Sugar
-
నిద్ర కరువైతే అనారోగ్యం..!
విజయనగరం ఫోర్ట్: మానవుని జీవనశైలిలో మార్పులు, అధికంగా మొబైల్ వాడడం, టీవీ ఎక్కువగా చూడడం వల్ల అధికశాతం మంది నిద్రలేమి బారిన పడుతున్నారు. ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పనిచేయడం, జంక్ఫుడ్స్ ఎక్కువగా తినడం, రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోవడం, రాత్రి షిఫ్టుల్లో విధులు నిర్వహించడం వల్ల తగినంత నిద్ర ఉండదు. దీని వల్ల వారు బీపీ, సుగర్, ఊబకాయం, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, థైరాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. చాలా మంది నిద్ర లేకపోతే ఏంజరుగుతుంది? అని తేలికగా తీసుకుంటారు.అర్ధరాత్రి వరకు చాలా మంది నిద్రపోరు. దీని వల్ల అనేక సమస్యల బారిన పడతారు. నిద్రలేమి వల్ల ఓఎస్ఏ (అబ్‌్సట్రక్ట్రివ్ స్లీప్ అస్నియా) అనే సమస్యకు గురవుతారు. ఈ సమస్య ఉన్న వ్యక్తి శ్వాస తీసుకోవడం పదేపదే ఆగిపోవడం, ఊపిరి లోతుగా తీసుకోవడం (అల్పశ్వాస) జరుగుతుంది. అదేవిధంగా పెద్దగా గురక పెట్టడం, శ్వాస పునఃప్రారంభం అయినప్పడు ఉక్కిరిబిక్కిరి అయి వింత శబ్దాలు రావడం, పగటి సమయంలో మధ్యమధ్య కునుకుపాట్లు పడుతూ ఉండడం, అలసటగాను, మత్తుగాను ఉంటుంది. మద్యం తాగడం, పొగతాగడం, స్థూలకాయం వల్ల ఓఎస్ఏ సమస్య తీవ్రతరం అవుతుంది. చిన్నపిల్లల్లో అయితే ఎదుగుదల ఉండదు. మానసిక సమస్యల బారిన పడతారు.నెలకు 1000 మంది వరకు నిద్ర లేమి సమస్య బారిన పడుతున్నారు. 6నుంచి 7 గంటల నిద్ర అవసరం ప్రతి వ్యక్తి రోజులో 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. ఇలా నిద్ర పోవడం వల్ల హార్మోన్స్ తయారవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. పనిచేయడానికి అవసరమైన శక్తి తయారవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. జాగ్రత్తలు నిద్రలేమి సమస్య బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయమం చేయాలి. కనీసం రోజులో 6 గంటలు నిద్ర పోవాలి. నిద్రలేమి సమస్య ఉన్నట్లయితే పలమనాలజిస్టునుగాని, ఈఎన్టీ వైద్యుడిని గాని సంప్రదించాలి. ఊబకాయం రాకుండా చూసుకోవాలి. పానీపూరీ, చాట్, పిజ్జా, బర్గర్లు వంటివి ఎక్కువగా తినకూడదు.ఎక్కువ మందికి నిద్రలేమి సమస్య చాలామంది నిద్రలేమి సమస్య బారిన పడుతున్నా రు. అయితే ఈసమస్యకు ఎవరిని సంప్రదించాలో చాలామందికి తెలియదు. పలమనాలజిస్టునుగాని, ఈఎన్టీ వైద్యుడిని గానీ సంప్రదించాలి. ఆరోగ్యంగా జీవించడం కోసం రోజులో 6 నుంచి 7 గంటల పాటు నిద్రపోవాలి. సెల్‌ఫోన్ ఎక్కువగా వినియోగించకూడదు. అదేవిధంగా టీవీ కూడా గంటల తరబడి చూడకూడదు. - డాక్టర్ బొత్స సంతోష్‌కుమార్,అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
Mahakumbh: చక్కెర, గోధుమలు, మైదా గోడౌన్లు ఖాళీ.. దొరకని పాలు, బ్రెడ్
ప్రయాగరాజ్: యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లో గత ఐదు రోజులుగా కిలోమీటర్ల పొడవున భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. గతంలో రెండు గంటల్లో చేరుకునే దూరానికి ఇప్పుడు 10 గంటల సమయం పడుతున్నదని స్థానికులు వాపోతున్నారు. వాహనాల రద్దీ కారణంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసర సరుకులను తరలించే రవాణా వాహనాలు ప్రయాగ్‌రాజ్‌లోనికి ప్రవేశించలేకపోతున్నాయి.ట్రాఫిక్‌ను నియంత్రించడానికి పోలీసులు పలుచోట్ల బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాణిజ్య వాహనాలు ప్రయాగ్‌రాజ్‌లోనికి ప్రవేశించేందుకు అనుమతి లేకపోవడంతో ప్రయాగ్‌రాజ్‌లో పాలు, బ్రెడ్ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు పెట్రోల్ పంపులలో పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తోంది. నగరంలోని ప్రధాన మార్కెట్ అయిన ముత్తిగంజ్‌లోని పలు వ్యాపారులకు చెందిన గిడ్డంగులలో చక్కెర, గోధుమలు, మైదా నిల్వలు దాదాపుగా ఖాళీ అయిపోయాయి. కొద్దిపాటి స్టాక్ ఉన్న వ్యాపారులు రిటైల్ దుకాణాల డిమాండ్‌ను తీర్చలేకపోతున్నారు. జనవరి 26 నుంచి ప్రయాగ్‌రాజ్‌లోనికి వాణిజ్యవాహనాల రాకపోకలను నిలిపివేశారు. అయితే వసంత పంచమి తరువాత కొన్ని వాహనాలకు అనుమతులిచ్చారు. దీంతో కొంతమేరకు సమస్య పరిష్కారమయ్యింది. ఇయితే ఇప్పుడు తిరిగి ఆ ఆహార నిల్వలు ఖాళీ అయిపోయాయి.ప్రయాగ్‌రాజ్‌కు చెందిన రిటైల్ వ్యాపారి దీపక్ కేసర్వానీ మీడియాతో మాట్లాడుతూ తాను చక్కెర కొనడానికి హోల్‌సేల్ మార్కెట్‌కు వెళ్లగా, అక్కడ చక్కెర నిల్వలు లేనట్లు తెలిసిందన్నారు. మరో వ్యాపారి మాట్లాడుతూ తాను 50 కిలోల చక్కెర కోసం ప్రయత్నించగా, 15 కిలోలు మాత్రమే దొరికిందన్నారు. పప్పుధాన్యాలతో నిండిన ట్రక్కులు గత కొన్ని రోజులుగా చక్‌ఘాట్ సరిహద్దు వద్దనే ఉండిపోయాయని, వాటిని ప్రయాగ్‌రాజ్‌లోనికి అనుమతించడం లేదని గ్రెయిన్ ఆయిల్ సీడ్స్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ కేసర్వానీ తెలిపారు. నగరంలో ఆహారధాన్యాలు, నిత్యావసరాల కొరత సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు. ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. ఢిల్లీలో సినిమా, కేరళలో ప్రకటన షూటింగ్? -
మనోళ్లకు బీపీ, షుగర్ ఎక్కువే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల్లో హైపర్ టెన్షన్ (రక్తపోటు), డయాబెటీస్ మెల్లిటస్ (మధుమేహం) కేసులు ఎక్కువే అని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది జనవరి–ఆగస్టు మధ్య చేపట్టిన ఇంటింటి సర్వేలో తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బీపీ, షుగర్ కేసులు పెరుగుతున్నట్టుగా స్పష్టమైంది. గతంలో చేసిన అధ్యయనంలో వెల్లడైన వివిధ అంశాలను బలపరిచేలా తాజాగా విడుదల చేసిన ‘సెకండ్ రౌండ్ స్క్రీనింగ్, డయాగ్నసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ హైపర్ టెన్షన్/డయాబెటీస్ మెల్లిటస్, తెలంగాణ స్టేట్’లో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వివిధ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోనూ వ్యవసాయ ఆధారిత ప్రదేశాల్లోనూ బీపీ, షుగర్ కేసులు వెలుగులోకి రావడం.. సర్వే నిర్వహించిన వారిని ఆశ్చర్యచకితులను చేసింది. తమకు హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉందని తెలియకుండానే తమ రోజువారీ జీవితాలను గడుపుతున్న వారిలో అవగాహన కల్పింపంచి, ఆయా అనారోగ్యాలకు తగిన చికిత్స అందించేందుకు ఉద్దేశించి ఈ సర్వే నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జీవనశైలి అలవాట్ల కారణంగా ఎదురవుతున్న సమస్యలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాలు, తేడాలు గుర్తించేందుకు దీనిని ఎంచుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తమ అనారోగ్య సమస్యలు పెరిగి హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వచ్చి పరీక్షలు నిర్వహించినప్పుడు రక్తపోటు, మధుమేహం బయటపడుతుండడంతో, అన్ని ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. సర్వే చేసింది ఇలా.... రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 30 ఏళ్లు, ఆపైబడిన టార్గెట్ జనాభాకు సంబంధించి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–5 మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా అంశాల్లో నిర్దేశిత జనాభా శాతానికి అనుగుణంగా రాష్ట్రంలో అధ్యయనం చేశారు. మొత్తంగా చూస్తే...30 ఏళ్లకు పైబడిన టార్గెట్ పాపులేషన్‌కు సంబంధించి 33 జిల్లాల్లోని 1,68,86,372 మందిని పరీక్షల కోసం గుర్తించారు. ఈ టార్గెట్ జనాభాలోని 1,50,28,690 మందిని (89 శాతం) స్క్రీనింగ్ చేశారు. వీరిలో ఎన్ఎఫ్హెచ్ఎస్–5 ప్రకారం 26 శాతం మందిని అంటే 43,90,457 మందిని పరీక్షించగా 19,31,994 మందికి (అంచనా వేసిన వారిలో 44 శాతం) హైపర్‌టెన్షన్ కలిగి ఉన్నట్టుగా తేలింది. అదేవిధంగా ఎన్ఎఫ్హెచ్ఎస్–5 ప్రకారం 13శాతం మందిని అంటే 21,95,228 మందిని పరీక్షించగా 10,17,253 మందికి (అంచనా వేసిన వారిలో 46 శాతం) డయాబెటీస్ మెల్లిటస్ కలిగి ఉన్నట్టుగా వెల్లడైంది. ఈ అధ్యయన వివరాలను పరిశీలించినప్పుడు... రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో నిర్వహించిన పరీక్షలకు అనుగుణంగా... వారిలో 46 శాతం మంది షుగర్‌తో, 44 శాతం మంది బీపీతో బాధపడుతున్నట్టుగా స్పష్టమైంది. ఈ సమాచారానికి అనుగుణంగా చూస్తే...రాష్ట్రంలో మొత్తంగా 10,17, 253 మంది మధుమేహంతో, 19,31,994 అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్టుగా డయాగ్నైజ్ అ య్యింది. హైపర్ టెన్షన్, షుగర్లకు సంబంధించి వివిధ జిల్లాల వారీగా గణాంకాలను పరిశీలించినపుడు...రెండింటిలోనూ టాప్–5గా నిలిచిన జిల్లాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. -
ప్రతి 18మందిలో ఒకరికి షుగర్
రాష్ట్రంలో జీవనశైలి జబ్బులు ప్రమాద ఘంటిక మోగిస్తున్నాయి. ప్రతి 18 మందిలో ఒకరు షుగర్‌తో బాధపడుతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించే నాన్–కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) పోర్టల్‌లోని నవంబరు నెలాఖరు నాటి సమాచారం ఆధారంగా.. రాష్ట్రంలో 3.85 కోట్ల మందికి వైద్యశాఖ స్క్రీనింగ్ చేయగా.. 20.92 లక్షల మందిలో షుగర్ నిర్ధారణ అయినట్లు తేలింది. దేశవ్యాప్తంగా 32.33 కోట్ల మందికి గాను 2.96 కోట్ల మందిలో ఈ సమస్య ఉంది. ఇందులో అత్యధికంగా 47.92 లక్షల మంది కేరళలో ఉన్నారు. అనంతరం.. మహారాష్ట్రలో 40.03 లక్షలు, కర్ణాటక 28.83 లక్షలు, తెలంగాణలో 24.52 లక్షల మంది బాధితులున్నారు. ఈ లెక్కన గమనిస్తే దేశంలో సగటున 11 మందిలో ఒకరు షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. – సాక్షి, అమరావతితీసుకోవాల్సిన జాగ్రత్తలు..⇒ ధూమపానం, మద్యపానం వంటి వాటిని విడనాడాలి. ⇒ తక్కువ కేలరీలున్న ఆహార పదార్థాలు తీసుకుంటూ, బరువు తగ్గించుకోవాలి. ⇒ శరీరంలో కొవ్వు నియంత్రణకు తోడ్పడే జాగ్రత్తలు తీసుకోవాలి. ⇒ ఆహారంలో జంక్ ఫుడ్స్ తీసుకోకూడదు. పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ⇒ రోజూ కనీసం 30 నిమిషాల నడక, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు విధిగా చేయాలి. క్రమం తప్పని వ్యాయామం వల్ల శరీర కణజాలంలోని ఇన్సులిన్ గ్రాహకాల సెన్సిటివిటీ పెరుగుతుంది. ⇒ తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినడం మంచిది. నియంత్రణ మన చేతుల్లోనే.. మధుమేహం రెండు రకాలు. టైప్–1.. ఇది వంశపారంపర్యంగా వస్తుంది. టైప్–2 ఇది అనారోగ్యకర జీవనశైలితో వస్తుంది. టైప్–1ను ఎవరూ ఆపలేరు. కానీ, టైప్–2 రాకుండా నియంత్రించడం మన చేతుల్లోనే ఉంది. చిప్స్, నూడిల్స్ వంటి అల్ట్రాప్రాసెస్డ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం.. కదలికల్లేని యాంత్రిక జీవనంతో పాఠశాల విద్యార్థుల్లోనూ టైప్–2 మధుమేహం వస్తోంది. ఈ అలవాట్లను పూర్తిగా నియంత్రించాలి. వ్యాయామాలు చేయాలి.మధుమేహ బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ విషయంలో నిర్లక్ష్యంచేస్తే రెటినోపతి, కిడ్నీల వైఫల్యానికి కారణమయ్యే నెఫ్రోపతి, న్యూరోపతి, రక్తనాళాలకు సంబంధించిన పెరిఫెరల్ వాస్క్యులర్ వ్యాధుల వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. – డాక్టర్ ఎం. నాగచక్రవర్తి, జనరల్ మెడిసిన్ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, మంగళగిరి ఎయిమ్స్ -
పసితనంలో చక్కెరకు చెక్ పెడితే.. చక్కని ఆరోగ్యంq
మధుమేహం, రక్తపోటు రెండు జంట జబ్బులు ప్రస్తుతం మానవాళిని పట్టి పీడిస్తున్నాయి. వీటి బారినపడకుండా ఉండాలంటే చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార అలవాట్లు అలవరుచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిరుప్రాయం నుంచి తినే ఆహారం పట్ల నియంత్రణ ఉంటే పెద్దయ్యాక వ్యాధుల ముప్పు తగ్గుతుందని పలు అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో తొలి వెయ్యి రోజులు చిన్నారులకు అందించే ఆహారంలో చక్కెరను నియంత్రిస్తే పెద్దయ్యాక 35 శాతం టైప్–2 డయాబెటిస్, 25 శాతం రక్తపోటు ముప్పు తగ్గుతుందని అమెరికాలోని సౌత్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి జన్మనిచ్చాక, ఆ శిశువుకు రెండేళ్లు వచ్చే వరకు... అంటే వెయ్యి రోజుల పాటు చక్కెర తీసుకోవడాన్ని తగ్గిస్తే పెద్దయ్యాక రక్తపోటు, మధుమేహం ముప్పు గణనీయంగా తగ్గించవచ్చని నిర్ధారించారు. యూకే బయో బ్యాంక్‌లోని 1951 నుంచి 1956 మధ్య జన్మించిన 60 వేల మంది చిన్నారుల ఆరోగ్య వివరాలపై జరిపిన అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. రేషన్‌లో చక్కెర తీసుకున్న వారు, తీసుకోని వారు ఇలా రెండు వర్గాలుగా చిన్నారులను విభజించి అధ్యయనం నిర్వహించారు. ఈ నేపథ్యంలో చక్కెర తీసుకున్న వారితో పోలిస్తే తీసుకోని వారు యుక్త వయస్సులో దీర్ఘకాలిక జబ్బుల బారినపడే ప్రమాదం తక్కువగా ఉన్నట్టు తేలింది. – సాక్షి, అమరావతి -
నలిగిపోతున్ననాలుగో సింహం
పోలీస్ అధికారులు విధులకు ఒకవేళంటూ ఉండదు. లా అండ్ ఆర్డర్లో ఉండే సిబ్బందికి ఉరుకులుపరుగులు మరీ ఎక్కువ. శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తులు, కేసుల దర్యాప్తు, కోర్టులకు హాజరుకావడం..ఉన్నతాధికారుల సమీక్షలకు వెళ్లడం..ఇలా బహుళ డ్యూటీలు చేస్తుండాలి. ఏఆర్, టీజీఎస్పీ సిబ్బంది విధుల్లోనూ తిప్పలు తప్పవు. పండుగలు, సభలు, సమావేశాలు, వీఐపీల బందోబస్తులంటూ గంటల తరబడి నిలబడక తప్పదు. ఇలా శారీరకంగా, మానసికంగానూ శ్రమ ఎక్కువే. ఈ ప్రభావం అంతా పోలీసుల ఆరోగ్యంపై వివిధ జబ్బుల రూపంలో చూపుతోంది. బీపీ, షుగర్‌తో మొదలై క్రమంగా పలు ప్రమాదకర జబ్బులకు దారితీస్తోంది. 2019 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 21 వరకు ఆరోగ్య భద్రత అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం..6,347 మంది కేన్సర్ చికిత్స తీసుకున్నారు. రెండో స్థానంలో కిడ్నీ రోగులు ఉన్నారు. 4,922 మంది నెఫ్రాలజీ చికి త్స తీసుకున్నారు. యూరాలజీ సమస్యలతోనూ ఎక్కువ మందే బాధపడుతున్నారు. గుండె జబ్బుల కారణంగా 2,875 మంది ఆస్పత్రులపాలయ్యారు. మానసిక ఒత్తిడిసైతం అధికంగానే ఉంటోంది. కొన్నిసార్లు బీపీ పెరగడంతో న్యూరో సమస్యలు వస్తున్నాయి. న్యూరాలజీకి సంబంధించి 1,937 మంది చికిత్స పొందారు. వేతనం నుంచి కార్పస్ ఫండ్‌కు నిధులు ఆరోగ్య భద్రత కార్పస్ ఫండ్ కోసంకానిస్టేబుల్ నుంచి ఎస్సై ర్యాంకు వరకుకేటగిరీ–1 కింద నెలకు రూ.200 చొప్పున,ఇన్స్పెక్టర్ నుంచి డీజీపీ ర్యాంకు వరకుకేటగిరీ–2 కింద అధికారుల వేతనంలో నెలకు రూ.250 చొప్పున జమ చేస్తున్నారు. ఇలా పోలీస్‌శాఖలోని 68 వేల మంది సిబ్బంది నుంచి ఈ కార్పస్ ఫండ్ నిధులు జమ అవుతుంటాయి. కేన్సర్..లేదంటే కిడ్నీ సమస్యలతో పోలీసుల సతమతంసాక్షి, హైదరాబాద్: కేన్సర్..లేదంటే కిడ్నీ జబ్బుల బారిన పడే పోలీసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఐదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే..ఈ విషయం స్పష్టమవుతోంది. పోలీస్‌శాఖలోని దాదాపు 40 శాతం మందికిపైగా సిబ్బందికి బీపీ, షుగర్ రావడం సర్వసాధారణంగా మారింది. పనిఒత్తిడి, సమయం తప్పిన ఆహారంతోనూ అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. పోలీస్ అధికారులు, సిబ్బంది..వారి కుటుంబీలకు ఆరోగ్య భద్రత పథకం కింద పలు నెట్వర్క్ ఆస్పత్రులలో వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్య భద్రత కింద 2019 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 21 వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది కలిపి మొత్తం 1,04,014 మంది పలు రోగాలకు చికిత్సలు పొందారు. వీరి వైద్యం కోసం రూ.446.3 కోట్లు ఖర్చు చేశారు. పోలీస్ సిబ్బంది తల్లిదండ్రుల్లో 45,923 మంది చికిత్సకు రూ.318.03 కోట్లు ఖర్చు చేశారు. వైద్యంతోపాటు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా తెలంగాణ పోలీస్‌శాఖ నుంచి ఆరోగ్య భద్రత కింద ప్రతి రెండేళ్లకు ఒకసారి ఉచిత ఆరోగ్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.ఓపీ పేషెంట్లకు సబ్సిడీ ధరలకే వైద్య పరీక్షలు చేసేలా రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది రకాల డయాగ్నొస్టిక్ సెంటర్లతో ఆరోగ్య భద్రత ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆరోగ్య భద్రత కింద లబ్దిదారుల సంఖ్యతోపాటు వైద్యఖర్చులు పెరగడంతో ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం నుంచి రావా ల్సిన రీయింబర్స్మెంట్ నిధులు సైతం పేరుకుపోతున్నాయి. 2021 నుంచి రీయింబర్స్మెంట్ సకాలంలో జరగడం లేదు. దాదాపు రూ.200 కోట్ల వరకు ఆరోగ్య భద్రత నిధులు పెండింగ్ ఉండగా.. ఇటీవలే 30 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. రీయింబర్స్మెంట్ నిధుల పెండింగ్ కారణంగా కొన్ని సార్లు ఆస్పత్రులు వైద్యం అందించేందుకు ఇబ్బంది పెడుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటూ సిబ్బందికి సకాలంలో వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఇవీ జబ్బులకు ప్రధాన కారణాలు» పోలీస్ అంటే 24 గంటలపాటువిధి నిర్వహణ తప్పని ఉద్యోగం.పోలీస్స్టేషన్లలో శాంతిభద్రతల విధులు మొదలు ఏ ప్రత్యేక బలగంలో ఉన్నా.. ఒత్తిడి తప్పనిసరి అవుతోంది. » ఎండ, వాన, చలి,దుమ్మూధూళి, కాలుష్యంఇలా పలు రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేయడం సైతం జబ్బులకు కారణమవుతోంది. » బందోబస్తు విధుల్లో ఉన్నా.. ట్రాఫిక్ విధుల్లో ఉన్నా..గంటల తరబడి నిలబడక తప్పని పరిస్థితి. » ఆహార నియమాలవిషయంలో శ్రద్ధ తీసుకోవాలని ఉన్నా.. తీసుకునేలా పరిస్థితులు లేకపోవడం సైతం అనారోగ్యానికి కారణం అవుతోంది. » శాంతిభద్రతల విధుల్లో ఒక్కోసారి తగినంత విశ్రాంతి తీసుకోవడం సాధ్యం కాని పరిస్థితులుఉండడం సైతం శారీరకశ్రమను పెంచుతోంది. -
ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!
పెట్రోలియం, జెమ్‌స్టోన్ (రత్నాలు), చక్కెర, ఆగ్రోకెమికల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ పాత్ర అంతర్జాతీయంగా బలోపేతం అవుతోంది. గడిచిన ఐదేళ్లుగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ రంగాల నుంచి భారత్ ఎగుమతుల వాటా పెరుగుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2018 నుంచి 2023 మధ్య కాలంలో వీటితోపాటు ఎలక్ట్రికల్ గూడ్స్, న్యూమాటిక్ టైర్లు, ట్యాప్‌లు, వాల్వ్‌లు, సెమీకండక్టర్ పరికరాల ఎగుమతులు సైతం పెరుగుతున్నాయి.వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం..2023లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 85 బిలియన్ డాలర్ల(రూ.7.09 లక్షల కోట్లు)కు పెరిగాయి. ఈ రంగంలో అంతర్జాతీయంగా భారత్ వాటా 2018 నాటికి 6.45 శాతంగా ఉంటే, 2023 నాటికి 12.59 శాతానికి పెరిగింది. 2018లో పెట్రోలియం ఉత్పత్తుల పరంగా ఐదో అతిపెద్ద దేశంగా ఉండగా, 2023 నాటికి మూడో అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది.విలువైన రాళ్లుప్రీషియస్, సెమీ ప్రీషియష్ (విలువైన రాళ్లు) స్టోన్స్ ఎగుమతుల పరంగా 2018 నాటికి భారత్ వాటా 16.27 శాతం కాగా, 2023 చివరికి 36.53 శాతానికి పెరిగింది. ఈ విభాగంలో అంతర్జాతీయంగా భారత్ నంబర్1 స్థానానికి చేరింది. 2023లో 1.52 బిలియన్ డాలర్ల విలువైన తర్నాలను భారత్ ఎగుమతి చేసింది. 2018లో ఎగుమతులు కేవలం 0.26 బిలియన్ డాలర్లుగానే (అంతర్జాతీయంగా రెండో స్థానం) ఉన్నాయి.చక్కెర ఎగుమతులుచెరకు లేదా చక్కెర ఎగుమతుల పరంగా అంతర్జాతీయంగా భారత్ వాటా 2018 నాటికి ఉన్న 4.17 శాతం నుంచి 2023లో 12.21 శాతానికి చేరింది. చక్కెర ఎగుమతుల్లో భారత్ అంతర్జాతీయంగా రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ఆగ్రోకెమికల్, పురుగు మందులుఆగ్రోకెమికల్, పురుగు మందుల ఉత్పత్తుల ఎగుమతులతో అంతర్జాతీయంగా భారత్ వాటా 8.52 శాతం నుంచి 10.85 శాతానికి పెరిగింది. 2023 చివరికి ఎగుమతులు 4.32 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి. అంతర్జాతీయ వ్యవసాయ, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాలు భారత్‌కు కలిసొస్తున్నాయి. ఈ విభాగంలో అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానానికి ఎగబాకింది. ఇదీ చదవండి: అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?రబ్బర్ టైర్ల ఎగుమతులురబ్బర్ న్యూమాటిక్ టైర్ల ఎగుమతులు 2018లో 1.82 బిలియన్ డాలర్లుగా ఉంటే 2023 చివరికి 2.66 బిలియన్ డారల్లకు పెరిగాయి. అంతర్జాతీయంగా భారత్ వాటా 2.34 శాతం నుంచి 3.31 శాతానికి చేరింది.సెమీకండక్టర్లుసెమీకండక్టర్, ఫొటోసెన్సిటివ్ పరికరాల ఎగుమతులు 2018లో కేవలం 0.16 బిలియన్ డాలర్లుగానే ఉండగా, 2023 నాటికి 1.91 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందినట్టు వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. -
కడుపు నిండుగా.. షుగర్‌కు దూరంగా..!
ఏ రోజైనా వేరే ఏం తిన్నా, ఎంత తిన్నా.. కాసింత అన్నం కడుపులో పడితే తప్ప మనసున పట్టదు.. కూరలు ఏవైనా చేత్తో కలుపుకొంటూ ఇంత అన్నం తింటే ఉండే తృప్తే వేరు. కానీ మధుమేహం (షుగర్) వ్యాధి వచ్చి.. ఈ సంతృప్తి లేకుండా చేస్తోంది. అన్నం త్వరగా అరిగి, శరీరంలోకి వేగంగా గ్లూకోజ్ విడుదల కావడం.. రక్తంలో షుగర్ స్థాయిలు వేగంగా పెరిగిపోయే అవకాశం ఉండటమే దీనికి కారణం. దీనితో షుగర్‌తో బాధపడుతున్నవారు అన్నాన్ని చూస్తూనే నోరు కట్టేసుకుంటున్నారు. పెద్దగా అలవాటు లేకపోయినా, తినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. గోధుమ, జొన్న రొట్టెలనో.. కొర్రలు, ఊదలతో చేసిన అన్నమో తింటున్నారు. కానీ షుగర్ బాధితులు పెద్దగా గాభరా అవసరం లేకుండా హాయిగా లాగించేయడానికి వీలైన బియ్యం రకమే.. ‘తెలంగాణ సోనా’. సాధారణ బియ్యంతో పోలిస్తే.. ఈ బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువని, రక్తంలో వేగంగా షుగర్ లెవల్స్ పెరిగే సమస్య తక్కువని తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.మన వ్యవసాయ వర్సిటీలోనే అభివృద్ధి.. అన్నం తింటే రక్తంలో షుగర్ స్థాయి వేగంగా పెరుగుతుందన్న భయంతో నడి వయస్కులు కూడా ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు. షుగర్ వచ్చినవారు, యాభై ఏళ్లు దాటినవారైతే నోటికి తాళం వేసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని రకాల బియ్యంతోనూ ఇదే సమస్య. అదే ‘తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్–15048)’రకంతో ఈ ఇబ్బంది ఉండదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మిగతా రకాల బియ్యంతో పోలిస్తే.. ఈ రకం బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువని, మనకిష్టమైన అన్నం తింటూనే షుగర్‌ను నియంత్రణలో పెట్టుకోవచ్చని వివరిస్తున్నారు. ఈ తెలంగాణ సోనా బియ్యం ప్రత్యేకతలకు సంబంధించి అమెరికా ‘జర్నల్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్’లోనూ ఆర్టికల్ ప్రచురితమైందని చెబుతున్నారు. ఈ బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ 51.5 మాత్రమే. ఈ రకాన్ని వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలే అభివృద్ధి చేయడం గమనార్హం. సరిహద్దులు దాటిన తెలంగాణ సోనా ‘షుగర్ ఫ్రీ రైస్’గా పేరు తెచ్చుకున్న తెలంగాణ సోనా బియ్యానికి దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఈ రకం వరిని పండించేందుకు వివిధ రాష్ట్రాల రైతులు మొగ్గుచూపుతున్నారు. మిగతా సన్నరకాల వరితో పోల్చితే పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉండటం, తక్కువ కాలంలోనే పంట చేతికి రావడం, అన్ని కాలాల్లోనూ సాగుకు అనుకూలం కావడంతో.. ‘తెలంగాణ సోనా’రకం వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మూడేళ్ల క్రితం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన తెలంగాణ సోనా సాగు.. ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ సాగు చేస్తున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం తెలంగాణలో రెండు సీజన్లలో కలిపి 20 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా వరి సాగవుతోంది. ఇతర రాష్ట్రాల్లో మరో 30 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. సాధారణంగా ఇతర సన్నరకాల వడ్లను మిల్లింగ్ చేస్తే.. 50 నుంచి 60 కిలోల బియ్యమే వస్తాయి. నూకల శాతం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ సోనా రకమైతే 68 నుంచి 70 కిలోల వరకు బియ్యం వస్తున్నాయని.. ఈ రకం సాగు వ్యవధి మిగతా వాటి కంటే 20 రోజులు తక్కువకావడం వల్ల ఫెర్టిలైజర్ వాడకం కూడా తక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆన్లైన్లో భారీగా వ్యాపారం తెలంగాణ సోనా బియ్యానికి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. షుగర్ బాధితులతోపాటు సాధారణ వ్యక్తులూ దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో ఆన్లైన్లో ఈ బియ్యం వ్యాపారం పెరిగింది. అమెజాన్ వంటి ప్రముఖ ఈ–కామర్స్ సైట్లలోనూ తెలంగాణ సోనా విక్రయాలు సాగుతున్నాయి. ‘డయాబెటిక్ కంట్రోల్ వైట్ రైస్, డయాబెటిక్ కేర్ రైస్, షుగర్ కంట్రోల్ రైస్, డెక్కన్ ముద్ర లో జీఐ, గ్రెయిన్ స్పేస్ తెలంగాణ సోనా రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్’తదితర పేర్లతో ఆన్లైన్లో లభ్యమవుతున్నాయి.అయితే ఈ పేరిట అమ్ముతున్నదంతా తెలంగాణ సోనా రకమేనా అన్నది తేల్చడం, పక్కాగా అదేనా, కాదా అని గుర్తుపట్టడం కష్టమేనని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తోపాటు పలు సంస్థలు, వ్యక్తులతో వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ సోనా బ్రాండింగ్‌పై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ ఏంటి? దానితో సమస్యేమిటి? మనం తీసుకునే ఏ ఆహారమైనా ఎంత వేగంగా అరిగిపోయి, శరీరంలోకి ఎంత గ్లూకోజ్‌ను విడుదల చేస్తుందనే లెక్కను గ్లైసిమిక్ ఇండెక్స్(జీఐ)తో కొలుస్తారు. జీఐ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే.. రక్తంలో షుగర్ స్థాయిలు అంత వేగంగా పెరుగుతాయన్న మాట. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు తీవ్రమైన సమస్యగా మారుతుంది. బియ్యంతో చేసిన అన్నం ఎక్కువ. 1–55 మధ్య ఉంటే తక్కువగా అని.. 56–69 ఉంటే మధ్యస్థమని.. 70 శాతానికి పైగా ఉంటే అత్యధికమని చెబుతారు. సాధారణంగా బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ 79.22 వరకు ఉంటుంది. అందుకే షుగర్ బాధితులు అన్నం తగ్గించి, ఇతర ఆహారం తీసుకుంటారు. అయితే తెలంగాణ సోనా గ్లైసిమిక్ ఇండెక్స్ 51.5 వరకే ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ‘జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) మాత్రం తెలంగాణ సోనాలో మరీ అంత తక్కువగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండదని పేర్కొంది. ఓ మోతాదు మేరకు తినొచ్చుసాధారణ బియ్యంతో పోలిస్తే తెలంగాణ సోనా గ్లైసిమిక్ ఇండెక్స్ త క్కువని వ్యవసాయ విశ్వవిద్యాల యం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ లెక్కన చూ స్తే ఇతర రకాల బియ్యం కంటే తెలంగాణ సోనాతో ప్రయోజనం ఉంటుందని చెప్పవచ్చు.మధుమే హం బాధితులు ఓ మోతాదు వరకు ఈ బియ్యంతో వండిన అన్నం తీసుకో వచ్చు. దక్షిణ భారతంలో వేల ఏళ్లుగా అన్నమే ప్రధాన ఆహారం. అన్నం తింటేనే కాస్త సంతృప్తి. అందువల్ల మధు మేహ బాధితులు వైద్యులను సంప్రదించి.. ఎంత మేరకు ఈ అన్నం తినవచ్చన్నది నిర్ధారించుకుని వాడితే మంచిది. – ప్రొఫెసర్ కిరణ్ మాదల, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ బాధితులకు తెలంగాణ సోనాతో మేలు తెలంగాణ సోనా రకం బియ్యంతో వండిన అన్నాన్ని షుగర్ బాధితులు తీసుకో వచ్చు. ఇది మెల్లగా జీర్ణమవుతుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కావడం వల్ల గ్లూకోజ్ లెవల్స్ వేగంగా పెరగవు. షుగర్ బాధితులేకాదు.. మిగతా వారంతా ఈ బియ్యాన్ని వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. – డాక్టర్ ఆర్.జగదీశ్వర్, రిటైర్డ్ పరిశోధన సంచాలకుడు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ బియ్యంలో పిండి పదార్థాలు తక్కువ సాంబమసూరి, ఇతర వరి రకాలతో పోలిస్తే తెలంగాణ సోనా బియ్యంలో పిండి పదార్థాల శాతం తక్కువ. కాబట్టి ఇది షుగర్ బాధితులకు ఉపయోగపడుతుంది. వాస్తవంగా షుగర్ నియంత్రణ కోసం ఈ వరి వంగడాన్ని తయారు చేయలేదు. రూపొందించిన తర్వాత అందులో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువని తేలింది. పలు పరిశోధనల తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2015లో తెలంగాణ సోనాను అభివృద్ధి చేసింది. రకం సాగుతో రైతులకూ ప్రయోజనం. పెట్టుబడి తక్కువ. దిగుబడి ఎక్కువ. – డాక్టర్ వై.చంద్రమోహన్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, రైస్బ్రీడర్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం– సాక్షి, హైదరాబాద్Suh -
చేదెక్కిన రేషన్ చక్కెర!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పౌరసరఫరాల శాఖలో సబ్సిడీ చక్కెర చేదెక్కింది. అర్హులైన లబ్ధిదారులకు ప్రతీ నెల పంచదార పంపిణీ చేయాల్సి ఉన్నా పట్టింపు కరువైందని విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకంలో భాగంగా అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) రేషన్‌కార్డు ఉన్న లబ్ధిదారులైన ఒక్కో యూనిట్‌కు 35 కిలోల బియ్యంతోపాటు ఒక కిలో చక్కెర తప్పనిసరిగా అందించాలి. కానీ గత కొంతకాలంగా లబ్ధిదారులకు చక్కెర పంపిణీ జరగడం లేదని చెపుతున్నారు. గత సర్కారు హయాం నుంచే చక్కెరను లబ్ధిదారులకు అందించడం నిలిపివేశారని సమాచారం. దీంతో లబ్ధిదారులు తప్పని పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఒక కిలో పంచదారకు బహిరంగ మార్కెట్లో రూ.42 వరకు ధర ఉంది. అదే చౌకధరల దుకాణాల్లో సబ్సిడీతో రూ.13.50 చొప్పున అందించే అవకాశం ఉంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ ఖర్చు భరిస్తోంది. చక్కెరను రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ సేకరించి సరఫరా చేయాలి. కానీ చక్కెర సరఫరా సక్రమంగా జరగక గత కొన్నేళ్లుగా కేవలం రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. గతంలో కొందరు డీలర్లు చక్కెర కోసం డీడీలు కట్టినా సరుకు రేషన్ షాపులకు చేరలేదు. దీంతో చాలామంది డీలర్లు చక్కెరను అడగడమే మానేశారు. కట్టిన డబ్బులు రాకపోవడంతో ఆయా డీలర్లు సైతం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. జిల్లాస్థాయి అధికారులు చొరవ తీసుకుంటున్న చోట్ల మాత్రమే చక్కెర పంపిణీ జరుగుతోందని చెపుతున్నారు.రాష్ట్రంలో చౌకధరల దుకాణాల వివరాలు..మొత్తం రేషన్ షాపులు :17,352రేషన్ కార్డులు : 89,95,931పంపిణీ చేస్తున్న బియ్యం: 1.79 లక్షల మెట్రిక్ టన్నులుఅంత్యోదయ కార్డులు : 5,66,845పంపిణీ చేయాల్సిన చక్కెర: 566 మెట్రిక్ టన్నులుఅక్టోబర్లో చక్కెర కేటాయింపులు: 538 మెట్రిక్ టన్నులుచక్కెర ఇవ్వాలి..రేషన్ షాపుల్లో ప్రస్తుతం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. ప్రతీ నెల తక్కువ ధరలో వచ్చే చక్కెర కూడా ఇస్తే మాకు ఉపయోగంగా ఉంటుంది. – కుమ్మరి బక్కక్క, మల్లంపేట, కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లా -
క్వీన్ ఆఫ్ నట్స్ .. షుగర్, కేన్సర్ రానివ్వవు..
సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే మకడమియ తోటల సాగు మనకు బాగా కొత్త. ప్రోటీసీ కుటుంబం. ఎన్నో పోషక విలువలతో కూడినది కావటం వల్ల దీనికి క్వీన్ ఆఫ్ ద నట్స్ అని పేరొచ్చింది. మకడమియ చెట్టు గింజలను క్వీన్స్లాండ్ నట్స్ లేదా ఆస్ట్రేలియన్ నట్స్ అని కూడా పిలుస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ఉష్ణమండల ప్రాంతాలు దీని సాగుకు అనుకూలం. గుండె జబ్బులు, కేన్సర్, షుగర్ రానివ్వకుండా చూసే ఈ అద్భుత పంటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..మకడమియ దీర్ఘకాలిక పంట. గుబురుగా పెరిగే చెట్టుకు కాచే గుండ్రటి మకడమియ కాయల నుంచి వొలిచిన గింజలను తింటారు. ఈ గింజలు చూడడానికి పెద్ద శనగల మాదిరిగా ఉంటాయి. గుండ్రటి కాయలోని మరొక ΄÷రలో ఈ గింజ దాక్కొని ఉంటుంది. మకడమియ చెట్లలో ఏడు జాతులున్నాయి. వాణిజ్యపరంగా సాగుకు అనువైనవి రెండు మాత్రమే. మకడమియ ఇంటెగ్రిఫోలియ (దీని కాయ పెంకు గుల్లగా ఉంటుంది), మకడమియ టెట్రాఫిల్లా (దీని కాయ పెంకు కొంచెం గట్టిగా ఉంటుంది). మిగతా రకాల గింజలు విషపూరితాలు, తినటానికి పనికిరావు.కిలో గింజల ధర రూ. 1,175మకడమియ పంట ఆస్ట్రేలియా, హవాయి, సౌతాఫ్రికా, మలావి, బ్రెజిల్, ఫిజి, కాలిఫోర్నియ (అమెరికా)లో ఎక్కువగా సాగువుతున్నది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో కొందరు రైతులు ఈ చెట్ల సాగును ఈ మధ్యనే ప్రారంభించారు. 2017 నాటి గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 48,544 టన్నుల మకడమియ కాయల వార్షిక ఉత్పత్తి జరుగుతోంది. ప్రధానంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెన్యాల నుంచే 70% దిగుబడి వస్తోంది. డిమాండ్‌కు తగిన మకడమియ గింజల లభ్యత మార్కెట్లో లేదు. ఈ గింజల ఖరీదు కిలోకు 14 అమెరికన్ డాలర్లు. అంటే.. రూ. 1,175. ఇంత ఖరీదైన పంట కాబట్టే మకడమియ తోటల సాగుపై మన దేశంలోనూ రైతులు ఆసక్తి చూపుతున్నారు.12 అడుగుల ఎత్తుమకడమియ ఉష్ణమండల పంట. అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉంటుంది. అశోకా చెట్ల ఆకుల మాదిరిగా దీని ఆకులు ఉంటాయి. ఎత్తు 2–12 మీటర్లు, కొమ్మలు 5–10 మీటర్ల వరకు పెరగుతాయి. తెల్లటి పూలు గుత్తులుగా (8–10 సెం.మీ. పోడవున) వస్తాయి. శీతాకాలం మధ్యలో పూత ్ర΄ారంభమవుతుంది. గుత్తికి 100కిపైగా పూలు ఉన్నా 2 నుంచి 10 కాయలు మాత్రమే వస్తాయి. స్వపరాగ సంపర్కం జరిగే పంట ఇది. కృత్రిమంగా పోలినేషన్ చేస్తే దిగుబడి పెరుగుతుంది. మకడమియ కాయ పైన ఉండే మందపాటి తీసేస్తే గట్టి గుళ్లు బయటపడతాయి. వాటిని పగులగొడితే మధ్యలో గింజలు ఉంటాయి. లేత పసుపు రంగులో మెత్తగా ఉండే గింజలు తియ్యగా ఉంటాయి. పూత వచ్చిన 7–8 నెలల్లో కాయలు కోతకొస్తాయి. 13 –31 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దీనికి సూటబుల్. వార్షిక వర్ష΄ాతం 125 సెం.మీ. చాలు. నీరు నిలవని సారవంతమైన లోమీ సాయిల్ (ఇసుక, బంకమన్ను, సేంద్రియ పదార్థం కలిసిన ఎర్ర ఒండ్రు భూములు) అనుకూలం. విత్తనాల ద్వారా, కొమ్మ కత్తిరింపుల ద్వారా మొక్కలు పెంచవచ్చు. నాటిన తర్వాత 4–5 ఏళ్లలో కాపు ప్రారంభమై.. 50–75 ఏళ్ల ΄ాటు కాయల దిగుబడినివ్వటం ఈ చెట్ల ప్రత్యేకత.ఆరోగ్యదాయక పోషకాల గనిఆరోగ్యదాయకమైన అనేక పోషకాలతో కూడి ఉండే మకడమియ గింజలు తియ్యగా, కమ్మని రుచిని కలిగి ఉంటాయి. మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫాటీ ఆసిడ్లు ఉంటాయి. ఆస్ట్రేలియాలో జరిగిన పరిశోధనల ప్రకారం.. ఈ గింజలు తిన్న వారి రక్తంలో టోటల్, ఎల్డిఎల్ కొలస్ట్రాల్ తగ్గింది. వంద గ్రాముల గింజలు 718 కేలరీల శక్తినిస్తాయి. గింజలకే కాదు దాని పైన రలో కూడా అధిక కేలరీలను ఇచ్చే శక్తి ఉంది. ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఇందులో ఉన్నాయి. వంద గ్రాముల మకడమియ గింజల్లో 8.6 గ్రాములు లేదా రోజుకు మనిషికి కావాల్సిన 23% డైటరీ ఫైబర్ ఉంది. చెడు కొలెస్ట్రాల్ లేదు. బి–సిటోస్టెరాల్ వంటి ఫైటోస్టెరాల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఓలిక్ ఆసిడ్ (18:1), పాల్మిటోలీక్ ఆసిడ్ (16:1) వంటి మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీసు, జింగ్, సెలీనియం (గుండె రక్షణకు ఇది ముఖ్యం) వంటి ఎంతో ఉపయోగకరమైన మినరల్స్ ఉన్నాయి. ఇంకా.. జీవక్రియలకు దోహదపడే బి–కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉన్నాయి. వంద గ్రాముల మకడమియ గింజల్లో 15% నియాసిన్, 21% పైరిడాక్సిన్ (విటమిన్ బి–6), 100% థయామిన్, 12% రిబోఫ్లావిన్ వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉన్నాయి. ఆక్సిజన్–ఫ్రీ రాడికల్స్ కలిగించే నష్టం నుంచి డిఎన్ఎను, కణజాలాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు మకడమియ గింజల్లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ పంటకు అంత క్రేజ్!గుండె ఆరోగ్యానికి మేలు..షుగర్, కేన్సర్ రానివ్వవు..👉మకడమియ గింజలు గుండె ఆరోగ్యానికి మంచి చేస్తాయి. 👉 మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ తగ్గిస్తాయి. 👉 ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ∙జీర్ణ శక్తిని పెంచుతాయి. 👉 కేన్సర్ నిరోధక శక్తినిస్తాయి.👉 మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. 👉 చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. 👉 ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. 👉 మానసిక వత్తిడి నుంచి ఇన్ఫ్లమేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 👉 రక్తహీనత రాకుండా చూస్తాయి. 👉 మధుమేహం రాకుండా చూస్తాయి. -
ఆవాలతో ప్రయోజనాలు: చిన్నగా ఉన్నాయి కదాని లైట్ తీసుకోవద్దు!
షుగర్ లేదా మధుమేహం(Diabetes) ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న అతి ముఖ్యమైన సమస్యల్లో ఒకటి. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు కారణంగా రోజు రోజుకు మధుమేహం బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అలాగే లక్షలాదిమంది ప్రీడయాబెటిస్తో జీవిస్తున్నారు. అయితే రోజూ వ్యాయామంతోపాటు కొన్ని ఆహార జాగ్రత్తలు, మరికొన్ని చిట్కాల వల్ల షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మన వంట ఇంట్లో సులువుగా లభించే ఆవాలతో ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.ఆవాలు చూడ్డానికి చిన్నవిగా ఉన్నా, ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే మాత్రం చాలా శక్తివంతమైనవి. మన ఆహారంలో ఆవాలకు చాలా ప్రాధాన్యత ఉంది. రోజూ పోపు దినుసుగా వాడటంతోపాటు, మన ఆహారంలో భాగమైన ఆవకాయ లాంటి పచ్చళ్ళలో ఆవ పిండిని బాగా వాడతాము. కొన్ని ప్రాంతాలో ఆవకూర, ఆవనూనెను కూడా బాగా బాడతారు.ఆవాలు ఆరోగ్య ప్రయోజనాలుపుష్కలంగాపోషకాలు: ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి వివిధ పోషకాలకు ఆవాలు మంచి మూలం.ఆవపిండిలో గ్లూకోసినోలేట్స్, మైరోసినేస్ వంటి సమ్మేళనాలు శరీరంలో కేన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ఆవపిండిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన ఐసోథియోసైనేట్స్ అనే సమ్మేళనాలుంటాయి. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఆవాలు లేదా ఆవాల నూనెతో శరీరంలో మంట తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. జీర్ణశక్తికి కూడా చాలా మంచిది. ఎముకలకు కూడా చాలా మేలు చేస్తుంది. ఆవలోని సెలీనియం ఎముకలకు బలాన్నిస్తుంది.జుట్టు, దంతాలను బలోపేతం చేయడానికి కూడా ఆవాలు సహాయపడతాయి. ఆవాలులో కార్బోహైడ్రేట్లు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయ పడుతుంది. అలాగే ఆవాలు తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది.గతంలో జరిగిన అధ్యయనం ప్రకారం ఆవాల వినియోగం ద్వారా రక్తంలో గ్లూకోజ్ ,వారి కొలెస్ట్రాల్ స్థాయిలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ముగ్గురికి గ్లూకోజ్ స్థాయిలు 46శాతం తగ్గాయి. కొలెస్ట్రాల్ స్థాయి సగటున 10శాతం తగ్గింది. చిగుళ్ళు, ఎముకలు, దంతాల నొప్పిని తగ్గించడంలో తోడ్పడతాయి ఈ గింజలు. చర్మానికి కాంతినిస్తాయి. పైల్స్ నొప్పి నివారణలో కూడా ఆవనూనె బాగా ఉపయోగపడుతుంది.ఆహారంలో ఎలా చేర్చుకోవాలిఆవ కూరను తినవచ్చు. ఆవపొడిరూపంలో గానీ, గింజలుగా గానీ రోజూ కూరల్లో వాడు కోవచ్చు. ఆవనూనె కూరగాయలను వేయించడానికి, మాంసం లేదా చేపల వంటకాల్లో లేదా సలాడ్లపై చల్లుకోవచ్చు. -
రక్తం, గుండె..: ఈ వైద్య లెక్కల్ని ఎపుడైనా గమనించారా!
‘ఆరోగ్యమే..మహాభాగ్యం’ ఈ భాగ్యాన్ని దక్కించుకునేందుకు అందరూ కష్టపడుతూ ఉంటారు. చక్కటి జీవనశైలి, సమతుల ఆహారం, ఒత్తిడి, ఆందోళన జీవితం కోసం ఆరాట పడతారు. అయితే మానవ శరీర ఆరోగ్యానికి కావాల్సిన ప్రామాణికాలు ఏంటి? ఈ విషయంలో పురుషులకు, స్త్రీలకు మధ్య తేడా ఉంటుందా? మనిషి పల్స్ రేటు, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, ఊపిరి వేగం, బరువు ఈ ఐదింటిని ముఖ్యమైన అంశాలుగా పరిగణిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మంచి ఆరోగ్యం అనేది పూర్తి శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు స్థితి. ఆరోగ్యం అంటే బలమైన రోగనిరోధకశక్తి, ఆహారం, అరుగుదల, రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర, ఎలాంటి అనారోగ్యం, ఆందోళన, ఒత్తిడి, శారీరక బాధలు లేని ప్రశాంతమైన జీవితం. స్త్రీలైనా, పురుషులైనా ఏవో కొన్ని తప్ప దాదాపు ఇవే ప్రమాణికాలు వర్తిస్తాయి. అదే మహిళల్లో అదనంగా రుతు సమస్యలు, గర్భధారణ సమస్యలు లేకుండా ఉండటం కూడా చాలా కీలకం.ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన వైద్య ప్రామాణికాలురక్తపోటు 120/80 ఉండాలి. పల్స్ 70-100 ఉండాలి. ఉష్ణోగ్రత 36.8-37 ఉండాలి.శ్వాసక్రియ రేటు 12-16 ఉండాలి. పురుషుల్లో హిమోగ్లోబిన్ 13.5-18 వరకు, అదే స్త్రీలలో అయితే 11.50-16 ఉండాలి.కొలెస్ట్రాల్ 130-200, పొటాషియం 3.5-5, సోడియం 135-145 ఉండాలి.ట్రై గ్లిజరైడ్స్ 220 లోపు ఉండాలి. శరీరంలో రక్తం పరిమాణం 5-6 లీటర్లు ఉండాలి.షుగర్ తినక ముందు పిల్లలకు 70-130, పెద్దలకు 70-110 మధ్య ఉండాలి.ఐరన్ 8-15 మి.గ్రా. ఉండాలి.తెల్ల రక్త కణాలు 4000-11000, ప్లేట్లెట్స్ 1.50 లక్షల నుంచి 4 లక్షలుఎర్ర రక్త కణాలు 4.5 - 6 మిలియన్లు ఉండాలి.క్యాల్షియం 8.6-10.3, విటమిన్ డీ-3 స్థాయి 20-511, విటమిన్ బి12 లెవల్స్ 200-900 వరకు ఉండాలి. -
పెరగనున్న చక్కెర ధర
ఇకపై తీపి తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల మధ్య చక్కెర మిల్లల నిర్వహణ వాటి యజమానులకు భారంగా మారింది. ఈ నేపధ్యంలో చక్కెర కనీస విక్రయ ధరను కిలోకు కనీసం రూ. 42కి పెంచాలని నేషనల్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఫెడరేషన్ (ఎన్‌ఎఫ్‌సీఎస్‌ఎఫ్)ప్రభుత్వాన్ని కోరింది.మరోవైపు అక్టోబర్ ఒకటి నుండి ప్రారంభమయ్యే 2024-25 సీజన్‌కు చక్కెర కనీస అమ్మకపు ధర (ఎంఎస్పీ) ను పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఎఫ్‌సీఎస్‌ఎఫ్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం చక్కెర ధరను పెంచినట్లయితే, దాని ప్రభావం రిటైల్ మార్కెట్లో కనిపిస్తుంది. దీంతో చక్కెర ధర పెరిగేందుకు అవకాశముంది. చక్కెర ధర కిలోకు రూ.3 నుంచి 4 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.2019 నుండి చెరకు కనీస అమ్మకపు ధర కిలోకు రూ. 31 వద్ద కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం ప్రతి సంవత్సరం చెరకు రైతులకు చెల్లించే న్యాయమైన,లాభదాయక ధర (ఎఫ్ఆర్పీ)ని పెంచింది. ఎన్ఎఫ్సిఎస్ఎఫ్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ చెరకు కనీస అమ్మకపు ధరను సర్దుబాటు చేయడం అవసరమని, చక్కెర కనీస విక్రయ ధరను కిలోకు రూ.42కి పెంచితే చక్కెర పరిశ్రమ లాభసాటిగా మారుతుందని పేర్కొన్నారు. -
కొత్తిమీరతో అద్భుత ప్రయోజనాలు, వారికి తప్ప
వంటల్లో విరివిగా ఉపయోగించే మంచి హెర్బ్ కొత్తిమీర. అలాగే పురాతన కాలంనుంచీ వాడుకలో ఉన్నదిధనియాలు. ధనియాలు, కొత్తిమీర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది. కొత్తిమీర వినియోగంతో వచ్చే లాభాలు, బరువు తగ్గడానికి పని చేసే ఒక మంచి చిట్కా గురించి తెలుసుకుందాం. మీకు తెలుసా?కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవాలని అమ్మమ్మల నుంచి విన్నాం. కొత్తిమీర ఆకులలో ముఖ్యమైన నూనెలు యాంటీమైక్రోబయల్, ఫంగల్ లక్షణాలను కలిగి ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది. ఇంకా విటమిన్ ఏ సీ, కెరోటినాయిడ్లు, పుష్కలం. ఈ పోషకాలతో పాటు డైటరీ ఫైబర్, ఐరన్, మాంగనీస్, కాల్షియం, విటమిన్ కె, ఫాస్పరస్ మొదలైన అనేక పోషకాలు ఉంటాయి. ఇంకా చాలా సంతృప్త కొవ్వు, 11 ముఖ్యమైన నూనెలు లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది. లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.కొత్తిమీర ఆరోగ్య ప్రయోజనాలుకొన్ని అధ్యయనాల ఆధారంగా, కొత్తిమీర ఆకులను తీసుకోవడం వల్ల నిద్రలేమి, ఆందోళల సమస్యలు తగ్తుతాయి. విటమిన్ ఏ, సీ, ఈవిటమిన్ ఇ కారణంగా కళ్లకు చాలా మంచిది. కొత్తిమీర రోజువారీ వినియోగిస్తే వయసు కారణంగా వచ్చే మచ్చలకు మంచి చిట్కా. రోగనిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది. ఐరన్ తీసుకోవడంలో బాడీగా బాగా సహాయపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయికొత్తిమీరలోని ఆకుపచ్చ రంగు యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్ పనితీరును మెరుగుపరుస్తుంది. కొత్తిమీర కలిపిన నీటిని రోజూ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న వ్యక్తికి మేలు జరుగుతుంది. ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది. కొత్తిమీర గ్లైసెమిక్ ఇండెక్స్ 33 మాత్రమే. ఇది చాలా తక్కువ. అటువంటి పరిస్థితిలో, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చి కొత్తిమీర శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించి, ఇన్సులిన్ మొత్తాన్ని పెంచుతుంది. బ్లడ్ షుగర్ తక్కువగా ఉంటే కొత్తిమీర నీళ్లు తాగకండి. ఇది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.చెడు కొలెస్ట్రాల్నేటి జీవనశైలిలో, ప్రతి మూడవ వ్యక్తి అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. కొత్తిమీర ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ,హెచ్‌డిఎల్ (మంచి) కొలెస్ట్రాల్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఎముకల ఆరోగ్యానికి కొత్తిమీర ఆకులు కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్ లాంటి ఖనిజాలు పుష్కలం కొత్తిమీరలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫంక్షన్ ఆర్థరైటిస్ సంబంధిత నొప్పి నుండి ఎముకలను రక్షిస్తుంది.గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోకొత్తిమీరలో మంచి ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కడుపు నొప్పి, విరేచనాలు, ప్రేగు కదలికలు, గ్యాస్ లేదా వికారం వంటి వివిధ జీర్ణ సమస్యలకు కూడా పని చేస్తుంది. చర్మ ఆరోగ్యంఐరన్, విటమిన్ ఇ , విటమిన్ ఎ యొక్క పవర్‌హౌస్‌గా ఉండటం వల్ల ఇది చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. కొత్తిమీర అదనపు నూనెను పీల్చుకునే సామర్థ్యం కారణంగా జిడ్డు చర్మానికి నివారణగా కూడా పనిచేస్తుంది. యాంటీమైక్రోబయల్, యాంటిసెప్టిక్ ,యాంటీ ఫంగల్ ఏజెంట్ చర్మాన్ని చల్లబరుస్తుంది.గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందిశరీరంలోని అదనపు నీరు, సోడియంను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బరువు తగ్గాలంటే అంతేకాదు అధిక బరువుతో బాధపడే వారికి కొత్తిమీర నీరు మంచి వైద్యం అని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలోని పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు నియంత్రణలో సహాయ పడుతుంది. కొత్తిమీరలోని పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు కొవ్వును కరిగించడంలో సహాయ పడతాయి. థైరాయిడ్ సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది. కొత్తిమీర ఆకులు, కాండం యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. దీన్ని ఉదయాన్నే పరగడుపున తాగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. కొత్తిమీర గింజలలో ఉండే థైమోల్ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.జాగ్రత్తలుకొత్తిమీర, ధనియా వాటర్ రక్తపోటును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. లోబీపీ ఉన్నవారు అపమ్రత్తంగా ఉండాలి. దీనిని హైపోగ్లైసీమియా అని కూడా పిలుస్తారు. దీని వల్ల ఆందోళన, దడ, చెమట , ఆకలిలాంటి సమస్యలొస్తాయి. ఏదైనా మితంగా, వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. -
Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?
భారతీయ వంటల్లో కరివేపాకుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దీని వల్ల వంటలకు సువాసనను, రుచిని అందించడమే కాదు అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.ఉదయాన్నే శుభ్రమైన కరివేపాకును నమిలి తినవచ్చు. లేదా కరివేపాకు నీటిని తాగవచ్చు.కరివేపాకు డీటాక్స్ వాటర్ గ్లాసుడు నీళ్లలో కొంచెం కరివేపాకులు వేసి మరిగించాలి. అలాగే పుదీనా ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి కొన్ని నిమిషాలు మరిగించాలి. దీనికి కొద్దిగా తేనె లేదా, నిమ్మరసం కలపు కొని తాగవచ్చు.జీర్ణక్రియలో సహాయపడుతుందిఫైబర్ నిండిన కరివేపాకు జీర్ణవ్యవస్థకు మంచిది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. కరివేపాకు నీటిని ఉదయాన్నే మోతాదుగా తీసుకుంటే మంచిది.రక్తాన్ని శుద్ధి చేస్తుంది: కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్ లక్షణం శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేస్తుంది. ముఖ్యంగా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.జుట్టు పెరుగుదలకు గ్రేట్: జుట్టుకు సహాయపడే గుణాలకు ప్రసిద్ధి చెందిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఆరోగ్యానికి సాయపడుతుంది.చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది: యాంటీఆక్సిడెంట్లతో నిండిన కరివేపాకు చర్మానికి హాని కలిగించే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. అల్పాహారానికి ముందు క్రమం తప్పకుండా ఈ నీటిని తాగితే చర్మం ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. సహజమైన, ప్రకాశవంతమైన మెరుపు వస్తుంది.రోగనిరోధకశక్తికి బూస్టర్: కరివేపాకులో పోషకాలు ఎక్కువ. ఫైబర్ ఎక్కువ విటమిన్ సీ, ఇతర శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన కరివేపాకు సహజంగానే రోగనిరోధక శక్తి బూస్టర్‌లా పనిచేస్తుంది. కరివేపాకు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు , వ్యాధులకు వ్యతిరేకంగా శరీర శక్తి పెరుగుతుంది.చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది: కరివేపాకు గుండె ఆరోగ్యానికి చాలామంచిది. అవి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఖాళీ కడుపుతో తీసుకున్న కరివేపాకు నీళ్లతో గుండె సంబంధిత సమస్యలును నివారించుకోవచ్చు.బ్లడ్ షుగర్: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరం. హై పోగ్లైసీమిక్ లక్షణాలతో కూడిన కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థ వంతంగా సమతుల్యం చేస్తుంది.అధిక బరువు: ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి కానీ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే కరివేపాకును నమిలి తింటే అధిక బరువుతో బాధపడుతున్న వారికి దివ్య ఔషధంగా పని చేస్తుంది. కరివేపాకు వాటర్ ఆకలిని నియంత్రిస్తుంది. చెడు కొవ్వును కరిగిస్తుంది. నోట్: ఇది అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు డైటీషియన్ లేదా మీ వైద్యుడిని సంప్రదించండి. -
అరవింద్ కేజ్రీవాల్ మామిడి పండ్ల డైట్..షుగర్ పేషెంట్లకు మంచిదేనా..?
లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే డైట్లో మామిడిపండ్లు తీసుకోవడం, టీలో చక్కెర వేసుకోవడం వంటివి చేస్తున్నారని ఈడీ ఆరోపణలు చేసింది. అయితే కోర్టు ఇంటి నుంచి తీసుకొచ్చిన ఆహారం తినడానికి అనుమతించినందున మామిడిపండ్లు, స్వీట్లతో సహా ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. అయితే మధుమేహం ఉన్నవ్యక్తి ఇలాంటివి తింటారా అనేది ఈడీ వాదన, కానీ కేజ్రీవాల్ న్యాయవాది మాత్రం డాక్టర్ సూచించన ప్రకారమే ఇంటి నుంచి ఆహారం పంపిస్తున్నారని చెప్పారు. అయితే ఇక్కడ మామిడి పండు కారణంగా డయాబెటిస్ పేషెంట్లకు రక్తంలో చక్కెర స్థాయలు పెరుగుతాయా అంటే..? నిజానికి అరవింద్ కేజ్రీవాల్ టైప్2 డయాబెటిస్ పేషెంట్. ఆయనకు గత 30 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. తన చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటారని ఆయన తరుపు న్యాయవాది తెలిపారు. ఇక్కడ ఆయన డైట్లో మామిడిపండ్లు తీసుకుంటున్నారు. అందువల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయా? అసలు షుగర్ పేషెంట్లు తినోచ్చా అంటే.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో మామిడి పండు ఒకటి. ఇది అధిక చక్కెర కంటెంట్ తోపాటు ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్ సీ, ఫైబర్, కాపర్లు వంటివి పుష్కలంగా ఉంటాయి. దీనిలో ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. అయితే ఇందులో 90 శాతానికి పైగా కేలరీలు చక్కెర నుంచే వస్తాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిలు పెరగడానికి ఇది దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు డయాబెటిస్ ఉన్న వ్యక్తులు చక్కెర స్థాయిలను ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకోకూడదు. ముఖ్యంగా మామిడి, అరటి పండ్లు, సపోటా, వంటివి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయని యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎల్ సుదర్మన్ రెడ్డి అన్నారు. అయితే ఇందులో వివిధ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వాటి మొత్తం చక్కెర ప్రభావాన్ని తగ్గించడంలో పాత్ర పోషిస్తాయి. అందులో ఉండే ఫైబర్ శరీరంలోని రక్తం చక్కెరను గ్రహించే రేటుని తగ్గిస్తుంది. పైగా శరీరంలోని కార్బోహైడ్రేట్లు ప్రభావాన్ని తగ్గించి రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించేలా చేస్తుంది. అందువల్ల ఈ పండుని తీసుకుంటే షుగర్ పేషంట్లకు కూడా ఎలాంటి హాని ఉండదని తెలిపారు. అయితే దీని వల్ల మంచి ప్రయోజనాలు పొందేలా షుగర్ పేషెంట్లు ఎలా తీసుకుంటే మంచిదంటే.. మామిడి పండును డయాబెటిక్ ఫ్రెండ్లీగా మార్చే మార్గాలు.. ముందుగా డైట్‌ని అరకప్పు మామిడి కప్పులతో ప్రారంభించండి ఆ రోజు అధిక కార్బోహైడ్రేట్లు తీసుకోకూడదు. ప్రోటీన్లు తీసుకోవాలి. అందుకోసం గుడ్డు, కొన్ని రకాల తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. మామిడి పండ్లు అమితంగా ఇష్టం అనుకునేవారు ఆరోజు మంచిగా పండ్లు తింటూనే సరిపడ ప్రోటీన్ ఫైబర్ అందేలా ఫుడ్స్‌ని జోడిస్తే సరి. అప్పుడు మామిడిపండ్లు డయాబెటిస్ పేషెంట్లు తిన్నా ఏం కాదు. (చదవండి: 61 ఏళ్ల వయసులో 38 ఏళ్ల కుర్రాడిలా..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
నెస్లే సెరెలాక్ మంచిదేనా..? పరిశోధనలో షాకింగ్ విషయాలు!
ఇటీవలకాలంలో కొన్ని ప్రముఖ ఫుడ్ బ్రాండ్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో క్యాడ్బరీ చాక్లెట్లు, బోర్నావిటా వంటి ప్రొడక్ట్స్‌పై ఆరోపణలు వచ్చాయి. వాటిల్లో అధిక చక్కెర ఉందని ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు తెలిపారు. అవి మరువక మునుపై తాజాగా ప్రముఖ బేబి బ్రాండ్ నెస్లేపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రొడక్ట్స్‌పై జరిపిన అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏం జరిగిందంటే..నెస్లే బ్రాండ్‌కి సబంధించిన శిశువుల ప్రొడక్ట్స్ సెరెలాక్‌లో అధిక చక్కెర కలుపుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఒక్కో స్పూన్లో దాదాపు మూడు గ్రాములు చక్కెర ఉన్నట్లు పరిధనలో గుర్తించారు. ఇది అంతర్జాతీయ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు పబ్లిక్ ఐ, అంతర్జాతీయ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్స్ అనే పరిశోధన సంస్థలు పేర్కొన్నాయి. దీని కారణంగా ఊబకాయం, దీర్థకాలిక వ్యాధులు తలెత్తుతాయిని తెలిపింది. ఈ ఉల్లంఘనలు కేవలం ఆసియా, ఆఫ్రికన్ మరియు లాటిన్ అమెరికన్ దేశాలలో మాత్రమే జరుగుతున్నట్లు గుర్తించింది. నెస్లే ద్వారా అమ్ముడవుతున్న రెండు రకాల బేబీ ఫుడ్ బ్రాండ్స్‌లలో అధిక స్థాయిలో చక్కెర ఉన్నట్లు పబ్లిక్ ఐ వెల్లడించింది. అయితే యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నెస్లే ఉత్పత్తుల్లో చక్కెర రహితం ఉన్నాయని పబ్లిక్ ఐ తెలిపింది. భారత్‌లో ఇదే బ్రాండ్ మొత్తం 15 సెరెలాక్ బేబీ ప్రొడక్ట్స్‌లో ఒక్కో సర్వింగ్‌లో సగటున దాదాపు మూడ గ్రాములు చక్కెర ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే ఇథియోపియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఇదే బ్రాండ్ ప్రొడక్ట్స్‌లో ఏకంగా ఆరు గ్రాములు చక్కెర ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. మరీ జర్మనీ, యూకేలో మాత్రం చక్కెర జోడించకుండా విక్రయించడ గమనార్హం. నిజానికి ఈ నెస్లే ప్యాకేజింగ్‌పై షోషకాహార సమాచారంలో ఈ జోడించిన చక్కెర గురించి సమాచరం లేనట్లు నివేదిక పేర్కొంది. ఇది కేవలం తన ఉత్పత్తులపై విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాల గురించి ప్రముఖంగా హైలైట్ చేస్తుందని, పారదర్శకంగా లేదని నివేదిక వెల్లడించింది. నిపుణలు ఏం మంటున్నారంటే.. శిశువుల ఉత్పత్తుల్లో అధిక చక్కెర ప్రమాదకరమైనదని నిపుణలు చెబుతున్నారు. శివువులు, చిన్న పిల్లలకు అందించే ఆహారంలో చక్కెర ఎక్కువగా జోడించకూడదు. వాళ్లు ఈ రుచికి అలవాటు పడి చక్కెరకు సంబంధించిన ఆహారాలను తినేందుకు ఇష్టపడటం జరుగుతుంది. దీంతో క్రమంగా పోషకాహార రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. ఫలితంగా కౌమర దశకు చేరుకోక మునుపే ఊబకాయం, మధుమేహం లేదా రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారని నిపుణులు వెల్లడించారు. అయితే పరిశోధన సంస్థపబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్‌లు నెస్లే కంపెనీ దృష్టికి తీసుకువెళ్లగా..గత ఐదేళ్లలో, నెస్లే ఇండియా ప్రపంచవ్యాప్తంగా శిశు తృణధాన్యాల పోర్ట్‌ఫోలియోలో (పాలు తృణధాన్యాల ఆధారిత కాంప్లిమెంటరీ ఫుడ్) వేరియంట్‌ను బట్టి 30% వరకు చక్కెరలను జోడించడం తగ్గించింది అని చెబుతుండటం విశేషం. (చదవండి: ఎవరీ ప్రియంవదా నటరాజన్? ఏకంగా టైమ్ మ్యాగజైన్లో..!) -
జైల్లో బరువు తగ్గిన కేజ్రీవాల్:మధుమేహం కారణమా?
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ (రిమాండ్ ఖైదీ)లో భాగంగా తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆయన జైలులో ఉండటం వల్ల అస్వస్థతకు గురయ్యారని.. మార్చి 21న సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 4.5 కిలోల బరువు తగ్గారని జలవనరుల శాఖ మంత్రి ఆతీశీ అన్నారు ‘ఎక్స్ ’వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహం (డయాబెటిక్స్) వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి. అయితే ఆయనకు ఆరోగ్య సమ్యలు ఉన్నపటికీ దేశం కోసం 24 గంటలు పని చేసేవారిని ఆతీసీ అన్నారు. కానీ తీహార్ జైలు అధికారులు ఆ ఆరోపణలన్నింటిని కొట్టిపారేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, షుగర్ లెవెల్స్ కూడా తగ్గలేదని పేర్కొనడం గమనార్హం. అయితే ఇక్కడ మధుమేహ వ్యాధితో బాధపడేవారిలో రక్తంలోని చక్కెర స్థాయిల హెచ్చు తగ్గులు బరువు మీద ప్రభావం చూపిస్తాయా? అలాంటప్పుడు ఏం చేయాలి? తదితరాల విషయాలు గురించి సవివరంగా తెలుసుకుందాం!. ఇన్సులిన్ నిర్వహణ: ఒక వ్యక్తి మధుమేహంతో బాధపడుతున్నప్పుడు..వారి శరీరం ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయదు. పైగా ప్రతిస్పందించదు. దీని వల్లే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇబ్బందులకు దారితీస్తుంది. ఎప్పుడైతే శరీరం ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించలేకపోతుందో అప్పుడు రక్తప్రవాహంలో చక్కెర ప్రసరణకు దారితీస్తుంది. ఫలితంగా అదికాస్త కొవ్వుగా పేరుకుపోయి అధిక బరువుకి దారితీస్తుంది. కొందరూ బరువు ఎలా తగ్గిపోతారు.. రక్తంలోని చక్కెర స్థాయిలు మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోవడం జరుగుతుంది. ఇలా జరిగితే శరీరం ముఖ్యమైన శక్తి వనరులను కోల్పోతుంది. శక్తి కోసం గ్లూకోజ్‌ను సమర్థవంతంగా వినియోగిచదు. దీంతో శక్తికోసం శరీరం ఉన్న కొవ్వు నిల్వలను, కండరాలను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంద. దీంతో బరువు తగ్గడానికి కారణమవుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ టైప్ 1తో బాధపడేవారిలో ఈ పరిస్థితి ఎదురవ్వుతుంది. ద్రవాలను కోల్పోతుంది.. రక్తంలోని చక్కెర స్థాయిలలో హెచ్చు తగ్గులు డీ హైడ్రేషన్, నీటి నిలుపదలకు దారితీస్తుంది. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు కారణంగా మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్ వెళ్లపోతుండటంతో నిర్జలీకరణ దారితీసి, శరీర బరవును తాత్కలికంగా పెంచే రీహైడ్రేషన్కి గురై బరువు పెరిగే అవకాశం ఉంటుంది. జీవక్రియ ప్రభావం దీర్థకాలికి వ్యాధి అయిన బ్లడ్ షుగర్ ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఇక్కడ కణాలలోకి గ్లూకోజ్ పొందాలంటే శరీరానికి ఎక్కువ ఇన్సులిన్ అవసరమవుతుంది. ఈ అదనపు ఇన్సులిన్ కొవ్వు నిల్వకు దారితీస్తుంది. ముఖ్యంగా పొత్తి కడుపు ప్రాంతంలో బరువు పెరిగేందుకు దారితీస్తుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్యం. ఎందుకుంటే..? బరువు నిర్వహణకు ఇది అత్యంత ముఖ్యమైనది. అందువల్ల ఈ వ్యాధిగ్రస్తులు సరైన మందులు వాడుతూ..ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం వంటివి చేయాలి. అలాగే శారీర శ్రమ, రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా పర్యవేక్షించడం వంటివి చేస్తుంటే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతాం. బరువు కూడా అదుపులో ఉంటుంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. వ్యక్తిగత నిపుణులు, వైద్యులు సలహాలు సూచనలతో మధుమేహం వ్యాధిగ్రస్తులు ఎలాంటి జాగ్రత్తల తీసుకుని ఆచరిస్తే మంచిది అనేది తెలసుకోవడం ఉత్తమం. (చదవండి: మధుమేహాన్ని ఇలా నియంత్రించొచ్చా? ప్రూవ్ చేసిన ఫైనాన్షియల్ ఆఫీసర్) -
నో ఫ్యాట్, నో షుగర్.. మార్కెట్లోకి ‘నీలకంఠ’ ఆలూ!
మనం పలు రకాల బంగాళ దుంపలను(ఆలూ) చూసేవుంటాం. అయితే ఇప్పుడు తాజాగా నీలకంఠ ఆలూను మార్కెట్లోకి విడుదల చేశారు. పేరుకు తగినట్టుగానే ఇది నీలి రంగు బంగాళాదుంప. షుగర్ పేషెంట్లు కూడా నిరభ్యంతరంగా దీనిని తినొచ్చని చెబుతున్నారు. ఈ నీలకంఠ బంగాళాదుంప రకాన్ని బీహార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన రోహ్తాస్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ అభివృద్ధి చేసింది. సాధారణ బంగాళదుంపతో పోలిస్తే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ బంగాళదుంపలో అనేక సుగుణాలు ఉన్నాయని రోహ్తాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రతన్ కుమార్ తెలిపారు. దీనిలో అతి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పైగా ఈ నీలకంఠ ఆలూలో చక్కెర చాలా తక్కువ శాతంలో ఉంటుంది. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తెల్ల బంగాళదుంపల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీంతో షుగర్ పేషెంట్లు తెల్ల బంగాళాదుంపలను తినవద్దని వైద్యులు సూచిస్తుంటారు. ఎవరైనా నీలకంఠ బంగాళాదుంపలను సాగు చేయాలనుకుంటే రోహ్తాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం నుంచి విత్తనాలను ఆర్డర్ చేయవచ్చు. ఇతర విత్తనాలతో పోలిస్తే దీని విత్తనాలు కొంచెం ఖరీదైనవి. ఈ బంగాళదుంప వైరస్ రహితమని, ఈ బంగాళాదుంప మార్కెట్ విలువ అధికంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నో షుగర్ డైట్!అలా చేయడం మంచిదేనా?
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ భారీ బడ్జెట్ మూవీ 'షెహజాదా'తో ఘోర పరాజయాన్ని చవిచూశాడు. ఆ తర్వాత 'సత్యప్రేమ్‌కి కథ'తో ప్రేక్షకుల మన్ననలను పొంది నెమ్మది నెమ్మదిగా పరిశ్రమలో నిలదొక్కుకునే యత్నం చేశాడు. మళ్లీ అలానే మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని తహతహలాడుతున్నాడు. ఆ నేపథ్యంలోనే ప్రఖ్యాత దర్శకుడు కబీర్ ఖాన్ నిర్మిస్తున్న 'చందు ఛాంపియన్' మూవీతో మన ముందుకొస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. ఈ మూవీ షూటింగ్ ఒక ఏడాదికి పైగా పట్టింది. పగలు, రాత్రి అనక జరిగిన నిర్విరామ షూటింగ్లో హీరో ఆర్యన్ చక్కెర జోలికే పోలేదట. ఈ చిత్ర నిర్మాణం దాదాపు పూర్తి అవ్వడంతో దర్శకుడు కబీర్ సింగ్ ఇప్పుడైన నోరీ తీపి చేసుకోమంటూ రసమమలై తీసుకొచ్చి హీరో ఆర్యన్‌కి తినిపించాడు. ఈ మూవీ షూటింగ్ ఎంతలా విజయవంతంగా పూర్తి అయ్యిందో, అలానే ఈ మూవీ నీకు మంచి పేరు తెచ్చిపెడుతుందంటూ ఆర్యన్‌కి శుభాకాంక్షలు తెలిపాడు. ఆర్యన్ తన కొత్త సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు అంటే..దాదాపు ఏడాదికి పైగా చక్కెర లేని ఆహారమే తీసుకున్నాడు. పైగా చక్కెరకు బదులు తాను సహజ ఉత్పత్తుల తీసుకున్నట్లు కొన్ని రహస్యాలు బయటపెట్టాడు. ఆ హీరోలా చేస్తే శరీరంలో సంభవించే మార్పేలేంటి తదితరాల గురించి తెలుసుకుందామా!. ఒక ఏడాది పాటు ఆ హీరోలా చక్కెర లేని ఆహారం తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, ఎవ్వరైన దీన్ని ప్రయ్నతించవచ్చా?. ఈ డైట్ కారణంగా శరీరంలో ఎలా ప్రభావితమవ్వుతుంది, ఇది మంచిదేనా? అంటే..పూర్తిగా చక్కెరకు దూరంగా ఉండటం లేదా చక్కెర లేని ఆహారం తీసుకుంటే శరీరం అనేక సానుకూల మార్పులకు దారితీస్తుంది. మొదట్లో ఈ డైట్ పాటించటం కాస్త ఇబ్బందిగా అనిపించినా.. క్రమేణ మంచి ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్ సమ స్థాయిల్లో ఉండటం జరగుతుంది. తద్వారా మానసికోల్లాసం ఏర్పడి జీవక్రియ మెరుగుపడుతుంది. ఒబెసిటీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా మొటిమలు తగ్గి నిత్య యవ్వనంగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ డైట్ వల్లే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో సవివిరంగా చూద్దాం!. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది: ఒక టీస్పూన్ చక్కెరలో 20 కిలో కేలరీలు ఉంటాయి. కాబట్టి ఈ చక్కెరను పూర్తిగా దూరంగ పెట్టగలిగితే ఇన్సులిన్ సెన్సిటివిటీకీ సహాయపడుతుంది. టైప్ 2 డయబెటిస్ రాకుండా చేస్తుంది. ఒక రకంగా దంత ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కావిటీస్, చిగుళ్ల వ్యాధులు దరిచేరవు. ఎప్పుడైతే పరిమిత కేలరీలు తీసుకుంటామో అప్పుడూ ఆటోమెటిక్‌గా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది: చక్కెర వినియోగం ఎప్పుడైతే తగ్గిస్తామో.. ముందుగా మానసిక స్థితిలో మంచి మార్పులు వస్తాయి. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది తద్వారా మతిమరుపు వంటి బ్రెయిన్ సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. అలాగే బరువు కూడా అదుపులో ఉంటుంది. దీంతో మీలో ఆత్మవిశ్వాసం ఏర్పడి తెలియని మానసికోల్లాసం వస్తుంది. నిజం చెప్పాలంటే చక్కెర వినియోచటం మానేయడం వల్ల చాలావరకు పాజిటివ్ మార్పులే చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రారంభంలో పంచదార తీసుకోకపోతే నీరసంగా అనిపిస్తుంది. ఎలాగైతే ఆల్కహాల్ అకస్మాత్తుగా వదిలేస్తే సమస్యలు ఎదురవ్వుతాయో అలాంటి లక్షణాలే పంచాదర మానేసిన వారిలోనూ కనిపిస్తాయట. అంతేగాదు నీరసం తోపాటు మానసికంగా కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుందట. అయితే శరీరంలో మెటబాలిజం మాత్రం పెరుగుతందట. ఫలితంగా ఎలాంటి దీర్ఘాకాలిక వ్యాధులు దరిచేరవని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇక్కడ చక్కెరను తగ్గించడం అంటే దానికి బదులుగా బెల్లం లేదా కృత్రిమ స్వీటెనర్లతో భర్తీ చేయడం కాదు. చక్కెర, బెల్లం రెండూ సమాన కేలరీలను కలిగి ఉంటాయనే విషయం గుర్తించుకోవాలి. అందువల్ల మనం తీసుకునే స్వీట్లు, పానీయాలు, శక్తి పానీయాలు వంటి వాటిల్లోని షుగర్ కంటెంట్ దృష్టిలో ఉంచుకుని దూరంగా ఉంటేనే మంచింది. అలాగే ఈ నో షుగర్ డైట్‌ని ఫాలో అయ్యే మందు ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణుడిని సంప్రదించి వారి మార్గదర్శకంలో సరైన విధంగా ఈ డైట్‌ని ఫాలో అయ్యి సత్ఫలితాలను పొందడం మంచిది. ఏదీఏమైన చక్కెరను పరిమిత చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చనేది వాస్తవం. (చదవండి: ఆ వాటర్ ఫాల్ 'ఓ కన్నతల్లి గుండె కోత'! ఇప్పటికీ రాత్రిళ్లు అక్కడకు వెళ్తే హడలిపోవాల్సిందే!) -
షుగర్‌ని ఎంతలా స్వాహా చేసేస్తున్నామో తెలుసా?
షుగర్ లెస్‌గా తినడం దాదాసే అసాధ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులైన ఒక్కోసారి నోరు కట్టడి చేయడం కష్టంగా ఉంటుంది. స్వీట్ తినలేకపోతున్నామనే బాధను భర్తీ చేసేలా వాటి స్థానంలో ప్రాసెప్ చేసినవి కూడా వచ్చాయి. నిపుణులు అభిప్రాయం ప్రకారం వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండి, విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే ఈ రెండింటిలో ఏదీ బెటర్? పూర్తిగా షుగర్ వాడకాన్ని నియంత్రించొచచ్చా? ప్రపంచవ్యాప్తంగా గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు 176 మిలియన్ మెట్రిక్ టన్నుల చక్కెర వినియోగం అవుతుంది. ఈ ఏడాది కల్లా అది కాస్త ఏకంగా 180 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందనేది అంచనా. ప్రతీ వ్యక్తి రోజుకి 17 టీస్పూన్ల కంటే ఎక్కువ చక్కెర తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. నిజానికి పురుషులు తొమ్మిది టీస్పూన్లు, స్త్రీలు ఆరు టీస్పూన్ల చక్కెర వాడాలని సిపార్సు చేయగా, ప్రజలు మాత్రం దాన్ని మించే వినియోగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారికి ప్రాసెస్ చేసిన షుగర్ వాడోచ్చా అంటే?. నిపుణులు దానికంటే సహజ చక్కెర్లు ఉన్న పండ్లు పాలు తీసుకోవడమే ఉత్తమం అని చెబుతున్నారు. తేనె వంటి కొన్ని రకాల సిరప్లు మంచివే గానీ వాటిలో అదనపు చక్కెర్లు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వైద్యులు మాత్రం ఫ్రక్టోజ్, తేనె, బెల్లం వంటి వాటిల్లో తక్కువ గ్లైసెమిక్ ఉండి, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. అయినప్పటికీ వీటిని కూడా అతిగా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడమే గాక రక్తపోటు వంటి వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అలాగే తేనెలో యాంటీమైక్రోబయల్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. వీటన్నింటికంటే ఉత్తమమైన స్వీటెనర్ కేవలం సహజసిద్ధమైన పండ్లేనని, అవి తీసుకోవడమే మేలని చెబుతున్నారు. చక్కెరను పూర్తిగా తొలగించాలనుకోవడం కంటే ఇలా సహజసిద్ధమైన పండ్ల రూపంలో తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా నారింజ, ఆపిల్, పైనాపిల్, కివి వంటి పండ్లు మంచివని చెబుతున్నారు. అలాగే వీటి తోపాటు తృణధాన్యాలు కూడా ఆరోగ్యానికి మంచివి. ఇవి శరీరానికి కావాల్సిన మంచి చక్కెర్లను అందిస్తాయి. ఎలాంటి చక్కెర్లకు దూరంగా ఉండాలి సోడాలు, కూల్ డ్రింక్స్ వంటి జోలికి పోవకపోవడమే ఉత్తమం అని చెబుతున్నారు. ఎందుకంటే వాటిలో అధికంగా షుగర్ కంటెంట్ ఉంటుంది. ఇది కాలేయం ప్రభావం చూపించి ఇన్సులిన్ని ప్రభావితం చేస్తుంది. తగినంతగా నిద్రపోకపోతే ఆకలి అనే హార్మోన్‌పై ఎలాంటి ప్రభావం ఏర్పడదు లేదంటే తెలియకుండానే ఎక్కువ తినాలనే కోరిక కలుగుతుంది. దీంతో చక్కెర కలిగిన ఆ హరం తీసుకుంటారని చెబుతున్నారు నిపుణులు. నిద్రలేమి లెప్టిన్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో తినే సంతృప్తికి సంబంధించిన హార్మోన్, ఆకలితో సంబంధం ఉన్న గ్రెలిన్, అడిపోనెక్టిన్ల సాంద్రతను పెంచేస్తుంది. తత్ఫలితంగా స్వీట్ కంటెంట్‌కి సంబంధించినవి తినాలనిపిస్తుంది. నూనెలో డీప్ ఫ్రై చేసిన వాటికంటే కొద్ది ఆలివ్ నూనెతో ఓవెన్లో వేయించినవి తీసుకుంటే మేలని చెబుతన్నారు. ఇలా తీసుకుంటే సహజ చక్కెరలతో కూడిన పోషకాహారం శరీరానికి అందడమే గాక తినేందుకు కూడా రుచికరంగానూ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: బాదం పప్పులు మంచివని తినేస్తున్నారా? అధికంగా తీసుకుంటే డేంజరే!) -
చక్కెర ఉత్పత్తులపై 50 శాతం సుంకం.. కారణం తెలుసా..
ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో చెరకు నుంచి తీసే ఇథనాల్ ఉత్పత్తికి కీలకమైన మొలాసిస్‌పై ప్రభుత్వం 50 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. ఈ నిబంధనలు జనవరి 18 నుంచి అమలులోకి వచ్చాయి. దేశీయ డిస్టిలరీల కోసం మొలాసిస్‌ను అందుబాటులో ఉంచడం, పెట్రోల్, డీజిల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత సంవత్సరంలో పెట్రోల్‌లో 15 శాతం ఇథనాల్‌ను కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇథనాల్ మళ్లింపు లేకపోవడం వల్ల 2023-24 సీజన్లో (అక్టోబర్-సెప్టెంబర్) చక్కెర ఉత్పత్తి 37.3 మిలియన్ టన్నుల నుంచి 32.3-33 మిలియన్ టన్నులకు పడిపోయిందని ప్రభుత్వం తలిపింది. ఇదీ చదవండి: రూపాయి కంటే తక్కువ విలువైన కరెన్సీలు ఇవే.. వియత్నాం, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ ఫిలిప్పీన్స్‌తో సహా ఇతర దేశాలకు భారతదేశం మొలాసిస్‌ను ఎగుమతి చేస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు మొలాసిస్‌ను ఎగుమతి చేస్తున్నాయి. -
గోధుమలు, బియ్యం, చక్కెర ఎగుమతులపై మంత్రి కీలక వ్యాఖ్యలు
దేశంలో పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో గోధుమలు, భాస్మతియేతర బియ్యం, చక్కెర ఎగుమతులను నిషేధించింది. ఈ మేరకు గతంలోనే నోటిఫికేషన్ జారీచేసింది. అయితే, అప్పటికే గోధుమల ఎగుమతి కోసం జారీ చేసిన లెటర్స్ ఆఫ్ క్రెడిట్‌ను అనుసరిస్తామని ప్రభుత్వం చెప్పింది. కొవిడ్, వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ యుద్ధం వల్ల తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్న కొన్ని దేశాలకు గోధుమలను ఎగుమతి చేస్తామని గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని కేంద్ర ప్రకటించిన సంగతి తెలిసిందే. గోధుమలు, బియ్యం, చక్కెరపై ఎగుమతి ఆంక్షలు ఎత్తివేసే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తాజాగా వెల్లడించారు. గోధుమలు, చక్కెరను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం గానీ, అలాంటి ప్రణాళిక కూడా తమ వద్ద లేదని పేర్కొన్నారు. ఇదీ చదవండి: కోట్ల రూపాయలు కావాలా..? స్థలం ఎక్కడ కొనాలంటే.. 2022 మే నుంచి భారత్ గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 2023 జులై నుంచి బాస్మతియేతర బియ్యం, 2023 అక్టోబరు నుంచి చక్కెర ఎగుమతులపైనా నియంత్రణలు విధించింది. ఆహార భద్రతా అవసరాలు ఉన్న ఇండోనేషియా, సెనెగల్, గాంబియా తదితర మిత్ర దేశాలకు మాత్రం భారత్ బియ్యం పంపిస్తోందని మంత్రి చెప్పారు. -
'బిగ్ విన్'! ఒక్క వీడియో..ప్రముఖ ఫుడ్ కంపెనీని షేక్ చేసింది!
ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న ప్యాకేజింగ్ ఆహారా పదార్థాలు ఆయా కంపెనీలు లేబుల్ చేసినట్లు ఆరోగ్యకరమైనవి కావడం లేదు. మొదట్లో అడ్వర్టైస్మెంట్లతో ఊదరగొట్టి చివరికీ.. అవే ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు పెదవివిరవడం చూస్తూనే ఉన్నాం. అయినా అవేమీ వాటి తీరు మార్చుకోవు. మనం కూడా గత్యంతర లేకనో అలవాటు పడో గానీ అవే కొనేస్తున్నాం. కానీ ఇక్కడొక ఇన్స్టాగ్రాం వినియోగదారుడు ఒక్క వీడియోతో ప్రముఖ కంపెనీని షేక్ చేశాడు. దెబ్బకు దిగొచ్చి తీరు మార్చుకునేలా చేశాడు. వివరాల్లోకెల్తే..ఓ ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లుయెన్సర్ రేవంత్ హిమంత్ సింకా అకా ప్రముఖ క్యాడ్బరీ సంస్థకి చెందిన బోర్న్‌విటా చాక్లెట్స్, హెల్త్ డ్రింగ్లో చక్కెర కంటెంట్ అధికంగా ఉందని ప్రూవ్ చేశాడు. బోర్న్‌విటా ప్రతి వందగ్రాముల పొడిలో సుమారు 37.4 గ్రాముల చక్కెర ఉందని వాదించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది. ఇది నిజంగా ఆరోగ్యానికి హానికరమైనదని డయాబెటిస్ పేషెంట్లుగా మారుస్తుందని విమర్శలు చేశారు. పైగా ఆ కంపెనీ లెబుల్పై చెబుతున్నవన్నీ అబద్ధాలే అని ప్రజలను మాయం చేస్తుందంటూ ఫైర్ అయ్యారు. ఇందులో వాడే షుగర్ వల్ల డయాబెటిస్, ఉపయోగిస్తున్న ఫుడ్ కలర్స్ క్యాన్సర్‌కి దారితీస్తుందని చెప్పారు. తాను పోషకాహార నిపుణుడనని, ఆరోగ్య నిపుణుడిగా దీన్ని బల్లగుద్ది చెప్పగలనని అన్నారు. ఆ బ్రాండ్ టాగ్లైన్పై కూడా హిమంత్ సింకా విమర్శలు కురిపించారు. అయితే కంపెనీ తొలుత అవన్నీ అశాస్త్రీయమైనవంటూ కొట్టిపారేసింది. పైగా హిమంత్ సింకాకి లీగల్ నోటీసులు కూడా పంపించింది సదరు బోర్న్‌విటా కంపెనీ. అయితే హిమంత్ విడుదల చేసిన వీడియో అప్పటికీ నెట్టింట విస్తృతంగా వైరల్ అయ్యింది. Bournvita.. is it... I'm Shocked 😳😳😳😳 I am a victim from childhood #bournvita #childhood #victim #young #india pic.twitter.com/gmiI3tci4e — Prof Dr Shibu A (@shibu_prof) April 5, 2023 అదీగాక ఈ వీడియోని రాజకీయవేత్త పరేష్ రావల్, మాజీ క్రికెటర్, ఎంపీ కీర్తి ఆజాద్ కూడా షేర్ చేశారు. దీంతో ఎనిమిది మంది వైద్యులు, పోషకాహార నిపుణులతో కూడిన ప్రముఖ భారతీయ పోషకాహార సంస్థ హిమత్సింకా వీడియోలో చెప్పింది కచ్చితమైనదని ధృవీకరించింది. దెబ్బకు బోర్న్ విటా కంపెనీ దిగొచ్చి చక్కెర పరిమాణాన్ని సుమారు 14.4% మేర దిగొచ్చింది. చరిత్రలో తొలిసారి ఇలా విమర్శలు అందుకున్న వెంటనే ఓ కంపెనీ మార్పుకి నాంది పలికి షుగర్ కంటెంట్‌ని తగ్గించింది. దీంతో ఏ కంపెనీ తప్పుగా లేబుల్ చేస్తూ మార్కెట్ చేసే సాహసం చేయదని అన్నారు హిమంత్ సింకా. ఆరోగ్యకరమైన ఆహారం కోసం చేసిన పోరాటం ఇది, కేవలం బోర్న్ విటాకు వ్యతిరేకం కాదని అన్నారు. జంక్‌పుడ్ విక్రయించే ఏ కంపెనీకి అయినా తాను వ్యతిరేకంగా పోరాటం చేస్తా, ముఖ్యంగా దాని లేబుల్‌పై తప్పుడు ప్రచారం చేస్తే అస్సలు ఉపేక్షించనని అన్నారు. ఈ ఘటనతో ప్రతి కంపెనీ ప్యాకేజింగ్ ఫుడ్ విషయంలో తప్పక జాగ్రత్త పడుతుంది. ఇది మాములు విజయం కాదు 'బిగ్ విన్'. ఎందుకంటే? ఒక్క వీడియోతో కంపెనీ మూలాలే కదిలిపోయాలా చేశాడు హిమంత్ సింకా. View this post on Instagram A post shared by Revant Himatsingka (@foodpharmer) (చదవండి: పార్కిన్సన్స్ డిసీజ్ ప్రాణాంతక వ్యాధా? ఎలా నివారించాలి?) -
వ్యవసాయ ఎగుమతులకు ఆంక్షల దెబ్బ
న్యూఢిల్లీ: గోధుమలు, బాస్మతియేతర బియ్యం, చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ ఎగుమతులపై 4–5 బిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే, బాస్మతి, పండ్లు..కూరగాయలు, మాంసం..డెయిరీ మొదలైన వాటి ఎగుమతులు పెరుగుతుండటంతో కనీసం గత ఆర్థిక సంవత్సరం స్థాయినైనా నిలబెట్టుకోగలమని ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ, ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ దాడుల కారణంగా బాస్మతి బియ్యం ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకవేళ యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా మార్కెట్లకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తే వ్యయాల భారం 15–20 శాతం మేర పెరగొచ్చని సంబంధిత వర్గాలు తెలి పాయి. ‘‘పరిమితుల వల్ల వ్యవసాయ ఎగుమ తులపై 4–5 బిలియన్ డాలర్ల మేర ప్రభావం పడినా, మొత్తం మీద చూస్తే ఎగుమతులు గతేడాది స్థాయి లో ఉండొచ్చని అంచనా వేస్తున్నాం’’ అని పేర్కొన్నాయి. 2022–23లో వ్యవసాయ ఎగుమతులు 53.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. బాస్మతి టాప్.. భారత్ నుంచి ఎగుమతయ్యే వ్యవసాయోత్పత్తుల్లో బాస్మతి బియ్యం అగ్రస్థానంలో ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు ఈ ప్రీమియం వెరైటీ ఎగుమతులు 3 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో బాస్మతి బియ్యం ఎగుమతులు 15–20 శాతం అధికంగా ఉండొచ్చని ప్రభు త్వం అంచనా వేస్తోంది. మరోవైపు, ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ దాడుల కారణంగా బాస్మతి ఎగుమతులపై ఆందోళన నెలకొంది. దీంతో ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న రిసు్కలపై చర్చించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ విభాగం వారితో సమావేశమైంది. ఇప్పటివరకైతే దాడులపరంగా ఎలాంటి ప్రభావమూ లేదని, ఒకవేళ రిసు్కలు అలాగే కొనసాగిన పక్షంలో యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా మార్కెట్లకు చేరుకోవడానికి వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙంచాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘దీనితో వారి వ్యయాలు 15– 20% పెరగవచ్చు. అది ధరల్లోనూ ప్రతిఫలించే అవకాశం ఉంది’’ అని వివరించాయి. బాస్మతి బియ్యం ప్రీమియం ఉత్పత్తి కావడంతో ధర కొంత పెరిగినా డిమాండ్‌లో మార్పేమి ఉండకపోవచ్చని తెలిపాయి. -
తగ్గిన ‘తీపి’ ఉత్పత్తి..! కారణాలు ఇవే..
దేశవ్యాప్తంగా గతంలో నెలకొన్న ఎల్‌నినో, వర్షాల ప్రభావం చక్కెర(షుగర్) ఇండస్ట్రీపై పడింది. ప్రస్తుతం చక్కెర ఉత్పత్తి తగ్గుతోంది. ఈ ఏడాది అక్టోబర్ 1–డిసెంబర్ 15 మధ్య ఉత్పత్తి అయిన చక్కెర గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 11 శాతం తగ్గి 74.05 లక్షల టన్నులుగా రికార్డయ్యింది. గతేడాది ఇదే సమయంలో 82.05 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అయింది. సాధారణంగా షుగర్ మార్కెటింగ్ అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు గరిష్ఠంగా ఉంటుంది. గతేడాది ఉన్న 497 ఫ్యాక్టరీలు ఈ ఏడాదీ ఉత్పత్తి ప్రారంభించాయి. వీటిలో ఎటువంటి మార్పు లేదని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) పేర్కొంది. కానీ మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ఫ్యాక్టరీలు 10–15 రోజులు లేటుగా ప్రొడక్షన్ ప్రారంభించినట్లు వివరించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో చక్కెర ఉత్పత్తి అక్టోబర్ 1–డిసెంబర్ 15 మధ్య 22.11 లక్షల టన్నులుగా నమోదయ్యింది. గతేడాది మార్కెటింగ్ ఇయర్లో ఇదే సమయానికి 20.26 లక్షల టన్నుల చక్కెరను ఉత్పత్తి చేసింది. మహారాష్ట్రలో అయితే చక్కెర ఉత్పత్తి 33.02 లక్షల టన్నుల నుంచి 24.45 లక్షల టన్నులకు తగ్గింది. కర్ణాటకలో 19.20 లక్షల టన్నుల నుంచి 16.95 లక్షల టన్నులకు పడిపోయింది. చెరుకును చక్కర ఉత్పత్తితోపాటు ఇథనాల్ ప్రొడక్షన్‌కు వినియోగిస్తున్నారు. అయితే చెరుకును ఇథనాల్ కోసం వాడకపోతే ప్రస్తుత మార్కెటింగ్ ఇయర్లో 325 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని ఇస్మా అంచనా వేస్తోంది. ఇదీ చదవండి: వీటిని తెగవాడుతున్నారు..! దేశవ్యాప్తంగా డిస్టిలరీ ప్రాజెక్టులు ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం విస్తరణ ప్లాంట్లలో దాదాపు రూ.35,000 కోట్లు పెట్టుబడి పెట్టాయి. మరోవైపు ఎల్ నినో, వర్షాల ప్రభావంతో దేశవ్యాప్తంగా చెరుకు ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటకల్లో ఉత్పత్తిపై ప్రభావం పడినట్లు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్(ఎన్‌ఎఫ్‌సీఎస్‌ఎఫ్) తెలిపింది. దేశంలో చక్కెర ధరలను కంట్రోల్ చేసేందుకు సప్లయ్ సమస్యలు లేకుండా చూసేందుకు ప్రస్తుత మార్కెటింగ్ ఇయర్లో ప్రభుత్వం ఎగుమతులను నిలిపేసింది. -
కర్ణాటకనే దిక్కు! ‘ట్రైడెంట్’లో ఊసేలేని చెరకు క్రషింగ్..
సంగారెడ్డి: జహీరాబాద్‌లోని ‘ట్రైడెంట్’ యాజమాన్యం క్రషింగ్‌ను చేపట్టే పరిస్థితి కనిపించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు పక్క రాష్ట్రాలకు చెరకును తరలిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ప్రజా ప్రతినిధులు మర్చిపోవడంతో రైతాంగం వారిపై ఆశలు వదులుకొని తమ దారి తామే చూసుకుంటున్నారు. ఇప్పటికే పలు కర్మాగారాలతో ఒప్పందం సైతం చేసుకున్నారు. జహీరాబాద్ జోన్ పరిధిలో సుమారు 18 వేల ఎకరాల్లో చెరకు పంట సాగులో ఉంది. 7 లక్షల టన్నుల మేర చెరకు పంట ఉత్పత్తి కానుంది. ఇంత మొత్తంలో పంట జోన్ పరిధిలో ఉండడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు పక్కనే ఉన్న కర్ణాటకకు పంటను తరలిస్తున్నారు. కర్ణాటకలోని చించోళి, బరూర్, మన్నాక్కెల్లి, గాంధీ చక్కెర కర్మాగారాలకు పంటను పంపిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, యాజమాన్యంపై ఆశలు వదులుకొని ఇప్పటికే జోన్ పరిధిలో సాగులో ఉన్న దాంట్లో 8 వేల ఎకరాల పంటను పక్కనే ఉన్న కర్ణాటకలోని చించోళి యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. జోన్ పరిధిలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాల్లో రైతులు చెరకు పంటను విస్తారంగా సాగు చేసుకున్నారు. కర్ణాటకలోని యాజమాన్యాలు టన్నుకు ధర రూ.2,650 మేర చెల్లించి, చెరకు కోత, రవాణా ఖర్చులను వారే భరిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. రూ.9 కోట్ల మేర బకాయి.. ‘ట్రైడెంట్’ కర్మాగారంలో 2022–23 క్రషింగ్ సీజన్‌కు గాను 2.55 లక్షల టన్నుల చెరకును గాను గాడించింది. టన్నుకు రూ.3,270 ధర నిర్ణయించింది. మొదటి విడత కింద టన్నుకు రూ.3 వేల వంతున చెల్లిస్తూ వచ్చింది. మిగితా రూ.270 పెండింగ్ పెట్టింది. జనవరి నెలాఖరు, ఫిబ్రవరి మాసంలో చెరకును సరఫరా చేసిన రైతులకు మాత్రం పూర్తిస్థాయిలో బిల్లులు పడ్డాయి. జోన్ పరిధిలో ఉన్న మొత్తం 2,287 మంది రైతులు కర్మాగారానికి చెరకును సరఫరా చేశారు. ఇందులో 1,699 మంది రైతులకు టన్నుకు రూ.270 వంతున బకాయి పడింది. మిగిలిన రైతులకు పూర్తిస్థాయిలో బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. రూ.83 కోట్లకు గాను రైతాంగానికి ఇప్పటి వరకు రూ.74 కోట్ల మేర చెల్లించారు. ఇంకా రూ.9 కోట్ల మేర బకాయిలను చెల్లించాల్సి ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఇచ్చిన హామీని మరిచిన నేతలు! ఎన్నికల సందర్భంగా కర్మాగారంలో క్రషింగ్‌ను చేపట్టేలా చర్యలు తీసుకుంటామని, మొత్తం చెరకు బకాయిలు ఇప్పిస్తామని రైతులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చి మర్చిపోయారని రైతులు వాపోతున్నారు. పలు సమావేశాల్లో ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, నియోజకవర్గం బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి దేవిప్రసాద్ హామీ ఇచ్చారని రైతులు పేర్కొంటున్నారు. అవసరం అయితే తమ ఆస్తులను అమ్మి బకాయిలు చెల్లిస్తామని మాట ఇచ్చారని, వారు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలోనే క్రషింగ్ జరిపేలా చూస్తామని చెప్పినట్లు గుర్తు చేస్తున్నారు. అధికారులు హామీ ఇచ్చి.. ఎన్నికల ప్రచారం నిమిత్తం నవంబర్ 23వ తేదీన జహీరాబాద్‌కు అప్పటి సీఎం కేసీఆర్ ప్రచారం నిమిత్తం వస్తుండడంతో సభను అడ్డుకునేందుకు రైతులంతా తీర్మానించారు. డిసెంబర్ మొదటి వారంలో బకాయిలను ఇప్పించడంతోపాటు క్రషింగ్‌ను జరిపిస్తామని ఎమ్మెల్యే మాణిక్‌రావు, కేన్, పోలీసు అధికారులు హామీ ఇచ్చి తమ ఆందోళనను విరమింపజేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఎవరూ పట్టించుకోవడం లేదు. – కొండల్‌రెడ్డి, రైతుసంఘం నాయకుడు, జహీరాబాద్ ఇవి చదవండి: వలస.. ఏదీ భరోసా? -
ఇథనాల్ తయారీలో చెరకు రసం వినియోగంపై నిషేధం
న్యూఢిల్లీ: ఇథనాల్ ఉత్పత్తిలో చెరకు రసం, షుగర్ సిరప్‌ల వినియోగాన్ని నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే ప్రారంభమైన 2023–24 సరఫరా సంవత్సరానికి (డిసెంబర్–నవంబర్ మధ్య కాలం) ఇది వర్తిస్తుంది. దేశీయంగా వినియోగానికి తగినంత స్థాయిలో చక్కెర నిల్వలు ఉండేలా చూసేందుకు, అలాగే ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇథనాల్ ఉత్పత్తి కోసం ’బి–మొలాసిస్’ను వినియోగించడానికి అనుమతించింది. చక్కెర పరిశ్రమ దీన్ని స్వాగతించింది. అయితే ప్రత్యేకంగా చెరకు రసం, షుగర్ సిరప్‌ల ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి యూనిట్లు పని చేయకపోతే అవి ఖాయిలా పడే అవకాశం ఉందని పేర్కొంది. 2023–24 మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్–సెప్టెంబర్) చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) అంచనాల ప్రకారం 2023–24 మార్కెటింగ్ సంవత్సరంలో స్థూలంగా చక్కెర ఉత్పత్తి 9 శాతం తగ్గి 337 లక్షల టన్నులకు పరిమితం కానుంది. 2022–23 మార్కెటింగ్ సంవత్సరంలో భారత్ 61 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. అంతక్రితం ఏడాది రికార్డు స్థాయిలో 112 లక్షల టన్నుల చక్కెర ఎగుమతైంది. ధరలను అదుపులో ఉంచే ఉద్దేశంతో ఈ మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఎగుమతులకు కేంద్రం అనుమతించలేదు. -
ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా? షుగర్ వ్యాధి వస్తుందట
ఉప్పు ఎక్కువగా వాడితే రక్తపోటు(బీపీ)వస్తుందనే ఇప్పటి వరకు విన్నాం. కానీ ఉప్పు వల్ల మధుమేహం కూడా వస్తుందని మీకు తెలుసా? లండన్‌కు చెందిన సైంటిస్టులు తాజాగా జరిపిన రీసెర్చ్‌లో ఈ విషయం వెల్లడైంది. మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటే మధుమేహం వస్తుందని పరిశోధకులు తేల్చిచెప్పారు. మరి రోజువారి మొత్తంలో ఎంత మేరకు ఉప్పు తీసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో చూసేద్దాం. ఉప్పు లేకుండా వంట చేయడం దాదాపు అసాధ్యం. ఏ వంట చేయాలన్నా ఉప్పు తప్పనిసరి. చాలామంది కూర చప్పగా ఉందనో, రుచి కోసమో మోతాదుకు మించి ఉప్పు వాడేస్తుంటారు. ఊరగాయ పచ్చళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బోలెడంత ఉప్పు ఉంటుంది అందులో. అయితే ఇలా అవసరానికి మించి ఉప్పు తినడం వల్ల రక్తపోటు వస్తుందనే ఇప్పటి వరకు మనకు తెలుసు. కానీ తాజాగా ఉప్పు వల్ల మధుమేహం కూడా వస్తుందని పరిశోధకులు తెలిపారు. అధిక ఉప్పు వాడటం వల్ల టైప్-2 డయాబెటిస్ వస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. యూకేలోని 'తులనే' యూనివర్సిటీ నిర్వహించిన రీసెర్చ్‌లో ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 12 ఏళ్ల పాటు 13 వేల మందిపై జరిపిన అధ్యయనంలో.. మోతాదుకు మించి ఉప్పు వాడే వారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే రిస్క్ అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉప్పు తక్కువ తీసుకునే వారితో పోలిస్తే, ఎక్కువగా కొన్నిసార్లు తీసుకునే వ్యక్తుల్లో 13 శాతం, సాధారణంగా తీసుకునే వారిలో 20 శాతం, ఎల్లప్పుడూ తీసుకునే వారిలో 39 శాతం టైప్ 2 డయాబెటిస్ వచ్చినట్లుగా అధ్యయనంలో వెల్లడైంది. ఉప్పు తక్కువగా తీసుకుంటే బీపీ మాత్రమే కాదు, మధుమేహం వచ్చే ఛాన్స్ కూడా తగ్గించుకోవచ్చని సైంటిస్టులు తెలిపారు. కొంతమంది ఆహారం తీసుకొనేటప్పుడు టేబుల్ సాల్ట్ వాడతారని దీని వల్ల టైప్ 2 మధుమేహం 40 శాతం పెరిగే అవకాశం ఉందని కొత్త పరిశోధనలో తేలిందని తులనే యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. రోజుకు రెండు టీ స్పూన్ల ఉప్పుును తీసుకునే వారిలో డయాబెటిస్ ముప్పుు ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఉప్పుతో డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే మాత్రం రోజు 1500 మి. గ్రా లకు మించి ఉప్పు వాడరాదని నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు బీపీ, షుగర్ సహా గుండె సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. -
షుగర్ ఉందని స్వీట్స్‌కి దూరంగా ఉండాల్సిన పనిలేదు, ఎందుకంటే..
మనలో స్వీట్స్ అంటే ఇష్టం లేనివారు ఉండరేమో. కానీ మారుతున్న జీవనశైలికి అనుగుణంగా దేశంలోనే కాదు ప్రపంచంలో మధుమేహ రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతుంది. దీంతో కృత్రిమ స్వీటెనర్ వాడకం కూడా పెరిగింది. చక్కెరకి ప్రత్యామ్నాయంగా వీటి వినియోగం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. అయితే షుగర్ బదులు షుగర్-ఫ్రీ స్వీటెనర్స్ వాడడం వల్ల కేలొరీలు తగ్గుతాయి. సహజ ఉత్పత్తుల నుంచి తయారుచేసిన స్వీటెనర్స్ వాడడం వల్ల ఆహారంలో కేలొరీలు తగ్గుతాయి. దీని వల్ల బరువు అదుపులో ఉండటమే కాకుండా మధుమేహం, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఉదాహరణకి స్టెవియా ఆధారిత స్వీటెనర్లు ఒక మొక్క ఆకుల నుంచి తయారు చేస్తారు. ఈ మధ్యకాలంలో అలాంటి అల్లులోజ్ వాడకం బాగా పెరిగింది. అల్లులోజ్ను D-psicose అని కూడా పిలుస్తారు.ఇది 70% తీపిగా ఉన్న ఫీలింగ్ కలిగినప్పటికీ ఇందులో కేవలం 10% మాత్రమే కేలరీలను కలిగి ఉంటుంది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలని మెరుగుపరుస్తుంది. అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నా నాణ్యత విషయంలో పేలవంగా ఉందని కెనడా సహా మరికొన్ని దేశాల్లో అల్లులోజ్ వాడకంపై బ్యాన్ విధించారు. అయితే ఇప్పుడు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, డేవిస్ (UC డేవిస్) సైంటిస్టులు అల్లులోజ్ క్వాలిటీపై జరిపిన పరీక్షల్లో ముఖ్యమైన పరోగతిని సాధించారు. అల్లులోజ్ చక్కెరకు గొప్ప ప్రత్యామ్నాయమని సైంటిస్టులు తెలిపారు. ఎందుకంటే ఇది గోధుమలు,అత్తిపండ్లు, ఎండుద్రాక్ష వంటి కొన్ని మొక్కలతో తయారుచేశారు. ఇందులో ఒక గ్రాములో కేవలం 0.4 కేలరీలు మాత్రమే కలిగి ఉంటుంది, సుక్రోజ్‌లో గ్రాముకు నాలుగు కేలరీలు ఉంటాయి. అల్లులోజ్ను తిన్న తర్వాత 70% జీర్ణం అవగా, మిగతాది కేవలం 24గంటల వ్యవధిలోనే యూరిన్ ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి అల్లులోజ్ రక్తంలో గ్లూకోజ్ లేదా ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేయదని పేర్కొన్నారు. -
రైస్ వల్ల షుగర్ లెవల్స్ పెరగవు!.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
రైస్ అధికంగా తినడం వల్లే బరువు పెరుగుతామని, అలాగే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిపోతాయని చాలామంది అనుకుంటారు. అందుకే రైస్‌ని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తారు కూడా. కొందరు రాత్రి సమయంలో చపాతీలు, పుల్కాలు, సూప్‌లతో సరిపెట్టేస్తారు. అదేం అవసరం లేదంటున్నారు న్యూటిషియన్లు. దీనిపై అధ్యయనం చేసిన యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూటిషియన్లు కూడా రైస్‌ను హాయిగా తినొచ్చని అంటున్నారు. అదంతా కేవలం అపోహే అని తేల్చి చెబుతున్నారు. ఆ రైస్‌కి తాము చెప్పిన వాటిని జోడించి తింటే ఆ భయాలు కూడా ఉండవని నొక్కి చెబుతున్నారు. ఐతే మధుమేహం వ్యాధి గ్రస్తులు కూడా రైస్‌ని రెండుపూట్ల హయిగా తినేయొచ్చ? తదితరాల గురించే ఈ కథనం.! రైస్‌లో అత్యంత సాధారణ కార్బోహైడ్రేట్ ఉంటుందని అంటున్నారు ప్రముఖ న్యూటిషియన్ పూర్ణిమ. ఆహారంలో రైస్ ఎక్కువుగా తీసుకుంటే బరువు పెరుగుతామన్న భయంతో కొద్దికొద్దిగానే తింటూ బాధపడుతుంటారు. కానీ అది నిజం కాదని చెబుతున్నారు న్యూటిషియన్ పూర్ణిమ. ఇది బరువు తగ్గడంలోనూ, చక్కెర స్థాయిలను నిర్వహించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుందంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఈ మేరకు పూర్ణిమ యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ అధ్యయనంలో కనుగొన్న ఆసక్తికర విషయాలు ఏంటంటే... ఎలా తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయంటే.. తెల్లటి అన్నంలో వంద శాతం గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అదే రైస్‌కి వెనిగర్ కలిపి వండుకుంటే గ్లూకోజ్ స్థాయిలు పెరుతాయన్న భయమే ఉండదు. బియ్యానికి వెనిగర్‌ని జోడించడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రభావం గణనీయంగా తగ్గిపోతుంది. అలాగే రైస్‌కి పాలు చేర్చడం వల్ల మంచి ప్రోటీన్ లభిస్తుంది. ఆటోమెటిక్‌గా గ్లైసెమిడ్ ఇండెక్స్ తగ్గుతుందని సోయాబీన్ లేదా సోయాబీన్ ఉత్పత్తులతో కూడిన బియ్యంలో కూడా గ్లైసెమిక సూచిక తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. నిమ్మరసాన్ని జోడించడం వల్ల కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రభావం గణనీయంగా 40 శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. నిమ్మరసంతో అన్నం తినడం వల్ల ఎక్కువుగా తిన్న అనుభూతి కలుగుతుంది. అందువల్ల తెలియకుండానే ఈజీగా బరువు కూడా తగ్గుతాం పులియబెట్టిన పదార్థాలను రైస్‌కి జోడించడం వల్ల కూడా గ్లూకోజ్ స్థాయిలు తక్కువుగానే ఉంటాయి. ఉదాహరణకు కొబుచా, సౌర్‌క్రాట్, కిమ్చి, మిసో, పెరుగు తదితరాలు ప్రేగులకు మంచిది. ఎసిటిక్ యాసిడ్‌తో కలిగిన పదార్థాలు లేదా వెనిగర్ ఆధారిత పదార్థాలు, పచ్చళ్లు, సాస్‌లు, ఆవాలు, సలాడ్లు(మిక్సిడ్ కూరగాయాలు) తదితరాలు అన్నానికి జోడించి తీసుకుంటే మంచిది. ఇది కుదరనట్లయితే రైస్‌లో ఏదో రకంగా నిమ్మరసం జోడించి తీసుకోవడం మంచి ఆప్షన్ని అని న్యూట్రిషియన్ పూర్ణిమ చెబతున్నారు. ఇలా తీసుకుంటుంటే బరువు తగ్గడమే గాక రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించగలం అంటున్నారు న్యూట్రిషియన్ పూర్ణిమ. అందుకు సంబంధించిన వీడియోని కూడా నెట్టింట షేర్ చేశారు. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Poornima Peri (@poornimahormonecoach) (చదవండి: రాత్రిళ్లు అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా? బీ కేర్‌ఫుల్ అంటున్న వైద్యులు!) -
మాటలతోనే మధుమేహాన్ని పట్టేస్తుంది!
మీరు మధుమేహం బారిన పడ్డారో లేదో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? కానీ... దూరంగా ఉండే డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవడం ఇష్టం లేదా? ఇంట్లోకి వచ్చి రక్త నమూనాలు సేకరించినా వద్దని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఓ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుని ఓ పదిసెకన్లపాటు మాట్లాడితే మీకు డయాబిటీస్ ఉన్నదీ లేనిది స్పష్టమైపోతుంది అంటున్నారు క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు. మన మాటకూ మధుమేహానికీ సంబంధం ఏమిటనేదేనా మీ ప్రశ్న.. అయితే చదివేయండి! మారిన జీవనశైలి, ఆహారపు అలావాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి అనేక కారణాలతో ప్రపంచంలో ఏటికేడాదీ మధుమేహ బాధితులు పెరిగిపోతున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా భారతదేశం టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాజధానిగా మారిపోయిందన్న వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాధిని వీలైనంత తొందరగా, సులువుగా గుర్తించేందుకు తగిన పరీక్షలు అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ బయోటెక్ కంపెనీ క్లిక్ ల్యాబ్ వీటిల్లో ఒకటి. ఈ సంస్థ శాస్త్రవేత్తలు కొందరు ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించి కేవలం వాయిస్ రికార్డింగ్ ద్వారా మాత్రమే మధుమేహం సోకిన వారిని గుర్తించవచ్చునని నిర్ధారించారు. అధ్యయనంలో భాగంగా క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు 267 మందిని ఎంచుకున్నారు. వీరిలో 192 మంది వ్యాధి సోకనివారు. మిగిలిన 75 మంది మధుమేహంతో బాధపడుతున్న వారు. వీరందరి స్మార్ట్ఫోన్లలో శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన ఒక అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేశారు. అధ్యయనంలో పాల్గొన్న వారు ఈ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి కొన్ని నిర్దిష్ట పదాలతో కూడిన వాక్యాన్ని రోజుకు ఆరుసార్లు రికార్డు చేయమని కోరారు. మాట్లాడే వేగాన్ని బట్టి ఈ ఆడియో రికార్డింగ్ ఆరు నుంచి పది సెకన్ల నిడివి మాత్రమే ఉంటుంది. సూక్ష్మస్థాయి తేడాలు... ఈ పద్ధతిలో శాస్త్రవేత్తలకు మొత్తం 18465 రికార్డింగ్‌లు లభించాయి. స్థాయి, తీవ్రత వంటి 14 ధ్వని సంబంధిత అంశాలను విశ్లేషించి చూసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. మధుమేహ రోగుల రికార్డింగ్‌లలో సాధారణ పరిస్థితుల్లో మనం అస్సలు వినలేని సూక్ష్మస్థాయి తేడాలున్నట్లు స్పష్టమైంది. ప్రత్యేకమైన సిగ్నల్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ మాత్రమే వీటిని గుర్తించగలదన్నమాట. మధుమేహులు, ఇతరుల మధ్య ఉన్న తేడాలు చాలా సుస్పష్టంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మధుమేహం బారిన పడ్డ వారి స్వరంలో సూక్ష్మమైన తేడాలు వస్తాయని ఈ అధ్యయనం చెబుతోంది. కృత్రిమ మేధను జోడించారు... క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనం ద్వారా తెలుసుకున్న విషయాలకు కృత్రిమ మేధను జోడించడంతో ఫలితాలు మరింత కచ్చితత్వంతో రావడం మొదలైంది. వ్యక్తి వయసు, పురుషుడా? మహిళనా? ఎత్తు?, బరువు? వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని స్వరాన్ని విశ్లేషించేందుకు రూపొందించిన కృత్రిమమేధ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించినప్పుడు మహిళల్లో టైప్-2 వ్యాధిని 89 శాతం కచ్చితంగా గుర్తించినట్లు తెలిసింది. పురుషుల విషయంలో ఈ కచ్చితత్వం 86 శాతం మాత్రమే. టెక్నాలజీకి మరింత పదును పెడితే కచ్చితత్వం కూడా పెరుగుతుందని, పైగా ప్రస్తుతం పరగడపున నిర్వహిస్తున్న ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్‌ల కచ్చితత్వం 85 శాతం మాత్రమేనని శాస్త్రవేత్తలు వివరించారు. సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ పరీక్షలు కూడా 91 శాతం, 92 శాతం కచ్చితత్వంతో కూడిన ఫలితాలను మాత్రమే ఇస్తున్నట్లు క్లిక్ ల్యాబ్స్ శాస్త్రవేత్త జేసీ కాఫ్మాన్ తెలిపారు. స్వరం ద్వారా మధుమేహాన్ని గుర్తించే పద్ధతిని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు మరిన్ని పరీక్షలు చేపడుతున్నామని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా మధుమేహ పరీక్షలకు ప్రస్తుతం అవుతున్న వ్యయప్రయాసలను గణనీయంగా తగ్గించవచ్చునని అభిప్రాయపడ్డారు. పరిశోధన వివరాలు మేయో క్లినిక్ ప్రొసీడింగ్స్: డిజిటల్ హెల్త్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
షుగర్ ఉంటే పెడిక్యూర్ చేయించుకోవచ్చా? లేదంటే..
షుగర్ ఉన్నవాళ్లు కళ్లు దగ్గర నుంచి కాళ్ల వరకు ప్రతి అవయవాన్ని కాపాడుకోవాల్సిందే. మధుమేహం అందరికీ కామన్ వ్యాధిలా అనిపించినా అదొక సైలెంట్ కిల్లర్. నెమ్మదిగా అవయవాలన్నింటిని బలహీనం చేసి చావు అంచులదాక తీసుకువెళ్లే భయానక వ్యాధి. సకాలంలో మందులు వేసుకుంటూ జాగురుకతతో వ్యవహరించకపోతే అంతే సంగతి. ఇప్పుడూ షుగర్ వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తోంది. ఇలా మధుమేహంతో బాధపడేవాళ్లు పార్లర్‌కి వెళ్లి పాదాలకు పెడిక్యూర్ వంటివి చేయించుకోవద్దని స్ట్రాంగ్‌గా హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మధుమేహగ్రస్తులు ప్రతి అవయవాన్ని చాలా సున్నితంగా చూసుకోవాల్సిందే. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు సమంగా ఉండాలి. కళ్లు, మూత్రపిండాలు, గుండె మీద ఎలాంటి ప్రభావం పడకుండా ఎప్పటికప్పుడూ చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధిగ్రస్తుల పాదాల్లో నరాలు సున్నితంగా ఉంటాయి. ముఖ్యంగా పాదాలకు ఎలాంటి గాయాలు కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పైగా చాలామందికి పాదాల్లో తిమ్మిర్లు, స్పర్శ లేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి వీళ్లు పార్లర్‌కి వెళ్లి పాదాలకు సంబంధించిన పెడిక్యూర్ వంటివి చేయించుకోకూడదు. ఎందుకంటే? వాళ్లు పాదాలల్లో ఉన్న డెడ్ స్కిన్‌ని తొలగించడం వంటివి చేస్తారు. ఇది మరింత ప్రమాదం. వాళ్లు చేసే మసాజ్ కారణంగా నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మాములు వ్యక్తులకు ఏం కాదు. కానీ ఘుగర్ ఉన్నవాళ్లకి అరికాళ్ల వద్ద చర్మ పలుచబడిపోతుంది. కాబట్టి పార్లర్ లేదా సెలూన్లో పాదాలకు సంబందించిన మసాజ్‌లు కాస్త ప్రమాదమే. ఎందుకు పెడక్యూర్ వద్దు..? డయాబెటిస్ స్టేజ్‌ల రీత్యా వారు ఈ పెడిక్యూర్ చేయించుకుంటే అరికాళ్లలోని స్కిన్‌ని తొలగించడం కారణంగా గాయాలుగా మారే అవకాశం ఉంటుంది. అదే ఒక వేళ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉంటే గాయం అయినా కూడా తెలియదు. మరింత పెద్దిగా మారి ప్రాణాంతకంగా మారవచ్చు. నిజానికి మసాజ్ చేసినప్పుడూ రక్తప్రసరణ జరిగి చేయించుకన్న అనుభూతి, రిలీఫ్ ఉంటాయి. మధుమేహం ఎక్కువగా ఉంటే ఏం చేసినా అంతగా తెలియదు. పెడిక్యూర్‌లో భాగంగా గోళ్లు కత్తిరంచడం లేదా క్లీన్ చేయడం జరుగుతుంది. ఒకరికి ఉపయోగించిన సాధనాలను అపరిశుభ్రంగా వాడితే అది ఇన్ఫెక్షన్లకు దారితీయొచ్చు. మధుమేహగ్రస్తులు పాదాలకు సంబంధించిన చికిత్సలు ఆర్థోపెడిస్ట్ నిపుణుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఇలా సెలూన్ లేదా బ్యూటీపార్లర్‌లో చేయించుకుంటే మాత్రం ఇన్ఫెక్షన్ల బారిన పడటమే కాకుండా మరింతగ ఆయా ప్రాంతాల్లో స్పర్శ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. (చదవండి: మానసిక అనారోగ్యమే అని లైట్ తీసుకోవద్దు! బీ కేర్ ఫుల్! లేదంటే..) -
ప్రెగ్నెన్సీలో వచ్చిన బీపీ,షుగర్.. డెలీవరీ తర్వాత తగ్గుతాయా?
ప్రెగ్నెన్సీ టైమ్‌లో వచ్చిన బీపీ, షుగర్.. డెలివరీ తర్వాత తగ్గుతాయా? నాకు ఇప్పుడు ఆరో నెల. బీపీ, షుగర్ రెండూ వచ్చాయి. అందుకే భయంగా ఉంది. – ఎన్. శ్రీలీల, చెన్నై ప్రెగ్నెన్సీలో అధికంగా బరువు పెరిగినా, పోషకాహారం.. జీవన శైలి సరిగ్గా లేకపోయినా హార్మోన్స్, వయసు కారణంతో ఈరోజుల్లో చాలామంది గర్భిణీలకు ఆరవ నెల, ఏడవ నెల నుంచి బీపీ, సుగర్లు వస్తున్నాయి. దీనిని జెస్టేషనల్ హైపర్‌టెన్షన్, జెస్టేషనల్ డయాబెటిస్ (జీడీఎమ్)అంటాం. డెలివరీ అయిన ఆరువారాలకు జీడీఎమ్ నార్మల్ లెవెల్‌కి వస్తుంది. అందుకే డెలివరీ అయిన ఆరువారాలకు ఓజీటీటీ అనే టెస్ట్ చేస్తారు. ఇది నార్మల్‌గా ఉంటే తర్వాత డయాబెటిక్ కేర్ అవసరం లేదు. కానీ సంవత్సరానికి ఒకసారి హెచ్‌బీఏ1సీ / ఎఫ్బీఎస్ టెస్ట్‌ను చేయించుకుంటూ ఫాలో అప్‌లో ఉండాలి. జీడీఎమ్ ఉన్నవారిలో తర్వాత టైప్ 2 డయాబెటిస్ రావడానికి 40 శాతం ఎక్కువ చాన్సెస్ ఉంటాయి. బీఎమ్ఐ 30 కన్నా ఎక్కువ ఉన్నా.. మీకు ఆరవ నెలలోపు జీడీఎమ్ వచ్చినా.. కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా.. డెలివరీ తరువాత అయిదేళ్లలోపు మీకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే చాన్స్ ఉంటుంది. అందుకే డెలివరీ తరువాత క్రమం తప్పకుండా ఫాలో అప్‌లో ఉండాలి. చక్కటి డైట్ కూడా ఫాలో కావాలి. - డా.భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
ఉదయాన్నే పరగడుపున ఖర్జూరాలు తింటున్నారా?దీనిలోని బి6..
తియ్యగా తగ్గించుకోండి పంచదారకు బదులు అనేక స్వీట్ల తయారీలో కర్జూరాలను వాడుతుంటాము. స్వీట్‌గా ఉండే ఈ ఖర్జూరాల్లో అనేక ఆరోగ్య సుగుణాలు ఉన్నాయి. డేట్స్ తింటూ పొట్ట తగ్గించుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం... ►బరువు తగ్గాలంటే ఉదయాన్నే పరగడుపున ఖర్జూరాలు తినాలి. ఉదయాన్నే క్యాలరీలు ఎక్కువగా ఉండే ఖర్జూరాలు తింటే రోజంతా ఆకలి లేకుండా యాక్టివ్‌గా ఉంటారు. రాత్రి సమయాల్లో ఖర్జూరాలు తినకూడదు. ఇవి అంత సులభంగా అరగవు. పరగడుపున ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి పోషకాలు చక్కగా అందుతాయి. దీనిలోని ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయులను పెంచుతాయి. ►ఉదయాన్నే డేట్స్ తినడం వల్ల జీవక్రియలు సక్రమంగా జరిగి అధిక మొత్తంలో క్యాలరీలు ఖర్చవుతాయి. డేట్స్‌ను ఓట్స్‌తో కలిపి స్మూతీ, షేక్స్ చేసుకుని తాగితే కడుపు నిండుగా ఉండి ఆకలి వేయదు. ఫలితంగా ఇతర పదార్థాలు ఏమి తినలేం. ఫలితంగా తక్కువ క్యాలరీలతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. ► ఖర్జూరాలలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది శరీరంలో సెరొటోనిన్, నోర్పైన్ఫ్రైన్ అనే హ్యాపీ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీంతో డిప్రెషన్, ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలు తగ్గుతాయి. నిత్యం ఖర్జూరాలను తినడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. ఖర్జూరాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఖర్జూరాలు అంటే చాలా మంది ఇష్టమే ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఖర్జూరాలను రోజుకు 3 చొప్పున తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి ►ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. కెరోటినాయిడ్స్ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ►అదే విధంగా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ► ఫ్లావనాయిడ్స్ లోని యాంటి ఇన్‌ఫ్లామేటరీ గుణాలు మధుమేహం, కాన్సర్ ముప్పును తగ్గిస్తాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ► ఇందులోని ఫినోలిక్ ఆసిడ్ సైతం గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ► ఖర్జూరాల్లో కాపర్, సెలీనియం, మెగ్నీషియం ఎక్కువ. ఎముకలను బలంగా ఉంచడంలో తోడ్పడతాయి. ► ఖర్జూరాల్లోని కోలిన్, విటమిన్ బి జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి. అల్జీమర్స్ తగ్గిస్తాయి. కాబట్టి వీటిని తరచుగా తినడం మేలు. ►ఖర్జూరాలు నిద్రలేమిని దూరం చేస్తాయి. ► మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్నవాళ్లు ఖర్జూరాలు తింటే మంచిది. ►గర్భిణీలకు ఖర్జూరం తినిపిస్తే మంచిదని చెబుతుంటారు పెద్దలు. గర్భిణులు వీటిని తినడం వల్ల ఇందులోని ఫైబర్ కారణంగా పైల్స్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. బ్యూటీ టిప్స్ టేబుల్ స్పూను పటిక పొడిలో తగినంత రోజ్ వాటర్‌ను వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి, మెడకు రాసుకుని మర్దన చేయాలి. పదిహేను నిమిషాలపాటు మర్దన చేసిన తరువాత నీటితో కడిగేయాలి. ముఖాన్ని తడిలేకుండా శుభ్రంగా తుడిచి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. -
నిన్న బియ్యం ఎగుమతులపై నిషేధం: నెక్ట్స్ ఏంటో తెలిస్తే..!
బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం ఇపుడు మరో కీలకమైన అడుగువేయనుందని తెలుస్తోంది. ఈ ఎగుమతుల బ్యాన్ లిస్ట్‌లో నెక్ట్స్ చక్కెర ఉండవచ్చనే అంచనాలు ఆందోళన రేకెత్తిస్తోంది. బియ్యం ఎగుమతి నిషేధం ఆహార భద్రత, ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం ఆందోళనకు స్పష్టమైన సంకేతమిదని ట్రాపికల్ రీసెర్చ్ సర్వీసెస్ వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఈ జాబితాలో చక్కెర , ఇథనాల్ ఉండవచ్చని సంస్థ హెడ్ హెన్రిక్ అకమైన్ అన్నారు. (టెస్లాలో కీలక పదవికి భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా, ఆసక్తికర విషయాలు) ఇప్పటికే ప్రతికూల వాతావరణం, ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ ఆహార మార్కెట్లపై ఒత్తిడి పెరిగిందని, ఈనేపథ్యంలో చక్కెర విషయంలో ఇలాంటి నిషేధాలనే అమలు చేయనుంది అనేది ఆందోళన కలిగిస్తోందని అకమైన్ అన్నారు. దేశీయ ధరలను నియంత్రించేందుకు బియ్యం ఎగుమతులను నిషేధించిన తర్వాత, మరో ముఖ్యమైన ఆహారం వస్తువు చక్కెరపై ఆంక్షలుండవచ్చని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ సరఫరాలు కఠినతరం కావడంతో దక్షిణాసియా దేశం నుండి చక్కెర ఎగుమతులపై ప్రపంచం ఎక్కువగా ఆధారపడుతోంది. భారతదేశంలోని వ్యవసాయ బెల్ట్లలో అసమాన వర్షపాతం చక్కెర ఉత్పత్తి తగ్గిపోతుందనే ఆందోళనను రేకెత్తించింది. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే సీజన్లో వరుసగా రెండో సంవత్సరం పడిపోనుందని అంచనా. ఇది దేశం ఎగుమతి సామర్థ్యాన్ని పరిమితం చేయవచ్చు. దేశీయ సరఫరాలు, ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే గోధుమలు, కొన్ని బియ్యం రకాల విదేశీ అమ్మకాలను పరిమితం చేసిన సంగతి తెలిసిందే. (అయ్యయ్యో.. దుబాయ్ అతిపెద్ద జెయింట్ వీల్ ఆగిపోయింది) మరోవైపు మహారాష్ట్ర , కర్నాటకలోని ప్రధాన ఉత్పత్తి ప్రాంతాలలో చెరకు పొలాలు జూన్‌లో తగిన వర్షాలు పడలేదు. ఇది పంట ఒత్తిడికి దారితీసిందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిత్య జున్‌జున్‌వాలా తెలిపారు. 2023-24లో చక్కెర ఉత్పత్తి ఏడాది క్రితం నుండి 31.7 మిలియన్ టన్నులకు 3.4శాతం తగ్గుతుందని గ్రూప్ అంచనా వేసింది. అయినప్పటికీ, దేశీయ డిమాండ్‌ను సరఫరా చేయగలదని జున్‌జున్‌వాలా చెప్పారు. ఇదిలా ఉండగా, జీవ ఇంధనం కోసం భారత్ మరింత చక్కెరను వినియోగించేందుకు సిద్ధమైంది. ఇథనాల్‌ను తయారు చేయడానికి 4.5 మిలియన్ టన్నులను మళ్లించడాన్నిఅసోసియేషన్ గుర్తించింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 9.8శాతం ఎక్కువ. భారతదేశం ఇంతకు ముందు చక్కెర ఎగుమతులను పరిమితం చేసింది. 2022-23 సీజన్లో, ఎగుమతులు 6.1 మిలియన్ టన్నులకు పరిమితం చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరం 11 మిలియన్ టన్నుల నుండి తగ్గింది. తదుపరి సీజన్లో, అకామైన్ అండ్ లిమాతో సహా విశ్లేషకులు 2 మిలియన్ నుండి 3 మిలియన్ టన్నులు మాత్రమే అనుమతించబడతారని భావిస్తున్నారు.ప్రస్తుత ఉత్పత్తి స్థాయిలో, భారతదేశం ఎటువంటి ఎగుమతిని ఆంక్షలను విడుదల చేయకపోవచ్చు" అని స్టోన్ఎక్స్ సుగర్ అండ్ ఇథనాల్ హెడ్ బ్రూనో లిమా అన్నారు. అయితే ఇథనాల్ మళ్లింపు పూర్తి స్థాయిలో జరుగుతుందా లేదా అనేది పరిశీలించాల్సి ఉందన్నారు. దక్షిణ ఆఫ్రికా మధ్య అమెరికా వంటి ఇతర ప్రాంతాలలో తక్కువ ఉత్పత్తితో కలిపి, ఎల్‌నినో దక్షిణ ,ఆగ్నేయాసియా వేడి, పొడి వాతావరణ పరిస్థితులను తీసుకువస్తుందని మార్కెట్ ఆందోళన చెందుతోంది. థాయ్‌లాండ్‌లో కూడా ఉత్పత్తి తగ్గుదల కనిపించవచ్చు. దీంతో షుగర్ ఫ్యూచర్లు ఈ సంవత్సరం దాదాపు 20శాతం పెరిగాయి, అయితే బ్రెజిల్ బంపర్ పంటను సాధించింది.(లక్ అంటే ఇదే: ఖరీదైన బ్యాగ్‌ను ఎయిర్‌ట్యాగ్ పట్టిచ్చింది!) 2023-24 చక్కెర ఎగుమతి కోటాలపై భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. అక్టోబరు నుండి మాత్రమే హార్వెస్ట్ ప్రారంభమవుతుంది. ఇటీవలి వర్షాలు పంటకు ప్రయోజనం చేకూరుస్తుందని ఐఎస్ఎంఏ వ్యాఖ్యానించింది. అయితే ఉత్పత్తి తగ్గుతుందని పేర్కొంది. చక్కెర ఉత్పత్తి తక్కువగా ఉంటుందనే ఐఎస్ఎంఏ అంచనాలను భారత ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా ఖండించారు. ఇలాంటి ముందస్తు అంచనాలే దేశంలో తీవ్ర కొరతను సృష్టించిందన్నారు. అయితే పూర్తి ఉత్పత్తి గణాంకాల వరకు అధికారులువేచి చూస్తారని ఉంటారని రాబోబ్యాంక్లోని సీనియర్ కమోడిటీ విశ్లేషకుడు కార్లోస్ మేరా అన్నారు. -
మీకు తెలుసా? ఈ పండ్లు, కూరగాయలు తింటే షుగర్ రాదు
డయాబెటిస్ ఇప్పుడు అందరి నోటా అదే మాట. ఇది రక్తంలో చక్కెరను అనూహ్యంగా పెంచే జీవక్రియ వ్యాధి. ఒక వ్యక్తి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు తక్కువగా ఉన్నపుడు షుగర్ వ్యాధి అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది డయాబెటిస్ కు గురయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అందరూ పరీక్షలు చేయించుకుంటే ఈ సంఖ్య మరికొంత పెరిగే అవకాశముంది. షుగర్ వచ్చిందని తేలితే.. ఎక్కడ లేని ఆంక్షలు మొదలవుతాయి. ఏది తినాలన్నా.. షుగర్ పెరుగుతుందంటారు. పండు ముట్టనివ్వరు, భోజనం సరిగా చేయనివ్వరు. ఈ పరిస్థితి అత్యంత ఇబ్బందికరం. షుగర్ వచ్చిన వాళ్లు ఏం తినాలి? ఏం తినకూడదు? షుగర్ ఉన్న వాళ్లు పళ్లు తినకూడదంటారు కానీ, చిన్నప్పటినుంచి పళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు బాగా తింటే షుగర్ సమస్య రాదు. షుగర్ ఉన్నవారు కూడా ఒక పద్ధతిలో పిండిపదార్థాలను బాగా తగ్గించి పొద్దున, సాయంత్రం ఖాళీ కడుపున పండ్లు తీసుకోవడం మంచిది. అయితే బాగా తియ్యగా వుండే మామిడి, ద్రాక్ష లాంటివి కాకుండా దోర జామ, కివి, బొప్పాయి లాంటివి మంచిది. ఆకు కూరల్లో ఏముంది? తాజా ఆకుకూరలు ముఖ్యంగా తోటకూర, పుంటి కూర, పాలకూర, మెంతి కూర వంటి వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు ఆహారంలో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి. అలాగే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలలో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. షుగర్ ఉన్నవారు ఏం చేయాలి? షుగర్ వున్న వారికి బీపీ తోడవుతుంది కనుక ఉప్పు వాడకాన్ని తగ్గించాలి టైమ్ ప్రకారం భోజనం చేయాలి, అన్నం తగ్గించి జొన్న, సజ్జ, గోధుమ ఏదో ఒక రూపంలో తీసుకోవాలి టీ, కాఫీ తగ్గించాలి, వాటి కంటే లెమన్ టీ, అల్లం టీ మంచిది. నూనెలో బాగా వేయించిన వడియాలు, అప్పడాలు అసలే వద్దు అలాగే వడలు, పూరీలు, బజ్జీలు, మైదాతో చేసినవి తగ్గించాలి, లేదా ఆపేయాలి 6 important medical items to have at home: 1. First aid box: for home accidents 2. Thermometer: for body temperature 3. Routine meds: e.g. if diabetic 4. BP device: if you're hypertensive 5. Glucometer: if you're diabetic 6. Inhaler & portable nebulizer: if asthmatic Take note. — First Doctor (@FirstDoctor) July 10, 2023 షుగర్ పెరగకుండా ఏం చేయాలి? తిన్నది ఏదైనా అరిగించుకునేలా.. అంటే క్యాలరీలు ఖర్చయ్యేలా చూసుకోవాలి నడకతో పాటు వ్యాయామం మంచిది, ఓపిక, శక్తిని బట్టి ఈత, సైక్లింగ్ చేస్తే బెటర్ రాత్రి పూట కనీసం 8 గంటల పాటు కంటి నిండా నిద్ర పోవడం తప్పనిసరి ఒత్తిడికి దూరంగా ఉండండి, కుటుంబంతో సరదాగా గడపండి షుగర్ ఉన్నవాళ్లు తినకూడనివి స్వీట్లు, ఐస్‌క్రీమ్స్, చక్కెర పదార్థాలు అరటి పండ్లలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. డయాబెటస్ పేషెంట్స్ తినకపోవడమే మంచిది బొప్పాయి పండులో కూడా చక్కెర స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి. షుగర్ ఉన్నవాళ్లు చాలా మితంగా మాత్రమే తీసుకోవాలి పండ్లతో పోలిస్తే జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.. కాబట్టి అవి తీసుకోకపోవడమే మంచిది ప్రాసెడ్ ఫుడ్స్‌కి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు వైద్యులు -
బీపీ, షుగర్ రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్త
-
బెల్లం పొడి అమ్మేస్తోంది
ఇంట్లో అందరికీ షుగర్ వస్తే మంచి డాక్టర్ ఎవరా అని వెతుకుతారు అంతా.కాని ఎంబీఏ చేసి మంచి హోదాలో ఉన్న నవనూర్ కౌర్ మాత్రం ఉద్యోగం వదిలేసింది. లోకంలో ఇంత మందికి షుగర్ ఉందంటే చక్కెరకు ప్రత్యామ్నాయమైన బెల్లం అమ్మితేఅటు ఆరోగ్యం, ఇటు లాభం అని నిశ్చయించుకుంది. ‘జాగర్‌కేన్’ అనే బ్రాండ్ స్థాపించి నాణ్యమైన బెల్లం పొడిని తెగ అమ్మేస్తోంది.టీలో కలపాలన్నా, స్వీట్ చేయాలన్నా బెల్లం పొడి బెస్ట్ అంటోంది. ఈమె వ్యాపారం జామ్మని సాగుతోంది. నవనూర్ కౌర్ ప్రచార చిత్రాలు ఎవరినైనా ఆకర్షిస్తాయి. ఒక పోస్టర్లో ‘బెల్లం పాలు తాగితే ఎన్ని ఉపయోగాలో తెలుసా? వత్తిడి తగ్గుతుంది, స్త్రీలలో రుతుస్రావ సమస్యలు తగ్గుతాయి, హిమోగ్లోబిన్ పెరుగుతుంది, చర్మానికి మంచిది, జీర్ణక్రియ బాగుంటుంది, కీళ్ల నొప్పలు తగ్గుతాయి’. ఆ పోస్టర్ చూసినవారెవరైనా బెల్లం పాలు తాగాలనే అనుకుంటారు.ఇంకో పోస్టర్లో చక్కెరకు బెల్లానికి ఉన్న వ్యత్యాసాలు చూపిస్తుందామె. ‘చక్కెర రక్తంలో వెంటనే కరిగిపోతుంది. కాని బెల్లం మెల్లగా కరిగి మెల్లగా శక్తిని విడుదల చేస్తుంది. చక్కెరలో ఏ పోషకాలూ లేవు. బెల్లంలో ఐరన్, పొటాషియం ఉంటాయి. చక్కెర అసిడిటీ ఇస్తుంది. బెల్లం జీర్ణానికి అవసరమైన ఆల్కలైన్‌గా మారుతుంది’. నవనూర్ కౌర్ బెల్లం అమ్మకాల్లో ఏదో గుడ్డిగా ప్రవేశించలేదు. ఒక సంపూర్ణ అవగాహన, లక్ష్యంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. బిజినెస్ స్కూల్ విద్యార్థి నవనూర్ కౌర్‌ది లూధియానా. తండ్రి ప్రొఫెసర్. తల్లి స్కూల్ ప్రిన్సిపాల్. చురుకైన విద్యార్థి అయిన నవనూర్ కౌర్ ఐఎంటి ఘజియాబాద్ నుంచి ఎంబీఏ చేసింది. వెంటనే కొటాక్ మహేంద్ర బ్యాంక్‌లో మంచి ఉద్యోగం వచ్చింది. కాని తనకు వేరే ఏదో చేయాలని ఉండేది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే చేయదగ్గ వ్యాపారం ఏమిటా అని ఆలోచిస్తే తమ కుటుంబంలో బంధువుల్లో షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారని అర్థమైంది. డయాబెటిస్ పేషెంట్లు, డయాబెటిస్ ఉన్నవాళ్లు తీపి కోసం బెల్లం ఉపయోగించాలని అనుకున్నా మార్కెట్లో దొరుకుతున్న బెల్లం నాణ్యంగా లేదని తెలుసుకుంది. ఆర్గానిక్ బెల్లం అని చెప్పి అమ్ముతున్నది కూడా కల్తీయే అని అర్థమయ్యాక ఒక వైపు ఉద్యోగంలో తాను సంపాదించిన ఐదు లక్షల రూపాయలతో బెల్లం పొడి తయారీ కేంద్రం పెట్టి, అందులో బెల్లం పొడి తయారు చేసి అమ్మాలని నిశ్చయించుకుంది. అవాంతరాలు ఆర్గానిక్‌గా చెరకు పండించి, రసాయనాలు లేకుండా బెల్లం తయారు చేసి సరుకు వేసేవారి కోసం నవనూర్ కౌర్ పంజాబ్, ఉత్తర ప్రదేశ్ చాలా తిరగాల్సి వచ్చింది. అలా ఇస్తామని చెప్పిన వారు కూడా మోసం చేయక తప్పని పరిస్థితిలో ఉన్నారని గ్రహించింది. అయితే అదృష్టవశాత్తు తన తండ్రి దగ్గర చదువుకుని సేంద్రియ పద్ధతిలో చెరకు పండిస్తున్న కౌశల్ అనే రైతు పంజాబ్‌లోనే ఆమెకు దొరికాడు. అతనికి బెల్లం తయారీ కేంద్రం కూడా ఉంది. ‘నువ్వు నాణ్యమైన బెల్లం తయారు చేయ్. నేను మార్కెటింగ్, బ్రాండ్ చూసుకుంటాను. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం’ అని చెప్పింది. కౌశల్ సరే అన్నాడు. ఇద్దరూ కలిసి ‘జాగర్‌కేన్’ అనే బ్రాండ్ మొదలుపెట్టారు. వెంటనే ఆదరణ నవనూర్ కౌర్ తయారు చేసిన బెల్లం పొడి వెంటనే ఆదరణ పొందింది. కల్తీ లేనిది కావడాన... రుచి కూడా బాగుండటాన అందరూ కొనడం మొదలెట్టారు. దుకాణం దారులు నిల్వ ఉండటం లేదని ఫిర్యాదు చేస్తే తగిన ప్రయోగాలు చేసి 9 నెలల పాటు నిల్వ ఉండేలా తయారు చేశారు. ఇప్పుడు 22 జిల్లాల్లో ఆమెకు డిస్ట్రిబ్యూషన్ ఉంది. గత సంవత్సరం 2 కోట్ల టర్నోవర్ వచ్చింది. మరో ఐదేళ్లలో 100 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంటామని భావిస్తోంది. కృత్రిమమైన చక్కెర కంటే బెల్లం ఎక్కువ ఆరోగ్యకరమైనదని తెలుసుకునే కొద్దీ తనలా బెల్లం ఉత్పత్తులు చేసేవారు తప్పక విజయం సాధిస్తారని ఆమె గట్టిగా సందేశం ఇస్తోంది. ఉద్యోగాలు మంచివే అయినా ఒక మంచి వ్యాపార ఐడియా ఎక్కడికో చేర్చగలదు. నవనూర సక్సెస్ స్టోరీ అందుకు ఉదాహరణ. -
ఒత్తిడికి దూరంగా ఉండాలంటే..?
ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి కారణం సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడమే. డైట్ నుంచి కొన్ని ఆహారాలని మినహాయించడం వల్ల డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు.వాటి గురించి వివరంగా తెలుసుకుందాం... చక్కెర మీరు ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతున్నట్లయితే ముందుగా ఆహారం నుంచి చక్కెరను మినహాయించండి. ఎందుకంటే తీపి పదార్థాలు మీ శక్తి స్థాయిని ప్రభావితం చేస్తాయి. శరీర అసమతుల్యతను కలిగిస్తాయి. దీనివల్ల మనిషిలో టెన్షన్ పెరగడం మొదలవుతుంది. అందుకే డిప్రెషన్‌తో బాధపడేవారు చక్కెరను ఎక్కువగా తినకూడదు. ఆల్కహాల్ ఆల్కహాల్ కాలేయానికి మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఆల్కహాల్ మెదడులోని సెరోటోనిన్ చర్యను మారుస్తుంది. ఇది ఆందోళనను పెంచుతుంది. అందుకే మద్యం తాగకూడదు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ∙ఆందోళన పెరుగుతుంది. కెఫిన్ కెఫిన్ కలిగిన పానీయాలు అధికంగా తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమికి కారణమవుతాయి. కెఫిన్ అనేది కాఫీలోనే కాదు, టీలో కూడా ఉంటుంది. అందువల్ల కాఫీ, టీ, చాక్లెట్లు, కొన్ని రకాల శీతల పానీయాలలో కూడా కెఫిన్ ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే వీటివల్ల డిప్రెషన్‌కు గురవుతారు. ఉప్పు ఉప్పు మానసిక స్థితిని పాడు చేస్తుంది. మీరు అలసిపోయేలా చేస్తుంది. అలాగని ఉప్పు తీసుకోవడాన్ని పూర్తిగా మానేయకూడదు. తగ్గించి తీసుకుంటే ఉత్తమం. కొందరికి మజ్జిగన్నంలో ఉప్పు తప్పనిసరి. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, వడియాలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. -
రస్మలై ఇష్టమా! ఈ పదార్థాలు ఉంటే చాలు ఇంట్లోనే ఇలా ఈజీగా..
తీపిని ఇష్టపడే వారు ఇలా ఇంట్లోనే రస్మలై తయారు చేసుకోండి. నోరూరించే స్వీట్‌తో ఈ హోలీని సెలబ్రేట్ చేసుకోండి! రస్మలై తయారీకి కావాల్సినవి: ►రసగుల్లాలు – 15 (ఇంట్లో చేయడం కుదరకపోతే రెడీమేడ్‌వి తీసుకోవచ్చు) ►పాలు – లీటరు ►చక్కెర – 5 టేబుల్ స్పూన్లు ►బాదం –10 ; పిస్తా– 10 ►యాలకుల పొడి– టీ స్పూన్ ►కుంకుమ పువ్వు – 20 రేకలు తయారీ: ►అరకప్పు వేడి నీటిలో బాదం, పిస్తాలను అరగంట సేపు నానబెట్టి పొట్టు తీసి తరగాలి. ►పావు కప్పు వేడి పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి. ►మందపాటి బాణలిలో పాలు మరిగించాలి. ►పైకి తేలిన మీగడను స్పూన్‌తో తీసి ఒక గిన్నెలో వేసుకుంటూ పాలు అడుగు పట్టకుండా కలుపుతూ, పాలు సగమయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు చక్కెర వేసి కరిగే వరకు కలుపుతూ మరిగించాలి. ►యాలకుల పొడి, బాదం, పిస్తా (సగం), కుంకుమ పువ్వు పాలు కలిపి వీటి రుచి పాలకు పట్టే వరకు సన్నమంట మీద మరిగించాలి. ►ఇప్పుడు రసగుల్లాను ఒక ప్లేట్లోకి తీసుకుని గరిటె లేదా అట్లకాడ సాయంతో లేదా వేళ్లతో చక్కెర పాకం జారిపోయేటట్లు మెల్లగా నొక్కాలి. ►ఇలా రసగుల్లాలన్నింటినీ నొక్కి జాగ్రత్తగా పాలలో వేయాలి. ►రెండు నిమిషాలపాటు పాలలో ఉడకనిచ్చి స్టవ్ ఆపేయాలి. ►రసమలై చల్లారిన తర్వాత కప్పులో వేసి మీగడ(ఇష్టమైతే), బాదం, పిస్తాలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఇవి కూడా ట్రై చేయండి: Rice Kheer Recipe: హోలీకి రైస్ ఖీర్ తయారు చేసుకోండిలా! Rasgulla Recipe: రసగుల్ల తయారీ ఇలా! చక్కెర ద్రవం పాకం వస్తే అంతే సంగతి! -
Holi 2023: హోలీకి రైస్ ఖీర్ తయారు చేసుకోండిలా!
ఈ హోలీకి రైస్ ఖీర్ తయారు చేసుకోండిలా! తీపి రుచిని ఆస్వాదించండి! రైస్ ఖీర్ తయారీ విధానం ఇలా కావలసినవి: ►బియ్యం– కప్పు ►పాలు – ఒకటిన్నర లీటరు (వెన్న తీయనివి) ►చక్కెర – కప్పు ►యాలకుల పొడి– టీ స్పూన్ ►కుంకుమ పువ్వు– చిటికెడు లేదా 15 రేకలు ►బాదం – టేబుల్ స్పూన్ ►జీడిపప్పు – టేబుల్ స్పూన్ ►పిస్తా – టేబుల్ స్పూన్ ►కిస్మిస్ – టేబుల్ స్పూన్. తయారీ: ►బియ్యం కడిగి 15 నిమిషాల సేపు నానబెట్టాలి. ►చిన్న పాత్రలో నీటిని వేడి చేసి బాదం, పిస్తా వేసి మూతపెట్టాలి. ►అర గంట తర్వాత పొట్టు తీసి సన్నగా తరగాలి. ►కిస్మిస్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. ►బియ్యం నానిన తర్వాత స్టవ్ మీద వెడల్పు పాత్ర పెట్టి పాలు పోసి మరిగించాలి. ►ఒక గరిటెడు పాలు విడిగా తీసుకుని కుంకుమ పువ్వు రేకలను నానబెట్టాలి. ►బియ్యంలోని నీటిని వంపేసి బియ్యాన్ని మరుగుతున్న పాలలో వేసి ఉడికించాలి. ►బియ్యం ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత చక్కెర వేసి కలిపి సన్నమంట మీద ఉడికించాలి. ►అన్నం ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత యాలకుల పొడి, బాదం, పిస్తా తరుగు, కిస్మిస్, కుంకుమ పువ్వు కలిపిన పాలు పోసి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆపేయాలి. రైస్ ఖీర్ రెడీ. ►ఖీర్ దగ్గరయ్యే వరకు ఉడికించాల్సిన అవసరం లేదు. ►స్టవ్ ఆపేసిన తర్వాత చల్లారే కొద్దీ దగ్గరవుతుంది. ఇవి కూడా ట్రై చేయండి: Rasgulla Recipe: రసగుల్ల తయారీ ఇలా! చక్కెర ద్రవం పాకం వస్తే అంతే సంగతి! పాలిచ్చే తల్లులకు శ్రేష్ఠం.. సొప్పు పాల్య, మోహన్ లడ్డు -
నోరూరించే రసగుల్ల తయారీ ఇలా! చక్కెర ద్రవం పలుచగా ఉంటేనే..
Holi Recipes 2023: రంగుల పండుగ వస్తోంది. రంగరంగ వైభవంగా వస్తోంది. తీపి జ్ఞాపకాలను తెస్తోంది. రుచులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ ఏటి హోలీ ఇచ్చిన తీపి రుచిని... రాబోయే హోలీ వరకు మర్చిపోదు మది. రసగుల్ల తయారీ విధానం ఇలా: కావలసినవి: ►పాలు – లీటరు (వెన్న తీయనివి) ►నిమ్మరసం– 3 టేబుల్ స్పూన్లు ►చక్కెర – 2 కప్పులు ►నీరు – లీటరు ►పాలు – టేబుల్ స్పూన్ ►ఉప్మారవ్వ– టీ స్పూన్ ►పిస్తాపలుకులు : 20 తయారీ: ►పాలను మందపాటి పాత్రలో పోసి స్టవ్ మీద పెట్టాలి. ►బాగా మరిగిన తర్వాత మంట తగ్గించి నిమ్మరసం వేసి కలపాలి. ►ముందు సగం నిమ్మరసం వేసి కలిపి చూసి, పాలు బాగా విరిగితే మిగిలిన రసాన్ని ఆపేయాలి. ►పాలు సరిగ్గా విరగకపోతే మొత్తం రసాన్ని వేసి కలపాలి (పాశ్చరైజేషన్ జరగని పాలకు ఒక స్పూన్ నిమ్మరసం సరిపోతుంది). ►విరిగిన పాలను పలుచని వస్త్రంలో పోసి మూట కట్టి ఏదైనా కొక్కేనికి వేలాడదీయాలి. ►ఓ అరగంట తర్వాత నీరు పోయేలా చేత్తో గట్టిగా నొక్కాలి. ►ఆ తర్వాత పైన బరువు పెట్టాలి. ఇలా చేయడం వల్ల నీరంతా కారిపోతుంది. ►పాల విరుగు మాత్రం మూటలో మిగులుతుంది. ►పాలవిరుగులో రవ్వ వేసి వేళ్లతో నలుపుతూ కలపాలి. ఇలా చేస్తూ ఉంటే ముందుగా పాల విరుగు పొడిగా మారుతుంది. ►మరికొంత సేపటికి ముద్దగా అవుతుంది. ►ఇప్పుడు ఆ ముద్దను చిన్న చిన్న గోళీలుగా చేయాలి. ►వెడల్పుగా, లోతుగా ఉన్న కడాయిలో చక్కెర, నీరు పోసి వేడి చేయాలి. ►చక్కెర కరిగిన తరవాత అందులో టేబుల్ స్పూన్ పాలు వేయాలి. ►రెండు నిమిషాలకు చక్కెర ద్రవం శుభ్ర పడి అందులోని మలినాలు నల్లగా పైకి తేలుతాయి. ►స్పూన్‌తో కానీ చిల్లుల గరిటెతో తీసేయాలి లేదా పలుచని వస్త్రంలో వడపోయడం మంచిది. ►వడపోసిన ద్రవాన్ని మళ్లీ కడాయిలో పోసి మరిగించాలి. ►ఇప్పుడు చక్కెర ద్రవంలో పాల విరుగుతో చేసిన గోళీలను వేసి నాలుగైదు నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికించాలి (పెద్ద మంట మీద ఉడికిస్తే రసగుల్లాలు విరిగిపోతాయి). ►చిన్న గోళీలుగా వేసిన రసగుల్లాలు చక్కెర పాకాన్ని పీల్చుకుని పెద్దవవుతాయి. ►అప్పుడు స్టవ్ ఆపేయాలి. ►వేడి తగ్గిన తరవాత కప్పులో రసగుల్లాతోపాటు ఒక టేబుల్ స్పూన్ సిరప్, పిస్తా వేసి సర్వ్ చేయాలి. గమనిక: రసగుల్లాలకు చేసే చక్కెర ద్రవం పలుచగా ఉండాలి. పాకం రాకూడదు. ఇవి కూడా ట్రై చేయండి: వంకాయ బోండా.. భలే రుచి.. ఇలా తయారు చేసుకోండి! బనానా, ఓట్స్‌తో కజ్జికాయలు తయారు చేసుకోండిలా! -
మంత్రి ఉచిత చక్కెరకు మహిళ తిరస్కారం
సాక్షి, యశవంతపుర: ఏదైనా ఉచితంగా ఇస్తామంటే ఎవరైనా ఎగబడతారు, పైగా తమకు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలని బతిమాలతారు. కానీ బాగలకోట జిల్లా బీళగిలో మంత్రి మురుగేశ్ నిరాణి అనుచరులు ఉచితంగా పంచిన చక్కెరను ఒక మహిళ ఇంటి బయట పడేసింది. ఈ వీడియో సోషల్ వీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి మద్దతుదారులు బీళగిలో ఇంటింటికీ ఉచితంగా కొంత పంచదారను పంచారు. కార్యకర్తలు ప్యాకెట్లను ఆమె ఇంట్లోకి తీసుకెళ్లి ఇవ్వగా, వద్దని తిరస్కరించింది. లేదు, తీసుకోవాల్సిందేనని వాటిని ఇంట్లో పెట్టి వెళ్లిపోయారు. ఆమె ప్యాకెట్లను తీసి ఇంటి బయట పడేసింది. ఆమె నిజాయితీని చూసిన నెటిజన్లు అభినందించారు. ఈ వీడియోను యల్లప్ప హెగ్డే అనే సామాజిక కార్యకర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (చదవండి: పెళ్లికి వెళ్లి వస్తూ మృత్యు ఒడికి.. ) -
పనీర్ తురుము, మైదాపిండితో నోరూరించే బొబ్బట్లు.. తయారీ ఇలా
నోరూరించే పనీర్ బొబ్బట్లు తయారు చేసుకోండిలా..! కావలసినవి: ►పనీర్ తురుము, మైదాపిండి – 1 కప్పు చొప్పున ►పంచదార పొడి – అర కప్పు ►ఏలకుల పొడి – అర టీ స్పూన్ ►పచ్చి కోవా – కొద్దిగా, ఉప్పు – సరిపడా ►నెయ్యి – 4 టేబుల్ స్పూన్ల పైనే తయారీ: ►ముందుగా మైదాపిండి, తగినంత ఉప్పు వేసుకుని.. నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం ఒక బౌల్ తీసుకుని.. అందులో పనీర్ తురుము, పంచదార పొడి, పచ్చికోవా, ఏలకుల పొడి వేసుకుని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. ►ఇప్పుడు కొద్దికొద్దిగా మైదా మిశ్రమాన్ని తీసుకుని.. చిన్న చిన్న అట్లు మాదిరి ఒత్తుకోవాలి. ►మధ్యలో పనీర్ మిశ్రమంతో తయారు చేసుకున్న బాల్స్‌ని ఉంచి.. చుట్టూ మైదా మిశ్రమంతో మళ్లీ బాల్స్‌లా చేసుకుని వాటిని అట్లుగా ఒత్తుకోవాలి. ►వాటిని ఒకదాని తర్వాత ఒకటి పెనంపైన నేతిలో వేయిస్తే భలే రుచిగా ఉంటాయి. -
Chocolate: కోకో పౌడర్, గోధుమ పిండి.. చాకొలెట్లు ఇంట్లోనే ఇలా ఈజీగా..
కాలం కరిగిపోతుంది. చాక్లెట్లు కూడా... నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. చాక్లెట్లనగానే మనకు బయటినుంచి కొనుక్కుని రావడం మాత్రమే తెలుసు. కానీ కాస్త సమయం కరిగిస్తే ... ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చాక్లెట్లతో పాటే తీపి జ్ఞాపకాలను కూడా చప్పరించేయొచ్చు. అదెలాగో చూడండి మరి! మిల్క్ చాక్లెట్ కావలసినవి: ►కోకో పౌడర్ – 2 కప్పులు ►చక్కెర – అర కప్పు ►గోధుమ పిండి– పావు టీ స్పూన్ ►బటర్ – ముప్పావు కప్పు (ఉప్పు లేనిది) ►పాలు – ముప్పావు కప్పు ►నీరు – కప్పు. తయారీ: ►కోకో, బటర్‌ను ప్రాసెసర్‌లో మెత్తని పేస్టు చేయాలి. ►ఇప్పుడు పెనం వేడి చేసి పావు కప్పు నీరు పోసి వేసి చేసి అందులో కోకో, బటర్ మిశ్రమం పేస్ట్ ఉన్న పాత్రను ఉంచాలి. ►కోకో మిక్స్ బాగా కరిగిన తర్వాత ఆ పాత్రను నేరుగా స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద కలుపుతూ వేడి చేయాలి. ►మరిగే స్థాయికి వచ్చిన తర్వాత దించేసి మిశ్రమాన్ని విస్కర్‌తో బాగా చిలకాలి. ►ఇప్పుడు పాలను మరిగించి పిండి, చక్కెర వేసి కరిగే వరకు కలపాలి. ►ఇందులో కోకో మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ►ఇప్పుడు మిశ్రమాన్ని చాకొలెట్ మౌల్డ్ ట్రేలో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఫ్రిజ్ మ్యాగ్జిమమ్లో ఉంచాలి. ►మిశ్రమం గట్టిపడిన తర్వాత బయటకు తీసి మౌల్డ్ నుంచి వేరు చేయాలి. ►వెంటనే వేరుపడకపోతే ట్రేని గోరువెచ్చని నీటి మీద తేలేటట్లు నాలుగైదు సెకన్ల పాటు ఉంచితే చాక్లెట్లు ట్రే నుంచి విడివడుతాయి. వైట్ చాక్లెట్ కావలసినవి: ►కోకో బటర్– కప్పు ►చక్కెర పొడి– 3 టేబుల్ స్పూన్లు ►పాల పొడి– 3 టేబుల్ స్పూన్లు ►వెనిల్లా ఎసెన్స్– మూడు చుక్కలు. తయారీ: ►ఒక పాత్రలో నీటిని వేడి చేసి అందులో కోకో బటర్ ఉన్న పాత్రను పెట్టి కలుపుతూ కరిగించాలి. ►దించిన తర్వాత అందులో చక్కెర పొడి, పాల పొడి, వెనిలా ఎసెన్స్ వేసి ఉండలు లేకుండా సమంగా కలిగే వరకు కలపాలి. ►ఈ మిశ్రమాన్ని చాక్లెట్ మౌల్డ్‌లో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ►మిశ్రమం గట్టి పడడానికి మ్యాగ్జిమమ్ డిగ్రీల్లో అర గంట నుంచి ముప్పావు గంట పడుతుంది. ►ఇంకా త్వరగా కావాలంటే ఫ్రీజర్‌లో పెడితే 20 నిమిషాల్లో చాక్లెట్ తయారవుతుంది. -
5.62 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులు!
న్యూఢిల్లీ: భారత్ అక్టోబర్‌లో ప్రారంభమైన ప్రస్తుత 2022–23 మార్కెటింగ్ సంవత్సరంలో డిసెంబర్ 6వ తేదీ వరకూ 5.62 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసిందని వాణిజ్య వేదిక– ఏఐఎస్‌టీఏ (ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్) మంగళవారం తెలిపింది. ప్రస్తుత (2022–23) మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్–సెప్టెంబర్) 60 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేయడానికి నవంబర్‌లో ప్రభుత్వం అనుమతించింది. ఏఐఎస్‌టీఏ లెక్కల ప్రకారం, చక్కెర మిల్లుల నుండి ఎగుమతుల కోసం పంపిన పరిమాణం 12.19 లక్షల టన్నులు. దీనిలో భౌతిక రవాణా ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం డిసెంబర్ 9 వరకు 5.62 లక్షల టన్నులు. యునైటెడ్ ఆరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)కి గరిష్టంగా చక్కెర ఎగుమతయ్యింది. ఆ తర్వాత బంగ్లాదేశ్, ఇండోనేషియా, సోమాలియా, ఇతర దేశాలకు ఎగుమతులు జరిగాయి. దాదాపు 5.22 లక్షల టన్నుల చక్కెర లోడింగ్ లేదా లోడింగ్ కోసం సిద్ధంగా ఉంది. 2021–22 మార్కెటింగ్ సంవత్సరంలో భారతదేశం రికార్డు స్థాయిలో 111 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. -
Beauty Tips: దాల్చిన చెక్క, పప్పు, పాలు, పంచదార.. బ్లాక్‌హెడ్స్‌కు చెక్!
How To Get Rid of Blackheads: ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ బ్లాక్‌హెడ్స్ వస్తూనే ఉంటాయి. వీటివల్ల ముఖం డల్‌గా, కళావిహీనంగా కనిపిస్తుంది. వీటిని తీయించుకోవడం ఖర్చుతో కూడుకున్నదేగాక, సమయం కూడా వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఇంట్లో ఉండే దాల్చిన చెక్క, నిమ్మకాయ, పప్పు, పాలు, పంచదార, కొబ్బరి నూనె, ఉప్పుతో సులభంగా తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం... కొల్లాజెన్ విడుదలలో.. ►చర్మంలో అతిముఖ్యమైన ప్రోటిన్ కొల్లాజెన్ విడుదలను మెరుగుపరచడంలో దాల్చిన చెక్క ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మం మీద ఏర్పడే రంధ్రాలను దాల్చిని తగ్గిస్తుంది. నిమ్మరసంలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంమీద రంధ్రాలను లోతుగా శుభ్రం చేస్తాయి. ►అందువల్ల అరచెక్క నిమ్మరసంలో టీస్పూను దాల్చిన చెక్కపొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతంలో పూతలా వేసి పదిహేను నిమిషాలపాటు మర్దనా చేయాలి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి. ఎర్రకందిపప్పు ఉంటే.. ►పాలు చర్మానికి పోషణ అందిస్తే పప్పు దినుసులు బ్లాక్‌హెడ్స్‌ను వేళ్లతోసహా పీకేస్తాయి. ఎర్రకందిపప్పుని ఒక టేబుల్ స్పూను తీసుకుని నాలుగు గంటలపాటు నానబెట్టాలి. నానినపప్పులో నీటిని తీసేసి రెండు స్పూన్ల పాలు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాలపాటు మర్దన చేసి తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పప్పులోని యాంటిఆక్సిడెంట్స్ చర్మానికి అందుతాయి. మర్దనతో బ్లాక్ హెడ్స్ పోతాయి. సున్నిత చర్మతత్వం కలిగిన వారికి ఈ స్క్రబ్ చక్కగా పనిచేస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది ►స్పూను పంచదారలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు మర్దన చేసి తరువాత కడిగేయాలి. పంచదార లోతుగా శుభ్రంచేసి మూసుకుపోయిన రంధ్రాలను తెరవడంతోపాటు, మృతకణాలను తొలగిస్తుంది. కొబ్బరి నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు, మృదువుగా మారుస్తాయి. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది! అరచెక్క నిమ్మరసంలో అరటీస్పూను సాల్ట్‌వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదినిమిషాలపాటు మర్దన చేసి చల్లని నీటితో కడిగేయాలి. ఈ స్క్రబ్ వదులుగా ఉన్న చర్మాన్ని బిగుతుగా మార్చడంతోపాటు, బ్లాక్‌హెడ్స్‌ను తొలగించి చర్మం కాంతిమంతంగా మెరిసేలా చేస్తుంది. చదవండి: Radhika Madan: నా చర్మ సౌందర్య రహస్యం ఇదే.. వారానికోసారి ఇలా చేశారంటే.. -
Recipe: బ్రెడ్ జామూన్ ఇంట్లోనే తయారు చేసుకోండిలా!
నోరూరించే బ్రెడ్ జామూన్ ఇలా తయారు చేసుకోండి. కావలసినవి: ►పంచదార – కప్పు ►యాలకులు – మూడు (పొడిచేసుకోవాలి) ►నిమ్మరసం – టేబుల్ స్పూను ►తెల్లని బ్రెడ్ స్లైస్‌లు – ఆరు ►క్రీమ్ మిల్క్ పౌడర్ – రెండు టేబుల్ స్పూన్లు ►ఫ్రెష్ క్రీమ్ – టేబుల్ స్పూను ►వేడి పాలు – నాలుగు టేబుల్ స్పూన్లు ►నెయ్యి లేదా నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీ: ►గిన్నెలో పంచదార, కప్పు నీళ్లుపోసి వేడిచేయాలి ►సన్నని మంటమీద సుగర్ సిరప్ తయారయ్యేవరకు మరిగించాలి ►సిరప్ అయ్యిందనుకున్నప్పుడు యాలకులపొడి, నిమ్మరసం వేసి చక్కగా కలిపి తిప్పి, స్టవ్ మీద నుంచి దించేసి పక్కనపెట్టుకోవాలి ►ముదురు రంగులో ఉన్న బ్రెడ్ స్లైసుల అంచులు కత్తిరించాలి. ►ఇప్పుడు మిగిలిన స్లైసుని ముక్కలుగా తరిగి, తరువాత పొడిచేసుకోవాలి ►ఈ పొడిలో పాలపొడి, ఫ్రెష్ క్రీమ్ వేసి కలపాలి. ►ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా పాలు పోస్తూ మెత్తని ముద్దలా కలుపుకోవాలి ►చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని పిండి ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని పక్కనపెట్టుకోవాలి ►వేడెక్కిన నూనెలో ఈ ఉండలను వేసి సన్నని మంటమీద గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించి తీసుకోవాలి ►అన్ని ఉండలు వేగిన తరువాత వెంటనే సుగర్ సిరప్‌లో వేసి రెండు గంటలపాటు ఉంచి, తరువాత సర్వ్‌చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Recipes: శాగూ కేసరి.. పన్నీర్ వైట్ గ్రేవీ ఇలా తయారు చేసుకోండి! Fish Omelette Rolls Recipe: నోరూరించే ఫిష్ ఆమ్లెట్స్ రోల్స్ తయారీ ఇలా! -
Beauty Tips: పంచదార, తేనె, ఆలివ్ ఆయిల్, నిమ్మ.. దెబ్బకు జిడ్డు వదులుతుంది!
వర్షాకాలంలో పేరుకుపోయిన మృతకణాలతో ముఖం జిగటగా ఉంటుంది. ఈ జిగటను తొలగించే స్క్రబ్‌ను ఇంట్లోనే అత్యంత సులువుగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం... ►కప్పు పంచదారలో టీస్పూను తేనె, అరటీస్పూను నిమ్మరసం, టీస్పూను ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసి ఆరిన తర్వాత సున్నితంగా మర్దన చేసి నీటితో కడిగేయాలి. ►వారంలో రెండు సార్లు ఈ స్క్రబ్ అప్లై చేయడం వల్ల జిగటపోయి ముఖచర్మం ఆరోగ్యంగా, కాంతిమంతంగా కనిపిస్తుంది. సహజమైన క్లెన్సర్స్ ►ముఖం మరీ మురికిగా అనిపిస్తే పాలు, మీగడ, పెరుగు, మజ్జిగ ఏది అందుబాటులో ఉంటే దానిని పట్టించి మెల్లగా రుద్దాలి. ఇవి సహజమైన క్లెన్సర్స్. ►మార్కెట్లో దొరికే క్లెన్సింగ్ మిల్క్‌కు బదులుగా వీటిని వాడవచ్చు. ►రోజూ మామూలుగా ముఖాన్ని శుభ్రం చేస్తున్నప్పటికీ దుమ్ముకణాలు చర్మం లోపలి గ్రంథుల్లోకి వెళ్లి చర్మానికి పట్టేస్తాయి. ►అలాంటప్పుడు కూడా ఈ క్లెన్సర్‌ను వాడవచ్చు. చదవండి: Health Tips: ఇవి తరచుగా తింటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది! అంతేకాదు.. -
సామాన్యుల నెత్తిన మరో పిడుగు.. వాటి ధరలకు రెక్కలు?
నిత్యవసర వస్తువల ధరల పెరుగుదలతో సామాన్యులు సతమతం అవుతున్నారు. కూరగాయలు, వంట నూనెకు తోడు ఇటీవల గోధుమల ధరలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా ఈ జాబితాలో చేరేందుకు చక్కెర రెడీ అవుతుంది. అయితే పంచదార ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్రం తక్షణ చర్యలకు ఉపక్రమించవచ్చని తెలుస్తోంది. బహిరంగ మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉండటంతో చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించనుందంటూ రాయిటర్స్, బ్లూంబర్గ్‌లు కథనాలు ప్రచురించాయి. ఈ ఏడాది చక్కెర ఎగుమతులను కేవలం 10 మిలియన్ టన్నులకే పరిమితి చేసే అవకాశం ఉందంటూ తేల్చి చెప్పాయి. బయటి దేశాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేస్తే దేశీయంగా కొరత వచ్చి ధరలు పెరగవచ్చనే అంచనాతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవచ్చంటూ వార్తలు గుప్పుమన్నాయి. మన దేశంలో వార్షిక చక్కెర ఉత్పత్తి సామర్థ్యం 35.5 మిలియన్ టన్నులు. ఇందులో 9.5 మిలియన్ టన్నుల చక్కెరని ఈ ఏడాది ఎగుమతి చేయోచ్చని ముందుగా అంచనా వేసి ఆ మేరకు అనుమతులు జారీ చేశారు. అయితే సగం ఏడాది కూడా పూర్తి కాకముందే ఇప్పటికే 8 మిలియన టన్నుల చక్కెర ఎగుమతులకు ఆర్డర్లు వచ్చాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాల్లో చక్కెరకు డిమాండ్ పెరిగింది. దీంతో భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే మన దేశంలో ఉన్న చర్కెర అంతా విదేశాలకు తరలి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా చక్కెర ఎగుమతులపై కేంద్రం పరిమితి విధించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్లో చక్కెర కిలో ధర సగటున 41.50 దగ్గర ఉంది. ప్రభుత్వం కనుక ఎగుమతులపై పరిమితి విధిస్తే రాబోయే రోజుల్లో రూ. 40 నుంచి 43 మధ్యనే ఉండవచ్చని మార్కెట్ వర్గాలు వర్గాలు అంటున్నాయి. అలాకాని పక్షంలో గోదుమల తరహాలోనే చక్కెర ధరలకు రెక్కలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. చక్కెర ఎగుమతులపై నిషేధం వార్తలు బటయకు రావడంతో స్టాక్ మార్కెట్లో చక్కెర కంపెనీల షేర్ల ధరలు పడిపోయాయి. చదవండి: మూడు రెట్లు పెరిగిన నష్టాలు,షేర్లు జంప్, టార్గెట్ ఎంతంటే? -
Health: ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు తింటే.. ఈ ప్రమాదం పొంచిఉన్నట్లే!
ఇటీవల కాలంలో చిన్న వయసులో కూడా గుండెపోటుతో అకస్మాత్తుగా మృత్యువాత పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తగిన స్థాయిలో నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పోషకాలతో కూడిన ఆహారంన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో.. కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తగ్గించాలి 👉🏾జంక్ ఫుడ్ తినడాన్ని పూర్తిగా తగ్గించి విటమిన్స్,న్యూట్రియెంట్స్‌తో సమృద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 👉🏾ఎక్కువ మంది ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తింటుంటారు. ఇవి గుండె ఆరోగ్యానికి కీడు చేస్తాయి. 👉🏾వీటిలో ఆహారాన్ని ఎక్కువ రోజులపాటు నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. 👉🏾ఇవి గుండెకి మంచివి కావు. వీటివల్ల గుండె జబ్బులు వస్తాయి. 👉🏾కనుక ఈ ఆహారాలకు బదులుగా ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను ఇంట్లోనే తయారు చేసుకుని తినాలి. 👉🏾ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. ఉప్పులో ఉండే సోడియం శరీరానికి మంచిది కాదు. దీనివల్ల హైపర్ టెన్షన్ వస్తుంది. 👉🏾అంతేకాకుండా చివరకు అది గుండె జబ్బులకు దారితీస్తుంది. 👉🏾అదే క్రమంలో చక్కెర వల్ల అధికంగా బరువు పెరుగుతారు. అది కూడా గుండె జబ్బులు వచ్చేందుకు దారి తీస్తుంది. 👉🏾కనుక ఈ రెండు పదార్థాలను నిత్యం తక్కువగా తీసుకోవాలి. లేదా పూర్తిగా మానేయాలి. 👉🏾వీటితో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చదవండి👇 Healthy Heart Diet: 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు, బచ్చలి కూర తిన్నారంటే! Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తింటే మేలు! -
Health Tips: పటికబెల్లం ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
Patika Bellam Health Benefits: పటికబెల్లం అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది తియ్యటి రుచిని కలిగి ఉంటుంది. పటికబెల్లం శరీరానికి చలువ చేస్తుంది, జీర్ణశక్తిని పెంచి దేహానికి బలాన్ని, వీర్యపుష్టిని ఇస్తుంది. వాత, పిత్త , కఫ దోషాల వల్ల కలిగే అనేక రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది. అయితే తియ్యగా ఉంది కదా అని ఎక్కువ తింటే మాత్రం మలబద్ధకం తప్పదు. ఈ క్రమంలోనే పటిక బెల్లంతో మనకు కలిగే ఇతర ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం. పటికబెల్లం ఆరోగ్య ప్రయోజనాలు ►పంచదారను ప్రాసెస్ చెయ్యడానికి ముందు రూపమే పటికబెల్లం. దీనిని కలకండ అని కూడా అంటారు. మిశ్రీ అంటారు. పటికబెల్లం పంచదార కన్నా మంచిది. ►మూడు, లేదా నాలుగు దొండ పండ్లను పటికబెల్లం పొడిలో అద్దుకొని తింటూ ఉంటే దగ్గు తొందరగా తగ్గిపోతుంది. ►చెంచాడు పటికబెల్లం పొడి, చెంచాడు పచ్చి లేదా ఎండు కొబ్బరి కోరు కలిపి పిల్లలకు తినిపిస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి. ►వేడివేడి పాలల్లో పటికబెల్లం పొడి కలిపి రెండు లేక మూడు పూటలు తాగితే స్వరపేటికను ఎక్కువగా ఉపయోగించడం వల్ల వచ్చే గొంతు బొంగురు తగ్గిపోతుంది. ముఖ్యంగా ►ఇది అధ్యాపక, ఉపన్యాస వృత్తిలో ఉండే వారికి, పాటలు పాడే వారికి బాగా ఉపకరిస్తుంది. ►రెండు టేబుల్ స్పూన్ల పటికబెల్లం పొడి, టేబుల్ స్పూన్ల గసగసాలు తీసుకుని ఈ రెండింటినీ కలిపి మెత్తగా నూరి గాలి చొరని గాజు సీసాలో నిల్వ ఉంచుకుని పూటకు చెంచా చొప్పున వెన్నతో కలుపుకుని రెండు పూటలా తింటే గర్భిణులలో వచ్చే పొత్తి కడుపు నొప్పి, కండరాలు బిగదియ్యడం, రక్త విరేచనాలు, జిగట విరేచనాలు వంటివి తగ్గిపోతాయి. ►పటికబెల్లాన్ని, మంచిగంధాన్ని సాన మీద అరగదీసి.. అంతే మొత్తంలో తేనెను తీసుకుని ఈ మూడింటినీ అరగ్లాసు బియ్యం కడిగిన నీటిలో కలిపి పూటకు ఒకసారి తీసుకుంటే రక్తవిరేచనాలు, జిగట విరేచనాలు తగ్గుతాయి. దీంతో శరీరంలో ఏర్పడే మంటలు కుడా తగ్గుతాయి. ►పటికబెల్లం 20 గ్రాములు, ఆవువెన్న 20 గ్రాములు, పొట్టు తీసిన బాదం పప్పులు 7 తీసుకుని ఈ మూడింటినీ కలిపి ఉదయం పూట ఒకేసారి తీసుకుంటే ఉంటే దగ్గు తగ్గుతుంది. ►కనుచూపు మెరుగవుతుంది. ►పాలల్లో పటికబెల్లం పొడి వేసి కలిపి తాగితే దాహం తగ్గుతుంది. ►పటికబెల్లం పొడి అరస్పూను, టీ స్పూన్ పుదీనా ఆకుల రసం కలిపి రోజూ రెండు లేక మూడు పూటలు సేవిస్తూ ఉంటే దద్దుర్లు తగ్గుతాయి. ►వేసవిలో పిల్లలకు వడదెబ్బ తగలకుండా ఉండాలంటే, పటికబెల్లం పొడి కలిపిన నీటిలో గింజలు తీసేసిన ఎండు కర్జూరాలను వేసి ఉంచాలి. మధ్యాన్నం ఎండగా ఉన్నప్పుడు ఈ నీటిని వడకట్టి పిల్లలకు తాగిస్తే చాలా మంచిది. చదవండి👉🏾Maredu Juice: మారేడు జ్యూస్ తాగుతున్నారా.. ఇందులోని టానిన్, పెక్టిన్‌ల వల్ల.. -
చక్కెర ఎగుమతులు 90 లక్షల టన్నులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం నుంచి ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఎగుమతులు 90 లక్షల టన్నులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) ప్రకారం.. 2021 సెప్టెంబర్‌తో ముగిసిన మార్కెటింగ్ సంవత్సరంలో 71–72 లక్షల టన్నుల చక్కెర విదేశాలకు సరఫరా అయింది. మార్కెట్ నివేదికలు, నౌకాశ్రయాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సుమారు 80 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి ఒప్పందం జరిగింది. 2021 అక్టోబర్ నుంచి 2022 మార్చి మధ్య ఇప్పటికే 57.17 లక్షల టన్నుల చక్కెర విదేశాలకు చేరింది. అంత క్రితం మార్కెటింగ్ సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 31.85 లక్షల టన్నులకు పరిమితం అయింది. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో ఎగుమతి అయిన పరిమాణంలో 44 శాతం ఇండోనేషియా, బంగ్లాదేశ్ కైవసం చేసుకున్నాయి. అంత క్రితం ఏడాదిలో ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్లు 48 శాతం వాటా చేజిక్కించుకున్నాయి. 2021–22లో 350 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి కానుంది. ఇందులో ఇప్పటికే మిల్లులు 330 లక్షల టన్నులు ఉత్పత్తి చేశాయి. దేశీయంగా 272 లక్షల టన్నుల చక్కెర వినియోగం అవుతుంది. ఎగుమతులు, దేశీయ వినియోగం పోను సెప్టెంబర్ నాటికి మిగులు 68 లక్షల టన్నులు ఉంటుంది. -
పైనాపిల్ కేక్ ఇంట్లోనే ఇలా ఎంచక్కా తయారు చేసుకోండి!
పైనా‘పిల్’ను తింటే వేరుగా ఏ ‘పిల్’ తీసుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది చమత్కరిస్తూ ఉంటారు. దీనిని ఆరోగ్యాల ఆవాస కేంద్రం అని కూడా చెబుతుంటారు. పైనాపిల్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. అయితే, ఎప్పుడూ రొటీన్‌గా పైనాపిల్ ముక్కలు తినడం, జ్యూస్ తాగడం వంటివి కాకుండా ఇలా ఎంచక్కా కేక్ చేసుకుని తినండి! పైనాపిల్ కేక్ కావలసినవి: బ్రౌన్ సుగర్ పౌడర్ – 150 గ్రాములు అన్ సాల్టెడ్ బటర్ – 175 గ్రాములు, పైనాపిల్ స్లైస్, చెర్రీస్ – 20 చొప్పున మైదాపిండి – ఒకటిన్నర కప్పులు, బేకింగ్ పౌడర్ – ఒకటిన్నర టీ స్పూన్లు ఉప్పు – పావు టీ స్పూన్, పంచదార పొడి – అర కప్పు, గుడ్లు – 2 వెనీలా ఎక్స్ట్రాక్ట్ – 1 టీ స్పూన్, సోర్ క్రీమ్, పాలు, పైనాపిల్ జ్యూస్ – పావు కప్పు చొప్పున తయారీ: ముందుగా ఒక బౌల్లో 60 గ్రాముల కరిగించిన బటర్ వేసుకుని.. అందులో 100 గ్రాముల బ్రౌన్ సుగర్ పౌడర్ వేసుకుని బాగా కలిపాలి. ఆ మిశ్రమాన్ని గుండ్రటి షేప్‌లో ఉండే కేక్ బౌల్లో అర అంగుళం మందంలో విస్తరించాలి. దానిపైన గుండ్రటి పైనాపిల్ స్లైస్, చెర్రీతో డెకరేట్ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం పెద్ద బౌల్ తీసుకుని మైదాపిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసుకుని బాగా కలిపి ఉంచుకోవాలి. ఈలోపు మరో బౌల్లో మిగిలిన బటర్, బ్రౌన్ సుగర్, పంచదార పొడి వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సాయంతో క్రీమ్‌లా చేసుకోవాలి. అందులో గుడ్లు పగలగొట్టి వేసుకుని మరింత మెత్తటి క్రీమ్‌లా చేసుకోవాలి. మధ్యమధ్యలో మైదా–బేకింగ్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకుంటూ.. సోర్ క్రీమ్, పాలు, పైనాపిల్ జ్యూస్ కొద్దికొద్దిగా వేసుకుంటూ హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రిజ్‌లో పెట్టుకున్న కేక్ మేకర్ బౌల్ తీసుకుని దాని నిండుగా ఈ మిశ్రమాన్ని వేసుకుని సమాంతరంగా చేసుకుని ఓవెన్లో బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత నచ్చిన విధంగా కలర్‌పుల్ క్రీమ్స్‌తో డెకరేట్ చేసుకోవచ్చు. -
ఇదేం ఖర్మ పుతిన్.. చక్కెర కోసం కొట్టుకుంటున్న రష్యన్ ప్రజలు.. వీడియో వైరల్
ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్ ప్రకటించిన రష్యా తగ్గేదేలే అన్నట్లు ముందుకు వెళ్తోంది. మరోవైపు యుద్ధం కారణంగా రష్యాలో ప్రజల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఈ దాడులని వ్యతిరేకిస్తూ ప్రపంచ దేశాలన్నీ ఆంక్షల విధించి రష్యాను ఏకాకిని చేసిన సంగతి తెలిసిందే. అయినా రష్యా ఏమాత్రం తగ్గకుండా ఉక్రెయిన్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. మరోవైపు రష్యా మొత్తం ఆర్థిక సంక్షోభం సంభవిస్తోంది. చాలా దేశాలు ఆంక్షలు పేరుతో రష్యాకు దిగుమతులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో నిత్యావసరసరకులు కొరత కూడా రష్యా ప్రజలను వేధిస్తోంది. రష్యాలో వార్షిక ద్రవ్యోల్బణం 2015 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకోవడంతో చక్కెర ధరలు విపరీతంగా పెరిగాయి. అంతేగాక కొన్ని నిత్యావసరుకులు కొరత కారణంగా రష్యాలోని షాపులు కస్టమర్‌కి షరతులతో కూడిన సరకులను అందిస్తున్నాయి. తాజాగా ఓ సూపర్ మార్కెట్లో చక్కెర కోసం రష్యన్లు విచక్షణారహితంగా కొట్లాడుకున్నారు. ఒకరి దగ్గర ఉన్న చెక్కర ప్యాకెట్లను మరొకరు లాక్కున్నారు. చెక్కర కోసం కొట్లాడుకుంటున్న రష్యన్ ప్రజల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుత ఉక్రెయిన్ వ్యవహారం త్వరగా తేలకపోతే రష్యా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. Сахарные бои в Мордоре продолжаются pic.twitter.com/hjdphblFNc — 10 квітня (@buch10_04) March 19, 2022 -
Beauty Tips: ఇలా చేస్తే మెడపైన పేరుకున్న నలుపు దెబ్బకు వదులుతుంది!
Beauty Tips In Telugu: మెడ నల్లగా ఉందని బాధపడుతుంటారు చాలా మంది. కొంతమందికేమో కేవలం స్నానం చేస్తున్నప్పుడు మాత్రమే మెడ కడుక్కునే అలవాటు ఉంటుంది. అలా కాకుండా ఈ చిన్న చిట్కాలు పాటిస్తే సరి. టీ స్పూను కాఫీ పొడిలో టీస్పూను పంచదార, టీస్పూను ఈనోపొడి, టీస్పూను నిమ్మరసం, టీస్పూను కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన మెడకు అప్లై చేసి పదినిమిషాలపాటు మర్దన చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడు సార్లు ఇలా చేయడం వల్ల మెడపైన పేరుకున్న నలుపు వదిలి మెడ సహజసిద్ద రంగులో అందంగా కనిపిస్తుంది. మెడ మీదే కాకుండా మోచేతులు, మోకాళ్ల మీద ఉన్న నలుపునకు కూడా ఈ ప్యాక్ అప్లై చేస్తే నలుపు పోతుంది. ముఖం మరీ మురికి పట్టినట్టు అనిపిస్తే పాలు, మీగడ, పెరుగు, మజ్జిగ ఏది అందుబాటులో ఉంటే దానిని పట్టించి మెల్లగా రుద్దుకోవాలి. ఇవి సహజమైన క్లెన్సర్స్‌గా పనిచేస్తాయి. బయట దొరికే క్లెన్సింగ్ మిల్క్‌కు బదులుగా వీటిని వాడవచ్చు. ముఖాన్ని మామూలుగా శుభ్రం చేస్తున్నప్పటికీ దుమ్ముకణాలు చర్మం లోపలి గ్రంథుల్లోకి వెళ్తాయి. అలాంటప్పుడు ఈ క్లెన్సర్‌ను వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. చదవండి: Beauty Tips: కొబ్బరి నూనె.. కాఫీ పొడి.. ముఖం మెరిసిపోవడం ఖాయం -
షుగర్, అధికబరువుకు చెక్ చెప్పండిలా!
-
చక్కెర ఎగుమతులపై తాలిబన్ ఎఫెక్ట్ ?
ఇరవై ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల రాకతో మరోసారి అలజడి రేగింది. గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను కొత్తగా అధికార పీఠం కైవసం చేసుకున్న తాలిబన్లు గౌరవిస్తారా ? లేదా ? అసలు ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై వ్యాపార వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ముఖ్యంగా ఎగుమతి దారులు అఫ్గన్‌లో సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనాలని కోరుకుంటున్నారు. మంచి సంబంధాలు ఆఫ్ఘనిస్తాన్ , ఇండియాల మధ్య మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా అధికారంలో నిరంకుశ తాలిబన్లు ఉన్నా, అమెరికా మద్దతు ఉన్న ప్రభుత్వం ఉన్నా ఎగుమతులు, దిగుమతులు బాగానే జరిగాయి. ముఖ్యంగా అఫ్గన్ నుంచి ఇండియాకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా దిగుమతి అవుతుండగా ఇండియా నుంచి అఫ్గన్‌కి చక్కెర, తృణధాన్యాలు, టీ, సుగంధ ద్రవ్యాలు, ఔషధాలు, వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. 826 మిలియన్ డాలర్ల ఎగుమతులు గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం అఫ్గన్ నుంచి ఇండియాకు జరిగిన దిగుమతుల విలువ 509 మిలియన్ డాలర్లు ఉండగా ఇండియా నుంచి జరిగిన ఎగుమతుల విలువ 826 మిలియన్ డాలర్లుగా నమోదు అయ్యింది. ఎగుమతులు వన్ బిలియన్కి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండగా ఒక్కసారిగా అఫ్గన్‌లో సంక్షోభం తలెత్తింది ఇబ్బందులు తప్పవా ? ఇండియా నుంచి అఫ్గన్‌కి జరుగుతున్న ఎగుమతుల్లో ప్రధానమైంది చక్కెర. అఫ్గన్‌లో ఇండియా చక్కెరను భారీగా ఉపయోగిస్తారు. ఇండియా నుంచి సముద్ర మార్గంలో కరాచీ పోర్టుకు చేరకున్న చక్కెర అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అఫ్గన్ చేరుకుంటుంది. గతేడాది 6.24 లక్షల టన్నుల చక్కెర అఫ్గనిస్తాన్‌కి ఎగుమతి అయ్యిందని ఆలిండియా సుగర్ ట్రేడ్ అసోసియేషన్ తెలిపింది. ప్రస్తుత సంక్షోభంతో ఈ ఎగుమతి డోలాయమానంలో పడిందంటూ వారు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అఫ్గన్ లాంటి పెద్ద మార్కెట్‌ను కోల్పోతే ఇబ్బందులు తప్పవంటున్నారు. పరిస్థితులు చక్కబడతాయి మరోవైపు తాలిబన్లు అత్యవసర వస్తువులపై ఎక్కువగా దిగుమతి సుంకం విధించని, గతంలో 1996 నుంచి 2001 వరకు వారితో వ్యాపారం సజావుగానే జరిగిందంటున్నాడు పాతకాలం వర్తకులు. అధికార పీఠం గురించి జరిగే వివాదాలు సద్దుమణిగితే పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బంగారం రుణాల్లోకి షావోమీ ! -
కాకరకాయ కూర తరచూ తింటే షుగర్ అదుపులోకి వస్తుందా?
చక్కెరవ్యాధి ఉన్నవారు తరచూ కాకరకాయ కూర తింటూ ఉండటంగానీ లేదా రోజూ కాకరను తమ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల... చక్కెర అదుపులో ఉంటుందని భావిస్తుంటారు. ఇది ఒకరకంగా అపోహ లేదా పాక్షిక సత్యం మాత్రమే అని చెప్పవచ్చు. నిజానికి కాకరలో ఉండే రెండు ప్రధాన పోషకాలైన ‘కరాటిన్’, ‘మమోర్డిసిన్’లకు రక్తంలోని చక్కెరపాళ్లను కొంతవరకు తగ్గించే సామర్థ్యం ఉన్నమాట వాస్తవమే. అలాగే కాకర గింజలలో పాలీపెపై్టడ్–పీ అనే ఇన్సులిన్‌ను పోలిన పదార్థం కూడా ఉంటుంది. అది కూడా ఇన్సులిన్‌లాగా ప్రవర్తించి కొంతవరకు చక్కెరపాళ్లను అదుపు చేస్తుంది. అయితే... ఒకసారి డయాబెటిస్ వ్యాధి వచ్చిదంటే... అది కేవలం కాకరకాయ తినడం వల్ల మాత్రమే అదుపులో ఉండడమన్నది జరగదు. డయాబెటిస్ రోగులు కాకరకాయ కూర తింటున్నా చక్కెరను నియంత్రించే మందులు తీసుకోవాల్సిందే. కాకపోతే కాకరలో ఇంకా అద్భుతమైన గుణాలున్నాయి. ఆరోగ్యాన్ని సమకూర్చి పెట్టే కాకరలో పోషకాలు చాలా ఎక్కువ. పీచు పుష్కలం. క్యాలరీలు చాలా తక్కువ. పోషకాల విషయానికి వస్తే విటమిన్ బి1, బి2, బి3, సి లతో పాటు జీర్ణ వ్యవస్థను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచే ఫైబర్‌తో పాటు మెగ్నీషియమ్, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం ఉంటాయి. కాకర గింజలు కొవ్వును కరిగించి గుండె గదులు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా రక్షిస్తాయి. అలా గుండె పనితీరును క్రమబద్ధం చేస్తాయి. సి విటమిన్ చాలా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ కావడంతో అది దేహంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. ఆ ప్రక్రియతో మాలిగ్నంట్ కణాల (క్యాన్సర్ కారక కణాలు) తొలగిపోయి... క్యాన్సర్లు నివారితమవుతాయి. ఇలా అనేక రకాలుగా కాకర ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. చదవండి : కరోనా వచ్చిన తర్వాత నిద్రలేమా?.. ఇలా చేయండి! -
చక్కెర షేర్లు.. తియ్యటి ర్యాలీ
న్యూఢిల్లీ: చక్కెర కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు తీపి లాభాలను పంచుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే ఈ స్టాక్స్ మంచి ర్యాలీ చేయగా.. ఇక ముందూ లాభాలను ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్రెజిల్లో చక్కెర సాగు ఆశాజనకంగా లేనందున ధరలు పెరిగి, భారత కంపెనీలకు కలిసొస్తుందని భావిస్తున్నారు. బ్రెజిల్లో ఏప్రిల్ నెలలో పంచదార ఉత్పత్తి దాదాపు 35 శాతం వరకూ తగ్గింది. ఈ మేరకు భారత షుగర్ కంపెనీలకు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. ‘‘బ్రెజిల్ దక్షిణాది ప్రాంతంలో చక్కెర దిగుబడి ఏప్రిల్ నెల మొదటి అర్ధ భాగంలో 6,24,000 టన్నులు. అంతక్రితం ఏడాది ఏప్రిల్‌లో ఇదే కాలంలో ఉత్పత్తి 9,71,000 టన్నులుగా ఉంది. 2020లో ఇదే కాలంతో పోల్చి చూస్తే చెరకు క్రషింగ్ 30 శాతం తగ్గి 15.6 మిలియన్ టన్నులుగా ఉంది’’ అని చక్కెర ఉత్పత్తిదారుల సంఘం యూనికా పేర్కొంది. అదే సమయంలో భారత్‌లో మాత్రం పంచదార ఉత్పత్తి 2020 అక్టోబర్ – 2021 సెప్టెంబర్ సీజన్లో 41 లక్షల టన్నుల మేర పెరగడం గమనార్హం. అన్ని షేర్లదీ పరుగే..: ఆంధ్రా షుగర్స్, ఈఐడీ ప్యారీ, బలరామ్‌పూర్ చినీ, ధంపూర్ షుగర్, దాల్మియా, అవధ్ షుగర్.. ఇవన్నీ కూడా గత ఏడాది కాలంలో అద్భుతమైన రాబడులను ఇచ్చాయి. ప్రధానంగా గత మూడు నెలల్లోనే 50–100 శాతం మధ్య ర్యాలీ చేసి నూతన గరిష్టాలకు చేరాయి. సరఫరా కఠినంగా మారొచ్చు.. పంచదార ఉత్పత్తికి ప్రపంచంలో బ్రెజిల్ అతిపెద్ద మార్కెట్. ఇక్కడి ఉత్పత్తి పరిస్థితులు భారత్ కంపెనీల లాభాలను నిర్ణయించగలవు. బ్రెజిల్లో ఇప్పటికే చెరకు సాగు సీజన్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు దిగుబడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు సానుకూలించకపోవడంతో సాగు తగ్గిందని.. దీనివల్ల దిగుబడితోపాటు నాణ్యత కూడా క్షీణించొచ్చని అంచనా. దీనికితోడు థాయిలాండ్, ఈయూ సైతం చక్కెర ఉత్పత్తిని పెంచకపోవచ్చని.. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్–సరఫరా పరిస్థితులు సానుకూలంగా ఉండకపోవచ్చని ఎలారా సెక్యూరిటీస్ తెలిపింది. సైక్లికల్ కాదు.. భారత్‌లో షుగర్ పరిశ్రమ ధరల పరంగా ఇక ఎంత మాత్రం సైక్లికల్ కాబోదని (హెచ్చుతగ్గులు) జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. పాక్షిక నియంత్రణల నుంచి కూడా బయటకు రావచ్చని భావిస్తున్నట్టు తెలిపింది. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ, చక్కెర రైతులకు చెల్లింపులు సకాలంలో అందేలా చూడాలన్న ఉద్దేశం ఈ రంగానికి ఎంతో మేలు చేస్తుందని అంచనా వేస్తోంది. చక్కెరకు మద్దతు ధరలు, ఎగుమతి సబ్సిడీలు, ఇథనాల్ రూపంలో మద్దతు వంటి చర్యలు ఈ రంగంలోని కంపెనీలు నిలదొక్కుకునేలా చేస్తాయని పేర్కొంది. ఫలితంగా ఈ రంగంలోని పటిష్టమైన కంపెనీలు మరింత లాభాలు, నగదు ప్రవాహాలను చూస్తాయని జేఎం ఫైనాన్షియల్ అంచనా వేసింది. షేర్ల గమనం కంపెనీ ప్రస్తుత ధర 3 నెలల్లో ఏడాదిలో (రూ.లలో) పెరుగుదల(%) పెరుగుదల(%) అవధ్ షుగర్ 306 60 110 దాల్మియా భారత్ 318 98 364 ద్వారికేష్ షుగర్ 56 75 200 బలరామ్‌పూర్ చినీ 303 68 190 ధంపూర్ షుగర్ 318 78 206 -
కరోనాను జయించిన వందేళ్ల బామ్మ
హైదరాబాద్: కరోనాను జయించిన ఈ బామ్మ పేరు ఆండాళ్లమ్మ. సరూర్‌నగర్‌లోని వికాస్‌నగర్‌లో నివసిస్తున్న ఈమె శత వసంతాలు పూర్తి చేసుకుంది. కొద్దిగా వినికిడి సమస్య మినహా బీపీ, షుగర్ వంటి అనారోగ్య ఇబ్బందులు లేకపోవటం గమనార్హం. మహారాష్ట్రలో ఉండే మనుమరాలు, ఆమె భర్తకు కరోనా సోకటంతో హైదరాబాద్ తీసుకొచ్చి వైద్యం చేయించారు. ఈ క్రమంలో ఇటీవల ఆండాళ్లమ్మ కోవిడ్ బారినపడ్డారు. అయితే కరోనా వచ్చిందని తెలిసినా ఆమె ఏమాత్రం భయపడలేదు. మనోనిబ్బరంతో డాక్టర్లు సూచించిన విధంగా మందులు వాడి కరోనాను జయించింది. ఆమె ధైర్యంగా ఉండటమే కాక, కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇలా వందేళ్ల వయసులోనూ కరో నాను జయించిన బామ్మను చూసి చుట్టుపక్కల వారు అభినందిస్తున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు. చదవండి: కోవిడ్-19 రోగులకు ఆక్సీమీటర్లు ఎందుకు అవసరం? -
భారత్‌పై ఆక్రోశం? చక్కెర, పత్తికి పాకిస్తాన్లో తిప్పలు
ఇస్లామాబాద్: పక్కనున్న దేశంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అవసరమైన వస్తువుల దిగుమతిపై నిషేధం విధించగా తాజాగా మళ్లీ ఎత్తి వేసే ప్రయత్నాలు జరిగాయి. దీనిపై నిన్న మంత్రిమండలి కూడా నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతి చేసుకోవాలని తీర్మానించారు. అయితే ఒకరోజు తిరిగే లోపే ఆ నిర్ణయానికి బ్రేక్ పడింది. దీంతో ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు చుక్కెదురైంది. భారత్ నుంచి వస్తువుల దిగుమతికి ఆ దేశంలోని జాతీయ సంస్థ నిరాకరించింది. 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌పై తీసుకున్న చర్యలతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి నుంచి భారత్ నుంచి దిగుమతి చేసుకునే పత్తి, చక్కెర తదితర వస్తువులపై నిషేధం విధించింది. పాకిస్తాన్ మంత్రిమండలి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అధ్యక్షతన బుధవారం సమావేశమై భారత్ నుంచి దిగుమతులు పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు పత్తి, చక్కెర దిగుమతులకు తిరిగి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే తెల్లారే గురువారం పాకిస్తాన్లో ఆర్థిక సహకార కమిటీ (ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ-ఈసీసీ) ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. భారత్ నుంచి దిగుమతులు అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే మంత్రిమండలి తీసుకున్న నిర్ణయమే ఫైనలా? లేదా ఆర్థిక కమిటీ నిర్ణయం ఫైనలా అనేది తేలాల్సి ఉంది. భారత్‌ను దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో పాక్ వైఖరి ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్లో ఆహార కొరత తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే చక్కెర, పత్తి కొరత తీవ్రంగా ఉంది. అందుకే వాటిని తిరిగి దిగుమతి చేసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తుండగా ఆ నిర్ణయానికి ఆర్థిక కమిటీ నిరాకరించింది. మరి ఇమ్రాన్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
‘‘బీపీ, షుగర్ ఉన్నాయి.. ప్లీజ్ నన్ను గెలిపించండి’’
సాక్షి, చెన్నై: ఆరోగ్యశాఖను తన భుజస్కంధాలపై మోస్తున్న మంత్రే తనకు ఉన్న బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలను గుర్తు చేస్తూ ప్రచారంలో పడడం సర్వత్రా విస్మయంలోకి నెట్టింది. పుదుకోట్టై జిల్లా నుంచి విరాళిమలై నుంచి విజయభాస్కర్ ఇప్పటికే రెండు సార్లు గెలిచారు. ఆరోగ్య మంత్రిగా అత్యధిక సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి విజయభాస్కర్. కరోనా కాలంలో ఆయన సేవలు ప్రశంస నీయం. తాజాగా అదే విరాళిమలై నుంచి మళ్లీ పోటీలో విజయభాస్కర్ ఉన్నారు. అయితే, సెంటిమెంట్‌తో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఆయన తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు చర్చకు విస్మయానికి దారి తీసింది. తనకు బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నాయని, తనను ఆదరించాలన్నట్టు ఆయన ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై వ్యంగ్యాస్త్రాలు, సెటైర్లు వేసే వాళ్లు పెరిగారు. దీంతో గురువారం విజయభాస్కర్ ఓ మీడియాతో మాట్లాడుతూ, వివరణ ఇచ్చుకున్నారు. తానేమీ సెంటిమెంట్‌తో ఓట్ల కోసం పాకులాడడం లేదన్నారు. వాస్తవిక జీవితంలో తనకు ఉన్న సమస్యలను గుర్తు చేయడంలో తప్పులేదన్నారు. ఈ నియోజకవర్గంలో తాను అడగాల్సిన అవసరం లేదని, తన ముఖం కనిపిస్తే చాలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్లు ఎక్కువేనని పేర్కొన్నారు. తాను ఏ మేరకు సేవల్ని అందించానో వివరిస్తూ ఓ చోట చేసిన ప్రసంగాన్ని వక్రీకరించినట్టు పేర్కొన్నారు. వాస్తవిక జీవితంలో వి శ్రాంతి లేకుండా సేవల్ని అందించానని, అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ చోట బీపీ, షుగర్ గురించి మాట్లాడనే గానీ, ఇందులో తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. ఈ ప్రచారం పుణ్యమా అని ఆరోగ్యమంత్రి అనారోగ్య మంత్రయ్యాడంటూ వ్యంగ్యాస్త్రాలు హోరెత్తడం గమనార్హం. చదవండి: ఓటుకు నోటు ఇవ్వలేను.. మీరే నాకివ్వండి -
మధుమేహగ్రస్థులు చక్కెరకు బదులు ఇది వాడొచ్చా?
చక్కెర.. పరిమితంగా తీసుకున్నంతవరకు తియ్యగానే ఉంటుంది... ఒకస్థాయిని మించితే మాత్రం ఆరోగ్యానికి చేదే! పరిమితి దాటిన చక్కెర మధుమేహంలాంటి అనేక అనారోగ్య సమస్యలు సృష్టిస్తుంది. అందుకే ఆరోగ్యంపై అవగాహన ఉన్న చాలామంది చక్కెరను దూరం పెడుతున్నారు. మరికొందరు మితంగా తీసుకుంటున్నారు. ఇంకొందరు ప్రత్యామ్నాయం ఎంచుకుంటున్నారు. ఈ ప్రత్యామ్నాయాల్లో ప్రకృతి సిద్ధంగా లభించే తేనెతోపాటు కృత్రిమంగా తయారుచేస్తున్న స్టివియా, ఎరిత్రిటోల్, గ్జైలిటోల్ వంటివి ఉన్నాయి. ఈ కోవలోకి తాజాగా అగావె నెక్టర్, అగావె షుగర్ చేరాయి. మధుమేహగ్రస్థులు వీటిని సాధారణ చక్కెరకు బదులు వాడొచ్చని విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అందులోని వాస్తవాలేంటో తెలుసుకుందామిలా.. అగావె అంటే? అగావె అంటే మన దగ్గర కనిపించే కలబందలో ఒకరకం. ఉత్తర అమెరికాలోని మెక్సికోలో సుమారు 200కు పైగా కలబంద రకాలు కనిపిస్తాయి. వీటిలో రెండింటి నుంచి ఈ అగావె నెక్టర్(కలబంద తేనె), అగావె సుగర్ (కలబంద చక్కెర)ను తయారుచేస్తారు. అగావె నెక్టర్నే అగావె సిరప్గానూ వ్యవహరిస్తారు. ఇవి రెండే కాక కలబంద నుంచి ఆల్కహాల్ సైతం తయారుచేస్తారు. ఈ మూడింటి వినియోగం మెక్సికోలో శతాబ్దాలుగా ఉంది. సాధారణ చక్కెర కంటే మేలా? అన్ని చెట్లు, మొక్కల్లాగే కలబందలోనూ మన ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని మూలకాలు ఉన్నాయి. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్థులు సాధారణ చక్కెరకు ప్రత్యామ్నాయంగా కలబంద చక్కెర, తేనె తీసుకోవడంపై అనేక వాదనలున్నాయి. నిజానికి అగావె కలబందలో ఫ్రక్టోన్స్ లాంటి ఆరోగ్యకర ఫైబర్స్ ఉంటాయి. ఇవి జీవక్రియ సరిగా జరగడంలో తోడ్పడతాయి. అయితే, ఈ కలబందను తేనె, చక్కెరగా మార్చే ప్రక్రియలో వాటిలోని ఫైబర్స్ విచ్ఛిన్నమవుతాయి. ఫలితంగా వాటి సహజ లక్షణం కోల్పోతాయి. సాధారణంగా ఆహారంలోని చక్కెర ఎంత వేగంగా రక్తంలోకి చేరుతుందనేదానికి గ్లైస్మిక్ ఇండెక్స్(జీఐ)ను కొలమానంగా పరిగణిస్తారు. కాబట్టి జీఐ అధికంగా ఉంటే చక్కెర వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే గ్లూకోజ్లాగా ఫ్రక్టోజ్ రక్తంలోని చక్కెర స్థాయిలను తక్కువ వ్యవధిలోనే పెంచలేదు. అందువల్ల ఫ్రక్టోజ్ స్థాయి అధికంగా ఉన్న తీపి పదార్థాలను ఆరోగ్యకరమైనవిగా, మధుమేహ రోగులకు మేలు చేసేవిగా పరిగణిస్తారు. దీని ప్రకారం తక్కువ జీఐ ఉన్న కలబంద తేనె/చక్కెరలో ఫ్రక్టోజ్ ఎక్కువగానూ గ్లూకోజ్ తక్కువగానూ ఉండడంతో అది సాధారణకు చక్కెర కంటే మేలని ప్రచారంలోకి వచ్చింది. ఎలుకలపై చేసిన ఓ ప్రయోగం సైతం దీనిని బలపర్చింది. ఈ ప్రయోగంలో కొన్ని ఎలుకలకు సాధారణ చక్కెరను, మరికొన్నింటికి కలబంద చక్కెర ఇచ్చి 34 రోజుల తర్వాత వాటిని పరిశీలించారు. ఇందులో కలబంద చక్కెర తిన్న ఎలుకలు తక్కువ బరువు పెరగడంతోపాటు వాటి రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువున్నట్లు తేలింది. అయితే, ఈ ప్రయోగం కాలవ్యవధి స్వల్పం కావడంతో సాధారణ చక్కెరలోని గ్లూకోజ్.. రక్తంలోని సుగర్, ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేసినట్లు కలబంద చక్కెరలోని ఫ్రక్టోజ్ చేయకలేకపోయింది. అందువల్లే కలబంద తేనెలో తక్కువ జీఐ స్థాయి ఉన్నట్లు చూపుతోంది. ♦ సాధారణ చక్కెరలో, మొక్కజొన్న గింజలతో తయారుచేసే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్(హెచ్‌ఎఫ్‌సీఎస్)లోనూ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ చెరో 50శాతం ఉంటాయి. అయితే, కలబంద తేనె, చక్కెరలో దాదాపు 85శాతం ఫ్రక్టోజే ఉంటుంది. ♦ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ లక్షణాలు చాలావరకు ఒకదానికొకటి సామీప్యంగా ఉన్నప్పటికీ మన శరీరంపై అవి చూపే ప్రభావాలు విభిన్నం. ♦ ప్రతిరోజు మనం తీసుకునే పండ్లు, కూరగాయలు, ఆహారంలో గ్లూకోజ్ తగినంత ఉంటుంది. ఒక్కోసారి మన శరీరం కూడా సొంతంగా కొంతమేర గ్లూకోజ్‌ను తయారుచేసుకుంటుంది. వాస్తవానికి అన్ని జీవకణాల్లోనూ గ్లూకోజ్ తప్పనిసరి మూలకం. ♦ మన శరీరంలోని ప్రతి కణం గ్లూకోజ్‌ను జీవక్రియకు ఉపయోగించుకోగలదు. కాలేయం మాత్రం ఫ్రక్టోజ్‌ను తన జీవక్రియకు వినియోగించుకుంటుంది. ♦ శరీరంలో ఫ్రక్టోజ్ అధికంగా చేరితే కాలేయంలో శోషణ ఎక్కువై అది కొవ్వుగా మారుతుంది. ఫలితంగా రక్తప్రసరణలో సమస్యలు ఏర్పడతాయి. జీవక్రియపై దుష్ప్రభావం చూపుతుంది. టైప్2 డయాబెటిస్, ఫాటీ లివర్ డిసీజ్ వస్తాయి. అనేక పరిశోధనలు దీన్ని రుజువు చేశాయి. ♦ శరీరంలో ఫ్రక్టోజ్ ఎక్కువైనప్పుడు కొవ్వు శాతం పెరిగి రక్తంలో సుగర్, ఇన్సులిన్ స్థాయిలు అధికమవుతాయి. ఫలితంగా మెటబాలిక్ సిండ్రోమ్, టైప్2 డయాబెటిస్‌కు దారితీస్తాయి. అలాగే చెడు కొవ్వు విపరీతంగా పెరిగిపోయి ఊబకాయానికి దారితీస్తుంది. ♦ అందువల్ల మధుమేహగ్రస్థులు కలబంద తేనె/చక్కెరకు బదులు స్టివియా, ఎరిత్రిటోల్, గ్జైలిటోల్ వంటి ప్రత్యామ్నాయ చక్కెర/సిరప్‌లను తీసుకోవడం ఉత్తమం. సో.. మిగిలిన అన్ని రకాల చక్కెరలతో పోలిస్తే కలబంద చక్కెరలో అతి తక్కువ తీపిస్థాయిలు ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా సాధారణ చక్కెరే శ్రేష్టం! చదవండి: -
‘దేశీ’ ఉత్పత్తులే దివ్యౌషధాలు!
ఇదొక విలక్షణ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం. అపురూపమైన దేశీ వరి రకాలతోపాటు.. అరుదైన గడ్డి రకాలు కూడా అక్కడ సాగవుతున్నాయి. అంతేకాదు.. ఔషధ విలువలు కలిగిన ప్రత్యేక దాణా మేపు ద్వారా దేశీ ఆవుల పెంపకం ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం విశిష్టత. ఈ ఆవుల పాలతో తయారైన పెరుగు, నెయ్యి దివ్యౌషధాలుగా పనిచేస్తున్నాయని, వీటిని తిన్న వారిలో మందులు వాడకుండానే షుగర్ నియంత్రణలో ఉంటున్నదని పశువైద్య శాస్త్రవేత్త డా. సాయి బుచ్చారావు చెబుతున్నారు. దీనిపై మరింత లోతైన అధ్యయనం చేయడానికి జాతీయ పోషకాహార సంస్థ (ఎన్.ఐ.ఎన్.) ఇటీవల సుముఖత తెలిపిందని వెల్లడించారు. మూడేళ్లు కొనసాగే ఈ ప్రయోగం శాస్త్రీయంగా రుజువైతే షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు జరగడంతోపాటు.. దేశీ ఆవుల పెంపకందారులకు స్థిరమైన మంచి ఆదాయం కూడా సమకూరుతుందనటంలో సందేహం లేదు. సిద్ధార్థ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం శివారులో 27 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రముఖ ఆర్కిటెక్ట్ వేగిశ్న శ్రీనివాస్ రాజు దేశవాళీ గోజాతులపై ఉన్న అమితమైన ప్రేమతో తన భూమిని రాజీలేని గో ఆధారిత ప్రకతి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దారు. 18 సాహివాల్ దేశవాళీ ఆవులను పెంచుతున్నారు. పంటలు, పశుగ్రాసం సాగులో గాని, ఆవుల పోషణలో గాని రసాయనాలకు ఏమాత్రం చోటివ్వకుండా పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తుండటం విశేషం. అంతరించిపోతున్న దేశవాళీ వరి వంగడాల్లో పోషకాలతో పాటు ఔషధ విలువలు పుష్కలంగా ఉంటాయని రాజు నమ్ముతూ ఈ రకాలనే మూడేళ్లుగా సాగు చేస్తున్నారు. రత్నచోడి, నవార, బ్లాక్ రైస్, బహురూపి, నారాయణ కామిని, తెల్లహంస తదితర దేశీ రకాల ధాన్యాన్ని పండిస్తున్నారు. ఈ రకాలు 130–150 రోజుల్లో కోతకు వస్తాయి. ధాన్యాన్ని అమ్మటం లేదు. తానే బియ్యం పట్టించి షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని సైతం పొందుతున్నారు. క్వింటా మార్కెట్లో రూ.10 వేల ధర పలుకుతున్నదన్నారు. పిండి పదార్థం తక్కువగా, పీచు శాతం ఎక్కువగా ఉండి దేహానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అంటారు. దేశీ వరి రకాల విత్తనాలను ఆసక్తి ఉన్న రైతులకు అందజేçస్తున్నారు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులు వరి సాగులో ఎకరాకు రూ.20 వేలు ఖర్చు చేస్తుంటే.. ఈయన రూ. 11,500 ఖర్చుతో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం, కషాయాలు రైతు స్వయంగా తయారు చేసుకొని వాడాలి. కాయకష్టమే తప్ప పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. పైగా ఆరోగ్యమైన ఉత్పత్తులు చేతికి అందుతాయి అంటున్నారు శ్రీనివాస్ రాజు. ఆవుల కోసం ఏడు రకాల గడ్డి సాగు 18 దేశవాళీ సాహివాల్ ఆవుల మేత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏడు రకాల కాయ, పప్పు జాతుల పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. 25% ప్రొటీన్ కలిగి ఉండే ఛాయ (స్పినాచ్ ట్రీ) పశుగ్రాస చెట్లను సాగు చేస్తున్నారు. తూ.గో. జిల్లా నుంచి తెప్పించిన చెంగల్వ గడ్డి, గుజరాత్ నుంచి తెచ్చిన జింజువ గడ్డితోపాటు సూపర్ నాపియర్, హెడ్జ్ లూసర్న్ తదితర రకాల గడ్డిని ఆరు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ప్రముఖ పశువైద్య నిపుణులు డా. సాయిబుచ్చారావు సూచనల మేరకు వీటి ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఔషధ గుణాలతో కూడిన దాణా రసాయన రహితంగా ఈ వ్యవసాయ క్షేత్రంలో పండించిన జొన్నలు, మొక్కజొన్నలు తదితర ముడి పదార్థాలనే ఆవులకు దాణాగా వాడుతున్నారు. అంతేకాదు.. ఆ దాణాలో 21 రకాల ఔషధ మొక్కల నుంచి సేకరించిన వేర్లు, ఆకులు, కాండాలను ప్రత్యేక శ్రద్ధతో ఆయుర్వేద నియమాల ప్రకారం శుద్ధి చేసి.. పొడిగా చేసి.. ఆ పొడిని కలిపిన దాణాను సాహివాల్ ఆవులకు మేపుతున్నారు. వ్యవసాయ పనుల కోసం ఒంగోలు జాతి గిత్తలను పోషిస్తున్నారు. దేశీ ఆవుపాల ఉత్పత్తులపై పరిశోధన సీనియర్ పశువైద్య నిపుణులు డాక్టర్ ఎం. సాయి బుచ్చారావు దేశీ గోజాతులపై గత 8 సంవత్సరాలుగా విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు. ఔషధ మూలికల పొడిని తగు మోతాదులో కలిపిన దాణాను దేశీ ఆవులకు తినిపించడం ద్వారా.. వాటి పాలల్లో ఔషధ గుణాలను పెంపొందించవచ్చని ఆయన అంటున్నారు. ఈ పాలతో తయారైన పెరుగు, నెయ్యి తిన్న వారిలో మధుమేహం (టైప్1, టైప్2 కూడా) మందులతో అవసరం లేకుండా నియంత్రణలోకి వస్తుందని 2012 నుంచి తాను నిర్వహిస్తున్న పరిశోధనల్లో తేలిందని ఆయన తెలిపారు. తూ.గో. జిల్లా తాపేశ్వరం, ప.గో. జిల్లా ఐ. భీమవరం, చిన్నకాపవరంలలో ఒంగోలు, గిర్, సాహివాల్ ఆవులతో పరిశోధనలు చేశానన్నారు. వీటి పెరుగు, నెయ్యి తిన్న వారిలో మధుమేహం నియంత్రణ మందులు అవసరం లేకుండా సాధ్యపడిందని డా. సాయి బుచ్చారావు అన్నారు. అధ్యయనానికి ఎన్.ఐ.ఎన్. సింసిద్ధత ఔషధ మూలికల పొడితో కూడిన దాణా తినటం వల్ల దేశీ ఆవుల పాల ఉత్పత్తుల్లో ఏయే మార్పులు చోటుచేసుకుంటున్నదీ తెలుసుకోవడానికి గతంలో ప్రయోగశాలలో లోతైన అధ్యయనం నిర్వహించలేదని డా. సాయి బుచ్చారావు తెలిపారు. ఈ నేపథ్యంలో లోతైన పరీక్షలు చేయడానికి రీసెర్చ్ ప్రాజెక్టును చేపట్టేందుకు హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్.ఐ.ఎన్.) ఇటీవలే ప్రాథమికంగా అంగీకారం తెలిపిందని డాక్టర్ సాయి బుచ్చారావు వెల్లడించారు. ఈ పూర్వరంగంలో సిద్ధార్థ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రం కేంద్రంగా ఎన్.ఐ.ఎన్. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ అనంతన్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం మూడేళ్లపాటు ఈ పరిశోధనలు నిర్వహించనుంది. ఈ ప్రయోగాలు పూర్తిగా విజయవంతం అయితే దేశీ గోజాతుల పెంపకంపై రైతులకు ఆసక్తితోపాటు వాటి సంతతి పెరుగుతుందని డా. సాయిబుచ్చారావు ‘సాక్షి’తో చెప్పారు. మధుమేహాన్ని పారదోలడంతో పాటు దేశీ ఆవులను పెంచి పోషించే రైతులకు స్థిరమైన ఆదాయ మార్గం చూపడమే తమ లక్ష్యమని డా. సాయి బుచ్చారావు అంటున్నారు. – కైరంకొండ నర్సింలు, సదాశివపేట రూరల్ ఎన్.ఐ.ఎన్. అంగీకారం సంతోషదాయకం ఔషధ మూలికల దాణా తిన్న దేశీ ఆవుల పెరుగు, నెయ్యిలో మధుమేహాన్ని నియంత్రించే సుగుణం ఉందని నా 8 ఏళ్ల పరిశోధనలో తెలుసుకున్నాను. అయితే, 3 నెలల తర్వాత కొందరి సుగర్ లెవల్స్‌లో హెచ్చు తగ్గులు కనిపించాయి. అందుకు గల కారణాలపై గతంలో లేబరేటరీ పరీక్షల ద్వారా పరిశోధించలేదు. ప్రాథమిక పరిశోధనా ఫలితాలను పరిశీలించిన మీదట లోతుగా అధ్యయనం చేయడానికి జాతీయ పోషకాహార సంస్థ(ఎన్.ఐ.ఎన్.) అంగీకరించటం సంతోషదాయకం. దేశీ ఆవులతోపాటు సంకర జాతి/విదేశీ జాతుల ఆవులు, గేదెలపై కూడా గతంలో పరిశోధన చేశా. అయితే, సంకర జాతి/విదేశీ జాతుల ఆవుల పెరుగు, నెయ్యి తిన్న మధుమేహ రోగుల్లో ఎటువంటి సత్ఫలితాలు కనిపించలేదు. గేదె పెరుగు, నెయ్యి ద్వారా ఫలితాలు కొంతవరకు కనిపించాయి. తాజాగా ఎన్.ఐ.ఎన్. చేపట్టబోయే పరిశోధనల్లోనూ దేశీ ఆవులతోపాటు సంకరజాతి, గేదెలపై కూడా పరిశోధన జరుగుతుంది. – డా. ఎం.సాయి బుచ్చారావు , (99122 92229), ప్రముఖ పశువైద్య శాస్త్రవేత్త -
షుగర్‌తో డిప్రెషన్.. జాగ్రత్త
న్యూఢిల్లీ: దేశంలోని మెజారిటీ ప్రజలకు తియ్యటి పదార్ధాలంటే విపరీతమైన ఇష్టం. కానీ అదే పనిగా తీపి పదార్ధాలను తినడం ద్వారా కోవ్వు పెరుగుతుందని మనందరికి ఇది వరకే తెలుసు. కానీ ఆశ్చర్యకరంగా తీపి పదార్ధాలకు డిప్రెషన్‌కు సంబంధం ఉన్నట్లు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ నివేదిక తెలిపింది. అయితే ఆహార పదార్ధాల ద్వారా వ్యక్తి స్పందనలు ఉంటాయని తెలిపింది. కాగా రెండు రకాల షుగర్లు కీలక పాత్ర పోషిస్తాయి. 1)సింపల్ షుగర్ 2)ప్రాసెస్డ్ షుగర్ 1) సింపల్ షుగర్: కూరగాయలు, పండ్లలో సింపుల్ షుగర్ ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు(మినరల్స్) సమృద్ధిగా లభిస్తాయి. 2) ప్రాసెస్డ్ షుగర్: ఇందులో ఏ విధమైన షోషక విలువలు, కేలరీలు ఉండవు. ఉదా: చాక్లెట్స్, సాప్టడ్రింక్స్ (కూల్‌డ్రింక్స్) అయితే మన శరీరంలో తియ్యటి పదార్ధాల చేరాక కార్బోహైడ్రేట్స్‌గా ఉన్న పదార్ధాలను గ్లూకోజ్లోకి మార్చుతాయి. అయితే తియ్యటి పదార్ధాలు తింటే ఎక్కువ స్ధాయిలో డోపమైన్ విడుదలవుతుంది(సంతోషం కలిగించే హార్మోన్). మరోవైపు ఎక్కువ తియ్యటి పదార్ధాలు తిన్నట్లయితే షుగర్‌ను స్థిరీకరిచేందుకు రసాయన చర్యలు జరుగుతాయి. ఈ క్రమంలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ సమస్యలతో బాధపడతారని నివేదిక తెలిపింది. కాగా షుగర్ ఎక్కువగా తీసుకుంటే పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా మనసిక సమస్యలు, డిప్రెషన్‌తో బాధపడతారని సైన్స్ రిపోర్ట్ జర్నల్ అధ్యయనం తెలిపింది. అయితే షుగర్(తీపి పదార్ధాలు) ను అప్పుడప్పుడు మితంగా తీసుకుంటే సమస్యలు ఉండకపోవచ్చని నివేదిక తెలిపింది. మరోవైపు షుగర్ సమస్యతో బాధపడేవాళ్లు చాలా జగ్రత్తతో ఉండాలని అధ్యయనకర్తలు సూచిస్తున్నారు. టైప్ 1డయాబెటిస్(మధుమేహం) సమస్యతో బాధపడేవారు ఇన్సూలిన్ మార్పులను గమనించాలి. లేకుంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే జీవక్రియల సమతూల్యత కోల్పోయి డిప్రెషన్ సమస్యకు దారితీయొచ్చని ప్లస్ వన్ జర్నల్ అధ్యయనం పేర్కొంది. -
‘తీపి’ తగ్గింది!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నష్టాల ఊబిలో ఉన్న చక్కెర కంపెనీలకు లాక్డౌన్ మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. డిమాండ్ లేకపోవడం, సరఫరా సమస్యలు పరిశ్రమకు కొత్తగా తోడయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా 50 శాతం మేర అమ్మకాలు పడిపోయాయని పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. ఫ్యాక్టరీల వద్ద షుగర్ నిల్వలు పేరుకుపోయాయి. ఆదాయం తగ్గడం, కార్మికుల వేతనాలు, వడ్డీలు.. వెరసి చేతిలో ఉన్న మూలధనం కాస్తా ఆవిరైందని కంపెనీలు అంటున్నాయి. ఇప్పట్లో ఈ రంగం కోలుకోవడం కష్టమేనని కంపెనీల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశవ్యాప్తంగా నెలకు సుమారు 22 లక్షల టన్నుల చక్కెర అమ్ముడవుతోంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం గత సీజన్లో భారత్‌లో 172 మిల్లులు చక్కెర ఉత్పత్తి చేయగా.. ప్రస్తుత సీజన్లో ఈ సంఖ్య 139కి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నష్టాల్లోనే కంపెనీలు.. బస్తా (100 కిలోలు) చక్కెర ఉత్పత్తి వ్యయం ప్రస్తుతం రూ.4,000 పైమాటే. మిల్లుల వద్ద విక్రయ ధర రూ.3,400 ఉంది. అంటే ఒక్కో బస్తాపై కంపెనీలు రూ.600 నష్టం మూటగట్టుకుంటున్నాయి. చిన్న కంపెనీలకైతే∙రూ.700 వరకు నష్టం వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 100 కిలోల బస్తాకు మిల్లు వద్ద అమ్మకం ధర రూ.4,200 ఉంటేనే కంపెనీలు మనగలవని కేసీపీ షుగర్, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి.వెంకటేశ్వర రావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఒకట్రెండు కంపెనీలు మినహా మిగిలినవన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయని చెప్పారు. శానిటైజర్ల తయారీని కొన్ని కంపెనీలు చేస్తున్నప్పటికీ, వీటి ద్వారా వచ్చే ఆదాయం తాత్కాలికమేన న్నారు. రికవరీ ఇప్పట్లో కష్టమే..: కౌలు ధర అధికంగా ఉండడం, కూలీ ఖర్చులు తడిసిమోపెడు అవడం, ఉత్పత్తికి ధర లేకపోవడంతో చెరకు పంట వేయడానికి రైతులు ముందుకు రావడం లేదని వెంకటేశ్వరరావు తెలిపారు. ‘రైతులకు మిల్లులు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయి. దేశంలో అప్పులు లేని కంపెనీలు ఒకట్రెండు మాత్రమే ఉంటాయి. వైరస్ భయానికి ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి కార్మికులు రావడం లేదు. లాక్డౌన్ తదనంతరం తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఆరు నెలలకుపైగా సమయం పడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్యోగుల కోత, వేతనాల కుదింపు తప్పదు. మిల్లు వద్ద విక్రయ ధర పెరిగితే తప్ప ఈ పరిశ్రమ రికవరీ ఇప్పట్లో కనపడడం లేదు’ అని చెప్పారు. అక్టోబర్ నాటికి..: దేశంలో 2019 అక్టోబరు 1 నాటికి 110 లక్షల టన్నుల చక్కెర నిల్వలు ఉన్నాయి. 2019–20 (అక్టోబర్–సెప్టెంబర్) క్రషింగ్ కాలంలో దేశవ్యాప్తంగా 270 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని సమాచారం. ఈ ఏడాది 50–60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి కావచ్చని పరిశ్రమ భావించగా, ఇప్పటికి సుమారు 30 లక్షల టన్నులే ఎగుమతైంది. అంతర్జాతీయంగా తక్కువ ధర, సరఫరా సమస్యల కారణంగా 10 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి ఆగిపోనుందని ఓ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఏడాది అక్టోబరు 1 నాటికి చక్కెర నిల్వలు దేశంలో సుమారు 75 లక్షల టన్నులు ఉంటాయని ఆయన చెప్పారు. -
ఆ రెండూ దొరకట్లేదు..
సాక్షి, హైదరాబాద్: కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. వైరస్‌ను కట్టడి చేసేందుకు దోహదం చేసే మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్, డెటాల్ తదితర ఉత్పత్తుల రేట్లు గణనీయంగా పెరిగాయి. మరోవైపు కృతిమ కొరత కూడా సృష్టిస్తూ రేట్లు పెంచి యథేచ్ఛగా అమ్మకాలు జరుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తారనే ప్రచారంతో రక్తపోటు, మధుమేహానికి సంబంధించిన మాత్రలు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ఇక అజిత్రోమైసిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. అజిత్రోమైసిన్ మాత్ర రూ.22 ఉండగా, ఇప్పుడు రూ.30–32 వరకు పలుకుతోంది. మాస్కులకు కటకట.. కరోనా మహమ్మారి విశ్వరూపం చూపుతుండటం.. వైరస్ నియంత్రణకు నిరంతరం చేతులు శుభ్రం చేసుకోవాలని, మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు, ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. దీంతో మార్కెట్లో మాస్కులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఇక ఎన్–95 మాస్కుల ధరలకైతే రెక్కలొచ్చాయి. నెల రోజుల క్రితం వరకు రూ.75 ఉన్న ఈ మాస్కు ధర ప్రస్తుతం రూ.350 నుంచి 400కు చేరింది. మామూలు మాస్కుల ధర రూ.3–5 నుంచి 25–30 వరకు పెరిగింది. ఇక హ్యాండ్‌వాష్‌లు అంతంతగానే లభ్యమవుతున్నాయి. హ్యాండ్‌వాష్‌కు ఉపయోగించే శానిటైజర్లు, డెటాల్, శావిలియన్ సబ్బులు కూడా దొరకడంలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు నకిలీ శానిటైజర్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. కరోనా భయంతో ఉన్న ప్రజలను మోసగించేందుకు నకిలీ శానిటైజర్ల తయారీ ముఠాలు రంగంలోకి దిగాయి. పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేయడంతో నకిలీ శానిటైజర్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. నకిలీ శానిటైజర్ల వాడకంతో చేతులకు బొబ్బలు వస్తున్నట్లు గుర్తించినందున జాగ్రత్త వ్యవహరించాలని సూచించింది. మరోవైపు ప్రముఖ కంపెనీలు విక్రయించే శానిటైజర్ల కొరత తీవ్రంగా ఉంది. దీనికితోడు లాక్‌డౌన్‌తో సరుకు రవాణా నిలిచిపోవడం, ఉత్పత్తులపై కూడా ప్రభావం చూపడంతో ప్రస్తుతం మార్కెట్లో శానిటైజర్లు మచ్చుకైనా కనిపించట్లేదు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ అమ్మకాలు బంద్ హైడ్రాక్సీ క్లోరోక్విన్, హెచ్సీక్యూఎస్ టాబ్లెట్ల అమ్మకాలను ప్రభుత్వం దాదాపు నిలిపేసింది. శ్వాసకోస, మలేరియా రోగుల కోసం వినియోగించే ఈ మాత్రలే ప్రస్తుతం కరోనా బాధితుల కోసం ఉపయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉపద్రవం ముంచుకొస్తే ఈ మాత్రల కొరత రాకుండా ముందస్తు జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే హోల్‌సేల్ డీలర్ల నుంచే కాకుండా మెడికల్ షాపుల నిర్వాహకుల వద్ద ఉన్న ఈ మాత్రలను వెనక్కి తీసుకుంటున్నట్లు సమాచారం. పైగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులు విచ్చలవిడిగా వాడితే గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని, డాక్టర్ల సలహా మేరకు మాత్రమే వాడాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలావుండగా, బీపీ, షుగర్ పేషెంట్లు మాత్రం ముందుచూపుతో మూడు నెలలకు సరిపడా మందులు కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ రోగుల మాత్రలు ఇట్టే అమ్ముడుపోతున్నట్లు మందుల దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే.. కండోమ్‌ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. లాక్డౌన్ నేపథ్యంలో 15 రోజులు ఎవరూ గడప దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి లేకపోవడంతో అంతా ఇంటికి పరిమితమయ్యారు. కరోనాకు ముందు మార్కెట్లో కండోమ్‌ల అమ్మకాలు విరివిగా ఉండేవి. ప్రస్తుతం వీటిని అడిగేవారే కరువయ్యారని ఓ మెడికల్ షాప్ నిర్వాహకుడు చెప్పారు. -
ఆయుష్షును తగ్గించే చక్కెర
చక్కెర ఎక్కువగా తింటే ఒళ్లు పెరిగిపోయి మధుమేహం వస్తుందని మనకు చాలాకాలంగా తెలుసు. అయితే ఈ తెల్లటి విషం మన ఆయుష్షును కూడా తగ్గించేస్తుందని అంటున్నారు యూకేలోని ఎమ్మార్సీ లండన్ ఇన్స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు. అధిక చక్కెరతో మీకు ఊబకాయం రాకున్నా సరే. ఆయుష్షు తగ్గడం మాత్రం గ్యారెంటీ అని వీరు హెచ్చరిస్తున్నారు. సెల్ మెటబాలిజమ్ అనే జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. చక్కెర ఎక్కువగా తినడం వల్ల శరీరంలో యూరిక్ ఆసిడ్ పేరుకుపోవడం వల్ల జీవితకాలం తక్కువ అవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ హెలెనా కోచెమ్ అంటున్నారు. ఈగలకు చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారం ఇచ్చి తాము పరిశీలనలు జరిపామని, మనుషుల మాదిరిగానే వాటికీ చక్కెరతో ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం వంటి సమస్యలు ఎదురయ్యాయని కోచెమ్ తెలిపారు. అయితే ఉప్పు మాదిరిగానే చక్కెర కూడా శరీరంలో నీటి మోతాదును తగ్గించేస్తోందని అందుకే మధుమేహానికి తొలి గుర్తు అధిక దాహమని వివరించారు. ఈగల మూత్ర వ్యవస్థను పరిశీలించినప్పుడు యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని, ఫలితంగా ఊబకాయం వంటి సమస్యల్లేకున్నా తొందరగా మరణించే అవకాశాలు పెరిగిపోతున్నట్లు తాము గుర్తించామని తెలిపారు. మానవుల్లోనూ చక్కెర ఎక్కువగా తీసుకున్నప్పుడు మూతంరలో ప్యూరిన్లు ఎక్కువగా కనిపిస్తాయని ఇది కాస్తా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోందని చెప్పారు. -
బీపీ షుగర్ ఉంటే క్రమం తప్పక పరీక్షలు చేయించాలి
నా వయస్సు 66 ఏళ్లు. నాకు గత పదిహేనేళ్లుగా షుగర్, బీపీతో బాధపడుతున్నాను. ఈమధ్య నా ముఖం బాగా ఉబ్బింది. పొట్ట నొప్పి కూడా వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేసి మూత్రపిండాల్లో సమస్య ఉందన్నారు. కిడ్నీలు ముప్ఫయి శాతం దెబ్బతిన్నాయని చెప్పారు. నష్టపోయిన దాన్ని మళ్లీ బాగు చేయలేమని కూడా చెప్పారు. నాకు వచ్చిన సమస్య ఏమిటి? నా మూత్రపిండాలు మిగతా 70 శాతం చెడిపోకుండా ఉండాలంటే నేనేం చేయాలి. షుగర్, బీపీ... ఈ రెండు సమస్యలు ఉన్నవారిలో చాలామందికి కొంతకాలం తర్వాత మూత్రపిండాలపై వాటి దుష్ప్రభావం పడి అవి దెబ్బతినడం చాలా సాధారణంగా కనిపిస్తుంది. అందువల్లనే బీపీ, షుగర్... ఈ రెండూ ఉన్నవారు ఏడాదికి ఒక్కసారైనా వాటికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని చికిత్సలో తగు మార్పులు (అంటే... మందులు, వాటి మోతాదుల్లో మార్పులు) చేయించుకోవాల్సి ఉంటుంది. బహుశా మీరు ఈ పరీక్షలు తరచూ చేయించకపోవడం వల్లనో లేదా మీకు ఈ సమస్యల దుష్ప్రభావాల ఫలితాలపై అవగాహన లేకపోవడం వల్లనో ఇప్పటికే ముప్పయి శాతం డ్యామేజీ జరిగిపోయి ఉంవడచ్చు. ఇప్పుడు బాగా ఉన్న మిగతా 70 శాతం చెడిపోకుండా ఉండాలంటే మీరు మీ బీపీ, షుగర్లను ఎపుపడూ అదుపులో పెట్టుకోవడం అవసరం. అందుకోసం వైద్యులను తరచూ సంప్రదిస్తూ క్రమం తప్పకుండా పీరియాడికల్ చెక్–అప్ చేయించుకోవడం అవసరం. ఇలా రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకుంటే ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుని మరింత నష్టం జరగకుండా చూసుకోవచ్చు. -
తాటి నీరా తరుణమిదే!
తాటి చెట్ల నుంచి నీరాను సేకరించడం డిసెంబర్ నెల నుంచి ప్రారంభమవుతుంది. తాటి నీరా అత్యంత ఆరోగ్యదాయకమైన ప్రకృతిసిద్ధమైన పానీయం. తాటిచెట్టు గెలల నుంచి స్రవించే పోషక ద్రవాన్ని పులియకుండా సేకరిస్తే నీరా, పులియబెట్టి సేకరిస్తే కల్లు అవుతాయి. తాజా నీరా చక్కటి రుచితో అంతకుమించిన పోషకాలతో కూడి ఉంటుంది. దీన్ని హెల్త్ డ్రింక్‌గా తాగవచ్చు. తాటినీరాతో బెల్లం, పాకం(సిరప్), పంచదార, పటిక బెల్లం తయారు చేయవచ్చు. ఇళ్లలో, బేకరీల్లో చక్కెరకు బదులుగా వీటిని వాడుకోవచ్చు. తాటి ఉత్పత్తుల గ్లైసెమిక్ ఇండెక్స్(జి.ఐ.) తక్కువ కాబట్టి సాధారణ వ్యక్తులతోపాటు షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా వాడుకోవచ్చని తూ.గో. జిల్లా పందిరిమామిడిలోని ఉద్యాన పరిశోధనా కేంద్రానికి చెందిన ఫుడ్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త పి. సి. వెంగయ్య చెబుతున్నారు. ఈ పరిశోధనా కేంద్రంలో తాటి నీరాతో వివిధ ఉత్పత్తుల తయారీ కోసం అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పారు. గీత కార్మికులు, రైతులు, గ్రామీణులకు శిక్షణ ఇస్తున్నారు. తాటి నీరా ప్రకృతి సిద్ధంగా తాటి చెట్టు నుంచి లభించే పానీయాన్ని పులియకుండా సేకరిస్తే.. దాన్ని నీరా అంటారు. ఇది రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయం. నీరా తియ్యగా ఉండటమే కాకుండా సుక్రోజు వంటి పిండి పదార్థాలు ఎక్కువగా కలిగి ఉంటుంది. నీరాలో ఇంకా అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి. నీరా చక్కెర శాతం ఎక్కువగా కలిగిన పానీయం. దీనిలో చక్కెరతోపాటు ఐరన్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్, ఆస్కార్బిక్ ఆమ్లాలు వంటి విటమిన్లు ఉన్నాయి. నీరా జీర్ణశక్తిని పెంచుతుంది. కామెర్లు వంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. పోషక విలువలు ఎక్కువగా ఉన్న నీరాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా వాడవచ్చు. దీనిలో మినరల్స్, అవశ్యకమైన అమైనో ఆమ్లాలు, బి–కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. గర్భవతులకు, బలహీనంగా ఉన్న పిల్లల ఆరోగ్య రక్షణకు ఉపయోగించే ఆయుర్వే ఔషధాల్లో నీరాను వాడుతున్నారు. గర్భవతులు నీరాను వారానికి మూడు లేదా నాలుగు రోజులు తీసుకోవడం వల్ల పుట్టబోయే శిశువు మంచి రంగులో, ఆరోగ్యంగా జన్మిస్తుంది. బలహీనంగా ఉన్న పిల్లలకు రోజూ తక్కువ మోతాదులో ఇస్తే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు. మధుమేహం, ఊబకాయం, దంత క్షయం ఉన్న వారికి నీరా ఉపయోగపడుతుంది. గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన కేలరీలు తక్కువగా ఉండే పదార్థాలు ఇష్టపడేవారు నీరాతో తయారు చేసిన పదార్థాలను వాడవచ్చు. తాటి నీరా సిరప్ (పాకం), బెల్లం, పంచదారను ఇళ్లలో, బేకరీలో వివిధ రకాల పదార్థాల తయారీలో చక్కెరకు బదులుగా వాడవచ్చు. నీరాను పాకం, బెల్లం, పంచదార వంటి పదార్థాలుగా మార్చడం వలన వీటిని సాంప్రదాయ వంటలు, ఇతర పదార్థాల తయారీలో చెరకు నుంచి తయారు చేసిన బెల్లం, పంచదారకు బదులుగా వాడవచ్చు. తాటి పటిక బెల్లం తాజాగా సేకరించిన నీరా (తాజా నీరా ఉదజని సూచిక 7–8 ఉంటుంది)ను 103–105 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద బాగా మరిగించాలి. నీరా బాగా మరిగి దాదాపు మూడో వంతు వరకు ఇగిరిన తర్వాత మంటను ఆర్పివేసి.. సన్నని దారాలు లేదా తీగలతో తయారు చేసిన క్రిష్టలైజర్లో పోయాలి. దీన్ని కదలకుండా, గాలి తగలకుండా ఉన్న చోటనే 35–40 రోజుల పాటు ఉంచాలి. తరువాత దారాలు లేదా తీగలకు అంటుకొని ఏర్పడిన స్ఫటికాల(అదే పటిక బెల్లం)ను బయటకు తీసి కడిగి, ఆరబెట్టి నిల్వచేసుకోవచ్చు. తాటి బెల్లం తాటి నీరాతో బాండీలో పోసి మరిగించి సులభంగానే బెల్లం తయారు చేసుకోవచ్చు. తొలుత 103–105 డిగ్రీల ఉష్ణోగ్రతతో బాగా మరగబెట్టి, తరువాత తక్కువ మంట మీద కలుపుతూ ఉండాలి. చిక్కబడిన తర్వాత అచ్చులలో పోస్తే బెల్లం తయారవుతుంది. ఎటువంటి ఎంజైములు, రసాయనాలు కలపనవసరం లేదు. తాటి పంచదార తాటి చెట్ల పెంపకంలో రసాయనాలు వాడే అవసరం లేదు. కాబట్టి తాటి నీరాతో తయారు చేసే పంచదారను కూడా ప్రకృతి సిద్ధంగా, ఏ విధమైన రసాయనాలు శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. రసాయనాలు వాడకుండానే తాటి పంచదారను తయారు చేసుకోవచ్చు. ఇంతులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. నీరా పంచదారను వాడటం వలన బరువు తగ్గడం, మధుమేహం అదుపులో ఉండటంతోపాటు సీరమ్ కొలస్ట్రాల్ శాతాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో కూడా నీరా పంచదార ఉపయోగపడుతుంది. తాజా నీరా(ఉదజని సూచిక 7–8)ను 103–105 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరిగించి, బాగా చిక్కబడిన తరువాత క్రిస్టలైజర్, సెంట్రిఫ్యూజులను ఉపయోగించి పంచదారను తయారు చేస్తారు. తాటి సిరప్ (పాకం) తాజా నీరాను బాణలిలో పోసి 103–105 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బాగా మరిగించాలి. నీరా బాగా మరిగి దాదాపు సగం పరిమాణానికి తగ్గినప్పుడు మంటను ఆర్పివేసి, చల్లబర్చి గాజు సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. దీన్ని చక్కెరకు బుదులుగా వాడుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. టీ, కాఫీలలోను, కషాయాల లోను, బేకరీ ఉత్పత్తులలోను, ఐస్‌క్రీమ్‌ల తయారీలోను నీరా సిరప్‌ను ఎక్కువగా వాడతారు. 4 కోట్ల తాటి చెట్లున్నా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 4 కోట్ల తాటిచెట్లు ఉన్నాయి. ముదురు చెట్ల నుంచి డిసెంబర్ నుంచి 4 నెలల పాటు నీరాను సేకరించవచ్చు. చెరకు రసంతో తయారు చేసే పంచదార, బెల్లం కన్నా తాటి బెల్లం, తాటి పంచదార ఎంతో మేలైనవి. ఈ సహజ తీపి ఉత్పత్తులను గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి మధుమేహ రోగులు కూడా తినొచ్చు. ఇంత ప్రయోజనకరమైన తాటి చెట్లలో 1 శాతాన్ని కూడా మనం ఉపయోగించుకోకపోవడం దురదృష్టకరం. ప్రతి తాటి చెట్టు నుంచి ఏటా గరిష్టంగా రూ. 10 వేల ఆదాయం పొందవచ్చు. గ్రామీణులకు ఉపాధి అవకాశాలను ఇవ్వగల శక్తి తాటి, ఈత చెట్లకు ఉందని ప్రభుత్వాలు, గీత కార్మికులు, రైతులు గుర్తించాలి. – పి. సి. వెంగయ్య (94931 28932), సీనియర్ శాస్త్రవేత్త (ఫుడ్‌సైన్స్, టెక్నాలజీ), అఖిల భారత తాటిపరిశోధనా పథకం, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పందిరి మామిడి, తూ. గో. జిల్లా తాటి నీరాతో తయారవుతున్న తాటి బెల్లం, తాజా తాటి నీరా -
బీపీ, షుగర్ రోగులకు ఐడీ నంబర్
సాక్షి, హైదరాబాద్: బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు యూనిక్ ఐడీ నంబర్ కేటాయించాలని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిర్ణయించింది. ప్రతి వ్యక్తికి ప్రత్యేక నంబర్‌తో కూడిన బుక్ అందజేస్తారు. ఈ బుక్‌లో యూనిక్ ఐడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) కోడ్, జిల్లా, గ్రామం కోడ్స్ ఉంటాయి. ఇప్పటికే బుక్స్ సిద్ధం కాగా, త్వరలోనే పంపిణీ చేయనున్నారు. యూనిక్ ఐడీ నంబర్ల వినియోగంపై ప్రస్తుతం ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో రోగికి ఒక్కో బుక్ ఇచ్చి, అందులోని యూనిక్ ఐడీ నంబర్‌తో రోగుల వివరాలను అనుసంధానించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. వారికి అందిస్తున్న వైద్యం, ఉచితంగా పంపిణీ చేస్తున్న మందులు, ఇతర విషయాలు బుక్‌లోనూ, ఆన్లైన్లో నమో దుచేస్తారు. దీంతో వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ ఏదైనా చికిత్స కోసం వెళితే ఈ యూనిక్ ఐడీ నంబర్ ఆధారంగా డాక్టర్లు వైద్యం చేసే అవకాశముంది. 5.14 లక్షల మందికి నంబర్లు.. రాష్ట్రంలో సిద్దిపేట, జనగామ, కరీంనగర్, మహబూబాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మెదక్, సంగారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో నాన్–కమ్యూనికబుల్ డిసీజ్ (ఎన్సీడీ) సర్వే పూర్తయింది. ఈ జిల్లాల్లో 30 ఏళ్లు పైబడిన 35 లక్షల మందికి బీపీ, షుగర్ పరీక్షలు చేయించారు. ఇందులో 2.14 లక్షల మందికి డయాబెటిస్, సుమారు 3 లక్షల మందికి బీపీ ఉన్నట్టు గుర్తించారు. తమకు షుగర్, బీపీ ఉందని వీరిలో సుమారు 50 శాతం మందికి సర్వే నిర్వహించే వరకూ తెలియదు. మిగిలిన జిల్లాల్లో సర్వే కొనసాగుతోంది. క్షేత్రస్థాయి ఆరో గ్య కార్యకర్తలు గుర్తించిన అనుమానిత కేసులకు పీహెచ్సీ స్థాయిలో మరోసారి పరీక్షలు చేయాల్సి ఉంది. సర్వే పూర్తైన 12 జిల్లాల్లో మరోసారి సర్వే చేయనున్నట్టు చెబుతున్నారు. తొలి దశలో కొన్ని చోట్ల పాత పేషెంట్ల వివరాలు నమోదు చేయలేదు. వీరికి కూడా యూనిక్ ఐడీ నంబర్ ఇస్తారు. త్వరలో అందరి హెల్త్ ప్రొఫైల్.. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తన నియోజకవర్గంలో హెల్త్ ప్రొఫైల్‌పై మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెల్త్ ప్రొఫైల్ చేపట్టే అంశంపై అధికారులకు ఆదేశాలు రానున్నాయి. ముందుగా సీఎం నియోజకవర్గం నుంచి ప్రారంభించి దశల వారీగా రాష్ట్రం మొత్తం అమలు చేయనున్నారు.మొత్తం వైద్య ఆరోగ్య శాఖతోపాటు హెల్త్ ప్రొఫైల్‌పై ముఖ్యమంత్రి త్వరలో సమీక్ష చేసే అవకాశముంది. -
గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కోసం...
ఇటీవల కాలంలో చాలా మందిని గ్యాస్ సమస్య వేధిస్తోంది. దీనికి రక రకాల మాత్రలు వాడేకంటే చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ►కడుపు ఖాళీగా ఉంటే గ్యాస్ సమస్య వస్తుంది. కాబట్టి రోజూ 6 నుంచీ 8 గ్లాసుల నీటిని తీసుకుంటే గ్యాస్ సమస్య తలెత్తదు. ►రోజూ భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను నమిలి మింగడం చాలా మంచిది. దానిని నేరుగా తినలేకపోతే కొద్దిగా బెల్లం లేదా పంచదార కలుపుకుని కూడా తినవచ్చు. ►నాలుగైదు వెల్లుల్లి రెబ్బలకు రెండేసి స్పూన్ల ధనియాలు, జీలకర్ర తీసుకుని 5 నిముషాలపాటు ఉడికించాలి. చల్లారాక వడపోసి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ►దాల్చిన చెక్క గ్యాస్ సమస్యకు మంచి మందు. కొద్దిగా దాల్చిన చెక్కను తీసుకుని నీటిలో వేసి మరిగించాలి. తర్వాత ఆ జ్యూస్ ను తాగాలి. ఇలా రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య తొలగి పోతుంది. ►గ్యాస్ సమస్య ఉన్నవాళ్లు రోజూ కొబ్బరి నీళ్ళని తాగటం అలవాటు చేసుకుంటే మంచిది. ఇలా నెల రోజులు ఈ చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. -
పెద్దలకూ పరీక్షలు
మనం ముఖం చూసుకోడానికి అద్దం వాడతాం. ఏమైనా తేడా వస్తే వెంటనే గుర్తిస్తాం. ముఖం మీద ఏదో గాయమో, అలర్జీయో లాంటిది కనిపిస్తే వెంటనే తగిన చికిత్స తీసుకునేందుకు హాస్పిటల్‌కు పరుగెడతాం. ఇక మిగతా ఒళ్లు భాగం కూడా అంతే. కాకపోతే ముంజేతి కంకణానికి అక్కర్లేనట్టే మిగతా శరీరభాగాలకూ అద్దం అవసరం లేదు. ఇలా బయట కనిపించే తేడాలను గుర్తించడం సరే... కానీ మరి ఒంట్లోని మిగతా శరీర భాగాలు, అంతర్గత అవయవాలు, వాటి పనితీరులో తేడాలు ఇవన్నీ గుర్తించడం ఎలా? అందుకు వైద్య పరీక్షలు తోడ్పడతాయి. మరీ ముఖ్యంగా నలభై, యాభై ఏళ్లు దాటాక ప్రతి వ్యక్తిలోనూ అంతర్గత అవయవాల పనితీరులో మార్పులు రావడం మొదలవుతుంది. అయితే ఒంటి మీద వచ్చినట్టుగా అవి బయటకు కనిపించవు కదా. అందుకే ఒక వయసు దాటాక తరచూ వైద్య పరీక్షలు చేయిస్తూ ఉండాలనీ, అందులో కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలు లేదా వైద్య సమస్యలు రాబోతున్న విషయం ముందగానే తెలుసుకుంటే మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. యాభై ఏళ్లు దాటినవారిలో మరీముఖ్యంగా పురుషుల్లో ఎలాంటి వైద్య పరీక్షలు అవసరమో, అవి ఎందుకు చేయించాలో తెలిపేందుకు ఉపయోగపడేదే ఈ ప్రత్యేక కథనం. సాధారణంగా యాభై, అరవైలలో వచ్చే ఆరోగ్య సమస్యలు చాలావరకు వెన్వెంటనే బయటకు తమ లక్షణాలను కనిపించనివ్వవు. బయటకు అంతా బాగున్నట్లు అనిపించినా, లోపల ఆరోగ్యం అంతే బాగుండకపోవచ్చేమో! ఉదాహరణకు హైబీపీ. అది ఉన్నట్లే తెలియదు. కానీ లోపలంతా డొల్ల చేసేస్తుంది. ఆరోగ్యాన్ని గుల్లబారుస్తుంది. అలాగే డయాబెటిస్. ఇలాంటిదే కొలెస్ట్రాల్. అందుకే యాభై, అరవైలలో ఆ వయసు పురుషుల ఆరోగ్యానికి కొన్ని పరీక్షలు అవసరం. ఇక మధ్య వయసు వచ్చే వరకూ వాళ్లకు పొగతాగే అలవాటు ఉంటే పైన పేర్కొన్న జబ్బులతో పాటు గుండెపోటూ, క్యాన్సర్ వంటి వాటికీ అవకాశం ఎక్కువ. ఇక క్యాన్సర్ వంటి కొన్ని జబ్బులను ముందుగానే కనుగొంటే మంచి ఫలితం ఉంటుంది. ఉదాహరణకు చాలా రకాల క్యాన్సర్లను మొదటి దశలోనే కనుగొన్నామనుకోండి. 85కి పైగా రకాలను దాదాపుగా నూరుపాళ్లు పూర్తిగా నయం చేయవచ్చు. యాభై ఏళ్ల పురుషులకు చేయించాల్సిన పరీక్షలు చక్కెర వ్యాధి కోసం: సాధారణంగా ఉదయాన్నే పరగడుపున ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించాలన్న విషయం ఈ రోజుల్లో చాలామందికి తెలిసిందే. అనంతరం భోజనం చేసిన రెండు గంటల తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ కూడా చేయించాలి. ఈ రెండు పరీక్షలతో రక్తంలోని చక్కెర పాళ్ల ఆధారంగా డయాబెటిస్ తీవ్రతను నిర్ధారణ చేస్తారు. ఇక వీటితో పాటు సీరమ్ క్రియాటినిన్, సీయూఈ అనే పరీక్షలు కూడా అవసరమవుతాయి. డయాబెటిస్ కారణంగా మూత్రపిండాలూ ప్రభావితం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి క్రియాటినిన్ పరీక్షలో మూత్రపిండాలు ఏమైనా ప్రభావితం అయ్యాయా అన్న విషయం తెలుస్తుంది. అలాగే సీయూఈ పరీక్ష అన్నది మూత్రపరీక్ష. దీని ద్వారా జాండిస్ ఏమైనా వచ్చాయా అన్నది తెలుసుకుంటారు. అంతేగాక చక్కెర పాళ్లు నియంత్రణలో ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోడానికి హెచ్‌బీఏ1సీ, జీటీటీ (గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్) అనే పరీక్షలు అవసరమవుతాయి. గుండె జబ్బుల నిర్ధారణ కోసం: ► గుండెజబ్బుల నిర్ధారణ కోసం కొన్ని సాధారణ వైద్య పరీక్షలు ►ఈసీజీ, ►లిపిడ్ ప్రొఫైల్ వంటివి చేయిస్తారు. ఇక గుండెజబ్బల కోసమే చేయించాల్సిన ప్రత్యేక పరీక్షలు... ►2డి ఎకో ►టీఎమ్‌టీ ►సీటీస్కాన్‌తో పాటు అవసరాన్ని బట్టి ►కరోనరీ యాంజియో వంటివి డాక్టర్ల సలహా మేరకు చేయించాల్సి ఉంటుంది. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు: ►క్యాన్సర్ నిర్ధారణ కోసం ఈ కింది సాధారణ పరీక్షలు చేస్తారు. ►పురుషుల్లో ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ (పీఎస్ఏ) అనే పరీక్షను ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ కోసం చేస్తారు. చాలా చిన్న రక్త పరీక్ష అయిన దీని ద్వారా త్వరగా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను దాదాపుగా నయం చేయవచ్చు. ►ఛాతీ ఎక్స్–రే (ఇది అనేక వ్యాధులతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లనూ నిర్ధారణ చేస్తుంది), అల్ట్రాస్కాన్ అబ్డామిన్ ప్రత్యేక పరీక్షలు కూడా చేస్తారు. ►బోన్‌స్కాన్ పరీక్ష, ► పెట్ స్కాన్ పరీక్ష వంటివి ఎముకల పరిస్థితిని ఎలా ఉందో తెలుసుకోవడం కోసం, పెట్ స్కాన్ ద్వారా ఒంట్లో ఎక్కడైనా క్యాన్సర్ కణం ఉందేమో తెలుసుకునేందుకు చేస్తారు. (ఇవి క్యాన్సర్ నిర్ధారణలో ముందుగా చేసే ప్రాథమిక పరీక్షలు, వీటిలో ఏదైనా తేడా ఉన్నట్లు తెలిస్తే మరి కాస్త అడ్వాన్స్డ్ పరీక్షలు అవసరమవుతాయి. వీటిలో ఏమీ లేదని తెలిస్తే ఇప్పటికి క్యాన్సర్ ముప్పేమీ లేదని నిశ్చింతగా ఉండవచ్చు. అయితే యాభై ఏళ్ల వయసు దాటాక ఈ క్యాన్సర్‌ను కనుగొనే స్క్రీనింగ్ పరీక్షలను డాక్టర్ చెప్పిన వ్యవధుల్లో (ఇంటర్వెల్స్‌లో) చేయించాలి.) పళ్లకు సంబంధించిన పరీక్షలు: మన నోటి ఆరోగ్యం (ఓరల్ హెల్త్) మీదే అనేక ఒంటి సమస్యలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మన నోటిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది గుండె సమస్యలకూ దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి నోటిని శుభ్రంగా ఉంచుకుంటే దేహంలోని అంతర్గత అవయవాల్లో చాలా వాటిని ఆరోగ్యంగా ఉంచవచ్చు. అందుకే దంతాలను పరీక్షింపజేసుకోవడం కోసం ప్రతి ఆర్నెల్లకు ఒకమారు డెంటిస్ట్‌ను సంప్రదించాలి. వాటి సలహా మేరకు అవసరాన్ని బట్టి పళ్లు క్లీన్ చేయించుకోవాలి. ఇక చిగుళ్ల వ్యాధులు ఏవీ లేవని నిర్ధారణ చేసుకుని నిశ్చింతగా ఉండాలి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చిగుళ్ల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. కంటి పరీక్షలు: మీ కళ్లను ప్రతి రెండేళ్లకు ఒకసారి కంటి నిపుణులకు చూపించుకోవాలి. ఎందుకంటే ఓ వయసు దాటాక కళ్లలో ఇంట్రాఆక్యులార్ ప్రెషర్ అనే ఒక రకం ప్రెషర్‌ను చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఇది ఎక్కువైతే గ్లకోమాకు దారితీయవచ్చు. అందుకే ఇంట్రాఆక్యులార్ ప్రెషర్‌ను పరీక్ష చేయించుకుని గ్లకోమా అవకాశాలు ఏవీ లేవని తెలుసుకుని నిర్భయంగా ఉండవచ్చు. మీకు మద్యం, సిగరెట్ అలవాట్లు ఉంటే... ►పురుషుల్లో చాలామందికి పొగతాగడం, మద్యం తీసుకోవడం వంటి అలవాట్లు ఉంటాయి. మీరు పొగతాగేవారైతే... గుండె పరీక్షలతో పాటు... ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుసుకునే పీఎఫ్‌టీ పరీక్ష కూడా చేయించుకోవాలి. ►ఇక ఆల్కహాల్ అలవాటు ఉన్నవారైతే... కాలేయ సామర్థ్యాన్ని తెలుసుకుని లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్ఎఫ్టీ పరీక్ష), గుండె పరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్షలు చేయించుకోవాలి. ►స్థూలకాయం ఉంటే... మీరు ఏ మేరకు స్థూలకాయులో తెలుసుకునేందుకు బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ)తో పాటు, థైరాయిడ్ సమస్యలను తెలుసుకునేందుకు అవసరాన్ని బట్టి టీ3, టీ4, టీఎస్‌హెచ్ పరీక్షలనూ చేయించుకోవాలి. ఇక స్థూలకాయులు ఎఫ్బీఎస్, లిపిడ్ ప్రొఫైల్స్ చేయించడం కూడా అవసరం. ►ఇక్కడ ప్రస్తావించిన సమస్యలేగాక ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే... వాటిని బట్టి మీ ఫిజీషియన్ సలహా మేరకు అవసరమైన మరికొన్ని పరీక్షలు చేయించుకోవాలి. అరవైలలో ఆరోగ్య పరీక్షలివే... పురుషుల్లో వయసు అరవైకి చేరాక ఆ వయసుకు తగినట్లుగా కొన్ని పరీక్షలు చేయించుకోవడం మంచిది. అవి... ►అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిజమ్ స్క్రీనింగ్: పురుషుల వయసు 65–75 మధ్య ఉన్నవాళ్లు... గతంలో వాళ్లకు పొగతాగిన అలవాటు ఉంటే... అయోర్టిక్ అన్యురిజమ్ అనే కండిషన్ కోసం ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్ష చేయించుకోవడం మంచిది. బీపీ స్క్రీనింగ్: ఒక వయసు దాటాక ఇక తరచూ బీపీ చెక్ చెయించుకోవడం అవసరం. ఇకవేళ డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, ఇతరత్రా ఏవైనా జబ్బులు ఉంటే దానికి సంబంధించి డాక్టర్ పేర్కొన్న పరీక్షలను క్రమం తప్పకుండా చేయంచాలి. కొలెస్ట్రాల్ స్క్రీనింగ్: యాభై దాటాక ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించి, అది నార్మల్ గనక వస్తే ఇక అప్పట్నుంచి ప్రతి ఐదేళ్లకోమారు కొలెస్ట్రాల్ స్థాయులు తెలుసుకుంటూ ఉండటం మంచిది. ►ఒకవేళ వారికి డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్ పేర్కొన్న వ్యవధిలో క్రమం తప్పకుండా కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ పరీక్ష చేయిస్తూ ఉండాల్సిందే. ►డయాబెటిస్ కోసం తరచూ పరీక్షలు చేయిస్తూనే ఉండాలి. ఒకవేళ అది ఉన్నట్లు తేలితే డాక్టర్ పేర్కొన్న వ్యవధిలో క్రమం తప్పకుండా చక్కెర నిర్ధారణ పరీక్షలు చేయించాలి. గుండె పరీక్షలు: ఈసీజీ, 2 డి ఎకో, టీఎమ్‌టీ వంటి పరీక్షలు డాక్టర్ సలహా మేరకు చేయించాలి. పెద్ద వయసులో ఈ పరీక్షలతో ఇక నిశ్చింత ►ఏడాదిలో ఒకసారి మల పరీక్ష ►ప్రతి ఐదేళ్లకోసారి ఫ్లెక్సిబుల్ సిగ్మాయిడోస్కోపీ. దీనితో పాటు స్టూల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ కొలనోస్కోపీ అనే పరీక్ష యాభై దాటిన నాటి నుంచి ప్రతి పదేళ్లకోమారు చేయించుకోవడం మంచిది. ►కొలనోస్కోపీ అనే పరీక్షను ప్రతి పదేళ్లకోమారు చేయించుకోవడం మంచిది. ►ఇక వ్యక్తిగతంగా ఉన్న లక్షణాలను, కుటుంబ చరిత్రను, రిస్క్ ఫ్యాక్టర్స్‌ను బట్టి డాక్టర్ సూచించిన ఇతర పరీక్షలు చేయించుకోవాలి. వయసు పైబడ్డాక తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు : పురుషులు 65 ఏళ్లు దాటాక అంతకు ముందు ఎప్పుడూ తీసుకుని ఉండకపోతే ‘న్యూమోకోకల్ వ్యాక్సిన్’ తీసుకోవాలి. ఒకవేళ గతంలో తీసుకుని ఉండి, ఐదేళ్లు దాటినా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ► ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాధి నుంచి రక్షణకోసం ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ► ప్రతి పదేళ్లకోమారు టెటనస్–డిఫ్తీరియా బూస్టర్ డోస్ తీసుకుంటూ ఉండాలి. ►గతంలో ఎప్పుడూ తీసుకోకపోతే 65 ఏళ్లు దాటక టీ–డాప్ వ్యాక్సిన్ తీసుకోవాలి. (ఇది డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది). ►అరవై దాటక షింగిల్స్ లేదా హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. గతంలో తీసుకుని ఉండకపోతే ఇది వెంటనే తీసుకోవడం మేలు. చివరగా... ఇవేగాక సాధారణంగా చూసుకునే పరీక్షలైన బరువు చెక్ చేయించుకోవడం, కింద జారిపడకుండా చూసుకోవడం, చెవులు చక్కగా వినిపిస్తున్నాయేమో చూసుకోవడం, ఆహ్లాదంగా లేకపోతే డిప్రెషన్‌కు గురికాకుండా జాగ్రత్త పడటం వంటి ఎవరికి వారు చేసుకునే పరీక్షలతోపాటు పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం, మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోవడం వంటివి చేస్తుంటే వయసు పైబడ్డా సరే... ఆ సమయంలోనూ దీర్ఘకాలం ఆరోగ్యంగా, ఎలాంటి సమస్యలూ లేకుండా చాలాకాలం ఆరోగ్యంగా ఉంటారు. మహిళల కోసంఉద్దేశించిన ప్రత్యేక పరీక్షలివి... ఇక మహిళల విషయానికి వస్తే... పైన పేర్కొన్న పరీక్షలతో పాటు (పురుషుల కోసం ఉద్దేశించిన పీఎస్ఏ వంటివి కాకుండా... వారికే ప్రత్యేకమైన మామోగ్రామ్ పరీక్షలు, పాప్‌స్మియర్ పరీక్షల వంటివి చేయించుకుంటూ ఉండాలి. మహిళల్లో మెనోపాజ్ దాటాక వారిలో కొన్ని సమస్యలు కనిపించడం చాలా సాధారణం. వారి వచ్చే ఆ సమస్యలను బట్టి అవసరమైతే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వంటివి అవసరం కావచ్చు. అందుకోసం డాక్టర్లు సూచించిన మరికొన్ని ప్రత్యేక పరీక్షలు అవసరమవుతాయి. ఇక మెనోపాజ్ దశకు చేరకముందు... మహిళల్లో వారిలోని ఈస్ట్రోజెన్ హార్మోన్ కారణంగా వారి గుండెకు ఒక స్వాభావికమైన రక్షణ ఉంటుంది. మెనోపాజ్ తర్వాత ఆ స్వాభావిక రక్షణ తొలగిపోతుంది కాబట్టి గుండెకు సంబంధించిన పరీక్షలనూ దాంతోపాటు క్రమం తప్పకుండా హైబీపీ, షుగర్ పరీక్షలను చేయించుకుంటూ ఉండాల్సిందే. డాక్టర్ జి. హరిచరణ్ సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
డౌట్ ఉంటే చెప్పేస్తుంది
బీపీ సొంతంగా చెక్ చేసుకోవచ్చు. సుగర్‌ను కూడా. అలాగే గర్భధారణ జరిగిందీ లేనిదీ తెలిపే ఉపకరణం అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఎవరికి వారు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షను చేసుకునే పరికరం కూడా రాబోతోంది! కొత్తపరికరం దుర్గాపూర్ (కోల్‌కతా)లోని ‘నిట్’ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) విద్యార్థులు కనిపెట్టిన ఈ వినూత్న పరికరంలో చెకప్ స్ట్రిప్ ఉంటుంది. స్ట్రిప్ ధర 150 నుంచి 200 రూపాయల వరకు ఉండే అవకాశాలున్నాయి. వేలినుంచి ఒక రక్తపు చుక్కను తీసి పేపర్‌తో తయారై ఉండే ఆ స్ట్రిప్ మీద ఉంచి, దానికి చిన్న చుక్క ‘రీజెంట్’ను (పరీక్షక పదార్థం) కలిపి విశ్లేషించినప్పుడు వచ్చే ఫలితాన్ని బట్టి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నదీ, లేనిదీ, భవిష్యత్తులో రాబోయే అవకాశం ఏమైనా ఉందా అన్నదీ తెలిసిపోతుంది. స్త్రీ దేహంలో క్యాన్సర్ కారకాలను గుర్తించే ‘హర్2’ అనే యాంటిజెన్ పరిమాణాన్ని ఈ పరికరం గుర్తిస్తుంది. ఆరోగ్యంగా ఉన్న స్త్రీ దేహంలో ఈ ‘హర్2’ మోతాదు 15 నానో గ్రాములు/ఎం.ఎల్. కన్నా తక్కువగా ఉంటుంది. అది కనుక 15 నానో గ్రాముల్ని మించి ఉంటే తక్షణం వెళ్లి బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షను చేయించుకోవడం అవసరం. కచ్చితమైన ఫలితాలను ఇస్తున్న ఈ పరికరాన్ని ‘నిట్’లోని బయోటెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ మోనీదీప ఘోష్ నేతృత్వంలో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు రూపొందించారు. దుర్గాపూర్‌లోని సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా వీళ్లకు సహకారం అందించింది.పరికరం ఉత్పత్తి వ్యయం పదివేల రూపాయల వరకు ఉండగా, ఎక్కువ సంఖ్యలో మార్కెట్లోకి వస్తే కనుక ఒక్కో స్ట్రిప్‌ను 50 రూపాయలకు కూడా అందించే వీలుంటుందని మోనీదీప చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా పదిలక్షల యాభై వేల మందిలో బ్రెస్ట్ క్యాన్సర్ బయపడుతోందని ఆమె తెలిపారు. అన్నట్లు ఆ పరికరానికి ఇంకా పేరు పెట్టలేదు. -
హైబీపీ, డయాబెటిస్ ఉన్నాయా..? కిడ్నీ పరీక్షలు తప్పనిసరి
మన శరీరంలో మూత్రపిండాలను (కిడ్నీలను) చాలా సంక్లిష్టమైన అవయవాలుగా చెప్పుకోవచ్చు. అవి శరీరంలోని విషతుల్యమైన పదార్థాలను మూత్రం ద్వారా వడపోస్తాయి. హార్మోన్లను, ఎంజైములను కూడా విడుదల చేస్తుంటాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే మూత్రపిండాల్లో ఎడమవైపుది కొంచెం పెద్దగా కుడివైపు దానికంటే కొంచెం ఎగువగా ఉంటుంది. దాదాపు 150 గ్రాముల వరకు బరువుండే మూత్రపిండాలు 11–14 సెం.మీ పొడవు, 6 సెం.మీ వెడల్పు, 4 సెం.మీ మందంగా ఉంటాయి. రక్తంలోని వ్యర్థాలను తొలగించడంలో కిడ్నీలది ప్రధాన పాత్ర.అధిక రక్తపోటు (హైబీపీ), మధుమేహం (డయాబెటిస్)తో బాధపడేవారికి మూత్రపిండాలు వైఫల్యం చెందే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఎప్పటికప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్టులు చేయించుకుంటూ ఉండటం తప్పనిసరి.మూత్రపిండాలకు సంబంధించి నాలుగు రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 1 కిడ్నీ ఇన్ఫెక్షన్స్ 2 కిడ్నీ స్టోన్స్ 3 కిడ్నీ ఫెయిల్యూర్ 4 కిడ్నీ ట్యూమర్స్ అండ్ క్యాన్సర్స్ ♦ మహిళల్లో ఎక్కువగా కనిపించే బ్యాక్టీరియల్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కిడ్నీలకు వరకు పాకి ఇన్ఫెక్షన్లకు గురిచేస్తుంటాయి. యాంటీబయాటిక్ కోర్సులతో ఈ సమస్య తొలగిపోతుంది. ♦ పురుషుల్లో ఎక్కువగా కనిపించే మూత్రపిండాల్లో వచ్చే రాళ్లలో అనేక రకాలుండటంతో పాటు ఇసుకరేణువు పరిమాణం దగ్గర్నుంచి గోల్ఫ్‌బాల్ సైజు వరకూ ఉంటాయి. తీవ్రమైన నొప్పి, బాధను కలిగించే ఈ రాళ్లకు సైజును బట్టి అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ♦ అధిక బరువు, పొగతాగడం, మద్యం, రక్తపోటు, చక్కెరపాళ్లు అదుపులో లేకపోవడం వల్ల ఆ దుష్ప్రభావాలతో కిడ్నీలు విఫలమైనప్పుడే కిడ్నీ సమస్యల లక్షణాలు బయటపడుతుంటాయి. కాబట్టి దీన్ని ఒక సైలెంట్ డిసీజ్‌గా చెప్పుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్‌కు డయాలసిస్, కిడ్నీ మార్పిడి (ట్రాన్స్‌ప్లాంటేషన్) చికిత్స పద్ధతులు తప్పనిసరి. ♦ పుట్టుకతో వచ్చే కిడ్నీ సమస్యల్లో పిల్లలకు స్నానం చేయించేటప్పుడు లేదా డాక్టర్ దగ్గరకు చెకప్స్ కోసం వెళ్లినప్పుడు కణుతులు బయటపడుతుంటాయి. కణితి పరిమాణాన్ని బట్టి మూత్రంలో రక్తం, కడుపునొప్పి, జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, అజీర్ణం, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నెఫ్రోబ్లాస్టోమా లేదా విల్మ్స్ ట్యూమర్స్‌గా చెప్పకునే మూత్రపిండాల్లో కణుతులు పిల్లల్లో 4, 5 ఏళ్ల వయసులో బయటపడుతుంటాయి. అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లో ఎక్కువగా కనిపించే ఈ కణుతులను పూర్తిగా నయం చేయడం సాధ్యమే. ప్రమాదకరమైన కణుతులు రీనల్‌సెల్ కార్సినోమా (ఆర్సీసీ) అనే ఒక రకం కణితి పెద్ద వయసులో కనిపిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులకు, ఇతర భాగాలకు వ్యాపించే గుణం ఈ క్యాన్సర్‌కు ఎక్కువ. ఒక్కొక్కసారి ఇలా వ్యాప్తిచెందిన (మెటాస్టాసిస్ అయిన) భాగాల ద్వారా కూడా ఈ క్యాన్సర్‌ను గుర్తించడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి రెండు మూత్రపిండాలలో కూడా ఈ కణుతులు ఉండవచ్చు. అనేక సబ్టైపులలో ఉండే ఈ క్యాన్సర్ ఇతర కిడ్నీ సంబంధిత పరీక్షలతో, ఆల్ట్రాసౌండ్ వంటి పరీక్షలతో కనుగొనడం జరుగుతుంది. వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్ పెరిగే అవకాశం ఎక్కువ. అయితే పొగతాగే అలవాటు ఉన్నవారిలో చాలా చిన్నవయసు వారిలోనే ఈ క్యాన్సర్ నమోదవుతున్నట్లు అనేక అధ్యయనాలు / సర్వేలు తెలుపుతున్నాయి. అందుకే ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పట్టణాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పొగతాగడం, మద్యం అలవాటు ఉండటం, అధిక బరువు వంటి వాటితో పాటు జన్యుపరివర్తనాలు (జీన్ మ్యుటేషన్స్) కూడా ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారకాలు అవుతాయి. పరీక్షలు లక్షణాలు కనిపించనప్పుడు శారీరక పరీక్షలు చేయడం (ఫిజికల్ ఎగ్జామ్స్), రక్తపరీక్షలు (బ్లడ్ టెస్ట్స్), మూత్రపరీక్షలు (యూరిన్ టెస్ట్స్), ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎమ్మారై, క్యాల్షియమ్ లెవెల్స్ తెలిపే పరీక్షలతో పాటు, ఒక్కోసారి ఈ క్యాన్సర్ బయటపడే సరికే ఊపిరితిత్తులకు, ఎముకలకు క్యాన్సర్ పాకి ఉండవచ్చు. కాబట్టి డాక్టర్లు ఛాతీ ఎక్స్‌రేతో పాటు బోన్స్కాన్స్ కూడా చేయిస్తూ ఉంటారు. చికిత్స కిడ్నీ మొత్తంగా తీసేయాల్సిన శస్త్రచికిత్సతో పాటు క్యాన్సర్ రకాన్ని బట్టి కీమో, రేడియో థెరపీలను ఇస్తారు. కిడ్నీలనిప్పుడు లాపరోస్కోపిక్ పద్ధతిలోనూ తొలగిస్తున్నారు. క్యాన్సర్ కాని కణుతులకు కూడా సైజుని బట్టి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ కణుతులు ఎక్కువగా ఉన్నా లేదా మూత్రపిండాలలో చాలా పెద్దగా ఉన్న సందర్భాల్లో కూడా కిడ్నీలను తొలగించాల్సి రావచ్చు. కిడ్నీ ట్యూమర్ స్టేజ్ మీద ఆధారపడి శస్త్రచికిత్సని మూడు రకాలుగా చేస్తూ ఉంటారు. రాడికల్ నెఫ్రోక్టమీ: ఎక్కువగా చేసే ఈ సర్జరీలో మూత్రపిండంతో పాటు అడ్రినల్ గ్లాండ్స్, లింఫ్ నాళాలలను, కణజాలాన్ని మొత్తంగా తీసివేయడం జరుగుతుంది. కణితి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సర్జరీని చేస్తారు. సింపుల్ నెఫ్రొక్టమీ: స్టేజ్ – 1 : కిడ్నీ క్యాన్సర్‌కు ఒక్క మూత్రపిండాన్ని మాత్రమే తీసివేయడం జరుగుతుంది. పార్షియల్ నెఫ్రోక్టమీ: పుట్టు్టకతో ఒకే ఒక మూత్రపిండం ఉండి, దానిలో కణితి కనిపించినప్పుడు, కణితి ఉన్నంత వరకు మాత్రమే తీసివేయడం జరుగుతుంది. ♦ ఒక్కోసారి రెండు మూత్రపిండాల్లోనూ కణుతులు ఏర్పడినప్పుడు కూడా ఇలా కణుతులు ఉన్నంత మేరకు మాత్రమే వాటిని తీసేయడం జరుగుతుంది. ♦ కణితిని తొలిదశలోనే గుర్తించి, ఒక్క మూత్రపిండాన్ని మాత్రమే తొలగించినప్పుడు, శస్త్రచికిత్స అయిన కొద్దిరోజుల్లోనే వారు సాధారణ జీవితాన్ని గడపగలుగుతారు. రెండు మూత్రపిండాలను తీసేసినా, ఒక్కటి ♦ తీసేశాక రెండోది సరిగా పనిచేయకపోయినా వారికి డయాలసిస్ చేస్తూ, వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించాల్సి ఉంటుంది. ♦ చికిత్స అయిపోయిన తర్వాత కూడా ఫాలో అప్ తప్పనిసరి. సీటీ స్కాన్, ఛాతీ ఎక్స్‌రే వంటి పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. ♦ మూత్రంలో రక్తం కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా ఉండటంతో పాటు పొగతాగడం, మద్యం వంటి అలవాట్లు ఉంటే వాటికి దూరంగా ఉంటుండటం వల్ల మూత్రపిండాలను కొంతవరకైనా కాపాడుకోగలిగిన వారమవుతాం. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
పాల ఉత్పత్తులతో సమస్య లేదు!
పాలు ఆరోగ్యానికి మంచిది కావని మీకు ఇటీవలి కాలంలో ఎవరైనా చెప్పారా? వాళ్ల మాటల్లో నిజం లేదని అంటున్నారు హార్వర్డ్, టఫ్ట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. గుండెజబ్బులతోపాటు, మధుమేహానికి, పాలకు సంబంధం లేదని తాము అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నామని వీరు చెబుతున్నారు. ఆహారంలో పాల ఉత్పత్తులను భాగంగా చేసుకున్న దాదాపు మూడు వేల మందిపై తాము అధ్యయనం చేశామని.. వీరికి మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తేలిందని ఓ శాస్త్రవేత్త తెలిపారు. అలాగే సుమారు రెండు లక్షల మందిని దశాబ్దాల పాటు పరిశీలించిన తరువాత తాము పాలతో గుండెజబ్బుల సమస్య ఎక్కువ కాదన్న అంచనాకు వచ్చామని వివరించారు. పాల ఉత్పత్తులతో అందే కొవ్వులకు బదులు మొక్కలతో లభించే కొవ్వులు, గింజలను వాడినప్పుడు గుండెజబ్బుల ప్రమాదం ఇంకో 24 శాతం తగ్గిందని వీరు అంటున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. మాంస ఉత్పత్తులతో సమస్య ఆరు శాతం వరకూ ఎక్కువ కావడం. మొక్కల ద్వారా లభించే కొవ్వులు, పాలతో వచ్చే వెన్నలోని కొవ్వులను పోల్చి చూసినప్పుడు మొదటి రకం కొవ్వులు ఆరోగ్యకరంగా ఉంటే.. రెండో రకం కొవ్వులను మితంగా వాడితే పెద్ద ప్రమాదమేమీ లేదని ఇంకో అధ్యయనం స్పష్టం చేసింది. మొత్తమ్మీద చూస్తే ఏ రకమైన కొవ్వులనైనా మితంగా వాడటం మేలని అర్థమవుతుంది. -
షుగర్ కోసం సాహసాలు!
హీరోయిన్లు త్రిష, సిమ్రాన్ అద్భుతమైన సాహసాలు చేస్తున్నారు. వెండితెరపై వారి సాహసాన్ని ఆడియన్స్ ఆస్వాదించడానికి చాలా సమయం ఉంది. సిమ్రాన్, త్రిష ప్రధాన పాత్రధారులుగా సుమంత్ రాధాకృష్ణన్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సిమ్రాన్, త్రిషలపై కొన్ని సాహసోపేతమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ అడ్వంచరస్ మూవీకి ‘షుగర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట టీమ్. ఇందులో సిమ్రాన్, త్రిష అక్కాచెల్లెళ్ల పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది విడుదలైన రజనీకాంత్ ‘పేట’ చిత్రం తర్వాత సిమ్రాన్, త్రిష కలిసి ఒకే సినిమాలో నటిస్తున్న చిత్రం ఇదే. -
చక్కెర చాయ్‌తో క్యాన్సర్!
న్యూఢిల్లీ : చిక్కటి చక్కెర చాయ్ తాగితే నీరసంగా ఉన్న శరీరానికి అనుకోని బలం హఠాత్తుగా వచ్చినట్లు ఉంటుంది. గ్లాసుడు పళ్ల రసం పుచ్చుకున్న నిస్సత్తువ శరీరానికి ఎక్కడిలేని శక్తి వచ్చినట్లు ఉంటుంది. అయితే ఈ రెండింటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు భారీగా పెరుగుతాయని శాస్త్రవేత్తలు తాజాగా ఓ అధ్యయనం తేల్చారు. 100 మిల్లీ లీటర్ల స్వచ్ఛమైన పళ్ల రసం రోజు పుచ్చుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం 12 శాతం పెరుగుతుందని దాదాపు లక్ష మంది ప్రజలు ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేసిన ఫ్రాన్స్ వైద్యులు తెలిపారు. ఇక అంతే మొత్తంలో కార్డియల్, ఫిజ్జీ పాప్లు తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశం 19 శాతం పెరుగుతాయని వారు చెప్పారు. రెండు టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకొని రోజుకు ఒక్క కప్పు టీ తాగినా అంతే ప్రమాదమట. కోక కోలా డ్రింక్ కన్నా కప్పు ఛాయ్ ప్రమాదమట. చక్కెర కలవడం వల్లనే ఈ పానీయాలన్నీ క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతున్నాయని అధ్యయనకారులు అభిప్రాయపడ్డారు. వయస్సును బట్టి చక్కెర పాళ్లను పరిమితం చేస్తే పెద్ద ప్రమాదమేమీ లేదని వారే చెబుతున్నారు. బ్రిటన్ పిల్లలు మోతాదుకు మించి చక్కెర తీసుకుంటున్నారని ‘పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్’ ఆందోళన చెందుతోంది. పిల్లలు, టీనేజర్లు కూల్ డ్రింకులను ఎక్కువగా తీసుకుంటున్నారని, వాటిల్లోనే క్యాన్సర్‌కు దారితీసే చక్కెర శాతం ఎక్కువ ఉంటుందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. బాటిళ్లలో దొరకి పళ్ల రసాల్లో కూడా చక్కెర కలుపుతారుకనుక సాధారణ పళ్ల రసాల కన్నా అవి మరింత ప్రమాదకారకాలని వారంటున్నారు. క్యాన్సర్ మరణాలను తగ్గించాలంటే అన్ని డ్రింకుల్లో చక్కెర పాళ్లను నియంత్రించాల్సిన అవసరం ఎంతైన ఉందని అధ్యయనకారులు ఫ్రెంచ్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. పారిస్‌లోని సార్బోన్, ఫ్రెంచ్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ నిపుణులు సంయుక్తంగా ఈ తాజా అధ్యయనం జరిపారు. -
ముంజల వారి విందు
ఐస్‌ను ఫ్రై చేసుకుని తింటే ఎలా ఉంటుంది?అడిగినవారికి మైండ్ లేదనిపిస్తోంది కదూ!కానీ మీకు తెలుసా... ఫ్రైడ్ ఐస్ క్రీమ్ దొరుకుతుందని!అలాగే చల్లటి ముంజలను వేడివేడిగా వండుకుని తినొచ్చు!ప్రయత్నించండి! వేడివేడిగా తినండి.కడుపును చల్లబరచండి. నొంగు పాల్ కావలసినవి: లేత ముంజలు – 6 (తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి); పాలు – 2 కప్పులు; పంచదార/తేనె – 1 టేబుల్‌స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను తయారీ: ►ఒక పాత్రలో పాలు పోసి స్టౌ మీద ఉంచి బాగా కాగిన తరవాత, మంట బాగా తగ్గించి, పాలు మూడు వంతులయ్యే వరకు మరిగించాలి ►పంచదార/తేనె జత చేసి బాగా కలియబెట్టాలి ►ఏలకుల పొడి జత చేసి ఆపకుండా కలుపుతుండాలి ►అన్నీ బాగా కరిగిన తరవాత దింపి చల్లార్చాలి ►ముంజలను చేతితో మెత్తగా మెదిపి, మరిగించిన పాలకు జత చేసి బాగా కలపాలి ►ఫ్రిజ్‌లో ఉంచి రెండు మూడు గంటల తరవాత బయటకు తీసి, చల్లగా అందించాలి. (నన్నారి, పిస్తా, రోజ్, చాకొలేట్, కేసర్ టూటీ ఫ్రూటీలతో కూడా తయారు చేసుకోవచ్చు) ముంజలు మునగ కాడ కర్రీ కావలసినవి: లేత ముంజల గుజ్జు – 2 కప్పులు; లేత మునగకాడ ముక్కలు – ఒక కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; పనీర్ తురుము – పావు కప్పు; గసగసాలు + జీడి పప్పు + ఎండు కొబ్బరి పేస్ట్ – ఒక టేబుల్ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 6; నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చి మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ►మునగ కాడల ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి ►టొమాటో తరుగు, ఉల్లి తరుగు ఒకదాని తరవాత ఒకటి వేసి కొద్దిసేపు వేయించాలి ►ముంజల గుజ్జు జత చేసి బాగా కలపాలి ►కొద్దిగా నీళ్లు, తగినంత ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి ►కొద్దిగా ఉడికిన తరవాత పనీర్ తురుము, గసగసాలు + జీడి పప్పు + ఎండు కొబ్బరి పేస్ట్ జత చేసి కలియబెట్టి, మరి కొద్ది సేపు ఉడికించాలి ►కొత్తిమీర తరుగుతో అలంకరించి దింపేయాలి ►వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. ముంజల డ్రింక్ కావలసినవి: ముంజలు – 8; పాలు – రెండు కప్పులు; నీళ్లు – తగినన్ని; పంచదార – 2 టేబుల్ స్పూన్లు; రూహ్ అఫ్జా – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►మిక్సీ జార్లో నాలుగు తాటి ముంజలు వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ►మిగిలిన ముంజలను చాకుతో సన్నగా కట్ చేసి పక్కన ఉంచాలి ►మిక్సీ జార్లో పాలు, కొద్దిగా నీళ్లు, పంచదార, రూహ్ అఫ్జా, ముంజల గుజ్జు వేసి బాగా మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, గ్లాసులోకి తీసుకోవాలి ►ముంజ ముక్కలు, ఐస్ ముక్కలు జత చేసి చల్లగా అందించాలి. ముంజల బజ్జీ కావలసినవి: కొద్దిగా ముదిరిన ముంజలు – 10; సెనగ పిండి – ఒక కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; ధనియాల పొడి – ఒక టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముంజల తొక్క తీసి, నీరు వేరు చేయాలి ►ఒక గిన్నెలో సెనగ పిండి, బియ్యప్పిండి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, మిరప కారం, ఉప్పు వేసి బాగా కలపాలి ►తగినన్ని నీళ్లు జత చేసి బజ్జీ పిండి మాదిరిగా కలుపుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ముంజలను పిండిలో ముంచి బజ్జీల మాదిరిగా వేయాలి ►రెండు వైపులా దోరగా కాలిన తరవాత పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►టొమాటో సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి. తాటి ముంజల పొట్టు చట్నీ కావలసినవి: ముంజల పొట్టు – ఒక కప్పు; మినప్పప్పు – 3 టేబుల్ స్పూన్లు; కంది పప్పు – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 4; చింత పండు – నిమ్మకాయంత; ఎండు మిర్చి – 5; లవంగాలు – 4; ఎండు కొబ్బరి ముక్కలు – అర కప్పు; ఉప్పు – ఒక టీ స్పూను; నూనె – ఒక టీ స్పూను తయారీ: ►ముంజల పొట్టును నీళ్లలో నానబెట్టాలి (లేదంటే రంగు మారిపోతుంది) ►స్టౌ మీద బాణలి వేడయ్యాక మినప్పప్పు, కంది పప్పు, వెల్లుల్లి, ఎండు మిర్చి, చింత పండు కొబ్బరి ముక్కలు, లవంగాలు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించి దింపేసి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►ముంజల పొట్టులోని నీటిని పూర్తిగా ఒంపేయాలి ►పొట్టును ఒక ప్లేట్లో ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో పావు టీ స్పూను నూనె వేసి కాగాక ముంజల పొట్టు, ఉప్పు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి ►ముందుగా పోపు సామానును మిక్సీలో వేసి మెత్తగా చేశాక, ముంజల పొట్టు జత చేసి మరోమారు మెత్తగా అయ్యేవరకు తిప్పి, గిన్నెలోకి తీసుకోవాలి ►ఇది చపాతీ, దోసె, బ్రెడలలో నంచుకుని తినొచ్చు, అన్నంలోకి కూడా రుచిగా ఉంటుంది. తాటి ముంజల కూర కావలసినవి: నూనె – ఒక టేబుల్ స్పూను; బిర్యానీ ఆకులు – 2; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 6; ఉప్పు – తగినంత; ముంజలు – 10 (కొద్దిగా ముదురుగా ఉండాలి); పసుపు – పావు టీ స్పూను; కారం – అర టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ: ►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, రెండు బిర్యానీ ఆకులు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి ►ఉల్లి తరుగు, టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి ►కొద్దిగా ఉప్పు జత చేయాలి ►తరిగిన ముంజలు వేసి బాగా కలపాలి ►తగినంత పసుపు, కారం వేసి మరోమారు కలియబెట్టాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేయాలి ►కొద్దిగా నీళ్లు పోసి, మూత పెట్టి, ముంజలు మెత్తబడే వరకు ఉడికించాలి ►మూత తీసి మరోమారు కలియబెట్టాలి ►ధనియాల పొడి, కొత్తిమీర తరుగు జత చేసి మరోమారు కలియబెట్టి దింపేయాలి. తాటి ముంజల కుర్మా కావలసినవి: తాటి ముంజలు – 12; ఉప్పు – తగినంత; కారం – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; నూనె – 2 టేబుల్ స్పూన్లు; పోపు సామాను – ఒక టీ స్పూను (ఆవాలు, జీలకర్ర); ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 3; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను ; క్యారట్ తరుగు – పావు కప్పు; నువ్వులు + జీడి పప్పు పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు; పెరుగు – అర కప్పు; కొత్తిమీర – అర టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను. తయారీ: ►ముంజలను ఒక ప్లేట్లో ఉంచి, వాటి మీద ఉప్పు, పావు టీ స్పూను కారం, పావు టీ స్పూను పసుపు చల్లి, అన్నిటికీ అంటేలా చేతితో సరిచేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ►ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు కలపాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేయాలి ►క్యారట్ తరుగు వేసి మరోమారు కలపాలి ►టొమాటో తరుగు జత చేసి కలియబెట్టాలి ►కొద్దిగా నీళ్లు పోసి మరోమారు కలిపి, మూత ఉంచి ఉడికించాలి ►జీడిపప్పు, నువ్వుల పేస్ట్ వేసి కలిపి ఉడికించాలి ►తగినంత ఉప్పు జత చేయాలి ►కారం, పసుపు, ధనియాల పొడి వేసి మరోమారు కలపాలి ►పెరుగు జత చేసి కలియబెట్టాలి ►కొద్దిగా నీళ్లు జత చేయాలి ►ముంజలను జత చేసి ఉడికించాలి ►గరం మసాలా, కొత్తిమీర తరుగు జత చేసి మూత ఉంచాలి ►కొద్దిగా ఉడికిన తరవాత మూత తీసి మరోమారు కలియబెట్టాలి ►ఉడికిన కుర్మాను ఒక పాత్రలోకి తీసుకుని కొత్తిమీరతో అలంకరించాలి. తాటి ముంజల పొట్టు కర్రీ కావలసినవి: తాటి ముంజల పొట్టు – ఒక కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూను. పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4; ఉల్లి తరుగు – అర కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; కారం – ఒక టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను తయారీ: ►స్టౌ మీద మందపాటి గిన్నె ఉంచి, అందులో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి ►తాటి ముంజల పొట్టు వేసి ఉడికించాలి ►చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు జత చేసి కలియబెట్టి బాగా ఉడికించి దింపేయాలి ►నీటిని వడకట్టి తీసేయాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాచాలి ►జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండు మిర్చి, పచ్చి సెనగ పప్పు వేసి వేయించాలి ►ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ►పసుపు జత చేయాలి ►ముంజల పొట్టు జత చేసి బాగా కలపాలి ►కారం, గరం మసాలా వేసి మరోమారు కలిపి, దింపేయాలి. -
ఫైబర్ రైస్‌తో షుగర్ వ్యాధికి చెక్!
న్యూఢిల్లీ: పాలిష్ చేసిన బియ్యం (వైట్ రైస్)కి స్వస్తిచెప్పి.. పీచు పదార్థం ఎక్కువగా లభించే రైస్ తీసుకుంటే మధుమేహం, బ్లడ్ షుగర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం నుంచి బయటపడవచ్చని మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. వైట్ రైస్ వాడకం వలన టైప్–2 మధుమేహం వస్తుంది. ఆపై కళ్లు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, నరాల బలహీనత వంటి ఇతర జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఫైబర్ ఎక్కువగా లభించే పదార్థాలు ఆహారంగా తీసుకుంటే బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో ఉంటాయి. అందుకే వైట్ రైస్ స్థానంలో హై ఫైబర్ రైస్‌ను తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అధిక బరువు సమస్యకూ ఇది చక్కని పరిష్కారమని వివరించారు. నిద్రలేమి, పని ఒత్తిడితో హై బీపీ! మ్యూనిచ్: నిద్రలేమి, పని ఒత్తిడి అనేవి హైపర్ టెన్షన్‌కు కారణమవుతున్నాయని జర్మనీలోని మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటుందని వారు వెల్లడించారు. అలాంటి వారికి గుండె జబ్బులు సంభవించే అవకాశం ఎక్కువని తెలిపారు. అధ్యయనంలో భాగంగా 25 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న 2 వేల మంది బీపీ రోగులను పరిశీలించారు. -
డయాబెటిస్ అంటున్నారు...ఎలాంటి ఆహారంతీసుకోవాలి?
నా వయసు 38 ఏళ్లు. ఇటీవలే జనరల్ హెల్త్ పరీక్ష చేయించుకుంటే డయాబెటిస్ ఉన్నట్లు వచ్చింది. నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలో దయచేసి సూచించండి. డయాబెటిస్ కనుగొన్న తర్వాత డాక్టర్ సూచించిన మందులతో పాటు వారి వారి వ్యక్తిగత బరువు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, ఆహారనిపుణులు వారికి వ్యక్తిగతంగా ఆహారపు నిబంధనలు (డైట్ చార్ట్) సూచిస్తారు. అయితే ఈ కింద పేర్కొన్నవి డయాబెటిస్ ఉన్నవారు పాటించాల్సిన సాధారణ ఆహార నిబంధనలు మాత్రమే. పిండిపదార్థాల విషయానికి వస్తే అవి తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ (పంచదార) పాళ్లు వేగంగా పెరుగుతాయి. అందుకే డయాబెటిస్ రోగులు పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఉండే పదార్థాలను తీసుకోవాల్సి వస్తే... ముడిబియ్యం, దంపుడు బియ్యం లాంటి పొట్టుతీయని ధాన్యాలు తీసుకోవడం వల్ల పీచు పదార్థాలు (ఫైబర్) శరీరానికి ఎక్కువగా అందుతాయి. రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గించడానికి ఈ పీచుపదార్థాలు ఉపయోగపడతాయి. బెండకాయ, వంకాయ, టొమాటో, గుమ్మడికాయ వంటి కాయగూరలు, తోటకూర, బచ్చలికూర, మెంతికూర వంటి ఆకుపచ్చని ఆకుకూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్)లోనూ, బొప్పాయి, జామపండు వంటి పండ్లు, సజ్జలు, జొన్నలు, బార్లీ, రాగులు, కొర్రలు వంటి ధాన్యాల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ల విషయానికి వస్తే ఇవి శరీర కణాలను మరమ్మతు చేయడానికి అవసరం. ప్రోటీన్లు. గ్లూకోజ్ పాళ్లు పెరగకుండా చూసే అమైనో ఆమ్లాలను అందిచడంలోనూ దోహదపడతాయి. పాలు, పాల ఉత్పాదనలు, పప్పులు, బీన్స్ వంటివి వంటి వాటిల్లో ప్రోటీన్లు ఎక్కువ. మాంసాహారం ద్వారా కూడా ప్రోటీన్లు అందుతాయి. అంతే మాంసాహారం వల్ల కొవ్వు పాళ్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మాంసాహారం తీసుకునే సమయంలో వేటమాంసం, రెడ్ మీట్‌కు బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలు వంటివి తీసుకోవడం మంచిది. ఇక కొవ్వుల విషయానికి వస్తే మన శరీర జీవక్రియలకు కొవ్వులు అవసరమైనందున వాటిని పూర్తిగా మానేయడం సరికాదు. డయాబెటిస్ ఉన్నవారు కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసహారం, నెయ్యి, వెన్న, జున్ను, మీగడ, వనస్పతి, పామోలిన్ వంటివి తీసుకుంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే అవకాశం ఎక్కువ. కాబట్టి డయాటెటిస్ ఉన్నవారు గుండె జబ్బు లేకపోయినా ఉన్నట్లుగా భావించి ఆమేరకు జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఇలాంటి కొవ్వు లేదా నూనె పదార్థాలు తీసుకోవడం సరికాదు. ఇక నూనెల విషయానికి వస్తే పాలీ అన్‌శాచ్యురేటెడ్ నూనెలైన (ప్యూఫా) పొద్దుతిరుగుడు, కుసుమ నూనెలనూ ఉదయం వేళల్లోనూ... ఇక మోనో అన్‌శ్యాచ్యురేటెడ్ నూనెలైన (మ్యూఫా) నువ్వుల నూనె, సోయానూనె, ఆలివ్ ఆయిల్స్‌ను సాయంత్రం వేళల్లో ఉపయోగించడం మంచిది. ఇలా వీలు కాకపోతే ఒక నెలంతా ప్యూఫా, మరో నెలంతా మ్యూఫా నూనెలను మార్చి మార్చి ఉపయోగించడం వల్ల మధుమేహం ఉన్నవారికే గాక అందరికీ మంచిది. గుండె, శరీరానికి సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఇది ఉపయోగపడుతుంది. ఒక పరిమితి మించకుండా కొవ్వు పదార్థాలు తీసుకోవాలంటే ప్రతి ఒక్కరూ రోజుకు 50 గ్రాములకు మించి నూనె ఉపయోగించకూడదు. అంటే నెలకు 450 గ్రాములు అన్నమాట. కొండగుర్తుగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు నెలకు అర్ధలీటరుకు మించకుండా నూనె వాడటం శ్రేయస్కరం. డయాబెటిస్ రోగులు నేరుగా తీసుకోకూడని పదార్థాలు: ►పంచదార / వాటితో తయారు చేసిన తీపి పదార్థాలు ►తేనె ►జామ్స్ / జెల్లీస్ ►కేకులు / పేస్ట్రీలు ►పళ్లరసాలు ∙మద్యం ►(పండ్లను పండ్లరసాల రూపంలో తీసుకోవడం కంటే నారింజ, కమలాపండు, జామ, పుచ్చకాయ, బొప్పాయి వంటి పండ్లను కొరికి తినడం మంచిది). డయాబెటిస్ ఉన్నవారు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: ►మొలకెత్తిన గింజలు తీసుకోవడం మధుమేహరోగుల ఆరోగ్యానికి మంచిది. ►నేల కింద పండే దుంపలు (ఆలు, చిలగడ, కంద వంటి దుంపలు) డయాబెటిక్ రోగులకు మంచిది కాదు. నేల కింద పండే వాటన్నింటి నుంచి దూరంగా ఉండాలని డయాబెటిస్ రోగులు గుర్తుంచుకోవాలి. అయితే ఈ నిబంధన నుంచి ముల్లంగికి మినహాయింపు ఉంది. డయాబెటిస్ రోగులు ముల్లంగిని తీసుకోవచ్చు. ►ఈ ఆహారంతోపాటు వ్యాయామం చేస్తూ బరువు పెరగకుండా జాగ్రత్త పడితే డయాబెటిస్ దుష్ప్రభావాలనుంచి దూరంగా ఉండవచ్చు. బార్డర్‌లైన్ అంటున్నారు...డయాబెటిస్ వచ్చినట్టేనా? నేను ఇటీవలే రక్తపరీక్ష చేయించుకుంటే నాకు డయాబెటిస్ బార్డర్‌లైన్‌లో ఉందన్నారు. అంటే నాకు డయాబెటిస్ వచ్చినట్లేనా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. మీరు పరగడుపున రక్తపరీక్ష చేయించుకున్నప్పుడు రక్తంలోని చక్కెర పాళ్ల విలువ 100 కంటే తక్కువ ఉండటం; భోజనం చేశాక రక్తపరీక్షలో ఆ విలువ 140 కంటే తక్కువ ఉండటం జరిగితే మీకు డయాబెటిస్ లేదని అర్థం. ఒకవేళ మీరు పరగడుపున చేయించిన పరీక్షలో రక్తంలోని చక్కెర పాళ్ల విలువ 125 కంటే ఎక్కువగానూ, భోజనం చేసిన తర్వాత చేసిన రక్తపరీక్షలో ఆ విలువ 200 కంటే ఎక్కువగానూ, హెచ్‌బీఏ1సీ అనే పరీక్షలో వచ్చిన విలువ 6.5 శాతం కంటే ఎక్కువగానూ ఉంటే మీకు డయాబెటిస్ ఉన్నట్లు లెక్క. ఇంకా చెప్పాలంటే... హెచ్‌బీఏ1సి విలువ 5.6 నుంచి 6.5 వరకు ఉన్నా లేదా పరగడుపున చేయించిన రక్తపరీక్షలో చక్కెర 100 నుంచి 125 ఉన్నా, భోజనం చేశాక రక్తంలో చక్కెర 140 నుంచి 200 లోపు ఉన్నా దాన్ని బార్డర్‌లైన్ డయాబెటిస్ అంటారు. అంటే పరీక్షల్లో ఈ రీడింగ్స్ వస్తే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువ అన్నమాట. ఇలాంటివారు రోజూ కనీసం ఒక గంట సేపు వ్యాయామం చేయడం, తాము తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తక్కువగా తీసుకోవడం, స్థూలకాయం లేకుండా చూసుకోవడం చేస్తుంటే చాలాకాలం పాటు డయాబెటిస్ దరిచేరకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డయాబెటిస్ రాకుండా కాపాడుకునే అవకాశం ఇంకా ఉందని అర్థం. డయాబెటిస్ ఉంది... విహారయాత్రకు సూచనలు చెప్పండి నేను గత ఆరేళ్లనుంచి డయాబెటిస్తో బాధపడుతున్నాను. ఈసారి వేసవి సెలవల్లో ఎటైనా విహారయాత్రకు వెళ్దామనుకుంటున్నాను. ప్రయాణంలో నా చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకోడానికి ఏవైనా సూచనలు చెప్పండి. డయాబెటిస్ అనేది క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ఉండాల్సిన దీర్ఘకాలిక సమస్య. అంతమాత్రాన ఇది ఉన్నవారు విహారయాత్రలకు వెళ్లడం, ప్రయాణాలు చేయడం మానుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... ►మీరు వెళ్లబోయే ప్రదేశం ఏమిటో, అక్కడికి చేరడానికి ఎంత సమయం పడుతుందో మీ డాక్టర్‌కు చెప్పండి ►మీ డయాబెటిస్ మందులతో పాటు ఒకవేళ మీకు ప్రయాణం సమయంలో వికారం, వాంతులు, నీళ్ల విరేచనాల సమస్య వస్తే తీసుకోవాల్సిన మందుల ప్రిస్క్రిప్షన్‌ను ఇవ్వమని కోరండి ►మీరు మీ గమ్యస్థానాన్ని చేరగానే ఒకసారి మీ చక్కెర పాళ్లు పరీక్షించుకోండి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే చేరాల్సిన ఆసుపత్రినీ, లేదా వైద్యసహాయం అందించే చోటును ముందే ఎంపిక చేసుకుని పెట్టుకోండి. ►మీరు ఇన్సులిన్ మీద ఉంటే ఇన్సులిన్‌ను లేదా నోటి ద్వారా తీసుకునే మందులైతే వాటిని మీతో పాటే ఉంచుకోండి. మీ ఇన్సులిన్ మరీ ఎక్కువ వేడి ఉండే చోట లేకుండా చూసుకోండి మీరు కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకునేలా ఏర్పాటు చేసుకోండి ►అకస్మాత్తుగా రక్తంలో చక్కెర తగ్గే పరిస్థితి (హైపోగ్లైసీమియా) ఏర్పడితే తీసుకోడానికి కొన్ని చాక్లెట్లు కూడా మీతో ఉంచుకోండి. షుగర్ తగ్గినా ప్రమాదమా? మా అమ్మగారి వయసు 68 ఏళ్లు. చాలా ఏళ్లుగా ఆమె డయాబెటిస్తో బాధపడుతున్నారు. రోజూ క్రమం తప్పకుండా టాబ్లెట్లు తీసుకుంటారు. ఒకరోజు అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోతే హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. అక్కడ డాక్టర్లు ఆమెను పరీక్షించి రక్తంలో షుగర్ పాళ్లు తగ్గాయని చెప్పారు. షుగర్ పెరిగితే కదా ప్రమాదం. ఇలా షుగర్ తగ్గడం వల్ల కూడా ప్రమాదాలు ఉంటాయా? ఒక్కోసారి పెద్దవయసు వాళ్లు తాము తినాల్సిన ఆహారం తినరు. దాంతో వారి రక్తంలోని చక్కెరపాళ్లు తగ్గుతాయి. అలా తగ్గడాన్ని వైద్యపరిభాషలో హైపోగ్లైసీమియా అంటారు. దీనివల్ల వృద్ధులైన రోగుల్లో వణుకు, చెమటలు పట్టడం వంటి లక్షణాలకు బదులుగా నరాలకు సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే నిద్రమత్తుగా ఉన్నట్లుండటం, నిస్సత్తువ, భ్రాంతులు, అయోమయం వంటివి అన్నమాట. ఆ వయసువారికి మత్తుగా జోగుతుండటం వల్ల పడిపోయి ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో వారిని తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయాలి. ఇలా రక్తంలోని చక్కెరపాళ్లు తగ్గకుండా ఉండటం కోసం తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినాలి. రోజూ సరైన వేళకు ఆహారం తీసుకుంటూ ఉండాలి. తెల్లజుట్టు రాకుండా నిరోధించడం సాధ్యమే! జుట్టుకు రంగు వేసుకొని.. వేసుకొని విసిగిపోయారా? ఇక ఆ రంగులకు, బ్రష్‌లకు ప్యాకప్ చెప్పేయొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. అందరినీ వేధిస్తున్న తెల్లజుట్టు బెంగ ఇక అక్కర్లేదట. జుట్టు తెల్లబడటానికి కారణమైన జన్యువును కనుగొన్నామని.. ఇది మరింత విప్లవాత్మక మార్పులకు దారితీయనుందని లండన్ పరిశోధకులు చెబుతున్నారు. ఐఆర్ఎఫ్ 4 అనే జన్యువు వల్లే జుట్టు రంగు మారుతోందని గుర్తించారు. మెలనిన్‌ను నియంత్రిస్తున్న ఈ జన్యువే జుట్టును కూడా తెల్లబరుస్తోందని ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ ఆవిష్కరణతో జట్టు తెల్లబడటాన్ని నిరోధించడం భవిష్యత్తులో సాధ్యమే అంటున్నారు. జుట్టు రంగు, సాంద్రత, ఆకారాన్ని ప్రభావితం చేసే జన్యువులను గుర్తించేందుకు లాటిన్ అమెరికా చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు ఆరువేల మందిపై ఈ పరిశోధన సాగింది. జుట్టు తొందరగా తెల్లబడటానికి కేవలం జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ పరిస్థితులు కాకుండా.. మనిషిలోని జన్యువే ప్రధాన పాత్ర పోషిస్తోందని లండన్ శాస్త్రవేత్తలు తేల్చారు.బట్టతల రావడానికి, జుట్టు రంగును మార్చే జన్యువులను ఇప్పటికే గుర్తించినా, మానవుల్లో జుట్టు తెల్లగా మారడానికి కారణమైన జన్యువును గుర్తించడం ఇదే ప్రథమమని, చాలా కీలకమైందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ (యూసీఎల్) కు చెందిన డాక్టర్ కౌస్తుభ్ అధికారి చెప్పారు. ఇది ఇంతకు ముందెన్నడూ జరగని పరిశోధన అని పేర్కొన్నారు. ఇది కాస్మోటింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందంటున్నారు. మానవ వృద్ధాప్య జీవశాస్త్రం అంశాల పరిశోధనలో తమ అధ్యయనం మంచి పరిణామమని ప్రొఫెసర్ ఆండ్రెస్ రూయిజ్– లినారెస్ చెప్పారు. గడ్డం దగ్గర జుట్టు మందం, కనుబొమ్మల మందాన్ని, వైవిధ్యాన్ని నియంత్రించే జన్యువులను కూడా తమ పరిశోధనలో గుర్తించినట్టు తెలిపారు. అయితే. రసాయనాలు కలిసిన రంగుల గాఢతను జుట్టు భరిస్తుందో లేదోనని ఆలోచించడం లేదు. ఇలా చేసే ముందు సరైన జాగ్రత్తలు పాటించకపోతే చర్మసమస్యలు ఎదురు అవుతాయి. అందువలన చాలా వరకూ ఇలాంటి పద్ధతులకు దూరంగా ఉంటే మంచిది అంటున్నారు వారు. డాక్టర్ ఎల్. సునందిని సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, యాస్టర్ ప్రైమ్ హాస్పిటల్, హైదరాబాద్ -
పిస్తా కుల్ఫీ
కావలసినవి: పాలు – 1 లీటరు, పంచదార – 250 గ్రా., బ్రెడ్ – ఒక స్లైస్ (చివర్లు కట్‌చేసి వైట్‌ది మాత్రమే తీసుకోవాలి), బాదంపప్పు – 20 (నీళ్లలో నానబెట్టి పై పొట్టుతీసి గ్రైండ్ చేసుకోవాలి), పిస్తాపప్పు – అర కప్పు (పైన పొట్టు తీసేసి, పలుకులుగా చేసుకోవాలి), ఏలకులు – 4, కుంకమపువ్వు – రెండు, మూడు రేకలు. తయారి: పాలు అరలీటర్ అయ్యేంత వరకు మరిగించాలి ►పాలు చల్లారాక ఇందులో పంచదార, బ్రెడ్, బాదంపప్పుపొడి, పిస్తాపప్పు, ఏలకులపొడి, కుంకుమపువ్వు వేసి కలపాలి ►కుల్ఫీ చేసే మౌల్డ్‌లో సిల్వర్ ఫాయిల్సెట్ చేసి అందులో పాలమిశ్రమం పోయాలి. ఐస్‌క్రీమ్ పుల్లను కూడా అమర్చాలి ►పన్నెండు గంటలపాటు కుల్ఫీమౌల్డ్ని ఫ్రీజర్‌లో ఉంచాలి ►కుల్ఫీ మౌల్డ్స్‌ని వేడినీటిలో ముంచితీస్తే ఫ్రీజ్ అయిన తర్వాత కుల్ఫీ బయటకు సులభంగా వస్తుంది ►చల్ల చల్లగా పిల్లలకు అందించవచ్చు. నోట్: కుల్ఫీ మౌల్డ్స్ లేకపోతే చిన్న గ్లాసులలో పాలమిశ్రమం పోసి ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చు. -
ఈ కాఫీకి గింజల అవసరం లేదు...
మాంసం కావాలంటే పశువులు.. పాలు కావాలంటే ఆవులు కావాలన్నది మనకు తెలిసిన సత్యం. కానీ.. టెక్నాలజీ పుణ్యమా అని పరిశోధనశాలలోనే మాంసం కృత్రిమంగా తయారైపోతే.. పాలకు ప్రత్యామ్నాయాలు బోలెడున్నాయని కూడా ఇటీవలే స్పష్టమైంది. మరి మనలో చాలామంది రోజూ ఉదయాన్నే ఎంతో ఆస్వాదించే కాఫీ? దీనికీ ఓ ప్రత్యామ్నాయం తయారు చేసేశాం అంటోంది సియాటెల్ స్టార్టప్ అటోమో. కాఫీగింజలు ఏమాత్రం వాడకుండా తాము తయారు చేస్తున్న కాఫీలో పాలు, చక్కెర కూడా వాడాల్సిన అవసరం లేదని, పైగా మీకు నచ్చిన విధంగా రుచిని మార్చుకోనూవచ్చని అంటున్నారు అటోమో సీఈవో యాండీ క్లీస్టెక్. కాఫీ వాసన, అదిచ్చే ఫీలింగ్, రంగు వంటి అన్ని అంశాలకు సంబంధించి తాము 40 వరకూ పదార్థాలను గుర్తించామని... వాటిని కృత్రిమంగా కలిపేయడం ద్వారా తయారైన తమ కాఫీ అసలుదానికి ఏమాత్రం తీసిపోదని ఆయన వివరించారు. ప్రస్తుతం మనం పండిస్తున్న కాఫీ కారణంగా ఎన్నో సమస్యలు ఉన్నాయని.. పైగా ఇప్పటికే 60 శాతం నాటు కాఫీ మొక్కలు కనిపించకుండాపోయాయని చెప్పారు. అంతేకాకుండా కాఫీ తోటలు ఎదుర్కొంటున్న కూలీల కొరత తదితర సమస్యల వల్ల కాఫీ పెంపకం పెద్దగా లాభదాయకం కాదని నెస్లే లాంటి కంపెనీలే ఒప్పుకుంటున్నాయని ఈ నేపథ్యంలోనే తాము కృత్రిమ కాఫీని తయారు చేశామని.. సహజసిద్ధమైన మొక్కల పదార్థాలతోనే దీన్ని తయారు చేసినప్పటికీ అందులో ఏమున్నాయో ప్రస్తుతానికి వెల్లడి చేయలేమని అన్నారు. -
హెల్త్ టిప్స్
►అరటిపండులో చక్కెర... సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటివి సహజరూపంలో ఉంటాయి. పీచు పదార్థాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. రెండు అరటిపండ్లు తింటే 90 నిమిషాల సేపు పని చేయవచ్చని పరిశోధనల్లో రుజువైంది. అందుకే క్రీడాకారులు ఎక్కువగా అరటిపండు తీసుకుంటారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి అరటిపండు మంచి ఆహారం. కాబట్టి ప్రతిరోజూ అరటిపండు తింటే శక్తితోపాటు జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగవుతుంది. ►ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎంఎస్) సమస్య ఉన్న వాళ్లు పీరియడ్స్‌కు కనీసం వారం ముందు నుంచి ప్రతిరోజూ అరటిపండు తింటుంటే ఆ సమయంలో ఆందోళన, ఉద్వేగం వంటి లక్షణాలు అదుపులో ఉంటాయి. ►ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఎనీమియాను అరికడుతుంది. బ్లడ్‌ప్రెజర్‌ను అదుపులో ఉంచుతుంది. గుండెపోటును నివారించడంలో బాగా పని చేస్తుంది. -
చక్కెర ఇవ్వరట..!
‘వెంకటమ్మ రేషన్ కార్డు మీద సరుకులు తెచ్చుకున్నవా.. పండుగ దగ్గరకొత్తాంది.. ఏం సరుకులిత్తాండ్లని రేషన్‌షాపుకు పోవాలే.. నాకున్న అంత్యోదయ కార్డు మీద ఇదివరకు చక్కెర వచ్చేది.. ఇప్పుడు బియ్యమే దిక్కయినయి. పోయినేడు కాంచి చక్కెర ఇస్తలేరు.. గట్లున్నది సర్కారోళ్లు, రేషన్ డీలర్ల పనితీరు ఏం చేయాల్నే రమణమ్మ.. ఆయింత పట్టించుకునేటోళ్లు లేరు. –సాక్షి, వరంగల్ రూరల్ ఒకప్పుడు రేషన్ షాపుకు వెళ్తే తొమ్మిది రకాల సరుకులు లభించేవి. ఇప్పుడు కేవలం బియ్యం తప్పా ఏమీ ఇవ్వడం లేదు.. అంత్యోదయ కార్డుదారులకు ప్రభుత్వం అందిస్తున్న చక్కెరకు రేషన్ డీలర్లు మంగళం పాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంత్యోదయ కార్డుదారులకు బియ్యంతో పాటు చక్కెరను సైతం అందించాలని గతంలోనే నిర్ణయించింది. 2015 సంవత్సరం తర్వాత ఆహార భద్రత కార్డులకు చక్కెర పంపి ణీ నిలిపివేశారు. అంత్యోదయకార్డులకు చక్కెరను ప్రభుత్వం అందిస్తోంది. జిల్లాలో జిల్లాలో 2,18,269 మొత్తం కార్డులుండగా అంత్యోదయ కార్డులు 12,187లు ఉన్నాయి. గత కొంత కాలంగా అంత్యోదయ కార్డుదారులకు చక్కెరను ప్రభుత్వం అందిస్తున్నా రేషన్ డీలర్లు అందించడం లేదు. ప్రతీ నెల రేషన్ డీలర్లు కేవలం బియ్యానికే డీడీలు చెల్లిస్తున్నారు. ప్రతి రేషన్‌షాప్‌లో పదుల సంఖ్య లో అంత్యోదయ కార్డులుంటాయి. ప్రభుత్వం అందిస్తున్న చక్కెరను అందించేందుకు రేషన్ డీలర్లు ముందుకు రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా సగం కంటే తక్కువ మంది రేషన డీలర్లు మాత్రమే ఒక్కో నెల చక్కెరను అందిస్తున్నారు.. ఇంకో నెల అందించడం లేదు. అసలు కారణమిదే.. చక్కెరను ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే రేషన్ షాపుల్లో గొడవలు జరుగుతున్నాయి. ఆహార భద్రత, అన్నపూర్ణ కార్డుదారులకు ఇవ్వకుండా కేవలం అంత్యోదయ కార్డులకే చక్కెరను ఇస్తే మిగతా వారి నుంచి ఇబ్బందులు తలెత్తుతున్నాయని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2015 జూన్ కంటే ముందు అన్ని కార్డు దారులకు అరకిలో చొప్పున చక్కెరను అందించేవారు. అంత్యోదయ కార్డుదారులకు చక్కెర అందడం లేదని సివిల్ సప్లయ్ అధికారులకు తెలిసినా సైతం పట్టించుకోవడం లేదు. బియ్యానికే పరిమితం.. గతంలో ఆహారభద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులకు బియ్యంతో పాటు తొమ్మిది వస్తువులు రేషన్ షాపుల ద్వారా అందించేవారు. ప్రస్తుతం బియ్యానికే పరిమితమయింది. బియ్యంతో పాటు చక్కెర, పసుపు, కారం, చింతపండు, కందిపప్పు. ఉప్పు, గోధుమ పిండి, ఫామాయిల్, గోధుమలు అందించేవారు. రాను రాను అన్ని నిత్యావసర వస్తువులు ప్రభుత్వం ఇవ్వడం బంద్ చేసింది. చక్కెర పంపిణీ చేయడం సమస్యగా మారింది ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కేవలం అంత్యోదయ కార్డు కలిగిన వినియోగదారులకు మాత్రమే చక్కెర రావడం చాలా సమస్యగా మారింది. చాలామంది దసరా పండుగకు మాకెందుకు చక్కెర ఇవ్వడం లేదంటూ గొడవ పడుతున్నారు. అధికారులకు విషయం చెపితే మా చేతుల్లో ఏమి లేదందటున్నారు. మరి మేం ఏం చేయలి. గతంలో మాధిరిగానే వినియోగదారులకు పంపిణీ చేస్తే సమస్య సద్దుమణుగుతుంది. ఉన్నతాధికారులు స్పందించి రేషన్ కోటాను పెంచాల్సిన అవసరం ఉంది. –చందుపట్ల రాజేందర్‌రెడ్డి, రేషన్ డీలర్ల సంఘం పరకాల డివిజన్ అధ్యక్షుడు ఈ నెల అందరూ డీడీలు కట్టాలని ఆదేశించా.. అంత్యోదయకార్డు దారులకు గత కొంత కాలం చక్కెరను ప్రభుత్వం అందిస్తోంది. కానీ కొందరు డీలర్లు చెల్లించడం లేదు. ఈ నెల 18న బియ్యం డీడీలతో పాటు చక్కెరకు సంబంధించిన డీడీలను అందించాలని ఆదేశించాను. అంత్యోదయ కార్డుదారులకు చక్కెరను ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి తప్పకుండా కార్డుదారులకు చక్కెర చేరాలి. –వనజాత, డీఎస్ఓ జిల్లాలో 2,18,269 మొత్తం కార్డులు అంత్యోదయ కార్డులు 12,187 ఆహార భద్రత కార్డులు 2, 06, 067 అన్నపూర్ణ 15 కార్డులు జిల్లాలో 464 రేషన్ షాప్‌లు -
నాలుక పట్టేసి మాట ముద్దగా వస్తోంది...
న్యూరాలజీ కౌన్సెలింగ్ మా పెద్దనాన్నగారి వయసు 48 ఏళ్లు. ఆర్నెల్ల క్రితం నుంచి ఆయనకు నాలుక పట్టేసినట్లుగా ఉండి, మాట ముద్దముద్దగా వస్తోంది. కుడివైపు భాగమంతా చచ్చుబడినట్లుగా మారుతోంది. చికిత్స తీసుకున్నా ప్రయోజనం లేదంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి పరిష్కారం చెప్పండి. – ఎల్. వెంకటేశ్వరరావు, నల్లగొండ మాట సరిగా రాకపోవడం, చూపులో తేడా రావడం, శరీరంలోని ఒకవైపు భాగం బలహీనపడటం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ లేకపోవడం... వంటి అకస్మాత్తుగా కనిపించే లక్షణాలన్నీ పక్షవాత సూచనలుగా పరిగణించాలి. అయితే దీన్ని నిర్ధారణ చేయడానికి సీటీ/ఎమ్మారై స్కాన్ పరీక్ష అవసరం. సాధారణంగా తొలిసారి కొద్దిపాటి పక్షవాతం వచ్చిన 30 శాతం మందిలో, ఏడాదిలో రెండోసారి తీవ్రంగా వచ్చేందుకు అవకాశం ఉంది. ప్రత్యేకంగా దీనికోసం రక్తాన్ని పలుచబార్చే మందులైన యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్, స్టాటిన్స్ వంటివి తీసుకోని వారిలో ఇది తీవ్రంగా రావచ్చు. దీనితో పాటు పక్షవాతానికి ఆస్కారమిచ్చే రిస్క్ ఫ్యాక్టర్లు అయిన బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, హోమోసిస్టిన్ లేదా గురక వంటివి రోగికి ఉండి, వాటిని నియంత్రించకపోతే పక్షవాతం వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే మీ బంధువుకు వెంటనే అన్ని రకాల పరీక్షలు చేయించి, వ్యాధి విషయంలో తగిన నిర్వహణ చర్యలు (మేనేజ్మెంట్ ఆఫ్ డిసీజ్) తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ బంధువుకు మళ్లీ పక్షవాతం (స్ట్రోక్) వస్తే అది వైకల్యాన్ని తెస్తుంది. కాబట్టి మీరు వెంటనే మీ దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. రెండోసారి స్ట్రోక్‌ను నివారించేందుకు తగిన మందులు క్రమం తప్పకుండా వాడండి. కాళ్లలో మంటలూ – తిమ్మిర్లు... ఎందుకిలా? నా వయసు 53 ఏళ్లు. రెండేళ్ల నుంచి నా కాళ్లలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు చాలా బాధపెడుతున్నాయి. నాకు బీపీ, షుగర్ వ్యాధులు లేవు. ఎటువంటి చెడు అలవాట్లు కూడా లేవు. అయినా నాకు ఎందుకీ సమస్య. నాకు తగిన పరిష్కారం చూపగలరు. – ఎమ్. రామ్మోహన్రావు, నెమ్మికల్ కాళ్లలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు, కాలి చివర మొద్దుబారడం వంటి లక్షణాలు నరాల నుంచి వెన్నుపాము వరకు వచ్చే సమస్యలకు ఒక సూచన. ఈ సమస్య పెరుగుతూ పోతే చేతులకు కూడా వస్తుంది. అలాగే నడకలో మార్పు, మలమూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, అంగస్తంభనలో కూడా ఇబ్బందులు ఉండవచ్చు. వీటినే పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. డయాబెటిస్, విటమిన్ బి12, బి1, ఫోలిక్ యాసిడ్, ప్యాంటథెనిక్ యాసిడ్ లోపాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలు. కొన్నిసార్లు లెప్రసీ, హెచ్ఐవీ, హెపటైటిస్–బి అండ్ హెపటైటిస్ సి వైరస్ ల వంటివి కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. సాధారణంగా 30 శాతం మందిలో ఏ కారణం లేకుండా కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటివారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. పై లక్షణాలను నియంత్రించడానికి గాబాపెంటిన్, ప్రీగాబాలిన్, అమీట్రిప్టిలిన్, డ్యూలోక్సెటిన్ మందులతో పాటు, మీ కండిషన్‌కు ఏ అంశం కారణమో దానికి కూడా వైద్యం చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. అంటే ఉదాహరణకు బీ12 లోపం వల్ల ఈ కండిషన్ ఏర్పడిందనుకోండి. అప్పుడు దాన్ని భర్తీ చేయడం కోసం ఆ విటమిన్‌ను సమకూర్చాలన్నమాట. మీరు చెబుతున్న లక్షణాలున్నప్పుడు అరికాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే చిన్న పుండ్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. కొన్నిసార్లు రక్తప్రసరణలో ఇబ్బందులు, వెన్నుపాము జబ్బులు కూడా ఇలాంటి లక్షణాలను కలిగించవచ్చు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా తలనొప్పే వంశపారంపర్యంగా మా అబ్బాయికీ వస్తోందా? నా వయసు 36 ఏళ్లు. గత రెండు దశాబ్దాలుగా నాకు ప్రతినెలా తలనొప్పి వస్తోంది. అలా నెలలో నాలుగైదుసార్లు వస్తోంది. ఈ తలనొప్పితో నేను నా రోజువారీ పనులేవీ చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు మా అబ్బాయిని కూడా అదే సమస్య వేధిస్తోంది. ఇప్పుడు వాడి వయసు ఎనిమిదేళ్లు. నా సమస్య వంశపారంపర్యంగా వాడికి సంక్రమించిందా? దయచేసి మా సమస్యను వివరించండి. – డి. కామేశ్వరి, కాకినాడ మీ చెబుతున్న లక్షణాలను బట్టి మీరు మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తరచూ తలనొప్పి రావడం, దాంతోపాటు వాంతులు, వెలుగును చూడటంలో ఇబ్బంది పడటం, పెద్ద శబ్దాలను తట్టుకోలేకపోవడం, చీకటి గదిలో కాసేపు నిద్రపోయాక తలనొప్పి ఉపశమించడం లాంటి లక్షణాలు ఉంటే అది మైగ్రేన్ కావచ్చు. మీకు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశం ఏమిటో చూడండి. అంటే... సూర్యకాంతికి ఎక్స్పోజ్ కావడం, ఘాటైన వాసనలు, పర్ఫ్యూమ్స్ లేదా సుగంధద్రవ్యాల వాసన, సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రలేమి, మీరు తీసుకునే ఆహారపదార్థాలలో నిర్దిష్టంగా ఏదైనా సరిపడక వెంటనే తలనొప్పి రావడం (ఉదాహరణకు చీజ్, ఆరెంజ్, అరటిపండ్లు, అజినమోటో వంటి చైనా ఉప్పు, చాక్లెట్లు వంటివి) జరుగుతుంటే వెంటనే దాన్ని తీసుకోవడం ఆపేయండి. దాంతో తలనొప్పిని నివారించవచ్చు. మీకు వచ్చే తలనొప్పిని నివారించే టోపిరమేట్, డైవల్‌ప్రోయేట్, ఫ్లునరిజిన్, ప్రొపనలాల్ వంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే 70 శాతం వరకు మళ్లీ వచ్చే అవకాశం నివారితమవుతుంది. మీరు చెప్పినట్టే మైగ్రేన్ కుటుంబసభ్యుల్లో వంశపారంపర్యంగా రావచ్చు. అయితే మీ అబ్బాయిలో కనిపించే లక్షణాలు కంటి చూపునకు సంబంధించినవా లేక మెదడుకు సంబంధించినవా అని పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఒకసారి మీరు న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. కళ్లు తిరిగి పడిపోతున్నట్లుగా ఉంది... కారణం ఏమిటి? నా వయసు 47 ఏళ్లు. నాకు గత రెండేళ్ల నుంచి అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయి. మందులు వాడినప్పుడు తగ్గి మళ్లీ మళ్లీ ఈ సమస్య వస్తోంది. అలా అవుతున్నప్పుడు నాకు భయమేస్తోంది. దీనికి పూర్తిగా పరిష్కారం లేదా? – కె. రాధాకుమారి, శ్రీకాకుళం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ సమస్య ‘వర్టిగో’ అని చెప్పవచ్చు. మనల్ని సరిగ్గా అంటే బ్యాలెన్స్డ్గా నిలబెట్టే ప్రధాన భాగం చిన్నమెదడు, చెవిలోపల ఉన్న ‘వెస్టిబ్యులార్ నరం’. చిన్నమెదడుకు వచ్చే జబ్బుల వల్ల మీరు పేర్కొన్న వర్టిగో లక్షణాలతో పాటు ఇతర లక్షణాలు కూడా ఉండవచ్చు. అంటే చూపులో, మాటలో, నడకలో, స్పర్శలో, బలంలో మార్పులు ఉంటే తక్షణం న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. అలాగే కళ్లు తిరగడం అనేది తల తిప్పినప్పుడు కొద్ది క్షణాల పాటు ఉండి, వెంటనే తగ్గిపోవడం, వినికిడి తగ్గడం, చెవిలో హోరు శబ్దం రావడం... ఇవి చెవి నరానికి సంబంధించిన జబ్బు తాలూకు లక్షణాలు. దీనికి తక్షణ ఉపశమనానికి బీటాహిస్టిన్, సిన్నరజిన్ లాంటి మందులు ఉపయోపడతాయి. కొన్నిసార్లు ఇది మళ్లీ మళ్లీ వస్తుంది. అలా తరచుగా వచ్చేవారికి వెస్టిబ్యులార్ ఎక్సర్సైజెస్, ఎప్లేస్ మెథడ్ ద్వారా చికిత్స అవసరం. అప్పటికీ ఫలితం కనిపించకపోతే చెవి నరానికి కొన్ని ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. వర్టిగో అనేది కాస్త ఇబ్బంది పెడుతుంది గానీ ఏమాత్రం ప్రమాదకరం కాదు. కాబట్టి మీరు అనవసరంగా ఆందోళన పడకండి. – డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి, చీఫ్ న్యూరోఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
చక్కెర గుళికలు నొప్పిని తగ్గిస్తాయా?
పిల్లలు అనుకోకుండా కిందపడ్డారనుకోండి.. నొప్పి ఏమార్చేందుకు బెల్లం ముక్క నోట్లో పెట్టడం మనం చూసే ఉంటాం. గాయం తాలూకూ నొప్పి నుంచి వారి దృష్టి మళ్లించేందుకు ఇది పనికొస్తుందని మనం ఇప్పటివరకూ అనుకుంటూ ఉన్నాం. అయితే తగిన మెదడు నిర్మాణం, మానసిక స్థితి ఉన్న వారికి ఈ తీపి కాస్తా శక్తిమంతమైన మందుగానూ పనిచేస్తుందని అంటున్నారు నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఈ పరిశోధన వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంచనా. అనేక దుష్ప్రభావాలను చూపించే రసాయనిక మందుల స్థానంలో ఒట్టి చక్కెర గుళికలు ఇవ్వవచ్చునని, ఫార్మా కంపెనీలు మందుల ప్రభావశీలతను పరీక్షించేందుకు కొంతమందికి ఇచ్చే ఉత్తుత్తి మాత్రలను లేకుండా చేయవచ్చునని, ఆసుపత్రి ఖర్చులూ తగ్గుతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వానియా అప్కారియన్ వివరించారు. నేచర్ కమ్యూనికేషన్స్ తాజా సంచికలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం నొప్పితో బాధపడుతున్న వారికి ఏవో మందులిస్తున్నామని కాకుండా.. చక్కెర గుళికలే ఇస్తున్నాంగానీ.. అది నొప్పి తగ్గిస్తుందని నమ్మబలికితే చాలని వివరించారు. నడుం నొప్పితో బాధపడుతున్న కొందరిపై తాము ప్రయోగాలు నిర్వహించి మరీ ఈ నిర్ధారణకు వచ్చామన్నారు. -
తొమ్మిది పదుల యువకుడు
పశ్చిమగోదావరి ,తాడేపల్లిగూడెం రూరల్: ఆవేశ పడితే బీపీ.. శారీరక వ్యాయామం లేకపోతే సుగర్.. కాస్త ఎక్కువగా నడిస్తే కీళ్ల నొప్పులు.. ఇవి నేటి ఆధునిక మానవుడిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులు. కానీ వీటికి భిన్నంగా పట్టణంలోని రెండో వార్డుకు చెందిన కవల కృష్ణమూర్తి(91) నిలుస్తున్నారు. తొమ్మిదో తరగతి చదివిన కృష్ణమూర్తి తొమ్మిది పదుల వయస్సు పైబడినప్పటికీ తన పనులు తాను చేసుకుంటూనే కళ్లజో డు లేకుండా వార్తా పత్రికలు చదవడం విశేషం. వయస్సు పైబడే కొలదీ వచ్చే బీపీ, సుగర్, కీళ్లనొప్పులు వంటివి ఏమీ ఆయన దరి చేరలేదు. వయస్సు పైబడినప్పటికీ నిత్య యవ్వనుడిగానే ఆయనను పేర్కొనవచ్చు. తన ఆరోగ్య రహస్యంపై ఆయనను ప్రశ్నిస్తే మాత్రంఇలా చెప్పుకొచ్చారు. ఆహారం విషయంలో సమయ పాలన పాటించడం, ఎటువంటి చెడు అలవాట్లు లేకపోవడమే కారణమంటున్నారు. ఆయన ప్రస్తుత దినచర్య విషయానికొస్తే... ఉదయం రెండు ఇడ్లీలు తిని తొమ్మిది గంటలకు ఇంటి వద్ద బయల్దేరి నెమ్మదిగా అదే వార్డు యర్రా నారాయణస్వామి మున్సిపల్ పాఠశాల ఆవరణలోని గ్రంథాలయానికి రావడం వార్తా దినపత్రికలను చదవడం. తదుపరి మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం5 గంటలకు భోజనం. ఇదే ఆయన ఆహార పట్టిక. తొమ్మిది పదుల వయస్సు పైబడిన వృద్ధాప్యంలోనూ కనీసం కళ్లజోడు కూడా లేకుండా వార్తాపత్రికలను మొదటి నుంచి చివరి పేజీ అక్షరం వదలకుండా అవలీలగా చదివేస్తారు. ఈ వయస్సులో కనీసం బీపీ, సుగర్, కీళ్లనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఆయన దరి చేరకపోవడం విశేషం. -
ఇంటి చిట్కాలు
తీపిని ఇష్టపడని పిల్లలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కొంతమంది పిల్లలకు చక్కెరతో చేసిన స్వీట్ తింటే వెంటనే జలుబు, దగ్గు సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు తేనె వాడడం మంచిది. చక్కెర చక్కటి ప్రత్యామ్నాయం తేనె. ఇది సహజమైనది కాబట్టి ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. త్వరగా శక్తినిస్తుంది కూడ. తేనె కొద్ది నెలలకు చిక్కబడుతుంది. అప్పుడు సీసాను పది నిమిషాల సేపు ఎండలో ఉంచితే తిరిగి పలచబడుతుంది. చిక్కబడకపోయినా సరే కనీసం ఏడాదిలో ఒకసారి అయినా అరగంట సేపు ఎండలో ఉంచాలి. బాటిల్ అడుగున ఉండిపోయిన తేనెను బయటకు తీయాలన్నా కూడా ఇదే పద్ధతి. తేనెను ఎప్పుడు కూడా మంట మీద వేడిచేయకూడదు. -
‘తియ్యటి’ విపత్తు.!
ఒకవైపు పెరిగిన జీవన వేగం, అది పెంచిన ఒత్తిడి.. మరోవైపు మోడ్రనైజేషన్ ముసుగులో అభివృద్ధి చెందుతున్నామనుకుంటూ దీర్ఘకాలిక రోగులతో నిండిపోతోంది మన సమాజం. ఎప్పుడో అరవైల్లో కనపడాల్సిన వ్యాధులు కూడా ఇరవై, ముప్పైల్లోనే పలకరించేస్తున్నాయి. ముఖ్యంగా మధుమేహం.. ఇది అంటు వ్యాధి కాదు అయినా దీని బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే ఇదొక సైలెంట్ కిల్లర్. ముందుగానే గుర్తించి నియంత్రణలో పెట్టుకుంటే సరే! లేకపోతే పైకి ఎలాంటి లక్షణాలూ కనబడకుండానే.. చాప కింద నీరులా ఒళ్లంతా గుల్ల చేసేస్తుంది. ఇంతటి పెను ముప్పు మన ‘కృష్ణా’ ఒంట్లో పాగా వేసింది. లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణాజిల్లాలో మధుమేహ వ్యాధి వ్యాప్తి వేగంగా ఉన్నట్లు ప్రభుత్వ సర్వేలు నిర్థారించడంతో, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫైలట్ పథకానికి జిల్లాను ఎంపిక చేశారు. జిల్లా జనాభాలో 30 ఏళ్లు దాటిన గ్రామీణుల్లో 11 శాతం, పట్టణాల్లో 18 శాతం మంది మధుమేహ రోగులు ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు తేల్చాయి. వ్యాధిగ్రస్తుల్లో 25 శాతం మందికి లక్షణాలు ఏమి కనిపించని కారణంగా మందులు వాడటం లేదని.. వ్యాధి ఉందని తెలిసిన వారిలో కూడా 50 శాతం మందే మందులు వాడుతున్నారని, వారిలో కూడా 25 శాతం మంది మాత్రమే వ్యాధిని అదుపులో (హెచ్‌బీఏ1సీ 6.5 శాతంలోపు) ఉంచుకోగలుగుతున్నట్లు నిర్ధారణయ్యింది. చిన్న వయస్సులోనే.. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయస్సులోనే వ్యాధి బారిన పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 20 నుంచి 30 ఏళ్ల యువకుల్లో సైతం మధుమేహం సోకుతున్నట్లు చెబుతున్నారు. రెండు జిల్లాలో 8 లక్షలకు పైగా మధుమేహ రోగులు వుండగా, వారిలో 10 శాతం మంది 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సువారేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వ్యాధి సోకిన ఐదు నుంచి పదేళ్లలో అవయవాలపై దుష్ఫలితాలు చూపుతున్నందున 35 నుంచి 45 ఏళ్లలోనే దయనీయ స్థితికి చేరుకుంటున్నట్లు హెచ్చరిస్తున్నారు. దుష్ఫలితాలు.. ♦ గుండె జబ్బులకు గురవుతున్న వారిలో 40 శా తం మందిలో మధుమేహం కారణం అవుతోంది. ♦ ఏటా మధుమేహం కారణంగా ఐదు వేల మం దికి పైగా కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. ♦ సుగర్ కారణంగా జిల్లాలో ఏటా వెయ్యిమందిలో కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ♦ వ్యాధి ఉన్న వారిలో 5 శాతం మందిలో గాంగ్రీన్స్ వస్తున్నట్లు చెబుతున్నారు. దీనిని తొలిదశలో గుర్తించకుంటే అవయవాలు(కాలు, చేయి) తొలగించాల్సిన ప్రమాదం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టులో చేసేది ఇది.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఆరోగ్య సిబ్బంది మధుమేహంపై ప్రత్యేక శ్రద్ధ చూపించనున్నారు. గ్రామీణుల్లో మధుమేహం ఉన్నట్లు నిర్థారణ అయితే వారు రెగ్యూలర్‌గా మందులు వాడేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఆహార నియమాలు, వ్యాయామం వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. రెగ్యూలర్‌గా రక్తపరీక్షలు, వైద్య పరీక్షలు చేస్తూ మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించనున్నారు. అదుపు ఇలా.. మన శరీరంలో చక్కెర స్థాయిలు పరగడుపున 126.. ఆహారం తీసుకున్న తర్వాత 160 మించకుండా ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా మూడు నెలల చక్కెర స్థాయిలు(హెచ్‌బీ ఏ1సీ) 6.5 ఉండేలా చూడాలి. అందుకు మితాహారం తీసుకుంటూ.. కొవ్వు పదార్థాలకు, పామాయిల్, వనస్పతి, కొబ్బరి నూనెలకు దూరంగా ఉండాలి. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువుగా తీసుకోవాలి. అంతేకాకుండా రోజూ 45 నిమిషాలు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ముందు చూపే మందు మధుమేహంపై అవగాహన పెంచుకోవడం ద్వారా వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. వ్యాధి సోకిన వారిలో సగం మందికిపైగా సరైన నియమాలు పాటించకపోవడం వల్ల దాని ప్రభావం గుండె, కిడ్నీ, మెదడు, కళ్లపై పడుతోంది. దీంతో ప్రాణాపాయం ఏర్పడంతో పాటు, మరికొందరు పూర్తిగా చూపును కోల్పోతున్నారు. వ్యాధి సోకిన పదేళ్లలోపు దుష్ఫలితాలు కనిపించడం లేదని, నియమాలు పాటించకపోతే.. అనంతరం అవయవాలు దెబ్బతిన్న తర్వాత చేయగలిగిందేమి ఉండదు. మధుమేహ వ్యాధి ఉన్న వారు ఆరోగ్యకరమైన ఆహార, వ్యాయామ నియమాలు పాటించడం, ఇతర నిర్ధేశిత మందులను క్రమం తప్పకుండా వేసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు.– డాక్టర్ ఎం. శ్రీకాంత్,మధుమేహ నిపుణుడు, విజయవాడ -
జీఎస్టీ రిటర్న్ ఇకపై మరింత సులువు
సాక్షి, న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జిఎస్టీ)లో కీలకమైన జీఎస్టీఎన్ను ఇకపై ప్రభుత్వ ఆధీన సంస్థగా మార్చేందుకు జిఎస్టీ కౌన్సిల్ అంగీకారం తెలిపింది. అంతేకాదు జీఎస్టీ రిటర్న్‌లను సరళీకృతం చేసే రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసినట్టు 27వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కౌన్సిల్ వెల్లడించింది. అలాగే చక్కెరపై పన్ను విధించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసింది. డిజిటల్ చెల్లింపులపై 2శాతం ప్రోత్సాహమిచ్చే అంశాన్ని కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం పరిశీలనకు అప్పగించినట్టు తెలిపింది. కొత్త 27 వ సమావేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ పై అధికార నిర్ణయం తీసుకునే సంస్థ ప్యానెల్,జీఎస్టీఎన్ ను మార్చడానికి ప్రతిపాదనకు అంగీకరించినట్టు తెలిపారు. ప్రైవేటు సంస్థల వాటాను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనకు కౌన్సిల్ అంగీకరించిందనీ, కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూరుస్తుందన్నారు. మిగతా వాటా రాష్ట్రాలదని స్పష్టంచేశారు. జిఎస్టీ నెట్ వర్క్ లేదా జిఎస్‌టీఎన్లో ప్రస్తుతం 24.5 శాతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నదని జైట్లీ పేర్కొన్నారు. మిగిలిన 51శాతం ఐదు (హెచ్ఎఫ్సీ లిమిటెడ్, హెచ్ఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంకు లిమిటెడ్, ఎన్ఎస్ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ కో, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్) ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్సిట్యూట్లదని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన సమావేశానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.జీఎస్టీ ఫైలింగ్‌ను మరింత సరళీకృతం చేయనున్నట్టు వెల్లడించారు. ఆరునెలల్లో ఒకే నెలవారీ రిటర్న్ ఫైలింగ్ వ్యవస్థ అమల్లోకి వస్తోందని ఆర్థికశాఖ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా చెప్పారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి అమిత్ మిత్రా మాట్లాడుతూ దాదాపు అయిదు రాష్ట్రాలు సుగర్‌పై లెవీకి అనుకూలంగా లేవని అన్నారు. ముఖ్యంగా ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా చక్కెరపై లెవీని వ్యతిరేకించారు. ఇది సామాన్యుడిపై మరింత భారాన్ని మోపుతుందన్నారు. -
మయూరి హోటల్ సమీపంలో మనిషి కాలు
సాక్షి, విజయనగరం ఫోర్ట్ : జిల్లా కేంద్రంలో తెగిపడి ఉన్న కాలు ఎముకలు కలకలం రేపాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న మయూరి హోటల్ సమీపంలో మనిషి కాలు పడి ఉంది. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఓ మనిషి కాలు అక్కడకు ఏలా వచ్చిందన్న దానిపై సర్వత్రా చర్చించుకున్నారు. ఎవరైనా నరికి పడేశారా.. లేదా సమీపంలో ఉన్న ఆస్పత్రుల్లో ఆపరేషన్ చేసి కాలు తొలిగించి పడేశారా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే పోలీసుల విచారణలో ఆస్పత్రిలో తొలగించబడిన కాలు ఎముకలని తేలడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఒకటో పట్టణ సీఐ చంద్రశేఖర్ తెలియజేసిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల కిందట మయూరి హోటల్‌కు సమీపంలో ఉన్న ఆస్పత్రికి ఓ మ«ధుమేహ రోగి వచ్చారు. అతని కాలు కుళ్లిపోవడంతో వైద్యులు ఆపరేషన్ చేసి కాలు తొలిగించి, బయోవేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహించే సంస్థకు అప్పగించారు. అయితే వారు వాహనంలో తరలిస్తుండగా కాలు జారి పడిందని సమాచారం. ప్రస్తుతం ఆ కాలును ఆస్పత్రి వైద్య సిబ్బంది భద్రపరిచారు. -
బాదమ్ బర్ఫీ
కావలసినవి: బాదంపప్పు – కప్పు; చక్కెర – 1 1/4 కప్పు; నెయ్యి – 1/4 కప్పు ( 6 టేబుల్ స్పూన్లు); పాలు – 1/4 కప్పు; పిస్తా – గార్నిష్‌కి సరిపడా. తయారీ: బాదంపప్పులను కొద్దిసేపు వేడినీళ్ళలో నానబెటì ్ట తరవాత పొట్టు తీయాలి. తరవాత దానిని పాలతో కలిపి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. ఒక పాన్ తీసుకొని పంచదార, కొద్దిగా నీరు పోసి తీగ పాకం పట్టాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్‌ని పాకంలో వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. అది దగ్గరకి వస్తుండగా కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ బాగా కలపాలి. ఈలోగా ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసి పక్కన ఉంచుకోవాలి. బాగా ఉడికి విడివిడిలాడుతుండగా దింపేయాలి. వెంటనే ప్లేట్ మీద కొద్దిగా మందంగా ఈ మిశ్రమాన్ని వేయాలి. అది గట్టిపడుతుండగా మీకు కావలసిన షేప్‌లో కట్ చేయాలి. చివరగా బాదం, పిస్తా పలుకులతో గార్నిష్ చేయాలి. -
ఫుడ్ ఫ్యాక్ట్స్
పంచదారను అధికంగా తీసుకోకూడదు. మనం తీసుకునే పదార్థాలలో ఏ పదార్థంలోనూ లేనన్ని కెమికల్స్ ఒక్క పంచదారలోనే అధికంగా ఉన్నాయని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. పంచదార బదులు బెల్లం వాడటం మంచిది. పంచదారను అధికంగా తీసుకుంటే... ♦ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి, గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది ♦ శరీర బరువు పెరిగి, లావుగా అయిపోతారు ♦ బ్లడ్ ప్రెషర్ వచ్చి, బ్రెయిన్‌కి నష్టం కలిగించే బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి ♦ పంచదారలో ఉండే సుక్రోజు శరీరంలో జీర్ణం కాదు ♦ పంచదారలో దాదాపు 23 రకాల హానికారక కెమికల్స్ ఉంటాయి. ♦ డయాబెటిస్ రావడానికి ముఖ్య కారణం పంచదార. ♦ శరీరంలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్‌ని అమాంతం పెంచేస్తాయి. ♦ పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. -
రసాయనిక ఎరువుల వల్లే షుగర్, గుండెజబ్బులు!
పంటలకు వేసే రసాయనిక ఎరువులే రైతులను, వినియోగదారులను షుగర్, గుండె జబ్బుల పాలుజేస్తున్నాయా? అవునని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రసాయనిక ఎరువులలోని విషతుల్యమైన భారఖనిజాలకు.. రైతులు షుగర్, గుండెజబ్బుల పాలు కావడానికి మధ్య సంబంధం ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నానోసైన్స్, వాటర్ రీసెర్చ్ యూనిట్ శాస్త్రవేత్తలు నిర్ణయానికి వచ్చారు. తమిళనాడులోని ఒక గ్రామంలో 900 మంది రైతులు, వినియోగదారుల మూత్ర నమూనాలను సేకరించి అధ్యయనం చేసినప్పుడు ఆశ్చర్యకరమైన ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ నిధులతోనే ఈ అధ్యయనాన్ని చేపట్టడం విశేషం. కోయంబత్తూరులోని కొవై మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో ఈ మూత్ర నమూనాలను పరీక్షించారు. మద్రాస్ ఐఐటీలో రసాయన శాస్త్ర ఆచార్యుడు ప్రదీప్ తలప్పిల్ ఈ అధ్యయన వివరాలు వెల్లడించారు. ‘మూత్ర నమూనాలు ఇచ్చిన ఈ 900 మందిలో 82.5% మంది వ్యవసాయదారులు. అధ్యయనం చేసిన ఆ గ్రామంలో పంటలకు వాడుతున్న రసాయనిక ఎరువుల్లో అత్యంత విషతుల్యమైన భార ఖనిజాలు ఉన్నట్లు కనుగొన్నారు. 43.4% మంది షుగర్‌కు ముందు దశలో ఉన్న వారు, 16.2% మంది షుగర్ వ్యాధికి గురైన వారు, 10.3% మంది గుండెలో రక్తనాళాలు పూడుకుపోయే జబ్బు (అథెరోసెలెరోసిస్) బారినపడ్డారని... ప్రదీప్ తలప్పిల్ చెప్పారు. ఊబకాయం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలున్న వారికి ఈ జబ్బులు రావడం సహజం. అయితే, ఈ 900 మందికి అటువంటివేమీ లేకపోయినప్పటికీ ఆశ్చర్యకరంగా షుగర్, గుండె జబ్బుల పాలయ్యారని ఆయన వివరించారు. గ్రామీణుల్లో షుగర్, గుండె జబ్బులు గతంలో కన్నా పెరుగుతున్నాయని భారతీయ వైద్య పరిశోధనా మండలి చెబుతోంది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఇటీవల ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... ఏటేటా ప్రతి వెయ్యి మంది గ్రామీణులలో ఇద్దరు షుగర్ వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. వీటికి రసాయనిక ఎరువులే కారణమవుతున్నాయన్నది తాజా అధ్యయనంలో తేలిన విషయం. రైతులు ఆహార ఉత్పత్తిదారులైతే... వినియోగదారులమైన మనం సహ ఉత్పత్తిదారులమని అనుకోవచ్చు. మనం ఎటువంటి ఆహారం కావాలంటే రైతులు అటువంటి ఆహారాన్నే పండిస్తారు. మనం వరి బియ్యం, గోధుమలు వద్దు... ఆరోగ్య సిరులనిచ్చే సిరిధాన్యాలే కావాలని మనం అంటే... రైతులు వాటినే పండించి మనకు ఇస్తారు. కాబట్టి, రసాయనాలు అవసరం లేకుండా ఆరోగ్యదాయకంగా పంటలు పండించడాన్ని ప్రోత్సహిద్దాం. సేంద్రియ పద్ధతుల్లో చిరు(సిరి)ధాన్యాలను, పప్పుధాన్యాలను, నూనెగింజలను పండించే రైతులను అధిక ధర ఇచ్చి మరీ ప్రోత్సహిద్దాం. భూమాతను అనారోగ్యం నుంచి పోషకాల లోపం నుంచి కాపాడదాం. అనవసర జబ్బుల నుంచి, ఆత్మహత్యల నుంచి రైతులను రక్షించుకుందాం. మన పిల్లల, మన ఆరోగ్యాలను రక్షించుకుందాం. మనం కదలడానికి, మంచి వైపు కదలడానికి ఇంకా ఎన్నెన్ని అధ్యయనాలు చేయాలి? ఎంత కాలం చేజారాలి? అన్నవే మనముందున్న ప్రశ్నలు. -
కృత్రిమ చక్కెరలతోనూ ఊబకాయ, మధుమేహ సమస్యలు!
చక్కెర తెస్తున్న చిక్కుల పుణ్యమా అని ఈరోజుల్లో చాలామంది కృత్రిమ స్వీట్నర్స్ను వాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవి కూడా ఊబకాయం, మధుమేహం వంటి అనేక వ్యాధులకు కారణమవుతున్నట్లు తాజాగా ఓ పరిశోధన స్పష్టం చేసింది. మెడికల్ కాలేజ్ ఆఫ్ విస్కాన్సిన్, మారెక్యూట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సంయుక్తంగా జరిపిన ఈ పరిశోధనల్లో ఈ కృత్రిమ చక్కెరలు శరీరంలో ఎలాంటి మార్పులకు కారణమవుతున్నాయో విస్తృతంగా చర్చించారు. కృత్రిమ చక్కెరలను వాడటం మొదలై చాలాకాలమవుతున్నా.. ఊబకాయపు సమస్య ఏ కొంచెం కూడా తగ్గకపోవడం ఇక్కడ గమనార్హం. సాధారణ చక్కెరతోపాటు ఆస్పారటేమ్, అసిసూల్ఫేమ్ పొటాసియం వంటి కృత్రిమ చక్కెరలను ఎలుకలకు అందించినప్పుడు వాటి శరీరాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త బ్రియన్ హాఫ్మాన్ తెలిపారు. మూడు వారాల తరువాత జరిపిన పరిశీలనల్లో కీలకమైన రసాయనాలు, కొవ్వులు, అమినోయాసిడ్లలో తేడాలు నమోదయ్యాయి అని చెప్పారు. వీటన్నింటిని బట్టి ఈ కృత్రిమ చక్కెరలు మన శరీరం కొవ్వులను జీర్ణం చేసుకునే పద్ధతుల్లో మార్పులకు కారణమవుతున్నాయని.. కొన్ని కృత్రిమ చక్కెరలు రక్తంలో పేరుకుపోయి రక్తనాళాల్లోని కణాలపై దుష్ప్రభావం చూపుతాయని హాఫ్మాన్ తెలిపారు. కృత్రిమ చక్కెరలను మోతాదుకు మించి అది కూడా దీర్ఘకాలంపాటు తీసుకుంటే సమస్యలు తప్పవని తొలిసారి తమ పరిశోధన చెబుతోందని హాఫ్మాన్ చెప్పారు. -
చేదెక్కిన తీపి!
ఎండలు మండితే కూల్ డ్రింక్! నలుగురు కలిసినా.. విందువినోదాల్లో సేద తీరాలన్నా ఇదే.. ఊరెళ్లినా పక్కన ఉండాల్సిందే.. మితిమీరిన చక్కెరతో ఒళ్లు హూనమవుతుందని తెలిసినా.. తగ్గని ఈ తీపి అలవాటుకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. అమ్మే ప్రతి బాటిల్‌పై ప్రభుత్వాలు పన్నుల కొరడా ఝళిపిస్తున్నాయి. మెక్సికోతో మొదలైన ఈ దాడి యూకేకూ పాకిన నేపథ్యంలో.. మనకు చేటు చేసే చక్కెర సంగతులేమిటో చూసేయండి! ఎంత పన్ను వేస్తున్నారు? ఐదు నుంచి ఎనిమిది శాతం చక్కెర ఉంటే.. లీటర్‌కు 18% 8 శాతం కంటే ఎక్కువ ఉంటే.. లీటర్‌కు 24% కూల్డ్రింక్స్పై షుగర్ ట్యాక్స్ విధించిన దేశాలు 24 తొలి దేశం.. మెక్సికో(2014) అదే బాటలో.. ఫ్రాన్స్, నార్వే, పోర్చుగల్, థాయ్‌లాండ్, స్పెయిన్. ఇదే బాటలో ఐర్లండ్, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా. దుష్ప్రభావాలివీ.. షుగర్ అంతా క్యాలరీలతో నిండిపోయి ఉంటుంది. అందులో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, శరీరానికి అవసరమయ్యే ఫాట్స్ లాంటివేవీ ఉండవు. అప్పటికప్పుడు శక్తినిచ్చే పదార్థమే. అవసరానికి మించి షుగర్‌ని తీసుకుంటే ఎన్నో వ్యాధుల బారిన పడతాం. అవేంటో ఓసారి చూద్దాం.. ♦ షుగర్ అధికంగా తీసుకోవడం వల్ల నోట్లో హానికరమైన బ్యాక్టీరియా చేరి దంతాలు పాడైపోతాయి ♦ మన శరీరంలోని ఇన్సులిన్ వ్యవస్థ దెబ్బతిని మధుమేహ వ్యాధి(టైప్ 2) సంక్రమిస్తుంది ♦ మెటబాలిజమ్‌పై ప్రభావం చూపించి అధికంగా బరువు పెరుగుతారు. ఒబెసిటీకి దారి తీయొచ్చు ♦ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత వ్యాధులు రావొచ్చు ♦ బ్రెయిన్లో అధిక మోతాదులో డొపమైన్ విడుదలై పంచదార తినడం అన్నది ఒక వ్యసనంగా మారుతుంది ♦ కాలేయానికి సంబంధించి వ్యాధులు, చివరికి కేన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది చక్కెరపై పరిమితి ఎంత? (ఒక టీ స్పూన్ పంచదార 4.2 గ్రాములతో సమానం) పురుషులు 9 టీ స్పూన్స్ మహిళలు 6 టీ స్పూన్స్ పిల్లలు 3 టీ స్పూన్స్ ఏ డ్రింక్స్‌లో ఎంత షుగర్! సాఫ్ట్ డ్రింక్(600 ఎంఎల్) - 16 టీ స్పూన్స్ స్పోర్ట్స్ డ్రింక్ (600 ఎంఎల్) - 9 టీ స్పూన్స్ ఎనర్జీ డ్రింక్ (250 ఎంఎల్) - 7 టీ స్పూన్స్ -
ఆరోగ్యంతోనే ప్రపంచాన్ని జయించవచ్చు
ప్రొద్దుటూరు : మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ ప్రపంచాన్ని జయించడం సాధ్యమవుతుందని వీరమాచనేని రామకృష్ణారావు తెలిపారు. స్థానిక అనిబిసెంట్ ఎగ్జిబిషన్ మైదానంలో సీబీఐటీ చైర్మన్ వి.జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ డయాబెటిక్, బీపీ ఉన్నవారిని వైద్య రంగం శాశ్వతంగా వారిని రోగులుగా మార్చిందన్నారు. వాస్తవానికి దగ్గు వస్తే ఎలా పోతుందో షుగర్, బీపీలు కూడా అలానే నియంత్రివచ్చన్నారు. డయాబెటిక్ రోగులు అనే పదం పచ్చి అబద్దమన్నారు. వానపామును అనకొండలా చూపి వారిని సర్వ నాశనం చేస్తున్నారని తెలిపారు. ప్రధానంగా మందుల వాడకాన్ని క్రమేపి పెంచడం వల్ల వారు మరింత అనారోగ్యంపాలై కళ్లు పోగొట్టుకుంటున్నారన్నారు. కిడ్నీలు కూడా మందులు వాడకం వల్ల దెబ్బతింటున్నాయనేది వాస్తవమని తెలిపారు. చివరికి డయాబెటిక్ రోగుల పరిస్థితి ఆత్మహత్య చేసుకునే స్థితికి తెచ్చారన్నారు. తన ఆరోగ్య సూచనల వల్ల ఇన్సులిన్ వాడేవారు సైతం డయాబెటిక్ నుంచి బయట పడవచ్చన్నారు. అసలు వైద్య రంగంలో డయాబెటాలజి అనే విభాగమే లేదని తెలిపారు. ఆహారంపై దృష్టి పెట్టాలి మనిషి ప్రధానంగా తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫాట్ ఉంటుందన్నారు. ఆధునిక జీవితంలో గుడ్డును తింటున్నా అందులోని పచ్చసోన తినడం లేదన్నారు. వాస్తవానికి పచ్చ సోనలోనే 80 శాతం ఫాట్ ఉంటుందన్నారు. 1977లో అమెరికా దేశం కొలస్ట్రాల్ వల్లే గుండెజబ్బులు వస్తున్నాయని ప్రచారం చేశారని తెలిపారు. అది అగ్రదేశం కావడంతో అందరూ ఆ విధానాన్ని పాటిస్తున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. పాలిష్ బియ్యం వాడటం వల్ల అనారోగ్యానికి కారణమవుతున్నామని, ఆకలిని బట్టి ఆహారాన్ని తింటున్నామన్నారు. పూర్వం పొలం పనులు చేసుకుంటూ రైతులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తినడాన్ని అలవాటు చేసుకున్నారని, ప్రస్తుతం శారీరక శ్రమ చేయకున్నా ఇదే విధానాన్ని అవలంభిస్తున్నామన్నారు. అవసరం ఉన్నా లేకున్నా తింటుండటంతో ఊబకాయం, రోగాలు రావడం జరుగుతోందన్నారు. రీఫైండ్ ఆయిల్ సంస్కృతి మంచిది కాదని తెలిపారు. సముద్ర ఉప్పును వినియోగించాలని కోరారు. తాను వెయ్యిమందిని డయాబెటిక్ రోగులను దత్తత తీసుకుని వ్యాధి నివారణ చేస్తానని, అందులో ఒక్కరికైనా డాక్టర్లు వ్యాధిని పోగొడుతారా అని ఆయన ప్రశ్నించారు. తాను అలా చేయలేని పక్షంలో జైలుకైనా వెళ్లడానికి సిద్ధమని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానన్నారు. అనంతరం సీబీఐటీ కళాశాల చైర్మన్ వి.జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకుని ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు అనేక మంది సహకారం అందించారని తెలిపారు. కార్యక్రమంలో నెక్ ప్రతినిధి బాలస్వామి, రెడ్డి ఉపేంద్రబాబు, సీబీఐటీ, వీబీఐటీ ప్రిన్సిపాళ్లు పాండురంగన్ రవి, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ అల్పాహారంగా గుడ్డు, చికెన్ ముక్కలు, వాటర్ ప్యాకెట్లు అందించారు. -
ఖైరున్నిసాపై కరుణ చూపరూ
శంషాబాద్: ప్రేమగా అమ్మ చక్కెరను నోట్లో పోయదు... మారాం చేసినా నాన్న చాక్లెట్ కూడా కొనివ్వడు.. ఎందుకో ఆ చిన్నారికి అర్థం కాదు...? తల్లిదండ్రులు తనపై ఎందుకంత కఠినంగా ఉంటున్నారో ఆ పాపకు తెలియదు. ఐదేళ్లు నిండక ముందే తీపి తినే అదృష్టానికి తాను దూరమైందని చెప్పినా అర్థం చేసుకునే వయసు ఆ చిన్నారికి లేదు. కడుపు నింపుకోడానికే కష్టాల కడలి ఈదుతున్న ఆ కుటుంబానికి తియ్యని నవ్వులు పూయించే పాపకు వచ్చిన కష్టం వారిని కుంగదీస్తోంది. శంషాబాద్‌లోని అహ్మద్‌నగర్‌లోని అద్దెగదిలో నివాసముండే షేక్ షానూర్ పట్టణంలో విధుల్లో తిరుగుతూ చాయ్‌లు అమ్ముతూ జీవిస్తున్నాడు. ఆయన భార్య రేష్మా సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. ఏడాదిన్నర కిందట తమ చిన్నకూతురు ఖైరున్నీసా అతిమూత్ర విసర్జనతో పాటు తరచూ సొమ్మసిల్లి పడిపోతుండడంతో పరీక్షలు చేయించారు. చిన్నారికి మధుమేహం 400 పైగా ఉందని తేలింది. తక్షణ వైద్యసేవల కోసం వెంటనే నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నెలరోజుల పాటు కోమాలోకి వెళ్లిన పాపకు అక్కడి వైద్యులు చికిత్సలు నిర్వహించి ఎట్టకేలకు మాములు స్థితికి తీసుకొచ్చారు. తప్పని కష్టాలు... పాపకు మధుమేహం తీవ్రత ఉన్న కారణంగా రోజూ మూడుసార్లు తప్పనిసరిగా ఇన్సులిన్ ఇంజ„క్షన్లు ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. అప్పటి నుంచి పాపకు రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇన్సులిన్ వాడుతున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఎక్కడా ఇన్సులిన్‌ను ఉచితంగా ఇవ్వకపోవడంతో ప్రైవేటుగానే కొనుగోలు చేయాల్సిన దుస్థితి. దీంతో పొట్టనింపుకోలేని ఆ కుటుంబానికి చిన్నారి వైద్య ఖర్చులు మరింత భారంగా మారిపోయాయి. ఇప్పటికే సుమారు రూ.2 లక్షలకు పైగా అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయారు. ఆర్థిక భారం భరించలేక పెద్దకుమారుడు, కుమార్తెను రాజేంద్రనగర్‌లోని చింతల్మెట్లో బంధువుల వద్ద ఉంచి చదివిస్తున్నారు. ఒకపక్క పాప పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే జీవనోపాధి కోసం పరుగులు పెడుతున్న ఆ కుటుంబం ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తోంది. పాపకు నిరంతర వైద్యం అందించేందుకు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వైద్యం చేయించలేని దుస్థితి.. మా పాపకు మా శాయశక్తులా అప్పులు చేసి వైద్య చేయిస్తున్నాం. ఏడాదిన్నర నుంచి రో జూ ఇన్సులిన్ ఇంజక్షన్లు వాడుతున్నాం. జీవి తాంతం పాపకు మందులు, సూదులు ఇవ్వా లని డాక్టర్లు చెప్పారు. ఇన్సులిన్ ఇవ్వడంలో ఆలస్యం జరిగితే సొమ్మసిల్లి పడిపోతోంది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయాం. రో జూ వీధుల్లో చాయ్ అమ్ముకుంటూ జీవిం చే నాకు పాప వైద్యం భారంగా మారు తోంది. దాతలు ఎవరైనా ఆర్థిక చేయూ తనిచ్చి ఆ దుకోవాలని వేడుకుంటున్నా. – షేక్ షానూర్, పాప తండ్రి పాపకు ఆర్థిక సాయం చేయదలుచుకుంటే.... చిన్నారి షేక్ ఖైరున్నిసా, తండ్రి షేక్ షానూర్ (జాయింట్ అకౌంట్ ) అకౌంట్ నం: 3601397468 శంషాబాద్, బ్రాంచ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
గర్భవతులు చక్కెర తింటే పిల్లలకు అలర్జీలు
మీకు పూర్తి ఆరోగ్యకరమైన బేబీ పుట్టాలని భావిస్తున్నారా? పుట్టాక ఆ చిన్నారికి ఎలాంటి అలర్జీలూ ఉండకూడదని అనుకుంటున్నారా? సింపుల్ మీరు చేయాల్సిందల్లా గర్భవతిగా ఉన్న సమయంలో చక్కెర చాలా తక్కువగా తినడమే. మీరు ఎంత తక్కువగా చక్కెర లేదా చక్కెరతో చేసిన పదార్థాలు తింటే మీ చిన్నారి అంత ఆరోగ్యకరంగా పుడుతుంది. అంతేకాదు... ఎన్నో అలర్జీలు ఎదుర్కొనే శక్తి కూడా వారికి సమకూరుతుంది. అయితే ఇక్కడ తాజా పండ్ల నుంచి లభ్యమయ్యే చక్కెరకు మినహాయింపు ఉంది.ఇటీవల బ్రిటన్‌లో 8,956 మంది గర్భవతులపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో కొంతమంది గర్భిణులు చాలా తక్కువ చక్కెర వినియోగించగా... మరో 20 శాతం మంది చాలా ఎక్కువగా చక్కెర పదార్థాలను తీసుకున్నారు. ఇంకొందరు ఓ మోస్తరుగా చక్కెర పదార్థాలు వాడారు. వారందరికీ పుట్టిన బిడ్డలను వారి ఏడవ ఏట దుమ్ములో సూక్ష్మక్రిములకు (డస్ట్‌మైట్స్), పిల్లల వెంట్రుకలకు, గడ్డి వంటి వాటికి... ఇలా మూడు అంశాలకు ఎక్స్పోజ్ చేశారు. తక్కువ చక్కెర తిన్న తల్లులకు పుట్టిన వారితో పోలిస్తే... ఎక్కువ చక్కెర వినియోగించిన మహిళల బిడ్డలే ఎక్కువగా అలర్జీలకు లోనయ్యారు. వీరిలో తక్కువ చక్కెర తీసుకున్న తల్లుల బిడ్డలు ఒక అంశానికీ, కాస్త మోతాదుకు మించి చక్కెర పదార్థాలు వాడిన తల్లుల బిడ్డలు రెండు అంశాల పట్ల అలర్జీకి గురయ్యారు. ఇక అత్యధికంగా చక్కెర వాడిన తల్లుల బిడ్డల్లో ‘అలర్జిక్ ఆస్థమా’ కండిషన్ కనిపించింది. ఈ అధ్యయన ఫలితాలు ‘యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్’లో చోటుచేసుకున్నాయి. -
చక్కెరపై పన్ను?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : చక్కెర పరిశ్రమకు సంబంధించి విచిత్రమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకవంక అంచనాలను మించిన ఉత్పత్తి అటు చెరకు రైతును ఇటు చక్కెర ధరను దెబ్బతీస్తుండగా... మరోవంక రిటైల్ ధరలు మాత్రం ఉపశమనం ఇవ్వటం లేదు. తాజాగా ఎగుమతులను ప్రోత్సహించటానికి స్థానికంగా జరిగే చక్కెర విక్రయాలపై పన్ను వేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు వెల్లడయింది. సోమవారం ఈ వార్తలు షికారు చేయటంతో... అది చక్కెర కంపెనీల విక్రయాలు, లాభాలపై తీవ్ర ప్రభావం చూపించవచ్చన్న అంచనాలతో షుగర్ కంపెనీల షేర్లలో భారీ విక్రయాలు చోటు చేసుకున్నాయి. దీంతో మార్కెట్లు పెరిగినా కూడా చక్కెర కంపెనీల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. పన్ను ఎందుకంటే... ఈ చక్కెర సీజన్లో 29.5 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి కావచ్చనేది ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) అంచనా. 2016–17 సీజన్‌తో పోలిస్తే ఇది 45 శాతం అధికం. నిజానికి దేశీయ డిమాండ్ 24.5 మిలియన్ టన్నులే. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఎంత కాదన్నా ఈ సీజన్లో 20 లక్షలు, వచ్చే సీజన్లో 50 లక్షల టన్నుల చక్కెరను విదేశాలకు ఎగుమతి చేయాల్సి ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే అంతర్జాతీయంగా ధర తక్కువగా ఉంది. పాకిస్తాన్ క్వింటాలుకు సుమారు రూ.2,200కు విక్రయిస్తోంది. భారత్‌లో మిల్లు ధరే రూ.2,900 పైన ఉంది. ఈ ధరలో అంతర్జాతీయంగా పోటీపడలేమని కేసీపీ షుగర్ సీవోవో జి.వెంకటేశ్వర రావు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. నిజానికి ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 20 శాతంగా ఉన్న ఎగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. ఇంకా మిల్లులకు నగదు ప్రోత్సాహకాలివ్వాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలిసింది. స్థానికంగా చక్కెర అమ్మకాలపై పన్ను వేయడం ద్వారా సమీకరించిన మొత్తాన్ని ఎగుమతుల ప్రోత్సాహకానికి వినియోగించే అవకాశం ఉంది. ‘‘మిల్లులు ఇప్పటికే రిఫైన్డ్ చక్కెరను ఉత్పత్తి చేశాయి. చాలా దేశాలు ముడి చక్కెరనే కొనుగోలు చేస్తాయి. అంటే ఈ సీజన్లో ఎగుమతులు పెద్దగా ఉండకపోవచ్చు’’ అని ఓ కంపెనీ ప్రతినిధి చెప్పారు. తగ్గుతున్న హోల్‌సేల్ ధర! న్యూఢిల్లీ హోల్‌సేల్ మార్కెట్లో సోమవారం షుగర్ ధర క్వింటాలుకు రూ.180 తగ్గి ఎం–30 రకం రూ.3,150–3,270 మధ్య పలికింది. స్టాకిస్టులు, సాఫ్ట్ డ్రింక్, ఐస్‌క్రీమ్, కన్ఫెక్షనరీ వంటి కంపెనీల నుంచి డిమాండ్ పడిపోవడం కూడా ధర పతనానికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత సీజన్లో ఒకానొక దశలో మిల్లు ధర రూ.3,800 దాకా వెళ్లింది. ప్రస్తుతం రూ.2,900 పలుకుతోంది. తయారీ వ్యయం కంటే అమ్మకం ధరలు తక్కువ ఉండటంతో కంపెనీలు నష్టాలను చవి చూస్తున్నట్లు చెబుతున్నాయి. నష్టాల వల్ల దేశంలోని 523 చక్కెర మిల్లుల్లో ఇప్పటికే 106 మూతపడ్డాయి. ఇందులో ఏడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి. రైతులకు మిల్లులు చెల్లించాల్సిన బకాయిలు జనవరి 31 నాటికే రూ.14,000 కోట్లకు చేరుకున్నాయి. ఈ నెలాఖరుకు ఇవి ఇంకా భారీగా పెరగనున్నాయి. -
చెక్క్కెర
అమ్మో... ఎంత అమాయకంగా కనబడుతుంది! తెల్లగా నిగనిగలాడుతూ... స్ఫటికంగా స్వచ్ఛంగా మెరుస్తూ! కానీ... అమ్మో... వైట్ పాయిజన్ అట. సైలెంట్‌గా ప్రాణం మీదికి తెస్తుందట. అందుకే... బీ కేర్‌ఫుల్ ఆఫ్ ష్ష్ష్షు...గర్. అండ్ చెక్ ద చక్కెర!! చక్కెర... ఏ తినుబండారాన్నైనా తియ్యగా మార్చాలంటే చాలా తేలిగ్గా ఉపయోగించగల పదార్థం. చిన్న చిన్న స్ఫటికాలుగా చెంచాలో పట్టేలా ఉండటమే దీన్ని బాగా ఉపయోగంలోకి తెచ్చింది. అదే బెల్లం లేదా తేనె అనుకోండి. మొదటిది అచ్చులుగా ఉండి, కావాల్సిన పరిమాణంలో పడకపోవచ్చు. ఇక రెండోదైన తేనె విషయానికి వద్దాం. అదెంతో ఆరోగ్యకరమే అయినా చిక్కటి ద్రవం రూపంలో ఉండటంతో హ్యాండ్లింగ్ ఒకింత కష్టం. అందుకే చక్కెరకు అంత ప్రాచుర్యం. కానీ చక్కెర అంటే తెల్లటి విషం అంటున్నారు చాలామంది ఆహారనిపుణులు. పిల్లలెవరైనా సిగరెట్‌తో కనిపిస్తే తిడతాం. చెడ్డ అలవాటంటూ క్లాస్ తీసుకుంటాం. వాళ్లు మద్యం జోలికి వెళ్లారా... మన ప్రతిచర్య మరింత తీవ్రంగా ఉంటుంది. కానీ చేజేతులారా పిల్లలకు మనమే తీపి పదార్థాలూ, క్యాండీలు ఇస్తుంటాం. వాటిల్లో చాలావరకు చక్కెరతో తయారైనవే ఉంటాయి. చక్కెరతో తయారైన పదార్థాలు వాళ్లకు ఇవ్వడం అంటే చేజేతులారా సిగరెట్ లేదా మద్యం కంటే హానికరమైన పదార్థాలు వాళ్లకు సాక్షాత్తూ పెద్దలే అందించడం లాంటిది అంటున్నారు ప్రముఖ బయోకెమిస్ట్ రేమండ్ ఫ్రాన్సిస్. ఆయన రాసిన ‘నెవర్ బి సిక్ అగైన్’ (ఇంకెప్పుడూ జబ్బుపడకండి) అనే పుస్తకం చాలా ప్రఖ్యాతి పొందింది. చక్కెర గురించి ఆయన చెబుతున్న విషయాలివి... ‘‘చక్కెర తెల్లగా, ఆకర్షణీయంగా కనిపించే ఒక తియ్యటి విషం. చాలారోజుల కిందట నేను జబ్బుపడ్డాను. స్వతహాగా బయోకెమిస్ట్ను కావడంతో ఆహారపదార్థాలు, అవి తినగానే మనలో జరిగే జీవరసాయన చర్యలపై నాకు అవగాహన ఉంది. దాంతో నా ఆహారం ఆరోగ్యకరంగా ఉండేలా జాగ్రత్త వహించాను. అంటే నా ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవడం, ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం వంటి నియమాలు పాటించాను. దాంతో కిందటి సారి జబ్బు పడి కోలుకున్న తర్వాత గత 26 ఏళ్లలో మళ్లీ నేను కనీసం ఎప్పుడూ చిన్న జ్వరానికి కూడా గురికాలేదు. కాకపోతే ఒక్కసారి మాత్రం నాకు జలుబు చేసింది. దానికి కారణం కూడా నాకు తెలుసు ఒక సారి నేను చక్కెరతో చేసిన పదార్థం తినడమే ఇందుకు కారణం’’ అంటారాయన. చక్కెర ఎందుకు, ఎంత ప్రమాదం... మనం జీవితంలో ఎప్పుడూ జబ్బుపడకుండా ఉండాలంటే కేవలం చక్కెర తీసుకోకుండా ఉంటే చాలంటారు రేమండ్ ఫ్రాన్సిస్. ఆయన రాసిన ‘నెవర్ బి సిక్ అగైన్’, ‘నెవర్ బి ఫ్యాట్ అగైన్’, నెవర్ ఫియర్ క్యాన్సర్ అగైన్’, ‘నెవర్ ఫీల్ ఓల్డ్ అగైన్’, ‘ద గ్రేట్ అమెరికన్ హెల్త్ హోక్స్’... పుస్తకాలన్నీ జనాదరణ పొందాయి. ఆయన చెబుతున్న ప్రకారం కేవలం ఒక టీ స్పూన్ చక్కెర తీసుకుంటే చాలు.. రెండు గంటల్లో... అది మన దేహంలోని జీవ రసాయన చర్యల్లోని అసమతౌల్యత కలగజేస్తుంది. దాంతో మన వ్యాధి నిరోధక సామర్థ్యం 50 శాతం తగ్గుతుంది. ఈ లెక్కన ఏదైనా వ్యాధికారక క్రిములతో మనకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలప్పుడు రెండు రెట్లు పెరుగుతాయి కదా. అలా మనం జబ్బు పడే అవకాశాలు ఎక్కువ అంటారు రేమండ్ ఫ్రాన్సిస్. ఇక ఆయన కోలా సాఫ్ట్డ్రింక్స్ను ఎంతగా నిరసిస్తారంటే... కేవలం ఒక టీ స్పూన్ చక్కెరతోనే ఇంత ప్రమాదం ఉందంటే... ఒక సాఫ్ట్‌డ్రింక్‌లో 10 – 12 టీస్పూన్ల చక్కెరకు తక్కువ ఉండదు. అలాంటిప్పుడు అదెంత హానికరమో ఆలోచించండి... అంటారు. - రేమండ్ ఫ్రాన్సిస్, బయో కెమిస్ట్, ‘నెవర్ బి సిక్ అగైన్’ పుస్తక రచయిత చక్కెర ఎందుకు హానికరమంటే... కేవలం రేమండ్ ఫ్రాన్సిస్ చెప్పడం మాత్రమే కాదు... చక్కెర హానికరం అని చెప్పే పరిశోధనలు ఎన్నెన్నో ఉన్నాయి. అనేక అధ్యయనాలను బట్టి ఆరోగ్యకరమైన బెల్లం, తేనె వంటి స్వీటెనర్లతో పోలిస్తే చక్కెర ఎందుకు హానికరమో చెప్పడానికి ఒక దృష్టాంతమిది... చక్కెరను ప్రాసెస్ చేసే ప్రక్రియలో గంధకం (సల్ఫర్) ఒక ప్రధానమైన రసాయనం. అంటే మనం బాణాసంచాలోనూ, టపాకాయల్లోనూ ఉపయోగించే రసాయనాన్నే చక్కెర ప్రాసెసింగ్‌లో ఉపయోగిస్తున్నామన్న మాట. కేవలం గంధకం మాత్రమే కాకుండా... మానవులకు హానికరమైన మరో 23 రసాయనాలను చక్కెర ప్రాసెసింగ్‌లో వాడతారు. చక్కెర తెచ్చే అనర్థాల్లో కొన్ని ప్రధానమైనవి... ∙చక్కెరతో ఒంట్లో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పాళ్లు పెరుగుతాయి. తద్వారా అది గుండెజబ్బులకు తావిస్తుంది. ∙చక్కెర వినియోగం పెరిగితే అది ఊబకాయాన్ని కలిగిస్తుంది. ఊబకాయంతో వచ్చే అనర్థాలు అన్నీ ఇన్నీ కావన్నది తెలిసిందే. ∙ఊబకాయం పెరగడం వల్ల వచ్చే అనర్థాల్లో ముఖ్యమైనది అధికరక్తపోటు. అంటే పరోక్షంగా చక్కెరతో మనం హైబీపీని తెచ్చిపెట్టుకుంటున్నామన్నమాట. ∙ఒక్కోసారి మరణానికి... లేదా మరణం తప్పినా జీవితాంతం వైకల్యంతో బాధపడేలా చేసే పక్షవాతానికి ప్రధాన కారణం చక్కెర. ∙చక్కెర తినడం వల్ల డయాబెటిస్ రాకపోయినా... ఒకసారి డయాబెటిస్ వచ్చాక చక్కెర తినడం ఎంత ప్రాణాంతకమో అందరికీ తెలిసిన విషయమే. ∙చాలామంది పచ్చళ్లు, వంటకాల్లో మితిమీరిన కారం లేదా మసాలాలు మాత్రమే కడుపులోని అల్సర్లకు కారణం అనుకుంటారు. కానీ చక్కెర కూడా కడుపులో అల్సర్స్ వచ్చేందుకు అంతే సమానంగా దోహదం చేస్తుంది. నిపుణులు చెప్పే మాటలివి... ‘సెయింట్ విత్ స్టెతస్కోప్’ అంటూ ఆదరంగా పిలుచుకునే కేరళకు చెందిన ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి.వి. గంగాధరన్‌తో పాటు చాలామంది క్యాన్సర్ చికిత్సా నిపుణులు చక్కెర గురించి చెప్పే మాటలివి... ∙మీరు చక్కెరకు దూరంగా ఉండగలిగితే చాలు... క్యాన్సర్ కణం దానంతట అదే నశిస్తుంది. ∙ ప్రతిరోజూ కాస్తంత గోరువెచ్చని నీళ్లలో ఒక నిమ్మకాయ పిండుకొని పరగడుపున తాగండి. అది కీమోథెరపీ కంటే 1000 రెట్లు ప్రభావవంతమైనది. ఇది మేరీల్యాండ్ కాలేజీ నిపుణుల అధ్యయన ఫలితాలు తేల్చిన వాస్తవం. మరి చెక్కెర లేకపోతే జీవితంలో తియ్యదనం ఎలా? తియ్యదనానికి చక్కెర ఒక్కటే కేరాఫ్ అడ్రస్ కాదు. దానికి ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు మంచి పరిశుభ్రమైన బెల్లం, తేనె వంటివి. వాటితో పాటు మరికొన్ని స్వీటెనర్లూ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనకు అనువైన దాన్ని ఎంచుకోవచ్చు. ఆ స్వాభావిక, ప్రాకృతిక తీపి పదార్థాలు ఇవి కొన్ని మాత్రమే... ఉన్నాయిగా మనకు స్వాభావిక స్వీటెనర్లు... స్టీవియా : ఈ తీపి పదార్థాన్ని స్టీవియా రెబౌడినా అనే మొక్క నుంచి సేకరిస్తారు. ఇది స్వాభావికమైన చక్కెరతో పోలిస్తే 290 రెట్లు ఎక్కువ తీపి ఉంటుంది. దీన్ని స్వాభావిక చక్కెర (సుక్రోజ్)తో కలిపి మనకు వాణిజ్య ప్రయోజనాలకోసం ‘సీఎస్ఆర్ స్మార్ట్’ పేరిట మార్కెట్లో లభ్యమయ్యేలా చూస్తున్నారు. సార్బిటాల్ : దీన్నే గ్లూసిటాల్ అంటారు. ఇది కొన్ని రకాల పండ్లను పాకం పట్టినప్పుడు చక్కెర పాకంలా తయారైన పదార్థాం నుంచి సేకరిస్తారు. స్వాభావిక చక్కెరతో పోలిస్తే దీనిలో తీపిదనం కాస్తంత తక్కువ. స్వీటెనింగ్ ఆపిల్ ఎక్స్ట్రాక్ట్స్: ఇక కొన్ని ఆపిల్స్ నుంచి తీసే పదార్థాలు (ఆపిల్ ఎక్స్ట్రాక్ట్స్) నుంచి సేకరించిన పదార్థాలు స్వాభావికం కావడంతో ఇవి తియ్యదనాన్ని, రుచినీ, ఆరోగ్యాన్నీ ఒకేసారి ఇస్తాయి. స్వాభావిక తీపి పదార్థాలతో ప్రయోజనాలు : ∙స్టీవియా తీపి పదార్థం మొక్క నుంచి సేకరిస్తారు కాబట్టి అది హానికరం కాదు. ఆ తీపి వల్ల రక్తంలోని చక్కెర పాళ్లు పెరగవు. కాబట్టి డయాబెటిస్ రోగులకు స్టీవియా మంచిది. అగేవ్ నెక్టర్ : ఇది మెక్సికోలో పెరిగే ఒక రకం మొక్క నుంచి సేకరించే పాకం. దీనిని తినడం వల్ల సాధారణ చక్కెర తీపి తిన్నప్పటికంటే తక్కువ తీపి శరీరంలో విడుదలవుతుంది. అందుకే రక్తంలో షుగర్ పాళ్లు పెరగవు. కాబట్టి డయాబెటిస్ రోగులు తినే తీపి పదార్థాలకు ఇది చక్కెర కంటే మంచి ప్రత్యామ్నాయం. డేట్ షుగర్ : దీని ఉపయోగం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. డేట్ షుగర్ అంటే మరేదో కాదు. ఎండబెట్టిన ఖర్జూరాలను పొడిలా చేసి, తీపిని ఇచ్చేందుకు దాన్ని పంచదారలా వాడుకోవచ్చు. అయితే ఇది వేడి పదార్థాలలో కరగదు. ఉదాహరణకు వేడి వేడి టీలో దీన్ని చక్కెరలా వేసుకోవడం సాధ్యం కాదు. అయితే బేకింగ్ ఉత్పాదనలకు స్వీటెనింగ్ అడిటివ్లా మాత్రం వాడుకోవచ్చు. తేనె : తీపిని ఇచ్చేందుకు వాడే పదార్థంగా దీని ప్రాధాన్యం, ప్రాచుర్యం అందరికీ తెలిసిందే. ఇది కేవలం ఒక రుచిని ఇచ్చే ఆహారంగానే కాక... ఔషధ గుణాలు కలిగి, ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా దీని ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పరిమిత మోతాదులో దీన్ని ఎంతకాలమైనా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. - సుజాతా స్టీఫెన్ చీఫ్ న్యూట్రిషనిస్ట్ యశోద హాస్పిటల్స్ ,మలక్‌పేట, హైదరాబాద్ ► అందుకే ఇకపై చక్కెరకు బదులు ఈ స్వాభావికమైన తీపి పదార్థాలు వాడుకోండి. లేదా చక్కెరే తప్పనిసరిగా వాడుకోవాలంటే దాని ఉపయోగాన్ని వీలైనంతగా పరిమితం చేసుకోండి. -
నాటు సారాకు కొత్త రెక్కలు
రాష్ట్రంలోని పల్లెల్లో నాటుసారా మళ్లీ గుప్పుమంటోంది. ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టినా, నల్లబెల్లం అమ్మకాలపై నిఘా పెట్టినా.. ‘చక్కెర’రూపంలో కొత్త రెక్కలు తొడుక్కుంటోంది. గోదావరి నది వెంట.. అడవి మొదట్లో.. వ్యవసాయ బావుల వద్ద గుడుంబాగా విరగకాస్తోంది. సారా, గుడుంబా తయారీకి కొంతకాలంగా దూరంగా ఉన్నవారంతా.. తిరిగి మళ్లీ సారా వైపు మళ్లుతున్నట్లు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రాన్ని గుడుంబారహితంగా మార్చడం కోసం ప్రభుత్వం కొంతకాలంగా కఠిన చర్యలు చేపడుతోంది. సారా తయారీపైనే ఆధారపడిన కుటుంబాల పునరావాసం కోసం ఆర్థిక సాయమూ చేస్తోంది. దీంతో కొంతకాలం పాటు నాటుసారా, గుడుంబాల తయారీ తగ్గినా.. ఇప్పుడు మళ్లీ పల్లెల్లోకి చొరబడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా, నల్లబెల్లం అందకుండా కట్టడి చేసినా తయారీదారులు వెనక్కి తగ్గడం లేదు. బెల్లానికి ప్రత్యామ్నాయంగా నేరుగా చక్కెరనే వినియోగిస్తూ సారా తయారు చేస్తున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో మొలాసిస్తో నాటుసారా కాస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లో నాటుసారా తయారీ చాపకింద నీరులా విస్తరిస్తున్నట్లు ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ఖమ్మం జిల్లాలో జోరుగా..: పాత ఖమ్మం జిల్లా పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం పట్టణం మినహా చుట్టూ ఉన్న మండలాల్లో గుడుంబా వ్యాపారం జోరుగా సాగుతోంది. నల్లబెల్లానికి బదులుగా చక్కెరతో గుడుంబా తయారీని మొదలుపెట్టింది ఈ ప్రాంతం వారేనని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇక్కడి గుడుంబా స్థావరాలపై దాడులు చేసినప్పుడల్లా భారీగా చక్కెర నిల్వలు పట్టుబడుతుండడం గమనార్హం. కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో ఎక్సైజ్ అధికారులు నాటుసారా తయారీదారులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నల్లబెల్లం బదులుగా చక్కెర వాడుతున్న విషయాన్ని వెల్లడించారు. దుమ్ముగూడెంతోపాటు చర్ల, భద్రాచలం, బూర్గంపాడు మండలాలు, అటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుడుంబా తయారవుతోంది. అటవీ ప్రాంతంలోనే సారా తయారు చేసి.. ప్యాకెట్లలో నింపి మైదాన ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుడుంబా మాఫియా సాధారణ గిరిజన కుటుంబాలు కాసిన నాటుసారాను సేకరించి.. ప్యాకెట్లలో నింపి టోకున విక్రయిస్తోంది. కొత్తగూడెం జిల్లా భద్రాచలం, కొత్తగూడెం పారిశ్రామికవాడతోపాటు సమీప పల్లెలు, మండల కేంద్రాల్లో కలిపి రోజుకు సుమారు 1,000 లీటర్ల గుడుంబా విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. చక్కెర ఎందుకంటే..? రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణల కారణంగా నల్లబెల్లం దొరకడం లేదు. ఎక్కడైనా దొరికినా కిలో రూ.90 నుంచి రూ. 110 దాకా పలుకుతోంది. అది కూడా నమ్మకస్తులైన వారికే విక్రయిస్తున్నారు. అదే చక్కెరకు ఎంతైనా దొరుకుతుంది. నల్లబెల్లంతో పోలిస్తే చౌకగా వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో చక్కెర ధర రూ.45 వరకు ఉంది. అయితే వ్యాపారులు ఛత్తీస్‌గఢ్, ఏపీ రాష్ట్రాల నుంచి ఖండసారి చక్కెర (కాస్త నలుపుగా, నాణ్యత తక్కువగా ఉండే స్థానిక మిల్లుల చక్కెర)ను తీసుకొచ్చి రూ.35కే కిలో చొప్పున సారా తయారీదారులకు విక్రయిస్తున్నారు. దీంతో సారాకు చక్కెర వినియోగం పెరిగింది. అక్కడ 60 శాతం చక్కెర సారాకే! గుడుంబా తయారీకి చక్కెర వినియోగంపై ‘సాక్షి’బృందం భద్రాచలం పట్టణంలో పరిశీలన చేసింది. ఇక్కడ దాదాపు 12 హోల్‌సేల్ చక్కెర దుకాణాలు ఉన్నాయి. గతంలో వీరంతా కలిపి నెలకు ఆరు లోడ్ల (లోడుకు 17 టన్నుల) చక్కెర విక్రయించేవారు. కానీ కొద్దినెలలుగా నెలకు 16 లోడ్ల చక్కెర అమ్ముడుపోతోంది. అంటే 272 టన్నుల చక్కెర వినియోగం అవుతోంది. అయితే ఇందులో 60 శాతం చక్కెరను సారా తయారీ కోసం వినియోగిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో మొలాసిస్తో.. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోని నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల మొలాసిస్ (చెరుకు రసం నుంచి చక్కెర తయారు చేయగా మిగిలే మడ్డి)తో గుడుంబా తయారు చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు వాటి సరిహద్దుల్లో ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో చెరుకు సాగు ఎక్కువ. ఖండసారి చక్కెర కర్మాగారాలు విస్తృతంగా ఉన్నాయి. వాటిలో చెరుకు నుంచి చక్కెర తీయగా మిగిలిన మొలాసిస్‌ను లీటర్ రూ.20 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు. గుడుంబా తయారీదారులు ఈ మొలాసిస్‌ను కొనుగోలు చేసుకువెళ్లి.. గుడుంబా తయారుచేస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని మాగనూరు, కృష్ణా, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, మనూరు, కంగ్టి, కల్హేర్, న్యాల్కల్ తదితర మండలాలు, నిజామాబాద్ జిల్లా భీంగల్, కమ్మర్పల్లి, మోర్తాడ్, సిరికొండ, ధర్పల్లి, జక్రాన్‌పల్లి తదితర మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో నాటుసారా గుప్పుమంటోంది. అదిలాబాద్ జిల్లాలో జైనథ్, బోథ్, వాంకిడి, ఉట్నూర్ తదితర మండలాల్లో మొలాసిస్తో గుడుంబా తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారుల వెనుకంజ! రాష్ట్రంలో గుడుంబా ఉత్పత్తి స్థాయిని కేసుల నమోదు ద్వారా అంచనా వేస్తుంటారు. కేసులు ఎక్కువగా నమోదైతే నాటుసారా విక్రయాలు ఎక్కువగా ఉన్నట్టు. లేకుంటే తయారీ లేనట్టే. దీంతో ఎక్సైజ్ అధికారులు తమ పరిధిలో సారా తయారీ లేదనిపించుకోవడం కోసం కేసులు నమోదు చేయడమే లేదని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. గుడుంబా విక్రయిస్తూ పట్టుబడిన వారిని బెదిరించి వదిలేస్తున్నారని అంటున్నాయి. దాంతో సారా తయారీ నిరాటంకంగా సాగిపోతోంది. ఇలా చేస్తున్నారు? బిందెడు నీళ్లలో రెండు మూడు కిలోల చక్కెర కలిపి ద్రావణం తయారు చేస్తున్నారు. అందులో పాచిపోయిన అన్నం, తవుడు, టైర్లు, ట్యూబుల ముక్కలు వేసి కొన్ని రోజుల పాటు పులియబెడుతున్నారు. దానికి పలు రకాల రసాయనాలు కలిపి.. మరగబెట్టి గుడుంబా తయారు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని వ్యవసాయ బావుల వద్ద ఇది నిరాటంకంగా జరిగిపోతోంది. -
జంట వ్యాధులతో గజగజ
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రజలను జంట భూతాలు (మధుమేహం, బీపీ) పీక్కుతింటున్నాయి. వారికి తెలియకుండానే వారి శరీరంలోని అవయవాలను క్షీణింపజేస్తున్నాయి. ఇటీవల కాలంలో యువతపైన కూడా తమ ప్రభావం చూపుతున్నాయి. రానున్న కాలంలో మరింత ప్రమాదం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రైవేటు బ్యాంకులో పనిచేసే 35 ఏళ్ల యువకుడు ఇటీవల ఎక్కువ నీరసంగా ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. రక్తపోటు అధికంగా ఉండడంతో పాటు, మూత్రపిండాల్లో ఫిల్టర్స్ పదిశాతం వరకూ దెబ్బ తిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఐదేళ్ల నుంచి రక్తపోటు ఉన్నా గుర్తించక పోవడంతో ఆ ప్రభావం మూత్ర పిండాలపై చూపింది. ప్రస్తుతం రక్తపోటు క్రానిక్ (దీర్ఘకాలిక వ్యాధిగా)డీసీజ్‌గా మారినట్లు వైద్యులు తెలిపారు. ♦ ఇరిగేషన్‌శాఖలో పనిచేసే 28 ఏళ్లు ఉద్యోగి తరచూ కళ్లు తిరిగినట్లు ఉండటంతో ఇటీవల వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అతని శరీరంలో చక్కెర స్థాయి 160 ఉండటంతో పాటు, హెచ్‌బీఏ 1సీ 10కి చేరింది. మరికొంతకాలం ఇదే పరిస్థితి ఉంటే గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వైద్యులు హెచ్చరించారు. ♦ ఇలా వీరిద్దరే కాదు.. నగరంలో అనేక మంది రెండు పదుల వయస్సులోనే రక్తపోటు, మధుమేహం అనే జంట భూతాల బారిన పడుతున్నారు. నగరంలోని ఆస్పత్రుల్లో గుండె, కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతున్న వారిలో 80 శాతం మందికి ఈ రెండు వ్యాధులే కారణమని నిర్ధారణ అవుతుంది. చిన్న వయస్సులోనే సోకుతున్న వ్యాధులపై అప్రమత్తం కాకుంటే రానున్న రోజుల్లో మనిషి జీవిత కాలంలో పది నుంచి పదిహేనేళ్లు తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ నిర్వహించిన సర్వే ప్రకారం జిల్లాలో వయస్సు 30 సంవత్సరాలు దాటిన వారిలో 12 శాతం మంది మధుమేహం, 10.5 శాతం మంది బీపీతో భాదపడుతున్నట్లు తేలింది. జంట వ్యాధులకు కారణాలివే జీవనశైలిలో మార్పులు, మాంసాహారం, కార్బోహైడ్రేడ్స్ ఎక్కువుగా ఉండే జంక్ ఫుడ్స్ తీసుకోవడం, శారీరక శ్రమ లేక పోవడం కారణంగా తేలింది. అంతేకాకుండా ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం కూడా రక్తపోటు పెరగడానికి కారణంగా గుర్తించారు. రాజధాని ప్రాంత ఉద్యోగుల్లో 70 శాతం మంది ఒత్తిడికి గురవడం కూడా చిన్న వయస్సులోనే రక్తపోటు, బీపీకి కారణాలుగా చెబుతున్నారు. వీటిని అరికట్టేందుకు ఏం చేయాలంటే.. ♦ జంట వ్యాధులను అరికట్టేందుకు ప్రతిరోజూ 45 నిమిషాల చొప్పున వారంలో ఐదు రోజుల పాటు వ్యాయామం, వాకింగ్ లాంటివి తప్పక చేయాలి. ♦ విధి నిర్వహణలో, జీవితంలో ఎదుర్కొనే ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగ చేయడం మంచిది. ♦ ఆహారంలో కార్బోహైడ్రేడ్స్ తక్కువుగా ఉండేలా చూసుకోవాలి, మాంసాహారం, జంక్ ఫుడ్స్‌ను తగ్గించాలి. ♦ పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. తాజా పళ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువుగా తినాలి. ♦ శరీరంలో బీపీ, చక్కెర స్థాయి, కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకునేలా తరచూ పరీక్షలు చేయించుకోవాలి. ♦ ప్రతి మనిషి నెలకు 500 గ్రాములకు మించి వంట నూనెలు వాడరాదు. అధికంగా నూనెలు వినియోగించడం చాలా ప్రమాదకరం. ♦ ఒకే నూనె కాకుండా మార్చి మార్చి వాడటం మంచిది. ముందు చూపే మేలు చిన్న వయస్సులోనే మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు గురైన వారిని నిత్యం చూస్తున్నాం. పదేళ్లలో వాటి ప్ర భావం గుండె, కిడ్నీలు, మెదడు వంటి కీలక అవయవాలపై పడుతుంది. కాళ్లు, శరీరంపై పుళ్లుపడి మానక పోవడం వంటి సమస్యలతో ఎక్కువ మంది మా వద్దకు వస్తున్నారు. అలాంటి వారికి శస్త్ర చికిత్స చేసి సాధారణ స్థితికి తెస్తున్నాం. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాయామం, ఆహార నియమాలు ముఖ్యం. – డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి, మధుమేహ వ్యాధి నిపుణుడు -
మధుమేహులకు ఓ శుభవార్త..
మధుమేహులకు ఓ శుభవార్త. రక్తంలో చక్కెర మోతాదును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇకపై మీరు గ్లూకోమీటర్‌ను ప్రత్యేకంగా మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీ చేతుల్లోని స్మార్ట్‌ఫోన్‌కు ఉన్న తొడుగునే గ్లూకోమీటర్గా మార్చేశారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. అంతేకాదు. ఈ స్మార్ట్‌ఫోన్ కేస్ ద్వారా లెక్కించే చక్కెర మోతాదును స్మార్ట్ అప్లికేషన్ ద్వారా ఫోన్లోనే చూసేసుకోవచ్చు. అంతేకాకుండా ఏళ్ల రికార్డులను నిక్షిప్తం చేసుకునే అవకాశం ఉండటం వల్ల జబ్బును మరింత మెరుగ్గా నియంత్రించుకునేందుకు అవకాశముంటుంది. ఇంతకీ ఈ సరికొత్త, వినూత్న పరికరాన్ని ఏమంటున్నారో తెలుసా? జీపీ ఫోన్ అంటున్నారు. దీంట్లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. త్రీడీ ప్రింటర్ సాయంతో ముద్రించిన తొడుగు, ఒకమూలన ఉండే సెన్సర్ ఒక భాగం. ఇక రెండోభాగంలో అయస్కాంత శక్తితో సెన్సర్‌కు అతుక్కోగల చిన్న చిన్న గుళికలు. ఈ గుళికలన్నీ కొన్ని ఫోన్లకు అనుబంధంగా వచ్చే పెన్నులాంటి పరికరం మాదిరిగా ఉంటాయి. ఒక గుళికను సెన్సర్‌పై వేసి.. దానిపై చుక్క రక్తం వేస్తే చాలు. అందులోని గ్లూకోజ్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ సాయంతో చక్కెర శాతం విశ్లేషణ జరిగిపోతుంది. సమాచారం వైర్లెస్ పద్ధతిలో స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌కు చేరిపోతుంది. కేవలం 20 సెకన్లలో టెస్ట్ పూర్తవుతుందని, ఒక్కో స్టైలస్‌లో 30 వరకూ గుళికలు ఉంటాయని ఈ పరికరాన్ని తయారుచేసిన వారిలో ఒకరైన ప్యాట్రిక్ మెర్సియర్ తెలిపారు. ప్రస్తుతానికి తాము నమూనా మాత్రమే తయారు చేశామని, మరిన్ని పరీక్షలు నిర్వహించడం ద్వారా మెరుగైన స్మార్ట్‌ఫోన్ గ్లూకోమీటర్‌ను తయారుచేసే ప్రయత్నాల్లో ఉన్నామని ఆయన చెప్పారు. ఈ పరికరంతో కరెంటు ఖర్చు బాగా తగ్గుతుంది! అపార్ట్మెంట్లలో.. వీధి చివర్లలో.. విద్యుత్ సబ్స్టేషన్లలో ఉండే ట్రాన్స్ఫార్మర్లను మీరు చూసే ఉంటారు... వోల్టేజీని నియంత్రించేందుకు పనికొచ్చే ఈ పరికరాల ద్వారా కరెంటు కొంత వృథా అవుతూంటుంది. ఇంకో మార్గం లేదు కాబట్టి వీటిని ఇంకా వాడుతున్నాం. అయితే ఇకపై ఈ పరిస్థితి మారనుంది. ట్రాన్స్ఫార్మర్లతోపాటు అన్ని రకాల పవర్ ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా జరిగే నష్టాన్ని కనిష్ట స్థాయికి చేర్చేందుకు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. రెట్టింపు సామర్థ్యంతో పనిచేయగల గాలియం నైట్రైడ్ పవర్ ఎలక్ట్రానిక్స్ పరికరాలను మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న పరికరాలు కేవలం 600 వోల్టుల సామర్థ్యం కలిగి ఉండగా.. కొత్తవి 1200 వోల్టులను తట్టుకోగలవని... భవిష్యత్తులో మూడు నుంచి అయిదు వేల వోల్టులను కూడా అతి తక్కువ వృథాతో మార్చగలిగే (వోల్టేజీని తగ్గించడం, ఏసీని డీసీగా మార్చడం వంటివి) పరికరాలను తయారు చేస్తామని ఎంఐటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1200 వోల్టుల పరికరాలు అందుబాటులోకి వస్తే.. విద్యుత్తుతో నడిచే వాహనాల్లో కరెంటు వాడకం బాగా తగ్గుతుందని.. తద్వారా ఎక్కువ మైలేజీ పొందవచ్చునని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. గాలియం నైట్రైడ్ పవర్ ఎలక్ట్రానిక్స్ సామర్థ్యం పెరిగితే ప్రస్తుతం డేటా సెంటర్లలో, పవర్ గ్రిడ్ల ద్వారా కూడా ఎంతో విద్యుత్తును ఆదా చేయవచ్చునని... ఫలితంగా కొత్తగా విద్యుత్తు తయారు చేయాల్సిన అవసరం తగ్గుతుందని ఆయన అంటున్నారు. మానవ వలసపై కొత్త అవగాహన! ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో పుట్టిన మనిషి ఆ తరువాత అన్ని ఖండాలకూ విస్తరించాడని మనం పుస్తకాల్లో చదువుకుని ఉంటాం. దాదాపు 60 వేల ఏళ్ల క్రితం మొదలైన ఈ ప్రస్థానం దశలవారీగా అన్ని ఖండాలకూ చేరిందన్నది ఇప్పటివరకూ ఉన్న అంచనా. అయితే హవాయి యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన పరిశోధనలు ఈ అంచనాను తారుమారు చేస్తున్నాయి. ఆసియా ఖండంలోకి సుమారు 1.2 లక్షల ఏళ్ల క్రితమే ఆధునిక మానవుడి ప్రస్థానం మొదలైందని వీరు అంటున్నారు. పదేళ్లుగా డీఎన్ఏ విశ్లేషణ ఆధారంగా చేసిన పరిశోధనలన్నింటినీ పరిశీలించి మరీ తాము ఈ అంచనాకు వచ్చామని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ వలస కూడా ఒకేసారి పెద్దఎత్తున కాకుండా.. చిన్న చిన్న గుంపులుగా దశలవారీగా సాగిందని... చివరకు ఆస్ట్రేలియాకు చేరడం కూడా లక్షా ఇరవై వేల ఏళ్ల క్రితమే జరిగినట్లు మైకెల్ పెట్రాగ్లియా అనే శాస్త్రవేత్త తెలిపారు. ఈ కొత్త పరిశోధనల నేపథ్యంలో మానవుల వలసలు మరింత సంక్లిష్టమైనవిగా అర్థం చేసుకోవచ్చునని, ఆసియా ప్రాంతంలో గతానికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం గురించి తెలియజేస్తుందని ఆయన అన్నారు. -
నీటిలో వేసినా కరగలేదు.. ప్లాస్టిక్ చక్కెర కలకలం
సాక్షి, మైసూరు(కర్ణాటక): మైసూరు నగరంలో నకిలీ చక్కెర కలకలం రేపింది. గురువారం ఒక దుకాణంలో చక్కెర కొనుగోలు చేసిన ఓ వ్యక్తి నీటిలో వేసినా కరగకపోవడంతో అది ప్లాస్టిక్ చక్కెర అంటూ ఆందోళనకు దిగాడు. ఖిల్లా మొహల్లాలో ఉన్న ఒక కిరాణా అంగడిలో అతను తమ టీ స్టాల్ కోసం 2 కేజీల చక్కెరను కొన్నాడు. దానిని టీలో వేసినప్పుడు ఎంతసేపైనా కరగకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో మొత్తం చక్కెరను పరిశీలించాడు. అది చక్కెర మాదిరిగా కనిపించే ప్లాస్టిక్ రవ్వ అని గుర్తించి వెంటనే మీడియాకు సమాచారం ఇచ్చాడు. ఇటీవలే నగరంలో రూ. 2 వేల నకిలీ నోటు రావడం, తాజాగా ప్లాస్టిక్ చెక్కర కలకలంతో ప్రజలు కల్తీల మాయాజాలంపై ఆందోళనకు గురవుతున్నారు. -
అసలు విలన్ ఎవరు?
కొవ్వు పదార్థాలు ఎక్కువ తినొద్దన్న సలహా మీకు ఎప్పుడైనా వచ్చిందా? కొంచెం బొద్దుగా ఉన్నా.. కాస్త లావెక్కినా అందరి నోటి నుంచి వచ్చే మాటే ఇది. చాలామంది ఈ సూచనను నమ్మి ఆచరిస్తుంటారు కూడా. 50 ఏళ్ల కింద జరిగిన ఒక కుట్ర ఫలితంగా కొవ్వు పదార్థాలు మనకు చెడు చేసేవిగా చిత్రీకరించాయని.. అసలు విలన్ మనం తినే చక్కెర అంటున్నారు శాస్త్రవేత్తలు. ఫలానా పదార్థం మనకు మంచి చేస్తుంది... ఫలా నాది హాని చేస్తుందని ఎవరు నిర్ధరిస్తారు? పదార్థాలను క్షుణ్నంగా పరిశీలించాక శాస్త్రవేత్తలు వాటి లక్షణాలను వెల్లడిస్తారు. ఇందుకు సంబంధించి పరిశోధన వ్యాసాలు ప్రచురిస్తారు. 1960 ప్రాంతంలో ‘ప్రాజెక్ట్ 259’పేరుతో ఎలుకలపై రెండు పరిశోధనలు జరిగాయి. చక్కెర పరి శ్రమల సమాఖ్య ఒకటి ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అం దించింది. ఒక పరిశోధనలో భాగంగా రెండు గుంపుల ఎలుకలను తీసుకున్నారు. ఒక గుంపులోని వాటికి చక్కెరలు బాగా ఎక్కువ ఉండే ఆహారాన్ని అందించగా.. ఇంకో దానికి చేపలు, పప్పుధాన్యాలు, ఈస్ట్, బీన్స్ వంటి వాటితో కూడిన సమతుల ఆహారం అందించారు. కొంత కాలం తర్వాత పరిశీలిస్తే మొదటి గ్రూపులోని ఎలుకలకు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. వీటిల్లో చెడు కొవ్వులుగా పరిగణించే ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రెండో అధ్య యనంలో భాగంగా కొన్ని ఎలుకలకు చక్కెరలు ఎక్కువగా ఉండే తిండి.. రెండో గ్రూపు ఎలుకలకు పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారమందించి చూడగా.. మొదటి గ్రూపు ఎలుకల్లో కేన్సర్ కారక ఎంజైమ్‌లు ఎక్కువైనట్లు తెలిసింది. చక్కెరతో సమస్యలున్నాయని స్పష్టంగా తెలిపిన ఈ అధ్యయనాలు ఇప్పటివరకూ ప్రచురణకు నోచుకోలేదు. చక్కెర పరిశ్రమల సమాఖ్య ‘ప్రాజెక్టు 259’ను అర్ధంతరంగా నిలిపేసింది. తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయి..? గత 50 ఏళ్లలో చక్కెరల దుష్ప్రభావంపై చాలా పరిశోధనలే జరిగాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో పాటు మూత్ర పిండాల సమస్యలకూ ఈ పదార్థమే కారణమని పలు పరి శోధనలు స్పష్టం చేశాయి. తాజాగా జరిగిన కొన్ని పరిశోధ నలు చక్కెరలు కేన్సర్ కణితుల పెరుగుదల పనిచేస్తున్నట్లు సూచించాయి. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలం వరకూ కొన్ని రకాల ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదని చెబుతూ వచ్చిన వైద్యులు కూడా ఇప్పుడు తమ విధానాలను మార్చుకుంటున్నారు. రోజుకు కొంత నెయ్యి, లేదంటే గుడ్డులోని పచ్చసొన తీసుకోవడంలో తప్పు లేదని అంటున్నారు. శీతల పానీయాల్లో చక్కెరలను తగ్గించేం దుకు పరిశ్రమలూ ప్రయత్నాలు చేస్తున్నాయి. 2021 నాటికి అమెరికాలో తయారయ్యే ప్రతి ఆహార పదార్థం ప్యాకేజింగ్‌పై చక్కెర మోతాదు ఎంత అన్నది స్పష్టంగా ప్రదర్శించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకీ కుట్ర.. అధిక చక్కెరల వల్ల రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశ ముందని గతేడాది ఓ అధ్యయనం ప్రచురితమైనప్పుడు అమెరికాకు చెందిన ‘షుగర్ అసోసియేషన్’తీవ్రంగా స్పందించింది. ఈ పరిశోధన సంచలనాల కోసం రాసిందే గానీ.. మనం తీసుకునే చక్కెరలకు, కేన్సర్‌కు ఏ మాత్రం సంబంధం లేదని ఖండించింది. ఈ ‘షుగర్ అసోసియేషన్’ను గతంలో ‘ది షుగర్ రీసెర్చ్ ఫౌండేషన్’ అని పిలిచే వారని.. కొంతమంది శాస్త్రవేత్తలు ప్లాస్ బయాలజీ అనే సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. తమకు అనుకూలంగా లేని పరిశోధనల గొంతు నొక్కేయడం దీనికి కొత్తేమీ కాదని.. 50 ఏళ్ల కింద కూడా ఇలాగే చేశారంటూ 1960 నాటి అంశాన్ని వివరించడంతో విషయం వెలుగు చూసింది. 1967 ప్రాంతంలో ‘షుగర్ అసోసియేషన్’ చక్కెరల వల్ల ప్రమాదం లేదని.. సమస్య అంతా కొవ్వుల వల్లేనని ప్రచారం చేసేందుకు ముగ్గురు హార్వర్డ్ శాస్త్రవేత్తలకు లంచాలిచ్చినట్లు ఇప్పటికే స్పష్టమవడం కొసమెరుపు! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చాక్లెట్‌తో షుగర్‌కు చెక్!
మధుమేహం ఉన్నవారు తీయని పదార్థాలకు కచ్చితంగా దూరంగా ఉండాలి. ఒకవేళ చాక్లెటో, స్వీటో తింటే వారిలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి. కానీ రోజూ ఓ చాక్లెట్ తింటే షుగర్ వ్యాధి రాదని చెబుతున్నారు పరిశోధకులు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా శాస్త్రీయంగా దీనిని నిరూపించారు కూడా. రోజూ ఓ చాక్లెట్ తీసుకుంటే టైప్ టూ డయాబెటిస్ రాకుండా అడ్డుకోవచ్చని, చాక్లెట్లో ఉండే కొకోవా అనే పదార్థం శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా విడుదల చేసేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుదలకు దీటుగా స్పందిస్తుందని బ్రిగ్హామ్ యంగ్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేందుకు దోహదపడే బీటా కణాలు మెరుగ్గా పనిచేసేందుకు ప్రేరేపించే పదార్థాలు కొకోవాలో పుష్కలంగా ఉన్నట్లు జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీలో ప్రచురితమైన ఓ అధ్యయనం కూడా వెల్లడించింది. ఒత్తిడిని నియంత్రించి కణాలకు పునరుత్తేజం కల్పించే గుణం కూడా చాక్లెట్లలో ఉందని, కొకోవాపై దశాబ్దకాలంగా ఎన్నో పరిశోధనలు జరిగినా దీని ఉపయోగంపై నిర్దిష్ట ప్రయోజనాలను విశ్లేషిస్తూ సాగిన అధ్యయనం ఇదేనని పరిశోధకులు చెబుతున్నారు. -
చక్కెర ధరలు పెంచితే కఠిన చర్యలు
పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా చక్కెర నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ చక్కెర వ్యాపారులను హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చక్కెర ధరల నియంత్ర ణకుగాను ఆయన రాష్ట్రంలోని హోల్‌సేల్ చక్కెర వ్యాపా రుల సంఘం ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. చక్కెర నిల్వలు, లావాదేవీలపై పరిమితులు విధిస్తూ కేంద్రం గతంలో విడుదల చేసిన ఉత్తర్వులను మరో 6 నెలల (ఈ ఏడాది అక్టోబర్ 28) వరకు పొడిగించింది. లైసెన్స్ పొందిన వ్యాపారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ధర కన్నా ఎక్కువకు చక్కెర అమ్మకూడదని కమిషనర్ అన్నారు. 5 క్వింటాళ్ల కంటే ఎక్కువ చక్కెర నిల్వ చేసే వ్యాపారినే డీలర్‌గా పరిగణిస్తామని, వారు సంబంధిత జిల్లా పౌరసరఫరాల అధికారి, తహసీల్దార్ దగ్గర హోల్‌సేల్, రిటైల్ లైసెన్స్ తీసుకోవా లని, లేనిపక్షంలో వారిపై నిత్యావసరాల చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చక్కెర నిల్వలపైనా కమిషనర్ పరిమితి విధించారు. -
షుగర్.. నో ఫికర్
మధుమేహంతో చాలామంది పడరాని పాట్లు పడుతుంటారు. అలాంటి వారికి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు ఓ శుభవార్త చెబుతున్నారు. ఓ ప్రత్యేక విధానం ద్వారా ఇన్సు లిన్‌ను ఉత్పత్తి చేసే క్లోమకణాల సంఖ్యను గణ నీయంగా పెంచగలిగామని, తద్వారా శరీరంలో ఈ వ్యాధి అన్నదే లేకుండా చేయగలిగా మంటున్నారు. ప్రస్తుతానికి ఇది టైప్–1 మధు మేహులకు పూర్తి స్థాయిలో వ్యాధిని నయం చేస్తుందని, టైప్–2 వారికి ఇన్సులిన్‌ను తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని పరిశోధనల్లో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలు బ్రూనో డోరియన్, రాల్ఫ్ డిఫ్రోన్జోలు తెలిపారు. ఈ పద్ధతిని ఎలుకలపై ప్రయోగించి విజయవంతమయ్యాయని, ఏడాది పాటు ఈ వ్యాధి రాకుండా అడ్డుకోగలిగామన్నారు. క్లోమ గ్రంథిలో బీటా కణాలతో పాటు ఇతర కణాలు కూడా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేలా మార్చామని చెప్పారు. దీంతో రక్తంలోని గ్లూకోజ్ మోతాదును నియంత్రించగలిగామని వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు ఒక వైరస్‌ను వాహకంగా వాడుకుని క్లోమ కణాలకు కొన్ని జన్యువులను అందజేశారు. దీంతో బీటా కణాలు కానివి కూడా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాయని డిఫ్రోన్జో పేర్కొన్నారు. -
చేతికి పెట్టుకుంటే షుగర్ ఎంతుందో చెప్పేస్తుంది!
ఈయనగారి చేతికున్నది వాచీ అనుకుంటున్నారా? కానేకాదు. మధుమేహంతో బాధపడుతున్నవారికి కాసింత ఉపశమనాన్ని ఇచ్చే హైటెక్ గాడ్జెట్. దీన్ని చేతికి బిగించుకుంటే మీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సూదులతో గుచ్చుకుని రక్త పరీక్షలు చేసుకునే అవసరాన్ని తప్పించేందుకు డల్లాస్‌లోని టెక్సస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ శాలినీ ప్రసాద్ సిద్ధం చేశారు దీన్ని. చర్మంపైన స్వేద బిందువుల్లో ఉండే కార్టిసోల్, గ్లూకోజ్, ఇంటర్‌ల్యూకిన్–6 పదార్థాల మోతాదును లెక్కించేందుకు ఇందులో సూక్ష్మమైన సెన్సర్లు ఏర్పాటు చేశారు. వీటిద్వారా ఎప్పటికప్పుడు రక్తంలోని గ్లూకోజ్ మోతాదులను తెలుసుకోవచ్చు. అయితే వారానికి ఒకసారి కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ గాడ్జెట్‌ను మళ్లీమళ్లీ వాడుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా టైప్–2 మధుమేహంతో బాధపడేవారికి దీన్ని చౌకగా అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏడాదిలోపు ఇది మార్కెట్లోకి వస్తుందని అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బియ్యానికి ఎసరు..!
► ఇప్పటికే చక్కెర, కిరోసిన్‌కు మంగళం ► త్వరలో అమలుకు ప్రభుత్వం కసరత్తు ► ఏడు లక్షల మంది పేదలపై ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా అందించే సరుకుల సంఖ్యను పెంచే సంగతి పక్కన పెట్టి ఉన్న సరుకులకు మంగళం పాడుతూ వస్తోంది. పేద ప్రజల సంక్షేమం మరిచి ఏకపక్ష నిర్ణయాలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే కేంద్రం సబ్సిడీలకు కోత పెట్టిందని సాకు చూపుతూ జూన్ నుంచి చక్కెర, కిరోసిన్‌కు మంగళం పాడింది. త్వరలోనే బియ్యానికి కూడా ఎసరు పెట్టేందుకు టీడీపీ సర్కార్ సన్నద్ధమవుతోంది. దీనిస్థానంలో నేరుగా సబ్సిడీని లబ్ధిదారులకు అందించాలనే ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపనుంది. ఇది సుమారు ఏడులక్షల మంది పేదలపై ప్రభావం చూపనుంది. సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం...సరుకుల సంఖ్యను పెంచుతామంటూ ప్రగల్బాలు పలికింది.అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కుతోంది. అంతకుముందు కాంగ్రెస్‌లోని కిరణ్ సర్కార్ అమ్మ హస్తం పేరుతో ఎనిమిది సరుకులను అందించేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పామోలిన్‌కు కేంద్ర సబ్సిడీ లేదని చెప్పి మొదట్లోనే సరఫరాను నిలిపి వేసింది. తర్వాత మూడు,నాలుగు వస్తువులను ఇస్తూ కాలం గడుపుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చక్కెర, కిరోసిన్‌కు సంబంధించి సబ్సిడీని ఎత్తివేశారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని భరించి చక్కెర, కిరోసిన్ అందిస్తుందని ప్రజలు భావించినా ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో జూన్ నెల నుంచి చక్కెర, కిరోసిన్ సరుకులను నిలిపి వేశారు. పేద కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా అందించే బియ్యానికి కూడా త్వరలో మంగళం పాడనున్నారు. ఒక్కో వ్యక్తికి నెల కు ఐదు కిలోల చొప్పున అందించే బియ్యానికి సంబంధించి నగదు రూపంలో లబ్ధి దారుని అకౌంట్లలో వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఐదు కేజీలకు రూ. 5తో పాటు కేంద్రం అందించే సబ్సిడీ రూ.45 కలుపుకొని రూ. 50 వేస్తే బాగుంటుందనే ఆలోచన ఉన్నత స్థాయిలో జరుగుతోంది. డీలర్లకు దెబ్బ: జిల్లాలో పేదలకు అందించే రేషన్‌డీలర్లకు దెబ్ద తగలనుంది. ఇప్పటికే పలుమార్లు సరుకులపై ఇచ్చే కమీషన్ చాలడం లేదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డీలర్ల సంఘం ప్రతినిధులు చంద్రబాబును కలిసి మొర పెట్టుకున్నారు. సరుకులు తగ్గిస్తుండడంతో వాటిపై వచ్చే కమీషన్ కూడా రాకుండా పోతోంది. ఇప్పటికే చక్కెర, పామోలిన్, కిరోసిన్ నిలిపేశారు. బియ్యం కూడా ఆపేస్తే నష్టపోవాల్సి వస్తోందని డీలర్లు వాపోతున్నారు. జిల్లాకు సంబం«ధించి సమాచారం జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య – 7 లక్షలకు పైగానే జిల్లాలో చౌక దుకాణాల సంఖ్య – 1,738 అంత్యోదయ అన్న యోజన కార్డులు – 5,7000 -
రేషన్‌కోత..పేదలకు వెత
♦ నిత్యావసరాల్లో పంచదార, కిరోసిన్‌కు మంగళం ♦ చౌక దుకాణాల్లో సరఫరా నిలిపివేత ♦ దశల వారీగా ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం ♦ సామాన్యులకు తప్పని తిప్పలు మార్కెట్లో ధరల మోత.. ప్రభుత్వం రాయితీపై అందజేసే కిరోసిన్, చక్కెరలను నిలిపివేయడంతో ప్రజలపై అదనపు భారం పడుతోంది. బహిరంగ మార్కెట్లో కిలో చక్కెర రూ.40 అమ్ముతుండగా, చౌక దుకాణాల్లో రూ. 13.50కే అందజే సేవారు. ఇంట్లో దీపం, కట్టెల పొయ్యి వెలిగించడానికి కిరోసిన్ ను వినియోగిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో నీలి కిరోసిన్ దొరకదు. మామూలు కిరోసిన్ లీటరు ధన రూ. 40 పలుకుతోంది. వీటిని కొనుగోలు చేయాలంటే పేద ప్రజలపై ఆర్థిక భారం పడక తప్పదు. పర్చూరు: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులపై అతి పెద్ద కోత విధించేందుకు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. తెల్లరేషన్ కార్డుదారులకు అందిస్తున్న రెండు నిత్యావసర వస్తువులు ఇక నుంచి పేదలకు దూరమయ్యాయి. గతంలో చౌక దుకాణాల్లో కందిపప్పు, నూనె, గోధుమపిండి, పసుపు, ఉప్పు, గోధుమలు కూడా అందిస్తుండగా కాలక్రమేణా వాటికి స్వస్తి పలికారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మరో రెండు నిత్యావసర వస్తువులను ఈ జాబితాలో చేర్చింది. ప్రస్తుత జూన్ నెల కోటాలో చక్కెర, కిరోసిన్ పంపిణీ చేయడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈ నిర్ణయం చౌక దుకాణాల సరుకులపైనే ఆధారపడుతున్న పేదలపై తీవ్రప్రభావం చూపనుంది. నిర్వీర్యమవుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ... దారిద్రరేఖకు దిగువన ఉన్నవారికి రాయితీపై నిత్యావసర సరుకులు అందించాలన్నది చౌక దుకాణాల ఉద్దేశం. ఈ లక్ష్యం రోజు రోజుకు నీరుగారిపోతుండడంతో ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. ప్రారంభంలో అందజేసిన సరుకుల్లో కోత విధిస్తోంది. చౌక దుకాణాల్లో అందించే గోధుమ పిండి, నూనెకు ఇప్పటికే మంగళం పాడిన ప్రభుత్వం జూన్ నెల నుంచి చక్కెర, కిరోసిన్‌లను కూడా నిలిపివేసింది. కిరోసిన్, చక్కెరపై తాము అందజేసే రాయితీ నిలిపివేస్తున్నామని, వాటి పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రజా పంపిణీలో మారుతున్న నిర్ణయాలపై ప్రజల్లో ఆసంతృప్తి రెట్టింపవుతోంది. చౌక దుకాణాల దుస్థితి.. జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో 8,68,088 రేషన్‌కార్డులకు గాను 2151 చౌక దుకాణాలు ఉన్నాయి. -
మీ పిల్లల గదిలో టీవీ ఉందా?
అయితే ఊబకాయం ముప్పు తప్పదట! లండన్: మీ పిల్లల గదిలో టీవీ ఉందా? అయితే అర్జెంటుగా దానిని తీసేయండి. ఎందుకంటే... భవిష్యత్తులో మీ పిల్లలు ఊబకాయంబారిన పడడానికి అదే కారణం కావొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గదిలో టీవీ ఉండడం వల్ల ఎక్కువసేపు టీవీకి అతుక్కుపోయే అవకాశముందని, దీనివల్ల మధుమేహం, ఊబకాయం వంటి సమస్యల ముప్పు మరింతగా పెరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. లండన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్(యూఎల్సీ) చేసిన పరిశోధనలో ఈ విషయం రుజువైంది. ఏడేళ్ల నుంచే పిల్లల గదిలో టీవీ ఏర్పాటు చేయడం ద్వారా.. వారు ఊబకాయంబారిన పడే ముప్పు 30 శాతం పెరుగుతుందని, 11 ఏళ్లప్పుడు ఏర్పాటు చేస్తే ఒబేసిటీ ముప్పు 20 శాతం పెరుగుతుందని తమ పరిశోధనలో తేలినట్లు యూఎల్సీ శాస్త్రవేత్తలు తెలిపారు. ‘గదిలో పిల్లల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తే... టీవీ చూసే స్వేచ్ఛ పెరుగుతుంది. కదలకుండా కూర్చోవడం, గంటల తరబడి టీవీ కార్యక్రమాలను వీక్షించడంవల్ల శారీరక శ్రమ తగ్గి, బరువు పెరుగుతారు. ఇది క్రమేపీ ఊబకాయానికి, మధుమేహానికి దారితీయవచ్చు. దాదాపు 12,556 మంది పిల్లలపై పరిశోధన చేసి, ఈ విషయాన్ని నిర్ధారించుకున్నామ’ని యూఎల్సీ ప్రొఫెసర్ యాంజా హీల్మన్ తెలిపారు. -
బియ్యంతో సరి
జంగారెడ్డిగూడెం : భవిష్యత్‌లో రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులేవీ సబ్సిడీ ధరకు పంపిణీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ అధికారంలోకి రాకముందు రేషన్ కార్డులపై 9 రకాల సరుకుల్ని పంపిణీ చేసేవారు. చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రేషన్ కార్డులపై ఇచ్చే సరుకులు ఒకదాని వెంట ఒకటిగా తొలగిస్తూ వస్తున్నారు. సబ్సిడీపై ఇచ్చే పంచదార, కిరోసిన్ పేదలకు అందని ద్రాక్షగానే మారాయి. ఎన్టీఆర్ ప్రజా పంపిణీ పథకమంటూ ఆర్భాటంగా ప్రారంభించిన రేషన్ పంపిణీ విధానంలో మొదట్లో బియ్యం, పంచదార, కిరోసిన్‌తోపాటు పామాయిల్, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, గోధుమ పిండి, కారం, చింతపండు, ఉప్పు వంటి నిత్యావసర సరుకుల్ని తక్కువ ధరకు సరఫరా చేసేవారు. ఆ తరువాత ప్రభుత్వం దశలవారీగా అన్ని సరుకుల పంపిణీపై కోత విధిస్తూ వస్తోంది. చివరకు బియ్యం పంపిణీకి మాత్రమే పరిమితం అవుతోంది. ఈ నెలలో పంచదార, కిరోసిన్ రేషన్ షాపులకు అవసరమైన స్థాయిలో సరఫరా కాలేదు. ప్రస్తుత నెలలో విడుదల చేసిన పంచదార, కిరోసిన్, గత నెలలో మిగిలిన పంచదార, కిరోసిన్ కలిపి ప్రస్తుతానికి పంపిణీ చేస్తున్నారు. పంచదార మొత్తం కోటాలో 30 శాతం, కిరోసిన్ 45 శాతం మాత్రమే జిల్లాలోని రేషన్ డిపోలకు కేటాయించారు. కిరోసిన్ ఇంకా విడుదల కాలేదు. సబ్సిడీ ఉపసంహరించిన కేంద్రం పంచదార, కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీని తొలగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వాటి పంపిణీకి మంగళం పాడి సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. నెలనెలా కిరోసిన్ కేటాయింపులు తగ్గిస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇకపై దానిని పూర్తిగా నిలిపివేసేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. కిరోసిన్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతున్నామంటూ ప్రజలను మాయ చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని, అందువల్ల కిరోసిన్ వినియోగం ఉండదని చెబుతోంది. ఇందుకు పైలెట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరిని ఎన్నుకుంది. జిల్లాకు 90 వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయగా, అవి సరిపోవని మరో 80 వేల కనెక్షన్లు కావాలని జిల్లా కలెక్టర్ నివేదించడంతో 1.70 లక్షలకనెక్షన్లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ గ్యాస్ కనెక్షన్లు వినియోగదారులకు ఇంకా అందలేదు. ఈలోగానే కిరోసిన్ పంపిణీ నిలిపివేయడంతో పేదల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వచ్చే నెల నుంచి రేషన్ షాపుల ద్వారా కిరోసిన్ పంపిణీ నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వచ్చే నెల నుంచి పంచదార పంపిణీ పూర్తిగా నిలిచిపోనుంది. దీంతో ఆ సరుకుల్ని బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి లబ్ధిదారులకు ఏర్పడుతోంది. ఇదిలావుంటే.. బియ్యం వద్దనుకునే వారికి నేరుగా వారి ఖాతాలో నగదు జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా బియ్యం పంపిణీని కూడా దశల వారీగా నిలిపివేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. డీలర్ల గతేంటి! రేషన్ డీలర్లను బిజినెస్ బ్యాంక్ కరస్పాండెంట్లుగా నియమిస్తున్నట్టు ప్రభుత్వం గతంలో జీఓ జారీ చేసింది. రేషన్ షాపులను మినీ షాపింగ్‌మాల్స్‌గా మారుస్తామని ప్రకటించింది. ఇవి అమ ల్లోకి రాలేదు. రేషన్ షాపులను మినీ షాపింగ్ మాల్స్‌గా మారిస్తే అన్నిరకాల నిత్యావసర సరుకుల్ని వాటిద్వారా పంపిణీ చేయవచ్చు. రేషన్ డీలర్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమిస్తే సామాజిక పెన్షన్లు, కరెంటు బిల్లుల వసూలు, ఉపాధి హామీ కూలీల వేతనాలను పంపిణీ చేయవచ్చు. తద్వారా వారికి ఎంతోకొంత ఆదాయం సమకూరి ఉండేది. నగదు బదిలీ పథకం అమలు చేయడం వల్ల డీలర్లు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. జిల్లాలో 11,96,418 లబ్దిదారులకు పంచదార, కిరోసిన్ అందకుండా పోతుంటే, 2,163 రేషన్ షాపుల ద్వారా సేవలు అందిస్తున్న డీలర్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోంది. ఇటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. పేదలకు అన్ని నిత్యావసర సరుకుల్ని రేషన్ డిపోల ద్వారా సబ్సిడీపై పంపిణీ చేయాలి. ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోకపోతే ప్రజల్ని ప్రత్యక్ష ఆందోళనకు సమాయాత్తం చేస్తాం. – బూరుగుపల్లి సూరిబాబు, అధ్యక్షులు, గుడిసెవాసుల సంఘం, జంగారెడ్డిగూడెం ప్రభుత్వానికి పతనం తప్పదు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఉపసంహరించుకోకపోతే పతనం తప్పదు. ఇప్పటికే ఇచ్చిన హామీలు సరిగా అమలు చేయని ప్రభుత్వం.. పేదవారికి చేరువగా ఉన్న చౌక డిపోలను నిర్వీర్యం చేస్తే తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. ప్రజాకంటక నిర్ణయాలు మానుకుని, ప్రజలకు చేరువయ్యే పాలన అందించే దిశగా ప్రభుత్వం కృషిచేయాలి. – బి.సాయికిరణ్, చిరుద్యోగి, జంగారెడ్డిగూడెం -
రేషన్‌లో తీపి లేనట్టే?
►చక్కెరపై సబ్సిడీని ఉపసంహరించుకున్న కేంద్రం ►రేషన్‌ద్వారా పంపిణీ లేనట్టే ! ►వచ్చే నెల నుంచే అమలు ►అంత్యోదయ కార్డులకు మినహాయింపు నిరుపేదలకు చక్కెర దొరకడం గగనమవుతుందా?.. చౌకదుకాణాల ద్వారా పంపిణీ నిలిపివేయనున్నారా..? వచ్చే నెల నుంచి బహిరంగ మార్కెట్లోనే కొనుగోలు చేయాలా..? వీటికి అవుననే సమాధానం వస్తోంది. కేంద్ర ప్రభుత్వం చక్కెరపై సబ్సిడీ ఎత్తివేసింది. ఆ భారాన్ని రాష్ట్రప్రభుత్వం భరిస్తేనే ఇకపై చౌకదుకాణాల ద్వారా చక్కెర అందే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. పుత్తూరు : అల్పాదాయ వర్గాల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాట మాడుతున్నాయి. ఇన్నాళ్లూ చౌకదుకాణా ల ద్వారా అందిస్తున్న చక్కెరకు మంగళం పాడేందుకు కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం చక్కెరపై ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేయగా ఆభారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి దొరకడం గగనమే చౌకదుకాణాల ద్వారా చక్కెర పంపిణీ వచ్చే నెల నుంచి ఆపేయనున్నట్లు తెలు స్తోంది. ప్రభుత్వం ప్రతి రేషన్‌కార్డుకు నెలకు అరకిలో చక్కెర రూ.6.75కు అంది స్తోంది. ఫిబ్రవరిలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో చక్కెరకు అందిస్తున్న సబ్సిడీని ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఒక కిలో చక్కెరపై కేంద్రం రూ.18.5 సబ్సిడీగా అందిస్తోంది. దీన్ని ఉపసంహరించుకోవడంతో ఇక నుంచి బహిరంగ మార్కెట్లోనే చక్కెర కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. కేంద్రం ఉపసంహరించుకున్న సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే తప్ప రేషన్ దుకాణాల్లో చక్కెర సరఫరాకు మార్గం లేనట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చేదుకానున్న చక్కెర జిల్లాలో 10,02,412 తెల్ల రేషన్‌కార్డులు న్నాయి. ప్రతి నెలా ఒక్కొక్కరికీ చౌకదుకాణాల ద్వారా అరకిలో చక్కెర అందుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కారణంగా ఇక నుంచి వీరంతా బహిరంగ మార్కెట్లో చక్కెర కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కిలో చక్కెర రూ.42 నుంచి రూ.45 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్ పెరగనుండడంతో చక్కెర ధరకు రెక్కలొచ్చే అవకాశం ఉందని ట్రేడర్లు అంటున్నారు. అంత్యో‘దయ’ అంత్యోదయ అన్నయోజన కార్డులు ఉన్న నిరుపేద వర్గాలపై కేంద్ర ప్రభుత్వం కరుణ చూపింది. జిల్లాలో 27, 586 ఏఏవై కార్డులు ఉన్నాయి. వీటికి యథావిధిగా సబ్సిడీని అందించేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. ఏఏవై కార్డుదారులకు నెలకు ఒక కిలో చక్కెర సబ్సిడీపై అందించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. -
పిస్తా బాదం కుల్ఫీ
క్విక్ ఫుడ్ కావలసినవి పాలు – 2 కప్పు, పంచదార – 4 టీస్పూన్లు ఏలకులపొడి – చిటికెడు పిస్తా పప్పులు – 1 టీస్పూను తయారి : మందంగా వున్న పాన్‌లో పాలుపోసి ఎక్కువ మంటమీద మరిగిస్తూ కలుపుతుండాలి. పాలు ఒక కప్పు గా మరిగాక స్టౌ మంట తగ్గించాలి. ఈ మిశ్రమానికి పంచదార, ఏలకులపొడి బాదం, పిస్తా కలిపి దించేయాలి. కుల్ఫీట్రేలో పోసి ఫ్రీజర్‌లో ఆరు గంటలపాటు వుంచితే కుల్ఫీ రెడి. -
రేషన్ చక్కెర బంద్
- వచ్చే నెల నుంచి... - సబ్సిడీ ఆపేసిన కేంద్రం..చేతులెత్తేసిన రాష్ట్రం సాక్షి, హైదరాబాద్: నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ తర్వాత పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు చక్కెర చేదెక్కనుంది. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తు న్న చక్కెరను ఏప్రిల్ నుంచి నిలిపి వేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. చక్కెరపై ఇచ్చే సబ్సి డీని ఎత్తి వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటించింది. ఏప్రిల్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సైతం చేతులె త్తేసింది. రాష్ట్రంలోనూ సబ్సిడీ చక్కెర నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రేషన్ కార్డుదారులకు అంత్యోదయ అన్న యోజన కింద ప్రతి నెలా అరకిలో చక్కెరను పౌర సరఫరాల విభాగం పంపిణీ చేస్తోంది. రేషన్ షాపుల్లో కిలోకు రూ.13.50 చొప్పున రాయితీపై అందజేస్తుంది. ఏఏవై కార్డులున్న దాదాపు 5.54 లక్షల కుటుంబాలకు ప్రతి నెలా రేషన్ చక్కెర పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతినెలా 4,500 మెట్రిక్ టన్నుల చక్కెరను సివిల్ సప్త్లస్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తోంది. కేంద్రం ఇచ్చే సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చక్కెర కొనుగోలుకు రూ.143 కోట్లు ఖర్చు చేస్తోంది. కేంద్రం ఇచ్చే సబ్సిడీ నిలిచిపోతే రాష్ట్ర ప్రభుత్వంపై ఈ భారం అంతకంతకూ పెరిగిపోతుంది. బహిరంగ మార్కెట్లో కిలో చక్కెర రూ.40 నుంచి రూ.43 ధరలో లభ్యమవుతోంది. ఈ లెక్కన సబ్సిడీ చక్కెర కొనుగోలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏటా కనీసం రూ.235 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే రేషన్ బియ్యం సబ్సిడీ భారం ప్రభుత్వానికి తడిసి మోపెడవుతోంది. ఏటా దాదాపు రూ.2,500 కోట్లకుపైగా భారం పడుతోంది. అందుకే సబ్సిడీ చక్కెరకు మంగళం పాడి.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్నే రాష్ట్రంలోనూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
చక్కెర విక్రయాల్లో చేదు లేదట..!
• 400 బస్తాల లోడ్‌తో ‘పేట’కు చేరుకున్న చక్కెర లారీ • నామమాత్రంగా పరిశీలించిన వదిలేసిన అధికారులు నారాయణపేట : స్థానిక పాతగంజ్‌కు గురువారం 400 బస్తాల చక్కెర లోడ్‌తో లారీ చేరుకుంది. ఇందులో 200 క్వింటాళ్ల విలువ చేసే 400 చక్కెర బస్తాలున్నాయి. సంక్రాంతి పండుగ రావడంతో భారీస్థాయిలో కొనుగోళ్లు జరుగుతాయనే వ్యాపార ఏజెన్సీ నిర్వాహకులు పుండలీక చక్కెరను కర్ణాటకలోని బిజాపూర్ నుంచి తెప్పించుకున్నారు. అక్రమంగా పెద్దఎత్తున చక్కెర క్రయవిక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు కాళప్ప, జనార్దన్ అక్కడికి చేరుకుని.. లారీలో ఉన్న చక్కరను పరిశీలించి వాటికి సంబంధించిన బిల్లులను తీసుకున్నారు. అయితే అందులోని వివరాలు వారికి అర్థం కాకపోవడంతో విషయాన్ని ఇన్చార్జ్ తహసీల్దార్ ప్రమీలకు అందజేశారు. అంతలోపే ఆ విషయం సబ్‌కలెక్టర్‌కు అందినట్లు తెలుస్తోంది. దీంతో రెవెన్యూ అధికారులు ఆ బిల్లులను తీసుకెళ్లి సబ్‌కలెక్టర్ కృష్ణాదిత్యాకు చూపించడంతో పూర్తిస్థాయిలో పరిశీలించి వ్యాపారులతో విచారణ చేపట్టాలని వారికి సూ చించారు. బిల్లులను పరిశీలించిన తర్వాత అందులో వే బిల్లులు తప్పా అన్నీ సక్రమంగానే ఉన్నాయని రెవెన్యూ అధికారులు ధృవీకరించి లారీని వదిలిపెట్టారు. అసలు చక్కెర ఇంత పెద్దమొత్తంలో నారాయణపేటలో క్రయవిక్రయాలు జరుగుతుంటే అమ్మక పన్ను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక నుంచి చక్కెరను దిగుమతి చేసుకున్న తెలంగాణకు కట్టాల్సిన పన్నులు కట్టారో లేదోనని అధికారులు పరిశీలించలేకపోయారు. వారిS అవగాహన లోపంతో ఉన్న బిల్లులను చూసి అవే కరెక్టు అని వ్యాపారులు చెప్పడంతో తల ఊపి పట్టుకున్న లారీని వదిలేశారు. ఆ వ్యాపారి మాత్రం వచ్చిన చక్కెర బస్తాలను గంటల వ్యవధిలోనే విక్రయించడం కొసమెరుపు. -
ఇంటిప్స్
తీపిని ఇష్టపడని పిల్లలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కొంతమంది పిల్లలకు చక్కెరతో చేసిన స్వీట్ తింటే వెంటనే జలుబు, దగ్గు సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు తేనె వాడడం మంచిది. చక్కెర చక్కటి ప్రత్యామ్నాయం తేనె. ఇది సహజమైనది కాబట్టి ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్‌లూ ఉండవు. త్వరగా శక్తినిస్తుంది కూడ. తేనె కొద్ది నెలలకు చిక్కబడుతుంది. అప్పుడు సీసాను పది నిమిషాల సేపు ఎండలో ఉంచితే తిరిగి పలచబడుతుంది. చిక్కబడకపోయినా సరే కనీసం ఏడాదిలో ఒకసారి అయినా అరగంట సేపు ఎండలో ఉంచాలి. బాటిల్ అడుగున ఉండిపోయిన తేనెను బయటకు తీయాలన్నా కూడా ఇదే పద్ధతి. తేనెను ఎప్పుడు కూడా మంట మీద వేడి చేయకూడదు. -
ఆపిల్ వినెగర్‌తో మరో మంచి ఫలితం
న్యూయార్క్: ఆపిల్ సైడర్ వినెగర్ను ఆహారానికి ముందు ఔషధంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని ఎంతోమంది డాక్టర్లు ఎప్పటి నుంచో చెబుతున్నారు. దానివల్ల ప్రయోజనాలకు మించి అనర్థాలున్నాయని వాదిస్తున్న డాక్టర్లు కూడా లేకపోలేదు. అయితే ఇటీవల జరిపిన మరో అధ్యయనంలో టైప్ టూ డయాబెటీస్ రోగులకు ఆపిల్ వినెగర్ ఎంతో పనిచేస్తుందని తేలింది. రాత్రిపూట భోజనానికి ముందు రెండు టీ స్ఫూన్లకు మించకుండా ఆపిల్ వినెగర్ను తీసుకోవడం ఎంతో మంచిదని ‘డయాబెటిక్ కేర్’ పత్రిక తాజా సంచికలో పేర్కొన్నారు. డయాబెటీస్ లేని వారిని, వచ్చే అవకాశం ఉన్న వారిని, ఇప్పటికే డయాబెటీస్‌తో బాధ పడుతున్నవారిని మూడు బందాలుగా ఎంపికచేసి వైద్యులు వారికి రాత్రిపూట భోజనానికి ముందు ఆపిల్ వినెగర్ను ఇచ్చారు. ఆ మరుసటి రోజే వారికి సుగర్ పరీక్షలు నిర్వహించగా, ఆరోగ్య వంతుల్లో, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్న వారిలో సుగర్ స్థాయి 50 శాతం తగ్గగా, డయాబెటీస్‌తో బాధపడుతున్న వారిలో సుగర్ లెవల్ 25 శాతం తగ్గింది. ఏయే ప్రయోజనాలు.... ఆపిల్ వినెగర్ను ఔషధంగా తీసుకుంటే శరీరం బరువు తగ్గుతుందని, అధిక ఆకలిని నియంత్రిస్తుందని, రక్తంలో ట్రైగ్లిజరాట్స్ను తగ్గించడం వల్ల గుండె పోట్లు రాకుండా నివారిస్తుందని వైద్యులు ఇదివరకే తేల్చారు. వినెగర్ను తీసుకోవడం వల్ల పంటి ఎనామిల్ దెబ్బతింటుందని, శరీరంలో పొటాషియం తగ్గుతుందని, ఎసిడిటి పెరుగుతుందని కూడా వైద్యులు హెచ్చరించారు. అయితే పంటికి తగులకుండా నేరుగాగానీ, నీటితో కలిపిగానీ మోతాదులో తీసుకుంటే ఎలాంటి హాని లేదని ఇప్పుడు వైద్యులు తెలియజేస్తున్నారు. ఆపిల్ వినెగర్ అంటే ఏమిటీ? ఆపిల్ పళ్ల రసం నుంచి దీన్ని తయారు చేస్తారు. ఆపిల్ పళ్లరసానికి మంచి బ్యాక్టీరియాను, ఈస్ట్‌ను కలిపి పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు. అనేక బ్రాండ్ కంపెనీలు వీటిని విక్రయిస్తున్నాయి. అత్యంత ఘాటుగా ఉంటుంది కనుక నేరుగా వినెగర్ తీసుకోలేనివారు సలాడ్స్‌పై వేసుకొని తినే అవకాశం కూడా ఉంది. -
నోట్ల మార్పిడికి వచ్చి.. ఆసుపత్రికి చేరి
సంజామల సిండికేట్ బ్యాంకులో నగదు డ్రా చేసుకోవడానికి వెళ్లిన ఖాతాదారుడు పుల్లయ్య ఎండకు క్యూలో నిలబడలేక సొమ్మసిల్లి కుప్పకూలిపోయాడు. ఉదయం క్యూలో ఉండటంతో షుగర్ స్థాయి తగ్గి కళ్లు తిరిగి పడిపోయాడు. అక్కడున్న ఖాతాదారులు బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. బ్యాంకు అధికారులు ఆలస్యంగా 10.30 గంటలకు క్యాష్ కౌంటర్ తెరవడంతో ఖాతాదారులు అధిక సమయంలో క్యూలో ఉండాల్సి వచ్చింది. - సంజామల -
చెరకుకు రూ. 2,900 మద్దతు ధర
చెల్లూరు సుగర్స్ జీఎం వెల్లడి చెల్లూరు (రాయవరం): మండలంలోని చెల్లూరు సర్వారాయ చక్కెర కర్మాగారం చెరకు సరఫరా చేసే రైతులకు మద్దతు ధరను ప్రకటించింది. ఈ విషయాన్ని సర్వారాయ చక్కెర కర్మాగారం జనరల్ మేనేజర్ జి.కోటేశ్వరరావు గురువారం విలేకరులకు తెలిపారు. 2016–17 సీజ¯ŒSకు కేంద్ర ప్రభుత్వం చెరకు మద్దతు ధర టన్నుకు రూ.2,300 ప్రకటించిందన్నారు. అయితే రైతుల సంక్షేమాన్ని, వారి అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు పన్నుతో కలిపి టన్నుకు రూ.2,900 ఇవ్వనున్నట్టు తెలిపారు. 2016–17 సీజ¯ŒSకుగాను 2017 జనవరి 15వ తేదీ వరకు టన్నుకు రూ.2,825 వంతున కొనుగోలు చేస్తామని, 2017 జనవరి 16 నుంచి పరిశ్రమకు చెరకు సరఫరా చేసే రైతులకు కొనుగోలు పన్నుతో కలిపి టన్ను ఒక్కింటికి రూ.2,900 వంతున చెల్లించేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ణయించిందన్నారు. చెరకు సరఫరా చేసేందుకు అయ్యే రవాణా చార్జీలకు పరిశ్రమ ప్రకటించిన రాయితీ దీనికి అదనంగా చెల్లిస్తామని తెలిపారు. 2016–17 సీజ¯ŒSకు చెరకు నాటే రైతులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఒక ఎకరానికి 4టన్నుల విత్తనం లేదంటే రూ.10వేల నారు మొక్కలు ఉచితంగా ఇస్తామన్నారు. రసాయనిక ఎరువులు వడ్డీలేని రుణం కింద ఇస్తామన్నారు. జీవన ఎరువులు ఎకరానికి ఆరు బస్తాలు వడ్డీలేని రుణం కింద ఇవ్వనున్నట్టు తెలిపారు. చెరకు తోటలో వచ్చే కీటకాలు, తెగుళ్ల నివారణకు క్రిమి సంహారక మందులను కొంత సబ్సిడీ మీద మిగిలిన మొత్తాన్ని వడ్డీలేని రుణంగా ఇస్తామన్నారు. పరిశ్రమ పరిధిలోని రైతులు ఫ్యాక్టరీ ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలు ఉపయోగించుకుని చెరకు సాగును విరివిగా చేపట్టాలని కోరారు. -
ఇంటిప్స్
రోజుకు మూడుసార్లు మ్యాంగో మిల్క్ షేక్ తీసుకుంటుంటే త్వరగా బరువు పెరుగుతారు. నెల రోజులలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. మామిడిపండులో చక్కెర సమృద్ధిగా ఉంటుంది. పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటి కాంబినేషన్ బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. బాగా పండిన తాజా మామిడిపండు ఒకటి తీసుకుని, గుజ్జును బ్లెండర్లో వేసి మెత్తగా చేసిన తర్వాత ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలను కలిపి తాగాలి. -
షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి
- ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి డిమాండ్ నంద్యాలరూరల్: షుగర్ ఫ్యాక్టరీని మూసివేసి కార్మికులను వీధిన పడేసిన చైర్మన్ మధుసూదన్‌గుప్తపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతుందని, ఫ్యాక్టరీ చైర్మన్‌ను అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా రెండో రోజు శుక్రవారం నందిపల్లె రైతులు దీక్ష చేశారు. వీరికి సంఘీభావం తెలిపి రమేష్‌కుమార్ మాట్లాడారు. నంద్యాల, గిద్దలూరు, శ్రీశైలం, పాణ్యం, బనగానపల్లె, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లోని వేలాది మంది రైతులు ఫ్యాక్టరీకి చెరుకును తీసుకొచ్చేవారని, ఫ్యాక్టరీ మూతతో ఇప్పుడా పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పేరుతో బ్యాంకుల్లో రుణం పొంది మోసానికి పాల్పడ్డ చైర్మన్‌పై 420కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెంచి రైతులకు రావాల్సిన బకాయిలను, రుణమాఫీని, కార్మికులకు అందాల్సిన వేతనాలను చైర్మన్ ద్వారా ఇప్పించి ఫ్యాక్టరీ మూతపడకుండా కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. దీక్షల్లో భారతీయ కిసాన్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, చెరుకు రైతు సంఘం నాయకులు సాగేశ్వరరెడ్డి, బంగారురెడ్డి, ఈశ్వరరెడ్డిలు పాల్గొనగా మహానంది మండలం నందిపల్లెకు చెందిన చెరుకు రైతులు వెంకటరెడ్డి, మౌలాలి, రామకోటేశ్వరరెడ్డి, పెద్ద మహానందిరెడ్డి, మద్దయ్య, ఖాజాహుసేన్, మోహన్‌రావు, గుర్రప్ప, కౌలు రైతు సంఘం డివిజన్ కార్యదర్శి మార్క్‌లు దీక్షలో కూర్చున్నారు. -
డయాబెటిస్ ఉన్నా...
స్థూలకాయులకూ, షుగర్ వ్యాధిగ్రస్తులకు మామిడిపండు పట్ల చాలానే ఆంక్షలు ఉన్నాయి. ఇది వారికి అంత మంచిది కాదని అందరూ అంటుంటారు. అయితే ఇది అపోహ మాత్రమేననీ, టైప్-2 డయాబెటిస్‌ను మామిడి సమర్థంగా నియంత్రిస్తుందని అంటున్నారు పరిశోధకులు. కొవ్వులను తిన్న తర్వాత మన జీర్ణవ్యవస్థలో ఏర్పడే కొన్ని బ్యాక్టీరియాను ఈ పండు నివారిస్తుందని పేర్కొంటున్నారు ఓక్లహోమా స్టేట్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. ఎలుకలపై నిర్వహించిన పరీక్షల్లో ఇది తెలిసిందంటూ తమ పరిశోధనల వివరాలను వెల్లడించారు. దాదాపు 60 ఎలుకలపై 12 వారాలపాటు ఈ అధ్యయనం నిర్వహించారు. అవి తీసుకునే ఆహారంలోని క్యాలరీలలో 10 శాతం జంతువుల కొవ్వునుంచి, 60 శాతం ఆహారాన్ని ఇతర కొవ్వుల నుంచి, మరో 10 శాతం మామిడి నుంచి లభ్యమయ్యేలా చూశారు. మిగతా క్యాలరీలు ఇతర ఆహారం నుంచి లభ్యమయ్యేలా చేశారు. ఈ తరహా ఆహారాన్ని ఇచ్చే ముందూ... ఆ తర్వాతా మామూలుగా ఆహారాన్ని ఇచ్చారు. ఈ మూడు సమయాల్లోనూ వచ్చిన ఫలితాలను విశ్లేషించారు. మామిడిని ఆహారంగా ఇచ్చే సమయంలో జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియా తీరుతెన్నులను పరిశీలించినప్పుడు అనేక ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. మామిడి స్థూలకాయాన్ని నివారించేదిగా (యాంటీ-ఒబెసోజెనిక్), చక్కెరను తగ్గించేదిగా (హైపోగ్లైసీమిక్), వ్యాధి నిరోధకతను పెంచేందుకు తోడ్పడేదిగా ఉన్నట్లు తెలిసిందని పేర్కొంటున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న ప్రొఫెసర్ ఎడ్రాలిన్ ల్యూకాస్. ‘‘జంతువుల్లో నిర్వహించిన అనేక పరిశోధనల ద్వారా మామిడిపండు జీర్ణవ్యవస్థలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పాళ్లను క్రమబద్ధంగా ఉంచుతుందని తేలింది’’ అని ఆయన పేర్కొన్నారు. ఇందులోని పీచుపదార్థం పేగులనూ, జీర్ణవ్యవస్థనూ మరింత ఆరోగ్యంగా ఉంచుతుందని వివరిస్తున్నారాయన. ఈ అధ్యయనం పూర్తి ఫలితాలూ, మానవుల్లోనూ అదే ప్రభావం ఉంటుందా అన్న విషయం తేలాల్సి ఉంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు, స్థూలకాయంతో బాధపడేవారు మామిడిని పూర్తిగా దూరం చేసుకోనవసరం లేదని, పరిమిత మోతాదుల్లో తీసుకోచ్చనే మంచి విషయం త్వరలో సాధికారికంగా తెలియనుందనే సంకేతాలను ఈ పరిశోధన వెల్లడిస్తోంది. -
చక్కెర చేదు!
* కేజీ ధర రూ.42.. గత ఏడాదితో పోలిస్తే 50 శాతం పెరుగుదల * సాగు డీలా, కర్మాగారాల మూసివేతే ప్రధాన కారణం * ఎగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచి ధరల నియంత్రణ ఆరంభించిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చక్కెర చేదెక్కుతోంది. గణనీయంగా పడిపోయిన సాగు విస్తీర్ణంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఏడాది కాలంలో చక్కెర ధరల్లో 50 శాతం మేర పెరుగుదల కనిపిస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి కిలో రూ.27.50 పైసలు ఉండగా ప్రస్తుతం అది రూ.42కి పైనే పలుకుతోంది. రాష్ట్రంలో చక్కెర సాగు విస్తీర్ణం వేగంగా పడిపోతుండటం, గిట్టుబాటు ధరలు లేకపోవడం, ప్రభుత్వ భాగస్వామ్య సంస్థ ‘నిజాం దక్కన్ సుగర్స్’ మూసివేత వెరసి చక్కెర ఉత్పత్తి, ధరలపై ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో 2015-16లో ఏడు ప్రైవేటు కర్మాగారాల పరిధిలో 27,76,180 క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి కాగా.. ప్రస్తుతం 12,65,238 క్వింటాళ్ల మేర నిల్వ ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. పండుగల సీజన్ సమీపిస్తుండటంతో ఈ నిల్వలు కేవలం మరో మూడు లేదా నాలుగు నెలలకు సరిపోతాయని లెక్కలు వేస్తున్నారు. డిసెంబర్ వరకు రాష్ట్రంలో చక్కెర ఉత్పత్తి జరిగే పరిస్థితి లేనందున.. మరో ఐదు నెలల పాటు పొరుగు రాష్ట్రాలపై ఆధార పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. చక్కెర ఉత్పత్తిపై మూసివేత ప్రభావం.. 2015-16లో నిజాం దక్కన్ సుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) పరిధిలోని మూడు కర్మాగారాలు మూత పడటంతో చక్కెర ఉత్పత్తి, సాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చెరుకు సాగు విస్తీర్ణం సుమారు లక్ష ఎకరాలు కాగా.. నిజాం సుగర్స్ పరిధిలోనే 20 వేల ఎకరాల మేర ఉండేది. ఎన్డీఎస్ఎల్ నష్టాలతో ఈ సాగు విస్తీర్ణం గత ఏడాది 7వేల ఎకరాలకు పడిపోయింది. నిజాం సుగర్స్ మూసివేతతో రాష్ట్రంలో చక్కెర దిగుమతి సుమారు 1,80,000 వేల క్వింటాళ్ల మేర తగ్గిందని అంచనా. ఈ నేపథ్యంలో చక్కెర ధరలపై ప్రభావం చూపెడుతోంది. ప్రస్తుత ఖరీఫ్ పంట అందుబాటులోకి వ చ్చేందుకు మరో నాలుగు నుంచి ఐదు నెలలు పట్టే అవకాశం ఉన్నందున అప్పటివరకు ధరల పెరుగుదల మరింత హెచ్చుగా ఉంటుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చక్కెర ధరలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా.. చక్కెర ఎగుమతులపై 20 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించింది. చక్కెర కొరత తీవ్రమైతే సుంకాన్ని మరింత పెంచడమో లేదా ఎగుమతులను పూర్తిగా నిషేధించడమో జరుగుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సజ్ అండ్ కస్టమ్స్ వర్గాలు వెల్లడించాయి. కాగా.. గత ఏడాది చక్కెర దిగుమతులపై 40 శాతం మేర కస్టమ్స్ సుంకాన్ని విధించిన కేంద్రం.. ఈ ఏడాది ఎగుమతులపై సుంకం విధించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఎగుమతులపై ఆంక్షల నేపథ్యంలో ఈ నిల్వలు స్థానిక మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో చక్కెర దిగుమతులపై ఎంట్రీ టాక్స్ లేకపోవడంతో స్థానిక మార్కెట్లలో ధరల నియంత్రణ కొంత మేర సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
తప్పుడు రిపోర్టుతో భయపెడుతున్నారు
గుంటూరు: ఏడేళ్ల బాలుడికి అధిక మోతాదులో షుగరు ఉందంటూ తప్పుడు రిపోర్టు ఇచ్చి తమను భయాందోళనకు గురి చేశారని, సదరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం బాలుడి తండ్రి జీజీహెచ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక పాతగుంటూరు యాదవబజారుకు చెందిన ఏడేళ్ల కీళ్ల సాయితేజకు మూత్రంలో రక్తం వస్తుండడంతో చికిత్స కోసం ఈనెల 21న జీజీహెచ్‌కు వచ్చారు. డాక్టర్ బాలుడిని పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలని సూచించారు. దీంతో అవుట్ పేషెంట్ విభాగం 24వ నంబరు గదిలోని రక్త పరీక్షల కేంద్రంలో షుగర్ పరీక్ష చేయించారు. బాలుడికి షుగర్ 334 ఉన్నట్లు రిపోర్టు ఇవ్వడంతో కంగారు పడిపోయి తదుపరి ప్రైవేటు ల్యాబ్‌లో రెండు పర్యాయాలు పరీక్ష చేయిస్తే 98 నుంచి 119 లోపు ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయని బాలుడి తండ్రి హర్ష తెలిపారు. తమకు రిపోర్టులు తప్పుగా ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుని, ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చూడాలని కోరారు. -
స్కానింగా మజాకా...
మీరు తీసుకునే ఆహారంలో క్యాలరీలు, ప్రొటీన్లు, షుగర్ లాంటివి ఎంతెంత ఉన్నాయో తెలుసా? పోనీ తెలుసుకోవాలని ఉందా? అవి చూస్తే కనపడవు. మరి ఎలా? స్కాన్ చేస్తే సరిపోతుంది. స్కానింగ్‌లో అవన్నీ ఎలా తెలుస్తాయనేగా మీ సందేహం. ఏమీ లేదండీ.. పక్కన కనిపిస్తున్న పరికరం పేరు ‘టెల్స్పెక్’. దీంతో మీరు తినే ఆహారాన్ని స్కాన్ చేయాలి. అప్పుడు అందులో ఎన్ని క్యాలరీలు, ప్రొటీన్లు ఉన్నాయో చెప్పడమే కాక ఎన్ని రసాయనాలున్నాయో కూడా చెప్పేస్తుంది. ఎలా అంటే, ఆ సమాచారమంతా దానికి అమర్చి ఉన్న బ్లూటూత్ ద్వారా మీ మొబైల్ లేదా ఐప్యాడ్‌లో కనిపిస్తుంది. దానివల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ... రసాయనాలతో కూడిన ఆహారానికి దూరంగా ఉండొచ్చు. -
పాపాల గుట్టు రట్టు
♦ సాక్ష్యాలతో పట్టుకున్న పోలీసులు ♦ సామగ్రి స్వాధీనం... అదుపులో నిందితుడు అశ్వారావుపేట : పాలు.. తాగడమంటే ఎవరికైనా ఇష్టమే. విటమిన్లు ఉంటాయని.. అందరూ తాగొచ్చని వైద్యులు సలహాలు సూచనలు చేస్తారు.. కానీ.. ఇక్కడి పాలు తాగిన వారు డబ్బులిచ్చి చేజేతులా ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నట్లే.. యూరియా, వంట నూనె, పంచదార, పాలపిండి, మంచినీళ్లతో క్షణాల్లో పాలు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పోలీసుల తనిఖీల్లో ఏళ్ల తరబడి కుటీర పరిశ్రమలా నడుస్తున్న నకిలీ పాల గుట్టు రట్టు కావడంతో ఊరి జనమంతా ఇదెక్కడి దందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అచ్యుతాపురం గ్రామానికి చెందిన పాల సేకరణ వ్యాపారి ఇంట్లో ఏళ్ల తరబడి గుట్టుగా నిర్వహిస్తున్న నకిలీ పాల తయారీ యంత్రాన్ని అశ్వారాపుపేట, దమ్మపేట పోలీసులు సోమవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. నిర్వాహకుడు పాలను సృష్టిస్తుండగా ఆధారాలతో సహా దొరికిపోయాడు. అచ్యుతాపురం, నారంవారిగూడెం గ్రామాల్లో పాల ఉత్పత్తి ఎక్కువ. ఇక్కడి నుంచి చాలా మంది పాలను సేకరించి.. ప్రైవేటు డెయిరీలకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో ఇదే వ్యాపారం చేస్తున్న అచ్యుతాపురానికి చెందిన వేజల మురళి ఇంటి ముందు దమ్మపేట ఎస్సై నాగరాజు, అశ్వారావుపేట పీఎస్సై వెంకన్న, ఏఎస్సై కోటేశ్వరరావు, రెండు పోలీస్స్టేషన్ల సిబ్బంది తెల్లవారేసరికి ఉన్నారు. దీంతో గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. తీరా అతగాడే నకిలీ పాలు తయారు చేస్తున్నాడని తెలిసి నిర్ఘాంతపోయారు. క్షణాల్లో పాల తయారీ.. విష పదార్థాలేమీ లేకుండా యూరియా, వంట నూనె, పంచదార, పాలపిండి, మంచినీళ్లతో క్షణాల్లో పాలు తయారు చేస్తున్నాడు. లీటరు నూనె, కిలో యూరియా, లీటరు నీళ్లు, పావుకిలో పంచదార, పావుకిలో పాలపిండి కలిపి సరిపడా నీళ్లు పోసి అన్నింటినీ ఒకే మిశ్రమంగా పాల సేకరణ డ్రమ్ములో కలుపుతున్నాడు. తర్వాత విద్యుత్ మోటార్‌కు అమర్చిన కవ్వంతో చిలుకుతున్నాడు. డ్రమ్ముపై మూత గట్టిగా ఉండటంతో చుక్క కూడా బయట పడకుండా మిశ్రమం అంతా మదించబడి పాలవంటి పదార్థం పైకి తేలుతుంది. దీనిని సేకరించిన పాలలో కలిపి పాల సేకరణ కేంద్రాలకు విక్రయిస్తున్నాడు. పాలలోని వెన్న శాతాన్నిబట్టి ప్రైవేటు కంపెనీలు లీటరుకు రూ.70 వరకు చెల్లిస్తుండటంతో.. రూ.100 పెట్టుబడితోనే రూ.వెయ్యి విలువైన పాలవ ంటి మిశ్రమాన్ని తయారు చేస్తున్నాడు. సేకరణ కేంద్రాల నుంచి పసిపిల్లల దాకా.. పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తెలగపిండి, కుడితి, పశువు, పొదుగు లేకుండా ఎరువు, వంటనూనెతో తయారు చేసిన నకిలీ పాలను అశ్వారావుపేట, దమ్మపేటలోని హెరిటేట్, మోడల్ డెయిరీలకు విక్రయిస్తుంటాడు. ఇతడితోపాటు ఇటువంటి పాల తయారీదారులు అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో వందలాది మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వాళ్లు విక్రయించిన నకిలీ పాలు పాల శీతలీకరణ కేంద్రాల గుండా మిల్క్ చిల్లింగ్ సెంటర్లకు తరలిస్తారు. ఇక్కడి నుంచి పలు పరిమాణాల్లో ప్యాకెట్ల రూపంలో ఐఎస్ఓ స్టాండర్డ్లతో విక్రయిస్తుంటారు. కొనే పాల ప్యాకెట్లో విషం పసిపాపల నుంచి వృద్ధుల వరకు ప్రభావాన్ని చూపుతోందని నిర్వాహకుడు చెప్పేదాన్నిబట్టి తెలుస్తోంది. శాస్త్రం తెలిసిన వ్యక్తే ఆద్యుడు.. అశ్వారావుపేటలోని మోడల్ డెయిరీలో గతంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసిన రామకృష్ణ అనే వ్యక్తి ఈ టెక్నాలజీని పరిచయం చేసినట్లు చెబుతున్నాడు మురళి. పాల లో వెన్న శాతం అధికంగా రావాలంటే.. పాలు అధికంగా ఉండాలంటే ఇలా నూనె, ఎరువులు కలిపితే లాభాలు వస్తాయని చెప్పినట్లు చెబుతున్నాడు. ఆఫ్ హెచ్‌పీ మోటార్, ప్లాస్టిక్ కవ్వం, కలిపే విధానం, టెక్నాలజీని నేర్పినందుకు రూ.35వేలు తీసుకున్నట్లు చెబుతున్నాడు. పాల తయారీకి వాడిన నూనె ప్యాకెట్లను ఎప్పటికప్పుడు ఇంటి ఆవరణలోనే తగుల బెడుతున్నాడు. అంతేకాక గ్రామంలో ఎవరితోనూ వివాదం లేకుండా అమాయకుడిలా కనిపించే మురళి ఇలా చేయడం గ్రామస్తులను విస్మయానికి గురిచేస్తోంది. పాలు కొనేందుకు ఎవరయినా వచ్చినా.. ఇంటిలో నుంచి తడికదాకా వచ్చి పాలు పోసే వాడని.. తీరా పోలీసులు వచ్చాక మోసం బయటపడిందని గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు. ైరె తుల నుంచి రోజుకు 40 లీటర్ల పాలు సేకరించి.. తర్వాత 450 లీటర్ల పాలు విక్రయించడంపై గ్రామస్తులకు వచ్చిన అనుమానంతో గుట్టు పాల తయారీకి వాడిన 80 నూనె ప్యాకెట్లు, 8 డ్రమ్ములు, 20 కిలోల యూరియా, పాలపిండి, పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
2025 నాటికి 7 కోట్ల మందికి షుగర్
* 21 కోట్ల మందికి హై-బీపీ * ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన సాక్షి, హైదరాబాద్: దేశంలో 30 నుంచి 59 ఏళ్ల మధ్య వయసులో చనిపోతున్న వారిలో 53 శాతం మంది దీర్ఘకాలిక వ్యాధులతోనే మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఆందోళన వ్యక్తంచేశాయి. అందులో హృదయ సంబంధ వ్యాధులతో చనిపోతున్న వారు 29 శాతం ఉన్నారంది. ‘భారత్‌లో దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, నిర్మూలన’పై కేంద్ర ఆరోగ్యశాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఇటీవల ఢిల్లీలో కీలక సదస్సు నిర్వహించాయి. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ, నిమ్స్ నెఫ్రాలజిస్ట్ టి.గంగాధర్ పాల్గొన్నారు.దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, నిర్మూలనకు సంబంధించి మార్గదర్శకాలపై సదస్సులో నివేదిక విడుదల చేశారు. మధుమేహ (షుగర్) వ్యాధి ద్వారానే దీర్ఘకాలిక వ్యాధులు మరింత ప్రబలుతున్నాయని ఆ నివేదిక స్పష్టంచేసింది. 2025 నాటికి దేశంలో 21.30 కోట్ల మంది హై-బీపీ, సుమారు 7కోట్ల మంది షుగర్ రోగులు ఉంటారని తెలిపింది. షుగర్, హై-బీపీ, గుండె పోట్ల కారణంగా విదేశాలతో పోలిస్తే దేశంలో ఐదు పదేళ్ల ముందే చనిపోతున్నారంది. చిన్న వయసులో షుగర్, గుండెపోటు రావడానికి ప్రధాన కారణం తాజా పండ్లు, కూరగాయలు తీసుకోకపోవడం, ఆహారపుటలవాట్లు, పొగ తాగడమేనని తేల్చింది. గ్రామస్థాయి వరకు వెల్నెస్ కేంద్రాలు... ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా మూడు రకాల ప్రత్యేక కార్యక్రమాలు... ఆరోగ్యంపై అవగాహన, దీర్ఘకాలిక వ్యాధులను ముందే గుర్తించడం, వ్యాధులకు గురైన వారికి అవసరమైన చికిత్స చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. ప్రజలు రోగాల బారిన పడకుండా చూసేలా గ్రామస్థాయి వరకు ‘వెల్నెస్ కేంద్రాల’ను నెలకొల్పాలని సూచించింది. కాగా, తమిళనాడులో ప్రస్తుతం ఆదర్శవంతమైన ఆరోగ్య వ్యవస్థ ఉందని, దాన్ని అమలు చేస్తే బాగుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలపై కసరత్తు చేసి ఆదర్శవంతమైన ఆరోగ్య విధానాన్ని రూపొం దిస్తామని ఆయన తెలిపారు. -
ఇంటింటా చిటపట
మండుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలు మార్కెట్‌కు వెళ్లాలంటనే భయమేస్తోందంటున్న జనం 15% వరకూ పెరిగిన నూనెల ధరలు కుతకుతలాడుతున్న పప్పులు.. బియ్యం, చక్కెర, అల్లం, వెల్లుల్లి ధరలూ నింగికి.. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఇప్పటికే పెరిగిన స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులతో ప్రజల విలవిల ప్రభుత్వం వెంటనే కల్పించుకుని ధరలు తగ్గించే చర్యలు చేపట్టాలని డిమాండ్ పచ్చిమిర్చి రూ. 100 పైనే కిలో టమాటా రూ. 90 బీరకాయ, చిక్కుడు రూ. 80పైనే సాక్షి నెట్వర్క్: కూరగాయల ధరలు కొండెక్కాయి.. పప్పులు ఎంతకూ దిగిరానంటున్నాయి.. నూనెలు మంటెక్కుతున్నాయి.. బియ్యం ధరలు చుక్కలను తాకుతున్నాయి.. చక్కెర చేదెక్కిపోయింది.. సంచుల్లో డబ్బులు తీసుకెళ్లి జేబుల్లో సరుకులు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది.. సగటు మనిషి జీవితం ఆగమాగమవుతోంది.. పేదలు, మధ్యతరగతి జనాలు విలవిల్లాడిపోతున్నారు. వంద రూపాయలు పట్టుకుని బజారుకు వెళితే ఒక్కరోజుకు సరిపడా సరుకులు కూడా రాక లబోదిబోమంటున్నారు. ఇప్పటికే భారీగా పెరిగిన స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులతో సతమతమవుతున్నవారు ధరల పెంపుతో నిండా ఆవేదనలో కూరుకుపోతున్నారు. ధరల మంటతో ఇలా పేదలు, మధ్య తరగతి అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. అటు కేంద్ర ప్రభుత్వం ‘అచ్ఛేదిన్ ఆగయే’ అంటూ డప్పు కొట్టుకుంటోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ వెలిగిపోతోందని ప్రకటనలు చేస్తోంది. నిత్యావసరాల ధరలు తగ్గించడంపై మాత్రం ఎవరికీ పట్టింపు లేదు. కొనాలంటే భయం.. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూరగాయల ధరలు 30 శాతానికిపైగా పెరగగా.. నిత్యావసరాల ధరలు 15 శాతం వరకు పెరిగాయి. టమాటా, పచ్చిమిర్చి వంటివి కిలో రూ.100కు చేరుకున్నాయి. బీరకాయ, బెండకాయ, చిక్కుడు, కాకర, క్యాబేజీ వంటివి వాటితో పోటీ పడుతున్నాయి. పాలకూర, మెంతికూర, కొత్తిమీర, తోటకూర వంటి ఆకుకూరలన్నీ పది రూపాయలకు నాలుగైదు కట్టలు చొప్పున విక్రయించేవారు. ప్రస్తుతం పది రూపాయలకు రెండు కట్టలు కూడా ఇవ్వడం లేదు. మార్కెట్లకు వెళుతున్నవారు ఒక్కో కూరగాయలను పావుకిలోకు మించి కొనేందుకు సాహసించడం లేదు. ఇక మార్కెట్లకు దూరంగా ఉన్న ప్రాంతాల్లోని దుకాణాలు, తోపుడు బండ్లు వంటి వాటిలో కిలోకు మరో పది ఇరవై రూపాయలు అదనంగా విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్, బోయిన్పల్లి తదితర హోల్‌సేల్ మార్కెట్లతోపాటు మెహిదీపట్నం, ఎర్రగడ్డలోని రైతుబజార్లలోనూ కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. నెల క్రితం హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ.7కు లభించిన టమాటా ఇప్పుడు రూ.60 నుంచి రూ.70 మధ్య పలుకుతోంది. ఇది రిటైల్‌కు వచ్చే సరికి ప్రాంతాన్ని బట్టి రూ.90-100 వరకు విక్రయిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంట్లో వారానికి సరిపడా కూరగాయల కోసం నెల రోజుల కింద రూ.300 వరకు ఖర్చు కాగా.. ఇప్పుడది రూ.550-600కు చేరుకోవడం గమనార్హం. ఇక అప్పుడప్పుడూ చుక్కలనంటే ధరలతో భయపెట్టే ఉల్లిగడ్డ మాత్రం ఇప్పుడు తక్కువ ధరకే (కిలో రూ.15కే) దొరుకుతుండడం గమనార్హం. ఈ జ్ఞాపకం మధురమే! కందిపప్పు కిలోకు ఒక రూపాయి డెబ్బై పైసలు, నూనె కిలోకు నాలుగున్నర రూపాయలు.. భలే తక్కువ ధరలు కదా! దాదాపు 45 ఏళ్ల కింద 1971లో రాసిన సరుకుల చిట్టా ఇది. మధుర జ్ఞాపకాలు అంటూ ఈ చిత్రం ఫేస్బుక్లో చెక్కర్లు కొడుతోంది. అప్పట్లో నాలుగు రకాల పప్పులు ఎనిమిది కిలోలు, మూడు కిలోల నూనె, పావుకిలో నెయ్యి, రెండు కేజీల చక్కెర, 2 సబ్బులు, పోపు సామగ్రి అంతా కలిపి కేవలం 40 రూపాయల 75 పైసలకే ఇచ్చేశారు. నిజంగా ఇది మధుర జ్ఞాపకమే! నిత్యావసరాలు భగ్గు కూరగాయలే కాదు బియ్యం, పప్పులు, నూనెలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయి. గత ఏడాది హోల్‌సేల్ మార్కెట్లో రూ.110కు కిలోచొప్పున లభించిన కందిపప్పు ఇప్పుడు రూ.150 దాటింది. అది రిటైల్ దుకాణాలకు వచ్చే సరికి కిలో రూ.180 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. లీటర్ వేరుశనగ నూనె రూ.100 నుంచి రూ.125కు, సన్‌ఫ్లవర్ నూనె రూ.80 నుంచి రూ.95కు పెరిగాయి. పేదలు వినియోగించే పామాయిల్ ధర కూడా లీటర్ రూ.65 నుంచి రూ.75కు పెరిగింది. బియ్యం, గోధుమలు వంటి వాటి ధరలూ 15 శాతం వరకూ పెరిగాయి. ఇక చింతపండు, అల్లం, వెల్లుల్లి, చక్కెర వంటి వాటి ధరలు కూడా బాగా పెరిగాయి. ధరల పెంపుపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కందిపప్పు కొనడం మానేశామని, ఇప్పుడు టమాటా వంటి కూరగాయలను కూడా కొనలేని పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కల్పించుకుని నిత్యావసరాల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తగ్గిన సాగు కొన్నేళ్లుగా కొనసాగుతున్న తీవ్ర వర్షభావ పరిస్థితులుతో కూరగాయల సాగు తగ్గిపోయింది. భూగర్భజలాలూ అడుగంటడంతో నీళ్లు లేక చిన్న రైతులు కూడా కూరగాయలు పండించలేకపోతున్నారు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, మదనపల్లి, అనంతపురం ప్రాంతాల్లో కూరగాయలు సాగవుతుంటాయి. కానీ కరువు పరిస్థితుల కారణంగా పంటల సాగు తగ్గింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో రైతులు అత్యధికంగా కూరగాయల సాగు చేసి హైదరాబాద్ నగరంలో విక్రయిస్తుంటారు. వారిలో ఈసారి సగం మంది కూడా కూరగాయలు సాగు చేయకపోవడం గమనార్హం. ఖమ్మం జిల్లాలో ఏటా దాదాపు 10 వేల ఎకరాల్లో కూరగాయలు సాగు చేసేవారు. ఈసారి 6 వేల ఎకరాల్లోనే వేశారు. అందులోనూ నీళ్లు లేక దిగుబడి బాగా తగ్గిపోయింది. ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో కూరగాయల పంటలకు భారీగా మచ్చల తెగులు సోకడంతో నష్టం కలిగింది. మార్కెట్‌కు వెళ్లాలంటే భయమే.. ‘‘పప్పులు, బియ్యం ధరలు బాగా పెరిగాయి. మార్కెట్‌కు వెళదామంటే భయమేస్తుంది. ధరలు ఇలా పెరిగితే పేదలు, సామాన్యుల పరిస్థితి ఏం కావాలి? ప్రభుత్వం వెంటనే ధరలు నియంత్రించాలి.’’ - బసయ్య, తాండూరు, రంగారెడ్డి జిల్లా ఏం తినేటట్లు లేదు ‘‘కనీసం కూ రగాయలు కూడా కొనలేకపోతున్నాం. రెండు నెలల్లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్నడూ లేనట్లు పచ్చిమిర్చి, టమాటా ధరలు కిలో 100 రూపాయలు దాటిపోయాయి. ఇలాగే ఉంటే ఏమీ కొనలేం. ఏమీ తినలేం..’’ - చింతల ఏసమ్మ, హైదరాబాద్ -
షుగర్...నో ఫికర్
పాంక్రియాస్‌ను చైతన్యవంతం చేసే ఆసనం ఉంది. ఇన్సులిన్ ఉత్పత్తిని ఆర్డర్లో పెట్టే ఆసనాలూ ఉన్నాయి. షుగర్ రావడం అంటే శరీరంలో ఏదో సవ్యత లోపించడమే. యోగా శరీరాన్ని క్రమస్థితిలో ఉంచుతుంది. అంటే షుగర్‌ని కూడా కంట్రోల్లో ఉంచుతుందన్నమాట. 1. వక్రాసన సుఖాసనంలో కూర్చుని రెండు కాళ్లు ముందుకు సాచాలి. స్ట్రెచ్ చేయాలి. కుడి మోకాలును పైకి లేపి పాదాన్ని పూర్తిగా జననేంద్రియాలకు దగ్గరగా ఉంచాలి. శరీరాన్ని, నడుముని కుడివైపుకు తిప్పి నిలబెట్టినట్టుగా ఉండాలి. కుడిమోకాలు ఎడమ చంకభాగంలోకి వచ్చేటట్లుగా కుడి చెయ్యి సీటుకి వెనుక వైపుగా తీసుకెళ్లి, అరచేతిని భూమి మీద నొక్కుతూ ఆ సపోర్ట్‌తో వీలైనంతవరకూ నడుమును పూర్తిగా ట్విస్ట్ చేస్తూ కుడి భుజం నుండి వెనుకకు చూసే ప్రయత్నం చేయాలి. ఈ ఆసనంలోకి వెళ్లి 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ తిరిగి వెనుకకు అంటే యధాస్థితికి రావాలి. కాళ్లు రెండూ ఫ్రీ చేసుకున్న తరువాత రెండవ వైపు కూడా ఇలాగే సాధన చేయాలి. ఈ వక్రాసనం మరీచాసనం తరువాత చేయబోయే అర్థమశ్చీంద్రాసనానికి సిద్ధం చేస్తుంది. ఉపయోగాలు: నడుమును ట్విస్ట్ చేయుడం, పొట్ట దగ్గర కండరాలను లోపలకు లాగడం వలన జీర్ణావయవాలకు మంచి టోనింగ్ జరుగుతుంది. 2. అర్ధమశ్ఛీంద్రాసన పై వక్రాసనంలో నిలబెట్టి ఉంచిన కుడికాలును ఎడమకాలు మీద నుండి క్రాస్ చేసి, ఎడమ పాదాన్ని కుడి తొడ బయట వైపుకు తీసుకురావాలి. సీటుకు వీలైనంత దగ్గరగా ఉంచి ఎడమకాలును మడిచి ఎడమ పాదాన్ని, ఎడమ మడమ కుడి సీటు భాగానికి దగ్గరగా ఉంచి, ఎడమ చంక భాగంలోకి నిలబెట్టి (ఫొటోలో చూపిన విధంగా) కుడి చేతిని మడచి వీపు వెనుక భూమికి సమాంతరంగా ఉంచాలి. కుడి మోకాలు మీద నుంచి ఎడమ చేతిని ట్విస్ట్ చేస్తూ వీపు వెనుక రెండు చేతి వేళ్లను ఇంటర్‌లాక్ చేసే ప్రయత్నం చేయాలి. శ్వాస తీసుకుంటూ తల కుడి భుజం మీదుగా తిప్పి వెనుకకు కుడివైపుకు చూసే ప్రయత్నం. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ తిరిగి యధాస్థితికి రావాలి. తరువాత కాలు మార్చుకుని రెండవ వైపుకు కూడా ఇలాగే చేయాలి. ఉపయోగాలు: ఈ ఆసనం ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పకుండా చేయాలి. పాంక్రియాస్ మీద ఒత్తిడి ఉండటం వలన, పాంక్రియాస్ బాగా యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరుగుతుంది. రెండవవైపు చేసినప్పుడు లివర్ మీద ప్రభావం ఉంటుంది. దీంతో ఫాటీ లివర్ సిండ్రోమ్, లివర్ సిరోసిస్ వంటి వ్యాధులకు కూడా పరిష్కారం లభిస్తుంది. గమనిక: ఆసనం పూర్తి స్థాయిలో చేయలేకపోయినా కాలు నిలబెట్టి ఉంచినప్పుడు క్రాస్ చేసినప్పుడు శరీరానికి దగ్గరగా అదుముతూ నడుమును పక్కలకు ట్విస్ట్ చేయగల్గినట్లయితే ఆశించిన పలితం తప్పకుండా చేకూరుతుంది. 3. యోగముద్రాసన పద్మాసనంలో కూర్చొని చేతులు రెండు వెనుకకు తీసుకెళ్లాలి. వ్యతిరేక దిశలో కుడిచేతితో ఎడమపాదాన్ని కాలివేళ్లను, ఎడమచేత్తో కుడి పాదాన్ని, కాలివేళ్లను పట్టుకుని (ఆ ఆసనం బద్ధ పద్మాసనమని పిలుస్తారు) శరీరాన్ని నిటారుగా ఉంచి, పూర్తిగా శ్వాసతీసుకుని శ్వాసను వదులుతూ ఉండాలి. నడుము నుండి పై శరీర భాగాన్ని బాగా సాగదీస్తూ ముందుకు వంగి నుదురును భూమి మీద ఆనించాలి. లేదా భూమికి వీలైనంత దగ్గరగా తీసుకురావాలి. ఒక వేళ వెనుక నుండి కాలి వేళ్లను ఫొటోలో చూపిన విధంగా పట్టుకోలేకపోతే ఎడమచేతి మణికట్టును కుడి చేత్తో పట్టుకుని చేతుల్ని వెనుక కిందకు లాగుతూ శరీరాన్ని ముందుకు వంచవచ్చు. తల భూమికి శక్తి కొద్దీ దగ్గరకు తీసుకువస్తే ఆశించిన ఫలితం లభిస్తుంది. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుని పైకి రావాలి. ఉపయోగాలు: జీర్ణవ్యవస్థకు, పునరుత్పత్తి వ్యవస్థకు ఈ ఆసనం చాలా మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కగా పనికి వచ్చే ఆసనం. -
ఒత్తిడితో చిత్తు
► పని భారంతో రోగాలబారిన ► పడుతున్న పోలీసులు ► సెలవుల్లేక సతమతం ► తాజాగా ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం పలమనేరు: తీవ్రమైన పని ఒత్తిడితో పోలీసు విభాగంలోని కిందిస్థాయి సిబ్బంది చిత్తవుతున్నారు. బాస్‌లకు మస్కా కొట్టే సిబ్బంది మాత్రం జల్సాగా ఉంటుంటే చిత్తశుద్ధితో పనిచేసేవారికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. తగినన్ని సెలవులు లేకపోవడం, అత్యవసర విధుల కు హాజరవుతుండడంతో సమయానికి తిండిలేక, తగిన విశ్రాంతి లేక రోగాల బారినపడుతున్నారు. ఇక మహిళా కానిస్టేబుళ్ల పరిస్థితి మరో ఘోరంగా తయారైంది. ఉదయం రెండు గంటల వ్యవధి మాత్రమే ఉండడంతో ఇంట్లో వంట కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. విపరీతమైన టెన్షన్, ఉన్నతాధికారుల టార్గెట్లు, వేధింపులతో కొందరు సిబ్బంది ఉద్యోగం పైనే విరక్తి చెందుతున్నారు. విధి లేని పరిస్థితుల్లో ఉద్యోగాన్ని వదులుకోలేక, తమ కష్టాలను ఎవరికీ చెప్పుకోలేక లోలోన మదనపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కుప్పం పోలీస్ స్టేషన్‌కు చెందిన రెడ్డెప్ప అనే కానిస్టేబుల్ సోమవారం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. అమలుకు నోచుకోని వీక్లీ ఆఫ్ గతంలో పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చేలా పోలీస్ ఉన్నతాధికారులు ఓ ప్రతిపాదనను తీసుకొచ్చారు. అయితే అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. పోలీస్ మ్యానువల్ ప్రకారం సంవత్సరానికి 15 లీవులు మాత్రమే వీరికి ఉన్నాయి. ఇక ఆప్షనల్ హాలిడేస్‌గా పదింటిని వాడుకునే వెసులుబాటుంది. ఒకవేళ మెడికల్ లీవ్ పెడితే జీతంలో కోత విధిస్తారు. ఈఎల్ (ఎర్నింగ్ లీవ్) పెట్టినా డబ్బులు చేతికందని పరిస్థితి. దానికితోడు సిబ్బంది పరిస్థితిని బట్టే సెలవులిచ్చే అవకాశం ఉంది. తమకు కావాల్సిన వారికి మాత్రం సెలవులు ఇవ్వడం.. మిగిలిన వారికి కుదరదని చెప్పడం పోలీస్ శాఖలో షరా మామూలేనని ఓ సీనియర్ హెడ్‌కానిస్టేబుల్ ఆవేదన. 40 శాతం మందికి జబ్బులే మొత్తం పోలీసులు 40 శాతం మంది సిబ్బంది షుగర్, బీపీ, అల్సర్‌తో బాధపడుతున్నారు. వీరికి సకాలంలో ఆహారం లేకపోవడం, తగిన విశ్రాంతి లేకపోవడం, మానసిక ఒత్తిడి జబ్బులకు కారణమవుతోంది. కనీసం పోలీస్ స్టేషన్ల లో విశ్రాంతి తీసుకోవడానికి కూడా తగిన సదుపాయాలు లేవు. దీంతో స్టేషన్‌లోని చెక్కబల్లలు, వరండాల్లో పడుకోవాల్సిందే. ఇలాం టి ఇబ్బందుల మధ్య అత్యవసర విధులను ఎలా నిర్వహించాలో అర్థం గాని పరిస్థితి. ఎన్నాళ్ల నుంచో డిమాండ్లున్నాయి పోలీస్ శాఖలో పనిచేసే వారికి వారాంతపు సెలవు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీంతోపాటు భార్య కాన్పు సమయంలో భర్తకు సెలవు ఇవ్వడం, కోరుకున్నపుడు సెలవులు, ఎనిమిది గంటల డ్యూటీ, పోలీస్ స్టేషన్లో తగిన సదుపాయాలతో విశ్రాంతి తదితర డిమాండ్లను వీరు కోరుతూనే ఉన్నారు. కానీ వీరి సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోకుండానే పోతున్నాయి. సమాజాన్ని రక్షించే పోలీసులకు తగిన సౌకర్యాలు, మానసిక ప్రశాంతత లేక ఒత్తిడితోనే విధులను నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. -
అలవాటు పడితే చక్కెర కూడా..
చక్కెర తినడానికి అలవాటు పడిన వాళ్లని మత్తు పదార్థాలకు బానిసలైన వారి కింద లెక్కవేయాలని అంటోంది తాజా అధ్యాయనం. నికోటిన్ వ్యసనానికి అలవాటు పడిన మనుషులకు ఇచ్చే మందులను చక్కెరకు బానిసలైన జంతువులకు అందించొచ్చని ఈ పరిశోధనలో వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలోని 1.6 బిలియన్ జనాభాలో 600 మిలియన్ల మంది ఒబెసిటీతో బాధపడుతున్నారని తేల్చింది. ఇందులో అధికశాతం ప్రజలు చక్కెర పాళ్లు ఎక్కువగా తీసుకున్నవారే కావడం గమనార్హం. పొగాకు, కొకైన్, మార్ఫైన్తో సమానంగా చక్కెరకూ అడిక్టివ్ సామర్ధ్యం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. బరువు పెరగడంతో పాటు చక్కెర పాళ్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటున్న జంతువులు న్యూరొలాజికల్, మనో వ్యాధులకు గురవుతాయని తెలిపారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఆమోదించిన వారెన్క్లియన్, చంపిక్స్ మందులు చక్కెర అడిక్షన్‌ను ట్రీట్ చేయడానికి ఉపయోగపడతాయని తమ పరిశోధనలో తేలిందని పరిశోధకులు వివరించారు. సహజంగా తయారయ్యే చక్కెరే కాకుండా కృత్రిమంగా తయారుచేసే చక్కెర వల్ల కూడా ఈ ప్రభావం ఉంటుందన్నారు. వీటికి సంబంధించిన వివరాలను ప్లొస్ వన్ జర్నల్‌లో ప్రచురించారు. -
ఉగాదికి తీపిలేదు!
♦ రేషన్ చక్కెరకు ప్రభుత్వం మంగళం ♦ రెండు నెలలుగా విడుదలకాని కోటా ♦ ఇప్పటికే కందిపప్పు ఆపేసిన సర్కారు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పేద ప్రజలకు ఇది చే దు వార్త. చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే చక్కెరకు ప్రభుత్వం మంగళం పాడింది. ప్రతి కార్డుకు అరకిలో చొప్పున పంచ దార సరఫరా చేస్తున్న ప్రభుత్వం రెండు నెలలుగా పంపిణీని నిలిపివేసింది. మార్చి, ఏప్రిల్‌కు సంబంధించి 1,170 మెట్రిక్ టన్నుల చక్కెర కోటా రాకపోవడంతో తొలిపండగ ఉగాది పచ్చడిలో తీపికి అవకాశంలేకుండా పోయింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 11.40 లక్షల రేషన్‌కార్డులకు ప్రతినెలా అరకేజీ చొప్పున 585 టన్నుల చక్కెరను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. అయితే, ఈ కోటాను గత రెండు నెలలుగా విడుదల చేయకపోవడంతో 120 టన్నుల బఫర్‌స్టాకును జిల్లా పౌరసరఫరాల శాఖ సర్దుబాటుచేసింది. కాప్రా, రామంతాపూర్, యాచారం, వికారాబాద్, పరిగి, ఘట్కేసర్, మహేశ్వ రం కేంద్రాల్లో ఉన్న నిల్వలను కార్డుదారులకు అందజేసింది. అయితే, తాజా పరిస్థితులను గమనిస్తే చక్కెరను కూడా ఎత్తివేసే అవకాశం కనిపిస్తోందని అధికారవర్గా లు అంటున్నాయి. ఇప్పటివరకు ప్యాకింగ్‌కు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరాచేసే సరుకులను తగ్గించుకుంటూ వస్తున్న సర్కారు.. మూడు నెలలుగా కంది పప్పు పంపిణీ నిలిపివేసింది. తాజాగా పంచదారనూ పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో కేవలం చౌక బియ్యం పంపిణీకే పరిమితం కానున్నట్లు అర్థమవుతోంది. -
నిలవకు విలువైన సూత్రాలు
ఇంటిప్స్ సాంబారు, రసం పొడులను డీప్ ఫ్రీజర్‌లో నిలవ ఉంచితే ఎక్కువ రోజులు వాసన పోకుండా తాజాగా ఉంటాయి. పచ్చళ్ళు, ఊరగాయల్లో స్టీల్ స్పూన్లు వాడకూడదు.కోడిగుడ్డు పొరటు మెత్తగా రావాలంటే మూడు టీ స్పూన్ల పాలు కలపాలి.ఉల్లిపాయలను గ్రైండ్ చేసిన వెంటనే వాడాలి, ఆలస్యమైతే చేదవుతుంది. గ్రైండ్ చేసే ముందు ఉల్లిపాయలను కొద్దిగా నూనెలో వేయిస్తే ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది.క్యారట్ పైభాగాన్ని కోసేసి గాలి దూరని కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నల్లని కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే వారం రోజులైనా తాజాగా ఉంటాయి.క్యారట్ వండేటప్పుడు నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపితే రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. వంకాయలను కోసిన వెంటనే ఒక స్పూను పాలు కలిపిన నీళ్లలో వేస్తే ముక్కలు నల్లబడవు. పచ్చిమిరపకాయలు తరిగిన తర్వాత వేళ్ల మంట తగ్గాలంటే చల్లటి పాలలో కొద్దిగా చక్కెర వేసి అందులో వేళ్లను ముంచాలి. పుట్టగొడుగులు వాతావరణంలోని తేమ ను పీల్చుకుని ఉంటాయి. వండేటప్పుడు కడిగితే మరింతగా నీటిని పీల్చుకుంటాయి కాబట్టి కడగకుండా శుభ్రమైన పేపర్‌తో కాని వస్త్రంతో కాని తుడవాలి. బంగాళాదుంపలను వారం పాటు నిలవ చేస్తే మొగ్గలు వస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే బంగాళాదుంపలతో పాటు ఒక ఆపిల్‌ను ఉంచాలి.బెండకాయల జిగురు పోవాలంటే వండేటప్పుడు రెండు చుక్కల నిమ్మరసం కాని ఒక స్పూను పెరుగు కాని కలపాలి.కాఫీ కప్పులకు పట్టిన మరకలు పోవాలంటే సోడా నింపి మూడు గంటల తర్వాత కడగాలి. టొమాటోలను తొడిమ కింది వైపుకు వచ్చేటట్లుగా ఉంచితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. -
ఏఈఈ రవీంద్రుడు మృతి
► మూడ్రోజుల తరువాత వెలుగులోకి.. ► ఉబ్బిపోయిన మృతదేహం అనంతపురం : అనంతపురంలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్య సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యూడీసీ)లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈ)గా పని చేసే పల్లా రవీంద్రుడు (50) మరణించారు. తన గదిలో మూడ్రోజుల కిందట ఆయన మరణించగా శుక్రవారం సాయంత్రం కొనుగొన్నారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన రవీంద్రుడు రెండేళ్ల కిందట అనంతపురం జిల్లాకు బదిలీపై వచ్చారు. అవివాహితుడు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆయన హౌసింగ్ బోర్డులోని ఓ అద్దె గదిలో ఉండేవారు. ఇటీవల గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్ ఎదురుగా ఉన్న ఓ అపార్ట్మెంట్లోకి మారారు. ఈ నెల 23న కాంట్రాక్టర్ నల్లయ్యతో కలసి ఉరవకొండకు క్యాంపు వెళ్లారు. అక్కడ నిర్మాణ పనులు చూసుకుని మధ్యాహ్నం గదికి చేరుకున్నారు. అంతే అప్పటి నుంచి బయటకు రాలేదు. గదికి రెండు తలుపులు ఉండగా రెండింటికీ లోపలే గడియ పెట్టుకున్నాడు. ఆయన మొబైల్‌కు కార్యాలయ అధికారులు, సిబ్బంది, స్నేహితులు, కాంట్రాక్టర్లు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. రింగ్ అవుతున్నా...రిసీవ్ చేయలేదు. వెలుగులోకి వచ్చింది ఇలా... వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు సమీపంలో షిరిడీ సాయిబాబా ఆలయాన్ని రవీంద్రుడు నిర్మించారు. ఆలయ నిర్వహణకు కొందరిని నియమించాడు. అయితే ఆ ఆలయానికి కొన్ని నెలలుగా కరెంటు బిల్లులు చెల్లించలేదు. ఈ క్రమంలో నిర్వాహకులు 23 నుంచి పలుమార్లు రవీంద్రుడికి ఫోన్ చేశారు. స్పందన లేదు. ఈ క్రమంలో శుక్రవారం గురుప్రసాద్ అనే వ్యక్తి జమ్మలమడుగు నుంచి నేరుగా అనంతపురంలోని రవీంద్రుడి గదికి చేరుకున్నాడు. గడియ పెట్టుకోవడంతో ఎంతసేపు పిలిచినా స్పందించలేదు. తర్వాత కిటీలో నుంచి తొంగిచూడగా ఆయన రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వెంటనే అపార్టుమెంట్ యజమానికి సమాచారం అందించాడు. ఆయన వచ్చి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సీఐ శుభకుమార్ తమ సిబ్బందితో వచ్చి వాకిలిని బలవంతంగా తొలిగించి లోపలికి వెళ్లారు. మృతదేహం బాగా ఉబ్బిపోయి భరించలేనంతగా వాసన వస్తోంది. మృతదేహం నుంచి అధికంగా రక్తస్రావమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక మార్చురీకి తరలించారు. ఏమై ఉంటుంది..? రవీంద్రుడు కొంతకాలంగా బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నాడు. ఎండ తీవ్రత నెలకొన్న పరిస్థితుల్లో క్యాంపునకు వెళ్లిన ఆయన తిరిగి వచ్చిన తర్వాత అనారోగ్యంతో బాధపడినట్లు తెలిసింది. ఈ క్రమంలో స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో తీవ్ర అనారోగ్యానికి గురై మరణించారా, లే ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని సీఐ తెలిపారు. -
ఆహారం వికటించి విద్యార్థులకు అస్వస్థత
రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం శాస్త్రిపురం డివిజన్లోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 16 మంది శుక్రవారం అస్వస్థత పాలయ్యారు. మధ్యాహ్న భోజనం తర్వాత ఓ విద్యార్థిని తెచ్చిన చక్కెరను 16 మంది తినగా... వెంటనే వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో వారిని రాజేంద్రనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది. మధ్యాహ్న భోజనానికి సుమారు 80 మంది విద్యార్థులు హాజరుకాగా, చక్కెర తిన్న 16 మంది మాత్రమే అస్వస్థతకు గురవడం గమనార్హం. -
అర్బన్ ‘హెల్’ సెంటర్లు
లేస‘మాత్ర’మైనా అందని వైద్యం షుగర్, బీపీ మాత్రలు లభించక రోగుల అవస్థ కానరాని ప్లూయిడ్స్ డ్రెస్సింగ్ మెటీరియల్ నిడదవోలు : విరోచనాలు, వాంతులు, జ్వరం వంటి తదితర రోగాలతో పట్టణ ఆరోగ్య కేంద్రాల(అర్బన్ హెల్త్ సెంటర్లు)కు మీరు పరుగుతీశారా!.. అంతే వేగంతో వెనక్కి వచ్చేస్తారు. ఇక ప్రమాదాల్లో గాయాలపాలైన వారిని అక్కడికి తీసుకెళ్తే కనీస ప్రాథమిక చికిత్స అందక విలవిల్లాడిపోతారు. కనీసం అక్కడ డ్రెసింగ్ చేసే దిక్కు కూడా కనిపించక నరకం అనుభవిస్తారు. ఎందుకంటే అక్కడ సెలైన్లు(ఐవీ ప్లూయిడ్స్, ప్రాథమిక చికిత్స డ్రెస్సింగ్ మెటీరియల్, షుగర్ పరీక్ష చేసే కిట్లు.. అంతెందుకు కనీసంలో కనీసం జ్వరానికి వాడే పారాసిట్మాల్ మాత్రలు కూడా దొరకవు. ఇదీ జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లలో పరిస్థితి. -నిడదవోలు హెల్త్ సెంటర్ల ఏర్పాటు లక్ష్యాలివీ.. జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థలో 7, భీమవరంలో మూడు, తాడేపల్లిగూడెంలో మూడు, నరసాపురంలో రెండు, పాల కొల్లు, నిడదడవోలు, కొవ్వూరు, తణుకు మునిసిపాలీటి పరిధిలో ఒక్కొక్కటి చొప్పున అర్బన్ హెల్త్ సెంటర్లున్నాయి. పట్టణ శివారులలో వెనుకబడిన ప్రాంతాలు (స్లమ్ ఏరియా) లలో ఎస్సీ, ఎస్టీ, నివాస ప్రాంతాలలో పేదలకు సత్వర వైద్యమందించేందుకు ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా చంటి పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, గర్భిణుల నమోదు, కుటుంబ నియంత్రణ వంటి కార్యక్రమాలతో పాటు ఎక్కడైనా ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స అందించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ, పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అర్బన్ హెల్త్ సెంటర్లు పనిచేస్తున్నాయి. అయితే రోగాలతో ఆవస్థలు పడుతూ హెల్త్ సెంటర్లకు వస్తున్న రోగులకు మందు బిళ్లలు లేకపోవడంతో నానా ఆవస్థలు పడుతున్నారు. ప్రతి కేంద్రంలో షుగర్ పరీక్షలకు అవసరమైన షుగర్ పరీక్షా యంత్రం లేకపోవడంతో పేదలు కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రయివేట్ లేబ్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. అంతేకాకుండా వేసవిలో వడదెబ్బకు గురైన వారికి అందించాల్సిన సెలెన్స్ (ఐవి ఫ్లూయిడ్స్)కూడా లేవు. నిడదవోలు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్‌తో పాటు జిల్లాలోని ప్రతి సెంటర్లో ఇదే దుస్థితి నెలకొంది. -
ఆర్టీసీ ఆస్పత్రిలో మందుల కొరత
మూడు నెలలుగా ఇదే పరిస్థితి కార్మిక కుటుంబాలు ఎదురుచూపులు రాష్ట్రం మొత్తంలోనే ఏకైక ఆర్టీసీ జోనల్ ఆస్పత్రి అది. ఐదు జిల్లాల ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన వైద్య సేవలందించాలి. అలాంటి కరీంనగర్ జోనల్ ఆస్పత్రిని మందుల కొరత వెంటాడుతోంది. ఆస్పత్రికి సరిపడా మందులు సరఫరా కాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. - మంకమ్మతోట ఆర్టీసీ కరీంనగర్ జోనల్ ఆస్పత్రికి గతంలో కావాల్సిన మందులన్నీ నెలలో ఒకేసారి సరఫరా అయ్యేవి. ఇప్పుడు మందుల కోసం అధికారులు రెండు,మూడు సార్లు హైదరాబాద్‌లోని ఆర్టీసీ సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌కు వెళ్లాల్సివస్తోంది. ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వ్యాధులకు మందులు అందుబాటులో ఉంటున్నా అవి సరిపడా సరఫరా కావడం లేదు. కొత్తకొత్త కంపెనీలకు చెందిన మందులు ఇస్తున్నారని, ప్రతినెల మందుల కంపెనీలు మారుతుండడంతో తాము ఏ మందులు వేసుకుంటున్నామో తెలియని పరిస్థితి నెలకొందని కార్మికులు, వారి కుటుంబసభ్యులు అంటున్నారు. బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఇక్కడ నెలకు ఒకేసారి మందులు ఇస్తుంటారు. మందులు వచ్చినట్లు తెలియగానే వెంటనే వెళ్లాలి. లేకుంటే అవి ముందుగా వచ్చిన వారికి ఇస్తున్నారు. దీంతో ఆలస్యంగా వెళ్లిన వారికి వేరే కంపెనీలు, ఎంజీ తక్కువ, ఎక్కువగా ఉన్న మందులు ఇస్తున్నారని అంటున్నారు. ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ల్యాబ్‌లో వైరల్ ఫీవర్ రక్తపరీక్షల కిట్లు కూడా అందుబాటులోలేవని సమాచారం. ఐదు జిల్లాల కార్మికులకు సేవలు రాష్ట్రం మొత్తంలోనే ఏకైక ఆర్టీసీ జోనల్ ఆస్పత్రి కరీంనగర్లో ఉంది. కరీంనగర్ జోన్లో ఏడు వేల మంది కార్మికులు సహా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన కార్మికుల కుటుంబాలకు సేవలు అందించాల్సి ఉంది. ఇక్కడ వారికి సంపూర్ణ వైద్యం అందడం లేదనే ఆరోపణలున్నాయి. రోజు ఈ ఆస్పత్రికి 130 నుంచి 150 మంది వరకు వైద్య సేవల కోసం వస్తుంటారు. దీంతో ప్రతినెల 100కు పైగా కేసులను ఆర్టీసీతో ైటె అప్‌గా ఉన్న ప్రతిమ హాస్పిటల్‌కు పంపిస్తున్నారు. ఉన్న ఆస్పత్రిలోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తే రోగులకు ఇబ్బందులు తొలగడమే కాకుండా లక్షలాది రూపాయలు ఆదా అవుతాయని కార్మికులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఆర్టీసీ కరీంనగర్ జోనల్ ఆస్పత్రికి గతంలో కావాల్సిన మందులన్నీ నెలలో ఒకేసారి సరఫరా అయ్యేవి. ఇప్పుడు మందుల కోసం అధికారులు రెండు,మూడు సార్లు హైదరాబాద్‌లోని ఆర్టీసీ సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌కు వెళ్లాల్సివస్తోంది. ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వ్యాధులకు మందులు అందుబాటులో ఉంటున్నా అవి సరిపడా సరఫరా కావడం లేదు. కొత్తకొత్త కంపెనీలకు చెందిన మందులు ఇస్తున్నారని, ప్రతినెల మందుల కంపెనీలు మారుతుండడంతో తాము ఏ మందులు వేసుకుంటున్నామో తెలియని పరిస్థితి నెలకొందని కార్మికులు, వారి కుటుంబసభ్యులు అంటున్నారు. బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఇక్కడ నెలకు ఒకేసారి మందులు ఇస్తుంటారు. మందులు వచ్చినట్లు తెలియగానే వెంటనే వెళ్లాలి. లేకుంటే అవి ముందుగా వచ్చిన వారికి ఇస్తున్నారు. దీంతో ఆలస్యంగా వెళ్లిన వారికి వేరే కంపెనీలు, ఎంజీ తక్కువ, ఎక్కువగా ఉన్న మందులు ఇస్తున్నారని అంటున్నారు. ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ల్యాబ్‌లో వైరల్ ఫీవర్ రక్తపరీక్షల కిట్లు కూడా అందుబాటులోలేవని సమాచారం. ఐదు జిల్లాల కార్మికులకు సేవలు రాష్ట్రం మొత్తంలోనే ఏకైక ఆర్టీసీ జోనల్ ఆస్పత్రి కరీంనగర్లో ఉంది. కరీంనగర్ జోన్లో ఏడు వేల మంది కార్మికులు సహా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన కార్మికుల కుటుంబాలకు సేవలు అందించాల్సి ఉంది. ఇక్కడ వారికి సంపూర్ణ వైద్యం అందడం లేదనే ఆరోపణలున్నాయి. రోజు ఈ ఆస్పత్రికి 130 నుంచి 150 మంది వరకు వైద్య సేవల కోసం వస్తుంటారు. దీంతో ప్రతినెల 100కు పైగా కేసులను ఆర్టీసీతో ైటె అప్‌గా ఉన్న ప్రతిమ హాస్పిటల్‌కు పంపిస్తున్నారు. ఉన్న ఆస్పత్రిలోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తే రోగులకు ఇబ్బందులు తొలగడమే కాకుండా లక్షలాది రూపాయలు ఆదా అవుతాయని కార్మికులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. -
22 బస్తాల రేషన్ చక్కెర పట్టివేత
ధర్మపురి: సివిల్ సప్లై గోదాము నుంచి పక్కదారి పడుతున్న చక్కెర నిల్వలను గుర్తించిన అధికారులు 22 బస్తాల చక్కెరను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ధర్మపురిలో గురువారం వెలుగుచూసింది. స్థానిక సివిల్ సప్లై గోదాముల నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న చక్కెర బస్తాలను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. -
జయలలిత సంక్రాంతి బహుమతి
చెన్నై: తమిళ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తీపికబురు అందించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నట్టుగా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుటుంబానికి రూ. 100 నగదు, కిలో బియ్యం, కిలో చక్కెరతో పాటు.. రెండు అడుగుల పొడవైన చెరకు గడలను పొంగల్ గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. బియ్యం పొందడానికి అర్హత ఉన్న రేషన్ కార్డుదారులు కూడా బహుమతి ద్వారా లబ్ధి పొందవచ్చన్నారు. జనవరి 15 న సంక్రాంతి పండుగ రోజున రేషన్ దుకాణాల ద్వారా ఈ కానుక పంపిణీ చేస్తారని ఆమె చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 1.91 కోట్ల మంది రేషన్ కార్డుదారులతో పాటు శరణార్థి శిబిరాల్లో ఉంటున్న శ్రీలంక తమిళులకు, పోలీసు సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని ప్రకటించారు . దీనికోసం రూ. 318 కోట్లను వెచ్చించనున్నట్టు తెలిపారు. -
చెంచాడు చక్కెర చాలు...
పరిపరి శోధన క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారా..? గెలుపు కోసం కఠోర సాధనే కాకుండా, నానా తంటాలు పడుతూనే ఉంటారు లెండి. శక్తినిచ్చే సప్లిమెంట్లు, ఎనర్జీ డ్రింకులతో గెలుపు బాటలో సాగిపోగలమనే ధీమా పెంచుకునే ఉంటారు లెండి. అయితే, ఎనర్జీ డ్రింకులు క్రీడా పోటీల్లో విజయానికి ఏమంత భరోసా ఇవ్వలేవని, వాటి బదులు ఒక చెంచాడు చక్కెర తీసుకుంటే చాలు, ఎలాంటి క్రీడా పోటీల్లోనైనా గెలుపు బాటలో దూసుకుపోవచ్చని బాత్ వర్సిటీ పరిశోధకులు సెలవిస్తున్నారు. ముఖ్యంగా విపరీతంగా శక్తిని ఖర్చు చేయాల్సి వచ్చే పరుగు పోటీలు, సైకిల్ రేసుల వంటి వాటిలో పాల్గొనేవారు ఎనర్జీ డ్రింకులను నమ్ముకోవడం కంటే, చెంచాడు చక్కెర తీసుకుంటే చాలు... వెంటనే శక్తి వచ్చి, సునాయాసంగా గెలుపు బావుటా ఎగరేయగలరని వారు చెబుతున్నారు. -
చక్కెర తింటే నిద్రొస్తుందట!
చాక్లెట్లు, స్వీట్లు తినడం వల్ల పిల్లల్లో మంచి ఉత్సాహం, చురుకుదనం వస్తుందని కొందరు తల్లిదండ్రుల నమ్మకం. అయితే నిజానికి ఇలాంటి చక్కెర గల పదార్థాలతో నిద్ర వచ్చే అవకాశాలున్నాయని, చక్కెర మగతను కలిగించగలదని పరిశోధకులు అంటున్నారు. ‘‘అతిగా భోజనం చేసిన తర్వాత నిద్ర ఎక్కువగా వస్తుందని మనలో చాలా మంది అనుకుంటాం. కానీ అంతకంటే అధికంగా చక్కెర గల పదార్థాలు తీసుకుంటే త్వరగా నిద్రలోకి జారుకుంటాం’’ అని లియాన్ న్యూరోసైన్స్‌కు చెందిన పరిశోధకుడు క్రిస్టోఫీ వెరిన్ తెలిపాడు. ఫ్రాన్స్‌కు చెందిన వెరిన్ బృందం ఎలుకల్లో జరిపిన ప్రయోగం ద్వారా ఈ విషయం వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా కొన్ని ఎలుకల మెదడులోకి గ్లూకోజ్ (చక్కెరలోని ఓ రకం)ను ఇంజెక్ట్ చేశారు. మెదడులోని వీఎల్పీఓ (వెంట్రోలేటరల్ ప్రీయాప్టిక్ న్యూక్లియస్) ప్రాంతంలో దీన్ని ఇంజెక్ట్ చేశారు. ఎలుకలకు నిద్ర కలిగేందుకు వీఎల్పీఓ తోడ్పడుతుంది. గ్లూకోజ్‌ను ఇంజెక్ట్ చేసిన వెంటనే అవి నిద్రలోకి జారుకున్నాయి. దాదాపు రెండు గంటలపాటు అవి నిద్రలోనే ఉన్నాయి. ఎలుకల్లాగే మానవుల మెదడుపై చక్కెర పదార్థాలు ప్రభావం చూపగలవని అధ్యయనవేత్తలు తెలిపారు. చక్కెర కలిగిన పిండి పదార్థాలు ఉన్న ఆహారం అధికంగా తీసుకున్నప్పుడు మనకు కూడా నిద్ర వచ్చే అవకాశం అధికంగా ఉందని వారు అన్నారు. -
బెల్లం నిల్వల స్వాధీనం
భువనగిరి: నాటుసారా తయారీకి అక్రమంగా అమ్మకాలు సాగిస్తున్న బెల్లం నిల్వలను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి రూరల్ సీఐ తిరుపతి నేతృత్వంలో ఎస్ఐలు సురేష్ బాబు, భిక్షపతి తదితర సిబ్బంది బెల్లం దుకాణాలపై మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. గంజ్ మార్కెట్లోని సాయిగణేష్ ట్రేడర్స్ దుకాణంలో అక్రమంగా నిల్వవుంచిన 54 బస్తాల బెల్లం పౌడర్, 76 బెల్లం ముద్దలు, రెండు బస్తాల పటికను స్వాధీనం చేసుకున్నారు. దుకాణం యజమానిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తిరుపతి తెలిపారు. -
మహిళల కోసం ప్రత్యేకంగా నెఫ్రాలజీ కౌన్సెలింగ్
ఇది కిడ్నీకి సంబంధించిన జబ్బేనా? నా వయసు 35 ఏళ్లు. షుగర్ ఉంది. ఈమధ్యకాలంలో కాళ్లు బాగా వాస్తున్నాయి. బలహీనంగా కూడా అనిపిస్తోంది. ఊపిరి తీసుకోవడం కూడా అప్పుడప్పుడూ ఇబ్బందిగా ఉంటోంది. జీర్ణశక్తి తగ్గింది. మూత్రవిసర్జనలో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి వాంతులు అవుతున్నాయి. ఇది కిడ్నీలకు సంబంధించిన జబ్బేమోనని భయంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - మేరీ కృపావరం, కడప చాలా సందర్భాల్లో కిడ్నీలకు సంబంధించిన జబ్బుల విషయంలో ముందస్తు హెచ్చరికలుగా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అయితే శరీరంలో వచ్చే మార్పులను ముందుస్తు హెచ్చరికలుగా పరిగణించి జాగ్రత్తపడాలి. ప్రస్తుతం మీ విషయంలో కూడా మీరు చెప్పిన లక్షణాలన్నీ కిడ్నీ జబ్బులకు సంబంధించిన ముందస్తు సంకేతాలుగానే అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమయంలో కాలయాపన మరింత ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే మీకు అందుబాటులో ఉన్న నెఫ్రాలజిస్టును మీరు కలవండి. ఏమాత్రం ఆలస్యం చేయవచ్చు. కిడ్నీ సంబంధిత జబ్బుల లక్షణాలు లేదా సంకేతాలను గ్రహించిన మూడు నెలలోనే ఆ జబ్బులను పరీక్షల ద్వారా నిర్ధారణ చేయించుకుని, చికిత్స ప్రారంభించకపోతే కిడ్నీలు పూర్తిగా విఫలం కాగలవు. ఒకసారి కిడ్నీలు విఫలమైన తర్వాత వాటిని సాధారణ స్థితికి తీసుకురావడం ఏ చికిత్స ద్వారా కూడా సాధ్యం కాదన్న వాస్తవాన్ని గ్రహించి, తక్షణమే వైద్యులను సంప్రదించండి. నా వయసు 50 ఏళ్లు. టైప్-2 డయాబెటిస్తో బాధపడుతున్న నాకు రెండు మూత్రపిండాలూ పాడైపోవడంతో చాలాకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. అయితే ప్రతిసారీ డయాలసిస్ కోసం ఆస్పత్రికి వెళ్లిరావడం ఇబ్బందిగా ఉంటోంది. దీనికి ప్రత్యామ్నాయ పద్ధతి ఉందని ఇటీవలే తెలిసింది. దాని గురించి వివరించండి. - ఎస్ ఇందిరాదేవి, బీహెచ్ఈఎల్, రామచంద్రాపురం ఆస్పత్రి లేదా నర్సింగ్‌హోమ్‌లలో నిర్వహించే డయాలసిస్‌ను హీమోడయాలసిస్ అంటారు. అయితే ఇంటి దగ్గర మీరే స్వయంగా లేదా మీ కుటుంబ సభ్యుల సహాయంతో డయాలసిస్ చేసుకునే మరో ప్రక్రియ కూడా ఉంది. ఇదే పెరిటోనియల్ డయాలసిస్. అయితే ఇంటి దగ్గర డయాలసిస్ చేసుకోగల నేర్పు, ఓర్పు పేషెంట్‌కు ఉండాలి. లేదా దీనిని చేయగలవారు ఇంట్లో అందుబాటులో ఉండాలి. ఇందులో కడుపు లోపల అంటే ఉదర కుహరంలో ఆవరించిన పొరలలో ఉండే రక్తనాళాల్లోకి డయాలసేట్ అనే ద్రవాన్ని నింపుతూ ఎప్పటికప్పుడు రక్తంలో వ్యర్థాలను బయటకు తీయవచ్చు. రక్తాన్ని శుద్ధి చేసే ద్రవాన్ని కేథెటర్ ద్వారా కడుపులోకి పంపిస్తారు. ఈ ద్రవం నిర్ణీతకాలం వరకు కడుపులో ఉంటుంది. ఈ సమయంలో రక్తంలోని వ్యర్థాలు, రసాయనాలు, ద్రవాలు... కడుపులోపలి పొరను అంటిపెట్టుకుని ఉండే రక్తనాళాల నుంచి బయటకు వచ్చి ఆ ద్రవంలో కలుస్తాయి. నిర్ణీత సమయం తర్వాత వ్యర్థాలు కలిసిన ద్రవం పేషెంట్ శరీరం వెలుపల అమర్చిన సంచిలోకి డ్రెయిన్ అవుతుంది. కడుపులోకి ద్రవాన్ని పంపడం, కొంతసేపటి తర్వాత దాన్ని బయటకు తీయడం ప్రక్రియను ఎక్స్ఛేంజ్ అంటారు. రాత్రివేళ పేషెంట్ నిద్రించే సమయంలో కూడా డయాలసిస్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆటోమేటెడ్ సైక్లర్‌ను వినియోగిస్తారు. ఈ సైక్లర్ తనంతట తానుగా డయాలసిస్ ద్రవాన్ని కడుపులోపలికి పంపించడం, నిర్ణీత వ్యవధి తర్వాత దాన్ని బయటకు డ్రెయిన్ చేయడం వంటి విధులు నిర్వహిస్తుంది. -
కిరాణా షాపులో రేషన్ బియ్యం పట్టివేత
ఆత్మకూర్ : నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఓ కిరాణా షాపుపై విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. చౌక ధరల దుకాణం ద్వారా పేదలకు పంపిణీ చేయాల్సిన 50 కిలోల చక్కెర, క్వింటాన్నర బియ్యం షాపులో విక్రయానికి ఉండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. యజమాని చందా రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.