Apple iPhone
-
ఐఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్స్!
భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (మార్చి 7 నుంచి 13 వరకు) ప్రారంభమైంది. ఇందులో భాగంగా లేటెస్ట్ ఐఫోన్ 16, ఐఫోన్ 15 మోడళ్లపై డిస్కౌంట్స్ కూడా ప్రకటించింది. ఈ తగ్గింపులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఐఫోన్ 16 సిరీస్ ఆఫర్లుఐఫోన్ 16 బేస్ వేరియంట్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,900 నుంచి 68,999 రూపాయలకు చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్ కింద రూ. 4000, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కింద రూ. 5000 తగ్గింపును పొందవచ్చు. అంటే ఇప్పుడు ఐఫోన్ 16ను రూ. 59,999లకు సొంతం చేసుకోవచ్చు. నో కాస్ట్ ఈఎమ్ఐ కూడా రూ. 10,000 నుంచి ప్రారంభమవుతుంది.కొత్తగా విడుదలైన ఐఫోన్ 16e ధర రూ. 59,900. అయితే ఇది ఇప్పుడు 55,900 రూపాయలకు అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 89,900 నుంచి రూ. 78,999కు చేరింది. ఐఫోన్ 16 ప్రో రూ. 1,19,900 నుంచి రూ. 1,08,900కు & ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అసలు ధర రూ. 1,44,900 కాగా, సేల్‌లో భాగంగా రూ. 1,31,900కు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్, ఇతర ప్రయోజనాలను ఉపయోగించుకుంటే.. వీటి ధరలు మరింత తగ్గుతాయి.ఐఫోన్ 15 సిరీస్ ఆఫర్లుఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 14 వరుసగా రూ. 60,999, రూ. 64,999 & రూ. 50,999 ప్రారంభ ధరలకు అందుబాటులో ఉన్నాయి. సాధారణ డిస్కౌంట్లతో పాటు, కొనుగోలుదారులు నో కాస్ట్ ఈఎమ్ఐ ఎంపికలు, స్టాండర్డ్ ఈఎమ్ఐ ఎంపికలు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, కూపన్ ఆధారిత డిస్కౌంట్లను సేల్‌లో పొందవచ్చు. -
లాంచ్‌కు ముందే 'ఐఫోన్ ఎస్ఈ 4' వివరాలు లీక్!
యాపిల్ కంపెనీ మార్కెట్లో.. సరసమైన 'ఐఫోన్ ఎస్ఈ4' (iPhone SE 4) లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ రోజు కొత్త మోడల్ రానున్నట్లు 'టిక్ కుక్' కూడా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడించారు. లాంచ్ కావడానికి ముందే ఈ ఫోనుకు సంబంధించిన చాలా వివరాలు లీక్ అయ్యాయి.భారత కాలమానం ప్రకారం.. ఈ రోజు రాత్రి 11.30 గంటలకు నిర్వహించనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 4ను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటికే లీకైన వివరాల ప్రకారం.. ఈ కొత్త ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. వెనుక భాగం ఎస్ఈ 3 మాదిరిగా ఉంటుంది. ముందు భాగంలో నాచ్ & సన్నని బాటమ్ బెజెల్ ఉంటుందని తెలుస్తోంది.ఐఫోన్ ఎస్ఈ 4 రియర్ కెమెరా సిస్టమ్ కూడా స్వల్ప మార్పును పొందినట్లు తెలుస్తోంది. 48 మెగా పిక్సెల్ రియర్ కెమెరా పిక్సెల్ ఉంటుందని చెబుతున్నారు. ఇది ఎస్ఈ 3లోని 12 మెగా పిక్సెల్ సెన్సార్ కంటే అద్భుతంగా ఉంటుంది. హై-ఎండ్ మోడళ్లతో పోలిస్తే రియర్ సెన్సార్ చిన్నదనే చెప్పాలి.ఇదీ చదవండి: ఆన్లైన్ లవ్.. రూ.4.3 కోట్లు అర్పించేసుకున్న మహిళఐఫోన్ ఎస్ఈ 4లో పెద్ద 6.1 ఇంచెస్ ఓఎల్ఇడి డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. ఎస్ఈ 4 మొబైల్ 8 జీబీ ర్యామ్, ఏ18 ప్రాసెసర్ వంటివి పొందనున్నట్లు సమాచారం. ఐఫోన్ 14 వంటి బ్యాటరీనే ఎస్ఈ 4లో కూడా ఉండొచ్చు. అయితే కంపెనీ ఈ ఫోన్ స్పెసిఫికేషన్లకు సంబంధించిన చాలా వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇవన్నీ లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
iPhone: నీ దూకుడు.. సాటెవ్వరూ..!
పాత విషయాన్ని ఇప్పుడెందుకు చెబుతున్నారనేగా మీ ప్రశ్న? భారత్‌లో ఐఫోన్ ‘విలువ’మరింత పెరిగిందని చెప్పేందుకే పాత జ్ఞాపకాన్ని మీ ముందుంచాం. భారత స్మార్ట్ఫోన్ల మార్కెట్లో అమ్మకాల విలువ పరంగా ఐఫోన్ ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు.. విక్రయాల సంఖ్యపరంగా తొలిసారిగా టాప్–5 జాబితాలోకి దూసుకొచి్చంది. భారతీయుల్లో యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్‌కు ఈ మైలురాళ్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విక్రయాలే కాదు.. ఎగుమతుల పరంగానూ ఐఫోన్ మార్కెట్ కొత్తపుంతలు తొక్కుతోంది. టాప్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచిన యూఎస్, అర్బన్ చైనా, యూకే, ఫ్రాన్స్, ఆ్రస్టేలియా, జపాన్ సరసన భారత్ చేరింది. యాపిల్‌కు 5వ అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది.ఖరీదైనా తగ్గేదేలే..సగటున ఐఫోన్ ధర సామ్సంగ్, వివోతో పోలిస్తే మూడింతలు ఉంటుంది. షావొమీతో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువ. అయినా మనవాళ్లు తగ్గేదేలే అంటున్నారు. కొత్త సిరీస్ ఎప్పుడొస్తుందా.. ఎప్పుడెప్పుడు చేతుల్లోకి తీసుకుందామా అని ఎదురు చూసే కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. ఐఫోన్ అంటే చాలా మందికి స్టేటస్. అందుకే ఖరీదుకు వెనుకాడడం లేదు. ఈఎంఐ సౌకర్యం ఉందన్న భరోసా ఎలాగూ ఉంది. దేశంలో అమ్ముడవుతున్న ఐఫోన్లలో పెద్ద నగరాల వాటా 40 శాతమే. మిగిలిన 60 శాతం చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాలు కైవసం చేసుకున్నాయంటే ఐఫోన్‌కు ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ అమ్మకాల ఆధారంగా సగటు విక్రయ ధర 2024లో రూ. 78,200 ఉంది. 2020లో ఇది రూ. 62,700 నమోదైంది. ఐదేళ్లుగా ఐఫోన్ల అమ్మకాల జోరు కొనసాగుతోంది. ప్రస్తుత వేగాన్నిబట్టి చూస్తే 2026లో భారత్‌లో 1.5 కోట్లకుపైగా ఐఫోన్లు అమ్ముడవుతాయని వివిధ నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఐడీసీ ప్రకారం దేశవ్యాప్తంగా 2023లో 90 లక్షల ఐఫోన్లు అమ్ముడయ్యాయి. 2024లో ఈ సంఖ్య 35 శాతం వృద్ధితో 1.2 కోట్లకు ఎగిసింది. నివేదికలనుబట్టి సంఖ్యలు మారినా.. ఐఫోన్లకు డిమాండ్ ఊహించనంతగా దూసుకెళుతోందన్నది వాస్తవం. యాపిల్ పంట పండింది.. భారత్‌లో 2024లో అన్ని బ్రాండ్స్ కలిపి 15.3 కోట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించాయి. 2023తో పోలిస్తే విక్రయాలు ఒక శాతం పెరిగాయి. 2024లో అమ్ముడైన మొత్తం స్మార్ట్ఫోన్ల విలువలో యాపిల్ 23 శాతం వాటా సొంతం చేసుకొని తొలి స్థానంలో నిలిచిందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. సంఖ్యాపరంగా 2024 అక్టోబర్–డిసెంబర్లో యాపిల్ 5వ స్థానానికి ఎగిసింది. వార్షిక ప్రాతిపదికన పరిమాణంలో కంపెనీ వాటా 9 నుంచి 11 శాతానికి చేరింది. అయితే 2024లో భారత్‌లో రూ. 90,680 కోట్ల విలువైన ఐఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయని ఐడీసీ అంచనా వేసింది. 2023లో ఇది రూ. 75,255 కోట్లని వెల్లడించింది. ప్రీమియం ఫోన్లవైపు ప్రజలు మళ్లుతుండటం కంపెనీకి కలిసొస్తోంది. దేశంలో రూ. 30,000పైగా ఖరీదు చేసే స్మార్ట్ఫోన్ల విభాగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోంది.రికార్డుల భారత్.. యాపిల్ ఎగుమతులు భారత్ నుంచి గతేడా ది రూ. లక్ష కోట్ల మార్కును దాటాయి. 2023తో పోలిస్తే ఎగుమతులు 42 శాతం పెరిగి 2024లో రూ. 1.08 లక్షల కోట్లకు చేరాయి. గత సంవత్సరంలో దేశంలో రూ. 1.48 లక్షల కోట్ల విలువైన యాపిల్ ఉత్పత్తులు తయారయ్యాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 46 శాతం అధికం కావడం విశేషం. ఇక దేశం నుంచి వివిధ దేశాలకు 2023లో సరఫరా అయిన ఐఫోన్ల విలువ రూ. 76,500 కోట్లు. గతేడాది ఇది రూ. 1,02,000 కోట్లు. మొత్తం ఐఫోన్ల ఉత్పత్తిలో భారత వాటా 14 శాతం దాటిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. లేటెస్ట్ మోడళ్లు అయిన ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ సైతం భారత్‌లో తయారవడం విశేషం. హైదరాబాద్ సమీపంలోని ఫాక్స్‌కాన్ ప్లాంటులో కొద్ది రోజుల్లో ఎయిర్‌పాడ్స్ తయారీ ప్రారంభం కానుంది. 2023–24లో యాపిల్ నికరలాభం 23 శాతం దూసుకెళ్లి రూ. 2,745.7 కోట్లు, ఆదాయం 36 శాతం పెరిగి రూ. 67,121 కోట్లుగా నమోదైంది. భారీ అవకాశాలు ఉన్నాయ్..భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్ మోడల్‌గా ఐఫోన్ అవతరించింది. రికార్డు స్థాయిలో వ్యాపారాన్ని నమోదు చేసిన భారత్‌పై కంపెనీ చాలా ఆసక్తిగా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో ఐఫోన్ అత్యధికంగా అమ్ముడై భారత్‌లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో స్మార్ట్ఫోన్లకు భారత్ రెండవ అతిపెద్ద విపణి. అలాగే పర్సనల్ కంప్యూటర్లు, టాబ్లెట్ పీసీలకు మూడవ అతిపెద్ద మార్కెట్. ఇక్కడ భారీ వ్యాపార అవకాశాలు ఉన్నాయి. మరిన్ని యాపిల్ స్టోర్లను ప్రారంభిస్తాం. అంతర్జాతీయంగా డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ మొత్తం ఆదాయం రికార్డు స్థాయిలో 4 శాతం పెరిగి 124.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. – టిమ్ కుక్, సీఈవో, యాపిల్ -
ఫోన్ పోయిందా? ఇలా చేస్తే.. కనిపెట్టేయొచ్చు
ప్రస్తుతం చాలామంది యాపిల్ ఐఫోన్స్ ఉపయోగిస్తున్నారు. ఇవి కొంత ఖరీదైనవే అయినప్పటికీ.. ఆసక్తి కారణంగానో లేదా ఇతర కారణాల వల్ల ఆండ్రాయిన్ ఫోన్ యూజర్స్ కూడా ఐఫోన్లకు మారిపోతున్నారు. అయితే అంత ఖరీదైన ఫోన్లు పొతే? ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మీ ఐఫోన్ పోగొట్టుకున్నా.. దొంగతనానికి గురైనా.. ఏ మాత్రం గాబరా పడకుండా? కొన్ని చర్యలు తీసుకుంటే మళ్ళీ పొందే అవకాశం ఉంటుంది.'ఫైండ్ మై' యాప్ ఉపయోగించండిమొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు 'ఫైండ్ మై' యాప్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఐఫోన్లో ఈ యాప్‌ని ఇన్స్టాల్ చేసుకుని సెట్ చేసుకోవాలి. ఇది మీ ఫోన్‌ను ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది. అంతే కాకుండా మీ మొబైల్ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పటికీ.. దగ్గరగా ఉన్నప్పుడు యాప్ ద్వారా సౌండ్ ప్లే చేయవచ్చు.లాస్ట్ మోడ్‌ను యాక్టివేట్ చేసుకోండిమీ ఫోన్ బయట పోయిందని లేదా దొంగతనానికి గురైంది మీరు విశ్వసిస్తే, లాస్ట్ మోడ్ ఉపయోగించుకోవాలి. దీనికోసం మీరు 'ఫైండ్ మై' యాప్‌ను ఓపెన్ చేసి లేదా iCloud.comలో సైన్ ఇన్ చేసిన తరువాత.. 'మార్క్ యాజ్ లాస్ట్' లేదా 'లాస్ట్ మోడ్' ఎంచుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత ఏదైనా ఒక సందేశాన్ని లేదా కాంటాక్ట్ వివరాలను పంపించవచ్చు. అప్పుడు మీ ఫోన్ దొరికిన వారు మళ్ళీ మీకు తీసుకు వచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది.మీ డేటాను సంరక్షించుకోవాలిమొబైల్ ఫోన్లో మీ వ్యక్తిగత డేటా ఏదైనా ఉంటే.. దానిని సంరక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఫోన్ డేటాను రిమోట్‌గా తొలగించడానికి 'ఫైండ్ మై' యాప్ లేదా iCloudని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇది ట్రాకింగ్‌ను నిలిపివేస్తుంది, డేటా రికవరీ కూడా సాధ్యం కాదు. మీ అకౌంట్స్ యాక్సిస్ ఇతరుల చేతుల్లోకి పోకుండా ఉండటానికి appleid.apple.comలో మీ Apple ID పాస్‌వర్డ్‌ను మార్చుకోవచ్చు.సిమ్ బ్లాక్ చేయాలిమీ ఫోన్ పోయిందని తెలుసుకున్న తరువాత.. మీ సిమ్ కార్డును బ్లాక్ చేసుకోవడం ఉత్తమం. దీనికోసం మీ సిమ్ కార్డుకు సంబంధించిన సంస్థను సంప్రదించాలి. మీ ఫోన్ పోయిందని సంస్థకు తెలియాజేస్తూ.. సిమ్ కార్డును బ్లాక్ చేయమని చెప్పాలి. అంతే కాకుండా డివైజ్‌ను కూడా బ్లాక్‌లిస్ట్ చేయొచ్చు. ఇలా చేస్తే.. ఎవరైనా ఫోన్ దొంగలించి ఉంటే, దానిని ఇతరులకు విక్రయించలేరు.పోలీసులకు తెలియజేయండిమీ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే.. వెంటనే పోలీసులకు తెలియజేయండి. మొబైల్ ఫోన్ IMEI నెంబర్ సాయంతో పోలీసులు పోయిన ఫోన్‌ను కనుగొనే అవకాశం ఉంది.ఇదీ చదవండి: మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులున్నాయి? ఇలా తెలుసుకోండిముందుగానే కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలిమీరు ఫోన్ కొనుగోలు చేసిన వెంటనే.. ఫైండ్ మై ఫోన్‌ను ఎనేబుల్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. స్ట్రాంగ్ పాస్‌కోడ్ లేదా బయోమెట్రిక్ సెట్ చేసుకోవాలి. డేటాను కూడా ఎప్పటికప్పుడు ఐక్లౌడ్ లేదా కంప్యూటర్‌కు బ్యాకప్ చేయాలి. వీటితో పాటు AirTags వంటి ట్రాకింగ్ యాక్ససరీస్ ఉపయోగించడం కూడా ఉత్తమం. -
అదే జరిగితే.. భారత్‌లో భారీగా పెరగనున్న ఐఫోన్ల ఉత్పత్తి
యాపిల్ కంపెనీ తన కార్యకలాపాలను చైనా వెలుపల గణనీయంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే భారతదేశంలో ఉత్పత్తిని పెంచడానికి కావలసిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. చైనా దిగుమతులపై.. అమెరికా సుంకాలను పెంచితే, యాపిల్ తన ఐఫోన్ ఉత్పత్తిని మన దేశంలో రెట్టింపు చేసే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చైనీస్ దిగుమతులపై భారీ సుంకాలను విధించాలని నిర్ణయించుకుంటే యాపిల్ భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిని ఏటా 30 బిలియన్లకు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం యాపిల్ ఇండియాలో సుమారు రూ. 1,30,000 కోట్ల నుంచి రూ. 1,36,000 కోట్ల విలువైన పరికరాలను తయారు చేస్తున్నట్లు సమాచారం.ఎన్నికల ప్రచారంలో చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 60 నుంచి 100 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ వెల్లడించారు. ఇదే నిజమైతే అమెరికా భారతదేశం మీద ఎక్కువ ఆధారపడి అవకాశం ఉంది. కాబట్టి యాపిల్ కంపెనీ కూడా తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. దీంతో కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తాయి.గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా చైనా దిగుమతులపై సుంకాలను విధించారు. కాబట్టి ఇప్పుడు కూడా చైనా దిగుమతులపై సుంకాలను మరింత పెంచే అవకాశం ఉంది. కాబట్టి ట్రంప్ తిరిగి రావడం ఇండో-అమెరికా సంబంధాలను మరింత ప్రభావితం చేయగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇప్పటికే భారతదేశంలో యాపిల్ ఐఫోన్ల తయారీ చాలా వేగంగా సాగుతోంది. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే ఇండియా నుంచి సుమారు 6 బిలియన్ డాలర్ల (రూ. 50వేల కోట్లు) విలువైన ఐఫోన్లు ఎగుమతి అయినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. 2024 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా 10 బిలియన్ డాలర్ల (రూ. 85వేల కోట్లు) విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని అంచనా. -
భారత్‌లో యాపిల్ కొత్తగా నాలుగు అవుట్లెట్లు!
ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ భారత్‌లో నాలుగు అవుట్లెట్లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ సీఈఓ టిమ్‌కుక్ తెలిపారు. భారత్‌లో యాపిల్ ఉత్పత్తుల విక్రయాలు పెరుగుతున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ గతంలో కంటే 6 శాతం పెరిగి 94.9 బిలియన్ డాలర్ల(రూ.7.9 లక్షల కోట్లు)కు చేరిందని తెలిపారు.ఈ సందర్భంగా యాపిల్ సీఈఓ టిమ్‌కుక్ ముదుపర్లను ఉద్దేశించి మాట్లాడారు. ‘యాపిల్ తాజా త్రైమాసిక ఫలితాల్లో రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీగా ఐఫోన్ అమ్మకాలు జరిగాయి. భారతదేశంలో యాపిల్ సేల్స్ గరిష్ఠాలను చేరుకున్నాయి. ఇండియాలో కంపెనీ కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే దేశంలో ముంబయి, ఢిల్లీలో రెండు అవుట్లెట్లను ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో మరో నాలుగు అవుట్లెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీంతో కంపెనీ రెవెన్యూ మరింత పెరిగే అవకాశం ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్‌కు పోటీ ఇవ్వనుందా?మంబయిలో యాపిల్ బీకేసీ, ఢిల్లీలో యాపిల్ సాకెత్ పేరుతో రెండు అవుట్లెట్లను గతంలో ప్రారంభించింది. బెంగళూరు, పుణె, ముంబయి, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ల్లో మరో నాలుగు కొత్త స్టోర్లను ప్రారంభించే యోచనతో ఉన్నట్లు గతంలో ప్రతిపాదించింది. తాజాగా కంపెనీ సీఈఓ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించడం గమనార్హం. ఇటీవల కంపెనీ ఐఫోన్ 16 సిరీస్‌ను ఆవిష్కరించింది. వారం కిందట యాపిల్ ఐఓఎస్ 18.1ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో వినియోగదారులకు వినూత్న ఫీచర్లను అందించినట్లు కంపెనీ తెలిపింది. -
ఐఫోన్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత
తమిళనాడులోని హొసూరు వద్ద యాపిల్ ఐఫోన్ భాగాలను తయారు చేసే టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిరవధికంగా నిలిచిపోయింది. రెండు రోజుల క్రితం ఇక్కడ అగ్నిప్రమాదం జరిగింది. దీని తర్వాత మరింత నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉత్పత్తి ఇప్పుడప్పుడే కొనసాగే పరిస్థితి లేనట్లు తెలుస్తోంది.ప్రమాదం సమయంలో పడిపోయిన షెడ్లను తొలగిస్తున్నప్పుడు మళ్లీ అగ్ని ప్రమాదం లేదా పొగ వచ్చే అవకాశాలు ఉన్నందున ప్లాంట్‌లో ఫైరింజన్లను అందుబాటులో ఉంచినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.వేలు రాయిటర్స్‌తో అన్నారు. అగ్నిప్రమాదానికి కారణాన్ని ఇంకా నిర్ధారించలేదని చెప్పారు.ప్లాంట్‌లో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఉత్పత్తిని నిలిపివేశారు. యాపిల్ చైనాను దాటి భారత్‌ను కీలక వృద్ధి మార్కెట్‌గా చూస్తున్న నేపథ్యంలో ఐఫోన్ సరఫరా గొలుసును ప్రభావితం చేసే తాజా సంఘటన ఇది. ఈ సంఘటనపై యాపిల్ వ్యాఖ్యానించలేదు. మరోవైపు టాటా మాత్రం అగ్నిప్రమాదానికి కారణం ఏంటన్నదానిపై దర్యాప్తు జరుగుతోందని, ప్లాంట్‌లోని ఉద్యోగులు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీ..ఈ ప్లాంట్‌లో ఐఫోన్లకు క్లిష్టమైన బ్యాక్ ప్యానెల్లతోపాటు కొన్ని ఇతర భాగాలను తయారు చేస్తారు. ఇదే కాంప్లెక్స్‌లోని మరో భవనంలో ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్ ఈ ఏడాది చివర్లో ప్రారంభించాల్సి ఉంది. అయితే అగ్ని ప్రమాద ప్రభావం దీనిపై ఎంత మేరకు పడిందో స్పష్టంగా తెలియలేదు. -
అదిరే ఫీచర్లతో యాపిల్16
-
అద్భుత ఫీచర్లతో ఐఫోన్ 16 !
పుస్తకం హస్తభూషణం అనేది పాత మాట. చేతికో చక్కని స్మార్ట్‌ఫోన్ అనేది నవతరం మాట. మెరుపువేగంతో ఇంటర్నెట్, స్పష్టమైన తెరలు, అదిరిపోయే సౌండ్, వేగంగా పనికానిచ్చే చిప్, రామ్లుండే కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ కోసం జనం ఎగబడటం సర్వసాధారణమైంది. మార్కెట్లోకి కొత్త ఫోన్ వస్తోందంటే చాలా మంది దాని కోసం వెయిట్ చేస్తారు. అందులోనూ యాపిల్ కంపెనీ వారి ప్రపంచ ప్రఖ్యాత ఐఫోన్ సిరీస్‌లో కొత్త మోడల్ వస్తోందంటే టెక్ ప్రియులంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. వారి నిరీక్షణకు శుభం పలుకుతూ నేడు అమెరికాలోని కుపర్టినో నగరంలో ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ఫోన్లను యాపిల్ ఆవిష్కరిస్తోంది. తమ సంస్థ కొత్త ఉత్పత్తులు, వాటి ఫీచర్లకు సంబంధించి యాపిల్ ఏటా యాపిల్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనికి విశేషమైన క్రేజ్ ఉంది. ఏటా సెప్టెంబర్ రెండో వారంలో యాపిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం తెల్సిందే. యాపిల్ ఇన్నేళ్లలో వందల కోట్ల ఐఫోన్లను విక్రయించింది. అయితే కొత్త మోడల్ తెచ్చినప్పుడు దాంట్లో చాలా స్వల్ప స్థాయిలో మార్పులు చేసి కొత్తగా విడుదలచేసింది. దాంతో పెద్దగా మార్పులు లేవని తెలిసి ఇటీవలి కాలంలో యాపిల్ ఫోన్ల విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా స్వల్పంగా తగ్గాయి. దీంతో యాపిల్ ఈసారి కృత్రిమ మేథ మంత్రం జపించింది. కొత్త సిరీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎక్కువగా వాడినట్లు వార్తలొచ్చాయి. దీంతో 17 ఏళ్లలో తొలిసారిగా ఐఫోన్లో విప్లవాత్మక మార్పులు చేసుకోబో తున్నట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా లోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో జరిగే యాపిల్ ఈవెంట్ యూట్యూబ్‌లో ప్రత్యక్షప్రసారంకానుంది. ఐఫోన్ 16, ఐఫోన్ ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడళ్లను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఐఓస్ 18తో పాటు ఇతర సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చే ఛాన్సుంది. 16 సిరీస్ మోడళ్లలో యాక్షన్ బటన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రో మోడల్స్‌లో మాత్రమే యాక్షన్ బటన్ ఇచ్చారు. కొత్త తరం హార్డ్‌వేర్, ఏఐతో రూపొందిన ఐఫోన్లు యూజర్లను తెగ ఆకట్టుకుంటాయని యాపిల్ సంస్థ భావిస్తోంది. కొత్త ఏఐ ఆధారిత ఫోన్లతో ఫోన్ల విక్రయాలు ఊపందుకోవచ్చు. ఈ వార్తలతో ఇప్పటికే జూన్నుంచి చూస్తే కంపెనీ షేర్ విలువ స్టాక్మార్కెట్లో 13 శాతం పైకి ఎగసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ మరో 400 బిలియన్ డాలర్లు పెరిగింది. – వాషింగ్టన్ -
'యాపిల్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక'
కేంద్ర భద్రతా సలహాదారు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఐఫోన్లు, ఐప్యాడ్లు మొదలైన ఇతర యాపిల్ ఉత్పత్తులలో భద్రతా సమస్యలు ఉన్నట్లు వెల్లడించింది. వీటిని నేరగాళ్లు యాక్సెస్ చేసే అవకాశం ఉందని, ఇది స్పూఫింగ్‌కు దారితీయవచ్చు, సమాచారం లీక్ అయ్యే అవకాశం కూడా ఉందని కేంద్రం హెచ్చరించింది.17.6, 16.7.9కి ముందున్న ఐఓఎస్, ఐపాడ్ఓఎస్ వెర్షన్లు.. 14.6కి ముందు ఉన్న మ్యాక్ఓఎస్ సోనోమా వెర్షన్లు, 13.6.8కి ముందు మ్యాక్ఓఎస్ వెంచురా వెర్షన్లు, 13.6.8కి ముందు మ్యాక్ఓఎస్ మోంటెరేరీ వెర్షన్లు, 12.7కి ముందు వెర్షన్లు, 12.7కి ముందు వెర్షన్ వంటి యాపిల్ ఉత్పత్తులు ఈ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది.విచారణ జరిపే వరకు తమ ఉత్పత్తులలోని భద్రతా సమస్యలను నిర్ధారించని యాపిల్ సంస్థ.. గత వారం లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్స్ విడుదల చేసింది. ఈ సాఫ్ట్వేర్ లేటెస్ట్ వెర్షన్లు కూడా వారి పోర్టల్‌లో జాబితా చేశారు. వీటిని యాపిల్ ఉత్పత్తులలో కూడా అప్డేట్ చేసుకోవాలి CERT-In వినియోగదారులను కోరింది.ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్‌బుక్స్, విజన్ప్రో హెడ్సెట్లకు ప్రభుత్వం ఇదే విధమైన హై రిస్క్ వార్ణింగ్ జారీ చేసింది. వివిధ యాపిల్ ఉత్పత్తులలో "రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్"కు సంబంధించి సమస్యను ఇందులో హైలెట్ చేశారు. -
బడ్జెట్ ఎఫెక్ట్: భారీగా తగ్గిన ఐఫోన్ ధరలు
యూనియన్ బడ్జెట్ 2024-25లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొబైల్ ఫోన్ల మీద బేసిక్ కష్టం డ్యూటీస్ 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో మొబైల్ ఫోన్ ధరలు క్రమంగా తగ్గనున్నాయి. ఈ తరుణంలో యాపిల్ తన మొత్తం పోర్ట్‌ఫోలియోలో ఐఫోన్ ధరలను 3 నుంచి 4 శాతం తగ్గించింది.ధరలను తగ్గించిన తరువాత ప్రో లేదా ప్రో మాక్స్ మోడల్‌ను కొనుగోలు చేస్తే రూ. 5100 నుంచి రూ. 6000 మధ్య తగ్గింపు లభిస్తుంది. మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్ 13, 14, 15 మోడల్స్ మీద రూ. 3000 తగ్గుతుంది. ఇదే సమయంలో ఐఫోన్ ఎస్ఈ మీద రూ. 2300 తగ్గుతుంది.యాపిల్ కంపెనీ తన ప్రో మోడల్స్ ధరలను తగ్గించడం ఇదే మొదటిసారి. నిజానికి కొత్త ప్రో మోడల్స్ లాంచ్ అయిన తరువాత పాత మోడల్స్ ఉత్పత్తి నిలిపివేస్తుంది. అప్పటికే ఉన్న మోడల్లను డీలర్ల ద్వారా స్వల్ప డిస్కౌంట్స్ ద్వారా క్లియర్ చేస్తారు. కాబట్టి ఇప్పటి వరకు కొత్త ప్రో మోడల్స్ ధరలు తగ్గించలేదు. -
ఆఫీసులో ఐఫోన్ మాత్రమే వాడండి!.. మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం
ప్రముఖ టెక్ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' మొబైల్ వాడకంపై కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగులు తప్పకుండా ఐఫోన్స్ మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. చైనాలోని కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉపయోగిస్తున్న వారికి ఐఫోన్లను అందించడం ప్రారంభించినట్లు సమాచారం. చైనాలోని ఉద్యోగులందరూ సెప్టెంబర్ నుంచి ఆపిల్ ఐఫోన్స్ తప్పనిసరిగా ఉపయోగించాలని సంస్థ స్పష్టం చేసింది.చైనాలో గూగుల్, గూగుల్ ప్లే సేవలు లేదు. ఆ దేశం మొబైల్ బ్రాండ్స్ అన్నీ సొంత ప్లాట్‌ఫామ్ కలిగి ఉన్నాయి. కాబట్టి అలాంటి మొబైల్స్ ఉపయోగించడం వల్ల కంపెనీ డేటాకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అయితే యాపిల్ ఐఫోన్లలో సెక్యూరీటీ సిస్టం పటిష్టంగా ఉంటుంది. కాబట్టి డేటా బయటకు వెళ్లే అవకాశం లేదు. ఈ కారణంగానే మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.చైనాలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ పాస్వర్డ్ మేనేజర్, ఐడెంటిటీ పాస్ యాప్‌ను ఉపయోగించాలని కంపెనీ పేర్కొంది. ఇవి యాపిల్, గూగుల్ ప్లే స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఉద్యోగులు తప్పకుండా ఆండ్రాయిడ్ ఫోన్స్ వదిలిపెట్టి.. ఐఫోన్ ఉపయోగించాలని కోరింది.ఐఫోన్ లేని, ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న ఉద్యోగులకు కంపెనీ కొత్త డివైజ్‌లను అందజేస్తుంది. ఉద్యోగులకు కొత్త ఐఫోన్ 15 ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే కంపెనీ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడొద్దని, కేవలం ఐఫోన్స్ మాత్రమే వాడండి అని చెప్పడంతో కొందరిలో అనుమానాలు పుడుతున్నాయి. -
ఐఫోన్ ప్లాంట్‌లో వివాహితలకు ‘నో జాబ్’.. రంగంలోకి దిగిన కేంద్రం
దేశంలో ఐఫోన్లు, ఇతర యాపిల్ ఉత్పత్తులు తయారు చేసే ఫాక్స్‌కాన్ ప్లాంటులో ఉద్యోగాలకు వివాహిత మహిళలను తిరస్కరించిందని రాయిటర్స్ ఓ సంచలన కథనం వెలువరించింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.1976 నాటి సమాన వేతన చట్టాన్ని ఉటంకిస్తూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో, ఉద్యోగ నియామకాల్లో పురుషులు, మహిళల మధ్య ఎటువంటి వివక్ష చేయరాదని చట్టం స్పష్టంగా నిర్దేశిస్తుందని పేర్కొంది. చైన్నై సమీపంలోని ఐఫోన్ ఫ్యాక్టరీలో ఈ వివక్ష కొనసాగుతోందని రాయిటర్స్ బయటపెట్టిన నేపథ్యంలో తమిళనాడు కార్మిక శాఖ నుంచి వివరణాత్మక నివేదికను కోరినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రభుత్వ ప్రకటనపై యాపిల్, ఫాక్స్‌కాన్ యాజమాన్యాలు వెంటనే స్పందించలేదు.రాయిటర్స్ మంగళవారం ప్రచురించిన పరిశోధనాత్మక కథనంలో ఫాక్స్‌కాన్ తమిళనాడులోని చెన్నై సమీపంలోని తన ప్రధాన ఐఫోన్ ప్లాంటులో ఉద్యోగాల కోసం వివాహిత మహిళలను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారని కనుగొంది. పెళ్లైన మహిళలు ఎక్కువ కుటుంబ బాధ్యతలు కలిగి ఉంటారనే కారణంతోనే వారిని క్రమపద్ధతిలో మినహాయిస్తున్నట్లు రాయిటర్స్ గుర్తించింది. రాయిటర్స్ ఇంటర్వ్యూ చేసిన ఫాక్స్‌కాన్ నియామక ఏజెంట్లు, హెచ్ఆర్ వర్గాలు ఇదే విషయాన్ని చెప్పారు. కుటుంబ బాధ్యతలు, గర్భం, అధిక గైర్హాజరును ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో వివాహిత మహిళలను నియమించకపోవడానికి కారణాలుగా పేర్కొన్నారు. -
టెక్ టాక్: ఇన్‌స్టాలో 15 నిమిషాల ఎడిట్ ఫీచర్.. మీకొసమే..!
మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీలో కూడా వినూత్న మార్పులు చోటుచూసుకుంటున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్ మన దగ్గరకు వస్తున్నాయి. వాటిలో రెగ్యులర్‌గా వాడే వస్తువులైనా ఉండొచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామైనా ఉండొచ్చు. ఫీచర్‌కి తగ్గట్టుగా సరికొత్త టెక్నాలజీ పరికరాలు ఇప్పుడు మీ ముందుకు వచ్చాయి. మరవేంటో చూద్దాం. ఇన్‌స్టాలో 15 నిమిషాల ఎడిట్ ఫీచర్! మెసేజ్‌లను పంపిన తరువాత పదిహేను నిమిషాల వరకు ఎడిట్ చేయవచ్చని ప్రకటించింది ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్. పదిహేను నిమిషాల ఈ ఎడిట్ విండో వాట్సాప్‌లాంటి ఇతర మెసేజింగ్ ప్లాట్ఫామ్లాగే ఉంటుంది. సరిగ్గా అనిపించని మెసేజ్‌లను సరిచేయడానికి ఇది యూజర్లను అనుమతిస్తుంది. యూజర్లు ఒకే సందేశాన్ని పలుమార్లు ఎడిట్ చేయవచ్చు. ఒకసారి ఎడిట్ చేసిన తరువాత మెసేజ్ ఎడిట్ చేయబడిందనే విషయం హైలెట్ అవుతుంది. యాపిల్ న్యూ మ్యాక్‌బుక్ ఎయిర్ సైజ్ : 13.30 అంగుళాలు రిజల్యూషన్ : 2560్ఠ1600 పిక్సెల్స్ బరువు (కేజీ) : 1.29 మెటీరియల్ : అల్యూమినియం స్టోరేజ్ : 256జీబి కలర్ : గోల్డ్, సిల్వర్, స్పేస్ గ్రే గెలాక్సీ ఎఫ్ 15 లేటెస్ట్ బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్15 గురించి ప్రకటించింది శాంసంగ్. 4/6 జీబి ఆఫ్ ర్యామ్, 128 జీబి ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన రెండు మెమోరీ వేరియంట్స్‌తో వస్తోంది. కొన్ని వివరాలు.. డిస్ప్లే : 6.5 అంగుళాలు రిఫ్రెష్ రేట్: 90 హెచ్ ప్రైమరీ కెమెరా : 50 ఎంపీ బ్యాటరీ : 6,000 ఎఏహెచ్ కలర్స్ : యాష్ బ్లాక్, జాజ్ గ్రీన్, వయోలెట్ ఇవి చదవండి: వరల్డ్ బెస్ట్ లిస్ట్‌లో భారత ఫిల్టర్ కాఫీ -
లాంచ్‌కు ముందే ఐఫోన్ 16 వివరాలు లీక్!
యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ త్వరలో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ లాంచ్ కావడానికి ముందే.. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఇప్పటి వరకు లీక్ అయిన వివరాల ప్రకారం, ఐఫోన్ 16 సిరీస్ మొత్తం 5 వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. వీటి ధరలు రూ.58 వేలు నుంచి రూ.91 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇవి ఖచ్చితమైన ధరలు కాదు, కంపెనీ ఈ ఐఫోన్ 16 లాంచ్ చేసే సమయంలో అధికారిక ధరలను వెల్లడిస్తుంది. ఐఫోన్ 16 సిరీస్ ఇప్పటి వరకు ఉన్న ఇతర మోడల్స్ కంటే కూడా ఎక్కువ అప్డేట్స్ పొందుతుందని, కొత్త వేరియంట్స్ కూడా అందుబాటులో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటిలో 6.1 ఇంచెస్, 6.7 ఇంచెస్ డిస్ప్లేలు ఉంటాయని సమాచారం. కొత్త ఐఫోన్ 16లో సింగిల్ పిల్ షేప్‌లో కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ ఎంతవరకు వాస్తవమని విషయం తెలియాల్సి ఉంది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే అద్భుతంగా ఉంటుందని భావించవచ్చు. అయితే ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. కంపెనీ ఈ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో లాంచ్ చేసే అవకాశం ఉంది. -
అలాస్కా విమాన ప్రమాదం, మరో ఆశ్చర్యకరమైన విషయం
అలాస్కా ఎయిర్‌లైన్స్ ASA 1282 విమానంలో ఊహించని పరిణామంలో ప్రయాణీకులు అందరూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో మరో ఆశ్చర్యకరమైన సంఘటన కూడా నమోదైంది. అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానం నుండి 16వేల అడుగుల కింద పడిపోయిన ఆపిల్ ఐఫోన్ చిన్న గీత కూడా పడకుండా , చెక్కు చెదరకుండా ఉండటం విశేషంగా నిలిచింది. పోర్ట్‌లాండ్‌కు చెందిన సీనాథన్ బేట్స్ ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేశారు. విమానం శిధిలాలను గుర్తించిన ప్రాంతానికి సమీపంలో ఉన్న బార్న్స్ రోడ్లో నడుస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఐఫోన్‌ను కనుగొన్నానని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఎన్టీఎస్బీ సమాచారం ప్రకారం ఆ ఘటనలో కనుగొన్న రెండో ఐఫోన్ అని, కానీ డోర్ మాత్రం దొరకలేదు అంటూ కమెంట్ చేశారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటు దీనిపై నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. 16వేల అడుగుల ఎత్తునుంచి పడినా దానికి గీతలు పడలేదని, కవర్ , స్క్రీన్ ప్రొటెక్టర్ చెక్కుచెదరకుండా ఉన్నాయని బేట్స్ వెల్లడించారు. ఐఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉందని , దానిని కనుగొన్నప్పుడు అన్‌లాక్ చేసినట్టు వెల్లడించారు. ఈ సమాచారాన్ని ఎన్టీఎస్బీ ఇచ్చినట్లు ట్విటర్(ఎక్స్)లో షేర్ చేశారు. దీన్ని అలాస్కా ఎయిర్‌లైన్ ప్యాసింజర్‌కు చెందినదని నిర్ధారించారు. అయితే ఇది ఏ మోడల్ ఐఫోన్ అనే వివరాలు అందుబాటులో లేవు. Found an iPhone on the side of the road... Still in airplane mode with half a battery and open to a baggage claim for #AlaskaAirlines ASA1282 Survived a 16,000 foot drop perfectly in tact! When I called it in, Zoe at @NTSB said it was the SECOND phone to be found. No door yet😅 pic.twitter.com/CObMikpuFd — Seanathan Bates (@SeanSafyre) January 7, 2024 కాగా పోర్ట్‌ల్యాండ్, ఒరెగాన్ నుండి కాలిఫోర్నియాలోని అంటారియోలో చెందిన అలాస్కా విమానం గాలిలో ఉండగా దాని డోర్ ఊడి ఎగిరిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ సీట్లలో ఉన్న ప్రయాణికుల చేతుల్లోని మొబైల్ ఫోన్లతోపాటు, కొన్ని వస్తువులు కూడా ఆ విమానం నుంచి గాల్లోకి ఎగిరిపడ్డాయి. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. చివరకు అదే ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. -
విపక్ష ఎంపీల ఐఫోన్లకు అలర్టులు...
న్యూఢిల్లీ: దిగ్గజ ఐటీ కంపెనీ యాపిల్ సైబర్ సెక్యూరిటీ ప్రతినిధులు త్వరలో భారత్‌కు రానున్నారు. గత నెలలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతల ఐఫోన్లలో వార్నింగ్ నోటిఫికేషన్లు ప్రత్యక్షమ వడంతో తీవ్ర దుమారం రేగిన తెలిసిందే. కేంద్ర ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్ చేయిస్తోందంటూ వారు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ ఆధ్వర్యంలోని సీఈఆర్టీ–ఐఎన్(కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం) యాపిల్ సంస్థకు నోటీసులిచ్చింది. భారత్‌లోని యాపిల్ సంస్థ ప్రతినిధులు సీఈఆర్టీ–ఐఎన్ నిపుణులను కలుసుకున్నారు. అయితే, ఈ సమస్య వారి సా మర్థ్యానికి మించినదని తేలింది. దీంతో త్వర లోనే అమెరికా నుంచి యాపిల్ సైబర్ సెక్యూ రిటీ ప్రతినిధుల బృందం ఇక్కడికి రానుందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు. -
యాపిల్ బెదిరింపు నోటిఫికేషన్లు.. విచారణకు హాజరవనున్న అధికారులు
ప్రపంచ టెక్‌దిగ్గజ సంస్థ యాపిల్ ఇటీవల కొందరు ప్రతిపక్ష రాజకీయ నాయకులు, జర్నలిస్టులకు బెదిరింపు నోటిఫికేషన్లను పంపిన విషయం తెలిసిందే. దానిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందులో భాగంగా సంస్థకు చెందిన విదేశాల్లోని సాంకేతిక, సైబర్ సెక్యూరిటీ నిపుణులు విచారణకు హాజరవనున్నట్లు సీనియర్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అక్టోబర్ 31న టీఎంసీకు చెందిన మహువా మోయిత్రా, శివసేన పార్టీకి చెందిన ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్‌లోని శశి థరూర్, ఆప్‌కు చెందిన రాఘవ్ చద్దా సహా పలువురు ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ నుంచి బెదిరింపు నోటిఫికేషన్ వచ్చిందని వివిధ సామాజిక మాధ్యమాల్లో తెలిపారు. వారి ఫోన్లను స్థానికులు కొందరు తప్పుగా వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నోటిఫికేషన్ సారాశం. ఇదీ చదవండి: గూగుల్‌పేలో రీఛార్జిపై ఫీజు.. ఎంతంటే..? ఇదిలాఉండగా ప్రభుత్వమే ఈ చర్యలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపించడంతో రాజకీయ దుమారం చలరేగింది. వారి వాదనలు ఖండించిన ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. దాంతోపాటు ఆ నోటిఫికేషన్లకు సంబంధించి యాపిల్ సంస్థ నుంచి వివరణ కోరింది. ఇప్పటికే దేశంలోని యాపిల్ ప్రతినిధులను ప్రభుత్వ అధికారులు విచారించారు. కానీ సంస్థ సాంకేతిక నిపుణులు విదేశాల్లో ఉండడంతో వారూ విచారణకు హాజరవ్వాలని ప్రభుత్వం కోరింది. వీసా సమస్య కారణంగా వారు ఇండియాకు రావడం ఆలస్యమైందని అధికారులు చెప్పారు. త్వరలో విచారణకు హాజరవుతారని చెప్పారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఈ విచారణను నిర్వహిస్తోంది. -
ఐఫోన్ల విక్రయాలు కొత్త రికార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల విపణిలో యాపిల్ కొత్త రికార్డు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై–సెపె్టంబర్ కాలంలో 25 లక్షల యూనిట్లకుపైగా ఐఫోన్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 34 శాతం అధికంగా సాధించడం విశేషం. ఒక త్రైమాసికంలో భారత్‌లో కంపెనీ ఖాతాలో ఇదే ఇప్పటి వరకు రికార్డు. ఖరీదైన మోడళ్లకు మార్కెట్ మళ్లుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. సెపె్టంబర్ త్రైమాసికంలో భారత్‌లో 17.2 శాతం వాటాతో శామ్సంగ్ తొలి స్థానంలో నిలిచింది. నాలుగు త్రైమాసికాలుగా శామ్సంగ్ అగ్రస్థానాన్ని కొనసాగిస్తోందని పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ బుధవారం వెల్లడించింది. ఏ, ఎం సిరీస్ ఫోన్లు ఇందుకు దోహదం చేసిందని తెలిపింది. ఇక 16.6 శాతం వాటాతో షావొమీ రెండవ స్థానం ఆక్రమించింది. రూ.30–45 వేల ధరల శ్రేణి విభాగంలో వన్‌ప్లస్ 29 శాతం వాటాతో సత్తా చాటుతోంది. ఫోల్డబుల్ మోడళ్లకు.. ప్రీమియం విభాగం, 5జీ లక్ష్యంగా కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. రూ.45,000 ఆపైన ఖరీదు చేసే అల్ట్రా ప్రీమియం మోడళ్లకు డిమాండ్ ప్రతి త్రైమాసికంలోనూ పెరుగుతూ వస్తోంది. సెప్టెంబర్ క్వార్టర్లో అల్ట్రా ప్రీమియం మోడళ్ల అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 44 శాతం దూసుకెళ్లాయి. సులభ వాయిదాలు, ఇతర ప్రోత్సాహకాలు, నూతన టెక్నాలజీవైపు కస్టమర్ల మొగ్గు ఇందుకు దోహదం చేశాయి. ఫోల్డబుల్ మోడళ్లకు డిమాండ్ దూసుకెళ్తోంది. ఈ విభాగంలోకి కంపెనీలు క్రమంగా ప్రవేశిస్తున్నాయి. అన్ని బ్రాండ్ల అమ్మకాల్లో 5జీ స్మార్ట్ఫోన్ల వాటా ఏకంగా 53 శాతానికి ఎగబాకింది. 10–15 వేల ధరల శ్రేణిలో ఎక్కువ మోడళ్లను కంపెనీలు ప్రవేశపెట్టాయి. వీటిలో 5జీ మోడళ్ల వాటా ఏడాదిలో 7 నుంచి 35 శాతానికి చేరింది. ఆసక్తికర విషయం ఏమంటే 5జీ, అధిక ర్యామ్ (8జీబీ) వంటి కీలక ఫీచర్లు రూ.10,000లోపు సరసమైన స్మార్ట్ఫోన్లకు విస్తరించాయి. -
ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ అలర్ట్.. మీ ఫోన్ హ్యాక్ అవుతుందంటూ వార్నింగ్
న్యూఢిల్లీ: పలువురు లోక్‌సభ ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ ఫోన్ వార్నింగ్ అలర్ట్ పంపింది. ఎంపీల యాపిల్ ఐడీ ఆధారంగా స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ తమ ఐఫోన్, ఈ-మెయిల్స్ హ్యాక్ చేస్తున్నట్లు హెచ్చరించింది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మెసెజ్ అందుకున్న వారిలో త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, శివసేన(ఉద్దవ్ వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఉన్నారు. కేంద్రలోని బీజేపీ ప్రభత్వం తన ఫోన్, ఈ-మెయిల్‌ను హ్యక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి తన ఫోన్‌కు వచ్చిన హెచ్చరిక మెసెజ్ స్క్రీన్‌షాట్‌ను ట్విటర్లో చేశారు. ‘ప్రభుత్వం నా ఫోన్, ఈ-ఇమెయిల్‌లను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తోందని హెచ్చరిస్తూ ఆపిల్ నుంచి టెక్స్ట్, ఈ మెయిల్ వచ్చింది. మీ భయం నన్ను మీపై జాలిపడేలా చేస్తుంది’ అంటూ అదానీ, పీఎంవో, హోమంమంత్రి కార్యాలయాలను ఉద్ధేశిస్తూ ట్వీట్ చేశారు. So not just me but also @MahuaMoitra has received this warning from Apple. Will @HMOIndia investigate? https://t.co/aS01YQpRpB — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) October 31, 2023 అదే విధంగా శివసేన(ఉద్దవ్ వర్గం) రాజ్యసభ ఎంపీ, తను, మరో ముగ్గురు ఇండియా కూటమి సభ్యులకు ఈ మెసెజ్ అందినట్లు మహువా పేర్కొన్నారు. ఆమెకు అందిన ఈ మెసెజ్‌లో ‘హెచ్చరిక:మీ యాపిల్ ఐడీతో అనుసంధానించిన ఐఫోన్‌ను స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ మీ ఐఫోన్‌ను టార్గెట్ సేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఉంది. Received from an Apple ID, threat-notifications@apple.com, which I have verified. Authenticity confirmed. Glad to keep underemployed officials busy at the expenses of taxpayers like me! Nothing more important to do?@PMOIndia @INCIndia @kharge @RahulGandhi pic.twitter.com/5zyuoFmaIa — Shashi Tharoor (@ShashiTharoor) October 31, 2023 మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరరూర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. తనకు కూడా యాపిల్ నుంచి హెచ్చరిక సందేశం వచ్చినట్లు పేర్కొన్నారు. తన ఫోన్, ఈ-మెయిల్ లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొంటూ ట్విటర్లో పీఎంవోను ట్యాగ్ చేశారు. ప్రభుత్వానికి చేయడానికి ఇంతకుమించిన ముఖ్యమైన పని మరేం లేదా అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. వీరితో హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం ఈ హెచ్చరికను అందుకున్నారు. తనకు వచ్చిన మెసెజ్‌ను ఒవైసీ ట్విటర్లో పంచుకున్నారు. Received from an Apple ID, threat-notifications@apple.com, which I have verified. Authenticity confirmed. Glad to keep underemployed officials busy at the expenses of taxpayers like me! Nothing more important to do?@PMOIndia @INCIndia @kharge @RahulGandhi pic.twitter.com/5zyuoFmaIa — Shashi Tharoor (@ShashiTharoor) October 31, 2023 Received an Apple Threat Notification last night that attackers may be targeting my phone ḳhuub parda hai ki chilman se lage baiThe haiñ saaf chhupte bhī nahīñ sāmne aate bhī nahīñ pic.twitter.com/u2PDYcqNj6 — Asaduddin Owaisi (@asadowaisi) October 31, 2023 -
ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి? తెలిస్తే అవాక్కవుతారు!
యాపిల్ లవర్స్ అందరూ ఎంతాగానే ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'ఐఫోన్ 15 సిరీస్' ఎట్టకేలకు విడుదలైంది. అయితే ఈ ఐఫోన్‌కు 'ఇస్రో'కి కనెక్షన్ ఉన్నట్లు చాలామందికి తెలియక పోవచ్చు. ఈ కథనంలో ఈ సంబంధం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇటీవల విడుదలైన ఐఫోన్ 15 ప్రో మోడల్స్ ఇస్రో రూపొందించిన జీపీఎస్ సిస్టమ్ NavIC (న్యావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టెలేషన్)కు సపోర్ట్ చేస్తాయి. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ యాపిల్ తన ఐఫోన్ మోడల్స్‌లో తీసుకురావడం ఇదే మొదటిసారి. ఈ ఫీచర్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ రెండింటిలోనూ ఉంటుంది. NavIC గురించి.. 'న్యావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టెలేషన్'ని గతంలో ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (IRNSS) అని పిలిచేవారు. ఇది ఏడు ఉపగ్రహాల సమూహం ద్వారా సేకరించిన సమాచారం ద్వారా పనిచేస్తుంది. కావున భారతదేశపు మొత్తం భూభాగాన్ని కవర్ చేస్తుంది. అంతే కాకుండా జీపీఎస్ కంటే కూడా మంచి ఫలితాలను ఇస్తుందని సమాచారం. మొత్తం మీద దీని ద్వారా లొకేషన్ ట్రాకింగ్ కెపాసిటీ మరింత మెరుగుపడుతుందని స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: చిన్నప్పుడే తండ్రి మరణం.. నేడు ముఖేష్ అంబానీకంటే ఎక్కువ కార్లు కలిగిన బార్బర్ NavIC అనేది ISRO స్వతంత్రంగా అభివృద్ధి చేసింది. నిజానికి ఇది 2008లో 174 మిలియన్ డాలర్స్ లేదా రూ. 1426 కోట్లతో కార్య రూపం దాల్చి 2011 చివరికి పూర్తయింది. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) రూపొందించిన నావిక్ శాటిలైట్ సిస్టమ్ ఉందని, ఇది 'భారతదేశానికి మైలురాయి' అని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గురువారం తెలిపారు. NavIC కేవలం ఐఫోన్ సిరీస్ మొబైల్స్‌కి మాత్రమే కాకుండా రియల్మీ 9 ప్రో, వన్ ప్లస్ నార్డ్ 2టీ, షియోమీ ఎమ్ఐ 11ఎక్స్ వంటి వాటిలో కూడా లభిస్తుంది. కావున వినియోగదారులు దీంతో ఉత్తమ్ లొకేషన్ ట్రాకింగ్ అనుభవాన్ని పొందవచ్చు. జీపీఎస్ పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. #WATCH | Delhi: Union Minister Rajeev Chandrasekhar says, "The world's largest company in technology Apple has launched its new iPhone 15. During this launch, India is achieving two milestones. First, the availability of the iPhone 15 in India would be on the same day as the… pic.twitter.com/Hc8H7IEzOb — ANI (@ANI) September 14, 2023 -
ఐఫోన్ వాడకం నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న ఆ దేశ ప్రభుత్వం!
సాధారణంగా యాపిల్ ఐఫోన్స్‌ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది ఇష్టపడతారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధునిక కాలంలో చాలామందికి వినియోగించే మొబైల్స్‌లో ఐఫోన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఆఫీసు పనులకు యాపిల్ ఐఫోన్స్ వాడకూడదని చైనా ఇటీవల ఆదేశించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎక్కువ దేశాలు చైనా వస్తువులను వినియోగించడానికి ఒకింత ఆలోచిస్తాయి. కానీ చైనా ఐఫోన్స్ మాత్రమే కాకుండా విదేశీ బ్రాండ్ ఫోన్స్ వినియోగాన్ని నిషేదించింది. భద్రతాపరమైన భయం వల్ల ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అయితే ఈ రూల్ ఎంతవరకు అమలవుతుందనేది తెలియాల్సి ఉంది. కొన్ని నివేదికల ప్రకారం కేవలం యాపిల్ ఐఫోన్స్ మాత్రమే వినియోగించకూడదని, ఇతర బ్రాండ్స్ గురించి ప్రస్తావించలేదని తెలుస్తోంది. ఈ విషయం మీద యాపిల్ కంపెనీ స్పందించకపోవడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ 15 సిరీస్ విడుదలకు ముందు చైనా తీసుకున్న ఈ నిర్ణయం అమ్మకాలను దెబ్బ తీస్తుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో నెలకు రూ. 40వేలు సేవ్ చేస్తున్నా.. టెకీ ట్వీట్ వైరల్ భద్రత మాత్రమే కాకుండా స్వదేశీ బ్రాండ్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అమెరికా తరువాత యాపిల్ కంపెనీకి పెద్ద మార్కెట్ అయిన చైనా తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా ఐఫోన్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. దీనిపైన కంపెనీ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. -
యాపిల్ ఐఫోన్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్
-
నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్
మన గతంలో చాలామంది సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తల స్టోరీల గురించి తెలుసుకున్నాం. వీరిలో చాలామంది ఆదాయంలో ఖర్చుకంటే పొదుపునకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. విలాసాలకు పోకుండా, సాధారణ జీవితాన్ని గడుపుతూనే ఎన్నో ఉన్నత శిఖరాల నధి రోహించిన వారి జర్నీల గురించి విన్నాం. ఈ లిస్ట్‌లో తాజాగా వీసీ మీడియా కోఫౌండర్, కంటెంట్ స్పెషలిస్ట్ సుశ్రుత్ మిశ్రా చేరారు. డబ్బును ఎప్పుడు, ఎక్కడ,ఎలా పెట్టుబడి పెట్టాలో అర్థం చేసుకోవడమే తెలివైన వ్యాపారవేత్త లక్షణం.ఎంత డబ్బు సంపాదించాం అన్నది ముఖ్యంకాదు. ఎంత పొదుపు చేయగలిగాం, పెట్టుబడి ద్వారా ఎంత రిటర్న్స్ సాధించాం అనేది ముఖ్యం. ఈ క్రమంలో సుశ్రుత్ మిశ్రా ట్వీట్ వైరల్‌గా మారింది. 1.7 మిలియన్ల వ్యూస్‌ను, 12.8 వేల లైక్స్‌ను సొంతం చేసుకుంది. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) నెలకు 1.5 లక్షలకు పైగా సంపాదించే 23 ఏళ్ల సుశ్రుత్ మిశ్రా తనకు యాపిల్ ఐఫోన్ గానీ, కారుకానీ, కనీసం బైక్ కూడా లేదని ట్వీట్ చేశాడు. ఈ విలాసాలకంటే రిటైర్ అయిన తల్లిదండ్రులు ఆనందంగా గడిపేలా చూడటం, బిల్లులు చెల్లింపులు, భవిష్యత్తు ఎదుగుదల ప్రణాళికలే ఇందుకు కారణమని మిశ్రా చెప్పుకొచ్చాడు. కొడుకుగా అమ్మనాన్నల బాధ్యత అని తెలిపారు. దీన్ని అందరికీ తెలిసేలా గ్లామరైజ్ చేయాలనుకున్నా అంటూ ట్వీట్ చేశాడు. సుశ్రుత్ మిశ్రా లైఫ్ స్టైల్ చాలామందకి ప్రేరణగా నిలిచింది. ఇది ఇండియా స్టోరీ. 2011లో రూ. 35 వేల జీతం ఉన్నపుడు తాను కూడా ఇలాగే చేశానని ఒకరు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. (లేఆఫ్స్ సెగ: అయ్యయ్యో మార్క్ ఏందయ్యా ఇది!) తనకూ పైబాధ్యతలన్నీ ఉన్నాయి..కుటుంబ ఖర్చులు, చెల్లెలి చదువు భవిష్యత్తు పెట్టుబడులు. అమ్మ మందులు, సొంత ఇంటి కోసం పొదుపు, కొన్ని ఇతర ఖర్చులు ఇవన్నీ నా కోరికల కంటే మించినవి..కానీ బైక్, ఐఫోన్‌ను సొంతం చేసుకోవడం మీకెందుకు అడ్డంకిగా ఉన్నాయి? అని మరొక వినియోగదారు కమెంట్ చేశారు. కాగా కంటెంట్, మార్కెటింగ్ ఏజెన్సీ వ్యాపారాన్ని సుశ్రుత్ మిశ్రా, రోషన్ శర్మ కలిసి స్థాపించారు. (అదరగొట్టిన పోరీలు..ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!) I'm a 23yo with ₹1.5 lakh+ monthly income. Yet: - I don't own any 'Apple' - I don't live on my own - I don't have a bike/car Why? Responsibilities of an Indian son who: - Retired his parents - Pays all the bills - Plans for his family's future I want to glamourize this. — Sushrut Mishra (@SushrutKM) June 9, 2023 -
ఐవోఎస్ 17 అదిరిపోయే అప్డేట్: ఈ పాపులర్ ఐఫోన్ యూజర్లకు మాత్రం
న్యూఢిల్లీ: WWDC 2023లో టెక్ దిగ్గజం యాపిల్‌కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసింది. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టం 17 లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ను ప్రకటించింది. దీంతోపాటు 16 ఆపరేటింగ్ సిస్టంపై మరిన్ని అప్డేట్స్ ప్రకటించింది. లేటెస్ట్ iOS సాఫ్ట్వేర్ నుంచి మల్టీ హార్డ్‌వేర్ ప్రొడక్టుల వరకు కంపెనీ మొట్టమొదటి మిశ్రమ రియాలిటీ హెడ్సెట్ విజన్ ప్రోగా పిలుస్తోంది. ఐవోఎస్ 17 అందుబాటులో ఉండే ఐఫోన్ల జాబితాను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో 3 పాపులర్ ఐఫోన్ మోడల్స్ ను తొలగించింది. సంస్థ ప్రకటించిన అధికారిక జాబితా ప్రకారం యాపిల్ ఎక్స్ఎస్, తరువాత మోడల్స్‌ను దీనికి అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఐవోఎస్ 17 అప్డేట్ లేని ఐఫోన్లలో క్రిటికల్ లోపాన్ని సవరించేందుకు స్పెషల్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇది ప్రస్తుతం డెవలపర్ ప్రోగ్రామ్ సభ్యులకు అందుబాటులో ఉంది. అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ వెర్షన్ వచ్చే నెలలో ఈ ఏడాది సెప్టెంబరు నాటికి లాంచ్ కానుందని అంచనా. IOS 17 సపోర్ట్‌తో యాపిల్ మిక్స్డ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను కూడా పరిచయం చేసింది. ఐవోఎస్ 17 అప్డేట్ను పొందని ఐఫోన్లు ఐఫోన్ X iPhone 8 ఐఫోన్ 8 ప్లస్ iPhone SE ఫస్ట్ జెన్ -
తొలి పదిరోజుల్లోనే కోట్ల అమ్మకాలు: వామ్మో అన్ని కొనేశారా!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో అమ్మకాల్లో దూసుకుపోతోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో రిటైల్ స్టోర్ ఓపెన్ చేసిన 10 రోజుల్లోనే దాదాపు రెండు కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. తొలి రోజునుంచే అద్భుతమైన అమ్మకాలతో ఐఫోన్ స్టోర్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్టోర్‌గా నిలుస్తోంది. (వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా: ఆయన వేతనం, నెట్‌వర్త్ ఎంతో తెలుసా?) ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లోని మొదటి అంతస్తులో 8,417.83 చదరపు అడుగుల స్థలాన్ని పదేళ్లపాటు లీజుకు తీసుకుని మరీఈ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం కంపెనీ సుమారు రూ. నెలకు 40 లక్షలతో పాటు కొంత ఆదాయ వాటాను చెల్లించ నుంది. అయితే తొలి పది రోజుల్లోనే యాపిల్ ఐఫోన్లు,ఎయిర్ పాడ్స్, ఐప్యాడ్స్, ఇతర ఉత్పత్తుల్లో భారీ అమ్మకాలను సాధించింది. ఈ మొత్తం అమ్మకాల విలువ దాదాపు రూ. 2 కోట్లని తెలుస్తోంది. (బీమా పాలసీపై క్రెడిట్ కార్డ్ లోన్స్: ఇకపై ఇలా చేయలేరు!) ఇండియాలో రెండో స్టోర్‌గా యాపిల్ సాకేత్‌ను ఢిల్లీలో ఏప్రిల్ 20న యాపిల్ సీఈవో టిక్ కుక్ లాంచ్ చేశారు. అంతకుముందు ముంబైలో తొలిస్టోర్‌ను లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు 20 ప్రత్యర్థిబ్రాండ్ల స్టోర్స్ లేకుండా జూలై 2022లో మాల్తో ఒప్పందం కుదుర్చుకుంది యాపిల్. -
యాపిల్ డేస్ సేల్: ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: దేశీయ ఎలక్ట్రానిక్స్ స్టోర్ విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్ ను లాంచ్ చేసింది. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు విజయ్ సేల్స్ స్టోర్స్, ఆన్లైన్ వెబ్సైట్ ఆపిల్ డేస్ సేల్ కొనసాగనుంది. ఈసేల్‌లో యాపిల్ ఐఫోన్13, 14, ఎంఐ మ్యాక్బుక్ఎయిర్ (M1 MacBook Air) తదితర యాపిల్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డీల్స్ ,డిస్కౌంట్ అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ కారర్డ్స్కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌లు , ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కూడా పొందవచ్చు. అలాగే నో కాస్ట్ EMI స్కీమ్ కూడాఉంది. దీంతోపాటు మొత్తం కొనుగోలుపై 0.75శాతం MyVS లాయల్టీ రివార్డ్ పాయింట్లను ఆఫర్ చేస్తుందిజ వీటిని తర్వాత రీడీమ్ చేసుకోవచ్చు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలలో విస్తరించి ఉన్న కంపెనీకి చెందిన 125+ స్టోర్లలోఈ సేల్ యాక్టివ్‌గా ఉంటుంది. కంపెనీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా ఆఫర్లను పొందవచ్చు. (Layoffs crisis ఊడిపోతున్న ఐటీ ఉద్యోగాలు: ఇలా చేస్తే...!) రూ. 69,900విలువైన ఐఫోన్ 13 ప్రత్యేక డీల్ ధర రూ. 61,490. హెచ్డీఎఫ్సీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా రూ. 2వేలు తగ్గింపు. మొత్తంగా రూ. 59,490కే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. (లావా బ్లేజ్ 1ఎక్స్ 5జీ చూశారా? బడ్జెట్ ధరలో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ ) ఐఫోన్ 14 ప్లస్ ఆఫర్ ధర రూ. 80,490 కాగా, వెనిలా ఐఫోన్ 14 రూ. 70,990కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడల్‌లు వరుసగా రూ. 1,20,990 , రూ. 1,31,490కి అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ , డెబిట్ కార్డ్‌ల ద్వారా ఐఫోన్ 14 సిరీస్‌పై రూ. 4వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను క్లెయిమ్ చేసుకునే అవకాశం. (ఈ ట్రాక్ వేసుకుని యాప్ ఆన్ చేస్తే ... గుట్టంతా విప్పేస్తుంది!) యాపిల్ ఎంఐ మ్యాక్ బుక్ ఎయిర్ రూ. 82,900కి అందుబాటులో ఉంటుంది. మిగిలిన ల్యాప్‌టాప్‌లపై కస్టమర్లు రూ. 5 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఇంకా ఐప్యాడ్స్ , ఎయిర్‌పాడ్స్, వాచెస్‌పై తగ్గింపుధరలను ప్రకటించింది. -
భారత్‌లో ‘యాపిల్’ స్టోర్ ప్రారంభం.. (ఫొటోలు)
-
Apple-Mumbai BKC: భారత్‌లో 25 ఏళ్ల సంబరం.. ముంబైలో యాపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్ (ఫొటోలు)
-
ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్: ఐఫోన్13పై రూ.10 వేలు డిస్కౌంట్!
యాపిల్ ఐఫోన్13పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 13 ఒక సంవత్సరం పాతదే అయినా ఇప్పటికీ చాలా మంది దాన్ని కొనడానికి చూస్తున్నారు. యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఐఫోన్ 13 ధర రూ.69,990. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. ఐఫోన్13 128జీబీ వేరియంట్ రూ.60 వేల కంటే తక్కువకే లభిస్తోంది. యాపిల్ ఐఫోన్13 128జీబీ వేరియంట్ అసలు ధర రూ.69,990. దీనిపై ఫ్లిప్‌కార్ట్ రూ.10,901 డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో రూ.58,999కే ఐఫోన్13ను సొంతం చేసుకోవచ్చు. మరోవైపు యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించడం ద్వారా అదనంగా మరో రూ.1,000 తగ్గింపు పొందవచ్చు . అంటే రూ.57,999కే ఐఫోన్13 మీ చేతికి వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న సమ్మర్ సేల్‌లో భాగంగా ఈ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ సమ్మర్ సేల్ ఏప్రిల్ 17న ముగియనుంది. ఐఫోన్13 ఫీచర్లు ఇవే.. సిరామిక్ షీల్డ్‌తో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే సాధారణ పరిస్థితుల్లో 800 నిట్లు, HDRతో 1200 నిట్ల బ్రైట్నెస్ Apple A15 బయోనిక్ చిప్సెట్, iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్ 12MP + 12MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ పోర్ట్రెయిట్ మోడ్, ఆటోమేటిక్ నైట్ మోడ్, 4K వీడియో రికార్డింగ్, స్లో మోషన్ వంటి అనేక రకాల ఫీచర్లు ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్.. ఇక దూసుకెళ్లడమే! -
ఐఫోన్14.. యాపిల్ బంపర్ ఆఫర్!
తక్కువ ధరకు యాపిల్ ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే. రూ.80 వేల విలువైన ఐఫోన్ 14ను రూ.14 వేలకే అందిస్తోంది యాపిల్. ఐఫోన్ 14ను ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14ప్రో మ్యాక్స్‌లతో యాపిల్ గతేడాది విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.79,999. యాపిల్ స్టోర్ ఎప్పుడో గానీ డిస్కౌంట్లు ఇవ్వదు. కానీ ఐఫోన్ 14పై మాత్రం భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఇందులో రెండు రకాల ఆఫర్లు ఉన్నాయి. మొదటి పాత ఫోన్ ఎక్సేంజ్, రెండోది బ్యాంక్ ఆఫర్. వీటిని ఉపయోగించుకుని చాలా తక్కువ ధరకే ఐఫోన్14 కొనుక్కోవచ్చు. అది ఎలాగో చూడండి... అన్ని రకాల ఆఫర్లు, డిస్కౌంట్లను వినియోగించుకుంటే యాపిల్ స్టోర్‌లో ఐఫోన్ 14 రూ.14,170 లభిస్తోంది. రూ.79,990 ఉండే ఈ ఫోన్‌ను యాపిల్ ప్రాథమిక ఆఫర్‌తో రూ.58,730కు ఉంచింది. ఆ తర్వాత పనిచేసే కండీషన్లో ఉన్న మీ పాత ఫోన్‌ను ఎక్సేంజ్ చేసుకుంటే గరిష్ట మొత్తంలో ఆఫర్ లభిస్తుంది. ఇక్కడ బయటకు కనిపించని ఒక సీక్రెట్ ఏంటంటే.. పైకి ఎంతో ఆసక్తికరంగా కనిపించే ఈ ఆఫర్ లో కొన్ని లిటిగేషన్ లు కూడా ఉన్నాయి. పాత ఫోన్ అనగానే మనం వాడే ఫోన్ తీసుకెళ్తే దానికి అంతగా విలువ కట్టరు. యాపిల్ ఫోన్లను ప్రతీసారి అప్ డేట్ చేసుకునే కస్టమర్లు కొందరు ఉంటారు. కొత్త మోడల్ వచ్చిన ప్రతీసారి వారు తమ వద్ద ఉన్న మోడల్ ను ఇచ్చి కొత్తది తీసుకుంటారు. అలాగే ఐఫోన్ 14 విషయంలోనూ ఇలాంటి షరతే వర్తిస్తుంది. మీ దగ్గర మంచి కండీషన్ లో ఉన్న ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 13 మోడల్ ఉంటే.. దానికి గరిష్టంగా కట్టే విలువ దాదాపు రూ.35 వేలు. ఇక హెచ్డీఎఫ్సీ కార్డ్‌లతో చెల్లింపులు చేస్తే రూ.7వేలకు పైగా డిస్కౌంట్ వస్తుంది. ఇలా అన్ని ఆఫర్లు, డిస్కౌంట్లను ఉపయోగించుకుంటే రూ.14,170కే ఐఫోన్ 14 మీ సొంతం అవుతుంది. పైకి సులభంగా అనిపించినా.. షరతులన్నీ చూసుకుంటే.. లాభమా? నష్టమా? వినియోగదారులే నిర్ణయించుకోవాలి. (ఇదీ చదవండి: హైడ్రోజన్‌తో నడిచే బస్.. త్వరలో భారత్ రోడ్ల పైకి) -
మ్యూజిక్ లవర్స్‌కి అదిరిపోయే గుడ్‌న్యూస్.. సగం ధరకే యాపిల్ ఎయిర్‌పాడ్స్!
యాపిల్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఉత్పత్తులుకు డిమాండ్ మామూలుగా ఉండదన్న సంగతి తెలిసిందే. ఐఫోన్, ఎయిర్‌పాడ్స్, ఐప్యాడ్ ఇలా ఏదైనా టూ కాస్ట్లీగా ఉంటాయి. అయినా కూడా ఇవి సేల్స్ పరంగా దుమ్ము దులుపుతుంటాయి. అందుకు ఈ బ్రాండ్‌పై ఉన్న నమ్మకం, ఇందులో ఉపయోగిస్తున్న టెక్నాలజీ కారణమనే చెప్పాలి. అయితే యాపిల్ ఎయిర్‌పాడ్స్ ధరలు కూడా భారీ స్థాయిలో ధరలు ఉండడంతో, మిగిలిన ఉత్పత్తులతో పాలిస్తే ఇవి వినియోగదారులను అంతగా ఆకట్టుకోకపోతున్నామని యాపిల్ భావిస్తోంది. అందుకే తక్కువ ధరలో ఎయిర్‌పాడ్స్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. ఆడియో మార్కెట్‌పై కన్ను... రూ.8 వేలకే సమాచారం ప్రకారం.. యాపిల్ సరసమైన ధరలలో ఎయిర్‌పాడ్స్ తీసుకురావడం మాత్రమే కాకుండా, కొత్త తరం ఎయిర్‌పాడ్స్ మాక్స్( AirPods Max)పై కూడా పనిచేస్తోంది.సరసమైన ఎయిర్‌పాడ్స్ ధర 99 డాలర్లు(ఇది భారతదేశంలో కరెన్సీ ప్రకారం దాదాపు రూ.8000) ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎయిర్‌పాడ్స్ సరఫరాదారులను కూడా మార్చాలని కంపెనీ చూస్తున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ ధరలో యాపిల్ ఎయిర్‌పాడ్స్ అందుబాటులోకి వస్తే సేల్స్ అమాంతం పెరిగే అవకాశం ఉంది. అయితే, బడ్జెట్లో వచ్చే ఎయిర్‌పాడ్స్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండకపోవచ్చని అనలిస్టులు చెబుతున్నారు. ఎయిర్‌పాడ్స్‌ను తక్కువ ధరలో తీసుకురావడం ద్వారా ఆడియో మార్కెట్లోనూ తమ సేల్స్పెంచుకోవాలన్నది యాపిల్ లక్ష్యంగా తెలుస్తోంది. ఒకవేళ రూ.8వేల ధరలో తీసుకొస్తే యాపిల్ సేల్స్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం యాపిల్ ఎయిర్‌పాడ్స్ (Airpods) కొనాలంటే కనీసం రూ.15వేలు వెచ్చించాల్సిందే. చదవండి: అమెజాన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే కొత్త ప్లాన్, ప్రైమ్ కంటే చవక! -
వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!
సామర్ధ్యం ఉండి.. ఐఫోన్‌ను కొనలేకపోయామే అని బాధపడుతున్న ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త. గతేడాది మార్కెట్లో యాపిల్ శాంసంగ్, వన్ ప్లస్‌తో పాటు ఇతర సంస్థలు భారీ ఎత్తున ఫోన్లను విడుదల చేశాయి. ఏ సంస్థ నుంచి ఎన్ని ఫోన్లు విడుదలైన అందులో ఐఫోన్‌కు ప్రత్యేకత వేరే ఉంటుంది. అందుకే స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ జీవితంలో ఒక్కసారైన ఐఫోన్‌ను వినియోగించాలని అనుకుంటారు. కానీ ఆ ఫోన్ ధర కారణంగా వెనక్కి తగ్గుతుంటారు. ఇప్పుడు అలాంటి వారి కోసమే ఈకామర్స్ కంపెనీలు భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ దేశీయ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ అమ్మకాలపై క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. 2022 ఆగస్ట్ నెలలో యాపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేసింది. ఆ సిరీస్‌లోని ఐఫోన్ 14 పై భారీ ఎత్తున డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. రీటైల్ మార్కెట్లో ఆఫోన్ ధర రూ.80 వేలు ఉండగా.. ఇప్పుడు అదే ఫోన్ పై రూ.5,910 డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇలా ఫ్లిప్ కార్ట్‌తో పాటు ఇతర డిస్కౌంట్లతో ఆ ఫోన్ ధర రూ.50,990కి తగ్గింది. ఒకవేళ మీరు 128 జీబీ వేరీయంట్ ఐఫోన్ 14ను ఎక్ఛేంజీలో సైతం కొనుక్కోవచ్చు. ఫోన్ కండీషన్ బాగుండి, మేజర్ సమస్యలు లేకపోతే ట్రేడ్- ఇన్ డిస్కౌంట్ వ్యాల్యూ ఆధారంగా క్యాలిక్లేట్ చేసి మీ ఫోన్ పై ఎంత ఎక్ఛేంజీ ఇవ్వాలో నిర్ధారిస్తారు ఐఫోన్ ప్రతినిధులు. ఆఫోన్పై ఎక్ఛేంజ్తో రూ.23వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎగ్జిస్టింట్ ఇన్స్టంట్ డిస్కౌంట్ కింద 7శాతం డిస్కౌంట్, ఇతర బ్యాంక్‌లు ఇచ్చే ఆఫర్లు ఇలా మొత్తం కలిపితే రూ.40వేలకే ఫోన్ కొనుగోలు చేయొచ్చని ప్లిప్ కార్ట్ తెలిపింది. కాగా, యాపిల్ కంపెనీ త్వరలో ఐఫోన్ 15 సిరీస్ ఫ్లాగ్ షిప్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. చదవండి👉‘నా దారి నేను చూసుకుంటా’, చైనాకు యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారీ షాక్! -
ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్!
భారత్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5జీ సేవలు (5G Services) ప్రారంభమయ్యాయి. అయితే ఈ సేవలు ఒకేసారి దేశవ్యాప్తంగా కాకుండా ప్రస్తుతానికి కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే లభ్యమవుతోంది. 5జీ సేవలు ఉపయోగించాలంటే ఆయా మొబైల్ కంపెనీలు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో కొన్ని కంపెనీలు ఇప్పటికే అప్డేట్ ప్రక్రియను పూర్తి చేయగా.. తాజాగా యాపిల్ కంపెనీ ఐఫోన్ యూజర్లకు శుభవార్త చెప్పింది. దేశంలోని ఐఫోన్ యూజర్లకు 5జీ సపోర్ట్ అందించినట్లు యాపిల్ కంపెనీ తెలిపింది. 5జీ సేవలు ప్రారంభం జియో , ఎయిర్టెల్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్న ఐఫోన్ యూజర్లకు 5జీ అప్డేట్ సేవలు అందజేసినట్లు యాపిల్ స్పష్టం చేసింది. iOS 16.2 రిలీజ్ కావడంతో.. భారత్‌లోని వినియోగదారులు కవరేజీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 5G నెట్వర్క్ స్పీడ్‌ను ఉపయోగించగలరు. ఐఫోన్ 12 తర్వాత మార్కెట్లోకి వచ్చిన అన్ని అనుకూల మోడల్‌లలో 5G సేవలు సపోర్ట్ చేస్తాయి. మొదట ఐఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అనంతరం జనరల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆపై సాఫ్ట్వేర్ అప్డేట్పై ట్యాప్ చేయాలి. అక్కడ iOS 16.2ని డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. నిబంధనలు అంగీకరించిన తర్వాత అప్డేట్ను డౌన్లోడ్ చేయాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ iOS 16.2కి అప్డేట్ చేయడానికి ముందు మీ మొబైల్లో తగినంత బ్యాటరీ ఉందని నిర్ధారించుకోవడం ముఖ్యం. చదవండి: పదేళ్లుగా నడుస్తోంది.. ఐఫోన్లకు సంబంధించి పెద్ద సీక్రెట్ బయటపెట్టిన యాపిల్ సీఈఓ! -
పదేళ్లుగా నడుస్తోంది.. ఐఫోన్లకు సంబంధించి పెద్ద సీక్రెట్ బయటపడింది!
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫోన్ల మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన నేమ్‌తో పాటు ఫేమ్‌ను సంపాదించుకుంది ఐఫోన్. దీని తయారీ వెనుక ఏ విషయాన్ని యాపిల్ కంపెనీ బయటపెట్టేది కాదు. అయితే తాజాగా సంస్థ సీఈఓ ఐఫోన్లకు సంబంధించి ఓ పెద్ద సీక్రెట్‌ని రివీల్ చేశారు. అదేంటో తెలుసుకుందాం! ఐఫోన్ కెమెరాతో క్లిక్ చేస్తే ఫోటో అద్భుతంగా రావాల్సిందే. ఎందుకంటే దాని క్లారిటీ అలాంటిది మరీ. తాజాగా జపాన్ పర్యటనలో ఉన్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఐఫోన్ కెమెరాలకు సంబంధించి పెద్ద రహస్యాన్ని బయటపెట్టాడు. ఐఫోన్ కెమెరాలను సోనీ సంస్థ తయారు చేస్తుందని తెలిపారు. అత్యున్నత కెమెరా సెన్సర్ల కోసం దశాబ్ధకాలంగా సోనీ సంస్థతో తాము చేతులు కలిపామని కుక్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. తమ భాగస్వామ్యం నిరంతం కొనసాగుతుందన్నారు. సంవత్సరాలుగా, ఆపిల్ ఐఫోన్ మోడల్‌లలో ఉపయోగించే హార్డ్‌వేర్ గురించి పెదవి విప్పలేదు. అంతేకాకుండా ఏదైనా ఐఫోన్ మోడల్స్‌లో కూడా అధికారిక స్పెక్స్ షీట్న్ చూసినట్లయితే, కంపెనీ ర్యామ్, కెమెరా రిజల్యూషన్ సహా నిర్దిష్ట వివరాలను ఎప్పుడూ వెల్లడించలేదు. సోనీ ఐఫోన్ల కోసం కెమెరా సెన్సార్లను తయారు చేస్తుందన్న విషయాన్ని టిమ్ కుక్ తొలిసారిగా వెల్లడించడం గమనార్హం. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, సోనీ తన కెమెరా సెన్సార్ పనితనం మరింత పెంచేందుకు కొత్త సెమీకండక్టర్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించే కొత్త ఇమేజ్ సెన్సార్‌ను అభివృద్ధి చేస్తోందట. We’ve been partnering with Sony for over a decade to create the world’s leading camera sensors for iPhone. Thanks to Ken and everyone on the team for showing me around the cutting-edge facility in Kumamoto today. pic.twitter.com/462SEkUbhi — Tim Cook (@tim_cook) December 13, 2022 చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
ఫస్ట్ టైమ్... ఐ ఫోన్ 14 పై భారీ డిస్కౌంట్
-
సేల్స్ బీభత్సం, ఆ కంపెనీకి ఒక సెకను లాభం రూ. 1.48 లక్షలు!
ఇటీవల స్మార్ట్ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో మొబైల్ రంగంలో కంపెనీలు అత్యధిక లాభాలు పొందుతున్నాయి. ఈ జాబితాలో టాప్ స్థానంలో కొనసాగుతున్న ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ లాభాల బాటలో దూపుకుపోతోంది. లాభాల విషయానికొస్తే ..యాపిల్ ప్రతి సెకనుకు ఎంత లాభం పొందుతుందో తెలుసా? ఇది $1,820 ( భారత కరెన్సీ ప్రకారం రూ. 1.48 లక్షలకు పైగా), రోజుకు సుమారు $157 మిలియన్ (రూ. 1,282 కోట్ల కంటే ఎక్కువ) ఆర్జిస్తోంది. తోటి టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృ సంస్థ), అలాగే వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే కూడా ప్రతి సెకనుకు వెయ్యి డాలర్లకు పైగా సంపాదిస్తున్నాయి. అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఫైనాన్షియల్ టెక్నాలజీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న టిపాల్టీ ఈ నివేదికను తయారు చేసింది. యాపిల్ టాప్ రెండవ స్థానంలో, మైక్రోసాఫ్ట్ సెకనుకు సుమారు $1,404 (రూ. 1.14 లక్షలు), బెర్క్‌షైర్ హాత్వే సెకనుకు $1,348 (సుమారు రూ. 1.10 లక్షలు) సంపాదిస్తూ తర్వాతి వరుసలో ఉన్నాయి. ఆల్ఫాబెట్ నాల్గవ స్థానంలో సెకనుకు $1,277 సంపాదిస్తే, మెటా ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి సెకనుకు $924 లాభలను ఆర్జిస్తున్నాయి. ఉబెర్ (Uber) టెక్నాలజీస్ 2021లో $6.8 బిలియన్ల భారీ నష్టాన్ని చవిచూసింది, ఇది ప్రతి సెకనుకు $215 నష్టంతో సమానం. ప్రపంచంలోనే అతిపెద్ద రైడ్-హెయిలింగ్ యాప్ అయినప్పటికీ, ఉబెర్ ప్రముఖంగా ఎప్పుడూ లాభాలను ఆర్జించలేదు. చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! -
హోసూరులో అతిపెద్ద ఐఫోన్ తయారీ ప్లాంట్
న్యూఢిల్లీ: దేశంలో యాపి ల్ ఐఫోన్ల తయారీకి సంబంధించి అతిపెద్ద ప్లాంట్ కర్ణాటకలోని హోసూరులో టాటా ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానుంది. దీని ద్వారా 60వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ వివరాలను కేంద్ర టెలికం, ఐటీ శాఖా మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఐఫోన్ల తయారీపై రాంచీ, హజారీబాగ్‌కు చెందిన ఆరువేల మంది గిరిజన మహిళలకు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. -
బాబోయ్, సరికొత్త రికార్డ్ సృష్టించిన యాపిల్ సంస్థ.. షాక్‌లో ప్రత్యర్థి కంపెనీలు!
స్మార్ట్ఫోన్లలో యాపిల్ కంపెనీ ఐఫోన్లకు ఉన్న క్రేజ్ వేరు. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ యాపిల్ ఫోన్లకు సొంతం. అంతటి ప్రాముఖ్యత సంపాదించుకున్న యాపిల్ తాజాగా ఓ రికార్డ్ సృష్టించింది. మార్కెట్ విలువ పరంగా మరే కంపెనీ చేరలేని రేర్ ఫీట్‌ని సాధించి తన బ్రాండ్‌ని మరో సారి నిరూపించుకుంది. మార్కెట్ విలువలో యాపిల్ కంపెనీ గురువారం ఒక్క రోజే 190.9 బిలియన్ డాలర్ల పెరిగింది. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్డ్ డేటా వెల్లడించింది. దీంతో ప్రస్తుతం యాపిల్ మార్కెట్ విలువ 2.34 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అదే సమయంలో, ఇతర మూడు టెక్ దిగ్గజాల మార్కెట్ విలువు $2.306 ట్రిలియన్లకు చేరింది. గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ (1.126 ట్రిలియన్ డాలర్లు), అమెజాన్ (939.78 బిలియన్ డాలర్లు), ఫేస్బుక్ పేరెంట్ మెటా (240.07 బిలియన్ డాలర్లు) ఉన్నాయని యాహూ ఫైనాన్స్ డేటా వెల్లడించింది. అసలే ఆర్థిక మాంద్యం భయాలతో కంపెనీ మార్కెట్ విలువలు ఆశించినంత స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో యాపిల్ ఈ స్థాయిలో మార్కెట్ విలువను చూసి మిగిలిన కంపెనీలు షాక్‌లో ఉన్నాయి. గత వారం, యాపిల్ మార్కెట్ విలువ ఆల్ఫాబెట్ ఇంక్, అమెజాన్, మెటా మార్కెట్ విలువ కంటే ఎక్కువగా పెరిగింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఆపిల్ ఆదాయ ఫలితాలు రెండంకెల వృద్ధిని నమోదు చేసిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ గత నెలలో తెలిపారు. యాపిల్ ప్రస్తుతం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 37% వాటాను కలిగి ఉండగా, దేశంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 3% మార్కెట్ వాటాను కలిగి ఉంది. చదవండి: హైదరాబాద్: జియో 5జీ సేవలు కావాలంటే.. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇలా చేయాల్సిందే! -
ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్: రూ.40 వేల భారీ డిస్కౌంట్
సాక్షి,ముంబై: యాపిల్ పాపులర్ ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలనేవారికి మంచి అవకాశం. యాపిల్ ఐఫోన్ 11 ఇపుడు భారీ తగ్గింపులో అందుబాటులో ఉంది. అత్యంత జనాదరణ పొందిన, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 11పై 40వేల రూపాయల దాగా డిస్కౌంట్ లభిస్తోంది. ముఖ్యంగా ఎక్స్చేంజ్ ఆఫర్ 17,500 వరకు తగ్గింపుతో రూ. 23,490లకే కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం తగ్గింపును అదనం. ఫ్లిప్‌కార్ట్‌లో 64జీబీ స్టోరేజ్ బేస్ మోడల్ దాదాపు రూ.40,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. యాపిల్ ఐఫోన్ 11 సిరీస్ 2019లో భారతదేశంలో రూ.64,900 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో ఐఫోన్11 ప్రొ, ప్రొమాక్స్ను తీసుకొచ్చిన సంగతి తె లిసిందే. 2020లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 11. అయితే ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తరువాత కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను నిలిపివేసింది. (ఐఫోన్ 14 కొనుగోలు చేశారా? తాజా వార్నింగ్ ఏంటో తెలుసా?) ఐఫోన్ 11 స్పెసిఫికేషన్స్: 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD డిస్ప్లే, 1792 x 828 పిక్సెల్స్‌రిజల్యూషన్, A13 బయోనిక్ చిప్సెట్, 12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ప్రధానంగా ఉన్నాయి. -
యాపిల్ కంపెనీకే షాకిచ్చాడు.. ఏకంగా రూ.140 కోట్లు కొట్టేసిన ఉద్యోగి!
చేసిన తప్పుకి ఎప్పటికైనా శిక్ష పడక మానదు. ఈ మాటే చాలా సార్లు వినే ఉంటాం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది భారతి సంతతికి చెందిన ఉద్యోగికి. అన్నం పెట్టిన కంపెనీకే కన్నం వేశాడు. దొరికినంత దోచుకున్నాడు, అయితే పాపం పండి చివరికి దోషిగా నలుగురిలో నిలబడ్డాడు. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన 52 ఏళ్ల ధీరేంద్ర ప్రసాద్.. కాలిఫోర్నియాలోని యాపిల్ సంస్థలో 2008-18 వరకు పనిచేశాడు. కంపెనీలో దొంగ ఇన్ వాయిస్ లు సృష్టించడం, ఎలక్ట్రానిక్ భాగాలు దొంగిలించడం, కంపోనీలో లేని సర్వీసులకు కూడా డబ్బులు వసూలు చేయడం లాంటివి చేశాడు. ఈ మోసం 2011 నుంచి ప్రారంభమై 2018 వరకు కొనసాగించాడు. అలా కంపెనీలో 17 మిలియన్ డాలర్లకు (భారత కరెన్సీ ప్రకారం) పైగా దోచుకున్నాడు. ఎట్టికేలకు ఈ విషయం బయటకు రావడంతో ప్రసాద్ కటకటాలపాలయ్యాడు. కోర్టులో దీనిపై విచారణ జరపగా.. ఇందులో రాబర్ట్ గ్యారీ హాన్సెన్, డాన్ ఎమ్ బేకర్ అనే మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలిపాడు. చివరికి కంపెనీని $17 మిలియన్లకు పైగా మోసం చేసినట్లు కోర్టులో అంగీకరించాడు. అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి వాయిదా 2023 మార్చి 14న ఉండనుంది. అంతవరకు ప్రసాద్ పోలీసు కస్టడీలో ఉంచనున్నారు. ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ ప్రోగ్రామ్ సహాయంతో ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రాసిక్యూషన్ జరిగింది. -
45వేల ఉద్యోగులు కావాలి.. అంతా మహిళలే.. ఎక్కడంటే!
భారత్‌లో ఐఫోన్ తయారీని పెంచేందుకు టాటా గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం తమిళనాడులోని తన ప్లాంట్‌లో వేలాది సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. అక్కడి ప్లాంట్‌లో ఐఫోన్ విడిభాగాల తయారీని చేపడుతున్న సంగతి తెలిసిందే. కోవిడ్ లాక్డౌన్లు, అమెరికాతో రాజకీయ ఉద్రిక్తతల నడుమ యాపిల్ తన తయారీ స్థావరాన్ని చైనా నుంచి తరలించాలని చూస్తోంది. ఈ అంశం భారత్‌కు కలిసొచ్చే అంశంగా మారింది. ప్రస్తుతం భారత్‌లో తన కార్యకలాపాలను పెంచాలని యాపిల్ భావిస్తోంది.బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. తమిళనాడులో హోసూర్‌లోని ప్లాంట్‌లో పనిచేసేందుకు వచ్చే 18 నుంచి 24 నెలల్లో 45 వేల మంది ఉద్యోగులను టాటా గ్రూప్ నియమించుకోనుంది. వారందరూ కూడా మహిళా ఉద్యోగులేనని తెలుస్తోంది. కాగా ఫ్యాక్టరీలో ఇప్పటికే 10,000 మంది కార్మికులు పనిచేస్తుండగా, వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ఈ ప్లాంట్ 500 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. గత సెప్టెంబర్‌లో దాదాపు 5,000 మంది మహిళలను నియమించుకున్నారు. అయితే టాటా, ఆపిల్ సంస్థలు హోసూర్‌లో ఈ నియామకాల గురించి పూర్తి సమాచారం తెలపాల్సి ఉంది. దేశంలో ఐఫోన్లను అసెంబుల్ చేసేందుకు ఎలక్ట్రానిక్స్ తయారీ జాయింట్ వెంచర్‌ను స్థాపించడానికి టాటా గ్రూప్ విస్ట్రాన్‌తో చర్చలు కూడా జరుపుతోంది. చదవండి: సామాన్యులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు -
భారీ షాక్.. దీపావళి తర్వాత ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్!
మీరు పాత ఐఫోన్‌ని(iPhone) ఉపయోగిస్తున్నారా లేదా మీ ఫోన్ ఐఓఎస్(iOS) పాత వెర్షన్లో రన్ అవుతుందా?అయితే మీ ఫోన్‌ని అప్‌గ్రేడ్ చేయాలి లేదా iOS లేటెస్ట్ వెర్షన్‌లోకి అప్డేట్ చేసుకోవాలి. ఇలా చేయకుంటే ఆ ఫోన్లలో ఇకపై వాట్సాప్ సేవలను వినియోగించడం కుదరుదు. ఎందుకంటే ఈ దీపావళి తర్వాత నుంచి కొన్ని ఐఫోన్లలో వాట్సాప్ పని చేయదు. కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. అక్టోబర్ 24 నుంచి ఐఫోన్5, ఐఫోన్ 5సీ మొబైల్స్‌తో పాటు ios 10, ios 11తో పని చేస్తున్న ఐఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ఫోన్లను ios 12, లేదా ఆపైన వెర్షన్‌కు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆండ్రాయిడ్ వెర్షన్ 4.1 లేదా అంతకంటే తక్కువ వెర్షర్ ఓఎస్‌లు(os) మీద పని చేస్తున్న మొబైల్స్‌లోనూ వాట్సాప్ సేవలు ఉండవు. iPhoneని ఎలా అప్‌గ్రేడ్ చేయాలి iOS 10, iOS 11 అనేవి ఐఫోన్ల పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లు. ఐఫోన్ ఇంకా అప్డేట్ కాకపోతే వెంటనే అప్డేట్ చేయడం మంచిది. సెట్టింగ్‌లు > జనరల్‌కి నావిగేట్ చేయండి. ఇక్కడ సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్‌ని ఎంచుకుని, ఆపై సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయడానికి లేటెస్ట్ iOS వెర్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. కాగా ఆపిల్ గతంలో.. కొన్ని పాత iPhoneలలో వాట్సాప్ యాప్ పని చేయదని తెలిపింది. వాట్సాప్ ప్రకారం, మెసేజింగ్ యాప్ అక్టోబరు 24 నుంచి iOS 10, iOS 11 పరికరాల్లో పనిచేయదు. ఈ మేరకు పేర్కొన్న ఫోన్లను వాడుతున్న వినియోగదారులకు హెచ్చరికలు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే చదవండి: ఐటీ కంపెనీల ముందు పెను సవాళ్లు.. వచ్చే 12 నెలల్లో భారీ షాక్! -
ఆపిల్‌కు షాక్ ఇచ్చిన ఎలాన్ మస్క్... ఐఫోన్ కు పోటీగా టెస్లా ఫోన్
-
‘ఎలాన్ మస్క్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది’..విడుదల ఎప్పుడు, ధర ఎంత!
స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త సంచలనాలకు శ్రీకారం చుట్టారు. యాపిల్, శాంసంగ్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలకు ధీటుగా టెస్లా ‘పై’ పేరుతో స్మార్ట్ ఫోన్‌ను తర్వలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మస్క్ ఇప్పటికే స్పేస్ ఎక్స్, స్టార్ లింక్, ది బోరింగ్ కంపెనీ, న్యూరాలింక్ కార్పొరేషన్, జిప్2, ఓపెన్ ఏఐ, టెస్లా, సోలార్ సిటీ, పేపాల్ కంపెనీలను స్థాపించి తన మార్క్ బిజినెస్ స్ట్రాటజీస్‌తో ముందుకు దూసుకెళ్తున్నారు. మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తూనే బార్ట్న్ హెయిల్ పేరుతో పెర్ఫ్యూమ్ అమ్మకాలు ప్రారంభించాడు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టెస్లా స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఆ ఫోన్ ఫీచర్లు, ధరలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘పై’ ఫోన్ ఫీచర్లు తొలిసారి స్మార్ట్ ఫోన్ తయారీ మార్కెట్లోకి అడుగు పెట్టిన మస్క్..పై పేరుతో ఫోన్‌ను డిసెంబర్ నెలలో మార్కెట్‌కు పరిచయం చేయనున్నారు. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.7 అంగుళాల ఫోన్‌కు ఓల్ఈడీ ప్యానెల్, 1284*2778 పిక్సెల్ స్క్రీన్ రెజెల్యూషన్, 458 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఒలియోఫోబిక్ కోటింగ్‌తో స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఈ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉండగా.. ఒక్కో కెమెరా రెజెల్యూషన్ 50ఎంపీ(మెగా పిక్సెల్) గా ఉంది. ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్, డ్యూయల్ ఎల్ఈడీ టోన్ ఫ్లాష్, హెచ్డీఆర్, హైక్వాలిటీ, వీడియో కంప్రెషన్ కోసం ప్రోరెస్ ఫార్మాట్, సినిమాటిక్ మోడ్, స్టెరో సౌండ్ రికార్డింగ్ ఫీచర్లు ఉన్నాయి. ధర ఎంతంటే? ఫోన్ ముందు భాగంలో 40 మెగా పిక్సెల్ సింగిల్ పంచ్ హోల్ కెమెరా, కదులుతున్న మనుషుల్ని, జంతువుల్ని స్టిల్ ఫోటోలుగా క్యాప్చర్ చేసేందుకు గైరో స్కోప్ ఎలక్ట్రానిక్స్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ( Gyro-EIS) వంటి ఫీచర్లు ఉన్నాయి. టెస్లా సొంతంగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను తయారు చేయగా.. ఈ ఫోన్ ధర రూ.70వేల నుంచి రూ.80వేల మధ్యలో ఉండనున్నట్లు సమాచారం. చదవండి👉 ‘అదానీ సంపద హాంఫట్’ ఒక్కరోజే వేలకోట్ల నష్టం..కారణం ఏంటో తెలుసా -
ఐఫోన్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్!
యాపిల్ ఐఫోన్ కొనుగోలుదారులకు ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. దివాళీ సేల్‌లో భాగంగా ఐఫోన్లను డిస్కౌంట్‌కే అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఐఫోన్ 13 ధర రూ.69,990 ఉండగా రూ.59,990కే అందిస్తుంది. ఇక 256జీబీ, 512జీబీ ఫోన్ల ధరల్ని సైతం తగ్గించింది. ఐఫోన్ కొనుగోలుదారులు ఎస్బీఐ, కొటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగిస్తే రూ.1250 అదనంగా ఆఫర్‌ను పొందవచ్చు. దీంతో పాటు యూజర్లు ఎక్స్ఛేంజ్ డీల్ కింద రూ 16,990 వరకూ పొందుతారు. ఐఫోన్ 13 ఫీచర్లు యాపిల్ సంస్థ ఐఫోన్ 13, మినీ, ప్రో, ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. వీటిలో ఐఫోన్ 13 గులాబీ, నీలం తదితర అయిదు రంగుల్లో లభిస్తుంది. ఇక ఈ ఫోన్ల ఫీచర్ల విషయానికొస్తే.. ఫోన్ల వెనుకవైపు అధునాతన డ్యుయల్ కెమెరాలు, 5జీ, 6 కోర్ సీపీయూ, 4 కోర్ జీపీయూ, కొత్త ఏ15 బయోనిక్ చిప్సెట్ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 13 డిస్ప్లే 6.1 అంగుళాలు, మినీ డిస్ప్లే 5.4 అంగుళాలుగా ఉంటుంది. ఐఫోన్ 12 మినీతో పోలిస్తే 13 మినీ బ్యాటరీ సామర్థ్యం 1.5 గంటలు, ఐఫోన్ 12తో పోలిస్తే ఐఫోన్ 13 బ్యాటరీ సామర్థ్యం 2.5 గంటలు ఎక్కువగా ఉంటుంది. -
ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే..జాక్ పాట్! ఆపిల్‌కు దిమ్మదిరిగే కౌంటర్లు
సాక్షి,ముంబై: ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే విలువైన వస్తువుకు బదులు చీప్‌గా సబ్బులు, ఇతర పనికిరాని వస్తువులు, ఒక్కోసారి రాళ్లు వచ్చిన సంఘటనలు గతంలో చాలా చూశాం. దీనికి సంబంధించి ఫ్లిప్‌కార్ట్ గతంలో విస్తృతంగా ట్రోల్ అయింది కూడా. అలాగే ఇటీవలి సేల్‌లో కస్టమర్లకు చివరి నిమిషాల్లో ఆర్డర్లను రద్దు చేసిందంటూ ఫ్లిప్‌కార్ట్ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఒక ఆసక్తికరమైన ఉదంతం చోటు చేసుకుంది. ఒక వినియోగ దారుడు ఐఫోన్13ని ఆర్డర్ చేస్తే.. దీనికి బదులుగా లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్ 14 అందుకోవడం చర్చకు దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ట్విటర్ యూజర్ అశ్విన్ హెడ్జ్ ట్వీట్ చేశారు. అయితే దీనికి నెటిజన్లు రియాక్షన్ మాత్రం అల్టిమేట్. ఐఫోన్ 13, 14 అయినా ఒకటేగా పెద్దగా తేడా ఏముంది అంటూ వ్యంగ్యంగా కమెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన నెటిజన్లు..రెండూ ఒకటేగా..ఆపిల్‌కే అయోమయంగా ఉంది. అయినా వాళ్ల తప్పేముంది.. నిజానికి రెండూ ఒకటేగా అంటూ సెటైర్లతో తమ కసి అంతా తీర్చుకుంటున్నారు. One of my follower ordered iPhone 13 from Flipkart but he recieved iPhone 14 instead of 13 😂 pic.twitter.com/FDxi0H0szJ — Ashwin Hegde (@DigitalSphereT) October 4, 2022 Even Apple got confused "ki dono same hi hai" https://t.co/V9HAjh2W5a — Raghav Aggarwal (@Raghav_285) October 5, 2022 Can't blame them, they literally are same devices. 😂 https://t.co/1PZGYFoCDZ — Vaibhav Sharma (@TheVaibhavShrma) October 5, 2022 -
ఆపిల్ కి షాకిచ్చిన ఐఫోన్ 14 ప్రో... భారీగా ప్రైస్ డ్రాప్
-
యాపిల్ సంస్థ గుడ్ న్యూస్.. మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్, ధర తగ్గునుందా!
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్లకు విపరీతంగా డిమాండ్ ఉంది. ప్రత్యేకంగా యూత్‌లో ఇఫోన్‌కి ఉన్న క్రేజ్ వేరే. అందులోని ఆపరేటింట్ సిస్టం, సెక్యూరిటీ సర్వీసెస్, ఫీచర్స్ కస్టమర్లను కట్టిపడేశాయి. అందుకే భారీగా ధర ఉన్నప్పటికీ డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఫోన్ కంపెనీ యాపిల్ సంస్థ తాజాగా భారత్‌లో ఐఫోన్ 14 తయారీని ప్రారంభించినట్లు ప్రకటించింది. తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్ కేంద్రంగా ఫాక్స్‌కాన్ సంస్థతో కలిసి యాపిల్ ఈ ఐఫోన్లు ఉత్పత్తి చేపడుతోంది. ఫాక్స్‌కాన్ ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు మాత్రమే కాదు ప్రధాన ఐఫోన్ అసెంబ్లర్ కూడా. అతి త్వరలో మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్ 14 ఇండియన్ మార్కెట్లోకి రాబోతోంది. త్వరలోనే వీటిని మార్కెటలోకి అందుబాటులో ఉంచుతామని సంస్థ తెలిపింది. అయితే దేశీయంగా ఐఫోన్లు తయారీ అవుతున్నాయి కాబట్టి వీటి ధర తగ్గే అవకాశలు ఉండచ్చని ఐఫోన్ ప్రియులు భావిస్తున్నారు. యాపిల్ తన 2022 ఐఫోన్ లైనప్‌ను సెప్టెంబర్ 7న ‘ఫార్ అవుట్’ ఈవెంట్లో ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో iPhone 14, iPhone 14 Pro, iPhone 14 Pro Max తో పాటు సరికొత్త iPhone 14 Plus ఉన్నాయి. ఈ సిరీస్‌లో అదిరిపోయే ఫీచర్లతో రాబోతోంది. ఇందులో మెరుగైన కెమెరా, పవర్ఫుల్ సెన్సార్లు, అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్(SOS) టెక్స్ట్‌లను పంపడానికి శాటిలైట్ మెసేజింగ్ ఫీచర్‌తో వస్తుంది. భారతదేశంలో ఐఫోన్ 14ను తయారు చేస్తున్నందును సంతోషిస్తున్నామని. కొత్త ఐఫోన్ లైనప్ అధునాతన టెక్నాలజీతో పాటు ముఖ్యమైన భద్రతా సామర్థ్యాలు కూడా ఉండనున్నట్లు కంపెనీ పేర్కొంది. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
యాపిల్ నుంచి బిగ్ అప్డేట్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ భారీ కీలక నిర్ణయం తీసుకుంది. లాభాల్ని గడించేందుకు ప్రయత్నిస్తున్న యాపిల్ తన ఐఫోన్ ఇంటర్ ఫేస్‌పై అనవరసరమైన బ్లోట్ వేటర్ అనే థర్డ్ పార్టీ యాప్స్‌ను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పాడ్ కాస్ట్, మ్యాప్స్,న్యూస్,మ్యూజిక్, మెజేస్‌లు యాపిల్ యాప్స్‌తో రానున్నాయి. అవసరం అయితే యూజర్లు వాటిని డిలీట్ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక వెలుగులోకి తెచ్చింది. అంతేకాదు రెవెన్యూ కోసం సీఈవో టిమ్ కుక్ కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నట్లు పేర్కొంది. బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం.. ఐఫోన్లపై కనిపించే యాప్స్‌లో యాపిల్ యాడ్స్‌ను ప్రసారం చేయనుంది. ఇప్పటికే యాపిల్ యాపిల్ స్టోర్, ఇన్ హౌస్ న్యూస్, స్టాక్స్ యాప్‌పై యాడ్స్ ప్లే చేస్తుంది. థర్డ్ పార్టీ డెవలపర్ల సాయంతో ఆ సాఫ్ట్వేర్లను ప్రమోట్ చేస్తున్నట్లు హైలెట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా ఐఫోన్, మాక్స్, ఐపాడ్, యాపిల్ మ్యాప్స్,పాడ్ క్యాస్ట్లపై యాడ్స్‌ను ప్రమోట్ చేయడం, అదే సమయంలో ఎంత వీలైతే అంత ఎక్కువగా యాడ్స్ వ్యాల్యూమ్ను పెంచనున్నట్లు బ్లూమ్ బర్గ్ అనలిస్ట్ మార్గ్ గుర్మాన్ వెల్లడించారు. అయితే ఇతర యాండ్రాయిడ్ యాప్స్‌లాగా ఐఫోన్ స్పామీ నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వదని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ యాడ్-సపోర్టెడ్ సబ్స్క్రిప్షన్ తరహాలో యాపిల్ టీవీ ప్లస్ టైర్లో అదే తరహా యాడ్స్ సపోర్టెడ్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్‌ను అమలు చేయనుంది. -
వర్క్‌ఫ్రం హోంపై యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ఆసక్తికర వ్యాఖ్యలు
కరోనా భయాలు పూర్తిగా తొలగిపోలేదు. ఇంకా కొత్త వేరియంట్లు భయపెడుతూనే ఉన్నాయి. ఉన్నట్టుండి కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కంపెనీలు ఇక వర్క్‌ఫ్రం హోం చాలు ఆఫీసులకు రండి అంటూ తాకీదులు పంపుతున్నాయి. ఈ తరుణంలో ప్రపచంలోనే అతి పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో ఒకటైన యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ఈ అంశంపై స్పందించారు. ప్రయోగాలు చేస్తున్నాం టైమ్ మ్యాగజైన్ నిర్వహించిన ఓ సదస్సులో టిమ్ కుక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,.. వర్క్ ఫ్రం హోం, ఆఫీసు నుంచి పని ఈ రెండు విధానాల విషయంలో యాపిల్ అనేక ప్రయోగాలు చేస్తోందని వివరించారు. ఇంత వరకు ఇలాంటి పరిస్థితిని మనం ఎదుర్కొలేదు. కాబట్టి ఉద్యోగులు, సంస్థలకు మేలు చేసే విధానం ఏంటనేది తెలుసుకోవాలంటూ రకరకాల ప్రయోగాలు చేయకతప్పదని పేర్కొన్నారు. ప్రస్తుతం యాపిల్‌లో వారానికి రెండు రోజుల పాటు వర్క్ ఫ్రం హోంకి అవకాశం కల్పిస్తున్నట్టు టిమ్‌కుక్ తెలిపారు. మెంటల్ హెల్త్ కరోనా సంక్షోభం రావడానికి ముందు అందరికీ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధ ఉండేది. కానీ కరోనా అది మోసుకొచ్చిన అనేక సమస్యలు మెంటర్ హెల్త్ మీద చాలా ప్రభావం చూపించాయి. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే సరిపోదు మెంటల్ హెల్త్ కూడా ముఖ్యమే అనే భావన కలిగించాయి. కాబట్టి మెంటల్ హెల్త్‌కి ఏ పద్దతి మంచిదనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలని కుక్ అన్నారు. ఆఫీస్ వర్క్.. కానీ వ్యక్తిగతంగా తనకు పర్సనల్ రిలేషన్స్ అంటేనే ఎక్కువ ఇష్టమంటూ ఆఫీసుకు వర్క్‌కే ఆయన మొగ్గు చూపారు. అయితే వర్చువల్ వర్క్ అనేది ఆఫీస్ వర్క్ కంటే తక్కువ స్థాయిది ఏమీ కాదని, అదొక భిన్నమైన పని విధానమంటూ చెప్పుకొచ్చారు టిమ్‌కుక్. మొత్తంగా ఆఫీస్ వర్క్ పని విధానమే మేలైనప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా దాన్ని బలవంతంగా అమలు చేయడం సరికాదన్నట్టుగా టిమ్‌కుక్ వ్యాఖ్యలు చేశారు. చదవండి: Crypto Currency: క్రిప్టోలు ‘సముద్ర దొంగల ప్రపంచమే’! -
ఐఫోన్13 పై ఆఫర్ మామూలుగా లేదుగా,నెలకు రూ.760కే..అస్సలు మిస్ చేసుకోవద్దు!
ఐఫోన్ కొనడం కొందరికి అందని ద్రాక్షనే. ఎందుకంటే ఆ ఫోన్ ఖరీదు ఎక్కువ. కాకపోతే ఇతర ఫోన్లతో పోలిస్తే లుకింగ్‌తో పాటు, టెక్నాలజీ పరంగా ఐఫోన్లు చాలా అడ్వాన్స్‌గా ఉంటాయి. అందుకే ఖరీదైనా సరే ఆ ఫోన్లను కొనుగోలు చేసేందుకు యూజర్లు మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్13 పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన వైర్లెస్ నెట్ వర్క్ ఆపరేటర్ (జియో టైప్) వెరిజోన్ ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.నెలకు ఈఎంఐ రూ.760 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. యాపిల్‌కు చెందిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్-13 వరల్డ్ వైడ్‌గా హాట్ కేకుల్లా అమ్ముడవతున్న ఫోన్. తాజాగా ఈ ఫోన్లో యాపిల్ సంస్థ ఏ15 బయోనిక్ చిప్, గ్రీన్ గ్రీన్ ఫినిషెస్ తో డిజైన్ చేసిన ఐఫోన్‌ను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఆ ఫోన్‌ను వెరిజోన్ సంస్థ నెలకు 10డాలర్లు (భారత్ కరెన్సీలో రూ.760) చెల్లించి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. నెలకు 10 డాలర్లు, 36 నెలలు వెరిజోన్ సంస్థ ప్రస్తుతం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. అమెరికన్లు నెలకు 10 డాలర్లను సుమారు 36నెలలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆ ఫోన్ ధర ప్రస్తుత మార్కెట్లో 699డాలర్లు (భారత్ కరెన్సీలో రూ.53,355.79) ఉండగా, ఈ ఆఫర్ దక్కించుకున్న యూజర్లకు 360 డాలర్లు (భారత్ కరెన్సీలో రూ.27,479.38) కే పొందవచ్చు. చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్ -
ఐఫోన్ యూజర్లకు కొత్త సమస్య! యాపిల్‌పై ఆగ్రహం..!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల విడుదల చేసిన ఐఓఎస్ అప్డేట్పై ఐఫోన్ వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫోన్లలో ఈ కొత్త ఐఓఎస్‌ను అప్ డేట్ చేస్తే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే పరిష్కరించాలని యాపిల్‌కు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. మార్చి 14న ఐఫోన్లలో యాపిల్ అట్టహాసంగా ఐఓఎస్ 15.4ను అప్డేట్ విడుదల చేసింది. లేటెస్ట్ ఐఓఎస్ వెర్షన్లో ఫీచర్లు బాగున్నా..పనితీరు బాగాలేదంటూ వినియోగదారులు యాపిల్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త ఐఓఎస్ దెబ్బకు ఐఫోన్ బ్యాటరీ డెడ్ అయ్యిందంటూ ట్వీట్లలో ప్రస్తావిస్తున్నారు. మ్యాగ్జిమ్ షిషాకో అనే ట్విట్టర్ యూజర్ ఐఓఎస్ 'ఐఓఎస్ 15.4 అప్డేట్ తర్వాత నా ఐఫోన్ బ్యాటరీ డెడ్ అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. Since iOS 15.4 released yesterday on March.15 2022, many iPhone users started to notice that their iPhone storage has been increased 2x while some notice that they lost some GB of storage after updating to iOS 15.4 and battery life is also worse #Apple #iOS #iOS154 #iPhone — SaadPlayz (@isaadplayz) March 15, 2022 ఇప్పుడే ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లో ఐఓఎస్ అప్డేట్ చేశా. ఇంతకు ముందు ఛార్జింగ్ పెడితే ఒకటి , లేదా రెండు రోజులు వినియోగించే వాడిని. కానీ ఇప్పుడు ఒక్కరోజు కాదు కదా.. సగం రోజులోనే ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందని మరో యూజర్ తెలిపాడు. ios 15.4 battery drain is absolutely ridiculous. @Apple @AppleSupport Need to fix the issue asap or you’re gonna lose your customers very badly Model: iphone 13 mini Battery health: 100% — Nasarudheen (@Nasaruattu) March 19, 2022 నా ఐఫోన్‌కు ఛార్జింగ్ పెట్టా. 95పర్సంటేజ్, 97పర్సంటేజ్ అని చూపించింది. ఛార్జింగ్ తీసేస్తే 100పర్సెంట్ చూపిస్తుంది. ఐదు నిమిషాల తర్వాత ఆటోమెటిగ్గా ఫోన్ రీస్టార్ట్ అవుతుంది.ఛార్జింగ్ ఎంత పర్సంటేజ్ ఉందో కూడా చూపించడం లేదని మండిపడ్డాడు. ఇలా మైక్రోబ్లాగింగ్‌లో ఐఫోన్ వినియోగదారులు యాపిల్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేస్తుండగా.. ఐఫోన్ యూజర్లకు తలెత్తిన సాంకేతిక సమస్యలపై యాపిల్ సంస్థ ఇంత వరకూ స్పందించలేదు. చదవండి: ఆపిల్ అదిరిపోయే ఫీచర్.. మాస్క్ పెట్టుకున్న ఫేస్ అన్‌లాక్! -
ఉక్రెయిన్ ఎఫెక్ట్.. యాపిల్‌కి తప్పని కష్టాలు.. నష్టాలు..
ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడుల్ని ఖండిస్తూ ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు రష్యాలో కార్యకలాపాల్ని నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సైతం రష్యాలో ఐఫోన్ అమ్మకాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన యాపిల్‌కు తీవ్ర నష్టాల్ని మిగిల్చుతున్నట్లు తెలుస్తోంది రష్యాలో యాపిల్ సేవల్ని నిలిపిస్తున్నట్లు ప్రకటించడంపై లిథువేనియాకు చెందిన ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ బుర్గా స్పందించింది. రష్యాలో యాపిల్ కార్యకలాపాలు ఆగిపోతే.. టెక్ దిగ్గజానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుందనే అంశంపై ఓ అంచనా వేసింది. ఆ అంచనా ప్రకారం.. యాపిల్ సంస్థ రష్యాలో ఐఫోన్ల అమ్మకాల్ని నిలిపివేడయంతో ప్రతీ రోజూ 3 మిలియన్ డాలర్లు, సంవత్సరానికి 1.14 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్లు బుర్గా సంస్థ అంచనా వేసింది. ఇక మిగిలిన స్మార్ట్ ఫోన్ కంపెనీల వాటాల విషయానికొస్తే దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ 34 శాతంతో రష్యాలో అగ్రస్థానంలో ఉండగా, షావోమీ 26 శాతంతో మూడో స్థానంలో, రియల్ మీ 8 శాతం, పోకో 3 శాతం, ఇతర చిన్న బ్రాండ్లు 14 శాతం వాటా కలిగి ఉన్నాయని బుర్గా నివేదిక పేర్కొంది. కాగా, గత కొన్ని సంవత్సరాలుగా రష్యా సాధారణ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల ఆదాయం క్రమంగా పెరుగుతోందని, వాటిని పరిగణనలోకి తీసుకుంటే యాపిల్ ఆదాయం ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. చదవండి: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.50 వేల యాపిల్ ఐఫోన్ రూ.10 వేలకే..! -
సేల్స్ బీభత్సం!! గతేడాది ఎక్కువగా అమ్ముడైన టాప్-10 స్మార్ట్ఫోన్లు ఇవే!
వరల్డ్ వైడ్ స్మార్ ఫోన్ మార్కెట్లో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ సేల్స్ బీభత్సం సృష్టిస్తున్నాయి. గతేడాది ఎక్కువగా కొనుగోలు చేసిన టాప్-10 స్మార్ట్ ఫోన్లలో ఏడు స్థానాల్ని ఐఫోన్లే సొంతం చేసుకున్నాయి. ప్రముఖ రీసెర్చ్ సంస్థ 'కౌంటర్ పాయింట్' తాజాగా గ్లోబల్ టాప్-10 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ -2021 పేరుతో ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం యాపిల్ బ్రాండ్‌కు చెందిన 7 ఐఫోన్లను, యాపిల్ తర్వాత శాంసంగ్ ఒక ఫోన్ , షావోమీ రెండు ఫోన్లను ఎక్కువగా కొనుగులు చేసినట్లు రిపోర్ట్‌లో హైలెట్ చేసింది. ఇక 2021లో ఎక్కువగా అమ్ముడైన టాప్ ఫైవ్ ఐఫోన్లలో ఐఫోన్ 12 ప్రథమ స్థానంలో ఉండగా.. ఆ తర్వాత 41శాతంతో ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13, ఐఫోన్ 12ప్రో, ఐఫోన్ 11 అమ్మకాలు జరిగాయి. క్యూ4లో ఐఫోన్ 12 కంటే అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో ఐఫోన్ 12ప్రో మ్యాక్స్, ఐఫోన్13 ఫోన్లు ముందున్నాయి. ఐఫోన్ 12 ప్రో నాల్గవ స్థానంలో ఉండగా..2019లో విడుదలైన ఐఫోన్ 11తర్వాతి స్థానంలో ఉంది.శాంసంగ్, షోవోమీ మాత్రమే టాప్-10 జాబితాలో నిలవగా శాంసంగ్ గెలాక్సీ ఏ12 ఆరోస్థానంలో ఆ తర్వాత షోవోమీ రెడ్మీ 9ఏ ఏడవ స్థానంలో నిలిచింది. యాపిల్‌కు చెందిన ఐఫోన్ ఎస్ఈ 2020-2021లో అత్యధికంగా అమ్ముడైన పరికరంలో ఎనిమిదో స్థానంలో ఉండగా, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-10 ఫోన్లు మొత్తం గ్లోబల్ అమ్మకాలలో 19శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2020 విలువలతో పోలిస్తే 3 శాతం పాయింట్లు పెరిగాయి. చదవండి: యాపిల్ ఈవెంట్: టెక్ లవర్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కొత్త ప్రొడక్ట్‌లు!! -
యాపిల్ ఈవెంట్: టెక్ లవర్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కొత్త ప్రొడక్ట్‌లు!!
Apple Event 2022: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ టెక్ లవర్స్ సస్పెన్స్‌కు తెరదించింది. మంగళవారం జరిగిన యాపిల్ ఈవెంట్లో తన కొత్త ప్రొడక్ట్‌లను లాంఛ్ చేసింది. యాపిల్ పీక్ పర్ఫామెన్స్ 2022 పేరిట జరిపిన ఈవెంట్లో యాపిల్ నాలుగు కొత్త ప్రొడక్ట్‌లను విడుదల చేసింది. ఇందులో యాపిల్ ఏ15 బయోనిక్ చిప్సెట్తో 5జీ ఐఫోన్ ఎస్ఈ, ఎం1 చిప్‌తో ఐపాడ్ ఎయిర్, హైబ్రిడ్ డివైజ్ పేరుతో డిస్ప్లేతో పనిచేసే మాక్ స్టూడియో డివైజెస్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. యాపిల్ ఐఫోన్13 యాపిల్ ఈవెంట్ సందర్భంగా యాపిల్ ఐఫోన్13 రెండు వేరియంట్ కలర్స్‌ను ప్రకటించింది. అందులో ఐఫోన్13 కోసం గ్రీన్, ఐఫోన్ 13 ప్రో కోసం ఆల్పైన్ గ్రీన్ తో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఏ15 బయోనిక్ చిప్సెట్తో ఐఫోన్ఎస్ఈ యాపిల్ ఈ మెగా ఈవెంట్లో బయోనిక్ చిప్ సెట్‌తో ఐఫోన్ ఎస్ఈ ప్రకటించింది. ఈ సందర్భంగా అన్నీ ధరల్లో ఉన్న అన్నీ స్మార్ట్ ఫోన్ల కంటే ఏ15 బయోనిక్ చిప్ సెట్ చాలా ఫాస్ట్‌గా పనిచేస్తున్నట్లు యాపిల్ పేర్కొంది. కొత్త ఐఫోన్ ఎస్ఈలో గ్రాఫిక్స్ పనితీరు ఇటీవల విడుదలైన ఐఫోన్13 సిరీస్ ఫోన్‌తో సమానంగా పనిచేస్తుందని వెల్లడించింది. ఇక ఈ కొత్త ఐఫోన్ ఎస్ఈ రెడ్, వైట్,బ్లాక్ కలర్స్ వేరియంట్‌తో గాజు, అల్యూమినియం డిజైన్‌ను కలిగి ఉంది. ఐఫోన్13, ఐఫోన్13 ప్రో మాదిరిగానే ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్ట్రాంగ్ గ్లాస్ ఉండగా..స్మార్ట్‌ఫోన్ మునుపటి డిజైన్ల నుండి హోమ్ బటన్‌ను కలిగి ఉందని ఈవెంట్లో స్పష్టం చేసింది. దీంతో పాటు బ్యాటరీ లైఫ్ మెరుగుపడిందని పునరుద్ఘాటించింది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ధర 429 (ఇండియన్ కరెన్సీలో రూ.32,953.21)డాలర్లు. ఐపాడ్ ఎయిర్ యాపిల్ కొత్త ఎం1 చిప్‌తో ఐపాడ్ ఎయిర్‌ను విడుదల చేసింది. తద్వారా యూజర్లు భారీ ప్రొక్రియేట్ ప్రాజెక్ట్‌లను ఈజీగా చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు ట్రెండింగ్‌లో ఉన్న గేమ్స్ ను ఈజీగా ఆడుకోవచ్చని సూచించింది. ఐపాడ్ ఎయిర్‌లోని ఫ్రంట్ కెమెరా సరికొత్త 12ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాతో అప్‌గ్రేడ్ చేసింది. ఇది యాపిల్ సెంటర్ స్టేజ్ టెక్నాలజీకి సపోర్ట్ ఇస్తుంది. 5జీ నెట్ వర్క్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తున్న ఐపాడ్ ఎయిర్ స్మార్ట్ కీబోర్డ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇందులో యాపిల్ సెకండ్ జనరేషన్ పెన్సిల్ తోపాటు కొత్త ఐపాడ్ ఓఎస్ 15ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఐపాడ్ ప్రారంభ ధర 599డాలర్లు( ఇండియన్ కరెన్సీలో రూ.46,025.06గా) ఉంది. మార్చి18నుంచి ఈ ప్రొడక్ట్‌ను ఆన్లైన్లో సేల్కు ఉంచనుంది. ఎం1 ఆల్ట్రా చిప్ యాపిల్ ఎం1 అల్ట్రా అనే చిప్‌ని పరిచయం చేసింది. యాపిల్ ఎం1 మ్యాక్స్ ఇప్పటి వరకు అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్. అయితే తాజాగా యాపిల్ ఎం1 ఆల్ట్రా చిప్ ను తెచ్చింది. ఈ చిప్ పనితీరును మరింత పెంచేందుకు అల్ట్రాఫ్యూజన్ టెక్నాలజీని వినియోగిస్తుంది. ఎం1 అల్ట్రాతో భారీ బ్యాండ్‌విడ్త్, శక్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. ఎం1 చిప్ కంటే ఎనిమిది రెట్లు వేగంగా పని చేస్తుంది. 20-కోర్ సీపీయూ, 64-కోర్ జీపీయూని కలిగి ఉంది. ఎం1 అల్ట్రా 90శాతం తక్కువ శక్తిని ఉపయోగిస్తున్నప్పుడు తోటి 16-కోర్ సీపీయూల కంటే ఎక్కువ శక్తిని అందిస్తుంది. మాక్ స్టూడియో.. మాక్ డిస్ప్లే సాధారణంగా యాపిల్ మాక్ మిని ఫారమ్ ఫ్యాక్టర్‌లో ఎం1 అల్ట్రా పనితీరును ఏకీకృతం చేసింది. ఈ పోర్టబుల్ సీపీయూని స్టూడియో డిస్ప్లేతో ఉపయోగించవచ్చు, మాక్ స్టూడియో కనెక్టివిటీ కోసం బహుళ పోర్ట్‌లతో వస్తుంది. ఇది ఒకే సమయంలో గరిష్టంగా నాలుగు డిస్ప్లేలతో కనెక్ట్ చేయగలదు. మాక్ స్టూడియో పెద్ద ఎం1 చిప్‌లతో వస్తుంది. ఎం1 మ్యాక్స్ తో సహా మాక్ ప్రోని కూడా అధిగమిస్తుంది. అదనంగా ఎం1 అల్ట్రాతో కూడిన మాక్ స్టూడియో 26-కోర్ సీపీయూతో మాక్ ప్రో కంటే 60శాతం కంటే ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ఎం1 మ్యాక్స్ మాక్ స్టూడియో 64జీబీ యూనిఫైడ్ మెమరీతో వస్తుంది. ఎం1 ఆల్ట్రా మ్యాక్స్ స్టూడియో 128జీబీ మెమరీతో వస్తుంది. స్టూడియో డిస్ప్లే అల్యూమినియం ఛాసిస్‌తో కూడిన ఆల్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉంది. స్టూడియో డిస్ప్లే 27-అంగుళాల డిస్ప్లే, 600 నిట్ల వరకు బ్రైట్నెస్,బిలియన్ కంటే ఎక్కువ కలర్స్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది యాపిల్ ట్రూ టోన్‌కు మద్దతు ఇస్తుంది. యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్‌తో వస్తుంది -
ఐఫోన్ లవర్స్ కు బంపరాఫర్!! రూ.15వేలకే 5జీ ఐఫోన్!
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు బంపరాఫర్. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన రూమర్స్ ప్రకారం..మార్చి 8న విడుదల కానున్న ఐఫోన్ ఎస్ఈ ఫోన్ ను రూ.15వేలకే సొంతం చేసుకోవచ్చని తెలుస్తుంది. బ్లూమ్ బెర్గ్ ప్రతినిధి మార్క్ గుర్మాన్.. మార్చి8న జరగాల్సిన ఈవెంట్లో యాపిల్ సంస్థ 5జీ ఐఫోన్ ఎస్ఈ 2020ని లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు. ఐఫోన్ ఎస్ఈ 2020 లాంచ్ సమయంలో ఆ ఫోన్ ధర మనదేశంలో భారతదేశంలో ధర రూ. 42,500గా ఉండనుంది. అయినప్పటికీ ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర ఈకామర్స్ వెబ్ సైట్లో రూ.26,999 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండనుంది. అంతేకాదు ఇతర ఆఫర్ల కింద ఆ ఫోన్ ధర దాదాపు రూ.15,000కే సొంతం చేసుకోవచ్చని గుర్మాన్ పేర్కొన్నారు. లీకైన ధర నిజమైతే యాపిల్ దేశీయంగా గణనీయమైన వృద్ధిని సాధించనుంది. అయితే, వృద్ధి ప్రీమియం విభాగానికి పరిమితం చేయబడింది. ఇప్పటికే యాపిల్ డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో 2.3మిలియన్ యూనిట్లను విక్రయించి...సంవత్సరానికి 34శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్ గణాంకాల ప్రకారం..యాపిల్ మనదేశంలో 5 శాతం కంటే తక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉండగా.. రూ.20,000 లోపు ధర ఐఫోన్ తో కొత్త కొనుగోలు దారులు అట్రాక్ట్ కానున్నారు. -
రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఏమంటారో!!
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న చర్యలపై ప్రపంచ దేశాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. నెటిజన్లు సైతం సోషల్ మీడియా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక హ్యాకర్లు సైతం తమ సొంత దేశమైన రష్యా తీరును విమర్శిస్తూ హ్యాకర్స్ సైబర్ దాడులు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. మెటా పరిధిలోని ఫేస్బుక్లో రష్యన్ మీడియాకు సంబంధించిన అడ్వెర్టైమెంట్లును జ్నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఫేస్‌బుక్‌తో పాటు టెక్ దిగ్గజం యాపిల్ తన కార్యకలాపాల్ని రష్యాలో నిషేధం ఉక్రెయిన్ ఉపాధ్యక్షుడు,డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మంత్రి మైఖైలో ఫెడోరోవ్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కు లేఖ రాశారు. ప్రపంచమంతా ఆంక్షలు విధిస్తూ రష్యా తీరును ఎండగడుతోంది. శత్రువు గణనీయమైన నష్టాలను చవి చూడాలి. అందుకు మీ మద్దతు కావాలి. అందుకే యాప్ స్టోర్‌ను నిషేధించాలని కోరుతున్నామని ట్వీట్లో పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల రష్యన్ ప్రజలు అక్కడి యువత ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దురాక్రమణను అడ్డుకుంటాయని భావిస్తున్నాం. ఈ దాడిని అడ్డుకోవాలని రష్యన్ ప్రజలకు మైఖైలో ఫెడోరోవ్ విజ్ఞప్తి చేశాడు. -
తగ్గేదేలే ఐఫోన్ 14 : యాపిల్ ఎత్తు..శాంసంగ్ చిత్తు?!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ప్రత్యర్ధి శాంసంగ్‌కు చెక్ పెట్టనుంది. ఇటీవల శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ 2022 ఈవెంట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా మూడు స్మార్ట్ఫోన్లను శాంసంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు శాంసంగ్‌కు చెక్ పెట్టేలా యాపిల్ సంస్థ ఐఫోన్ 14ప్రో మోడల్స్‌ను 8 జీబీ ర్యామ్‌తో తీసుకురానున్నట్టు తెలుస్తోంది. యాపిల్ గతేడాది ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లు 6జీబీ ర్యామ్‌తో విడుదల చేసింది. త్వరలో మార్కెట్లో విడుదల కానున్న ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్‌ను 8 జీబీ ర్యామ్‌తో తీసుకొచ్చేందుకు యాపిల్ సంస్థ సన్నాహాలు చేస్తుంది. మాక్ రూమర్స్ రిపోర్ట్ ప్రకారం..యాపిల్ సంస్థ ఈ ఏడాది నాలుగు ఐఫోన్14 మోడళ్లు..ఐఫోన్14, ఐఫోన్14 మ్యాక్స్, ఐఫోన్14ప్రో, ఐఫోన్14 ప్రో మ్యాక్స్‌లను విడుదల చేయనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. మరో కొరియా టెక్ బ్లాగ్ 'yeux1122 పోస్ట్ ప్రకారం..హైటాంగ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ అనలిస్ట్ జెఫ్ పు నుండి వచ్చిన నివేదిక ఆధారంగా ఐఫోన్ 14 ప్రో 6.1 అంగుళాలు, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడల్‌లు 6.7 అంగుళాలు ఉండగా 8జీబీ మెమరీతో అందుబాటులోకి రానున్నాయి. ఇక ఐఫోన్ 14 , ఐఫోన్ 14 మాక్స్ నాన్-ప్రో ఐఫోన్ 14 మోడల్‌లు 8జీబీ కంటే తక్కువ ర్యామ్‌ను కలిగి ఉంటాయని సమాచారం. -
ఐఫోన్ పై అదిరిపోయే ఆఫర్, రూ.23వేల వరకు భారీ డిస్కౌంట్!!
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు బంపరాఫర్. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఫ్లిప్ కార్ట్ సేల్‌లో ఐఫోన్ 12,ఐఫోన్ 12మినీ, ఐఫోన్ ఎస్ తో పాటు పలు మోడళ్ల ఐఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను అందిస్తున్నాయి. ఇక ఐఫోన్-13పై రూ.23వేల భారీ డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఐఫోన్-13 డిస్కౌంట్ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్-13 128జీబీ వేరియంట్ ధర రూ.74,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.84,900, 512జీబీ వేరియంట్ ధర రూ.1,04,900గా ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ సేల్ లో డిస్కౌంట్ తో పాటు కొనుగోలుదారులు తమ పాత ఫోన్ ను ఎక్ఛేంజ్ చేస్తే రూ.18,500 వరకు ఆఫర్ పొందవచ్చు.ఈ ఎక్ఛేంజ్ ఆఫర్లో కొనుగోలు దారులు ఫోన్ పనితీరు, మోడల్ నంబర్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ ఎక్ఛేంజ్ ధరను నిర్ణయిస్తుందని గుర్తుంచుకోవాలి. డిస్కౌంట్,ఎక్ఛేంజ్ ఆఫర్ తర్వాత ఐఫోన్13 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.56400, 128జీబీ ఫోన్ ధర రూ.66400, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.86400కే సొంతం చేసుకోవచ్చు.అంతేకాదు ఫ్లిప్‌కార్ట్,యాక్సిక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లుపై 5శాతం రివార్డ్, నెలకు రూ.2560 ప్రారంభ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తుంది. -
రూ.14వేలకే యాపిల్ ఐఫోన్!! ఇక మీదే ఆలస్యం!
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు భారీ బంపరాఫర్. ఐఫోన్ లవర్స్ కోసం దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఊహించని రీతిలో ఆఫర్లు ప్రకటించింది. 26శాతం డిస్కౌంట్‌తో పాటు ఇతర ఆఫర్ల కింద రూ.14వేలకే ఐఫోన్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. యాపిల్ ఐఫోన్ ప్రపంచంలోని మొబైల్ ప్రియులకు అత్యంత ఇష్టమైన బ్రాండ్. ఈ ఫోన్‌ను ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని ప్రత్యేకత అటువంటిది. ఈ బ్రాండ్ ఫోన్ వాడాలనేది చాలా మంది సామాన్యుల కల. అయినా ఈఫోన్ ధర దిగిరాదు. ఐఫోన్ కు ఉన్న డిమాండ్ కారణంగా ధర తగ్గదు. అయితే ఇప్పుడు అలాంటి యాపిల్ కు చెందిన రూ.39,900 విలువైన ఐఫోన్ ఎస్ఈని కేవలం రూ.14వేలకే అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది ప్లిప్ కార్ట్‌లో భారీ తగ్గిన ఐఫోన్ ధరలు బ్లాక్ కలర్ 64జీబీ యాపిల్ ఐఫోన్ ధర రూ.39,900 ఉండగా ఫ్లిప్‌కార్ట్ 26శాతం డిస్కౌంట్ ఇస్తుంది. దీంతో ఆ ఫోన్ పై మరో రూ.10,601 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.29,990కి తగ్గుతుంది. ఎక్ఛేంజ్ ఆఫర్ ఎక్ఛేంజ్ ఆఫర్ కింద ఫ్లిప్ కార్ట్‌లో ఐఫోన్ ఎస్ ఫోన్ ధర మరింత తగ్గుతుంది. వివిధ మోడల్స్ పై ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ అందిస్తుంది. ఎక్స్చేంజి ఆఫర్ కింద గరిష్టంగా రూ.15,500 తగ్గింపు పొందవచ్చు. దీంతో ఐఫోన్ రూ.13,799కే అందుబాటులోకి వస్తుంది. వీటితో పాటు హాట్ స్టార్ వన్ ఇయర్ చందా కూడా అందిస్తుంది. అయితే ఎక్స్చేంజి ఆఫర్ మీ ఏరియా ఉందో లేదో తెలుసుకునేందుకు పిన్ కోడ్‌ను ఎంటర్ చేసి తెలులుకోవచ్చు. -
ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త, బడ్జెట్ ధరలో మరో కొత్త 5జీ ఐఫోన్! ధర ఎంతంటే?
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త.ఈ ఏడాది మార్చి నెలలో జరిగే ఈవెంట్లో యాపిల్ సంస్థ తక్కువ ధరలో 5జీ ఐఫోన్ ను విడుదల చేయనుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. మార్చి నెలలో జరగనున్న ఈవెంట్లో యాపిల్ సంస్థ బడ్జెట్ ధరలో 5జీ ఐఫోన్ తో పాటు ఐపాడ్, మాక్ కంప్యూటర్ను విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. యాపిల్ గతేడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 13, అక్టోబర్‌లో మాక్ బుక్ ప్రో ల్యాప్ ట్యాప్‌లను విడుదల చేసింది. ఆ తరహాలోనే మరికొద్ది రోజుల్లో జరిగే యాపిల్ ఈవెంట్లో లో బడ్జెట్లో ఐఫోన్, మాక్‌లను విడుదల చేయనున్నట్లు బ్లూమ్ బెర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఐఫోన్ ఎస్ఈ 2022 యాపిల్ సంస్థ తొలిసారి ఐఫోన్ ఎస్ఈ సిరీస్‌ను 2020లో మార్కెట్లో పరిచయం చేసింది. అయితే తాజాగా యాపిల్ ఎస్ఈ సిరీస్ బడ్జెట్ ధరలో 5జీ ఐఫోన్ ను ఐఫోన్ఎస్ఈ 2022 పేరిట వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఫీచర్లు ఐఫోన్ ఎస్ఈ 2022 కొత్త మోడల్ పాత డిజైన్‌తో 4.7 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ,5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేసేలా ప్రాసెసర్ తో విడుదలవుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈఫోన్ ధర విషయానికొస్తే ఐఫోన్ ఎస్ఈ 2022 ధర రూ.30వేలు ఉండగా.. త్వరలో విడుదలయ్యే ఐఫోన్ ఎస్ఈ 2022 ఫోన్ ధర కూడా అదే తరహాలో ఉండనుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
కొన్ని గంటలే ఈ బంపరాఫర్, సగానికి సగం ధరకే ఐఫోన్లు..!! త్వరపడండిలా!
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లు ఐఫోన్ లపై బంపరాఫర్లు ప్రకటించాయి. సగం ధరకే ఐఫోన్లను అందిస్తున్నట్లు తెలిపాయి. దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో యూజర్లను విపరీతంగా ఆకట్టుకున్న ఐఫోన్ 11పై అమెజాన్, ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లకే అందిస్తున్నాయి. అయితే ఇందుకు కొన్ని షరతులకు లోబడి కొనుగోలు దారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 2019లో ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో యాపిల్ సంస్థ ఐఫోన్ 11ను విడుదల చేసింది. విడుదల సమయంలో ఫోన్ ప్రారంభ ధర రూ.64,900 ఉంది. అయితే ఇప్పుడు అదే ఫోన్ రూ.49,900కే అందిస్తుంది. క్యాష్ బ్యాక్, డిస్కౌంట్, ఎక్ఛేంజ్ ఆఫర్లతో ఫోన్ ను రూ.34900 నుంచి రూ.30,900ల లోపే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ అమెజాన్ లో కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ లో రూ.15,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వారి పాత స్మార్ట్‌ఫోన్ విలువ రూ. 15,000 అయితే, అమెజాన్‌లో ఐఫోన్ 11 ధర రూ. 34,900కి తగ్గుతుంది. ఇంకా ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లపై రూ.4,000 తగ్గింపు పొంద వచ్చు. దీంతో అమెజాన్‌లో ఐఫోన్ 11ను రూ.30,900 ధరతో కొనుగోలు చేయోచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో సైతం ఐఫోన్ 11 ధర రూ.49,900 ఉంది. ఇ-కామర్స్ దిగ్గజం పాత స్మార్ట్‌ఫోన్ పై రూ.18,850 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. అంటే మీరు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 31,050 కంటే తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ‘ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్’ క్రెడిట్ కార్డ్ వినియోగంతో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. -
ఐఫోన్‌కు షాక్, సేల్స్ పెరిగిన భారత్‌లో తొలిస్థానం ఆ ఫోన్‌దే!!
భారత్‌లో యాపిల్ ఐఫోన్ సేల్స్ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా గతేడాది క్యూ4 ఫలితాల్లో ఒక్క ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఐఫోన్ 34 శాతం సేల్స్ నమోదయ్యాయి. అయితే ఊహించని విధంగా ఐఫోన్ సేల్స్ జరిగినప్పటకీ.. దేశీయ మార్కెట్లో తొలి ఐదుస్థానాల్లో ఉన్న మిగిలిన స్మార్ట్ ఫోన్లకు సరైన పోటీ ఇవ్వకపోవడం ఆసక్తి కరంగా మారింది కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం..క్యూ4 ఫలితాల్లో భారత్‌లో ఐఫోన్ సేల్స్ షావోమీ, శాంసంగ్, రియల్మీ, వివో, ఒప్పోల స్థానాల్ని అధిగమించలేకపోయింది. అందుకు కారణం ఐఫోన్ ఖరీదు ఎక్కువగా ఉండడటమేనని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇతర ఫోన్ తయారీదారులతో పోలిస్తే మార్కెట్ వాటా పరంగా ఐఫోన్ వెనుకబడి ఉండగా.. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, వాటిలో కొన్ని స్మార్ట్ ఫోన్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించినట్లు కొన్ని గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. భారత్ లో ఐఫోన్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ 2021,4వ త్రైమాసికంలో యాపిల్ సుమారు 2.3 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. శాంసంగ్ 7.2 మిలియన్ ఫోన్లను,షావోమీ మొత్తం 9.3 మిలియన్ యూనిట్ల షిప్ మెంట్‌తో ఆగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇతర ప్రధాన బ్రాండ్లతో పోల్చితే తక్కువ అమ్మకాలు జరిపినప్పటికీ దేశీయంగా క్యూ4 2021లో 2.09 బిలియన్ల ఆదాయాన్ని గడించి ఉండొచ్చని, శాంసంగ్ దాదాపు 2 బిలియన్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. పండుగ సీజన్లో కస్టమర్లు ఐఫోన్ 12, ఐఫోన్ 13 సేల్స్ దూకుడు పెంచాయి. గతేడాది డిసెంబర్ నెలలో ఐఫోన్ 12ను రూ.50వేలకు అమ్మడంతో పాటు ఐఫోన్ 13పై క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించడంతో కొనుగోలుదారులు ఐఫోన్లను సొంతం చేసేందుకు ఇంటస్ట్ర్ చూపించారు. ఈ సందర్భంగా.. గత త్రైమాసికంలో దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్ సేల్స్‌పై కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ హెడ్ నీల్ షా మాట్లాడుతూ..ఈ సేల్స్ తో భారత్ లో ఐఫోన్ మరో మలుపు తిరిగింది. కోవిడ్‌లోనూ భారతీయులు ప్రీమియం ఫోన్లపై డబ్బులు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. టెక్నాలజీతో ముడిపడి ఉన్న ఫోన్లను సొంతం చేసేందుకు కొనుగోలు దారులు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. -
యాపిల్ జంబలకిడిపంబ: మగాడికి కడుపొస్తే..
Apple Brings Pregnant Man Emoji Soon To iPhones: టెక్ ప్రపంచంలో రోజూవారీ పనుల్ని తగ్గించేవెన్నో. అందులో సరదాగా మొదలైన ఎమోజీల వ్యవహారం.. ఇప్పుడు ఛాటింగ్ ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. జస్ట్ ఒక ఎమోజీతో బదులు ఇవ్వడమే కాదు.. పెద్ద పెద్ద ఉద్యమాలు సైతం నడుస్తున్న రోజులివి. కొన్నిసార్లు భావోద్వేగాలను మోతాదులో మించి ప్రదర్శిస్తున్నాయి కాబట్టే అంత ఆదరణ ఉంటోంది ఎమోజీలకు. కానీ, ఎమోజీలతో భావోద్వేగాలతో ఆడుకుంటే మాత్రం జనాలు ఊరుకుంటారా? యాపిల్ కంపెనీ కొత్తగా తీసుకొచ్చిన ‘ప్రెగ్నెంట్ మ్యాన్’ ఎమోజీ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. గురువారం అందించిన ఈ అప్డేట్ సడన్ సర్ప్రైజ్తో పాటు సీరియస్ డిస్కషన్‌కు తెర తీసింది ఈ ఎమోజీ. గర్భంతో ఉన్న మగవాడి ఎమోజీ ద్వారా వివక్షకు తెర తీసిందంటూ కొందరు విమర్శిస్తుండగా.. కొందరేమో ఈ ఎమోజీని సరదా కోణంలో ఆస్వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ లింగ వివక్ష, మాతృత్వాన్ని దెబ్బ తీస్తుందన్న విమర్శల కోణంలో ఈ ఎమోజీపై నెగెటివిటీనే చెలరేగుతోంది సోషల్ మీడియాలో. #Pregnant man, pregnant person emoji coming to Apple iPhones. #Apple and #TimCook are you really that stupid. https://t.co/YA88hM4NiW #Pregnantemoji — Michael Osuna (@mlosuna) January 29, 2022 New Apple 'pregnant man' emoji looks like a regular dude with a beer belly to me and that's what i'm going with. pic.twitter.com/4MDN4xp5Fw — Pineapple on Pizza Speculator (@OnSpeculator) January 29, 2022 People in ancient times didn’t have pregnant men symbols because they had common sense #WokeHorseShit #emojis #pregnantman pic.twitter.com/wnClxh3Hra — Terry McNeely Comedian 🎙 (@Mac72Terry) January 29, 2022 ఐవోఎస్ 15.4 తాజా అప్డేట్తో ఐఫోన్లలో కొత్త ఎమోజీలు వచ్చాయి. ప్రెగ్నెంట్ మ్యాన్‌తో పాటు పెదవి కొరికే ఎమోజీ.. మరో 35 ఎమోజీలను ఐఫోన్ తీసుకొచ్చింది. ప్రస్తుతం బేటా వెర్షన్లో ఉన్న ఈ ఎమోజీలు.. త్వరలో పూర్తిస్థాయిలో వాడుకలోకి రానున్నాయి. Men 👏🏼 cannot 👏🏼 get 👏🏼 pregnant! 👏🏼 Why is this so controversial?? @Apple #PregnantManEmoji #Apple #PregnantMan #Impossible — Conservative Goth Girl 🇺🇸❤️ (@ConservativeGG6) January 29, 2022 Stop attacking womanhood #apple #pregnantman — amornesta (@amornesta1) January 29, 2022 కొత్తేం కాదు.. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ఇదే తరహా ఎమోజీను విడుదల చేసి విమర్శలు ఎదుర్కొంది ఎమోజీపీడియా. దీంతో ఆ ఎమోజీని ట్రాన్స్ మెన్, నాన్-బైనరీ పీపుల్, పొట్టి జుట్టు ఉన్న మహిళల కోసం.. ఉపయోగించొచ్చంటూ తప్పించుకునే వివరణ ఇచ్చుకుంది. అయినా విమర్శలు ఆగలేదు. ‘ఫుల్‌గా తిని కడుపు నిండిన మగవాళ్లు కూడా ఈ ఎమోజీని సరదాగా ఉపయోగించొచ్చు అంటూ ఎమోజీపీడియా జేన్ సోలోమన్ ఇచ్చిన స్టేట్మెంట్పై తిట్లు పడగా.. చివరికి తన మాటలకు క్షమాపణలు చెప్పాడు సోలోమన్. మరి విమర్శల నేపథ్యంలో యాపిల్ వెనక్కి తగ్గుతుందా? ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి మరి!. చదవండి: మాస్క్ ఉన్నా ఫేస్ డిటెక్ట్ చేసి.. లాక్ తీసేస్తది! -
మాస్క్ ఉన్న చల్తా... వారి ఫోన్ ఇట్టే అన్‌లాక్..!
కోవిడ్-19 రాకతో మాస్క్ ప్రతి ఒక్కరికి మస్ట్ అనే విధంగా తయారైంది. సరైన మాస్క్‌ను ధరించడంతోనే కరోనా వైరస్ నుంచి తప్పించుకోవచ్చునని ఇప్పటికే శాస్త్రవేత్తలు, వైద్యులు ఎంతో మంది సూచించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మనలో కొంతమందికి మాస్క్ కొంత చిరాకును కూడా తెచ్చి పెట్టే ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరీను..! ఫేస్ అన్ లాక్ ఫీచర్ కల్గిన స్మార్ట్ఫోన్లలో కచ్చితంగా మాస్క్‌ను తీసే ఫోన్ అన్ లాక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఫోన్ పాస్‌వర్డ్‌ను టైప్ చేసి అన్‌లాక్ చేయాలి. ఫేస్ ఐడి అన్‌లాక్ కల్గిన ఫీచర్ మాత్రం నిరుపయోగంగా మారే పరిస్థితి ఏర్పడింది. అయితే మాస్క్ ఉన్న కూడా ఫోన్ అన్ లాక్ చేసే ఫీచర్‌ను త్వరలోనే యాపిల్ తన యూజర్లకు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ వెర్షన్లో..! యాపిల్ తమ iOS Beta (iOS 15.4) బీటా వెర్షన్లో ఈ కొత్త ఫీచర్ రిలీజ్ చేసింది. దాంతో పాటుగా iPadOS 15.4, macOS 12.3 వెర్షన్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఫేస్ ఐడీ అన్‌లాక్ ఫీచర్‌తో మాస్క్ ధరించిన ఫోన్లను లాక్చేయవచ్చును. ఈ సరికొత్త ఫీచర్ వెంటనే పొందాలంటే ప్రస్తుత ఐవోఎస్ వెర్షన్ నుంచి ఐవోఎస్ 15.4 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది. మాస్క్ ఒక్కటే కాదు..! గతంలో ఐఫోన్లను పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్, యాపిల్ వాచ్‌ను ఉపయోగించి సదరు స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేసేది. లేటెస్ట్ వెర్షన్ సహాయంతో ఇకపై పాస్వర్డ్, యాపిల్ వాచ్ అవసరం లేకుండానే సులభంగా యాపిల్ డివైజ్ అన్ లాక్ చేయవచ్చు. మాస్క్ ధరించి ఉండగానే ఫోన్ అన్ లాక్ అవుతోంది. మాస్కే కాకుండా ఐఫోన్ వినియోగదారులు గ్లాసెస్ ధరించినప్పుడు కూడా ఫేస్ ఐడిని యాక్సెస్ చేయవచ్చు. నాలుగు విభిన్న రకాల గ్లాసెస్‌తో ఐఫోను లాక్ చేసే అవకాశాన్ని యాపిల్ తన యూజర్లకు కల్పించనుంది. 'యూజ్ ఫేస్ ఐడి విత్ ఎ మాస్క్' సెట్టింగ్ సహాయంతో ఈ ఫీచర్‌ను పొందవచ్చును. ఐఫోన్ X , తరువాతి మోడల్‌లలో ఫేస్ ఐడి అందుబాటులో ఉన్నప్పటికీ, ఫేస్ ఐడిని మాస్క్‌తో ఉపయోగించే ఫీచర్ ఐఫోన్ 12 , ఐఫోన్ కొత్త వెర్షన్ ఫోన్లలో మాత్రమే ఈ ఫీచర్ పరిమితం కానుంది. చదవండి: ఐఫోన్లో మరో అదిరిపోయే ఫీచర్..! -
అదిరిపోయే డిస్కౌంట్లు, ఐఫోన్‌పై బంపరాఫర్లు!
దేశంలో ఫెస్టివల్ సీజన్ సందర్భంగా యాపిల్ సంస్థ ఐఫోన్13 పై భారీ ఆఫర్లు ప్రకటించింది. గతేడాది విడుదలైన క్యూ3 ఫలితాల్లో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో రెండో స్థానంలో ఉన్న చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీకి యాపిల్ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఐఫోన్13 విడుదలతో యాపిల్ రెండవ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్13 క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఐఫోన్13పై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు యాపిల్ తెలిపింది. గతేడాది విడుదలైన ఐఫోన్13' 128 జీబీ స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ. 79,900గా ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది. యాపిల్ రీసెల్లర్ ఇండియా ఐ స్టోర్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్.. కోటక్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.6 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అంటే ఈఫోన్ ధర రూ.73,990కి తగ్గింది. కస్టమర్లు పాత స్మార్ట్‌ఫోన్ (ఉదాహరణకు 64జీబీతో ఐఫోన్11) ఉంటే ఎక్స్చేంజ్పై రూ.15,000, దీంతో పాటు ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.3వేలని దక్కించుకోవచ్చు. దీంతోపై ఆఫర్లన్నీ సొంతం చేసుకుంటే రూ. 79,900 ఉన్న ఐఫోన్‌ను రూ.55,900కే కొనుగోలు చేయొచ్చు. చదవండి: ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
యాపిల్: వివాదాస్పద ఐఫోన్ ప్లాంట్ మళ్లీ ఓపెన్
యాపిల్ కంపెనీ సప్లయిర్‌గా ఉన్న ఫాక్స్‌కాన్, తమిళనాడులోని వివాదాస్పద ప్లాంట్‌ను తిరిగి తెరిచేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది. జనవరి 12న ఈ ప్లాంట్‌లో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనుందని స్థానిక ప్రజాప్రతినిధితో పాటు అధికారులు సైతం ప్రకటించడం విశేషం. శ్రీ పెరుంబుదూర్‌లో ఉన్న ఈ ఐఫోన్ అసెంబ్లింగ్ సెంటర్ బయట ఉన్న ఓ వసతి గృహంలో ఆహారం కల్తీ కావడంతో సుమారు 159 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై రోడ్డెక్కిన ఉద్యోగులు భారీ ఎత్తున్న ఆందోళన చేపట్టగా.. ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఫాక్స్‌కాన్‌ను హెచ్చరించినట్లు సమాచారం. అంతేకాదు ప్రమాణాలకు తగ్గట్లు వసతి గృహాలు లేవనే ఆరోపణల్ని సైతం ఒప్పుకుంది. 2021 డిసెంబర్ 18న ఈ ఘటన జరగ్గా.. డిసెంబర్ 30నే తిరిగి ప్లాంట్‌ను తెరవాల్సి ఉంది. అయితే ప్రమాణాలు మెరుగుపర్చడం అనే కారణంతో నిర్ణయాన్ని మరికొంత కాలం వాయిదా వేసింది ఫాక్స్‌కాన్. ఈ లోపు యాజమాన్యాన్ని మార్చడంతో పాటు ఉద్యోగులకు, కార్మికులకు మూతపడిన కాలానికి జీతాలు సైతం చెల్లించింది. ఇదీ చదవండి: ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందా? ‘ప్లాన్-బి’ ఉందిగా! -
బంపరాఫర్..! ఉచితంగా యాపిల్ ఎయిర్ పాడ్స్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ బంపరాఫర్‌ను ప్రకటించింది. యూజర్లకు ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఎయిర్ పాడ్స్‌ను ఫ్రీగా పొందాలంటే యాపిల్ నిబంధనల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. యాపిల్ మార్చి 7,2022 వరకు 'బ్యాక్ టూ యూనివర్సిటీ' ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్ధులు, టీచర్లకు ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా అందిస్తుంది. ఇందుకోసం యూజర్లు మాక్, ఐపాడ్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందనే షరతు విధించింది. ఈ ఆఫర్ యాపిల్ ప్రొడక్ట్ లైన మాక్‌బుక్ ఎయిర్, మాక్ బుక్ ప్రో, ఐమాక్, మాక్ మిని, ఐమాక్ ప్రో, ఐపాడ్ ప్రో, ఐ పాడ్ ఎయిర్‌ను కొనుగోలు చేస్తే యాపిల్‌కు చెందిన సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా పొందవచ్చు. అదే ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా పొందిన యూజర్లు థర్డ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్, ఎయిర్ పాడ్స్ ప్రో కి అప్‌గ్రేడ్ అవ్వొచ్చని తెలిపింది. కాకపోతే న్యూజనరేషన్ ఆడియో ప్రొడక్ట్‌లకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆఫర్ ఏఏ దేశాల్లో ఉందంటే? ప్రస్తుతం మాక్, ఐపాడ్ కొన్న యూజర్లకు యాపిల్ అందిస్తున్న ఈ ఫ్రీ ఆఫర్ ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, బ్రెజిల్, సౌత్ కొరియాతో పాటు భారత్‌లో సైతం అందుబాటులో ఉంది. కానీ యాపిల్ అఫీషియల్ సైట్లో మాత్రం "సేవ్ ఆన్ ఏ న్యూ మాక్ ఆర్ ఐపాడ్ విత్ యాపిల్ ఎడ్యుకేషన్ ప్రైసింగ్" అని చూపిస్తుంది. కాబట్టి డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదనంగా యాపిల్ 'యాపిల్ కేర్ ప్లస్' ప్రొటెక్షన్ ప్లాన్లపై 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. యూజర్లు ముందుగా ఈ ఆఫర్ పొందేందుకు మాక్, ఐపాడ్ ఉత్పత్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఉచితంగా పొందే ఎయిర్ పాడ్స్ అప్డేట్ అవుతాయి. యాపిల్ అధికారిక సైట్ ప్రకారం..ఈ ఆఫర్ ప్రస్తుతం, లేదంటే కొత్తగా ఆమోదించిన యూనివర్సిటీ విద్యార్ధులకు,లెక్చరర్స్‌కు, విద్యార్ధుల తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటుంది. మీరు ముందుగా సైన్ అప్ చేసి unidasyలో నమోదు ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ జరుగుతుందని గుర్తించాలి. చదవండి: సంచలనం..! ఛార్జర్ అవసరంలేదు, ఫోన్‌డిస్‌ప్లేతో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు! -
Blackberry The Fall: ఆ ఆలస్యమే బ్లాక్‌బెర్రీ కొంప ముంచింది
ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ రారాజు. చేతిలో ఆ కంపెనీ ఫోన్ ఉంటే అదో దర్పం. ప్రొఫెషనల్స్‌కి అదొక అవసరం కూడా. ఒకానొక సీజన్లో ఏకంగా ఒక 5 కోట్ల డివైజ్‌లు అమ్ముడు పోయిన చరిత్ర ఉంది. కానీ, అటుపై ఘోరమైన పతనాన్ని చవిచూసింది. అందుకు కారణం ఆలస్యమేనన్న విశ్లేషణ నడుస్తోంది ఇప్పుడు. ‘ఆలస్యం అమృతం విషం’ అంటారు పెద్దలు. రీసెర్చ్ ఇన్ మోషన్(RIM) అలియాస్ బ్లాక్‌బెర్రీ లిమిటెడ్ విషయంలో ఇదే జరిగింది. పోటీతత్వాన్ని తేలికగా తీసుకున్న బ్లాక్‌బెర్రీ.. రాంగ్ స్టెప్పులు వేసింది. నష్టాలను సైతం పట్టించుకోకుండా విలువల పేరుతో ఈ కెనెడియన్ టెలికాం కంపెనీ స్వీయ తప్పిదాలు చేసి పతనం వైపు అడుగు వేసింది. ఇంతకీ బ్లాక్‌బెర్రీ ది రైజ్ అండ్ ది ఫాల్ ఎలా సాగిందో చూద్దాం.. పేజర్లు, హ్యాండ్సెట్ల తయారీతో మొదలైన RIM(బ్లాక్‌బెర్రీ) ప్రస్థానం.. స్మార్ట్‌ఫోన్ రాకతో కొత్త పుంతలు తొక్కింది. పూర్తిగా ఐకానిక్ కీబోర్డుతో పదిహేనేళ్లపాటు కోట్ల మంది యూజర్లను అలరించింది. ఒకానొక టైంలో బ్లాక్‌బెర్రీ.. అమెరికాలో 50 శాతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను, ప్రపంచం మొత్తం మీద 20 శాతం మార్కెట్‌ను శాసించింది. 2011, 2012లో ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి హ్యాండ్సెట్ల అమ్మకాలతో సంచలనం సృష్టించిన బ్లాక్‌బెర్రీకి.. పోటీదారుల ఒరవళ్లతో గడ్డుకాలం మొదలైంది. 2016 నుంచి ఏకంగా ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన బ్లాక్‌బెర్రీ.. తాజాగా సొంత ఓఎస్ ఫోన్లు పని చేయవంటూ ప్రకటించింది. దీంతో కోట్ల ఫోన్లు మూగబోయాయి. ఇంతకీ ఏం జరిగింది? బీజం.. 1984లో మైక్ లాజరడీస్,డౌగ్లస్ ఫ్రాగ్ అనే కెనెడియన్ ఇంజీనీర్లు RIMను ప్రారంభించారు. మొదట్లో ఈ కంపెనీ ఐబీఎంకోసం ఎల్ఈడీ సిస్టమ్, మోడెమ్స్ తో పాటు పేజెస్ వంటి లోకల్ నెట్ వర్కింగ్ కనెక్టివిటీ టెక్నాలజీ డెవలప్ చేసింది. అలాగే ఫిల్మింగ్ ఎడిటింగ్ సిస్టమ్‌ను డిజైన్ చేసింది. అందుకు గాను 1998లో ఆస్కార్ అవార్డ్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 1989లో కెనడియన్ ఫోన్ కంపెనీ అయిన రోజెర్స్ ఫోన్ మెసేజింగ్ కోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన తన మొబైల్ నెట్‌వర్క్‌లో పనిచేసేలా రిమ్(RIM)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా పేజర్ల తయారీ మొదలుపెట్టింది. 1996లో వాటర్లూ(ఒంటారియో) వేదికగా రిమ్ నుంచి పేజర్లు కలర్ ఫీచర్లతో రిలీజ్ అయ్యాయి. ఫోన్ల రాక.. బ్లాక్ బెర్రీ డివైజ్ 850 1999 నుంచి అధికారికంగా రిలీజ్ అయ్యింది. 2000 సంవత్సరంలో ఫిజికల్ బోర్డుతో కూడిన 957 మోడల్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయ్యింది. 2006లో ట్రాక్ బాల్‌ను అమర్చింది. బిజినెస్ ప్రొఫెషనల్స్ కోసం తీసుకొచ్చిన ఫోన్లు.. సాధారణ జనాలకు సైతం కిక్కు ఇచ్చింది. బ్లాక్ బెర్రీ అంటే.. ముందుగా వచ్చిన అడ్వాన్స్డ్ స్మార్ట్‌ఫోన్ అనే ముద్ర పడింది. 2007లో కంపెనీ ఆదాయం అక్షరాల 3 బిలియన్ డాలర్లు దాటేసింది. బ్లాక్‌బెర్రీ సెల్ ఫోన్లు ఒకప్పుడు చాలా ప్రజాదరణ పొందిన వ్యక్తులు వాటిని "క్రాక్బెర్రీస్" అని పిలిచేవారు. కిమ్ కర్దాషియాన్, బరాక్ ఒబామా లాంటి ప్రముఖులు ఈ ఫోన్లనే వాడేవాళ్లు. పెద్ద కీబోర్డు, మధ్యలో ఐబాల్.. కీ సెటప్‌తో ప్రత్యేకంగా ఆకర్షించేవి ఫోన్లు. అందులో నెట్ ఇన్కమ్ 631 మిలియన్ డాలర్లు. ఈ లోపు బ్లాక్‌బెర్రీ స్ఫూర్తితో యాపిల్ ఐఫోన్లను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా స్టీవ్ జాబ్స్ అంగీకరించడం విశేషం. పైగా ఇకపై బ్లాక్‌బెర్రీకి తాము గట్టి పోటీ ఇవ్వబోతున్నామంటూ ఆయన ప్రకటించాడు కూడా. కానీ, బ్లాక్‌బెర్రీ మాత్రం ఏనాడూ యాపిల్‌ను పోటీగా చూడలేదు. అదే కొంప ముంచింది. ఏడాదికో అప్డేట్ లేకపాయే! 2008లో రిలీజ్ అయిన ఫ్లిప్ఫోన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. అయితే ఆ వెంటనే వచ్చిన టచ్ మోడల్ మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. అదే సమయంలో ఐఫోన్ అమ్మకాలు మొదలైనా ఖరీదు ఎక్కువ కావడంతో బ్లాక్‌బెర్రీ హవానే నడిచింది. అలా 2011 వరకు బ్లాక్‌బెర్రీ ఫోన్ల డామినేషన్ కొనసాగింది. అయితే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వస్తున్న మార్పును పసిగట్టడంలో బ్లాక్‌బెర్రీ ఘోరంగా విఫలమైంది. ఐఫోన్లో ప్రతీ ఏడాది ఓ అప్డేట్ రావడం, ఆపై మోటోరోలా అమ్మకాల సంచలనం కొనసాగడంతో బ్లాక్‌బెర్రీ పతనం చిన్నగా మొదలైంది. అదే సమయంలో టార్చ్, ప్లేబుక్ టాబ్లెట్ అంటూ ఇన్నోవేషన్లు చేసిందే తప్ప.. అప్డేట్కి ప్రయత్నించలేదు. దీంతో ఆ తర్వాత వచ్చిన మోడల్స్ ఏవీ పెద్దగా అమ్ముడుపోలేదు. బోర్ కొట్టించాయి. సొంత యాప్ స్టోర్ బ్లాక్‌బెర్రీలో మరో ఫెయిల్యూర్ అంశం. యాపిల్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లా మ్యాజిక్ చేయలేకపోయింది. ఎంత ప్రయత్నించినా.. చిన్న చిన్న ఫీచర్లు తీసుకొచ్చేందుకు బోలెడంత సమయం తీసుకునేది. ఇదంతా యూజర్లకు విసుగు తెప్పించింది. తోటి పోటీదారులు ఫ్రంట్ బ్యాక్ కెమెరాలంటూ అడ్వాన్స్డ్ ఫీచర్లు తెస్తుంటే.. బ్లాక్‌బెర్రీ మాత్రం అక్కడే ఆగిపోయింది. దీంతో పతనం ఉధృతి పెరిగింది. 2009లో 20 శాతానికి పడిపోయిన బ్లాక్‌బెర్రీ మార్కెట్.. మూడేళ్లలో 5 శాతానికి పడిపోయింది. అయితే 2013లో టచ్ మోడల్స్ స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికీ.. అప్పటికే చాలా ఆలస్యమైంది. అదే ఏడాది రిమ్ అధికారికంగా బ్లాక్‌బెర్రీ అనే పేరును ప్రమోట్ చేసుకుంది. కానీ, ఆ వ్యూహం కూడా బెడిసి కొట్టింది. కస్టమర్లు, యూజర్ల పట్ల నిజాయితీగా ఉందనుకునే తప్పా.. పతనాన్ని ఊహించలేదు. 2016 చివరి క్వార్టర్‌కు చేరుకునే సరికి.. 432 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లో అమ్ముడుపోయినవి కొన్నే. దీంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షేర్ సున్నాకు చేరింది. చేతులు మారినా.. 2015 నుంచి బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను నిలిపివేసి.. సొంత ఓఎస్ ప్లేస్‌లో ఆండ్రాయిడ్ భాగస్వామిగా సాగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణలో సంచలనాలకు నెలవైన బ్లాక్‌బెర్రీ లిమిటెడ్.. అనూహ్యంగా ఓనర్షిప్ నుంచి పక్కకు జరిగింది. 2016లో చైనీస్ కన్జూమర్ ఎలక్ట్రిక్ కంపెనీ టీసీఎల్.. బ్లాక్‌బెర్రీని కొనుగోలు చేసింది. బ్లాక్‌బెర్రీ 10, బ్లాక్బెరర్రీ వోఎస్‌లతో పని చేసింది. 1999 నుంచి కెనెడియన్ కంపెనీ బ్లాక్‌బెర్రీ లిమిటెడ్ (RIM) ఆధ్వర్యంలో పని చేసి.. 2016 నుంచి బీబీ మెరాహ్ పుతిహ్(ఇండోనేషియా), ఒప్టిమస్ ఇన్ఫ్రాకమ్(ఇండియా), టీసీఎల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో నడిచింది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీసీఎల్ కార్పొరేషన్ మాత్రమే బ్లాక్‌బెర్రీ డెవలపర్‌గా ఉంది. కస్టమైజ్డ్ ఆప్షన్స్, సెక్యూరిటీ ఫీచర్స్.. ఇలా ఎన్నో.. 2018లో రిలీజ్ అయ్యింది. BlackBerry KeyOne అండ్ Key2 వంటి స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది టీసీఎల్. ఇక జనవరి 4, 2022 తేదీ నుంచి బ్లాక్‌బెర్రీ మోడల్స్ ఫోన్లలో బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను పూర్తిగా నిలిపివేశాయి. కానీ బ్లాక్‌బెర్రీ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. 2021 నుంచి టెక్సాస్‌కు చెందిన స్టార్టప్ ఆన్వార్డ్మొబిలిటీ 5జీ బ్లాక్‌బెర్రీ స్మార్ట్ఫోన్ల లైసెన్స్‌ను చేజిక్కించుకుంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుంచి బ్లాక్‌బెర్రీ ఫోన్లు ఇంకా పూర్తిగా కనుమరుగు కాకపోయి ఉండొచ్చు.. కానీ, క్లాసిక్ టచ్‌తో వచ్చిన ఫోన్లు, ఫీచర్లు, సొంత సాఫ్ట్వేర్ మాత్రం ఇక కనిపించవు. బహుశా.. రాబోయే రోజుల్లో ఆ పేరు కనుమరుగు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే.. బ్లాక్‌బెర్రీ నోస్టాల్జియా కేటగిరీలో చేరిపోవడం ఖాయం. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
చిక్కుల్లో యాపిల్..విచారణకు ఆదేశాలు
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు భారీ షాక్ తగిలింది. భారత్‌లో యాపిల్ అనైతిక బిజినెస్ కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ఆదేశాలు జారీ చేసింది. "టుగెదర్ వుయ్ ఫైట్ సొసైటీ" అనే ఫిర్యాదుదారు ప్రకారం.. యాపిల్ యాప్ స్టోర్‌లో థర్డ్ పార్టీ యాప్ స్టోర్లను అనుమతించరు. అటువంటి సర్వీసులను ఆఫర్ చేయడంకు యాప్ డెవలపర్లతో అగ్రిమెంట్లు చేసుకుంటూ వారిని నిరోధించే ప్రయత్నం చేస్తుందంటూ ఫిర్యాదు దారుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు నేపథ్యంలో సీసీఐ యాపిల్‌పై విచారణ చేపట్టాలంటూ 20పేజీల లేఖను రాసింది. ఆ లేఖలో అగ్రిమెంట్లు ద్వారా యాప్ డిస్ట్రిబ్యూటర్లు, యాప్ స్టోర్ డెవలపర్లు యాప్ మార్కెట్లోకి వెళ్లలేకపోతున్నారని పేర్కొంది. అందుకే సంస్థ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని సీసీఐ ఆదేశాలు జారీ చేసింది. చదవండి: స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో కింగ్..జనవరి నుంచి ఆ స్మార్ట్ ఫోన్ ఇక కనిపించదు! -
నిర్లక్ష్యంగా ఉంటామంటే చూస్తూ ఊరుకోం.. యాపిల్ హెచ్చరిక
న్యూఢిల్లీ: ఉద్యోగులకు ఆహార, వసతి సదుపాయాల్లో లోపాలపై వివాదం నేపథ్యంలో ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌కు చెందిన తమిళనాడు ప్లాంటును ప్రొబేషన్‌లో (పరిశీలన) ఉంచినట్లు టెక్ దిగ్గజం యాపిల్ వెల్లడించింది. కఠినమైన ప్రమాణాలను అమలుపర్చిన తర్వాతే యూనిట్ తిరిగి తెరుచుకునేలా చూస్తామని పేర్కొంది. ‘మా సరఫరాదారులకు పరిశ్రమలోనే అత్యుత్తమ ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇందుకోసం మేము తరచూ వాటి పనితీరును మదింపు చేస్తుంటాం. ఇదే క్రమంలో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్లాంటులో నిర్వహించిన తనిఖీల్లో ఉద్యోగుల డార్మిటరీలు, డైనింగ్ రూమ్‌లు మా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. దీంతో ప్లాంటును ప్రొబేషన్‌లో ఉంచాం. సరఫరాదారు వేగవంతంగా దిద్దుబాటు చర్యలు తీసుకునేలా చూస్తున్నాం‘ అని యాపిల్ ప్రతినిధి తెలిపారు. మరోవైపు, అత్యుత్తమ ప్రమాణాలు పాటించే దిశగా స్థానిక మేనేజ్మెంట్ బృందాన్ని, వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యకలాపాలు పునఃప్రారంభించడానికి పట్టే కాలావధిలో ఉద్యోగులకు యథాప్రకారం వేతనాల చెల్లింపు కొనసాగుతుందని తెలిపింది. ఉద్యోగుల ఆందోళన యాపిల్‌కు ఫాక్స్‌కాన్ ఐఫోన్లను తయారు చేసి అందిస్తోంది. కంపెనీకి శ్రీపెరంబుదూర్‌లో ఉన్న ప్లాంటు ఉద్యోగులకు సంబంధించిన డార్మిటరీలో విషాహార ఉదంతం చోటుచేసుకోవడంతో సిబ్బంది ఇటీవల ఆందోళనలకు దిగారు. దీంతో ప్లాంటు మూతబడింది. ఆహారం, వసతి విషయంలో ఆందోళన వ్యక్తమవడంతో యాపిల్ స్వంతంగా ఆడిటర్లను పంపించి, పరిశీలించింది. ఫాక్స్‌కాన్ దిద్దుబాటు చర్యలతో డిసెంబర్ 30 నాటికి ప్లాంటు తిరిగి తెరుచుకుంటుందనే అంచనాలు నెలకొన్నప్పటికీ.. తాజా పరిణామంతో ఈ విషయంలో మరింత జాప్యం జరగవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. చదవండి:ఒక్కొక్కరికి రూ.కోటిన్నర దాకా బోనస్!.. వలసలను అడ్డుకునేందుకు టెక్ దిగ్గజాల పాట్లు -
ఐఫోన్లలో అదిరిపోయే ఫీచర్, సిమ్‌కార్డ్‌తో పనిలేకుండా..!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారింది. టెక్ మార్కెట్లో ప్రత్యర్ధుల్ని నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. విడుదల చేసే ప్రతి గాడ్జెట్‌లో ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటూనే..మార్కెట్‌ను శాసిస్తుంది. తాజాగా యాపిల్ ఐఫోన్15 సిరీస్‌లో సిమ్ స్లాట్ లేకుండా ఈ-సిమ్(ఎలక్ట్రానిక్ సిమ్)తో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు టెక్ బ్లాగ్లు కథనాల్ని ప్రచురించాయి. యాపిల్ ఐఫోన్ 13సిరీస్ విడుదల నేపథ్యంలో ఐఓఎస్‌ను అప్ డేట్ చేసింది. త్వరలో విడుదల చేయబోయే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లలో నాచ్ డిస్ప్లే కాకుండా సెల్ఫీ కెమెరా, ఫ్రంట్ సెన్సార్లతో హోల్ పంచ్ డిస్ప్లేతో పరిచయం చేయనుంది. ఇక వాటికంటే భిన్నంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌ను సిమ్ స్లాట్ లేకుండా విడుదల చేయనున్నట్లు టెక్ బ్లాగ్లు కథనాల్లో పేర్కొన్నాయి. జీఎస్ఎం అరీనా కథనం ప్రకారం..2023లో విడుదల కానున్న ఐఫోన్ 15 సిరీస్ నుంచి ఫోన్లలో ఫిజకల్ సిమ్ ఉండదని, ఇకపై యాపిల్ విడుదల చేయబోయే ఐఫోన్ సిరీస్‌లన్నీ ఈ-సిమ్‌తో వస్తాయని తెలిపింది. మరికొన్ని నివేదికలు..ఐఫోన్లు డ్యూయల్ ఈ-సిమ్ సపోర్ట్‌తో వస్తాయని, యూజర్లు ఏకకాలంలో రెండు ఈ-సిమ్‌లను వినియోగించుకునే సౌకర్యం ఉన్నట్లు పేర్కొన్నాయి. అయినప్పటికీ, నాన్-ప్రో మోడల్‌లలో పూర్తిగా ఈ-సిమ్ స్లాట్లు ఉంటాయా లేదా ఫిజికల్‌గా సిమ్ కార్డ్‌లను కొనసాగిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా యాపిల్ సిమ్ కార్డ్ స్లాట్ లేకుండా ఐఫోన్‌ను లాంఛ్ చేసినప్పటికీ, ఈ-సిమ్‌లను ఉపయోగించలేని దేశాల్లో ఫిజికల్ సిమ్ స్లాట్ వెర్షన్‌ను అందించే అవకాశం ఉంది. ఈ-సిమ్ అంటే ఏమిటి? ఈ-సిమ్ అనేది ఎలక్ట్రానిక్ సిమ్ కార్డ్. ప్రస్తుతం మనం ఫోన్లలో వినియోగించే ప్లాస్టిక్ సిమ్ కార్డ్‌లా కాకుండా చిప్ తరహాలో ఉంటుంది. ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లలో స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. వాటిలో ఈ-సిమ్‌ను ఇన్సర్ట్ చేయడం చాలా సులభం. అందుకే టెక్ కంపెనీలు ఈ-సిమ్‌ను వినియోగించేందుకు సుమఖత వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా యాపిల్ సైతం ఐఫోన్ 15లో ఈ ఈ-సిమ్‌ను ఇన్సర్ట్ చేయనుంది. చదవండి: షిప్మెంట్లో దుమ్ము లేపుతుంది, షావోమీకి షాకిచ్చిన 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే! -
సంచలన ఆవిష్కరణ: బుల్లెట్లను తట్టుకునే స్మార్ట్‌ఫోన్
Bulletproof iphone 13 series Price And Details: పై హెడ్డింగ్ చదివాక.. సాంకేతికత ఎంతగా వృద్ధి చెందినా.. స్మార్ట్‌ఫోన్ ఉండేది కేవలం వాడుకోవడానికే కదా అనే అనుమానం కలగవచ్చు. కానీ, ఇప్పుడు చెప్పబోయే ఫోన్ అందరికీ అందుబాటులో ఉండేది కాదు. చాలా ప్రత్యేకత సంతరించుకుంది మరి!. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌కి బుల్లెట్ తగిలితే.. దూసుకెళ్లి తునాతునకలు అవుతుంది. కానీ, ఈ ఫోన్లు మాత్రం తీవ్రతను తట్టుకుని చక్కగా పని చేస్తాయి. ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ కంపెనీ ‘కేవియర్’ స్టీల్త్ ఐఫోన్ పేరుతో సిరీస్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. కిందటి ఏడాది ఐఫోన్ 12లో లగ్జరీ మోడల్‌ను తీసుకొచ్చిన కేవియర్.. ఇప్పుడు దానికి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా స్టీల్త్ 2.0 ఐఫోన్ 13 సిరీస్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. బుల్లెట్లను సైతం తట్టుకోగలుగుతుంది. స్టీల్త్ వెర్షన్ 2.0 ఐఫోన్లు.. బీఆర్-2 క్లాస్2కి చెందిన బుల్లెట్‌ప్రూఫ్ కవచంతో తయారు చేయించింది. బుల్లెట్‌ప్రూఫ్ కవచాలతో ఆయుధ వాహనాల్ని, యుద్ధ విమానాల్ని రూపొందించే ఎన్పీవో టీసీఐటీ సహకారంతో కేవియర్ ఈ ఐఫోన్‌ను పైప్యానెల్ను ప్రత్యేకంగా రూపొందించారు. అంతేకాదు పిస్టోల్స్ ఈ ఫోన్లను కాల్చి మరీ డెమోలను చూపించింది కంపెనీ. అదే టైంలో ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దంటూ ప్రజలకు సూచించింది కూడా. సాధారణ ఫోన్లకు గనుక బుల్లెట్ తగిలితే.. అది ఫోన్ పై ప్యానెల్ గుండా ఫోన్ బాడీలోకి చీల్చుకుపోతుంది. ఫోన్‌ను పనికి రాకుండా డ్యామేజ్ చేస్తుంది. కానీ, ఈ ఫోన్ మాత్రం బుల్లెట్ తీవ్రతను తట్టుకుని పైన ప్యానెల్‌ను పగలగొట్టి సరిపెట్టుకుంది. విశేషం ఏంటంటే.. బుల్లెట్ తగిలాక కూడా ఆ ఫోన్ కండిషన్‌తో పని చేయడం. బుల్లెట్‌ప్రూఫ్ ఫోన్లుగా ఇప్పటికే కొన్ని మార్కెట్లో చెలామణి అవుతుండగా.. వాటన్నింటికంటే ఇది స్టాండర్డ్‌గా తేలడం విశేషం. ఇక కేవియర్ ఇలాంటి ఫోన్లను కేవలం 99 యూనిట్లు(పీసులను) మాత్రమే తయారు చేయించింది. ప్రారంభ ధర 6, 370 డాలర్లుగా(మన కరెన్సీలో 4, 86 వేల రూపాయలకు పైనే) ఉంటుంది. గరిష్టంగా ఈ తరహా బుల్లెట్ ఐఫోన్‌ను(ఐఫోన్ ప్రో మ్యాక్స్.. 1 టీబీ స్టోరేజ్) 7, 980 డాలర్లకు అందించనుంది. కాబట్టి, బాగా డబ్బున్నోళ్ల కోసం, సెక్యూరిటీ భయం ఉన్నవాళ్ల కోసం ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు అర్థమవుతోంది కదా!. 2010 నుంచి ఇటాలియన్ నగల వ్యాపారి ఇలియా గియకోమెట్టి ఆధ్వర్యంలో ‘కేవియర్’(1861 నుంచి వ్యాపారంలో ఉంది).. ఫ్లోరెన్స్(ఇటలీ) వేదికగా లగ్జరీ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తోంది. ఐఫోన్, శాంసంగ్‌లతో పాటు పలు రకాల బ్రాండ్లకు విలాసవంతమైన సొగసులు అద్ది(బంగారం, వజ్రాలు ఇతరత్రాలు) లిమిటెడ్ యూనిట్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఓ బ్రాండ్‌గా ముద్రను సంపాదించుకుంది. చదవండి: వారం పాటు బ్యాటరీ వచ్చే స్మార్ట్‌ఫోన్! ఏదంటే.. -
Work From Home: చేసింది చాలు, యాపిల్ కీలక నిర్ణయం..!
Apple Work From Home End Latest Updates: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ వర్క్ ఫ్రమ్ హోమ్ పై కీలక ప్రకటన చేసింది. కరోనా కారణంగా వర్క్ హోమ్ కే పరిమితమైన ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే యాపిల్ వర్క్ ఫ్రమ్ చేస్తున్న ఉద్యోగుల్ని కార్యాలయానికి రావాలని పలుమార్లు మెయిల్స్ పంపింది. కానీ కోవిడ్ వల్ల ఆఫీస్‌లో వర్క్ చేసే విషయాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చింది. తాజాగా యాపిల్ మరోసారి ఉద్యోగులకు డెడ్ లైన్ విధించింది. ఫిబ్రవరి 1 నుంచే ఫిబ్రవరి 1 నుంచి ఉద్యోగులందరూ తిరిగి కార్యాలయాల నుంచి పనిచేయాలని యాపిల్ స్పష్టం చేసింది. అంతకుముందు జనవరి 22 నుంచి ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని కంపెనీ కోరగా తాజాగా దీన్ని ఫిబ్రవరి 1కి పొడిగించారు. తాజా సమాచారం ప్రకారం.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తన ఉద్యోగులకు కొత్త వర్క్ ప్లాన్ గురించి మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. మెయిల్ గురించి వచ్చిన కథనాల ఆధారంగా..ఉద్యోగుల్ని దశలవారీగా ఆఫీస్‌లకు రావాలని టిమ్ కుక్ మెయిల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు వారానికి రెండు రోజులు మాత్రమే ఆఫీస్‌లో పనిచేయాలని సూచించారు. ఈ వర్క్ప్లాన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి1 నుంచి కొనసాగుతుంది. ప్లాన్‌లో భాగంగా ఉద్యోగులు వారానికి కనీసం 3రోజులుమూడు రోజులు సోమవారం,మంగళవారం, గురువారం ఆఫీస్‌కు రావాలని తెలిపారు. బుధవారం,శుక్రవారం ఇంటి నుంచి పనిచేసేందుకు టిమ్ కుక్ అనుమతి ఇచ్చారు. చదవండి: విమాన ప్రమాదం, తండ్రి - కూతురు ప్రాణాలు కాపాడిన ఐపాడ్..! -
యాపిల్ బంపర్ ఆఫర్..! ఇకపై మీఫోన్‌లను మీరే బాగు చేసుకోవచ్చు..!
ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ శుభవార్త చెప్పింది. ఇకపై ఐఫోన్ వినియోగదారులు వారి ఫోన్లను వారే రిపేర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇందుకోసం యాపిల్ సంస్థ సెల్ఫ్ సర్వీస్ స్కీమ్‌ను ప్రారంభించనుంది. యూఎస్, యూకే దేశాల్లో వినియోగదారులు వాషింగ్ మెషిన్,టీవీ, ఫ్రిడ్జ్‌లు, ఫోన్లు ఇలా.. ఏదైనా ఎలక్ట్రిక్ ప్రొడక్ట్‌లు చెడిపోతే సొంతంగా రిపేర్ చేసే అధికారం లేదు. ప్రొడక్ట్ చెడిపోయిందంటే సర్వీస్ సెంటర్‌కు తీసుకొని వెళ్లాల్సిందే. దీంతో వినియోగదారులు పెద్దఎత్తున రైట్-టూ రిపేర్ ఉద్యమం చేశారు. ఈ ఉద్యమంతో దిగొచ్చిన యూకే ఈ ఏడాది జులై నెలలో ఎలక్ట్రిక్ ప్రొడక్ట్‌లు వినియోగదారులు రిపేర్ చేసుకోవచ్చంటూ కొత్త చట్టాన్ని అమలు చేసింది. వారం రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అదే చట్టాన్ని దేశంలో అమలు చేసేలా ప్రణాళికల్ని సిద్ధం చేయాలని ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ftc)కి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 'సెల్ఫ్ సర్వీస్ స్కీమ్'ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 2022లో ప్రారంభం కానున్న ఈ స్కీమ్‌లో భాగంగా యాపిల్ వినియోగదారులు,5వేల మంది యాపిల్ ఆథరైర్డ్ సర్వీస్ ప్రొవైడర్లు, 2,800మంది వినియోగదారులు ఈ స్కీమ్‌లో పాల్గొనవచ్చని యాపిల్ వెల్లడించింది. 'సెల్ఫ్ సర్వీస్ స్కీమ్'తో లాభాలేంటి? యాపిల్ ప్రారంభించనున్న ఈ 'సెల్ఫ్ సర్వీస్ స్కీమ్' వల్ల యాపిల్ ప్రొడక్ట్‌లను రిపేర్ చేయొచ్చు. సొంతంగా ఉపాధిని పొందవచ్చు. యాపిల్ సంస్థకు కొన్ని దేశాల్లో సొంత సర్వీస్ సెంటర్లు లేవు. థర్డ్ పార్టీ సంస్థల నుంచి యాపిల్ ప్రొడక్ట్ అమ్మకాలు, సర్వీసులు జరుగుతాయి. ఈ థర్డ్ పార్టీ సర్వీస్ సెంటలలో ప్రొడక్ట్ రిపేర్ చేయించాలంటే తడిసి మోపెడవుతుంది. అయితే యాపిల్ ప్రొగ్రాంతో సర్వీస్ ఖర్చు తగ్గిపోతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
యాపిల్ లోగోలో ఇంత విషయం ఉందా..! టచ్ చేసి చూడండి..అదిరిపోద్దంతే..!
స్మార్ట్ ఫోన్లలో రారాజు ఐఫోన్. ఫోన్లు ఎన్ని ఉన్నా ఐఫోన్ తర్వాతనే ఏదైనా. అటు ఫీచర్లు, ఇటు సెక్యూరిటీ విషయంలో మిగిలిన ఫోన్ల కంటే ఐఫోన్ చాలా భిన్నంగా ఉంటుంది. అయితే ఇన్ని హంగులున్న ఈ ఐఫోన్ ధర మాత్రం ఎక్కువే. అందుకే ఆ ఫోన్ సామాన్యులకు అందని ద్రాక్షాగా మిగిలిపోయింది. దీనికి తోడు ఆండ్రాయిడ్ వెర్షన్ కంటే యాపిల్ ఐఓఎస్ వెర్షన్ ను ఆపరేట్ చేయడం చాలా కష్టం. ఇప్పటికీ ఆ ఫోన్లను వినియోగించే వారికి ఫోన్లో ఉండే ఫీచర్లు గురించి తెలియదంటే నమ్మశక్యం కాదు, కానీ ఇది వాస్తవం..! అయితే అటువంటి ఐఫోన్లో ఓ సూపర్ ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ ఫోన్ లోపల కాదు. బయటే? అదెలా అంటారా? ఐఫోన్ లోగో యాపిల్ ఐఫోన్లో యూజర్లను ఎట్రాక్ట్ చేసేది లోగోనే. తాజాగా లోగోను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చేసింది యాపిల్ సంస్థ. ఫోన్లపై దిష్టిబొమ్మలాగ ఉండేలోగోలు కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయా అనే అనుమానం రావొచ్చు. యూకేకి చెందిన ప్రముఖ మీడియా 'డైలీ రికార్డ్' కథనం ప్రకారం.. యాపిల్ సంస్థ గతేడాది సెప్టెంబర్ 16న ఐఓఎస్ 14ను అందుబాటులోకి తెచ్చింది. యాక్సిలేటర్ ఆధారంగా పనిచేసేలా ఐఫోన్ 8 నుంచి ఆపై మోడల్స్ అన్నింటిలో బ్యాక్ ట్యాప్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఆ ఫీచర్ ఉన్న ఐఫోన్పైన ఉండే లోగోను రెండు లేదా మూడుసార్లు టచ్ చేస్తే చాలు ఫోన్‌లోపల ఉండే అప్లికేషన్లు డీఫాల్ట్‌గా పనిచేస్తాయని డైలీ రికార్డ్ తన కథనంలో పేర్కొంది. ఐఫోన్లో బ్యాక్ ట్యాప్ ఉపయోగించి ఇంకేం చేయొచ్చో? యాపిల్ లోగోను 'బ్యాక్ ట్యాప్'గా ఉపయోగించడం ద్వారా వాల్యూమ్‌ను తగ్గించడం, పెంచడం, స్క్రీన్షాట్లను తీయడం, హోమ్ స్క్రీన్‌కి వెళ్లడం లేదంటే సెట్టింగ్‌లో మీరు సెలక్ట్ చేసుకున్న యాప్స్‌లలో ఎంటర్ అవ్వొచ్చు. అంతేకాదు మాగ్నిఫైయర్, వాయిస్ ఓవర్, అసెస్టీవ్ టచ్, సిరి షార్ట్‌కట్, రీచబిలిటీ వంటి ఫీచర్లను ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. మీరు ఐఫోన్‌ను వినియోగిస్తుంటే మీరు ఐఫోన్ 8 కానీ, ఆ తర్వాత సిరీస్ ఫోన్లను వినియోగిస్తుంటే ఈ బ్యాక్ ట్యాప్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు ఫోన్లో లేటెస్ట్ ఓస్ వెర్షన్‌ను అప్డేట్ చేసి ఉండాలి. 'బ్యాక్ ట్యాప్' ఫీచర్‌ను వినియోగించడం చాలా సులభం. మీ ఐఫోన్లో సెట్టింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి >> క్లిక్ చేస్తే యాక్సెసిబిలిటీ ఆప్షన్ ఓపెన్ అవుతుంది >> అందులో టచ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి >> క్లిక్ చేస్తే మీరు బ్యాక్ ట్యాప్ ఆప్షన్‌లోకి వెళతారు. చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్ -
యాపిల్‌పై పిడుగు..! ఇప్పట్లో ఐఫోన్ 13లేనట్లే..!
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల విడుదలైన క్యూ3 ఫలితాలతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. యాపిల్ ఎన్నడు లేనంతగా ఐఫోన్ 13తో ఇండియన్ మార్కెట్లో సత్తచాటడంపై తెగ సంబరపడిపోయారు. కానీ ఆ ఆనందం అంతలోనే ఆవిరైంది. చిప్ కొరత కారణంగా ఆ ప్రభావం ఐఫోన్ 13పై పడింది. దీంతో భారత్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఐఫోన్ల కొరత ఏర్పడనుంది. ఈ కొరత యాపిల్ కు భారీ నష్టాన్ని మిగల్చనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల మనదేశంలో స్మార్ట్ ఫోన్ మూడో త్రైమాసిక (జులై,ఆగస్ట్, సెప్టెంబర్) ఫలితాలు విడుదలయ్యాయి. త్రైమాసికంలో ఐఫోన్13 తో యాపిల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా ఐఫోన్13 తో యాపిల్ ఇండియన్ మార్కెట్లో పట్టు సాధించిందని మార్కెట్ వర్గాలు అభివర్ణించాయి. దీంతో ఐఫోన్13ను భారత్‌లో పెద్ద ఎత్తున అమ్ముకాలు ప్రారంభించాలని టిమ్ కుక్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంతులోనే 'డిగిటైమ్స్ ఏషియా' రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం..ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్13 సిరీస్ స్టాక్ లేవని తెలిపింది. ఫిబ్రవరిలోపు వినియోగదారులకు తగినంత ఐఫోన్లను అందించలేదని రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే డిమాండ్‌కు తగ్గట్లు చిప్ ఉత్పత్తులను పెంచితే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి గ్లోబల్‌గా చిప్కొరత డిమాండ్ తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఐఫోన్ 13 పై భారీ ప్రభావం వరల్డ్ వైడ్‌గా టెక్నాలజీ, ఆటోమొబైల్‌తో పాటు ఇతర రంగాలు సెమీకండక్టర్ చిప్‌పై ఆధారపడ్డాయి. గ్లోబల్ చిప్ కొరత కారణంగా సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్13 అమ్మకాలపై ప్రభావం పడింది. ఇప్పుడు ఆ చిప్ కొరత మనదేశంలో డిమాండ్ ఉన్న ఐఫోన్ 13 సిరీస్ లోని ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్ లపై పడిందని డిగిటైమ్స్ ఏషియా వెల్లడించింది. కానీ డిమాండ్‌కు తగ్గట్లు ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు లేవని స్పష్టం చేసింది. యాపిల్ కు భారీ నష్టమే క్యూ3 (త్రైమాసికం)లో చిప్ కొరత కారణంగా యాపిల్ సుమారు 6 బిలియన్ డాలర్లను కోల్పోయింది. దీంతో పాటు చాలా దేశాల్లో ఫెస్టివల్ సీజన్ కారణంగా పెరిగిన సేల్స్‌కు అనుగుణంగా ప్రొడక్ట్‌లు లేకపోవడం, చిప్ కొరత ఏర్పడడం మరో కారణమని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. అదే సమయంలో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల కోసం యాపిల్ ఐపాడ్లతో పాటు మిగిలిన ప్రొడక్ట్‌ల ఉత్పత్తిని తగ్గించింది. ఐఫోన్లకు చిప్‌లను అందించింది. కానీ తాజాగా భారత్‌తో పాటు మిగిలిన దేశాల్లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు తగినంత లేకపోవడం యాపిల్ భారీ ఎత్తున నష్టపోయే అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు చిప్‌లు అందుబాటులో ఉంటేనే నష్టాల్ని నివారించ వచ్చనేది మరికొన్ని రిపోర్ట్లు నివేదికల్లో పేర్కొంటున్నాయి. ఏది ఏమైనా చిప్ కొరత యాపిల్‌కు పెద్ద దెబ్బేనని, ఆటోమోటివ్ రంగంలో మహమ్మారి, పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఏడాది ప్రారంభం నుంచి సెమీకండక్టర్ కొరత ఏర్పడింది. 2023లోపు ఈ సమస్య ఇలాగే కొనసాగుతుందని ఇంటెల్ సీఈఓ పాట్ గెల్సింగర్ అన్నారు. చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్ -
యాపిల్ భారీ మార్పులు, ఐఫోన్-14 ఫీచర్స్ లీక్..మాములుగా లేవుగా!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ ఫీచర్లు లీకయ్యాయి. లీకైన ఫీచర్ల యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటుండగా ఐఫోన్ 14సిరీస్ ఫోన్లలో 48 మెగా పిక్సెల్ ప్రైమరీ షూటర్, న్యూ చిప్ సెట్ తో పాటు 3ఎన్ఎమ్ లేదంటే 4ఎన్ఎమ్ ప్రాసెసర్లు ఉండనున్నాయి. కొత్తగా వస్తున్న ఐఫోన్ 14సిరీస్ నుంచి ఇకపై అన్నీ ఫోన్లకు పోర్ట్ లెస్ డిజైన్‌తో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఐఫోన్ 13 సిరీస్‌తో యూజర్లను ఆకట్టుకున్న యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ విడుదలతో అన్నీదేశాల స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఐఫోన్ 14 ఫీచర్లు ►వచ్చే ఏడాది స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదల కానున్న ఐఫోన్ 14 సిరీస్ ఫీచర్లు యూజర్లను కట్టిపడేస్తున్నాయి.యాపిల్ సంస్థ ఐఫోన్ 13 సిరీస్‌లో ఐఫోన్ మిని, ఐఫోన్ 13, ఐఫోన్ 13ప్రో, ఐఫోన్ 13ప్రో మ్యాక్స్‌లను విడుదల చేసింది. ఐఫోన్ 14సిరీస్‌లో మాత్రం 6.1 అంగుళాలతో ఐఫోన్ 14ప్లస్, 6.7అంగుళాలతో ఐఫోన్ 14మ్యాక్స్ మోడల్స్‌తో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ►ఇక డిజైన్ విషయంలో యాపిల్ సంస్థ ఐఫోన్ 14సిరీస్ లో భారీ మార్పులు చేయనుంది. ఇప్పటికే డిజైన్ల మార్పులపై యాపిల్ ప్రతినిధులు పనిచేస్తున్నారని ప్రముఖ స్మార్ట్ ఫోన్ ఎనలిస్ట్ మార్క్ గుర్మాన్ తెలిపారు. ►మారనున్న డిజైన్లపై ఐఫోన్లను భారీ ఎత్తున అమ్మకాలు జరిపే 'జాన్ ప్రాసెసర్ మాట్లాడుతూ..ఐఫోన్లలో నాచ్ డిజైన్‌ను తొలగించి..ఐఫోన్ 14సిరీస్ నుంచి పంచ్ హోల్ కెమెరా ఉండగా, ప్రోమోడల్స్లో లిమిటెడ్‌గా ఓఎల్ఈడీ ప్యానల్ కింద ఫేస్ ఐడి సెన్సార్లను డిజైన్ చేయనున్నట్లు' తెలిపారు. ► ఐఫోన్ 14లో..ఐఫోన్ 4 డిజైన్లు ఉండనున్నాయి. ముఖ్యంగా ఫోన్ ఫ్లాట్ సైడ్ భాగంలో ఉండే వ్యాల్యూమ్, మ్యూట్ బటన్లు రౌండ్‌గా ఉండనున్నాయి. ఫోన్ వెనక భాగంలో ఫినిషింగ్ గ్లాస్ ఉండగా..సైడ్లు టైటానియంతో తయారు చేసే అవకాశం ఉందని జాన్ ప్రాసెసర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్యానెల్ కెమెరా బంప్ లేకుండా పూర్తిగా ఫ్లాట్‌గా ఉండనుంది. ►లీకైన రిపోర్ట్‌ల ప్రకారం.. ఐఫోన్ 14లో టచ్ ఐడి ఉండనుంది. ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీలో టచ్ ఐడి పవర్ బటన్‌లో డిజైన్‌తో ఉంది. ►ఐఫోన్ 14 సిరీస్ మోడళ్లకు 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, 60హెచ్‌జెడ్ ఎల్టీపీఎస్ ప్యానెల్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఆటో ఫోకస్ ఫీచర్, వెనుక కెమెరా 12మెగాపిక్సెల్ సెన్సార్ నుండి అప్గ్రేడింగ్తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను పొందుతుంది. ►విడుదలయ్యే ఐఫోన్లలో స్టాండడ్ చిప్సెట్లు ఉండనున్నాయి. ఐఫోన్ 13లో 3 ఎన్ఎం చిప్ సెట్లు ఉండగా..ఐఫోన్ 14 చిప్సెట్లు 4 ఎన్ఎంలు ఉండనున్నాయి. ►ఐఫోన్లు పూర్తిగా పోర్ట్‌లెస్ డిజైన్‌కు మారుతాయని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. కానీ ఐఫోన్ 13లో సైతం ఈ పోర్ట్ లెస్ డిజైన్‌తో విడుదల చేయలేదు. అయితే ఐఫోన్14 వైర్‌లెస్‌గా మారే అవకాశం ఉంది. ఐఫోన్ 14 విడుదల, ధర యాపిల్ ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో నిర్వహించే ఈవెంట్లో ఐఫోన్లను విడుదల చేస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 14 యాపిల్ ఐఫోన్ 13 ని విడుదల చేసింది. వచ్చే ఏడాది యాపిల్ ఈవెంట్లో ఐఫోన్ 14సిరీస్ ఫోన్లు విడుదల కానున్నాయి.ఇక ఐఫోన్ 14సిరీస్ 128జీబీ స్టోరేజ్ ఐఫోన్ 13 బేస్ వేరియంట్ రూ.79,990గా ఉండగా ఐఫోన్ 14 ధర కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉందని లీకైన రిపోర్ట్‌ల ఆధారంగా తెలుస్తోంది. చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్ -
దివాళీ బంపర్ ఆఫర్, ఐఫోన్‌పై కళ్లు చెదిరేలా భారీ డిస్కౌంట్లు
మనదేశంలో దసరా, దివాళీ ఫెస్టివల్ సేల్స్ కొనసాగుతున్నాయి. ఈ ఫెస్టివల్ సేల్స్‌లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు భారీ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఊహించని రీతిలో ఐఫోన్ 13 సేల్స్ జరగడంపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సైతం ఆనందంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పనిలో పనిగా భారత్‌లో ఐఫోన్13పై భారీ ఆఫర్లను ప్రకటించారు. యాపిల్ సంస్థ సెప్టెంబర్ 14న ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా ఐఫోన్ 13 ను విడుదల చేసింది. దాని ధర రూ.79,900 ఉంది. తాజాగా ఈ ఫోన్‌పై రూ.14 వేల నుంచి రూ.24వేల వరకు ఆఫర్‌ను ప్రకటించారు. ఐఫోన్ 13ను డిస్కౌంట్, ఎక్ఛేంజ్, క్యాష్‌బ్యాక్ తో రూ.55.900కే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 13పై డిస్కౌంట్ ఐఫోన్ 13పై రూ.24 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ వినియోగదారులు రూ.6 వేల వరకు డిస్కౌంట్‌తో పాటు, 64జీబీ పాత ఐఫోన్ ఎక్స్ఆర్ ఫోన్ పై ఎక్ఛేంజ్ కింద రూ.15వేలు, అదనంగా మరో రూ.3వేలు బోనస్ అందిస్తున్నట్లు యాపిల్ సంస్థ తెలిపింది. సంతోషంలో టిమ్ కుక్ ఇటీవల న్యూజూ గణాంకాల ప్రకారం.. 91.2 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో చైనా తొలిస్థానంలో ఉండగా భారత్ 43.9 కోట్ల మంది యూజర్లతో రెండో స్థానంలో ఉన్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో యాపిల్ సంస్థ బలంగా ఉన్న..భారత్‌లో యాపిల్‌కు చెందిన ఐఫోన్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరిగేవికావు. సేల్స్ పెంచేందుకు టిమ్ కుక్ సైతం భారత్‌పై ఫోకస్ చేశారు. దేశంలో సొంత యాపిల్ స్టోర్లు, మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను ప్రారంభించే పనిలో ఉన్నారు. అదే సమయంలో యాపిల్ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే 'యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్' ను ఈ ఏడాది నిర్వహించింది. అయితే ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా సెప్టెంబర్ 14న నిర్వహించిన ఈవెంట్లో టిమ్‌కుక్ ఐఫోన్ 13ను విడుదల చేశారు. విడుదల తరువాత యాపిల్ ఫోన్ అమ్మకాలు జోరుగా సాగాయి. ఇదే విషయాన్ని టిమ్ కుక్ బహిరంగంగా ప్రకటించారు. పనిలో పనిగా దీపావళి సందర్భంగా ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. చదవండి: అమెజాన్ అదిరిపోయే ఆఫర్, ఐఫోన్ 11పై భారీ డిస్కౌంట్ -
ఆనందంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఉక్కిరి బిక్కిరి..ఎందుకంటే
భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో అమ్ముడవుతున్న అన్నీ ఫోన్లలో కంటే యాపిల్ ఐఫోన్లు చాలా ఖరీదు. ఇదే విషయం ఆ ఫోన్ల అమ్మకాల్లో తేలింది. కానీ ట్రెండ్ మారింది. తాజాగా విడుదలైన క్యూ3 ఫలితాల్లో ఐఫోన్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ అమ్మకాల ఫలితాలతో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటీవల విడుదలైన 2021 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌లో ఐఫోన్ అమ్మకాలు పెరిగాయని, ఈ విషయంలో యాపిల్ సంస్థ అరుదైన ఘనతను సాధించిందని కొనియాడారు. అయితే భారత్‌లో ఐఫోన్ అమ్మకాలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 13 తో దశ తిరిగింది. టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న యాపిల్ సంస్థ ఐఫోన్ 13 విడుదల ముందు వరకు భారత్‌లో గడ్డు పరిస్థితుల్నే ఎదుర్కొంది. ఎందుకంటే మిగిలిన టెక్ కంపెనీలకు చెందిన స్మార్ట్ఫోన్లు,గాడ్జెట్స్ ధరలు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉండేవి. కానీ యాపిల్ విడుదల చేసే ఐఫోన్లలో ఫీచర్లు బాగున్నా ధరలు ఆకాశాన్నంటేవి. అందుకే ఐఫోన్ అమ్మకాలు ఆశాజనకంగా లేవని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐఫోన్ 13 సిరీస్ విడుదలతో భారత్‌లో యాపిల్ ఐఫోన్ అమ్మకాల దశ తిరిగింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఏం తేల్చింది మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ క్యూ3 ఫలితాల్లో యాపిల్ సంస్థ 212 శాతం వార్షిక వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ అని పేర్కొంది. యాపిల్ కంపెనీ ఇప్పుడు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో (రూ. 30,000 కంటే ఎక్కువ ఉన్న ఫోన్లు) 44 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా కొనసాగుతుందని తెలిపింది. అల్ట్రా-ప్రీమియం విభాగంలో 74 శాతం మార్కెట్ వాటాతో (రూ. 45,000 పైన ఉన్న ఫోన్లు) ప్రథమ స్థానంలో ఉందని స్పష్టం చేసింది. అయితే ఇలా సేల్స్ పెరగడానికి యాపిల్ తెచ్చిన ఫీచర్లేనని తెలుస్తోంది. పెద్ద ఐఫోన్ స్క్రీన్లు 2017 నుంచి యాపిల్ సంస్థ ఐఫోన్ల స్క్రీన్ సైజ్‌ను పెంచుతూ వచ్చింది.ఇక తాజాగా స్క్రీన్ సైజ్ పెరిగిన ఫోన్లలో ఐఫోన్ 11,ఐఫోన్ 12, ఐఫోన్ 13 ఫోన్లు ఉన్నాయి. దీంతో పాటు మిగిలిన ఆండ్రాయిడ్ ఫోన్ లతో పోలిస్తే యాపిల్ ఇప్పుడు 6 అంగుళాల డిస్ప్లేతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది. తద్వారా ఐఫోన్ వినియోగదారులు ఈజీగా సినిమాలు, గేమ్స్, నెట్ బ్రౌజింగ్ ఈజీగా చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం యాపిల్ విడుదల చేస్తున్న ఐఫోన్లలో 4.7 అంగుళాల స్క్రీన్ నుండి 6.7 అంగుళాల వరకు ఐఫోన్లను అమ్ముతుంది. ఐఓఎస్ అప్డేట్లు ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్లు చాలా అవసరం. అందుకే అప్డేట్ విషయంలో ఆలస్యం చేసే యాపిల్ సంస్థ గత కొంత కాలంటే సాఫ్ట్వేర్ల విషయంలో అప్డేట్గా ఆలోచిస్తుంది. ఐఫోన్ 13 సిరీస్‌ను ఆవిష్కరించిన కొన్ని రోజుల తర్వాత ఐఓస్ 15 అప్డేట్ చేసింది. 2015లో విడుదలైన ఐఫోన్ 6ఎస్ లో ఓఎస్ అప్డేట్లు చేస్తూ వస్తోంది. ఐఫోన్‌కు మరో అడ్వాంటేజ్ చిప్ సెట్ లు డిస్ప్లే ,సాఫ్ట్వేర్ అప్డేట్లు కాకుండా ఐఫోన్ సేల్స్ పెరగడానికి మరో కారణం చిప్సెట్. యాపిల్ బయోనిక్ చిప్సెట్లను వినియోగిస్తుంది. 2019నుంచి ఈ బయోనిక్ చిప్సెట్ల వినియోగం ప్రారంభమైంది. ఈ బయోనిక్ చిప్ ఉన్న ఐఫోన్ల వినియోగం సులభంగా ఉన్నట్ల ఐఫోన్ లవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజూవారి పనులే కాకుండా గేమింగ్, బ్రౌజింగ్ ఈజీగా చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదే..! -
అమెజాన్‌లో ఐఫోన్ 12 ఆర్డర్ చేశాడు.. పార్సిల్ ఓపెన్ చేస్తే..లబోదిబో!!
ఓ వ్యక్తి అమెజాన్‌లో ఐఫోన్ 12 ఆర్డర్ చేశాడు. ఆర్డర్ ప్యాక్ ఓపెన్ చేసి చూసి సృహతప్పి పడిపోయాడు!! అందులో ఏముందంటే.. కేరళలోని కొచ్చికి చెందిన నూరుల్ అమీన్ అనే వ్యక్తి రూ. 70,900ల ఖరీదైన ఐఫోన్ 12ను అమెజాన్‌లో అక్టోబర్ 12న ఆర్డర్ చేశాడు. అమెజాన్ పే కార్డ్‌తో బిల్ కూడా కట్టేశాడు. అక్టోబర్ 15న ఆర్డర్ ప్యాక్ వచ్చింది. ఉత్సాహంతో తెరిచాడు.. తీరా చూస్తే లోపల అంట్లు తోమే సోప్, 5 రూపాయల కాయిన్ ఉన్నాయట. దీంతో సదరు ఎన్నారై సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చదవండి: Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట! ఐతే నూరుల్ ఆర్డర్ చేసిన ఐఫోన్‌ను అప్పటికే జార్ఖండ్‌కి చెందిన ఓ వ్యక్తి సెప్టెంబర్ నుంచి వినియోగిస్తున్నాడనే విస్తుపోయే వాస్తవం బయటపడింది. దీంతో సైబర్ పోలీసులు అమెజాన్ అధికారులను సంప్రదించగా.. సెప్టెంబర్ 25 నుండి జార్ఖండ్‌లో ఈ ఫోన్ వాడుకలో ఉందని, నూరుల్ నుంచి అక్టోబర్‌లో ఆర్డర్ వచ్చింది కానీ అప్పటికే స్టాక్ అయిపోయిందని, అతను చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వబడుతుందని వెల్లడించారట. తనకెదురైన ఈ వింత సంఘటనను నూరుల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే అది వైరల్ అయ్యింది. ఐఫోన్ బదులుగా ఆకుపచ్చ రంగు విమ్ డిష్ వాష్ సబ్బు, రూ .5 నాణెం కనిపించే ఒక చిత్రం కూడా సోషల్ మీడియా సైట్లలో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులకు బదులు ఇటుకలు, సబ్బులు.. ఆర్డర్ ప్యాకుల్లో రావడం మామూలైపోయింది. సో.. కస్టమర్లు ఆన్లైన్ పర్చేజింగ్తో కాస్త జాగ్రత్త మరి. చదవండి: Mystery Case: 5 యేళ్ల క్రితం హత్యచేశారు.. కానీ.. -
యాపిల్‌కు భారీ షాక్, ఒక్క సెకన్లో ఐఫోన్13 హ్యాక్
గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమిని వెనక్కి నెట్టిన యాపిల్ సంస్థకు భారీ షాక్ తగిలింది. ఇటీవల యాపిల్ విడుదల చేసిన 'ఐఫోన్ -13 ప్రో'ను సెకన్ల వ్యవధిలో 'వైట్ హ్యాట్' హ్యాకర్స్ హ్యాక్ చేశారని చైనాకు చెందిన టెక్ అనాలసిస్ సంస్థ ఐథోమ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. షావోమిని వెనక్కి నెట్టింది.. కానీ గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ ప్రకారం..ఈ ఏడాది క్యూ3 (జులై నుంచి సెప్టెంబర్) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో టెక్ దిగ్గజం యాపిల్ 15 శాతం వాటాతో.. చైనాకు చెందిన షావోమిని అధిగమించింది. తిరిగి రెండో స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. అందుకు కారణం ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌కు విపరీతమైన డిమాండ్ పెరగడమేనని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. యాపిల్ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే 'యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్'ను ఈ ఏడాది నిర్వహించింది. ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా సెప్టెంబర్ 14న నిర్వహించిన ఈవెంట్లో యాపిల్ సంస్థ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. సెక్యూరిటీ విషయంలో తిరుగు లేదు ఈ సందర్భంగా యాపిల్ ప్రతినిధులు మాట్లాడుతూ తాము విడుదల చేసే, లేదంటే విడుదల కానున్న ఐఫోన్లలో ప్రైవసీ,సెక్యూరిటీ విషయంలో రాజీపడబోమని తెలిపారు. కానీ చైనా 'వైట్ హ్యాట్' హ్యాకర్స్ మాత్రం ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లను ఎలా హ్యాక్ చేయొచ్చో..తాజాగా యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 13సిరీస్ ఫోన్లను సెకన్లలో హ్యాక్ చేయొచ్చని తెలిపారు. ఒక్క సెకన్లో హ్యాక్ చేశారు ఇటీవల చైనాలో 4వ 'టియాన్ఫు కప్' ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ కాంటెస్ట్ జరిగింది. ఈ కాంటెస్ట్‌లో వైట్ హ్యాట్ హ్యాకర్ ఐఫోన్ 13 ప్రోని సెకన్లలో హ్యాక్ చేశాడు. హ్యాక్ చేసిన హ్యాకర్ ఐఫోన్లో ఉన్న ఫోటో ఆల్బమ్, యాప్‌లకు యాక్సెస్ చేశాడు. అంతేకాదు అందులో ఉన్న డేటాను ఈజీగా డిలీట్ చేయడం సాధ్యమైందని ఐథోమ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. మరి ఈ ఐఫోన్13 ప్రో హ్యాకింగ్ పై ఐఫోన్ ప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. వైట్ హ్యాట్ హ్యాకర్లు అంటే ఎవరు వైట్ హ్యాట్ హ్యాకర్లు లేదా ఎథికల్ హ్యాకర్స్. ఈ హ్యాకర్స్‌ను ఆయా సంస్థల్లో లేదంటే, టెక్నాలజీలోని లోపాల్ని గుర్తిస్తారు. నిబంధనలకు అనుగుణంగా లోపాల్ని గుర్తించేలా పనిచేసే వీళ్లని ఆయా టెక్ సంస్థలు, లేదంటే ప్రభుత్వాలు సైతం నియమించుకుంటాయి. చదవండి : ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
కస్టమర్‌కి షాకిచ్చిన ఫ్లిప్‌కార్టర్ట్: ఐఫోన్ ఆర్డర్ చేస్తే...
ముంబై: మనం ఆన్లైన్లో ఏదైన ఆర్డర్ చేస్తే మనం ఆర్డర్ చేసింది కాకుండా వేరేది వచ్చి అది కూడా మనం వేలు ఖరీదు చేసే ఆర్డర్‌కి పొంతన లేకుండా కేవలం రూపాయల్లో ఖరీదు చేసే వస్తువు వస్తే మనకి ఎంతో టెన్షన్‌గా అనిపిస్తోంది కదూ. అలాంటి సంఘటనే ఒకటి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో జరిగింది. అసలేం జరిగిందంటే దసరా పండుగ సీజన్ పురస్కరించుకొని అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు బిగ్ బిలయన్ డే సేల్ ప్రారంభించి భారీగా ఆఫర్ల కురిపించిన సంగతి తెలిసిందే. చాలా మంది స్పెషల్ డిస్కౌంట్ సమయాల్లో తమకు కావాల్సిసిన వాటిని ఆర్డర్ చేసుకుంటారు. అలానే సిమ్రాన్ పాల్ సింగ్ అనే వ్యక్తి భారీ డిస్కౌంట్ లభిస్తుండటంతో 50 వేలు ఖరీదు చేసే ఆపిల్ ఐ ఫోన్12 సిరీస్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేశాడు. తన ఐఫోన్ ఎప్పుడూ వస్తుందా అని చాలా ఎగ్జాయిట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నాడు. ఆర్డర్ వచ్చాకా ఎంతో ఉత్సాహంగా ప్యాకెట్‌ని ఒపెన్ చేశాడు. దాంట్లో ఉన్న వాటిని చూసి షాకయ్యాడు. ఎందుకంటే తను ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. ఫ్లిప్‌కార్ట్ నిర్మా సబ్బులు పంపింది. దీంతో ఒకస్కారిగా సింగ్ షాక్‌కి గురైయ్యాడు. వెంటన్ సింగ్ కస్టమర్ కేర్‌కి కంప్లయిట్ చేయడంతో ఫ్లిప్ కార్ట్ తన తప్పుని అంగీకరించి వెంటనే ఆ ఆర్డర్‌ని కేన్సిల్ చేసి డబ్బుని సదరు వ్యక్తి కి వాపస్ చేసింది. అయితే సింగ్ ఈ ఘటనను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ప్రముఖ దిగ్గజ కంపెనీ ఈ విధంగా చేయడం ఏమిటంటూ నెటిజన్లు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏది ఏమైన డెలివరీని కస్టమర్లకు పంపించే ముందు ఒక్కసారి చెక్ చేసి పంపించాలి మరీ ఇలాంటి అత్యంత ఖరీదైన వస్తువుల విషయంలో తగు జాగ్రత్త అవసరం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: భారత స్పేస్ అసోసియేషన్‌ని ప్రారంభించనున్న మోదీ) -
'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్
doctor uses iPhone 13 Pro Max camera for eye treatment. వైద్య చరిత్రలో ఇదో అద్భుతం.అతి సున్నితమైన కంటి చూపును మెరుగు పరిచేందుకు ఓ డాక్టర్ యాపిల్ ఐఫోన్13ను ఉపయోగించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.ఫోన్లో ఉన్న మ్యాక్రోమోడ్ టెక్నాలజీని జోడించి కంటి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్లు సైతం 'డాక్టర్ బాబు'..కార్నియా రాపిడి నయమైందని అంటున్నారు.వినడానికి వింతగా ఉన్న ఇది మెడికల్ మిరాకిల్ అని అంటున్నారు వైద్య నిపుణులు. అమెరికా కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో అనే ప్రాంతానికి చెందిన టామీ కార్న్ టెక్సాస్ సౌత్ వెస్ట్రన్ మెడికల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. అనంతరం 21 సంవత్సరాలుగా కంటి వైద్యుడిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం షార్ప్ మెమోరియల్ ఆస్పత్రిలో ప్రముఖ ఆప్తమాలజిస్ట్‌గా,డిజిటల్ ఇన్నోవేటర్(టెక్నాలజీతో చేసే వైద్యం)గా పనిచేస్తున్నారు. అయితే తాజాగా ఈయన,ఐఫోన్13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రోమోడ్‌ని ఉపయోగించి'ఐ'ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంతేకాదు ఈ టెక్నాలజీ ద్వారా కంటి చూపు ఏ స్థాయిలో ఉందో గుర్తించి ఫోటోల్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఆ ఫోటోల సాయంతో కార్నియా ఆపరేషన్ తరువాత వచ్చే రాపిడి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఇలా సాధారణ ట్రీట్మెంట్తో పరిష్కరించలేని ఎన్నో సున్నితమైన సమస్యల్ని మ్యాక్రోమోడ్ ఫీచర్ తో కంటికి ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో లింక్డిన్లో పోస్ట్ చేశారు. మ్యాక్రోమోడ్ ఫీచర్ అంటే? ప్రొఫెషనల్‌గా ఫోటోలు తీయాలంటే ఫోటోగ్రాఫర్ కావాల్సిన అవసరం లేదు. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. సినిమాటిక్ మోడ్, మ్యాక్రోమోడ్ ఫీచర్ల సాయంతో సాధారణ లొకేషన్లలో అందంగా ఫోటోల్ని క్యాప్చర్ చేయోచ్చు.ఇప్పుడు ఐఫోన్13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రోమోడ్ ఫీచర్‌ను ఉపయోగించే డాక్టర్ టామీ కార్న్ కంటి వైద్యం చేస్తున్నారు. ఫోన్లో ఎన్ని ఫోటో ఫీచర్స్ ఉన్నా..మ్యాక్రోమోడ్ చాలా ప్రత్యేకం. ఉదాహరణకు కంట్లో ఉన్న అతి సూక్ష్మమైన నలుసుని సైతం అడ్వాన్స్డ్ మ్యాక్రోమోడ్ టెక్నాలజీతో హెచ్డీ క్వాలిటీ ఫోటోల్ని తీయొచ్చు. ఐఫోన్13 ప్రో మ్యాక్స్‌తో ట్రీట్మెంట్.. కంటిలో ముందు భాగాన్ని కార్నియా అంటారు. ఇది చాలా పలచగా ఉంటుంది. వెలుతురిని కంటి లోపలి భాగాలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఇటీవల ఓ వ్యక్తి కార్నియా ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ ఆపరేషన్ తరువాత తాత్కాలికంగా కంటి లోపల రాపిడి జరుగుతుంది. ఆ సమస్యను అధిగ మించేలా ఐఫోన్ 13లో ఉన్న మ్యాక్రో మోడ్‌తో కంట్లో కార్నియాను చెక్ చేశారు. అనంతరం ఆ సమస్య గురించి డాక్టర్ టామీకార్న్ పేషెంట్‌ను అడగ్గా..తన కంటి చూపు మెరుగుపడిందని సంతోషంగా చెప్పాడు. ఆ పేషెంట్‌కు అందించిన ట్రీట్మెంట్ విధానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చదవండి: ఎవరబ్బా ఈ వీడియో తీసింది.. ఓ రేంజ్లో ఉంది -
ఎవరబ్బా ఈ వీడియో తీసింది.. ఓ రేంజ్లో ఉంది
అందమైన ఫొటోలు, వీడియోలు తీయాలంటే ప్రొఫెషనల్ కెమెరాపర్సన్ అయ్యి ఉండాలా?. చేతిలో ఫోన్, కెమెరాలు ఉంటే చాలూ తీసేయొచ్చు. కాకపోతే ఈరోజుల్లో సోషల్‌మీడియాలో షేర్ చేయడానికి ‘జస్ట్ వాంట్ టు షూట్ ఏ లిటిల్ వీడియో’ అనుకునే వాళ్లు.. అది కచ్చితంగా అందరూ మాట్లాడుకునేలా ఉండాలని అనుకుంటున్నారు. ఇందుకోసం ‘క్వాలిటీ’ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. అలాంటి వాళ్ల కోసం సినిమాటిక్ మోడ్‌ను అందిస్తోంది ఐఫోన్ 13. పైన మీరు చూస్తున్నది మెక్సికో సిటీలో గత కొంతకాలంగా తీసిన దృశ్యాలు. ఎంత బాగున్నాయో కదా! ఏదో హాలీవుడ్ రేంజ్ వీడియోలాగా అనిపిస్తుందా? కానీ, ఇది తీసింది ఓ ఫోన్‌తో. అదీ ఐఫోన్ 13 ప్రోతో. ఇందులోని సినిమాటిక్ మోడ్ వెర్షన్ ఇప్పుడు యూత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీడియోగ్రాఫర్ జె.మారిసన్, సింగర్ జూలియ వోల్ఫ్(ఫాలింగ్ ఇన్ లవ్ సాంగ్ ఫేమ్) మ్యూజిక్ వీడియోలను స్టూడియోలలో కాకుండా రోడ్ల మీద చిత్రీకరించి శబ్భాష్ అనిపించుకున్నాడు. దీనికి కారణం ఐఫోన్13 సినిమాటిక్ మోడ్ అంటాడు మారిసన్. ‘ఐఫోన్13 ప్రో నా చేతుల్లోకి తీసుకోగానే మొదట నేను ఆసక్తితో పరీక్షించింది సినిమాటిక్ మోడ్. చాలా షార్ప్ అనిపించింది. మీలో టాలెంట్ తక్కువైనా సరే, సాధారణ లొకేషన్స్ అయినా సరే ఖరీదైన లుక్ తీసుకురావచ్చు. కిట్ భారం లేకుండా ట్రావెల్ వీడియోలకు సినిమాటిక్ లుక్ ఇవ్వొచ్చు’ అంటున్నాడు మారిసన్. అడ్వాన్స్డ్ వీడియో రికార్డింగ్ ఫీచర్ ‘సినిమాటిక్ మోడ్’ ఐఫోన్13 నాలుగు మోడల్స్‌లోనూ అందుబాటులో ఉంది. చదవండి: ఐఫోన్-13 ప్రీ-బుకింగ్స్‌లో దుమ్మురేపిన ఇండియన్స్..! సెప్టెంబర్ 14 ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్ ఈవెంట్’ జరిగిన తరువాత యాపిల్ ఐఫోన్13 సిరీస్‌లోని లాంగర్ బ్యాటరీలైఫ్, హైయర్ స్క్రీన్బ్రైట్నెస్, మెరుగైన కెమెరాసిస్టమ్...ఇలా ఆసక్తికరమైన విషయాలు, ఫెంటాస్టిక్ అప్గ్రేడ్ల గురించి మాట్లాడుకోవడం ఎక్కువైంది. వీటిలో యూత్‌ను ఆకట్టుకుంటున్న ఫీచర్... సినిమాటిక్ మోడ్. డిజిటల్ ఫొటోగ్రఫీ శకం మొదలైన తరువాత ఆనాటి ఫిల్మ్కెమెరాలతో సాధ్యమైనవి సాధ్యం చేయడం తోపాటు ‘రీల్’కు అందని సూక్ష్మఅంశాలను కాప్చర్ చేయడం, పరిమితులతో కూడిన విన్యెటింగ్(రిడక్షన్ ఆఫ్ ఇమేజెస్ బ్రైట్నెస్) పరిధిని పెంచడం లాంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ వీడియో ప్రేమికులను ఆకట్టుకునే ఫీచర్లకు ప్రాధ్యానత ఇస్తుంది. తాజా ‘సినిమాటిక్ మోడ్’ హెడ్లైన్ న్యూఫీచర్గా నిలిచింది. ‘సినిమాటిక్ మోడ్’తో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే, ముఖ్యంగా...వీడియో బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేయవచ్చు. ఆటో–ఫోకస్ సెట్ చేసుకోవచ్చు. పోట్రాయిట్ మోడ్ వీడియోలకు, ఫోకస్ పాయింట్లను ఎంపిక చేసుకోవడానికి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ట్రెడిషనల్ వీడియో మోడ్‌తో పోల్చితే ‘స్పెషల్’ మోడ్‌గా చెప్పే దీనిలో రిజల్యూషన్, ఫ్రేమ్‌రేట్ మెరుగ్గా ఉంటుంది. డెప్త్ ఇన్ఫర్మేషన్(సైట్లో ఉండే అబ్జెక్ట్స్కు కెమెరాకు మధ్య ఉండే దూరం)ను రికార్డ్ చేస్తుంది. ఈ సమాచారంతో వీడియో షూట్ చేసిన తరువాత కూడా సీన్లో ఫోకస్‌ను షిఫ్ట్ చేసుకోవచ్చు. మోడ్రన్ డే మూవీస్‌లో ‘డెప్త్ ఆఫ్ ఫీల్డ్’ కీలక పాత్ర పోషిస్తుంది. ‘డెప్త్ ఆఫ్ ఫీల్డ్’ను ఎడిట్ చేసుకోవడానికి ఇక ప్రొఫెషనల్ కెమెరాలు మాత్రమే అవసరం లేదు. మూవీస్‌లో కనిపించే ‘ఐకానిక్ విజువల్ ఎఫెక్ట్’ను సినిమాటిక్మోడ్తో పునఃసృష్టి చేసే ప్రయత్నం చేసింది ఐఫోన్ 13. డాల్బీ విజన్ హెచ్‌డీఆర్‌లో సినిమాటిక్మోడ్ వీడియోలను రికార్డ్ చేస్తుంది. స్థూలంగా చెప్పాలంటే స్టూడియో లు, ప్రొఫెషనల్ లైటింగ్, ఖరీదైన సాంకేతిక పరికరాలు అవసరం లేకుండానే... వీడియోలకు సినిమాటిక్ లుక్ తీసుకు రావచ్చు. చదవండి: Apple iPhone 13 .. యాపిల్ అదిరిపోయే ఆఫర్ -
ఐఫోన్లలో కొత్త సమస్యలా?.. ఇలా చేయండి
iphone iOS 15 Update Bugs: ఐఫోన్ యూజర్లకు కొత్త సమస్య వచ్చిపడింది. ఐవోఎస్ 15 అప్డేట్తో గుడ్‌న్యూస్ అందించిన యాపిల్.. ఆ తర్వాత ఎదురవుతున్న ‘స్టోరేజ్ ఫుల్’ బగ్ విషయంలో మాత్రం త్వరగతిన పరిష్కారం చూపించడం లేదు. యాపిల్ తన ఐఫోన్ యాజర్ల (ఐఫోన్ 6ఎస్ మోడల్ మొదలు తర్వాతి వెర్షన్లు) కోసం ఈ మధ్యే ఐవోఎస్ 15 అప్డేట్ తీసుకొచ్చింది. 2021 సెప్టెంబరు 20 నుంచి ఈ అప్డేట్ని యూజర్లకు అందిస్తోంది. అయితే ఈ అప్డేట్ చేసుకున్న వెంటనే యూజర్లకు ‘ఫోన్ మొమరీ ఫుల్’ అనే పాప్-అప్ చూపిస్తోందట. దీంతో వేల మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక ఈ సమస్యపై కంగారుపడాల్సిన అవసరం లేదని యాపిల్ చెబుతోంది. iPhone storage almost full బగ్ పరిష్కారం కోసం సింపుల్‌గా ఫోన్‌ను రీస్టార్ట్ చేయమని సూచిస్తోంది. కానీ, అలా చేసినా కూడా చాలామందికి సమస్య తీరడం లేదంట. పైగా కొందరికి ఫోన్లో ఉన్న స్పేస్ కంటే.. ఎక్కువ స్టోరేజ్ చూపిస్తోందని చెప్తున్నారు. ఇక ఐఫోన్లతో పాటు ఐప్యాడ్‌లలోనూ ఇదే తరహా సమస్య ఎదురవుతోందట. సమస్య గురించి ప్రస్తావిస్తున్న వాళ్లందరికీ ఓపికగా రిప్లైలు ఇస్తున్న యాపిల్.. సమస్య ఏంటన్నది మాత్రం చెప్పడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ.. ఐవోఎస్ 15 వెర్షన్ అప్డేట్ చేసుకున్న ఐఫోన్లలో ఇన్స్టాగ్రామ్ యాప్ సరిగా పని చేయడం లేదని తెలుస్తోంది. వీడియోలు, స్టోరీల విషయంలో సౌండ్ పని చేయడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు కొందరు. అయితే ఇన్స్టాగ్రామ్ 206.1 వెర్షన్ మాత్రం ఈ బగ్‌ను ఆటోమేటిక్‌గా ఫిక్స్ చేసుకోవడం విశేషం. యాపిల్ సపోర్ట్ కమ్యూనిటీ ఫోరమ్‌లోనూ స్టోరేజ్ బగ్ ఇష్యూ తలెత్తడం కొసమెరుపు. ఇక యాపిల్ యూజర్ల కోసం 14.8 నుంచి ఐవోఎస్ 15 అప్డేట్కి చేరింది. తద్వారా ఫోన్ పనితీరులో మరింత మెరుగు అవుతుందని యాపిల్ పేర్కొంది. ముఖ్యంగా కనెక్టివిటీ, ఫోకస్, ఎక్స్ప్లోర్ విభాగంలో అప్డేట్ బాగా పని చేస్తుందని చెబుతోంది. ప్రస్తుతం బగ్ ఫిక్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు యాపిల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కానీ, ఎంత టైం పడుతుందనేది చెప్పలేదు. చదవండి: యాపిల్ అదిరిపోయే ఆఫర్, ఐఫోన్ 13పై రూ.46వేల వరకు.. -
యాపిల్ అదిరిపోయే ఆఫర్, ఐఫోన్ 13పై రూ.46వేల వరకు..
ఐఫోన్ లవర్స్‌కు టెక్ దిగ్గజం యాపిల్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ కొనుగోలుదారులకు రూ.46 వేల వరకు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ ఆఫర్‌ను దక్కించుకోవాలంటే ఐఫోన్ 13 లవర్స్ 'ట్రేడ్ ఇన్ ఆఫర్'లో పాల్గొనాల్సి ఉంటుంది. ఎక్సేంజ్ ఆఫర్లు ఎలా ఉన్నాయి ట్రేడ్ ఇన్ ఆఫర్లో ఐఫోన్ 12ప్రో మ్యాక్స్ ఎక్ఛేంజ్‌లో రూ.46,120 వరకు, ఐఫోన్ 12 ప్రో పై రూ.43,255, బేసిక్ ఐఫోన్ 12పై రూ.31,120, ఐఫోన్ 12 మినీ పై రూ.25,565, ఆండ్రాయిడ్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఫోన్ పై రూ.13,085వరకు సొంతం చేసుకోవచ్చు. ట్రేడ్ ఇన్ ఆఫర్లో ఎలా పాల్గొనాలి యాపిల్ ఆన్లైన్ షాప్ ద్వారా ఐఫోన్13 ఫోన్ బుక్ చేసుకునే ముందు.. కొనుగోలు దారులు ట్రేడ్ ఇన్ ఆఫర్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆన్ లైన్లో జరిగే ట్రేడ్ ఇన్ ఆఫర్లో యాపిల్ సంస్థ మీ పాత ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. మీరు ఇచ్చిన సమాధానాల ఆధారంగా మీకు ఐఫోన్ 13 ఫోన్‌కు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను ప్రకటిస్తుంది. మీరు కరెక్ట్‌గా సమాధానం చెప్పి ఐఫోన్ 13 ఫోన్ ను బుక్ చేసుకోవచ్చు. అనంతరం ఆన్లైన్లో మీకు ఐఫోన్ 13ఫోన్ డెలివరీ టైం, డేట్ చూపిస్తుంది. ఆ టైం కు ఐఫోన్ ప్రతినిధులు ఐఫోన్ 13 ఫోన్‌ను మీరు ఇచ్చిన అడ్రస్‌కు డెలివరీ చేస్తారు. ఎక్ఛేంజ్ ఆఫర్లో ఐఫోన్ 13ను తీసుకోవాలి ఐఫోన్ 13 డెలివరీ టైంకు ట్రేడ్ ఇన్ ఆప్షన్లో ఇచ్చిన అడ్రస్‌కు ఆపిల్ ప్రతినిధులు వస్తారు. వచ్చే ముందు మీరు ఏ ఫోన్ పై ట్రేడ్ ఇన్ ఆప్షన్ నిర్వహించారో ఆ ఫోన్లను సిద్ధం చేసుకోవాలి. ప్రతినిధులు మీ అడ్రస్‌కు వచ్చిన వెంటనే మీ పాత ఐఫోన్ 12 సిరీస్ ఫోన్, ఆండ్రాయిండ్ ఫోన్లను వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్లు మీరు ట్రేడ్ ఇన్ ఆప్షన్ లో మీరు మీఫోన్ గురించి చెప్పినట్లుగా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. అనంతరం మీరు చెప్పింది నిజమే అయితే ఆన్లైన్ లో అప్రూవల్ ఇస్తారు. ఐఫోన్ 13ను మీకు ఆఫర్ ప్రైస్‌కే అందిస్తారు. చదవండి: ఐఫోన్-14 ఫీచర్స్ లీక్.. మాములుగా లేవుగా! -
ఐఫోన్-14 ఫీచర్స్ లీక్..మాములుగా లేవుగా!
గత వారం యాపిల్ దిగ్గజం విడుదల చేసిన ఐఫోన్ 13 సిరీస్ మోడల్ ఫోన్ అమ్మకాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి.దీంతో ఐఫోన్ 14సిరీస్ గురించి చర్చ మొదలైంది.ఐఫోన్ 14మోడల్ ఫోన్లు ఎప్పుడు విడుదలవుతాయి.వాటి ధరలు ఎలా ఉంటాయి. ఏఏ ఫీచర్లు ఉండనున్నాయి. అనే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ఫీచర్స్ చైనాలో యాపిల్ ఐఫోన్ అమ్మకాలు జరిపే సంస్థల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఆ దేశానికి చెందిన టెక్నాలజీ బ్లాగ్ 'గిజ్చైనా' కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..2022లో ఐఫోన్ 14 సిరీస్ మోడల్ ఫోన్లు కనీసం మూడు మోడల్ ఫోన్లను యాపిల్ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది విడుదల కావాల్సిన యాపిల్ 14సిరీస్‌లోని ఓ మోడల్ ఫోన్ 120హెచ్‌జెడ్ డిస్ప్లే, మరో ఫోన్ 60హెచ్‌జెడ్ ఎల్‌టిపిఎస్ ఓఎల్ఇడి డిస్ప్లేతో రానుంది. ఇదే నిజమైతే ఐఫోన్ 14 సిరీస్ బేసిక్ ఫోన్ ఐఫోన్ 14 మినీ 60హెచ్ స్క్రీన్‌తో విడుదల కానుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఐఫోన్ 13 ధరల కంటే ఐఫోన్ 14సిరీస్ ఫోన్ తక్కువ ధరకే లభ్యం కానుంది. ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ విడుదల ఎప్పుడంటే ? యాపిల్ సంస్థ ఐఫోన్ 14మోడల్ ఫోన్లను 2022లో విడుదల చేస్తుందని చైనా టెక్ బ్లాగ్ తన కథనంలో పేర్కొంది. అయితే 2022లో ఐఫోన్ 14 సిరీస్‌తో వచ్చే ఫీచర్లు గురించి ఇప్పుడే కాదు. గతంలో సైతం విడుదలైన నివేదికల్లో ఐఫోన్ 14 మాక్స్ విడుదల చేసినా ఐఫోన్ 14 మినీని విడుదల చేయకపోవచ్చనే నివేదికలు సూచించాయి. అది అయిపోతే, ఐఫోన్ 14 ,ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మాక్స్,ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడళ్లతో విడుదల కానుంది. ఐఫోన్ 14 మోడల్స్ ఆపిల్ ఏ16 చిప్సెట్,ప్రొటెక్ట్ కోసం ఫేస్ఐడీ, టచ్ ఐడి ఫీచర్లతో ఐఫోన్ 14 విడుదల కానుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుండగా..ఐఫోన్ 14ఫోన్ మోడళ్ల ఎల్టీపీఓ (A low-temperature polycrystalline oxide (LTPO) display ) డిస్ ప్లే తయారీ కోసం ఎల్జీ యాపిల్‌తో చేతులు కలపనుంది. చదవండి: ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
ఐఫోన్ 13.. భారత్‌లో మరీ అంత రేట్లా?
Iphone 13 Series Price In India: 'కాలిఫోర్నియా స్ట్రీమింగ్' వర్చువల్ లాంచ్ ఈవెంట్లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు అట్టహాసంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ సందర్భంగా భారత్‌లో ఐఫోన్ 12 సిరీస్ ధరలకే.. ఐఫోన్ 13 మోడల్స్‌ను విక్రయిస్తామని యాపిల్ సంస్థ ప్రకటించింది కూడా. కానీ పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. కొనుగోలుదారులు ఐఫోన్ 13సిరీస్ మోడల్ని బట్టి భారీ ఎత్తున ట్యాక్స్ పే చేయాల్సి రానుంది. ఈ సిరీస్‌లోని ఒక్కో ఫోన్‌కు మినిమమ్ ఇరవై వేల రూపాయల నుంచి గరిష్టంగా రూ.40,034 వరకు పన్నులు చెల్లించాల్సి వస్తుందనేది ఇప్పుడు అంచనా. సెప్టెంబర్ 24 నుంచి ఐఫోన్13 అమ్మకాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో బేసిక్ మోడల్ ఫోన్‌ను భారత్‌లో కొనుగోలు చేస్తే రూ.79,900 చెల్లించాల్సి ఉండగా.. అమెరికాలో రూ.51,310కే సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దేశాల మధ్య ధరల వ్యత్యాసం భారీగా ఉండడంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తయారీ యూనిట్లు లేవు భారత్‌లో యాపిల్ ఫోన్లు అమ్మకాలు థర్డ్ పార్టీ స్టోర్ల ఆధారంగా అమ్మకాలు కొనసాగిస్తున్నాయి. దిగుమతుల వల్ల పన్నులూ అదే స్థాయిలో విధించాల్సి వస్తోంది. ఇప్పుడు ఇదే అంశం భారత్‌లో ఐఫోన్ ధరలు భారీగా ఉండటానికి కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా నుంచి భారత్ కు వచ్చే ఐఫోన్ 13(మిని) సిరీస్ ఫోన్‌పై కొనుగోలు దారులు కస్టమ్ డ్యూటీ 22.5శాతం కింద రూ.10,880 చెల్లించాల్సి ఉంది. కస్టమ్ డ్యూటీతో పాటు జీఎస్టీ రూ.10,662గా ఉంది. ఏ ఫోన్‌కు ఎంత ట్యాక్స్ అంటే.. భారత్ లో ఐఫోన్ 13 సిరీస్ మోడల్‌ను బట్టి ట్యాక్స్ పేచేయాల్సి ఉంటుంది. ఐఫోన్ ప్రో మ్యాక్స్ పై రూ.40,034, ఐఫోన్ 13 మినీలో 21,543, ఐఫోన్ 13 పై 24,625, ఐఫోన్ 13 ప్రోపై రూ. 36,952 ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుందని లెక్కలేస్తున్నారు. -
3,500 స్టోర్లు, ఇండియాలో భారీ ఎత్తున ఐఫోన్ 13 అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యాపిల్ ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్ దేశవ్యాప్తంగా 3,500 ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని రెడింగ్టన్ ప్రకటించింది. అలాగే వినియోగదార్లకు క్యాష్ బ్యాక్ అందించేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. ఐఫోన్ 13, 13 మినీ, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్ మోడళ్లను కంపెనీ ఇటీవల ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. భారత్‌తోసహా 30 కిపైగా దేశాల్లో శుశ్రవారం (సెప్టెంబర్ 17) నుంచి ప్రీ–ఆర్డర్స్ ప్రారంభం అయ్యాయి. ముందస్తుగా బుక్ చేసుకున్న వినియోగదార్లకు ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు కోసం సమయాన్ని నిర్ధేశిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ 24 నుంచి స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లో తళుక్కుమంటాయి. ధరల శ్రేణి మోడల్‌నుబట్టి రూ.69,900 నుంచి రూ.1,79,900 వరకు ఉంది. చదవండి: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్ : తగ్గిన ధరలు -
24 నుంచి ఐఫోన్ 13 విక్రయాలు
న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు ఈ నెల 24 నుంచి భారత మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. అమెరికా, జపాన్ తదితర చాలా దేశాల్లో అదే రోజు నుంచి విక్రయాలను మొదలవుతాయని తెలిపింది. యాపిల్ ఇండియా వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ఆధారంగా.. ఐఫోన్ 13 మినీ ధరలను రూ.69,900 నుంచి 99,900 మధ్య నిర్ణయించింది. ఐఫోన్ 13 ధరలు రూ.79,900–1,09,900.. ఐఫోన్ 13 ప్రో ధరలు రూ.1,19,900–169,900, ఐఫోన్ 13 ప్రోమ్యాక్స్ ధరలు రూ.1,29,900–179,900 మధ్య ఉండనున్నాయి. ఇందులో ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌ను 5జీ సపోర్ట్‌తో, మరిన్ని బ్యాండ్లతో యాపిల్ తీసుకొచ్చింది. అదే విధంగా కొత్త ఐప్యాడ్ (9వ జనరేషన్) ధర రూ.30,900 నుంచి.. ఐప్యాడ్ మినీ ధర రూ.46,900 నుంచి ఆరంభమవుతుంది. ప్రీమియం ఫోన్ల జోరు.. కౌంటర్‌పాయింట్ అంచనాల ప్రకారం.. భారత్‌లో ప్రీమియం (ఖరీదైన) స్మార్ట్ఫోన్ల మార్కెట్ జూన్‌లో 122 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ప్రీమియం ఫోన్ల వాటా 7 శాతంగా ఉంది. దేశీ ప్రీమియం మార్కెట్లో వన్‌ప్లస్ 34 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంటే, యాపిల్ 25 శాతం వాటాతో రెండో స్థానంలోను, శామ్సంగ్ 13 శాతం వాటాతో మూడో స్థానంలో, వివో 12%, షావోమీ 7% వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
ఐ ఫోన్ 13 వచ్చేసింది! దమ్ మారో దమ్
-
యాపిల్ మెగా ఈవెంట్.. విడుదలైన ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ ఫోటోలు
-
ఐఫోన్ యూజర్లకు ఆపిల్ హెచ్చరికలు ! అందులో నిజమెంత?
ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ హెచ్చరికలు జారీ చేసిందనే కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. వాహన దారులు టూవీలర్ డ్రైవింగ్ సమయంలో ఐఫోన్‌ను బైక్‌కు అటాచ్ చేయడం వల్ల హైపవర్ మోటర్ సైకిల్ నుంచి ఉత్పన్నమయ్యే వైబ్రేషన్స్‌తో స్మార్ట్‌ఫోన్ కెమెరాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆపిల్ సంస్థ సపోర్ట్ డాక్యుమెంట్లో వెల్లడించిందనే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) లేదా క్లోజ్డ్-లూప్ ఆటోఫోకస్‌తో ఐఫోన్ కెమెరా లెన్స్‌లు దెబ్బతినే అవకాశం ఉందని ఆపిల్ సంస్థ తెలిపినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల్లో పేర్కొన్నాయి. ఈ సమస్యను అదిగమించేందుకు ఐఫోన్ యూజర్లు గైరోస్కోప్‌లు లేదా మాగ్నెటిక్ సెన్సార్లను ఉపయోగించాలని ఆపిల్ తన సపోర్ట్ డాక్యుమెంట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు టూవీలర్ నుంచి వచ్చే శబ్ధ తరంగాల వైబ్రేషన్లు తీవ్రంగా ఉంటాయని, కాబట్టి వినియోగదారులు ఐఫోన్లను నేరుగా వెహికల్ కు అటాచ్ చేయోద్దని ఆపిల్ సిఫార్సు చేసిందనే కథనాలపై ఆపిల్ స్పష్టత ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు.ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఐఫోన్లను బైక్‌లకు అటాచ్ చేయడం వల్ల కెమెరా దెబ్బతింటుందనే కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న కథనాలపై ఆపిల్ సంస్థ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. చదవండి: స్పేస్ఎక్స్: నలుగురు మనుషులు,కక్ష్యలో 3 రోజుల ప్రయాణం -
ఐఫోన్ 12/11 కొనేముందు ఒక్కసారి ఆలోచించండి
మీరు కొత్త ఐఫోన్ 12 కొనాలని చూస్తున్నారా?, మీరు ఐఫోన్ 11ను తక్కువ ధరకు కొనాలని అనుకుంటున్నారా? ఒకవేళ అవును అయితే. ఇప్పుడే కొత్త ఐఫోన్ కోసం షాపింగ్ చేయడానికి వెళ్ళకండి. ఎందుకంటే, ఆపిల్ ఐఫోన్ 12 ఫోన్లను కొనడానికి ఇది సరైన సమయం కాదు అని నిపుణులు పేర్కొంటున్నారు. ఆపిల్ తన తర్వాతి తరం మొబైల్ ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను మన దేశంలో వచ్చే నెల తీసుకొని వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఐఫోన్ లాంఛ్ సమావేశంలో ఆపిల్ తన పాత ఐఫోన్ల కొత్త ధరలను, లభ్యత వివరాలను ప్రకటిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఐఫోన్ 13 లాంఛ్ చేసిన తర్వాత ఐఫోన్ 12, ఐఫోన్ 11 ధరలు తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. (చదవండి: ఈవీ ఛార్జింగ్ సమస్యలను సులభంగా చెక్ పెట్టొచ్చు: ఓలా సీఈఓ) ప్రస్తుతం ఐఫోన్ 12 సిరీస్ మొబైల్ ప్రారంభ ధర రూ.69,900గా ఉంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి థర్డ్ పార్టీ ఈ-కామర్స్ సంస్థలు అప్పుడప్పుడు సేల్స్ లో భాగంగా తక్కువ ధరకు తీసుకొనివస్తాయి. తర్వాతి తరం ఐఫోన్ విడుదల చేసిన తర్వాత ప్రస్తుతం ఐఫోన్ ఫోన్ల మీద ఉన్న డిస్కౌంట్ కంటే ఎక్కువ డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. అలాగే, కొత్త ఐఫోన్ 13, ఐఫోన్ 12 ధర దగ్గరలో గనుక ఉంటే మీరు ఒక మంచి అవకాశాన్ని కూడా కోల్పోవచ్చు. ఆపిల్ నుంచి రాబోయే ఐఫోన్ 13 వేగవంతమైన ప్రాసెసర్, మెరుగైన డిస్ ప్లే టెక్నాలజీ, అద్భుతమైన కెమెరాల టెక్నాలజీతో వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో, కొత్త ఐఫోన్ 13 అక్టోబర్ 1న అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది అని నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి మీరు ఐఫోన్ ఎప్పడూ కొనుగోలు చేయాలో మీరే ఒక తెలివైన నిర్ణయం తీసుకుంటే మంచిది. -
ఐఫోన్ 13లో సరికొత్త ఆప్షన్.. ఆపదలో ఆదుకునేలా!
సరికొత్త ఫీచర్లతో టెక్ యూజర్లను ఆకట్టునేలా ఫోన్లను తీసుకువచ్చే యాపిల్ కంపెనీ ఈ సారి మరో కొత్త ఆప్షన్‌తో ముందుకు రానుంది. ఈ నెలాఖరుకల్లా మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్న ఐ ఫోన్ 13ని ఆపదలో ఆదుకునే పరికరంగా కూడా ఉపయోగపడేలా డిజైన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎమర్జెన్సీ ఎస్సెమ్మెస్ యాపిల్ సంస్థ నుంచి త్వరలో మార్కెట్‌కి రాబోతున్న ఐఫోన్ 13లో ఎమర్జెన్సీ ఎస్ఎమ్మెస్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం. మారుమూల ప్రాంతాలు, రిమోట్ ఏరియాలు, దట్టమైన అడవులు, సముద్ర ప్రయాణాలు చేసే సమయంలో నెట్వర్క్ పని చేయని సందర్భంలో ఇతరులతో కమ్యూనికేట్ అయ్యేలా ఈ ఫీచర్ పని చేస్తుందని బ్లూమ్‌బర్గ్ టెక్ నిపుణుడు మార్క్ గుర్మన్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫోన్లలో అత్యవసర సమయంలో ఎస్‌వోఎస్ మేసేజ్‌లు చేసే వీలున్నా ఇవన్నీ పరిమితంగానే పని చేస్తాయి. యాపిల్ అందించే ఎమర్జెన్సీ ఫీచర్లో తమ చుట్టు ఉన్న పరిస్థితులను వివరిస్తూ ఎస్ఎమ్మెస్లను పంపే వీలుంటుంది. దీని వల్ల ఎమర్జెన్సీ మెసేజ్ రిసీవ్ చేసుకున్న వారు మరింత మెరుగ్గా స్పందించే వీలు కలుగుతుంది. లియో ఆధారంగా ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్ రంగంలో భవిష్యత్తు టెక్నాలజీగా చెబుతున్న లో ఎర్త్ ఆర్బిన్, లియో (LEO) ఆధారంగా ఈ ఎమర్జెన్సీ మెస్సేజ్ పని చేస్తుందని చెబుతున్నారు. మొబైల్ నెట్వర్క్ పని చేయని చోట తక్కువ ఎత్తులో ఉండే శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా ఫోన్‌ను ఉపయోగించుకునే వీలు ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీ పరిమితంగా కొన్ని దేశాల్లోనే అందుబాటులో ఉంది. అక్కడ మాత్రమే ఈ ఎమర్జెన్సీ ఎస్ఎమ్మెస్ ఫీచర్ పని చేస్తుంది. ప్రస్తుతం అనేక సంస్థలు లియో టెక్నాలజీని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నాయి. ఇండియాలో టాటా , ఎయిర్టెల్ సంస్థలు లియో టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాయి. ఆ ఫీచర్ ఇప్పుడే కాదు ఐ ఫోన్ 13 లియో టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుందని, మొబైల్ నెట్‌వర్క్‌తో పని లేకుండానే కాల్స్, మేసేజ్ చేసుకోవచ్చనే వార్తలు మొదటగా వచ్చాయి. అయితే లియో టెక్నాలజీ ఆధారంగా ఫోన్లు తయారు చేసేందుకు అవసరమైన హార్డ్‌వేర్ ఇంకా భారీ స్థాయిలో అందుబాటులోకి రాలేదు, పైగా అన్ని దేశాల్లోనూ లియో టెక్నాలజీ కమర్షియల్ స్థాయిని అందుకోలేదు. దీంతో లియో టెక్నాలజీని తెచ్చేందుకు సమయం పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. యాపిల్ సొంతంగా టెక్నాలజీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేసే యాపిల్ సంస్థ లియో పైనా కన్నేసింది. అయితే ఇతర సంస్థలకు చెందిన శాటిలైట్లను ఉపయోగించుకోవడానికి బదులుగా తానే స్వయంగా రంగంలోకి దిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. అందువల్లే ఐఫోన్ 13లో లియో టెక్నాలజీ వాడలేదని చెబుతున్నారను. కానీ యాపిల్ సంస్థ ఇంటర్నల్ మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం లియో ఆపరేషన్స్ సొంతంగా చేసే అవకాశం ఉందని అంటున్నారు. చదవండి: టెక్ దిగ్గజం ఆపిల్‌ను దాటేసిన షియోమీ -
థర్మామీటర్ గడియారాలొస్తున్నాయ్!
టెక్ వరల్డ్‌లో కింగ్ మేకర్‌గా ఉన్న ఆపిల్ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతుంది. భూమి నుంచి 500 కి.మీ ఎత్తులో ఉండే 'లో ఎర్త్ ఆర్బిట్' సాయంతో సిమ్ లేకుండా వాయిస్ కాల్, బ్రౌజింగ్.. పోయిన వస్తువుల్ని గుర్తించేందుకు ఎయిర్ ట్యాగ్స్, గేమ్ లవర్స్ గేమ్ ఆడి సమయంలో ఢీలా పడిపోకుండా యాక్టీవ్‌గా ఉండేలా వైర్ లెస్ ఇయర్ పాడ్ ఇలా కొత్త కొత్త టెక్నాలజీలను ఆపిల్ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మరో అడుగు ముందుకేసింది. జ్వరాన్ని గుర్తించేందుకు ఉపయోగించే థర్మా మీటర్ వాచ్‌లను (గడియారాలను) అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. చదవండి: భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్పై ఎలన్ మస్క్ కీలక ప్రకటన ! ఇప్పటికి ఎన్ని ధర్మామీటర్లు ఉన్నాయంటే గెలీలియో గెలీల! ఇటలీకు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ప్రయోగాలతో ప్రమేయం లేకుండా సృష్టిలోని నిజాల్ని స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా మాత్రమే వివరించవచ్చనే అరిస్టాటిల్ సిద్ధాంతాల్ని విభేదించారు. ఆ విభేదాలతో ఆర్ధికంగా ఎంతో ఇబ్బందిపడ్డారు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు గెలీల.. మూసి ఉన్న గాజు గొట్టంలో గాలిని నింపి దానిని ఒక నీరు ఉన్న పాత్రలో ఉంచినపుడు ఆ గాలి తరగాల ఆధారంగా థర్మామీటర్‌ను కనిపెట్టారు. ఇన్నోవేటర్స్ ఆ ధర్మామీటర్‌ను కాలానికి అనుగుణంగా మారుస్తూ వచ్చారు. అలా వచ్చినవే మనో మెట్రిక్ థర్మామీటర్, లిక్విడ్ ఇన్ గ్లాస్ థర్మామీటర్, గ్యాస్ థర్మామీటర్, బయోమెటల్ థర్మామీటర్, డిజిటల్ థర్మామీటర్లు .. తాజాగా కరోనా కారణంగా ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ వినియోగం ఎక్కువైంది. అయితే రాను రాను ఈ థర్మామీటర్లు కనుమరుగు కానున్నట్లు తెలుస్తోంది. వాచ్ థర్మామీటర్ అంటే! యూజర్లకు అనుగుణంగా ఆయా టెక్ దిగ్గజాలు ధర్మా మీటర్ల స్థానంలో వాచ్ థర్మామీటర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఇప్పటికే సౌత్ కొరియా టెక్ జెయింట్ శాంసంగ్ గతేడాది ' Samsung Galaxy Watch Active 2' పేరుతో బ్లడ్ ప్రెజర్ ను గుర్తించేందుకు స్మార్ట్‌వాచ్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే తాజాగా ఆపిల్ సైతం ప్రత్యర్ధి టెక్ కంపెనీలకు చెక్ పెట్టేలా థర్మామీటర్ వాచ్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ వాచ్ సాయంతో బ్లడ్ ప్రజెర్, టెంపరేచర్, స్లీప్, బ్లడ్ షుగర్ లను గుర్తించేలా బిల్డ్ చేయనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. వాచ్ బిల్డ్ చేయడం కంప్లీట్ అయినా మార్కెట్లోకి వచ్చే ఏడాది విడుదల కానుందని తెలిపింది. -
ఆపిల్ 'థింక్ డిఫరెంట్'..వీళ్లకి మూడింది!
థింక్ డిఫరెంట్ క్యాప్షన్ తో ప్రపంచ టెక్ మార్కెట్‌ను శాసిస్తున్న ఆపిల్ మరో అడుగు ముందుకేసింది. సంస్థలో పని చేసే ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించేలా చర్యలకు సిద్ధమైంది. ఇకపై ఉద్యోగులు ఎలాంటి వేధింపులకు గురైనా ఆ ప్లాట్ ఫామ్‌లో ఎకరువు పెట్టేలా నిర్ణయం తీసుకుంది. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాను లైంగిక ఆరోపణలు మాయని మచ్చని మిగుల్చుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ ఈ తరహా చర్యలు తీసుకోవడం టెక్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఆపిల్ సంస్థలో వరల్డ్ వైడ్‌గా పనిచేస్తున్న 500 మంది ఉద్యోగుల నుంచి అభిప్రాయాల్ని సేకరించింది. అభిప్రాయాలతో పాటు జాత్యహంకారం, లింగవివక్ష, అసమానత్వం, వివక్ష, బెదిరింపు, అణచివేత, బలవంతం, దుర్వినియోగం ఇలా అన్నీ అంశాల్లో ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుంది. #appletoo,#metto అని పిలిచే ఈ వేదికకు ఆపిల్ సంస్థ గ్లోబల్ సెక్యూరిటీ టీమ్‌లో సెక్యూరిటీ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న 'చెర్ స్కార్లెట్' ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చెర్ స్కార్లెట్ మాట్లాడుతూ..ఆపిల్‌లో నిజమైన మార్పును చూడాలనుకుంటున్న ఆపిల్ ఉద్యోగులు పనివేళల్లో తలెత్తుతున్న సమస్యల గురించి స్పందించాలని కోరుతున్నాం.దీంతో ఆపిల్‌లో బాసిజంతో పాటు రకరకాల వేధింపులకు గురి చేస్తున్న వారికి చెక్ పెట్టినట్లవుతుంది' అని అన్నారు. ఇందులో మాజీ ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు సైతం పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. కాగా, ఆపిల్ నిర్ణయంపై టెక్ దిగ్గజ సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. థింక్ డిఫరెంట్‌తో సొంత సంస్థలో ఉద్యోగుల వేధింపుల గురించి బహిరంగంగా చర్చించడం సాధారణ విషయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదవండి : ఆన్ లైన్ గేమ్స్: ఇక వారంలో మూడు గంటలే ఆడాలి! -
ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త
ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త. ఆపిల్ సంస్థ ప్రతినిధులు 'ఐఫోన్13 సిరీస్' విడుదల తేదీని ప్రకటించి సస్పెన్స్‌కు తెరదించినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా ఐఫోన్ వినియోగదారులు ఐఫోన్ 13 విడుదల కోసం ఎంతగానే ఎదురు చూస్తున్నారు. రకరకాల కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఐఫోన్ 13 సిరీస్ సెప్టెంబర్ 17 న విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. చైనా సోషల్ మీడియా దిగ్గజం వైబూ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. సెప్టెంబర్ లోనే ఐఫోన్ 13ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ తో పాటు సెప్టెంబర్ 30న ఆపిల్ తన సంస్థకు చెందిన మరో నాలుగు కొత్త ప్రాడక్ట్ లను విడుదల చేయనుంది' అంటూ కొన్ని స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ స్క్రీన్ షాట్ల ప్రకారం ఐఫోన్ 13 సిరీస్ తో పాటు ఐఫోన్ 13ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లను సెప్టెంబర్ 17 నుంచి అమ్మకాలు జరపాల్సి ఉండగా..సెప్టెంబర్ తరువాత ఎయిర్ పాడ్స్3 ని విడుదల చేయనుంది. అధికారికంగా ఐఫోన్ 13 విడుదల తేదీ ఎప్పుడనేది కన్ఫాం కాకపోయినప్పటికీ..ఆపిల్ మాత్రం సెప్టెంబర్ 17న విడుదల చేస్తుందని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఆపిల్ ప్రాడక్ట్ తేదీ విడుదల ఎప్పుడనే అంశంపై సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. ఆ వార్తల్ని ఖండించని ఆపిల్ సంబంధిత తేదీల్లోనే విడుదల చేయడం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు ఊతమిచినట్లైంది. చదవండి : ఆకట్టుకునే ఫీచర్లకు పెట్టింది పేరు ఈ స్మార్ట్ ఫోన్ -
వాట్సాప్ స్కాన్.. ఫోన్లోని ఫొటోలన్నీ లీక్??
సోషల్ మీడియా యాప్‌లలో అభ్యంతకర కంటెంట్ వైరల్ కావడం ఈమధ్య కాలంలో పెరిగింది. ఈ తరుణంలో వాట్సాప్‌లోనూ అలాంటి వ్యవహారాలు నడుస్తుండగా.. ‘రిపోర్టింగ్’ ద్వారా సదరు యూజర్ అకౌంట్, గ్రూపుల మీద చర్యలు తీసుకుంటోంది వాట్సాప్. అయితే ఇలాంటి కంటెంట్ కట్టడి కోసం యాపిల్ తీసుకున్న ఓ నిర్ణయం.. యూజర్ ప్రైవసీకి భంగం కలిగించేదిగా ఉందన్న చర్చకు దారితీసింది. ఫొటో ఐడెంటిఫికేషన్ ఫీచర్ పేరిట ఐఫోన్లలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలని.. తద్వారా వాట్సాప్ ఫొటోలను స్కాన్ చేసి ఆటోమేటిక్‌గా అభ్యంతరకర ఫొటోలను తొలగించే దిశగా యాపిల్ చర్యలు చేపట్టింది. కానీ, ఈ నిర్ణయాన్ని గట్టిగానే వ్యతిరేకిస్తోంది వాట్సాప్. ఈమేరకు వాట్సాప్ హెడ్ విల్క్యాథ్కార్ట్.. యాపిల్ కంపెనీ మీద అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. అశ్లీలత కంటెంట్ గుర్తింపు-కట్టడి కోసం యాపిల్ ఎంతో కాలంగా కృషి చేస్తోంది. ఈ ప్రయత్నం అభినందనీయమే. కానీ, ఫొటో ఐడెంటిఫికేషన్ సాప్ట్వేర్ అనేది యూజర్ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించాలనే ప్రయత్నంగా భావించాల్సి వస్తుంది అని విల్ పేర్కొన్నాడు. యాపిల్ రూపొందించబోయే సాఫ్ట్వేర్ కేవలం వాట్సాప్ స్కానింగ్‌తోనే ఆగదు. ఫోన్లోని వ్యక్తిగత ఫొటోలను, డేటాను సైతం స్కాన్ చేసే అవకాశం లేకపోలేదు. అంటే.. ఇది భద్రతాపరంగా కాకుండా.. యూజర్‌పై నిఘా వ్యవస్థలా పని చేస్తుంది. కాబట్టి ఇలాంటి టూల్స్‌ను వాట్సాప్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోదు. అని స్పష్టం చేశాడు విల్. మరోవైపు సైబర్ నిపుణులు కూడా వాట్సాప్ వాదనతో ఏకీభవిస్తున్నారు. ఇదిలా అశ్లీల కంటెంట్, ముఖ్యంగా చైల్డ్ ఎబ్యూజ్ కంటెంట్ కట్టడి కోసం చేసే ప్రయత్నమని యాపిల్ బలంగా చెప్తోంది. అయినప్పటికీ ‘రిపోర్ట్’ చేసే ఆప్షన్ యూజర్‌కి ఉండగా, వాళ్ల అనుమతి లేకుండా సాఫ్ట్వేర్ ద్వారా ఫోన్‌ను, డివైజ్‌లను స్కానింగ్ చేయడం సరైందని కాదని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యాపిల్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. యూజర్ వ్యక్తిగత భద్రతపై ఎలాంటి హామీ ఇవ్వకుండానే.. ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఐవోస్, మాక్‌ఓస్, వాచ్ఓస్, ఐమెసేజ్ డివైజ్‌లలో వీలైనంత తొందరగా ఈ సాఫ్ట్‌వేర్‌ను యూజర్లకు అందించనున్నట్లు ప్రకటించింది. కొత్త వెర్షన్ అప్డేట్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ కథనాల మ్యాగజీన్ ‘ది వర్జ్’ ఓ కథనం ప్రచురించింది. -
బంపర్ ఆఫర్: ఆపిల్ ప్రొడక్ట్స్ ఇప్పుడు కొనండి .. తర్వాతే పే చేయండి
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ యాపిల్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. డబ్బులు చెల్లించకుండా మనకు కావాల్సిన యాపిల్ ఉత్పత్తుల్ని సొంతం చేసుకునే సదుపాయం కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2019లో యాపిల్ సంస్థ యాపిల్ క్రెడిట్ కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ కార్డ్ ద్వారా యాపిల్ సంస్థకు చెందిన గాడ్జెట్స్ కొనుగోలు చేసుకునే సౌకర్యం ఉంది. అయితే తాజాగా యాపిల్ సంస్థ 'యాపిల్ క్రెడిట్ కార్డ్'తో సంబంధం లేకుండా ఏదైనా ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి, వాటికి మనీని తర్వాత పే చేసే అవకాశం కల్పించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమచారం. ఇందుకోసం యాపిల్ సంస్థ పేమెంట్ గేట్‌వే గోల్డ్ మెన్ సాచ్స్ తో జతకట్టనుంది. 'యాపిల్ పే ఇన్ 4' 'యాపిల్ పే ఇన్ మంత్లీ సిస్టమ్ పేరుతో ఈ స్కీమ్‌లో భాగంగా యాపిల్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసిన కష్టమర్లు పేమెంట్ గేట్ వే గోల్డ్ మెన్ సాచ్చ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన ఉత్పత్తులపై యాపిల్ విధించిన వారాల గడువులోపు పే చేస్తే వడ్డీ ఉండదు. నెలల వ్యవధి ఉంటే వాటిపై ఇంట్రస్ట్‌ను చెల్లించాల్సి ఉంది. ఈ సదుపాయం ప్రస్తుతం రీటైల్, ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉందని యాపిల్ సంస్థ ప్రతినిథులు తెలిపారు. యాపిల్ పే లేటర్ సేవను ఉపయోగించాలనుకునే వినియోగదారులు ఐఫోన్ యాప్‌లో అప్లయ్ చేసి అనుమతి పొందాల్సి ఉంటుందాఇ. అప్పుడే యాప్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతేకాదు కొన్ని ఉత్పత్తులపై అడిషనల్ ఛార్జెస్ , ప్రాసెసింగ్ ఫీజుల్ని మినహాయింపు, క్రెడిట్ కార్డ్ స్కోర్ అవసరం లేకుండా ఉత్పత్తుల కొనుగోళ్లపై చర్చిస్తోంది. -
వీడియో గేమ్: గంటలో లక్ష ఫసక్.. కారు అమ్ముకున్న తండ్రి
వీడియో గేమ్‌ల పేరుతో జేబులు గుల్ల చేసుకుంటున్న కేసులు చూస్తూనే ఉన్నాం. అయితే అధికారిక గేమ్ వంకతో ఓ వ్యక్తిని నిలువునా దోచిన వైనం బ్రిటన్‌లో చోటు చేసుకుంది. అతని ఏడేళ్ల కొడుకు వీడియోగేమ్ ఆడుతూ చేసిన పనితో.. కారు అమ్మేసి మరీ ఆ డబ్బు కట్టాల్సి వచ్చింది. లండన్: నార్త్ వేల్స్‌కి చెందిన ఏడేళ్ల బాలుడు అషాజ్ తన తండ్రి ఐఫోన్లో ‘డ్రాగన్స్: రైజ్ ఆఫ్ బెర్క్’ వీడియో గేమ్ ఆడాడు. ఆట మధ్యలో ఒక్కో లెవల్ దాటుకుంటూ పోతుండగా.. మధ్య వచ్చిన యాప్ యాడ్స్‌ను క్లిక్ చేసుకుంటూ పోయాడు. అలా గంట వ్యవధిలో సుమారు రెండు పౌండ్ల నుంచి వంద పౌండ్ల విలువ చేసే యాప్స్ కొన్నింటిని కొనుక్కుంటూ పోయాడు. ఆ మొత్తం ఎమౌంట్ 1,289 పౌండ్లకు(మన కరెన్సీలో లక్షా ముప్ఫై వేలదాకా) చేరింది. ఈ-మెయిల్స్ ద్వారా యాపిల్ కంపెనీ నుంచి బిల్లులు జనరేట్ అయిన విషయం గుర్తించిన ఆ పిల్లాడి తండ్రి ముహమ్మద్ ముతాజా.. షాక్ తిన్నాడు. కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అయిన ముతాజా.. అంత స్తోమత లేకపోవడంతో కారును అమ్మేసుకున్నాడు. ఆషాజ్కు ఫోన్ పాస్ వర్డ్ తెలిసినప్పటికీ.. ఆటలో అపరిమిత కొనుగోలు వ్యవహారంపై రచ్చ మొదలైంది. పచ్చి మోసం నిజానికి అది ఫ్రీ వెర్షన్ గేమ్. నాలుగేళ్లు పైబడిన పిల్లలు ఎవరైనా ఆడోచ్చు. కానీ, అంతేసి అమౌంట్ యాప్‌ల కొనుగోలు యాడ్లను ఇవ్వడంపై ముతాజా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. కొనుగోళ్లను.. అందులో పెద్ద మొత్తం ఎమౌంట్తో అనుమతించడం పెద్ద మోసమని ముతాజా వాపోతున్నాడు. ఇదొక పెద్ద స్కామ్‌గా భావిస్తూ.. యాపిల్ కంపెనీకి ఫిర్యాదు చేశాడు. అయితే కొంతలో కొంత ఊరటగా.. 207 పౌండ్లు(సుమారు 21 వేలు) వెనక్కి వచ్చాయి. మరోవైపు పిల్లల గేమ్‌ల్లో పరిమితులు లేని కొనుగోళ్ల వ్యవహారంపై ఆయన కోర్టును ఆశ్రయించాడు. చదవండి: వయసు 24.. సంపాదన ఊహించలేనంత! -
Deal Of The Day: న్యూ ఆపిల్ ఐఫోన్ 12 మినీపై డిస్కౌంట్
హైదరాబాద్: న్యూ ఐఫోన్ 12 మినీపై మెగా డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. మార్కెట్లో ఈ ఫోన్ 64 జీబీ వేరియంట్ ధర 69,900లు ఉండగా డీల్ ఆఫ్ ది డేలో భాగంగా ఈ ఫోన్‌పై రూ. 7,000 డిస్కౌంట్ వస్తోంది. దీంతో పాటు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా గరిష్టంగా మరో రూ. 15,000 వరకు తగ్గింపును పొందవచ్చు. స్మాల్డిస్ప్లే ప్రస్తుత ట్రెండ్‌కి భిన్నంగా ఈ మొబైల్ డిస్ ప్లే సైజు చిన్నగా డిజైన్ చేసింది. జేబులో ఇమిడిపోయే సైజులో 5.4 అంగులాల డిస్ప్లేతో ఈ మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. చిన్న సైజు మొబైల్ ఫోన్లు కావాలనుకునే వారికి ఈ ఫోన్ సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో మెజారిటీ ఫోన్లు 6 అంగులాల డిస్ప్లే తోనే వస్తున్నాయి. ఫీచర్స్ 12 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ ప్రైమరీ కెమెరా, వైడ్ కెమెరాలతో పాటు 12 మెగా పిక్సెల్ ట్రూ డెప్త్ ఫ్రంట్ కెమెరా విత్ నైట్ మోడ్‌లో లభిస్తోంది. ఈ మొబైల్‌తో 4కే డాల్బీ విజన్ హెచ్డీఆర్ రికార్డింగ్ సదుపాయం కూడా ఉంది. న్యూ ఆప్ లైబ్రరీ, కొత్తం రకం హోం స్క్రీన్ విడ్జెట్స్ తదితర ఆప్షన్లు ఉన్నాయి. చదవండి:ఆపిల్ ఎలక్ట్రిక్ వాహనాల ప్రాజెక్టు మరింత వేగవంతం -
భారత్‌లో ఐఫోన్–12 అసెంబ్లింగ్
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఐఫోన్–12 స్మార్ట్‌ఫోన్ అసెంబ్లింగ్‌ను భారత్‌లో మొదలుపెట్టింది. స్థానిక కస్టమర్ల కోసం వీటిని దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నందుకు గర్వంగా ఉందని ఈ సందర్భంగా సంస్థ వెల్లడించింది. ఈ మోడల్‌ను థర్డ్ పార్టీ అయిన ఫాక్స్‌కాన్ రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే భారత్‌లో ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్–10ఆర్, ఐఫోన్–11 మోడళ్లను ఫాక్స్‌కాన్, విస్ట్రన్ కంపెనీలు అసెంబుల్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2017లో తొలుత ఐఫోన్ ఎస్ఈ మోడల్‌తో భారత్‌లో ఫోన్ల తయారీకి యాపిల్ శ్రీకారం చుట్టింది. భారతదేశాన్ని మొబైల్, విడిభాగాల తయారీకి పెద్ద కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు. పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుందని అన్నారు. జోరుమీదున్న అమ్మకాలు.. ఆన్లైన్ స్టోర్ మెరుగైన పనితీరుతో డిసెంబర్ త్రైమాసికంలో భారత్‌లో తమ వ్యాపారం రెండింతలైందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ జనవరిలో వెల్లడించారు. కంపెనీ తన ఉనికిని పెంచుకోవడానికి దేశంలో రిటైల్ ఔట్లెట్లను ఏర్పాటు చేసే పనిలో ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా స్టోర్లు నెలకొల్పాలన్నది సంస్థ లక్ష్యం. కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం 2020 అక్టోబర్–డిసెంబరులో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో దేశంలో ఆరవ స్థానంలో ఉన్న యాపిల్ అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 171 శాతం వృద్ధి సాధించింది. 2019తో పోలిస్తే గత సంవత్సరం 93 శాతం అధికంగా సేల్స్ నమోదు చేసింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ 15 లక్షల యూనిట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించింది. సంస్థ ఈ స్థాయి అమ్మకాలు ఒక త్రైమాసికంలో సాధించడం ఇదే తొలిసారి. గతేడాది యాపిల్ టర్నోవర్ 29 శాతం పెరిగి రూ.13,756 కోట్లు నమోదు చేసింది. నికరలాభం రూ.926 కోట్లుగా ఉంది. -
యాపిల్ ఫోన్ ఆర్డర్ చేస్తే యాపిల్ జ్యూస్!
బీజింగ్: ఏ చిన్న వస్తువుకైనా ఆన్‌లైన మీద ఆధారపడటం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఒక్క క్లిక్కుతో మనం కోరిన వస్తువు ఇంటి ముందుకొచ్చేస్తోంది. కానీ ఒక్కోసారి మనం ఆర్డర్ చేసిన దానికి బదులు మరో వస్తువు పార్శిల్లో ప్రత్యక్షమవుతుంది. దాన్ని రిటర్న్ తీసుకుని మనం అడిగింది రీప్లేస్ చేస్తే సరేసరి, కాదూ, కూడదని చేతులెత్తేస్తేనే అసలు సమస్య! తాజాగా చైనాకు చెందిన లియు అనే యువతి ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ ఆర్డర్ చేసింది. ఆన్లైన్లోనే 1500 డాలర్లు(భారత కరెన్సీలో రూ.1,10,231) బిల్లు కూడా చెల్లించింది. ఫోన్ ఎప్పుడు చేతికొస్తుందా? అని ఆరాటంగా ఎదురుచూస్తుండగా ఆ రోజు రానే వచ్చింది. ఆమె ఇంటి ముందు పార్శిల్ లాకర్లో డెలివరీ బాయ్ ఓ బాక్స్‌ను ఉంచి వెళ్లిపోయాడు. తర్వాత దాన్ని ఎంతో ఆతృతగా ఓపెన్ చేసిన లియుకు లోపల యాపిల్ జ్యూస్ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ తింది. యాపిల్ ఐఫోన్ ఆర్డర్ చేస్తే యాపిల్ ఫ్లేవర్డ్ డ్రింక్ రావడమేంటని మండిపడింది. యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఆర్డర్ చేసినప్పటికీ ఇలా జరిగిందేంటని వాపోయింది.. తనకు జరిగిన అన్యాయం గురించి ఆమె మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై యాపిల్‌తో పాటు ఎక్స్‌ప్రెస్ మెయిల్ సర్వీసెస్ స్పందిస్తూ కస్టమర్ చెప్పిన ప్రదేశానికి ఫోన్‌ను ఆర్డర్ చేశామని పేర్కొన్నాయి. దీంతో డెలివరీలో ఏ పొరపాటు జరిగి ఉండకపోవచ్చని, కానీ ఆమె ఇంటి ముందు పార్శిల్ లాకర్లో పెట్టిన తర్వాత దుండగులు ఎవరైనా దాన్ని మార్చేసి ఉండొచ్చేని భావిస్తున్నారు. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు ఐఫోన్ ఎలా మాయమైందన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. యాపిల్ కూడా ఈ విషయంపై విచారణ చేపడుతున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి: గే తమ్ముడి దంపతుల బిడ్డకు జన్మనిచ్చిన అక్క కన్నీళ్లు తెప్పిస్తున్న డెలివరీ డ్రైవర్ దీన గాథ -
బంగారు హెడ్‌ఫోన్స్ @ రూ. 80 లక్షలు
శాన్ఫ్రాన్సిస్కో: ఐఫోన్ల దిగ్గజం యాపిల్ తయారీ తొలి హెడ్‌ఫోన్స్‌ను మరింత విలాసవంతంగా తీర్చిదిద్దింది. రష్యన్ కంపెనీ కేవియర్. ఎయిర్‌పోడ్స్ మాక్స్‌ను స్వచ్చమైన బంగారంతో రూపొందించింది. నిజానికి ఎయిర్‌పోడ్స్ మాక్స్ ఇయర్ కప్స్‌ను యాపిల్ కంపెనీ అల్యూమినియంతో తయారు చేస్తోంది. అయితే బాగా ప్రాచుర్యం పొందిన గ్యాడ్జెట్స్‌ను లగ్జరీ ఐటమ్స్‌గా మలిచే రష్యన్ కంపెనీ కేవియర్ వీటిని ప్యూర్ గోల్డ్‌తో రూపొందించింది. అంతేకాకుండా మెష్ హెడ్‌బ్యాండ్‌ను అరుదైన క్రోకొడైల్ లెదర్‌తో అలంకరించింది. వెరసి యాపిల్ హెడ్‌ఫోన్స్ ఖరీదు 1.08 లక్షల డాలర్లుగా ప్రకటించింది. అంటే సుమారు రూ. 80 లక్షలన్నమాట! వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా(కస్టమ్ మేడ్) వీటిని పరిమితంగానే తయారు చేయనున్నట్లు కేవియర్ పేర్కొంది. కొత్త ఏడాది(2021)లో ఈ హెడ్‌ఫోన్స్ మార్కెట్లో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. చదవండి: (యాపిల్ నుంచి తొలిసారి హెడ్‌ఫోన్స్) తొలి హెడ్‌ఫోన్స్ ఈ నెల మొదట్లో ఎయిర్‌పోడ్స్ మ్యాక్స్ పేరుతో యాపిల్ తొలిసారి హెడ్‌ఫోన్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిని రూ. 59,900 ధరలో ప్రవేశపెట్టింది. స్పష్టమైన శబ్దం, అడాప్టివ్ ఈక్వలైజర్, అనవసర శబ్దాలను తగ్గించే సాంకేతికలతో వీటిని రూపొందించింది. కాగా.. వీటికి మరింత ప్రీమియంను జత చేస్తూ రష్యన్ లగ్జరీ బ్రాండ్ కేవియర్.. తాజాగా గోల్డ్ ప్లేటెడ్ కప్స్‌తో రూపొందించింది. వీటిని రెండు కలర్స్‌లో అందిస్తున్నట్లు తెలియజేసింది. నలుపు, తెలుపు రంగుల్లో లభించే ఈ హెడ్‌ఫోన్స్‌ను ప్యూర్ గోల్డ్‌తోపాటు.. హెడ్‌బ్యాండ్‌ను క్రోకొడైల్ లెదర్‌తో రూపొందించినట్లు వెల్లడించింది. రెండు రంగుల్లోనూ బంగారంతో చేసిన కప్స్, లెదర్ హెడ్‌బ్యాండ్‌లతో ఇవి లభించనున్నట్లు వివరించింది. -
ఫ్లిప్‌కార్ట్‌లో మరో షాపింగ్ ఫెస్టివల్
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ లవర్స్ కోసం ఫ్లిప్‌కార్ట్ మరో షాపింగ్ ఫెస్టివల్‌తో ముందుకు వచ్చింది. ఈ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ డిసెంబర్ 26న ప్రారంభం కానుంది. ఈ సేల్ డిసెంబర్ 26 నుండి డిసెంబర్ 28 వరకు కొనసాగుతుంది. ఎలక్ట్రానిక్స్ సేల్‌లో స్మార్ట్ఫోన్లతో సహా ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్లను అందించనుంది. స్మార్ట్‌ఫోన్ ఒప్పందాలు ఇప్పటికే మొబైల్స్ కి సంబందించిన ప్రత్యేక పేజీలో కనిపిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుదారులకు ప్రత్యేక తగ్గింపులను కూడా అందిస్తోంది. ఐసీఐసీఐ వినియోగదారులకు 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.(చదవండి: శాంసంగ్ గెలాక్సీ ఏ72 స్పెసిఫికేషన్స్ లీక్) ఐఫోన్ ఎస్ఈ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్‌లో భాగంగా 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 6,901 రూపాయల ధర తగ్గింపుతో 32,999 రూపాయలకు లభిస్తుంది. ఐఫోన్ ఎక్స్ఆర్ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్‌లో 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 10,000 రూపాయల ధర తగ్గింపుతో 38,999 రూపాయలకు లభిస్తుంది. ఐఫోన్ 11 ప్రో ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్‌లో భాగంగా 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 20,000 రూపాయల ధర తగ్గింపుతో 79,999 రూపాయలకు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ సందర్భంగా రియల్మీ ఎక్స్ 3 సూపర్‌జూమ్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 6,000 రూపాయల ధర తగ్గింపుతో 23,999 రూపాయలకు లభిస్తుంది. కొన్ని రోజుల క్రితం లాంచ్ అయిన మోటో జీ 5జీ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఈ సేల్‌లో 4,000 రూపాయల ధర తగ్గింపుతో 20,999 రూపాయలకు లభిస్తుంది. ఈ సేల్‌లో గత నెలలో విడుదల అయిన మోటో జీ 9పవర్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 4,000 రూపాయల ధర తగ్గింపుతో 11,999 రూపాయలకు లభిస్తుంది. -
ఐఫోన్11 ఫోన్లకు స్క్రీన్ల రీప్లేస్మెంట్
శాన్ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం యాపిల్ తయారీ ఐఫోన్ 11 వినియోగదారులకు శుభవార్త. ఐఫోన్ 11 మోడల్ ఫోన్లకు స్ర్కీన్లను రీప్టేస్ చేయనున్నట్లు యాపిల్ ఇంక్ తాజాగా ప్రకటించింది. ఐఫోన్ 11 మోడళ్లలో టచ్ స్ర్రీన్ సమస్యలు ఎదురవుతుండటంతో ఉచితంగా స్క్రీన్లను మార్పు చేయనున్నట్లు తెలియజేసింది. 2019 నవంబర్ నుంచి 2020 మే నెల మధ్యకాలంలో తయారైన ఐఫోన్ 11 మోడళ్లలో ఈ సమస్యలు ఎదురవుతున్నట్లు యాపిల్ ఇంక్ వెల్లడించింది. డిస్ప్లే మాడ్యూల్లో సమస్యల కారణంగా ఈ మోడల్ ఐఫోన్లు కొన్నింటిలో టచ్ సక్రమంగా పనిచేయడంలేదని వివరించింది. చెక్ చేసుకోవచ్చు ఐఫోన్ 11 మోడల్ వినియోగదారులు టచ్ స్క్రీన్ సమస్యలను పరిశీలించేందుకు వీలుగా యాపిల్ వివరాలు అందించింది. యూజర్లు ఫోన్ సీరియల్ నెంబర్ చెకర్ ద్వారా స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌కు అర్హమైనదీ లేనిదీ తెలుసుకోవచ్చని వెల్లడించింది. యాపిల్ వెబ్సైట్లో రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా సీరియల్ నెంబర్‌ను ఎంటర్ చేస్తే వివరాలు కనిపించనున్నట్లు తెలియజేసింది. ఈ పరిధిలో మీ ఫోన్ ఉంటే యాపిల్ అధీకృత సర్వీసుల కేంద్రంలో ఉచితంగా స్క్రీన్‌ను రీప్లేస్ చేయనున్నట్లు వివరించింది. ఒకవేళ ఇప్పటికే ఈ సమస్య కారణంగా సొంత ఖర్చులతో స్ర్రీన్ను మార్చుకున్నట్లయితే.. యాపిల్‌ను సంప్రదించడం ద్వారా రిఫండ్‌ను పొందవచ్చని తెలియజేసింది. -
ఐఫోన్ 12- 12 మినీ.. ఏది బెటర్?
ముంబై, సాక్షి: యాపిల్ తయారీ ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ దేశీయంగా రూ. 10,000 ధరల తేడాతో లభిస్తున్నాయి. ఐఫోన్ 12 రూ. 79,900 నుంచి ప్రారంభంకాగా.. 12 మినీ రూ. 69,900 ప్రారంభ ధరలో లభిస్తోంది. ఈ రెండు ఫోన్లను పరిశీలిస్తే ప్రధానంగా డిస్ప్లే పరిమాణం, బ్యాటరీ సామర్థ్యం ప్రస్తావించవచ్చని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. స్మార్ట్‌ఫోన్ నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇతర అంశాలు చూద్దాం.. 5.4 అంగుళాలు ఐఫోన్ 12.. డిస్ప్లే 6.1 అంగుళాలుకాగా.. 12 మినీ 5.4 అంగుళాల తెరను కలిగి ఉంది. పూర్తి హెచ్డీ, సూపర్ రెటీనా XDR డిస్ప్లేతో లభిస్తోంది. ఫ్రంట్ కెమెరా నాచ్, ఫేస్ ఐడీ సెన్సార్లను సైతం కలిగి ఉంది. 12 మినీ పరిమాణం తక్కువకావడంతో ఒంటి చేత్తో ఆపరేట్ చేయడం సులభంగా ఉంటుంది. అయితే ఐఫోన్ 5 Sతో పోలిస్తే పరిమాణంలో పెద్దదనే చెప్పాలి. కేవలం 135 గ్రాముల బరువుతో సౌకర్యంగా కూడా ఉంటుంది. 7.4 ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉండటంతో సులభంగా వినియోగించవచ్చు. గ్లాసీ బ్యాక్ కావడంతో చేతివేళ్ల మార్క్‌లకు ఆస్కారం తక్కువే. అయితే ఐఫోన్ 12తో పోలిస్తే పెద్ద స్క్రీన్‌పై టైపింగ్‌కు అలవాటుపడిన వారికి కొంతమేర అసౌకర్యంగా అనిపించవచ్చు. చదవండి: (ప్లూటన్‌తో విండోస్ పీసీ హ్యాకర్లకు చెక్) 12తో పోలిస్తే 12 మినీ చిన్న స్క్రిన్‌ను కలిగి ఉన్నప్పటికీ ఐఫోన్ 12 స్థాయిలో బ్రైట్నెస్ను కలిగి ఉంటుంది. హెచ్డీఆర్ కంటెంట్ విషయంలో 625 నుంచి 1200 నిట్స్వరకూ బ్రైట్నెస్ను ప్రతిబింబిస్తుంటుంది. వీడియో కంటెంట్ చూస్తున్నప్పుడు స్టీరియో స్పీకర్ కారణంగా ఆడియో సైతం స్పష్టంగా బిగ్గరగా వస్తుంది. 12 మినీలోనూ 5 ఎన్ఎం ఆధారిత A14 బయోనిక్ చిప్‌నే వినియోగించారు. 4 జీబీ ర్యామ్, ఐవోఎస్ 14 ద్వారా అత్యుత్తమ యూజర్ ఎక్స్పీరియన్స్ పొందే వీలుంది. 64 GB అంతర్గత మెమొరీతో రూపొందింది. ఇక గేములు ఆడేటప్పుడు ఐఫోన్ 12తో పోలిస్తే 12 మినీ స్వల్పంగా వేడెక్కుతోంది. పరిమాణంరీత్యా ఇది ప్రస్తావించదగ్గ అంశంకాదు. ఇదేవిధంగా 12 మినీ 15 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను సపోర్ట్ చేస్తుందని యాపిల్ చెబుతోంది. అయితే ఐఫోన్ 12తో పోలిస్తే గేములు, వీడియో స్ట్రీమింగ్ విషయంలో బ్యాటరీ చార్జింగ్ తొందరగా కోల్పోయే అవకాశముంది. సగటు వినియోగదారునికి ఇది సమస్యకాకపోవచ్చు. ఫాస్ట్ చార్జర్ ఐఫోన్ 12 మినీ 18W చార్జర్‌తో గంటలోనే చార్జింగ్ పూర్తవుతుంది. కొత్త మాగ్‌సేఫ్ చార్జర్ సపోర్ట్ చేసినప్పటికీ 12W చార్జింగ్ సామర్థ్యానికే పరిమితం. ఐఫోన్ 12లో అయితే 15W చార్జింగ్కు వీలుంది. అంతేకాకుండా మాగ్‌సేఫ్ చార్జింగ్ వల్ల 12 మినీ కొంతమేర వేడెక్కుతోంది. ఈ చార్జర్‌ను రెండో ఆప్షన్‌గానే పరిగణించాలి. 12 మినీ బ్యాటరీ సామర్థ్యం 2227 ఎంఏహెచ్కాగా.. 2815 ఎంఏహెచ్ను ఐఫోన్ 12 కలిగి ఉంటుంది. ఇక వెనుకవైపు రెండు కెమెరాలు 12 ఎంపీ, వైడ్, అల్ట్రావైడ్ లెన్స్‌తో రూపొందాయి. ఫ్రంట్ కెమెరా సైతం 12 ఎంపీని కలిగి ఉంటుంది. వెరసి చాలా వరకూ రెండు ఫోన్లూ ఒకే తరహా ఫీచర్లను కలిగి ఉన్నాయి. స్క్రీన్ పరిమాణం, బ్యాటరీ విషయంలో మాత్రమే ఐఫోన్ 12 మినీ విభిన్నతను కలిగి ఉన్నట్లు స్మార్ట్‌ఫోన్ నిపుణులు పేర్కొంటున్నారు. -
భారత్‌లో యాపిల్ అమ్మకాలు సూపర్
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం రూ. 13,756 కోట్లకు చేరాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 10,674 కోట్లతో పోలిస్తే ఇది 29 శాతం అధికం. 2019–20లో భారత్‌లో విక్రయాలపై యాపిల్ నికర లాభం రూ. 926 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 262 కోట్లు. భారత ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ల మార్కెట్లో శాంసంగ్, వన్‌ప్లస్ వంటి సంస్థలకు మరింత గట్టి పోటీనివ్వడంపై యాపిల్ దృష్టి పెడుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారత్‌లోనే ఐఫోన్ 11 ఫోన్ల అసెంబ్లింగ్‌ను మొదలుపెట్టింది. ఈమధ్యే దేశీయంగా తమ తొలి ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఆన్లైన్ స్టోర్‌కి మంచి స్పందన లభించిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్‌లో మరింత మెరుగైన ఫలితాలు సాధించినట్లు యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇటీవల పేర్కొన్నారు. కొత్త ఐఫోన్ 12కి ప్రి–ఆర్డర్లు వెల్లువెత్తడమూ కంపెనీకి లాభించినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. చదవండి: ఐఫోన్13 ఫీచర్లు హల్చల్ -
వాల్ స్ట్రీట్‌కు వైరస్ షాక్
పలు దేశాలలో మళ్లీ కోవిడ్-19 కేసులు విజృంభిస్తుండటంతో బుధవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. డోజోన్స్ 943 పాయింట్లు(3.4 శాతం) పడిపోయి 26,520కు చేరగా.. ఎస్అండ్పీ 120 పాయింట్లు(3.5 శాతం) నష్టంతో 3,271 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 426 పాయింట్లు(3.75 శాతం) కోల్పోయి 11,005 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు నాలుగు నెలల కనిష్టాలకు అంటే జులై స్థాయికి చేరాయి. అమెరికా, రష్యాసహా యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు ఒక్కసారిగా భారీ అమ్మకాలకు తెరతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. బ్రిటన్ బాటలో జర్మనీ, ఫ్రాన్స్‌లో లాక్డవున్లు విధించడంతో అంతకుముందు యూరోపియన్ మార్కెట్లు సైతం 2.6-4 శాతం మధ్య కుప్పకూలినట్లు తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రతిపాదించిన భారీ ప్యాకేజీపై కాంగ్రెస్‌లో డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు వివరించారు. వచ్చే నెల మొదట్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలోగా ప్యాకేజీకి ఆమోదముద్ర పడుతుందని ఇన్వెస్టర్లు భావించినట్లు తెలియజేశారు. ఫాంగ్ స్టాక్స్ వీక్ ఫాంగ్ స్టాక్స్‌గా పేర్కొనే యాపిల్, అల్ఫాబెట్, ఫేస్బుక్ నేడు క్యూ3(జులై- సెప్టెంబర్) ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా.. బుధవారం అల్ఫాబెట్, ఫేస్బుక్ 5.5 శాతం, మైక్రోసాఫ్ట్, యాపిల్ 5 శాతం, అమెజాన్ 4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ 4.5 శాతం క్షీణించగా..ఎయిర్‌లైన్స్ కంపెనీలలో యునైటెడ్, సౌత్‌వెస్ట్, డెల్టా, అమెరికన్ 4.6 -2.5 శాతం మధ్య నష్టపోయాయి. క్రూయిజర్ కౌంటర్లలో కార్నివాల్ 11 శాతం, రాయల్ కరిబియన్ 7.5 శాతం చొప్పున కుప్పకూలాయి. ఫార్మా డౌన్ కోవిడ్-19కు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్న ఫార్మా దిగ్గజాలలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో నోవావాక్స్ 9 శాతం, మోడర్నా ఇంక్ 7 శాతం, ఫైజర్ 5.3 శాతం, జీఎస్కే 4 శాతం, మెక్‌డొనాల్డ్స్ 3.7 శాతం, నోవర్తిస్, ఇంటెల్ కార్ప్ 3 శాతం, సనోఫీ 2.7 శాతం చొప్పున డీలా పడ్డాయి. అయితే ఈ ఏడాది క్యూ3లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో డైవర్సిఫైడ్ దిగ్గజం జనరల్ ఎలక్ట్రిక్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఈ షేరు పతన మార్కెట్లోనూ 5 శాతం దూసుకెళ్లింది. -
5జీ ఐఫోన్ 12 వచ్చేసింది..
కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా తమ 5జీ టెక్నాలజీ ఆధారిత ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ప్రో, ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఐఫోన్ 12 మినీ రేటు 699 డాలర్ల నుంచి, ఐఫోన్ 12 రేటు 799 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. మినీ పరిమాణం 5.4 అంగుళాలు, ఐఫోన్ 12 స్క్రీన్ 6.1 అంగుళాలు కాగా, ప్రో స్క్రీన్ సైజు 6.1 అంగుళాలు, ప్రో మ్యాక్స్ డిస్ప్లే 6.7 అంగుళాలుగా ఉంటుంది. ఐఫోన్ 12 నలుపు, తెలుపు, ఎరుపు తదితర అయిదు రంగుల్లో లభిస్తుంది. ఐఫోన్ 11తో పోలిస్తే ఇది 11 శాతం నాజూకైనది, 16 శాతం తేలికైనది. ఇందులో రెట్టింపు పిక్సెల్స్ ఉంటాయి. మరింత దృఢమైన సెరామిక్ షీల్డ్‌తో తయారైంది. స్మార్ట్ డేటా మోడ్ కారణంగా అవసరాన్ని బట్టి ఇది 5జీ, ఎల్టీఈ నెట్‌వర్క్‌పై పనిచేస్తుంది. 6.1 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే, డ్యుయల్ కెమెరా, అత్యంత శక్తిమంతమైన ఏ14 బయోనిక్ చిప్ మొదలైన ఫీచర్లు ఐఫోన్ 12లో ఉంటాయి. ఐఫోన్ బాక్స్‌లో ఇకపై అడాప్టర్ ఉండదని సంస్థ తెలిపింది. 5జీని అత్యంత వేగవంతమైన, అధునాతనమైన టెక్నాలజీగా కంపెనీ సీఈవో టిమ్ కుక్ అభివర్ణించారు. ఐఫోన్లతో పాటు హోమ్ పాడ్ మినీ తదితర ఉత్పత్తులను కూడా యాపిల్ ఆవిష్కరించింది. అక్టోబర్ 16 నుంచి ప్రి–అర్డర్లు, 23 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. -
ఫెస్టివ్ సీజన్ : త్వరలో ఐఫోన్12
సాక్షి, న్యూఢిల్లీ : కొత్త ఐఫోన్ కోసం ఐఫోన్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నతరుణంలో మార్కెట్లో అనేక ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. ఎప్పటినుంచో ఎపుడెపుడా అని ఊరిస్తున్నయాపిల్ ఐఫోన్12 ఆవిష్కారానికి రంగం సిద్ధమవుతోంది. యాపిల్ తన రాబోయే స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 12 త్వరలోనే లాంచ్ చేయనుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. యాపిల్ లాంచ్ ఈవెంట్‌ను అక్టోబర్ 13 న నిర్వహించనుందని, ఈ సందర్భంగానే దీన్ని ఆవిష్కరించనుందని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో భారతీయ వినియోగదారులకు ఐఫోన్ సిరీస్ లో భాగంగా కొత్త ఐఫోన్12 మినీ, ఐఫోన్12 రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానుంది. (యాపిల్ ఆన్లైన్ స్టోర్ : బంపర్ ఆఫర్లు) ప్రస్తుతానికి కొత్త ఐఫోన్ కోసం ప్రణాళికలను యాపిల్ ధృవీకరించలేదు. సాధారణంగా యాపిల్ తన ఫోన్ లాంచ్ ఈవెంట్‌ను సెప్టెంబర్‌లో నిర్వహిస్తుంది. అయితే కోవిడ్-19, లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఇటీవల వర్చువల్ గా నిర్వహించిన గ్లోబల్ ఈవెంట్ లో యాపిల్ వాచ్ సిరీస్, ఐపాడ్ లాంటి ఉత్పత్తులను లాంచ్ చేసింది. ఈ సందర్భంగా యాపిల్ ఐఫోన్ 12 పై ఒక ప్రకటన ఉంటుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. ఐఫోన్ లాంచ్ గురించి యూట్యూబర్ జోన్ తాజా సమాచారం ఐఫోన్ 12 లాంచ్ కార్యక్రమం అక్టోబర్‌లో జరగనుంది. మూడు రెగ్యులర్ వేరియంట్లలో తీసుకురానుంది. అంతేకాదు అక్టోబర్ 16 నుండి ప్రీ ఆర్డర్లను ప్రారంభించవచ్చట. 6.1 అంగుళాల స్క్రీన్ 256వరకు స్టోరేజ్ , 5.4 అంగుళాలు 64జీబీ స్టోరేజ్ తో రానుంది. 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ఏ14 బయోనిక్ ప్రాసెసర్ తో రూపొందిస్తున్న ఐఫోన్ 12 ప్రో, ప్రో మాక్స్ స్క్రీన్ పరిమాణాలు వరుసగా 6.1 అంగుళాలు, 6.7 అంగుళాలుగా ఉండవచ్చని మరో అంచనా. -
యూఎస్ మార్కెట్లు అప్- క్రూయిజర్ షేర్ల స్పీడ్
దాదాపు మూడు వారాల తరువాత శుక్రవారం యూఎస్ మార్కెట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎగశాయి. డోజోన్స్ 359 పాయింట్లు(1.35%) పెరిగి 27,174 వద్ద ముగిసింది. ఎస్అండ్పీ 52 పాయింట్ల(1.6%) లాభంతో 3,298 వద్ద నిలిచింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 241 పాయింట్లు(2.3%) జంప్‌చేసి 10,914 వద్ద స్థిరపడింది. అయినప్పటికీ ఈ వారం నికరంగా డోజోన్స్ 1.8 శాతం నష్టపోగా.. ఎస్అండ్పీ 0.6 శాతం నీరసించింది. అయితే 4 వారాల నష్టాలకు చెక్ పెడుతూ నాస్డాక్ మాత్రం 1.1 శాతం పుంజుకుంది. ఇటీవల కరెక్షన్ బాటలో సాగుతున్న మార్కెట్లు వరుసగా నాలుగో వారం నష్టాలతో ముగిశాయి. తద్వారా 2019 ఆగస్ట్ తదుపరి అత్యధిక కాలం మార్కెట్లు వెనకడుగుతో నిలిచినట్లయ్యింది. ఆశావహ అంచనాలు వచ్చే వారం హౌస్ డెమక్రాట్లు ప్రతిపాదిస్తున్న 2.4 ట్రిలియన్ డాలర్ల ఉపశమన ప్యాకేజీపై వోటింగ్ చేపట్టనున్నారు. నిరుద్యోగులకు లబ్దిని పెంచడంతోపాటు.. నష్టాలకు లోనవుతున్న ఎయిర్‌లైన్స్‌కు ఆర్థిక మద్దతు అందించేందుకు ఈ బిల్లును రూపొందించారు. అయితే ఈ బిల్లు రిపబ్లికన్లు ప్రతిపాదించిన ప్యాకేజీకంటే అధికంకావడం విశేషం! దీంతో సెంటిమెంటు బలపడగా.. టెక్నాలజీ దిగ్గజాలలో షార్ట్ కవరింగ్ మార్కెట్లకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. క్రూయిజర్ దూకుడు వారాంతాన ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో యాపిల్ 3.8 శాతం లాభపడగా.. అమెజాన్ 2.5 శాతం, మైక్రోసాఫ్ట్ 2.3 శాతం, నెట్‌ఫ్లిక్స్, ఫేస్బుక్ 2.1 శాతం చొప్పున ఎగశాయి. ఇతర కౌంటర్లలో ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ 5 శాతం జంప్‌చేసింది. క్రూయిజర్ నిర్వాహక కంపెనీలు కార్నివాల్ 9.7 శాతం, నార్వేజియన్ క్రూయిజ్ లైన్ 13.7 శాతం, రాయల్ కరిబియన్ 7.7 శాతం చొప్పున దూసుకెళ్లాయి. ఈ నెలలో వీక్ మార్కెట్లకు దన్నునిస్తున్న ఫాంగ్ స్టాక్స్ సెప్టెంబర్‌లో వెనకడుగు వేస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ యాపిల్ 13 శాతం పతనంకాగా.. మైక్రోసాఫ్ట్, అల్ఫాబెట్(గూగుల్), నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ఫేస్బుక్ సుమారు 8 శాతం చొప్పున క్షీణించాయి. దీంతో ఈ నెలలో మార్కెట్లు కరెక్షన్ బాట పట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా ఈ నెలలో ఇప్పటివరకూ డోజోన్స్ 4.4 శాతం, ఎస్అండ్పీ 5.8 శాతం చొప్పున పతనంకాగా.. నాస్డాక్ మరింత అధికంగా 7.3 శాతం తిరోగమించడం గమనార్హం! -
యాపిల్, వాల్‌మార్ట్ ప్లస్- యూఎస్ రికార్డ్స్
ఆరు రోజుల రికార్డ్ ర్యాలీకి సోమవారం బ్రేక్ పడినప్పటికీ మంగళవారం తిరిగి అమెరికా స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రధానంగా ఐఫోన్ల దిగ్గజం యాపిల్, రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ జంప్‌చేయడంతో ఎస్అండ్పీ, నాస్డాక్ సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఎస్అండ్పీ 26 పాయింట్లు(0.75%) బలపడి 3,527కు చేరగా.. నాస్డాక్ 164 పాయింట్లు(1.4%) జంప్‌చేసి 11,940 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. డోజోన్స్ 216 పాయింట్లు(0.8%) ఎగసి 28,646 వద్ద స్థిరపడింది. ఆగస్ట్‌లో తయారీ రంగ పీఎంఐ గణాంకాలు 19ఏళ్ల గరిష్టాన్ని తాకడంతో సెంటిమెంటుకు బూస్ట్ లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. దిగ్గజాల అండ ఈ నెలాఖరు నుంచి మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొనడంతో వాల్‌మార్ట్ 6 శాతం జంప్‌చేసింది. రీసెర్చ్ సంస్థలు బయ్ రేటింగ్ ద్వారా టార్గెట్ ధరను పెంచడంతో యాపిల్ ఇంక్ 4 శాతం ఎగసింది. 5 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించనున్నట్లు వెల్లడించడంతో ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ 4 శాతం పతనమైంది. ఇక జూమ్ షేరు ఏకంగా 41 శాతం దూసుకెళ్లింది. క్యూ2లో పటిష్ట ఫలితాలకుతోడు.. పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలు ఆకట్టుకోవడం జూమ్ కౌంటర్‌కు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆగస్ట్‌లో స్పీడ్ గత నెలలో యూఎస్ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపాయి. డోజోన్స్ 7.6 శాతం, ఎస్అండ్పీ 7 శాతం చొప్పున పుంజుకోగా.. నాస్డాక్ మరింత అధికంగా 9.6 శాతం దూసుకెళ్లింది. వెరసి 2020 జనవరి నుంచి ఎస్అండ్పీ 8.3 శాతం, నాస్డాక్ 31.2 శాతం ర్యాలీ చేయగా.. డోజోన్స్ 0.4 శాతం వెనకడుగులో ఉంది. ఇందుకు ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజాలు దోహదం చేశాయి. ఆగస్ట్లోమైక్రోసాఫ్ట్ 10 శాతం లాభపడగా.. 2020లో ఇప్పటివరకూ 43 శాతం జంప్‌చేసింది. ఇదే విధంగా గత నెలలో యాపిల్ ఇంక్ 21.4 శాతం పుంజుకోగా.. ఈ ఏడాదిలో 76 శాతం దూసుకెళ్లింది. టెస్లా జోరు ఆగస్ట్‌లో యాపిల్ ఇంక్ 4:1 నిష్పత్తిలోనూ, టెస్లా ఇంక్ 5:1 నిష్పత్తిలోనూ షేర్ల విభజనను చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్‌లో టెస్లా ఇంక్ షేరు 74 శాతం జంప్‌చేసింది. ఈ షేరు 2020లో ఇప్పటివరకూ 496 శాతం దూసుకెళ్లడం విశేషం! కాగా.. డోజోన్స్‌లో ఎగ్జాన్ మొబిల్, ఫైజర్ ఇంక్, రేథియాన్ టెక్నాలజీస్ చోటు కోల్పోగా.. వీటి స్థానే సేల్స్‌ఫోర్స్.కామ్, యామ్జెన్ ఇంక్, హనీవెల్ ఇంటర్నేషనల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. -
యాపిల్ నుంచి స్మార్ట్ వాచ్, ఎయిర్‌ఫోన్స్
ముంబై: టెక్ దిగ్గజం యాపిల్(ఐఫోన్) సరికొత్త ఫీచర్లతో మొబైల్ వినియోగదారులను నిరంతరం ఆకట్టుకుంటుంది. త్వరలో యాపిల్ అభిమానులకు మరో శుభవార్త తెలిపింది. త్వరలో యాపిల్ స్మార్ట్ వాచ్‌లను మార్కెట్లోకి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే గత సంవత్సరం ప్రత్యేక స్మార్ట్ వ్యాచ్(యాపిల్ వాచ్ సిరీస్ 5) లను ప్రవేశ పెట్టిన యాపిల్ సంస్థ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం తక్కువ ధర, అత్యుత్తమ క్వాలిటీతో స్మార్ట్ వాచ్‌లను యాపిల్ సంస్థ ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఫిట్‌బిట్, గార్మిన్, తదితర సంస్థలు స్మార్ట్ వాచ్‌లను నాణ్యతతో రూపొందిస్తున్నాయి. మరోవైపు యాపిల్ కేవలం స్మార్ట్ వాచ్‌లనే కాకుండా ఎయిర్‌ఫోన్స్, మ్యూజిక్ కేటగిరీలలో కొత్త డివైస్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో హోమ్పోడ్, ఏయిర్పోడ్స్, ప్రొ, ఐపోడ్ టచ్ తదితర కొత్త సేవలను యాపిల్ అందించనుంది. ఈ అంశాలపై యాపిల్ త్వరలో ప్రకటన చేయనుందని సంస్థ వర్గాలు తెలిపాయి. చదవండి: సరికొత్త ఫీచర్లతో యాపిల్ ప్రొడక్టులు -
యూట్యూబ్ ఐవోఎస్‌లో సరికొత్త సేవలు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాలను వీడియోలతో యూట్యూబ్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఐవోఎస్ అప్లికేషన్లలో యూట్యూబ్ సరికొత్త సేవలను ప్రారంభించింది. ఐవోఎస్ అప్లికేషన్లో పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్‌ను (పీఐపీ) ప్రవేశపెట్టింది. తాజాగా ఎమ్ఏసీ నివేదిక ప్రకారం ఐపాడ్ వినియోగదారులకు సరికొత్త ఐవోఎస్ అప్లికేషన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. మరోవైపు యాపిల్ ఐఫోన్ ఇదివరకే ఐవోఎస్ అప్డేట్ సేవలు కల్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐవోఎస్ అప్లికేషన్లో యూట్యూబ్ కొన్ని ఫీచర్లను ప్రవేశపెట్టింది. కానీ ప్రస్తుతం ఈ ఫీచర్ కొన్ని వీడియోలతో అతి కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉంది. అయితే వీడియోలను వినియోగదారులు ఐవోఎస్ హోమ్ స్క్రీన్ ద్వారా వీక్షించవచ్చు. కాగా యూట్యూబ్ ప్రీమియమ్‌కు సభ్యత్వాన్ని పొందిన వినియోగదారులకే వీడియోలను ప్లేబ్యాక్ చేయడానికి యూట్యూబ్ అనుమతిస్తుంది. అదే విధంగా యూట్యూబ్ ప్రీమియమ్ చెల్లించనవారికే పీఐపీ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే పీఐపీ మోడ్ కావాలనుకునే భారతీయ వినియోగదారులు నెలకు రూ.129 తెలపగా, మొత్తం ఫ్యామిలీ వినియోగదారులైతే(5గురు) 189 రూపాయలు చెల్లించాలని యూట్యూబ్ పేర్కొంది. -
ఐఫోన్లతో యాపిల్- 2 ట్రిలియన్ డాలర్లకు
కోవిడ్-19 కారణంగా ఆర్థిక రికవరీ అత్యంత అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఫెడరల్ రిజర్వ్ తాజాగా పేర్కొంది. కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలంతో ఆర్థిక వ్యవస్థ అనూహ్య సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు అభిప్రాయపడింది. దీంతో రికవరీ బలహీనపడే వీలున్నట్లు అంచనా వేసింది. ఫలితంగా బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాల నుంచి వెనకడుగు వేశాయి. ప్రస్తుతం ఫ్యూచర్స్‌లోనూ 0.7 శాతం నష్టంతో కదులుతున్నాయి. బుధవారం డోజోన్స్ 85 పాయింట్లు(0.3 శాతం) నీరసించి 27,693 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 15 పాయింట్లు(0.45 శాతం) క్షీణించి 3,375 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ 64 పాయింట్లు(0.6 శాతం) డీలాపడి 11,146 వద్ద స్థిరపడింది. తొలి అమెరికన్ కంపెనీ బుధవారం ట్రేడింగ్‌లో యాపిల్ షేరు ఇంట్రాడేలో దాదాపు 468 డాలర్లకు చేరింది. తద్వారా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారి 2 లక్షల కోట్ల డాలర్లను తాకింది. వెరసి అమెరికన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. చివరికి 463 డాలర్ల వద్ద ముగిసింది. దీంతో మార్కెట్ క్యాప్ 1.98 ట్రిలియన్ డాలర్లకు చేరింది. 2018 ఆగస్ట్ 2న తొలిసారి యాపిల్ మార్కెట్ విలువ 1 ట్రిలియన్ డాలర్లను తాకింది. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి కంపెనీగా ఆవిర్భవించింది. తిరిగి ఈ జూన్‌లో 1.5 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. ఈ బాటలో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ సైతం 1.5 ట్రిలియన్ డాలర్లను దాటడం గమనార్హం! ఐఫోన్ల దన్ను కంపెనీ కొంతకాలంగా ఐఫోన్లు, ఐప్యాడ్స్, వాచీలు, ఎయిర్‌పోడ్స్ అమ్మకాలతో జోరు చూపుతోంది. ఇటీవల యాపిల్ టీవీ+, యాపిల్ మ్యూజిక్ సర్వీసులను సైతం ప్రారంభించింది. కంపెనీ అమ్మకాల వృద్ధికి ప్రధానంగా ఐఫోన్ సహకరిస్తోంది. 2007లో అప్పటి సీఈవో స్టీవ్ జాబ్స్ హయాంలో తొలిసారి ఐఫోన్‌ను యాపిల్ విడుదల చేసింది. దీంతో కంపెనీ ఒక్కసారిగా స్పీడందుకుంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ చరిత్రను ఐఫోన్ తిరగరాసినట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 2020లో ఇప్పటివరకూ యాపిల్ షేరు 57 శాతం దూసుకెళ్లడం విశేషం! 12 నెలల కాలాన్ని పరిగణిస్తే.. 120 శాతం ర్యాలీ చేసింది! 5జీ ఫోన్ ఇటీవల యాపిల్ తక్కువ ధరల శ్రేణిలో ఎస్ఈ మోడల్ ఐఫోన్లను విడుదల చేసింది. మరోవైపు ఐఫోన్ 12 పేరుతో 5జీ ఫోన్ విడుదల సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బాటలో మ్యాక్ ప్రొడక్టులకు సొంత చిప్‌లను వినియోగించే వ్యూహాలను అమలు చేస్తోంది. ఇలాంటి పలు అంశాలు యాపిల్ షేరుకి జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన చమురు దిగ్గజం సౌదీ అరామ్కో 2 ట్రిలియన్ డాలర్లను అందుకున్న కంపెనీగా ఇప్పటికే రికార్డ్ సాధించినప్పటికీ ప్రస్తుతం 1.8 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. -
టెక్ దిగ్గజాల షాక్- నాస్డాక్ పతనం
టెక్ దిగ్గజాల కౌంటర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకోవడంతో గురువారం యూఎస్ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రధానంగా ఫాంగ్ స్టాక్స్‌లో అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్‌తోపాటు.. మైక్రోసాఫ్ట్, టెస్లా పతనంకావడంతో నాస్డాక్ అత్యధికంగా 245 పాయింట్లు(2.3 శాతం) తిరోగమించింది.10,461 వద్ద ముగిసింది. ఈ బాటలో డోజోన్స్ 354 పాయింట్లు(1.3 శాతం) క్షీణించి 26,652కు చేరగా.. ఎస్అండ్పీ 40 పాయింట్ల(1.25 శాతం) వెనకడుగుతో 3,236 వద్ద స్థిరపడింది. వెరసి నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. కారణాలివీ గత వారం నిరుద్యోగ భృతికి దరఖాస్తులు గత నాలుగు నెలల్లోలేని విధంగా 1.416 మిలియన్లకు పెరిగినట్లు కార్మిక శాఖ వెల్లడించింది. మరోవైపు ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌పై వివిధ రాష్ట్రాలలో వినియోగదారుల పరిరక్షణ అంశాలపై దర్యాప్తు జరగనుందన్న వార్తలు టెక్ కౌంటర్లలో అమ్మకాలకు కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం అజ్యూర్ ఒక త్రైమాసికంలో తొలిసారి 50 శాతంకంటే తక్కువ వృద్ధిని నమోదు చేయడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక వరుసగా నాలుగో త్రైమాసికంలో లాభాలు ప్రకటించినప్పటికీ షేరు ఇటీవల అనూహ్య ర్యాలీ చేయడంతో టెస్లా ఇంక్ కౌంటర్లో లాభాల స్వీకరణ తలెత్తినట్లు తెలియజేశారు. నేలచూపులో ఎలక్ట్రిక్ కార్ల బ్లూచిప్ కంపెనీ టెస్లా ఇంక్ షేరు 5 శాతం పతనమై 1513 డాలర్లకు చేరగా.. టెక్ దిగ్గజాలలో యాపిల్ 4.6 శాతం వెనకడుగుతో 371 డాలర్లను తాకింది. మైక్రోసాఫ్ట్ 4.6 శాతం పతనమై 203 డాలర్ల దిగువకు చేరగా.. అమెజాన్ 3.7 శాతం నష్టంతో 2987 డాలర్ల దిగువన స్థిరపడింది. ఇతర కౌంటర్లలో గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ 3.4 శాతం, ఫేస్బుక్ 3 శాతం, నెట్‌ఫ్లిక్స్ 2.5 శాతం చొప్పున క్షీణించాయి. కాగా.. వచ్చే రెండు నెలల్లో మరిన్ని సర్వీసులను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలియజేయడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ 3.7 శాతం ఎగసింది. రోజువారీ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగినట్లు వెల్లడించడంతో ట్విటర్ 4.1 శాతం జంప్‌చేసింది. -
యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ రికార్డ్స్
ప్రధానంగా టెక్ దిగ్గజాలు అండగా నిలుస్తుండటంతో నాస్డాక్ సరికొత్త రికార్డులను సాధిస్తోంది. మంగళవారం ఫాంగ్(FAANG) స్టాక్స్ బలపడటంతో 75 పాయింట్లు(0.75 శాతం) పుంజుకుని 10,131 వద్ద ముగిసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. గత 18 ట్రేడింగ్ సెషన్లలో 16సార్లు లాభాలతో నిలిచింది. ఇంతక్రితం 1999లో మాత్రమే ఈ ఫీట్ సాధించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ నాస్డాక్ 21వసారి రికార్డ్ గరిష్టాన్ని సాధించడం విశేషం! ఇక డోజోన్స్ 130 పాయింట్లు(0.5 శాతం) ఎగసి 26,156 వద్ద స్థిరపడగా.. ఎస్అండ్పీ 13 పాయింట్లు(0.45 శాతం) బలపడి 3,131 వద్ద ముగిసింది. ఎస్అండ్పీ ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ 20 శాతం ర్యాలీ చేసింది. మే నెలలో గృహ విక్రయాలు దాదాపు 17 శాతం ఎగసి 6.76 లక్షలను తాకాయి. విశ్లేషకులు 6.4 లక్షల అమ్మకాలను అంచనా వేశారు. దీంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. రికార్డుల బాట.. ఐఫోన్ల దిగ్గజం యాపిల్ 2.15 శాతం లాభంతో 366 డాలర్లను అధిగమించగా.. అమెజాన్ 2 శాతం పుంజుకుని 2764 డాలర్లను దాటింది. ఇక మైక్రోసాఫ్ట్ కార్ప్ 1.35 శాతం వృద్ధితో 202 డాలర్లకు చేరింది. నెట్‌ఫ్లిక్స్ తొలుత 474 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకినప్పటికీ తదుపరి 466 డాలర్లకు నీరసించింది. తద్వారా యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్ సరికొత్త గరిష్టాలను అందుకోగా.. ఫేస్బుక్, అల్ఫాబెట్ సైతం 0.7 శాతం చొప్పున బలపడటం గమనార్హం. బేయర్ అప్ కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ తయారీలో సనోఫీ పాస్టెర్తో భాగస్వామ్యం కదుర్చుకున్నట్లు వెల్లడించడంతో థెరప్యూటిక్స్ కంపెనీ ట్రాన్స్‌లేట్ బయో కౌంటర్ ఏకంగా 47 శాతం దూసుకెళ్లింది. మోన్శాంటో కొనుగోలు తదుపరి వీడ్‌కిల్లర్ ప్రొడక్ట్‌పై తలెత్తిన సమస్యకు 8-10 బిలియన్ డాలర్లతో సెటిల్మెంట్ కుదుర్చుకోనున్న వార్తలతో బేయర్ ఏజీ 5 శాతం జంప్‌చేసింది. కాగా.. ఇతర కౌంటర్లలో బయోన్టెక్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, వన్‌లైఫ్, క్లియర్ వే తదితరాలు 8-5 శాతం మధ్య పతనమయ్యాయి. -
సరికొత్త ఫీచర్లతో యాపిల్ ప్రొడక్టులు
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఇంక్ సొంత చిప్‌ను ఆవిష్కరించనున్నట్లు పేర్కొంది. దీంతో ఇకపై యాపిల్ తయారీ మాక్ కంప్యూటర్లు సొంత చిప్‌తో వెలువడనున్నట్లు తెలియజేసింది. తద్వారా 15 ఏళ్లుగా ఆధారపడుతున్న ఇంటెల్ కార్ప్‌నకు యాపిల్ టాటా చెప్పనుంది. యాపిల్ తయారీ ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ కంప్యూటర్లు ఇకపై సొంత చిప్‌తో రూపొందనున్నట్లు కంపెనీ సీఈవో టిమ్ కుక్ తాజాగా పేర్కొన్నారు. వెరసి కొత్త శకానికి నాంది పలుకుతున్నట్లు వ్యాఖ్యానించారు. కాలిఫోర్నియాలోని క్యుపర్టినోగల కంపెనీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచవ్యాప్త డెవలపర్ వార్షిక సమావేశం తొలి రోజు కుక్ మరిన్ని వివరాలు వెల్లడించారు. ఐఓఎస్ 14 తమ హార్డ్‌వేర్ ప్రొడక్టులకు సిలికాన్ హృదయంవంటిదని, ప్రపంచస్థాయి డిజైన్ టీమ్ ద్వారా సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు కుక్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటికే కంపెనీ తయారీ ఐఫోన్లు, ఐప్యాడ్లలో యాపిల్ అభివృద్ధి చేసిన చిప్‌లను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. యాప్ స్టోర్ ద్వారా అందిస్తున్న సేవలు ఇటీవల కంపెనీ ఆదాయంలో ప్రధాన వాటా సాధిస్తున్న నేపథ్యంలో ఈ కాన్ఫరెన్స్‌కు ప్రాధాన్యత పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. కారు తాళాలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు డిజిటల్ షేరింగ్ చేసేందుకు వీలుగా యాపిల్ కొత్త వ్యవస్థను రూపొందించింది. ఐమెసేజ్ వ్యవస్థ ద్వారా బీఎండబ్ల్యూ 5 సిరీస్ వాహనాలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు యాపిల్ పేర్కొంది. ప్రస్తుతం అందిస్తున్న ఐఓఎస్ 13 ద్వారా ఇందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలియజేసింది. వచ్చే ఏడాదిలో మరిన్ని కార్లకు ఈ సదుపాయాన్ని విస్తరించే వీలున్నట్లు వివరించింది. నచ్చిన సైజులో విడ్జెట్స్ యాపిల్ కొత్త ఐవోఎస్ 14ను ప్రవేశపెట్టనుంది. దీనిలో భాగంగా విడ్జెట్స్‌ను విభిన్న పరిమాణంలో నచ్చిన విధంగా అమర్చుకోవచ్చు. అంతేకాకుండా పిక్చర్ ఇన్ పిక్చర్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. తద్వారా వీడియోను మినిమైజ్ చేసుకుని స్క్రీన్‌లో ఏదో ఒక కార్నర్లో సెట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఐఫోన్లలో ఇన్కమింగ్ కాల్స్ తెరనంతటినీ ఆవరించకుండా పైభాగానికి కుదించుకోవచ్చు. ఇక ఐప్యాడ్స్, ఐఫోన్ల వినియోగంలో డివైస్ల మధ్య ఐపోడ్స్ ఆటోమేటిగ్గా కనెక్ట్(స్విచ్ బ్యాక్) అవుతాయి. ఇక యాపిల్ వాచీలకు ఓఎస్-7ను అభివృద్ధి చేసింది. స్లీప్ ట్రాకింగ్‌ను ప్రధానంగా కంపెనీ ప్రస్తావిస్తోంది. వినియోగదారుడు నిద్రకు ఉపక్రమించగానే ఆటోమ్యాటిగ్గా స్లీప్ మోడ్‌లోకి మారుతుందని యాపిల్ తెలియజేసింది. ఇంకా యాపిల్ టీవీలకు వీడియో కెమెరాల ద్వారా డోర్‌బెల్ నోటిఫికేషన్స్ తదితర సౌకర్యాలను మెరుగుపరచినట్లు వివరించింది. -
ఇంటెల్‌కు త్వరలో యాపిల్ గుడ్‌బై?
ముంబై: టెక్ దిగ్గజాలు ఇంటెల్, యాపిల్ సంయుక్తంగా ప్రపంచానికి ఎన్నో కొత్త ఆవిష్కరణలు అందించాయి. ప్రస్తుతం కంప్యూటర్ తయారీలో యాపిల్ సంస్థ ఇంటెల్ మైక్రోప్రాసెసర్లను ఉపయోగిస్తుంది. అదే విధంగా యాపిల్ సంస్థ అత్యాధునిక చిప్‌లను రూపొందిస్తుంది. సొంతంగా ఎదగాలనే వ్యూహంతో మరో టెక్ దిగ్గజాం ఇన్‌టెల్‌తో విడిపోవాలని యాపిల్ సంస్థ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా త్వరలో యాపిల్ సంస్థ రూపొందించే సరికొత్త ఆవిష్కరణల ప్రణాళికను వివరిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా విభిన్న ఫీచర్లతో అత్యాధునిక స్మార్ట్‌ఫోన్(ఐఫోన్)లను రూపొందించి కోట్లాది వినియోగదారులను యాపిల్ ఆకట్టుకుంది. కానీ యాపిల్ సంస్థ సొంతంగా నిలదొక్కుకునే వ్యూహాలు రచిస్తుంది. ఇటీవల ట్రక్కుల తయారీలో ఈకామర్స్ దిగ్గజం అమోజాన్ ప్రవేశించిన విషయం విదితమే. మరోవైపు అన్ని దేశాల సాంకేతికతలను ఉపయోగించుకొని సరికొత్త ఆవిష్కరణలకు యాపిల్ సంస్థ వ్యూహాలు రచిస్తుంది. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఐఫోన్లకు సరికొత్త చిప్‌ల ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. మరోవైపు అత్యాధునిక సాంకేతికతతో దిగ్గజ కంపెనీలు సొంతంగా ఎదగాలనే వ్యూహాలు రచిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: శాంసంగ్‌కు బై, ఆపిల్‌కు సై : వారెన్ బఫెట్) -
యాపిల్ స్టోర్స్ బంద్- డోజోన్స్ డౌన్
మరోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లు ఊగిసలాటకు లోనయ్యాయి. హెచ్చుతగ్గుల మధ్య అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్ 209 పాయింట్లు(0.8 శాతం) క్షీణించి 25,871కు చేరగా..ఎస్అండ్పీ 18 పాయింట్లు(0.6 శాతం) వెనకడుగుతో 3,098 వద్ద స్థిరపడింది. అయితే నాస్డాక్ 3 పాయింట్ల నామమాత్ర లాభంతో 9,9436 వద్ద స్థిరపడింది. యూరోపియన్ మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్, యూకే 0.4-1 శాతం మధ్య బలపడ్డాయి. ఇక ఆసియాలో చైనా, హాంకాంగ్, జపాన్, కొరియా, ఇండొనేసియా 1-0.4 శాతం మధ్య పుంజుకోగా.. సింగపూర్ 1.2 శాతం, థాయ్‌లాండ్ 0.2 శాతం మధ్య బలహీనపడ్డాయి. తైవాన్ యథాతథంగా ముగిసింది. నాస్డాక్ జోరు గత వారం డోజోన్స్ నికరంగా 1 శాతం లాభపడగా.. ఎస్అండ్పీ దాదాపు 2 శాతం ఎగసింది. టెక్ దిగ్గజాల అండతో నాస్డాక్ మరింత అధికంగా 3.7 శాతం జంప్‌చేసింది. కాగా.. ఫిబ్రవరిలో సాధించిన చరిత్రాత్మక గరిష్టాలకు డోజోన్స్ 8.5 శాతం, ఎస్అండ్పీ 12.5 శాతం దూరంలో నిలవగా.. నాస్డాక్ 1.3 శాతం సమీపంలో ముగిసింది. యాపిల్ స్టోర్లు బంద్ ఇటీవల ఫ్లోరిడా, ఆరిజోనా, ఉత్తర, దక్షిణ కరోలినాలలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కొన్ని ప్రాంతాలలో స్టోర్లను మూసివేస్తున్నట్లు ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ పేర్కొంది. దీంతో యాపిల్ షేరు స్వల్పంగా 0.5 శాతం నీరసించింది. కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్న ఆందోళనలతో థియేటర్ల నిర్వాహక సంస్థ ఏఎంసీ ఎంటర్టైన్మెంట్ హోల్డింగ్స్ 2 శాతం క్షీణించింది. ఈ ఆందోళనలతో క్రూయిజర్ కంపెనీలు నార్వేజియన్, కార్నివాల్ 5 శాతం చొప్పున పతనంకాగా.. రాయల్ కరిబ్బియన్స్ 7 శాతం జారింది. ఈ బాటలో రిటైల్ దిగ్గజాలు, వియానయాన కంపెనీలు నార్డ్‌స్ట్రామ్, కోల్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా 6-4 శాతం మధ్య తిరోగమించాయి. బ్యాంక్స్ ప్లస్ అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్ (ఏడీఆర్)లో వారాంతాన అత్యధిక శాతం లాభాలతో ముగిశాయి. టాటా మోటార్స్(టీటీఎం)3.5 శాతం జంప్‌చేసి 6.6 డాలర్ల వద్ద నిలవగా.. ఐసీఐసీఐ బ్యాంక్(ఐబీఎన్) 2.5 శాతం ఎగసి 9.47 డాలర్ల వద్ద స్థిరపడింది, హెచ్డీఎఫ్సీ బ్యాంక్(హెచ్డీబీ) 2.15 శాతం పుంజుకుని 44.69 డాలర్లను తాకగా.. వేదాంతా(వీఈడీఎల్) 3.7 శాతం పతనమై 5.44 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర కౌంటర్లలో విప్రో లిమిటెడ్ 1.2 శాతం నీరసించి 3.3 డాలర్లకు చేరగా.. ఇన్ఫోసిస్ 0.7 శాతం వెనకడుగుతో 9.16 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ బాటలో డాక్టర్ రెడ్డీస్ 0.2 శాతం బలహీనపడి 53.18 డాలర్ల వద్ద నిలిచింది. -
యూఎస్ మార్కెట్ల హైజంప్- ఉపాధి పుష్
వారాంతాన యూఎస్ మార్కెట్లు హైజంప్ చేశాయి. కోవిడ్-19 విసురుతున్న సవాళ్లను అధిగమించి మే నెలలో ఏకంగా 2.5 మిలియన్ ఉద్యోగాల కల్పన జరిగినట్లు వెల్లడికావడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. వెరసి శుక్రవారం డోజోన్స్ 829 పాయింట్లు(3.2 శాతం) దూసుకెళ్లి 27,111 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 82 పాయింట్లు(2.6 శాతం) జంప్‌చేసి 3,194 వద్ద స్థిరపడింది. నాస్డాక్ 198 పాయింట్లు(2 శాతం) క్షీణించి 9,814 వద్ద ముగిసింది. కోవిడ్-19 సమస్యలకు ఎదురొడ్డి ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోగలదన్న ఆశలతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో నాస్డాక్ 9,846కు ఎగసింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. ఫిబ్రవరి 19న క్లోజింగ్ రికార్డ్ 9,817కు సమీపంలో ముగిసింది. ఈ బాటలో ఎస్అండ్పీ ఇండెక్స్ రికార్డ్ గరిష్టానికి 6 శాతం చేరువలో నిలిచింది. మే నెలలో వ్యవసాయేతర రంగంలో 2.5 మిలియన్ మందికి ఉద్యోగాలు లభించినట్లు కార్మిక శాఖ పేర్కొంది. నిజానికి 8 మిలియన్లమంది ఉపాధి కోల్పోతారని అంచనా వేశారు. దీంతో నిరుద్యోగిత 13.3 శాతానికి పరిమితమైంది. తొలుత 19.5 శాతంగా అంచనాలు వెలువడ్డాయి. గత వారం జోరు శుక్రవారంతో ముగిసిన గత వారం నాస్డాక్ 3.4 శాతం జంప్‌చేయగా.. ఎస్అండ్పీ 4.7 శాతం, డోజోన్స్ 6.8 శాతం చొప్పున దూసుకెళ్లాయి. కాగా.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ షేరు 77 శాతం, బోయింగ్ ఇంక్ 41 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. వారాంతాన ఒక్క రోజే బోయింగ్ ఇంక్ 11 శాతం జంప్‌చేసింది. ఇక ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ షేరు 3 శాతం ఎగసి 332 డాలర్లకు చేరింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా..మార్చి నుంచీ ఈ షేరు 50 శాతం పురోగమించడం విశేషం! ఈ బాటలో కోక కోలా, చెవ్రాన్, ఎక్సాన్ మొబిల్, వాల్ట్ డిస్నీ, కేటర్పిల్లర్ సైతం మార్కెట్లకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫాంగ్ అండ నాస్డాక్ ర్యాలీకి ప్రధానంగా ఫాంగ్(FAANG) స్టాక్స్.. యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అల్ఫాబెట్, ఫేస్బుక్ సహకరించాయి. ప్రస్తుతం వీటి మొత్తం మార్కెట్ కేపిటలైజేషన్ 5.7 లక్షల కోట్ల డాలర్లను అధిగమించడం విశేషం! ఈ బాటలో నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ క్యాప్ 185 బిలియన్ డాలర్లను తాకింది. ఈ షేరు 2020లో ఇప్పటివరకూ 30 శాతం ర్యాలీ చేసింది. టాటా మోటార్స్ దూకుడు వారాంతాన అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్ (ఏడీఆర్)జోరు చూపాయి. టాటా మోటార్స్(టీటీఎం) 11.5 శాతం దూసుకెళ్లి 7.45 డాలర్లను తాకగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్(హెచ్డీబీ) 5 శాతం జంప్‌చేసి 47.61 డాలర్లకు చేరింది. ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంక్(ఐబీఎన్) 5 శాతం ఎగసి 9.77 డాలర్ల వద్ద నిలవగా.. వేదాంతా(వీఈడీఎల్) 1.8 శాతం బలపడి 5.65 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర కౌంటర్లలో ఇన్ఫోసిస్ 1.2 శాతం పుంజుకుని 9.38 డాలర్ల వద్ద, విప్రో 0.6 శాతం లాభంతో 3.33 డాలర్ల వద్ద, డాక్టర్ రెడ్డీస్(ఆర్డీవై) 0.15 శాతం బలపడి 53.04 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. -
యాపిల్ ఐఫోన్12 ధరలు లీక్!
కాలిఫోర్నియా: కరోనా మహమ్మారితో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినా ఐఫోన్12 సిరీస్‌ని ఈ ఏడాది తీసుకురావాలని ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థ ఆపిల్ భావిస్తోంది. ఐఫోన్12 సిరీస్‌పై యాపిల్ ప్రేమికుల్లో భారీ అంచనాలున్నాయి. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ లాంచ్ తేదీలను ముందుగానే తెలిపిన జోన్ ప్రోసర్, ఇప్పుడు ఐఫోన్ 12 ధరలను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. జోన్ ప్రోసర్ తెలిపిన వివరాల ప్రకారం... ఐఫోన్12 సిరీస్ ధరలు 5.4 ఐఫోన్ 12 డీ52జీ ఓఎల్ఈడీ/5జీ రెండు కెమెరాలు 649 డాలర్లు(దాదాపు. రూ.48,931) 6.1 ఐఫోన్ 12 డీ53జీ ఓఎల్ఈడీ/5జీ 2కెమెరాలు 749డాలర్లు(దాదాపు. రూ.56,470) 6.1 ఐఫోన్ 12 ప్రో డీ53పీ ఓఎల్ఈడీ/5జీ 3 కెమెరాలు+ లిడార్ 999 డాలర్లు(దాదాపు. రూ.75,319) 6.7 ఐఫోన్ 12 ప్రో మాక్స్ డీ54పీ ఓఎల్ఈడీ/5జీ 3 కెమెరాలు+ లిడార్ 1099 డాలర్లు(దాదాపు. రూ.82,5011) Been seeing some reports speculating on iPhone 12 prices, so I asked my sources 👇 5.4 iPhone 12 D52G OLED / 5G 2 cam $649 6.1 iPhone 12 D53G OLED / 5G 2 cam $749 6.1 iPhone 12 Pro D53P OLED / 5G 3 cam + LiDAR $999 6.7 iPhone 12 Pro Max D54P OLED / 5G 3 cam + LiDAR $1,099 — Jon Prosser (@jon_prosser) April 30, 2020 -
కొత్త ఐఫోన్ ఎస్ఈ వచ్చేసింది
-
యాపిల్ ఐఫోన్ ఎస్ఈ వచ్చేసింది..
సాక్షి, న్యూఢిల్లీ : ఎప్పటినుంచో ఊరిస్తున్న యాపిల్ ఐఫోన్ ఎస్ఈ (2020)ని కంపెనీ విడుదల చేసింది. 'జనాదరణ పొందిన డిజైన్‌లో శక్తివంతమైన కొత్త స్మార్ట్‌ఫోన్' గా యాపిల్ ప్రకటించింది. హాప్టిక్ టచ్ సపోర్ట్ అనే కొత్త ఫీచర్ తో లాంచ్ చేసిన ఐఫోన్ ఎస్ఈ(2020) ధర మన దేశంలో రూ.42,500 (64 జీబీ వేరియంట్) నుంచి ప్రారంభం కానుంది. ఇది మాత్రమే కాకుండా 128 జీబీ, 256 జీబీ వేరియంట్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. డిజైన్ పరంగా ఐఫోన్ 8ను పోలిన లేటెస్ట్ ఐఫోన్ లో ఫేస్ ఐడీకి బదులుగా టచ్ ఐడీ బటన్ అందించింది. ఎరుపు, నలుపు, తెలుపు మూడు రంగుల్లో లభ్యం కానున్నాయి. అయితే వీటి ధరలను అధికారికంగా ఆపిల్ ప్రకటించలేదు. అలాగే మనదేశంలో ఎప్పటినుంచి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేదీ స్పష్టత ఇవ్వలేదు. కానీ అమెరికాలో మాత్రం తక్కువ ధరకే ఈ ఫోన్ ను లాంచ్ చేసింది కంపెనీ. అమెరికాలో 64 జీబీ మోడల్ ఐఫోన్ ఎస్ఈ ధర 399 డాలర్ల(సుమారు రూ.30,500) నుంచి ప్రారంభం కానుంది. 128 జీబీ మోడల్ ధరను 499 డాలర్లు (సుమారు రూ.34,400) గానూ, 256 వేరియంట్ ధరను 549 డాలర్లు(సుమారు రూ.45,000) గానూ నిర్ణయించింది. ఇండియాలో అయితే 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 47,800 గాను, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 58,300 గా వుంటుందని అంచనా. ఐఫోన్ ఎస్ఈ(2020) ఫీచర్లు 4.7 అంగుళాల రెటీనా హెచ్ డీ ఎల్సీడీ డిస్ ప్లే 750x1334 పిక్సెల్స్ రిజల్యూషన్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 7 ఎంపీ సెల్ఫీ కెమెరా -
శాంసంగ్‌కు బై, ఆపిల్‌కు సై : వారెన్ బఫెట్
వారెన్ బఫెట్.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో నెం. 1 స్థానంలో ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం దాదాపు 88 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో బఫెట్ మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం బిలియనీర్ వారెన్ బఫెట్ ఓ అద్భుతం చేశాడు. ఆపిల్ పెట్టుబడిదారుడుగా ఉన్న ఆయన ఎట్టకేలకు స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అయ్యారు. అదీ శాంసంగ్‌కు బై చెప్పి, ఆపిల్ ఐ ఫోన్‌ను తీసుకోవడం విశేషం. సుదీర్ఘ కాలం నుంచి ఆయన ఉపయోగిస్తున్న శాంసంగ్ హెవెన్ ఫ్లిప్ ఫోన్‌ను పక్కకు పడేసి తాజాగా ఐఫోన్ 11 తీసుకున్నారు. అయితే ఐఫోన్ 11లో ఏ రకం మోడల్ ఉపయోగిస్తున్నారనేది మాత్రం చెప్పలేదు.(యాపిల్‌కూ ‘వైరస్’) ఇప్పటికే ఆపిల్ సంస్థలో 5.6 శాతం వాటాను బఫెట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీని విలువ 70 బిలియన్లు. ఇప్పటి వరకు ఫ్లిప్ ఫోన్‌ను ఉపయోగించిన బఫెట్ ప్రస్తుతం దానిని వాడటం లేదని స్మార్ట్ ఫోన్‌ను స్వీకరిస్తున్నానని వెల్లడించారు. నా ‘ఫ్లిప్ ఫోన్ శాశ్వతంగా పోయింది’ ఆయన అని పేర్కొన్నారు. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ దీనిపై స్పందించారు. చాలా కాలం నుంచి బఫెట్‌కు కొత్త ఫోన్ కొనాలని సూచించానని.. ఇప్పుడు ఆయన ఐఫోన్ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా కొత్త ఐఫోన్ కొన్నా కేవలం ఫోన్ కాల్స్ చేయడానికి ఉపయోగిస్తానని, అందులోని ఆప్షన్ల జోలికి వెళ్లనని వారెన్ బఫెట్ తెలిపారు. బఫెట్ వద్ద ప్రస్తుతం ఐపాడ్ కూడా ఉంది. దానిని పరిశోధన కొరకు, స్టాక్ మార్కెట్ ధరలను చూసుకోడానికి వాడుతానని ఆయన పేర్కొన్నారు. చదవండి : (ఆపిల్ సీఈవోకు వేధింపులు, ఫిర్యాదు) -
యాపిల్‌కూ ‘వైరస్’
శాన్ఫ్రాన్సిస్కో/క్యూపర్టినో: కోవిడ్–19(కరోనా) వైరస్ ప్రభావం ఆపిల్ కంపెనీపై పడింది. ఈ మార్చి క్వార్టర్లో ఆదాయ అంచనాలను అందుకోలేమని ఐఫోన్స్ తయారు చేసే యాపిల్ కంపెనీ సోమవారం వెల్లడించింది. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా చైనాలో ఐఫోన్ల తయారీ దెబ్బతిన్నదని, ఫలితంగా తగిన స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లను సరఫరా చేయలేమని తెలిపింది. అంతేకాకుండా చైనాలో యాపిల్ స్టోర్స్‌ను కొన్ని రోజులు మూసేశామని, అమ్మకాలు, డిమాండ్ కూడా తగ్గాయని వివరించింది. స్టోర్స్ కొన్నింటిని తెరచినప్పటికీ, కొనుగోళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయని తెలిపింది. ఈ అంశాలన్నీ ఆదాయంపై ప్రభావం చూపగలవని పేర్కొంది. ఆదాయ అంచనాలను అందుకోలేమని స్పష్టం చేసింది. ఈ మార్చి క్వార్టర్లో ఆదాయం 6,300 కోట్ల డాలర్ల నుంచి 6,700 కోట్ల డాలర్ల మేర (రూ.4.5–4.7 లక్షల కోట్లు)ఆదాయం రాగలదని యాపిల్ అంచనా వేసింది. ఐఫోన్లు అత్యధికంగా అమ్ముడయ్యే అతి పెద్ద మూడో మార్కెట్ చైనాయే. చైనా కాకుండా ఇతర మార్కెట్లలో అమ్మకాలు పటిష్టంగా ఉన్నాయని యాపిల్ పేర్కొంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు త్వరలోనే నెలకొనగలవని అంచనా వేశామని, ఈ అంచనాలు తప్పాయని పేర్కొంది. కాగా కరోనా కాటు యాపిల్పైనే కాకుండా ఇతర దిగ్గజ కంపెనీలపై కూడా పడింది. యాపిల్ సరఫరాదారు ఫాక్స్‌కాన్, వాహన దిగ్గజం టయోటా, స్పోర్ట్స్‌వేర్ కంపెనీలు నైకీ, ఆడిడాస్లు కూడా తమ ఆదాయంపై కరోనా ప్రభావం ఉండగలవని పేర్కొన్నాయి. -
ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త
సాక్షి,న్యూఢిల్లీ: ఐ ఫోన్ ప్రేమికులకు శుభవార్త. బడ్జెట్ ధరలో ఐఫోన్. అసలు ఈ మాటే...వినియోగదారులకు వీనుల విందైన మాటల మూట. ఐఫోన్లపై వినియోగదారుల క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆపిల్ కంపెనీ సన్నద్ధమవుతోంది. తక్కువ ధరలో ఐఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఈ ఏడాది మార్చి నాటికి ఈ ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో వచ్చేనెల ఫిబ్రవరి నుంచి ఈ కొత్త ఐఫోన్ విడిభాగాల అసెంబ్లింగ్‌ను ప్రారంభించనుంది.ఇందుకోసం హ్యాండ్సెట్ అసెంబ్లింగ్‌ను హాన్‌హయ్ ప్రీసీషన్ ఇండస్ట్రీ, పెగట్రాన్ కార్పోరేషన్, విస్ట్రన్ కార్పొరేషన్లకు అప్పగించింది. తద్వారా అటు వినియోగదారులకు ఆకట్టుకోవడంతోపాటు, భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత విస్తరించుకోవాలని ఆపిల్ భావిస్తోంది. ఐఫోన్ ఎస్ఈ తరువాత అతి తక్కువ ధరలో రానున్న మొదటి ఐఫోన్ మోడల్ ఇది కానుండటం విశేషం. 4.7అంగుళాల స్క్రీన్‌తో 2017లో వచ్చిన ఐఫోన్ 8 మాదిరిగానే ఉండనుందట. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్ల మాదిరిగానే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అమర్చనుంది. 2020లో మరిన్ని కొత్త ఫీచర్లు, 5 జీ కనెక్టివిటి, పాస్టర్ ప్రొసెసర్, 3డి బ్యాక్ కెమెరా లాంటి ఫీచర్లతో హైఎండ్ ఐ ఫోన్లను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. అలాగే 2020 లో 200 మిలియన్ యూనిట్లకు పైగా రవాణా చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఆపిల్. ఈ లక్ష్య సాధనలో రానున్న లోబడ్జెట్ ఐఫోన్ ముఖ్యమైన పాత్ర పోషించనుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి దీని ధరపై ఎలాంటి అంచనాలు లేవు. మరోవైపు ఈ వార్తలపై స్పందించడానికి ఆపిల్ ప్రతినిధి నిరాకరించారు. -
మీ ఐఫోన్ జాగ్రత్త!
అందరూ ముచ్చటగా కొనుక్కునే ఐఫోన్లు అంతర్జాతీయ ముఠాలకు టార్గెట్ అవుతున్నాయి. వాటిని లోకల్‌గా తస్కరించి విదేశాలకు తరలించేస్తున్నారు. తర్వాత సాంకేతికంగా ఆపిల్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను బాధితుడి నుంచే సంగ్రహించి, ఫోన్లను అన్‌లాక్ చేసి తిరిగి ఆన్లైన్లో విక్రయిచేస్తున్నారు. ఇలాంటి ఓ అంతర్జాతీయ ముఠా వ్యవహారాలపై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఉప్పందింది. వ్యవస్థీకృతంగా దందా సాగిస్తున్న వీరికి చెక్ పెట్టడానికి పోలీసుఅధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గడిచిన నెలన్నర రోజుల్లో ఏడుగురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఈ తరహా గ్యాంగ్ బారినపడి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా.. గురువారం పంజగుట్టకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మరో బాధితుడిగా మారానంటూపోలీసుల వద్దకు వచ్చారు. సెక్యూరిటీ పరంగా ఎంతో శక్తిమంతమైనదిగా పేరొందిన ‘ఐఫోన్’ హ్యాకింగ్ వెనుక అంతర్జాతీయంగా పెద్ద వ్యవహారమే జరుగుతోంది. సాక్షి, సిటీబ్యూరో: ఐఫోన్లను టార్గెట్‌గా చేసుకుని వాటిని తస్కరించి, సాంకేతికంగా యూపిల్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను బాధితుడి నుంచే సంగ్రహించి, అన్‌లాక్ చేసి ఆన్లైన్లో విక్రయిస్తున్న ఓ అంతర్జాతీయ ముఠా వ్యవహారాలపై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఉప్పందింది. వ్యవస్థీకృతంగా దందా సాగిస్తున్న వీరికి చెక్ చెప్పేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గడిచిన నెలన్నర రోజుల్లో ఏడుగురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఈ తరహా ముఠాల బారినపడి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా... గురువారం పంజగుట్టకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ చేసేది లోకల్ స్నాచర్లే... ఈ అంతర్జాతీయ ముఠాలు దళారుల ద్వారా స్థానికంగా ఉంటున్న దొంగలతోనే ఐఫోన్లు చోరీ చేయిస్తున్నాయి. పంజగుట్టకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి డ్యూటీలో భాగంగా బెంగళూరుకు వెళ్లి గత నెల 4న తిరిగి వచ్చాడు. యాప్రాల్‌లో ట్రావెల్స్ బస్సు దిగిన అతను సిటీ బస్సు ఎక్కాడు. టికెట్ తీసుకునే ప్రయత్నంలో ఉండగా ఓ వ్యక్తి అతడి జేబులో ఉన్న ఐఫోన్–10ను తస్కరించి బస్సు దిగి పరిగెత్తాడు. తన ఫోన్ చోరీకి గురైనట్లు గుర్తించిన బాధితుడు వెంటనే కండెక్టర్ నుంచి ఫోన్ తీసుకుని తన నంబర్‌కు కాల్ చేయగా, అప్పటికే అది స్విచ్ఛాఫ్ అయినట్లు గుర్తించాడు. చోరీ చేసిన వెంటనే అంత వేగంగా ఆధునిక ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేయగలిగాడంటే సదరు చోరుడికి ఆయా ఫోన్ల వినియోగంపై పట్టుందని పోలీసులు చెబుతున్నారు. పార్శిల్స్‌లో సరిహద్దులు దాటిస్తూ... ఈ దొంగల నుంచి చోరీ ఫోన్లు కొనేందుకు కొందరు సెకండ్ హ్యాండ్ వ్యాపారులు సిద్ధంగా ఉంటున్నారు. సిండికేట్‌గా ఏర్పడే వీరు నిర్ణీత సంఖ్యలో ఫోన్లు తమ వద్దకు చేరిన వెంటనే ‘ఎక్స్పోర్ట్’ పని మొదలెడుతున్నారు. నగరానికి రష్యా, చైనాల నుంచి వివిధ వస్తువుల దిగుమతి జరుగుతూ ఉంటుంది. ఇలా వచ్చిన వాటిలో కొన్ని వివిధ కారణాల నేపథ్యంలో రిటర్న్ అవుతాయి. ఇలాంటి వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుంటున్న చోరీ ఫోన్ల కొనుగోలుదారులు వాటితో కలిపి చోరీ సెల్ఫోన్లను ఆయా దేశాలకు తరలిస్తున్నారు. ఐ–ఫోన్లు చాలా సెక్యూర్డ్ అని, తస్కరణకు గురైనా వాటి ఆచూకీ కనిపెట్టవచ్చని, ఎవరైనా చేజిక్కించుకున్నా ఓపెన్ చేయలేరనే భావన అనేక మందిలో ఉంటోంది. అయితే ఈ అంతర్జాతీయ ముఠాలు సాంకేతిక పంథాను అనుసరిస్తూ వీటిని అన్‌లాక్ చేస్తున్నాయి. ఆ మెసేజ్ వద్దు ఐఫోన్ వినియోగదారులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఫోన్ పోగొట్టుకుంటే ఐక్లౌడ్‌లో బ్రాడ్ కాస్ట్ మెసేజ్ పెట్టినా ఇబ్బంది ఉండకపోవచ్చు. చోరీకి గురైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మెసేజ్ పెట్టరాదు. అలా చేస్తే నేరగాళ్లు హ్యాకర్ల సాయంతో వ్యక్తిగత వివరాలు సంగ్రహించడానికి అవకాశం ఇచ్చిన వారవుతారు. ఈ తరహా బాధితులు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు. పోలీసులను ఆశ్రయిస్తున్న వారంతా సాఫ్ట్వేర్ ఉద్యోగులే కావడం గమనార్హం. మీ ఫోన్ లొకేషన్ అంటూ హ్యాకర్లు పంపే లింకు కేవలం ఒకేసారి ఓపెన్ అవుతుంది. రెండోసారి ప్రయత్నిస్తే ‘డెసెప్టివ్ వెబ్సైట్ వార్నింగ్’ అంటూ డిస్ప్లే అవుతుంటుంది. ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. – సైబర్ క్రైమ్ పోలీసులు హ్యాకర్ల సాయంతో ఎస్ఎంఎస్లు.. ఇలా ఐఫోన్లు కోల్పోయిన బాధితులు వెంటనే ఐక్లౌడ్‌లోకి వెళ్లడం ద్వారా తమ ఫోన్‌ను ‘లాస్ట్ మోడ్’లో పెడుతూ ‘బ్రాడ్ కాస్ట్‌మెసేజ్’ టైప్ చేస్తున్నారు. దీంతో ఆ ఫోన్ ఎవరికి దొరికినా దాని స్క్రీన్‌పై ‘ఈ ఫోన్ నేను పోగొట్టుకున్నాను’ అనే సందేశంతో పాటు బాధితుడి ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. దీనిని ఇతర దేశాల్లో ఉంటున్న హ్యాకర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బల్క్ ఎస్సెమ్మెస్ సైట్స్‌ను హ్యాక్ చేయడం ద్వారా ఆయా బాధితుల నంబర్లకు సందేశాలు పంపుతున్నారు. ఈ మెసేజ్‌లో సెండర్ వివరాలు డిస్ప్లే అయ్యే చోట ఐక్లౌడ్‌ను పోలిన పేరు పెడుతున్నారు. పంజగుట్టకు చెందిన సదరు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు శనివారం ఇలాంటి సందేశమే వచ్చింది. ‘మీరు పోగొట్టుకున్న ఐఫోన్‌ను గుర్తించాం’ అంటూ ‘ఐసీఐఓయూడీ’ నుంచి మేసేజ్ వచ్చింది. కంగారులో సీ తర్వాత ఐ అక్షరాన్ని చూసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎల్గా భ్రమించారు. దీంతో ఐక్లౌడ్ నుంచి ఆ సందేశం వచ్చిందని భావించి అందులోని లింకును క్లిక్ చేశారు. నేరుగా హ్యాకర్ సైట్ ఓపెన్... ఇలా క్లిక్ చేసిన వెంటనే ఆ లింకు నేరుగా సదరు హ్యాకర్ సృష్టించిన ఐక్లౌడ్‌ను పోలిన సైట్‌కు చేరుతోంది. అందులో ఫోన్ లోకేషన్ తెలుసుకోవాలంటే యూపిల్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయమని కోరుతుంది. పంజగుట్టకు చెందిన ఇంజినీర్ అలా చేయడంతో ఈ వ్యక్తిగత వివరాలు కూడా చోరీకి గురైన ఫోన్‌ను చేజిక్కించుకున్న ముఠాకు చేరాయి. వీటి ఆధారంగా ఆయా ఫోన్లను ఈ ముఠాలు అన్ లాక్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకసారి అన్‌లాక్ అయిన తర్వాత వాటి ఐఎంఈఐ నెంబర్‌ను క్లోనింగ్ చేసి ఎక్కడా ట్రాక్ కాకుండా చేసి ఆన్లైన్లో భారత్ సహా ఇతర దేశాల్లో విక్రయిస్తున్నారు. క్లోనింగ్ సాధ్యం కాకపోతే రష్యా, చైనా తదితర విదేశాల్లో విక్రయిస్తున్నారు. ఐఎంఈఐ నంబర్ మారితే దేశంలో ఉన్నా ట్రాక్ చేయడం సాధ్యం కాదు. మారకపోయినా విదేశాల్లో ఉంటే మన పోలీసులు గుర్తించలేరు. ఈ కారణంగానే చోరీకి గురైన, కొన్నిసార్లు పోగొట్టుకున్న ఐ–ఫోన్లు ట్రాక్ కావట్లేదని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. -
మరింత సన్నటి ‘ఐప్యాడ్స్’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థ ఆపిల్ ఇప్పటివరకు లేనంత సన్నని (మందం తక్కువ) ఐపాడ్, మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లను తీసుకొస్తున్నట్లు ఆపిల్ కంపెనీ విశ్లేషకులు మింగ్ చీ క్యూ సూత్రప్రాయంగా మీడియాకు తెలియజేశారు. ఐపోడ్, మ్యాక్‌బుక్ ప్రోలలో ఆరు సన్నటి మోడళ్లు 2020 సంవత్సరానికి మార్కెట్లోకి వస్తాయని ఆయన చెప్పారు. ఇప్పటివరకు మందంగా 0.29 అంగుళాల మోడళ్లలో ఓ ఎల్ఈడీ లైట్లను ఉపయోగించగా, మందం తక్కువ సన్నటి మోడళ్లలో స్క్రీన్ డిస్ ప్లే కోసం చిన్న ఎల్ఈడీ లైట్లను, సన్నటి పిక్చల్స్‌ను ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. ఆరు సన్నటి మోడళ్లు వచ్చే ఏడాది ఏ నెలలో మార్కెట్లోకి వస్తాయో, వాటి ధర ఎంత ఉండవచ్చో మింగ్ చీ క్యూ వెల్లడించలేదు. సన్నటి మోడళ్లలో 16 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రోను రూపొందిస్తున్నట్లు మార్కెట్ వర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది. -
ఐఫోన్ లవర్స్‌కు నిరాశ : మూడురోజుల్లోనే..
సాక్షి, న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్. ఈ నెలలో లాంచ్ చేసిన యాపిల్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఈ నెల 20 నుంచి ప్రీ బుకింగ్ కోసం అందుబాటులో ఉన్న యాపిల్ ఐఫోన్ 11 వేరియంట్ అవుట్ ఆఫ్ స్టాక్‌గా నిలిచింది. అమెజాన్ ఇండియా, ప్లిప్‌కార్ట్‌లో ఇది ప్రీ ఆర్డర్‌కు లభించడంలేదు. కేవలం మూడు రోజుల్లో ఐఫోన్11 అవుట్ ఆఫ్ స్టాక్‌గా నిలవడం విశేషం. అయితే ఐఫోన్ 11 ప్రొ అమెజాన్‌లో మాత్రమే అందుబాటులోవుండగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే బుక్ అయిపోయాయి. ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ (256 జీబీ స్టోరేజ్) వేరియంట్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఆవిష్కరించిన ఐఫోన్ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లు దేశీయంగా ఈ నెల 23నుంచి ప్రీ బుకింగులను ఆరంభించగా, ఈ నెల 27నుంచి విక్రయానికి రానున్నసంగతి తెలిసిందే. -
భారత్‌లోకి ‘ఆపిల్’.. భారీగా పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అన్ని దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు భారత మార్కెట్ పట్ల ఆసక్తి చూపుతున్నాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ క్రమంలోనే ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్.. అతి పెద్ద వ్యాపార ప్రణాళికతో ఇక్కడ విస్తరించేందుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ సంస్థకు భారత్ ఎగుమతుల హబ్‌గా మారనుందన్నారు. ఇక తమ హయాంలోనే భారత్‌లోని మొబైల్ ఫ్యాక్టరీలు రెండు నుంచి 268కి చేరాయని చెప్పారు. మన దేశంలో బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆపిల్ సిద్ధమవుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఫండ్స్ పెట్టుబడుల్లో చిన్న పట్టణాల హవా న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ చిన్న పట్టణాల్లోని ఇన్వెస్టర్లనూ పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం పెట్టుబడులు ఆగస్ట్ చివరికి రూ.25.64 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం జూలై చివరికి ఉన్న రూ.24.53 లక్షల కోట్లతో పోలిస్తే 4 శాతం పెరిగాయి. దేశంలోని టాప్ 30 పట్టణాలు కాకుండా.. ఇతర పట్టణాల (బియాండ్ 30) నుంచి ఇన్వెస్టర్ల పెట్టుబడుల వాటా మొత్తం రూ.25.64 లక్ష కోట్లలో 15.3 శాతంగా ఉన్నట్టు ‘యాంఫి’ డేటా తెలియజేస్తోంది. జూలై చివరికి ఉన్న 14.48 శాతం నుంచి సుమారు ఒక్క నెలలోనే ఒక శాతం పెరిగింది. చిన్న పట్టణాలకూ విస్తరించే దిశగా సెబీ గత కొన్ని సంవత్సరాలుగా తీసుకొస్తున్న ఒత్తిడి ఫలితాలనిస్తోంది. ఫండ్స్ పెట్టుబడి ఆస్తుల్లో అత్యధికంగా 41.80 శాతం వాటాతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. వ్యక్తిగత ఇన్వెస్టర్ల వాటా 52.60 శాతంగా ఉంటే, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల వాటా 47.40 శాతంగా ఉంది. ఫండ్స్ పెట్టుబడులు చౌక: మార్నింగ్ స్టార్ కాగా, సెబీ తీసుకున్న చర్యలతో ఫండ్స్‌లో పెట్టుబడులు చౌకగా మారినట్టు మార్నింగ్‌స్టార్ నివేదిక పేర్కొంది. అప్‌ఫ్రంట్ కమీషన్లపై నిషేధం, ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే వ్యయ చార్జీలపై పరిమితులు వంటి అంశాలను ప్రస్తావించింది. -
‘ఐఫోన్ 11’ సేల్ 27 నుంచి..
న్యూఢిల్లీ: కాలిఫోర్నియాలో మంగళవారం అట్టహాసంగా విడుదలైన ‘ఐఫోన్ 11’ సిరీస్ స్మార్ట్‌ఫోన్ భారత ధరలను.. యాపిల్ కంపెనీ బుధవారం ప్రకటించింది. మొత్తం ఆరు రంగుల్లో లభ్యంకానున్న ‘ఐఫోన్ 11’ ధర ఇక్కడి మార్కెట్లో . రూ. 64,900 ప్రారంభం కానుంది. ‘ఐఫోన్ 11 ప్రో’ ప్రారంభ ధర రూ. 99,900 కాగా, ‘ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్’ భారత ధర రూ. 1,09,900 వద్ద నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈనెల 27 నుంచి ఇక్కడి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. యాపిల్ వాచ్ ధర రూ. 40,900 యాపిల్ ఐ వాచ్ సిరీస్ 5 (జీపీఎస్) ధర రూ. 40,900 నుంచి ప్రారంభం కానుండగా.. వాచ్ సిరీస్ 5 (జీపీఎస్ ప్లస్ సెల్యులార్) ధర రూ. 49,900 నుంచి ప్రారంభంకానున్నట్లు ప్రకటించింది. ఇక వీడియో గేమింగ్ సర్వీస్–ఆర్కేడ్ నెలవారీ ధర రూ. 99 వద్ద నిర్ణయించింది. ఐపాడ్ ధర రూ. 29,900. -
యాపిల్ స్పెషల్ ఈవెంట్ అదిరిపోయే ఫోటోలు
-
యాపిల్ ఐఫోన్ 11 వచ్చేసింది..
కాలిఫోర్నియా: ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న కొత్త ఐఫోన్లను యాపిల్ విడుదల చేసింది. ఐఫోన్ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్ అధునాతన స్మార్ట్ఫోన్లను యాపిల్ హెడ్‌క్వార్టర్స్ క్యుపర్టినోలోని స్టీవ్ జాబ్స్ ఆడిటోరియమ్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్లో ఆవిష్కరించారు. ఐఫోన్ 11 ఆరు రంగుల్లో లభ్యం కానున్నది. కొత్తగా గ్రీన్, పర్పుల్ రెడ్, యెల్లో రంగుల్లో లభించనున్నది. స్పెషల్ ఆడియో, డాల్బీ అట్మోస్ ఫీచర్, ఇరువైపులా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 6.1 లిక్విడ్ రెటినా డిస్ప్లే, స్లో మోషన్ సెల్ఫీలు, ఏ13 బయోనిక్ చిప్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఐఫోన్ 11 ధర 699 డాలర్ల నుంచి మొదలవుతుంది. యాపిల్ ఐ వాచ్ 5.. మరోపక్క, ఐవాచ్ సిరీస్ 5ను తీసుకొచ్చింది. మామూలు వాచ్‌లాగానే ఎప్పుడు డిస్ప్లే కంటికి కనిపించేలా ఐ వాచ్ సిరీస్ 5ను ఆవిష్కరించింది. ఈ వాచ్‌ల్లో కంపాస్‌ను కూడా అమర్చింది. ధర 399 నుంచి 499 డాలర్లు. ఏడో జనరేషన్ ఐప్యాడ్లను కూడా యాపిల్ ప్రవేశపెట్టింది. ధరలు 329 డాలర్ల నుంచి ప్రారంభమవుతాయి. వీటి అమ్మకాలు ఈ నెల 30 నుంచి మొదలవుతాయి. కొత్తగా వీడియో స్ట్రీమింగ్ సర్వీస్–యాపిల్ టీవీ, వీడియో గేమింగ్ సర్వీస్–ఆర్కేడ్లను అందుబాటులోకి తెచ్చింది. యాపిల్ టీవీ... నెట్‌ఫ్లిక్స్ తరహా స్ట్రీమింగ్ వీడియో సర్వీస్, ఆపిల్ టీవీని యాపిల్ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఆపిల్ టీవీ ద్వారా ఓఫ్రా విన్ఫ్రే, జెన్నిఫర్ అనిస్టిన్ తదితర స్టార్స్ నటించిన ఒరిజినల్ ప్రోగ్రామ్స్‌ను ప్రసారం చేస్తుంది. వంద దేశాల్లో ఈ సర్వీస్ నవంబర్ 1 నుంచి లభించనున్నది. నెలకు సబ్స్క్రిప్షన్ 4.99 డాలర్లు. కొత్త ఐఫోన్లు, ఐపాడ్లు కొన్నవాళ్లకు ఏడాది పాటు ఈ సర్వీస్‌ను ఉచితంగా అందిస్తారు. యాపిల్ ఆర్కేడ్ యాపిల్ కంపెనీ వీడియో గేమింగ్ సర్వీస్–ఆర్కేడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధర 4.99 డాలర్లు ఇది ఈ నెల 19 నుంచి అందుబాటులోకి వస్తుంది. కొత్తగా వంద గేమ్స్‌ను అందిస్తోంది. మన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ కూడా కొన్ని గేమ్స్‌ను అందిస్తుండటం విశేషం. సర్వీసులపై దృష్టి... ఐఫోన్ల అమ్మకాలు పడిపోవడంతో ఇప్పుడు యాపిల్ కంపెనీ సర్వీసులపై దృష్టి పెట్టిందని నిపుణులంటున్నారు. గత ఏడాది వరుసగా మూడు క్వార్టర్ల పాటు ఐఫోన్ల అమ్మకాలు పడిపోయాయి. గతంలో కొత్తది రాగానే పాత ఫోన్‌ను పక్కనపెట్టి, కొత్త ఫోన్ కోసం పరుగులు పెట్టేవాళ్లు. ఇప్పుడు సీన్ మారింది. కనీసం ఐఫోన్ యూజర్లలో చాలా మంది మూడేళ్లు దాటిన తర్వాతనే కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారని నిపుణులంటున్నారు. డివైస్ల అమ్మకాలు పడిపోతుండటంతో ఆపిల్ మ్యూజిక్, ఐక్లౌడ్, యాపిల్ టీవీ వంటి సర్వీసులపై యాపిల్ కంపెనీ దృష్టిని ఎక్కువగా పెడుతోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వచ్చేస్తోంది కొత్త ఐఫోన్
శాన్ ఫ్రాన్సిస్కో: త్వరలో కొత్త ఐఫోన్ వెర్షన్‌ను ప్రవేశపెట్టనుందన్న వార్తలకు ఊతమిస్తూ టెక్ దిగ్గజం యాపిల్ వచ్చే నెల 10న సిలికాన్ వేలీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ఇన్విటేషన్లు పంపింది. సాధారణంగా ఏటా క్రిస్మస్ షాపింగ్ సీజన్‌కు ముందు.. ఇలాంటి కార్యక్రమంలోనే యాపిల్ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ వస్తోంది. ఈసారీ సెప్టెంబర్ 10న జరిగే కార్యక్రమంలో ’ఐఫోన్ 11’ హ్యాండ్‌సెట్స్‌ను కూడా ఆవిష్కరించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం మూడు ఐఫోన్ 11 మోడల్స్‌ను ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్‌ని అప్‌గ్రేడ్ చేసి ఎక్స్ఎస్, ఎక్స్ఆర్ మోడల్స్‌ను కొత్త రూపంలో ఆవిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐఫోన్ ఎక్స్ఎస్ సిరీస్ స్థానంలో వచ్చే కొత్త ఐఫోన్ 11 మోడల్లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. -
ఇక ఐఫోన్ల ధరలు దిగి వచ్చినట్టే!
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సర్కార్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధలను సడలించింది. దీంతో అమెరికా, చైనా టెక్ కంపెనీలకు భారీ ఊరట లభించనుంది. ప్రధానంగా భారత వినియోగదారులకు విలాసవంతమైన ఆపిల్ ఫోన్లపై ఉన్న మోజు ఎక్కువే. తాజాగా ఎఫ్‌డీఐ నిబంధనల సవరణల నేపథ్యంలో ఇకమీద ఆపిల్ ఉత్పత్తులు తక్కువ ధరలకే కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు ఆపిల్ లాంటి కంపెనీలు సొంత ఆన్లైన్ స్టోర్ ద్వారా అమ్మకాలు చేపట్టే వెసులు బాటు లభించనుంది. ఆపిల్ కంపెనీ, ఐ ఫోన్లు, వాచ్‌లు, మాక్‌బుక్స్, ఇతర ఉత్పత్తులను విక్రయించేందుకు ఇప్పటి వరకు థర్డ్‌పార్టీ సంస్థలపై ఆధారపడిన సంగతి తెలిసిందే. కానీ, సింగిల్ బ్రాండ్ రిటైల్ వాణిజ్యంలో ప్రభుత్వం ఇటీవల ఎఫ్‌డీఐ నిబంధనల్ని సరళతరం చేసిన నేపథ్యంలో ఆపిల్ భారత మార్కెట్లోకి దూసుకు రానుంది. విదేశీ కంపెనీలకు 30 శాతం ప్రొడక్ట్‌లను ఇక్కడే తయారు చేయాలనే షరతు విధించింది గతంలో. కానీ భారత ప్రభుత్వం తాజా నిబంధనల ప్రకారం దీనికి కొంత సడలింపు ఇచ్చింది. అంటే వార్షికంగా 30 శాతం అనే నిబంధనను సవరించి..ఇకపై ఐదేళ్లకు సగటున 30శాతం సమీకరించినా సరిపోతుందని తెలిపింది. అలాగే ఆన్లైన్ విక్రయాలకు కూడా అనుమతినిచ్చింది. ఇంకా, ఐదేళ్ల ఎగుమతులను పరిగణనలోకి తీసుకునే ప్రస్తుత పరిమితిని తొలగించాలని ప్రతిపాదించారు. సింగిల్-బ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డిఐ కోసం దరఖాస్తు చేసుకున్న బ్రాండ్లు ఆన్లైన్ రిటైల్ సేల్స్‌ను ప్రారంభించవచ్చు. అయితే రెండేళ్లలో ఫిజికల్ స్టోర్‌ను తెరవాల్సి వుంటుంది. ఈ నిర్ణయంతో ఆపిల్లాంటి దిగ్గజ కంపెనీలు దేశంలో తమ మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు అవకాశం లభించినట్టే. ఈ క్రమంలోఅతి త్వరలోనే ఆపిల్ భారత్‌లో తన తొలి ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించనుందట. దీంతోపాటు వచ్చే ఏడాది నాటికి ఆపిల్ ముంబైలో తన రిటైల్ స్టోర్‌ను కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా భారతదేశంలో 140 రిటైల్ దుకాణాల ద్వారా తన ఫోన్లను విక్రయిస్తున్న ఆపిల్ ఎగుమతుల విషయంలో సుమారు 1.2శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది -
ఆపిల్ నుంచి ఆ కాంట్రాక్టర్ల తొలగింపు
శాన్ఫ్రాన్సిస్కొ: ప్రముఖ మొబైల్ తయారీదారు ఆపిల్‌కు ‘సిరి’ కాంట్రాక్టర్లు కొత్త తలనొప్పులు తీసుకొచ్చారు. దీంతో ఆపిల్ కంపెనీ ఐర్లాండ్‌లోని తమ సంస్థలో పని చేస్తున్న దాదాపు 300 కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. తమ వినియోగదారులకు చెందిన సున్నితమైన విషయాలను 'సిరి' పోగ్రామ్ కాంట్రాక్టర్లు రహస్యంగా విని, ఆపిల్ సేవలను దుర్వినియోగ పరచిన కారణంగా వారిని తొలగించడంతో యూరప్ వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశయైంది. ఆపిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్లు, వినియోగదారులు - సిరితో చేసిన సంభాషణలు విని అది ఇచ్చే రెస్పాన్స్‌లో అవసరమైన మార్పులు చేయాలి. కానీ వారు వినియోగదారులు మాట్లాడుకునే వ్యక్తిగత శృంగార సంభాషణలు, డ్రగ్స్, బిజినేస్ డీల్స్‌ను కాంట్రాక్టర్లు పదేపదే విన్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై దుమారం రేగడంతో ఆపిల్ కంపెనీ వెంటనే సిరి గ్రేడింగ్ ప్రోగ్రామ్‌ను నిలిపివేసి కాంట్రాక్టర్లపై కొరడా ఝళిపించింది. తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన ‘సిరి’ సేవలను కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేశారని, వాటిలో రికార్డైన సంభాషణలను రహస్యంగా వింటున్నారని ఓ ప్రజావేగు(విజిల్ బ్లోయర్) గార్డియన్ పత్రిక ద్వారా తెలపడంతో వినియోగదారులు షాక్‌కు గురయ్యారు. దీనిపై ఆపిల్ వివరణ ఇస్తూ ‘తమ కంపెనీ ప్రధానంగా వినియోగదారుని భద్రతకి ప్రాధాన్యం ఇస్తుందని, ఈ ఘటనపై వినియోగదారులను క్షమాపణలు కోరుతున్నామని’ తెలిపింది. అంతేకాక సదరు కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని వివరణ ఇచ్చింది. -
యాపిల్ ఛార్జింగ్ కేబుల్‌తో డాటా చోరీ..!
సాన్‌ఫ్రాన్సిస్కో: ఈ వార్త చదివాక ఇక మీదట వేరే వారికి డాటా కేబుల్ ఇవ్వాలన్నా.. తీసుకోవాలన్నా కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే.. చార్జింగ్ కేబుల్స్ కూడా డాటాను చోరీ చేస్తున్నాయట. నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం అంటున్నాడో హ్యాకర్. ఇప్పటికే అవసరం నిమిత్తం కొన్ని.. అలవాటుగా కొన్ని యాప్స్‌ని మొబైల్స్‌లో ఇన్స్టాల్ చేసుకుని.. మన వ్యక్తిగత సమాచారాన్ని మూడో వ్యక్తికి అందజేస్తున్నాం. చార్జింగ్ కేబుల్ కూడా ఇదే పని చేస్తుందంటున్నాడు సదరు హ్యాకర్. చెప్పడమే కాక స్వయంగా నిరూపించాడు కూడా. యాపిల్ యూఎస్బీ కేబుల్‌తో ఇలాంటి ప్రమాదం ఉందని హెచ్చరించాడు. దీని గురించి సదరు హ్యాకర్ వివరిస్తూ.. ‘ఈ కాలంలో చాలా మంది ఫ్లాష్ డ్రైవర్స్‌ని వారి డివైజ్‌కి కనెక్ట్ చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. అదే చార్జింగ్ కేబుల్ దగ్గరకు వచ్చే సరికి ఇలాంటి అనుమానాలేవి కలగవు. కానీ చార్జింగ్ కేబుల్ కూడా మీ డాటాను చోరీ చేస్తుంది. ఓ.ఎంజీ కేబుల్‌గా పిలవబడే యాపిల్ యూఎస్బీ లైటెనింగ్ కేబుల్ చూడ్డానికి సాధరణ చార్జింగ్ కేబుల్‌లానే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఈ కేబుల్‌ని మీ డివైజ్‌కు కనెక్ట్ చేశారనుకోండి. వితిన్ వైఫై రేంజ్లో హ్యాకర్ మీకు తెలియకుండా మీ డివైస్‌లోకి హానికరమైన పేలోడ్స్‌ని వైర్‌లెస్‌గా పంపించగల్గుతాడు’ అని వివరించాడు. ‘ఈ చార్జింగ్ కేబుల్‌లో ఉండే కమాండ్స్, స్క్రిప్ట్స్, పేలోడ్స్‌ను ఉపయోగిస్తూ.. హ్యాకర్ మీ వ్యక్తిగత డాటాను చోరీ చేస్తాడు. అంతేకాదు ఒకసారి ఈ కేబుల్‌ను మీ సిస్టంకు కనెక్ట్ చేశారంటే.. అటాకర్ ఆటోమెటిగ్గా మీ కంప్యూటర్ను లాగాఫ్ చేయడం.. ఆ తర్వాత మీరు ఎంటర్ చేసే పాస్‌వర్డ్‌ను కూడా తస్కరించడానికి అవకాశం ఉంది’ అంటున్నాడు సదరు హ్యాకర్. మరి దీనిపై యాపిల్ సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. -
ఐఫోన్ 11 ఆవిష్కరణ.. త్వరలోనే
అమెరికా స్మార్ట్‌పోన్ దిగ్గజం ఆపిల్ తన తదుపరి ఐఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనుందట. ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 11ను సెప్టెంబర్‌లో లాంచ్ చేయనుందని తాజా లీక్‌ల ద్వారా తెలుస్తోంది. సెప్టెంబర్ రెండవ వారంలో ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌ను 11 ప్రొ, 11 ఆర్, 11 మాక్స్ పేరుతో మూడు మోడళ్లలో లాంచ్ చేయనుంది. 5జీ టెక్నాలజీ అప్‌గ్రేడ్, ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి ఫీచర్లతో వీటిని తీసుకురానుందని సమాచారం. సాధారణంగా సెప్టంబరు మాసంలో తన ఫ్లాగ్షిప్ డివైస్‌లను లాంచ్ చేయడం ఆపిల్ ఆనవాయితీగా పాటిస్తూ వస్తోంది. ఈ సాంప్రదాయాన్ని గత రెండేళ్లుగా మిస్ అవుతూ వస్తోంది. 2017 లో, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ సెప్టెంబరులో విడుదల చేయగా , ఐఫోన్ ఎక్స్‌ను నవంబర్‌లో తీసుకొచ్చింది. అయితే 2018 లో, ఐఫోన్ ఎక్స్ సెప్టెంబరులో, లోయర్-ఎండ్ ఐఫోన్ ఎక్స్ అక్టోబర్‌లో ప్రారంభించింది. 2019లో మాత్రం సెప్టెంబర్ సెంటిమెంట్‌ను ఫాలో కావాలని ఆపిల్ భావిస్తోందట. మరోవైపు అమెరికా చైనా ట్రేడ్‌వార్ నేపథ్యంలో సెప్టెంబరు 1 నుంచి అమెరికాలో చైనా దిగుమతులపై 10శాతం సుంకాల విధింపు ప్రకటన చైనాలో ఆపిల్ విక్రయాలపై ప్రభావం చూపుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. తాజాగా సుంకాల విధింపును డిసెంబరు వరకు వాయిదా వస్తూ ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకుంది. -
ఐఫోన్లో క్రెడిట్ కార్డ్ సేవలు ఆరంభం
న్యూయార్క్: ఐఫోన్ యూజర్లు ‘ఆపిల్ కార్డ్’ సేవలను ఈ మంగళవారం నుంచి వినియోగించుకోవచ్చని టెక్ దిగ్గజం ఆపిల్ ప్రకటించింది. వాలెట్ యాప్ నుంచి క్రెడిట్ కార్డ్ కావాలని దరఖాస్తు చేసుకున్నవారికి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుందని వెల్లడించింది. గోల్డ్‌మన్ శాక్స్ భాగస్వామ్యంతో నూతనతరం ఆర్థిక సేవలకు శ్రీకారం చుట్టిన ఈ సంస్థ.. ఆపిల్ బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ సేవలను తొలుత అమెరికాలో ప్రారంభించనున్నట్లు వివరించింది. వీలైనన్ని సైన్–అప్స్‌ను పెంచడం ద్వారా కార్డు సేవలను విస్తరించాలనే ప్రణాళికలో ఉన్నట్లు తెలిపింది. సాధ్యమైనంత వరకు ఫీజుల భారాన్ని తగ్గించివేయనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. ఆపిల్ పే యాప్‌లో అభివృద్ధిచేసిన డిజిటల్ క్రెడిట్ కార్డు వినియోగంపై 2 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఉంటుంది. కార్డు ఆధారంగా సునాయాసంగా డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వీలు ఉందని, యూజర్లు ఫిజికల్ కార్డు కావాలని కోరితే కొంత రుసుము వసూలుచేసి కార్డును ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లు తెలిపింది. వెబ్సైట్ ఆప్షన్ లేదని స్పష్టంచేసింది. కార్డు నెంబర్, సంతకం, సీవీవీ సెక్యూరిటీ కోడ్ వంటి సంప్రదాయ ఫిజికల్ క్రెడిట్ కార్డ్‌ల మాదిరిగా వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేకుండా.. చిటికెలో చెల్లింపులు జరిగిపోయే డిజిటల్ కార్డును ఐఫోన్ యూజర్లకు అందించనున్నామని ఈ ఏడాది మార్చిలోనే కంపెనీ ప్రకటించింది. -
కొత్త సెక్యూరిటీతో ‘ఐఫోన్లు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన మొబైల్ ఫోన్లుగా ప్రసిద్ధి చెందిన ‘ఐఫోన్లు’ మరింత భద్రతతో వినియోగదారుల ముందుకు రాబోతున్నాయి. ‘అండర్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్’ సెన్సార్లతో ఐఫోన్లు 2021 నాటికి మార్కెట్లోకి వస్తున్నాయని ప్రముఖ పారిశ్రామిక విశ్లేషకుడు మింగ్ చీ కూ తెలిపారు. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు ఐఫోన్ల యాజమాన్యం 2017లోనే పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి అడపా దడపా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఐఫోన్ల భద్రతకు ఇంతకుముందు ‘టచ్ఐడీ’ పద్ధతి ఉండేది. స్క్రీన్కు దిగువన సెట్పైన ఫింగర్ ప్రింట్ ద్వారా ఫోన్‌ను లాక్, అన్‌లాక్ చేసే వెసులుబాటు ఉండేది. ఆ తర్వాత ఐఫోన్లతో ‘ఫేస్ఐడీ’ పద్ధతి వచ్చింది. ఆ తర్వాత 8 ప్లస్ సిరీస్ నుంచి ఈ ఫింగర్ ఐడీని తీసివేసి ఒక్క పేస్‌ఐడితో ఐఫోన్లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ‘ఇన్‌స్క్రీన్ ఫింగర్ ప్రింట్ ఐడీ (స్క్రీన్ మీద వేలి ముద్రను రిజిస్టర్ చేయడం ద్వారా)’ సౌకర్యంతో ఐఫోన్లు వస్తున్నాయట. ఈ పద్ధతిని చైనా సంస్థ అప్పో ‘రెనో హాండ్ సెట్’ను ఇదే సౌకర్యంతో తీసుకొచ్చింది. ఆ తర్వాత శ్యామ్‌సంగ్, షావోమీ, హూవీ కంపెనీలు తీసుకొచ్చాయి. -
అతను మాయ చేసేవాడు
వాషింగ్టన్: ప్రత్యర్థి సంస్థ యాపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ సారథ్య నైపుణ్యాలపై టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపి, సుదీర్ఘంగా గంటల కొద్దీ పనిచేసేలా మాయ చేయడంలో జాబ్స్ ఆరితేరిన వ్యక్తని కితాబిచ్చారు. అథఃపాతాళంలోకి జారిపోతున్న యాపిల్‌ను మళ్లీ నిలబెట్టి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా నిలిపిన జాబ్స్ 2011లో క్యాన్సర్‌తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ‘అతను మాట్లాడుతుంటే అందరూ మంత్ర ముగ్ధులైపోవడం నేను చూశాను. అయితే, నేను కూడా ఒక చిన్న పాటి మంత్రగాణ్ని కావడంతో ఆయన మాయలు, మంత్రాలేవీ నా మీద ప్రభావం చూపేవి కావు‘ అని ఒక ఇంటర్వ్యూలో గేట్స్ పేర్కొన్నారు. టాలెంట్‌ను గుర్తించడంలోను, వారిలో స్ఫూర్తి నింపడంలోనూ జాబ్స్‌ను మించినవారెవరూ ఇప్పటిదాకా తనకు కనిపించలేదని చెప్పారు. -
అది ఆపిల్ పండు కాదమ్మా.. ఆపిల్ కంపెనీ!
-
అది ఆపిల్ పండు కాదమ్మా.. ఆపిల్ కంపెనీ!
లైవ్ టీవీలో చర్చ నడుస్తోంది. చర్చలో మాట్లాడుతున్న విశ్లేషకుడు యాపిల్ గురించి ఉదాహరణగా చెప్పాడు. ఆపిల్ బిజినెస్ మన దేశ బడ్జెట్ కంటే కూడా ఎన్నోరెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పాడు. దానికి, ‘ఔనౌను.. ఆపిల్ పండ్ల బిజినెల్ చాలా బాగా జరుగుతోందట. ఆపిల్ పండ్లలో ఎన్నో వెరైటీలు కూడా ఉంటాయంటూ ఆ విశ్లేషకుడితోపాటు టీవీ చూస్తున్న జనాలకు షాక్ ఇచ్చింది ఓ టీవీ యాంకర్. పాకిస్తాన్‌కు చెందిన ఓ టీవీ చానెల్లో చర్చ సందర్భంగా ఈ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. టీవీలో లైవ్ చర్చకు వచ్చిన ప్యానలిస్ట్.. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ.. పాక్ బడ్జెట్ కంటే కూడా యాపిల్ బిజినెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. దీనికి ఆపిల్ అంటే పండు అనుకున్నయాంకర్ ఇచ్చిన బదులు ఇప్పుడు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో సెటైర్లు, జోకులు వెళ్లువెత్తుతున్నాయి. పాక్ టీవీ చర్చలు ఇలానే కామెడీగా ఉంటాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
గాడ్జెట్ లవర్ మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆపిల్ఫోన్ అంటే పడిచచ్చేవాళ్లు చాలా మందే ఉంటారు. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆపిల్‌కు అభిమానే. సోషల్‌మీడియాలో ఆక్టీవ్‌గా ఉండే మోదీ గాడ్జెట్ల పట్ల తనకున్న అభిమానాన్ని చాలా సార్లు బహిరంగంగానే చాటుకున్నారు. 2018లో చైనా, దుబాయ్ దేశాల పర్యటన సమయంలో ఆపిల్ ఐఫోన్ 6 సిరీస్ స్టోర్లను సైతం సందర్శించారు. మోదీ డిజిటల్ ఇండియా చొరవతోనే భారతదేశంలో స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగింది. 2019 సంవత్సరానికి గానూ భారత్ ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో రెండవ స్థానంలో నిలిచింది. 2014లో కేవలం రెండు మొబైల్ యూనిట్ల తయారీ ప్లాంట్ల నుంచి నేడు 268 తయారీ యూనిట్లకు ఎదిగి స్మార్ట్ఫోన్ల తయారీలోదూసుకుపోతోంది. అందుకే మోదీ కేవలం చేతిలోని ఫోన్‌తో కోట్ల ప్రజలతో నిరంతరం తన భావాలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మోదీని 110 మిలియన్లు ఫాలో అవుతున్నారు. ఇక ట్విటర్ యుద్ధాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ట్రంప్ సైతం స్మార్ట్‌ఫోన్ ప్రియుడే. ఈయనని ప్రపంచవ్యాప్తంగా 96 మిలియన్ల మంది సోషల్‌మీడియాలో ఫాలో అవుతున్నారు. ఆపిల్‌కు ఒక్క మోదీయే కాదు ఆయన కేబినెట్ మంత్రులు సైతం అభిమానులే. ముఖ్యంగా ప్రభుత్వంలో నెంబర్ 2 గా ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆపిల్ ఎక్స్ఎస్ను వాడుతున్నారు. ఈయనకు ట్విటర్లో 14 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఐఫోన్, ఆండ్రాయిడ్లు రెండూ వాడుతున్నారు. ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తన స్మార్ట్‌ఫోన్ ద్వారా సోషల్‌మీడియాలో ప్రజలకు అందుబాటులో ఉంటోంది. ఇక నర్మగర్భ వ్యాఖ్యలతో ఎన్నికల ఫలితాల వరకూ హడావుడి చేసిన నితిన్ గడ్కరీకి 5.15 మిలియన్ల ఫాలోవర్లు ట్విటర్లో ఉన్నారు. ఇలా ప్రముఖులు అందరూ అరచేతితో ప్రపంచాన్ని పలకరిస్తూ బిజీగా ఉంటున్నారు. -
ఐట్యూన్స్‌కు యాపిల్ గుడ్‌బై..
శాన్ జోస్: ఆన్లైన్ మ్యూజిక్ రూపురేఖలు మార్చేసిన ఐట్యూన్స్ యాప్ ఇకపై కనుమరుగు కానుంది. దీని స్థానంలో మూడు యాప్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు టెక్ దిగ్గజం యాపిల్ ప్రకటించింది. యాపిల్ మ్యూజిక్, పాడ్‌కాస్ట్స్ యాపిల్ టీవీ ఇందులో ఉంటాయని వివరించింది. 2001లో తొలిసారిగా ఐట్యూన్స్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఇంటర్నెట్ మాధ్యమంగా మ్యూజిక్, ఆన్ డిమాండ్ వీడియోలు మొదలైనవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. తాజాగా ఐట్యూన్స్‌ను మూడు వేర్వేరు యాప్‌ల కింద తీసుకురావడం ద్వారా ఈ ఏడాదే ప్రవేశపెట్టబోయే టీవీప్లస్ సర్వీసులకు మరిన్ని హంగులు అద్దేందుకు యాపిల్ ప్రయత్నిస్తోంది. యాపిల్ టీవీ యాప్‌ను స్మార్ట్ టెలివిజన్స్‌లో పొందుపర్చడంతో పాటు రోకు, అమెజాన్ ఫైర్ టీవీ మొదలైన థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ల్లో కూడా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రెగ్ ఫెడరిగి తెలిపారు.