Mohammad Azharuddin
-
అజహరుద్దీన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టుకు మాగంటి గోపీనాథ్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎన్నిక అంశం కోర్టుకు చేరింది. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ పిటిషన్‌ను సవాల్ చేస్తూ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో, అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో అజారుద్దీన్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి ఆరో తేదీ వరకు రిజయిండర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు హైకోర్టులో ఎన్నికల పిటిషన్ విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. -
అజారుద్దీన్ కు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?
-
HCA: అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు
టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో సమన్లు ఇచ్చింది. కాగా అంతర్జాతీయ క్రికెట్లో 1984- 2000 వరకు అజారుద్దీన్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.తన కెరీర్లో మొత్తంగా 99 టెస్టులు, 334 వన్డేలు ఆడిన ఈ హైదరాబాదీ.. సంప్రదాయ క్రికెట్లో 6215, యాభై ఓవర్ల ఫార్మాట్లో 9378 పరుగులు సాధించాడు. విజయవంతమైన బ్యాటర్‌గా పేరొందిన అజారుద్దీన్ కెప్టెన్‌గానూ సేవలు అందించాడు. అయితే, ఫిక్సింగ్ ఆరోపణలతో అతడి కీర్తిప్రతిష్టలు మసకబారగా.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.ఈ క్రమంలో 2020 - 2023 మధ్యలో హెచ్‌సీఏలో దాదాపు రూ. 3.8 కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా.. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు గుర్తించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌కు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అజారుద్దీన్ ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందాడు. -
CWC: 2003లో ఓడిపోయాం.. కానీ ఈసారి ట్రోఫీ మనదే: అజారుద్దీన్
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం సమీపించింది. మరికొన్ని గంటల్లో వన్డే వరల్డ్-2023 ఫైనల్ పోరుకు తెరలేవనుంది. అహ్మదాబాద్ వేదికగా అజేయ టీమిండియా- ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో టైటిల్ పోరులో తలపడనుంది. ఇరవై ఏళ్ల క్రితం కంగారూ జట్టు చేతిలో ఎదురైన ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, రాజకీయ నాయకుడు మహమ్మద్ అజహరుద్దీన్ టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ‘‘ఈ రోజు మ్యాచ్ రసవత్తరంగా ఉంటుంది. భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్, బౌలింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేయాలా.. బౌలింగ్ చేయాలా అన్నది పిచ్‌పై ఆధారపడి ఉంటుంది. 2003లో ఆస్ట్రేలియాతో ఫైనల్లో ఓడిపోయాం. ఈసారి భారత జట్టు గెలిచి ప్రపంచ కప్‌ను అందుకుంటుంది. ప్రచారంలో ఉంటూనే తీరికవేళ మ్యాచ్‌ను తిలకిస్తాను’’ అని అజారుద్దీన్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా మేటి క్రికెటర్‌గా పేరొందిన అజారుద్దీన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఒత్తిడిని జయించిన తీరు అద్భుతం: ఓజా అదే విధంగా టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా సాక్షితో మాట్లాడుతూ.. ‘‘లీగ్ దశ నుంచి ఒత్తిడిని జయిస్తూ మన భారత క్రీడాకారులు ప్రదర్శించిన క్రీడా నైపుణ్యాలు ఎంతో స్ఫూర్తి నింపాయి. ఎలాంటి తడబాటు లేకుండా క్రికెట్ ఫేవరెట్ టీంలను సైతం చిత్తు చేయడం కప్‌ను సాధిస్తామని చెప్పకనే చెప్పారు. బ్యాటింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో పాటు బౌలింగ్‌లో దూసుకుపోతున్న తీరు చూస్తూ ప్రతీ భారతీయుడు ఇప్పటికే విజయాన్ని ఖాయం చేసుకున్నారు. భారత క్రికెట్ ఆటగాడిగానే కాకుండా క్రికెట్‌కు అతిపెద్ద అభిమానిగా మరోసారి వరల్డ్ కప్ భారత ఒడిలో చేరుతుందని నమ్మకంగా ఉన్నాను’’ అని రోహిత్ సేన విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. -
అజారుద్దీన్‌కు భారీ ఊరట.. ముందస్తు బెయిల్ మంజారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్‌కు భారీ ఊరట లభించింది. అజారుద్దీన్‌కు మల్కాజిగిరి కోర్టు ముందస్తు బెయిల్ మంజారు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యుక్షనిగా ఉన్నప్పుడు భారీ అవినీతికు పాల్పడడారని అజారుద్దీన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విధితమే. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు నియమించిన లావ్ నాగేశ్వర్రావు కమిటీ ఫిర్యాదు మేరకు ఆయనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో అజారుద్దీన్ ముందస్తు బెయిల్ కోసం మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఫిటిషన్ను సోమవారం విచారించిన న్యాయస్ధానం అజారుద్దీన్ కు ముందస్తు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా పోలీసుల విచారణకు సహకరించాలని అజారుద్దీన్ ను కోర్టు ఆదేశించింది. కాగా అజారుద్దీన్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. చదవండి: WC 2023: బంగ్లాదేశ్ అప్పీలు.. మాథ్యూస్ అవుట్! అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! -
బకెట్ చైర్స్ టెండర్లలో అవకతవకలు జరిగినట్లు గుర్తింపు
-
'టీమిండియాకు ఇదొక మంచి ఛాన్స్.. మరోసారి వరల్డ్ ఛాంపియన్స్‌గా'
వన్డే ప్రపంచకప్-2023లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. వరుస విజయాలతో భారత జట్టు దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన భారత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్లో దాయాది పాకిస్తాన్‌ను కూడా భారత్ చిత్తు చేసింది. ఆక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. వరుసగా 8వ సారి వరల్డ్‌కప్ టోర్నీలో పాక్‌ను భారత్ ఓడించింది. ఈ క్రమంలో భారత జట్టుపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కూడా రోహిత్ సేనను ఆకాశానికెత్తాడు. ప్రస్తుత భారత జట్టు ఫామ్‌ను చూస్తుంటే కచ్చితంగా వరల్డ్‌కప్ ట్రోఫిని సొంతం చేసుకుంటందని అజారుద్దీన్ థీమా వ్యక్తం చేశాడు. "నా విషెస్ ఎల్లప్పుడూ భారత జట్టుకు ఉంటాయి. మా జట్టు ఈ సారి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలుస్తుందని ఆశిస్తున్నాను. ఈ మెగా టోర్నీని మా బాయ్స్ అద్భుతంగా ఆరంభించారు. వరల్డ్‌కప్ ట్రోఫిని సొంతం చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. ప్రస్తుత జట్టు అన్ని విధాల సమతూకంగా ఉంది. అదే విధంగా సరైన నాయకుడు కూడా ఉన్నాడు. అతడు జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడు అని ఏఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. -
టీమిండియా మాజీ కెప్టెన్‌కు భారీ షాక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్‌కు భారీ షాక్ తగిలింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందుకు జస్టిస్ లావు నాగేశ్వర్రావు కమిటీ అజారుద్దీన్‌పై అనర్హత వేటు వేసింది. దీంతో అజహార్ రానున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ కమిటీ అజారుద్దీన్ పేరును హెచ్‌సీఏ ఓటర్ల జాబితా నుంచి కూడా తొలగించింది. -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే నెల (అక్టోబర్) 20వ తేదీన ఎన్నికలు నిర్వహరణకు ముహూర్తం ఖరారైంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ మెంబర్స్‌కు ఎన్నికలు జరుగనున్నాయి. ఆరోజే ఫలితాలు ఈ నేపథ్యంలో 173 మందితో కూడిన ఓటర్ల జాబితాను కూడా విడుదల చేశారు. వచ్చే నెల 4 నుంచి 7వ తేదీ వరకు ఎన్నికల అధికారి వి.సంపత్ కుమార్ నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబరు 14న నామినేషన్లను స్క్రూటినీ చేయనున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు 16వ తేదీని ఆఖరి రోజుగా నిర్ణయించారు. అక్టోబరు 20న ఎన్నికలు నిర్వహించడం సహా అదే రోజు ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. మోగిన ఎన్నికల నగారా కాగా వివాదాల నేపథ్యంలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా మహ్మద్ అజారుద్దీన్ పదవీకాలం పూర్తైన తర్వాత.. సుప్రీంకోర్టు.. మాజీ జస్టిస్ లావు నాగేశ్వర్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు హెచ్‌సీఏ బాధ్యతలను జస్టిస్ లావు నాగేశ్వరరావు పర్యవేక్షించారు. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల నగారా మోగింది. చదవండి: WC2023: అతడి ఆట అద్భుతం.. గేమ్ ఛేంజర్ తనే: యువరాజ్ సింగ్ -
రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ధోనికి అలా సాధ్యం కాలేదు!
Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Rohit Sharma Record: ఐదేళ్ల క్రితం ఆసియా కప్ టోర్నీలో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా మరోసారి అదే ఫీట్‌ను పునరావృతం చేశాడు. హిట్‌మ్యాన్ సారథ్యంలో భారత జట్టు ఆసియా కప్-2023 ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో మట్టికరిపించి విజయకేతనం ఎగురవేసింది. మిస్టర్కూల్తో పాటు లంక లెజెండ్ మాదిరిగానే వన్డే మ్యాచ్‌లో 50 పరుగులకే ఆలౌట్ అయిన శ్రీలంక విధించిన స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 6.1 ఓవర్లలోనే ఛేదించి రికార్డు స్థాయిలో అతి పెద్ద విజయం నమోదు చేసింది. కాగా ఆటగాడిగా రోహిత్ శర్మ కెరీర్లో ఇది 250వ అంతర్జాతీయ వన్డే కావడం విశేషం. అదే విధంగా ఆసియా కప్ వన్డే చరిత్రలో 28వది. ఇక ఈ మ్యాచ్‌లోనే కెప్టెన్‌గానూ రోహిత్ అరుదైన ఘనతలు సాధించాడు. శ్రీలంకపై విజయంతో ఆసియా వన్డే కప్‌లో సారథిగా తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి.. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, శ్రీలంక లెజెండ్ అర్జున రణతుంగతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ధోనికి అలా సాధ్యం కాలేదు అయితే, ధోని(14 మ్యాచ్‌లలో), రణతుంగ(13 మ్యాచ్‌లలో)ల కంటే అత్యంత వేగంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. 11 మ్యాచ్‌లలో 9 విజయాలు సాధించి చరిత్రకెక్కాడు. ఇదిలా ఉంటే.. కొలంబోలో శ్రీలంకతో ఆదివారం నాటి ఫైనల్లో గెలుపుతో రోహిత్ శర్మ కెప్టెన్‌గా రెండోసారి ఆసియా కప్ అందుకున్నాడు. అజారుద్దీన్‌తో పాటు.. ధోని, రోహిత్ ఈ క్రమంలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా మహ్మద్ అజారుద్దీన్, మహేంద్ర సింగ్ ధోని తర్వాతి స్థానంలో నిలిచాడు. 1990-91లో అజారుద్దీన్, 2010, 2016(టీ20 ఫార్మాట్లో తొలిసారి)లో ధోని టీమిండియాకు టైటిల్ అందించారు. కాగా ఫైనల్లో ఆరు వికెట్లతో చెలరేగి హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. చదవండి: Asia Cup 2023: కాస్త ఓవర్ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్ అతడే మా కొంపముంచాడు.. మమ్మల్ని క్షమించండి ప్లీజ్: శ్రీలంక కెప్టెన్ Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 -
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తామని మాజీ ఎంపీ, టీం ఇండియా మాజీ సారథి మహ్మద్ అజహరుద్దీన్ పేర్కొన్నారు. యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని టీ–హోప్ కార్యాలయంలో ఆదివారం అజహరుద్దీన్ ఆ సంస్థ చైర్మన్ ఉపేందర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అజహరుద్దీన్ మాట్లాడుతూ... స్థానికంగా ఉపేందర్‌రెడ్డి ఇప్పటికే ఎన్నోమార్లు పర్యటించి సమస్యలను తెలుసుకున్నారని, ప్రజాభిమానాన్ని చూరగొన్నారని అన్నారు. అలాంటి నాయకుడు తమకు సహకారం అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపితే ఇక్కడ కాంగ్రెస్ విజయం తధ్యమవుతుందని అజహరుద్దీన్ స్పష్టం చేశారు. ఉపేందర్‌రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందించదగ్గవని ఆయన పేర్కొన్నారు. ఇక్కడకు వచి్చన మహిళల ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, ఇక కాంగ్రెస్ తిరుగులేదని అనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రజలందరికీ మంచి జరగాలని తపన పడుతున్న ఆయనకు భవిష్యత్‌లో మంచే జరుగుతుందన్నారు. టికెట్ అనేది త్వరలోనే తెలుస్తుందని, అయితే ప్రతి ఒక్కరూ కలిసి పార్టీకి విజయం చేకూర్చాలనే తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ... టీ–హోప్ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు తెలుసుకుని కాంగ్రెస్ నాయకులందరూ ఇక్కడకు రావడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో... కాంగ్రెస్‌కు పూర్వవైభవం లభించేనా?
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఆ పార్టీ తెలంగాణ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందనడం నిరి్వవాదాంశం. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల్లో నిరాశనిస్పృహలే కని్పస్తున్నాయి. ప్రధానంగా నియోజకవర్గంలో పార్టీని నడిపించే యోధుడు ఆశించిన స్థాయిలో చురుగ్గా లేకపోవడమే కారణమంటూ పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. హైదరాబాద్: ఒకప్పుడు రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గం అది. జనహృదయ నేత పి.జనార్ధన్‌రెడ్డి (పీజేఆర్) అంటే ఖైరతాబాద్... ఖైరతాబాద్ అంటేనే పీజేఆర్ అనే విధంగా ఉండేది. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆయన ప్రజల నడుమే ఉండేవారనడం.. ప్రజామద్దతు ఆయనకే ఉండేదనడం అతిశయోక్తికాదు. పీజేఆర్ అకాల మరణంతో ఆయన తనయుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించినా పీజేఆర్‌కు ఉన్న ఓర్పు, నేర్పు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రస్తుత జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రాంతంలో క్రమేపీ ఆ పార్టీ తన ప్రాబల్యాన్ని కోల్పోతూ వచ్చింది. ఇప్పటికీ పీజేఆర్ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు పటిష్టంగా ఉన్నా సమర్థవంతంగా నడిపించే నాయకులు లేక పార్టీ చతికిల పడిపోయింది. దీంతో దశాబ్దాలకాలం పాటు వెన్నంటి నడిచిన కేడర్‌కు దిక్కులేకుండా పోయింది. ► అధికార పార్టీ ఒత్తిడిని తట్టుకోలేక మెజారిటీ నాయకులు పార్టీలు మారినా.. ఉన్న కొంత మంది పీజేఆర్‌ను మరువలేక పార్టీని వదలలేక పార్టీలోనే కొనసాగుతున్నారు. ► పీజేఆర్ తనయుడు మాజీ ఎమ్మెల్యే పీవీఆర్ కేవలం ఎలక్షన్స్ ముందు మాత్రమే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పీవీఆర్‌కు సత్తా ఉన్నా నియోజకవర్గంలో సమస్యలు, పార్టీలో యువతను సంఘటితం చేస్తూ పార్టీలో చురుకుగా పాల్గొనకపోవడం పెద్ద సమస్యగా మారింది. పి.విష్ణువర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా చురుకుగా ఉండి, ఎప్పుడూ నియోజకవర్గంలోనే ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. క్రమేపీ ఆయనలోని మార్పుల వల్ల పార్టీ బలహీనంగా మారింది. ► ఆయన నివాసం కూడా దోమలగూడలో ఉండటంతో కార్యకర్తలు, నేతలకు ఒకింత సమస్యగానే మారింది. దీంతో కొత్త నాయకత్వం వైపు పలువురు సీనియర్ నేతలు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇంతవరకూ పెద్దాయనపై ఉన్న గౌరవంతో ఈ నియోజకవర్గం పార్టీ స్థితిగతులపై దృష్టి సారించిన పార్టీ హైకమాండ్ మారుతున్న రాజకీయ పరిస్థితులపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు సమాచారం. గతంలో... దివంగత పీజేఆర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది తన సత్తా చాటుకున్నారు. జాతీయ స్థాయి నాయకుల మన్ననలు పొందారు. ఆయన మరణాంతరం జరిగిన ఉప ఎన్నికల్లో పీజేఆర్ తనుయుడు విష్ణువర్ధన్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తరువాత నూతనంగా ఏర్పాటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మరోసారి పి.విషువర్ధన్‌రెడ్డి విజయం సాధించారు. మొత్తంగా ఏడుగురు కార్పొరేటర్లలో నలుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో విష్ణువర్ధన్‌రెడ్డి వరుస అపజయాలను మూటగట్టుకున్నారు. ► టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టాక పార్టీలో నూతనోత్తేజం వస్తుందని అశించిన పార్టీ కేడర్‌కు నిరాశే మిగిలింది. ► మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి పనితీరుతో ఎలాంటి మార్పు రాకపోవడంతో పార్టీని బతికించుకోవడం కోసం తమ ఉనికిని కాపాడుకోవడం కోసం కొత్త నాయకత్వం వైపు చూడక తప్పడంలేదని సీనియర్లు భావిస్తున్నారు. ► సీనియర్ నేతలను సంప్రదించకుండా ఏక పక్షంగా నియామకాలు చేపట్టంపై అసంతృప్తి చెందిన నేతలు నియోజకవర్గంలో పార్టీ ప్రక్షాళన కోసం శ్రీకారం చుట్టారు. అజహరుద్దీన్ పర్యటనలో ఆంతర్యమేమిటో? కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, టీం ఇండియా మాజీ సారథి మహ్మద్ అజహరుద్దీన్ బుధవారం జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు. ముఖ్య నేతలను కలుసుకొని వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. నియోజకవర్గంలో అభ్యర్థులు గెలుపోటముల్లో ముస్లిం ఓట్లే కీలకం అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అజహరుద్దీన్‌ను బరిలోకి దింపితే ఎలా ఉంటుందో అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పార్టీ ఢిల్లీ అధిష్టానం సూచనల మేరకే అజహరుద్దీన్ పర్యటన సాగిందని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బరిలో అధిష్టానం మాజీ ఎమ్మెల్యే పీవీఆర్‌కు మరో అవకాశం ఇస్తుందా.. కొత్త నేతలకు అవకాశం ఇస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. -
జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్ వర్సెస్ విష్ణువర్ధన్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీ హిల్స్ నియోజక వర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు బయటపడ్డాయి. మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మహమద్ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఒకటి బలంగా నడుస్తోంది. ఈ క్రమంలో.. ఇవాళ(బుధవారం) నియోజకవర్గంలో అజారుద్దీన్ వర్గం సమావేశం నిర్వహించగా.. పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి చెందిన వర్గం ఎంట్రీతో పరిస్థితి వేడెక్కింది. అజారుద్దీన్ ఇవాళ రెహమత్ నగర్లో సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు సమావేశాన్ని అడ్డుకున్నారు. విష్ణుకు చెందిన నియోజకవర్గంలో ఆయనకు సమాచారం అందించకుండా మీటింగ్ ఎలా పెడతారంటూ నిలదీశారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకోగా.. పోలీసులు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఇదే నిజయోకవర్గం నుంచి విష్ణువర్దన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక మహమద్ అజారుద్దీన్ 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోరాదాబాద్(యూపీ) నుంచి ఎంపీగా నెగ్గారు. 2019లో సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించినా.. భంగపాటే ఎదురైంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్‌ప్రెసిడెంట్‌గా ఉన్న అజారుద్దీన్.. ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక కథనాల కోసం క్లిక్ చేయండి -
బ్యాటింగ్‌కు రాకపోయినా అరుదైన రికార్డుతో మెరిసిన కోహ్లి
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి బ్యాటింగ్‌కు రాలేదు. బ్యాటింగ్ రాకపోయినా కోహ్లి మాత్రం ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. అదెలాగంటే విండీస్ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లి సంచలన క్యాచ్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన జడేజా బౌలింగ్‌లో నాలుగో బంతిని షెపర్డ్ ఆఫ్‌సైడ్ కవర్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించాడు.అయితే బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో మొదటి స్లిప్‌లో ఉన్న కోహ్లి.. మెరుపు వేగంతో తన కుడివైపుకి డైవ్ చేసి సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ క్రమంలో కోహ్లి వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న ఆటగాళ్ల జాబితాలో రాస్ టేలర్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. కోహ్లి అందుకున్న షెపర్డ్ క్యాచ్ అతనికి 142వది. ఇక కోహ్లి కంటే ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 156 క్యాచ్‌లతో మూడో స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ 160 క్యాచ్‌లతో ఉన్నాడు. లంక దిగ్గజ ఆటగాడు మహేళ జయవర్దనే 218 క్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక కోహ్లి తన స్థానంలో బ్యాటింగ్‌కు రాకపోవడం వెనుక ఒక కారణం ఉంది. వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో తాము విఫలమైతే బ్యాటింగ్ బలం ఎంతనేది తెలుసుకోవడానికి రోహిత్, కోహ్లిలు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మ్యాచ్ అనంతరం హిట్‌మ్యాన్ తెలిపాడు. టార్గెట్‌ను చేధించే క్రమంలో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయినప్పటికి ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. Most catches in ODI history: 1) Jayawardena - 218 2) Ponting - 160 3) Azharuddin - 156 4) Taylor - 142 5) Kohli - 142* pic.twitter.com/GjMZGcXiDJ — Johns. (@CricCrazyJohns) July 28, 2023 King Grab 🦀@imVkohli pulls off a stunner 😱#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/ozvuxgFTlm — FanCode (@FanCode) July 27, 2023 చదవండి: AB De Villiers: 'రొనాల్డో, ఫెదరర్‌లానే కోహ్లి కూడా చాలా గొప్పోడు' -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు
-
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ హైదరాబాద్ వన్డే.. టికెట్ల విక్రయం ఎప్పుడు, ఎలా అంటే..?
IND VS NZ 1st ODI: ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ ముగిశాక, న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కివీస్ 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. పర్యటనలో భాగంగా తొలుత వన్డే సిరీస్ ఆడనున్న న్యూజిలాండ్.. జనవరి 18న హైదరాబాద్ వేదికగా తొలి వన్డే, 21న రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డే, 24న ఇండోర్ వేదికగా మూడో వన్డే ఆడుతుంది. అనంతరం జనవరి 27న రాంచీ వేదికగా తొలి టీ20, 29న లక్నో వేదికగా రెండో టీ20, అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 1న మూడో టీ20 ఆడనుంది. వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటల నుంచి, టీ20లు రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమవుతాయి. కాగా, నాలుగేళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. టికెట్ల విక్రయం, మ్యాచ్‌కు ముందు షెడ్యూల్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. గతేడాది ఆసీస్‌తో టీ20 సందర్భంగా టికెట్ల విక్రయంలో జరిగిన రసాభసను దృష్టిలో ఉంచుకుని ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. గతంలోలా కాకుండా ఈసారి టికెట్లను కేవలం ఆన్లైన్లో (పేటీయం) మాత్రమే విక్రయిస్తామని స్పష్టం చేశారు. ఆన్లైన్లో టికెట్లు జనవరి 13 నుండి 16 వరకు విడతల వారీగా సేల్ చేస్తామని తెలిపారు. మ్యాచ్‌కు రావడానికి ఫిజికల్ టికెట్ తప్పనిసరి అని, విక్రయించిన టికెట్లను ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో జనవరి 15 నుండి 18 వరకు (ఉదయం 10 నుండి 3 వరకు) కలెక్ట్ చేసుకోవాలని సూచించారు. స్టేడియం కెపాసిటీ 39,112 అయితే, 9695 కాంప్లిమెంటరీ టికెట్స్ పోగా మిగతా 29, 417 టికెట్స్ ఆన్లైన్లో సేల్ చేస్తామని తెలిపారు. న్యూజిలాండ్ టీమ్ జనవరి 14న హైదరాబాద్‌కు చేరుకుంటుందని, 15న ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటుందని, జనవరి 16న టీమిండియా నగరానికి చేరుకుంటుందని వివరించారు. -
అజహరుద్దీన్ నిర్ణయాలను రద్దు చేయండి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా మొహమ్మద్ అజహరుద్దీన్ ఈ ఏడాది సెప్టెంబర్ 30 తర్వాత తీసుకున్న అన్ని నిర్ణయాలను రద్దు చేయాలని సూపర్వైజరీ కమిటీ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ (రిటైర్డ్) ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన సుప్రీం కోర్టుకు తన నివేదిక అందించారు. దీని ప్రకారం కార్యదర్శి విజయానంద్ పదవితో పాటు అడ్హాక్ కమిటీ కూడా రద్దయినట్లే. సెప్టెంబర్ 30తోనే అజహర్ పదవీకాలం ముగిసిందని, ఆపై ఆయన తీసుకున్న నిర్ణయాలకు ఎలాంటి విలువా లేదని కక్రూ పేర్కొన్నారు. ఆయన నివేదిక ప్రకారం సెలక్టర్లు, కోచ్‌ల ఎంపిక, ఇతర నియామకాలేవీ చెల్లవు. సూపర్వైజరీ కమిటీ పర్యవేక్షణలోనే కొత్త సెలక్టర్లను కూడా ఎంపిక చేయాలని కక్రూ సూచించారు. చదవండి: ఇంగ్లండ్ వికెట్ కీపర్ అద్భుత విన్యాసం.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్ -
భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్ ఇంట విషాదం
సాక్షి, హైదరాబాద్ (బంజారాహిల్స్): భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్ మహ్మద్ అజహారుద్దీన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అజహార్ తండ్రి మహ్మద్ యూసఫ్ ఆనారోగ్యం కారణంగా ఇవాళ మృతి చెందారు. యూసఫ్.. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేపు బంజారాహిల్స్ లోని మసీద్ ఇ బాకీ జోహార్లో నమాజ్ ఇ జనాజా అనంతరం యూసఫ్ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. -
Ind Vs Aus: అవన్నీ అవాస్తవాలు.. ఒక్కొక్కరు నాలుగు టికెట్లు కొంటే: అజారుద్దీన్
India Vs Australia 3rd T20 Tickets- Mohammad Azharuddin Comments: భారత్- ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌లో మూడో టీ20 నేపథ్యంలో టికెట్ల అమ్మకాలపై వస్తున్న ఆరోపణలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ స్పందించారు. టికెట్ల అమ్మకాల విషయంలో కొంతమంది కావాలనే వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న ఆయన.. అవేమీ నిజం కావన్నారు. పేటీఎం ద్వారా ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు జరిగాయని... పేటీఎం తన పనిని చక్కగా నెరవేర్చిందని పేర్కొన్నారు. ఓ వ్యక్తి నాలుగు టికెట్లు కొంటే.. టికెట్ల అమ్మకం, జింఖానా గ్రౌండ్లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అజారుద్దీన్ శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆన్లైన్లో పారదర్శకంగా టికెట్ల అమ్మకం జరిపినపుడు ఇలాంటి అక్రమాలు జరిగాయని ఎలా అంటున్నారో అర్థం కావడం లేదు. ఒకవేళ ఓ వ్యక్తి ఆన్లైన్లో నాలుగు టికెట్లు కొన్నారనుకోండి. వారికి ఆఫ్‌లైన్‌లో టికెట్లు జారీ చేసేటపుడు ఆధార్ కార్డు వంటి ఐడీలను పరిశీలిస్తాం. అంతేగానీ ఆ నాలుగు టికెట్లను వారు ఏం చేస్తున్నారో మాకేం తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా బ్లాక్‌లో అమ్మకాలు జరిపారని తెలిస్తే కఠినమైన చర్యలు ఉంటాయి’’ అని పేర్కొన్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ టికెట్ల వివరాలివే! కాంప్లిమెంటరీ కిందే ఎక్కువ టికెట్లు ఇచ్చామన్న అజారుద్దీన్.. టికెట్ల అమ్మకాలకు సంబంధించిన లెక్కలను మీడియాకు వివరించారు. ‘‘సెప్టెంబరు 15 ఆన్లైన్లో పేటీఎం ద్వారా 11,450 టికెట్లు, పేటీఎం కార్పొరేట్ బుకింగ్ 4000, మిగతా ఆన్లైన్ సేల్స్ 2100, ఆఫ్‌లైన్ సేల్స్ సెప్టెంబరు 22న 3000, మిగతా 6 వేల టికెట్లు(ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్, స్పాన్సర్స్, కార్పొరేట్స్) అమ్మినట్లు తెలిపారు. చికిత్స చేయిస్తాం జింఖానాలో తొక్కిసలాట దురదృష్టకరమని.. గాయపడిన వారికి తమ వంతు సాయం చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఘటనకు హెచ్‌సీఏ మాత్రం కారణం కాదని అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. ఇందులో తమ తప్పేమీ లేదని.. తమ పొరపాటు లేదన్నారు. టికెట్ల అమ్మకాల్లో మా ప్రమేయం లేదు ఇక హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ.. టికెట్ల అమ్మకాల్లో తమ ప్రమేయం లేదన్నారు. ఆ పనిని పేటీఎంకు అప్పగించామని.. తాము మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. హెచ్‌సీఏలో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని.. అయితే, ప్రతీ వ్యవస్థలోనూ ఇలాంటివి సహజమేనన్నారు. ఏదేమైనా మ్యాచ్ నిర్వహణను విజయవంతం చేయడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. తొక్కిసలాటపై స్పందిస్తూ.. గాయపడిన వారికి చికిత్స అందించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. చదవండి: Dewald Bravis: 'బేబీ ఏబీ' విధ్వంసం.. మరొక్క బంతి మిగిలి ఉంటేనా! -
అజారుద్దీన్ రివర్స్ అటాక్.. మ్యాచ్ నిర్వహించడం అంత ఈజీ కాదు..
సాక్షి, హైదరాబాద్: భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 టిక్కెట్ల అమ్మకాల నేపథ్యంలో జింఖానా గ్రౌండ్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ క్రమంలో రాష్ట్ర క్రీడా శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్.. హెచ్‌సీఏ, పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. టికెట్ల గోల్మాల్ వ్యవహారాన్ని అజారుద్దీన్ లైట్ తీసుకున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎదుటే అజారుద్దీన్ రివర్స్ అటాక్ ఇచ్చారు. అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహించడం మీటింగ్‌లో కూర్చుని మాట్లాడినంత సులభం కాదని అజారుద్దీన్ అన్నారు. తనకు మ్యాచ్ నిర్వహణ పనులు చాలా ఉన్నాయని.. మీతో మాట్లాడే సమయం లేదంటూ మంత్రితో ఆయన చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే టిక్కెట్ల మొత్తం అమ్ముడుపోయయాని, ఆన్లైన్లో పెట్టడానికి కూడా లేవని ఆయన తేల్చిచెప్పారు. ఇక టికెట్ల గోల్మాల్ అంశంపై ప్రశ్నించగా.. అజారుద్దీన్ సమాధానం చెప్పకుండా దాటేసినట్లు తెలిసింది. కాగా తొక్కిసలాట ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని చెప్పారు. ఇంత పెద్ద మ్యాచ్ జరిగినప్పుడు చిన్నా చితక ఘటనలు జరుగుతాయంటూ అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. త్వరలోనే టికెట్ల అమ్మకాలకు సంబంధించి పూర్తి వివరాలను మంత్రికి అందజేస్తామని అజారుద్దీన్ పేర్కొన్నారు. చదవండి: Ind A vs NZ A 1st ODI: ఆల్‌రౌండ్ ప్రతిభ.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం! -
ఆజహార్, వెంగ్సర్కార్లను ఏకి పారేసిన గవాస్కర్.. బుద్ధి ఉండాలంటూ ఘాటు వ్యాఖ్యలు
భారత క్రికెట్ దిగ్గజాల్లో ముఖ్యుడైన లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తన సమకాలీకులైన దిలీప్ వెంగ్‌సర్కార్, మహ్మద్ అజహారుద్దీన్లను ఏకి పారేశాడు. ఇటీవల ప్రకటించిన భారత టీ20 ప్రపంచకప్-2022 జట్టుపై ఆ ఇద్దరు చేసిన వ్యతిరేక కామెంట్స్‌కు సన్నీ ఘాటుగా బదులిచ్చాడు. ఆటగాళ్ల ఎంపిక జరిగాక వారిపై వ్యతిరేక కామెంట్లు చేసేందుకు బుద్ధి, జ్ఞానం ఉండాలని పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ ధ్వజమెత్తాడు. ఒకరి బదులు ఇంకొకరిని ఎంపిక చేసుంటే బాగుండేదని కామెంట్స్ చేసే ముందు ఓసారి ఆలోచించి ఉంటే బాగుండేదని గడ్డిపెట్టాడు. ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల అంతర్జాతీయంగా మన దేశ పరువు దిగజారడంతో పాటు ఆటగాళ్లను నైతికంగా నిరుత్సాహపరిచినవారమవుతామంటూ మొట్టికాయలు వేశాడు. జట్టు ఎంపికపై అసంతృప్తి ఉన్నా దానిపై బహిరంగా కామెంట్ చేయకూడదన్న ఇంగిత జ్ఞానం ఉండాలని వాయించాడు. సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా పని చేసిన అనుభవమున్న వారు జట్టు ఎంపిక తర్వాత ఆటగాళ్లను నిరుత్సాహపరిచే విధంగా కామెంట్లు చేయడమేంటని నిలదీశాడు. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలకు జట్టును ఎంపిక చేసేప్పుడు సవాలక్ష సమీకరణలు ఉంటాయని, భారతీయులుగా మనం సెలెక్టర్ల ఛాయిస్‌కు గౌరవమివ్వాలి కాని, ఒకరి స్థానంలో ఇంకొకరిని ఎంపిక చేసుంటే బాగేండేదంటూ కామెంట్లు చేయకూడదని చురకలంటించాడు. జట్టు ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగినా వెనకేసుకురావాలి కానీ మన వీక్నెస్ను మనమే బహర్గతం చేసుకోకూడదని సూచించాడు. ఇదే సందర్భంగా సన్నీ రోహిత్ నేతృత్వంలో ఎంపిక చేయబడ్డ భారత వరల్డ్‌కప్ స్క్వాడ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత వరల్డ్ కప్ జట్టు సమతూకంగా చాలా బాగుందని, ఈసారి హిట్‌మ్యాన్ సేన ఎలాగైనా టైటిల్ సాధించి మెగా టోర్నీల్లో భారత్ రాణించలేదన్న అపవాదును తొలగించాలని ఆకాంక్షించాడు. ఇందుకు కొద్దిగా లక్ కూడా తోడైతే టీమిండియాను ఆపడం ఎవరి వల్ల కాదని అభిప్రాయపడ్డాడు. భారత్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గాక ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా సాధించని విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత సెలెక్టర్లు టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్ వ్యతిరేక కామెంట్లు చేశాడు. వరల్డ్ కప్ మెయిన్ జట్టులో శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ పేర్లు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, జట్టులో స్థానం పొందిన వారిలో దీపక్ హుడా, హర్షల్ పటేల్‌లను తప్పించి శ్రేయస్, షమీలకు ఛాన్స్ ఇస్తే బాగుండేదని ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అజహార్ వ్యాఖ్యలకు వంత పాడుతూ వెంగసర్కార్ సైతం కొద్ది రోజుల తర్వాత ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తనైతే షమీ, ఉమ్రాన్ మాలిక్, శుభ్‌మన్ గిల్లను ఎంపిక చేసే వాడినని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వ్యాఖ్యానించాడు. -
T20 WC: నేనైతే వాళ్లిద్దరిని సెలక్ట్ చేసేవాడిని! నువ్వొక మాజీ కెప్టెన్.. కానీ ఏం లాభం?
T20 World Cup 2022- India Squad: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ పెదవి విరిచాడు. శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీలను వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. తానైతే దీపక్ హుడా స్థానంలో అయ్యర్‌కు.. హర్షల్ పటేల్ స్థానంలో షమీకి చోటు ఇస్తానని పేర్కొన్నాడు. కొన్ని మార్పులు మినహా అంతా వాళ్లే! కాగా యువ పేసర్ ఆవేశ్ ఖాన్‌పై వేటు వేయడం సహా.. గాయంతో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దూరమైన నేపథ్యంలో ఆసియా కప్-2022 ఈవెంట్ ఆడిన జట్టునే ప్రపంచకప్‌నకు సెలక్ట్ చేసింది బీసీసీఐ. గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ సహా అక్షర్ పటేల్ కొత్తగా జట్టులోకి వచ్చారు. ప్రధాన జట్టుకు ఎందుకు ఎంపిక చేయలేదు! ఇక షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయి, దీపక్ చహర్ స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా స్పందించిన అజారుద్దీన్.. శ్రేయస్ అయ్యర్, షమీని ప్రధాన జట్టుకు ఎంపిక చేయకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశాడు. వాళ్లిద్దరి అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. అయితే, చాలా మంది నెటిజన్లు అజారుద్దీన్‌తో ఏకీభవించడం లేదు. నువ్వొక మాజీ కెప్టెన్‌వి.. కానీ! గత టీ20 ప్రపంచకప్ టోర్నీలో షమీ ఆట తీరును.. ఆస్ట్రేలియా పిచ్‌లపై శ్రేయస్ అయ్యర్ విఫలమైన విషయాన్ని గుర్తు చేస్తూ అజారుద్దీన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ‘‘నువ్వొక మాజీ కెప్టెన్‌వి.. కానీ నీకు ఈ విషయాలు తెలియవు. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో షమీ ఎకానమీ ఎంతో తెలియదు. అతడు ఎన్ని వికెట్లు పడగొట్టాడో తెలియదు. ఇక శ్రేయస్ అయ్యర్ షార్ట్ పిచ్ బంతులను ఆడటంలో విఫలమవుతున్నాడనీ తెలియదు. అసలే ఈ ఐసీసీ టోర్నీ జరిగేది ఆస్ట్రేలియాలో! కనీసం ఈ విషయమైనా నీకు గుర్తున్నట్లు లేదు! ఇది టీ20 ఫార్మాట్ సర్. దీపక్ హుడా ఆల్‌రౌండర్. అవసరమైనపుడు బౌలింగ్ కూడా చేయగలడు. అయినా.. ‘కెప్టెన్’ నువ్వు ఏ ప్రాతిపదికన ఈ కామెంట్ చేశావు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. షమీ అప్పుడు నిరాశపరిచినా.. ఐపీఎల్-2022లో.. కాగా టీ20 ప్రపంచకప్-2021లో షమీ కేవలం ఆరు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్-2022లో మాత్రం గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తంగా 16 మ్యాచ్‌లు ఆడిన షమీ 20 వికెట్లతో రాణించి తమ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ.. పొట్టి ఫార్మాట్‌కు షమీ సూట్ కాడన్న అభిప్రాయాల నేపథ్యంలో అతడిని స్టాండ్ బైగా ఎంపిక చేయడం గమనార్హం. ఇక దీపక్ హుడా బ్యాటర్‌గా రాణించడంతో పాటు స్పిన్ బౌలింగ్ చేయగలడు కూడా! చదవండి: నువ్వేమి చేశావు నేరం.. శాంసన్‌ను ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై ఫ్యాన్స్ విచారం క్రికెట్ సౌతాఫ్రికాకు భారీ షాక్ Surprised at the omission of Shreyas Iyer and Md. Shami from the main squad. https://t.co/GOKUzRyMot — Mohammed Azharuddin (@azharflicks) September 12, 2022 Shreyas Iyer instead of Deepak Hooda and Md. Shami in the place of Harshal Patel would be my choice. — Mohammed Azharuddin (@azharflicks) September 12, 2022 Then please teach Iyer how to play short ball becase in Australian bouncy pitches, he cant survive — Ankit Singh (@ankittfit) September 12, 2022 You are just outdated and shami had never been a good T20 bowler. Deepak hooda can bowl pls be aware what is T20 format — Arunkumar06 (@Arunkumar064) September 12, 2022 This man captained India... I don't even know how to react! — Gagan Chawla (@toecrushrzzz) September 12, 2022 -
'ఇంగ్లండ్‌లో అతడు చెలరేగి ఆడుతాడు.. ఒక్క సెంచరీ సాధిస్తే చాలు..'
టీమిండియా స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్-2022లోనూ కోహ్లి అంతగా రాణించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 341 పరుగులు మాత్రమే సాధించాడు. కాగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్నటీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కోహ్లి.. ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు తిరిగి జట్టులోకి రానున్నాడు. ఈ క్రమంలో విరాట్ ఫామ్‌పై భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో కోహ్లి మరింత బలంగా పుంజుకుంటాడని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. "విరాట్ కోహ్లి 50పైగా పరుగులు చేసినా అతడు విఫలమైనట్లు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది కోహ్లి పెద్దగా ఆడలేదు. ఎటువంటి స్టార్ ఆటగాళ్లైనా ఏదో ఒక దశలో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. కోహ్లి కూడా అంతే. అతడు గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. అయితే అతడికి ఇప్పుడు కాస్త విశ్రాంతి లభించింది. కాబట్టి ఇంగ్లండ్ సిరీస్‌లో కోహ్లి తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఆశిస్తున్నాను. కోహ్లి ఒక సెంచరీ సాధిస్తే.. అతడిలో ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది" అని అజారుద్దీన్ పేర్కొన్నాడు. చదవండి: Hardik Pandya: 'ఆ ఆటగాడు ఇకపై ఫోర్-డి ప్లేయర్'.. టీమిండియా మాజీ క్రికెటర్ -
IPL 2022: పంత్‌పై మాజీ క్రికెటర్ల విమర్శలు.. క్రీడాస్ఫూర్తిని మరిచావు!
IPL 2022 DC Vs RR No Ball Controversy: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌పై టీమిండియా మాజీ ఆటగాళ్లు, ఇతర మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. జెంటిల్మెన్ గేమ్‌లో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం ఏమిటని మండిపడుతున్నారు. ఏదేమైనా ఢిల్లీ సారథి పంత్, అసిస్టెంట్ కోచ్ ఆమ్రే ప్రవర్తించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శిస్తున్నారు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ శుక్రవారం తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్లో రాజుకున్న నో- బాల్ వివాదం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన రిషభ్ పంత్, క్రీజులో ఉన్న తమ ఆటగాళ్లను వెనక్కి పిలవడం.. ఆమ్రే మైదానంలోకి దూసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. ‘‘ఢిల్లీ క్యాపిటల్స్ క్రీడాస్ఫూర్తిని మరచి చెత్తగా వ్యవహరించింది. జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్లో ఇలాంటివి అస్సలు ఆమోదయోగ్యం కాదు’’ అని పంత్ తీరుపై మండిపడ్డాడు. ఇక భారత జట్టు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సైతం ఇదే తరహాలో స్పందించాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ తమ ప్లేయర్లను వెనక్కి పిలవడం సరికాదు. ఇలాంటివి పునరావృతం కాకపోతే మంచిది. ఆటను సాగనివ్వాలి. అంపైర్లు కొన్నిసార్లు తప్పిదాలు చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని ఇలా మరిచిపోవడం ఎంతవరకు సమంజసం’’ అని అసహనం వ్యక్తం చేశాడు. ఇక ఇంగ్లండ్ మాజీ సారథి, ఐపీఎల్ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ పంత్ వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించాడు. ‘‘ఇది క్రికెట్.. ఫుట్‌బాల్ కాదు. ఇక్కడ ఇలాంటివి చేయకూడదు. ఒకవేళ రిక్కీ పాంటింగ్ అక్కడ ఉండి ఉంటే గనుక ఇలా జరిగేది కాదు. మరోసారి ఇలాంటివి జరగకూడదు’’ అని పేర్కొన్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ సైతం.. ‘‘పంత్ నుంచి ఇలాంటివి ఊహించలేదు. ఇది క్రికెట్ పంత్’’ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ 15 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని ఈ సీజన్లో నాలుగో పరాజయం నమోదు చేసింది. చదవండి👉🏾Rishabh Pant: అలా చేయడం తప్పే.. కానీ మేము నష్టపోయాం.. థర్డ్ అంపైర్ జోక్యం చేసుకోవాల్సింది: పంత్ Bad sportsman spirit on display by #DelhiCapitals Cricket is a game of gentlemen and this behaviour is completely unacceptable. #IPL20222 #DCvsRR — Mohammed Azharuddin (@azharflicks) April 22, 2022 Didn’t expect Pant could do that. Not cricket. #IPL20222 pic.twitter.com/ab5yRzDQqg — R P Singh रुद्र प्रताप सिंह (@rpsingh) April 22, 2022 That's that from Match 34. @rajasthanroyals take this home by a 15-run win. Scorecard - https://t.co/IOIoa87Os8 #DCvRR #TATAIPL pic.twitter.com/D2JXBfMTSp — IndianPremierLeague (@IPL) April 22, 2022 What is Pant thinking ? It’s a street game , calling his team back . pic.twitter.com/WDEZvpRnay — SKS (@TweetSailendra) April 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నన్ను బెదిరిస్తున్నారు.. పోలీసులను ఆశ్రయించిన అజారుద్దీన్
సాక్షి, హైదరాబాద్/సనత్‌నగర్: హెచ్‌సీఏ నుంచి సస్పెండ్ అయిన కొంత మంది సభ్యులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ అజారుద్దీన్ గురువారం బేగంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాన్ మనోన్, విజయానంద్, నరేష్ శర్మలు జింఖానా గ్రౌండ్‌లోని హెచ్‌సీఏ కార్యాలయానికి వచ్చిఅక్కడ ఉండే కొంత మంది సిబ్బందిని కూడా ఇబ్బంది పెడుతూ, బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై న్యాయ సలహా తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని బేగంపేట ఇన్స్పెక్టర్ పీ శ్రీనివాసరావు తెలిపారు. చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి Rishi Dhawan: ఐపీఎల్ ఆడకపోవడమే అతను చేసిన నేరమా.. అందుకే టీమిండియాకు ఎంపిక చేయలేదా..?