mars
-
వచ్చేస్తోంది మార్స్ ట్రాన్స్ఫర్ విండో!
మరొక్క నెల రోజులే! సైంటిస్టులంతా రెండేళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎర్త్–మార్స్ ట్రాన్స్ఫర్ విండో’ అక్టోబర్‌లో అందుబాటులోకి రానుంది. 2022 నాటి ట్రాన్స్ఫర్ విండో సందర్భంగా నాసా వంటి అంతరిక్ష సంస్థలు పలు అంగారక ప్రయోగాలు చేశాయి. భావి మార్స్ మిషన్లకు అవసరమైన సామగ్రిని అంగారకునిపైకి ముందే చేరేసేందుకు ప్రయతి్నంచాయి. మరో నెల రోజుల అంతరం అక్టోబర్ ‘విండో’లో కూడా అలాంటి ప్రయోగాలు చేపట్టే దిశగా యోచిస్తున్నాయి. ఏమిటీ ట్రాన్స్ఫర్ విండో? ఇది భూ, అంగారక గ్రహాలు రెండూ పరస్పరం అత్యంత సమీపానికి వచ్చే సమయమని చెప్పవచ్చు. కనుక సహజంగానే ఆ సందర్భంగా భూమికి, అంగారకునికి మధ్య దూరం అత్యంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో అతి తక్కువ ఇంధన వ్యయంతో అంగారక ప్రయోగాలు సాధ్యపడుతాయి. ఫలితంగా ప్రయోగ ఖర్చుతో పాటు అరుణ గ్రహాన్ని చేరేందుకు పట్టే సమయమూ తగ్గుతుంది. కేవలం 6 నుంచి 8 నెలల్లో అంగారకున్ని చేరవచ్చు. అదే ఇతర సమయాల్లో అయితే ఏళ్ల కొద్దీ సమయం పడుతుంది. వీటన్నింటికీ మించి ట్రాన్స్ఫర్ విండోలో ప్రయోగించే అంతరిక్ష నౌక అంగారకుడు అత్యంత అనువైన పొజిషన్లో ఉండగా దాని కక్ష్యలోకి ప్రవేశించగలుగుతుంది. కనుక ప్రయోగం విజయవంతమయ్యే అవకాశం ఎన్నో రెట్లు పెరుగుతుంది. భూమి, అంగారకుల మధ్య ఈ విండో దాదాపు 26 నెలలకు ఓసారి పునరావృతమవుతూ ఉంటుంది. హాన్‌మన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ సూత్రం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. ఈ విండో సమయాన్ని కచి్చతంగా లెక్కించడం అంతరిక్ష సంస్థలకు చాలా కీలకం. లేదంటే ప్రయోగం రెండేళ్లు ఆలస్యమయ్యే ప్రమాదముంటుంది. 2026 విండోపై స్పేస్ ఎక్స్ కన్ను ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ తన అంగారక యాత్ర సన్నాహాలకు మరింత పదును పెడుతోంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే 2026లో అంగారకునిపైకి మానవరహిత ‘స్టార్íÙప్’ మిషన్ చేపట్టనున్నట్టు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆ ఏడాది ‘ఎర్త్–మార్స్ ట్రాన్స్ఫర్ విండో’ సందర్భంగా ప్రయోగం ఉంటుందని వెల్లడించారు. అంతరిక్ష నౌక సజావుగా అరుణ గ్రహంపై దిగి తమ మిషన్ విజయవంతమైతే మరో రెండేళ్లలో, అంటే 2028 నాటికి మానవసహిత అంగారక యాత్ర ఉంటుందని చెప్పారు. నాసా, ఇతర అంతరిక్ష సంస్థలు కూడా 20206 విండో సందర్భంగా అంగారకునిపైకి మరింత అదనపు సామగ్రి తదితరాలను చేరవేసేందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు వేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Nasa: మార్స్‌పై హెలికాప్టర్ క్రాష్
కాలిఫోర్నియా: అంగారకుని(మార్స్)పై అమెరికా అంతరిక్ష పరిశోపధన సంస్థ నాసాకు చెందిన మినీ హెలికాప్టర్ మూడేళ్ల ప్రస్థానం ముగిసింది. అంగారకునిపై ఈ నెల 18న చివరిసారిగా ఎగిరి ల్యాండ్ అయ్యే సమయంలో రోటర్ చెడిపోయి మినీ హెలికాప్టర్ క్రాష్ అయినట్లు నాసా ప్రకటించింది. మార్స్‌పై ఇన్‌జెన్యూటీ మినీ హెలికాప్టర్ ప్రయాణం ముగిసిందని నాసా అధికారులు తెలిపారు. హెలికాప్టర్ క్రాష్‌కు గల కారణాలను అణ్వేషిస్తున్నట్లు చెప్పారు. 2021 ఏప్రిల్‌లో మార్స్‌పై ల్యాండ్ అయినప్పుడు తొలుత హెలికాప్టర్ 30 రోజులు పనిచేస్తుందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా అది 3 సంవత్సరాల పాటు పనిచేసి మార్స్‌పై 14 సార్లు ఎగరగలిగింది. సౌరవ్యవస్థలో సరికొత్త ఏవియేషన్ ప్రయోగాలకు ఇన్‌జెన్యూటీ నాంది పలికింది. మార్స్‌పై ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ను ప్రిజర్వెన్స్ రోవర్ ఆపరేట్ చేసింది. ఇదీచదవండి.. మూన్ ష్నైపర్ శీర్షాసనం -
‘మార్స్ ’ రెడ్ ప్లానెట్ ఎందుకయ్యింది? విలక్షణత ఎలా వచ్చింది?
మార్స్ అంటే అంగారక గ్రహం. ఇది ఎర్రగా కనిపించడం వెనుక అనేక కారణాలున్నాయి. వీటిలో మొదటిది దాని ఉపరితలం నిర్మాణంతో ముడిపడి ఉంది. కాగా ఐరన్ ఆక్సైడ్ ఉనికిని రస్ట్ అని అంటారు. ఆక్సిజన్‌తో పాటు తేమకు చేరువైనప్పుడు భూమిపై ఉన్న ఇనుప వస్తువులు తుప్పు పడతాయి. ఇదేవిధంగా మార్స్‌పై ఇనుము ఆక్సీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఫలితంగా అంగారక గ్రహం నేల, రాళ్ళకు విలక్షణమైన ఎరుపు రంగు సంతరించుకుంటుంది. భూమితో పోలిస్తే మార్స్ బలహీనమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అక్కడి వాతావరణం కార్బన్ డయాక్సైడ్తో కూడి ఉంటుంది. ఈ బలహీన వాతావరణంలో సూర్యరశ్మి భిన్నంగా వెలువడుతుంది. సూర్యరశ్మి అంగారకుని వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు రేలీ స్కాటరింగ్ అనే ప్రక్రియ జరుగుతుంది. దీని వలన కాంతిలోని తక్కువ తరంగదైర్ఘ్యాలు (నీలం, ఆకుపచ్చ వంటివి) ఎక్కువ వెదజల్లుతాయి. ఎక్కువ తరంగదైర్ఘ్యాలు (ఎరుపు, నారింజ వంటివి) ప్రబలంగా మారతాయి. ఇదే అక్కడి ఎరుపు రంగుకు కారణం. మార్స్ చరిత్రలో గణనీయమైన అగ్నిపర్వత కార్యకలాపాలు జరిగాయి. ఈ విస్ఫోటనాల సమయంలో విడుదలయ్యే అగ్నిపర్వత శిలలు, ఖనిజాలు కూడా గ్రహం రంగుకు దోహదం చేస్తాయి. అంగారక గ్రహంపై ఉన్న కొన్ని అగ్నిపర్వత పదార్థాలు, వాతావరణం మారినప్పుడు ఎరుపు రంగును ఉత్పత్తి చేస్తాయి. అంగారక గ్రహంపై భారీగా దుమ్ము తుఫానులు చోటుచేసుకుంటాయి. సూక్ష్మ ధూళి కణాలతో నిండిన ఈ తుఫానులు, సూర్యరశ్మి వెదజల్లినప్పుడు మార్స్కున్న ఎరుపు రూపాన్ని మరింత వృద్ధి చేస్తాయి. ఈ రంగు ఖగోళ శాస్త్రవేత్తలు, అంతరిక్ష ప్రేమికులను ఆకర్షిస్తూనే ఉంటుంది. అంగారక గ్రహాన్ని అధ్యయనం చేసేందుకు కూడా అక్కడి ఎరుపురంగు దోహదపడుతుంది. ఇది కూడా చదవండి: దోమలను ఎవరు ఇష్టంగా తింటారు? -
రాష్ట్రంలో మార్స్ గ్రూప్ పెట్టుబడి మరో రూ.800 కోట్లు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా పెంపుడు జంతువులు (పెట్స్) తినే ఆహార ఉత్పత్తుల్లో పేరొందిన ‘మార్స్ గ్రూప్’తెలంగాణలో మరో రూ.800 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో శుక్రవారం మార్స్ చీఫ్ డేటా, అనలిటిక్స్ ఆఫీసర్ శేఖర్ కృష్ణమూర్తి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది. సిద్దిపేటలో ఇప్పటికే తమ పెంపుడు జంతువుల (పెట్స్) ఫుడ్ తయారీ ప్లాంట్ ద్వారా కార్యకలా పాలు నిర్వహిస్తున్నట్లు ఆ బృందం వెల్లడించింది. మొదట కేవలం రూ.200 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభించి, ఆ తర్వాత మరో రూ.500 కోట్లతో విస్తరించామని పేర్కొంది. తాజాగా మరో రూ.800 కోట్లతో విస్తరణ ప్రణాళికను చేపడతామని మార్స్ గ్రూప్ ప్రతినిధి బృందం వెల్లడించింది. పెట్ కేర్, పెట్ ఆహార ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో కేవలం తయారీకే కాకుండా పరిశోధన, అభివృద్ధి తదితర రంగాల్లో ఉన్న అవకాశాలను ఈ బృందం వివరించింది. కొత్త పెట్టుబడులు, విస్తరణలకు ప్రాధాన్యత కొత్త పెట్టుబడులు, ఇప్పటికే ఉన్న సంస్థల విస్తరణ కార్యకలాపాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. రూ.200 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభించిన మార్స్ గ్రూప్ పెట్టుబడులు విడతల వారీగా రూ.1500 కోట్లకు చేరడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి ఇ.విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
Chandrayaan-3: ఇక అంగారకుడిపైకి అడుగు!
బెంగళూరు: దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ హర్షం వ్యక్తంచేశారు. భారత శాస్త్రవేత్తల కృషి ఫలించిందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘చంద్రయాన్–3 విజయంతో అంగారకుడిపైకి వెళ్తాం. భవిష్యత్తులో శుక్రుడితోపాటు ఇతర గ్రహాలపైకి వెళ్తాం’ అని చెప్పారు. ఇది ఏ దేశానికైనా కష్టం ‘ఈ రోజు టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినా చంద్రుడిపైకి ప్రయాణం చేయడం ఏ దేశానికైనా అంత సులువు కాదు. అదీగాక సాఫ్ట్ లాండింగ్ మరింత సంక్లిష్టమైన విషయం. అయితే, కేవలం రెండు మిషన్లతోనే భారత్ సుసాధ్యం చేసి చూపింది. మానవరహిత వ్యోమనౌకను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు మాత్రమే చంద్రయాన్–1ను చేపట్టాం.’ అని సోమనాథ్ చెప్పారు. మేడిన్ ఇండియా మిషన్ ‘ చంద్రయాన్–2 నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రతి ఒక్కరూ చంద్రయాన్ విజయం కోసం ప్రార్థించారు. చంద్రయాన్–2 మిషన్‌లో పాలుపంచుకున్న చాలామంది కీలక శాస్త్రవేత్తలు చంద్రయాన్–3 మిషన్ బృందంలో పనిచేశారు. చంద్రయాన్–3లో వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం ఏ టెక్నాలజీ కంటే కూడా తక్కువ కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ సెన్సర్లు మన వద్ద ఉన్నాయి. ఇది పూర్తిగా ప్రపంచస్థాయి పరికరాలతో దేశీయంగా రూపొందించిన మేడిన్ ఇండియా మిషన్’ అని సోమనాథ్ చెప్పారు. -
అంగారక గ్రహంపై "కాలనీ"..ఎంతమంది మనుషులు కావాలంటే..
అంగారక గ్రహంపై మానవుని ఆవాసానికి యోగ్యమైనదా? కాదా అనే దానిపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ నీటి జాడలు ఉన్నాయా లేదా ఒక వేళ ఉండాల్సి వచ్చినా అనువుగా ఉంటుందా లేదా అనేదానిపై శాస్త్రవేత్తలు పరిశోధనులు చేశారు. ఆ క్రమంలో శాస్త్రవేత్తలు తాజగా ఆ గ్రహంపై ఎంతమంది వ్యక్తులు ఉండొచ్చొ వెల్లడించారు. జార్జ్ మాసన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మార్స్‌పై కాలనీని 22 మంది వ్యోమగాములతో నిర్మించొచ్చు అని పేర్కొన్నారు. ఇక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకునేలా ఎంతమంది వ్యక్తులు ఉండొచ్చొ కూడా చెప్పారు. తాము ఎన్నో యేళ్లుగా చేస్తున్న అధ్యయనాల్లో.. మానవ స్థావరాన్ని నిర్మించడం చాలా క్లిష్టమైన ఇంజనీరింగ్ సమస్య అని తేలిందన్నారు. వనరులు పరిమితంగా ఉన్నందునన ఈ గ్రహంపై ఆవాసం నిర్మించడం అనేది సవాలుతో కూడినది. అయితే అక్కడ ఎంతమంది వ్యోమోగాములు ఆవాసాలను నిర్మించగలరు, ఎంతమంది ఉండొచ్చు అనేదానిపై పరిశోధనలు చేశారు. ఈ అధ్యయనాల్లో దాదాపు 22 మంది వ్యోమగాములతో కాలనీ నిర్మించొచ్చని, అలాగే సుమారు 100 నుంచి 500 మంది దాక ఉండొచ్చని గుర్తించారు. దీనివల్ల భవిష్యత్తులో వలసవాద సమస్య గానీ, మానవ వికృతి ప్రవర్తనకు సంబంధించిన సవాళ్లు గానీ ఎదరయ్యే అవకాశం ఉందని పరిశోధకులు గట్టిగా హెచ్చరించారు. అంగారక గ్రహంపై ఏ ప్రాంతంలో కాలనీలు నిర్మించాలనే దాని గురించి కూడా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రహంపై మానవ మనుగడను అంచనా వేసేందుకు ఏజెంట్-బేస్డ్ మోడలింగ్ అనే కంప్యూటర్ అనుకరణను ఉపయోగించారు. అక్కడ ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని తట్టుకుని జీవించగలిగే మానవుల మనసతత్వాలను గూర్చి కూడా ఈ కంప్యూటర్ వెల్లడించింది. "న్యూరోటిక్" మనస్తత్వం కలవారు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉండగా, "పరిస్థితులను అంగీకరించదగిన" వ్యక్తిత్వ గల వ్యక్తులు అక్కడ ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని తమ పరిశోధనల్లో గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం..ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఉత్కంఠ! వీడియో వైరల్) -
కుజునిపై జీవముండేదా?
కుజ గ్రహం మీద పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్ తాజాగా కీలకమైన విశేషాలను సేకరించింది. కుజుని ఉపరితలంపై పురాతన పగుళ్లను కనిపెట్టింది. ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉన్న ఆ పగుళ్లను ఫొటోలు, వీడియోలు తీసి భూమికి పంపింది. వాటిని చూసి సైంటిస్టులే ఆశ్చర్యపోతున్నారు. ఒకదాని తరువాత ఒకటిగా వచ్చి పోయే తడి, పొడి ఆవర్తనాలకు సూచికలైన ఈ తరహా పగుళ్లు జీవం పుట్టుకకు అత్యంత అనుకూలమని చెబుతారు. ..ఎండా, వానా కాలాలు కుజ గ్రహంపై అత్యంత పురాతన కాలం నాటి బురదమయమైన పగుళ్లను క్యూరియాసిటీ రోవర్ కనిపెట్టింది. షట్కోణాకృతిలోని ఆ పగుళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. వీటిని తొలినాటి కుజునిపై తడి, పొడి ఆవర్తనాల తాలూకు ఆనవాళ్లుగా భావిస్తున్నారు. జీవం పుట్టుకకు ఇవి అత్యంత కీలకమే గాక ఎంతో అనుకూలం కూడా. భూమిపై మాదిరిగా కుజునిపై క్రమానుగతంగా తడి, పొడి ఋతువులు, మరోలా చెప్పాలంటే వేసవి, వానాకాలాలు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తూ పోతూ ఉండేవనేందుకు ఈ ఆవర్తనాలు నిదర్శనమని పరిశోధనకు సారథ్యం వహించిన విలియం రేపిన్ అభిప్రాయపడ్డారు. మట్టి పొర, లవణ ఖనిజాలతో సమృద్ధమైన వాటి పై పొరల మధ్య జోన్లో ఈ చక్రాలను కనిపెట్టారు. బురద ఎండిపోయినకొద్దీ కుంచించుకుపోయి, పగుళ్లిచ్చి టీ ఆకారపు జంక్షన్ మాదిరిగా ఏర్పడ్డాయి. పదేపదే నీరు పారిన మీదట వై ఆకృతిలోకి, అంతిమంగా షట్కోకోణాకృతిలోకి మారి గట్టిపడ్డాయి. భూమ్మీద మాదిరిగానే ఎండా, వానా కాలాలు క్రమం తప్పకుండా వచ్చేవని కచ్చితంగా చెప్పవచ్చని రేపిన్ చెప్పారు. ‘పైగా భూమి మాదిరిగా కుజునిపై టెక్టానిక్ ఫలకాలు లేవు. కనుక ఆ గ్రహం తాలూకు పురాతన చరిత్ర సురక్షితంగా ఉంది’అని అన్నారు. ఈ పరిశోధన ఫలితాలను నేచర్ జర్నల్‌లో తాజాగా ప్రచురించారు. జీవం తాలూకు ఆనవాళ్లు ఇప్పటికీ ఇంత సురక్షితంగా ఉన్న కుజుని వంటి గ్రహం భూమికి ఇంత సమీపంగా ఉండటం ఒక రకంగా మన అదృష్టం. విశ్వ రహస్యాలను ఛేదించే క్రమంలో ఇదో పెద్ద ముందడుగు కాగలదు’ – విలియం రేపిన్, పరిశోధన సారథి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎలానూ... ఇలా అయినవేంది!!
ఏఐ ఆర్టిస్ట్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు... అన్నట్లుగా తయారైంది పరిస్థితి. సదరు నౌఫాల్ ఆనే ఏఐ ఆర్టిస్ట్ తన ఆర్ట్‌తో బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను అమెరికా నుంచి ముంబైకి తీసుకువచ్చి ఛాయ్‌వాలాగా మార్చాడు. ఈ ‘చాయివాలా–ఎలాన్ మస్క్’ ఇమేజ్ అంతర్జాల లోకంలో తెగ వైరల్ అయింది. ట్విట్టర్లో వేగంగా రెండు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అంతర్జాల లోకవాసులు ఒకరిని మించి ఒకరు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ‘ఎలాన్... ఏమైనా చేయగలడు!’, ‘ఏఐ టెక్నాలజీతో గరం ఛాయ్ తయారుచేస్తున్నాడు!’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. మరో ఏఐ ఆర్టిస్ట్ ఎలాన్‌ను ఏకంగా బేబీగా మార్చేశాడు. ‘బ్రేకింగ్న్యూస్: ఎలాన్ మస్క్ యాంటీ ఏజీంగ్ ఫార్ములాపై పనిచేస్తున్నాడు. దాని ఫలితమే ఈ ఫొటో’ అనే కాప్షన్ ఆకట్టుకుంటోంది. ‘మార్స్ పైకి వెళ్లడానికి మస్క్‌కు ఇప్పుడు బోలెడు సమయం దొరికింది’... అని ఒకరు కామెంట్ పెట్టారు. -
‘అంగారకుడి’పై ఏడాది పాటు జీవనం.. ఎవరామె?
అంగారకుడిపై మనిషి మనుగడ సాధ్యమేనా?.. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఏళ్ల తరబడి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. అందుకు మరో దశాబ్దం దాకా పట్టవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. ఈలోపు అలాంటి వాతావరణమే భూమ్మీద సృష్టించి.. మనుషుల మీద ప్రయోగాలు నిర్వహించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఓ మహిళా సైంటిస్ట్ ఏడాదిపాటు అంగారకుడి వాతావరణంలో గడపనుంది. కెనడియన్ జీవ శాస్త్రవేత్త 52 ఏళ్ల కెల్లీ హాస్టన్కి మార్స్(అంగారకుడు)పై జీవించడం అనేది ఆమె చిన్ననాటి కల అట. అది ఇప్పుడూ ఆనుకోని విధంగా నెరవేరనుంది. ప్రస్తుతం హాస్టన్ అందుకోసం సన్నద్ధమవుతోంది. అంగారక గ్రహంపై వాతావరణాన్ని తట్టుకునేలా కసరత్తులు శిక్షణ తీసుకుంటోంది. జూన్ చివరి వారంలో టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో మార్టిన్ నివాస స్థలంలోకి(అంగారకుడిపై మాదిరి పరిస్థితులే ఉంటాయక్కడ) అడుగుపెట్టనున్నారు. అయితే.. ఆమె అక్కడికి ఒంటరిగానే వెళ్లడం లేదు. కూడా నలుగురు వాలంటీర్లు ఉంటారు. భవిష్యత్తులో వివిధ వైవిధ్య పరిమిత వాతావరణంలో మానువుడి ఎదుర్కొనగల సామార్థ్యాన్ని అంచనా వేసేందుకు, అంతరిక్షంలో మానవుడి జీవనం గురిచి అధ్యయనం చేసేందుకు ఈ మిషన్ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నట్లు నాసా పేర్కొంది. ఇందులో గడిపే వారు అనేక రకాల సవాళ్ల తోపాటు, నీటి పరిమితులు ఎదుర్కొనక తప్పదని స్పేస్ ఏజెన్సీ హెచ్చరించింది. అలాగే బయట ప్రపంచం కమ్యూనికేషన్ ఉండదు. భూమి, అంగారకం గ్రహం మధ్య జీవన వ్యత్యాసం తెలియడమే గాక పరిస్థితులను తట్టకుని జీవింగలమా లేదన్నది అవగతమవుతుందని నాసా వెల్లడించింది. ఈ మార్స్(అంగారక గ్రహం)పై ఉండేందుకు మార్స్ డ్యూన్ అల్ఫాగా పిలిచే ఒక నివాస స్థలం ఉంటుంది. మార్స్ డ్యూన్ ఆల్ఫాగా పిలచే త్రీడీ ప్రింటెడ్ 1700 చదరపు అడుగుల నివాస స్థలం, బెడ్రూమ్లు, వ్యాయామశాల తదితర సౌకర్యాలు ఉంటాయి. హాస్టన్కి నాసా నుంచి ఈ అవకాశం వచ్చిన వెంటనే దరఖాస్తు చేసుకోవడం తదితరాలు వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ మేరకు ఈ మిషన్‌లో ఆమె తోపాటు నలుగురు సభ్యులు ఆహారాన్ని పండించుకునేలా పొలం అన్ని ఉంటాయి. ఎయిర్ లాక్ చేయబడిన గదిలో అంతరిక్షంపై నడిచే విధానాన్ని ప్రాక్టీస్ చేయడమే గాక, సూట్‌ని ధరించగలిగి ఉండేలా శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. మార్స్‌లోకి ప్రయాణించే వారిలో తాను ఉన్నట్లు నిర్థారించగానే ఆమె ఆనందానికి వదలి లేకుండా పోయింది,. తనతోపాటు అక్కడ ఒక ఇంజనీర్, ఎమర్జెన్సీ డాక్టర్, నర్సు ఉంటారు. నాసా ఎంపిక చేసిన ఆయా వ్యక్తులు ఒకరికొకరూ పరిచయమే లేదు. అయితే మార్స్ కోసం హ్యూస్టన్ నివాస స్థలంలో ఉండనున్న హౌస్మేట్స్ మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనడం అనేది అత్యంత కీలకం. అలాగే అక్కడ గ్రహంపై గడిపే వారు తమ వ్యక్తిగత సమస్యలను పక్కనబెట్టి మరీ మిగతా హౌస్‌మేట్స్‌తో బ్యాలెన్స్ చేసుకుంటూ గడపాల్సి ఉంది. ముఖ్యంగా కుటుంబానికి దూరంగా అన్ని రోజులు ఉండగలమా? అనేది అత్యంత ఆందోళన కలిగించే అంశం. కేవలం ఈమెయిల్‌తోనే తన కుటుంబసభ్యులతో టచ్‌లో ఉండాల్సిందే. ఈ ప్రయోగాత్మక మిషన్ చాపే(క్రూ హెల్త్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ప్లోరేషన్ అనలాగ్) పేరుతో నాసా ప్లాన్ చేసింది. ఇదిలా ఉండగా, అంగారక గ్రహంపై ఏడాది పాటు జీవించగలిగే మిషన్‌ని 2015-2016లో హవాయిలోని నివాస స్థలంలో ప్రారంభం కానుంది. అమెరికా 2030 చివరినాటి కల్లా అంగారక గ్రహంపై యాత్రకు సిద్ధం చేసే ప్రయోగంలో భాగంగా సుదీర్ఘకాలం అక్కడ ఎలా జీవించగలం అనే దానిపై మిషన్ ప్రయోగాలు నిర్వహిస్తోంది. అంతేగాదు మానవులను చంద్రునిపైకి పంపే యోచన కూడా చేస్తున్నట్లు నాసా పేర్కొంది. కాగా, అంగారకుడి గ్రహంపై జీవించనున్న కెల్లీ మాత్రం ఈ విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, నిజంగా అంగారకుడి వద్దకు వెళ్తున్నానా అని ఎగ్జైట్ అవుతోంది. (చదవండి: ఉక్రెయిన్ క్లినిక్‌పై క్షిపణి దాడి..) -
ఆ గ్రహంపై బంగాళ దుంప పిండి, ఉప్పుతో ఇళ్లు కట్టుకోవచ్చు.. అసలు మ్యాటర్ ఇదే!
భూమిపై రోజురోజుకూ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఇలా ఇంకొన్ని రోజులు పోతే ఇక్కడి వనరులు కూడా సరిపోని పరిస్థితులు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే ఇతర గ్రహాలపై మానవ నివాసం కోసం అన్వేషణ సాగుతోంది. అయితే భూమి కాకుండా మానవులు నివసించడానికి అనువుగా ఉండే మరో గ్రహం ఏదైనా ఉందా అంటే.. వెంటనే వచ్చే సమాధానం అంగారకుడు (Mars). మరి ఒకవేళ మార్స్‌పై నివాసాలు ఏర్పాటు చేసుకుంటే ఇంటి నిర్మాణం ఎలా చేపట్టాలి? ఇలా అనేక అనుమానాలు వ్యక్త మయ్యాయి. ఇందుకోసం వ్యోమగాముల రక్తం, మూత్రాన్ని ఇందుకోసం వాడుకోవచ్చని సైంటిస్ట్‌ల పరిశోధనల్లో తేలింది. వ్యోమగాములందరూ రక్తాన్ని ఇవ్వటానికి అంగీకరించకపోవచ్చు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకునే అదే అంతరిక్ష నిర్మాణాలకు ఉపయోగపడే దృఢమైన ఇటుకలను ఇటీవల మాంచెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటి తయారీకి వారు వాడిన పదార్థాలను తెలుసుకుంటే, ఎవరైనా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే! సాధారణ కాంక్రీట్ దారుఢ్యం గరిష్ఠంగా 70 ఎంపీఏ వరకు ఉంటే, మాంచెస్టర్ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ ఇటుకల దారుఢ్యం 72 ఎంపీఏ వరకు ఉండటం విశేషం. అంతరిక్ష ధూళి, బంగాళ దుంపలు, ఉప్పు సహా వివిధ పదార్థాల సమ్మేళనంతో తయారు చేసిన కాంక్రీట్ తరహా పదార్థాన్ని ఉపయోగించి ఈ ఇటుకలను తయారు చేశారు. ఇటుకల తయారీకి ఉపయోగించిన ఈ పదార్థానికి వారు ‘స్టార్‌క్రీట్’గా నామకరణం చేశారు. దీనిని ‘కాస్మిక్ కాంక్రీట్’గా కూడా అభివర్ణిస్తున్నారు. అత్యంత దృఢమైన కాంక్రీట్ తయారీలో భాగంగా వీరు చంద్రుడి ధూళిని ఉపయోగించి తయారు చేసిన ఇటుకల దారుఢ్యమైతే ఏకంగా 91 ఎంపీఏ పైగానే ఉంది. తమ ప్రయోగాలు విజయవంతమైతే, ప్రపంచంలోనే అత్యంత దృఢమైన కాంక్రీట్‌ను రూపొందించగలమని మాంచెస్టర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
‘స్పేస్’లో ఇళ్లకు రిహార్సల్‌గా భూమిపై త్రీడీ ప్రింటింగ్ హోటల్
ఇల్లు కట్టాలంటే.. ఇటుకలు, సిమెంటు, ఇసుక ఇలా ఎన్నోకావాలి. మరి భవిష్యత్తులో చందమామపైకో, అంగారకుడిపైకో వెళ్లినప్పుడు అక్కడ ఇళ్లు కట్టుకోవాలంటే ఎలా? దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చెప్తున్న సమాధానం.. ‘త్రీడీ ప్రింటింగ్’ ఇళ్లు. కేవలం చెప్పడమే కాదు! చంద్రుడు, అంగారకుడిపై ఇళ్లు కట్టేందుకు ఓ ప్రైవేటు కంపెనీతో భాగస్వామ్య ఒప్పందమూ కుదుర్చుకుంది. ఆ కంపెనీ ఇందుకు రిహార్సల్‌గా.. భూమ్మీదే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో విశాలమైన హోటల్‌ను కట్టేందుకు రెడీ అయింది. ఈ వివరాలేమిటో తెలుసుకుందామా? భవిష్యత్తుకు బాటలు వేసేలా.. మున్ముందు చంద్రుడిపైకి, అంగారకుడిపైకి మనుషులను పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో మనుషులు అక్కడ జీవించేందుకు వీలుగా.. అక్కడి మట్టితోనే ఇళ్లు కట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం త్రీడీ ప్రింటింగ్‌లో పేరెన్నికగన్న కంపెనీ ‘ఐకాన్’తో భాగస్వామ్య ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఐకాన్ సంస్థ తొలుత ప్రయోగాత్మకంగా భూమ్మీదే త్రీడీ ప్రింటింగ్‌తో ఇళ్లను నిర్మించి పరిశీలించాలని నిర్ణయించింది. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఎడారిలో ఉన్న మర్ఫా పట్టణ శివార్లలో 60 ఎకరాల్లో త్రీడీ ప్రింటింగ్ భవనాలు, గదులు, ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. ఏమిటీ హోటల్ ప్రత్యేకతలు? ► ఈ హోటల్లో త్రీడీ విధానంలో ప్రింట్ చేసే కొన్ని భవనాలు, దూరం దూరంగా కొన్ని ఇళ్లు, ఒక స్విమ్మింగ్ పూల్, స్పా, ఆరుబయట సేద తీరేందుకు పలు ఏర్పాట్లు ఉంటాయి. ► దూరం దూరంగా నిర్మించే ఇళ్లకు ‘సండే హోమ్స్’గా పేరుపెట్టారు. రెండు నుంచి నాలుగు బెడ్రూమ్లు, బాత్రూమ్లతో ఆ ఇళ్లు ఉంటాయి. ► గుండ్రటి నిర్మాణాలు, డోమ్‌లు, ఆర్చీల డిజైన్లతో ఇళ్లు, భవనాలు ఉంటాయి. గదుల్లో బెడ్లు, టేబుల్స్ వంటి కొంత ఫర్నిచర్‌ను కూడా త్రీడీ విధానంలోనే ప్రింట్ చేయనున్నారు. ► చుట్టూ ఉన్న ఎడారి వాతావరణంలో కలిసిపోయేలా ఈ నిర్మాణాలకు రంగులను నిర్దేశించారు. ► ఎడారిలో క్యాంపింగ్ సైట్‌గా ఉన్న ప్రాంతంలో ప్రింట్ చేస్తున్న ఈ హోటల్‌కు ‘ఎల్ కాస్మికో’గా పేరు పెట్టారు. ఇలాంటి త్రీడీ ప్రింటెడ్ హోటల్ ప్రపంచంలో ఇదే మొదటిది కానుందని చెప్తున్నారు. ► ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ కంపెనీ ‘బిగ్ (బ్జర్కే ఇంగెల్స్ గ్రూప్)’ దీనికి డిజైన్లు రూపొందించగా.. ఐకాన్ సంస్థ త్రీడీ ప్రింటింగ్‌తో నిర్మాణాలు చేపట్టనుంది. ఇక్కడ చేసి.. చూపించి.. ‘‘చంద్రుడు, మార్స్‌పై మొట్టమొదటి నివాసాలు కట్టేందుకు మా సంస్థ నాసాతో కలసి పనిచేస్తోంది. వాటికి రిహార్సల్‌గా అక్కడి ప్రాంతాలను పోలినట్టుగా భూమ్మీద ఉన్న ఎడారిలో త్రీడీ ప్రింటింగ్‌తో ఇళ్లను నిర్మించబోతున్నాం. కేవలం మట్టిని వాడి ఇళ్లను నిర్మించిన పురాతన మూలసూత్రాలను, ప్రస్తుత అత్యాధునిక త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని వినియోగించి.. అద్భుతమైన నిర్మాణాలను రూపొందించనున్నాం..’’ – ‘ఐకాన్’ సహ వ్యవస్థాపకుడు జేసన్ బల్లార్డ్, హోటల్ యజమాని లిజ్ లాంబర్ట్ –సాక్షి సెంట్రల్ డెస్క్ -
నాసా ‘మూన్ టు మార్స్’ చీఫ్‌గా మనోడు!
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘మూన్ టు మార్స్’ కార్యక్రమం హెడ్‌గా భారత సంతతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్, రోబోటిక్స్ ఇంజనీర్ అయిన అమిత్ క్షత్రియ నియమి తులయ్యారు. చంద్రుడిపై సుదీర్ఘ కాలం మకాం వేయడానికి, అక్కడి నుంచి అంగారక గ్రహంపైకి మనుషులను పంపే బృహత్తర లక్ష్యంతో నాసా ఈ మిషన్‌కు రూపకల్పన చేసింది. ‘మూన్ టు మార్స్’ కార్యక్రమానికి సారథ్యం వహించనున్న అమిత్ క్షత్రియ నాసా ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ డెవలప్మెంట్ మిషన్ డైరెక్టరేట్‌లో కొత్తగా ఏర్పాటయ్యే కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తారు. ఇప్పటి వరకు ఆయన కామన్ ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ డెవలప్మెంట్ డివిజన్ తాత్కాలిక డిప్యూటీ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు. 2003 నుంచి అంతరిక్ష కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికా వలస వచ్చారు. క్షత్రియ విస్కాన్సిన్లోని బ్రూక్‌ఫీల్డ్‌లో పుట్టారు. -
అవిగవిగో నీటి జాడలు.. చంద్రుడిపై ఉన్న నీటి మ్యాప్ తయారీ
జీవుల మనుగడకు కావాల్సింది జలం. భూమిపై జలం ఉంది కాబట్టి మానవులతో సహా లక్షల సంఖ్యలో జీవులు ఆవిర్భవించాయి. నిక్షేపంగా మనుగడ సాగిస్తున్నాయి. భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడిపైనా నీటి జాడలు ఉన్నట్లు గతంలోనే పరిశోధకులు గుర్తించారు. ఈ నీటి ఆనవాళ్లకు సంబంధించిన సవివరమైన పటాన్ని(మ్యాప్)ను తాజాగా రూపొందించారు. దీనివల్ల చందమామ ఉపరితలం, అక్కడ మానవుల జీవనానికి అందుబాటులో ఉన్న పరిస్థితుల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ‘ఆర్టిమిస్’పేరిట కీలకమైన ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో చందమామపైకి మనుషులను పంపించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రుడిపై నీటి మ్యాప్‌ను తయారు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటు చంద్రునిపై.. అటు అంగారకుడిపై.. ► అమెరికా, జర్మనీ సంయుక్తంగా ప్రయోగించిన స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ అస్ట్రానమీ(సోఫియా) అనే అంతరిక్ష నౌక పంపించిన డేటా ఆధారంగా చంద్రుడిపై ఉన్న నీటి మ్యాప్‌ను రూపొందించారు. ► చంద్రుడిలో మన కంటికి కనిపించే భాగంలో నాలుగింట ఒక వంతు భాగాన్ని ఈ మ్యాప్ కవర్ చేస్తోంది. చంద్రుడిపై 60 డిగ్రీల అక్షాంశాల దిగువ భాగం నుంచి దక్షిణ ధ్రువం వరకూ ఉన్న ప్రాంతమంతా ఈ మ్యాప్‌లో ఉంది. ► చంద్రుడిపై నీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎలా కదులుతుంది? అనేది ఈ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చని సైంటిస్టులు అంటున్నారు. అంతేకాకుండా చంద్రుడి దక్షిణ ధ్రువంలోని భౌగోళిక పరిస్థితులను స్పష్టంగా గమనించవచ్చని చెబుతున్నారు. ► చంద్రుడి ఉపరితలంపై చాలా ప్రాంతాల్లో సూర్యకాంతి పడదు. అతిశీతల వాతావరణం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చందమామ ఉపరితల లక్షణాలతో అక్కడి నీటికి ఎలాంటి సంబంధం ఉంది? అనేది మ్యాప్ సులభంగా ద్వారా తేల్చవచ్చని నాసా వెల్లడించింది. ► చంద్రుడి ఉపరితలంలో పాటు అంతర్భాగంలోనూ నీటి ఉనికిని గతంలో గుర్తించారు. ఇది మంచు స్ఫటికాల రూపంలో నిక్షిప్తమై ఉన్నట్లు అంచనాకొచ్చారు. మరి కొంత నీరు రసాయన సమ్మేళనాలుగా ఉన్నట్లు కనిపెట్టారు. ► చంద్రుడిపై అసలు నీరు ఎలా పుట్టిందన్న సంగతి నిగ్గు తేల్చడానికి సైంటిస్టులు ఆసక్తి చూపుతున్నారు. ఆర్టిమిస్ ప్రయోగం ► వ్యోమగాములను పంపించడానికి నాసా చంద్రుడిపై 13 ల్యాండింగ్ సైట్లను గుర్తించింది. ► విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో చందమామపై నీరు ఎలాంటి మార్పులు చెందుతున్న సంగతి తెలుసుకోవడానికి జల పటం ఉపకరిస్తుందని నాసా వెల్లడించింది. ► ఆర్టిమిస్ ప్రయోగం ద్వారా తొలిసారిగా ఒక మహిళను, ఒక నల్ల జాతీయుడిని చంద్రుడిపైకి పంపించాలని నాసా సంకల్పించింది. చంద్రుడిపై మనుషులు దీర్ఘకాలం నివసించేందుకు అనువైన పరిస్థితులను సృష్టించడానికి ప్రయోగాలు చేస్తోంది. ► ఇందులో భాగంగా అక్కడున్న నీటిని ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై పరిశోధనలు సాగుతున్నాయి. ► చంద్రుడి నీటి మ్యాప్ ఆర్టిమిస్ ప్రోగ్రామ్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ‘వైపర్’సైన్స్ టీమ్ సభ్యుడు కాసీ హానీబాల్ చెప్పారు. అరుణ గ్రహంపై జల సవ్వడి! అంగారక గ్రహం (మార్స్)పై వాతావరణం శూన్యం. గాలి, నీరు ఉండే అవకాశమే లేదని, మానవ మనుగడపై అనువైన పరిస్థితులు లేవని పరిశోధకులు ఇన్నాళ్లూ భావించారు. కానీ, అక్కడ నీటి ఉనికి ఉందన్న నిజం వెలుగులోకి వచ్చింది. మార్స్ మధ్యరేఖ వద్ద పురాతన హిమానీనదం(గ్లేసియర్) అవశేషాలను గుర్తించామని అమెరికా సైంటిస్టులు ప్రకటించారు. ఈ అవశేషం 6 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల వెడల్పు ఉందని వివరించారు. ఇదే ప్రాంతంలో వేలాది సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. అగ్నిపర్వతం పేలుడు వల్ల ఇక్కడున్న నీరు ఉప్పురూపంలో ఘనీభవించినట్లు భావిస్తున్నామని వివరించారు. ఈ వివరాలను ఇటీవల జరిగిన 54వ లూనార్ అండ్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్‌లో విడుదల చేశారు. భూమికి 5.46 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణ గ్రహంపై అమెరికాతో పాటు వివిధ దేశాలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాలు రోవర్లను సైతం పంపించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంగారకుడిపై సూర్యకిరణాలు.. ఇదే తొలిసారి!
వాషింగ్టన్: ఫొటోలో కనిపిస్తున్నవేమిటో తెలుసా? అంగారకునిపై కనువిందు చేస్తున్న సూర్య కిరణాలు. కుజ గ్రహంపై సూర్య కిరణాలు మన కంటపడటం ఇదే తొలిసారి! మార్స్‌పై పరిశోధనలు చేస్తున్న క్యూరియాసిటీ రోవర్ తాజాగా వీటిని తన కెమెరాలో బంధించింది. దిగంతాల మీదుగా సూర్యుడు అస్తమిస్తున్న క్రమంలో మేఘాలన్నింటినీ ప్రకాశవంతం చేస్తున్న తీరును ఫొటోలో గమనించవచ్చు. కుజునిపై మేఘాలు ఉపరితలానికి 60 కిలోమీటర్ల ఎత్తున నీరు, మంచుతో కూడి ఉన్నాయని నాసా అంచనా. కుజ గ్రహాన్ని వాసయోగ్యం చేసుకుని అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలకు కేంద్రంగా మార్చుకోవాలని అమెరికా భావిస్తోంది. ఈ క్రమంలో అక్కడి వాతావరణం, దాని కూర్పు, ఇతర స్థితిగతులను తెలుసుకోవడానికి దాని మేఘాలను విశ్లేషించడం కీలకం. -
‘రక్షణ కవచం’ సక్సెస్.. గంటకు 20వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి..
మానవ సహిత గ్రహాంతర ప్రయోగాల్లో వ్యోమనౌకలు సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ‘లోఫ్టిడ్ (లోఎర్త్ ఆర్బిట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ యాన్ ఇన్‌ఫ్లాటబుల్ డీసెలరేటర్)’ ప్రయోగం విజయవంతమైంది. అమెరికాలోని కాలిఫోరి్నయా నుంచి యునైటెడ్ లాంచ్ అలయన్స్‌కు చెందిన ‘అట్లాస్ వి’ రాకెట్ ద్వారా గురువారం తెల్లవారుజామున 4.49 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 3.19 గంటలకు) ఓ వాతావరణ ఉపగ్రహంతో కలిపి లోఫ్టిడ్ను ప్రయోగించారు. Photo credit: NASA గంటకు 20వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి. అట్లాస్ వి రాకెట్ మొదట వాతావరణ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టి.. కాసేపటికి ‘లోఫ్టిడ్’ను భూమివైపు వదిలేసింది. వెంటనే ‘లోఫ్టిడ్’ తిరగేసిన గొడుగులా విచ్చుకుని.. గంటకు 20 వేలకుపైగా కిలోమీటర్ల వేగంతో భూమివైపు ప్రయాణం మొదలుపెట్టింది. వాతావరణ ఘర్షణతో దాని వేగం తగ్గుతూ వచ్చింది. భూఉపరితలానికి కొద్దివేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు అందు లోని పారాచూట్ విచ్చుకుని.. హవాయి లోని హొనొలులు దీవులకు తూర్పున పసి ఫిక్ మహా సముద్రంలో ల్యాండ్ అయింది. భారత కాలమానం ప్రకారం.. గురు వారం సాయంత్రం 5.04 గంటలకు భూమివైపు ప్రయాణం ప్రారంభించిన హీట్ షీల్డ్.. 5.38 గంటలకు ల్యాండ్ అయింది. ఆ స్థలాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ‘లోఫ్టిడ్’ను రికవరీ చేసేందుకు కహనా–2 అనే నౌకను పంపారు. ఈ నౌక ‘లోఫ్టిడ్’ను తీసుకుని తిరిగి కాలిఫోరి్నయా తీరానికి చేరేందుకు రెండు రోజులు పడుతుందని అంచనా. తర్వాత శాస్త్రవేత్తలు ‘లోఫ్టిడ్’లోని సెన్సర్లు రికార్డు చేసిన డేటాను అధ్యయనం చేసి.. ఎంత వేగంతో దిగింది? ఎంత ఉష్ణోగ్రత పుట్టింది? వాతావరణ పరిస్థితులను ఎంతమేర తట్టుకోగలిగిందన్న వివరాలను పరిశీలించనున్నారు. అంగారక వాతావరణానికి తగినట్టుగా మార్చేందుకు.. భూమితో పోలిస్తే అంగారకుడిపై వాతావరణం పలుచగా ఉంటుంది. అందువల్ల అక్కడి వాతావరణం ఘర్షణ కూడా తక్కువ. అందువల్ల వ్యోమనౌకలను ఏ వేగంతో, ఎలాంటి పరిస్థితుల్లో ల్యాండ్ చేయాలి, వేగం తగ్గించేందుకు ఏం చేయాలి, ‘లోఫ్టిడ్’లో అందుకు తగినట్టుగా ఎలాంటి మార్పు చేర్పులు అవసరమన్నది శాస్త్రవేత్తలు నిర్ధారించనున్నారు. ఈ మొత్తం డేటా ఆధారంగా ఇన్‌ఫ్లాటబుల్ హీట్ షీల్డ్‌కు తుదిరూపు ఇచ్చి భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాల్లో వినియోగించనున్నారు. -
ఫ్లయింగ్ సాసర్లా కనిపించే.. ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్.. ప్రయోజనాలు ఇవే
అంతరిక్ష ప్రయోగాలు అంటేనే ఎంతో క్లిష్టమైనవి. అందులోనూ మనుషులు స్పేస్‌లోకి వెళ్లే ప్రయోగాలు మరింత రిస్క్. పెద్ద ఎత్తున రక్షణ ఏర్పాట్లు ఉండాలి. ఏ చిన్న లోపమున్నా భారీ ప్రమాదం తప్పదు. పైగా మార్స్‌పైకి మనుషులను పంపేందుకు నాసా ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో స్పేస్ షిప్‌లు.. మార్స్‌పై దిగేప్పుడు పుట్టే వేడిని తట్టుకోవడానికి, మెల్లగా ల్యాండ్ కావడానికి వీలయ్యే రక్షణ ఏర్పాట్లు కావాలి. ఈ క్రమంలోనే నాసా ఫ్లయింగ్ సాసర్లా కనిపించే ఓ ప్రత్యేక ‘ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్’ను రూపొందించింది. బుధవారం దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. ఈ హీట్ షీల్డ్ ఏంటి, దాని ప్రాధాన్యత, భవిష్యత్తులో ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.. – సాక్షి సెంట్రల్ డెస్క్ వాతావరణం ఘర్షణ నుంచి.. అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్లు, వ్యోమనౌకలు గంటకు 25 వేల కి.మీ.కిపైగా వేగంతో ప్రయాణిస్తుంటాయి. తిరిగి భూవాతావరణంలోకి వచ్చేప్పుడూ అంతే వేగంతో ప్రవేశిస్తాయి. ఈ సమయంలో వాతావరణ ఘర్షణ వల్ల వాటి ఉపరితలంపై వేల డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత పుడుతుంది. దీనిని తట్టుకునేందుకు రాకెట్లు, స్పేస్ షిప్‌ల ఉపరితలంపై హీట్ షీల్డ్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక సిరామిక్ టైల్స్ వాడతారు. మార్స్‌పైకి వెళ్లాలంటే.. భూమితోపాటు అంగారకుడు (మార్స్), శుక్రుడు (వీనస్) వంటి గ్రహాలపైనా వాతావరణం ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరిన వ్యోమనౌకలు మార్స్‌పై దిగాలంటే దాని వాతావరణం ఘర్షణను ఎదుర్కోవాలి. అదే సమయంలో సున్నితంగా ల్యాండింగ్ కావడం కోసం వేగాన్ని త్వరగా తగ్గించుకోవాలి. ఇప్పటివరకు చంద్రుడు, మార్స్‌పైకి రోవర్లను పంపినప్పుడు ల్యాండింగ్ కోసం ప్యారాచూట్లను వాడారు. చిన్నవైన రోవర్లకు అవి సరిపోయాయి. కానీ మానవసహిత ప్రయోగాలకు వాడే వ్యోమనౌకలు భారీగా ఉంటాయి. ఈ క్రమంలో వేడిని ఎదుర్కోవడం, వేగాన్ని తగ్గించుకోవడానికి పరిష్కారంగా నాసా శాస్త్రవేత్తలు ‘లో ఎర్త్ ఆర్బిట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ యాన్ ఇన్‌ఫ్లాటబుల్ డీసెలరేటర్ (లోఫ్టిడ్)’ ప్రయోగాన్ని చేపట్టారు. ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్ అంటే.. మొదట చిన్నగా ఉండి, కావాలనుకున్నప్పుడు గాలితో ఉబ్బి, పెద్దగా విస్తరించే ఉష్ణ రక్షక కవచం అని చెప్పుకోవచ్చు. ఎలా పనిచేస్తుంది? వ్యోమనౌకకు ముందు భాగాన ఈ ప్రత్యేక పరికరాన్ని అమర్చుతారు. మార్స్పైగానీ, భూవాతావరణంలోకిగానీ వ్యోమనౌక ప్రవేశించినప్పుడు ఇది విచ్చుకుంటుంది. వ్యోమనౌక ముందు గొడుగులా ఏర్పడుతుంది. దీనివల్ల వాతావరణం నేరుగా వ్యోమనౌకను తాకకుండా ఈ హీట్‌షీల్డ్ అడ్డుకుంటుంది. ఇది సుమారు 20 అడుగుల వెడల్పుతో ఉండటంతో వాతావరణం ఒత్తిడికి వ్యోమనౌక వేగం కూడా తగ్గుతుంది. వేగం బాగా తగ్గాక చివరన ప్యారాచూట్‌ను వినియోగిస్తారు. దీనితో సున్నితంగా ల్యాండింగ్ అవుతుంది. ప్రయోగాత్మకంగా.. సోమవారం అమెరికాలోని వాండెన్‌బర్గ్ స్పేస్‌ఫోర్స్ స్టేషన్ నుంచి అట్లాస్–వి రాకెట్ ద్వారా మరో ఉపగ్రహంతోపాటు ‘లోఫ్టిడ్’ను ప్రయోగించనున్నారు. రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లాక దీనిని భూమివైపు వదిలేస్తుంది. సుమారు గంటకు 35వేల కిలోమీటర్ల వేగంతో అది భూమివైపు ప్రయాణం మొదలుపెడుతుంది. తర్వాత ఎంత వేగంతో ప్రయాణిస్తోంది? ఒత్తిడి ఎంత పడుతోంది? ఎంతమేర ఉష్ణోగ్రత పుడుతోందన్న వివరాలను పరిశీలించేందుకు ఇందులో ప్రత్యేకమైన సెన్సర్లను ఏర్పాటు చేశారు. ఈ డేటా ఆధారంగా ‘లోఫ్టిడ్’కు తుదిరూపు ఇవ్వనున్నారు. ప్రస్తుతం కేవలం హీట్‌షీల్డ్‌ను మాత్రమే ప్రయోగిస్తున్నారు. విజయవంతమైతే వ్యోమనౌకలకు అమర్చి పంపుతారు. భవిష్యత్తులో ఇతర గ్రహాలపైకి చేసే అన్ని రకాల ప్రయోగాల్లో ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొలంబియా ప్రమాదమే ఉదాహరణ 2003లో నాసాకు చెందిన కొలంబియా స్పేస్ షటిల్ అంతర్జాతీయ అంతరిక్షం (ఐఎస్ఎస్) నుంచి తిరిగి వస్తూ పేలిపోయింది. అందులో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా సహా ఏడుగురు వ్యోమగాములు మృతిచెందారు. ఈ ప్రమాదానికి కారణం స్పేస్ షటిల్ ఎడమవైపు రెక్కపై ఉన్న హీట్ షీల్డ్ కొంతమేర దెబ్బతినడమే. అంతకుముందు స్పేస్ షటిల్ అంతరిక్షంలోకి వెళ్తున్న సమయంలోనే.. దానికి అనుబంధంగా ఉన్న రాకెట్ ట్యాంక్ ఇన్సులేటింగ్ ఫోమ్ చిన్న ముక్క విడిపోయి స్పేస్ షటిల్ రెక్కపై ఉన్న హీట్ షీల్డ్‌కు తగిలింది. హీట్ షీల్డ్‌గా అమర్చిన టైల్స్‌లో పగులు వచ్చింది. చిన్న పగులుతో.. పెద్ద ప్రమాదం కొలంబియా షటిల్ భూమికి తిరిగివచ్చేప్పుడు ధ్వని వేగానికి 20 రెట్లకుపైగా వేగంతో.. అంటే సుమారు గంటకు 25 వేల కిలోమీటర్లకుపైగా వేగంతో భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో 1,500 సెంటీగ్రేడ్లకుపైగా వేడి పుట్టింది. కానీ షీట్ షీల్డ్ టైల్స్‌లో పగులు కారణంగా ఆ వేడి లోపలి భాగానికి చేరి.. రెక్కలోని భాగాలు దెబ్బతినడం మొదలైంది. కాసేపటికే స్పేస్ షటిల్ పేలి ముక్కలైపోయింది. హీట్ షీల్డ్‌లో చిన్న పగులు ఉన్నా ఇంత ఘోరమైన ప్రమాదం జరిగే పరిస్థితులు ఉంటాయి. ఈ క్రమంలోనే నాసా శాస్త్రవేత్తలు.. ఇతర గ్రహాలపై దిగేప్పుడు స్పేస్ షిప్‌లకు హీట్ షీల్డ్‌గా ఉండేందుకు, అదే సమయంలో వేగాన్ని తగ్గించి సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు తోడ్పడే ‘ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్’ను అభివృద్ధి చేస్తున్నారు. -
LOFTID: నవంబర్ 1న నాసా ‘లోఫ్టిడ్’ ప్రయోగం
వాషింగ్టన్: అంగారక గ్రహంపై(మార్స్) క్షేమంగా దిగడానికి వీలు కల్పించే ప్రయోగానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) శ్రీకారం చుడుతోంది. ఫ్లైయింగ్ సాసర్ వంటి భారీ హీట్ షీల్డ్‌ను వచ్చే నెల 1న అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. దీనికి లో–ఎర్త్ ఆర్బిట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ యన్ ఇన్‌ఫ్లాటబుల్ డిసీలరేటర్(లోఫ్టిడ్)గా నామకరణం చేసింది. అట్లాస్ వి–రాకెట్ ద్వారా లో–ఎర్త్ ఆర్బిట్‌లోకి హీట్ షీల్డ్‌ను పంపించనుంది. భవిష్యత్తులో మార్స్‌పైకి పంపించే అంతరిక్షనౌక వేగాన్ని తగ్గించి, ఉపరితలంపై క్షేమంగా దించడానికి ఈ హీట్ షీల్డ్ తోడ్పడనుంది. -
సౌర వలయాలు
ఫొటోల్లో కన్పిస్తున్నది సూర్యుని చుట్టూ ఏర్పడ్డ వెలుతురు వలయం (సన్ హాలో). రెండో ఫొటోలోది భూమ్మీద నుంచి కన్పిస్తున్నది కాగా, మొదటి ఫొటోలోనిదేమో అంగారకునిపై నుంచి కన్పించిన సన్ హాలో. అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను అన్వేషించే క్రమంలో పెర్సెవరెన్స్ రోవర్ ఈ అరుదైన దృగ్విషయాన్ని గత డిసెంబర్లో అనుకోకుండా క్లిక్‌మనిపించింది. 2021 డిసెంబర్ 15న వాటిని నాసాకు పంపింది. సన్ హాలో భూమి పై నుంచి తరచూ కనిపిస్తూనే ఉంటుంది గానీ అంగారకునిపై నుంచి కంటబడటం ఇదే తొలిసారని స్పేస్ సైన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్లానెటరీ సైంటిస్టు మార్క్ లేమన్ చెప్పారు. 2020లో నాసా ఈ రోవర్‌ను అంగారకునిపైకి పంపించడం తెలిసిందే. ఏమిటీ సన్ హాలో...? మేఘాల్లో అసంఖ్యాకమైన సూక్ష్మ మంచు స్ఫటికాలుంటాయి. కాంతి వాటి గుండా సాగే క్రమంలో అప్పడప్పుడూ విడిపోవడంతో పాటు వక్రీభవనం కూడా చెందుతుంటుంది. ఫలితంగా ఒక్కోసారి ఇంద్రధనుస్సును తలపించే కాంతి వలయాలు ఏర్పడతాయి. నిర్దిష్ట కోణం నుంచి చూసినప్పుడు ఇవి వృత్తాకారంలో కనువిందు చేస్తాయి. వాటిని సన్ హాలోగా పిలుస్తారు. ఇలా భూమ్మీది నుంచి కన్పించే వలయాలు సాధారణంగా 22 డిగ్రీల కోణంలో ఏర్పడేవి అయుంటాయని అమెరికాలోని ఇల్లినాయీ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. అయితే భూమితో పోలిస్తే అంగారకునిపై నీటి శాతం అత్యల్పం. అక్కడ అత్యధికంగా ఉండేది కార్బన్ డయాక్సైడే. కాబట్టి పెర్సెవరెన్స్ రోవర్ అందించిన ఫొటోలు నిజంగా సన్ హాలోకు సంబంధించినవేనా అని శాస్త్రవేత్తలు మీమాంసలో పడ్డారు. బహుశా రోవర్ తాలూకు కెమెరా కోణం వల్ల అలాంటి వెలుతురు వలయం ఏర్పడి ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. అయితే చివరికి ఇది దుమ్మూ ధూళి వల్ల ఏర్పడ్డది కాదని, సన్ హాలోయేనని తేల్చారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఎలాన్ మస్క్‌కు మరో ఎదురు దెబ్బ,పేలిన స్పేస్ ఎక్స్ రాకెట్!
ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. టెక్సాస్‌లో స్పేస్ ఎక్స్‌కు చెందిన సూపర్ హెవీ బూస్టర్ పేలింది. ఈ పరిణామం మస్క్‌ను ఆర్ధికంగా మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాయిటర్స్ కథనం ప్రకారం..మార్స్పైన మనిషి మనుగడ సాధించడమే లక్ష్యంగా ఎలన్ మస్క్ పనిచేస్తున్నాడు. ఇందుకోసం సులభంగా అతి తక్కువ ఖర్చుతో మార్స్, చంద్రమండలంపై మానువుడు అడుగుపెట్టేలా రీయిజబుల్ స్పేస్ క్రాఫ్ట్తో స్టార్ షిప్ స్పేస్ రాకెట్లను తయారు చేస్తున్నాడు. వాటిని ప్రయోగిస్తున్నాడు. Holy moly. Well, that was unexpected!https://t.co/dUUqw7ojRv pic.twitter.com/7IGztPuE12 — Chris Bergin - NSF (@NASASpaceflight) July 11, 2022 ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం చివరి నాటికి భూకక్ష్యలోకి పంపేందుకు స్పేస్ ఎక్స్ సంస్థ తయారు చేసిన 394 అడుగుల (120 మీటర్లు) సూపర్ హెవీ ఫస్ట్ స్టేజ్ బూస్టర్ 7 ప్రోటో టైప్‌ను టెక్సాస్‌లో స్పేస్ఎక్స్ రాకెట్ ప్రయోగాలు జరిపే బోకా చికా ప్రాంతంలో టెస్ట్ నిర్వహించింది. ఈ ప్రయోగం జరిపే సమయంలో స్పేస్ ఎక్స్ రాకెట్ బూస్టర్ ఒక్కసారిగా పేలి తునాతునకలైంది. Yeah, actually not good. Team is assessing damage. — Elon Musk (@elonmusk) July 11, 2022 పేలుతున్న ఆ దృశ్యాల్ని నాసా అఫిషియల్ వెబ్ సైట్ లైవ్ టెలికాస్ట్ చేయగా..పేలిన 33 రాప్టార్ ఇంజిన్లతో తయారు చేసిన రాకెట్ ఎందుకు పేలిందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎలన్ మస్క్ సైతం రాకెట్ పేలుడిపై స్పందించాడు. యా. ఇది మంచిది కాదు. రాకెట్ పేలుడు నష్టాన్ని స్పేస్ ఎక్స్ టీం అంచనా వేస్తుందని ట్వీట్ చేశాడు. -
మట్టితోనే గట్టి పునాది!
భూమిని దాటేసి అంతరిక్షంలో పాగా వేయాలని.. చంద్రుడిపై, అంగారకుడిపై ఇళ్లు కట్టాలని శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. సంకల్పం బాగానే ఉన్నా.. అక్కడ ఇల్లు కట్టుకునేదెలా? భూమ్మీది నుంచి సిమెంటు, ఇటుకలు, ఉక్కు, గాజు వంటివి పట్టుకెళ్లలేం. పోనీ గట్టి ప్లాస్టిక్‌నూ తీసుకెళదామనుకున్నా అదీ కొంతే. మరి ఇళ్లు కట్టుకోవడమెలాగన్న దానిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. చంద్రుడిపై, అంగారకుడిపై ఉన్న మట్టితోనే గట్టి ఇటుకలను, కాంక్రీట్ వంటి పదార్థాన్ని తయారు చేయవచ్చని గుర్తించారు. నిర్జీవమైన మట్టే.. ధూళి రూపంలో ఉండే చంద్రుడి మట్టిపై శాస్త్రవేత్తలు ఇప్పటికే చాలా ప్రయోగాలు చేశారు. అందులోని రసాయనాలు భూమిపై ఉండే మట్టికి భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు. ఇక అంగారకుడిపైకి పంపిన రోవర్లు అక్కడి మట్టి, రాళ్లపై పరిశోధనలు చేసి..రసాయనాల శాతాన్ని పరిశీలించాయి. వీటన్నింటిపై పరిశోధన చేసిన అమెరికాకు చెందిన సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు..ఆ మట్టితో గట్టి నిర్మాణ పదార్థాన్ని రూపొందించవచ్చని తేల్చారు. బాగా వేడి అవసరం చంద్రుడు, అంగారకుడిపై మట్టికి ఉప్పు నీళ్లు కలిపి ఇటుకలు, కాంక్రీట్ వంటి పదార్థాన్ని తయారు చేయవచ్చని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త రణజే ఘోష్ తెలిపారు. చంద్రుడి రాళ్ల నుంచి సేకరించిన ధూళి (రిగోలిత్)ను ఉపయోగించి చేసిన ప్రయోగంలో తాము ఈ విషయాన్ని గుర్తించామని వెల్లడించారు. అయితే ఆ మట్టిని, ఉప్పు నీళ్లకు కలిపి అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాల్సి ఉంటుందని.. దీనికి సంబంధించిన ఆ వేడిని ఉత్పత్తి చేయడం (హీట్ సోర్స్) ఎలాగనేది తేల్చాల్సి ఉందని వివరించారు. దీనికి సంబంధించి త్వరలోనే మరింత మెరుగైన పరిష్కారాన్ని కనుగొనగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
Mars Doorway: అంగారకుడి మీద ‘తలుపు’ మిస్టరీ వీడింది
అంగారక గ్రహం మీద తలుపులాంటి నిర్మాణం(డోర్‌వే) ఉన్న ఓ ఫోటోను తాజాగా నాసా విడుదల చేసింది. మార్స్ రోవర్ క్యూరియాసిటీ తీసిన ఈ ఫొటోలో ఒక పెద్ద బండరాయికి ఎవరో చెక్కినట్లు ఉన్న ఆ తలుపు నిర్మాణం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఇది ఏలియన్లు నిర్మించిందేంటూ ప్రచారం మొదలైంది. మార్స్ మీద ఏలియన్ల ఉనికి ప్రచారం ఈనాటిది కాదు. తరచూ ఏలియన్ల ఉనికిని ప్రస్తావిస్తూ బోలెడన్ని కథనాలు వెలువడేవి. అయితే తాజాగా బయటపడిన తలుపు తరహా నిర్మాణం మాత్రం ఆ వాదనను బలంగా సమర్థించింది. అది ఏలియన్ల పనేనంటూ వాదించడం మొదలుపెట్టారు కొందరు. ఈ తరుణంలో డోర్‌వే మిస్టరీని చేధించే పనిలోకి దిగారు పరిశోధకులు. చివరికి అదొక రాయి భాగం మాత్రమే అని తేల్చారు. సాధారణంగా.. అంగారకుడి మీద భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ క్రమంలో మే 4వ తేదీన కూడా భారీ భూకంపం సంభవించినట్లు నాసా గుర్తించింది. ఈ నేపథ్యంలో అలాంటి రాయి భాగం ఏదైనా ఆ తరహా నిర్మాణంలో ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు రోవర్ దానిని ప్రత్యేకమైన యాంగిల్లో ఫొటో తీయడం వల్లే.. అదంతా ప్రత్యేకంగా ఏదో తలుపు నిర్మాణం లాగా కనిపించింది. మార్స్‌పై ఇలాంటి భాగాలు చాలానే ఉన్నాయని నాసా నిర్ధారించింది. ఇక డోర్ తరహా బండరాయి ఫొటోల ద్వారా చూడడానికి పెద్దదిగా కనిపిస్తున్నప్పటికీ.. వాస్తవానికి అది సెంటీమీటర్లు లేదంటే ఇంచుల్లో మాత్రమే ఉంటుందని, అదేంటో పూర్తిస్థాయిలో అంచనాకి రావడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని నాసా స్పష్టం చేస్తోంది. చదవండి: చంద్రుడిపై పచ్చదనం.. మొలకెత్తిన విత్తనాలు -
అంతరిక్షంలో ఆధిపత్య పోరు
భూమిపై దేశాల మధ్య రాజకీయాలు నింగికి పాకుతున్నాయి. పలు అంశాల్లో అమెరికాకు సవాలు విసురుతున్న చైనా తాజాగా అంతరిక్షంలో ఆధిపత్య పోరుకు తెర తీసింది. దీంతో ఒకప్పుడు సోవియట్ యూనియన్– అమెరికా మధ్య ఉన్న పోటీ మరోమారు చైనా– యూఎస్ రూపంలో అంతరిక్షంలో కనిపించనుంది. అగ్రరాజ్య హోదా కోసం తహతహలాడుతున్న చైనా తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు అన్ని రంగాల్లో విపరీతంగా శ్రమిస్తోంది. ప్రపంచ పెద్దన్న అమెరికా ప్రాబల్యమున్న వివిధ అంశాల్లో కాలు మోపి ఉనికి చాటుకోవాలని యత్నిస్తోంది. తాజాగా అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. యూఎస్ఎస్ఆర్ (సోవియట్ రిపబ్లిక్) కుప్పకూలక ముందువరకు అమెరికాతో ఇదే తరహా పోటీ చూపేది. అయితే సోవియట్ పతనానంతరం ప్రపంచం ఏక ధ్రువ ప్రపంచంగా మారిపోయింది. సోవియట్ వదిలి వెళ్లిన ఖాళీని పూడ్చేందుకు చైనా రంగంపైకి వచ్చింది. ఈ క్రమంలో 2021లో అంతరిక్ష ప్రయోగాల పరంగా చైనా అదరగొట్టింది. గత ఏడాది చైనా మొత్తం 55 అంతరిక్ష ప్రాజెక్టులు చేపట్టగా అమెరికా 51తో సరిపుచ్చుకుంది. 2030 నాటికి కుజుడు (మార్స్)పైకి ఉపగ్రహాన్ని పంపి శాంపిళ్లను తీసుకువస్తామని తాజాగా చైనా లూనార్ ప్రోగ్రామ్ డిజైనర్ వూ వైరెన్ ప్రకటించారు. అంతటితో తమ యత్నాలు ఆగవని, సౌర వ్యవస్థలో ఇప్పటివరకు వెళ్లని దూరాలను అన్వేషిస్తామని చెప్పారు. ఇప్పటికే చైనా చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపి అక్కడి నుంచి శాంపిళ్లను విజయవంతంగా తీసుకువచ్చింది. ఇదే తరహాలో మార్స్ మిషన్ పూర్తి చేస్తామని వూ చెప్పారు. చంద్ర మిషన్‌తో పోలిస్తే మార్స్ మిషన్ క్లిష్టమైనదని, ముందుగా శక్తివంతమైన లాంచ్ వాహనాన్ని రూపొందించాల్సి ఉందని చెప్పారు. మేమే ముందు.. మార్స్‌పైకి మనిషిని పంపే ప్రణాళికకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ను గత ఏడాది చైనా విడుదల చేసింది. 2033– 2043 కాలంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సంకల్పించినట్లు ప్రకటించింది. 2020లోనే చైనా గ్రహాంతరయానానికి తొలిమెట్టు అయిన టియాన్వెన్ –1 ప్రోబ్‌ను ప్రయోగించింది. ఈ ప్రోబ్ 2021లో మార్స్ కక్ష్యలోకి ప్రవేశించింది. మే నెలలో ఈ ప్రోబ్ నుంచి జురాంగ్ అనే రోవర్‌ను కుజుడి ఉపరితలంపైకి దించారు. ఈ రోవర్ నిర్ధేశిత పనులను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో రష్యా, అమెరికా తర్వాత మార్స్‌పైకి రోవర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేసిన మూడో దేశంగా చైనా నిలిచింది. ఈ ధైర్యంతో రాబోయే ఎనిమిది సంవత్సరాల్లో కుజుడి ఉపరితలం నుంచి శాంపిళ్లను తెచ్చేందుకు చైనా యత్నిస్తోంది. 2020లో అమెరికా తన సొంత మార్స్ మిషన్‌ను చేపట్టింది. 2021లోనే మార్స్ పైకి అమెరికా రోవర్ దిగింది. ఇప్పటివరకు ఈ రోవర్ ఏడు శాంపిళ్లను సేకరించింది. యూరోపియన్ యూనియన్ స్పేస్ కమిషన్‌తో కలిసి ఈ శాంపిళ్లను 2031 నాటికి భూమిపైకి తీసుకురావాలని నాసా భావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే చైనా 2030లో శాంపిళ్లను తెస్తామని ప్రకటించిందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా కన్నా ముందుగా కుజుడి శాంపిళ్లను తీసుకురావడం ద్వారా అంతరిక్ష ఆధిపత్య పోరులో ముందంజలో ఉండాలన్నది చైనా భావన. అంతరిక్ష దౌత్యం ప్రస్తుతం భూమిపైన ఈ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న పోరు నడుస్తోంది. దీన్ని అంతరిక్షంలోకి తీసుకుపోవాలని చైనా భావిస్తోంది. రాబోయే రోజుల్లో అంతరిక్షంపై ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికాకు భిన్నంగా అంతరిక్ష దౌత్య మార్గం ద్వారా ఆధిపత్యం సాధించాలని చైనా యోచిస్తోంది. ఇందులో భాగంగా తన స్పేస్ ప్రోగ్రామ్స్‌లో ఇతర దేశాలకు అవకాశాలు ఇస్తోంది. చైనా నిర్మించే స్పేస్ స్టేషన్ పూర్తయితే ఇతర దేశాల వ్యోమగాములకు అవకాశాలు కల్పించడం ద్వారా పటిష్టమైన అంతరిక్ష దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాలన్నది చైనా భావనగా ఆ దేశానికి చెందిన చైనా డైలీన్యూస్ వెబ్సైట్ వెల్లడించింది. ఇది చైనాకు మంచి ప్రజాసంబంధాల వారధి (పబ్లిక్ రిలేషన్స్–పీఆర్)గా పనిచేస్తుందని తెలిపింది. అంతరిక్ష దౌత్యంలో భాగంగా చిన్న దేశాలకు కృత్రిమ ఉపగ్రహాలను నిర్మించి ఇవ్వడం, తన దగ్గర ఉన్న ఉపగ్రహ డేటాను ఆయా దేశాలతో పంచుకోవడం వంటి చర్యలను చైనా చేపట్టింది. అయితే ఇలాంటి ఆధిపత్య పోరు కన్నా గతంలో సోవియట్, అమెరికా కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించినట్లు చైనా, అమెరికా సంయుక్తంగా పనిచేయడం ప్రపంచం అంతటికీ మేలు చేకూరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాదే పైచేయి 2021లో చైనా అంతరిక్ష ప్రదర్శనల్లో అదరగొట్టింది. కానీ ఇప్పటికీ అంతరిక్షంపై అమెరికా ఆధిపత్యమే నడుస్తోంది. ప్రస్తుతం భూమి చుట్టూ దాదాపు 4,500 కృత్రిమ ఉపగ్రహాలు తిరుగుతుంటే వాటిలో 2,700 ఉపగ్రహాలు అమెరికాకి చెందినవే ఉన్నాయి. అటు చైనా ఉపగ్రహాల సంఖ్య దాదాపు 400 మాత్రమే. అమెరికా వద్ద అత్యంత శక్తివంతమైన రాకెట్లున్నాయి. ఇటీవల కాలంలో చైనా అంతరిక్షంపై పెట్టుబడులను పెంచుతూ వచ్చింది. 2020 నాటికి ఈ రంగానికి చైనా సుమారు 890 కోట్ల డాలర్ల నిధులు కేటాయించింది. కానీ అదే సమయంలో అమెరికా అంతరిక్ష ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులు ఏకంగా 4,800 కోట్ల డాలర్లు కావడం విశేషం. అమెరికాలో స్పేస్ ఎక్స్‌లాంటి పలు ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షరంగ సంస్థలు ప్రభుత్వానికి దీటుగా అంతరిక్ష ప్రాజెక్టులు చేపడుతున్నాయి. చైనాలో అంతటిస్థాయి ప్రైవేటు అంతరిక్ష కంపెనీలు ఏర్పడలేదు. – నేషనల్ డెస్క్, సాక్షి -
మరో ఐదేళ్లకు మార్స్‌పై జెండా ఎగరేద్దాం
స్పేస్ టూరిజం.. ఇప్పుడు ఇది సర్వసాధారణంగా మారిపోయింది. భూమి నుంచి 100 కిలోమీటర్లు దాటితే వచ్చే.. ఖర్మాన్ లైన్‌ను అంతరిక్షంగా ఫీలైపోతున్నారు. ఈ విషయంలో పోటీ స్పేస్‌ఏజెన్సీలకు దీటైన సమాధానమిస్తూ సిసలైన స్పేస్ యాత్రను.. అదీ సాధారణ పౌరులకు రుచి చూపించి శెభాష్ అనిపించుకున్నాడు ఎలన్ మస్క్. ఈ స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఇప్పుడు ఆసక్తికర ప్రకటన చేశాడు. రాబోయే ఐదేళ్లలో మనిషి మార్స్ మీదకు చేరడం ఖాయమని, అందుకు తనది హామీ అని, అదీ స్పేస్ఎక్స్ ద్వారానే సాధ్యమవుతుందని ధీమాగా చెప్తున్నాడు. ‘రాబోయే ఐదేళ్లలోనే మార్స్ మీదకు మనిషిని తీసుకెళ్లడం మా బాధ్యత. ఒకవేళ వరెస్ట్ సినారియో ఎదురైతే మాత్రం.. మరో పదేళ్లు పట్టొచ్చు. కానీ, ఆ పదేళ్ల నడుమ మార్స్ యాత్ర జరిగి తీరుతుంది. అందుకు నాదీ హామీ’అని ప్రకటించాడు ఎలన్ మస్క్. పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు మస్క్. అయితే డెడ్లైన్లను మిస్ కావడం ఎలన్ మస్క్‌కి కొత్తేం కాదు. గతంలో టెస్లా, స్పేస్ఎక్స్ సహా చాలా ప్రయోగాల విషయంలో ఇదే జరిగింది. కానీ, మార్స్ మీదకు మనిషి ప్రయాణం అనేది ఎలన్ మస్క్ చిన్ననాటి కల. ఆ కలే అతనితో రాకెట్ ఇంజినీరింగ్‌తో పాటు స్పేస్ఎక్స్ ప్రయోగానికి బీజం వేయించింది. మరి అలాంటిదాన్ని తప్పే ప్రసక్తే లేదనుకోవచ్చు మరి. -
అంగారకుడిపై అతిపెద్ద జలరాశి
న్యూఢిల్లీ: అన్యగ్రహాలపై జీవాన్వేషణలో మరో అడుగు ముందుకు పడింది. అంగారకుడి ఉపరితలం కింద.. పైపొరల్లోనే అతిపెద్ద నీటి సముదాయం ఉన్నట్లు తాజాగా సైంటిస్టులు గుర్తించారు. ఈ రిజర్వాయిర్ దాదాపు హరియాణా రాష్ట్రమంత ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అంగారకుడి ధృవప్రాంతాల్లోనే నీటి జాడలు(ఐస్ రూపంలో) బయటపడ్డాయి. ప్రస్తుతం అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తున్న టీజీఓ(ద ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్) సదరు గ్రహ మధ్య భాగంలో నూతన నీటి నిల్వలను కనుగొంది. తాజా పరిశోధనతో అంగారకుడి ఇతర ప్రాంతాల్లోనూ నీటి నిల్వలు ఉండే అవకాశాలున్నట్లు గుర్తించారు. విశేషాలు.. ►అంగారకుడిపైన ఉన్న వాలెస్ మెరైనెరిస్ ప్రాంతంలో ఉపరితలం కింద నీరు ఉన్నట్లు గుర్తించింది. ఈప్రాంతంలోని అంగారకుడి మట్టిలో హైడోజ్రన్ పాళ్లను బట్టి టీజీఏ నీటి నిల్వల నిర్ధారణ చేసింది. తాజా రిజర్వాయిర్ 45 వేల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించినట్లు తెలిసింది. ►నిజానికి అంగారకుడి మధ్య ప్రాంతంలో ఉండే అతి ఉష్ణోగ్రతల వల్ల ఇక్కడ నీరు, మంచు ఉండే అవకాశం లేదని భావిస్తూ వచ్చారు. అయితే, ఈ ప్రాంతం మట్టిలోని దుమ్ము కణాల్లో ఐస్ ఉన్నట్లు అనుమానించి ఉపరితాలనికి మీటరు లోతున టీజీఓ పరిశోధన జరిపిందని, దీంతో గత పరిశోధనల్లో బయటపడని నీటి నిల్వలు ఇక్కడ బయటపడ్డాయని స్పేస్ సైంటిస్టు ఐగర్ మిత్రోఫనావ్ చెప్పారు. ► టీజీఓలోని ఫ్రెండ్(ఫైన్ రిజల్యూషన్ ఎపిథర్మల్ న్యూట్రాన్ డిటెక్టర్) టెలిస్కోపు సాయంతో నీటి ఆచూకీ కనుగొన్నారు. కొత్తగా బయటపడ్డ జలరాశి దాదాపు నెదర్లాండ్స్ అంత విస్తీర్ణంలో వ్యాపించి ఉందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. ► 2018–21 మధ్య టీజీఓ పంపిన పరిశీలనలను సైంటిస్టులు అధ్యయనం చేసి నీటి నిల్వపై నిర్ధారణకు వచ్చారు. ► గెలాక్టిక్ కాస్మిక్ కిరణాలు అంగారకుడిని ఢీకొన్నప్పుడు న్యూట్రాన్లు ఉత్పత్తి అవుతాయని, తడి నేల కన్నా పొడి నేల నుంచి ఎక్కువ న్యూ ట్రాన్లు ఉత్పత్తి అవుతాయని, దీన్ని బట్టి ఉపరితలం కింద నీటి పరిమాణాన్ని లెక్కిస్తారని మరో సైంటిస్టు అలెక్సీ మలఖోవ్ తెలిపారు. ► ప్రస్తుతం బయటపడ్డ రిజర్వాయర్‌లో నీరు ద్రవ లేదా ఐస్ స్థితిలో ఉండొచ్చని అంచనా. ఉపరితలంలోని ఇతర మినరల్స్‌తో ఈ నీటి అణువులు రసాయన బంధంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ► త్వరలో అంగారకుడిపైకి వ్యోమనౌకను పంపే యోచనలో ఉన్న మానవాళికి తాజా వార్త ఆశాజనకంగా ఉంటుందని సైంటిస్టులు విశ్లేషిస్తున్నారు. -
స్పేస్ ఎక్స్ దివాళా..! ఉద్యోగులకు ఎలన్ మస్క్ వార్నింగ్..!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చారు. స్పేస్ ఎక్స్ ప్రయోగానికి సంబంధించి ఎలన్ మస్క్ ఉద్యోగులకు మెయిల్ పెట్టారు. ఆ మెయిల్లో "ఇటీవల కాలంలో స్టార్‌షిప్ లాంచ్ వెహికల్‌కు ఉపయోగించే రాప్టార్ ఇంజిన్ తయారీలో చాలా వెనకబడి పోయాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే స్పేస్ఎక్స్ సంస్థకు దివాళా తీసే పరిస్థితి తలెత్తుతుంది" అంటూ పేర్కొన్నారు. ఎలన్ మస్క్ మార్స్పైన మనిషి మనుగడ సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. భూమి మీద ఏదైనా ప్రమాదం జరిగి, భూమి మీద మనుగడ అంతరించి పోతే మానవుడు మార్స్ మీద జీవించడానికి తన తన సంపద ఉపయోగ పడాలని ఎలన్ మస్క్ కోరుకుంటున్నాడు. ఆ లక్ష్యంతోనే ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ముందుకు సాగుతుంది. తాను ఊహించినట్లు భవిష్యత్‌లో మార్స్, చంద్రమండలంపై మానువుని మనుగడ కోసం రీయిజబుల్ స్పేస్ క్రాఫ్ట్తో స్టార్ షిప్ స్పేస్ రాకెట్లను తయారు చేస్తున్నారు. దీని కోసం ప్రస్తుతం ఉన్న అన్నీ ఎర్త్ రాకెట్ల కంటే 1000 రెట్లు ఎక్కువ ఉన్న స్టార్ షిప్ రాకెట్ ను మోయాల్సి ఉంటుంది. ఆ స్టార్ షిప్ రాకెట్‌ను మోసేందుకు స్పేస్ఎక్స్ రాఫ్టర్ ఇంజిన్లు ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు ఈ రాప్టర్ ఇంజిన్ తయారీలో స్పేస్ఎక్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఆ సమస్యని అధిగమించేందుకు స్పేస్ ఎక్స్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ మెయిల్ పెట్టారు. ఉద్యోగులు వారాంతాల్లో పనిచేయాలని, స్పేస్ ఎక్స్ ప్రయోగం సంక్షోభంలో ఉందని, దానిని త్వరగా పరిష్కరించకపోతే స్పేస్ ఎక్స్ దివాలా తీసే ప్రమాదం ఉందని ఉద్యోగులకు చేసిన మెయిల్స్‌లో ఎలన్ మస్క్ హెచ్చరించినట్లు ది వెర్జ్ తన కథనంలో పేర్కొంది. చదవండి: యాపిల్ పరువు తీసి పడేశాడు.. కొత్తేం కాదుగా!