ICC
-
టాప్ ర్యాంక్‌కు చేరువలో టీమిండియా ఓపెనర్..
ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాకింగ్స్లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) అగ్రస్ధానానికి అడుగు దూరంలో నిలిచింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మంధాన రెండో స్ధానానికి చేరుకుంది. ఓ స్ధానం మెరుగుపరుచుకుని రెండో స్ధానానికి మంధాన దూసుకొచ్చింది.ఐర్లాండ్‌తో సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కారణరంగా స్మృతి ర్యాంక్ మెరుగుపడింది. ఈ భారత వైస్ కెప్టెన్ ఖాతాలో ప్రస్తుతం 738 పాయింట్లు ఉన్నాయి. ఐర్లాండ్ సిరీస్‌లో మంధాన అదరగొట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో స్మృతి ఓ సెంచరీతో పాటు మొత్తంగా 249 పరుగులు చేసింది. కాగా ఐసీసీ మహిళల బ్యాటింగ్ ర్యాకింగ్స్లో భారత్ నుంచి మంధాన ఒక్కరే ఉండడం గమనార్హం.మరోవైపు ఈ ఐరీష్ సిరీస్‌లో సెంచరీతో కదం తొక్కిన జెమిమా రోడ్రిగ్స్ రెండు స్ధానాలు మెరుగు పరుచుకుని 17వ ర్యాంక్‌కు చేరుకుంది. అదేవిధంగా ఈ సిరీస్‌కు దూరమైన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 15వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. ఇక ఆల్‌రౌండర్ కోటాలో స్టార్ ప్లేయర్ దీప్తి శర్మ 344 పాయింట్లతో ఆరో స్ధానంలో నిలిచింది.టాప్‌లో సౌతాఫ్రికా బ్యాటర్..కాగా వన్డే బ్యాటర్ల ర్యాకింగ్స్లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్(773) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో మంధాన(738), మూడో స్ధానంలో శ్రీలంక బ్యాటర్ చమిర అతపట్టు(733) మూడో స్ధానంలో ఉన్నారు. మహిళల వన్డే బౌలింగ్ ర్యాకింగ్స్లో ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ సోఫియా ఎకిల్‌స్టోన్(770) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. గార్డెనర్(724), మెగాన్ స్కాట్(696) వరుసగా రెండు మూడు స్ధానాల్లో నిలిచారు.చదవండి: Neeraj Chopra: నీరజ్ చోప్రా ప్రేమ పెళ్లి.. ‘కట్నకానుకలు’ ఎంతో తెలుసా? -
యువ సమరం... నేడే ఆరంభం
రెండేళ్ల క్రితం నిర్వహించిన ఐసీసీ మహిళల అండర్–19 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన యువ భారత్... ట్రోఫీ నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది. మహిళల క్రికెట్‌కు మరింత తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి నేటి నుంచి తెరలేవనుండగా... రేపు జరగనున్న తొలి పోరులో వెస్టిండీస్‌తో యువ భారత్ తలపడనుంది. షఫాలీ వర్మ, రిచా ఘోష్ వంటి సీనియర్ స్థాయిలో ఆడిన ప్లేయర్లతో బరిలోకి దిగి తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన భారత్... ఈసారి కూడా ఆధిపత్యం కొనసాగించాలని చూస్తుంటే... తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకోవాలని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తహతహలాడుతున్నాయి. 2023 వరల్డ్‌కప్ జట్టులోనూ ఆడిన తెలుగు ప్లేయర్లు గొంగడి త్రిష, షబ్నమ్‌లపై ఈసారీ భారీ అంచనాలు ఉన్నాయి. మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఈరోజు జరిగే ఆరు మ్యాచ్‌ల్లో స్కాటాండ్తో ఆస్ట్రేలియా (ఉదయం గం. 8 నుంచి); ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ (ఉదయం గం. 8 నుంచి); సమోవాతో నైజీరియా (ఉదయం గం. 8 నుంచి); నేపాల్‌తో బంగ్లాదేశ్ (ఉదయం గం. 8 నుంచి); అమెరికాతో పాకిస్తాన్ (మధ్యాహ్నం గం. 12 నుంచి); దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ (మధ్యాహ్నం గం. 12 నుంచి) తలపడతాయి. కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ రెండో ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం 16 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌కు శనివారం తెరలేవనుంది. 2023లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి వరల్డ్‌కప్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన భారత జట్టు ట్రోఫీ కైవసం చేసుకోగా... ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న యంగ్ ఇండియా టైటిల్ నిలబెట్టుకుంటుందా చూడాలి. ఫార్మాట్ ఎలా ఉందంటే... మొత్తం 16 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. వెస్టిండీస్, శ్రీలంక, ఆతిథ్య మలేసియాతో కలిసి భారత జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుంది. ఒక్కో గ్రూప్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు (12) ‘సూపర్ సిక్స్’ దశకు చేరుకుంటాయి. ఈ 12 జట్లను ‘సూపర్ సిక్స్’లో రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. గ్రూప్–1లో ఆరు జట్లు... గ్రూప్–2లో మరో ఆరు జట్లు ఉంటాయి. ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లు ముగిశాక గ్రూప్–1, గ్రూప్–2లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సీనియర్ జట్టులోకి దారి... సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న ప్లేయర్లు ఈ టోర్నీలో రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు. గత ఎడిషన్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై గెలిచిన షఫాలీ వర్మ సారథ్యంలోని టీమిండియా... ఈసారి కూడా అదే ఆధిపత్యం కనబర్చాలని చూస్తోంది. 2023 అండర్–19 ప్రపంచకప్‌లో రాణించడం ద్వారా టిటాస్ సాధు, శ్వేత సెహ్రావత్... ఆ తర్వాతి కాలంలో భారత మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అదే బాటలో పయనించి మెరుగైన ప్రదర్శనతో ఈ ఏడాది భారత్‌లో జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని యంగ్ ప్లేయర్లు కసరత్తులు చేస్తున్నారు. త్రిష రెండోసారి... గత ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచిన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష వరుసగా రెండోసారి ఈ మెగా టోర్నీలో ఆడనుంది. గత నెల మహిళల అండర్–19 ఆసియాకప్‌లో భారత జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన త్రిష... ఈసారి కూడా మెరుగైన ప్రదర్శన చేసి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా సాగుతోంది. శనివారం స్కాట్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుండగా... ఆదివారం జరగనున్న తమ తొలి పోరులో వెస్టిండీస్‌తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. సమోవా, నైజీరియా, నేపాల్, మలేసియా జట్లు తొలిసారి ఐసీసీ టోర్నీలో ఆడనున్నాయి. ఈ టోర్నీలో ప్రధానంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల నుంచి యంగ్ ఇండియాకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఇటీవల ఆసియాకప్ నెగ్గి మంచి జోరుమీదున్న అమ్మాయిలు కలసి కట్టుగా కదంతొక్కితే టైటిల్ నిలబెట్టుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. భారత మహిళల అండర్–19 టి20 క్రికెట్ జట్టు: నికీ ప్రసాద్ (కెప్టెన్), సానిక చల్కె, త్రిష, కమలిని, భవిక అహిరె, ఐశ్వరి అవసారె, మిథిలా, జోషిత, సోనమ్, పరుణిక, కేసరి ధ్రుతి, ఆయుషి శుక్లా, అనందిత, షబ్నమ్, వైష్ణవి. -
ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు జరిమానా
రాజ్‌కోట్: భారత పర్యటనలో ఐర్లాండ్ మహిళల క్రికెట్ జట్టుపై జరిమానా పడింది. భారత మహిళల జట్టుతో బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో ఐర్లాండ్ జట్టు మందకొడిగా బౌలింగ్ చేసింది. దీంతో జట్టు ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. నిర్ణీత సమయంలో పూర్తి ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. రెండు ఓవర్లు ఆలస్యం కావడంతో మ్యాచ్ రిఫరీ జి.ఎస్.లక్షి... ఐర్లాండ్ కెప్టెన్ గాబీ లూయిస్ వివరణ అనంతరం జరిమానా ఖరారు చేసింది. ‘అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నియమావళిలోని 2.22 ఆర్టికల్ ప్రకారం, కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోతే ఓవర్‌కు 5 శాతం చొప్పున మొత్తం పదిశాతం మ్యాచ్ ఫీజులో కోత విధించాం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. మూడు వన్డేల సిరీస్‌ను స్మృతి మంధాన నేతృత్వంలోని భారత జట్టు 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆఖరి పోరులో అయితే అమ్మాయిలు ఆకాశమే హద్దుగా చెలరేగి ఏకంగా 435/5 భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మంధాన, ప్రతీకలిద్దరు శతకాలతో కదంతొక్కారు. ఐర్లాండ్‌ను భారత బౌలర్లు 31.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూల్చడంతో టీమిండియా 304 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. -
IND vs AUS: సిడ్నీ పిచ్‌పై ఐసీసీ రేటింగ్..
భారత్, ఆ్రస్టేలియా మధ్య ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’(Border Gavaskar Trophy)లో భాగంగా చివరి టెస్టు జరిగిన సిడ్నీ పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సానుకూల నివేదిక ఇచ్చింది. ఈ పిచ్‌ను ‘సంతృప్తికరం’ అనే రేటింగ్‌ను ఇచ్చింది. సీమ్ బౌలింగ్‌కు విపరీతంగా స్పందించడంతో పాటు అనూహ్య బౌన్స్‌తో కనిపించిన ఈ పిచ్‌పై పేస్ బౌలర్లు చెలరేగారు. గ్రౌండ్స్‌మన్ ఈ టెస్టు కోసం కొత్త తరహా పచ్చికను ఉపయోగించారు. ఫలితంగా సిడ్నీలో తక్కువ సమయంలో ముగిసిన టెస్టుల జాబితాలో (బంతుల పరంగా) ఈ మ్యాచ్ మూడో స్థానంలో నిలిచింది. మ్యాచ్‌లో రెండు అర్ధసెంచరీలు మాత్రమే నమోదయ్యాయి.ఐసీసీ ఇచ్చిన నివేదిక వల్ల మున్ముందు ఇలాంటి ‘సంతృప్తికర’ పిచ్‌లను రూపొందించేందుకు తాము సిద్ధమవుతామని ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు (సీఏ) స్పందించింది. మరో వైపు తొలి నాలుగు టెస్టులు జరిగిన పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్ మైదానాలు ‘చాలా బాగున్నాయి’ అనే రేటింగ్‌తో ఐసీసీ కితాబునిచ్చింది.సిడ్నీలో ఘోర ఓటమి.. కాగా ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. ఈ సిరీస్‌తో పాటు భారత్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు కూడా గల్లంతయ్యాయి.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ తర్వాతి మ్యాచ్‌ల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా ఈ సిరీస్‌లో భారత్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా సిరీస్‌ను కోల్పోయింది.ఆస్ట్రేలియా గడ్డపై అద్బుతమైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లి సైతం ఈసారి సత్తాచాటలేకపోయాడు. ఇక సిరీస్ ఓటమి అనంతరం భారత జట్టు గురువారం ఉదయం స్వదేశానికి చేరుకుంది. అనంతరం జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌లకు టీమిండియా సిద్దం కానుంది.చదవండి: ‘అమెరికన్ల ఆటగా మార్చడమే లక్ష్యం’ -
USA: ‘వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ స్థాయి పెరిగింది’
సాక్షి, హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలి కాలంలోనే క్రికెట్ కొత్తగా అభివృద్ధి చెందుతోంది. 2024 టి20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణతో స్థానికుల దృష్టి దీనిపై పడగా... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా భాగం కావడంతో మరింత ఎక్కువ మందికి ఆసక్తి పెరుగుతోంది. అయితే అమెరికన్లు పెద్దగా పట్టించుకోని సమయంలో ఆటను వారికి చేరువ చేయడంలో యూఎస్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్, తెలుగు వ్యక్తి వేణుకుమార్ రెడ్డి పిసికె పాత్ర ఎంతో ఉంది. నల్లగొండకు చెందిన వేణు గత ఆరేళ్లుగా యూఎస్‌లో క్రికెట్‌ను విస్తృతం చేయడంలో ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆటను అమెరికన్లు తమదిగా భావించి ఇతర క్రీడల్లాగే ప్రాధాన్యత ఇచ్చేలా చేయడమే తన లక్ష్యమని వేణు ‘సాక్షి’తో చెప్పారు. ఇటీవలే భారత్‌కు వచ్చిన ఆయన బీసీసీఐ ఉన్నతాధికారులను కలిసి అమెరికా క్రికెట్ అభివృద్ధి కోసం సహకారాన్ని కూడా కోరారు. ‘టి20 వరల్డ్ కప్‌ను విజయవంతంగా నిర్వహించగలిగాం. భారత్, పాకిస్తాన్లతో అమెరికా తలపడిన మ్యాచ్‌లకు స్థానిక అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. పాక్‌పై గెలుపుతో అమెరికన్లు కూడా ఫలితాలపై ఆసక్తి చూపించారు. ఇప్పుడు మా ముందు ఒలింపిక్స్ రూపంలో పెద్ద లక్ష్యం ఉంది. వచ్చే రెండేళ్లలో క్రికెట్ వారికి మరింత చేరువ చేయడమే మా లక్ష్యం’ అని వేణు రెడ్డి అన్నారు. 1998లో ఐటీ నిపుణుడిగా యూఎస్‌కు వెళ్లి ఆపై సగటు భారత క్రికెట్ అభిమాని తరహాలో అక్కడ క్రికెట్ టోర్నీలు, క్యాంప్‌లు నిర్వహిస్తూ వేణు ఆటకు ప్రాచుర్యం పెంచారు. ముఖ్యంగా స్కూల్, కాలేజీలలో టీమ్‌లను తయారు చేయడం ద్వారా ప్రతిభను గుర్తించే అవకాశం దక్కింది. ‘సహజంగానే భారత్ నుంచి వచ్చిన వారు, భారత మూలాల ఉన్నవారే క్రికెట్ వైపు వచ్చారు. అందరూ ఇతర ఉద్యోగాల్లో ఉంటూ క్రికెట్ ఆడేందుకు వచ్చేవారే. వేర్వేరు రాష్ట్రాల్లో కూడా ఆటకు ప్రాచుర్యం కల్పించేందుకు వాలంటీర్లు ముందుకు వచ్చారు. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు యూఎస్ జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులు ఇస్తున్నాం. ఇదంతా ఇన్నేళ్లలో అమెరికా క్రికెట్లో వచి్చన మార్పు గురించి చెబుతుంది’ అని వేణు వివరించారు.అయితే ఇప్పటికీ అసలైన అమెరికన్లు కాకుండా ఇతర దేశాల నుంచి వస్తున్న వారే యూఎస్ క్రికెట్ జట్లలో ఎక్కువగా ఉండటం వాస్తవమేనని ఆయన అంగీకరించారు. దీనిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అలా జరిగితే క్రికెట్ కూడా యూఎస్‌లో ఇతర క్రీడల్లా దూసుకుపోతుందని వేణు అభిప్రాయపడ్డారు. ‘టి20 వరల్డ్ కప్ సమయంలో పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రతిష్టాత్మక మీడియా కంపెనీలు క్రికెట్‌పై బాగా దృష్టి పెట్టాయి. అండర్–11 స్థాయి నుంచి అండర్–23 వరకు ఇప్పుడు వరుసగా టోర్నీలు నిర్వహిస్తున్నాం. ఈ దశలో పెద్ద సంఖ్యలో అమెరికన్లు భాగమవుతున్నారు. జాతీయ జట్టుకు ఎంపిక చేసే ముందుకు జరిగే సెలక్షన్స్‌లో వీరంతా పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో యూఎస్ టీమ్‌లో మనవారు మాత్రమే కాకుండా అమెరికన్లను కూడా చూడవచ్చు. అయితే భారతీయుల్లో మన తెలుగువారు కూడా యూఎస్ క్రికెటర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం సంతోషకరం. సీనియర్ మహిళల క్రికెట్లో పగడ్యాల చేతనా రెడ్డి ఇటీవల 136 పరుగులు చేసి అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచింది’ అని వేణు గుర్తు చేశారు. ఐసీసీ టోర్నీల్లో మినహా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అవకాశం అమెరికాకు ఎక్కువగా రావడం లేదని... భారత్‌లోని రంజీ టీమ్‌లతో మ్యాచ్‌లు ఏర్పాటు చేసి తమ ఆటను మెరుగుపర్చుకునే అవకాశం ఇవ్వాలని ఇటీవల ఐసీసీ చైర్మన్ జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలకు విజ్ఞప్తి చేసినట్లు వేణు వెల్లడించారు. ఆసియా కప్ తరహాలో ‘నార్త్ అమెరికన్ చాంపియన్‌షిప్’ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశామని, త్వరలోనే ఈ టోర్నీ జరుగుతుందని ఆయన చెప్పారు. 2018 నుంచి యూఎస్సీఏలో డైరెక్టర్‌గా అడుగు పెట్టిన వేణు 2023లో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తన పదవీ కాలంలో యూఎస్ జట్టు 2024 టి20 టోర్నీ (ఆతిథ్య జట్టు హోదాలో), 2026 టి20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిందని... 2027 వన్డే వరల్డ్ కప్‌కు క్వాలిఫై కావాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు వేణు రెడ్డి స్పష్టం చేశారు. -
'అదొక చెత్త నిర్ణయం'.. ఐసీసీపై విండీస్ గ్రేట్ ఫైర్
టెస్టు క్రికెట్‌కు ఆదరణను మరింత పెంచే దిశగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అడుగులు వేస్తోంది. సంప్రదాయ ఫార్మాట్‌ను రెండు శ్రేణుల్లో( 2- Tier Test cricket) నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.ఈ క్రమంలోనే అగ్ర శ్రేణి జట్లైనా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మరిన్ని ఎక్కువ సిరీస్‌లను నిర్హహించాలని ఐసీసీ యోచిస్తోంది. ఇదే విషయంపై ఐసీసీ ఛైర్మన్ జై షా, బీసీసీఐ ప్రతినిధులు, క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు, ఈసీబీ చీఫ్ ఈ నెలాఖరులో సమావేశం కానున్నారని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.విండీస్ గ్రేట్ ఫైర్..కాగా టెస్టుల్లో ఈ రెండంచెల విధానం ప్రతిపాదనపై వెస్టిండీస్ గ్రేట్ క్లైవ్ లాయిడ్ మండిపడ్డాడు. "ఐసీసీ నిజంగా టెస్టుల్లో 2 టైర్ విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తుంటే, అది కచ్చితంగా భయంకరమైన నిర్ణయమవుతోంది. టెస్టు క్రికెట్ హోదా పొందేందుకు కష్టపడుతున్న చిన్న జట్ల పట్ల శాపంగా మారనుంది. ఇకపై లోయర్ డివిజన్లో మిగతా జట్లు వాళ్లతో వాళ్లే ఆడుకుంటారు. దీంతో టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెరగడం కాదు మరింత తగ్గుతోంది. చిన్న జట్లను అగ్ర జట్లతో ఎక్కువగా ఆడేలా చేయడంపై ఐసీసీ దృష్టి సారించాలి. అంతే తప్ప ఎటువంటి చెత్త నిర్ణయాలు తీసుకోకూడదు అని 80 ఏళ్ల క్లైవ్ లాయిడ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.వెస్టిండీస్ జట్టును రద్దు చేసి విడివిడిగా ఆడాలన్న ఐసీసీ మాజీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే సూచనపై కూడా లాయిడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. " వరల్డ్ క్రికెట్లో వెస్టిండీస్ జట్టుకు గొప్ప చరిత్ర ఉంది. అలాంటి జట్టును విడదీయాలని మాట్లాడుతున్నారు. అది సరైన పద్దతి కాదు. వెస్టిండీస్‌తో సహా ఇన్ని జట్లకు సమంగా డబ్బులిస్తే సౌకర్యాలను మెరుగుపరుచుకుంటారు. వారు తమ క్రికెట్‌ను మరింత మెరుగుపరచుకునేందుదు మెరుగైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటారు అని లాయిడ్ వ్యాఖ్యనించారు.చదవండి: 'రాహుల్ కోసం అతడిని పక్కన పెట్టేశారు.. ఒక్క ఛాన్స్ ఇవ్వాల్సింది' -
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం.. పాకిస్తాన్‌కు మరో షాక్
తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయిన్టైన్ చేసినందుకు గానూ పాకిస్తాన్ మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత విధించబడింది. అలాగే ఐదు డబ్ల్యూటీసీ పాయింట్లు డాక్ చేయబడ్డాయి. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ కథనం మేరకు.. నిర్దేశిత సమయం ముగిసే లోగా పాక్ ఐదు ఓవర్లు వెనుకపడింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం.. నిర్దేశిత సమయంలోగా ఓవర్ వెనుకపడితే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో ఐదు శాతం కోత విధిస్తారు. అలాగే ఓ డబ్ల్యూటీసీ పాయింట్ డాక్ చేయబడుతుంది. ఐసీసీ విధించిన జరిమానాను పాక్ సారధి షాన్ మసూద్ స్వీకరించాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాక్ చివరి నుంచి రెండో స్థానంలో (ఎనిమిది) ఉంది.కాగా, సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను పాక్ 0-2 తేడాతో కోల్పోయింది. తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో పాక్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 615 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ డబుల్ సెంచరీతో (259) అదరగొట్టగా.. టెంబా బవుమా (106), వికెట్ కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (62), కేశవ్ మహారాజ్ (40) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్, సల్మాన్ అఘా తలో మూడు వికెట్లు తీయగా.. మీర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 194 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేసి పాక్ ఇన్నింగ్స్ నేలకూల్చారు. రబాడ 3, మఫాకా, మహారాజ్ తలో 2, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్ చెరో వికెట్ పడగొట్టారు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మొహమ్మద్ రిజ్వాన్ (46) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కారణంగా పాక్ ఫాలో ఆడింది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాక్ అద్భుతంగా పోరాడింది. ఫాలో ఆడుతూ రికార్డు స్కోర్ (478) చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (145) సూపర్ సెంచరీతో మెరవడంతో పాక్ ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోగలిగింది. కానీ ఓటమి మాత్రం తప్పలేదు. బాబర్ ఆజమ్ (81) వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ద సెంచరీతో ఆకట్టుకోగా.. మొహమ్మద్ రిజ్వాన్ (41), సల్మాన్ అఘా (48) ఓ మోస్తరు స్కోర్లు చేసి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటేలా చేశారు.పాక్ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా ఛేదించి జయకేతనం ఎగురవేసింది. బెడింగ్హమ్ (47), మార్క్రమ్ (14) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌తో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో మ్యాచ్‌లన్నీ పూర్తి చేసుకుంది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. -
టీ20 క్రికెటర్ ఆఫ్ దియర్-2024 నామినీస్ వీరే.. బుమ్రాకు నో ఛాన్స్
ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్-2024కు సంబంధించిన నామినీస్ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆదివారం(డిసెంబర్ 29) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కోసం మొత్తం నలుగురు ఆటగాళ్లను ఐసీసీ నామినేట్ చేసింది.ఈ జాబితాలో భారత్ నుంచి యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది కేవలం 18 టీ20లు మాత్రమే ఆడిన అర్ష్‌దీప్ 7.49 ఏకనామీతో 36 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్-2024లోనూ అర్షదీప్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. మొత్తం 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి ఈ మెగా ఈవెంట్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇక ఈ అవార్డు కోసం అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం, జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా, ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్ పోటీ పడుతున్నారు.ఈ ఏడాది టీ20ల్లో బాబర్ పర్వాలేదన్పించాడు. 23 ఇన్నింగ్స్‌లో 738 పరుగులతో పాక్ తరపున లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా సికిందర్ రజా ఈ ఏడాది టీ20 క్రికెట్లో ఆల్‌రౌండ్ షోతో అదరగట్టాడు. మొత్తం 23 ఇన్నింగ్స్‌లలో 573 పరుగులతో పాటు 24 కూడా వికెట్లు పడగొట్టాడు. ఇక ట్రావిస్ హెడ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది 15 ఇన్నింగ్స్‌లో 539 పరుగులు చేశాడు.బుమ్రాకు నో ఛాన్స్.. కాగా ఈ నామినీస్ జాబితాలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో బుమ్రా ఎనిమిది మ్యాచ్‌లలో 4.17 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా బుమ్రా నిలిచాడు. అయినప్పటికి బుమ్రాను టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ చేయకపోవడం గమనార్హం. -
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదే..! భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఖారారు చేసిటనట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 'రెవ్‌స్పోర్ట్జ్' అనే స్పోర్ట్స్ వెబ్ సైట్ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.రెవ్‌స్పోర్ట్జ్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో కరాచీ వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. అయితే టీమిండియా తమ మొదటి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ తటస్ధ వేదికపై జరుగుతాయి అని సదరు వెబ్సైట్ పేర్కొంది.దాయాదుల పోరు ఎప్పుడంటే?రెవ్‌స్పోర్ట్జ్ ప్రకారం.. ఈ మెగా టోర్నీలో ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్ధిలు పాకిస్తాన్-భారత్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. కాగా లీగ్ దశలో భారత్ మొత్తం మూడు మ్యాచ్‌లను ఆడనుంది. న్యూజిలాండ్‌తో చివరి లీగ్ మ్యాచ్‌ను మార్చి 2న ఆడనుంది.మార్చి 4న సెమీఫైనల్-1, మార్చి 5న సెమీఫైనల్-2 జరగనుండగా.. మార్చి 9న ఫైనల్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. టీమిండియా తమ మ్యాచ్‌లను శ్రీలంక లేదా దుబాయ్ వేదికలగా ఆడే అవకాశముంది.కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనేందుకు పాకిస్తాన్‌కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించడంతో ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. భారత మ్యాచ్‌లు మినహా మిగితా అన్నీ పాక్‌లోనే జరగనున్నాయి. టీమిండియా ఒకవేళ నాకౌట్స్‌కు చేరితే ఆ మ్యాచ్‌లు కూడా తటస్థవేదిక గానే జరగనున్నాయి.చదవండి: VHT 2024: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ విధ్వంసకర సెంచరీ.. 18 ఫోర్లు, 7 సిక్స్‌లతో -
హైబ్రిడ్ పద్ధతే ఖరారు
దుబాయ్: భారత్‌ను ఎలాగైనా ఈసారి తమ దేశంలో ఆడించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పంతం నెరవేరలేదు. హైబ్రిడ్ పద్ధతి కుదరదని మొండికేసిన పీసీబీకి అనుకున్నట్లే చుక్కెదురైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరినట్లే టీమిండియా ఆడాల్సిన మ్యాచ్‌ల్ని తటస్థ వేదికపై నిర్వహిస్తామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం అధికారికంగా వెల్లడించింది. వేదిక ఫలానా అని స్పష్టంగా చెప్పకపోయినా యూఏఈలోని దుబాయ్‌నే ఖరారు చేయనున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. పైగా ముందు నుంచీ కూడా దుబాయ్‌లో అయితేనే చాంపియన్స్ ట్రోఫీ ఆడతామని లేదంటే లేదని బీసీసీఐ ఇది వరకే పలుమార్లు స్పష్టం చేసింది. దీంతో దుబాయ్ దాదాపు ఖాయం కానుంది! టీమిండియా లీగ్ మ్యాచ్‌లు సహా నాకౌట్ చేరినా కూడా అక్కడే ఇతర దేశాలు వచ్చి ఆడి వెళతాయి. ‘2024–2027 సైకిల్లో జరిగే ఐసీసీ టోర్నీల్లో భారత్, పాక్‌లు ఆడే అన్నీ మ్యాచ్‌లు తటస్థ వేదికల్లో నిర్వహించుకునేందుకు ఐసీసీ బోర్డు ఆమోదించింది’ అని ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం మీద ఇన్నాళ్లు భారత్‌లో ఆడేందుకు వచ్చిన పాక్ ఇకపై అలా రాదు. ఈ విషయంలో పాక్‌కు తమ మాట నెగ్గించుకున్న తృప్తి మిగిలింది. ఇక్కడితోనే అయిపోలేదు! భారత బోర్డు అనుకున్నది అయితే సాధించింది. కానీ ఇక మీదట భారత్‌లో పాక్ కూడా ఆడదు. గతేడాది భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో పాల్గొన్న పాకిస్తాన్ జట్టు ఇకపై తమ మ్యాచ్‌ల్ని హైబ్రిడ్ పద్ధతిలోనే ఆడేందుకు ఐసీసీ వద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2027–2028 సీజన్ వరకు భారత్‌లో జరిగే పురుషుల, మహిళల ఐసీసీ మెగా ఈవెంట్లలో పోటీ పడేందుకు పాక్ జట్లు రావు. పీసీబీ కోరిన తటస్థ వేదికలు... యూఏఈ లేదంటే శ్రీలంక దేశాల్లో పాకిస్తాన్ మ్యాచ్‌లు జరుగుతాయి. వచ్చే ఏడాది భారత్‌లో మహిళల వన్డే ప్రపంచకప్, 2026లో భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహించే పురుషుల టి20 ప్రపంచకప్ టోర్నీలకు సంబంధించిన మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగుతాయి. విశ్వసనీయ వర్గాల ప్రకారం పాక్‌లో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు యూఏఈ (దుబాయ్)లో... భారత్‌లో పాక్ ఆడాల్సిన మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. -
BCCI: బీసీసీఐకి కళ్లు చెదిరే ఆదాయం
ప్రపంచంలోని అత్యంత సంపన్న బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పేరుగాంచింది. ఇతర క్రికెట్ బోర్డులకు అందనంత ఎత్తులో ఉన్న బీసీసీఐకి 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగానే ఆదాయం చేకూరింది. ఏడాది కాలంలో రెవెన్యూలో రూ. 4200 కోట్ల మేర పెరుగుదల కనిపించింది.వార్తా సంస్థ పీటీఐ అందించిన వివరాల ప్రకారం.. ‘‘2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,493 కోట్లుగా ఉన్న బీసీసీఐ నగదు, బ్యాంక్ బ్యాలెన్స్.. 2024 ముగింపు నాటికి రూ. 20,686 కోట్లకు చేరింది. సుమారుగా రూ. 4200 వేల కోట్ల మేర ఆదాయం పెరిగింది’’ అని బీసీసీఐ తన డాక్యుమెంట్లో పేర్కొంది.ప్రధాన ఆదాయ వనరులివేకాగా క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కొనసాగుతోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ద్వారానే బీసీసీఐకి అధికమొత్తంలో ఆదాయం చేకూరుతోంది. ఐపీఎల్ మీడియా హక్కుల రూపంలో భారీ మొత్తం ఆర్జిస్తున్న బీసీసీఐ.. ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌ల ద్వారానూ దండిగానే సంపాదిస్తోంది.ఐసీసీ నుంచి సింహభాగంజూన్ 2022లో ఐదేళ్ల కాల వ్యవధికి గానూ ఐపీఎల్ మీడియా హక్కులను భారత బోర్డు రికార్డు స్థాయిలో రూ. 48,390 కోట్లకు అమ్ముకుంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మార్కెట్ కలిగి ఉన్న బీసీసీఐకి.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ద్వారా వచ్చే ఆదాయం కూడా ఎక్కువే. మిగతా బోర్డులతో పోలిస్తే బీసీసీఐకే సింహభాగం లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే రిచెస్ట్ బోర్డుగా బీసీసీఐ అవతరించింది.బీసీసీఐ దరిదాపుల్లో కూడా లేని బోర్డులునిజానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ. 7476 కోట్ల మేర ఆదాయం ఆర్జించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, అనూహ్య రీతిలో రూ. రూ. 8995 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ బీసీసీఐ రూ. 10,054 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా బీసీసీఐ పరిధిలో 38 స్టేట్ క్రికెట్ బోర్డు విభాగాలు ఉన్నాయి.ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 2024 నాటికి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల విలువ కలిపి రూ. 1608 కోట్లు. బీసీసీఐ(రూ. 20,686 కోట్లు) తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా(రూ. 658 కోట్లు), ఇంగ్లండ్(రూ. 492 కోట్లు), పాకిస్తాన్(రూ. 458 కోట్లు), బంగ్లాదేశ్(రూ. 425 కోట్లు), సౌతాఫ్రికా(రూ. 392 కోట్లు) టాప్-5లో ఉన్నాయి. చదవండి: ‘త్వరలోనే భారత్‌కు కోహ్లి గుడ్‌బై... లండన్‌లో స్థిరనివాసం’ -
షాకింగ్.. టీ20 ఫార్మాట్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ!?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభమవ్వాలి. కానీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మాత్రం ఇప్పటివరకు ఇంకా అధికారికంగా షెడ్యూల్ రిలీజ్ చేయలేదు.అందుకు కారణం బీసీసీఐ-పీసీబీ మధ్య నెలకొన్న విభేదాలే. భద్రతా కారణాల దృష్ట్యా భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు పంపేంచేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఇప్పటికే ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు ఐసీసీకి స్పష్టం చేసింది. భారత్ ఆడే మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ కోరుతుంది.అందుకు అన్ని క్రికెట్ బోర్డులు అంగీకరించినా, పీసీబీ మాత్రం ససేమీరా అంటుంది. అయితే హైబ్రిడ్ మోడల్లో నిర్వహణకు పీసీబీని ఒప్పించేందుకు ఐసీసీ అన్ని విధాల ప్రయత్నిస్తోంది. ఒకవేళ అందుకు ఒప్పుకోపోతే టోర్నీని పాక్ నుంచి వేరే చోటకు తరలిస్తామని పీసీబీకి ఐసీసీ షరతు విధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పీసీబీ ఓ మెట్టు దిగి వచ్చి హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించేందుకు సిద్దమైనట్లు సమాచారం.మరో కొత్త ట్విస్ట్..తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ వివాదంలో మరో కొత్త ఆంశం తెరపైకి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీని వన్డే ఫార్మాట్‌కు బదులగా టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని ఐసీసీ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం..ఐసీసీ షెడ్యూల్‌ను ఇంకా ఖారారు చేయకపోవడంతో మార్కెటింగ్ చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతాయని పెట్టబడుదారులు అవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.మరి కొన్ని రోజులు ఇదే తంతు కొనసాగితే ఛాంపియన్స్ ట్రోఫీని టీ20 ఫార్మాట్లలో నిర్వహించాలని సదరు స్టేక్‌హోల్డర్స్ సూచించినట్లు తెలుస్తోంది. అందుకు ఐసీసీ కూడా సముఖంగా ఉన్నట్లు క్రిక్‌బజ్‌తో పాటు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వన్డే ఫార్మాట్ కంటే టీ20లను ఈజీగా నిర్వహించవచ్చని ఐసీసీ భావిస్తున్నట్లు వినికిడి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌పై గురువారం(డిసెంబర్ 12)ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.చదవండి: IND vs AUS: 'ధోని లాంటి కెప్టెన్‌ను నేను ఎప్పుడూ చూడలేదు.. అతడొక లెజెండ్' -
విండీస్ పేసర్‌కు షాకిచ్చిన ఐసీసీ
వెస్టిండీస్ పేసర్ అల్జరీ జోసఫ్‌కు ఐసీసీ షాకిచ్చింది. డిసెంబర్ 8న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌కు ముందు ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1ని ఉల్లంఘించినందుకు గానూ జోసఫ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. అదనంగా జోసఫ్ యొక్క క్రమశిక్షణా రికార్డుకు ఒక డీమెరిట్ పాయింట్ జోడించబడింది. ఐసీసీ నివేదిక ప్రకారం.. మ్యాచ్ ప్రారంభానికి ముందు జోసఫ్ స్పైక్‌లతో పిచ్‌పై అడుగు పెట్టకుండా ఉండమని ఫోర్త్ అంపైర్ సూచించాడు. అయితే ఇది పట్టించుకోని జోసఫ్ స్పైక్‌లతో పిచ్‌పై అడుగుపెట్టడంతో పాటు అంపైర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ చర్య ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3ని ఉల్లంఘణ కిందకు వస్తుంది. జోసఫ్ తన నేరాన్ని అంగీకరించినట్లు మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో తెలిపాడు. జోసఫ్ గత 24 నెలల వ్యవధిలో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం ఇది రెండో సారి.ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 47.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (113) మెరుపు శతకం బాది విండీస్‌ను గెలిపించాడు. ఈ సిరీస్‌లో రెండో వన్డే ఇవాళ (డిసెంబర్ 10) జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 5 ఓవర్లు పూర్తయ్యే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోయి 34 పరుగులు చేసింది. తంజిద్ హసన్(30), లిటన్ దాస్ (1) క్రీజ్‌లో ఉన్నారు. -
ట్రావిస్ హెడ్, సిరాజ్‌లకు ఐసీసీ షాక్!?
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఆతిథ్య ఆస్ట్రేలియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం కన్న స్టార్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్‌ల మధ్య జరిగిన వాగ్వాదమే ఎక్కువగా హైలెట్ అయింది.రెండో రోజు ఆట సందర్భంగా ఈ స్టార్ ఆటగాళ్ల మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది. సెంచరీతో చెలరేగిన హెడ్(140)ను సిరాజ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. మంచి ఊపుమీద ఉన్న సిరాజ్ ట్రావిస్ హెడ్‌ను పెవీలియన్‌కు వెళ్లాల్సిందిగా సైగ చేశాడు. హెడ్ కూడా బౌల్డ్ అయ్యాక సిరాజ్‌ను ఏదో అనడం కెమెరాలో రికార్డు అయింది. ఇదే విషయంపై రెండో రోజు ఆట అనంతరం వారిద్దరూ స్పందించారు.బాగా బౌలింగ్ చేశావని సిరాజ్‌ను మెచ్చుకున్నాని, అతడు తప్పుగా ఆర్ధం చేసుకున్నాడని హెడ్ తెలిపాడు. సిరాజ్ మాత్రం హెడ్ అబద్దం చెబుతున్నాడని పేర్కొన్నాడు. ఏదమైనప్పటికి వీరిద్దరూ వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.ఐసీసీ సీరియస్..!ఈ క్రమంలో వీరిద్దరిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చర్యలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ది డైలీ టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. సిరాజ్, హెడ్ ఇద్దరూ ఐసీసీ క్రమశిక్షణా విచారణను ఎదుర్కోనున్నట్లు సమాచారం.అయితే ఐసీసీ ప్రవర్తనా నియమావళిని వీరిద్దరూ పూర్తి స్ధాయిలో ఉల్లఘించకపోవడంతో సస్పెన్షన్ నుంచి తప్పించుకోనున్నారు. ఇది నిజంగా ఇరు జట్లు బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి. అయితే ఐసీసీ వీరిద్దరిని కేవలం మందలింపుతో విడిచిపెట్టే అవకాశముంది.చదవండి: జట్టులో బుమ్రా ఒక్కడే లేడు కదా.. అందరూ ఆ బాధ్యత తీసుకోవాలి: రోహిత్ -
ఆటను సమున్నత శిఖరాలకు తీసుకెళ్తా: జై షా
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన చైర్మన్‌గా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జై షా క్రికెట్‌ను సమున్నత శిఖరాలకు తీసుకెళ్తానని అన్నారు. గురువారం చైర్మన్‌గా తొలిసారి ఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆయన మాట్లాడుతూ కొత్త బాధ్యతలు ఉత్తేజంగా పని చేసేందుకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.‘నేను దేన్నయితే ఆసక్తిగా చూసేవాడినో (క్రికెట్)... అదే ఇప్పుడు నన్ను ప్రోత్సహిస్తుంది. మంచి గుర్తింపును ఇస్తుంది. అయితే నాకిది ఆరంభం మాత్రమే! క్రికెట్ క్రీడకు మరింత సొబగులద్దాలి. ఆట కొత్త శిఖరాలు అధిరోహించేందుకు ఐసీసీ ఉన్నతాధికారులతో కలిసి ఇప్పటి నుంచే కష్టపడతాను. మేమంతా స్పష్టమైన విజన్‌తో ముందుకెళ్తాం’ అని అన్నారు. కార్యాలయ సందర్శన వల్ల సహచరులతో కలిసి పనిచేసేందుకు చక్కని సమన్వయం కుదురుతుందని, ఆరోగ్యకర వాతావరణం నెలకొంటుందన్నారు. రోడ్‌మ్యాప్‌కు అవసరమైన వ్యూహాలు ఇక్కడే మొదలవుతాయన్నారు. అంకితభావంతో పనిచేసే ఐసీసీ బృందంతో ఇలా పనిచేయడం మంచి అనుభూతి ఇస్తుందని పేర్కొన్నారు. జై షాకు సాదర స్వాగతం పలికిన డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా ఐసీసీ కొత్త చైర్మన్ పదవీ కాలంలో మరెన్నో మైలురాళ్లు సాధించాలని ఆకాంక్షించారు.చదవండి: SA vs SL 2nd Test: రికెల్టన్ సెంచరీ.. తొలి రోజు సఫారీలదే -
ICC: ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో జస్ప్రీత్ బుమ్రా
నవంబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినీస్ జాబితాను ఐసీసీ గురువారం (డిసెంబర్ 5) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ జాబితాలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ స్పీడ్ స్టార్ హ్యారీస్ రవూఫ్, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ ఉన్నారు. వీరి ముగ్గురూ నవంబర్ మంత్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు.జస్ప్రీత్ బుమ్రా..గత నెలలో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బుమ్రా అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి మొత్తం 8 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు కివీస్‌తో సిరీస్ కోల్పోయినప్పటికి బుమ్రా తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు బుమ్రా నామినేట్ అయ్యాడు.హ్యారీస్ రవూఫ్..ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాక్ స్పీడ్ స్టార్ హ్యారీస్ రవూఫ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి సిరీస్‌ను పాక్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత కంగారులతో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా అతడు 5 వికెట్లు పడగొట్టాడు.మార్కో జాన్సెన్..భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సఫారీ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ తన ఆల్‌రౌండ్ స్కిల్స్‌ను చూపించాడు. బ్యాట్‌తోనూ బంతితోనూ అదరగొట్టాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఏకంగా 11 వికెట్లు పడగొట్టి ప్రోటీస్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు.చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
బీసీసీఐ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ.. హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ
బీసీసీఐ డిమాండ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు తలొగ్గింది. ఛాంపియన్స్ ట్రోఫీ- 2025ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. దీంతో ఈ మెగా టోర్నీలో భారత క్రికెట్ జట్టు తమ మ్యాచ్‌లను తటస్థ వేదికలో ఆడనుంది.టీమిండియా ఆడే మ్యాచ్‌లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే విషయంపై పీసీబీ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో చర్చించినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ రిపోర్ట్స్ ప్రకారం.. గురువారం(డిసెంబర్ 5) సాయంత్రం బోర్డు మీటింగ్ అనంతరం ఐసీసీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది.ఐసీసీ కొత్త చైర్మెన్‌గా ఎన్నికైన జైషా అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లోఎ మొత్తం 15 దేశాల క్రికెట్ బోర్డుల ప్రతినిధులు పాల్గోనున్నారు. కాగా ఇటీవల జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో పీసీబీ హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించినప్పటికి బీసీసీఐకి కొన్ని షరతులు విధించింది.రాబోయే కాలంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ ఈవెంట్లను కూడా ఇదే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని పీసీబీ కోరింది. కానీ బీసీసీఐ మాత్రం అందుకు సున్నితంగా తిరష్కరించింది.అదేవిధంగా హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోకపోతే టోర్నీని వేరే చోటకు తరలిస్తామని పీసీబీకి ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీసీబీ హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
విండీస్ ఆటగాళ్లకు జరిమానా
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ 101 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను వెస్టిండీస్ ఆటగాళ్లు జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్లకు జరిమానా పడింది. సీల్స్ వికెట్ తీసిన ఆనందంలో బంగ్లా ఆటగాళ్ల పట్ల దూకుడుగా వ్యవహరించినందుకు గాను అతని మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత విధించారు. అలాగే అతనికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా లభించింది.ఆల్‌రౌండర్ కెవిన్ సింక్లెయిర్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో లేకపోయినా, ప్రత్యామ్నాయ ఫీల్డర్‌గా వచ్చి స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పడింది. సింక్లెయిర్, సీల్స్ అంపైర్లు ఎన్ని సార్లు హెచ్చరించినా పట్టించుకోకుండా బంగ్లాదేశ్ ఆటగాళ్ల పట్ల దూకుడుగా వ్యవహరించారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సీల్స్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 15.5 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ తొలి టెస్ట్‌లో నెగ్గగా.. బంగ్లాదేశ్ రెండో టెస్ట్‌లో విజయం సాధించింది. ఫలితంగా 1-1తో సిరీస్ సమంగా ముగిసింది. -
WTC Final: న్యూజిలాండ్ అవకాశాలపై నీళ్లు చల్లిన ఐసీసీ
ఇంగ్లండ్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ ఇరు జట్ల మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం కోత విధించింది. అలాగే ఇరు జట్లకు మూడు డబ్ల్యూటీసీ పాయింట్లు పెనాల్టీ పడ్డాయి.ఐసీసీ తీసుకున్న ఈ చర్య వల్ల ఇంగ్లండ్‌కు పెద్దగా నష్టమేమీ లేనప్పటికీ.. న్యూజిలాండ్‌కు మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు దెబ్బతిన్నాయి. తాజా పెనాల్టీ అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ ఐదో స్థానానికి పడిపోయింది. దీనికి ముందు ఆ జట్టు శ్రీలంకతో పాటు సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉండింది.న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌తో తదుపరి జరుగబోయే రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరలేదు. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పర్సెంటేజీ 47.92గా ఉంది. ఇంగ్లండ్‌తో తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా న్యూజిలాండ్ పాయింట్ల పర్సెంటేజీ 55.36 శాతం వరకు మాత్రమే చేరుకుంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరేందుకు ఇది సరిపోదు. కాబట్టి ఐసీసీ తాజాగా విధించిన పాయింట్ల కోత న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను దెబ్బతీసిందనే చెప్పాలి. మరోవైపు న్యూజిలాండ్‌తో పాటు పాయింట్ల కోత విధించబడ్డ ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి ఇదివరకే అనధికారికంగా నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ జట్టు 40.75 శాతం పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది.ఇదిలా ఉంటే, క్రైస్ట్‌చర్చ్ వేదికగా తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ (171), బ్రైడన్ కార్స్ (10 వికెట్లు) సత్తా చాటి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి మొదలవుతుంది. -
పాకిస్తాన్ తలవంచినట్లే!
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ–2025 నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకు గట్టిగా పట్టుదల కనబర్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తప్పనిసరి పరిస్థితుల్లో మెత్తపడింది. ‘హైబ్రిడ్’ మోడల్‌కు అంగీకరించేది లేదని, మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లోనే నిర్వహిస్తామని చెబుతూ వచి్చన పీసీబీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ ఆ ఆశలు వదిలేసుకున్నారు. శనివారం ఐసీసీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘మేం ఏం చేసినా క్రికెట్ మేలు కోసమే’ అంటూ ఐసీసీ షరతులకు తలవంచారు. ఐసీసీ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా... నఖ్వీ మాటలను బట్టి చేస్తూ ‘హైబ్రిడ్’ మోడల్ ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఇరు దేశాల ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. కాబట్టి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఐసీసీ త్వరలోనే సమగ్ర ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా సమస్యల కారణంగా పాకిస్తాన్‌కు తాము వెళ్లమని బీసీసీఐ గతంలోనే ప్రకటించింది. దాంతో ఐసీసీ ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చింది.. ‘హైబ్రిడ్’ మోడల్ ప్రకారం భారత్ ఆడే మ్యాచ్‌లు మినహా ఇతర మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లోనే జరుగుతాయి. భారత్ మాత్రం మరో వేదికలో ఆడుతుంది. ప్రస్తుతానికి అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అయ్యే అవకాశం ఉంది. అయితే చివరి ప్రయత్నంగా పీసీబీ కొన్ని డిమాండ్లు చేసినట్లు సమాచారం. ఐసీసీ టోరీ్నల విషయంలో తాము ‘సమానత్వం’ కోరుకుంటున్నట్లు నఖ్వీ వెల్లడించారు. దీని ప్రకారం మున్ముందు భారత్‌లో జరిగే ఐసీసీ టోరీ్నలకు కూడా ‘హైబ్రిడ్’ మోడల్ అమలు చేయాలని పీసీబీ కోరింది. అంటే తాము కూడా ఇకపై భారత్‌కు వెళ్లి మ్యాచ్‌లు ఆడమని...తమ కోసం ప్రత్యామ్నాయ వేదికను చూడాలని పీసీబీ డిమాండ్ చేసింది. 2026లో టి20 వరల్డ్ కప్, 2029లో చాంపియన్స్ ట్రోఫీ, 2031లో వన్డే వరల్డ్ కప్‌లతో పాటు ఆసియా కప్‌కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. మరో వైపు ఐసీసీ నుంచే తమకు లభించే ఆదాయాన్ని కూడా కొంత శాతం పెంచాలని, ‘హైబ్రిడ్’కు అంగీకరించినందుకు కొంత అదనపు మొత్తాన్ని ఇవ్వాలని కూడా పీసీబీ కోరినట్లు సమాచారం. చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి – మార్చిలో జరగనుంది. పాక్‌లో వేదికలుగా లాహోర్, కరాచీ, రావల్పిండలను నిర్ణయించారు. -
ఎట్టకేలకు దిగివచ్చిన పాకిస్తాన్.. ‘హైబ్రిడ్ మోడల్’కు ఓకే!.. కానీ..
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దిగివచ్చినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025 విషయంలో ఎట్టకేలకు హైబ్రిడ్ విధానానికి అంగీకరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, ఐసీసీ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకొన్నప్పటికీ కొన్ని షరతులు విధించినట్లుగా సమాచారం.కాగా వన్డే ఫార్మాట్లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సొంతగడ్డపై మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగాలని పాక్ భావించింది. టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌లతో కలిసి టోర్నమెంట్ బరిలో దిగాలని ఉవ్విళ్లూరింది.పీసీబీకి ఐసీసీ అల్టిమేటంఅయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తే లేదని బీసీసీఐతో పాటు భారత విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకువెళ్లిన బీసీసీఐ.. హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయాలని కోరింది. ఈ క్రమంలో ఐసీసీ ఈ విషయం గురించి పీసీబీకి చెప్పగా.. ఇందుకు పాక్ బోర్డు ససేమిరా అంది.మరోవైపు.. భారత్ కూడా ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టలేమని ఐసీసీకి గట్టిగానే చెప్పింది. ఈ క్రమంలో శుక్రవారం ఐసీసీ పెద్దలు పాక్‌తో ఇతర దేశాల బోర్డులతో వర్చువల్‌గా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, పాకిస్తాన్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు మొండివైఖరి ప్రదర్శించగా.. ఐసీసీ కఠినంగా వ్యవహరించకతప్పలేదు.టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేందుకు వీలుగా హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించకుంటే.. టోర్నీ మొత్తాన్ని పాక్‌ను తరలిస్తామని హెచ్చరిక జారీ చేసింది. దీంతో దిగివచ్చిన పాక్ బోర్డు.. ఐసీసీ ప్రపోజల్‌కు సరేనందని.. అయితే, మూడు షరతులు కూడా విధించిందని ఇండియా టుడే కథనం పేర్కొంది.ఆ మూడు కండిషన్లు ఏమిటంటే?..👉టీమిండియా గ్రూప్ దశలో, సెమీ ఫైనల్స్, ఫైనల్లో(ఒకవేళ అర్హత సాధిస్తే) ఆడేమ్యాచ్లను దుబాయ్‌లోనే నిర్వహించాలి.👉ఒకవేళ టీమిండియా గనుక గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తే.. అప్పుడు సెమీస్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌లను లాహోర్‌లో నిర్వహించేందుకు పాకిస్తాన్‌కు అనుమతినివ్వాలి.👉ఇక భవిష్యత్తులో భారత్ నిర్వహించే ఐసీసీ ఈవెంట్లు ఆడేందుకు పాకిస్తాన్ అక్కడికి వెళ్లకుండా.. తటస్థ వేదికలపై మ్యాచ్‌లు నిర్వహించాలి. చదవండి: IND Vs AUS PM XI Test: టీమిండియా ‘పింక్ బాల్’ టెస్టు సన్నాహకాలపై నీళ్లు! -
‘హైబ్రిడ్’ మోడల్‌కు అంగీకరించాల్సిందే!
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ‘హైబ్రిడ్ మోడల్’కు అంగీకరించబోమని మంకు పట్టు ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హెచ్చరిక జారీ చేసింది. వెంటనే ఈ ప్రతిపాదనకు అంగీకరించాలని... లేదంటే టోర్నీని పూర్తిగా పాకిస్తాన్ నుంచి తరలిస్తామని స్పష్టం చేసింది. దీంతో పాటు పాకిస్తాన్ జట్టు కూడా ఆడకుండా టోర్నీని జరుపుతామని కూడా తేల్చేసింది. చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి శుక్రవారం వర్చువల్‌గా జరిగిన సమావేశం 15 నిమిషాల్లోపే ముగిసింది! ఇందులో ఎలాంటి ఫలితం రాకపోయినా, తాము చెప్పినట్లు చేస్తేనే శనివారం సమావేశం కొనసాగుతుందని కూడా ఐసీసీ పాక్‌కు చెప్పేసింది. దుబాయ్‌లోనే ఉన్న పీసీబీ అధ్యక్షుడు మొహసిన్ నక్వీ ఇందులో ప్రత్యక్షంగా పాల్గొనగా, మిగతా దేశాల బోర్డు సభ్యులంతా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే గైర్హాజరు కావడంతో డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. భారత్ మ్యాచ్‌లను మరో దేశంలో నిర్వహిస్తూ ఇతర మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్లో జరిపేలా ప్రతిపాదిస్తున్న ‘హైబ్రిడ్’ మోడల్‌ను పీసీబీ ఇక్కడా తిరస్కరించింది. దీనికి ఎట్టి పరిస్థితిల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. పాక్ పరిస్థితిపై వివిధ దేశాలకు సానుభూతి ఉన్నా... ప్రస్తుత స్థితిలో ‘హైబ్రిడ్’ మోడల్‌కు మించి మరో ప్రత్యామ్నాయం లేదని అందరూ అంగీకరించారు. దీనిని అమలు చేస్తే భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ యూఏఈలో జరుగుతాయి. ‘భారత జట్టు టోర్నీ లో లేకపోతే ఏ ప్రసారకర్త అయినా ఐసీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. ఈ విషయం పాక్‌కూ తెలుసు. కాబట్టి వెంటనే అంగీకరిస్తే శనివారం తుది నిర్ణయం వెలువడవచ్చు’ అని సమావేశంలో పాల్గొన్న సభ్యుడొకరు వెల్లడించారు. టోర్నీ పాక్ దాటి వెళితే ఆతిథ్య హక్కుల కోసం ఐసీసీ ఇచ్చే 6 మిలియన్ డాలర్లతోపాటు టోర్నీ ద్వారా వచ్చే ఆదాయం కూడా పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగాల్సి ఉంది. -
‘పాక్‌కు మోదీ వెళ్లొచ్చు.. టీమిండియా వెళ్లకూడదా?’
పాట్నా : వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుండగా.. ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించింది. ఈ నిర్ణయంపై రాజకీయం వివాదం రాజుకుంది. ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ తప్పుబట్టారు. బిర్యానీ తినేందుకు ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు వెళ్లొచ్చు. కానీ భారత క్రికెర్లు అక్కడకు వెళ్లి క్రికెట్ ఆడకూడదా? అని ప్రశ్నించారు. క్రీడలకు రాజకీయాలను ఉంచాలని కేంద్రాన్ని కోరారు. ‘క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు.. వాళ్లు (పాకిస్తాన్) మన దేశానికి రావాలి. మన ఆటగాళ్లు పాకిస్థాన్‌కి వెళ్లాలి. క్రీడలతో సమస్య ఏంటి? దాయాది దేశాల మధ్య క్రీడలు జరుగుతుంటే యుద్ధం జరుగుతున్నట్లు కాదుగా అని అన్నారు. మోదీ బిర్యానీ తినేందుకు పాక్‌కు వెళితే మంచి విషయం. కానీ భారత క్రికెట్ టీమ్ వెళితే తప్పా? అని ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయి క్రికెట్లో జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించిన తేజస్వి ప్రధాని హోదాలో ప్రధాని మోదీ 2015లో పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధానితో కలిసి మోడీ విందు చేశారు. ఈ పర్యటనను ఉద్దేశిస్తూ తేజస్వీ యాదవ్ పై విధంగా కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో పర్యటించింది. ఇక అప్పటి నుండి టీమిండియా మళ్లీ పాక్‌కు వెళ్లలేదు. చిరకాల ప్రత్యర్థులు చివరిసారిగా 2012-13లో భారత్‌లో ద్వైపాక్షిక సిరీస్ ఆడారు. -
‘హైబ్రిడ్’ మోడల్‌పైనే చర్చ!
దుబాయ్: వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం వెలువడే సమయం వచి్చంది. పాకిస్తాన్ వేదికగా 2025 ఫిబ్రవరి–మార్చి నెలలో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే భారత క్రికెట్ జట్టు పాక్‌కు వెళ్లేందుకు నిరాకరించడంతో వేదిక విషయంపై సందిగ్ధత నెలకొంది. టోర్నీ ప్రసారకర్తలతో ఒప్పందం ప్రకారం కనీసం 90 రోజుల ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అది జరగనేలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ బోర్డు సభ్యులు శుక్రవారం సమావేశం కానున్నారు. వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ సమావేశంలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారు. లేదంటే ఓటింగ్ కూడా జరపాల్సి రావచ్చు. ఎనిమిది దేశాలు పాల్గొనే ఈ వన్డే టోర్నీ కి సంబంధించి ఐసీసీ వద్ద చర్చ కోసం మూడు ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటిది హైబ్రిడ్ మోడల్. దీని ప్రకారం దాదాపు అన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్‌లోనే నిర్వహించి భారత్ ఆడే మ్యాచ్‌ల కోసం మరో దేశంలో ప్రత్యామ్నాయ వేదికను చూడటం. భారత్ నాకౌట్ దశకు చేరితే కూడా ఇదే వర్తిస్తుంది. ప్రస్తుత స్థితిలో ఇది సరైందిగా ఐసీసీ భావిస్తోంది. గత ఏడాది ఆసియా కప్‌ను కూడా ఇలాగే నిర్వహించారు. అయితే దీనికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీపీ) ససేమిరా అంటోంది. దీనికి ఒప్పుకునేది లేదని గురువారం మరోసారి ఐసీసీకి సమాచారం అందించింది. రెండో ప్రతిపాదనతో పూర్తిగా టోరీ్నలో మరో దేశంలో (యూఏఈ కావచ్చు) నిర్వహించి ఆతిథ్య హక్కులు మాత్రం పాకిస్తాన్ వద్దే ఉంచడం. అయితే ఇప్పటికే టోర్నీ కోసం లాహోర్, కరాచీ స్టేడియాలను ఆధునీకరించి సిద్ధమవుతున్న పాకిస్తాన్ దీనికి ఎలాగూ అంగీకరించదు. పైగా 1996 వరల్డ్ కప్ తర్వాత అక్కడ ఒక్క ఐసీసీ టోర్నీ జరగలేదు. టోర్నీ దేశం దాటిపోతే ఆర్థికపరంగా బాగా నష్టం కూడా. మూడోది భారత్ లేకుండా టోర్నీని జరపడం. వాణిజ్యపరమైన అంశాలను చూసుకుంటే ఇది అసాధ్యమైన ప్రతిపాదన. మరోవైపు లీగ్ దశలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ను ఎక్కడ జరపాలనే అంశంపై కూడా ప్రత్యేక చర్చ జరగనుంది. హైబ్రిడ్ మోడల్‌కు తాము అంగీకరించాలంటే భారత్‌లో రాబోయే ఐదేళ్లలో జరిగే నాలుగు టోర్నీలకు కూడా దీనిని వర్తింపజేస్తామని హామీని ఇవ్వాలని... తామూ భారత్‌కు వెళ్లమని పాక్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. -
డబ్బు కోసం అలా చేయము: పట్టువీడని పాకిస్తాన్.. ఐసీసీ నిర్ణయం?
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నక్వీ కీలక వ్యాఖ్యలు చేశాడు. డబ్బు కోసం ఆతిథ్య హక్కులను అమ్ముకోబోమని వ్యాఖ్యానించాడు. అదే సమయంలో.. తమకు అంతిమంగా దేశ ప్రయోజనాలే ముఖ్యమని నక్వీ పేర్కొన్నాడు. కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాక్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌కు టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ అర్హత సాధించగా.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగనుంది. పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తి లేదుఅయితే, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తి లేదని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి స్పష్టం చేసింది.హైబ్రిడ్ విధానం కావాలిఈ నేపథ్యంలో టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానం తెరమీదకు వచ్చింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. మిగతా జట్లన్నీ తమ దేశానికి వస్తున్నాయని.. రోహిత్ సేన కూడా రావాల్సిందేనని పట్టుబడుతోంది. అయితే, బీసీసీఐ మాత్రం తమ ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేదు.ఈ క్రమంలో పీసీబీకి ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు చేకూరేలా ఐసీసీ ఆఫర్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. నవంబరు 29 నాటి సమావేశంలో ఇందుకు సంబంధించి తుదినిర్ణయం వెలువడనుందని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ గురువారం తెల్లవారుజామున మీడియాతో మాట్లాడాడు.ఐసీసీ నిర్ణయం ఏమిటో?!‘‘పాకిస్తాన్ క్రికెట్‌కు ఏది మంచో అదే చేస్తాం. ఐసీసీ చైర్మన్‌తో నేను సంప్రదింపులు జరుపుతున్నాను. ఒకవేళ టీమిండియా ఇక్కడికి రాకపోతే మేము కూడా ఇకపై భారత్‌లో ఆడబోమని కచ్చితంగా చెప్పేశాం. సమానత్వ భావన ముఖ్యం. ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.అదైతే ఎప్పటికీ జరుగదుఏదేమైనా డబ్బు కోసం ఆతిథ్య హక్కులను మాత్రం అమ్ముకోమని నేను మీకు వాగ్దానం చేస్తున్నా. అదైతే ఎప్పటికీ జరుగదు. అయితే, అంతిమంగా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం’’ అని నక్వీ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్తాన్లో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపుతప్పిన విషయం తెలిసిందే.అదుపుతప్పిన శాంతి భద్రతలుపాకిస్తాన్కు వరల్డ్‌కప్ ట్రోఫీ అందించిన మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనలతో ఇస్లామాబాద్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్(పీటీఐ) పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. ఫలితంగా దేశంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఇలాంటి తరుణంలో పాక్‌లో మెగా టోర్నీ నిర్వహించడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశం ఉంది.చదవండి: డేంజర్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ పర్యటన నుంచి వైదొలిగిన శ్రీలంక