Sachin Tendulkar
-
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బద్దలు
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంతవేగంగా 11000 పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఈ ఫీట్‌ను చేరుకోవడానికి రోహిత్‌కు 261 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ ఈ రికార్డును 276 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. తాజా మ్యాచ్‌తో లిటల్మాస్టర్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. కాగా ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో రన్-మెషీన్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి 2019లో కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్..కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి రెండు ఓవర్లలో కాస్త ఆచితూచి ఆడిన రోహిత్.. మూడో ఓవర్ నుంచి బౌండరీల మోత మొదలు పెట్టాడు. కేవలం 36 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసి రోహిత్ శర్మ ఔటయ్యాడు. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి హిట్‌మ్యాన్ తన వికెట్‌ను కోల్పోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది.బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 100) విరోచిత సెంచరీతో చెలరేగగా.. జాకర్ అలీ(68) ఆర్ధ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఫైవ్ వికెట్ హాల్‌తో మెరిశాడు. తన 10 ఓవర్ల కోటాలో షమీ 53 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. అతడితో పాటు హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు.వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..1 - విరాట్ కోహ్లి: 222 ఇన్నింగ్స్‌లు2 - రోహిత్ శర్మ: 261 ఇన్నింగ్స్3 - సచిన్ టెండూల్కర్: 276 ఇన్నింగ్స్4 - రికీ పాంటింగ్: 286 ఇన్నింగ్స్‌లు5 - సౌరవ్ గంగూలీ: 288 ఇన్నింగ్స్చదవండి: Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. -
సచిన్ కాదు!.. నంబర్ వన్ వన్డే బ్యాటర్ అతడే: సెహ్వాగ్
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గురించే చర్చ. ఈ వన్డే ఫార్మాట్ టోర్నమెంట్ కోసం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో సెమీ ఫైనలిస్టులు, ఫైనల్స్ చేరే జట్లు, విజేతపై తమ అంచనాలు తెలియజేస్తూ సందడి చేస్తున్నారు.సచిన్ టెండ్కులర్కు రెండో స్థానంఈ నేపథ్యంలో భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) వన్డే క్రికెట్లో టాప్-5 ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లు వీరేనంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇందులో తన సహచర ఓపెనర్, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండ్కులర్(Sachin Tendulkar)కు వీరూ భాయ్ రెండో స్థానం ఇవ్వడం విశేషం. మరి ఆ మొదటి ప్లేయర్ ఎవరంటారా?!..అప్పుడే తొలిసారిగా చూశానుచాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ నేపథ్యంలో క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘నా ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ వన్డే బ్యాటర్లలో క్రిస్ గేల్ ఐదో స్థానంలో ఉంటాడు. అతడు గొప్ప బ్యాటర్. గొప్ప ఓపెనర్ కూడా! 2002-03లో టీమిండియా వెస్టిండీస్‌కు వెళ్లింది. నాటి ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో గేల్ మూడు శతకాలు బాదాడు.అంతర్జాతీయ స్థాయిలో ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో బ్యాక్ ఫుట్ షాట్లతో సిక్సర్లు బాదిన క్రికెటర్‌ను నేను అప్పుడే తొలిసారిగా చూశాను’’ అని సెహ్వాగ్ గేల్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇక నాలుగో స్థానంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌కు చోటిచ్చిన వీరూ భాయ్.. ‘‘డివిలియర్స్ బ్యాటింగ్ చేసే విధాననం నాకెంతో ఇష్టం. సిక్సర్లు కొట్టడంలో అతడిదొక ప్రత్యేక శైలి’’ అని పేర్కొన్నాడు.అతడిని చూసే నేర్చుకున్నాఅదే విధంగా.. పాకిస్తాన్ మాజీ స్టార్ ఇంజమామ్ ఉల్ హక్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆసియాలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో ఇంజమామ్ ఒకడు. అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. మ్యాచ్‌ను ఎలాగోలా తన ఆధీనంలోకి తెచ్చుకునేవాడు.చివరిదాకా ఇన్నింగ్స్ ఎలా కొనసాగించాలో నేను అతడిని చూసే నేర్చుకున్నా. ఓవర్‌కు ఏడు లేదంటే ఎనిమిది పరుగులు రాబట్టడం అప్పట్లో చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే, ఇంజమామ్ మాత్రం మంచినీళ్లు తాగినంత సులువుగా ఇన్నింగ్స్ ఆడేవాడు. ఎవరి బౌలింగ్‌లో ఎప్పుడు సిక్సర్లు కొట్టాలన్న విషయంపై అతడికి స్పష్టమైన అవగాహన ఉండేది’’ అని సెహ్వాగ్ కొనియాడాడు.సింహంతో కలిసి వేటకు వెళ్తున్నట్లుఇక సచిన్ టెండుల్కర్ గురించి సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరికి అభిమాన క్రికెటర్.. నాకు ఆదర్శమూర్తి అయిన సచిన్ టెండుల్కర్ గురించి చెప్పాలంటే.. ఆయనతో కలిసి బ్యాటింగ్‌కు వెళ్తుంటే... అడవిలో సింహంతో కలిసి వేటకు వెళ్తున్నట్లు ఉండేది.అప్పుడు ప్రతి ఒక్కరి కళ్లు ఆ సింహంపైనే ఉండేవి. నేను సైలెంట్‌గా నా పనిచేసుకుపోయేవాడిని’’ అని అభిమానం చాటుకున్నాడు. ఇక వన్డేల్లో అత్యుత్తమ బ్యాటర్లలో విరాట్ కోహ్లికి అగ్రస్థానం ఇచ్చిన సెహ్వాగ్.. ‘‘నంబర్ వన్ విరాట్ కోహ్లి. సరైన సమయంలో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడటం అతడికి వెన్నతో పెట్టిన విద్య.అతడొక ఛేజ్‌మాస్టర్. ఆరంభంలో ఉన్న కోహ్లికి.. ఇప్పటి కోహ్లికి చాలా తేడా ఉంది. రోజురోజుకు అతడు మరింత పరిణతి చెందుతున్నాడు. 2011-12 తర్వాత మాత్రం సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. ఫిట్నెస్, ఆటలో నిలకడ.. ఈ రెండింటిలో తనకు తానే సాటి. అద్భుతమైన ఇన్నింగ్స్‌కు అతడు పెట్టింది పేరు’’అని రన్‌మెషీన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.వీరేంద్ర సెహ్వాగ్ ఆల్‌టైమ్ బెస్ట్ టాప్-5 క్రికెటర్లు1. విరాట్ కోహ్లి(ఇండియా)2. సచిన్ టెండుల్కర్(ఇండియా)3. ఇంజమామ్ -ఉల్ -హక్(పాకిస్తాన్)4. ఏబీ డివిలియర్స్(సౌతాఫ్రికా)5. క్రిస్ గేల్(వెస్టిండీస్).చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
ఛాంపియన్స్ ట్రోఫీ.. చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను క్వీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై కన్నేసింది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టు శనివారం దుబాయ్‌కు పయనమైంది.ఈ మెగా ఈవెంట్ పాకిస్తాన్, యూఏఈ వేదికలగా హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీలో రన్నరప్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్స్‌గా తిరిగిరావాలని పట్టుదలతో ఉంది. ఈ మినీ వరల్డ్‌కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 19న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.సచిన్ రికార్డుపై విరాట్ కన్ను..కాగా ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli)ని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. బంగ్లాతో మ్యాచ్‌లో కోహ్లి మరో 37 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యంతవేగంగా 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 350వ వన్డే ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌పై ఈ ఫీట్‌ను అందుకున్నాడు.కోహ్లి ఇప్పటివరకు 285 ఇన్నింగ్స్‌లలో 13963 పరుగులు చేశాడు. సచిన్ తర్వాతి స్ధానంలో శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర ఉన్నాడు. సంగ్కర 378 ఇన్నింగ్స్‌లలో 14,000 పరుగుల మైలు రాయిని సాధించాడు. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌లో ఈ దిగ్గజాలను కోహ్లి అధిగమించే అవకాశముంది.అంతేకాకుండా ఈ టోర్నీలో విరాట్ మరో 173 పరుగులు సాధిస్తే.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా శిఖర్ ధావన్ రికార్డు కూడా బద్దలు అయ్యే ఛాన్స్ ఉంది. దావన్ ఛాంపియన్స్ ట్రోఫీలో 10 మ్యాచ్‌లు ఆడి 701 పరుగులు చేశాడు. కోహ్లి విషయానికి వస్తే.. 13 మ్యాచ్‌ల్లో 529 పరుగులు చేశాడు. అదేవిధంగా కోహ్లి మరో 263 పరుగులు చేయగలిగితే ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించే అవకాశముంటుంది. ప్రస్తుతం ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. గిల్ 791 పరుగులతో ఈ టోర్నీలో టాప్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో కోహ్లి హాఫ్ సెంచరీ సాధించి తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. అదేజోరును ఈ ఐసీసీ ఈవెంట్లోనూ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.చదవండి: ENG vs IND: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్? -
సారా టెండుల్కర్ స్టన్నింగ్ లుక్స్.. అదిరిపోయిన ఫొటోలు
-
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ కోసం భారత్, శ్రీలంక జట్ల ప్రకటన
ఫిబ్రవరి 22 నుంచి భారత్‌లో జరుగనున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (International Masters League) అరంభ ఎడిషన్ (2025) కోసం భారత్ (Indian Masters), శ్రీలంక (Sri Lanka Masters) జట్లను ఇవాళ (ఫిబ్రవరి 14) ప్రకటించారు. ఈ టోర్నీలో భారత మాస్టర్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) నాయకత్వం వహించనుండగా.. శ్రీలంక మాస్టర్స్‌కు కుమార సంగక్కర (Kumara Sangakkar) సారధిగా ఉంటాడు.భారత మాస్టర్స్ జట్టులో సచిన్‌తో పాటు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు తదితర మాజీ స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. శ్రీలంక మాస్టర్స్ జట్టులో సంగక్కర, కలువితరణ, ఉపుల్ తరంగ తదితర స్టార్లు పాల్గొంటున్నారు.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లకు చెందిన మాజీలు, దిగ్గజాలు ఈ టోర్నీలో పాల్గొంటారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లను ప్రకటించాల్సి ఉంది. వెస్టిండీస్‌కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్‌కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నారు.ఈ టోర్నీలో వెస్టిండీస్ తరఫున క్రిస్ గేల్, సౌతాఫ్రికా తరఫున మఖాయ ఎన్తిని, ఇంగ్లండ్ తరఫున మాంటి పనేసర్ లాంటి మాజీ స్టార్లు పాల్గొంటున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ మొత్తం మూడు వేదికల్లో నిర్వహించబడుతుంది. మొదటి ఐదు మ్యాచ్‌లు నవీ ముంబైలో జరుగనుండగా.. ఆతర్వాతి ఆరు మ్యాచ్‌లకు రాజ్‌కోట్ వేదిక కానుంది. చివరి ఏడు మ్యాచ్‌లతో పాటు నాకౌట్ మ్యాచ్‌లు రాయ్‌పూర్‌లో జరుగనున్నాయి.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆరంభ ఎడిషన్ రౌండ్ రాబిన్ పద్దతిలో జరుగనుంది. ఈ దశలో ప్రతి జట్టు మిగతా ఐదు జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది. రౌండ్ రాబిన్ దశ అనంతరం మొదటి నాలుగు స్థానాల్లో ఉండే జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌లో విజేతలు మార్చి 16న రాయ్‌పూర్‌లో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.ఈ టోర్నీలోని మ్యాచ్‌లన్నీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి. కలర్స్ సినీప్లెక్స్ (SD & HD), కలర్స్ సినీప్లెక్స్ సూపర్‌హిట్స్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లో శ్రీలంక.. భారత జట్టుతో తలపడుతుంది.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో భారత మాస్టర్స్ జట్టు: సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు, రాహుల్ శర్మ, షాబాజ్ నదీమ్, నమన్ ఓఝా (వికెట్‌కీపర్), స్టువర్ట్ బిన్నీ, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి, పవన్ నేగి, గురుకీరత్ మాన్, అభిమన్యు మిధున్శ్రీలంక మాస్టర్స్ జట్టు: కుమార సంగక్కర (కెప్టెన్), రొమేశ్ కలువితరణ (వికెట్‌కీపర్), అషాన్ ప్రియరంజన్, ఉపుల్ తరంగ, లహీరు తిరుమన్నే, చింతక జయసింఘే, సీక్కుగే ప్రసన్న, జీవన్ మెండిస్, ఇసురు ఉడాన, దిల్రువన్ పెరీరా, చతురంగ డిసిల్వ, సురంగ లక్మల్, నువాన్ ప్రదీప్, దమ్మిక ప్రసాద్, అసేల గణరత్నే -
సచిన్, కోహ్లికి సాధ్యం కాని ఘనతను సాధించిన జింబాబ్వే ఆటగాడు
క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లి (Virat Kohli) సాధించలేని ఘనతలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వాటిలో ఓ ఘనతను ఇవాళ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ (Brian Bennett) సాధించాడు. బెన్నెట్.. 22 ఏళ్లు నిండకముందే (21 ఏళ్ల 96 రోజులు) వన్డేల్లో 150 ప్లస్ స్కోర్ సాధించాడు. దిగ్గజ బ్యాటర్లు సచిన్, విరాట్ ఇంత చిన్న వయసులో ఈ ఘనతను సాధించలేదు. విరాట్ 23 ఏళ్ల 134 రోజుల వయసులో .. సచిన్ 26 ఏళ్ల 198 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ సాధించారు.వన్డే క్రికెట్ చరిత్రలో బ్రియాన్ కంటే చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ చేసిన బ్యాటర్లు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. వీరిలో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (20 ఏళ్ల 4 రోజులు) అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించగా.. బంగ్లాదేశ్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ (20 ఏళ్ల 149 రోజులు), ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ (20 ఏళ్ల 353 రోజులు) ఆతర్వాతి ఉన్నారు. తాజాగా బ్రియాన్ వన్డేల్లో 150 ప్లస్ స్కోర్ సాధించిన నాలుగో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు.ఐర్లాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 14) జరుగుతున్న వన్డేలో బ్రియాన్ 163 బంతుల్లో 20 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 169 పరుగులు చేశాడు. కెరీర్లో కేవలం ఏడో వన్డేలోనే బ్రియాన్ రికార్డు సెంచరీ సాధించాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో 150 పరుగుల మార్కును తాకిన ఐదో క్రికెటర్‌గా బ్రియాన్ రికార్డుల్లోకెక్కాడు. దీనికి ముందు బ్రియాన్ జింబాబ్వే తరఫున టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగానూ రికార్డు నెలకొల్పాడు.మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ భారీ సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ క్రెయిగ్ ఐర్విన్ (66) అర్ద సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ బెన్ కర్రన్ 28, సికందర్ రజా 8, మెదెవెరె 8, జోనాథన్ క్యాంప్‌బెల్ (అలిస్టర్ క్యాంప్‌బెల్ కొడుకు) 6, మరుమణి 2 పరుగులతో అజేయంగా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 2, జాషువ లిటిల్, హ్యూమ్, ఆండీ మెక్‌బ్రైన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ 31 ఓవర్ల అనంతరం 3 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ డకౌట్ కాగా.. పాల్ స్టిర్లింగ్ 32, కర్టిస్ క్యాంపర్ 44 పరుగులు చేసి ఔటయ్యారు. హ్యారీ టెక్టార్ (33), లోర్కాన్ టక్కర్ (30) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, సికందర్ రజా తలో వికెట్ పడగొట్టారు. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తిరుగులేని హిట్‌మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar)ను అధిగమించాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డే(India vs England) సందర్భంగా ఈ ఘనత సాధించాడు. అదే విధంగా.. ఈ మ్యాచ్‌లో శతక్కొట్టడం ద్వారా మరిన్ని రికార్డులను హిట్‌మ్యాన్ తన ఖాతాలో వేసుకున్నాడు.అద్భుత ఇన్నింగ్స్కాగా రోహిత్ శర్మ గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో విమర్శలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దారుణంగా విఫలమైన అతడు రిటైర్ అయిపోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఇంగ్లండ్‌తో కటక్ వన్డేలో తనదైన శైలిలో విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడి.. విమర్శించినవాళ్లే ప్రశంసించేలా రోహిత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీబరాబతి స్టేడియంలో లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు రోహిత్ శర్మ. ఫ్లడ్‌లైట్ల సమస్య కారణంగా కాసేపు అవాంతరాలు ఎదురైనా.. అతడి ఏకాగ్రత చెదరలేదు. ఒంటిమీదకు బాణాల్లా దూసుకువస్తున్న ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ల బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్న రోహిత్ శర్మ తన వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.డెబ్బై ఆరు బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌లో ఏకంగా పన్నెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. అయితే, లియామ్ లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో ఆదిల్ రషీద్‌కు క్యాచ్ ఇవ్వడంతో హిట్‌మ్యాన్ ధనాధన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఇక ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా నిలిచాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఇప్పటి వరకు 15404 పరుగులు చేశాడు. తద్వారా సచిన్ టెండుల్కర్‌ను అధిగమించాడు.కాగా ఓపెనర్‌గా సచిన్ టెండుల్కర్ 15335 పరుగులు చేశాడు. మరోవైపు.. ఈ జాబితాలో విధ్వంసకర మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 15758 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలోకి ఇప్పుడు రోహిత్ దూసుకువచ్చాడు. కాగా 2007లో అరంగేట్రం చేసిన రోహిత్.. 2013లో ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాడు.ద్రవిడ్‌ను అధిగమించివన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ (267 వన్డేల్లో 10,987 పరుగులు) నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న రాహుల్ ద్రవిడ్ (344 వన్డేల్లో 10,889 పరుగులు) ఐదో స్థానానికి చేరాడు. టాప్–3లో సచిన్ టెండూల్కర్ (463 వన్డేల్లో 18,246 పరుగులు), విరాట్ కోహ్లి (296 వన్డేల్లో 13,911 పరుగులు), సౌరవ్ గంగూలీ (311 వన్డేల్లో 11,363 పరుగులు) ఉన్నారు.32వ శతకంవన్డేల్లో రోహిత్ శర్మ సెంచరీలు 32. తద్వారా అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. టాప్–2లో విరాట్ కోహ్లి (50), సచిన్ టెండూల్కర్ (49) ఉన్నారు.ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. కటక్‌లో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు బట్లర్ బృందం ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రోహిత్ సేన 44.3 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన భారత్.. నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భారత్- ఇంగ్లండ్ మధ్య నామమాత్రపు మూడో వన్డే అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరుగుతుంది.చదవండి: జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ -
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మను ఊరిస్తున్న భారీ రికార్డు
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్ (Team India Captain) రోహిత్ శర్మను (Rohit Sharma) ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ మరో 134 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ రికార్డు సాధించేందుకు రోహిత్‌కు మరో 19 ఇన్నింగ్స్‌ల సమయం ఉంది.ప్రస్తుతం రోహిత్ 257 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 31 సెంచరీలు, 57 అర్ద సెంచరీల సాయంతో 10866 పరుగులు చేశాడు. విరాట్ వన్డేల్లో 11,000 పరుగులను 222 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తి చేశాడు. వన్డేల్లో వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ తర్వాతి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ 276 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అధిగమించాడు. రోహిత్ మరో 19 ఇన్నింగ్స్‌ల్లో 134 పరుగులు చేస్తే సచిన్‌ను వెనక్కు నెట్టి విరాట్ తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తాడు.కాగా, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో రోహిత్ శర్మ ఈ ఏడాది తొలిసారి టీమిండియా తరఫున బరిలోకి దిగనున్నాడు. జనవరి ప్రారంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగలేదు. ఫామ్‌లేమి కారణంగా రోహిత్ వాలంటీర్‌గా ఆ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. అనంతరం ఈ ఏడాది భారత్ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడింది. గతేడాది టీ20 వరల్డ్‌కప్ అనంతరం రోహిత్ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్‌లో ఆడలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి వన్డే రోహిత్‌కు ఈ ఏడాది భారత్ తరఫున తొలి మ్యాచ్ అవుతుంది.రంజీల్లోనూ నిరాశేఇంగ్లండ్తో టీ20 సిరీస్ జరిగే సమయంలో రోహిత్ రంజీ బరిలోకి దిగాడు. ఖాళీగా ఉన్న సమయంలో టీమిండియా క్రికెటర్లంతా రంజీల్లో ఆడాలని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం అనంతరం రంజీ మ్యాచ్ ఆడిన రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. గతేడాది నుంచి పెద్దగా ఫామ్‌లో లేని రోహిత్ రంజీ మ్యాచ్‌తో అయినా తిరిగి టచ్‌లోకి రావాలని భావించాడు. కానీ రోహిత్‌కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది.ఫిబ్రవరి 6 నుంచి మొదలుఇంగ్లండ్తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి మొదలవుతుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరుగనుంది. అనంతరం ఫిబ్రవరి 9, 12 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లను కటక్, అహ్మదాబాద్ వేదిక కానుంది. ఈ మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి ప్రారంభమవుతాయి.చిత్తుగా ఓడిన ఇంగ్లండ్వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా ముగిసిన చివరి టీ20లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. అనంతరం బౌలర్లు తలో చేయి వేసి భారత్‌కు ఘన విజయాన్ని అందించారు. -
ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి
స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించిన టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో వన్డేల్లో తలపడేందుకు సిద్దమైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నహాకాల్లో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నాగ్‌పూర్ వేదికగా గురువారం(ఫిబ్రవరి 6) జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే నాగ్‌పూర్‌కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులోకి తిరిగొచ్చారు. మరోవైపు ఇంగ్లండ్ జట్టులోకి సీనియర్ ఆటగాడు జో రూట్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లికి ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లి..నాగ్‌పూర్ వన్డేలో కోహ్లి మరో 96 రన్స్ చేస్తే.. అత్యంతవేగంగా వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 350వ వన్డే ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌పై ఈ ఫీట్‌ను అందుకున్నాడు. కోహ్లి విషయానికి వస్తే.. 283 వన్డే ఇన్నింగ్స్‌లలో 58.18 సగటుతో 13906 పరుగులు చేశాడు. సచిన్ తర్వాతి స్ధానంలో శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర ఉన్నాడు. సంగ్కర 378 ఇన్నింగ్స్‌లలో 14,000 పరుగుల మైలు రాయిని సాధించాడు. ఈ క్రమంలో తొలి వన్డేల్లో వీరిద్దరి దిగ్గజాలను కోహ్లి అధిగమించే అవకాశముంది. కాగా వన్డే ప్రపంచకప్-2023 తర్వాత కోహ్లి కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. ఆ మూడు మ్యాచ్‌ల్లో 19.33 సగటుతో 58 (24, 14 మరియు 20)పరుగులు చేశాడు. అయితే కోహ్లి ప్రస్తుతం చెప్పుకొదగ్గ ఫామ్‌లో అయితే లేడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తీవ్ర నిరాశపరిచిన కోహ్లి.. 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ బరిలోకి కూడా దిగాడు. అక్కడ కూడా కింగ్ కోహ్లి నిరాశపరిచాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో కనీసం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తోనైనా కోహ్లి తన ఫామ్‌ను అందుకోవాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు.జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జోరూట్, జాకోబ్ బెతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోస్ బట్లర్, జేమీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహ్మూద్, మార్క్ వుడ్.చదవండి: సూర్యకుమార్.. అందుకు సమయం అసన్నమైంది: అశ్విన్ -
BCCI Naman Awards 2025: అవార్డుల ప్రదానోత్సం.. విజేతల పూర్తి జాబితా
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నమన్ అవార్డుల(BCCI Naman Awards 2025) వేడుక శనివారం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar)ను బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. అదే విధంగా.. గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు ఈ సందర్భంగా పురస్కారాలు అందజేశారు. పురుషుల ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ విభాగంలో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు అవార్డు దక్కింది. అన్ని ఫార్మాట్లలోనూ గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన బుమ్రాకు బీసీసీఐ ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్’ అవార్డు అందజేసింది.అదే విధంగా.. మహిళల క్రికెట్లో స్మృతి మంధానకు ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్' దక్కింది. ఇక భారత లెజెండరీ స్పిన్నర్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్‌ను ప్రత్యేక పురస్కారంతో బీసీసీఐ సత్కరించింది. మూడు ఫార్మాట్లలో కలిపి 765 వికెట్లు తీసిన అశూ సేవలకు గుర్తింపుగా అవార్డు అందజేసింది.ఇక ఈ అవార్డుల ప్రదానోత్సవంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఈ ఈవెంట్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మొత్తంగా 26 మంది క్రికెటర్లు పురస్కారాలు అందుకున్నారు.బీసీసీఐ నమన్ అవార్డులు-2025: విజేతల పూర్తి జాబితా1. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24 ఉత్తమ మహిళా క్రికెటర్ (జూనియర్ డొమెస్టిక్) [పతకం] - ఈశ్వరి అవసరే2. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24 ఉత్తమ మహిళా క్రికెటర్ (సీనియర్ డొమెస్టిక్) (సీనియర్ మహిళల వన్డే) [పతకం] - ప్రియా మిశ్రా3. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ (అండర్-16) [పతకం] - హేమచుదేశన్ జగన్నాథన్4. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు (U-16) [పతకం] - లక్ష్య రాయచందనీ5. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కూచ్ బెహార్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్(U-19) [పతకం] - విష్ణు భరద్వాజ్6. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కూచ్ బెహార్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ (U-19) [పతకం] - కావ్య టియోటియా7. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ (U-23) - ప్లేట్ గ్రూప్ [పతకం] - నీజెఖో రూపేయో8. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ (U-23) - ఎలైట్ గ్రూప్ [పతకం] - పి. విద్యుత్9. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక పరుగులు (U-23) - ప్లేట్ గ్రూప్ [పతకం] - హేమ్ చెత్రి10. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక పరుగులు (U-23) - ఎలైట్ గ్రూప్ [పతకం] - అనీష్ కేవీ11. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ - ప్లేట్ గ్రూప్ [పతకం] - మోహిత్ జంగ్రా12. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ - ఎలైట్ గ్రూప్ [పతకం] - తనయ్ త్యాగరాజన్13. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు - ప్లేట్ గ్రూప్ [పతకం] - అగ్ని చోప్రా14. మాధవరావు సింధియా అవార్డ్: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు - ఎలైట్ గ్రూప్ [పతకం] - రికీ భుయ్15. దేశీయ పరిమిత ఓవర్ల పోటీలలో ఉత్తమ ఆల్ రౌండర్‌గా లాలా అమర్నాథ్ అవార్డు, 2023-24 [పతకం] - శశాంక్ సింగ్16. రంజీ ట్రోఫీ 2023-24 లో ఉత్తమ ఆల్ రౌండర్‌గా లాలా అమర్నాథ్ అవార్డు [పతకం]- తనుష్ కోటియన్17. దేశీయ క్రికెట్లో ఉత్తమ అంపైర్, 2023-24 [ట్రోఫీ] - అక్షయ్ టోట్రే18. 2023-24 బీసీసీఐ దేశీయ టోర్నమెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన - ముంబై క్రికెట్ అసోసియేషన్19. 2023-24 మహిళల వన్డేలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ [పతకం] - దీప్తి శర్మ20. 2023-24 మహిళల వన్డేలలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ [పతకం] - స్మృతి మంధాన21. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం - మహిళలు [ట్రోఫీ] - ఆశా శోభన22. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం - పురుషులు [ట్రోఫీ] - సర్ఫరాజ్ ఖాన్23. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ - మహిళలు [ట్రోఫీ] - స్మృతి మంధాన24. పాలీ ఉమ్రిగర్ అవార్డు: ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ - పురుషులు [ట్రోఫీ] - జస్ప్రీత్ బుమ్రా25. బీసీసీఐ ప్రత్యేక అవార్డు [షీల్డ్] - రవిచంద్రన్ అశ్విన్26. కల్నల్ CK నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు [షీల్డ్] - సచిన్ టెండూల్కర్. -
సచిన్‌కు ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు'.. బెస్ట్ ప్లేయర్లగా బుమ్రా, మంధాన
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ‘జీవిత సాఫల్య’ పురస్కారం అందజేయనుంది. క్రికెట్లో దేశానికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత తొలి కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు పేరుమీదుగా 1994 నుంచి ఈ ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డును బోర్డు వార్షిక పురస్కారాల్లో ప్రదానం చేస్తున్నారు. నేడు బోర్డు నిర్వహించే కార్యక్రమంలో 51 ఏళ్ల సచిన్‌కు ఈ అవార్డు బహూకరిస్తారు. రెండు దశాబ్దాల పైచిలుకు భారత క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచిన బ్యాటింగ్ తురుపుముక్క సచిన్ సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో 664 మ్యాచ్‌లాడాడు. 200 టెస్టుల్లో 15, 291 పరుగులు, 51 శతకాలు... 463 వన్డేల్లో 18,426 పరుగులు, 49 సెంచరీలు సాధించాడు. ఈ రెండు ఫార్మాట్లో కలిపి 100 సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా క్రికెట్ పుటల్లోకెక్కాడు.బుమ్రాకు పాలీ ఉమ్రిగర్..అదేవిధంగా గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్’ అవార్డుతో బీసీసీఐ సత్కరించనుంది. 2024 ఏడాదిలో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా బుమ్రా అదరగొట్టాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అయితే బుమ్రా దుమ్ములేపాడు.గతేడాది 13 టెస్టుల్లో ఆడిన బుమ్రా 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన అయిదు టెస్టుల సిరీస్‌లో భారత స్పీడ్ స్టార్ 32 వికెట్లతో సత్తాచాటాడు. అదేవిధంగా టీ20 వరల్డ్‌కప్-2024ను భారత్ సొంతం చేసుకోవడంలో బుమ్రాది కీలక పాత్ర.మొత్తంగా 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. 2024కు గాను ఐసీసీ బెస్ట్ క్రికెటర్ అవార్డుకు బుమ్రా ఎంపికైన సంగతి తెలిసిందే. అలాగే ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్‌ది ఈయర్ అవార్డు కూడా బుమ్రా సొంతం చేసుకున్నాడు.మరోవైపు మహిళల్లో స్మృతి మంధానకు ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్' అవార్డు వరించింది. గతేడాది 50 ఓవర్ల ఫార్మాట్లో 743 పరుగులు చేసింది. 2024లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసినందుకు గాను ఈ ప్రతిష్టాత్మకు అవార్డును ఆమె అందుకోనుంది. ఈ అవార్డులను బీసీసీఐ శనివారం ప్రధానం చేయనుంది.చదవండి: పాండ్యా, దూబే మెరుపులు.. సిరీస్ టీమిండియా వశం -
సందడిగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం (ఫొటోలు)
-
వాంఖడే స్టేడియంలో క్రికెట్ దిగ్గజాల కోలాహలం (ఫోటోలు)
-
ఏడు ఇన్నింగ్స్‌లో 752 రన్స్.. అసాధారణం: సచిన్ టెండుల్కర్
భారత క్రికెటర్ కరుణ్ నాయర్(Karun Nair)పై టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) ప్రశంసల వర్షం కురిపించాడు. ఏడు ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదు శతకాలు బాదడం గాలివాటం కాదని.. కఠోర శ్రమ, అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నాడు. కరుణ్ వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరింత ముందుకు వెళ్లాలని సచిన్ ఆకాంక్షించాడు.ఐదు సెంచరీల సాయంతోకాగా రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించిన కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్లో చాలా కాలం పాటు కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, 2023-24 సీజన్ నుంచి అతడు విదర్భకు ఆడుతున్నాడు. ఈ క్రమంలో దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25(Vijay Hazare Trophy) సీజన్లో 33 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.యాభై ఓవర్ల ఫార్మాట్లో కరుణ్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఏకంగా 752 పరుగులు రాబట్టాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు.. ఏడు ఇన్నింగ్స్‌లోనూ అజేయంగా నిలవడం మరో విశేషం. ఇక కెప్టెన్‌గానూ కరుణ్ నాయర్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. బ్యాటర్‌గా ఆకట్టుకుంటూనే సారథిగానూ సరైన వ్యూహాలతో విదర్భను తొలిసారి ఈ వన్డే టోర్నీలో ఫైనల్‌కు చేర్చాడు.ఈ నేపథ్యంలో కరుణ్ నాయర్‌కు టీమిండియా సెలక్టర్లు పిలుపునివ్వాలని.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి అతడిని ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ సైతం కరుణ్ నాయర్ ప్రతిభను కొనియాడుతూ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో‘‘కేవలం ఏడు ఇన్నింగ్స్‌లో ఐదు శతకాల సాయంతో 752 పరుగులు.. ఇది అసాధారణ విషయం కరుణ్ నాయర్!.. ఇలాంటి ప్రదర్శనలు కేవలం ఒక్కరోజులోనే సాధ్యం కావు. ఇందుకు ఆట పట్ల అంకిత భావం, దృష్టి ఉండాలి. కఠిన శ్రమతోనే ఇలాంటివి సాధ్యమవుతాయి. ఇదే తీరుగా ధైర్యంగా ముందుకు వెళ్లు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో’’ అని సచిన్ టెండ్కులర్ ‘ఎక్స్’ వేదికగా కరుణ్ నాయర్‌ను అభినందించాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శనివారం జట్టును ప్రకటించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జట్టు వివరాలను వెల్లడించనున్నాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ టోర్నీ ఆడతాడా? లేదా? అన్నది ఈ సందర్భంగా తేలనుంది.నా అంతిమ లక్ష్యం అదేఇక చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు కరుణ్ నాయర్‌కు అవకాశం ఇవ్వాలంటూ టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బలంగా తన గొంతును వినిపించాడు. అయితే, మరో భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ మాత్రం కరుణ్‌ను మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేసే అవకాశం లేదంటూ కొట్టిపారేశాడు. ఇదిలా ఉంటే.. పరుగుల వరద పారిస్తున్న కరుణ్ నాయర్ మాత్రం తనకు మరోసారి భారత్ తరఫున ఆడాలని ఉందంటూ మనసులోని మాటను బయటపెట్టాడు.‘‘దేశం తరఫున ఆడాలని ప్రతి ఆటగాడికి ఉంటుంది. నా కల కూడా ఇంకా సజీవంగానే ఉంది. అందుకే నేను ఇంకా క్రికెట్లో కొనసాగుతున్నాను. ఏదో ఒకరోజు మళ్లీ టీమిండియాలో అడుగుపెడతా. నా ఏకైక, అంతిమ లక్ష్యం అదే’’ అని కరుణ్ నాయర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎనిమిదేళ్ల క్రితంకాగా 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కరుణ్ నాయర్ చివరగా 2017లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. భారత్ తరఫున ఆరు టెస్టులు ఆడిన కరుణ్ నాయర్ ఖాతాలో 374 పరుగులు ఉన్నాయి, ఇందులో త్రిబుల్ సెంచరీ(303) ఉంది. ఇక రెండు వన్డేలు ఆడిన కరుణ్ నాయర్ కేవలం 46 పరుగులకే పరిమితమయ్యాడు.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ -
భారత జట్టు కెప్టెన్‌గా సచిన్ టెండుల్కర్.. అభిమానులకు పండుగే!
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్(ఐఎమ్ఎల్- International Masters League) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాదే ఆరంభం కావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, ఈసారి మాత్రం అలాంటి అడ్డంకులేవీ లేవంటూ నిర్వాహకులు తాజాగా ఐఎమ్ఎల్ ఆరంభ, ముగింపు తేదీలను ప్రకటించారు.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫిబ్రవరి 22న మొదలై.. మార్చి 16న ఫైనల్‌తో పూర్తవుతుందని తెలిపారు. ఇందుకు మూడు వేదికలను కూడా ఖరారు చేసినట్లు పరోక్షంగా వెల్లడించారు. కాగా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి రిటైర్ అయిన క్రికెటర్ల మధ్య ఈ టీ20 లీగ్ జరుగనుంది.భారత జట్టు కెప్టెన్‌గా సచిన్ఇందులో ఆరు జట్లు పాల్గొనున్నాయి. భారత్‌తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఇక ఈ టీ20 లీగ్‌లో దిగ్గజ క్రికెటర్లు కూడా పాల్గొననుండటం విశేషం. భారత జట్టుకు లెజెండరీ బ్యాటర్, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.మరోవైపు.. వెస్టిండీస్ జట్టుకు రికార్డుల ధీరుడు బ్రియన్ లారా, శ్రీలంక టీమ్‌కు కుమార్ సంగక్కర, ఆస్ట్రేలియా బృందానికి షేన్ వాట్సన్, ఇంగ్లండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్, సౌతాఫ్రికా టీమ్‌కు జాక్వెస్ కలిస్ సారథ్యం వహించనున్నారు. ఆ ముగ్గురు కీలకంకాగా ఐఎమ్ఎల్కు సంబంధించి గతేడాది ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. లీగ్ కమిషనర్‌గా ఎంపికైన టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) మాట్లాడుతూ.. ‘‘ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను మరోసారి ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఐఎమ్ఎల్ కృషి చేస్తోంది. క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని అందిస్తామని మాట ఇస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.ఇక ఐఎమ్ఎల్ పాలక మండలిలో గావస్కర్‌తో పాటు వెస్టిండీస్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్‌తో పాటు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ కూడా ఉన్నారు. కాగా గతేడాది నవంబరు 17 నుంచి డిసెంబరు 8 వరకు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి ఎడిషన్ నిర్వహిస్తామని తొలుత ప్రకటన వచ్చింది. అయితే, అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ ఈ లీగ్‌ను ఎట్టకేలకు ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్వాహకులు వెల్లడించారు.వేదికలు అవే?ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌కు సంబంధించిన వేదికలు ఇంకా ఖరారు కానట్లు సమాచారం. అయితే, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంతో పాటు.. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం, రాయ్‌పూర్‌లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియాన్ని నిర్వాహకులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.డబుల్ ధమాకాఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో పాటు ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ అర్హత సాధించింది. ఇక ఈ ఐసీసీ టోర్నీ మొదలైన మూడు రోజులకే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ కూడా ఆరంభం కానుండటం.. అందులోనూ సచిన్ టెండుల్కర్ మరోసారి బ్యాట్ పట్టి మైదానంలో దిగడం.. క్రికెట్ ప్రేమికులకు డబుల్ ధమాకా అనడంలో సందేహం లేదు.చదవండి: Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా అతడు ఫిక్స్!.. వారిపై వేటు? -
IND Vs AUS: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే పంత్ ఒక అద్బుతం'
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) బీభత్సం సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో టీ20ను తలపించేలా బ్యాటింగ్ చేశాడు. భారత్ 59 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్.. ఎదురుదాడికి దిగాడు.ప్రత్యర్ధి బౌలర్లను ఈ ఢిల్లీ ఆటగాడు ఉతికారేశాడు. కేవలం 33 బంతులు ఎదుర్కొన్న పంత్ 184.85 స్ట్రైక్ రేట్‌తో 61 పరుగులు సాధించి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ప్రస్తుతం టీమిండియా 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేసిన పంత్‌పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కష్టమైన వికెట్‌పై రిషబ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడని సచిన్ కొనియాడు."సిడ్నీలో రిషబ్ పంత్ విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ కఠినమైన వికెట్‌పై మిగితా బ్యాటర్లు 50 కంటే తక్కువ స్ట్రైక్ రేటుతో ఆడితే.. పంత్ మాత్రం ఏకంగా 184 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. ఇది నిజంగా నమ్మశక్యం కానిది. తొలి బంతి నుంచే ఆస్ట్రేలియా బౌలర్లను అతడు టార్గెట్ చేశాడు. పంత్ ఎప్పుడూ తన బ్యాటింగ్‌తో అందరిని అలరిస్తూ ఉంటాడు. అతడు ఇన్నింగ్స్ ఎంతో ప్రభావం చూపుతోందని" సచిన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ సహా యాజమాని పార్ధ్ జిందాల్ సైతం రిషబ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తుమ టెస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ అని అతడు ప్రశంసించాడు.కాగా ఐపీఎల్లో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్ వరకు ఢిల్లీకే ప్రాతినిథ్యం వహించిన పంత్.. ఈ సారి లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడనున్నాడు. రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో పంత్‌ను సొంతం చేసుకుంది. On a wicket where majority of the batters have batted at a SR of 50 or less, @RishabhPant17's knock with a SR of 184 is truly remarkable. He has rattled Australia from ball one. It is always entertaining to watch him bat. What an impactful innings!#AUSvIND pic.twitter.com/rU3L7OL1UX— Sachin Tendulkar (@sachin_rt) January 4, 2025 Introducing to you the greatest Indian test wicketkeeper batsman in our history come on @RishabhPant17 come on India!— Parth Jindal (@ParthJindal11) January 4, 2025 -
లవ్ యూ కాంబ్లీ.. త్వరలోనే వచ్చి కలుస్తా: టీమిండియా దిగ్గజం భరోసా
అనారోగ్యం నుంచి కోలుకున్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(Vinod Kambli)ని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ పరామర్శించాడు. కాంబ్లీతో ఫోన్లో సంభాషించి అతడికి ధైర్యం చెప్పాడు. అదే విధంగా కాంబ్లీకి చికిత్స అందించిన వైద్యులకు కపిల్ దేవ్ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఇటీవల అస్వస్థతకు గురైన వినోద్ కాంబ్లీ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే.కపిల్ దేవ్‌తో వీడియో కాల్మూత్రనాళాల ఇన్ఫెక్షన్తో రెండు వారాల క్రితం కాంబ్లీ ఆస్పత్రిలో చేరగా... అతడి మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పుడు రెండు వారాల చికిత్స అనంతరం కాంబ్లీ కోలుకుని బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ సందర్భంగా కాంబ్లీకి చికిత్స అందించిన ఆకృతి ఆస్పత్రి డైరెక్టర్.. కపిల్ దేవ్(Kapil Dev)కు వీడియో కాల్ చేసి కాంబ్లీతో మాట్లాడించాడు. ఈ క్రమంలో భావోద్వేగానికి లోనైన కాంబ్లీ.. ‘‘హాయ్.. కపిల్ పాజీ ఎలా ఉన్నారు’’ అంటూ పలకరించగా.. కపిల్ దేవ్ కూడా ఆప్యాయంగా బదులిచ్చాడు. లవ్ యూ.. తొందర్లోనే వస్తాను‘‘నేను త్వరలోనే వచ్చి నిన్ను కలుస్తాను. మరికొన్నాళ్ల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు చెప్తే మాత్రం అక్కడే ఉండు. నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా! గడ్డానికి కూడా రంగేసుకున్నావు. కానీ దేనికీ ఇప్పుడే తొందరపడవద్దు. పూర్తిగా కోలుకున్న తర్వాతే మునుపటి జీవితం గడుపగలవు. డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలన్నీ తప్పక పాటించు. తొందర్లోనే నేను వచ్చి కలుస్తాను. సరేనా.. లవ్ యూ’’ అని కపిల్ దేవ్ కాంబ్లీకి భరోసా ఇచ్చాడు. కాగా ఇంటికి చేరుకున్న అనంతరం కాంబ్లీ నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులకు సందేశం ఇచ్చాడు. ‘‘మద్యం, మాదక ద్రవ్యాలు జీవితాన్ని నాశనం చేస్తాయి. వాటికి దూరంగా ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది’’ అని పేర్కొన్నాడు. సచిన్ టెండుల్కర్ బాల్య మిత్రుడుమరోవైపు.. కాంబ్లీ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని... కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆయనకు వైద్యం అందించిన డాక్టర్ వివేక్ త్రివేది పేర్కొన్నారు. కాగా ముంబైకి చెందిన వినోద్ కాంబ్లీ సచిన్ టెండుల్కర్(Sachin tendulkar)కు బాల్య మిత్రుడు. ఇద్దరూ ముంబై నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించారు.అయితే, సచిన్ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ లెజెండరీ బ్యాటర్‌గా ఎదగగా.. కాంబ్లీ మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. చెడు వ్యసనాలకు బానిసై ఆరోగ్యాన్ని కూడా పాడుచేసుకున్నాడు. ఈ క్రమంలో.. ఇటీవల తమ చిన్ననాటి కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ 92వ జయంతి సందర్భంగా సచిన్‌ను కలిసిన కాంబ్లీ పరిస్థితిని చూసి అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. కపిల్ సేన ఆర్థిక సాయం!ఈ క్రమంలో అతడిని ఆదుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు వెల్లువెత్తగా. కపిల్ సారథ్యంలో 1983 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టు కాంబ్లీకి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే, కాంబ్లీ చెడు అలవాట్లు మానేసి.. పునరావాస కేంద్రానికి వెళ్తేనే సహాయం అందిస్తామని షరతు పెట్టగా.. అతడు అందుకు అంగీకరించాడు. తాను మందు, పొగ తాగటం మానేశానని చెప్పాడు. చదవండి: IND vs AUS 5th Test: రోహిత్ శర్మపై వేటు.. భారత కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!? -
సచిన్ తనయుడికి భారీ షాక్.. జట్టు నుంచి తీసేశారు!
భారత క్రికెట్ దిగ్గజం తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు గోవా క్రికెట్ అసోసియేషన్ ఊహించని షాకిచ్చింది. విజయ్ హజారే ట్రోఫీ 2024-25 మధ్యలోనే గోవా జట్టు నుంచి అర్జున్ టెండూల్కర్‌ను జీసీఎ తప్పించింది. దీంతో అతడు శనివారం ఉత్తరఖాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమమయ్యాడు.25 ఏళ్ల అర్జున్ గోవా రెడ్ బాల్ జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నప్పటికి వైట్ బాట్ స్వ్కాడ్‌లో మాత్రం తన స్ధానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. కాగా అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో కూడా కేవలం మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత అతడిపై జీసీఎ వేటు వేసింది.మళ్లీ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో సరిగ్గా మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాతే సెలక్టర్లు జట్టు నుంచి తప్పించారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అర్జున్ కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఒడిశాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అర్జున్ 3 వికెట్లు పడగొట్టినప్పటికి.. తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 61 పరుగులు సమర్పించుకున్నాడు.ఆతర్వాతి రెండు మ్యాచ్‌ల్లో చెరో వికెట్ సాధించినప్పటకి ఆరుకు పైగా ఏకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలోనే అతడిపై గోవా క్రికెట్ ఆసోసియేషన్ వేటు వేసింది. దీంతో వైట్‌బాల్ క్రికెట్లో అర్జున్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.మరోసారి ముంబైతో..కాగా అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్లో మరోసారి ముంబై ఇండియన్స్ తరపున ఆడనున్నాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 20 లక్షల కనీస ధరకు అర్జున్ను ముంబై సొంతం చేసుకుంది. ఈ మెగా వేలంలో అర్జున్ను తొలుత ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు.కానీ ఆఖరికి యాక్సిలరేటెడ్ రౌండ్లో ముంబై దక్కించుకుంది. జూనియర్ టెండూల్కర్ ఐపీఎల్-2021 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో భాగంగా ఉన్నాడు. అతడు 5 మ్యాచ్‌లలో 9.37 ఎకానమీ రేటుతో 3 వికెట్లు పడగొట్టాడు. అర్జున్ కనీసం ఈసారైనా రాణిస్తాడో లేదో వేచి చూడాలి.చదవండి: IND Vs AUS: స్టుపిడ్.. స్టుపిడ్! భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లొద్దు: పంత్‌పై సన్నీ ఫైర్ -
సచిన్ టెండుల్కర్ అందుకు అంగీకరించారు: ఎంసీసీ
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు విశిష్ట గౌరవ సభ్యత్వం ఇవ్వనున్నట్లు మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ (Melbourne Cricket Club-ఎంసీసీ) ప్రకటించింది. తమ ప్రతిపాదనను సచిన్ అంగీకరించినట్లు తెలిపింది.కాగా 1838లో స్థాపించిన ఎంసీసీ ఆస్ట్రేలియాలోనే పురాతన క్రీడా క్లబ్. ఈ క్లబ్‌కు చెందిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో సచిన్ చేసిన పరుగుల రికార్డు ఇంకా పదిలంగానే ఉంది.ఎంసీజీలో పరుగుల వరదఈ వేదికపై మొత్తంగా ఐదు టెస్టులాడిన టెండుల్కర్(Sachin Tendulkar) 44.90 సగటుతో 449 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. సచిన్‌కు విశిష్ట సభ్యత్వం(Honorary Cricket Membership) ఇవ్వాలని ఎంసీసీ నిర్ణయించింది. ఆయన అంగీకరించడం మాకు సంతోషంఈ మేరకు.. ‘ఎంసీసీ సభ్యత్వం స్వీకరించేందుకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ సచిన్ అంగీకరించడం చాలా సంతోషంగా ఉంది. క్రికెట్‌కే అతడొక ఐకాన్ ప్లేయర్. అంతర్జాతీయ క్రికెట్లో అసాధారణ ఆటతీరుకు గుర్తింపుగా విశిష్ట సభ్యత్వం ఇస్తున్నాం’ అని ఎంసీసీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.అదే విధంగా.. ఎంసీసీ అధ్యక్షుడు ఫ్రెడ్ ఓల్డ్‌ఫీల్డ్ మాట్లాడుతూ.. ‘‘కేవలం భారత క్రికెట్‌కే కాదు.. ప్రపంచ క్రికెట్‌కు కూడా సచిన్ టెండుల్కర్ ఎనలేని సేవలు అందించారు. ఆయన మా విశిష్ట సభ్యత్వం స్వీకరించేందుకు ఒప్పుకొన్నారు. ఇంతకంటే మాకు గొప్ప విషయం మరొకటి ఉండదు’’ అని పేర్కొన్నాడు. ఇలాంటివేం కొత్త కాదుఇక.. ఆస్ట్రేలియా నుంచి సచిన్‌కు ఈ గౌరవం కొత్తేం కాదు. మనదేశంలో ‘భారతరత్న’ లాంటి ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ పురస్కారంతో 2012లోనే అక్కడి ప్రభుత్వం సచిన్ టెండుల్కర్‌ను సత్కరించింది. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా టీమిండియా ప్రస్తుతం ఎంసీజీలోనే ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టు ఆడుతోంది. అంతకు ముందు పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్, అడిలైడ్ టెస్టులో ఆసీస్ గెలవగా.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రా అయింది. దీంతో ప్రస్తుతం ఇరుజట్లు 1-1తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సమంగా ఉన్నాయి. చదవండి: IND VS AUS: తగ్గేదేలేదన్న నితీశ్ రెడ్డి.. వైరలవుతున్న పుష్ప స్టయిల్ సెలబ్రేషన్స్ -
Vinod Kambli: క్షీణించిన ఆరోగ్యం.. ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ!
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆస్పత్రి పాలయ్యాడు. తీవ్రమైన అనారోగ్యంతో శనివారం రాత్రి థానెలోని ఓ హాస్పిటల్లో చేరాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వార్తా సంస్థ IANS అందించిన వివరాల ప్రకారం.. క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది.ఈ నేపథ్యంలో ఆయనను శనివారం రాత్రి థానెలో గల ఆకృతి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. కాస్త విషమంగానే ఉందని తెలుస్తోంది. ఈ మేరకు IANS ఎక్స్ ఖాతాలో వివరాలను పోస్ట్ చేసింది.కాగా ముంబైకి చెందిన వినోద్ కాంబ్లీ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కులర్కు చిన్ననాటి స్నేహితుడు. ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ వద్ద ఓనమాలు నేర్చుకున్న వీళ్లిద్దరు అద్భుతమైన నైపుణ్యాలు కలవాళ్లే. చెడు వ్యసనాల వల్లే?అయితే, సచిన్ ఆటలో శిఖర స్థాయికి చేరుకోగా.. కాంబ్లీ మాత్రం పాతాళానికి పడిపోయాడు. వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడం, చెడు అలవాట్ల వల్లనే అతడికి ఈ పరిస్థితి ఎదురైందని కాంబ్లీ సన్నిహిత వర్గాలు గతంలో వెల్లడించాయి.ఇదిలా ఉంటే.. గతంలో కాంబ్లీకి గుండెపోటు వచ్చింది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఇటీవల రమాకాంత్ ఆచ్రేకర్ 92వ జయంతి సందర్భంగా సచిన్ టెండుల్కర్తో కలిసి ముంబైలో వేదిక పంచుకున్న సమయంలో.. కాంబ్లీ పరిస్థితి మరింత దిగజారినట్లు కనిపించింది.సాయం తీసుకుంటా.. చెప్పినట్లు వింటాఈ నేపథ్యంలో కపిల్ దేవ్ సారథ్యంలోని 1983 వరల్డ్‌కప్ విజేత జట్టులోని సభ్యులు.. కాంబ్లీకి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే, అతడు రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లి చికిత్స తీసుకుంటేనే సహాయం అందిస్తామని షరతు విధించారు. ఇందుకు అంగీకరించిన వినోద్ కాంబ్లీ.. తాను మద్యం, పొగతాగడం మానేశానని.. చికిత్స తీసుకుంటానని స్పష్టం చేశాడు.అయితే, తాజా సమాచారం ప్రకారం వినోద్ కాంబ్లీ మరోసారి తీవ్ర అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. కాగా భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో వినోద్ కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. తన తొమ్మిదేళ్ల ఇంటర్నేషనల్ కెరీర్లో టెస్టుల్లో 1084, వన్డేల్లో 2477 రన్స్ చేశాడు. అంతేకాదు.. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా(14 ఇన్నింగ్స్‌లో) వెయ్యి పరుగుల మార్కు అందుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. తిలక్ వర్మకు చేదు అనుభవం In pictures: Cricketer Vinod Kambli's condition deteriorated again, leading to his admission at Akriti Hospital in Thane late Saturday night. His condition is now stable but remains critical. pic.twitter.com/7NBektzQ54— IANS (@ians_india) December 23, 2024 -
'సచిన్ కూడా అప్పట్లో నీలాగే అవుటయ్యాడు.. కానీ’
గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన కోహ్లి.. కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు కోహ్లి ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి వెనుదిరిగాడు.ఆస్ట్రేలియా గడ్డపై అద్బుతమైన రికార్డు ఉన్న కోహ్లి ఈసారి మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. ఫాస్ట్ బౌలర్లు కోహ్లిని ఈజీగా ట్రాప్ చేసి పెవిలియన్‌కు పంపుతున్నారు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వెళ్లే బంతిని వెంటాడే క్రమంలో విరాట్ తన వికెట్‌ను కోల్పోతున్నాడు. కాగా ఇప్పటివరకు ఈ సిరీస్‌లో 5 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి.. మొత్తం అన్ని సార్లు వికెట్ కీపర్ లేదా స్లిప్ ఫీల్డర్ల చేతికే చిక్కాడు.ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లికి భారతక్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశాడు. 2004 ఆసీస్ పర్యటనలో మాస్టర్ బ్లాసర్ సచిన్ టెండూల్కర్ ఏమి చేశాడో, ఇప్పుడు విరాట్ కోహ్లి కూడా అలానే చేయాలని గవాస్కర్ సలహా ఇచ్చాడు."సచిన్ టెండూల్కర్‌ను విరాట్ కోహ్లి ఉదాహరణగా తీసుకోవాలి. 2004 ఆసీస్ పర్యటనలో సచిన్ కూడా ఇదే సమస్యలను ఎదుర్కొన్నాడు. మొదటి మూడు టెస్ట్ మ్యాచ్‌లలో అతడు ఆఫ్-స్టంప్ వెలుపల వెళ్లే బంతులను ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. మొత్తం ఆరు ఇన్నింగ్స్‌లలోనూ స్లిప్స్ లేదా షార్ట్ గల్లీ వద్ద ఫీల్డర్లకు చిక్కాడు. కానీ సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో మాత్రం సచిన్ ఆ తప్పు చేయలేదు. కవర్స్ దిశగా ఎటువంటి షాట్లు ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. స్ట్రైట్ డ్రైవ్స్, మిడ్ ఆఫ్ దిశగానే షాట్లు ఆడాడు. అతడు తనకు ఇష్టమైన కవర్ డ్రైవ్ షాట్ కూడా ఆడలేదు. ఆఫ్-స్టంప్ వెలుపల బంతులను టచ్ చేయకూడదని సంకల్పంగా పెట్టుకున్నాడు. తన స్కోర్ 200 పరుగులు దాటాక సచిన్ కవర్స్ వైపు షాట్ ఆడాడు. ఇప్పుడు కోహ్లి కూడా సచిన్‌నే ఫాలో అవ్వాలి. ఆఫ్-స్టంప్ వెలుపుల బంతులను ఆడే సమంయలో మన మనస్సు నియంత్రణలో" ఉంచుకోవాలి అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS: జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. అయితే వర్షం కారణంగా తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.ప్రస్తుతం క్రీజులో ఓపెనర్లు మెక్‌స్వీనీ(4 నాటౌట్), ఉస్మాన్ ఖావాజా(19 నాటౌట్) ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌తో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన పేరిట అరుదైన రికార్డు లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియాపై 100 మ్యాచ్‌లు(అన్ని ఫార్మాట్లు) ఆడిన రెండో ప్లేయర్‌గా విరాట్ చరిత్ర సృష్టించాడు. బ్రిస్బేన్ టెస్టులో కోహ్లి మైదానంలో అడుగుపెట్టిన వెంటనే ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లి ఆస్ట్రేలియాపై ఇప్పటివరకు 28 టెస్టులు, 49 వన్డేలు, 23 టీ20లు ఆడాడు.ఈ అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో కోహ్లి కంటే ముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ తన కెరీర్లో కంగారులపై 39 టెస్టులు, 71 వన్డేలతో కలిపి 110 మ్యాచ్‌లు ఆడాడు. విరాట్ మరో 11 మ్యాచ్‌లో ఆడితే సచిన్ రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.ఆసీస్‌పై అదుర్స్.. కాగా ఆల్ఫార్మాట్లలో ఆసీస్‌పై కోహ్లికి అద్భుతమైన రికార్డు ఉంది. ఈ 100 మ్యాచ్‌ల్లో కోహ్లి 50.24 సగటుతో 5326 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా ఆస్ట్రేలియాపై 23 ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు.ఆస్ట్రేలియాపై అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లుసచిన్ టెండూల్కర్ (భారత్)-110 మ్యాచ్లువిరాట్ కోహ్లి(భారత్)-100 మ్యాచ్లుడెస్మండ్ లియో హేన్స్ (వెస్టిండీస్)- 97 మ్యాచ్లుమహేంద్ర సింగ్ ధోని( భారత్)- 91 మ్యాచ్లువివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్)-88 మ్యాచ్లుజాక్వెస్ కల్లిస్(దక్షిణాఫ్రికా)-82 మ్యాచ్లుచదవండి: రోహిత్ శర్మ నిర్ణయం సరికాదు.. కమిన్స్ సంతోషించి ఉంటాడు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
నా పరిస్థితి బాలేదు.. తాగడం మానేశాను.. సాయం కావాలి: వినోద్ కాంబ్లీ
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. మద్యం సేవించడం, పొగ తాగే అలవాట్ల కారణంగా తన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయిందన్నాడు. అయితే, ఆరు నెలల క్రితమే ఈ చెడు వ్యసనాలను వదిలేశానని.. తన పిల్లల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అదే విధంగా.. భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బృందం తనకు ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరిస్తున్నట్లు కాంబ్లీ పేర్కొన్నాడు.పాతాళానికి పడిపోయాడుముంబై తరఫున టీమిండియాలో అడుగుపెట్టిన వినోద్ కాంబ్లీ.. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండుల్కర్‌కు బాల్య మిత్రుడు. సచిన్ అంతటి స్థాయికి ఎదిగే నైపుణ్యాలున్నా.. వ్యక్తిగత క్రమశిక్షణ లోపించిన కారణంగా కాంబ్లీ పాతాళానికి పడిపోయాడని క్రికెట్ ప్రేమికులు భావిస్తుంటారు. ఇటీవల తమ ‘గురు’, ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ 92 జయంతి సందర్భంగా సచిన్ టెండుల్కర్తో కలిసి వినోద్ కాంబ్లీ వేదికను పంచుకున్నాడు.సాయం చేస్తాం.. కానీ ఓ షరతుఆ సమయంలో కాంబ్లీ ఆరోగ్య, మానసిక పరిస్థితిని చూసిన అభిమానులు చలించిపోయారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్యం కారణంగా కుంగిపోయిన అతడి దుస్థితికి చింతించారు. ఈ నేపథ్యంలో 1983 ప్రపంచకప్ విజేత, కపిల్ దేవ్ సారథ్యంలోని భారత ఆటగాళ్లు కాంబ్లీకి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.అయితే, కాంబ్లీ పునరావాస కేంద్రానికి వెళ్లి చికిత్స తీసుకునేందుకు సిద్ధంగా ఉంటేనే.. సాయం చేస్తామనే షరతు విధించారు. ఈ నేపథ్యంలో విక్కీ లల్వానీ యూట్యూబ్ చానెల్‌తో ముచ్చటించిన వినోద్ కాంబ్లీ.. కపిల్ దేవ్ కండిషన్‌కు తాను ఒప్పుకొంటున్నట్లు తెలిపాడు.నా కుటుంబం నాతో ఉంది‘‘రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా కుటుంబం నాతో ఉంది. కాబట్టి నాకు ఇప్పుడు ఎలాంటి భయం లేదు. తొలుత సునిల్ గావస్కర్ నాతో మాట్లాడారు. ఇక అజయ్ జడేజా కూడా నాకు మంచి స్నేహితుడు.అతడు నా దగ్గరికి వచ్చాడు. నీకోసం మేమంతా ఎదురుచూస్తున్నామని చెప్పాడు. బీసీసీఐ నాకు సహాయం చేస్తుందని తెలుసు. మాజీ పేసర్ అభయ్ కురువిల్లా నాతో పాటు నా భార్యతోనూ టచ్‌లో ఉన్నాడు.నిజానికి నా పరిస్థితి అస్సలు బాగా లేదు. అయినప్పటికీ నా భార్య అన్నింటినీ చక్కగా హ్యాండిల్ చేస్తోంది. ఆమెకు కచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నాకిప్పుడు ఎలాంటి భేషజాలు లేవు. ధైర్యంగా రిహాబ్ సెంటర్‌కు వెళ్లి.. ఆరోగ్యంగా తిరిగి వస్తాను.ఇప్పుడు అన్నీ వదిలేశానుఆరు నెలల క్రితమే మద్యం, పొగ తాగటం మానేశాను. నా పిల్లల బాగుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. గతంలో నాకు చెడు అలవాట్లు ఉన్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అన్నీ వదిలేశాను’’ అని వినోద్ కాంబ్లీ చెప్పుకొచ్చాడు. కాగా గతంలో భార్య ఆండ్రియా కాంబ్లీపై గృహహింస కేసు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం వాళ్లు సఖ్యతగా ఉంటున్నట్లు కాంబ్లీ మాటలను బట్టి తెలుస్తోంది.తొమ్మిదేళ్ల కెరీర్లోఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడిన వినోద్ కాంబ్లీ.. తొమ్మిదేళ్ల పాటు(1991-2000) అంతర్జాతీయ కెరీర్ కొనసాగించాడు. టెస్టుల్లో 1084, వన్డేల్లో 2477 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా(14 ఇన్నింగ్స్‌లో) వెయ్యి పరుగుల మార్కు అందుకున్న భారత క్రికెటర్‌గా ఇప్పటికీ కాంబ్లీ తన రికార్డును కొనసాగిస్తున్నాడు.చదవండి: D Gukesh Prize Money: గుకేశ్ ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే? -
పెళ్లి పనుల్లో పీవీ సింధు బిజీ బిజీ.. ఫోటోలు వైరల్
-
కాంబ్లీ తన ఆరోగ్యంపై బాధ్యతతో ఉండాలి: కపిల్ దేవ్
భారత మాజీ కెప్టెన్, ఆల్‌రౌండ్ దిగ్గజం కపిల్ దేవ్ సాయానికి ఎందరు ముందుకొచ్చినా... వినోద్ కాంబ్లీ తన ఆరోగ్యం పట్ల తనే శ్రద్ధ చూపెట్టాలని సూచించాడు. 52 ఏళ్ల కాంబ్లీ గతితప్పిన జీవనశైలితో పాటు మద్యానికి బానిసై తీవ్ర ఆనారోగ్యం పాలయ్యాడు.కోచింగ్ లెజెండ్ రమాకాంత్ ఆచ్రేకర్ స్మారకార్థం ఇటీవల ముంబైలో జరిగిన కార్యక్రమంలో కాంబ్లీ ఓ పేషంట్లా కనిపించడంతో విచారం వ్యక్తం చేసిన భారత మాజీలు, దిగ్గజాలు అతని పరిస్థితి మెరుగయ్యేందుకు తమవంతు ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించారు.ఆ కార్యక్రమంలో సచిన్ కూడా పాల్గొని కాంబ్లీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. భారత్‌కు తొలి వన్డే ప్రపంచకప్ (1983లో) అందించిన కపిల్ దేవ్ కూడా తాజాగా కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై విచారం వెలిబుచ్చారు. ‘మేమంతా అతనికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ దీనికంటే ముఖ్యం తను కూడా తన ఆరోగ్య పరిస్థితికి తగ్గట్లుగా నడుచుకోవాలి. తిరిగి ఆరోగ్యవంతుడయ్యేందుకు స్వీయ నియంత్రణ పాటించాలి. ఒక విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఒక వ్యక్తి తనను తాను చూసుకోలేకపోతే మనం మాత్రం చేయగలిగేదేమీ ఉండదు’ అని అన్నారు.కాంబ్లీ సహచరులే కాదు... అతని సీనియర్లు, పలువురు దిగ్గజ క్రికెటర్లు అతని దీన పరిస్థితి చూసి బాధపడుతున్నారని, అతని సన్నిహితులెవరైనా బాధ్యత తీసుకొని అతను మెరుగయ్యేందుకు చొరవ చూపించాలని, రిహాబిలిటేషన్‌కు పంపి యోగక్షేమాలు చూసుకోవాలని కపిల్ సూచించారు.సచిన్ బాల్యమిత్రుడు, క్రికెట్లో సమకాలికుడు అయిన కాంబ్లీ ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న సంగతి మరిచి క్రమశిక్షణ లేని జీవితంతో క్రీడా భవిష్యత్తునే కాదు... తాజాగా ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు.తన కెరీర్లో 104 వన్డేలాడి 2477 పరుగులు, 17 టెస్టుల్లో 1084 పరుగులు చేశాడు. కెరీర్ ముగిశాక గాడితప్పిన జీవితం వల్ల 39 ఏళ్ల వయసులోనే అతని గుండెకు 2012లోనే శస్త్రచికిత్స జరిగింది. అయినాసరే కాంబ్లీ ఏమాత్రం మారకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో ఇప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.చదవండి: సిరాజ్ మ్యాచ్ ఫీజులో కోత -
సచిన్‌ను పెళ్లికి ఆహ్వానించిన పీవీ సింధు జంట.. ఫోటోలు వైరల్
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తసాయి(Venkata DattaSai) అనే వ్యక్తితో సింధూ తన జీవితాన్ని పంచుకోనుంది. వీరిద్దరి వివాహం డిసెంబర్ 22న ఉదయ్‌పూర్‌లో జరగనుంది.ఈ నేపథ్యంలో కాబోయే దంపతులు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను కలిసి తమ వివాహానికి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సచిన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. త్వరలోనే వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్న వెంకట్, సింధు జోడికి శుభాకాంక్షలు. మీ ఇద్దరూ జీవితాంతం అద్భుతమైన జ్ఞాపకాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. పెళ్లికి రావాలని మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని సచిన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.ఎవరీ వెంకట దత్తసాయి?హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తసాయి 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఫ్లేమ్ యూనివర్సిటీ నుంచి బీబీఏ పట్టా అందుకున్నారు. అంతకంటే ముందు.. ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా పూర్తి చేశారు.వెంకట దత్తసాయి ప్రస్తుతం ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌తోనూ సాయి కలిసి పనిచేశాడు. అయితే వెంకట సాయి కుటుంబానికి, సింధు ఫ్యామిలీకి ముందుగానే పరిచయం ఉంది. ఈ క్రమంలోనే ఇరు కుటంబాల పెద్దలు వీరిద్దిరి పెళ్లిని నిశ్చయించారు. ఈ విషయాన్ని పీవీ సింధు తండ్రి పీవీ రమణ స్వయంగా నిర్దారించారు.చదవండి: IND vs AUS: ట్రావిస్ హెడ్, సిరాజ్‌లకు ఐసీసీ షాక్!?In badminton, the score always starts with 'love', & your beautiful journey with Venkata Datta Sai ensures it continues with 'love' forever! ♥️🏸 Thank you for personally inviting us to be a part of your big day. Wishing you both a lifetime of smashing memories & endless rallies… pic.twitter.com/kXjgIjvQKY— Sachin Tendulkar (@sachin_rt) December 8, 2024 -
కాంబ్లీని ఆదుకుంటామన్న టీమిండియా లెజెండ్.. కానీ ఓ కండిషన్!
ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపళ్లాలు సహజం. వెలుగు వెంటే చీకటి.. సుఖం వెంటే దుఃఖం.. ఇలా ఒకదాని వెనుక మరొకటి రావడం సహజం. కానీ కొందరి జీవితంలో అంతా బాగుందనుకునేలోపే.. మొత్తం తలకిందులైపోతుంది. దర్జాగా కాలుమీద కాలు వేసుకుని బతికినవాళ్లు సైతం కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితికి చేరుకుంటారు. టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రస్తుత స్థితి ఇందుకు నిదర్శనం.ముంబై నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వచ్చిన మేటి ఆటగాళ్లలో కాంబ్లీ ఒకడు. భారత క్రికెట్ దిగ్గజం అంటూ నీరజనాలు అందుకుంటున్న సచిన్ టెండుల్కర్‌కు బాల్య స్నేహితుడు. రమాకాంత్ ఆచ్రేకర్ వద్ద క్రికెట్ పాఠాలు నేర్చుకున్న వీళ్లిద్దరిలో ఒకరు ఆకాశమంత ఎత్తుకు ఎదిగితే.. మరొకరు అగాథంలో కూరుకుపోయారు. ఇందుకు కారణాలు అనేకం.ఒకప్పుడు కోటీశ్వరుడు.. ఇప్పుడిలా!కాంబ్లీ కెరీర్ ఊపుమీద ఉన్నపుడు అతడి పరిస్థితి బాగానే ఉండేది. అప్పట్లో అతడి నికర ఆస్తుల విలువ ఎనిమిది కోట్ల వరకు ఉండేదని జాతీయ మీడియా వర్గాల అంచనా. అయితే, ఇప్పుడు మాత్రం కాంబ్లీ దీనస్థితిలో కూరుకుపోయాడు. 2022 నుంచి పరిస్థితి మరీ దిగజారింది. ఇందుకు కాంబ్లీ క్రమశిక్షణా రాహిత్యమే కారణమనే విమర్శలు ఉన్నాయి.ఏదేమైనా.. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చితికిపోయిన వినోద్ కాంబ్లీ ప్రస్తుతం బీసీసీఐ ఇచ్చే నెలవారీ పెన్షన్ రూ. 30 వేలతో కాలం వెళ్లదీస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల రమాకాంత్ ఆచ్రేకర్ 92వ జయంతి సందర్భంగా సచిన్‌తో కలిసి కాంబ్లీ ఒకే వేదికపై కనిపించిన తర్వాత.. మరోసారి అతడి గురించి చర్చ మొదలైంది.ముఖ్యంగా కాంబ్లీ ఆరోగ్య స్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడికి సాయం అందించాలంటూ సోషల్ మీడియా వేదికగా భారత క్రికెటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసన్ బల్విందర్ సంధు చేసిన వ్యాఖ్యలు వారికి ఊరటనిచ్చాయి.కాంబ్లీని ఆదుకుంటామన్న టీమిండియా లెజెండ్.. కానీ ఓ కండిషన్!వినోద్ కాంబ్లీకి సాయం చేసేందుకు 83 బ్యాచ్ సిద్ధంగా ఉందని బల్విందర్ తెలిపాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘కాంబ్లీ పునరావాస కేంద్రానికి వెళ్లాలని భావిస్తే తప్పకుండా సాయం చేద్దామని కపిల్ దేవ్(1983 వరల్డ్‌కప్ విజేత జట్టు కెప్టెన్) నాతో చెప్పాడు. ఆర్థికంగానూ సాయం అందిద్దామన్నాడు.అయితే, అతడు రిహాబ్ సెంటర్‌కు వెళ్లినపుడు మాత్రమే అక్కడి బిల్లులు చెల్లిస్తామని.. చికిత్స పూర్తయ్యేంత వరకు ఖర్చులన్నీ భరిస్తామని చెప్పాడు. ఒకవేళ కాంబ్లీ అందుకు సిద్ధంగా లేకపోతే మేమేమీ చేయలేము’’ అని బల్విందర్ సంధు పేర్కొన్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ -
ఒకే ఒక సెంచరీ.. చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని అద్బుతమైన విజయంతో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు కంగారులతో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఆడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్(పింక్‌బాల్ టెస్టు)గా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్తశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఈ ఆడిలైడ్ టెస్టుకు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిని పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.కోహ్లి కన్నేసిన రికార్డులు ఇవే..👉ఆసీస్‌తో రెండో టెస్టులో కోహ్లి మరో సెంచరీ సాధిస్తే, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు(10) చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్‌ను అధిగిమిస్తాడు. ప్రస్తుతం ఈ ఐకానిక్ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో సచిన్ టెండూల్కర్(9)తో కలిసి కోహ్లి సంయుక్తంగా అగ్రస్ధానంలో ఉన్నాడు.👉అదే విధంగా అడిలైడ్ ఓవల్‌లో విరాట్ కోహ్లి ఇప్పటివరకు మూడు టెస్టు సెంచరీలు సాధించాడు. ఇప్పుడు రెండో టెస్టులో కోహ్లి మరో శతకం నమోదు చేస్తే.. ఆస్ట్రేలియా గడ్డపై ఒకే వేదికలో అత్యధిక సెంచరీలు చేసిన పర్యాటక బ్యాటర్‌గా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఇంగ్లండ్ లెజెండ్ జాక్ హాబ్స్ పేరిట ఉంది.చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి
ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ విఠల్ ఆచ్రేకర్ 92వ జయంతిని ముంబైలో ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ పార్క్‌లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ‘గురు’ ఆచ్రేకర్ మొమోరియల్‌ను సచిన్ ఆవిష్కరించారు.స్నేహితుడితో కరచాలనంఇక ఈ కార్యక్రమంలో సచిన్ చిన్ననాటి స్నేహితుడు, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కూడా పాల్గొన్నాడు. అయితే, సచిన్ కంటే ముందే కాంబ్లీ వేదిక మీదకు చేరుకోగా.. సచిన్ వస్తూ వస్తూ తన స్నేహితుడితో కరచాలనం చేశాడు.చేయి వదిలేందుకు ఇష్టపడని కాంబ్లీఅయితే, కాంబ్లీ మాత్రం సచిన్ చేతిని వదలకుండా గట్టిగా అలాగే పట్టుకున్నాడు. దీంతో పక్కనున్న వ్యక్తి కాంబ్లీ నుంచి అతడి చేతిని విడిచిపించడానికి కాస్త కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత సచిన్ తన కుర్చీ వద్దకు వెళ్లి కూర్చోగా.. కాంబ్లీ స్నేహితుడి వైపే చూస్తూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాంబ్లీపై నెటిజన్ల సానుభూతి.. ఈ పరిస్థితికి కారణం ఎవరు?ఈ నేపథ్యంలో వినోద్ కాంబ్లీ పరిస్థితిని చూసి నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సచిన్ స్థాయికి చేరుకోగల సత్తా ఉన్నా చేజేతులా కెరీర్ నాశనం చేసుకుని.. ఇలాంటి దుస్థితికి చేరుకున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. వ్యక్తిగతంగానూ క్రమశిక్షణ లోపించినందు వల్లే అతడి కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోయిందన్న కాంబ్లీ సన్నిహిత వర్గాల మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాగా కాంబ్లీ ప్రస్తుతం ఆరోగ్యపరంగా.. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.కాగా భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 1993- 2000 మధ్య వినోద్ కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 1084, 2477 రన్స్ చేశాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్. ఇక దేశీ టోర్నీలో 2004లో మధ్యప్రదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ముంబైకి చివరగా ఆడాడు కాంబ్లీ.ఇదిలా ఉంటే.. 2013లో వినోద్ కాంబ్లీకి హార్ట్ ఎటాక్ వచ్చింది. కారులో వెళ్తున్న సమయంలో గుండెపోటు రాగా.. ఓ పోలీస్ అధికారి గమనించి సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.సెంచరీ సెంచరీల వీరుడిగా సచిన్మరోవైపు.. సచిన్ టెండుల్కర్ భారత క్రికెట్‌కు మారుపేరుగా ఎదిగాడు. టీమిండియా తరఫున 664 మ్యాచ్‌లు ఆడి 34357 పరుగులు సాధించాడు. ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్‌గా సచిన్ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. అంతేకాదు.. ఇంటర్నేషనల్ క్రికెట్లో వంద సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు కూడా సచినే. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ‘భారత రత్న’తో సత్కరించింది. ఇక సచిన్, కాంబ్లీ ఇద్దరూ ఆచ్రేకర్(1932- 2019) శిష్యులే కావడం గమనార్హం.చదవండి: WTC Final: న్యూజిలాండ్ అవకాశాలపై నీళ్లు చల్లిన ఐసీసీ #WATCH | Maharashtra: Former Indian Cricketer Sachin Tendulkar met former cricketer Vinod Kambli during an event in Mumbai.(Source: Shivaji Park Gymkhana/ANI) pic.twitter.com/JiyBk5HMTB— ANI (@ANI) December 3, 2024 -
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన జో రూట్
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండిన ఓ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్ట్‌ల్లో నాలుగో ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. నాలుగో ఇన్నింగ్స్‌ల్లో సచిన్ 1625 పరుగులు చేయగా.. ప్రస్తుతం రూట్ ఖాతాలో 1630 పరుగులు ఉన్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా రూట్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఛేదనలో రూట్ 23 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.సచిన్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే..!ఫోర్త్ ఇన్నింగ్స్‌లో రూట్ సచిన్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 1630 పరుగులు చేశాడు. రూట్‌కు ఈ మైలురాయి చేరుకునేందుకు 49 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. సచిన్ 60 ఇన్నింగ్స్‌ల్లో 1625 పరుగులు చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-5 స్థానాల్లో వీరు ఉన్నారు.రూట్- 1630 పరుగులు (49 ఇన్నింగ్స్‌లు)సచిన్- 1625 (60 ఇన్నింగ్స్‌లు)అలిస్టర్ కుక్- 1611 (53 ఇన్నింగ్స్‌లు)గ్రేమ్ స్మిత్- 1611 (41 ఇన్నింగ్స్‌లు)శివ్‌నరైన్ చంద్రపాల్- 1580 (49 ఇన్నింగ్స్‌లు)కేన్ సచిన్ రికార్డును తన 150వ టెస్ట్‌లో బద్దలు కొట్టడం విశేషం. రూట్ ప్రస్తుతం టెస్ట్‌ల్లో 12777 పరుగులు చేసి సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ (15921) టాప్‌లో ఉండగా.. రికీ పాంటింగ్ (13378), కల్లిస్ (13289), ద్రవిడ్ (13288) రూట్ కంటే ముందున్నారు.కాగా, క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యరీ బ్రూక్ (171) భారీ సెంచరీతో కదంతొక్కగా.. బ్రైడన్ కార్స్ 10 వికెట్లతో విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన రూట్ రెండో ఇన్నింగ్స్‌లో జేకబ్ బేతెల్తో (50 నాటౌట్) కలిసి అజేయమైన 23 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. -
‘అతడిని లారా, సచిన్ అన్నారు.. ఒక్కరు కన్నెత్తి చూడలేదు.. తగిన శాస్తే’
‘‘అతడొక అద్భుతమైన పిల్లాడు. కానీ తనని అందరూ అపార్థం చేసుకునేందుకు అన్ని విధాలా ఆస్కారం ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఇలాంటి కుదుపు ఒకటి అవసరం. షాక్ తగలాల్సిందే. అతడు చిన్ననాటి నుంచే ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రశంసలు అందుకున్నాడు. అత్యంత ప్రతిభావంతమైన బ్యాటర్ అని కితాబులు అందుకుంటూ పెరిగాడు.ప్రపంచంలో సచిన్, కోహ్లి తర్వాత ఎంఆర్ఎఫ్ బ్యాట్‌ను సొంతం చేసుకున్న ఆటగాడిగా నీరాజనాలు అందుకున్నాడు. కొంతమంది అతడిని లారా అన్నారు. మరికొందరేమో మరో సచిన్ అని కీర్తించారు. ముంబై క్రికెట్ మొత్తం అతడి గురించే మాట్లాడేది. సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్ వంటి దిగ్గజాలను ముంబై అందించింది.అతడు కూడా వారి స్థాయికి ఎదుగుతాడని అంతా భావించారు. కానీ.. పృథ్వీకి ఊహించని షాక్ తగిలింది. అతడికి ఇలా జరగాల్సిందే. ఇప్పటి వరకు ఐపీఎల్లో అతడికి కాంట్రాక్టు ఉండేది. కానీ ఇప్పుడు అసలు తన పేరే ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదు’’ అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ అన్నాడు. భారత క్రికెటర్ పృథ్వీ షాను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.పృథ్వీ షా అంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాలిఇప్పటికైనా పృథ్వీ కఠినంగా శ్రమించి.. మునుపటి కంటే గొప్పగా తిరిగి రావాలని పార్థ్ జిందాల్ ఆకాంక్షించాడు. ఫిట్నెస్ సాధించడంతో పాటు క్రమశిక్షణతో మెలుగుతూ పృథ్వీ షా అంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాలని అతడిని ఉద్దేశించి ఇండియా టుడేతో స్పూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు.కాగా భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ పృథ్వీ షా. 2018లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ తొలి టెస్టులోనే సెంచరీ చేశాడు. అయితే, శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన పృథ్వీ షా క్రమక్రమంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. టీమిండియాలో చోటు కరువుశుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి బ్యాటర్ల రాకతో ఓపెనర్‌గా మళ్లీ అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు.. ఐపీఎల్‌లోనూ మంచి ఆరంభమే అందుకున్నా.. ఇప్పుడు కనీస ధరకు కూడా అమ్ముడుపోని దుస్థితికి చేరుకున్నాడు. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన మెగా వేలంలో పృథ్వీ షా రూ. 75 లక్షలకే అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంఛైజీ కూడా అతడి వైపు కన్నెత్తి చూడలేదు. ఆరంభం నుంచి అవకాశాలు ఇచ్చిన ఢిల్లీ కూడా పృథ్వీని మొత్తానికే వదిలించుకుంది.క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్లేమిముంబై క్రికెట్ జట్టులోనూ పృథ్వీ షాకు సుస్థిర స్థానం లేదు. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్‌నెస్‌లేమి ఇందుకు కారణాలు. ఈ నేపథ్యంలో అతడిపై విమర్శల వర్షం కురుస్తుండగా.. పార్థ్ జిందాల్ పైవిధంగా స్పందించాడు. కాగా 2018లో ఐపీఎల్లో ఢిల్లీ తరఫున అడుగుపెట్టిన పృథ్వీ షా ఇప్పటి వరకు 79 మ్యాచ్‌లు ఆడి 1892 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్-2024లో ఢిల్లీ ఫ్రాంఛైజీ అతడి సేవల కోసం ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు చేసింది. కానీ పూర్తిగా నిరాశపరచడంతో వేలానికి ముందు విడిచిపెట్టింది.చదవండి: వేలంలో అమ్ముడుపోలేదు.. ఇక్కడేమో అత్యంత చెత్త రికార్డుతో శార్దూల్!.. రహానే దంచికొట్టినా.. -
సచిన్ టెండుల్కర్ పదో తరగతితో ఆపితే.. అర్జున్ ఎంత వరకు చదివాడో తెలుసా? (ఫొటోలు)
-
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్.. బ్యాటింగ్‌లో కాదు..!
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు. టెస్ట్‌ల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్ల జాబితాలో విరాట్ (116).. సచిన్‌ను (115) వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో రాహుల్ ద్రవిడ్ (210 క్యాచ్‌లు) టాప్‌లో ఉండగా.. వీవీఎస్ లక్ష్మణ్ (135) రెండో స్థానంలో ఉన్నాడు.కాగా, పెర్త్ టెస్ట్‌లో టీమిండియా విజయం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో 534 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలుపొందాలంటే మరో 362 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. మిచెల్ మార్ష్ (39), అలెక్స్ క్యారీ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మెక్‌స్వీని 0, ఉస్మాన్ ఖ్వాజా 4, కమిన్స్ 2, లబూషేన్ 3, స్టీవ్ స్మిత్ 17, ట్రవిస్ హెడ్ 89 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు.అంతకుముందు భారత్ 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసి సెకెండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (161), విరాట్ కోహ్లి (100 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. రాహుల్ 77, పడిక్కల్ 25, పంత్ 1, జురెల్ 1, వాషింగ్టన్ సుందర్ 29 పరుగులు చేశారు. నితీశ్ కుమార్ రెడ్డి 38 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో లయోన్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ తీసుకున్నారు.దీనికి ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బుమ్రా (5/30), సిరాజ్ (2/20), హర్షిత్ రాణా (3/48) కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ రెడ్డి (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ 4, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ఆస్ట్రేలియా గడ్డపై తనకు తిరుగులేదని టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.ఆసీస్ బౌలర్లను అలవోకగా ఆడుతూ 143 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. టెస్టుల్లో కోహ్లికి ఇది 30వ శతకం. అదేవిధంగా ఆస్ట్రేలియా గడ్డపై విరాట్‌కు 7వ సెంచరీ కావడం గమనార్హం. ఇక ఈ సెంచరీతో కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..👉ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (6 సెంచరీలు) పేరిట ఉండేంది. ఈ సెంచరీతో సచిన్ ఆల్‌టైమ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. ఈ పర్యాటక బ్యాటర్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.👉అదేవిధంగా టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్(29)ను కోహ్లి అధిగమించాడు.👉అదే విధంగా విదేశాల్లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత క్రికెటర్‌గా సునీల్ గవాస్కర్ రికార్డును విరాట్ సమం చేశాడు. కోహ్లి ఆస్ట్రేలియాలో 7 సెంచరీలు చేయగా.. గవాస్కర్ కూడా వెస్టిండీస్‌లో సరిగ్గా 7 సెంచరీలు నమోదు చేశాడు. -
ఉదయాన్నే బూత్‌లకు వచ్చి ఓటేసిన ప్రముఖులు.. మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ చిత్రాలు ఇవిగో
-
‘మహా’ పోరు.. ఓటు వేసిన ప్రముఖులు వీరే..
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే బారామతిలో డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ ఓటు వేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, నాగ్‌పుర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఓటు వేశారు. అలాగే, ఎంపీ సుప్రియా సూలే తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పలు పోలింగ్ బూత్‌లో క్రికెటర్ సచిన్ సహా ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్, సినీ నటుడు రాజ్ కుమార్ రావ్, నటి గౌతమీ కపూర్, నటులు అక్షయ్ కుమార్, అలీ ఫజల్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | | Former Indian Cricketer Sachin Tendulkar, his wife and their daughter cast their votes at a polling station in Mumbai#MaharashtraAssemblyElections2024 pic.twitter.com/JX8WASuy4Y— ANI (@ANI) November 20, 2024 #WATCH | Mumbai: Former Indian Cricketer Sachin Tendulkar, his wife Anjali Tendulkar and their daughter Sara Tendulkar, show their inked fingers after casting vote for #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/ZjHix46qmb— ANI (@ANI) November 20, 2024 #WATCH | Filmmaker and actor Farhan Akhtar shows his inked finger after casting his vote for #MaharashtraAssemblyElections2024, at a polling booth in Bandra, Mumbai. pic.twitter.com/R9wyvbphFx— ANI (@ANI) November 20, 2024 #WATCH | Mumbai: Actor Ali Fazal shows his inked finger after casting his vote for #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/GVspi9nAfA— ANI (@ANI) November 20, 2024 #WATCH | NCP-SCP MP Supriya Sule along with her family show their inked fingers after casting a vote for #MaharashtraAssemblyElections2024NCP has fielded Deputy CM Ajit Pawar and NCP-SCP has fielded Yugendra Pawar from the Baramati Assembly constituency. pic.twitter.com/x22KuN8OEI— ANI (@ANI) November 20, 2024 Superstar #AkshayKumar is among the first voters to cast their vote today.pic.twitter.com/EXKGNWZ0pq— Nitesh Naveen (@NiteshNaveenAus) November 20, 2024 -
రెండు భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి.. మరో 458 పరుగులు చేస్తే!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడి వికెట్ పారేసుకున్నాడు.ఈ నేపథ్యంలో కోహ్లి బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కివీస్ చేతిలో టీమిండియా 3-0తో వైట్‌వాష్ కావడంతో భారత మాజీ క్రికెటర్లు సైతం కోహ్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంత మంది మాత్రం.. ‘‘ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం’’ అని ఈ రన్‌మెషీన్‌కు అండగా నిలిచారు.రెండు భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి.. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పర్యటన రూపంలో కోహ్లి వరుస వైఫల్యాలకు చెక్ పెడుతూ.. తనను తాను మరోసారి నిరూపించుకునే సమయం వచ్చింది. మామూలుగానే కంగారూలతో టెస్టుల్లో చెలరేగి ఆడే ఈ ఢిల్లీ బ్యాటర్.. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మరింత గొప్పగా రాణిస్తాడని ఇటు టీమిండియా, అటు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు.ఒకవేళ ఇక్కడా విఫలమైతే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ) కోసం ఆస్ట్రేలియా పర్యటనకు రావడం ఇదే చివరిసారి అవుతుందని కూడా జోస్యం చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కోహ్లి గనుక మునుపటి ఫామ్ అందుకుంటే ఆస్ట్రేలియా గడ్డపై రెండు అరుదైన భారీ రికార్డులు సొంతం చేసుకునే అవకాశం ఉంది.మరో 458 పరుగులు చేస్తే!బీజీటీ 2024-25లో భాగంగా ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కోహ్లి గనుక 458 పరుగులు సాధిస్తే.. సచిన్ టెండుల్కర్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలవుతుంది. కంగారూ గడ్డపై సచిన్ 20 టెస్టులు ఆడి 53.20 సగటుతో.. 1809 పరుగులు సాధించాడు. తద్వారా ఆస్ట్రేలియాలో టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.మరోవైపు కోహ్లి.. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు ఆడిన 13 టెస్టుల్లో 54.08 సగటుతో 458 పరుగులు సాధించాడు. కాబట్టి ఈసారి ఇంకో 458 పరుగులు చేశాడంటే.. సచిన్ టెండ్కులర్ను అధిగమిస్తాడు.ఇక ఆస్ట్రేలియా గడ్డపై సచిన్ టెండుల్కర్, కోహ్లి ఆరేసి శతకాలు చేసి.. ఈ ఘనత సాధించిన టీమిండియా బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈసారి కోహ్లి ఒక్క సెంచరీ చేస్తే.. సచిన్‌ను వెనక్కి నెట్టి భారత్ తరఫున ఆస్ట్రేలియాలో అత్యధిక శతకాలధీరుడిగా అవతరిస్తాడు.కాగా.. నవంబరు 22 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య మొదటి టెస్టు ఆరంభం కానుంది. జనవరి 3-7 వరకు జరుగనున్న ఐదో టెస్టుతో టీమిండియా ఆసీస్ టూర్ ముగుస్తుంది. ఇదిలా ఉంటే.. కోహ్లి ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో రాబట్టిన పరుగులు 0, 70, 1, 17, 4, 1.చదవండి: ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే ధర.. రూ. 14.5 కోట్లకు ఆ జట్టు సొంతం! -
ఐదు వికెట్లతో చెలరేగిన అర్జున్ టెండుల్కర్.. మెగా వేలంలో...
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ రంజీ మ్యాచ్‌లో అదరగొట్టాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ గోవా ఆల్‌రౌండర్.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. అర్జున్ దెబ్బకు ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. 84 పరుగులకే ఆలౌట్ అయింది.గోవాకు ప్రాతినిథ్యంకాగా ముంబైకి చెందిన అర్జున్ టెండుల్కర్ దేశవాళీ క్రికెట్లో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఎడమచేతి వాటం కలిగిన బ్యాటర్ అయిన అర్జున్.. లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ కూడా! ఇక 25 ఏళ్ల అర్జున్ రంజీ ట్రోఫీ 2024-25లో ప్లేట్ గ్రూపులో ఉన్న గోవా.. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో తలపడుతోంది.పొర్వోరిమ్లోని గోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్లో బుధవారం ఇరుజట్ల మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన అరుణాచల్ ప్రదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే అటాక్ మొదలుపెట్టిన గోవా ఆల్‌రౌండర్ అర్జున్ టెండుల్కర్.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను బెంబేలెత్తించాడు.టాప్-5 వికెట్లు అతడి ఖాతాలోనేఅర్జున్ ధాటికి టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ కకావికలమైంది. ఓపెనర్ నబాం హచాంగ్‌ను డకౌట్ చేయడంతో వికెట్ల వేట మొదలుపెట్టిన అర్జున్.. మరో ఓపెనర్ నీలం ఒబి(22), వన్‌డౌన్ బ్యాటర్ చిన్మయ్ పాటిల్(3), నాలుగో స్థానంలో వచ్చిన జే భస్వార్(0), ఐదో నంబర్ బ్యాటర్ మోజీ ఎటె(1)లను పెవిలియన్‌కు పంపాడు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శనతద్వారా అర్జున్ టెండుల్కర్.. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన(5 Wicket Haul) నమోదు చేశాడు. ఇక అర్జున్‌తో పాటు గోవా బౌలర్లలో కేత్ పింటో రెండు, మోహిత్ రేడ్కర్ మూడు వికెట్లతో రాణించారు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే కుప్పకూలిన అరుణాచల్ ప్రదేశ్.. 84 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.ముంబై తరఫున కాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అర్జున్ టెండుల్కర్ ఈమేరకు ఉత్తమ ప్రదర్శన కనబరచడం.. అతడికి సానుకూలాంశంగా మారింది. ఈ ఆల్‌రౌండర్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇక సచిన్ టెండుల్కర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న ముంబై ఇండియన్స్ తరఫున అర్జున్ గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడి 13 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు. అయితే, రిటెన్షన్స్‌లో భాగంగా ఐదుగురిని అట్టిపెట్టుకున్న ముంబై.. అర్జున్ను వదిలివేసింది. ఇదిలా ఉంటే.. సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో ఐపీఎల్ వేలంపాట జరుగనుంది.చదవండి: ఆతిథ్య హక్కులు మావే.. మ్యాచ్‌లన్నీ మా దేశంలోనే.. పాక్ ప్రభుత్వ వైఖరి ఇదే! -
చరిత్ర సృష్టించిన అఫ్గాన్ ఓపెనర్.. సచిన్, కోహ్లి రికార్డులు బద్దలు
షార్జా వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో అఫ్గానిస్తాన్ సొంతం చేసుకుంది. అఫ్గాన్ విజయంలో స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ కీలక పాత్ర పోషించాడు.ఈ మ్యాచ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. 245 పరుగుల లక్ష్య చేధనలో గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 120 బంతులు ఎదుర్కొన్న గుర్భాజ్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. కాగా రహ్మానుల్లాకు ఇది ఎనిమిదో వన్డే అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. తద్వారా గుర్భాజ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.సచిన్, కోహ్లి రికార్డు బద్దలు..అంతర్జాతీయ వన్డేల్లో అతి పిన్న వయస్సులోనే ఎనిమిది సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా గుర్భాజ్ రికార్డులెక్కాడు. గుర్భాజ్ కేవలం 22 సంవత్సరాల, 349 రోజుల వయస్సులో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, రన్ మిషన్ విరాట్ కోహ్లిని గుర్భాజ్ ఆధిగమించాడు. సచిన్ 22 ఏళ్ల 357 రోజుల వయస్సులో ఈ రికార్డు సాధించగా.. కోహ్లి 23 ఏళ్ల 27 రోజుల వయస్సులో అందుకున్నాడు.ఇక ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ అగ్రస్ధానంలో ఉన్నాడు. డికాక్ 22 ఏళ్ల 312 రోజుల్లో ఈ రికార్డును నమోదు చేశాడు. కాగా అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు వన్డేల్లో సాధించిన మొత్తం సెంచరీల(30)లో గుర్భాజ్ సాధించినివే 25 శాతం కావడం గమనార్హం.చదవండి: అదొక పగటి కల.. భారత్‌కు పీసీబీ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి: పాక్ మాజీ కెప్టెన్ -
రికార్డుల రారాజు.. సచిన్‌ను మైమరిపించిన విరాటుడు
ప్రపంచ క్రికెట్లో అతడొక కింగ్. అతడికి సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. తండ్రి ఆశయం కోసం ఎంతటి సవాలునైనా ఎదిరించగల సాహసి. ప్రాణంలా ప్రేమించిన తండ్రి మరణం బాధిస్తున్నా.. ఆటగాడిగా తన విధిని నిర్వర్తించిన అంకితభావం గల వ్యక్తి. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైనా సరే అతడు బరిలోకి దిగనంతవరకే.. అతడు మైదానంలో అడుగుపెడితే ప్రత్యర్ధి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే.రికార్డులను తన ఇంటి పేరుగా మార్చుకుంటూ వరల్డ్ క్రికెట్‌పై తనదైన ముద్ర వేసుకున్న ధీరుడు అతడు. క్రికెట్ దేవుడు సచిన్‌ను మరిపించేలా పరుగుల ప్రవాహంతో అనేక రికార్డులు బద్దలు కొట్టడం.. మరెన్నో రికార్డుల మీద గురి పెట్టడం అతడికే చెల్లింది.కొండంత లక్ష్యాన్ని కూడా సరే అవలీలగా కరిగించే ఛేజ్ మాస్టర్. వరల్డ్‌క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు మారుపేరు అతడు. అతడు ఎవరో కాదు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి. "విరాట్ కోహ్లి నుదుటి రాతను దేవుడు రాయడు అతనే స్వయంగా తన రాత రాసుకుంటాడు". ఇది సచిన్ వన్డే సెంచరీల రికార్డును విరాట్ బ్రేక్ చేసినప్పుడు కామెంటేటర్ సునీల్ గవాస్కర్ చెసిన వాఖ్య ఇది. ఇది నిజంగా అక్షర సత్యం. కోహ్లి నేడు తన 36వ పుట్టిన రోజు జరుపునకుంటున్నాడు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో సాధించిన పలు అరుదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.👉: అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు 295 వన్డేలు ఆడిన కోహ్లి మొత్తంగా 50 సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై సెంచరీ నమోదు చేసిన విరాట్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు మాస్టర్‌బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(49) పేరిట ఉండేది. ఆ రికార్డును ఎవరూ టచ్ చేయలేరని అంతా అనుకున్నారు. కానీ సచిన్ రికార్డు బద్దలు కొట్టి కోహ్లి చరిత్రకెక్కాడు. తన ఆటతో సచిన్‌ను కూడా ఫిదా చేసి.. క్రికెట్ దేవుడినే మైమరిపించాడు.👉: వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 13000 పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లి పేరిటే ఉంది. 2023 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు. కోహ్లి కేవలం 278వ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్(321) పేరిటే ఉండేది.👉: మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడు కూడా కోహ్లినే. ఇప్పటివరకు 538 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 21 సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు. టెస్టుల్లో మూడుసార్లు, వన్డేల్లో 11సార్లు, టీ20ల్లో 7సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కింగ్ కోహ్లి సొంతం చేసుకున్నాడు.👉: వన్డే ప్రపంచకప్ ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు కలిగి ఉన్నాడు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కోహ్లి ఏకంగా 765 పరుగులు చేసి ఈ ఫీట్‌ను సాధించాడు.👉: అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన జాబితాలో విరాట్ కోహ్లి పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజం తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివకు 125 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 39 హాఫ్ సెంచరీలు చేశాడు. బాబర్ కూడా సరిగ్గా 39 హాఫ్ సెంచరీలు సాధించాడు.👉: అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 3500 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు. ఆసియాకప్-2022లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ రికార్డు సాధించాడు. కేవలం 96 ఇన్నింగ్స్‌లలోనే కోహ్లిఈ ఫీట్ నమోదు చేశాడు. -
టీమిండియాపై సచిన్ సీరియస్.. అసలు తప్పు ఎక్కడ జరిగింది?
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు 3-0 తేడాతో వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. మొత్తం మూడు టెస్టుల్లోనూ దారుణ ప్రదర్శన కనబరిచి కివీస్ ముందు టీమిండిచా మోకరిల్లింది. 92 ఏళ్ల ఇండియన్ క్రికెట్లో సొంతగడ్డపై రెండు కంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో తొలిసారి వైట్‌వాష్‌కు గురై ఘోర అవమానాన్ని రోహిత్ సేన ఎదుర్కొంది. ఈ సిరీస్ అసాంతం భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. ముంబై వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా చతకిల పడింది. ఈ ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను టీమిండియా సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఘోర పరభావంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. ఈ ఓటమితో భారత జట్టు కచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాలని సచిన్ అభిప్రాయపడ్డాడు."స్వదేశంలో 3-0 తేడాతో టెస్టు సిరీస్‌ను కోల్పోవడం మింగుడు పడని విషయం. కచ్చితంగా టీమిండియా ఈ ఓటుములపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ ఘోర పరభావానికి ప్రిపరేషన్ లోపమా, పేలవమైన షాట్ ఎంపికనా, లేక మ్యాచ్ ప్రాక్టీస్ లోపమా? కచ్చితంగా తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. శుబ్‌మన్ గిల్ మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ సత్తాచాటాడు. ఈ సిరీస్‌లో అతడు పూర్తిగా భిన్నంగా కన్పించాడు. పంత్ ఫుట్‌వర్క్ చాలా బాగుంది. అతడి బ్యాటింగ్‌ను చూస్తే వేరే పిచ్‌పై ఆడినట్లు అన్పించింది. పంత్ సింప్లీ సూపర్బ్ అంటూ" ఎక్స్‌లో లిటల్ మాస్టర్ రాసుకొచ్చాడు.చదవండి: Wriddhiman Saha Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ క్రికెటర్ -
Ind vs NZ: ఈ ఇద్దరూ అద్భుతం.. భవిష్యత్ వీరిదే: సచిన్
టీమిండియా- న్యూజిలాండ్ తొలి టెస్టులో ఇద్దరు యువ ఆటగాళ్లు బాగా హైలైట్ అయ్యారు. వారిలో ఒకరు భారత సంతతికి చెందిన కివీస్ క్రికెటర్ రచిన్ రవీంద్ర.. మరొకరు ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్. బెంగళూరు టెస్టులో వీరిద్దరు సెంచరీలతో చెలరేగారు.టీమిండియా పరువు నిలబెట్టిన సర్ఫరాజ్కాగా ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో సర్ఫరాజ్ సాధించిన పరుగులు సున్నా. అయితే, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేయగలిగిందంటే మాత్రం అందుకు ప్రధాన కారణం సర్ఫరాజ్ ఖానే!అద్భుత ఆట తీరుతో కివీస్ బౌలర్లపై అటాక్ చేస్తూ మెరుపు సెంచరీ సాధించిన ఈ ముంబైకర్.. 195 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 150 పరుగులు చేశాడు. జట్టు క్లిష్ట సమయంలో ఉన్న వేళ అంతర్జాతీయ కెరీర్లో తొలి శతకం సాధించి ఆటగాడిగా తన విలువను చాటుకున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) తండ్రి సొంతూరిలో కివీస్ తరఫున రచిన్ శతకంమరోవైపు.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులతో శుభారంభం అందించగా.. నాలుగో స్థానంలో వచ్చిన రచిన్ రవీంద్ర శతక్కొట్టి జట్టును భారీ స్కోరు వైపు నడిపించాడు. తన తండ్రి సొంత ఊరైన బెంగళూరు వేదికగా టెస్టుల్లో రెండో సెంచరీ(157 బంతుల్లో 134) నమోదు చేశాడు. అతడికి తోడుగా టిమ్ సౌథీ(65) రాణించడంతో మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ 402 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.ఎవరిది పైచేయి అవునో?!ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కివీస్‌కు 107 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. మరొక్కరోజు(ఆదివారం) మాత్రమే ఆట మిగిలి ఉండటంతో న్యూజిలాండ్ బ్యాటర్లు, భారత బౌలర్ల మధ్య పోటీలో ఎవరు నెగ్గుతారోనన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. బెంగళూరు సెంచరీ హీరోలు సర్ఫరాజ్ ఖాన్, రచిన్ రవీంద్రల గురించి టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.ఈ ఇద్దరూ అద్భుతం.. భవిష్యత్ వీరిదే‘‘మన మూలాలను అనుసంధానం చేసే మార్గం క్రికెట్‌కు ఉంది. రచిన్ రవీంద్రకు బెంగళూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. అతడి కుటుంబం అక్కడి నుంచే వలస వెళ్లింది. అక్కడే అతడు శతకం బాదాడు.ఇక సర్ఫరాజ్ ఖాన్... తన కెరీర్లో తొలి టెస్టు సెంచరీ సాధించడానికి ఇంతకంటే గొప్ప సందర్భం ఏముంటుంది?! టీమిండియాకు అత్యవసరమైన వేళ అతడు శతకం బాదాడు. ప్రతిభావంతులైన ఈ ఇద్దరు యువకులు భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయగలరు’’ అని సచిన్ టెండుల్కర్ రచిన్, సర్ఫరాజ్లపై ప్రశంసలు కురిపించాడు. చదవండి: Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్ ఆగ్రహం.. కోహ్లి ఆన్ ఫైర్!Cricket has a way of connecting us to our roots. Rachin Ravindra seems to have a special connection with Bengaluru, where his family hails from! Another century to his name.And Sarfaraz Khan, what an occasion to score your first Test century, when India needed it most!… pic.twitter.com/ER8IN5xFA5— Sachin Tendulkar (@sachin_rt) October 19, 2024 -
అమెరికాలో సచిన్‌కు సత్కారం.. దేవుడు ఇక్కడే ఉన్నాడన్న ఉన్ముక్త్! (ఫొటోలు)
-
నవంబర్ 17 నుంచి దిగ్గజాల క్రికెట్ లీగ్.. టీమిండియా కెప్టెన్‌గా సచిన్
క్రికెట్ అభిమానులకు మరో టీ20 లీగ్ కనువిందు చేయనుంది. నవంబర్ 17 నుంచి ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) తొలి ఎడిషన్ ప్రారంభం కానుంది. దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటున్న ఈ లీగ్‌కు సంబంధించిన ఫిక్షర్స్ మరియు కెప్టెన్ల వివరాలను నిర్వహకులు ఇవాళ (అక్టోబర్ 8) వెల్లడించారు. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 8 వరకు సాగే ఈ లీగ్ భారత్‌లోని మూడు వేర్వేరు వేదికలపై (ముంబై, లక్నో, రాయ్‌పూర్) జరుగనుంది. ఈ లీగ్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు జరుగుతాయి.ఈ లీగ్‌లో భారత్ సహా ఆరు ఐసీసీ సభ్యు దేశాలు పాల్గొంటున్నాయి. ఈ లీగ్‌లో భారత జట్టుకు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సారథ్యం వహించనున్నాడు. శ్రీలంక జట్టుకు కుమార సంగక్కర, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్‌కు ఇయాన్ మోర్గాన్, వెస్టిండీస్‌కు బ్రియాన్ లారా కెప్టెన్లు వహించనున్నారు.లీగ్ ఫిక్షర్స్..నవంబర్ 17- భారత్ వర్సెస్ శ్రీలంక (ముంబై, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 18- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా (ముంబై, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 17- శ్రీలంక వర్సెస్ ఇంగ్లండ్ (ముంబై, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 20- వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా (ముంబై, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 21- భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 23- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 24- భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 25- వెస్టిండీస్ వర్సెస్ శ్రీలంక (లక్నో, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 26- ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 27- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 28- భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 30- శ్రీలంక వర్సెస్ ఇంగ్లండ్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)డిసెంబర్ 1- భారత్ వర్సెస్ వెస్టిండీస్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)డిసెంబర్ 2- శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)డిసెంబర్ 3- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)డిసెంబర్ 5- సెమీఫైనల్-1 (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)డిసెంబర్ 6- సెమీఫైనల్-2 (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)డిసెంబర్ 8- ఫైనల్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)చదవండి: PAK VS ENG 1st Test: జమాల్ 'కమాల్' క్యాచ్ -
అమెరికా జాతీయ క్రికెట్ లీగ్ భాగస్వామిగా సచిన్
వాషింగ్టన్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అమెరికాకు చెందిన నేషనల్ క్రికెట్ లీగ్ (ఎన్సీఎల్) యాజమాన్యంలో భాగస్వామి అయ్యాడు. ఈ టోర్నీలో ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన దిగ్గజ క్రీడాకారులు ఏదో ఒక రూపంలో పాల్గొంటుండగా... ఇప్పుడు ఆ జాబితాలో సచిన్ టెండూల్కర్ పేరు చేరింది. అమెరికాలో క్రికెట్‌కు మరింత ఆదరణ పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ‘క్రికెట్ నా జీవితంలో అతి ముఖ్య భాగం. అలాంటి ఈ ప్రయాణంలో ఎన్‌సీఎల్‌లో భాగం కావడం మరింత ఆనందాన్నిస్తోంది. అమెరికాలో క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం లభించే విధంగా కృషి చేస్తా. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చిన ఎన్‌సీఎల్‌లో నేను భాగస్వామి కావడం సంతోషంగా ఉంది’ అని సచిన్ పేర్కొన్నాడు. ఎన్సీఎల్ తొలి సీజన్లో సునీల్ గవాస్కర్, వెంగ్‌సర్కార్, వెంకటేశ్ ప్రసాద్ (భారత్), జహీర్ అబ్బాస్, అక్రమ్, మొయిన్‌ఖాన్ (పాకిస్తాన్), రిచర్డ్స్ (వెస్టిండీస్), జయసూర్య (శ్రీలంక) వేర్వేరు జట్లకు కోచ్, మెంటార్లుగా వ్యవహరించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో మార్పులను స్వాగతించే వారిలో ముందు వరుసలో ఉండే సచిన్... ఇప్పుడు ఈ 60 స్ట్రయిక్ ఫార్మాట్లో భాగం కానున్నారు. ఇప్పటికే విశ్వవ్యాప్తంగా టి20, టి10, హండ్రెడ్ ఫార్మాట్లు ప్రాచుర్యం పొందగా... ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ ఎన్సీఎల్ సిక్స్టీ స్ట్రయిక్స్ పేరుతో మరో కొత్త ఫార్మాట్‌కు తెరలేపుతోంది. తొలి ఎడిషన్‌లో రైనా, దినేశ్ కార్తీక్, అఫ్రిది, షకీబ్, షమ్సీ, క్రిస్ లిన్, ఏంజెలో మాథ్యూస్, బిల్లింగ్స్ వంటి పలువురు ప్లేయర్లు పాల్గొంటారు. -
Irani Cup 2024: సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్
ఇరానీ కప్ 2024లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీతో మెరిశాడు. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఈ మార్కును తాకాడు. రెండో రోజు మూడో సెషన్ సమయానికి సర్ఫరాజ్ 218 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా శార్దూల్ ఠాకూర్ (25) క్రీజ్‌లో ఉన్నాడు. 133.4 ఓవర్ల అనంతరం ముంబై స్కోర్ 522/8గా ఉంది. ముంబై ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అజింక్య రహానే (97), శ్రేయస్ అయ్యర్ (57), తనుశ్ కోటియన్ (64) అర్ద సెంచరీలతో రాణించారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, ప్రసిద్ద్ కృష్ణ తలో రెండు వికెట్లు తీశారు.సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్రెస్ట్ ఆఫ్ ఇండియాపై సెంచరీతో సర్ఫరాజ్ ఖాన్ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ సరసన చేరాడు. సర్ఫరాజ్‌కు ఇరానీ కప్‌లో ఇది రెండో సెంచరీ కాగా.. సచిన్, ద్రవిడ్ కూడా ఇరానీ కప్‌లో తలో రెండు సెంచరీలు చేశారు. ఇరానీ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత దిలీప్ వెంగ్‌సర్కార్, గుండప్ప విశ్వనాథ్‌కు దక్కుతుంది. ఈ ఇద్దరు ఇరానీ కప్‌లో తలో నాలుగు సెంచరీలు చేశారు. వెంగ్‌సర్కార్, విశ్వనాథ్ తర్వాత ఇరానీ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత హనుమ విహారి, అభినవ్ ముకుంద్, సునీల్ గవాస్కర్, వసీం జాఫర్‌లకు దక్కుతుంది. వీరంతా ఈ టోర్నీలో తలో మూడు సెంచరీలు చేశారు.చదవండి: డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్ -
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్ పట్టనున్న సచిన్
వెటరన్ క్రికెటర్లు సందడి చేసేందుకు మరో టీ20 క్రికెట్ లీగ్ పుట్టుకొచ్చింది. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీ తొట్టతొలి సీజన్ ఈ ఏడాది జరగనుంది. సోమవారం ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ మొదటి ఎడిషన్‌ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లాంచ్ చేశారు. ఈ లీగ్ కమీషనర్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ నియమితుడయ్యాడు. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక మొత్తం ఆరు జట్లు పాల్గోనున్నాయి. ఈ ఆరు దేశాల నుంచి క్రికెట్ స్టార్లు పాల్గొనున్నారు. సచిన్ టెండూల్కర్ కూడా ఈ లీగ్‌లో భారత తరపున ఆడనున్నట్లు తెలుస్తోంది."క్రికెట్‌కు భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతూనే ఉంది. గత దశాబ్దం నుంచి టీ20 క్రికెట్‌కు మరింత ఆదరణ పెరిగింది. ఈ పొట్టి క్రికెట్లో తమకు ఇష్టమైన మాజీ క్రికెటర్లు ఆడితే చూడాలన్న కోరిక అభిమానుల్లో ఉంది. వెటరన్ క్రికెటర్లు ఆడే ప్రతీ లీగ్‌కు ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారని సచిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా లీగ్‌లోని మ్యాచ్‌లు ముంబై, లక్నో, రాయ్‌పూర్‌లలో జరగనున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. -
విరాట్ కోహ్లి మరో 35 పరుగులు చేస్తే..
శుక్రవారం నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు కాన్పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు పర్యాటక బంగ్లా జట్టు మాత్రం భారత గడ్డపై తొలి టెస్టు విజయాన్ని నమోదు చేయాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. కాన్పూర్ టెస్టులో కోహ్లి మరో 35 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 27,000 పరుగుల మైలు రాయిని అందుకున్న నాలుగో క్రికెటర్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు 514 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి..26,965 పరుగులు చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(34357) , కుమార సంగర్కకర(28016), రికీ పాంటింగ్(27483) ఉన్నారు.కోహ్లి ఫామ్‌లోకి వస్తాడా?కాగా టీ20 వరల్డ్‌కప్-2024 తర్వాత కోహ్లి తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో విఫలమైన విరాట్.. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులోనూ అదే తీరును కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అందరి కళ్లు కోహ్లిపైనే ఉన్నాయి. కాన్పూర్ టెస్టులో విరాట్ ఎలా రాణిస్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. -
కోహ్లిలో ఊపు తగ్గింది.. సచిన్ రికార్డులు బద్దలు కొట్టలేడు: ఆసీస్ మాజీ
టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిలో మునుపటి ఊపు లేదని హాగ్ ఆరోపించాడు. పరుగులు సాధించడంలో విరాట్ లయ తప్పాడని హాగ్ అన్నాడు. గత కొంతకాలంగా విరాట్ టెస్ట్‌ల్లో అంత గొప్ప ప్రదర్శనలేమీ చేయడం లేదని తెలిపాడు. ఇలాగే ఆడితే విరాట్ సచిన్ రికార్డులు అధిగమించడం కష్టమని అభిప్రాయపడ్డాడు.మాస్టర్ బ్లాస్టర్ తన కెరీర్లో 200 టెస్ట్‌లు ఆడి 15,921 పరుగులు చేయగా.. 35 ఏళ్ల విరాట్ ఇప్పటివరకు 114 టెస్ట్‌లు ఆడి 8871 పరుగులు మాత్రమే సాధించాడని హాగ్ అన్నాడు. విరాట్ సచిన్ రికార్డును అధిగమించాలంటే మరో 7051 పరుగులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఫామ్‌తో కోహ్లి ఇన్ని పరుగులు సాధించడం దాదాపుగా అసాధ్యమే అని హాగ్ అభిప్రాయపడ్డాడు. టెస్ట్‌ల్లో గత కొన్ని సంవత్సరాలుగా కోహ్లి అస్థిరమైన ఫామ్ అతన్ని వెనక్కు నెట్టిందని హాగ్ పేర్కొన్నాడు. విరాట్ సచిన్ రికార్డులకు చేరవగా వెళ్లాలంటే తదుపరి 10 టెస్ట్‌ల్లో తిరిగి తన లయను అందుకోవాల్సి ఉంటుందని అన్నాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ హాగ్ ఈ విషయాలను ప్రస్తావించాడు.కాగా, ఫాబ్ ఫోర్‌గా చెప్పుకునే విరాట్, రూట్, విలియమ్సన్, స్టీవ్ స్మిత్‌లలో జో రూట్ సచిన్ రికార్డు దిశగా దూసుకెళ్తున్నాడు. ఇటీవలికాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న రూట్ ఇప్పటివరకు 146 టెస్ట్‌లు ఆడి 12402 పరుగులు చేశాడు. రూట్ టెస్ట్‌ల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డు బద్దలు కొట్టాలంటే మరో 3500 పైచిలుకు పరుగులు సాధిస్తే చాలు. రూట్ ప్రస్తుత ఫామ్ ప్రకారం ఇది అసాధ్యమేమి కాకపోవచ్చు. చదవండి: బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్.. జోరుగా ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా -
సచిన్ తనయుడి సూపర్ పెర్ఫార్మెన్స్..!
కేఎస్‌సీఏ ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో (కెప్టెన్ కే తిమ్మప్పయ్య మెమోరియల్) క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అద్బుత ప్రదర్శనతో మెరిశాడు. ఈ టోర్నీలో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్.. ఆతిథ్య కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల ఘనత నమోదు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అర్జున్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. అర్జున్ చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో గోవా ఇన్నింగ్స్ 189 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగులకు ఆలౌటైంది. అర్జున్ 13 ఓవర్లలో 41 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అనంతరం అభినవ్ తేజ్రాణా సెంచరీతో (109) కదంతొక్కడంతో గోవా తొలి ఇన్నింగ్స్‌లో 413 పరుగులు చేసింది. గోవా ఇన్నింగ్స్‌లో మంతన్ కుట్కర్ అర్ద సెంచరీతో (69) రాణించాడు. భారీ వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక..సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కనబర్చింది. అర్జున్ 13.3 ఓవర్లలో 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడంతో కర్ణాటక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా ఈ మ్యాచ్‌లో గోవా భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ మొత్తంలో అర్జున్ 26.3 ఓవర్లు వేసి 87 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. వచ్చే వారం 25వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న అర్జున్.. సీనియర్ లెవెల్లో ఇప్పటివరకు 49 మ్యాచ్‌లు (మూడు ఫార్మాట్లలో) ఆడాడు. ఇందులో 68 వికెట్లు పడగొట్టాడు. లెఫ్ట్ అర్మ్ మీడియం పేసర్ అయిన అర్జున్ తన కెరీర్లో 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు పడగొట్టాడు. చదవండి: బంగ్లాతో తొలి టెస్టు.. కోహ్లికి చుక్కలు చూపించిన బుమ్రా -
సచిన్ మరో రికార్డు బద్దలు కొట్టేందుకు రెడీగా ఉన్న కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యాడు. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టెస్ట్‌లో విరాట్ మరో 58 పరుగులు చేస్తే సచిన్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ 27000 రన్స్ రికార్డును (అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో) బద్దలు కొడతాడు. అంతర్జాతీయ క్రికెట్లో 27000 పరుగుల మార్కును అందుకునేందుకు సచిన్‌కు 623 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. విరాట్‌కు 594 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డు బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. విరాట్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 593 ఇన్నింగ్స్‌లు ఆడి 26942 పరుగులు చేశాడు. సచిన్ ఓవరాల్‌గా 782 ఇన్నింగ్స్‌ల్లో 34357 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే 27000 పరుగుల మార్కును అందుకున్నారు. వీరిలో సచిన్ అగ్రస్థానంలో ఉండగా.. సంగక్కర (28016), రికీ పాంటింగ్ (27483) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. బంగ్లాతో మ్యాచ్‌లో విరాట్ మరో 58 పరుగులు చేస్తే ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్ అవుతాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో విరాట్ మరో 1075 పరుగులు చేస్తే.. సచిన్ తర్వాత రెండో అత్యధిక రన్ స్కోరర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి.. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతాయి. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి.తొలి టెస్ట్‌కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: ట్రిపుల్ సెంచరీకి చేరువలో కుల్దీప్ -
మిడిలార్డర్లో కపిల్ దేవ్.. గంభీర్, దాదాకు దక్కని చోటు
భారత క్రికెట్లో పాతతరం నుంచి నేటివరకు తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. కపిల్ దేవ్, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, మహేంద్ర సింగ్ ధోని, జహీర్ ఖాన్, గౌతం గంభీర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా.. చెప్పుకొంటూ పోతే జాబితా పెరుగుతూనే ఉంటుంది.పీయూశ్ చావ్లా ఏమన్నాడంటేఇంతమంది ఆటగాళ్లలో అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాలంటే కష్టమే మరి! అయితే, భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా మాత్రం తనకు ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉందంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 2006 నుంచి 2012 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు ఈ ఉత్తరప్రదేశ్ బౌలర్. కెరీర్లో మొత్తంగా 6 టెస్టుల్లో 7, 25 వన్డేల్లో 32, ఏడు టీ20లలో 4 వికెట్లు పడగొట్టాడు.స్వల్ప కాలమే టీమిండియాకు ఆడినా పీయూశ్ చావ్లా ఖాతాలో రెండు ప్రపంచకప్ ట్రోఫీలు ఉండటం విశేషం. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో పీయూశ్ సభ్యుడు. గత పన్నెండేళ్లుగా ఐపీఎల్‌కే పరిమితమైన ఈ వెటరన్ స్పిన్నర్.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ ఆడుతున్నాడు. కెప్టెన్‌గా ధోని.. నాలుగోస్థానంలో కోహ్లిఈ క్రమంలో శుభాంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీయూశ్ తన ఆల్‌టైమ్ ఇండియా వన్డే ప్లేయింగ్ ఎలెవన్‌ను వెల్లడించాడు. తన జట్టుకు ధోనిని కెప్టెన్‌గా ఎంచుకున్న పీయూశ్.. సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మలకు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో వీరేంద్ర సెహ్వాగ్‌కు మూడు, విరాట్ కోహ్లికి నాలుగో స్థానం ఇచ్చాడు. మిడిలార్డర్లో ఆల్‌రౌండర్లు యువరాజ్ సింగ్, కపిల్ దేవ్లను ఎంపిక చేసుకున్న పీయూశ్.. ఆ తర్వాత ధోనిని నిలిపాడు. స్పిన్ విభాగంలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్‌లకు చోటిచ్చిన అతడు.. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్‌లను ఎంపిక చేసుకున్నాడు.దాదా, గంభీర్‌కు చోటు లేదుఅయితే, వరల్డ్‌కప్(2007, 2011) హీరో గౌతం గంభీర్, స్టార్ కెప్టెన్ సౌరవ్ గంగూలీలకు పీయూశ్ తన జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం. అంతేకాదు.. నంబర్ 3లో హిట్టయిన కోహ్లిని నాలుగో స్థానానికి ఎంచుకోవడం విశేషం. ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల పీయూశ్ చావ్లా ఐపీఎల్ రికార్డు మాత్రం ఘనంగా ఉంది. ఇప్పటి వరకు 192 మ్యాచ్‌లు ఆడి 192 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహించాడు.పీయూశ్ చావ్లా ఆల్‌టైమ్ వన్డే ప్లేయింగ్ ఎలెవన్సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్.చదవండి: పాకిస్తాన్‌లోనే చాంపియన్స్ ట్రోఫీ: ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ -
147 ఏళ్ల చరిత్రలో తొలిసారి: కోహ్లి మరో 58 రన్స్ చేశాడంటే!
భారత స్టార్ క్రికెటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత ముంగిట నిలిచాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం.. కోహ్లి మరో 58 పరుగులు సాధిస్తే చాలు..!! ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటారా?!..వన్డే శతక రారాజుఢిల్లీ బ్యాటర్ విరాట్ కోహ్లి 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. టీమిండియా తరఫున ఇప్పటి వరకు వన్డేల్లో 50, టెస్టుల్లో 29, టీ20లో ఒక శతకం బాదాడు. మొత్తంగా 80 సెంచరీలతో సచిన్ టెండుల్కర్(100 సెంచరీలు) తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, ఇప్పటికే వన్డేల్లో సచిన్ సెంచరీల(49) రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. యాభై ఓవర్ల ఫార్మాట్లో శతకాల రారాజుగా ఆవిర్భవించాడు.27 వేల పరుగుల మైలురాయికి చేరువలోఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి ఇప్పటికే టెస్టుల్లో 8848, వన్డేల్లో 13906, టీ20లలో 4188 పరుగులు సాధించాడు. మొత్తంగా తన ఖాతాలో 26,942 పరుగులు జమచేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్టులో మరో 58 రన్స్ చేశాడంటే.. కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 27 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ క్రమంలోనే సచిన్ టెండుల్కర్ వరల్డ్ రికార్డును అతడు బద్దలు కొట్టనున్నాడు.సచిన్ 623 ఇన్నింగ్స్‌లో సాధిస్తేకాగా సచిన్ ఖాతాలో 34,357 పరుగులు ఉన్నాయి. అయితే, ఇందులో 27 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు సచిన్ 623 ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. 226 టెస్టు, 396 వన్డే, ఒక టీ20 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని అతడు అందుకున్నాడు. తద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు.అదే జరిగితే.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా కోహ్లి పేరుఅయితే, విరాట్ కోహ్లి ఇప్పటికి 591 ఇన్నింగ్స్‌లోనే 26,942 పరుగులు చేశాడు. బంగ్లాతో సెప్టెంబరు 19న మొదలయ్యే తొలి టెస్టులో 58 పరుగులు చేశాడంటే.. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో అంతర్జాతీయ క్రికెట్లో 27 వేలు పరుగులు చేసిన క్రికెటర్‌గా సచిన్‌ను అధిగమిస్తాడు. కేవలం 592 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ నమోదు చేసి.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కుతాడు. అదీ సంగతి!కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య తొలుత రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనుంది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. టెస్టు, వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: IND vs BAN: భారత్‌తో టెస్టు సిరీస్.. బంగ్లా జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్ దూరం -
చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్
శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ పరుగుల వరద పారించాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రూట్ 75.00 సగటుతో 375 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు ఉన్నాయి. లంకతో సిరీస్‌ను 2-1తో ఇంగ్లండ్ సొంతం చేసుకోవడంలో జో కీలక పాత్ర పోషించాడు. కాగా సిరీస్ అసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో రూట్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. రూట్‌కు ఇది టెస్టుల్లో 6వ ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు కావడం విశేషం. దీంతో పలు అరుదైన రికార్డులను రూట్ తన పేరిట లిఖించుకున్నాడు.రూట్ సాధించిన రికార్డులు ఇవే..⇥టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక ప్లేయర్ ఆఫ్‌ది అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు దిగ్గజ ఆటగాళ్లు గ్రాహం గూచ్, ఆండ్రూ స్ట్రాస్, జేమ్స్ ఆండర్సన్‌ల పేరిట ఉండేది. వీరిముగ్గురూ 5 సార్లు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌లగా నిలిచారు. తాజా సిరీస్‌లో ఆరోసారి అవార్డు గెలుచుకున్న రూట్.. ఈ దిగ్గజ త్రయాన్ని అధిగమించాడు.⇥ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డులు సొంతం చేసుకున్న జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను రూట్ అధగమించాడు. సచిన్ తన టెస్టు కెరీర్లో 5 సార్లు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఈ జాబితాలో రూట్ దిగ్గజ క్రికెటర్లు మాల్కం మార్షల్, కర్ట్లీ ఆంబ్రోస్, స్టీవ్ వాలతో కలిసి సంయుక్తంగా ఆరో స్ధానంలో నిలిచాడు.చదవండి: AUS vs ENG: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ క్రికెట్ కీలక నిర్ణయం -
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్!
దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ రైజింగ్ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్. దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘బి’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. ఇండియా-‘ఏ’ జట్టుతో మ్యాచ్ సందర్భంగా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయగా వన్‌డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ పట్టుదలగా నిలబడ్డాడు.ఫోర్ల వర్షంమొత్తంగా 373 బంతులు ఎదుర్కొని 181 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. స్పిన్నర్ల బౌలింగ్‌లో దూకుడుగా ఆడుతూ ఈ మేర పరుగులు రాబట్టాడు. అయితే, చైనామన్ స్పి న్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ముషీర్ అవుట్ కావడం గమనార్హం.ఇక ముషీర్‌కు తోడు టెయిలెండర్ నవదీప్ సైనీ అర్ధ శతకం(144 బంతుల్లో 56)తో రాణించాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇండియా- ‘బి’ తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.సచిన్ రికార్డు బద్దలుకాగా జట్టును పటిష్ట స్థితిలో నిలపడంలో కీలక పాత్ర పోషించిన ముషీర్ ఖాన్.. ఈ మ్యాచ్ సందర్భంగా అరుదైన ఘనత సాధించాడు. టీనేజ్లోనే దులిప్ ట్రోఫీలో అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్‌ను ముషీర్ వెనక్కినెట్టాడు.కాగా 1991, జనవరిలో గువాహటి వేదికగా జరిగిన దులిప్ ట్రోఫీలో వెస్ట్ జోన్‌కు ప్రాతినిథ్యం వహించిన సచిన్.. ఈస్ట్‌జోన్‌తో మ్యాచ్‌లో 159 పరుగులు చేశాడు. తాజాగా.. పందొమిదేళ్ల ముషీర్ సచిన్‌ను అధిగమించాడు.అన్నను మించిపోతాడేమో!దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీర్ ఖాన్ టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్‌కు తోడబుట్టిన తమ్ముడు. మిడిలార్డర్లో రాణించగల సత్తా ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. గత రంజీ సీజన్లో ఓ ద్విశతకం బాదిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. ఓవరాల్‌గా 529 పరుగులు సాధించాడు. అంతేకాదు... అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలోనూ సత్తా చాటాడు. ఇప్పుడు దులిప్ ట్రోఫీలోనూ తనదైన మార్కు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు ముషీర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్నను మించిన తమ్ముడు అంటూ కొనియాడుతున్నారు.దులిప్ ట్రోఫీ అరంగేట్రంలో టీనేజ్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు19 ఏళ్ల వయసులో బాబా అపరాజిత్- 212 పరుగులు(2013లో)19 ఏళ్ల వయసులో యశ్ ధుల్- 193 పరుగులు(2022లో)19 ఏళ్ల వయసులో ముషీర్ ఖాన్- 181 పరుగులు(2024లో)18 ఏళ్ల వయసులో సచిన్ టెండుల్కర్-159 పరుగులు (1991లో).A 6⃣ that hits the roof & then caught in the deep!Kuldeep Yadav bounces back hard and a magnificent innings of 181(373) ends for Musheer Khan 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/OSJ2b6kmkk— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2024 -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆల్‌టైం రికార్డులు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్టుల్లో తన దూకుడును కొనసాగిస్తున్నాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న సెకెండ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ రూట్ సెంచరీలతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులతో సత్తాచాటిన రూట్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో చెలరేగాడు. 121 బంతులు ఎదుర్కొన్న అతడు 10 ఫోర్లు సాయంతో 103 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రూట్‌కు ఇది 34వ టెస్టు సెంచరీ. తద్వారా పలు అరుదైన రికార్డులను రూట్ తన ఖాతాలో వేసుకున్నాడు.రూట్ సాధించిన రికార్డులు ఇవే..→టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్‌గా రూట్ అవతరించాడు. గతంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ పేరిట ఉన్న అత్యధిక శతకాల (33) రికార్డును బ్రేక్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కుక్ రికార్డును సమం చేసిన రూట్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ సెంచరీతో అతడిని అధిగమించాడు.→ఈ సెంచరీతో అతడు మరో ముగ్గురు క్రికెటర్ల అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు. యూనిస్ ఖాన్, జయవర్దనే, సునీల్ గవాస్కర్, లారా రికార్డును సమం చేశాడు. వీరిందరూ టెస్టుల్లో 34 సెంచరీలు చేశారు. రూట్ మరో సెంచరీ సాధిస్తే ఈజాబితాలో ఆరో స్ధానంలో ఎగబాకుతాడు. ఇక టెస్టు అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్(51) అగ్రస్ధానంలో ఉన్నాడు.→ఒకే వేదికలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్‌గా రూట్ నిలిచాడు. రూట్ లార్డ్స్‌లో ఇప్పటివరకు 7 టెస్టు సెంచరీలు సెంచరీ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం గ్రాహం గూచ్ పేరిట ఉండేది. గూచ్ లార్డ్స్‌లో 6 సెంచరీలు చేశాడు. తాజా మ్యాచ్‌తో గూచ్ ఆల్‌టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు.→50 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ సెంచరీలు చేసిన 9వ క్రికెటర్‌గా రూట్ నిలిచాడు. రూట్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో అగ్రస్ధానంలో ఉన్నాడు.డేంజర్లో సచిన్ రికార్డు.. కాగా రూట్ జోరును చూస్తుంటే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బద్దలు కొట్టేలా ఉన్నాడు. సచిన్ తన టెస్టు కెరీర్లో 15,921 రన్స్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఈ జాబితాలో రూట్ 12377 పరుగులతో 7వ స్ధానంలో కొనసాగుతున్నాడు. కాగా రూట్ సచిన్‌కు కేవలం 3,544 పరుగుల దూరంలోనే ఉన్నాడు. సచిన్ 200 టెస్టులు ఆడి తన కెరీర్‌ను ముగించగా.. రూట్ ఇప్పటివరకు 145 టెస్టులు మాత్రమే ఆడాడు. అయితే 33 ఏళ్ల రూట్ ఫిట్నెస్ పరంగా కూడా మెరుగ్గా ఉండడంతో సచిన్ ఆల్‌టైమ్ టెస్టు రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. -
సచిన్ టెండుల్కర్‌ను కలిసిన మనూ భాకర్ (ఫొటోలు)
-
సచిన్, కోహ్లి కాదు!.. అత్యంత సంపన్న భారత క్రికెటర్ ఇతడే!
భారత్‌లో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల్లో క్రికెటర్లే అగ్రస్థానంలో ఉంటారు. వారిలోనూ టీమిండియా లెజెండరీ ఆటగాడు, వంద సెంచరీల వీరుడు సచిన్ టెండుల్కర్, దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. అటు ఆట ద్వారా.. ఇటు పలు ప్రఖ్యాత బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించడం ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ ముగ్గురు స్టార్లు ఒక్కొక్కొరు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని వినికిడి. మరి వీరికంటే ధనవంతుడైన భారత క్రికెటర్ మరొకరు ఉన్నారు. అతడి ఒక్కడి సంపాదనే వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. లక్షల కో ట్ల సంపదకు అతడు వారసుడు. బిజినెస్ టైకూన్ కుమారుడుదేశంలోనే.. కాదు కాదు.. బహుశా ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెటర్ అయిన అతడు మరెవరో కాదు ఆర్యమన్ విక్రమ్ బిర్లా. దిగ్గజ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడు. జూలై 9, 1997లో ముంబైలో జన్మించాడు. పుట్టుకతోనే రిచ్‌కిడ్ అయిన ఆర్యమన్.. క్రికెటర్‌గా తొలి అడుగులు వేశాడు. మధ్యప్రదేశ్ తరఫున 2017- 18లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన ఆర్యమన్.. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 9 మ్యాచ్‌లు ఆడి 414 పరుగులు సాధించాడు ఆర్యమన్ బిర్లా. రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన రాయల్స్ఇందులో ఓ శతకం, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఇక లిస్ట్-ఏ క్రికెట్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతడు 36 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆర్యమన్ బిర్లా.. 2018 ఐపీఎల్ వేలంలోకి రాగా.. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా 2019లోనే క్రికెట్‌కు కూడా దూరమయ్యాడు ఆర్యమన్. కుటుంబ వ్యాపారాలతో బిజీ అయ్యాడు. తన సోదరి అనన్య బిర్లాతో కలిసి ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ఓ కంపెనీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. సొంతంగా ముంబైలో ఓ క్లబ్ కూడా కలిగి ఉన్న ఆర్యమన్.. పెంపుడు జంతువు ఓ స్టోర్ కూడా నడుపుతున్నాడు.రెండు లక్షల కోట్లకు పైగా సంపదహురున్ విడుదల చేసిన దేశీయ అత్యంత ధనవంతులు జాబితాలో కుమార్ మంగళం బిర్లా చోటు దక్కించుకోవడంతో.. ఆర్యమన్ బిర్లా పేరు మరోసారి ఇలా తెరపైకి వచ్చింది. ఇక హురున్ రిచ్ లిస్టులో గౌతమ్ అదానీ 11.6 లక్షల కోట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ముకేశ్ అంబానీ 10.14 లక్షల కోట్ల నికర ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఆరోస్థానంలో ఉన్న కుమార్ మంగళం బిర్లా 2,35,200 కోట్ల నికర సంపద కలిగి ఉన్నారు. ఈ క్రమంలో ఆర్యమన్ నెట్‌వర్త్ డెబ్బై వేల కోట్లకు పైగానే ఉంటుందని వ్యాపారవర్గాలు అంటున్నాయి.చదవండి: క్రికెటర్ సంచలన నిర్ణయం.. 26 ఏళ్లకే ఆటకు వీడ్కోలు! -
వన్డే చరిత్రలో పది అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు..!
వన్డే చరిత్రలో పది అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల వివరాలను స్పోర్ట్స్ టుడే సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో మ్యాక్స్‌వెల్ ఆఫ్ఘనిస్తాన్పై చేసిన అజేయ డబుల్ సెంచరీకి (201) టాప్ ప్లేస్ లభించింది. 1983 వరల్డ్‌కప్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్ చేసిన 175 పరుగుల ఇన్నింగ్స్‌కు రెండో స్థానం దక్కింది. 1998లో షార్జాలో ఆస్ట్రేలియాపై సచిన్ టెండూల్కర్ ఆడిన 143 పరుగుల ఇన్నింగ్స్ మూడో స్థానం.. 1984లో ఇంగ్లండ్‌పై వివ్ రిచర్డ్స్ ఆడిన 189 పరుగుల ఇన్నింగ్స్‌కు నాలుగో స్థానం.. 2003 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్‌పై రికీ పాంటింగ్ ఆడిన 140 పరుగుల ఇన్నింగ్స్‌కు ఐదో స్థానం.. 1997లో భారత్‌పై సయీద్ అన్వర్ ఆడిన 194 పరుగుల ఇన్నింగ్స్‌కు ఆరో స్థానం.. 2023 వరల్డ్‌కప్‌లో భారత్‌పై ట్రవిస్ హెడ్ ఆడిన 137 పరుగుల ఇన్నింగ్స్‌కు ఏడో స్థానం.. 2012లో శ్రీలంకపై విరాట్ కోహ్లి ఆడిన 133 పరుగుల ఇన్నింగ్స్‌కు ఎనిమిదో స్థానం.. 2011 వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకపై గౌతమ్ గంభీర్ ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్‌కు తొమ్మిదో స్థానం.. 2014లో శ్రీలంకపై రోహిత్ ఆడిన 264 పరుగుల ఇన్నింగ్స్‌కు పదో స్థానం దక్కాయి. -
ముంబై : ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం (ఫొటోలు)
-
సచిన్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టేది అతడే: రిక్కీ పాంటింగ్
అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్ సచిన్ టెండుల్కర్. టెస్టుల్లో 15,921... వన్డేల్లో 18,426 పరుగులతో ఓవరాల్‌గా రెండు ఫార్మాట్లలోనూ ఈ టీమిండియా దిగ్గజం టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక సచిన్ సాధించిన సెంచరీల రికార్డుకు చేరువగా ఉన్న ఏకైక క్రికెటర్ టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి.ఇప్పటికే 80 శతకాలు బాదిన 35 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మరో 20 మార్లు వంద పరుగుల మార్కును అందుకుంటే సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేస్తాడు. అయితే, వన్డేల్లో ఇప్పటి వరకు 13,906 పరుగులు సాధించి.. టాప్ స్కోరర్ల జాబితాలో ఉన్న కోహ్లి టెస్టు ఖాతాలో 8848 పరుగులు మాత్రమే ఉన్నాయి.ఈ నేపథ్యంలో వన్డే కింగ్ అయిన కోహ్లి టెస్టుల్లో మాత్రం సచిన్‌ను అందుకోవడం కష్టమే అంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్. టెస్టుల్లో సచిన్ టెండుల్కర్ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టగల సత్తా ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్‌కు ఉందని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లిష్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రూట్ ప్రస్తుతం బెన్‌స్టోక్స్ సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.అప్పట్లో ఫామ్‌లేమితో సతమతమైన 33 ఏళ్ల ఈ రైట్‌హ్యాండర్.. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో 32వ సెంచరీ సాధించిన రూట్.. 12 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘ఇంకో నాలుగేళ్ల పాటు రూట్ టెస్టుల్లో కొనసాగితే కచ్చితంగా ఇది సాధ్యమవుతుంది.అయివతే, ఇంగ్లండ్ ఏడాదికి ఎన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడుతుందన్న అంశం మీదే అతడి గణాంకాలు ఆధారపడి ఉంటాయి. ఏడాదికి కనీసం 14 మ్యాచ్‌లు ఆడటం సహా అందులో సంవత్సరానికి రూట్ 800 నుంచి వెయ్యి పరుగుల చొప్పున సాధిస్తే అతడు సచిన్ రికార్డు బ్రేక్ చేయడం సాధ్యమే.అయితే, 37 ఏళ్ల వయసులోనూ అతడు పరుగుల దాహంతో ఉంటేనే.. అది కూడా రోజురోజుకు తన ఆటను మరింత మెరుగుపరచుకుని.. నిలకడగా రాణిస్తేనే రూట్‌కు ఈ అవకాశం ఉంటుంది. నాలుగేళ్ల క్రితం కనీసం యాభై పరుగుల మార్కు అందుకోవడానికి కష్టాలు పడ్డ రూట్.. ఇప్పుడు తన శైలిని మార్చేశాడు. అందుకే మరో నాలుగేళ్లపాటు అతడు ఇలాగే కొనసాగితే.. కచ్చితంగా టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరిస్తాడు’’ అని రిక్కీ పాంటింగ్ అంచనా వేశాడు. ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ సైతం గతంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా టెస్టుల్లో ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్ టెస్టుల్లో 13,378 పరుగులు సాధించి.. సచిన్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ జాబితాలో సౌతాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కలిస్(13,289), టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్(13,288), ఇంగ్లండ్ మాజీ సారథి అలిస్టర్ కుక్(12,472), శ్రీలంక లెజెండరీ వికెట్ కీపర్ కుమార్ సంగక్కర(12, 400) తర్వాత ఏడో స్థానంలో రూట్(12,027) ఉన్నాడు. -
పదిహేడేళ్ల వయసులో తొలి శతకం.. సచిన్‌కు సాటెవ్వరు!
పదిహేడేళ్ల వయసులో.. సరిగ్గా ఇదే రోజు ఓ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి శతకం నమోదు చేశాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. తన అసాధారణ ప్రతిభతో వాటన్నింటిని దాటుకుని.. శతక శతకాల ధీరుడిగా ప్రపంచంలో ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని ఘనత సాధించాడు. అతడే.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్.టీమిండియా తరఫున 1989లో పాకిస్తాన్‌తో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సచిన్.. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే, మొదటి 15 మ్యాచ్‌లలో ఒక్క శతకం కూడా సాధించలేకపోయిన ఈ ముంబై బ్యాటర్.. 1990లో ఇంగ్లండ్ గడ్డ మీద తన సెంచరీల ప్రయాణానికి నాంది పలికాడు.మాంచెస్టర్‌లో సెంచరీల ప్రయాణానికి నాందిమాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో సచిన్ శతకంతో మెరిశాడు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 189 బంతులు ఎదుర్కొని 119 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. భారత్ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితం ఎలా ఉన్నా సచిన్ కెరీర్లో ఈ మ్యాచ్ మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.వందో సెంచరీ అక్కడేనాడు ఇంగ్లండ్ మీద తొలి సెంచరీ చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆసియా 2012 వన్డే కప్ సందర్భంగా బంగ్లాదేశ్ మీద మీర్పూర్ వేదికగా వందో శతకం బాదాడు. మొత్తంగా టీమిండియా తరఫున 200 టెస్టులు ఆడిన సచిన్ టెండుల్కర్.. 51 శతకాలు, 68 అర్ధ శతకాల సాయంతో 15921 పరుగులు సాధించాడు.ఎవరికీ అందనంత ఎత్తులోఅదే విధంగా.. 463 వన్డేల్లో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు చేసి 18426 పరుగులు స్కోరు చేశాడు. ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20 ఆడిన సచిన్ ఖాతాలో 10 పరుగులు ఉన్నాయి. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో 664 మ్యాచ్‌లు ఆడి 34,357 పరుగులు స్కోరు చేసి.. అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. వంద శతకాలు ఖాతాలో ఉన్నా మొదటి సెంచరీ మాత్రం ఎల్లప్పుడూ ప్రత్యేకమే కదా!! -
వినేశకు రజతం ఇవ్వాలి: సచిన్ టెండూల్కర్
-
తన ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన వినోద్ కాంబ్లీ
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన ఆరోగ్యానికి సంబంధించి అప్డేట్ అందించాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని.. దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉందని తెలిపాడు. కాగా ముంబైకి చెందిన వినోద్ కాంబ్లీ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు చిన్ననాటి స్నేహితుడన్న విషయం తెలిసిందే.వీరిద్దరు కలిసి దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. టీమిండియాకు కూడా కలిసే ఆడారు. అయితే, సచిన్ అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకుని భారత క్రికెట్ ఐకాన్‌గా మారగా.. వినోద్ కాంబ్లీ మాత్రం అనతికాలంలోనే కనుమరుగైపోయాడు. కెరీర్పరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.ఈ క్రమంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు అతడిని చుట్టుముట్టాయి. ఇందుకు అతడి క్రమశిక్షణరాహిత్యమే కారణమని వినోద్ కాంబ్లీ సన్నిహిత వర్గాలు గతంలో వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల కాంబ్లీకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. అందులో.. నడవడానికి కూడా శక్తి లేని కాంబ్లీ.. ఇతరుల ఆసరాతో ఓ షాపులోకి వెళ్లినట్లు కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు.. ఈ మాజీ క్రికెటర్‌కు సహాయం అందించాలంటూ సచిన్‌తో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేశారు. అయితే, అది పాత వీడియో అని తాజాగా తేలింది. ఈ వీడియో చూసిన తర్వాత.. తాము వినోద్ కాంబ్లీ ఇంటికి వెళ్లామని.. అతడి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని అతడి స్కూల్‌మేట్ రిక్కీ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అంపైర్ మార్కస్ తెలిపారు. నేనింకా ఫిట్‌గానే ఉన్నానుఈ క్రమంలో వినోద్ కాంబ్లీ సైతం.. ‘‘దేవుడి దయ వల్ల నేనింకా ఫిట్‌గానే ఉన్నాను. ఇప్పటికీ మైదానంలో దిగి బ్యాటింగ్ చేయగల సత్తా నాకు ఉంది’’ అని నవ్వుతూ థంబ్స్‌అప్ సింబల్ చూపించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, బక్కచిక్కినట్లు కనిపిస్తున్న వినోద్ కాంబ్లీని చూసి అతడి అభిమానులు ఉద్వేగానికి లోనవుతున్నారు. అతడికి వైద్య సహాయం అవసరముందని తెలిసిపోతుందని.. దయచేసి తనను ఆదుకోవాలని మరోసారి సచిన్ టెండుల్కర్‌కు మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నారు. కాగా 1993- 2000 మధ్య కాలంలో వినోద్ కాంబ్లీ అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 17 టెస్టులు, 104 వన్డే మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 1084, 2477 పరుగులు సాధించాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్.ఇక 2000 సంవత్సరంలో టీమిండియా తరఫున చివరి వన్డే ఆడిన వినోద్ కాంబ్లీ.. 2004లో మధ్యప్రదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ముంబైకి చివరగా ఆడాడు. కాగా 2013లో వినోద్ కాంబ్లీకి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆ మరుసటి ఏడాదే ఆంజియోప్లాస్టీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో కాంబ్లీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమైనట్లు తెలుస్తోంది.@sachin_rt : plz watch #VinodKambli. Really looks in a bad shape and is in need of urgent medical help. I know you have done a lot for him but i will request you to keep your grievances aside and take up his guardianship till he gets better. Thanks 🙏pic.twitter.com/a4CbGNNhIB— Rahul Ekbote ☝️ (@rekbote01) August 9, 2024 -
వినేశ్‌కు రజతం ఇవ్వాలి: సచిన్ టెండూల్కర్
పారిస్ ఒలింపిక్స్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రజత పతకానికి అర్హురాలేనని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. మహిళల 50 కేజీల విభాగంలో వరస విజయాలతో ఫైనల్‌కు చేరిన ఫొగాట్.. వంద గ్రాములు అదనపు బరువు కారణంగా పతకానికి దూరమై రెజ్లింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలికింది.ఈ నేపథ్యంలో సచిన్ సోషల్ మీడియాలో స్పందించాడు. ‘ప్రతి ఆటలో నిబంధనలు ఉంటాయి. వాటిని సందర్భానుసారంగా చూడాలి. అవసరమైతే మార్పులు చేయాలి. వినేశ్ చక్కటి ఆటతీరుతో ఫైనల్‌కు చేరింది. తుదిపోరుకు ముందు అదనపు బరువు కారణంగా అనర్హత వేటు పడి రజత పతకానికీ దూరమైంది. దీనికి సరైన కారణం కనిపించడం లేదు. ఇందులో క్రీడా స్ఫూర్తి లోపించినట్లే’ అని సచిన్ ఎక్స్‌లో పేర్కొన్నాడు. డ్రగ్స్ వంటి అనైతిక చర్యలతో అనర్హతకు గురై ఉంటే చివరి స్థానం ఇవ్వడం సబబే అని.. కానీ వినేశ్ న్యాయంగా పోరాడి ఫైనల్‌కు చేరిందని సచిన్ గుర్తు చేసుకున్నాడు. ఫొగాట్ రజత పతకానికి అర్హురాలే అని.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (సీఏఎస్) తీర్పు తర్వాత అయినా వినేశ్‌కు పతకం వస్తుందని ఆశిస్తున్నట్లు సచిన్ ‘ఎక్స్’లో పేర్కొన్నాడు. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
శ్రీలంకతో వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం కొలంబో వేదికగా లంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో హిట్‌మ్యాన్ 64 పరుగులు చేశాడు.ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన భారత ఓపెనర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. రోహిత్ ఇప్పటివరకు 121 సార్లు 50 ప్లస్ పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ తన అంతర్జాతీయ కెరీర్లో భారత ఓపెనర్‌గా 120 సార్లు 50కిపైగా స్కోర్లు నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో సచిన్ ఆల్‌టైమ్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో హిట్‌మ్యాన్ ఆరో స్ధానంలో నిలిచాడు. తొలి స్ధానంలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(146 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు) అగ్రస్ధానంలో ఉన్నాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్లు 1. డేవిడ్ వార్నర్ - 146 (374 మ్యాచ్‌లు)2. క్రిస్ గేల్ - 144 (441 మ్యాచ్‌లు)3. సనత్ జయసూర్య - 136 (: 506 మ్యాచ్‌లు)4. డెస్మండ్ హేన్స్ - 131 ( 354 మ్యాచ్‌లు)5. గ్రేమ్ స్మిత్ - 125 (342 మ్యాచ్‌లు)6. రోహిత్ శర్మ - 121 (334 మ్యాచ్‌లు)ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఈ ముంబైకర్ అధిగమించాడు. ధోనీ మొత్తం 10,773 సాధించగా.. రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో 10,831 చేరాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ధోనిని వెనక్కి నెట్టి ఐదో స్ధానానికి హిట్‌మ్యాన్ చేరుకున్నాడు. -
బ్లాక్ డ్రెస్‌లో సచిన్- అంజలి గారాలపట్టి హొయలు (ఫొటోలు)
-
వన్డే ప్రపంచకప్ ఆల్‌టైమ్ అత్యుత్తమ జట్టు.. కోహ్లికి నో ఛాన్స్!
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ 2012లో అంతర్జాతీయ క్రికెట్లో వందో సెంచరీ కొట్టి.. శతక శతకాల ధీరుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. సమకాలీన క్రికెటర్లు ఎవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేసి.. శిఖరాగ్రాన నిలిచాడు. వన్డేల్లో 49, టెస్టుల్లో 51 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డు బద్దలయ్యే అవకాశమే లేదని భావిస్తున్న తరుణంలో.. విరాట్ కోహ్లి అనే కుర్రాడు తెరమీదకు వచ్చాడు.ఇప్పటికే వన్డేల్లో 50 శతకాలు బాదిన ఈ రన్‌మెషీన్.. సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు. టెస్టుల్లో 29, టీ20లలో ఒక సెంచరీ బాది.. ఆల్‌టైమ్ రికార్డుకు ఎసరుపెట్టాడు. 35 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌కు మారుపేరుగా కొనసాగుతున్న కోహ్లి వరల్డ్‌కప్ టోర్నీల్లోనూ సత్తా చాటుతున్నాడు. వన్డే రారాజుగా కొనసాగుతున్నాడు. అయితే, ఇలాంటి రికార్డుల వీరుడికి తన ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ వన్డే వరల్డ్‌కప్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు లేదంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ మాథ్యూ హెడెన్.భారత్ నుంచి ఇద్దరు లెజెండ్స్ మాత్రమే ఈ టీమ్‌లో స్థానం సంపాదించడానికి అర్హులు అన్నట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ జట్టులో ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా నలుగురిని ఎంపిక చేసుకున్న ఈ కంగారూ బ్యాటర్.. పాకిస్తాన్ నుంచి ఇద్దరి చోటు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి శ్రీలంకతో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. గౌతం గంభీర్ గైడెన్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.మాథ్యూ హెడెన్ ఎంచుకున్న గ్రేటెస్ట్ వన్డే వరల్డ్‌కప్ ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ఆడం గిల్‌క్రిస్ట్(ఆస్ట్రేలియా), వీరేంద్ర సెహ్వాగ్(ఇండియా), రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా- కెప్టెన్), సచిన్ టెండుల్కర్(ఇండియా), బ్రియన్ లారా(వెస్టిండీస్), జాక్వెస్ కలిస్(సౌతాఫ్రికా), వకాన్ యూనిస్(పాకిస్తాన్), వసీం అక్రం(పాకిస్తాన్), షేన్ వార్న్(ఆస్ట్రేలియా), ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక), గ్లెన్ మెగ్రాత్(ఆస్ట్రేలియా).చదవండి: SA20 2025: సౌతాఫ్రికా కెప్టెన్‌కు షాకిచ్చిన సన్‌రైజర్స్.. జట్టు నుంచి ఔట్ -
‘వాళ్లు ఆడుతుంటే గంగూలీ- సచిన్ గుర్తుకువస్తారు’
టీమిండియా టీ20 కొత్త ఓపెనింగ్ జోడీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ జంటను చూస్తుంటే తనకు సౌరవ్ గంగూలీ- సచిన్ టెండుల్కర్ గుర్తుకువస్తున్నారని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ఐసీసీ టోర్నీల్లో రోహిత్- విరాట్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఫలితంగా.. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ప్రపంచకప్ ప్రధాన జట్టుకు ఎంపికైనా బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు.. భవిష్య కెప్టెన్ శుబ్‌మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్లలో ఒకడిగా జట్టుతో ప్రయాణించాడు. అయితే, దిగ్గజ బ్యాటర్లు కోహ్లి- రోహిత్ రిటైర్మెంట్ తర్వాత పొట్టి ఫార్మాట్లో యశస్వి- గిల్ జోడీ ఓపెనింగ్‌కు వస్తున్నారు.వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత భారత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లగా.. శుబ్‌మన్ గిల్ తొలిసారిగా టీమిండియా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో గెలిచాడు. ఈ టూర్లో యశస్వి- గిల్ ఎక్కువసార్లు ఓపెనింగ్ చేశారు. తాజాగా శ్రీలంక పర్యటనలోనూ వీరే టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించారు.టీమిండియా లంకతో టీ20 సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. యశస్వి- గిల్ జోడీని గంగూలీ- సచిన్‌లతో పోల్చాడు.వాళ్లు ఆడుతుంటే గంగూలీ- సచిన్ గుర్తుకువస్తారు‘‘వీళ్లిద్దరిని చూస్తే నాకు సౌరవ్ గంగూలీ- సచిన్ టెండుల్కర్ గుర్తుకువస్తారు. వాళ్లిద్దరు ఎలా పరస్పరం అవగాహనతో ఆడేవారో.. వీరూ అలాగే చేస్తారు. తమవైన వ్యూహాలు అమలు చేస్తూనే.. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పుతారు. వీళ్లిద్దరు కలిసి బ్యాటింగ్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. ఇక జైస్వాల్ గురించి చెప్పాలంటే.. త్వరలోనే అతడు వన్డేల్లో కూడా ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలడు.టెస్టు, టీ20 క్రికెట్లో ఇప్పటికే టీమిండియా తరఫున తానేంటో నిరూపించుకున్నాడు. వన్డేల్లోనూ రాణించగలడు. పరుగులు చేయడమే పరమావధిగా ముందుకు సాగుతున్న అతడికి ఇదేమీ అసాధ్యం కాదు’’ అని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కాగా యశస్వి గంగూలీ మాదిరే ఎడమచేతి వాటం బ్యాటర్ కాగా.. గిల్ సచిన్‌లా రైట్‌హ్యాండ్ బ్యాటర్. -
రూట్.. సచిన్ రికార్డును బద్దలు కొడతాడు..!
ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ తాజాగా విండీస్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సూపర్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో (32) రూట్ ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి, ఓవరాల్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 11వ స్థానానికి, టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎనిమిదో స్థానానికి (11940) ఎగబాకాడు.టెస్ట్‌ల్లో 32 సెంచరీలు పూర్తి చేసిన అనంతరం రూట్‌పై ఆ దేశ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. రూట్ అతి త్వరలో ఇంగ్లండ్ లీడింగ్ టెస్ట్ రన్ స్కోరర్‌గా అవతరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. త్వరలో రూట్ సచిన్ పేరిట ఉన్న అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డును కూడా సవరిస్తాడని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం రూట్ వయసు 33 ఏళ్లే అని.. మరో రెండు,మూడేళ్లలో సచిన్ రికార్డు బద్దలు కావడం ఖాయమని జోస్యం చెప్పాడు.కాగా, రూట్ ప్రస్తుతం అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, స్టీవ్ వాలతో కలిసి సంయుక్తంగా 11వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (51) అగ్రస్థానంలో ఉండగా.. కలిస్ (45), పాంటింగ్ (41), సంగక్కర (38), ద్రవిడ్ (36), యూనిస్ ఖాన్ (34), గవాస్కర్ (34), లారా (34), జయవర్దనే (34), కుక్ (33) రూట్ కంటే ముందున్నారు. రూట్ మరో సెంచరీ చేస్తే.. తన దేశ అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్ అలిస్టర్ కుక్ రికార్డును సమం చేస్తాడు.అలాగే రూట్ మరో 54 పరుగులు చేస్తే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రియాన్ లారాను (11953) అధిగమించి ఏడో స్థానానికి ఎగబాకుతాడు. ఈ జాబితాలో సచిన్ (15921) టాప్‌లో ఉండగా.. పాంటింగ్ (13378), కలిస్ (13289), ద్రవిడ్ (13288), కుక్ (12472), సంగక్కర (12400), లారా మాత్రమే రూట్ కంటే ముందున్నారు. జులై 26 నుంచి విండీస్‌తో జరుగబోయే చివరి టెస్ట్‌లో రూట్ పై పేర్కొన్న వాటిలో కొన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. -
టెస్టుల్లో సచిన్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: వాన్
నాటింగ్‌హామ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 122 పరుగులు చేసిన రూట్.. ఇంగ్లండ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. రూట్‌కు ఇది 32వ టెస్టు సెంంచరీ కావడం విశేషం.ఈ నేపథ్యంలో రూట్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును రూట్ బ్రేక్ చేస్తాడని వాన్ అభిప్రాయపడ్డాడు."జో రూట్ మరి కొద్ది రోజుల్లోనే టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. అంతేకాదు టెస్టు క్రికెట్ హిస్టరీలో లీడింగ్ రన్‌స్కోరర్ అయిన సచిన్ టెండూల్కర్‌ను కూడా అధిగమించే సత్తా రూట్‌కు ఉంది. ఇప్పటికే సచిన్ రికార్డుకు రూట్ చేరవయ్యే వాడు. కానీ ఆ మధ్య కాలంలో రూట్ తన ఫామ్‌ను కోల్పోయి కాస్త ఇబ్బంది పడ్డాడు. నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ తన వికెట్‌ను కోల్పోయేవాడు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం అతడు అద్భుతంగా ఆడాడు. ఇప్పుడు మాత్రం అతడు తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. దూకుడుగా ఆడుతున్నాడు. ఇదే కొనసాగితే సచిన్ రికార్డును రూట్ బ్రేక్ చేసే అవకాశముందని" ది టెలిగ్రాఫ్ కోసం తన కాలమ్‌లో వాన్ రాసుకొచ్చాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రూట్ ప్రస్తుతం 8వ స్ధానంలో కొనసాగుతున్నాడు.260 ఇన్నింగ్స్‌లలో రూట్ ఇప్పటివరకు 11,940 పరుగులు చేశాడు. కాగా సచిన్ 329 టెస్టు ఇన్నింగ్స్‌లలో 15921 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. సచిన్ తర్వాతి స్ధానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(13378) ఉన్నాడు. -
సచిన్ టెండుల్కర్ కుటుంబం.. కొత్త ఫొటోలు చూశారా?
-
సచిన్, నేనూ కాదు.. అత్యుత్తమ క్రికెటర్ అతడే: లారా
క్రికెట్ ప్రపంచంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారా రికార్డుల రారాజులుగా వెలుగొందారు. తమ తరంలోని ఆటగాళ్లకు సాధ్యం కాని అరుదైన ఘనతలెన్నో సాధించారు.అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాల వీరుడిగా సచిన్ చెక్కు చెదరని రికార్డుని సొంతం చేసుకుంటే.. టెస్టుల్లో క్వాడ్రపుల్ సెంచరీ(400) బాది రికార్డుల్లో తన పేరును పదిలం చేసుకున్నాడు లారా.ఇక ఈ ఇద్దరు దిగ్గజాలు పరస్పరం గౌరవ, మర్యాదలతో మెలగడమే కాకుండా చిరకాల స్నేహితులుగా కూడా కొనసాగుతున్నారు. సందర్భం వచ్చినపుడల్లా సచిన్‌పై ప్రశంసలు కురిపించే బ్రియన్ లారా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తామిద్దరి కంటే కూడా అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు వేరొకరు ఉన్నారంటూ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. లారా చెప్పిన క్రికెటర్ మరెవరో కాదు ఆల్‌రౌండర్ కార్ల్ హూపర్. విండీస్ మాజీ కెప్టెన్.ఈ విషయం గురించి తన పుస్తకంలో ప్రస్తావించిన లారా.. ‘‘కార్ల్ వంటి అత్యుత్తమ ఆటగాడిని నేను ఇంత వరకు చూడలేదు. టెండుల్కర్ గానీ, నేను గానీ ప్రతిభ విషయంలో అతడికి దరిదాపుల్లో కూడా లేమంటే అతిశయోక్తి కాదు.కెప్టెన్‌గానూ కార్ల్ కెరీర్ ఎంతో మెరుగ్గా ఉంది. సారథిగా ఉన్న సమయంలోనూ సగటున 50కి పైగా పరుగులు సాధించాడు. నిజానికి వివియన్ రిచర్ట్స్కి నాకంటే కూడా కార్ల్ అంటేనే ఎక్కువ ఇష్టం.అతడి ఆటను ఇష్టపడేవాడు. తనపైనే ప్రేమను కురిపించేవాడు’’ అని పేర్కొన్నాడు. కాగా 1987- 2003 మధ్య కాలంలో వెస్టిండీస్‌కు ప్రాతినిథ్యం వహించాడు కార్ల్ హూపర్.కుడిచేతి వాటం కలిగిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. కెరీర్లో మొత్తంగా 102 టెస్టులు ఆడిన హూపర్ 5762 పరుగులు సాధించాడు. ఇందులో 13 శతకాలతో పాటు ఒక డబుల్ సెంచరీ ఉంది. ఇక 114 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక 227 వన్డేల్లో ఏడు సెంచరీల సాయంతో 5761 రన్స్ చేసిన కార్ల్ హూపర్.. 193 వికెట్లు పడగొట్టాడు. కాగా 1999 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు రిటైర్మెంట్ ప్రకటించిన హూపర్.. 2001లో కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం. 22 టెస్టుల్లో విండీస్‌కు అతడు సారథిగా వ్యవహరించాడు.కెప్టెన్ కాకముందు హూపర్ బ్యాటింగ్ సగటు 36.46గా ఉంటే.. నాయకుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత 46కు పైగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే లారా హూపర్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. -
కోహ్లి, రోహిత్, ధోని కాదు.. ప్రపంచంలో వాళ్లే టాప్ బ్యాటర్స్: భజ్జీ
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ విజేతగా ఇండియా ఛాంపియన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో భారత క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ది కీలక పాత్ర. టోర్నీ ఆసాంతం తన స్పిన్ మయాజాలం ప్రదర్శించిన భజ్జీ.. ఇండియాకు తొట్ట తొలి టైటిల్‌ను అందించాడు.అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్భజన్కు ఓ మహిళా ప్రేజేంటర్ నుంచి ఓ అనూహ్య ప్రశ్న ఎదురైంది. వరల్డ్ క్రికెట్లో టాప్ త్రీ బ్యాటర్లను ఎంచుకోమని ఆమె భజ్జీని ప్రశ్నించింది. ఈ క్రమంలో హార్భజన్ ప్రస్తుతం తరంలోని ఒక్క క్రికెటర్‌కు కూడా తన టాప్ త్రీలో చోటు ఇవ్వలేదు.భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కల్లిస్‌ను తన వరల్డ్ టాప్ త్రీ బ్యాటర్లగా భజ్జీ ఎంచుకున్నాడు. అయితే భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు భారత్‌కు రెండు వరల్డ్‌కప్ టైటిల్స్‌ను అందించిన ధోనిని కూడా హార్భజన్ ఎంపిక చేయకపోవడం గమనార్హం.మరో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా తన టాప్-3 బ్యాటర్లలో విరాట్ కోహ్లి, రోహిత్ , ధోనిలకు చోటు ఇవ్వలేదు. అతడు కూడా సర్ వివియన్ రిచర్డ్స్, టెండూల్కర్, లారాలను తన టాప్-3 బ్యాటర్లగా ఎంచుకున్నాడు. View this post on Instagram A post shared by Shefali Bagga (@shefalibaggaofficial) -
Yuvraj Singhs all-time playing XI: యువరాజ్ బెస్ట్ టీమ్ ఇదే.. ధోనికి నో ఛాన్స్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 అరంగేట్ర ఎడిషన్ విజేతగా ఇండియా ఛాంపియన్స్ నిలిచింది. వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు.. ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఛాంపియన్స్‌ను ఓడించింది. ఈ టోర్నీలో కెప్టెన్ యువరాజ్ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.నాయకుడుగా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా ఆటగాడిగా యువీ రాణించాడు. కీలక సెమీస్‌లో సత్తాచాటి ఇండియాను ఫైనల్‌కు చేర్చాడు. అదేవిధంగా ఫైనల్లో కూడా 12 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఈ ఫైనల్లో విజయనంతరం యువరాజ్ సింగ్ తన ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు.తన అత్యుత్తుమ ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు మాత్రమే యువీ ఛాన్స్ ఇచ్చాడు. అయితే భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి యువరాజ్ చోటు ఇవ్వకపోవడం అందరని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక యువ ఎంచుకున్న జట్టులో కోహ్లి, రోహిత్, సచిన్‌తో పాటు దిగ్గజ క్రికెటర్లు ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, మెక్‌గ్రాత్, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్‌లకు చోటు దక్కింది.యువరాజ్ ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, మెక్‌గ్రాత్, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్. pic.twitter.com/Fim1k9uvBL— Out Of Context Cricket (@GemsOfCricket) July 13, 2024 -
రోహిత్‌కు రూ. 5 కోట్లు.. మూడు టైటిళ్ల ధోనికి ఎంత? కపిల్ డెవిల్స్ పాపం!
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలవడంతో భారత్ ఖాతాలో ఐదో ఐసీసీ ట్రోఫీ చేరింది. ఈ మెగా టోర్నీ ముగిసి వారం రోజులు దాటినా ఆ గెలుపు తాలుకా సంబరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో రోహిత్ సేనకు బీసీసీఐ అందించిన రూ. 125 కోట్ల భారీ నజరానా ప్రత్యేకంగా హైలైట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన పంపకాల గురించి కూడా నెట్టింట చర్చ జరుగుతోంది. ఆటగాళ్లకు రూ. 5 కోట్ల మేర అందించడం అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ క్రమంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ సాధించిన ధోని సేనకు బోర్డు ఎంత క్యాష్ రివార్డు ప్రకటించింది? ఎవరెవరికి ఎంత మొత్తం దక్కిందన్న అంశంపై ఆరా తీస్తున్నారు నెటిజన్లు. మరి ఆ వివరాలు చూద్దామా?పొట్టి కప్ మొదటగా మనకే2007లో టీమిండియా తొలిసారి పొట్టి వరల్డ్‌కప్ గెలిచింది. ధోని సారథ్యంలో తొట్ట తొలి టీ20 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. నాడు జట్టు మొత్తానికి కలిపి బీసీసీఐ 12 కోట్ల రూపాయల రివార్డు ప్రకటించింది.సొంత గడ్డపై వన్డే ప్రపంచకప్ఇక సొంతగడ్డపై 2011లో ధోని సేన మరోసారి మ్యాజిక్ చేసింది. ప్రఖ్యాత వాంఖడే మైదానంలో జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి.. వన్డే వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. ఆనాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలుత.. జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ. కోటి మేర క్యాష్ రివార్డు అందిస్తామని తెలిపింది.అయితే, అనంతరం దీనిని రూ. 2 కోట్లకు పెంచింది. అదే విధంగా.. సహాయక సిబ్బందికి రూ. 50 లక్షలు, సెలక్టర్లకు రూ. 25 లక్షల చొప్పున క్యాష్ రివార్డు అందించింది.చాంపియన్స్ ట్రోఫీ విజేతలకు ఎంతంటే?2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులోని ఆటగాళ్లకు బీసీసీఐ రూ. కోటి చొప్పున నజరానా అందించింది. అదే విధంగా సహాయక సిబ్బందికి రూ. 30 లక్షల మేర కానుకగా ఇచ్చింది.మరి మొట్టమొదటి వరల్డ్‌కప్ గెలిచిన కపిల్స్ డెవిల్స్‌కు ఎంత?1983లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ దేవ్ సేన ఏకంగా వన్డే వరల్డ్‌కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. అయితే, అప్పటికే క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేకపోవడం.. బీసీసీఐ వద్ద కూడా తగినన్ని నిధులు లేక సంబరాలు కూడా సాదాసీదాగా జరిగాయి.నాడు ఒక్కో ఆటగాడికి కేవలం పాతికవేలు మాత్రమే బీసీసీఐ రివార్డుగా ఇచ్చినట్లు సమాచారం. అయితే, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తన మ్యూజిక్ కన్సర్ట్ ద్వారా నిధులు సమీకరించడంతో ఈ మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టుమహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), యువరాజ్ సింగ్ (వైస్ కెప్టెన్), అజిత్ అగార్కర్, పీయూష్ చావ్లా, గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, జోగిందర్ శర్మ, దినేశ్ కార్తీక్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఆర్పీ సింగ్, ఎస్. శ్రీశాంత్, రాబిన్ ఉతప్ప.2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టుమహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, శ్రీశాంత్, ఆశిష్ నెహ్రా, రవిచంద్రన్ అశ్విన్, పీయూష్ చావ్లా, యూసుఫ్ పఠాన్.2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు:మహేంద్ర సింగ్ ధోనీ(కెప్టెన్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లి, భువనేశ్వర్ కుమార్, వినయ్ కుమార్, అమిత్ మిశ్రా, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ, మురళీ విజయ్, ఉమేశ్ యాదవ్.1983 వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియాకపిల్ దేవ్(కెప్టెన్), మొహిందర్ అమర్నాథ్(వైస్ కెప్టెన్), కీర్తి ఆజాద్, రోజర్ బిన్నీ, సునిల్ గావస్కర్, సయ్యద్ కిర్మాణీ(వికెట్ కీపర్), మదన్ లాల్, సందీప్ పాటిల్, బల్విందర్ సంధు, యశ్పాల్ శర్మ, రవి శాస్త్రి, క్రిష్ణమాచారి శ్రీకాంత్, సునిల్ వాల్సన్, దిలిప్ వెంగ్‌సర్కార్. -
వరల్డ్‌కప్‌లో టీమిండియా సరికొత్త చరిత్ర.. సచిన్ ట్వీట్ వైరల్
పాకిస్తాన్‌పై అజేయ చరిత్రను కొనసాగిస్తూ టీమిండియా మరోసారి ఐసీసీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థిపై ఆధిపత్యం చాటుకుంది. టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది.వరల్డ్‌కప్‌లో టీమిండియా సరికొత్త చరిత్రతద్వారా టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు పాకిస్తాన్‌పై ఏడుసార్లు గెలుపొంది ఈ ఘనత తన పేరిట లిఖించుకుంది.ఇక దాయాది పాక్‌పై భారత్ విజయంలో ఈసారి బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా.. మూడు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.మరోవైపు పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం రెండు వికెట్లతో రాణించగా.. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టి పాకిస్తాన్‌ను ఆలౌట్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు.ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ విజయం పట్ల టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ హర్షం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా రోహిత్ సేనపై.. ముఖ్యంగా బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్!‘‘ఇండియా వర్సెస్ పాకిస్తాన్. కొత్త ఖండం.. అయినా అదే ఫలితం. టీ20 ఫార్మాట్ అనేది బ్యాటర్ల గేమ్.. అయితే, న్యూయార్క్‌లో మాత్రం బౌలర్లు కనువిందు చేశారు.ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్! అమెరికాలో అద్భుత వాతావరణంలో అత్యద్భుతంగా మన ఆట తీరును చూపించారు. బాగా ఆడారు.. టీమిండియాదే విజయం’’ అని సచిన్ టెండుల్కర్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపాడు.ఈ క్రమంలో సచిన్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు సైతం భారత జట్టును అభినందించారు. ఇదొక ప్రత్యేకమైన విజయమని ఆటగాళ్లను కొనియాడారు.ఇండియా వర్సెస్ పాకిస్తాన్👉వేదిక: నసావూ ఇంటర్నేషనల్ స్టేడియం, న్యూయార్క్👉టాస్: పాకిస్తాన్.. తొలుత బౌలింగ్👉టీమిండియా స్కోరు: 119 (19)👉పాకిస్తాన్ స్కోరు: 113/7 (20)👉ఫలితం: పాకిస్తాన్‌పై ఆరు పరుగుల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్ప్రీత్ బుమ్రా(3/14).చదవండి: Ind vs Pak: బుమ్రా విషయంలో ఇలా చేస్తారా?: రోహిత్‌పై విమర్శలు View this post on Instagram A post shared by ICC (@icc) -
సచిన్, గవాస్కర్ కాదు.. అతడే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి జైశంకర్
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్డర్ ఎస్ జైశంకర్ టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే జైశంకర్‌ను అత్యుత్తమ భారత బ్యాటర్ ఎవరని ప్రశ్నించగా.. విరాట్ కోహ్లికి తన ఓటు వేశాడు. ఈ విషయంలో జైశంకర్‌కు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లి రూపంలో మూడు ఆప్షన్లు ఇవ్వగా.. విరాట్పైపు మొగ్గు చూపాడు. ఫిట్నెస్ మరియు వైఖరి కారణంగా కోహ్లిను ఇష్టపడతానని జైశంకర్ చెప్పుకొచ్చాడు. ఈ కారణాలు మినహాయించి సచిన్, గవాస్కర్లను పక్కకు పెట్టడానికి వేరే కారణాలు లేవని తెలిపాడు. సుశాంత్ సిన్హా యూట్యూబ్ ఛానెల్లో మాట్లడుతూ జైశంకర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లి 35 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫామ్‌లో ఉండి ఇరగదీస్తున్నాడు. కోహ్లి ఈ వయసులోనూ భీకర ఫామ్‌లో ఉండటానికి అతని ఫిట్‌నెస్సే కారణమని అంతా అంటుంటారు. ఆట పట్ల అతనికున్న అంకితభావం, దృక్పదం అతన్ని లేటు వయసులోనూ టాప్ క్రికెటర్‌గా నిలబెడుతుంది. చాలా మంది యువ క్రికెటర్లు సైతం ఫిట్నెస్ విషయంలో, యాటిట్యూడ్ విషయంలో విరాట్‌ను ఆదర్శంగా తీసుకుంటారు. Question:- Virat Kohli or Sachin Tendulkar or Sunil Gavaskar? (Sushant Sinha YT).External affairs Minister Dr Jaishankar:- "I have biased towards Virat Kohli because of his fitness, attitude. That's why I will pick Virat".pic.twitter.com/Y7ossf99CQ— Tanuj Singh (@ImTanujSingh) May 29, 2024పెద్దపెద్ద సెలబ్రిటీలు సైతం విరాట్ ఫిట్‌నెస్‌కు ముగ్దులవుతుంటారు. ప్రపంచ క్రికెట్లో దృవతారగా వెలగడానికి విరాట్ ఫిట్‌నెస్సే కారణమనడం అతిశయోక్తి కాదు. మైదానంలో అతను ప్రదర్శించే దూకుడు, చిన్న చిన్న విషయాలకు సైతం స్పందించే విభిన్నమైన తత్వం విరాట్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. మంత్రులే కాక దేశాధినేతలు సైతం విరాట్‌ను అభిమానించడానికి అతని ఫిట్నెస్, ఆట పట్ల అతనికున్న అంకితభావమే కారణం.ఇదిలా ఉంటే, విరాట్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో విరాట్ 15 మ్యాచ్‌ల్లో 61.75 సగటున సెంచరీ, 5 అర్ధసెంచరీ సాయంతో 714 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. విరాట్.. జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌కప్‌లో ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే టీమిండియా రెండోసారి టైటిల్ గెలవడం ఖాయం. -
సచిన్ టెండూల్కర్‌ని కలిసిన బాక్సింగ్ క్వీన్ (ఫొటోలు)
-
ఓటేసిన సచిన్, సూర్యకుమార్.. ఫోటోలు వైరల్
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఐదో దశలో భాగంగా మహారాష్ట్రతో పాటు ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్, వెటరన్ అజింక్యా రహానే, అర్జున్ టెండూల్కర్ సైతం ఓటు వేశారు. సచిన్ తన తనయుడు అర్జున్‌తో కలిసి ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్ బయట సిరాతో ఉన్న వేలిని చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. అదేవిధంగా సూర్యకుమార్ సైతం ఓటు వేసిన అనంతరం తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మన దేశ భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కును వినియోగించుకోవాలని సూర్య పిలుపునిచ్చాడు. Let’s shape the future of our nation by casting our vote today. ✌️ pic.twitter.com/ZYgT69zhis— Surya Kumar Yadav (@surya_14kumar) May 20, 2024