Mohammed Shami
-
షమీ... శుబ్... ఆరంభం
229 పరుగుల స్వల్ప విజయలక్ష్యం...భారత్‌లాంటి బలమైన జట్టు ఆడుతూపాడుతూ దీనిని ఛేదిస్తుందని ఎవరైనా భావిస్తారు... కానీ పిచ్ ఒక్కసారిగా నెమ్మదించింది... పరుగులు రావడం కష్టంగా మారిపోయింది. ఈ స్థితిలో శుబ్‌మన్ గిల్ పట్టుదలగా నిలబడ్డాడు... కీలక భాగస్వామ్యాలతో జట్టును గెలుపుతీరం చేర్చడంతో పాటు వరుసగా రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు భారత్ పదునైన బౌలింగ్‌కు ఒకదశలో 35/5 వద్ద కుప్పకూలే స్థితిలో నిలిచిన బంగ్లాదేశ్... తౌహీద్, జాకీర్ ఆటతో 200 పరుగులు దాటగలిగింది. మరో ఐసీసీ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో షమీ తన పునరాగమాన్ని ఘనంగా ప్రదర్శించాడు. శుభారంభం తర్వాత ఆదివారం అసలు పోరులో పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలుపు బోణీ చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. తౌహీద్ హృదయ్ (118 బంతుల్లో 100; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... జాకీర్ అలీ (114 బంతుల్లో 68; 4 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 34.2 ఓవర్లలో 154 పరుగులు జోడించారు. మొహమ్మద్ షమీ (5/53) ఐదు వికెట్లతో చెలరేగగా... హర్షిత్ రాణా 3, అక్షర్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లకు 231 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (129 బంతుల్లో 101 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకం నమోదు చేయగా... కెప్టెన్ రోహిత్ శర్మ (36 బంతుల్లో 41; 7 ఫోర్లు), కేఎల్ రాహుల్ (47 బంతుల్లో 41 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. భారీ భాగస్వామ్యం... తొలి 5 వికెట్లకు 35 పరుగులు... చివరి 5 వికెట్లకు 39 పరుగులు... మధ్యలో తౌహీద్, జాకీర్ భారీ భాగస్వామ్యం! బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సాగిన తీరిది. షమీ, రాణా దెబ్బకు టపటపా 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాను అక్షర్ తన తొలి ఓవర్లోనే దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో తన్జీద్ (25 బంతుల్లో 25; 4 ఫోర్లు), ముష్ఫికర్ (0)ను అవుట్ చేసిన అతను త్రుటిలో హ్యాట్రిక్ కోల్పోయాడు. 35/5 నుంచి తౌహీద్, జాకీర్ జట్టును ఆదుకున్నారు. భారత ఆటగాళ్ల పేలవ ఫీల్డింగ్ కూడా వారికి కలిసొచ్చింది. సుదీర్ఘ ప్రయత్నం తర్వాత ఎట్టకేలకు 206 బంతుల ఈ భాగస్వామ్యాన్ని షమీ విడగొట్టాడు. ఆ తర్వాత 49వ ఓవర్ తొలి బంతికి సింగిల్‌తో తౌహీద్ 114 బంతుల్లో కెరీర్లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రాణించిన రాహుల్... స్వల్ప లక్ష్యమే అయినా భారత్ ఛేదన సులువుగా సాగలేదు. ముస్తఫిజుర్ ఓవర్లో 3 ఫోర్లు సహా కొన్ని చక్కటి షాట్లు ఆడిన రోహిత్ పదో ఓవర్లో వెనుదిరగ్గా, గిల్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పిచ్ ఒక్కసారిగా మందగించడంతో పరుగుల రాక గగనమైంది. గిల్, విరాట్ కోహ్లి (38 బంతుల్లో 22; 1 ఫోర్) కలిసి 12.5 ఓవర్లలో 43 పరుగులే జోడించగలిగారు. అనంతరం 11 పరుగుల వ్యవధిలో శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) అవుటయ్యారు. అయితే గిల్‌కు రాహుల్ అండగా నిలిచాడు. బంగ్లా బౌలర్లు మధ్యలో కొద్ది సేపు ఆధిపత్యం ప్రదర్శించినట్లు కనిపించినా... నిలదొక్కుకున్న తర్వాత వీరిద్దరు స్వేచ్ఛగా ఆడారు. గిల్, రాహుల్ 16.2 ఓవర్లలో అభేద్యంగా 87 పరుగులు జోడించి మ్యాచ్‌ను ముగించారు. ఈ క్రమంలో 46వ ఓవర్లో సింగిల్‌తో 125 బంతుల్లో గిల్ వన్డేల్లో ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జీద్ (సి) రాహుల్ (బి) అక్షర్ 25; సౌమ్య సర్కార్ (సి) రాహుల్ (బి) షమీ 0; నజు్మల్ (సి) కోహ్లి (బి) రాణా 0; మిరాజ్ (సి) గిల్ (బి) షమీ 5; తౌహీద్ (సి) షమీ (బి) రాణా 100; ముష్ఫికర్ (సి) రాహుల్ (బి) అక్షర్ 0; జాకీర్ (సి) కోహ్లి (బి) షమీ 68; రిషాద్ (సి) పాండ్యా (బి) రాణా 18; తన్జీమ్ (బి) షమీ 0; తస్కీన్ (సి) అయ్యర్ (బి) షమీ 3; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 228. వికెట్ల పతనం: 1–1, 2–2, 3–26, 4–35, 5–35, 6–189, 7–214, 8–215, 9–228, 10–228. బౌలింగ్: షమీ 10–0–53–5, హర్షిత్ రాణా 7.4–0–31–3, అక్షర్ 9–1–43–2, పాండ్యా 4–0–20–0, జడేజా 9–0–37–0, కుల్దీప్ 10–0–43–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రిషాద్ (బి) తస్కీన్ 41; గిల్ (నాటౌట్) 101; కోహ్లి (సి) సర్కార్ (బి) రిషాద్ 22; అయ్యర్ (సి) నజ్ముల్ (బి) ముస్తఫిజుర్ 15; అక్షర్ (సి అండ్ బి) రిషాద్ 8; రాహుల్ (నాటౌట్) 41; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (46.3 ఓవర్లలో 4 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–69, 2–112, 3–133, 4–144. బౌలింగ్: తస్కీన్ 9–0–36–1, ముస్తఫిజుర్ 9–0–62–1, తన్జీమ్ 8.3–0–58–0, మిరాజ్ 10–0–37–0, రిషాద్ 10–0–38–2. అక్షర్ ‘హ్యాట్రిక్’ మిస్ మ్యాచ్‌లో బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగినా భారత్ ఫీల్డింగ్ స్థాయికి తగినట్లుగా లేకపోయింది. అక్షర్ తొలి ఓవర్లో వరుసగా రెండు వికెట్ల తర్వాత జాకీర్ (0 వద్ద) ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను స్లిప్‌లో రోహిత్ వదిలేశాడు. దాంతో అక్షర్ ‘హ్యాట్రిక్’ అవకాశం చేజారింది. రోహిత్ ఆ క్యాచ్ పట్టి ఉంటే స్కోరు 35/6తో ఇక కోలుకునే అవకాశం లేకపోయేది. ఆ తర్వాత జాకీర్ 24 వద్ద ఉన్నప్పుడు జడేజా బౌలింగ్‌లో స్టంప్ చేసే అవకాశాన్ని రాహుల్ చేజార్చాడు. చివరకు బ్యాటర్ 68 పరుగులు సాధించగలిగాడు. తౌహీద్ స్కోరు 23 వద్ద కుల్దీప్ బౌలింగ్‌లో మిడాఫ్‌లో పాండ్యా సునాయాస క్యాచ్ వదిలేయగా చివరకు అతను సెంచరీ పూర్తి చేసుకోగలిగాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో 12 వద్ద తన్జీద్ను రనౌట్ చేసే అవకాశం వచ్చినా...అయ్యర్ త్రో స్టంప్స్‌కు చాలా దూరంగా వెళ్లింది. భారత్ ఇన్నింగ్స్‌లో రాహుల్ 9 వద్ద ఉన్నప్పుడు జాకీర్ సులువైన క్యాచ్ వదిలేసి మేలు చేశాడు.200 వన్డేల్లో షమీ 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. బంతుల పరంగా చూస్తే అందరికంటే వేగంగా (5126 బంతుల్లో) ఈ ఘనత సాధించిన బౌలర్‌గా అతను రికార్డు సాధించాడు. ఇందు కోసం మిచెల్ స్టార్క్‌కు (ఆ్రస్టేలియా) 5240 బంతులు పట్టాయి. తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన భారత బౌలర్‌గానూ షమీ గుర్తింపు పొందాడు. గతంలో అజిత్ అగార్కర్ 133 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయి అందుకోగా... షమీ 103 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.60 ఐసీసీ టోర్నీల్లో అత్యధిక (60) వికెట్లు తీసిన భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. జహీర్ ఖాన్ (32 ఇన్నింగ్స్‌లలో 59) రికార్డును షమీ (19 ఇన్నింగ్స్‌లలో 60) సవరించాడు.11000 వన్డేల్లో రోహిత్ 11 వేల పరుగులు పూర్తి చేసుకొని ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా నిలిచాడు.156 వన్డేల్లో కోహ్లి క్యాచ్‌ల సంఖ్య. భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా అజహరుద్దీన్ (156) రికార్డును సమం చేయగా... జయవర్ధనే (218), పాంటింగ్ (160) వీరికంటే ముందున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో నేడు దక్షిణాఫ్రికా X అఫ్గానిస్తాన్ వేదిక: కరాచీ మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
Champions Trophy 2025: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. డబుల్ సెంచరీ కొట్టిన షమీ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు (43 ఓవర్ల వరకు) తీసిన షమీ.. వన్డేల్లో 200 వికెట్ల పూర్తి చేసుకున్నాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వన్డే వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ రికార్డు నెలకొల్పాడు. షమీకి 200 వికెట్లు తీసేందుకు 5126 బంతులు అవసరమయ్యాయి. షమీకి ముందు ఈ రికార్డు మిచెల్ స్టార్క్ పేరిట ఉండింది. స్టార్క్ 5240 బంతుల్లో 200 వన్డే వికెట్ల మైలురాయిని తాకాడు.బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్లు..షమీ-5126 బంతులుస్టార్క్- 5240సక్లెయిన్ ముస్తాక్- 5451బ్రెట్ లీ- 5640ట్రెంట్ బౌల్ట్- 5783వకార్ యూనిస్- 5883మ్యాచ్‌ల ప్రకారం చూస్తే.. షమీ.. మిచెల్ స్టార్క్ తర్వాత అత్యంత వేగంగా 200 వికెట్ల వన్డే మైలురాయిని తాకిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.మ్యాచ్‌ల ప్రకారం అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఆటగాళ్లు..స్టార్క్- 102షమీ/సక్లెయిన్ ముస్తాక్- 104ట్రెంట్ బౌల్ట్- 107బ్రెట్ లీ- 112అలన్ డొనాల్డ్- 117ఓవరాల్‌గా చూస్తే.. వన్డేల్లో 200 వికెట్లు పూర్తి చేసిన 43 బౌలర్‌గా షమీ రికార్డుల్లోకెక్కాడు. భారత తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. షమీకి ముందు అనిల్ కుంబ్లే (334), జవగల్ శ్రీనాథ్ (315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), హర్భజన్ సింగ్ (265), కపిల్ దేవ్ (253), రవీంద్ర జడేజా (226) భారత్ తరఫున 200 వికెట్లు తీశారు. జవగల్ శ్రీనాథ్ (315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), కపిల్ దేవ్ (253) తర్వాత 200 వికెట్ల క్లబ్లో చేరిన ఐదో భారత పేసర్‌గా షమీ రికార్డు నెలకొల్పాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఆదిలో భారత బౌలర్లు చెలరేగడంతో 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ (68) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. 46.2 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 215/8గా ఉంది. తౌహిద్ హృదోయ్ (91 నాటౌట్), తస్కిన్ అహ్మద్ క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. -
'అతడొక సూపర్ స్టార్.. దుబాయ్‌లో దుమ్ములేపుతాడు'
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన రీఎంట్రీలో సత్తాచాటలేకపోతున్నాడు. దాదాపు ఏడాది తర్వాత గాయం నుంచి కోలుకుని అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన షమీ తన మార్క్ చూపించలేకపోతున్నాడు. తన రిథమ్‌ను తిరిగి పొందడానికి ఈ బెంగాల్ స్టార్ సీమర్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో షమీ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) రూపంలో షమీ మరో సవాలు ఎదురు కానుంది. ఈ టోర్నీకి పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో భారత ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్‌కు షమీనే నాయకత్వం వహించాలి.అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యాతో కూడా పేస్ త్రయాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత షమీపైనే ఉంది. అయితే షమీ తన రిథమ్‌ను అందుకుంటే అపడం ఎవరి తరం కాదు. ఇప్పటికే 2023 వన్డే వరల్డ్‌కప్‌లో తనంటో ఈ స్పీడ్ స్టార్ నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో షమీపై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ రాబిన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో షమీ దుమ్ములేపుతాడని రాబిన్‌సింగ్ జోస్యం చెప్పాడు. కాగా రాబిన్ సింగ్ ప్రస్తుతం ఇంటర్ననేషనల్ టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. దీంతో దుబాయ్ స్టేడియంలో పిచ్ ఎలా ఉంటుందో అతడికి బాగా తెలుసు. ఈ క్రమంలోనే దుబాయ్ వికెట్ షమీకి సరిగ్గా సెట్ అవుతాందని రాబిన్ సింగ్ అంచనా వేశాడు."దుబాయ్ వికెట్‌పై రాత్రి పూట బౌలింగ్ చేయడం కొంచెం కష్టమనే చెప్పాలి. మంచు కారణంగా బంతి బౌలర్లు చేతి నుంచి జారిపోయే అవకాశముంది. అయితే ప్రస్తుతం ఇక్కడ మంచు విస్తృతంగా లేదు. ఈ వికెట్‌పై రాత్రిపూట బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. పరుగులు సునాయసంగా రాబట్టవచ్చు. కానీ ఈ పరిస్థితులను మంచి సీమ్ బౌలర్ అయితే తనకు తగ్గట్టు మలుచుకుంటాడు. షమీలాంటి స్పీడ్ స్టార్‌కు ఈ వికెట్ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే సరైన లెంగ్త్‌తో పాటు గుడ్ ఏరియాలలో అతడు హిట్ చేస్తాడు. షమీ పర్ఫెక్ట్ సీమ్ పొజిషన్ కలిగి ఉన్నాడని" ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబిన్ సింగ్ పేర్కొన్నాడు. కాగా ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిచదవండి: IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ.. చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి -
CT 2025: రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఆరంభానికి సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ వన్డే మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇందులో పాల్గొనే ఎనిమిది జట్ల వివరాలు వెల్లడయ్యాయి. ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సైతం ఈ ఐసీసీ టోర్నీకి తొలుత ప్రకటించిన జట్టులో రెండు మార్పులతో టీమ్‌ను ఖరారు చేసింది.యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను ఈ జట్టు నుంచి తప్పించిన బీసీసీఐ(BCCI).. అతడి స్థానంలో ఐదో స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)ని జట్టులో చేర్చింది. అదే విధంగా.. స్టార్ బౌలర్, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఇంకా వెన్నునొప్పి నుంచి కోలుకోకపోవడంతో అతడి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను ఎంపిక చేసింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత తుదిజట్టుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనని ప్రకటించిన ఈ మాజీ బ్యాటర్.. అనూహ్యంగా వన్డే వరల్డ్‌కప్-2023 హీరోలను మాత్రం పక్కనపెట్టాడు.అద్బుత ప్రదర్శనస్వదేశంలో 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆలస్యంగా అడుగుపెట్టినా అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు మహ్మద్ షమీ. మెగా ఈవెంట్లో ఏకంగా 24 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. అనంతరం చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు పద్నాలుగు నెలల తర్వాత పునరాగమనం చేశాడు.సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన టీ20, వన్డే సిరీస్‌లలో షమీ ఆడాడు. అయితే, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లలో ఈ బెంగాల్ పేసర్ స్థాయికి తగ్గట్లు రాణించలేదు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే వికెట్లు తీశాడు.మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా ఇంగ్లండ్‌తో వన్డేల్లో ఆకట్టుకోలేకపోయాడు. అయితే, అతడిని బ్యాటింగ్ ఆర్డర్లో డిమోట్ చేయడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. సాధారణంగా ఐదో స్థానంలో వచ్చే ఈ కర్ణాటక బ్యాటర్‌ను మేనేజ్మెంట్ ఆరో స్థానంలో పంపింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో తొలి రెండు వన్డేల్లో రాహుల్(2, 10) విఫలమయ్యాడు.రాహుల్ ధనాధన్ ఇన్నింగ్స్అయితే, మూడో వన్డే సందర్భంగా తన రెగ్యులర్ ప్లేస్‌లో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ ధనాధన్ ఇన్నింగ్స్(29 బంతుల్లో 40) ఆడాడు. ఇక అంతకుముందు వన్డే వరల్డ్‌కప్‌లోనూ రాహుల్ రాణించాడు. అయినప్పటికీ షమీతో పాటు కేఎల్ రాహుల్‌కు కూడా సురేశ్ రైనా తన చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటివ్వకపోవడం గమనార్హం.ఇక షమీని కాదని యువ పేసర్ హర్షిత్ రాణా వైపు మొగ్గు చూపిన సురేశ్ రైనా.. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ స్థానంలో రిషభ్ పంత్‌ను ఎంచుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో యాజమాన్యం రిషభ్ పంత్‌ను పూర్తిగా పక్కనపెట్టడం గమనార్హం.చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చాంపియన్స్ ట్రోఫీ-2025కి సురేశ్ రైనా ఎంచుకున్న తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్.చదవండి: ఆఖరికి అతడికి జట్టులో స్థానమే లేకుండా చేశారు: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
టీమిండియాకు భరోసానిచ్చిన బౌలర్లు.. అతడికీ త్వరలోనే అవకాశం!
ఇంగ్లండ్‌తో నాగపూర్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ తరుఫున మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)ని రంగంలోకి దించుతారని అందరూ భావించారు. అయితే, గురువారం నాటి ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడినప్పటికీ వరుణ్‌కు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. ఇందుకు బదులుగా ఆల్‌రౌండర్లైన రవీంద్ర జడేజా(Ravindra Jadeja), మరో ఎడం చేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav)లతో భారత్ బరిలోకి దిగింది. ఈ ఫార్ములా టీమిండియాకు బాగానే పనిచేసింది.తడబడినా రాణించిన రానాఇక పేస్ బౌలర్లలో గాయం నుంచి కోలుకున్న మహమ్మద్ షమీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాలతో పాటు 23 ఏళ్ళ హర్షిత్ రాణాకి స్థానం ఇచ్చారు. అతడికి ఇదే తొలి వన్డే. ఢిల్లీకి చెందిన హర్షిత్ రాణా గత సీజన్ లో ఐపీఎల్ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరుఫున ఆడిన రానా 13 మ్యాచ్ లలో 20.15 సగటుతో 19 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా లో నాలుగో బౌలర్ గా నిలిచాడు.ఇక డెత్ ఓవర్లలో 9.85 పరుగుల సగటు తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టిన రాణా.. అరంగేట్రంలోనే మూడు వికెట్లు పడగొట్టి వన్డే జట్టులోనూ స్థానం సంపాదించాడు. అయితే నాగపూర్ లో తన తొలి స్పెల్ లోని మూడో ఓవర్లో రాణా ఏకంగా 26 పరుగులు ఇచ్చి ఓ చెత్త రికార్డుని తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ మూడు సిక్సలు, రెండు బౌండరీలతో ఏకంగా 26 పరుగులు సాధించాడు.అయితే అతడి స్థానంలో తర్వాత బౌలింగ్ కి వచ్చిన హార్దిక్ పాండ్యా నిలకడగా బౌలింగ్ చేయడమే కాక , అదే ఓవర్లో సాల్ట్ రనౌట్ అవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కి బ్రేకులు పడ్డాయి. మళ్ళీ రెండో స్పెల్ కి వచ్చిన రాణా ఎంతో మెరుగ్గా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ మరో ఓపెనర్ బెన్ డకేట్ వికెట్ తీయడమే కాక మొత్తం మీద ఏడు ఓవర్లలో 53 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.షమీ రాకతో కొంత ఊరట ఇక గాయం నుంచి కొలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చిన ౩౩ ఏళ్ళ షమీ పొదుపుగా బౌలింగ్ చేసి 38 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. జట్టు ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి నుంచి కోలుకోవడం పై స్పష్టమైన సమాచారం లేక పోవడం తో షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యల బౌలింగ్ భారత్ జట్టు మేనేజిమెంట్ కి కొద్దిగా ఊరట కలిగించవచ్చు. అయితే బుమ్రా లేని లోటు పూరించడం కష్టమే అయినా ఈ ముగ్గురు రాణించడం పేస్ బౌలింగ్ భారం కొద్దిగా తగ్గినట్టు భావించవచ్చు.వరుణ్‌కు త్వరలో అవకాశం అయితే ఈ మ్యాచ్ కి ముందు అందరూ ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తప్పక ఆడతాడని భావించారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్ లో వరుణ్ రాణించడమే ఇందుకు కారణం. ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ జట్టులో వరుణ్ కి స్థానం కల్పించడానికి ముందు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ లో ఆడించడం చాల ముఖ్యం. ఈ నేపథ్యంలో నాగపూర్ లో 33 ఏళ్ల వరుణ్ ఆడటం ఖాయమని భావించారు. అయితే మ్యాచ్ కి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ అయితే ఈ టోర్నమెంట్ లో ఏదో ఒక దశ లో వరుణ్ ఆడే అవకాశం ఉందని వివరించాడు.అయితే అతడు ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడడం పై ఇప్పుడే స్పష్టంగా చెప్పలేనని ఈ టోర్నమెంట్ లో అతని ప్రదర్శన పై అది ఆధారపడి ఉంటుందని రోహిత్ వివరించాడు. "వరుణ్ బౌలింగ్ లో వైవిధ్యం ఉంది. ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఇది రుజువైంది. అయితే అతని ఆడింది టి20 ఫార్మాట్ అయినందున వన్డేల్లో అతని ప్రదర్శనపై ఇంకా అంచనా వేయాల్సి ఉందని రోహిత్ వ్యాఖ్యానించాడు."ఈ సిరీస్‌లో వరుణ్ తో ఏదో ఒక దశలో ఆడించడానికి ప్రయత్నిస్తాం. అతని సామర్థ్యం ఏమిటో చూడటానికి ఇది మాకు అవకాశాన్ని కలిపిస్తుంది. ప్రస్తుతం మేము అతన్ని తీసుకోవాలా వద్దా అనే దాని గురించి ఆలోచించడం లేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపికలో వరుణ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే, అతని ప్రదర్శన కూడా మేము ఆశించిన స్థాయిలో ఉంటే వరుణ్ కి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో అవకాశం కల్పించే అవకాశం పై తప్పక పరిశీలిస్తాం’’ అని రోహిత్ వివరించాడు. -
ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. ప్రపంచ రికార్డుపై గురి పెట్టిన షమీ
ఫిబ్రవరి 6న ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి వన్డేలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) ఓ వరల్డ్ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్లు తీస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గా వరల్డ్ రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆసీస్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) పేరిట ఉంది. స్టార్క్ 102 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు పూర్తి చేశాడు. షమీ ప్రస్తుతం 100 ఇన్నింగ్స్‌ల్లో 195 వికెట్లు కలిగి ఉన్నాడు.వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు..మిచెల్ స్టార్క్-102 మ్యాచ్లుసక్లయిన్ ముస్తాక్-104 మ్యాచ్లుట్రెంట్ బౌల్ట్-107 మ్యాచ్లుబ్రెట్ లీ-112 మ్యాచ్లుఅలన్ డొనాల్డ్-117 మ్యాచ్‌లుకాగా, 2023 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా గాయపడిన షమీ.. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఫిబ్రవరి 6 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో షమీ వన్డేల్లోకి కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. షమీ చివరిగా ఆడిన వన్డే వరల్డ్‌కప్‌లో కేవలం ఏడు ఇన్నింగ్స్‌ల్లోనే 24 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు ఐదు వికెట్ల ఘనతలు ఉండటం విశేషం. షమీ చెలరేగడంతో భారత్ ఆ వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు అజేయంగా చేరింది. అయితే తుది పోరులో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది.34 ఏళ్ల షమీ రీఎంట్రీ ఇచ్చాక ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో వికెట్లేమీ తీయలేదు. దీంతో అతన్ని నాలుగో టీ20లో పక్కన పెట్టారు. నాలుగో టీ20తో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో షమీకి తిరిగి చివరి టీ20లో అవకాశం దక్కింది. ఈ సారి షమీ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో షమీ 3 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలకప్రాత పోషించాడు.షమీ.. త్వరలో జరుగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షమీపై భారీ అంచనాలే పెట్టుకుంది. ఈ టోర్నీలో షమీ రాణిస్తే పూర్వవైభవం సాధిస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత ప్రయాణం ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనున్నాయి. దీనికి ముందు ఫిబ్రవరి 6న భారత్ నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో తొలి వన్డే ఆడుతుంది. అనంతరం ఫిబ్రవరి 9, 12 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు కటక్, అహ్మదాబాద్ వేదికలు కానున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి ప్రారంభమవుతాయి. -
‘ఐదో టీ20లో తప్పక ఆడిస్తాం.. అతడి రాకతో జట్టులో జోష్’
దాదాపు ఏడాది తర్వాత టీమిండియా తరఫున పునరాగమనం చేశాడు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami). ఇంగ్లండ్‌తో మూడో టీ20(India vs England) సందర్భంగా భారత తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, మంగళవారం నాటి(జనవరి 28) ఈ మ్యాచ్‌లో షమీ కొత్త బంతితో ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా రాజ్‌కోట్ టీ20లో మూడు ఓవర్లకే పరిమితమైన షమీ.. మొత్తంగా 25 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో అతడికి ఆడే అవకాశం రాలేదు. షమీపై వేటు వేసిన టీమిండియా యాజమాన్యం యువ తరంగం అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh)ను మళ్లీ వెనక్కి పిలిపించింది.తుది జట్టులోకి వస్తాడా? లేదా? ఈ నేపథ్యంలో షమీ మళ్లీ తుది జట్టులోకి వస్తాడా? లేదా? అన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో షమీని ఆడిస్తామనే సంకేతాలు ఇచ్చాడు. నాలుగో టీ20 జరుగుతున్న సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘షమీ బాగానే ఉన్నాడు.అతడు చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. వార్మప్ మ్యాచ్‌లలోనూ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు జట్టుతో చేరడం సంతోషంగా ఉంది. తదుపరి మ్యాచ్‌లో అతడికి ఆడే అవకాశం రావచ్చు. అయితే, అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం.భారత క్రికెట్‌కు కొత్త జోష్ఏదేమైనా.. అతడు తిరిగి టీమిండియాలోకి రావడం బౌలింగ్ విభాగానికి సానుకూలాంశం. ఎంతో అనుభవజ్ఞుడు. తన అనుభవాలను యువ బౌలర్లతో పంచుకుంటున్నాడు. బౌలర్‌గా తన జ్ఞానాన్ని వాళ్లకూ పంచుతున్నాడు. షమీ రాకతో భారత క్రికెట్‌కు కొత్త జోష్ వచ్చింది. షమీ నుంచి గొప్ప ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నాం’’ అని మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.చీలమండ గాయానికి సర్జరీకాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ తర్వాత షమీ జాతీయ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. చీలమండ గాయం వేధిస్తున్నా ఐసీసీ టోర్నీలో మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తర్వాతే సర్జరీ చేయించుకున్నాడు. అనంతరం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన షమీ.. కోలుకోవడానికి దాదాపు ఏడాది పట్టింది.అనంతరం.. బెంగాల్ తరఫున రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆడి ఫిట్నెస్ నిరూపించుకున్న షమీని.. బీసీసీఐ ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేసింది. అదే విధంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులోనూ చోటిచ్చింది. ఐదో టీ20లో ఆడటం పక్కా!అయితే, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో స్పిన్నర్లకు పెద్ద పీట వేసిన యాజమాన్యం.. ఒకే ఒక్క స్పెషలిస్టు పేసర్‌తో బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్‌పై నమ్మకం ఉంచిన యాజమాన్యం షమీకి ఇప్పటి వరకు ఒకే ఒక మ్యాచ్‌లో అవకాశం ఇచ్చింది.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో పదిహేను పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. అంతకు ముందు కోల్‌కతా, చెన్నైలలో విజయం సాధించిన సూర్యకుమార్‌సేన.. తాజా విజయంతో 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక టీమిండియా-ఇంగ్లండ్ మధ్య ఆదివారం ముంబైలో ఆఖరిదైన నామమాత్రపు ఐదో టీ20 జరుగుతుంది. ఇప్పటికే భారత్ సిరీస్ గెలిచింది కాబట్టి.. అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతినిచ్చి.. షమీని ఆడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. 14 నెలల తర్వాత షమీ రీ ఎంట్రీ
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ 14 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. రాజ్‌కోట్ వేదికగా ఇగ్లండ్తో జరుగుతున్న మూడో టీ20కు భారత తుది జట్టులో షమీ చోటు దక్కించుకున్నాడు. దీంతో అభిమానుల సదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. రాజ్‌కోట్ టీ20కు యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు టీమ్ మెనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానంలోనే షమీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు.కాగా షమీ చివరిసారిగా వన్డే ప్రపంచకప్ 2023లో ఫైనల్ భారత్ తరపున ఆడాడు. భారత్ రన్నరప్‌గా నిలిచినప్పటికి షమీ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత షమీ చీలమండ గాయంతో జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత తన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అనంతరం ఎన్సీఎలో చేరి ఫిట్నెస్ సాధించేందుకు షమీ తీవ్రంగా శ్రమించాడు.అతడు తిరిగి భారత జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని భావించిన సమయంలో ఎడమ కాలి మడమలో మళ్లీ వాపు వచ్చింది. దీంతో అతడు రీ ఎంట్రీ అలస్యమైంది. అయితే అతడు తిరిగి కోలుకుని తొలుత దేశవాళీ క్రికెట్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్హాజారే ట్రోఫీలో షమీ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో షమీ చోటు దక్కించుకున్నాడు. అయితే తొలి రెండు టీ20ల్లో మాత్రం షమీ ఆడే అవకాశం లభించలేదు. ఎట్టకేలకు రాజ్‌కోట్ టీ20తో షమీ పునరాగమనం చేశాడు.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్భారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), ధ్రువ్ జురెల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిచదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సౌతాఫ్రికాకు షాక్.. -
Rohit-Virat: నేను సిద్ధమే.. వాళ్లు రెడీగా ఉండాలి కదా!: టీమిండియా కొత్త కోచ్
టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) పూర్తి ఫిట్నెస్తోనే ఉన్నాడని భారత బ్యాటింగ్ కొత్త కోచ్ సితాన్షు కొటక్(Sitanshu Kotak) వెల్లడించాడు. అయితే, ఇంగ్లండ్‌తో మూడో టీ20లో అతడు ఆడతాడా? లేదా? అన్న అంశంపై మాత్రం స్పష్టతనివ్వలేదు.కాగా ఏడాది తర్వాత.. ఇంగ్లండ్‌తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా షమీ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, బట్లర్ బృందంతో తొలి రెండు టీ20లో మాత్రం అతడికి భారత తుదిజట్టులో చోటు దక్కలేదు.ఈ నేపథ్యంలో షమీ ఫిట్‌నెస్‌పై మరోసారి ఊహాగానాలు వచ్చాయి. జట్టు ప్రయోజనాల దృష్ట్యా మేనేజ్మెంట్ అతడిని పక్కనపెడుతోందని కొంతమంది భావిస్తుండగా.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు షమీపై అదనపు భారం పడకుండా చూస్తున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తుది నిర్ణయం వాళ్లదేఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందిస్తూ.. షమీకి ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవన్నాడు. అతడు వందశాతం మ్యాచ్ ఫిట్నెస్తో ఉన్నాడని అయితే తుదిజట్టులో ఆడించే అంశంపై కెప్టెన్ సూర్యకుమార్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లే నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు.కాగా.. 2023 నవంబర్‌లో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత షమీ మళ్లీ టీమిండియా తరఫున ఆడలేకపోయాడు. కొన్నాళ్లు విశ్రాంతి, ఇంకొన్నాళ్లు గాయాలతో సతమతమైన 34 ఏళ్ల వెటరన్ బెంగాల్ సీమర్‌ను తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌కు ఎంపికచేశారు. దీంతో 15 నెలల తర్వాత జట్టులో చోటు దక్కింది కానీ ఆడేందుకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో కోల్‌కతా టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా.. చెన్నై మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా మంగళవారం మూడో టీ20 జరుగుతుంది. రోహిత్, కోహ్లిలకోసం ప్రత్యేకంగా ఏమైనా..?ఇటీవలి కాలంలో టెస్టుల్లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli) గురించి విలేకరులు సితాన్షు కొటక్ వద్ద ప్రస్తావన తీసుకువచ్చారు. బ్యాటింగ్ కోచ్‌గా వారికోసం ఏవైనా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారా అని అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘రోహిత్, విరాట్ చాలా సీనియర్ ఆటగాళ్లు.అయినా.. ఈరోజుల్లో ప్రతి ఒక్క ఆటగాడు తన ఆట గురించి తానే అంచనా వేసుకోగలుగుతున్నాడు. ఇతరులతో తన ప్రణాళికల గురించి పంచుకుంటూ ..లోపాల్ని సరిచేసుకుంటున్నారు. అలాంటి వారికి మనవంతుగా ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వగలగడం గొప్ప విషయమే. సలహాలిస్తే తీసుకోవాలి కదా!నిజంగా నా సలహాల వల్ల రోహిత్, కోహ్లిల ఆట కనీసం రెండు నుంచి ఐదు శాతం మెరుగుపడినా అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. అయినా వాళ్లిద్దరు ఇప్పటికే ఎన్నో గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. అయినా సరే నా నుంచి కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే.. అందుకు వారు సిద్ధంగా ఉండాలి. తద్వారా ఎప్పటికపుడు ఆటను మెరుగుపరచుకోవచ్చు’’ అని సితాన్షు కొటక్ వెల్లడించాడు.కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ పూర్తిగా విఫలం కాగా.. విరాట్ కోహ్లి కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రోహిత్ ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 31 పరుగులే చేశాడు.ఇక కోహ్లి పదకొండు ఇన్నింగ్స్ ఆడి 191 పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కంగారూ జట్టుకు కోల్పోయింది. ఇందుకు ప్రధాన కారణం ‘విరాహిత్’ ద్వయం వైఫల్యమేనని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఇద్దరూ రంజీ బరిలోకి వచ్చారు.చదవండి: U19 T20 WC 2025: భారత్‌తో పాటు సెమీస్ చేరిన జట్లు ఇవే.. షెడ్యూల్ వివరాలు -
చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి సిరాజ్! కారణం ఇదే!
చాంపియన్స్ ట్రోఫీ-2025 భారత జట్టులో మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)కు చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఈ ఐసీసీ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ప్రకటించిన జట్టులో ఒకే ఒక్క పేసర్ పూర్తి ఫిట్‌గా ఉండటం ఇందుకు కారణమని పేర్కొన్నాడు. మిగతా ఇద్దరు ఫాస్ట్ బౌలర్ల ఫిట్‌నెస్‌పై స్పష్టత రావడం లేదు కాబట్టి.. సిరాజ్ మియా దుబాయ్ ఫ్లైట్ ఎక్కడం ఖాయంగానే కనిపిస్తుందని పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆడనుంది. హైదరాబాదీ పేసర్‌కు దక్కని చోటుఈ నేపథ్యంలో జనవరి 18న బీసీసీఐ ఈ మెగా ఈవెంట్‌కు తమ జట్టును ప్రకటించగా.. ఇందులో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మాత్రం చోటు దక్కలేదు. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)తో పాటు మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేసిన సెలక్టర్లు.. యువ తరంగం, పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న అర్ష్‌దీప్ సింగ్‌కు కూడా స్థానం ఇచ్చారు. అందుకే పక్కన పెట్టామన్న కెప్టెన్ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘బుమ్రా పూర్తి ఫిట్‌గా ఉంటాడో లేదో తెలియదు. ఇక షమీతో పాటు అర్ష్‌దీప్ కొత్త బంతితో రాణించగలడు. అంతేకాదు.. డెత్ ఓవర్లలోనూ బాగా బౌలింగ్ చేయగలడు. అయితే, సిరాజ్ మాత్రం ఆరంభంలో చూపినంత ప్రభావం ఆఖర్లో చూపలేకపోతున్నాడు. అందుకే అతడిని పక్కనపెట్టాల్సి వచ్చింది’’ అని వివరణ ఇచ్చాడు.వైల్డ్ కార్డ్ ఎంట్రీఅయితే, తాజా పరిస్థితులు చూస్తుంటే సిరాజ్‌కు చాంపియన్స్ ట్రోఫీ జట్టులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. టోర్నీ నాటికి బుమ్రా వంద శాతం ఫిట్నెస్ సాధించే సూచనలు కనిపించడం లేదు. అదే విధంగా.. షమీ కూడా ఇంత వరకు రీఎంట్రీ ఇవ్వలేదు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇంగ్లండ్‌తో తొలి రెండు టీ20లకు అతడు దూరమైనా.. నెట్స్‌లో కుంటుతూ బౌలింగ్ చేసిన దృశ్యాలు అభిమానులను కలవరపెడుతున్నాయి.సిరాజ్‌కు చోటు పక్కాఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘షమీ గురించి కాసేపు పక్కనపెడతాం. బుమ్రా గురించి మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాచారం రావడం లేదు. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో ఒక్క పేసర్ మాత్రమే ఫిట్‌గా ఉన్నాడు.మిగతా ఇద్దరు(బుమ్రా, షమీ) సంగతి తెలియదు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు జట్టుకు దూరమైతే.. ఆటోమేటిక్‌గా సిరాజ్ జట్టులోకి వచ్చేస్తాడు. కాబట్టి సిరాజ్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి. బాగా ప్రాక్టీస్ చేయాలి.చాంపియన్స్ ట్రోఫీలో ఆడబోతున్నానని భావించి పూర్తి ఫిట్‌గా.. అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలి. గాయం నుంచి కోలుకున్న తర్వాత షమీ ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ఇక బుమ్రా ఒక్క వన్డేలోనూ భాగం కాలేదు. కాబట్టి సిరాజ్‌కు గనుక చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం వస్తే నాకైతే సంతోషమే’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన ప్రాథమిక జట్టులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది.చదవండి: పరాయి స్త్రీలను తాకను.. ఇంత పొగరు పనికిరాదు! -
షమీ రీఎంట్రీ.. మళ్లీ వాయిదా?!.. గంభీర్‌తో సమస్యా?
సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టీమిండియా పునరాగమనం కోసం మరికొన్నాళ్లు వేచిచూడక తప్పదని సమాచారం. పూర్తి ఫిట్‌గా ఉన్నా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో(India vs England 3rd T20I)నూ అతడిని ఆడించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇందుకు గల కారణాలను షమీ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.కాగా దశాబ్ద కాలంగా టీమిండియా తరఫున నిలకడగా రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్‌గా షమీకి పేరుంది. అయితే, వన్డే ప్రపంచకప్-2023 సందర్భంగా గాయపడ్డ ఈ బెంగాల్ పేసర్ కోలుకోవడానికి ఈసారి చాలా సమయమే పట్టింది. చీలమండ గాయం వేధిస్తున్నా.. వరల్డ్‌కప్ టోర్నీని పూర్తయ్యేదాకా పంటిబిగువన నొప్పిని భరించిన షమీ.. సొంతగడ్డపై జరిగిన ఈ మెగా ఈవెంట్లో ఇరవై నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.శస్త్ర చికిత్స తర్వాతతద్వారా ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన షమీ.. అనంతరం చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో దాదాపు ఏడాదికాలంగా టీమిండియాకు దూరమైన ఈ రైటార్మ్ పేసర్.. దేశవాళీ క్రికెట్‌తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. బెంగాల్ తరఫున దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ బరిలో దిగాడు. నిలకడగా బౌలింగ్ చేయడంతో వికెట్లు తీసిన షమీ... ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు.ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ సెలక్టర్లు షమీకి చోటిచ్చారు. ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20తో అతడు రీఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ.. తుదిజట్టులో మాత్రం షమీకి చోటు దక్కలేదు. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా స్పిన్నర్లకు పెద్దపీట వేసిన క్రమంలో అతడికి మొండిచేయి ఎదురైంది.పూర్తి ఫిట్‌గా ఉన్నాడుఅదే విధంగా.. చెన్నైలో జరిగిన రెండో టీ20లోనూ షమీని ఆడించలేదు. తాజా సమాచారం ప్రకారం.. రాజ్‌కోట్‌లో జరిగే మ్యాచ్‌లోనూ అతడిని మేనేజ్మెంట్ పక్కనపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై షమీ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ స్పందించాడు. రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘కోల్‌కతాలో జరిగిన తొలి టీ20కి ముందే షమీ నన్ను తన దగ్గరకు పిలిపించాడు.అంతా బాగానే ఉందని.. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు చెప్పాడు. అయితే, జట్టు యాజమాన్యం ఆలోచన మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాది కాలంగా అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కాబట్టి షమీ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.గంభీర్‌తో సమస్యా?అయితే, ఇంగ్లండ్‌తో ఆఖరి రెండు టీ20లలో మాత్రం అతడిని ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. అదే విధంగా.. వన్డే సిరీస్‌లోనూ షమీకి అవకాశం ఇస్తారు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ మేరకు మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతిమంగా యాజమాన్యం నిర్ణయాలే చెల్లుబాటు అవుతాయి. కోచ్ గౌతం గంభీర్, షమీ మధ్య సమన్వయ, సమాచార లోపం లేదనే అనుకుంటున్నా’’ అని బద్రుద్దీన్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన సూర్యకుమార్ సేన.. రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో గట్టెక్కింది. తద్వారా 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. రాజ్‌కోట్‌లో మంగళవారం ఇంగ్లండ్‌తో మూడో టీ20లో తలపడనుంది.చదవండి: IND vs ENG: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
Ind vs Eng: టీమిండియాకు ఎదురుదెబ్బ.. విధ్వంసకర వీరుడికి గాయం!
ఇంగ్లండ్‌తో రెండో టీ20కి టీమిండియా(India Vs England 2nd T20) పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. విజయంతో ఆరంభించిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిపత్యమే లక్ష్యంగా చెపాక్ బరిలో దిగనుంది. అయితే, చెన్నై మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిన అభిషేక్ శర్మ(Abhishek Sharma) గాయపడినట్లు సమాచారం. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా శుక్రవారం సాయంత్రం చిదంబరం స్టేడియంలో నెట్స్‌లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు.చీలమండ నొప్పిఈ సందర్భంగానే అభిషేక్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. అతడి పాదం మెలిక పడగా.. చీలమండ నొప్పి(Ankle Injury)తో విలవిల్లాడాడు. ఈ క్రమంలో వెంటనే ఫిజియోలు వచ్చి అభిషేక్‌ను పరీక్షించారు. అనంతరం అతడు మైదానం వీడాడు. అయితే, మళ్లీ నెట్ సెషన్లో బ్యాటింగ్‌కు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో శనివారం నాటి రెండో టీ20కి అభిషేక్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అన్న అంశంపై సందిగ్దం నెలకొంది.సంజూకు జోడీ ఎవరు?ఒకవేళ అభిషేక్ శర్మ గనుక దూరమైతే సంజూ శాంసన్‌తో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా వస్తాడా? లేదంటే ప్రయోగాత్మకంగా ఇంకెవరినైనా టాపార్డర్‌కు ప్రమోట్ చేస్తాడా? అనే చర్చ జరుగుతోంది. కాగా ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.తొలి టీ20లో అభిషేక్ ధనాధన్టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత జట్టు.. బట్లర్ బృందాన్ని 132 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం.. లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్(20 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ధనాధన్ దంచికొట్టాడు. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొన్న 24 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 79 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లతో పాటు ఏకంగా ఎనిమిది సిక్సర్లు ఉండటం విశేషం.మిగతా వాళ్లలో కెప్టెన్ సూర్యకుమార్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ 19, హార్దిక్ పాండ్యా 3 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో కేవలం మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.షమీ వస్తాడా?కాగా టీమిండియలో పునగామనం కోసం ఎదురుచూస్తున్న సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీకి కోల్‌కతాలో మొండిచేయి ఎదురైన విషయం తెలిసిందే. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన క్రమంలో షమీకి చోటు ఇవ్వలేకపోయినట్లు మేనేజ్మెంట్ వర్గాలు తెలిపాయి. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అద్భుత గణాంకాలు కలిగి ఉన్న యువ పేసర్ అర్ష్‌దీప్ ఒక్కడికే తుదిజట్టులో దక్కగా.. షమీ బెంచ్‌కే పరిమితమయ్యాడు.అయితే, తొలి టీ20లో ప్రభావం చూపలేకపోయినప్పటికీ రవి బిష్ణోయికి మరో అవకాశం ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. చెపాక్ పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది కాబట్టి వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లతో పాటు అతడినీ రెండో టీ20లో కొనసాగించే అవకాశం ఉంది. ఇక అభిషేక్ శర్మ గాయంతో దూరమైతే గనుక షమీని తుదిజట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పొదుపుగా బౌలింగ్ చేయలేకపోయాడు. ఆరంభ ఓవర్లలో అర్ష్‌దీప్ త్వరత్వరగా వికెట్లు తీశాడు కాబట్టి సరిపోయింది. అందుకే ఈసారి అర్ష్‌దీప్‌తో పాటు షమీని కొత్త బంతితో బరిలోకి దించాలనే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా చెన్నైలో చిదంబరం స్టేడియం(చెపాక్)లో శనివారం రాత్రి ఏడు గంటలకు ఇండియా- ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 ఆరంభం కానుంది.చదవండి: భారత్‌తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు -
ఇంగ్లండ్‌తో రెండో టీ20.. చెపాక్లోనైనా మహ్మద్ షమీ ఆడుతాడా?
కోల్‌కతాలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు చెన్నై వేదికగా రెండో మ్యాచ్‌కు సిద్దమైంది. శనివారం చెన్నైలోని ఐకానిక్ ఎంఎ చిదంబరం స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు రెండో టీ20లో తలపడనున్నాయి.రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా పర్యాటక ఇంగ్లండ్‌ను చిత్తు చేసి సిరీస్ అధిక్యాన్ని పెంచుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఇంగ్లీష్ జట్టు చెన్నై టీ20లో ఎలాగైనా తిరిగిపుంజుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే చెన్నై చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాయి.మహ్మద్ షమీ రీ ఎంట్రీ ఇస్తాడా?అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో అందరి అందరి కళ్లు సీనియర్ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమీపైనే ఉన్నాయి. గాయం కారణంగా ఏడాదికి పైగా ఆటకు దూరమై, ఎట్టకేలకు భారత జట్టులోకి పునరాగమనం చేసిన షమీ.. కోల్‌కతా వేదికగా జరిగిన టీ20లో ఆడుతాడని అంతా భావించారు. కానీ తుది జట్టులో మాత్రం షమీకి చోటు దక్కలేదు.అతడిని ఎందుకు పక్కన పెట్టారన్న విషయంపై జట్టు మెనెజ్‌మెంట్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. షమీ మళ్లీ గాయపడ్డాడా లేదా కావాలనే పక్కన పెట్టారన్న అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రెండో టీ20లో కూడా షమీ ఆడేది అనుమానంగానే మారింది. ఎందుకంటే చెపాక్ స్టేడియం సాధరణంగా స్పిన్‌కు అనుకూలిస్తోంది. దీంతో రెండో టీ20లో కూడా భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవిబిష్ణోయ్‌లు చెపాక్ టీ20లో కూడా ఆడే సూచనలు కన్పిస్తున్నాయి. ఒకవేళ తుది జట్టులో షమీకి ఛాన్స్ ఇవ్వాలని జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తే పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డిపై వేటు వేసే ఛాన్స్ ఉంది. ఇక రెండో టీ20లో ఇంగ్లండ్ తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. గాస్ అట్కిన్సన్ స్ధానంలో బ్రైడన్ కార్సేకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటుదక్కింది.టీమిండియాతో రెండో టీ20కి ఇంగ్లండ్ తుదిజట్టు:బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెతెల్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.భారత్ తుది జట్టు(అంచనా): సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి/మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి -
Ind vs Eng: షమీని తప్పించడానికి కారణం అతడే?
ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన తొలి టీ20(India vs England) మ్యాచ్‌లో టీమిండియా అభినుల అందరి దృష్టి పేస్ బౌలర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) పైనే నిలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడా(India Beat England)తో సునాయాసంగా విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా.. అయిదు మ్యాచ్‌లో సిరీస్‌లో శుభారంభం చేసింది. అయితే దాదాపు పద్నాలుగు నెలల తర్వాత ఈ మ్యాచ్ ద్వారా మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు షమీ సిద్ధంగా ఉన్నాడు. కానీ బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో షమీని భారత్ తుది జట్టు నుంచి తప్పించారు. సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డితో పాటు భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌తో రంగంలోకి దిగింది.షమీ ఎందుకు ఆడలేదు? కానీ ఎందుకు షమీ ఆడలేదు? అతను పూర్తి ఫిట్నెస్ తో లేడా? అలాంటప్పుడు అసలు జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారు? ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి షమీ మ్యాచ్ ప్రాక్టీస్ చేయడానికి ఇదొక చక్కని అవకాశం. జట్టులోని ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పై అనుమానాలు ఉన్న సమయంలో షమీ మ్యాచ్ ప్రాక్టీస్ తో పూర్తిగా సిద్ధమవడం భారత్ జట్టు ప్రయోజనాల దృష్ట్యా చాలా కీలకం. దీని వెనుక కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మక ఎత్తుగడ ఏమైనా ఉందా అన్న ప్రశ్నఅందరి లో తలెత్తకమానదు.ఎందుకంటే మ్యాచ్ కి కొద్దీ సేపు ముందు జరిగిన తుది ప్రాక్టీస్ లో షమీ బౌలింగ్ చేయడం ఈడెన్ గార్డెన్స్ లోని ప్రేక్షకులందరూ ప్రత్యక్షంగా చూసారు. షమీ పూర్తి స్థాయి లో బౌలింగ్ చేయకపోయినా ఎలాంటి అసౌకర్యంతో ఉన్నట్టు కన్పించలేదు. మ్యాచ్ కి ముందు వార్మప్‌లలో బౌలింగ్ చేశాడు. దీంతో అతను పూర్తి ఫిట్నెస్ తో ఉన్నట్టు తేటతెల్లమైంది. మరి ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ ఓపెనర్‌లో షమీ ఎందుకు ఆడలేదు? మ్యాచ్ కి ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మేము పిచ్ ని దృష్టిలో ఉంచుకొని తుది జట్టుని నిర్ణయించాం. అందుకే షమీ ఈ మ్యాచ్ లో ఆడటంలేదని చెప్పాడు. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోకి దిగడం విశేషం.ఫిట్‌గా లేడేమో?కాగా షమీ చివరిసారి 2023 నవంబర్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో అతని చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. "షమీ ఆడటం లేదు అంటే అతను ఈ మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్ నెస్ తో లేడని స్పష్టంగా తెలుస్తోంది. అర్ష్‌దీప్ రూపంలో భారత్ ఒక ఫ్రంట్‌లైన్ పేసర్‌ను మాత్రమే ఆడించాలని నిర్ణయించుకుంది. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరూ పేస్ బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ఆల్‌రౌండర్లు. ఇంగ్లాండ్ ఇందుకు భిన్నంగా నాలుగు పేసర్లను రంగంలోకి దించింది" అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.పరిస్థితులకు అనుగుణంగానేఈ మ్యాచ్ లో 34 బంతుల్లో 79 పరుగులు చేసిన భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనంతరం మాట్లాడుతూ, పరిస్థితుల ఆధారంగా జట్టు యాజమాన్యం షమీ నిర్ణయం తీసుకుందని అన్నాడు. "ఇది జట్టు యాజమాన్యం నిర్ణయం అని నేను భావిస్తున్నాను. పిచ్ పరిస్థితుల అనుగుణంగా చూసినట్టయితే ఇదే సరైన నిర్ణయమని వారు భావించారు" అని మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో అభిషేక్ అన్నాడు.గంభీర్ నిర్ణయమేనా?ఇది పూర్తిగా కోచ్ గంభీర్ నిర్ణయంలాఅనిపిస్తోంది. జట్టులో ఉన్న స్టార్ సంస్కృతికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని భావించాల్సి ఉంటుంది. భారత్ జట్టు ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించిన దృష్ట్యా చూస్తే ఈ వ్యూహం ఫలించిందని చెప్పాలి. ఇక షమీని తప్పించిన విషయాన్ని పక్కన పెడితే , ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై సరైన నిర్ణయమే అని రుజువైంది. మరి రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కి ఈ సిరీస్ సన్నాహక టోర్నమెంట్ గా భావిస్తున్న నేపథ్యంలో షమీ ఆడటం చాలా కీలకం. చెన్నై లో జరిగే రెండో మ్యాచ్ లో షమీ రంగప్రవేశం చేస్తాడేమో చూడాలి. -
టీమిండియా అభిమానుల కళ్లన్నీ అతడి పైనే!
ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానులందరి దృష్టి పేస్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) మీదే ఉంది. దాదాపు పద్నాలుగు నెలల విరామం తర్వాత టీమిండియాలోకి వచ్చిన షమీ త్వరలో జరగనున్న ఇంగ్లండ్ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. అనంతరం ప్రతిష్టాత్మకమైన చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సిద్ధం కానున్నాడు. ఎడమ మోకాలిపై పట్టీతోనే ప్రాక్టీస్ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆదివారం కసరత్తు ప్రారంభించాడు. జనవరి 22 నుండి ఇంగ్లండ్‌తో(India vs England) జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో షమీ తొలుత పాల్గొంటాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న 34 ఏళ్ళ షమీ తన ఎడమ మోకాలిపై పట్టీతోనే ప్రాక్టీస్ పిచ్‌లపై తన బౌలింగ్ కసరత్తు ప్రారంభించడం గమనార్హం. మొదట కొద్దిగా మెల్లిగా బౌలింగ్ చేసినప్పటికీ క్రమంగా తన వేగాన్నిపెంచి.. తన రిథమ్ సాధించేందుకు ప్రయత్నించాడు. షమీ చివరిసారిగా అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ప్రపంచ కప్ ఫైనల్ లో టీమిండియాకి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత చీలమండ గాయం కారణంగా శస్త్రచికిత్స జరగడంతో భారత్ జట్టుకు దూరమయ్యాడు.బుమ్రా ఫిట్‌నెస్‌పై ఆందోళన భారత్ జట్టు ప్రధాన బౌలర్ అయినా జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) వెన్నునొప్పి కారణంగా ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ మధ్యలో తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా చాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతుండటంతో ఎంతో అనుభవజ్ఞుడైన షమీ పునరాగమనం భారత్ జట్టుకి ఎంతో కీలకం. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేయాలనీ టీం మేనేజ్మెంట్ కోరింది.అక్కడ అతని ఫిట్నెస్ను వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌లోని మొదటి రెండు వన్డేలకు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశం లేదు. అయితే మూడో వన్డేకి బుమ్రా జట్టులో చేరే అవకాశం ఉందని, చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో బుమ్రా పాల్గొంటాడని, భారత్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల వెల్లడించాడు.అర్ష్‌దీప్ సింగ్‌కు అంతటి అనుభవం లేదుఅయితే బుమ్రా సకాలంలో కోలుకోలేని పక్షం లో షమీ పైనే భారత్ జట్టు భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం మహమ్మద్ సిరాజ్ కూడా జట్టులో లేనందున పెద్దగా అనుభవం లేని అర్ష్‌దీప్ సింగ్ పై జట్టు నుంచి పెద్దగా ఆశించడం కష్టమే. 2015లో ఆస్ట్రేలియా జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్ లో భారత్ జట్టు సెమీఫైనల్ కి చేరడంలో కీలక పాత్ర వహించిన షమీ పాత, కొత్త బంతుల్తో నిర్దిష్టమైన లైన్ వేయడంలో మంచి దిట్ట.కొద్దిగా అనుకూలించే పిచ్‌లపై చెలరేగిపోయే షమీని ఎదుర్కోవడం బ్యాటర్లకు ఆషామాషీ విషయం కాదు. ప్రస్తుతం అద్భుత ఫామ్ తో ఉన్న బుమ్రాకి షమీ తోడైతే భారత్ బౌలింగ్ ప్రత్యర్థి జట్లకు పెద్ద సవాలుగా తయారవుతుందనడంలో సందేహం లేదు. గత కొద్ది కాలంగా భారత్ స్వదేశంలో మాత్రమే కాకా విదేశాల్లో కూడా విజయాలు సాధించడంలో బుమ్రా, షమీ కీలక పాత్ర పోషించారనడంలో సందేహం లేదు.షమీ లేని లోటు కనిపించిందిఇక ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటన లో షమీ లేని లోటు భారత్ జట్టులో స్పష్టంగా కనిపించింది. బుమ్రా వొంటి చేత్తో తొలి టెస్ట్ గెలిపించినా అతనికి మరో వైపు నుంచి సహకారం కొరవడింది. సిరాజ్ అడపా దడపా మెరుపులు మెరిపించినా, కీలకమైన సమయాల్లో వికెట్లు సాధించడంలో విఫలమయ్యాడు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో కూడా సిరాజ్ ఆశించిన రీతిలో రాణించలేదు.ఈ కారణంగానే బుమ్రా జట్టు భారమంతా భుజానికెత్తుకుని విపరీతంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని ఫలితంగానే బుమ్రా చివరి టెస్ట్ మధ్యలో వెన్ను నొప్పితో వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం షమీ పైనే భారత్ జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే షమీ పూర్తిగా కోలుకున్నాడా లేదా? బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి పూర్తి ఫిటెనెస్ సాధిస్తాడా లేదా అన్న అంశాలపైనే భారత్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.చదవండి: ‘అతడి కథ ముగిసిపోయింది.. ఇకపై టీమిండియాలో చోటు ఉండదు’ -
షమీ పునరాగమనం
న్యూఢిల్లీ: సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ భారత జట్టులోకి 14 నెలల తర్వాత పునరాగమనం చేశాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే టి20 సిరీస్ కోసం సెలక్టర్లు శనివారం ఎంపిక చేసిన జట్టులో షమీకి చోటు లభించింది. ముందుగా కాలి మడమ, ఆపై మోకాలి గాయంతో బాధపడిన షమీ చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. 2023 నవంబర్ 19న ఆ్రస్టేలియాతో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన తర్వాత టీమిండియాకు ప్రాతినిధ్యం వహించలేదు. గాయంతో కోలుకొని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిలిటేషన్ తర్వాత దేశవాళీ క్రికెట్లోకి అడుగు పెట్టిన షమీ వరుసగా మూడు ఫార్మాట్లలో కూడా ఆడి మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. రంజీ ట్రోఫీ, ముస్తాక్ అలీ టి20 టోర్నీలతో ప్రస్తుతం గురువారం విజయ్‌హజారే వన్డే టోర్నీ ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో కూడా షమీ బరిలోకి దిగాడు. ఇటీవల ఆ్రస్టేలియాతో ముగిసిన ఐదు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం షమీని ఎంపిక చేసే అంశంపై చర్చ జరిగింది. అయితే పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో అతడిని జట్టులోకి తీసుకునేందుకు సెలక్టర్లు ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో పెద్ద సంఖ్యలో ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత షమీ ఫిట్‌గా ఉన్నట్లు తేలింది. నిజానికి భారత్ తరఫున నవంబర్ 2022 తర్వాత అతను టి20 మ్యాచ్ ఆడలేదు. ఈ ఫార్మాట్లో యువ పేసర్ల రాకతో షమీ దాదాపుగా జట్టుకు దూరమైపోయాడు. అయితే ఈ సిరీస్ తర్వాత ఇంగ్లండ్‌తోనే జరిగే వన్డే సిరీస్, ఆపై చాంపియన్స్ ట్రోఫీ కోసం జట్లను ఎంపిక చేయనున్న నేపథ్యంలో వాటికి ముందు టి20ల ద్వారా షమీ ఫిట్నెస్ను పూర్తి స్థాయిలో పరీక్షించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అందుకే ఈ ఫార్మాట్లో అతనికి చోటు లభించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో 15 మంది సభ్యుల ఈ బృందం ఎంపికలో ఎలాంటి భారీ మార్పులు, సంచలనాలు చోటు చేసుకోలేదు. అయితే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడిన రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్‌లకు విశ్రాంతినివ్వగా...గాయంపై స్పష్టత లేకపోవడంతో బుమ్రాను కూడా ఎంపిక చేయలేదు. భారత జట్టు తమ చివరి సిరీస్ ఆడిన టీమ్‌లో (దక్షిణాఫ్రికాతో) ఉన్న ఐదుగురు ఆటగాళ్లు తమ స్థానాలు నిలబెట్టుకోలేకపోయారు. రమణ్‌దీప్ సింగ్, జితేశ్ శర్మ, అవేశ్ ఖాన్, యశ్ దయాళ్, విజయ్‌కుమార్ వైశాక్‌లను పక్కన పెట్టిన సెలక్టర్లు ఆసీస్‌తో టెస్టులు ఆడిన నితీశ్, హర్షిత్, సుందర్, జురేల్‌లను ఈ టి20 టీమ్‌లోకి తీసుకున్నారు. భుజం గాయంతో బాధపడుతున్న రియాన్ పరాగ్నూ పక్కన పెట్టారు. ఈ నెల 22, 25, 28, 31, ఫిబ్రవరి 2న జరిగే ఐదు టి20 మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. భారత జట్టు వివరాలు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్ ), సంజు సామ్సన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్, మొహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురేల్. -
వరల్డ్ రికార్డుపై కన్నేసిన షమీ.. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడంటే..
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) అరుదైన ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో గనుక అతడు రాణిస్తే.. మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంటాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023లో షమీ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే.కాస్త ఆలస్యంగా ఈ మెగా టోర్నీలో ఎంట్రీ ఇచ్చినా.. వికెట్ల వేటలో మాత్రం దూసుకుపోయాడు షమీ. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో ఏకంగా 24 వికెట్లు కూల్చి.. లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయితే, వరల్డ్‌కప్ మధ్యలోనే చీలమండ నొప్పి వేధించినా లెక్కచేయని షమీ.. టోర్నీ ముగిసిన తర్వాత మాత్రం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన షమీ.. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి దాదాపు ఏడాది కాలం పట్టింది. అయితే, ఇప్పటి వరకు అతడు టీమిండియాలో పునరాగమనం చేయలేకపోయాడు. తొలుత దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన ఈ పేస్ బౌలర్.. పదకొండు వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో షమీ స్థానం దక్కించుకున్నాడు. సొంతగడ్డపై జరిగే ఈ సిరీస్ సందర్భంగా అతడు రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఇంగ్లండ్‌తో వన్డేల్లోనూ షమీ చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయమైంది.ఈ నేపథ్యంలో షమీని ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో అతడు ఐదు వికెట్లు తీస్తే చాలు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్లో చేరిన మొదటి క్రికెటర్‌గా నిలుస్తాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది.షమీ ఇప్పటికి 100 ఇన్నింగ్స్లోస్టార్క్ 102 ఇన్నింగ్స్‌లో 200 వికెట్ల మార్కును అందుకున్నాడు. అయితే, షమీ ఇప్పటికి 100 ఇన్నింగ్స్‌లో 195 వికెట్లు పడగొట్టాడు. కాబట్టి తదుపరి ఆడబోయే వన్డేలో షమీ ఐదు వికెట్లు తీశాడంటే.. స్టార్క్ వరల్డ్ రికార్డును అతడు బద్దలుకొడతాడు. ఇక భారత్ తరఫున అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్‌గా.. టీమిండియా ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కొనసాగుతున్నాడు. అతడు 133 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ అందుకున్నాడు.కాగా టీమిండియా ఇంగ్లండ్‌తో జనవరి 22- ఫిబ్రవరి 2 వరకు ఐదు టీ20లు ఆడనుంది. అనంతరం.. ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది. ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో తొలి వన్డే, ఫిబ్రవరి 9న కటక్‌లో రెండో వన్డే, ఫిబ్రవరి 12న మూడో అహ్మదాబాద్‌లో మూడో వన్డే జరుగనున్నాయి.వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్లు వీరే1. మిచెల్ స్టార్క్- 102 మ్యాచ్‌లలో2. సక్లెయిన్ ముస్తాక్- 104 మ్యాచ్‌లలో3. ట్రెంట్ బౌల్ట్- 107 మ్యాచ్‌లలో4. బ్రెట్ లీ- 112 మ్యాచ్‌లలో5. అలెన్ డొనాల్డ్- 117 మ్యాచ్‌లలో.చదవండి: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్‌స్టార్‌పై వేటు! -
Ind vs Eng: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్‌స్టార్‌పై వేటు!
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్(India vs England)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని ఈ జట్టులో పదిహేను మందికి స్థానం కల్పించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎట్టకేలకు షమీ పునరాగమనంఇక ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఎట్టకేలకు పునరాగమనం చేయనున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ బెంగాల్ బౌలర్.. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ బరిలో దిగిన షమీ.. తొమ్మిది మ్యాచ్‌లు ఆడి పదకొండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ బెంగాల్ తరఫున బరిలోకి దిగి.. ఎటువంటి ఇబ్బంది లేకుండా పది ఓవర్ల కోటా పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఫిట్నెస్ నిరూపించుకున్న షమీకి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఇక పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు, మరో స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ విశ్రాంతి పేరిట జట్టుకు దూరమయ్యారు.వైస్ కెప్టెన్‌గా అతడేఈ క్రమంలో షమీ సారథ్యంలోని పేస్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నారు. ఇక స్పిన్నర్ల కోటాలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్షోయి స్థానం సంపాదించగా.. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(Axar Patel), వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యారు. ఇక ఈ సిరీస్ ద్వారా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.సూపర్‌స్టార్‌పై వేటు!మరోవైపు.. సూపర్‌స్టార్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)ను మాత్రం సెలక్టర్లు ఇంగ్లండ్‌తో టీ20లకు ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్‌తో పాటు ధ్రువ్ జురెల్ చోటు దక్కించుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కారణంగా బిజీగా గడిపిన పంత్‌కు విశ్రాంతినిచ్చారా? లేదంటే అతడిపై వేటు వేశారా అన్నది మాత్రం తెలియరాలేదు.ఇక సౌతాఫ్రికాలో మాదిరి ఈసారి కూడా అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. లెఫ్టాండర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్ కూడా ఈ జట్టులో ఉన్నారు. సౌతాఫ్రికా పర్యటనలో అదరగొట్టిన టీమిండియాకాగా సూర్య సేన చివరగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ ఆడింది. ఆ టూర్లో సంజూ శాంసన్, తిలక్ వర్మ రెండేసి శతకాలతో దుమ్ములేపారు. వీళ్లిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ప్రొటిస్ జట్టును 3-1తో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20లుకోల్‌కతా వేదికగా జనవరి 22న మొదటి టీ20 జరుగనుండగా.. జనవరి 25న చెన్నై రెండో టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం.. జనవరి 28న రాజ్‌కోట్‌లో మూడో టీ20.. జనవరి 31న పుణె వేదికగా నాలుగో టీ20, ఫిబ్రవరి 2న ముంబైలో ఐదో టీ20 జరుగనుంది. అయితే, ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు మాత్రం బీసీసీఐ జట్టును ప్రకటించలేదు.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్). చదవండి: స్టీవ్ స్మిత్ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్’ రికార్డ్! -
Ind vs Eng: నేను సిద్ధం.. సెలక్టర్లకు మెసేజ్ ఇచ్చిన భారత పేసర్!
వెటరన్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టీమిండియా పునరాగమనానికి సై అంటున్నాడు. ఇప్పటికే దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఈ బెంగాల్ బౌలర్.. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆకట్టుకుంటున్నాడు. మధ్యప్రదేశ్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో(42 పరుగులు నాటౌట్)నూ సత్తా చాటిన షమీ.. తాజాగా ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో బంతితో రాణించాడు.వడోదర వేదికగా తొలి ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ - హర్యానా(Haryana vs Bengal) మధ్య గురువారం మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హర్యానాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అర్ష్ రంగా(23), హిమాన్షు రాణా(14) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. కెప్టెన్, వన్‌డౌన్ బ్యాటర్ అంకిత్ కుమార్(18) కూడా నిరాశపరిచాడు.రాణించిన మిడిలార్డర్ బ్యాటర్లుఅయితే, మిడిలార్డర్లో పార్థ్ వత్స్(62), నిశాంత్ సింధు(64) మాత్రం దుమ్ములేపారు. ఇద్దరూ అర్ధ శతకాలతో రాణించి.. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించారు. మిగిలిన వాళ్లలో రాహుల్ తెవాటియా(29) ఫర్వాలేదనిపించగా.. ఎనిమిదో స్థానంలో వచ్చిన సుమిత్ కుమార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి హర్యానా 298 పరుగులు చేసింది.ఇక ఈ మ్యాచ్‌లో బెంగాల్ పేసర్ మహ్మద్ షమీ తన బౌలింగ్ కోటా పూర్తి చేయడంతో పాటు.. వికెట్లు తీయడం టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. హర్యానాతో మ్యాచ్‌లో షమీ పది ఓవర్లు బౌల్ చేసి.. 61 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆరంభంలో ఓపెనర్ హిమాన్షు రాణాను అవుట్ చేసిన షమీ.. డెత్ ఓవర్లలో దినేశ్ బనా(15), అన్షుల్ కాంబోజ్(4)లను వెనక్కి పంపాడు.సర్జరీ తర్వాత నో రీ ఎంట్రీఇలా ఓవరాల్‌గా తన ప్రదర్శన ద్వారా షమీ.. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నాననే సంకేతాలు ఇచ్చాడు. మిగతా బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు, సయాన్ ఘోష్, ప్రదీప్త ప్రామాణిక్, కౌశిక్ మైటీ, కరణ్ లాల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా షమీ టీమిండియాకు చివరగా ఆడాడు.స్వదేశంలో జరిగిన నాటి ఐసీసీ టోర్నీలో ఈ రైటార్మ్ పేసర్ 24 వికెట్లతో సత్తా చాటాడు. చీలమండ గాయం వేధిస్తున్నా ఈ మెగా ఈవెంట్లో కొనసాగిన షమీ.. అనంతరం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన మహ్మద్ షమీ.. ఇంత వరకు భారత జట్టులో రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు.నేను సిద్ధం.. సెలక్టర్లకు మెసేజ్!కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి.. పదకొండు వికెట్లు తీసినా.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి అతడిని పక్కనపెట్టారు. టెస్టుల్లో బౌలింగ్ చేసే స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదన్న కారణంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. అయితే, తదుపరి టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. జనవరి 22 నుంచి ఐదు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. ఈ నేపథ్యంలో షమీ పది ఓవర్ల కోటా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసి.. తానూ రేసులో ఉన్నానని సెలక్టర్లకు గట్టి సందేశం ఇచ్చాడు. చదవండి: ‘చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!’ -
ఇంకెన్నాళ్లు ఇలా?.. అతడిని ఆస్ట్రేలియా టూర్‌కి పంపాల్సింది!
వెటరన్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టీమిండియా పునరాగమనం ఎప్పుడు? ఇప్పటికే ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు దూరమైన ఈ సీనియర్ బౌలర్.. కనీసం ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు అయినా అందుబాటులోకి వస్తాడా?.. ఇంతకీ షమీకి ఏమైంది? అతడి గాయం తీవ్రత ఎలా ఉంది?.. దేశవాళీ క్రికెట్ ఆడేందుకు తప్ప జాతీయ జట్టుతో చేరేందుకు అతడు సిద్ధంగా లేడా?..భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) వ్యక్తం చేస్తున్న సందేహాలు ఇవి. అసలు షమీ ఫిట్నెస్ గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గానీ.. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) గానీ స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదని ఈ మాజీ క్రికెటర్ ప్రశ్నిస్తున్నాడు. తానే గనుక బీసీసీఐ నాయకత్వంలో ఉంటే గనుక షమీని కచ్చితంగా ఆస్ట్రేలియా పర్యటనకు పంపించేవాడినని పేర్కొన్నాడు.అదే ఆఖరుకాగా వన్డే ప్రపంచకప్-2023(ODI World Cup 2023) సందర్భంగా మహ్మద్ షమీ చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ టోర్నీలో ఈ రైటార్మ్ పేసర్ ఏకంగా 24 వికెట్లు పడగొట్టాడు. చీలమండ నొప్పి వేధిస్తున్నా బంతితో మైదానంలో దిగి.. ప్రత్యర్థులకు వణుకుపుట్టించాడు. అద్భుత ప్రదర్శనతో టీమిండియా ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.దేశీ టీ20 టోర్నీతో రీ ఎంట్రీఅయితే, దురదృష్టవశాత్తూ టైటిల్ పోరులో రోహిత్ సేన ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈ మెగా ఈవెంట ముగిసిన తర్వాత షమీ చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అనంతరం బెంగళూరులోని ఎన్సీఏలో పునరావాసం పొందాడు. దాదాపు ఏడాది తర్వాత దేశీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా బెంగాల్ తరఫున బరిలోకి దిగాడు.ఈ టోర్నీలో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన షమీ.. పదకొండు వికెట్లు తీసి సత్తా చాటాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో ఓవరాల్‌గా 201 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అప్పటికే ఆసీస్‌తో టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ మొదలుపెట్టగా.. కనీసం మూడో టెస్టు నుంచైనా షమీ జట్టుతో చేరతాడనే వార్తలు వచ్చాయి.కొన్నాళ్లు విరామం కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం షమీ గాయంపై స్పష్టత లేదని.. అతడి ఫిట్నెస్ గురించి తమకు పూర్తి సమచారం లేదని పేర్కొన్నాడు. దీంతో షమీ ఆసీస్ టూర్ అటకెక్కింది. ఈ క్రమంలో కొన్నాళ్లు విరామం తీసుకున్న షమీ.. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో ఈ బెంగాల్ ఆటగాడు బ్యాట్ ఝులిపించడం విశేషం. 42 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో షమీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. మహ్మద్ సిరాజ్‌తో పాటు యువ పేసర్లు హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ పెద్దగా రాణించకపోవడంతో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై అదనపు భారం పడింది. ఇక ఈ సిరీస్‌ను టీమిండియా 1-3తో కోల్పోయిన విషయం తెలిసిందే.ఇంకెన్నాళ్లు ఇలా?ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘అసలు అతడు ఎక్కడ ఉన్నాడు? పూర్తి స్థాయిలో కోలుకునేది ఎప్పుడు? అతడిని ఇంకెన్నాళ్లు ఎన్సీఏలో కూర్చోబెడతారు? అతడి ఫిట్నెస్ గురించి, ప్రస్తుతం అతడి పరిస్థితి గురించి బీసీసీఐ గానీ, ఎన్సీఏ గానీ ఎందుకు సరైన సమాచారం ఇవ్వలేకపోతోంది. నిజానికి అతడికి ఉన్న నైపుణ్యాల దృష్ట్యా.. నేనైతే అతడు పూర్తి ఫిట్‌గా లేకున్నా ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లేవాడిని’’ అని షమీ గురించి ప్రస్తావించాడు.అతడిని ఆస్ట్రేలియా టూర్‌కి పంపాల్సింది!ఇందుకు ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ బదులిస్తూ.. ‘‘షమీ పూర్తి ఫిట్‌గా లేకపోయినా.. కనీసం నాలుగైదు ఓవర్లు అయినా బౌల్ చేసేవాడు. బ్యాకప్ సీమ్ బౌలింగ్ ఆప్షన్‌గా అందుబాటులో ఉండేవాడు. నిజంగా అతడు గనుక టీమిండియాతో ఉండి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా తదుపరి ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. మనసు మార్చుకున్న రోహిత్, కోహ్లి!? -
మొహమ్మద్ షమీ విధ్వంసం.. సెలెక్టర్లకు సవాల్
విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్ బౌలర్, బెంగాల్ ఆటగాడు మొహమ్మద్ షమీ చెలరేగిపోయాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షమీ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన షమీ.. 34 బంతుల్లో 5 బౌండరీలు, సిక్సర్ సాయంతో అజేయమైన 42 పరుగులు చేశాడు. షమీ బ్యాట్ ఝులిపించడంతో ఈ మ్యాచ్‌లో బెంగాల్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.సెలెక్టర్లకు సవాల్..తాజాగా ఇన్నింగ్స్‌తో షమీ భారత సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. గాయం కారణంగా చాలాకాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న షమీ.. ఇప్పుడిప్పుడే దేశవాలీ క్రికెట్ ఆడుతున్నాడు. షమీ ఫిట్‌గా ఉన్నప్పటికీ భారత సెలెక్టర్లు అతన్ని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి పరిగణలోకి తీసుకోలేదు. త్వరలో భారత్ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఆతర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లు తప్పించినా.. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీలో భాగం కావాలని షమీ భావిస్తున్నాడు. తాజా ఇన్నింగ్స్ షమీని టీమిండియా తలుపులు తట్టేలా చేస్తాయేమో వేచి చూడాలి.పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న కెప్టెన్ఈ మ్యాచ్‌లో బెంగాల్ కెప్టెన్ సుదీప్ ఘరామీ (99) పరుగు తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఘరామీ 125 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బెంగాల్ ఇన్నింగ్స్‌లో ఘరామీతో పాటు సుదీప్ ఛటర్జీ (47), షమీ (42 నాటౌట్), కౌశిక్ మైతి (20 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. షమీ-మైతీ జోడి ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 64 పరుగులు జోడించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆర్యన్ పాండే, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సరాన్ష్ జైన్, సాగర్ సోలంకీ చెరో వికెట్ దక్కించుకున్నారు.270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 23 ఓవర్ల అనంతరం 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. మధ్య ప్రదేశ్ ఓపెనర్లు హర్ష్ గావ్లీ, హిమాన్షు మంత్రి డకౌట్లయ్యారు. శుభమ్ శ్యామ్ సుందర్ శర్మ (53), కెప్టెన్ రజత్ పాటిదార్ (49) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ గెలవాలంటే మరో 27 ఓవర్లలో 162 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. -
అఫీషియల్.. ఆసీస్‌తో టెస్టు సిరీస్ నుంచి షమీ ఔట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టులకూ టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరిచింది. గాయం నుంచి కోలుకున్న షమీ.. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆఖరి రెండు టెస్టులకు షమీ అందుబాటులోకి వస్తాడని వార్తలు వినిపించాయి. అయితే షమీ మరోసారి గాయం బారిన పడ్డాడు.బౌలింగ్ ఓవర్‌లోడ్ కారణంగా షమీ మోకాలి వాపు సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ ఫార్మాట్లో సుదీర్ఘ స్పెల్‌లు వేయడానికి సిద్ధంగా లేడని బీసీసీఐ వైద్య బృందం తెల్చింది. ఈ క్రమంలోనే షమీ టీమిండియా రీఎంట్రీ మరింత అలస్యం కానుంది."ఈ ఏడాది రంజీ సీజన్లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ తరుపున షమీ 43 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో మొత్తం 9 మ్యాచ్‌ల్లో ఆడాడు. ఆ సమయంలో అతడు టెస్టు క్రికెట్లో ఆడేందుకు సిద్దంగా ఉన్నాడని భావించాము. అందుకు తగ్గట్టు షమీ కూడా అదనపు బౌలింగ్ ప్రాక్టీస్ సెషన్లలో పాల్గోన్నాడు. కానీ బౌలింగ్ వర్క్‌లోడ్ ఎక్కువ కావడంతో అతడి ఎడమ మోకాలి వాపు వచ్చింది. ఈ క్రమంలో అతడి గాయాన్ని బీసీసీఐ వైద్య బృందం పరిశీలించింది. అతడు ఇంకా ఎక్కువ ఓవర్ల పాటు బౌలింగ్ చేసే ఫిట్నెస్ సాధించలేదని మా వైద్య బృందం నిర్ధారించింది. అతడు పూర్తి స్ధాయి క్రికెట్‌కు అందుబాటులోకి రావడం మరింత సమయం పట్టనుంది.దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని మిగిలిన రెండు టెస్ట్‌లకు షమీ దూరం కానున్నాడు. అతడు ప్రస్తుతం మా వైద్య బృందం పరిశీలను ఉంటాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతను పాల్గొనడం కూడా అనుమానమే" అని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
BGT: మహ్మద్ షమీకి బైబై!
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేలా కనిపించడం లేదు. ఆసీస్‌తో మూడో టెస్టు నుంచే ఈ బెంగాల్ బౌలర్ భారత జట్టుకు అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇటీవల... వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడాయి.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ పూర్తి కాగానే‘‘షమీ టీమిండియా కిట్ ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ పూర్తి కాగానే అతడు కూడా కంగారూ గడ్డపై అడుగుపెట్టనున్నాడు’’ అని పేర్కొన్నాయి. అయితే, అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది. ఇప్పటికే టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మొదలైపోయింది.బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం ఈ మ్యాచ్ ఆరంభమైంది. మరోవైపు.. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే బెంగాల్ జట్టులో షమీ పేరును చేర్చారు సెలక్టర్లు. కాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ డిసెంబరు 21 నుంచి జనవరి 18 వరకు జరుగనుంది.షమీతో పాటు ముకేశ్ కుమార్ ఎంపికఈ నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనబోయే తమ జట్టులో ఇరవై మంది ఆటగాళ్లకు చోటిచ్చింది. సుదీప్ కుమార్ ఘరామీ కెప్టెన్సీలో ఆడబోయే ఈ టీమ్‌కు టీమిండియా స్టార్లలో మహ్మద్ షమీతో పాటు ముకేశ్ కుమార్‌ను కూడా ఎంపిక చేసింది. అదే విధంగా షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్ కూడా ఈ టోర్నీలో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు.చీలమండ గాయానికి సర్జరీకాగా 34 ఏళ్ల షమీ చివరగా వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. స్వదేశంలో జరిగిన ఈ ఐసీసీ టోర్నీలో షమీ 24 వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత అతడు చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు.దేశీ టీ20 టోర్నీలో షమీ అదుర్స్ఈ నేపథ్యంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావసం పొందిన షమీ.. దాదాపు ఏడాది తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లో అడుగుపెట్టాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో బెంగాల్ తరఫున బరిలోకి దిగాడు. ఈ టోర్నమెంట్లో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 7.85 ఎకానమీతో పదకొండు వికెట్లు తీశాడు.టీమిండియా తలుపులు తెరిచే ఉన్నాయి.. కానీతద్వారా టీ20 క్రికెట్లో 201 వికెట్లు పూర్తి చేసుకున్నాడు షమీ. ఈ క్రమంలో షమీ ఇక ఆస్ట్రేలియా విమానం ఎక్కడమే తరువాయి అనుకున్న తరుణంలో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. షమీ కోసం టీమిండియా తలుపులు తెరిచే ఉన్నాయని.. అయితే, అతడి ఫిట్‌నెస్‌పై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని పేర్కొన్నాడు.షమీకి బైబై చెప్పేశారా?కాగా షమీ ఫిట్‌గానే ఉన్నప్పటికీ ఐదు రోజుల క్రికెట్(టెస్టు) ఆడేందుకు అతడు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అందుకే బీసీసీఐ అతడిని ఆసీస్ పర్యటన నుంచి పూర్తిగా పక్కనపెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు షమీ సిద్ధం కావడం విశేషం.ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే రెండు టెస్టులు పూర్తి చేసుకున్న టీమిండియా.. బ్రిస్బేన్(డిసెంబరు 14-18), మెల్బోర్న్(డిసెంబరు 26-30), సిడ్నీ(జనవరి 3-7)లో మిగిలిన మూడు టెస్టులు ఆడనుంది. మరోవైపు.. షమీ భాగమైన బెంగాల్ జట్టు.. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా డిసెంబరు 21న ఢిల్లీతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.విజయ్ హజారే ట్రోఫీ-2024కు బెంగాల్ జట్టుసుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్), మహ్మద్ షమీ, అనుస్తుప్ మజుందార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుదీప్ ఛటర్జీ, కరణ్ లాల్, షకీర్ హబీబ్ గాంధీ (వికెట్ కీపర్), సుమంత గుప్తా, శుభమ్ ఛటర్జీ, రంజోత్ సింగ్ ఖైరా, ప్రదీప్తా ప్రామాణిక్, కౌశిక్ మైటీ, వికాస్ సింగ్, ముకేశ్ కుమార్, సక్షీమ్ చౌదరి, రోహిత్ కుమార్, మహ్మద్ కైఫ్, సూరజ్ సింధు జైస్వాల్, సయాన్ ఘోష్, కనిష్క్ సేథ్.చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
షాబాజ్ అహ్మద్ సుడిగాలి ఇన్నింగ్స్ వృథా.. సెమీస్‌లో బరోడా
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో మరో సెమీ ఫైనలిస్టు ఖరారైంది. బెంగాల్‌పై 41 పరుగుల తేడాతో గెలిచిన బరోడా టాప్-4లో అడుగుపెట్టింది. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టుకు కృనాల్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక అతడి తమ్ముడు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం ఈసారి దేశవాళీ క్రికెట్ బరిలో దిగాడు.ప్రపంచ రికార్డుకాగా కృనాల్ సారథ్యంలో బరోడా జట్టు ఈసారి అద్భుతాలు సృష్టించింది. లీగ్ దశలో భాగంగా సిక్కిం జట్టుపై పరుగుల విధ్వంసానికి పాల్పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 349 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సాధించింది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది.ఇదే జోరులో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్న బరోడా జట్టు.. బుధవారం బెంగాల్ జట్టుతో తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.రాణించిన ఓపెనర్లుపాండ్యా బ్రదర్స్ హార్దిక్(10), కృనాల్(7) పూర్తిగా విఫలమైనా.. ఓపెనర్లు శశ్వత్ రావత్(40), అభిమన్యు సింగ్(37) ఆకట్టుకున్నారు. వీరికి తోడు శివాలిక్ శర్మ(24), భాను పనియా(17), విష్ణు సోలంకి(16 నాటౌట్) రాణించారు. ఇక బెంగాల్ బౌలర్లలో మహ్మద్ షమీ, కనిష్క్ సేత్, ప్రదీప్త ప్రమాణిక్ తలా రెండు వికెట్లు దక్కించుకోగా.. సాక్షిమ్ చౌదరి ఒక వికెట్ పడగొట్టాడు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన బెంగాల్‌కు ఓపెనర్ అభిషేక్ పోరెల్(13 బంతుల్లో 22) మెరుపు ఆరంభం అందించినా.. మరో ఓపెనర్ కరణ్ లాల్(6), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ సుదీప్ కుమార్ ఘరామి(2) పూర్తిగా విఫలమయ్యారు. నాలుగో స్థానంలో వచ్చిన రితిక్ ఛటర్జీ సైతం డకౌట్‌గా వెనుదిరిగాడు.షాబాజ్ మెరుపు హాఫ్ సెంచరీఈ క్రమంలో రిత్విక్ చౌదరి(18 బంతుల్లో 29)తో కలిసి టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 36 బంతుల్లోనే 55 పరుగులతో షాబాజ్ చెలరేగాడు. అయితే, రితిక్‌ను హార్దిక్ పాండ్యా, షాబాజ్‌ను అతిత్ సేత్ అవుట్ చేయడంతో బెంగాల్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. బరోడా బౌలర్ల ధాటికి.. మిగతా వాళ్లలో ప్రదీప్త 3, సాక్షిమ్ చౌదరి 7, షమీ 0, కనిష్క్ 5(నాటౌట్), సయాన్ ఘోష్(0) చేతులెత్తేశారు.ఫలితంగా 18 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయిన బెంగాల్.. 41 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. మరోవైపు.. బరోడా సెమీ ఫైనల్స్‌కు దూసుకువెళ్లింది. సెమీస్‌లో బరోడాబరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ లుక్మాన్ మెరివాలా, అతిత్ సేత్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. అభిమన్యు ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అంతకు ముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ సౌరాష్ట్రను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది.చదవండి: అతడికి ఆసీస్ జట్టులో ఉండే అర్హత లేదు: డేవిడ్ వార్నర్ -
హార్దిక్ పాండ్యా విఫలం.. షమీకి రెండు వికెట్లు
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్ ముగింపునకు చేరుకుంది. సెమీ ఫైనల్స్‌కు చేరే క్రమంలో ఎనిమిది జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. సౌరాష్ట్ర- మధ్యప్రదేశ్, బరోడా- బెంగాల్, ముంబై- విదర్భ, ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ మధ్య క్వార్టర్ ఫైనల్స్ జరుగుతున్నాయి.ఇందులో భాగంగా తొలుత సౌరాష్ట్ర- మధ్యప్రదేశ్(క్వార్టర్ ఫైనల్-3) మ్యాచ్ ఫలితం వెలువడింది. కర్ణాటకలోని ఆలూర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్రపై ఆరు వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ గెలిచింది. తద్వారా సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.బరోడా ఓపెనర్లు భళాఇక క్వార్టర్ ఫైనల్-1లో భాగంగా బరోడా బెంగాల్‌తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన బరోడా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు శశ్వత్ రావత్(26 బంతుల్లో 40), అభిమన్యు సింగ్ రాజ్‌పుత్(34 బంతుల్లో 37) రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు.పాండ్యా బ్రదర్స్ విఫలంమొత్తంగా 11 బంతులు ఎదుర్కొని కేవలం పది పరుగులే చేశాడు హార్దిక్ పాండ్యా. ఇక అతడి అన్న, బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా సైతం పూర్తిగా నిరాశపరిచాడు. పదకొండు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులే చేసి నిష్క్రమించాడు. శివాలిక్, విష్ణు మెరుపు ఇన్నింగ్స్మిగతా వాళ్లలో శివాలిక్ శర్మ(17 బంతుల్లో 24), భాను పనియా(11 బంతుల్లో 17), విష్ణు సోలంకి(7 బంతుల్లో 16 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బరోడా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగలిగింది. బెంగాల్ బౌలర్లలో టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, కనిష్క్ సేత్, ప్రదీప్త ప్రమాణిక్ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. సాక్షిమ్ చౌదరి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. గెలుపు కోసం నువ్వా- నేనా అన్నట్లు పోటీపడిన ఈ మ్యాచ్‌లో బరోడా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.బ్యాటింగ్‌లో విఫలమైన హార్దిక్ మూడు వికెట్లతో మెరిశాడు.బరోడా వర్సెస్ బెంగాల్ తుదిజట్లుబెంగాల్అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కరణ్ లాల్, సుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్), రిటిక్ ఛటర్జీ, షాబాజ్ అహ్మద్, రిత్విక్ చౌదరి, ప్రదీప్త ప్రమాణిక్, కనిష్క్ సేథ్, మహ్మద్ షమీ, సాక్షిమ్ చౌదరి, సయన్ ఘోష్.బరోడాశశ్వత్ రావత్, అభిమన్యు సింగ్ రాజ్‌పుత్, భాను పనియా, శివాలిక్ శర్మ, హార్దిక్ పాండ్యా, విష్ణు సోలంకి (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా (కెప్టెన్), అతిత్ షేత్, మహేష్ పితియా, లుక్మాన్ మేరీవాలా, ఆకాష్ మహరాజ్ సింగ్చదవండి: SMAT 2024: వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షో.. సెమీస్‌లో మధ్యప్రదేశ్ -
భారత్‌కు భారీ షాక్.. షమీ ఆస్ట్రేలియా టూర్ క్యాన్సిల్!?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ జాతీయ జట్టు తరపున ఇప్పటిలో రీ ఎంట్రీ ఇచ్చే సూచనలు కన్పించడం లేదు. బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి రెండు టెస్టులలో ఆడేందుకు షమీ సిద్దంగా ఉన్నాడని, త్వరలోనే ఆస్ట్రేలియాకు పయనం కానున్నాడని వార్తలు వినిపించాయి.అయితే ఇప్పుడు మరో అనూహ్య కథనం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. షమీకి ఎన్సీఏ వైద్య బృందం తాజాగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. షమీ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదని, ఐదో రోజుల పాటు జరిగే టెస్టు క్రికెట్‌కు అతడు సిద్దంగా లేడని వైద్యం బృందం తేల్చినట్లు సమాచారం.కానీ చిన్నస్వామి స్టేడియం వేదికగా బరోడా-బెంగాల్ జట్ల మధ్య జరగనున్న ముస్తాక్ అలీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో షమీ ఆడనున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది. షమీకి మరోసారి ఏన్సీఎ వైద్య బృందం ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వినికిడి.అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే షమీ ఇప్పటిలో ఆస్ట్రేలియాకు వెళ్లేలా కన్పించడం లేదు. కాగా షమీ ఫిట్‌నెస్‌పై రెండో టెస్టు అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు. షమీ మోకాలి వాపుతో ఇబ్బంది పడుతున్నాడని, అతడిపై ఒత్తిడి తీసుకురావాలనుకోవడం లేదని రోహిత్ చెప్పుకొచ్చాడు. షమీ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరపున ఆడుతున్నాడు. అంతకుముందు రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో కూడా ఈ బెంగాల్ స్టార్ కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. తన రీ ఎంట్రీలో సత్తాచాటుతున్నప్పటికి అతడి ఫిట్‌నెస్‌పై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.ఇక ఆసీస్‌తో పింక్ బాల్ టెస్టులో ఓటమి చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు మూడో టెస్టుకు సిద్దమవుతోంది. డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భారత్ భావిస్తోంది.చదవండి: PAK vs SA: షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు.. -
షమీ మళ్లీ మాయ చేస్తాడా?.. నేటి నుంచే ముస్తాక్ అలీ ట్రోఫీ క్వార్టర్స్ పోరు
శస్త్రచికిత్స అనంతరం తిరిగి మైదానంలో అడుగు పెట్టిన భారత సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ... దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో పోరుకు సిద్ధమయ్యాడు. రంజీ ట్రోఫీలో రాణించి ఫిట్నెస్ చాటుకున్న షమీ... ముస్తాక్ అలీ ట్రోఫీలో అటు బంతితో ఇటు బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడు. చండీగఢ్‌తో కీలక ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆల్‌రౌండ్ మెరుపులతో షమీ బెంగాల్ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో నేడు నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. బరోడాతో బెంగాల్, మధ్యప్రదేశ్‌తో సౌరాష్ట్ర, ముంబైతో విదర్భ, ఢిల్లీతో ఉత్తరప్రదేశ్ తలపడనున్నాయి. గాయం నుంచి కోలుకున్న అనంతరం షమీ దేశవాళీల్లో 64 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 16 వికెట్లు పడగొట్టాడు. ఆ్రస్టేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ చివరి రెండు టెస్టుల కోసం షమీ ఆసీస్ వెళ్లనున్నాడనే వార్తల నేపథ్యంలో... అతడికి ముస్తాక్ అలీ టోర్నీ క్వార్టర్ ఫైనల్ మరో అవకాశం ఇస్తోంది.మరోవైపు ఇటీవల సిక్కింపై 20 ఓవర్లలో 349 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన బరోడా జట్టు... అదే జోష్‌లో సెమీఫైనల్లో అడుగు పెట్టాలని భావిస్తోంది. బరోడా బ్యాటింగ్ సామర్థ్యానికి... బెంగాల్ బౌలింగ్ నైపుణ్యానికి మధ్య తీవ్ర పోటీ ఖాయం. రింకూ మెరిసేనా?ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ నుంచి రింకూ సింగ్‌పై అందరి దృష్టి నిలవనుంది. మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్, రజత్ పాటిదార్ కీలకం కానుండగా...విదర్భతో పోరులో ముంబై జట్టు తరఫున శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానే, సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యారు.చదవండి: సిరాజ్‌ను సీనియర్లే నియంత్రించాలి: ఆసీస్ మాజీ కెప్టెన్ -
గాయం రేపిన చిచ్చు.. రోహిత్-షమీ మధ్య విభేదాలు..?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ మొహమ్మద్ షమీ మధ్య విభేదాలు ఉన్నాయని గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరి మధ్య విభేదాలకు షమీ గాయం కారణమని తెలుస్తుంది. దైనిక్ జాగారణ్ నివేదిక మేరకు.. రోహిత్-షమీ మధ్య విభేదాలకు భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ సందర్భంగా బీజం పడింది. ఆ సిరీస్‌లోని తొలి టెస్ట్‌కు ముందు షమీ గురించి రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. షమీ ఫిట్‌గా లేడని, అతడి మోకాలి భాగంలో వాపు వస్తుందని రోహిత్ మీడియాకు వివరణ ఇచ్చాడు. మరోవైపు షమీ మాత్రం తాను పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు సోషల్‌మీడియా వేదికగా ప్రకటించాడు. ఇదే విషయమై రోహిత్-షమీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తుంది. తాను పూర్తిగా ఫిట్‌గా ఉన్నప్పుడు తప్పుడు స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నావని షమీ రోహిత్‌ను నిలదీశాడట.తాజాగా మరోసారి అదే స్టేట్మెంట్అడిలైడ్ టెస్ట్‌లో టీమిండియా పరాజయం అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. షమీ మోకాలు మళ్లీ వాచిందని, గాయాన్ని తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పాడు. షమీ కోసం టీమిండియా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నాడు. అయితే గాయం పూర్తిగా తగ్గకముందే బరిలోకి దింపి షమీని ఒత్తిడిలోకి నెట్టదలచుకోవడం లేదని అన్నాడు. రోహిత్ గతంలోనూ షమీపై ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ వ్యాఖ్యలకు భిన్నంగా..ఓ పక్క రోహిత్ శర్మనేమో షమీ పూర్తిగా ఫిట్‌గా లేడని స్టేట్మెంట్లు ఇస్తుంటే షమీ మాత్రం మైదానంలో అదరగొడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో షమీ దుమ్మురేపుతున్నాడు. అంతకుముందు రంజీ ట్రోఫీలోనూ షమీ సత్తా చాటాడు. తాను ఫిట్‌గా ఉండటమే కాకుండా మంచి ఫామ్‌లో కూడా ఉన్నట్లు షమీ మెసేజ్ పంపుతున్నాడు. తాజాగా చండీఘడ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో షమీ ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. 17 బంతుల్లోనే 32 పరుగులు చేయడటమే కాకుండా బౌలింగ్‌లో 13 డాట్ బాల్స్ వేసి ఓ వికెట్ తీశాడు. రోహిత్ చెబుతున్నట్టు షమీకి గాయం తిరగబెడితే అతను విశ్రాంతి తీసుకోవాలి కాని, బరిలోకి దిగి ఇంత మెరుగ్గా ఎలా ఆడగలడు. ఇప్పుడు ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. -
భారత్ గెలవాలంటే అతడు ఉండాల్సిందే: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ త్వరలోనే ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా గతేడాదిగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న షమీ.. డిసెంబర్ 26 నుంచి ఆసీస్‌తో జరగనున్న నాలుగో టెస్టుతో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి రెండు టెస్టులకు షమీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.కాగా చీలమండ గాయం నుంచి కోలుకున్న షమీ ఈ ఏడాది రంజీ ట్రోఫీ సీజన్‌తో తిరిగి మైదానంలో అడగుపెట్టాడు. ఈ టోర్నీలో బెంగాల్‌కు షమీ ప్రాతినిథ్యం వహించాడు. షమీ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు. అయితే షమీ దేశవాళీ క్రికెట్లో ఆడుతున్నప్పటికి ఎన్సీఏ నుంచి ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ పొందలేదు.అతడికి ఒకట్రెండు రోజుల్లో ఎన్సీఏ వైద్య బృందం ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వినికిడి. అక్కడ అతడు ఉత్తీర్ణత సాధిస్తే వెంటనే ఆస్ట్రేలియాకు పయనం కానున్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా జరగనున్న మూడో టెస్టుకు షమీ దూరం కావడం ఖాయమైంది.ఇదే విషయాన్ని భారత కెప్టెన్ రోహిత్ శర్మ సైతం స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్‌తో జరిగే మూడో టెస్టులో మహ్మద్ షమీ సేవలు భారత్‌కు ఎంతో అవసరమని అలీ అభిప్రాయపడ్డాడు."మహ్మద్ షమీ ఆఖరి రెండు టెస్టుల్లో ఆడనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే అతడిని నాలుగో టెస్టు నుంచి ఆడిస్తే భారత్‌కు ఏమి ప్రయోజనం ఉండదు. షమీని ఇప్పుడే ఆస్ట్రేలియాకు పంపండి. బ్రిస్బేన్‌లో జరిగే మూడో టెస్టులో షమీని ఆడించిండి.అంతేతప్ప మెల్బోర్న్ టెస్టులో ఆడించాలనుకుంటే దయచేసి అతడిని ఆస్ట్రేలియాకు పంపించవద్దు. ఎందుకంటే షమీ సేవలు భారత జట్టుకు ఇప్పుడు ఎంతో అవసరం. భారత పేస్ ఎటాక్‌కు అతడు నాయకత్వం వహిస్తాడని" బసిత్ అలీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS: 'రోహిత్ ఇంకేం నిరూపించుకోవాలి.. అతడి సత్తా ఏంటో మనకు తెలుసు' -
బ్యాట్‌తో రాణించిన షమీ.. క్వార్టర్ ఫైనల్లో బెంగాల్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బెంగాల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (డిసెంబర్ 9) ఉదయం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్ చండీఘడ్‌పై 3 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పదో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన మొహమ్మద్ షమీ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి 17 బంతుల్లో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 33 పరుగులు చేసిన కరణ్ లాల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రదిప్త ప్రమాణిక్ 30, వ్రిత్తిక్ చట్టర్జీ 28 పరుగులు చేశారు. చండీఘడ్ బౌలర్లలో జగ్జీత్ సింగ్ 4 వికెట్లు పడగొట్టగా.. రాజ్ బవా 2, నిఖిల్ శర్మ, అమృత్ లుబానా, భగ్మేందర్ లాథర్ తలో వికెట్ తీశారు.160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చండీఘడ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. సయాన్ ఘోష్ నాలుగు వికెట్లు తీసి చండీఘడ్ను దెబ్బకొట్టాడు. కనిష్క్ సేథ్ 2, షాబాజ్ అహ్మద్, షమీ తలో వికెట్ పడగొట్టారు. చండీఘడ్ ఇన్నింగ్స్‌లో రాజ్ బవా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రదీప్ యాదవ్ (27), మనన్ వోహ్రా (23), నిఖిల్ శర్మ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కాగా, డిసెంబర్ 11న జరిగే క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్ బరోడాను ఢీకొంటుంది. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు రెండో ప్రీ క్వార్టర్ ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఉత్తర్ ప్రదేశ్.. ఆంధ్రప్రదేశ్‌తో తలపడనుంది. -
మహ్మద్ షమీ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనే! వీడియో వైరల్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన బ్యాట్‌ను ఝళిపించాడు. ఈ టోర్నీలో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. చంఢీఘర్‌తో జరుగుతున్న ప్రీ క్వార్టర్ మ్యాచ్‌లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. పదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కులు చూపించాడు.అద్భుతమైన షాట్లతో ఈ వెటరన్ క్రికెటర్ అలరించాడు. కేవలం 17 బంతులు మాత్రమే ఎదుర్కొన్న షమీ.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా షమీ మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బెంగాల్ బ్యాటర్లలో షమీతో పాటు కరణ్ లాల్(33), ప్రదీప్త ప్రమాణిక్(30) పరుగులతో రాణించారు. చంఢీగర్ బౌలర్లలో జగిత్ సింగ్ 4 వికెట్లు పడగొట్టగా.. రాజ్ భా రెండు, నికిల్, అమ్రిత్, లాథర్ తలా వికెట్ సాధించారు.టీమిండియాలోకి ఎంట్రీ ఎప్పుడంటే?బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి రెండు టెస్టులకు షమీ భారత జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. తొలుత బ్రిస్బేన్ వేదికగా జరిగే మూడో టెస్టుకు ముందు షమీ జట్టుతో కలుస్తాడని వార్తలు వినిపించాయి. కానీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఆ వార్తలను కొట్టిపారేశాడు. షమీ ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని, బ్రిస్బేన్ టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని పరోక్షంగా హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు. Bengal have set a target of 160 in front of Chandigarh 🎯Mohd. Shami provides a crucial late surge with 32*(17)Karan Lal top-scored with 33 (25)Jagjit Singh Sandhu was the pick of the Chandigarh bowlers with 4/21#SMAT | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/u42rkbUfTJ pic.twitter.com/gQ32b5V9LN— BCCI Domestic (@BCCIdomestic) December 9, 2024 -
ఎస్ఆర్హెచ్లోకి మహ్మద్ షమీ.. రూ.10 కోట్లకు సొంతం
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీపై కాసుల వర్షం కురిసింది. మహ్మద్ షమీని రూ. 10 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన షమీ కోసం తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి. అయితే ఆఖరికి కేకేఆర్, సీఎస్కే పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ స్టార్ బౌలర్‌ను ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. కాగా షమీ గతంలో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే అతడిని ఈ మెగా వేలానికి ముందు గుజరాత్ రిటైన్ చేసుకోలేదు.ఈ మెగా వేలంలో అతడిని తిరిగి సొంతం చేసుకోవడానికి ఆర్‌టీమ్ ఆప్షన్ ఉన్నప్పటకి గుజరాత్ సముఖత చూపలేదు. దీంతో అతడు సన్‌రైజర్స్ సొంతంమయ్యాడు. ఇక దాదాపు ఏడాది తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన షమీ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
BGT 2024-25: టీమిండియాలోకి షమీ..?
టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. గాయం కారణంగా గతేడాది కాలంగా కాంపిటేటివ్ క్రికెట్‌కు దూరంగా ఉన్న షమీ ఇటీవలే ఓ రంజీ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో షమీ ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించిన సమయానికి షమీ పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. అందుకే అతన్ని మెగా సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అయితే ప్రస్తుతం టీమిండియా ఉన్న పరిస్థితుల్లో టీమిండియా మేనేజ్మెంట్ షమీ వైపు చూస్తుంది. బీజీటీకి అతన్ని ఎంపిక చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుంది. షమీ పూర్తి ఫిట్నెస్ సాధించడంతో పాటు రంజీ మ్యాచ్‌లో 40కి పైగా ఓవర్లు వేసి పూర్వ స్థితికి చేరాడు.బీజీటీ సుదీర్ఘకాలం సాగనుంది కాబట్టి షమీని ఏ సమయంలోనైనా భారత జట్టుకు ఎంపిక చేయవచ్చని తెలుస్తుంది. భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ అంశానికి బలం చేకూరుస్తున్నాయి.మోర్నీ మోర్కెల్ ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడుతూ.. మేము షమీని చాలా దగ్గర నుంచి గమనిస్తున్నాం. అతను సంవత్సరం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. షమీ తిరిగి క్రికెట్ ఆడటం టీమిండియాకు సానుకూలాంశం. షమీ తిరిగి జట్టులో చేరేందుకు తాము చేయాల్సినవన్నీ చేస్తున్నాం. భారత్‌లో షమీకి దగ్గరగా ఉన్న వాళ్లతో మేము టచ్‌లో ఉన్నాం. షమీ వరల్డ్ క్లాస్ బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నాడు.మోర్నీ మాటలను బట్టి చూస్తే షమీని బీజీటీలో బరిలోకి దించేందుకు టీమిండియా మేనేజ్మెంట్ శతవిధాల ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. బీజీటీలో షమీ సేవలు టీమిండియాకు చాలా అవసరం. ఈసారి బీజీటీలో భారత పేస్ అటాక్ మునుపెన్నడూ లేనంత బలహీనంగా కనిపిస్తుంది. ప్రస్తుత జట్టులో బుమ్రా ఒక్కడే అనుభవజ్ఞుడైన పేసర్. సిరాజ్‌కు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉన్నా, ఇటీవలికాలంలో అతను పెద్దగా ఫామ్‌లో లేడు. మిగతా పేసర్లు ఆకాశ్‌దీప్, ప్రసిద్ద్ కృష్ణలకు అనుభవం చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో షమీ జట్టులో ఉంటే టీమిండియా విజయావకాశాలు మెరుగుపడతాయి. మరి భారత మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
SMT 2024: ఒకే జట్టులో మహ్మద్ షమీ బ్రదర్స్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2024-25 కోసం బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సుదీప్ కుమార్ ఘరామి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దాదాపు ఏడాదిగా వైట్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఇండియన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ఈ జట్టులో చోటు దక్కింది.షమీ ఇటీవలే రంజీ ట్రోఫీ 2024-25లో తిరిగి మైదానంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే 6 వికెట్లతో ఈ సీనియర్ బౌలర్ సత్తచాటాడు. ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు ఈ బెంగాల్ స్టార్ సిద్దమయ్యాడు. కాగా ఈ జట్టులో మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్‌కు కూడా బెంగాల్ సెలక్టర్లు చోటిచ్చారు. నవంబర్ 23 నుంచి ఈ దేశవాళీ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో బెంగాల్ జట్టు హైదరాబాద్, మేఘాలయ, మధ్యప్రదేశ్, మిజోరాం, బీహార్, రాజస్థాన్, పంజాబ్‌లతో పాటు గ్రూప్-ఎలో ఉంది.బెంగాల్ జట్టు: సుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్), అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుదీప్ ఛటర్జీ, షాబాజ్ అహ్మద్, కరణ్ లాల్, రిటిక్ ఛటర్జీ, రిత్విక్ రాయ్ చౌదరి, షకీర్ హబీబ్ గాంధీ (వికెట్ కీపర్), రంజోత్ సింగ్ ఖైరా, ప్రయాస్ రే బర్మన్ (వికెట్ కీపర్), అగ్నివ్ పాన్ (వికెట్ కీపర్), ప్రదీప్త ప్రమాణిక్, సాక్షం చౌదరి, మహ్మద్ షమీ, ఇషాన్ పోరెల్, మహ్మద్ కైఫ్, సూరజ్ సింధు జైస్వాల్, సయన్ ఘోష్, కనిష్క్ సేథ్ మరియు సౌమ్యదీప్ మండల్.చదవండి: IPL 2025 Mega Auction:'వేలంలో అతడికి రూ. 25 కోట్లు పైనే.. స్టార్క్ రికార్డు బద్దలవ్వాల్సిందే' -
7 వికెట్లతో సత్తా చాటిన షమీ.. రీఎంట్రీ అదుర్స్..!
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ రీఎంట్రీలో అదరగొట్టాడు. 360 రోజుల తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లోకి అడుగుపెట్టిన షమీ.. వచ్చీ రాగానే రంజీ మ్యాచ్‌లో తన ప్రతాపం చూపించాడు. రంజీల్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించే షమీ మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తంగా ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన షమీ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో షమీ బ్యాట్‌తోనూ రాణించాడు. 36 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో షమీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించడంతో మధ్యప్రదేశ్‌పై బెంగాల్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది.MOHAMMAD SHAMI PICKED 7 WICKETS IN HIS FIRST COMPETITIVE MATCH IN 360 DAYS. ❤️pic.twitter.com/e231mVfTDM— Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ 228 పరుగులకు ఆలౌటైంది. షాబాజ్ అహ్మద్ (92), అనుస్తుప్ మజుందార్ (44) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆర్మన్ పాండే, కుల్వంత్ కేజ్రోలియా తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ 167 పరుగులకే కుప్పకూలింది. షమీ (4/54) మధ్యప్రదేశ్ పతనాన్ని శాశించాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సేనాపతి (47), రజత్ పాటిదార్ (41) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.61 పరుగుల ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ 276 పరుగులకు ఆలౌటైంది. విృత్తిక్ ఛటర్జీ (52) అర్ద సెంచరీతో రాణించగా.. సుదీప్ ఘరామీ (40), సుదీప్ ఛటర్జీ (40), వృద్దిమాన్ సాహా (44), షమీ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ తలో నాలుగు వికెట్లు పడగొట్టారు.338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్.. షమీ (3/102), షాబాజ్ అహ్మద్ (4/48), రోహిత్ కుమార్ (2/47), మొహమ్మద్ కైఫ్ (షమీ తమ్ముడు) (1/50) ధాటికి 326 పరుగులకు ఆలౌటైంది. సేనాపతి (50), శుభమ్ శర్మ (61), వెంకటేశ్ అయ్యర్ (53) మధ్యప్రదేశ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. -
బ్యాట్‌తోనూ సత్తా చాటిన షమీ
360 రోజుల తర్వాత యాక్టివ్ క్రికెట్లోని అడుగుపెట్టిన టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ వచ్చీ రాగానే రంజీ ట్రోఫీలో చెలరేగిపోతున్నాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించిన షమీ తొలుత బౌలింగ్‌లో రాణించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో షమీ 19 ఓవర్లలో 54 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం షమీ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో చెలరేగిపోయాడు. పదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన షమీ 36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. షమీ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో బెంగాల్ తమ లీడ్‌ను భారీగా పెంచుకోగలిగింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు ఆలౌటైంది. షాబాజ్ అహ్మద్ (92), కెప్టెన్ అనుస్తుప్ మజుందార్ (44) రాణించారు. షమీ 2 పరుగులకే ఔటయ్యాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆర్మన్ పాండే, కుల్వంత్ కేజ్రోలియా తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే ఆలౌటైంది. షమీ (4/54), సూరజ్ సింధు జైస్వాల్ (2/35), మొహమ్మద్ కైఫ్ (2/41), రోహిత్ కుమార్ (1/27) మధ్యప్రదేశ్ పతనాన్ని శాశించారు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సుభ్రాంన్షు సేనాపతి (47), రజత్ పాటిదార్ (41) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.61 పరుగుల ఆధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్.. సుదీప్ ఘరామీ (40), సుదీప్ ఛటర్జీ (40), వ్రిత్తిక్ ఛటర్జీ (52), వృద్దిమాన్ సాహా (44), షమీ (37) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 276 పరుగులకు ఆలౌటైంది. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ పాండే, సరాన్ష్ జైన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ మూడో రోజు టీ విరామం సమయానికి వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ గెలవాలంటే మరో 279 పరుగులు చేయాల్సి ఉంది. ఓపెనర్లు సుభ్రాన్షు సేనాపతి (27), హిమాన్షు మంత్రి (29) క్రీజ్‌లో ఉన్నారు. -
రీ ఎంట్రీలో చెలరేగిన మహ్మద్ షమీ..
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. 361 రోజుల తర్వాత తిరిగి మైదానంలో అడుగు పెట్టిన షమీ తన మాస్టర్ క్లాస్ బౌలింగ్‌తో అదరగొట్టాడు. రంజీ ట్రోపీ 2024-25 సీజన్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. తన రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.ఇండోర్ వేదికగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షమీ 4 వికెట్లతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ బెంగాల్ స్టార్ పేసర్ కేవలం పరుగులిచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.అతడితో పాటు సురజ్ జైశ్వాల్, మహ్మద్ కైఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ కూడా కేవలం 228 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం బెంగాల్ 61 పరుగుల ఆధిక్యంలో ఉంది.టీమిండియాలోకి రీ ఎంట్రీ!?షమీ టీమిండియా తరపున చివరగా గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో ఆడాడు. ఆ తర్వాత తన కాలి మడమ గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. అతడి తిరిగి మళ్లీ బోర్డర్ - గావస్కర్ ట్రోఫీట్రోఫీతో జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు.కానీ ఫిట్నెస్ సమస్యల వల్ల షమీని భారత సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. రంజీల్లో తన ఫిట్నెస్ను నిరూపించుకోవాలని షమీని సెలక్టర్లు సూచించారు. ఈ క్రమంలోనే రంజీల్లో ఆడేందుకు షమీ బరిలోకి దిగాడు.ఇదే ఫిట్నెస్తో అతడు ఒకట్రెండు మ్యాచ్‌లు బెంగాల్ తరపున ఆడితే జాతీయ జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఆస్ట్రేలియాతో ఆఖరి మూడు టెస్టులకు భారత జట్టులో షమీ చేరే అవకాశమున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.చదవండి: IPL 2025: చహల్ కోసం పోటా పోటీ.. రూ.12 కోట్లకు కొనుక్కున్న ఆర్సీబీ!? అట్లుంటది మరి ఫ్యాన్స్‌తో.. -
షమీ పునరాగమనం
కోల్‌కతా: టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ పునరాగమనానికి సిద్ధమయ్యాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన షమీ... శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకొని దేశవాళీ మ్యాచ్‌లు ఆడేందుకు రెడీ అయ్యాడు. రంజీ ట్రోఫీలో భాగంగా బుధవారం నుంచి మధ్యప్రదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌లో షమీ బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ మేరకు బెంగాల్ క్రికెట్ సంఘం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. స్వదేశంలో జరిగిన 2023 వన్డే వరల్డ్‌కప్‌లో 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీసి అదరగొట్టిన షమీ... ఆ తర్వాత గాయం కారణంగా మైదానానికి దూరమయ్యాడు. కాలి మడమకు శస్త్రచికిత్స చేయించుకున్న షమీ... ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకున్నాడు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఆ్రస్టేలియా పర్యటన వరకు అతడు కోలుకుంటాడనుకుంటే అది సాధ్యపడలేదు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రీహాబిలిటేషన్‌లో ఉన్న షమీ మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. ‘భారత క్రికెట్ జట్టుతో పాటు, బెంగాల్ రంజీ టీమ్‌కు శుభవార్త. స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. మధ్యప్రదేశ్‌తో రంజీ మ్యాచ్‌లో షమీ బెంగాల్ జట్టు తరఫున ఆడతాడు’అని బెంగాల్ క్రికెట్ సంఘం కార్యదర్శి నరేశ్ ఓజా తెలిపాడు. షమీ ఫిట్నెస్ సాధించకపోవడంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అతడిని ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టుల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ కోసం ఎంపిక చేయలేదు. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణను ఆ్రస్టేలియాతో సిరీస్‌కు ఎంపిక చేసిన బోర్డు... ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైనీ, ఖలీల్ అహ్మద్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా ప్రకటించింది. జట్టును ప్రకటించిన సమయంలో రోహిత్ మాట్లాడుతూ... పూర్తి ఫిట్నెస్ సాధించని షమీతో ప్రయోగాలు చేయబోమని ప్రకటించాడు. -
IPL 2025: అతడికి రూ. 18 కోట్లు.. గుజరాత్ రిటెన్షన్ లిస్టు ఇదే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతోంది. నవంబరు చివరి వారంలో ఆక్షన్ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. అదే విధంగా.. వేలానికి ముందు పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబరు 31లోపు సమర్పించాలని డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్‌కు సంబంధించిన ఆసక్తికర వార్తలు తెరమీదకు వచ్చాయి. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని విడిచిపెట్టాలని ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను కొనసాగించడంతో పాటు అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కూడా టైటాన్స్ రిటైన్ చేసుకోనుందట!పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంకాగా 2022లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే చాంపియన్‌గా నిలిచింది. మరుసటి ఏడాది రన్నరప్‌గా నిలిచి సత్తా చాటింది. అయితే, ఆ రెండు దఫాల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ ఏడాది జట్టును వీడి.. ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఈ క్రమంలో హార్దిక్ స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు ఫ్రాంఛైజీ సారథ్య బాధ్యతలు అప్పగించింది.అయితే, ఐపీఎల్-2024లో గిల్ సేన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. గాయం కారణంగా షమీ సీజన్ మొత్తానికి దూరం కావడం.. కొన్ని మ్యాచ్‌లలో ఆఖరి వరకు పోరాడినా ఒత్తిడిలో చిత్తు కావడం ప్రభావం చూపింది. దీంతో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచిన గుజరాత్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.అతడికి రూ. 18 కోట్లుఅయినప్పటికీ.. టీమిండియా భవిష్య కెప్టెన్‌గా గుర్తింపు పొందిన శుబ్‌మన్ గిల్‌పై నమ్మకం ఉంచిన ఫ్రాంఛైజీ యాజమాన్యం అతడికి రూ. 18 కోట్ల మేర చెల్లించి తమ జట్టు నాయకుడిగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇక వరల్డ్‌క్లాస్ స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్ సైతం ఈ సీజన్లో నిరాశపరిచాడు. 12 మ్యాచ్‌లు ఆడి కేవలం పది వికెట్లే తీశాడు. అయినప్పటికీ రషీద్ నైపుణ్యాలపై నమ్మకంతో అతడిని కూడా రిటైన్ చేసుకోనున్నారట.సాయి కిషోర్‌ను కూడా...అదే విధంగా.. ఐపీఎల్-2024లో శతకం బాది.. ఓవరాల్‌గా 527 పరుగులతో సత్తా చాటిన సాయి కిషోర్‌ను కూడా టైటాన్స్ అట్టిపెట్టుకోనుందట. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్లు షారుఖ్ ఖాన్,రాహుల్ తేవటియాలను కూడా కొనసాగించనున్నట్లు సమాచారం. కాగా షమీ వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తా చాటిన అనంతరం చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు దూరమైన అతడు ఇంతవరకు పునరాగమనం చేయలేదు. అందుకే టైటాన్స్ షమీని వదిలేయనున్నట్లు సమాచారం.చదవండి: Ranji Trophy: 68 బంతుల్లోనే సెంచరీ.. ఆర్సీబీకి స్ట్రాంగ్ మెసేజ్! -
Ind vs Aus: బ్యాటర్లు తడబడ్డా.. మేము చెలరేగిపోవడం ఖాయం!
త్వరలోనే తాను పునరాగమనం చేయనున్నట్లు టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ తెలిపాడు. తొలుత దేశవాళీ క్రికెట్లో ఆడతానని.. పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే ఆస్ట్రేలియా పర్యటన గురించి ఆలోచిస్తానని పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ ఆడిన అనంతరం చీలమ గాయంతో షమీ ఆటకు పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో అతనికి శస్త్రచికిత్స కూడా జరిగింది. కాలిపై భారం పడకూడదనిప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫిట్‌గా మారేందుకు ప్రయత్నిస్తున్న షమీ తొలిసారి తాను పూర్తి రనప్‌తో బౌలింగ్ చేసినట్లు తాజాగా వెల్లడించాడు. ఆ సమయంలో గాయానికి సంబంధించి తనకు ఎలాంటి నొప్పి కలగలేదని షమీ చెప్పాడు. కాగా 34 ఏళ్ల షమీ ఆదివారం భారత్-న్యూజిలాండ్ టెస్టు ముగిసిన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో సుదీర్ఘ సమయం పాటు ఎలాంటి ఇబ్బందీ లేకుండా బౌలింగ్ చేశాడు. భారత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అతడి బౌలింగ్‌ను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ.. ‘కాలిపై భారం పడకూడదని చాలా రోజులుగా జాగ్రత్తగా, పరిమిత రనప్‌తో బౌలింగ్ చేస్తూ వచ్చాను. ఆదివారం మాత్రం చాలా సంతృప్తిగా అనిపించింది. పూర్తిగా నా సామర్థ్యం మేరకు బౌలింగ్ చేశాను. ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. 100 శాతం నొప్పి కూడా తగ్గిపోయింది. సాధ్యమైనంత త్వరగా బరిలోకి దిగాలని ఆశిస్తున్నా’ అని షమీ చెప్పాడు. బెంగాల్ తరఫున బరిలోకి... ఆస్ట్రేలియా పర్యటనకు ముందు దేశవాళీ క్రికెట్లో రెండు, మూడు మ్యాచ్‌లు ఆడాలని భావిస్తున్న షమీ... అప్పుడే తన ఆట, ఫిట్‌నెస్‌పై పూర్తి స్పష్టత వస్తుందని అన్నాడు. నవంబర్ 22 నుంచి పెర్త్‌లో టీమిండియా- ఆసీస్ మధ్య తొలి టెస్టు జరగనుండగా... ఫిట్‌గా మారేందుకు షమీకి మరో నెల రోజుల సమయం ఉంది. ‘పూర్తి ఫిట్నెస్ను సాధించడమే నా ముందున్న లక్ష్యం. ఆ్రస్టేలియాకు వెళ్లే ముందు నేను ఎంత దృఢంగా తయారవుతాననేది ముఖ్యం. ఫిట్‌గా లేకుండా అక్కడికి వెళ్లి ఏదైనా జరిగితే అది మంచిది కాదు.డాక్టర్లు ఓకే చెప్పేలా రోజుకు కనీసం 20–30 ఓవర్లు బౌలింగ్ చేయాలని భావిస్తున్నా. అందు కోసం మ్యాచ్‌లు ఆడటమే సరైంది’ అని షమీ పేర్కొన్నాడు. భారత జట్టు ఆసీస్ బయల్దేరడానికి ముందు రంజీ ట్రోఫీలో బెంగాల్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనుంది. వీటిలో అతను బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫిట్‌గా మారి కంగారూ గడ్డకు చేరితే భారత్, భారత్ ‘ఎ’ మధ్య జరిగే మూడు రోజుల మ్యాచ్‌లో కూడా షమీ ఆడవచ్చు.బ్యాటర్లు తడబడ్డా.. మేము చెలరేగిపోవడం ఖాయం!గాయం నుంచి కోలుకొని మళ్లీ ఆడటం అంత సులువు కాదని... ఈ సుదీర్ఘ విరామం ఓపికను ప్రదర్శించే లక్షణాన్ని తనలో పెంచిందని అతను అభిప్రాయ పడ్డాడు. ప్లేయర్ ఎప్పుడైనా తన ప్రతిభ, సత్తాపై నమ్మకాన్ని కోల్పోరాదని, ప్రస్తుతం తన పోరాటమంతా ఫిట్నెస్తోనే అతను షమీ చెప్పాడు. 140 కిలోమీటర్లకు పైగా బంతులు విసిరే ముగ్గురు పేసర్లు ఒకే సమయంలో జట్టులో ఆడటం అరుదని... ఆస్ట్రేలియాలోని బౌన్సీ వికెట్లపై మన జట్టు సాధారణ స్కోరు నమోదు చేసినా... బౌలర్లు చెలరేగిపోగలరని అతడు వ్యాఖ్యానించాడు. 2018–19 పర్యటనలో 16 వికెట్లతో భారత జట్టు ఆసీస్ గడ్డపై తొలిసారి సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన షమీ... 2020–21 టూర్ తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తూ చేతికి గాయం కావడంతో సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. చదవండి: Mohammed Siraj: సిరాజ్‌కు అసలేమైంది? ఫామ్‌పై ఆందోళన! -
టీమిండియాకు గుడ్ న్యూస్
టీమిండియా అభిమానులకు శుభవార్త. స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని షమీనే స్వయంగా వెల్లడించాడు. షమీ గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ గాయం నుంచి కోలుకునేందుకు షమీ సర్జరీ చేయించుకున్నాడు.ప్రస్తుతం షమీ గాయం తాలూకా నొప్పి లేకుండా పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు అప్డేట్ ఇచ్చాడు. తాజాగా అతను నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. షమీ తన ఫిట్నెస్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. సర్జరీ అనంతరం మోకాళ్ల వాపు కారణంగా షమీ పునరాగమనంపై సందేహాలు ఉండేవి. అయితే తాజాగా షమీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న విధానం చూస్తే ఆ సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. షమీ పూర్తి రన్నప్‌తో మునపటిలా బౌలింగ్ చేశాడు.Mohammed Shami in action 🔥@MdShami11 pic.twitter.com/qzXHHub4J9— Subhayan Chakraborty (@CricSubhayan) October 20, 2024ఆస్ట్రేలియా టూర్‌కు ముందు షమీ తన ఫిట్నెస్ను నిరూపించుకునేందుకు రంజీ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. షమీ బెంగాల్ తరఫున ఒకటి లేదా రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. షమీ రీఎంట్రీ వార్త తెలిసి భారత క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా, టీమిండియా నవంబర్ 21 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ సమయానికి స్టార్ పేసర్ షమీ అందుబాటులో ఉండాని భావిస్తున్నాడు. బీజీటీలో ఆడేందుకు షమీ వీలైనంత విరామాన్ని తీసుకుంటున్నాడు. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ సిరీస్‌లో ఆడాలన్నది షమీ మనోగతం. ఈ సిరీస్ కోసమని షమీ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు.టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్ మ్యాచ్ పూణే వేదికగా అక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ -
షమీ ఫిట్‌గా ఉన్నా.. ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లం: రోహిత్ శర్మ
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ పునరాగమనంపై కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడిని ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకువెళ్లే పరిస్థితి లేదని స్పష్టం చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023లో అద్భుత ప్రదర్శన కనబరిచిన షమీ.. చీలమండ గాయంతో జట్టుకు దూరమయ్యాడు.ఈ మెగా టోర్నీ తర్వాత శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. ఐపీఎల్-2024తో పాటు టీమిండియా కీలక సిరీస్‌లకూ అందుబాటులో లేకుండా పోయాడు. సర్జరీ అనంతరం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్న ఈ ‘బెంగాల్’ పేసర్ అక్కడే పునరావాసం పొందుతున్నాడు. క్రమక్రమంగా కోలుకుంటూ నెట్స్‌లోనూ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు.షమీ ఆశలపై నీళ్లు!ఈ క్రమంలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ నాటికి షమీ అందుబాటులోకి వస్తాడని విశ్లేషకులు భావించారు. కానీ కివీస్‌తో మ్యాచ్‌లకు ప్రకటించిన జట్టులో అతడికి స్థానం దక్కలేదు. దీంతో ఆస్ట్రేలియాతో జరుగనున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి కూడా షమీ దూరమవుతాడనే వార్తలు వచ్చాయి.అయితే, షమీ మాత్రం వీటిని ఖండించాడు. నిరాధారపూరితంగా వదంతులు వ్యాప్తి చేయడం సరికాదని.. తాను ఆసీస్‌తో సిరీస్ బరిలో ఉన్నానంటూ సంకేతాలు ఇచ్చాడు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ షమీ ఆశలపై నీళ్లు చల్లాడు.షమీ ఫిట్‌గా ఉన్నా.. ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లంన్యూజిలాండ్తో బుధవారం నుంచి టెస్టులు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన రోహిత్‌కు షమీ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఆస్ట్రేలియాతో సిరీస్‌కు అతడు అందుబాటులో ఉంటాడో లేదో ఇప్పుడే చెప్పడం కష్టం.అతడు గాయం తాలూకు బాధతో ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. మోకాళ్లు ఉబ్బి ఉన్నాయి. పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. ఎన్సీఏ డాక్టర్లు, ఫిజియోలు ఎప్పుటికప్పుడు అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఏదేమైనా పూర్తిస్థాయిలో సిద్ధంగా లేని షమీని మేము ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లము’’ అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. కాగా నవంబరులో భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా అక్కడ ఐదు టెస్టులు ఆడనుంది. చదవండి: T20 WC: భారత్ అవుట్!.. ఇంత చెత్తగా ఆడతారా?: పాక్ మాజీ కెప్టెన్ -
టీమిండియాకు ఆ ఇబ్బంది ఉండదు: న్యూజిలాండ్ కోచ్
టీమిండియా బెంచ్ పటిష్టంగా ఉందని.. .. గాయాల వల్ల భారత జట్టుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని న్యూజిలాండ్ హెడ్‌కోచ్ గ్యారీ స్టెడ్ అన్నాడు. కీలక ఆటగాళ్లు లేకపోయినా ప్రత్యర్థి జట్టుకు గట్టి సవాలు విసరగల సత్తా రోహిత్ సేనకు ఉందని ప్రశంసించాడు. ముఖ్యంగా టెస్టుల్లో భారత్‌కు ఎన్నో అత్యుత్తమ ఆప్షన్లు ఉండటం సానుకూల అంశమని పేర్కొన్నాడు.టీమిండియాకు పెద్దగా ఇబ్బంది ఉండదుప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా టీమిండియా న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఇరుజట్ల మధ్య అక్టోబరు 16(బుధవారం) నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో కివీస్ ప్రధాన కోచ్ గ్యారీ స్టడ్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా.. ‘‘గాయాల వల్ల ఆటగాళ్లు దూరమైతే.. మిగతా జట్ల లాగా టీమిండియాకు పెద్దగా ఇబ్బంది ఉండదు.ఒక్క ఆటగాడు దూరమైతే అతడి స్థానంలో అంతే నైపుణ్యం గల మరొక ఆటగాడు వస్తాడు. టీమిండియా తగినన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో నైపుణ్యం, అనుభవం గల ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. టీమిండియా బ్రాండ్ క్రికెట్ వల్ల పర్యాటక జట్లకే ఎల్లప్పుడూ ఇబ్బంది.మాకు కఠిన సవాలుమాకు ఇక్కడ కఠిన సవాలు ఎదురుకాబోతోంది. అయితే, అత్యుత్తమ ఆట తీరుతో దానిని మేము అధిగమిస్తాం. ఉత్తమ తుదిజట్టుతో బరిలోకి దిగి అనుకున్న ఫలితాలు రాబడతాము. వైఫల్యాలు దాటుకుని.. గొప్పగా ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నాము’’ అని గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. కాగా టీమిండియా ఇటీవల బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి జోరు మీద ఉండగా.. న్యూజిలాండ్ మాత్రం శ్రీలంక చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఇదిలా ఉంటే.. భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఇంకా అందుబాటులోకి రాలేదు. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన షమీ కివీస్ సిరీస్‌కూ దూరంగానే ఉండనున్నాడు.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
కూతురితో షమీ వీడియో.. హసీన్ జహాన్ ఘాటు వ్యాఖ్యలు
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీపై హసీన్ జహాన్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేసింది. కేవలం ప్రచార యావతోనే తన కుమార్తెను షాపింగ్‌మాల్‌కు తీసుకువెళ్లాడని.. అంతే తప్ప అతడికి కూతురిపై ప్రేమ లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా 2014లో షమీ హసీన్ జహాన్ అనే మోడల్‌ను పెళ్లి చేసుకున్నాడు.వీరికి 2015లో కూతురు జన్మించగా ఐరా అని నామకరణం చేశారు. అయితే, కొన్నాళ్లకు షమీ- హసీన్ మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో తన భర్త వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని ఆరోపించిన హసీన్.. మ్యాచ్ ఫిక్సింగ్, గృహహింసకు పాల్పడ్డాడంటూ అతడిని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కించింది. అయితే, సర్వోన్నత న్యాయస్థానంలో షమీకి ఊరట దక్కింది.2018 నుంచి షమీ- హసీన్ విడివిడిగానేఈ నేపథ్యంలో 2018 నుంచి షమీ- హసీన్ విడివిడిగానే ఉంటున్నారు. కుమార్తె ఐరా తల్లి వద్దనే పెరుగుతోంది. ఈ క్రమంలో షమీ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశాడు. ‘‘సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తనను కలిసేంత వరకు కాలం ఇలాగే గడుస్తుంది. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను బెబో’’ అంటూ షమీ తన కుమార్తెను హత్తుకుని ఉన్న దృశ్యాలను షేర్ చేశాడు. ఇందులో అతడు ఐరాను షాపింగ్‌కు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. కూతురికి దూరంగా ఉండటం నరకమంటూ షమీ పట్ల నెటిజన్లు సానుభూతి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హసీన్ జహాన్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ‘‘ఇదంతా కేవలం షో ఆఫ్ కోసమే. నా కూతురు పాస్ట్‌పోర్టు గడువు ముగిసింది.అందుకే ఐరాను అక్కడకు తీసుకువెళ్లాడుకొత్త పాస్‌పోర్టు కావాలంటే షమీ సంతకం అవసరం. అందుకే ఐరా తన తండ్రి దగ్గరకు వెళ్లింది. అయితే, అతడు మాత్రం సంతకం చేయనేలేదు. నా కూతురిని తీసుకుని షాపింగ్ మాల్‌కు వెళ్లాడు. ఆ కంపెనీకే షమీ ప్రచారకర్తగా ఉన్నాడు.ఆ షాపులో నా కూతురికి షూస్, బట్టలు కొనిచ్చాడు. వాటికి అతడు డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. అందుకే ఐరాను అక్కడకు తీసుకువెళ్లాడు. నా కూతురు తనకు గిటార్, కెమెరా కావాలని అడిగింది. కానీ.. అతడు వాటిని కొనివ్వనేలేదు.అతడు నా కూతురు గురించి ఎప్పుడూ ఆలోచించడు. గత నెలలో కూడా ఐరాను కలిశాడు. కానీ అప్పుడు ఇలాంటి వీడియోలేవీ షేర్ చేయలేదు. ఇప్పుడు పబ్లిసిటీ కోసం ఇదంతా చేశాడు’’ అని హసీన్ జహాన్ పేర్కొన్నట్లు ఆనంద్‌బజార్.కామ్ తెలిపింది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ నొప్పితో టీమిండియాకు దూరమైన షమీ ఇంకా రీఎంట్రీ ఇవ్వలేదు.చదవండి: IND VS BAN 1st T20: వరల్డ్ రికార్డుపై కన్నేసిన సూర్య భాయ్..! View this post on Instagram A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11) -
ఆ సిరీస్‌కు దూరమయ్యానని బీసీసీఐ చెప్పిందా?
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియా తదుపరి న్యూజిలాండ్‌తో తలపడనుంది. సొంతగడ్డపై అక్టోబరు 16 నుంచి కివీస్‌తో మూడు టెస్టుల సిరీస్ మొదలుపెట్టనుంది. అనంతరం నవంబరులో బోర్డర్ గావస్కర్ ట్రోపీ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.ఫైనల్‌గా ఆసీస్తోఅక్కడ భారత జట్టు కంగారూ టీమ్‌తో ఐదు టెస్టులు ఆడనుంది. ఇక ఆసీస్‌తో ఈ సిరీస్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-2లో టీమిండియా ప్రయాణం ముగియనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరువైన రోహిత్ సేన.. ఆసీస్‌పై మరోసారి పైచేయి సాధించి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది.ఇంకా ఫిట్నెస్ సాధించలేదంటూ..అయితే, ఈ మెగా సిరీస్‌తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ పునరాగమనం చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే, అతడు ఇంకా ఫిట్నెస్ సాధించలేదని.. ఆసీస్‌తో సిరీస్‌కూ దూరమయ్యాడని వదంతులు వ్యాప్తి చెందాయి. ఈ విషయంపై షమీ ఘాటుగా స్పందించాడు.సిరీస్‌కు దూరమయ్యానని బీసీసీఐ చెప్పిందా?‘‘ఎందుకీ నిరాధారణ వార్తలు? పూర్తిగా కోలుకోవడానికి నా శక్తినంతా ధారపోస్తూ.. తీవ్రంగా శ్రమిస్తున్నాను. బీసీసీఐ గానీ.. లేదంటే నేను గానీ.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నుంచి నేను తప్పుకొన్నానని చెప్పలేదు కదా!మీ పబ్లిసిటీ కోసం దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకండి. ఎవరో పనికిమాలిన వ్యక్తులు, తమకు తోచింది మాట్లాడే వ్యక్తులు చేసిన వ్యాఖ్యల ఆధారంగా నకిలీ వార్తలను సృష్టించకండి. ముఖ్యంగా.. నేను ఏదేనా స్వయంగా చెప్పిన తర్వాతే ఓ అంచనాకు రండి’’ అని షమీ సోషల్ మీడియా వేదికగా గాసిప్‌రాయుళ్లకు చురకలు అంటించాడు.చీలమండ గాయానికి సర్జరీకాగా వన్డే ప్రపంచకప్-2023లో అద్బుత ప్రదర్శన కనబరిచిన మహ్మద్ షమీకి.. ఈ టోర్నీ తర్వాత చీలమండ గాయం తీవ్రమైంది. దీంతో శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ ఫాస్ట్ బౌలర్ ఇంతవరకు మళ్లీ బరిలోకి దిగలేదు. దాదాపు పది నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాడు.చదవండి: WTC: ఫైనల్ చేరాలంటే టీమిండియా చేయాల్సిందిదే! -
భారత్‌కు బిగ్ షాక్.. ఆసీస్ సిరీస్‌కూ స్టార్ ప్లేయర్ దూరం!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఇప్పటిలో రీ ఎంట్రీ ఇచ్చేలా కన్పించడం లేదు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ ఆకాడమీలో ఉన్న మహ్మద్ షమీ తాజాగా మోకాలి గాయం బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో తన కాలి మడమకు శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. తిరిగి ఫిట్నెస్ సాధించేందుకు ఎన్సీఏలో చేరాడు.అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుండగా మోకాళ్లలో వాపు ఏర్పడినట్లు సమాచారం. దీంతో అతడు పునరాగమనం మరింత ఆసల్యం కానుంది. ఈ గాయం కారణంగా అతడు దాదాపు 6-8 వారాల ఆటకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో షమీ స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు దూరమైనట్లే. అంతేకాకుండా కివీస్‌తో టెస్టు సిరీస్ తర్వాత భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌కు కూడా షమీ అందుబాటులో ఉండేది అనుమానమే."షమీ తన బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. అతడు త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ అతడి మోకాలి గాయం తీవ్రమైంది. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అతడు కోలుకోవడానికి కాస్త సమయం పడుతోంది"అని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. కాగా గతేడాది వన్డే వరల్డ్‌కప్ తర్వాత షమీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. -
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. విజేత ఎవరో చెప్పేసిన షమీ!
ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కావడానికి మరో రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఏడాది ఆఖరిలో ఆస్ట్రేలియా పర్యటన భారత జట్టు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా ఈ బీజీటీ ట్రోఫీ జరగనుంది.అయితే 1991-92 సీజన్ తర్వాత తొలిసారి ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. గత రెండు పర్యాయాలు వారి సొంత గడ్డపై కంగారులను చిత్తు చేసిన ఈ సారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మరోవైపు 2014 తర్వాత ఒక్కసారి కూడా బోర్డర్- గవస్కర్ ట్రోఫీ గెలవలేకపోయిన ఆసీస్.. ఈ సారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని భావిస్తోంది.విజేత ఎవరో చెప్పేసిన షమీ..?ఇక క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) వార్షిక అవార్డుల వేడుకల్లో పాల్గోనున్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకు బీజీటీ-2024కు సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ఏడాది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విజేతగా ఎవరు నిలుస్తారో ఎంచుకోమని షమీని అడిగారు. వెంటనే మేము ఫేవరెట్స్, వారే భయపడాలి అంటూ షమీ బదులిచ్చాడు.అదే విధంగా తన రీ ఎంట్రీ కోసం మాట్లాడుతూ.. " రీ ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా. త్వరలోనే మైదానంలో అడుగుపెడతా. పునరాగమనం చేశాక ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నాను. నేను ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించాల్సి ఉంది అని చెప్పుకొచ్చాడు. కాగా షమీ ప్రస్తుతం చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడు తిరిగి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. చదవండి: IND vs BAN: బంగ్లాతో తొలి టెస్టు.. రోహిత్ మాస్టర్ ప్లాన్! ఇక చుక్కలే? -
అందుకే వాళ్లిద్దరికి టీమిండియాలో చోటు దక్కలేదు!
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా వరుస మ్యాచ్‌లతో బిజీ కానుంది. చివరిసారిగా.. శ్రీలంక పర్యటన సందర్భంగా ఆగష్టు 7న వన్డే మ్యాచ్ ఆడిన రోహిత్ సేన.. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగనున్న బంగ్లాతో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదివారమే తొలి టెస్టుకు జట్టును కూడా ప్రకటించింది.ఈ సిరీస్ ద్వారా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పునరాగమనం చేయనుండగా.. కేఎల్ రాహుల్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సైతం టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు.. ఉత్తరప్రదేశ్ యువ పేసర్ యశ్ దయాల్‌కు సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు.ఐపీఎల్ టీమ్‌ను చాంపియన్‌గా నిలిపిఅయితే, ఈ జట్టులో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం చోటు దక్కలేదు. రంజీల్లో ఆడాలన్న ఆదేశాలను బేఖాతరు చేశాడంటూ క్రమశిక్షణ చర్యల కింద గతంలో అతడిపై బీసీసీఐ వేటు వేసింది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి కూడా తప్పించింది. అయితే, ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా వ్యవహరించి.. ఆ జట్టును చాంపియన్‌గా నిలిపిన ఈ ముంబై ప్లేయర్‌కు శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా బీసీసీఐ అవకాశమిచ్చింది.ఈ క్రమంలో రెడ్‌బాల్ జట్టులో కూడా చోటు దక్కించుకోవాలన్న లక్ష్యంతో బుచ్చిబాబు టోర్నమెంట్లోనూ శ్రేయస్ అయ్యర్ ఆడాడు. అయితే, అక్కడ ఆశించిన మేర రాణించలేకపోయాడు. అనంతరం దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇండియా- డి కెప్టెన్‌గా వ్యవహరించాడు.సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశంఇండియా-సితో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో 39 బంతుల్లోనే అర్ధ శతకం బాది ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు. అయితే, సెలక్టర్లు మాత్రం అతడిపై నమ్మకం ఉంచలేదు. శ్రేయస్ అయ్యర్ ఆటలో నిలకడలేని కారణంగా అతడిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మరో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం సెలక్టర్లు పిలుపునివ్వడం విశేషం. కాగా కేఎల్ రాహుల్ గైర్హాజరీలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఈ రంజీ వీరుడు వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదిన విషయం తెలిసిందే.అందుకే షమీని కూడా తీసుకోలేదు!ఇక అయ్యర్‌తో పాటు బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీని కూడా ఎంపికచేయలేదు సెలక్టర్లు. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ ప్రస్తుతం ఫిట్‌గానే ఉన్నాడు. అయితే, అతడిని హడావుడిగా జట్టుకు ఎంపిక చేసి రిస్క్ తీసుకోవడం ఎందుకని బీసీసీఐ భావించినట్లు సమాచారం. ప్రధాన పేసర్ బుమ్రా అందుబాటులో ఉండటం, సొంతగడ్డపై అదీ బంగ్లాదేశ్ వంటి జట్టుతో సిరీస్ నేపథ్యంలో షమీని వెంటనే పిలిపించాల్సిన అవసరం లేదని భావించినట్లు తెలుస్తోంది. అందుకే అతడి స్థానంలో యశ్ దయాల్‌కు చోటిచ్చినట్లు సమాచారం. ఇక రంజీల్లో బెంగాల్ తరఫున షమీ ఒక మ్యాచ్ ఆడిన తర్వాత అతడిని న్యూజిలాండ్‌తో సిరీస్ నాటికి పిలిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్. చదవండి: Duleep Trophy: రింకూ సింగ్‌కు లక్కీ ఛాన్స్.. ఆ జట్టు నుంచి పిలుపు? -
టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ పేసర్ వచ్చేస్తున్నాడు..!
టీమిండియాకు గుడ్ న్యూస్. చాలాకాలం తర్వాత స్టార్ పేసర్ మహ్మద్ షమీ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం ఎన్సీఏలో శిక్షణలో ఉన్న షమీ.. అక్టోబర్‌లో మొదలయ్యే రంజీ ట్రోఫీలో బరిలో ఉంటాడని సమాచారం. షమీ ఈ ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక కావడం ఖాయమని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు. షమీని త్వరలో జరిగే బంగ్లాదేశ్ సిరీస్‌కు ఎంపిక చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. షమీ ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకుని ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నాడు. షమీ రాకతో టీమిండియా పేస్ బలం మరింత పెరగనుంది. షమీ తుది జట్టులోకి వస్తే టీమిండియాకు తిరుగుండదు. భారత్ ఈ ఏడాది బంగ్లాదేశ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలతో కీలక సిరీస్‌లు ఆడనుంది.ఈ ఏడాది భారత్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు..సెప్టెంబర్ 19-23 వరకు బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ (చెన్నై)సెప్టెంబర్ 29-అక్టోబర్ 1 వరకు బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్ (కాన్పూర్)అక్టోబర్ 6- బంగ్లాదేశ్‌తో తొలి టీ20అక్టోబర్ 9- బంగ్లాదేశ్‌తో రెండో టీ20అక్టోబర్ 12- బంగ్లాదేశ్‌తో మూడో టీ20అక్టోబర్ 16-20 వరకు న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ (బెంగళూరు)అక్టోబర్ 24-28 వరకు న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్ (పూణే)నవంబర్ 1-5 వరకు న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ (ముంబై)నవంబర్ 8- సౌతాఫ్రికాతో తొలి టీ20 (డర్బన్)నవంబర్ 10- సౌతాఫ్రికాతో రెండో టీ20 (క్వెబెర్బా)నవంబర్ 13- సౌతాఫ్రికాతో మూడో టీ20 (సెంచూరియన్)నవంబర్ 15- సౌతాఫ్రికాతో నాలుగో టీ20 (జొహనెస్‌బర్గ్)నవంబర్ 22-26 వరకు ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ (పెర్త్)డిసెంబర్ 6-10 వరకు ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ (అడిలైడ్)డిసెంబర్ 14-18 వరకు ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ (బ్రిస్బేన్)డిసెంబర్ 26-30 వరకు ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్ (మెల్బోర్న్)జనవరి 3-7 వరకు ఆస్ట్రేలియాతో ఐదో టెస్ట్ (సిడ్నీ) -
రోజూ కేజీ మటన్ తింటాడు: షమీ ఫ్రెండ్
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్న ఈ వెటరన్ పేసర్ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవలే ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.ఇదిలా ఉంటే.. షమీ వ్యక్తిగత జీవితంలో పడ్డ కష్టాల గురించి అతడి ప్రాణ స్నేహితుడు ఉమేశ్ కుమార్ తాజాగా వెల్లడించాడు. ఈ ఉత్తరప్రదేశ్ క్రికెటర్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.ఆరోజు తనని అలా చూడగానే భయం వేసింది‘‘షమీకి అది నిజంగా గడ్డుకాలం. ఆరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో నీళ్లు తాగేందుకు నేను నిద్రలేచాను. కిచెన్ వైపు వెళ్తూ.. బాల్కనీ వైపు చూశా. అప్పుడు షమీ వాళ్ల బాల్కనీ చివర నిల్చుని కిందకు చూస్తున్నాడు. మేము ఉండేది 19వ ఫ్లోర్. అతడి ఆలోచన ఏమిటో నేను పసిగట్టాను. నాకెంతోగానో భయం వేసింది’’ అని ఉమేశ్ కుమార్ చేదు జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు.అయితే, అదృష్టవశాత్తూ షమీపై వచ్చిన ఆరోపణలు తొలగిపోయాయని.. తిరిగి టీమిండియాకు ఆడి తానేంటో నిరూపించుకున్నాడని ఉమేశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా షమీ మాజీ భార్య హసీన్ జహాన్ అప్పట్లో అతడిపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.స్త్రీలోలుడైన మహ్మద్ షమీ పాకిస్తానీల నుంచి డబ్బు తీసుకుని మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని బాంబు పేల్చింది. అంతేకాదు తనను చిత్రహింసలు పెడుతున్నాడంటూ గృహహింస కేసు పెట్టింది. ఈ క్రమంలో షమీ కెరీర్ ప్రమాదంలో పడగా.. లోతుగా దర్యాప్తు జరిపిన బీసీసీఐ విచారణ కమిటి అతడికి క్లీన్ చిట్ ఇచ్చింది.ఇక అనేక అవాంతరాల అనంతరం హసీన్ జహాన్ నుంచి షమీ పూర్తిగా విడిపోయాడు. అయితే, నాటి పరిస్థితుల్లో డిప్రెషన్‌కు లోనైన షమీ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడని ఉమేశ్ కుమార్ శుభాంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో తాజాగా వెల్లడించాడు. అదే విధంగా.. షమీ డైట్ గురించి ఓ సీక్రెట్ కూడా పంచుకున్నాడు.కేజీ మటన్ ఉండాల్సిందే‘‘షమీ రోజుకు కిలో మటన్ తింటాడు. డైట్లో ఏమైనా తేడాలు వస్తే సహిస్తాడేమో గానీ.. మటన్ లేకుంటే మాత్రం అతడికి కోపం వస్తుంది. ఒక్కరోజైతే మటన్ లేకుండా ఉంటాడు.. కానీ రెండో రోజు అస్సలు ఊరుకోడు. మూడో రోజు కూడా మటన్ పెట్టలేదంటే పిచ్చోడైపోతాడు.అంతేకాదు.. అతడి బౌలింగ్ స్పీడ్ గంటకు పదిహేను కిలోమీటర్ల మేర తగ్గినా తగ్గొచ్చు’’ అంటూ ఉమేశ్ కుమార్ సరదాగా చెప్పుకొచ్చాడు. షమీకి అన్నింటికంటే మటన్ అంటే ఎంతో ఇష్టమని తెలిపాడు. అదే విధంగా.. షమీకి షాపింగ్ చేయడం అంటే సరదా అని.. మ్యాచ్‌లు లేనపుడు తనను ఢిల్లీలో షాపింగ్‌కు తీసుకువెళ్తాడని ఉమేశ్ కుమార్ తమ స్నేహబంధం గురించి చెప్పాడు.చదవండి: Paris Olympics 2024: పూర్తి షెడ్యూల్, ఆరంభ సమయం.. అథ్లెట్ల వివరాలు -
టీమిండియా స్టార్ వచ్చేస్తున్నాడు: అగార్కర్!
టీమిండియాకు గుడ్ న్యూస్. స్టార్ పేసర్ మహ్మద్ షమీ రీ ఎంట్రీకి ముహర్తం ఖారరైనట్లు తెలుస్తోంది. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత కాలి మడమ గాయం కారణంగా షమీ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత లండన్‌లో తన మడమ గాయానికి శస్త్ర చికిత్స చేసుకున్న షమీ.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ ఆకాడమీలో పునరావసం పొందుతున్నాడు.అయితే షమీ తన గాయం నుంచి శర వేగంగా కోలుకుంటున్నాడు. షమీ బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. ప్రస్తుతం నెట్స్‌లో జాగ్రత్తగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. పూర్తిస్థాయి తీవ్రతతో బౌలింగ్ చేయడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశముంది.ఇక షమీ రీ ఎంట్రీపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సైతం తాజాగా స్పందించాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సమయానికి షమీ పునరాగమనం చేసే ఛాన్స్ ఉందని అగార్కర్ తెలిపాడు."ప్రస్తుతం భారత జట్టులో కొంతమంది ఆటగాళ్లు గాయాలతో సతమతవుతున్నారు. అందులో ఒకరు మహ్మద్ షమీ. షమీ ప్రస్తుతం తిరిగి బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. నిజంగా ఇది భారత క్రికెట్‌కు శుభసూచికం. సెప్టెంబరు 19నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడనున్నాం.ఆ సమయానికి షమీ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని ఆశిస్తున్నాము. షమీ బంగ్లా సిరీసే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే అతడు పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేను. ఎన్సీఏ ఆధికారులను అడిగి అప్డేట్ తెలుసుకోవాలి. మాకు బంగ్లాతో సిరీస్ తర్వాత చాలా టెస్టులు ఉన్నాయి. కాబట్టి షమీ లాంటి బౌలర్ కచ్చితంగా మాకు అవసరం. గత కొంత కాలంగా టెస్టుల్లో బుమ్రా, షమీ, సిరాజ్ మాత్రమే ఫాస్ట్ బౌలర్లగా కొనసాగుతున్నారు. టెస్టు ఫార్మాట్‌కు సెట్ అయ్యేలా బౌలర్లను తయారు చేయాల్సిన సమయం వచ్చింది. త్వరలో ఫస్ట్-క్లాస్ క్రికెట్ కూడా ప్రారంభం కాబోతంది. అక్కడ మెరుగ్గా రాణించే వారికి భారత జట్టులోకి ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని" ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అగర్కార్ పేర్కొన్నాడు. -
సానియా మీర్జాతో పెళ్లి..? ఎట్టకేలకు స్పందించిన మహ్మద్ షమీ
టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ-టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వార్తలను సానియా తండ్రి ఖండిస్తూ ఓ క్లారిటీ ఇచ్చినప్పటకి.. ఎదో ఒక చోట వీరిద్దరూ పెళ్లి ప్రస్తావన వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ వార్తలపై మహ్మద్ షమీ స్పందించాడు. ఇటీవలే శుభంకర్ మిశ్రా అనే యూట్యూబర్‌కు షమీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన రెండో పెళ్లి గురుంచి వస్తున్న పుకార్లపై షమీని శుభంకర్ మిశ్రా ప్రశ్నించాడు."ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. సానియాతో నా పెళ్లి అనేది కేవలం రూమర్స్ మాత్రమే. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేయడం మానుకోవాలి. మీ సరదా కోసం ఇతరుల మనోభావాలను దెబ్బతీయకూడదు. మీరు చేస్తుంది సరైనది కాదు. ఆ మధ్య కాలంలో నా ఫోన్ ఓపెన్ చేసి చూస్తే చాలు అవే మీమ్ప్ కనిపించేవి. మీమ్‌లు అనేది కేవలం వినోదం కోసం మాత్రమే. అంతే తప్ప అబద్దాలను ప్రచారం చేయడానికి కాదు. ట్రోలర్స్, మీమర్స్‌కు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను.దయచేసి వ్యక్తిగత జీవితాల విషయానికి రావొద్దు. ఒకరి వ్యక్తిగత జీవితాన్నిఇంకొకరితో ముడివేస్తూ వారిని బజారుకి లాగవద్దు. మీకు దమ్ము ఉంటే ఇలాంటి పోస్టులను గుర్తింపు లేని సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కాకుండా నిజమైన అకౌంట్స్ నుంచి పోస్ట్ చేయండి.అప్పుడు నేను ఏమి సమాధానం చెప్పాలో అదే చెబుతా. దయచేసి ఎటువంటి వికృత చేష్ఠలు మానుకుని జీవితంలో ఎదగడానికి ప్రయత్నంచండి. మీ వంతు ప్రజలకు సహాయం చేయండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అప్పుడే మీరు మంచి వ్యక్తిగా ఈ సమాజంలో జీవించగలరు" అని షమీ స్ట్రాంగ్ రిప్లే ఇచ్చాడు. కాగా షమీ ఇప్పటికే తన భార్య హసిన్ జహాన్‌కు విడాకులు ఇవ్వగా.. సానియా కూడా తన భర్త షోయబ్ మాలిక్‌తో విడిపోయింది. -
ప్రాక్టీస్ షురూ... రీ ఎంట్రీకి సిద్ధమైన టీమిండియా స్టార్
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించే క్రమంలో నెట్స్‌లో తీవ్రంగా చెమటోడుస్తున్నాడు. భారత క్రికెట్ జట్టులో తిరిగి చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా షమీ శ్రమిస్తున్నాడు.వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత ఈ ఉత్తరప్రదేశ్ ఫాస్ట్‌బౌలర్ టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై ఈ ఐసీసీ టోర్నీలో భారత్‌ను ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించిన షమీ.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.అంతేకాదు.. వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో అత్యంత వేగంగా యాభై వికెట్ల మార్కు అందుకున్న తొలి బౌలర్‌గానూ షమీ రికార్డు సాధించాడు. అయితే, చీలమండ గాయం తీవ్రం కావడంతో ఈ మెగా ఈవెంట్ ముగిసిన వెంటనే శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.ఈ క్రమంలో సుదీర్ఘకాలం పాటు విశ్రాంతి తీసుకున్న షమీ సౌతాఫ్రికా పర్యటనతో పాటు ఐపీఎల్-2024, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలకు దూరమయ్యాడు.క్రమక్రమంగా కోలుకున్న షమీ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ రైటార్మ్ పేసర్ బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు.కాగా షమీ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నాటికి అందుబాటులోకి వస్తాడని భారత నియంత్రణ క్రికెట్ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా ఇప్పటికే వెల్లడించారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు మారాయి.రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్‌గా ఎంపికైన గౌతం గంభీర్ యువ ఆటగాళ్లకే పెద్దపీట వేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్.. యంగ్‌స్టర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా జట్టులో కీలకంగా మారాడు.ముఖ్యంగా ప్రపంచకప్-2024 టోర్నీలో టాప్ వికెట్ టేకర్ల(17)లో ఒకడిగా నిలిచాడు. ఈ క్రమంలో అర్ష్‌దీప్ వైపు గంభీర్ మొగ్గుచూపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మాంబ్రే ఇప్పటికే షమీ రీఎంట్రీపై సందేహాలు వ్యక్తం చేశాడు.గంభీర్ హయాంలో 33 ఏళ్ల షమీ పునరాగమనం చేయాలంటే అద్భుతమైన ప్రదర్శన చేయడంతో పాటు.. ఫిట్నెస్ విషయంలోనూ మరింత దృష్టి సారించకతప్పదని పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్ తర్వాత జింబాబ్వేతో టీ20 సిరీస్(4-1)గెలిచిన టీమిండియా తదుపరి జూలై 27 నుంచి శ్రీలంకలో పర్యటించనుంది. అనంతరం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌లు ఆడనుంది. View this post on Instagram A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11) -
టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీపై సందేహాలు! గౌతీ ప్లాన్?
వన్డే ప్రపంచకప్-2023 తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు స్టార్ పేసర్ మహ్మద్ షమీ. చీలమండ గాయం వేధిస్తున్నా పంటిబిగువన నొప్పిని భరించి ఐసీసీ టోర్నీని పూర్తి చేసిన ఈ ఫాస్ట్‌బౌలర్.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.సొంతగడ్డపై ఈ మెగా ఈవెంట్లో ఫైనల్ వరకు అజేయంగా నిలవడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు షమీ. అయితే, వరల్డ్‌కప్ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకున్నాడు.అయితే, ఈ యూపీ ఎక్స్‌ప్రెస్ ఇంత వరకు పునరాగమనం చేయలేదు. ఐపీఎల్-2024తో పాటు టీ20 ప్రపంచకప్-2024కు కూడా దూరమయ్యాడు. తాను క్రమక్రమంగా కోలుకుంటున్నానని షమీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసినా రీఎంట్రీపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు.పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక టీ20 వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా తదుపరి ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు చాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌పై కన్నేసింది.ఈ ఐసీసీ టోర్నీల్లో రాణించాలంటే సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అవసరం ఉందని టీమిండియా బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మాంబ్రే అన్నాడు. ఈ విషయంలో కొత్త కోచింగ్ సిబ్బంది చొరవతీసుకోవాలని సూచించాడు.‘‘షమీ తదుపరి ప్రణాళిక ఏమిటో కోచింగ్ స్టాఫ్ అడిగి తెలుసుకోవాలి. అతడిని సంప్రదించి.. ఫిట్‌గా ఉన్నాడా లేదా? ఇంకెన్నాళ్లు క్రికెట్ ఆడాలనుకుంటున్నాడు? అన్న విషయాలను అడగాలి. అతడికీ వయసు మీద పడుతోంది.అయినా షమీ నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకోగలగాలంటే అందుకు తగ్గ వ్యూహాలు రచించాలి. జట్టుకు అదెంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. గౌతీ ఆ పని చేస్తాడని నాకు నమ్మకం ఉంది.టెస్టుల్లో అతడిని వాడుకోవాలనుకుంటే ఆస్ట్రేలియాతో సిరీస్ నాటికి పూర్తిస్థాయిలో అతడు ఫిట్నెస్ సాధించేలా శిక్షణ ఇవ్వాలి. అయితే, ఆడేందుకు షమీ శరీరం సహకరిస్తేనే అన్నీ సజావుగా సాగుతాయి.షమీ లాంటి సీనియర్ల విషయంలో యో- యో టెస్టు(ఫిట్నెస్) అవసరం లేదనే అనుకుంటా’’ అని పారస్ మాంబ్రే ది టెలిగ్రాఫ్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా టీమిండియా కొత్త కోచ్‌గా గౌతం గంభీర్ నియమితుడైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు షమీ కూడా కొన్నేళ్లుగా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. ఇంగ్లండ్ తొలి ప్లేయర్‌గా రికార్డు -
సిగ్గు పడండి.. కెమెరాల ముందు ఇలా చేస్తారా?: మహ్మద్ షమీ ఫైర్
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాపై టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లను కించపరిచేలా వ్యవహరించడం సరికాదని విమర్శించాడు. కెప్టెన్ పట్ల బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం సిగ్గు చేటంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సేన నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగలిగింది.టాపార్డర్ పూర్తిగా విఫలం కాగా ఐదు, ఆరు స్థానాల్లో వచ్చిన నికోలస్ పూరన్(48), ఆరో నంబర్ బ్యాటర్ ఆయుశ్ బదోని(55) అద్భుత ఇన్నింగ్స్ చేయడంతో ఈ మాత్రం పరుగులు రాబట్టింది.ఇక ఈ మ్యాచ్‌లో రాహుల్ 33 బంతులు ఎదుర్కొని కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 75), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89) విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా 9.4 ఓవర్లలోనే పని పూర్తి చేసింది.ఫలితంగా లక్నో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో లక్నో యజమాని కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై అందరి ముందే సీరియస్ అయ్యాడు. రాహుల్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా అస్సలు వినిపించుకోలేదు.ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా.. సంజీవ్ గోయెంకా తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ స్పందిస్తూ.. గోయెంకా తీరును తప్పుబట్టాడు.‘‘ఆటగాళ్లకు ఆత్మ గౌరవం ఉంటుంది. యజమానిగా మీరు కూడా ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న వ్యక్తి. చాలా మంది మిమ్మల్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు.కెమెరాల ముందు మీరిలా చేయడం నిజంగా సిగ్గు చేటు. ఇది కచ్చితంగా సిగ్గుపడాల్సిన విషయమే. ఒకవేళ మీరు కెప్టెన్‌తో మాట్లాడాలనుకుంటే అందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి.డ్రెసింగ్‌రూం లేదంటే హోటల్ రూంలో కెప్టెన్‌తో మాట్లాడవచ్చు. కానీ ఇలా అందరి ముందే మైదానంలో ఇలా అరిచేయడం సరికాదు. ఇలా చేయడం ద్వారా ఎర్రకోట మీద జెండా ఎగురవేసినంత గొప్ప ఏమైనా వచ్చిందేంటి?అతడు కేవలం ఆటగాడే కాదు కెప్టెన్ కూడా! ప్రతిసారి ప్రణాళికలు పక్కాగా అమలు చేయలేకపోవచ్చు. ఆటలో గెలుపోటములు సహజం. అంత మాత్రాన కెప్టెన్ కించపరిచేలా వ్యవహరిస్తారా? ఇలా చేసి తప్పుడు సందేశం ప్రజల్లోకి వెళ్లేలా చేశారు’’ అంటూ మహ్మద్ షమీ సంజీవ్ గోయెంకా వ్యవహార శైలిపై విరుచుకుపడ్డాడు. కాగా చీలమండ సర్జరీ కారణంగా షమీ(గుజరాత్ టైటాన్స్) ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. -
IPL 2024: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. షమీ రికార్డు బద్దలు
గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రషీద్ ఖాన్ రికార్డులెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్‌ను ఔట్ చేసిన రషీద్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. రషీద్ ఇప్పటివరకు ఐపీఎల్లో గుజరాత్ తరపున 49 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు గుజరాత్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ(48) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో షమీని రషీద్ అధిగమించాడు. కాగా ఈ ఏడాది సీజన్‌కు గాయం కారణంగా మహ్మద్ షమీ దూరమైన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అబ్దుల్ సమద్(29), అభిషేక్ శర్మ(29) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్, ఒమర్జాయ్, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు. -
నువ్వేమైనా ధోనివా?.. నీకిది అవసరమా హార్దిక్?: షమీ
ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అతడు అనుసరించిన వ్యూహాలపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా వంటి మేటి బౌలర్ సేవలను సరైన సమయంలో వినియోగించుకోలేదని విమర్శిస్తున్నారు. అదే విధంగా.. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్లో ఏడోస్థానంలో రావడాన్ని కూడా తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా సీనియర్ పేసర్, గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహ్మద్ షమీ స్పందిస్తూ.. హార్దిక్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘ధోని ఎల్లప్పుడూ ధోనినే. అతడిని ఎవరూ మ్యాచ్ చేయలేరు. ధోని అయినా.. కోహ్లి అయినా.. ప్రతి ఒక్క ఆటగాడి మైండ్‌సెట్ వేరుగా ఉంటుంది. మన నైపుణ్యాలు, ఆటకు తగినట్లు ప్రవర్తించాల్సి ఉంటుంది. నువ్వు గత రెండు సీజన్లుగా మూడు లేదంటే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నావు. ఆ పొజిషన్లో ఆడటానికి అలవాటు పడ్డావు. ఒక్కోసారి ఐదో స్థానంలో కూడా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ.. ఏడో నంబర్లో మాత్రం కాదు’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. హార్దిక్ పాండ్యా.. ధోనిలా ఏడో స్థానంలో వచ్చి గొప్ప ఫినిషర్ అవలేడని షమీ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2022లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా అరంగేట్రంలోనే టైటిల్ అందించాడు. గతేడాది రన్నరప్‌గా నిలిపాడు. అయితే, ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ గూటికి చేరుకుని అనూహ్య రీతిలో రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ క్రమంలో గుజరాత్‌తో అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో ముంబై ఓడటంతో పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. సీజన్ ఆరంభంలోనే పరాజయం అతడిని పలకరించింది. ఇక ఈ మ్యాచ్‌లో పాండ్యా ఏడో స్థానంలో వచ్చి 4 బంతుల్లో 11 పరుగులు చేశాడు. అంతకుముందు 3 ఓవర్లు బౌల్ చేసి 30 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే.. గత రెండు సీజన్లలో పాండ్యా సారథ్యంలో గుజరాత్‌కు ఆడిన మహ్మద్ షమీ గాయం కారణంగా తాజా ఎడిషన్‌కు దూరమైన విషయం తెలిసిందే. చదవండి: #HardikPandya: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్.. మండిపడ్డ రోహిత్! పక్కనే అంబానీ.. 6️⃣ • 4️⃣ • 𝗪 Skipper Hardik leads the fightback, but Umesh won the battle ⚔️🔥#IPLonJioCinema #TATAIPL #IPL2024 #GTvMI pic.twitter.com/R3K3ArF7OM — JioCinema (@JioCinema) March 24, 2024 -
టీమిండియా క్రికెటర్‌కు లక్కీ ఛాన్స్.. ఏకంగా షమీ స్ధానంలోనే?
ఐపీఎల్-2024 సీజన్‌కు గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. షమీ ఇటీవలే తన చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. షమీ ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో షమీ స్ధానాన్ని తమిళనాడు పేసర్ సందీప్ వారియర్‌తో గుజరాత్ టైటాన్స్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఐపీఎల్ పాలక మండలి ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. సందీప్‌ను కనీస ధర రూ.50 లక్షలకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. సందీప్ వారియర్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున 2019 - 2021 మధ్య 5 మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఐదు మ్యాచ్‌ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కాగా వారియర్ టీమిండియా తరపున కేవలం ఒక్క టీ20 మ్యాచ్ ఆడాడు. 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌తో వారియర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో వారియర్ విఫలమకావడంతో తర్వాత సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఐపీఎల్-2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. -
ఐపీఎల్ కోసమే నాటకాలు.. అవునన్న షమీ! ఫొటో వైరల్
వన్డే వరల్డ్‌కప్-2023 సమయంలోనే మడిమ నొప్పి వేధించినా పంటి బిగువన భరించి జట్టు కోసం తపించాడు టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ. మెగా టోర్నీలో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా అత్యధిక వికెట్ల(24) వీరుడిగా నిలిచి సత్తా చాటాడు. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్ వరకు చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, ఈ టోర్నీ ముగిసిన తర్వాత షమీ మళ్లీ ఇంత వరకు మైదానంలో దిగలేదు. మడిమ నొప్పి తీవ్రతరం కావడంతో శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ రైటార్మ్ పేసర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ అందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. ‘‘అందరికీ హెలో! నేను క్రమక్రమంగా కోలుకుంటున్నాను. నాకు సర్జరీ జరిగి 15 రోజులు అవుతోంది. ఇటీవలే సర్జరీ సమయంలో వేసిన కుట్లు విప్పారు. కోలుకునే ప్రయాణంలో తదుపరి దశకు చేరుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని షమీ తన ఫొటోలు పంచుకున్నాడు. ఇందుకు బదులిస్తూ ఓ నెటిజన్.. ‘‘వరల్డ్‌కప్ సమయంలో నొప్పిని భరిస్తూనే షమీ భాయ్... వంద శాతం ఎఫర్ట్ పెట్టాడు. కానీ ఓ ఆటగాడు ఉన్నాడు.. గాయపడకపోయినా.. గాయపడినట్లు నమ్మించి.. ఐపీఎల్ కోసం మాత్రం తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించినట్లుగా ఉన్న ఈ పోస్టుకు షమీ లైక్ కొట్టడంతో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా వరల్డ్‌కప్-2023 సమయంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన పాండ్యా.. తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు. అయితే, ఐపీఎల్-2024కు మాత్రం అతడు అందుబాటులో ఉండనున్నాడు. ఇక గుజరాత్ టైటాన్స్‌ను వీడిన పాండ్యా.. తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరి కెప్టెన్‌గా ఎంపికైన విషయం విదితమే!.. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. ఈ సీజన్ మొత్తానికి దూరంగా ఉండనున్నాడు. చదవండి: అతడు టీమిండియా కెప్టెన్.. వేటు వేస్తారా?: యువరాజ్ సింగ్ Hello everyone! I wanted to provide an update on my recovery progress. It has been 15 days since my surgery, and I recently had my stitches removed. I am thankful for the advancements I have achieved and looking forward to the next stage of my healing journey. 🙌 pic.twitter.com/wiuY4ul3pT — 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) March 13, 2024 -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్.. రిషబ్ పంత్‌కు గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త అందింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఐపీఎల్ ఆడేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2022 చరమాంకంలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ 14 నెలల రీహ్యాబ్ అనంతరం పూర్తి ఫిట్నెస్ సాధించాడని బీసీసీఐ సర్టిఫై చేసింది. పంత్ బ్యాటర్‌గానే కాకుండా వికెట్‌కీపర్‌గానూ ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ ధృవీకరించింది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. BCCI update on Rishabh Pant. pic.twitter.com/LnprCkgJ0v — CricTracker (@Cricketracker) March 12, 2024 బీసీసీఐ ఇచ్చిన సర్టిఫికెట్తో పంత్‌కు రానున్న ఐపీఎల్ సీజన్ ఆడేందుకు మార్గం సుగమం అయ్యింది. పంత్ బ్యాటర్‌గానే కాకుండా వికెట్‌కీపింగ్ కూడా చేయగలడిన బీసీసీఐ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానుల ఆనందానికి అవథుల్లేకుండా పోతున్నాయి. పంత్ ఐపీఎల్ 2024లో ఆడతాడని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా, వికెట్‌కీపింగ్ చేస్తాడా లేదా అన్న విషయమై సందిగ్దత నెలకొని ఉండింది. బీసీసీఐ తాజా ప్రకటనతో అభిమానుల అనుమానాలన్నీ తొలగిపోయాయి. రీఎంట్రీలో పంత్ మునపటిలా చెలరేగుతాడో లేదో వేచి చూడాలి. 🚨NEWS🚨 Rajasthan Royals pacer Prasidh Krishna underwent surgery on his left proximal quadriceps tendon and will miss IPL 2024. Mohammed Shami had surgery for his right heel problem and will take no part in IPL 2024 📸: BCCI#IPL2024 pic.twitter.com/0WBQsma9jI — CricTracker (@Cricketracker) March 12, 2024 పంత్ గురించి అప్డేట్ ఇచ్చే సందర్భంగానే బీసీసీఐ మరో ఇద్దరు ఆటగాళ్ల గురించి కూడా ప్రకటన విడుదల చేసింది. ఇటీవలే సర్జరీ చేయించుకున్న రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరంగా ఉండనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అలాగే చీలిమండ సర్జరీ చేయించుకున్న గుజరాత్ టైటాన్స్ పేసర్ మొహమ్మద్ షమీ కూడా సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడని అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. -
మొహమ్మద్ షమీకి సంబంధించి బిగ్ అప్డేట్
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీకి సంబంధించి బీసీసీఐ కార్యదర్శి జై షా బిగ్ అప్డేట్ ఇచ్చారు. షమీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో (స్వదేశంలో) జరిగే టెస్ట్ సిరీస్ సమయానికి అందుబాటులోకి వస్తాడని షా తెలిపారు. షా స్టేట్మెంట్ను బట్టి చూస్తే షమీ టీ20 వరల్డ్‌కప్‌తో పాటు ఐపీఎల్ ఆడడని ఖరారైపోయింది. లండన్‌లో చీలిమండ గాయానికి శస్త్రచికిత్స చేసుకుని ఇటీవలే స్వదేశానికి వచ్చిన షమీ.. గతేడాది భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. జై షా షమీ హెల్త్ అప్డేట్ ఇస్తున్న సందర్భంగానే మరో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌కు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. వెన్ను సమస్యతో బాధపడుతున్న రాహుల్.. ఐపీఎల్ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని షా తెలిపారు. ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రాహుల్‌కు ఇంజెక్షన్ అవసరముందని షా పేర్కొన్నారు. వెన్ను సమస్య కారణంగా రాహుల్ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని చివరి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కాగా, జై షా వీరిద్దరి గురించే కాకుండా మరో టీమిండియా ఆటగాడి హెల్త్ గురించి కూడా అప్డేట్ ఇచ్చడు. 2022లో కారు ప్రమాదానికి గురై ప్రస్తుతం ఎన్సీఏ రీహ్యాబ్‌లో ఉన్న రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నాడని షా తెలిపారు. పంత్ మునపటిలా బ్యాటింగ్ చేస్తున్నాడని పేర్కొన్నారు. త్వరలోనే పంత్‌కు ఎన్ఓసీ ఇస్తామని షా వెల్లడించారు. -
మహ్మద్ షమీ సంచలన నిర్ణయం.. క్రికెట్ గుడ్‌బై!? రాజకీయాల్లోకి ఎంట్రీ?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. షమీ భారతీయ జనతా పార్టీ తరపున పశ్చిమ బెంగాల్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ పెద్దలు షమీతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. బెంగాల్‌లోని బసిర్హత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి షమీని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే షమీ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా బెంగాల్ క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే బెంగాల్ మాజీ క్రికెటర్లు మనోజ్ తివారీ, అశోక్ దిండా రాజకీయాల్లో ఉన్నారు. తివారీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా.. దిండా బీజేపీ శాసన సభ్యునిగా ఉన్నాడు. కాగా షమీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇటీవలే తన మడమ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ తర్వాత వేగంగా కోలుకోవాలని ప్రధాని మోదీ సైతం షమీకి విషెస్ కూడా చెప్పారు. దీంతో షమీ రాజీకీయాల్లోకి రావడం ఫిక్స్ అయిపోయిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే షమీ ఒక వేళ రాజకీయాల్లోకి వస్తే అతడి అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది క్రికెటర్లు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. అంతర్జాతీయ క్రికెట్లో యాక్టివ్‌గా లేరు. షమీగా లోక్‌సభ ఎన్నికలో పోటీచేయాలని భావిస్తే అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికే ఛాన్స్ ఉంది. షమీ ప్రస్తుతం భారత క్రికెట్లో కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో షమీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 24 వికెట్లతో టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయితే వన్డే వరల్డ్‌కప్ తర్వాత షమీ తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. చదవండి: IND vs ENG: ఎందుకంత ఓవరాక్షన్ బాబు.. నీకు రోహిత్ చేతిలో ఉందిలా! వీడియో వైరల్ -
IPL 2024: గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్..
IPL 2024- Blow To Gujarat Titans: ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ! ఆ జట్టు ప్రధాన బౌలర్, టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తాజా సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం. షమీ మడిమ నొప్పి తీవ్రతరమైన నేపథ్యంలో అతడు సర్జరీ కోసం యూకే వెళ్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత భారత రైటార్మ్ పేసర్ మహ్మద్ షమీ ఆటకు దూరమైన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్‌లో ఇరగదీసి సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో తుదిజట్టులో చోటు కోసం ఎదురుచూడాల్సి వచ్చినా.. తనకు అవకాశం రాగానే ఆకాశమే హద్దుగా చెలరేగాడు షమీ. ఏకంగా మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి.. మొత్తంగా 24 వికెట్లు తీశాడు. తద్వారా వరల్డ్‌కప్-2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవార్డు అందుకున్నాడు. కాగా ఎడమకాలి మడిమ నొప్పి వేధిస్తున్నా బాధను పంటిబిగువన భరిస్తూ షమీ తన నైపుణ్యాలను ప్రదర్శించాడు. అయితే, ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత నొప్పి ఎక్కువ కావడంతో సౌతాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్న షమీ.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో తాజా టెస్టు సిరీస్‌కూ దూరమయ్యాడు. అయితే, మార్చిలో ఆరంభం కానున్న ఐపీఎల్ 17వ ఎడిషన్‌తో రీఎంట్రీ ఇస్తాడని భావించగా.. బీసీసీఐ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఇది అసాధ్యమేనని తెలుస్తోంది. లండన్‌లో చికిత్స? మడిమ నొప్పి చికిత్సకై షమీ లండన్ వెళ్లనున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి వెల్లడించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కాగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. అరంగేట్రంలోనే జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. గత సీజన్లో 17 మ్యాచ్‌లలో కలిపి 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వీడి ముంబై ఇండియన్స్ సారథిగా నియమితుడైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా నయా సూపర్‌స్టార్, యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ టైటాన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా.. షమీ రూపంలో ప్రధాన బౌలర్ జట్టుకు దూరం కావడం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. చదవండి: Yashasvi Jaiswal: టెంట్లలో నివాసం నుంచి.. బాంద్రా ఫ్లాట్ దాకా! కోట్లు పెట్టి కొన్నాడు -
IND vs ENG: టీమిండియాకు మరో బ్యాడ్ న్యూస్!?
స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే రెండో టెస్టుకు స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరం కాగా.. ఇప్పుడు వెటరన్ పేసర్ షమీ సిరీస్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లకు ప్రకటించిన భారత జట్టులో షమీకి చోటు దక్కలేదు. కానీ ఆఖరి మూడు టెస్టులకైనా తిరిగి వస్తాడని జట్టు మేనెజ్మెంట్ భావించింది. అయితే ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ.. పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. షమీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. షమీ బౌలింగ్ వేసే క్రమంలో చీలమండ నొప్పితో బాధపడుతున్నాడని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్ సైట్ క్రిక్ బజ్ పేర్కొంది. షమీ తన గాయం నుంచి కోలుకోవడానికి ఇంజెక్షన్లు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో అతడు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అతడు అందుబాటులోకి వచ్చేది అనుమానమే క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇక వన్డే వరల్డ్‌కప్ అద్బుత ప్రదర్శన కనబరిచిన అనంతరం షమీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాగా శుక్రవారం నుంచి విశాఖపట్నం వేదికగా భారత్ ఇంగ్లండ్ రెండో టెస్టు ప్రారంభం కానుంది. చదవండి: Sarfaraz Khan: చిన్న జట్ల మీద ఆడితే సరిపోతుందా? మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ -
పెళ్లి కొడుకు గెటప్‌లో షమీ.. మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా?
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ ప్రస్తుతం మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ తర్వాత షమీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా షమీ దూరమయ్యాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన జట్టులో షమీకి చోటు దక్కలేదు. అయితే షమీ త్వరలోనే సర్జరీ కోసం జర్మనీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వరుడి గెటప్‌లో షమీ.. ఇక ఇది ఇలా ఉండగా.. షమీ కొత్త లూక్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లికొడుకు ముస్తాబులో, తలపాగా ధరించి మెడలో దండతో ఉన్న మూడు ఫొటోలను షమీ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. ఫోటోలు చూసిన అభిమానులు ఏంటి షమీ సర్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా షమీ తన భార్య హసీన్ జహాన్‌తో ప్రస్తుతం దూరంగా ఉంటున్నాడు. షమీ తనతో క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని, గృహహింస సహా పలు ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో వారిద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో షమీ కొత్త లూక్లో ఇలా దర్శనివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
బ్యాటింగ్‌లోనూ ఇరగదీసిన షమీ తమ్ముడు.. టాప్ స్కోరర్‌గా..!
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ తమ్ముడు మొహమ్మద్ కైఫ్ రంజీ ట్రోఫీ 2024లో ఇరగదీస్తున్నాడు. బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కైఫ్.. యూపీతో జరుగుతున్న మ్యాచ్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. ఆంధ్రతో జరిగిన తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి పర్వాలేదనిపించిన కైఫ్.. బెంగాల్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 4, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి అన్నకు తగ్గ తమ్ముడనిపించుకున్నాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కైఫ్ యూపీతో మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన కైఫ్.. 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 45 పరుగులు చేసి, తన జట్టుకు అతి మూల్యమైన పరుగులను అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. కైఫ్ (4/14), సూరజ్ సింధు (3/20), ఇషాన్ పోరెల్ (2/24) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులకే కుప్పకూలింది. అనంతరం టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ (8/41) విజృంభించడంతో బెంగాల్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (188) పరిమితమైంది. ఆఖర్లో కైఫ్ (45 నాటౌట్) రాణించకపోయి ఉంటే, యూపీకి పట్టిన గతే బెంగాల్‌కు కూడా పట్టి ఉండేది. బెంగాల్ ఇన్నింగ్స్‌లో కైఫ్‌దే అత్యధిక స్కోర్ కావడం విశేషం. అనంతరం కైఫ్ యూపీ రెండో ఇన్నింగ్స్‌లోనూ బంతితో (3/72) చెలరేగాడు. కైఫ్‌తో పాటు సూరజ్ సింధు ఓ వికెట్ తీయడంతో యూపీ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 50 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. -
‘అర్జున’తో అందలం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు ప్రదాన కార్యక్రమం మంగళవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. వేర్వేరు క్రీడాంశాల్లో సత్తా చాటి ఈ పురస్కారానికి ఎంపికైన భారత ఆటగాళ్లు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దీనిని సగర్వంగా అందుకున్నారు. భారత క్రికెట్ జట్టు స్టార్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీతో పాటు తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ అర్జున అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు. జకార్తాలో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడుతున్న కారణంగా తెలంగాణ షూటర్ ఇషా సింగ్ ఈ అవార్డును అందుకోలేకపోయింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ‘ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపికైన టాప్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్), చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. వీరిద్దరు ప్రస్తుతం కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొంటున్నారు. భారత మహిళా చెస్ గ్రాండ్‌మాస్టర్, తమిళనాడు అమ్మాయి ఆర్. వైశాలి, రెజ్లర్ అంతిమ్ పంఘాల్, అథ్లెట్ పారుల్ చౌదరి, భారత కబడ్డీ జట్టు కెపె్టన్, తెలుగు టైటాన్స్ జట్టు స్టార్ ప్లేయర్ పవన్ కుమార్ సెహ్రావత్ కూడా అర్జున పురస్కారాన్ని అందుకున్నారు. పారా ఆర్చర్ శీతల్ దేవి అవార్డు అందుకుంటున్నప్పుడు ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లతో అభినందించగా... వీల్‌చైర్‌లో కూర్చుకున్న పార్ కనోయిస్ట్ ప్రాచీ యాదవ్ వద్దకు వెళ్లి స్వయంగా రాష్ట్రపతి అవార్డు అందించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంధ క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి కూడా అర్జున అవార్డును అందుకోగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన స్విమ్మర్ మోతుకూరి తులసీ చైతన్య టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాన్ని స్వీకరించాడు. విజయవాడ సిటీ స్పెషల్ బ్రాంచ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న 34 ఏళ్ల తులసీ చైతన్య కాటలీనా చానెల్, జిబ్రాల్టర్ జలసంధి, పాక్ జలసంధి, ఇంగ్లిష్ చానెల్, నార్త్ చానెల్లను విజయవంతంగా ఈది తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 2023 సంవత్సరానికి ఇద్దరికి ‘ఖేల్ రత్న’... 26 మందికి ‘అర్జున’... ఐదుగురికి ‘ద్రోణాచార్య’ రెగ్యులర్ అవార్డు... ముగ్గురికి ‘ద్రోణాచార్య’ లైఫ్‌టైమ్... ముగ్గురికి ‘ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్’ అవార్డులు ప్రకటించారు. ప్రతి ఏటా జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29న) ఈ అవార్డులను అందజేస్తారు. అయితే ఆ సమయంలో హాంగ్జౌ ఆసియా క్రీడలు జరుగుతుండటంతో అవార్డుల ఎంపికతోపాటు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. -
మహ్మద్ షమీకి అర్జున అవార్డు
-
రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న షమీ
టీమిండియా పేస్ బాద్షా మొహమ్మద్ షమీ ఇవాళ (జనవరి 9) దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నాడు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా షమీ ప్రతిష్టాత్మక అవార్డుచే సత్కరించబడ్డాడు. వన్డే వరల్డ్‌కప్ 2023లో అద్భుత ప్రదర్శన (7 మ్యాచ్‌ల్లో 3 ఐదు వికెట్ల ఘనతలతో 24 వికెట్లు) కారణంగా షమీ అర్జున్ అవార్డుకు ఎంపికయ్యాడు. A proud day for cricket...!!! Shami is now a Arjuna Awardee. 🫡pic.twitter.com/A8NDBqcjt1 — Mufaddal Vohra (@mufaddal_vohra) January 9, 2024 షమీతో పాటు వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు లభించాయి. గతేడాది బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమంగా రాణించిన చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి, రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌లకు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులు దక్కాయి. షమీకి ముందు ప్రస్తుత భారత క్రికెటర్లు శిఖర్ ధవన్ (2021), రవీంద్ర జడేజా (2019), రోహిత్ శర్మ (2015), రవిచంద్రన్ అశ్విన్ (2014), విరాట్ కోహ్లి (2013) అర్జున అవార్డులు గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్ అనంతరం షమీ గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు సైతం అతను దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ సమయానికి షమీ ఫిట్‌గా ఉంటాడని తెలుస్తుంది. 33 ఏళ్ల షమీ టీమిండియా తరఫున 64 టెస్ట్‌లు, 101 వన్డేలు, 23 టీ20లు ఆడి 448 వికెట్లు పడగొట్టాడు. షమీ ఖాతాలో రెండు టెస్ట్ అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. షమీకి ఐపీఎల్లో సైతం ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. తన ఐపీఎల్ కెరీర్లో 110 మ్యాచ్‌లు ఆడి 127 వికెట్లు పడగొట్టాడు. -
అరంగేట్రంలో సత్తాచాటిన మహ్మద్ షమీ తమ్ముడు.. ఆంధ్రా జట్టుపై!
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ తన రంజీ ట్రోఫీ అరంగేట్రంలో అదరగొట్టాడు. రంజీ ట్రోఫీ-2024 సీజన్లో భాగంగా ఆంధ్రాతో మ్యాచ్‌తో బెంగాల్ తరుపున మహ్మద్ కైఫ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కైఫ్ 3 వికెట్లు పడగొట్టి అందరని అకట్టుకున్నాడు. కైఫ్‌కు కేవలం ఒకే ఇన్నింగ్స్‌లో మాత్రం బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. ఓవరాల్‌గా మొదటి ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లు బౌలింగ్ చేసిన కైఫ్.. కవలం 62 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. ఇక ఆంధ్ర, బెంగాల్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 409 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బెంగాల్ బ్యాటర్లలో ముజుందార్(125) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అనంతరం ఆంధ్ర జట్టు సైతం తమ తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. ఆంధ్ర కూడా 445 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. 36 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బెంగాల్ ఆఖరి రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: IND vs SA: రోహిత్ వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్.. చర్యలకు సిద్దం!? -
టీమిండియాను వదలని గాయాల బెడద.. అతడు కూడా అవుట్?
Ind vs Eng Test Series- 2024: టీమిండియా వెటరన్ బౌలర్ మహ్మద్ షమీ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా అతడు ఇప్పట్లో మైదానంలో దిగడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్‌కప్-2023లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన ఐసీసీ టోర్నీలో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఈ స్టార్ పేసర్.. 24 వికెట్లు పడగొట్టాడు. తద్వారా తాజా ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవార్డు అందుకున్నాడున. చీలమండ నొప్పితో బాధపడుతున్నప్పటికీ ఇంజక్షన్లు తీసుకుంటూ ఈ ఈవెంట్‌ను పూర్తి చేశాడు షమీ. ప్రపంచకప్ ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకున్న షమీ.. గాయం నుంచి కోలుకొని కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోయాడు. అయితే, స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ నాటికి అతడు అందుబాటులోకి వస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. తాజా సమాచారం ప్రకారం అతడు ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘షమీ ఇప్పటికీ బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టలేదు. జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి అతడు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. కాబట్టి ఇంగ్లండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నాయి. కాగా సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ అదరగొట్టారు. వీరిద్దరి విజృంభణ కారణంగా కేప్‌టౌన్‌లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకోగలిగింది. అయితే, అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా వీరిద్దరికి మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. ఇంగ్లండ్‌తో టెస్టులకు వీరిలో ఒక్కరు అందుబాటులోకి వచ్చినా షమీ లేనిలోటు తెలియదు. అలాకాక ఇద్దరికీ రెస్ట్ పొడిగిస్తే.. యువ ఫాస్ట్‌బౌలర్లకు అవకాశం దక్కొచ్చు. అయితే, ఉపఖండ పిచ్‌లపై స్పిన్నర్లే ఎక్కువ ప్రభావం చూపగలరు కాబట్టి.. పేస్ దళం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాగా టీమిండియా ప్రస్తుతం గాయాల బెడదతో సతమతమవుతోంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటికే ఆటకు దూరమయ్యారు. ఇదిలా ఉంటే.. జనవరి 11- 17 మధ్య అఫ్గనన్తో టీ20 సిరీస్ ఆడనున్న టీమిండియా.. తదుపరి జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది. చదవండి: ‘మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇకపై అక్కడికి వెళ్తారా? లేదా..’ -
తమ్ముడి అరంగేట్రం.. మహ్మద్ షమీ భావోద్వేగం!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ బెంగాల్ జట్టు తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. రంజీట్రోఫీ-2024 సీజన్లో భాగంగా శుక్రవారం ఆంధ్ర జట్టుతో ప్రారంభమైన మ్యాచ్‌తో మహ్మద్ కైఫ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో తన తమ్ముడికి అభినందనలు తెలుపుతూ మహ్మద్ షమీ భావోద్వేగ పోస్ట్ చేశాడు. "ఎట్టకేలకు నీవు అనుకున్నది సాధించావు. బెంగాల్ వంటి అద్బుత జట్టు తరపున రంజీ క్రికెట్ ఆడే అవకాశం లభించింది. నా దృష్టిలో ఇది నీవు సాధించిన గొప్ప విజయం. నీ కెరీర్లో మరింత ఎత్తుకు ఎదిగాలని కోరుకుంటున్నాను. జట్టు కోసం ప్రతీ మ్యాచ్‌లోను 100 శాతం ఎఫర్ట్ పెట్టి ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. కంగ్రాట్స్ కైఫ్ అని షమీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. కాగా మహ్మద్ కైఫ్ కూడా షమీ మాదిరే రైట్ ఆర్మ్ మీడియం పేసర్ కావడం విశేషం. కాగా లిస్ట్-ఏ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తుండడంతో కైఫ్‌కు ఈ ఏడాది రంజీ సీజన్లో తమ తొలి రెండు మ్యాచ్‌లకు ప్రకటించిన బెంగాల్ జట్టులో చోటు దక్కింది. 2021లో బెంగాల్ తరపున లిస్ట్-ఏ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. గతేడాది ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా కైప్ అదరగొట్టాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన కైఫ్ 12 వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11) -
వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2023 అవార్డు రేసులో ముగ్గురు టీమిండియా క్రికెటర్లు
ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 నామినీస్ జాబితాను ఇవాళ (జనవరి 4) ప్రకటించింది. అవార్డు రేసులో ఏకంగా ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఉండటం విశేషం. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో అద్బుత ప్రదర్శన కనబర్చిన విరాట్ కోహ్లి, మొహమ్మద్ షమీతో పాటు గతేడంతా వన్డేల్లో అద్భుతంగా రాణించిన శుభ్‌మన్ గిల్ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు కోసం పోటీపడనున్నారు. వీరితో పాటు న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ రేసులో నిలిచాడు. మిచెల్ సైతం గతేడంతా వన్డేల్లో అద్భుతంగా రాణించడంతో పాటు వరల్డ్‌కప్ 2023లోనూ చెలరేగిపోయాడు. కాగా, ఐసీసీ నిన్న మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (2023), మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ (2023) అవార్డుల కోసం నామినీస్ జాబితాను ప్రకటించింది. టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌తో పాటు జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్, ఉగాండ ఆటగాడు అల్పేశ్ రామ్‌జనీ ఉండగా.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో టీమిండియా అప్‌కమింగ్ స్టార్ యశస్వి జైస్వాల్‌తో పాటు న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర, సౌతాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ, శ్రీలంక పేసర్ దిల్షన్ మధుషంక నిలిచారు. గతేడాది ఆయా విభాగాల్లో ప్రదర్శన ఆధారంగా ఐసీసీ నామినీస్ జాబితాను ఎంపిక చేసింది. -
షమీ.. నీ కమిట్మెంట్కు సలాం.. వరల్డ్‌కప్ మొత్తం పెయిన్ కిల్లర్స్‌తోనే..!
టీమిండియా స్వింగ్ సుల్తాన్ మొహమ్మద్ షమీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2023 వరల్డ్‌కప్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచి, టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన షమీ.. మెగా టోర్నీ ఆధ్యాంతం గాయంతో సతమతమయ్యాడని సమాచారం. దీర్ఘకాలిక మడమ సమస్యతో బాధపడుతున్న షమీ నొప్పిని అధిగమించేందుకు ప్రతి మ్యాచ్‌కు ముందు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ వాడాడని అతని సహచరుడొకరు ప్రముఖ న్యూస్ ఛానెల్‌తో చెప్పాడు. గాయం కారణంగా అప్పటికే కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం కోల్పోయిన షమీ.. హార్దిక్ గాయపడ్డాక బెంచ్‌పై కూర్చోకూడదని నిర్ణయించకున్నాడట. అందుకే రిస్క్ చేసి మరీ బరిలోకి దిగాడట. ఆట పట్ల షమీకి ఉన్న అంకితభావం గురించి తెలిసి అభిమానులు అతన్ని పోరాట యోధుడితో పోలుస్తున్నారు. షమీ.. నీ కమిట్మెంట్కు సలాం అని కొనియాడుతున్నారు. కాగా, ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫైనల్ వరకు అద్భతమైన ఆటతీరు కనబర్చి, తుది సమరంలో ఆసీస్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో షమీ 7 మ్యాచ్‌ల్లో 3 ఐదు వికెట్ల ఘనతల సాయంతో 24 వికెట్లు పడగొట్టాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు వరల్డ్‌కప్ అనంతరం విరామం తీసుకున్న షమీ.. తొలుత సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే బీసీసీఐ నుంచి అతనికి ఫిట్నెస్ క్లియెరెన్స్ దక్కకపోవడంతో సిరీస్ మొత్తనికి దూరంగా ఉన్నాడు. షమీ గైర్హాజరీలో టీమిండియా.. తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. షమీ స్థానంలో రెండో టెస్ట్‌కు ఆవేశ్ ఖాన్‌ను ఎంపిక చేశారు భారత సెలెక్టర్లు. వచ్చే ఏడాది (2024) జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్ (వికెట్‌కీపర్), అభిమన్యు ఈశ్వరన్, అవేష్ ఖాన్ -
రంజీ ట్రోఫీకి జట్టు ప్రకటన.. మహ్మద్ షమీ తమ్ముడు ఎంట్రీ?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో తమ తొలి రెండు మ్యాచ్‌లకు ఎంపిక చేసిన బెంగాల్ జట్టులో మహ్మద్ కైఫ్‌కు చోటుదక్కింది. లిస్ట్-ఏ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తుండడంతో కైఫ్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. 2021లో బెంగాల్ తరపున లిస్ట్-ఏ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఈ ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా కైప్ అదరగొట్టాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన కైఫ్ 12 వికెట్లు పడగొట్టాడు. ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో బెంగాల్ జట్టుకు ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారీ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. బెంగాల్ జట్టు మనోజ్ తివారీ(కెప్టెన్), అనుస్తుప్ మజుందార్, సుదీప్ ఘరామి, అభిషేక్ పోరెల్, సౌరవ్ పాల్, శ్రేయాన్ష్ ఘోష్, శుభమ్ ఛటర్జీ, రంజోత్ ఖైరా, ఇషాన్ పోరెల్, ఆకాశ్ దీప్, కౌశిక్ మైతీ, కరణ్ లాల్, సూరజ్ జైస్వాల్, అన్కీ మహ్మద్ కైఫ్ , ప్రయాస్ బర్మన్, ప్రదీప్త ప్రమాణిక్, సుమన్ దాస్. -
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్.. టీమిండియాలోకి యువ పేసర్
జనవరి 3 నుంచి సౌతాఫ్రికాతో జరుగనున్న రెండో టెస్ట్ కోసం టీమిండియా ఓ మార్పు చేసింది. టెస్ట్ సిరీస్ కోసం తొలుత ఎంపిక చేయబడిన మొహమ్మద్ షమీ.. ఫిట్నెస్ క్లియెరెన్స్ లభించని కారణంగా సిరీస్ మొత్తానికే దూరం కాగా.. 27 ఏళ్ల మధ్యప్రదేశ్ పేసర్ ఆవేశ్ ఖాన్ షమీ స్థానంలో రెండో టెస్ట్ కోసం టీమిండియాలోకి వచ్చాడు. ఈ విషయాన్ని భారత సెలెక్టర్లు ఇవాళ (డిసెంబర్ 29) అధికారికంగా ప్రకటించారు. ఆవేశ్ ఖాన్ ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 6 వికెట్లతో రాణించిన కారణంగా రెండో టెస్ట్ కోసం అతన్ని ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు చెప్పారు. ఆవేశ్ ఖాన్ భారత టెస్ట్ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. గతేడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ఆవేశ్.. టీమిండియా తరఫున ఇప్పటివరకు 8 వన్డేలు, 19 టీ20లు ఆడి ఓవరాల్‌గా 27 వికెట్లు పడగొట్టాడు. కాగా, సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో ఇటీవల ముగిసిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేస్తూ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైన భారత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింత దారణంగా విఫలమై 131 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (101) అద్భుతమైన సెంచరీతో పోరాడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (76) ఒంటరిపారాటం చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విరాట్‌తో పాటు కేవలం శుభ్‌మన్ గిల్ (26) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో రబాడ (5/59), నండ్రే బర్గర్ (3/50).. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బర్గర్ (4/33), జన్సెన్ (3/36) కుప్పకూల్చారు. సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఓపెనర్ డీన్ ఎల్గర్ (185) భారీ శతకంతో కదంతొక్కడంతో పాటు బెడింగ్హమ్ (56), మార్కో జన్సెన్ (84 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటైంది. ఈ స్కోర్‌ను భారత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కూడా అధిగమించలేక ఇన్నింగ్స్ తేడాతో ఓడింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లతో పర్వాలేదనిపించగా.. సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ద్ కృష్ణ, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. వచ్చే ఏడాది (2024) జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్ (వికెట్‌కీపర్), అభిమన్యు ఈశ్వరన్, అవేష్ ఖాన్ -
'అతడిని టీమిండియా మిస్సవుతోంది.. సౌతాఫ్రికాకు చుక్కలు చూపించేవాడు'
సెంచూరియన్ వేదికగా టీమిండయాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో దక్షిణాఫ్రికా పట్టుబిగుస్తోంది. భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే కట్టడి చేసిన దక్షిణాఫ్రికా.. అనంతరం బ్యాటింగ్‌లోనూ సత్తాచాటుతోంది. రెండో రోజు ఆటలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు. ముఖ్యంగా ప్రోటీస్ ఓపెనర్ డీన్ ఎల్గర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ మినహా మిగితా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బమ్రా, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించగా.. అరంగేట్ర ఆటగాడు ప్రసిద్ద్ కృష్ణ ఒక్క వికెట్ పడగొట్టినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతడితో పేస్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ కూడా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా.. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ సేవలు కోల్పోయిందని కార్తీక్ అభిప్రాయపడ్డాడు. "వెటరన్ పేసర్ మహ్మద్ షమీని భారత జట్టు నిజంగా మిస్ అవుతోంది. అందులో ఎటువంటి సందేహం లేదు. సెంచూరియన్ వంటి వికెట్‌పై షమీ తన సీమ్‌తో అద్భుతాలు చేయగలడు. షమీ ఆడి ఉంటే ఇప్పటికే దక్షిణాఫ్రికా ఆలౌట్ అయిపోయి ఉండేది. జస్ప్రీత్ బుమ్రా, షమీ ద్వయం ప్రత్యర్ధి జట్టును ముప్పుతిప్పులు పెట్టేవారు. శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. వీరిద్దరి కలిసి కేవలం 27 ఓవర్లలనే 118 పరుగులు సమర్పించుకున్నారు. సిరాజ్ వికెట్లు తీసినప్పటికీ కొంచెం ఎక్కువగా పరుగులు ఇచ్చాడు. అయితే చివరి స్పెల్‌లో సిరాజ్ అద్భుతమైన బంతులను వేశాడు. అతడి బౌలింగ్ చూస్తే ఒకట్రెండు వికెట్లు పడగొట్టగలడనే నమ్మకం నాకు కలిగింది. మూడో రోజు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేస్తే మ్యాచ్ మలుపు తిరగవచ్చు అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. చదవండి: AUS Vs PAK: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిపోయిన మ్యాచ్! వీడియో వైరల్ -
Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: బవుమా
Ind vs SA 2023 Test Series: పటిష్ట టీమిండియాను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదని సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా అన్నాడు. గత దశాబ్దకాలంగా భారత జట్టు టెస్టుల్లో మరింత ప్రమాదకారిగా మారిందని.. వారిని ఓడించడం అంత సులువేమీ కాదని పేర్కొన్నాడు. ముఖ్యంగా టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణిస్తూ ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసురుతున్నారని కొనియాడాడు. సఫారీ గడ్డపై అందని ద్రాక్షగానే సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసిన భారత్.. వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ఈ క్రమంలో.. సఫారీ గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్ విజయంపై కన్నేసింది. ప్రొటిస్ జట్టుపై పైచేయి సాధించి చరిత్రాత్మక గెలుపు నమోదు చేయాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే రోహిత్ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఇరు జట్ల మధ్య మంగళవారం (డిసెంబరు 26) నుంచి తొలి టెస్టు ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా మీడియాతో మాట్లాడాడు. టీమిండియాను తేలికగా తీసుకోం ఈ సందర్భంగా టీమిండియా పేసర్ మహ్మద్ షమీ గైర్హాజరీ గురించి ప్రశ్న ఎదురుకాగా ఆసక్తికర సమాధానమిచ్చాడు. షమీ జట్టుతో లేకపోయినా.. అతడి స్థానాన్ని భర్తీ చేసే ఏ టీమిండియా బౌలర్ అయినా తమను ఒత్తిడిలోకి నెట్టగలడని బవుమా పేర్కొన్నాడు. భారత బౌలింగ్ విభాగం పటిష్టమైందని.. వారిని తేలికగా తీసుకోమని స్పష్టం చేశాడు. ‘‘ఒక క్రికెటర్‌గా.. ముఖ్యంగా బ్యాటర్‌గా అత్యుత్తమైన ప్రత్యర్థితో తలపడాలని భావించడం సహజం. మహ్మద్ షమీ అలాంటి కోవకే చెందుతాడు. అతడు అద్భుతమైన పేసర్. మాలో చాలా మంది అతడి బౌలింగ్‌లో ఆడాలని కోరుకుంటారు. షమీ లేకపోయినా.. టీమిండియా టీమిండియానే అయితే, అతడు లేకపోయినా టీమిండియా.. టీమిండియానే.. అతడి స్థానంలో ఎవరు వచ్చినా మాపై ఒత్తిడి పెంచగలడు. ఎందుకంటే భారత బౌలింగ్ లైనప్ ప్రస్తుతం అలా ఉంది. సొంతగడ్డపై ఆడటం మాకు సానుకూలాంశమే అయినా.. టీమిండియా వంటి పటిష్ట జట్టుతో పోటీ అంటే సవాలే. సిరీస్ గెలిచి తీరతాం గత ఐదు- పదేళ్ల కాలంలో వారు టెస్టుల్లో అద్భుతమైన విజయాలు సాధించారు. భారత బౌలింగ్ అటాక్ వల్లే ఇది సాధ్యమైందని చెప్పడంలో అతిశయోక్తి లేదు’’ అని తెంబా బవుమా టీమిండియా బౌలింగ్ విభాగంపై ప్రశంసలు కురిపించాడు. అయితే, భారత జట్టుపై స్వదేశంలో తమకు ఉన్న అజేయ రికార్డును తప్పకుండా నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా బవుమా ధీమా వ్యక్తం చేశాడు. కాగా గాయం కారణంగా షమీ జట్టుకు దూరం కాగా.. అతడి స్థానంలో ముకేశ్ కుమార్ లేదంటే ప్రసిద్ కృష్ణ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. చదవండి: WFI: సస్పెన్షన్ ఎత్తివేయాల్సిందే! మా దగ్గర సాక్ష్యాలున్నాయి! -
షమీకి అర్జున.. చిరాగ్, సాత్విక్‌లకు ఖేల్‌రత్న అవార్డులు
జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ ఏడాది వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు, బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమంగా రాణించిన ఇద్దరికి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులు దక్కాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అత్యుత్తమంగా రాణించిన మొహమ్మద్ షమీని అర్జున అవార్డు వరించగా.. చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి, రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌లకు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులు దక్కాయి. అర్జున, ఖేల్‌రత్న అవార్డులతో పాటు కేంద్రం ద్రోణాచార్య (రెగ్యులర్, లైఫ్‌టైమ్), ధ్యాన్‌చంద్ (లైఫ్‌టైమ్ అఛీవ్మెంట్) అవార్డులను కూడా ప్రకటించింది. అవార్డు పొందిన వారందరూ వచ్చే ఏడాది (2024) జనవరి 9న భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకుంటారు. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులు 2023: చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి (బ్యాడ్మింటన్) రాంకిరెడ్డి సాత్విక్‌సాయిరాజ్ (బ్యాడ్మింటన్) అర్జున అవార్డులు 2023: ఓజాస్ ప్రవీణ్ దియోటలే (ఆర్చరీ) అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ) ఎం శ్రీశంకర్ (అథ్లెటిక్స్) పారుల్ చౌదరీ (అథ్లెటిక్స్) మొహమ్మద్ హుస్సాముద్దీన్ (బాక్సింగ్) ఆర్ వైశాలీ (చెస్) మొహమ్మద్ షమీ (క్రికెట్) అనూషా అగర్వల్లా (ఈక్వెస్ట్రియన్) దివ్యకృతి సింగ్ (ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్) దీక్షా దాగర్ (గోల్ఫ్) కృషణ్ బహదూర్ పాఠక్ (హాకీ) పుఖ్రంబం సుశీల చాను (హాకీ) పవన్ కుమార్ (కబడ్డీ) రీతు నేగి (కబడ్డీ) నస్రీన్ (ఖోఖో) పింకీ (లాన్ బౌల్స్) ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్) ఈషా సింగ్ (షూటింగ్) హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్) అహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్) సునీల్ కుమార్ (రెజ్లింగ్) అంటిమ్ (రెజ్లింగ్) నౌరెమ్ రోషిబినా దేవి (ఉషు) శీతల్ దేవి (పారా ఆర్చరీ) ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్) ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్) ద్రోణాచార్య అవార్డులు 2023 (రెగ్యులర్): లలిత్ కుమార్ (రెజ్లింగ్) ఆర్ బి రమేష్ (చదరంగం) మహావీర్ ప్రసాద్ సైనీ (పారా అథ్లెటిక్స్) శివేంద్ర సింగ్ (హాకీ) గణేష్ ప్రభాకర్ దేవ్రుఖ్కర్ (మల్లఖాంబ్) ద్రోణాచార్య అవార్డులు 2023 (లైఫ్‌టైమ్): జస్కీరత్ సింగ్ గ్రేవాల్ (గోల్ఫ్) ఈ భాస్కరన్ (కబడ్డీ) జయంత కుమార్ పుషీలాల్ (టేబుల్ టెన్నిస్) ధ్యాన్‌చంద్ అవార్డులు 2023 (లైఫ్‌టైమ్): మంజుషా కన్వర్ (బ్యాడ్మింటన్) వినీత్ కుమార్ శర్మ (హాకీ) కవిత సెల్వరాజ్ (కబడ్డీ) మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2023: గురునానక్ దేవ్ యూనివర్సిటీ, అమృత్సర్ (విజేత) లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ (మొదటి రన్నరప్) కురుక్షేత్ర విశ్వవిద్యాలయం, కురుక్షేత్ర (రెండో రన్నరప్) -
టీమిండియాకు భారీ షాక్.. ఆ ఇద్దరూ కూడా! బీసీసీఐ అధికారిక ప్రకటన
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ ఫిట్నెస్ కారణంగా సౌతాఫ్రికాతో టెస్టులకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా శనివారం దృవీకరించింది. షమీ ఫిట్‌నెస్‌పై మెడికల్ టీమ్ ఇంకా క్లియర్స్ ఇవ్వలేదని, అందువల్ల షమీ దక్షిణాఫ్రికు వెల్లడం లేదని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా షమీ ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. మోకాలి నొప్పికి అతడు చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి బీసీసీఐ తప్పించింది. అతడు తిరిగి వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అదే విధంగా భారత యువ పేసర్ దీపక్ చాహర్.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ప్రోటీస్ పర్యటనకు దూరంగా ఉండాలని చాహర్ నిర్ణయించకున్నాడు. దీంతో అతడి స్ధానాన్ని బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్తో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దీపక్ చాహర్ తండ్రి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తండ్రిని దగ్గరుండి చాహర్ చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడు వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. 🚨 NEWS 🚨 Deepak Chahar withdrawn from the ODI series; Mohd. Shami ruled out of the Test series. Details 🔽 #TeamIndia | #SAvIND https://t.co/WV86L6Cnmt pic.twitter.com/oGdSJk9KLK — BCCI (@BCCI) December 16, 2023