building
-
Uttar Pradesh: భవనంలో అగ్ని ప్రమాదం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
నోయిడా: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అగ్ని ప్రమాదాలు(Fire hazards) చోటుచేసుకుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గల సెక్టార్ 18లోని ఒక భవనంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అగ్ని కీలల నుంచి తప్పించుకునేందుకు కొందరు భవనంపై నుంచి దూకడాన్ని మనం వీడియోలో చూడవచ్చు नोएडा के सेक्टर 18 स्थित बिल्डिंग में आग लग गई। देखिए लोग कैसे कूदकर अपनी जान बचा रहे हैं: @NavbharatTimes pic.twitter.com/2I4LC0IVgF— NBT Uttar Pradesh (@UPNBT) April 1, 2025మీడియాకు అందిన వివరాల ప్రకారం అట్టా మార్కెట్(Atta Market)లోని ఒక వాణిజ్య భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటల నుంచి తప్పించుకునేందుకు భవనంలోని వారు తొలుత భవనం పైభాగానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సెక్టార్ 18లోని కృష్ణ అపరా ప్లాజాలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నదీ ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. తొలుత భవనం బేస్మెంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి అగ్ని జ్వాలలు మొదటి అంతస్తుకు, తరువాత రెండవ అంతస్తుకు చేరుకున్నాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఉన్న అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇది కూడా చదవండి: Rajasthan: లీకయిన విషవాయువు.. ఒకరు మృతి.. 40 మందికి అస్వస్థత -
భవనంపై నుంచి దూకి నవ వధువు ఆత్మహత్య
ముషీరాబాద్: భర్త, అత్తింటి వేధింపులు తాళలేక ఓ నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్‌పూర్‌లో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భోలక్‌పూర్‌కు చెందిన సౌజన్యకు మూసాపేటకు చెందిన జిమ్ నిర్వాకుడు శబరీష్ యాదవ్‌తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.అయితే, సౌజన్యకు గుండెలో రంధ్రం ఉందని, చెప్పకుండా పెళ్లి చేశారని ఆమె భర్త, అతడి కుటుంబ సభ్యులు సౌజన్యను తరచూ వేధిస్తున్నారు. ఈ విషయం దాచినందుకు అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు. పలుమార్లు ఆమెను పుట్టింటికి పంపారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి అత్తింటికి వెళ్లిన సౌజన్యను తమ ఇంటికి రావొద్దంటూ అక్కడినుంచి వెల్లగొట్టారు.దీంతో మనస్తాపం చెందిన సౌజన్య పుట్టింటికి వచ్చి మూడంతస్తుల భవనం పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికి మృతి చెందినట్లు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి పుష్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Bhadrachalam: బిల్డింగ్ కూలి పలువురి మృతి
-
భద్రాచలంలో విషాదం.. బిల్డింగ్ కూలి పలువురి మృతి
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కూలి ఆరుగురు మృతిచెందారు. ఆరంతస్తుల భవనం కూప్పకూలింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. క్రేన్లు, పొక్లెయిన్లతో శిథిలాలను తొలగిస్తున్నారు. పాత భవనంపైనే మరో నాలుగు అంతస్తులు నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. నిర్మాణంలో లోపాల వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి.. భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది.పట్టణంలోని రామాలయ పరిసర ప్రాంతంలోని సూపర్ బజార్ సెంటర్లో ఈ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ ఈ భవనాన్ని నాసిరకమైన పిల్లర్లతో నిర్మాణం చేపట్టారని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఐటీడీపీవో రాహుల్ ఈ భవనాన్ని కూల్చివేయమని పంచాయతీ శాఖకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. అయినప్పటికీ ప్రాజెక్టు అధికారి ఆదేశాలను నిర్లక్ష్యం చేయడంతోనే ఈ ప్రమాదం జరిగి పలువురు మరణానికి కారణమైందని పలువురు చెబుతున్నారు.సామాజిక కార్యకర్తలపై ఇంటి యజమాని బెదిరింపులకు దిగారనే ఆరోపణలున్నాయి. పట్టణంలోని పలు భవన నిర్మాణాలు ఇలాగే నిబంధన విరుద్ధంగా జరుగుతున్నాయని ఎవరు ఫిర్యాదు చేసిన సంబంధించిన శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదానికి పూర్తిగా పంచాయతీ శాఖ బాధ్యత వహించాలని పలువురు అంటున్నారు. -
కోకాపేట జీఏఆర్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరగలేదు: ఏసీపీ
సాక్షి, హైదరాబాద్: కోకాపేట జీఏఆర్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరగలేదని నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు. బిల్డింగ్‌లో రెస్టారెంట్ పనులు జరుగుతున్నాయని.. గ్యాస్ లీక్ అయ్యిందని తెలిపారు. దీంతో గ్యాస్ పీల్చి కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారన్నారు. వారిని వారిని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి నార్సింగి పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలికి చేరుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కాగా, మొదట కోకాపేట జీఏఆర్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనలో పలువురు ఐటీ ఉద్యోగులు గాయపడ్డారంటూ ప్రచారం జరిగింది. కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. బిల్డింగ్‌లో ఉన్న రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి. -
ఆ మహానగరంలో 11 అంతస్థుల రైల్వే స్టేషన్
ముంబై: భారతీయుల కలల నగరం ముంబై(Mumbai) త్వరలో మరో ఖ్యాతిని కూడా దక్కించుకోబోతోంది. ముంబైలోని థానేలో 11 అంతస్థుల రైల్వే స్టేషన్ నిర్మితం కానుంది. ఈ రైల్వే స్టేషన్లో కేవలం రైళ్ల రాకపోకలే కాకుండా ప్రయాణికులకు వినోదాన్ని అందించే పలు వేదికలు కూడా సిద్ధం కానున్నాయి. ఈ రైల్వే స్టేషన్ పైభాగంలో అద్భుతమైన మాల్, ఆఫీస్ స్పేస్, రిటైల్ షాపులు కూడా ఉండనున్నాయి. ఈ ప్రాజక్టు పూర్తయితే రైల్వేశాఖకు భారీగా ఆదాయం సమకూరనుంది.థానే రైల్వే స్టేషన్(Thane Railway Station)లోని 10ఏ ప్లాట్ఫారంలో తొమ్మిది వేల చదరపు మీటర్ల ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టుకు కేటాయించనున్నారు. దీనితోపాటు 24,280 చదరవు మీటర్ల ప్రాంతాన్ని లీజుకు తీసుకోనున్నారు. ఈ లీజు 60 ఏళ్ల పాటు కొనసాగనుంది. ఈ ప్రాజెక్టును 2026, జూన్ 30 నాటికి పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రైల్వే స్టేషన్‌కు బస్సులు, మెట్రో సేవలను అనుసంధానించనున్నారు.రైల్వే స్టేషన్ బేస్మెంట్(Basement)లో పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఇక్కడి నుంచే లోకల్ బస్సులు ఎక్కే అవకాశం కల్పించనున్నారు. పైఫ్లోర్‌లో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. ఇక్కడ ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ల ఏర్పాటుకు కూడా అనుమతి ఇవ్వనున్నారు. ఇది కూడా చదవండి: Holi 2025: ఈ దేశాల్లోనూ అంబరాన్నంటే హోలీ వేడుకలు -
హైరైజ్బాద్..
సాక్షి, హైదరాబాద్: ఆకాశహర్మ్యాలతో అంతర్జాతీయ నగరంగా విలసిల్లుతున్న హైదరాబాద్‌లో మరో భారీ ఆకాశసౌధం ఆవిష్కృతం కానుంది. దక్షిణ భారతదేశంలోనే అత్యధిక అంతస్తులు కలిగిన భవనాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన సింక్ అనే సంస్థ 61 అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.సుమారు 7.19 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. 5 టవర్లలో అన్నీ 4 పడకగదులు ఉన్న ఫ్లాట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఒక్కో ఫ్లాట్ 3,600 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంటుంది. ‘వాక్ టు వర్క్’ కాన్సెప్ట్ తరహాలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. దక్షిణాదిలో ఇప్పటివరకు 59 అంతస్తుల నిర్మాణమే (క్యాండియర్ స్కైలైన్) పెద్దది కాగా.. ఇప్పుడు 61 అంతస్తుల అత్యంత ఎత్తయిన టవర్ హైదరాబాద్‌లో రానుండటం విశేషం. -
Delhi: చుట్టుముట్టిన అగ్ని కీలలు.. రెండో అంతస్థు నుంచి దూకి..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని నాంగ్లోయీలోని ఒక భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నికీలలు భవన్నాన్నంతటినీ చుట్టుముట్టాయి. మంగళవారం పొద్దుపోయాక ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భవనంలో ఉంటున్నవారంతా భయాందోళనలకు లోనయ్యారు. అయితే వారంతా అప్రమత్తమై, తమ బాల్కనీలలోనికి చేరుకుని ఒక్కొక్కరుగా రెండో అంతస్థు నుంచి దూకారు. ఈ నేపధ్యంలో వారంతా గాయాలపాలయ్యారు. బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి కారణమేమిటన్నది ఇంకా వెల్లడి కాలేదు. देखिए एक घर में लगी भयंकर आग,एक शख़्स दूसरी मंज़िल से कूद पड़ा आग लगने की घटना दिल्ली नांगलोई फोन मार्किट कल देर रात की है , जिसका वीडियो सामने आया है बताया जा रहा है गैस लीक होने की वजह से एक घर की पहली मंजिल पर आग लग गई थी,दूसरी मंज़िल पर से एक व्यक्ति ने छलांग लगा दी जो घायल… pic.twitter.com/MvwtDgwzua— Lavely Bakshi (@lavelybakshi) February 18, 2025ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో భవనంలో ఎగసిపడుతున్న మంటలను, బాల్కనీలో నుంచి దూకుతున్నవారిని చూడవచ్చు. అలాగే అక్కడే ఉన్న ఫైర్ బ్రిగేడ్ మంటలు ఆపే ప్రయత్నం చేయడాన్ని కూడా గమనించవచ్చు. భవనంలో వ్యాపించిన మంటల నుంచి మొత్తం ఆరుగురు రెండో అంతస్థు నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇది కూడా చదవండి: పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?.. భగవంత్ మాన్ క్లారిటీ -
డొల్ల విలాస్
పైన పటారం, లోన లొటారం అంటే అచ్చం ఇలాగే ఉంటుంది. 1987లో ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ది ర్యుంగ్యాంగ్ హోటల్(The Ryungyang Hotel)’ అత్యంత ఖరీదైన నిర్మాణాల్లో ఒకటి. ‘ది హోటల్ ఆఫ్ డూమ్’( The Hotel of Doom) అని పిలిచే ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు ఆరువందల మిలియన్ల పౌండ్లు (అంటే రూ.6,330 కోట్లు) ఖర్చు చేసింది.తాజాగా, ఈ హోటల్‌కెళ్లిన యూట్యూబర్ కాకెరల్, ‘వెయ్యి అడుగుల ఎత్తు, 105 అంతస్తులతో పిరమిడ్ ఆకారంలో, బయటకు అందంగా కనిపించే ఈ హోటల్ లోపల అంతా డొల్ల్ల. చుట్టూ సిమెంట్ గోడలతో, చేసింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి, అతిథుల కోసం లగ్జరియస్ సదుపాయాలు, మూడువేల గదులతో డిజైన్ చేసిన ఈ హోటల్‌ను ఇప్పటి వరకు తెరవలేదు.వనరుల లోపం కారణంగా మధ్యలోనే ఈ నిర్మాణాన్ని ఆపేశారు. అప్పటి నుంచి కేవలం చూడటానికి మాత్రమే అందంగా కనిపిస్తుంది కాని, ఇప్పటి వరకు ఈ హోటల్ ఒక్క అతిథికి కూడా ఆతిథ్యం ఇవ్వలేదు. ఇంకా నిర్మాణ దశలో ఉన్న హోటల్ ఇలాగే ఉంటుందని కొందరు అంటుంటే, మరికొందరు, కేవలం చూడటానికే ఈ హోటల్‌ను నిర్మించినట్లు ఉన్నారని సెటైర్లు వేస్తున్నారు. -
కేజ్రీవాల్‌కు ‘శీష్‌మహల్’ ఉచ్చు.. విచారణకు సీవీసీ ఆదేశం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్న ఆప్ అదినేత కేజ్రీవాల్ మరో సమస్యలో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటున్న సమయంలో కేజ్రీవాల్ నివసించిన ఢిల్లీలోని ప్రభుత్వ భవనంలో అవినీతికి పాల్పడుతూ, అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ వచ్చిన ఆరోపణలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణకు ఆదేశించింది. అసెంబ్లీలో మాజీ ప్రతిపక్ష నేత, రోహిణి ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశారు.శీష్ మహల్ (సీఎం ప్రభుత్వ బంగ్లాకు బీజేపీ పెట్టిన పేరు)పై విజేంద్ర గుప్తా దాఖలు చేసిన ఫిర్యాదుపై సీవీసీ దర్యాప్తునకు ఆదేశించింది. ఆయన 2024 అక్టోబర్ 14న సీవీసీకి దీనిపై ఫిర్యాదు దాఖలు చేశారు. 40,000 చదరపు గజాల (8 ఎకరాలు) విస్తీర్ణంలో శీష్ మహల్ నిర్మించడానికి కేజ్రీవాల్ భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.దీనిపై 2024, అక్టోబర్ 16న సీవీసీ దర్యాప్తు ప్రారంభించింది. వాస్తవ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని నాడు హామీ ఇచ్చింది. 2025, ఫిబ్రవరి 13న వాస్తవ నివేదికను పరిశీలించిన తర్వాత, ఈ విషయంపై వివరణాత్మక దర్యాప్తు నిర్వహించాలని సంబంధిత ఉన్ననాధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి నివాసం, దాని పునరుద్ధరణ, ఇంటీరియర్ డెకరేషన్ కోసం జరిగిన వృధా ఖర్చుపై దర్యాప్తుకు సంబంధించి సీవీసీకి అధికారికంగా ఫిర్యాదు చేసిన దరిమిలా ఇప్పుడు దీనిపై చర్యలు తీసుకోనున్నారు.ఢిల్లీ మాజీ సీఎం అధికార నివాసానికి దాదాపు రూ. 80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు బీజేపీ నేత విజేందర్ గుప్తా సీవీసీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. శీష్ మహల్‌ని ఆధునీకరిస్తూ, టాయిలెట్లో గోల్డెన్ కమోడ్, స్విమ్మింగ్‌పూల్, మినీ బార్ వంటివి ఏర్పాటు చేసుకున్నారని గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బంగ్లాను ఆధునీకరించడంలో లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని బీజేపీ నేతలు కూడా పలుమార్లు విమర్శించారు.ఇది కూడా చదవండి: రాష్ట్రపతి పాలన తొలిగా ఏ రాష్ట్రంలో ఎందుకు విధించారు? -
సకల హంగులతో ఉస్మానయా
సాక్షి, హైదరాబాద్: కొత్త ఉస్మానియా ఆసుప్రతిని పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు వీలుగా డిజైన్లు సిద్ధం చేశారు. మొత్తం 2 వేల పడకలతో గోషామహల్ స్టేడియంలో ఏర్పాటు కానున్న ఈ ఆసుపత్రి భవనానికి శుక్రవారం ఉదయం 11.45 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే ఇప్పటివరకు శిథిలావస్థకు చేరి తరచూ పెచ్చులూడుతున్న పురాతన భవనంలో చికిత్స పొందుతున్న రోగులకు మెరుగైన వైద్యసేవలు అందేందుకు అవకాశం ఏర్పడుతుంది. మల్టీ లెవల్ పార్కింగ్ మొత్తం 26.30 ఎకరాలకు గాను 15.84 ఎకరాల్లో ‘ఏ’బ్లాకును నిర్మించనున్నారు. అదే విధంగా 7.81 ఎకరాల్లో ‘బీ’బ్లాకు ను నిర్మించనున్నారు. 0.74 ఎకరాల్లో ‘సీ’బ్లాకు, 0.64 ఎకరాల్లో ‘డీ’బ్లాక్, 0.22 ఎకరాల్లో ‘ఈ’బ్లాకును నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మిగిలిన స్థలంలో మిగతా బ్లాకులు నిర్మిస్తారు. ఇన్‌పేషంట్, అవుట్ పేషంట్ సరీ్వసులతో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, పోస్టు ఆపరేటివ్ వార్డులు ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద మల్టీ లెవల్ పార్కింగ్ సౌకర్యంతోపాటు లాండ్ స్కేపింగ్, గార్డెన్లతో ఆసుపత్రిలో ఆహ్లాదకర వాతావరణం నెలకొననుంది. సహాయకులకు ధర్మశాల ఉచిత భోజనం ఓపీ, ఐపీ సేవలతో పాటు క్లిష్టమైన మూత్రపిండాలు, కాలేయం, స్కిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్లు కూడా ఏర్పాటు కానున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మార్చురీ, ఒకే గొడుగు కింద అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా అత్యాధునిక డయాగ్నొస్టిక్స్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఏకకాలంలో 3000–5000 మంది ఒకేచోట కూర్చొనే సామర్థ్యంతో కూడిన వెయిటింగ్ హాల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, దంత వైద్య కళాశాల కూడా ఇదే ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు.మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక వసతి గృహంతో పాటు రోగుల సహాయకులకు ఉచిత భోజనం సరఫరా చేసే ధర్మశాల కూడా ఇక్కడ ఏర్పాటు కానుంది. ఫైర్ స్టేషన్, పోలీసు అవుట్ పోస్టు, ఫ్యాకల్టీ రెసిడెన్సీ సహా బోయ్స్, గరŠల్స్ హాస్టళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త భవన నిర్మాణంతో రోగుల కష్టాలు పూర్తిగా తీరనున్నాయని తెలంగాణ వైద్యుల సంఘం ఉస్మానియా యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు డాక్టర్ బొంగు రమేష్ నేతృత్యంలోని వైద్య బృందం గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపింది.వ్యతిరేకిస్తున్న స్థానికులు!నిజానికి పురాతన భవనం కూల్చాల్సిన అవసరం లేకుండా ప్రస్తుత ప్రాంగణంలోనే మరో కొత్త భవనం నిర్మించేందుకు అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. కులీకుతుబ్‌షా భవనం నుంచి ధోబీఘాట్ వరకు 8 ఎకరాల విస్త్రీర్ణం అందుబాటులో ఉందని, ఇక్కడ రెండు భారీ టవర్లు నిర్మించవచ్చని అంటున్నారు. ఇందుకు భిన్నంగా చుట్టూ ప్లైవుడ్ గోదాములు, ఇరుకైన రోడ్లతో భారీ ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతంలో ఉస్మానియా కొత్త భవనం నిర్మించడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకా శం లేకపోలేదని స్థానికులు చెబుతున్నారు.ఇక్కడ ఆస్పత్రి నిర్మాణాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టుకు ప్రభుత్వం రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 104 ఎకరాలు కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో కోర్టు రాజేంద్రనగర్‌కు తరలి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అప్పుడు మూసీపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించి ఈ రెండు వైపులా ఉన్న ఈ రెండు చారిత్రక భవనాలను అనుసంధానించడం వల్ల డబ్బు కూడా ఆదా అవుతుందని చెబుతున్నారు. -
కేపిటల్ భవనంపై దాడిలో పాల్గొన్న వారికి క్షమాభిక్ష: Donald Trump
-
‘కేపిటల్’ దోషులకు క్షమాభిక్ష
వాషింగ్టన్: 2021 యూఎస్ కేపిటల్ భవనంపై దాడిలో పాల్గొన్న వారికి క్షమాభిక్ష ప్రసాదిస్తానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంకేతాలిచ్చారు. జనవరి 20న బాధ్యతలు స్వీకరించగానే వలసలు, ఇంధనం, ఎకానమీతో పాటు క్షమాభిక్షకు సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల విజయం తరువాత ఎన్‌బీసీతో జరిగిన తొలి మీట్ ది ప్రెస్‌లో ట్రంప్ పలు అంశాలపై మాట్లాడారు. ఉక్రెయిన్‌కు తన హయాంలో ఆశించనంత సాయం అందకపోవచ్చన్నారు. ‘‘అమెరికాలో జని్మంచిన ప్రతి ఒక్కరికీ దేశ పౌరసత్వం పొందడానికి అర్హత కలి్పంచే జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తా. బైడెన్, ఆయన కుటుంబంపై ప్రత్యేక విచారణ కోరబోను. నాపై విచారణ జరిపిన డెమొక్రటిక్ పార్టీ నేతృత్వంలోని ప్రతినిధుల సభ కమిటీ సభ్యులు మాత్రం జైలుకు వెళ్లాల్సిందే’’ అని ట్రంప్ అన్నారు. నాటోతోనే.. కానీ! నాటో నుంచి ఆమెరికా వైదొలిగే విషయమై ట్రంప్ ఆసక్తికరంగా స్పందించారు. మిగతా సభ్య దేశాలు తమ వాటా నిధులను చెల్లిస్తే, నిష్పాక్షింగా వ్యవహరిస్తున్నాయని భావిస్తే నాటోలో కొనసాగుతామని చెప్పారు. అబార్షన్ మాత్రలపై ఆంక్షలు విధించాలని తాను కోరబోనని చెప్పారు.మెక్సికో, కెనడా కూడా అమెరికాలో కలిసి పోతే మేలు!మెక్సికో, కెనడాలకు అమెరికా ఇస్తున్న భారీ రాయితీలను ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘కెనడాకు ఏటా 100 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8,48,700 లక్షల కోట్లు). మెక్సికోకైతే ఏకంగా 300 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,46,100 లక్షల కోట్ల). ఇంతటి రాయితీలివ్వడం అమెరికాకు అవసరమా? అసలు రాయితీలు ఎందుకివ్వాలి? దీనికి బదులు వాటిని పూర్తిగా అమెరికాలో కలుపుకుంటే సరిపోతుంది’’ అని వ్యాఖ్యానించారు. -
భవనంపై నుంచి దూకి ప్రేమికుల ఆత్మహత్య
సాక్షి,విశాఖపట్నం:గాజువాక అక్కిరెడ్డిపాలెంలో ప్రేమికుల ఆత్మహత్య కలకలం రేపింది. మంగళవారం(డిసెంబర్3) తెల్లవారుజామున వెంకటేశ్వర కాలనీలోని అపార్ట్మెంట్ మూడవ అంతస్తు పైనుంచి దూకి యువ జంట ఆత్మహత్య చేసుకుంది.మృతులను పిల్లి దుర్గారావు,సాయి సుష్మితలుగా గుర్తించారు. ఇద్దరూ అమలాపురానికి చెందినవారేనని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ఏం కష్టం వచ్చింది తల్లీ.. -
150 గంటల్లో ఫ్యాక్టరీ భవనం: ఈప్యాక్ ప్రిఫ్యాబ్ ఘనత
భారతదేశంలోని ప్రముఖ ప్రీ-ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) తయారీదారులలో ఒకరైన ఈప్యాక్ ప్రిఫ్యాబ్, కేవలం 150 గంటల సమయంలో ఒక నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన నిర్మాణంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మంబట్టులో పూర్తయిన ఈ ప్రాజెక్ట్.. ఈప్యాక్ ప్రిఫ్యాబ్ నిబద్ధతకు నిదర్శనం.మొత్తం 1,51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ నిర్మాణం పూర్తిగా లేటెస్ట్ ప్రిఫ్యాబ్రికేషన్ అండ్ పీఈబీ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. ఈప్యాక్ ప్రిఫ్యాబ్ వేగవంతమైన పురోగతిని సాధించడానికి ప్రతి దశ నిర్మాణాన్ని నిశితంగా ప్లాన్ చేసింది. ప్రాథమిక నిర్మాణం 48వ గంటకు పూర్తయింది, ఆ తర్వాత 90వ గంటకు రూఫింగ్.. 120వ గంటకు క్లాడింగ్ పూర్తయింది. మొత్తం మీద ఒక నిర్ణీత సమయంలో ఒక నిర్మాణం పూర్తయింది. ఈ విజయం గొప్ప ప్రపంచ రికార్డును నెలకొల్పింది, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది.150 గంటల సమయంలో ఒక నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఈప్యాక్ ప్రిఫ్యాబ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ సింఘానియా మాట్లాడుతూ.. పీఈబీ టెక్నాలజీని ఉపయోగించి భారతదేశంలో అత్యంత వేగవంతమైన నిర్మాణాన్ని పూర్తి చేసిన ఘనత మాకే దక్కుతుంది. పీఈబీ అనేది నిర్మాణం భవిష్యత్తు. పీఈబీ పరిష్కారాలు ఎక్కువ ఆమోదం పొందడంతో పరిశ్రమలో మరిన్ని బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.ఈప్యాక్ ప్రిఫ్యాబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ నిఖెల్ బోత్రా మాట్లాడుతూ.. భారతదేశంలో వేగవంతమైన నిర్మాణం పూర్తవడం సంతోషంగా ఉందన్నారు. గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆసియా హెడ్ మనీష్ విష్ణోయి.. ఈప్యాక్ ప్రిఫ్యాబ్ నిరంతర అన్వేషణను అభినందించారు. -
5 అంతస్థుల భవనం కూల్చేందుకు హైడ్రా రెడీ..
-
ఉద్రిక్తతల నడుమే.. ఒరిగిన బిల్డింగ్ కూల్చివేత ప్రారంభం
హైదరాబాద్, సాక్షి: గచ్చిబౌలి సిద్ధిఖ్ నగర్లో గత రాత్రి ప్రమాదకర స్థాయిలో ఒరిగిపోయిన భవనాన్ని కూల్చివేత ప్రారంభమైంది. బుధవారం ఉదయమే హైడ్రాలిక్ ‘బాహుబలి’క్రేన్‌తో అక్కడికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు.. ఉద్రిక్త వాతావరణంలోనే తమ పనిని ప్రారంభించారు. సదరు భవనం ముందు కేవలం పదిఫీట్ల రోడ్డు మాత్రమే ఉండడంతో.. చుట్టుపక్కల మరే నష్టం జరగకుండా కూల్చివేస్తున్నారు.ఈ ఉదయం ఆ భవనం పక్కన ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు.. బిల్డింగ్ కుంగడానికి ప్రధాన కారణమైన పిల్లర్లను పూడ్చేశారు. డీఆర్ఎఫ్ సిబ్బంది కూల్చివేతలో పాల్గొంటున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఆంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. గుంతలు తవ్విన భవన యాజమానిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇక..ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా గుంతలు తవ్వడం వల్లే పక్కన ఉన్న భవనం కుంగిందని, అలాగే కుంగిన ఆ భవనాన్ని కూడా నిబంధనలకు లోబడి కట్టలేదని, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఒరిగిన బిల్డింగ్ యాజమాని మాత్రం తమ వెర్షన్ వినిపిస్తున్నారు. ‘‘ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తవ్వకాలు చేపట్టారు. సెల్లార్ గుంతలు తవ్వడం వల్లే మా బిల్డింగ్ కుంగిపోయింది. మాకు ఆ ఓనర్‌తో నష్టపరిహారం ఇప్పించాలి’’ అని డిమాండ్ చేస్తున్నారు.వసుకుల లక్ష్మణ్ అనే పేరిట ఈ ప్లాట్ ఉంది. జీప్లస్ ఫోర్లో రెండు పోర్షన్ల చొప్పున నాలుగు ఫ్లోర్లు నిర్మాణం చేశారు. ఆ భవనంలో మొత్తం 48 మంది అద్దెకు ఉంటున్నారు. చుట్టుపక్కల ఐటీ కారిడార్‌లో పని చేసేవాళ్లంతా. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలోనే గోడ కూలినట్లు శబ్దం వచ్చినా.. ఎవరూ పట్టించుకోలేదు. రాత్రి 8.30 గంటల సమయంలో పెద్దగా శబ్దం వచ్చి భవనం ఒరిగిపోతోందని అరుపులు వినిపించడంతో అందరూ భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఆదరాబాదరాగా కిందకు వచ్చేశారు. ఇంతలోనే మూడో అంతస్తులో ఉండే సాదిక్ హుస్సేన్ కిందికి దూకగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. -
తప్పిన పెను ప్రమాదం
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని కార్మికుల నిరసన
-
కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు
బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులోని బాబాసపాల్యా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. మంగళవారం(అక్టోబర్ 22) ఈ ఘటనలో ఒకరు చనిపోగా పలువురు గాయపడ్డారు.పదిహేడు మంది దాకా కార్మికులు భవన శిథిలాల కిందే చిక్కుకుపోయినట్లు సమాచారం. రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు నలుగురిని కాపాడారు. మిగిలిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వల్లే భవనం కూలిపోయినట్లు తెలుస్తోంది.#Karnataka: Incessant rains have caused the collapse of an under-construction multi-storey building in Babasapalya near Hennur in #Bengaluru. Sixteen labourers are reportedly trapped beneath the debris, while one labourer, who sustained injuries, managed to escape after the… pic.twitter.com/cENnfDuO1j— South First (@TheSouthfirst) October 22, 2024 ఇదీ చదవండి: నాగపూర్‌లో పట్టాలు తప్పిన రైలు -
సచివాలయంపై నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్
ముంబై: మహారాష్ట్ర సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్.. సచివాలయంలోని మూడో అంతస్తుపై నుంచి కిందకు దూకేశారు. అయితే ఆయన దూకిన సమయంలో భవనానికి సేఫ్టీ నెట్ ఏర్పాటు చేసి ఉండటంతో వారు అందులో పడిపోయారు. పోలీసులు వెంటనే వారిని రక్షించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు.పెసా చట్టం ప్రకారం ఉద్యోగ నియామకాలను వ్యతిరేకిస్తూ గత 15 రోజులుగా మహారాష్ట్రలో గిరిజన విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. ఎస్టీ కేటగిరీలో ఉన్న ధంగర్ కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలో గిరిజన ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. అయినప్పటికీ ప్రభుత్వం వీరి గోడు పట్టించుకోకపోవడంతో గిరిజన ఎమ్మెల్యేలు, గిరిజన సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ స్పీకర్ విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్, మరికొందరు గిరిజన ఎమ్మెల్యేలు నేరుగా నేడు మంత్రాలయ భవనం వద్దకు చేరుకుని మూడో అంతస్తు నుంచి కొన్ని డాక్యుమెంట్లను గాల్లోకి విసిరేస్తూ దూకేశారు. అయితే భవనానికి నెట్ కట్టి ఉండటంతో ఎవరికీ ఏం కాలేదు.#WATCH | NCP leader Ajit Pawar faction MLA and deputy speaker Narhari Jhirwal jumped from the third floor of Maharashtra's Mantralaya and got stuck on the safety net. Police present at the spot. Details awaited pic.twitter.com/nYoN0E8F16— ANI (@ANI) October 4, 2024 ఈ వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్తో ఇప్పటికే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చర్చలు జరిపారు. ఈ సమస్య పరిష్కారానికి సానుకూలంగానే ఉన్నామని సీఎం చెప్పినప్పటికీ అందుకు తగ్గట్టుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో గిరిజన ప్రజాప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
వీడియో: రష్యాపై విరుచుకుపడుతున్న ఉక్రెయిన్.. 9/11 తరహాలో దాడులు
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా రష్యాలోని సరాటోవ్‌లోని 38 అంతస్తుల అత్యంత ఎత్తయిన భవనం వోల్గా స్కైపైకి ఉక్రెయిన్ డ్రోన్ దూసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భవనంలోని పలు అపార్ట్మెంట్లు దెబ్బతిన్నాయి. వోల్గా స్కై కాంప్లెక్స్ ఎత్తు 128.6 మీటర్లు. ఈ ప్రాంతంలో ఇదే అత్యంత ఎత్తయిన భవనం. డ్రోన్ శిథిలాలు భవనంపై చెల్లాచెదురుగా పడివున్నాయని అధికారులు చెబుతున్నారు. A large drone recently crashed into the 38-story Volga Sky residential complex, the tallest building in Saratov, Russia, causing significant damage and injuring at least two people.#russia #Ukraine pic.twitter.com/iWU96hPpok— Bhoopendra Singh 🇮🇳 (@bhoopendratv007) August 26, 2024ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో డ్రోన్ స్ట్రైక్ కారణంగా వాటి శిథిలాలు కింద చెల్లాచెదురుగా పడ్డాయని ప్రాంతీయ గవర్నర్ రోమన్ బుసార్గిన్ తెలిపారు. ఈ తాజా దాడి రష్యాలో భద్రతాపరమైన ఆందోళనలను లేవనెత్తింది. ఈ ఉదంతానికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ అయిన వీడియోలు డ్రోన్ దాడి కారణంగా ఎంత నష్టం వాటిల్లిందనేది చూపిస్తున్నాయి. 2001, సెప్టెంబరు 11న యునైటెడ్ స్టేట్స్‌లోని ట్విన్ టవర్స్‌పై అల్-ఖైదా వైమానిక దాడులు జరిపింది. వాటిని 9/11 దాడులుగా పేర్కొంటారు.🇺🇦#Ukraine 🇷🇺#Russia #Saratov #Engels #UkraineRussiaWar️️ #UkraineWar #UAV Russian media reports that at least twenty cars were damaged when a drone flew into the 38-story Volga Sky residential complex in the city of Engels in the Saratov region.The attack began at… pic.twitter.com/S9eRX8dbxQ— 🛰️ Wars and news 🍉 (@EUFreeCitizen) August 26, 2024 -
సికింద్రాబాద్‌లో విషాదం.. భవనంపై నుంచి దంపతులు జారిపడి..
సాక్షి, సికింద్రాబాద్: రెజిమెంటల్ బజార్లో విషాద ఘటన చోటుచేసుకుంది. బిల్డింగ్ మీద నుంచి భార్యభర్తలు జారిపడ్డారు. నిర్మాణంలో ఉన్న భవనం రెండో అంతస్తు నుంచి దంపతులు గిరి, లచ్చమ్మ ప్రమాదవశాత్తు పడిపోయారు.ఆసుపత్రి కి తరలిస్తుండగా భర్త గిరి మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న భార్య లచ్చమ్మ గాంధీకి తరలించారు. గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Mumbai: కూలిన భవనం.. శిథిలాల కింద పలువురు?
మహారాష్ట్రలోని నవీ ముంబైలో మూడంతస్తుల భవనం ‘ఇందిరా నివాస్’ కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. షాబాజ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ముంబై పోలీసులు, అగ్నిమాపక శాఖ, మున్సిపాలిటీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. #WATCH नवी मुंबई (महाराष्ट्र): शाहबाज गांव में तीन मंजिला इमारत 'इंदिरा निवास' ढह गई है। कई लोग मलबे में फंसे हुए हैं। मौके पर NDRF, पुलिस, अग्निशमन दल और नगरपालिका के अधिकारी पहुंचे हैं। बचाव कार्य जारी है।अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/oNkccmXiS1— ANI_HindiNews (@AHindinews) July 27, 2024 మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈరోజు (శనివారం) తెల్లవారుజామున 4:35 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. భవనం కూలిపోతుండటాన్ని గ్రహించిన కొందరు బయటకు పరుగుపరుగున వచ్చారు. అయితే కొందరు బయటకు రావడం ఆలస్యం కావడంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని రక్షించి ఆసుపత్రికి తరలించామని నవీ ముంబై మునిసిపల్ కమిషనర్ కైలాష్ షిండే తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపడుతున్నదని, కుప్పకూలిన భవనం పదేళ్ల క్రితం నాటిదని అన్నారు. భవన యజమానిపై చర్యలు తీసుకుంటామని షిండే పేర్కొన్నారు. #WATCH नवी मुंबई (महाराष्ट्र): कैलाश शिंदे (पालिका आयुक्त नवी मुंबई) ने कहा, "करीब आज सुबह 5 बजे के पहले ये इमारत ढह गई। ये जी+3 की इमारत है सेक्टर-19, शाहबाज गांव में है। ये 3 मंजिला इमारत था इमारत से 52 लोग सुरक्षित बाहर निकले और मलबे में फंसे 2 लोगों को बचाया गया है और भी 2… https://t.co/tKmHs4xIWG pic.twitter.com/6ha8X3PtW9— ANI_HindiNews (@AHindinews) July 27, 2024 -
‘ట్రంప్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని చూశా’
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార ర్యాలీలో అతనిపై కాల్పులు జరిపిన వ్యక్తిని తాను చూశానని ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నారు. ఈవెంట్ గ్రౌండ్‌కు సమీపంలో ఉన్న భవనం పై నుంచి అతను డొనాల్డ్‌పై కాల్పులు జరిపాడని తెలిపారు. అతను భవనంపైకి రైఫిల్‌తో చేరుకున్నాడని ప్రత్యక్ష సాక్షి గ్రెగ్ మీడియాకు తెలిపారు.తాను భవనంపై అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి గురించి పోలీసులకు, సీక్రెట్ సర్వీస్‌కు సమాచారం అందించినట్లు తెలిపారు. కాగా ట్రంప్ తన ఎన్నికల ర్యాలీలో వేదికపైకి వచ్చిన కొద్దిసేపటికే ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి గాయమైనట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేదికపైకి వచ్చి, ట్రంప్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటనలో ట్రంప్‌కు ఎటువంటి ప్రాణాపాయం లేదని సమాచారం.ఈ ఘటన అనంతరం డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో తన కుడి చెవి పై భాగానికి బుల్లెట్ తాకిందని తెలిపారు. తుపాకీ పేలిన శబ్దం వినిపించిన వెంటనే ఒక బుల్లెట్ తన చెవి చర్మం గుండా వెళ్లిందన్నారు. దీంతో ఏదో తప్పు జరిగిందని అనిపించిందని ట్రంప్ పేర్కొన్నారు. WATCH: Shooter at Trump rally opened fire from the roof of a nearby building pic.twitter.com/AgMbtLqKEe— BNO News (@BNONews) July 14, 2024 -
Nigeria: స్కూలు బిల్డింగ్ కూలి 22 మంది విద్యార్థులు మృతి
నైజీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర మధ్య నైజీరియాలో హఠాత్తుగా రెండంతస్తుల పాఠశాల భవనం కూలిపోయింది. తరగతులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 22 మంది విద్యార్థులు మృతి చెందగా, 100 మందికి పైగా విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారని తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసుకువచ్చేందుకు రిలీఫ్ అండ్ రెస్క్యూ టీమ్‌లు ఘటనాస్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.బుసా బుజి కమ్యూనిటీలోని సెయింట్స్ అకాడమీ కాలేజీలో తరగతులు ప్రారంభమైన కొద్దిసేపటికే పాఠశాల భవనం కుప్పకూలింది. ప్రమాదం బారినపడినవారిలో 15 ఏళ్లలోపు విద్యార్థులు ఉన్నారు. శిథిలాల్లో మొత్తం 154 మంది విద్యార్థులు చిక్కుకుపోయారని, 132 మందిని రక్షించామని పోలీసు అధికార ప్రతినిధి ఆల్ఫ్రెడ్ అలబో తెలిపారు. వీరంతా ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో 22 మంది విద్యార్థులు మృతి చెందారు.నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. పాఠశాల నిర్మాణం బలహీనంగా ఉండడం, నది ఒడ్డున ఉండడం వల్లే ఈ ఘటన జరిగివుంటుందని అధికారులు అంటున్నారు. ప్రమాదం సంగతి తెలియగానే గ్రామస్తులు ముందుకు వచ్చి, సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి విద్యార్థులను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బందికి సహకారం అందించారు. ఆఫ్రికాలోని అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో భవనాలు తరచూ కూలిపోతుండటం గమనార్హం. గత రెండేళ్లలో ఇలాంటి పలు ఘటనలు నమోదయ్యాయి. -
హత్రాస్ ఘటన: వెలుగులోకి ‘భోలే బాబా’ భవనం, ఖరీదైన కార్లు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ హరి సాకర్( భోలే బాబా)పై శనివారం తొలి కేసు నమోదైంది. అయితే భోలే బాబాకు సంబంధించి పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019కి ముందు భోలేబాబా కొన్ని రోజులు లఖింపూర్‌ఖేరిలో అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అజ్ఞాతంలో ఉన్నప్పడు నివసించిన విలాసవంతమైన భవనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ భవనంలో ఒక లగ్జరీ కార్లు, గుహ వంటి నిర్మాణంలో ఉన్న గది ఉన్నాయి. అందులో భోలే బాబా ఫొటోలు, మంత్రాల చిత్రాలు కనిపించాయి. ఈ బిల్డింగ్‌లోనే భోలే బాబా మూడునాలుగు సార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన చివరిసారి ఇక్కడ 2019లో 15 రోజులపాటు ఉన్నట్లు ఈ భవనం యజమాని గోవింద్ పుర్వార్ తలిపారు. ఇక.. ఈ బిల్డిండ్ పూర్తిగా వ్యవసాయ భూములు, పెద్ద తోటల మధ్యలో ఉండటం గమనార్హం. ఈ భవనంలో విశాలమైన పార్కింగ్ స్థలం ఉంది. భోలే బాబాకు చెందిన రెండు లగ్జరీ కార్లు ఇక్కడ పార్క్ చేయబడి ఉన్నాయి. వంట చేసుకోవటం కోసం కిచన్, స్టవ్, సామాగ్రి కూడా ఉన్నాయి. వంటగది పక్కనే గుహవంటి రూం ఉంది. ఇందులో 2019 నాటి భోలే బాబా సత్సంగ్ పోటోలు ఉన్నాయి. మరో గదిలో గోధుమ కంటేయినర్లు, భోలే బాబా ఫోటోలు, హనుహాన్ చాలిసా మాదిరిగా చేతితో రాసిన హారతి చాలిసా ఉన్నాయి. అయితే భోలే బాబా ఈ భవనంలో విశ్రాంతి తీసుకునేవారని స్థానికంగా ఉండే ఆయన భక్తులు మీడియాతో తెలిపారు.ఇక తొక్కిసలాట ఘటన తర్వాత భోలేబాబా శనివారం తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. జులై 2న జరిగిన ఘటనతో చాలా వేదనకు గురైనట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధను భరించే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచాలని బాధితులకు సూచించారు. ఘటనకు కారకులను విడిచిపెట్టరనే విశ్వాసం తనకు ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి అండగా ఉండాలని కమిటీ సభ్యులను అభ్యర్థించినట్లు పేర్కొన్నారు.మరోవైపు హత్రాస్ ఘటనపై విచారణ జరిపేందుకు యూపీ ప్రభుత్వం జూలై 3న హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. -
మరో కూల్చివేతకు టీడీపీ కుట్ర.. సాక్షి చేతిలో సంచలన ఆడియో ప్రూఫ్
-
చేపను పోలిన భవనం..ఎక్కడుందంటే..?
కనస్ట్రక్షన్కి టెక్నాలజీ కూడా తోడవ్వడంతో విభిన్న ఆకృతిలో భవనాలను నిర్మిస్తున్నారు అధికారులు. అవి నగరానకి స్పెషల్ ఐకాన్‌గా నిలిస్తున్నాయి. అబ్బా ఎలా నిర్మించారు దీన్ని అని ఆశ్చరయపోయేలా వాటిని నిర్మిస్తున్నారు. అలానే చేప ఆకృతిలో భవనాన్ని నిర్మించి వాటే ఏ బిల్డింగ్ ఇది అను ముక్కునవేలేసుకునేలా చేశారు నిర్మాణకారులు. ఎక్కడుందంటే ఈ భవనం..?ఈ ఫిష్ బిల్డింగ్ హైదరబాద్ ఉంది. దీన్ని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ప్రాంతీయ కార్యాలయంగా చేప ఆకృతిలో నిర్మించారు. స్థానికంగా దీన్ని ఫిష్ బిల్డింగ్ అనిపిలుస్తారు. ఈ బిల్డింగ్‌కి స్ఫూర్తి..1992లో పూర్తి అయిన బార్సిలోనా ఫ్రాంక్ గెహ్రీ స్మారక ఫిష్ శిల్పం. దాన్ని చూసి ఇలా చేప ఆకారంలో బిల్డింగ్‌ని నిర్మించడం జరిగింది. ఈ భవనం మిమెటిక్ ఆర్కిటెక్చర్‌కు ఒక ఉదాహరణ. చేప రూపంలో మొత్తం బిల్డింగ్ కార్యచరణ అంశాలను కలుపుతుంది. దీని ప్రవేశ ద్వారం రెండు మెట్లపై ఉన్న గుడారంలా ఉంటుంది. రెండు వృత్తాకరా అద్దాలు చేప కళ్లులా కనిపిస్తాయి. మొత్తం భవనం స్టెయిన్లెస్ స్టీల్‌తో కప్పబడి, మధ్యలో నీలిరంగు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. అంతేగాదు ఆ బిల్డింగ్‌కి ఉన్న బ్లూ-పర్పుల్ స్పాట్లైట్లు రాత్రిపూట భవనాన్ని ప్రకాశించేలా చేస్తాయి. చూడటానికి ఈ ఫిష్ బిల్డింగ్ ఓ'జెయింట్ ఫిష్' హైదరాబాద్‌లో ఈదుతున్నట్లుగా కనిపిస్తుంది.(చదవండి: రూ. 83 లక్షల జీతం వదులుకుని మరీ పేస్ట్రీ చెఫ్‌గా..రీజన్ వింటే షాకవ్వుతారు!) -
సరిపల్లిలో టీడీపీ, జనసేన కార్యకర్తల విధ్వంసం
కొయ్యలగూడెం: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో సచివాలయ భవనాన్ని ఆదివారం జనసేన, టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాలరాజు శిలాఫలకాన్ని, సచివాలయం నిర్మించ తలపెట్టిన సామగ్రిని ధ్వంసం చేశారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ పేరిట ప్రణాళిక ప్రకారం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనం వద్దకు చేరుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డిŠ, తెల్లం బాలరాజు ఫ్లెక్సీలను, శిలాఫలకాలను ధ్వంసం చేశారు.సచివాలయ కార్యాలయంలోని సామగ్రిని పగలగొట్టి వీరంగం సృష్టించారు. ఎవరైనా అడ్డుకుంటే అంతుచూస్తామంటూ భవన నిర్మాణ కారి్మకులను బెదిరించారు. పక్కన నిర్మాణంలో ఉన్న మహానేత వైఎస్సార్ విగ్రహం, స్మారక మందిరం వద్ద దాడులకు పాల్పడుతున్న సమయంలో సమీపంలోని రైతులు ఎదురు తిరగడంతో విరమించుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు పీఏసీఎస్ అధ్యక్షురాలు మందపాటి శ్రీదేవి తెలిపారు.కొయ్యలగూడెం మండలం సరిపల్లి సచివాలయ భవనంపై దాడి చేస్తున్న కూటమి పార్టీ కార్యకర్త -
ప్రపంచంలో ఎత్తైన రెసిడెన్షియల్.. ఫిదా చేస్తున్న వీడియో
దుబాయ్ అనగానే చాలామందికి ప్రపంచంలో ఎత్తైన భవనంగా కీర్తి గడిస్తున్న 'బుర్జ్ ఖలీఫా' గుర్తొస్తుంది. అయితే త్వరలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ అందుబాటులోకి రానుంది. నగరంలోని మెరీనా జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఈ రెసిడెన్షియల్ మొత్తం 122 అంతస్తులుగా నిర్మించనున్నారు.'సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్' పేరుతో నిర్మిస్తున్న ఈ భవనం 517 మీటర్లు లేదా 1696 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన రెసిడెన్షియల్‌గా.. న్యూయార్క్ నగరంలోని 'సెంట్రల్ పార్క్ టవర్' (474 మీటర్లు లేదా 1550 అడుగులు) కంటే చాలా పొడవుగా ఉంటుంది.సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్‌ను వుడ్స్ బాగోట్ అండ్ డబ్ల్యుఎస్పీ మిడిల్ ఈస్ట్ రూపొందించారు. ఇది గుండ్రంగా మెరుస్తున్న టవర్ మాదిరిగా ఉంటుంది. బాల్కనీలను, టెర్రస్ వంటి వాటిని కలుపుతూ చివరి బిందువు మాదిరిగా పూర్తయ్యి ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్ మొత్తం మిచెల్ & ఈడెస్ పూర్తి చేస్తుంది. కాబట్టి ఇందులో అరబ్ యువరాజుకు సరిపోయే హై-ఎండ్ యాక్సెసరీస్, మెటీరియల్‌లను ఉపయోగించినట్లు సమాచారం.సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్‌లో అత్యాధునిక ఫిట్నెస్ సౌకర్యాలు ఫంక్షనల్ జిమ్‌లు, వర్చువల్ సైక్లింగ్, బాక్సింగ్ స్టూడియోలు, ఇన్ఫినిటీ పూల్, ఐస్ బాత్‌లు, సాల్ట్ రూమ్, బయో, సౌండ్ హీలింగ్ రూమ్, మసాజ్ సూట్లు, ఇండోర్ అండ్ అవుట్డోర్ సినిమాస్ వంటి ఎన్నో ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి.సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్ దుబాయ్ మెరీనాకు కొంత చరిత్ర కూడా ఉంది. ఇది 2007లో పెంటోమినియం టవర్గా ప్రారంభమైంది. తరువాత ఆనతి కాలంలోనే ప్రపంచ ఆర్ధిక సంక్షోభం కారణంగా నిర్మాణం నిలిచిపోయింది. ఇటీవలే సెలెక్ట్ గ్రూప్ అసంపూర్తిగా ఉన్న ఈ భవనాన్ని 100 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం నిర్మాణం 25 శాతం పూర్తయింది. ఇది 2028 చివరి నాటికి పూర్తవుతుందని సమాచారం. -
పాపాయిల కోసం ప్రాణాలే అడ్డేసిన నర్సులు
తైవాన్‌లో వచ్చిన అతిపెద్ద భూకంపం అక్కడి ప్రజలను వణికించింది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా భూమి కంపించడం ప్రకపనలు రేపింది. పెద్ద పెద్ద భవనాలు, నివాస గృహాలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. రవాణా మార్గాలు స్థంభించాయి. ఈ భారీ భూకంపానికి సంబంధించిన వీడియోను, ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వెలుగులోకి వచ్చాయి. అలాంటి వీడియో ఒకటి నెటిజనుల అభిమానాన్ని సంపాదించుకుంది. భూకంపం ప్రభావం అక్కడి ఆసుపత్రులను కూడా ప్రభావితంచేశాయి. ఇలాంటి సమయంలో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స తీసుకుంటున్న వారు, ఆపరేషన్ థియేటర్లలో ఉన్న రోగులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇందుకు ఆయా విభాగాల వైద్యులు, నర్సులు అప్రమత్తమవుతారు.ప్రాణాలకు తెగించి మరీ వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి ఘటనే తైవాన్ భూంకపం సమయంలోనూ చోటు చేసుకుంది. (చీరలతో కేన్సర్ ప్రమాదం : షాకింగ్ స్టడీ!) భూకంపం తైవాన్ను అతలాకుతలం చేస్తున్న సమయంలో స్థానిక ఆసుపత్రిలోని నర్సులు వెంటనే స్పందించారు. ఆస్పత్రి మెటర్నిటీ వార్డులో పసికందుల ప్రాణాలు కాపాడడానికి రంగంలోకి దిగారు. భూప్రకంపనలను గుర్తించిన వెంటనే పరుగు పరుగున వచ్చి ఉయ్యాలలో నిద్రపోతున్న శిశువులను రక్షించే ప్రయత్నం చేయడం పలువురి ప్రశంసలు దక్కించుకుంది. ప్రసూతి యూనిట్‌లోని నలుగురు సిబ్బంది ఉయ్యాలలను కదలకుండా ఉంచడానికి, గట్టిగా పట్టుకోవడానికి కష్టపడ్డారు. ఒక పక్క బిల్డింగ్ అటూ ఇటూ ఊగుతోంది. దీనికి పసిబిడ్డలు ఉయ్యాలలూ కదిలిపోతున్నాయి. మరోవైపు కిటికీలు పగులుతాయోమోనన్న భయం. ఈ సమయంలో వారి ఆందోళన, కష్టం సీసీటీవీలో రికార్డైనాయి. (గుండెలు పిండే విషాదం : మరణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న స్టార్ యాక్టర్) These nurses risk their lives to literally save lives of babies during earthquake in Taiwan. Real life heros! Be safe🙏pic.twitter.com/Q8YLdSKQkJ — Nico Gagelmann (@NicoGagelmann) April 4, 2024 -
Muthu Nandini: పర్యావరణహిత భవనం! ఈ ముత్తు నందిని ప్యాలెస్..
రాజ్ చందర్ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్‌లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది. ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు. ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ ట్రావెల్‌ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచి్చనట్లు వివరిస్తుంటుంది. బాల్యంలోకి వెళ్లారాయన! ‘‘రాజ్‌చందర్ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభి్రపాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్ సెర్చింగ్ మొదలు పెట్టాం. సంజీవని శకలం.. కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చెప్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం. ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పొడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పొట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్‌ను వాడాం. పై కప్పుకి కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్ స్లాబ్ టెక్నిక్ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, కరెంటుకోసం సోలార్ ప్యానెల్స్ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్ రూమ్‌లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్ స్పేస్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాట ప్రాంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్ గురించి వివరించింది జయలక్ష్మి. ఇవి చదవండి: Afshan Ashiq: 'ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను' -
ప్రపంచంలో అతిపెద్ద డైమండ్ భవనం.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
సూరత్: ప్రపంచంలోనే అతిపెద్ద భవనం "సూరత్ డైమండ్ బోర్స్"ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. రూ.3400 కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భవనం వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా మారనుంది. డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్కనెక్టడ్ భవనం. దాదాపు 4500 కార్యాలయాలను కలిగి ఉన్న ఈ భవనం.. పెంటగాన్‌లో ఉన్న భవనం కంటే పెద్దది కావడం విశేషం. సూరత్‌లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ ట్రేడింగ్ సెంటర్‌గా మారనుంది. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్‌లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదికగా మారనుంది. దీంతో దేశంలో డైమండ్ ట్రేడింగ్ ఒకే గొడుగు కిందకు తెచ్చినట్లవుతుంది. 15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇందులో 4500 కార్యాలయాలు ఉన్నాయి. ఇది తొమ్మిది దీర్ఘచతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. ఈ భవనం 6,20,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టినట్లు పేర్కొంది. వజ్రాల నిపుణులు రైళ్లలో ప్రతి రోజూ ముంబయికి వెళ్లకుండా ఈ భననం అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నిర్మాణ సంస్థ సీఈఓ మహేశ్ గాదవి తెలిపారు. అంతర్జాతీయ డిజైన్లకు తగ్గట్టుగా భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఇజ్రాయెల్‌లోని 80,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న డైమండ్ సెంటర్ కంటే సూరత్‌లోని డైమండ్ బోర్స్ సెంటర్ అతిపెద్దది. ఇజ్రాయెల్ డైమండ్ సెంటర్లో కేవలం 1000 కార్యాలయాలే ఉన్నాయి. కానీ సూరత్ డైమండ్ బోర్స్‌లో 4500 ఆఫీస్‌లు ఉన్నాయి. ఇదీ చదవండి: షాహీ ఈద్గాలో సర్వేపై స్టేకు సుప్రీం నిరాకరణ -
220 టన్నుల హోటల్ని జస్ట్ 700 సబ్బులతో తరలించారు!
కొన్ని పురాతన భవనాలు శిథిలావస్థకు చేరుకుంటే అధికారులు కూల్చేస్తారు. ఇది సర్వసాధారణం. అలాంటి ఓ పురాతన భారీ హోటల్ కట్టడం కూడా శిధిలావస్థకు చేరుకోవడంతో కూల్చేయాలనుకున్నారు అధికారులు. ఎప్పటి నుంచే కూల్చేస్తామని ఆ హోటల్‌కి నోటీసులు వచ్చాయి కూడా. అయితే ఆ భవంతి నిర్మాణం అత్యంత పురాతనమైనదే గాక చాలా భారీ కట్టడం కూడా అది. అలాంటివి కూల్చితే మళ్లీ అదే రీతిలో పునర్నిర్మించటం కూడా కష్టమే!. ఆ చారిత్రక భవనాన్ని కూల్చడానికి మనసొప్పని ఓ కంపెనీ దాన్ని కొనుగోలు చేయడమే గాక మరొక ప్రదేశానికి చెక్కు చెదరకుండా తరలించాలనుకుంది. అదెలా సాధ్యం అనిపిస్తోంది కదా!.పైగా అంత పెద్ద కట్టడం తరలించడం మాటలు కూడా కాదు. మరేలా చేసిందంటే...? ఆ చారిత్రాత్మక కట్టడం కెనడాలో ఉంది. ఈ కట్టడాన్ని సుమారు 1826లలో నిర్మించారు. దీని పేరు హాలిఫాక్స్ ఎల్మ్వుడ్ భవనం. ఆ తర్వాత దీన్ని 1896లో విక్టోరియన్ ఎల్మ్వుడ్ హోటల్‌గా మార్చారు. ఇది 2018 నుంచి శిథిలావస్థ స్థితిలోకి చేరవవ్వుతోంది. దీంతో కెనడా అధికారులు ఆ పురాతన కట్టడాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు. అది నగరంలో ఉన్న పురాతన భారీ కట్టడం. దీంతో చాలామంది ఈ నిర్మాణాన్ని కూల్చివేయడాన్ని ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో గెలాక్సీ ప్రాపర్టీస్ అనే కంపెనీ దాన్ని కొనుగోలు చేసి తరలించేందుకు ముందుకు వచ్చింది. అంతేగాక ఈ చారిత్ర నిర్మాణాన్ని కొత్త ప్రదేశానికి తరలించేలా ప్రణాలికలు కూడా సిద్ధం చేసింది. అయితే ఈ భారీ నిర్మాణం దాదాపు 220 టన్నుల బరువు ఉంటుంది. సాధారణ రోలర్‌తో కదిలిస్తే భవనానికి నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదు. దీంతో వారు ఐవరీ సబ్బుతో తయారు చేసిన సొల్యూషన్ బార్లను ఉపయోగించి తరలించాలని అనుకున్నారు. అయితే ఆ సబ్బు కడ్డీలకు ఉండే మృదు స్వభావం ఆ భవనాన్ని చెక్కు చెదరకుండా సజావుగా తరలించడంలో చక్కగా ఉపయోగపడింది. మొత్తం మీద కంపెనీ సిబ్బంది ఈ భవనాన్ని దాదాపు 700 బార్ సోప్‌లు, రెండు ఎక్స్కవేటర్లు, ఒక ట్రక్కు సాయంతో విజయవంతంగా 30 అడుగుల వరకు లాగింది. అంతేగాదు ఆ హోటల్ని మరోక పునాదిపై ఉండిచ అపెర్ట్మెంట్కి కనక్ట్ చేయాలని చూస్తోంది ఆ కంపెనీ. భవిష్యత్తులో ఇలాంటి చారిత్రక భవనాలను రక్షించుకునేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంది సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ. అందుకు సంబంధించిన వీడియోని కూడా నెట్టింట షేర్ చేసింది. (చదవండి: మేకలకు ఏడాది జైలు శిక్ష! ఏం తప్పు చేశాయో వింటే షాకవ్వుతారు!) -
కృత్రిమ దీవిలో వివాదాస్పద భవంతి
పోలండ్‌లోని నోటెకా అభయారణ్యంలో ఈ భవంతి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. నదిలో కృత్రిమ దీవిని ఏర్పాటు చేసుకుని, దానిపై మధ్యయుగాల శైలిలో దాదాపు ఎనిమిదేళ్లుగా నిర్మిస్తున్న ఈ భవంతి గురించిన వివరాలు ఇప్పటికీ పూర్తిగా ఎవరికీ తెలియవు. ఎవరు ఎందుకు ఈ భవంతిని నిర్మిస్తున్నారనే దానిపై అనేక వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఈ భవంతి నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు. దీని నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. ఇది 2025 నాటికి పూర్తి కాగలదని అంచనా. అభయారణ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ భవంతి గురించి జనాలకు కొంత ఆలస్యంగా తెలిసింది. దీనిపై స్థానిక పర్యావరణవేత్తలు గగ్గోలు చేయడంతో 2020లో ఏడుగురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. ఏళ్ల తరబడి నిర్మాణం సాగుతున్నా, దీనిపై పట్టించుకోనందుకు స్థానిక గవర్నర్‌కు పదవి ఊడింది. అయినా, ఈ భవంతి నిర్మాణం వెనుక ఎవరు ఉన్నారనేది మాత్రం స్పష్టంగా బయటపడలేదు. ఈ పరిణామాల తర్వాత కూడా ఈ భవంతి నిర్మాణం యథా ప్రకారం కొనసాగుతూనే ఉంది. ఈ భవంతి నిర్మాణానికి దాదాపు 75 మిలియన్ పౌండ్లు (రూ.78.94 కోట్లు) ఖర్చవుతుందని ఒక అంచనా. ఈ భవంతి నిర్మాణం వెనుక జాన్ కుల్సిక్ అనే పోలిష్ కోటీశ్వరుడు ఉన్నట్లు ఒక వదంతి ప్రచారంలో ఉంది. నిజానికి అతడు ఈ నిర్మాణం ప్రారంభించే నాటికే 2015లో మరణించాడు. అయితే, తాను జీవించి ఉండగానే, మరణించినట్లు ప్రచారం చేసుకుని, తెరవెనుక ఉండి ఈ నిర్మాణం కొనసాగిస్తున్నాడనే ప్రచారం బలంగా ఉంది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ నిర్మాణాన్ని నిలిపివేయడానికి పోలిష్ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవేవీ నెరవేరలేదు. అలాగే ఈ నిర్మాణం వెనుక ఎవరున్నారో, దీనిని ఏ ఉద్దేశంతో నిర్మిస్తున్నారో ఇప్పటి వరకు బయటపడకపోవడమే ఆశ్చర్యకరం. -
ముంబైలో అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవదహనం!
మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని గిర్గావ్ చౌపటీలో గల నాలుగు అంతస్తుల భవనంలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనమయ్యారని, ముగ్గురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఒక ప్రకటనలో తెలిపింది. భవనంలో చాలామంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ముంబైలోని గిర్గామ్ చౌపటీ ప్రాంతంలోని గోమతి భవన్లో లెవల్-2లో మంటలు చెలరేగాయని బీఎంసీ తెలిపింది. 10 అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పే పని కొనసాగుతోంది. మంటలు భవనంలోని మూడు, నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తమకు ఈ సమాచారం అందిందని పోలీసు అధికారి తెలిపారు. అనంతరం పది అగ్నిమాపక యంత్రాలతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. భవనం నుంచి దహనమైన స్థితిలో ఉన్న రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. భవనంలోని మూడో అంతస్తులో ఈ మృతదేహాలు కనిపించాయని అధికారి తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో పొగమంచు.. విమానాలు మళ్లింపు #WATCH | Maharashtra: Fire broke out at Gomti Bhawan Building in Mumbai's Girgaon Chowpatty. Firefighting operations are underway. pic.twitter.com/jZHbCxkNUF — ANI (@ANI) December 2, 2023 -
రావణుని వైభోగం ఎంత? అవశేషాలు ఎక్కడున్నాయి?
దసరా రోజున రావణ దహనం చేస్తారు. ఇది మనలోని చెడును కాల్చివేయాలనే సందేశాన్ని అందిస్తుంది. అయితే ఇప్పుడు మనం రావణ దహనం గురించి కాకుండా రావణుని వైభోగం గురించి తెలుసుకోబోతున్నాం. రావణుడు ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపాడో? అతని రాజభవనం ఎంత విలాసవంతమైనదో ఈ కథనంలో తెలుసుకుందాం. నేడు శ్రీలంకలో కనిపించే ‘సిగిరియా’ ఒకప్పుడు రావణుడి లంక అని చెబుతారు. రావణునికి ఇక్కడ ఒక పెద్ద రాతిపై ఒక రాజభవనం ఉందని, అక్కడ అతను సురక్షితంగా నివసించాడని స్థానికులు చెబుతారు. ఇక్కడికి సమీపంలో ఒక ప్రత్యేక విమానాశ్రయం ఉందని, అక్కడ నుండే రావణుని పుష్పక విమానం ఎగురేదని చెబుతారు. ఆనాటి కాలానికి అనుగుణంగా రావణుడి రాజభవనం పలు ఆధునిక సౌకర్యాలతో ఉండేది. రావణుని రాజభవనానికి లిఫ్ట్ సౌకర్యం ఉందని, నీటి నిర్వహణకు ఆధునిక వ్యవస్థ కూడా ఉండేదని చెబుతారు. మీడియా కథనాల ప్రకారం శ్రీలంకలోని సిగిరియా రాతిపై పురాతన ప్యాలెస్ అవశేషాలు కనిపించాయి. ఇక్కడి రాగైలా అడవుల్లో రావణుని మృతదేహాన్ని దాదాపు 8 వేల అడుగుల ఎత్తులో ఉంచినట్లు శ్రీలంక మీడియా పేర్కొంది. దానిని మమ్మీ రూపంలో ఉంచారని చెబుతారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. శ్రీలంకలో రావణుని ప్యాలెస్ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇది కూడా చదవండి: ఇందిర ‘మూడవ కుమారుడు’ ఎవరు? -
విశాఖకు కృష్ణాబోర్డు
సాక్షి, అమరావతి: కృష్ణాబోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అన్ని వసతులతో కూడిన భవనాన్ని సిద్ధం చేసింది. తక్షణమే హైదరాబాద్ నుంచి విశాఖకు కార్యాలయాన్ని తరలించాలని బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్‌కు జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు. కృష్ణా, గోదావరి నదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రాకుండా చూసేందుకు కృష్ణా, గోదావరి బోర్డులను విభజన చట్టం ద్వారా కేంద్రం ఏర్పాటుచేసింది. కృష్ణాబోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌లోను, గోదావరి బోర్డు కార్యాలయం తెలంగాణలోను ఏర్పాటుచేయాలని నిర్దేశించింది. ప్రస్తుతం రెండు బోర్డుల కార్యాలయాలు హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తున్నాయి. 2020లో కృష్ణాబోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి ఆదేశించారు. కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అక్కడ భవనం, వసతులు కల్పిస్తే హైదరాబాద్ నుంచి తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణాబోర్డు తెలిపింది. విశాఖపట్నంలో నార్త్‌కోస్ట్ సీఈ కార్యాలయం ప్రాంగణంలో నిర్మిం చిన భవనంలో ఒక అంతస్తును కృష్ణాబోర్డు కార్యాలయానికి ప్రభుత్వం కేటాయించి, బోర్డుకు తెలిపింది. -
ఎత్తయిన భవనాలపై ఎర్ర లైట్లు ఎందుకు? విమానాలకు సంబంధం ఏమిటి?
మీరు ఎప్పుడైనా ఏదైనా మహానగరంలో రాత్రిపూట ఆకాశం వైపు చూసినప్పుడు కొన్ని ఎత్తైన భవనాల పైన ఎరుపురంగు లైట్లు కనిపిస్తాయి. ఈ రెడ్ లైట్లు అలంకారం కోసం కాదని, దీని వెనుక ప్రత్యేక కారణం ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. మహానగరాలు కాంక్రీట్ అడవులుగా ఎప్పుడో మారిపోయాయి. ఆ నగరాల్లో ఎత్తైన భవనాలన్నింటిపైనా ఈ తరహా లైట్లను ఏర్పాటు చేస్తుంటారు. ఈ లైట్లు భారీ భవనాలపైననే ఎందుకు కనిపిస్తాయి? ఓ మాదిరి భవనాలపై ఎందుకు కనిపించవు? దీని వెనుక ఏదైనా ప్రభుత్వ మార్గదర్శకం ఉందా లేదా భద్రతా కారణాల దృష్ట్యా ఇలా చేస్తున్నారా? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భవనాల పైభాగంలో ఎరుపు రంగు దీపాలను అమర్చడానికి ప్రధాన కారణం విమాన భద్రత. ఈ లైట్లను ఏవియేషన్ అబ్స్ట్రక్షన్ లైట్లు లేదా ఎయిర్‌క్రాఫ్ట్ వార్నింగ్ లైట్లు అని అంటారు. ఆకాశహర్మ్యాలు, కమ్యూనికేషన్ టవర్లు, విండ్ టర్బైన్లు తదితర ఎత్తైన నిర్మాణాలు.. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలకు ముప్పును కలిగిస్తాయి. ముఖ్యంగా దృశ్యమానత తగ్గినప్పుడు, అననుకూల వాతావరణంలో రెడ్ లైట్లు నిరంతర ఫ్లాషింగ్ సిగ్నల్స్‌ను విడుదల చేస్తాయి. అవి విమాన పైలట్లకు సులభంగా కనిపిస్తాయి. ఇది విమానాలకు హెచ్చరికలా పనిచేస్తుంది. విమానయాన అధికారులకు ప్రమాదాలను నివారించడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇటువంటి లైట్ల ఏర్పాటుకు సంబంధించి పలు దేశాలలో కఠినమైన నిబంధనలను ఉన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ భద్రతను నిర్ధారించడానికి ఈ నియమాలను పాటించడం తప్పనిసరి. ఈ లైట్లను అమర్చనిపక్షంలో భవన యజమానులు జరిమానాలతో పాటు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎత్తైన భవనాలపైన ఉండే రెడ్ లైట్లు విమానాల కోసం నావిగేషనల్ ఎయిడ్స్‌గా కూడా పనిచేస్తాయి. వాటి స్థానాన్ని, దిశను గుర్తించడంలో సహాయపడతాయి. విమాన భద్రతతో పాటు, భవనాలపై కనిపించే ఎరుపురంగు లైట్లు సమీపంలోని ఎత్తైన నిర్మాణాలకు హెచ్చరికగా కూడా పనిచేస్తాయి. ఇది కూడా చదవండి: దేశంలోని తొలి సినిమాహాలు ఏది? ఏ సినిమాలు ఆడేవి? -
ఈ ఫోటోలో ఉన్నది కేకు అనుకుంటున్నారా? తెలిస్తే షాకవ్వుతారు!
ఫొటోలో చూస్తే ఇదేదో కేకులా కనిపిస్తుంది గాని, నిజానికి ఇది వెడ్డింగ్ కేకు నమూనాలో రూపొందించిన భవంతి. బటర్ క్రీమ్ మెట్లు, ఐసింగ్ టైల్స్ వంటి అలంకరణలను సిరామిక్‌తో ఏర్పాటు చేసి, దీనిని అచ్చంగా వెడ్డింగ్ కేకును తలపించేలా రూపొందించడం విశేషం. భారీ స్థాయిలో పన్నెండు మీటర్ల (39 అడుగులు) ఎత్తున ఈ వెడ్డింగ్ కేకు భవంతిని పోర్చుగీస్ కళాకారిణి జోవానా వాస్కోన్సెలస్ రూపొందించింది. కళాత్మకమైన శిల్పాల తయారీలో ముప్పయ్యేళ్ల అనుభవం ఉన్న జోవానా తన అనుభవాన్నంతా రంగరించి ఈ భవంతిని సిసలైన కేకులా తీర్చిదిద్దడంతో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. అతిథులు ఈ భవనంలోని మూడంతస్తుల్లోనూ తిరుగుతూ, ఇందులోని ప్రతి ఒక్క అంశాన్నీ పరిశీలించడానికి వీలుగా దీన్ని తయారు చేయడం విశేషం. లోపలి భాగంలో బంగారు రంగులో చేసిన అలంకరణలు, ఐసింగ్లా తయారు చేసిన శిల్పాకృతులు చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తాయి. పద్దెనిమిదో శతాబ్దినాటి పోర్చుగీస్ సంప్రదాయమైన గార్డియన్ పెవిలియన్స్ ఆతిథ్యాన్ని నేటి తరానికి గుర్తుచేసేందుకు ఈ వెడ్డింగ్కేకు భవంతిని రూపొందించినట్లు జోవానా తెలిపారు. వచ్చే అక్టోబర్ 26 వరకు ఈ కేకు భవంతిని తిలకించేందుకు సందర్శకులను అనుమతించనున్నట్లు వెల్లడించారు. (చదవండి: 130 వేల ఏళ్ల నుంచే మానవుల ఉనికి! వెలుగులోకి విస్తుపోయే విషయాలు!) -
HYD: క్షణాల్లో నేలమట్టమైన భవనాలు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో ఇవాళ ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మాదాపూర్ మైండ్ స్పేస్ ఐటీ పార్కులోని రెండు పక్కపక్క భవనాలను క్షణాల్లో నేలమట్టం చేసేశారు. పేలుడు పదార్థాల అమర్చి.. అధునాతన టెక్నాలజీతో ఈ కూల్చివేత చేపట్టారు. మాదాపూర్ మైండ్‌స్పేస్‌లోని రెండు భవనాలను క్షణాల్లో నేలమట్టం చేశారు. డిజైనింగ్‌లో లోపంతో ఈ కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ బిల్డింగ్ కూల్చివేతకు టీఎస్ఐఐసి నుండి అనుమతి లభించింది. భవనాల కూల్చివేత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు బిల్డింగ్ ఓనర్స్ తెలిపారు. కూల్చివేసిన స్థానంలో భారీ భవనాలు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. *Video from earlier today showing the controlled demolition of Mindspace Madhapur Buildings 7 & 8 carried out by Edifice Engineering & Jet Demolition!..* #Hyderabad pic.twitter.com/sdwmZMSFpu — DONTHU RAMESH (@DonthuRamesh) September 23, 2023 -
పాత పార్లమెంట్ భవనాన్ని ఏం చేస్తారు?
-
వియత్నాంలో ఘోర అగ్ని ప్రమాదం
హనోయి: వియత్నాం రాజధాని నగరం హనోయి ఘోర అగ్నిప్రమాదానికి నిలయంగా మారింది. హనోయిలో మంగళవారం రాత్రి తొమ్మిది అంతస్తుల భవంతి పార్కింగ్ ప్రాంతంలో మొదలైన అగి్నకీలలు వెనువెంటనే భవనం మొత్తాన్నీ చుట్టేశాయి. అత్యవసరంగా బయటపడే మార్గం ఈ భవనానికి లేదు. దీంతో తప్పించుకునే మార్గం కానరాక ఏకంగా 56 మంది అగి్నకి ఆహుతయ్యారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. 37 మంది గాయపడ్డారు. 150 కుటుంబాలు నివసిస్తున్న ఈ భవనం ఇరుకైన దారిలో నిర్మించారు. దీంతో మంటలు ఆర్పే అగి్నమాపక సిబ్బంది భవనం దాకా చేరుకోలేకపోయారు. ఇరుకైన మార్గం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. మంటలు అంటుకుంటాయనే భయంతో కొందరు భవనం మీద నుంచి కిందకు దూకారు. ఇలా గాయపడిన వారిని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రుల్లో చికిత్సనందిస్తున్నారు. పొగపీల్చడంతో ఇబ్బందులు పడుతున్న వారికీ చికిత్సచేస్తున్నారు. -
అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు.. 50 మందికిపైగా మృత్యువాత
వియాత్నంలోని అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దేశ రజధాని హనోయిలోని 9 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో 50 మంది మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మరో 70 మందిని అధికారులు రక్షించారు. మంగళవారం రాత్రి 11.30 గంటలకు భవనంలోని పార్కింగ్ ఏరియాలో మొదలైన మంటలు క్షణాల్లోనే అపార్ట్మెంట్ మొత్తం వ్యాపించాయి. భవనం చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. బిల్డింగ్‌లో 45 కుటుంబాలు నివసిస్తుండగా ప్రమాద సమయంలో అందరూ ఇళ్లలోనే ఉన్నారు. నిద్రమత్తులో ఉన్న నివాసితులు తేరుకొని సాయం కోసం గట్టిగా కేకలు వేశారు. అయితే అపార్ట్మెంట్ నుంచి తప్పించుకునే మార్గం లేకుండా పోయిందని, ఈ కారణంతోనే మరణాలు భారీగా సంభవించాయని అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అయితే అపార్టమెంట్ ఇరుకైన గల్లీలో ఉండటంతో అక్కడికి చేరుకునేందుకు అగ్నిమాపక సిబ్బందికి కష్టమవుతోంది. దీంతో అగ్నిమాపక వాహనాలను భవనానికి 300 నుంచి 400 మీటర్ల దూరంలో నిలిపి ఉంచి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం -
మన పాలకులకు ప్రేమ, భక్తి ఉన్నాయి
సాక్షి ప్రతినిధి,వరంగల్: ఆధ్యాత్మిక భావనతో మనసులో ఎటువంటి కల్మషం లేకుండా, మానవీయ కోణంలో ఏ కార్యక్రమం తలపెట్టినా సత్ఫలితాలు వస్తాయని త్రిదండి చిన జీయర్‌స్వామిజీ అన్నారు. కొత్త ఆలయాలు నిర్మించడం సహజమని, కానీ పురాతన ఆలయానికి పునరుజ్జీవం పో యడం గొప్ప విషయమని, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వల్మిడిలో రామాలయం నిర్మించడం మరింత అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలకులకు ప్రేమ, భక్తి రెండూ కలసి ఉండడంతో మనం అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇలాగే పచ్చగా కొనసాగాలని ఆకాంక్షించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో సోమవారం జరిగిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునఃప్రారంభం, విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో చినజీయర్ పాల్గొని సందేశం ఇచ్చారు. మనుషుల్లో అంతర్లీనమైన ప్రేమ, సహోదర భా వం పెంపొందించడంతో పాటు మానసిక ధైర్యాన్ని ఇచ్చేందుకు ప్రతిచోట ఆలయాలు అవసరమని ఆయన తెలిపారు. వాల్మికితో సంబంధం ఉన్న అతి ప్రాచీనమైన వల్మిడి రామాలయాన్ని దివ్య క్షేత్రంగా వెలుగొందేలా మంత్రి దయాకర్‌రావు చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి దీటుగా వల్మిడి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ముందుగా వేదమంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల విగ్రహాన్ని జీయర్ స్వామి ప్రతిష్టించారు. అనంతరం ఆలయంలోని ఇతర విగ్రహాలను, ఆలయ గోపురంపై కలశాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాగా పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమ నాథుడి స్మృతి వనం, కల్యాణ మండపం, హరిత హోటల్, గిరిజన భవన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. -
Hyderabad: పక్కకు ఒరిగిన నిర్మాణంలో ఉన్న భవనం
బహుదూర్‌పురా: హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పక్కకు ఒరిగిపోయింది. నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఆ బహుళ అంతస్తుల భవనం ఓ వైపునకు ఒరిగింది. దాంతో భయాందోళన చెందిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో సంఘటనా స్థలికి చేరుకుని భవనాన్ని పరిశీలించారు అధికారులు. ఆ భవనం యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భవనం పక్కకు ఒరిగిపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు అధికారులు. -
రెండో అంతస్తులోకి దూసుకెళ్లిన కారు.. అలా ఎలా రాజా?
వాషింగ్టన్: అమెరికాలోని పెన్సిల్వానియాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక కారు డ్రైవర్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆశ్చర్యకరంగా పక్కన ఉన్న బిల్డింగ్ రెండో అంతస్తులోకి దూసుకెళ్లాడు. కారు పరిమాణంలో బిల్డింగ్ పైభాగంలో పెద్ద రంధ్రం కూడా పడింది. వెంటనే ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగి కారును, కారు డ్రైవరును జాగ్రత్తగా కిందకు దించారు. బిల్డింగ్ లోకి దూసుకెళ్లిన కారు దృశ్యాలు, శిధిలమైన బిల్డింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. పెన్సిల్వానియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కారును 20 ఏళ్ల యువకుడు డ్రైవింగ్ చేస్తున్నాడని ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం అతడు అక్కడికి సమీపంలోనే ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని అన్నారు. అతడు కోలుకుంటేగానీ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందో తెలియదన్నారు. మాకైతేలండి యాక్సిడెంట్ కాదేమో అనిపిస్తున్ది అన్నారు. ఇదిలా ఉండగా స్థానికులు మాత్రం దగ్గర్లోని కల్వర్టు వద్ద ఓవర్ స్పీడింగ్ వలన రైలింగును ఢీకొని ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆ కారణంతోనే కారు గాల్లోకి లేచి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలను చూసినవారంతా కారును స్పైడర్ మ్యానో, సూపర్ మ్యానో డ్రైవింగ్ చేసి ఉంటారని కొందరు, గాల్లో వెళ్లడమంటే ఇదేనేమో అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదని మరి కొందరు మానవతా దృక్పధంతో కూడా కామెంట్లు చేస్తున్నారు. A driver has been taken to hospital after crashing a car into the second story of a house in Pennsylvania. State Police say investigators believe it wasn’t an accident. pic.twitter.com/D2U5P0fQMn — Pop Crave (@PopCrave) August 8, 2023 ఇది కూడా చదవండి: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు.. తాత్కాలిక ప్రధాని ఎవరు? -
భక్త మహాశయులకు...
అన్నవరం: ఆధ్యాత్మిక చింతనతో.. మది నిండా భక్తిభావంతో.. ఆ స్వామివారిని స్మరిస్తూ రత్నగిరికి కాలినడక వచ్చే భక్త మహాశయులకు సౌకర్యాలు ఒనగూరుతున్నాయి.. మెట్ల మార్గం నుంచి అలసి సొలసి వచ్చేవారి కోసం విశ్రాంతి భవనం (డార్మెట్రీ) సకల హంగులతో రూపుదిద్దుకుంటోంది.. రత్నగిరిపై వనదుర్గ ఆలయం ఎదురుగా రూ.రెండు కోట్లతో దాత పెన్నాడ వెంకట రాజామణి సారథ్యంలో భక్తుల విశ్రాంతి భవన నిర్మాణం జరుగుతోంది. ఇది ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి కానుంది. గత ఏడాది ఆగస్టులో పనులు ప్రారంభం కాగా, ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. వచ్చే ఆగస్టు నెలాఖరుకు మిగిలిన పనులు పూర్తి చేసి డార్మెట్రీని దేవస్థానానికి అప్పగించాలని దాత నిర్ణయించారు. డార్మెట్రీని దేవస్థానానికి అప్పగించిన వెంటనే ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఈఓ చంద్రశేఖర్ అజాద్ వివరించారు. అలా పునాది పడి.. రత్నగిరి సత్యదేవుని దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇందులో చాలామంది మెట్ల దారి నుంచి వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు. అలాంటి వారికోసం డార్మెట్రీ నిర్మించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. బాత్రూమ్లలో స్నానం చేసి, తమ వస్తువులను అక్కడే లాకర్లలో భద్రపర్చుకునేందుకు శ్రీవనదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఈ భవనం చేపట్టాలని భావించారు. ఈ సమయంలోనే రాజమహేంద్రవరానికి చెందిన దాత పెన్నాడ వెంకట రాజామణి డార్మెట్రీ నిర్మించడానికి ముందుకు వచ్చారు. అప్పటి ఈఓ వి.త్రినాథరావు శ్రీవనదుర్గ ఆలయం వద్ద ఉన్న పాత భవనాన్ని కూల్చి వేసి ఆ స్ధలాన్ని దాతకు అప్పగించారు. ఈ నిర్మాణానికి గత ఏడాది ఆగస్టు 13న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ భూమిపూజ చేశారు. వెయ్యి మంది సేదతీరేలా.. మొత్తం 3,900 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తులలో ఈ భవనం నిర్మిస్తున్నారు. ఏకకాలంలో సుమారు వెయ్యి మంది సేదతీరే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మూడు అంతస్తులలోనూ టాయిలెట్లు, స్నానపు గదులు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల భక్తులు కొండపై వసతి గదుల కోసం ప్రయత్నించకుండా ఇక్కడే స్నానం చేసి స్వామివారిని దర్శనానికి రావొచ్చని అధికారులు తెలిపారు. ఈ పనులు ప్రారంభించిన మూడు నెలలకే పునాదుల దశ పూర్తి చేయగా, ఏప్రిల్ నెలలోనే మూడు శ్లాబ్‌ల నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తయి వెలుపల ప్లాస్టింగ్, టైల్స్ అతికించడం పనులు చేస్తున్నారు. టాయిలెట్ల నిర్మాణం, విద్యుత్తు సరఫరా పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని నిర్మాణ కాంట్రాక్టర్ అబ్బులు తెలిపారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద భవనం.. మన దేశంలోనే.. ఎక్కడో తెలుసా..?
అహ్మదాబాద్: ప్రపంచంలోనే అత్యంత పెద్ద భవనం పెంటగాన్‌పై ఉన్న రికార్డ్ ప్రస్తుతం మారిపోనుంది. ఇప్పుడు ఆ వేదిక ఇక గుజరాత్‌లోని సూరత్ కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద భవనం డైమండ్ ట్రేడింగ్ సెంటర్‌ను సూరత్‌లో నిర్మించారు. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్‌లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదికగా మారనుంది. 15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇది తొమ్మిది ధీర్ఘచతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. దాని ఫ్లోర్ 7.1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టినట్లు పేర్కొంది. ఈ ట్రేడింగ్ భవనాన్ని ఈ ఏడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. వజ్రాల నిపుణులు రైళ్లలో ప్రతి రోజూ ముంబయికి వెళ్లకుండా ఈ భననం అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నిర్మాణ సంస్థ సీఈఓ మహేశ్ గాదవి తెలిపారు. అంతర్జాతీయ డిజైన్లకు తగ్గట్టుగా భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఇదీ చదవండి: విపక్షాల భేటీకి దీటుగా.. 38 పార్టీలతో ఎన్డీఏ కూటమి సమావేశం.. -
18 వ అంతస్తు నుంచి ‘అమ్మా’ అంటూ కేక... తల్లి పైకి చూసేసరికి..
ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. 18 వ అంతస్తులో ఉన్న ఆ పిల్లాడు గ్రౌండ్ ఏరియాలో ఉన్న తన తల్లిని పిలిచాడు. అదే అతనికి అంతిమ ఘడియగా మారింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి 8 గంటల సమయంలో.. నోయిడా ఎక్స్టెన్షన్ అంటే గ్రేటర్ నోయిడా వెస్ట్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. బిస్రఖ్ ప్రాంతానికి చెందిన డివైన్ సొసైటీలో రాత్రి 8 గంటల సమయంలో 18వ అంతస్తులోని ఫ్లాట్ నుంచి పడిపోయిన 7వ క్లాస్‌లు కుర్రాడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ 12 ఏళ్ల బాలుడు అదే బిల్డింగ్‌లోని గ్రౌండ్ ఏరియాలో ఉన్న తన తల్లిని పిలిచేందుకు 18 వ ఫ్లోరు బాల్కనీలో నుంచి తొంగిచూస్తూ కిందపడిపోయాడు. తండ్రి ఏదోపనిమీద బయటకు వెళ్లగా.. ఈ ఉదంతం గురించి స్థానిక పోలీసు అధికారి మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో బాల్కనీలో ఆ బాలుడు ఒక్కడే ఉన్నాడని తెలిపారు. తల్లిదండ్రులిద్దరూ ఇంటిలో లేరన్నారు. ఆ బాలుని తండ్రి ఏదోపనిమీద బయటకు వెళ్లగా, తల్లి గ్రౌండ్ ఏరియాలో ఉన్నదన్నారు. ఈ సమయంలో బాలుడు కిందినున్న తల్లిని పిలిచేందుకు బాల్కనీలో నుంచి తొంగిచూశాడని, పట్టుతప్పి కిందపడిపోయాడన్నారు. వెంటనే ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. గత నెలలో పార్క్ సొసైటీలో.. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధిత కుటుంబం మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడకు వచ్చి ఉంటోంది. మృతుని తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కాగా నోయిడాలోని బహుళ అంతస్తుల భవనాల నుంచి జారిపడి మృతిచెందిన ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. గత నెలలో పార్క్ సొసైటీలోని 8వ అంతస్తు నుంచి 5 ఏళ్ల బాలుడు కిందపడి మృతి చెందాడు. ఇది కూడా చదవండి: ఒక్క పర్వతంపై 900 ఆలయాలు.. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా.. -
చైనాలో మరో అద్భుతం: బిల్డింగ్ మధ్య నుంచి దూసుకుపోయే రైలు..
చైనా లోకల్ ఉత్పత్తులను భారత్‌లో విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. చాలామంది చైనా వస్తువులకు ఎటువంటి గ్యారెంటీ ఉండదంటూ హేళన చేస్తుంటారు. అయితే చైనా టెక్నాలజీ, అధునాతన ఉత్పత్తులు ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తుంటాయి. టెక్నాలజీ పరంగా చైనా ఎంత వేగంగా దూసుకుపోతున్నదనే విషయాన్ని అవి తెలియజేస్తుంటాయి. అధునాతన రైళ్లు అనగానే ముందుగా చైనా, జపాన్ గుర్తుకువస్తాయి. ఈ దేశాల రైళ్ల వేగం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. చైనా రైల్వే టెక్నాలజీ మరో అద్భుతాన్ని చేసి చూపింది. తాజాగా చైనా19వ అంతస్థుల నివాసిత బిల్డింగ్ మధ్య నుంచి రైల్వే ట్రాక్‌ను రూపొందించింది. ప్రజలు ఉండే ఈ భవనం ఇప్పుడు రైల్వే స్టేషన్‌గానూ మారిపోయింది. బిల్డింగ్ మధ్య నుంచి వెళ్లే రైలు చైనా రైల్వే సిస్టం అద్భుతమైనది. ప్రపంచంలో ట్రాక్ లేకుండా రైలు నడిపిన ఘనత కూడా చైనాకే దక్కింది. హైస్పీడ్ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తూ ప్రయాణికులకు చైనా మరింత ఉత్తమ సేవలు అందిస్తోంది. అందుకే కొందరు చైనా రైల్వే సేవలు ప్రపంచంలోనే అత్యుత్తమని అంటుంటారు. తాజాగా చైనా ఒక బిల్డింగ్ మధ్య నుంచి రైల్వే ట్రాక్ నిర్మించింది. ఈ బిల్డింగ్ మధ్య నుంచి రోజూ రైళ్ల రాకపోకలు సాగుతుంటాయి. 19 అంతస్థుల ఈ బిల్డింగ్‌లోని 6వ, 8వ ఫ్లోర్లపై రైల్వే ట్రాక్ నిర్మించారు. భవనం మధ్య నుంచి ట్రాక్ నిర్మించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. బిల్డింగ్‌లోని వారికి ఇబ్బంది కలుగకుండా.. చైనా ఈ రైల్వే ట్రాక్ నిర్మిస్తున్నప్పుడు ఈ మార్గంలో 19 అంతస్థుల బిల్డింగ్ అడ్డుగా నిలిచింది. అయితే రైల్వేశాఖ బిల్డింగ్ యజమానులను సంప్రదించి బిల్డింగ్ మధ్యగా ట్రాక్ వేసేందుకు అనుమతి పొందింది. అనంతరం బిల్డింగ్ మధ్య నుంచి ట్రాక్ వేశారు. ఇది ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ భవనంలో ఉంటున్నవారికి ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఈ ట్రాక్ రూపొందించారు. ఈ ట్రాక్ వలన భవనంలో నివాసం ఉంటున్నవారికి మరో ప్రయోజనం కూడా చేకూరింది. వారికంటూ ఒక ప్రత్యేక రైల్వే స్టేషన్ ఏర్పడింది. దీంతో వారు ఇంటి నుంచి బయటకు వచ్చి, నేరుగా రైలులోనే కూర్చుని తదుపరి స్టేషన్‌కు చేరుకుంటారు. ఇక రైలు నుంచి వచ్చే శబ్ధం బిల్డింగ్‌లోని వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు సైలెన్సింగ్ టెక్నిక్ వినియోగించారు. ఇది కూడా చదవండి: ఎన్నారై డాక్టర్ చేసిన తప్పేంటి? మెడికల్ లైసెన్స్ ఎందుకు లాక్కున్నారు? -
వామ్మో..! తాళ్లు లేకుండా 123 ఫ్లోర్ల బిల్డింగ్‌పైకి సగం ఎక్కేశాడు..కానీ..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాల్లో ఐదోదైన 123 ఫ్లోర్ల బిల్డింగ్‌ను తాళ్లు లేకుండా ఎక్కడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ కొరియా సియోల్‌లోని లొట్టే వరల్డ్ టవర్.. 123 ఫ్లోర్లతో ప్రపంచంలోనే ఐదో ఎత్తైన బిల్డింగ్. దీన్ని ఎక్కడానికి 24 ఏళ్ల బ్రిటీష్ యువకుడు ప్రయత్నించాడు. చిన్న షార్ట్ ధరించి ఎలాంటి తాళ్లు లేకుండా గంటలోనే సగానికి పైగా 73 అంతస్తులు ఎక్కేశాడు. యువకున్ని గమనించిన పోలీసులు..అక్కడికి చేరుకుని బిల్డింగ్ ఎక్కడం ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారు. అగ్ని మాపక సిబ్బంది పైకి చేరుకుని యువకున్ని భవనంలోకి లాగారు. అనంతరం అతన్ని పోలీసులు నిర్బంధించారు. ఆ యువకున్ని బ్రిటన్‌కు చెందిన జార్జ్ కింగ్-థాంప్సన్‌గా గుర్తించారు. అయితే..ఆ యువకునికి 2019లోనే షార్డ్ బిల్డింగ్‌ను ఎక్కినందుకు జైలు శిక్ష కూడా పడింది. 2018లో లొట్టే వరల్డ్ టవర్‌ను ఎక్కే ప్రయత్నం చేసినందుకు ఫ్రెంచ్ స్పైడర్‌మ్యాన్ అలైన్ రాబర్ట్‌ను పోలీసులు అప్పట్లో అరెస్టు చేశారు. ఇదీ చదవండి:భూమి లోతుల్లో మరో అద్భుత ప్రపంచం -
ప్రభుత్వ కార్యాలయంలో మంటలు.. విలువైన ఫైల్స్ బుగ్గిపాలు..
మధ్యప్రదేశ్:మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వా కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సాత్పురా భవన్‌లోని మూడో అంతస్తులో ఆదివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విలువైన ధ్రువపత్రాలు దగ్దమయ్యాయని అధికారులు తెలిపారు. సెలవు దినమైనందున ఎవరూ కార్యాలయానికి వెళ్లలేదని పేర్కొన్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ఫోన్లో ప్రమాదం గురించి వివరించినట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి అన్ని విధాలు సహాయం అందుతుందని హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. పలు ప్రభుత్వ కార్యాలయాలకు నిలయమైన సాత్పుర భవన్లో మంటలు చెలరేగడంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ అవినీతి భయటపడుతుందనే భయంతోనే ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించాయి. ఎలాగూ వచ్చేసారి అధికారంలోకి రాలేమనే భయం అధికార పార్టీకి పట్టుకుందని విమర్శించాయి. ఇదీ చదవండి:‘220 నెలల్లో 225 కుంభకోణాలు.. అది బీజేపి ఘనత’ -
ఎత్తైన భవనం నుంచి దూకిన పిల్లి.. అయినా ఏం కాలేదంటే నమ్మండి!
బ్యాంకాక్‌లో 8.5 కేజీల బరువున్న ఓ పిల్లి పొరపాటున ఆరో అంతస్తు నుండి కిందికి దూకింది. అంతెత్తు నుండి పడిపోయినా కూడా ఆ పిల్లికి చిన్న గాయమైనా కాలేదు. ఇది చూసి ఆ యజమానే కాదు డాక్టర్ కూడా ఆశ్చర్య పోయాడు. అయితే ఈ పిల్లి నేరుగా పార్కింగ్ చేసి ఉన్న ఒక కార్ మీద పడటంతో దాని బరువుకు కారు వెనుక అద్దం మాత్రం పగిలింది. మృత్యుంజయురాలు... బ్యాంకాక్ కు చెందిన అపివాత్ టొయోతక అనే మహిళ తాను ప్రేమగా పెంచుకుంటున్న పిల్లి షిఫుని ఇంట్లో వదిలి బయటకు వెళ్ళింది. వెళ్లేముందు కిటికీ తలుపు వేయడం మరిచిపోయింది. ఇంకేముంది షిఫు స్వేచ్ఛగా బయటకు వెళ్లి షికారు చేయాలనుకుందో ఏమో.. కిటికీలోనుంచి అమాంతం దూకేసింది. అదృష్టవశాత్తు షిఫు కింద పార్కింగ్ చేసి ఉన్న ఒక కారు అద్దం మీద పడటంతో అద్దాన్ని పగలగొట్టుకుని కార్ సీటు మీద సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. కారు అద్దానికి ఎలాగూ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇక షిఫుని డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్లగా అక్కడక్కడా కారు అద్దం గీసుకున్న గాయాలు తప్ప దాని ఒంటి మీద వేరే గాయాలు లేకపోవడం చూసి షాకయ్యాడు. మృత్యుంజయురాలైన షిఫు చేసిన ఈ స్టంటును టొయోతక తన ట్విట్టర్లో పోస్ట్ చేసి గొప్పగా వివరించింది. చదవండి:మలేషియాలో పాకిస్తాన్ కు ఘోర అవమానం.. విమానం సీజ్ -
Parliament : పార్లమెంట్ నూతన భవనం (ఫొటోలు)
-
పార్లమెంట్ నూతన సౌధం ప్రారంభోత్సవం ఇలా...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 7.15 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. రెండు దశలుగా ప్రారంభోత్సవం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉదయం 7.15 గంటలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన భవనం వద్దకు చేరుకుంటారు. 7.30: యజ్ఞం, పూజ ప్రారంభం. దాదాపు గంటపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 8.30: ప్రధాని మోదీ లోక్‌సభ చాంబర్లోకి ప్రవేశిస్తారు. 9.00: చరిత్రాత్మక రాజదండం సెంగోల్‌ను లోక్‌సభ స్పీకర్ స్థానం సమీపంలో ప్రతిష్టిస్తారు. 9.30: పార్లమెంట్ లాబీలో ప్రార్థనా కార్యక్రమం ప్రారంభమవుతుంది. పార్లమెంట్ నుంచి ప్రధాని మోదీ బయటకు వెళ్తారు. 11.30: ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అతిథులు కొత్త భవనం వద్దకు చేరుకుంటారు. 12.00: ప్రధాని మోదీ రాక. జాతీయ గీతాలాపాన ప్రారంభం. 12.10: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రసంగం. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పంపించిన సందేశాన్ని చదివి వినిపిస్తారు. 12.17: రెండు షార్ట్ ఫిలింలు ప్రదర్శిస్తారు. 12.38: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగిస్తారు. 1.05: రూ.75 నాణెం, స్మారక పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని మోదీ విడుదల చేస్తారు. 1.10: ప్రధానమంత్రి ప్రసంగం ప్రారంభం 2.00: అధికారికంగా వేడుకుల ముగింపు -
‘గవర్నర్‌ను పిలవరుగానీ.. రాష్ట్రపతి విషయంలో విమర్శలా?’
సాక్షి,అంబర్‌పేట (హైదరాబాద్): సీఎం కేసీఆర్ బాధ్య తా రహిత సీఎం అని.. కేంద్ర ప్రభుత్వం చేపట్టే కీల క సమావేశాలు, కార్యక్రమాలకు కూడా హాజరుకాకపోవడం కేసీఆర్ అహంకారానికి నిదర్శమని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ విద్యానగర్ శివం రోడ్డులోని అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఏటీఐ)లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు హాజరుకాలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, సికింద్రాబాద్‌లో వందేభారత్ రైలు ప్రారం¿ోత్సవాలకు కేసీఆర్ రాలేదేమని నిలదీశారు. ప్రముఖుల జయంతులకు వెళ్లే తీరిక సీఎం కేసీఆర్‌కు ఉండదుగానీ.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ సమావేశాలకు మాత్రం తీరిక ఉంటుందని విమర్శించారు. కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరిని అవలంబిస్తూ తెలంగాణకు నష్టం కలిగేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం రోజుకు ఎన్ని సెటిల్మెంట్లు చేశాం, ఎందరిని మోసం చేశామని సమీక్షించుకుంటుందే తప్ప. రాష్ట్ర ప్రయోజనాలపై సమీక్ష ఉండదని ఆరోపించారు. రాష్ట్ర సచివాలయం ప్రారంభానికి గవర్నర్‌ను పిలవాలనే సోయిలేని సీఎం కేసీఆర్.. కొత్త పార్లమెంటు ప్రారంభానికి రాష్ట్రపతిని పిలవడం లేదని వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. -
నూతన పార్లమెంట్ భవనాన్ని ఎవరు ప్రారంభించాలి...
-
సిడ్నీలో భారీ అగ్నిప్రమాదం.. చూస్తుండగానే కుప్పకూలిన 7 అంతస్తుల భవనం!
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న 7 అంతస్తుల భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సుమారు 100 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. వివరాల ప్రకారం.. సర్రీ హిల్స్ ప్రాంతంలో ఉన్న ఓ 7 అంతస్తుతల భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మొదటగా 3 అంతస్తుల్లో మాత్రమే మంటలు మొదలైనప్పటికీ చూస్తుండగానే భవనమంతా వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు భారీ ఎత్తున ఎగిసిడటంతో చుట్టు పక్కల భవనాలు కూడా ఆ మంటలు వ్యాపించాయి. దీంతో ఆ పరిసరాలంతా దట్టమైన పొగ కమ్మేసింది. అగ్ని ప్రమాదం కారణంగా భవనం పూర్తిగా దెబ్బతిని చూస్తుండగానే కుప్పకూలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. దాదాపు 100 అగ్నిమాపక సిబ్బంది 20 యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమీప భవనాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. అగ్నిమాపక కార్యకలాపాలు కొనసాగుతున్నందున ఈ ప్రాంతంలోకి ప్రజలు ఎవరూ రావొద్దని అధికారులు సూచించారు. Woah huge fire in the heart of Surry Hills right now in Sydney, sent by @annamccrea37 @abcnews @abcsydney. pic.twitter.com/HMQGwmvr2T — Evelyn Leckie (@Evelyn_Leckie) May 25, 2023 SURRY HILLS | Wall collapses as major fire engulfs seven-storey building. New video footage, released by FRNSW, shows the moment a wall from an engulfed building in Surry Hills came crashing down onto the street below. pic.twitter.com/mZeYGg1Kox — Fire and Rescue NSW (@FRNSW) May 25, 2023 చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద హైవే.. 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా! -
కుక్కకు భయపడి.. మూడో అంతస్తు పైనుంచి దూకి..
సాక్షి, హైదరాబాద్: డెలివరీ పార్సిల్‌ను అందించేందుకు వచ్చిన ఓ యువకుడు...పెంపుడు కుక్క అరవడంతో భయపడి అపార్టుమెంట్ మూడో అంతస్తు నుంచి దూకేశాడు. దీంతో తీవ్రగాయాలపాలవగా ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం సాయంత్రం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటి కాలనీలోని శ్రీనిధి హైట్స్ అపార్ట్మెంట్లోని మూడవ అంతస్తులో అద్దెకు ఉంటున్న నీలారాణి మూడు రోజుల క్రితం అమెజాన్‌లో పరుపు(బెడ్)ను ఆర్డర్ చేసింది. దాంతో ఆదివారం దాన్ని తీసుకుని డెలివరీ బాయ్ ఇలియాజ్ వారి ఇంటికి లిఫ్ట్‌లో వచ్చాడు. అతను తెచ్చిన బెడ్‌ను తలుపు తెరచి ఉండటంతో ఇంట్లోకి నేరుగా వచ్చి హాల్లో వేశాడు. దాని చప్పుడుకు ఇంట్లో ఉన్న లాబ్ జాతి కుక్క ఒక్కసారిగా అరవటంతో అతను భయపడి పోయాడు. ఆ సమయంలో కుక్క ఎక్కడ కరుస్తుందో అనే భయంతో ఏకంగా మూడవ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకాడు. నేరుగా అపార్ట్మెంట్ ప్రహరీగోడపై పడటంతో నడుము భాగంలో గాయమయ్యింది. దీంతో నీలారాణి భర్త డాక్టర్ సుబ్బరామిరెడ్డి సపర్యలు చేసి 108కు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి పంపారు. డెలివరీ బాయ్ ఉదయం ఫోన్ చేసి ఈరోజు డెలివరీ చేస్తామని చెప్పాడని, వచ్చే ముందు ఎలాంటి ఫోన్ చేయటం, ఇంటి ముందుకు వచ్చి బెల్ కొట్టడం చేయలేదని, నేరుగా ఇంట్లోకి రావడం వల్లే కుక్క అరిచిందని నీలారాణి తెలిపారు. బాధితుడు తన అన్నకు ఫోన్ చేయటంతో ఓవైసీ ఆసుపత్రికి తీసుకుని రావాలని చెప్పటంతో 108 సిబ్బంది అతన్ని అక్కడకు తరలించినట్టు సమాచారం. రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి సమాచారం సేకరించారు. అనంతరం నీలారాణిపై కేసు నమోదు చేశారు. చదవండి: కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో లేనట్టే! -
హైదరాబాద్ లో లక్ష బెడ్ రూం ఇళ్ల పంపిణీపై కేటీఆర్ తొలి సంతకం
-
కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
-
తెలంగాణ కొత్త సచివాలయం భవనం డ్రోన్ విజువల్స్
-
ఈ నెల 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం
-
27 అంతస్థుల భవనంపై దూకుతూ పిల్లల డేంజరస్ స్టంట్లు
-
జీడిమెట్లలో కుప్పకూలిన పురాతన భవనం
సాక్షి, మేడ్చల్ జిల్లా: జీడిమెట్లలో పురాతన భవనం కుప్పకూలింది. చెరుకుపల్లి కాలనీలో ఓ పురాతన బిల్డింగ్‌కు మరమ్మత్తులు చేస్తుండగా ఒక్క సారిగా కూలిపోయింది. పక్క నున్న 3 భవనాలపై శిథిలాలు పడటంతో పక్క బిల్డింగ్ గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కూలిపోయిన భవనంలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పక్క బిల్డింగ్‌లో ఇద్దరు గాయపడ్డారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఛీ, తను కూతురేనా?.. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు కన్నవాళ్లను దారుణంగా.. -
భవనంపై నుంచి పడి ఎయిర్‌హోస్ట్ మృతి.. బాయ్‌ఫ్రెండ్ అరెస్ట్
బెంగళూరు: ఎయర్హోస్ట్ భవనంపై నుంచి కింద పడి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని కోరుమంగళలో రేణుకా రెసిడెన్సీలోని అపార్ట్మెంట్లో ఎయిర్ హోస్ట్ అర్చన ధీమాన్, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆదేశ్‌తో కలిసి నివసిస్తోంది. ఆదేశ్ నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్కీగా పనిచేస్తున్నాడు. వీరిద్దరికి డేటింగ్ సైట్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. గత ఆరు నెలలుగా రిలేషన్షిప్లో ఉంటున్నారు. కాగా ఎయిర్‌హోస్ట్ అర్చన మృతిలో ఆదేశ్ పాత్ర ఉందనే అనుమానంతో పోలీసులు అతడిపై హత్య నేరం మోపి అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు జరగుతున్నాయని ఆదేశ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఈ ప్రమాదం జరిగిన రోజు రాత్రి ఇద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు తెలిపాడు. ఆరోజు అర్చన నాల్గో అంతస్థు బాల్కనీ నుంచి జారిపడిందని, తాను ఆస్పత్రికి తరలించగా మృతి చెందిందని పేర్కొన్నాడు. అయితే దర్యాప్తులో ఈ ప్రమాదానికి నాలుగు రోజుల ముందే అర్చన దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చినట్లు తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు పోలీసులు. (చదవండి: స్వలింగ వివాహలకు చట్టబద్ధత అంశం.. రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు) -
భవనంపై నుంచి పడి అంధ విద్యార్థి దుర్మరణం
సాక్షి, సనత్‌నగర్: భవనం ఐదో అంతస్తు నుంచి కిందపడి ఓ అంధ విద్యార్థి మృతి చెందిన ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై జయచందర్ వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ ప్రాంతంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన వెంకట రవికుమార్ కుమారుడు గౌతం లక్ష్మీశ్రీకర్ (12) బేగంపేటలోని దేవనార్ అంధుల పాఠశాలలో ఆరో చదువుకుంటున్నాడు. గౌతం బాధ్యతలను చూసుకునేందుకు తల్లిదండ్రులు ఓ కేర్‌టేకర్‌నూ నియమించారు. ఆ కేర్‌టేకర్‌తో కలిసి రోజూ పాఠశాలకు వెళ్తుంటాడు. భవనం నాలుగో అంతస్తులోని తరగతి గదిలో చదువుకుంటుంటాడు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు కేర్ టేకర్ కూడా గౌతంతో పాటు ఉంటుంది. రోజూలాగే పాఠశాలకు వచ్చిన గౌతంను గురువారం ఎవరూ గమనించకపోవడంతో మెట్లమార్గంలో ఉన్న రెయిలింగ్‌ను పట్టుకొని ఐదో అంతస్తు వరకు వెళ్లాడు. అయితే అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్న దృష్ట్యా కాంట్రాక్టర్ మెటీరియల్‌ను యంత్రం ద్వారా పైకి తరలించేందుకు సులువుగా ఉండేందుకు ప్రహరీని కొంతమేర కూల్చివేశారు. అలా నడుచుకుంటూ మెటీరియల్ సప్లై కోసం ప్రహరీ పగులగొట్టిన ప్రాంతం నుంచి నేరుగా కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కనీసం ప్రహరీ ఉన్నా ఆ విద్యార్థి ప్రాణాలు దక్కేవని స్థానికులు పేర్కొన్నారు. -
Lucknow Building Collapsed: ఎస్పీ నేత భార్య, తల్లి దుర్మరణం
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సహాయాక బృందాలు రక్షించిన ఇద్దరు మహిళలు బుధవారం చికిత్స పొందుతూ చనిపోయారు. మృతి చెందిన ఇద్దరూ మహిళలు సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అబ్బాస్ హైదర్ తల్లి బేగం హైదర్(72), అతని భార్య ఉజ్మా(30) హైదర్‌గా గుర్తించారు. ఆ రోజు ఈ ప్రమాదం జరిగిన వెంటనే శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని రెస్క్యూ బృందాలు సజీవంగా బయటకు తీశారు. ప్రస్తుతం ఆ శిథిలాల కింద ఇంకా ఇద్దరూ లేదా ముగ్గురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన అలాయా అపార్ట్మెంట్ యజమానులు మహ్మద్ తారిఖ్, నవాజీష్ షాహిద్, బిల్డర్ ఫహద్ యజ్దానీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐతే డివిజన్ కమిషనర్ రోషన్ జాకబ్ లక్నో డెవలప్మెంట్ అధికారులపై కూడా కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆ బిల్డర్ యజ్దానీ నిర్మించిన ఇతర భవనాల గురించి కూడా తనీఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఆ భవనాలు కూడా నాణ్యమైనవి కావు అని తేలితే వాటిని కూడా కూల్చేయమని చెప్పారు జాకబ్. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి డివిజన్ రోషన్ జాకబ్ నేతృత్వం వహించగా, లక్నో పోలీసలు జాయింట్ కమిషనర్ పీయూష్ మోర్డియా, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ తదితరులు కమిటీలో సభ్యులుగా ఉంటారని అధికారిక వర్గాలు తెలిపాయి. (చదవండి: లక్నో: కుప్పకూలిన నాలుగంతస్థుల బిల్డింగ్.. శిథిలాల కింద పదుల సంఖ్యలో..!) -
హైదరాబాద్ కూకట్ పల్లిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం
-
కుప్పకూలిన బతుకులు
భాగ్యనగర్‌కాలనీ (హైదరాబాద్): కూకట్‌పల్లిలో ఓ భవనం నాలుగో అంతస్తు స్లాబ్ నిర్మాణం అలా జరిగిందో లేదో.. ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో మూడో అంతస్తు సైతం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. భవనం స్లాబ్‌లు పెద్దశబ్ధంతో కూలడంతో చుట్టుపక్కలవారు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి గ్రామంలో మూడు అంతస్తుల నిర్మాణం జరిగిన ఓ భవనంపై శనివారం నాలుగో అంతస్తు స్లాబ్ వేశారు. అయితే స్లాబ్ పూర్తి అయిన కొద్ది సేపటికి ఊతంగా కట్టిన కర్రల తాడును కూలీలు తీస్తుండగా ఒక్కసారిగా నాలుగో అంతస్తు శ్లాబ్ కూలిపోయింది. ఆ సమయంలో స్లాబ్‌పై ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దయాశంకర్ (25), ఆనంద్ (23) అనే ఇద్దరు కార్మికులు శిథిలాల కింద పడి అక్కడడిక్కడే మృతి చెందారు. స్లాబ్ కూలిన సమయంలో అక్కడే ఉన్న భవన యజమాని లక్ష్మణ్‌రావుకు తలపై గాయం కావటంతో వెంటనే ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వాసు అనే మరో వ్యక్తికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. భవనం కూలిన విషయం తెలుసుకున్న కూకట్పల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందికి వారు సమాచారం ఇవ్వడంతో ఆయా విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకోగా సకాలంలో అధికారులు చేరుకున్నప్పటికీ సహాయక చర్యలు చేపట్టడంలో ఆలస్యం చోటుచేసుకుంది. శిథిలాల కింద సాయంత్రం 5.30 గంటలకు మృతి చెందిన వారిలో ఒకరి చేయి బయటకు కనిపించింది. దీంతో స్లాబ్‌కు వాడిన ఇనుప చువ్వలను కట్ చేసి, సిమెంట్ పెచ్చులను తొలగించి అతికష్టంమీద రాత్రి కల్లా రెండు మృతదేహాలను వెలికి తీశారు. ఈ భవనానికి రెండు అంతస్తులకు అనుమతులు తీసుకొని నాలుగు అంతస్తుల నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. మృతులు ఇద్దరికీ వివాహాలు కాగా బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ‘సెంట్రింగ్’ లోపమే కారణమా? భవన స్లాబ్ నిర్మాణ సమయంలో సెంట్రింగ్ పనులు సరిగా చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్లాబ్ నిర్మాణం జరిపే సమయంలో భారీగా సిమెంట్, కాంక్రీట్ మిశ్రమాన్ని పోస్తుంటారు. అయితే ఆ బరువుకు తగ్గట్లుగా సెంట్రింగ్ పనులు జరగలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. నాలుగో స్లాబ్ పరిస్థితి ఇలా ఉంటే.. మూడో స్లాబ్ కూడా కూలడంతో నాణ్యతలో డొల్ల తనం స్పష్టం తెలుస్తోంది. స్లాబ్లకు సరిగ్గా క్యూరింగ్ జరపకుండా అంతస్తులపై అంతస్తులు నిర్మించడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అనుమతులకు మించి అంతస్తులు.. వాస్తవానికి జీహెచ్ఎంసీ నుంచి భవనం యజమాని జీ ప్లస్ 2 నిర్మాణానికి అనుమతి పొందినట్లు సమాచారం. అయితే అంతకుమించి 3, 4 అంతస్తులను అక్రమంగా నిర్మాణం ని ర్మించారు. ముందుగానే అధికారులు అడ్డుకుని ఉంటే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసేవి కావని స్థానికులు అంటున్నారు. క్రిమినల్ కేసులు పెడతాం: డీసీ రవీందర్‌కుమార్ ఈ ఘటనపై జీహెచ్ఎంసీ కూకట్పల్లి డిప్యూటీ కమిషనర్ రవీందర్‌కుమార్ స్పందించారు. ముందుగా తీసుకున్న అనుమతులకు మించి అదనపు అంతస్తులు వేయడంతో.. ప్రమాదానికి కారణమైన భవన యజమాని, ఆర్కిటెక్ట్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అనుమతికి మించి అంతస్తులు నిర్మించినందుకు భవన యజమానికి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే మాధవరం.. స్లాబ్‌లు కూలిన భవనాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణలు పరిశీలించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. -
కూకట్‌పల్లిలో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం
-
డ్రైన్ ఉంటే మాకేంటి...ఆక్రమించి మరీ భవన నిర్మాణం!
ఒంగోలు సబర్బన్: నగరంలో అక్రమ కట్టడాలు యథేచ్చగా సాగుతున్నాయి. నగర పాలక సంస్థ అధికారుల అనుమతులు లేకుండానే భారీ నిర్మాణాలు పూర్తవుతున్నాయి. కళ్ల ముందే పెద్ద పెద్ద భవనాలు వెలుస్తున్నా నగర పాలక సంస్థ అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. నగరంలో ఒకచోట కాదు అనేక ప్రాంతాల్లో అనుమతుల్లేని నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. తనిఖీలకు వెళ్లిన సమయంలో తెరవెనుక ఒప్పందాలు కుదుర్చుకుని వస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్‌లో అక్రమంగా నిర్మిస్తున్న భారీ భవనం. దక్షిణ బైపాస్ ప్రగతి భవన్‌కు వెళ్లే ప్రధాన గేటుకు ఆనుకొని దానిని నిర్మిస్తున్నారు. వారం రోజులుగా పనులు జరుగుతున్నాయని తెలిసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఒకటికి నాలుగు సార్లు అక్కడికి వెళ్లి వచ్చారే తప్ప నిర్మాణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదంటే.. దాని మతలబు ఏమై ఉంటుందో స్పష్టమవుతోంది. దీనికి తోడు దక్షిణ బైపాçస్లో ఉత్తరం వైపున ఆనుకొని ఒంగోలు నగరానికి చెందిన ప్రధాన డ్రైనేజీ కాలువ ఉంది. మామిడిపాలెం, హౌసింగ్ బోర్డు, ఎస్ఎస్ ట్యాంకు–1 పరిసర ప్రాంతాల నుంచి మురుగు నీరు, వర్షపు నీరు ఈ డ్రైనేజి నుంచే ప్రవహించాల్సి ఉంది. అయితే దాదాపు 10 అడుగుల వెడల్పు ఉండే దీనికి రెండు సిమెంట్ పైపులు వేసి తాత్కాలికంగా మట్టితో కప్పేసి మరీ నిర్మాణం చేస్తున్నారు. పెద్ద వరద వస్తే వర్షపు నీరు సాఫీగా వెళ్లే వీలు లేక ప్రభుత్వ భవనాల సముదాయం, నాగార్జున యూనివర్శిటీ స్టడీ సెంటర్, నవోదయ కళాశాలల్లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా నగరంలో అక్రమ నిర్మాణాలకు కట్టడి వేయాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతున్నా టౌన్ ప్లానింగ్‌లో ఉన్నతాధికారి స్పందించకపోవడం గమనార్హం. నగర పాలక సంస్థ ఆదాయానికి గండి: అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేసుకుంటూ పోతే నగర పాలక సంస్థ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఫ్లింత్ ఏరియాను బట్టి, అంతస్తుల భవనాల లెక్కన కార్పొరేషన్‌కు ఫీజులు చెల్లించాలి. నగర పాలక సంస్థ ఆదాయానికి భారీగా తూట్లు పడుతున్నా తమ జేబులు నిండితే చాలు అన్న చందంగా ఉంది టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు. నోటీసులు ఇచ్చి ఆపుతాం.. అక్రమంగా జరుగుతున్న భవన నిర్మాణాలను ఆపేస్తాం. నిబంధనలకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకుంటాం. దక్షిణ బైపాస్‌లో ప్రగతి భవన్ ముందు జరుగుతున్న భవన నిర్మాణం విషయం నా దృష్టికి వచ్చింది. వెంటనే నోటీసులు ఇవ్వమని టౌన్ ప్లానింగ్ అధికారులకు చెప్పా. నోటీసు ఇవ్వటంతో పాటు అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేస్తాను. టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమాలకు పాల్పడిన విషయం నా దృష్టికి రాలేదు. ఆ విషయంపై కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటాను. – ఎం.వెంకటేశ్వరరావు, కమిషనర్, ఒంగోలు నగర పాలక సంస్థ -
Dubai: ప్రపంచంలోనే ఎత్తైన నివాస భవనం
దుబాయ్: ఆకాశ హర్మ్యాలకు కేరాఫ్ అయిన యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్.. మరో ఘనతను దక్కించుకోబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనానికి దుబాయ్ వేదిక కాబోతోంది. దుబాయ్ పరిధిలో ఆర్థిక ప్రాంతంగా పేరున్న ‘బిజినెజ్ బే’లో వంద ఫ్లోర్లతో నిర్మించిన ఈ హైపర్‌టవర్ గిన్నిస్ రికార్డు ఘనతను సొంతం చేసుకోవడానికి సిద్ధమైంది. అంతకు ముందు ఈ రికార్డు న్యూయార్క్ నగరం(అమెరికా) మాన్‌హట్టన్ 57వ స్ట్రీట్‌లోని సెంట్రల్ పార్క్ టవర్ పేరిట ఉంది. ఆ భవనంలో 98 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక.. ఎత్తు 472 మీటర్ల రికార్డును సైతం దుబాయ్ హైపర్‌టవర్ అధిగమించనుంది. కేవలం ఎత్తులోనే కాదు.. అత్యంత విలాసవంతమైన నివాస భవనంగానూ ఇది రికార్డు సృష్టించడానికి సిద్ధమైంది. సెంట్రల్ పార్క్ టవర్ దుబాయ్‌లో ఈ హైపర్‌టవర్‌ను ప్రపంచ రికార్డు నెలకొల్పే ఉద్దేశంతోనే నిర్మిస్తున్నట్లు నిర్మాణ కంపెనీలు మంగళవారం ప్రకటించాయి. ఎమిరేటి ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ ‘బింఘట్టి’, ప్రముఖ వాచ్‌మేకర్ కంపెనీ ‘జాకోబ్ అండ్ కో’ సంయుక్తంగా ఈ భవనాన్ని నిర్మించాయి. దీంతో.. ఈ భవనానికి బుర్జ్ బింఘట్టి జాకోబ్ అండ్ కో రెసిడెన్సీగా నామకరణం చేశారు. అగ్రభాగాలు.. డైమండ్ ఆకారంలో ఉండడం ఈ భవనానికి ఉన్న మరో ప్రత్యేకత కాగా, రాత్రిపూట మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుతురులో ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఈ ఆకాశ హర్మ్యం. పూర్తిగా డబుల్, త్రిబుల్ బెడ్ రూంలతో పాటు ప్రత్యేకమైన సదుపాయాలెన్నింటినో ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ. చివరి ఐదు ఫ్లోర్లలో అత్యంత విలాసవంతమైన పెంట్‌హౌజ్‌లను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ భవనం ప్రారంభ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇదీ చదవండి: మొట్టమొదటి ఆకాశ హార్మ్యం ఏది? ఎవరు కట్టారో తెలుసా? -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవంతి.. కానీ..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవంతి. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉందిది. రోమ్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన వియా వెనెటోకు కూతవేటు దూరంలో ఉన్న ఈ భవంతి పదహారో శతాబ్దం నాటిది. దీని సీలింగ్‌పై ఆనాటి సుప్రసిద్ధ ఇటాలియన్ చిత్రకారుడు కరవాగియో చిత్రించిన మ్యూరల్స్ ఈ భవంతికి ప్రత్యేక ఆకర్షణ. దాదాపు 70 ఎకరాల ప్రాంగణంలో ఉన్న ఈ భవంతి విస్తీర్ణం 30 వేల చదరపు అడుగులు. ఇటలీలోని ప్రముఖ కుటుంబాల్లో ఒకటైన లుదోవిసీ కుటుంబానికి చెందిన ఈ భవంతిలో ప్రస్తుతం ప్రిన్స్ నికోలా లుదోవిసీ బోన్‌కాంపానీ మూడో భార్య ప్రిన్సెస్ రీటా బోన్‌కాంపానీ లుదోవిసీ ఉంటున్నారు. ప్రిన్స్ నికోలో మొదటి భార్య సంతానం ఆస్తి కోసం దావా వేయడంతో ఈ భవంతిని ఇప్పుడు వేలం వేసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ భవంతికి 53,900 కోట్ల డాలర్లు (రూ. 44.31 లక్షల కోట్లు) ఉంటుందని అధికారుల అంచనా. ఈ ఏడాది జనవరిలోను, ఆ తర్వాత ఏప్రిల్లోను దీనికి వేలం ప్రకటించినా, దీనిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అపర కుబేరులెవరైనా ముందుకొస్తే తప్ప ఈ భవంతిని వేలంలో అమ్మడం సాధ్యం కాదని ఇటాలియన్ అధికారులు అంటున్నారు. వేలంలో కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో దీనిని ఇటాలియన్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తే బాగుంటుందని ప్రిన్సెస్ రీటా దాదాపు 40 వేల సంతకాలతో ప్రభుత్వానికి ఒక పిటిషన్‌ను సమర్పించారు. అయితే, ఈ భవంతి విలువ ఇటలీ సాంస్కృతిక శాఖ బడ్జెట్‌కు మించి ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చదవండి: ఉద్యోగులకు ఊహించని షాక్!..ట్విటర్,మెటా బాటలో మరో దిగ్గజ సంస్థ! -
పుణెలోని బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం.. గ్రౌండ్ ఫ్లోర్లో జహీర్ ఖాన్ రెస్టారెంట్
పుణె: మహారాష్ట్రలోని పూణె నగరంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లుల్లా నగర్ చౌక్ ప్రాంతంలోని మార్వెల్ విస్టా భవనం టాప్ ఫ్లోర్‌లోని వెజిటా రెస్టారెంట్లో ఉదయం 8.45 నిమిషాలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేశాయి. మూడు ఫైరింజన్లు, వాటర్ ట్యాంకర్లను రంగంలోకి దింపినట్లు పుణె అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. Fire breaks out at the top floor of Marvel Vista building in Lulla Nagar Chowk in Pune, Maharashtra pic.twitter.com/y2Y9YQTVFu — The Jamia Times (@thejamiatimes) November 1, 2022 ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇందులో మంటల ధాటికి కాలిపోతున రెస్టారెంట్ రూఫ్, కీటికీలు కూలి కిందపడిపోవటం కనిపిస్తోంది. అయితే ఈ ప్రమాద సమమంలో రెస్టారెంట్ మూసివేసి ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించించలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇదే బిల్డింగ్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ కూడా ఉన్నట్లు తెలిసింది. చదవండి: ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిన మంటలు #Pune: Massive fire breaks out inside a home at Marvel Vista, a G+7 storey building in Lullanagar, Kondhwa Two water tankers and three fire brigades responded immediately and reached the spot#PuneFire #Fire pic.twitter.com/81x5aVnaGd — Free Press Journal (@fpjindia) November 1, 2022 -
మైండ్‌బ్లోయింగ్ ఐడియా.. మట్టి లేకుండా వ్యవసాయం, ఏడాదికి 70 లక్షల ఆదాయం!
భారత్ గతంలో వ్యవసాయ ఆధారిత దేశంగా ఉండేది. అధిక శాతం జనాభా ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉండేవారు. అయితే ఏళ్లు గడిచే కొద్దీ వ్యవసాయానికి సాయం లేక డీలా పడిపోయింది. దీంతో వ్యవసాయ భూములు కాలం గడిచే కొద్దీ కనుమరుగవుతూ ఉన్నాయి. మరోవైపు ఇటీవల కొందరు రసాయనాల ద్వారా పంటలు పండిస్తున్నట్లు చాలా ఘటనల్లో నిరూపితమైంది. దీంతో ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకమైంది. ఈ తరుణంలో ఎటువంటి రసాయనాలు కలపకుండా సేంద్రీయ పద్ధతిలో సహజంగా పండించిన కూరగాయలు, పండ్లకి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. మట్టి లేకుండా వ్యవసాయం.. అందుకే వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఓ వ్యక్తి తన ఇంటినే వ్యవసాయ క్షేత్రంగా మార్చి ఏడాదికి 70 లక్షల సంపాదిస్తూ అందరికీ షాకిస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్ కి చెందిన రామ్ వీర్ సింగ్ అనే రైతు అతని ఇంటి మీద పంట వేయడమే కాకుండా లాభాల బాట పట్టించి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు. గతంలో జర్నలిస్ట్‌గా పని చేసిన ఈయన.. తనకున్న వనరులతో వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. అందుకే వింపా ఆర్గానిక్ అండ్ హైడ్రోపోనిక్స్ అనే స్టార్టప్ ని ప్రారంభించి హైడ్రోపోనిక్ పద్దతిని తెలుసుకుని, దానికి అనుగుణంగా తన ఇంటిలో పై ఉన 3 అంతస్తులను వ్యవసాయ క్షేత్రంగా మలచుకున్నాడు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ పద్ధతితో సాగుకు మట్టి అవసరం లేదని, 90 శాతం నీటిని పొదుపు చేయవచ్చు. ఇందులో రసాయనాలు కూడా వాడాల్సిన అవసరం లేదు. కేవలం పీవీసీ పైపుల సహాయంతో అతని బాల్కనీలో పంటలు పండిస్తున్నాడు. స్ట్రా బెర్రీ, కాలీ ఫ్లవర్, బెండకాయలు వంటి 10 వేల రకాల మొక్కలను 3 అంతస్తుల్లో లేయర్స్ గా వేసి పండిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరో విషయం ఏమిటంటే ఈ విషయంలో ఇతర రైతులకు కూడా రామ్ వీర్ సహాయం చేస్తున్నాడు. This man earns 70 lakhs growing vegetables in a 3 storey house without soil or chemicals.#growingvegetables #housegardening #chemicalfree #jounalist #uttarpradesh pic.twitter.com/aZ3N6KFCWN — The Better India (@thebetterindia) October 20, 2022 చదవండి: క్రెడిట్ స్కోరు పెంచుకోవాలా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! -
ఘోర అగ్ని ప్రమాదం...భవనంపైకి దూసుకెళ్లిన మిలటరీ విమానం
రష్యా మిలటరీ విమానం తొమ్మిది అంతస్తుల భవనంపైకి దూసుకురావడంతో ఒక్కసారిగా అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఈ ఘటన ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న రష్యాలోని యెయిస్క్ ప్రాంతంలో సంభవించింది. ఈ సుఖోయ్-34 విమానం మిలటరీ ఎయిర్‌ఫీల్డ్ నుంచి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది ఒక మీడియం రేంజ్ సూపర్సోనిక్ జెట్ ఫైర్‌బాల్‌గా పేలినట్లు ఆ ప్రాంతీయ గవర్నర్ వెనియామిన్ కొండ్రాటీవ్ తెలిపారు. సుమారు ఐదు అంతస్తుల్లో దాదాపు 2 వేల చదరపు మీటర్లు మంటలు వ్యాపించినట్లు వెల్లడించారు. టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు పైలెట్లు నివేదించినట్లు పేర్కొన్నారు. అందులోని విమాన సిబ్బంది విమానం అపార్టమెంట్ కాంప్లెక్స్ వైపుకి దూసుకొచ్చేలోపు బయటకొచ్చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా 13 మంది మృతి చెందగా, 19 మంది తీవ్రంగా గాయపడ్డారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సమాచారం రష్యా అధ్యక్షుడి పుతిన్‌కి తెలియజేసినట్లు పేర్కొంది. అలాగే మిలటరీ విమానంలో గాయపడ్డవారికి తక్షణ సాయం అందించాలని క్రెమ్లిన్ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. Watch the moment of military #plane #crash at a residential building in #Yeysk , #Russia. pic.twitter.com/TEunPX3KQl — Gaurav Kumar Singh (@GKSinghJourno) October 17, 2022 In the Krasnodar Territory of Russia, a military plane crashed on a residential building in Yeysk. According to preliminary data, the pilot managed to eject. Eyewitnesses report that after the plane crash, a residential building is on fire from the first to the ninth floor. pic.twitter.com/NytFaAB8Up — Ey Villan (@NeutralNews111) October 17, 2022 (చదవండి: ఉక్రెయిన్‌పై ఇరాన్ డ్రోన్ బాంబులు.. 8 మంది మృతి) -
భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలు.. షాకింగ్ దృశ్యాలు వైరల్
బీజింగ్: చైనాలోని బహుళ అంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా పలు అంతస్థులు మంటల్లో దగ్ధమైపోయాయి. దట్టమైన పొగతో అక్కడి వాతావరణం అత్యంత భయానకంగా ఉంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే రెస్క్యూ కార్యక్రమం చేపట్టింది. ఆ భవనం ప్రభుత్వ యజమాన్యంలోని టెలికాం కార్యాలయం అని చైనా పేర్కొంది. ఈ ఘటన సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్షాలో చోటుచేసుకుంది. ఈ భయానక ఘటనకు సంబధించిన వీడియో అన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: క్వీన్ అంత్యక్రియల వేళ... అనుహ్య ఘటన) -
ఆదివాసీ, గిరిజనానికి ప్రత్యేక ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మించిన జంట భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రేపు(ఈనెల 17న) ప్రారంభించనున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఈ ఏర్పాట్లను అత్యంత ఘనంగా చేపట్టింది. భవనాల ప్రారంభోత్సవానికి ఆయా వర్గాల ప్రజలను ఆహ్వానిస్తోంది. గిరిజన గూడేలు, ఏజెన్సీ గ్రామాలు, తండాల్లోని పంచాయతీలకు ప్రత్యేకంగా ఆహ్వానాలను పంపింది. ఆదివాసీ తెగలు, గిరిజన పౌరులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని అందులో సూచించింది. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంతా హైదరాబాద్‌లో జంట భవనాల ప్రారంభోత్సవానికి హాజరు కావాలని సూచి స్తూ, ఆయా ఉద్యోగులకు ఆన్‌డ్యూటీ సౌకర్యాన్ని సైతం కల్పించింది. జంట భవనాల ప్రారంభోత్సవం అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే గిరిజన మహాసభను విజ యవంతం చేయాల్సిందిగా ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఒక్కో భవనానికి రూ. 22 కోట్లు... మహానగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్‌లో ఈ రెండు భవనాల కోసం ఎకరా స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చింది. నిర్మాణంకోసం రూ.44 కోట్లు కేటాయించింది. ఓక్కో భవనానికి రూ.22 కోట్లు చొప్పున ఖర్చు చేసింది. ఒక్కో భవనంలో సగటున వెయ్యి మంది సమావేశమయ్యేందుకు వీలుగా నిర్మించింది. ఇక ఈ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులకు అక్కడే వసతి కల్పించేలా గదులు ఉన్నాయి. ఆయా భవనాల్లోకి ప్రవేశించగానే వారి సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే బొమ్మలు, కళాత్మక చిత్రాలను కూడా ఏర్పాటు చేసింది. గతేడాది సెప్టెంబర్ నాటికే భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సమయం కోసమే గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈనెల 17న ముహూర్తం కుదరడంతో.. రేపు ఆ రెండు భవనాలు ప్రారంభం కానున్నాయి. -
మెలికల టవర్.. ఎత్తు 590 అడుగులు..
బీజింగ్: చూశారుగా ఎలా మెలితిరిగి ఉందో.. అందుకే ఇది ప్రపంచంలోని అత్యంత మెలికలు తిరిగిన ఆకాశహార్మ్యాల్లో ఒకటిగా నిలిచింది. పశ్చిమ చైనాలోని చోంగ్క్వింగ్ నగరంలో తాజాగా ప్రారంభమైన ఈ టవర్ ఎత్తు 590 అడుగులు. ‘డ్యాన్స్ ఆఫ్ లైట్’గా పిలిచే ఈ భవంతి 8.8 డిగ్రీల కోణంలో మెలికలు తిరిగి ఉంది. ఈ తరహాలో నిర్మించిన ఇతర ఆకాశహార్మ్యాలకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ మెలికలు ఈ టవర్ సొంతమని నిర్మాణ సంస్థ ఏడస్ తెలిపింది. ఉత్తర ధ్రువం వద్ద ఆకాశంలో వివిధ ఆకృతుల్లో కనిపించే కాంతుల తరహాలో ఈ టవర్‌ను డిజైన్ చేశామని సంస్థ పేర్కొంది. పగటిపూట సూర్యకిరణాల తాకిడి వల్ల ఈ భవంతి మెరుస్తూ కనిపిస్తుందని.. రాత్రిపూట గ్లాస్ ప్యానెళ్ల వల్ల కాంతులు వక్రీభవనం, పరావర్తనం చెందుతుంటాయని.. అందుకే దీనికి డ్యాన్స్ ఆఫ్ లైట్ అని పేరు పెట్టినట్లు వివరించింది. చదవండి: జింబాబ్వేలో 'మీజిల్స్' విలయం.. 700 మంది చిన్నారులు మ్యత్యువాత -
మన హైదరాబాద్‌లో 100% గ్రీన్ ఆఫీస్! అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే..
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి నెట్‌జీరో ప్రభుత్వ కార్యాలయ భవనం హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో ఆధునిక హంగులతో శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్రెడ్కో) కోసం 1,872 గజాలు, ఐదంతస్తుల్లో నిర్మితమవుతున్న ఈ భవనంలో నూటికి నూరు శాతం పర్యావరణ అనుకూల పద్ధతులను అనుసరిస్తున్నారు. నిరంతరం చల్లదనం ఉండేలా... భవనం శ్లాబ్‌లో స్టీల్, కాంక్రీట్ మిశ్రమంతోపాటు రేడియంట్ ఫ్లోర్ పైపులు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల పైపుల్లో నిరంతరం నీరు ప్రవహిస్తూ భవనం పైకప్పు నుంచి లోనికి వేడి రాకుండా ఇది నియంత్రించనుంది. దీంతో భవనం ఎల్లప్పుడూ చల్లదనంతో ఉండనుంది. ఫలితంగా ఏసీలు, ఫ్యాన్ల వినియోగం గణనీయంగా తగ్గనుంది. ఎంత ఖర్చు చేస్తే.. అంత ఉత్పత్తి.. భవనంలో ఎంత విద్యుత్‌ను ఖర్చు చేస్తున్నామో.. అంత ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో టీఎస్ రెడ్కో భవనాన్ని నిర్మిస్తున్నారు. సాధారణ భవనాల్లో ఏడాదికి ప్రతి చదరపు మీటరు (చ.మీ.)కు 175 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అదే ఎనర్జీ కన్జ ర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) భవనాలల్లో 120 యూనిట్లవుతుంది. అయితే టీఎస్రెడ్కో నిర్మించనున్న ఈ భవనంలో మాత్రం కేవలం 45 యూనిట్ల విద్యుత్ ఖర్చయ్యేలా రూపొందిస్తున్నారు. ఇందుకోసం భవన నిర్మాణ డిజైన్లోనే ఇంధన సమర్థత ఉండేలా చర్యలు చేపడుతున్నారు. పైకప్పులో గాలి మర, సౌర విద్యుత్.. భవనం పైకప్పులో సౌర విద్యుత్ ఫలకాలు, గాలి మరను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈ భవన అవసరాలకు అయ్యే విద్యుత్ ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. భవనంలో విద్యుత్ వినియోగాన్ని తెలిపే అనలిటికల్ డేటా డిస్ప్లే, అగ్నిప్రమాదాల గుర్తింపు అలారం, సమాచార డ్యాష్ బోర్డులు, ఎల్ఈడీ డిస్ప్లే వంటివి ఉండనున్నాయి. సాధారణ స్టీల్ నిర్మాణాలతో పోలిస్తే 10 శాతం అదనపు ధృఢత్వాన్ని కలిగి ఉండేలా ఆటోక్లేవ్డ్ ఏరోటెడ్ కాంక్రీట్ బ్లాక్స్‌తో నిర్మాణం చేపడుతున్నారు. గాలి, వెలుతురు ధారాళంగా ప్రవేశించేలా భవన డిజైన్‌ను రూపొందించారు. దీంతో భవనం లోపల విద్యుత్ ఉపకరణాల వినియోగం తగ్గనుంది. భవనం తొలి 3 అంతస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ (టీఎస్ఎన్పీడీసీఎల్) కార్యాలయం, 4, 5 అంతస్తులలో రెడ్కో ఆఫీసు ఏర్పాటు కానున్నాయి. జూన్ నాటికి అందుబాటులోకి.. ఈ భవన డిజైన్లను ఢిల్లీకి చెందిన అశోక్ బీ లాల్ అర్కిటెక్ట్స్ రూపొందించగా.. జైరాహ్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీ నిర్మిస్తోంది. బేస్మెంట్, స్టిల్ట్‌తోపాటు ఐదంతస్తుల్లో భవనం ఉంటుంది. ప్రతి అంతస్తు 8 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంటుంది. రూ. 22.76 కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గ్రౌండ్‌ఫ్లోర్ శ్లాబ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. -
పరిచయమైన మూడు రోజులకే పెళ్లి చేయాలంటూ.. యువకుడి హల్చల్
సాక్షి, హైదరాబాద్: ఒకరోజు చూశాడు.. రెండో రోజు మాట్లాడాడు.. మూడో రోజు బిల్డింగ్ ఎక్కి ఆ అమ్మాయితో నాకు పెళ్లి చేయండి.. లేదంటే చేస్తాను.. అంటూ ఓ యువకుడు హల్చల్ చేయడంతో కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి గ్రామంలో కలకలం రేపింది. పేట్‌బషీరాబాద్ ఎస్ఐ భాను, స్థానికుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా రాళ్లకల్ గ్రామానికి చెందిన కదిరి ఆంజనేయులు దూలపల్లిలో ఉంటున్న తన మామ ఇంటికి వచ్చి స్థానికంగా పని చేసుకుంటూ అద్దె గదిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఓ మైనర్(13) అమ్మాయిని చూశాడు. రెండో రోజు ఆమెతో మాట కలిపాడు. ఇంతలో ఏమైందో ఏమో.. న కు ఆ పిల్లను ఇచ్చి పెళ్లి చేయమని శనివారం ఉదయం ఐదంతస్తుల బిల్డింగ్ ఎక్కి హల్చల్ చేయడం కలకలం రేపింది. ఈ విషయాన్ని స్థానికులు కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి సమా చారం ఇచ్చారు. సదరు యువకుడు సై తం 100కు డయల్ చేసి తాను ఆత్మహకు పాల్పడుతున్నట్లు పోలీసులకు తెలిపారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుకున్న పోలీసులు కొద్దిసేపు యువకుడితో మాటలు కలిపి స్థానికుల సాయంతో నాలుగు తగిలించి కిందకు తీసుకు వచ్చారు. సదరు అమ్మాయిపై ప్రేమ విషయాన్ని చెబుతూ రావడంతో స్థానికులు ఆరా తీయగా చిన్నారి మైనర్ అని తేలింది. ఈ మేరకు పోలీసులు న్యూసెన్స్ కేసు కింద సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. చదవండి: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. మళ్లీ ఏక్ షామ్.. చార్మినార్ కే నామ్ -
ఇంటికి పంపలేదని.. భవనం పైనుంచి అందరూ చూస్తుండగానే..
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యా లయంలో చదువుతున్న విద్యార్థిని.. ఇంటికి పంపించలేదనే ఆవేదనతో భవనం పైనుంచి దూకగా గాయాలయ్యాయి. మండలంలోని తుంగారానికి చెందిన పప్పుల మురళి–కృష్ణ కుమారి దంపతుల కుమార్తె ప్రమీలను గత నెలలో కేజీబీవీలో చేర్పించారు. అప్పటి నుంచి ప్రమీల విద్యాలయంలో ఉండనని రోదిస్తుండగా, 3రోజులుగా ఇంటికి పంపించాలని కోరుతోంది. ఈ క్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కాంతకుమారి విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇంతలోనే మంగళవారం ఉదయం బట్టలు ఆరేసేందుకు భవనం పై అంతస్తుకు వెళ్లి ప్రమీల అందరూ చూస్తుండగానే దూకింది. అయితే, ఆమె పడిన ప్రదేశంలో బురద గుంత ఉండటంతో గాయాలతో బయటపడింది. ఈమేరకు స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తర్వాత కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఐదో అంతస్థు నుంచి కిందపడిన చిన్నారి.. దేవుడిలా వచ్చి..
ఎత్తైన భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడుతున్న చిన్నారిని ఓ వ్యక్తి దేవుడిలా వచ్చి పట్టుకొని ప్రాణాలు రక్షించాడు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. జెజియాంగ్ ప్రావిన్స్‌లోని టోంగ్సియాంగ్లో షెన్ డాంగ్ అనే వ్యక్తి తన కారును రోడ్డు పక్కన పార్క్ చేస్తుండగా పెద్ద శబ్ధం వినిపించింది. ఓ పెద్ద అపార్ట్మెంట్లోని అయిదో అంతస్తు కిటికీలోంచి అదుపుతప్పి రెండేళ్ల చిన్నారి కిందకు పడటం గమనించాడు. కిటికీ నుంచి పడిపోతున్న సమయంలో ముందుగా పాప.. ఒక స్టీల్ రూఫ్ మీద పడింది. అక్కడినుంచి క్షణాల్లోనే కిందకు జారింది. అప్రమత్తమైన వ్యక్తి వెంటనే బిల్డింగ్ వద్దకు పరుగెత్తి కింద పడుతున్న పాపను కాపాడి హీరోలా నిలిచాడు. హీరోలు మన మధ్యే ఉంటారనే క్యాప్షన్‌తో చైనా ప్రభుత్వ అధికారి లిజియాన్ జావో ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉన్న ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 68 వేల మంది వీక్షించారు. ఈ వీడియో నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. చిన్నారిని రక్షించిన వ్యక్తి ధైర్య సాహసాలను ప్రశంసిస్తున్నారు. ‘నిజమైన హీరోలు ప్రపంచంలోనే ఉన్నారు. సినిమాల్లో కాదు. సూపర్ హీరో.. లెజెండ్.. అతనికి ప్రమోషన్ లేదా మెడల్ ఇవ్వండి’ అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: కోతి పగ పట్టిందా.. రక్తం వచ్చేలా తల్లి, చిన్నారిపై దాడి కాగా ప్రమాదంలో చిన్నారి కాళ్లు, ఊపిరిత్తితులకు గాయాలు అయినట్లు, ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని వైద్యులు తెలిపారు. పాప ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై డాంగ్ మాట్లాడుతూ.. రోడ్డు పక్కన కారు పార్క్చేస్తుండగా పాప పడిపోవడం గమనించి వెంటనే పరుగెత్తి ఆమెను రక్షించినట్లు తెలిపారు. తాను సమయానికి అక్కడికి చేరుకొని పాపను కాపాడటం అదృష్టంగా భావిస్తున్నానని, లేదంటే పేర్కొన్నారు. Heroes among us. pic.twitter.com/PumEDocVvC — Lijian Zhao 赵立坚 (@zlj517) July 22, 2022 -
హఠాత్తుగా ‘కదిలిన’ పురాతన భవనం: వీడియో వైరల్!
ఏదైన భవనం కదలడం గురించి విన్నామా!. లేదుకదా అదికూడా కేవలం టీవీల్లో ఏదైన గ్రాఫిక్ మాయాజాలంతో జరిగి ఉండోచ్చు. అంతేగానీ ఒక పెద్ద భవనం కదలడం అన్నది అసాధ్యం. నమశక్యం గానీ నిజం. కానీ అవన్నంటిని కొట్టిపారేసేలా ఔను! భవనాలు కదులుతాయి అని కచ్చితంగా అంటాం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి. అసలు భవనం కదలడం ఏంటి? అదేలా సాధ్యం అనే కదా! అసలు విషయం ఏంటంటే.....చైనాలోని షాంఘైలో వందేళ్ల పురాతన భవనం కదిలింది. అది కూడా వందేళ్ల నాటి పురాతన భవనం కదలడం ఏంటీ? అనే కదా!. ఇది పురాతనమైన భవనం కావడంతో చైనా ప్రభుత్వానికి కూల్చడం ఇష్టం లేదు. పైగా ఆ ప్రాంతంలో ఉండటం కూడా ఇష్టం లేదటా. అందుకే ఏకంగా ఆ భవనాన్నే ఉన్నపళంగా కదిలించాలనుకుంది. పైగా ఆ భవనం బరువు సుమారు మూడు వేల టన్నుల బరువు. కదల్చడం అంత సులభమేమి కాదు. అందుకని చైనా ప్రభుత్వం భారీ యంత్రాల సాయంతో ఆ ప్రదేశం నుంచి ఆ భవనాన్ని కదిలించి మరో ప్రదేశంలో యథాతధంగా ఉంచింది. ఏదో బొమ్మ ఇల్లుని మార్చినట్లుగా సునాయాసంగా మార్చింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఒక చైనా మహిళ 'శతాబ్దాల నాటి ఇల్లు పరిగెడుతోంది' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 3,800-ton century-old building slowly "walking" in Shanghaipic.twitter.com/fCeTbKpR7M — Zhang Meifang张美芳 (@CGMeifangZhang) July 10, 2022 (చదవండి: చెత్త బండిలో మోదీ, ఆదిత్యనాథ్ ఫోటోలు... ఉద్యోగం కోల్పోయిన మున్సిపాలిటీ ఉద్యోగి) -
వందేమాతరం అంటూ భవనం పై నుంచి దూకేసిన దొంగ.. షాక్‌లో పోలీసులు
ఇటీవలకాలంలో దొంగలు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. విచిత్రమైన వాటిని దొంగలించి ప్రజలను, పోలీసులను షాక్‌కి గురి చేస్తున్నారు. సినిమాలోని డాన్లు మాదిరి దొంగతనం చేసి తప్పించుకోవడం వంటివి చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి దొంగతనానికి వచ్చాడు. ఐతే సమయానికి పోలీసులు వచ్చేయడంతో...ఆ వ్యక్తి అరెస్టు అవుతానన్న భయంతో ఏం చేశాడో వింటే కచ్చితంగా షాక్ అవుతారు. అసలేం జరిగిందంటే....ముంబైలో కొలాబా ప్రాంతంలోని చర్చ్‌గేట్ సమీపంలోని ఒక భవనంలోకి 25 ఏళ్ల వ్యక్తి ప్రవేశించాడు. ఆ భవనం వాచ్మెన్ ఒక అపరిచిత వ్యక్తి గేటు పై నుంచి దూకి భవనంలోకి ప్రవేశించనట్లు గమనించాడు. దీంతో అతను ఎమర్జెన్సీ అలారం మోగించాడు. ఆ అలారం మోగడంతో భవనంలోని నివాసితులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో పోలీసులు కూడా సంఘటన స్థలానికి సమయానికి చేరుకున్నారు. దీంతో సదరు వ్యక్తి అరెస్టు అవుతానన్న భయంతో ఆ భవనం పైన నాల్గో అంతస్తులోని కిటికి అంచునే నిలబడిపోయాడు. అతన్ని కిందకి వచ్చేయమని పోలీసులు, నివాసితులు చెప్పిన అతను వినలేదు. ఆఖరికి అతన్ని అరెస్టు చేయమని పోలీసులు హామీ ఇచ్చిన అతన కన్విన్స్ అవ్వలేదు. ఇక చేసేదేమీ లేక పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని కూడా రప్పించారు. వారు అతన్ని ప్లాస్టిక్ వలపైకి దూకేయమని కోరారు కూడా. దాదాపు మూడు గంటలపాటు అతన్ని ఒప్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇంతలో ఒక పోలీసు సేఫ్టి బెల్ట్ సాయంతో దొంగ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అంతే సదరు దొంగ వందేమాతరం అంటూ అరుస్తూ... నాల్గో అంతస్తు నుంచి దూకేశాడు. దీంతో ఒక్కసారిగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, నివాసితులు షాక్ అయ్యారు. ఈ ఘటన అక్కడ ఉన్నవారందర్నీ కలచి వేసింది. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సదరు వ్యక్తిని రోహిత్‌గా గుర్తించమని పోలీసులు చెప్పారు. ఐతే అతను చికిత్స పొందుతూ మృతి చెందడంతో అతని గురించి పూర్తి విషయాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. (చదవండి: తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. వీడియో తీసి) -
అతి పెద్ద శక్తిగా అవతరించనున్న చైనా... టెన్షన్లో యూఎస్!
China Monitoring US Military: చైనా కంబోడియాలో సైనిక స్థావరాలను ఏర్పరచుకుంటోంది. ఎప్పటి నుంచో ఇండో ఫసిపిక్‌లో ప్రాంతంలో తన అధిపత్యధోరణిని చూపించుకునేందుకు చైనా ఎంతగానో తాపత్రయపడుతోందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చైనా వ్యూహాత్మకంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో మొదటిది అయినా కంబోడియాలో సైనిక ఉపయోగం కోసం నౌకదళ సదుపాయన్ని నిర్మిస్తోంది. అదీగాక ఇప్పటి వరకు చైనాకు తూర్పు ఆఫ్రికా దేశమైన జిబౌటిలోనే ఏకైక విదేశీ సైనిక స్థావరం ఉంది. ప్రపంచ శక్తిగా ఎదగాలన్న చైనా ఆకాంక్ష మేరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సైనిక సౌకర్యాల నెట్వర్క్ ఉండేలా ఈ నౌకదళ స్థావారాలను నిర్మిస్తోందని అమెరికా చెబుతోంది. బీజింగ్ వ్యూహంలోనే భాగామే ఈ కంబోడియాలో నిర్మిస్తున్న కొత్త నావికా స్థావరం అని కూడా పేర్కొంది. అదీగాక చైనా నాయకులకు ఇండో పసిఫిక్ ఒక ముఖ్యమైన భాగం మాత్రమే కాదు. ఇది తమ చారిత్రాత్మక ప్రాభావాన్ని చూపించుకునే అతి ముఖ్యమైన ప్రాంతంగా వారు భావిస్తారు. అంతేకాదు 2019లోనే ది వాల్ స్ట్రీట్ జర్నల్ చైనా కంబోడియాతో తన మిలటరీ స్థావారాన్ని ఏర్పర్పచుకునేలా ఒప్పందం చేసుకుందని ప్రచురించింది కూడా. దీంతో అమెరికా దాని మిత్రదేశాలు ఆయా దేశాలను ప్రశ్నించింది కూడా. ఐతే అప్పుడు ఆ ఇరు దేశాలు ఆ విషయాన్ని తోసిపుచ్చాయి. కానీ కాలక్రమైణ అదే నిజమైందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు చైనా ఇలాంటి స్థావరాల్లో సైనిక బలగాలను మోహరింపచేయడమ కాకుండా యూఎస్ మిలటరీ పై నిఘా పెట్టేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడిందంటూ అమెరికా దుమ్మెత్తిపోస్తోంది. (చదవండి: దారుణం: మహిళను బలవంతంగా రైల్వే ట్రాక్‌పైకి తోసేశాడు..!) -
మా సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం తొలి ప్రాధాన్యత: మంచు విష్ణు
Manchu Vishnu Interesting Comments On Maa Building: ‘‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) సభ్యుల ఆరోగ్యం, అవకాశాలు, సంక్షేమం కోసం తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎన్నికల హామీలో భాగంగా ‘మా’కి శాశ్వత భవన నిర్మాణం కోసం ఆరు నెలల్లో భూమి పూజ చేస్తాం’’ అని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్లో ‘మా’ సభ్యులకు ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘‘మా’ ఎన్నికల హామీలను 6 నెలల్లోనే 75 శాతం పూర్తి చేశాను. ‘మా’ సభ్యులకు ప్రతి మూడు నెలలకు ఒక హెల్త్ క్యాంప్ నిర్వహిస్తాం. ‘మా’ సభ్యత్వం నిబంధనలను కఠినతరం చేశాం.. అందుకు డీఆర్సీ కమిటీ చైర్మన్ కృష్ణంరాజు, సభ్యులు బాలకృష్ణ, మోహన్ బాబు, గిరిబాబు, జయప్రద, శివకృష్ణ అమోదం తెలిపారు. కళామతల్లిని నమ్ముకున్న వారే ‘మా’లో సభ్యులుగా చేరాలి. సినిమా టెక్కెట్ ధరల పెంపు విషయంలో నేను మాట్లాడలేదని నన్ను విమర్శించినా, సైలెంట్‌గా ఉన్నా. ఒక రాష్ట్రంలో టిక్కెట్ ధరలు పెంచినందుకు, మరో రాష్ట్రంలో టిక్కెట్ ధరలు తగ్గించినందుకు కోర్టులకు వెళ్లారు. అలాగే కొన్ని సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచారు. దాని వల్ల విపరీతమైన ఇబ్బంది ఉందని అంటున్నారు. ఏది తప్పు? ఏది ఒప్పు? అనే చర్చ చాలా పెద్దది. దాని గురించి నేను చెప్పేకన్నా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ చాంబర్ కలిసి చర్చించి, ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘మా’ ఉపాధ్యక్షులు మాదాల రవి, పృధ్వీ, నటుడు వీకే నరేష్, ట్రెజరర్ శివబాలాజీ, ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ జీవీ రావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: టాలీవుడ్లో ఎన్టీఆర్, సమంత టాప్.. చిరంజీవితో ఏ గొడవ లేదు.. వారే దూరం పెంచుతున్నారు: జీవిత var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం
-
హెచ్ఎండీఏలో అంతా మా ఇష్టం.. ఆన్లైన్లో స్వీకరణ.. ఆఫ్‌లైన్‌లో జారీ
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్ అనుమతుల జారీలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు అధికారులు నిబంధనల్లో మార్పులు చేస్తున్నారు. కాల్వలు, పంటపొలాలు, వక్ఫ్‌స్థలాలు సైతం ఉన్నపళంగా ‘రెసిడెన్షియల్ జోన్’ జాబితాలో చేరిపోతున్నాయి, నిర్మాణదారులు నేరుగా హెచ్ఎండీఏకు వెళ్లాల్సిన అవసరం లేకుండా టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ.. నేరుగా కలిస్తే తప్ప పనులు కావడం లేదు. మరోవైపు ఎంఎస్‌బీఆర్ (మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ రెగ్యులేటరీ కమిటీ) సమావేశాలు ఏర్పాటు చేయకుండానే బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులను ఇస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని శంకర్పల్లి, శంషాబాద్, మహేశ్వరం, మేడ్చల్, శేరిలింగంపల్లి, ఘట్కేసర్ తదితర ప్రాంతాల్లో నిబంధనలను పాతరేసి లేఅవుట్ పర్మిషన్లు ఇస్తున్నారు. ఉల్లంఘనలు ఇలా.... ∙తెల్లాపూర్, నల్లగండ్ల తదితర ప్రాంతాల్లో కొన్ని భూములపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో వివాదం కొనసాగుతోంది. ఈ భూములు వ్యవసాయ కాల్వల పరిధిలో ఉండటంతో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. కానీ కొంతమంది రియల్టర్లు కొందరు అధికారుల సహకారంతో వివాదాస్పద భూ ముల్లోనూ అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. ∙తెల్లాపూర్‌లోని ఓ సర్వే నంబర్లో ఉన్న ఇలాంటి పంట కాల్వ (క్రాఫ్ట్ కెనాల్) పరిధిలోని 5 ఎకరాల భూమిలో 9 అంతస్తుల భవనానికి ఇటీవల అనుమతులిచ్చారు. ఈ మేరకు హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో ‘రెసిడెన్షియల్ జోన్’గా మార్చేశారు. సదరు నిర్మాణ సంస్థ రెండేళ్ల క్రితమే భవన నిర్మాణ అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోని నిబంధలకు విరుద్ధంగా ఉన్నట్లు అప్పట్లో ఓ ఉన్నతాధికారి ఏకంగా నాలుగుసార్లు తిరస్కరించారు. చివరకు ఇటీవల మోక్షం లభించింది. ఎంఎస్‌బీఆర్ (మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ రెగ్యులేటరీ ) కమిటీ సమావేశం కూడా లేకుండానే అనుమతులను ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఎంఎస్‌బీఆర్ కమిటీ గతంలో నిర్వహించిన సమావేశాల్లోని మినిట్స్‌లో మార్పులు చేసినట్లు తెలిసింది. నిర్మాణదారులకు, అధికారులకు నడుమ మధ్యవర్తులే అన్ని విధాలా “ఈ వ్యవహారాన్ని’ నడిపించడం గమనార్హం. ఏమార్చి ఎల్పీ ఇచ్చారు... అధికారులు తలుచుకుంటే చెరువులు, కుంటలు, అడవులు సైతం నివాసయోగ్యమైన జాబితాలో చేరిపోతాయి. చివరకు వక్ఫ్‌భూములకు సైతం రక్షణ కొరవడింది. మహేశ్వరం మండలంలోని కొంగరకుర్దు గ్రామంలో ఓ సర్వే నంబర్లో ఉన్న 11.17 ఎకరాల వక్ఫ్‌భూమిని ఇలాగే మార్చేసి లే అవుట్ పర్మిషన్ ఇచ్చారు. ధరణిలోనూ, రిజిస్ట్రార్ రికార్డుల్లోనూ ఇది నిషేధిత జాబితాలో ఉంది. దీనిపై ఇటీవల స్థానికంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా మరోసారి అదేస్థలంలో నిర్మాణ అనుమతులను పొందేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. ‘మాస్టర్‌ప్లాన్‌లో నిబంధనలకు అనుగుణంగా ఉన్న స్థలాల్లో రకరకాల కొర్రీలు పెట్టి తిప్పుకొంటారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భూములకు మాత్రం అడ్డగోలుగా అనుమతులిచ్చేస్తారు’అని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రతినిధి విస్మయం వ్యక్తం చేశారు. చదవండి: ..అంతకుమించి.. బీజేపీ దృష్టి మొత్తం ఆ సభ మీదే! -
ప్రపంచంలోనే సన్న భవనం
ప్రపంచంలోని అతి పొడవైన భవనం ఏది అనగానే టక్కున బుర్జ్ ఖలీఫా అంటారు. మరి ప్రపంచంలోని అతి సన్నని, ఎత్తైన భవనం ఎక్కడుందో, దాని పేరేంటో తెలుసా? న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో నిర్మించిన ‘స్టెయిన్వే టవర్’. దీని వెడల్పు కేవలం 17.5 మీటర్లు. ఎత్తేమో 435 మీటర్లు. అంటే ఎత్తుకు వెడల్పుకు ఉన్న నిష్పత్తి 25:1. అదే 828 మీటర్లున్న బుర్జ్ ఖలీఫా వెడల్పు 45 మీటర్లు. ఈ సన్నని స్టెయిన్వే టవర్‌లో మొత్తం 82 అంతస్తులు, 60 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక్కో అపార్ట్మెంట్ ధర దాదాపు రూ. 60 కోట్లు. ఇక పెంట్ హౌస్ ధరైతే ఏకంగా రూ. 500 కోట్లపైనే. ఈ సన్నని భవనంను న్యూయార్క్ ఆర్కిటెక్చర్ కంపెనీ ‘షాప్’ డిజైన్ చేసింది. జేడీఎస్ డెవలప్మెంట్, ప్రాపర్టీ మార్కెట్స్ గ్రూప్ అండ్ స్ప్రూస్ క్యాపిటల్ పార్ట్నర్స్ నిర్మించింది. ఈ సన్న భవనంకు దగ్గర్లోనే ప్రపంచంలోనే అతి పొడవైన నివాస భవనం ‘సెంట్రల్ పార్క్ టవర్’ (దీని ఎత్తు 472 మీటర్లు) ఉంది. – సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
కేవలం 45 రోజుల్లో ఏడంతస్తుల భవనం...దేశ నిర్మాణ చరిత్రలోనే రికార్డు
న్యూఢిల్లీ: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ కోసం బహుళ-అంతస్తుల భవన నిర్మాణాన్ని కేవలం 45 రోజుల్లో పూర్తి చేసింది. ఈ ఏడంతస్తుల భవనాన్ని బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(ఏడీఈ) వద్ద నిర్మించింది. దీన్ని సంప్రదాయ, ప్రీ-ఇంజనీరింగ్, ప్రీకాస్ట్ మెథడాలజీతో కూడిన హైబ్రిడ్ టెక్నాలజీతో పూర్తి చేసింది. స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఏఎంసీఏ) ప్రోగ్రాం కోసం నిర్మించిన ఈ భవనాన్ని ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఏవియోనిక్స్ అభివృధికి వినియోగిస్తారు. ఈ ఐదవతరం స్వదేశీ ఏఎంసీఏ రీసెర్చ్ అండ్ డెలవలప్మెంట్ సౌకర్యాలను అందిస్తుంది. ఈ ఏడంతస్తుల భవనాన్ని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బెంగళూరులో గురువారం ప్రారంభించారు. అంతేకాదు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు భవనంలోనే ప్రాజెక్ట్‌పై ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు డిఆర్డిఓ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయన 45 రోజుల తక్కువ వ్యవధిలో కాంపోజిట్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ద్వారా మౌలిక సదుపాయాలు అందిచాలని చెప్పారని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన నవంబర్ 22, 2021న జరిగిందని, నిర్మాణం ఫిబ్రవరి 1, 2022న ప్రారంభమైందని తెలిపారు. హైబ్రిడ్ నిర్మాణ సాంకేతికతతో ఏడు అంతస్తుల శాశ్వత భవనాన్ని పూర్తి చేయడం ఒక ప్రత్యేకమైన రికార్డు అని అన్నారు. దేశ నిర్మాణ పరిశ్రమ చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. అంతేకాదు ఇది సాంప్రదాయ నిర్మాణంతో పోలిస్తే సమయం, శ్రమను తీవ్రంగా తగ్గిస్తుందని చెప్పారు. ఈ అత్యాధునిక భవనంలో ప్రామాణిక జాతీయ భవనం కోడ్ ప్రకారం విద్యుత్ వ్యవస్థ, ఫైర్ ప్రోటెక్షన్ తోపాటు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కూడా ఉంటుందని అన్నారు. ఈ భవన నిర్మాణాం అన్ని నిబంధనలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నిర్మాణంలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కీ బృందాలు సాంకేతిక సహాయాన్ని అందించాయని తెలిపారు. (చదవండి: ఇంతకీ ఐపీఎస్ అధికారి సూట్ కేస్‌లో ఏముందో తెలుసా!) -
వేములవాడ: రాజన్న కోడెకు ఎంత కష్టం..!!
-
కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల.. 300 భవనాలకు సీల్
సాక్షి, ముంబై: ముంబైలో కరోనా, ఒమిక్రాన్ రోగుల సంఖ్య పెరుగుతుండటంతో బీఎంసీ అధికారులు 300పైగా భవనాలకు సీలు వేశారు. ఒక్కో భవనంలో లేదా వింగ్‌లో 20 శాతం ఇళ్లలో కరోనా రోగులుంటే సీల్ వేస్తామని బీఎంసీ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు పెరిగిన కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని కట్టడి చర్యల్లో భాగంగా 300 పైగా భవనాలకు సీలు వేశారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు, ఆర్థిక రాజధాని ముంబైలో కూడా కరోనా రోగులు పెద్దసంఖ్యలో పెరిగారు. ముంబైలో గత రెండు రోజులుగా 25 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. శనివారం ఈ సంఖ్య మరింత పెరగడంతో బీఎంసీ అప్రమత్తమైంది. ముంబైసహా పుణే జిల్లాలో కూడా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రోగులకు వైద్యం అందించే 364 మంది డాక్టర్లు కూడా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఈ వ్యాధి మరింత విస్తరించకుండా భవనాలకు, వింగ్‌లకు సీలు వేసినట్లు బీఎంసీ తెలిపింది. రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ముంబైకర్లు భయపడాల్సిన అవసరం లేదని మేయర్ కిషోరీ పేడ్నేకర్ శనివారం స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ, బీఎంసీ ఆస్పత్రుల్లో, జంబో కోవిడ్ కేంద్రాలలో తగినన్ని బెడ్లు, ఐసీయూ, ఆక్సిజన్ వార్డులు సమకూర్చామని, ఆక్సిజన్ నిల్వలు కూడా తగినన్ని ఉన్నాయని చెప్పారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం కరోనా నాలుగు రెట్లు వేగంగా విస్తరిస్తోందని, అయినప్పటికీ వీకెండ్ లాక్డౌన్ విధించే ఆలోచన కూడా ప్రస్తుతం ప్రభుత్వానికి లేదన్నారు. కేసులపై ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆమె చెప్పారు. ముంబై ప్రజలు అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావద్దని, కోవిడ్ నియమాలు పాటిస్తే లాక్డౌన్ అమలుచేసే అవసరం రాదని ఈ సందర్భంగా ముంబైకర్లకు సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చినవారిలోనూ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, చికిత్సకోసం ఆస్పత్రులకు వస్తున్న వారిసంఖ్య కూడా పరిమితంగానే ఉంటోందని మేయర్ వెల్లడించారు. చదవండి: ఆదిత్య ఠాక్రే సంకల్పం: ఉద్యాన వనంలో ‘ట్రీ–హౌస్’.. ప్రత్యేకతలివే.. -
మీ మనసులోకి తొంగి చూడలేను.. శిక్ష అనుభవించాల్సిందే!
Capitol rioters tears remorse don’t spare them from jail: అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మార్చాలని డిమాండ్ చేస్తూ అమెరికా పార్లమెంటు 'క్యాపిటల్' భవనంలో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడులను ప్రపంచ దేశాలన్ని విస్తుపోయి చూసిన సంగతి తెలిసిందే. నాటి ఘటనకు కారణమైన వాళ్లందరికి కఠిన శిక్షలు విధించారు. దీంతో వారంతా కన్నీటి పర్యంతమవుతూ నాటి ఘటనకు సిగ్గుపడుతున్నాం అని చెబుతున్నప్పటికి శిక్షలు నుంచి తప్పించుకోవడం అసాధ్యం అని యూఎస్ కోర్టు స్పష్టం చేసింది. (చదవండి: భారత సంతతి అమృతపాల్ సింగ్ మాన్కు యూకే గౌరవ జాబితాలో చోటు !) అమెరికా పార్టమెంటు దాడుల ఘటనలో ఉద్యోగులు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పయారని ఇది చాలా క్రూరమైన చర్యగా కోర్టు అభివర్ణించింది. అయితే ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి సుమారు 700 మంది అభియోగాల ఉన్నాయి. అందులో ఫ్లోరిడా వ్యాపార యజమాని రాబర్ట్ పాల్మెర్కి ఐదేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇప్పటి వరకుర దాదాపు 71 మందికి శిక్షలు విధించారు. వారిలో కంపెనీ సీఈవో, ఆర్కిటెక్ట్, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ లెఫ్టినెంట్ కల్నల్, జిమ్ యజమాని, మాజీ హ్యూస్టన్ పోలీసు అధికారి, యూనివర్సిటీ ఆఫ్ కెంటకీ విద్యార్థి ఉన్నారు. అయితే వారిలో యాభై-ఆరు మంది క్యాపిటల్ భవనంలో దాడులకు పాల్పడినందుకు నేరాన్ని అంగీకరించారు. అంతేకాదు ప్రతి శిక్షకు సంబంధించిన యూఎస్ చట్టాల ప్రకారం వారిలో చాలా మందికి గృహ నిర్బంధం లేదా వారాలు లేదా నెలలలో జైలు శిక్ష విధించబడింది. అయితే పోలీసు అధికారులపై దాడి చేసిన అల్లరిమూకలు మాత్రం ఏళ్ల తరబడి కటకటాలపాలయ్యారు. ఈ మేరకు మొత్తంగా ఇప్పటి వరకు 165 మంది నేరాన్ని అంగీకరించారని, పైగా అందులో ఎక్కువగా ఆరు నెలల గరిష్ట శిక్ష విధించే నేరాలకు పాల్పడినవారే.అధికారిక లెక్కల ప్రకారం మూడు నెలలు లేదా అంతకంటే తక్కువ శిక్షలు పొందిన 22 మందితో సహా సుమారు 31 మంది నిందితులకు జైలు శిక్ష విధించబడింది. మరో 18 మంది నిందితులకు గృహ నిర్బంధం విధించారు. మిగిలిన 22 మందిని గృహనిర్బంధం లేకుండానే ప్రొబేషన్‌లో ఉంచారు. అయితే యూఎస్‌లో న్యాయమూర్తులు తరచూ పశ్చాత్తాపాన్ని శిక్షలను నిర్ణయించడంలో కీలకమైన అంశంగా పేర్కొంటారు. దీంతో చాలా మంది నిందితులు పశ్చాత్తాపతో అభ్యర్థించడం ప్రారంభించారు. ఈ మేరకు యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి తాన్యా చుట్కాన్ మాట్లాడుతూ.. మీ అందరి పశ్చాత్తాపం నిజమైనదో కాదో చెప్పలేను. పైగా నేను మీ మనసులోకి తొంగి చూడలేను. ఈ కేసు తర్వాత మీరు మీ జీవితాన్ని నిర్వహించే విధానమే మీరు నిజంగా పశ్చాత్తాపపడుతున్నారా అనే దాని గురించి తెలియజేస్తుంది" అని అన్నారు. (చదవండి: టెస్లా ఆటో పైలెట్ టీమ్‌కి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తి!) -
సగం కొట్టేసిన బిల్డింగ్‌లా కనిపిస్తోందా.. అలా అనుకుంటే పొరపాటే!
సడన్‌గా చూస్తే.. సగం కొట్టేసిన బిల్డింగ్‌లా కనిపిస్తోంది కదూ.. నిజానికిది పూర్తిగా కట్టేసిన బిల్డింగ్.. దీని డిజైనే అంత.. ఇలాంటి వింత డిజైన్ సృష్టికర్త నెదర్లాండ్స్‌కు చెందిన ఎంవీఆర్‌డీవీ సంస్థ. ఆమ్స్టర్డంలో 75 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మూడు భవంతుల సముదాయాన్ని వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు. దూరం నుంచి అలా కనిపిస్తోంది గానీ.. దగ్గర్నుంచి చూస్తే.. దేనికది బ్లాక్స్లాగ కట్టినట్లు ఉంటుంది. అంతేకాదు.. వీటిపైనే ఎక్కడికక్కడ మొక్కలు, చెట్లను పెంచుతారట. మొత్తం 13 వేల రకాల మొక్కలు, చెట్లకుఇది నిలయంగా మారుతుందని చెబుతున్నారు. ఈ భవంతుల సముదాయంలో వాణిజ్య కార్యాలయాలతోపాటు 200 అపార్టుమెంట్లు, రూఫ్ గార్డెన్, స్కైబార్ ఉంటాయి. -
ఆరో అంతస్తునుంచి దూకి ఐఏఎస్ కుమారుడు ఆత్మహత్య
IAS Officer son committed suicide న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఐఏఎస్ అధికారి కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తాజాగా వెలుగుచూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువకుడు తల్లిదండ్రులులేని సమయంలో 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన ఇరుగుపొరుగువారు హుటాహుటీనా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన యువకుడు చికిత్స సమయంలో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రాత్రి 8 గంటల 30 నిముషాలకు చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ చేపట్టారు. మృతి చెందిన బాలుడు (15) మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని, గత సెప్టెంబర్ నుంచి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో తల్లిదండ్రులు ఎవ్వరూ ఇంట్లో లేరని, ఆత్మహత్యకు కారణం తెలియాల్సి ఉందని, ఈ రోజుల్లో ప్రతి చిన్న కారణానికి యువత ప్రాణాలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా పోలీసధికారి ఒకరు తెలిపారు. చదవండి: New Year 2022: న్యూ ఇయర్ రోజున ఇలా చేస్తే ఏడాదంతా మంచి జరుగుతుంది! -
ఏపీ సచివాలయాల వ్యవస్థ దేశానికే ఆదర్శం
-
బాప్రే! 14 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం... ఐతే ఆ ఇద్దరు...!! షాకింగ్ వీడియో
Teenage siblings escaped their burning apartment: మనం ఎన్నో భయంకరమైన ప్రమాదాలు చూసి ఉంటాం. కొన్ని ప్రమాదాలను మాత్రం తప్పించుకోవడం అసాధ్యంగా ఉంటుంది. పైగా ఆసమయంలో మనకు సాయం చేసేవారుకూడా లేకపోతే ఆ పరిస్థితి మరింత ఘోరం. అచ్చం అలానే ఇక్కడ ఇద్దరు అక్క తమ్ముడు అలాంటి స్థితిలోనే ఉంటారు. అంతేకాదు వాళ్లు ఆ గండం నుంచి చాలా చాకచక్యంగా బయటపడతారు. (చదవండి: బంగారు గనుల తవ్వకాల్లో బయటపడ్డ వెయ్యికాళ్ల ప్రాణి!) అసలు విషయంలోకెళ్లితే...న్యూయార్క్ నగరంలోని ఈస్ట్ విలేజ్‌లో 14-అంతస్తుల జాకబ్ రియిస్ 14- భవనంలోని నాల్గవ అంతస్తులో ఒక్కసారిగా మంట్లో వ్యాపించాయి. అంతేకాదు భయంకరంగా అగ్నికిలలు ఎగిసి పడుతుంటాయి. అయితే ఆభవనంలో ఉన్న ఇద్దరు అక్క తమ్ముళ్లు ఆ భవనం కిటికి గుండా బయటికి రావడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ క్రమంలో వారు ఆభవనానికి ఆనుకుని ఉన్న పైపు సాయంతో నెమ్మదిగా కిందకి వచ్చేశారు అయితే వారి అమ్మ మాత్రం మంటల్లో చిక్కుకుంటారు. ఆవిడకి త్రీవ గాయలవుతాయి. ఈ మేరకు ఆ సమయంలో ఆమె ఒక గదిలో ఉండిపోతుంది. అయితే వారిద్దరూ వాళ్ల అమ్మను తలుపు తీయమని గట్టిగా పిలిచినప్పటికీ ఆవిడ తీయలేకపోతారు. పైగా ఈ ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. అంతేకాదు ఎలక్ట్రిక్ భవనాల కారణంగా అగ్నికిలలు వ్యాపించి ఉంటాయని భావించారు. ఈ మేరకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే వారు వచ్చే లోపు ఈ ఇద్దరూ అక్కతమ్ముడు ఏదోరకంగా ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటం విశేషం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: విలేకరుల సమావేశం జరపవద్దు!... అంటూ సాలీడు ఎలా అడ్డుపడుతుందో చూడండి!!) Yesterday morning 2 teens—a 13 and 18-yr-old— escaped a burning building in East Village, NYC. In the video you can see the first teen hanging from the window then stand up and hold on to a pole and help the second person. (1/2) pic.twitter.com/xzHP5QqM2I — GoodNewsCorrespondent (@GoodNewsCorres1) December 17, 2021 -
ఏ తల్లి కన్న బిడ్డో గానీ.. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా..
గతంలో ఎవరైనా ఆపదలో ఉంటే ప్రజలు తక్షణమే స్పందించి ప్రమాదంలోని వారికి సాయం అందించేవాళ్లు. కానీ ప్రస్తుత సోషల్‌మీడియా సమాజంలో మాత్రం సాయం మాట అటుంచితే సెల్ఫీలు, వీడియోలు తీసి నెట్టింట షేర్‌చేసే నెటిజన్లకు మాత్రం కొదవలేదని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఇటీవల మనం చాలానే చూసాం. అయితే ఇంకా మానవత్వం మిగిలే ఉందని అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మనకి అనిపిస్తాయి. అసలు అంతలా ఆ వీడియోలో ఏముంది.. ఓ బాలుడు ప్రమాదకరంగా భవనంపై నుంచి వేలాడుతూ కనిపిస్తాడు. దీంతో ఎక్కడి నుంచి వచ్చాడో గానీ ఒక్కడు మాత్రం అందరిలా చోద్యం చూస్తూ, వీడియోలు ఫోటోలు తీయడం చేస్తూ సమయాన్ని వృథా చేయలేదు. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు కదిలాడు. ఆలోచన చేయలేదు, ఒక్కఉదుటున పెకెక్కి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఏ తల్లి కన్న బిడ్డవో గానీ నువ్వు చల్లగా ఉండాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు. అందరిలా చోద్యం చూస్తూ, వీడియెాలు పొటోలు తీసుకుంటు సమయాన్ని వృద్దా చేయలేదు. తన ప్రాణం గురించి ఆలోచన చేయలేదు, ఒక్క ఉదుటున పైకెక్కి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడినాడు. ఏ తల్లికన్న బిడ్డవో ?నీవు చల్లగా వుండాలి సోదరా pic.twitter.com/TCPEYMaJX8— సన్న పిన్ చార్జర్ (@sannapincharger) December 7, 2021 -
Hyderabad: ఒకే అపార్ట్మెంట్లో పది మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్: బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోవిడ్ కలకలం సృష్టించింది. పీరంచెరువులోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న పది మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అపార్ట్మెంట్ వాసులంతా భయాందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గేటెడ్ కమ్యూనిటీలోని బ్లాక్‌లో ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతను ఢిల్లీకి వెళ్లి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. వీరి కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కరోనా పరీక్షలు చేశారు. మొత్తం నలుగురికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చదవండి: (భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య) మరో బ్లాక్‌లో ఉంటున్న ఆరుగురు కుటుంబ సభ్యులకూ కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరందరినీ ఐసొలేషన్‌లో ఉంచారు. ఈ విషయాన్ని గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో శనివారం శానిటేషన్ ఇన్స్పెక్టర్ మనోహర్ ఆధ్వర్యంలో అపార్ట్‌మెంట్‌ను పరిశీలించి శానిటైజ్ చేశారు. అపార్ట్మెంట్ మొత్తం సోడియం హైపోక్లోరైట్ మిశ్రమంతో పిచికారీ చేయించారు. ప్రస్తుతం బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. -
విషాదం: అప్పటి వరకు బుడిబుడి నడకలతో ఇల్లంతా సందడి.. చూస్తుండగానే వెళ్లి..
సాక్షి,పరిగి(వికారబాద్): అప్పటి వరకు బుడిబుడి నడకలతో ఇల్లంతా సందడి చేసిన చిన్నారి.. ఆడుకుంటూ వెళ్లి రెండో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని రాపోల్కు చెందిన సందీప్ పరిగిలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పరిగిలోని అయ్యప్ప కాలనీలో ఓ ఇంట్లో కుటుంబంతో సహా అద్దెకు ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం సందీప్ కుమార్తె పర్ణిక (18 నెలలు) రెండో అంతస్తులో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడింది. దీంతో చికిత్స నిమిత్తం నగరానికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. చిన్నారి మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే: పసిప్రాయంలో తల్లి.. తర్వాత తండ్రి.. ఇప్పుడు అన్న.. -
అదృష్టం.. భూమ్మిద ఇంకా నూకలున్నాయ్!
చైనా: ఓ వృద్ధ మహిళ తను నివసించే అపార్టుమెంట్‌లోని బాల్కని నుంచి అదుపు తప్పి కిందకు జారీపడింది. అయితే బట్టలు ఆరేసే ర్యాక్కు ఆమె చిక్కుకొని ప్రమాదకరంగా తలకిందులుగా వేలాడింది. ఈ ఘటన తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ చోటు చేసుకుంది. అపార్టుమెంట్‌లోని 19వ అంతస్తు బాల్కని నుంచి ఆమె కిందికి వేలాడటం గమనించిన స్థానికులు ఫైర్ ఫైటర్లకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ ఫైటర్లు ఆ వృద్ధురాలని సురక్షితంగా కాపాడారు. ఆ మహిళ గాయాలపాలు కాకుండా.. ప్రాణాపాయం తప్పిందని ఫైర్ ఫైటరర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. An 82-year-old woman was seen dangling upside down from a clothes rack after falling from the 19th floor of a building in eastern China’s Jiangsu province. pic.twitter.com/Y4yvFRNBo8 — South China Morning Post (@SCMPNews) November 23, 2021 -
ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!
World's Richest Dog: నిజానికి చాలామంది ఏంటీ ఈ జీవితం మరి విలువ లేకుండా పోయింది. మరీ కుక్క కన్న హీనంగా జీవిస్తున్నాం ఛీ అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ కుక్కని చూశాక అందరూ బతికితే ఈ కుక్కలా బతకాలి అని కచ్చితంగా అనుకుంటారు. ఏంటి ఇలా చెబుతున్నారు అని అనుకోకండి. ఇది నిజం యూఎస్‌లోని మియామిలో నివశిస్తున్న కుక్కను చూసి ఎవరైన ఇలానే అనుకుంటారు. (చదవండి: ఆ మూడు వ్యవసాయ బిల్లులు రద్దవ్వడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది) అసలు విషయంలోకెళ్లితే...యూఎస్‌లోని మియామిలో నివసిసున్న కుక్క ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క. పైగా దీనికి వందల కోట్లు విలువ చేసే భారీ బంగ్లా కూడా ఉంది. అయితే ఈ కుక్క పేరు గుంథర్ VI. ఈ కుక్క తాత గుంథర్ IV అనే మరో కుక్క నుంచి 500 మిలియన్ డాలర్ల(రూ.3715 కోట్లు) సంపద వారసత్వంగా లభించింది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ కుక్కలకు ఆస్తులు లభిస్తున్నాయి. ఈ కుక్క వంశానికి చెందిన గుంథర్ III 1992లో మరణించింది. దీంతో దాని చివరి యజమాని జర్మన్ కౌంటెస్ కార్లొట్టా లైబెన్‌స్టెయిన్ నుంచి ఈ కుక్కకు 58 మిలియన్ డాలర్లు (సుమారు రూ.431 కోట్లు) విలువ చేసే ట్రస్ట్ వారసత్వంగా లభించింది. అంతేకాదు రోజులు గడిచే కొద్ది ఆ ఆస్తుల విలువ పెరుగడం వల్ల గుంథర్ VI ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్కగా రికార్డులకెక్కింది. ఈ కుక్కల ఆఖరి యజమాని చనిపోయిన తర్వాత హ్యాండర్ల బృందం వీటి బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే ఈ గుంథర్ VI తాను నివశిస్తున్న టుస్కాన్ విల్లాను అమ్మకానికి పెట్టింది. ఈ మేరకు ఈ భారీ సౌధాన్ని 2000 సంవత్సరంలో మడొన్నా నుంచి కొనుగోలు చేశారు. అయితే అప్పట్లో ఈ బంగ్లా విలువ రూ.7.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.53 కోట్లు). కానీ ఇప్పుడు దీన్ని రూ.238 కోట్లకు అమ్మకానికి పెట్టారు. అంతేకాదు ఈ భవనాన్ని 1928లో నిర్మించారు. ఇందులో మొత్తం తొమ్మిది బెడ్రూమ్లు, ఎనిమిది బాత్రూమ్లు, ఔట్ డోర్ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. పైగా ఈ ఇంటిని విక్రయించే బాధ్యతను ది అసోలిన్ టీమ్‌కు చెందిన ‘రూతీ అండ్ ఏతాన్ అస్సౌలిన్’ సంస్థ స్వీకరించింది. ఈ మేరకు ఆ సంస్థ నిర్వాహకురాలు రుతీ మాట్లాడతుతూ...అత్యంత ఖరీదైన ఈ భారీ సౌధానికి యజమాని కుక్క అని నేను ఆశ్చర్యపోయాను. అసలు నేను మొదట నమ్మలేకపోయాను. పైగా ఈ భవనానికి గొప్ప చరిత్ర ఉంది. అంతేకాదు గుంథర్ VIతో మేం సమావేశమైనప్పుడు ఆ కుక్క పరుగెత్తుకుంటూ వచ్చి నాకు ముద్దిచ్చింది. ఓహో ఇది మాతో తను ఒప్పందం చేసుకోవడం ఇష్టమే అన్నట్లుగా ఇలా ముద్దిచ్చినట్లుందని భావిస్తున్నా" అని అన్నారు. (చదవండి: ఆ హోటల్లో దెయ్యాలు..! ‘ఎలిజిబెత్’.. అంటూ మగ గొంతుతో పిలిచి..) -
Viral Video: అపార్ట్మెంట్లో మంటలు
-
అపార్ట్మెంట్లో మంటలు ...కానీ అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికి!!
ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో మన పక్కింటి వాళ్ల ఇల్లు కాలిపోతే రక్షించటానికి ఎంత మంది ముందుకొస్తారు చెప్పండి. అసలు ముందు సహాయం చేయడానికి ఎవ్వరైన వస్తున్నారో లేదో చూసి చేస్తాం లేదంటే లేదు అన్నట్టుగా ఉండిపోతారు. కానీ ఇక్కడొక అపార్ట్మెంట్ వాసులు తమ పక్కవాళ్ల ఖాళీ అపార్ట్మెంట్ బాల్కనీలో మంటలు చెలరేగుతాయి. (చదవండి: రెండు రోజులుగా గుహలోనే... పైగా 240 మంది రెస్య్కూ టీం..చివరికి!!) అయితే అగ్నిమాపక సిబ్బంది వచ్చేంత వరకు వేచి ఉండకుండా అక్కడ ఉన్న ఇరుగు పొరుగ తమ వంతు ప్రయత్నంగా బకెట్ వాటర్‌తో ఆర్పడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నంలో వారు సఫలం అయ్యారు. అగ్నిమాపక వాహనం రాక మునుపే ఆ మంటలను అదుపులోకి తీసుకువచ్చేశారు. అయితే ఈ ఘటన జూలై 7, 2020న రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగింది. అయితే ప్రస్తతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు మనమంత ఇలానే కలిసి ఉండాలి అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: 30 ఏళ్లుగా టాయిలెట్ నీటినే తాగారా!) -
చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఎంత పనిచేసింది..
సాక్షి, మియాపూర్(హైదరాబాద్): చక్కగా చదువుకోలేకపోతున్నాననే మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవికుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని దయాళ్‌పూర్‌నకు చెందిన వీరేంద్రసింగ్ నేగి, సోనియా నేగి దంపతులకు కుమార్తె జాహ్నవి నేగి (17), కుమారుడు ఉన్నారు. వీరు మియాపూర్ మైహోమ్స్‌లో టార్క్ ఐఎస్ బ్లాక్‌లో 9వ అంతస్తులో జీవనం కొనసాగిస్తున్నారు. జాహ్నవి ప్రస్తుతం సీబీఎస్ఈ 12వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆమె తల్లిదండ్రులు వాకింగ్‌కు వెళ్లారు. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో 9వ అంతస్తు నుంచి కిందకి దూకింది. గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు జాహ్నవి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. చదువులో మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: డేటింగ్ యాప్‌లో పరిచయం.. చాటింగ్‌లో మునిగితేలారు.. చివరకు -
మత్స్యకారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. గన్నవరంలో 30 లక్షల వ్యయంతో నిర్మించిన మత్స్య సహకార నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. గుజరాత్లో డ్రగ్స్ కేసుల్ని ఏపీకి అంటగట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. (చదవండి: ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు: సీఎం జగన్) దసరాకు 4వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని మంత్రి వెల్లడించారు. అధిక ధరలు వసూలు చేసే ప్రైవేట్ బస్సులపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం త్వరలో ప్రత్యేక వాట్సాప్ నెంబర్ అందుటులోకి తీసుకువస్తామన్నారు. ఆన్ లైన్ టిక్కెట్లపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా పెట్టామని మంత్రి పేర్ని నాని తెలిపారు. చదవండి: దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు -
కోతి చేసిన పని.. ఓ వ్యక్తి ప్రాణం పోయింది
ఢిల్లీ: కోతుల బెడతతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కున్న ఘటనలు మనం చూసే ఉంటాం. అయితే తాజాగా కోతి చేసిన పని వల్ల ఓ వ్యక్తి ప్రాణం పోయింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ ఢిల్లీలోని నబికరీం ప్రాంతంలో నివాసం ఉంటున్న మహ్మద్ కుర్బాన్ అనే వ్యక్తి తలపై ఓ ఇంటి నుంచి ఇటుక రాయి పడింది. దీంతో అతని తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ప్రమాదానికి కారకులెవరో తెలియకపోవడంతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి నిర్లక్ష్యం ద్వారా ప్రమాదం జరిగినట్టు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసులు విచారణలో.. ఓం ప్రకాశ్ మిశ్రా అనే వ్యక్తి ఇంటిపై నుంచి ఇటుక పడిందని తేలింది. దీంతో అతన్ని విచారించగా.. ఆ ఇటుకలను తాను ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్‌పై పెట్టినట్లు అంగీకరించాడు. అక్కడ కోతులు నిత్యం ట్యాంక్ మూత తీస్తుంటాయని మూత రాకుండా ఉండేందుకే ఆ ఇటుకలు పెట్టానని అన్నాడు. ఈ క్రమంలోనే ఇంటిపైకి వచ్చిన కోతి ఆ ఇటుకను కిందకు విసరగా, మహ్మద్ కుర్బాన్ పై పడిందని తెలిపాడు. అలసత్వంతోనే కోతులు ఇటుకలను కింద పడేశాయని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. చదవండి: కూతురితో ప్రేమ వ్యవహారం.. యువకుడిని కిడ్నాప్ చేసి.. -
పోలీస్ భవనాలు ఎప్పటికి పూర్తయ్యేనో....
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ప్రకారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఏర్పడినా పక్కా భవనాలకు మాత్రం మోక్షం లభించడంలేదు. కొన్నిచోట్ల అద్దె భవనాల్లో ఎస్పీ కార్యాలయాలు కొనసాగుతుండగా, మరి కొన్ని జిల్లాల్లో ఇతర ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల నిర్మాణాలకు 2017–18లోనే పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ టెండర్లు పిలిచి పునాది రాళ్లు కూడా వేసింది. అయితే ఏళ్లు గడిచినా కొన్ని జిల్లాల్లో ఇంకా పనులే ప్రారంభం కాకపోవడంతో ఆయా జిల్లాల పోలీస్ యూనిట్లు, అధికారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. (చదవండి: రాబోయే రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్లు) ఐదేళ్లు గడిచినా... ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీస్టేషన్‌ను ఎస్పీ కార్యాలయం నుంచి అప్‌గ్రేడ్ చేసి కమిషనరేట్‌గా ప్రభుత్వం మార్చింది. అయితే పాత అర్బన్ ఎస్పీ కార్యాలయం నుంచి ప్రస్తుత కమిషనరేట్ కార్యకలాపాలు సాగిస్తోంది. ఇదే కార్యాలయం పక్కన ఉన్న పోలీస్ క్వార్టర్స్‌ను కూల్చివేసి కొత్త కమిషనరేట్ నిర్మాణానికి 2017లో అప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శంకుస్థాపన చేశారు. ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు అక్కడ నిర్మాణ పనులు చేపట్టలేదు. అయితే కమిషనరేట్ పనులకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ నిర్మాణంపై వెనక్కి తగ్గడంతో పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఆ కంపెనీని టెండర్ నుంచి తొలగించేసింది. దీంతో అప్పటినుంచి రీ టెండర్‌కు ప్రయత్నం చేస్తున్నా ఏ కంపెనీ ముందుకు రాకపోవడంతో నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉండిపోయినట్టు హౌజింగ్ కార్పొరేషన్ ద్వారా తెలిసింది. (చదవండి: ‘కన్ఫ్యూషన్ ఏం లేదు.. ఏ పార్టీలో చేరాలో స్పష్టత ఉంది’) భూమి కేటాయింపులే ప్రధాన సమస్య.... జగిత్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటివరకు నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఈ మూడు జిల్లాల్లో పోలీస్ హెడ్ క్వార్టర్ల నిర్మాణానికి భూమి కేటాయింపు సమస్యగా మారినట్టు తెలిసింది. భద్రాద్రి కొత్తగూడెంలో విజయవాడ హైవే వైపు ల్యాండ్ పరిశీలించినా, పోలీస్ శాఖకు అనువుగా ఉండదని అధికారులు భావించినట్టు తెలిసింది. ఇకపోతే ఇదే సమస్య నిర్మల్లోనూ తలెత్తినట్టు హౌజింగ్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. అక్కడ ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో ఇప్పటివరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. అదే విధంగా జగిత్యాల జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నిర్మాణం టెండర్లు జరిగినా టెక్నికల్ సమస్య వల్ల రద్దు చేశారు. మళ్లీ టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో పెండింగ్‌లో పడినట్టు తెలిసింది. ఇకపోతే మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల 70 శాతం, 80 శాతం పనులు పూర్తికాగా, మరికొన్ని చోట్ల 50 శాతం పనులు పూర్తయి మిగిలిన పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని పూర్తి చేస్తాం.. జిల్లాల్లో ఎస్పీ, కమిషనరేట్ల భవన నిర్మాణాలకు చిన్నచిన్న అవాంతరాలున్నాయి. కొన్ని చోట్ల భూమి కేటాయింపు సమస్య ఉండగా, మరికొన్ని చోట్ల రీ టెండర్లు పిలుస్తున్నాం. అవికాకుండా మిగిలిన జిల్లాల్లో పోలీస్ కార్యాలయాల పనులు 80 శాతం పూర్తయ్యాయి. త్వరలోనే అన్ని నిర్మాణాలు పూర్తిచేస్తాం. – కోలేటి దామోదర్ గుప్తా, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ -
వైరల్ వీడియో: కుప్పకూలిన 7 అంతస్థుల భవనం
-
ఘోరం: బెంగళూరులో అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు ఐఐఎం సమీపాన బేగూర్‌లోని దేవరచిక్కనహల్లిలోని ఒక అపార్ట్మెంట్లో సిలిండర్ లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనం కాగా మరికొంత మందికి గాయాలయ్యాయి. కాగా మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో అశ్రిత ఆస్పైర్ అపార్ట్మెంట్లో పైప్‌లైన్‌లో గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో అపార్‌మెంట్‌ను పొగ కమ్మేసింది. అగ్నిమాపక శాఖ నియంత్రణ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 4.41 గంటలకు అగ్నిప్రమాదం గురించి సమాచారం రావడంతో అగ్నిమాపకశాఖ సిబ్బందితో పాటు మూడు ఫైర్‌టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు. Fire at apartment called Ashrith Aspire near IIM #Bangalore #Karnataka. Fire engines rushed to spot. Locals says people are trapped. pic.twitter.com/O2PpnAEQzu — Imran Khan (@KeypadGuerilla) September 21, 2021 Bengaluru | Fire broke out at an apartment in Devarachikkana Halli, Begur due to gas leakage in pipeline around 3:30 pm, this afternoon. Three fire tenders at the spot: Fire department#Karnataka pic.twitter.com/InXOtx9t6W — ANI (@ANI) September 21, 2021 చదవండి: దారుణం: ‘మా అమ్మాయినే వేధిస్తావా?’ మెడకు బెల్ట్ బిగించి.. -
ఆసుపత్రిని కూల్చవద్దంటూ నిరసన చేపట్టిన వామపక్షాలు
-
ఇటలీ : మంటల్లో 20 అంతస్తుల భవనం
-
వైరల్ వీడియో.. చూస్తుండగానే సముద్రంలో కలిసిపోయిన ఇల్లు
సోషల్ మీడియాను వాడుతున్న యూజర్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అందులో పలు వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటూ వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటే.. మరికొన్ని ఆందోళనకు గురిచేస్తుంటాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట దూసుకుపోతుంది. ఓ ఇల్లు ఒక్కసారిగా సముద్రంలో కుప్పకూలింది. ఆ ఇల్లు కూలినట్లు గాక సముద్రమే మింగేసిందా? అనేలా ఉన్న ఈ వీడియో చూస్తున్నంతసేపు మనల్ని భయబ్రాంతులకు గురిచేస్తుంది. జూలై 28న అర్జెంటినాలోని బ్యూనస్ ఎయిర్స్‌లోని మార్ డెల్ తుయులో ఈ ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో నీటిమట్టం అంతకంతకూ పెరగడంతో తీరం సమీపాన ఉన్న ఓ రెండస్థుల భవనం పునాదులు పూర్తిగా దెబ్బతింది. దీంతో ఒక్కసారిగా ఆ రెండస్థుల భవనం సముద్రంలోకి కుప్పకూలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ ఇంట్లో ఎవరూ లేరని, పెను ప్రమాదం తప్పిందని అర్జెంటినా మీడియా వెల్లడించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా తీర ప్రాంతం కోతకు గురవుతున్న కారణంగానే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. After teetering on the edge for some time, a house in Buenos Aires, Argentina, has finally collapsed into the sea. Watch more videos from Sky News: https://t.co/3ZESAqWhX3 pic.twitter.com/8cZE8LKe8S — Sky News (@SkyNews) July 30, 2021 -
తొమ్మిదో అంతస్తు నుంచి కింద పడిన మహిళ
-
షాకింగ్ వీడియో: తొమ్మిదో అంతస్తు నుంచి కింద పడిన మహిళ
లక్నో: ఆకాశానికి చాలా ఎత్తులో ఉండే బిల్డింగ్ నుంచి ఎవరైనా కిందపడితే ఎముకలు విరిగి అక్కడికక్కడే చనిపోవడం ఖాయం. కానీ ఘజియాబాద్‌లో ఒక మహిళ మాత్రం ప్రమాదవశాత్తు తొమ్మిదో ఫ్లోర్ నుంచి జారిపడినా ఆమె బతికి బట్టకట్టింది. కానీ తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. ఈ ఒళ్లు గగుర్పొడిచే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని ఒక అపార్ట్మెంట్లో దంపతుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వారు ఉంటున్న తొమ్మిదో ఫ్లోర్ బాల్కనీలో మాట్లాడుతుండగా మహిళ పట్టుతప్పింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె భర్త ఆమె చేతిని గట్టిగా పట్టుకొని పైకి లాగే ప్రయత్నం చేశాడు. కానీ అతని చేతి పట్టు జారి ఆమె ఒక్కసారిగా అందరూ చూస్తుండగానే కిందపడిపోయింది. అంత ఎత్తు నుంచి పడడంతో ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని అంతా భావించారు. కానీ ఆమె తీవ్ర గాయాలతో పడి ఉంది. దీంతో వెంటనే ఆమె భర్త స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరు ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు తమ విచారణనను ప్రారంభించారు. మహిళ ప్రమాదవశాత్తు జారి పడిందా లేక ఆమె భర్త ఆమెనే తోసేశాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. -
తెల్లవారితే వివాహ నిశ్చితార్థం.. అంతలోనే మృత్యుముఖం
సాక్షి, భాగ్యనగర్‌కాలనీ: తెల్లవారితే ఆ యువతికి పెళ్లి నిశ్చితార్థం.. అంతలోనే ఆమెను రెయిలింగ్ రూపంలో మృత్యువు కబళించింది. మూడంతస్తుల భవనంపై నుంచి రెయిలింగ్ కూలి కింద కూర్చున్న యువతిపై పడటంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. తమ గారాలపట్టి వివాహ నిశ్చితార్థ ఏర్పాటులో ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా తీరని విషాదం నెలకొంది. ఈ దుర్ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకోగా.. బుధవారం వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లి ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కారంకోట గ్రామానికి చెందిన జట్టూరి శేఖర్, సత్తెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు రోజా బీటెక్ పూర్తి చేసింది. ఆమె స్నేహితురాలు మౌనికతో పాటు మరో మిత్రురాలితో కలిసి కూకట్‌పల్లిలో గది అద్దెకు తీసుకొని ఉంటోంది. శామీర్‌పేట్‌లోని ఎస్పీ అక్యూర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఇటీవల అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో రోజాకు వివాహం కుదిరింది. కొత్త దుస్తుల కోసం వెళ్లగా.. బుధవారం పెళ్లి ముహూర్తం పెట్టుకునే రోజు కావటంతో మంగళవారం సాయంత్రం కూకట్పల్లి బీజేపీ కార్యాలయం రోడ్డులోని శ్రీ బాలాజీ లేడీస్ ఫ్యాషన్ డిజైనర్స్ షాపులో దుస్తుల కోసం వెళ్లింది. ఆ సమయంలో షాపు యజమాని ఇంటికి వెళ్లటంతో బయట తన స్నేహితురాలు మౌనికతో వేచి చూస్తోంది. ఒక్కసారిగా షాపు భవనం మూడో అంతస్తు నుంచి రెయిలింగ్ విరిగి రోజా తలపై బలంగా పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని మృతురాలి తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సదరు భవనం ఓ ఎమ్మెల్యే బంధువులకు చెందింది కావటంతో కూకట్పల్లి పోలీసులు మృతురాలి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. -
12 అంతస్తుల భవనం.. క్షణాల్లో నేలమట్టం
వాషింగ్టన్: అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన 121 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.. అయితే ప్రస్తుతం ఉత్తర మియామీ సమీపంలోని 12 అంతస్తుల నివాస భవనం జూన్ 24 తెల్లవారుజామున కూలిపోగా.. 2021, జూలై 4న పాక్షికంగా కూలిపోయిన భవనాన్ని బాంబుల సాయంతో అక్కడి సిబ్బంది కూల్చివేశారు. ఇందుకోసం చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 24 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 121 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇక కొన్నేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో కొన్ని రోజుల కిందట పగుళ్లు గుర్తించినట్లు స్థానిక ఇంజనీర్లు చెబుతున్నారు. వాటికి మరమ్మతులు చేయాల్సి ఉండగా, ఈలోగా ప్రమాదం జరిగింది. కాగా, వచ్చే వారంలో ఎల్సా తుపాను వచ్చే అవకాశం ఉండటంతో.. సర్ఫ్‌సైడ్‌లోని మిగిలిన 12-అంతస్తుల చాంప్లైన్ టవర్స్ సౌత్‌ను అక్కడి కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 10:30 తర్వాత కూల్చివేశారు. తుపాను ముప్పు కాగా, చాంప్లైన్ సౌత్ టవర్ కూల్చివేతను చూడటానికి పెద్ద మొత్తంలో ప్రజలు అక్కడి చేరుకున్నారు. ఈ ఘటనపై కౌంటీ మేయర్ లెవిన్ కావా మాట్లాడుతూ.. ఉష్ణమండల తుఫాను ఎల్సా కరేబియన్ మీదుగా ఉత్తరం వైపు వస్తుండటంతో.. అధికారులు బిల్డింగ్ కూల్చివేత షెడ్యూల్‌ను వేగవంతం చేశామని తెలిపారు.. గతవారం ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ ప్రాంతాన్ని సందర్శించి బాధితుల బంధువులను ఓదార్చారు. అంతే కాకుండా రెస్క్యూ కార్మికులను కలుసుకుని వారి పనితీరుని ప్రశంసించారు. WATCH: The portion left standing of the partially collapsed Champlain Towers South condo building in Surfside, Florida, was demolished.https://t.co/ssfxO7WmMN pic.twitter.com/hKOS0nAr4e — CBS 21 News (@CBS21NEWS) July 5, 2021 -
కడప జిల్లా నాగరాజుపేట లో కుప్పకూలిన మూడంతస్థుల భవనం
-
అమ్మ బాబోయ్.. రైలు వేగానికి స్టేషన్ భవనం కూలింది
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఓ రైల్వే స్టేషన్ అందరు చూస్తుండగానే కుప్పకూలిపోయింది. ఈ సంఘటన బుర్హన్‌పూర్ జిల్లాలోని చందాని రైల్వే స్టేషన్లో బుధవారం సాయంత్రం జరిగింది. ఈ స్టేషన్ సెంట్రల్ రైల్వే భూసవాల్ రైలు డివిజన్ పరిధిలోకి వస్తుంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నేపానగర్-అసిగర్ మధ్య బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో పుష్పక్ ఎక్స్‌ప్రెస్ 110 కిలోమీటర్ల వేగంతో స్టేషన్ గుండా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సుమారు 14 సంవత్సరాల క్రితం నిర్మించిన స్టేషన్ భవనం రైలు వేగంగా వెళ్లడంతో ఆ ప్రకంపనలను తట్టుకోలేక కూలిపోయింది. ప్రమాదం జరగడానికి ముందు రైలుకు గ్రీన్ సిగ్నల్ చూపించడానికి అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ప్రదీప్ కుమార్ పవార్ తన కార్యాలయం నుంచి బయటికు రావడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన జరిగినప్పుడు భవనంలో ఎవరూ లేరని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ తరహా ఘటన జరగడం దేశంలో ఇదే తొలిసారని పేర్కొంటున్నారు. జీఆర్పీ సిబ్బంది ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ కారణంగా పుష్పక్ రైలును 30 నిమిషాల పాటు రైల్వే స్టేషన్లోనే నిలిపివేశారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. లూప్ లైన్ ద్వారా రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. చదవండి: ‘అంత్యక్రియలు అయ్యాక ప్రత్యక్షం.. దెయ్యమా ఏంటి?’ -
భారీ భూకంపం: వీడియో వైరల్
గువహటి: అసోం, సోనిత్‌పూర్‌లో బుధవారం సంభవించిన భారీ భూకంపం కలకలం రేపింది. 6.4గా తీవ్రతతో ఒక్కసారిగా భూమి కంపించింది. దీనికి సంబధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌మీడియాలో షేర్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి భూంప్రకంపనల తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక అపార్ట్మెంట్ భవనం మరో భవనంపైకి ఒరిగిపోయింది. దీంతో రెండు అసార్ట్‌మెంట్ వాసులతోపాటు సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. నగౌస్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. (అసోంలో భారీ భూకంపం: పరుగులు తీసిన జనం) భూకంపంపై అసోం సీఎం సర్బానంద సోనావాల్ ట్వీట్ చేశారు. అసోంలో భారీ భూకంపం వచ్చిందని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాతోపాటు, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా దీనిపై స్పందించారు. రాష్ట్రానికి కేంద్రానికి అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రధాని మోదీ ట్విట్ చేశారు. అటు కరోనా సెకండ్ వేవ్, ఇటు భూకంపంతో అసోం ప్రజలు బాధపడుతున్నారంటూ ప్రియాంక గాంధీ వారికి తన సానుభూతిని ప్రకటించారు. #WATCH Assam | A building in Nagaon tilts against its adjacent building. An earthquake with a magnitude of 6.4 on the Richter Scale hit Sonitpur today. Tremors were felt in Nagaon too. pic.twitter.com/03ljgzyBhS — ANI (@ANI) April 28, 2021 To my sisters and brothers in Assam who are now dealing with the double blow of an earthquake and the rampaging second wave of COVID, I send you my love and prayers. — Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 28, 2021 -
సూరజ్ ఖాన్ ఆసుపత్రి వద్ద కుప్పకూలిన భవనం గోడ
-
విషాదం.. సెల్ ఫోన్లో మాట్లాడుతూ..
సాక్షి, డబీర్‌పురా: సెల్ఫోన్లో మాట్లాడుతూ ఓ యువకుడు ప్రమాదవశాత్తు భవనం 5వ అంతస్తు పైనుంచి కిందపడి మృతి చెందిన సంఘటన బుధవారం మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన హరీష్, లక్ష్మణ్ (22) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జహేరానగర్ ప్రాంతంలో ఉంటున్నారు. మంగళవారం రాత్రి వారిద్దరూ నిర్మాణంలో ఉన్న మోయిన్ ఆలం ఖాన్ భవనంలోని 5వ అంతస్తుకు వెళ్లారు. ఫోన్ మాట్లాడుతున్న లక్ష్మణ్ ప్రమాదవశాత్తు 5వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. స్థానికులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రంప్ అభిశంసన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానాన్ని బుధవారం ప్రతినిధుల సభ ఆమోదించింది. అమెరికా చరిత్రలోనే ప్రతినిధుల సభలో రెండు సార్లు అభిశంసనకు గురైన అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. 2019 డిసెంబర్‌లోనూ ట్రంప్‌ను ప్రతినిధుల సభ అభిశంసించింది. క్యాపిటల్ భవనంపై దాడికి బాధ్యుడిని చేస్తూ డెమొక్రటిక్ సభ్యులు ప్రతినిధుల సభలో ‘తిరుగుబాటు చేసేలా రెచ్చగొట్టారు’అనే ప్రధాన ఆరోపణతో ట్రంప్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం ఈ తీర్మానంపై ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో ట్రంప్ అభిశంసనకు అనుకూలంగా 232 ఓట్లు, వ్యతిరేకంగా 197 ఓట్లు వచ్చాయి. 10 మంది రిపబ్లికన్ సభ్యులు కూడా ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేయడం విశేషం. అమెరికా చరిత్రలో ఇది నాలుగో అభిశంసన ప్రక్రియ. మద్దతుదారులను ఉద్దేశించి రెచ్చగొట్టేలా ప్రసంగించారని, ఆ కారణంగానే ప్రజాస్వామ్య సౌధమైన క్యాపిటల్ భవనంపై దాడితో పాటు హింస చెలరేగిందని ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంలో ఆరోపించారు. ఆ దాడి కారణంగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను పార్లమెంటు నిర్ధారించే ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. ఆ హింసలో ఒక పోలీసు అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రతినిధుల సభలో ఆమోదం పొందడంతో, ఈ అభిశంసన తీర్మానం సెనెట్‌కు వెళ్తుంది. సెనెట్‌లో కూడా ఆమోదం పొందితే.. ట్రంప్ ఇక జీవితకాలంలో దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టలేరు. అయితే, సెనెట్ సమావేశాలు ఇప్పటికే జనవరి 19 వరకు వాయిదా పడ్డాయి. జనవరి 20న కొత్త అధ్యక్షుడిగా డెమొక్రటిక్ నేత జో బైడెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. దాంతో, అధ్యక్షుడిగా గడువు ముగిసేవరకు వైట్‌హౌజ్‌లో కొనసాగే అవకాశం ట్రంప్‌కు లభించింది. బైడెన్ ప్రమాణ స్వీకారం లోపు సెనెట్‌లో అభిశంసన తీర్మానం ప్రక్రియ ముగిసే అవకాశం లేదని సెనెట్ మెజారిటీ లీడర్ మిచ్ మెక్ కానెల్ పేర్కొన్నారు. సెనెట్‌లో ఈ తీర్మానం ఆమోదం పొందాలంటే కనీసం 17 మంది రిపబ్లికన్ సభ్యులు అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుంది. అభిశంసన తీర్మానంపై ప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్‌లో డెమొక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ ఎంపీలైన అమీ బెరా, ఆర్ఓ ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీల జయపాల్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. -
ట్రంప్ అభిశంసన దిశగా..!
వాషింగ్టన్: గడువుకు ముందే దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దేశ ప్రజాస్వామ్య సౌధం క్యాపిటల్ భవనంపై దాడికి కారణమయ్యారన్న ఆరోపణలపై అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రతినిధుల సభలో బుధవారం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడికి అనుచరులను రెచ్చగొట్టారన్న ప్రధాన ఆరోపణతో ఈ అభిశంసన తీర్మానాన్ని రూపొందించారు. డెమొక్రాట్లు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభలో ఈ తీర్మానం ఆమోదం పొందితే.. వెంటనే దీనిని సెనెట్‌కు పంపిస్తారు. డెమొక్రాట్లతో పాటు పలువురు రిపబ్లికన్ సభ్యులు కూడా ఈ అభిశంసనకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న ట్రంప్‌ను అభిశంసిస్తూ రూపొందించిన ఈ తీర్మానంపై ప్రతినిధుల సభలో బుధవారం అర్ధరాత్రి(భారత కాలమానం) దాటిన తరువాత కూడా చర్చ కొనసాగింది. అభిశంసన తీర్మానం అమోదం పొందుతుందన్న విశ్వాసాన్ని డెమొక్రాటిక్ సభ్యులు వ్యక్తం చేశారు. ‘అధ్యక్షుడిగా ట్రంప్ శ్వేత సౌధంలో ఉన్నంతకాలం మన దేశం, మన స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నట్లే. క్యాపిటల్ భవనంపై దాడికి బాధ్యత వహించాల్సింది ట్రంపే. ఆయనే ఈ దాడికి కుట్ర చేశారు.అనుచరులను రెచ్చగొట్టారు. అందువల్ల ట్రంప్‌ను అభిశంసించే ఈ తీర్మానానికి మద్దతు పలకవలసిందిగా సహచర సభ్యులను కోరుతున్నా’ అని ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన డెమొక్రాట్ సభ్యడు జేమ్స్ మెక్ గవర్న్ సహచర ఎంపీలను కోరారు. క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించి ‘తిరుగుబాటు చేసేందుకు రెచ్చగొట్టారు’ అనే ప్రధాన ఆరోపణతో అభిశంసన తీర్మానాన్ని రూపొందించారు. ‘దాడితో ధ్వంసమైన ఈ భవనాన్ని మరమ్మత్తు చేయవచ్చు. కానీ ప్రజాస్వామ్య సౌధంపై జరిగిన ఆ దాడికి ట్రంప్‌ను బాధ్యుడిని చేయనట్లయితే, ఈ దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేం’ అని జేమ్స్ పేర్కొన్నారు. ‘దేశ ప్రజాస్వామ్య పునాదులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ‘అమెరికాలో ఇలాంటివి(క్యాపిటల్ భవనంపై దాడి) ఎట్టి పరిస్థితుల్లో కుదరవన్న గట్టి సందేశం ఇప్పుడు ఇవ్వనట్లయితే.. ఇవి మళ్లీ మళ్లీ జరిగే ప్రమాదముంది’ అని ఎంపీ చెల్లీ పింగ్రీ హెచ్చరించారు. ట్రంప్ పై అభిశంసన నిర్ణయం సరైంది కాదని రిపబ్లికన్ సభ్యుడు స్టీవ్ చాబొట్ అభిప్రాయపడ్డారు. ‘విభజిత దేశాన్ని కలిపే ప్రయత్నం చేయకుండా, మరింత విడదీసే ప్రయత్నం చేస్తున్నార’ని డెమొక్రాట్లపై విమర్శలు గుప్పించారు. రాజకీయ రచ్చను పక్కనబెట్టి, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను కలసికట్టుగా పరిష్కరించాల్సిన సమయం ఇదని సూచించారు. అంతకుముందు, 25వ రాజ్యాంగ సవరణ ద్వారా లభించిన అధికారంతో అధ్యక్షుడిగా ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను కోరుతూ ప్రతినిధుల సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 223 ఓట్లు, వ్యతిరేకంగా 205 ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్లలో ఒకరు తీర్మానానికి అనుకూలంగా ఓటేయగా, ఐదుగురు ఓటింగ్‌లో పాల్గొనలేదు. అయితే, 25వ రాజ్యాంగ సవరణ అధికారాన్ని వినియోగించుకుని ట్రంప్‌ను పదవి నుంచి దించాలన్న ఆలోచన తనకు లేదని స్పష్టం చేస్తూ ఈ ఓటింగ్ కన్నా ముందే ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి మైక్ పెన్స్ ఒక లేఖ రాశారు. అనుకూలంగా ఓటేస్తా అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తానని భారతీయ అమెరికన్ ఎంపీ డాక్టర్ అమీ బెరా స్పష్టం చేశారు. క్యాపిటల్ భవనంపై దాడికి కుట్ర పన్నినందుకు గానూ అమెరికా చరిత్రలో చెత్తకుండీలో చేరే స్థాయికి ట్రంప్ చేరారని మండిపడ్డారు. అమెరికా చరిత్రలోనే జనవరి 6 చీకటి రోజన్నారు. దేశ ప్రజాస్వామ్య సౌధంపై ఆ రోజు జరిగిన దాడికి కుట్రదారు, వ్యూహకర్త ట్రంపేనని విరుచుకుపడ్డారు. ఇందుకు ఆయన కొన్నాళ్లుగా ప్రణాళికలు వేశారన్నారు. ట్రంప్ దుశ్చర్యలను వివరించేందుకు మాటలు లేవన్నారు. ట్రంప్‌ని తొలగించలేం: పెన్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 25వ సవరణ ద్వారా గద్దె దింపేయాలని వస్తున్న డిమాండ్లను ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తోసిపుచ్చారు. ఆర్టికల్ 25 ద్వారా ట్రంప్‌ని పదవీచ్యుతుడ్ని చేయలేమని ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసికి లేఖ రాశారు. ‘‘మన రాజ్యాంగం ప్రకారం 25వ రాజ్యాంగ సవరణ అంటే అధ్యక్షుడికి శిక్ష విధించడం కాదు. అది ఎలాంటప్పుడు ఉపయోగించాలంటే భావి తరాలకు మార్గదర్శకంగా ఉండాలి. అధ్యక్షుడు అసమర్థుడైనప్పుడు, పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్‌ని ప్రయోగించాలి’’అని మైక్ పెన్స్ ఆ లేఖలో పేర్కొన్నారు. క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ట్రంప్‌ని గద్దె దింపేయాలంటూ డిమాండ్లు అధికమయ్యాయి. స్పీకర్ నాన్సీ ఈ డిమాండ్‌ను తీవ్రంగా వినిపించడంతో ఉపాధ్యక్షుడు ఆమెకు లేఖలో ఈ వివరణ ఇచ్చారు. అప్రమత్తతలో భాగంగా క్యాపిటల్‌లో మొహరించిన నేషనల్ గార్డ్ బలగాలు విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యం -
ఘోర ప్రమాదం: 23 మంది మృతి
ఘజియాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘజియాబాద్‌లో భవనం కూలి సుమారు 23 మంది వరకూ మృత్యువాత పడ్డారు. మురాద్‌నగర్ శ్మశానవాటిక కాంప్లెక్స్‌లో పైకప్పు కూలిపోయింది. రామ్ ధాన్ అనే వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించడానికి 25మందికి పైగా శ్మశానానికి వెళ్లారు. కాగా, ఆ సమయంలో వర్షం రావడంతో వారంతా శ్మశానంలో ఉన్న కాంప్లెక్స్‌లో వెళ్లగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు అక్కడిక్కడే మరణించగా, కొంతమంది ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: అడ్వాన్స్ ఇవ్వలేదని ప్రయాణికురాలి పీక కోశాడు..) -
హవ్వా!! పిచ్చి పనికి గిన్నిస్ రికార్డా..
అబుదాబి : ఓ పెద్ద బిల్డింగ్‌ను అతి తక్కువ సమయంలో కూల్చి ప్రపంచ రికార్డు నెలకొల్పిందో రియల్ ఎస్టేట్ సంస్థ. వివరాలు.. అబుదాబికి చెందిన మోడన్ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొద్దిరోజుల క్రితం 541.44 అడుగుల సొంత బిల్డింగ్ ‘మినా ప్లాజా’ను 10 సెకన్లలో కూల్చేసింది. 4 టవర్లు, 144 ఫ్లోర్లు ఉన్న ఆ పెద్ద భవనం అతి తక్కవ సమయంలో పేకమేడలా కూలిపోయింది. దీంతో గిన్నిస్ బుక్ రికార్డ్ సంస్థ సొంతమైంది. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ సంస్థ తమ అధికారిక ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసింది. ( ఆన్లైన్లో పెళ్లికి 2 వేల మంది అతిధులు ) దీంతో వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు‘అవెంజర్స్ సినిమాలో టోనీ స్టార్క్.. హల్కుతో గొడవపడి ఎప్పుడో ఇలాంటి బిల్డింగ్‌ను కూల్చేశాడు’.. ‘అదో పిచ్చి పని’.. ‘ డబ్బుల్ని, వనరుల్ని వృధా చేస్తున్నారు’.. ‘అద్బుతంగా ఉంది’.. ‘ హవ్వా!! పిచ్చి పనికి గిన్నిస్ రికార్డా..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
సింగపూర్ సూపర్ పెంటహౌజ్ అమ్మకం
కౌలాలంపూర్: సింగపూర్‌లోనే అంత్యంత ఎత్తైన, ఖరీదైన మూడు అంతస్తుల భవన పెంటహౌజ్‌ను బ్రిటిష్ బిలియనీర్ జేమ్స్ డైసన్ ఆయన భార్య అమ్మకానికి పెట్టారు. బ్యాగ్‌లెస్ వ్యక్యూమ్ క్లీనర్ ఆవిష్కకర్తే జెమ్స్ డైసన్. అంత్యంత ఖరీదైన భవనానం పెంటహౌజ్‌ను డైసన్ గతేడాది 74 మిలియన్సింపూర్ డాలర్(యుఎస్ డాలర్. 54 మిలియన్)లకు కొనుగొలు చేశారు. అయితే ఈ పెంటహౌజ్‌ను డైసన్ 62 మిలియన్ల సింగపూర్ డాలర్‌కు ఆమెరికాకు చెందిన వ్యాపారవేత్తకు అమ్ముతున్నట్లు డైసన్ సంస్థ ప్రతినిధి అక్కడి మీడియాకు వెల్లడించారు. (చదవండి: నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తిన వీడియో) అయితే దీనిని డైసన్ కొనుగొలు చేసిన దానికంటే 15 శాతం నష్టానికి అమ్ముతున్నట్లు ఆయన చెప్పారు. ఈ పెంట్‌హౌజ్‌ను ఇండోనేషియాకు చెందిన అమెరికా పౌరుడు లియో కొగువాన్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. లియో కొగువాన్ అమెరికా ఇన్పోటెక్ ప్రోవైడర్, ఎస్హెచ్ఐ ఇంటర్నేషనల్ చైర్మన్, సహా వ్యవస్థాపకుడు. టాంజోంగ్ పగర్ సెంటర్, ఐదు పడక గదులతో సూపర్ పెంట్ హౌజ్‌గా పేదొందిన ఈ భవనం విలువ ఒకప్పుడు 100 మిలియన్ యుఎస్ డాలర్‌గా ఉండేది. ఈ సూపర్ పెంటహౌజ్‌లో అతిపెద్ద స్విమ్మింగ్ పూల్, జాకుజీతో పాటు విలాసవంతమైన ప్రైవేటు గార్డెన్ ఉంది. (చదవండి: ట్రంప్‌కు షాకిచ్చిన ట్విట్టర్) -
అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుళ్ల మృతి
పట్నంబజారు(గుంటూరు): అనుమానాస్పద స్థితిలో తొమ్మిది నెలల చిన్నారి సహా తల్లి మృతి చెందిన ఘటనపై కేసు నమోదయింది. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంభొట్లవారిపాలెంకు చెందిన నర్రా కల్యాణ్‌చంద్రకు అదే జిల్లా పంగులూరు గ్రామానికి చెందిన మనోజ్ఞ(29)కు మూడేళ్ల కిందట వివాహం జరిగింది. కల్యాణ్‌చంద్ర నేవీలో ప్రైవేట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. వీరికి తొమ్మిది నెలల తులసి అనే కుమార్తె ఉంది. అయితే హైదరాబాద్‌లో మనోజ్ఞ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. కల్యాణ్ విధుల నిమిత్తం వెళ్లి కొద్ది నెలల తర్వాత వస్తుండేవాడు. ఈ క్రమంలో కరోనా లాక్డౌన్ సమయం నుంచి గుంటూరు నగరంలోని లక్ష్మీపురం కమలేష్ అపార్ట్‌మెంట్స్‌లో కల్యాణ్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. వివాహ సమయంలో 50 సవర్ల బంగారం, ఐదు సెంట్ల స్థలం, రూ.2 లక్షల నగదు, ఒక ఇల్లును కట్నంగా ఇచ్చారు. అయినప్పటికీ మనోజ్ఞను భర్త కల్యాణ్ అతని తల్లిదండ్రులు శ్రీమన్నారాయణ, కామేశ్వరి అనేక రకాలుగా హింసించేవారని, తమతో ఏ మాత్రం మీ కుటుంబం సరితూగదని నిత్యం వేధింపులకు గురిచేసేవారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల కిందట మృతురాలు ఇక్కడ ఉండలేకపోతున్నాని తల్లిదండ్రులు బాచిన రమేష్‌బాబు, విజయలక్ష్మితో ఫోన్లో మాట్లాడి కన్నీరుమున్నీరయింది. ఆ సమయంలో మనోజ్ఞను తీసుకువెళ్లేందుకు వచ్చిన ఆమె తల్లిదండ్రులను వియ్యంకుడు శ్రీమన్నారాయణ సర్దిచెప్పి పంపించి వేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మనోజ్ఞ, ఆమె కుమార్తె తులసి అపార్ట్‌మెంట్‌పై నుంచి కిందపడి మృతి చెందగా విషయాన్ని తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గుంటూరుకు చేరుకున్నారు. తమ బిడ్డను భర్త, అత్తమామలే చంపేసి కింద పడేసి ఉంటారని మనోజ్ఞ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టాభిపురం ఎస్‌హెచ్‌వో ఇ.పూర్ణచంద్రరావు తెలిపారు. -
కుప్పకూలిన ఐదంతస్తుల బిల్డింగ్
ముంబై: మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లా మహద్‌లో సోమవారం దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద 200 మందికి పైగా చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన పట్ల పలువురు విషాదం వ్యకం చేస్తున్నారు. ఈ సంఘటనలో గాయపడిన వారికి తక్షణ సాయం అందించాలని సీఎం ఆదేశించారు. చదవండి: ‘అసంతృప్త నేతలపై చర్యలు లేవు’ -
ఐదు నిమిషాలైతే ప్రాణాలు పోయేవి..
జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నెం. 44లోని నివాసంపై బండరాళ్లు పడిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు సంబంధిత కాంట్రాక్టర్‌పై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు తాము జూబ్లీహిల్స్ పోలీసులకు ఏడుసార్లు ఫిర్యాదు చేశామని అయినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. 30 అడుగుల బండరాయి ఒక్కసారిగా భవనంపై పడటంతో ఆ శబ్ధానికి ప్రాణం పోయినంత పనైంద న్నారు. ఆ సమయంలో భవనం వెనుక వైపు ఉన్న బెడ్రూమ్లో ఉండి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బెడ్రూమ్లో ఉన్న బండరాళ్లును చూస్తే ఒళ్ళు జలదరిస్తుందని అన్నారు. తవ్వకాలపై జూబ్లీహిల్స్ సొసైటీ కి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కొండ తమ ఇంటిపైకి వాలుగా ఉన్న విషయాన్ని కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లామని అయినా సద రు కాంట్రాక్టర్ దీనిని పట్టించుకోకుండా, కనీస అనుమతులు తీసుకోకుండా రాక్ కటి ంగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించాడు. ఇంత పెద్ద బండరాయిని పగులగొట్టేటప్పుడు మైనింగ్ అనుమతులు తీసుకోవాల్సి ఉందని వారు ఇవేవి తీసుకోకుండా అడిగిన ప్రతిసారి తమకు జీహెచ్ఎంసీ అనుమతులు ఉన్నా యని బుకాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలోరూ. 40 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని దీనిని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో విషాదం
-
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో విషాదం
సాక్షి, విజయవాడ: తీవ్ర మనస్తాపంతో ప్రభుత్వాసుపత్రి భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నగరంలో చోటు చేసుకుంది. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న మహిళను వైద్యులు డిశ్చార్జ్ చేయగా, ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన మహిళ ఆసుపత్రి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చల్లపల్లి మండలం నారాయణపురానికి చెందిన ఆదిలక్ష్మిగా ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. మరోవైపు కుమారుడికి కరోనా సోకడంతో ఓ వృద్ధుడు విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌పై ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే సమీపంలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి అతడిని కాపాడారు. అనంతరం జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు మచిలీపట్నంకు చెందిన నాగేశ్వరరావుగా గుర్తించారు. -
మారిషస్‌లో సుప్రీంకోర్టు భవనం ప్రారంభోత్సవం
-
బెంగళూరులో కూలిన భవనం
-
చూస్తూ ఉండగానే పేక మేడలా..
కర్ణాటక,శివాజీనగర: బెంగళూరులో ఒక భవనం క్షణాల్లో కుప్పకూలింది. మంగళవారం రాత్రి 9:15 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. అందరూ చూస్తూ ఉండగానే పేకమేడలా నేలరాలింది. ప్రమాదాన్ని ఊహించి జనం ముందే భవనాన్ని ఖాళీ చేయడంతో పెద్ద గండం తప్పినట్లయింది. వివరాల్లోకి వెళితే.. నగరం నడిబొడ్డున ఎస్సీ రోడ్డు, కపాలి థియేటర్ వెనుకభాగంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. థియేటర్‌ను కూల్చి కొత్త భవనం నిర్మాణ పనులు చేపట్టారు. పక్కనే నాలుగు అంతస్తుల భవనం ఉండగా దానిని లాడ్జ్, హోటల్‌గా ఉపయోగించేవారు. ఇటీవల భారీ వర్షాలు కురవడం, భవనం సమీపంలోనే కొత్త కట్టడానికి తవ్వకాలు జరుగుతుండడంతో ఈ పాత భవంతి కూలినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటనను కొందరు స్థానికులు తమ మొబైల్ఫోన్లలో చిత్రీకరించగా, వైరల్ అయ్యింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పక్క భవనం ఇంజనీర్ ముస్తఫాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. మేయర్ గౌతంకుమార్ జైన్ పరిశీలించారు. -
దళిత విజ్ఞాన ధామం ప్రారంభోత్సవానికి సిద్ధం
జూబ్లీహిల్స్: దళిత విజ్ఞానధామంగా భావిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవన నిర్మాణం పనులు చివరిదశకు చేరుకున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని రహమత్‌నగర్ ఎస్పీఆర్ హిల్స్‌లో నిర్మిస్తున్న భవనానికి 2016 ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయగా, 2017 నవంబర్‌లో ప్రారంభమైన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. 1400 గజాల విస్తీర్ణంలో రెండు సెల్లార్లతో కలిపి మొత్తం 9 అంతస్తుల్లో దాదాపు 77,800 చదరపు అడుగుల విస్తీర్ణంతో రూ.21 కోట్ల వ్యయంతో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆడిటోరియం, కంపౌండ్‌వాల్ నిర్మాణం పూర్తిచేసి ట్రాన్స్ఫార్మర్ బిగించడం సహా చిన్నపాటి ప్యాచ్‌వర్క్‌లు పూర్తిచేసి త్వరలోనే భవనాన్ని అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. బౌద్ధ సంప్రదాయం ఉట్టిపడేలా.. ఎక్కువ భాగం స్టీల్‌తో కొంత మొత్తం సిమెంట్‌తో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానమైన ‘కాంపోజిట్ స్ట్రక్చర్’ పద్ధతిలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన ‘ఎక్స్పాండెడ్ పాలిస్ట్రెయిన్ వాల్’(ఈపీఎస్) టెక్నాలజీతో దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా నిర్మాణం జరుపుకుంటోంది. పూర్తిస్థాయిలో స్టీల్ పిల్లర్లు నిర్మించి వాటిపై సిమెంట్‌తో స్లాబ్ వేస్తున్నారు. సాధారణ భవనాల నిర్మాణంతో పోలిస్తే నిర్మాణవ్యయం తగ్గుతోంది. ఈ భవనంలో కనీసం 4–5 డిగ్రీల వేడి తక్కువగా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇక బౌద్ధ సంప్రదాయం ఉట్టిపడేలా ముద్రలు, స్థూపాలు ఏర్పాటు చేస్తున్నారు. సెంటర్ ఏర్పాటు లక్ష్యం.. దళిత స్టడీస్ ఏర్పాటు ప్రధాన లక్ష్యం చిరకాలంగా దళితులు, ఆదివాసీలు ఇతర వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సమస్యలను గుర్తించడం, వాటికి సమర్థవంతమైన పరిష్కారాలపై పరిశోధన చేయడం, ప్రభుత్వానికి సిఫారస్ చేయడం ద్వారా పాలసీస్థాయిలో పటిష్ట కృషి చేయడం, వివిధ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్‌లపై, సామాజిక సమస్యల పరిష్కారంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం. మొత్తం తొమ్మిది అంతస్తులు.. మొదటి అంతస్తులో డైనింగ్, కాఫీషాప్ ఏర్పాటు. రెండో అంతస్తులో ధ్యానగది, బోర్డ్‌రూమ్, సమావేశ మందిరం, మూడవ అంతస్తులో లైబ్రరీ, డిజిటల్ ల్యాబ్, మీడియా గది, నాల్గో అంతస్తులో శిక్షణకు వచ్చేవారికి వసతి గదులు, ఐదో అంతస్తులో ఆడిటోరియం, ఆరో అంతస్తులో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. దళితులతో సహా ఆర్థికంగా వెనుకబడిన వారి సమస్యలపై పరిశోధన కేంద్రం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, విశాలమైన పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. భవనం పైకప్పుపై బౌద్ధమత శైలిలో డోమ్‌తో కూడిన విశాల ధ్యాన కేంద్రం నిర్మిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా అంబేడ్కర్ విగ్రహం.. భవనం ముందు భాగంలో మూడవ అంతస్తుపై 25అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి ఫైబర్‌తో నాగ్‌పూర్‌లో విగ్రహం తయారు చేయించి తీసుకువచ్చారు. ఇది దేశంలోనే ఎత్తయిన విగ్రహంగా చెబుతున్నారు. -
దారుణం: తండ్రి మీద కోపంతో పిల్లల్ని..
కోల్‌కతా: కోల్‌కతాలోని బుర్రాబజార్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. తండ్రితో ఉన్న గొడవలను మనుసులో ఉంచుకొని వారి పిల్లలను నాలుగంతస్థుల భవనంపై నుంచి తోసేశాడో వ్యక్తి. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ కమిషనర్ మురళీధర్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం... బుర్రాబజార్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ వ్యక్తికి ఇంటి పక్కన ఉన్న మరో కుటుంబంతో వివాదాలు ఉండేవి. ఈ నేపథ్యంలో సదురు కుటుంబం మీద పగ పెంచుకున్న ఆ వ్యక్తి ఇద్దరి పిల్లలను ఫ్లాట్‌లోని నాలుగో అంతస్తు నుంచి కిందికి తోసేశాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. రెండేళ్ల బాలుడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో బాలుడు(6) పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ఇద్దరు బాలురకు సంబంధించిన సంబంధం తెలియాల్సి ఉంది. కాగా.. ఘటనకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు జేసీపీ శర్మ తెలిపారు. చదవండి: తీవ్ర ఉత్కంఠ, ప్రాణాలకు తెగించి మరీ.! -
కంపించిన మినర్వా కాంప్లెక్స్
రాంగోపాల్‌పేట్:ఉదయం11గంటలు...ఎస్డీరోడ్‌లోని మినర్వాకాంప్లెక్స్లో ఉండే కార్యాలయాల్లో ఉద్యోగులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు...అప్పుడప్పుడే షాపులు తెరుచుకుంటున్నాయి...ఉన్నట్లుండి కాంప్లెక్స్‌లోని కొన్ని ప్లోర్లలో ప్రకంపనలు కనిపించాయి. టేబుళ్లపై ఉన్న కంప్యూటర్లు కదులుతుండటంతో భూ కంపం వచ్చిందని భావించిన ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. అందరూ కాంప్లెక్స్ బయటికి వచ్చి ఏమి జరుగుతుందోనని ఆందోళనలో కాలం గడిపారు. దీనిపై సమాచారం అండంతో పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు హడావిడిగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే సెల్లార్లో ఉండే బ్యాంకు లాకర్లను తరలిస్తుండటంతో వస్తువులు కంపించినట్లు తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా లాకర్ల తరలిస్తుంటేనే భవనాలు కంపించడంతో భవనం పటిష్టతపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎస్డీరోడ్ మినర్వా కాంప్లెక్స్ ఏడు అంతస్తులతో కొనసాగుతుంది. 1980 సంవత్సరంలో ఈ కాంప్లెక్స్‌ను నిర్మించారు. సెల్లార్లో ఉన్న అలహాబాద్ బ్యాంకును పీజీ రోడ్‌కు తరలిస్తున్న నేపథ్యంలో అందులోని లాకర్లను గురువారం ఉదయం బయటికి తీసుకువచ్చారు. ఒక్కో లాకర్ భారీగా ఉండటంతో వాటిని బయటికి తీసుకువచ్చే ప్రయత్నంలో కాంప్లెక్స్ కంపించింది. దీంతో 3, 5వ ప్లోర్లలో ఎక్కువగా కదలికలు కనిపించాయి. 3వ ప్లోర్లోని ఓ బ్యాంకులో కంప్యూటర్లు కదలిపోవడంతో ఆందోళనకు గురైన సిబ్బంది బయటికి పరుగు తీశారు. ఒక ఆఫీస్‌లో సింకు విరిగి కింద పడిపోయింది. కొన్ని గ్లాసులు పగిలిపోయాయి. దీంతో వందల సంఖ్యలో ఉద్యోగులు కార్యాలయాలను వదలి రోడ్డుపైకి వచ్చారు. ఆ కొద్దిసేపటికి కాంప్లెక్స్ మెయింటెనెన్స్ సిబ్బంది అక్కడికి వచ్చి విషయం చెప్పడంతో కొందరు ఊపిరిపీల్చుకుని మళ్లీ కాంపెక్స్‌లోని తమ కార్యాలయాల్లోకి వెళ్లారు. మరికొందరు భయంతో ఈ రోజు విధులకు రామని తెగేసి చెప్పి ఇళ్లకు వెళ్లిపోయారు. జీహెచ్ఎంసీ అధికారుల పరిశీలన దీనిపై సమాచారం అందడంతో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ జోనల్ సీపీ ప్రసాద్, బేగంపేట సర్కిల్ ఏసీపీ ఖుద్దూస్, డీఈ ప్రశాంతి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కాంప్లెక్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్‌కు నోటీసులు ఇచ్చి స్ట్రక్చరల్ స్టెబిలిటీని పరిశీలిస్తామని తెలిపారు. తమ ఇంజనీరింగ్ అధికారులు భవనాన్ని తనిఖీ చేస్తారని వారు పేర్కొన్నారు. -
ఒరిగిన 4 అంతస్తుల భవనం
కర్ణాటక,బనశంకరి: బెంగళూరులో భవనాలు కుంగిపోవడం, బీటలు వారడం, పక్కకు వాలిపోవడం పరిపాటిగా మారిపోయింది. నగరంలో మరో నాలుగు అంతస్తుల కట్టడం పక్కకు వాలిపోవడంతో కట్టడంలో ఉన్న ప్రజలు భయంతో కట్టడం ఖాళీ చేశారు. హెబ్బాల కెంపాపురలో నాలుగు అంతస్తుల భవనంలో ప్రైవేటు హాస్టల్‌ను నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఒక్కసారిగా భవనం పక్కకు వాలిపోవడంతో భవనంలో నివసిస్తున్న కుటుంబాలు, పీజీ వాసులు బయటకు పరుగులు తీశారు. తక్షణం అగ్నిమాపకసిబ్బంది, పోలీసులకు సమాచారం అందించడంతో అమృతహళ్లి పోలీసులు, అగ్నిమాపకసిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పక్కన పునాది తవ్వడంతో ప్రమాదం అగ్నిమాపక సిబ్బంది భవనంలో ఎక్కడ పగుళ్లు, బీటలు ఏర్పడ్డాయి అనే దానిని పరిశీలించారు. అలాగే పాలికె అదికారులు కూడా చేరుకుని భవనాన్ని పరిశీలించి అక్కడ ఉన్న నివాసప్రజలను వేరే చోటుకు తరలించారు. పాలికె అధికారులు విలేకరులతో మాట్లాడుతూ కట్టడం యజమాని రాహుల్ పీజీ నిర్వహిస్తుండగా, భవనం వెనుక భాగంలో ఇల్లు నిర్మించడానికి బాబు అనే వ్యక్తి పునాది తీశారు. సుమారు 5 నుంచి 8 అడుగుల మేర పునాది తీయడంతో పీజీ భవనం పక్కకు వాలిందన్నారు. వాలిన భవనాన్ని తొలగించడం కోసం చుట్టుపక్కల ఇళ్లవాసులను ముందుజాగ్రత్తగా వేరే స్థలానికి వెళ్లాలని మనవిచేశారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకుండా పునాది తవ్వారని దీని వల్ల భవనం పక్కకు వాలిందని ఇరుగుపొరుగు నివాసులు ఆరోపించారు. ఈ ఘటన పై అమృతహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. -
టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
అహ్మదాబాద్ : గుజరాత్‌లోని సూరత్ జిల్లా సరోలి ప్రాంతంలోని రఘువీర్ టెక్స్టైల్ మార్కెట్లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పదిఅంతస్తుల భవనం మంటల్లో చిక్కుకోవడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. 50కి పైగా అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్ధలానికి చేరాయని అధికారులు తెలిపారు. కాగా కొద్దిరోజుల కిందట ఇదే భవనంలోని నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం జరగడం గమనార్హం. మరోవైపు అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలను కొద్దిసేపటిలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. చదవండి : అగ్ని ప్రమాదం; 14 కార్లు దగ్ధం -
ప్రియురాలిని కిందకు నెట్టేసిన ప్రియుడు
-
కట్టుబట్టల్తో బయటపడ్డాం
సాక్షి, కాకినాడ : నగరంలోని దేవి మల్టీప్లెక్స్ సమీపంలో పక్కకు ఒరిగిన ఐదంతస్తుల భవనం భాస్కర్ ఎస్టేట్స్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం భాస్కర్ ఎస్టేట్స్ భవనాన్ని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ రమేష్, స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులు కలెక్టర్ వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. మందులు కూడా తీసుకోకుండా కట్టుబట్టలతో రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం మురళీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ భవనాన్ని పరిశీలించాము. మూడు పిల్లర్లు డామేజ్ అయ్యాయి. భవనంలోనికి ఎవరినీ అనుమతించేది లేదు. విలువైన సామగ్రిని తీసుకోవడానికి అవకాశం కల్పించాలంటూ స్థానికులు కోరుతున్నారు. ఫైర్ సిబ్బందితో మాట్లాడి వారి సహాయంతో ఒక్కొక్కరినీ లోపలికి పంపించి సామాన్లు తెప్పించే ప్రయత్నం చేస్తాము. భవనం పరిస్థితిని అధ్యయనం చేయడానికి జేఎన్టీయూ కాకినాడ నిపుణుల బృందం వస్తుంది. భవనం పరిస్థితిని అధ్యయనం చేసిన తరువాత వారి సూచనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. నిపుణుల నివేదిక ఆధారంగా భవనాన్ని కూల్చాలా లేక రిట్రో ఫిటింగ్ చేయాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. భవనం నిర్మించిన బిల్డర్లను, ఇంజనీర్లను రప్పించి వారితో మాట్లాడతామ’’ని అన్నారు. చదవండి : కాకినాడ: పక్కకు ఒరిగిన ఐదంతస్తుల భవనం -
కాకినాడ: పక్కకు ఒరిగిన ఐదంతస్తుల భవనం
సాక్షి, కాకినాడ: కాకినాడలోని దేవి మల్టీప్లెక్స్ సమీపంలో ఐదంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. అపార్ట్మెంట్ వెనక భాగంలో మూడు పిల్లర్లు శిథిలమైపోయి ఏ క్షణమైనా కూలిపోయే స్థితికి చేరింది. దీంతో అధికారులు భవనాన్ని ఖాళీ చేయించారు. ఇప్పటికే 40 ప్లాట్లను అధికారులు ఖాళీ చేయించారు. ఈ భవనాన్ని 14 ఏళ్ళ క్రితం నిర్మించారు. -
భార్యబిడ్డలను బిల్డింగ్‌పై నుంచి తోసేసిన భర్త
-
పారిస్ అపార్టుమెంట్లో మంటలు
పారిస్: పారిస్‌లోని ఓ అపార్టుమెంట్లో సోమవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 30 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనను విద్రోహ చర్యగా అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలోని 16వ డిస్ట్రిక్ట్ ర్యుఎర్లాంగర్ ప్రాంతంలోని 8 అంతస్తుల అపార్టుమెంట్లో అర్థరాత్రి సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పై అంతస్తుల్లో మంటలు వ్యాపించటంతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సుమారు 200 మంది అగ్ని మాపక సిబ్బంది ఐదు గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారని మేయర్ తెలిపారు. సుమారు 50 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన 10 మంది మృతి చెందగా ఆరుగురు అగ్ని మాపక సిబ్బంది సహా మొత్తం 30 మంది గాయపడ్డారని ఆమె వెల్లడించారు. విద్రోహ చర్యగా భావిస్తున్న ఈ ఘటనకు సంబంధించి ఒక మహిళ(40)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారి స్తున్నారు. ఈ ఘటనపై అధ్యక్షుడు మేక్రాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పారిస్‌లోని భవంతిలో మంటలు వ్యాపించిన దృశ్యం -
అంతేగా.. అంతేగా!!
పటమట (విజయవాడ తూర్పు): పాలకులు పలుకుబడి... అధికారుల అండదండలుంటే చాలు నిబంధనలు బేఖాతర్ చేయవచ్చని.. అనుమతులకు చెల్లించాల్సిన చార్జీలను కూడా ఎగ్గోట్టోచ్చని విజయవాడ టీడీపీ నాయకులు, వీఎంసీ అధికారులు మరోమారు నిరూపించారు. నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక అధికారులు పాలకపక్షం నేతలు చెప్పింది తూచా తప్పకుండా పాటించటంతోపాటు వీఎంసీకి రావాల్సిన ఆదాయానికి గండికొట్టి తమ జేబులు నింపుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలిస్తున్న అధికారులు అసలు పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంటుందని ఆరోపణలు పెరుగుతున్నాయి. ఒకే నిర్మాణానికి వేర్వేరు బిల్డింగ్ ఇన్సెపెక్టర్లు పరిశీలనకు వెళ్లగా ఒక అధికారి తిరస్కరించిన ప్లాను, అనుమతిని మరో అధికారి మంజూరు చేయటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 14 శాతం ఓపెన్‌స్పేస్ చార్జీలను ఒక అధికారి సిఫారసు చేస్తే అదే భవనాకికి నామమాత్రపు చార్జీలతో అనుమతులు ఇచ్చేయటం ఇప్పుడు వీఎంసీలో చర్చనీయాంశంగా మారింది. దీనికి నగరంలోని టీడీపీకి చెందిన ఓ యువనేత చక్రం తిప్పి అటు అధికారులకు, ఇటు నిర్మాణాదారులకు మధ్యవర్తిత్వం వహించి వీఎంసీకి సమకూరాల్సిన సొమ్ముకు గండికొట్టారు. వివరాల మేరకు .. బెంజిసర్కిల్ వద్ద కళానగర్‌లో 2018 నవంబర్ 440 గజాల స్థలంలో సిల్టు, జీప్లస్3 నిర్మాణానికి అనుమతి కావాలని వీఎంసీకి దరఖాస్తు వచ్చింది. దీన్ని క్షేత్రస్థాయి పరిశీలనకు బిల్డింగ్ ఇన్సెపెక్టర్ వశీంబేగ్ వెళ్లారు. సంబంధిత ఆస్తికి చెందిన దస్తావేజులు, పన్ను చెల్లింపుల రసీదుల పరిశీలనలో భవన నిర్మాణ అనుమతికి సంబంధించి కేవలం 1999ల నుంచి పన్నులు చెల్లిస్తున్నట్లు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పరిశీలనలో తేలటంతో ఈ ఆస్తికి 14 శాతం ఓపెన్‌స్పేస్ బెటర్మెంట్ చార్జీలు అప్లై అవుతుందని నివేదిక ఇచ్చారు. ఆ చార్జీలు చెల్లించిన తర్వాతే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. బెటర్మెంట్ చార్జీలు చదరపుగజానికి రూ. 60,500 చొప్పున 440 చదరపు గజాలకి 14 శాతం చొప్పున 37.26 లక్షలు వీఎంసీకి చెల్లించాల్సి వచ్చింది. దీంతో సదరు భవన నిర్మాణదారులు భవన నిర్మాణ అనుమతి దరఖాస్తును విత్‌డ్రా చేసుకున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ పనులు జరిగినా అధికారులు ఇటువైపు కన్నెతి చూడలేకపోయారు. అయితే ఈ ఏడాది జనవరి 10వ తేదీన సంబంధిత భవనానికి సిల్టు, జీప్లస్ 4 నిర్మాణానికి మళ్లీ వీఎంసీకి దరఖాస్తు అందింది. మళ్లీ క్షేత్రస్థాయి పరిశీలనకు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ రాం కుమార్ వెళ్లటంతో సంబంధిత భవన నిర్మాణదారులు టీడీఆర్ (టాన్స్‌ఫర్‌బుల్ డెవలప్మెంట్ రైట్స్) బాండ్లు సమర్పించి దరఖాస్తు చేసుకోవటంతో అధికారులు భవన నిర్మాణానికి నామమాత్రపు చార్జీలు రూ. 1.6 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని సిఫారసు చేయటంతో వీఎంసీ అధికారులు అనుమతిని యధేచ్ఛగా ఇచ్చేశారు. అయితే ముందు జరిగిన పరిశీలనలో ఉన్న 14 శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలను అధికారులు కన్పించకుండా మాయచేసి అనుమతులు ఇచ్చేవారని, దీనికి నగరంలోని టీడీపీలో కీలకంగా ఉన్న ఓ యువ నాయకుడు చక్రంతిప్పి అటు నిర్మాణదారులకు, ఇటు అధికారులకు సమన్యాయం చేశారని సమాచారం. పరిశీలించాల్సి ఉంది దీనిపై పరిశీలన చేయాల్సి ఉంది. భవన నిర్మాణదారులు 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లించారా లేదా అనేది పరిశీలించి చెల్లించకపోతే చర్యలు తీసుకుంటాం.- లక్ష్మణరావు, సిటీ ప్లానర్