Money Mantra
-
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
బలహీనమైన ప్రపంచ సూచనల మధ్య బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 53.82 పాయింట్లు లేదా 0.07 శాతం పెరిగి 81,563.87 వద్ద, నిఫ్టీ 4.10 పాయింట్లు లేదా 0.02 శాతం లాభంతో 24,614.15 ప్రారంభమయ్యాయి. మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 31 పాయింట్లు లాభంతో 24,641 వద్దకు, సెన్సెక్స్ 16 పాయింట్లు పుంజుకుని 81,526 వద్దకు చేరింది.మార్కెట్ ముగింపు సమయానికి బ్యాంకింగ్ రంగ స్టాక్‌లు నష్టల్లోకి వెళ్లాయి. ఐటీ స్టాక్‌లు రాణించాయి. కెమికల్ స్టాక్‌లో ఒకే రేంజ్బౌండ్లో కదలాడాయి. స్టీల్ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిలకడగా మార్కెట్ సూచీలు
మంగళవారం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1.59 పాయింట్లు లేదా 0.0019 శాతం లాభంతో 81,510.05 వద్ద, నిఫ్టీ 8.95 పాయింట్లు లేదా 0.036 శాతం నష్టంతో 24,610.05 వద్ద నిలిచాయి.శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. భారతి ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, అదానీ ఎంటర్ప్రైజెస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 24,599కు చేరింది. సెన్సెక్స్ 81 పాయింట్లు దిగజారి 81,426 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.14 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.61 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.62 శాతం దిగజారింది.దేశీయంగా అక్టోబర్ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి సూచీ వివరాలు గురువారం(12న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి వార్షికంగా 3.1 శాతం పుంజుకుంది. ఆర్థికవేత్తల 2.5 శాతం అంచనాలను అధిగమించింది. ఇదేవిధంగా నవంబర్ నెలకు సంబంధించిన రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు 12న వెలువడనున్నాయి. అక్టోబర్‌లో సీపీఐ వార్షిక రేటు 6.21 శాతంగా నమోదైంది. ఎఫ్ఐఐలు పెట్టుబడులకు ఆసక్తి చూపడం ట్రేడర్లను ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలనే చవిచూశాయి. సెన్సెక్స్ 200.66 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టంతో 81,508.46 వద్ద, నిఫ్టీ 58.80 పాయింట్లు లేదా 0.24 శాతం నష్టంతో 24,619.00 వద్ద నిలిచాయి.విప్రో, లార్సెన్ & టూబ్రో, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా స్టీల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో.. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హిందూస్తాన్ యూనీలివర్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 24,674కు చేరింది. సెన్సెక్స్ 17 పాయింట్లు దిగజారి 81,682 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.97 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 71.21 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.14 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.25 శాతం లాభపడింది. నాస్డాక్ 0.81 శాతం పుంజుకుంది.దేశీయంగా అక్టోబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ వివరాలు గురువారం(12న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి వార్షికంగా 3.1 శాతం పుంజుకుంది. ఆర్థికవేత్తల 2.5 శాతం అంచనాలను అధిగమించింది. ఇదేవిధంగా నవంబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు సైతం 12న వెలువడనున్నాయి. అక్టోబర్‌లో సీపీఐ వార్షిక రేటు 6.21 శాతంగా నమోదైంది. ఎఫ్ఐఐలు పెట్టుబడులకు ఆసక్తి చూపడం ట్రేడర్లను ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం మిశ్రమంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో మొగిశాయి. సెన్సెక్స్ 87.03 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో 81,678.83 వద్ద, నిఫ్టీ 39.35 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టంతో 24,669.05 వద్ద నిలిచాయి.టాటా మోటార్స్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వంటి కంపెనీ టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అదానీ పోర్ట్స్, సిప్లా, భారతి ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటివి నష్టాల జాబితాలో చేశాయి.ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటనకు ముందు భారత బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 శుక్రవారం మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 108 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 81,874 వద్ద ఉంది. నిఫ్టీ 12 పాయింట్లు లేదా 0.05 శాతం నష్టంతో 24,695 వద్ద ఉంది.గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం కీలక నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం మీడియాకు వివరిస్తారు. భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన నేపథ్యంలో కీలక రుణ రేటు రెపో యథాతథంగానే కొనసాగే అవకాశం ఉందన్నది మెజారిటీ ఆర్థికవేత్తల అంచనా.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలని చవి చూశాయి. సెన్సెక్స్ 950.06 పాయింట్లు లేదా 1.17 శాతం లాభంతో 81,906.39 వద్ద, నిఫ్టీ 271.30 పాయింట్లు లేదా 1.11 శాతం లాభంతో.. 24,738.75 వద్ద నిలిచాయి.టైటాన్ కంపెనీ, టీసీఎస్, ట్రెంట్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 24,524కు చేరింది. సెన్సెక్స్ 226 పాయింట్లు పుంజుకుని 81,186 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.25 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.6 శాతం లాభపడింది. నాస్డాక్ 1.3 శాతం పుంజుకుంది.గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం కీలక నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం మీడియాకు వివరిస్తారు. భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన నేపథ్యంలో కీలక రుణ రేటు రెపో యథాతథంగానే కొనసాగే అవకాశం ఉందన్నది మెజారిటీ ఆర్థికవేత్తల అంచనా.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కీలక వడ్డీరేట్లపై త్వరలో నిర్ణయం.. ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 24,467 వద్దకు చేరింది. సెన్సెక్స్ 110 పాయింట్లు ఎగబాకి 80,956 వద్దకు చేరింది.ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) క్రమంగా అమ్మకాలను తగ్గిస్తున్నారు. అయితే ఈ నెల 6న జరగబోయే ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంపై మార్కెట్ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో కీలక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోనున్నారు.సెన్సెక్స్ 30 సూచీలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, టీసీఎస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఎల్ అండ్ టీ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, ఆదానీ పోర్ట్స్ అండ్ సెజ్, పవర్‌గ్రిడ్, మారుతీ సుజుకీ, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, నెస్లే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ముందుకు సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 578.66 పాయింట్లు లేదా 0.72 శాతం లాభంతో 80,826.74 వద్ద, నిఫ్టీ 168.70 పాయింట్లు లేదా 0.69 శాతం లాభంతో 24,444.75 వద్ద నిలిచాయి.అదానీ పోర్ట్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), అదానీ ఎంటర్ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. భారతీ ఎయిర్టెల్, ఐటీసీ కంపెనీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, సన్ ఫార్మా వంటి కంపెనీలు నష్టాన్ని చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం 9:53 సమయానికి నిఫ్టీ 54 పాయింట్లు లాభపడి 24,328కు చేరింది. సెన్సెక్స్ 193 పాయింట్లు పుంజుకుని 80,431 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.44 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 71.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.2 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.24 శాతం లాభపడింది. నాస్డాక్ 0.97 శాతం పుంజుకుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం (జులై–సెపె్టంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను అందుకోలేకపోయింది. గత 7 త్రైమాసికాలలోనే అత్యల్పంగా 5.4 శాతంగా నమోదైంది. జీడీపీ గణాంకాలు గత వారాంతాన మార్కెట్లు ముగిశాక వెలువడినా దాని ప్రభావం సోమవారం మార్కెట్లపై పెద్దగా కనిపించలేదు. ఆర్బీఐ త్వరలో కీలక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు వస్తున్న సమాచారం మేరకు రెపోరేటును స్థిరంగా ఉంచి, సీఆర్ఆర్ వంటి సూచీల్లో మార్పులు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 450.99 పాయింట్లు లేదా 0.57 శాతం లాభంతో 80,253.78 వద్ద, నిఫ్టీ 142.90 పాయింట్లు లేదా 0.59 శాతం లాభంతో 24,274.00 వద్ద నిలిచాయి.అల్ట్రా టెక్ సిమెంట్, అపోలో హాస్పిటల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీలు నష్టాలను చవి చూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:53 సమయానికి నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 24,124కు చేరింది. సెన్సెక్స్ 108 పాయింట్లు దిగజారి 79,689 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.11 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.1 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.21 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.42 శాతం లాభపడింది. నాస్డాక్ 0.83 శాతం పుంజుకుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం (జులై–సెపె్టంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను అందుకోలేకపోయింది. గత 7 త్రైమాసికాలలోనే అత్యల్పంగా 5.4 శాతంగా నమోదైంది. జీడీపీ గణాంకాలు గత వారాంతాన మార్కెట్లు ముగిశాక వెలువడటంతో ఈ ప్రభావం నేడు (2న) దేశీ స్టాక్ మార్కెట్లపై కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు అంతర్జాతీయ పరిస్థితులు, విదేశీ పెట్టుబడులు, స్థూల ఆర్థిక గణాంకాలు సైతం ఈ వారం సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు తెలియజేశారు. ఈ వారం చివర్లో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పరపతి సమీక్షను చేపట్టనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల బాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 705.11 పాయింట్లు లేదా 0.89 శాతం లాభంతో.. 79,748.85 వద్ద, నిఫ్టీ 208.20 పాయింట్లు లేదా 0.87 శాతం లాభంతో 24,122.35 పాయింట్ల వద్ద నిలిచాయి.భారతి ఎయిర్టెల్, సిప్లా, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, అపోలో హాస్పిటల్, నెస్లే వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 23,973కు చేరింది. సెన్సెక్స్ 154 పాయింట్లు ఎగబాకి 79,177 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.24 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.38 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.6 శాతం దిగజారింది.మార్కెట్ ఒడిదొడుకులకు కొన్ని కారణాలుఅమెరికాలో అక్టోబర్ వినియోగదారుల వ్యయం అంచనాలకు (0.3%) మించి 0.4% పెరిగింది. కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు తగ్గుతున్నాయి. దీనికి తోడు ట్రంప్ దిగుమతులపై అధిక సుంకాల విధింపు హెచ్చరికల నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని రెండుశాతం దిగువకు తీసుకొచ్చే లక్ష్యానికి ఆటంకం నెలకొంది.డిసెంబర్లో మూడో దఫా వడ్డీరేట్ల తగ్గింపు అంశంపై ఫెడ్ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు ఇటీవలి ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశ వివరాల్లో వెల్లడైంది. దీంతో 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లపై కోతపై ఆశలు పెట్టుకున్న ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు.అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు అనూహ్యంగా పెరిగాయి. డాలర్ ఇండెక్స్ 106.39 స్థాయికి చేరింది. బాండ్లపై రాబడులు పెరగడంతో భారత్‌లాంటి వర్ధమాన దేశాల నుంచి అమెరికాకు పెట్టుబడులు తరలిపోతున్నాయి. డాలర్ బలంతో విదేశీ పెట్టుబడుదారులకు వ్యయాలు పెరుగుతాయి. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దలాల్ స్ట్రీట్‌పై బేర్ మెరుపు దాడి
ముంబై: దలాల్ స్ట్రీట్‌పై బేర్ మెరుపు దాడితో స్టాక్ సూచీలు గురువారం ఒకటిన్నర శాతం నష్టపోయాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు తోడు, నెలవారీ ఎక్స్పైరీ రోజున లాభాల స్వీకరణతో సూచీలు రెండు నెలల్లో ఒకరోజులో అతిపెద్ద పతనాన్ని చూవిచూసింది. సెన్సెక్స్ 1,190 పాయింట్లు క్షీణించి 80వేల దిగువ 79,044 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 361 పాయింట్లు కోల్పోయి 24వేల స్థాయిని కోల్పోయి 23,914 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,315 పాయింట్లు, నిఫ్టీ 401 పాయింట్లు పతనమయ్యాయి. అమెరికా ద్రవ్యోల్బణ పెరుగుదల, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు, ట్రంప్ టారీఫ్‌ల పెంపు హెచ్చరికలకు తోడు రష్యా– ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయి. ఆసియాలో జపాన్, సింగపూర్ మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు 2% నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు ఒకటిన్నర శాతం పతనమై రికవరీ అయ్యాయి. యూఎస్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.మార్కెట్లో మరిన్ని సంగతులు ∙సెన్సెక్స్ సూచీలో 30 షేర్లకు గానూ ఎస్బీఐ (0.55%) మినహా అన్ని షేర్లూ నష్టాన్ని చవిచూశాయి. అత్యధికంగా ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 3.50% – 2.50% నష్టపోయాయి. ఐటీ ఇండెక్స్ 2.35% అత్యధికంగా నష్టపోయింది. → అధిక వెయిటేజీ షేర్లు ఇన్ఫోసిస్ (–3.50%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (–2%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (–1%), టీసీఎస్(–2%), ఎంఅండ్ఎం(–3.50%) నష్టపోయి సూచీల పతనాన్ని శాసించాయి. → నష్టాల మార్కెట్లోనూ అదానీ గ్రూప్ షేర్లు రాణించాయి. అదానీ టోటల్ గ్యాస్ 16%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ ఎనర్జీ గ్రీన్ 10%, అదానీ పవర్ 7%, అదానీ ఎంటర్ప్రైజెస్ 2 శాతం లాభపడ్డాయి.నష్టాలకు నాలుగు కారణాలు అమెరికాలో అక్టోబర్ వినియోగదారుల వ్యయం అంచనాలకు (0.3%) మించి 0.4% పెరిగింది. కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు తగ్గుతున్నాయి. దీనికి తోడు ట్రంప్ దిగుమతులపై అధిక సుంకాల విధింపు హెచ్చరికల నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని రెండుశాతం దిగువకు తీసుకొచ్చే లక్ష్యానికి ఆటంకం నెలకొంది.→ డిసెంబర్లో మూడో దఫా వడ్డీరేట్ల తగ్గింపు అంశంపై ఫెడ్ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు ఇటీవలి∙ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశ వివరాల్లో వెల్లడైంది. దీంతో 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లపై కోతపై ఆశలు పెట్టుకున్న ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు.→ అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు అనూహ్యంగా పెరిగాయి. డాలర్ ఇండెక్స్ 106.39 స్థాయికి చేరింది. బాండ్లపై రాబడులు పెరగడంతో భారత్‌లాంటి వర్ధమాన దేశాల నుంచి అమెరికాకు పెట్టుబడులు తరిలిపోతాయి. డాలర్ బలంతో విదేశీ పెట్టుబడుదారులకు వ్యయాలు పెరుగుతాయి. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది.→ దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ఈ వారంలో వరుస మూడు రోజులు పాటు నికర కొనుగోలుదారులుగా నిలిచి ఎఫ్ఐఐలు తిరిగి అమ్మకాలకు పాల్పడ్డారు. గురువారం ఏకంగా రూ. 11,756 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. సెన్సెక్స్ ఒకటిన్నర శాతం పతనంతో ఒక్కరోజులో మార్కెట్ క్యాప్ రూ.1.21 లక్షల కోట్లు ఆవిరై రూ. 443.27 లక్షల కోట్లకు దిగివచ్చింది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 237.61 పాయింట్లు లేదా 0.30 శాతం లాభంతో 80,241.67 వద్ద, నిఫ్టీ 78.50 పాయింట్లు లేదా 0.32 పాయింట్ల లాభంతో 24,273.00 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రిక్ లిమిటెడ్, ట్రెంట్స్ లిమిటెడ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) మొదలైన కంపెనీలు చేరాయి. అపోలో హాస్పిటల్, టైటాన్ కంపెనీ, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి సంస్థలు నష్టాన్ని చవి చూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 117 పాయింట్లు లేదా 0.2 శాతం లాభంతో 80,121 వద్ద ప్రారంభమైంది. కానీ వెంటనే 100 పాయింట్లకు పైగా క్షీణించి 79,879 కనిష్ట స్థాయికి దిగజారింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీ 20 పాయింట్లు క్షీణించి 24,170 స్థాయిల వద్ద కోట్ చేసింది.నిఫ్టీ 50 స్టాక్స్‌లో కోల్ ఇండియా దాదాపు 2 శాతం లాభపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్ కూడా 1 శాతంపైగా పురోగమించాయి. మరోవైపు, సిప్లా, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బీఎన్కే, టాటా కన్స్యూమర్ ఒక్కొక్కటి 1 శాతం క్షీణించాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 106.72 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టంతో 80,003.13 వద్ద, నిఫ్టీ 32.55 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టంతో 24,189.35 వద్ద నిలిచాయి. సోమవారం ఉదయం నుంచి లాభాలబాట పట్టిన స్టాక్ మార్కెట్లు మళ్ళీ (మంగళవారం) నష్టాల్లోనే ముగిశాయి.శ్రీరామ్ ఫైనాన్స్, బ్రిటానియా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు లాభాల జాబితాలో చేరగా.. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:52 సమయానికి నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 24,249కు చేరింది. సెన్సెక్స్ 82 పాయింట్లు ఎగబాకి 80,175 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.81 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.01 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.3 శాతం పెరిగింది. నాస్డాక్ 0.14 శాతం పుంజుకుంది.ఇటీవల భారీగా పడిన మార్కెట్లు షార్ట్‌కవరింగ్‌తో పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో మార్కెట్లు పరుగు పెడుతున్నట్లు చెబుతున్నారు. అయితే ప్రపంచస్థాయిలో రాజకీయ, భౌగోళిక ఆందోళనలు, దీంతో పెరుగుతున్న ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు వివరించారు. మరోవైపు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతుండటంతో రూపాయి నీరసిస్తోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల బాటపట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 1,820.19 పాయింట్లు లేదా 2.36 శాతం పెరిగి 78,975.98 వద్ద, నిఫ్టీ 525.70 పాయింట్లు లేదా 2.25 శాతం పెరిగి 23,875.60 వద్ద నిలిచాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), టైటాన్ కంపెనీ, టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (TCS), జేఎస్‌డబ్ల్యు స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలోకి చేరాయి. బజాజ్ ఆటో, వోడాఫోన్ ఐడియా, ఫెడరల్ బ్యాంక్, పీఐ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి. నిన్న (నవంబర్ 21) భారీ నష్టాలను చవి చూసిన అదానీ సంస్థలు మళ్ళీ లాభాల్లో పయనించాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 154 పాయింట్లు లాభపడి 23,491కు చేరింది. సెన్సెక్స్ 443 పాయింట్లు ఎగబాకి 77,596 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.07 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.5 శాతం పెరిగింది. నాస్డాక్ 0.03 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అదానీ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:49 సమయానికి నిఫ్టీ 224 పాయింట్లు నష్టపోయి 23,294కు చేరింది. సెన్సెక్స్ 668 పాయింట్లు దిగజారి 76,931 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.4 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ క్రితం ముగింపు వద్దే కదలాడింది. నాస్డాక్ 0.11 శాతం దిగజారింది.విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను గణనీయంగా ఉపసంహరిస్తున్నారు. రెండో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలు పెద్దగా లాభాలు పోస్ట్ చేయకపోవడం మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు మార్కెట్ అస్థిరతకు కారణమవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా మందగించిన పారిశ్రామికోత్పత్తి వృద్ధి కూడా మార్కెట్ తిరోగమనానికి కారణమని చెబుతున్నారు.అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు న్యూయార్క్‌లో అధికారులు అభియోగాలు మోపారు. గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. దాంతో అదానీ గ్రూప్ కంపెనీ స్టాక్‌లు భారీగా నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో కదలాడుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 131 పాయింట్లు పెరిగి 23,582కు చేరింది. సెన్సెక్స్ 451 పాయింట్లు ఎగబాకి 77,783 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.4 శాతం లాభపడింది. నాస్డాక్ 0.6 శాతం ఎగబాకింది.కొద్ది రోజులుగా మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొంతమేర షార్ట్‌కవరింగ్‌కు వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా మార్కెట్లు మంగళవారం కొంత పెరుగుతుననట్లు తెలియజేశారు. ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో ఇప్పటికిప్పుడే వడ్డీరేట్లను తగ్గించే అవసరం ఉండకపోవచ్చని తెలిపారు. దాంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదొడుకులతో కదలాడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 23,555కు చేరింది. సెన్సెక్స్ 54 పాయింట్లు ఎగబాకి 77,631 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.48 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.28 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.32 శాతం నష్టపోయింది. నాస్డాక్ 2.24 శాతం దిగజారింది.కొద్ది రోజులుగా మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొంతమేర షార్ట్‌కవరింగ్‌కు వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని తెలియజేశారు. కొత్త ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతోంది. దీంతో దేశీ కరెన్సీ బలహీనపడుతూ వస్తోంది. దీనికితోడు యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ సైతం మెరుగుపడుతున్నాయి. మరోవైపు చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీస్తోంది. దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ.22,420 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ 60 పాయింట్లు పెరిగి 23,622కు చేరింది. సెన్సెక్స్ 164 పాయింట్లు ఎగబాకి 77,825 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.48 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.28 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.02 శాతం పెరిగింది. నాస్డాక్ 0.14 శాతం దిగజారింది.ఇదీ చదవండి: రూ.199 కోట్లతో ఇవాంకా ఇంటి పనులుదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 14 నెలల గరిష్ఠానికి పెరిగి 6.21 శాతానికి చేరింది. గతంలో ఆగస్టు 2023లో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంది. కానీ ఈసారి ఈ మార్కును దాటింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇది 5.49 శాతం నమోదవ్వగా.. గతేడాది అక్టోబర్‌లో 4.87 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం పెరగడమే రిటైల్ ద్రవ్యోల్బణం ఇంతలా పెరిగేందుకు కారణమని ఆర్బీఐ తెలిపింది. శుక్రవారం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలక అంశాలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగించనున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
6:15 గంటల్లో రూ.5 లక్షల కోట్లు ఆవిరి!
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 324 పాయింట్లు నష్టపోయి 23,559 వద్దకు చేరింది. సెన్సెక్స్ 984 పాయింట్లు దిగజారి 77,690 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ మార్కెట్లో ఒక్కరోజే దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది.విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి రోజూ సరాసరి రూ.4వేల కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగుస్తున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ మీటింగ్‌లో భాగంగా 25 బేసిస్ పాయింట్లు కీలక వడ్డీరేట్లలో కోత విధించింది. అయితే శుక్రవారం ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ యూఎస్ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి ఫెడ్ మినట్స్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు.ఇదీ చదవండి: నాలుగేళ్లలో 45.7 కోట్లకు శ్రామికశక్తిసెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్. ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఎం అండ్ ఎం, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
బలహీనమైన ప్రపంచ సూచనల మధ్య భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 167 పాయింట్లు లేదా 0.21 శాతం క్షీణించి 78,507.87 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు లేదా 0.26 శాతం క్షీణించి 23,820 వద్ద ఉన్నాయి.బీఎస్ఈ సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 16 షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ ఇండియా, టాటా స్టీల్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా నష్టాలలో ముందుండగా, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, భారతి ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.ఇక నిఫ్టీ 50 షేర్లలో 31 షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లాభాల్లో ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ ముందుండగా, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, హీరోమోటోకో, హెచ్డీఎఫ్సీ లైఫ్ నష్టాల్లో ముందున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఒకే రోజు రూ.4.3 లక్షల కోట్లు ఆవిరి!
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్ ప్రారంభంలో కాసేపు లాభాల్లో కదలాడిన సూచీలు ముగింపు సమయానికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 257 పాయింట్లు నష్టపోయి 23,883 వద్దకు చేరింది. సెన్సెక్స్ 820 పాయింట్లు దిగజారి 78,675 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ మార్కెట్లో ఒక్కరోజే దాదాపు రూ.4.3 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది.విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగుస్తున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ మీటింగ్‌లో భాగంగా 25 బేసిస్ పాయింట్లు కీలక వడ్డీరేట్లలో కోత విధించింది. అయితే శుక్రవారం ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ యూఎస్ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి ఫెడ్ మినట్స్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు.సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్సర్వ్ వంటి కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. యూఎస్ మార్కెట్ల బలంతో బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 లాభాలతో మొదలుపెట్టాయి.ప్రారంభ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 250 పాయింట్లు లేదా 0.31 శాతం పెరిగి 79,746 వద్ద, నిఫ్టీ 84.5 పాయింట్లు లేదా 0.35 శాతం పెరిగి 24,225 వద్ద చలిస్తున్నాయి.డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారతీయ స్టాక్స్‌ను విక్రయించడం, యూఎస్ కొనుగోలు చేస్తుండటం, సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయ సంస్థల పనితీరు పెట్టుబడిదారులకు ఆందోళన కలిగించే అంశాలుగా ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 81 పాయింట్లు తగ్గి 24,066కు చేరింది. సెన్సెక్స్ 290 పాయింట్లు నష్టపోయి 79,196 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.75 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.3 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.38 శాతం పెరిగింది. నాస్డాక్ 0.09 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: మస్క్ ‘ఫోరమ్ షాపింగ్’! ట్రంప్‌తో దోస్తీ ఇందుకేనా..?అక్టోబర్ నెలకు సంబంధించిన యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు 13న వెలువడనున్నాయి. సెప్టెంబర్‌లో ఇది 2.4 శాతంగా నమోదైంది. ఇక కీలకమైన వినియోగ ధరల సూచీ సెప్టెంబర్‌లో 3.3 శాతాన్ని తాకింది. శుక్రవారం కీలక అంశాలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగించనున్నారు. గత వారం చేపట్టిన పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు తాజాగా 4.5–4.75 శాతానికి చేరాయి. ఇక మరోపక్క జులై–సెప్టెంబర్‌కు జపాన్ జీడీపీ గణాంకాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఏప్రిల్–జూన్‌లో జపాన్ జీడీపీ 0.7 శాతం పుంజుకుంది. అక్టోబర్‌కు చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం తెలియనున్నాయి. సెప్టెంబర్‌లో 5.4 శాతం పురోగతి నమోదైంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మోస్తరు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.21 గంటల సమయంలో భారతీయ బెంచ్ మార్క్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ 328.04 పాయింట్లు లేదా 0.41% నష్టంతో 79,213.75 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 112.30 పాయింట్లు లేదా 0.46% నష్టపోయి 24,087.05 వద్ద చలిస్తున్నాయి.ట్రెంట్, కోల్ఇండియా, బీపీసీల్, రిలయన్స్, టాటా మోటర్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు ఐటీ షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 38 పాయింట్లు తగ్గి 24,451కు చేరింది. సెన్సెక్స్ 63 పాయింట్లు నష్టపోయి 80,302 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.43 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో భారీ లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 2.53 శాతం పెరిగింది. నాస్డాక్ 2.95 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: టారిఫ్ వార్ 2.0!సుంకాల మోత ఖాయమనే అంచనాతో నష్టాలుఅమెరికాలో అధికారం చేజిక్కించుకున్న రిపబ్లికన్ల పార్టీ ‘ట్రంప్ సరిచేస్తారు’ అనే నినాదం అక్కడి మార్కెట్లనూ ప్రతిధ్వనించింది. ట్రంప్ అమెరికా ఫస్ట్ వైఖరి ప్రభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. సుంకాల మోత ఖాయమనే అంచనాలతో ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్, కొరియా సూచీలు బుధవారం 2.5% నుంచి అరశాతం నష్టపోయాయి. అయితే జపాన్, సింగపూర్, తైవాన్ సూచీలు 2% వరకు పెరిగాయి. యూరప్‌లో జర్మనీ డాక్స్, ఫ్రాన్స్ సీఏసీ, బ్రిటన్ ఎఫ్టీఎస్ సూచీలు 1% నష్టపోయాయి. ట్రంప్ గెలుపు ఆధిక్యం కొనసాగుతున్న వేళ డాలర్ల రూపంలో ఆదాయాలు ఆర్జించే దేశీయ ఐటీ కంపెనీల షేర్లకు నిన్న డిమాండ్ లభించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఒకే రోజు రూ.5 లక్షల కోట్ల కొనుగోళ్లు!
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 271 పాయింట్లు పెరిగి 24,484 వద్దకు చేరింది. సెన్సెక్స్ 901 పాయింట్లు ఎగబాకి 80,378 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ మార్కెట్లో ఒక్కరోజే దాదాపు రూ.5 లక్షల కోట్ల మేరకు కొనుగోళ్లు జరిగినట్లయింది.ఇటీవల వరుస నష్టాలతో ముగిసిన మార్కెట్లు బుధవారం లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్ ఈరోజు దేశీయ స్టాక్‌మార్కెట్‌ను నడిపించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయో ఒక అంచనాకు వస్తుండడంతో మార్కెట్లు పుంజుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా, యూఎన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా దేశీయ సంబంధాలు మెరుగ్గానే ఉంటాయని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కొంత స్పష్టత వస్తుండడంతో మదుపర్లు కొనుగోళ్లకు పూనుకున్నారు.ఇదీ చదవండి: ఆఫీస్‌కు రండి.. లేదా కంపెనీ మారండి!సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, ఇన్ఫీసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, రిలయన్స్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)