APSRTC
-
‘ఎక్స్‌ప్రెస్’ బస్సుల్లో ఉచితం ఇవ్వాలా వద్దా!?
సాక్షి, అమరావతి : మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రధానంగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలుచేయాలా వద్దా అనే అంశంపై సందిగ్థతతో కొట్టుమిట్టాడుతోంది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులకే ఈ పథకాన్ని పరిమితంచేస్తే ఎలా ఉంటుంది?.. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తే ఎలా ఉంటుంది?.. అనే దానిపై తర్జనభర్జన పడుతోంది. ప్రభుత్వ పెద్దల ఉద్దేశం గ్రహించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ రెండు రకాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. అయినా.. ఇటీవల సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోలేకపోవడం గమనార్హం. ఎన్నికల హామీని నీరుగార్చేదెలా.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలుచేస్తామనే టీడీపీ కూటమి ఎన్నికల్లో హామీ ఇచి్చంది. దీని ప్రకారం.. అన్ని కేటగిరీల బస్సుల్లో ఉచితంగా అమలుచేయాలి. కానీ, ఈ పథకాన్ని నీరుగార్చేందుకే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యత్నిస్తోంది. అందుకే ఈ తరహా పథకాన్ని అమలుచేస్తున్న ఇతర రాష్ట్రాల్లో పర్యటనల పేరుతో ఏడు నెలలుగా కాలయాపన చేసింది. ముందు అధికారుల బృందాలు పర్యటించి నివేదిక సమర్పించాయి. అయినాసరే మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించి మరోసారి పర్యటనలతో కాలం వెళ్లదీశారు. ఆగస్టు 15 నుంచి ఓసారి.. కాదు దసరా నుంచి అని మరోసారి చెప్పుకొచ్చారు.సంక్రాంతికి కూడా ఈ పథకాన్ని ప్రారంభించడంలేదని తాజాగా వెల్లడించి ఉగాదికి వాయిదా వేశారు. తీరా ఇటీవల సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెండు రకాల ప్రతిపాదనలపై చర్చించడం గమనార్హం. కేవలం పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులకే పరిమితంచేస్తే ఎంత భారంపడుతుంది.. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం అమలుచేస్తే ఎలా ఉంటుందని చర్చించారు.ఆ మూడు రాష్ట్రాలు నిధుల కేటాయింపు ఇలా.. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల్లో ఎక్స్‌ప్రెస్ సర్వీసులతో సహా అన్ని కేటగిరీల సర్వీసుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలుచేస్తున్నాయి. అందుకోసం ఏటా తమిళనాడు ప్రభుత్వం రూ.6,396 కోట్లు, కర్ణాటక ప్రభుత్వం రూ.5,015 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం రూ.4,084 కోట్లు కేటాయిస్తున్నాయి. కానీ, ఆ స్థాయిలో నిధుల కేటాయింపుపై టీడీపీ కూటమి ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. అందుకే ఈ పథకాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తోంది.ఎక్స్‌ప్రెస్ బస్సులతో సహా అన్ని బస్సుల్లో పథకాన్ని అమలుచేయాలంటే.. » ఏడాదికి ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు: రూ.3,182 కోట్లు » నెలకు కేటాయించాల్సింది : రూ.265 కోట్లు » ఉచిత ప్రయాణానికి కేటాయించాల్సిన బస్సుల సంఖ్య : 8,193 » కొత్తగా కొనాల్సిన బస్సుల సంఖ్య : 2,045 » కొత్తగా నియమించాల్సిన ఉద్యోగులు : 11,479 (డ్రైవర్లు, కండక్టర్లు, నిర్వహణ సిబ్బంది)పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులకే ఈ పథకాన్ని పరిమితం చేస్తే.. » ఏడాదికి ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు : రూ.2,122 కోట్లు » నెలకు కేటాయించాల్సింది : రూ.177 కోట్లు » ఉచిత ప్రయాణానికి కేటాయించాల్సిన బస్సుల సంఖ్య : 6,303 » కొత్తగా కొనాల్సిన బస్సుల సంఖ్య : 1,684 » కొత్తగా నియమించాల్సిన ఉద్యోగులు: 9,449 (డ్రైవర్లు, కండక్టర్లు, నిర్వహణ సిబ్బంది) -
సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీ 2,400 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. రెగ్యులర్‌గా నడిచే సర్విసులతో పాటు 2,400 బస్సులను అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు డిఫ్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్.విజయలక్ష్మి తెలిపారు. ప్రత్యేక బస్సులు జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడుపుతారు. ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచి లేదా అ«దీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల నుంచి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఎంజీబీఎస్‌లో ప్రయాణికులు, బస్సుల రద్దీ దృష్ట్యా.. జనవరి 10వ తేదీ నుంచి 12 వరకు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే రెగ్యులర్, ప్రత్యేక బస్సులను గౌలిగూడ సీబీఎస్ నుంచి నడుపుతారు. -
కష్టజీవులను కబళించిన మృత్యుశకటం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గార్లదిన్నె: వారంతా వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు. రోజూ మాదిరిగానే ఉదయాన్నే పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యుశకటం కబళించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నెకు సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు గార్లదిన్నె మండలం తిమ్మంపేట వద్ద అరటి తోటలో ఎరువు వేసే పనికోసం ఉదయమే ఆటోలో వచ్చారు. అక్కడ పని ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి తిరుగు పయనమయ్యారు. తలగాచిపల్లి క్రాస్ వద్ద ఆటో గార్లదిన్నె వైపునకు మలుపు తీసుకుంటుండగా.. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలపెద్దయ్య అలియాస్ తాతయ్య (55), చిన్ననాగమ్మ (48) రామాంజినమ్మ (47), పెద్ద నాగమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో నుంచి రోడ్డు మీద పడి తీవ్రగాయాలతో హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తున్న కూలీలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనాల్లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్ననాగన్న (55), జయరాముడు (48), కొండమ్మ (50), ఈశ్వరయ్య మృతిచెందారు. లక్ష్మీదేవి, పెద్దులమ్మ, రామాంజినమ్మ, గంగాధర్, ఆటో డ్రైవర్ నీలకంఠ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో చిన్ననాగన్న–చిన్ననాగమ్మ, ఈశ్వరయ్య–కొండమ్మ దంపతులు.ఒకేరోజు ఎనిమిది మంది మృతిచెందడం, ఐదుగురు గాయపడడంతో ఎల్లుట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతపురం ప్రభుత్వాస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై గార్లదిన్నె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్, అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి:వైఎస్ జగన్అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించారు. వీరంతా కూలి పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. వారికి అవసరమైన సాయం అందజేయాలని కోరారు. -
మనం అసలు సమీక్షలు చేయాల్సిన అవసమే లేద్సార్! అమలు చేయలేదు కాబట్టి!
మనం అసలు సమీక్షలు చేయాల్సిన అవసమే లేద్సార్! అమలు చేయలేదు కాబట్టి! -
ఏపీలో దసరాకు 6,100 స్పెషల్ బస్సులు
విజయవాడ, సాక్షి: దసరాకు APSRTC ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. అక్టోబర్ 4 నుంచి 20వ తేదీ మధ్య 6,100 సర్వీసులు నడపనుంది. సాధారణ ఛార్జీలతోనే దసరా స్పెషల్ బస్సులు నడపనున్నట్లు.. అలాగే ముందస్తుగా రాను,పోను రిజర్వేషన్లు చేసుకున్న వారికి 10 శాతం రాయితీ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది. -
రూ.10 నాణెం చెల్లుతుంది
సాక్షి, అమరావతి: రూ.10 నాణెం చెల్లుబాటుపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి ముందుకు రావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏపీఎస్‌ఆరీ్టసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలు పది రూపాయల నాణేలను స్వీకరించడం ద్వారా ప్రజలకు భరోసా కలి్పంచేలా తక్షణం పత్రికా ప్రకటన విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. బుధవారం విజయవాడలో 32వ స్టేట్ లెవెల్ సెక్యూర్టీ మీటింగ్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ కమల్ పి పట్నాయక్ మాట్లాడుతూ ప్రజల్లో నెలకొన్న అపోహల వల్ల రాష్ట్రంలో తీవ్రమైన చిల్లర కొరత నెలకొని ఉందన్నారు.ఇటువంటి పరిస్థితుల్లోనే కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రకటన విడుదల చేసిన తర్వాత రూ.10 నాణేల చెలామణి ఏడు రెట్లు పెరిగిందని చెప్పారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశానికి చైర్మన్‌గా వ్యవహరించిన రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ను కోరారు. ఇప్పటికే ఆర్బీఐ పలు ప్రకటనలు చేసినా వినియోగం ఆశించినంత పెరగలేదని, ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. రూ.10 నోట్లతో పోలిస్తే నాణేల జీవిత కాలం రెండు దశాబ్దాలుపైన ఉంటుందని తెలిపారు.రూ.10 నాణేలు చెల్లవనే ప్రచారం ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా ఉందని, హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ పరిధిలో రూ.22 కోట్ల విలువైన రూ.10 నాణేలు మింట్, కరెన్సీ చెస్ట్‌ల్లో మూలుగుతున్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో 14 డిజైన్లలో పది రూపాయల నాణేలు చెలామణిలో ఉన్నాయని, ఇవన్నీ కూడా చెల్లుతాయని ఆర్బీఐ అధికారులు స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన విశ్వజిత్ ఆర్బీఐ లిఖిత పూర్వకంగా ఈ ప్రతిపాదనను పంపిస్తే తక్షణంచర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వంతో చర్చిస్తామని హామీనిచ్చారు.రూ.10 నాణేల చెలామణి పెంచే విధంగా బ్యాంకులు కూడా ప్రోత్సహించాలని ఆర్బీఐ కోరింది. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు, డీమార్ట్, మోడరన్ సూపర్ బజార్, రైస్ మిల్లుల వ్యాపారులకు రూ.10 నాణేలను కమల్ పి పట్నాయక్, కుమార్ విశ్వజిత్ చేతుల మీదుగా అందజేశారు. -
ఆర్టీసీ ఎంతో హ్యాపీ..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఈ పేరు వింటనే ఆర్టీసీ ఉద్యోగులకు భరోసా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు...ఈ పేరు చెవిలో పడితేనే ఆ ఉద్యోగుల్లో హడల్ ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది ఉద్యోగుల దీర్ఘకాలిక పోరాటం...కల కూడా. గతంలో చంద్రబాబుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విలీనం సాధ్యం కాదని కొట్టిపారేశారు. అంతేకాదు ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించి తన రాజగురువు రామోజీరావుకు అప్పగించాలన్న దురాలోచన కూడా చేశారన్నది బహిరంగ రహస్యమే. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.దశాబ్దాల ఆర్టీసీ ఉద్యోగుల కలను సాకారం చేస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ చరిత్రాతి్మక నిర్ణయం 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో నవోదయాన్ని తీసుకువచి్చంది. ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలను కలి్పంచడమే కాకుండా ఆర్టీసీని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తోంది. ఆర్టీసీ పట్ల చంద్రబాబు వైఖరి? ఆయన విధానాలు ...ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన అనే అంశాలను ఓసారి సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది.జగన్ విలీన హాసం..!⇒ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. 52 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం.⇒ ఉద్యోగుల జీతాల కోసం ఒక్క నెల కూడా అప్పు చేయలేదు. ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు చెల్లించింది. ఇప్పటికి 52 నెలల్లో రూ.15,600 కోట్లు చెల్లించిన ప్రభుత్వం. ⇒ జీతాల కోసం అప్పులే చేయలేదు కాబట్టి...వడ్డీ సమస్యే లేదు ⇒ వైస్సార్సీపీ కోసం అద్దెకు తీసుకున్న బస్సులకు తక్షణమే పార్టీ ఖాతా నుంచి బిల్లుల చెల్లింపు ⇒ జీతాల చెల్లింపునకు ఐదేళ్లలో రూ.2,500 కోట్లు అప్పు తీర్చింది. అప్పు రూ.2 వేల కోట్లకు తగ్గింది. ⇒ ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సంఘం బకాయి రూ.200 కోట్లు చెల్లింపు దాంతో ఉద్యోగులకు సులభంగా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు ⇒ ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ కింద ప్రమాద బీమా సదుపాయం ప్రమాద బీమా మొదట రూ.45 లక్షలకు...అనంతరం ఏకంగా రూ.1.10 కోట్లకు పెంపు ⇒ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు ⇒ 2016 నుంచి పెండింగులో ఉన్న కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల కల్పన ⇒ 2016 నుంచి 2019 మధ్య పెండింగులో ఉన్న 845 మందికి ఉద్యోగాలు ⇒ 2020 తరువాత మరణించిన 955 మంది ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు ⇒ 2020 తరువాత అనారోగ్య కారణంతో పదవీ విరమణ చేసిన 100 మంది ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు. ⇒ 2020 తరువాత రిటైరైన ఉద్యోగులకు గ్రాడ్యుటీ రూ.23.25 కోట్లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కింద రూ.271.89 కోట్లు, సరెండర్ లీవుల కింద రూ.165 కోట్లు చెల్లింపు ⇒ ఇప్పటికి 1,406 కొత్త బస్సులు కొనుగోలు. మరో 1,500 కొత్త బస్సుల కొనుగోలుకు ప్రతిపాదన. తొలిసారిగా ఈ–బస్సులను ప్రవేశపెట్టిన ఆర్టీసీ. తిరుమల–తిరుపతి ఘాట్‌లో 100 ఈ–బస్సులు. రానున్న ఐదేళ్లలో 7 వేల ఈ–బస్సుల కొనుగోలుకు నిర్ణయం ⇒ ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.బాబు మాటల మోసం..!⇒ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు. ⇒ ఉద్యోగుల జీతాల కోసం ప్రతి నెలా అప్పులు చేయాల్సిన దుస్థితి. ⇒ ఉద్యోగుల జీతాల కోసం చేసిన అప్పులే ఏడాదికి రూ.350 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వచ్చేది.⇒ టీడీపీ అవసరాల కోసం బస్సుల వినియోగం. బిల్లులు చెల్లించని టీడీపీ.⇒ రూ.4,500 కోట్ల నష్టాల్లో ఉండేది.⇒ ఉద్యోగుల పరపతి సంఘానికి రూ.200 కోట్ల బకాయి పడడంతోరుణాలు ఇవ్వలేని దుస్థితి.⇒ ప్రమాద బీమా రూ.30 లక్షలు మాత్రమే.⇒ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకే పరిమితం.⇒ కారుణ్య నియామకాలు చేపట్ట లేదు.⇒ గ్రాడ్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాలు, సరెండర్ లీవులు పెండింగ్..⇒ కొత్త బస్సులు కొనుగోలు లేదు.⇒ పూర్తిగా ప్రైవేటుపరం చేసేందుకు సన్నాహాలుఇవి చదవండి: పిఠాపురంతోనే సీఎం జగన్ లాస్ట్ పంచ్.. -
టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: టెన్త్, ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. పరీక్షల సమయంలో విద్యార్ధులకు బాసటగా నిలుస్తూ.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. విద్యార్థులు హాల్‌టికెట్లు చూపించి పరీక్ష కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. కాగా, టెన్త్, ఇంటర్ విద్యార్థులు కలిపి 16 లక్షల మంది(టెన్త్‌లో 6 లక్షలు, ఇంటర్లో 10 లక్షలు) మంది పరీక్షలు రాయబోతున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2024 మార్చి 18 నుండి 30 వరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటాయి. ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. -
APSRTC: 541 అద్దె బస్సులకు ఆర్టీసీ టెండర్లు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. ఎంఎస్టీసీ ఈ-కామర్స్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఆర్టీసీ 541అద్దె బస్సుల కోసం టెండర్లను పిలిచింది. ఆసక్తి ఉన్నవారు ఎంఎస్టీసీ ఈ-కామర్స్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఈ నెల 21 నుంచి మార్చి 6వ తేదీ వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. మార్చి 14వ తేదీ ఈ–వేలం నిర్వహిస్తారు. అద్దె బస్సులు నిర్వహించా ల్సిన రూట్లు, టెండరు నిబంధనలు, ఇతర వివరాల కోసం తమ వెబ్సైట్ http://apsrtc.ap.gov.inను సంప్రదించాలని ఏపీఎస్ ఆర్టీసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. టెండర్లు పిలిచిన బస్ సర్వీసుల వివరాలు ఏసీ స్లీపర్–2, నాన్ ఏసీ స్లీపర్–9, సూపర్ డీలక్స్–22, అల్ట్రా డీలక్స్–33, ఎక్స్‌ప్రెస్–168, అల్ట్రా పల్లెవెలుగు–74, పల్లె వెలుగు–225, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు–3, సిటీ ఆర్డినరీ–5. -
పండుగ ప్రయాణంపై ‘డైనమిక్’ పిడుగు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి వేళ దూర ప్రాంతాల్లోని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై తెలంగాణ ఆర్టీసీ ‘డైనమిక్ చార్జీ’ రూపంలో పెను భారం మోపింది. దాదాపు రెట్టింపు చార్జీలతో జేబులు గుల్ల చేస్తోంది. గతంలో పండుగ సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు రుసుము వసూలు చేసే విధానం ఉండేది. కానీ ఇటీవల దాన్ని రద్దు చేసి సాధారణ చార్జీలకే ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు ఆర్టీసీ కల్పించింది. కానీ సంక్రాంతి వేళ.. డైనమిక్ ఫేర్ విధానం పేరిట.. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అదనపు రుసుము వసూలు చేస్తోంది. విశాఖ స్పెషల్ రూ.3 వేలు వాస్తవానికి కొన్ని నెలలుగా దశల వారీగా డైనమిక్ ఫేర్ విధానాన్ని విస్తరిస్తూ వచ్చిన టీఎస్ఆర్టీసీ.. సంక్రాంతి రద్దీ సమయానికి దూరప్రాంత రూట్లను కూడా ఈ విధానంలోకి తెచ్చేసింది. ఫలితంగా పండుగ ప్రత్యేక బస్సుల్లో చార్జీలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సాధారణ రోజుల్లో విశాఖపటా్ననికి స్లీపర్ బస్సులో టికెట్ ధర రూ.1,500 లోపు ఉండగా, ఇప్పుడు ప్రత్యేక బస్సుల్లో అది రూ.3 వేలను దాటింది. విజయవాడ మార్గంలో సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.300, రాజధానిలో రూ.550, గరుడలో రూ.800 వరకు చార్జీలు పెరిగాయి. మిగతా దూరప్రాంతాల మార్గాల్లోని బస్సుల్లోనూ ఇదే బాదుడు కనిపిస్తోంది. డిమాండ్, ముందు.. వెనుక సీట్లను బట్టి చార్జీలు డిమాండ్ పెరిగే కొద్దీ చార్జీలను సవరించి పెంచుకోవటాన్నే డైనమిక్ ఫేర్ విధానం అంటున్నారు. సాధారణంగా విమానయాన సంస్థలు దీన్ని అను సరిస్తుంటాయి. నెల రోజుల ముందు బుక్ చేసుకునే విమాన టికెట్ ధరకు, అదేరోజు బుక్ చేస్తే ఉండే చార్జీకి పొంతనే ఉండదు. మూడు నాలుగు రెట్లు కూడా చార్జీ పెరుగుతుంది. ఇదే విధానాన్ని తెలంగాణ ఆర్టీసీ అనుసరిస్తోంది. తొలిసారిగా గతేడాది బెంగళూరు మార్గంలో దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఆ తర్వాత విస్తరిస్తూ తాజాగా ఇతర రాష్ట్రాల రూట్లలో అమలు ప్రారంభించింది. సాధారణ రోజుల్లో డిమాండ్ ఉండక బస్సుల్లో సీట్లు మిగిలిపోతుంటాయి. అలాంటి సమయంలో సాధారణ టికెట్ ధరలో 80% మొత్తాన్నే వసూలు చేస్తోంది. అంటే రూ.100గా ఉండే టికెట్ ధరను రూ.80గా మారుస్తోంది. కానీ డిమాండ్ పెరిగే కొద్దీ టికెట్ ధరలను క్రమంగా పెంచుతూ గరిష్టంగా 150 శాతంగా ఖరారు చేస్తోంది. ఇక ముందు వైపు ఉండే సీట్లలో ఒక ధర, వెనక సీట్లలో మరో ధర, కిటికీ వైపు సీటుకు ఓ ధర, పక్క సీటుకు మరో ధర, ఉదయం వేళ ఒక ధర, సాయంత్రం, రాత్రి వేళ వేరు ధరలు.. ఇలా ఎప్పటికికప్పుడు సందర్భాన్ని బట్టి చార్జీలను సవరిస్తోంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో కూడా ఈ విధానం అనుసరిస్తున్నారు. డిమాండ్ లేని సాధారణ రోజుల్లో చార్జీలో సగం మాత్రమే వసూలు చేస్తుండటంతో ఆ బస్సులు నిండిపోయి ప్రయాణిస్తుంటాయి. అదే సమయంలో ఆర్టీసీ బస్సులు ఖాళీగా కన్పిస్తుంటాయి. ఇక డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో రెండు మూడు రెట్లకు టికెట్ ధర పెంచి ప్రైవేటు ట్రావెల్స్ వసూలు చేస్తుంటాయి. ఈ విధానం లాభసాటిగా ఉండటంతో తెలంగాణ ఆర్టీసీ కూడా దీన్ని అమల్లోకి తెచ్చింది. ఆదుకున్న ఏపీఎస్ ఆర్టీసీ సాధారణంగా సంక్రాంతి, దసరా, దీపావళి పండగ వేళల్లో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. 15 లక్షల నుంచి 20 లక్షల మంది తరలి వెళ్తారు. దీంతో ఏపీకి టీఎస్ఆర్టీసీ అదనంగా బస్సులు నడుపుతుంది. అలా ఈ సంక్రాంతికి 1,550 బస్సులను ఏపీకి తిప్పాలని భావించింది. కానీ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావటంతో రద్దీ విపరీతంగా పెరిగి బస్సులు సరిపోని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో నామమాత్రంగా 400 అదనపు బస్సులతో సరిపెట్టింది. ఇదే సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 1,450 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. అవి సరిపోక పోవడం ఎంజీబీఎస్, జేబీఎస్‌లకు ప్రయాణికులు పొటెత్తుతుండటంతో మూడు రోజుల క్రితం ప్రత్యేక బస్సుల సంఖ్య పెంచాల్సిందిగా ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులను టీఎస్ఆర్టీసీ అధికారులు కోరారు. దీంతో గత మూడు రోజులుగా మరో 350 ప్రత్యేక బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ రంగంలోకి దించింది. ప్రైవేటు బస్సు చార్జీలూ భగ్గు తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 4,420 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. దక్షిణమధ్య రైల్వే విశాఖ, కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, తదితర ప్రాంతాలకు రద్దీకనుగుణంగా అదనపు రైళ్లను ఏర్పాటు చేసింది. ఇవి ఏ మూలకూ చాలటం లేదు. దీంతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ట్రావెల్స్ నిర్వాహకులు పెరిగిన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని చార్జీలను పెంచేశారు. వైజాగ్, అమలాపురం, కాకినాడ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో రూ.950 నుంచి రూ.2000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. విశాఖపటా్ననికి నగరం నుంచి సాధారణ రోజుల్లో రూ.1300గా ఉండే స్లీపర్ బస్సు చార్జీ ఇప్పుడు రూ.4000 వరకు చేరుకుంది. రాజమండ్రికి రూ.3,800 వరకు, విజయవాడకు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. సర్విసు నిబంధనల్లోని క్రమశిక్షణ చర్యలు, వాటిపై అప్పీళ్లు, సమీక్షలకు సంబంధించి ఉద్యోగుల డిమాండ్‌పై సానుకూలంగా స్పందించింది. ఆమేరకు ఏపీఎస్ఆర్టీసీ సర్విసు నిబంధనలు–2023లోని సెక్షన్–5ను సవరిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జూలై 25 కంటే ముందు చేపట్టిన చర్యలకు ఈ సవరణ వర్తిస్తుందని పేర్కొంది. ఉద్యోగులపై చర్యలకు సంబంధించి చార్జ్ïÙట్లను డిస్పోజ్ చేసేటప్పుడు ఉమ్మడి జిల్లా డిప్యూటీ సీటీఎంలను కమిటీ సభ్యులుగా చేర్చడం, అప్పీళ్లను డిస్పోజ్ చేసేటప్పుడు రివ్యూ అథారిటీలో ఉమ్మడి జిల్లా రీజనల్ మేనేజర్‌ను సభ్యుడిగా చేర్చడం, ఆ పైస్థాయిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు మెర్సీ పిటిషన్‌ను పరిశీలించేందుకు అనుమతించింది. రెండేళ్లుగా అప్పీళ్లు, రివ్యూ అథారిటీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ప్రభుత్వ ఉత్తర్వులతో ఊరట లభించింది. వారి కేసుల సత్వర పరిష్కారానికి మార్గం సుగమమైంది. 2023 జులై 25 తరువాత వచ్చిన కేసులకు మాత్రం తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వేచి ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల హర్షం సర్విసు నిబంధనలను సవరించడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి పలు సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వహణ అధ్యక్షుడు జీఏం నాయుడు, ప్రధాన కార్యదర్శి డీఎస్పీ రావు, నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో కృతజ్ఞతలు తెలియజేశారు. -
సంక్రాంతి పిలుస్తోందంటూ సొంతూళ్లకు క్యూ కట్టిన పట్నం ప్రజలు (ఫొటోలు)
-
సంక్రాంతికి తెలంగాణ నుంచి అదనంగా వెయ్యి ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీకి ఉన్న పరిమితులను ఏపీఎస్ఆర్టీసీ సమర్థంగా అందిపుచ్చుకోవడమే అందుకు తాజా నిదర్శనం. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అదనంగా వెయ్యి సంక్రాంతి స్పెషల్ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. వాస్తవానికి ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్ కింద 6,725 బస్సులను నడపాలని నిర్ణయింది. అందులో హైదరాబాద్ నుంచి సంక్రాంతికి ముందు 1,600 బస్ సర్విసులు, సంక్రాంతి తరువాత 1,500 బస్ సర్విసులు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించింది. ఏటా సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడిపేది. కానీ తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తుండటంతో అంచనాలకు మించి మహిళా ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్విసులు నడపలేమని తెలంగాణ ఆర్టీసీ చేతులెత్తేసింది. ఈ అవకాశాన్ని ఏపీఎస్ఆర్టీసీ సద్వినియోగం చేసుకుంది. పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వచ్చేవారికి సౌలభ్యంగా ఉండేందుకు అదనంగా వెయ్యి ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, అమలాపురం, కర్నూలు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విశాఖపట్నాలకు అదనపు వెయ్యి బస్సు సర్విసులు నడుపుతారు. బెంగళూరు, చెన్నైల నుంచి కూడా మన రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. వీటితోపాటు విజయవాడ నుంచి కర్నూలు, అనంతపురం, తిరుపతిలకు అదనపు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు మెరుగైనసేవలు అందించేందుకు అదనంగా ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించామని ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకాతిరుమలరావు చెప్పారు. -
APSRTC: మహిళలకు ఉచిత ప్రయాణంపై క్లారిటీ
ఎన్టీఆర్, సాక్షి: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద.. మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్టీసీకి నష్టం రాకుండా ఆ భారమంతా తెలంగాణ ప్రభుత్వమే భరించనుంది. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో APSRTC స్పందించింది. ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇక.. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపిన ఆయన.. రాను పును బుక్ చేసుకుంటే పది శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. ఇక మరో నాలుగు నెలల్లో 1,500 కొత్త బస్సులు రాబోతున్నాయని, త్వరలో సరికొత్త హంగులతో సూపర్ లగ్జరీ బస్సులు వస్తాయని ఆయన అన్నారు. ఇక సంక్రాంతి సందర్భంగా గురువారం నుంచి డోర్ పిక్ అప్ అండ్ డోర్ డెలివరీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ. గతంలో డోర్ డెలివరీ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకుని నిర్వహించేదని.. ఇప్పుడు ఆర్టీసీనే స్వయంగా చేయనుందని చెప్పారాయన. రోజుకు డోర్ డెలివరీ సర్వీస్ లు 25వేలకు పైగా జరుగుతున్నాయని.. ప్రస్తుతానికి విజయవాడలో మాత్రమే పికప్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ముఖ్యనగరాలకు ఆ సేవల్ని విస్తరిస్తామని తెలిపారు. -
సంక్రాంతి ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
సాక్షి, విజయవాడ: సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. స్పెషల్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఆర్టీసీ వసూలు చేయనుంది. జనవరి 6 నుంచి 18 వరకూ ప్రత్యేక బస్సులు నడవనున్నారు. సంక్రాంతికి 6795 స్పెషల్ బస్సులు నడపనుంది. పండుగ రద్దీ దృష్ట్యా పొరుగు రాష్ట్రాలకూ ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడపనుంది. ఆర్టీసీ వెబ్సైట్, టికెట్ బుకింగ్ కేంద్రాల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం కల్పించనున్నారు. రానుపోను టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి 10 శాతం రాయితీ సౌకర్యం ఆర్టీసీ కల్పించనుంది. ఇదీ చదవండి: Volunteer Jobs: ఏపీ బాటలో తెలంగాణ! -
53 వేల కుటుంబాలకు మందికి బట్టల పంపిణీ కార్యక్రమం
-
జగనన్నకు థ్యాంక్స్: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి జీతాలతో పాటు అలవెన్స్‌ల చెల్లింపు జరపనుంది ప్రభుత్వం. ఈ మేరకు అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు సైతం జారీ చేశారు. ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు అంతటా హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇదీ చదవండి: నెలా జీతాలతోపాటు అలవెన్సులు కూడా! -
ఆర్టీసీ ఉద్యోగులపై అవాస్తవాలు
-
ఉద్యోగుల ఆరోగ్యంపై రాజీ ప్రసక్తే లేదు: APSRTC
సాక్షి, ఎన్టీఆర్: ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య సదుపాయలు కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. ప్రభుత్వ ఉద్యోగులతో ఆర్టీసీ ఉద్యోగుల్ని సమానంగా చూస్తోందని.. పైగా వైద్య సదుపాయాలు అందించే విషయంలో ప్రత్యేక చొరవ కనబరుస్తోందని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ చెబుతోంది. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యంతో సర్కార్ చెలగాటం పేరిట ఇవాళ ఈనాడులో ప్రచురితమైన కథనాన్ని మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ ఖండిస్తూ.. పూర్తి వివరాలను తెలియజేసింది. ‘‘ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు అనేక సదుపాయాలు పొందుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా హెల్త్ కార్డులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులకు రిఫర్ చేయబడిన ఆసుపత్రులలోనే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా మెరుగైన వైద్యం అందుతోంది. ఈహెచ్ఎస్ ఆసుపత్రుల్లో చికిత్స, ఓపీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జిల్లాకొక లైజనింగ్ అధికారిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది కూడా.. .. ఇటీవల కాలంలో ఉద్యోగులకు తలెత్తుతున్న అనారోగ్య సమస్యలపై ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగులందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోంది. కార్డియాక్ కేర్ Try-cog మెషీన్ల ద్వారా ఉద్యోగులకు ఏర్పడే హృద్రోగ సమస్యలను ముందుగానే పసిగట్టి వైద్యం అందిస్తున్నాం. అలా ఇప్పటి వరకూ 149 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ముందస్తు పరీక్షల ద్వారా ఆరోగ్య భద్రత కల్పించాం’’ అని తెలిపింది. వైద్య సేవల విషయానికొస్తే.. అనారోగ్యం బారినపడిన ఆర్టీసీ ఉద్యోగులకు వైద్యపరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. తద్వారా సకాలంలో చికిత్స అందేలా చూస్తున్నారు. ఆర్టీసీకి సంబంధించిన అన్నిడిస్పెన్సరీలలో నిరంతరం వైద్యం.. ఔషధాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నారు. 2021లో సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతో వైఎస్సార్ జిల్లాలో డా.వైఎస్సార్ ఏరియా ఆర్టీసీ ఆసుపత్రి ఏర్పాటైంది. తిరుపతి, నరసరావుపేట, మచిలీపట్నంలో ఉద్యోగుల కోసం శరవేగంగా ఆర్టీసీ ఆస్పత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయి. -
ఏపీఎస్ ఆర్టీసీపై ఈనాడు అబద్ధాలు
-
డొక్కు రాతలే దిక్కా రామోజీ..?!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్న రామోజీరావు.. ప్రగతి రథచక్రంలా పరుగెడుతున్న ఆర్టీసీపై పనిగట్టుకుని విషం చిమ్మారు. అవాస్తవాలన్నీ పోగేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ‘డొక్కు బస్సులే దిక్కా’ అంటూ ఈనాడులో ఓ కథనాన్ని అచ్చేశారు. వాస్తవాలన్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ ఉద్యోగులకు తెలుసు. ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు అందుకుంటున్న వారి కుటుంబాలకు తెలుసు. కొత్త బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తెలుసు. తొలిసారిగా విద్యుత్ బస్సుల్లో వెళుతున్న తిరుమల–తిరుపతి భక్తులకు తెలుసు. ఎవరేమనుకుంటే నాకేంటి.. నా ‘పచ్చ’పార్టీకి ఇష్టంగా రాయడమే నాకు తెలుసు అన్నట్లు రామోజీరావు తన వక్రబుద్ధిని ఆ కథనంలో బయటపెట్టుకున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రగతిపథంలో పరుగెడుతోంది అని చెప్పడానికి నాలుగేళ్లలో పెరిగిన సంస్థ రాబడే నిదర్శనం. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం అనడానికి టీడీపీ ప్రభుత్వ హయాం కంటే గణనీయంగా తగ్గిన బస్సు ప్రమాదాలే తార్కాణం. అందువల్లే ఆర్టీసీవి కొత్త బస్సులు.. రామోజీవి డొక్కు రాతలు అని అటు ప్రయాణికులు, ఇటు సిబ్బంది ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బోరుకు వచ్చింది ఈనాడు పత్రికే అని గుర్తించాలని రామోజీకి హితబోధ చేస్తున్నారు. కొత్త బస్సులు కనబడటంలేదా? వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలు వేగవంతం చేసింది. 2019–20లో 406 కొత్త బస్సులను కొనుగోలు చేసింది. కోవిడ్ మొదటి, రెండు వేవ్‌ల తరువాత ఆర్టీసీలో ఉన్న 2,584 బస్సులను రూ. 50 కోట్లు వెచ్చించి ఆధునీకరించింది. ఇక పాత బస్సుల స్థానంలో కొత్తగా 900 డీజిల్ బస్సులను అద్దె విధానంలో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో తొలిసారిగా 100 ఈ–బస్సులను తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో ప్రవేశపెట్టిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కింది. తాజాగా 1,500 కొత్త డీజీల్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. పారదర్శకంగా కొనుగోలు కోసం టెండర్ల ప్రక్రియను జ్యుడిíÙయల్ ప్రివ్యూకు పంపింది. కేంద్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం 15 ఏళ్ల కాలపరిమితి ముగిసిన వాటిని ఎప్పటికప్పుడు ఆర్టీసీ తొలగిస్తోంది. ఈ నాలుగేళ్లలో 214 బస్సులను తుక్కుగా మార్చింది. ఈ ఆరి్థక సంవత్సరంలో మరో 52 బస్సులను తుక్కుగా మార్చనుంది. మౌలిక వసతులు అభివృద్ధి రాష్ట్రంలో ఆర్టీసీ మౌలిక వసతులను నాలుగేళ్లలో ప్రభుత్వం గణనీయంగా అభివృద్ధి చేసింది. బస్స్టేషన్ల పునరుద్ధరణ, నిర్మాణం కోసం రూ. 110 కోట్లు వెచ్చించింది. రాజాం, విజయనగరం, నరసాపురం, హనుమాన్ జంక్షన్, గుడివాడ, మచిలీపట్నం, పామర్రు, జగ్గయ్యపేట, దోర్నాల, సింగరాయకొండ, కడప, కోయిలకుంట్ల, వేంపల్లి, ప్రొద్దుటూరు, రాయచోటి, బేతంచర్ల, డోన్, ఆత్మకూరులలో బస్స్టేషన్లు నిర్మించింది. రాజమహేంద్రవరం, అనంతపురం, తిరుపతి, నరసరావుపేటలలో మెడికల్ డిస్పెన్సరీలను విస్తరించి ఆధునీకరించింది. రూ. 34 కోట్లతో పులివెందులలో బస్‌స్టేషన్, బస్‌డిపో నిర్మించింది. ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ఆర్టీసీ బస్సు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. డ్రైవర్లకు పూర్తిస్థాయిలో ఎప్పటికప్పుడు శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. డ్రైవర్లతో సహా ఆర్టీసీ ఉద్యోగులకు తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. రోజువారీ విధుల్లో చేరే ముందు డ్రైవర్లకు తప్పనిసరిగా బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేస్తోంది. 2018 తరువాత బస్సు ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. టీడీపీ హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బస్సు ప్రమాదాలు బాగా తగ్గాయి. సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం.. ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌ను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. సంస్థ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం ప్రతినెల రూ. 275 కోట్లు వెచ్చిస్తోంది. జనవరి, 2020 నుంచి ఇప్పటివరకు రూ. 11,711 కోట్లు జీతాల కోసం చెల్లించింది. తీవ్రమైన కోవిడ్ పరిస్థితుల్లోనూ ప్రతి నెల ఒకటో తేదీనే ఆర్టీసీకి జీతాలు చెల్లించడం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో సంస్థపై ఆర్థికభారం తగ్గడంతో దీర్ఘకాలంగా ఉన్న బకాయిలను చెల్లిస్తోంది. ఇప్పటికే బ్యాంకు రుణాలు రూ. 1,121 కోట్లు, పీఎఫ్ బకాయిలు రూ. 996 కోట్లు, సీసీఎస్బకాయిలు రూ. 269 కోట్లు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 374 కోట్లు కలిపి మొత్తం రూ. 2,760 కోట్ల బకాయిలను చెల్లించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సర్వీసులో ఉంటూ మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన 693 మందికి ఇప్పటివరకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగులతోసమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా పీఆర్సీ–2022ను అమలు చేసింది. ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా కోసం ఎస్బీఐతో కార్పొరేట్ సాలరీ ప్యాకేజీ కింద ఒప్పందం కుదుర్చుకుంది. ఉద్యోగులకు క్యాష్‌లెస్ హెల్త్స్కీమ్ను సమర్థంగా అమలు చేస్తోంది. హయ్యర్ పెన్షన్ విధానాన్ని వర్తింపజేసింది. ప్రభుత్వంలో విలీనం చేసిన నాటికి ఉన్న ఉద్యోగులకు ఆర్టీసీ నిబంధనల మేరకే పదోన్నతలు కల్పించాలని నిర్ణయించింది. ప్రమాద బాధ్యులపై చర్యలు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ముగ్గురి మృత్యువాతకు కారణమైన ప్రమాద ఘటనపై ఆర్టీసీ తీవ్రంగా స్పందించింది. విచారణ నిర్వహించి ప్రమాదానికి బాధ్యులుగా నిర్ధారించిన డ్రైవర్, ట్రాఫిక్ సూపర్ వైజర్లను సస్పెండ్ చేసింది. పెరుగుతున్న ఆదరణ.. ఆదాయం.. ఆర్టీసీ చేపడుతున్న చర్యల ఫలితంగా ఆర్టీసీ బస్సులపట్ల ప్రజలకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. నాలుగేళ్లుగా పెరుగుతున్న ఆర్టీసీ రాబడే అందుకు నిదర్శనం. ♦ 2019–20లో ఆర్టీసీకి రూ. 4,781 కోట్ల రాబడి రాగా 2022–23కు అది రూ. 5,574 కోట్లకు పెరిగింది. ♦ 2019–20లో కి.మీటర్‌కు రూ. 31.31 చొప్పున రాబడి రాగా 2022–23లో కి.మీటర్‌కు రూ. 37.91కు పెరిగింది. ♦ ఇక కార్గో సేవల ద్వారా 2018–19లో రూ. 101 కోట్లు రాబడి రాగా 2022–23లో రూ. 169 కోట్లు వచ్చింది. ♦ వాణిజ్య ఆదాయం 2018–19లో రూ. 227 కోట్లు రాగా 2022–23లో రూ. 300 కోట్లకు పెరిగింది. సక్రమంగా నిర్వహణ.. నిధులు మంజూరు ♦ ఆర్టీసీ బస్సులకు స్పేర్పార్ట్ల కొనుగోలు, ఇతర నిర్వహణ వ్యయం కోసం నిధుల్లో కోత విధించారన్న ఈనాడు రాతలు పూర్తి అవాస్తవం. నాలుగేళ్లలో పూర్తిస్థాయిలో స్పేర్ పార్ట్లు, నిర్వహణ కోసం స్టోర్స్ విభాగానికి ఆర్టీసీ పూర్తిస్థాయిలో నిధులు కేటాయించింది. 2020–21, 2021–22లో కోవిడ్ మొదటి, రెండో వేవ్‌లలో ఆర్టీసీ బస్సు సర్విసులు బాగా కుదించింది. దాంతో స్పేర్ పార్టుల కోసం బడ్జెట్ ప్రతిపాదనలు తగ్గాయి. -
Fact Check: ఆర్టీసీపై ఇవేం అబద్ధాలు రామోజీ.. వాస్తవాలు ఇవిగో..
సాక్షి, విజయవాడ: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సాహసోపేత నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్‌పై ‘ఈనాడు’ విషం చిమ్ముతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిత్యం బురదజల్లడమే పనిగా పెట్టుకున్న రామోజీ మరో మారు తన నైజాన్ని చాటుకున్నారు. ఆర్టీసీకి ప్రతీ నెలా రూ.275 కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందిస్తోన్న ప్రభుత్వంపై ‘డొక్కు బస్సులే దిక్కా’ అంటూ ఈనాడు పత్రిక ప్రచురించిన అవాస్తవ కథనాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఖండించింది. ఇందులో నిజానిజాల్లోకి వెళితే.. 2020 జనవరి 1 నుంచి ఇప్పటి వరకు రూ. 11,711 కోట్ల భారీ ఆర్థిక సహాయాన్ని అందించింది. కరోనా సమయంలో దేశంలోని అన్ని ఆర్టీసీల ఉద్యోగులు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మద్దతుతోనే ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు కరోనా కాలంలో ఆకలితో అలమటించే పరిస్థితి తప్పింది. ప్రభుత్వంలో విలీనం చేయకముందు ఏపీఎస్ ఆర్టీసీలో 693 కారుణ్య నియామకాలు జరిగాయి. విలీనం వల్ల ఏపీఎస్ఆర్టీసీలోని ఖాళీల మేరకు మాత్రమే కాకుండా ఇతర ప్రభుత్వ శాఖలలో కూడా మరణించిన కుటుంబాలకు కారుణ్య ఉపాధి లభించింది PRC-2022 అన్ని ఇతర ప్రభుత్వ శాఖలతో సమానంగా అమలు చేయబడింది. విలీనం కారణంగా ఇప్పటి వరకూ 2,760 కోట్ల అప్పు తీరింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ అత్యుత్తమ సేవలు అందించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరం ఆర్టీసీ ఆదాయం 4,781 కోట్లు. 2022-23 ఆర్ధిక సంవత్సరం ఆర్టీసీ ఆదాయం 5,574 కోట్లు. దసరా,సంక్రాంతి పండుగల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయకుండానే ఆదాయం వచ్చింది. 2019-20 సంవత్సరంలో 406 కొత్త బస్సులు కొనుగోలు చేసిన ఆర్టీసీ.. పాత బస్సుల స్థానంలో 900 కొత్త డీజిల్ అద్దె బస్సులను ప్రవేశపెట్టింది. తిరుపతి-తిరుమల ఘాట్ రోడ్డు, తిరుపతి నుండి సమీప నగరాలకు నడపడానికి 2022-23లో 100 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. కొత్తగా 1,500 డీజిల్ బస్సుల కొనుగోలు పురోగతిలో ఉంది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన కొత్త స్క్రాప్ పాలసీ ప్రకారం 15 ఏళ్ల సర్వీసు పూర్తైన 214 బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది. 2024 మార్చిలోపు మరో 52 బస్సులను రద్దు చేసే యోచనలో ఆర్టీసీ ఉంది. ప్రజల రవాణా కోసం ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను అధ్వాన్న స్థితిలో నడుపుతోందని చెప్పడం సరికాదు. ప్రస్తుత సంవత్సరంలో ప్రజల ఆదరణ పెరిగింది. గతేడాది కంటే169 కోట్ల మేర అదనపు రాబడి వచ్చింది. డిపోలకు విడిభాగాల సరఫరాపై ఖర్చు భారీగా తగ్గిందని చెప్పడం సరికాదు. 2019-20 సంవత్సరంలో 163.11 కోట్లు చేసిన ఆర్టీసీ.. 2020-21 సంవత్సరంలో 91.65 కోట్లు, 2021-22 సంవత్సరంలో 168.51 కోట్లు, 2022-23 సంవత్సరంలో 231.29 కోట్లు విడిభాగాల సరఫరా కోసం ఆర్టీసీ ఖర్చు చేసింది. 110 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా బస్ స్టేషన్ల పునరుద్ధరణ,కొత్త డిపోల నిర్మాణం ఆర్టీసీ చేపట్టింది. గతంతో పోలిస్తే ప్రమాదాలు గణనీయంగా పెరిగాయని చెప్పడం సరికాదు.. 2019-20 లో జరిగిన ప్రమాదాలు 974.. 2020-21లో జరిగిన ప్రమాదాలు 392.. 2021-22 లో జరిగిన ప్రమాదాలు 617.. 2022-23 లో జరిగిన ప్రమాదాలు 907. ఈ నెల 6వ తేదీన విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో జరిగిన ఘోర ప్రమాదంపై చర్యలు తీసుకున్నాం. ముగ్గురు సభ్యులతో కూడిన సీనియర్ అధికారుల కమిటీ విచారణ చేపట్టింది. డ్రైవర్ గేర్‌ను తప్పుగా ఎంచుకోవడం, యాక్సిలరేటర్‌ను గట్టిగా నొక్కడం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీ నివేదించింది. ప్రమాదంలో ముగ్గురు మరణించారు.. ఒకరికి గాయాలయ్యాయి. ఘటనకు బాధ్యులైన బస్సు డ్రైవర్‌ను సస్పెండ్ చేశాం. డ్రైవర్‌కు తగిన శిక్షణ ఇవ్వడంలో విఫలమయ్యారనే కారణంతో ఆటోనగర్ డిపో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) ను సస్పెండ్ చేశాం. మృతులకు ఒక్కొక్కరికి పది లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాం. గాయాలపాలైవన వారి పూర్తి వైద్య సంరక్షణ బాధ్యత ఆర్టీసీ తీసుకుంటుంది. ఆర్టీసీ బస్టాండ్ లో ప్లాట్ ఫారానికి ఆనుకుని ఉన్న ప్రతి బస్ బేకు స్టాపర్ వాల్ ఎత్తు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఆర్టీసీ పేర్కొంది. అసత్యాన్ని ప్రచురించడం బాధ్యతారాహిత్యమే కాకుండా సాధారణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. ఇటువంటి ప్రయత్నాలు ఆర్టీసీ సంస్థతో పాటు ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి. తప్పుడు సమాచారాన్ని ప్రచురించి, సంస్థ గౌరవానికి భంగం కలిగిస్తే పరువు నష్టం కేసు నమోదు చేస్తామని ఆర్టీసీ హెచ్చరించింది. చదవండి: Fact Check: రోడ్డున పడ్డది రామోజీ పరువే.. -
ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతీసేలా అబద్ధాలతో రామోజీ కథనం
-
సాధారణ చార్జీలతోనే దసరా ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: అదనపు చార్జీల భారం లేకుండా దసరా పండుగ ప్రత్యేక బస్సులు నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది. సాధారణ చార్జీలతోనే దసరా ప్రత్యేక బస్సులు నడపనుంది. దసరా కోసం ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేకంగా 5,500 బస్సు సర్వీసులు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు ఈ దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. ► దసరా పండుగకు ముందుగా ఈ నెల 13 నుంచి 22 వరకు 2,700 బస్సు సర్వీసులు నిర్వహిస్తారు. దసరా అనంతరం ఈ నెల 23 నుంచి 26 వరకు 2,800 బస్సు సర్వీసులు నడుపుతారు. ► అంతర్రాష్ట్ర సర్వీసులకు సంబంధించి హైదరాబాద్ నుంచి 2,050, బెంగళూరు నుంచి 440, చెన్నై నుంచి 153 బస్సు సర్వీసులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఏర్పాటు చేశారు. ► విశాఖపట్నం నుంచి 480, రాజమహేంద్రవరం నుంచి 355, విజయవాడ నుంచి 885, రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాల నుంచి 1,137 బస్సు సర్వీసులు నిర్వహిస్తారు. ► చార్జీలకు చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు యూటీఎస్ మెషిన్ల ద్వారా టికెట్ల జారీ విధానాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా టికెట్లు తీసుకోవచ్చు. ► దసరా ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించింది. ► బస్సులకు జీపీఎస్ ట్రాకింగ్, 24 గంటల సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కాల్ సెంటర్ నంబర్లు 149, 0866–2570005. ► దసరా ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. -
దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్ సర్వీసులు
సాక్షి, విజయవాడ: పండగపూట ప్రయాణాలు చేసేవారికి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈసారి విజయదశమి(దసరా) 5,500 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 26వ దాకా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అంతేకాదు.. సాధారణ ఛార్జీలతోనే ఈ సర్వీసులను నడిపించనున్నట్లు స్పష్టం చేసింది APSRTC. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున కర్ణాటక ప్రజలు జరుపుకునే పండుగ దసరా. ప్రత్యేకించి విజయవాడ దుర్గమ్మ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. పండుగ నేపథ్యం.. సెలవుల్లో ప్రయాణాల దృష్ట్యా ప్రయాణికుల కోసం ప్రత్యేక సర్వీసుల్ని నడిపించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణ.. ప్రత్యేకించి హైదరాబాద్‌తో పాటు బెంగుళూరు, చెన్నై లాంటి అంతరాష్ట్ర నగరాల నుండి వచ్చే ప్రయాణికులకు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా APSRTC ఏర్పాట్లు చేస్తోంది. అలాగే విజయవాడ నుంచి అన్ని ప్రాంతాలకు బస్సుల్ని నడిపించనున్నట్లు తెలిపింది. ఎప్పుడు.. ఎక్కడి నుంచంటే.. 13 నుంచి 22 దాకా.. దసరా ముందు రోజులలో 2,700బస్సుల్ని, అలాగే.. పండుగ దినాలైన 23వ తేదీ నుంచి 26 దాకా(పండుగ ముగిశాక కూడా) 2,800 బస్సుల్ని నడిపించనుంది. హైదరాబాద్ నుండి 2,050 బస్సులు, బెంగుళూరు నుండి 440 బస్సులు,చెన్నై నుండి 153 బస్సులువివిధపట్టణాలకు నడపబడతాయి.విశాఖపట్నం నుండి 480బస్సులు,రాజమండ్రి నుండి 355బస్సులు, విజయవాడ నుండి 885బస్సులు, అదే విధంగా రాష్ట్రంలోనిఇతర జిల్లాల నుండి వివిధ ప్రాంతాలకు/ పల్లెలకు/ నగరాలకు 1,137 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిపింది. ఆన్లైన్ పేమెంట్స్.. చిల్లర సమస్యలకు చెక్ అంతేకాకుండా ఆన్లైన్ పేమెంట్స్‌తో ప్రయాణికులు ఏ బాధా లేకుండా ప్రయాణించొచ్చని.. తద్వారా ఆర్టీసీకి చిల్లర సమస్యలు ఉండబోవని ఏపీఎస్సార్టీసీ చెబుతోంది. ప్రయాణికులు ఫోన్ పే, గూగుల్ పే కోడ్ స్కాన్ చేయడం, క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా కూడా టిక్కెట్లు తీసుకుని ప్రయాణం సాగించే వీలు కల్పిస్తోంది. రిజర్వేషన్లకు కూడా అవకాశం ఉందని తెలిపింది. అంతేకాదు.. అడ్వాన్స్ రిజర్వేషన్‌తో ఛార్జిలో 10% రాయితీ సౌకర్యము ఉంటుందని తెలిపింది. బస్సుల ట్రాకింగ్ మరియు 24/7 సమాచారం.. సమస్యలకై కాల్ సెంటర్ నెంబర్ 149 & 08662570005 అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే తమ ధ్యేయమంటూ.. ఆర్టీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. -
Fact Check: ‘ప్రగతి రథం’పై ‘పిచ్చి’ కథ
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలు చూసి ఆవేదన చెందిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని పాదయాత్ర సందర్భంగా చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే చెప్పిన మాట ప్రకారం 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను నిజం చేస్తూ ప్రభుత్వంలో విలీనం చేశారు. దీని ద్వారా ఆర్టీసీ ఉద్యోగులు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ప్రజల నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. స్వప్రయోజనాలే పరమావధిగా పనిచేసే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని చెప్పడమే కాదు.. ఆ సంస్థను అడగడుగునా నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఇవి వాస్తవాలు. కానీ, రామోజీరావుకు చంద్రబాబు ప్రయోజనాల పరిరక్షణ ఓ ‘పిచ్చి.’ చంద్రబాబు తప్ప ప్రజలు, ఉద్యోగులు సంతోషంగా ఉంటే సహించలేరు. అందుకే వాస్తవాలను విస్మరించి ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఓ విష కథనాన్ని ఈనాడులో ప్రచురించారు. అవాస్తవాలు, అభూతకల్పనలతో కథనాన్ని అల్లారు. విలీన ప్రక్రియ సందర్భంగా వివిధ దశల్లో ఉన్న అంశాలను వక్రీకరిస్తూ ఉద్యోగులను తప్పుదారి పట్టించేందుకు కుట్రలు పన్నారు. కానీ వాస్తవాలు ఆర్టీసీ ఉద్యోగులకు తెలుసు. వారి సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కనబరుస్తున్న నిబద్ధత తెలుసు. ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం నుంచి ఇతరత్రా ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం వరకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన కార్యాచరణ చేపట్టింది. ఆర్టీసీ ఉద్యోగులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలను ఓసారి పరిశీలిద్దాం.. కార్పొరేట్ శాలరీ (ప్రమాద బీమా) ప్యాకేజీ ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ (ప్రమాద బీమా) ప్యాకేజీని మొదట రూ.45 లక్షలకు అనంతరం ఏకంగా రూ.1.10 కోట్లకు ప్రభుత్వం పెంచడం విశేషం. అందుకోసం ఎస్బీఐతో ఒప్పందం చేసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచింది. జీతాలతోపాటు అలవెన్స్‌లు డ్యూటీ సంబంధిత అలవెన్స్‌లను ఆర్టీసీ గతంలో జీతంతో కలిపి ఇచ్చేది. కానీ ప్రభుత్వ శాఖల్లో ఆ విధానం అమలులో లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ, ఆ సంస్థ ఉద్యోగులకు మాత్రం జీతంతోపాటే అలవెన్స్‌లను కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. ఆ ఫైల్ ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద ఉంది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయిని ప్రభుత్వం చెప్పింది. సమగ్రంగా సర్వీసు నిబంధనలు ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు నిబంధనలపైనా ఈనాడు వక్రభాష్యం చెప్పింది. గతంలోఆర్టీసీ రెగ్యులేషన్ నిబంధనలు అమలులో ఉండేవి. ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు నిబంధనలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. ఉద్యోగుల ప్రవర్తన, క్రమశిక్షణ నిబంధనలకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఆచరణలోకి తెచ్చేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆ ప్రక్రియ తుది దశలో ఉంది. త్వరలోనే సర్వీసు నిబంధనలను ఖరారు చేయనున్నారు. ఆ నిబంధనలు విడుదలైన తరువాత ఆ ప్రకారం ప్రస్తుతం పెండింగులో ఉన్న అప్పీళ్లు అన్నీ పరిష్కరిస్తారు. మెరుగైన పింఛన్ విధానం ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ–2022 ను ఆర్టీసీ ఉద్యోగులకు కూడా సీఎం వైఎస్ జగన్ వర్తింపజేశారు. అదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు పీఎఫ్ సంస్థ ద్వారా అమలయ్యే పింఛన్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. ఎందుకంటే అప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న సీపీఎస్ పింఛన్ విధానంలో కూడా మార్పులు చేసేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. జీపీఎస్‌ను అమలులోకి తేవడానికి సర్వం సిద్ధమైంది. జీపీఎస్ అమలుపై తుది ఆదేశాలు వచ్చిన తరువాత ఆర్టీసీ ఉద్యోగుల పింఛన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మెరుగైన రీతిలో ఈహెచ్ఎస్ ప్రభుత్వ ఉద్యోగుల వైద్య సదుపాయం కోసం ఈహెచ్ఎస్ను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆర్టీసీ ఉద్యోగుల పనివేళలు, ఉండే ప్రదేశాలు కాస్త భిన్నంగా ఉంటాయి. అందుకే ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చేసే ఈహెచ్ఎస్ విధానంలో తగిన మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. పథకాలు ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో వర్తించిన ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ పథకాలను నిపుణుల కమిటీ రద్దు చేసింది. ఎందుకంటే ఆ పథకాలకు సరిసమానమైన పథకం ఏపీజీఎల్ఐ ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతోంది. వాటినే ఆర్టీసీ ఉద్యోగులకూ వర్తింపజేసింది. అందువల్ల 2026 ఏప్రిల్ వరకు ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులకు ‘ఎస్ఆర్ఎంబీ’ లో జమ అయిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించారు. 2030 ఏప్రిల్ వరకు ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులకు ‘ఎస్బీటీ’లో జమ అయ్యే మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించారు. మిగతా ఉద్యోగులకు కూడా చెల్లించాల్సిన మొత్తాన్ని వడ్డీతో సహా వారి ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరిన వేళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది దీర్ఘకాలిక డిమాండ్. దశాబ్దాలు గడిచిపోతున్నా ఆ డిమాండ్ కలగానే మిగిలిపోతుందా అని ఆర్టీసీ ఉద్యోగులు నిర్వేదంలో కూరుకుపోయిన వేళ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న విధాన నిర్ణయం వారి జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చింది. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడుతూ వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ప్రజా రవాణా విభాగంగా మార్చారు. అంతకు ముందు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని నిర్ద్వందంగా తిరస్కరించిన అంశాన్ని వైఎస్ జగన్ సుసాధ్యం చేసి చూపించారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచే నెలనెలా జీతాలు అందుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం ప్రతి నెలా రూ.275 కోట్ల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. ఆ విధంగా ఇప్పటివరకు రూ.10,336 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. దాంతో ఆర్టీసీపై ఆర్థిక భారం తగ్గి, దీర్ఘకాలికంగా ఉన్న అప్పులను తీరుస్తూ ఆ సంస్థ లాభాల బాటలో ప్రయాణిస్తోంది. సీసీఎస్ వంటి సంస్థల నుంచి తీసుకున్న రూ.2,415 కోట్ల అప్పులు తీర్చింది. ఆర్టీసీ ఉద్యోగులకు రూ.307 కోట్ల ఎరియర్స్‌ను కూడా చెల్లించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే సంస్థను మూసుకోవాల్సిందే అని హేళన చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. నాలుగేళ్ల తరువాత తన మాటను వెనక్కి తీసుకున్నారు. ఏపీ సీఎం జగన్ బాటను అనుసరించి తెలంగాణ ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. అదీ సీఎం వైఎస్ జగన్ దార్శనికత. ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అంటే ఇదే అని వేల మంది ఆర్టీసీ ఉద్యోగులతో పాటు యావత్ రాష్ట్ర ప్రజలు గర్వంగా తమ ముఖ్యమంత్రి గురించి చెప్పుకునేలా చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు ఉద్యోగుల ప్రయోజనాలే కాదు ప్రయాణికులకు సౌకర్యాల కల్పనలోనూ ఆర్టీసీది అగ్రస్థానం. కొత్త విద్యుత్ బస్సులు కొనడంతోపాటు డీజిల్ బస్సులను విద్యుత్ బస్సులుగా మారుస్తోంది. 1,500 కొత్త డీజిల్ బస్సుల కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టింది. 2023–24లో కొత్తగా వేయి విద్యుత్ బస్సులు కొనాలని నిర్ణయించింది. దేశంలో వివిధ పుణ్య క్షేత్రాల సందర్శన, పుష్కరాల కోసం కొత్త బస్సులు నడుపుతోంది. రెండు వైపులా టికెట్లు తీసుకునే ప్రయాణికులకు 10 శాతం రాయితీ కల్పిస్తోంది. ఇలా ప్రయాణికులకు అనేక మెరుగైన సేవలతో వారి మన్ననలు పొందుతోంది. -
కొత్తగా ఈ–బస్సులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) మరిన్ని విద్యుత్ బస్సులు (ఈ–బస్సులు) కొనుగోలు దిశగా కార్యాచరణకు సంసిద్ధమవుతోంది. కొత్తగా 1,500 ఈ–బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డు సర్వీసుల కోసం 100 ఈ–బస్‌లను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలకూ వీటి సేవలను విస్తరించాలని నిర్ణయించింది. అందుకోసం రెండో దశ కింద 1,500 ఈ–బస్‌లను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్)తో కలిసి ఆర్టీసీ ఈ బస్సులను తీసుకురానుంది. డీజిల్ బస్సుల స్థానంలో ఈ–బస్‌లు.. సీఈఎస్ఎల్, ఆర్టీసీ సంయుక్తంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్కో బస్సుకు రూ.కోటి చొప్పున రూ.1,500 కోట్ల బడ్జెట్‌తో ప్రాజెక్టును ఆమోదించాయి. డీజిల్ బస్సుల స్థానంలో ఈ–బస్‌లను ప్రవేశపెట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు 27 శాతం నిర్వహణ వ్యయం తగ్గుతుంది. ఇక తొమ్మిది మీటర్ల పొడవుండే ఈ–బస్‌లు అయితే కి.మీ.కు రూ.39.21, అదే 12 మీటర్ల పొడవున్న ఈ–బస్ అయితే కి.మీ.కు రూ.43.49 వ్యయం అవుతుందని అంచనా వేశారు. జిల్లా కేంద్రాల మధ్య ఈ–బస్ సర్వీసులు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలతోపాటు ప్రధాన పట్టణాల్లో ఈ–బస్ సేవలను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అందుకే సమీపంలో ఉన్న జిల్లా కేంద్రాల మధ్య ఈ సర్వీసులను నిర్వహించాలని నిర్ణయించారు. మొదటగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు డిపోలకు వాటిని కేటాయించనున్నారు. ఆ డిపో కేంద్రాలు ఉన్న జిల్లా కేంద్రాల నుంచి రానూపోనూ 250 కి.మీ. దూరంలో ఉన్న జిల్లా కేంద్రాలతోపాటు ప్రధాన పట్టణాలకు వీటిని నడుపుతారు. ఎందుకంటే ఈ–బస్‌లకు ఓసారి చార్జింగ్ పెడితే గరిష్టంగా 250 కి.మీ. వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అందుకోసం ఆయా డిపోల్లో చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటుచేస్తారు. ఇక ఆర్టీసీకి వెయ్యి ఈ–బస్‌లను అద్దె విధానంలో అందించేందుకు సీఈఎస్ఎల్ త్వరలో టెండర్ల ప్రక్రియ నిర్వహించనుంది. అనంతరం ఈ ఏడాది చివరి నాటికి వాటిని ఆర్టీసీకి అందజేస్తుంది. -
AP: గుడ్‌న్యూస్.. ఆర్టీసీలో మరోసారి ‘కారుణ్యం’
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమంపై చిత్తశుద్ధిని చాటుకుంటూ మరోసారి కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. సర్వీసులో ఉండగా మరణించిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబాలకు ఊరట కల్పిస్తూ అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించనున్నారు. 2016 నుంచి 2020 జనవరి వరకు మృతి చెందిన 311 మంది ఆర్టీసీ సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే అనుమతించారు. ఆ ఉద్యోగాలను భర్తీ చేసిన ఆర్టీసీ యాజమాన్యం ప్రస్తుతం వారికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా 2020 జనవరి 1 నుంచి ఇప్పటివరకు మరణించిన ఆర్టీసీ సిబ్బంది వారసులకు కూడా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈమేరకు రెండో విడత కారుణ్య నియామకాలకు ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. మూడు దశల్లో.. 2020 జనవరి 1 నుంచి 2023 ఆగస్టు 15 వరకు 1,538 మంది ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయారు. ఆయా కుటుంబాల్లో అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద మూడు దశల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు. మొదటి దశలో కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా కమిటీలు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఆయా జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో వారిని నియమిస్తారు. జిల్లా కమిటీలు గుర్తించిన పోస్టులను భర్తీ చేయగా మిగిలిన వారికి ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పిస్తారు. అప్పటికీ ఇంకా అర్హులు మిగిలిపోతే వారికి మళ్లీ జిల్లా కమిటీల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తారు. ఇప్పటికే మొదటి దశగా జిల్లా కమిటీల ద్వారా కారుణ్య నియామకాల ప్రక్రియను చేపట్టారు. మిగిలిన ఉద్యోగాల కల్పనకు కూడా ఆర్టీసీ సమాయత్తం అవుతోంది. ఆర్టీసీలో 715 పోస్టుల గుర్తింపు కారుణ్య నియామకాల కోసం ఆగస్టు 15 నాటికి ఆర్టీసీలో అందుబాటులో ఉన్న ఉద్యోగాలను గుర్తించారు. రాష్ట్రంలో 12 ఆర్టీసీ రీజియన్ల వారీగా మొత్తం 715 ఉద్యోగాలను గుర్తించారు. వీటిలో డ్రైవర్ పోస్టులు 346, కండక్టర్ పోస్టులు 90, అసిస్టెంట్ మెకానిక్ పోస్టులు 229, ఆర్టీసీ కానిస్టేబుల్ పోస్టులు 50 ఉన్నాయి. కారుణ్య నియామకాల కింద ఈ పోస్టులను నెల రోజుల్లో భర్తీ చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు చెప్పారు. అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు. – సీహెచ్.ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ ఎండీ ప్రభుత్వానికి ఎన్ఎంయూ కృతజ్ఞతలు కారుణ్య నియామకాల భర్తీకి ఆర్టీసీలో 715 పోస్టులను గుర్తించడం పట్ల నేషనల్ మజ్దూర్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. ఈమేరకు సర్క్యులర్ జారీ చేయడంపై ముఖ్యమంత్రి జగన్, ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావుకు ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కూడా చదవండి: AP: కాంట్రాక్ట్ ఉద్యోగులకు మరో శుభవార్త -
APSRTC: కొత్తగా 1500 బస్సులు కొనుగోలుకు ప్లాన్!
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు అవసమరైన అన్ని చర్య లు తీసుకోవాలని ఆ సంస్థ పాలకమండలి నిర్ణయించింది. క్యాడర్ స్ట్రెంత్ సర్దుబాటుతో ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తగిన విధానాన్ని రూపొందించాలని తీర్మానించింది. కాగా, విజయవాడ ఆర్టీసీ భవన్లో గురువారం పాలకమండలి సమావేశం జరిగింది. కొత్తగా 1,500 బస్సులను కొనుగోలు చేయడంతోపాటు 100 ఈ–బస్సు లను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు కూడా సమావేశంలో నిర్ణయించారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఆమో దించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ మల్లి కార్జునరెడ్డి, ఎండీ సీహెచ్.ద్వారకా తిరు మలరావు, డైరెక్టర్ రాజ్‌రెడ్డి పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: బలహీనపడిన అల్పపీడనం.. ఇక గట్టి వానలు తగ్గినట్టే! -
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇకపై హయ్యర్ పెన్షన్‌కు నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల హయ్యర్ పెన్షన్ కల నెరవేరింది. నూతన హయ్యర్ పెన్షన్ అర్హత ప్రకారం 5-6 రెట్లు పెన్షన్ పెరగనుంది. ఈపీఎఫ్‌వో జారీ చేసిన హయ్యర్ పెన్షన్ ఆమోద పత్రాన్ని (నెలకు 25 వేలు హయ్యర్ పెన్షన్ గా నిర్ధారిస్తూ) జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.సత్యనారాయణకు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు అందజేశారు. దేశంలో ఏ ఇతర ఆర్టీసీ ఉద్యోగులకు లేని అవకాశం ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చదవండి: దారుణాలకు కేరాఫ్ చంద్రబాబే! -
ఆర్టీసీపై ఆంధ్రజ్యోతి చిల్లర రాతలు
-
ప్రగతి పథంలో ఆర్టీసీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రజా రవాణా వ్యవస్థ. దానిని ఎంత నూతనత్వంగా తీర్చిదిద్దితే అంతగా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే కాకుండా, ఆ సంస్థ అభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టారు. దీంతో కరోనా కష్టకాలాన్ని కూడా అధిగమించి ఆర్టీసీ ప్రగతి పథంలో పయనిస్తోంది. ఆర్టీసీ రాబడి 17 శాతం పెరగడమే దీనికి నిదర్శనం. పచ్చ మీడియా రాజకీయ దురుద్దేశంతో ఆర్టీసీ తిరోగమనంలో ఉందంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించేలా అభూత కల్పనలతో వార్త ప్రచురించింది. కానీ, వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. అవేమిటో పరిశీలిద్దాం.. ♦ టీడీపీ హయాంలోకంటే వైఎస్సార్సీపీ హయాంలో ఆర్టీసీ ప్రగతి బాట పట్టింది. కోవిడ్ కారణంగా దేశంలోఅన్ని రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల మాదిరిగానే ఆర్టీసీ కూడా 2020, 2021లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. కానీ మళ్లీ వెంటనే గాడిన పడింది. కోవిడ్ ముందుకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ఆక్యుపెన్సీ రేటు (ఓఆర్) పెరిగింది. ఆర్టీసీ సాధిస్తోన్న రాబడి లెక్కలే ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. ♦ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అంటే 2019–20లో ఆర్టీసీకి రూ.4,781 కోట్ల రాబడి వచ్చింది. 2022–23లో రూ.5,574 కోట్ల రాబడి సాధించింది. అంటే కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా 2019–20 కంటే 2022–23లో రూ.793 కోట్లు అధికంగా (17% అధికం) రాబడి సాధించడం విశేషం. ♦ 2019–20లో కిలోమీటర్‌కు రాబడి రూ.31.31 ఉండగా.. 2022–23లో రూ.37.91కు పెరిగింది. కిలోమీటర్‌కు రూ. 6.60 అంటే 21 శాతం అధికంగా సాధించింది. ♦ దసరా, సంక్రాంతి పండుగలకు దశాబ్దాలుగా ఆర్టీసీ అధిక చార్జీలు వసూలు చేసేది. ప్రస్తుతం దసరా, సంక్రాంతి పండుగల్లో కూడా సాధారణ చార్జీలతోనే సర్వీసులు నిర్వహిస్తోంది. ♦ ప్రయాణికుల అభిరుచికి తగ్గట్టుగా నాన్ ఏసీ స్లీపర్ బస్సులు ప్రవేశపెట్టడం వంటి వినూత్న చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ♦ రూ.50 కోట్లతో 2,200 బస్సులను ఆధునీకరించింది. 900 డీజిల్ బస్సులను కొత్తగా ప్రవేశపెట్టింది. ♦ తొలిసారి 100 ఈ–బస్సులను కూడా అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా 1,500 బస్సులను కొనుగోలు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ♦ ఆర్టీసీ 980 బస్సులను తుక్కు కింద తొలగించిందని పచ్చ మీడియా పేర్కొంది. ఇది అవాస్తవం. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరించి 214 బస్సులను తొలగించింది. ♦ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సీమాంధ్ర నుంచి తెలంగాణ ప్రాంతానికి రోజూ 1,226 బస్సు సర్వీసులను నిర్వహించేవారు. వాటిలో అత్యధిక సర్విసులు హైదరాబాద్‌కే నిర్వహించేవారు కూడా. కోవిడ్ అనంతర పరిణామాలతో తెలంగాణ ఆర్టీసీ ఇరు రాష్ట్రాల మధ్య సర్విసులను తగ్గించాలని ప్రతిపాదించింది. ఆమేరకు రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య కుదిరిన కొత్త ఒప్పందం మేరకు బస్సు సర్వీసులు తగ్గించారు. కోవిడ్‌కు ముందు ఏపీ నుంచి తెలంగాణకు రోజూ 2.65 లక్షల కిలోమీటర్ల మేర సర్విసులు నిర్వహిస్తే.. ప్రస్తుతం రోజూ 1.60 లక్షల కి.మీ. సర్విసులు నిర్వహిస్తున్నారు. అంటే 1.04 లక్షల కి.మీ. మేర సర్విసులను తగ్గించారు. అదే రీతిలో తెలంగాణ ఆర్టీసీ కూడా ఏపీకి నిర్వహించే బస్ సర్విసులను తగ్గించింది. అంతర్రాష్ట్ర ఒప్పందం మేరకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వక్రీకరిస్తూ ఆర్టీసీ బస్ సర్విసులు తగ్గిపోయాయని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది. అప్పులు తీర్చి.. మౌలిక సదుపాయాలు కల్పిస్తూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత సంస్థ గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది. ఈ మూడేళ్లలో తీర్చిన అప్పులే అందుకు నిదర్శనం. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల బకాయిలు రూ.886కోట్లు, పీఎఫ్ బకాయిలు రూ.996కోట్లు, సీసీఎస్ బకాయిలు రూ.226 కోట్లు, ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.307 కోట్లు వెరసి మొత్తం రూ.2,415 కోట్ల బకాయిలను ఆర్టీసీ తీర్చింది. మరోపక్క మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఆర్టీసీ ప్రత్యేకంగా దృష్టిసారించింది. రూ.34 కోట్లతో పులివెందులలో బస్ స్టేషన్‌ను నిర్మించింది. రూ.91 కోట్లతో కొత్తగా 19 బస్ స్టేషన్ల నిర్మాణం చేపట్టింది. రాజమహేంద్రవరం, అనంతపురం, తిరుపతి, నరసరావుపేటలలో డిస్పెన్సరీలను ఆధునీకరించింది. -
‘సర్.. బస్సు ఖాళీగా లేదు.. సీట్లు ఫుల్.. ముందు బస్సు దిగేయండి’
‘సర్.. బస్సు ఖాళీగా లేదు.. సీట్లన్నీ ఫుల్లయ్యాయి.. ముందు బస్సు దిగేయండి.. వెనుక ఖాళీగా వస్తోంది. ఆ బస్సులు రండి’ ఇదీ ఆర్టీసీ సిబ్బంది నుంచి వినిపిస్తున్న మాట. సీట్లు ఖాళీగా ఉన్నా.. ఆపేందుకు డ్రైవర్లు ఆసక్తి చూపకపోగా.. కొందరు కండక్టర్లు టిక్కె ట్లు కొట్టి డబ్బులు తీసుకోవాలన్నా ఇబ్బంది పడిపోతున్నారు. బస్సు ఖాళీ లేదు.. దిగండి అంటూ.. ప్రయాణికులను ఒకింత దగమాయిస్తూ దింపేస్తున్నారు.. వెనుక వస్తున్న బస్సునైనా ఎక్కదామంటూ ఆ సిబ్బందే అదేమాట.. ఇదెక్కడో కాదండోయ్.. మన తిరుపతి జిల్లాలోనే.. దీంతో చేసేది లేక ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. తిరుపతి అర్బన్: ఆర్టీసీ ఆర్థిక కష్టాలు అందరికీ తెలిసిందే. ప్రతి డిపో కష్టాల్లోనే నడుస్తోంది. దీనికితోడు 2020–21లో కోవిడ్ మరింత దెబ్బతీసింది. ఆ తర్వాత తిరుపతి జిల్లా లాభాల దిశగా పయనిస్తోంది. అయినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ఉద్యోగులు వ్యవహరించాల్సి ఉంది. అయితే కొందరు డ్రైవర్లు, కండక్టర్లు బస్టాండ్‌లో, స్టాపింగ్ పాయింట్ల వద్ద బస్సు ఆపకుండా వెళ్లిపోతుండడం విమర్శలకు తావిస్తోంది. వెనుక బస్సు ఖాళీగా వస్తోంది శ్రీకాళహస్తి, పుత్తూరు, చిత్తూరు మార్గాల్లో తిరుపతికి వచ్చిపోయే బస్సుల్లో స్టాపింగ్ ఉన్నా, ప్రయాణికులు చెయ్యెత్తి మొత్తుకున్నా బస్సులు ఆగకుండా వెళ్లిపోతున్నాయి. సార్ సీట్లు లేవు.. వెనుక బస్సు ఖాళీగా వస్తోంది.. అంటూ ఉచిత సలహాలు ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఆర్టీసీ కండక్టర్లు చెప్పిన మాటలు నిజమేనని తర్వాత వచ్చే వెనుక బస్సును ఆపినా అదే పరిస్థితి. మరీ పిల్లలు, వృద్ధులు ఉంటే అస్సలు ఆపడం లేదు. చిన్నపాటి బ్యాగ్‌లు ఉన్నా ఆపని పరిస్థితి. దీంతో ప్రజలు ఆర్టీసీ ఉద్యోగుల తీరును తప్పుపడుతున్నారు. తాము స్టాడింగ్ జర్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నా బస్సులు ఆపకుండా వెళ్తున్నారని మండిపడుతున్నారు. ఇదిగో సాక్ష్యం రెండు రోజుల క్రితం ఓ ప్రయాణికుడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తి సమీపంలోని మిట్టకండ్రిగ బస్టాపింగ్ పాయింట్ వద్దకు చేరాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత ఓ ఆర్డినరీ సర్వీసు వచ్చింది. బస్సు ఖాళీగా ఉన్నా డ్రైవర్ ఆపలేదు. చెయ్యెత్తి మొత్తుకున్నా కన్నెత్తి చూడలేదు.. దీంతో చేసేది లేక తమిళనాడుకు ఆర్టీసీ బస్సులో ఆ యువకుడు తిరుపతికి వెళ్లాల్సి వచ్చింది. సీట్లతో పనిలేదు సీట్లతో పనిలేదు. తప్పకుండా బస్సును ఆయా సర్కిళ్లలో నిలపాలి. ప్రయాణికులు చెయ్యెత్తిన చోటంతా బస్సును ఆపాల్సిందే. జిల్లాలోని డీఎంలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తాం. లేదంటే డ్రైవర్లు, కండక్టర్లపై చర్యలు తప్పవు. –చెంగల్‌రెడ్డి, ఆర్ఎం, ఆర్టీసీ -
ఆర్టీసీలో బ్రేక్ జర్నీ
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఇప్పటివరకు విమాన ప్రయాణికులకు మాత్రమే పరిమితమైన బ్రేక్ జర్నీ సదుపాయం ప్రస్తుతం ఆర్టీసీ ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు బస్సు మారిన ప్రతిసారి టిక్కెట్టును తీసుకునే వారు. ఇకపై అలాంటి అవసరం లేకుండా మల్టీ సిటీ టిక్కెటింగ్ సౌలభ్యాన్ని ఆర్టీసీ కల్పించింది. ఏదైనా పట్టణం నుంచి దూర ప్రాంతంలో ఉన్న మరో పట్టణానికి లేదా నగరానికి వెళ్లడానికి నేరుగా బస్సు సదుపాయం ఉండడం లేదు. ఇలాంటి వారు తాము వెళ్లేబోయే ప్రాంతానికి ఎక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉందో అక్కడికి చేరుకోవాల్సి ఉండేది. ఇకపై తాము బయలుదేరే చోటునుంచే వెళ్లే గమ్యస్థానానికి ఆన్లైన్ ద్వారా ఒకేసారి నేరుగా టిక్కెట్‌ను పొందవచ్చు. ఉదాహరణకు కడప నుంచి శ్రీకాకుళం వెళ్లాలంటే డైరెక్టర్‌గా ఆర్టీసీ సర్వీసు లేదు. విశాఖపట్టణం ఒక బస్సులో వచ్చి శ్రీకాకుళం వెళ్లాలంటే మరో బస్సు ఎక్కి టిక్కెట్ తీసుకోవాల్సి వచ్చేది. ఇది వ్యయ ప్రయాసలతో కూడుకుని ఉంది. అంతేకాకుండా వీరు ఎక్కిన ప్రతి బస్సులోనూ రిజర్వేషన్ కోసం ఇబ్బంది పడాల్సి వచ్చేది. అయితే ఈ మల్టీ సిటీ టిక్కెటింగ్ విధానంలో తాము వెళ్లే బస్సులో ఒకే రిజర్వేషన్ చార్జితో ప్రయాణించే వీలు కల్పించారు. మారే బస్సులోనూ ముందుగానే సీటు రిజర్వు అయి ఉంటుంది. ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విధానంలో ప్రయాణీకులు తమ గమ్యస్థానానికి వెళ్లేందుకు బ్రేక్ జర్నీ సదుపాయాన్ని కల్పించారు. తాము వెళ్లే బస్సుకోసం 2 గంటల నుంచి 22 గంటల వరకు వేచి ఉన్న బ్రేక్ జర్నీలో ఆ టిక్కెట్ చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ముందు వెళ్లే వారి బస్సు మార్గమధ్యలో ఎక్కడైనా మరమ్మతుకు గురైతే ఆ ప్రయాణీకుడిని మరో బస్సులో వెంటనే పంపించి ప్రయాణానికి ఆటంకం లేకుండా చూస్తారు. రాయలసీమ ప్రాంతం నుంచి రాయలసీమలోని 8 జిల్లాల నుంచి విశాఖ పట్టణం మినహా ఇతర దూర ప్రాంతాలకు నేరుగా ఆర్టీసీ బస్సు సదుపాయాలు లేవు. దీనిని దృష్టిలో పెట్టుకుని విశాఖ సహా శ్రీకాకుళం, విజయనగరం, భద్రాచలం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు మల్టీ సిటీ టిక్కెటింగ్ (బ్రేక్ జర్నీ) సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది. ప్రచారం నిర్వహిస్తున్నాం ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చిన మల్టీ సిటీ టిక్కెటింగ్ సదుపాయంపై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నాం. టిక్కెట్ కౌంటర్లలోనూ ఈ విషయం తెలియజేస్తున్నాం. అక్కడక్కడ పోస్టర్లను కూడా ప్రదర్శించనున్నాం. ఈ కొత్త విధానంలో బ్రేక్ జర్నీకి వీలు కల్పిస్తున్నాం. కడప జోన్ వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, తిరుపతి, చిత్తూరు, మదనపల్లె. పుట్టపర్తి, అనంతపురం, హిందూపురం డిపోల నుంచి బ్రేక్ జర్నీ సదుపాయం కల్పిస్తున్నాం. – గోపినాథ్‌రెడ్డి, కడపజోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
AP: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 1,489 ఆర్టీసీ బస్సులు
సాక్షి, అమరావతి: ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సేవలందించేందుకు ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. కొత్తగా 1,489 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దూర ప్రాంతాలు, అంతర్రాష్ట సర్వీసుల కోసం ఈ బస్సులను కొనుగోలు చేయనుంది. డీలర్ల వద్ద నుంచి కాకుండా నేరుగా బస్సుల తయారీ కంపెనీల నుంచే వాటిని కొనుగోలు చేయాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక్కో బస్ ఖరీదు దాదాపు రూ.45లక్షల చొప్పున మొత్తం రూ.670కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కాగా టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు జ్యుడీషియల్ ప్రివ్యూకు ఆర్టీసీ నివేదించింది. టెండర్ డాక్యుమెంట్లను జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. టెండరు నిబంధనలు, ఇతర అంశాలపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈమెయిల్ ద్వారా తెలిపేందుకు ఈ నెల 19 సాయంత్రం 5గంటల వరకు అవకాశం ఇచ్చారు. - టెండర్ పత్రాలు అందుబాటులో ఉంచిన జ్యుడిషియల్ ప్రివ్యూ వెబ్సైట్ www.judicialpreview. ap.gov.in - టెండర్ల ప్రక్రియపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తెలిపేందుకు ఈమెయిల్స్ పంపాల్సిన జ్యుడీషియల్ ప్రివ్యూ ఈమెయిల్ ఐడీలు judge&jpp@ap.gov.in, apjudicialpreview@gmail.com. ఇది కూడా చదవండి: ఆదుకోవాలని వచ్చిన వారికి తక్షణ సాయం -
APSRTC: ఆర్టీసీలో మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయం
సాక్షి, అమరావతి: విమాన ప్రయాణాల తరహాలో మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఒక పట్టణం లేదా నగరం నుంచి మరో పట్టణం, నగరానికి నేరుగా బస్సు సౌకర్యంలేనప్పుడు బ్రేక్ జర్నీ విధానంలో ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తిరుపతి నుంచి భద్రాచలం వెళ్లేందుకు నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తిరుపతి నుంచి విజయవాడకు, అక్కడి నుంచి భద్రచలానికి ఒకేసారి రిజర్వేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నై, బెంగళూరు వంటి దూరప్రాంతాలకు కూడా బస్ రిజర్వేషన్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. బ్రేక్ జర్నీ సమయం కనీసం రెండు గంటల నుంచి గరిష్టంగా 22 గంటల వరకు ఉండవచ్చు. మొదటి దశలో రాష్ట్రంలో 137 పట్టణాలు, నగరాల నుంచి ఈ మల్టీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత దశల్లో మరిన్ని పట్టణాలకు ఈ సౌలభ్యాన్ని విస్తరించనుంది. ఇది కూడా చదవండి: బాబు సర్కారు కుంభకోణాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు -
ఆర్టీసీ బస్సు ఎక్కండి, తీర్థయాత్రలు పూర్తి చేసుకోండి
సాక్షి, విశాఖపట్నం : ఆదాయం పెంపు కోసం ఆర్టీసీ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ప్రయాణికుల ద్వారా వచ్చే రాబడికంటే దానికయ్యే ఖర్చే అధికంగా ఉంటోంది. అయినప్పటికీ సేవా దృక్పథంతో ప్రజల కోసం బస్సులను నడుపుతోంది. దీంతో ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే లాజిస్టిక్స్ ద్వారా ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. కొత్తగా కార్గోలో డోర్ డెలివరీ, పికప్ సదుపాయాలను కూడా ప్రవేశపెట్టింది. దీనికి వినియోగదార్ల నుంచి ఆదరణ బాగుంటోంది. ఈ నేపథ్యంలో సరికొత్తగా టెంపుల్ టూరిజంపై ఫోకస్ పెట్టింది. ఇందులోభాగంగా విశాఖపట్నం నుంచి తమిళనాడులోని అరుణాచలం, పొరుగున ఒడిశాలో ఉన్న పూరీ సహా మరికొన్ని పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి అరుణాచలానికి 120 వరకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. ప్రతి పౌర్ణమికి అరుణాచల గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విశాఖ (ద్వారకా బస్‌స్టేషన్) నుంచి అరుణాచలానికి ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ జోన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.రవికుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మే 5 నాటి పౌర్ణమికి 3వ తేదీ నుంచే ఇక్కడ నుంచి ఈ బస్సులు బయలుదేరేలా ప్రణాళిక రూపొందించామన్నారు. అరుణాచలం వెళ్లేటప్పుడే కాణిపాకం, శ్రీపురం, కంచి, శ్రీకాళహస్తి దేవాలయాలను కూడా దర్శించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. పౌర్ణమి దర్శనం అయ్యాక ఏడో తేదీన విశాఖలో చేరుస్తామన్నారు. సూపర్ లగ్జరీ సర్వీసుకు రూ.4,000, ఇంద్ర ఏసీ సర్వీసుకు రూ.5,000 చొప్పున ఒక్కొక్కరికి టిక్కెట్టు ధర నిర్ణయించామన్నారు. ఈ యాత్రకు ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకునే వీలు కల్పించామన్నారు. పూరీ, భువనేశ్వర్‌లకు కూడా.. మరోవైపు పొరుగున ఒడిశాలోని కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా స్పెషల్ ప్యాకేజీతో బస్సులను నడపనున్నట్టు ఈడీ రవికుమార్ తెలిపారు. పూరీలోని జగన్నాథస్వామి, భువనేశ్వర్‌లోని లింగరాజస్వామి, కోణార్క్ సూర్య దేవాలయం, చిలక సరస్సుల సందర్శనకు ప్రతి వారాంతం (శనివారం)లో వీటిని నడుపుతామన్నారు. ఈనెల 29 నుంచి ఈ బస్సులను ప్రారంభిస్తామన్నారు. ఈ ప్యాకేజీలో (సూపర్ లగ్జరీ) టిక్కెట్టు ధర రూ.2,350గా నిర్ణయించామని చెప్పారు. డిమాండ్‌ను బట్టి ఏసీ సర్వీసులను కూడా ప్రవేశపెడతామన్నారు. అరుణాచలంతో పాటు ఒడిశా పుణ్యక్షేత్రాలకు ఏడాది పొడవునా ఈ టెంపుల్ టూరిజం బస్సులు నడుపుతామని తెలిపారు. మీడియా సమావేశంలో ఆర్టీసీ డీపీటీవో బలిజి అప్పలనాయుడు, డిప్యూటి సీటీఎం జి.సత్యనారాయణ, విశాఖ డిపో మేనేజర్ గంగాధరరావులు పాల్గొన్నారు. -
అరుణాచల గిరి ప్రదక్షిణ: భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ తియ్యటి వార్త
సాక్షి, విశాఖపట్నం: అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకి ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. విశాఖ నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.రవికుమార్ వెల్లడించారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. 3న విశాఖలోని ద్వారక బస్‌స్టేషన్ నుంచి బయలు దేరి కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, కంచి, శ్రీకాళహస్తి క్షేత్రాల దర్శనం ఉంటుందన్నారు. 5న పౌర్ణమి రోజున అరుణాచల గిరి ప్రదక్షిణ అనంతరం 7న తేదీన విశాఖకి చేరుకుంటోందన్నారు. టికెట్స్ కావాల్సిన www.apsrtconline.inలో ద్వారా ఆన్ లైన్లో బుక్ చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. అలాగే అదనపు సర్వీసులు కూడా నడపడానికి ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధంగా ఉందని రవికుమార్ పేర్కొన్నారు. చదవండి: అలర్ట్: తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణం -
తిరుపతి జిల్లా: పూడి క్రాస్ వద్ద ఆర్టీసి బస్సు బోల్తా
-
ఏపీ: టెన్త్ పరీక్షలకు సర్వం సిద్దం.. ఆర్టీసీలో విద్యార్థులకు ఫ్రీ ప్రయాణం
సాక్షి, విజయవాడ: ఏపీలో సోమవారం(ఏప్రిల్ 3) నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు 18వ తేదీ వరకు జరుగనున్నాయి. కాగా, పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ఏపీ టెన్త్ పరీక్షలు 2023 మోడల్ పేపర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక, మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. టెన్త్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాము. రాష్ట్రంలో 6.69 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్ష సమయం ఉంటుందన్నారు. ఆరు సబ్జెక్ట్‌లకు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లకు అనుమతి లేదు. ప్రభుత్వ టీచర్లు మాత్రమే ఇన్విజిలేటర్లుగా ఉంటారు. పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినట్టు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద నో మొబైల్ జోన్‌గా ప్రకటించాం. సెల్ ఫోన్, స్మార్ట్ పరికరాలు మొదలైనవి ఇన్విజలేటర్లు కూడా తీసుకురాకూడదు. పరీక్షలు జరిగే రోజున పరీక్షా కేంద్రాల పరిధిలోని ఆయా పాఠశాలలకి సెలవు ఉంటుంది. పరీక్షల నిర్వహణకి 800 స్క్వాడ్లు ఏర్పాటు చేశాం. ఇక, వేసవి కాలం ఎండ నేపథ్యంలో ఈనెల 3వ తేదీ నుంచి ఏపీలో ఒంటిపూట బడులు నడుస్తాయని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలు సైతం మూడో తేదీ నుంచి ఒంటి పూటే బడులు నిర్వహించాలి అని తెలిపారు. -
ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణీకులకు అదిరిపోయే గుడ్ న్యూస్
-
APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు
సాక్షి, విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు పడ్డాయి. భారీగా సొంత బస్సులు కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2,736 కొత్త బస్సుల కొనుగోలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.572 కోట్ల అంచనాతో 1500 కొత్త డీజిల్ బస్సులు, జీసీసీ మోడల్ లో 1000 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. 200 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పు చేస్తున్నామని ఆయన తెలిపారు. ‘‘36 కొత్త అద్దె బస్సులు తీసుకోబోతున్నాం. వీలైతే కర్ణా టక తరహాలో 15 మీటర్ల అంబారీ బస్సులు. కొత్త స్క్రాప్ పాలసీ ప్రకారం కొన్ని బస్సులు తీసేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో 15 ఏళ్ల సర్వీసు దాటిన బస్సులు కేవలం 221 మాత్రమే ఉన్నాయి. అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపే విషయంపై ఒడిశా, కర్ణాటకతో ఒప్పందాలు పూర్తయ్యాయి. తమిళనాడు, తెలంగాణతో త్వరలోనే ఒప్పందాలు చేసుకుంటాం’’ అని ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. చదవండి: మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే.. -
ఆదాయం బాటలో ఏపీఎస్ ఆర్టీసీ
సాక్షి, కొవ్వూరు: నష్టాలను అధిగమించి అదనపు ఆదాయ ఆర్జనపై ఆర్టీసీ దృష్టి సారించింది. కార్గో సేవలను విస్తృతం చేయడం, ప్రయాణికులను ఆకర్షించేలా పర్యాటక ప్రాంతాలకు ప్యాకేజిలు ప్రవేశపెట్టడం, పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు నడపడం లాంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆదాయం సమకూరే ఏమార్గాన్నీ వీడకుండా సంస్థ అధికారులు గట్టిగా కృషి చేస్తున్నారు. రెండేళ్లపాటు కరోనా విపత్తులో 50 నుంచి 60 శాతం మేర సంస్థ ఆదాయం కోల్పోయింది. కరోనా సద్దుమణిగాక కొన్నాళ్లుగా పూర్వపు పరిస్థితిని సంతరించుకోగలిగింది. తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంతో పాటు కొవ్వూరు, నిడదవోలు,గోకవరంలలో సంస్థకు డిపోలున్నాయి. వీటి పరిధిలో 56 రూట్లలో 301 బస్సులు నడుస్తున్నాయి. కార్గో సేవలతో ఊపు ఆర్టీసీకి కార్గో సేవలు బాగా కలిసొస్తున్నాయి. ఈ సేవల ద్వారా సంస్థకు విశేష ఆదాయం సమకూరుతోంది. గతేడాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్గో సేవల ఆదాయం విషయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్ధానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా ఆరంభం నుంచే జోరు కొనసాగిస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో జనవరి నాటికి జిల్లా వ్యాప్తంగా రూ.8.90 కోట్ల మేరకు ఆదాయం ఆర్జించింది. ఈనెలాఖరుకు రూ.9.50 కోట్ల మేర సగటు ఆదాయం లభించనుందని అధికారులు లెక్కగట్టారు. 2016 జూన్ నుంచి కార్గో సేవలు ప్రారంభమమైనా ఆరంభంలో అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. సరైన ప్రొత్సాహం..ప్రణాలిక లేకపోవడం ఇందుకు కారణం. టీడీపీ హయాంలో 2018–19లో కేవలం రూ.3.30 కోట్లు ఆదాయం మాత్రమే లభించింది. ఇప్పుడు దానికి రెండు రెట్లు మించి ఆదాయం పెరిగింది. ప్రయాణికులను ఆకట్టుకునేలా సర్వీసులు ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ లక్కీ కూపన్ల విధానం ప్రవేశపెట్టింది. నెలనెలా డ్రా తీస్తోంది. విజేతలను ఎంపిక చేసి బహుమతులను అందజేస్తోంది. పంచభూత లింగదర్శిని పేరుతో కంచి, చిదంబరం, జంబుకేశ్వరం,అరుణాచలం, శ్రీకాళహస్తి ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. త్రివైకుంఠ దర్శిని పేరుతో భద్రాచలం, ద్వారకాతిరుమల, అన్నవరం క్షేత్రాలకు ప్యాకేజి తరహాలో బస్సులు నడుపుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరిలో నవజనార్ధన పారిజాతాలుగా గుర్తింపు పొందిన తొమ్మిది క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక యాత్ర బస్సు నడుతుతోంది. కార్తికమాసంలో పంచారామ క్షేత్రాలు, శబరిమలై, విజయవాడలకూ బస్సులు నడపుతూ ఆదాయం పెంచుకుంటోంది. సుమారు 50 మంది ముందుకు వస్తే ఎక్కడ నుంచి ఎక్కడికైనా బస్సు నడిపేందుకు తాము సిద్ధమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 2018–19లో ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా రూ.156.23 కోట్లు వస్తే ఈ ఏడాది రూ.197 కోట్ల వరకు ఆదాయం రానుందని అంచనా. ఇతర ఆదాయ వనరుల ద్వారా.. అవకాశమున్న ఏ ఆదాయ వనరునూ ఆర్టీసీ విడిచిపెట్టడం లేదు. డిపోల్లోని సైకిల్ స్టాండ్లు, దుకాణాల అద్ధెలతో పాటు ప్రత్యేక సర్వీసుల నిర్వహణ ద్వారా ఆదాయం పెంచుకుంటోంది. 2018–19లో నాలుగు డిపోలకు ఇతర మార్గాల ద్వారా రూ.34.90 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి రూ.38.83కోట్లు ఆదాయం సమకూరింది. ఫిబ్రవరి.. మార్చి నెలల ఆదాయం కూడా అంచనా వేసుకుంటే సుమారు రూ.42 కోట్ల మేర ఆదాయం వస్తుందని ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయి. 2018–19లో నిడదవోలు డిపోకు ఇతర ఆదాయ వనరుల ద్వారా రూ.2.40 కోట్లు వస్తే ఇప్పుడు ఆ ఆదాయం రూ.3.51 కోట్లకు చేరుకుంది. అలాగే రాజమహేంద్రవరంలో రూ.20.22 కోట్ల నుంచి రూ.25.55 కోట్లకు, కొవ్వూరు డిపోలో రూ.3.86 కోట్ల నుంచి రూ.5.37కోట్లకు రాబడి సాధించింది. -
మార్చి 2 నుంచి అఖిల భారత రవాణా సంస్థల కబడ్డీ పోటీలు
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా పబ్లిక్ బస్ ట్రాన్స్ పోర్ట్ కబడ్డీ టోర్నమెంట్-2023 మార్చి 2 నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్(ఏఎస్ఆర్టీయూ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ టోర్నమెంట్‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఆతిథ్యం ఇస్తోంది. హైదరాబాద్ శివారు హకీంపేటలోని ట్రాన్స్పోర్ట్ అకాడమీలో గురువారం నుంచి మూడు రోజుల పాటు కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుంది. ఆర్టీసీ ఉద్యోగులకు మానసిక ఉల్లాసంతో పాటు చక్కటి ఆరోగ్యం లభించేందుకు ఏఎస్ఆర్టీయూ ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జన్నార్ తెలిపారు. ఈ టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మహారాష్ట్ర, హర్యానా ఆర్టీసీలతో పాటు నవీ ముంబై, బృహణ్ ముంబై, పుణే మహానగర్ పరివాహన్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు పాల్గొంటున్నాయని వివరించారు. కబడ్డీ పోటీలను గురువారం (మార్చి 2) ఉదయం 9.30 గంటలకు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారక తిరుమలరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారు. -
AP: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
కదిరి (శ్రీసత్యసాయి జిల్లా): పదోన్నతి పొందిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఈ నెల 24న ఉత్తర్వులు విడుదలయ్యాయి. సవరించిన కొత్త పీఆర్సీ ప్రకారం మార్చి 1వ తేదీన వారంతా వేతనాలు అందుకోనున్నారు. దీనికితోడు పదోన్నతి పొందిన నాటి నుంచి వారికి రావాల్సిన వేతన బకాయిలు కూడా కొత్త పీఆర్సీ ప్రకారం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ)లో రాష్ట్ర వ్యాప్తంగా 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 2,096 మందికి పదోన్నతి లభించింది. డీపీసీ నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ అనుమతి లేకుండా పదోన్నతి కల్పించారంటూ ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పీఆర్సీ వీరికి వర్తింపజేయడం కుదరదని తెగేసి చెప్పింది. పదోన్నతి పొందిన వారిని మినహాయించి 49,392 మందికి 2022 సెప్టెంబర్ 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాయి. సీఎం సానుకూలంగా స్పందించి.. వారికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫలితంగా పదోన్నతి పొందిన వారికి కూడా కొత్త పీఆర్సీ వర్తింపజేస్తూ బకాయిలతో సహా చెల్లించేలా ఈ నెల 24న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో 2,096 మందికి లబ్ధి చేకూరనుంది. వీరిలో 27 మంది డిపో మేనేజర్లు, 18 మంది అసిస్టెంట్ డీఎంలు, 148 మంది గ్రేడ్–1 కండక్టర్లు, 332 మంది గ్రేడ్–1 డ్రైవర్లు, 197 మంది అసిస్టెంట్ డిపో క్లర్కులు, 345 మంది ఆర్టిజాన్లు, 198 మంది మెకానిక్‌లు, 322 మంది సూపర్వైజర్లు, 44 మంది సెక్యూరిటీ విభాగం వారితో పాటు ఇతరులు 465 మంది ఉన్నారు. మనసున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేరుస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆర్థిక శాఖ అనుమతి లేకున్నా సరే 2,096 మందికి పదోన్నతులు కల్పించారు. ప్రస్తుతం వారికి పే రివిజన్‌ను క్రమబద్ధీకరించారు. మనసున్న సీఎంవైఎస్ జగన్‌కి ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటికీ మద్దతుగా నిలుస్తారు. – చంద్రయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్టీసీ వైఎస్సార్ యూనియన్ సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్మికులకు దేవుడయ్యారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతి పొందిన మాలాంటి 2,096 మందికి కొత్త పీఆర్సీ అమలయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. సీఎంకు ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది మొత్తం జీవితాంతం రుణపడి ఉంటాం. – మోకా హరిమోహన్, అసిస్టెంట్ మేనేజర్, కదిరి డిపో -
జాతీయ స్థాయిలో ఏపీఎస్ఆర్టీసీకి మరో అవార్డు
సాక్షి, విజయవాడ: జాతీయ స్థాయిలో ఏపీఎస్ఆర్టీసీకి మరో అవార్డు దక్కింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన డిజిటల్ టెక్నాలజీ పోటీల్లో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ విభాగంలో డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డు లభించింది. ఇటీవల ప్రవేశపెట్టిన (UTS) డిజిటల్ చెల్లింపులకు గానూ ఈ అవార్డు దక్కింది. కాగా ఏపీఎస్ఆర్టీసీకి ఈ అవార్డు దక్కడం వరుసగా అయిదోసారి. కొచ్చిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటేశ్వరరావు, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ (ఐటీ) శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకున్నారు. ప్రయాణీకులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు ఆర్టీసీకి ప్రశంసలు -
ఆర్టీసీ గరుడ బస్సు బోల్తా
చిల్లకల్లు (జగ్గయ్యపేట): ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్‌ప్లాజాకు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ గరుడ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో విజయవాడకు చెందిన నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఏపీ16 జడ్ 0599 బస్సు విజయవాడ నుంచి మియాపూర్ వెళ్తుండగా టోల్‌ప్లాజా వద్దకు వచ్చే సరికి హెడ్లైట్లలో సమస్య తలెత్తడంతో అదుపు తప్పింది. డ్రైవర్ నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ పక్కకు దూసుకెళ్లి ఓ వైపునకు బోల్తా పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కాపాడండంటూ కేకలు వేశారు. గమనించిన టోల్‌ప్లాజా సిబ్బంది, హైవే పోలీసులు బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడ్డ వారిని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగతా వారిని మరో బస్సు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు పంపించారు. -
Apsrtc: ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రచారం ఫేక్
సాక్షి, కృష్ణా: ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ నోటిఫికేషన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని ఖండించింది ఏపీఎస్ఆర్టీసీ. తాము ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని చెబుతూ.. ఆ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దంటూ ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఏపీఎస్సార్టీసీలో డ్రైవర్ , కండక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు కొందరు. పైగా వాట్సాప్‌లో Apsrtc వెబ్ సైట్ డొమైన్ ను యాడ్ చేస్తూ నోటిఫికేషన్ అంటూ ప్రచారం చేశారు ఆ అగంతకులు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని ఖండించింది ఆర్టీసీ. అలాంటిదేమైనా ఉంటే తాము అధికారికంగానే ప్రకటించి రిలీజ్ చేస్తామని స్పస్టం చేసింది. -
లోకేష్‌కు కలిసిరాని కొత్త ప్లాన్.. చట్టపరంగా చర్యలకు దిగిన ఏపీఎస్ఆర్టీసీ!
సాక్షి, విజయవాడ: టీడీపీ తప్పుడు ప్రచారాలకు కేరాఫ్ మారింది. ఉన్నది లేన్నట్టుగా.. జరగనిది జరిగినట్టుగా చూపిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. తాజాగా మరో తప్పుడు వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై అక్కస్సు వెళ్లగక్కింది. కానీ, తీరా అది ఫేక్ అని తేలడంతో టీడీపీని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. అటు, ఏపీఎస్ఆర్టీసీ కూడా టీడీపీ తప్పుడు ప్రచారంపై స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. నారా లోకేష్‌ను కలిసిన ఓ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించారని టీడీపీ, లోకేష్ మద్దతుదారులు సోషల్ మీడియాలో ఓ పోస్టును పెట్టి వైరల్ చేశారు. అయితే, ఈ పోస్టుపై ఏపీఎస్ఆర్టీసీ యాజ్యమాన్యం స్పందించింది. తాము ఆ డ్రైవర్‌ను తొలగించలేదని స్పష్టం చేసింది. ఇది అస్యత ప్రచారం అని ఖండించింది. ఇలాంటి తప్పుడు ప్రచారానికి బాధ్యులైన టీడీపీ సోషల్ మీడియా నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇక, టీడీపీ పోస్టు చేసిన వార్త ఫేక్ అని తేలడంతో నారా లోకేష్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. #FakeNewsAlert This is absolutely false News. We strongly deny these claims made in media. APSRTC will initiate suitable legal action on the responsible social media administrators for such fake propaganda https://t.co/g5HveEE2R0 — APSRTC (@apsrtc) February 8, 2023 -
శ్రీశైలం భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ
సాక్షి, అమరావతి: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టింది. రోజూ 1,075 దర్శనం టికెట్లు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. తాజాగా ఈ నెల 9 నుంచి శ్రీశైలం భక్తులకు కూడా ప్యాకేజీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు దేవదాయ శాఖతో ఒప్పందం చేసుకుంది. వాటిలో స్పర్శ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం టికెట్లు ఉన్నాయి. రూ.500 స్పర్శ దర్శనం టికెట్లు 275, రూ.300 అతి శీఘ్ర దర్శనం టికెట్లు 300, రూ.150 శీఘ్ర దర్శనం టికెట్లు 500 అందుబాటులోకి తీసుకువచ్చింది. భక్తులు ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా శ్రీశైలం వెళ్లేందుకు ప్రయాణ టికెట్లతోపాటు ఈ దర్శనం టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చును. వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి నిర్వహించే 95 ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ టికెట్లను బుక్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. శ్రీశైలం వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకే దేవదాయ శాఖతో కలసి ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టామని ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఏపీ, కర్ణాటక మధ్య మరిన్ని బస్ సర్వీసులు
సాక్షి, అమరావతి: కర్ణాటకకు మరిన్ని బస్ సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్ సర్వీసుల నిర్వహణ అంశంపై కర్ణాటక ఆర్టీసీతో ఏపీఎస్ ఆర్టీసీ గురువారం ఒప్పందం చేసుకుంది. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, కేఎస్ ఆర్టీసీ ఎండీ వి అంబుకుమార్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కేఎస్ ఆర్టీసీతో ఏపీఎస్ ఆర్టీసీ తొలిసారిగా గురువారం ఈ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఏపీఎస్ ఆర్టీసీ కర్ణాటకలో అదనంగా రోజూ 327 బస్ సర్వీసులను 69,284 కి.మీ. మేర నడుపుతుంది. దీంతో మొత్తమ్మీద ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 1,322 బస్సులు కర్ణాటకలో రోజూ 2,34,762 కి.మీ. మేర నడుస్తాయి. ఇక కేఎస్ ఆర్టీసీ ఏపీలో అదనంగా రోజూ 496 బస్ సర్వీసులను 69,372 కి.మీ. మేర నడపాలని నిర్ణయించారు. దీంతో మొత్తమ్మీద కేఎస్ ఆర్టీసీకి చెందిన 1,489 బస్సులు ఏపీలో రోజూ 2,26,044 కి.మీ. నడుస్తాయి. ఆర్టీసీ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు కేఎస్ బ్రహ్మానందరెడ్డి, ఎ.కోటేశ్వరరావు, పి.కృష్ణమోహన్, కేఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రశాంత్‌కుమార్ మిశ్రా, ఆంథోని జార్జ్, ఎస్.రాజేశ్ పాల్గొన్నారు. -
ఏపీఎస్ ఆర్టీసీకి లాభాలు తెచ్చిన సంక్రాంతి
విజయవాడ: ఈ సంక్రాంతి ఏపీఎస్ ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ ఏడాది సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీకి రూ. 141 కోట్ల ఆదాయం వచ్చింది. సంక్రాంతికి ప్రత్యేక సర్వీసులను ప్రయాణిలు విశేషంగా ఆదరించడంతో భారీగా ఆదాయం వచ్చినట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరమలరావు తెలిపారు. తిరుగు ప్రయాణానికి కూడా తగినన్ని బస్సులు వేయడంతో విశేష ఆదరణ లభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి 1,483 ప్రత్యేక బస్సులు నడిపడమే కాకుండా, జనవరి 6వ తేదీ నుండి 14వరకూ రికార్డు స్థాయిలో 3,392 బస్సులు నడిపినట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు. కాగా, సాధారణ ఛార్జీలకే తగిన సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉండటంతో ఏపీఎస్ ఆర్టీసి బస్సులకే అధిక ప్రాధానిమచ్చారు. రాను-పోను టికెట్లపై బుక్ చేసుకున్న వారికి టిక్కెట్ చార్జీపై 10 శాతం రాయితీ ఇవ్వడం కూడా ఏపీఎస్ ఆర్టీసీ భారీ ఆదాయానికి కారణమైంది. -
అదనపు చార్జీల భారం లేదు.. ప్రయాణికులకు పండుగే
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పండుగ సమయాల్లో సామాన్య, పేద, మధ్య తరగతి ప్రయాణికులకు జగన్ సర్కార్ ఊరటనిచ్చింది. గతంలోలా అదనపు చార్జీల భారం మోపుతూ జేబులు గుల్ల చేయడం లేదు. ఇది వరకు ప్రతి పండుగ సమయంలో, వరుస సెలవులప్పుడు, దాదాపు రద్దీ సమయాల్లో ప్రయాణికుల నుంచి ఏపీఎస్ఆర్టీసీ సాధారణ చార్జీలకు మించి 50 శాతం వరకు అదనంగా వసూలు చేసేది. దూరాన్ని బట్టి సగటున ఒక్కో కుటుంబం రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు అదనంగా చెల్లించి ప్రయాణించాల్సి వచ్చేది. ‘సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేది సామాన్య, పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే. పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల పేరిట వారి నుంచి అదనంగా టికెట్ వసూలు చేయడం తగదు. ఈ విషయంలో సహేతుక నిర్ణయాలు తీసుకోండి’ అని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనల మేరకు 3000 సర్వీసుల్లోని 1.40 లక్షల సీట్లకు సంబంధించి అదనపు చార్జీల వసూళ్ల జోలికి వెళ్లడం లేదని ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లిఖార్జునరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. గతంలో మనుగడ కోసం అంటూ ఆర్టీసీ ఫక్తు వ్యాపార ధోరణిలో కార్యకలాపాలను నిర్వర్తించేది. డిమాండ్ ఆధారంగా రెగ్యులర్ చార్జీలపై 10, 20 శాతం పెంచి వసూలు చేసేది. స్పెషల్ బస్సుల్లో 50 శాతం వరకు వసూలు చేసే వారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విశాఖకు సూపర్ లగ్జరీ బస్సులో నలుగురు సభ్యులున్న ఓ కుటుంబానికి సాధారణ టికెట్ రూ.4,440 అవుతుంది. 50 శాతం పెంపుతో రూ.6,520 అవుతుంది. ఈ లెక్కన అదనపు భారం రూ.2,080. అమరావతి ఏసీ బస్సులో అయితే రూ.3,200 అదనపు భారం పడుతుంది. సీఎం వైఎస్ జగన్ నిర్ణయం వల్ల ఇప్పుడు ఏ బస్సులోనూ ఇలా అదనపు భారం ఉండదు. ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీకి రోజుకు రూ.2 కోట్ల అదనపు ఆదాయం ఉండక పోయినా, సీఎం ఆదేశాల మేరకు ప్రజలకు మేలు కలుగుతోందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు తెలిపారు. 4 టికెట్లపై రూ.3,600 మిగులు గతంలో హైదరాబాద్ నుంచి అమలాపురం రావాలంటే టికెట్ రేట్లు చూసి భయపడేవాళ్లం. ప్రయివేటు ట్రావెల్స్ వారి తరహాలో ఆర్టీసీ కూడా అదనంగా వసూలు చేసేది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఒక టికెట్‌పై రూ.450 వరకు అదనపు భారం లేదు. మా కుటుంబంలో నలుగురికి రానుపోను కలిపి ఇప్పుడు రూ.3,600 అదనపు భారం తప్పినట్లే. ఇది పండుగ ఖర్చుకు కలిసి వచ్చినట్లే. – కోడూరి సత్య మణికంఠ, ప్రయాణికుడు, అమలాపురం -
Hyderabad: సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం..
భీమవరం (ప్రకాశంచౌక్): సంక్రాంతికి నగరం మొత్తం పల్లెబాట పట్టింది. దీంతో హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చే జనాల్ని గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసుల్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ఈ నెల 6 నుంచి ప్రారంభమైన పండగ ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుంచి జిల్లాల్లోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం డిపోలకు నడుస్తాయి. ఈ నెల 10 నుంచి హైదరాబాద్ నుంచి ప్రయాణికుల సంఖ్య పెరిగింది. హైదారాబాద్ నుంచి జిల్లాకు ఏర్పాటు చేసిన ఆర్టీసి బస్సులు దాదాపు కిక్కిరిసి ఉంటున్నాయి. 105 ప్రత్యేక బస్సులు ఏర్పాటు హైదారాబాద్ నుంచి జిల్లాలో పలు ప్రాంతాలకు పండుగకు వచ్చే ప్రయాణికులను తీసుకురావడానికి ఆర్టీసీ 105 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు నడుపుతోంది. గతేడాది మాదిరిగానే సాధారణ ధరలకే ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. సూపర్ లగ్జరీ టిక్కెట్ రూ.750, ఇంద్ర రూ.950, అల్ట్రా రూ.710 చొప్పున వసూలు చేస్తున్నారు. రిజర్వేషన్ కూడా 90 శాతం మేర పూర్తయ్యింది. బస్సుల సంఖ్య పెంచుతాం సంక్రాంతి పండుగకు ముందు, తర్వాత కూడా ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నాం. పండగకు ముందు 105, పండగ తర్వాత తిరుగు ప్రయాణానికి 84 ప్రత్యేక బస్సులు తిప్పుతాం. ప్రయాణికుల రద్దీ మేరకు బస్సుల సంఖ్య పెంచుతాం. «టిక్కెట్ చార్జీ పెంచకుండా సాధారణ చార్జీలకే సర్వీసులు నడుపుతున్నాం. ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు. పండగకు ప్రజలు ఆర్టీసీ బస్సులల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. – ఏ.వీరయ్య చౌదరి, ప్రజా రవాణా అధికారి, భీమవరం -
ఫేస్బుక్లో అభ్యర్థన.. ఆర్టీసీ బస్సు ఏర్పాటు
సాక్షి, అమరావతి: ఫేస్బుక్లో పోస్టు ద్వారా అభ్యర్థించిన వెంటనే ప్రయాణికులకు ఓ బస్సు సర్వీసును ఏర్పాటు చేసి ప్రజా సేవే తమ లక్ష్యమని ఆర్టీసీ నిరూపించిన ఆసక్తికరమైన ఘటన కృష్ణాజిల్లాలోని పామర్రులో జరిగింది. 40 మంది ప్రయాణికులు మంగళవారం రాత్రి పామర్రు నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్ల వెళ్లాల్సి ఉంది. వీరిలో ఒకరు తమకు బస్సు ఏర్పాటు చేయగలరా అని ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) కె.ఎస్.బ్రహ్మానందరెడ్డిని ఫేస్బుక్ పోస్టు ద్వారా అభ్యర్థించారు. దీనిపై వెంటనే స్పందించిన బ్రహ్మానందరెడ్డి గుడివాడ బస్ డిపో మేనేజర్‌తో మాట్లాడి ఆ ప్రయాణికులకు పామర్రు నుంచి నెల్లిమర్లకు ప్రత్యేకంగా బస్సు సర్వీసు ఏర్పాటు చేశారు. ఆ 40 మంది ప్రయాణికులు ఆ బస్సులో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానమైన నెల్లిమర్లకు బుధవారం ఉదయం చేరుకున్నారు. అడగంగానే సాయం చేసిన ఆర్టీసీ సేవలను అభినందించారు. -
APSRTC: ఫేస్బుక్ పోస్ట్‌కు స్పందించిన ఆర్టీసీ అధికారులు
సాక్షి, విజయవాడ: ప్రయాణికుల అభ్యర్థనలకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందిస్తున్నారు. ఫేస్ బుక్ పోస్ట్‌కు ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించారు. 40 మంది ఉన్నాం మాకో బస్సు ఏర్పాటు చేయాలంటూ ఎస్. వెంకటరావు అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. వెంకటరావు అభ్యర్థనకు సత్వరమే స్పందించిన ఆర్టీసీ ఈడీ బ్రహ్మనందరెడ్డి.. పామర్రు నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్లకు బస్సు ఏర్పాటు చేశారు. కాగా, ప్రజా రవాణా సంస్థ ప్రయాణికుల కోసం వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) మెరుగు పరుచుకునేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే సీనియర్ సిటిజన్ల (వయో వృద్ధులు)కు టిక్కెట్లో 25 శాతం రాయితీ కల్పిస్తోంది. దీంతోపాటు ఇప్పుడు మరికొన్ని రాయితీలను కల్పించింది. చదవండి: ఆర్టీసీలో ఆఫర్లు.. టిక్కెట్లో 25 వరకు శాతం రాయితీ -
APSRTC: ఆర్టీసీలో ఆఫర్లు.. టిక్కెట్లో 25 వరకు శాతం రాయితీ
కడప (వైఎస్ఆర్ జిల్లా): ప్రజా రవాణా సంస్థ ప్రయాణికులను ఆకర్శించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. ప్రయాణికులు ప్రైవేటు ఆపరేటర్ల వైపు వెళ్లకుండా అనేక చర్యలు చేపడుతోంది. మరోవైపు ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) మెరుగు పరుచుకునేందుకు పాటుపడుతోంది. అలాగే సీనియర్ సిటిజన్ల (వయో వృద్ధులు)కు టిక్కెట్లో 25 శాతం రాయితీ కల్పిస్తోంది. దీంతోపాటు ఇప్పుడు మరికొన్ని రాయితీలను కల్పించింది. నలుగురు ప్రయాణికులు (పిల్లలతోసహా) ఒకేసారి టిక్కెట్ తీసుకుంటే ఛార్జి మొత్తంలో 5 శాతం రాయితీ కల్పించింది. ఇది కుటుంబాలతో కలిసి ప్రయాణం చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. మరోవైపు ఈ–వ్యాలెట్ ద్వారా టిక్కెట్‌ను బుక్ చేసుకుంటే ఛార్జిలో ఐదుశాతం సొమ్ము తగ్గించే వెసులుబాటు కల్పించింది. ప్రయాణికులు రానుపోను టిక్కెట్‌ను ముందుగా రిజర్వు చేసుకుంటే తిరుగు ప్రయాణ ఛార్జిలో పది శాతం తగ్గిస్తోంది. ఈ సదుపాయాన్ని సంక్రాంతి, దసరా వంటి పండుగల సీజన్లలో నడిపే ప్రత్యేక సర్వీసులకు వర్తింపజేస్తోంది. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. దీంతో ప్రయాణికులకు, ఆర్టీసీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఆర్టీసీ అధికారులు ఇప్పటికే రానున్న సంక్రాంతికి కడప జోన్‌లోని కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి 400–450 ప్రత్యేక సర్వీసులను నడపనున్నారు. ఈ బస్సుల్లో రెగ్యులర్ ఛార్జీలే తప్ప మునుపటిలా టిక్కెట్‌పై 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఆర్టీసీ అందిస్తున్న రాయితీ సదుపాయాలను వినియోగించుకోవాలని కడప జోన్ ఈడీ గోపీనాథ్‌రెడ్డి కోరారు. (క్లిక్ చేయండి: సంక్రాంతి సంబరాలు షురూ.. గిరి పల్లెల్లో మొదలైన సందడి) -
ఆర్టీసీలో ఆఫర్లు!.. నలుగురు ప్రయాణికులు ఒకేసారి టికెట్ తీసుకుంటే..
సాక్షి, విశాఖపట్నం: ప్రజా రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తోంది. ప్రయాణికులు ప్రైవేటు ఆపరేటర్ల వైపు మళ్లకుండా తగు చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా సంస్థ ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్)తో పాటు ఆదాయాన్ని మెరుగు పరచుకునేందుకు పాటుపడుతోంది. ఇప్పటికే వయోవృద్ధులకు (సీనియర్ సిటిజన్లకు) టిక్కెట్టులో 25 శాతం రాయితీ ఇస్తోంది. తాజాగా ఇప్పుడు మరికొన్ని రాయితీలను అందజేస్తోంది. నలుగురు ప్రయాణికులు (పిల్లలు సహా) ఒకేసారి టిక్కెట్టు తీసుకుంటే చార్జీ మొత్తంలో ఐదు శాతం రాయితీ ఇస్తుంది. ఇది కుటుంబాలతో కలిసి ప్రయాణం చేసే వారికి లాభదాయకం కానుంది. అలాగే ఈ–వాలెట్ ద్వారా టిక్కెట్టును బుక్ చేసుకున్నా చార్జీలో ఐదు శాతం సొమ్ము తగ్గించే వెసులుబాటు కల్పించింది. కాగా ప్రయాణికులు రానూపోనూ టిక్కెట్టును ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణం చార్జీలో 10 శాతం తగ్గిస్తుంది. ఈ సదుపాయాన్ని సంక్రాంతి, దసరా వంటి పండుగల సీజన్లలో నడిపే ప్రత్యేక బస్సులకూ వర్తింపజేస్తుంది. రానున్నది సంక్రాంతి సీజను కావడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికుల రాకపోకలు సాగిస్తారు. దీంతో ఇది ఇటు ప్రయాణికులకు, అటు ఆర్టీసీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఆర్టీసీ అధికారులు ఇప్పటికే రానున్న సంక్రాంతికి విశాఖ జిల్లా నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 550 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ బస్సుల్లో రెగ్యులర్ చార్జీలే తప్ప మునుపటిలా టిక్కెట్టుపై 50 శాతం అదనపు చార్జీ వసూలు చేయబోమని ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. ఈ నిర్ణయం కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు పెరిగేందుకు దోహదపడనుంది. ఫలితంగా ఆదాయం కూడా పెరగనుంది. ఆర్టీసీ అందిస్తున్న ఈ రాయితీ సదుపాయాలను ప్రయాణికులు వినియోగించుకోవాలని విశాఖ జిల్లా ప్రజా రవాణా శాఖాధికారి (డీపీటీవో) ఎ.అప్పలరాజు కోరారు. -
ఆర్టీసీ కార్గో రికార్డు రాబడి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) కార్గో రవాణా సేవలకు విశేష ఆదరణ లభిస్తోంది. సత్వరం డోర్ డెలివరీ సౌలభ్యంతో ప్రవేశపెట్టిన కార్గో రవాణా సేవల ద్వారా ఆర్టీసీ రికార్డుస్థాయిలో రాబడి సాధిస్తోంది. 2022లో ఏకంగా రూ.122.33 కోట్ల రాబడి సాధించి రికార్డు సృష్టించింది. 2021 కంటే ఇది 30 శాతం అధికం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్టీసీ 2021–22లో కార్గో రవాణా ద్వారా రూ.122.19 కోట్ల రాబడి సాధించింది. 2022–23లో డిసెంబర్ 25 నాటికే రూ.122.33 కోట్ల రాబడి సాధించడం విశేషం. ఆర్థిక సంవత్సరం ఇంకా మూడునెలలు ఉండటంతో ఈ రాబడి రూ.150 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. 2022లో కార్గో రవాణా రాబడిలో తిరుపతి కేంద్రంగా ఉన్న జోన్–4 అత్యధికంగా రూ.34.28 కోట్లు సాధించింది. రాష్ట్రంలో ఆర్టీసీ నిర్వహిస్తున్న 329 బస్స్టేషన్లలో.. 249 బస్స్టేషన్ల నుంచి కార్గో సేవలను అందిస్తోంది. బస్స్టేషన్ల వద్ద కాకుండా ఇతర ప్రదేశాల్లో ఆర్టీసీకి 525 మంది పార్సిల్ బుకింగ్ ఏజెంట్లను నియమించింది. మరోవైపు డోర్ డెలివరీ సౌలభ్యాన్ని కూడా అందిస్తోంది. దీంతో ఆర్టీసీ కార్గో రవాణా సేవలకు సానుకూల స్పందన లభిస్తోంది. -
APSRTC: ఆర్టీసీ జనతా గ్యారేజ్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజా రవాణా విభాగం డిపోలు త్వరలో ‘జనతా గ్యారేజ్’లుగా మారి.. ఆర్టీసీతో పాటు ప్రైవేటు వాహనాలకు కూడా సర్వీసింగ్ సేవలందించనున్నాయి. ఆదాయ వనరులను పెంపొందించుకునే ప్రణాళికలో భాగంగా జనతా గ్యారేజ్ విధానానికి ఆర్టీసీ రూపకల్పన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా ఉన్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వయం సమృద్ధి సాధించేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల వాహనాలుండగా.. వాటిలో సుమారు 17 లక్షల వరకు ప్రైవేటు వాణిజ్య వాహనాలే ఉన్నాయి. వాటి యజమానులు ప్రస్తుతం ప్రైవేటు సెంటర్లలో తమ వాహనాలకు సర్వీసింగ్ చేయిస్తున్నారు. ఈ భారీ ‘సర్వీసింగ్’ మార్కెట్లోకి ఇప్పుడు ఆర్టీసీ కూడా జనతా గ్యారేజ్‌ల ద్వారా ప్రవేశించబోతోంది. నిపుణుల కమిటీ సూచనల మేరకు కార్యాచరణ చేపట్టింది. మూడు దశల్లో 12 డిపోల్లో.. జనతా గ్యారేజ్ విధానాన్ని మూడు దశల్లో 12 డిపోల్లో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొదటి దశలో విజయనగరం, విజయవాడ, నెల్లూరు, కడప డిపోల్లో ప్రైవేటు వాహనాలకు సర్వీసింగ్ సేవలందిస్తారు. ఈ డిపోల్లో ఇప్పటికే ఆర్టీసీ బస్సు టైర్ల రీట్రేడింగ్ యూనిట్లున్నాయి. వీటి ద్వారా ప్రైవేటు వాహనాల టైర్లను కూడా రీట్రేడింగ్ చేసే సేవలను ప్రవేశపెడతారు. వాహనాల సాధారణ సర్వీసింగ్, అన్ని రకాల రిపేర్లు, బాడీ పెయింటింగ్, వాటర్ సర్వీసింగ్ తదితర సేవలను అందుబాటులోకి తెస్తారు. ఇందుకోసం అవసరమైన అదనపు యంత్ర పరికరాలను కొనుగోలు చేయనున్నారు. ఇప్పటికే ఆర్టీసీ టెక్నికల్ స్టాఫ్‌కు శిక్షణ కార్యక్రమం కూడా పూర్తయ్యింది. ఇతర సేవల కోసం అవుట్ సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా ఆర్టీసీ వాహనాల స్పేర్ పార్టులు, ప్రైవేటు వాహనాల స్పేర్ పార్టులకు వేర్వేరుగా స్టోర్ రూమ్‌లు, రికార్డులు నిర్వహిస్తారు. తొలి దశలో భారీ వాహనాలకు సర్వీసింగ్ సేవలందిస్తారు. అనంతరం కార్లు, ఎస్‌యూవీలు, ఇతర వాహనాలకు సర్వీసింగ్ సేవలందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలో ఐటీఐ, ఆటోమొబైల్ డిప్లొమా విద్యార్థులకు అప్రెంటీస్ విధానాన్ని మరింత విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఈ డిపోలు ఉపయోగపడతాయి. రెండో దశలో విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి డిపోల్లో, మూడో దశలో శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు డిపోల్లో జనతా గ్యారేజ్ విధానాన్ని ప్రవేశపెడతారు. మూడు నెలల్లో జనతా గ్యారేజ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ కృషి చేస్తోంది. -
ఏపీకి 3,300 ‘సంక్రాంతి’ బస్సులు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ఏపీవాసుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడపనున్నాయి. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ఆంధ్రాలోని వివిధ ప్రాంతాలకు 1,800 బస్సులు నడపాలని నిర్ణయించగా తాజాగా టీఎస్ఆర్టీసీ దాదాపు 1,500 బస్సులు నడిపేందుకు కసరత్తు చేస్తోంది. గత రెండేళ్లలో కోవిడ్ తీవ్రత వల్ల సిటీ నుంచి వెళ్లే ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఆ మేరకు బస్సులు తగ్గించిన ఇరు ఆర్టీసీలు.. ప్రస్తుతం భారీగా బస్సు సర్వీసులు పెంచాయి. ఈసారి నగరం నుంచి ఏపీకి దాదాపు 15లక్షల మంది వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జనవరి 6 నుంచి 14 వరకు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు వైపు వెళ్లే బస్సులను సీబీఎస్ (ఓల్డ్ హాంగర్) నుంచి నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కృష్ణకిషోర్ నాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ ఆంధ్రావైపు వెళ్లే బస్సులను దిల్సుఖ్నగర్ నుంచి వరంగల్ వైపు వెళ్లే బస్సులను ఉప్పల్ నుంచి, కరీంనగర్‌వైపు వెళ్లే బస్సులను జేబీఎస్ నుంచి నడిపేందుకు సన్నాహాలు చేస్తోందని అధికారులు తెలిపారు. ప్రత్యేక చార్జీలు లేకుండానే.. నిజానికి రెండు ఆర్టీసీలు నడిపే ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు సరిపోవు. ఎక్కువ మంది రైళ్లలో వెళ్లనుండగా అంతకంటే ఎక్కువ మంది సొంత, ప్రైవేటు వాహనాల్లో వెళ్తుంటారు. కొంతకాలంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులతోపాటు కార్లు, మినీ బస్సుల వల్ల ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లుతోంది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకొనే క్రమంలో ఇరు ఆర్టీసీలు పండుగ స్పెషల్ బస్సుల్లో విధించే 50 శాతం అదనపు చార్జీని రద్దు చేశాయి. తెలంగాణ ఆర్టీసీ ఏపీ, కర్ణాటకతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు రెగ్యులర్ సర్వీసులు కాకుండా 4,233 అదనపు బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ నిత్యం హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 352 బస్సులను నడుపుతోంది. పండుగ నేపథ్యంలో ఆ బస్సులకు అదనంగా 1,800 స్పెషల్ బస్సులు తిప్పనున్నట్లు ప్రకటించింది. -
సంక్రాంతికి 6,400 స్పెషల్ బస్సులు.. రిజర్వేషన్‌పై 10శాతం రాయితీ!
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండగకు స్వగ్రామం వెళ్లాలని భావిస్తున్నవారికి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ శుభవార్త అందించింది. సంక్రాంతి రద్దీకి తగ్గట్లుగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సోమవారం ప్రకటించారు. సంక్రాంతి కోసం మొత్తం 6,400 బస్సులు అదనంగా తిప్పనున్నట్లు వెల్లడించారు. సంక్రాంతి పండగ సందర్భంగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు ఎండీ తిరుమలరావు. సాధారణ ఛార్జీలతోనే బస్సులు నడుపుతామన్నారు. జనవరి 6 నుంచి 14 వరకు 3,120 బస్సులు, సంక్రాంతి తర్వాత మరో 3,280 బస్సులు అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేసుకుంటే అదనంగా 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: విజయవాడ: క్రిస్మస్ తేనీటి విందుకు హాజరుకానున్న సీఎం జగన్ -
Chandrababu Naidu: ఆర్టీసీకి ‘చంద్రన్న భజన’ బకాయి రూ.78.36 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బీసీలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వారిని మరింత చైతన్యం చేసేందుకు బుధవారం విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సదస్సు పైనా ఈనాడు పత్రిక విషపు రాతలు రాసింది. ఈ సదస్సుకు ముందుగానే డబ్బులు చెల్లించి, ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకొన్నప్పటికీ, ‘వైఎస్సార్సీపీకి ఆర్టీసీ జీ హుజూర్’ అంటూ బండలేసింది. ఇదే ఈనాడుకు ఆనాడు చంద్రబాబు పేరిట పెట్టిన ‘జయము జయము చంద్రన్న’ అనే భజన కార్యక్రమానికి అప్పనంగా ఆర్టీసీ బస్సులను తిప్పిన విషయం పట్టించుకోదు. ఆ కార్యక్రమం కోసం టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీకి బకాయి పెట్టిన మొత్తం రూ.78.36కోట్లు. ‘జయహో బీసీ’ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ముందుగానే డబ్బులు చెల్లించి ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకుంది. ఈ విషయాన్ని దాచిపెట్టి, అబద్ధాలు రాసింది. ఈనాడు పత్రిక కడుపుమంట అలాంటిది. ఇంతకీ చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్టీసీ దుస్థితి, ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటో ఓసారి పరిశీలిద్దాం... పైసా అద్దె చెల్లించకుండానే.. ఆర్టీసీ అందరికీ బస్సులు అద్దెకిస్తుంది. వ్యక్తులకు, సంస్థలకు, వేడుకలకు... ఇలా ముందుగా అద్దె చెల్లిస్తే బస్సులు పంపుతుంది. ప్రభుత్వం కూడా ఇలా అద్దెకు బస్సులు తీసుకుంటుంది. పార్టీలూ తీసుకుంటాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రచార కార్యక్రమాల కోసం ఆర్టీసీ బస్సులను ఇష్టానుశాతం వాడుకున్నారు. నిబంధనల ప్రకారం ఆర్టీసీ బస్సులను ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు తీసుకుంటే అందుకు అద్దె చెల్లించాలి. టీడీపీ ఐదేళ్లలో ఏనాడూ దీనిని పట్టించుకోలేదు. పోలవరం సందర్శన కోసం 19,923 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. అందుకోసం ఆరీ్టసీకి రూ.65.79 కోట్లు చెల్లించాలి. అక్కడికి బస్సుల్లో తరలించిన వారితో చంద్రన్న భజన పాటలు పాడించారు. అయినా, 2019లో టీడీపీ అధికారాన్ని కోల్పోయే వరకు ఆ బకాయి చెల్లించనే లేదు. కట్టని రాజధానిని చూపించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజల్ని బలవంతంగా అమరావతికి ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. అందుకోసం 1,518 బస్సులను వాడుకున్నారు. ఆ బస్సుల అద్దె బకాయి రూ.5.36 కోట్లు చెల్లించనే లేదు. ‘దివ్య దర్శనం’ పేరుతో టీడీపీ ప్రభుత్వం 1,984 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుంది. అందుకు చెల్లించాల్సిన అద్దె రూ.7.21 కోట్లు. ఇదీ చెల్లించలేదు. మొత్తం మీద చంద్రబాబు ఆరీ్టసీకి పెట్టిన బకాయి రూ.78.36 కోట్లు. కానీ ఈనాడు పెన్ను ఈ వాస్తవం రాయదు. ఎందుకంటే ఆర్టీసీ సొమ్మును అప్పనంగా వాడుకుంది వారి చంద్రబాబు కదా. ఆర్టీసీ సంస్థ నష్టాల్లో కూరుకుపోయినా, అప్పుల పాలైపోయినా పర్వాలేదు. చంద్రబాబు భజన చేస్తే చాలన్నది దాని సిద్ధాంతం. అద్దె ముందే చెల్లించడం వైఎస్సార్సీపీ విధానం ప్రస్తుతం ఆర్టీసీపై వైఎస్సార్సీపీ ఒక్క రూపాయి కూడా భారం మోపడంలేదు. పార్టీ కార్యక్రమాలకు అవసరమైతే నిరీ్ణత అద్దెను ముందుగానే చెల్లించి మరీ బస్సులను తీసుకుంటోంది. ఈ ఏడాది జూలైలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీకి 1,823 బస్సుల కోసం రూ.3.38కోట్లు ముందుగానే చెల్లించింది. విజయవాడలో బుధవారం నిర్వహించిన ‘జయహో బీసీ’ సభ కోసం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి 1,460 ఆర్టీసీ బస్సులను దాదాపు రూ.7 కోట్లకు అద్దెకు తీసుకుంది. అయినా సరే ‘ఈనాడు’ మాత్రం ప్రభుత్వానికి ఆర్టీసీ జీ హుజూర్... అంటూ దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని మోసగించేందుకు యత్నించింది. స్వామి భక్తి అంటూ ఇష్టారీతిన పదాలు వాడింది. ఇదే స్వామి భక్తి చంద్రబాబు హయాంలో అప్పనంగా ఇచ్చినప్పుడు ఈనాడు గమనించలేకపోయిందా? కాదు.. చూడనట్లే ఉంది. ఇష్టం వచ్చినట్లుగా బస్సులు వాడుకొని, అద్దె ఎగ్గొట్టిన చంద్రబాబు దందాను మరుగున పెట్టి, ముందస్తుగా డబ్బు చెల్లించి ఆర్టీసీకి ఆదాయాన్ని సమకూర్చిన వైఎస్సార్సీపీపై అక్కసు వెళ్లగక్కింది. చదవండి: వారికి జీతాలు పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు -
APSRTC: సంక్రాంతికి ఊరెళుతున్నారా..? ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్
సాక్షి, విశాఖపట్నం: ఈసారి సంక్రాంతికి ఆర్టీసీ శుభవార్తలు చెప్పింది. సంక్రాంతి పండగకు ఊరు వెళ్లే వారికి రాయితీని ప్రకటించింది. రానూపోనూ టిక్కెట్టును ముందుగా బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో (ఏసీ, నాన్ ఏసీ ఏ బస్సుకైనా) 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. అంతేకాదు.. సంక్రాంతి ప్రయాణికులకు ఆర్టీసీ మరో వెసులుబాటును కల్పించింది. ఏటా దసరా, సంక్రాంతి పండగల సమయంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ స్పెషల్స్ పేరిట ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ఈసారి సంక్రాంతికి మాత్రం స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీని వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. గత దసరా సీజనుకు నడిపిన స్పెషల్స్‌కు కూడా ఆర్టీసీ అదనపు చార్జీ వసూలు చేయకుండానే నడిపింది. అది ప్రయాణికుల ఆదరణను చూరగొనడంతో ఆశించిన స్థాయిలో ఆదాయమూ సమకూరింది. దీంతో ఈ సంక్రాంతికి కూడా అదనపు బాదుడు లేకుండా సాధారణ చార్జీలతోనే స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇది ప్రయాణికులకు ఊరట కలిగించనుంది. ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభం ఈ సంక్రాంతి పండగకు ఊరెళ్లే వారి కోసం ఆర్టీసీ ఆన్లైన్ బుకింగ్స్‌ను ఇటీవలే ప్రారంభించింది. దూరప్రాంతాలకు వెళ్లే వారు కొంతమంది ఇప్పట్నుంచే తమ టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారు. రానూపోనూ టిక్కెట్టును ముందుగా బుక్ చేసుకున్న వారికి తిరుగు ప్రయాణం చార్జీలో 10 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిన వారు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. తిరుగు ప్రయాణంలో ఏ బస్సులో ప్రయాణించినా టిక్కెట్టుపై 10 శాతం రాయితీ వర్తిస్తుందని విశాఖ జిల్లా ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి ఎ.అప్పలరాజు ‘సాక్షి’కి చెప్పారు. సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికుల ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్టును apsrtconline.in వెబ్సైట్ ద్వారా ముందుగా బుక్ చేసుకోవచ్చని సూచించారు. సంక్రాంతి పండగ రద్దీకనుగుణంగా అవసరమైన బస్సులను నడుపుతామని ఆయన తెలిపారు. వారం రోజుల ముందు నుంచి.. సంక్రాంతి పండగకు ఏటా ఆర్టీసీ అధికారులు విశాఖ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతారు. ఇలా విశాఖ రీజియన్ నుంచి గత సంక్రాంతికి 641 బస్సులను నడిపారు. సంక్రాంతికి వారం రోజుల ముందు నుంచి ప్రయాణికుల రద్దీ మొదలవుతుంది. ఈ లెక్కన జనవరి ఏడెనిమిది తేదీల నుంచి ఈ స్పెషల్స్‌ను అందుబాటులోకి తెస్తారు. అలాగే తిరుగు ప్రయాణం చేసే వారి కోసం 20వ తేదీ వరకు నడుపుతారు. చదవండి: ఇప్పటం లోగుట్టు లోకేష్‌కు ఎరుక.. ఆర్కే తనదైన శైలిలో.. -
AP: ఆర్టీసీలో ఇక అన్నీ ఈ-బస్సులే
సాక్షి,అమరావతి/గోపాలపట్నం/సింహాచలం: రాష్ట్ర ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) పూర్తిగా ఈ – బాట పట్టనుంది. ఆర్టీసీలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు (ఈ–బస్సులు) రానున్నాయి. కాలుష్య నియంత్రణ, ప్రజలకు మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఈ–బస్సులను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ–బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఈ–బస్సుల కొనుగోలుపై చర్చించి కార్యాచరణను ఖరారు చేశారు. ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు సమర్పించారు. వాటిపై ముఖ్యమంత్రి సమీక్షించి, అనుమతినిచ్చారు. ఆర్టీసీ ఇప్పటికే తిరుమల–తిరుపతి మార్గంలో 100 ఈ–బస్సులను ప్రవేశపెట్టింది. వీటిపై ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ఇప్పుడు రాష్ట్రమంతటా ఈ–బస్సులను ప్రవేశపెట్టనుంది. ఈ–బస్సును ఒకసారి చార్జింగ్ చేస్తే ఒక రూట్లో రానుపోనూ ప్రయాణించవచ్చని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. డిస్కంలతో కలిసి ఈ–బస్సులకు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మొదటి దశలో రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో, రెండో దశలో జిల్లా కేంద్రాల్లోని బస్ స్టేషన్లలో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. మూడో దశలో డివిజన్ కేంద్రాలు, రాష్ట్ర సరిహద్దు సమీపంలోని పట్టణాల్లోని బస్ స్టేషన్లలో ఏర్పాటు చేస్తారు. రెండు దశల్లో 4 వేల ఈ–బస్సులు ప్రస్తుతం ఆర్టీసీలో 11,214 డీజిల్ బస్సులున్నాయి. వాటి స్థానంలో దశల వారీగా ఈ–బస్సులను ప్రవేశపెడతారు. మొదటగా రెండు దశల్లో 4 వేల బస్సులు కొనాలని నిర్ణయించారు. 2023లో 2 వేల ఈ–బస్సులను ప్రవేశపెడతారు. ఇందుకోసం ఆర్టీసీ వచ్చే ఏడాది ప్రారంభంలో టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. 2024లో పరిస్థితిని సమీక్షించాక.. మరో 2 వేల బస్సులను ప్రవేశపెడతారు. అవసరమైతే ఆ సంఖ్యను పెంచుతారు. ముందుగా సిటీ సర్వీసులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, దూర ప్రాంతాలకు నడపాలని భావిస్తున్నారు. ఐదేళ్లలో ఆర్టీసీలో డీజిల్ బస్సు అన్నదే లేకుండా పూర్తిగా ఈ–బస్సులనే నడపాలన్నది లక్ష్యం. వీటి కోసం విశాఖ నగరానికి సమీపంలోని సింహాచలం వద్ద సింహపురి లే అవుట్లో ఉన్న ఆర్టీసీ స్థలంలో ప్రత్యేక డిపో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ స్థలాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గురువారం పరిశీలించారు. -
ప్రగతి రథంపై పాడు ఏడుపు
సాక్షి, అమరావతి: ‘వినే వాడుంటే చెప్పే వాడు ఎన్నయినా చెబుతాడు’ అన్నట్లుగా.. చదువుతున్నారు కదా అని పాఠకులంటే ఆ పత్రికకు అలుసు. నిత్యం అనేకానేక అబద్ధాలు రాసేస్తోంది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెంచుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం అక్కసు వెళ్లగక్కుతోంది. అదే ధోరణిలో ఆర్టీసీపైనా అబద్ధాలు అచ్చేసింది. ‘అద్దె బస్సులతో ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల కోత అంటూ’ ఓ రోత కథనాన్ని సోమవారం ప్రచురించింది. ఈనాడు కథనం అవాస్తవమని అంశాలవారీగా తేల్చిచెబుతున్న ఫ్యాక్ట్ చెక్ ఇలా ఉంది.. 1979 నుంచే అద్దె బస్సుల విధానం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అద్దె బస్సుల విధానంతో సంస్థ నిర్వీర్యమవుతోందని ఈనాడు చెప్పుకొచ్చింది. కానీ అద్దె బస్సుల విధానం ఆర్టీసీలో 1979 నుంచీ అమలులో ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్లలో కూడా అద్దె బస్సుల విధానం కొనసాగింది. అదేమీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. ఒక్క అద్దె బస్సూ పెరగ లేదు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్టీసీలో అద్దె బస్సులు పెరిగాయన్న ఈనాడు కథనం పూర్తిగా అవాస్తవం. ప్రస్తుత ప్రభుత్వం ఆరీ్టసీలో కొత్తగా ఒక్క అద్దె బస్సును కూడా తీసుకోలేదు. ప్రస్తుతం ఆర్టీసీలో 11,214 బస్సులు ఉండగా వాటిలో 2,360 మాత్రమే అద్దె బస్సులు. అంటే అద్దె బస్సులు 21 శాతమే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకముందు కూడా 2,360 అద్దె బస్సులను ఆర్టీసీ నిర్వహించింది. గతంలో తీసుకున్న అద్దె బస్సుల కాల పరిమితి ముగియడంతో వాటి స్థానంలో అదే సంఖ్యలో కొత్త అద్దె బస్సులను టెండర్ల విధానంలో తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అద్దె బస్సుల సంఖ్యను పెంచనే లేదు. కొనసాగుతున్న కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ ఆర్టీసీ కొత్త బస్సులను కొనేందుకు ప్రభుత్వం అనుమతించలేదన్న ఈనాడు ఆరోపణ పూర్తిగా అవాస్తవం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్టీసీ కొత్తగా 406 బస్సులను కొనుగోలు చేసింది. త్వరలో మరో వెయ్యి బస్సులు కొనేందుకు నిర్ణయించింది. ఒక్క ఉద్యోగంలో కూడా కోత లేదు వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగంలో కూడా కోత పడలేదు. ఇక ముందు కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గించే యోచన ప్రభుత్వానికి లేదు. పైగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను సీఎం జగన్మోహన్రెడ్డి సాకారం చేశారు. దాంతో 52 వేల మంది ఆర్టీసి ఉద్యోగులు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. తద్వారా ఉద్యోగ భద్రతతోపాటు అదనపు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతున్నారు. సంస్థ లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం నుంచి నెలనెలా వారికి జీతాలు అందుతున్నాయి. -
APSRTC: కార్గో కొత్త పుంతలు.. 48 గంటల్లోపే సరకు డెలివరీ
సాక్షి, విశాఖపట్నం: సరకు రవాణాలో ఏపీఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోజురోజుకు వినియోగదారుల ఆదరణను చూరగొంటూ ఆదాయాన్ని పెంచుకుంటోంది. కార్గో సేవలను మరింత విస్తృతం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 48 గంటల్లోపే సరకును డెలివరీ చేస్తోంది. కంటైనర్లలో రవాణా చేయడం వల్ల సరకు పాడవకపోవడమే కాదు.. కార్గో నాణ్యత కూడా దెబ్బతినే అవకాశం ఉండదు. ఇది వినియోగదార్లను బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఆర్టీసీ అధికారులు ఫ్లిప్‌కార్ట్, బిర్లా వైట్, ఇతర సిమెంట్ కంపెనీలతో పాటు బిస్కెట్లు, ఆహార పదార్థాల తయారీ, కెమికల్స్ తయారీ సంస్థలతోను ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆయా సంస్థలు, కంపెనీల సరకును కోరుకున్న చోటకు బల్క్ ఆర్డర్లతో కంటైనర్ల (డిపో గూడ్స్ ట్రాన్స్‌పోర్టు–డీజీటీల) ద్వారా రవాణా చేస్తున్నారు. అలాగే ప్లైవుడ్, బియ్యం, గోధుమ పిండి, మందులు, ఆటోమొబైల్స్ విడిభాగాలు, వస్త్రాలు, దుస్తులు వంటివి ఎక్కువగా వీటిలో రవాణా అవుతున్నాయి. సరికొత్తగా హౌస్ షిఫ్టింగ్‌కు కూడా ఆర్టీసీ కంటెయినర్లను (డీజీటీలను) సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ విజయనగరం కార్గో జోన్లో 42 కంటెయినర్ డీజీటీలున్నాయి. వినియోగదార్ల ఆదరణ బాగుండడంతో ఈ సంఖ్యను మరింత పెంచనున్నారు. ఆ బస్సుల్లో టన్ను సరకుకు జాగా అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ఒక టన్ను లగేజీకి సరిపడేందుకు వీలుగా జాగాను కేటాయిస్తున్నారు. వీటిలో ఒక నెల రోజుల పాటు రెగ్యులర్‌గా సరకు రవాణా చేసే వారికి తక్కువ ధరకే అంటే.. కిలోమీటరుకు రూ.3–4 చొప్పున కేటాయించే వెసులుబాటు కల్పించారు. ఇతర సంస్థల సరకు రవాణా చార్జీల కంటే ఈ ధర తక్కువ. ఆర్టీసీ సరకు రవాణాతో పాటు పార్సిల్ డెలివరీలోనూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీంతో పార్సిల్/కొరియర్ బుకింగ్‌లు పెరుగుతూ ఆదాయాన్ని పొందుతోంది. విశాఖ ద్వారకా బస్‌స్టేషన్ వద్ద ఉన్న పార్సిల్ బుకింగ్ కౌంటర్‌ను 24 గంటలూ తెరిచి ఉంచేలా ఆర్టీసీ అధికారులు ఇటీవల చర్యలు తీసుకున్నారు. దీనికి స్పందన బాగుండడంతో త్వరలో మద్దిలపాలెం, విజయనగరం, శ్రీకాకుళంలో 24/7 బుకింగ్ కౌంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఆదాయం అదుర్స్ ఆర్టీసీ విజయనగరం కార్గో జోన్ పరిధిలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోనే ఈ కార్గో జోన్ ఆదాయంలో అగ్రభాగాన ఉంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు (ఆరు నెలల్లో) పార్సిల్స్ ద్వారా రూ.6.75 కోట్లు, సరకు రవాణా (డీజీటీ) ద్వారా రూ.3.28 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇదే సమయానికి గత ఏడాది పార్సిల్స్ ద్వారా రూ.4.67 కోట్లు, డీజీటీతో రూ.2.14 కోట్లను పొందింది. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే పార్సిల్స్‌లో రూ.2.18 కోట్లు, డీజీటీలో రూ.1.14 కోట్లు పెరిగింది. ఆర్టీసీ కార్గో సేవలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మరిన్ని కార్గో బుకింగ్ పాయింట్లను, కంటెయినర్ డీజీటీలను పెంచుతామని విజయనగరం జోన్ డీసీఎం కణితి వెంకట్రావు ‘సాక్షి’తో చెప్పారు. (క్లిక్ చేయండి: విశాఖ నగర అందాలను చూస్తూ షిప్లో విహారం) -
డ్రైవర్ అప్రమత్తం.. తప్పిన పెను ప్రమాదం
పెదపారుపూడి(కృష్ణా జిల్లా): ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అలర్ట్ అయ్యాడు. మంటలను గ్రహించి బస్సును రోడ్ పక్కకు ఆపేశాడు. దాంతో ప్రయాణికులు పరుగు పరుగున కిందికి దిగిపోయారు. ఈ ఘటన జిల్లాలోని పెదపారుపూడి వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 48 ప్రయాణికులు ఉన్నారు. కాగా, డ్రైవర్ మాత్రం బస్సుకు మంటలు వ్యాపించిన విషయాన్ని గ్రహించి రోడ్ పక్కకు ఆపేశాడు. డ్రైవర్ అప్రమత్తంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. విజయవాడ నుంచి గుడివాడకు వెళుతుండా ఈ ప్రమాదం సంభవించింది. -
కృష్ణా జిల్లా: డ్రైవర్ అప్రమత్తం.. తప్పిన పెను ప్రమాదం
-
APSRTC: పల్లె వెలుగు బస్సుల్లో న్యూమాటిక్ డోర్లు.. ఎలా పనిచేస్తాయంటే..
సాక్షి, అమరావతి: ప్రయాణికుల భద్రత కోసం ఏపీఆర్టీసీ మరిన్ని మెరుగైన చర్యలు తీసుకుంటున్నది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ‘న్యూమాటిక్ డోర్లు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా రెండు బస్సుల్లో ఏర్పాటు చేసిన న్యూమాటిక్ డోర్లను ఆర్టీసీ ఎండీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు మంగళవారం పరిశీలించారు. ప్రయాణికులు తొందరపాటుతో కదులుతున్న బస్సుల్లోంచి దిగుతున్నప్పుడుగానీ ఎక్కుతున్నప్పుడుగానీ కాలుజారి పడడం వంటి ప్రమాదాలను నివారించేందుకు న్యూమాటిక్ డోర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ డోర్లు పూర్తిగా డ్రైవర్ నియంత్రణలో ఉంటాయి. బస్సు ఆగిన తరువాత డ్రైవర్ సీటు వద్ద ఉన్న బటన్‌ను నొక్కితేనే డోర్లు తెరుచుకుంటాయి. వర్షాలు, చలితో బస్సులోని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ డోర్లు ఉపయోగపడతాయి. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు డ్రైవర్లతో మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కాగా, త్వరలోనే అన్ని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ న్యూమాటిక్ డోర్లను ఆర్టీసీ ఏర్పాటు చేయనుంది. (క్లిక్ చేయండి: ఇదీ.. అమరావతి రాజధాని అసలు కథ) -
AP: ఆర్టీసీకి జై కొట్టిన ప్రయాణికులు.. రెగ్యులర్ చార్జీలతోనే రెట్టింపు ఆదాయం
సాక్షి, అమరావతి: దసరా సీజన్లో కూడా రెగ్యులర్ చార్జీలే అమలు చేసిన ఆర్టీసీకి ప్రయాణికులు జై కొట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 4,500 సర్వీసుల్లో ఏకంగా 1.84 లక్షల మంది ప్రయాణాలు సాగించారు. 80 శాతం ఆక్యుపెన్సీ రేటుతో రూ.4.42 కోట్ల ఆదాయం సమకూర్చారు. కొత్త రికార్డు సృష్టించారు. వివరాల్లోకి వెళితే... దశాబ్దకాలంగా ఆర్టీసీ దసరా సీజన్లో అధిక చార్జీలు వసూలు చేస్తూ వచ్చింది. రెగ్యులర్ టికెట్ల కంటే 50శాతం పెంచడం పరిపాటిగా మారింది. చదవండి: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇది దోహద పడుతుందని భావించేవారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగుల జీతాల వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో సర్వీసులే తక్కువుగా నడిపారు. తొలిసారిగా ఈ ఏడాది దసరా సీజన్లో అధిక చార్జీలు వసూలు చేయకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 25 నుంచి దసరా వరకు 2,206 ప్రత్యేక సర్వీసులు నడిపింది. రెగ్యులర్ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడపడంతో ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికే ప్రాధాన్యమిచ్చారు. గతేడాది 150 శాతం చార్జీలు వసూలు చేసినా సరే రూ.2.10కోట్ల రాబడే వచ్చింది. ఆర్టీసీపై ప్రయాణికుల్లో పెరుగుతున్న ఆదరణకు ఈ దసరా సీజన్ ప్రతీకగా నిలిచింది. ఇదే స్ఫూర్తితో 10వ తేదీ వరకు 2,400 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. -
Digital Payments: క్యాష్తో పనిలేకుండా.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం
సాక్షి, విశాఖపట్నం: మీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు.. క్యాష్తో పనిలేదు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేయొచ్చు. ఆర్టీసీ యాజమాన్యం యూనిఫైడ్ టిక్కెటింగ్ సొల్యూషన్ పేరిట ఇటీవల డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇన్నాళ్లూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయా ణించే వారు టిక్కెట్టు కోసం నగదును చెల్లించాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండా క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)ల ద్వారా చెల్లించే వెసులుబాటునూ కల్పించింది. దీనికి ప్రయాణికుల నుంచి కూడా ఇప్పుడిప్పుడే మంచి స్పందన లభిస్తోంది. ఇటీవల కాలంలో ప్రజలు వివిధ కొనుగోళ్లు, ఆర్థిక లావాదేవీలకు నగదు రహిత డిజిటల్ చెల్లింపులకే ఎక్కువగా అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం దేశంలోనే తొలిసారిగా ప్రయాణికులు బస్సుల్లో టిక్కెట్ సొమ్ము చెల్లించేందుకు యూపీఐ (డిజిటల్ చెల్లింపుల) విధానాన్ని ప్రవేశపెట్టింది. విశాఖపట్నం జిల్లాలో దీనిని గత నెల ఏడో తేదీ నుంచి అమలు చేస్తున్నారు. టిక్కెట్టు మొత్తాన్ని క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి స్వైపింగ్, ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటివి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా చెల్లించవచ్చన్న మాట! ప్రయాణికుల ఆసక్తి ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ చెల్లింపులకు ప్రయాణికులు ఇప్పు డిప్పుడే ఆకర్షితులవుతున్నారు. తొలుత బస్సుల్లో డ్రైవర్లు/కండక్టర్లు డిజిట ల్ చెల్లింపుల సదుపాయం ఉందన్న విషయాన్ని ప్రయాణికులకు వివరి స్తున్నారు. అవకాశం, ఆసక్తి ఉన్న వారు చెల్లిస్తున్నారు. లేనివారు ఎప్పటిలాగే నగదు ఇచ్చి టిక్కెట్టు తీసుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు జరుపుతున్న వారి సంఖ్య 10 శాతం ఉందని, క్రమంగా పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి 97 బస్సుల్లో అమలు.. విశాఖ జిల్లాలో ప్రజా రవాణా శాఖ (పీటీడీ)కు 704 ఆర్టీసీ బస్సులు న్నాయి. తొలుత దూరప్రాంతాలకు నడిచే 97 ఎక్స్‌ప్రెస్, ఆపై (డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర, గరుడ, అమరావతి, డాల్ఫిన్ క్రూయిజ్ తదితర) సర్వీసుల్లో డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తెచ్చారు. 580కి పైగా ఉన్న సిటీ బస్సుల్లో దశల వారీగా డిజిటల్ సేవలను ప్రవేశపెట్టనున్నారు. డిజిటల్ చెల్లింపులు జరిపే ఈ–పోస్ యంత్రం మరిన్ని ప్రయోజనాలు.. ప్రయాణికులు డిజిటల్ చెల్లింపులే కాదు.. మున్ముందు మరిన్ని సదుపా యాలు పొందే వీలుంది. ఇప్పటివరకు బస్సు కదిలే సమయానికి రిజర్వేషన్ చార్టును కట్ చేసి డ్రైవర్/కండక్టర్‌కు ఇస్తున్నారు. దీంతో ఆ తర్వాత ఆ బస్సులో రిజర్వేషన్ ద్వారా సీటు పొందే వీలుండదు. ఇక మీదట చార్టు క్లోజ్ అయ్యే పనుండదు. ఈ–పోస్ యంత్రాల్లో అమర్చిన సాంకేతికతతో బస్సు నడుస్తుండగా ఖాళీ సీట్లను ముందు స్టేజిల్లో ఎక్కే వారు తెలుసుకుని రిజర్వేషన్ చేసుకోవచ్చు. లేదా ఏటీబీ (ఆథరైజ్డ్ టిక్కెట్ బుకింగ్) ఏజెంట్లు, బస్సులో కండక్టర్/డ్రైవర్ కేటాయించవచ్చు. డిజిటల్ చెల్లింపుల విధానంతో ప్రయాణికులు, కండక్టర్లను ఎప్పట్నుంచో వేధిస్తున్న చిల్లర సమస్యకు పరిష్కారం లభించినట్టయింది. టిమ్స్ స్థానంలో ఈ–పోస్ మిషన్లు ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ల జారీకి టిమ్స్ యంత్రాలను వినియో గిస్తున్నారు. ఇకపై వాటి స్థానంలో డిజిటల్ చెల్లింపులకు వీలుగా ఈ–పోస్ మిషన్లను సమకూరుస్తున్నారు. ఇలా విశాఖ జిల్లాకు ఇప్పటివరకు 180 ఈ–పోస్ మిషన్లు వచ్చాయి. వీటి వినియోగంపై డ్రైవర్లు, కండక్టర్లకు ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు. ప్రయాణికుల్లో ఆసక్తి.. డిజిటల్ పేమెంట్ సదుపాయం గురించి ప్రయాణికులకు చెబుతున్నాం. దీంతో వారూ ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. అవకాశం ఉన్న వాళ్లు దీన్ని వినియోగించుకుంటున్నారు. ప్రస్తుత టిమ్స్కంటే ఈ–పోస్లతోనే టిక్కెటింగ్ సులువుగా ఉంది. కొన్నిసార్లు నెట్ కనెక్ట్ కాక యూపీఐ, కార్డు పేమెంట్లు జరగడం లేదు. మున్ముందు ఆ సమస్య తలెత్తదని భావిస్తున్నాం. – ఆర్.టి.నాథం, ఆర్టీసీ డ్రైవర్, విశాఖపట్నం. ఎంతో సౌలభ్యంగా ఉంది.. ఇప్పుడు చాలామంది తమ అవసరాలకు డిజిటల్ పేమెంట్లే జరుపుతు న్నారు. ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపుల విధానం ఎంతో సౌలభ్యంగా ఉంది. నగదు చెల్లించి టిక్కెట్టు తీసుకోవడంతో తరచూ చిల్లర సమస్య తలెత్తుతోంది. ఇకపై చిల్లర సమస్యకు చెక్ పడుతుంది. సాంకేతిక సమస్యలను అధిగమిస్తే మరింత ఆదరణ పెరుగుతుంది. – పి.రమేష్‌నాయుడు, ప్రయాణికుడు, శ్రీకాకుళం. దశల వారీగా అన్ని బస్సుల్లో.. ప్రస్తుతం జిల్లాలో 97 బస్సుల్లో డిజిటల్ చెల్లింపులకు వీలుగా ఈ–పోస్ మిషన్లను ప్రవేశపెట్టాం. వీటికి ప్రయాణికుల నుంచి ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. దశల వారీగా సిటీ బస్సులు సహా అన్ని బస్సుల్లోనూ అందుబాటులోకి తెస్తాం. ఇప్పటికే వీటి వినియోగంపై డ్రైవర్/కండక్టర్లకు శిక్షణ ఇచ్చాం. ఈ–పోస్ యంత్రాల్లో టిక్కెట్ల జారీలో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా అవి తాత్కాలికమే. –ఎ.అప్పలరాజు, జిల్లా ప్రజారవాణా అధికారి, విశాఖపట్నం -
AP: ఆర్థిక స్వయం సమృద్ధి దిశగా ఆర్టీసీ
సాక్షి, అమరావతి: వనరుల సద్వినియోగం ద్వారా ఆర్థిక స్వయం సమృద్ధి సాధన దిశగా ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో విలువైన స్థలాల్లో ‘నిర్మించు–నిర్వహించు–బదలాయించు(బీవోటీ) విధానంలో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించింది. తాజాగా మున్సిపాల్టీలు, మండల కేంద్రాల్లోని ఆర్టీసీ స్థలాలను కూడా లీజుకు ఇవ్వాలని, ఆ స్థలాలను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించాలని ప్రణాళిక రూపొందించింది. చదవండి: ఏపీ రైతులకు అలర్ట్.. ఈ నెల 12 వరకే గడువు.. మొదటి దశలో 48 కేంద్రాల్లో స్థలాలను లీజుకు ఇవ్వనుంది. రాష్ట్రంలో నాలుగు జోన్ల పరిధిలోని మొత్తం 1,98,393 చ.గజాల విస్తీర్ణంలోని స్థలాలను ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల కాలపరివిుతికి ఇవ్వాలని నిర్ణయించింది. మొదటి జోన్ పరిధిలో 14 కేంద్రాల్లో 38,188 చ.గజాలు, రెండో జోన్ పరిధిలో 10 కేంద్రాల్లో 21,125 చ.గజాలు, మూడో జోన్ పరిధిలో 11 కేంద్రాల్లో 33,326 చ.గజాలు, నాలుగో జోన్ పరిధిలో 13 కేంద్రాల్లో 1,05,754 చ.గజాల స్థలాలు ఉన్నాయి. వాటిలో కనిష్టంగా 250 చ.గజాల నుంచి గరిష్టంగా 15,500 చ.గజాల స్థలాల వరకు ఉండటం విశేషం. ఆ స్థలాల్లో జి+1 విధానంలో వాణిజ్య సముదాయాల నిర్మాణానికి అనుమతిస్తారు. లీజు కాలపరిమితి ముగిసిన తర్వాత ఆ సముదాయాలు ఆర్టీసీ సొంతమవుతాయి. ఈ స్థలాల లీజుకు సంబంధించి ఆయా జోన్ల వారీగా వచ్చే ఏడాది ప్రారంభం నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. -
AP: అక్టోబర్ 1 నుంచే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ పేస్కేల్
సాక్షి, అమరావతి : ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) ఉద్యోగులకు నేటి (అక్టోబరు 1) నుంచి ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించనున్నారు. ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేరుస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని గతంలోనే ప్రభుత్వంలో విలీనం చేశారు. ఫలితంగా ఆర్టీసీపై ఉద్యోగుల జీతాల చెల్లింపు భారం తొలగిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వ పే స్కేల్‌ను కూడా వర్తింపజేయడంతో దాదాపు 52వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలగనుంది. పే స్కేల్ నిమిత్తం ఆర్టీసీ ఉద్యోగుల కేడర్‌ను కూడా ఇప్పటికే ఖరారుచేశారు. ఇక దర్జాగా ప్రభుత్వ జీతాలు ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నప్పుడు ప్రతినెలా ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఉండేది. ఆ అప్పుల మీద వడ్డీ భారమే ఏడాదికి రూ.350 కోట్లు చెల్లించాల్సి రావడంతో ఆర్టీసీ ఖర్చులు తడిసిమోపెడయ్యేవి. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్టీసీని 2020, జనవరి 1 నుంచి ప్రభుత్వంలో విలీనం చేసింది. అప్పటి నుంచి దాదాపు 52 వేలమంది ఉద్యోగుల జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందుకు ప్రభుత్వం నెలకు రూ.300 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3,600 కోట్లు వెచ్చించింది. ఇలా ఇప్పటికి రెండేళ్ల 9 నెలల్లో రూ.9,900 కోట్లను ప్రభుత్వం జీతాల కింద చెల్లించింది. ప్రభుత్వ కొత్త పే స్కేల్ ప్రకారం జీతాల చెల్లింపుతో సర్కారుపై ఏడాదికి రూ.360 కోట్ల అదనపు భారం పడుతుంది. అలాగే, మొత్తం మీద రూ.3,960 కోట్ల ఆర్థికభారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. మరోవైపు.. ప్రభుత్వంలో సంస్థను విలీనం చేయడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే పలు ప్రయోజనాలూ పొందుతున్నారు. చదవండి: ఏపీలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ -
దసరాకు 1,072 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
బస్టాండ్( విజయవాడ పశ్చిమ): దసరా సెలవుల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ ఎన్టీఆర్ జిల్లా నుంచి వివిధ దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి ఏసుదానం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు, విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాలకు 1,072 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు చెప్పారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 10 వరకు ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని, సాధారణ చార్జీలే అమలవుతాయని తెలిపారు. అక్టోబర్ ఒకటి, రెండు తేదీల్లో 40 బస్సులను పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి రాయలసీమ ప్రాంతాలైన రాయదుర్గం, కదిరి, అనంతపురం, పులివెందుల, రాయచోటి, ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగు, కర్నూలు, నంద్యాల గుంతకల్ ప్రాంతాలకు, విజయవాడ నుంచి విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, భద్రాచలానికి ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్టు తెలిపారు. అలాగే హైదరాబాద్, చెన్త్నె, బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చే బస్సులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులకూ ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్టు ఏసుదానం వెల్లడించారు. -
ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగులుగా హోదా
-
AP: సీఎం జగన్‌ను కలిసిన ఆర్టీసీ ఉద్యోగులు
సాక్షి, తాడేపల్లి: ఆర్టీసీ ఉద్యోగులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం కలిశారు. తమకు పీఆర్సీ అమలు చేయడంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్నారని ప్రస్తావించారు. కరోనా సమయంలోనూ ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇబ్బంది లేకుండా చేశారని గుర్తు చేశారు. తాజాగా అక్టోబర్ 1 నుంచి వారికి పీఆర్సీ అమలు చేయబోతున్నట్లు తెలిపారు. గురుకుల, ఎయిడెడ్, యూనివర్సిటీ ఉద్యోగుల వయోపరిమితి పెంచే విషయంపై సీఎం సానుకూలంగా స్పందించారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. 52 వేల మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది అని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ (ఏపీపీటీడీ) వైఎస్సార్ ఎంప్లాయ్ అసోసియేషన్ నేత చల్లా చంద్రయ్య కొనియాడారు. తమకు 10 వేల కోట్ల జీతాలు చెల్లించి ఆర్టీసీ భవిష్యత్తును కాపాడినట్లు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి కొత్త పే స్కేల్ అమలు చేయబోతున్న క్రమంలో సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ముఖ్యమంత్రికి రుణపడాల్సి ఉందన్నారు. పెన్షన్ విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. పదోన్నతుల ఫైల్ కూడా ప్రభుత్వానికి పంపినట్లు, ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. చదవండి: ఆర్గానిక్ పాల ఉత్పత్తిపై దృష్టి సారించాలి: సీఎం జగన్ -
మాట తప్పని జగన్...ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం
-
తిరుమల–తిరుపతిలో ఈ–బస్సులు
సాక్షి, అమరావతి: ప్రజా రవాణా రంగంలో సరికొత్త అధ్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలుకుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల–తిరుపతిని కేంద్రంగా చేసుకుని తొలిసారిగా ఎలక్ట్రికల్ బస్సు (ఈ–బస్)లను ఆర్టీసీ ప్రవేశపెడుతోంది. తిరుమల, తిరుపతిలలో 100 ఈ–బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈవే ట్రాన్స్ లిమిటెడ్ సంస్థ సరఫరా చేసిన ఈ–బస్‌ను ఆర్టీసీ ఇప్పటికే విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది. మరో 9 ఈ–బస్సులను మంగళవారం ఉదయానికి తిరుపతికి తీసుకురానుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలుత 10 ఈ–బస్సులను మంగళవారం సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అనంతరం దశల వారీగా డిసెంబర్ నాటికి 100 ఈ–బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. తిరుమల ఘాట్ రోడ్డులో 50 బస్సులు.. అలిపిరి బస్ డిపో కేంద్రంగా ఆర్టీసీ వీటిని నడపనుంది. కాంట్రాక్టు దక్కించుకున్న ఈవే ట్రాన్స్ లిమిటెడ్ కంపెనీ వీటిని 12 ఏళ్ల పాటు నిర్వహించనుంది. 50 బస్సులను తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డు సర్వీసుల కోసం కేటాయించారు. అలాగే, రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు 14 బస్సులు, తిరుపతి నుంచి మదనపల్లికి 12, తిరుపతి నుంచి నెల్లూరుకు, కడపకు 12 సర్వీసుల చొప్పున నిర్వహించాలని నిర్ణయించారు. కాలుష్య నియంత్రణ జీరో కర్బన ఉద్గారాలను వెదజల్లే వీటితో కాలుష్యాన్ని నియంత్రించవచ్చని అధికారులు చెబుతున్నారు. 100 ఈ–బస్సులవల్ల ఏటా 5,100 మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయంటున్నారు. ఏసీ ఇంద్ర బస్సుకు కిలోమీటర్‌కు రూ.28.75 ఇంధన వ్యయం అవుతుండగా.. ఎలక్ట్రికల్ బస్వల్ల కిలోమీటర్‌కు కేవలం రూ.7.70 ఖర్చే అవుతుంది. రానున్న రోజుల్లో ‘ఈవీ’ బ్యాటరీల ధరలు తగ్గనుండటంతో నిర్వహణ వ్యయం మరింతగా తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. -
ఆర్టీసీలో పీఆర్సీకి రైట్ రైట్
కర్నూలు(రాజ్‌విహార్): ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 2020 జనవరి 1 నుంచి రోడ్డు రవాణా సంస్థ కార్మికులను ప్రజా రవాణ శాఖలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. తాజాగా పీఆర్సీ(పేరివిజన్ స్కేల్) జీతాలు అక్టోబర్ 1వ తేదీ నుంచి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాల నాటి కల నెరవేరిందని, సాహసవంతమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకున్నారని, తాము ఆయనకు రుణపడి ఉంటామని ఉద్యోగులు, సంఘాల నాయకులు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో 4,037 మంది ఉద్యోగుల ఇళ్లలో ఆనందం నెలకొంది. ఆర్టీసీ చరిత్ర ఇదీ.. 1932లో 27 బస్సులతో ఈ సంస్థ ప్రారంభమైంది. ముందుగా నిజాం రోడ్ ట్రాన్స్‌పోర్టు పేరుతో ఆవిర్భవించిన సంస్థ 1951 నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్ర రవాణా సంస్థగా, 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా ఏర్పడింది. ప్రపంచంలో ప్రభుత్వ రంగం ఆధ్వర్యంలో నడపబడుతున్న అతిపెద్ద సంస్థగా 1999లో గిన్నీస్ బుక్‌లో స్థానం పొందింది. రాష్ట్రం విడిపోయాక 2015 మే 14వ తేదీన ఆర్టీసీ తెలంగాణలో సేవలను నిలిపివేయడంతో టీఎస్ ఆర్టీసీ ఏర్పడింది. హామీలు.. అమలు ఆర్టీసీ కష్టాలను తొలగించాలని కార్మిక సంఘాలు చేసిన విన్నపాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్టీసీ విలీనానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. వంద రోజుల్లోపు నివేదికలు తెప్పించుకొని మంత్రివర్గంలో, అసెంబ్లీలో ఆమోదం కల్పించి, 2020 జనవరి 1వ తేదీన ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేశారు. దీంతో కార్మికులతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో పాటు అన్ని బెనిఫిట్స్, అలవెన్స్‌కు అర్హత సాధించారు. ఉద్యోగుల భద్రత, సంక్షేమం, పదవీ విరమణ పొందాక పెన్షన్ అందుకునేందుకు అర్హత కల్పించారు. ఆక్టోబర్ 1 నుంచి ట్రెజరీ ద్వారా కొత్త పీఆర్సీ వేతనాలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రకటించి మరోసారి మాట నిలుపుకున్నారు. 4,037 మంది ఉద్యోగులకు లబ్ధి కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 12 డిపోల్లో 4,037 మంది ఆర్టీసీ ఉద్యోగులున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా లబి్ధపొందనున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల్లో డ్రైవర్లు 1,677 మంది, కండక్టర్లు 1,286 మంది, అధికారులు, సూపర్వైజర్లు 258 మంది, అకౌంట్స్, పర్సనల్ అధికారులు 103 మంది ఉన్నారు. అలాగే నిర్వహణ విభాగంలో 607 మంది, స్టోర్స్‌లో ముగ్గురు, సెక్యూరిటీ గార్డులుగా 72 మంది, వైద్య విభాగంలో ఏడుగురు, సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆరుగురు పనిచేస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీ నంఉచి కొత్త పీఆర్సీ వేతనాలు ఇస్తుండడంతో వీరంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వచ్చే నెల నుంచి ట్రెజరీ ద్వారా కొత్త పీఆర్సీ జీతాలు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల ఇళ్లలో దసరాకు ముందే పండుగ వాతావరణం నెలకొంది. చాలా గొప్ప నిర్ణయం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా పీఆర్సీ జీతాలు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఉద్యోగుల్లో సంతోషం నెలకొంది. ఆయన నిర్ణయం గొప్పగా ఉంది. ఇచి్చన హామీలను అమలు చేస్తున్న సీఎంకు ఉద్యోగుల తరఫున అభినందనలు. – మద్దిలేటి, ఎన్ఎంయూ రీజినల్ కార్యదర్శి నిజమైన పండగ ఆర్టీసీ బాగు కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశారు. అదే తరహాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రజా రవాణ శాఖలో విలీనం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ జీతాలు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఉద్యోగులకు నిజమైన పండగ. మాట నిలబెట్టుకున్న సీఎంకు ఆర్టీసీ ఉద్యోగులు రుణపడి ఉంటారు. – నాగన్న, వైఎస్ఆర్ ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అభినందనీయం ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు పీఆర్సీ వేతనాలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచి్చన తరువాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇప్పుడు పీఆర్సీ వేతనాలు ఇవ్వడం చాలా సంతోషం. – ఏవీ రెడ్డి, ఈయూ రీజినల్ కార్యదర్శి ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఆర్టీసీని ప్రజా రవాణా శాఖలో విలీనం చేసి కార్మికులను ఉద్యోగులుగా మార్చారు. దీంతో మాకు ఉద్యోగ భద్రత కలిసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని అలవెన్స్‌లు అందుకుంటున్నాం. ఇప్పుడు పీఆర్సీ వేతనాలు చెల్లించేందుకు ఆదేశాలు ఇచ్చారు. సీఎం నిర్ణయం అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. – జె. రబ్బాని, కర్నూలు–2డిపో డ్రైవర్ -
AP: అదనపు చార్జీల్లేకుండానే దసరా స్పెషల్ బస్సులు
సాక్షి, అమరావతి: ప్రయాణికులపై అదనపు చార్జీల భారం లేకుండానే దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు చెప్పారు. దశాబ్దకాలం తరువాత ఇలా అదనపు చార్జీలు లేకుండా ఆర్టీసీ దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించడం ఇదే తొలిసారని తెలిపారు. విజయవాడలోని బస్‌భవన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది దసరా రద్దీ దృష్ట్యా 4,500 ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తామని చెప్పారు. దసరా ఉత్సవాల ముందు ఈ నెల 29 నుంచి అక్టోబరు 4 వరకు 2,100 బస్సులు, దసరా తరువాత అక్టోబరు 5 నుంచి 9 వరకు 2,400 బస్సులు నడుపుతామని తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులతోపాటు రాష్ట్రంలోని 21 నగరాలు, ముఖ్య పట్టణాలకు ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పారు. అన్ని సర్వీసుల్లోను యూటీఎస్ విధానాన్ని అమలు చేస్తూ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్లు, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా టికెట్లు తీసుకోవచ్చని వివరించారు. అన్ని బస్సులను జీపీఎస్ ట్రాకింగ్ విధానంతో అనుసంధానించి కంట్రోల్ రూమ్ నుంచి 24/7 పర్యవేక్షిస్తామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపే ప్రైవేటు బస్సులను నిరోధించేందుకు పోలీసు, రవాణా శాఖలతో కలసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈ–బస్ సర్వీసులు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆర్టీసీ ఈ–బస్ సర్వీసులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో 10 ఈ–బస్సులను నడుపుతామన్నారు. అనంతరం దశలవారీగా డిసెంబర్ నాటికి తిరుమల–తిరుపతి ఘాట్‌రోడ్డులో 100 ఈ–బస్ సర్వీసులను ప్రవేశపెడతామని చెప్పారు. తిరుమల ఘాట్రోడ్తోపాటు రాష్ట్రంలో దూరప్రాంత సర్వీసుల కోసం కొత్తగా 650 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. గత ఏడాది 1,285 బస్సులను ఫేస్‌లిఫ్ట్ విధానంలో నవీకరించామని ఈ ఏడాది రూ.25 కోట్లతో మరో 1,100 బస్సులను నవీకరిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తామన్నారు. ఇటీవల పదోన్నతులు పొందిన దాదాపు రెండువేల మందికి సాంకేతికపరమైన అంశాలను పూర్తిచేసి నవంబర్ 1 నుంచి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఈడీ (కమర్షియల్) కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం!
ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నాళ్లో వేచిన ఉదయం మరో పది రోజుల్లో రానుంది. ఉద్యోగుల దశాబ్దాల కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారు. ఇన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులుగానే కొనసాగారు. సీఎం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగుల హోదాతో పాటు పీఆర్సీ వేతనాలను అందుకోబోతున్నారు. పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని అమల్లోకి తీసుకువస్తుండడంతో ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబాల్లో సంతోషం పరిఢవిల్లుతోంది. నెల్లూరు (క్రైమ్): వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట తప్పని మడమ తిప్పని నేతగా, ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ ఏపీఎస్ఆరీ్టసీని ప్రత్యేక కార్పొరేషన్ సంస్థగా ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రభుత్వ పరంగా నిధులు కల్పించి ఆ సంస్థను ప్రజలకు అందించారు. ఆర్టీసీ బస్సుతో ప్రతి పల్లె జనంతో విడదీయరాని బంధం ఏర్పడింది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ వారి మన్ననలను చూరగొంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆర్టీసీ బస్సులను తన ప్రచార సభలకు వాడుకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టాలకు కారకులయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతున్న ఆర్టీసీకి నిధులిచ్చి ఆదుకోవాల్సిన అప్పటి చంద్రబాబు సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరించింది. నష్టాల పేరుతో ప్రైవేట్ పరం చేసేందుకు ఎన్నోసార్లు కుయుక్తులు పన్నారు. అయితే ఉద్యోగులు,కార్మికులు ఈ చర్యలను అడ్డుకుని సంస్థను కాపాడుకునేందుకున్నారు. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి సంస్థను ఆర్టీసీ నిధులు అందించి లాభాలు ఆర్జీంచేందుకు చర్యలు తీసుకున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించారు. అయితే ఆ తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన ప్రభుత్వాలు తమ ఏకపక్ష నిర్ణయాలు, నిరంకుశ విధానాలతో సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. కార్మికుల కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. ఈ క్రమంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆర్టీసీ కార్మికుల కలిసి పరిస్థితి వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఏపీపీటీడీగా మార్చారు. ఇప్పటి వరకు కార్మికులుగానే ఉన్న వీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపులోకి వచ్చారు. అక్టోబర్ ఒకటి నుంచి నూతన పీఆర్సీని అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అక్టోబర్ ఒకటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులందరికి పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించారు. దీంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంస్థలో పని చేస్తున్న కార్మికులు గతంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3,011 మందికి లబ్ధి నెల్లూరు రీజియన్‌లో నెల్లూరు 1 ,2, రాపూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు డిపోల్లో 2,951 మంది ఉద్యోగులున్నారు. వీరితో పాటు ఆర్ఎం కార్యాలయంలోని 60 మంది ఉద్యోగులు మొత్తంగా 3,011 మందికి నూతన పీఆర్సీ ప్రకారం అక్టోబర్ ఒకటి నుంచి కొత్త జీతాలు అందనున్నాయి. ఉద్యోగుల స్థాయిని బట్టి రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు అదనంగా జీతాలు పెరగనున్నాయి. వీటితో పాటు టీఏ, డీఏలు, ఇతర అలవెన్స్‌లు అందనున్నాయి. పీఆర్సీని స్వాగతిస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత తొలిసారి అమలు చేస్తున్న పీఆర్సీని స్వాగతిస్తున్నాం. పీఆర్సీ అమలుతో జీతాలు పెరగనుండటం మా జీవితాలు కూడా మారుతాయి. చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్మోహన్రెడ్డికి ఆర్టీసీ ఉద్యోగులు జన్మజన్మలకు రుణపడి ఉంటాం. – మురళీ, ఎన్ఎంయూ నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మేము ప్రభుత్వ ఉద్యోగులమని గర్వంగా చెప్పుకుంటున్నాం. మాకు సమాజంలో గౌరవం పెరిగింది. పీఆర్సీ అమలుతో కొత్త జీతాలు రానుండడం సంతోషంగా ఉంది. – మేకపాటి చిన్నారెడ్డి, ఎన్ఎంయూ అధ్యక్షుడు ఆత్మకూరు డిపో ఆనందంగా ఉంది ఎన్నో అవరోధాలను అధిగమించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఇప్పటి వరకు చిన్నపాటి జీతాలు తీసుకుంటున్నాం. పీఆర్సీ ద్వారా జీతాలు పెరగనున్నాయి. పాతబకాయిలు సైతం విజయదశమి నాటికి అందజేస్తుండడంతో ఉద్యోగులకు మరింత ఊరట కలుగుతుంది. – షేక్ మహమ్మద్ అలీ, ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రచారకార్యదర్శి, ఆత్మకూరు డిపో సీఎం జగన్‌కు రుణపడి ఉన్నాం ఆర్టీసీ కార్మికులందరూప్రభుత్వ ఉద్యోగులుగా మారడం సంతోషంగా ఉంది. సమాజంలో గౌరవం పెరిగింది. ప్రస్తుతం అన్నీ రాయితీలు మాకు అందుతున్నాయి. పీఆర్సీతో జీతాలు పెరగనున్నాయి. మా దశబ్దాల కల నెరవేరింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉన్నాం. – వి. వెంకటాద్రి, వైఎస్సార్ మజ్దూర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి -
దసరాకు 4,485 స్పెషల్ బస్సులు
సాక్షి, అమరావతి: దసరా ఉత్సవాల్లో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సదుపాయాల కోసం ఆర్టీసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో 4,485 దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. నవరాత్రుల సందర్భంగా దసరాకు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు 2,100 ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తోంది. దసరా అనంతరం తిరుగు ప్రయాణం కోసం 2,385 ప్రత్యేక బస్ సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి అత్యధికంగా హైదరాబాద్‌కు 2,290 బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తోంది. -
ఈ–బస్.. ట్రయల్ రన్ సక్సెస్!
తిరుపతి అర్బన్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలను కేంద్రంగా చేసుకుని ఎలక్ట్రికల్ బస్సులను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి ఈ–బస్ ట్రయల్ రన్‌ను సోమవారం అధికారులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ– బస్సును తిరుపతి అలిపిరి డిపో నుంచి తిరుమలకు రెండు సార్లు నడిపారు. ఈ ట్రయల్ రన్ విజయవంతం అయినట్లు ఆర్టీసీ కడప ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) గోపినాథ్‌రెడ్డి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈ– బస్సులను వినియోగంలోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. కాగా, బస్సు పనితీరును పరిశీలించడానికి విజయవాడ నుంచి ఆర్టీసీకి చెందిన ప్రత్యేక కమిటీ సభ్యులు రవివర్మ, చంద్రశేఖర్, సుధాకర్, వెంకటరత్నం తిరుపతికి వచ్చారు. అనంతరం ఈ–బస్సు సర్వీస్‌ను తిరుపతి ఐఐటీకి చెందిన ప్రొఫెసర్లు శ్రీరామసుందర్, విఘ్నేష్ పరిశీలించారు. బస్సు కండీషన్‌పై వారు నివేదిక ఇచ్చిన తర్వాత రెండు మూడు రోజుల్లో మరో 10 ఎలక్ట్రికల్ బస్సులు అలిపిరి డిపోకు చేరుకోనున్నాయి. అలిపిరి నుంచి తిరుమలకే కాకుండా ఇతర ప్రాంతాలకూ ఈ– బస్సులు అందుబాటులోకి రానున్నాయని గోపినాథ్‌రెడ్డి చెప్పారు. ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటాయని, బ్రహ్మోత్సవాల్లో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. -
దశాబ్దానికి దక్కిన న్యాయం
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో ప్రమాదానికి గురై వికలాంగుడిగా మారిన ఓ కండక్టర్ తనకు రావాల్సిన వేతన బకాయిల కోసం దశాబ్దం కాలంగా చేస్తున్న న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఆ కండక్టర్‌కు 2001 నుంచి 2007 వరకు వేతన బకాయిలను, ఇతర ఉద్యోగులు (కండక్టర్లు)తో సమానంగా అన్ని ఇంక్రిమెంట్లను కలిపి ఆరు శాతం సాధారణ వార్షిక వడ్డీతో సహా రెండు నెలల్లో చెల్లించాలని ఏపీఎస్ ఆర్టీసీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ తీర్పు చెప్పారు. వైకల్యం బారిన పడిన ఉద్యోగిని వదిలేయకుండా అతనికి గతంలో నిర్వహించిన పోస్టుకు సమానమైన ప్రత్యామ్నాయ పోస్టును, అదే జీతం, సర్వీసు ప్రయోజనాలతో సహా కల్పించాల్సిన బాధ్యత యజమానిగా ఆర్టీసీపై ఉందని స్పష్టంచేశారు. అధికారులు పట్టించుకోలేదు... కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన సీహెచ్ రాజేశ్వరరావు ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తూ ప్రమాదానికి గురవడంతో ఆయన వెన్నెముకకు వైద్యులు శస్త్రచికిత్స చేసి రెండు డిస్క్‌లను తొలగించారు. వైకల్యం కారణంగా రాజేశ్వరరావును ఆర్టీసీ యాజమాన్యం 2001లో రిటైర్ చేసింది. దీంతో రాజేశ్వరరావు 2005లో డిజేబుల్డ్ కమిషనర్ వద్ద కేసు దాఖలు చేశారు. విచారణ చేసిన కమిషనర్, అంగవైకల్య చట్ట నిబంధనల ప్రకారం పిటిషనర్ వినతిని పరిగణనలోకి తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను 2006లో ఆదేశించారు. దీంతో 2007లో ఆర్టీసీ అధికారులు రాజేశ్వరరావును తిరిగి సర్వీస్‌లో చేర్చుకున్నారు. బస్‌స్టేషన్‌లో ఆయన సర్వీసులను ఉపయోగించున్నారు. తనను రిటైర్ చేసిన 2001 నుంచి 2007 మధ్య కాలానికి సంబంధించిన బకాయిలన్నింటినీ చెల్లించడంతోపాటు కండక్టర్ కేడర్‌లో తనకు పే ఖరారు చేయాలని రాజేశ్వరరావు పలుమార్లు కోరారు. ఆర్టీసీ అధికారులు స్పందించకపోవడంతో ఆయన 2011లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల జస్టిస్ రవినాథ్ తిల్హరీ తుది విచారణ జరిపారు. ‘అంగవైకల్య చట్టంలోని సెక్షన్ 47(1) ప్రకారం సర్వీసులో ఉండగా ప్రమాదానికి గురైన ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించడం గానీ, ర్యాంకును తగ్గించడం గానీ చేయకూడదు. ఆ ఉద్యోగి గతంలో నిర్వహించిన పోస్టుకు çసమానమైన పోస్టు లేకపోతే తగిన పోస్టు ఇచ్చేంత వరకు ఆ ఉద్యోగి కోసం సూపర్ న్యూమరరీ పోస్టు సృష్టించి అందులో కొనసాగించాలి. వైకల్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ కేసులో హైకోర్టు తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తోంది. పిటిషనర్‌కు 2001 నుంచి 2007 వరకు వేతన బకాయిలు, ఇంక్రిమెంట్లతోపాటు ఆరు శాతం సాధారణ వార్షిక వడ్డీ కలిపి రెండు నెలల్లో చెల్లించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం
రాజమహేంద్రవరం సిటీ: ఆర్టీసీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఉద్యోగులకు అక్టోబర్ నుంచి పీఆర్సీ అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటనతో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. పీఆర్సీ అమలు ప్రకటనను స్వాగతిస్తున్నామంటూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న పీఆర్సీతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో (ప్రస్తుత తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు) సుమారు 3,600 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ (ఏపీఎస్‌పీటీడీ)గా మార్చారు. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పదోన్నతి కల్పించారు. కార్మికుల సంబరాలు అక్టోబర్ నుంచి పీఆర్సీ అమలు కానుండడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలో ఆర్టీసీని అప్పుల ఊబిలో నుంచి కొంతమేర బయటకు తీసుకువచ్చి, ఆర్టీసీ కార్మికులకు అనేక రాయితీలు కల్పించి అండగా నిలిచారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆర్టీసీపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మరిన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయింది. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత 2020 జనవరిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లు ప్రకటించారు. అయితే సంస్థాగత, సాంకేతిక, విధాన పరంగా కొన్ని చిక్కులు రావడంతో ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించారు. అనంతరం అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పెరగనున్న జీతాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, రావులపాలెం, రామచంద్రపురం, రాజోలు, ఏలేశ్వరం, తుని, గోకవరం, కొవ్వూరు, నిదడవోలు ఆర్టీసీ డిపోలున్నాయి. ఈ డిపోల్లోని సుమారు 3600 మంది ఉద్యోగులకు నూతన పీఆర్సీ ప్రకారం కొత్త జీతాలు అందనున్నాయి. వీరిలో పర్యవేక్షణ అధికారులు, సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, క్లీనర్లు, ఎల్రక్టీíÙయన్లు ఉన్నారు. వీరికి వారి ఉద్యోగ స్థాయి ప్రకారం రూ.2 వేల నుంచి 6 వేల వరకు అదనంగా జీతాలు పెరగనున్నాయి. ప్రతిరోజు ఉమ్మడి జిల్లాలో 2 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. రోజుకు సుమారు రూ.కోటి వరకు ఆదాయం వస్తుంది. దీంతో పాటు కార్గో ద్వారా ఆదాయం సమకూరుతోంది. పీఆర్సీని స్వాగతిస్తున్నాం మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తరువాత మొదటిసారి అమలు చేస్తున్న పీఆర్సీని స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి నిర్ణయం ఆనందాన్ని నింపుతోంది. పాత బకాయిలు సైతం విజయదశమి నాటికి అందజేస్తే ఉద్యోగులకు మరింత ఊరట కలుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. – గిడ్ల చిరంజీవి, ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ, రాజమహేంద్రవరం సీఎం జగన్‌కు ధన్యవాదాలు ఇప్పటివరకూ చిన్నపాటి మొత్తంలో జీతాలు తీసుకుంటున్న మాకు కొత్త పీఆర్సీ ద్వారా వచ్చే జీతాలు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నాం. మా దశాబ్దాల కల నెరవేరింది. ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారు. మా ఉద్యోగులు అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. – సీహెచ్ఎన్ లక్ష్మీ, ఏపీపీటీడీ ఎంప్లాయూస్ యూనియన్, మహిళా కమిటీ కోశాధికారి, రాజమహేంద్రవరం చాలా సంతోషం ఆర్టీసీ కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మార డం సంతోషంగా ఉంది. ఇప్పుడు అన్ని రాయితీలు మాకు అందుతున్నాయి. కొత్త పీఆర్సీ అమలుతో జీతాలు కూడా పెరుగుతాయి. మేము ప్రభుత్వ ఉద్యోగులమని గర్వంగా చెప్పుకుంటున్నాం. మాకు సమాజంలో గౌరవం పెరిగింది. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. – పోలిశెట్టి లక్ష్మణరావు, ఏపీపీటీడీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు, రాజమహేంద్రవరం సాహసోపేతం ఆరీ్టసీని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్ మెంట్‌గా మార్చి ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయడం సాహసోపేత నిర్ణయం. ఎన్ని అవరోధాలు ఏర్పడినా సీఎం జగన్ తాను ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఉద్యోగుల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పీఆర్సీ అమలుతో కొత్త జీతాలు రావడం ఆనందంగా ఉంది. – వీరమల్లు శివ లక్ష్మణరావు, డ్రైవింగ్ స్కూల్ కోచ్, రాజమహేంద్రవరం -
AP: ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గింపు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అందించింది. బస్సులు ఛార్జీలు తగ్గిస్తున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఏసీ బస్సుల్లో తాత్కాలికంగా చార్జీలను 20 శాతం వరకు తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 30వరకూ చార్జీల తగ్గింపు అమలులో ఉండనున్నట్టు ఆదేశాల్లో పేర్కొంది. కాగా.. రూట్లు, చార్జీలు ఎంత తగ్గించాలనే నిర్ణయం ఆర్ఎంలకు అప్పగించినట్టు స్పష్టం చేసింది. బస్సుల్లో తగ్గించిన చార్జీలు ఇవే.. - అమరావతి, గరుడ, వెన్నెల బస్సు చార్జీల్లో 10 శాతం తగ్గింపు - విజయవాడ-విశాఖ డాల్ఫిన్ క్రూజ్ బస్సుల్లో 20 శాతం తగ్గింపు - హైదరాబాద్-విజయవాడ ఏసీ బస్సుల్లో 10 శాతం తగ్గింపు - విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు బస్సుల్లో 20 శాతం తగ్గింపు. -
ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు
సాక్షి, అమరావతి: ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాల చెల్లింపునకు అడ్డంకులు తొలగిపోయాయి. కొత్త పే స్కేల్ ప్రకారం జీతాల చెల్లింపునకు ఆర్థిక శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్థిక శాఖతో మంగళవారం జరిపిన సంప్రదింపులు ఫలించాయి. ఆర్టీసీలో మొత్తం 51,500 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో దాదాపు 2 వేల మందికి ఇటీవల పదోన్నతులు కల్పించారు. పదోన్నతులు పొందిన వారు మినహా మిగిలిన ఉద్యోగులు అందరికీ సెప్టెంబరు ఒకటిన కొత్త పే స్కేల్ ప్రకారం జీతాల చెల్లింపునకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పదోన్నోతులు పొందిన వారి ఫైల్‌ను ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. పదోన్నతులను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత వారికి కూడా కొత్త పే స్కేల్ ప్రకారం జీతాల చెల్లింపునకు ఆర్థిక శాఖ అనుమతినిస్తుందని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో ప్రభుత్వ ఆమోదం లభిస్తే వీరికి కూడా సెప్టెంబరు ఒకటిన కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తారు. లేకపోతే ఆక్టోబరు ఒకటి నుంచి కొత్త జీతాలు చెల్లిస్తారు. ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ఎరియర్స్‌తో సహా జీతాలు చెల్లిస్తారని, ఎవరికీ ఇబ్బంది ఉండదని ఆర్టీసీవర్గాలు చెబుతున్నాయి. -
AP: ఆర్టీసీ బస్సులకు సరికొత్త రూపు
సాక్షి, అమరావతి: ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) బస్సులు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. దశాబ్ద కాలంగా పాతబడిన బస్సులతో ప్రయాణికులు పడుతున్న పాట్లకు ముగింపు పలకాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సులను ఆధునికీకరణకు ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే 650 కొత్త బస్సుల కొనుగోలుతోపాటు 880 అద్దె బస్సులకు ఆర్టీసీ టెండర్లు పిలిచింది. మరోవైపు ప్రస్తుతం ఉన్న బస్సులకు ఫేస్‌లిఫ్ట్ ద్వారా సరికొత్తగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. రెండు దశల్లో 2,750 బస్సులను ఆధునికీకరిస్తారు. దసరా నాటికి మొదటి దశ ఆధునికీకరించిన బస్సులను ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. ఆర్టీసీలో ప్రస్తుతం 11,271 బస్సుల్లో దాదాపు 3,800 బాగా పాతబడ్డాయి. వాటిలో ఏసీ బస్సులు 10 లక్షల కిలోమీటర్లు, ఎక్స్‌ప్రెస్ బస్సులు 8 లక్షల కి.మీ., పల్లె వెలుగు బస్సులు 12 లక్షల కి.మీ. పూర్తి చేశాయి. ఆర్టీసీ ఆదాయం సరిపోక, ఉద్యోగుల జీతాలకే అప్పులు చేయాల్సి రావడంతో దశాబ్ద కాలంగా ఆర్టీసీ కొత్త బస్సులు కొనలేదు. ఉన్న వాటికి మరమ్మతులు చేయించలేదు. ఉన్న బస్సుల ఆధునికీకరణా చేపట్టలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి 2020 జనవరి నుంచి ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఉద్యోగుల జీతాల కోసం ఏటా రూ.3,600 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తోంది. దాంతో ఆర్టీసీ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన బస్సు ప్రయాణాన్ని అందించేలా పాలక మండలి కార్యాచరణ చేపట్టింది. రెండు దశల్లో ఆధునికీకరణ 2,750 బస్సులను ఆధునికీకరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. కొత్త సీట్లు వేయడం, టైర్లు, హెడ్లైట్లు మార్చడం, రంగులు వేయడం, సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తారు. బస్సులకు కొత్త రూపు తెస్తారు. మొదటి దశలో 1,250 పల్లె వెలుగు బస్సులు, 250 సిటీ బస్సుల ఆధునీకరణ చేపట్టారు. ఆర్టీసీ మెకానికల్ విభాగం సొంత గ్యారేజీల్లోనే ఈ పనులు చేపట్టింది. ఒక్కో బస్సుకు రూ.2 లక్షల చొప్పున మొత్తం 1,500 బస్సుల ఆధునీకరణకు రూ.30 కోట్లు వెచ్చిస్తున్నారు. దసరా నాటికి తొలి దశ పూర్తి చేయనున్నారు. రెండో దశలో 1,250 ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ఆధునికీకరించనున్నారు. వాటిలో ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సెమీ లగ్జరీ సర్వీసులున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రాల మధ్య తిరిగే ఈ సర్వీసులను మరింత వినూత్నంగా ఫేస్ లిఫ్ట్ డిజైన్‌ను ఆర్టీసీ రూపొందించింది. సీట్లు, టైర్లు, లైట్లు మార్చడంతోపాటు అవసరమైన మేరకు బస్సు బాడీనీ కొత్తగా నిర్మిస్తారు. డిసెంబర్ దీనిని పూర్తి చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. -
ఏపీఎస్ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ‘ప్రవాస్ ఎక్సలెన్స్’ వేడుకల్లో భాగంగా ఏపీఎస్ ఆర్టీసీకి ‘రెడ్ బస్ పీపుల్స్ చాయిస్’ అవార్డు దక్కింది. చదవండి: టీచర్లకు గుడ్‌న్యూస్.. ప్రమోషన్లకు విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్! శుక్రవారం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు అవార్డును అందుకున్నారు. సురక్షితమైన, స్మార్ట్, స్థిరమైన ప్యాసింజర్ మొబిలిటీ అనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి దేశవ్యాప్తంగా 4వేల మంది పబ్లిక్, ప్రైవేటు రవాణా వాహనాల ఆపరేటర్లు, వ్యాపారులు, సందర్శకులు హాజరయ్యారు. -
విద్యార్థుల ప్రయాణం సురక్షితం.. సుఖవంతం
పాఠశాలలు.. కళాశాలలకు వెళ్లేందుకు.. తిరిగి ఇంటికి చేరేందుకు విద్యార్థులకు బెంగలేదిక. చదువు సమయం వృథా అవుతుందన్న ఆందోళన అవసరం లేదు. సమయానికి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రాయితీ ప్రయాణాలు కల్పిస్తూ... విద్యార్థుల బంగారు భవితకు పరోక్షంగా బాటలు వేస్తోంది. పార్వతీపురం టౌన్: ఆర్టీసీ సంస్థ సేవలను విస్తరిస్తోంది. ఓ వైపు ప్రయాణికులతో పాటు కార్గో సేవలను అందిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. అధిక ఆదాయం ఆర్జిస్తోంది. మరోవైపు విద్యార్థులకు సురక్షిత, సుఖమయ ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. విద్యాలయాల సమయానికి అనుగుణంగా బస్సు సర్వీసులు నడుపుతోంది. రాయితీపై పాసులు జారీ చేస్తోంది. దీనివల్ల చదువు సమయం వృథా కాకుండా.. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు పరోక్షంగా సాయపడుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులు రాకపోకలు సాగించే రూట్లలో ప్రత్యేక బస్‌సర్వీసులను నడుపుతూ సకాలంలో గమ్యస్థానాలకు చేర్చుతోంది. ప్రత్యేక సర్వీసులు ఇలా.. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. పార్వతీపురం ఆర్టీసీ డిపో నుంచి 3, పాలకొండ నుంచి 5, సాలూరు డిపో నుంచి ఒక బస్సును పాఠశాల, కళాశాల వేళల్లో నడుపుతున్నారు. ఉచిత బస్‌పాస్‌లు ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లను జారీ చేస్తోంది. తల్లిదండ్రులకు పిల్లల చదువుల భారం లేకుండా చేస్తోంది. సురక్షిత, సుఖమయ ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 1800 ఉచిత బస్సు పాసులను ఆర్టీసీ అధికారులు జారీ చేశారు. జిల్లాలోని 1,03,733 మంది విద్యార్థులు ఉండగా, అందులో సుమారు 40 శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి విద్యను అభ్యసించిన వారే. 12–18 ఏళ్లలోపు విద్యార్థులు 15,970 మందికి 60 శాతం రాయితీపై పాసులు జారీ చేశారు. అర్హులందరికీ ఉచిత పాసులు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని మూడు ఆర్టీసీ డిపోల పరిధిలోని 1800 మంది విద్యార్థులకు ఉచిత బస్సుపాసు లను అందజేశాం. 15, 970 మంది విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జిల్లాలోని 9 విద్యార్థుల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. విద్యార్థులు ఎక్కువుగా ప్రయాణించే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలకు అదనపు బస్సులను పంపించేందుకు చర్యలను చేపట్టాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – టీవీఎస్ సుధాకర్, జిల్లా ప్రజారవాణా అధికారి, పార్వతీపురం మన్యం ఇబ్బందులు లేకుండా... గతంలో కళాశాలలకు రావాలన్నా, తిరిగి ఇంటికి వెళ్లాలన్నా బస్సులలో నిలబడి వెళ్లేవాళ్లం. ఒక్కోరోజు బస్సులు ఉండకపోవడంతో ఆటోలపై వెళ్లేవాళం. ఇప్పుడు మా కష్టాలన్నీ తీరాయి. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాయితీతో బస్సు పాసులను అందజేసి సమయానికి ఇంటికి, పాఠశా లలకు, ఇళ్లకు చేరేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. – సాయి, విద్యార్థి, పుట్టూరు, పార్వతీపురం మండలం సమయానికి చేరుకుంటున్నాం కళాశాలల సమయానికి చేరుకుంటున్నాం. ఆర్టీసీ మా ప్రాతం నుంచి పార్వతీపురం పట్టణానికి ప్రత్యేక బస్సు వేశారు. దీనివల్ల ఎటువంటి భయంలేకుండా సమయానికే పాఠశాలలకు చేరుకుంటున్నాం. పాఠశాల పూర్తయిన తరువాత ఆర్టీసీ బస్టాండ్‌లో గంటల తరబడి వేచి ఉండకుండా సమయానికే బస్సు దొరుకుతుంది. తొందరగా ఇళ్లకు చేరుకుంటున్నాం. – దేవి ప్రసాద్, కొత్తపల్లి, కురుపాం మండలం -
ఆర్టీసీలో ఇక మహిళా డ్రైవర్లు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలో ఇకపై మహిళా డ్రైవర్లు రానున్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళా కండక్టర్లను చూసిన మనం ఇకపై వారిని డ్రైవర్లుగానూ చూడబోతున్నాం. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక కసరత్తు మొదలెట్టారు. రాష్ట్రంలోని ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికను తయారుచేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా శిక్షణ పొందే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. దీనిపై ఇప్పటికే 13 ఉమ్మడి జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)లకు ప్రాథమికంగా ఆదేశాలిచ్చారు. పదో తరగతి పాసైన వారు శిక్షణకు అర్హులు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. వారికి ఉమ్మడి జిల్లాల్లోని అందుబాటులో ఉన్న ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లలో 32 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఆర్టీసీ బస్సుపైనే శిక్షణ ఇవ్వడంతో వారికి డ్రైవింగ్‌లో మరిన్ని మెలకువలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ శిక్షణ ఇచ్చినందుకు గాను ఆర్టీసీకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం నగదు చెల్లిస్తుంది. ఆర్టీసీలోనే పోస్టింగ్.. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థులకు ఆర్టీసీలోనే డ్రైవర్‌గా పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డ్రైవింగ్‌లో శిక్షణతో పాటు మహిళలకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తారు. వారిలో అర్హత, నైపుణ్యాన్ని బట్టి తొలి దశలో ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టుల్లో నియమించేందుకు ప్రతిపాదించారు. నైపుణ్యాభివృద్ధిలో భాగంగా శిక్షణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో మహిళలకు పదవులు, నామినేటెడ్ పనులు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో అగ్రపీఠం వేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో ఎస్సీ మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అర్హుల ఎంపిక కోసం అవసరమైన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం. ఎంపికైన ఎస్సీ మహిళలకు ఆర్టీసీ ద్వారా భారీ వాహనాల డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తాం. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలను తొలి దఫా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 310 ఎస్సీ బ్యాక్లాగ్ డ్రైవర్ పోస్టుల్లో నియమించేలా ప్రభుత్వానికి నివేదిస్తాం. – మేరుగ నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
బస్సులు పెంచుకుందాం.. ఆదాయం పంచుకుందాం!
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుకునే దిశగా మళ్లీ కదలిక మొదలైంది. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు ఈడీలతో కలిసి హైదరాబాద్ బస్‌భవన్‌లో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీలతో సోమవారం భేటీ అయ్యారు. ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టు, ఎస్బీటీ, ఎస్ఆర్బీఎస్ పథకాల విభజనే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరిగినా అంతర్రాష్ట్ర సర్వీసులపై కూడా చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య తిరిగే ప్రయాణికులు చాలినన్ని ఆర్టీసీ సర్వీసుల్లేక ప్రైవేటు బస్సుల్లో వెళ్తున్నారని, రెండు ఆర్టీసీలకు రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు ఆపరేటర్లు కొట్టుకుపోతున్నందున ఆర్టీసీ సర్వీసుల సంఖ్య పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం 1.52 లక్షల కి.మీ. చొప్పున మాత్రమే రెండు ఆర్టీసీల అంతర్రాష్ట్ర సర్వీసులు తిరుగుతున్నాయని, ఇప్పుడు కనీసం 2.05 లక్షల కి.మీ.కన్నా పెంచుకోవాలని ఏపీ అధికారులు పేర్కొన్నారు. అయితే తమ వద్ద బస్సుల సంఖ్య పరిమితంగా ఉందని, కొత్త బస్సులు కొన్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని సజ్జనార్ పేర్కొన్నారు. త్వరలో టీఎస్ఆర్టీసీ 1,016 కొత్త బస్సులు కొననుంది. మరో 300 ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులు సమకూర్చుకోనుంది. రెండేళ్ల కింద భారీగా కుదింపు.. రెండు ఆర్టీసీల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకునే క్రమంలో రెండేళ్ల కింద బస్సు సర్వీసుల సంఖ్యను భారీగా కుదించారు. 2020 ఆగస్టు నాటికి.. తెలంగాణ నుంచి ఏపీకి 746 బస్సులు తిరుగుతుండగా, ఏపీ నుంచి తెలంగాణకు 1,006 బస్సులు (లాక్‌డౌన్‌కు పూర్వం) నడిచేవి. తెలంగాణ బస్సులు ఏపీ పరిధిలో 1,52,344 కి.మీ. తిరుగుతుంటే, ఏపీ బస్సులు తెలంగాణలో 2,64,275 కి.మీ. తిరిగేవి. రెండూ సమంగా ఉండాలని, ఇందుకు లక్ష కి.మీ. పరిధిని, అంతమేర సర్వీసులను కుదించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ అప్పుడు డిమాండ్ చేయగా ఏపీ తగ్గించుకుంది. పీఎఫ్ నిధి వాడుకోవటంతో చిక్కులు ఆర్టీసీ ఉమ్మడిగా ప్రత్యేకంగా పీఎఫ్ ట్రస్టును ఏర్పాటు చేసుకుని సొంతంగా పీఎఫ్ నిధిని నిర్వహిస్తోంది. ఆర్టీసీ విడిపోయినా ఆ ట్రస్టు ఉమ్మడిగానే ఉంది. తెలంగాణ ఆర్టీసీ రూ.1,300 కోట్ల పీఎఫ్ నిధిని వాడేసుకుని బకాయి పడింది. దీంతో పీఎఫ్ కమిషనరేట్ తీవ్రంగా స్పందించి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కానీ, ట్రస్టు చైర్మన్‌గా ఏపీ ఆర్టీసీ ఉన్నందున ఆ నోటీసులు ఏపీఎస్ ఆర్టీసీ పేరుతోనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు, నిధుల విభజనపైనా అధికారులు చర్చించారు. స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం (ఎస్ఆర్బీఎస్), స్టాఫ్ బెన్వెలంట్ ట్రస్టు (ఎస్బీటీ)లు కూడా ఉమ్మడిగానే ఉన్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన నేపథ్యంలో ఈ రెండు మనుగడలో లేవు. వాటిని కూడా విభజించుకునే అంశంపై చర్చించినా కొలిక్కి రాలేదు. దీంతో మరో నెలలో మరో సమావేశం ఏర్పాటు చేసుకుని వాటి విభజన ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. -
అద్దె బస్సులొస్తున్నాయ్!
సాక్షి, విశాఖపట్నం: ప్రయాణికుల అవసరాలు, అవస్థలు తీర్చడానికి అద్దె బస్సులొస్తున్నాయి. రద్దీకి అనుగుణంగా ఆయా ప్రాంతాలకు ఇవి నడవనున్నాయి. ఆర్టీసీ విశాఖపట్నం రీజియన్‌లో కొత్తగా 83 అద్దె బస్సులు నడపడానికి అనుమతులు లభించాయి. దీంతో ప్రయాణికుల తాకిడి అధికంగా ఉండి, బస్సు సరీ్వసులు తక్కువగా ఉన్న రూట్లను గుర్తించారు. విశాఖతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నంల నుంచి కూడా వివిధ ప్రాంతాలకు వీటిని నడపనున్నారు. అంతేకాదు చాన్నాళ్ల నుంచి విశాఖ నుంచి కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, ఇచ్ఛాపురం, పాలకొండ, సోంపేట, మందస వంటి దూర ప్రాంతాలకు బస్సుల డిమాండ్ ఉంది. బస్సుల కొరతతో సరిపడినన్ని సరీ్వసులను నడపలేక పోతున్నారు. ఇప్పుడు ఈ రూట్లలోనూ అద్దె బస్సులను నడిపి ప్రయాణికుల అవసరాలను తీర్చనున్నారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు అధికం ఈ అద్దె బస్సుల్లో అత్యధికంగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌లున్నాయి. మొత్తం 83 అద్దె బస్సులకు గాను 39 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, 12 పల్లెవెలుగు,తొమ్మిది సిటీ ఆర్డినరీ, ఎనిమిది సూపర్ లగ్జరీ, ఎనిమిది ఎక్స్‌ప్రెస్, ఏడు అల్ట్రా డీలక్స్ సర్వీసులు. పల్లె వెలుగు సర్వీసులను అనకాపల్లి– నర్సీపట్నం–అనకాపల్లి, అనకాపల్లి–విజయనగరం, నర్సీపట్నం–చోడవరంల మధ్య నడుపుతారు. మెట్రోలను విశాఖ నుంచి విజయనగరం, చోడవరం, కొత్తవలస, భీమిలి, యలమంచిలి, చోడవరం, అనకాపల్లి తదితర రూట్లకు, సూపర్ లగ్జరీలను విశాఖ నుంచి అమలాపురం, కాకినాడలకు, అల్ట్రా డీలక్స్‌లను రాజమండ్రి, ఇచ్ఛాపురం, పాలకొండలకు తిప్పుతారు. సిటీ ఆర్డినరీ సర్వీసులను ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి యలమంచిలి, దువ్వాడ రైల్వే స్టేషన్, సింథియా నుంచి సింహాచలంలకు కేటాయించారు. మూడు నెలల్లో రోడ్లపైకి.. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ అద్దె బస్సుల కోసం ఇటీవల టెండర్లు పిలిచారు. నెలాఖరుకల్లా వీటిని ఖరారు చేయనున్నారు. టెండర్లు ఖాయమయ్యాక అద్దె బస్సుల యజమానులకు మూడు నెలల గడువిస్తారు. ఆర్టీసీ యాజమాన్యం అధీకృత బాడీ బిల్డింగ్ యూనిట్లలో మాత్రమే ఈ బస్సులను తయారు చేయాల్సి ఉంటుంది. అద్దె బస్సులు అందుబాటులోకి వస్తే రద్దీ ఉన్న రూట్లలో బస్సుల కొరత తీరి ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణాధికారి ఎ.అప్పలరాజు ‘సాక్షి’కి చెప్పారు. -
617 కొత్త బస్సులకు ఆర్టీసీ రైట్‌రైట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజారవాణా విభాగం (ఆర్టీసీ) కొత్త బస్సులకు రైట్‌రైట్ చెబుతోంది. దశాబ్దంగా పాత బస్సులతో నెట్టుకొస్తున్న ఆర్టీసీ కొత్త బస్సులను ప్రవేశపెట్టేందుకు పచ్చజెండా ఊపింది. అందుకోసం రూ.250 కోట్లతో 617 బస్సులను కొనుగోలు చేయడంతోపాటు అద్దె ప్రాతిపదికన 2,307 బస్సులను ప్రవేశపెట్టేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. దశాబ్దంగా కొత్త బస్సులు కొనుగోలు చేయకపోవడంతో ఆర్టీసీ పాత బస్సులతోనే సతమతమవుతోంది. ఆర్టీసీలోని 2,925 బస్సులు 12 లక్షల కంటే ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించాయి. అయినా పదేళ్లుగా కొత్త బస్సుల కొనుగోలుకు గత ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదు. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు సాహసించలేకపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. దీంతో ఉద్యోగుల జీతాల భారం ఏటా దాదాపు రూ.3,600 కోట్లను ప్రభుత్వం భరిస్తోంది. ఆర్టీసీ వ్యయంలో దాదాపు 40 శాతం జీతాల చెల్లింపునకే వెచ్చించాల్సి వచ్చేది. రెండేళ్లుగా ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తుండటంతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి కుదుటపడుతోంది. దీంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా ఆర్టీసీ కార్యాచరణకు ఉపక్రమించింది. అందులో భాగంగానే కొత్త బస్సుల కొనుగోలు ప్రతిపాదనలను సూత్రప్రాయంగా ఆమోదించింది. సుఖమైన ప్రయాణమే లక్ష్యం ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ప్రయాణికుల ఆదరణ, ట్రెండ్‌కు అనుగుణంగా అధునాతన బస్సులను కూడా ప్రవేశపెడుతున్నాం. అందుకే ఆర్టీసీలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వం నుంచి తుది ఆమోదం రాగానే కొత్త బస్సులను కొనుగోలు చేస్తాం. – సీహెచ్.ద్వారకాతిరుమలరావు, ఆర్టీసీ ఎండీ దశలవారీగా ఆర్టీసీలో కొత్త బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ ప్రణాళిక ఇలా ఉంది.. ► తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో నడిపే సప్తగిరి సర్వీసుల కోసం కొత్తగా 152 ఎక్స్‌ప్రెస్ బస్సులను కొనుగోలు చేయనున్నారు. ఎందుకంటే ఘాట్ రోడ్డులో అద్దె ప్రాతిపదికన కాకుండా ఆర్టీసీ సొంత బస్సు సర్వీసులను నిర్వహిస్తోంది. అందుకోసం ఒక్కో బస్సుకు రూ.36 లక్షల చొప్పున మొత్తం రూ.54.72 కోట్లు వెచ్చించనుంది. ► రాష్ట్రంలో జిల్లా కేంద్రాలు, ఇతర ముఖ్య పట్టణాలను అనుసంధానించే సర్వీసుల కోసం 465 బస్సులను కొనుగోలు చేయనున్నారు. వాటిలో డాల్ఫిన్ క్రూయిజ్ ఏసీ బస్సులు 3, ఇంద్ర ఏసీ బస్సులు 8, సూపర్ లగ్జరీ బస్సులు 372, అల్ట్రా డీలక్స్ బస్సులు 82 ఉన్నాయి. ఇందుకోసం ఆర్టీసీ మొత్తం రూ.194.82 కోట్లు ఖర్చు చేయనుంది. సప్తగిరి, ఇతర బస్సులు కలిపి మొత్తం 617 బస్సుల కోసం ఆర్టీసీ మొత్తం రూ.250 కోట్లు వెచ్చించనుంది. ► అద్దె ప్రాతిపదికన 2,307 బస్సులను దశలవారీగా ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే మొదటి విడత టెండర్లు తుదిదశకు చేరుకున్నాయి. రెండోదశ టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ► ప్రయాణికులను మరింతగా ఆకట్టుకునే దిశగా ఆర్టీసీ కొత్త సర్వీసులను తొలిసారిగా ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీలు ఇప్పటివరకు నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టలేదు. కానీ దూరప్రాంత సర్వీసులకు ప్రైవేటు ట్రావెల్స్ నాన్ ఏసీ బస్సులను నిర్వహిస్తున్నాయి. రైళ్లలో స్లీపర్ క్లాస్ తరహాలో ఉండే ఈ నాన్ ఏసీ స్లీపర్ బస్సులకు ప్రయాణికుల నుంచి స్పందన లభిస్తోంది. ఏసీ బస్సుల కంటే టికెట్ రేట్లు తక్కువగా కూడా ఉండటంతో ఈ బస్సులకు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రయాణికులు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఒక్కో బస్సులో 30 బెర్త్‌లు ఉండే నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొదటి దశలో 40 బస్సులను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం దశలవారీగా బస్సు సర్వీసులను పెంచాలన్నది ఆర్టీసీ ఉద్దేశంగా ఉంది. -
ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న 896 మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ, జిల్లా కలెక్టర్ల పూల్ కింద కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ముందు సర్వీసులో ఉండగా.. 896 మంది ఉద్యోగులు మరణించారు. 2016 నుంచీ సర్వీసులో ఉండి.. మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది. విలీనమైన తరువాత సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య నియామకాలు కూడా చేపట్టింది. కాగా అంతకుముందు 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న 896 కారుణ్య నియామకాలు కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ, కలెక్టర్ పూల్‌కింద ఉన్న ఉద్యోగాల్లో నియమించేందుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. ► పెండింగ్‌లో ఉన్న 896 మంది కారుణ్య నియామకాల జాబితాను ఆర్టీసీ ఎండీ సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపుతారు. ► వారిలో అర్హులను గుర్తించి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కలెక్టర్లు నియమిస్తారు. మిగిలిన అభ్యర్థుల జాబితాను ఆర్టీసీ ఎండీకి పంపిస్తారు. ► అలా మిగిలిన వారి జాబితాలోని అర్హతలను బట్టి ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లుగా నియమిస్తారు. అప్పటికి ఇంకా మిగిలి ఉంటే ఆ జాబితాను తిరిగి సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపుతారు. ► ఆర్టీసీ ఎండీ నుంచి వచ్చిన జాబితాలో ఉన్నవారికి కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఖాళీలలో భర్తీ చేస్తారు. సీఎం గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీలో 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబాల్లో వెలుగులు నింపుతూ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ, ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం గొప్ప విషయం. – చెంగయ్య, అధ్యక్షుడు, ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ యూనియన్ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలపై సానుకూల నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. ప్రభుత్వంలో విలీనానికి ముందు సర్వీసులో ఉండి మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల పట్ల సానుకూల దృక్పథంతో మంచి నిర్ణయం తీసుకున్నారు. – పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు, ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు -
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇకపై ఆధార్ కార్డు డిజిటల్ అయినా ఓకే!
సాక్షి, అమరావతి: సీనియర్ సిటిజన్లకు బస్ టికెట్లలో రాయితీ కోసం డిజిటల్ ఆధార్ కార్డును కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ టికెట్ల ధరల్లో 25 శాతం రాయితీ ఇస్తోంది. అందుకోసం ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, రేషన్‌కార్డులను గుర్తింపు కార్డులుగా పరిగణిస్తున్నారు. ఇక నుంచి డిజిటల్ ఆధార్‌ను కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ ఈడీ కేఎస్ బ్రహ్మానందరెడ్డి అధికారులను ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
APSRTC: చౌకగా ఆర్టీసీ కార్గో సేవలు.. పెరుగుతున్న ఆదరణ
ఆర్టీసీ అంటే ప్రజల్లో ఓ నమ్మకం. ప్రయాణం సురక్షితంగా.. సుఖవంతంగా సాగుతుందన్న భరోసా. ఇప్పుడు కార్గో సేవల్లోనూ ఆ సంస్థ అధికారులు అదే మంత్రాన్ని పఠిస్తున్నారు. సరుకులను సురక్షితంగా, సమయానికి గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. చౌకగా రవాణా సేవలు అందిస్తున్నారు. అందుకే... ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. సుస్థిర ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది. దీనికి పార్వతీపురం మన్యం జిల్లాలో కార్గో సేవలతో ఆర్టీసీకి పెరుగుతున్న ఆదాయమే నిదర్శనం. పార్వతీపురం టౌన్: ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. సరకు రవాణా పెరుగుతుండడంతో సంస్థకు అదనపు ఆదాయం చేకూరుతోంది. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ డిపోల పరిధిలో కార్గో ఆదాయం గతేడాది కంటే పెరిగింది. ప్రైవేటు సంస్థలతో పోల్చితే ఆర్టీసీలో సురక్షితంగా సేవలందుతుండడంతో వినియోగదారులు కార్గోపై ఆసక్తి చూపుతున్నారు. ఆర్టీసీకి అండగా నిలుస్తున్నారు. చౌకగా రవాణా.. వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పుస్తకాలు, మందులు తదితరవి తక్కువ చార్జీలతో రవాణా చేస్తుండడంతో ఆర్టీసీ కార్గోసేవలు వినియోగదారుల ఆదరణ చూరగొంటున్నాయి. జిల్లాలో కార్గో సేవల ద్వారా 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.90లక్షల ఆదాయం సమకూరింది. పార్సిల్స్, కొరియర్ కవర్లు రవాణా చేయడంతో ఈ ఆదాయాన్ని సముపార్జించింది. రోజూ సుమారు మూడు డిపోల ద్వారా 90 పార్సిళ్లు ఉంటున్నాయి. పార్సిళ్లను జిల్లాలో అయితే సుమారు 8 గంటల్లోపు, రాష్ట్రంలో అయితే 24 గంటల్లోపు గమ్య స్థానాలకు చేర్చుతోంది. 2021–22లో సరుకు రవాణాతో రూ.1.16 కోట్ల ఆదాయం ఆర్జించింది. యువతకు ఉపాధి.. కార్గో సేవలతో ఓ వైపు ఆర్టీసీకి ఆదాయంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తోంది. జిల్లాలో ని 3 డిపోల నుంచి సరకు రవాణా చేయడమే కాకుండా పార్వతీపురం డిపోకు అనుసంధానంగా బొబ్బిలి బస్టాండ్‌లో కార్గో పాయింట్లలో ఆరుగురు, సాలూరు డిపోలో ఆరుగురు, పాలకొండలో ఆరుగురు మొత్తం 18 మంది ఏజెంట్లను నియమించింది. వారికి కార్గో వ్యాపారంలో భాగస్వామ్యం కల్పించింది. 180 మంది కళాసీలకు పని కల్పిస్తోంది. ఆసక్తి కలిగిన మరింతమంది నిరుద్యోగులకు ఫ్రాంచైజీ ఏజెన్సీలు ఇవ్వడానికి కూడా ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ ఏజెన్సీ ద్వారా కేవలం సరకు బుకింగ్, డెలివరీ సదుపాయాలే కాకుండా ఆర్టీసీ బస్ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అయితే రూ.10వేలు డిపాజిట్‌గా, మిగిలిన ప్రాంతాల్లో రూ.1000 డిపాజిట్ చెల్లించి ఏజెన్సీ పొందవచ్చని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. నమ్మకంతో రవాణా ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గతంతో పోల్చుకుంటే వ్యాపారం పెరిగింది. అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషి వల్ల ఆదాయం గణనీయంగా వృద్ధిచెందింది. వ్యాపారులకు, ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. వ్యాపారులు వారి సరుకులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చాం. – టీవీఎస్ సుధాకర్, జిల్లా ప్రజారవాణా అధికారి, పార్వతీపురం మన్యం -
659 అద్దెబస్సులకు ఆర్టీసీ టెండర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అద్దె ప్రాతిపదికన 659 బస్సుల కోసం ఏపీఎస్ఆర్టీసీ టెండర్లు పిలిచింది. వాటిలో ఏసీ స్లీపర్ 9, నాన్ ఏసీ స్లీపర్ 47, ఇంద్ర ఏసీ 6, సూపర్ లగ్జరీ 46, అల్ట్రా డీలక్స్ 22, ఎక్స్‌ప్రెస్ 70, అల్ట్రా పల్లె వెలుగు 208, పల్లె వెలుగు 203, మెట్రో ఎక్స్‌ప్రెస్ 39, సిటీ ఆర్డినరీ బస్సులు 9 ఉన్నాయి. ‘ఎంఎస్టీసీ’ ఇ–పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని, ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టెండర్లు దాఖలు చేయవచ్చునని బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఆగస్టు 5 ఉదయం 10గంటల నుంచి ఆగస్టు 6 సాయంత్రం 4గంటల వరకు రివర్స్ టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తారు. అనంతరం అద్దె బస్సుల టెండర్లను ఖరారు చేస్తారు. బస్సు రూట్ల వివరాలు, బస్సు ప్రమాణాలు, టెండర్ల నిబంధనలు, ఇతర వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్: http://apsrtc.ap. gov. in టెండర్లు పిలిచిన అద్దె బస్సుల వివరాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి శ్రీకాకుళం–39, పార్వతీపురం మన్యం–32, విజయనగరం–14, విశాఖపట్నం–61, అనకాపల్లి–22, కాకినాడ–41, తూర్పు గోదావరి–27, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ – 39, పశ్చిమ గోదావరి–52, ఏలూరు – 21, కృష్ణా – 28, ఎన్టీఆర్ – 12, గుంటూరు – 26, పల్నాడు – 30, బాపట్ల– 6, ప్రకాశం– 10, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు – 39, తిరుపతి– 35, చిత్తూరు – 2, అన్నమయ్య – 10, వైఎస్సార్ – 6, నంద్యాల – 29, కర్నూలు – 14, అనంతపురం – 31, శ్రీసత్యసాయి – 33. -
డీజిల్ ధరల పెరుగుదల కొండంత.. సెస్ పెంపు గోరంతే
సాక్షి, అమరావతి: అర్ధసత్యాలు, అవాస్తవాలతో ఈనాడు, ఎల్లో మీడియా మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కింది. ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపును వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పడరాని పాట్లు పడింది. రోజుకోరీతిలో వైఎస్సార్సీపీ సర్కారుపై దుష్ప్రచారమే అజెండాగా వ్యవహరిస్తున్న ఈనాడు పత్రిక ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు విషయంలోనూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. చంద్రబాబు హయాం కంటే ప్రస్తుత ప్రభుత్వంలోనే ఆర్టీసీ చార్జీలు పెరిగాయని చెప్పుకొచ్చిన ఈనాడు పత్రిక ఆ కథనంలో ఎక్కడా కూడా దేశంలో డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతున్నాయని ఒక్క వాక్యం కూడా రాయలేదు. ఇక చంద్రబాబు ప్రభుత్వంలో డీజిల్ ధర ఎంత.. ప్రస్తుతం రెండేళ్లుగా పెరిగిన డీజిల్ ధరలు ఎంత అన్న లెక్కలు కూడా దాచిపెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించింది. డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతుండటంతో పొరుగునున్న తెలంగాణతో సహా దేశంలో అన్ని రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు విధిలేని పరిస్థితుల్లో డీజిల్ సెస్ విధించాయి. తెలంగాణ కంటే ఏపీఎస్ ఆర్టీసీ తక్కువగానే విధించింది. ఈ వాస్తవాలను ప్రస్తావించకుండా చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా తప్పుడు కథనాన్ని ప్రచురించడం ఎల్లో మీడియా కుతంత్రాన్ని మరోసారి బయటపెట్టింది. డీజిల్ ధర పెరుగుదల 104 శాతం.. సెస్ విధింపు 45 శాతం ఇక డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతున్నా సరే వీలైనంత వరకు ప్రయాణికులపై తక్కువ భారం పడేలా ఆర్టీసీ విధాన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మూడేళ్లలో డీజిల్ ధరలు ఏకంగా 104 శాతం పెరిగాయి. కానీ, ఆర్టీసీ మూడు విడతల్లో కలిపి కేవలం 45 శాతమే డీజిల్ సెస్ విధించింది. ఈ మూడేళ్లలో డీజిల్ ధరల పెరుగుదలను ప్రధానంగా మూడు భాగాలుగా పరిగణిస్తే.. డీజిల్ ధరలు పెరిగిన నిష్పత్తిలో ఆర్టీసీ డీజిల్ సెస్‌ను పెంచలేదు. పెరుగుతున్న ధరల్లో రెండొంతుల భారాన్ని ఆర్టీసీనే భరిస్తోంది. ఆర్టీసీ డీజిల్ సెస్ పెంచిన మూడు సందర్భాల్లోనూ ఇలానే వ్యవహరించింది. అందుకు నిదర్శనం ఈ గణాంకాలే.. భారీగా పెరిగిన డీజిల్ ధరలు టీడీపీ హయాంలో కంటే ఇప్పుడే ఆర్టీసీ చార్జీలు పెరిగాయని చెబుతున్న ఎల్లో మీడియా.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెరిగిన తీరు.. ఇప్పుడు పెరిగిన తీరును వివరించలేదు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుతం డీజిల్ ధరలు భారీగా పెరిగాయన్న వాస్తవాన్ని అంగీకరించాల్సి వస్తుంది కాబట్టి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మార్కెట్ ధరలను బట్టి ఆర్టీసీ లీటరు డీజిల్‌ను రూ.48.46 చొప్పున కొనుగోలు చేస్తే.. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.99.06, బల్క్ డీజిల్ అయితే లీటరుకు రూ.134.79 ఉంది. దాంతో ఎప్పుడూ కొనుగోలు చేసే బల్క్ డీజిల్ కాకుండా ఆర్టీసీ ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో డీజిల్ కొనుగోలు చేస్తోంది. అంత హేతుబద్ధంగా వ్యవహరిస్తున్నా ఆర్టీసీపై రోజుకు అదనంగా రూ.2.50 కోట్ల ఆర్థికభారం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల పెరుగుదల, కరోనా పరిస్థితులు, రష్యా–ఉక్రేయిన్ యుద్ధ పరిణామాలతో దేశంలో డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాగే, చంద్రబాబు అధికారంలో ఉన్న 2015లో కంటే ఇప్పటికి బహిరంగ మార్కెట్లో డీజిల్ ధర వంద శాతం పెరగగా.. ఆర్టీసీ సాధారణంగా కొనుగోలు చేసే బల్క్ డీజిల్ ధర దాదాపు 150 శాతం పెరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రయాణికులపై నామమాత్రపు భారమే... మరోవైపు.. డీజిల్ సెస్ పెంపుతో ప్రయాణికులపై ఏడాదికి రూ.2వేల కోట్ల అదనపు భారం పడుతుందన్న ఈనాడు పత్రిక వాదన పూర్తిగా అవాస్తవం. గతంలో రెండుసార్లు డీజిల్ ధరలు అమాంతంగా పెరిగినప్పుడు ఆర్టీసీ అనివార్యంగా పెంచిన డీజిల్ సెస్‌తో ఆదాయం నామమాత్రంగానే పెరిగింది. 2019 డిసెంబరులో చార్జీల పెంపుతో ఏడాదికి రూ.844 కోట్ల రాబడి వస్తుందని ఆర్టీసీ అంచనా వేసింది. కానీ, కోవిడ్ ప్రభావంతో ఆర్టీసీ సర్వీసులను సరిగా నిర్వహించలేకపోయింది. ఇక ఏప్రిల్ 2022లో డీజిల్ సెస్ పెంపుతో ఏడాదికి రూ.712 కోట్ల రాబడి వస్తుందని.. రోజుకు రూ.2కోట్ల వరకు రాబడి వస్తుందని భావించారు. కానీ, రోజుకు రూ.1.50 కోట్ల ఆదాయమే వస్తోంది. ఇక తాజాగా నామమాత్రంగా పెంచిన డీజిల్ సెస్‌తో కూడా ఆర్టీసీకి అదే రీతిలో నామమాత్రంగానే రాబడి పెరుగుతుందన్నది తెలుస్తూనే ఉంది. అంటే ప్రయాణికులపై పెద్దగా భారం పడబోదన్నది స్పష్టమవుతోంది. తెలంగాణ కంటే తక్కువగా సెస్ ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణ కంటే ఏపీఎస్ఆర్టీసీ డీజిల్ సెస్ తక్కువగానే విధిస్తోంది. తద్వారా ప్రయాణికులపై ఎక్కువ భారం పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపులో ఉన్న వ్యత్యాసమే ఇందుకు నిదర్శనం. ఆ వివరాలు ఇవిగో.. -
ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు
సాక్షి, అమరావతి: డీజిల్ ధరలు అమాంతం పెరుగుతుండటంతో నష్టాలను కొంతవరకు భర్తీ చేసుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం టికెట్లపై డీజిల్ సెస్సు పెంచింది. పెరిగిన డీజిల్ ధరలతో ఆర్టీసీపై రోజుకు రూ.2.50 కోట్ల మేర అదనపు భారం పడుతోంది. దీంతో అనివార్యంగా డీజిల్ సెస్సు పెంచుతున్నట్టు ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి, ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెరిగిన డీజిల్ సెస్సు శుక్రవారం నుంచి అమలులోకి రానుంది. కనీస దూరం ప్రయాణానికి డీజిల్ సెస్ పెంపుదల నుంచి మినహాయింపునిచ్చారు. అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణాలపై ఏకమొత్తంగా కాకుండా కి.మీ. ప్రాతిపదికన డీజిల్ సెస్ పెంచారు. ప్రయాణికులపై తక్కువ భారం పడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సిటీ బస్సుల్లో డీజిల్ సెస్ పెంచలేదు. తెలంగాణతో పోలిస్తే ఏపీఎస్ ఆర్టీసీ డీజిల్ సెస్ తక్కువ పెంచింది. తెలంగాణలో అన్ని ఆర్టీసీ బస్సులు, విద్యార్థుల బస్ పాస్‌లపై డీజిల్ సెస్‌ను రెండోసారి జూన్ 9న పెంచిన విషయం తెలిసిందే. బల్క్ డీజిల్ ధర లీటర్ రూ.131 2019 డిసెంబర్లో డీజిల్ ధర మార్కెట్లో లీటరు రూ.67 ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ నాటికి రూ.107కి చేరుకుంది. అంటే లీటరుకు రూ.40 చొప్పున పెరిగింది. దీంతో నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసుకునేందుకు అనివార్యంగా ఆర్టీసీ డీజిల్ సెస్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 13 నుంచి విధిస్తోంది. ప్రస్తుతం బల్క్ డీజిల్ ధర లీటర్ రూ.131కి చేరుకోవడంతో ఆర్టీసీ నిత్యం అదనంగా రూ.2.50 కోట్ల నష్టాన్ని భరించాల్సి వస్తోంది. బస్సుల నిర్వహణ, స్పేర్ పార్ట్‌ల ధరలు కూడా పెరగడంతో ఆర్థిక భారం అధికమైంది. దీన్ని కొంతవరకైనా భర్తీ చేసే ఉద్దేశంతో డీజిల్ సెస్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కనీస దూరానికి పెంపులేదు ప్రయాణించే దూరాన్ని బట్టి కి.మీ. ప్రాతిపదికన డీజిల్ సెస్ పెంచారు. కనీస దూరానికి డీజిల్ సెస్ పెంచలేదు. పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీ, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో 30 కి.మీ, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో 20 కి.మీ, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 55 కి.మీ, ఏసీ సర్వీసుల్లో 35 కి.మీ, అమరావతి సర్వీసుల్లో 55 కి.మీ వరకు ప్రస్తుతం డీజిల్ సెస్సు పెంచలేదు. అంతకుమించి ప్రయాణించే కి.మీ. ప్రాతిపదికన డీజిల్ సెస్సు పెంచారు. విద్యార్థుల బస్ పాస్ చార్జీలు కూడా స్వల్పంగా పెరుగుతాయి. సహృదయంతో సహకరించాలి డీజిల్ ధరలు అమాంతం పెరుగుతుండటంతో ఆర్టీసీపై నష్టాల భారం రోజురోజుకు పెరుగుతోంది. అనివార్యంగా ఆర్టీసీ డీజిల్ సెస్ పెంచాల్సి వచ్చింది. ప్రజలు సహృదయంతో అర్థం చేసుకొని సహకరించాలని కోరుతున్నాం. ఆర్టీసీలో సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణ సేవలందిస్తాం. – ఎ.మల్లికార్జున రెడ్డి, (ఆర్టీసీ చైర్మన్), సీహెచ్.ద్వారకా తిరుమలరావు (ఆర్టీసీ ఎండీ) -
ఎస్సీ మహిళలకు బస్ డ్రైవింగ్‌లో శిక్షణ
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ద్వారా ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. ఎస్సీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలపై వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శిక్షణ అనంతరం వారికి ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో డ్రైవర్లుగా అవకాశం కల్పిస్తామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల సౌజన్యంతో నర్సింగ్ కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తామని చెప్పారు. భారీ వాహనాల కొనుగోలు కోసం ఇచ్చే రుణ మొత్తాన్ని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకం కింద విదేశాల్లో పీజీ చేసేవారికి రూ.20 లక్షలు, స్వదేశంలో పీజీ చేసే వారికి రూ.15 లక్షల వరకు రుణాలు అందిస్తామన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, డైరెక్టర్ కె.హర్షవర్ధన్, గురుకులాల కార్యదర్శి పావనమూర్తి, లిడ్‌క్యాప్ సీఎండీ డోలా శంకర్, ఎస్సీ కార్పొరేషన్ జీఎం కరుణకుమారి పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై అవగాహన అంతకుముందు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై మంత్రి మేరుగ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. దళితులు, గిరిజనులను వేధించకూడదని అగ్రవర్ణాల వారికి, తప్పుడు కేసులు పెట్టకూడదని ఎస్సీ, ఎస్టీలకు అవగాహన కల్పించాలన్నారు. తహశీల్దార్లు, ఎస్సైలు వారానికి ఓసారి గ్రామాల్లోకి వెళ్లి ప్రజల్ని చైతన్య పరచాలన్నారు. ఈ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో అతి తక్కువ శాతం నిందితులకు మాత్రమే శిక్షలు పడుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలు ఏర్పడినందున అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కేసులను విచారించే డీఎస్పీలను నియమించాలన్నారు. ఈ సమావేశంలో సీఐడీ పీసీఆర్ ఎస్పీ రత్న, జేడీ ప్రాసిక్యూషన్ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ పే స్కేల్
సాక్షి, అమరావతి: ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) ఉద్యోగులు 52 వేల మంది జీవితాల్లో నూతన అధ్యాయమిది. జూలై 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం జీతాలు అందుకోనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని 2020 జనవరి 1న ప్రభుత్వంలో విలీనం చేస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. ఇప్పటివరకు కార్పొరేషన్ పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కేడర్ నిర్ధారణను ప్రభుత్వం ఇటీవల పూర్తిచేసింది. ఆమేరకు నూతన పే స్కేల్‌ను కూడా ప్రకటించింది. జూలై 1 నుంచి కొత్త జీతాలు చెల్లిస్తామని తెలిపింది. నిర్ధారించిన కేడర్‌కు అనుగుణంగా ఉద్యోగుల జీతాలు, ఇతర భత్యాలను ఉన్నతాధికారులు నిర్ణయించారు. జీతాల చెల్లింపు విధానంపై జిల్లాలు, డిపోలవారీగా ఉద్యోగులకు అవగాహన కల్పించారు. పే స్లిప్‌ల తయారీ, ఇతర లాంఛనాలను పూర్తి చేశారు. తాజా పీఆర్సీ మేరకు ఏడాది కాలానికి ఫిట్‌మెంట్‌ను నిర్ణయించి అమలు చేయనున్నారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగులకు గరిష్టంగా ప్రయోజనం చేకూరుతుంది. ప్రధానంగా అత్యధిక సంఖ్యలో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, సాధారణ, కిందిస్థాయి సిబ్బందికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. కార్పొరేషన్ జీతాలకంటే ప్రభుత్వ ఉద్యోగులుగా చెల్లించే జీతాలు ఎక్కువని అధికారవర్గాలు తెలిపాయి. ఏడీసీలుగా పదోన్నతి పొందిన డ్రైవర్లు, కండక్టర్లకు కలిగే అదనపు ప్రయోజనాలపై తొలుత కొంత సందిగ్ధత నెలకొంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్థిక శాఖను సంప్రదించి తదనుగుణంగా చర్యలు తీసుకున్నారు. దాంతో వారికి కూడా అదనపు ఆర్థిక ప్రయోజనం కలగనుంది. మరోవైపు రాష్ట్ర ప్రధాన కేంద్రంలో.. అంటే విజయవాడలో పనిచేసే ఉద్యోగులందరికీ అదనపు హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన దాదాపు 200 మంది ఉద్యోగులకే అదనపు హెచ్ఆర్ఏ చెల్లిస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో విజయవాడలో పనిచేసే అందరికీ చెల్లిస్తారు. దీనివల్ల దాదాపు 500మందికి మరింత ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వ పే స్కేల్‌తో ఆర్టీసీ ఉద్యోగులకు భవిష్యత్‌లో మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని ఉద్యోగవర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. -
టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు.. ఏపీఎస్ఆర్టీసీకి రాబడి
సాక్షి, అమరావతి: తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు రెండోసారి పెంచడం ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి అనుకూలంగా మారుతోంది. మన రాష్ట్రంలో కంటే తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సులకే ప్రయాణికులు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీ రాబడి గణనీయంగా పెరుగుతోంది. తెలంగాణ ఆర్టీసీ.. డీజిల్ సెస్ పేరుతో జూన్ 9న రెండోసారి చార్జీలు పెంచింది. దీంతో కనీసం రూ.5 నుంచి గరిష్టంగా రూ.170 వరకు ఆ రాష్ట్రంలో బస్సు చార్జీలు పెరిగాయి. ప్రధానంగా 100 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణంపై చార్జీల పెంపు భారం అధికంగా ఉంది. ఈ పరిణామం ఏపీఎస్ఆర్టీసీకి కలసివస్తోంది. ప్రధానంగా రెండు రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉండే హైదరాబాద్ రూట్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు పెరుగుతోంది. విజయవాడ–హైదరాబాద్ రూట్లో ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులకు ప్రయాణికుల నుంచి ఆదరణ మరింతగా పెరిగింది. ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ముందస్తు రిజర్వేషన్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ రాబడి కూడా గణనీయంగా వృద్ధి చెందుతోంది. చదవండి: (AP: అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి) బస్ సర్వీసులు పెంచడంపై దృష్టి జూన్ 9 కంటే ముందు విజయవాడ –హైదరాబాద్ రూట్లో ఆర్టీసీకి రోజుకు గరిష్టంగా రూ.కోటి రాబడి వచ్చేది. కానీ తెలంగాణ ఆర్టీసీ చార్జీలు రెండోసారి పెంచాక ఏపీఎస్ఆర్టీసీ రాబడి పెరుగుతోంది. జూన్ 9న రూ.1.19 కోట్ల రాబడి రాగా.. జూన్ 10న రూ.1.21 కోట్లు వచ్చింది. జూన్ 11న రూ.1.26 కోట్లు, జూన్ 12న రూ.1.24 కోట్లు రాబడి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న రోజుల్లో విజయవాడ –హైదరాబాద్ రూట్‌తోపాటు తిరుపతి– హైదరాబాద్ రూట్,రాష్ట్రంలోని తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ రాబడి మరింతగా పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. అందుకు అనుగుణంగా బస్ సర్వీసులు పెంచడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యాల కల్పనపై దృష్టిసారించారు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ చార్జీలు ఇలా.. ►ఉదాహరణకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ చార్జీ తెలంగాణ ఆర్టీసీలో రూ.505. కానీ ఏపీఎస్ఆర్టీసీలో రూ.470 మాత్రమే. ►ఏపీఎస్ఆర్టీసీ ఇంద్ర బస్‌లో హైదరాబాద్ (కేపీహెచ్‌బీ)కి చార్జీ రూ.610 ఉండగా.. అదే రీతిలో ఉండే తెలంగాణ ఆర్టీసీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో చార్జీ రూ.642. ►ఏపీఎస్ఆర్టీసీ గరుడ సర్వీసులో హైదరాబాద్ (కేపీహెచ్‌బీ)కి చార్జీ రూ.690 ఉండగా.. తెలంగాణ ఆర్టీసీలో చార్జీ రూ.783గా ఉంది. -
ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి : ఆర్టీసీ ఉద్యోగుల కల నెరవేరింది. ఇచ్చిన హామీ మేరకు సంస్థను ప్రభుత్వంలో విలీనంచేసిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు వారికి ప్రభుత్వోద్యోగులతో సమానంగా పీఆర్సీ కూడా అమలుచేయనుంది. 11వ పీఆర్సీ అమలుకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులకూ పీఆర్సీని ఎలా అమలుచేయాలి, వారి పేస్కేల్, అలవెన్సులు ఇతర అన్ని అంశాలను ఎలా నిర్ధారించాలో స్పష్టంచేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 2020 జనవరి 1నుంచి పీఆర్సీ అమలు ప్రభుత్వంలో విలీనమైన 2020 జనవరి ఒకటో తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలుకానుంది. ఇచ్చిన హామీ ప్రకారం మిగిలిన ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే 32 గ్రేడ్లు, 83 స్టేజ్లలో వారికి మాస్టర్స్ స్కేల్స్ ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. 23 శాతం ఫిట్మెంట్, డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ (సిటీ కాంపన్సేటరీ అలవెన్స్) ఎలా నిర్ధారించాలో అందులో పేర్కొంది. 2018 జూలై, 2020 జనవరి మధ్య ఆర్టీసీలో చేరిన ఉద్యోగులకు పే స్కేల్ నిర్ధారించేందుకు మార్గదర్శకాలు ఇచ్చింది. పెన్షన్, గ్రాట్యుటీ ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ఎలా వర్తింపజేయాలో కూడా సూచించింది. ట్రావెలింగ్ ఇతర అలవెన్సులకు సంబంధించి మరో జీఓ ఇచ్చింది. డ్రైవర్లు, కండక్టర్లకు వారి డ్యూటీల ప్రకారం ఇచ్చే అలవెన్సులను నిర్ధారించింది. -
రీమోడల్ ప్రయోగం సక్సెస్
చిత్తూరు రూరల్: ఆర్టీసీ బస్సు రీ మోడల్ ప్రయోగం ఫలించింది. చిత్తూరు–2 డిపోకు చెందిన బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్పు చేశారు. ఇందుకు రూ.72 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. 2 గంటలు చార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు పరుగులు పెట్టనుంది. డీజిల్ భారం ఆర్టీసీకి పెద్ద తలనొప్పిగా మారింది.ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రిక్ బస్సుగా మార్పు చేయాలని భావించి.. రెండేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని వీర వాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఈ బాధ్యతను అప్పగించింది. అన్ని పనులు పూర్తయ్యాక విజయవాడకు చెందిన ఆర్టీసీ టీమ్ ఆ ఎలక్ట్రిక్ బస్సును పరీక్షించింది. అనంతరం బస్సును చిత్తూరు–2 డిపోకు తీసుకొచ్చారు. బస్సు ప్రత్యేకతలు ఇవే... చిత్తూరు–2 డిపో గ్యారేజీకి గత వారం ఈ బస్సు చేరింది. ఇందులో ఆరు హెవీ డ్యూటీ బ్యాటరీలు ఉన్నట్లు గుర్తించారు. ఈ బ్యాటరీల చార్జింగ్కు 1.30 నుంచి 2 గంటల సమయం తీసుకుంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 180 నుంచి 200 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఈ బస్సు గేర్ సహాయం లేకుండా స్విచ్ టైప్‌తో ఆటోమెటిక్‌గా నడుస్తుంది. గంటకు 80 కి.మీ వేగంతో నడిచేలా తీర్చిదిద్దారు. ఎలక్ట్రిక్ మోటార్‌తో చక్కటి స్టీరింగ్‌ను ఏర్పాటు చేశారు. పాత పద్ధతిలో బ్రేక్ సిస్టం, డ్రైవర్‌కు సౌకర్యార్థంగా డాష్‌బోర్డును బిగించారు. దీని ద్వారా బ్యాటరీ పరిస్థితి, బస్సు ఏ గేర్‌లో వెళుతోంది.. అనే విషయాలను తెలుసుకునే వీలుంది. ఇక బస్సు కింద భాగంలో అమర్చిన పరికరాలు వర్షానికి తడవకుండా అల్యూమినియంతో పూర్తిగా కప్పేశారు. తిరుపతి–తిరుమల మార్గంలో.. కొత్తగా రూపుదిద్దుకున్న ఎలక్ట్రిక్ బస్సును తిరుపతి–తిరుమల మార్గంలో తిప్పనున్నారు. ఈ క్రమంలో అలిపిరి వద్ద చార్జింగ్ స్టేషన్ పనులు జరుగుతున్నాయి. అలాగే తిరుపతి బస్టాండులో కూడా ఒక చార్జింగ్ పాయింట్ పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని పరీక్షలు పూర్తయిన తరువాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బండిని రోడ్డుపైకి తీసుకొస్తారని సమాచారం. డ్రైవర్‌కు అనుకూలమైన బస్సు. గేర్లు లేకుండా నడపవచ్చు. బ్యాటరీ, మోటార్ సాయంతో వెళుతుంది. ఈ బస్సుతో డీజిల్ భారం తగ్గనుంది. పొగ రాదు.. వాయు కాలుష్యం ఉండదు. – ఇబ్రహీం, డిప్యూటీ సీఎంఈ, చిత్తూరు -
బస్సుల్లోనూ డిజిటల్ చెల్లింపులు
సాక్షి, అమరావతి బ్యూరో: ఏపీఎస్ఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. బస్సుల్లోనూ నగదు రహిత డిజిటల్ చెల్లింపులకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం డ్రైవర్లు, కండక్టర్ల వద్దనున్న టికెట్ ఇష్యూయింగ్ యంత్రాల(టిమ్స్) స్థానంలో ఈ–పోస్ యంత్రాలను అందుబాటులోకి తెస్తోంది. వీటితో ప్రయాణికులు నగదు చెల్లించనవసరం లేకుండా డెబిట్/క్రెడిట్ కార్డులు, ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాటితో టికెట్లు పొందొచ్చు. ఫలితంగా బస్సుల్లో చిల్లర సమస్య ఉండదు. పైలట్ ప్రాజెక్టు కింద విజయవాడ, గుంటూరు–2 డిపోలను ఎంపిక చేశారు. ఈ డిపోల నుంచి తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంత సర్వీసుల్లో ఈ–పోస్ మెషీన్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ రూట్లలో విధులు నిర్వర్తించే డ్రైవర్లు, కండక్టర్లకు ఈ–పోస్ యంత్రాల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో డిపో నుంచి పది మంది చొప్పున డ్రైవర్లు, డ్రైవర్ కం కండక్టర్లు మూడు వారాలుగా ఈ శిక్షణ పొందుతున్నారు. వీరికి శిక్షణ పూర్తయ్యాక ఈ–పోస్ యంత్రాలు ప్రవేశపెడతారు. దశలవారీగా అన్ని డిపోల్లోనూ, నిర్దేశిత బస్టాండ్లు, బస్టాపుల్లో టిక్కెట్లు ఇచ్చే గ్రౌండ్ బుకింగ్ స్టాఫ్‌కు కూడా ఈ–పోస్ యంత్రాలను సమకూర్చనున్నారు. ఇక్సిగో–అభిబస్‌తో ఒప్పందం యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ (యూటీఎస్) సాంకేతికతతో కూడిన ఈ–పోస్ యంత్రాల సరఫరాకు ఇక్సిగో–అభిబస్ సంస్థతో ఆర్టీసీకి ఒప్పందం కుదిరింది. ఈ యంత్రాల ద్వారా సాధారణ టికెట్లతో పాటు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, జర్నలిస్టులు తదితరులు కూడా రాయితీ టికెట్లు పొందొచ్చు. -
ప్రగతి రథానికి ప్రభుత్వం దన్ను
దశాబ్దాల డిమాండ్.. 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక స్వప్నం.. ఎడతెగని సాగదీత... గందరగోళం.. వీటన్నింటికీ ఒక్క నిర్ణయం ముగింపు పలికింది. అదే.. ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక నిర్ణయం. 2020 జనవరి నుంచి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రజా రవాణా విభాగం (పీటీడీ)ని ఏర్పాటు చేశారు. ఫలితం కళ్లముందు కనిపిస్తోంది. – సాక్షి, అమరావతి ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ► పీఎఫ్ చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయి. ► ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సహకార సొసైటీకి 2014 నుంచి ఉన్న బకాయిలు రూ.200 కోట్లను యాజమాన్యం చెల్లించింది. దాంతో సొసైటీ ద్వారా ఉద్యోగులు రుణాలు పొందుతున్నారు. ► ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ప్రకటించారు. అందు కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు. ప్రమాదవశాత్తు మరణించే ఉద్యోగుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున, సహజ మరణానికి కూడా రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ► 2020 జనవరి తరువాత రిటైరైన ఉద్యోగుల గ్రాట్యుటీ కోసం రూ.23.25 కోట్లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాల కోసం రూ.271.89 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ► 2020–21, 2021–22లో ఉద్యోగుల సరెండర్ లీవుల ఎన్‌క్యాష్‌మెంట్ కోసం రూ.165 కోట్లు చెల్లించింది. ► ఏపీ గవర్నమెంట్ ఇన్సూ్యరెన్స్ స్కీమ్ ద్వారా 55 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న 44,500 మందికి ప్రయోజనం కలుగుతుంది. ఏపీ గవర్నమెంట్ స్టేట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూ్యరెన్స్ స్కీమ్‌ను కూడా వర్తింపజేశారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను కూడా ఉద్యోగులు పొందుతున్నారు. ► 2016 నుంచి పెండింగులో ఉన్న కారుణ్య నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. ► 2020 జనవరి 1 తరువాత అనారోగ్య సమస్యలతో ఉద్యోగ విరమణ చేసిన 100 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ► 2016 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 మధ్య మరణించిన 845 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు, 2020 జనవరి 1 తరువాత మరణించిన 955 మంది ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఉద్యోగుల జీతాల కోసం ఏటా రూ.3,600 కోట్లు దశాబ్దాల ఆర్టీసీ చరిత్ర మొత్తం ఉద్యోగుల జీతాల కోసం నెల నెలా అప్పులు చేయడం. నెలకు దాదాపు రూ.300 కోట్లు జీతాలకు చెల్లించాలి. ఆ అప్పుల మీద ఏడాదికి వడ్డీల భారమే దాదాపు రూ.350 కోట్లు. విలీనం తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం నంబర్లు కేటాయించి సీఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు సక్రమంగా చెల్లిస్తోంది. ఇందుకోసం నెలకు ఏడాదికి రూ.3,600 కోట్ల భారాన్ని మోస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా బస్సు సర్వీసులు తగ్గించింది. టికెట్ల ద్వారా వచ్చే రాబడి గణనీయంగా పడిపోయింది. అటువంటి గడ్డు పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వమే నెల నెలా జీతాలు చెల్లిస్తోంది. జీతాల భారం తప్పడంతో ఆర్టీసీ నష్టాల ఊబి నుంచి బయటపడుతోంది. 2020 జనవరి నాటికి ఆర్టీసీకి దాదాపు రూ.4 వేల కోట్ల అప్పులున్నాయి. ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుండటంతో ఈ రెండేళ్లలో ఆర్టీసీ రూ.1,500 కోట్ల అప్పులు తీర్చింది. జీవితాల్లో వెలుగులు నింపారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న గొప్ప నిర్ణయం 52 వేల మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపింది. నెల నెలా జీతాల కోసం పడిన ఇబ్బందులు తొలగిపోయాయి. ఉద్యోగ భద్రత కల్పించారు. ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నారు.’. – బీఎస్ రాములు, డ్రైవర్, విజయనగరం రీజియన్ ఉద్యోగుల ప్రయోజనాలకు కట్టుబడ్డ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వంలో విలీనం ద్వారా ఉద్యోగ భద్రత, ఆర్థిక భరోసా కల్పించింది. ఏ ప్రభుత్వ శాఖలో లేని రీతిలో కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ప్రకటించింది. త్వరలో పే స్కేళ్లను నిర్ధారించనుంది. దీంతో ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలుగుతుంది. – ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సీఎం జగన్ నిర్ణయం చరిత్రాత్మకం ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకుంటామని ఎందరో చెప్పారు గానీ ఏమీ చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే గొప్ప నిర్ణయం తీసుకుని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరాయి. ఉద్యోగ భద్రత, పని వేళలు వంటి ప్రభుత్వ విధానాలు అమల్లోకి రావడంతో మాకు ప్రయోజనం కలుగుతోంది.’ – పీహెచ్ వెంకటేశ్వర్లు, మెకానిక్, నెల్లూరు రీజియన్ ఒక్క కి.మీ. తిరగకపోయినా జీతాలు చెల్లించారు ‘కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఒక్క కిలోమీటరు కూడా తిరగకపోయినా ఉద్యోగులకు జీతాలు సక్రమంగా అందాయి. ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల్లో కోత విధించారు. మన రాష్ట్రంలో మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు చెల్లించడంతోపాటు ఇతర ప్రయోజనాలూ కల్పిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం ఫలితమే ఇది. ఆర్టీసీ ఉద్యోగులు సీఎంకు కృతజ్ఞతతో ఉంటారు.’ – కొండలు, ఆర్టీసీ సూపర్వైజర్, గుడివాడ -
మామిడితో కాసులు.. ఆర్టీసీకి ఏ దిల్ ‘మ్యాంగో’ మోర్
సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్టీసీకి మామిడి కాసులు తెచ్చి పెడుతోంది. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు మామిడి కాయలు/పండ్లను పార్శిల్ ద్వారా పంపే వారి సంఖ్య పెరుగుతోంది. ఆర్టీసీ కార్గో, కొరియర్ సర్వీసులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటికి డోర్ డెలివరీ సదుపాయాన్ని కూడా కల్పించడంతో మంచి ఆదరణ లభిస్తోంది. పార్శిల్ బుక్ చేసిన 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోని నిర్దేశిత ప్రాంతాలకు సరకును అందజేస్తోంది. ఇది వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. చదవండి: కేశినేని కుటుంబంలో కుంపటి! మామిడికి ప్రత్యేక కౌంటర్.. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (పీఎన్బీఎస్)లో కార్గో బుకింగ్ కౌంటర్ అందుబాటులో ఉంది. రెండు నెలల క్రితం నుంచి మామిడి సీజను మొదలైంది. మామిడిని పార్శిల్ ద్వారా పంపే వారి కోసం ప్రత్యేకంగా పీఎన్ బస్టాండులోని 60వ నంబరు ప్లాట్‌ఫాం వద్ద కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేక ర్యాక్‌లను కూడా అమర్చారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే మ్యాంగో బాక్సుల డెలివరీకి 57వ నంబరు ప్లాట్‌ఫాం వద్ద మరో ప్రత్యేక కౌంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల కార్గో బుకింగ్ కౌంటర్ వద్ద రద్దీ తగ్గడంతో పాటు వేగంగా పార్శిళ్లను బుక్ చేసుకునే వీలుంటోంది. ఇలా ఈ మ్యాంగో బుకింగ్ కౌంటర్లో నెలకు 600 నుంచి 800 వరకు బాక్సులు/పార్శిళ్లు బుక్ అవుతున్నాయి. గతేడాది కంటే మిన్నగా.. గత ఏడాది ఏప్రిల్‌లో 400 మ్యాంగో పార్శిళ్లు, మే నెలలో 600, జూన్‌లో 600 చొప్పున పీఎన్ బస్టాండు నుంచి వేర్వేరు ప్రాంతాలకు బుక్ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 600, మే నెలలో ఇప్పటివరకు 800 వరకు పార్శిళ్లను పంపించారు. అంటే గత ఏడాదికంటే ఈ సీజనులో మామిడి పండ్ల/కాయల పార్శిళ్ల సంఖ్య పెరిగినట్టు స్పష్టమవుతోంది. ఆర్టీసీ ఒక్కో బాక్సుకు (5–15 కిలోల బరువు వరకు) రూ.100–120 వరకు రవాణా చార్జీ వసూలు చేస్తోంది. ఈ లెక్కన మామిడి రవాణా ద్వారా ఏప్రిల్‌లో రూ.60 వేలు, మే నెలలో (ఇప్పటి దాకా) రూ.80 వేల వరకు కార్గో ఆదాయం సమకూరింది. జూన్‌లోనూ 800 వరకు మ్యాంగో పార్శిళ్లు బుక్ అవుతాయని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, విశాఖలకు అధికం.. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నంలకు అధికంగా మ్యాంగో పార్శిళ్లు బుక్ చేస్తున్నారు. ఆ తర్వాత తిరుపతి, రాజమండ్రిలకు బుక్ అవుతున్నాయని ఆర్టీసీ కార్గో విభాగం అధికారులు చెబుతున్నారు. ఒకే వినియోగదారుడు నాలుగైదుసార్లు పార్శిళ్లను పంపుతున్న వారు కూడా ఉంటున్నారని వివరిస్తున్నారు. మామిడి తర్వాత.. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు కార్గో రవాణాలో మామిడి తర్వాత మందులు, ఫ్యాన్సీ సరుకులు, వ్రస్తాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, పుస్తకాలు వంటివి ఉంటున్నాయి. ఇలా వీటి ద్వారా విజయవాడ కార్గో కౌంటర్‌కు రోజుకు రూ.2.50 నుంచి 3 లక్షల వరకు ఆదాయం సమకూరుతోందని ఆర్టీసీ కార్గో విభాగం డెప్యూటీ సీటీఎం (కమర్షియల్) రాజశేఖర్ ‘సాక్షి’కి చెప్పారు. డోర్ డెలివరీ కూడా.. మరోవైపు పది కిలోమీటర్లలోపు డోర్ డెలివరీకి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ఇది కూడా వినియోగదారులకు వెసులుబాటుగా ఉంటోంది. బుక్ చేసిన సరకును వెళ్లి తీసుకురావడానికి సమయాన్ని వెచ్చించడంతో పాటు ఆటో, బస్సు, వాహన చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. డోర్ డెలివరీ వెసులుబాటు ఉండడం వల్ల వీరికి డబ్బుతో పాటు సమయం కూడా ఆదా అవుతోంది. దీంతో పలువురు ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. విడిపించని సరకులకు నేడు వేలం.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పార్శిళ్లను కొంతమంది విడిపించుకోరు. అలాంటి వాటిని ఆర్టీసీ అధికారులు కొన్నాళ్ల పాటు వేచి చూసి ఎవరూ రాకపోతే వేలం వేస్తుంటారు. ఇలా పీఎన్ బస్టాండులో 2–3 నెలలుగా విడిపించుకోని 80 వరకు పార్శిళ్లు ఉన్నాయి. వీటిలో మందులు, దుస్తులు, స్టేషనరీ, స్పేర్ పార్టులు వంటివి ఉన్నట్టు గుర్తించారు. వీటికి శనివారం ఉదయం 11 గంటల నుంచి వేలం వేస్తామని పార్శిల్ విభాగం అధికారులు తెలిపారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
కలికిరి: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి కలికిరి క్రాస్ రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు.. కలికిరి పట్టణానికి చెందిన మస్తాన్‌వలీ(45) పీలేరు పట్టణంలో పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాడు. బుధవారం రాత్రి పని నిమిత్తం తన బంధువు నూర్‌మహమ్మద్(42)తో కలిసి కలికిరి రాజువారిపల్లికి వెళ్లి వస్తుండగా క్రాస్ రోడ్డు సమీపంలోని నగిరిపల్లి క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన పీలేరు ఆర్టీసీ డిపో బస్సు ఢీకొంది. ప్రమాదంలో మస్తాన్ వలీ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు, నూర్మొహమ్మద్కు కాలు విరిగింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మస్తాన్ వలీ మరణించినట్లు ధ్రువీకరించారు. నూర్‌మహమ్మద్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తీసుకెళ్లారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కారు ధ్వంసం మదనపల్లె టౌన్: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వెనుక వస్తున్న కారు మరో ద్విచక్ర వాహనం బస్సును ఢీకొని« ధ్వంసమైన సంఘటన మదనపల్లె రూరల్‌లో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మదపల్లెకు చెందిన రామకృష్ణ రూ.14 లక్షల కారును కొనుగోలు చేసి అమ్మవారి ఆలయంలో పూజ చేయించేందుకు బయలుదేరాడు. రోడ్డుకు కుడివైపున ఆలయానికి వెళ్లేందుకు కారు ఇండికేటర్ వేసి మలుపు తిప్పుతుండగా ఆర్టీసీ ఆద్దె బస్సు వేగంగా వచ్చిన కారును వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో కొత్తకారు వెనుకభాగం పూర్తిగా దెబ్బతినింది. బస్సు కారును ఢీకొట్టి సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న బి.కొత్తకోట చెందిన నవీన్ కారు ముందు భాగం ధ్వంసమైంది. ఆ కారు వెనుకనే వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈడిగపల్లెకు చెందిన సంతోష్(21) తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. హైవే పట్రోల్ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేశారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అద్దె బస్సుల విధానం ఈనాటిది కాదు: ఆర్టీసీ ఎండీ
సాక్షి, విజయవాడ: ఆర్టీసీ సంస్థ ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తోందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీకి ప్రజలు ముఖ్యమైన వారు. ఇటీవల కొన్ని పత్రికలు ఆర్టీసీపై దుష్రచారం చేస్తున్నాయి. ఆర్టీసీలో అద్దె బస్సుల విధానం కొత్తది కాదు. అద్దె బస్సులు 1979 నుంచి నడుపుతున్నారు. ప్రజల సౌకర్యం కోసం ప్రస్తుతం 995 అద్దె బస్సులు నడుపుతున్నాం. కోవిడ్ కారణంగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కొత్తవి కొనలేక అద్దెవి నడుపుతున్నాం. అద్దె బస్సులు కూడా పాతవి కాకుండా.. కొత్తవి, కండిషన్లో ఉన్నవి మాత్రమే వాడాలి. కొత్త బస్సులు ఉన్నవారు మాత్రమే టెండర్లలో పాల్గొనాలి. అద్దె బస్సులు కూడా ఆర్టీసీ సూచించిన విధంగానే నడుపుతారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది అత్యంత అరుదైనది, చరిత్రాత్మకమైనది. కర్ణాటక, తెలంగాణలో ఆర్సీఈ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేయాలని అనేకమార్లు ధర్మాలు చేశారు. అయినా అక్కడ ప్రభుత్వాలు స్పందించలేదు. అద్దె బస్సుల వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించలేదు. ప్రభుత్వం ఉద్యోగులను తొలగిస్తూ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయా పత్రికల్లో వచ్చిన దుష్రచారాలను నమ్మొద్దు. ఇతర రాష్ట్రాలలో రెండు, మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. ఉద్యోగుల సొమ్మును సైతం ఆయా రాష్ట్రాల్లో వాడుకుంటున్నారు. ప్రభుత్వంలో విలీనం తర్వాత 16,080 కోట్లు అప్పులు తీర్చాం. పీఎఫ్ బకాయిలు మొత్తం చెల్లించాం. సడెన్‌గా మెరుపు సమ్మెలు చేస్తారని కావాలనే హైయర్ బస్సుల పెనాల్టీలు పెంచాం. ప్రజలకు మంచి సేవలు అందాలనే ఇలా చేశాం. కోవిడ్ సమయంలో బస్సులు తిరగనప్పుడు ఇన్సూరెన్స్ ఎక్స్టెండ్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించటంతో వేగంగా కారుణ్య నియామకాలు చేపడుతున్నాం. 2,237 ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో దాతల సాయంతో చలువ పందిళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని' ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలు
సాక్షి, అమరావతి: ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు చెందిన నిపుణులు విజయవాడ విద్యాధరపురంలోని ఏపీఎస్ఆర్టీసీ సెంట్రల్ హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చారని ఏపీఎస్ఆర్టీసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డీవీఎస్ అప్పారావు తెలిపారు. ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కార్మికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వైద్య సేవల సమయాలను ఆయన శనివారం మీడియాకు విడుదల చేశారు. క్యాపిటల్ హాస్పిటల్స్, అమెరికన్ అంకాలజీ ఇన్స్టిట్యూట్, శ్రీగాయత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వంశీ హార్ట్ కేర్ సెంటర్ యాజమాన్యాలు ఆర్టీసీ ఉద్యోగులకు ఉచిత కన్సల్టేషన్ సూపర్ స్పెషాలిటీ సేవలను అందించనున్నాయన్నారు. ► యూరాలజీ: ప్రతి నెల 1వ, 3వ మంగళవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు క్యాపిటల్ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది చూస్తారు. ► అంకాలజీ: 1వ, 3వ బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు శ్రీగాయత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తారు. ► అంకాలజీ: 2వ, 4వ బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వారు చూస్తారు. ► కార్డియాలజీ: 1వ, 3వ గురువారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు క్యాపిటల్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందిస్తారు. ► కార్డియాలజీ: 2వ, 4వ గురువారం మధ్యాహ్నం 12–2 గంటల వరకు వంశీ హార్ట్ కేర్ సెంటర్ వైద్య సేవలు అందిస్తారు. ► దీంతోపాటు ప్రతి గురువారం ఒక రేడియాలజిస్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు అల్ట్రా సౌండ్ స్కాన్ నిర్వహించేందుకు అందుబాటులో ఉంటారు. -
పదో తరగతి విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ ఆదేశాలిచ్చింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వారి గ్రామం నుంచి పరీక్ష కేంద్రం వరకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలని రాష్ట్రంలోని ఆయా జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు, జిల్లాల పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్లకు ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) ఆదేశాలిచ్చారు. పరీక్ష అయిపోయాక ఇంటికి చేరుకునేందుకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని అందులో సూచించారు. హాల్ టికెట్ ఆధారంగా బస్సుల్లో ఉచితంగా పరీక్ష కేంద్రాల వరకు రాకపోకలు సాగించొచ్చు. ఈ అవకాశం పదో తరగతి పరీక్షలు జరిగే ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో 3,780 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 6,22,746 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పది పరీక్షలపై మంత్రి బొత్స సమీక్ష విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక గురువారం తొలిసారి సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలన్నింటినీ సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర చర్యలపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నతాధికారులతో కలసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, వైద్య సదుపాయం, ఫర్నిచర్ ఏర్పాట్లు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్, ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి.దేవానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కరోనా వల్ల ఆర్టీసీకి రూ.5,680 కోట్ల నష్టం
రాజమహేంద్రవరం సిటీ: కరోనా వేవ్‌ల వల్ల ఆర్టీసీ రూ.5,680 కోట్ల మేర నష్టపోయిందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి చెప్పారు. డీజిల్ ధరల పెరుగుదలతో మరింత భారం పడిందని తెలిపారు. అయినా కూడా ప్రజల ప్రయోజనాలను కాపాడుతూ ఆర్టీసీని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. కరోనా వల్ల ఆర్టీసీకి రూ.5,680 కోట్ల నష్టం వాటిల్లిందని.. డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో రోజుకు రూ.320 కోట్ల మేర నష్టపోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీని అప్పుల బారి నుంచి బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తే.. ప్రతిపక్షాలు తమ ఉనికి కోసం రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు మల్లికార్డునరెడ్డి ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో ఈడీ చింతా రవికుమార్, కోనసీమ డీపీటీవో ఆర్వీఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సౌర వెలుగులు.!
మదనపల్లె సిటీ: రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం సౌరవిద్యుత్‌పై దృష్టి సారించింది. ప్రధానంగా ప్రభుత్వ సంస్థల్లో సౌర విద్యుత్‌ను వినియోగించేలా అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో మదనపల్లె ఆర్టీసీ –1, 2 డిపోలు, గ్యారేజీలు, బస్‌స్టేషన్, జెడ్పీహైస్కూల్ ప్రాంగణాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. వీటిద్వారా వస్తున్న విద్యుత్‌ను ఆ సంస్థలు సమర్థవంతంగా వినియోగించుకుంటూ నెలనెలా వస్తున్న కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం పొందాయి. మదనపల్లెలో సౌర వెలుగులపై ప్రత్యేక కథనం. మదనపల్లె ఆర్టీసీ డిపోలు.. తన ఆస్తులను మరింత సమర్థవంతంగా సద్వి నియోగం చేసుకునే వ్యూహంలో భాగంగాఆర్టీసీ సౌర విద్యుత్ బాట పట్టింది. బస్ స్టేషన్, డిపోలు, గ్యారేజీ భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పారు. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో నాలుగు డిపోలను ఎంపిక చేశారు. అందులో భాగంగా 2018లో మదనపల్లె ఆర్టీసీ డిపోలో సోలార్ ప్లాంటును ఏర్పాటు చేశారు. 100 కిలో వాట్ల సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేశారు. ఇందు కోసం రూ.37 లక్షల వరకు వెచ్చించారు. ప్లాంటు ద్వారా నెలకు 10 వేల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. సుమిత్ సంస్థ టెండర్ ద్వారా ఆర్టీసీకి 25 ఏళ్లపాటు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తోంది. వీటి ద్వారా బస్‌స్టేషన్, రెండు డిపో కార్యాలయాలు, గ్యారేజీలో సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. 1, 2 డిపో కార్యాలయాలపై 326 పలకలను ఏర్పా టు చేశారు. గతంలో విద్యుత్ బిల్లు నెలకు రూ.1.50 లక్ష వరకు వచ్చేది. సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసిన తరువాత నెలకు సరాసరి రూ.40–50 వేలు బిల్లు వస్తోంది. సగటున నెలకు రూ.లక్ష వరకు ఆదా అవుతోంది. గత 5 సంత్సరాలుగా సోలార్ ప్లాంటు విజయవంతంగా నడుస్తోంది. ఇతర డిపోల్లో ఏర్పాటుకు సన్నాహాలు మదనపల్లె ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంటు సక్సెస్ కావడంతో రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. త్వరలో అన్ని డిపోల్లో ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టారు. పూర్వ విద్యార్థి సహకారం.. జెడ్పీ పాఠశాలకు వరం పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన రవిసుబ్రమణ్యం ఖతర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన చిన్నప్పుడు మదనపల్లెలో చదువుకున్నాడు. ఆయనకు విద్యబోధించిన ఉపాధ్యాయుడు ఫణీంద్ర ప్రస్తుతం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. గత ఏడాది మదనపల్లెకు వచ్చినప్పుడు తన గురువును కలిసి సన్మానం చేయాలనుకున్నాడు. దీనికి ఉపాధ్యాయుడు నిరాకరించి పాఠశాలలో సోలార్ ప్లాంటు ఏర్పాటు చేయాలని కోరాడు. ఆయన అభ్యర్థన మేరకు రూ.4.50 లక్షల వ్యయంతో సోలార్ ప్లాంట్‌ను గత ఏడాది మార్చి నెలలో ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ 60 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా 50 సోలార్ పలకలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా సరఫరా అయ్యే విద్యుత్‌ను పాఠశాలలోని 55 గదుల్లో ఫ్యాన్లు, లైట్లకు వినియోగించేలా వైరింగ్ చేశారు. పాఠశాల ఆవరణంలో తాగునీటి కోసం బోరు కూడా వినియోగిస్తున్నారు. గతంలో నెలకు రూ. 15 వేలు నుంచి 18 వేలు వరకు వచ్చే బిల్లు ప్రస్తుతం రూ.2 వేలు లోపే వస్తోంది. పాఠశాలలోని తరగతి గదులు, ల్యాబ్‌లు, గ్రంథాలయం, కార్యాలయంతో పాటు అవసరం ఉన్నచోట్ల సౌర విద్యుత్‌నే వినియోగిస్తున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సాహం సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రణాళికల్లో భాగంగా మదనపల్లె డిపోలోని బస్‌స్టేషన్‌పై సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేశారు. దీని వల్ల ఆర్టీసీకి నెలకు రూ. లక్ష వరకు ఆదా అవుతోంది. –వెంకటరమణారెడ్డి, వన్ డిపో మేనేజర్.మదనపల్లె దాతలు ముందుకు రావాలి మా పాఠశాలలో 2,138 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఖతర్‌లో పని చేసే రవిసుబ్రమణ్యం సోలార్‌ప్లాంటు ఏర్పాటు చేయడం అభినందనీయం. దాతలు ముందుకు వస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. –రెడ్డె్డన్నశెట్టి, హెచ్ఎం, జెడ్పీ ఉన్నత పాఠశాల, మదనపల్లె -
ఆర్టీసీ బస్సు ప్రయాణం మరింత సుఖవంతం
సాక్షి, అమరావతి: ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖవంతం.. సురక్షితం’ అనే నినాదాన్ని మరింత నిజం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) కార్యాచరణకు సిద్ధమవుతోంది. ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దశాబ్దంగా పాతబడిన బస్సులతోనే నెట్టుకొస్తున్న దుస్థితికి ఇక ముగింపు పలకనుంది. ఆర్టీసీలో ప్రస్తుతం 11,271 బస్సులు ఉన్నాయి. వాటిలో దాదాపు 3,800 బస్సులు బాగా పాతబడ్డాయని గుర్తించారు. ఏసీ బస్సులు 10 లక్షల కి.మీ., ఎక్స్‌ప్రెస్ బస్సులు 8 లక్షల కి.మీ., పల్లె వెలుగు బస్సులు 12 లక్షల కి.మీ. సర్వీసును పూర్తి చేశాయి. గత టీడీపీ ప్రభుత్వం వివిధ కారణాలతో కొత్త బస్సులను ప్రవేశపెట్టలేదు. దీంతో పలుచోట్ల ఆర్టీసీ బస్సులు బ్రేక్‌డౌన్ కావడం, ఇతరత్రా సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి ముగింపు పలుకుతూ కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. అందుకోసం మూడంచెల విధానానికి ఆమోదం తెలిపింది. కొత్తగా అద్దె బస్సులను ప్రవేశపెట్టడం.. ప్రస్తుతం ఉన్న బస్సులను ఫేస్‌లిఫ్ట్ ప్రక్రియ ద్వారా ఆధునికీకరించడం.. పర్యావరణహితంగా దాదాపు 2 వేల డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మలచడం దిశగా కార్యాచరణను వేగవంతం చేసింది. జూలై చివరికి రోడ్డెక్కనున్న కొత్త బస్సులు త్వరలో కొత్తగా 998 బస్సులను అద్దె విధానంలో ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. దీనికోసం ఈ నెలాఖరులో టెండర్ల ప్రక్రియ చేపట్టి.. వచ్చే నెల రెండోవారం నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. జూలై చివరికి కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. దీంతో జిల్లా కేంద్రాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు సర్వీసులు తిప్పడానికి కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయి. ఇక 1,150 బస్సులను ఫేస్‌లిఫ్ట్ ప్రక్రియ ద్వారా ఆధునికీకరిస్తున్నారు. కొత్త సీట్లు వేయడం, టైర్లు మార్చడం, ఇతర సాంకేతిక సమస్యలను పరిష్కరించడం ద్వారా నూతన రూపు తెస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ గ్యారేజీలలో వెయ్యి బస్సులకు ఫేస్‌లిఫ్ట్ ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో ప్రయాణికులకు ఆ బస్సులు సౌకర్యవంతంగా మారాయి. 150 ఇ–బస్సులకు టెండర్ల ప్రక్రియ పూర్తి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఆర్టీసీ దశలవారీగా ఇ–బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో నడపడానికి 150 ఇ–బస్సుల కోసం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇ–బస్సులను ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఆర్టీసీలో ఉన్న దాదాపు 2 వేల డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మార్చేందుకు రెట్రోఫిట్మెంట్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఒక డీజిల్ బస్సును రెట్రోఫిట్ చేసి ఇ–బస్సుగా మార్చారు. త్వరలో ఆ బస్సును పుణెలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ (సీఐఆర్టీ) పరిశీలనకు పంపించనున్నారు. సీఐఆర్టీ ఆమోదించాక ఆ ప్రమాణాల మేరకు దాదాపు 2 వేల డీజిల్ బస్సులను దశలవారీగా ఇ–బస్సులుగా మారుస్తారు. ప్రయాణికులకు సుఖమయ ప్రయాణమే లక్ష్యం ప్రయాణికులకు సుఖమయ ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. దీర్ఘకాలంగా ఉన్న పాత బస్సుల సమస్య త్వరలో పరిష్కారం కానుంది. కొత్తగా అద్దె బస్సులను ప్రవేశపెడతాం. అలాగే దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా పర్యావరణ పరిరక్షణ కోసం ఇ–బస్సులు ప్రవేశపెట్టేందుకు ప్రణాళికను వేగవంతం చేస్తున్నాం. – సీహెచ్ ద్వారకా తిరుమలరావు, ఎండీ, ఆర్టీసీ -
అనివార్యమయ్యే ఆర్టీసీ టికెట్లపై డీజిల్ సెస్
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇంధన సంస్థలు డీజిల్ ధరలను అమాంతం పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ టికెట్లపై డీజిల్ సెస్ విధించాల్సి వస్తోందని ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. 2019లో లీటర్ డీజిల్ రూ.67 ఉండగా ప్రస్తు తం రూ.107కు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. బుధవారం విజయవాడలోని బస్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. అనివార్య పరిస్థితుల్లో పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఒక్కో టికెట్‌పై డీజిల్ సెస్ నిమిత్తం రూ.2 చొప్పున, ఎక్స్‌ప్రెస్, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ సర్వీసుల్లో రూ.5 చొప్పున, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో రూ.10 చొప్పున డీజిల్ సెస్ వసూలు చేయనున్నట్లు తెలి పారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస టికెట్ ధర రూ.10గా ఉంటుందన్నారు. పెరిగిన డీజిల్ సెస్ చార్జీలు గురువారం నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించారు. అమాంతం పెరిగిన డీజిల్ ధరలతో ఆర్టీసీపై ఏటా రూ.1,100 కోట్లు అదనంగా ఆర్థికభారం పడుతోందని చెప్పారు. డీజిల్ సెస్ ద్వారా ఏడాదికి రూ.720 కోట్లు సమకూరినప్పటికీ అదనంగా దాదాపు రూ.400 కోట్ల భారాన్ని ఆర్టీసీ భరించాల్సి వస్తోందని వివరించారు. డీజిల్ ధరలు తగ్గితే సెస్ తొలగించే విషయాన్ని పరిశీలిస్తామన్నా రు. తెలంగాణలో కూడా డీజిల్ సెస్ విధించిన విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్ పరిస్థితుల్లో గత రెండేళ్లలో ఆర్టీసీ దాదాపు రూ.5,680 కోట్ల రాబడి కోల్పోయిందని తెలిపారు. అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకునే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఖాళీ స్థలాలను వాణిజ్య ప్రయోజనాల కోసం బీవోటీ ప్రాతిపదికన కేటాయించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. టెండర్లను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. కార్గో సేవల ద్వారా అదనపు ఆదాయాన్ని సాధించడానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి.. డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో అనివార్యం గా సెస్ విధించాల్సి రావటాన్ని ప్రజలు సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల కోవిడ్ గడ్డు పరిస్థితుల్లో కూడా ఉద్యోగులకు జీతాలు చెల్లించగలిగామన్నారు. ప్రభుత్వం ప్రతి నెల రూ.300 కోట్ల వరకు జీతాల భారాన్ని భరిస్తోందని తెలిపారు. -
ఆర్టీసీ బస్ రూటు ఎటు?
సాక్షిప్రతినిధి, అమలాపురం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అతి పెద్ద ఆర్టీసీ రీజియన్ రాజమహేంద్రవరం. జిల్లాల పునర్విభజన తరువాత ఈ జిల్లా మూడు జిల్లాలవ్వడంతో రాజమహేంద్రవరం రీజియన్ విభజనపై ఉద్యోగ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు రీజియన్ కూడా మూడు రీజియన్లు అవుతుందా ? లేకుంటే డిపోల వారీగా విభజన జరుగుతుందా? అనేది ఆర్టీసీలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఆర్టీసీ రీజియన్ పనిచేస్తోంది. రీజినల్ మేనేజర్ రాజమహేంద్రవరంలోనే ఉంటున్నారు. జిల్లాల విభజనకు ముందున్న రీజియన్ పరిధిలో తొమ్మిది డిపోలు ఉన్నాయి. విభజన అనంతరం రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడ్డ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి పశ్చిమగోదావరి జిల్లా నుంచి మూడు నియోజకవర్గాలు చేరాయి. కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో కొవ్వూరు, నిడదవోలులో డిపోలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండు డిపోలు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోకి రావడంతో డిపోల సంఖ్య 11కు చేరింది. విజయవాడకు నివేదిక రీజియన్ స్థాయిలో 11 డిపోల విభజనపై కసరత్తు మొదలైంది. జిల్లాల పునర్విభజన తరువాత కోనసీమ జిల్లా పరిధిలోకి నాలుగు ఆర్టీసీ డిపోలు (అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రాపురం) వస్తాయంటున్నారు. కాకినాడ జిల్లా పరిధిలోకి మూడు డిపోలు (కాకినాడ, తుని, ఏలేశ్వరం)తీసుకురానున్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడ్డ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి (రాజమహేంద్రవరం, గోకవరం, కొవ్వూరు, నిడదవోలు) డిపోలు రానున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలో ప్రాథమికంగా జరిపిన విభజనలో తూర్పుగోదావరి జిల్లాలో మిగిలిన జిల్లాల్లో కంటే ఒక డిపో అదనంగా వచ్చేలా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని రాజమహేంద్రవరం రీజియన్‌కు రోజూ కోటి రూపాయల పైనే ఆదాయం వస్తోంది. ఇందులో అత్యధికంగా కాకినాడ డిపో పరిధిలో తిరిగే 171 బస్సుల ద్వారా వస్తోంది. ఈ బస్సులు 75,722 కిలోమీటర్లు తిరిగి రూ.26 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఉద్యోగుల ఎదురుచూపులు ఆదాయంలో మూడో స్థానం రాజమహేంద్రవరం డిపోలో కనిపిస్తోంది. ఈ డిపో పరిధిలో 141 బస్సులు 54,828 కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఫలితంగా రూ.17 లక్షల ఆదాయం వస్తోంది. ఆదాయం, బస్సులు, ఉద్యోగుల సంఖ్య ఆధారంగా ఆర్టీసీలో విభజన జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. జిల్లాల వారీగా విభజించి ఈ మేరకు వివరాలను విజయవాడ బస్సు భవన్‌కు ఇప్పటికే పంపారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో అధికారికంగా విభజన ప్రకటన ఎప్పుడు వెలువడుతుందా? అని 3501 మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. సహజంగా ఆర్టీసీలో ఏళ్ల తరబడి ఒకే డిపో పరిధిలో పనిచేస్తున్న వారే అధికం. అదీ కూడా తమ సొంత ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న వారే ఎక్కువ. ఈ పరిస్థితుల్లో జిల్లాల పునర్విభజన తరువాత ఏ డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులను అక్కడే కొనసాగిస్తారా?, లేక అటూ, ఇటూ మార్చుతారా? అనేది ఎప్పటికి తేలుస్తారోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. డిపో మేనేజర్లను ఎప్పటి మాదిరిగానే కొనసాగే అవకాశ ముంది. రీజియన్ వ్యవస్థ కాకుండా మూడు జిల్లాలకు ముగ్గురు జిల్లా మేనేజర్లను నియమిస్తారని భావిస్తున్నారు. డిపోల విభజన సహా అన్ని అంశాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాలు రావాల్సి ఉంది డిపోల విభజన, ఉద్యోగుల సర్దుబాటు వంటి అంశాలపై ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. డిపోల స్థాయిలో కసరత్తు పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదించాం. ఉద్యోగుల విభజన పెద్దగా ఉండదనే అంటున్నారు. ఏ డిపో పరిధిలో వారు ఆ డిపోలోనే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. – నాగేశ్వరరావు, ఆర్ఎం, రాజమహేంద్రవరం -
ఇక ఆర్టీసీ బస్సుల్లోనే కార్గో బుకింగ్
సాక్షి, అమరావతి: ఇకనుంచి ఆర్టీసీ బస్సుల్లోనే కొరియర్, కార్గో బుకింగ్‌కు అవకాశం కల్పించాలని సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కొరియర్, కార్గో బుకింగ్ చేయాలంటే ఆర్టీసీ బస్ స్టేషన్లు, ఇతర ప్రాంతాల్లో ఉన్న గుర్తింపు పొందిన ఏజెంట్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా నిర్ణీత ఆర్టీసీ బస్సు వద్దకే వెళ్లి కొరియర్, కార్గో బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 94 ఆర్టీసీ బస్ స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లతోపాటు 422 మంది ఏజెంట్ల ద్వారా కొరియర్, కార్గో బుకింగ్ సేవలు అందిస్తున్నది. రోజుకు సగటున 20,500 బుకింగ్‌ల ద్వారా రూ.40లక్షల రాబడి ఆర్జిస్తోంది. కాగా 2022–23లో రోజుకు సగటున 40వేల బుకింగ్‌లతో రూ.68లక్షలు రాబడి సాధించాలని ఆర్టీసీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.250కోట్లు రాబడి సాధించాలన్నది ఆర్టీసీ ప్రణాళిక. రాష్ట్రంలో 672 మండలాల్లోని 14,123 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సేవలు అందిస్తోంది. ఇకనుంచి ఖాతాదారులు సంబంధిత బస్సు వద్దకు వెళ్లి నేరుగా కండక్టర్ వద్దే పార్సిల్ బుకింగ్ చేసుకునే సౌలభ్యం కలిగించనుంది. బుకింగ్ చేసుకున్న తరువాత సత్వరమే పార్సిళ్లు గమ్యస్థానాలకు చేరుతాయి. ఇందుకోసం టిమ్ మెషిన్ల ద్వారా కొరియర్ బుకింగ్ చేయడం, రశీదు ఇవ్వడం, ఇతర అంశాలపై కండక్టర్లకు అవగాహన కల్పిస్తున్నారు. కొరియర్ బుకింగ్ మొత్తాన్ని టికెట్ కలెక్షన్ల మొత్తంగా చూపించే వే బిల్లుతో కాకుండా.. విడిగా నమోదు చేస్తారు. కొరియర్ బుకింగ్‌లు బాగా చేసే కండక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలో మొదటగా గుంటూరు జిల్లా ఆర్టీసీ బస్సుల్లోనే కార్గో సేవల బుకింగ్ సదుపాయాన్ని ప్రారంభిస్తామని, అనంతరం నెలరోజుల్లోనే దశలవారీగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నామని ఆర్టీసీ ఎండీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు ‘సాక్షి’కి తెలిపారు. -
త్వరలో ఆర్టీసీ సర్వీసింగ్ సెంటర్లు
సాక్షి, అమరావతి: ఆదాయ మార్గాలు పెంచుకునే దిశగా ఆర్టీసీ సన్నాహాలు ముమ్మరం చేసింది. ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి ఉన్న విలువైన భూములను వాణిజ్య అవసరాలకోసం సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిసారించింది. ఆర్థిక శాఖ సూచనలతో ఈ దిశగా కార్యాచరణ ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఆర్టీసీ గ్యారేజీలు, డిపోలను ప్రైవేట్ వాహనాల సర్వీసింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఆర్టీసీకి ప్రస్తుతం రాష్ట్రంలో విలువైన ప్రదేశాల్లో గ్యారేజీలు, డిపోలు ఉన్నాయి. ఒక్కో గ్యారేజీ పది ఎకరాల్లోను, డిపోలు ఆరేడు ఎకరాల్లోను విస్తరించి ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల సర్వీసింగ్ చేస్తున్నారు. అదే గ్యారేజీలు, డిపోల్లో ప్రైవేటు వాహనాలకు కూడా సర్వీసింగ్ సేవలు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఆర్టీసీ విజయనగరం, ఏలూరు, కర్నూలుల్లో టైర్ సర్వీసింగ్ సెంటర్లను నిర్వహిస్తోంది. అదే రీతిలో రాష్ట్రంలోని ఆర్టీసీ గ్యారేజీలు, డిపోలలో పూర్తిస్థాయిలో ఆటోమొబైల్ సర్వీసింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ చేపట్టేందుకు అధికారుల కమిటీని నియమించింది. తక్కువ చార్జీతో మెరుగైన సేవలు ప్రైవేటు సర్వీసింగ్ సెంటర్ల కంటే మెరుగైన రీతిలో తక్కువ ధరకు వాహనాల సర్వీసింగ్ సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. సాధారణ సర్వీసింగ్, అన్ని రకాల రిపేర్లు, బాడీ పెయింటింగ్, వాటర్ సర్వీసింగ్ మొదలైన సేవలు అందిస్తారు. ఆర్టీసీ టెక్నికల్ స్టాఫ్ స్కిల్డ్ సేవలు అందిస్తారు. అన్‌స్కిల్డ్ సేవల కోసం అవుట్ సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమిస్తారు. ప్రస్తుతం గ్యారేజీల్లో ఉన్న మౌలిక వసతులతోపాటు అవసరమైన యంత్ర పరికరాలు కొనుగోలు చేస్తారు. ఆర్టీసీ వాహనాలు, ప్రైవేటు వాహనాలకు వేర్వేరుగా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేస్తారు. ఆర్టీసీ వాహనాల స్పేర్ పార్టులు, ప్రైవేటు వాహనాల స్పేర్ పార్టులకు వేర్వేరుగా స్టోర్ రూమ్‌లు, రికార్డులు నిర్వహిస్తారు. తద్వారా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూస్తారు. తొలిదశలో భారీ వాహనాలకు సర్వీసింగ్ సేవలను అందుబాటులోకి తెస్తారు. అనంతరం కార్లు, ఎస్‌యూవీలు, ఇతర వాహనాల సర్వీసింగ్ అందిస్తారు. తొలిదశలో నాలుగైదు కేంద్రాల్లో రెండు నెలల్లో సర్వీసింగ్ సేవలను ప్రారంభించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అనంతరం అన్ని ఆర్టీసీ డిపోలు, గ్యారేజీల్లో ప్రైవేటు వాహనాల సర్వీసింగ్ సేవలను విస్తరించనున్నారు. ప్రైవేటు సర్వీసింగ్ కేంద్రాల కంటే మెరుగైన రీతిలో తక్కువ చార్జీలకు ఆర్టీసీ ఆటోమొబైల్ సర్వీసింగ్ సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆర్టీసీ ఈడీ కృష్ణమోహన్ చెప్పారు. -
డిజిటల్ చెల్లింపులకు ఆర్టీసీ రైట్ రైట్
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ డిజిటల్ బాట పడుతోంది. బస్సుల్లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికుల నుంచి సదరు మొత్తాన్ని నగదు రూపంలోనే వసూలు చేస్తున్నారు. ఇకపై డిజిటల్ చెల్లింపులను కూడా స్వీకరించేందుకు ఆర్టీసీ మార్గం సుగమం చేస్తోంది. దీనికోసం ‘యూనిఫైడ్ టికెటింగ్ సిస్టం (యూటీఎస్)’ను ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించి నిర్వహించిన టెండర్‌ను అభి బస్ సంస్థ దక్కించుకుంది. యూటీఎస్ కోసం ఆర్టీసీ నిర్వహించిన టెండర్లలో 8 కంపెనీలు బిడ్లు దాఖలు చేయగా.. మూడు కంపెనీలు అర్హత సాధించాయి. రివర్స్ టెండరింగ్‌లో అభి బస్ సంస్థను ఆర్టీసీ ఎంపిక చేసింది. దేశంలోనే అతి తక్కువ రేటుకు కాంట్రాక్ట్‌ను ఖరారు చేసింది. యూటీఎస్ విధానమిలా.. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల జారీ కోసం వినియోగిస్తున్న టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ (టిమ్స్) స్థానంలో ఇ–పాస్ మెషిన్లను ప్రవేశపెడతారు. వాటిద్వారా డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తారు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా కూడా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో ముందుగా టికెట్ల బుకింగ్‌లు, బస్‌పాస్‌లు, కొరియర్ సేవలు, పార్సిల్ బుకింగ్‌లకూ అవకాశం కల్పిస్తారు. బస్ లైవ్ ట్రాకింగ్ తెలుసుకునే అవకాశంతోపాటు ప్రయాణికుల సమాచారం, సెంట్రల్ కమాండ్ స్టేషన్ నిర్వహణ మొదలైనవి అందుబాటులోకి వస్తాయి. ఈ విధంగా అన్ని సేవలను ఏకీకృతం చేసి ఒకే వేదిక మీదకు తీసుకువస్తూ యూటీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. వచ్చే రెండు నెలల్లో దీనిని ప్రయోగాత్మకంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమలు చేస్తారు. ఆరేడు నెలల్లో రాష్ట్రమంతటా యూటీఎస్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. -
మరోసారి ఆర్టీసీలో ‘కారుణ్యం’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆర్టీసీలో 1,852 కారుణ్య నియామకాలను చేపట్టేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) వెల్లడించారు. బుధవారం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వంలో విలీనం అనంతరం ఆర్టీసీలో అద్భుతమైన మార్పులు వచ్చాయని చెప్పారు. 2015కు ముందు సర్వీసులో ఉంటూ మరణించిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబాలలో 385 మందికి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కారుణ్య నియామకాలు కింద ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. వీరితోపాటు 2016 నుంచి మరణించిన ఉద్యోగుల కుటుంబాలలో మరో 896 మందికి, 2020 నుంచి మరణించిన వారిలో 956 మందికి మొత్తం 1,852 మందిని కారుణ్య నియామకాల కింద ఆర్టీసీతో పాటు, గ్రామ, వార్డు సచివాలయాల్లో, జిల్లా కలెక్టరేట్ పరిధిలోని 40 శాఖల్లో భర్తీ చేయనున్నామని, ఈ మేరకు కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. బయట డీజిల్ కొనుగోలుతో రూ.65 కోట్లు ఆదా కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీల ద్వారా బల్క్ విధానంలో ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్ ధరలకు, బయట రేట్లలో చాలా వ్యత్యాసం ఉందని మంత్రి నాని తెలిపారు. బల్క్‌లో కొనుగోలు కంటే బయటే డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. దీంతో సంస్థపై ఆర్థిక భారం పడకుండా ఆర్టీసీకి అవసరమైన డీజిల్‌ను బయట బంకుల్లో కొనుగోలు చేస్తున్నామన్నారు. బయట కొనడంతో ప్రస్తుతం పెరిగిన ధరలతో నెలకు సరాసరి రూ.33.83 కోట్లు ఆదా అవుతోందన్నారు. ఇప్పటిదాకా రూ.65 కోట్లు వరకు ఆదా అయిందన్నారు. బల్క్‌లో డీజిల్ ధర తగ్గినపుడు తిరిగి అక్కడే కొనుగోలు చేస్తామన్నారు. సంస్థ అవసరాలకు నెలకు సుమారు 8 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోందన్నారు. 1 నుంచి సీనియర్ సిటిజన్లకు రాయితీ కోవిడ్ కారణంగా నిలిపివేసిన సీనియర్ సిటిజన్ల రాయితీ టికెట్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నామని మంత్రి నాని వెల్లడించారు. 60 ఏళ్లు పైబడిన వారు గుర్తింపు కార్డులు చూపి టికెట్‌పై 25 శాతం రాయితీ పొందవచ్చని సూచించారు. దీనివల్ల సుమారు రెండు లక్షల మంది ప్రయోజనం పొందుతారన్నారు. ఆర్టీసీలో ఏసీ ఎలక్ట్రిక్ బస్సులకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. ఏప్రిల్ 30న మొదటి బస్సును తిరుపతిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. తిరుపతి నుంచి తిరుమల, మదనపల్లె, కర్నూలు తదితర మార్గాల్లో మొత్తం 50 ఎలక్ట్రిక్ ఇంద్ర ఏసీ బస్సులను నడపనున్నట్లు చెప్పారు. విలీనంతో రూ.3,600 కోట్ల భారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో జీతభత్యాల కింద ప్రభుత్వంపై ఏటా రూ.3,600 కోట్ల భారం పడుతున్నా అప్పుల్లో ఉన్న సంస్థను బతికించాలనే లక్ష్యంతో సీఎం జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని మంత్రి నాని చెప్పారు. 2020–21లో ఆర్టీసీకి రూ.2,691 కోట్ల రాబడి రాగా ఖర్చు రూ.2,049 కోట్లుగా ఉందన్నారు. కోవిడ్ లేకుంటే సంస్థకు రూ.2,800 కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగుల పీఎఫ్, ఎస్బీటీ, సీసీఎస్ తదితరాల నుంచి వినియోగించుకున్న రూ.705 కోట్లను ప్రభుత్వం తిరిగి ఆయా ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి తెలిపారు. -
1800కు పైగా ఆర్టీసీ కుటుంబాల వారికి ఉద్యోగాలు: పేర్నినాని
-
ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలు: పేర్ని నాని
APSRTC Compassionate Appointment, సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో కొత్తగా కారుణ్య నియామకాలు చేస్తున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. మొత్తం 1800 పైచిలుకు ఉద్యోగుల కుటుంబాల వారికి కారుణ్య నియామకాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయన ఏపీ అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. సంబంధిత జిల్లాలోనే ఉద్యోగం ఇస్తామని, కలెక్టర్లకు ఆదేశాలిచ్చి లిస్టులు పంపామని వెల్లడించారు. గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని చెప్పారు. కేంద్రం ఇచ్చే ఆయిల్ ధర కంటే బయట బంకుల్లో నాలుగు రూపాయలు తక్కువే వస్తుందని తెలిపారు. రోజుకు కోటిన్నర రూపాయల భారం ఆర్టీసీపై తగ్గుతుందని తెలిపారు. ఆర్టీసీకి నష్టాలు రాకూడదని తాము ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటివరకు 33.83 కోట్ల రూపాయలు సేవ్ చేయగలిగామని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. త్వరలోనే 40 బస్సులు అందుబాటులోకి వస్తాయని, మిగతావి మరికొన్ని వారాల్లోనే అందుతాయని చెప్పారు. తిరుమల-తిరుపతికి యాభై బస్సులు నడుపుతామని, 60 సంవత్సరాల పైబడిన ప్రయాణికులకు రాయితీలు ఏప్రిల్ నాలుగు నుంచి అమలు చేస్తామని చెప్పారు. గతంలో కరోనా వలన వాటిని నిలిపేశామని, తాజాగా ఇప్పుడు మళ్లీ పునరుద్దరిస్తున్నామని తెలిపారు.ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకోవటం వల్ల మూడు వేల కోట్ల పైబడి భారం పడుతోందని గుర్తు చేశారు. అయినాసరే ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాని మంత్రి పేర్ని నాని తెలిపారు. -
వృద్ధులకు రాయితీ ఎందుకు ఇవ్వట్లేదో చెప్పండి
సాక్షి, అమరావతి: రైళ్లు, ఆర్టీసీ బస్సు చార్జీల్లో వృద్ధులకు ఇచ్చిన రాయితీని కోవిడ్ తగ్గిన తరువాత ఎందుకు పునరుద్ధరించడం లేదో తెలపాలని రైల్వే బోర్డు, ఏపీఎస్ ఆర్టీసీని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలంది. తదుపరి విచారణను మార్చి 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
శైవక్షేత్రాలకు 3,325 బస్సులు
నరసరావుపేట: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు వెళ్లే భక్తుల వద్ద నుంచి ఆర్టీసీ పాత టికెట్ ధరలే వసూలు చేస్తుందని, ధరల్లో ఎలాంటి మార్పులూ చేయడం లేదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు చెప్పారు. రెండేళ్లుగా డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగినా.. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ వద్ద జరిగే తిరునాళ్లకు ఆర్టీసీ సంస్థ చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం ఆయన నరసరావుపేటకు వచ్చారు. ఈ సందర్భంగా గ్యారేజ్ ఆవరణలో సిబ్బందికి గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మార్చి ఒకటో తేదీన మహాశివరాత్రికి సంస్థ సంసిద్ధమైందన్నారు. కోటప్పకొండ, కర్నూలు జిల్లాలోని శ్రీశైలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 96 చిన్నా, పెద్ద శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా శివరాత్రి ముందురోజు, శివరాత్రి రోజున 21 లక్షల మంది కోసం 3,325 బస్సులను సిద్ధం చేసినట్టు తెలిపారు. వాటిలో 410 బస్సులు కోటప్పకొండకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నరసరావుపేట నుంచి 285, మిగతా ప్రాంతాల నుంచి 55, ఘాట్‌రోడ్డులో 70 బస్సులు నడుస్తాయని చెప్పారు. -
డీజిల్ బస్సులకు టాటా.. ఇ–బస్సులకు స్వాగతం
సాక్షి, అమరావతి: డీజిల్ బస్సులకు టాటా చెబుతూ.. ఇ–బస్సులను స్వాగతించేందుకు రాష్ట్ర ప్రజా రవాణా విభాగం(ఆర్టీసీ) ముందడుగు వేస్తోంది. పర్యావరణ పరిరక్షణ, నిర్వహణ వ్యయం తగ్గింపునకు డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు (ఇ–బస్సులు)ను ప్రవేశపెట్టేందుకు సిద్ధపడుతోంది. ఇప్పటికే తిరుమల–తిరుపతి మధ్య 150 ఇ–బస్సులను ప్రవేశపెట్టేందుకు టెండర్లు ఖరారు చేసింది. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ ఇ–బస్సులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆ ర్టీసీ డీజిల్ బస్సుల స్థానంలో కొత్త ఇ–బస్సులను ప్రవేశపెట్టడం భారీ వ్యయంతో కూడినది కావడంతో.. పాత డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మార్పు చేసేందుకు సిద్ధపడుతోంది. ఇందుకోసం రెట్రోఫిట్మెంట్ (పునర్నిర్మాణ) ప్రాజెక్టును చేపట్టనుంది. ప్రాజెక్టు ఇలా.. డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మార్చేందుకు ఆర్టీసీ రెట్రోఫిట్మెంట్ ప్రాజెక్టుపై కసరత్తును ఆర్టీసీ ముమ్మరం చేసింది. పైలట్ ప్రాజెక్ట్‌గా ఒక డీజిల్ బస్సును ఇటీవల రెట్రోఫిట్ చేసి ఇ–బస్సుగా మార్చింది. డీజిల్ ఇంజన్ చాసిస్ ఉన్న బస్సులో బ్యాటరీతో పనిచేసే ఇంజన్‌ను ఏర్పాటు చేశారు. చాసిస్‌ను అలానే ఉంచి ఇ–బస్సుకు అనుగుణంగా రీ బాడీ బిల్డింగ్ చేశారు. దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం పుణేలోని ‘సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ (సీఐఆర్టీ)’కి పంపిస్తారు. ఆ బస్సును అక్కడి నిపుణులు పరీక్షించి అన్ని ప్రమాణాల మేరకు ఉన్నాయని భావిస్తే సర్టిఫికెట్ జారీ చేస్తారు. అనంతరం ఆర్టీసీ డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మారుస్తారు. దశలవారీగా ఇ–బస్సులుగా మార్పు ప్రస్తుతం ఆర్టీసీ వద్ద మరో పదేళ్ల జీవిత కాలం ఉన్న 2 వేల డీజిల్ బస్సులు ఉన్నాయి. వాటిని ముందుగానే దశల వారీగా ఇ–బస్సులుగా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకోసం నీతి ఆయోగ్, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మార్గనిర్దేశాల ప్రకారం కసరత్తు చేస్తోంది. కొత్తగా కొనుగోలు చేసే ఇ– బస్సులకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. 12 మీటర్ల బస్సులకు రూ.55 లక్షలు, 9 మీటర్ల బస్సులకు రూ.45 లక్షల చొప్పున రాయితీ ఇస్తోంది. డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మార్చి నప్పుడు అదే రీతిలో రాయితీ ఇవ్వాలని ఆర్టీసీ కేంద్రాన్ని కోరనుంది. పుణేలోని సీఐఆర్టీ నుంచి సర్టిఫికేషన్ వచ్చిన తరువాత ఈ దిశగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుల తరహాలో ఈ రెట్రోఫిట్మెంట్ ప్రాజెక్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. అందుకోసం టెండర్లు పిలిచి బిడ్డర్లను ఎంపిక చేస్తుంది. డీజిల్ బస్సులను దశలవారీగా ఇ–బస్సులుగా మార్చే దిశగా రెట్రోఫిట్మెంట్ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తున్నామని ఆర్టీసీ ఈడీ (ఇంజినీరింగ్) కృష్ణమోహన్ ‘సాక్షి’కి తెలిపారు. దీనివల్ల కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందన్నారు. -
సమ్మె వద్దు.. ఆర్టీసీని కాపాడుకుందాం
సాక్షి, అమరావతి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును మర్చిపోవద్దని సంస్థ ఉద్యోగులకు ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి సూచించారు. ఇతర సమస్యలను కూడా సీఎం జగన్ త్వరలోనే పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. తాజా పీఆర్సీకి, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధం లేదన్నారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు.. సమ్మెకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అందులో ముఖ్యమైనదని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల మనఃసాక్షికి కూడా ఆ విషయం తెలుసన్నారు. ప్రభుత్వం రెండేళ్లలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం రూ.6,200 కోట్లకు పైగా ఖర్చు చేసిందని వివరించారు. సంస్థకు రూ.6 వేల కోట్ల అప్పులుండగా.. కరోనా వల్ల ఆదాయం తగ్గడంతో కేవలం రూ.1,490 కోట్లే తీర్చగలిగామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఎవరో చెప్పిన మాటలకు ప్రభావితమై సమ్మెకు దిగితే.. సంస్థ తీవ్రంగా నష్టపోతుందనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఆ భారం కూడా మళ్లీ ఉద్యోగులపైనే పడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల అక్కడి ఉద్యోగుల ప్రయోజనాలకు ఎంతగా విఘాతం కలిగిందో ఓసారి గుర్తు చేసుకోవాలని మల్లికార్జునరెడ్డి సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు వెళ్లరనే తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొన్ని సంఘాలు సమ్మెలో పాల్గొనట్లేదని ప్రకటించాయని.. మిగిలిన సంఘాలు కూడా సమ్మెకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా మెరుగైన సేవలందించి.. ఆర్టీసీని అభివృద్ధి పథంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ఉద్యోగులపైనా ఉందన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులు సీఎంకు మద్దతివ్వాలి
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించనప్పటికీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పూర్తి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ఆర్టీసీ ఉద్యోగులపై ఉందని పీటీడీ (ప్రజారవాణా విభాగం) వైఎస్సార్ ఉద్యోగుల సంఘం పేర్కొంది. మానవీయ దృక్పథంతో ముఖ్యమంత్రి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంతో 55 వేలమంది ఉద్యోగులకు శాశ్వత ప్రయోజనం కలిగిందని గుర్తుచేసింది. అదేరీతిలో ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళవారం వినతిపత్రం ఇచ్చింది. ఉద్యోగులందరికీ క్యాడర్ ఫిక్సేషన్ చేయడంతోపాటు పే స్కేల్ స్థిరీకరించాలని కోరింది. ఆర్టీసీ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించడంతోపాటు 2017 పీఆర్సీ బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులకు మధ్య ఉన్న 19 శాతం ఫిట్మెంట్ వ్యత్యాసాన్ని భర్తీచేయాలని, పెండింగులో ఉన్న కారుణ్య నియామకాల ప్రక్రియ చేపట్టాలని కోరింది. సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన వారిలో పీటీడీ వైఎస్సార్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు డి.ఎస్.సి.రావు, ఉపాధ్యక్షుడు జేఎం నాయుడు, ప్రధాన కార్యదర్శి కె.అబ్రహం తదితరులున్నారు. సజ్జలతో ఆర్టీసీ వైఎస్సార్ యూనియన్ ప్రతినిధులు -
ఆర్టీసీ ఉద్యోగులకూ న్యాయం చేయండి
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వేతన వ్యత్యాసం సరిచేసి, పాతపెన్షన్‌కు అనుమతించాలని, ఇంటి అద్దెలు, సీసీఏలు పాతవి కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్‌కి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్ఎంయుఎ) విజ్ఞప్తి చేసింది. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలోకి విలీనం చేసిన సీఎంకు కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో నాలుగేళ్లకు ఓసారి వేతన సవరణ జరిగేదని తెలిపారు. 2017 ఏప్రిల్ 1న 25శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ జరిగిందని పేర్కొన్నారు. అనంతరం 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలోకి విలీనం చేసిందని, అప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ ఉద్యోగులకు 19శాతం వేతన వ్యత్యాసం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2020 జనవరి 1 నుంచి బకాయి ఉన్న కరువు భత్యంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఫిట్‌మెంట్‌ను కలిపి 2021 ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణ చేసి.. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలని కోరారు. -
ప్రయాణికులకు ఆర్టీసీ సరికొత్త ఆఫర్
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ–బెంగళూరుల మధ్య ప్రయాణించే వారికి ఆర్టీసీ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఈ రెండు నగరాల మధ్య నడిచే వెన్నెల స్లీపర్, అమరావతి (ఏసీ) బస్సుల్లో ప్రయాణించే వారికి టిక్కెట్ చార్జీలో 20 శాతం రాయితీ ఇవ్వనుంది. ఈ బస్సులు గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి మీదుగా ప్రయాణిస్తాయి. ఆయా స్టేషన్లలో బస్సులు ఎక్కే ప్రయాణికులకు కూడా ఈ రాయితీ వర్తిస్తుంది. అయితే విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే సర్వీసుల్లో ఆదివారం, బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే సర్వీసుల్లో శుక్రవారం మాత్రం రాయితీ లేకుండా సాధారణ చార్జీనే వసూలు చేస్తారు. వారంలో మిగిలిన అన్ని రోజులు 20 శాతం రాయితీ ఇస్తారు. విజయవాడ నుంచి బెంగళూరుకు సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరే వెన్నెల స్లీపరు సర్వీసు (నెం.3870)లో సాధారణ టికెట్టు చార్జి రూ.1,830 కాగా, 20 శాతం రాయితీ పోను రూ.1,490గా నిర్ణయించారు. సాయంత్రం 6.00 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరే అమరావతి సర్వీసు (నెం.3872)లో సాధారణ టికెట్టు రూ.1,710కు గాను రాయితీ పోను రూ.1,365 వసూలు చేస్తారు. ఇక బెంగళూరు నుంచి రాత్రి 7.30కి విజయవాడ బయలుదేరే వెన్నెల స్లీపరు సర్వీసు (నెం.3871)కు రూ.1,490, రాత్రి 9.00 గంటలకు బయలుదేరే అమరావతి సర్వీసు (నెం.3873)కు రూ.1,365గా టికెట్ ధర నిర్దేశించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎం.వై.దానం సూచించారు. -
ఆర్టీసీకి ఒమిక్రాన్ దెబ్బ!
సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్టీసీ బస్సులపై ఒమిక్రాన్ ప్రభావం గణనీయంగా పడుతోంది. సంక్రాంతికి విపరీతమైన రద్దీ ఉంటుందని ఆశించిన సంస్థకు కరోనా కొత్త వేరియంట్ దెబ్బ కొడుతోంది. రోజురోజుకు కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండడంతో పండక్కి సొంతూళ్లకు వెళ్లే వారు వెనకడుగు వేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ చేదు జ్ఞాపకాలకు భయపడి ప్రయాణాలు తగ్గించుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రభావం ఆర్టీసీ బస్సులపై బాగా కనిపిస్తోంది. ఈసారి రిజర్వేషన్లు అంతంతమాత్రమే వాస్తవానికి సంక్రాంతికి వారం రోజుల ముందు నుంచే బస్సుల్లో సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దూరప్రాంతాలకు వెళ్లే వారు రెండు, మూడు వారాల ముందుగానే ముందస్తు రిజర్వేషన్లు చేయించుకుంటారు. కానీ, ఈ సంక్రాంతికి అలాంటి పరిస్థితి కనిపించడంలేదు. కోవిడ్ ప్రభావంవల్ల గత సంక్రాంతికి ఈ రీజియన్ నుంచి 1,093 స్పెషల్ బస్సులను నడిపారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిందన్న ఉద్దేశంతో ఈ సంక్రాంతికి ఆర్టీసీ కృష్ణా రీజియన్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 1,266 ప్రత్యేక (స్పెషల్) బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. వీటిలో విశాఖపట్నానికి 390, రాజమండ్రికి 360, హైదరాబాద్‌కు 362, చెన్నైకి 20, బెంగళూరుకు 14, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు 120 బస్సులను తిప్పడానికి ప్లాన్ చేశారు. అయితే.. ఇప్పటివరకు రోజువారీ తిరిగే రెగ్యులర్ బస్సుల్లో 50 శాతం, స్పెషల్ బస్సుల్లో 40 శాతం వరకే ప్రయాణికులు రిజర్వేషన్లు చేయించుకున్నారు. గడచిన మూడు రోజుల్లో రీజియన్ నుంచి 600 స్పెషల్ సర్వీసులు నడపాల్సి ఉండగా కేవలం 150 బస్సులనే నడపగలిగినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎంవై దానం ‘సాక్షి’కి చెప్పారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరికి తాకిడి ఏటా సంక్రాంతి పండగకు హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. వీరంతా తమ స్వస్థలాలకు వెళ్లడానికి ముందస్తుగానే రిజర్వేషన్లు చేయించుకుంటారు. అందువల్ల బస్సుల్లో సీట్లు దొరకని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం భర్తీ అవుతున్న సీట్లలో విజయవాడ–విశాఖపట్నం రూటుకే అత్యధిక డిమాండ్ కనిపిస్తోంది. విశాఖపట్నం మీదుగా విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల వైపు వెళ్లే రెగ్యులర్ బస్సుల్లో దాదాపు నూరు శాతం రిజర్వేషన్లు అయిపోయాయి. ప్రత్యేక బస్సుల్లో మాత్రం ఆ స్థాయిలో సీట్లు భర్తీ కావడంలేదు. పొరుగు రాష్ట్రాల నుంచి అరకొర.. ప్రస్తుతం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సంక్రాంతికి వచ్చే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటోందని ఆర్టీసీ అధికారులు అంచనాకొచ్చారు. కోవిడ్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు ఆయా ప్రాంతాల నుంచి రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూçపకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇక కోవిడ్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం కూడా ప్రయాణికులు విధిగా మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తోంది. అలాగే, రైల్వేశాఖ కూడా అప్రమత్తమైంది. అన్ని రైలు బోగీల్లోనూ ఆర్పీఎఫ్ సిబ్బంది తిరుగుతూ ప్రతి ప్రయాణికుడి వద్దకు వెళ్లి చూస్తున్నారు. మాస్కులు లేకుండా.. సరిగా ధరించని వారికి దగ్గరుండి మాస్కులు ధరించేలా చేస్తున్నారు. -
తమిళనాడు పాక్షిక లాక్‌డౌన్‌తో ఆర్టీసీ అప్రమత్తం
సాక్షి, అమరావతి: తమిళనాడులో రాత్రివేళ లాక్డౌన్ విధించడంతో ఏపీఎస్ఆర్టీసీ అప్రమత్తమైంది. ఈ నెల 6 నుంచి 10 వరకు తమిళనాడులో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు పాక్షిక లాక్డౌన్ అమలులోకి వచ్చినందున బస్ సర్వీసుల విషయంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు శనివారం పలు సూచనలు చేశారు. తమిళనాడు వైపు వెళ్లే బస్సుల్లో 50 శాతం మాత్రమే సీట్లు భర్తీ చేయాలని, సిబ్బంది రెండు సార్లు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని, ఇతర కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. తమిళనాడులో లాక్డౌన్ అమలులోకి వచ్చే సమయాల్లో ఆర్టీసీ బస్సులు ఏపీ బోర్డర్‌కు చేరుకోవాలని సూచించారు. -
సీఎం జగన్ మా జీవితాల్లో వెలుగునింపారు: ఆర్టీసీ ఉద్యోగులు
-
ఉద్యోగులే నిర్మించుకున్న వైద్యాలయం
భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఉద్యోగుల ఆరోగ్యానికి కూడా పెద్దపీట వేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ). రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ హాస్పిటల్లో లక్ష మందికిపైగా ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్యసేవలు అందేవి. విభజన అనంతరం 2016లో విజయవాడ ప్రధాన కేంద్రంగా ఏపీఎస్ ఆర్టీసీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టేషన్‌లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో పరిపాలనా కార్యకలాపాలను ప్రారంభించింది. అప్పట్లో రాష్ట్రంలోని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు వ్యయప్రయాసలకోర్చి తార్నాక హాస్పిటల్ వెళ్లి వైద్య సేవలు పొందాల్సి వచ్చేది. దీంతో రెండు మూడు రోజుల సమయం వృథా అయ్యేది. ఈ కారణంగా సిబ్బంది తిరిగి విధులకు హాజరు కావడానికి కొంత సమయం పట్టేది. తద్వారా ప్రయాణికుల సేవలకు బస్సులను సకాలంలో నడపటంలో సమస్యలు తలెత్తేవి. 18 డిస్పెన్సరీలు విద్యాధరపురంలోని సెంట్రల్ హాస్పిటల్‌కు అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా 18 డిస్పెన్సరీలను కూడా ఏర్పాటు చేశారు. కాగా, ఇటీవల కడపలో 20 పడకల ఏరియా ఆస్పత్రిని నిర్మించి అక్కడ కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న విశ్రాంత ఉద్యోగులు విజయవాడ వరకు రావాల్సిన పని లేకుండా గత ఏడాది డిసెంబర్ 18న హైదరాబాద్ తార్నాక రోడ్డు నంబర్–1లో 19వ వైద్యశాలను నెలకొల్పారు. వార్డులు.. అత్యవసర విభాగాలెన్నో.. ఈ ఆస్పత్రిలో అత్యవసర పేషెంట్ల కోసం ఐసీయూ, క్యాజువాలిటీ, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు ఏర్పాటు చేశారు. జనరల్ మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్, గైనిక్, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, చెవి, ముక్కు, గొంతు, పీడియాట్రిక్స్, రేడియాలజీ, పాథాలజీ, డెంటల్, అనస్థీషియా విభాగాలు అందుబాటులో ఉన్నాయి. ఇవికాకుండా కార్డియాలజీ, ఆంకాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ సూపర్ స్పెషాలిటీ విభాగాల కన్సల్టెంట్ వైద్యులు నెలలో రెండుసార్లు ఇక్కడకు వచ్చి సేవలు అందించే ఏర్పాటు చేశారు. డిజిటల్ ఎక్సరే, ఈసీజీ, స్కానింగ్, లాప్రోస్కోపీ, ఫ్యాకో (కేటరాక్ట్ ఆపరేషన్ కోసం) కలర్ డాప్లర్, ఆటో అనలైజర్, సీ–ఆర్మ్ వంటివే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్యానికి పనికొచ్చేలా 20 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కూడా అందుబాటులో ఉంచారు. అత్యాధునిక ఫిజయోథెరఫీ విభాగాన్ని సైతం ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్‌కు మెరుగైన వైద్యం కోసం రిఫరల్ హాస్పిటల్స్‌కు తరలించేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌ను కూడా సమకూర్చారు. వైద్యపరంగా ఏ విధమైన సమాచారం కావాలన్నా 24 గంటలపాటు పనిచేసే హెల్ప్‌లైన్ నంబర్లను (9494248897, 0866– 2415206) అందుబాటులోకి తెచ్చారు. వైద్య పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలు, యంత్ర సామగ్రిని కూడా ఈ ఆస్పత్రి సొంతంగా సమకూర్చుకుంది. తార్నాక హాస్పిటల్‌కు దీటుగా.. ఉద్యోగుల ఇబ్బందులను అధిగమించే క్రమంలో తార్నాక హాస్పిటల్‌కు దీటుగా విజయవాడలోని విద్యాధరపురంలో ఉద్యోగుల భాగస్వామ్యంతో 2.50 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.15 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో ఆర్టీసీ సెంట్రల్ హాస్పిటల్ నిర్మించింది. ఇందులో 2017 జూలై నెల 4వ తేదీ నుంచి వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. 50 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ ఆస్పత్రి సుమారు 52 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పెన్షనర్లు కలిపి మొత్తం సుమారు 2.25 లక్షల మంది వైద్య అవసరాలను తీరుస్తోంది. ఈ ఆస్పత్రి నిర్మాణానికి ప్రతి ఉద్యోగి తమ జీతం నుంచి నెలకు రూ.100 చొప్పున రెండేళ్ల పాటు స్వచ్ఛందంగా విరాళంగా అందజేయటం విశేషం. ఇలా సుమారు రూ.13 కోట్లను సంస్థ సిబ్బంది సమకూర్చుకోగా.. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం వెచ్చించింది. భవనాల నిర్మాణానికయ్యే ఖర్చులో ఎక్కువ మొత్తం సిబ్బంది నుంచే అందగా.. మిగిలిన మొత్తంతోపాటు ఆస్పత్రిలో సౌకర్యాల కల్పన, పరికరాలు, ల్యాబొరేటరీల ఏర్పాటుకయ్యే నిధులను ప్రభుత్వమే సమకూర్చింది. ఈ విధంగా సకల సదుపాయాలు, సంపూర్ణ సౌకర్యాలతో ఉద్యోగులే కట్టుకున్న వైద్యాలయంగా ఆర్టీసీ సెంట్రల్ హాస్పిటల్ విరాజిల్లుతోంది. వైద్య సేవలకు ప్రాధాన్యత ఆర్టీసీ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుతున్నాయి. సిబ్బంది ఆరోగ్యాన్ని సంరక్షించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకెళుతోంది. సంస్థ ప్రభుత్వంలో విలీనమైన తరువాత ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కార్డులు మంజూరైనా సంస్థాపరమైన వైద్య సేవలను ఎప్పటిలానే అందిస్తున్నాం. ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు అందుబాటులో లేని ఉచిత కన్సల్టేషన్, మందులు అందించే సౌకర్యాన్ని ఆర్టీసీ సంస్థ మాత్రమే తన ఉద్యోగులకు కల్పించింది. – సీహెచ్ ద్వారకాతిరుమలరావు, ఎండీ, ఏపీఎస్ ఆర్టీసీ 4 లక్షల పరిమితి వరకు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు అవసరమైన ఆధునిక మెషినరీ, పరికరాలు సమకూర్చుకుంటున్నాం. రోజుకు దాదాపు 200 మంది సిబ్బంది ఈ విద్యాధరపురం హాస్పిటల్‌కు వస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్‌లలో రోజుకు 1700 నుంచి 2 వేల మంది వైద్య సేవలు పొందుతున్నారు. రిటైరైన ఉద్యోగి, అతని జీవిత భాగస్వామికి కలిపి రూ.4 లక్షల పరిమితి వరకు వైద్య సేవలు అందిస్తున్నాం. – డీవీఎస్ అప్పారావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్, సెంట్రల్ హాస్పిటల్ -
హైదరాబాద్–ఏపీకి 1,500 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ అన్ని జిల్లాలకు ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈనెల 7 నుంచి 14 వరకు హైదరా బాద్ నుంచి ఏపీలోని 13 జిల్లాల్లోని వివిధ పట్టణాలకు 1,500 ప్రత్యేక బస్సులు నడపను న్నట్లు సంస్థ హైదరాబాద్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ప్రతిరోజూ 344 రెగ్యులర్ బస్సులను హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్, మియా పూర్, కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, ఎంజీబీఎస్, ఎల్బీనగర్, జీడిమెట్ల, జేబీఎస్, ఈసీఐఎల్ నుంచి నడుపుతున్న ఆర్టీసీ.. పండుగ స్పెషల్స్‌ను అదనంగా ఏర్పాటు చేసి నట్లు చెప్పారు. రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు వైపు వెళ్లే బస్సులను ఎంజీబీఎస్ బయటున్న ఓల్డ్ సీబీఎస్ హాంగర్ నుంచి నడపనున్నట్లు తెలిపారు. ప్రత్యేక బస్సులకు కూడా అడ్వాన్స్ రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. -
సంక్రాంతికి 6,970 స్పెషల్ బస్సులు
సాక్షి, అమరావతి: సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సన్నద్ధమైంది. భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సంక్రాంతి సీజన్లో ఏకంగా 6,970 ప్రత్యేక సర్వీసులు నిర్వహించనుంది. వాటిలో పండగ ముందు 4,145 ప్రత్యేక సర్వీసులు, పండగ తరువాత 2,825 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ప్రణాళికను ఆమోదించింది. గత ఏడాది కంటే 35 శాతం అధికంగా ఈ ఏడాది ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. సంక్రాంతి స్పెషల్ సర్వీసులు ఇలా.. సంక్రాంతికి ముందు అంటే జనవరి 8వ తేదీ నుంచి 14 వరకు 4,145 ప్రత్యేక బస్సులు నిర్వహిస్తుంది. వీటిలో 1,500 బస్ సర్వీసులు హైదరాబాద్‌కు కేటాయించారు. విశాఖపట్నానికి 650, విజయవాడకు 250, బెంగళూరుకు 100, చెన్నైకి 45 సర్వీసులు నిర్వహిస్తారు. మిగిలిన 1,600 సర్వీసులు అన్ని జిల్లా కేంద్రాలతోపాటు ప్రధాన పట్టణాలకు కేటాయించారు. గత ఏడాది సంక్రాంతి ముందు మొత్తం 2,982 ప్రత్యేక బస్సులే ఆర్టీసీ నడిపింది. ఈసారి 1,163 సర్వీసులను అధికంగా కేటాయించింది. తిరుగు ప్రయాణానికీ ఇబ్బంది లేకుండా.. పండగ తరువాత తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం కూడా తగినన్ని ప్రత్యేక బస్సు సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. జనవరి 15 నుంచి 17 వరకు 2,825 ప్రత్యేక బస్సులు నడపనుంది. వాటిలో హైదరాబాద్‌కు అత్యధికంగా వెయ్యి బస్సులను కేటాయించారు. విశాఖపట్నానికి 200, విజయవాడకు 350, బెంగళూరుకు 200, చెన్నైకు 75 బస్సులతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెయ్యి ప్రత్యేక బస్సులు నిర్వహిస్తారు. గతేడాది సంక్రాంతి తరువాత 2,151 ప్రత్యేక బస్సులు నిర్వహించారు. ఈ ఏడాది 674 బస్సులను అధికంగా కేటాయించారు. -
ప్రభుత్వం ఎంతో చేసింది
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలై ఖచ్చితంగా రెండేళ్లు పూర్తయ్యిందని, 2020 జనవరి 1న ప్రభుత్వంలో సంస్థ విలీనమైందని ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు అన్నారు. ప్రభుత్వం మనకు ఎంతో చేసిందని, మన విశ్వసనీయతను చాటుకుందామని ఆయన ఆర్టీసీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ హౌస్‌లో శనివారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో కేక్ కట్ చేసిన ఆయన ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వంలో విలీనమైన మొదటి ఏడాదిలో అనేక రకాల అనుభవాలు, అపోహలు, అంతరాలు, అవగాహన లోపాలు కలిగాయని, రాను రాను కార్యకలాపాలు పుంజుకున్న కొద్ది అవి సమసిపోయాయని వివరించారు. కోవిడ్ సమయంలో అందరూ పలు రకాల ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు అందించిందని చెప్పారు. ప్రభుత్వ నెట్వర్క్ ఆస్పత్రుల్లో పొందిన వైద్య సేవలకు కూడా మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీమ్‌కు ఆర్టీసీ ఉద్యోగులను అర్హులుగా చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈడీలు ఎ.కోటేశ్వరరావు (అడ్మినిస్ట్రేషన్), పి.కృష్ణమోహన్ (ఇంజనీరింగ్), కేఎస్ బ్రహ్మనందరెడ్డి, ఆదం సాహెబ్, సి.రవికుమార్, విజయవాడ ఆర్ఎం ఎంవై దానం తదితరులు మాట్లాడారు. -
ఈ కామర్స్ ఆర్టీసీ టికెట్లపై జీఎస్టీ
సాక్షి, అమరావతి: లాభాపేక్షతో నిర్వహిస్తున్న ప్రైవేటు ఈ కామర్స్ పోర్టల్స్, యాప్స్ ద్వారా బుక్ చేసుకునే ఆర్టీసీ నాన్ ఏసీ టికెట్లపై ఏపీఎస్ఆర్టీసీ 5 శాతం జీఎస్టీ విధించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు గురువారం ఆర్టీసీ అధికారులు ఈ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ప్రస్తుతం ఆర్టీసీ టికెట్ బుకింగ్ సేవలు అందిస్తున్న అభిబస్, రెడ్‌బస్, పేటీఎం పోర్టల్స్‌లో టికెట్లు కొనుగోలు చేసేవారు జనవరి 1వ తేదీ నుంచి జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి సేవా దృక్పథంతో నిర్వహించే ఆర్టీసీ పోర్టల్, ఆర్టీసీ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకునే టికెట్లకు, నేరుగా బస్సుల్లో తీసుకునే టికెట్లకు జీఎస్టీ ఉండదని ఆర్టీసీ అధికారులు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఆర్టీసీ పాలక మండలి భేటీ
సాక్షి, అమరావతి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంస్థను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని ఆర్టీసీ పాలకమండలి నిర్ణయించింది. ఏటా రూ.3 వేల కోట్ల వేతన భారాన్ని ప్రభుత్వమే భరిస్తున్నందున సంస్థకు గణనీయంగా ఆర్థిక వెసులుబాటు కలిగిందని పేర్కొంది. ఆర్టీసీ నూతన పాలకమండలి సమావేశాన్ని బుధవారం విజయవాడలో నిర్వహించారు. కీలకమైన 45 అంశాలతో కూడిన అజెండాపై పాలకమండలి సుదీర్ఘంగా చర్చించింది. సమావేశంలో మాట్లాడుతున్న మల్లికార్జునరెడ్డి కొత్త బస్సుల కొనుగోలు, ఆర్టీసీ బస్ స్టేషన్లలో సదుపాయాల మెరుగుదల తదితర అంశాలపై చర్చ సాగింది. కాగా, డ్రైవర్లు, కండక్టర్లను కాంట్రాక్టు విధానంలో నియమించేందుకు ప్రభుత్వ అనుమతి కోరాలని నిర్ణయించినట్టు తెలిసింది. సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి, ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, రవాణా, ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖల ముఖ్య కార్యదర్శులు ఎంటీ కృష్ణబాబు, ఎస్ఎస్ రావత్, శశిభూషణ్‌కుమార్, కేంద్ర ఉపరితల రవాణా శాఖ అధికారి పరేశ్‌కుమార్, సీఐఆర్టీ డైరెక్టర్ కేవీఆర్కే ప్రసాద్, ఏఎస్ఆర్టీయూ ఈడీ ఆర్.ఆర్.కె.కిషోర్ పాల్గొన్నారు. -
Sankranthi: రైళ్లు, బస్సులు ఫుల్..
సాక్షి, అమరావతి బ్యూరో: సంక్రాంతికి ఇంటికెళదామనుకునే వారికి కష్టాలు తప్పని పరిస్థితి తలెత్తింది. జనవరి 7 నుంచి 14 వరకు రైళ్లు, బస్సుల్లో బెర్తులు, సీట్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి. ప్రధానంగా విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్లే రైళ్లు, బస్సులకు డిమాండ్ అధికంగా ఉంటోంది. ఈ రూట్లో జనవరి 7వ తేదీ నుంచి 14 వరకు రైళ్లలో బెర్తులు దొరకని పరిస్థితి నెలకొంది. రిజర్వేషన్ చేయించుకుందామంటే చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంటోంది. కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఇప్పటికే ‘రిగ్రెట్’ అని వస్తోంది. విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా నిత్యం 85 రైళ్లకు పైగా వెళ్తుంటాయి. వీటిలో రోజూ నడిచే రెగ్యులర్ రైళ్లు 27 కాగా, వీక్లీ, బై వీక్లీ రైళ్లు 58 వరకు ఉన్నాయి. సెకండ్ సిట్టింగ్‌తో నడిచే విజయవాడ–విశాఖ (రత్నాచల్), గుంటూరు–విశాఖ (సింహాద్రి), లింగంపల్లి–విశాఖ(జన్మభూమి) రైళ్లలో మాత్రమే ప్రస్తుతానికి కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన అన్ని రైళ్లలో.. అన్ని క్లాసులూ వెయిటింగ్ లిస్టులతోనే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. వీరంతా సంక్రాంతికి తమ స్వస్థలాలకు వెళ్లడానికి ముందస్తుగానే రిజర్వేషన్లు చేయించుకోవడంతో రైళ్లలో సీట్లు, బెర్తులు లభ్యం కావడం లేదు. బస్సులదీ అదే దారి మరోవైపు బస్సుల్లోనూ విజయవాడ–విశాఖపట్నం రూటుకే అత్యధిక డిమాండ్ కనిపిస్తోంది. విశాఖపట్నం మీదుగా విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల వైపు వెళ్లే రెగ్యులర్ బస్సుల్లో నూరు శాతం రిజర్వేషన్లు అయిపోయాయి. ఆర్టీసీ కృష్ణా రీజియన్ నుంచి రాష్ట్రంలోని వివిధ దూరప్రాంతాలకు రోజూ 463 రెగ్యులర్ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో ఇప్పటివరకు సంక్రాంతి సమయంలో (జనవరి 8–14 మధ్య) అధిక శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రెగ్యులర్ బస్సుల్లో సీట్లు ఫుల్ అయ్యాక స్పెషల్ సర్వీసులకు రిజర్వేషన్లు తెరుస్తారు. హైదరాబాద్ వైపు రైళ్లలో ఖాళీలు కాగా, సంక్రాంతి సీజన్లో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే రైళ్లలో సీట్లు, బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ రూట్లో 36 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణిస్తుండగా రోజువారీ 19, వీక్లీ/బైవీక్లీ ట్రైన్లు 17 వరకు నడుస్తున్నాయి. వీటిలో శాతవాహన, గోల్కొండ, జన్మభూమి, ఇంటర్సిటీ రైళ్లు సెకండ్ సీటింగ్వి కాగా.. మిగిలినవి స్లీపర్ క్లాసులున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లే. ప్రస్తుతం ఈ రైళ్లలో దాదాపు అన్ని క్లాసుల బెర్తులు, సీట్లు పదులు, వందల సంఖ్యలో ఖాళీలున్నాయి. సంక్రాంతికి 1,266 స్పెషల్ బస్సులు ఈ సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ కృష్ణా రీజియన్ నుంచి 1,266 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. వీటిలో విశాఖపట్నానికి 390, రాజమండ్రికి 360, హైదరాబాద్‌కు 362, చెన్నైకి 20, బెంగళూరుకు 14, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు 120 బస్సులను నడపాలని నిర్ణయించినట్టు రీజనల్ మేనేజర్ ఎంవై దానం ‘సాక్షి’కి చెప్పారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి మరిన్ని స్పెషల్ సర్వీసులను నడపనున్నట్టు తెలిపారు. కాగా కోవిడ్ ప్రభావం వల్ల గత సంక్రాంతికి ఈ రీజియన్ నుంచి 1,093 స్పెషల్ బస్సులు నడిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి 173 సర్వీసులు ఎక్కువ. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఈ సంక్రాంతికి స్పెషల్ సర్వీసుల సంఖ్యను పెంచుతున్నారు. -
Andhra Pradesh: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. 2019 మార్చి 1 నుంచి, 2021 నవంబర్ 30లోగా రిటైరైన ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 2017– పే స్కేల్ బకాయిలను రెండు విడతలుగా చెల్లించాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడత మొత్తాన్ని సోమవారమే వారి ఖాతాల్లో జమ చేసింది. తద్వారా 5 వేల మందికి ప్రయోజనం కలగనుంది. త్వరలోనే రెండో విడత బకాయిలను కూడా చెల్లించనుంది. ఈ నిర్ణయంపై ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, దామోదరరావు, నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వి.రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు, ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి ఎం.అబ్రహం, వర్కింగ్ ప్రెసిడెంట్ డీఎస్పీ రావు, ముఖ్య ఉపాధ్యక్షుడు నాయుడు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. (చదవండి: ఏపీపీఎస్సీ ఇన్చార్జి చైర్మన్‌గా రమణారెడ్డి ) -
రెప్పపాటులో 'ఘోరం'.. జల్లేరు వాగులో బస్సు బోల్తా
సమయం మధ్యాహ్నం 12 గంటలు.. పల్లె వెలుగు బస్సు ఓ వంతెనపై వెళుతోంది.దాదాపు నాలుగు గంటలుగా ప్రయాణం.. సాఫీగానే సాగుతోంది... మరో పావు గం టలో గమ్యస్థానం చేరుకోనుండటంతో ప్రయాణికులంతా సిద్ధంగా ఉన్నారు.. అంతలో.. హఠాత్తుగా పెద్ద కుదుపు.. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి బ్రిడ్జిపైనే ఓవర్టేక్ చేసి బస్సు ముందుకు దూసుకొచ్చాడు.. అదుపు తప్పిన బస్సు డివైడర్‌ను ఎక్కి వంతెన ఎడమ వైపు రెయిలింగ్‌ను బలంగా ఢీ కొట్టింది.. తేరుకునేలోపే బస్సు వాగులో పడిపోయింది.. పది ప్రాణాలు నీటిలో కలిశాయి.. పశ్చిమ గోదావరి జిల్లా వేగవరం వద్ద జల్లేరు వాగులో చోటు చేసుకున్న విషాద ఘటన ఇది. ప్రముఖుల దిగ్భ్రాంతి బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. జంగారెడ్డిగూడెం/జంగారెడ్డిగూడెం రూరల్, ఏలూరు టౌన్: కొద్దిసేపట్లో గమ్య స్థానానికి చేరుకోవాల్సిన బస్సు ప్రయాణం కొన్ని కుటుంబాలకు అంతిమయాత్రగా మారింది. మృతుల కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఒక ప్రాణాన్ని రక్షించే క్రమంలో పది ప్రాణాలు పోయాయి. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం శివారు జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. అక్కడున్న స్థానికులు తక్షణమే స్పందించగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను కాపాడటంతోపాటు వెంటనే ఆస్పత్రులకు తరలించి వైద్య సాయం అందించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మరో రూ.2.5 లక్షల చొప్పున అదనంగా పరిహారాన్ని అందించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. భద్రాచలం నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్న పల్లె వెలుగు బస్సు (ఏపీ 37 జడ్ 0193) జల్లేరు వాగు వంతెనపై ఓ ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో ప్రమాదానికి గురైంది. ఉదయం 8 గంటలకు బయల్దేరిన ఈ బస్సులో 47 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఆ సమయంలో వాగులో నీరు నిండుగా ప్రవహిస్తోంది. క్షతగాత్రుల హాహాకారాలతో స్థానికులు వెంటనే స్పందించి కాపాడారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు వీఆర్ ఎలీజా, తెల్లం బాలరాజు, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, జేసీ హిమాన్షు శుక్లా, ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ ద్వారకా తిరుమలరావు సహాయ చర్యలను పర్యవేక్షించారు. జల్లేరు వాగులో పడిన ఆర్టీసీ బస్సు వద్ద సహాయక చర్యల్లో స్థానికులు ఆర్టీసీ తరఫున రూ.2.50 లక్షలు ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన సేవలు అవసరమైతే తక్షణమే ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు. తీవ్ర గాయాలైన బాధితులకు మెరుగైన వైద్యాన్ని ఆర్టీసీ పర్యవేక్షణలోనే అందిస్తామని తెలిపారు. ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి మృతులకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించారని, ఆర్టీసీ తరపున మరో రూ.2.50 లక్షలు అందచేస్తామని చెప్పారు. తొలుత వారిద్దరూ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రి వద్ద విలపిస్తున్న బాధితులు నిమిషాల వ్యవధిలో... ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 20 నిమిషాల్లోనే రెస్క్యూ అక్కడకు చేరుకుంది. క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, డీఎస్పీలు డాక్టర్ రవికిరణ్ తదితరులు ఆగమేఘాలపై అక్కడకు వెళ్లారు. సుమారు 4 గంటలకుపైగా శ్రమించిన రెస్క్యూ టీం వాగులో పడిన బస్సును మూడు భారీ క్రేన్ల సాయంతో వెలికి తీసింది. క్షతగాత్రులకు తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రుల వివరాలు.... పసుపులేటి రాజారావు (సూర్యారావుపాలెం–ఉండ్రాజవరం), కె.హరినాథ్‌బాబు (నల్లజర్ల), కవ్వాడి కామరాజు (గోపన్నగూడెం–అశ్వారావుపేట), సత్తెనపల్లి కృష్ణవేణి (తాళ్లపూడి), సత్తెనపల్లి పద్మారావు (తాళ్లపూడి), చోడేదేవి (పూసర్ల–వేలేరుపాడు), చోడే సీతమ్మ (పూసర్ల–వేలేరుపాడు), మల్లిడి సోమశేఖర్‌రెడ్డి (రామవరం–అనపర్తి), కోట మనీషా(కుక్కునూరు), కోట ముత్యాలు (కుక్కునూరు), ఎం.లక్ష్మి (జంగారెడ్డిగూడెం), కె.నాగమ్మ (దేవులపల్లి), పంపన శకుంతలదేవి (గొల్లగూడెం–ద్వారకాతిరుమల), కె.కీర్తి (నాగిగూడెం–కుక్కునూరు), కోట ప్రశాంతి (కుక్కునూరు), తాటి సుబ్బలక్ష్మి (తోటపల్లి–బుట్టాయగూడెం),కె.సులోచన (నాయుడుగూడెం– కుక్కునూరు), పాయం శివ (భద్రాచలం), పాయం రమేష్ (పండువారిగూడెం), ఉమ్మడి దుర్గ (టి.నర్సాపురం), జి.రవిశేఖర్ (కరిచెర్లగూడెం), పసుపులేటి మంగ (సూర్యారావుపాలెం), కేత వరలక్ష్మి, కండెల్లి స్వప్న (గోపాలపురం), ఉండ్రాజవరపు గీతికాన్షి (జి.కొత్తపల్లి–ద్వారకాతిరుమల). ఈత రావడంతో.. బస్సు ముందు సీట్లల్లో కూర్చున్నాం. హఠాత్తుగా వెనుక నుంచి ఓ ద్విచక్ర వాహనం వేగంగా రావడంతో తప్పించే క్రమంలో వంతెనను ఢీకొని బస్సు వాగులో పడిపోయింది. ఈత రావడంతో వాగులో దూకి ప్రాణాలు కాపాడుకున్నాం. స్థానికులు, మత్స్యకారులు వెంటనే స్పందించి నాటు పడవలు, తాళ్ల సాయంతో గాయపడ్డ వారిని రక్షించారు. – శివ, రమేష్, భద్రాచలం (ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్న ప్రత్యక్ష సాక్షులు) ఆర్డీవోతో విచారణ కమిటీ క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ప్రమాద సమాచారం తెలియగానే ఆయన వెంటనే జంగారెడ్డిగూడెం చేరుకుని గాయపడ్డవారిని పరామర్శించారు. స్వల్ప గాయాలైన వారికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ 9 మందికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బస్సు ప్రమాద ఘటనపై ఆర్డీవో స్థాయి అధికారితో కమిటీని నియమించామని, నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదంపై గవర్నర్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం పట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో డ్రైవర్‌తో సహా 9 మంది ప్రయాణికులు మృతిచెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు తగిన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. సీఎం జగన్ సానుభూతి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాకు ఆదేశం సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని మోదీ బాసట సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని ప్రధాని కార్యాలయం అధికారిక ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఈ మొత్తాన్ని అందచేయనున్నట్లు పేర్కొన్నారు. బాధాకరం: మండలి చైర్మన్ సాక్షి,అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ఏపీ శాసనమండలి చైర్మన్ మోషెన్ రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో తొమ్మిది మంది మరణించడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు వెనువెంటనే ప్రభుత్వం స్పందించి సత్వరంగా రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సకోసం జంగారెడ్డిగూడెం, ఏలూరులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారని పేర్కొన్నారు. ఘటనపై సత్వరమే స్పందించి, విచారణకు ఆదేశించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
డ్రైవింగ్ చేసేందుకు డోర్ వద్దకు వెళ్లి నిల్చున్నాడు.. బస్సు తలుపు ఊడి..
సాక్షి,ప్రొద్దుటూరు: మరో ఐదు నిమిషాల్లో అతను డ్రైవింగ్ మారతాడు.. ఇందుకోసం డోర్ వద్ద నిల్చున్నాడు.. ఇంతలోనే లారీ రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీడిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ పి రూబెన్ (55) అక్కడిక్కడే మృతి చెందాడు. శుక్రవారం వేకువ జామున ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ముందు వెళ్తున్న లారీని ఢీ కొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు డిపో నుంచి ఏపీ04 జెడ్ 0311 నంబర్ గల సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు 26 మంది ప్రయాణికులతో గురువారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరింది. పి రూబెన్(410219), ఎస్కే బాషా(411458) బస్సు డ్రైవర్లు. ప్రొద్దుటూరు నుంచి ఎస్కే బాషా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాడు. మార్గం మధ్యలో ఎస్కే బాషా డ్రైవింగ్ మారాల్సి ఉంది. అంతవరకు నిద్రపోయిన రూబెన్ వేకువ జామున సుమారు 3.40 గంటల సమయంలో డ్రైవింగ్ మారేందుకు డోర్ వద్దకు వెళ్లి నిల్చున్నాడు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్ సమీపంలోకి వెళ్లగానే తను డ్రైవింగ్ చేస్తానని, బస్సు నిలపాలని రూబెన్ అతన్ని అడిగాడు. కొంత దూరం వెళ్లాక దిగుతానని డ్రైవింగ్ చేస్తున్న ఎస్కే బాషా తెలిపాడు. జడ్చర్ల దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న లారీని ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో డోర్ ఊడిపోవడంతో అక్కడే నిల్చున్న రూబెన్ కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఎడమవైపు వెళ్తున్న లారీ ఒక్కసారిగా కుడివైపునకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనలో మరో డ్రైవర్ ఎస్కే బాషాతో పాటు ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ప్రొద్దుటూరు ఆర్టీసీడిపో మేనేజర్ మధుశేఖర్‌రెడ్డి, పలువురు యూనియన్ నాయకులు, కార్యాలయ అధికారులు హుటాహుటీనా సంఘటనా స్థలానికి వెళ్లారు. 25 ఏళ్ల నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా.. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లకు చెందిన రూబెన్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె కొన్ని నెలల కిందట మృతి చెందింది. కుమారుల్లో ఒకరు అలహాబాద్‌లో, మరొకరు నంద్యాలలో చదువుకుంటున్నారు. రూబెన్ 1996లో ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్‌గా చేరాడు. కొన్నేళ్లు రాయచోటి డిపోలో పని చేశాడు. తర్వాత ప్రొద్దుటూరు డిపోలో విధులు నిర్వహిస్తున్నాడు. వృత్తి పట్ల ఎంతో నిబద్ధత కలిగిన డ్రైవర్‌గా అతను పేరు తెచ్చుకున్నాడని తోటి డ్రైవర్లు చెబుతున్నారు. కేఎంపీఎల్ విషయంలో చాలా సార్లు అధికారుల నుంచి ప్రశంశలు పొందాడన్నారు. ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు, యూ నియన్ నాయకులు రూబెన్‌కు నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మంచి వ్యక్తిని కోల్పోయామని తోటి డ్రైవర్లు కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: శిల్పా చౌదరి కేసు: ఆ డబ్బంతా బ్లాక్‌ను వైట్ చేసేందుకే ఇచ్చారా? -
ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా అడ్వాన్స్డ్ రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆర్టీసీ విస్తరించింది. 60 రోజుల ముందుగానే ప్రయాణికులు సీట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆర్టీసీలో 30 రోజుల ముందుగా సీట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. కాగా, పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని 60 రోజుల ముందుగా సీట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది. దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చే ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల బస్సు సర్వీసుల్లో ఈ అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించామని ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) కేఎస్బీ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. చదవండి: (YS Jagan: అండగా నిలవండి) -
APSRTC: ఆర్టీసీలో 'సొసైటీ' ఎన్నికల వేడి
తిరుపతి అర్బన్: ఆర్టీసీకి చెందిన క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) ఎన్నికలను అన్ని ఉద్యోగ సంఘాలకు చెందిన అసోసియేషన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టిపరిస్థితుల్లో బోర్డును తమ అసోసియేషన్ కైవసం చేసుకోవాలంటూ ఉద్యోగ సంఘం నేతలు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. డిపోల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో మొత్తం పది అసోసియేషన్లు పోటీలో ఉన్నా, ప్రధానంగా మూడు అసోసియేషన్లు నువ్వా నేనా అన్నట్లు పోటీగా ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలోని 129 డిపోలకు కలిపి 210 డెలిగేట్ స్థానాలున్నాయి. ఆయా డిపోల్లోని డెలిగేట్ స్థానాలను బట్టి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. డిసెంబర్ 6వ తేదీకి నామినేషన్ల తంతు ముగియనుండగా, డిసెంబర్ 14న ఎన్నికలు, అదే రోజు కౌంటింగ్ పూర్తవుతుంది. 210 డెలిగేట్ స్థానాల్లో 50 శాతానికి పైగా స్థానాలు సాధించిన అసోసియేషన్‌కు బోర్డు కైవసమవుతుంది. విజయం సాధించిన అసోసియేషన్ డిసెంబర్ 29న 9 మంది డైరెక్టర్లతో కొత్త బోర్డును ఏర్పాటు చేయనుంది. వీరు డిసెంబర్ 31న విజయవాడ ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేస్తారు. 9 మంది డైరెక్టర్లతోపాటు ముగ్గురు ఆర్టీసీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఐదేళ్లపాటు బోర్డు కొనసాగుతుంది. 50,300 మంది సభ్యులు 1956 నుంచి ఆర్టీసీ క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 50,300 మంది సభ్యులతో ఆసియాలోనే అత్యంత పెద్ద సొసైటీగా గుర్తింపు పొందింది. సభ్యత్వం ఉన్న ఉద్యోగుల బేసిక్‌ను ఆధారంగా చేసుకుని జీతంలో ప్రతి నెలా 4 శాతం సీసీఎస్‌కు కట్ అవుతుంది. ఈ క్రమంలో సీసీఎస్ ప్రస్తుతం రూ.1,550 కోట్లు టర్నోవర్ కొనసాగిస్తోంది. ప్రధానంగా సీసీఎస్‌లో సభ్యత్వం ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు ఇంటి రుణాలతోపాటు పిల్లల చదువు, వివాహం తదితరాలకు రుణాలు మంజూరు చేస్తారు. రూ.1 లక్ష నుంచి రూ.20 లక్షల మేరకు వారి వేతన స్థాయిలను బట్టి రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. రుణాలకు అతి తక్కువ వడ్డీ ఉంటుంది. విజయం సాధిస్తాం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా పనిచేస్తున్నాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసినట్లే ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలకు ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోటీ చేస్తోంది. తప్పకుండా విజయం సాధిస్తాం. – చల్లా చంద్రయ్య, ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆ కుటుంబం అందరిదీ ఆర్టీసీ అభివృద్ధికి వైఎస్ కుటుంబం చేసిన మేలు ఎవరూ మరచిపోరు. ఆ కుటుంబం అంటే ఆర్టీసీ సిబ్బంది తమ కుటుంబంగా భావిస్తారు. పదేళ్లుగా ఎంప్లాయీస్ యూనియన్ అండ్ అసోసియేషన్ బోర్డును కైవసం చేసుకుంది. ఎంతో మందికి రుణాలు ఇప్పించాం. మా అసోసియేషన్‌ను గెలిపించాలని కోరుతున్నాం. – ఆవుల ప్రభాకర్ యాదవ్, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అండ్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఉద్యోగులకు అండగా నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఉద్యోగులకు అండగా నిలుస్తోంది. మేము వైఎస్ కుటుంబానికి కృతజ్ఞత కల్గిన వాళ్లమే. సీఐటీయూ పొత్తుతో రాష్ట్రంలో అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నాం. – బీఎస్ బాబు, నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లాసెక్రటరీ -
డిసెంబర్ 14న ఆర్టీసీ ఎన్నికలు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలో ఎన్నికల సమీకరణలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆర్టీసీలోని క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) పాలక మండలి ఎన్నికలు డిసెంబర్ 14న జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీకి దిగిన ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ)కు ఏపీ పీటీడీ ఆఫీస్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఓస్వా) మద్దతును ప్రకటించింది. ఈ మేరకు శనివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఓస్వా రాష్ట్ర అధ్యక్షుడు ఐఎల్ నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శివప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 14న జరుగుతున్న సీసీఎస్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 129 డిపోలు, యూనిట్లు, ఆఫీసు కార్యాలయాల్లో పనిచేసే పీటీడీ ఆఫీస్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేన్ (ఓస్వా) సభ్యులు అంతా ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈయూ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు జేఏసీగా రాష్ట్రవ్యాప్తంగా జరిపిన అన్ని పోరాటాల్లోనూ ఓస్వా భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. 2017 వేతన సవరణ ఒప్పందంలో 25 శాతం తాత్కాలిక ఫిట్మెంట్ సాధించుకున్నామని, సిబ్బంది పదోన్నతుల కోసం పోరాడామని తెలిపారు. -
తమిళనాడులో ఆంధ్రా ఆర్టీసీ బస్సు సీజ్
వేలూరు( చెన్నై): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సును తమిళనాడు అధికారులు గురువారం సీజ్ చేశారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా ఆంబూరుకు చెందిన సుబ్రమణ్యం నాయుడు(57). ఇతను తన రోజువారీ వ్యాపారాన్ని పూర్తి చేసుకొని 2010 డిసెంబర్ 17వ తేదీన గుడియాత్తం నుంచి ఆంబూరుకు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కాడు. గుడియాత్తం బస్టాండ్ సమీపంలోకి బస్సు వస్తుండగా డ్రైవర్ ఉన్న ఫలంగా బ్రేక్ వేయడంతో ముందు ఉన్న సీటు కమ్మీ తల తగిలి అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో 2019 ఆగస్టు 7న వానియంబాడి కోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో న్యాయమూర్తి ఆంధ్ర రాష్ట్ర ఆర్టీసీ బస్సు యాజమాన్యం రూ. 15 లక్షలు బాధిత కుటుంబానికి పరిహారంగా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అయితే ఎటువంటి నష్ట పరిహారం చెల్లించక పోవడంతో సుబ్రమణ్యం నాయుడు కుమారుడు దనకుమార్ మరో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో సదరు ఆంధ్రా ఆర్టీసీ బస్సును జప్తు చేయాలని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దీంతో బుధవారం రాత్రి వానియంబాడికి వచ్చిన ఆంధ్ర ప్రభుత్వ బస్సును కోర్టు సిబ్బంది సీజ్ చేశారు. చదవండి: ఎంత కష్టం.. 40 ఏళ్లు వచ్చినా పిల్ల కరువాయే!.. పెళ్లి లేదాయే! ఛలో బీహార్, యూపీ -
‘ఆర్టీసీ’లో ఎన్నికల హారన్
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు–పరపతి సహకార సొసైటీ ఎన్నికల నగారా మోగింది. రెండేళ్ల కాల పరిమితితో 210 మంది ప్రతినిధులను ఎన్నుకునేందుకు డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం ఎన్నికైన సొసైటీ ప్రతినిధులు 9 మంది పాలక మండలి సభ్యులను డిసెంబర్ 29న ఎన్నుకుంటారు. ఈ మేరకు సొసైటీ ఎన్నికల షెడ్యూల్ బుధవారం వెలువడింది. దాని ప్రకారం.. సొసైటీ నూతన పాలకమండలి ఎన్నికలకు నోటిఫికేషన్‌ను 15న విడుదల చేస్తారు. నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి సొసైటీలో సభ్యులుగా నమోదైన వారు ఓటర్లుగా ఉంటారు. కనీసం ఏడాది సర్వీస్‌ను పూర్తి చేసుకుని, సీసీఎస్ ఫామ్ సమర్పించడంతో పాటు రూ.300 షేర్ క్యాపిటల్ చెల్లించిన ఆర్టీసీ ఉద్యోగులు ఓటర్లుగా నమోదయ్యేందుకు అర్హులు. నూతన ఓటర్ల నమోదు ఈ నెల 15 వరకూ కొనసాగుతుంది. ప్రస్తుతం సొసైటీలో 50,300 మంది ఓటర్లున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌పై అభ్యంతరాలను ఈ నెల 22 వరకూ స్వీకరిస్తారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 12 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 10 వరకూ అవకాశం కల్పిస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను డిసెంబర్ 10న ప్రకటిస్తారు. పోలింగ్‌ను డిసెంబర్ 14న నిర్వహించి.. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికైన ప్రతినిధులు 9 మంది పాలక మండలి సభ్యులను ఎన్నుకుంటారు. ఆర్టీసీ నాలుగు జోన్ల నుంచి ఇద్దరు చొప్పున సభ్యులు, హెడ్ ఆఫీస్ నుంచి ఒక సభ్యుడు.. మొత్తం మీద 9 మంది పాలక మండలి సభ్యులను ఎన్నుకుంటారు. ఆర్టీసీ ఎండీ చైర్మన్‌గా వ్యవహరించే ఈ సొసైటీకి వైస్ చైర్మన్‌గా ఆర్టీసీ ఈడీతో పాటు, మరో ముగ్గురు అధికారులు సభ్యులుగా ఉంటారు. ఇదిలా ఉండగా ఆర్టీసీలో సొసైటీ ఎన్నికల హడావుడి ఇప్పటికే మొదలైంది. హామీలు నెరవేర్చాం.. మరోసారి అవకాశం ఇవ్వండి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ తమ సభ్యులతో విజయవాడలో బుధవారం సమావేశం నిర్వహించింది. ఈయూ నేతృత్వంలోని పాలక మండలి.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి విశేషంగా కృషి చేసిందని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, దామోదరరావు చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు. సొసైటీకి రావాల్సిన బకాయిలను చెల్లించేందుకు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు బుధవారం హామీ ఇవ్వడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మరిన్ని సేవలందించేందుకు ఈయూ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. ఎన్ఎంయూ అభ్యర్థులను గెలిపించండి సొసైటీ ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) అభ్యర్థులను గెలిపించాలని ఆ సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి కోరారు. విజయవాడలో ఎన్ఎంయూ బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకవర్గం వైఫల్యంతో కుటుంబ నేస్తం, జనతా వ్యక్తిగత బీమా పథకాలు రద్దయ్యాయని విమర్శించారు. సొసైటీకి సంస్థ నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టలేకపోయారని విమర్శించారు. -
కారుణ్య నియామకాలు 30లోగా పూర్తి
సాక్షి, అమరావతి: కారుణ్య నియామకాల ప్రక్రియను ఈ నెల 30లోగా పూర్తి చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులిచ్చారు. కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబసభ్యులకు ఉద్యోగాలిచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆర్టీసీ సంస్థ వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విధి విధానాలు, షెడ్యూల్‌ను నిర్దేశిస్తూ ఎండీ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నియామక ప్రక్రియ ఇలా.. ► ఆర్టీసీ రీజనల్ మేనేజర్లు తమ పరిధిలోని అర్హుల దరఖాస్తుల పరిశీలనను ఈ నెల 20లోగా పూర్తి చేస్తారు. ► జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగుల ఎంపికను జోనల్ సెలక్షన్ కమిటీలు ఈ నెల 23లోగా పూర్తి చేస్తాయి. ► కండక్టర్, డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు ఎంపికను రీజనల్ కమిటీలు ఈ నెల 25లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ► ఎంపికైన వారికి ఈ నెల 27లోగా వైద్య పరీక్షలు చేస్తారు. ► జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు.. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ ఉద్యోగాలకు రీజనల్ మేనేజర్లు ఈనెల 30లోగా నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. అనంతరం శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ► కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు అర్హులైనవారు లేకపోతే ఎక్స్‌గ్రేషియా అందిస్తారు. క్లాస్–4 ఉద్యోగి కుటుంబానికి రూ.5 లక్షలు, నాన్‌గెజిటెడ్ అధికారి స్థాయి కుటుంబానికి రూ.8 లక్షలు, గెజిటెడ్ అధికారి స్థాయి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తారు. ఉద్యోగ సంఘాల హర్షం.. కారుణ్య నియామకాల ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, పి.దామోదరరావు, నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.