Ramoji Rao
-
రూ.2,610 కోట్ల అక్రమ డిపాజిట్లు.. 18 ఏళ్లుగా జిత్తులు!
చట్టపరమైన చర్యల కోసం కింది కోర్టులో అ«దీకృత అధికారి ఫిర్యాదు చేస్తే దానిపై పిటిషన్..! వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిషన్‌ను నియమిస్తే పిటిషన్...! అధీకృత అధికారిని నియమిస్తే పిటిషన్..! కేసు వాదించడానికి స్పెషల్ పీపీని నియమిస్తే పిటిషన్! కింది కోర్టు విచారణకు స్వీకరిస్తే పిటిషన్...! వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తే పిటిషన్..! హైకోర్టు జోక్యానికి నిరాకరిస్తే సుప్రీంకోర్టులో పిటిషన్...!! ఇలా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్ 6న బట్టబయలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు.ప్రతి దశలోనూ విచారణను అడ్డుకుంటూ వచ్చారు. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 7వ తేదీన మరోసారి విచారణ జరపనుంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు స్వీకరించిందా? లేదా? అనే విషయాన్ని తేల్చనుంది. చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించినట్లు తేలితే వసూలు చేసిన రూ.2,610 కోట్లకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అటు అక్రమ డిపాజిట్లు.. ఇటు నష్టాలంటూ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997 కేంద్ర చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. అయితే దీన్ని ఖాతరు చేయకుండా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి 1997 నుంచి 2006 మార్చి నాటికి 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.2,610.38 కోట్లు అక్రమంగా వసూలు చేసింది. ఇంత భారీగా డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఆశ్చర్యకరంగా 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. తద్వారా 50 శాతం మంది డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేరింది. డొంక కదిల్చిన ఉండవల్లి... మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. మార్గదర్శి అక్రమాల తీరును బహిర్గతం చేశారు. ఇదే సమయంలో ఆ డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నుంచి వివరణ కోరింది.వాస్తవానికి 1997లోనే డిపాజిట్ల సేకరణపై మార్గదర్శి స్పష్టత కోరగా ప్రజల నుంచి అలా సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ అప్పుడే స్పష్టం చేసింది. అయినా సరే పట్టించుకోకుండా మార్గదర్శి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తూ వచి్చంది. ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారో అప్పుడు మళ్లీ ఆర్బీఐ దీనిపై స్పందించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. రంగాచారి, కృష్ణరాజు నియామకం.. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో చట్ట ప్రకారం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముందుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని, చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ టి.కృష్ణరాజును అ«దీకృత అధికారిగా నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ నియామకాలను సవాలు చేస్తూ రామోజీ 2006లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం 2007లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఐటీ శాఖ నుంచి సేకరించిన రంగాచారి.. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రంగాచారి నిర్వహించిన విచారణకు రామోజీరావు, మార్గదర్శి సహకరించకుండా కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డంకులు సృష్టించారు. తమ పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని, డాక్యుమెంట్లు ఇచ్చేది లేదంటూ మొండికేశారు. దీంతో రంగాచారి ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ నుంచి తెప్పించుకున్నారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని పేర్కొంటూ 2007 ఫిబ్రవరి 19న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టుకు నివేదించటాన్ని తన నివేదికలో పొందుపరిచారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆరి్థక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. రామోజీ పెట్టుబడి రూపాయైనా లేదు.. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీ తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణలో తేల్చారు. 2000, ఆ తరువాత బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని నిగ్గు తేల్చారు. కోర్టు అనుమతితో తనిఖీలు.. మరోవైపు ఈ కేసులో అ«దీకృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు కోర్టు అనుమతితో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో తనిఖీలు చేశారు. దీన్ని సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ 14.3.2007న కోర్టు ఉత్తర్వులిచి్చంది. దీనిపై రామోజీ హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టు ఇచి్చన సెర్చ్ వారెంట్‌ను నిలుపుదల చేసింది. ఈ క్రమంలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. దీన్ని కొట్టి వేయాలంటూ అదే ఏడాది రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ రజనీ స్టేతో మూలపడిన కేసు.. దీంతో దిక్కుతోచని రామోజీ 2010లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అ«దీకృత అధికారి ఇచ్చిన ఫిర్యాదులో విచారణను సెక్షన్ 45(ఎస్)(1), 45(ఎస్)(2), 58బీ(5ఏ) రెడ్ విత్ సెక్షన్ 58(ఈ)లకే పరిమితం చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ నాంపల్లి కోర్టు 2011లో ఉత్తర్వులిచ్చి0ది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్బీఐ చట్టం పరిధిలోకి మార్గదర్శి ఫైనాన్షియర్స్ రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 20.7. 2011న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.‘‘స్టే’’ వల్ల కేసు అప్పటి నుంచి మూలనపడిపోయింది. అటు తరువాత వచి్చన ప్రభుత్వాలు రామోజీ గుప్పిట్లో ఉండటంతో మార్గదర్శి అక్రమాలను పట్టించుకోలేదు. విచారణ.. తీర్పు.. ఒకే రోజు ఉమ్మడి హైకోర్టు విభజన 1.1.2019న జరిగింది. 31.12.2018 ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అటు న్యాయవాదులు ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై దృష్టి సారించలేని పరిస్థితిని రామోజీరావు తనకు అనుకూలంగా మలచుకున్నారు. నాంపల్లి కోర్టులో అ«దీకృత కృష్ణరాజు చేసిన ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో తాము దాఖలు చేసిన వ్యాజ్యాలను రామోజీ విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రాను రంగంలోకి దించారు. లూథ్రా వాదనలు విన్న జస్టిస్ రజనీ ఇంత పెద్ద కేసులో అదే రోజు అంటే 31వతేదీన తీర్పు కూడా ఇచ్చేశారు. రామోజీ, మార్గదర్శి వాదనను సమరి్థంచారు. హెచ్‌యూఎఫ్.. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదని జస్టిస్ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో అధీకృత అధికారి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి అదే రోజు తీర్పునివ్వడం అరుదైన ఘటన. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లుగానీ ఎవరూ గుర్తించలేదు. అటు తరువాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. జస్టిస్ రజనీ తీర్పుపై మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అటు తరువాత మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2019 డిసెంబర్ 17న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. హైకోర్టు తీర్పును రద్దు చేసిన సుప్రీం.. హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు 19.9.2020న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం17.8.2022న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటు ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ ప్రభుత్వం, ఇటు మార్గదర్శి, రామోజీరావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చి0ది. మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు విచారణ సందర్భంగా ఆర్బీఐ న్యాయవాది మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా ఈ ఏడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసుల కొట్టివేతకు సుప్రీం నిరాకరణ.. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ ఇదే సమయంలో రామోజీ, మార్గర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చి0ది. చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని.. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు ఏకపక్షంగా ఇచి్చన తీర్పును పక్కనపెడుతున్నామని స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని, సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. తాజాగా విచారణ జరిపి ఆరు నెలల్లో విచారణను ముగించాలని, సేకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని తెలిపింది. తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూన్‌లో తిరిగి విచారణ ప్రారంభించింది. విచారణ జరుగుతుండగానే రామోజీరావు మరణించగా ఆయన స్థానంలో హెచ్‌యూఎఫ్ కర్తగా తనను చేర్చాలని రామోజీ కుమారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలు వాయిదాల అనంతరం పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ఈ నెల 7న విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. -
రూ.2,610 కోట్ల అక్రమ డిపాజిట్లు..18 ఏళ్లుగా జిత్తులు!
చట్టపరమైన చర్యల కోసం కింది కోర్టులో అదీకృత అధికారి ఫిర్యాదు చేస్తే దానిపై పిటిషన్..! వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిషన్‌ను నియమిస్తే పిటిషన్...! అధీకృత అధికారిని నియమిస్తే పిటిషన్..! కేసు వాదించడానికి స్పెషల్ పీపీని నియమిస్తే పిటిషన్! కింది కోర్టు విచారణకు స్వీకరిస్తే పిటిషన్...! వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తే పిటిషన్..! హైకోర్టు జోక్యానికి నిరాకరిస్తే సుప్రీంకోర్టులో పిటిషన్...!! సాక్షి, అమరావతి: ఇలా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్ 6న బట్టబయలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు. ప్రతి దశలోనూ విచారణను అడ్డుకుంటూ వచ్చారు. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 7వ తేదీన మరోసారి విచారణ జరపనుంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు స్వీకరించిందా? లేదా? అనే విషయాన్ని తేల్చనుంది. చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించినట్లు తేలితే వసూలు చేసిన రూ.2,610 కోట్లకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అటు అక్రమ డిపాజిట్లు.. ఇటు నష్టాలంటూ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997 కేంద్ర చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. అయితే దీన్ని ఖాతరు చేయకుండా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి 1997 నుంచి 2006 మార్చి నాటికి 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.2,610.38 కోట్లు అక్రమంగా వసూలు చేసింది. ఇంత భారీగా డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఆశ్చర్యకరంగా 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. తద్వారా 50 శాతం మంది డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేరింది. డొంక కదిల్చిన ఉండవల్లి... మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. మార్గదర్శి అక్రమాల తీరును బహిర్గతం చేశారు. ఇదే సమయంలో ఆ డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నుంచి వివరణ కోరింది. వాస్తవానికి 1997లోనే డిపాజిట్ల సేకరణపై మార్గదర్శి స్పష్టత కోరగా ప్రజల నుంచి అలా సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ అప్పుడే స్పష్టం చేసింది. అయినా సరే పట్టించుకోకుండా మార్గదర్శి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారో అప్పుడు మళ్లీ ఆర్బీఐ దీనిపై స్పందించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. రంగాచారి, కృష్ణరాజు నియామకం.. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో చట్ట ప్రకారం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముందుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని, చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ టి.కృష్ణరాజును అ«దీకృత అధికారిగా నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ నియామకాలను సవాలు చేస్తూ రామోజీ 2006లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం 2007లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఐటీ శాఖ నుంచి సేకరించిన రంగాచారి.. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రంగాచారి నిర్వహించిన విచారణకు రామోజీరావు, మార్గదర్శి సహకరించకుండా కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డంకులు సృష్టించారు. తమ పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని, డాక్యుమెంట్లు ఇచ్చేది లేదంటూ మొండికేశారు. దీంతో రంగాచారి ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ నుంచి తెప్పించుకున్నారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని పేర్కొంటూ 2007 ఫిబ్రవరి 19న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టుకు నివేదించటాన్ని తన నివేదికలో పొందుపరిచారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. రామోజీ పెట్టుబడి రూపాయైనా లేదు.. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీ తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణలో తేల్చారు. 2000, ఆ తరువాత బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని నిగ్గు తేల్చారు. కోర్టు అనుమతితో తనిఖీలు.. మరోవైపు ఈ కేసులో అదీకృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు కోర్టు అనుమతితో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో తనిఖీలు చేశారు. దీన్ని సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ 14.3.2007న కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీనిపై రామోజీ హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టు ఇచ్చిన సెర్చ్ వారెంట్‌ను నిలుపుదల చేసింది. ఈ క్రమంలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. దీన్ని కొట్టి వేయాలంటూ అదే ఏడాది రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ రజనీ స్టేతో మూలపడిన కేసు.. దీంతో దిక్కుతోచని రామోజీ 2010లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అ«దీకృత అధికారి ఇచ్చిన ఫిర్యాదులో విచారణను సెక్షన్ 45(ఎస్)(1), 45(ఎస్)(2), 58బీ(5ఏ) రెడ్ విత్ సెక్షన్ 58(ఈ)లకే పరిమితం చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ నాంపల్లి కోర్టు 2011లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్బీఐ చట్టం పరిధిలోకి మార్గదర్శి ఫైనాన్షియర్స్ రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 20.7. 2011న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.‘‘స్టే’’ వల్ల కేసు అప్పటి నుంచి మూలనపడిపోయింది. అటు తరువాత వచ్చిన ప్రభుత్వాలు రామోజీ గుప్పిట్లో ఉండటంతో మార్గదర్శి అక్రమాలను పట్టించుకోలేదు. విచారణ.. తీర్పు.. ఒకే రోజు ఉమ్మడి హైకోర్టు విభజన 1.1.2019న జరిగింది. 31.12.2018 ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అటు న్యాయవాదులు ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై దృష్టి సారించలేని పరిస్థితిని రామోజీరావు తనకు అనుకూలంగా మలచుకున్నారు. నాంపల్లి కోర్టులో అ«దీకృత కృష్ణరాజు చేసిన ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో తాము దాఖలు చేసిన వ్యాజ్యాలను రామోజీ విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రాను రంగంలోకి దించారు. లూథ్రా వాదనలు విన్న జస్టిస్ రజనీ ఇంత పెద్ద కేసులో అదే రోజు అంటే 31వతేదీన తీర్పు కూడా ఇచ్చేశారు. రామోజీ, మార్గదర్శి వాదనను సమర్ధించారు. హెచ్‌యూఎఫ్.. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదని జస్టిస్ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో అధీకృత అధికారి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి అదే రోజు తీర్పునివ్వడం అరుదైన ఘటన. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లుగానీ ఎవరూ గుర్తించలేదు. అటు తరువాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. జస్టిస్ రజనీ తీర్పుపై మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అటు తరువాత మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2019 డిసెంబర్ 17న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. హైకోర్టు తీర్పును రద్దు చేసిన సుప్రీం.. హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు 19.9.2020న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం17.8.2022న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటు ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ ప్రభుత్వం, ఇటు మార్గదర్శి, రామోజీరావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చింది. మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు విచారణ సందర్భంగా ఆర్బీఐ న్యాయవాది మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా ఈ ఏడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అదీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసుల కొట్టివేతకు సుప్రీం నిరాకరణ.. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ ఇదే సమయంలో రామోజీ, మార్గర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని.. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నామని స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని, సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. తాజాగా విచారణ జరిపి ఆరు నెలల్లో విచారణను ముగించాలని, సేకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని తెలిపింది. తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూన్‌లో తిరిగి విచారణ ప్రారంభించింది. విచారణ జరుగుతుండగానే రామోజీరావు మరణించగా ఆయన స్థానంలో హెచ్‌యూఎఫ్ కర్తగా తనను చేర్చాలని రామోజీ కుమారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలు వాయిదాల అనంతరం పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ఈ నెల 7న విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. -
బయటపడ్డ చంద్రబాబు మరో నిర్వాకం..
-
విస్తుపోయేలా బాబు సర్కార్ నిర్వాకం.. రామోజీ సంస్మరణ సభ ఖర్చు ఎంతంటే?
సాక్షి, విజయవాడ: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణ కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని పణంగా పెట్టింది. ఏకంగా రూ.4.28 కోట్లు ఖర్చు చేసింది. జూన్ 27న విజయవాడలో రామోజీ సంస్మరణ సభను చంద్రబాబు సర్కార్ నిర్వహించింది.అయితే, సభను నిర్వహణ ఖర్చు 4.28 కోట్లు రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో రామోజీ సంస్మరణ సభకు అంత భారీగా ఖర్చు చేశారా అంటూ ప్రభుత్వ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఒక వ్యాపార వేత్త సంస్మరణ సభకు రూ.4 కోట్లుపైగా ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై చర్చ కూడా జరుగుతోంది.ఇదీ చదవండి: ఇది సరైన సందేశమేనా? -
రామోజీ రావు ఎదుగుదల ఆ ఒక్క అడుగుతో మొదలైంది
-
ఇది కచ్చితంగా క్విడ్ ప్రోకో: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: రామోజీరావుకు క్లీన్చిట్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రామోజీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రామోజీరావు సంస్థలను చంద్రబాబు కాపాడుతున్నారన్నారు.రామోజీ ఆర్థిక నేరస్థుడు..‘‘డీబీటీ పథకాలన్నీ చంద్రబాబు పక్కనపెట్టారు. దాచుకో.. దాచుకో.. తినుకో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మార్గదర్శి ఫండ్స్‌ను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశారు. చిట్స్ వసూలు చేసి మిగతా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. రామోజీ అనేక అక్రమాలకు పాల్పడ్డారు. చట్ట వ్యతిరేకంగా రామోజీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. రామోజీ ఆర్థిక నేరస్థుడు. రామోజీ పెట్టుబడులన్నీ అక్రమంగా నిర్వహించినవే. చిట్స్ కేసు కొట్టేస్తే పత్రికల్లో వార్త రాకుండా జాగ్రత్తపడ్డారు. అర్ధాంతరంగా కేసును సీఐడీ విత్ డ్రా చేసుకోవడం దారుణం. దీనిపై ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఉండవల్లి ఈ కేసును బతికించారు’’ అని అంబటి చెప్పారు.అసలు మార్గదర్శి చట్టపరంగా నడుస్తోందా? ‘‘మార్గదర్శికి సహాయం చేయాలనే దురుద్దేశంతో చంద్రబాబు ఇటువంటి పనులకు పాల్పడ్డారు. రామోజీరావు కుటుంబం చట్టాలను ఉల్లంఘించింది. రామోజీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. మార్గదర్శి మీద అనేక కోర్టుల్లో విచారణ జరుగుతోంది. కానీ ఈ కేసులను ప్రభుత్వం విత్ డ్రా చేసకోవటం చాలా అన్యాయం. ఇది కచ్చితంగా క్విడ్ ప్రోకో. కోర్టులతో పనిలేకుండా ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇస్తోంది. మార్గదర్శి అంటే వైఎస్సార్, జగన్‌కు కోపం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మార్గదర్శిలోని లోపాల గురించి మాట్లాడటం లేదు. అసలు మార్గదర్శి చట్టపరంగా నడుస్తోందా? లేదా? అనేదే చూడాలి. ఒక చిట్ వేసేటప్పుడు దానికి ప్రత్యేకంగా ఒక ఎకౌంట్ ఓపెన్ చేయాలి. ఇలా ఎన్ని చిట్లు వేస్తే అన్ని ఖాతాలు తెరవాలి. కానీ మార్గదర్శి కేసులో ఒకే ఖాతాలో ఎమౌంట్ వేశారు’’ అని అంబటి రాంబాబు వివరించారు. సీఐడీ విత్ డ్రా.. దీని వెనుక కుట్ర ‘‘ఆ డబ్బుని ఇతర సంస్థల్లో పెట్టుబడి పెట్టారు. ప్రజల సొమ్ముతో పెద్ద సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్నారు. సీఐడీ దీన్ని గుర్తించి రామోజీరావుని కూడా విచారించింది. ఎవరైనా చట్టానికి అతీతులు కాదు. ప్రధానిగా చేసిన ఇందిరాగాంధీ, పీవి నరసింహారావు కూడా కోర్టులో నిలబడ్డారు. రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్. 2006లోనే మార్గదర్శి ఫైనాన్షియల్ అక్రమాలను ఆర్బీఐ గుర్తించింది. ఆ తర్వాతే కేసు నమోదు చేశారు. రాష్ట్రం విడిపోయే ముందు రోజు ఎవరికీ తెలియకుండా కోర్టు కొట్టేసింది. ఆనాడు ఏ పత్రికా ఆ వార్త రాయలేదు. ఇవాళ కూడా సీఐడీ విత్‌డ్రా చేసుకున్న సంగతిని కూడా ఏ పత్రిక రాయలేదు. అంటే దీని వెనుక కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. మార్గదర్శిలో డిపాజిట్లు కూడా ఎవరూ వేయకపోవటంతో దివాళా దశగా ఆ సంస్థ నడుస్తోంది. ప్రభుత్వం కేసు విత్‌డ్రా చేసుకున్నా కేసు ఎక్కడకూ పోదు. గతంలో ఇలాగే చేసినా ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లి కేసును బతికించారు. రామోజీ, చంద్రబాబులకు వ్యవస్థలను మేనేజ్ చేయటం అలవాటు.’’ అని అంబటి దుయ్యబట్టారు.చంద్రబాబు జీవితమంతా కొనుగోలు, అమ్మకాలే..‘‘నీతి, నిజాయితీ గలవారే రాజకీయాలు చేయగలరు. చంద్రబాబు జీవితమంతా కొనుగోలు, అమ్మకాలే. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో అక్కడివారు గట్టిగా నిలబడ్డారు. ఎంపీటీసి, జడ్పీటీసీలను చూసైనా ఈ ఎంపీలు బుద్ది తెచ్చుకోవాలి. ఎంతమంది వెళ్లినా వైసీపికి 40 శాతం ఓటర్లు ఉన్నారని గుర్తించాలి. చంద్రబాబు, ఎల్లోమీడియా కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి ని టార్గెట్ చేశారు. అసలు సజ్జలకు ఈ కేసుతో ఏం సంబంధం ఉంది?. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుగా ఈ కేసుతో చంద్రబాబు హడావుడి ఉంది. అదంతా త్వరలోనే భూమ్ రాంగ్ అవుతుంది. జెత్వాని వ్యవహారాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి. చంద్రబాబు స్కాం చేసినందున అరెస్టు అయ్యాడు. ఆయన్ని అరెస్టు చేశారని కక్ష కట్టి ఐపీఎస్‌ల మీద పగ సాధిస్తున్నారు. బాలకృష్ణ కాల్పుల కేసును కూడా బయటకు తీస్తారేమో చూడాలి’’ అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. -
రామోజీ కుటుంబానికి బాబు రిటర్న్ గిఫ్ట్.. బయటపడ్డ అసలు నిజం
-
ఈనాడుకు బాబు గిఫ్ట్
పరస్పర ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా పణంగా పెడతారో సీఎం చంద్రబాబు, ఈనాడు రామోజీ కుటుంబం మరోసారి రుజువు చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక ఐదేళ్లపాటు సాగించిన విష ప్రచారానికి గానూ బాబు ప్రభుత్వం నుంచి భారీ ప్రతిఫలాన్ని పొందింది. మార్గదర్శి విషయంలో అక్రమాలు జరిగినట్లు సీఐడీ గతంలో పక్కా ఆధారాలతో చార్జిషిట్లు వేసింది.దీంతో తేడా వస్తే తమ ఆస్తులు జప్తు అయ్యే అవకాశం ఉండటంతో బయట పడేందుకు మార్గదర్శి వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందుకు చంద్రబాబు సర్కారు, కీలక దర్యాప్తు సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. సాక్షి, అమరావతి: ‘కుమ్మక్కు బంధం’ రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతటి విఘాతమో మరోసారి తేటతెల్లమైంది. పరస్పర ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా పణంగా పెడతారో సీఎం చంద్రబాబు, ఈనాడు రామోజీ కుటుంబం మరోసారి రుజువు చేసింది. వైఎస్సార్సీపీ సర్కారుపై ఐదేళ్ల పాటు దుష్ప్రచారం చేసిన రామోజీ కుటుంబానికి టీడీపీ కూటమి ప్రభుత్వం కృతజ్ఞతాపూర్వకంగా ‘కానుక’ సమర్పించింది. అదీ రాష్ట్రంలో వేలాదిమంది మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల ప్రయోజనాలను కాలరాసి మరీ!! మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఆంధ్రప్రదేశ్ డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 వర్తించదంటూ ప్రత్యేక కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను, అలాగే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన దాదాపు రూ.1,050 కోట్ల విలువైన ఆస్తుల జప్తును ఖరారు చేసేందుకు నిరాకరిస్తూ గుంటూరు కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన అప్పీళ్లను సీఐడీ ద్వారా ఉపసంహరింప చేశారు. ఈమేరకు సీఐడీ అదనపు డీజీ గురువారం హైకోర్టుకు నివేదించారు. దీంతో అప్పీళ్ల ఉపసంహరణకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ వ్యాజ్యాలు తాజాగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ముందు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. సీఐడీ కేసులన్నింటినీ తనకు అప్పగిస్తూ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ (ఈ అప్పీళ్లలో శైలజా కిరణ్ తరఫున వాదనలు వినిపించారు) ప్రొసీడింగ్స్ ఇచ్చారని నివేదించారు. అందువల్ల సీఐడీ తరఫున తాను హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ అప్పీళ్లను ఉపసంహరించుకోవాలంటూ సీఐడీ అదనపు డీజీ లేఖ రాశారన్నారు. దీంతో తాము తమ అప్పీళ్లను ఉపసంహరించుకుంటున్నట్లు అదనపు డీజీ రాసిన లేఖను కోర్టుకు సమర్పించారు. ఆ లేఖను పరిశీలించిన న్యాయస్థానం పీపీ లక్ష్మీనారాయణ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకుని నమోదు చేసింది. అప్పీళ్లను ఉపసంహరించుకున్న నేపథ్యంలో వాటిని పరిష్కరిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి అనంతరం ఉత్తర్వులు జారీ చేశారు. చిట్స్ రిజిస్ట్రార్ల ఫిర్యాదుతో రంగంలోకి సీఐడీ.. మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ధిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిష్ట్రార్లు గతంలో సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్‌ఫండ్ చట్ట నిబంధనల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. మార్గదర్శి చిట్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పలువురు ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. వారి వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. గడువు ముగిసినా, ష్యూరిటీలు సమర్పించిన తరువాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయలేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. సాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందంటూ చందాదారులు స్పష్టంగా ఫిర్యాదు చేశారు. పకడ్బందీ ఆధారాలతో చార్జిషీట్లు... మార్గదర్శి చిట్‌ఫండ్స్ అవకతవకలపై పకడ్బందీగా అన్ని ఆధారాలను సేకరించిన సీఐడీ ప్రత్యేక కోర్టుల్లో చార్జిషిట్లు దాఖలు చేసింది. ఇదే సమయంలో ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం చట్ట ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన దాదాపు రూ.1,050 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఖరారు చేయాలని కోరుతూ సీఐడీ పిటిషన్లు దాఖలు చేసింది. అయితే సీఐడీ దాఖలు చేసిన చార్జిషిట్లను పరిశీలించిన గుంటూరు, విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులు వాటిని రిటర్న్ చేశాయి. ఆస్తుల జప్తు ఖరారు కోసం సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను గుంటూరు కోర్టు కొట్టివేసింది. మార్గదర్శి, శైలజా కిరణ్ వాదనలను గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన సీఐడీఈ అప్పీళ్లపై హైకోర్టు గత ఏడాది డిసెంబర్ నుంచి విచారణ జరుపుతూ వస్తోంది. ఈ అప్పీళ్ల విచారణార్హతపై రామోజీ, శైలజా కిరణ్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ తరఫున నాడు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు అభ్యంతరం చెప్పారు. మొదట విచారణార్హతపై తేల్చాలని పట్టుబట్టారు. దీనిపై సీఐడీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. తమ అప్పీళ్ల విచారణార్హతపై అభ్యంతరం ఉంటే ఆ విషయాన్ని అనుబంధ పిటిషన్ లేదా కౌంటర్ రూపంలో తెలియచేయాలే తప్ప మౌఖికంగా కాదంది. అనుబంధ పిటిషన్ లేదా కౌంటర్ దాఖలు చేసినప్పుడే అందుకు తగిన సమాధానం ఇచ్చేందుకు తమ అవకాశం ఉంటుందని తెలిపింది. దీంతో మార్గదర్శి, శైలజా కిరణ్ తదితరులు ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో జప్తు ఆస్తుల విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగిస్తామని మార్గదర్శి తరఫున న్యాయవాది పోసాని కోర్టుకు హామీ ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆ మేర మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అటు తరువాత ఈ అప్పీళ్లపై ఇప్పటిదాకా విచారణ జరుగుతూ వస్తోంది.అప్పీళ్ల ఉపసంహరణతో జరిగేదిది..తాజాగా అప్పీళ్లను సీఐడీ ఉపసంహరించుకోవడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు భారీ ఊరట లభించినట్లయింది. తద్వారా నామమాత్రమైన ఐపీసీ సెక్షన్ల కింద విచారణకు ఆస్కారం ఉంటుంది. దీని వల్ల మార్గదర్శి యాజమాన్యానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ప్రత్యేక కోర్టులో విచారణ జరిగి మార్గదర్శి డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కింద ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలే పరిస్థితి ఉంటే దాని యాజమాన్యానికి, మేనేజర్లకు పదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, అలాగే ఆ సంస్థకు రూ 5 లక్షల జరిమానా విధించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి మార్గదర్శి, దాని యాజమాన్యం బయటపడినట్లే. అదే రీతిలో రూ.1050 కోట్ల ఆస్తుల జప్తు కూడా ఉండదు. ఎందుకంటే ఆ జప్తును ఖరారు చేసేందుకు గుంటూరు కోర్టు తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఇలా ఈ మొత్తం కేసును నీరుగార్చి దాన్ని కొట్టేసేందుకు సీఐడీ ఆస్కారం కలిగించింది.భారీ గురు దక్షిణ..వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక ఐదేళ్లపాటు సాగించిన విష ప్రచారానికిగానూ చంద్రబాబు ప్రభుత్వం నుంచి భారీ ప్రతిఫలాన్ని పొందింది. ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను, కీలక ప్రాజెక్టులను అటకెక్కించేసిన సీఎం చంద్రబాబు.. రామోజీ కుటుంబం కోసం మాత్రం రంగంలోకి దిగారు. సీఐడీ దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు పూర్తిస్థాయిలో విచారణ జరిపి కింది కోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్ మాదిరిగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ కూడా ఇరుక్కుపోవడం ఖాయమని పసిగట్టి ఆ పరిస్థితి తలెత్తకుండా సీఐడీని రంగంలోకి దించి అనుకున్న విధంగా పనికానిచ్చేశారు. అంతేకాదు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్ధిక మోసాలపై ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్న కేసులను క్రమంగా ఎత్తివేసే దిశగా పావులు కదులుతున్నాయి. మార్గదర్శి విషయంలో రామోజీ కుటుంబం అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ గతంలో పూర్తి ఆధారాలతో సీఐడీ కేసు నమోదు చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితులు సంఘం ఏర్పాటు చేసుకుని మరీ ఆందోళనలను నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటుఇతర రాష్ట్రాల్లోనూ బాధితులున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాలు నాలుగు రాష్ట్రాలకు విస్తరించడం, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినందున ఈ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించాలని సీఐడీ అధికారులు గతంలో కోరడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి రూ.4,600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి చట్టపరంగా పీకల్లోతుల్లో కూరుకుపోయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం ఇప్పుడు మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహారంలో ఇరుక్కోకుండా జాగ్రత్త పడుతోంది. తేడా వస్తే దాదాపు రూ.1,050 కోట్ల ఆస్తులు జప్తు అయ్యే అవకాశం ఉండటంతో బయట పడేందుకు వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందుకు చంద్రబాబు సర్కారు, కీలక దర్యాప్తు సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. అందులో భాగంగా రామోజీరావు (ఇటీవల మృతి చెందారు) డైరెక్టర్‌గా, ఆయన కోడలు శైలజా కిరణ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ఆర్ధిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఉన్న ఆరోపణలను నీరుగారుస్తోంది.మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలలో కొన్ని..సకాలంలో చందాదారులకు చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం. చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్‌మనీని చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం చెల్లింపులు చేయడానికి మార్గదర్శి చిట్‌ఫండ్స్ వద్ద సరిపడినంత డబ్బు లేకపోవడమే. తమ వద్ద డబ్బు లేదు కాబట్టి చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ వద్దే అట్టిపెట్టుకుంది. అలా అట్టిపెట్టుకున్న మొత్తాలను రొటేషన్ చేస్తూ వస్తోంది. చట్ట నిబంధనల ప్రకారం చందాదారుల డబ్బును ప్రత్యేక ఖాతాల్లో ఉంచడం తప్పనిసరి. అయితే అలా ఉంచకుండా దానిని ఇతర అవసరాలకు మళ్లించేశారు. ఈ ఉల్లంఘనలన్నీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కిందకే వస్తాయి. నాడు సీఐడీ అభ్యంతరం.. అప్పీళ్లు దాఖలుఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా వాటిని పట్టించుకోకుండా, ప్రైజ్ మొత్తాల ఎగవేత జరిగినట్లు కనిపించడం లేదంటూ గుంటూరు, విశాఖపట్నం కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులపై గతంలో సీఐడీ అభ్యంతరం తెలిపింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ గత ఏడాది డిసెంబర్లో హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేసింది. మరికొన్ని అప్పీళ్లను ఈ ఏడాది జనవరిలో దాఖలు చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు, ఆర్ధిక అవకతవకలు, చట్ట ఉల్లంఘనలపై పూర్తిస్థాయి ఆధారాలను చార్జిషీట్ రూపంలో ప్రత్యేక కోర్టుల ముందు ఉంచినా, వాటిని పట్టించుకోకపోవడం ఎంత మాత్రం సరికాదని సీఐడీ తన అప్పీళ్లలో పేర్కొంది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినకుండానే అలా నిర్ధారించడం చట్ట విరుద్ధమంది. చార్జిషిట్‌లోని అంశాలపై మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన విషయాన్ని తన అప్పీళ్లలో హైకోర్టుకు వివరించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5కు ప్రత్యేక కోర్టులు భాష్యం చెప్పాయని, అలా చెప్పి ఉండకూడదంది. చార్జిషిట్లను రిటర్న్ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీ చేసిన ఉత్తర్వులను, జప్తును ఖరారు చేసేందుకు నిరాకరిస్తూ గుంటూరు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరింది. -
18 ఏళ్లుగా సాగదీత.. ఇంకా ఎన్నాళ్లో?
తాము ఏ సుద్దులు చెప్పిన... ఏ నీతులు చెప్పిన అవి ఎదుటి వారికే కాని తమకు కాదని ఈనాడు మీడియా గట్టిగా విశ్వసిస్తోంది. అందుకే ఈనాడు వారు తమకు ఇష్టం లేని వారిపై, లేదా తమ రాజకీయ ,వ్యాపార ప్రయోజనాలకు అడ్డం అవుతారని అనుకున్న వారిపై నానా బురద వేస్తుంటారు .పచ్చి అబద్దాలు రాయడానికి కూడా వెనుకాడడం లేదు .తెలుగుదేశం పార్టీకి , సీఎం చంద్రబాబుకు ,తమకు కొమ్ము కాసేవారికి మాత్రం రక్షణగా నిలబడుతుంది.గత ఐదేళ్లుగా వైఎస్ జగన్ పాలనపై ఎంత విషం చిమ్మిందో చూశాం. అప్పుడే కాదు ...వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం కోల్పోయినా, ఇప్పటికి వారిపైనే చెడరాస్తోంది. పాపాల పుట్టలు అని... అవి అని, ఇవి అని ఇష్టరీతిలో హెడ్గింగ్లు పెడుతుంది .అదే తమకు సంబందించిన అక్రమాల గురించి మాత్రం నోరు విప్పితే ఒట్టు.మార్గదర్శి ఫైనాన్షియర్స్కు సంబందించి రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా నివేదిక ఇవ్వడం, అందులో రామోజి సంస్థ అక్రమాలకు పాల్పడిందని , అర్హత లేకపోయినా డిపాజిట్ లు వసూలు చేసిందని ...శిక్షార్హ నేరమని స్పష్టంగా చెప్పినా కనీసం స్పందించ లేకపోయింది.వేలకోట్లకు సంబందించిన దందా అనండి ...స్కామ్ అనండి.. దానిపై నేరుగా వివరణ ఇచ్చే పరిస్థితి కూడా మార్గదర్శి ఫైనాన్శయర్స్ కాని...ఈనాడు మీడియాకు కాని ఉన్నట్లు లేదు.మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పట్టుదలతో సాగించిన పోరాటంతో ఈ మాత్రం అయినా కదలిక వచ్చింది .లేకుంటే ఈ దేశంలో మీడియాను అడ్డంపెట్టుకుని ... ఎన్ని అరాచకాలకైనా పాల్పడవచ్చని, తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేసి...తద్వారా ఎన్ని కైన ప్రభుత్వాల ద్వారా తమ అర్ధిక ప్రయోజనాలకు కాపాడుకోవచ్చని ఏవరైన భావించే పరిస్థితి ఏర్పడింది .తాజాగా ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించినప్పుడు జరిగిన పరిణామం చూస్తే మార్గదర్శి అనండి...దివంగత రామోజి రావు అనండి లేదా ప్రస్తుత యాజమాన్యం అనండి.. వారికి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ఎంత పట్టు ఉన్నది అర్ధం అవుతుంది .ఏపిలోని చంద్రబాబు ప్రభుత్వం...తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కేసులో జవాబు ఇవ్వడానికే సిద్దం పడకపోవడం విశేషం. చంద్రబాబు అంటే ఏటూ టిడిపి కనుక అయన తోటి ఈనాడుకు ఉన్న సంబంధాల రీత్య అర్ధం చేసుకోవచ్చు. రామోజీ కాంగ్రెస్‌కు అనుకూలం కాదని తెలిసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎలాంటి సమాదానం ఇవ్వకపోవడం గమనించదగ్గ అంశం.బహుశా గురుశిష్యులు ఇద్దరు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అవ్వడం మార్గదర్శి సంస్థకు కలిసి వస్తోందని అనుకోవాలి. ఈ రెండు రాష్ట్రాల న్యాయవాదులు మార్గదర్శి కేసు విచారణకు హజరు అయినా పూర్తిగా మాౌనం పాటించారట. దానిని మార్గదర్శి న్యాయవాది లుద్రా అనుకూలంగా మలచుకుని కేసును అలస్యం చేసేందుకు ప్రయత్నాలు ఆరంబించారని మీడియా కధనం. మొత్తం విషయం పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది .రెండు వేల ఆరువందల కోట్ల మేర అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారన్నది అభియోగం. అప్పటి ఎంపీ ఉండవెల్లి చేసిన ఫిర్యాదు వ్యవహరంలో అనేక ట్విస్టులు చోటు చేసుకుని చివరకు ఈ దశకు చేరింది .మద్యలో ఏదో కారణం చూపి రామోజి ఈ కేసును ఉమ్మడి ఏపి హైకోర్టు విభజనకు ముందు రోజు కోట్టివేయించుకోగలిగారు .ఆ తర్వాత ఎప్పటికో ఈ విషయం తెలిసి ఉండవల్లి సుప్రీం కోర్టుకు వెళ్లి తన పోరాటం కోనసాగించారు . అసలు ఏప్పడో చర్య తీసుకోవాల్సిన ఆర్బిఐ ఇనాళ్లు మౌనంగా ఉండడం కూడా అశ్చర్యం కలిగిస్తోంది .తుదకు కోర్టు ఆదేశాలతో ఒక నివేదికను తయారు చేసి సమర్పించింది.అందులో మార్గదర్శి అక్రమంగానే డిపాజిట్లు వసూలు చేసిందని తేల్చింది .ఆర్బీఐ చట్టం లో సెక్షన్ 45 ఎస్ ను మార్గదర్శి ఉల్లంఘించిందని బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని తెలిపింది .ఈ కేసులో నేరాభియోగం రుజువు అయితే జైలు శిక్షతో పాటు డిపాజిట్ లుగా వసూలు చేసినదానికి రెండింతులు పెనాల్టి చెల్లించాల్సి ఉంటుంది .దీనితో మార్గదర్శికి, ఈనాడు వారికి మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది .ఒక్క సాక్షి తప్ప మిగిలిన మీడియా ఇంత పెద్ద వార్తను ప్రముఖంగా ఇవ్వకపోవడం కూడా వారి పలుకుబడిని తెలియచేస్తుంది .రామోజి రావు 2008 లో సమర్పించిన అఫడివిట్ ప్రకారం 2610 కోట్లు సేకరించారు .అందులో 1864 కోట్లు తిరిగి చెల్లించామని తెలిపారు .మరి మిగిలిన సుమారు 750 కోట్ల డిపాజిట్లు ఏం అయ్యాయి?అవి ఎవరివి అన్న అంశాలను మాత్రం గుట్టుగా ఉంచారు .అంతేకాదు 1864 కోట్లు ఎవరేవరికి చెల్లించారో జాబితా ఇవ్వడానికి రామోజి కుటుంబం సమ్మతించడం లేదని సమాచారం మీడియాలో వచ్చింది.ఆ వివరాలు వెల్లడిస్తే కొందరు పెద్దలు ...అందులో ముఖ్యంగా టిడిపి వారికి చెందిన నల్లధనం బట్టబయలు అవుతుందని ..బినామి పేరుతో తాము పెట్టిన దందా వెల్లడి అవుతుందని రామోజీ కుటుంబం అందోళన చెందుతున్నట్టు సాక్షి పత్రిక నేరుగా అరోపించింది .ఈనాడు వారు కాని ...మార్గదర్శి వారు కాని ,రామోజి రావు కుమారుడు కిరణ్ , కోడలు శైలజ కాని ఏ మాత్రం విలువలు పాటించేవారైనా, ఖచ్చితంగా వీటికి సమాదానం చెప్పగలగాలి. అలా చెప్పడం లేదంటే దాని అర్దం వారు తప్పు చెసినట్టు అంగీకరించడమే .ఊరందరికి నీతులు చెప్పే ఈనాడు మీడియా ఈ విషయంలో ఉన్న గుట్టుముట్లను ఎందుకు విప్పడం లేదు అంటే ...దీని ఱర్ధం ఈ విషయాలు వెలుగులోకి వస్తే తమ పాపాల పుట్ట బయటపడుతుందా అన్న భయమా అనే సందేహం వస్తే తప్పు ఏముంది.దేశంలో ఉన్నవారందరని పారదర్శకంగా ఉండాలని నీతులు రాస్తూ ...కథలు చెబుతూ ఉండే ఈనాడు, మార్గదర్శిల యాజమాన్యం ఇప్పటికైనా ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేసినట్టుగా డిపాజిట్ లు ఏవరేవరికి చెల్లించారో వెల్లడించాలి.అలాగే ఎవరికి చెల్లించని 750 కోట్ల డిపాజిట్ ల రహస్యం ఏంటో తెలపాలి.అదంతా నల్లధనం కాదని ,తాము పద్దతిగా వ్యాపారం చేస్తున్నామని చెప్పగలగాలి.అలాగే చంద్రబాబు,రేవంత్ ప్రభుత్వాలు కూడా ఈ డిపాజిట్ లకు సంబందించి వాస్తవాలను తమ అఫడవిట్ ల ద్వారా తెలియచేయాలి.లేకుంటే ఈ రెండు ప్రభుత్వాలకు ఈనాడు మీడియాకు మద్య క్విడ్ ప్రో కో సాగుంతుందని జనం అభిప్రాయపడతారు . అరుణకుమార్ చేసిన విజ్ఞప్తికి రెండు రాష్ట్రాల సీఎంలు స్పందిస్తారా?అన్నది డౌటే.ఒకవేళ స్పందించినా, అది మార్గదర్శికి, ఈనాడు వారికి అనుకూలంగానే ఉండవచ్చు. నిజానికి ఉండవల్లి తన వాదనలో చెప్పినట్టు ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు తదుపరి చర్యకు దిగితే మొత్తం లోగుట్టులు అన్ని బహిర్గతం అవుతాయి. కాని ఇప్పుడు ఉన్న వాతావరణం గమనిస్తే అది అంత తేలిక కాకపోవచ్చు. పద్దేనిమిది ఏళ్లుగా సాగుతున్న ఈ వ్యవహరంలో ఎంతకాలం వీలైతే , అంత కాలం ఈ కేసును సాగదీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కేసుల వల్లే మన వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఏర్పడుతుంది .ప్రజల్లో విశ్వాసం నెలకోనాలంటే కనీసం న్యాయవ్యవస్థ అయినా ఈ కేసులో నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది .అది జరుగుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబూ.. జగన్‌లా మీరు చేయలేరా? ఉండవల్లి హాట్ కామెంట్స్
తూర్పుగోదావరి, సాక్షి: మార్గదర్శి కేసుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కనీస స్పందన లేదని, కనీసం హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలోనైనా స్పందిస్తారో చూడాలని మాజీ ఎంపీ, న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. గతంలో జగన్ ఇంప్లీడ్ కావడం బలాన్నిచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. బుధవారం ఉదయం రాజమహేంద్రవరంలో ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. ‘‘సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించింది. మార్గదర్శి తరపున సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపిస్తూ.. రెండు వారాల సమయం కోరారు. తాము ఎవరెవరికి డబ్బు చెల్లించామో 70 వేల పేజీల్లో సుప్రీంకోర్టుకు వివరాల్ని మార్గదర్శి సబ్మిట్ చేసింది. కట్టిన డబ్బుల ఇచ్చారే తప్ప వడ్డీ ఇవ్వలేదని పలువురు మార్గదర్శి ఫైనాన్స్ ఖాతాదారులు నన్ను అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా డబ్బు అందేందో లేదో పరిశీలించమని ఒక జ్యుడీషియరీ అడ్వైజర్ ను హైకోర్టులో నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది..ఇదీ చదవండి: టీడీపీకి ఇది నల్ల ఖజానా.. మార్గదర్శి డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధం. 2006లో అప్పటి ఫైనాన్స్ శాఖా మంత్రి చిదంబరానికి నేను చెప్పిందే.. ఇప్పుడు ఆర్బీఐ కూడా చెప్పింది. ఆర్బీఐ అఫిడవిట్‌తో నేను చెప్పిందే నిజమైంది. మార్గదర్శిపై నా పోరాటాన్ని మరోలా వక్రీకరించారు. ఇదేదో వైఎస్సార్ చెప్పటం వల్లే నేను చేశానని అందరూ అనుకుంటున్నారు... అది నిజం కాదు. ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ఏ చిట్‌ఫండ్ కంపెనీ కూడా చిట్‌ఫండ్ చట్టాన్ని అనుసరించడం లేదు. ఇటీవలె కాకినాడలో జయలక్క్క్ష్మి చిట్‌ఫండ్ కంపెనీ ఎత్తేశారు. మార్గదర్శి.. చిట్‌ఫండ్ యాక్ట్‌ను బ్యాడ్ లాగా పేర్కొంది. రామోజీరావు అనుసరించకపోవడం వల్లే తాము అదే ఫాలో అవుతున్నామని చెబుతున్నారు. ఈ విషయంలోనే నాపై మార్గదర్శి కంపెనీ కూడా కేసు కూడా వేసింది. రామోజీరావు కేసులో ప్రెస్‌మీట్ చెప్పిన అందరిని జైల్లో వేస్తున్నారు. మిగిలిన వారెవరు ప్రశ్నించకుండా ఉండేందుకు మార్గదర్శి నాపై పరువు నష్టం దావా కేసు వేశారు.సంబంధిత వార్త: మార్గదర్శి దందాకు క్విడ్ ప్రోకో కుట్ర.. మార్గదర్శి చిట్ ఫండ్స్ నాపై 50 లక్షలు పరువు నష్టం దావా వేశారు.. తెలంగాణ కోర్టులో అది ఇంకా పెండింగ్ లో ఉంది. మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యవహారం ఒక కొలిక్కి వస్తే నేను ఆ కేసు నుంచి బయటపడగలను. మార్గదర్శి చిట్స్ నుంచి డబ్బు మార్గదర్శి ఫైనాన్స్ లోకి వెళ్లి.. అక్కడి నుంచి రామోజీరావు జేబులోకి వెళ్ళింది. ఈనాడు పేపర్ ను అడ్డం పెట్టుకుని రామోజీరావు ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు. హెచ్ఎఫ్ ఇంపాక్ట్ కచ్చితంగా ఉంటుంది. వాస్తవం ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఉంది. .. సెప్టెంబర్ 11 కి వాయిదా ఉంది. మార్గదర్శి కేసులో విచారణ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా ఇటు రేవంత్, చంద్రబాబు ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించలేదు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంప్లీడ్ కావడంతో కేసుకు కాస్త బలం వచ్చింది. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆయనకు రామోజీరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నారు. కాబట్టి ఎలా స్పందిస్తారో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తేనే గౌరవం నిలబడుతుంది. కోర్టులో ఆలస్యం అవుతుందే తప్ప అన్యాయం జరగదు. రామోజీతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. సీఎం హోదాలో చంద్రబాబు విచారణకు సహకరించాలి. వెంటనే రెండు ప్రభుత్వాలు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలి’’ అని ఉండవల్లి కోరారు.ఏపీ ఎన్నికల ఫలితాలపైనా.. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ఐదు మండలాలు తిరిగి వెనక్కి ఇచ్చేయమని తెలంగాణ కోరుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వైయస్ జగన్ ఎలా అఫిడవిట్ ఫైల్ చేశారో.. మీరు కూడా అదే చేయమని చంద్రబాబును కోరుతున్నాను. స్పెషల్ కేటగిరి స్టేటస్ ప్రకటించిన 11 రాష్ట్రాల్లో తెలంగాణ ను ఎందుకు చేర్చారో తెలియటం లేదు. మహారాష్ట్రకు చెందిన ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి 12.5% తేడా ఉందన్న ప్రకటించారు.. దీనిపై ఎందుకు చంద్రబాబు స్పందించడం లేదు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం పోలింగ్ పూర్తయిన ఫలితాలు వచ్చిన 45 రోజుల వరకు ఓట్ల వివరాలు భద్రంగా ఉంచాలి. ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పిన వివరాలు తప్పయితే తప్పని చంద్రబాబు ప్రకటించాలి. ఓట్ల వివరాలు పది రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయమని ఎన్నికల కమిషనర్ మీనా ఎందుకు ప్రకటించారో .. స్పష్టం తెలియాలి అని ఉండవల్లి డిమాండ్ చేశారు. -
ఇదీ క్విడ్ ప్రోకో కుట్ర.. ‘మార్గదర్శి’ దందాకు బాబు రక్షణ
సాక్షి, అమరావతి: అసలు సిసలైన క్విడ్‌ప్రోకో అంటే ఇదే..! చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు, కుంభకోణాలకు ఈనాడు కొమ్ము కాస్తోంది. అందుకు ప్రతిగా ఆ పత్రిక యాజమాన్యం అక్రమ ఆర్థిక సామ్రాజ్యం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అవకతవకలకు చంద్రబాబు సర్కారు రక్షణగా నిలుస్తోంది!! అందుకే ‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్లపై న్యాయస్థానంలో తమ వైఖరి తెలిపేందుకు ససేమిరా అంటోంది. కుట్రపూరితంగా మౌనం పాటిస్తూ సామాన్య డిపాజిట్‌దారుల ప్రయోజనాలను గాలికొదిలేస్తోంది. మార్గదర్శి యాజమాన్యంతో కుమ్మక్కు కుట్రలో ఇటు చంద్రబాబు సర్కారు అటు తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడబలుక్కున్నట్లు ఒకే రీతిలో వ్యవహరిస్తున్నాయి. బాబు కుట్రపూరిత మౌనం.. ‘మార్గదర్శి’కి వత్తాసుమార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందాకు చంద్రబాబు ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది. ఆ కేసు విచారణను తీవ్ర జాప్యం చేసేలా వ్యవహరిస్తుండటమే అందుకు నిదర్శనం. ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట ఈనాడు రామోజీరావు కుటుంబం యథేచ్ఛగా సాగించిన అక్రమ డిపాజిట్ల దందా ఆధారాలతో సహా బట్టబయలైన విషయం తెలిసిందే. మార్గదర్శి పేరుతో ఏకంగా రూ.2,600 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు సేకరించారని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది.ఈ నేపథ్యంలో ఆ అక్రమ డిపాజిట్లపై విచారణ నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. అంతేకాదు.. ఏపీ, తెలంగాణలో మార్గదర్శి డిపాజిట్‌దారుల ప్రయోజనాలను పరిరక్షించాలని స్పష్టం చేసింది. అందుకోసం మార్గదర్శి అక్రమ డిపాజిట్ల అంశంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ వైఖరిని తెలంగాణ హైకోర్టుకు వెల్లడించాలని పేర్కొంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆర్బీఐ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కారు దీనిపై స్పందించలేదు. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది మంగళవారం తెలంగాణ హైకోర్టులో ఈ కేసు విచారణకు హాజరైనా పూర్తిగా మౌన ప్రేక్షకపాత్రకే పరిమితం కావడం గమనార్హం.తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కూడా మౌనమే వహించారు. ఇదే అదునుగా ‘మార్గదర్శి’ తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఈ కేసు విచారణను సాగదీసేందుకు ఎత్తుగడ వేశారు. ‘మార్గదర్శి’ సేకరించినవి అక్రమ డిపాజిట్లేనన్న ఆర్బీఐ అఫిడవిట్‌పై తమ వైఖరిని వెల్లడించేందుకు సమయం కావాలని కోరారు. దీంతో తెలంగాణ హైకోర్టు ఈ కేసు విచారణను సెప్టెంబరు 11కు వాయిదా వేసింది. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల అంశంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ వైఖరిని తెలియచేస్తూ రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టులు క్రియాశీలం.. ప్రభుత్వాలు ఉదాశీనం‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్ల వ్యవహారంపై న్యాయ వ్యవస్థ క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. అక్రమ డిపాజిట్ల వ్యవహారం నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డిపాజిటర్ల పేర్లు, డిపాజిట్ల వివరాలను జిల్లాల వారీగా ప్రకటించాలని.. ఎంతమందికి డిపాజిట్లు వెనక్కి ఇచ్చారో పరిశీలించాలని కూడా ఆదేశించడం గమనార్హం. ఆరు నెలల్లో ఈ కేసు విచారణను పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టుకు నిర్దేశించింది. ఈ క్రమంలో ‘సుప్రీం’ ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు ఈ కేసు విచారణను సత్వరం చేపట్టింది. కాగా ‘మార్గదర్శి’ డిపాజిట్లు చట్టవిరుద్ధమేనని ఆర్బీఐ తెలంగాణ హైకోర్టుకు లిఖితపూర్వకంగా వెల్లడించింది.ఈ కేసులో న్యాయస్థానాలు, ఆర్బీఐ చురుగ్గా వ్యవహరిస్తుండగా డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి ఉదాశీన వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. ‘మార్గదర్శి’ డిపాజిటర్ల వివరాలను జిల్లాలవారీగా ప్రకటిస్తామని, వారికి డిపాజిట్ల మొత్తం చెల్లించారో లేదో పరిశీలిస్తామని, ఎంతమందికి డిపాజిట్లు తిరిగి చెల్లించారు? ఎంతమందికి చెల్లించ లేదు? అనే అంశాలపై వాస్తవాలు తెలుసుకుని తెలంగాణ హైకోర్టుకు వెల్లడిస్తామని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పాల్సి ఉంది.క్షేత్రస్థాయిలో ఆ బాధ్యతను నిర్వర్తించాల్సింది ఈ రెండు ప్రభుత్వాలే. అయితే ఆ మాట చెప్పేందుకు ఇటు చంద్రబాబు ప్రభుత్వానికిగానీ అటు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి గానీ మనస్కరించడం లేదు. మార్గదర్శి యాజమాన్యానికి పరోక్షంగా సహకరించాలనే ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.నాడు కొట్టివేతకు బాబు ప్రభుత్వ సహకారంకేసును నిలబెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం1995 నుంచి 2004 వరకు చంద్రబాబు సర్కారు అండతోనే ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణించారు) ఉమ్మడి ఏపీలో యథేచ్చగా అక్రమ డిపాజిట్ల దందా సాగించారు. దీనిపై 2006లో నాటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో రామోజీ వసూలు చేసినవి అక్రమ డిపాజిట్లేనని ఆర్బీఐ స్పష్టం చేయడంతో ఆయన అనివార్యంగా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసివేశారు. సేకరించిన డిపాజిట్ల మొత్తాన్ని డిపాజిట్‌దారులకు చెల్లించేసినట్లు చెప్పారు.అయితే సేకరించిన డిపాజిట్లు, డిపాజిట్‌దారుల వివరాలు, వారికి తిరిగి చెల్లించిన మొత్తం వివరాలను వెల్లడించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్‌కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు ఈ కేసును పట్టించుకోలేదు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం రామోజీ అక్రమ డిపాజిట్ల దందాకు అండగా నిలిచింది. ఈ క్రమంలో 2018 డిసెంబర్లో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసును కొట్టివేయడం గమనార్హం.అయితే డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన నాటి చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఉమ్మడి ఏపీ హైకోర్టు తీర్పును ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆ కేసులో ఇంప్లీడ్ అయింది. తద్వారా ఆ కేసు నిలిచేలా చేసింది. మళ్లీ అదే కుతంత్రం..రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్ల దందాకు వత్తాసు పలుకుతోంది. ‘మార్గదర్శి’వి అక్రమ డిపాజిట్లేనని స్వయంగా ఆర్బీఐ నిగ్గు తేల్చడంతో రామోజీ కుటుంబం అడ్డంగా దొరికిపోయింది. ఈ కేసు విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించడంతో రామోజీ కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. దీంతో మీ అక్రమాలకు అండగా నేనున్నానంటూ చంద్రబాబు మరోసారి కుట్రలకు తెరతీశారు. అక్రమ డిపాజిట్లపై ప్రభుత్వ వైఖరిని చెప్పకుండా వీలైనంత జాప్యం చేసేలా కుట్ర పన్నుతున్నారు.ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అఫిడవిట్ దాఖలు చేయాల్సి వస్తే ‘గోడ మీద పిల్లి’ వైఖరి అనుసరించాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక జిల్లాల వారీగా డిపాజిటర్ల వివరాల వెల్లడి, వారికి డిపాజిట్ మొత్తాన్ని చెల్లించారో లేదో పరిశీలన ప్రక్రియ చేపట్టే ఉద్దేశమే లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా పరిగణించాలని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్గదర్శి డిపాజిటర్లకు న్యాయం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని స్పష్టం చేస్తున్నారు. -
KSR Live Show: రామోజీ రావు రాజ్యాంగానికి అతీతుడు.. మార్గదర్శి మోసానికి గాను భారతరత్న
-
రామోజీ అవినీతి సామ్రాజ్యం
-
మార్గదర్శి మోసాలకు శిక్ష తప్పదు
సాక్షి, అమరావతి: రామోజీరావు ఓ ఆర్థిక నేరస్తుడని తాము ముందు నుంచి చెబుతున్నామని, తాజాగా హైకోర్టులో ఆర్బీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌తో అది నిరూపితమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. మీడియా ముసుగులో రామోజీ యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘించి అవినీతి పునాదుల మీద ఆర్థిక సామ్రాజ్యాన్ని నిరి్మంచారని ధ్వజమెత్తారు. చట్ట విరుద్ధంగా మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వసూళ్లపై సీఎం చంద్రబాబు ఏనాడూ కన్నెత్తి చూడలేదని విమర్శించారు. తాము ఎన్ని నేరాలు చేసినా ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాలో రామోజీ వారసులు ఉన్నారని చెప్పారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. ⇒ దశాబ్దాల పాటు రామోజీ అక్రమ డిపాజిట్ల సేకరణ, మార్గదర్శిలో భారీ కుంభకోణాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వెలికితీశారు. ఆర్బీఐ చట్టం సెక్షన్–45(ఎస్) ప్రకారం ఆ డిపాజిట్ల సేకరణ నేరమని ఉండవల్లి ఫిర్యాదు చేయడంతో మార్గదర్శిపై విచారణ మొదలైంది.⇒ మార్గదర్శి ద్వారా రామోజీరావు 2006 నాటికి చట్ట విరుద్ధంగా రూ.2,610 కోట్లకుపైగా డిపాజిట్లు సేకరించారు. నాడు సీఎంగా ఉన్న వైఎస్సార్ మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వ్యవహారంపై చర్యలకు ఆదేశిస్తే చంద్రబాబుతోసహా రామోజీరావు మద్దతుదారులంతా పత్రికా స్వేచ్ఛపై దాడిగా దు్రష్పచారం చేశారు. ⇒ మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వ్యవహారంపై ఆర్బీఐ ప్రకటన చేసిన నేపథ్యంలో బాధ్యులు, ఆ సంస్థలో డైరెక్టర్లపై కోర్టులో విచారణ తప్పదు. శిక్ష కూడా తప్పదు. ⇒ ఎక్కడ, ఏ ఆఫీసులో చిత్తు కాగితాలు తగలబెట్టినా మా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం టీడీపీ, ఎల్లో మీడియాకు పరిపాటిగా మారింది. ఏ ఆఫీస్‌లో చెత్త కాగితాలు కూడా తగలెట్టొద్దంటూ జీవో ఇవ్వాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ⇒ పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలన్న తాపత్రయంతో స్పిల్‌వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్.. అన్నింటి పనులు ఒకేసారి మొదలు పెట్టినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా అంగీకరించినందున వారి తప్పిదాన్ని వారే ఒప్పుకున్నారు. -
‘మార్గదర్శి’ అక్రమాల నిగ్గు తేల్చాల్సిందే: అంబటి
సాక్షి, గుంటూరు: రామోజీరావు అనేక చట్టాలను ఉల్లంఘించారని.. అవినీతి మీద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘రామోజీరావు వైపు 2006 వరకు ఏ వ్యవస్థ చూడలేదన్నారు.‘‘మార్గదర్శిపై ఆనాడు ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆర్బీఐకి ఫిర్యాదు చేశారు. ఉండవల్లిపై కూడా రామోజీ పరువునష్టం దావా వేశారు. ఈ కేసును కొట్టేయమంటూ రామోజీ పిటిషన్ కూడా వేశారు. కేసు కొట్టేసినట్టు కూడా ఏ పేపర్లోనూ రాలేదు. 2016 డిసెంబర్లో ఉండవల్లి మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసును కొట్టేయడం సరికాదని, విచారించాలని సుప్రీంకు వెళ్లారు. దీంతో విచారణ జరగాలని తెలంగాణ హైకోర్టుకు అప్పగించింది. మార్గదర్శి డిపాజిట్లపై విచారణ జరగాల్సిందేనని ఆర్బీఐ తెలిపింది’’ అని అంబటి రాంబాబు వివరించారు.సంబంధిత వార్త: మార్గదర్శి అక్రమాల పునాదికి ఈనాడు కవచం‘‘రామోజీరావు చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడ్డారు. దుష్టచతుష్టయంలో రామోజీరావు కూడా ఉన్నారు. ప్రజల వద్ద నుంచి డిపాజిట్ల రూపంలో అక్రమంగా వసూలు చేశారు. చట్ట వ్యతిరేకంగా వసూలు చేసి పెట్టుబడి పెట్టుకున్నారు. రామోజీ ఎన్ని నేరాలు చేసినా ఇప్పటి సీఎం కూడా పట్టించుకోలేదు. ఎన్ని నేరాలు చేసినా తమను ఎవరూ పట్టించుకోకూడదని రామోజీ వారసులు కూడా వ్యవహరిస్తున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా చంద్రబాబుకు పట్టదు’’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘రామోజీరావు ఆర్థిక నేరస్థుడని మేం ముందునుంచి చెప్తున్నాం. ఈ కేసును బతికించడానికి ఉండవల్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుపై యుద్ధం చేయాలని అరుణ్‌కుమార్‌ను కోరుతున్నా. చిట్‌ఫండ్ పేరుతో చేసిన నేరాలపై ఉండవల్లి పోరాడాలి’’ అని అంబటి సూచించారు.సంబంధిత వార్త: అంతా నల్లధనం దందానే!2006 నాటికి రూ. 2610 కోట్లు అక్రమ వసూళ్లు..‘‘హెచ్‌యూఎఫ్ ప్రకారం డిపాజిట్లు సేకరించడం నేరమని ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది. హైకోర్టు విభజన చివరి రోజు కేసును కొట్టేయాలంటూ రామోజీరావు క్వాష్ పిటిషన్ వేశారు. 2006 నాటికి 2610 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారు. రామోజీరావు చనిపోయినా వారి కుటుంబ సభ్యుల పై చర్యలు తీసుకోవాలి. తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో అవినీతి కార్యక్రమాలను చేసుకోవడంలో రామోజీరావు ఒకరు’’ అని అంబటి పేర్కొన్నారు.రామోజీ కుటుంబం శిక్ష అనుభవించక తప్పదు‘‘వైఎస్ జగన్‌పై పుంఖాను పుంఖాలుగా తప్పుడు వార్తలు రాశారు. ఉదయం లేచినదగ్గర్నుంచి వైసీపీ పై దాడి చేసే ప్రయత్నం చేయడం దారుణం. మార్గదర్శి కేసులో రామోజీ కుటుంబం శిక్ష అనుభవించక తప్పదు. రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్.. ఆర్థిక నేరగాడు. మార్గదర్శి చిట్ ఫండ్ చేసిన కార్యక్రమాలన్నీ చట్ట వ్యతిరేకమే. మార్గదర్శిపై చర్యలు తీసుకోకపోతే చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని అంబటి డిమాండ్ చేశారు.చెత్త నుంచి స్కాములు సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నాడు‘‘రాజమండ్రి ఆర్అండ్ఆర్ కార్యాలయంలో ఫైల్స్ తగలబడిపోయాయని గగ్గోలు పెడుతున్నారు. ఆఫీసుల్లో చెత్తకాగితాలు తలేస్తుంటే ఎందుకు దిగజారిపోతున్నారు. చెత్త తగలబడితే స్కామ్ జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. చెత్త నుంచి స్కాములు సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నాడు. కావాలనే మా నాయకులను అరెస్టులు చేస్తున్నారు. మేం దేనికీ భయపడం. వైఎస్సార్సీపీ పార్టీ ధైర్యంలోంచి పుట్టింది. మా పై బురద చల్లాలలని చూస్తున్నారు’’ అని అంబటి మండిపడ్డారు. మంత్రి రామానాయుడు నిజం ఒప్పేసుకున్నాడు‘‘పోలవరం ఇష్యూ పై చంద్రబాబు, రామానాయుడికి చర్చకు రావాలన్న నా రిక్వెస్ట్‌ను విరమించుకుంటున్నా. అన్నీ సైమన్ టేనియస్ గా ప్రారంభించామని తెలిసో తెలియకో మంత్రి రామానాయుడు నిజం ఒప్పేసుకున్నాడు. ఇంక దీనిలో చర్చించడానికేం లేదు.’’ అని అంబటి చెప్పారు.కక్ష సాధింపు చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదు‘‘మా సమయంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గితే స్కామ్‌కు అవకాశమెక్కడుంటుంది? కక్షసాధింపు చర్యల్లో ఉండవని చంద్రబాబు చెబుతున్నాడు. కానీ చెప్పే మాటలకు చేతలకు తేడా ఉంది. మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి ఎర్రబుక్కు సంస్కృతితో కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. కక్ష సాధింపు చర్యల వెనుక మనిషి చంద్రబాబు.. బుర్ర లోకేష్‌ది. రామోజీరావును సపోర్ట్ చేసిన వారు ఆర్బీఐ అఫిడవిట్‌కు ఏం సమాధానం చెబుతారు?. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు కూడా రామోజీరావు ఎదుర్కున్న పరిస్థితులను ఎదుర్కోవడం ఖాయం’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
మార్గదర్శి అక్రమాల పునాదికి ఈనాడు కవచం
సాక్షి, అమరావతి: “నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక..! అన్నది తమ నినాదమని ఈనాడు పత్రిక నీతులు వల్లిస్తూ ఉంటుంది. నిజానికి రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి ‘మార్గదర్శి’ పునాది కాగా ‘ఈనాడు’ ఆ అరాచకాలకు దశాబ్దాలుగా రక్షణ కవచంలా నిలుస్తోంది!! మరి అలాంటి ‘మార్గదర్శి’ అక్రమాలను బట్టబయలు చేస్తే ఈనాడు సహిస్తుందా? పాత్రికేయ పైశాచికత్వం జడలు విప్పి కరాళ నృత్యం చేస్తుంది. అందుకే 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రి నాడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా ఈనాడు పత్రిక అంతగా దుష్ప్రచారానికి తెగబడింది. వైఎస్సార్ హఠాన్మరణం తరువాత కూడా ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కుట్రలకు పాల్పడింది. తదనంతరం 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడు బరితెగించి విష ప్రచారం చేసింది. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వక్రభాష్యం చెబుతూ రోజుకో రీతిలో బురద జల్లింది. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా రోజుకో రీతిలో వ్యక్తిత్వ హననానికి పాల్పడిందన్నది అక్షరసత్యం. రామోజీరావు ముమ్మాటికీ ఆర్థిక ఉగ్రవాది అనే వాస్తవాన్ని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచడంతోనే ఈనాడు అంతగా విషం చిమ్మిందన్నది నిరూపితమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన నివేదికే ఆ విషయాన్ని రుజువు చేస్తోంది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో... అనంతరం నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ఈనాడు ముసుగులో రామోజీ పాల్పడ్డ కుట్రలు తేటతెల్లమయ్యాయి. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో వాస్తవాలను వెల్లడిస్తూ తెలంగాణ హైకోర్టుకు ఆర్బీఐ సమరి్పంచిన నివేదిక లోగుట్టును విప్పింది.ఆర్థిక దోపిడీని అడ్డుకున్నారనే అక్కసుతోనే నాడు వైఎస్సార్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారం‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ ముసుగులో రామోజీరావు దశాబ్దాలుగా సాగించిన ఆర్థిక దోపిడీకి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదుతో 2006లో వైఎస్సార్ ప్రభుత్వం దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ రామోజీరావు అక్రమ డిపాజిట్లు సేకరిస్తున్నారని, అప్పటికే ఏకంగా రూ.2,600 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు సేకరించారని నిగ్గు తేల్చింది. అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రామోజీరావు అక్రమాలను ప్రశ్నించడం కాదు కదా మంత్రులు, ఉన్నతాధికారులు సైతం ఆయన పేరు పలికేందుకు సాహసించ లేదు. ఈ క్రమంలో అశేష ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమకు ఏ రాజగురువూ అవసరం లేదని, ప్రజల ఆశీస్సులే శ్రీరామరక్షగా భావించి దృఢ సంకల్పంతో వ్యవహరించారు. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ మూసివేయడంతో రామోజీరావు ఆర్థిక అక్రమ సామ్రాజ్యం పునాదులు కదలిపోయాయి. దశాబ్దాలుగా తాను సాగిస్తున్న ఘరానా మోసానికి వైఎస్ రాజశేఖరరెడ్డి అడ్డుకట్ట వేయడాన్ని ఆయన సహించలేకపోయారు. దాంతో పట్టరాని ఆక్రోశం, విద్వేషంతో వైఎస్సార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడులో నిత్యం పేజీలకు పేజీలు తప్పుడు వార్తలు రాయించారు. యావత్ వైఎస్సార్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దు్రష్పచారానికి తెగించారు. అయితే రామోజీ బ్లాక్ మెయిల్ పాత్రికేయానికి వైఎస్ రాజశేఖరరెడ్డి వెరవలేదు. ఆయనతో ఏమాత్రం రాజీ పడలేదు. తలొగ్గిన తరువాత ప్రభుత్వాలు ఆ అక్రమాలకు అండగా చంద్రబాబువైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనాడు రామోజీరావుకు జీహుజూర్ అన్నారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆర్థిక అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వమే కేసు పెట్టిందనే విషయాన్ని విస్మరించి నీరుగార్చారు. అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్వయంగా రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిని కలసి మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల గురించి ప్రస్తావించి ప్రజా ప్రయోజనాలను కాపాడాలని ఎంత కోరినా ఆలకించలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో రామోజీరావు అక్రమాలకు రక్షణ లభించింది. దాంతో గుట్టుచప్పుడు కాకుండా మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసును క్లోజ్ చేసేందుకు పావులు కదిపారు. ఈ నేపథ్యంలో 2018 డిసెంబర్లో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేయడం గమనార్హం. డిపాజిటర్ల ప్రయోజనాల కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మౌనంగా ఉండిపోవడం ద్వారా రామోజీ అక్రమాలకు రక్షణగా నిలిచింది.అక్రమాల పుట్ట మార్గదర్శి చిట్‌ఫండ్స్.. నిగ్గు తేల్చినందుకే జగన్‌పై దుష్ప్రచారంరామోజీ నెలకొల్పిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ కూడా ఆర్థిక అక్రమాల పుట్టేనని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. చందాదారుల ఫిర్యాదులతో స్టాంపులు–రిజి్రస్టేషన్ల శాఖ, సీఐడీ అధికారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించడంతో అక్రమాలు బట్టబయలయ్యాయి. కేంద్ర చిట్ ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా రామోజీరావు చందాదారుల సొమ్మును తమ కుటుంబ వ్యాపార సంస్థల్లో, మ్యూచ్‌వల్ ఫండ్స్‌లలో అక్రమంగా పెట్టుబడి పెడుతున్నట్లు గుర్తించారు. చందాదారులకు ప్రైజ్‌మనీ ఇవ్వకుండా రశీదు రూపంలో డిపాజిట్లు సేకరించారు. బ్రాంచి కార్యాలయాల్లోని నగదు నిల్వలలను హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి తరలించారు. నకిలీ చందాదారుల ముసుగులో నల్లధనం దందా సాగించారు. డమ్మీ చెక్కులతో మోసగిస్తూ చందాదారులను ఇబ్బంది పెట్టి వారి ఆస్తులను సొంతం చేసుకున్నారు. ఇలా మార్గదర్శి చిట్‌ఫండ్స్ యథేచ్ఛగా పాల్పడుతున్న అక్రమాలన్నీ ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ కేసులో నిందితులైన రామోజీరావు, ఆయన కోడలు శైలజ కిరణ్‌లను సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని వారి నివాసానికి వెళ్లి విచారించారు. తన ఇంటికి పోలీసులు రావడం ఇదే తొలిసారని రామోజీరావు సీఐడీ అధికారులతో వ్యాఖ్యానించడం గమనార్హం. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఆయన తనయుడు వైఎస్ జగన్ తమ అక్రమాలకు అడ్డుకట్ట వేయడాన్ని రామోజీరావు సహించలేకపోయారు. వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి వస్తే తమ అక్రమ సామ్రాజ్యం పూర్తిగా కుప్పకూలడం ఖాయమని, తమకు శిక్ష పడటం ఖాయమని గ్రహించారు. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీస్థాయిలో దుష్ప్రచారానికి తెగించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలకు వక్రభాష్యం చెబుతూ నిరాధార ఆరోపణలతో రోజుకో రీతిలో బురదజల్లారు. సత్యం నినదించడం కాదు... దోపిడీ వర్ధిల్లాలి అదే ఈనాడు నినాదం.. విధానం రామోజీరావు తన ఆత్మనే ఈనాడు పత్రికగా ... ‘నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక’ అనే జ్యోతిని వెలిగించి పత్రిక తెచ్చారని ఇటీవల ఈనాడు స్వర్ణోత్సవాల్లో ఘనంగా ప్రకటించారు. ఈ మాటలు వినటానికి ఎంత అందంగా ఉంటాయో ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం ఈనాడు పాత్రికేయం అంత పైశాచికంగా ఉంటుందన్నది 50 ఏళ్లుగా రోజూ నిగ్గుతేలుతున్న అక్షర సత్యం. రామోజీరావు అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి పునాది మార్గదర్శి ఫైనాన్సియర్స్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ అయితే.. ఆ ఆర్థిక ఉగ్రవాదానికి రక్షణ కవచంగా ఈనాడు పత్రికను వాడుకున్నారన్నది సీఐడీ దర్యాప్తులు, ఆర్బీఐ నివేదికల సాక్షిగా వెల్లడైన వాస్తవం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుటుంబం వాటాలను అక్రమంగా తన కోడలు పేరిట రామోజీ బదిలీ చేసుకున్నారు. ఈనాడు కార్యాలయాలు జాతీయ రహదారులు, నగరాల్లోని రహదారులను కబ్జా చేసినా వ్యవస్థలు కళ్లు మూసుకున్నాయి. తమకు పోటీగా ఉన్న ఉదయం పత్రికను దెబ్బతీసేందుకు సారా వ్యతిరేక ఉద్యమం...అనంతరం సంపూర్ణ మద్యపాన నిషేద ఉద్యమాన్ని ఈనాడు నెత్తిన పెట్టుకుంది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దు్రష్పచారం చేసింది. ఇక 1995లో ఆనాటి సీఎం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబు భాగస్వామి రామోజీ. అందుకు ప్రతిగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి రామోజీ ఫిల్మ్ సిటీలో మద్యాన్ని ఏరులై పారించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఫిల్మ్ సిటీ పేరిట కబ్జా చేసిన రామోజీరావుకు టీడీపీ ప్రభుత్వం సహకరించింది. ఇక ఈనాడు స్వర్ణోత్సవ వేడుకల్లో ఆ పత్రిక ప్రతినిధులు మాట్లాడుతూ 2006లోనూ 2022లోనూ ఈనాడు పత్రికపై ప్రభుత్వాలు దాడులకు పాల్పడ్డాయని ఆరోపించడం విడ్డూరంగా ఉంది.ఇకనైనాప్రభుత్వాలు స్పందిస్తాయా? మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు తాజాగా ఆర్బీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పుడు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇరు ప్రభుత్వాలు తెలంగాణ హైకోర్టుకు ఈ నెల 20న తమ అభిప్రాయాన్ని తెలపాల్సి ఉంది. ఇకనైనా డిపాజిట్ దారుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడతాయా? లేక ఈనాడు ప్రాపకం కోసం రామోజీ కుటుంబ ఆర్థిక దోపిడీకి వంత పాడి మౌనంగా ఉండిపోతాయా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దాదాపు 18 ఏళ్లుగా మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసులో మునుముందు ఎలా వ్యవహరిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.18 ఏళ్లు నెట్టుకొచ్చారు6.11.2006: మార్గదర్శి ఫైనాన్సియర్స్, రామోజీరావులపై చర్యలు కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండవల్లి ఫిర్యాదు.13.11.2006: ఉండవల్లి ఫిర్యాదును కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపింది. ఆర్బీఐ మార్గదర్శి వివరణ కోరింది. 30.11.2006: తాము సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రామన్న మార్గదర్శి. ఇకపై డిపాజిట్లు వసూలు చేయవద్దని మార్గదర్శికి ఆర్బీఐ ఆదేశం.19.12.2006: మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు సంబంధించిన సమాచారం, డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ.19.12.2006: వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఎన్.రంగాచారిని నియమిస్తూ జీవో నంబర్ 801 జారీ. మార్గదర్శి అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు అదీకృత అధికారిగా టి.కృష్ణరాజు నియామకం జీవో 800 జారీ. 27.12.2006: రంగాచారి, కృష్ణరాజుల నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మార్గదర్శి, రామోజీరావు పిటిషన్.29.12.2006: మార్గదర్శిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనంటూ ఆర్బీఐ లేఖ. 29.12.2006: ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం చట్టబద్ధతను సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీ హైకోర్టులో పిటిషన్.19.2.2007: ఎన్.రంగాచారి మార్గదర్శి అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పణ. 19.2.2007: రంగాచారి నియామక జీవోపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ.23.2.2007: రంగాచారి నియామకం విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మార్గదర్శి, రామోజీ రావు.23.1.2008: మార్గదర్శి అక్రమాలపై నాంపల్లి కోర్టులో అదీకృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదు. 13.7.2009: అదీకృత అధికారి దాఖలు చేసిన ఫిర్యాదులో రామోజీరావు వ్యక్తిగత హాజరుకు నాంపల్లి కోర్టు ఆదేశం 20.7.2009: నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన రామోజీ. 3.8.2009: రామోజీ పిటిషన్‌ను కొట్టేస్తూ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనన్న హైకోర్టు.7.9.2009: అదీకృత అధికారి తరఫున వాదనలు వినిపించేందుకు ప్రత్యేక పీపీ నియామకంపై మార్గదర్శి, రామోజీ పిటిషన్. 27.11.2009: వ్యక్తిగత హాజరు విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మార్గదర్శి, రామోజీ 17.10.2010: ప్రత్యేక పీపీ నియామకంపై మార్గదర్శి పిటిషన్ మూసివేత 1.7.2011: మార్గదర్శి అక్రమాల కేసులో విచారణను కొన్ని సెక్షన్లకే పరిమితం చేయాలంటూ రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసిన నాంపల్లి 18.7.2011: నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రామోజీ హైకోర్టులో పిటిషన్ 26.07.2011: మార్గదర్శి అక్రమాలపై దాఖలైన ఫిర్యాదును కొట్టేయాలంటూ హైకోర్టులో రామోజీ, మార్గదర్శి పిటిషన్ 2011: రామోజీ, మార్గదర్శిపై నాంపల్లి కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు 2014: రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో ఈ కేసు గురించి ఎవరూ పట్టించుకోలేదు. 18.9.2018: నాంపల్లి కోర్టులో మార్గదర్శికి వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదులో తదుపరి చర్యలు నిలుపుదల చేయాలంటూ మార్గదర్శి, రామోజీ అనుబంధ పిటిషన్ 12.10.2018: నాంపల్లి కోర్టులో మార్గదర్శికి వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదులో తదుపరి చర్యలు నిలుపుదలకు సుప్రీంకోర్టు నిరాకరణ 31.12.2018: నాంపల్లి కోర్టులో మార్గదర్శి, రామోజీరావుపై అ«దీకృత అధికారి దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేసిన హైకోర్టు 16.12.2019: హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ 17.10.2022: డిపాజిటర్ల పరిరక్షణ చట్టంపై మార్గదర్శి, రామోజీరావు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను మూసేసిన హైకోర్టు 9.4.2024: మార్గదర్శిపై అ«దీకృత అధికారి ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసిన దర్మాసనం. మార్గదర్శి అక్రమాలపై నిగ్గు తేల్చాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. మొత్తం వ్యవహారాలపై దర్యాప్తు చేయాలి మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్టు పూర్తి ఆధారాలతో సహా నిరూపితమైంది. ఆ సంస్థ చైర్మన్ రామోజీరావు లేకున్నా సరే మార్గదర్శి ఎండీగా ఉన్న ఆయన కోడలు శైలజ కిరణ్, భాగస్వాములుగా ఉన్న వారి కుటుంబ సభ్యులను చట్టపరంగా శిక్షించాలి. అంతేకాదు మార్గదర్శి మొత్తం అక్రమాలపై సమగ్రంగా దర్యాప్తు చేయాలి. – వొగ్గు గవాస్కర్, న్యాయవాదిరామోజీ కుటుంబం బాధ్యత వహించాల్సిందే మార్గదర్శి అక్రమాలు నిరూపితమయ్యాయి. హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావు ప్రస్తుతం లేకున్నా సరే ఆ హెచ్యూఎఫ్లోని ఇతర సభ్యులు బాధ్యత వహించాల్సిందే. వసూలు చేసిన డిపాజిట్లకు కనీసం పదిరెట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇతరత్రా శిక్షలకు రామోజీ కుటుంబ సభ్యులు అర్హులు. కోటంరాజు వెంకటేశ్ శర్మ, న్యాయవాది, విజయవాడ సొంత ఆడిట్ కుదరదు∙ నిజాలు నిగ్గు తేలాల్సిందే ∙ మార్గదర్శికి స్పష్టంచేసిన సుప్రీం మార్గదర్శి అక్రమ డిపాజిట్ల బాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకు అప్పట్లో చెరుకూరి రామోజీరావు చేయని కుతంత్రం లేదు... ఎంతగా అంటే ‘అక్రమంగా సేకరించిన డిపాజిట్ల సొమ్మును డిపాజిట్‌దారులకు చెల్లించేశాం... ఆ విషయాన్ని మా ఆడిటర్లు లెక్క తేల్చేసి నివేదిక ఇచ్చారు’అంటూ కనికట్టు చేసేందుకు యతి్నంచారు. కానీ, ఆ కుతంత్రాన్ని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే తిప్పికొట్టింది. ‘నేరం నాదే... దర్యాప్తు నాదే... తీర్పు నాదే’ అంటే కుదరదు అని తేల్చిచెప్పింది. డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించారో... లేదో... నిర్దారించాల్సిందిగా మార్గదర్శి ఆడిటర్లు కాదు... రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అని విస్పష్టంగా ప్రకటించింది. డిపాజిట్లు చెల్లించేశాం...మా ఆడిటర్లులెక్క తేల్చేశారు.. సుప్రీంకోర్టులో రామోజీ వితండవాదం రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా రూ.2,610.38కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన కేసులో చెరుకూరి రామోజీరావు సుప్రీంకోర్టులో అడ్డగోలు వాదనలతో కనికట్టు చేయాలని యతి్నంచారు. తాము అక్రమంగా సేకరించిన డిపాజిట్ల మొత్తాన్ని సంబంధిత డిపాజిట్‌దారులకు చెల్లించేశామని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. మొత్తం రూ.2,610.38 కోట్ల అక్రమ డిపాజిట్లలో 2023, జూన్ 30నాటికి 1,247మంది డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించేశామని చెప్పారు. కేవలం రూ.5.31కోట్లు మాత్రమే క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆడిటర్లు పూర్తిగా ఆడిట్ చేసి నివేదిక సమరి్పంచారని... అన్ని లెక్కలు సరిపోయాయని కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్‌దారులు, వారికి చెల్లింపుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని వితండవాదం చేశారు.అదేం కుదరదు.. డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందే – స్పష్టంచేసిన సుప్రీంకోర్టు రామోజీరావు తరఫు న్యాయవాదుల వాదనలను ఏప్రిల్‌లోనే సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ‘డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించేశామని మీరు చెబితే... మీ దగ్గర పని చేసే ఆడిటర్లు నివేదిక ఇస్తే సరిపోదు. ఆ నివేదికను పరిగణలోకి తీసుకోము’ అని స్పష్టం చేసింది. ఎందుకంటే రూ.5వేలు డిపాజిట్‌చేసిన వ్యక్తి తనకు న్యాయం జరగలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు.. అంతటి వ్యయ ప్రయాసలు భరించలేరు కదా అని కూడా వ్యాఖ్యానించింది. అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను కూడా పారీ్టగా చేరుస్తూ ఈ కేసును తెలంగాణ న్యాయస్థానం విచారించాలని తీర్పునిచి్చంది. డిపాజిట్లు తిరిగి చెల్లించినది.. లేనిది పరిశీలించేందుకు ఓ జ్యుడిíÙయల్ అధికారిని నియమించాలని కూడా తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. మొత్తం విచారణ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. -
రామోజీ ఆర్థిక నేరగాడే
సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్సియర్స్ నిర్భీతిగా నిబంధనలను ఉల్లంఘించి ఆర్థిక దోపిడీకి పాల్పడినట్లు స్పష్టమైంది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు కూడా చైర్మన్‌గా వ్యవహరించిన ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణించారు) ఆర్థిక నేరస్తుడని తేటతెల్లమైంది. చట్టానికి తాను అతీతమన్నట్టుగా దశాబ్దాలుగా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడి భారీగా దోపిడీకి తెగించినట్లు నిగ్గు తేలింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి విస్పష్టంగా ప్రకటించింది. ఈ మేరకు తాజాగా తెలంగాణ హైకోర్టుకు ఈ నెల 13న లిఖితపూర్వకంగా కౌంటర్లో నివేదించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా పూర్వాపరాలివి. ఆర్బీఐకి తెలియకుండానే...హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఏర్పాటైంది. ఈ హెచ్‌యూఎఫ్‌కు రామోజీరావు కర్త. డిపాజిట్లు వసూలు చేసేందుకు హెచ్‌యూఎఫ్‌లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతివ్వదు. ఇక్కడ అసక్తికర విషయం ఏమిటంటే అసలు మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనే సంస్థ ఉన్నట్లు రిజర్వ్ బ్యాంకుకే తెలియదు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండానే రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్సియర్స్ తన కార్యకలాపాలను కొనసాగించింది. ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా 2006 మార్చి నాటికి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి రూ.2,610.38 కోట్లను డిపాజిట్లుగా సేకరించింది. ఇంత భారీ మొత్తాల్లో డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి అప్పట్లో ప్రతీ సంవత్సరం వందల కోట్ల రూపాయల్లో నష్టాలు చూపింది. 2000 మార్చి 30వ తేదీ నాటికి 619.25 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేయగా, 2006 మార్చి 30 నాటికి వసూలు చేసిన డిపాజిట్ల మొత్తాన్ని రూ.2,610.38 కోట్లుగా చూపింది. ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసినప్పటికీ 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. అంటే 50 శాతం డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్సియర్స్ చేరింది. డిపాజిటర్లకు వడ్డీలు, మెచ్యూరిటీ మొత్తాలు చెల్లించేందుకు మళ్లీ డిపాజిట్లు తీసుకోవడం మొదలు పెట్టింది. ఇలా మార్గదర్శి ఆర్థికంగా మనుగడ సాగించింది. ఉండవల్లి ఫిర్యాదుతో కదిలిన మార్గదర్శి పునాదులు.. మార్గదర్శి ఫైనాన్సియర్స్ చట్ట ఉల్లంఘనలపై 2006లో అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమ డిపాజిట్ల కథ వెలుగులోకి వచ్చింది. ఉండవల్లి ఫిర్యాదును కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐకి పంపింది. దీంతో ఆర్బీఐ మార్గదర్శి ఫైనాన్సియర్స్ వివరణ కోరింది. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్) హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్)కు వర్తించదని మార్గదర్శి ఆర్బీఐకి రాతపూర్వకంగా తెలిపింది. అందులో ఎక్కడా కూడా డిపాజిట్లు వసూలు చేయలేదని మాత్రం చెప్పలేదు. అంతేకాక 2006 సెప్టెంబర్ 16 నుంచి రూ.లక్ష అంతకన్నా తక్కువ మొత్తాలను డిపాజిట్లుగా స్వీకరించడాన్ని నిలిపేశామని ఆర్బీఐకి చెప్పింది. ఈ వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. అక్రమాల నిగ్గు తేల్చే బాధ్యత రంగాచారికి ఆర్బీఐ సూచన మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడంతోపాటు మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలను, అవకతవకలను నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006 డిసెంబర్ 19న జీవో జారీ చేసింది. అలాగే మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ అధికారి టి.కృష్ణరాజును అదీకృత అధికారిగా నియమించింది. దీంతో ఉలిక్కిపడ్డ రామోజీరావు... మార్గదర్శి ఫైనాన్సియర్స్ ద్వారా అటు రంగాచారి, ఇటు కృష్ణరాజు నియామకాలను సవాలు చేస్తూ 2006లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు వారి నియామకాలను రద్దు చేసేందుకు తిరస్కరిస్తూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ పిటిషన్లను కొట్టేసింది. మార్గదర్శి, రామోజీల ప్రాసిక్యూషన్ కోసం కృష్ణరాజు ఫిర్యాదు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్సియర్స్, హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008, జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) దాఖలు చేశారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఇందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 58ఈ కింద శిక్షార్హమని తెలిపారు. ఈ ఫిర్యాదును కొట్టేయాలని కోరుతూ మార్గదర్శి 2008లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేసేందుకు నిరాకరించింది. మార్గదర్శిపై చర్యల నిలిపివేతకు సుప్రీంకోర్టు తిరస్కృతి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో రామోజీరావు 2010లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఫిర్యాదులో విచారణను సెక్షన్ 45(ఎస్)(1), 45(ఎస్)(2), 58బీ(5ఏ) రెడ్ విత్ సెక్షన్ 58(ఈ)లకే పరిమితం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని నాంపల్లి కోర్టును కోరారు. ఈ అభ్యర్థనను నాంపల్లి కోర్టు తోసిపుచ్చుతూ 2011లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీరావు హైకోర్టును ఆశ్రయించారు. హెచ్‌యూఎఫ్ అయిన మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ... మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 2011లో మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు నాంపల్లి కోర్టు ముందున్న ఫిర్యాదు (సీసీ 540)లో తదుపరి చర్యలను నిలిపేసేందుకు నిరాకరించింది. అలాగే హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొనసాగించేందుకు సైతం నిరాకరించింది. ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు మార్గదర్శికి అనుకూలంగా తీర్పు... ఆ తర్వాత 2019, జనవరి ఒకటో తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజన జరిగింది. అంటే 31.12.2018న ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అందరూ విభజన పనుల్లో నిమగ్నమయ్యారు. అటు న్యాయవాదులు, ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై ఎవరూ దృష్టి సారించలేని పరిస్థితి. ఇదే అదునుగా భావించిన రామోజీరావు నాంపల్లి కోర్టులో కృష్ణరాజు ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో దాఖలు చేసిన తన వ్యాజ్యాలను 2018, డిసెంబర్ 31వ తేదీన విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు విన్న జస్టిస్ రజనీ అదే రోజున... అంటే 2018, డిసెంబర్ 31న తీర్పు కూడా ఇచ్చేశారు. హెచ్‌యూఎఫ్ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదని జస్టిస్ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. మార్గదర్శి, రామోజీరావులకు క్లీన్చిట్ ఇచ్చేసిన న్యాయమూర్తి... డిపాజిట్ల సేకరణ విషయంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్, రామోజీరావులకు అసలు ఎలాంటి దురుద్దేశాలు లేవంటూ న్యాయమూర్తి సర్టిఫికెట్ ఇచ్చేయడం ఈ తీర్పులో ఆసక్తికర విషయం. అంతేకాక డిపాజిట్లను తిరిగి చెల్లించే ప్రక్రియను మొదలుపెట్టారని చెప్పిన హైకోర్టు, పరోక్షంగా మార్గదర్శి, రామోజీరావు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన విషయాన్ని నిర్ధారించినట్లు అయింది. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి తీర్పునివ్వడం విశేషం. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లు గానీ ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. దీంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం 2019లో ఇంప్లీడ్ అయింది. యావజ్జీవ ఖైదు... రెండింతల జరిమానా అక్రమ డిపాజిట్ల కేసులో నేరం నిరూపితమైతే భారీ జరిమానాతోపాటు ఆ సంస్థ బాధ్యులకు రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉందని ఈ ఏడాది ఏప్రిల్‌లో న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆ సంస్థ చైర్మన్ రామోజీ ఇటీవల మృతిచెందారు. కానీ నేరం రుజువైతే నేరంగానే పరిగణిస్తారు. ఆ సంస్థ నిర్వాహకులు అందుకు బాధ్యత వహించక తప్పదు. ఇక సేకరించిన అక్రమ డిపాజిట్లు రూ.రూ.2,610.38కోట్లకు రెట్టింపు జరిమానా విధించే అవకాశం ఉంది. బెడిసికొట్టిన ‘పత్రికా స్వేచ్ఛ’ పన్నాగంపత్రికా స్వేచ్ఛ ముసుగులో ఈ కేసు నుంచి బయటపడేందుకు నాడు రామోజీరావు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. ఈనాడు పత్రికకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యతిరేకం కాబట్టే ఈ కేసు విషయంలో పట్టుబడుతోందని రామోజీరావు తరఫున ప్రముఖ న్యాయవాదులు వినిపించిన వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశానికి, అక్రమ డిపాజిట్లకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఉండొద్దని వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికలు ఉన్నందునే ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోందన్న రామోజీ తరఫు న్యాయవాదుల వాదనలతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. ‘ఎన్నికలు ఉంటే ఈనాడుకు ఏమైంది? ఈనాడు ఏమీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కదా..? ఈనాడు కేవలం ఓ పత్రికే కదా..! ఎన్నికలతో ఏం సంబంధం?’ అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్‌పై నెపాన్ని నెట్టివేసేందుకు రామోజీ తరఫు న్యాయవాదులు విఫలయత్నం చేశారు. రంగాచారి నివేదికలోని కీలక అంశాలు ⇒ రంగాచారి విచారణకు రామోజీరావు, మార్గదర్శి ఎంతమాత్రం సహకరించలేదు. కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డుపడ్డారు. కావాల్సిన డాక్యుమెంట్లు ఇవ్వకుండా ముప్పుతిప్పులు పెట్టారు. తమ పిటిషన్లు కోర్టుల ముందు పెండింగ్‌లో ఉన్నాయని, అందువల్ల డాక్యుమెంట్లు ఇచ్చేది లేదన్నారు. చివరకు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన అన్నీ డాక్యుమెంట్లను పరిశీలించిన రంగాచారి 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ⇒ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్లు సేకరించిందని రంగాచారి తేల్చారు. ⇒ డిపాజిటర్లకు వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్న విషయాన్ని రంగాచారి తన నివేదికలో పొందుపరిచారు. ⇒ డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ లేదని, దాని ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ తీవ్ర నష్టాల్లో ఉండటమే అందుకు కారణమని స్పష్టంచేశారు. ⇒ రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిధులను మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తేల్చారు. క్రియాశీలకంగా లేని అనేక కంపెనీలకు మార్గదర్శి నిధులను బదలాయించినట్లు వారు సమర్పించిన డాక్యుమెంట్లే స్పష్టంగా చెబుతున్నాయని పేర్కొన్నారు. ⇒ రామోజీ గ్రూపులోని ఇతర కంపెనీల్లో కూడా ఇలాగే ఒక గ్రూపు నిధులను మరో గ్రూపునకు బదలాయించడం జరిగిందని పేర్కొన్నారు. ⇒ 2000, ఆ తర్వాత సంవత్సరాల్లోని బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని, మొత్తం ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని తెలిపారు. ⇒ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ తప్ప మిగిలిన అన్నీ కంపెనీలు నష్టాల్లో ఉన్నట్లు బ్యాలెన్స్ షీట్ల పరిశీలన ద్వారా తెలిసిందని రంగాచారి తన నివేదికలో వివరించారు. -
ఆ డిపాజిట్లు చట్టవిరుద్ధం
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను అడ్డు పెట్టుకుని రామోజీరావు సాగించిన ఆర్థిక అక్రమాలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎట్టకేలకు బహిర్గతం చేసింది. రామోజీ నిస్సందేహంగా ఆర్థిక ఉగ్రవాదేనని రుజువైంది. చట్ట విరుద్ధంగా దశాబ్దాల తరబడి ఆర్థిక దోపిడీకి తెగించారని తేటతెల్లమైంది. 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించినట్లు తెలంగాణ హైకోర్టుకు ఆర్బీఐ తాజాగా నివేదించింది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 (ఎస్)ను మార్గదర్శి యథేచ్ఛగా ఉల్లంఘించిందని తెలిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షి యర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం సీఆర్పీసీ సెక్షన్ 482 కింద క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన ప్పుడు ఆరోపిత నేరాలకు ప్రాథమిక ఆధారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్బీఐ చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్న నేపథ్యంలో తమపై దాఖలైన కేసు కొట్టివేయాలంటూ మార్గదర్శి, రామోజీ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని హైకోర్టును ఆర్బీఐ అభ్యర్థించింది.సుప్రీం ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు పునర్విచారణ...చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గ దర్శి, దాని కర్త రామోజీరావులపై డిపాజిటర్ల పరి రక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత అధికారి నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టి వేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అంతకు ముందు హైకోర్టు తీర్పులో కొంతభాగంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై ఈ ఏడాది ఏప్రిల్ 9న విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. హైకోర్టు తీర్పు ను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. కేసు లోతు ల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని స్పష్టం చేసింది. పునర్విచారణను ఆరు నెలల్లో ముగించాలని సూచించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఇటీవల ఈ విచారణ మొదలు పెట్టింది. హైకోర్టులో నెంబర్ టూ స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆర్బీఐని ప్రతివాదులుగా చేర్చి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్బీఐ పూర్తి వివరాలతో తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. ఆర్బీఐ కౌంటర్లో ముఖ్యాంశాలివీ...సెక్షన్ 45 ఎస్‌ను సుప్రీంకోర్టు గతంలోనే సమర్థించింది...‘1997లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్ట సవరణలో భాగంగా సెక్షన్ 45 ఎస్‌ను కూడా సవరించాం. ఓ వ్యక్తి వ్యక్తిగతంగా, సంస్థగా, వ్యక్తుల సమూహంతో కూడిన అన్ ఇన్కార్పొరేటెడ్లు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడాన్ని పూర్తిగా నిషేధించాం. చట్ట సవరణ వల్ల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వ్యాపారాన్ని సమర్థంగా నియంత్రించేందుకు మాకు అధికారం లభించింది. కంపెనీలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ లావాదేవీలు చేపట్టాలంటే మా నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ 45 ఎస్ చట్టబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 2000లో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సెక్షన్ 45 ఎస్‌ను సమర్థించింది. చట్టం ప్రకారం వ్యక్తులు, అన్ ఇన్ కార్పొరేటెడ్ కంపెనీలు చేసే వ్యాపారాన్ని సెక్షన్ 45 ఎస్ కింద ఆర్బీఐ నిషే«ధించలేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆన్ ఇన్ కార్పొరేటెడ్ సంస్థలు తమ స్వీయ నిధులతో లేదా బంధువుల వద్ద రుణంగా తీసుకున్న నిధులతో లేదా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న నిధులతో వ్యాపారం చేసుకోవచ్చు. అంతేగానీ ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేసి వాటి ద్వారా వ్యాపారం చేయడానికి వీల్లేదు’ అని ఆర్బీఐ తన కౌంటర్లో తేల్చి చెప్పింది.రెండేళ్ల జైలు.. రెండింతల జరిమానా‘చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారని భావించినప్పుడు ఆర్బీఐ లేదా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఆ డిపాజిట్ల వసూలు తాలుకూ డాక్యుమెంట్లన్నింటినీ తనిఖీ చేసే అధికారాన్ని సెక్షన్ 45 టీ కట్టబెడుతోంది. సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించినట్లు తేలితే ఆ వ్యక్తికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు లేదా వసూలు చేసిన డిపాజిట్ల మొత్తానికి రెండింతల జరిమానా విధించవచ్చు. చట్టవిరుద్ధంగా డిపాజిట్ల సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధీకృత అధికారి సంబంధిత కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయాల్సి ఉంటుంది. మార్గదర్శి వ్యవహారంలో కూడా అధీకృత అధికారి అలాగే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదునే గతంలో హైకోర్టు కొట్టేసింది. దానిపైనే ఇప్పుడు హైకోర్టు విచారణ జరుపుతోంది’ అని ఆర్బీఐ పేర్కొంది.హెచ్‌యూఎఫ్‌కు సెక్షన్ 45 ఎస్ వర్తిస్తుంది...హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) లీగల్ పర్సన్ కాదు. ఇది కొందరు వ్యక్తుల సమూహం. కర్త ద్వారా ఈ హెచ్‌యూఎఫ్ పని చేస్తుంటుంది. దీన్ని వ్యక్తుల సమూహంగానే పరిగణించాల్సి ఉంటుంది. అందువల్ల హెచ్‌యూఎఫ్‌కు ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్ వర్తిస్తుంది. వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం ఏ రకమైన వ్యాపారం, కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న దానిపై సెక్షన్ 45 ఎస్ వర్తింపు ఆధారపడి ఉంటుంది. వ్యాపారం చేసేందుకు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం ఈ సెక్షన్ కింద నిషిద్ధం. హెచ్‌యూఎఫ్ ఇలా డిపాజిట్లు వసూలు చేస్తే అది ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. ఈ కేసులో మొదటి ప్రతివాది అయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్యూఎఫ్గా ఆర్బీఐ చట్ట నిబంధనలకు తిలోదకాలు ఇచ్చింది. సెక్షన్ 45 ఎస్‌లో హెచ్యూఎఫ్ను చేర్చలేదని, తాము ఆ సెక్షన్ పరిధిలోకి రామని చెప్పడం సరికాదు. ప్రజల నుంచి డిపాజిట్ల స్వీకరణ నిషేధాన్ని ఆర్బీఐ పరిధిలోకి తేవడమే శాసనకర్తల ప్రధాన ఉద్దేశం. అందుకే ఆర్బీఐ చట్టంలో చాప్టర్ 3 బీ, 3 సీలను చేర్చింది’ అని రిజర్వ్ బ్యాంక్ తన కౌంటర్లో తెలిపింది.చట్ట విరుద్ధమన్న విషయాన్ని గతంలో హైకోర్టు పట్టించుకోలేదుహెచ్యూఎఫ్గా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం చట్ట విరుద్ధమన్న విషయాన్ని హైకోర్టు గతంలో పట్టించుకోలేదు. హెచ్‌యూఎఫ్ వ్యక్తుల సమూహం పరిధిలోకి వస్తుందన్న విషయాన్ని కూడా విస్మరించింది. ఇవన్నీ మార్గదర్శి, రామోజీరావు సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించారన్న విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. చట్ట విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేసినందుకు వీరికి సెక్షన్ 45ఎస్ (1), 45 ఎస్ (2) వర్తిస్తాయి. చట్టవిరుద్ధంగా వ్యవహరించారనేందుకు ఇవన్నీ ప్రాథమిక ఆధారాలే. సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా వ్యవహరించినందుకు వారిని ప్రాసిక్యూట్ చేయాలి. ఈ వివరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన ఈ క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని ఆర్బీఐ కౌంటర్లో అభ్యర్థించింది. కాగా రామోజీరావు ఇటీవల మరణించిన నేపథ్యంలో హెచ్‌యూఎఫ్ కర్తగా ఆ స్థానంలో ఆయన కుమారుడు చెరుకూరి కిరణ్‌ను చేర్చాలని (సబ్‌స్టిట్యూట్) కోరుతూ మార్గదర్శి ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 20న చేపట్టనున్నట్లు తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. అక్రమాలు బయటపడినందునే చెలరేగిన ‘ఈనాడు’ రామోజీ అక్రమ ఆరి్థక సామ్రాజ్యానికి ‘మార్గదర్శి’ పునాది కాగా.. ‘ఈనాడు’ ఆ అరాచకాలకు రక్షణ కవచంలా నిలుస్తోంది. మరి అలాంటి ‘మార్గదర్శి’ అక్రమాలను బట్టబయలు చేస్తే ఈనాడు సహిస్తుందా? అందుకే నాడు దివంగత వైఎస్సార్‌పై.. నేడు జగన్‌పై కట్టుకథలు అల్లుతూ దు్రష్పచారం చేస్తోంది. అక్రమాల సినిమాలో ఆయన త్రిపాత్రాభినయం ప్రజల సొమ్ము దోచుకునేందుకు రామోజీరావు త్రిపాత్రాభినయం చేశారు. ఆయన హెచ్‌యూఎఫ్ కర్తగా, ప్రొప్రైటర్‌గా, చైర్మన్‌గా మూడు వేర్వేరు పాత్రలలో అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఆర్బీఐకి మస్కా కొట్టారు. 18 ఏళ్లుగా నెట్టుకొచ్చారు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావుపై చర్యలు కోరుతూ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తొలి ఫిర్యాదు అందింది. నాంపల్లి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మొట్టికాయలు వేసినా.. ఆర్బీఐ తప్పుబట్టినా రామోజీరావు మాత్రం 18 ఏళ్లుగా తన అక్రమ దందాను కొనసాగిస్తూ వచ్చారు. సొంత ఆడిట్ కుదరదు.. ఎప్పుడో చెప్పిన సుప్రీంకోర్టు‘డిపాజిట్‌దారులకు సొమ్మును చెల్లించేశాం... మా ఆడిటర్లు లెక్క తేల్చేసి నివేదిక ఇచ్చారు’ అంటూ కనికట్టు చేసేందుకు యత్నించారు. ఆ కుతంత్రాన్ని పసిగట్టిన సుప్రీంకోర్టు.. ‘నేరం నాదే... దర్యాప్తు నాదే... తీర్పు నాదే’ అంటే కుదరదని, నిజాలు నిగ్గు తేలాల్సిందేనని స్పష్టం చేసింది. -
ఏపీని రామోజీ నిజంగానే ప్రేమించారా?
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సంస్మరణ సభలో కొందరు వక్తలు మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉంది. ప్రభుత్వపరంగా ఒక ప్రైవేటు వ్యక్తికి ఇలా సంస్మరణ సభలు నిర్వహించవచ్చా అన్న చర్చ ఒకటి అయితే, కీరవాణి వంటి సినీ ప్రముఖులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురి అవుతున్నాయి.కీరవాణి కులగజ్జితోనో, పార్టీ గజ్జితోనో మాట్లాడారన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తన మామ, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్.ను,రామోజీరావును సమానం చేస్తూ రాజగురువు పట్ల తన భక్తిని చాటుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనాడు మీడియా నిష్పక్షపాతంగా వార్తలు ఇస్తుందని అంటూ గత ప్రభుత్వం ఓడిపోయిందన్న వార్త విన్న తర్వాతే రామోజీ కన్నుమూశారని చెప్పారు. ఈ విషయాన్ని బట్టే రామోజీ పక్షపాతంగా పనిచేశారా?లేక నిష్పక్షపాతంగా పనిచేశారా అన్నది పవన్ చెప్పకనే చెప్పారనుకోవచ్చు. చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లు రాజకీయ నేతలు కనుక, ఈనాడు మీడియాతో తమ రాజకీయ అవసరాలు తీర్చుకోవాలి కనుక అలా మాట్లాడారులే అని సరిపెట్టుకోవచ్చు. కాని కీరవాణి చేసిన రాజకీయ విమర్శ అర్ధరహితంగా ఉందని చెప్పవచ్చు.సంస్మరణ సభ కనుక రామోజీ గురించి నాలుగు మంచి మాటలు చెప్పడం తప్పు కాదు. ఆయనను బాగా పొగడడం అభ్యంతరం కాదు. కాని అంతటితో ఆయన ఆగలేదు. రామోజీ ఏపీని ఎంతో ప్రేమిస్తారట.అలాంటి ఏపీ కబంధ హస్తాల నుంచి బయటపడిన తర్వాతే నిష్క్రమించారని ఆయన తెలిపారు . ఇది దుర్మార్గమైన కామెంట్. రామోజీ నిజంగానే ఏపీని ప్రేమించి ఉంటే అదెలాగో చెప్పి ఉండాల్సింది.ఏపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో కబంద హస్తాలలో ఉండి ఉంటే ఏ రకంగానో వివరించాలి కదా! పేదల కోసం జగన్ ప్రభుత్వం పనిచేస్తే అది కబంద హస్తం అవుతుందా?ప్రభుత్వ స్కూళ్లను ,ఆస్పత్రులను బాగు చేయడం, ప్రజల ఇళ్లవద్దకే పాలనను తీసుకు వెళ్లడం, వృద్దుల ఇళ్లవద్దే పెన్షన్ లు అందచేయడం, చెప్పిన హామీలు చెప్పినట్లు నెరవేర్చడం, కిడ్నీ బాదితుల కోసం ఉద్దానంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఆస్పత్రి, పరిశోధన కేంద్రం ఒక భారీ రక్షిత నీటి పధకం తీసుకు వస్తే అది కబంధ హస్తమా!రాజకీయాలలో గెలుపు,ఓటములు ఉంటాయి.ఇందుకు చాలా కారణాలు ఉంటాయి. ఆ మాటకు వస్తే కీరవాణి అభిమానించే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కూడా మూడుసార్లు ఓడిపోయింది. అప్పుడు కూడా ఏపీ కబంద హస్తం నుంచి బయటపడినట్లు అవుతుందా!చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో మద్యం ధరలు తగ్గిస్తానని ,నాణ్యమైన మద్యం సరఫరా చేస్తానని వాగ్దానం చేశారు.అది ఏపీ ప్రజలకు ఇచ్చిన అభయహస్తమని కీరవాణి భావిస్తున్నారా!జగన్ అమలు చేసిన వాగ్దానాలకన్నా మూడు రెట్లు అధికంగా ప్రజలకు డబ్బు పంచుతానని టిడిపి మానిఫెస్టోలో ప్రకటించింది.అప్పుడు అది కబంధ హస్తం అవుతుందా?లేక అభయహస్తం అవుతుందా?మద్యం ధర తగ్గించి, సినిమా టిక్కెట్ల రేట్లను పెంచి ప్రజలను దోపిడీ చేయడానికి బడా సినిమా నిర్మాతలకు అవకాశం ఇవ్వడం ఏపీకి అభయహస్తం ఇచ్చినట్లవుతుందని కీరవాణి అనుకుంటుండవచ్చు. ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ది చేయడం, కనీసం ముప్పైశాతం షూటింగ్‌లు చేయాలని జగన్ కోరితే అది కబంద హస్తం అన్నమాట.రామోజీకి నిజంగానే ఏపీపై అంత ప్రేమ ఉంటే ఫిలిం సిటీ వంటివాటిని ఏపీలో ఎందుకు పెట్టలేకపోయారు! ఆ రాష్ట్రంలో గత పదేళ్లలో ఆయన పెట్టిన సంస్థలు ఏమి ఉన్నాయి?పోనీ అంతకుముందు అయినా ఏపీ ప్రజల కోసం ఆయన చేసిన సేవ ఏమిటి?తుపాను వంటివి వచ్చినప్పుడు విరాళాలు సేకరించి కొన్నిచోట్ల ఒక వంద ఇళ్లు నిర్మించి ఉండవచ్చు. అది తప్ప మిగిలినదంతా ఆయన చేసింది వ్యాపారమే కదా!అంతవరకు ఆయన గొప్పవాడే అని చెప్పండి. కాని ఏపీని ఆయనే ఉద్దరించినట్లు కలరింగ్ ఇవ్వడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది.మార్గదర్శి సంస్థల ద్వారా సేకరించిన డబ్బు తీసుకువెళ్లి తెలంగాణలో రామోజీ ఫిలింసిటీని, టీవీ కార్యాలయాలను నెలకొల్పారు కాని, ఏపీలో ఏమైనా పెట్టుబడి పెట్టారా!ఈనాడు మీడియా ద్వారా అబద్దాల ప్యాక్టరీని పెట్టి నిత్యం తనకు గిట్టని వారిపై విషం చిమ్మడం విలువలకు ప్రాధాన్యం ఇచ్చినట్లా!సినిమా రంగానికి చెందిన దాసరి నారాయణరావు పేరు కూడా లేకుండా ఆయన సినిమాలను టీవీలలో చూపించడం గొప్ప విషయమా?రామోజీ ఒక వ్యక్తిగా,తన వ్యాపార రంగంలో అభివృద్ది చెందారు.దానిని ఎవరు కాదనరు.కాని దాంతోనే ఏపీ సమాజం అంతటికి ఆయనే ఆదర్శమన్నట్లు చిత్రీకరించడం కరెక్టు కాదు.ఏపీ సమాజానికి ఆయన ఏమి ఇచ్చారో కాని,ఆ సమాజం నుంచి ఆయన చాలా పొందారు. ఎంత మేలు చేశారోకాని, హానీ మాత్రం బాగా ఎక్కువగానే చేశారు. మీడియా లేకుండా కేవలం ఇతర వ్యాపారాలకే రామోజీ పరిమితం అయి ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వపరంగా ఇంత భారీ సభ నడిపేవారా?కీరవాణి ఇంతగా పొగిడేవారా!ఏపీలో తొలితరం పారిశ్రామికవేత్తలుగా పేరొందిన హరిశ్చంద్రప్రసాద్ వంటివారికి గాని, దేశంలోనే అత్యున్నత స్థానాలకు చేరిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధాని పివి నరసింహారావు ,ఉమ్మడి ఏపీకి చెందిన పలువురు మాజీ ముఖ్యమంత్రులకు కాని ఇవ్వనంతగా గౌరవం ఇచ్చారంటే కేవలం మీడియా ద్వారా ప్రభావితం చేయడం కాదా! తెలుగుదేశం పార్టీకి, అందులోను చంద్రబాబు నాయుడుకు బాజాలు కొట్టినందుకు కాదా! కీరవాణి వంటి వారికి సినిమా వ్యాపారంలో రామోజీ అవకాశాలు ఇచ్చి ఉండవచ్చు.అంతవరకు అభినందించడం, కృతజ్ఞతలు చెప్పడం మంచిదే.అలాకాకుండా జగన్ ప్రభుత్వంపై పిచ్చి వ్యాఖ్యలు చేయడం ద్వారా కీరవాణి కులగజ్జితోనే మాట్లాడుతున్నారని రుజువు చేసుకున్నట్లు కాదా!ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీతి,నిజాయితీల కోసం రామోజీ బతికారని చెప్పారు. మార్గదర్శిపై ఎన్నో కేసులు పెట్టారని ,ఎన్నో రకాలు గా హింసించారని ఆయన అన్నారు. రామోజీ తన పత్రిక, టీవి ద్వారా చాలామందిని అంతకన్నా ఎక్కువగా హింసించారు. అవన్ని ఎందుకు! మార్గదర్శి ద్వారా డిపాజిట్లు వసూలు చేయవచ్చా?అందులో నల్లధనం పెద్ద ఎత్తున ఉందని వచ్చిన అభియోగాలపై ఎందుకు రామోజీ తన జీవిత కాలంలో వివరణ ఇవ్వలేకపోయారు?రామోజీరావు ,ఎన్.టి.ఆర్.లను సమానం చేసే విదంగా చంద్రబాబు మాట్లాడడం ద్వారా తనకు రాజగురువుపై ఉన్న భక్తిని తేటతెల్లం చేశారని అనుకోవచ్చు.అంతవరకుతప్పుపట్టనవసరం లేదేమో! చంద్రబాబు ఒక ఆసక్తికర విషయం తెలియచేశారు.' కొన్ని పత్రికలలో ఇతర పార్టీల వార్తలు రాయరని, కాని రామోజీ మాత్రం ప్రతి పార్టీ,నాయయకుడికి వారి సంఖ్యా బలాన్ని బట్టి ,ప్రజాస్వామ్య విలువలకు గౌరవం ఇస్తారని, కవరేజీలో ఎక్కడ తప్పు చేయరు అని అన్నారు. తన అభిప్రాయాలను ఎడిటోరియల్ పేజీలో చెబుతారని" కూడా పేర్కొన్నారు.నిజంగానే ఇలా జరిగిందా అని చూస్తే నేతిబీరకాయలో నెయ్యి చందమే అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంఖ్యాబలాన్ని బట్టి వార్తలు ఇవ్వాలనే వారు. టిడిపి ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అవేమీ పాటించలేదు.గత ఐదేళ్లలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి 151 సీట్లు ఉంటే, విపక్ష టిడిపికి 23 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఒకసారి ఈ కాలంలో ఈనాడు మీడియా ఇచ్చిన కవరేజీని గమనిస్తే చంద్రబాబు ఈ విసయంలో కూడా అసత్యాలు చెప్పారని అర్దం అవుతుంది. టిడిపి కి డెబ్బైఐదుశాతం వార్తల కవరేజీ ఇస్తే,వైఎస్సార్సీపీకి పాతిక శాతం కూడా ఇవ్వలేదు.వైఎస్సార్సీపీ వ్యతిరేక వార్తలు మాత్రం డెబ్బై ఐదు శాతం ఇచ్చారు.అంతేకాదు.గత ఐదేళ్లు వార్తలకు,సంపాదకీయాలకు తేడా లేకుండా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని కధనాలను,పచ్చి అబద్దాలను మొదటిపేజీలో ఇచ్చారో అందరికి తెలుసు. రామోజీరావు అంటే నాకు గౌరవమే.ఆయన వద్ద పనిచేసిన అభిమానం ఉంటుంది.కాని ఆయన చెప్పిన సూత్రాల ప్రకారమే ఇప్పుడు వాస్తవాలు చెప్పవలసి వస్తోంది.చివరిగా ఒక మాట.కీరవాణి తన ప్రసంగంలో రామోజీరావును భీష్ముడితో పోల్చారు. అంటే భీష్ముడు మాదిరి కౌరవుల తరపునే రామోజీ యుద్దం చేశారని చెప్పినట్లే కదా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
KSR Comment: శృతిమించిన కీరవాణి.. రామోజీ నిజస్వరూపం బయటపెట్టిన పవన్
-
ఇది సరైన సందేశమేనా?
‘మరణం నా చివరి చరణం కాదు’ అంటాడు విప్లవ కవి అలిశెట్టి ప్రభాకర్. నిజమే, ప్రభావశీలమైన వ్యక్తులు మరణానంతరం కూడా జీవించే ఉంటారు. వారి ప్రభావ స్థాయిని బట్టి సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాల పర్యంతం కూడా. ప్రభావశీలతలో పాజిటివ్ కోణం ఒక్కటే చూడాలా? నెగెటివ్ ప్రభావానికి కూడా ఈ సూత్రం వర్తిస్తుందా? మానవ చరిత్రపై అడాల్ఫ్ హిట్లర్ చేసిన రక్తాక్షర సంతకం కూడా తక్కువ ప్రభావాన్ని చూపలేదు కదా! అతడు కూడా మనకు ప్రాతఃస్మరణీయుడవుతాడా?నిజానికి ఇందులో సమస్య ఏమీ లేదు. సందేహాతీతమైన సదాచారాలు మనకు ఉన్నాయి. సమాజం మేలు కోరిన వారు, ప్రజల మంచి కోసం పోరాడినవారు, మంచితనాన్ని పెంచినవారిని స్మరించుకునే సంప్రదాయం మనకున్నది. స్మారకాలు నిర్మించుకునే అలవాటు కూడా ఉన్నది. వారి జీవితాల్లోంచి సమాజం పాఠాలు నేర్చుకోవాలనే కాంక్షతో వారినలా తమ జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలబెట్టుకుంటారు. చెడుమార్గంలో పయనించి ప్రభావం కలిగించిన వారిని... అధ్యయనం కోసం మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కించాలి. వారికి మరణమే చివరి చరణం కావాలి. ఆ ప్రభావం ఆదర్శం కాకూడదు.కానీ, దురదృష్టవశాత్తు మారుతున్న కాలం వింత పోకడలు పోతున్నది. అభివృద్ధికి అర్థం మారుతున్నది. విజయ గాథలకు కొత్త నిర్వచనాలు చేరుతున్నాయి. గొప్పతనం అనే మాటకు తాత్పర్యం మారింది. ఎవరు బాగా సంపాదిస్తారో వారే మహానుభావులు అనే భావన బలపడుతున్నది. వారు ఏ మార్గంలో సంపాదించారన్న పట్టింపేమీ కనిపించడం లేదు. గమ్యం మాత్రమే కాదు, గమ్యాన్ని చేరే మార్గం కూడా పవిత్రంగా ఉండాలన్న గాంధీ బోధనను ఒక చాదస్తం కింద జమకట్టవలసిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. గాడ్సే వారసులకు గౌరవ మర్యాదలు లభిస్తున్న కాలంలోకి ప్రవేశించాము కదా!పారిశ్రామికాభివృద్ధిలో జాతి ప్రగతిని దర్శించిన జేఆర్డీ టాటా వంటి ఉన్నతస్థాయి పారిశ్రామికవేత్తలు కూడా మనకు ఉన్నారు. అటువంటి వారు చనిపోయినప్పుడు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకొని అధికారిక సంస్మరణ సభలు నిర్వహించినట్టు గుర్తు లేదు. అటువంటి అదృష్టం మన తెలుగువాడైన చెరుకూరి రామోజీరావుకు దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఈనాడు’కున్నంత పేరు ఆయనకూ ఉన్నది. బాగా సంపాదించారు. చిట్‌ఫండ్స్‌తో ప్రారంభమై మీడియాకు విస్తరించారు. మీడియా దన్నుతో సాటి చిట్‌ఫండ్ కంపెనీలను చావబాది, వాటిని దివాళా తీయించారు. ఫలితంగా ఆయన ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్’ దినదిన ప్రవర్ధమానమైంది.చిట్‌ఫండ్స్‌కు తోడుగా ‘ఫైనాన్షియర్స్’ పేరుతో మరో జంట కంపెనీ తెరిచారు. రెండు చేతులా ప్రజాధనాన్ని స్వీకరించారు. మీడియాను విస్తరింపజేశారు. ఫిలిం సిటీ పేరుతో ఓ మాహిష్మతీ రాజ్యాన్ని స్థాపించేశారు. ఈలోగా మీడియాను వాడుకొని ప్రభుత్వాలను మార్చారు. ‘పత్రికొక్కటి ఉన్న పదివేల సైన్యంబు’ అన్నారు నార్ల వెంకటేశ్వరరావు. ఆ వాక్యాన్ని చెరుకూరి వారు వ్యాపారపరంగా ఆలోచించారు. పదివేల సైన్యంబును ప్రయోగిస్తూ వచ్చారు. మొదట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పదివేల సైన్యం పొగబాంబులు పేల్చింది. ఫలితంగా ఎన్టీ రామారావు గద్దెనెక్కారు. రామోజీరావు వ్యాపారపు అడుగులకు మడుగులొత్తడానికి రామారావు నిరాకరించారు. క్రుద్ధుడైన రామోజీ వృద్ధుడైన రామారావుపైకి తన పదివేల సైన్యాన్ని అదిలించారు. ఎన్టీఆర్ గద్దె దిగి చంద్రబాబు గద్దెనెక్కారు. మనోవేదనతో ఐదు మాసాల్లోపే ఎన్టీఆర్ చనిపోయారు. రామోజీరావు పట్ల కృతజ్ఞతాపూర్వకంగా చంద్రబాబు ఆయనకు శుక్రాచార్యులవారి హోదా కల్పించారు.పత్రికా రచన రంగానికి సంబంధించి రామోజీకి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించాయి. ‘ఈనాడు’ ఎడిటర్ హోదాతో ఆయన ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. కానీ ఆయన వృత్తిపరంగా జర్నలిస్టు కాదు. నాన్ జర్నలిస్ట్ ఎడిటర్‌గా ఆయన పలు రికార్డుల్ని బద్దలు కొట్టారు. ఏకవాక్య రచన కూడా లేకుండా ఏకబిగిన దశాబ్దాల తరబడి ప్రధాన సంపాదకుడిగా కొనసాగిన ఘనతను ఆయన్నుంచి ఎవరూ లాక్కోలేరు. 1974లో విశాఖపట్నం నుంచి ‘ఈనాడు’ పత్రిక ప్రారంభమయ్యే నాటికి అప్పటికే ఉన్న రెండు పెద్ద పత్రికలు పాత మూసలోనే మునకేసి ఉన్నాయి. ఈ స్థితిలో కొంత ఆధునికతను జోడిస్తూ, ప్రజల అవసరాలను గమనిస్తూ, వారికి అర్థమయ్యే సరళమైన భాషను వినియోగిస్తూ ‘ఈనాడు’ ముందుకొచ్చింది. ఈ మార్పులకు మూల పురుషుడు ‘ఈనాడు’ తొలి ఎడిటర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ ఉరఫ్ ఏబీకే ప్రసాద్ అనే తెలుగుజాతి అగ్రశ్రేణి పాత్రికేయుడు.‘ఈనాడు’ హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైన కొద్ది కాలానికే ఏబీకే ప్రసాద్‌ను బయటకు పంపించారన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తర్వాత కాలంలో రామోజీరావే స్వయంగా ప్రధాన సంపాదకులయ్యారు. ఏబీకే నెలకొల్పిన పత్రికా ప్రమాణాల స్థానాన్ని క్రమంగా రామోజీ వ్యాపార సూత్రాలు ఆక్రమించాయి. ఈ వ్యాపార సూత్రాలు కూడా పత్రిక విస్తృతిలో వాటి పాత్రను పోషించాయి. ఆ రోజుల్లో ‘స్కైలాబ్’ పేరుతో అమెరికా నెలకొల్పిన ఒక అంతరిక్ష కేంద్రానికి ఆయుష్షు మూడింది. అది ముక్కచెక్కలై భూమ్మీద పడిపోయే సందర్భాన్ని ‘ఈనాడు’ వినియోగించుకున్నది. అది రేపోమాపో పడిపోనున్నదనీ, దాంతో భూమి బద్దలైపోతుందని, ఇవే మనకు చివరి రోజులనీ ఊరూరా ప్రచారం జరగడంలో ‘ఈనాడు’ గొప్ప పాత్రనే పోషించింది. ఆ విధంగా గ్రామీణ ప్రజల్లోకి కూడా చొచ్చుకొనిపోగలిగింది.పత్రికకు ఉండవలసిన నిష్పాక్షికత అనే లక్షణాన్ని ఈ యాభయ్యేళ్ల ప్రయాణంలో మొదటి ఐదారేళ్లు ‘ఈనాడు’ పాటించిందేమో! ఎనభయ్యో దశకం ప్రారంభంలోనే నిష్పాక్షికతకు నిప్పు పెట్టేసింది. గడిచిన నాలుగున్నర దశాబ్దాలుగా దాని పాత్రికేయమంతా ఏకపక్షా రచనా వ్యాసంగమే! నాణేనికి ఉండే రెండో కోణాన్ని తెలుగు ప్రజలు చూడకుండా ‘ఈనాడు’ దాచిపెట్టింది. పోటీగా మరో పత్రిక ఎదగకుండా దాని ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే రామోజీ ఎత్తుగడలన్నీ తెలుగు ప్రజల అనుభవంలో ఉన్నవే. ‘ఉదయం’ పత్రిక అకాల అస్తమయానికి ఈ ఎత్తుగడలే కారణం. ‘వార్త’ను నిర్వీర్యం చేయడానికి కూడా అది ప్రయత్నాలు చేసింది. ఒక్క ‘సాక్షి’ ముందు మాత్రం దాని మంత్రాంగం పారలేదు. ఫలితంగా గత పదహారేళ్లుగా తెలుగు ప్రజలకు వార్తాంశాల రెండో కోణం ఆవిష్కృతమైంది. దశాబ్దాల తరబడి తెలుగు ప్రజలకు నిష్పాక్షిక సమాచార హక్కును దక్కకుండా చేసినందుకుగాను ఆయన్ను అక్షర సూర్యుడుగా భృత్య మీడియా బహువిధాలుగా శ్లాఘించింది. ప్రభుత్వం వారి సంస్మరణ సభలో వక్తలందరూ నోరారా కొనియాడారు.ఇక రామోజీరావు తన వ్యాపార సామ్రాజ్య స్థాపనలో అనుసరించిన పద్ధతులూ, నియమోల్లంఘనలూ, చట్టవిరుద్ధ వ్యవహారాలూ ఆమోదయోగ్యమైనవేనా? భవిష్యత్తు తరాల వారికి వాటిని బోధించవచ్చునా? ఈ అంశాలపై విస్తృతమైన చర్చ జరగవలసి ఉన్నది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుతో ఆయన చేసిన డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమైనదని స్వయంగా ఆర్బీఐ ప్రకటించింది. ఆయన కూడా అది తప్పేనని ఒప్పుకున్నందువల్లనే ఆ సంస్థను మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ఎవరెవరి దగ్గర డిపాజిట్లు వసూలు చేశారో, ఎవరెవరికి తిరిగి చెల్లించారో తెలియజేస్తూ ఒక జాబితాను సమర్పించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం ఆదేశాన్ని ఆయన పాటించలేదు.కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. చిట్‌ఫండ్ సంస్థలు డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. కానీ మార్గదర్శి ఆ చట్టాన్ని ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించింది. ఆ డిపాజిట్లను నిబంధనలకు విరుద్ధంగా షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్‌లో, తమ సొంత కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టింది. లేని చందాదారులను ఉన్నట్టుగా చూపిస్తూ ఘోస్ట్ చిట్టీలు నడుపుతూ మనీలాండరింగ్ నేరానికి పాల్పడినట్టు ఇటీవల జరిగిన సోదాల్లో బయటపడింది. కేంద్ర దర్యాపు సంస్థలు జోక్యం చేసుకోవలసిన పరిణామాలివి.ఇక రామోజీ ఫిలింసిటీ ఒక అక్రమాల పుట్ట. ఇక్కడ జరిగిన నియమోల్లంఘనలు నూటొక్క రకాలు. ఇందులో ప్రభుత్వ భూముల ఆక్రమణ ఉన్నది. పప్పుబెల్లాలు పంచి అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన నేరం ఉన్నది. తరతరాల నాటి రహదారులనే కబ్జా చేసి కాంపౌండ్ వాల్ చుట్టుకున్న దాదాగిరి ఉన్నది. మాతృభూమిలో వైద్యసేవలు చేయడానికి వచ్చిన ఒక ఎన్ఆర్ఐ డాక్టర్‌ను బెదిరించి 200 ఎకరాల భూమిని కారుచౌకగా కొట్టేసిన దాష్టీకం ఉన్నది. భూపరిమితి చట్టాన్ని వెంట్రుక సమానంగా జమకట్టిన లెక్కలేని తెంపరితనం ఈ ఫిలింసిటీ కథలో దాగున్నది.ఎటువంటి అనుమతుల్లేకుండా ఫిలిం సిటీలో నిర్మించిన 147 భవనాలు హెచ్ఎమ్డీఏ అధికారాన్ని తొడగొట్టి సవాల్ చేస్తున్నాయి. చెరువులను చెరపట్టి వాటిలోకి ప్రవాహాలను మోసుకెళ్లే కాల్వలను రహదారులుగా మార్చుకున్న ఫిలింసిటీ రుబాబు ముంగిట... ‘వాల్టా’ చట్టం చేతులు ముడుచుకొని సిగ్గుతో తలవంచి నిలబడింది. రామోజీ వ్యాపార సామ్రాజ్య విస్తరణ వెనుక ఇంత తతంగం ఉన్నది. ఇది రేఖామాత్రపు ప్రస్తావన మాత్రమే! ఈ ‘సక్సెస్’ స్టోరీ రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదేనా? రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరపడం సమర్థనీయమేనా? అమరావతిలో శిలా విగ్రహం, ఒక రహదారికి పేరు, స్మారక ఘాట్ల స్థాపన ఎటువంటి స్ఫూర్తిని ఉద్దీపింపజేస్తాయి. ‘భారతరత్న’ బిరుదాన్ని ఆయనకు సంపాదించిపెడతామని ముఖ్యమంత్రి చేసిన వాగ్దానం సరైన సందేశాన్నే సమాజంలోకి పంపిస్తుందా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
KSR Live Show: కిరవాణి కులగజ్జి ?.. రామోజీ కోసం ఎన్టీఆర్ ని అవమానిస్తారా ?
-
ఏపీ ప్రజల సొమ్ముతో రామోజీ రావు సంస్మరణ సభ
-
రామోజీ బ్రతికుండగానే సమాధి కట్టుకున్నాడు.. ఎందుకంటే ?
-
Big Question: దుర్మార్గదర్శికి కాంస్య విగ్రహం