1 నుంచి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్(ఏటీఎం) చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్న బ్యాంక్ ఆందోళన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఇంటర్ చేంజ్ ఫీజ్ ను ₹2 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా వచ్చే ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్ధికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెరగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు 90 కోట్ల వరకు వాడుకలో ఉన్నాయి. ఐపీపీబీ డోర్ స్టెప్ సేవలు ఖరీదు: ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ సేవలకు ఇక నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలను, సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ రేట్లను ఐపీపీబీ సవరించింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలు 01 ఆగస్టు 2021 నుంచి వర్తిస్తాయి. ప్రస్తుతం, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సంబంధించి ఎలాంటి ఛార్జీలు లేవు. ఇక ఆగస్టు 1, 2021 నుంచి ప్రతి కస్టమర్ ఐపీపీబీ డోర్ స్టెప్ అభ్యర్థనకు బ్యాంకింగ్ ఛార్జీల కింద రూ.20 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకే కస్టమర్ ఎక్కువ సార్లు అభ్యర్థనలు చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ తన దేశీయ పొదుపు ఖాతాదారులకు నగదు లావాదేవీలు, ఎటిఎం ఇంటర్ చేంజ్, చెక్ బుక్ ఛార్జీల సవరించిన్నట్లు తెలిపింది. ఈ మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్ సైట్ తెలిపింది. అన్ని నగదు లావాదేవీలపై ఛార్జీల సవరణ వర్తిస్తుంది.ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. ఆ తర్వాత లావాదేవీలకు ఛార్జీలు వర్తిస్తాయి.ప్రతి ఆర్థిక లావాదేవీకి బ్యాంకు ₹20, ఆర్థికేతర లావాదేవీకి ₹8.50 వసూలు చేస్తుంది. ఆగస్టు 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుల హోమ్ బ్రాంచీలో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. లక్షకు పైగా జరిపే ప్రతి లావాదేవిపై ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది. ఎల్పీజీ ధరలు: ఎల్పీజీ ధరలను గ్యాస్ ఏజెన్సీలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తాయి. జూలై నెల 1 తేదీన ఎల్పీజీ ధరలను రూ. 26 పెంచాయి. మరి ఈ నెల పెరగనున్నాయా? తగ్గనున్నాయా? అనేది ఆగస్టు 1 తేదీన తెలవనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ): 15సీఏ, 15సీబీ ఫామ్స్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విషయంలో పలు సడలింపులు ఇచ్చింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. గతంలో జూలై 15 వరకు ఉన్న చివరి తేదీని ఆగస్ట్ 15కి పొడిగించింది. -
వర్క్ఫ్రమ్హోంకి ఇక వేరే జీతం!!
న్యూఢిల్లీ: కొవిడ్-19 ప్రభావం నుంచి కుదేలుకాకుండా ఐటీ రంగం కాస్తో కుస్తో జాగ్రత్త పడగలిగింది. భద్రత దృష్ట్యా ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌హోం వెసులుబాటు కల్పిస్తూనే.. ఇంకా ఎక్కువే అవుట్‌పుట్ రాబట్టుకుంటున్నాయి ఐటీ కంపెనీలు. అయితే ఆఫీస్ వర్క్‌కి-రిమోట్ వర్క్‌కి ఇక మీదట ఒకే రకమైన పే స్కేల్ ఉండకూడదని కంపెనీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గూగుల్ మొదటి అడుగు వేసింది. జీతభత్యాల విషయంలో ఒక క్లారిటీ ఇస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగుల జీతభత్యాల విషయంలో గూగుల్ కొత్తగా ఒక టూల్‌ను ప్రవేశపెట్టింది. వర్క్ లొకేషన్ టూల్‌గా పిలుచుకుంటున్న ఈ టూల్.. సదరు ఉద్యోగి ఉండే ప్రాంతం, ఆ ప్రాంతంలో కాస్ట్ ఆఫ్ లివింగ్(జీవన వ్యయం), లోకల్ జాబ్ మార్కెట్ తదితర అంశాలను ఆ టూల్ పరిగణనలోకి తీసుకుంటుంది. అలా ఆ ఉద్యోగికి ఎంత జీతం ఇవ్వాలన్నది అడ్జస్ట్చేసి ఆ టూల్ లెక్కగట్టి చెప్తుంది. దీనితో పాటు వాళ్లకు అదనంగా ఇంకేం అందించాలనేది కూడా ఈ టూలే నిర్ణయిస్తుంది. దీనిప్రకారం ఉద్యోగులు ఎక్కడి నుంచి పని చేసుకోవాలి? అనేది వాళ్ల స్వేచ్ఛకే వదిలేస్తున్నామని, అవసరమైతే బదిలీకి వెసులుబాటు కూడా కల్పిస్తామని గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, గూగుల్‌కి ప్రపంచవ్యాప్తంగా లక్షన్నరకి పైగా ఉద్యోగులు ఉన్నారు. రాబోయే రోజుల్లో వీళ్లలో 60 శాతం మంది ఆఫీసులకే వచ్చే సూచనలు ఉన్నాయని గూగుల్ అంచనా వేస్తోంది. మరో 20 శాతం కొత్త ఆఫీస్ లొకేషన్స్‌లో పనికి సిద్ధం కావొచ్చని, మరో 20 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం మీదే పని చేయొచ్చని అంచనా వేస్తోంది. చదవండి: కరోనా టైంలో గూగుల్ భారీ సాయం -
సింగరేణిలో ఇదేం వివక్ష ?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ద్వితీయ శ్రేణి పౌరుల్లా పరిగణించబడుతున్నారు. ఏడేళ్లుగా హైపవర్ వేతనాలు ఇచ్చే విషయంలోనూ పట్టింపు లేని సింగరేణి యాజమాన్యం.. కోవిడ్ బారిన పడిన కాంట్రాక్ట్ కార్మికుల పట్ల కూడా ఇలాగే వ్యవహరిస్తోంది. చివరకు కోవిడ్‌తో మరణించిన కాంట్రాక్ట్ కార్మికులకు పరిహారం చెల్లించడం లేదు. దీంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నాయి. కరోనాతో మరణించిన కాంట్రాక్ట్ కార్మికులకు రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని 2020 ఆగస్టు 14న కోలిండియా పరిధిలో జరిగిన 408వ బోర్డు మీటింగ్‌లో నిర్ణయించారు. అయితే ప్రస్తుతం పర్మినెంట్ కార్మికులు మృతి చెందితేనే వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలను పట్టించుకోవడం లేదు. ఈ వివక్షపై ప్రశ్నించినా ఫలితం లేదని, గుర్తింపు సంఘం నాయకులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో మృతిచెందిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సింగరేణి డైరెక్టర్ (పా) ఎన్.బలరామ్‌కు బీఎంఎస్ నాయకులు ఇటీవలే వినతిపత్రం అందజేశారు. గత ఏడాది కాలంలో సింగరేణి వ్యాప్తంగా 40 మంది కాంట్రాక్ట్ కార్మికులు కరోనాతో మృతిచెందినట్లు గణాంకాల్లో ఉన్నా.. వారి కుటుంబాలకు పరిహారం చెల్లించలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణి వ్యాప్తంగా సుమారు 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, వారి కుటుంబాలకు వైద్య సదుపాయంతో పాటు మరణించిన వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. విస్తృత సేవలందిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు కోవిడ్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైనప్పటికీ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సింగరేణి ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ సెంటర్లలో పర్మినెంట్ కార్మికులు కోవిడ్ పేషంట్లను ముట్టుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులు కోవిడ్ పేషంట్ల మధ్య, మృతదేహాల మధ్య విధులు నిర్వహిస్తున్నారు. కోవిడ్ పేషంట్లకు మందులు ఇవ్వకపోతే జీతం కట్, మృతిచెందిన వారిని పట్టుకోకుంటే ఉద్యోగం అవుట్ అంటూ కాంట్రాక్ట్ కార్మికులతో పనులు చేయిస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు మోయడం, మరుగుదొడ్లు శుభ్రం చేయడం, మృతదేహాలను తరలిస్తూ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్నారు. మరోవైపు సివిక్, సివిల్, పారిశుద్ధ్యం, సులభ్, లోడింగ్, అన్లోడింగ్, రైల్వే క్రాసింగ్, అంబులెన్స్, కోల్ శాంప్లింగ్, గార్డెనింగ్, క్యాంటీన్స్, ఫిల్టర్బెడ్లలో నీటి శుద్ధి, ఆఫీస్ బాయ్స్, కంప్యూటర్ ఆ పరేటర్లు, బెల్ట్ క్లీనింగ్, బ్లాస్టింగ్, క్రషర్.. ఇలా పలు విభాగాలలో కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి గనుల చట్టం 1952 ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సి ఉంది. అ యినప్పటికీ నామమాత్రపు వేతనాలు చెల్లించి శ్రమదోపిడీకి గురిచేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన సమయంలో సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ వ్యవస్థను బానిస వ్యవస్థగా అభివర్ణించడంతో పాటు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ మార్పు లేదని కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్లయినా అమలుకాని హైపపర్ వేతనాలు కోలిండియాలో కాంట్రాక్ట్ కార్మికులకు 2013 నుంచి హైపవర్ వేతనాలు అమలవుతున్నాయి. అయితే సింగరేణిలో హైపవర్ వేతనాలు అమలు చేయడం లేదు. దీంతో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా అమలు చేయడం లేదు. చివరకు కనీస వేతనం జీవోను సైతం అమలు కావడం లేదు. ఒక పర్మినెంట్ కార్మికుడి జీతంతో సుమారు 10 మంది కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో పని చేస్తున్నారు. దీంతో సింగరేణికి కోట్లాది రూపాయలు మిగులుతున్నాయి. అయినా కాంట్రాక్ట్ కార్మికుల పట్ల యాజమాన్యం సవతి తల్లి ప్రేమ చూపుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి కాంట్రాక్ట్ కార్మికులకు ఇన్సూరెన్స్ చేయడంతో పాటు, ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కుటుంబ సభ్యులకు కోవిడ్ సోకితే మెరుగైన వైద్యం అందించాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ విషయాలపై సింగరేణి జీఎం పర్సనల్ (ఐఆర్‌పీఎం) అందెల అనందరావును ‘సాక్షి’ వివరణ కోరగా కాంట్రాక్ట్ కార్మికుల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు విషయమై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. -
సంచీ తీసుకెళ్తేనే ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు!
సాక్షి, ముంబై: తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నెల వేతనంలో చిల్లర నాణేలు ఇవ్వాలని బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) యాజమాన్యం నిర్ణయించింది. ప్రతీరోజు టికెట్ల విక్రయం ద్వారా వివిధ బస్ డిపోలలో రూ. లక్షల్లో చిల్లర నాణేలు పోగవుతున్నాయి. ఇలా రూ. 12 కోట్లకు పైనే చిల్లర డబ్బులు బెస్ట్ ప్రధాన కార్యాలయమైన కొలాబాలోని బస్ భవన్లో నిల్వ ఉన్నాయి. వీటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేద్దామంటే ప్రతీరోజు పెద్ద మొత్తంలో చిల్లర నాణేలను స్వీకరించడానికి బ్యాంకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని బెస్ట్ యాజమాన్యం చిల్లర నాణేలకు ఉద్యోగుల జీతాలతో ముడిపెట్టింది. ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో భాగంగా రూ. 15 వేల చిల్లర నాణేలు ఇవ్వాలని, మిగతా జీతాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని బెస్ట్ సమితి నిర్ణయించింది. దీంతో ఉద్యోగులు వేతనాలు చెల్లించే రోజున సంచి వెంట తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. చార్జీలు తగ్గడంతో.. గతంలో బెస్ట్ బస్సుల్లో ప్రయాణించాలంటే కనీస చార్జీలు రూ. 8, ఆ తరువాత రూ. 10, రూ. 12, రూ. 14, రూ. 16 ఇలా ఉండేవి. దీంతో చిల్లర విషయంలో తరచూ గొడవలు జరిగేవి. టికెట్‌కు సరిపడా చిల్లర డబ్బులు ఇచ్చే విషయంలో ప్రయాణికులు, కండక్టర్లకు మధ్య వాగ్వాదాలు చోటుచేసుకునేవి. కానీ యాప్ ఆధారిత ఓలా, ఊబర్, షేర్ ట్యాక్సీ, ఆటోల నుంచి ఎదురవుతున్న పోటీని ఎదుర్కొనేందుకు 2019 అక్టోబర్‌లో బెస్ట్ సంస్థ ప్రయాణ చార్జీలను పునర్ వ్యవస్థీకరించింది. బస్సుల్లో ప్రయాణించేందుకు జనాలను ఆకట్టుకునేలా, ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు వీలుగా టికెట్ రేట్లను తగ్గించింది. మొదటి 5 కిలోమీటర్ల దూరానికి కనీస చార్జీలు రూ. 5, ఆ తరువాత రూ. 10, రూ. 15 ఇలా చార్జీలు మార్చింది. చార్జీలు తగ్గడంతో బెస్ట్ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అప్పటి నుంచి చిల్లర నాణేలు వివిధ బస్ డిపోలలో కుప్పలు తెప్పలుగా వచ్చి చేరుతున్నాయి. బ్యాంకులు నో.. ఉద్యోగులకు ముడి ఇలా 2021 జనవరి నుంచి భారీగా పోగవుతున్న చిల్లర నాణేలను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఓ కాంట్రాక్టర్‌ను నియమించాలనే ప్రతిపాదన సైతం తెరమీదకు వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. బ్యాంకు సిబ్బంది కూడా పెద్ద మొత్తంలో చిల్లర డబ్బులు స్వీకరించేందుకు నిరాకరించడంతో అవి దాదాపు రూ. 12–15 కోట్ల మేర పేరుకుపోయాయి. సంస్థలో 40 వేల మందికిపైగా ఉద్యోగులున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి నెలనెలా వేతనాలు చెల్లించడం సంస్థకు కష్టతరంగా మారింది. దీంతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతన్న బెస్ట్ సంస్థ ఈ చిల్లర నాణేలను ఉద్యోగుల జీతాలకు ముడిపెట్టింది. ఉద్యోగుల వేతనంలో చిల్లర నాణేలు చేతికివ్వాలని, మిగతావి వారి వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. బెస్ట్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సంస్థ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంతపెద్ద మొత్తంలో చెల్లించే చిల్లర నాణేలు ఇంటికెలా తీసుకెళ్లమంటారని సంస్థను ప్రశ్నిస్తున్నారు. ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు చిల్లర నాణేలు లెక్కపెట్టి ఇవ్వాలంటే చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా పెద్దమొత్తంలో చిల్లర స్వీకరించేందుకు వ్యాపారులు కూడా నిరాకరిస్తారు. దీంతో ఉద్యోగులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. -
ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్ : బైడెన్ తాజా నిర్ణయం
వాషింగ్టన్: భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో తీపి కబురు అందించారు. హెచ్-1బీ వీసాల వేతనాలకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేశారు. హెచ్-1బీ వీసాపై అమెరికాలో పనిచేసే విదేశీ నిపుణుల కనీస వేతనాలను భారీగా పెంచుతూ ట్రంప్ సర్కారు గతంలో తెచ్చిన నిబంధన అమలును మరింత ఆలస్యం చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. కార్మిక శాఖ శుక్రవారం ప్రచురించిన ఫెడరల్ నోటిఫికేషన్లో, మే 14 వరకూ దీని అమలును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. తమ నిర్ణయం అమెరికాలోని కొంతమంది విదేశీయుల తాత్కాలిక, శాశ్వత ఉద్యోగుల వేతన ప్రయోజనాలను కాపాడనుందని తెలిపింది. ఫలితంగా భారతీయ ఐటీ నిపుణులకు కూడా భారీ ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న కాలపరిమితిని మరింత ఆలస్యం చేయాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం ఇది మే 14 నుండి అమలులోకి రానుందని తెలిపింది. దీన్ని పొడిగించేముందు ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామని పేర్కొంది. కాగా అమెరికా సంస్థలపై విదేశీ ఉద్యోగుల వేతన భారం తగ్గడంతోపాటు, విదేశీ ఉద్యోగుల స్థానంలో అమెరికన్లకే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తాయంటూ అప్పటి అధ్యక్షుడు ట్రంప్ తప్పనిసరి కనీస వేతననిబంధనను తీసుకొచ్చారు. దీనిపై ఇరువైపులా నిరసన భారీగానే వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో బైడెన్ తాజా ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే బైడెన్ తాజా నిర్ణయాన్ని ఫెడరేషన్ ఫర్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్(ఫెయిర్) సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. అమెరికా ఉద్యోగులు, సంస్థల భద్రత నిమిత్తం మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమలు నిలుపుదలతో కరోనా సంక్షోభంలో చిక్కుకున్న వారి పరిస్థితి మరింత క్షీణిస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం -
ముఖ్య మంత్రుల జీతాలు ఎంత....?
-
ఆదర్శం నుంచి అధోగతికి!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎన్నో సహకార పరపతి సంఘాల ఆవిర్భావానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా ఆసియాలోనే ఉన్నత పొదుపు సంస్థగా గుర్తింపు పొందిన ఆర్టీసీ సహకార పరపతి సంఘం ప్రస్తుతం పతనం అంచుకు చేరుకుంది. ఆర్టీసీ స్వయంగా ఈ సహకార సంఘం పతనాన్ని లిఖిస్తోంది. ఉద్యోగుల వేతనాల్లోంచి పోగు చేసిన రూ. వేల కోట్ల నిధిని ఆర్టీసీ దిగమింగి తిరిగి కట్టకపోవటమే దీనికి కారణం. అత్యవసరాలకు రుణం అందించే నిధి మాయమవడంతో ఆర్టీసీ ఉద్యోగులు బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇక జీతంలో కోత లేకుండా చూసుకుంటే ఎక్కువ అప్పు పుడుతుందన్న ఉద్దేశంతో ఉద్యోగులు ‘అమ్మ’లాంటి సహకార సంఘంలో సభ్యత్వాన్ని వదులుకుంటున్నారు. 48 వేల మంది సభ్యులున్న ఆ పరపతి సంఘం నుంచి ఇప్పటికే 6 వేల మంది సభ్యత్వాలు ఉపసంహరించుకున్నారు. ప్రతినెలా కొత్తగా వందల సంఖ్యలో ఉపసంహరణ దరఖాస్తులందుతున్నాయి. చివరకు ఆర్టీసీలో అత్యున్నత పోస్టుగా భావించే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కూడా సహకార సంఘం నుంచి వైదొలుగుతున్నారు. ఎందుకీ దుస్థితి? రాష్ట్రం విడిపోయే వేళ ఈ సంఘంలో సాలీనా రూ. 3 వేల కోట్లకు పైచిలుకు నిధి జమయ్యేది. దాన్నుంచి లక్ష మందికి రుణాలు అందించేవారు. విభజన తర్వాత తెలంగాణ ఆర్టీసీ పరిధిలోని సీసీఎస్‌కు రూ. 1,500 కోట్ల వాటా వచ్చింది. ఇప్పుడా విలువ రూ. 2 వేల కోట్లను దాటాల్సి ఉంది. కానీ కొన్నేళ్లుగా దివాలా దిశలో సాగుతున్న ఆర్టీసీ.. సొంత ఖర్చులకు ఈ నిధిని వాడుకొని చేతులెత్తేసింది. అడపాదడపా కొంత మొత్తం తిరిగి చెల్లిస్తూ ప్రతినెలా పోగయ్యే కొత్త నిధిని వాడేసుకోవడం అలవాటు చేసుకుంది. గత రెండేళ్లుగా తిరిగి చెల్లింపు దాదాపు నిలిచిపోయింది. దీంతో సీసీఎస్ బ్యాలెన్స్ సున్నాగా మారిపోయింది. అప్పట్నుంచి రుణాలు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం దాదాపు 10 వేల వరకు దరఖాస్తులు పేరుకుపోయాయి. మధ్యలో కోర్టు ఆదేశం మేరకు రూ. 200 కోట్లు తిరిగి జమ చేసిన ఆర్టీసీ... ఆ తర్వాత మళ్లీ మొహం చాటేసింది. ఆ రూ. 200 కోట్లతో కొంత మందికి లోన్లు అందాయి. మిగతా సుమారు 8 వేల దరఖాస్తులు దుమ్ము కొట్టుకుపోతున్నాయి. తొలిసారి సభ్యత్వాల రద్దు వైపు ఉద్యోగులు.. సీసీఎస్ నుంచి రుణాలు రాకపోవడంతో ఉద్యోగులు గత్యంతరం లేక బ్యాంకుల నుంచో లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచో అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయినా ప్రతి నెలా సీసీఎస్‌కు జమ కట్టే పేరుతో ఆర్టీసీ వారి జీతాల నుంచి 7.5 శాతాన్ని కట్ చేస్తోంది. కానీ ఆ మొత్తాన్ని సీసీఎస్‌కు ఇవ్వకుండా సొంతానికి వాడేసుకుంటోంది. దీంతో వారి జీతం తగ్గి బ్యాంకు రుణం కూడా తక్కువగా ఉంటోంది. అదే ఈ కోత లేకుంటే, అంతమేర రుణం కూడా పెరుగుతుంది. అలాగే తీసుకున్న అప్పు కిస్తీలు కట్టడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ఉద్దేశంతో ఉద్యోగులు సీసీఎస్ నుంచి సభ్యత్వాలు రద్దు చేసుకోవడం ప్రారంభించారు. అలా రద్దు చేసుకుంటే అప్పటివరకు దాచుకున్న మొత్తం కూడా పొందే వీలుంటుంది. చిరుద్యోగులకైతే ఆ మొత్తం రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు, పెద్ద ఉద్యోగులకు అంతకంటే ఎక్కువ ఉంటుంది. కానీ ఆ మొత్తం చెల్లించాలంటే కొత్తగా నిధి పోగు కాకపోతుండటంతో అదీ సాధ్యం కావటం లేదు. కానీ చూస్తుండగానే 6 వేల మంది సభ్యత్వం రద్దు చేసుకున్నారు. మరో 4–5 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతినెలా ఆ సంఖ్య పెరుగుతోంది. ఉలుకూపలుకు లేని సంస్థ.. ఆర్టీసీ చరిత్రలో తొలిసారి ఈ విపరీత పరిణామం నెలకొనడంతో సంస్థ షాక్‌కు గురైంది. దీన్ని ఆపాలంటే మళ్లీ సీసీఎస్‌లో కొత్త నిధి ఏర్పడాలి. దానికి ఆర్టీసీ బకాయిపడ్డ రూ. 1800 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. కానీ ప్రతినెలా జీతాలు చెల్లించేందుకు బడ్జెట్ కేటాయింపుల కోసం ఆర్థిక శాఖ వైపు చూసే ఆర్టీసీ... ఇంత భారీ బకాయి చెల్లించడం వల్ల కాక మిన్నకుండిపోయింది. కళ్ల ముందే సభ్యత్వాలు పెద్ద సంఖ్యలో రద్దవుతున్నా మిన్నకుండిపోయింది. ఇప్పటికే ఆర్టీసీ తీరుపై సీసీఎస్ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించింది. గతంలో కోర్టు సూచన మేరకు రూ. 200 కోట్లను కనాకష్టంగా ఆర్టీసీ చెల్లించింది. ఇప్పుడా కేసు ఇంకా కొనసాగుతోంది. ఆర్టీసీలో ఫైనాన్స్ వ్యవహారాలు చూసే విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి, లీగల్ వ్యవహారాలు చూసే మరో ఉన్నతాధికారి, ఈడీలు కూడా సభ్యత్వం రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసిన విషయం గుప్పుమనడంతో ఇక ఇంతకాలం అందులో పోగైన నిధులు కూడా భవిష్యత్తులో తిరిగి రావేమోనన్న భయంతో సాధారణ ఉద్యోగులు సైతం సభ్యత్వాల రద్దు కోసం పోటెత్తుతున్నారు. ఏమిటీ పొదుపు సంఘం? ఆర్టీసీ ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెలా 7.5 శాతాన్ని సహకార పరపతి సంఘాని (సీసీఎస్)కి చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని మినహాయించిన తర్వాతే వారికి జీతాలు అందుతాయి. అలా మినహాయించిన మొత్తాన్ని ఆర్టీసీ ఈ సీసీఎస్‌లో జమ చేయాలి. అలా పోగయ్యే మొత్తాన్ని సీసీఎస్ పాలకవర్గం బ్యాంకుల్లో పెట్టి వడ్డీ రూపంలో ఆదాయాన్ని పొందుతుంది. ఆ మొత్తం నుంచి కార్మికుల కుటుంబ అవసరాల కోసం తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తుంది. పిల్లల పెళ్లిళ్లు, ఇళ్లు కట్టుకోవడం, చదువులు, ఆరోగ్యానకి సంబంధిం చిన ఖర్చులకు ఇస్తుంది. ఉద్యోగులు రిటైరైతే అప్పటి దాకా జమ అయిన మొత్తాన్ని బ్యాంకు రేట్ల స్థాయి వడ్డీతో కలిపి చెల్లిస్తుంది. నాడు వైభవం.. ఉత్తరాదికి చెందిన రైల్వే ఉద్యోగుల బృందం ఆ సంస్థ సందర్శనకు వచ్చి అంతర్గతంగా సహకార పరపతి సంఘం ఎలా ఉండాలో అధ్యయనం చేసింది. ఏడాదిలో రూ.3వేల కోట్లను పొదుపు రూపంలో సేకరించి లక్ష మందికి దరఖాస్తు చేసిన 3రోజుల్లోనే రుణాలు అందిస్తున్న తీరు చూసి అచ్చెరువొందింది. ఠంచన్‌గా రుణాల జమ, మళ్లీ కొత్త రుణాలు... నయాపైసా అవినీతి లేకుండా సాగుతున్న ఆ వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయింది. నేడు ప్రశ్నార్థకం.. అంత సమున్నత సంస్థ నిలువునా కూలిపోతోంది. దివాలాకు దగ్గరై మూతపడే దిశగా కదులుతోంది. ఆ సంస్థకు వెన్నెముకగా ఉండే సభ్యులు క్రమంగా సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంటున్నారు. ఇప్పటికే 6 వేల సభ్యత్వాలు రద్దవగా సగటున ప్రతి నెలా 350 మంది ఉససంహరణ దరఖాస్తులు అందజేస్తున్నారు. వెరసి.. ఆసియాలోనే ఉత్తమ సహకార సంఘాల్లో ఒకటిగా వెలుగొందిన ఆ సంస్థ ఉనికే ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. కూతురు పెళ్లి లోన్ కోసం సభ్యత్వం వదులుకున్నా నా కూతురు పెళ్లి కోసం ఏడాది కింద సీసీఎస్‌కు దరఖాస్తు చేశా. నిధులు లేక ఇవ్వలేదు. దీంతో ప్రైవేటుగా అప్పు తెచ్చా. ఇందుకు ప్రతినెలా రూ. 20 వేల కిస్తీ కడుతున్నా. జీతంలో సీసీఎస్ కోత ఉంటే ఇబ్బందిగా ఉంటోందని దాన్ని రద్దు చేసుకున్నా. ఏడు నెలలు గడుస్తున్నా నాకు అందులో ఉన్న నా సొమ్ము ఇవ్వట్లేదు. – వెంకటేశ్వర్లు, కంట్రోలర్, నల్లగొండ అప్పు తీర్చేందుకు సభ్యత్వం రద్దు చేసుకుంటున్నా పిల్లల చదువుకు రూ. లక్షన్నర, ఇంటి కోసం రూ. లక్షన్నర కోసం రెండు దరఖాస్తులు సమర్పించా. ఏడాదిగా అవి పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో రూ. 2 లక్షలు బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకున్నా. సకాలంలో జీతం రాక చెక్ బౌన్స్ అవుతుండటంతో కిస్తీల మందం ఉంచేందుకు ప్రైవేటుగా కొంత అప్పు తెచ్చా. అవి కట్టేందుకు జీతం సరిపోక, సీసీఎస్ కటింగ్ లేకుండా ఉండేందుకని సభ్యత్వమే రద్దు చేసుకునేందుకు దరఖాస్తు పెట్టా. – జియాఉద్దీన్, డ్రైవర్ ఇబ్రహీంపట్నం ఇది రైఫీజన్ చిత్రంతో ఉన్న పురస్కారం. సహకార పరపతి సంఘం విధానాలకు ఆద్యుడైన ఈ జర్మనీ మేధావి ఆశయాన్ని సుసంపన్నం చేస్తోందన్న ఉద్దేశంతో ఆర్టీసీ సహకార పరపతి సంఘం ఆయన చిత్రంతో కూడిన ఈ పురస్కారాన్ని పొందింది. ఇప్పుడు సీసీఎస్ గోడకు వేళ్లాడుతూ దాని దయనీయ స్థితికి మూగ సాక్ష్యంగా నిలిచింది. -
రెండోవారం గడుస్తున్నా ఇంకా అందని జీతాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు ఫిబ్రవరి రెండోవారం గడుస్తున్నా ఇంకా జీతాలు అందలేదు. గత నెల 12న వేతనం చేతికి అందింది. ఈ నెల మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద జీతాల కోసం రూ.20 కోట్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం. కావాల్సిన మిగతా రూ.100 కోట్లు ఆర్థిక శాఖ నుంచి రావాల్సి ఉంది. బడ్జెట్లో ప్రభుత్వం ఆర్టీసీకి కేటాయించిన మొత్తంలోంచి జీతాలకు నిధులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి ఆ నిధులు ఆర్థిక శాఖ నుంచి ఇంకా అందలేదని తెలుస్తోంది. ఇప్పటికే వాటిని విడుదల చేయాల్సిందిగా అధికారులు ఆర్థిక శాఖను కోరారు. గతంతో పోలిస్తే ఇటీవల ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో కొంత మెరుగుపడింది. రోజు వారీ ఆదాయం రూ.12 కోట్లను దాటింది. రోజువారీ టికెట్ ఆదాయం పెరిగినందున ఖర్చులు పోను రూ.20 కోట్లను ఆర్టీసీ జీతాల పద్దుకు సిద్ధం చేసుకుంది. గత నెల ఇలాగే కొంతే డబ్బు ఉండటంతో.. ఉన్నంత మేర కొంతమందికి జీతాలు చెల్లించి, మిగతావారికి ప్రభుత్వం నుంచి డబ్బు వచ్చాక చెల్లించారు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. ఈసారి అలా కాకుండా అందరికీ ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించారు. కావాల్సినన్ని డబ్బులు లేక రెండోవారంలో కూడా చెల్లించలేదు. సోమవారం నాటికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేందుకు యత్నిస్తున్నారు. గత 11 రోజుల్లో ఆర్టీసీకి రూ.118 కోట్ల ఆదాయం సమకూరినా.. ఉద్యోగులకు రెండోవారం నాటికి జీతాలు చెల్లించకపోవటం దారుణమని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు విమర్శించారు. వేతన సవరణ చేయాలి.. మరోవైపు ఆర్టీసీలో కార్మిక సంఘాల ఆందోళనలు క్రమంగా పెరుగుతున్నాయి. వేతన సవరణ విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ కొద్ది రోజులుగా సంఘాలు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇటీవలే టీఎంయూ, ఈయూ సమావేశాలు పెట్టి విమర్శలు గుప్పించాయి. తాజాగా దీనిపై చర్చించేందుకు టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఈనెల 20న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తుందని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాంచందర్, వీఎస్‌రావు తెలిపారు. అలాగే ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 22న కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షప్రధాన కార్యదర్శులు బాబు, రాజిరెడ్డి తెలిపారు. కార్మిక సంఘాలకు మళ్లీ ఆర్టీసీలో అవకాశం కల్పిస్తూ వెంటనే ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో 26న చలో బస్‌భవన్ చేపడుతున్నట్టు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి హనుమంతు తెలిపారు. చదవండి: మొదటి జీతం.. పేదలకు అంకితం సింగరేణిలో భారీగా ఉద్యోగాలు! -
మొదటి జీతం.. పేదలకు అంకితం
గీసుకొండ : వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా నియామకమైన వలపదాసు అనూష ఇటీవల విధుల్లో చేరింది. ఆమె మొదటి నెల వేతనాన్ని పేదల ఆకలి తీర్చడానికి వెచ్చించి ఆదర్శంగా నిలిచింది. ఆకలితో అలమటిస్తున్న వంద మంది నిరుపేదలు, భిక్షమెత్తుకునే వారికి భోజనం అందజేసింది. వరంగల్ నగరంలోని ఎస్ఆర్ఆర్ తోట ప్రాంతానికి చెందిన అనూష తండ్రి చిన్నతనంలో చనిపోయారు. తల్లి బీడీలు చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. అనూష పేదరికంలో బతుకుతూనే ఎంఏ బీఈడీ వరకు చదువుకుని ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తూ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించింది. పేదవారికి సాయం చేయా లానే సంకల్పంతో మొదటి వేతనంతో ఆహారం సమకూర్చానని, రానున్న రోజుల్లో తన శక్తి మేరకు సాయపడతానని అనూష చెబుతోంది. ఆమె పేదలకు ఆహార పొట్లాలు అందిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో పలువురు అభినందిస్తున్నారు. -
2021: ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత?
న్యూఢిల్లీ: ఈ ఏడాదంతా ఓ శూన్య సంవత్సరంలాగే గడిచింది. విహారాలు లేవు, వినోదాలు లేవు. పెళ్లిళ్లు పేరంటాలు అంటూ తిరగడాలు అసలే లేవు. నెలల తరబడి ఇంట్లోనే బందీలై పని లేక, పొద్దు పొడవక నీరసంగా బతుకు బండిని లాగించారు. కానీ వలస బతుకులు మాత్రం కూడు దొరక్క నరకయాతన అనుభవించారు. అటు ఎందరో ప్రైవేటు ఉద్యోగులు కూడా ఉన్న జాబ్ ఊడి రోడ్డున పడ్డారు. ఇటు ప్రభుత్వాల దగ్గర కూడా ఖజానా ఖాళీ అయి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని రోజులున్నాయి. మొత్తానికి జనాలను ముప్పు తిప్పలు పెట్టిన కరోనా పీడిత 2020 ఏడాది కథ ముగిసిపోతుంది. ఇప్పుడిప్పుడే అంతా కుదుటపడుతోంది. (చదవండి: అవార్డులు వెనక్కు ఇచ్చిన జవాన్లు: నిజమెంత?) ఇలాంటి సమయంలో ఉద్యోగులను ఠారెత్తిస్తూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. "రానున్న ఏడాది నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత ఉండబోతుంది. కార్మిక చట్టాల్లో సవరణల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులను గ్రేడుల వారీగా విభజించి దాని ప్రకారం జీతాలు తగ్గించనున్నారు" అన్నది సదరు వార్త సారాంశం. ఇది నిజమేనని నమ్మిన నెటిజన్లు దాన్ని తెగ షేర్ చేస్తున్నారు. దీంతో స్పందించిన ప్రభుత్వం దీన్ని తప్పుడు వార్తగా కొట్టిపారేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) వివరణ ఇచ్చింది. 2021లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో తగ్గింపు ఉంటుందనేది పూర్తిగా అబద్ధమని పేర్కొంది. వేతన కోడ్ బిల్లు-2019 కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు వర్తించదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో కోత పెడుతున్నట్లు ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదని స్పష్టం చేసింది. కాబట్టి ఉద్యోగులు.. ఒకటో తారీఖున జీతం తక్కువ వస్తుందేమోనని ఆందోళన చెందకండి. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మి టెన్షన్లు తెచ్చుకోకండి. (చదవండి: దేశ ప్రధానికి జీతం చాలట్లేదట! ) -
అదనపు కలెక్టర్లకు ఆరునెలలుగా జీతాల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అదనపు కలెక్టర్లుగా నియమితులైన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు (ఎస్జీడీసీ) అటు వేతన, ఇటు పాలనాపర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతులు ఇవ్వకపోవడంతో 18 మంది అదనపు కలెక్టర్లకు ఆరునెలలుగా వేతనాలు కూడా రాలేదని తెలుస్తోంది. గతంలో పనిచేసిన స్థానం నుంచే కొందరు ఇప్పటికీ వేతనాలు డ్రా చేస్తున్నారని, ఆ పోస్టుల్లో ఇతర అధికారులు వచ్చి చేరితే వేతనాలు రావడం లేదని సమాచారం. వేతనాలతో పాటు జాబ్ చార్ట్ లేకపోవడం మరో సమస్యగా మారింది. వారి విధులు, అధికారాలకు సంబంధించిన మార్గదర్శకాలు లేకపోవడంతో కలెక్టర్లు ఇచ్చిన అసైన్మెంట్లకే అదనపు కలెక్టర్లు పరిమితం అవుతున్నారని రెవెన్యూ సంఘాలు చెబుతున్నాయి. చదవండి: (స్మార్ట్ సిటీలు.. కావాలా..వద్దా?) జూనియార్టీతో తిప్పలు రాష్ట్రంలోని చాలా జిల్లాలకు అదనపు కలెక్టర్లుగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదా ఉన్న అధికారులను నియమించారు. వీరికి ప్రభుత్వంలో జాయింట్ డైరెక్టర్ స్థాయి హోదా కూడా లేదు. కానీ, జిల్లాల్లో సూపరిండెంట్ ఇంజనీర్లు, డీఎంహెచ్‌వో, ఆర్జేడీ, జేడీ అగ్రికల్చర్ లాంటి అధికారులు ప్రభుత్వంలో అడిషనల్ డైరెక్టర్ హోదా స్థాయిలో పనిచేస్తున్నారు. దీంతో అధికారుల మధ్య జూనియర్, సీనియర్ సమస్యలు వస్తున్నాయని, రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా సీనియర్ అధికారులతో సమన్వయం చేసుకుని సమీక్షలు నిర్వహించడం, ఆదేశాలివ్వడం అదనపు కలెక్టర్లకు ఇబ్బందిగా మారిందని రెవెన్యూ సంఘాలంటున్నాయి. ఈ నేపథ్యంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్న వారిలో 40–50 మంది అధికారులకు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పోస్టులు సృష్టించి ఇవ్వాలని, తద్వారా జిల్లాల్లో పాలన మరింత మెరుగవుతుందని సంఘాలు చెబుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు కూడా సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుల సృష్టికి సిఫారసు చేశారని, 2016లో తయారైన ఫైలు రెవెన్యూ శాఖలో పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ పోస్టులను మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా), డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్లు కూడా సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేయడం గమనార్హం. -
వారి జీతాల కోసం చెట్లు అమ్మాలా ?
సాక్షి, బెంగళూరు : ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి శివమొగ్గలోని మైసూర్ పేపర్ మిల్లు పరిధిలోని చెట్లను అమ్మేయాలా అని అటవీ శాఖ అధికారులను సీఎం బి.ఎస్.యడియూరప్ప ప్రశ్నించారు. మిల్లు పరిస్థితిపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో సీఎం శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ.. 1960లో శరావతి విద్యుత్ కేంద్రాన్ని నిర్మించే సమయంలో శివమొగ్గలోని 3,500 కుటుంబాలు తమ భూములను కోల్పోయాయన్నారు. వారందరికీ పునరాసంతో పాటు 9,800 ఎకరాల భూమిని ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని కానీ వారికి సరైన సాయం అందలేదని తెలిపారు. ఆ కుటుంబాలకు సహాయం చేయడానికి వెంటనే టైటిల్ డీడ్స్ సిద్ధం చేయాలని శివమిగ్గ జిల్లా పాలన యంత్రాంగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు.అదే విధంగా ఈ భూమలుపై సమగ్ర సర్వే చేపట్టాలని తెలిపారు. దీంతో పాటు భూములకు సంబంధించిన పహానీలను పొందేందుకు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయాలని అధికారులకు తెలిపారు. రోడ్లను వేయడానికి సంబంధిత శాఖ వద్ద ఎన్వోసీ పొందే విధంగా చర్యలు చేపట్టాలని టూరిజం శాఖకు వెల్లడించారు. తిర్థల్లి ఎమ్మెల్యే అరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ.... మిల్లు ఉద్యోగులకు మూడు, నాలుగేళ్లుగా జీతాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో వారికి జీతాలు ఇవ్వడానికి కనిపిస్తున్న ఏకైక మార్గం పేపర్ మిల్లు పరిశ్రమలోని చెట్లను అమ్మడమేనని ఆయన అన్నారు. కాగా పేపర్ తయారీ కోసం 1936లో అప్పటి మైసూర్ రాజు కృష్ణరాజ వడయార్ బహదూర్ భద్రావతి నది ఒడ్డున శివమొగ్గలో దీన్ని స్థాపించారు. అది 1977లో ప్రభుత్వ సంస్థగా మారింది. ఈ మిల్లులో కర్ణాటక ప్రభుత్వానికి 64.7 శాతం వాటా ఉంది. ప్రభుత్వంతోపాటు ఆ ప్రాంత ప్రజలు, ఐడీబీఐ బ్యాంకు, ఎల్ఐసీ కూడా మిల్లులో వాటా దక్కించుకున్నాయి. -
‘లాక్డౌన్’ కోత జీతాలు త్వరలో చెల్లింపు
సాక్షి, హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, ఇతరుల వేతనాల్లో కోత పెట్టిన మొత్తాన్ని జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. పింఛన్‌దారులకు రెండు వాయిదాలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులకు నాలుగు వాయిదాల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఐఏఎస్ అధికారులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, పింఛన్‌దారులు, ఇతరుల వేతనాల నుంచి విధించిన కోత మొత్తాన్ని మళ్లీ వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. పింఛన్‌దారులకు ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో రెండు వాయిదాల్లో జమ చేయనున్నారు. అదే విధంగా ఐఏఎస్ అధికారులు, గెజిటెడ్, నాన్‌గెజిటెడ్, నాలుగోతరగతి ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను మాత్రం ఈ ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌తో పాటు వచ్చే ఏడాది జనవరిలో కలిపి మొత్తం నాలుగు వాయిదాల్లో చెల్లిస్తారు. అదే విధంగా ప్రభుత్వరంగ సంస్థలు, ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే నాలుగు వాయిదాల్లో కోత పడిన వేతనాలను జమ చేయనున్నారు. కాగా, కోత విధించిన వేతనాలను ప్రభుత్వం ఏ రూపంలో జమ చేస్తుందోనన్న ఆందోళనలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు, పింఛన్‌దారులకు తాజా ఉత్తర్వులు ఊరట కలిగించాయి. -
పెద్దమనసు చాటుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: గత కొంతకాలంగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్ట్ అధ్యాపకుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. వారికి 12 నెలల జీతం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. సంబంధిత అధ్యాపకుల వినతి మేరకు 10 నెలల జీతాన్ని 12 నెలలకు పెంచుతూ ఆయన ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ, ప్రైవేట్ ఓరియంటల్.. ప్రభుత్వ ఓకేషనల్ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఇది వర్తించనుంది. సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని 5,042 మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. (చదవండి: అక్టోబర్ 1న ఏపీ కేబినెట్ సమావేశం) -
జీతం అడిగితే.. అశ్లీల వీడియోలు
మీరట్ : యూపీలోని మీరట్‌లో స్కూల్ యాజమాన్యం వికృత చర్యలు ఆలస్యంగా వెలుగుచూశాయి. జీతాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన మహిళా ఉపాధ్యాయులను వేధించడమే గాక టాయిలెట్స్‌లో రహస్యంగా స్పై కెమెరాలు ఏర్పాటు చేసి అశ్లీల వీడియోలు తీసినట్లు బయటపడింది. వివరాలు.. మీరట్‌లోని సర్ధార్ బజార్లో రిషబ్ అకాడమీ స్కూల్ నడుపుతున్నారు. లాక్డౌన్ ఉండడంతో పాఠశాలను మూసివేశారు. దీంతో ఆ స్కూల్లో పనిచేస్తున్న పలువురు మహిళా ఉపాధ్యాయులు తమకు అందాల్సిన జీతాలను ఇవ్వాలంటూ స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. పాఠశాల సెక్రటరీగా ఉన్న రంజీత్ జైన్ అతని కొడుకు అభినవ్ జైన్లు జీతాలు ఇవ్వకుండా వేధించడమే గాక మహిళల టాయిలెట్ రూంలో రహస్యంగా స్పై కెమెరాలు అమర్చినట్లు తేలింది.(చదవండి : విషాదం: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య) జీతాలు అడగానికి వచ్చిన సదరు మహిళా ఉపాధ్యాయులకు వారి వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు తెలిసింది. దీంతో పాఠశాల గేటు ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు అక్కడినుంచి మీరట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రంజిత్, అభినవ్‌లపై ఫిర్యాదు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా తండ్రీ, కొడుకులు తమకు తెలియకుండా తీసిన రహస్య వీడియోలను చూపించి చనువుగా ఉండాలంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని ఒక మహిళ ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తాము వారికి లొంగకపోతే చేతబడి చేయించి మమ్మల్ని చంపేందుకు కూడా వెనకాడమని బెదిరించారంటూ మరికొందరు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. (చదవండి : ప్రణయ్‌ని చంపినట్లు చంపుతామని..) -
వారియర్స్‌కు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నాలుగో తరగతి వైద్య సిబ్బందికి శుభవార్త. ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారందరి వేతనాలు పెంచాలని సర్కార్ యోచిస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ కూడా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కరోనా వేళ ఆయా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, రోగులకు సేవలందించే సిబ్బంది కీలకపాత్ర పోషిస్తు న్నారు. కరోనా నేపథ్యంలో తమకు ప్రత్యేక ప్రోత్సాహకం అందించాలని వారు ఇటీవల ప్రభుత్వానికి విన్నవించారు. ఈ విషయంపై మంత్రి ఈటల రాజేందర్.. బుధ, గురువారాల్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అలాగే కార్మిక, ప్రజాసంఘాల నాయకులతోనూ సమావేశమై వారి నుంచి సలహాలు తీసుకున్నారు. ప్రోత్సాహకమిస్తే కరోనా కాలం వరకే పరిమితం అవుతుందని, అలా కాకుండా వేతనం పెంచడం వల్ల శాశ్వత లబ్ధి జరుగుతుందని మంత్రి భావించారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచే విషయంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఆరు వేల మందికి ప్రయోజనం... వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ), తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని అన్ని ఆసుపత్రుల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో నాలుగో తరగతి ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇటీవల కొన్నిచోట్ల చేపట్టిన నియామకాలతో కలిపి వీరు దాదాపు 6,000 మంది ఉన్నారు. ప్రైౖ వేట్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా వీరికి వేతనాలు అందుతాయి. ఆసుపత్రిలో ఉన్న ఒక్కో పడకకు రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం ఏజెన్సీకి ఇస్తుంది. దీంతో ఒక్కో పారిశుధ్య, రోగుల సహాయకులకు నెలకు రూ. 9,225, సెక్యూరిటీ గార్డులకు రూ. 9,555 చొప్పున చెల్లించాలి. పీఎఫ్ కట్ చేసి ఇస్తుండటంతో పారిశుధ్య, రోగుల సహాయక సిబ్బందికి నెలకు రూ. 8,400, సెక్యూరిటీ గార్డులకు నెలకు రూ. 8,700 వరకు అందుతోంది. సెలవు పెడితే వేతనం అదే స్థాయిలో కోత పడుతుంది. కరోనా నేపథ్యంలో ఇంత తక్కువ వేతనానికి పనిచేసేందుకు చాలామంది వెనకడుగు వేస్తున్నారు. రిస్క్ ఉన్నచోట్ల పనిచేయడం కంటే సొంతూళ్లకు వెళ్లి ఉపాధి కూలీ చేసుకోవడమే బెటర్ అన్న భావనతో ఉన్నారు. దీంతో అనేక ఆసుపత్రుల్లో నాలుగో తరగతి ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఇది ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద సమస్యగా మారింది. నిమ్స్‌లో మాదిరిగా వేతనం పెంపు... ప్రస్తుతం ఈ ఉద్యోగులకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వడంలేదన్న చర్చ జరుగుతోంది. వాస్తవంగా ప్రతీ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిర్ణీత వేతనం ఇస్తుంటారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే నాలుగో తరగతి సిబ్బందికి మాత్రం అలా లేదు. ఇక్కడి వేతన వ్యవస్థే సరిగ్గా లేదన్న అభిప్రాయం ఉంది. ఉదాహరణకు ఒక ఆసుపత్రిలో 100 పడకలు ఉన్నాయనుకుందాం. ఒక్కో పడకకు నిర్ణీత సొమ్ము ప్రాతిపదికన ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి ప్రభుత్వం ఉద్యోగులను ఎంపిక చేసే బాధ్యత ఇస్తుంది. తక్కువ కోట్ చేసిన ఏజెన్సీకే టెండర్లో అవకాశం ఇస్తారు. అయితే ఏజెన్సీని దక్కించుకోవడం కోసం తక్కువకు కోట్ చేసేవారున్నారు. ఫలితంగా తక్కువ వేతనం ఇస్తున్నారు. దీంతో ఈ వ్యవస్థనే మార్చాలని, పడకలను బట్టి కాకుండా ఆసుపత్రుల్లో ఎంత మంది సిబ్బంది ఉండాలన్నది కూడా వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఒక్కో పడకకు రూ.5 వేల చొప్పున చెల్లించే మొత్తం దాదాపు 40 నుంచి 50 శాతం వరకూ పెరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా నిమ్స్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలని భావిస్తున్నారు. అక్కడ ఔట్సోర్సింగ్ సిబ్బందికి చెల్లిస్తున్నట్లుగా ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందికీ చెల్లించాలని నిర్ణయించినట్లు సమాచారం. నిమ్స్‌లో పారిశుధ్య సిబ్బందికి నెలకు రూ. 16,980 చొప్పున వేతనం ఉంది. వారి పీఎఫ్ కటింగ్ పోను దాదాపు రూ. 14,943 చొప్పున వేతనం వస్తుంది. ఇదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బంది, సెక్యూరిటీ, ఇతర సిబ్బందికి నెలకు సుమారు రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకూ అదనంగా వేతనాలు పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. పెంపు ఇలా ఉండొచ్చు... రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో తరగతి వైద్య సిబ్బంది: 6,000 ప్రస్తుతం ఒక్కొక్కరి వేతనం: రూ.9,400 పీఎఫ్ కటింగ్‌పోను చేతికి వచ్చేది: రూ.8,700 ప్రభుత్వం నిర్ణయంతో అదనంగా పెరిగే వేతనం: రూ.4000 పెరిగిన తర్వాత చేతికందే మొత్తం: రూ.12,700 -
బోధనాస్పత్రుల అధ్యాపకులకు యూజీసీ వేతనాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య విద్య బోధనాస్పత్రుల్లోని అధ్యాపకులకు యూజీసీ వేతనాలను అమలుచేస్తూ సర్కారు బుధవారం జీఓ జారీ చేసింది. వైద్య కళాశాలల్లోనూ అర్హులైన అధ్యాపకులందరికీ, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని అధ్యాపకులతో సమానంగా ఈ పీఆర్సీ వర్తిస్తుందని తెలిపింది. పెంచిన వేతన సవరణ 1 జనవరి 2016 నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వు లతో రాష్ట్రంలో 9 ప్రభుత్వ బోధనాస్పత్రుల్లోని 230 ట్యూటర్లు, 1561 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 614 అసో సియేట్ ప్రొఫెసర్లు, 461 ప్రొఫెసర్స్ లబ్ధి పొందనున్నారు. కాగా పీఆర్సీ ఎరియర్స్ వస్తాయనుకుంటే తమకు భంగపాటు ఎదురైందని తెలంగాణ ప్రభు త్వ వైద్యుల సంఘం ఒక ప్రకటనలో అసంతృప్తి వ్య క్తం చేసింది. త్వరలోనే ఎరియర్స్ జీఓతో పాటు ఏడో వేతన సవరణకు అనుగుణంగా రవాణా భత్యం మంజూరు చేయాలని సంఘం కోరింది. కాగా అధ్యాపకులందరికీ ఎరియర్స్ కింద రూ.525 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేసింది. -
ఆ రాష్ట్రాలలో డాక్టర్లకు జీతాల్లేవ్..!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సమస్త మానవాళిని కబళిస్తోంది. కరోనా సోకిన రోగులను సొంత కుటుంబీకులే దూరం పెడుతున్న ప్రస్తుత తరుణంలో కరోనా రోగులకు చికిత్స చేసి డాక్టర్లు పునర్జన్న ప్రసాదిస్తున్నారు. అయితే ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స చేస్తున్న డాక్టర్లకు మాత్రం ఐదు రాష్ట్రాలలో(న్యూఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, త్రిపుర, కర్ణాటక) జీతాలు చెల్లించడం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. యునైటెడ్ రెసిడెంట్స్ అండ్ డాక్టర్స్ అసోసియేషన్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. కాగా అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. ఈ నేపథ్యంలో వారంలోపు డాక్టర్లకు జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆగస్టు 10లోపు డాక్టర్లకు జీతాలు చెల్లించాలని కోర్టు తెలిపింది. అయితే క్వారంటైన్లో ఉన్న డాక్టర్లను క్యాజువల్ లీవ్‌లు అప్లై చేయాలని యాజమాన్యాలు వేధిస్తున్నాయని కోర్టుకు అసోసియేషన్ విన్నవించింది. పరిమిత స్థాయిలో క్యాజువల్ లీవ్‌లు ఉండడం వల్ల డాక్టర్లకు యాజమాన్యాలు జీతాల కోత విధిస్తున్నాయి. మరోవైపు కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ స్పందిస్తూ.. సుప్రీం కోర్టు తీర్పును అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని, ఒకవేళ చేయని పక్షంలో ఇండియన్ పీనియల్ కోడ్ డీఎం(విపత్తు నిర్వహణ చట్టం) ప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. అసోసియేషన్ అభిప్రాయాన్ని సొలిసిట్ జనరల్ తుషార్ మెహతా ఏకీభవించారు. ఆయన స్పందిస్తూ.. డాక్టర్లకు జీతాలు చెల్లించమని కేంద్ర ప్రభుత్వం సూచించినా ప్రభుత్వాలు పట్టించుకోలేదని తెలిపారు. మరోవైపు విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జీతాల చెల్లింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించవచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. చదవండి: కరోనాకు యువత అతీతం కాదు: డబ్ల్యూహెచ్‌వో -
ఉస్మానియాలో 3వ రోజు కొనసాగుతున్న నర్సుల ధర్నా
సాక్షి, హైదరాబాద్ : జీతాలు ఇవ్వడం లేదంటూ ఉస్మానియా ఆసుపత్రిలో నర్సులు చేపట్టిన దర్నా మూడో రోజుకు చేరుకుంది. నాలుగు నెలలుగా జీతం ఇవ్వడం లేదంటూ 87 మంది స్టాఫ్ నర్సులు విధులు బహిష్కరించారు. దీంతో గత మూడు రోజులుగా 12 ముఖ్య విభాగాల్లో సేవలు కుంటుపడ్డాయి. అవుట్సోర్సింగ్ కింద నాలుగు నెలల క్రితమే ఉద్యోగంలో చేరినా ఇప్పటివరకు దీనికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తక్షణమే అవుట్సోర్సింగ్ లెటర్‌తో పాటు, ఐడీ కార్డు, రెండు నెలల జీతం ఇస్తేనే విదులకు హాజరవుతామని డిమాండ్ చేస్తున్నారు. నర్సుల ఆందోళనలతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీ, ఎమర్జెన్సీ, ఐసోలేషన్ వార్డులు, పోస్టు ఆపరేటివ్ వార్డుల్లో రోగులు తీద్ర ఇబ్బందులు పడుతున్నారు. -
టార్గెట్లు ఎక్కువ.. జీతాలు తక్కువ
అప్పటిదాకా జీతాలు తక్కువైనా వారి జీవితాలు సాఫీగానే సాగేవి. అతికొద్ది జీతంతోనే సరిపెట్టుకొని పొదుపుగా జీవిస్తూ జీవనయానం కొనసాగించేవారు. సంవత్సరమంతా పనిచేసినా వీరికి జీతాలు వచ్చేది కేవలం పది నెలలు మాత్రమే. ఎండాకాలం రెండు నెలలు ఫీజులు వసూలు చేయమనే సాకుతో యాజమాన్యాలు వీరికి విధిస్తున్న కోత ఇది. ఇక అడ్మిషన్లు జరిగే సమయాల్లో వీరి పరిస్థితి వర్ణనాతీతం. వీరే ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేసే అధ్యాపకులు. ఈ ఉపాధ్యాయులకు బిజినెస్ ఏజంట్ల మాదిరిగా టార్గెట్లు ఇస్తారు. ఈ లక్ష్యాలను చేరులేకపోతే జీతం కట్. టూకీగా ఇదీ మనకు ఓనమాలు దిద్దించిన ఉపాధ్యాయుల పరిస్థితి. కుప్పకూలుతున్న జీవితాలు ఇదంతా ఒకఎత్తైతే కరోనా మహామ్మారితో వీరి నెత్తిన మరో పిడుగు పడినట్లైంది. వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్న విద్యాసంస్థల యాజమాన్యాలు ఒక్కసారిగా తమ లెక్కలు తిరగబడటంతో మానవత్వాన్ని మరిచారు. మార్చి23న లాక్డౌన్ విధిస్తే ఆ నెలలోనూ ఉపాధ్యాయులు, సిబ్బందికి జీతం చెల్లించలేదు. కొన్ని కార్పోరేట్ విద్యాసంస్థలు సైతం ఇదే విధానాన్ని అవలంభించాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా గత నాలుగు నెలలుగా జీతాలు లేక ఇంటి అద్దెలు కట్టలేక ఆపసోపాలు పడుతున్నారు. ఓ ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేస్తున్న అధ్యాపకుడు అరటిపండ్ల తోపుడు బండి పెట్టుకొని జీవనయానం చేస్తున్నారు. ఇటీవల దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చూసి కొందరు పూర్వ విద్యార్థులు చలించిపోయారు. తమకు పాఠాలు నేర్పించిన ఉపాధ్యాయుని గడ్డు పరిస్థితిని తెలుసుకొని విద్యార్థులే డబ్బు సహాయం చేశారు. -
కరోనా వేళ.. ‘సూపర్’ కథ!
సాక్షి, హైదరాబాద్ : గ్రూప్–2 నియామకాల ద్వారా నియమితులైన ఎస్సైల వేతనాల చెల్లింపులకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసమంటూ 83 సూపర్ న్యూమరరీ పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఎక్సైజ్ శాఖలో చర్చనీయాంశమైంది. కరోనా కాలంలో కాసులకు కష్టాలు ఎదుర్కొంటున్న వేళ ఈ పోస్టులు సృష్టించి మరీ ఏడాదిపాటు వేతనాలు చెల్లించడం ఎందుకనే చర్చ ఆ శాఖ వర్గాల్లో జరుగుతోంది. అయితే, ఈ పోస్టుల సృష్టి ద్వారా శాఖ పరిధిలో అడ్హాక్ పదోన్నతులు పొందిన హెడ్ కానిస్టేబుళ్లను రివర్షన్ గండం నుంచి తప్పించారని, తద్వారా చాలాకాలంగా పదోన్నతులు లేకుండా ఉన్నవారికి ఉపశమనం కలిగిందని మరికొందరు అంటున్నారు. చాలాకాలంపాటు ఎస్సైలుగా తాత్కాలిక పదోన్నతిపై పనిచేసినవారిని.. డైరెక్ట్ రిక్రూటీలు వచ్చారనే కారణంతో వెనక్కు పంపడం వారిని నైతికంగా దెబ్బతీస్తుందని, అందుకే వారికి సాధారణ పదోన్నతుల సమయం వచ్చే వరకు ఈ పోస్టులు మనుగడలో ఉండేలా ఉత్తర్వులు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఈ ఉత్తర్వుల ద్వారా గరిష్టంగా రూ.3 కోట్ల అదనపు భారం ఆ శాఖపై పడుతుందని సమాచారం. మరోవైపు ఈ ఉత్తర్వుల జారీ కోసం కాసులు చేతులు మారాయని, ఈ నేపథ్యంలోనే హడావుడి ఆదేశాలు వచ్చాయనే మరో చర్చ కూడా ఉద్యోగుల్లో సాగుతోంది. మొత్తం మీద కరోనా కలకలం రేపుతున్న వేళ వచ్చిన సూపర్ న్యూమరరీ ఉత్తర్వులు ఎక్సైజ్ శాఖలో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. -
రూ. 2 లక్షల పరిమితి తొలగింపు
న్యూఢిల్లీ: దేశానికి ఖ్యాతితెచ్చే క్రీడాకారులను తయారుచేసే భారత కోచ్‌లకు కేంద్ర క్రీడా శాఖ శుభ వార్త చెప్పింది. భారతీయ కోచ్‌ల జీతాలను గరిష్టంగా రూ. 2 లక్షలకే పరిమితం చేస్తూ ఇప్పటి వరకు ఉన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. స్వదేశీ కోచ్‌లు మరింత మెరుగైన ఫలితాలు రాబట్టేలా ఈ చర్య వారిని ప్రోత్సహిస్తుందని తెలిపింది. కోచింగ్ వైపు భారత మాజీ ఆటగాళ్లను కూడా ఆకర్షించడమే తమ లక్ష్యమని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ‘చాలా మంది భారత కోచ్‌లు గొప్ప ఫలితాలను అందిస్తున్నారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాల్సిందే. మేటి అథ్లెట్లను తయారు చేసేందుకు అత్యుత్తమ కోచ్‌లు కావాలనే మేం కోరుకుంటాం. అలాంటప్పుడు వారికి లభించే ఆర్థిక ప్రయోజనాలపై పరిమితి విధించకూడదని భావిస్తున్నాం. ఇకనుంచి నాలుగేళ్లకుగానూ కోచ్‌లతో కాంట్రాక్టు చేసుకుంటాం’ అని రిజిజు వివరించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ హర్షం వ్యక్తం చేశారు. మాజీ అథ్లెట్లు కోచింగ్ వైపు మొగ్గుచూపితే దేశంలో క్రీడల అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. -
ఈ నెల పూర్తి వేతనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. కరోనా లాక్డౌన్ వల్ల రాష్ట్ర ఆదా యం గాడి తప్పడంతో ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లలో గత 3 నెలలుగా కోత విధిస్తూ వచ్చిన ప్రభుత్వం... ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ గాడినపడుతుండటంతో ఈ నెల కోతల్లేకుండా పూర్తి వేతనం, పెన్షన్లను జూలైలో చెల్లించనుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంగళవారం ఆదేశించారు. ఖాళీ ఖజానాతో తప్పని కోతలు... కరోనా కట్టడి కోసం మార్చి 24న రాష్ట్రంలో లాక్డౌన్ విధించడంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఉద్యోగులు, పెన్షనర్లకు పూర్తి జీతాలు, పెన్షన్లు చెల్లించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్ల వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసుల ఉద్యోగుల జీతాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల జీతాల్లో 50 శాతం, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లను 25 శాతం, నాలుగవ, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తూ మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కోతలు అమల్లోకి ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏప్రిల్, మే, జూన్ జీతాలు, పెన్షన్లలో ప్రభుత్వం కోతలను అమలు పరిచింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల చట్టబద్ధతను ప్రశ్నించి హైకోర్టు... పెన్షన్లలో కోతను తప్పుబట్టింది. దీంతో విపత్తులు, ప్రజారోగ్య అత్యయిక పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో కోతలకు చట్టబద్ధత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16న ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసన తెలియజేశాయి. అయితే కేవలం హైకోర్టు కేసు కోసమే అత్యవసరంగా ఈ ఆర్డినెన్స్ తెచ్చినట్లు పేర్కొన్న ప్రభుత్వం... ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనం, పెన్షన్లను చెల్లించాలని తాజాగా నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించినట్లు అయింది. మంత్రి హరీశ్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావును కలసి తమకు పూర్తి వేతనాలు చెల్లించాలని, కోత పెట్టిన మూడు నెలల వేతనాలను నగదు రూపంలో ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన హరీశ్... ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లందరికీ జూన్ నుంచి పూర్తి వేతనాలు, పెన్షన్లు ఇస్తామని, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కోత విధించిన వేతనాల బకాయిలను మాత్రం ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అయితే సీపీఎఫ్ ఉద్యోగులు, పెన్షనర్లకు జీపీఎఫ్ ఉండదని ఉద్యోగ నేతలు మంత్రి దష్టికి తీసుకెళ్లగా... వారి బకాయిలను వాయిదాల్లో చెల్లించేందుకు అంగీకరించారు. మంత్రిని కలిసిన వారిలో ఐక్య వేదిక నాయకులు చిలాగాని సంపత్‌కుమారస్వామి, జంగయ్య, చావ రవి, సదానందగౌడ, పురుషోత్తమ్, వెంకట్‌రెడ్డి, విఠల్, పెన్షనర్ల జేఏసీ చైర్మన్ కె.లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. -
తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నెల (జూన్) పూర్తి వేతనం ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో గత మూడు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లలకు 50 శాతం వేతనాలు మాత్రమే చెల్లిస్తోంది. అయితే ఈ విషయంపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం, ధర్మాసనం కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. (చదవండి : కీలక భేటీ వాయిదా.. బస్సు ప్రయాణికులకు నిరాశ) ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. లాక్డౌన్ సడలింపుల తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడటం, జీతాలు, పింఛన్ల కోతపై ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ప్రతినిధుల సంబంధించి మాత్రం ఇదివరకు అమలులో ఉన్న 75శాతం కోత విధానాన్ని మరి కొంత కాలం కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
చనిపోయే ముందు సుశాంత్ ఔదర్యం!
ముంబాయి: సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్ మరణం బాలీవుడ్లో మాత్రమే కాకుండా అందరిని ఎంత శోకసంద్రంలో ముంచిదో తెలిసిందే. సుశాంత్ మరణానికి సంబంధించిన విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో సుశాంత్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు నుంచే తనని తాను సన్నద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. చనిపోవడానికి మూడు రోజుల ముందే ఇంట్లో పనివారిని, తాను డబ్బులు ఇవ్వాల్సిన వారికి ఇచ్చేసినట్లు ఇంట్లో పనివారు పోలీసులకు తెలిపారు. ('సుశాంత్ కాంట్రాక్ట్ ముగిసింది.. నువ్వు కూడా') ఇవ్వాల్సిన దానికంటే ఇంకా ఎక్కువే ఇచ్చి ఇంకా తాను వారికి జీతాలు ఇవ్వలేనని చెప్పినట్లు వారు పోలీసులకు తెలిపారు. ఇన్ని రోజులు తన బాగోగులు చూసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. ఆర్థికంగా తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇంట్లో పనివారు కరోనా కారణంగా ఇబ్బంది పడటం చూసి వారికి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువే సాయం చేయడం బట్టే సుశాంత్ మంచి తనం అర్థం అవుతుందని ఆయన అభిమానులు అంటున్నారు. (సుషాంత్ మరణం టిక్‌టాక్‌లో చూసి..) -
కోతలపై ఆర్డినెన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విపత్తులు, ప్రజారోగ్యపరంగా అత్యయిక పరిస్థితులు ఉత్పన్నమైన సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులో గరిష్టంగా 50 శాతం వరకు కోత (వాయిదా)కు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనుమతితో మంగళవారం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అత్యవసర ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా నేపథ్యంలో పెన్షన్లలో కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడంతో పాటు ఏ చట్టం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఇటీవల రాష్ట్ర హైకోర్టు నిలదీసింది. దీనిపై హైకోర్టులో బుధవారం విచారణ జరగాల్సి ఉండగా, ప్రభుత్వం ఒక రోజు ముందు అంటే మంగళవారం ఆగమేఘాల మీద తెలంగాణ విపత్తులు, ప్రజారోగ్య అత్యయిక పరిస్థితుల ఆర్డినెన్స్–2020 పేరిట ఆర్డినెన్స్ విడుదల చేసింది. 2020 మార్చి 24 నుంచి రాష్ట్రంలో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిందని, యావత్ రాష్ట్రానికి వర్తిస్తుందని స్పష్టం చేసింది. జీతాలు, పెన్షన్ల చెల్లింపుల్లో కొంత భాగాన్ని వాయిదా వేసేందుకు ప్రత్యేక నిబంధనలు రూపొందించడం అత్యవసరంగా మారిందని, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరగకపోవడంతో ఈ మేరకు చట్టాన్ని తీసుకురావడం సాధ్యం కాక ఈ అత్యవసర ఆర్డినెన్స్ జారీ చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. నేపథ్యం ఇదీ..: కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో గత మార్చి 24న రాష్ట్రంలో లాక్డౌన్ విధించడంతో ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్ల వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసుల ఉద్యోగుల జీతాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల జీతాల్లో 50 శాతం, రిటైర్డు ఉద్యోగుల పెన్షన్లు 25 శాతం, నాలుగో తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తూ గత మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ కోతలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్, మే, జూన్ నెలల జీతాలు, పెన్షన్లలో ఈ మేరకు ప్రభుత్వం కోతలను అమలుపరచగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కుదుటపడే వరకు కోతలను కొనసాగించే అవకాశాలున్నాయి. తిరిగి చెల్లింపుపై 6 నెలల్లో స్పష్టత.. జీతాలు, వేతనాలు, పెన్షన్లలో కోత (వాయిదా) వేసిన భాగాన్ని సదరు వ్యక్తులు, ఉద్యోగులు,పెన్షనర్లకు, సంస్థలకు తిరిగి చెల్లించే విధానంపై స్పష్టతనిస్తూ, కోతలను అమల్లోకి తెచ్చిన తేదీ నుంచి ఆరు నెలల్లోగా ప్రకటన జారీ చేస్తారు. విపత్తు, అత్యయిక పరిస్థితుల్లోనే ఏదైనా విపత్తు, ప్రజారోగ్య అత్యయిక పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు వ్యక్తికి, సంస్థకు, చెల్లించాల్సిన చెల్లింపులు, బకాయిల్లో కొంత భాగాన్ని గరిష్టంగా 50 శాతానికి మించకుండా వాయిదా లేదా కోత విధించేందుకు చట్టబద్ధంగా ప్రభుత్వానికి అధికారం ఉందని ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం తెలిపింది. విపత్తులు, అత్యయిక ప్రజారోగ్య పరిస్థితులు నెలకొని ఉన్నంత కాలం వాటిని సమర్థంగా నిర్వహించడానికి ప్రభుత్వానికి ఈ వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. ఏదైనా చట్టం, ఉత్తర్వులు, నిబంధనలు, నియమావళి, ఏదైనా కోర్టు/ట్రిబ్యునల్ ఉత్తర్వులు, తీర్పులతో సంబంధం లేకుండా ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర ఏదైనా వ్యక్తులకు నెలవారీగా చెల్లించాల్సిన చెల్లింపుల్లో గరిష్టంగా 50 శాతానికి మించకుండా వాయిదా వేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. ఉద్యోగి, పెన్షనర్, ఇతర ఎవరైనా వ్యక్తి, ఏదైనా ప్రభుత్వ యాజ మాన్య/ నియంత్రిత/ ఎయిడెడ్ సంస్థ, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, స్థానిక సంస్థలు, చట్టబద్ధ సంస్థ, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, ఎయిడెడ్ విద్యా సంస్థలు తదితర సంస్థలకు ఈ ఆర్డినెన్స్ వర్తించనుంది. -
పూర్తి వేతనాలు చెల్లించని కంపెనీలపై చర్యలు వద్దు
న్యూఢిల్లీ: లాక్డౌన్ కాలంలో కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలంటూ మార్చి 29న హోంశాఖ ఆదేశాలను ఉల్లంఘించిన కంపెనీలూ, యాజమా న్యాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ మే 15న ఇచ్చిన ఉత్తర్వులను జూన్ 12కి సుప్రీంకోర్టు పొడిగించింది. కోవిడ్ కారణంగా లాక్డౌన్ ప్రకటించిన సమయంలో ఎటువంటి పనీ జరగకపోయినప్పటికీ, కార్మికుల వేతనాల్లో ఎటువంటి కోతలూ విధించరాదనీ, పూర్తి జీతాలు చెల్లించాలంటూ హోంమంత్రిత్వ శాఖ కంపెనీలకూ, యాజమాన్యాలకూ సర్క్యులర్ జారీచేసింది. ఎవ్వరినీ ఉద్యోగాల్లోంచి తీసివేయవద్దనీ, వేతనాల్లో కోత విధించవద్దంటూ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్‌కి లేఖలు కూడా రాసింది. వంద శాతం వేతనం ఇవ్వకపోవడాన్ని నేరపూరితమనీ, వారిపై చర్యలు తీసుకొంటామన్న హోంమంత్రిత్వ శాఖ సర్క్యులర్‌లోని అంశాల పట్ల జస్టిస్ అశోఖ్ భూషణ్, ఎస్.కె.కౌల్, ఎంఆర్.షాల తో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రప్రభుత్వ సర్క్యులర్ని సవాల్ చేస్తూ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ సహా దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టింది. చిన్న పరిశ్రమలకు రాష్ట్రాలు చేయూతనివ్వాల్సి ఉంటుందనీ, దీనిపై యాజమాన్యాల్లోనూ, కార్మికుల్లోనూ చర్చలు జరగాలని కోర్టు అభిప్రాయపడింది. -
సగమా.. పూర్తి వేతనమా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల్లో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. గత రెండు నెలలుగా సగం జీతాలే తీసుకుంటున్న ఉద్యోగులు మే నెలలోనైనా ప్రభుత్వం పూర్తి జీతం ఇస్తుందా? పాత పద్ధతిలో నే వెళుతుందా అనే మీమాంసలో పడ్డారు. అయి తే, పూర్తి వేతనాలు చెల్లించే విషయంలో ప్రభు త్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తె లుస్తోంది. గతం కంటే రాష్ట్ర ఆదాయం మెరుగుపడటం, రంజాన్ పండుగ ఉండటంతో ప్రభుత్వం ఈ నెలలో పూర్తి వేతనం ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నా యి. సగం వేతనాలకు బిల్లుల తయారీని నిలిపివేయాలని జిల్లాల ట్రెజరీలకు మౌఖిక ఆదేశాలు అందాయని చర్చ జరుగుతున్నా.. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఉత్త ర్వులు వెలువడలేదు. కాగా, అన్ని ప్రభుత్వ శాఖ లు ఇప్పటికే బిల్లులను ఆన్లైన్లో ట్రెజరీలకు పం పాయి. వీటిని బిల్లులు చేసేందుకు గాను ట్రెజరీ శాఖ కూడా సిద్ధమవుతోంది. తాజాగా సగం వేతనాలకే బిల్లులు తయారు చేయాలనే సంకేతాలు ఆర్థిక శాఖ నుంచి ట్రెజరీలకు వచ్చాయని సంఘా లు పేర్కొంటున్నాయి తప్ప అధికారిక ప్రకటన లేదు. ఈ నేపథ్యంలో మే నెల వేతనం ఏమవుతుం దో? సీఎం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో? చివరి క్షణంలో ఆర్థిక శాఖ నుంచి ఏం ఉత్తర్వులు వస్తాయోనని ఉద్యోగులు వేచి చూస్తున్నారు. ‘పూర్తి జీతమివ్వాలి..’ రాష్ట్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు మే నెల పూ ర్తి వేతనం చెల్లించాలని సీఎం కేసీఆర్‌కు పీఆర్టీయూ–టీఎస్ విజ్ఞప్తి చేసింది. లాక్డౌన్ సడలింపులతో ప్రభుత్వ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయని, రాష్ట్ర ఆదాయం కూడా పెరగడంతో మే నెల వేతనాలు పూర్తిగా చెల్లించాలని పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు విన్నవించారు. అలాగే మార్చి, ఏప్రిల్‌లో కోత పెట్టిన వేతనాలను కూడా చెల్లించాలని జేఏసీ చైర్మన్ కారెం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత సీఎస్ సోమేశ్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. -
పరిశ్రమలకు ఊరట, ఉద్యోగులకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో కుదేలైన పరిశ్రమలకు కేంద్రం ప్రభుత్వం ఊరటనిచ్చింది. లాక్డౌన్ సమయంలో పనిచేయని ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ ఆదివారం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఉత్తర్వుల ను జారీ చేసింది. దీని ప్రకారం లాక్డౌన్ సమయంలో పని చేయని ఉద్యోగులకు కంపెనీలు ఇకపై తప్పనిసరిగా వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదు. కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడినా, ఎలాంటి కోతలు లేకుండా ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లించాలంటూ మార్చి 29 న ఎంహెచ్ఏ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. కరోనా వైరస్ సంక్షోభాన్ని అడ్డుపెట్టుకుని ఐటీ ఉద్యోగులను తొలగించకుండా, వారి జీతాల్లో కోత విధించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాన్ని సుప్రీంకోర్టు గత వారం తిరస్కరించింది. అలాగే మార్చి 20 న కార్మిక కార్యదర్శి నోటిఫికేషన్ , మార్చి 29న హోంశాఖ నోటిఫికేషన్ పై కర్ణాటక కేంద్రంగా పనిచేస్తున్న ఫికస్ పాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై స్పందించిన సుప్రీం ఈ కాలంలో తమ ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించలేని సంస్థలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. (కరోనా : లాక్డౌన్ సడలింపుల వేళ గుడ్ న్యూస్!) కాగా ముదురుతున్న ఆర్థిక సంక్షోభం, ప్రధానంగా దేశస్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)గణనీయంగా క్షీణించనుందనే అంచనాల నేపథ్యంలో ఆర్థిక కార్యకాలాపాల పునరుద్ధరణ నిమిత్తం అనేక రాష్ట్రాలు కంటైన్మెంట్ జోన్లతో పాటు దాదాపు అన్ని ప్రాంతాలలో కీలకమైన ఆర్థిక కార్యకలాపాల ప్రారంభానికి ఆంక్షలను సడలించిన సంగతి తెలిసిందే. -
కేంద్ర ఉద్యోగుల వేతనాల్లో కోత అబద్ధం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతకు సంబంధించిన ప్రతిపాదనేదీ లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి వస్తున్న వార్తలపై మంత్రి ట్విట్టర్లో స్పందించారు. ‘కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని రకాల ఉద్యోగుల ప్రస్తుత వేతనాల్లో కోత విధించాలన్న ప్రతిపాదనేదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. వేతనాల్లో కోత ఉంటుందంటూ ఒక వర్గం మీడియాలో వస్తున్న వార్తలు అబద్ధం. అవి నిరాధార వార్తలు’అని పేర్కొన్నారు. కేంద్ర ఉద్యోగుల పెంచిన డీఏ అమలును వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం.. వేతనాల్లో కూడా కోత పెడుతుందంటూ వస్తున్న వార్తలపై ఆమె పై విధంగా స్పందించారు. -
‘సాహో ఎన్టీఆర్.. నీకు సెల్యూట్’
కరోనా లాక్డౌన్ కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా పనిచేసుకుంటే గానీ పూటగడవని ఎంతో మంది అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తన చుట్టూ ఉన్న వారిని ఆదుకోవడానకి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నడుంబిగించారు. ఇప్పటికే కరోనా నేపథ్యంలో రూ.75 లక్షల విరాళం ప్రకటించి ఆర్థికంగా తన వంతు సాయాన్ని ప్రకటించారు. తాజాగా తన వ్యక్తిగత సిబ్బందికి ముందుగానే జీతాలు చెల్లించి వారికి అండగా నిలిచారు. అంతేకాకుండా తన సిబ్బందిలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వస్తే వారికి మరింత సాయం చేసుందుకు ఎన్టీఆర్ సిద్దంగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఉదార స్వభావానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘సాహో ఎన్టీఆర్.. నీకు సెల్యూట్’ అంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో ప్రభుత్వ లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ ఇంటికే పరిమితమయ్యారు ఈ స్టార్ హీరో. ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: ‘సితారా.. సింగర్‌గా ట్రై చేయ్’ మార్పుని అలవాటు చేసుకోవాల్సిందే var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_541241401.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఏప్రిల్ నెల వేతనంలో కూడా వాయిదా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల మాదిరిగానే ఏప్రిల్ నెల వేతనాల్లో కూడా కొంతభాగాన్ని వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం ప్రభుత్వం గత నెలలో విడుదల చేసిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు సోమవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావల్సిన పన్నులు, పన్నేతర ఆదాయం రాకపోవడంతో పాటు కోవిడ్–19 నివారణకు చర్యలు తీసుకోవలసి ఉన్నందున జీవో నం: 27 ప్రకారం ఏప్రిల్ నెల జీతంలో కూడా వాయిదా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అయితే పింఛన్‌దారులకు మాత్రం (లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పింఛన్ దారులను మినహాయించి) వారి నెల పింఛన్లో 25 శాతం మాత్రమే వాయిదా వేయాలని అందులో పేర్కొన్నారు. కాగా, తదుపరి ఉత్తర్వులో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
సీఏ జీతాల్లో కోత
మెల్బోర్న్: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేస్తోన్న కోవిడ్–19 ప్రభావం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)పై పడింది. కరోనాతో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా భారీ స్థాయిలో జీతాల కోత విధింపుతో పాటు సిబ్బందిని తీసివేయనున్నట్లు సీఏ గురువారం ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి జూన్ 30 వరకు తమ ఉద్యోగుల, కాంట్రాక్టర్ల జీతాల్లో 80 శాతం కోత విధించనున్నట్లు సీఏ వెల్లడించింది. దీనితో పాటు ఈ పరిస్థితుల్లో ఎలాంటి క్రీడా ఈవెంట్లు జరిగే వీలు లేనందున ఈ రెండు నెలల పాటు కొంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. -
సముచిత నిర్ణయమేగానీ...
అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు అసాధారణ నిర్ణయాలు తీసుకోక తప్పదు. కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడిన వర్తమానంలో ఎంపీల జీతభత్యాల్లో 30 శాతం కోత విధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌ను కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించడం కూడా ఇటువంటిదే. దీంతోపాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రాల గవర్నర్లు కూడా ఇదే తరహాలో తమ జీతాలు తగ్గించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. మాజీ ఎంపీలకిచ్చే పింఛన్లకు కూడా ఈ కోత వర్తిస్తుంది. ఇదంతా ఏడాదిపాటు అమల్లోవుంటుంది. ప్రధాని, కేంద్రమంత్రులు, సహాయమంత్రులు అందరూ దీని పరిధిలోకొస్తారు. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజాప్రతినిధులకూ, ప్రభుత్వ సిబ్బందికి ఇచ్చే జీతభత్యాల్లో కొంత శాతం కోత విధించాయి. ఈ మొత్తాన్ని అనంతరకాలంలో చెల్లిస్తామని ప్రకటించాయి. ఇప్పుడు కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయాన్ని గమనిస్తే, సర్వశక్తులూ కేంద్రీకరించి పనిచేస్తే తప్ప దీన్ని దుంపనాశనం చేయడం అసాధ్యం. కనుక ఆ దిశగా రాగలకాలంలో మరిన్ని చర్యలు తప్పకపోవచ్చు. వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వారి కోసం ఆసుపత్రులను, సిబ్బందిని సిద్ధంగా వుంచడం, చికిత్స చేయడం, అందుకు అవసరమైన ఔషధాలు, చికిత్సకు అవసరమైన ఉపకరణాలు సమీక రించడం భారీ యజ్ఞంవంటిది. పన్నుల రూపంలో, సుంకాల రూపంలో వివిధ పద్దులకింద ప్రభు త్వాలకు సమకూరే ఆదాయం కూడా వీటన్నిటికీ ఎక్కడా సరిపోదు. ఇందువల్లే స్తోమత వున్నవారు విరివిగా విరాళాలివ్వాలని పిలుపునిస్తున్నాయి. ఇప్పుడు ప్రజాప్రతినిధుల జీతభత్యాల్లో కోత దీనంతటికీ కొనసాగింపే. దేశం ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నదో మీడియాలో నిత్యం వచ్చే వార్తా కథనాలు వెల్లడిస్తూనే వున్నాయి. లాక్డౌన్ కారణంగా అన్ని రంగాలూ మూతబడి ఉత్పాదక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఆర్థిక, వాణిజ్య లావాదేవీలు కూడా ఆగిపోక తప్ప లేదు. సామాన్యులంతా ఈ పర్యవసానాలు అనుభవిస్తున్నారు. పూట గడవడం ఎలాగో తెలియక మహానగరాలను నమ్ముకుని ఇన్నాళ్లూ బతుకు బండి ఈడుస్తున్న నిరుపేద వర్గాల ప్రజలు గత్యం తరం లేని స్థితిలో స్వస్థలాలకు తిరుగుముఖం పట్టడం మీడియాలో అందరూ చూశారు. ఇప్పుడొ చ్చిన ఈ విపత్తు ఇంతక్రితం మానవాళి ఎదుర్కొన్న ఉత్పాతాలన్నిటినీ తలదన్నేంత తీవ్ర స్థాయిలో వుంది. ఈ వైరస్ సృష్టిస్తున్న జీవన విధ్వంసం సాధారణమైనది కాదు. అందరూ తమకు చేతనైనం తగా సాయం చేస్తేనే, తమకు తారసపడిన నిస్సహాయులకు ఏదో రూపంలో చేయూతనందిస్తేనే ఈ విషాద దశను దాటడం సాధ్యమవుతుంది. వ్యక్తులుగా కొందరు, అనేక స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి కృషిలో పాలుపంచుకుంటున్నాయి కూడా. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీఎం సహాయనిధు లకు విరాళాలు భారీగా అందుతున్నాయి. కేంద్రం కొత్తగా ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌కు ఇంతవరకూ దాదాపు రూ. 6,500 కోట్ల మేర విరాళాలు వచ్చాయంటున్నారు. ప్రజాప్రతినిధుల జీతభత్యాల్లో కోత విధించడంతోపాటు ఎంపీల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీలాడ్స్) నిధులను రెండేళ్లపాటు నిలిపివేయాలన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం. ఈ కారణంగా ప్రభుత్వానికి రూ. 7,900 కోట్లు సమకూరుతాయి. ఎంపీల జీతభత్యాలకు విధించే కోతలవల్ల వచ్చే నిధులతోపాటు ఈ నిధులు కూడా ప్రభుత్వ సంచితనిధికి తరలుతాయి. 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు సర్కారు ఎంపీలాడ్స్ పథకాన్ని అమల్లోకి తెచ్చి ప్రతి ఎంపీ ఏడాదికి అయిదు లక్షల రూపాయల పనులు మంజూరు చేసేందుకు అవకాశమిచ్చింది. ఆ మొత్తాన్ని మరుసటి సంవత్సరం కోటి రూపాయలకు పెంచింది. అది క్రమేపీ పెరుగుతూ వచ్చి ఇప్పుడు పది కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ నిధుల్ని సమర్థవంతంగా వినియోగించి తమ తమ పరిధుల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆ పథకాన్ని మెరుగ్గా వినియోగించనివారూ, అసలు దాని జోలికే పోనివారు కూడా వుంటున్నారు. కరోనా వైరస్‌పై పోరుకు అవసరమైన నిధులు సమీకరించడం కోసం ఈ ఎంపీలాడ్స్‌ను కూడా రెండేళ్లపాటు ఆపేయాలనుకోవడం కంటే, ఆ నిధుల్ని మరో పద్ధతిలో వినియోగించడానికి వీలు కల్పిస్తే బాగుండేది. వాటిని సంచితనిధికి తర లించడం కాక ఆ ఎంపీలు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాలకు కేటాయిస్తే కరోనా వైరస్‌తో పోరాడు తున్న ప్రభుత్వాలకు చేయూతనిచ్చినట్టు అయ్యేది. పన్నులు, సుంకాల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాల వాటా గతంతో పోలిస్తే తగ్గింది. పైగా కేంద్రంనుంచి రావాల్సిన బకాయిలు కొన్ని పెండింగ్ వున్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇలాంటి అననుకూల పరిస్థితుల్లో పలు రాష్ట్ర ప్రభు త్వాలు దాదాపు ఒంటిచేత్తో ఈ మహమ్మారిపై పోరాడుతున్నాయి. అటు మహమ్మారిని ఎదుర్కొన డానికి, ఇటు నిరుపేద వర్గాలకు చేయూతనీయడానికి అవసరమైన నిధులు అందుబాటులో వుంటేనే రాష్ట్రాలు ఈ సంక్షోభం నుంచి గట్టెక్కుతాయి. సంచిత నిధికి వెళ్లే వివిధ రకాల మొత్తాలన్నీ ఎటూ రాష్ట్రాల్లో వ్యయం చేస్తారు. దాన్నెవరూ కాదనరు. కానీ చాలాచోట్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికి ప్పుడు నిధుల అవసరం ఎంతోవుంది. ఆ అవసరాన్ని తీర్చడానికి ఎంపీలాడ్స్ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించి దాదాపు రెండు వారాలు కావస్తోంది. పౌరుల కదలికలపై తప్ప సరుకు రవాణాకు ఎలాంటి అడ్డంకులూ వుండబోవని కేంద్ర ప్రభుత్వం ప్రక టించినా రాష్ట్రాల మధ్యా, కొన్ని రాష్ట్రాల్లో వివిధ జిల్లాల మధ్యా ఇంకా సరుకు రవాణాకు, ముఖ్యంగా ఔషధాలకు ఆటంకాలు ఎదురవుతూనే వున్నాయి. పర్యవసానంగా కొన్ని సరుకులు మార్కెట్ల నుంచి మాయమైతే, మరికొన్నిటి ధరలు చుక్కలంటుతున్నాయి. ఇప్పుడెదురవుతున్న ఇబ్బందులతోపాటు, మున్ముందు ఎదురుకాబోయే సమస్యలేమిటో అంచనా వేసుకుని, రాష్ట్రాల సహకారంతో వీటన్నిటినీ చక్కదిద్దాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి వుంది. -
ఇంగ్లండ్ క్రికెటర్ల దాతృత్వం
లండన్: ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోన్న కోవిడ్–19పై పోరు కోసం ఇంగ్లండ్ పురుషులు, మహిళా క్రికెటర్లు ముందుకొచ్చారు. తమ వేతనాల్లో కోతను భరించేందుకు సిద్ధమయ్యారు. కరోనాకు సహాయం అందించేందుకు క్రికెటర్లు ముందుకు రావాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కోరగా దానికి వారు అంగీకరించారు. దీని ప్రకారం ఈసీబీతో సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న పురుష, మహిళల క్రికెటర్లకు రానున్న మూడు నెలల జీతాల్లో 20 శాతం కోత పడనుంది. దీంతో కేవలం పురుష క్రికెటర్ల వేతనాల కోత నుంచి లభించే మొత్తం 5,00,000 పౌండ్ల (రూ. 4 కోట్ల 68 లక్షలు)కు సమానం కానుంది. అలాగే మహిళా క్రికెటర్ల ఏప్రిల్, మే, జూన్ నెల జీతాల నుంచి కూడా విరాళాన్ని సేకరించనున్నట్లు ఈసీబీ ప్రకటించింది. ఓవరాల్‌గా ఎంత మొత్తం చారిటీ కోసం విరాళమివ్వాలనే అంశంపై వచ్చే వారం నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఆటగాళ్లంతా విరాళమివ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని మహిళా జట్టు కెప్టెన్ హెథర్‌నైట్ తెలిపింది. -
తగినంత నగదు ఉండేలా చూసుకోండి..
న్యూఢిల్లీ: ఒకటో తారీఖు దగ్గరపడటంతో జీతాల వేళ వేతన జీవులు ఇబ్బంది పడకుండా చూడటంపై కేంద్రం దృష్టి సారించింది. ఒక్కసారిగా విత్‌డ్రాయల్స్‌కు డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో తగినంత స్థాయిలో నగదు నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు సూచించింది. అలాగే వివిధ పథకాల కింద రైతులు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఖాతాల్లోకి బదిలీ చేసే నగదును ఆయా వర్గాలు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా బ్యాంకుల శాఖలను తెరిచి ఉంచాలని పేర్కొంది. కరోనావైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే రాబోయే రోజుల్లో వివిధ పథకాల లబ్ధిదారులు విత్‌డ్రాయల్స్ కోసం పెద్ద ఎత్తున బ్యాంకులకు వచ్చే అవకాశం ఉందని సీనియర్ బ్యాంక్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో పాటు జీతాల విత్‌డ్రాయల్స్‌కు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి 10 దాకా బ్యాంకుల్లో రద్దీ ఉంటుందని వివరించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే డిమాండ్‌కి తగినంత స్థాయిలో శాఖలతో పాటు ఏటీఎంలలో కూడా నగదు నిల్వలు ఉండేలా చూసుకోవాలని బ్యాంకులకు ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో శాఖలను కూడా తెరిచి ఉంచాలని కూడా ఆదేశించినట్లు వివరించాయి. రాష్ట్రాలకూ లేఖలు..: బ్యాంకుల సిబ్బంది, ఆర్బీఐ ఉద్యోగులు, నగదు సరఫరా చేసే సంస్థల సిబ్బంది, ఏటీఎం మెయింటెనెన్స్ ఉద్యోగులు, నగదు వ్యాన్లు మొదలైన వాటి రాకపోకలకు ఆటంకాలు కలగకుండా చూడాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కూడా డీఎఫ్ఎస్ లేఖ రాసింది. లాక్‌డౌన్‌పరమైన ఆంక్షల కారణంగా వీరు ఇబ్బందులు పడకుండా చూసేందుకు అధికారులు, పోలీసులకు తగు సూచనలు చేయాలని పేర్కొంది. -
కొత్త డీఎస్పీలకు జీతాల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం ఎదురు చూశారు... ఎట్టకేలకు పదోన్నతి పొందారు... పక్షంలో పోస్టింగ్ అనుకున్నారు... రెండు నెలలుగా కనీసం జీతాలు కూడా లేకుండా పని చేస్తున్నారు... ఆగస్టులో ఇన్స్పెక్టర్ నుంచి పదోన్నతి పొందిన డీఎస్పీల పరిస్థితి ఇది. ఇప్పటి వరకు పోస్టింగ్స్ లేకపోవడంతో వీరికి జీతాలు చెల్లించడానికి సాంకేతిక అంశాలు అడ్డు వస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 68 మంది డీఎస్పీ స్థాయి అధికారుల్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో కొత్తగా డీఎస్పీలు అయిన వాళ్ళు కేవలం 14 మంది మాత్రమే. మిగిలిన 39 మంది డీఎస్పీలు ఇంకా ఎదురు చూస్తున్నారు. పోలీసు విభాగంలో జీతాల చెల్లింపు అధికారి ఆధారంగా కాకుండా పోస్టు ఆధారంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏ పోస్టు కేటాయించాలన్నా, సృష్టించాలన్నా దానికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. ఓ అధికారి ఏ పోస్టులో పనిచేస్తుంటే దానికి సంబంధించిన జీతం ఆయనకు అందుతుంది. ఆగస్టు వరకు ఇన్స్పెక్టర్లుగా వివిధ పోలీసుస్టేషన్లు, ప్రత్యేక విభాగాల్లో పనిచేసిన 53 మందికి ఆ నెల 29న పదోన్నతులు వచ్చాయి. వీరిలో 1995తో పాటు 1996 బ్యాచ్‌కు చెందిన వారూ ఉన్నారు. అప్పటివరకు ఆయా ఠాణాలకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా (ఎస్హెచ్ఓ), ప్రత్యేక విభాగాల్లోని పోస్టుల్లో పనిచేసిన వీరిని పరిపాలన పరమైన కారణాల నేపథ్యంలో ఎటాచ్మెంట్ పద్ధతితో అక్కడే విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 12న గణేష్ నిమజ్జనం పూర్తయ్యే వరకు ఇదే పరిస్థితి ఉండి, ఆ తర్వాత పోస్టింగ్స్ వస్తాయని అధికారులు భావించారు. అయితే ఆ తర్వాత వరుసగా దసరా, ఆర్టీసీ సమ్మె వంటివి రావడంతో వీళ్ళంతా ఎటాచ్మెంట్ మీదే కొనసాగుతున్నారు. దీంతో ఇన్స్పెక్టర్ పోస్టులో వీళ్ళు లేకపోవడం, డీఎస్పీగా పోస్టింగ్ రాకపోవడంతో జీతాలు చెల్లించడానికి సాంకేతిక ఇబ్బందులు వచ్చాయి. దీంతో సెప్టెంబర్ నెల జీతాలు అందని వీరికి అక్టోబర్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇటీవల ఈ పదోన్నతి పొందిన అధికారుల స్థానాల్లో ఇన్స్పెక్టర్లుగా వేరే అధికారుల్ని నియమించారు. దీంతో ఆ పోస్టు కూడా పోయి కేవలం సూపర్ వైజింగ్ ఆఫీసర్లుగా మారిపోయారు. శుక్రవారం 68 మంది డీఎస్పీల బదిలీలు జరిగినా వీరిలో 14 మంది మాత్రమే పదోన్నతి పొందిన అధికారుల్లో ఉన్నారు. మిగిలిన వారంతా గతం నుంచి డీఎస్పీలుగా పనిచేస్తున్న వారే. దీంతో ఆగస్టులో పదోన్నతి పొందిన వారిలో ఇంకా 39 మందికి పోస్టింగ్స్ దక్కలేదు. ఇలా జీతాలకు దూరంగా ఉన్న అధికారులకు పోస్టింగ్ వచ్చిన తర్వాత అక్కడ చేరి పాత జీతం క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టింగ్ వచ్చిన 14 మందికీ అక్టోబర్ నెలలో జీతం అందే అవకాశం లేదు. వీరికంటే ఆలస్యంగా ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన సబ్–ఇన్స్పెక్టర్లకు కొన్ని రోజుల్లోనే పోస్టింగ్స్ రావడంతో జీతం ఇబ్బంది తప్పింది. మరోపక్క దాదాపు ఆరు నెలల క్రితం పదోన్నతి పొందిన ఐపీఎస్ అధికారులు సైతం పోస్టింగ్స్ లేకుండా ఉన్నారు. ఫలితంగా అదనపు డీజీగా పదోన్నతి పొందిన వారు ఐజీ పోస్టులు, డీఐజీగా పదోన్నతి పొందిన వారు ఎస్పీ పోస్టుల్లో కొనసాగుతున్నారు. అయితే వీరికి జీతాల చెల్లింపులో ఇబ్బంది లేదని, తమకు మాత్రం జీతాలు కూడా అందట్లేదని కొత్త డీఎస్పీలు వాపోతున్నారు. చదవండి: 68 మంది డీఎస్పీలకు స్థాన చలనం -
ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట
-
ఆర్టీసీ సమ్మె; కార్మికులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: గత 12 రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట లభించింది. గతనెల వేతనాలు చెల్లించేందుకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది. సోమవారం నాటికి జీతాలు చెల్లిస్తామని ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో జీతాలు ఇచ్చేందుకు సిబ్బంది లేరని కోర్టుకు విన్నవించింది. సోమవారం లోపు కార్మికులకు జీతాలు ఇచ్చే ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పనిచేసిన సెప్టెంబర్ జీతాలు చెల్లించేలా ఆర్టీసీ యాజమాన్యానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ఈమేరకు ఆదేశాల్చింది. సమ్మెలో ఉన్న ఉద్యోగులకు జీతాలు నిలిపివేయడంతో ఈ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని, వారితో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం మంగళవారం సూచించింది. ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఎన్ జీవో, టీజీవో సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ హెచ్చరించింది. జీతాలిచ్చినా సమ్మె కొనసాగుతుంది ప్రతి నెలా ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలు ఆర్టీసీ యాజమాన్యం కావాలనే తొక్కిపెట్టిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. చేసిన పనికి వేతనం ఇవ్వకపోవడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని, ఈ దుర్మార్గానికి హైకోర్టు ఫుల్స్టాప్ పెట్టిందని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఆర్టీసీపై ప్రభుత్వం వైఖరికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని, నియంతృత్వ పోకడలు మానుకోవాలన్నారు. జీతాలు రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు దయనీయ పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. సమ్మె ప్రభావం లేదని చెబుతున్న యాజమాన్యం జీతాలు ఇవ్వడానికి సిబ్బంది లేరని చెప్పడం విడ్దూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. -
కేసీఆర్ గారూ.. పేస్లిప్స్ చూడండి
సాక్షి, నిర్మల్ : ఆర్టీసీలో సీనియర్ ఉద్యోగులు రూ.50వేల వేతనం తీసుకుంటున్నారని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని బస్‌డిపో వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. పే స్లిప్పులను చూపిస్తూ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం రూ.25వేలే జీతం ఉందన్నారు. సీనియారిటీ ఉన్నవారందరికీ రూ.50 జీతాలు తీసుకుంటున్నారని సీఎం అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీనియారిటీ ఉన్నప్పటికీ రూ.25 వేలకు మించి లేవని, దీనికి రుజువులు తమ పేస్లిప్‌లేనన్నారు. సీఎం కేసీఆర్ ఒకసారి పేస్లిప్‌లను పరిశీలించి చూసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఆర్టీసీ కార్మికులకు భారీగా వేతనాలు ఉన్నాయని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారం మానుకోవాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లా జేఏసీ కన్వీనర్ ఏఆర్ రెడ్డి, జేఏసీ నాయకులు గంగాధర్, చందర్, నారాయణ, జమీర్, శ్రీనివాస్, రాజేశ్వర్, పోశెట్టి, శంకర్ తదితరులున్నారు. -
వాళ్లకి వేతనాలు ఇచ్చేదెలా?
సాక్షి, ఆదిలాబాద్ : గళ్లపెట్టే నిండా డబ్బులున్నా.. ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉమ్మడి జిల్లా పరిషత్‌ది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు విడుదల చేసి మూడు నెలలైనా ఇంత వరకు మాజీ సభ్యుల చేతికందలేదు. ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు జూన్‌లో విడుదల చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో విడత కూడా విడుదల చేసి జెడ్పీ ఖాతాలో జమ చేసింది. కాని ఆ డబ్బులను సభ్యులకు పంచే అధికారం మాత్రం ఇంతవరకు ఎవరికీ ఇవ్వలేదు. తాజా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు గత కొన్ని నెలలుగా వేతనాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వచ్చిన వేతనాలు పంపిణీ చేసేందుకు సర్కారు అధికారులకు అధికారం ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వం గత మూడు నెలల క్రితం తాజా మాజీ జెడ్పీ సభ్యులకు గౌరవ వేతనాలు విడుదల చేసింది. కాని స్థానిక సంస్థల ఎన్నికలు ముగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ డబ్బులను డ్రా చేసే చెక్‌పవర్ ఏ అధికారికి ఇవ్వకపోవడంతో వేతన నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో మాజీ సభ్యులకు గౌరవ వేతనాలు ఎప్పుడిస్తారని ప్రతిరోజూ ఎవరో ఒకరు పరిషత్ అధికారులకు ఫోన్ చేసి అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చెక్‌పవర్ లేక నిలిచిన చెల్లింపులు జెడ్పీ మాజీ సభ్యుల గౌరవ వేతనాల చెల్లింపు చెక్‌పవర్ లేకపోవడంతో నిలిచిపోయాయి. సభ్యులకు చెల్లించాల్సిన రూ.4.64 కోట్ల గౌరవ వేతనాలు ఉమ్మడి జెడ్పీ ఖాతాలో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి విడుదలైన ఈ నిధులు మాజీ సభ్యులకు పంచాల్సి ఉండగా, గత మూడు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో జెడ్పీటీసీ, ఎంపీపీ సభ్యుడికి నెలకు రూ.10వేలు, ఒక్కో ఎంపీటీసీ సభ్యుడికి నెలకు రూ.5 వేల చొప్పున అందరికీ 11 నెలలకు సంబంధించిన గౌరవ వేతనాలు రావాల్సి ఉంది. ఈ లెక్కన ఒక్కో జెడ్పీటీసీ, ఎంపీపీకి రూ.1.10 లక్షలు, ఒక్కో ఎంపీటీసీ సభ్యుడికి రూ.55 వేలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 52 మంది జెడ్పీటీసీలు, 52మంది ఎంపీపీలు, 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం 740 మంది మాజీ ప్రజాప్రతినిధులకు సంబంధించి న గౌరవ వేతనాల కింద పాత జెడ్పీకి రూ.4.64 కోట్లు అందాయి. వీటితోపాటు జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్‌కు చెల్లించాల్సిన 11 నెలల వేతనం కూడా వచ్చినట్లు సమాచారం. వీటిని ఆయా మాజీ సభ్యులకు పంచాల్సి ఉండగా పరిషత్‌లో అధికారికి చెక్‌పవర్ లేకపోవడంతో యంత్రాంగం ఏమి చేయలేని పరిస్థితి. కాని జెడ్పీ ఖాతా నుంచి డబ్బులు తీసేందుకు డ్రా యింగ్ పవర్ లేకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ‘మాజీ’లపై కనికరమేది.? 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2016లో జెడ్పీసభ్యుల గౌరవ వేతనాలు పెంచింది. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో తక్కువ వేతనాలు అందుకున్న çసభ్యులు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్లకే రెట్టింపు గౌరవాన్ని పొందారు. పెంచిన వేతనాలను సమయానుకూలంగా అందజేయకపోవడంతో అప్పట్లో సభ్యులు ఇబ్బందులు పడ్డారు. నెలనెలా కాకుండా ఏడాది, ఏడాదిన్నరకోసారి వేతనాలు విడుదల చేస్తూ వచ్చింది. తాము అధికారంలో ఉన్నామనే దీమాతో ప్రభుత్వం ఎప్పుడిచ్చిన వేతనాలు తీసుకున్నామని, ఇప్పుడు మాజీలుగా మారిన ప్రభుత్వం కనికరం చూపడం లేదని కొందరు సభ్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా వేతనాలు విడుదల చేసేందుకు అధికారులకు చెక్‌పవర్ ఇవ్వాలని కోరుతున్నారు. -
ఆర్టీసీ కార్మికులకు మరో అవకాశం!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గడువు పొడిగింపుపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. శనివారం సాయంత్రం 6 గంటల్లోపు విధులకు రాకుంటే డిస్మిస్ చేస్తామని ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. అయితే కార్మికులెవరూ ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదు. తాత్కాలిక సిబ్బందితో పోలీసుల బందోబస్తుతో బస్సులను నడిపినా ప్రజావసరాలకు ఏమాత్రం సరిపోలేదు. దసరా పండుగ కోసం సొంత ఊర్లకు ప్రయాణమైన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఆర్టీసీ సమ్మె ప్రభావం స్పష్టంగా కనబడటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు కనబడుతోంది. రేపు ఉదయం వరకు గడువును పొడిగించాలని ప్రభుత్వం భావిస్తుస్తున్నట్టు సమాచారం. కార్మికులకు ఇచ్చిన గడువు ఈ సాయంత్రంతో ముగిసింది. ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అందని జీతాలు.. ఉత్కంఠ ఆర్టీసీ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ప్రతినెలా ఒకటవ తేదీన అందాల్సిన జీతాలు.. గత కొద్దీ నెలలుగా ఆర్ధిక స్థితి బాగాలేకపోవడంతో 5వ తేదీన చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు ఖాతాల్లో జీతాలు పడకపోవడంతో ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. పండగ నేపథ్యంలో జీతాల కోసం కార్మిక కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుందా, లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. 9 వేల బస్సులు తిరిగాయి: ప్రభుత్వం ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల బస్సులు తిరిగాయని ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 2129 ఆర్టీసీ బస్సులు, 1717 అద్దె బస్సులు, 1155 ప్రైవేట్ బస్సులు నడిపినట్టు తెలిపింది. ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి 1195, మ్యాక్సీ క్యాబ్‌లతో పాటు 2778 ఇతర వాహనాలు నడిచాయని వెల్లడించింది. (చదవండి: తొలగించాలనుకుంటే నన్ను తీసేయండి) -
రూ. 45,770 కోట్లు తప్పనిసరి ఖర్చు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తప్పనిస రి ఖర్చు గుదిబండగా మారుతోంది. రెవెన్యూ వ్యయంలో సగం ఉద్యోగుల జీతభత్యా లు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్ కోసమే ఖర్చవుతోంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వ్యయంలో 54% తప్పనిసరి ఖర్చులకే వెచ్చించిందని కాగ్ తెలిపింది. రెవెన్యూ వ్యయం రూ.88,824 కోట్లలో రూ.45,770 కోట్లు జీతాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకు ఖర్చు చేసినట్లు తేల్చింది. ఆర్థిక ఇబ్బందులు(ఆర్థిక నిర్వహణ కోసం ప్రభుత్వం ఇక్కట్లు) సాక్షి, హైదరాబాద్: ఆర్థిక నిర్వహణ కోసం ప్రభుత్వం 2017–18 ఆర్థిక సంవత్సరంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొందని కాగ్ నివేదిక తెలిపింది. దీని ప్రకారం ఆర్బీఐ నిబంధనలకు లోబడి ఆర్థిక నియంత్రణ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఏడు రోజులు ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లి నిధులు సమకూర్చుకున్నట్టు తెలిపింది. ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లడం ద్వారా రూ.765 కోట్లు ప్రభుత్వం సమకూర్చుకుందని చెప్పింది. 127 రోజులపాటు వేస్ అండ్ మీన్స్ (రోజు వారీ ఖర్చుల కోసం)కు వెళ్లిందని, దీని ద్వారా రూ.10,789 కోట్ల సమకూర్చు కుందని తేల్చింది. మరో 204 రోజుల పాటు రిజర్వ్ బ్యాం క్ ఇచ్చే స్పెషల్ విత్‌డ్రాయల్ సౌకర్యా న్ని వాడుకుని రూ.11,278 కోట్లు తెచ్చుకుందని చెప్పింది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఓడీ, వేస్ అండ్ మీన్స్, స్పెషల్ విత్‌డ్రాయల్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని దాదాపు రూ.22 వేల కోట్లు రాబట్టుకుని ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టినట్టు వెల్లడించింది. కాగ్ నివేదిక ప్రకారం గతంతో పోలిస్తే 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక అవకతవకలు తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో భాగంగా జరిగే కొన్ని తప్పనిసరి సర్దుబాట్లు, పద్దుల మార్పులు లాంటి అంశాలను ఆర్థిక అవకతవకల కింద కాగ్ తప్పుపడుతుంది. అలాంటి వాటిలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద రూ.1,500 కోట్లు ఉన్నాయంది. కాళేశ్వ రం ప్రాజెక్టు భూసేకరణకు వాడిన ఈ నిధుల వినియో గం విషయంలో నిబంధనల ప్రకారం ఉపయోగించిన పద్దులను మార్చారని ఆక్షేపించింది. రుణమాఫీ కింద అంతకు ముందు ఏడాది మిగిలిన రూ.2 కోట్లకు పైగా నిధులను సరిగా జమ చేయలేదని తెలిపింది. -
పండుగ పూటా... పస్తులేనా...?
సాక్షి, కడప(ప్రొద్దుటూరు) : వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులు. కుటుంబ పోషణకోసం వీధుల్లో చెత్తా చెదారాన్ని తొలగిస్తూ కాలువలను శుభ్రం చేస్తుంటారు. మహిళా కార్మికులు సైతం రిక్షాలతో వీధుల్లో తిరుగుతూ చెత్తా చెదారాన్ని సేకరిస్తున్నారు. ఇంత కష్టపడుతున్నా తమకు ఏడు నెలలుగా వేతనం అందడం లేదని వీరంతా వాపోతున్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో 24 మంది గ్రీన్ అంబాసిడర్లను అధికారులు నియమించారు. నెలకు రూ.6వేలు వేతనం ప్రకారం గత ఏడాది సెప్టెంబర్‌లో విధుల్లో చేరారు. మూడు నెలలు మాత్రమే వేతనాలు పొందారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే ఇష్టమైతే పనిచేయండి, లేకపోతే మానుకోండని అధికారులు చెబుతుండటంతో వీరు ఆందోళన చెందుతున్నారు. దసరాకు ప్రసిద్ధి ప్రొద్దుటూరు దసరా ఉత్సవాల నిర్వహణలో ప్రొద్దుటూరుకు ప్రాధాన్యత ఉంది. పది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను అన్ని వర్గాలూ ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవడం ఆనవాయితీ. ప్రాధాన్యతగల ఈ పండుగ ఈనెలాఖరును ప్రారంభమవుతున్నా వేతనాలు రాకపోవడంపై కార్మికులు కలత చెందుతున్నారు. కొందరు చేసేది లేక పని మానుకుందామని ఆలోచించినా ఇంటి వద్ద ఉంటే బకాయి వేతనాలు వస్తాయో రావోననే ఆందోళన వెంటాడుతోంది. జిల్లా వ్యాప్తంగా 3వేల మంది కార్మికులు గ్రామ పంచాయతీల పరిధిలో గ్రీన్ అంబాసిడర్ల పేరుతో పారిశుద్ధ్య పని చేస్తున్నారు. స్వచ్ఛభారత్ నిధులను గత ప్రభుత్వ హయాంలో పసుపు–కుంకుమకు మళ్లించడంతో వేతనాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,918 గ్రామ పంచాయతీలను వ్యర్థరహిత పంచాయతీలుగా చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 9,856 చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను రూ.376 కోట్లు వెచ్చించి నిర్మించారు. వెయ్యి మంది జనాభాకు ఒకరు చొప్పున నియమితులైన గ్రీన్ అంబాసిడర్లకు వేతనాలు చెల్లించడం లేదు. చాలా చోట్ల కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య వెళ్లడంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఈ ఏడాది జూన్ 25న సర్కులర్ జారీ చేశారు. గ్రామ పంచాయతీల ద్వారా ముందుగా వీరికి వేతనాలు చెల్లించాలని సూచించారు. తర్వాత ప్రభుత్వం ఈ నిధులను గ్రామ పంచాయతీలకు చెల్లిస్తుందని తెలిపా రు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి విడుదలయ్యే నిధుల కోసం వేచి ఉండవద్దన్నారు. అయితే ఇంతవరకు ఈ కార్మికులకు వేతనాలు మాత్రం అందలేదు. కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి పుల్లారెడ్డిని సాక్షి వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాము బిల్లులను పంపామని చెప్పారు. ఎంపీడీఓ సుబ్రహ్మణ్యాన్ని వివరణ కోరగా ఫైనాన్స్ క్లియరెన్స్ రాకపోవడంతో ఈ సమస్య తలెత్తిందన్నారు. ఆస్పత్రికి వెళ్లాలన్నా డబ్బు లేదు ఎడమ వైపు కర్ణబేరి దెబ్బతింది. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి మెరుగైన వైద్యం చేయించుకోవాలన్నా డబ్బు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నా. వేతనాలు ఎప్పుడిస్తారో తెలియడం లేదు. ఒక్క నెల కూడా వేతనం పడలేదు. – యు.భార్గవ, కార్మికుడు, కొత్తపల్లె పంచాయతీ, ప్రొద్దుటూరు ఒక్క నెల వేతనం కూడా పడలేదు ఏడాదిగా పనిచేస్తున్నా ఒక్క నెల కూడా వేతనం అందలేదు. ఇందుకు ఏవేవో కారణాలు చెబుతున్నారు. కుటుంబ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. – చంద్రరంగ, కార్మికుడు, కొత్తపల్లె పంచాయతీ, ప్రొద్దుటూరు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ఇచ్చేది నెలకు రూ.6వేలు వేతనం. మా శ్రమ ఆ దేవుడికి తెలుసు. ఇన్ని నెలలు వేతనం ఇవ్వకుంటే ఎలా పనిచేయాలి. మా లాంటి వారికి ఇన్ని కష్టాలా..? – సునీత, కార్మికురాలు, కొత్తపల్లె పంచాయతీ, ప్రొద్దుటూరు -
ఔట్సోర్సింగ్ కుచ్చుటోపీ !
ఔట్ సోర్సింగ్ ముసుగులో గత ప్రభుత్వ నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తమ ప్రాబల్యం పెంచుకునేందుకు అధికారులను పావులుగా వాడుకుని అడ్డగోలుగా ప్రభుత్వ నిధులు కాజేశారు. మొన్నటికి మొన్న సర్వశిక్ష అభియాన్ ద్వారా భారీ స్క్రీన్ల పేరుతో నిధులు మింగినవైనం బయటపడగా... తాజాగా జిల్లాలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే అండతో ఏర్పాటైన ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఉద్యోగుల ఈఎస్ఐ, పీఎఫ్ మొత్తాలు చెల్లించకుండా బోర్డు తిప్పేసిన సంఘటన వెలుగు చూసింది. సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇప్పుడు ఆ సంస్థపై క్రిమినల్కేసు నమోదు చేయించేందుకు జిల్లా విద్యాశాఖాధికారి చర్యలు తీసుకుంటున్నారు. సాక్షి,విజయనగరం అర్బన్: విద్యాశాఖ అడ్డాగా గత ప్రభుత్వ పాలనలో సాగిన అక్రమాల పర్వం వెలుగు చూస్తూ నే ఉంది. జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల చెల్లింపుల్లో జరిగిన అక్రమాలు తాజాగా బయ ట పడ్డాయి. వారికోసం చెల్లించా ల్సిన ఈపీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము రూ.62 లక్షలు జమచేయకుండా జిల్లాలోని ఒక టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి చెందిన బేతస్థ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ తినేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏడాదిపాటు సిబ్బంది అడిగినా ఇటు విద్యాశాఖగానీ, అటు ఏజెన్సీగానీ స్పందించలేదు. అయితే తినేసిన ఆ రూ.62 లక్షలు ఆ ఎమ్మెల్యే ఎన్నికల ఖర్చులో చూపించారని ప్రచారం జరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ ఏజెన్సీ అడ్రస్‌కు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో విద్యాశాఖ క్రిమినల్ కేసు పెట్టింది. అధికారం అండతో... అడ్డగోలు నియామకాలు... జిల్లాలోని 16 మోడల్ స్కూళ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన హాస్టళ్ల నిర్వహణ కోసం గతేడాది జనవరిలో వివిధ కేడర్ నాన్ టీచింగ్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలుత జిల్లా విద్యాశాఖ అర్హులైన అభ్యర్థులతో నియామక జాబితాను సిద్ధం చేసి సర్వీసు అనుభవం ఉన్న ఒక ఔట్ సోర్సింగ్ ఏజెన్సీతో జిల్లా యంత్రాంగం ఒప్పందం పెట్టుకుంది. అయితే అప్పటి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకు ఆ నియామకాలను, ఏజెన్సీ ఒప్పందాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఆ ఏజెన్సీ స్థానంలో ఎలాం టి అనుభవం లేని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బంధువుకు చెందిన బేతస్థ ఔట్సోర్సింగ్ ఏజెన్సీని నియమించింది. రాత్రికి రాత్రి ఇచ్చిన ఆ ఆదేశాలతో నిబంధనలకు విరుద్ధంగా కనీసం పత్రికా ప్రకటనైనా లేకుండా ఒక్క రోజు సమయం ఇచ్చి నియామక నోటిఫికేషన్ మరలా విడుదల చేసి ఎలాగోలా తమకు అనుకూలమైనవారిని నియమించుకుని మరో జాబితా ప్రకటించారు. ఈ విషయం అప్పట్లో వివాదా స్పదమైనాజిల్లా యంత్రాంగం పట్టించుకోలేదు. తొలినుంచీ ఎగ్గొట్టిన ఈపీఎఫ్, ఈఎస్ఐ మొత్తాలు.. తొలి మూడు నెలలకు ఒకసారి వేతన నిధులు రావడంతో ఆ మొత్తం ఒకేసారి చెల్లించారు. ఆ సమయంలో ఈపీఎఫ్, ఈఎస్ఐ ఇతర సౌకర్యాల నిధులు వెళ్లలేదని విద్యాశాఖ గుర్తించి తదుపరి బిల్లులకు అనుమతులివ్వలేదు. జిల్లా యంత్రాంగంపై ఆ ఎమ్మెల్యే ఒత్తిడి పెంచడంతో ఈపీఎఫ్, ఈఎస్ఐ నిధులు కేటాయించకపోయినా తరువాత మరో ఐదునెలల వేతనాన్ని విడుదల చేశారు. అయినా ఆ ఏజెన్సీ ఈపీఎఫ్, ఈఎస్ఐ నిధులు ఎగ్గొట్టింది. ఇప్పుడు ఆ ఏజెన్సీ చెల్లించాల్సిన బకాయి రూ.62 లక్షలకు చేరింది. నూతన ప్రభుత్వం వచ్చాక జిల్లా యంత్రాంగంలో చలనం వచ్చింది. గత నెల రోజులుగా బేతస్థ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ యజమానికి నోటీసులు పంపారు. అక్కడినుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ ఆదేశాల మేరకు ఆ ఏజెన్సీపై విద్యాశాఖ తాజాగా ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్‌పై క్రిమినల్ కేసు పెట్టింది. ఆందోళనలో సిబ్బంది.. జిల్లాలోని 16 మోడల్ స్కూళ్లలో గతేడాది హాస్టళ్లను నూతనంగా ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ కోసం ఒక్కో హాస్టల్‌కు ఒక వార్డెన్, ఒక హెడ్కుక్, ఇద్దరు సహాయ కుక్‌లు, ఒక నైట్ వాచ్‌మన్ వంతున పోస్టులను భర్తీ చేశారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ ఖాతాల కోసం వేతన మొత్తం నుంచి తీసుకున్న సొమ్మును ఇవ్వకపోడంపై ఏడాదిగా ఆందోళనలో ఉన్నారు. ఆ ఏజెన్సీపై కేసుపెట్టాం.. జిల్లాలోని మోడల్ స్కూళ్లలో హాస్టల్ నిర్వహణ సిబ్బంది నియామకానికి గడచిన ఏడాది ఒప్పందం పెట్టుకున్న బేతస్థ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాం. వేతనాల నుంచి కేటాయించిన ఈపీఎఫ్, ఈఎస్ఐ నిధులను సిబ్బంది ఖాతాలో జమ చేయకుండా సుమారు రూ.62 లక్షలు తిరిగి చెల్లించాలని కొన్ని నెలలుగా కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ ఏజెన్సీపై చట్టబద్ధమైన చర్యలకోసం ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్లో క్రిమినల్ కేసు పెట్టాం. సిబ్బంది వివరాలను తాజాగా పోలీసులు అడిగారు. ఇస్తున్నాం. – జి.నాగమణి, డీఈఓ, విజయనగరం -
సర్పంచులకు వేతనాలు
సాక్షి, జైనథ్/ ఆదిలాబాద్: తాజామాజీ, కొత్త సర్పంచులకు ఎట్టకేలకు వేతనాలు విడుదలయ్యాయి. నూతన సర్పంచులుగా కొలువుదీరి ఏడు నెలలు గడుస్తుండగా గడిచిన నాలుగు నెలలకు సంబంధించిన వేతనాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. 2018లో నాలుగు నెలల పెండింగ్ వేతనాలు కూడా విడుదల చేయడంతో మాజీ సర్పంచుల ఎదురుచూపులు ఫలించాయి. కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడక ముందు 240 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రస్తుతం 467 గ్రామ పంచాయతీలు జిల్లాలో ఉన్నాయి. అన్ని గ్రామపంచాయతీ సర్పంచులకు వేతనాలు విడుదలకు డీపీవో ఖాతకు నిధులు జమ అయ్యాయి. రూ. 1.14కోట్లు విడుదల.. జిల్లా వ్యాప్తంగా 467 గ్రామ పంచాయతీలకు రూ.1.14కోట్ల వేతనాలు జమ చేసేందుకు నిధులు విడుదలయ్యాయి. 2018లో మాజీ సర్పంచుల హయాంలో నాలుగు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి సంబంధించిన నిధులు సైతం సర్దుబాటు చేసారు. 2018 జనవరి, ఫిబ్రవరి, మార్చి, జూలై నెలలకు సంబంధించిన బకాయి పడిన వేతనాలు మొత్తం డీపీవో ఖాతాలకు జమయ్యాయి. పాత సర్పంచులు 240మందికి ఒక్కొక్కరికి 20వేల (నాలుగు నెలలకు కలిపి) చొప్పున రూ.48లక్షలు విడుదలయ్యాయి. కొత్త సర్పంచులు 2019లో ఫిబ్రవరిలో కొలువు దీరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి ఒక్కసారి కూడా వేతనాలు మంజూరు కాలేదు. ప్రస్తుతం ఫిబ్రవరి, మార్చి, ఎప్రిల్, మే నెలలకు సంబంధించిన వేతనాలు అందనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 467 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క సర్పంచ్‌కు రూ.20వేల (నాలుగు నెలలు) చొప్పున మొత్తం 93లక్షలు విడుదలయ్యాయి. త్వరలోనే జీపీ ఖాతాల్లోకి... వేతనాలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ జీపీ ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదు. డీపీవో ఖాతా నుంచి ట్రెజరీకి, అక్కడి నుంచి గ్రామ పంచాయతీల వారీగా ఖాతాల్లోకి జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో త్వరలోనే సర్పంచుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. కాగా ఎప్పటి నుంచో వేతనాల కోసం ఎదురు చూస్తున్నామని, వేతనాలు విడుదల చేయడం సంతోషకరమని సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషం సర్పంచులు కొలువుదీరి 7 నెలలు గడుస్తుంది. అయిన ఇప్పటి వరకు వేతనాలు రాలేదు. 7నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నాము. ఎట్టకేలకు నాలుగు నెలల వేతనాలు విడుదల చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉంది. ఒక్కొక్కరికి నాలుగు నెలల చొప్పున రూ. 20వేలు వస్తాయి. ప్రభుత్వం నుంచి వేతనాలు అందుకోవడం ఆనందంగా ఉంది. – ఎడ్మల పోతరెడ్డి, సర్పంచ్ పూసాయి, జైనథ్ -
బ్రిటన్‌లో భారతీయులకు ఎక్కువ జీతాలు
లండన్ : బ్రిటన్‌లో శ్వేత జాతీయులైన బ్రిటీష్ వారికన్నా చైనీయులు, భారతీయులు అధిక మొత్తాల్లో జీతాలు అందుకుంటున్నారు. అన్ని దేశాల వారికన్నా చైనీయులు అత్యధికంగా వేతనాలు అందుకుంటుంటే భారతీయులు, బ్రిటీష్వారికన్నా 12 శాతం భారతీయులు అధిక వేతనాలు అందుకుంటున్నారని ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటస్టిక్స్’ స్వచ్ఛందంగా నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడయింది. శ్వీత జాతీయులకన్నా భారతీయులు అధిక జీతాలు అందుకోవడానికి వృత్తిపరమైన నైపుణ్యంతోపాటు విద్యార్హతలు ఎక్కువగా ఉండడం కారణాలని అధ్యయనంలో తేలింది. జీతాల విషయంలో బంగ్లాదేశీయులు బాగా వెనకబడి ఉన్నారు. బ్రిటీష్ వారికన్నా తక్కువ వేతనాలు అందుకుంటున్న దేశాల జాబితాలో బంగ్లాదేశీయులు ఐదో స్థానంలో ఉన్నారు. 30 ఏళ్లలోపున్న నల్ల జాతీయులు, కరేబియన్ కార్మికులు అదే ఏజ్ గ్రూప్ బ్రిటీష్ కార్మికులతో దాదాపు సమానంగా జీతాలు అందుకుంటున్నారు. ఒకే విద్యా, వృత్తి అర్హతలు కలిగిన బ్రిటీష్ వారికి, ఇతర జాతీయులకు మధ్య వేతనాల్లో పెద్దగా తేడాలేదు. ఇది క్రమంగా తగ్గుతూ వస్తోంది. విద్యార్హతలు, వృత్తిపరమైన నైపుణ్యం ఎక్కువగా ఉండడం వల్లనే చైనీయులతోపాటు భారతీయులు ఎక్కువ వేతనాలు అందుకుంటున్నారు. ఓ చైనా ఒద్యోగి సగటున గంటకు 15.75 డాలర్లు సంపాదిస్తుండగా, భారతీయ ఉద్యోగి 13.47 డాలర్లు, బ్రిటీష్ జాతీయులు 12.30 డాలర్లు, బంగ్లాదేశీయులు 9.60 డాలర్లు సంపాదిస్తున్నారు. గంటకు పది డాలర్లతో పాకిస్థాన్ జాతీయులు బంగ్లాదేశ్‌కన్నా కాస్త మెరుగైన స్థానంలో ఉన్నారు. ఇతర ఆసియా దేశస్థులు గంటకు 11.55 డాలర్లతో బ్రిటీష్ వారికన్నా కాస్త తక్కువ వేతనాలు అందుకుంటున్నారు. వయస్సు ఎక్కువగా ఉన్న బ్రిటీష్, ఇతర జాతీయుల వేతనాల మధ్య ఎక్కువ వ్యత్యాసం ఉండగా, యువకుల వేతనాల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంది. -
1.76 లక్షల ఉద్యోగులకు మరోసారి షాక్!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఆర్థిక సంక్షోభం కారణంగా జీతాలు చెల్లించలేమంటూ మరోసారి చేతులెత్తేసింది. తద్వారా 1.76 లక్షల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. జూన్ నెలకు సంబంధించి రూ. 850 కోట్ల విలువైన జీతాలతో పాటు, కార్యకలాపాలను నిర్వహించడం చాలా కష్టంగా మారిందంటూ ప్రభుత్వం నుండి తక్షణ నిధుల ఇన్ఫ్యూషన్ కోరింది. ఈ మేరకు జూన్ 18వ తేదీన బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ బడ్జెట్ , బ్యాంకింగ్ విభాగం, సీనియర్ జనరల్ మేనేజర్ పురన్ చంద్ర , టెలికాం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శికి రాసిన లేఖ రాసారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని, నగదు కొరత కారణంగా సంస్థ కార్యకలాపాలు, సర్వీసుల నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని సంస్థకుమద్దతివ్వాలని కోరింది. జూన్ నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితులున్నాయని, ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిపెట్టుకుని సహకరించాలని విజ్ఞప్తి చేసింది. కాగా వేల కోట్లు బకాయిలతో బాధపడుతున్న టెలికాం సంస్థ ఇటీవల సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో చిక్కుకుంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం సంస్థ తన చరిత్రలో తొలిసారిగా సుమారు 1.76 లక్షల మంది ఉద్యోగులకు ఫిబ్రవరి వేతనాలను చెల్లించలేకపోయింది. భారీ నష్టాలను నమోదు చేస్తున్న ప్రభుత్వరంగ సంస్థల్లో టాప్‌లో ఉన్న బీఎస్ఎన్ఎల్ రూ.13,000 కోట్ల రుణ సంక్షోభంలో పడి పోయింది. డిసెంబర్ 2018 నాటికి నిర్వహణ నష్టాలు రూ.90,000 కోట్లకు పైగా మాటేనని సమాచారం. -
వేతనాల పెంపు పట్ల ఆశా వర్కర్ల హర్షం
-
వేతనాల పెంపు పట్ల ఆశా వర్కర్ల హర్షం
సాక్షి, కాకినాడ : ఆశావర్కర్ల జీతాలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిర్ణయం వల్ల జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న 4500 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు సీఐటీయూ భవనంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆశా వర్కర్ల సంఘం గౌరవ అధ్యక్షురాలు బేబి రాణీ మాట్లాడుతూ.. తమ ఉద్యమాలను, పోరాటాలను గుర్తించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పారితోషికాలతో ముడి పెట్టకుండా రూ. 10 వేల గౌరవ వేతనంగా ఇవ్వాలని ఆమె కోరారు. చంద్రబాబు పాలనలో పనికి తగిన వేతనం ఇవ్వకపోగా.. తమపై రాజకీయ వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉద్యమాల సమయంలో ఆశా వర్కర్లపై చంద్రబాబు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సీఎం జగన్‌ను కోరారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : హమీ ఇచ్చారు అమలు చేశారు -
ఆశావర్కర్ల జీతాలు భారీగా పెంచిన ఏపీ సీఎం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఆశావర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీపి కబురు చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారి జీతాలను భారీగా పెంచారు. ఆశావర్కర్ల జీతాలను పదివేల రూపాయలకు పెంచుతున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖపై సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టిన వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో ఆశావర్కర్ల జీతాలు భారీగా పెరిగినట్టయింది. ప్రస్తుతం మూడు వేల రూపాయల వేతనం అందుకుంటున్న ఆశావర్కర్లు.. ఇకపై పదివేల రూపాయల వేతనం అందుకోనున్నారు. గ్రామీణ స్థాయిలో ఆశావర్కర్ల ప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రజాసంకల్పయాత్ర చేస్తున్నప్పుడు వైఎస్ జగన్‌ను కలిసిన ఆశావర్కర్లు తమ సమస్యలను వైఎస్ జగన్‌కు దృష్టికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారికి ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రెండు గంటలపాటు సాగిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైద్య రంగాన్ని మెరుగుపరచి ప్రతి పేదవారికి కూడా వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతిని సహించేది లేదని, వైద్యశాఖను తానే ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అధికారులు అంతా బాధ్యతతో పనిచేసి ఇందుకు సంబంధించి 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఆశా వర్కర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ చదవండి : వైద్య శాఖను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్న సీఎం జగన్ -
ఆశా వర్కర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్
-
అడిఆశలు చేశారు!
మండపేట: గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న ఆశ వర్కర్లు ఐదు నెలలుగా జీతాలు అందక అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణ భారమై అర్ధాకలితో అలమటిస్తున్నారు. జీతాల పెంపు హామీని తుంగలోకి తొక్కిన చంద్రబాబు సర్కారు, జీతాలు విడుదలను కూడా నిలిపివేసిందని ఆశ వర్కర్లు మండిపడుతున్నారు. జిల్లాలోని ఆశ వర్కర్లకు ఐదు నెలలకుగాను రూ.19.35 కోట్ల మేర వేతన బకాయిలు పేరుకుపోయాయి. కనీస వేతనానికి నోచుకోని ఆశ వర్కర్లను వెబ్సైట్లో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో ప్రభుత్వ పథకాల లబ్ధికి దూరం చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ఆరోగ్య పరిరక్షణకు ఆశ వర్కర్లు పాటుపడుతున్నారు. కుష్ఠు, టీబీ, తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి వైద్య సహాయం అందించడంతో పాటు 104 శిబిరాల నిర్వహణలో వీరు సేవలందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 4,500 మంది ఆశ వర్కర్లు ఉన్నారు. గతంలో ఆశ వర్కర్లు ఒక్కొక్కరికి గౌరవ వేతనం రూ.3 వేలు, పారితోషికం రూ.2 వేలు చెల్లించేవారు. గత ఎన్నికల్లో ఆశ వర్కర్ల వేతనాలు పెంచుతామని చంద్రబాబు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. సార్వత్రిక ఎన్నికల ముందు నవంబర్‌లో చంద్రబాబు నిర్వహించిన ప్రజాదర్భారులో పారితోషికం రూ.5,600, గౌరవ వేతనం రూ.3 వేలు చొప్పున అందజేస్తామని ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. తమకు ఇచ్చే వేతనాలు, పారితోషికం పెంచకపోగా జనవరి నుంచి మొత్తం చెల్లింపులు నిలిపివేశారని ఆశ వర్కర్లు మండిపడుతున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.8,600గాను జిల్లాలోని ఆశ వర్కర్లకు నెలకు రూ.3.87 కోట్లు చొప్పున ఐదు నెలలకు రూ.19.35 కోట్లు చెల్లించాల్సి ఉంది. తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం పనికి తగిన వేతనం ఇవ్వకపోగా జీతాలు నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనిఫాం అలవెన్సులు ఇవ్వడం లేదని, 104 సంచార వైద్యసేవలకు సంబంధించి బిల్లులు చెల్లించడం లేదని వారంటున్నారు. పెంచిన జీతాలు, బిల్లు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వెబ్సైట్లో ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు ఆశ వర్కర్లు అందరూ పేద వర్గాలకు చెందిన వారే. చంద్రబాబు సర్కారు వీరిని వెబ్సైట్లో ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేయడంతో ప్రభుత్వ పథకాల లబ్ధికి వీరిని దూరం చేసింది. కనీస వేతనాలకు నోచుకోని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ తమ పిల్లలకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగభృతి తదితర ఏ పథకాలకు ఎంపిక చేయడం లేదని వాపోతున్నారు. జీతాలు పెంచుతామని, వెబ్సైట్ నుంచి పేర్లు తొలగిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం తమ ఆశలను అడియాశలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వేతనాలపై చేతులెత్తేసిన జెట్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సమస్యలతో విమాన సర్వీసులను నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ వేతనాల కోసం ఎదురుచూస్తున్న సిబ్బందికి చేదు వార్త చేరవేసింది. సంస్ధ విక్రయానికి సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకూ వేతన చెల్లింపులకు నిధులు సర్ధుబాటు చేయలేమని బ్యాంకుల కన్సార్షియం తెలిపిందని జెట్ ఎయిర్వేస్ సీఈఓ వినయ్ దూబే ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బిడ్డింగ్ ప్రక్రియను కొనసాగిస్తూనే సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు కొన్ని నిధులు విడుదల చేయాలని తాము కోరగా బ్యాంకులు నిరాకరించాయని తెలిపారు. కొద్ది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తమ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే వారు మరోచోట ఉద్యోగం చూసుకోవడం మినహా వారికి మరో మార్గం లేదని తాము పదేపదే బ్యాంకులను కోరినా ఫలితం లేకుండా పోయిందని దూబే ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను తాము బ్యాంకర్ల దృష్టికి తీసుకువెళ్లగా దీనిపై కంపెనీ షేర్‌హోల్డర్లే నిర్ణయం తీసుకోవాలని సులభంగా తేల్చేశారని చెప్పారు. ఇక బోర్డు సమావేశాల్లోనూ వేతన బకాయిల చెల్లింపునకు ప్రమోటర్లు, వ్యూహాత్మక వాటాదారును కోరినా వారి నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి సహకరించాలని కోరినా ఫలితం లేకపోయిందని తెలిపారు. -
ఎన్నికల వేళ.. ఏపీలో ఉద్యోగుల పస్తులు
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ టీడీపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రంలోని ఉద్యోగుల పాలిట శాపంగా మరింది. ఓట్ల పథకాల కోసం డబ్బు మళ్లించిన చంద్రబాబు ప్రభుత్వం లక్షకు పైగా ఉద్యోగుల కుటుంబాలను పస్తులు ఉండేలా చేస్తోంది. 1900 కోట్ల రూపాయల మేర జీతాలను ప్రభుత్వం చెల్లించదు. ఆ డబ్బులన్నీ చంద్రబాబు ప్రభుత్వం ఓట్లకోసం మళ్లించింది. జీతాలు పొందనివారిలో ఎయిడెడ్ పాఠశాల టీచర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, అన్ని శాఖల్లోని జౌట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ కార్మికులకు 6 నెలల నుంచి జీతాలు అందడం లేదు. విద్యాశాఖలో సిబ్బందికి ప్రభుత్వం 3 నెలలకు పైగా జీతాలు చెల్లించలేదు. వేల మంది రెగ్యూలర్ ఉద్యోగులకు కూడా జీతాలు అందని పరిస్థితి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో హడావుడి నిర్ణయాలతో ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఏపీ ప్రభుత్వం భారీ ఓవర్ డ్రాఫ్ట్‌లోకి వెళ్లిపోయింది. ఏప్రిల్‌లోనే 8 వేల కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ కావడంపై అధికారులు విస్తుపోతున్నారు. ఎన్నికల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని ముంచేశారని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో 35వేల కోట్ల బిల్లులన్నీ పెండింగ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మొత్తం డబ్బులన్నీ ఎన్నికల పథకాలకు మళ్లించడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. -
4 నెలలుగా హోంగార్డులకు అందని జీతాలు
-
ఫీజు కోటి.. జీతం పాతిక వేలు!
డాక్టర్ నరేందర్. 2017లో ఎంబీబీఎస్ చేశారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలో దాదాపు రూ.60 లక్షల వరకు డొనేషన్ చెల్లించి మరీ వైద్యవిద్యలో డిగ్రీ పూర్తిచేశారు. ఇప్పుడు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఇంత కష్టపడి ఎంబీబీఎస్ పూర్తిచేసినా.. ఆసుపత్రిలో ఇస్తున్న వేతనం రూ.25 వేలు మాత్రమేనని ఆవేదన చెందుతున్నారు. డాక్టర్ నరేష్. 2016లో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. రెండుసార్లు పీజీ రాసినా రాలేదు. తాజాగా మళ్లీ పరీక్షకు హాజరయ్యారు. ఎంబీబీఎస్ డిగ్రీతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఇందుకు ఆయన పొందుతున్న వేతనం రూ.30 వేలు. లక్షల రూపాయల బ్యాంకు రుణం తీసుకొని ప్రైవేటులో పీజీ చేసినా తర్వాత ఆ రుణం చెల్లించే స్థాయిలో వేతనం వస్తుందా అనే అనుమానం వ్యక్తం చేశారు. డాక్టర్ అబ్దుల్లా 2015లో ఎంబీబీఎస్ చదివారు. ఎండీ కోసం చదువుతున్నారు. రెండుసార్లు పరీక్ష రాసినా రాలేదు. ప్రభుత్వం వైద్యుల నియామకాలు చేపట్టకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. తనకు ఎంసెట్‌లో 2వేల ర్యాంకు వచ్చి కన్వీనర్ కోటాలో సీటు పొందినా.. ఇప్పుడు పెద్దగా ఫలితం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ఇదీ ఎంబీబీఎస్ చదివిన విద్యార్థుల ఆవేదన. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసినా.. బతుకుదెరువు సమస్యగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ అని గొప్పగా చెప్పుకోవడమే తప్ప వేతనాలు కనీస స్థాయిలో కూడా లేవంటూ ఆందోళన చెందుతున్నారు. కొందరు రూ.50–60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఎంబీబీఎస్ కోసం డొనేషన్ చెల్లించారు. ఫలితం ఎంబీబీఎస్ పూర్తయ్యాక ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇస్తున్న వేతనం ఈ స్థాయిలో దారుణంగా ఉండటంతో.. ఎందుకు వైద్యరంగాన్ని ఎంచుకున్నామా? అని అని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వ రంగంలో డిమాండ్‌కు సరిపడినన్ని ఉద్యోగాలు లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారుతుందంటున్నారు. మండలాలు, గ్రామాల్లో ప్రాక్టీస్ పెట్టినా స్థానికంగా ఉండే సమస్యలతో సతమతం అవుతున్నామని అంటున్నారు. ఎంబీబీఎస్ చదువు కోసం, డొనేషన్లు కట్టేందుకు అనేకమంది తల్లిదండ్రులు వడ్డీలకు డబ్బులు తెచ్చారు. వాటిని తిరిగి వడ్డీలతో కలిపి చెల్లించేందుకు కూడా ఎంబీబీఎస్ చదువు పనికిరావడం లేదంటున్నారు. ఇక విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులు అనేకమంది ఎంసీఐ అర్హత పరీక్ష పాసు కాకపోవడంతో వారికి ఇస్తున్న వేతనాలు రూ.20 వేలకు కూడా మించడంలేదు. దీంతో వారి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. పీజీ సీట్లు రాక ఇబ్బందులు రాష్ట్రంలో 23 ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 3,500 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కానీ పీజీ సీట్లు మాత్రం సగం కూడా లేవు. ఇప్పుడు నీట్ ద్వారా నింపుతుండటంతో దేశవ్యాప్తంగా 32 వేల పీజీ మెడికల్ సీట్లున్నాయి. వీటికోసం గత నెల జరిగిన నీట్–2019 పరీక్షకు ఏకంగా 1.40 లక్షల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు రాశారు. ఇంత పోటీని తట్టుకుని పీజీ సీటు కొట్టడం ఆషామాషీ కాదు. రాష్ట్రంలోని ఎంబీబీఎస్, పీజీ సీట్లను పోలిస్తే.. ప్రతీ ఏడాది దాదాపుగా 2వేల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు పీజీ చేయలేకపోతున్నారు. వీరికితోడు చైనా, ఉక్రెయిన్, పిలిప్పీన్స్ తదితర దేశాల్లో చదివిన వారూ పోటీలో ఉంటున్నారు. పీజీ, సూపర్ స్పెషాలిటీ చదవకుంటే మార్కెట్లో కనీస గుర్తింపు ఉండడంలేదు. కేవలం ఎంబీబీఎస్‌తో వృత్తిలో ఎదిగే పరిస్థితి లేదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ప్రైవేటులో పీజీ చేయాలన్నా కోట్లలో డొనేషన్లు చెల్లించాల్సి వస్తుంది. పీజీలో సీటు రాక, ఎంబీబీఎస్ ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రిలో తక్కువ వేతనాలకు పనిచేయక తప్పని దుస్థితి తలెత్తిందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవకాశాలు లేవు ప్రైవేటులో పరిస్థితి ఇలాగుంటే ప్రభుత్వ రంగంలో పనిచేద్దామంటే భర్తీలు లేవని ఎంబీబీఎస్ డాక్టర్లు అంటున్నారు. తెలంగాణలో 2017లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ) 500 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం 5వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2018లో 1,150 పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల కొరకు 6,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. అటు పీజీ సీటు రాక, ఇటు ప్రభుత్వ ఉద్యోగం రాక తాము చేసేదేమీ లేదంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇచ్చే రూ.25 వేలు.. ఇంటి అద్దె, తిండికి కూడా సరిపోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ‘ప్రతి పల్లెలో అంగన్వాడీ కేంద్రం ఉంది. పంచాయతీ కార్యాలయం ఉంది. ప్రాథమిక పాఠశాల ఉంది. కానీ ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్న క్లీనిక్ లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 10వేలకు పైగా గ్రామాలుంటే.. కేవలం దాదాపు 700 పీహెచ్‌సీలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీహెచ్‌సీలను పెంచాల్సిన అవసరం ఉందని వైద్యులంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. ఆ లెక్కలను ప్రభుత్వాలు మరిచిపోయాయన్న విమర్శలు వస్తున్నాయి. ఎంబీబీఎస్‌తో బతికేదెలా? ఎంబీబీఎస్ డాక్టర్లకు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేతనాలు ఘోరంగా ఉంటున్నాయి. లక్షలు ఖర్చు చేసి ప్రైవేటు కాలేజీలో చదివినా ప్రయోజనం కనిపించడంలేదు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కోటి రూపాయల వరకు డొనేషన్ కట్టి ఎంబీబీఎస్ చదివించారు. చాలామంది కట్టిన ఫీజుకు వడ్డీలు కట్టుకోలేక.. బతకడానికి డబ్బులు లేక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలను ఎలా పోషించుకోవాలి? వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ, ఆరోగ్య ఖర్చులు ఎలా భరించాలి? ఒకవేళ గ్రామాల్లో ప్రైవేటు ప్రాక్టీసు చేయాలన్నా అనేకమంది అర్హత లేనివాళ్లు స్థానికంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వారిని నియంత్రించడంలేదు. ఎంబీబీఎస్ డాక్టర్లకు వంద నిబంధనలున్నాయి. అర్హత లేని వైద్యులకు అలాంటివేమీ లేదు. తప్పు చేస్తే శిక్ష విధించడం లేదు. ఈ నేపథ్యంలో ఆందోళనలో ఉన్న ఎంబీబీఎస్ వైద్యులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి, గవర్నర్ జోక్యం చేసుకోవాలి. పరిస్థితిని చక్కదిద్దాలి. – డాక్టర్ పీఎస్ విజయేందర్, అధ్యక్షుడు, టీఎస్ జూడా అవకాశాలు తక్కువ! కేవలం ఎంబీబీఎస్‌తో బయట అవకాశాల్లేని మాట వాస్తవమే. పైగా పీజీ మెడికల్ సీట్లు కూడా ఎంబీబీఎస్‌తో సమానంగా ఉండవు. కాబట్టి ఉన్న ఎంబీబీఎస్‌తోనే ముందుకు సాగాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో తక్కువ వేతనాలు ఇవ్వడానికి ప్రధాన కారణం అందరూ హైదరాబాద్‌లోనే ఉండాలన్న భావనే. దీంతో డిమాండ్ తగ్గి తక్కువ వేతనం ఇస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తయినవారు గ్రామాలకు వెళ్లి ప్రాక్టీసు చేస్తే ప్రజల నుంచి ఆదరణ ఉంటుంది. కానీ చాలామంది తమ మైండ్‌సెట్‌ను మార్చుకోవడంలేదు. అందరూ నగరానికే పరిమితమైతే అవకాశాలు ఎలా వస్తాయి? – డాక్టర్ రమేష్‌రెడ్డి, వైద్య విద్యా సంచాలకులు -
జీతాల కోసం వెయ్యికోట్ల రూపాయల అప్పు
ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఆర్థిక సంక్షోభాన్నిఎదుర్కోంటోంది. దీర్ఘకాలంనుంచి ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నసంస్థ తాజాగా ఉద్యోగులకు జీతాలు చెల్లించడం, తదితర అవసరాల కోసం వెయ్యకోట్లు రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. 20వేలకు పైగా ఉన్న ఉద్యోగులకు మూడు నెలల జీతాల చెల్లించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గత రెండు మూడు దశాబ్దాల కాలంగా ధనవంతులుగా ఉన్న హెచ్ఏఎల్ సంస్థ మొదటిసారిగా నగుదు కోసం అప్పు (ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా) చేసామని హెచ్ఏఎల్ ఛైర్మన్ ఆర్ మాధవన్ వ్యాఖ్యాలని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. పుష్కలమైన ఆర్థిక నిల్వలతో ఉన్న సంస్థ తాజాగా లోటు బడ్జెట్లోకి జారుకుందని మాధవన్ పేర్కొన్నారు. మార్చినాటికి ఈ నగదు ప్రతికూలత భరించలేనంత స్థాయిలో రూ. 6వేల కోట్లకు చేరుకోనుందన్నారు. ప్రధానంగా హెచ్ఏఎల్కు అతిపెద్ద కస్టమర్‌గా ఉన్న భారత వైమానిక దళం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయిన కారణంగా ఆర్థిక ఒత్తిడికి దారితీసినట్టు ఛైర్మన్ తెలిపారు. 2017 సెప్టెంబర్ నాటికి రూ. 14,500కోట్లుగా బకాయిల్లో కేవల రూ. 2వేల కోట్లను మాత్రమే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చెల్లించింది. 2017-18 సంవత్సరానికి రక్షణ మంత్రిత్వశాఖ 13,500 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. 2017-18 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయితో కలిపి సవరించిన బడ్జెట్ 33, 715 కోట్ల రూపాయలుగా ఉంది. మరోవైపు డిసెంబరు 31 నాటికి 15,700 కోట్లు తాకిన బకాయిలు మార్చి 31 నాటికి 20,000 కోట్ల రూపాయలకు చేరవచ్చన్నారు. రూ.14,500 కోట్లు ఐఏఎఫ్ చెల్లించాల్సి ఉండగా, మిగిలిన బకాయిలు భారతీయ సైన్యం, నావికాదళం, కోస్ట్ గార్డ్స్ నుంచి రావాల్సి ఉంది. ఈ పరిణామం సంస్థపై ఆధారపడిన దాదాపు 2వేల మంది సూక్ష్మ, చిన్నమధ్య తరహా వ్యాపారస్తులను ప్రభావితం చేయనుందని మాధవన్ ఆందోళన వ్యక్తం చేశారు. నగదు కొరత అప్పులవైపు నెడుతోంది, లేదంటే బకాయిలు చెల్లించమని ఎంఎస్‌ఎఈలను బలవంతం చేయాలి. ఇది వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెప్పారు. కాగా మొత్తం ఉద్యోగుల సంఖ్య 29,035. వీరికి చెల్లించే నెలవారీ జీతాల మొత్తం రూ.358 కోట్లు.