TRAI
-
టెల్కోల ఆశలన్నీ ప్రభుత్వం పైనే!
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలకు సంబంధించి టెలికాం కంపెనీలు ఆశలు పెంచుకుంటున్నారు. ఈ బకాయిలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన తుది రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. దాంతో దేశంలోని టెలికాం ఆపరేటర్లు బకాయిల ఉపశమనం కోసం ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు.సుప్రీంకోర్టు చర్యలుఏజీఆర్ లెక్కల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (డాట్) దిద్దుబాట్లు కోరుతూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిటెల్ వంటి టెలికాం కంపెనీలు సుదీర్ఘ న్యాయపోరాటం చేశాయి. కానీ 2025 జనవరి 28న సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుతో వాటి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, సంజయ్ కుమార్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశాన్ని పునఃసమీక్షించడంలో ఎలాంటి అర్హత లేదని తేల్చింది. రివ్యూ పిటిషన్లు, దానికి మద్దతుగా ఉన్న కారణాలను క్షుణ్ణంగా పరిశీలించామని, అయితే 2021 జులై 23న ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించడానికి ఎలాంటి కారణం లేదని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో టెలికాం ఆపరేటర్లకు ఇకపై న్యాయపరమైన ఆధారం లేకుండా పోయింది. దాంతో ప్రభుత్వ సాయం కోరాలని టెలికాం కంపెనీలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఎజీఆర్) అనేది ప్రభుత్వం, టెలికాం ఆపరేటర్ల మధ్య రుసుము-భాగస్వామ్య యంత్రాంగ విధానం. ఫిక్స్డ్ లైసెన్స్ ఫీజు మోడల్ స్థానంలో 1999లో అవలంబించిన రెవెన్యూ షేరింగ్ మోడల్లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఈ మోడల్ కింద టెలికాం కంపెనీలు తమ ఏజీఆర్‌లో కొంత శాతాన్ని వార్షిక లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వంతో పంచుకోవాల్సి ఉంటుంది.ఏజీఆర్ లెక్కింపు ఇలా..టెలికాం, నాన్ టెలికాం వనరుల నుంచి కంపెనీ ఆర్జించిన అన్ని ఆదాయాలను ఏజీఆర్‌లో చేరుస్తారు. ఇందులో ప్రధాన టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ ఆదాయం, డివిడెండ్, ఆస్తుల అమ్మకంపై లాభం, అద్దె రశీదులు వంటి ప్రధానేతర వనరులు ఉంటాయి. టెలికాం కంపెనీల స్థూల ఆదాయాల ఆధారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) లైసెన్స్ ఒప్పందాల్లో నిర్వచించిన విధంగా ఏజీఆర్‌ను లెక్కిస్తుంది. స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలకు 3-5 శాతం, లైసెన్సింగ్ ఫీజుకు 8 శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారు.ఇదీ చదవండి: 100 గిగావాట్ల అణుశక్తి లక్ష్యానికి తోడ్పాటువివాదం ఏమిటంటే..ఏజీఆర్‌లో కీలక టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం మాత్రమే ఉండాలని టెలికాం ఆపరేటర్లు వాదిస్తున్నాయి. టెలికాం శాఖ మాత్రం అన్ని ఆదాయాలు అందులో పరిగణిస్తారని పేర్కొంటుంది. సుప్రీంకోర్టు 2019లో డాట్ నిర్వచనాన్ని సమర్థించింది. ఇది టెలికాం ఆపరేటర్లపాలిట శాపంగా మారింది. దాంతో ఇప్పటివరకు బకాయిపడిన, ప్రభుత్వంతో పంచుకోని ఆదాయాన్ని వెంటనే చెల్లించేలా తీర్పు వెలువడింది. దాంతో ప్రభుత్వంతో మంతనాలు సాగించేందుకు టెలికా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. -
ట్రాయ్ కొత్త రూల్స్.. ఉల్లంఘిస్తే రూ.10 లక్షల వరకు ఫైన్
మొబైల్ యూజర్లు స్పామ్ కాల్స్, మెసేజ్‌లతో విసుగెత్తిపోతున్నారు. దీనికి చరమగీతం పాడటానికి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిబంధనలను మరింత కఠినతరం చేసింది.టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ (TCCCPR) నియమాల ప్రకారం.. టెల్కోలు స్పామ్ కాల్లపై ఫిర్యాదులను స్వీకరించాలి. ఫిర్యాదులను స్వీకరించిన తరువాత టెలిమార్కెటర్లపై వేగంగా (ఐదు రోజుల్లోపు) చర్య తీసుకోవాలి. ఈ నిబంధనలను అమలు చేయడంలో విఫలమైతే టెలికాం ఆపరేటర్లు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.నియమాలను అమలు చేయడంలో విఫలమైతే.. మొదటిసారి రూ. 2 లక్షల జరిమానా, రెండోసారి మళ్ళీ పునరావృతమైతే.. రూ. 5 లక్షలు, ఆపై ఉల్లంఘనలకు రూ. 10 లక్షల జరిమానా విధించనున్నట్లు ట్రాయ్ స్పష్టం చేసింది. కొత్త నియమాలు 30 నుంచి 60 రోజుల్లో రెండు దశల్లో అమలు చేయాలని ఆదేశించింది.మొబైల్ యూజర్లు స్పామ్ కాల్స్ లేదా ఫేక్ మెసేజ్‌లను నిజమని నమ్మితే.. ఆర్థికంగా నష్టం చూడాల్సి వస్తుంది. అంతే కాకుండా వ్యక్తిగత సమాచారం కూడా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి కాల్స్, మెసేజ్‌ల పట్ల మొబైల్ యూజర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టడానికి యాప్భారతదేశంలో కమ్యూనికేషన్ నిబంధనలను పర్యవేక్షించే 'ట్రాయ్' వినియోగదారులకు విసుగు తెప్పించే కాల్స్, మెసేజస్ వంటి వాటిని నిరోధించుకోవడానికి లేదా పరిష్కరించడాని 'డు నాట్ డిస్టర్బ్' (DND) యాప్ డెవెలప్ చేసింది. దీనిని ఉపయోగించి స్పామ్ కాల్స్, మెసేజస్ నుంచి యూజర్లు బయటపడవచ్చు.'డు నాట్ డిస్టర్బ్' యాప్ ఎలా ఉపయోగించాలి➤గూగుల్ ప్లే స్టోర్‌లో TRAI DND 3.0(Do Not Disturb) యాప్ సర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి.➤డౌన్లోడ్ పూర్తయిన తరువాత యాప్ ఓపెన్ చేసి.. OTP వెరిఫికేషన్ పూర్తి చేసి సైన్ ఇన్ చేసుకోవాలి.➤సైన్ ఇన్ పూర్తి చేసుకున్న తరువాత అవాంఛిత కాల్స్, టెక్స్ట్‌లను బ్లాక్ చేయడానికి మీ మొబైల్ నెంబర్ 'డు నాట్ డిస్టర్బ్' జాబితాకు యాడ్ అవుతుంది.➤యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత కూడా మీకు స్పామ్ కాల్స్ వస్తున్నట్లతే.. తప్పకుండా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ వారికి కంప్లైన్ట్ చేయాలి.ఇదీ చదవండి: ఎప్పుడు, ఎలా చనిపోతారో చెప్పే డెత్ క్లాక్: దీని గురించి తెలుసా? -
ల్యాండ్‌లైన్ యూజర్లకు కొత్త నంబరింగ్ సిస్టం: ట్రాయ్
న్యూఢిల్లీ: వినియోగంలో లేని ఫోన్ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్.. కేంద్రానికి సిఫార్సులు చేసింది. వీటి ప్రకారం కొత్త నంబర్ సిస్టం కోడ్ ఇకపై టెలికం సర్కిల్ లేదా రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. ల్యాండ్‌లైన్ యూజర్లు మరో ల్యాండ్‌లైన్ యూజరుకు కాల్ చేయాలంటే మొత్తం పది అంకెలు డయల్ చేయాల్సి వస్తుంది. ముందుగా సున్నాను, తర్వాత ఎస్టీడీ కోడ్, ఆ తర్వాత ఫోన్ నంబరును డయల్ చేయాల్సి ఉంటుంది. ఒకే ఎస్డీసీఏలో (షార్ట్ డిస్టెన్స్ చార్జింగ్ ఏరియా) లోకల్ కాల్ చేయాలన్నా ముందగా సున్నాను జోడించి, ఎస్‌డీసీఏ కోడ్, ఆతర్వాత యూజరు నంబరును డయల్ చేయాలి. కొత్త నంబరింగ్ విధానం వల్ల ప్రస్తుత యూజర్ల నంబర్లలో ఎలాంటి మార్పు ఉండదని ట్రాయ్ తెలిపింది. నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు టెలికం ఆపరేటర్లకు 6 నెలల వ్యవధినివ్వాలని టెలికం శాఖకు సూచించింది. -
5జీ స్పెక్ట్రమ్ వేలానికి మార్గం సుగమం
టెలికాం సేవల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు ట్రాయ్ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా 22 సర్కిళ్లలో 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో రూ.17,940 కోట్ల విలువైన కొత్త 5జీ స్పెక్ట్రమ్(spectrum) వేలానికి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆమోదం తెలిపింది. అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో హై-స్పీడ్ కనెక్టివిటీని అందించేందుకు టెలికాం శాఖ ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.వేలంలోని కీలక అంశాలుమిల్లీమీటర్ వేవ్ (ఎంఎంవేవ్) స్పెక్ట్రమ్‌లో భాగమైన 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌ను వేలం వేయనున్నారు. టెలికాం ఆపరేటర్లకు మరింత నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ బ్యాండ్ కీలకం కానుంది. అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు ఇది అనువైందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో ఒక్కో సర్కిల్‌కు మొత్తం 3,000 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ అందుబాటులో ఉంటుంది. స్పెక్ట్రమ్ రిజర్వ్ ధర సర్కిళ్లను అనుసరించి మారుతూ ఉంటుంది. ఢిల్లీ సర్కిల్లో అత్యధికంగా మెగాహెర్ట్జ్‌కు రూ.76 లక్షలు, ముంబైలో మెగాహెర్ట్జ్‌కు రూ.67 లక్షలు, మహారాష్ట్రలో రూ.54 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో మెగాహెర్ట్జ్‌కు రూ.49 లక్షలుగా ఉంది.మారటోరియం తిరస్కరణభవిష్యత్తులో జరగబోయే వేలంలో కొనుగోలు చేసే స్పెక్ట్రమ్‌పై 5-6 సంవత్సరాల వడ్డీ లేని చెల్లింపు వ్యవధి లేదా మారటోరియం కోసం టెలికాం ఆపరేటర్ల అభ్యర్థనను ట్రాయ్ తిరస్కరించింది. ముందస్తు చెల్లింపు, 20 సమాన వార్షిక వాయిదాల్లో చెల్లింపు నిబంధనల్లో మార్పులుండవని తేల్చి చెప్పింది. ఈ స్పెక్ట్రమ్‌ను టెలికాం ఆపరేటర్లకు 20 ఏళ్ల వ్యాలిడిటీ కాలానికి అందిస్తారు.ఇదీ చదవండి: అక్రమ జామర్స్‌తోనే కాల్ డ్రాప్స్ఈ వేలంలో హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, 5జీ సేవల ప్రారంభానికి మద్దతు ఇవ్వడానికి టెలికాం ఆపరేటర్లకు అవసరమైన స్పెక్ట్రమ్‌ను అందించనున్నారు. 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్ ముఖ్యంగా హైస్పీడ్ కనెక్టివిటీ అవసరమైన పట్టణ ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ వేలంలో యూనిఫైడ్ లైసెన్స్ కింద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీ), మెషిన్ టు మెషిన్ సర్వీస్ ప్రొవైడర్లను వేలంలో పాల్గొనేందుకు అనుమతించాలని ట్రాయ్ సూచించింది. -
జియో కొత్త ప్లాన్: 365 రోజుల వ్యాలిడిటీ
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI).. కొన్ని రోజులకు ముందు ప్రత్యేకంగా కాలింగ్, ఎస్ఎమ్ఎస్ కోసమే రీఛార్జ్ చేసుకునేవారి కోసం రీఛార్జ్ ప్లాన్లను అందించాలని ఆదేశించింది. దీంతో జియో రెండు ప్లాన్స్ ప్రవేశపెట్టింది. వీటి గురించి తెలుసుకుందాం.జియో ప్రవేశపట్టిన కొత్త ప్లాన్ల జాబితాలో 84 రోజుల ప్లాన్, 365 రోజుల ప్లాన్ ఉన్నాయి. వీటి రీఛార్జ్‌తో యూజర్ కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ వంటివి మాత్రమే చేసుకోవచ్చు, డేటా లభించదు. ఇవి కీ ప్యాడ్ మొబైల్ లేదా.. డేటా అవసరం లేని మొబైల్స్ ఉపయోగిస్తున్నవారికి మంచి ఆప్షన్.రూ.458 : 84 రోజులుజియో యూజర్లు రూ. 458తో రీఛార్జ్ చేసుకుంటే.. 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత ఎస్ఎమ్ఎస్లు పొందుతారు. అంతే కాకుండా వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు కూడా ఉచితంగానే యాక్సెస్ చేయవచ్చు.రూ.1,958 : 365 రోజులుజియో అందిస్తున్న మరో ప్లాన్ ధర రూ. 1,958. ఈ రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ పొందుతుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. అపరిమిత కాలింగ్ మాత్రమే కాకుండా.. 3,600 ఉచిత ఎస్ఎమ్ఎస్లు పొందుతారు. జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు కూడా ఉచితంగానే యాక్సెస్ చేయవచ్చు.జియో రెండు ప్లాన్లను తొలగించిందిజియో ఇప్పుడు తన జాబితా నుంచి రెండు పాత రీఛార్జ్ ప్లాన్లను తొలగించింది. అవి రూ. 479 ప్లాన్, రూ. 1899 ప్లాన్. 1899 రూపాయల ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో 24 జీబీ డేటాను అందించగా, రూ. 479 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో 6 జీబీ డేటాను అందించింది. ఇప్పుడు ఇవి రెండూ అందుబాటులో లేదని తెలుస్తోంది.ఇదీ చదవండి: కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్‌లో 50 శాతం తగ్గింపు -
ట్రాయ్ ఎఫెక్ట్.. ఎయిర్టెల్ కొత్త చౌక ప్లాన్లు
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్గదర్శకాలను అనుసరించి దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన ఎయిర్టెల్ (Airtel) రెండు వాయిస్-ఓన్లీ చౌక రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. 2జీ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించాలని ట్రాయ్ ఇటీవల టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ ప్లాన్లను ప్రారంభించిన ఏడు రోజులలోపు ట్రాయ్ సమీక్షిస్తుంది.ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ఎయిర్టెల్ తన వాయిస్-ఓన్లీ ప్లాన్లను సవరించింది. ఇటీవల తీసుకొచ్చిన రెండు ప్లాన్ల ప్రయోజనాలను అలాగే ఉంచుతూ తక్కువ ధరలో కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. పాత ప్లాన్లను తొలగించింది. ఈమేరకు ఎయిర్టెల్ తన వెబ్సైట్లో ప్లాన్లను అప్డేట్ చేసింది. సవరించిన ఎయిర్టెల్ ప్లాన్లు ఇవే..రూ.469 ప్లాన్ఇది 84 రోజుల ప్లాన్. గతంలో ఈ ప్లాన్ ధర రూ.499 ఉండేది. దీన్ని ప్రస్తుతం రూ. 30 తగ్గించింది. దీంతో దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను ఆనందించవచ్చు. ఉచిత జాతీయ రోమింగ్, 900 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటా ప్రయోజనాలు ఉండవు. ఎటువంటి డేటా అవసరం లేకుండా కాలింగ్, ఎస్ఎంఎస్ సేవలు అవసరమయ్యే 2జీ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం దీన్ని తీసుకొచ్చారు.రూ. 1849 ప్లాన్ ఇది 365 రోజుల ప్లాన్. ఇంతకుముందు ఈ ప్లాన్ ధర రూ. 1,959. రూ. 110 తగ్గించి రూ. 1,849 లకు తీసుకొచ్చింది. దీంతో దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్ మాట్లాడవచ్చు. ఉచిత జాతీయ రోమింగ్, 3,600 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా దీర్ఘకాలిక వాయిస్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను కోరుకునే వినియోగదారుల కోసం దీన్ని రూపొందించారు.జియో ప్లాన్లుట్రాయ్ మార్గదర్శకాలకు అనుగుణంగా వాయిస్-ఓన్లీ ప్లాన్లను ప్రారంభించిన మొదటి టెలికం కంపెనీ రిలయన్స్ జియో. 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో చౌకైన వాయిస్-ఓన్లీ ప్లాన్లను జియో తీసుకొచ్చింది. 84 రోజుల ప్లాన్ ధర రూ. 458. దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తుంది. 1,000 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఇక 365-రోజుల ప్లాన్ ధర రూ. 1,958. దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్‌తోపాటు 3,600 ఉచిత ఎస్ఎంఎస్లు ఆనందించవచ్చు. ఈ రెండు ప్లాన్లలోనూ ఎటువంటి డేటా ప్రయోజనాలు ఉండవు. -
కాల్స్ కోసమే ప్రత్యేక ప్యాక్.. వాట్సప్‌కు ఊరట
న్యూఢిల్లీ: కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ ప్యాక్స్‌ను టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్టెల్(Airtel) పరిచయం చేశాయి. 84 రోజుల కాల పరిమితితో రూ.499 ధరలో కొత్త ప్లాన్‌ను ఎయిర్టెల్ అందుబాటులోకి తెచ్చింది. అపరిమిత కాల్స్, 900 ఎస్ఎంఎస్లు ఆఫర్ చేస్తారు. అలాగే రూ.1,959 ధరలో 365 రోజుల వ్యాలిడిటీ గల ప్యాక్ కింద అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్లు అందుకోవచ్చు.రిలయన్స్ జియో రూ.458 ధరలో 84 రోజుల కాల పరిమితితో అపరిమిత వాయిస్‌కాల్స్, 1,000 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. ఏడాది కాల పరిమితితో రూ.1,958 ధరలో అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. డేటా అవసరం లేకపోయినా బండిల్ ప్యాక్స్ వల్ల కస్టమర్లకు చార్జీల భారం పడుతోందన్న ఫిర్యాదుల పెద్ద ఎత్తున రావడంతో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ గత నెలలో టారిఫ్ నిబంధనలను సవరించింది. దీనికి అనుగుణంగా డేటా అవసరం లేని కస్టమర్ల కోసం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం టెలికం కంపెనీలు ప్రత్యేక ప్లాన్స్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలకు లాభాలుఎన్సీఎల్ఏటీలో వాట్సాప్‌కి ఊరటన్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌లో (NCLAT) వాట్సాప్‌కు ఊరట లభించింది. మాతృ సంస్థ మెటాతో వాట్సాప్ అయిదేళ్ల పాటు యూజర్ల డేటాను షేర్ చేసుకోరాదంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నిషేధంపై ఎన్సీఎల్ఏటీ స్టే విధించింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. ప్రకటనల అవసరాలరీత్యా యూజర్ల డేటాను మెటాతో పాటు గ్రూప్ కంపెనీలకు అందించేలా 2021లో వాట్సాప్ గోప్యతా పాలసీని అప్డేట్ చేసింది. అయితే, ఇలాంటివి అనుచిత వ్యాపార విధానాల కిందికి వస్తాయంటూ నవంబర్‌లో సీసీఐ అయిదేళ్ల నిషేధంతో పాటు మెటాపై రూ.213 కోట్ల జరిమానా విధించింది. దీన్ని సవాలు చేస్తూ మెటా, వాట్సాప్ సంస్థలు ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. -
రూ. 20తో.. 120 రోజులు: ఇదే రూల్..
మొబైల్ యూజర్లలో చాలామంది రెండు సిమ్ కార్డులను ఉపయోగిస్తుంటారు. ఈ రెండూ యాక్టివేట్‌లో ఉండాలంటే తప్పనిసరిగా రీఛార్జ్ చేసుకోవాలి. ఇది యూజర్లకు భారమవుతోంది. దీనిని దృష్టిలో ఉందుకుని ట్రాయ్ కొత్త రూల్ తీసుకొచ్చింది. దీని ప్రకారం కేవలం 20 రూపాయలు రీఛార్జ్ చేసుకుని సిమ్ కార్డును 120 రోజులు యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు.సిమ్ కార్డును కాల్స్, ఎస్ఎమ్ఎస్ లేదా డేటా వంటి వాటి కోసం ఉపయోగించకుండా, ఎటువంటి రీఛార్జ్ చేసుకోకుండా 90 రోజులు పక్కన పెడితే.. అది ఆటోమేటిక్‌గా డిస్కనెక్ట్ అవుతుంది. ఆ తరువాత సిమ్ కార్డును (నెంబర్) టెలికాం ఆపరేటర్లు వేరేవారికి కేటాయిస్తారు. ఆలా జరగకుండా ఉండాలంటే.. రూ. 20తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిబంధనల ప్రకారం, మీరు 90 రోజులు సిమ్ కార్డును ఉపయోగించకుండా ఉంటే.. మీ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ నుంచి 20 రూపాయలు కట్ అవుతుంది. మరో 30 రోజులు యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతినెలా ఇలా రీఛార్జ్ చేసుకుంటే నెంబర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ కొత్త రూల్ జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియా (VI) వంటి అన్ని సంస్థలకు వర్తిస్తుంది.ఇదీ చదవండి: ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్లలో మార్పు: వివరాలివిగో..సమయానికి మీరు 20 రూపాయలతో రీఛార్జ్ చేయనప్పుడు గ్రేస్ పీరియడ్ 15 రోజులు లభిస్తుంది. ఆ తరువాత కూడా రీఛార్జ్ చేయకపోతే టెలికాం కంపెనీ సిమ్ కార్డును డీయాక్టివేట్ చేస్తుంది. ట్రాయ్ ప్రవేశపెట్టిన ఈ రూల్ కొత్తది కాదు. 2013 మార్చిలోనే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నియమాన్ని తీసుకొచ్చింది. కానీ దీనిని టెలికాం ఆపరేటర్లు పెడచెవిన పెట్టారు. కానీ ఇప్పుడు తప్పకుండా అన్ని సంస్థలు ఈ రూల్ పాటించాల్సిందే అంటూ ట్రాయ్ ఆదేశించింది. -
ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్లలో మార్పు: వివరాలివిగో..
భారతదేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటైన 'భారతి ఎయిర్టెల్'.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తన ప్రీపెయిడ్ ప్లాన్లలో కొన్ని మార్పులు చేసింది. ఇవి వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ల కోసం ఉపయోగపడతాయి.రూ.509 ప్లాన్ఎయిర్టెల్ అందిస్తున్న రూ. 509 ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. అపరిమిత వాయిస్ కాల్స్, 900 ఉచిత ఎస్ఎమ్ఎస్ల మాత్రమే ఈ రీఛార్జ్ ద్వారా పొందవచ్చు. అయితే ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కి ఉచిత యాక్సెస్, అపోలో 24/7 సర్కిల్ మెంబర్షిప్, ఉచిత హలో ట్యూన్లు వంటి కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే డేటా లభించదు.రూ.1999 ప్లాన్ఎయిర్టెల్ తన రూ. 1,999 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా సవరించింది. గతంలో ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్లు, 3000 ఉచిత ఎస్ఎమ్ఎస్లు, 24GB మొబైల్ డేటా ఉండేవి. ఇప్పుడు మొబైల్ డేటా ప్రయోజనాలను ఎయిర్టెల్ పూర్తిగా తొలగించింది. కాగా ఇప్పుడు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్, అపోలో 24/7 సర్కిల్ మెంబర్షిప్, ఉచిత హలో ట్యూన్లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.ఇదీ చదవండి: ట్రాయ్ కొత్త రూల్స్.. రూ.10తో రీఛార్జ్గతంలో పైన పేర్కొన్న రెండు ప్లాన్లలో డేటా సదుపాయం కూడా లభించేది. ఇప్పుడు డేటాను పూర్తిగా తొలగించింది. అయితే ఈ రెండు ప్లాన్స్ స్పామ్ ఫైటింగ్ నెట్వర్క్ సొల్యూషన్‌తో వస్తాయి. డేటాను ఉపయోగించని కస్టమర్లకు వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసుల కోసం విడిగా ప్లాన్‌ను ప్రవేశపెట్టాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసిన తరువాత ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
ట్రాయ్ కొత్త రూల్స్.. రూ.10తో రీఛార్జ్
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) 2G సేవలను ఉపయోగిస్తున్న దాదాపు 150 మిలియన్ల భారతీయ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ వంటి వాటికోసం మాత్రమే మొబైల్ ఉపయోగించేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కీప్యాడ్ మొబైల్స్ లేదా 2జీ మొబైల్స్ వాడేవారికి డేటాతో పనిలేదు. అయినప్పటికీ వారు రీఛార్జ్ చేసుకోవాలంటే డేటాకు కూడా కలిపి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ట్రాయ్ కొత్త మార్గదర్శకాలను రూపొందించడంతో.. టెలికాం కంపెనీలు సరసమైన ప్లాన్స్ ప్రారంభించాల్సి ఉంది.రీఛార్జ్ ప్లాన్లు రూ. 10 నుంచికొత్త నిబంధనల ప్రకారం Airtel, Jio, BSNL, Vodafone Idea (Vi) 10 రూపాయల ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉండే టాప్ అప్ వోచర్లను పరిచయం చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా.. ట్రాయ్ రూ. 10 డినామినేషన్‌కు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని తొలగించింది. దీంతో ఏదైనా విలువ కలిగిన టాప్ అప్ వోచర్లను జారీ చేయడానికి ఆపరేటర్లను అనుమతిస్తుంది.ఆన్లైన్ రీఛార్జ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యతకు దృష్టిలో ఉంచుకుని.. కలర్ కోడెడ్ ఫిజికల్ రీఛార్జ్ సిస్టమ్‌ను తొలగించాలని రెగ్యులేటర్ నిర్ణయించింది. ప్రత్యేక టారిఫ్ వోచర్ల చెల్లుబాటును కూడా 90 రోజుల నుంచి 365 రోజులకు పెంచింది. ఇంటర్నెట్ సేవలు అవసరం లేని 2G ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాయిస్.. ఎస్ఎంఎస్ ప్లాన్లను రూపొందించాలని టెలికాం ఆపరేటర్లకు సూచించింది.ఇదీ చదవండి: సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. అదిరిపోయే ఆఫర్స్: రూ. 209తో..ట్రాయ్ మార్గదర్శకాలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. కానీ కంప్లైంట్ రీఛార్జ్ ప్లాన్లను రూపొందించడానికి టెలికాం కంపెనీలకు కొన్ని వారాల సమయం ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక లాంచ్ తేదీని ప్రకటించనప్పటికీ, జనవరి చివరి నాటికి సరసమైన రీఛార్జ్ ప్లాన్లు మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. -
రిలయన్స్ జియోకు 37.6 లక్షల మంది దూరం
న్యూఢిల్లీ: టెలికం రంగ సంస్థ రిలయన్స్ జియో(reliance jio) అక్టోబర్‌లో 37.6 లక్షల మంది వైర్లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. టెల్కోలు కీలకంగా వ్యవహరించే క్రియాశీల మొబైల్ సబ్స్క్రైబర్స్ జియోకు 38.47 లక్షల మంది పెరిగారు. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన నెలవారీ డేటా ప్రకారం.. అక్టోబర్‌లో భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel) 19.28 లక్షల మంది వైర్లెస్ చందాదార్లను కొత్తగా దక్కించుకుంది. యాక్టివ్ కస్టమర్లు దాదాపు 27.23 లక్షలు అధికం అయ్యారు. వొడాఫోన్ ఐడియా 19.77 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. క్రియాశీల చందాదార్లు 7.23 లక్షల మంది తగ్గారు.రిలయన్స్ జియో మొత్తం వైర్లెస్ వినియోగదార్ల సంఖ్య అక్టోబర్ నాటికి 46 కోట్లకు వచ్చి చేరింది. సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 46.37 కోట్లుగా ఉంది. సెప్టెంబర్‌తో పోలిస్తే వొడాఫోన్ ఐడియా మొత్తం వైర్లెస్ యూజర్ బేస్ 21.24 కోట్ల నుంచి అక్టోబర్‌లో 21.04 కోట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య 106.6 కోట్లుగా ఉంది. మొత్తం బ్రాడ్‌బ్యాండ్ (broadband) చందాదారులు అక్టోబర్ 2024 చివరి నాటికి 0.31 శాతం తగ్గి 94.14 కోట్లుగా ఉన్నారు. మొత్తం టెలిఫోన్ చందాదారుల సంఖ్య 119.06 కోట్ల నుండి 0.21 శాతం తగ్గి 118.82 కోట్లకు క్షీణించింది. ఇదీ చదవండి: ఆన్లైన్ ఉన్నా చివరకు షోరూంలోనే.. తెలుగు రాష్ట్రాల వైర్‌లైన్‌లో జియో వృద్ధిఆంధ్రప్రదేశ్, తెలంగాణలో (ఏపీ టెలికం సర్కిల్) వైర్‌లైన్ విభాగంలో అక్టోబర్‌లో గణనీయంగా వృద్ధి సాధించినట్లు రిలయన్స్ జియో తెలిపింది. ట్రాయ్ (TRAI) గణాంకాల ప్రకారం రెండు రాష్ట్రాల్లో నికరంగా 69,930 కనెక్షన్లు కొత్తగా జతయినట్లు వివరించింది. దీంతో సెప్టెంబర్‌లో 17,49,696గా ఉన్న సబ్స్కైబర్ల సంఖ్య అక్టోబర్‌లో 18,19,626కి చేరినట్లు సంస్థ పేర్కొంది. -
వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్లాన్
న్యూఢిల్లీ: డేటాను ఉపయోగించని కస్టమర్లకు వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసుల కోసం విడిగా ప్లాన్‌ను ప్రవేశపెట్టాలని టెల్కోలకు నియంత్రణ సంస్థ ట్రాయ్ సూచించింది. 365 రోజుల వేలిడిటీకి మించకుండా కనీసం ఒక స్పెషల్ టారిఫ్ వోచర్‌ను అందించాలంటూ ఈ మేరకు టారిఫ్ నిబంధనలను సవరించింది.ఇదీ చదవండి: మంచి మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడం ఎలా?ట్రాయ్ సూచనల ప్రకారం కస్టమర్లు తాము వినియోగించుకునే సర్వీసులకు మాత్రమే చెల్లించే వీలు ఉంటుంది. ఇంటి వద్ద బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లున్న కుటుంబాలు, సీనియర్ సిటిజన్లకు పెద్దగా డేటా రీఛార్జ్ ప్లాన్ల అవసరం ఉండదనే వాదనలున్నాయి. అలాంటి యూజర్లు సాధారణ కస్టమర్ల మాదిరిగా అధికంగా డబ్బు వెచ్చించి రీఛార్జ్ చేసుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని ట్రాయ్ భావిస్తుంది. దాంతో డేటాను ఉపయోగించని కస్టమర్లకు వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసుల కోసం ప్రత్యేకంగా ప్లాన్‌ను తీసుకురావాలనే సూచనలు చేసింది. దీనిపై తుది నిర్ణయం మాత్రం టెల్కోలే తీసుకోవాల్సి ఉంటుంది. -
జియో.. ఎయిర్టెల్ పోటాపోటీ
ఎయిర్టెల్ కంటే రిలయన్స్ జియో అక్టోబర్ 2024లో యాక్టివ్ యూజర్ల సంఖ్యను పెంచుకున్నట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. అయితే ఇదే సమయంలో ఎయిర్టెల్ మాత్రం అధికంగా చెల్లింపులు చేసే 4జీ/ 5జీ యూజర్లను పెంచుకున్నట్లు పేర్కొంది.ఇప్పటివరకు ఉన్న మొత్తం యాక్టివ్ యూజర్ల విషయంలో జియోనే అధికంగా వినియోగదారులకు కలిగి ఉంది. ఇన్-యాక్టివ్ యూజర్ల తొలగింపు కారణంగా అక్టోబర్ నెలలో జియో సబ్స్క్రైబర్లను కోల్పోయినట్లు తెలిసింది. ఎయిర్టెల్ మాత్రం తన 4జీ/ 5జీ యూజర్ బేస్‌లో వృద్ధిని సాధించింది. మరోవైపు వొడాఫోన్ ఐడియా 3జీ/ 4జీ యాక్టివ్ యూజర్లను కోల్పోయింది. కాగా, బీఎస్ఎన్ఎల్ మాత్రం స్వల్పంగా యూజర్లను పెంచుకుంది.ఇదీ చదవండి: పాప్‌కార్న్‌పై జీఎస్టీ.. నెట్టింట చర్చజులైలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్‌లను 10–27 శాతం వరకు పెంచాయి. అయితే బీఎస్ఎన్ఎల్ ప్రత్యర్థుల బాటను అనుసరించకపోగా.. సమీప భవిష్యత్తులో టారిఫ్‌ల పెంపుదల ఉండబోదని బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి గతంలో స్పష్టం చేశారు. వినియోగదార్లను ఆకర్షించడానికి, మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు బీఎస్ఎన్ఎల్ ఇటీవల స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్క్, డైరెక్ట్–టు–డివైస్ తదితర సేవలను ప్రారంభించింది. -
స్పామ్ కాల్స్, ఆన్లైన్ మోసాల కట్టడికి సూచనలు
స్పామ్, ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు సరైన చర్యలు తీసుకోవాలని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను కోరింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల్లో స్పామ్ మెసేజ్‌లు, కాల్స్‌తోపాటు ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయని తెలిపింది.ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేలా ట్రాయ్ తగిన చర్యలు తీసుకోవాలని ఎయిర్టెల్ పేర్కొంది. ఏకీకృత యాంటీ స్పామ్ ఎకోసిస్టమ్‌ను సృష్టించడానికి ఓటీటీలు, టెలికాం ఆపరేటర్ల మధ్య తప్పనిసరి పాటించాల్సిన నియమాలను అభివృద్ధి చేయాలని సూచించింది. బిజినెస్ వెరిఫికేషన్, డేటా షేరింగ్ వంటి చర్యలతో ఈ మోసాలను కొంతవరకు కట్టడి చేయవచ్చని ప్రతిపాదించింది.ఇదీ చదవండి: అధిక వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఇవే..వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు స్పామ్ కాల్స్, మెసేజ్‌ల నివారణకు అతి త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు ఇటీవల వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. వినియోగదారులకు వచ్చే ఇబ్బందికర/ ప్రమోషనల్ లేదా అయాచిత వాణిజ్య కాల్స్ సమస్యను పరిష్కరించడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ ముసాయిదా మార్గదర్శకాలను 2024 జూన్‌లో రూపొందించారు. తుది మార్గదర్శకాలను నోటిఫై చేయాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) టెలికం శాఖకు ఇటీవల లేఖ రాసింది. -
వణికించిన ఫోన్ కాల్.. రూ. 7.28 లక్షలు దోపిడీ
ఆన్లైన్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. వయసుతో సంబంధం లేకుండా యువత, ఉన్నత విద్యావంతులు కూడా ఈ మోసాలకు గురవుతున్నారు. తాజాగా 25 ఏళ్ల ఐఐటీ బాంబే విద్యార్థి అధునాతన మోసంలో రూ. 7.28 లక్షలు కోల్పోయి బాధితుడయ్యాడు.వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ ప్రకారం.. విద్యార్థికి ట్రాయ్ అధికారినంటూ ఓ వ్యక్తి నుండి కాల్ వచ్చింది. విద్యార్థి మొబైల్ నంబర్‌పై చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన 17 ఫిర్యాదులు నమోదయ్యాయని ఆ వ్యక్తి చెప్పాడు. తమ సూచనలను పాటించకపోతే "డిజిటల్ అరెస్ట్" అయ్యే ప్రమాదం ఉందని బెదిరించాడు.చట్టపరమైన పరిణామాలు, అభియోగాల తీవ్రతకు భయపడిన విద్యార్థి వారి సూచనలను అనుసరించడానికి అంగీకరించాడు. కేసుల నుంచి పేరును తొలగించడానికి, చట్టపరమైన సమస్యలను నివారించడానికి రూపొందించిన ప్రక్రియ పేరుతో స్కామర్లు పలు దఫాలుగా రూ. 7.28 లక్షలను వారి ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించారు. భయంతో అతను వారి సూచనలను అనుసరించిన విద్యార్థి చివరికి bమోసానికి గురయ్యాడు.వణికిపోవద్దు..ఇలాంటి ఆన్లైన్ మోసాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఇలాంటి మోసాలకు బలి అవుతున్న వ్యక్తుల సంఖ్య దేశంలో పెరుగుతోంది. ఈ స్కామ్‌లలో చాలా వరకు వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా చట్టబద్ధమైన సంస్థల పేరుతో నకిలీ వెబ్సైట్ల ద్వారా జరుగుతన్నాయి. అటువంటి కాల్స్ వచ్చినప్పుడు కాలర్ గుర్తింపును ధ్రువీకరించుకోవాలని, సున్నితమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పరిస్థితిని అంచనా వేయడానికి కొంత సమయం తీసుకోవాలని, భయంతో హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. -
ఓటీపీ రాలేదా? డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్
నెట్ బ్యాంకింగ్, ఆధార్ వంటి సేవల్లో కీలకమైన ఓటీపీ మెసేజ్‌లు అందుకోవడంలో జాప్యంతో టెలికం వినియోగదారులు తరచూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు డిసెంబర్ 1 నుండి ఉండవని వినియోగదారులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) భరోసా ఇచ్చింది.డిసెంబర్ 1 నుండి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనలతో ముఖ్యమైన ఓటీపీ మెసేజ్‌ల డెలివరీలో ఎటువంటి మందగమనం ఉండదని ట్రాయ్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో చెలామణి అవుతున్న తప్పుడు సమాచారంపై స్పందిస్తూ పరిస్థితి అదుపులోనే ఉందని నొక్కి చెప్పింది. సమస్యలను నివారించడంలో భాగంగా సందేశాలను ట్రాకింగ్ చేయడానికి కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు వివరించింది.ఫేక్ కాల్స్, మెసేజ్‌లకు సంబంధించి పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి ట్రాయ్ చురుగ్గా పనిచేస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి వారు అక్టోబర్ 1న కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న అవాంఛిత మెసేజ్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించే వ్యవస్థను నవంబర్ 30 లోపు టెలికాం సంస్థలు ఏర్పాటు చేసుకోవాలి. వాస్తవానికి అక్టోబర్ 31 వరకే గడువు ఇచ్చినప్పటికీ టెలికం కంపెనీలు మరింత సమయం కావాలని అభ్యర్థించడంతో ట్రాయ్ మంజూరు చేసింది.ఇదీ చదవండి: డిసెంబర్లో బ్యాంకులు పనిచేసేది కొన్ని రోజులే..బల్క్ మెసేజ్‌లు ఎక్కడ నుండి వస్తున్నాయో ట్రాక్ చేసే వ్యవస్థ ఏర్పాటైతే అనుమానాస్పద లేదా మోసపూరిత సందేశాల మూలాన్ని గుర్తించడం వీలవుతుంది. దీంతోపాటు ముఖ్యమైన ఓటీపీల డెలివరీలో జాప్యం తగ్గుతుందని ట్రాయ్ పునరుద్ఘాటించింది. -
నెట్వర్క్ సమస్యకు చెక్.. టెలికాం సంస్థలకు ట్రాయ్ ఆదేశాలు
ఏ సిమ్ కార్డు తీసుకున్నా.. దేశంలోని ఏదో ఒక మూల తప్పకుండా నెట్వర్క్ సమస్య అనేది తెలెత్తుతుంది. దీనిని నివారించడానికి టెలికాం కంపెనీలకు 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) కీలక ఆదేశాలను జారీ చేసింది.టెలికాం సంస్థలు తమ వెబ్సైట్లలో తప్పకుండా.. జియో స్పేషియల్ కవరేజ్ మ్యాప్‌లను చూపించాలని ట్రాయ్ ఆదేశించింది. అంటే తమ నెట్వర్క్ ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉందనేది ఈ మ్యాప్ ద్వారా తెలుస్తుంది. దీన్ని బట్టి యూజర్ ఏ సిమ్ కొనుగోలు చేయాలనేది నిర్ణయించుకుంటాడు. దీని వల్ల యూజర్లు నెట్వర్క్ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా పోతుంది.కొత్త నిబంధనల ప్రకారం.. టెలికాం సంస్థలకు సంబంధించిన 2జీ, 3జీ, 4జీ, 5జీ సర్వీసులు కూడా వెబ్సైట్లలో వెల్లడించాల్సి ఉంది. దీంతో వినియోగదారుడు ఏ సర్వీస్ ఎంచుకోవాలి.. తాను ఏ సర్వీస్ పరిధిలో ఉన్నాడు, అంతరాయం లేకుండా మొబైల్ ఉపయోగించడానికి ఉత్తమమైన నెట్వర్క్ ఏది అనే అన్ని వివరాలను సిమ్ కొనుగోలు చేయడానికి ముందే తెలుసుకోవచ్చు.ట్రాయ్ ఆదేశించిన ఈ కొత్త మార్గదర్శకాలు యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మెరుగైన నెట్వర్క్ కవరేజీని అందించే ప్రొవైడర్లను వినియోగదారుడు ముందుగానే ఎంచుకోవచ్చు. నెట్వర్క్ సమస్యల వల్ల కస్టమర్ అసంతృప్తిని తగ్గించవచ్చు. టెలికాం కంపెనీలు ఈ మ్యాప్‌లను ప్రచురించే ఫార్మాట్.. ఇన్పుట్ వంటి వాటిని సమర్పించడానికి కొంత సమయం తీసుకున్నట్లు సమాచారం. -
వేలం వేస్తేనే పోటీ.. ట్రాయ్‌కి జియో లేఖ
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్‌కి ఉపయోగించే స్పెక్ట్రంను వేలం వేస్తేనే విదేశీ దిగ్గజాలతో దేశీ టెల్కోలు పోటీపడేందుకు అవకాశాలు లభిస్తాయని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి రాసిన లేఖలో రిలయన్స్ జియో పేర్కొంది. దేశీయంగా మూడు టెల్కోలు అనేక సంవత్సరాలుగా నిర్మించుకున్న సామర్థ్యాల కన్నా స్టార్‌లింక్, క్విపర్ శాట్‌కామ్ బ్యాండ్‌విడ్త్ అధికమని తెలిపింది.శాట్‌కామ్ సంస్థలు కేవలం టెరెస్ట్రియల్ కవరేజీ లేని మారుమూల ప్రాంతాల్లో మాత్రమే సేవలు అందిస్తాయి కాబట్టి వాటికి ప్రాధాన్యతనిస్తామనడం సరికాదని జియో వ్యాఖ్యానించింది. స్టార్‌లింక్, క్విపర్, ఇతరత్రా శాట్‌కామ్ దిగ్గజాలు తాము పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ సర్వీసులను కూడా అందించేందుకు పోటీపడతామని ఇప్పటికే వెల్లడించినట్లు తెలిపింది.ఇదీ చదవండి: వాట్సాప్ గ్రూప్‌లకు లైసెన్స్.. ఫీజు కూడా!ఈ నేపథ్యంలో స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించిన పక్షంలో వాటితో పోటీపడేందుకు దేశీ సంస్థలకు సమాన అవకాశాలు దొరకవని పేర్కొంది. అంతర్జాతీయ విధానాలకు తగ్గట్లుగా శాట్‌కామ్ స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతుండటంతో జియో లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
మొబైల్ యూజర్లకు ట్రాయ్ హెచ్చరిక
సైబర్ క్రైమ్స్ ప్రస్తుతం భారతదేశంలో ఒక పెద్ద సమస్యగా మారిపోతోంది. ఎప్పటికప్పుడు స్కామర్లు కొత్త అవతారాలెత్తి ప్రజలను మోసం చేస్తున్నారు, డబ్బు దోచేస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో మొబైల్ యూజర్లకు చాలా జాగ్రత్తగా ఉండాలని 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) హెచ్చిరికలు జారీ చేసింది.స్కామర్లు బాధితులను మోసం చేయడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రిక్ కనెక్షన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ వంటి సదుపాయాలను నిలిపేస్తామని బెదిరిస్తారు. బాధితుడు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని నేరగాళ్లు తప్పుగా పేర్కొంటారు. దీంతో కొందరు భయపడి నేరగాళ్లు చెప్పినట్లు వింటారు, భారీగా డబ్బు కోల్పోతారు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.. షేర్ చేసిన ఒక వీడియోలో ఇలాంటి స్కామ్‌కు సంబంధించిన సంఘటనను చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క మొబైల్ యూజర్ తెలియని నంబర్స్ నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని.. సంచార్ సాథీ పోర్టల్‌ని ఉపయోగించి ఏవైనా అనుమానాస్పద కాల్‌లను నివేదించాలని ట్రాయ్ కోరింది.భారతదేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ప్రభుత్వ డేటా ప్రకారం.. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు డిజిటల్ అరెస్ట్ స్కామ్ కారణంగా బాధితులు సుమారు రూ. 120.3 కోట్లు నష్టపోయినట్లు తెలిసింది. అక్టోబర్ 27న మన్ కీ బాత్ 115వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమాచారాన్ని అందించారు.నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) 2024 మొదటి త్రైమాసికంలో దాదాపు 7.4 లక్షల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు అందుకున్నట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: చెత్త సంపాదన రూ.2,364 కోట్లు: ప్రశంసించిన మోదీడిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు లేదా సైబర్ నేరగాళ్లు బాధితురాలకు ఫోన్ చేసి అక్రమ వస్తువులు లేదా నిషిద్ధ వస్తువులకు సంబంధించిన నేరంలో మీ ప్రమేయం ఉందని భయపెడతారు. టెక్నాలజీలను ఉపయోగించి వీడియో కాల్స్ ద్వారా నకిలీ కోర్టులను, న్యాయమూర్తులను ఏర్పటు చేస్తారు. అరెస్టు లేదా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండటానికి డబ్బు చెల్లించాలని.. భారీ మొత్తంలో మోసం చేస్తుంటారు. కాబట్టి ఇలా మోసం చేసేవారు మీకు ఎప్పుడైనా ఫోన్ చేసి బెదిరిస్తే.. తప్పకుండా సంబంధిత పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలి.अचानक से TRAI 📞 ने कि आपका नेटवर्क disconnect करने की बात 🧐🤔 सावधान रहे, ये एक scam है ! आपका अगला कदम ? रिपोर्ट करें चक्षु के साथ https://t.co/6oGJ6NSQal पर#SafeDigitalIndia pic.twitter.com/Zmkwj2Rjzg— DoT India (@DoT_India) November 9, 2024 -
శాట్‌కామ్ స్పెక్ట్రంపై చర్చిస్తున్నాం: ట్రాయ్ చైర్మన్
శాటిలైట్ కమ్యూనికేషన్స్‌కి (శాట్‌కామ్) ఉపయోగించే స్పెక్ట్రంను వేలం వేయాలా లేక కేటాయించాలా అనే అంశంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో దీనిపై చర్చల ప్రక్రియ కొనసాగుతోందని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటీ తెలిపారు. టెల్కోలతో సమానంగా శాటిలైట్ సంస్థలతో కూడా వ్యవహరించాలన్న టెలికం సంస్థల డిమాండ్‌పై స్పందిస్తూ వివిధ వర్గాలు పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. అంతర్జాతీయంగా అమల్లో ఉన్నట్లుగా ఈ స్పెక్ట్రంను కేటాయించాలంటూ అమెరికన్ దిగ్గజం స్టార్‌లింక్ కోరుతుండగా, దేశీ టెల్కోలు మాత్రం వేలం వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతర్జాతీయంగా పాటిస్తున్న విధానాన్నే దేశీయంగానూ అమలు చేస్తామంటూ కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ట్రాయ్ నిర్దిష్ట రేటు సిఫార్సు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సింధియా నిర్ణయాన్ని స్టార్‌లింక్ చీఫ్ ఎలాన్ మస్క్ ప్రశంసించారు. -
టెలికం సర్వీస్ లైసెన్సింగ్‌లో సమూల మార్పులు
న్యూఢిల్లీ: ప్రస్తుత టెలికం సర్వీస్ లైసెన్సింగ్ విధానంలో సమూలంగా మార్పులు తెచ్చే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రదానంగా మూడు రకాల అనుమతులను సిఫార్సు చేసింది. మెయిన్ సర్వీస్ ఆథరైజేషన్, అనుబంధ సర్వీసుల ఆథరైజేషన్, క్యాప్టివ్ సర్వీస్ ఆథరైజేషన్ వీటిలో ఉన్నాయి.వివిధ సేవలు, సర్వీస్ ఏరియాలవ్యాప్తంగా ’వన్ నేషన్ – వన్ ఆథరైజేషన్’ లక్ష్యాన్ని సాధించే దిశగా ’ఏకీకృత సర్వీస్ ఆథరైజేషన్’ కింద ట్రాయ్ ఈ సిఫార్సులు చేసింది. వీటి ప్రకారం మెయిన్ సర్వీస్ ఆథరైజేషన్లను నెట్వర్క్ సర్వీస్ ఆపరేటర్ (ఎన్ఎస్వో), వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ (వీఎన్‌వో)గా రెండు విభాగాల కింద ఇస్తారు.అనుబంధ సర్వీస్ ఆథరైజేషన్లను సాధారణంగా పెద్దగా పర్యవేక్షణ అవసరం ఉండని ఎంటర్ప్రైజ్ యూజర్లకు ఇస్తారు. సొంత అవసరాల కోసం నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకునేందుకు స్పెక్ట్రం తీసుకున్న సంస్థలకు క్యాప్టివ్ సర్వీస్ ఆథరైజేషన్ ఇస్తారు. -
బీఎస్ఎన్ఎల్ యూజర్లు 30 లక్షలు అప్..
న్యూఢిల్లీ: జూలైలో మొబైల్ టారిఫ్‌లను పెంచిన ప్రభావం ప్రైవేట్ రంగ టెల్కోలపై కనిపించింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా యూజర్లు తగ్గగా ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు పెరిగారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన జూలై గణాంకాల ప్రకారం బీఎస్ఎన్ఎల్ యూజర్ల సంఖ్య 29.4 లక్షల మేర పెరిగింది. ఎయిర్టెల్ సబ్ర్‌స్కయిబర్స్ 16.9 లక్షలు, వొడాఫోన్ ఐడియా కస్టమర్లు 14.1 లక్షలు, రిలయన్స్ జియో యూజర్లు 7.58 లక్షల మంది తగ్గారు. దేశీయంగా టెలికం యూజర్ల సంఖ్య జూన్ నాటి 120.56 కోట్ల నుంచి జూలైలో స్వల్పంగా క్షీణించి 120.51 కోట్లకు పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర టెలికం సర్కిల్స్‌లో మొబైల్ కనెక్షన్లు తగ్గాయి. జూలై తొలి వారంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సుమారు 10–27 శాతం శ్రేణిలో టారిఫ్‌లను పెంచడం తెలిసిందే. -
కోటి మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్
ఇబ్బందికరమైన కాలర్లు, మోసాలకు పాల్పడుతున్న మొబైల్ కనెక్షన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్, టెలికాం డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఇలాంటి కోటికిపైగా మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించాయి. అలాగే సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు 2.27 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లను టెలికాం శాఖ బ్లాక్ చేసింది."ఇప్పటి వరకు, సంచారసాథి సహాయంతో 1 కోటికి పైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్ చేశాం. అలాగే సైబర్ క్రైమ్/ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు 2.27 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లు బ్లాక్ చేశాం" అని ప్రకటన పేర్కొంది. స్పామ్ కాల్స్ కోసం రోబోకాల్స్, ప్రీ-రికార్డ్ కాల్స్‌తో సహా బల్క్ కనెక్షన్లను ఉపయోగిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది.వాటి కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసి బ్లాక్‌లిస్ట్ చేయాలని సూచించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ 4జీ కోసం 5జీ ఫోన్ కొనాలా?"గడిచిన 15 రోజుల్లో అటువంటి 3.5 లక్షల నంబర్లు డిస్కనెక్ట్ చేశాం. 50 సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేశాం. అలాగే దాదాపు 3.5 లక్షల ఉపయోగించని, ధ్రువీకరించని ఎస్ఎంఎస్ హెడర్లు, 12 లక్షల కంటెంట్ టెంప్లేట్లను బ్లాక్ చేశాం" అని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చర్యలతో పాటు నాణ్యతా సేవా నిబంధనలను ట్రాయ్ సవరించింది. ఇవి అక్టోబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి. ఏప్రిల్ 1 నుండి మొబైల్ సర్వీస్ క్యూఓఎస్ పనితీరు సమీక్ష త్రైమాసిక ప్రాతిపదికన కాకుండా నెలవారీగా నిర్వహించనున్నట్లు కూడా ప్రకటనలో వెల్లడించారు. -
2.75 లక్షల ఫోన్ నంబర్లకు చెక్
ఇబ్బందికర కాల్స్, నమోదుకాని టెలిమార్కెటర్లపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఉక్కుపాదం మోపుతోంది. ట్రాయ్ ఆదేశాలతో 2.75 లక్షల ఫోన్ నంబర్లను టెలికాం సంస్థలు డిస్కనెక్ట్ చేశాయి. నమోదుకాని 50 టెలిమార్కెటింగ్ కంపెనీలకు చెందిన టెలికాం సేవలను బ్లాక్ చేసినట్లు ట్రాయ్ వెల్లడించింది.ఈ చర్యలు స్పామ్ కాల్స్‌ను తగ్గించడంలో, కస్టమర్లకు ఉపశమనం కలిగించడంలో గణనీయ ప్రభావాన్ని చూపుతాయని ట్రాయ్ భావిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్ వల్ల 2024 ప్రథమార్థంలో నమోదుకాని టెలిమార్కెటర్లపై 7.9 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని ట్రాయ్ తెలిపింది. ఇబ్బందికర కాల్స్‌ను కట్టడి చేసేందుకు ట్రాయ్ 2024 ఆగస్ట్ 13న అన్ని యాక్సెస్ ప్రొవైడర్లకు కఠిన ఆదేశాలను జారీ చేసింది. టెలికాలం వనరులను దుర్వినియోగం చేస్తున్న నమోదుకాని టెలిమార్కెటర్ల నుంచి ప్రమోషనల్ వాయిస్ కాల్స్‌ను తక్షణమే నిలిపివేయాలని, రెండేళ్ల వరకు డిస్కనెక్షన్ లేదా బ్లాక్ లిస్టులో పెట్టాలని యాక్సెస్ ప్రొవైడర్లను ఆదేశించింది. ఇబ్బంది కలిగించే కాల్స్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా..50కి మించిన కాల్స్ లేదా ఎస్ఎంఎస్లు పంపే నిర్దిష్ట నంబర్‌కు గ్రేడ్స్ ప్రకారం అధిక టారిఫ్‌ను ప్రవేశపెట్టాలని ట్రాయ్ ఇటీవలే తన చర్చా పత్రం ద్వారా టెలికాం కంపెనీలకు సూచించింది.ఇదీ చదవండి: బెంగళూరు - హైదరాబాద్ టిక్కెట్ రూ.99కే! -
రోజుకు ఎన్ని కాల్స్ చేస్తున్నారు? ట్రాయ్ కొత్త ప్రతిపాదన
న్యూఢిల్లీ: ఇబ్బంది పెట్టే కాల్స్‌ను అరికట్టడానికి.. కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం గ్రేడ్స్ వారీ అధిక టారిఫ్‌ను ప్రవేశపెట్టాలని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా పరిశ్రమను కోరింది. రోజుకు 50కి పైగా కాల్స్, లేదా 50 ఎస్ఎంఎస్లు పంపిన టెలికం సబ్స్క్రైబర్లను ఇబ్బందికర కాలర్లుగా పరిశీలించాలని టెలికం కంపెనీలకు సూచించింది.దేశంలో 110 కోట్ల మందికిపైగా టెలికం సబ్స్క్రైబర్లు ఉండగా వీరిలో 0.03 శాతం మంది రోజుకు ఒక సిమ్ నుంచి 51 నుంచి 100 ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారని ట్రాయ్ పేర్కొంది. అలాగే 0.12% మంది ఒక సిమ్ నుంచి రోజుకు 51 నుండి 100 వాయిస్ కాల్స్ చేస్తున్నారని ట్రాయ్ తన కన్సల్టేషన్ పేపర్లో వివరించింది.‘టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్–2018’ నిబంధనల పరిధిలో నమోదైన ఒక సంస్థ కాకుండా ఇతర వ్యక్తులకు ఒక సిమ్‌కు రోజుకు ఒక నిర్దిష్ట పరిమితిని మించి ఎస్ఎంఎస్, వాయిస్ కాల్స్ కోసం గ్రేడ్స్ వారీ టారిఫ్ ఉండాలని స్పష్టం చేసింది. -
‘అన్లిమిటెడ్’ ప్లాన్లు ఉంటాయా? కంపెనీల వైఖరి ఇదే..
టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ (TRAI) ప్రతిపాదనలతో అపరిమిత కాలింగ్, డేటా ప్లాన్ల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. తమ ప్రియమైన అన్లిమిటెడ్ మొబైల్ రీచార్జ్ ప్యాకేజీలు ఆగిపోతాయేమోనని కోట్లాది మంది టెలికాం యూజర్లు ఆందోళన చెందుతున్నారు.అవసరం లేకపోయినా అన్ని కలిపి అందించే అన్లిమిటెడ్ ప్యాక్‌లు కాకుండా గతంలో మాదిరి కాలింగ్, ఎస్ఎంఎస్లకు విడివిడిగా ప్యాక్‌లు అందించే విషయంపై టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ (TRAI) ఇటీవల టెలికాం కంపెనీల స్పందన కోరింది. దీనికి ప్రధాన టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా తమ వైఖరిని తెలియజేశాయి. తమ రీఛార్జ్ ప్లాన్ల ప్రస్తుత నిర్మాణాన్ని సమర్థించుకున్నాయి.ఎయిర్టెల్ ఏం చెప్పిందంటే.. ఎయిర్టెల్ ట్రాయ్‌కి ఇచ్చిన స్టేట్మెంట్లో తమ ప్రస్తుత ప్లాన్లు సూటిగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయని పేర్కొంది. ఈ ప్లాన్లు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా వాయిస్, డేటా, ఎస్ఎంఎస్ సేవలను కలిపి అందిస్తున్నాయని చెప్పింది. ప్రత్యేక వాయిస్, ఎస్ఎంఎస్ ప్యాక్‌ల మోడల్‌కి తిరిగి వెళ్లడం పరిశ్రమను కాలం చెల్లిన సిస్టమ్‌గా మారుస్తుందని, విడివిడి రీఛార్జ్‌లతో వినియోగదారులకూ భారం పడుతుందని బదులిచ్చింది.జియోదీ అదే వైఖరిఎయిర్టెల్ వైఖరికి సమర్థిస్తూ జియో కూడా తమ సర్వే డేటాను సమర్పించింది. 91 శాతం మంది వినియోగరులు ప్రస్తుత టెలికాం ప్లాన్లను మోస్ట్ అఫర్డబుల్‌గా భావిస్తున్నారని, 93 శాతం తమకు మెరుగైన ప్రయోజనాలు లభిస్తున్నాయని నమ్ముతున్నారని పేర్కొంది. ఈ గణాంకాలు వినియోగదారులలో అపరిమిత మోడల్ విస్తృత ఆమోదాన్ని తెలియజేస్తున్నాయని జియో వివరించింది.ఆధునిక టెలికాం సేవలలో డేటా ప్రధాన అంశంగా మారిందని, అపరిమిత డేటా, కాలింగ్ మోడల్‌ను పే-యాజ్-యు-గో ప్రత్యామ్నాయం కంటే మెరుగైనదిగా టెలికాం కంపెనీలు నొక్కిచెప్పాయి. ఈ ప్లాన్లలో మార్పులు ప్రస్తుత వినియోగదారు అనుభవానికి అంతరాయం కలిగించవచ్చని పరిశ్రమ ఏకీకృత వైఖరి తెలియజేస్తోంది. ఇక దీనిపై ట్రాయ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
సెప్టెంబర్ 1 నుంచి ఆ మెసేజ్‌లు, కాల్స్ నిలిపివేత!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయి. చాలా కంపెనీలు మోసపూరిత మెసేజ్‌లు, కాల్స్ చేస్తూ టెలికాం వినియోగదారులను టార్గెట్ చేస్తున్నాయి. ఈ వ్యావహారంపై అవగాహనలేనివారు స్కామర్ల చేతికిచిక్కి ఆర్థికంగా, మనసికంగా బలవుతున్నారు. ఈ మోసాలను కట్టడి చేసేందుకు టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మెసేజ్ సేవల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, మోసపూరిత విధానాల నుంచి వినియోగదారులను రక్షించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని టెల్కోలను ఆదేశించింది. సరైన గుర్తింపులేని సర్వీస్ ప్రొవైడర్ల ప్రసారాలను నిలిపేస్తామని ప్రకటించింది.ఇదీ చదవండి: వాహనాలకు న‘కీ’లీ.. బీమా రెజెక్ట్!అయాచిత స్పామ్ కాల్స్, మెసేజ్‌ల కట్టడికి ట్రాయ్ గత కొద్ది కాలంగా కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మెసేజ్‌లు, కాల్స్ చేస్తున్నవారి సమాచారం తెలియని యూఆర్ఎల్లు, ఓటీటీ లింక్‌లను లేదా కాల్ బ్యాక్ నంబర్లను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిలిపేస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది. ఆయా విభాగాల్లోని సర్వీస్ ప్రొవైడర్లు ప్రసారాలు చేయకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సమాచారం పంపినవారి నుంచి మెసేజ్ గ్రహీతల వరకు అన్నింటినీ ట్రేస్ (గుర్తించడానికి) చేయడానికి నవంబర్ నుంచి తగిన చర్యలు తీసుకోవాలని ట్రాయ్ నిర్దేశించింది. పారదర్శకతలేని టెలిమార్కెటర్ చైన్ నుంచి వచ్చే సందేశాల ప్రసారం నిలిపివేతకు కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. -
జరా జాగ్రత్త ..! అలా చేస్తే బ్లాక్ లిస్టింగే.. ట్రాయ్ హెచ్చరిక
-
అలా చేస్తే బ్లాక్లిస్టింగే.. ట్రాయ్ హెచ్చరిక
న్యూఢిల్లీ: బల్క్ కనెక్షన్లను దుర్వినియోగం చేసే సంస్థలు కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టం చేసింది.వీటిని స్పామ్ కాల్స్ కోసం ఉపయోగిస్తున్నట్లు తేలిన పక్షంలో సదరు సంస్థల టెలికం వనరులను టెల్కోలు డిస్కనెక్ట్ చేయాలని, అలాగే ఆపరేటర్లంతా వాటిని రెండేళ్ల వరకు బ్లాక్ లిస్ట్ చేయాలని నిర్ణయించింది. టెల్కోల చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్లతో గురువారం సమావేశమైన మీదట ట్రాయ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.మరోవైపు, ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి వైట్లిస్ట్లో లేని యూఆర్ఎల్స్, ఏపీకేలు గల మెసేజీల డెలివరీకి అనుమతి ఉండదని ట్రాయ్ తెలిపింది. అలాగే మెసేజీని పంపే సంస్థ, టెలీమార్కెటర్ను ట్రేస్ చేసే సాంకేతికతను అక్టోబర్ 31 నాటికల్లా అమల్లోకి తేవాలని టెల్కోలకు సూచించింది. ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, జియో తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
సిగ్నెల్ రాకుంటే యూజర్లకు పరిహారం!.. ట్రాయ్ కొత్త రూల్స్
టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిబంధనలను ప్రకటించింది. టెలికామ్ సేవల్లో నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి, నిబంధనలను మరింత కఠినతరం చేసినట్లు వెల్లడించింది. ఈ అంశంపైన క్షుణ్ణంగా పరిశీలనలు జరిపిన తరువాత కొత్త రూల్స్ జారీ చేయడం జరిగిందని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ ఈవెంట్లో.. ట్రాయ్ చైర్మన్ 'అనిల్ కుమార్ లాహోటి' తెలిపారు.ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం.. సిగ్నెల్స్ రాకుంటే యూజర్లకు పరిహారం చెల్లించాలి. సర్వీస్ ప్రొవైడర్లు తమ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయాలని అథారిటీ వెల్లడించింది. దీనికి ఆరు నెలల గడువు కూడా ఇచ్చింది. కొత్త అప్‌గ్రేడ్స్ ద్వారా వినియోగదారులకు సరైన క్వాలిటీ సర్వీస్ లభిస్తుంది. నిబంధలనలను ఉల్లంఘించిన సంస్థలకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని అనిల్ కుమార్ లాహోటి పేర్కొన్నారు.ట్రాయ్ జారీ చేసిన కొత్త క్వాలిటీ సర్వీస్ రూల్స్ ప్రకారం, జిల్లా స్థాయిలో 24 గంటల కంటే ఎక్కువ సమయం సర్వీస్ ఆగిపోయినప్పుడు టెలికామ్ ఆపరేటర్లు చందాదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానా మొత్తాన్ని రూ. 50వేలు నుంచి రూ.1 లక్షకు పెంచారు.ఇదీ చదవండి: పెట్రోల్ అవసరం లేని వాహనాలు వచ్చేస్తున్నాయి: నితిన్ గడ్కరీగ్రేడెడ్ పెనాల్టీ విధానం ఆధారంగా జరిమానా రూ.1 లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షలుగా విభజించారు. ది స్టాండర్డ్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ యాక్సెస్ అండ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ రెగ్యులేషన్స్ చట్టం ప్రకారం ఈ రూల్స్ అమలులోకి వస్తాయి. ఈ కొత్త రూల్స్‌పై టెలికామ్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. -
నెట్‌వర్క్‌లో అంతరాయం.. బిల్లులో రాయితీ!
నెట్వర్క్ సేవల్లో అంతరాయం కలగడం సాధారణంగా దాదాపు అందరికీ ఎదురయ్యే సమస్యే. ఒక్కోసారి 24 గంటలైనా ఈ సమస్య పరిష్కారం అవ్వదు. అయినా ప్లాన్ గడువులో ఎలాంటి మార్పులుండవు. సర్వీస్ ప్రొవైడర్లు ప్రతిపాదించిన రీచార్జ్ చెల్లించాల్సిందే. పోస్ట్‌పోయిడ్ కస్లమర్ల పరిస్థితి అంతే. ఇకపై ఏదైనా నెట్వర్క్ సమస్య తలెత్తితే అందుకు అనుగుణంగా బిల్లు చెల్లింపుల్లో రాయితీ పొందేలా టెలికాం ప్రాధికార సంస్థ(ట్రాయ్) నిబంధనలను తీసుకొచ్చింది.ట్రాయ్ విడుదల చేసిన క్వాలిటీ సర్వీస్ రూల్స్ ప్రకారం..టెలికాం ఆపరేటర్లు జిల్లా స్థాయిలో అందించే నెట్వర్క్ సేవల్లో 24 గంటల కంటే ఎక్కువసేపు అంతరాయం కలిగితే పరిహారం చెల్లించాలి. ఈమేరకు గతంలోని జరిమానాను రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంచింది. దాంతోపాటు వివిధ ప్రమాణాల ఉల్లంఘనలకు రూ.1 లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షల గ్రేడెడ్ పెనాల్టీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈమేరకు ‘ది స్టాండర్డ్స్ ఆఫ్ సర్వీస్ యాక్సెస్ (వైర్‌లైన్స్ అండ్ వైర్లెస్), బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ రెగ్యులేషన్స్, 2024’ నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త నియమాలు ఆరునెలల తర్వాత అమల్లోకి వస్తాయని ట్రాయ్ తెలిపింది.గతంలోని సెల్యులార్ మొబైల్ సేవలు, బ్రాడ్‌బ్యాండ్ సేవలు, బ్రాడ్‌బ్యాండ్ వైర్లెస్ సేవల నాణ్యత వంటి మూడు నిబంధనలను భర్తీ చేస్తూ కొత్తవాటిని ప్రవేశపెట్టారు. వీటి ప్రకారం..పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు అందించే సేవల్లో అంతరాయం ఏర్పడితే నెలవారీ బిల్లులో రాయితీ ఇవ్వాలి. ప్రీ-పెయిడ్ కస్టమర్లకు ప్లాన్ వ్యాలిడిటీ గడువు పెంచాలి. అయితే ఏదైనా వాతావరణ విపత్తు వల్ల నెట్వర్క్ సేవల్లో అంతరాయం ఏర్పడితే దాన్ని పరిగణనలోకి తీసుకోరు. ఎలాంటి సమస్యనైనా వారం రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: బీఎన్ఎన్ఎల్ ‘5జీ-రెడీ సిమ్‌కార్డు’ విడుదలఫిక్స్డ్-లైన్ సర్వీస్ ప్రొవైడర్లు(కేబుల్ నెట్వర్క్) కూడా పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ కస్టమర్ల సమస్యలను మూడు రోజులలోపు పరిష్కరించాలి. లేదంటే పరిహారం చెల్లించాలి. మొబైల్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు తమ వెబ్సైట్లో వినియోగదారులకు సహాయపడే సేవల వారీగా (2G, 3G, 4G, 5G) జియోస్పేషియల్ కవరేజ్ మ్యాప్‌లను అందించాలని ట్రాయ్ పేర్కొంది. -
‘హాలో.. డాక్టర్ పూజానా‘.. మీరు అశ్లీల చిత్రాలు షేర్ చేస్తున్నారా?
సైబర్ నేరస్తుడు : హలో పూజానా మాట్లాడేది. డాక్టర్ పూజా : హా చెప్పండి నేనే డాక్టర్ పూజాని మాట్లాడుతున్నాను.సైబర్ నేరస్తుడు : మేడం మేం టెలిఫోన్ రెగ్యులరేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి మాట్లాడుతున్నాం. మీ ఫోన్ నుంచి అశ్లీల చిత్రాలు షేర్ అవుతున్నాయని మాకు సమాచారం అందింది. మీరు ఆ ఫోన్‌ను అందుకే వినియోగిస్తున్నారంటగా? నిజమేనా? డాక్టర్ పూజా : అయ్యో లేదు సార్..నేను డాక్టర్ని, నేను ఫోన్ చాలా తక్కువగా వినియోగిస్తాను. అశ్లీల చిత్రాలు ఎందుకు షేర్ చేస్తాను. అసలు ఆ విషయం గురించి నాకు తెలియదు. సైబర్ నేరస్తుడు : లేదు.. లేదు. మీరు అశ్లీల చిత్రాలు షేర్ చేస్తున్నట్లు మా విచారణలో తేలింది. డాక్టర్ పూజా : లేదండి నేను నిజమే చెబుతున్నాను. అశ్లీల చిత్రాలు షేర్ అవుతున్నాయని నాకు తెలియదు. సైబర్ నేరస్తుడు : సరే సరే మీరు నిజం చెబుతున్నారు. అలా అని మేం ఎలా నమ్మాలి. మీరు ఓ పని చేయండి. మేం మీకు వీడియో కాల్ చేస్తాం. ఆ వీడియో కాల్లో మీరే మాతో మాట్లాడాలి. డాక్టర్ పూజా : సరే ఇప్పుడే ఫోన్ చేయండి. నేనే మీతో వీడియో కాల్లో మాట్లాడుతాను. సైబర్ నేరస్తుడు : అవతలి నుంచి వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడింది. ఫలితం 48 గంటల పాటు డిజిటల్ అరెస్ట్ అయ్యింది. రూ.59 లక్షలు పోగొట్ఠుకుంది.సైబర్ నేరస్తులు తెలివి మీరారు. ఈజీ మనీకోసం అడ్డదార్లు తొక్కుతున్నారు. టెక్నాలజీ సాయంతో డిజిటల్ అరెస్ట్ చేసి బాధితుల్ని అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలా తాజాగా, డిజిటల్ అరెస్ట్‌తో నోయిడాకి చెందిన డాక్టర్ పూజా గోయల్ రూ.59 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంతకీ ఏం జరిగింది. నోయిడా సెక్టార్ 77లో నివసించే డాక్టర్ పూజా గోయల్‌కి జూలై 13న కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ట్రాయ్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆపై అశ్లీల చిత్రాల్ని షేర్ చేసేందుకు మీ ఫోన్ వినియోగిస్తున్నారని మాకు సమాచారం అందిందంటూ పూజా గోయల్‌ని హెచ్చరించే ప్రయత్నం చేశాడు. పలు మార్లు చేసిన తప్పు ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించాడు. అయితే బాధితురాలు పూజా మాత్రం జంకకుండా నా ఫోన్ నుంచి ఎలాంటి నీలి చిత్రాలు షేర్ చేయలేదని గట్టిగా బదులిచ్చింది. దీంతో కంగుతిన్న సైబర్ నేరస్తుడు డాక్టర్ పూజను తనదారికి తెచ్చేందుకు సంభాషణను కొనసాగించాడు. చివరికి తాను అనుకున్నట్లుగానే పూజ వీడియో కాల్ మాట్లాడేలా చేశాడు. వీడియో కాల్ ఆన్ చేసిన తర్వాత పూజా మాట్లాడింది. మాట్లాడే సమయంలో 48 గంటల పాటు ఓ రూంలో నిర్భందించాడు. ఆమె ఎక్కడి వెళ్లిపోకుండా తాను డాక్టర్ పూజా ఫోన్ గురించి చెప్పేది నిజమేనని నమ్మేలా చేశాడు. 48 గంటల నిర్భందంలో నిందితుడు బాధితురాలు ఫోన్ నుంచి రూ.రూ 59 లక్షల 54 వేల రూపాయలను తన బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఆమెను వదిలేశాడు. ఆ తర్వాతనే బాధితురాలికి అర్ధమైంది తాను మోసపోయానని. లబోదిబో మంటూ నోయిడా సెక్టార్ 36లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూజా ఫిర్యాదుపై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబర్ క్రైమ్) వివేక్ రంజన్ రాయ్ మాట్లాడుతూ.. బాధితురాలు ఏ బ్యాంక్ అకౌంట్‌కు డబ్బుల్ని ట్రాన్స్ ఫర్ చేశారో సంబంధిత ఆధారాలు తమవద్ద ఉన్నాయని, వాటిపై ఓ స్పష్టత వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఇలాంటి సైబర్ నేరాలు ఢిల్లీ-ఎన్సీఆర్ కేంద్రంగా ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయని, ఇప్పటికే ఇలాంటి డిజిటల్ అరెస్ట్‌కు సంబంధించిన ఓ పది కేసులు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. కాగా, అనుమానాస్పద కాల్స్ చేసి తాము ఫలానా డిపార్ట్మెంట్కు చెందిన ప్రభుత్వ అధికారులమని, మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు బెదిరించినా, లేదా వ్యక్తిగత, ఆర్థిక సమాచారం కోసం అడిగితే వెంటనే స్థానిక పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. డిజిటల్ అరెస్ట్ అంటే..టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సైబర్ నేరాలు సైతం అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీంతో సైబర్ నేరస్తులు కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి సైబర్ మోసాల్లో ఈ డిజిటల్ అరెస్ట్ ఒకటి. ఇందులో సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి తాము పోలీసులమనో, దర్యాప్తు అధికారులమనో నమ్మిస్తారు. బ్యాంకు ఖాతా, సిమ్ కార్డు, ఆధార్ కార్డు వంటివి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించుకున్నారని బెదిరిస్తారు. విచారణ పూర్తయ్యేంతవరకూ అక్కడి నుంచి కదలటానికి వీల్లేదని కట్టడి చేస్తారు. డబ్బులు చెల్లిస్తే వదిలేస్తామని చెబుతారు. వారి ఖాతాలోకి డబ్బులు జమయ్యాక విడిచిపెడతారు. ఇలా మనిషిని ఎక్కడికీ వెళ్లనీయకుండా.. ఒకరకంగా అరెస్ట్ చేసినట్టుగా నిర్బంధించటమే ‘డిజిటల్ అరెస్ట్’.డిజిటల్ అరెస్ట్ కొత్త సైబర్ నేరం కావటం వల్ల ప్రజలు దీన్ని పోల్చుకోవటం కష్టమైపోతోంది. దర్యాప్తు అధికారులమని తొందర పెట్టటం వల్ల కంగారుపడి, ఏది ఎక్కడికి దారితీస్తోందనే భయంతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. డాక్టర్ పూజా గోయల్లాంటి ఘటనలే దీనికి నిదర్శనం. -
నంబరు ‘పోర్టింగ్’ వ్యవధి 7 రోజులకు తగ్గింపు
న్యూఢిల్లీ: సిమ్ కార్డు దెబ్బతినడం వంటి కారణాలతో దాన్ని రీప్లేస్ చేసిన తర్వాత, మొబైల్ నంబరు పోర్టింగ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వ్యవధిని ట్రాయ్ ఏడు రోజులకు తగ్గించింది. వాస్తవానికి మొబైల్ ఫోన్ నంబర్లతో జరిగే మోసాలను కట్టడి చేసేందుకు గతంలో ఈ వ్యవధి పది రోజులుగా ఉండేది. అయితే, అత్యవసరంగా పోరి్టంగ్ చేసుకోవాల్సిన సందర్భాల్లో అన్ని రోజులు నిరీక్షించడం సమస్యగా ఉంటోందని, దీన్ని రెండు నుంచి నాలుగు రోజులకు తగ్గిస్తే సముచితంగా ఉంటుందని పలు వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు వివరణ నోట్లో ట్రాయ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా అటు మోసపూరిత పోర్టింగ్‌ను కట్టడి చేసేందుకు సమయం మరీ తక్కువ కాకుండా ఇటు వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా చూసేందుకు దీన్ని ఏడు రోజులకు మారుస్తూ తాజా సవరణ చేసినట్లు తెలిపింది. ఇది జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం సిమ్‌ను మార్చుకున్న ఏడు రోజుల్లోగా పోరి్టంగ్ కోసం ప్రయతి్నస్తే యూనిక్ పోరి్టంగ్ కోడ్ (యూపీసీ) లభించకుండా, దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. -
టెలికం యూజర్లు @120 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలి కం యూజర్ల సంఖ్య ఏప్రిల్‌లో 120 కోట్లు దాటింది. ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో మొత్తం సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 120.12 కోట్లుగా నమోదైంది.ఈ ఏడాది మార్చిలో ఇది 119.92 కోట్లుగా ఉంది. చివరిసారిగా 2017 జూలైలో 121 కోట్ల రికార్డు స్థాయిని తాకింది. తాజాగా, వైర్లెస్ విభాగంలో రిలయన్స్ జియోకి ఏప్రిల్‌లో 26.8 లక్షల మంది కొత్త యూజర్లు జత వడంతో మొత్తం యూజర్ల సంఖ్య 47.24 కోట్లకు చేరింది.7.52 లక్షల కొత్త కస్టమర్లు, మొత్తం 26.75 కోట్ల యూజర్లతో ఎయిర్టెల్ తర్వాత స్థానంలో ఉంది. బీఎస్ఎన్ఎల్ యూజర్ల సంఖ్య 12.3 లక్షలు, వొడాఫోన్ ఐడియా యూజర్లు 7.35 లక్షల మేర తగ్గారు. -
కొత్తగా ‘160’ సిరీస్ ఫోన్ నంబర్లు.. ఎవరికంటే..
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల ‘160’ సిరీస్ నంబర్లను ప్రవేశపెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ఉన్న సంస్థలు మొదటి దశలో సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ కోసం '160' ఫోన్ నంబర్ సిరీస్‌కు మారుతున్నట్లు ట్రాయ్ తెలిపింది.అంటే ఇకపై ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు, ఇతర సంస్థల నుంచి సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ '160'తో మొదలయ్యే ఫోన్ నంబర్ల నుంచి వస్తాయి. మోసగాళ్ల నుంచి వచ్చే మోసపూరిత కాల్స్‌ను వినియోగదారులు సులభంగా గుర్తించడంలో సహాయపడటానికి ట్రాయ్ ఈ చర్య తీసుకుంది.ట్రాయ్ అధికారులు, ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 25కు పైగా బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు, అంతర్జాతీయ బ్యాంకులు, టెల్కోలు సహా ఇతర ఆర్థిక సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ప్రమోషనల్ అవసరాల కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న 140 సిరీస్ కార్యకలాపాలను డీఎల్టీ (డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ)కి మార్చడంపై ఈ సమావేశంలో చర్చించినట్లు, డిజిటల్ సమ్మతిని కూడా అమలు చేస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది.సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ కోసం 160 సిరీస్, మార్కెటింగ్ కోసం 140 సిరీస్‌ను అమలు చేయడంతో.. 10 అంకెల నంబర్ల నుంచి వచ్చే స్పామ్ కాల్స్ పై గణనీయమైన నియంత్రణ ఉంటుందని ట్రాయ్ తెలిపింది. ప్రస్తుతం కంపెనీలకు చెందిన 10 అంకెల స్పామ్ నంబర్లలో చాలా వరకు కృత్రిమ మేధను ఉపయోగించి టెల్కోలు నేరుగా బ్లాక్ చేస్తున్నాయి. -
ఫోన్ నంబర్ ఇక ఫ్రీ కాదు.. ట్రాయ్ షాకింగ్ ప్రతిపాదన
టెక్నాలజీ విస్తృతమైన నేటి రోజుల్లో ఫోన్ నంబర్ లేని వారంటూ ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. దేశంలో ప్రతిఒక్కరికి వ్యక్తిగత ఫోన్ నంబరో లేక ల్యాండ్‌లైన్ నంబరో ఏదో ఒకటి ఉంటుంది. యూజర్లు తమ అవసరాలను బట్టీ వాటికి రీచార్జ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఫోన్ నంబర్ కోసం ఇప్పటి వరకూ ఎలాంటి రుసుము లేకపోయినప్పటికీ రానున్న రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ ప్రతిపాదన ప్రకారం మీ మొబైల్ నంబర్ లేదా ల్యాండ్ లైన్ నంబర్ కోసం త్వరలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ నంబర్‌ను అత్యంత విలువైన, పరిమితమైన ప్రజా వనరుగా భావిస్తున్న ట్రాయ్ ఈ నంబర్లకు గానూ మొబైల్ ఆపరేటర్లపై ఛార్జీలు విధించాలని ప్రతిపాదించింది. కంపెనీలు వీటిని వినియోగదారుల నుంచి రికవరీ చేయవచ్చు. అలాగే ఎక్కువ నంబర్లు కలిగి తక్కువ వినియోగం ఉన్న టెలికం ఆపరేటర్లపై జరిమానా విధించే అవకాశాన్ని ట్రాయ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఆస్ట్రేలియా, సింగపూర్, బెల్జియం, ఫిన్లాండ్, యూకే, లిథువేనియా, గ్రీస్, హాంకాంగ్, బల్గేరియా, కువైట్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, పోలాండ్, నైజీరియా, దక్షిణాఫ్రికా, డెన్మార్క్ సహా పలు దేశాలు ఇప్పటికే ఫోన్ నంబర్లకు ఫీజులు విధిస్తున్నాయి. భారత్‌లోనూ నంబరింగ్ వనరులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇలాంటి చర్యలను అవలంబించాలని ట్రాయ్ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఛార్జీల అమలుకు ట్రాయ్ పలు మార్గాలను సూచించింది. ప్రభుత్వం ప్రతి నంబర్‌కు వన్ టైమ్ ఛార్జీ లేదా వార్షిక రుసుమును విధించవచ్చు. ఇక ప్రీమియం లేదా 'వీఐపీ' నంబర్ల కోసం వేలం నిర్వహించవచ్చు.प्रेस विज्ञप्ति संख्या 27/2024 - राष्ट्रीय नंबरिंग योजना के संशोधन पर परामर्श पत्र के संबंध में ।Press Release No. 27/2024 regarding Consultation Paper on Revision of National Numbering Plan.https://t.co/AQC11neBSr— TRAI (@TRAI) June 7, 2024 -
ఏపీలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై ట్రాయ్ కి ఫిర్యాదు
-
టీడీపీ ఒత్తిళ్లతో సాక్షి, మరికొన్ని వార్తా ఛానెళ్ల నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ ఒత్తిళ్లతో మీడియా ప్రసారాలు నిలిపివేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పలు వార్తా ఛానళ్ల ప్రసారాలు శాశ్వతంగా నిలిపివేయాలని ఆ పార్టీ యత్నిస్తోందని పేర్కొంది. ఎలాంటి చట్టబద్ధమైన అనుమతి, విధానపరమైన సమ్మతిలేకుండా అధికార టీడీపీ ఒత్తిళ్ల కారణంగా సాక్షి, టీవీ–9.. ఎన్టీవీ, 10టీవీల ప్రసారాలు శాశ్వతంగా నిలిపివేయాలని ఏపీ కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ తీర్మానం చేసినట్లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కు మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీ ఎస్. నిరంజన్‌రెడ్డి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్, ప్రమోషన్–2019 2ఎస్సీసీ 104 కేసులో సుప్రీంకోర్టు ఎయిర్‌వేవ్, ఫ్రీక్వెన్సీలు పబ్లిక్ ప్రాపర్టీగా తన తీర్పులో పేర్కొందని, తద్వారా వాటిని వినియోగించుకోవడం ప్రతీ పౌరుడి హక్కు అనే విషయాన్ని ట్రాయ్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. చట్టానికి లోబడి సహేతుకమైన ఆంక్షలు విధించొచ్చని, అయితే ఎలాంటి కారణాలు లేకుండా ఏజెన్సీలు ఛానెళ్లను ఏకపక్షంగా తొలగించడం ఉల్లంఘన కిందకి వస్తుందని ఆయన స్పష్టంచేశారు. ట్రాయ్ నిబంధనలు ఏం చెబుతున్నాయనే విషయాన్ని ఫిర్యాదులో ఉటంకించారు.నోటీసు ఇవ్వకుండా సిగ్నల్ ఆపకూడదు..ప్రతిపాదిత డిస్కనెక్షన్కు కారణాలు స్పష్టంగా పేర్కొంటూ ప్రభావిత సర్వీస్ ప్రొవైడర్‌కు కనీసం మూడు వారాల నోటీసు ఇవ్వకుండా ఏ సర్వీస్ ప్రొవైడర్ టెలివిజన్ ఛానళ్ల సిగ్నల్‌ను డిస్కనెక్ట్ చేయరాదని 2017 నిబంధనల్లోని 17వ నిబంధన స్పష్టంచేస్తోందని.. కానీ, ప్రస్తుతం ఏపీలో ఈ నిబంధన తుంగలో తొక్కారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. నూతంగా ఏర్పాటవుతున్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం పలు వార్తా ఛానళ్లపై ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. నోటీసు జారీచేయకుండానే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో కేబుల్ టీవీ ఆపరేటర్ల అసోసియేషన్ ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రంపై ప్రత్యక్షంగా దాడిచేసినట్లేనన్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా భావించే వార్తా ఛానళ్లను ఏకపక్షంగా నిరోధించడం ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలపై స్వతంత్ర నివేదికలు, విమర్శనాత్మక విశ్లేషణలు అందించే ప్రతికా స్వేచ్ఛను హరిస్తున్నారని నిరంజన్‌రెడ్డి ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ తరహా జోక్యం ప్రతికా స్వేచ్ఛను నిరుత్సాహపరచడమేనని.. ఇది పాత్రికేయ స్వేచ్ఛను అణచివేయడమేనన్నారు. పౌరులకు భిన్నమైన, అవసరమైన సమాచారం అందించే అవకాశం మీడియా కోల్పోతుందన్నారు. ఛానెళ్లు మ్యూట్ చేయడమంటే అసమ్మతి గళం సహించబోమనే సందేశం ప్రజల్లోకి పంపుతోందన్నారు. దీనిద్వారా జర్నలిస్టులు, మీడియా సంస్థలు వివాదాస్పద అంశాలు కవర్ చేయడం తగ్గుతుందని, కేవలం ప్రభుత్వ అనుకూల కథనాలే ప్రసారమవుతాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ తరహా చర్యలవల్ల ప్రతికా స్వేచ్ఛపై పడే ప్రభావాలను ట్రాయ్ తక్షణమే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని నిరంజన్‌రెడ్డి కోరారు.సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి..ఇక ట్రాయ్ నిబంధనలు అమలుచేయడంతోపాటు ప్రభుత్వ ప్రభావం నుంచి మీడియాను రక్షించడానికి నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఏపీ కేబుల్ టీవీ ఆపరేటర్ల అసోసియేషన్ న్యూస్ ఛానళ్లను అక్రమంగా బ్లాక్ చేయడంపై సమగ్ర విచారణ జరపాలని, ట్రాయ్ 2017 నిబంధనల్లోని 17వ నిబంధన ఉల్లంఘించిన వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రెస్ స్వతంత్ర సూత్రాలను సమర్థించి మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్‌లపై ప్రభుత్వ ప్రభావం లేకుండా చూడాలని ఆ ఫిర్యాదులో నిరంజన్‌రెడ్డి కోరారు. తన ఫిర్యాదులోని అంశాన్ని అత్యవసరంగా తీసుకుని వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ఏపీలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేత.. ట్రాయ్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై ట్రాయ్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఏపీలో సాక్షి టీవీతో పాటు కొన్ని ఛానళ్ల ప్రసారాలు నిలిపివేతపై ట్రాయ్‌కి వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కేబుల్ ఆపరేటర్లపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి సాక్షితో పాటు కొన్ని ఛానళ్ల ప్రసారాలు రాకుండా కుట్ర చేస్తోంది.సాక్షి టీవీతో పాటు మరికొన్ని ఛానళ్ల ప్రసారాలను అడ్డుకోవడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించడమేనని ఫిర్యాదులో వైఎస్సార్సీపీ పేర్కొంది.మీడియాకు ఆంక్షలు.. కొత్త సర్కార్ విపరీత పోకడఏపీ సీఎం ప్రమాణస్వీకారానికి మీడియా, జర్నలిస్టులకు కొత్త ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సాక్షి మీడియాతో పాటు మరో రెండు ఛానళ్లకు అనుమతి నిరాకరించింది. కవరేజ్ కోసం మీడియా ప్రతినిధులకు పాస్‌లు ఇవ్వని అధికారులు.. ప్రధాని హాజరవుతున్న కార్యక్రమానికి మీడియా కవరేజ్‌కు ఆంక్షలు విధించడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రధాని పర్యటన వార్తలు కవర్ చేయొద్దన్న ఆంక్షలపై పలువురు మండిపడుతున్నారు. రాష్ట్ర చర్రితలో ఎన్నడూలేని విపరీత పోకడలపై విమర్శలు వస్తున్నాయి. గతంలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఎల్లో మీడియాకు ఆహ్వానాలు అందగా, బాబు ప్రభుత్వం కొలువు దీరకముందే ఆంక్షలు విధించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, రాష్ట్రంలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారు. కర్రలు, రాళ్లు, రాడ్లతో వీరంగం చేస్తున్నారు. విగ్రహాలను, శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. వీరు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల తీరుపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.. -
ట్రాయ్ చైర్మన్‌గా అనిల్ లాహోటీకి బాధ్యతలు
న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త చైర్మన్‌గా అనిల్ లాహోటీ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కాల్ సర్వీసుల నాణ్యత పెంచడం, కాల్ డ్రాప్‌ల నియంత్రణ, అన్ని సంస్థలకు సమాన స్థాయిలో అవకాశాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, టెలికం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్, ఇతర ట్రాయ్ అధికారులతో సమావేశమయ్యారు. పీడీ వాఘేలా పదవీ కాలం ముగిసిన తర్వాత గత నాలుగేళ్లుగా ట్రాయ్ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. కొత్త చైర్మన్‌గా రైల్వే బోర్డు మాజీ చీఫ్ అయిన లాహోటీ పేరును సోమవారం ప్రకటించారు. ఇండియన్ రైల్వే సర్వీస్ ఇంజినీర్స్ 1984 బ్యాచ్‌కి చెందిన ఆయన రైల్వే బోర్డు చైర్మన్, సీఈవోగా 2023 ఆగస్టులో పదవీ విరమణ చేశారు. -
తాన్లా బోర్డులోకి ట్రాయ్ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాయ్ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మను డైరెక్టర్ల బోర్డులో నియమించినట్లు తాన్లా ప్లాట్‌ఫామ్స్ సోమవారం ప్రకటించింది. దీంతో సంస్థ బోర్డ్ డైరెక్టర్ల సంఖ్య ఏడుకు చేరుకుంది. 2015–20 మధ్య ట్రాయ్ చైర్మన్‌గా ఆయన విధులు నిర్వర్తించారు. ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ అడ్మిని్రస్టేషన్ ఛైర్మన్‌గా.. భారత్‌లో కోవిడ్–19 టీకా కార్యక్రమానికి డిజిటల్ వెన్నెముక అయిన కో–విన్ రూపకల్పన, అమలుకు నాయకత్వం వహించారు. నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవోగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలైన ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలులో కీలకపాత్ర పోషించారు. 2009–13 మధ్య ఆధార్ కార్డుల జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్, మిషన్ డైరెక్టర్‌గా పని చేశారు. -
తిరుగులేని జియో.. భారీగా పెరిగిన యూజర్లు
న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ యూజర్ల సంఖ్య మరో 34.7 లక్షలు పెరిగి మొత్తం 44.92 కోట్లకు చేరింది. అటు పోటీ సంస్థ భారతి ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ 13.2 లక్షలు పెరగ్గా వొడాఫోన్ ఐడియా యూజర్లు 7.5 లక్షలు తగ్గారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ బుధవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం భారతి ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య 37.77 కోట్లుగా, వొడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్స్ సంఖ్య 22.75 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం వైర్లెస్ సబ్స్క్రైబర్స్ సంఖ్య 115 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంతాల్లో యూజర్ల సంఖ్య 63 కోట్లకు, గ్రామీణ ప్రాంతాల్లో సబ్స్క్రైబర్స్ సంఖ్య 52 కోట్లకు చేరింది. 88.5 కోట్లకు బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు.. ట్రాయ్ గణాంకాల ప్రకారం మొత్తం బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య ఆగస్టులో 87.65 కోట్లుగా ఉండగా సెప్టెంబర్ ఆఖరు నాటికి 88.5 కోట్లకు చేరింది. టాప్ 5 సర్వీస్ ప్రొవైడర్ల మార్కెట్ వాటా 98.35 శాతంగా ఉంది. ఇందులో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (45.89 కోట్లు), భారతి ఎయిర్టెల్ (25.75 కోట్లు), వొడాఫోన్ ఐడియా (12.65 కోట్లు), బీఎస్ఎన్ఎల్ (2.51 కోట్లు) ఉన్నాయి. -
షాకింగ్ ఫ్రాడ్: సీనియర్ టెకీని ఏకంగా రూ. 3.7 కోట్లకు ముంచేశారు
ఛాన్స్ దొరికితే చాలు.. కాదు కాదు.. సందు దొరకబుచ్చుకుని మరీ సేబర్ నేరగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా దిగ్గజ ఐటీ కంపెనీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌కు టోకరా ఇచ్చి మూడు కోట్లు దోచేసిన వైనం కలకలం రేపింది. పోలీసుల అధికారుల పేరుతో ఇన్ఫోసిస్ ఉద్యోగిని భయపెట్టి, బెదిరించి నిలువునా ముంచేశారు. నకిలీ పోలీసు స్టేషన్ సృష్టించిన ఈ షాకింగ్ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని ఇన్ఫోసిస్ ఉద్యోగి ఇచ్చిన పోలీసుల ఫిర్యాదు మేరకు సైబర్ నేరగాళ్లు అతడిని టార్గెట్‌గా చేసుకున్నారు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), సీబీఐ, ముంబై పోలీసుల అధికారుల అవతారమెత్తారు. మనీలాండరింగ్‌తో సహా పలు నేరాలకు పాల్పడ్డావంటూ తీవ్రంగా బెదిరించారు. అరెస్టుకు సిద్ధమని హెచ్చరించారు. నవంబర్ 21న ఫోన్ చేసిన మోసగాళ్లు మనీలాండరింగ్‌తో పాటు అనేక నేరారోపణల కింద, అరెస్టు చేస్తామని బెదిరించారు. ట్రాయ్ అధికారిగా పరిచయం చేసుకున్న కేటుగాడు పేరు మీద ఉన్న సిమ్‌కార్డు అక్రమ ప్రకటనల కోసం వినియోగిస్తున్నారని తెలిపాడు. షాక్ తిన్న ఇన్ఫోసిస్ టెకీ ఆ నంబర్ తనది కాదని చెప్పాడు. ఆధార్ కార్డ్ మీద సిమ్ కార్డు రిజిస్టర్ అయిందన్నాడు. ఆ మరునాడు తాను ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారినని మరొకడు ఫోన్ ఏశాడు. ఢిల్లీ, ముంబైలలో ఇదే కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఇందులో ఒకటి ముంబైలోని వకోలా పోలీస్ స్టేషన్లో, మరొకటి ముంబైలో మనీలాండరింగ్ కేసులని మ్మ బలికాడు తాను చెప్పిన మాట వినకుంటే ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తామని బెదిరించారు. అంతేకాదు వీడియో కాల్ చేసిన మోసగాళ్ళు అతడిని మరింత భయపెట్టారు. వీడియో కాల్లో నకిలీ పోలీస్ స్టేషన్, నకిలీ పోలీసులు, ఐడి కార్డులు ..ఇలా పెద్ద తతంగమే చేశారు. ఫిర్యాదు (తప్పుడు) కాపీని కూడా చూపించారు. దీంతో అయోమయం, గందరగోళానికి గురైన టెకీ మోసగాళ్లు చెప్పినట్లే చేశాడు. తన ఖాతాలో ఉన్న రూ.3.7 కోట్లను మోసగాళ్లకు వివిధ ఖాతాలకు బదిలీ చేశారు. ఇదంతా నవంబర్ 21 నుంచి 23 మధ్య జరిగింది. ఈ షాక్ నుంచి తేరుకున్నాక మోసపోయానని గ్రహించాడు. దీంతో నవంబర్ 25న పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 3 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినందున కేసును క్రిమినల్ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ)కి బదిలీ చేయనున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. అక్రమార్కుల బ్యాంకు ఖాతాలపై ఆరా తీస్తున్నారు. -
స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టడానికి కొత్త యాప్..
-
స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టడానికి కొత్త యాప్
టెక్నాలజీ పెరిగిపోతున్న సమయంలో ఫేక్ కాల్స్ లేదా స్పామ్ కాల్స్ పెరిగిపోతున్నాయి. అనవసరమైన కాల్స్, మెసేజ్‌లకు స్వస్తి పలకడానికి 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) ఓ కొత్త యాప్ తీసుకువచ్చింది. ఈ లేటెస్ట్ యాప్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలో కమ్యూనికేషన్ నిబంధనలను పర్యవేక్షించే 'ట్రాయ్' వినియోగదారులకు విసుగు తెప్పించే కాల్స్, మెసేజస్ వంటి వాటిని నిరోధించుకోవడానికి లేదా పరిష్కరించడాని 'డు నాట్ డిస్టర్బ్' (DND) యాప్ డెవెలప్ చేసింది. అయితే ఇందులో కొన్ని టెక్నికల్ సమస్యలు తలెత్తడం వల్ల దీనిని వినియోగించడంలో కొన్ని సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాయ్ కార్యదర్శి 'రఘునందన్' వెల్లడించారు. ట్రాయ్ డెవెలప్ చేసిన డు నాట్ డిస్టర్బ్ యాప్ ప్రధాన ఉద్దేశ్యం అవాంఛిత కాల్స్ లేదా మెసేజ్‌లను పూర్తిగా నిషేధించడమే. ఈ యాప్ సాయంతో వినియోగదారులు తమకు ఇబ్బందికరమైన కమ్యూనికేషన్లను సులభంగా నివేదించవచ్చు, పూర్తిగా నిరోధించవచ్చు. యాప్‌లో సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై రఘునందన్ మాట్లాడుతూ.. యాప్‌లో బగ్‌లను గుర్తించి పరిష్కరించడానికి ట్రాయ్ ఇప్పటికే ఏజెన్సీని నియమించింది, దీంతో ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. 2024 నాటికి ఇందులో ఎలాంటి సమస్యలు లేకుండా చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఐఫోన్లలో యాపిల్ పరిమితుల కారణంగా ఈ యాప్ పనిచేసే అవకాశం లేదు. రానున్న రోజుల్లో ఈ మొబైల్స్‌లో కూడా పనిచేసేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంకుపై చర్యలు ప్రతి రోజూ సుమారు 5 మిలియన్స్ కంటే ఎక్కువ స్పామ్ కాల్స్ వస్తున్నాయని, వీటి భారీ నుంచి విముక్తి చేయడానికి ట్రాయ్ ఈ యాప్ రూపొందించినట్లు తెలుస్తోంది. 'డు నాట్ డిస్టర్బ్' యాప్ ఎలా ఉపయోగించాలి గూగుల్ ప్లే స్టోర్‌లో TRAI DND 3.0(Do Not Disturb) యాప్ సర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. డౌన్లోడ్ పూర్తయిన తరువాత యాప్ ఓపెన్ చేసి.. OTP వెరిఫికేషన్ పూర్తి చేసి సైన్ ఇన్ చేసుకోవాలి. సైన్ ఇన్ పూర్తి చేసుకున్న తరువాత అవాంఛిత కాల్స్, టెక్స్ట్‌లను బ్లాక్ చేయడానికి మీ మొబైల్ నెంబర్ 'డు నాట్ డిస్టర్బ్' జాబితాకు యాడ్ అవుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత కూడా మీకు స్పామ్ కాల్స్ వస్తున్నట్లతే.. తప్పకుండా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ వారికి కంప్లైన్ట్ చేయాలి. -
మీకు అలాంటి కాల్స్ వస్తున్నాయా? యూజర్లకు ట్రాయ్ హెచ్చరికలు
న్యూఢిల్లీ: మోసపూరిత కాల్స్‌పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) హెచ్చరించింది. ‘కొన్ని కంపెనీలు/ఏజెన్సీలు/వ్యక్తులు ట్రాయ్ నుండి కాల్ చేస్తున్నామని, అలాగే సందేశాలు పంపుతూ ప్రజలను/కస్టమర్లను మోసగిస్తున్నట్టు ట్రాయ్ దృష్టికి వచ్చింది. ట్రాయ్ నుండి కాల్ చేస్తున్నట్టు తప్పుగా చెప్పుకునే కాలర్లు నంబర్లను డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తారు. ఆధార్ నంబర్లను సిమ్ కార్డ్స్ పొందేందుకు ఉపయోగించారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అట్టి సిమ్‌లను ఉపయోగిస్తున్నారని కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. మొబైల్ నంబర్ డిస్కనెక్ట్ కాకుండా ఉండాలంటే స్కైప్ వీడియో కాల్ చేయాల్సిందిగా కస్టమర్‌కు వారు సూచిస్తున్నారు. ట్రాయ్ ఏ వ్యక్తిగత టెలికం కస్టమర్ల మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేయడం లేదా డిస్కనెక్ట్ చేయదు. ట్రాయ్ నుండి వచ్చినట్లు చెప్పుకునే అటువంటి కాల్ లేదా సందేశాన్ని మోసపూరితంగా పరిగణించాలి. అలాంటి కాల్స్ చట్టవిరుద్ధం’ అని ట్రాయ్ స్పష్టం చేసింది. -
ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్
రద్దు చేసుకున్న, పనిచేయని మొబైల్ నంబర్లను కనీసం మూడు నెలల తర్వాతే వేరేవారికి కేటాయిస్తామని భారత టెలికాం నియంత్రణ సంస్థ-ట్రాయ్ తెలిపింది. డియాక్టివేట్ లేదా డిస్కనెక్ట్ చేసిన మొబైల్ నంబర్లు వాడిన వారి సమాచార గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్లు చెప్పింది. మొబైల్ నంబర్లు డిస్కనెక్ట్, డీయాక్టివేట్ చేసిన తర్వాత వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుందని గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. అందుకు ప్రతిగా ట్రాయ్ స్పందించింది. ఇదీ చదవండి: పేదల నుంచే జీఎస్టీ గరిష్ఠ వసూళ్లు ఈ రిట్పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై ట్రాయ్ తన స్పందనను తెలియజేసింది. గతంలో ఫోన్ నంబరు వాడిన చందాదారుడి గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకే 90 రోజుల వ్యవధి విధించినట్లు చెప్పింది. సబ్స్క్రైబర్లు సైతం తమ వంతుగా వ్యక్తిగత సమాచారానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని సూచించింది. వాట్సప్ సైతం తన స్పందనను కోర్టుకు తెలియజేసింది. ఒకవేళ 45 రోజుల కంటే ఎక్కువ రోజుల పాటు వాడకంలోలేని ఫోన్‌నంబర్లు ఆ తర్వాత కొత్త డివైజ్‌లో యాక్టివేట్ అయితే అందులోని డేటా మొత్తం తొలగిపోతుందని తెలిపింది. దాంతో గతంలో ఫోన్నంబర్తో వాట్సాప్ వాడిన వారి వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా ఉంటుందని వివరించింది. -
వొడాఫోన్ ఐడియాకు షాక్.. మూలిగే నక్కపై తాటికాయ అంటే ఇదే..
మూలిగే నక్కపై తాటికాయ పడటం అంటే ఇదే.. రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాకు భారీ జరిమానా రూపంలో ట్రాయ్ షాకిచ్చింది. ఇబ్బందికరమైన కాల్స్, SMSలను అరికట్టడంలో విఫలమైనందుకు టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ తమకు రూ. కోటి పెనాల్టీని విధించినట్లు వోడాఫోన్ ఐడియా కంపెనీ తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (Trai) సెప్టెంబర్ 28న జరిమానా విధించినట్లు వోడాఫోన్ ఐడియా (వీఐఎల్) తాజా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్, 2018 ప్రకారం 2021 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఫిర్యాదుల కోసం కంపెనీ నెట్వర్క్ ద్వారా పంపిన అన్‌సొలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్స్ (UCC)ని అరికట్టడంలో వొడాఫోన్ ఐడియా వైఫల్యం చెందినట్లు ట్రాయ్ పేర్కొంది. ఈ ఆర్డర్‌ని సమీక్షిస్తున్నామని, దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై పరిశీలిస్తున్నామని వొడాఫోన్ ఐడియా ఫైలింగ్‌లో తెలిపింది. వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర నష్టం మరింత పెరిగి రూ. 7,840 కోట్లను తాకింది. మరోవైపు జూన్ నెలలో 12.8 లక్షల మంది యూజర్లను ఈ టెలికాం కంపెనీ కోల్పోయింది. -
సెల్‌ఫోన్ యూజర్లకు వార్నింగ్ మెసేజ్.. స్పందించిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఫోన్ యూజర్లకు సెల్ఫోన్లో అలర్ట్ మెసేజ్ రావడం కలకలం సృష్టించింది. ఫోన్లను ఆపే వరకు అలారమ్ సౌండ్ రావడంతో కస్టమర్ల ఆందోళనకు గురయ్యారు. అయితే, టెస్టింగ్‌లో భాగంగానే వినియోగదారులకు ఇలా అలర్ట్ మెసేజ్ పంపినట్టు కేంద్రం వివరణ ఇచ్చింది. దీనిపై భయపడాల్సిందేమీలేదని స్పష్టం చేసింది. అయితే, దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌ల యూజర్లకు గురువారం ఉదయం 11-12 గంటల మధ్య ప్రాంతంలో సెల్ఫోన్లకు వార్నింగ్ మెసేజ్ వచ్చింది. ఫోన్లను ఆపే వరకు అలారమ్ సౌండ్ చేస్తూ స్క్రీన్‌పై మెసేజ్ డిస్ప్లే అయ్యింది. ఈ అలర్ట్‌పై కేంద్రం వివరణ ఇచ్చింది. ‘ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపంబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. ఎందుకంటే మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ నిర్వహణ అథారిటీ అమలు చేస్తున్న టెస్ట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థకి పంపబడింది. దీన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజా భద్రత మరియు అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందిస్తాయి అని తెలిపింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజా భద్రతను మరింత మెరుగుపరుస్తుంది అని రాసి ఉంది. కాగా, ఈ మెసేజ్ ఇప్పటి వరకు మూడు భాషల్లో యూజర్లకు వచ్చింది. మొదట ఇంగ్లీష్, తర్వాత తెలుగు, చివరగా హిందీలో మెసేజ్‌లు వచ్చాయి. What is this alert all about? @airtelindia @airtelnews @Airtel_Presence It's like a real high vibration and emergency alarm. pic.twitter.com/dLdohymNxL — Aksh (@aksh2810) September 21, 2023 మొబైల్ ఫోన్ యూజర్లకు అలెర్ట్ మెసేజ్ రావడం ఇటు హైదరాబాద్‌లోనూ కలకలం సృష్టించింది. ఒక సభలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉన్నప్పుడు ఈ అలారం వచ్చింది. ఒక్కసారిగా వార్నింగ్ సౌండ్ రావడంతో ఏమైందని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఫోన్లను ఆపే వరకు అలారం సౌండ్ రావడంతో అక్కడే ఉన్న వారు ఆందోళనకు గురయ్యారు. కాసేపటికే ఇది టెస్ట్ అలారం అని తెలియడంతో సమావేశాన్ని కొనసాగించారు. -
ఎయిర్‌టెల్‌కి షాకిచ్చిన జియో.. పాపం వొడాఫోన్ ఐడియా!
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం యూజర్ల సంఖ్య జూన్‌లో స్వల్పంగా పెరిగి 117.38 కోట్లకు చేరింది. రిలయన్స్ జియోకి 22.7 లక్షల మంది, భారతీ ఎయిర్‌టెల్‌కు 14 లక్షల మంది యూజర్లు కొత్తగా జతయ్యారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం మే ఆఖరు నాటికి టెలిఫోన్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 117.25 కోట్లుగా ఉంది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్), ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ యూజర్లు తగ్గారు. బీఎస్ఎన్ఎల్ సబ్‌స్క్రయిబర్స్ 18.7 లక్షల మంది, వీఐఎల్ 12.8 లక్షల మంది, ఎంటీఎన్ఎల్ 1.52 లక్షల మంది యూజర్లను కోల్పోయాయి. జియో 2.08 లక్షలు, భారతీ ఎయిర్టెల్ 1.34 లక్షలు, వీ–కాన్ మొబైల్ అండ్ ఇన్ఫ్రా 13,100 కలెక్షన్లు నమోదు చేసుకున్నాయి. -
టెలికం సేవల నాణ్యత నిబంధనలు కఠినతరం
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ ఫిర్యాదులు గణనీయంగా వస్తున్న నేపథ్యంలో సేవల నాణ్యత నిబంధనలను సమీక్షించడంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ దృష్టి పెట్టింది. ప్రస్తుతం టెలికం సర్కిల్ స్థాయిలో చేస్తున్న నెట్వర్క్ పనితీరు సమీక్షను జిల్లా స్థాయిలోనూ నిర్వహించాలని భావిస్తోంది. ఈ క్రమంలో సరీ్వసుల నాణ్యత నిబంధనల్లో కాల్ డ్రాప్ పరామితులు, కాల్ సక్సెస్ రేటు మొదలైనవి కఠినతరం చేయాలని ట్రాయ్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను సెపె్టంబర్ 20లోగా, ముసాయిదా నిబంధనలపై అక్టోబర్ 5న కౌంటర్ కామెంట్లు దాఖలు చేయాలని ట్రాయ్ సూచించింది. మొబైల్ టెలికమ్యూనికేషన్స్‌లో సాంకేతికత ఎంతగానో పురోగమించినా వినియోగదారులకు నాణ్యమైన సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదని ట్రాయ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా 4జీ నెట్వర్క్ ఉన్నా, 5జీ సేవలు విస్తరిస్తున్నా కాల్ డ్రాప్స్, కాల్ వినబడకపోవడం, డేటా వేగం తగ్గిపోవడం వంటి అంశాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయని తెలిపింది. ఇలాంటి అంశాల వల్ల నెట్వర్క్ సామర్థ్యాలపై సందేహాలు తలెత్తుతున్నాయని వివరించింది. -
డిజిటల్ ఇన్ఫ్రా సంస్థలకు పర్మిట్లు కేంద్రానికి ట్రాయ్ సిఫార్సు
న్యూఢిల్లీ: డిజిటల్ ఇన్ఫ్రా సేవల సంస్థల కోసం ప్రత్యేకంగా పర్మిట్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రానికి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ కొత్త కేటగిరీ లైసెన్సును డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ (డీసీఐపీ) లైసెన్సుగా వ్యవహరించవచ్చని ట్రాయ్ పేర్కొంది. డీసీఐపీలో కంపెనీలపై లైసెన్స్ రుసుము ఎలాంటి విధించబడదు. (హోండా కొత్త బైక్ ఎస్పీ160: ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే! ) అయితే పర్మిట్ల కోసం రూ. 2 లక్షలు ఎంట్రీ ఫీజు, రూ. 15,000 ప్రాసెసింగ్ ఫీజు విధించ వచ్చని తెలిపింది. అయితే డీసీఐపీ కోసం లైసెన్సు ఫీజు విధించవద్దని సూచించింది. దీన్ని స్టాండెలోన్ లైసెన్సుగా కాకుండా ఏకీకృత లైసెన్సు కిందే జారీ చేయొచ్చని ట్రాయ్ తెలిపింది. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్) -
సమతూకపు నియంత్రణ!
అసలేమీ చేయకుండా ఉండే కన్నా, ఆలస్యంగానైనా కళ్ళు తెరిచి ఆచరణలోకి దిగడం మంచిదే! కృత్రిమమేధ (ఏఐ)ను నియంత్రించడానికి చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అలాంటిదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అథారిటీ ఆఫ్ ఇండియా పేర ఒక సంస్థను నెలకొల్పాలంటూ భారత టెలికామ్ నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) చేసిన తాజా సిఫార్సు స్వాగతించాల్సిన అంశం. టెలికామే కాక బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, రవాణా, విద్య, వ్యవసాయం లాంటి అనేక రంగాలపై ఏఐ అమితమైన ప్రభావం చూపుతున్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి, సమగ్రమైన నియంత్రణకు సమకట్టడం సరైన చర్య. ట్రాయ్ ప్రతిపాదించిన నియంత్రణ సంస్థ ఏఐ సంబంధిత రంగాలన్నిటికీ సలహా దారుగా, నియంత్రణకర్తగా వ్యవహరి స్తుంది. సాంకేతిక సంస్థలు మాత్రం తమ నియంత్రణకు మరిన్ని చట్టాల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఏఐ కోసం స్వతంత్ర చట్టబద్ధ సంస్థను పెట్టాలన్న ట్రాయ్ సిఫార్సుపై తీవ్రంగా స్పందిస్తు న్నాయి. అయితే, సాంకేతికతతో వచ్చే లాభాలను స్వీకరిస్తూనే, జరిగే హానిని కూడా గుర్తించి, సమతూకం సాధించడం అవసరం. ప్రపంచవ్యాప్తంగా పాల కుల ముందున్న సవాలు ఇది. 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) లాంటి సాంకేతికతలు ఏఐతో ముడిపడ్డాయి. వీటికి విడివిడి విధానాలతో లాభం లేదు. అన్నిటినీ సమన్వయపరిచే సమగ్రమైనది అవసరం. ట్రాయ్ తన 141 పేజీల నివేదికలో ఆ మాటే ప్రస్తావించి, తాజా సిఫార్సు చేసింది. నూతన సాంకేతిక ఆవిష్కరణలు శరవేగంతో వస్తుంటే, మన విధాన నిర్ణేతలు ఎంతో వెనుకబడి ఉన్నారు. రెండు దశాబ్దాల క్రితం ఆరంభమైన ఆన్లైన్ వేదికలకు సైతం నేటికీ సరైన నియంత్రణ వ్యవస్థ లేని దేశం మనది. 1998లో వచ్చిన గూగుల్, 2004లో ఆరంభమైన ఫేస్బుక్ లాంటివి ఇప్పటికీ వినియోగదారుల డేటాను యథేచ్ఛగా వాడుకుంటూ, లాభాలు మూట గట్టుకుంటున్నాయి. దాన్ని నియంత్రించడానికి ఉద్దేశించిన వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు వగైరాలను దేశం దీర్ఘకాలంగా చర్చిస్తూనే ఉంది. సరైన నియంత్రణ లేక సామాజిక మాధ్యమ వేదికలు యూజర్ల డేటాను తస్కరిస్తూనే ఉన్నాయి. కొన్ని వేదికలు వేధింపులనూ, విద్వేషాలనూ రాజేస్తున్నాయి. ఏఐ ఆవిర్భావంతో డేటా దుర్విని యోగం ఎల్లలు దాటిందనే అనుమానం తలెత్తింది. వ్యక్తిగత గోప్యతే కాదు... ఆర్థికవ్యవస్థ పైనా ప్రభావం చూపే పరిస్థితి. ఏఐ నియంత్రణకు స్వతంత్ర వ్యవస్థ ఆలోచనను ఈ నేపథ్యం నుంచి చూడాలి. గత నవంబర్‌లో ఓపెన్ ఏఐ సంస్థ తన ఛాట్‌బాట్ అయిన ‘ఛాట్ జీపీటీ’ని విడుదల చేసినప్పటి నుంచి ఏఐ పట్ల ఉత్సాహం ఎంత ఉందో, ఆందోళనా అంతే ఉంది. ఛాట్ జీపీటీ లాంటి నమూనాల రూపకల్పనపై 6 నెలల మారటోరియం విధించాలని ఎలాన్ మస్క్ లాంటి నిపుణులు సైతం అనడం గమనార్హం. వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి, మానవకృషికి కొత్త మార్గాలు తెరిచి, మామూలు పనుల్ని సైతం సృజనాత్మకంగా చేయడానికి ఏఐ ఉపయుక్తమే. కానీ మనుషుల కృత్రిమ రూపాల తయారీ, తప్పుడు సమాచార వ్యాప్తి సహా ప్రమాదాలున్నాయి. ఏఐని అణ్వస్త్రపోరుతో పోలుస్తూ, మానవజాతి మనుగడకే ప్రమాదకారి అంటున్న శాస్త్రవేత్తలూ లేకపోలేదు. అందుకే, ఏఐని విశృంఖలంగా వదిలేయరాదన్నది నిపుణులు, పాలకుల ఏకాభిప్రాయం. నవీన ఆవిష్కరణల్ని ఆహ్వానిస్తూనే, వాటిని నైతికబద్ధంగా వాడేలా సమతౌల్య సాధన కీలకమనేది ప్రధాన సూత్రం. ఏఐ ప్రతికూల ప్రభావాన్ని కట్టడి చేయడానికి విశ్వవ్యాప్తంగా అనేక ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి. విదేశాలు చట్టాలు చేస్తున్నాయి. కెనడా ముసాయిదా చట్టం చేసింది. అమెరికా ఏఐ బిల్లు తెచ్చింది. సురక్షితంగా, పారదర్శకంగా ఏఐ అభివృద్ధి సాగేలా చూస్తామంటూ అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ తదితర 7 ప్రధాన ఏఐ సంస్థల నుంచి ఈ నెల 21నే అమెరికా ప్రభుత్వం స్వచ్ఛంద వాగ్దానాలు తీసుకుంది. చైనా సైతం పాలనా చర్యలపై ఒక ముసాయిదా సిద్ధం చేసి, ప్రజాస్పందన కోసం ఉంచింది. బ్రెజిల్, జపాన్‌లు ఏఐ నియమావళి సిద్ధం చేశాయి. అభివృద్ధి చెందిన దేశాలతో కూడిన ‘గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ’ సంస్థాపక సభ్యదేశమైన భారత్ వంతు ఇప్పుడు ట్రాయ్ సిఫార్సుతో వచ్చిందనుకోవాలి. ఏఐ అభివృద్ధిలో భాగస్థులు పాటించాల్సిన బాధ్యతల్ని నాస్కామ్ ఇప్పటికే వెల్లడించింది. కానీ ఏఐపై మోజులో ప్రమాణాలు, నైతికత, జవాబుదారీతనం గాలికి పోవచ్చు. కాబట్టి నియంత్రణ సంస్థ పెట్టాలన్న మాట బంగారు బాట. నిజానికి, పార్లమెంట్లో ‘డిజిటల్ వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు’ను ప్రవేశపెట్టనున్నారు. 2000 నాటి ఐటీ చట్టం స్థానంలో వచ్చే డిజిటల్ ఇండియా చట్టం కొంతవరకు ఏఐని నియంత్రిస్తుందని భావిస్తున్నారు. అయితే, ఏఐకి ప్రత్యేక చట్టం యత్నాలేవీ ఇప్పటికీ లేవు. ఇది ఆలోచించాల్సిన విషయం. యూజర్లకు హాని ఏ మేరకు కలుగుతుందనే కోణం నుంచి ఏఐపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ వైఖరి ఉంటుందనీ, ఇప్పటికిప్పుడు తీవ్రమైన చర్యలేమీ అవసరం లేదనీ సంబంధిత కేంద్ర మంత్రివర్యుల ఉవాచ. ముందుగానే ఏఐపై కఠిన నిబంధనలు పెట్టి, నవీన సాంకేతికకు ఉరితాళ్ళు బిగించరాదన్న మాట నిజమే! అదే సమయంలో రాబోయే కష్టనష్టాలను కూడా ముందుగా ఆలోచించడం, అవసరమైన చట్టాలతో యుద్ధానికి సిద్ధంగా ఉండడం వివేకం. ఏఐకి సంబంధించి చట్టబద్ధ మైన స్వతంత్ర నియంత్రణ సంస్థ ఆలోచన అందుకు తొలి అడుగు కావాలి. ఏఐపై ప్రాథమిక నిబంధనలు, హద్దు మీరితే జుల్మానాలు, దోషులపై పట్టు బిగించే అధికారాలతో సంస్థ ఏర్పాటు కావాలి. -
టెల్కోల వాయిస్ కాల్స్‌కు ఓటీటీ దెబ్బ
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో టెల్కోల ఆదాయంలో వాయిస్ కాల్స్ వాటా 80 శాతం, ఎస్ఎంఎస్ల వాటా 94 శాతం పడిపోయింది. అయితే, డేటా వాటా 10 రెట్లు పెరిగింది. ఓటీటీలను నియంత్రణ పరిధిలోకి తెచ్చే క్రమంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూపొందించిన చర్చాపత్రంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2013 జూన్ త్రైమాసికం – 2022 డిసెంబర్ త్రైమాసికం మధ్య కాలంలో గణాంకాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారం.. గత దశాబ్ద కాలంలో మెసేజింగ్, వాయిస్ కమ్యూనికేషన్ కోసం ఓటీటీ యాప్‌ల వినియోగం పెరగడం వల్ల అంతర్జాతీయంగా టెల్కోలకు వాయిస్, ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే ఆదాయాలు .. క్రమంగా డేటా వైపునకు మళ్లాయి. దేశీయంగా చూస్తే టెల్కోలకు సగటున ప్రతి యూజరుపై వచ్చే ఆదాయానికి (ఏఆర్పీయూ) సంబంధించి డేటా విభాగం తప్ప మిగతా అన్నింటి వాటా తగ్గిపోయింది. 2013 జూన్ క్వార్టర్లో టెల్కోల ఆదాయంలో డేటా వాటా 8.1 శాతంగా ఉండగా 2022 డిసెంబర్ త్రైమాసికంలో 10 రెట్లు పెరిగి 85.1 శాతానికి చేరింది. మరోవైపు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడమా లేక నిర్దిష్టంగా కొన్ని కాలింగ్, మెసేజింగ్ యాప్‌లను నిలిపివేయడమా అనే చర్చనీయాంశాన్ని కూడా చర్చాపత్రంలో ట్రాయ్ స్పృశించింది. ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్స్‌ను పూర్తిగా షట్‌డౌన్ చేయడం వల్ల ఎకానమీకే కాకుండా విద్యా, వైద్యం వంటి కీలక సేవలకు కూడా ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అల్లర్లు రేపేందుకు ఉగ్రవాదులు లేదా విద్రోహ శక్తులు ఉపయోగించే అవకాశమున్న నిర్దిష్ట ఓటీటీ యాప్‌లు, వెబ్సైట్లను మాత్రమే నిషేధించడం శ్రేయస్కరం కావచ్చని ట్రాయ్ పేర్కొంది. -
వాట్సాప్, ఫేస్బుక్ నియంత్రణపై చర్చలు - త్వరలో కొత్త రూల్స్!
ప్రస్తుతం వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ లేకుండా యువతకు సమయమే గడచిపోదు. అయితే వీటిని కొంత మంది మంచి పనుల కోసం ఉపయోగిస్తే.. మరికొందరు దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి అనుచిత సంఘటనకు సంబంధించిన కేసులు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. కొన్ని సందర్భాల్లో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఎంతోమంది అకౌంట్స్ కూడా బ్లాక్ చేసింది. అయితే ఇప్పుడు వీటిపైన కొన్ని నియంత్రణలు కల్పించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నివేదికల ప్రకారం.. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ఓవర్-ది-టాప్ (OTT) కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లను నియంత్రించడంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చర్చలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులలో కమ్యూనికేషన్ యాప్స్ మీద కొంత సమయం లేదా తాత్కాలిక నిషేధం విధించాల్సిన అవసరం ఉందా.. లేదా అనే విషయం మీద చర్చలు మొదలుపెట్టింది. ఇంటర్నెట్ బేస్డ్ కాల్స్ విషయంలో టెలికామ్ ప్రొవైడర్లకు వర్తించే నియమాలు కమ్యూనికేషన్ యాప్స్‌కి కూడా వర్తించేలా చేయాలని సంస్థలు ఎప్పటి నుంచో అడుగుతున్నాయి, అంతే కాకుండా లైసెన్స్ ఫీజులమీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ కారణంగా టెలికామ్ విభాగం 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా'ను సంప్రదించింది. దీంతో ట్రాయ్ యాప్స్ నియంత్రణ, తాత్కాలిక నిషేధం వంటి 14 అంశాల మీద చర్చలు జరపనుంది. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) వాట్సాప్, టెలిగ్రామ్ మొదలైన వాటికి పూర్తిగా నిషేధించే బదులు అత్యవసర పరిస్థితుల్లో చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా యాప్‌లలో ఆర్థిక, భద్రత పరమైన అంశాలను తప్పకుండా పరిశీలించాల్సిన అవసరం ఉందని ట్రాయ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. -
డిజిటల్ కమ్యూనికేషన్లో కొత్త టెక్నాలజీలకు ప్రోత్సాహం
న్యూఢిల్లీ: డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో రెగ్యులేటరీ శాండ్బాక్స్ ద్వారా వినూత్న టెక్నాలజీలు, సర్వీసులు, వ్యాపార మోడల్స్‌ను ప్రోత్సహించే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్చాపత్రాన్ని రూపొందించింది. లక్ష్యాలు, పరిధి, పాల్గొనే వారి అర్హతా ప్రమాణాలు, దరఖాస్తులను మదింపు చేసే ప్రక్రియ మొదలైన అంశాలను ఇందులో పొందుపర్చింది. నియంత్రిత వాతావరణంలో కంపెనీలు, ఆవిష్కర్తలు తమ కాన్సెప్టులు, సర్వీసులను ప్రయోగాత్మకంగా పరీక్షించుకునేందుకు రెగ్యులేటరీ శాండ్బాక్స్ ఉపయోగపడుతుంది. కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయడానికి ముందే వాటి సామరŠాధ్యలను పరీక్షించేందుకు అవసరమైన రియల్ టైమ్ నెట్వర్క్ వాతావరణం, ఇతర డేటాను పొందేందుకు శాండ్బాక్స్ ఉపకరిస్తుందని ట్రాయ్ పేర్కొంది. దీనిపై సంబంధిత వర్గాలు జూలై 17లోగా తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుంది. కౌంటర్ కామెంట్లను దాఖలు చేసేందుకు ఆగస్టు 1 ఆఖరు తేదీగా ఉంటుంది. -
ఇబ్బంది పెట్టే కాల్స్‌కు చెక్.. టెలికాం సంస్థలకు ట్రాయ్ కీలక ఆదేశాలు!
అవాంఛిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ల నుంచి యూజర్లకు ఉపశమనం కలిగేలా టెలికాం సంస్థలకు టెలికాం నియంత్రణాధికార సంస్థ (ట్రాయ్) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఫోన్ కాల్స్, మెసేజ్‌లు యూజర్లకు పంపాలంటే వారి అనుమతి తీసుకోవాలి. ఇందుకోసం 2 నెలల్లోపు ఓ యూనిఫైడ్ డిజిటల్ వేదికను అభివృద్ధి చేయాలని సూచించింది. ముందుగా అడ్వైర్టెజ్‌మెంట్ మొబైల్ ఫోన్ కాల్స్ అందుకోవడానికి సబ్స్క్రైబర్లు తమ సంసిద్ధతను తెలియజేయాల్సి ఉంటుంది. సంస్థలు కస్టమర్లను సంప్రదించి వారి అంగీకారం మేరకు వాణిజ్య ప్రకటనలు పంపడం ఆరంభిస్తాయంటూ ఓ ప్రకటనలో ట్రాయ్ వివరించింది. ప్రస్తుతం సంస్థలు ప్రమోషనల్ కాల్స్,మెసేజెస్ పంపుతున్నామని, అందుకు వినియోగదారుల అనుమతి కోరేలా ఎలాంటి వ్యవస్థ లేదు. అందుకే 2 నెలల్లో యూనిఫైడ్ డిజిటల్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని టెలికాం సంస్థలకు స్పష్టం చేసింది. సమ్మతి కోరుతూ పంపే సందేశాలు ‘127’తో మొదలయ్యేలా కామన్ షార్ట్ కోడ్‌ను వినియోగించాలని ఆయా సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. చదవండి👉 సూపర్, మైండ్ బ్లోయింగ్.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న టిమ్ కుక్! -
కేంద్రం కొత్త రూల్స్.. మే 1 నుంచి అమల్లోకి రానున్న ఫోన్ కాల్స్ నిబంధనలు!
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త చెప్పింది. మే నెల ప్రారంభం నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపింది. దీంతో యూజర్లకు భారీ ఊరట లభించినట్లైంది. ట్రాయ్ ప్రకటనతో ఫోన్ వినియోగదారులు ఫేక్, ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్ల బారి నుంచి ఉపశమనం పొందనున్నారు. ఇందుకోసం ట్రాయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయం తీసుకోనుంది. తద్వారా యూజర్లను అస్తమానం చికాకు పెట్టించే కాల్స్, మెసేజ్‌ల బెడద తప్పనుంది. టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు ఇక స్పామ్ కాల్స్ బెడద నుంచి యూజర్లను రక్షించేలా టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎయిర్ టెల్, జియో, వివో వంటి సంస్థలు తప్పనిసరిగా ఏఐ ఫిల్టర్‌ను వినియోగించాలని ఆదేశించింది. దీని ద్వారా, ఫోన్లలోని ప్రమోషనల్ కాల్స్ ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్ల నుంచి బయటపడొచ్చు. ట్రాయ్ ఆదేశాలు.. ఎయిర్టెల్ , జియో అప్రమత్తం ఈ తరుణంలో ట్రాయ్ ఆదేశాలపై జియో, ఎయిర్టెల్ స్పందించాయి. ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే తమ నెట్‌వర్క్‌లలో ఏఐ ఫిల్టర్ ఆప్షన్‌ను ఏనేబుల్ చేస్తామని తెలిపాయి. ఇక,ఈ ఆప్షన్ మే 1 నుంచి వినియోగించుకునే అవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాల్ ఐడీ ఉపయోగం ఏంటంటే? టెక్నాలజీ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ అవగాహనా రాహిత్యం వల్ల స్పామ్ కాల్స్, మెసేజ్‌ల వల్ల అనార్ధాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ట్రాయ్ గత కొంతకాలంగా పనిచేస్తుంది. ముఖ్యంగా సైబర్ నేరస్తులు ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్లతో అమాయకుల బ్యాంక్ అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు. ఈ తరహా సైబర్ మోసాలపై దృష్టి సారించిన ట్రాయ్.. టెలికాం కంపెనీలకు కాల్ ఐడీని అందుబాటులోకి తెచ్చేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ కాల్ ఐడీ ఆప్షన్‌తో మనకు ఫోన్ చేసే వారి పేర్లు, ఫోటోలు మొబైల్ ఫోన్లపై డిస్ప్లే కానున్నాయి. ఇలా చేయడం వల్ల మనకు ఫోన్ చేసేది ఎవరనేది ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడొచ్చని రెగ్యులేటరీ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ససేమీరా అంటున్న టెలికాం కంపెనీలు కానీ, ప్రైవసీ సమస్య కారణంగా ఎయిర్టెల్, జియో వంటి టెలికాం కంపెనీలు ఈ టెక్నాలజీని తీసుకురావడానికి వెనుకాడుతున్నాయి. అయితే దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. వినియోగదారులకు ఇబ్బంది కలిగించే కాల్స్, ఎస్ఎంఎస్లను అరికట్టడానికి ఏఐ ఫిల్టర్ మాత్రమే మే 1 నుండి అమల్లోకి రానుందనేది వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 వైరల్ అవుతున్న లలిత్ మోడీ ఆస్తుల విలువ.. ఎన్ని వేల కోట్లంటే? -
పోటీ సంస్థలను దెబ్బతీస్తున్న జియో.. ఎయిర్టెల్ ఏం చెబుతోందంటే?
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. తాము చౌక టారిఫ్‌లను అమలు చేస్తున్నామన్న దుగ్ధతోనే ఎయిర్టెల్ జియోఫైబర్‌పై ఫిర్యాదులు చేస్తోందని, కావాలనే తమ ప్రతిష్టను దెబ్బతీసే యత్నాలు చేస్తోందని రిలయన్స్ జియో ఆరోపించింది. భవిష్యత్తులో ఇలాంటి చౌకబారు ఆరోపణలు మళ్లీ చేయకుండా ఎయిర్‌టెల్‌ను హెచ్చరించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి రాసిన లేఖలో కోరింది. రిజిస్టర్ చేసుకోని డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫాంలకు కంటెంట్‌ను అందించడం ద్వారా బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు డౌన్‌లింకింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ ట్రాయ్‌కు ఎయిర్టెల్ ఫిర్యాదు చేసింది. తద్వారా ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను జియో టీవీ ప్రసారం చేస్తుండటాన్ని పరోక్షంగా ప్రస్తావించినట్లయింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (ఆర్జేఐఎల్) బ్రాడ్‌బ్యాండ్ ప్లానలతో పాటు పోటీ సంస్థలను దెబ్బతీసేలా చౌకగా లైవ్ టీవీ చానెళ్లు కూడా అందిస్తోందంటూ ఎయిర్టెల్ ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ జియోకు ట్రాయ్ సూచించింది. తాము వినియోగదారులకు అందుబాటు ధరల్లో సేవలు అందిస్తున్నామనే అక్కసుతోనే ఎయిర్టెల్ ఇటువంటి ఆరోపణలు చేస్తోందని జియో స్పష్టం చేసింది. తమ ప్లాన్లపై వివరణ ఇచ్చింది. -
అవాంఛిత కాల్స్‌పై టెల్కోలతో ట్రాయ్ భేటీ
న్యూఢిల్లీ: అవాంఛిత కాల్స్, మెసేజీలను కట్టడి చేసే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం ’వ్యాపారపరమైన అవాంఛిత కమ్యూనికేషన్ (యూసీసీ) డిటెక్ట్’ విధానాన్ని అభివృద్ధి చేయడం, అమలు చేయడానికి సంబంధించి మార్చి 27న టెల్కోలతో సమావేశం కానుంది. (ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్: భారత సంతతి ఎగ్జిక్యూటివ్ అమృత ఆహూజా పాత్ర ఏంటి?) డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్టీ) ప్లాట్‌ఫాంపై అవాంఛిత సందేశాలను టెల్కోలు గుర్తించడం, వాటిని పంపే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం, కృత్రిమ మేథ ఆధారిత యాంటీ–ఫిషింగ్ సిస్టమ్‌ను వినియోగించడం తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. సాంకేతిక సొల్యూషన్స్, నియంత్రణ, ఆదేశాలు, నిశిత పర్యవేక్షణ వంటి బహుముఖ వ్యూహాలతో అవాంఛిత కాల్స్, మెసేజీల సమస్యను పరిష్కరించే దిశగా టెల్కోలతో సమావేశం ఉండనున్నట్లు ట్రాయ్ పేర్కొంది. (మండే వేసవిలో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రైల్వే కీలక నిర్ణయం) -
సర్వీసుల నాణ్యతను పెంచాలి.. టెలికం కంపెనీలకు ట్రాయ్ చీఫ్ సలహా
న్యూఢిల్లీ: సర్వీసుల నాణ్యతను, దేశవ్యాప్తంగా కనెక్టివిటీని మరింతగా మెరుగుపర్చాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చీఫ్ పి.డి. వాఘేలా టెలికం సంస్థలకు సూచించారు. అలాగే కాల్ అంతరాయాలు, సర్వీసుల నాణ్యతకు సంబంధించిన గణాంకాలను రాష్ట్రాల స్థాయిలో కూడా వెల్లడించాలని పేర్కొన్నారు. సర్వీసుల నాణ్యతను సమీక్షించేందుకు శుక్రవారం రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తదితర టెల్కోలతో వాఘేలా సమావేశమయ్యారు. కాల్ డ్రాప్స్‌ను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆపరేటర్లకు ఆయన సూచించారు. సర్వీస్ నాణ్యతా ప్రమాణాలను మరింతగా కఠినతరం చేయనున్నట్లు, ఇందుకు సంబంధించి సంప్రదింపుల ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు వాఘేలా తెలిపారు. కాల్ డ్రాప్ డేటాను రాష్ట్రాల స్థాయిలో కూడా సమీక్షించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఎల్ఎస్ఏ (లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా)వారీగా, సగటున మూడు నెలలకోసారి ఈ డేటాను సేకరిస్తున్నారు. -
ట్రాయ్ నిబంధనలు కఠినతరం! కాల్ సేవల నాణ్యత మెరుగుపడేనా?
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్, కాల్స్ నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో టెలికం శాఖ (డాట్) ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కాల్స్ నాణ్యతను మెరుగుపర్చేందుకు, కాల్ డ్రాప్స్‌ను కట్టడి చేసేందుకు సేవల నాణ్యత నిబంధనలను మరింత కఠినతరం చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు సూచించింది. కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో సేవల నాణ్యత (క్యూఓఎస్) చాలా ముఖ్యమని డాట్ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్యూఓఎస్ విషయంలో అంతర్జాతీయంగా పాటిస్తున్న విధానాలను పరిశీలించిన మీద ట ట్రాయ్ కొన్ని కీలక అంశాలను ట్రాయ్‌కు సిఫార్సు చేసిందని పేర్కొన్నాయి. కాల్ డ్రాప్, కాల్స్ నాణ్యత అంశాలపై ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా ప్రజాభిప్రాయాలను సేకరించిన మీదట డాట్ ఈ మేరకు సూచనలు చేసింది. మరోవైపు, సర్వీసుల నాణ్యత, నిబంధనల సమీక్ష, 5జీ సేవల ప్రమాణాలు, అవాంఛిత వాణిజ్య సందేశాలు మొదలైన వాటికి సంబంధించి తీసుకోతగిన చర్యలు, కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు ఫిబ్రవరి 17న టెల్కోలతో ట్రాయ్ సమావేశం కానుంది. అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులను టెల్కోలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 5జీ సేవలతో కాల్ నాణ్యత మెరుగుపడుతుందని ఆశించినప్పటికీ.. పరిస్థితి మరింతగా దిగజారిందని యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. లోకల్‌సర్కిల్స్ సంస్థ జనవరిలో నిర్వహించిన సర్వే ప్రకారం కాల్ నాణ్యత అస్సలు మెరుగుపడలేదని 42 శాతం మంది, మరింతగా దిగజారిందని 19 శాతం మంది 5జీ యూజర్లు వెల్లడించారు. ఓటీటీల నియంత్రణకు టెల్కోల పట్టు.. కమ్యూనికేషన్ ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థల నియంత్రణకు గట్టి నిబంధనలు రూపొందించాలని ట్రాయ్‌ని టెల్కోలు మరోసారి కోరాయి. ఒకే రకం సేవలు అందించే సంస్థలకు ఒకే రకం నిబంధనలు ఉండాలని పేర్కొన్నాయి. తమలాంటి సేవలే అందిస్తున్న ఓటీటీలకు కూడా తమకు అమలు చేసే నిబంధనలను వర్తింపచేయాలని స్పష్టం చేశాయి. 2023 అజెండాపై కసరత్తుకు సంబంధించి ట్రాయ్‌తో బుధవారం జరిగిన భేటీలో టెల్కోలు ఈ మేరకు కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రిలయన్స్ జియో బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా, ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్, వొడాఫోన్ ఐడియా కార్పొరేట్ వ్యవహారాల అధికారి పి. బాలాజీ ఈ భేటీలో పాల్గొన్నారు. (ఇదీ చదవండి: జీఎస్టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు! ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే..) -
కాల్ డ్రాప్స్, నెట్వర్క్ కాల్స్ సమస్యపై టెల్కోలతో ట్రాయ్ కీలక భేటి
న్యూఢిల్లీ: టెలికం సేవల నాణ్యతను మెరుగుపర్చడం, 5జీ సర్వీసుల ప్రమాణాలను నిర్దేశించడం తదితర అంశాలకు సంబంధించిన మార్గదర్శ ప్రణాళికపై చర్చించేందుకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ఫిబ్రవరి 17న టెల్కోలతో సమావేశం కానుంది. ఈ సందర్భంగా కాల్ డ్రాప్స్, వ్యాపారాలపరమైన అవాంఛిత కాల్స్, సందేశాలు మొదలైన వాటి గురించి కూడా చర్చించనుంది. ట్రాయ్ గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తరచుగా సమావేశాల నిర్వహణ, చర్చా పత్రాలు, బహిరంగ చర్చలు మొదలైన మార్గాల్లో సేవల నాణ్యతను సమీక్షిస్తూ ఉంటామని, తగు చర్యలు తీసుకుంటూ ఉంటామని పేర్కొంది. దేశవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులను విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సర్వీసుల నాణ్యతను మెరుగు పర్చేందుకు తీసుకోతగిన చర్యలపై డిసెంబర్ 28న టెల్కోలతో టెలికం శాఖ సమావేశమైంది. 2022 నవంబర్ డేటా ప్రకారం 114 కోట్ల మొబైల్ సబ్‌స్క్రయిబర్స్‌తో భారత్ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఉంది. ఇప్పటివరకూ 200 పైచిలుకు నగరాల్లో 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. -
పదేళ్ళకు ఎంఎస్‌వోల రిజిస్ట్రేషన్ రెన్యువల్
న్యూఢిల్లీ: శాటిలైట్ టీవీ ఎంఎస్‌వోల (మల్టీ–సిస్టం ఆపరేటర్లు) రిజిస్ట్రేషన్‌ను 10 ఏళ్ల వ్యవధికి రెన్యువల్ చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కేంద్రానికి సూచించింది. ఇందుకోసం ప్రాసెస్ ఫీజును రూ. 1 లక్షగా నిర్ణయించాలని సిఫార్సు చేసింది. కేబుల్ టీవీ నెట్వర్క్స్ నిబంధనల్లో ఎంఎస్‌వోల రిజిస్ట్రేషన్ల రెన్యువల్ నిబంధనలు లేకపోవడంతో తగు సూచనలు చేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కోరిన మీదట ట్రాయ్ ఈ మేరకు సిఫార్సులు చేసింది. రెన్యువల్‌కి దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరిగేలా చూడాలని, బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్ ద్వారా పత్రాలన్నీ డిజిటల్ విధానంలో అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించాలని పేర్కొంది. అలాగే రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం పెండింగ్‌లో ఉన్న ఎంఎస్‌వోల జాబితాను, నిర్దిష్ట గడువులోగా దరఖాస్తు చేసుకోని వాటి లిస్టును పోర్టల్‌లో పొందుపర్చాలని సూచించింది. ఒకవేళ దరఖాస్తు పరిశీలనలో ఉన్నా, నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచినా తుది నిర్ణయం తీసుకునే వరకూ సదరు ఎంఎస్‌వోలకు పొడిగింపునివ్వాలని పే ర్కొంది. గడువు తేదీ ముగియడానికి ఏడు నుంచి రెండు నెలల ముందు వరకూ రెన్యువల్ కోసం దరఖాస్తులను స్వీకరించవచ్చని ట్రాయ్ సూచించింది. రెండు నెలల కన్నా తక్కువ సమయంలో దరఖాస్తు చేసుకుంటే జాప్యానికి చూపిన కారణాలను పరిశీలించి శాఖ తగు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. -
కొత్త సంవత్సరంలో టీవీ చూసేవారికి ఊహించని షాక్!
దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇదిలా ఉండగా టీవీ లవర్స్‌కి సైతం కొత్త ఏడాదిలో పెద్ద షాక్ తగలనుంది. ప్రముఖ టీవీ బ్రాడ్కాస్టర్లు ఛానళ్లకు సంబంధించి అలకార్టే, బౌక్వెట్ రేట్లను పెంచేశాయి. ఈ ధరల పెంపు నిర్ణయం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమలులోకి రానుంది. దీని కారణంగా, టీవీ రీఛార్జ్ కోసం నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్యాక్ ఖరీదుగా మారనుంది. 3 సంవత్సరాల తర్వాత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం.. సోనీ పిక్చర్స్, స్టార్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్తో సహా 42 ప్రసారకర్తలు 332 కంటే ఎక్కువ ఛానెల్‌లు ఉన్నాయి. ప్రసారకర్తలు ఈ ఛానెల్‌లను చూడటానికి నెలవారీ రుసుములను నిర్ణయించారు. దీని ధర 10 పైసల నుంచి 19 రూపాయల వరకు ఉంటుంది. టీవీ బ్రాడ్కాస్టర్లు 3 సంవత్సరాల తర్వాత ఛానెల్‌ల ధరలను సవరించారు. నవంబర్ 22న ప్రసార సేవల నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను ట్రాయ్ (TRAI) సవరించినందున ఈ ధరల పెంపు జరిగింది. ఆ తర్వాత జీ (ZEE), కల్వర్ మాక్స్ ఎంటర్టైన్మెంట్ సోనీ, సన్ టీవీనెట్వర్క్ తమ రిఫరెన్స్ ఇంటర్‌కనెక్ట్ ఆఫర్లను (RIO) ఫైల్ చేశాయి. ఆర్ఓఐ అనగా సర్వీస్ ప్రొవైడర్ జారీ చేసిన నియమ నిబంధనల పత్రం. ఒక సర్వీస్ ప్రొవైడర్ మరో నెట్‌వర్క్‌తో ఇంటర్కనెక్షన్ కోరుకునే నిబంధనలు, షరతులు అందులో ఉంటాయి. మరో వైపు డిస్నీ స్టార్ ఇండియా, వయాకామ్ 18 వంటి సంస్థలు కూడా త్వరలోనే ఆర్‌ఐఓలను దాఖలు చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి నుంచి కొత్త ధరలు నివేదిక ప్రకారం.. టీవీ వీక్షకుల నెలవారీ టీవీ చందా బిల్లు పెరగబోతోంది. ఎందుకంటే, ప్రధాన టెలివిజన్ ప్రసారకర్తలు ఛానెల్‌ల బౌక్వెట్ రేట్లను పెంచాయి. ఛానెల్‌లను వీక్షించడానికి పెరిగిన కొత్త ధరలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2023 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో టీవీ ఛానెల్‌లను చూడటానికి వీక్షకులు ఎక్కువ డబ్బు చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటికే కొన్ని బౌక్వెట్స్ ధరలు 10-15% రేట్లు పెంచినట్లు సమాచారం. సోనీ తన రూ. 31 ధర గల బౌక్వెట్ని నిలిపివేసి, దాని స్థానంలో రూ. 43 కొత్తదాన్ని తీసుకొచ్చిందని ఓ కేబుల్ టీవీ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వార్తా సంస్థకు తెలిపారు. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
మోసపూరిత, వేధింపు కాల్స్‌కు అడ్డుకట్ట.. త్వరలో అమల్లోకి కొత్త రూల్!
న్యూఢిల్లీ: మోసపూరిత, వేధింపు కాల్స్‌కు అడ్డుకట్ట వేసే దిశగా తలపెట్టిన కాలర్ ఐడెంటిటీ (సీఎన్ఏపీ) అంశంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్చాపత్రాన్ని రూపొందించింది. దీనిపై ప్రజలు డిసెంబర్ 27లోగా తమ అభిప్రాయాలు తెలపాలి. కౌంటర్ కామెంట్ల దాఖలుకు 2023 జనవరి 10 ఆఖరు తేదీ. సీఎన్ఏపీ అమల్లోకి వస్తే కాల్ చేసే వారి పేరు మొబైల్ ఫోన్లలో డిస్ప్లే అవుతుంది. తద్వారా గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్‌ను స్వీకరించాలా వద్దా అనే విషయంలో తగు నిర్ణయం తీసుకునేందుకు ఉపయోగపడనుంది. ప్రస్తుతం ట్రూకాలర్, భారత్ కాలర్ ఐడీ అండ్ యాంటీ స్పామ్ వంటి యాప్‌లు ఈ తరహా సర్వీసులు అందిస్తున్నాయి. అయితే, ఈ యాప్‌లలోని సమాచార విశ్వసనీయతపై సందేహాలు నెలకొన్నాయి. ప్రతి టెలిఫోన్ యూజరు పేరు ధృవీకరించే డేటాబేస్ .. టెలికం సంస్థలకు అందుబాటులో ఉంటే కచ్చితత్వాన్ని పాటించేందుకు అవకాశం ఉంటుంది. దీనిపైనే సంబంధిత వర్గాల అభిప్రాయాలను సేకరించేందుకు ట్రాయ్ చర్చాపత్రాన్ని రూపొందించింది. చదవండి: డిజిటల్ లోన్లపై అక్రమాలకు చెక్: కొత్త రూల్స్ నేటి నుంచే! -
ఇబ్బంది పెట్టే కాల్స్, సందేశాలకు చెక్!
న్యూఢిల్లీ: ఇబ్బంది పెట్టే కాల్స్, ఎస్ఎంఎస్లను గుర్తించేందుకు పలు టెక్నాలజీపై పనిచేస్తున్నట్టు టెలికం రంగ నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ ప్రకటించింది. ఆర్థిక మోసాల నివారణకు ఇతర నియంత్రణ సంస్థలతో కలసి సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపింది. ‘‘అనుచిత వాణిజ్య సంప్రదింపులు లేదా ఇబ్బంది పెట్టే సంప్రదింపులు అన్నవి ప్రజలను ఎక్కువగా అసౌకర్యానికి గురిచేస్తున్నాయి. వారి గోప్యతకు భంగం కలిగిస్తున్నాయి. నమోదు కాని టెలీ మార్కెటర్ల (యూటీఎం)కు వ్యతిరేకంగా అధిక ఫిర్యాదులు వస్తున్నాయి. పలు అనుచిత సందేశాలు కూడా పెరిగాయి. వీటితో పాటు ఇబ్బంది పెట్టే కాల్స్‌ను కూడా ఒకే రీతిలో చూడడమే కాకుండా, పరిష్కారం కనుగొనాల్సి ఉంది’’అని ట్రాయ్ పేర్కొంది. అనుమతి లేని వాణిజ్య సంప్రదింపులకు చెక్ పెట్టేందుకు పలు భాగస్వామ్య సంస్థలో కలసి చర్యలు తీసుకోనున్నట్టు ట్రాయ్ తెలిపింది. -
4జీ స్పీడ్, మరోసారి టాప్‌లో జియో
న్యూఢిల్లీ: అతి వేగవంతమైన 5 జీ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరోసారి తన సత్తా చాటుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అక్టోబరు 4జీ స్పీడ్ టెస్ట్ గణాంకాలను విడుదల చేసింది. జియో సగటు 4G డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ట్రాయ్ విడుదల చేసిన డేటా ప్రకారం, జియో సగటు 4G డౌన్లోడ్ వేగం సెప్టెంబర్‌లో 19.1 Mbps నుండి అక్టోబర్‌లో 20.3 Mbpsకి పెరిగింది. (మస్క్ మరో బాంబు: వన్ అండ్ ఓన్లీ అప్షన్, డెడ్‌లైన్) సగటు డౌన్లోడ్ స్పీడ్ విషయంలో ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మధ్య గట్టి నెలకొంది. అక్టోబర్‌లో ఎయిర్టెల్ సగటు 4జీ డౌన్లోడ్ వేగం 15 Mbps కాగా Vi (వోడాఫోన్-ఐడియా) 14.5 Mbps. కానీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాతో పోలిస్తే జియో 4జీ సగటు డౌన్లోడ్ వేగం 5 Mbps ఎక్కువ. (త్వరలోనే తప్పుకుంటా, అమెరికా కోర్టులో మస్క్ సంచలన ప్రకటన) సగటు 4G అప్లోడ్ వేగం పరంగా కూడా, రిలయన్స్ జియో గత నెలలో మొదటి సారి తొలి స్థానానికి చేరుకుంది. అక్టోబర్ నెలలో కూడా కంపెనీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 6.2 Mbps సగటు 4G అప్లోడ్ వేగంతో జియో టాప్ లో నిలిచింది. వోడాఫోన్-ఐడియా 4.5 Mbps వేగంతో రెండవ స్థానంలో కొనసాగింది. అదే సమయంలో, ఎయిర్టెల్ అప్లోడ్ స్పీడ్‌లో నిరంతర క్షీణత ఉంది. అక్టోబర్‌లో ఎయిర్టెల్ సగటు 4జీ అప్లోడ్ వేగం ఆందోళనకరంగా 2.7 Mbpsకి చేరుకుంది. ఎయిర్టెల్ అప్లోడ్ వేగం జియోలో సగం కంటే తక్కువకు చేరుకుంది. -
టెల్కోల ఆదాయాల్లో స్థిర వృద్ధి
న్యూఢిల్లీ: కొత్త యూజర్ల సంఖ్య మందగించినప్పటికీ ప్రస్తుత సబ్‌స్క్రయిబర్స్‌పై వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) మెరుగుపడటం, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్‌యూసీ) భారం కొంత తగ్గుతుండటం వంటి అంశాల కారణంగా రెండో త్రైమాసికంలో టెల్కోల ఆదాయాలు స్థిరమైన వృద్ధి నమోదు చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్రైమాసికాలవారీగా చూస్తే మార్జిన్లు పెరుగుతాయని టెల్కోల ఆదాయాల ప్రివ్యూ నివేదికలో బీవోఎఫ్‌ఏ సెక్యూరిటీస్ పేర్కొంది. అటు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ‘రెవెన్యూ వృద్ధి స్థిరంగా‘ ఉంటుందని, ఎస్‌యూసీ తగ్గుదల వల్ల మార్జిన్లు ఎగియవచ్చని పేర్కొంది. ‘సవరించిన స్థూల ఆదాయంలో (ఏజీఆర్) ఎస్‌యూసీ 3–3.5 శాతంగా ఉండేది. ఈ ఏడాది జూలైలో కొనుగోలు చేసిన స్పెక్ట్రంపై ఇది నామమాత్రం స్థాయికి తగ్గిపోయింది. ఈ పూర్తి ప్రయోజనాలు మూడో త్రైమాసికంలో ప్రతిఫలించవచ్చు‘ అని తెలిపింది. ఏఆర్పీయూ త్రైమాసికాలవారీగా 1.5–3 శాతం మేర వృద్ధి చెందవచ్చని పేర్కొంది. మరోవైపు జెఫ్రీస్ కూడా దాదాపు ఇదే తరహా అంచనాలు ప్రకటించింది. రెండో త్రైమాసికంలో ఆదాయాల వృద్ధి స్థిరంగా ఉంటుందని, త్రైమాసికాలవారీగా భారతి/జియో ఆదాయ వృద్ధి 2–4 శాతం స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. రెండో త్రైమాసికంలో రోజులు ఎక్కువ ఉన్నందున సీక్వెన్షియల్‌గా ఏఆర్పీయూ 1–2 శాతం పెరగవచ్చని వివరించింది. అయితే, అంతక్రితం రెండు త్రైమాసికాలతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా టెల్కోల ఆదాయ వృద్ధి బలహీనంగా (2.4 శాతం స్థాయిలో) ఉండవచ్చని, వార్షికంగా చూస్తే మాత్రం 19 శాతం పెరుగుదల నమోదు కావచ్చని బీఎన్పీ పారిబా పేర్కొంది. టారిఫ్‌ల పెంపు ప్రయోజనాలు ఇప్పటికే లభించడం, కొత్తగా చేరే యూజర్ల సంఖ్య అంతంతమాత్రంగానే ఉండటం ఇందుకు కారణమని తెలిపింది. 5జీపై దృష్టి.. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను అందించే 5జీ సేవల విస్తరణ, పెట్టుబడులు, టారిఫ్‌లు తదితర అంశాలపై టెల్కోలు క్యూ2 ఫలితాల సందర్భంగా ఏం చెప్పబోతున్నాయన్న దానిపై నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారతి ఎయిర్టెల్ ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై తదితర 8 నగరాల్లో క్రమంగా 5జీ సేవలు విస్తరిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలో జియో .. బీటా ట్రయల్స్ నిర్వహిస్తోంది. జియో 2023 డిసెంబర్ కల్లా దేశవ్యాప్తంగా 5జీ సర్వీసులు విస్తరించనున్నట్లు ప్రకటించగా, 2024 మార్చి నాటికి దీన్ని సాధించనున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది.అటు యాపిల్, శాంసంగ్ వంటి టాప్ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు .. భారత్‌లోని తమ 5జీ ఎనేబుల్డ్ ఫోన్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నాయి. చదవండి: ‘అలా చేస్తే మీకే కాదు..నా ఉద్యోగానికే దిక్కుండదు’, రషీద్ ప్రేమ్‌జీ సంచలన వ్యాఖ్యలు -
దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. జూలైలోనూ జోరు తగ్గలే!
టెలికాం రంగంలోకి అడుగుపెట్టడంతోనే ఓ సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది రిలయన్స్ జియో. ఇక అప్పటి నుంచి ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను తన వైపు తిప్పుకోవడంలో జియో ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా టెలికాం సెక్టార్ రెగ్యులర్ గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం.. రిలయన్స్ జియో జూలైలోను అత్యధికంగా సబ్స్క్రైబర్లను పొందింది. కొత్తగా 29.4 లక్షల మంది మొబైల్ సబ్స్క్రైబర్లను జియో సంపాదించుకుంది. దీంతో వారి మొత్తం యూజర్ల సంఖ్య 415.96 లక్షలకు చేరుకుంది. భారతీ ఎయిర్టెల్ జూలైలో 5.13 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లు రావడంతో దాని మొబైల్ కస్టమర్ల సంఖ్య 36.34 కోట్లకు చేరుకుంది. డేటా ప్రకారం జూలై 2022 చివరి నాటికి దేశవ్యాప్తంగా వైర్లెస్ చందాదారుల సంఖ్య 114.8 కోట్లకు చేరింది. ప్రైవేట్ యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లు వైర్లెస్ సబ్స్క్రైబర్లు 90.12 శాతం మార్కెట్ వాటా ఉండగా, రెండు పీఎస్‌యూ( PSU) యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లు బీఎస్ఎన్ఎల్( BSNL) (ఎంటీఎన్ఎల్) (MTNL) 9.88 శాతం మార్కెట్ వాటా మాత్రమే కలిగి ఉంది. జూలై 2022 నెలలో, దాదాపు 1.02 కోట్ల మంది కస్టమర్లు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP)ని ఎంచుకున్నట్లు నివేదిక పేర్కొంది. చదవండి: దేశంలో ఐఫోన్ల తయారీ..టాటా గ్రూప్‌తో మరో దిగ్గజ సంస్థ పోటా పోటీ! -
ట్రాయ్ రిపోర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో ధన్ ధనా ధన్!
సాక్షి,హైదరాబాద్: టెలికాం రెగ్యులేటరీ సంస్థ (TRAI) విడుదల చేసిన తాజా సబ్‌స్క్రైబర్ డేటా ప్రకారం, మే 2022 నెలకు గాను రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 3.27 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఇదే నెలలో భారతీ ఎయిర్టెల్ 71,312 మొబైల్ కస్టమర్లను చేర్చుకుంది. మరోవైపు ఇదే సమయంలో వోడాఫోన్ ఐడియా 74,808 మంది సబ్స్క్రైబర్లను కోల్పోగా, ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) 78,423 మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. జాతీయంగా, రిలయన్స్ జియో మే నెలలో 31.11 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్లను సంపాదించి, భారతీయ టెలికాం మార్కెట్లో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకుంది. ఫలితంగా, దేశవ్యాప్తంగా జియో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య ఇప్పుడు 40.87 కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా 10.27 లక్షల మంది సబ్స్క్రైబర్లను చేర్చుకుంది, దీంతో సంస్థ మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 36.21 కోట్లకు చేరుకుంది. మరో వైపు, వోడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్ల సంఖ్య ఈ నెలలో 7.59 లక్షలు తగ్గి 25.84 కోట్లకు పడిపోయింది. బీఎస్ఎన్ఎల్( BSNL ) వినియోగదారుల సంఖ్య కూడా దాదాపు 53.62 లక్షలు తగ్గి 11.28 కోట్లకు పడిపోయింది. చదవండి: ఇలా అయితే జీఎస్టీ ఉండదు: నిర్మలా సీతారామన్ క్లారిటీ -
పాపం వొడాఫోన్.. జెట్స్పీడ్తో జియో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ రిలయన్స్ జియో ఏప్రిల్‌లో కొత్తగా 16.8 లక్షల మంది మొబైల్ చందాదార్లను దక్కించుకుంది. దీంతో సంస్థ మొత్తం మొబైల్ యూజర్ల సంఖ్య 40.5 కోట్లకు ఎగసింది. ఎయిర్టెల్ ఖాతాలో నూతనంగా 8.1 లక్షల మంది చేరికతో మొత్తం మొబైల్ చందాదార్ల సంఖ్య 36.11 కోట్లను తాకింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గణాంకాల ప్రకారం.. వొడాఫోన్ ఐడియా 15.7 లక్షల మంది చందాదార్లను పోగొట్టుకుంది. ఈ సంస్థ మొత్తం సబ్‌స్కైబ్రర్లు 25.9 కోట్లకు వచ్చి చేరారు. ఇక అన్ని కంపెనీలవి కలిపి మొత్తం వైర్లెస్ చందాదార్ల సంఖ్య స్వల్పంగా పెరిగి 114.3 కోట్లుగా ఉంది. కస్టమర్లు పట్టణాల్లో 0.07 శాతం తగ్గి, గ్రామాల్లో 0.20 శాతం పెరిగారు. బ్రాడ్‌బ్యాండ్ చందాదార్లు మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో కొద్దిగా అధికమై 78.87 కోట్లకు చేరారు. చదవండి: బడ్జెట్ ధరలో రియల్మీ.. విడుదల ఎప్పుడంటే! -
ట్రాయ్ కాలర్ ఐడీతో మాకు పోటీనా.. ఛాన్సేలేదు..
న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రతిపాదించిన కేవైసీ ఆధారిత కాలర్ నేమ్ డిస్ప్లే విధానంతో తమకు పోటీ ఉండబోదని కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ సీఈవో అలాన్ మామెడీ తెలిపారు. తాము కేవలం కాలర్ గుర్తింపు సేవలే అందించడానికి పరిమితం కాకుండా తమ టెక్నాలజీ, డేటాతో మరెన్నో సమస్యలకు పరిష్కారాలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కమ్యూనికేషన్స్‌ను సురక్షితమైనవిగా చేసే దిశగా ట్రాయ్ తీసుకుంటున్న చర్యలను తాము స్వాగతిస్తున్నామని అలాన్ వివరించారు. ఒకవేళ ప్రతిపాదిత సర్వీసును ప్రవేశపెడితే, దాన్ని అభివృద్ధి చేసేందుకు, అమల్లోకి తెచ్చేందుకు చాలా సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాన టెలికం ఆపరేటర్లందరి సహకారం దీనికి అవసరమవుతుందని ఒక ప్రకటనలో వివరించారు. ట్రాయ్ కసరత్తు కనెక్షన్ తీసుకునే సమయంలో కస్టమరు ఇచ్చే వివరాల (కేవైసీ)ను ప్రాతిపదికగా తీసుకుని, కాల్ చేసేటప్పుడు సదరు యూజరు పేరు అవతలి వారి ఫోన్లో డిస్ప్లే అయ్యేలా వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టడంపై ట్రాయ్ కసరత్తు చేస్తోంది. త్వరలో పరిశ్రమ వర్గాలతో దీనిపై చర్చలు ప్రారంభించనుంది. ప్రస్తుతం ట్రూకాలర్ ఇదే తరహా సేవలు అందిస్తోంది. భారత్‌లో భారీ స్థాయిలో యూజర్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రాయ్ ప్రతిపాదన .. ట్రూకాలర్ వంటి కాలర్ ఐడెంటిఫికేషన్ సర్వీసుల సంస్థలకు ప్రతికూలం కాగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. చదవండి: మొబైల్ వినియోగదారులకు భారీ షాక్! -
ఇకపై తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తే..
న్యూఢిల్లీ: ఫోన్ కాంటాక్ట్స్ జాబితాలో ఉన్నవారి నుంచి కాల్ వస్తే వారి పేరు మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మరి కొత్త నంబర్ నుంచి ఫోన్ వస్తే పేరు తెలిసేది ఎలా? కొద్ది రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఈ అంశంపై పరిశ్రమతో సంప్రదింపులు జరపడానికి టెలికం శాఖ నుంచి సూచన అందుకున్నట్టు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది. కొన్ని నెలల్లో సంప్రదింపులు మొదలుకానున్నాయని ట్రాయ్ చైర్మన్ పి.డి.వాఘేలా వెల్లడించారు. ఇలాంటి ఫీచర్‌ను అమలు చేయాలని ట్రాయ్ ఇప్పటికే ఆలోచిస్తోంది. కానీ ఇప్పుడు టెలికం శాఖ నుండి నిర్దిష్ట సూచనతో దీనికి సంబంధించిన పని త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ విధానం అమలైతే కాల్ చేస్తున్న వారిని గుర్తించడంతోపాటు కచ్చితత్వం, పారదర్శకత, చట్టబద్ధత ఉంటుందన్నది ట్రాయ్ ఆలోచన. మొబైల్, ల్యాండ్‌లైన్ కనెక్షన్ తీసుకునే సమయంలో టెలికం కంపెనీలకు వినియోగదారు అందించే నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాల ఆధారంగా కాల్ చేస్తున్నవారి పేరు ఫోన్ స్క్రీన్ మీద దర్శనమీయనుంది. చదవండి: వద్దురా బాబు అంటున్నా వినకుండా.. -
వద్దురా బాబు.. అంటున్నా వినకుండా..
న్యూఢిల్లీ: అవాంఛిత కాల్స్, మెసేజీలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూపొందించిన డు నాట్ డిస్టర్బ్ (డీఎన్డీ) రిజిస్ట్రీలో నంబరు నమోదు చేసుకున్నా ఇలాంటి కాల్స్ బెడద తప్పడం లేదు. ఆన్లైన్ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 95 శాతం మంది తాము డీఎన్డీలో రిజిస్టర్ చేసుకున్నప్పటికీ మోసగాళ్లు, టెలీమార్కెటర్లు మొదలైన వారి నుంచి అవాంఛిత కాల్స్, మెసేజీలు ఆగడం లేదని వెల్లడించారు. 5 శాతం మంది మాత్రమే తమకు అలాంటివి రావడం లేదని పేర్కొన్నారు. ప్రతి రోజూ సగటున మూడు లేదా అంతకు మించి స్పామ్ కాల్స్ వస్తుంటాయని 64 శాతం మంది వెల్లడించారు. ఏం అడుగుతున్నారంటే? ఇక స్పామ్ కాల్స్ విషయంలో ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ కాలర్ గుర్తింపును చూపించే యాప్‌ను ఉపయోగిస్తున్నామని, అలాంటి కాల్స్‌కు స్పందించడం లేదని 14 శాతం మంది వివరించారు. మరో 14 శాతం మంది తమ ఫోన్ బుక్‌లో ఉన్న నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను మాత్రమే రిసీవ్ చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మార్చి 10 నుంచి మే 10 వరకూ 377 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో 37,000 మంది పైగా పాల్గొన్నారు. జరిమానాతో అయినా అవాంఛిత కాల్స్ సమస్య పరిష్కారానికి అధునాతన బ్లాక్‌చెయిన్ ఆధారిత టెక్నాలజీని ప్రవేశపెట్టినప్పటికీ, తమ దగ్గర నమోదు చేసుకోని టెలీమార్కెటర్లను కట్టడి చేయడం సవాలుగా ఉంటోందని ట్రాయ్ వర్గాలు తెలిపాయి. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై జరిమానాలను పెంచాలంటూ టెలికం శాఖ గతేడాది ప్రతిపాదించింది. చదవండి: మొబైల్ యూజర్లకు శుభవార్తను అందించిన ట్రాయ్..! -
టెలికం సంస్థల విమర్శలు..గట్టి కౌంటర్ ఇచ్చిన ట్రాయ్
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం నిబంధనలపై టెల్కోల విమర్శల నేపథ్యంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తన సిఫార్సులను సమర్ధించుకుంది. ఇవి అంతర్జాతీయంగా పాటిస్తున్న ప్రమాణాలకు అనుగుణంగా, సహేతుకంగా, సరళతరంగా, సముచితంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. కనీస సర్వీసుల కల్పన నిబంధన తిరోగామి చర్యగా టెల్కోలు వ్యాఖ్యానించడంపై ట్రాయ్ స్పందించింది. ఇతర 5జీ మార్కెట్లలో కూడా ఇది అమల్లో ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 5జీ ప్రయోజనాలు ఆపరేటర్లకు మాత్రమే కాకుండా కస్టమర్లకు కూడా అందేలా చూడాల్సిన బాధ్యత ట్రాయ్‌పై ఉందని ఆయన చెప్పారు. కనీస సర్వీసుల నిబంధనలు విధించకపోతే స్పెక్ట్రం వనరులను సమర్ధంగా ఉపయోగించుకోని పరిస్థితి తలెత్తుతుందని అధికారి వివరించారు. 5జీ సేవల వ్యాప్తికి నియమాలను నిర్దేశించే క్రమంలో అయిదేళ్లలో సగటున 4జీ సర్వీసుల విస్తరణను ట్రాయ్ పరిగణనలోకి తీసుకుందని ఆయన చెప్పారు. అందులో నాలుగో వంతు.. అది కూడా సర్కిళ్లను బట్టి వచ్చే 3–5 ఏళ్లలో అమలు చేయమంటోందని చెప్పారు. స్పెక్ట్రం ధర, ఇతర నిబంధనలను పునఃసమీక్షించాలన్న మొబైల్ ఆపరేటర్ల డిమాండ్లను ఆయన కొట్టిపారేశారు. సంపూర్ణ అధ్యయనంతో సహేతుకంగా చేసిన సిఫార్సులను ప్రకటించిన వారం రోజులకే మళ్లీ సమీక్షించే అవకాశమే ఉండదని పేర్కొన్నారు. సుమారు రూ. 7.5 లక్షల కోట్ల బేస్ ధరతో వివిధ బ్యాండ్లలో స్పెక్ట్రంను వేలం వేసేలా ట్రాయ్ ఈ నెల తొలినాళ్లలో సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ప్రచారంలో పీక్స్.. మొబైల్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలు ఉచితం -
వరుసగా మూడోసారి రిలయన్స్ జియోకు గట్టి షాకిచ్చిన యూజర్లు..! జోష్‌లో ఎయిర్టెల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో టెలికం చందాదార్ల సంఖ్య 2022 ఫిబ్రవరిలో 116.6 కోట్లు నమోదైంది. జనవరితో పోలిస్తే ఇది 0.29 శాతం తగ్గుదల. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం.. యూపీ తూర్పు, జమ్ము, కశ్మీర్, హర్యానా మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో మొబైల్ కస్టమర్లు తగ్గుముఖం పట్టారు. బ్రాడ్‌బ్యాండ్ చందాదార్లు స్వల్పంగా తగ్గి 78.34 కోట్ల నుంచి 78.33 కోట్లకు వచ్చి చేరారు. మొబైల్ సర్వీసెస్ విభాగంలో రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కస్టమర్లను పోగొట్టుకోగా, కేవలం భారతి ఎయిర్టెల్ మాత్రమే కొత్త వినియోగదార్లను సొంతం చేసుకుంది. భారతి ఎయిర్టెల్ నూతనంగా 15.91 లక్షల మందిని చేర్చుకుంది. రిలయన్స్ జియో మొబైల్ కస్టమర్లను పోగొట్టుకోవడం వరుసగా మూడవసారి. ఫిబ్రవరిలో ఈ సంస్థ నుంచి 36.6 లక్షల మంది వినియోగదార్లు నిష్క్రమించారు. దీంతో జియో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య 40.27 కోట్లకు వచ్చి చేరింది. ఫిక్స్డ్ లైన్ చందాదార్లు క్రమంగా పెరుగుతున్నారు. వీరి సంఖ్య 2.42 కోట్ల నుంచి 2.45 కోట్లకు ఎగసింది. ప్రైవేటు కంపెనీలు కస్టమర్లను పెంచుకుంటుండగా ప్రభుత్వ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వెనుకబడుతున్నాయి. ఈ విభాగంలో రిలయన్స్ జియో 2.44 లక్షలు, భారతి ఎయిర్టెల్ 91,243, వొడాఫోన్ ఐడియా 24,948, క్వాడ్రెంట్ 18,622, టాటా టెలీసర్వీసెస్ 3,772 కొత్త వినియోగదార్లను నమోదు చేశాయి. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంయుక్తంగా 70 వేల పైచిలుకు కస్టమర్లను దూరం చేసుకున్నాయి. చదవండి: జియో అదిరిపోయే బంపరాఫర్, రూ.200కే '14 ఓటీటీ' యాప్స్ సబ్స్క్రిప్షన్! -
ధరల తగ్గింపుపై టెలికాం సంస్థల అసంతృప్తి... ట్రాయ్ వివరణ..!
న్యూఢిల్లీ: స్పెక్ట్రం ధరల తగ్గింపు ఆశించిన స్థాయిలో లేదంటూ టెల్కోలు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్.. తన సిఫార్సులను సమర్థ్ధించుకుంది. శాస్త్రీయంగా లెక్కించి, హేతుబద్ధమైన చార్జీలనే సిఫార్సు చేశామని ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా చెప్పారు. 5జీ మార్కెట్లో భారీ అవకాశాలు ఉన్నందున.. స్పెక్ట్రం వేలంలో టెలికం సంస్థలు చురుగ్గా పాలుపంచుకుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము సిఫార్సు చేసిన రిజర్వ్ ధరలు .. బిడ్డర్లకు ఆకర్షణీయంగా ఉండగలవని భావిస్తున్నట్లు వాఘేలా తెలిపారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, పరిశ్రమ వర్గాల నుంచి విస్తృతంగా సేకరించిన అభిప్రాయాలు, దేశీయంగా 5జీ విస్తృతికి గణనీయంగా అవకాశాలు ఉండటం తదితర అంశాలే ట్రాయ్ ప్రస్తుత నిర్ణయానికి ప్రాతిపదికలని ఆయన వివరించారు. ‘ఆకర్షణీయమైన ధర, సరళతర చెల్లింపు ఆప్షన్లు, సులభతరంగా సరెండర్ చేసే నిబంధనలు, లీజింగ్ విషయంలో చేసిన సిఫార్సులు మొదలైన వాటితో త్వరలో నిర్వహించబోయే వేలం.. ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా ఉంటుంది‘ అని వాఘేలా తెలిపారు. 30 ఏళ్ల వ్యవధికి కేటాయించే స్పెక్ట్రం కనీస ధరలను దాదాపు 39% తగ్గిస్తూ .. సుమారు రూ. 7.5 లక్షల కోట్ల మెగా వేలానికి ట్రాయ్ సిఫార్సు చేసింది. -
5జీ స్పెక్ట్రం బేస్ ధర 35% తగ్గించవచ్చు
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలానికి సంబంధించి నిర్దిష్ట ఫ్రీక్వెన్సీల కనీస ధరను 35 శాతం మేర తగ్గించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. 5జీ మొబైల్ సర్వీసులకు ఉపయోగించే 3300–3670 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రం రేటును మెగాహెట్జ్‌కు రూ. 317 కోట్లుగా నిర్ణయించవచ్చని పేర్కొంది. ట్రాయ్ గతంలో సూచించిన రూ. 492 కోట్లతో (మెగాహెట్జ్‌కు) పోలిస్తే ఇది సుమారు 35 శాతం తక్కువని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక కీలకమైన 700 మెగాహెట్జ్ బ్యాండ్‌కు సంబంధించి బేస్ రేటును గతంలో ప్రతిపాదించిన దానికన్నా 40 శాతం తక్కువగా రూ. 3,927 కోట్లుగా నిర్ణయించవచ్చని ట్రాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది. 700 మెగాహెట్జ్ మొదలుకుని 2500 మెగాహెట్జ్ వరకూ ఉన్న ప్రస్తుత ఫ్రీక్వెన్సీలతో పాటు కొత్తగా చేర్చిన 600, 3300–3670, 24.25–28.5 మెగాహెట్జ్ బ్యాండ్లను కూడా వేలంలో విక్రయించనున్నట్లు వివరించింది. టెలికం రంగం నిలదొక్కుకోవడానికి, దీర్ఘకాలంలో వృద్ధి సాదించడానికి.. పెట్టుబడులను ప్రోత్సహించడం, ద్రవ్య లభ్యతను పెంచడం, స్పెక్ట్రం కోసం సులభతర చెల్లింపుల విధానాలను అమలు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని ట్రాయ్ తెలిపింది. అత్యంత వేగవంతమైన 5జీ మొబైల్ సర్వీసులను 2022–23 ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి తెచ్చే దిశగా ఈ ఏడాదే స్పెక్ట్రం వేలం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
మొబైల్ యూజర్లకు శుభవార్తను అందించిన ట్రాయ్..!
డిజిటల్ చెల్లింపులే లక్ష్యంగా ఫీచర్ ఫోన్లలో యూపీఐ లావాదేవీలను ప్రొత్సహించేందుకుగాను ఆర్బీఐ యూపీఐ123పేను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ సేవల్లో భాగంగా..మొబైల్ యూజర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్లందరికీ అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (USSD) సందేశాలపై ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు గురువారం ట్రాయ్ ప్రకటించింది. దీంతో ఇంటర్నెట్ యాక్సెస్ లేని ఫీచర్ ఫోన్లతో పాటుగా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల కోసం వాడే యూఎస్ఎస్డీ సందేశాలను మొబైల్ యూజర్లు పూర్తి ఉచితంగా పొందవచ్చును. కాగా రెండు సంవత్సరాల తరువాత USSD సేవలకు ఛార్జీల విధింపుపై ట్రాయ్ సమీక్షించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయా టెలికాం ఆపరేటర్లు USSD సందేశాలపై గరిష్టంగా రూ. 1.50 నుంచి 50 పైసల మేర ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. అసలు ఏంటి యూఎస్ఎస్డీ సందేశాలు..! USSD (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) మెసేజ్‌లను జీఎస్ఎమ్ సెల్ఫోన్ల సర్వీస్ ప్రొవైడర్ కంప్యూటర్లతో టెక్స్ట్ సందేశాల ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే ప్రోటోకాల్. అంటే సాధారణంగా మన మొబైల్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి వాడే నంబర్. వివిధ రకాల సర్వీసులకోసం ఆయా టెలికాం సంస్థలు యూఎస్ఎస్డీ నంబర్స్ యూజర్లకు అందుబాటులో ఉంటాయి. చదవండి: వచ్చేసింది..గూగుల్ పే, ఫోన్ పే యాప్స్‌కు పోటీగా టాటా పే...!