curruption
-
‘అమృత్ టెండర్లలో రేవంత్ కుటుంబీకుల భారీ అవినీతి’: KTR
హైదరాబాద్, సాక్షి: అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబీకులు భారీ అవినీతిని పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమృత్ టెండర్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ నిన్న(శుక్రవారం) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు రాసిన లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.‘‘ఈరోజు అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ ఎలాంటి అర్హతలు లేకున్నా దొడ్డిదారిన రూ. 1137 కోట్ల పనుల దక్కించుకున్న పత్రాలు ఇవిగో.ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీని రంగంలోకి దించి టెండర్లలో తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులను దక్కించుకున్న రేవంత్ రెడ్డి కుటుంబం. ఆ తర్వాత ఇదే కంపెనీతో తన సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ. ఇదే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు అప్పజెప్తుంది.ప్రజలకు అందుబాటులో ఉంచకుండా చీకటి వ్యవహారాన్ని నడుపుతుంది.అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన టెండర్ల పైన పూర్తిస్థాయి విచారణ జరిపి, టెండర్లు దక్కించుకున్న ప్రతి కంపెనీ వివరాలను బయటపెట్టాలి. 9 నెలలుగా రాష్ట్ర లోని అవినీతి పూరిత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ప్రతి టెండర్ పైన విచారణ జరిపి సమీక్ష చేసి అక్రమాలు జరిగిన ప్రతి టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి టెండర్ల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా’’ అని పేర్కొన్నారు.SCAM Alert - AMRUT Tenders I wrote a letter to Union Ministers Shri Manohar Lal Khattar Ji (@mlkhattar) and Shri Tokhan Sahu Ji (@tokhansahu_bjp) regarding corruption in AMRUT tendersContracts were awarded to Chief Minister Revanth Reddy's Brother-in-law, Srujan Reddy’s… pic.twitter.com/pqgz7aLBGR— KTR (@KTRBRS) September 21, 2024చదవండి: కోకాపేటపై హైడ్రా ఫోకస్.. కూల్చివేతలు షురూ -
karnataka: కాంగ్రెస్‌పై సొంత పార్టీ నేత తీవ్ర విమర్శలు
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి బి శివరాము సొంత పార్టీపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపైనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే అవినీతి పెరిగిపోయిందని మండిపడ్డారు. గత బీజేపీ ప్రభుత్వంలో 40 శాతం అవినీతి జరిగిందని ప్రశ్నించిన కాంగ్రెస్.. అంతకంటే ఎక్కువగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. తన సొంత జిల్లా హసన్‌లోనే ఈ అవినీతి.. బీజేపీ హాయాంలోని 40 శాతం కంటే అధికంగా పెరిగిపోందన్నారు. ఈ విషయాన్ని తాను నేరుగా సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు చేస్తున్న అవినీతిపై పార్టీ కార్యకర్తల్లో సైతం తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. తాను అవినీతి విషయంలో చాలా స్పష్టంగా తన అభిప్రాయాలు తెలియజేస్తున్నానని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన పలువురు నేతల్లో కూడా ఇదే అభిప్రాయం ఉందని తెలిపారు. పార్టీలో కొంతమంది చేస్తున్న అవినీతిపై చర్చ జరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతినకుండా.. ఎప్పటికప్పుడు పార్టీ నేతలపై నిఘా ఉంచాలని అన్నారు. తాను సొంతపార్టీ నేతల అవినీతిపై బహిరంగ వ్యాఖ్యలు చేస్తే చెడ్డవాడిగా ముద్రవేస్తారని తెలుసని అన్నారు. కానీ, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల కోసమే తాను మాట్లాడుతున్నానని తెలిపారు. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే మాజీ ఎమ్మెల్యే శివరాము.. అధికారంలో ఉన్న సొంత పార్టీపై అవినీతి ఆరోపణలు చేయటం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం గానీ.. సీఎం సిద్ధరామయ్య గాని ఎలా స్పందిస్తారో చూడాలి. చదవండి: ఢిల్లీలో ఆప్, బీజేపీ హోరాహోరీ నిరసనలు -
రానున్న పూర్వవైభవం.. ఏసీబీ మళ్లీ దాడులకు సిద్ధం!
సాక్షి, ఆసిఫాబాద్: ఎన్నికల నియమావళి అమల్లో ఉండటం.. సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడం.. తదితర కారణాలతో ప్రభుత్వ శాఖల్లో పనులు నత్తనడకన జరగడంతో ఇటీవల అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) జోరు తగ్గింది. ప్రజల నుంచి పెద్దగా ఫిర్యాదులు కూడా లేకపోవడంతో కేసుల కోసం తడుముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి.. కొత్త సర్కారు కొలువుదీరింది. పరిపాలన మళ్లీ గాడిన పడింది. ఏసీబీ బాస్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టాక.. ఏసీబీకి మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో ఏసీబీ అధికారులు మళ్లీ దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఫిర్యాదులతోపాటు సొంతంగా దాడులు చేసేందుకు అవకాశమున్న ‘ఆదాయానికి మించి ఆస్తులు’ కేసులపై ఈ విభాగం దృష్టి సారిస్తోంది. ఎన్నికలతో విరామం.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటివరకు రెండు ఏసీబీ దాడులు జరిగాయి. రెబ్బెన మండల సర్వేయర్, చైన్‌మెన్ రూ.10 వేలు, రూ.20 వేల లంచం తీసుకొంటూ చింతలమానెపల్లి ఎస్సై ఏసీబీకి దొరికిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఏసీబీ దాడులు నమోదు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల పర్వంతో రెవెన్యూ, పోలీసు, రవాణా, రిజిస్ట్రేషన్లు, పౌరసరఫరాలు తదితర కీలక శాఖల సిబ్బంది ఆ విధుల్లో మునిగిపోయారు. పింఛన్లు, భూముల పట్టాల మంజూరు, వివిధ రకాల అనుమతుల ప్రక్రియలు మందగించాయి. ప్రజలకు సంబంధించిన ప్రభు త్వ కార్యాలయాల్లో పనులన్నీ దాదాపు స్తంభించాయి. దీని వల్ల ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు కూడా చాలా తగ్గాయని ఏసీబీ సిబ్బంది చెబుతున్నారు. ఫిర్యాదుల ఆధారంగానే ఉద్యోగులపై నిఘా పెట్టి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి వీలవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, లంచాల కోసం ఎవరైనా డిమాండ్ చేసినా తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. ‘వారి’పై ప్రత్యేక దృష్టి.. ప్రస్తుతం ఫిర్యాదులు(ట్రాప్)లతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు(డీఏ) కలిగి ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏసీబీ భావిస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో లెక్కకు మిక్కిలిగా సంపాదించుకుంటున్న సిబ్బంది, బినామీ పేర్లతో ఆస్తులు వెనకేసుకున్న ఉద్యోగులు, ఇక్కడే ఏళ్ల తరబడి తిష్టవేసి, పాడి ఆవుల్లాంటి విభాగాల్లో పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగులపై ఈ విభాగం దృష్టి సారిస్తోంది. అవినీతికి బానిసలైన అధికారుల అక్రమ ఆస్తులపై, బినామీలపై ఏసీబీ రహస్యంగా నిఘా వేయనున్నట్లు సమాచారం. ఇవి చదవండి: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో నిర్లక్ష్యం -
తపాలా నిద్ర.. అక్రమాల ముద్ర
సాక్షిప్రతినిధి, కాకినాడ: పోస్టాఫీసు అంటే నమ్మకానికి చిరునామా. పల్లెల నుంచి నగరం వరకు ఏ చిన్న ఉత్తరం వచ్చినా భద్రంగా అందజేసి విశ్వసనీయత చాటుకునే వ్యవస్థగా మంచి పేరు. ఆధునిక పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరాల పాత్ర లేకపోవటంతో పోస్టాఫీసులు బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టాయి. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ)పేరుతో పల్లెల్లో బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాంకుల మాదిరి అన్ని నగదు లావాదేవీలు చేపడుతోంది. అయితే ఈ వ్యవహారాపై పర్యవేక్షణ, జవాబుదారీతనం కొరవడిందనే విమర్శ ఇటీవల బలంగా వినిపిస్తోంది. ఉన్నతాధికారుల అజమాయిషీ అంతంతమాత్రంగా ఉంటోందని తెలుస్తోంది. ఫలితంగా కొన్ని బ్రాంచిల్లో పోస్టుమాస్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఖాతాదారుల సొమ్ముకు ఎసరు పెడుతున్నారు. ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు బ్రాంచిల్లో వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కొవ్వూరు మండలం ధర్మవరం బ్రాంచిలో పోస్టుమాస్టర్ ఏకంగా నకిలీ పాస్‌పుస్తకాలు తయారుచేసి కోటిన్నర లూటీ చేయడం పోస్టల్శాఖనే ఒక్క కుదుపు కుదిపేసింది. జిల్లాల పునర్విభజనకు ముందు నుంచి బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తోన్న బ్రాంచిల్లో ఎక్కడోచోట ఈ బాగోతాలు బయటపడి ఖాతాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. బయటపడిన కొన్ని బాగోతాలు ఈ ఏడాది మేలో అమలాపురం పోస్టల్ డివిజన్ పరి«ధిలోని అయినవిల్లి మండలం విలస సబ్ పోస్టాఫీసు ఐపీపీబీలో రూ.1.18 కోట్లు దుర్వినియోగమయ్యాయి. హెడ్ పోస్టాఫీసులో సిస్టమ్ అడ్మిని్రస్టేటర్ ఖాతాదారుల సొమ్ములను సన్నిహితులు, బంధువుల ఖాతాలకు బదిలీచేసి అక్రమానికి పాల్పడ్డాడు. ఇందులో ఇద్దరు పోస్టల్ అసిస్టెంట్లు సస్పెండయ్యారు. ఆరుగురికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సూత్రధారి సిస్టమ్ అడ్మినిస్టేటర్ ఇప్పటికీ పరారీలో ఉండటం విస్మయాన్ని కలిగిస్తోంది. డిజిటల్ సంతకాల పాస్ వర్డ్‌లను తెలుసుకుని సిస్టమ్ అడ్మి్రస్టేటర్ అక్రమాలకు పాల్పడ్డాడని గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో 70 మంది ఖాతాదారులు మోసపోయిన వైనం ఆరు నెలల క్రితం బయటపడింది. డిపాజిట్ సొమ్ము డ్రా చేసేందుకు వెళ్లేసరికి అసలు ఖాతాల్లో సొమ్ములు లేవని తేలడంతో వీరంతా నివ్వెరపోయారు. బాధితులు తాడేపల్లిగూడెం హెడ్‌పోస్టాఫీసుకు ఫిర్యాదు చేయగా విచారణ జరుగుతోంది. నల్లజర్ల మండలం చీపురుగూడెంలో ఖాతాదారు ల డిపాజిట్లను పాస్‌బుక్‌లో నమోదు చేసినా ఐపీపీబీ ఖాతాల్లో జమ చేయలేదు .కల్లూరు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ చిగురుపల్లి గోవర్థన్ తన ఖాతాలో డిపాజిట్ సొమ్ము లేదని గుర్తించడంతో బ్రాంచి పోస్టుమాస్టర్ ఇందిర అవినీతి వ్యవహారం బహిర్గతమైంది. విచారణ జరుగుతోంది. గోకవరం సబ్ పోస్టాఫీసులో తపాలా ఉద్యోగి (జీడీఎస్–పేకర్) ఐపీపీబీ ఖాతాల నుంచి రూ. 20 లక్షలు కాజేసిన వైనాన్ని గతేడాది డిసెంబర్లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. డమ్మీ డిపాజిట్లతో లక్షల్లో విత్‌డ్రా చేసి తపాలా శాఖకు షాక్ ఇచ్చాడు. తాజాగా కొవ్వూరు మండలం ధర్మవరం బ్రాంచిలో పోస్టు మాస్టర్ ఖాతాదారులకు కుచ్చుటోపీ వేశారు. పోస్టు మాస్టర్ ఎస్కే మీరావలి నిర్వాకంతో సుమారు 750 మంది డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. పెదవేగి ఆనందరావు ధర్మవరం బ్రాంచిలో డిపాజిట్ చేసిన రూ.5లక్షలు కొవ్వూరు ప్రధాన కార్యాలయంలో పరిశీలిస్తే జమ కాలేదని తేలడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు కోటి రూపాయలు దాటి ఉంటుందని తెలుస్తోంది. దీనిపై అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ విచారిస్తున్నారు. 2002లో అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయంలో ఇందిరా వికాస్ పత్రాలు(ఐకేపీ) పేరుతో రూ.1.50 కోట్లు దురి్వనియోగమయ్యాయి. గడువుతీరిన ఐకేపీ పత్రాలను అడ్డం పెట్టుకుని సొమ్ము కాజేయడం అప్పట్లో సంచలనమైంది. ఇద్దరు పోస్టల్ ఉద్యోగులను తొలగించారు. ఐదుగురిని సస్పెండ్ చేశారు. 31 మందిని బాధ్యులుగా నిర్ధారించి జీతాల నుంచి రికవరీ చేశారు. 81 మంది బాధితుల్లో నలుగురు ఇప్పటికే చనిపోయారు. నిరంతర పర్యవేక్షణ బ్రాంచిల్లో ఐపీపీబీల కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణతో అవకతవకలకు తావులేకుండా చూస్తున్నాం. ప్రతి నెలా నాలుగైదు బ్రాంచిల్లో ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నాం. నాతో పాటు నలుగురు ఇనస్పెక్టర్లు, సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి ఐపీపీబీ ఖాతాదారుల పాస్‌పుస్తకాలు, రికార్డులను పరిశీలిస్తున్నాం. బ్రాంచి పోస్టాఫీసులకు వెళ్లి పరిశీలన జరిపే వరకు కూడా బృందం తనిఖీలకు వెళుతున్న సమాచారం గోప్యంగా ఉంచుతాం. కాకినాడ జిల్లాలో షెడ్యూల్ ప్రకారం చేస్తుండబట్టే అవకతవకలకు ఆస్కారం ఉండటం లేదు. నాగేశ్వరరెడ్డి, పోస్టల్ సూపరింటెండెంట్, కాకినాడ ఇలా చేస్తే అడ్డుకట్ట ఐపీపీబీ డివిజన్‌కు ఒక కార్యాలయం మాత్రమే ఉంది. దీంతో పెద్దగా పర్యవేక్షణకు ఆస్కారం ఉండటం లేదు. ఇక్కడ ఉద్యోగులను కూడా అవుట్ సోర్సింగ్‌లో తీసుకుంటున్నారు. ఐపీపీబీ కార్యాలయాల్లో సిబ్బందిని పోస్టల్ బ్రాంచ్ కార్యాలయాలు, సబ్ పోస్టాఫీసులకు అనుసంధానం చేయటంలో లోపాలున్నాయి. తరచూ పోస్టల్ డిపాజిట్లు, అకౌంట్లపై అధికారుల తనిఖీలు ఉండాలి. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు పోస్టల్ కార్యాలయాల్లో రికార్డులనే కాకుండా క్షేత్ర స్థాయికి వెళ్లి ఖాతాదారుల పాసుపుస్తకాలను కూడా తనిఖీ చేయాలి. వాణిజ్య బ్యాంక్‌ల మాదిరిగానే పోస్టల్ ఖాతాదారుల మొబైళ్లకు మెసేజ్ అలర్టు ఉన్నప్పటికీ నిధులు కాజేసే కొందరు ఉద్యోగులు ఈ మెసెజ్ రాకుండా సర్వర్‌ను నియంత్రిస్తున్నారని తెలుస్తోంది. ఈ విధానాన్ని కట్టడి చేయాల్సి ఉంది.పాస్‌వర్డు కింది స్థాయి సిబ్బందికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకిలా మోసం జరుగుతోంది... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐపీపీబీలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడమే ప్రధాన కారణం. సబ్ పోస్టాఫీసును సూపరింటిండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోసాఫీసెస్ వంటి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. వీరు సబ్ పోస్టాఫీసు, పోస్టాఫీసులను ప్రతి మూడు, అరు నెలలకు తనిఖీ చేస్తున్నా ఐపీపీబీ ఖాతాల ఆన్లైన్ లావాదేవీలపై దృష్టి పెట్టడం లేదు. ఈ విధానమే బ్రాంచి స్థాయిలో అవకతవకలకు ఆజ్యం పోస్తోందని తెలుస్తోంది. తపాలా ఉద్యోగులు, ఐపీపీబీ పర్యవేక్షకుల మధ్య సమన్వయం లేకపోవడం కొంప ముంచుతోంది. ఐపీపీబీ రాక ముందు (పోస్టల్ లావాదేవీలు ఆన్లైన్ కాక ముందు) తపాల కార్యాలయాల ద్వారా సేవింగ్స్ బ్యాంకు, రికరింగ్ డిపాజిట్, ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతాలను తెరిచేవారు. ఆఫ్‌లైన్‌లో లావాదేవీలు జరిగేటప్పుడు ఈ తరహా అవకతవకలు చోటుచేసుకోలేదు. ఆన్లైన్, ఐపీపీబీ వ్యవస్థ వచ్చాక ఖాతాల నుంచి సొమ్ము మాయవుతుండటం ఉన్నత స్థాయి వైఫల్యంగానే కనిపిస్తోంది. -
ఏసీబీకి చిక్కిన పంచాయతీ ఉద్యోగి
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): నవళగుంద పంచాయతీ ఉద్యోగి తలాటి ప్రదీప్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వివరాలు... ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కూలిన ఇళ్లకు ప్రభుత్వం పరిహారం అందజేస్తోంది. ఈ క్రమంలో పంచాయతీ పరిధిలోని ఓ బాధితుడు పరిహారం కోసం దరఖాస్తు చేయగా పంచాయతీ ఉద్యోగి ప్రదీప్ రూ. 15 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు నగదు అందజేస్తున్న సమయంలో ఏసీబీ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
సాక్షి, తూర్పుగోదావరి(ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలో పనిచేసే ఉద్యోగి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఏసీబీ రాజమండ్రి డీఎస్పీ రామచంద్రరావు కథనం ప్రకారం.. ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామానికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ గాది వరప్రసాద్ 2016లో రూ.9.5 లక్షల వ్యయంతో అన్నవరం రైల్వేస్టేషన్‌కు ఎదురుగా గల దేవస్థానం పొలంలో రేకుల షెడ్డు నిర్మాణ కాంట్రాక్ట్‌ను టెండర్ ద్వారా పొందాడు. పని పూర్తయ్యాక అతడికి కాంట్రాక్ట్ తాలుకు బిల్లులు చెల్లించారు. నిబంధనల ప్రకారం ఈఎండీ మొత్తం రూ.40,646 దేవస్థానం వద్ద డిపాజిట్లో ఉంచారు. ఈ మొత్తాన్ని కాంట్రాక్ట్ పూర్తయిన రెండేళ్ల తరువాత తిరిగి చెల్లించాల్సి ఉంది. దీంతో కాంట్రాక్టర్ గాది వరప్రసాద్ నాలుగు నెలలుగా ఈఎండీ మొత్తాన్ని ఇవ్వమని ఇంజినీరింగ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈనెల 19న ఇదే పనిపై ఇంజినీరింగ్ విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ చిక్కాల సాయిబాబాను కలిశాడు. రూ.ఐదు వేలు ఇస్తే తప్ప డిపాజిట్ రిఫండ్ ఇవ్వడం కుదరదని సాయిబాబా చెప్పడంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం అడిగినట్టుగా సాయిబాబా వాయిస్ రికార్డు కూడా కాంట్రాక్టర్ సమర్పించడంతో దానిని పరిశీలించి సాయిబాబాపై నిఘా ఉంచామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. గురువారం ఉదయం కాంట్రాక్టర్ వరప్రసాద్ సాయిబాబాకు కెమికల్ పూసిన రూ.500 నోట్లు ఇవ్వగా, తాము దాడి చేసి పట్టుకున్నామన్నారు. లంచం స్వీకరించిన నిందితుడు సాయిబాబాను అరెస్ట్ చేసి రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం ఇవ్వమని డిమాండ్ చేస్తే సెల్:9440446160కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్లు తిలక్, మోహన్‌రావు, పుల్లారావు, ఎస్సై నరేష్, కానిస్టేబుళ్లు ఈ దాడి లో పాల్గొన్నారు. విసిగి ఫిర్యాదు చేశా: కాంట్రాక్టర్ గాదె వరప్రసాద్ నిరుద్యోగంతో వేగలేక చిన్నచిన్న కాంట్రాక్టులు చేసుకుని జీవిస్తున్న తనను అన్నవరం దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు ఈఎండీ ఇవ్వకుండా వేధించారని కాంట్రాక్టర్ గాదె వరప్రసాద్ విలేకర్లకు తెలిపారు. తాను ఈఎండీ సొమ్ము ఇవ్వమని ఇంజినీరింగ్ ఆఫీసు చుట్టూ ఆరు నెలలుగా తిరుగుతున్నానని తెలిపారు. ఇంతకు ముందు గుమస్తా కూడా ఈఎండీ ఇవ్వాలంటే కొంచం ఖర్చువుద్ది అని చెప్పాడని తెలిపారు. దాంతో మూడు నెలలు ఆగి మరలా వస్తే ఇప్పుడున్న గుమస్తా చిక్కాల సాయిబాబా కూడా రూ.ఐదు వేలు లంచం ఇవ్వనిదే పని జరగదని చెప్పాడని తెలిపారు. దాంతో ఏసీబీ ని ఆశ్రయించినట్టు తెలిపారు. దేవస్థానంలో కాంట్రాక్ట్ చేసినట్టుగా ‘ఎక్స్పీరియన్స్’ సర్టిఫికెట్ ఇవ్వమని 2018లో ఇంజినీరింగ్ అధికారులను, అప్పటి ఈఓను అడిగినా ఇవ్వలేదని తెలిపారు. అదే విధంగా ఇంజినీరింగ్ కార్యాలయం సమీపంలో నిలిపి ఉంచిన తన మోటార్ సైకిల్ చోరీ జరిగిందని దీనిపై దేవస్థానం అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని కాంట్రాక్టర్ వరప్రసాద్ వాపోయారు. దీంతో విసిగి వేసారి సిబ్బందిలో కొంతైనా మార్పు వస్తుందనే ఇలా చేశానని తెలిపారు. -
కే ట్యాక్స్‌పై అసెంబ్లీలో చర్చిస్తాం
నరసరావుపేట రూరల్: ‘కోడెల ట్యాక్స్’ (కే టాక్స్)పై రాష్ట్ర అసెంబ్లీలో చర్చించనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి సాగించిన అవినీతి, అక్రమాలపై శాసనసభలో చర్చిస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోడెల కుటుంబం అవినీతిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే 19 కేసులు నమోదయ్యాయని వివరించారు. ఈ అక్రమాలపై అసెంబ్లీలో చర్చించిన అనంతరం దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తన కుటుంబంపై కక్ష సాధింపులో భాగంగా కేసులు నమోదు చేస్తున్నారని మాజీ స్పీకర్ కోడెల పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎందుకంటే, కే టాక్స్ బాధితులందరూ తెలుగు దేశం పార్టీకి చెందిన వారేనని గుర్తు చేశారు. కళ్ల ముందు కనిపిస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకుంటూ వైఎస్సార్సీపీపై అభాండాలు వేయడాన్ని మానుకోవాలని కోడెలకు హితవు పలికారు. కోడెల అక్రమాలన్నింటిపై విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. అలాగే పట్టణంలోని ట్రాఫిక్ ఆంక్షలపై టీడీపీ నేతలు విమర్శించడం తగదని హితవు పలికారు. ప్రజలకు ఇబ్బందులు కలిగే మార్పులను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. అలాగే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ప్రజా సంక్షేమ బడ్జెట్ అని ఎమ్మెల్యే గోపిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని రంగాలకు కేటాయింపులు జరిపారన్నారు. -
పట్టుకుంటే చాలు అవినీతి షాక్!
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ మంగళవారం విజయవాడ విద్యుత్ సౌధ కార్యాలయంలో భేటీ అయింది. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) మాజీ సీఎండీ పి.గోపాల్ రెడ్డి చైర్మన్‌గా ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం రెండు గంటలపాటు సాగింది. 45 రోజుల వ్యవధిలో ప్రభుత్వం సూచించిన ప్రాజెక్టులను ఏ విధంగా పరిశీలించాలి? అవినీతి కోణాన్ని గుర్తించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కమిటీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, సమాచార సేకరణకు అవసరమైన ఏర్పాట్లు.. తదితర అంశాలపై సమావేశంలో చైర్మన్, సభ్యులు రామారావు (ట్రాన్స్‌కో గ్రిడ్ ఆపరేషన్స్ మాజీ డైరెక్టర్), ప్రొఫెసర్ ఉషా రామచంద్ర (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్), రాజ్‌గోపాల్ రెడ్డి (ఆర్థిక నిపుణులు, ఏపీఈఆర్ మాజీ సభ్యుడు), సీహెచ్‌వీఎస్ సుబ్బారావు (ట్రాన్స్‌కో ప్లానింగ్ సీజీఎం) సమగ్రంగా చర్చించారు. ఎవరికి ఎంత అందిందో ఆరా.. ట్రాన్స్‌కోలో అవసరం లేకున్నా కమీషన్ల కోసమే విద్యుత్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అప్పు చేసి మరీ అనుకూలమైన సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చారు. ఇందుకోసం నిబంధనలను ఇష్టానుసారం మార్చారు. కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే అర్హత సంపాదించేలా జాగ్రత్త పడటంలో అప్పటి అధికారులు అన్ని విధాల టీడీపీ ప్రభుత్వానికి సహకరించారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఏపీ జెన్కోలో రెండు థర్మల్ ప్రాజెక్టుల ఈపీసీ కాంట్రాక్టులను దేశంలో ఎక్కడా లేని విధంగా కొన్ని సంస్థలకు కట్టబెట్టి, విద్యుత్ పంపిణీ సంస్థలను దండుకునే కేంద్రాలుగా గత ప్రభుత్వం మార్చేసింది.డెప్యూటేషన్‌పై ట్రాన్స్‌కోకు వచ్చిన ఓ అధికారి అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై సమగ్రంగా విచారణ జరపాలని కమిటీ నిర్ణయించింది. విద్యుత్ శాఖలో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు అధికారుల అవినీతి, బినామీ వ్యవహారాలపై కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. దీన్ని కూడా లోతుగా పరిశీలించే వీలుంది. అతి ముఖ్యమైన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, స్వల్పకాలిక, రోజువారీ విద్యుత్ కొనుగోళ్లలో ఎవరికి ఎన్ని ముడుపులు అందాయనేది ఆరా తీయబోతున్నారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఏళ్ల తరబడి అదే విభాగంలో ఉన్న అధికారుల ఆస్తులపై కూడా వివరాలు అందినట్లు తెలిసింది. ప్రతి ప్రాజెక్టులోనూ మాజీ ముఖ్యమంత్రి, ఆయన తనయుడి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని ఆధారాలతో వెలికితీయాలని కమిటీ నిర్ణయించింది. అవినీతిపైనే ప్రధాన దృష్టి.. గత ఐదేళ్లలో విద్యుత్ రంగం పూర్తిగా అవినీతి మయమైంది. ట్రాన్స్‌కో, జెన్కో ప్రాజెక్టుల విషయంలో భారీగా ముడుపులు చేతులు మారాయి. ఉన్నతాధికారుల దగ్గర్నుంచి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన తనయుడికి భారీగా ముడుపులు అందాయనే విమర్శలొచ్చాయి. ఈ అవినీతి వ్యవహారాలను ఐదేళ్లుగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలతో వెలుగులోకి తెచ్చింది. బొగ్గు కొనుగోళ్లు, థర్మల్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు, ట్రాన్స్‌కోలో కొంతమందికే అనుకూలంగా టెండర్ నిబంధనలు రూపొందించిన తీరును ఎప్పటికప్పుడు వెలికితీసింది. దీనిపై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనూ, బయట పెద్దఎత్తున పోరాడారు. తాము అధికారంలోకి రాగానే అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, బాధ్యులైన వారిని శిక్షిస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. -
అక్రమాల్లో ఇంద్రుడు!
సాక్షి, కర్నూలు : విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. ఎప్పుడూ డబ్బుపైనే ధ్యాస.. పథకాల పేరుతో అందినకాడికి రైతుల నుంచి వసూళ్లు.. ప్రభుత్వం కేటాయించిన దాణా, ఇతర ఇన్పుట్స్ లబ్ధిదారులకు అందజేయకుండా మెక్కేయడం.. ఇదీ ఆత్మకూరు మండలంలోని ఓ పశువైద్యాధికారి వ్యవహార శైలి. సంబంధిత ఏడీ, డీడీలు ఈయన పనితీరుపై రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. పశుసంవర్ధక శాఖ 50 శాతం సబ్సిడీపై పాడిగేదెలు, దాణా, దాణామృతం, సైలేజ్ గడ్డి వంటి వాటిని పంపిణీ చేస్తోంది. ఈ పథకాల అమలులో ఆ వైద్యుడు పాల్పడిన అక్రమాలపై రైతులు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వీరపాండియన్ ఈనెల 8న ఆత్మకూరు ప్రాంతానికి వెళ్లారు. జిల్లాకు చెందిన వారితో పాటు ఆత్మకూరు మండల అధికారులందరూ కలెక్టర్ వెం ట ఉన్నా ఈ పశువైద్యాధికారి మాత్రం పత్తా లేరు. రైతులను హర్యానాలో వదిలి... 2018–19కి సంబంధించి పాడి గేదెలను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేశారు. ఈయన తన పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మంది రైతుల నుంచి పాడిగేదెల యూనిట్ల పంపిణీకి ఒక్కొక్కరి నుంచి రూ.15వేలు నాన్స్ సబ్సిడీ మొత్తం రూ.3.60 లక్షలు వసూలు చేశారు. నిబంధనల ప్రకారం ఈ మొత్తాన్ని డీడీ తీసి పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయంలో అప్పగించాలి. పాడి గేదెలను హర్యానా, ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల్లోనే రైతుల సమక్షంలోనే కొనుగోలు చేయాలి. నాన్ సబ్సిడీ మొత్తానికి కార్యాలయంలో అప్పగించకుండా స్వాహా చేసి రైతులను హర్యానా రాష్ట్రానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత జేడీ కార్యాలయం అధికారులు విషయం తెలుసుకొని డీడీ లేకపోవడంతో డాక్టర్‌కు ఫోన్ చేశారు. డీడీ బీరువాలో పెట్టి మరిచి వచ్చానని.. వచ్చిన వెంటనే అప్పగిస్తానని నమ్మించే ప్రయత్నం చేశారు. ముందు డీడీ అప్పగించే ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే పాడిగేదెలు బేరం చేయాలని ఆదేశించారు. దీంతో రైతులను హర్యానా రాష్ట్రంలో వదిలి చెప్పాపెట్టకుండా వచ్చేశారు. రైతులు తిప్పలు పడి సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. రైతుల నుంచి వసూలు చేసిన నాన్ సబ్సిడీ మొత్తం ఇప్పటికీ చెల్లించలేదు. ఈ నెల చివరి వరకు ఓపీ రికార్డు పూర్తి... ఈ నెల 8న ఆత్మకూరు ప్రాంతానికి వెళ్లిన కలెక్టర్ వెంట పశుసంవర్ధక శాఖ జేడీ కూడా వెళ్లారు. డాక్టర్ లేకపోవడంతో పశువైద్యశాలకు వెళ్లి ఓపీ రికార్డు పరిశీలించారు. నెలకు సంబంధించిన చికిత్సల వివరాలతో ముందుగానే నింపేసి ఉండటాన్ని చూసి జేడీ అవాక్కయ్యారు. కోళ్ల దానాను వదల్లేదు వివిధ గ్రామాలకు చెందిన వారికి పశుసంవర్ధక శాఖ కోళ్లు పంపిణీ చేస్తుంది. కోళ్లకు దాణా, ఇతర ఇన్పుట్స్ ఇస్తారు. ఇందిరేశ్వరం తదితర గ్రామాల వారికి కోళ్లు పంపిణీ చేశారు తప్ప దాణా, ఇతర ఇన్పుట్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడంపై ఆరా తీస్తే అమ్మేసుకున్నట్లు తేలిందని రైతులు వాపోతున్నారు. -
‘దేవుడి’ సొమ్ముకే టెండర్
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. టెండర్లు పిలువకుండానే, లక్షలాది రూపాయల మేర అభివృద్ధి పనులను కొందరు అధికారులు గుట్టుచప్పుడు కాకుండా జరిపించేస్తున్నారు. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారనేది పక్కనబెడితే, దీని వల్ల లక్షలాది రూపాయల మేర దేవుడి సొమ్ము దుర్వినియోగమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సాధారణంగా రూ.30 వేలు పైబడి ఖర్చు చేసే ఏ పనికైనా దేవస్థానం మాన్యువల్ టెండర్‌ను పిలవాలి. అలాగే లక్ష రూపాయలు పైబడి జరిగే పనులకు ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్‌ను పిలిచి, ఎవరు తక్కువకు టెండర్ వేస్తే.. వారికే పనులను అప్పగించాలి. ఇలా చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో, సకాలంలో పనులు పూర్తవడంతో పాటు, పనుల్లో నాణ్యత కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆ నిబంధనలేవీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. అత్యవసరం పేరుతో 90 శాతం అభివృద్ధి పనులను ఎటువంటి టెండర్లూ లేకుండానే చకచకా కానిచ్చేస్తున్నారు. తమకు కావాల్సిన వారికి అధికారులు పనులను అప్పగించి, వారికి సొమ్ములను ముట్టచెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే వ్యక్తికి పనులు అప్పగింత ద్వారకాతిరుమలలో దాదాపు ఐదు జేసీబీలు ఉండగా, ఎప్పుడూ ఒక జేసీబీ యజమానికే దేవస్థానం ఇంజినీరింగ్ విభాగ అధికారులు పనులను అప్పగిస్తున్నారు. ఈ విషయంలో గతేడాది సెప్టెంబర్ 7న ఇద్దరు జేసీబీ యజమానులకు, దేవస్థానం అధికారులకు మధ్య ఘర్షణ కూడా జరిగింది. చివరకు ఆ గొడవ రోడ్డుపైనే సెటిల్మెంట్ అయ్యింది. అయినా అధికారులు తమకు అనుకూలంగా ఉన్న ఆ జేసీబీ యజమానికే ఇప్పటికీ టెండర్లు లేకుండా పనులను అప్పగించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షలాది రూపాయలపైబడి జరిగిన పనులకు సైతం రూ.30 వేలు లోపు, పలు బిల్లులను పెడుతూ ఆ వ్యక్తికే లబ్ధి చేకూరుస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీవారి శేషాచలకొండపై ఇటీవల జేసీబీతో జరుగుతున్న పనులు తక్కువ పని చేసినా.. జేసీబీ దాదాపు 4 గంటలు పనిచేస్తే, 10 గంటలు పనిచేసినట్లు బిల్లుల్లో చూపుతూ, గంటకు రూ.వెయ్యి వరకు అధికారులు ఆ వ్యక్తికి నగదు చెల్లింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. జేసీబీ ఎంత సమయం పనిచేసిందనే దాన్ని రీడింగ్ రూపంలో సంబంధిత సిబ్బంది లాక్‌బుక్ రాయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే దేవస్థానం బిల్లులను చెల్లించాల్సి ఉంది. అయితే ఈ పనులకు ఎటువంటి లాక్‌బుక్ లేనట్లు తెలుస్తోంది. తక్కువ పనిచేసినా.. ఎక్కువ పనిచేసినట్లు సిబ్బంది చేప్పే, ఒట్టి నోటి మాటల ద్వారానే, పెద్ద మొత్తంలో బిల్లులు ఒకే వ్యక్తికి ఇవ్వడం వల్ల చినవెంకన్న సొమ్ముకు గండి పడుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మొక్కల పెంపకానికి, ఇతర పనులకు మట్టిని తోలే పనులను సైతం అదే వ్యక్తికి అప్పగించినట్లు స్పష్టమవుతోంది. ఇలా అన్ని పనులూ దాదాపుగా ఒకే వ్యక్తికి అధికారులు అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటో ఆ చినవెంకన్నకే తెలియాలి. ఇప్పటికైనా అధికారులు నిబంధనలను పాటించి, అభివృద్ధి పనులకు టెండర్లను పిలవాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. దీనిపై ఆలయ ఈఓ దంతులూరి పెద్దిరాజును వివరణ కోరేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
ఇదీ అవినీతి రంగు!
ఏలూరు(సెంట్రల్): కాంట్రాక్టర్లతో చేతులు కలిపిన నగరపాలక సంస్థ అధికారులు స్వచ్ఛందంగా ప్రైవేట్ సంస్థలు చేసిన పనులకు డబ్బులు డ్రా చేసేందుకు కుయుక్తులు పన్నారు. బిల్లులు సిద్ధం చేశారు. ఈ ఉదంతం నగరపాలక సంస్థలో చర్చకు దారితీసింది. ఈ బిల్లుల తయారీలో నగరపాలక సంస్థ కీలక విభాగంలోని ఓ ముఖ్య అధికారి ప్రత్యేక పాత్ర పోషించినట్టుగా సమాచారం. అసలేం జరిగింది.. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల గోడలు, ఫ్లైఓవర్లు, వంతెనలు, డివైడర్ల గోడలపై కొందరు వాల్‌పోస్టర్లు, సినిమా పోస్టర్లు అంటించడం, ఇతర ప్రకటనల రంగులు వేయడం చేస్తున్నారు. దీనివల్ల అవి అధ్వానంగా తయారవుతున్నాయి. దీనిపై ఎట్టకేలకు కళ్లు తెరిచిన నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు సంబంధిత వ్యక్తులకు, సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు. అయినా మార్పు రాకపోవడంతో అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, వంతెనలు, ఫ్లైఓవర్ల గోడలను సుందరంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని తలంచారు. సుందరీకరణలో భాగంగా 3డీ బొమ్మలు, రంగులు వేయాలని నిర్ణయించారు. రంగులు, 3డీ డిజైన్లను వేసేందుకు నగరపాలకసంస్థ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి ఈ ఏడాది జనవరిలో టెండర్లను పిలిచారు. విశాఖపట్నానికి చెందిన ఓ కాంట్రాక్టర్ కాంట్రాక్టును దక్కించుకున్నట్లు సమాచారం. స్వచ్ఛందంగా చేసిన వ్యాపార సంస్థలు.. అయితే 3డీ డిజైన్లు, బొమ్మలు వేసేందుకు నగరంలోని పలు వ్యాపారసంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. నగరపాలకసంస్థ కార్యాలయం, నగరపాలకసంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న దామరాజు వెంకట్రావు పంతులు పార్కు, కర్రల వంతెన, లోబ్రిడ్జి, ప్రభుత్వాస్పత్రి, ఓవర్ బ్రిడ్జి గోడలకు వివిధ రకాల డిజైన్లతో కూడిన బొమ్మలను వేసి, వారి వ్యాపార సంస్థల పేర్లను వాటి పక్కనే వేసుకున్నారు. ఇదంతా ఉచితంగానే చేశారు. కాంట్రాక్టరే చేసినట్టుగా బిల్లులు అయితే ఈ పనిని కాంట్రాక్టరే చేసినట్టుగా నగరపాలక సంస్థ అధికారులు బిల్లుల కాజేతకు యత్నిస్తున్నట్టు సమాచారం. దీనిలో భాగంగా రూ.8.14 లక్షలకు బిల్లు తయారు చేసినట్టుగా తెలుస్తోంది. నగరంలోని గోడలకు ప్రైవేట్ సంస్థలు రంగులు వేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా.. కాంట్రాక్టరే రంగులు వేసినట్లు అధికారులు బిల్లులు సిద్ధం చేయడంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే దీనిపై చర్యలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రైవేట్ సంస్థల సౌజన్యంతోనే.. నగరంలోని డివైడర్లు, ప్రభుత్వ కార్యాలయాల గోడలకు పోస్టర్లను అంటించి అధ్వానంగా చేస్తున్నారు. దీంతో గోడలపై ఎటువంటి పోస్టర్లను వేయకుండా ఉండేలా 3డీ బొమ్మలు, రంగులు వేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశాం. అయితే వీటిని వేసేందుకు నగరంలోని వ్యాపారసంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో వాటితోనే రంగులు, బొమ్మలు వేయించాం. ఈ పనికి నగరపాలకసంస్థ నిధులు ఏమీ ఖర్చు చేయలేదు. బిల్లులు సిద్ధం చేసినట్టుగా నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేస్తాం. –ఎ.మోహన్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్ -
పోలవరం భూ బాగోతంలో మరో అవినీతి
-
పోలవరం భూ బాగోతంలో మరో అవినీతి
సాక్షి, పశ్చిమగోదావరి : పోలవరం భూ బాగోతంలో మరో అవినీతి బయపడింది. దాదాపు 13 కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకున్నట్లు తెలిసింది. పోలవరంలో తెలుగు తమ్ముళ్ల అవినీతిపై గత నాలుగైదు నెలలుగా సాక్షి టీవీలో వరుస కథనాలు ప్రచురితమవడంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. సాక్షి కథనాలతో విచారణ చేపట్టిన ఐటీడీఏ పీఓ హరీంద్రయ ప్రసాద్ దాదాపు రూ. 13 కోట్ల మేర అవినీతి జరిగినట్లు గుర్తించారు. జంగారెడ్డి గూడెం మండలం తాడువాయి, చల్లా వారి గూడెం, మంగి శెట్టి గూడెం తదితర గ్రామాల్లో సేకరించిన 1000 ఏకరాల భూమిలో తెలుగు తమ్ముళ్ల అవినీతి బట్ట బయలైంది. రాళ్ల క్వారిలో జీడిమామిడి తోట ఉన్నట్లు.. పామాయిల్ తోటలో కోకో తోటలు ఉన్నట్లు, లేని టేకు, వేప చెట్లను ఉన్నవాటిగా నమెదు చేసి కోట్ల రూపాయలు మింగిన వైనం తెరమీదకొచ్చింది. పోలవరంలో జరిగిన అవినీతి నిరూపణ కావడంతో పీఓ హరీంద్రయ ప్రసాద్ ఇప్పటికే 8 మంది ఉద్యోగులను సస్సెండ్ చేశారు. దాంతో పాటు కొందరు టీడీపీ నేతలకు రికవరీ నోటీసులు పంపించి.. సొమ్ము చెల్లించపోతే కఠిన చర్యలుంటాయిని హెచ్చరించారు. అయితే అవినీతికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు మీన మేషాలు లెక్కిస్తుండటం గమనార్హం. -
‘టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు’ : మధుయాష్కీగౌడ్
సాక్షి, నిజామాబాద్ అర్బన్: తెలంగాణ ఫైబర్ గ్రిడ్‌లో భారీ అవినీతి చోటు చేసుకుందని, కేసీఆర్ తన కుటుంబ సభ్యుల పేరిట భారీ అవినీతికి పాల్పడ్డారని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ మండిపడ్డారు. ఆదివారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌లో మూడు సంస్థలకు కాంట్రాక్టు అప్పగించారని, అందులో కేటీఆర్ కుటుంబీకులే ఉన్నారన్నారు. తన ఫ్యా మిలీకే కాంట్రాక్టు అప్పగించి కోట్లల్లో అవినీతికి పాల్పడ్డారన్నారు. జాగృతి పేరిట, బతుకమ్మ పేరిట ఇతర రాష్ట్రా ల్లో సైతం డబ్బులు వసూలు చేసిందన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లె వద్ద జైరాంరెడ్డికి వంద ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌గా మార్చి ఆ యనకు అప్పగించారని, ఇందుకుగాను ఎక్స్పో కంపెనీ క వితకు భారీగా ముడుపులు అందించారన్నారు. కేసీఆర్ తన ఫౌమ్‌హౌస్‌లో వందలాది బోర్లు వేయగా చుట్టు పక్కల రైతు లు నీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. మహాకూటమి నిశ్శబ్ధ విప్లవంగా వస్తుందని, క చ్చితంగా అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్‌కే పట్టంకట్టనున్నారని పేర్కొన్నారు. -
‘రాష్ట్ర విభజనకు అనుకూలమని చెప్పింది ఈయనే’
సాక్షి, విజయనగరం: ఏపీలో టీడీపీ ప్రభుత్వం దోచుకుందాం.. దాచుకుందాం అనే రీతిలో పరిపాలన కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గురువారం విజయనగరంలో వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయనతో పాటు, పెనుమత్స సాంబ శివరాజు, కోలగట్ల వీర భద్రస్వామి, పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశం అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. పట్టణానికి చెందిన రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయ్ క్రిష్ణ రంగారావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజులపై నిప్పులు చెరిగారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. సుజయ్.. దందాలు చేసుకోవడానికే బొబ్బిలి రాజావారూ జిల్లా అభివృద్ది కోసం పార్టీ మారుతున్నామన్నారు. ఈ మూడు సంవత్సరాలలో ఈ అభివృద్ది చేశామని ధైర్యంగా చెప్పండి. తలదించుకుని మీ మందు నిలబడతా. ఆస్తులు కాపాడుకోవడానికి, దందాలు చేసుకోడానికి మీరు పార్టీ మారారు సుజయ్. ఇక అశోక్ గజపతిరాజు మీరు జిల్లాకు చేసింది శూన్యం. కేంద్ర మంత్రిగా ఉండి హోదా కోసం ఎప్పుడైనా మాట్లాడారా? కాంగ్రెస్ మోసం చేసిందని తీవ్ర ఆరోపణలు చేసి.. నేడు అదే కాంగ్రెస్‌తో ఎలా జతకడతారు? రోశయ్య మీటింగ్‌లో రాష్ట్ర విభజనకి అనుకూలమని చెప్పింది ఈయన గారే. భోగా పురం ఏయిర్పోర్టు టెండర్లు రద్దు చేసి ప్రయివేట్ వారికి ముడుపులు తీసుకుని అప్పజెప్పాలను కోవడం వాస్తవం కాదని.. మీ ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ముందు ప్రమాణం చేసి చెప్పే ధైర్యం ఉందా? ఇంటికో రేటు.. పెన్షన్‌కో రేటు వసూలు మేం జిల్లా కేంద్రంలో జేఎన్టీయూ, ఆంధ్రా యునివర్సిటీ, కాలేజీలు, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశాం.. మీరేం తెచ్చారో చెప్పండి? పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి రామతీర్థ సాగర్ని మా హయాంలో మొదలు పెట్టాం. టీడీపీ నేతలు నేటికి పూర్తి చేయలేకపోయారు. ఇంటికో రేటు పెన్షన్‌కో రేటు పెట్టి వసూలు చేస్తున్నారు. టీడీపీ నాయకులు తాతగారి ఆస్తుల్లా 1300 కోట్లు అప్పనంగా చెల్లించారని కాగ్ బయటపెట్టింది. సీఎంకి ప్రయివేట్ సంస్థలకు వాటాలు నప్పకే అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం తేలట్లేదు. తోటపల్లి వద్ద పడుకుని పూర్తి చేశానని చంద్రబాబు అనడం హాస్యాస్పదం. సంక్షేమ రాజ్యం రావాలంటే.. ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసి వారికి ఓ భరోసాని ఇవ్వడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. 11 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని విజయనగరం జిల్లాకు చేరుకోనున్నారు. వైఎస్ జగన్‌కు కుర్చి మీద తపన ఆరోపణలు చేస్తున్నారు. నిజం జగన్‌కి కుర్చి కావాలి. పదవి ద్వారానే ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయగలరు. సంక్షేమ రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలి.. కావాల్సిందే. విజయనగరం జిల్లాలో జననేత మూడు వేల కిలోమీటర్ల మైలురాయికి చేరుకోవడం చారిత్రాత్మకం. -
నవాజ్ షరీఫ్‌కి భారీ ఊరట
-
బాబు పాలనలో అందరికీ కష్టాలే
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘రావాలి జగన్...కావాలి జగన్’ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో తాము పడుతున్న ఇబ్బందులను జనం వైఎస్సార్సీపీ నేతల వద్ద ఏకరువు పెడుతున్నారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం గొటుకూరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, యువజన విభాగం నాయకులు ప్రణయ్‌రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి జనంతో మాట్లాడారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువ జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి మొదలుకుని కార్యకర్త వరకు దోచుకోవడం తప్ప ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోలేదన్నారు. ధర్మవరం పట్టణం ఒకటో వార్డు శాంతినగర్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబును నమ్మి ఓట్లేస్తే డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదంటూ పలువురు మహిళలు వెంకటరామిరెడ్డితో వాపోయారు. మోసం చేసిన టీడీపీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం యర్రయ్యగారిపల్లి, చుండురోళ్లపల్లిలో హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు శంకరనారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఒక్క హామీ అమలు చేయకుండా దోచుకోవడమే పనిగా పెట్టుకున్న టీడీపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మడశికర నియోజకవర్గం గుండుమలలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను నెరవేర్చక అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేశారని తిప్పేస్వామి అన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సయుక్త కార్యదర్శి రంగేగౌడు పాల్గొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. జగన్ సీఎం అయితే చేపట్టే పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. కదిరి నియోజకవర్గం తలుపుల మండలం ఈదులకుంట్లపల్లిలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి, సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం మోసం చేసిన వైనాన్ని గ్రామస్తులు నాయకుల వద్ద వాపోయారు. కళ్యాణదుర్గం పట్టణం ఇందిరమ్మకాలనీలో నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్, పట్టణ కన్వీనర్ గోపారం శ్రీనివాసులు కార్యక్రమం నిర్వహించారు. ఏళ్ల తరబడి బుట్టలు అల్లుకుని జీవిస్తున్నామని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని మహిళలు వాపోయారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలూ అభివృద్ధి చెందుతాయని ఉషశ్రీచరణ్ వారికి భరోసా ఇచ్చారు. -
నవాజ్ షరీఫ్ జైలు శిక్ష రద్దు: విడుదల
ఇస్లామాబాద్: అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు.. ఇస్లామాబాద్ హైకోర్టు ఉపశమనం ఇచ్చింది. అవెన్‌ఫీల్డ్ కేసులో షరీఫ్ (68), ఆయన కూతురు మర్యం, అల్లుడు రిటైర్డ్ కెప్టెన్ ముహ్మద్ సఫ్దార్‌ల జైలు శిక్షను నిలిపివేస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. దీంతో బుధవారం రాత్రి ఈ ముగ్గురినీ విడుదల చేశారు. రావల్పిండి ఎయిర్‌బేస్ నుంచి ప్రత్యేక విమానంలో లాహోర్‌కు పటిష్టమైన భద్రత నడుమ తరలించారు. విడుదలకు ముందు జైలు సూపరింటెండెంట్ గదిలో తన సన్నిహితులతో ‘నేనేం తప్పు చేయలేదు. అది నా అంతరాత్మకు తెలుసు. ఏది సత్యమో అల్లాకు తెలుసు’ అని షరీఫ్ అన్నట్లు పాక్ మీడియా పేర్కొంది. లండన్‌లోని అవెన్‌ఫీల్డ్ ప్రాంతంలో ఖరీదైన బంగళాలు కొన్నారన్న కేసులో తమను జైల్లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ షరీఫ్, కూతురు, అల్లుడు ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. -
పోలవరం, పట్టిసీమపై చర్చకు సిద్ధం
సాక్షి, రాజమహేంద్రవరం: పోలవరం, పట్టిసీమ, అమరావతి బాండ్లు, పేదల ఇళ్ల నిర్మాణానికి అధిక ధర, రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడున్నాయి.. తదితర అంశాలపై చర్చకు తాను ఎప్పుడు.. ఎక్కడకు రావాలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కోరారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి బాండ్లలో అవినీతి జరిగిందన్నది తన వాదన కాదని, 10.36 శాతం ఎక్కువ వడ్డీకి ఎందుకు తీసుకున్నారనేదే తన వాదనని పునరుద్ఘాటించారు. వడ్డీ 8 శాతానికి మించి తీసుకోకూడదని జీవో జారీచేసిన ఆరు నెలలకే 10.36 శాతానికి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. చెల్లింపులపై ఆడిట్ అభ్యంతరాలివిగో.. రాజధాని మీటింగ్‌కు మోదీ వచ్చినప్పుడు రూ.4.98 లక్షల ఖర్చవగా.. అందులో కాంట్రాక్టర్ ప్రాఫిట్ అని రూ.70 లక్షలు ఇచ్చినట్టు రాశారని తెలిపారు. బిల్డింగ్లు కట్టడం కోసం రూ.53.74 కోట్లకు షెడ్యూల్ ఆఫ్ రేట్లు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందని, అయితే పల్లోంజి కంపెనీ రూ.103.42 కోట్లకు, ఎల్ అండ్ టీ అయితే రూ.106 కోట్లు ఇస్తే చేస్తామని చెప్పాయని.. నిబంధనల ప్రకారం ఐదు శాతం ఎక్కువ వస్తే టెండర్లు రద్దు చేయాల్సి ఉందన్నారు. కానీ వాళ్లను బేరానికి పిలిచి 25 శాతం అదనంగా చెల్లించేందుకు రెండు పనులు, 26 శాతం అదనానికి ఒక పని కేటాయించడంపై ఆడిట్ కార్యాలయం ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టులో పనులు చేయకుండా.. చేసినట్లు చూపించి రూ.101 కోట్లు చెల్లించారని 2018 జూలై 10న పోలవరం పే అండ్ అకౌంట్ అధికారి.. ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు లేఖ రాసిన విషయం నిజం కాదని కుటుంబరావు చెప్పాలన్నారు. -
ఆదరణ స్కీమ్‌లో అవినీతి...
-
అవినీతి ధార
అక్రమ కుళాయిలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులేఅక్రమాలకు పాల్పడుతున్నారు. భవన యజమానుల నుంచిఅక్రమంగా నగదు వసూలు చేసి నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీంతో అక్రమ కుళాయిలు వేల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.3 కోట్లునష్టం వాటిల్లుతోంది. ఈ వ్యవహారంలో ఫిట్టర్లుకీలకప్రాత పోషిస్తున్నారు. నెల్లూరు సిటీ: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 1.50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం కార్పొరేషన్ పరిధిలో 32,200, విలీన పంచాయతీల్లో 6,000 కుళాయిలు ఉన్నాయి. నెల్లూరు నగరంలోని కుళాయిలకు రూ.2,400, పంచాయతీల్లోని కుళాయిలకు రూ.1,200 పన్ను రూపంలో వసూలు చేస్తున్నారు. అలాగే 765 కమర్షియల్ భవనాల నుంచి ఏడాదికి రూ.40 లక్షలు వసూలవుతోంది. కార్పొరేషన్‌కు ఏడాదికిమొత్తం రూ.8 కోట్లు ఆదాయం వస్తోంది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 15 వేలకు పైగా అక్రమ కుళాయిలు ఉన్నట్లు అంచనా. వీటి వల్ల కార్పొరేషన్ రూ.3.60 కోట్లకు పైగా ఆదాయం కోల్పోతుంది. అధికారులు ఆన్లైన్ చేశామని, అక్రమ కుళాయిలు లేకుండా చేస్తామని ప్రకటనలు చేసినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ఫిట్టర్లు భవన యజమానుల నుంచి భారీగా వసూలు చేసి ఇష్టారాజ్యంగా అక్రమ కుళాయిలకు కనెక్షన్లు ఇస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగంలోని ఓ అధికారికి ఫిట్టర్లు ప్రతి నెలా రూ.లక్ష ఇవ్వాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నగదు అందుతుండడంతో పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. రెసిడెన్షియల్ భవనాలకు ఇంటి కుళాయి ఉన్నట్లు సృష్టించారు. నగరంలోని రెసిడెన్షియల్ భవన యజమానుల నుంచి ప్రతి ఏటా లక్షలు వసూలు చేస్తున్నారు. అర్హత లేని వారికి.. కార్పొరేషన్ పరిధిలో ఫిట్టర్లు 22 మంది పని చేస్తున్నారు. వారిలో కేవలం ఎనిమిది మంది మాత్రమే ఐటీఐ విద్యను పూర్తి చేశారు. మిగిలిన 14 మందికి సరైన విద్యార్హత లేదని తెలుస్తోంది. ప్రజారోగ్యానికి సంబంధించిన నీటి సరఫరాలో టెక్నికల్ సబ్జెక్ట్ కచ్చితంగా తెలిసి ఉండాలి. అయితే కార్పొరేషన్ ఉన్నతాధికారులు నిబంధనలకు తూట్లు పొడుస్తూ అనర్హులకు పోస్టింగ్‌లు ఇచ్చినట్లు విమర్శలు ఉన్నాయి. ఎక్కడైనా నీటి పైప్‌లైన్ పగిలితే సమస్యను పరిష్కరించడంలో వారు విఫలమవుతున్నారు. భలే డిమాండ్ కార్పొరేషన్లో ఫిట్టర్ పోస్ట్‌కు మంచి డిమాండ్ ఉంది. ఒక్కో పోస్ట్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అధికారులకు, పాలకవర్గానికి ముట్టజెబుతున్నారని సమాచారం. ఇటీవల ఓ పోస్ట్‌కు ఇంజినీరింగ్ విభాగంలోని ఉన్నతాధికారికి రూ.70 వేలు అందినట్లు ఆ శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అక్రమ కుళాయిలపై విజిలెన్స్ కన్ను అక్రమ కుళాయిలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. వాటిని క్రమబద్ధీకరించాల్సిన ఫిట్టర్లే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారు తప్ప కుళాయి కనెక్షన్లు కార్పొరేషన్ నీటి పైప్‌లైన్ నుంచి ఇవ్వలేరు. ఫిట్టర్ కింద ఉండే సిబ్బంది ద్వారా రాత్రికి రాత్రే తవ్వకాలు జరిపి బిగిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై వారు విచారణ చేస్తున్నారు. ఫిట్టర్ సస్పెన్షన్ అక్రమ కుళాయిల ఏర్పాటుకు సహకరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ అనే ఫిట్టర్‌ను ఇటీవల కమిషనర్ అలీంబాషా సస్పెండ్ చేశారు. ఇదే క్రమంలో మరో ఫిట్టర్‌పై కూడా ఫిర్యాదులు రావడంతో విచారించి సస్పెండ్ చేయనున్నట్లు తెలిసింది. -
అవినీతి @ 5% ప్రపంచ జీడీపీ
ఐక్యరాజ్యసమితి: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు అవినీతే మూల కారణమనీ, ఈ జాడ్యం కారణంగా ప్రపంచ జీడీపీలో 5 శాతానికి సమానమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ అన్నారు. హింస, ఘర్షణలు, అస్థిరత, ఆయుధాలు, మాదకద్రవ్యాలు, మానవుల అక్రమ రవాణా తదితర అనేక సమస్యలు అవినీతి వల్లే రోజురోజుకూ పెరిగిపోతున్నాయని చెప్పారు. లంచగొండితనం కారణంగా హింస పెచ్చరిల్లుతుండటం, అంతర్జాతీయంగా శాంతి భద్రతలను కాపాడేందుకు అవినీతిని అంతమొందిచటం అనే అంశాలపై ఐరాస భద్రతా మండలి సోమవారం నిర్వహించిన సమావేశంలో గ్యుటెరస్ మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) అంచనాలను ఆయన ఉటంకిస్తూ.. అవినీతి కారణంగా ప్రపంచం 2.6 ట్రిలియన్ డాలర్ల మేర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. అక్రమ నగదు రవాణా, పన్ను ఎగవేతల కారణంగానే అవినీతి రోజురోజుకూ పెరిగిపోతోందనీ, ఈ నేరాలను అరికట్టేందుకు అన్ని దేశాలూ సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని గ్యుటెరస్ కోరారు. జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్లను ఏర్పాటుచేసి, విచారణ జరపడం అత్యంత ఆవశ్యకమనీ, స్వతంత్ర న్యాయవ్యవస్థ, మీడియా స్వేచ్ఛ, అవినీతిని బయటపెట్టే సామాజిక కార్యకర్తలకు రక్షణ ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రపంచ దేశాలకు సూచించారు. ‘అవినీతి అన్ని దేశాల్లోనూ ఉంది. ధనిక–పేద, ఉత్తర–దక్షిణ, అభివృద్ధి చెందిన–అభివృద్ధి చెందుతున్న.. ఇలా ప్రపంచంలోని ప్రతీ దేశంలోనూ అవినీతి ఉంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం వ్యక్తులు, వాణిజ్య సంస్థలు ఏడాదికి ఒక ట్రిలియన్ డాలర్ల కన్నా ఎక్కువే లంచం ఇస్తున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
సబ్‌ప్లాన్ పనులకూ.. అధికార చీడ!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతలు ఏ పనులనూ వదలడం లేదు. అన్నీ తమకే అప్పగించాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మౌలిక సదుపాయాలైన రోడ్లు, మురికి కాలువలు వంటి పనులకు పిలిచిన టెండర్లను తెరవొద్దంటూ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. దీంతో టెండరు గడువు పూర్తయి సుమారు నెల రోజులు కావస్తున్నా వాటిని కర్నూలు కార్పొరేషన్ అధికారులు తెరవడం లేదు. తన వారికి దక్కలేదన్న కారణంగా అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో టెండర్లు తెరవడం లేదని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సంబంధించి కోట్లాది రూపాయల విలువైన పనులకు సకాలంలో టెండర్లు పిలవలేదంటూఏకంగా మునిసిపల్ డైరెక్టర్ రద్దు చేసినప్పటికీ వ్యవహారంలో మాత్రం మార్పు రావడం లేదు. మునిసిపల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సుమారు రూ.4.5 కోట్లతో మూడు వేర్వేరు టెండర్లను ఈ ఏడాది జూలై 21న పిలిచారు. వీటికి బిడ్లు సమర్పించే గడువు ఆగస్టు 13తో పూర్తయ్యింది. ఈ టెండర్లలో పలు సంస్థలు పాల్గొన్నాయి. అయితే, అధికార పార్టీ నేతకు అనుకూలంగా ఉన్న వ్యక్తికి దక్కలేదనే కారణంగా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి మరీ టెండర్లు తెరవకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధులు వెనక్కి వెళుతున్నా... ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పనులకు సంబంధించిన టెండర్లను త్వరగా పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో సబ్‌ప్లాన్ నిధులను సకాలంలో ఖర్చు చేయలేదన్న కారణంతో వెనక్కి తీసుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.300 కోట్ల మేర నిధులను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది. జిల్లాలో కూడా రూ.20 కోట్ల మేర వెనక్కి వెళ్లాయి. ఇప్పుడు కూడా రూ.4.5 కోట్ల పనులకు టెండర్లను పిలిచి 50 రోజులకు పైగా అయ్యింది. బిడ్లను సమర్పించి కూడా నెల రోజులు కావస్తోంది. అయినప్పటికీ టెండర్లను మాత్రం తెరవడం లేదు. అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో అధికారులు కిమ్మనకుండా ఉండిపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి సబ్‌ప్లాన్ పనులకు సంబంధించిన టెండర్లు ఆలస్యం కాకుండా చూడాలని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ కర్నూలు కార్పొరేషన్లో మాత్రం అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో గడువు ముగిసినా టెండర్లను తెరవని పరిస్థితి నెలకొంది. రంగంలోకి ఇతర కాంట్రాక్టర్లు! సబ్‌ప్లాన్ టెండర్లను తెరవకపోవడంతో కొద్ది మంది మునిసిపల్ కాంట్రాక్టర్లు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. సదరు నేత వద్దకు వెళ్లి.. టెండర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అయినప్పటికీ ఆ నేత ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. టెండరులో పనులు దక్కే కాంట్రాక్టర్‌ను మీ వద్దకు తీసుకొస్తామని పేర్కొన్నప్పటికీ అంగీకరించలేదని సమాచారం. కేవలం తన మనుషులకు మాత్రమే పనులు దక్కించుకునేందుకు ఈ విధంగా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
తప్పుడు ఎన్నికల అఫిడవిట్ అవినీతి చర్యే
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడాన్నీ అవినీతి చర్యగానే పరిగణించాలని సుప్రీంకోర్టు సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే, అలాంటి వ్యక్తులపై ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసేలా చట్టం తీసుకురావాలని పార్లమెంటును ఆదేశించలేమని సోమవారం స్పష్టం చేసింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పులను సీరియస్‌గా పరిగణించాలంటూ బీజేపీ నేత, సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావుల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పిటిషన్లన్నింటినీ ఒకేసారి విచారిస్తామని పేర్కొంది. ‘తప్పుడు ఎన్నికల అఫిడవిట్ విషయంలో సీరియస్‌గా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాం. తప్పుడు వివరాలు పొందుపరచడం నైతికంగా తప్పే. కానీ.. ఈ దిశగా సరైన చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని ఆదేశించలేం. అవినీతి చర్యల్లో దీన్ని కూడా చేర్చాలని పార్లమెంటుకు సూచించలేం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. జాతీయ లా కమిషన్ కూడా తన 244వ నివేదికలో ఈ అంశాన్ని పేర్కొందని.. ఎన్నికల కమిషన్ కూడా రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు ఇలాంటి చర్యలు తప్పవని ప్రతిపాదించిన విషయాన్ని ఉపాధ్యాయ తరపు న్యాయవాది.. రాణా ముఖర్జీ కోర్టుకు గుర్తుచేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125 (ఏ) ప్రకారం తప్పుడు అఫిడవిట్ సమర్పించిన వారికి ఆర్నెళ్ల జైలుశిక్ష విధించాలని చెబుతోందన్నారు. అయితే.. ఈ చట్టంలోని 123లో ఉన్న అవినీతి చర్యల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడాన్ని చేర్చనందునే ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. -
అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అవినీతిపై విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గత నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ చేసిన అవినీతిపై విచారణ జరిపిస్తామని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వివిధ సాగునీటి ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనకు కేం ద్రం భారీగా నిధులిస్తే సొమ్మొకడిది సోకొకడిది అన్న చందంగా కేంద్రం ఇచ్చే నిధులతో కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఎన్ని రకాలు గా దుష్ప్రచారం చేసినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ నిర్మాణాత్మక శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీలకు లోపాయి కారీ ఒప్పందం ఉందన్న ప్రచారాన్ని దత్తాత్రేయ తిప్పికొట్టారు. కేసీఆర్‌తో బీజేపీకి ఎప్పటికీ మితృత్వం ఉండదన్నారు. కాంగ్రెస్‌తో పొత్తుకు వెంపర్లాడుతున్న చంద్రబాబు ఎప్పటికీ స్వయం ప్రకాశవంతుడు కాలేరన్నారు. దత్తాత్రేయతో పాటు రాజస్థాన్ ప్రభుత్వ సలహాదారు వెదిరే శ్రీరాం తదితరులు ఉన్నారు. -
లంచాల కోసం.. ఏకంగా కార్యాలయం!
వేలూరు (తమిళనాడు): లంచాలు వసూలు చేసేందుకు ఏకంగా కార్యాలయాన్నే నడపడంతో పాటు 38 మంది సిబ్బందిని నియమించుకున్నాడు ఓ అధికారి. విజిలెన్స్ తనిఖీల్లో గుట్టు బయటపడటంతో కటకటాల పాలయ్యాడు. తమిళనాడులోని వేలూరు సత్‌వచ్చారిలో టౌన్‌ప్లానింగ్ జోన్ అసి స్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో సుబ్రమణియన్ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా పనిచేస్తున్నారు. వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో అనుమతిలేని ఇళ్ల స్థలాలు, పరిశ్రమలకు అనుమతులిస్తూ ఉంటాడు. అక్కడి సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో శుక్రవారం కార్యాలయంలో విజిలెన్స్ డీఎస్పీ శరవణకుమార్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సత్‌వచ్చారిలోని వివేకానందనగర్‌లో సుబ్రమణియన్.. ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కార్యాలయం ఏర్పాటు చేసి ఓ రిటైర్డ్ అధికారిని నియమించుకున్నాడు. ఆయన కింద 37మంది సిబ్బందిని నియమించి లంచాలు తీసుకుంటున్నట్లు విచారణలో తేలింది. సోదాల్లో రూ.3 లక్షల 28 వేల నగదు స్వాధీనం చేసుకుని, సుబ్రమణియన్‌ను అరెస్ట్ చేశారు. -
జేసీపై మండిపడిన టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి
-
‘నిరూపిస్తే నా తల నరుక్కుంటా’
సాక్షి, అనంతపురం: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది టీడీపీలో వర్గ విభేదాలు రోజు రోజుకు బయట పడుతున్నాయి. టీడపీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎంపీ జేసీ దివారక్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... జేసీకి వయస్సు మీద పడింది కానీ బుద్ధి రాలేదని అన్నారు. జేసీకి సభ్యత, సంస్కారం అసలుకు లేవు, అందుకే నీ అమ్మా, అబ్బా అంటూ తిడుతున్నారని ఆరోపించారు. జిల్లాలో దివాకర్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో ఆధికారులను, మీడియాను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తాను తలుచుకుంటే జేసీ కంటే ఎక్కువ తిట్టగలను, కానీ సంస్కారం అడ్డొస్తోందని అన్నారు. నిరుపిస్తే తల నరుక్కుంటా... జేసీ నీకు దమ్ము, దైర్యం ఉంటే తాను అవినీతికి పాల్పడినట్లు నిరుపిస్తే తల నరికేసుకుంటానని ప్రభాకర్ చౌదరి అన్నారు. ఎంపీ దివాకర్ రెడ్డి అవినీతిలో పీహెచ్డీ చేశారని విమర్శించారు. అనంతపురం జిల్లా అభివృద్ధికి జేసీనే అడ్డుపడుతున్నారని వాఖ్యానించారు. తాను ఏ తప్పు చేయలేదని, గన్ మెన్లు లేకుండా నేను తిరిగేందుకు నేను సిద్ధం మీరు సిద్ధామా అని సవాల్ చేశారు. నా సహనానికి ఓ హద్దు ఉంది, నా సహనాన్ని పరీక్షించొదని పరీక్షిస్తే ఖబడ్దారు అని హెచ్చరించారు. జేసీ దివాకర్ రెడ్డి ఆగడాలకు తాను వ్యతిరేకంగా పోరాటం చేస్తానని అన్నారు. జేసీ తాటాకు చప్పళ్లకు బెదిరేది లేదని, దివాకర్ రెడ్డి వైఖరి దొంగే దొంగ అన్నట్లుగా వ్యహరిస్తున్నారని వాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో జేసీ దౌర్జన్యాలను సహించేది లేదు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మానసిక స్థితిపై అనుమానాలు ఉన్నాయి. మేమంతా కలసి జేసీని గెలిపిస్తే తాను మమ్మల్నే బెదిరిస్తున్నారు. ఎంపీ జేసీ వల్ల టీడీపీకి చాలా సష్టం జరుగుతుందని ప్రభాకర్ చౌదరి అన్నారు. -
అవినీతి పాఠం!
జిల్లా విద్యాధికారి కార్యాలయంలో చేయి తడపందే పనులు కావడం లేదు. ఆమ్యామ్యాలిస్తేనే అనుమతులిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లకు అనుమతులు, రెన్యూవల్‌కు రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారు. లేదంటే ఫైళ్లను పెండింగ్‌లో ఉంచేస్తున్నారు. అధికారులు అడిగినంత ముట్టజెబుతున్న స్కూళ్ల నిర్వాహకులు ఆ మేరకు ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దండుకుంటున్నారు. అనంతపురం ఎడ్యుకేషన్: ప్రైవేట్ స్కూళ్ల ఏర్పాటుకు అనుమతులు, ఉన్న స్కూళ్ల గుర్తింపు రెన్యూవల్స్‌కు సంబంధించిన విషయాల్లో డీఈఓ కార్యాలయంలో మామూళ్ల దందా నడుస్తోంది. అక్కడి అధికారుల పనికి బట్టి ఫిక్స్డ్ రేట్లు నిర్ణయించారు. వారు చెప్పిన మేరకు చెల్లిస్తే సరే... అందులో పైసా తగ్గినా ఫైళ్లు ముందుకు కదలవు. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినా.. పెద్దగా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏటా ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి 60–70 పైళ్లు ఇలా డబ్బుతోనేముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు ఇలా... ♦ ప్రాథమిక పాఠశాలను కొత్తగా ఏర్పాటు చేయాలన్నా, ఉన్న స్కూల్ గుర్తింపు రెన్యూవల్ చేసుకోవాలన్నా రూ.2,500 చలానా తీయాలి. ♦ ఉన్నత పాఠశాలకైతే రూ. 5 వేలు చలానా కట్టాలి. ♦ ప్రాథమిక పాఠశాలలైతే ఎంఈఓ, ఉన్నత పాఠశాలలైతే డిప్యూటీ డీఈఓ వెళ్లి... సదరు పాఠశాలలో నిబంధనల ప్రకారం అన్ని వసతులు ఉన్నాయా...? లేదా..? వాటికి సంబంధించి సర్టిణఫికెట్లు పరిశీలించి ధ్రువీకరించుకున్న తర్వాత డీఈఓకు సిఫార్సు చేయాలి. ♦ ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి డీఈఓ అనుమతిలిస్తారు. ♦ ఉన్నత పాఠశాలల ఫైళ్లు డీఈఓ నుంచి రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ, కడప)కి... అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళ్తాయి. అన్నీ సవ్యంగా ఉంటేనే ప్రభుత్వం అనుమతిలిస్తుంది. జరుగుతోందిలా... ♦ ప్రాథమిక పాఠశాలలకైతే ఎంఈఓకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు ఇవ్వాల్సి వస్తోందని పలు పాఠశాలల నిర్వాహకులు చెబుతున్నారు. ♦ ఫైలు అక్కడి నుంచి డీఈఓ కార్యాలయానికి వెళ్లగానే కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు రూ.30 వేలు చెల్లించాలి. ♦ ఉన్నత పాఠశాలలైతే డిప్యూటీ డీఈఓలకు ఐదేళ్ల ఫైళ్లయితే రూ.30 వేలు, పదేళ్ల ఫైళ్లయితే రూ. 60 వేలు ఇవ్వాలట. ♦ అక్కడి నుంచి ఫైలు డీఈఓ కార్యాలయానికి రాగానే అక్కడ వారికి రూ. 30 నుంచి రూ. 40 వేలు ఇవ్వాలి. డబ్బు ముట్టజెబితే తప్ప ఫైలుకు ముందుకు వెళ్లని పరిస్థితి. – ఆర్జేడీ కార్యాలయంలోనూ ఒక్కో ఫైలుకు రూ. 60 వేలు ముట్టజెబితేనే ఫైళ్లు ముందుకు వెళ్తాయని ప్రైవేట్ స్కూళ్ల కరస్పాండెంట్లు వాపోతున్నారు. ♦ పాఠశాల నిర్వహణకు కీలకమైన బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్, సౌండ్నెట్, శానిటరి, ఫైర్ ఎన్ఓసీ, ట్రాఫిక్ ఎన్ఓసీ సర్టిఫికెట్లు పక్కాగా జత చేసినా...వీరికి మామూళ్లు ఇవ్వాల్సిందే. లేదంటే ఫైళ్లకు బూజు పడతాయి. డబ్బులిస్తే మేనేజ్ చేస్తారట పాఠశాల రెన్యూవల్ సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికెట్లు కచ్చితంగా ఇటీవల తీసుకున్నవే ఉండాలి. డీఈఓ కార్యాలయంలో కొందరు సిబ్బంది పాత సర్టిఫికెట్లు జతచేసి వాటితోనే ఫైళ్లను పూర్తి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కీలక అధికారుల పర్యవేక్షణలో ఈ మూమాళ్ల తతంగం నడుస్తోంది. ఏ ఫైలుకు ఎంత ఇవ్వాలనేది ఫిక్స్ చేసింది వారేనని ప్రచారం సాగుతోంది. పాఠశాల అనుమతి, రెన్యూవల్ విషయంలో డీఈఓ కార్యాలయ సిబ్బంది తీరుపై ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లలో చర్చనీయాంశమైంది. విద్యా సంవత్సరం ప్రారంభమైతే విద్యాశాఖలో కొందరికి పండుగే. కొందరు ఎంఈఓలతో పాటు డీఈఓ కార్యాలయంలో రెన్యూవల్స్, అనుమతులకు సంబంధించి ఫైళ్లు చూసే సెక్షన్ల సిబ్బంది సీజన్ ముగిసేదాకా కళకళలాడుతుంటారు. కొసమెరుపు డీఈఓ కార్యాలయంలో దందా చేస్తున్న సిబ్బంది అధికారుల వాటాగా మాత్రం రూ.4–5 వేలు కూడా ఇవ్వడం లేదని తెలిసింది. చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్న చందంగా అధికారుల పేరు చెబుతూ వసూళ్లకు తెర తీస్తుండడం కొసమెరుపు. విచారణ చేయిస్తా ప్రైవేట్ స్కూళ్ల రెన్యూవల్స్, కొత్తగా అనుమతులకు డబ్బులు తీసుకుంటున్న విషయం ఎవరూ నాదృష్టికి తీసుకురాలేదు. అయినా దీనిపై విచారణ చేయిస్తా. కార్యాలయంలో ఎవరైనా సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలితే కఠినంగా వ్యవహరిస్తాం. ఎవర్నీ ఉపేక్షించం. – జనార్దనాచార్యులు, జిల్లా విద్యాశాఖ అధికారి -
దోపిడీ ఫండ్‌గా మారిన సీఎం రిలీఫ్ ఫండ్
-
ఇసుక దందా
ఆదిలాబాద్‌రూరల్: జిల్లాలో ఇసుక దందా మళ్లీ జోరందుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి.. ఇసుక మేటలు వేసింది. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. వాగుల నుంచి నిత్యం వందలాది వాహనాల్లో అక్రమార్కులు దర్జాగా ఇసుక తరలిస్తున్నారు. యథేచ్ఛగా వివిధ ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మైన్స్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఆదిలాబాద్ మండలం లాండసాంగ్వి, అర్లి(బి) శివారు ప్రాంతాల్లోని సాత్నాల వాగు, చాందా(టి), భీంసరి, జైనథ్ మండలం తరోడ, పూసాయి, బేల మండలం పెన్‌గంగ పరీవాహక ప్రాంతాలు, తాంసి, తలమడుగు, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్ తదితర మండలాల్లోని వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లోని వాగుల్లో వర్షాకాలంలో కురిసే వర్షాలతో వాగు ప్రవహిస్తుంది. దీంతో ఆయా వాగు పరీవాహక ప్రాంతంలో రైతులకు సంబంధించి పంట పొలాలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాగుల నుంచి ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తుండడంతో క్రమేణ భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం నెలకొంది. కొన్నేళ్లుగా నిరంతరాయంగా అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటి సాగునీటి వనరులు గణనీయంగా తగ్గిపోతున్నాయని రైతులు పేర్కొంటున్నా ప్రయోజనం లేకుండాపోతోంది. ప్రవాహిస్తున్న వాగుల నుంచి సైతం ఇసుకను తొడేస్తున్నారు. దాడుల సమయంలో పది వాహనాలు పట్టుబడితే వాటిలో కొన్ని వదిలేసి నాలుగైదు వాహనాలకే జరిమానాలు విధిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఆయా గ్రామాల శివారు ప్రాంతాల్లోని ప్రజలు సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినా పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అధికారులు ఎంతమాత్రం కృషి చేయడం లేదు. పగలు రాత్రీ అని తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని ప్రజలు వాపోతున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లతో ఇసుక పట్టణంతోపాటు వివిధ ప్రాంతాలకు తరలిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో భూగర్భజలమట్టం మరింతగా పడిపోయే ప్రమాదం ఉందని ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇసుక అక్రమ రవాణా అరికట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్లు గుంతలమయం ఆయా ప్రాంతాల నుంచి జోరుగా అక్రమ ఇసుక రవాణా సాగుతుండగా.. ట్రాక్టర్ల రద్దీకి రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయి. దీంతో వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్రమంగా ఇసుక రవాణా చేయకూడదని, వాగుల సమీపంలోని పొలాలు ఉన్న రైతులు చెబుతున్నా వారు పట్టిం చుకోవడం లేదని వాపోతున్నారు. కొందరు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారి నుంచి రాయల్టీ రూపంలో ఒక్కో ట్రాక్టర్‌కు రూ.400 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ పనుల పేరుతో.. ప్రభుత్వ పనులు జరుగుతున్నాయని చెప్పి చాలామంది వ్యాపారులు ప్రైవేట్ వారికి ఇసుకను అమ్ముతున్నారు. వ్యాపారులు లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత ఆయా శాఖల రెవెన్యూ అధికారుల దాడులు సైతం అంతంత మాత్రంగానే ఉండడంతో వారి వ్యాపారం జోరుగా సాగుతోంది. నీరుగారుతున్న వాల్టా చట్టం.. భూగర్భ జల వనరుల సంరక్షణకు తీసుకువచ్చిన వాల్టా చట్టం అమలు నీరుగారుతోంది. వాల్టా చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర మినహా మరే ఇతర చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. కళ్ల ముందే అక్రమ ఇసుక రవాణా సాగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారం మూడు ట్రాక్టర్లు ఆరు వేలు అన్న చందంగా సాగుతోంది. మైన్స్, రెవెన్యూ తదితర సంబంధిత శాఖల అధికారులు స్పందించి వాల్టా చట్టం పరిరక్షణకు కృషి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రెవెన్యూ అధికారులే చూసుకోవాలి పలు ప్రాంతాల్లో ఇసుక రవాణా కొనసాగుతున్నట్లు మా దృష్టికి కూడా వచ్చింది. అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గతంలోనే చెప్పాం. వారికి నోటీసులు కూడా జారీ చేశాం. – రవిశంకర్, జిల్లా మైన్స్ అధికారి, ఆదిలాబాద్ -
ఒకేసారి క్రిమినల్, శాఖాపరమైన చర్యలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో అవినీతి అధికారులపై ఏకకాలంలో క్రిమినల్ కేసులతో పాటు శాఖాపరమైన క్షమశిక్షణ చర్యలు చేపట్టవచ్చని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) స్పష్టం చేసింది. కొన్ని అవినీతి కేసుల్లో తీసుకున్న క్రమశిక్షణ చర్యలపై అధ్యయనం తర్వాత అలాంటి కేసుల్లో కోర్టు విచారణ జరుగుతుందన్న సాకుతో శాఖపరమైన చర్యల్లో జాప్యం చేస్తున్నారని సీవీసీ గుర్తించింది. కేసు విచారణలో ఉందన్న సాకుతో కొన్ని విభాగాలు, సంస్థలు అలాంటి వైఖరి అనుసరించడం సరైన విధానం కాదని బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు స్పష్టం చేసింది. -
విద్యుత్ సంస్థలో అవినీతి చీకట్లు!
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) అవినీతి పుట్టగా మారింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కొంత మంది ఇంజినీర్లు ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది సైతం వీరిబాటలోనే నడుస్తున్నారు. దీంతో విసిగిపోయిన వినియోగదారులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలో గ్రేటర్ హైదరాబాద్‌లో ఇద్దరు ఏఈలు, ఒక లైన్మెన్ ఏసీబీకి పట్టుబడ్డారు. అక్రమ మీటర్ల వ్యవహారంలో మరో ముగ్గురి(ఒక ఏఈ సహా లైన్మెన్, ఆర్టిజన్)పై వేటు పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంస్థలో పెరిగిపోయిన అవినీతిని రూపుమాపేందుకు ప్రభుత్వం ఇతర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఈ శాఖ ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచింది. ఆశించిన దానికంటే అధిక మొత్తంలో వేతనాలు పెంచినా అక్రమ వసూళ్ల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం గచ్చిబౌలికి చెందిన లైన్మెన్ ఎ.రాజేందర్ ఓ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డాడు. ఆ తర్వాత ఏడీఈ, ఏఈలను కూడా ఏసీబీ విచారించింది. నిబంధనల ప్రకారం మీటర్లు, ప్యానల్ బోర్డు కోసం నిర్దేశించిన చార్జీలను వినియోగదారులు డిస్కంకు చెల్లించినప్పటికీ నెల రోజులుగా మీటర్లు జారీ చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఇందులో పెద్ద తలకాయల ప్రమేయం కూడాఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పెట్టిన ఖర్చులు సంపాదించుకునేందుకే.. ప్రభుత్వ సంస్థల్లో ఎక్కడా లేని విధంగా డిస్కంలో పనిచేసే ప్రదేశాలను యాజమాన్యమే ‘ఫోకల్.. నాన్ ఫోకల్’ కేటగిరీలుగా విభజించింది. ఆదాయం తక్కువగా ఉన్న ప్రాంతాలను నాన్‌ఫోకల్‌గా, ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఫోకల్‌గా పేర్కొంటున్నారు. బదిలీ సమయంలో ఫోకల్(కొత్త నిర్మాణాలు, కొత్త వెంచర్లు అధికంగా ఉండే ప్రదేశాలు) పోస్టు కోసం ఏఈలు, ఏడీఈలు, డీఈలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. రాజకీయ పెద్దలకు, ఉన్నతాధికారులకు భారీ మొత్తంలో చెల్లించి పోస్టింగ్‌లు పొందడం డిస్కంలో అందరికీ తెలిసిన తతంగమే. ముఖ్యంగా శివారు ప్రాంతలైన గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, సరూర్‌నగర్, చంపాపేట్, శంషాబాద్, హబ్సిగూడ, బోయిన్పల్లి, కూకట్‌పల్లితో పాటు పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం ఇంజినీర్లు పోటీ పడుతుంటారు. పోస్టింగ్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. ఇలా పెట్టిన ఖర్చులను తిరిగి సంపాధించుకునేందుకు ఆ తర్వాత అడ్డదారులు తొక్కతున్నారు. కొత్త మీటర్లు, ప్యానల్ బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్ షిష్టింగ్, రియల్ ఎస్టేట్ వెంచర్లలో కొత్త లైన్ల ఏర్పాటు.. ఇలా ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారు. ఇందుకు క్షేత్రస్తాయి కార్మికులను ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. ఎవరైనా పట్టుబడినప్పుడు తమకేమీ సంబంధం లేదని పెద్దలు తప్పించుకుంటే కిందిస్థాయి సిబ్బందిపై వేటు పడుతోంది. పెద్దల పనికి చిరుద్యోగులు బలి ఓల్డ్ బోయిన్పల్లి సెక్షన్ పరిధిలో రోలింగ్ స్టాక్‌లోని 130 మీటర్లును మాయం చేసి, గుట్టుచప్పుడు కాకుండా వినియోగదారుల నివాసాలకు అమర్చిన ఘటనలో లైన్మెన్ రమేషాచారి సహా ఏఈ వినోద్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు. ఈ విషయంలో ఏడీఈ, డీఈలకు సంబంధం లేదన్నట్లు వదిలేశారు. అదే విధంగా సరూర్‌నగర్ డివిజన్ హయత్‌నగర్ సెక్షన్ పరిధిలో హెచ్‌టీ మీటర్ల జారీలోనూ అక్రమాలు జరిగాయి. ఒకే సర్వీసు నెంబర్‌తో ఉన్న మీటర్‌ను అధిక మొత్తంలో రీడింగ్ నమోదైన ప్రతిసారి సాంకేతిక అంశాలను కారణాలుగా చూపి ఎనిమిదిసార్లు మార్చారు. అంతేగాక డిస్కంను ఏమార్చిన వినియోగదారుల నుంచి వసూలు చేసిన బిల్లులను సొంత ఖాతాలో జమ చేసుకున్నారు. ఈ ఘటనపై ఓ ఆర్టిజన్ కార్మికుపై డిస్కం వేటు వేసి విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఈ అంశంలో సంబంధత డివిజన్ ఉన్నతాధికారులకు ప్రమోయం ఉన్నప్పటికీ వారిపై చర్యలు తీసుకునేందుకు యాజమాన్యం వెనకాడుతుండుతోంది. యాజమాన్యమే అక్రమార్కులకు కొమ్ముకాస్తోందని సంస్థలోని ఉద్యోగులే విమర్శిస్తున్నారంటే ‘డిస్కం’ పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి డీఈ, ఏడీఈ, ఏఈలకు తెలియకుండా కొత్త మీటర్లు, ప్యానల్ బోర్డులు, ట్రాన్స్ఫార్మర్ల మంజూరు సాధ్యం కాదు. ఒకవేళ మంజూరు చేసినా వెంటనే తెలిసిపోతుంది. నిబంధనల ప్రకారం నిర్దేశించిన ఛార్జీలను వినియోగదారుడు సంస్థకు చెల్లించిన తర్వాత గడువులోగా వాటిని మంజూరు చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే కారణాలు అన్వేశించాల్సిన బాధ్యత సదరు ఉన్నతాధికారులదే. ఉన్నతాధికారులే ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని అక్రమాలను ప్రోత్సహిస్తుండడంతో వినియోగదారులు తమ బాధతలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. -
రూ.100 కోట్లు..నో బ్రేక్!
సాక్షి, అమరావతి /తిరుపతి క్రైం: రేణిగుంట చెక్‌పోస్ట్‌లో ఎంవీఐగా పనిచేస్తున్న పసుపులేటి విజయభాస్కర్‌పై ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం అతని ఆస్తులు రూ.4.5 కోట్లు ఉంటాయని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్లపైగానే ఉంటాయని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..పద్మావతిపురం పంచాయతీలోని శ్రీనివాసపురంలో ఉన్న ఇంటితో పాటు, బంధువులు, కుటుంబసభ్యులకు సంబంధించి 16ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బెంగళూరులోని 4 ప్రదేశాల్లో, అనంతరంపురంలో ఓ చోట, చిత్తూరు జిల్లాలో పదిచోట్ల, చెన్నైలోని ఓ ప్రాంతంలో, బంధువులకు చెందిన, బినామీ పేర్లతో సుమారు రూ.8కోట్ల ఆస్తులున్నట్లు గుర్తించారు. వీటితో పాటు రెండు లాకర్లను గుర్తించారు. కడప జిల్లా, నందలూరు మండలం, శేషామాంబపురానికి చెందిన పి.సుబ్బరాయుడు కుమారుడు పి.విజయభాస్కర్ (51) 1993లో అగ్నిమాపకశాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2005లో బదిలీపై రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. పలమనేరు చెక్‌పోస్టు , కడప డీటీసీ ఆఫీసులో 2014 వరకు విధులు నిర్వహించాడు. 2011లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో ఒక టివి చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌కు చిక్కి సస్పెండ్ అయ్యాడు. 2014లో ఇతనికి మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ లభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేణిగుంట ఆర్టీఏ చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్నాడు. గతంలోనూ పలుమార్లు తనిఖీల్లో పట్టుబడిన ఆయనపై ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించడంపై ఆర్సీవో కేసు నమోదు చేశారు. ఇంట్లో వందల కొద్ది పత్రాలు, బాండ్లు, నగదు, వెండి, విలువైన వస్తువులు, వాహనాలను గుర్తించారు. కొంతకాలంగా రాజకీయాల వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఆయన సన్నిహితులు కూడా రాజంపేట ఎమ్మెల్యే టికెట్టు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. విజయభాస్కర్ మొదటి భార్య త్రిపురసుందరి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు. నిందితుడ్ని అరెస్టు చేసి నెల్లూరు కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ ఏఎస్ఈ తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు. గుర్తించిన ఆస్తులివే... - బెంగళూరులోని హోసకేరహళ్లి సర్వేనం.120/3 నిందితుడు పి.విజయభాస్కర్ భార్య త్రిపురసుందరి పేరుతో ఉన్న రూ.228.69లక్షల ఇళ్లస్థలం 20 గుంటలు - బెంగళూరులోని హోసకేరహళ్లి సర్వేనం.120/5 విజయభాస్కర్ పెద్దమ్మ కామాక్షమ్మ , రెండో చెల్లెలు పి.నాగవేణి పేరుతో రూ.81.90లక్షల ఇళ్లస్థలం7.52 గుంటలు - బెంగళూరులోని హోసకేరహళ్లి సర్వేనం.168,ఆర్ఎస్నం.262 విజయభాస్కర్ రెండో చెల్లెలు పి.నాగవేణి పేరుతో రూ.11లక్షల ఇళ్లస్థలం 1.39 ఎకరాలు - కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం ఎర్రగుంటకోటలోని సర్వేనం.902/391/3ఎ1, 1500–2 పచ్చిపుల సుదర్శన్‌కుమార్ పేరుతో రూ.4లక్షల వ్యవసాయ భూమి 7.21 ఎకరాలు - కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం ఎర్రగుంటకోటలోని సర్వే నం 227/2ఎన్2లో పచ్చిపుల వెంకటసుబ్బయ్య పేరుతో రూ.0.20లక్షల 0.37 ఎకరాలు - బెంగళూరులో హోబ్లీ కృష్ణరాజపుర, దేవచంద్ర గ్రామంలో తన రెండో భార్య పి.ధనలక్ష్మి తండ్రి డి.కృష్ణ పేరు మీద రూ.16.02లక్షల 1800 చదరపు అడుగులున్న రెండు ప్లాట్లు - చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీలోని గౌతమ్‌నగర్‌లో రెండో భార్య పి.ధనలక్ష్మి పేరుతో రూ.26 లక్షల 306 అడుగులున్న ఇల్లు వివిధ కంపెనీల్లో పెట్టుబడులు.. - బెంగళూరులోని కనకపుర మెయిన్‌రోడ్డులోని గ్రేస్ క్రియేషన్స్ క్లాత్ డిజైనింగ్ కంపెనీలో 2011లో రూ.50లక్షలు పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. - బెంగళూరు మైసూర్ రోడ్డులోని కుంభలగోడు ఇండస్ట్రియల్ ఏరియాలోని గ్రేస్టెక్స్ప్రో ఫ్యాక్టరీ (ఎంబ్రయిడరీ మిషన్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ)లో 2011లో రూ.30లక్షల పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు. చరాస్తులు.. - విజయభాస్కర్ మొదటి భార్య పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.29లక్షలు - రెండో భార్య పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.53.33లక్షలు - గుర్తించిన నగదు 7.72లక్షలు - సంతకం చేసిన రూ.110.00లక్షల విలువైన 6 ఖాళీ చెక్కులు - రూ.57.00లక్షల విలువైన 12 ప్రామిసరీ నోట్లు - సంతకాలు చేసిన ప్రామిసరీ నోట్లు 25 - బ్యాంకు బ్యాలెన్స్ రూ.53లక్షలు - గోల్డ్ 350 గ్రాములు, సిల్వర్ 2 కేజీలు - ద్విచక్ర వాహనం ఒకటి, హోండా యాక్టివా, ఫోర్‌వీలర్స్ 2 (విలువ రూ.29లక్షలు) - 2 బ్యాంకు లాకర్లను గుర్తించారు. వీటిని ఇంకా పరిశీలించలేదు. -
ఏసీబీ ఉచ్చు.. సొమ్ములతోనే చిచ్చు
వరంగల్‌లోని హన్మకొండలో సర్వశిక్షాభియాన్ ఈఈ రవీందర్రావు ఫర్నిచర్ కాంట్రాక్టర్ కోసం బాధితుడు వన్నాల కన్నా నుంచి రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. బాధితులు ఏసీబీని ఆశ్రయించి 2018, ఫిబ్రవరి 26న వల వేయించి పట్టించారు. అయితే ఇందుకోసం కన్నా ఇచ్చిన సొమ్ము విషయం ఏసీబీ అధికారులను అడిగితే వారు పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. ఆరు నెలలు దాటిపోతున్నా తమకు బడ్జెట్ రాలేదని, తమ ఉన్నతాధికారులను కలవాలని సలహాలు ఇచ్చి పంపేస్తున్నారు. ఇది ఒక తాజా ఉదాహరణ మాత్రమే. ఇలాంటి బాధితుల చిట్టా చాలానే ఉంది. సాక్షి, హైదరాబాద్: అవినీతికి పాల్పడే అధికారుల భరతం పట్టేందుకు తమతో కలసి రావాలని ఏసీబీ పిలుపునిస్తోంది. అక్రమార్కులను పట్టించిన బాధితులు వినియోగించే సొమ్ములు తిరిగి చెల్లించే విషయంలో ఎగనామం పెడుతోంది. ఉచితంగా అందాల్సిన సేవలకు లంచాలు ఇవ్వలేక కొంతమంది బాధితులు పౌరవిజ్ఞతతో ఏసీబీకి ఫిర్యాదు చేస్తుంటారు.లంచగొండులను వల వేసే సమయంలో ఎక్కడో ఒక దగ్గరి నుంచి డబ్బులు అప్పుతెచ్చి ఏసీబీ ద్వారా పట్టిస్తుంటారు. ఇలా ట్రాప్ వేసిన కేసుల్లో బాధితులిచ్చిన మొత్తాన్ని కొద్ది రోజుల్లోపల కోర్టు వ్యవహారాలను పరిష్కరింపజేసుకొని బాధితులకు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అవినీతి నిరోధకశాఖలో ఈ ప్రక్రియ సజావుగా సాగక ఏళ్ల తరబడిగా బాధితులు తమ డబ్బు కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నారు. లంచంకోసం వెచ్చించిన మొత్తాలు వారి కుటుంబాల్లో చిచ్చురగిలిస్తోంది. 10 రోజుల్లో డిపాజిట్లు రావాల్సి ఉన్నా.. వాస్తవానికి ఏసీబీ ఇస్తున్న చైతన్యపూరితమైన ప్రకటనలతో బాధితులు వలపన్ని లంచమడిగిన అధికారులను పట్టించేందుకు రూ.5వేల నుంచి రూ.50వేల వరకు అప్పుచేసి ఆ మొత్తాలను ఇస్తున్నారు. ఇలా ఇచ్చిన లంచాన్ని ఏసీబీ పది రోజుల్లో కోర్టు డిపాజిట్ నుంచి విడుదల చేయించి ఫిర్యాదుదారుకు ఆ మొత్తం వచ్చేలా చేయాలి. ఇది జరగకపోవడంతో అవినీతి నియంత్రణ కోసం కృషిచేస్తున్న ఉత్సాహవంతులు నీరుగారిపోతున్నారు. అప్పు తెచ్చిన మొత్తాలకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వాంగ్మూల లోపమంటున్న ఏసీబీ.. ఇలాంటి కేసుల్లో వలపన్నేందుకు వినియోగించే మొత్తాలను వెనక్కు తేవాలంటే బాధితులు ఇచ్చిన కోర్టు వాంగ్మూలం సరిగ్గా ఉండనికారణంగానే అవి కోర్టులనుంచి విడిపించలేకున్నామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దీనితో బాధితులు విభేదిస్తూ తాము సక్రమంగానే స్టేట్మెంట్లు ఇస్తున్నామని అంటున్నారు.ట్రాప్ తర్వాత దర్యాప్తు అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం కారణమని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఇలా పరస్పర విరుద్ధమైన కారణాల వల్ల చివరికి నష్టపోయేది ఏసీబీని ఆశ్రయించి సహకరించిన బాధితులే కావడం విశేషం.ఏసీబీకి పట్టుబడ్డ అధికారి మాత్రం అరెస్టవ్వడం, రిమాండ్‌కు వెళ్లడం, బెయిల్‌పై బయటకు వచ్చి, వీలుంటే మళ్లీ పోస్టింగ్‌లు కూడా పొంది దర్జాగా ఉంటున్నారు. ఫిర్యాదుదారులే దిక్కుతోచని స్థితిలో చిక్కుకొని కొత్త ఆర్థిక చిక్కుల్లో పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. మరికొంతమంది బాధితుల చిట్టా.. - భూపాలపల్లి జిల్లాలో అసైన్‌ల్యాండ్ పట్టాకోసం వీఆర్వో జాకీర్ హుస్సేన్ (75)నుంచి రూ. 5వేలు లంచం డిమాండ్ చేశారు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి పట్టించాడు. ఇది జరిగి ఐదేళ్లు గడిచిపోయింది. రూ.5వేల కోసం తిరిగి తిరిగి రూ.10వేలు ఖర్చైందని బాధితుడు వాపోతున్నాడు. - ఇదే భూపాలపల్లి జిల్లా జంగేడు గ్రామానికి చెందిన రఘునా«థాచారి తన భూమి పట్టాకోసం ఆర్డీఓ ఆఫీసు జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రూ.50వేలు లంచం డిమాండ్ చేశాడు. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్ 11న ఈ వలపన్నారు. ఇతడికి ఇప్పటివరకు ట్రాప్ మొత్తం తిరిగి రాలేదు. - మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సై కమలాకర్ చార్జిషీట్ దాఖలుకు ఫిర్యాదు దారుడు శ్రీనివాస్ నుంచి రూ. 10వేలు డిమాండ్ చేసి మార్చి10, 2018న ఏసీబీకి చిక్కారు. ఈ కేసులో మొత్తానిదీ అదే పరిస్థితి. - వరంగల్ నర్సంపేట మండలం ఇంటి ఓనర్ షిప్ సర్టిఫికెట్ కోసం జడల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నుంచి రెవెన్యూ అధికారి మురళి రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. ఫిబ్రవరిలో ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి మురళిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు వెంకటేశ్వర్లు డబ్బు తిరిగి చేతికి రాలేదు. -
అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
సాక్షి, తాడేపల్లిగూడెం: టీడీపీ నాయకుల అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో జరిగిన నరసాపురం పార్లమెంట్ రివ్యూ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వరదల కారణంగా నష్టపోయిన కౌలు రైతులకు న్యాయం జరగడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కౌలు రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటివరకు ముంపుకు గురైన పోలాలను గుర్తించలేదని మండిపడ్డారు. పచ్చ చొక్కాలు కాంట్రాక్టు పనులు చేపట్టడం వల్లనే ఎర్రకాలువకు వరద ముంపు వచ్చిందని విమర్శించారు. డెల్టా మోడ్రనైజేషన్ పనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వలన పశ్చిమగోదావరి జిల్లా నష్టపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో నియంతపాలన సాగుతోందన్నారు. జిల్లా కలెక్టర్ ఒక ప్రజానాయకునికిపై కేసులు పెట్టడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. లంచమడిగాడని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును ఓ కాంట్రాక్టర్ ప్రశ్నిస్తే ఆయనపై కేసులు పెట్టిన సంఘటన ప్రపంచం మొత్తం చూసిందని గుర్తుచేశారు. పచ్చ చొక్కా నాయకులు తమ మాముళ్ల వసూళ్ల కోసం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయడం శోచనీయం అన్నారు. -
అవినీతి ముద్ర
స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి వేళ్లూనుకుంటోంది. రిజిస్ట్రేషన్ మొదలుకొని ఏం కావాలన్నా చేతులు తడపాల్సిందే. ఈసీలు, సీసీలు ఉచితంగా ఇవ్వాలనే నిబంధన ఉన్నా ముడుపులు చెల్లించుకోక తప్పడం లేదు. చుక్కలు, చిక్కులున్న సెటిల్మెంట్ భూములు, దేవాదాయ, డీకేటీ భూములే లక్ష్యంగా దళారుల చేతివాటంతో తప్పుడు రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ఇందుకు రిజిస్ట్రేషన్ శాఖకు రెవెన్యూ శాఖ పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందనే ఆరోపణలున్నాయి. చిత్తూరు, సాక్షి: జిల్లాలో తిరుపతి, చిత్తూరుల్లో జిల్లా రిజిస్ట్రారు కార్యాలయాలు ఉన్నాయి. ఇవి కాకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 25 ఉన్నాయి. వీటిలో ఎక్కువ అవినీతికి కేరాఫ్ అడ్రెస్‌గా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సంబంధించి మూల విలువపై 6.5 స్టాంపు సుంకం, 1 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇళ్లు, ఇళ్ల స్థలాల విషయంలో ఈ కార్యాలయాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు పెరుగుతున్నాయి. అత్యవసరమైతేæ అడిగినంత ఇస్తేనే పనులవుతాయనే వాదన ప్రజల్లో నాటుకుపోయింది. ఈ కార్యాలయాల నుంచి ఈసీ లు, ఆర్‌హెచ్ నకళ్లు పొందడం పెద్ద సమస్యగా మారుతోంది. చుక్కల భూముల వ్యవహారాన్ని చక్కదిద్దే క్రమంలో రెవెన్యూ అధికారులు మేన్యువల్ ఈసీలు, హక్కు ధ్రువీకరణ పత్రాలను ప్రామాణికంగా చేశారు. ఇది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని సిబ్బందికి అవకాశంగా మారింది. మేన్యువల్ ఈసీ, ఆర్‌హెచ్ నకలు తీసుకోవాలంటే కనీసం రూ.3 వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్యలతో కూడిన వ్యవహారం కావడంతో సకాలంలో రైతులకు ఈసీలు, ఆర్హెచ్లు సమకూర్చలేకపోతున్నారు. ఈసీకి రూ.520, ఆర్‌హెచ్ కాపీకి రూ.220 వరకు కలిపి వసూలు చేయాల్సి ఉండగా అవసరాల నేపథ్యంలో అడిగినంత ముట్టజె బుతున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రార్ కుమ్మక్కు పాకాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలోని పాకాల, పెనుమూరు మండలాల్లో దేవాదాయ, డీకేటీ, సెటిల్మెంట్ భూములు యజమానుల ప్రమేయం లేకుం డానే 1బీ ఆధారంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి. దీనికి అధికారపార్టీ నాయకులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. గ్రామాల్లో చుక్కలు, డీకేటీ భూములను గుర్తించి రెవెన్యూ అధికారుల సహకారంతో బినామీ పేర్లకు 1 బీ, అడంగల్‌లో నమోదు చేస్తున్నారు. పత్రాలు లేకుండానే కేవలం 1బీ ఆధారంగానే ఇతరులకు విక్రయ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం పెనుమూరు మండలం గుడ్యానంపల్లిలో అధికార పార్టీ నాయకుడు జయరామిరెడ్డి 70 ఎకరాలు డీకేటీ భూమిని బినామీ పేర్లతో ఆక్రమించుకున్నాడు. ఆన్లైన్ చేసుకున్నాడు. జెట్టిగుండ్లపల్లిలో కుంటస్థలాన్ని టీడీపీ నాయకులు అదే గ్రామానికి చెందిన ఓ మహిళ పేరుతో 1బీలో నమోదు చేశారు. రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఆ స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ సరైన ఆధారాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తుండటంతో భూ యజమానులు వారి భూములపై పట్టు కోల్పోతున్నారు. ఆఖరుకు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. చిట్ల కంపెనీలతో కుమ్మక్కు.. రిజిస్ట్రేషన్ అధికారులు ప్రైవేటు చిట్ల కంపెనీలతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ సంస్థల నుంచి ముడుపులు అందుతున్నాయని తెలు స్తోంది. దీనివల్లే ప్రై వేటు చిట్ కంపెనీలు నిబంధనలన్నీ ఉల్లంఘిస్తున్నా ఒక్క సంస్థపై కూడా చర్యలు తీసుకోలేదని విమర్శలున్నాయి. నిబంధనల ప్రకారం చిట్లను తెరిచేటప్పుడే.. సభ్యుల జాబితా సమర్పించాలి. దీంతో పాటు చిట్లను ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి. కంపెనీలు యథేచ్ఛగా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నా యి. చిట్ నిర్వహణలో ఖాతాదారుడు బయటికి వెళితే.. కొత్త ఖాతా దారుడిని చేర్చుకున్నా రిజిస్ట్రేషన్ శాఖకు తెలియజేయాలి. చిట్ కంపెనీలు ఇలాంటివేవి చేయడం లేదు. దీనిపై చర్యలు కూడా తీసుకోవడం లేదు. దీంతో చిట్ సంస్థ ఖాతాదారులు నిండా మునిగిపోతున్నారు. పత్రాలతో మాకు పనిలేదు భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో పత్రాలతో మాకు పనిలేదు. కేవలం 1బి చూస్తాం. దీని ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఎవరి పేరున 1బీలో భూములు ఉంటే వారినే యజమానిగా రిజిస్ట్రేషన్ చేస్తాం. ఈసీ, ఓసీలు ఉచితంగానే అందిస్తున్నాం. ఎక్కడగాని డబ్బులు తీసుకోవడం లేదు. రిజిస్ట్రేషన్‌లో ఎవరైనా అవినీతికి పాల్పడినా, డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – రమేష్‌బాబు, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ -
బ్యూటిప్స్
ముడతల నివారణకు...అరటిపండు – 1క్యాబేజీ ఆకులు – రెండు కోడిగుడ్డు – 1 (తెల్లసొన మాత్రమే) తయారి: అరటిపండు ముక్కలుగా కట్ చేయాలి. దీనితో పాటు క్యాబేజీ ఆకుల ను సన్నగా తరగాలి. ఈ రెంటినీ మిక్సర్ లో వేసి పేస్ట్ చేయాలి. దీంట్లో కోడిగుడ్డు తెల్లసొన వేసి కలపాలి. తర్వాత ముఖ మంతా అప్లై చేయాలి. అరగంట తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ముఖం మీద ముడతలు తగ్గుతాయి. క్లెన్సింగ్ ఫేస్ ప్యాక్ కావలసినవి: క్యారెట్లు – రెండు (ముక్కలుగా కట్‌చేసుకోవాలి), క్యాబేజీ తురు ము – టేబుల్ స్పూన్, టొమాటో – 1 తయారి: క్యాబేజీ తురుము, టొమాటో, క్యారెట్ ముక్కలు మిక్సర్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసి, మూడు చుక్కల తేనెతో కలపాలి. శుభ్రం చేసుకున్న ముఖానికి మెడకి ఈ పేస్ట్ అప్లై చేయాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపిస్తుంది. వారానికి ఒకసారి ఈ ఫేస్‌ప్యాక్‌ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. -
అవినీతి అధికారులకు ఎమ్మెల్సీ కితాబా?
సాక్షి, హైదరాబాద్: బాధ్యత గల ప్రతిపక్షంగా విద్యాశాఖలో వెలుగు చూసిన అవి నీతిని తాము వెలుగులోకి తెస్తే, తప్పును సరిదిద్దుకోకుండా దొంగలకు సద్ది మోసే విధంగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు. టీచర్ల బదిలీలపట్ల ఉపాధ్యాయుల్లో ఉన్న అసంతృప్తి గురించి తెలుసుకోకుండా అంతా సంతో షంగా ఉన్నారని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి కితాబివ్వడం తగదని వ్యాఖ్యానించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, విద్యాశాఖలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని, నష్టపోయిన వారందరికీ న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆచార్యకు కూడా లేఖ రాసినట్టు ఆయన వెల్లడించారు. విద్యా శాఖలో అవినీతి జరగకపోతే వెబ్ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత సర్దుబాటు పేరుతో ఓడీలు ఎందుకు ఇచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు చేరకపోతే అక్కడ విద్యార్థులు లేరన్న నెపంతో లెక్చరర్లను ఓడీల పేరిట బదిలీలు చేస్తున్నారని, విద్యార్థుల సంఖ్య, రెగ్యులర్ లెక్చరర్ల సంఖ్య, ఓడిపై ఏ కళాశాల నుండి ఏ కళాశాలకు పంపారన్న వివరాలను బయటపెట్టాలని కోరారు. అంతర్ జిల్లా బదిలీలు నిర్వహిం చి భార్యాభర్తలకు ఊరట కలిగిస్తామని 2016 మే 21న సీఎం ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేశారని, రెండేళ్ల క్రితం ఇచ్చి న జీవోపై మళ్లీ సీఎం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. -
‘నాలుగేళ్లలో 2.49 లక్షల కోట్ల రూపాయల అప్పు’
సాక్షి, విజయవాడ: నాలుగేళ్లలో 2 లక్షల 49 వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. సెప్టెంబర్ 15న విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించనున్ననూతన ప్రత్యామ్నాయ మహా గర్జన సభకు సంబంధించిన ప్రచార గీతమాలికను సోమవారం ఆయన అవిష్కరించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి సీపీఎం జాతీయ కార్యవర్గసభ్యులు శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం సెప్టెంబర్ 15న ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ మహా గర్జనలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని పిలపునిచ్చారు. ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకంగా, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం అనేక సదస్సులు నిర్వహించినట్టు పేర్కొన్నారు. రాయలసీమ వెనుకబాటుతనం, అక్కడి కరువు పరిస్థితులపై మంగళవారం వైఎస్సార్ జిల్లాలో సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడువి కేవలం ప్రచార ఆర్భాటలు మాత్రమేనని.. వాటి ద్వారా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజధానిని నిర్మించకుండా ముంబై వెళ్లి బాండ్లను విడుదల చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రాజధానిలో సెంట్ భూమి కొనుక్కొని, ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదని వ్యాఖ్యనించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. మార్చురీలో పోస్టుమార్టంకు కూడా డబ్బులు వసూలు చేసేంతలా అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి విలయం తాండవం చేస్తుంటే.. చంద్రబాబు డ్యాష్ బోర్డులో అది కనబడకపోవడం సిగ్గుచేటన్నారు. అది జ్ఞాన భేరి ఎలా అవుతుంది.. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చంద్రబాబు అధర్మ పాలన చేస్తూ ధర్మ పోరాటం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. వేలాది ఎకరాల భూములు లాక్కొని ఒక్క పరిశ్రమైనా నిర్మించారా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు చేసేది నిజమైన పోరాటం కాదని అన్నారు. ప్రశ్నించే హక్కు లేకుండా విద్యార్థులను అరెస్ట్ చేస్తే అది జ్ఞాన భేరి ఎలా అవుతుందో సమాధానం చెప్పాలన్నారు. ముంబై వెళ్లి బాండ్ల లిస్టింగ్పైన చూపే శ్రద్ద నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మీద పెట్టాలని సూచించారు. -
నాడెప్ తొట్లకు అవినీతి తూట్లు
సేంద్రియ ఎరువుల ఉత్పాదనని ప్రోత్సహించేందుకు.. రైతులు ఇంటి వద్దనే ఎరువులు తయారు చేసుకోవాలనే ఉన్నత లక్ష్యంతో స్వచ్ఛభారత్ స్వచ్ఛత్‌లో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్, వాటర్‌షెడ్ శాఖల ద్వారా నిర్మించిన నాడెప్ తోట్లు అవినీతి, అక్రమాలకు పరాకాష్టగా మారాయి. నేతల, అధికారుల అవినీతి, లబ్ధిదారులకు అవగాహన వైఫల్యంతో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. నాడెప్ తొట్ల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు చెల్లిస్తున్నా... ఎన్ఆర్ఈజీఎస్, వాటర్షెడ్ల శాఖ పర్యవేక్షణలో నిర్మాణాలు చేపట్టారు. కనిగిరి (ప్రకాశం): జిల్లాలోని 56 మండలాల్లో 2016–17 సంవత్సరానికి 47,218 నాడెప్ తోట్లు మంజూరు కాగా ఇప్పటికి 16,664 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందుకు గాను రూ.1657.34 లక్షలు ఖర్చు పెట్టినట్లు నివేదికలున్నాయి. అందులో 5,489 ఇన్ ప్రోగ్రస్‌లో ఉన్నాయి. 2017–18 ఏడాదికి గాను 17,893 మంజూరు కాగా, 5,436 పూర్తయ్యాయి. దీనికి గాను రూ.342.52 లక్షలు ఖర్చు పెట్టినట్లు నివేదికలున్నాయి. 3,775 ఇన్ ప్రోగ్రస్‌లో ఉన్నాయి. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 2016–17లో 7,040 మంజూరు కాగా, 2,283 పూర్తియ్యాయి. వీటికి గాను 221.41 లక్షలు ఖర్చుపెట్టినట్లు నివేదికలున్నాయి. 2017–18లో 2,760 మంజూరు కాగా, 1,088 పూర్తయ్యాయి. వీటిలో 30 శాతం నాడెప్ తొట్ల నిర్మాణాలు వాటర్‌షెడ్ పరిధిలో జరగ్గా, ఎన్ఆర్ఈజీఎస్ పరిధిలో 70 శాతం పనులు జరిగాయి. ఉపయోగం ఇలా.. 10/6 సైజులో కట్టిన నాడెప్ తొట్టిలో ఒక వరుస చెత్త, దానిపై మరో వరుస పుట్టమట్టి, దాని పేడ వేస్తారు. 40 రోజులు అలా వేస్తే సుమారు రెండున్నర టన్నుల సేంద్రియ ఎరువు ఉత్పత్తి అవుతుంది. వీటిని పొలాలకు ఎరువులుగా వాడటం వల్ల రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుంది. అయితే దీనిపై ఎక్కడా ఎన్ఆర్ఈజీఎస్, వ్యవసాయ అధికారులు లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. అక్రమం జరుగుతుంది ఇలా.. సన్న, చిన్న కారు రైతులకు, ఎస్సీ, ఎస్టీలకు నాడెప్ తొట్ల నిర్మాణాలకు అర్హులు. ఒక జాబ్ కార్డుకు ఒక నాడెప్ తొట్టిని శాంక్షన్ చేస్తారు. ఒక్కో దానికి (పొడవు 10 అడగులు, 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తు, 9 ఇంచెల మందంలో గోడ) రూ.10,159లు ఇస్తారు. అందులో రూ.194లను మాత్రమే కూలి పేరుతో నగదు చెల్లింపు ఉంటుంది. మిగతా రూ.9,965లను మెటీరియల్ కాంపోనెంట్ (ఇసుక, ఇటుక, సిమెంట్, వగైరా వస్తువుల కొనుగోలు) కింద చెల్లిస్తారు. వీటిని జాబ్ కార్డ్ హోల్టరే నిర్మించుకోవచ్చు. కానీ కొన్ని చోట్ల రైతులు నిర్మించుకోలేని పరిస్థితి. దీంతో ప్రభుత్వ సప్లయర్స్ విధానంలో నిర్మించుకునే అవకాశం కల్పించింది. దీన్ని ఆసరా చేసుకుని అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కై సప్లయర్స్ పద్ధతిలో 60 శాతంకు పైగా నాడెప్ తొట్ల నిర్మించి అక్రమార్జన చేసినట్లు తెలుస్తోంది. లక్షల్లో అవినీతి.. సప్లయర్స్ విధానాన్ని అసరాగా లక్షల్లో అవినీతి చోటు చేసుకుంటుంది. నాడెప్ తొట్టి శాంక్షన్ పొందిన లబ్ధిదారునికి అధికారులు వర్క్ కమిట్మెంట్ లెటర్ ఇస్తారు. సప్లయర్స్ విధానంలో నాడెప్ తొట్టిని నిర్మించుకునేందుకు ఇష్టపడుతున్నట్లు విల్లింగ్ లెటర్‌ను లబ్ధిదారుని నుంచి తీసుకుంటారు. ఈ క్రమంలో నాడెప్ తొట్టి నిర్మాణానికి వచ్చే రూ.10,159ని సప్లయర్స్ (కాంట్రాక్టర్) ఖాతాలోకి జమ చేస్తారు. అయితే నాడెప్ తొట్టి నిర్మాణానికి రూ.5 నుంచి రూ.6 వేలు మాత్రమే ఖర్చవుతుంది. మిగిలిన నగదును పర్సంటేజీల ప్రకారం అధికారులు, అధికార పార్టీ నాయకులు (సప్లయర్స్) పంచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈక్రమంలో ఒక్క కనిగిరి నియోజకవర్గంలోనే 2016–17లో మొత్తం 2,283 నాడెప్ తొట్లకు రూ.221.41 లక్షలు చెల్లించినట్లు నివేదికలున్నాయి. ఇటీవల జరిగిన సామాజిక తనిఖీల్లో ఆడిట్ బృందం గ్రామాల్లో తిరిగి పరిశీలించగా.. కొన్ని చోట్ల నిర్మాణాలు కనిపించకపోగా.. మరి కొన్ని చోట్ల వాటి ఆనవాళ్లు మాత్రమే కన్పించడం గమనార్హం. -
మెప్మా ..ఇదేంటి చెప్మా..
తిరుపతి తుడా: అవినీతి, అక్రమాలతో ఇప్పటికే అభాసుపాలైన మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ)లో వేధింపులకు అడ్డుకట్ట పడేలా కనిపించడం లేదు. అక్క డి అవినీతి జాడ్యాన్ని భరించలేని ఓ మ హిళ ప్రభుత్వం నుంచి మెప్మాకు అందుతున్న నిధులు, జమా ఖర్చు వివరాలను సమాచార హక్కు చట్టం కింద అడిగింది. దీంతో ఆ మహిళకు అధికారుల నుంచే కాకుండా అధికార పార్టీ నేతల నుంచి వేధింపులు మొదలయ్యాయి. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 4200 డ్వాక్రా గ్రూపులు ఉండగా, 43 వేల మంది సభ్యులుగా ఉన్నారు. మీనాక్షి సమాఖ్యలో కొర్లగుంట చంద్రశేఖర్‌రెడ్డి కాలనీకి చెందిన హేమలత సభ్యురాలు. గతంలో ఆర్పీగా పనిచేసేది. అనివార్య కారణాలతో ఏడాది క్రితం ఆ బాధ్యతల నుంచి తప్పుకుంది. మెప్మా అధికారుల అక్రమాలు, అవినీతిని భరించలేక బయటపడినట్లు సన్నిహితుల వద్ద ఆవేదనవ్యక్తం చేసేది. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం ప్రభుత్వం నుంచి మెప్మాకు ఎలాంటి నిధులు అందుతున్నాయి, ఖర్చుల వివరాల కోసం హేమలత భర్త ఆర్టీఏకు దరఖాస్తు చేశారు. ఫలితంగా ఆమెకు.. కుటుంబానికి వేధింపులు మొదలయ్యాయి. గుట్టు బయటపడుతుందనే.. హేమలత అడిగిన వివరాలను చూసిన అధికారులు ఖంగుతిన్నట్లు తెలిసింది. సమాచారం బయటకు పొక్కితే మెప్మా గుట్టు బయటపడుతుందని అధికారులు తిరుపతిలోని అధికార పార్టీ నేతలను ఆశ్రయించారు. ప్రజాప్రతినిధులు, వారి బంధువులు ఆ మహిళపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ వివరాలు ఎందుకంటూ అధికార పార్టీలో కీలక నాయకుడొకరు తనను వేధింపులకు గురిచేస్తున్నాడని బాధిత మహిళ ఆవేదన చెందుతోంది. పలుకుబడి, పరిచయాలతో మిగిలిన మూడు టీఎల్ఎఫ్లో పనిచేస్తున్న కొంతమంది సభ్యుల ద్వారా ఆమెపై బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. అండగా నిలవాల్సిన తోటి సభ్యులు, అధికార పార్టీ నేతలు ఆమెకు వ్యతిరేకంగా పావులు కదపడం చూస్తుంటే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్టీఏ కింద సమాచారం ఇవ్వకుండా మూడు నెలలుగా కాలయాపన జరుగుతోంది. వేధింపులు పరాకాష్టకు చేరడంతో ఆ మహిళ శనివారం ఈస్టు పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన మెప్మా.. మెప్మా అధికారులు రంగంలోకి దిగారు. ఓ ఎమ్మెల్యే, అధికార పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే బంధువు ద్వారా పోలీసు కేసు వెనక్కి తీసుకోవాలని ఆమెపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఆర్టీఏ కింద ఆమె అడిగిన సమాచారం ఇస్తే అవినీతి, అక్రమాలు బయటపడతాయని, తమతో పాటు సంఘాల లీడర్ల అవినీతి బాగోతం బయటపడుతుందని మహిళా సంఘాల సభ్యులను రెచ్చగొట్టి ఆమెపైకి ఉసిగొల్పుతున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. చిత్తూరు మెప్మా కార్యాలయానికి వస్తే చర్చించుకోవచ్చని పీడీ కోరినట్టు తెలుస్తోంది. -
రూ.42.79 కోట్లను మళ్లించేసిన మంత్రి
-
అ'ధన'పు అంతస్తులు
సాక్షి, అమరావతిబ్యూరో : విజయవాడలో అనధికార నిర్మాణాలు ఇబ్బడిముబ్బడిగా చేపడుతున్నారు. నగర పాలక సంస్థ నుంచి సరైన అనుమతులు తీసుకోకుండానే అపార్టుమెంట్లు సైతం కట్టేస్తున్నారు. తీసుకునే ప్లాన్ ఒకటయితే...నిర్మించే భవనం ఇంకో విధంగా ఉంటుంది. ఇందుకు బిల్డర్ల వద్ద టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, వీఎంసీ అధికారులు పెద్ద మొత్తంలో మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలొస్తున్నాయి. దీని వల్లకార్పొరేషన్ ఖజానాకు భారీగానే గండిపడుతోంది. భద్రతా ప్రమాణాలు తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్దంగా అదనపు అంతస్తులు కడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నగరంలో జరుగుతున్న అనధికారిక నిర్మాణాల గురించి అసెంబ్లీలో ప్రస్తావన వచ్చిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజధాని నేపథ్యంలో విజయవాడలో భవన నిర్మాణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయం మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ఓ వైపు రాజకీయ నాయకుల ఒత్తిడి మరోవైపు టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారుల చేతివాటంతో నగరంలో అనధికారిక నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. 2018 జనవరి నుంచి జూన్ వరకు కేవలం 3 వేల అపార్టుమెంట్లకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. కానీ నగరంలోని దుర్గాపురం, అజిత్‌సింగ్‌నగర్, భవానీపురం, ముత్యాలంపాడు, సత్యనారాయణపురంలో అన«ధికారిక నిర్మాణాలు కోకొల్లలు. ప్రధాన రహదారుల నుంచి గల్లీల వరకు అపార్టుమెంట్లు నిర్మాణాలు నానాటికీ పెరుగుతున్నాయి. వేలాది భవనాలు కనీస అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారు. నగరంలో అనుమతులు లేని భవనాల వివరాలు కావాలని నగరంలోని ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించారంటే అధికారుల ధనదాహం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నగరంలో భవన నిర్మాణ అనుమతులపై అవకతవకలు జరిగాయని ఏసీబీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ విభాగంపై విచారణ అంటేనే ఏళ్ల తరబడి సాగతీత వ్యవహారంగా మారటంతో ఇక్కడి అధికారులు ఎలాంటి విచారణకు బెదరడం లేదని సమాచారం. కన్పించని సెట్‌బ్యాక్స్ నగరంలో నిర్మాణాలు జరుగుతున్న బహుళ అంతస్తుల భవనాల నుంచి జీప్లస్–3 గృహాల వరకు సెట్‌బ్యాక్స్ వదలటంలేదు. ¿¶ భధ్రత ప్రామాణికంగా ఏర్పాటు చేసిన ఈ విధానానికి బిల్డర్లు తూట్లు పొడుస్తుంటే అధికారులు వంత పాడుతున్నారు. చాలా భవనాలకు సెట్‌బ్యాక్స్ అనేవి ప్రామాణికమైనా అవి నిషిద్ధం అన్నట్లు బిల్డర్లు వ్యవహరిస్తున్నారు. ఇవిగో అక్రమ నిర్మాణాలు.... బీసెంట్‌రోడ్డులో ఎల్ఐసీ భవనం వెంబడి ఓ నిర్మాణం పూర్తి నిబంధనల విరుద్దంగా సాగుతుంది. అనుమతి పొందింది జీప్లస్–3 వరకు మాత్రమే. కానీ స్థానిక కార్పొరేటర్ సహకారంతో అదనపు అంతస్తులు వేసేశారు. ఇందుకు గాను టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి కార్పొరేటర్ వరకు ఆ బిల్డరు రూ. 7 లక్షలు చెల్లించుకున్నట్లు సమాచారం. ఒన్‌టౌన్‌లోని మారుపిళ్ల చిట్టి రోడ్డులో 50 గజాల స్థలంలో జీప్లస్ 5 నిర్మాణం జరిగింది. నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న ఈ భవన నిర్మాణాన్ని అడ్డుకోవటానికి టౌన్ ప్లానింగ్ అధికారులు సాహసం చేయకలేకపోతున్నారు. కారణం అక్కడ ఎమ్మెల్యే అండదండలతో నిర్మాణం సాగుతోంది. ఇందుకు ఎమ్మెల్యేకు రూ. 10 లక్షలు చెల్లించినట్లు కార్పొరేషన్లో వినికిడి. కృష్ణలంకలోని పొట్టిశ్రీరాములు జూనియర్ కళాశాల వద్ద ఓ గ్రూప్‌హౌస్ నిర్మాణం జరుగుతుంది. ఇందుకు గాను టౌన్‌ప్లానింగ్ విభాగంలోని అధికారికి రూ. నాలుగులక్షలు అందాయని సమాచారం. ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం అనధికారిక నిర్మాణాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఫిర్యాదులు వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక స్క్వాడ్‌ను కూడా ఏర్పాటు చేశాం. అనధికారిక నిర్మాణాలను నిర్మూలించేందుకు చర్యలు చేపడతున్నాం.బి. లక్ష్మణరావు, సిటీ ప్లానర్ -
అన్న క్యాంటీన్లలోనూ బొజ్జ నింపుకున్నారు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల అవినీతి పర్వానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చివరకు అన్న క్యాంటీన్ల ఏర్పాటులోనూ కక్కుర్తి పడుతున్నారు. పెద్ద పెద్ద ప్రైవేటు హోటళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో క్యాంటీన్లు ఏర్పాటు కాకుండా అడ్డుకుంటున్నారు. ఇందుకోసం సదరు హోటళ్ల యాజమాన్యాల నుంచి భారీగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. కర్నూలు ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా ఉన్న వ్యవసాయ మార్కెట్‌యార్డులో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని మొదట నిర్ణయించారు. మార్కెట్‌కు జిల్లా నలుమూలల నుంచి వచ్చే రైతులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావించారు. అదేవిధంగా రోగులను చూసేందుకు వచ్చే బంధువుల సౌకర్యార్థం పెద్దాస్పత్రిలోనూ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకున్నారు. అయితే, ప్రైవేటు హోటళ్ల యాజమాన్యాలతో అధికార పార్టీ నేతలు చేతులు కలిపారు. కుంటిసాకులు చూపుతూఅన్న క్యాంటీన్లు ఏర్పాటు కాకుండా అడ్డుకున్నారు. మార్కెట్‌యార్డులో స్థలం లేదని, ఆసుపత్రిలో పారిశుద్ధ్య సమస్య వస్తుందనే నెపంతో క్యాంటీన్లు రద్దు చేయించడం గమనార్హం. ఊరికి దూరంగా... ప్రస్తుతం అన్న క్యాంటీన్లు రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా ఊరికి దూరంగా ప్రైవేటు హోటళ్లు ఎక్కువగా లేని ప్రాంతాలను ఎంపిక చేస్తున్నారు. కర్నూలులో ఏకంగా ఉల్చాల గ్రామానికి వెళ్లే దారిలో వీకర్ సెక్షన్ కాలనీ సమీపాన ఏర్పాటు చేశారు. ఇక్కడికి పెద్దగా వచ్చే వారు కూడా ఉండరు. ఇక కలెక్టర్‌లో క్యాంటీన్ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఉల్చాల దారిలో క్యాంటీన్ నిర్మాణ పనులు సగం కూడా కాకముందే ప్రారంభించిన అధికారులు.. కలెక్టరేట్లో మాత్రం ప్రారంభించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. తద్వారా ఇక్కడ ప్రైవేటు హోటళ్లకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ముఖ్యనేతలు క్యాంటీన్ల నిర్మాణంలో భారీ అవినీతికి పాల్పడడమే కాకుండా.. వాటి కోసం ప్రాంతాల ఎంపికలోనూ స్వార్థానికి ఒడిగట్టడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్రారంభించిన క్యాంటీన్లలో రోజూ చాలామంది నిరాశతో వెనుదిరుగుతున్నారు. అన్నం అయిపోయిందంటూ నిర్వాహకుల నుంచి సమాధానం వస్తోందని వారు పెదవి విరుస్తున్నారు. కమీషన్ల కోసమే.. ప్రైవేటు హోటళ్ల వారు ఇచ్చే కమీషన్ల కోసమే మార్కెట్‌యార్డులో అన్న క్యాంటీన్ రద్దు చేశారు. రైతులు అసలే దూరాభారం నుంచి వ్యయ ప్రయాసలకోర్చి మార్కెట్‌కు సరుకు తెస్తున్నారు. ఒక్కోసారి రోజంతా ఇక్కడే ఉండాల్సి వస్తోంది. మూడు పూటలా బయట తినాలంటే రూ.300 వరకు ఖర్చు వస్తుంది. అదే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఖర్చు చాలావరకు తగ్గుతుంది. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వెంటనే ఏర్పాటు చేయాలి. – ఈరన్న, కోడుమూరు -
ఆర్‌యూలో ఇష్టారాజ్యం
కర్నూలు(గాయత్రీ ఎస్టేట్): రాయలసీమ విశ్వవిద్యాలయం హాస్టళ్ల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. మెస్ బిల్లుల గురించి మాట్లాడితే విద్యార్థులు హడలిపోతున్నారు. ఇష్టానుసారం వసూలు చేస్తుండటంతో చెల్లించలేని స్థాయికి బకాయిలు చేరాయి. హాస్టళ్లలో ప్రొవిజన్స్, కూరగాయలు, చికెన్, పాలు, నీటి సరఫరాకు ఎలాంటి టెండర్లు లేకుండానే కొనుగోళ్ల కమిటీ (పర్చేజ్ కమిటీ) అనామతుగా కొని బిల్లులు చెల్లిస్తోంది. అధికారుల కక్కుర్తి కూడా తోడు కావటంతో విద్యార్థులకు బిల్లుల భారం తడిసి మోపెడవుతోంది. ఒక్క బిల్లులోనే రూ.77 వేలు అదనంగా చెక్ రాయగా.. అది కాస్తా బహిర్గతం కావడంతో క్యాన్సిల్ చేసి మరో చెక్కును సరుకుల సరఫరాదారులకు ఇచ్చారు. బయట పడటం వల్లే దాన్ని క్యాన్సిల్ చేశారు. బయట పడనివి ఎన్నో ఉన్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. విద్యార్థులపై ఏటా రూ.10 లక్షల వరకు అదనంగా మెస్ బిల్లుల భారం పడుతోంది. వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి సరుకులు, కూరగాయలు, చికెన్, పాలు, తాగునీరు లాంటి వాటిని ఎలాంటి టెండర్లూ లేకుండానే కొనుగోలు చేస్తున్నారు. ఈ బిల్లుల చెల్లింపు సమయంలో వర్సిటీలోని కొందరు అధికారులకు భారీగా కమీషన్లు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. అలాగే సరుకులు, కూరగాయలు తదితర వస్తువులు సదరు అధికారుల ఇళ్లకు చేరటం పరిపాటిగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అటకెక్కిన విచారణ.. గత విద్యా సంవత్సరం హాస్టళ్లకు ప్రొవిజన్స్, కూరగాయల కొనుగోలు తదితర వాటిలో భారీగా అవినీతి జరిగిందని, దానిపై విచారణ చేయించాలని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. దీంతో వర్సిటీ ఉన్నతాధికారులు ఆరు నెలల క్రితం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఆర్యూ ఈసీ మెంబర్ ప్రొఫెసర్ సంజీవరావు, సీడీసీ డీన్ ప్రొఫెసర్ విశ్వనాథ«రెడ్డి, ఫైనాన్స్ ఆఫీసర్ సుబ్బారెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక సమర్పించలేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఈ విద్యా సంవత్సరం ప్రొవిజన్స్, కూరగాయల సరఫరాకు టెండర్లు పిలిచారు. ప్రొవిజన్స్ సరఫరాకు కాంట్రాక్టర్ ముందుకొచ్చారు. సదరు కాంట్రాక్టర్ నాణ్యమైన సరుకులు సరఫరా చేయటం లేదని, తూకాల్లో వ్యత్యాసం ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కూరగాయల సరఫరాకు కాంట్రాక్టర్లు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో గత ఏడాది మాదిరిగానే కొనుగోలు చేస్తున్నారు. తడిసి మోపెడవుతున్న మెస్ బిల్లులు రాయలసీమ విశ్వవిద్యాలయంలో మూడు మెన్ హాస్టళ్లు, రెండు ఉమెన్ హాస్టళ్లు ఉన్నాయి. గత ఏడాది 330 మంది విద్యార్థులు, 335 మంది విద్యార్థినులు హాస్టళ్లలో ఉన్నారు. నెలకు సరిపడా ప్రొవిజన్స్‌కు రూ.7 లక్షల వరకు ఖర్చవుతుంది. కూరగాయలు, పాలు, చికెన్ తదితర వాటికి రూ.5.50 లక్షల వరకు అవుతుంది. అబ్బాయిలకు ఒక్కొక్కరికి నెలకు రూ.2,200, అమ్మాయిలకు రూ.1,700 వరకు బిల్లు వస్తోంది. కోర్సు, కేటగిరిని బట్టి వారికి స్కాలర్షిప్ ఏడాదికి రూ.5,400 నుంచి రూ.7,000 వరకు వస్తోంది. మిగతా మొత్తం చేతి నుంచి చెల్లించాల్సిందే. టెండర్ల ద్వారా ఏజెన్సీలను పిలిచి తక్కువ ధరకు సరుకులు, కూరగాయలు సరఫరా చేసే వారికి బాధ్యతలు అప్పగిస్తే విద్యార్థులపై మెస్ బిల్లుల భారం తగ్గుతుందని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. నిబంధనల ప్రకారం హాస్టళ్లను నిర్వహిస్తే ఏడాదికి రూ.10 లక్షల వరకు భారం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. విచారణ కమిటీ వేశాం హాస్టళ్లలో అవినీతిపై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించాం. ఈ నెల 24లోగా విచారణ పూర్తి చేసి రిపోర్ట్ ఇవ్వాలి. హాస్టళ్లలో అవినీతి జరిగిందని విద్యార్థులు ఆందోళనలు చేపట్టడంతో పాటు ఫిర్యాదు కూడా చేశారు. వారి వినతి మేరకు విచారణ కమిటీ ఏర్పాటు చేశాం. నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ప్రొవిజన్స్ కాంట్రాక్టర్ సరిగా సరఫరా చేయటం లేదనే ఆరోపణలున్నాయి. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం. – ప్రొఫెసర్ అమర్నాథ్, రిజిస్ట్రార్, ఆర్యూ నివేదిక ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది ఆర్యూ హాస్టళ్ల నిర్వహణలో రూ.లక్షల్లో అవినీతి జరిగింది. దీనిపై నియమించిన విచా రణ కమిటీ నివేదికను ఇంతవరకు ఇవ్వకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. కమిటీలు నామమాత్రంగా వేస్తున్నారు కానీ విచారణ పక్కాగా జరగటం లేదు. విద్యార్థులకు రూ.వేలల్లో మెస్ బిల్లులు వస్తున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవటంతో ఇలా జరుగుతోంది. అధికారులు స్పందించి ప్రతి ఒక్కటీ పద్ధతి ప్రకారం నిర్వహిస్తే ఎలాంటి అక్రమాలూ జరగవు. – సూర్య, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు కమిటీలు కాగితాలకే పరిమితం వర్సిటీలో అవినీతి, అక్రమాలు, అవకతవకలపై వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. అవి కాగితాలకే పరిమితమయ్యాయి. హాస్టళ్లలో అవినీతిపై కమిటీని నియమించి నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. దీన్ని బట్టి చూస్తే అధికారులు అందరూ కుమ్మక్కు అయినట్లు అర్థమవుతోంది. విచారణ చేపట్టి వాస్తవాలు బయటికి తీస్తే విద్యార్థుల్లో ఉన్న అనుమానాలు నివృత్తి అవుతాయి. వర్సిటీ అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టి నిజాలను బయట పెట్టాలి. లేకపోతే ఆందోళనకు సిద్ధమవుతాం. – శ్రీరాములు, ఆర్యూ విద్యార్థి జేఏసీ కన్వీనర్ -
రాష్ట్రంలో అవినీతి పెచ్చరిల్లుతోంది
యర్రగొండపాలెం (ప్రకాశం): రాష్ట్రంలో అవినీతి పెచ్చరిల్లుతోందని, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎపాలెం నియోజకవర్గ ఇన్చార్జి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ విమర్శించారు. సోమవారం స్థానిక మోడల్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడారు. కళాశాల భవన నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఒక తరగతి గదిలో అడ్డంగా పరదాలు కట్టుకొని రెండు తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కేవలం లంచం ఇవ్వడం లేదని కాంట్రాక్టర్‌కు సకాలంలో డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వ పెద్దలు జాప్యం చేస్తున్నారని వివరించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్‌ను మార్చాలనే ఆలోచనతో ఉన్నట్లు తమకు తెలిసిందని విద్యార్థులు పేర్కొన్నారు. కమీషన్ల కోసం తమ జీవితాలను నాశనం చేస్తున్నారని, గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే భవనాల నిర్మాణం చేపట్టకపోతే జిల్లా కేంద్రానికి వెళ్లి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆందోళన చేపట్టినప్పటికీ సమస్యలు సర్కారు చెవికి ఎక్కవని, విద్యార్థులు చేసే కార్యక్రమాల్లో తమ పార్టీ పాలుపంచుకుంటుందన్నారు. 2008లో మార్కాపురం ఎమ్మెల్యే కె.పి.కొండారెడ్డి ఈ ప్రాంత సమస్యలను సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారన్నారు. యర్రగొండపాలెం ప్రాంతంలో విద్యాభివృద్ధికి డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరడంతో స్పందించిన వైఎస్సార్ మోడల్ డిగ్రీ కళశాలను మంజూరు చేశారని గుర్తు చేశారు. ఆ తరువాత తాను కళాశాల భవనాల నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నానన్నారు. తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవిధంగా తాను కృషి చేస్తానని చెప్పారు. ముందుగా జూనియర్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్న మోడల్ డిగ్రీ కళాశాల తరగతి గదులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఏపీ ఎంహెచ్ఐడీసీ ఎండీతో ఫోన్లో కళాశాల భవనాల నిర్మాణం గురించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు దొంతా కిరణ్‌గౌడ్, ఎస్కే జబీవుల్లా, యవజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కె.ఓబులరెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎన్.వెంకటరెడ్డి, కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు ఎ.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
చెరువుల పేరుతో లూటీ
యర్రగొండపాలెం (ప్రకాశం): ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటి పారుదల, వ్యవసాయాభివృద్ధి పథకం కింద మంజూరైన నిధులు కాజేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ పనులకు సంబంధించి గతనెలలో బాక్సు టెండర్లను టీడీపీ వర్గీయులతో వేయించి ఇప్పుడిప్పుడే ఆ పనులకుగాను అగ్రిమెంట్లు చేసుకోవటానికి సిద్ధమవుతున్నారు. సహజంగా రోడ్లు, భవనాల శాఖ రూ.1 లక్ష పనులు, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలు రూ.5 లక్షల మేరకు పనులకు ఆన్లైన్ టెండర్లను వేయాల్సి ఉంటుంది. ఈ టెండర్లలో రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు పాల్గొనవచ్చు అనే నిబంధన ఉంది. అందుకు విరుద్ధంగా జిల్లాలో ఈ టెండర్ల ప్రక్రియను పూర్తిగా మార్చివేశారు. కోట్లాది రూపాయల ప్రజల సొత్తును టీడీపీ నాయకులకు కట్టబెట్టడానికి బాక్సు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు వేయటానికి కాంట్రాక్టర్లు షెడ్యూల్ దాఖలు చేయాల్సి ఉంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పనులకు గాను టెండర్లు మరో విధంగా వేశారు. నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి తన అధికారాన్ని ఉపయోగించి షెడ్యూల్‌ను తనకు అనుకూలంగా ఉన్న టీడీపీ వర్గీయులకే అందేలా చర్యలు తీసుకున్నారు. అందుకుగాను టెండరు దక్కించుకున్న టీడీపీ నేత ఆయనకు 10 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉందని నియోజకవర్గంలో ఆ వర్గానికి చెందిన నాయకులే చర్చించుకుంటున్నారు. సింగిల్ టెండర్ అయితే నిబంధనలను పూర్తిగా వ్యతిరేకించిన వారవుతారన్న ఉద్దేశంతో మరో ఫాల్ట్ టెండర్‌ను వేయించారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు : ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే, ఎస్‌ఎన్‌పాడు ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటి పారుదల, వ్యవసాయ అభివృద్ధి పథకం కింద మంజూరైన ఈ పనులు 100 ఎకరాలకుపైబడి ఉన్న చెరువులలో మాత్రమే చేయాల్సి ఉంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో మొ దటి విడత కింద 3 చెరువులకు రూ.7.70 కోట్లు నిధులు మంజూరయ్యాయి. పెద్దదోర్నాల మండలంలోని వై.చెర్లోపల్లి చెరువు అభివృద్ధికి రూ 3.70 కోట్లు, పెద్దారవీడు మండలంలోని బోడ్రెడ్డిపల్లె చెరువుకు రూ.2.50 కోట్లు, దేవరాజుగట్టు, పెద్దారవీడు చెరువులకు ఒకే ప్యాకేజి కింద రూ.1.50 కోట్లు ప్రకారం మంజూరయ్యాయి. ఈ నిధులు కాజేయటానికి అధికార పార్టీకి చెందిన నాయకులు పోటీపడ్డారు. అయితే తనకు అత్యంత సన్నిహింతంగా ఉండేవారితో మాత్రమే నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి ఈ టెండర్లు వేయించారని ఆరోపణలు వినవస్తున్నాయి. అప్పనంగా ప్రజల సొత్తును కాజేయటానికి అధికార పార్టీకి చెందిన వారు ప్రయత్నిస్తున్నారు. దీనివలన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. జిల్లాలో చెరువులకు రూ.37 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనులకు ఆన్లైన్ టెండర్లు పిలువాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు బాక్సు టెండర్లను పిలవడం శోచనీయం. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని చెరువులకు మంజూరైన రూ.7.70 కోట్ల పనులకు సింగిల్ టెండర్లు మాత్రమే వేయించుకున్నారు. కంటి తుడుపుగా మరొకరితో తప్పుడు టెండరు వేయించారు. షెడ్యూల్ కూడా టీడీపీ వర్గానికి చెందిన కాంట్రాక్టర్లకే ఇచ్చారు. అగ్రిమెంట్లు జరగకుండా రాష్ట్ర నీటిపారుదల మంత్రి, చీఫ్ ఇంజినీరు చర్యలు తీసుకోవాలి. ఈ టెండర్లపై సమగ్రంగా దర్యాప్తు జరపాలి. ఇప్పటికే 100 ఎకరాలలోపు ఉన్న చెరువులలో నీరు – చెట్టు పథకం కింద కోట్లాది రూపాయలు కాజేశారు. చెరువులను ఆడ్డంగా పెట్టుకొని టీడీపీ జేబులు నింపుకుంటున్నారు. -
అ‘ధర్మ’కర్త మండలి !
సాక్షి,విజయవాడ : ఎన్నో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న దుర్గ గుడి పాలక మండలి అవసరమా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దుర్గమ్మకు భక్తులు సమర్పించిన చీరను కాజేయడంతో కోడెల సూర్యలతను పాలకమండలి నుంచి ప్రభుత్వం తొలగించింది. పదవి కోల్పోయిన సూర్యలత పాలకమండలి చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, సభ్యుడు వెలగపూడి శంకరబాబు పై ఆరోపణలు చేశారు. వెలగపూడి శంకరబాబు ఐదుగురు ఓపీడీఎస్ మహిళల్ని వేధించారని, దీనిపై వారు ఫిర్యాదు చేసినా చైర్మన్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఎంతో హుందాగా ఉండాల్సిన పాలకమండలి సభ్యుడు దేవస్థానంలో పనిచేసే మహిళా సెక్యురిటీ సిబ్బందిని లైంగిక వేధింపులకు గురి చేశారనే విషయం ఇంద్రకీలాద్రి పై చర్చనీయాశంగా మారింది. చైర్మన్ దేవస్థానంలో సెక్యురిటీ టెండర్లను పారదర్శకంగా పాటించకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా పాలకమండలిలో ఉన్న మరొక సభ్యుడుకు నేర చరిత్ర ఉంది. అవినీతికి ఆలవాలమైన కమిటీ... దుర్గగుడి పాలకమండలి అవినీతికి ఆలవాలంగా మారింది. పాలకమండలి సభ్యులకు ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉండటంతో అధికారులు, సిబ్బంది కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పటికే 14 నెలలు గడిచిపోవడంతో ఉన్న కొద్దికాలంలో సాధ్యమైనంత రాబట్టేందుకు కొంతమంది పాలకమండలి సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాము చేయాల్సిన పనులు వదిలివేసి... పాలకమండలి సభ్యుడు దేవస్థానం ఆదాయం పెంచేందుకు కృషి చేయాలి. తమ పరపతిని ఉపయోగించి దేవస్థానానికి విరాళాలు వచ్చేటట్లు చేయాలి. అయితే ఏడాది గడిచిన పెద్దగా విరాళాలు తెచ్చిన దాఖాలు లేవు. తమ పరపతిని ఉపయోగించి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాబట్డడం లేదు. ఇక అధికారులకు మంచి సూచనలేమైనా చేశారంటే అదీ కనపడదు. భక్తులపై ఆర్థిక భారం తగ్గించే ప్రయత్నాలు కూడా ఏమీ కపడవు. భక్తిభావం లేని ఇటువంటి పాలకమండలి ఎంతమేరకు అవసరమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. -
‘ప’రేషన్
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. స్టాక్ పాయింట్ల నుంచి చౌక దుకాణాల వరకు అక్రమాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు సిబ్బంది, మరోవైపు డీలర్లు ‘రేషన్’ కొల్లగొడుతున్నారు. పేదల పొట్టకొడుతూ బ్లాక్మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చాలా కాలంగా ఇదే తంతు కొనసాగుతున్నా..పట్టించుకునే నాథులే కరువయ్యారు. ఇటు పౌరసరఫరాల శాఖ గానీ, అటు తూనికలు, కొలతల శాఖ గానీ శ్రద్ధ చూపకపోవడంతో కార్డుదారులు నష్టపోతున్నారు. రసీదులేవీ?: చౌక దుకాణంలో సరుకులు తీసుకునే కార్డుదారులకు ఈ–పాస్ మిషన్ నుంచి వచ్చే రసీదులను విధిగా ఇవ్వాలి. జిల్లాలో 2,436 చౌక దుకాణాలు ఉండగా.. ఏ ఒక్క దాంట్లోనూ రసీదులు ఇస్తున్న దాఖలాలు లేవు. రసీదులు ఇస్తే తమ అక్రమాలు బయట పడతాయనే ఉద్దేశంతో డీలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రేషన్ తూకం తక్కువ ఇస్తూ కార్డుదారులను దగా చేయడం డీలర్లకు పరిపాటిగా మారింది. ఈ మోసాన్ని అరికట్టాల్సిన బాధ్యత తూనికలు, కొలతల శాఖపై ఉంది. అయితే.. ఈ శాఖ టార్గెట్‌కు అనుగుణంగా కేసులు నమోదు చేసి..చేతులు దులిపేసుకుంటోంది. స్టాక్ పాయింట్ల నుంచే అక్రమాలు.. అక్రమాల పర్వం స్టాక్ పాయింట్ల నుంచే మొదలవుతోంది. నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ కాటాలతో తూకం వేసి డీలర్లకు సరుకులివ్వాలి. జిల్లాలోని ఏ స్టాక్ పాయింట్లోనూ ఇలా ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. స్టాక్ పాయింట్లలోనే క్వింటాల్‌కు ఐదు కిలోల వరకు కోత కోసి బియ్యం ఇస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని డీలర్లు మరింత చెలరేగిపోతున్నారు. తూకంలో రెండు కిలోల డబ్బా వాడుతూ.. దాని బరువు మేర బియ్యం కాజేస్తున్నారు. 25 కిలోల బియ్యం ఇవ్వాలంటే రెండుసార్లు తూకం వేయాలి. అంటే 25 కిలోల బియ్యంలో డీలర్లు నాలుగు కిలోల వరకు కాజేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంత్యోదయ కార్డులకు విధిగా 35 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలి. అనేక మంది డీలర్లు 30 నుంచి 32 కిలోల వరకే ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు 50 వేల క్వింటాళ్ల బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయనే విమర్శలున్నాయి. ఈ నెల నుంచి కార్డుకు రెండు కిలోల ప్రకారం ఇస్తున్న జొన్నలకు డిమాండ్ ఉంది. అయితే.. బియ్యంలో రెండు కిలోలు తగ్గించి.. ఆ మేర జొన్నలు ఇవ్వడంపై కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందే ప్యాక్ చేసి.. బియ్యం, చక్కెర, జొన్నలు తదితర సరుకులను విధిగా కార్డుదారుల ముందే తూకం వేసి ఇవ్వాల్సి ఉంది. కానీ డీలర్లు చక్కెరను ముందుగానే ప్యాక్ చేసి పెట్టుకొని ఇస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రతి 500 గ్రాములకు 100 గ్రాముల చొప్పున కాజేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముందుగా తూకం వేసిన సరుకులను తీసుకోరాదని, తమ సమక్షంలోనే తూకం వేయించుకోవాలనే విషయంపై కార్డుదారులకు అవగాహన కల్పించే చర్యలు కరువయ్యాయి. డీలర్లు సేవల్లో నాణ్యత పాటించకపోయినా, రసీదు ఇవ్వకపోయినా, అనుచితంగా ప్రవర్తించినా 1100కు లేదా 1800114000 నంబరుకు ఫోన్ చేయవచ్చన్న విషయం కార్డుదారులెవరికీ తెలియదు. యాక్టివ్‌లోకి తెచ్చుకోవడానికి తంటాలు రేషన్‌కార్డు ఎప్పుడు యాక్టివ్‌లో ఉంటుందో, ఎప్పుడు ఇన్‌యాక్టివ్‌లోకి పోతుందో తెలియని పరిస్థితి. ఉన్నట్టుండి ఇన్‌యాక్టివ్‌లోకి వెళితే.. దాన్ని యాక్టివ్‌లోకి తెచ్చుకోవాలంటే కార్డుదారులు చుక్కలు చూడాల్సి వస్తోంది. ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలని, ఈకేవైసీ వేసి ఉండాలనే నిబంధన పెట్టారు. నాలుగైదు నెలల క్రితం ఒక్క కర్నూలు నగరంలోనే 8,200 కార్డులను ఇన్‌యాక్టివ్‌లో పెట్టారు. కార్డుదారులు ప్రతి నెలా సరుకులు తీసుకుంటున్నా.. ఉన్నట్టుండి ఇన్‌యాక్టివ్‌లో పెట్టడంతో బాధితుల ఆందోళన అంతాఇంతా కాదు. యాక్టివ్‌లోకి తెచ్చుకునేందుకు కార్డుదారులు అన్ని ఆధారాలతో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ దాదాపు ఐదువేల మందికి సమస్య పరిష్కారం కావడం లేదు. -
అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత పేదల కోసం నిర్మించే పక్కా గృహాలు అగ్గిపెట్టెలను తలపిస్తున్నాయి. ఎన్నికల ముందు సొంత ఇళ్లు లేని కుటుంబానికి మూడు సెంట్ల స్థలం ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి షీర్వాల్ టెక్నాలజీ అంటూ గొప్పలు చెబుతూ జీప్లస్ త్రీ అంతస్తులతో నిర్మిస్తున్న ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీంలో కేవలం సెంటు స్థలానికి తక్కువగా ఉన్న విస్తీర్ణంలో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నారు. కడప కార్పొరేషన్ : పట్టణాల్లోని పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం(పీఎంఏవై) కింద అపార్ట్మెంట్ పద్దతిలో ఇళ్లు నిర్మిస్తున్నారు. మన రాష్ట్రంలో ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీం పేరుతో ఏపీ టిడ్కో ద్వారా వీటిని నిర్మిస్తున్నారు. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ కాంట్రాక్టుతీసుకుంది. మలేషియాలో ఉపయోగించే షియర్‌వాల్ టెక్నాలజీ పేరుతో పునాదులు, పిల్లర్లు లేకుండానే నిర్మించే ఇళ్లకు ఎంత వరకు మన్నిక ఉంటుందనే దానిపై ప్రధానంగా చర్చ సాగుతోంది. సాధారణంగా ఇక్కడ చిన్న ఇళ్లకు సైతం 12ఎంఎం ఇనుప కడ్డీలు, ఆపార్ట్‌మెంట్లకైతే 16ఎంఎం కడ్డీలు వాడుతుంటారు. ఎన్టీఆర్ హౌసింగ్‌కు మాత్రం కేవలం 8ఎంఎం సైజు కడ్డీలు ఉపయోగించి బెత్తెడు వెడల్పు మందంతో గోడలు నిర్మిస్తున్నారు. 8ఎంఎం కడ్డీలతోనే జీ ప్లస్ 3 ఆపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. స్లాబ్ మందం మాత్రం 6 ఇంచ్‌లు వేస్తున్నారు. ఇంత బరువును ఈ నాలుగు ఇంచ్ మందం ఉన్న గోడలు ఎంతమేరకు భరిస్తాయో భగవంతుడికే ఎరుక. షియర్ వాల్ టెక్నాలజీతో కట్టే ఇళ్లు సముద్రంలోనూ, భూకంపాలు వచ్చినా చెక్కుచెదరవని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్న మాటలు నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఏ ఇంటికైనా స్లాబ్ వేసినప్పుడు కనీసం 18 రోజులైనా క్యూరింగ్ చేయాల్సిఉంది. ఇక్కడ మొత్తంసిమెంటు కాంక్రీటుతోనే నిర్మిస్తున్నందున ఈ తరహాలోనే క్యూరింగ్ చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టు సంస్థ మాత్రం వాల్‌షీట్లు వేసి అందులో సిమెంటు కాంక్రీటు వేసి ఆరిపోగానే తీసివేస్తున్నారు. ఏడు రోజులు మాత్రమే నీళ్లు పోసి క్యూరింగ్ చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో నిర్మాణాలు పగుళ్లు బారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేగంగా నిర్మించాలనే తలంపుతో కార్మికులకు షిఫ్టు పద్దతి లేకుండా రేయింబవళ్లు పనిచేయిస్తున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. వీరికి కల్పించాల్సిన కనీస సౌకర్యాల విషయంలోనూ కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మరుగుదొడ్డి పక్కనే వంటగది ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీంలో కేంద్ర ప్రభుత్వం రూ.1.50లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50లక్షలు సబ్సిడీ ఇస్తాయి.300 చదరపు అడుగులు (రూ.6.03లక్షలు), 365 చదరపు అడుగులు(రూ.7.08లక్షలు), 430 చదరపు అడుగులు(రూ.8.20లక్షలు) వంటి మూడు కేటగిరిలలో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోంది. ఈమొత్తంలో ప్రభుత్వాలు ఇచ్చే రూ.3లక్షలు పోను మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు బ్యాంకుకు కంతుల రూపంలో చెల్లిం చాలి. రెండు, మూడు కేటగిరి ఇళ్లను ఎంచుకునే వారు లబ్ధిదారుని వాటా కింద వరుసగా రూ.50వేలు, లక్ష రూపాయలు నాలుగు విడతల్లో చెల్లించాలి. ఇందులో మొదటి రెండు కేటగిరీలు సింగిల్ బెడ్రూమ్ కాగా, మూడో కేటగిరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. డబుల్బెడ్రూమ్ ఇళ్లలో ఎడమ వైపు ఉన్న ఇళ్లకు బెడ్రూమ్కు వంటగదికి మధ్య బాత్రూమ్, మరుగుదొడ్డి ఏర్పాటు చేయడం మైనస్‌గా చెప్పవచ్చు. ఎవరూ కూడా వంటగది పక్కన బాత్రూమ్, మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకోరు. అలాంటిది ఎన్టీఆర్ హౌసింగ్ డిజైన్లలో ఇది ఏవిధంగా చేర్చారో అర్థం కాలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. దీనిపై ఏపీ టిడ్కో ఆధికారులను అడిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే డిజైన్ వాడుతున్నారని చెప్పడం గమనార్హం. మూడు కేటగిరీల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేవలం సెంటు విస్తీర్ణంలో నిర్మిస్తున్నారంటే అవి ఎంత పెద్దగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సకాలంలో పూర్తయ్యేనా...! రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీం కింద మూడు దశల్లో నిర్మించనున్న 19,232 ఇళ్లు సకాలంలో పూర్తయ్యే సూచనలు కన్పించడం లేదు. మొదటి దశలో మొత్తం 4092 నిర్మించనుండగా కడపలో 2,092 ఇళ్లు, ప్రొద్దుటూరులో 2,000 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. కడపలో ఒక బ్లాక్‌లో 32 ఇళ్ల చొప్పున మొత్తం 63 బ్లాకుల్లో 2,016 ఇళ్లు నిర్మించాలి. అయితే ఇందులో 33 బ్లాకులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. మరో ఆరు బ్లాకుల్లో ఆక్రమణలు ఉన్నాయి. మిగిలిన 24 బ్లాకుల్లో సాగుతుండగా 630 ఇళ్లు పూర్తయ్యాయి. 300 ఇళ్లను నెలాఖరులోపు పూర్తి చేయాల్సి ఉంది. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, బద్వేల్లో ఈ స్కీం ఇంకా మొదలు కాలేదు. ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. రెండవ దశలో 13,213 ఇళ్లు నిర్మించనుండగా, ఇందులో కడపలో 2,281, ప్రొద్దుటూరులో 2,150, బద్వేల్లో 808, రాయచోటిలో 1,011, రాజంపేటలో 1,279, ఎర్రగుంట్లలో 2,046, జమ్మలమడుగులో 1,415, పులివెందులలో 2143 చొప్పున నిర్మించాల్సి ఉంది. మూడో దశలో 1,927 ఇళ్లను నిర్మిచాల్సి ఉండగా ఇందులో మైదుకూరులో 927, పులివెందులలో 1000 చొప్పున నిర్మించాల్సి ఉంది. అయితే రెండు, మూడు దశల్లో నిర్మించే 15,140 ఇళ్లు డిసెంబర్, మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే కోర్టు కేసులు, భూసేకరణ సమస్యల వల్ల ఎన్నికలు రాబోతున్న ఈ నాలుగైదు మాసాల్లో అవి పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇక ఇళ్లు నిర్మించినచోట రోడ్లు, కాలువలు, విద్యుత్, డ్రైనేజీ, త్రాగునీరు వంటి మౌలిక వసతులు ఎçప్పటిలోగా కల్పిస్తారో వేచిచూడాల్సిందే. నాణ్యతలో సందేహాలు అక్కర్లేదు: ఈఈ ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీం కింద చేపట్టే ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతలో ఎలాంటి అక్కర్లేదని ఏపీటిడ్కో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లీలా క్రిష్ణ ప్రసాద్ అన్నారు. క్యూరింగ్ బాగానే చేస్తున్నామని, క్వాలిటీ తనిఖీ చేయడానికి ప్రత్యేక విభాగం ఉందని చెప్పారు. వారు ఎప్పటికప్పుడు నాణ్యతను తనిఖీ చేస్తుంటారని, కడ్డీలు సన్నగా ఉన్నా ఎక్కువ కడ్డీలు వేస్తున్నందున ఇళ్లకు బలం వస్తుందని, ఎన్ని ఏళ్లయినా చెక్కుచెదరవని చెప్పారు. -
పైసలా.. పట్టుచీరా!
ధర్మవరం హౌసింగ్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. చేయి తడిపితేనే పేదలు నిర్మించుకునే ఇళ్లకు బిల్లులు మంజూరవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు దళారులుగా మారి జియోట్యాగింగ్ చేయాలంటే ఒక రేటు, బిల్లు మంజూరైతే మరో రేటంటూ బహిరంగంగానే వసూళ్లు చేస్తున్నారు. అధికారులు కూడా వారు చెప్పిన వారికే బిల్లులు మంజూరు చేస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లబ్ధిదారులు డబ్బు ముట్టజెబుతున్నారు. ధర్మవరం టౌన్ : నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హౌసింగ్ ఫర్ ఆల్, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాలను ప్రవేశపెట్టాయి. ఈ పథకాల్లో భాగంగా ధర్మవరం పట్టణంలో 2016–17వ సంవత్సరానికి సంభందించి 1,400 ఇళ్లు, 2017–18వ సంవత్సరంలో 2,400 ఇళ్లు మంజూరయ్యాయి. అలానే ధర్మవరం మండలం, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాలకు 2016–17లో 1,250 ఇళ్లు, 2017–18వ సంవత్సరంలో 1,100 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.50 లక్షలు, పట్టణాల్లో అయితే రూ.2.50 లక్షలను ప్రభుత్వం ఇస్తోంది. అంతులేని అవినీతి ఇంటి నిర్మాణం ప్రారంభించే లబ్ధిదారునికి బేస్మెంట్, రూఫ్‌లెవల్, టాప్‌లెవల్, ఇంటినిర్మాణం పూర్తి అనే నాలుగు దశలలో బిల్లును చెల్లిస్తారు. ఇందుకోసం హౌసింగ్ అధికారులు ఒక్కో దశలో జియోట్యాగింగ్ చేసి బిల్లులు ఆన్లైన్లో నమోదు చేస్తే... నేరుగా అమరావతి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. అయితే లంచాలకు అలవాటు పడిన హౌసింగ్ అధికారులు చేయితడపందే బిల్లులు ఆన్లైన్లో నమోదు చేయడం లేదు. అంతేకాకుండా ఇలా డబ్బు వసూళ్ల కోసం అధికార పార్టీకి చెందిన వారినే దళారులుగా నియమించారు. ధర్మవరం నియోజకవర్గంలోని లబ్ధిదారుడు ఎవరైనా సరే... జియోట్యాగింగ్ చేసి బిల్లు ఆన్లైన్ చేయాలంటే... ముందుగా అధికార పార్టీకి చెందిన దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఉంది. వీరి ద్వారా ఒకసారి జియోట్యాగింగ్ చేస్తే రూ.2 వేలు చెల్లించాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. డబ్బులివ్వకపోతే నెలలు గడచినా జియోట్యాగింగ్ చేసేందుకు అధికారులు రావడం లేదనీ...అందువల్లే తప్పనిసరి పరిస్థితులలో లంచం ఇస్తున్నామని ఇళ్ల లబ్ధిదారులు వాపోతున్నారు. మరోవైపు ఇళ్లు మంజూరు కావాలంటే ముందుగానే రూ.20 వేలు చెల్లించాలని చాలా చోట్ల దళారులు, అధికారులు దోపిడీ చేస్తున్నట్లు సమాచారం. పట్టుచీరల ఇవ్వాలని డిమాండ్ పట్టణంలోని శివానగర్, కేశవనగర్, శాంతినగర్, చంద్రబాబు నగర్ తదితర చేనేతలు అత్యధికంగా> నివశించే ప్రాంతాల్లో హౌసింగ్ అధికారులు దళారుల చేత పట్టుచీరల కోసం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా చాలామంది చేనేత కార్మికులు తాము కష్టపడి నేసిన పట్టుచీరలను హౌసింగ్ కార్యాలయంలో ఓ అధికారినికి ఇచ్చి బిల్లులు పొందామని వాపోతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం వస్తుందన్న భరోసాతో ఇళ్లు నిర్మిస్తే..లంచాలకే అది సరిపోతోందని లబ్ధిదారులు నిట్టూరుస్తున్నారు. అధికారుల బాధ్యతా రాహిత్యం ఇటీవల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 200 మంది లబ్ధిదారులకు ఒకసారి చెల్లించాల్సిన బిల్లును అధికారులు రెండుసార్లు ఖాతాల్లో జమ చేశారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న అధికారులు బ్యాంకుల వద్దకు వెళ్లి లబ్ధిదారుల ఖాతాలను ఫ్రీజ్ చేశారు. వారి నుంచి డబ్బులు రికవరీ చేసేందుకు నానాపాట్లు పడ్డారు. దీంతో వాస్తవంగా ఆస్థానంలో బిల్లులు పొందాల్సిన వారు సకాలంలో బిల్లు అందక ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలానే పట్టణంలోని శివానగర్‌లో ఒక వ్యక్తి ఇంటిని రెండు సార్లు జియోట్యాగింగ్ చేసి బిల్లును పొందారు. ఈ విషమం హౌసింగ్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్ పరిగణించిన వారు బిల్లులు చెల్లించిన ఖాతాలను ఫ్రీజ్ చేసి నగదును రికవరీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అవినీతిని ఉపేక్షించం ఇళ్ల లబ్ధిదారులు జియోట్యాగింగ్, బిల్లులు చెల్లింపులకు ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన ఆవసరం లేదు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. సాంకేతిక సమస్యతో ఇటీవల కొంతమంది లబ్ధిదారులకు బిల్లు రెండుసార్లు ఖాతాలో జమ అయ్యింది. వెంటనే లబ్ధిదారుల ఖాతా నుంచి నగదును రికవరీ చేశాం. భవిష్యత్‌లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూస్తాం. –చంద్రశేఖర్, హౌసింగ్ డీఈ, ధర్మవరం -
కాంగ్రెసోళ్లు లుచ్చాగాళ్లు..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెసోళ్లు లుచ్చగాళ్లంటూ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఫైర్ అయ్యారు. కరీంనగర్లో రూ.231 కోట్లతో చేపడుతున్న స్మార్ట్‌సిటీ రోడ్ల పనులను, రూ.5కే భోజనం పథకాన్ని, కోర్టు జంక్షన్లో అందంగా రూపొందించిన కూడలిని బుధవారం ప్రారంభించారు. అనంతరం సర్కస్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోకి కొత్త బిచ్చగాళ్లొచ్చారంటూ.. సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు వచ్చి నట్లు ఎన్నికలు దగ్గర పడుతుండగానే ఢిల్లీ నుంచి ఇక్కడికొచ్చారని విమర్శించారు. గంగిరెద్దులోళ్లు మంచోళ్లంటూనే.. కాంగ్రెసోళ్లు లుచ్చాగాళ్లంటూ మండిపడ్డారు. నాలుగేళ్లుగా గ్రామాల్లో మొఖం చూపలేని.. తెలివిలేని దద్దమ్మలు ఇప్పుడొచ్చి ‘తిమ్మి ని బమ్మిని’చేసే మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగేళ్ల కేసీఆర్ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వ లేని కాంగ్రెస్ నేతలు ప్రజలపై కపట ప్రేమను ఒలక బోస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఖతం.. సొంత నియోజకవర్గంలోని అమేథీ మున్సిపాలిటీని గెలిపించుకోలేని రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తాడంటే హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీఎస్పీ, సమాజ్‌వాది దయ తో గెలిచిన రాహుల్.. ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ భూస్థాపితమవుతోందని విమర్శించారు. అందుకు కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో సైతం కాంగ్రెస్ ఖతమవుతుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. భవిష్యత్‌లో రాహుల్ శిష్య బృందానికి శంకరగిరి మాన్యాలు తప్పవని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కరెప్షన్‌కు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కరెప్షన్‌కు కేరాఫ్ అడ్రస్ అని.. అలాం టి వారు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేటీఆర్ అన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ అంటేనే దోపిడీ అంటూ రాహుల్ తిమ్మిని బమ్మిని చేస్తూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వాళ్లు అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్నారని, 60 ఏళ్లు దగాపడ్డ తెలంగాణకు మాత్రం ఏమీ ఇవ్వ మని చెప్పకనే చెబుతున్నారని విమర్శించారు. ఒక్క రిజర్వాయర్ లేకుండా 160 టీఎంసీల నీటిని కేవలం పంపింగ్ ద్వారా ఎత్తిపోయడం సాధ్యం కాదని, నీటి నిలువ సామర్థ్యం పెంచితే, కరువు సమయంలో కూడా నీళ్లను అందించేలా రీడిజైన్లు చేపట్టామని వివరించారు. రాహుల్ గన్‌పార్కుకు వెళ్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించడం విడ్డూరంగా ఉందన్నారు. 1969 ఉద్యమంలో ఇందిరాగాంధీ హయాంలో 369 మందిని చంపిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. గన్‌పార్కు ఎందుకు కట్టారో కూడా రాహుల్‌కు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. అభివృద్ధి చేసి చూపించాం: ఈటల 56 ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించామని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కురుచ పార్టీల నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రజలకు టీఆర్ఎస్పై ప్రేమ ఆశీర్వాదం ఉందని, కాం గ్రెస్ వాళ్ల కల్లబొల్లి మాటలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. తొలి బీమా ప్రయోజనం సిరిసిల్ల జిల్లాలో రెండు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందజేత సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకంలో తొలి ప్రయోజనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇద్దరు రైతుల కుటుంబాలకు దక్కింది. జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో మంత్రి కేటీఆర్ రెండ్రోజుల క్రితం మృతి చెందిన కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన జాప పోషయ్య (50), చందుర్తి మండలం మూడపల్లికి చెందిన రాచర్ల బూదమ్మ(42) కుటుంబ సభ్యులకు ప్రొసీడింగ్ కాపీలు అందించారు. రాష్ట్రంలోని 25 లక్షల మంది రైతులకు ప్రభుత్వమే ప్రీమి యం చెల్లించి బీమా చేయించిందని కేటీఆర్ తెలిపారు. రైతు చనిపోతే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ఎల్ఐసీ ద్వారా ఇప్పిస్తున్నామని స్పష్టం చేశారు. రైతులు చనిపోయిన 24 గంటల్లోగా బీమా సాయాన్ని అందించడం రాష్ట్రంలో తొలిసారి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ డి.కృష్ణభాస్కర్, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పాల్గొన్నారు. -
అవినీతి కొండ.. వెంగమాంబ
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం యంత్రాంగం అవినీతి ఊబిలో కూరుకుపోయింది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవంగా చెల్లించాల్సిన జీతాలు కంటే.. అధికంగా చెల్లించి ఏజెన్సీ నిర్వాకుడి మీద అభిమానం చాటుకుంది. వర్సిటీ ప్రధాన ఖాతా నుంచి నిధులు ఏజెన్సీ నిర్వాహకుడి ఖాతాలో అధికంగా జమ చేసింది. ఈ అవినీతి అక్రమాల వ్యవహారాన్ని ప్రొఫెసర్ల కమిటీ నిర్ధారించింది. ఎస్కేయూ: ఎస్కే యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న వెంగమాంబ సెక్యూరిటీ సర్వీసెస్‌కు అప్పగించిన విధానం, జీతాలు చెల్లింపు, విధివిధానాలు, నియమ నిబంధనలను పరిశీలించి సమగ్ర దర్యాప్తు చేయడానికి పాలకమండలి ఉప కమిటీని 2017 మార్చి 8న నియమించారు. ఈ ఉపకమిటీలో ప్రొఫెసర్ బి.ఫణీశ్వరరాజు, ప్రొఫెసర్ ఎ.మల్లికార్జునరెడ్డి, ప్రొఫెసర్ జి.శ్రీధర్ (మాజీ రెక్టార్) సభ్యులుగా ఉన్నారు. 2015 ఆగస్టు 10 నుంచి 2016 డిసెంబర్ 31 వరకు వెంగమాంబ ఏజెన్సీకి జమ చేసిన జీత మొత్తాల వివరాలను కమిటీ అధ్యయనం చేసింది. ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ వివరాలు సరైనవేనా అనే అంశంపై కమిటీ ప్రత్యేకంగా లేబర్ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఎక్సైజ్ విభాగాలను సందర్శించి మరీ పరిశీలించింది. సమగ్రంగా అధ్యయనం చేసిన కమిటీ అదే ఏడాది మార్చి 18న నివేదిక సమర్పించింది. ఇందులో ప్రధానంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కింద పనిచేసే ఉద్యోగుల జీతాల క్లెయిమ్ బిల్లులు, కమిటీ సిఫార్సులను పొందుపరిచింది. బోగస్ సంస్థల పేరుతో గోల్మాల్ ఏదైనా ఏజెన్సీ టెండర్ దక్కించుకోవాలంటే కచ్చితంగా కార్మిక శాఖలో పేరు నమోదు చేసుకోవాలి. కానీ వెంగమాంబ ఏజెన్సీ చట్టబద్ధత లేని సంస్థ అని కమిటీ స్పష్టం చేసింది. ఆరు కొటేషన్లను ప్రధానంగా తీసుకుని అందులో ప్రామాణికతలు గల ఏజెన్సీ సంస్థకు అప్పగించాలి. కానీ ఆరు కొటేషన్లు తిరుపతికి చెందిన ఏ మాత్రం చట్టబద్ధత లేని కంపెనీల పేరుతో బురిడీ కొట్టించి ఏజెన్సీ దక్కించుకుందని కమిటీ చివాట్లు పెట్టింది. మొదట 40 మంది ఉద్యోగులు అవసరమని టెండర్ ఖరారు చేసుకుని.. తర్వాత ఉద్యోగుల సంఖ్యను 69కు పెంచారు. జీతాల చెల్లింపుకు సంబంధించి జీఓ 43, జీఓ 151లను పాటించలేదు. ప్రభుత్వ సంస్థలు, వర్సిటీల్లో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ జీతాల చెల్లింపునకు ఈ జీఓల ప్రకారం తప్పనిసరిగా విధివిధానాలు పాటించాలి. కేవలం అవగాహన ఒప్పందంలో పొందుపరిచిన అంశాల ప్రకారం జీతాల చెల్లింపు అడ్డుగోలుగా జరిగాయని కమిటీ ఏకరువు పెట్టింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పైగా ఏజెన్సీ నిర్వాహకుడికి భారీగా లబ్ధి చేకూరింది. కమిటీ సిఫార్సులే పట్టించుకోలేదు.. ‘ఏజెన్సీ నిర్వాహకుడి వ్యవహారం అప్పటికే వివాదాస్పదం కావడంతో కమిటీ నివేదిక ఇచ్చే ముందు ఆరు నెలల జీతాలు చెల్లింపు చేయలేదు. దీంతో ఏజెన్సీకి ఇవ్వాల్సిన రూ.30.54 లక్షలు జీతాలు నిలిపివేయండి. వాస్తవానికి ఏజెన్సీకి అవగాహన ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన మొత్తం రూ.75,25,554. కానీ రూ.81,89,278 చెల్లించారు. ఉదారంగా రూ. 6,63,724 అదనంగా చెల్లించారు (కమిటీ నివేదిక ఇచ్చిన కాలం వరకే ). ఇంకా రూ.30.54 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇందులో నుంచి అధికంగా చెల్లించిన రూ. 6,63,724 రికవరీ చేయాలి. అనంతరం తక్కిన మొత్తాన్ని ఏజెన్సీ ద్వారా కాకుండా నేరుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించండి’ అని కమిటీ స్పష్టం చేసింది. కానీ ఒక్క నయాపైసా రికవరీ చేయలేదు. కమిటీ సిఫార్సు చేసినప్పటికీ, నివేదిక సమగ్రంగా ఇచ్చినప్పటికీ, ఏకంగా రూ.30,54,000ను ఏజెన్సీ నిర్వాహకుడికి చెల్లించేసి తమ ఉదారతను చాటుకున్నారు. నివేదికపై పాలకమండలిలో చర్చేదీ? ‘ఉద్యోగికి సంబంధించిన పీఎఫ్ చందాను ప్రతి నెలా ఏజెన్సీ నిర్వాకుడు జమ చేయలేదు. ఏజెన్సీ నిర్వాహకుడు స్వాహా చేసిన పీఎఫ్ మొత్తం రూ.6,82,201, ఈఎస్ఐ చందా కింద ఉద్యోగులకు దక్కాల్సిన మొత్తం రూ.2,70,038. పీఎఫ్, ఈఎస్ఐ మొత్తంతో పాటుగా వర్సిటీ అదనంగా చెల్లించిన రూ.6,63,724ను రికవరీ చేయండి. పీఎఫ్, ఈఎస్ఐ చందాలను ఉద్యోగుల ఖాతాల్లోకి జమ చేయండి. వర్సిటీకి రావాల్సిన అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన రూ.30.54 లక్షల్లో రికవరీ చేయాల’ని ఉప కమిటీ స్పష్టం చేసినప్పటికీ ఖాతరు చేయలేదు. ఇందులో లక్షలాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ నివేదికపై పాలకమండలి సమావేశంలో చర్చించలేదు. నివేదికను తొక్కిపెట్టి మౌనం వహిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెల్లించాల్సిన మొత్తం రూ.30.54 లక్షలు చెల్లించి ఏజెన్సీ నిర్వాకుడి మీద ఒక క్రిమినల్ కేసు పెట్టి చేతులు దులుపుకోవడం కొసమెరుపు. -
పిల్లల బియ్యం మెక్కేశారు...!
సాక్షి ప్రతినిధి కడప: పాఠశాలలో విద్యార్థులకు వండిపెట్టాల్సిన 60 బస్తాల బియ్యం అక్కడి అధికారి ‘స్థానిక’ సిబ్బందితో కలిసి గుట్టుచప్పుడు కాకుండా గుటుక్కున మింగేశారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. తమను ప్రశ్నించేవారు లేరనుకున్నారో.. లేక గతంలో బోలెడు అవినీతి చేసినా ఎవరూ కనుగొనలేకపోయారనుకున్నారో తెలియదు కానీ, ఈసారి బడి పిల్లల బియ్యానికే ఎసరు పెట్టి ఏకంగా 60 బస్తాలను మాయం చేశారు. మునుపటి ప్రధానోపాధ్యాయుడు పదవీ విరమణ చేసి కొత్త ప్రధానోపాధ్యాయుడు బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఈ అవినీతి ఒక్కసారిగా వెలుగు చూడడంతో బియ్యం బకాసురులు ఉలిక్కి పడుతున్నారు. కొండాపురం జిల్లా ఉన్నత పాఠశాలలో 280 మంది విద్యార్థులు చదువుతున్నారు. మధ్యాహ్నబోజన పథకంలో భాగంగా ఒక్కో విద్యార్థికి 150 గ్రాముల చొప్పున ఈ పాఠశాలలో నెలకు 18 నుంచి 20 బస్తాలు బియ్యం ఖర్చు అవుతాయి. విద్యార్థుల హాజరు ప్రకారం అక్కడ ఖర్చు అయిన బియ్యం కంటే 2017–18 విద్యా సంవత్సరంలో 60 బస్తాలు అదనంగా పంపించినట్లు రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. అంటే ఈ ఏడాది ఏప్రిల్ 23 నాటికి ఆపాఠశాలలో 30 క్వింటాళ్లు నిల్వ ఉండాలి. వాస్తవంలో ఒక్క క్వింటా కూడా మిగులులో లేదు. బాగోతం వెలుగు చూసిందిలా.. గతంలో బియ్యం గోల్మాల్ వ్యవహారం మూడో కంటికి తెలియకుండా ముగిసేది. ఈపరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయుడు ఈశ్వరయ్య మే31న పదవీ విరమణ చేశారు. తదుపరి సీనియర్ ఉపాధ్యాయునికి ప్రధానోపాధ్యాయుడి బాధ్యతలు అప్పగించే సమయంలో బియ్యం వ్యవహారం వెలుగుచూసింది. రికార్డు ప్రకారం తనకు 60 బస్తాలు నిల్వ చూపిస్తే తప్పా పూర్తి బాధ్యతలు తీసుకోలేనని గట్టిగా చెప్పడంతో అటు పూర్వపు ప్రధానోపాధ్యాయుడిని మందలించలేక, ప్రస్తుత ప్రధానోపా«ధ్యాయుడికి నచ్చజెప్పలేక అధికారులు తలపట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. ‘స్థానిక’ సిబ్బందిపైనా అనుమానాలు.. ఈస్వాహా పర్వంలో పూర్వపు ప్రధానోపాధ్యాయుడు ఈశ్వరయ్యతోపాటు స్థానికంగా ఉన్న కొందరు బోధన, బోధనేతర సిబ్బంది హస్తం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరు ప్రధానోపాధ్యాయుడి అలసత్వాన్ని ఆసరాగా తీసుకొని ఎవ్వరికీ చేతనైనన్ని మాయం చేసినట్లు తెలుస్తోంది. ఈపాపంలో తనకు భాగం ఉండడంతో ప్రధానోపాధ్యాయుడు అక్రమార్కులను వారించలేనట్లు సమాచారం. గతంలో సైతం ఈశ్వరయ్య పాఠశాల ఆవరణంలో ఉన్న దశాబ్దాల కాలం నాటి పెద్ద వృక్షాలను నరికించి వాటిని అమ్మకానికి పెట్టినట్లు ఆరోపణలు వెల్లవెత్తాయి. ఒక ట్రాక్టర్ మొద్దులు తరలించిన అనంతరం ఈ వ్యవహారం మీడియా దృష్టికి రావడంతో విధిలేని పరిస్థితుల్లో అటవీ అధికారులు జోక్యం చేసుకోని కొండాపురం పోలీసుస్టేషన్లో అప్పట్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఆ మిగులు మొద్దులు పాఠశాల ఆవరణలో కుళ్లిపోతున్నా కేసు మాత్రం ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు. అధికారులు ఏమి చేస్తున్నట్లు.. ఏ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు భోంచేశారన్న విషయాన్ని సంబంధిత ప్రధానోపాధ్యాయుడు ఏ రోజుకు ఆరోజు మొబైల్ యాప్ ద్వారా తెలియజేస్తూండాలి. ఈ లెక్క ఆధారంగానే తర్వాత నెలా బియ్యం కేటాయింపులు చేస్తారు. కొండాపురం పాఠశాలలో 100శాతం విద్యార్ధులు హాజరవుతున్నారని రాసినప్పటికీ ఇక్కడ నెలకు 20 బస్తాలు కంటే ఎక్కువ బియ్యం ఖర్చు కావు. అలాంటిది ఏకంగా మూడు నెలలకు సరిపడే బియ్యాన్ని అధికారులు ఆపాఠశాలకు అదనంగా కేటాయించి ఆవాటి లెక్క జమల అడుగక పోవడం ఆశ్చర్యం కల్గించక మానదు. ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు దృష్టి సారించకపోయి ఉంటే ఇక 60 బస్తాల స్వాహా పురాణం వెలుగు చూసే అవకాశం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కొండాపురం జడ్పీ హైస్కూల్లో చోటుచేసుకున్న బియ్యం స్వాహా ఉదంతంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా పదవీ విరమణ చేశారు కదా..అనారోగ్యంతో ఉన్నారు కదా....అని ఉపేక్షిస్తూ పోతే వ్యవస్థను మరింత అవినీతి మయం చేసినట్లు అవుతోందని విద్యావేత్తలు వాపోతున్నారు. -
మోదీ.. చర్చకు వస్తావా?
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ.. అబద్ధాలు చెప్పడంలో వారిద్దరిదీ ఒకటే స్టైల్.. ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ చెబితే, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇవి రెండూ నెరవేరేవి కావు. రాష్ట్రంలో ఒక్క కుటుంబానికే ప్రాధాన్యం ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ తుంగలోకి తొక్కారు..’’అంటూ ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. గత నాలుగేళ్లలో తెలంగాణలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, లక్ష ఉద్యోగాలు ఖాళీ ఉంటే 10 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీని అటకెక్కించారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, తెలంగాణలో ప్రస్తుతం ప్రతి కుటుంబంపై రూ.2.66 లక్షల అప్పు ఉందని పేర్కొన్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రాష్ట్రానికి వచ్చిన రాహుల్.. సాయంత్రం శేరిలింగంపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇచ్చిన హామీలేవీ పట్టించుకోని కేసీఆర్ కనీసం.. రాష్ట్ర విభజన హామీలను కూడా నెరవేర్చుకోలేకపోయారని అన్నారు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులివ్వని కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి పెద్ద నోట్ల రద్దు నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వరకు ప్రతి అంశంలోనూ బీజేపీకి కేసీఆర్ మద్దతిచ్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఏమీ చేయనప్పుడు కేంద్రానికి ఎందుకు మద్దతివ్వాల్సి వచ్చిందో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతిపై ఇంటింటికి వెళ్లండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అవినీతిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. కేంద్రంలో రాఫెల్ కుంభకోణంతోపాటు కేసీఆర్ చేస్తున్న అవినీతి, అబద్ధాలపై ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్‌లో మొదట్నుంచీ ఉండి పోరాటం చేస్తున్న వారికి తగిన గుర్తింపు ఉంటుందని, వారినే చట్టసభలకు పంపుతామని చెప్పారు. ఎన్నికల సమయంలో పైనుంచి ప్యారాషూట్లలో వచ్చి టికెట్లు అడిగే వారి సంగతి తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. విభజన హామీలన్నీ నెరవేరుస్తాం ‘‘నేను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నా.. నా రికార్డు చూడండి.. పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడినా, బయట మాట్లాడినా... నేను ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను..’’అని రాహుల్ అన్నారు. ‘‘రుణమాఫీ చేస్తామని చెప్పి కర్ణాటకలో రూ.70 వేల కోట్ల రైతుల అప్పులు రద్దు చేసి చూపించాం. భూసేకరణ చట్టం అమల్లోకి తెచ్చాం. నేను అబద్ధాలు చెప్పడానికి ఇక్కడకు రాలేదు. ప్రధానిలా ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పను. చందమామను భూమిపైకి తెస్తానని చెప్పను. ప్రధాని, తెలంగాణ ముఖ్యమంత్రిలాగా అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు. ఈ సభ నుంచి చెబుతున్నా. 2019 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం. అది ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదా అయినా... తెలంగాణకు ఇచ్చిన హామీలయినా.. అన్నింటిని నెరవేర్చి తీరుతాం’’అని స్పష్టం చేశారు. మోదీ చేసినా చేయకపోయినా ఆ హామీలను నెరవేర్చడం తమ బాధ్యతగా తీసుకుంటామన్నారు. పునర్విభజన హామీలు తెలంగాణ, ఆంధ్రా ప్రజల హక్కు అని, వాటిని కాపాడతామని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, పార్టీ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్క, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మధుయాష్కీ, జైపాల్‌రెడ్డి, గీతారెడ్డి, జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎస్.సంపత్‌కుమార్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, రేణుకా చౌదరి, మల్లు రవి, వి.హనుమంతరావు, మర్రి శశిధర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి భిక్షపతి యాదవ్, రవియాదవ్లతో పాటు భారీసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మోదీ.. చర్చకు వస్తావా? వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు స్కాంపై ప్రధాని మోదీ బహిరంగ చర్చకు రావాలని రాహుల్ సవాల్ విసిరారు. అది పార్లమెంటు ప్రాంగణంలో అయినా.. ఇంకెక్కడయినా తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. రూ.562 కోట్ల విలువైన విమానాలను రూ.17 వేల కోట్లు పెట్టి ఎలా కొన్నారని పార్లమెంటులో మోదీని అడిగితే దాని గురించి ఒక్క మాటా మాట్లాడలేకపోయారని ఎద్దేవా చేశారు. రాఫెల్ విమానాల ధరలు బయటకు చెప్పకూడదని కేంద్రం చెబుతోందని, దీనిపై తాను ఫ్రాన్స్ అధ్యక్షుడిని అడిగితే అలాంటిదేమీ లేదని ఆయన చెప్పారన్నారు. దీనిపై పార్లమెంటులో 56 అంగుళాల ఛాతీ ఉన్న కాపలాదారుడిని నిలదీస్తే కనీసం నా కళ్లలోకి చూడలేకపోయారని వ్యాఖ్యానించారు. దేశంలో, రాష్ట్రంలో తొలిసారి పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయిందని, వాస్తవాలను రాసేందుకు కూడా మీడియా వెనుకాడుతోందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పత్రికా స్వేచ్ఛను పునరుద్ధరిస్తామని చెప్పారు. -
అనుభవంతో అవినీతి అభివృద్ధి
దర్శి: దేశంలో అందరికంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్నట్లు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి రాష్ట్రంగా తీర్చి దిద్దడంలో ఆయన అనుభవాన్ని చూపించారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరువ లక్ష్మీ నారాయణ రెడ్డి విమర్శించారు. స్థానిక ఆపార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరశింహరావు అడిగిన రూ. 53 వేల కోట్లు పీడీ అకౌంట్లలో ఎందుకు జమచేయాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. కేంద్రం ఇస్తున్న ని«ధులతో కడుతున్న పోలవరం తానే కడుతున్నట్లు ఆంధ్ర ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని అన్నారు. తాగునీటి అవసరాలు తీర్చే వెలుగొండ, గుండ్లకమ్మ, పాలేరు వంటి చిన్న చిన్నప్రాజెక్టులను కూడా నాలుగేళ్లుగా ఎందుకు పూర్తి చేయలేక పోయారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. రూ. 25 వేల కోట్లతో అభివృద్ధి చెందే రామాయపట్నం పోర్టుకు ఎందుకు అనుకూలంతో కూడిన ప్రత్యుత్తరం కేంద్రానికి ఇవ్వలేక పోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల వద్ద పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుతో ధర్మదీక్షలు, విదేశాల పర్యటనల పేరుతో దర్వినియోగం చేస్తూ, తనకు అనుకూలమైన వారికి దోచి పెడుతూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని మండి పడ్డారు. ఇప్పటికీ జిల్లాలో జరుగుతున్న ఇసుకమాఫియా, అటవీ శాఖలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమాలను ఎప్పుడు అరికడతారని ప్రశ్నించారు. దర్శి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి శిద్దా రాఘవరావు 2014లో ఇచ్చిన హామీలైన ఆర్టీసీ డిపో, ఎర్రచెర్వును మంచినీటి చెరువుగా మార్చడం, దర్శి కేంద్రంగా రెవెన్యూ డివిజన్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ఇండోర్‌స్టేడియం, రైతుబజార్, దొనకొండ కేంద్రంగా పారిశ్రామిక హబ్, దర్శి– కురిచేడు, దర్శి–దొనకొండ డబుల్ రోడ్డు, వంటి ఎన్నో ప్రజలకు ఉపయోగ పడే హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. నియోజకవర్గంలో రూ.2500 కోట్ల అభివృద్ది చేశానని చెప్తున్న మంత్రి శిద్దా కనీసం తాగు నీటి సమస్య తీర్చగలిగారా అని ప్రశ్నించారు. ఇక్కడ జరిగింది అభివృద్ధి కాదని కందుల కొనుగోలు కేంద్రాల్లో భారీగా అవినీతి, జన్మభూమి కమిటీలను అడ్డుపెట్టి నీరు–చెట్టు పేరుతో దోపిడీ, నివాసాల మంజూరులో, మరుగుదొడ్లలో అవినీతి సాధించారని ప్రజలే చెప్తున్నారని విమర్శించారు. ఇన్ని కోట్ల అవినీతికి మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ తిండి నారాయణరెడ్డి, మండల పార్టీ అ«ధ్యక్షుడు ఆలమోతు అమర్నా«థ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మాడపాకుల శ్రీనివాసులు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరంరెడ్డి నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కణితి నాగభూషణాచారి, వి. అమరేశ్వరరావు, బోసులు పాల్గొన్నారు. -
తునిలో డంపింగ్ యార్డ్ లేక శ్మశానంలో చెత్త వేస్తున్నారు
-
ఎల్ఎల్ఆర్ మేళాతో మోసం
జంగారెడ్డిగూడెం : కాదేది వసూళ్లకు అనర్హం అన్నట్లుగా సాగింది ఓ సీఎస్సీ నిర్వాహకుడి తీరు. రవాణా శాఖ ద్వారా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎల్ఎల్ఆర్ మేళాను కాసులు కురిపించే కార్యక్రమంగా మార్చుకున్నాడు. అమాయక గిరిజనులను టార్గెట్ చేసుకుంటూ లక్షలాది రూపాయలు కాజేశాడు. మోసపోయామని తెలుసుకున్న గిరిజనులు ఐటీడీఏ పీఓను ఆశ్రయించడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రవాణా శాఖ ప్రతీ వాహన చోదకుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రవాణా శాఖ జంగారెడ్డిగూడెం సబ్యూనిట్ ఆధ్వర్యంలో ఇటీవల జీలుగుమిల్లిలో ఒక సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) ద్వారా ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు మంచి స్పందన వచ్చింది. ఆ రోజు సర్వర్ సక్రమంగాపనిచేయకపోవడంతో కొద్ది మందికి మాత్రమే స్థానిక ఎంవీఐ సీహెచ్ వెంకటరమణ, ఏఎంవీఐ శ్రీనివాస్ ఎల్‌ఎల్‌ఆర్‌లు జారీచేయగలిగారు. మిగిలిన వారంతా నిరాశతో వెనుదిరిగారు. దీనినే సీఎస్సీ నిర్వాహకుడు కాసులు పండించే అవకాశంగా మలుచుకున్నాడు. రవాణాశాఖ అధికారులకు తెలియకుండా వారి అనుమతి లేకుండా ఏజెన్సీ గ్రామాల్లో సొంతంగా ఎల్ఎల్ఆర్ మేళాను ఏర్పాటు చేశారు. ఒక కారులో ల్యాప్‌టాప్ తీసుకుని ఆయా గ్రామాలకు వెళ్లి దండోరా వేయించి ఏకంగా పంచాయతీ కార్యాలయంలోనే ఎల్ఎల్ఆర్ మేళా ఏర్పాటు చేశాడు. డ్రైవింగ్ లైసెన్స్ కావాల్సిన వారు పంచాయతీ కార్యాలయానికి రావాలని డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తామని దండోరా వేయించారు. ఐటీడీఏ ద్వారా మేళాను ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. దీంతో అమాయక గిరిజనులు వందల సంఖ్యలో క్యూకట్టారు. ఇలా జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో సదరు సీఎస్సీ నిర్వాహకుడు మేళాను ఏర్పాటు చేశారు. వాస్తవానికి మోటార్ సైకిల్ ఎల్‌ఎల్‌ఆర్‌కు రూ.260 తీసుకోవాల్సి ఉండగా సదరు నిర్వాహకుడు రూ.600, కారు లేదా ట్రాక్టర్‌కు అయితే రూ.410 తీసుకోవాల్సి ఉండగా రూ.1000 వరకు వసూలు చేశాడు. అంటే ఒక్కొక్క ఎల్‌ఎల్‌ఆర్‌కు రెట్టింపుపైగా వసూలు చేశాడు. సుమారు 2500 స్లాట్లు బుక్ చేశాడు. ఈ విధంగా లక్షలాది రూపాయలు దండుకున్నాడు. దీంతో స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో సెప్టెంబర్ 2వ వారం వరకు కూడా ఎల్‌ఎల్‌ఆర్‌కు స్లాట్లకు ఖాళీలేదు. సదరు నిర్వాహకుడు బుక్ చేసిన స్లాట్‌కు సంబంధించి గిరిజన యువకులు ఎంవీఐ కార్యాలయానికి వచ్చి లైసెన్స్ ఇమ్మని అడగడంతో రవాణా శాఖాధికారులు అవాక్కయ్యారు. దీనికోసం టెస్ట్ నిర్వహించడంతో వారంతా అవగాహన లేక టెస్ట్‌లో విఫలమయ్యారు. దీంతో గిరిజనులు ఐటీడీఏ పీఓ హరేంద్రప్రసాద్‌కు ఫిర్యాదుచేశారు. వెంటనే ఆయన స్థానిక ఎంవీఐ సీహెచ్ వెంకటరమణను అడగ్గా తామేమీ ఎల్ఎల్ఆర్మేళా నిర్వహించలేదని స్పష్టం చేశారు. దీంతో నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఐటీడీఏ మేనేజర్‌కు ఆదేశాలు జారీచేశారు. అయినా ఫలితం లేకపోయింది. గిరిజనులు మాత్రం డ్రైవింగ్ లైసెన్సుల కోసం స్థానిక ఎంవీఐ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఎంవీఐ వెంకట రమణ సీఎస్సీ హెడ్ అయిన ఏలూరుకు చెందిన రాజుకు ఫోన్లో జీలుగుమిల్లి సీఎస్సీ నిర్వాహకుడిపై ఫిర్యాదు చేశారు. అయినా నేటికీ చర్యలు లేవు. తామంతా మోసపోయామని, తమ వద్ద ఎల్ఎల్ఆర్ పేరుతో లక్షలాది రూపాయలు సీఎస్సీ నిర్వాహకుడు వసూలు చేశాడని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
స్వామీ.. ఏమిటీ దోపిడీ!
మంత్రాలయం: స్వామీ నిన్ను కొలవని వారికి నీవంటే భయం.. నిన్ను కొలిచే వారికి నీవంటే భక్తి.. నీ భక్తులను మోసం చేసేవారికి నీ సన్నిధి ఓ వ్యాపార కేంద్రం. ఇక్కడ రావాల్సింది అధికారులకు వస్తోంది. కావాల్సిన దానికి మించి కాంట్రాక్టర్‌కు మిగులుతోంది. దేవుని సాక్షిగా రూ.కోట్లలో అవినీతి పర్వం దర్జాగా సాగిపోతోంది. ఏటా దోపిడీ విలువ అక్షరాల కోటి రూపాయలు. ఈ సొమ్మంతా భక్తుల నుంచి దోచుకుంటున్నదే. ప్రముఖ ఉరుకుంద నృసింహ ఈరన్న స్వామి పుణ్య క్షేత్రంలో అధికారులు, కాంట్రాక్టర్లు ఏటా చేస్తున్న దగా ఇదీ. దోపిడీ లీలలు కన్నామంటే కళ్లు తిరిగాల్సిందే. ఇదిగో దోపిడీ బాగోతం. నారీకేళాల సమర్పణ 14 లక్షలు పుణ్యక్షేత్రంలో ఏటా శ్రావణ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రావణ సోమ, గురు, శనివారాలు భక్తుల రద్దీ ఉంటుంది. నెలలో దాదాపు 10 లక్షల మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శిస్తారు. అందులో ఎంతలేదన్న 7 లక్షల మంది భక్తులు జోడు టెంకాయలు స్వామికి సమర్పిస్తారు. ఈ లెక్కన క్షేత్రంలో అమ్ముడు పోయే టెంకాయలు 14 లక్షలు. టెంకాయలు ప్రతి భక్తుడూ ఇక్కడే కొనుగోలు చేస్తారు. టెంకాయల సమర్పణకు ఎలాంటి టిక్కెట్ లేకున్నా కొట్టే అర్చకులకు జోడికి రూ.10 ఇచ్చుకుంటారు. వాస్తవ ఖర్చు.. టెండర్‌దారులు తూర్పు గోదావరి జిల్లా కోనసీమ, రావులపాలెం, రాజమండ్రి ప్రాంతాల నుంచి ఇక్కడకు టెంకాయలు తీసుకువస్తారు. అక్కడ పెద్దసైజు టెంకాయ రూ.15, మధ్య సైజు టెంకాయ రూ.14, చిన్నసైజు రూ.10–12 ధర పలుకుతోంది. ఉరుకుంద క్షేత్రంలో మధ్యసైజు టెంకాయలు విక్రయిస్తారు. ఉత్సవాలకు 56 లారీల్లో (10 టైర్లు) టెంకాయలు దిగుమతి చేసుకుంటారు. ఒక్కో లారీలో 25 వేలు మధ్య సైజు టెంకాయలు లోడింగ్ అవుతోంది. ఒక్క లారీ బాడుగ అక్కడి నుంచి ఉరుకుందకు రూ.24 వేలు. బాడుగతో కలిపి లారీ టెంకాయలు రూ.3.74 లక్షలు. 56 లారీల టెంకాయలు విలువ రూ.1.96 కోట్లు. అందుకు లారీల బాడుగ మొత్తం రూ.13.44 లక్షలు. అంతా కలిపి కాంట్రాక్టర్ 56 లారీల సరుకు తెప్పించేందుకు గానూ రూ.2.09,44,000 వెచ్చిస్తారు. దోపిడీ తతంగం.. ఈఏడాది ఆదోనికి చెందిన మోహన్ అనే వ్యక్తి టెంకాయల టెండర్ కైవసం చేసుకున్నారు. రూ.90.90 లక్షలకు టెండర్ పాడారు. జోడి టెంకాయలను భక్తులకు రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు. 14 లక్షల టెంకాయలకుగానూ కాంట్రాక్టర్ ధర ప్రకారం వచ్చే మొత్తం రూ.4.90కోట్లు. అందులో ఆయన వెచ్చించిన నగదు రూ.2.09 కోట్లు. టెండర్ చెల్లింపు (రూ90.90 లక్షలు)తో కలిపి ఖర్చు రూ.3 కోట్లు అవుతోంది. భక్తులు సమర్పించిన టెంకాయలో అర చిప్ప కాంట్రాక్టర్‌కే సంబంధం. బయట మార్కెట్లో ఒక్కో చిప్ప ధర రూ.3లు. 14 లక్షల చిప్పలకుగానూ రూ.42 లక్షలు వస్తోంది. టెంకాయ కొట్టుకు 100 టెంకాయలు వేసేందుకు చేసే వసూలు 100. టెంకాయలకు రూ.60. ఈ లెక్కన వచ్చే ఆదాయం రూ.8.40 లక్షలు. అదనపు రేటు, చిప్పల విలువ కలిపి ఆయనకు నికరంగా మిగులు రూ.5,40,40,000. అందులో వెచ్చించి న ఖర్చు, టెండర్ నగదు తీసివేయగా దోపిడీ విలువ రూ.1.49 కోట్లు. ఇదీ ముమ్మాటికీ భక్తుల నుంచి దోచుకున్న సొమ్ము. అంతా కుమ్మక్కు.. ఏటా శ్రావణమాసంలో జరుగుతున్న దోపిడీ ఇది. కిందిస్థాయి నుంచి పైస్థాయి దేవదాయ శాఖాధికారులకు తెలిసిన విషయమే. ఇంతగా భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. ఆలయ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అటు దేవుడికి శఠగోపం, భక్తుల నెత్తిన టెంకాయ కొడుతున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అవినీతి సొమ్మును పంచుకు తింటున్నారు. భక్తులు ఎంతగా అరిచి గీపెట్టుకున్నా క్షేత్రం అధికారుల్లో చలనం లేదు. కారణం ఎవరికి ముట్టాల్సింది వారికి ముడుతోంది. ట్రస్టుబోర్డు కమిటీ సభ్యులు ఉన్నా ఫలితం శూన్యం. భక్తుల గోడు పట్టించుకునే పాపాన పోలేదు. నిలువు దోపిడీని అరికట్టి భక్తుల జేబులకు కన్నాలు వేయడం మానుకోవాలని భక్తులు వేడుకుంటున్నారు. ఈ విషయమై ఇటీవల ఈఓ రామ్‌ప్రసాద్ అడుగగా అధిక ధరలకు విక్రయించకుండా తగ్గించే ప్రయత్నం చేస్తామని సెలవిచ్చారు. -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ
సాక్షి, హైదరాబాద్: లంచం తీసుకుంటూ విద్యు త్ శాఖ డీఈ దుర్గారావు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కాడు. యాదాద్రి భువనగిరి జిల్లా టీఎస్ఎస్పీడీసీఎల్లో దుర్గారావు డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. భాస్కర్‌రావు అనే కాంట్రాక్టర్ దగ్గర బిల్లుల మం జూరుకై రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. దాంతో భాస్కర్‌రావు ఏసీబీని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు బుధవారం హైదరాబాద్‌లోని దుర్గారావు నివాసంలో లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దుర్గారావును అరెస్ట్ చేసి ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. -
‘అవినీతి అంతానికి రూ.లక్ష కోట్లతో పథకం’
తమిళ సినిమా (చెన్నై): తమిళనాడులో అవినీతిని అంతం చేయడానికి రూ.లక్ష కోట్ల వ్యయంతో ఒక పథకం తన వద్ద ఉన్నట్లు నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ ఆదివారం మీడియాకు తెలిపారు. ఆయన పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూనే నటుడిగానూ కొనసాగుతున్నారు. ప్రస్తుతం కమల్‌హాసన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన విశ్వరూపం 2 చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో అవినీతిని అంతం చేయడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. అందుకు తన వద్ద రూ.లక్ష కోట్ల బడ్జెట్లో ఒక పెద్ద పథకం ఉందన్నారు. ఆ పథకం అమల్లోకి వస్తే రాష్ట్రంలో లంచం, అవినీతి వంటివి పూర్తిగా అంతం అవుతాయన్నారు. దీనికంటే తనకు సినిమా ముఖ్యం కాదని అన్నారు. స్నేహబంధం రాజకీయాలకు సహకరిస్తుందా? అని అడుగుతున్నారని, మూగజీవాలకు స్నేహ బంధం ఉంటుందనీ, అవే దాన్ని ఉపయోగించుకుంటూ ఫలం పొందుతున్నప్పుడు రాజకీయవాదులు ఎందుకు ఉపయోగించుకోకూడదు అని ప్రశ్నించారు. తనకు నగరాల్లో కంటే గ్రామాల్లోనే అధిక అభిమాన గణం ఉందని తెలిపారు. వారికి తాను ప్రస్తుతం ఒక నటుడిగానే తెలుసుననీ, ఇకపై రాజకీయనాయకుడిగానూ ఆదరిస్తారనీ అన్నారు. -
టీడీపీ నేతలు దొంగల్లా తప్పించుకుంటున్నారు
సాక్షి, అమరావతి: ‘‘తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అతిపెద్ద కుంభకోణం జరిగిందని చెబితే.. ఆ అవినీతిని బయటపెట్టిన వారిపై విమర్శలు చేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. అవినీతిలో అడ్డంగా దొరికినప్పుడు లాలూ ప్రసాద్‌యాదవ్ మొదట్లో బుకాయించిన తరహాలోనే ఇప్పుడు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇంత పెద్ద అవినీతిని మీడియాలో రాకుండా చేసి విజయం సాధించవచ్చని అనుకుంటున్నారు. 2జీ స్కామ్, లాలూ స్కామ్ జరిగినప్పుడు నిందితులు ఇలాగే బుకాయించారు. అవినీతిలో కూరుకుపోయినా తమను ఎవరేం చేయగలరులే అనుకున్నారు. అలా అనుకున్న వారు చాలామంది చరిత్రలో అక్రమార్కులుగా మిగిలిపోయారు’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఆయన ఆదివారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రూ.53,000 కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును పర్సనల్ డిపాజిట్(పీడీ) ఖాతాల్లో జమ చేసి, ఖర్చు పెట్టిన వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇది కచ్చితంగా అతిపెద్ద అవినీతి కుంభకోణమని పునరుద్ఘాటించారు. పీడీ ఖాతాల కుంభకోణంపై సమాధానం చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం మొదట్నుంచీ ఇష్టపడడం లేదని, భయపడుతోందని జీవీఎల్ దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘రాష్ట్ర ప్రభుత్వంపై ‘కాగ్’ తీవ్ర ఆరోపణలు చేసింది. మీకు(ప్రభుత్వ పెద్దలకు) ఏమాత్రం సిగ్గు, శరం లేదా? లాలూ ప్రసాద్‌యాదవ్ కంటే దిగజారిన పరిస్థితిలో మీరు కనిపిస్తున్నారు. రూ.53,000 కోట్లు అవినీతి గురించి చెబితే తెలంగాణలో కూడా ఉన్నాయంటున్నారు. తెలంగాణలో రూ.8,545 కోట్ల నిధులను ఇలాంటి ఖాతాల్లో వేశారు. వాటికి ఆ ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. వారు ‘కాగ్’కు వివరణ ఇచ్చుకున్నారు. ఏపీలో రూ.53,000 కోట్ల గురించి సమాధానం అడిగితే ప్రభుత్వ పెద్దలు గుమ్మడికాయ దొంగల్లా తప్పించుకుంటున్నారు. మీ వెధవ కౌంటర్లు ప్రజలకు అక్కర్లేదు. ప్రజలకు కావాల్సింది నిధుల ఖర్చుకు వివరాలు మాత్రమే. ‘చౌదరి’ కాపాడుతారని అనుకుంటున్నారేమో! పీడీ ఖాతాల్లో ప్రభుత్వ డబ్బులే జమ చేస్తారు. ఈ ఖాతాల ద్వారా ఖర్చుల్లో అక్రమాలు జరిగినా పట్టుబడే అవకాశం తక్కువ. అలా పట్టుబడకూడదనే ఆంధ్రప్రదేశ్‌లో పీడీ ఖాతాలను పెద్ద సంఖ్యలో తెరిచారు. ఇతర రాష్ట్రాల్లో కేవలం వందల సంఖ్యలో పీడీ ఖాతాలు ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 58,539 పీడీ ఖాతాలు తెరిచారు. షేర్ మార్కెట్ కుంభకోణం లాగా ప్రభుత్వ డబ్బులను ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు, దాంట్లో నుంచి ఇంకొక ఖాతాలో వేసి వివరాలు చెప్పకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారు. ప్రజల డబ్బుల ఖర్చుకు వివరాలు చెప్పమంటే నాపై విమర్శలు చేసి, కావాల్సిన పత్రికల్లో తాటికాయంత ఆక్షరాలతో రాయించుకుంటే సరిపోదు. మీ నిజ స్వరూపాన్ని ‘కాగ్’ రిపోర్టు బయటపెట్టింది. కావాలంటే ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి అంటున్నారు. ఎవరో చౌదరి కాపాడుతారని అనుకుంటున్నారేమో! ఈ విషయాలు ఇంతటితో ఆగవు. ఈ నిధులపై జవాబు ప్రభుత్వం చెప్పేవరకూ దీని గురించి ప్రజాకోర్టులో ప్రస్తావిస్తూనే ఉంటాం. ప్రజలకు సంబంధించిన ప్రతి రూపాయి ఖర్చుకు ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందే. వెధవ కామెంట్లు చేసి తప్పించుకోలేరు. టీడీపీ ప్రభుత్వం సాగించిన అవినీతి వ్యవహారాలు బయటకు రాకుండా ఎక్కువ కాలం దాచలేరు. సద్వినియోగమైతే వివరాలు ఇవ్వరేం? మన రాష్ట్రంలో రూ.వేల కోట్ల నిధులను దారి మళ్లించడానికి, దొంగలించడానికి, అవినీతి చేయడానికి భారీ సంఖ్యలో పీడీ ఖాతాలను తెరిచారు. మిగతా రాష్ట్రాల్లో కేవలం రూ.వంద కోట్లు మాత్రమే ఇలాంటి ఖాతాల్లో ఉంటే, మన రాష్ట్రంలో రూ.వేల కోట్లు ఉన్నాయి. 2జీ స్కామ్, బొగ్గు స్కామ్, కామన్వెల్త్ స్కామ్‌ను బయటపెట్టినట్లుగానే ‘కాగ్’ టీడీపీ ప్రభుత్వ పీడీ ఖాతాల కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. ‘కాగ్’ నివేదికలోని అంశాలనే మేము ప్రస్తావిస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడినవారు అవినీతి దొంగల్లా మాట్లాడుతున్నారు తప్ప మేము అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడం లేదు. అవినీతి బయటపడిందని నిరాశ చెంది నాపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. పీడీ ఖాతాల కుంభకోణంపై సీఎం చంద్రబాబు జవాబు చెప్పాలి. లేదంటే ప్రతి దానికీ మా నాన్న గ్రేట్, నేను గ్రేట్ అని కితాబులిచ్చుకునే నారా లోకేశ్ అయినా జవాబు చెప్పాలి. రూ.53,000 కోట్లు ఎవరు తిన్నారు? ఎవరెవరు పంచుకున్నారు? సమాధానం ఇవ్వాలి. వాటిలో కొంతవరకైనా సద్వినియోగమై ఉంటే వాటి వివరాలెందుకు ఇవ్వట్లేదు? దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. టీడీపీ ప్రభుత్వం లాలూప్రసాద్ యాదవ్ ముద్రనే కొనసాగించాలనుకుంటే అది వారి ఇష్టం’’ అని జీవీఎల్ తేల్చిచెప్పారు. ప్రభుత్వానికి ఏడు ప్రశ్నలు ♦ పీడీ ఖాతాల అవినీతి కుంభకోణానికి సంబంధించి ‘కాగ్’ తన నివేదికలో పేర్కొన్న అంశాలనే ఏడు ప్రశ్నలుగా టీడీపీ ప్రభుత్వం ముందుంచుతున్నానని, వాటికి జవాబు చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ♦ దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 58,000కుపైగా పీడీ ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెరవాల్సి వచ్చింది? ♦ ఇవి కేవలం తాత్కాలిక అవసరాలకు వాడుకునే ఖాతాలయితే, అన్ని ఖాతాలు తెరవాల్సిన అవసరం ఏమిటి? వీటిద్వారా రూ.వేల కోట్లు నిధులు మళ్లించారని స్పష్టంగా అర్థమవడం లేదా? ♦ పీడీ ఖాతాల ద్వారా ఖర్చు పెట్టిన డబ్బుల వివరాలను ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో పెట్టాలి. ఆ వివరాలను ‘కాగ్’ అడిగినా ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ వివరాలన్నీ బయటకు వస్తేనే దీంట్లో ఎవరు ఎంత నొక్కారో స్పష్టంగా ప్రజలకు తెలిసిపోతుంది. ♦ నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరం ఆఖరి నాటికి పీడీ ఖాతాల్లో ఎంత డబ్బు ఉన్నా ఆ మొత్తాలను ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్‌కు జమ చేయాలి. కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభానికి ఆ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ ఉండాలి. అయినా దాదాపు రూ.25,000 కోట్లు పీడీ ఖాతాల్లో ఉంచారు. ♦ పీడీ ఖాతాల్లో భారీఎత్తున నిధులను వృథాగా ఉంచుకొని, 6.5 వడ్డీకి ప్రభుత్వం కొత్త అప్పులు చేసిందని ‘కాగ్’ ప్రస్తావించింది. అంటే ప్రభుత్వం వద్ద సొంత డబ్బులు ఉండి కూడా రూ.1,500 కోట్ల వడ్డీలు చెల్లిస్తోంది. డబ్బులు ఉంచుకొని, అప్పులు తెచ్చుకొని దాదాపు రూ.1,500 కోట్లు ప్రజాధనాన్ని వడ్డీగా చెల్లిస్తున్నారు. పీడీ ఖాతాల కుంభకోణంలో ‘రుణాలపై వడ్డీ’ స్కామ్ కూడా కలిసి ఉంది. ఇది రెండు కుంభకోణాలు కలిసిన ఉన్న అంశం. ♦ పీడీ ఖాతాల ద్వారా ఏడాదిలో ఖర్చు పెట్టిన రూ.51,000 కోట్లు ఎవరికి చేరాయి? ఎవరి ఖాతాలకు మళ్లించారు? వివరాలను ‘కాగ్’కు కూడా ఎందుకు ఇవ్వలేదు? ♦ పీడీ ఖాతాల ద్వారా అధికారులు సెల్ఫ్ చెక్ ద్వారా డబ్బులు వాడకూడదు. సెల్ఫ్ చెక్‌ల ద్వారా రూ.వందల కోట్లు డ్రా చేశారని ‘కాగ్’ తన నివేదికలో పేర్కొంది. దొంగలు ఎవరెవరు? ఎవరెంత పంచుకున్నారు? అన్నింటికీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. -
మోదీ అవినీతిని బయటపెడదాం
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ అనధికారికంగా ప్రారంభించింది. మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేసేందుకు ప్రజాఉద్యమాలు తీసుకురావాలని నిర్ణయించింది. దీనమైన దేశ ఆర్థిక స్థితి, బ్యాంకు కుంభకోణాలు, రాఫెల్ ఒప్పందం తదితర అంశాలపై దూకుడుగా బీజేపీని ఎదుర్కొనాలని శనివారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం నిర్ణయించింది. పార్టీ చీఫ్ రాహుల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కీలకమైన అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) అంశంలో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించారు. రాహుల్‌తోపాటుగా మాజీ ప్రధాని మన్మోహన్, ఏకే ఆంటోనీ, ఆజాద్, ఖర్గే, అహ్మద్ పటేల్, అశోక్ గెహ్లాట్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. యూపీఏ చైర్పర్సన్, మాజీ అధ్యక్షురాలు సోనియా వ్యక్తిగత కారణాలతో సీడబ్ల్యూసీ భేటీకి గైర్హాజరయ్యారు. పార్లమెంటు లోపలా, బయటా ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడంలో విపక్ష పార్టీలతో కలిసి ముందుకెళ్లాలని భేటీలో నిర్ణయించారు. ‘నేటి సీడబ్ల్యూసీ సమావేశంలో దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించాం. అవినీతి, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇదే మంచి తరుణం’ అనంతరం రాహుల్ ట్వీట్ చేశారు. చోక్సీ, రాఫెల్‌లపై దూకుడుగా.. సమావేశ వివరాలను పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మీడియాకు వెల్లడించారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రజాందోళనను ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పీసీసీల సహకారంతో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. 2017లో మెహుల్ చోక్సీకి పౌరసత్వం ఇచ్చినపుడు భారత విచారణ సంస్థలు క్లీన్చిట్ ఇచ్చాయని ఆంటిగ్వా ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని సమావేశంలో చర్చించారు. దీనిపై మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయించారు. మోదీ ప్రభుత్వం రహస్య ఒప్పందం చేసుకునే దేశం నుంచి చోక్సీని బయటకు పంపించిందని సుర్జేవాలా విమర్శించారు. రాఫెల్ ఒప్పందంపై ప్రధాని గానీ, రక్షణ మంత్రి గానీ ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదని సుర్జేవాలా అన్నారు. ఎన్నార్సీపై జాగ్రత్తగా.. అస్సాం ఎన్నార్సీ వివాదంపై కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎన్నార్సీ కాంగ్రెస్ పార్టీ మదిలో పుట్టిన గొప్ప ఆలోచన అని.. 1985లో మాజీ ప్రధాని రాజీవ్ చేసుకున్న అస్సాం ఒప్పందంలో భాగంగా ఎన్నార్సీ రూపకల్పన జరిగిందని సుర్జేవాలా తెలిపారు. భారతీయ పౌరుల్లో ఒక్కరు కూడా ఈ జాబితానుంచి తప్పిపోకుండా పార్టీ తరపున భరోసా ఇస్తున్నామన్నారు. 2005 నుంచి 2013 వరకు కాంగ్రెస్ పార్టీ 82,728 మంది బంగ్లాదేశీయులను బహిష్కరిస్తే.. ఎన్డీయే ప్రభుత్వం నాలుగేళ్లలో 1,822 మంది బంగ్లాదేశీయులను మాత్రమే బయటకు పంపిందన్నారు. -
కాసులు ఇస్తేనే బిల్లులు
రాయచోటి(వైఎస్సార్ కడప): రాయచోటి హౌసింగ్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. కార్యాలయంలో సిబ్బంది చేతివాటం తారాస్థాయికి చేరుకోవడంతో లబ్ధిదారులు గగ్గోలుపెడుతున్నారు. పక్కాగృహం మంజూరు దరఖాస్తు నుంచి చివరి బిల్లు పడేవరకు కదిలే ప్రతి ఫైలుకు ఒక ధరను నిర్ణయించి వసూలు చేస్తున్నారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి, అక్రమాలు పెచ్చుమీరడంతో ప్రజా సంఘాలు, రాజకీయపార్టీలు రోడ్డెక్కాయి. కార్యాలయ పరిధిలో జరుగుతున్న అవినీ తిపై సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తోం ది. అధికారపార్టీకి చెందిన కొంతమంది నాయకులను అండగా పెట్టుకుని వేలకు వేలు లబ్ధిదారుల నుం చి లాగేస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నా యి. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్విని యోగం చేసుకుని సొంతింటి కలను సాకారం చేసుకుందామనుకున్న పేదలకు మామూళ్ల వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇవ్వకుంటే బిల్లు చేయరన్న భయంతో చాలామంది అప్పులు చేసి సమర్పిస్తున్నట్లు ప్రజాసంఘాలు వెల్లడిస్తున్నాయి. నీరుగారుతున్న లక్ష్యం ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాన్ని సాధించడంలో హౌసింగ్ శాఖాధికారులు విఫలమవుతున్నారు. లబ్ధిదారుల నుంచి మామూళ్లు వసూళ్లపై పెట్టే శ్రద్ధ లక్ష్యాన్ని ఛేదించడంలో కనిపించడం లేదు. రాయచోటి నియోజకవర్గ పరిధిలో 4,643 పక్కాగృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని ఈ ఏడాది చివరికల్లా పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటివరకు 41.69శాతం అంటే 19,36 గృహాలు పూర్తవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 2,707 గృహాలు వివిధ స్థాయిలలో ఉన్నాయి. వీటిని డిసెంబరు చివరికి పూర్తిచేయించాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారు. వీటితో పాటు ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో మంజూరైన గృహాలలో కూడా కొన్ని పెండింగ్‌లోనే ఉన్నాయి. నాలుగేళ్లుగా మంజూరైన గృహా లను పూర్తి చేయించ లేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వందశాతం గృహాలను పూర్తి చేయిస్తారన్న నమ్మకం లబ్ధిదారులు కోల్పోయారు. దళారుల మాటే వేదం కార్యాలయ పరిధిలో ఫైలు కదలాలంటే దళారుల మాటే వేదం. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిలోని కొంతమంది మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్టీఆర్ గృహం మం జూరు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా, గృహాల కేటాయింపులో లబ్ధిదారులకు అవకాశం లభించా లన్నా, చివరికి బిల్లుల జమ వరకు దళారుల చేతికి డబ్బులు అందిన తర్వాతనే కార్యాలయంలో రికార్డులు ముందుకు సాగుతుంటాయి. మున్సిపాలిటీ, రూరల్ పరిధిలుగా విభజించి ఒకొక్క పక్కాగృహానికి రూ.20వేల నుంచి రూ.40 వేల వరకు మామూళ్ల రూపంలో చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ అవినీతి అక్రమాలపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్న వాదనలు ఉన్నాయి. సొమ్ములు లేకపోతే కనీసం అధికారపార్టీ అండదండలైనా ఉండి తీరాల్సిందేనని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హౌసింగ్ శాఖ నుంచి తొలగించిన సిబ్బందే దళారుల అవతారమెత్తినట్లు ప్రచారం నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రేషన్ కార్డులను అడ్డుపెట్టి డివిజన్ పరిధిలోని లబ్ధిదారులను పీల్చిపిప్పిచేస్తున్నారు. ఇప్పటికే దళారుల పాత్రతో సుమారు 200 గృహాలను మంజూరుచేసినట్లు ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చారు. వాటిపై చర్యలు తీసుకోవడంలో స్థానిక డీఈ, ఆ పైస్థాయి అధికారులు ఆలస్యం చేస్తున్నారు. పునాదుల బిల్లు సిద్ధం చేస్తున్నాం. డబ్బులు సిద్ధం చేసుకుని ఆఫీసుకొచ్చి కనపడు. డీఈ సర్ చెప్పారు. డబ్బు చెల్లిస్తే మీ బిల్లు బ్యాంకులో జమవుతుంది. అంటూ మధ్యవర్తులు, కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న సిబ్బంది నుంచి ఫోన్ ద్వారా లబ్ధిదారులకు చెబుతున్న మాటలు ఇవి. రాయచోటి పట్టణ పరిధిలోని సంజీవనగర్ పరిధికి చెందిన చాకలి రాజాకు ఎన్టీఆర్ గృహాన్ని మంజూరు చేశారు. గృహానికి సంబంధించిన బిల్లు సిద్ధమైంది.. రూ.5వేలు తీసుకుని కార్యాలయానికి రావాలని సిబ్బంది నుంచి ఫోన్ వచ్చింది. విషయాన్ని స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ కౌన్సిలర్ బిల్లుల మంజూరుకు మామూళ్లు వసూలు చేయడంపై ప్రశ్నించడంతో కార్యాలయం సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇలా కార్యాలయంలోని సిబ్బంది, మధ్యదళారుల అవినీతి, అక్రమాలు అధికమయ్యాయి. ప్రత్యక్షంగా హౌసింగ్ డివిజన్ అధికారి పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అవినీతికి పాల్పడితే కఠినచర్యలు తప్పవు పక్కాగృహాల మంజూరుకు, బిల్లులు చెల్లింపు కోసం లబ్ధిదారుల మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. వసూళ్లకు పాల్పడిన వారి వివరాలు నా దృష్టికి తెస్తే అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటాను. లబ్ధిదారులు ఎవ్వరూ కార్యాలయ సిబ్బందికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి పైసా ఆన్లైన్ ద్వారా లబ్ధిదారుని పేరున బ్యాంకులో జమ అవుతుంది. గురుప్రసాద్, గృహనిర్మాణశాఖ డీఈ, రాయచోటి -
అవినీతి కేసులో లాలూకు సమన్లు
సాక్షి,న్యూఢిల్లీ : ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాద్ సహా ఇతర నిందితులకు ఢిల్లీ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. ఓ ప్రైవేట్ సంస్థకు రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల కాంట్రాక్టు కేటాయింపులో అక్రమాలు చోటుచేసుకున్న కేసులో ఆగస్టు 31న కోర్టు ఎదుట హాజరు కావాలని నిందితులను ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ ఆదేశించారు. కేసుకు సంబంధించి నిందితులపై తగిన సాక్ష్యాధారాలున్నాయని ఏప్రిల్ 16న చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ పేర్కొంది. లాలూ కుటుంబ సభ్యులతో పాటు మాజీ కేంద్ర మంత్రి ప్రేమ్ చంద్ గుప్తా, ఆయన భార్య సరళా గుప్తా, బీకే అగర్వాల్, అప్పటి ఐఆర్సీటీసీ ఎండీ, డైరెక్టర్ రాకేష్ సక్సేనాల పేర్లు చార్జిషీట్లో పొందుపరిచారు. ఐఆర్సీటీసీ అప్పటి గ్రూప్ జనరల్ మేనేజర్లు వీకే ఆస్ధానా, ఆర్కే గోయల్, విజయ్ కొచ్చర్, వినయ్ కొచ్చర్, సుతాజా హోటల్స్ డైరెక్టర్లు, చాణక్య హోటల్ అధినేతల పేర్లు సైతం చార్జిషీట్లో నమోదయ్యాయి. -
లోక్‌పాల్ కోసం అక్టోబర్ 2 నుంచి నిరశన
రాలేగావ్ సిద్ధి: లోక్‌పాల్ నియామకంపై కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా అక్టోబర్ 2 నుంచి నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ప్రకటించారు. అవినీతి రహిత దేశం కోసం తాను చేపట్టిన ఈ ఉద్యమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన స్వస్థలమైన రాలేగావ్ సిద్ధిలో మహాత్ముడి జన్మదినమైన అక్టోబర్ 2 నుంచి నిరాహారదీక్ష చేపడతానని తెలిపారు. అవినీతిని అరికట్టాలనే చిత్తశుద్ధి ఎన్డీయే సర్కారుకు లేదని, అందుకే లోక్‌పాల్ నియామకంపై కుంటిసాకులు చెబుతోందని మండిపడ్డారు. లోక్‌పాల్ బిల్లు అమలుతో పాటు సత్వరమే లోక్‌పాల్‌ను నియమిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారం చేపట్టిన ఎన్డీయే, ఇప్పడు దానిని విస్మరించిందని ఆరోపించారు. లోక్‌పాల్ చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ 2011లో 12 రోజులపాటు అన్నా హజారే దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో అప్పటి యూపీఏ సర్కారు 2014లో లోక్‌పాల్ చట్టాన్ని తెచ్చింది. -
రాఫెల్లో అవినీతి అవాస్తవం: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: రాఫెల్లో అవినీతి జరగడం అవాస్తవమని ఎంపీ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు స్పందించని కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్, సోనియాగాంధీలపై పలు అవినీతి కేసులున్నాయని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ప్రధాని మోదీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో టీఆఎర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే వాయిదాకు ప్రయత్నించిందని అన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా 52 శాతం ఉంటే, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం 34 శాతం చూపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. మైనార్టీలకు 12% రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. -
కోర్టుకెక్కిన ఏపీ వైద్యారోగ్యశాఖ అవినీతి
-
‘రాఫెల్’ కొనుగోళ్లలో రూ.40 వేల కోట్ల అవినీతి
సాక్షి, హైదరాబాద్: రాఫెల్ యుద్ధ విమానా ల కొనుగోళ్లలో రూ.40 వేల కోట్ల అవినీతి జరిగిందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. బీజేపీ కుంభకోణాల ప్రభుత్వమని, ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కేసీఆర్ సంగతి చూస్తామని హెచ్చరించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడూతూ, బోఫోర్స్ కుంభకోణాన్ని బీజేపీ గోరంతది కొం డతగా చూపి రాజీవ్‌గాంధీని పార్లమెంట్లో అవమానించారని, ఆయన చనిపోయిన తర్వాత ఆ కుంభకోణంపై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. ఎలాంటి అనుభవం లేని అనిల్ అంబానీకి చెందిన కంపెనీకి రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్టు ఏలా ఇస్తారని ప్రశ్నించారు. -
ఆ కేసులో పంజాబ్ సీఎంకు ఊరట..
చండీగఢ్ : పదేళ్ల కిందట ప్రైవేట్ డెవలపర్‌కు భూమి బదలాయింపు కేసులో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సహా 17 మందికి విముక్తి లభించింది. నిందితుల్లో పంజాబ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, సహా ఇద్దరు మాజీ మంత్రులు మరణించారు. అమృత్సర్ ట్రస్ట్‌కు సంబంధించిన 32 ఎకరాల భూమిని ప్రైవేట్ డెవలపర్‌కు అభివృద్ధి పరిచే నిమిత్తం బదలాయించడంలో 18 మంది నిందితులు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని విజిలెన్స్ బ్యూరో (వీబీ) నివేదిక ఆధారంగా కేసును మూసివేస్తున్నట్టు మొహాలీ ప్రత్యేక న్యాయమూర్తి జస్వీందర్ సింగ్ స్పష్టం చేశారు. పంజాబ్ అసెంబ్లీ సూచనతో 2008లో విజిలెన్స్ బ్యూరో వీరిపై కేసు నమోదు చేసింది. న్యాయస్ధానానికి హాజరైన అమరీందర్ సింగ్ ఇతర నిందితులు తీర్పును స్వాగతించారు. చివరికి న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు. రాజకీయ కక్షసాధింపుతోనే తమపై విజిలెన్స్ బ్యూరోను ప్రేరేపించి కేసులో ఇరికించారని అప్పటి అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ అమరీందర్ సింగ్ అన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గిన విజిలెన్స్ బ్యూరో అధికారులపై ఎలాంటి చర్యలూ చేపట్టబోమని ఆయన స్పష్టం చేశారు. -
బాబు అవినీతిపై కేసులేవీ?
సాక్షి, హైదరాబాద్: అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన చంద్రబాబుపై కేసులు ఎందుకు పెట్టడం లేదని వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ బీజేపీని నిలదీశారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో వరప్రసాద్ మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలన, అవినీతిని ఆయన ఎండగట్టారు. ‘టీడీపీ మేనిఫెస్టో అంతా అబద్ధాల పుట్ట. నాలుగేళ్లుగా అబద్ధాలు, అవినీతితో బాబు పాలన సాగిస్తున్నారు. ఎంతో అవినీతికి పాల్పడ్డారు. ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం దేశంలో ధనిక సీఎం చంద్రబాబే. దేశంలోనే ఏపీ ఇప్పుడు అవినీతిలో నంబర్ వన్ స్థానంలో ఉంది. రాజధాని భూముల్లో అంతా అవినీతే. అలాంటి వ్యక్తిపై బీజేపీ నేతలు కేసులు ఎందుకు పెట్టడం లేదు’ అని వరప్రసాద్ అన్నారు. ‘రాజకీయ లబ్ధి కోసమే వైఎస్ జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. జగన్ దోషి అని ఏ కోర్టు చెప్పింది?.. రాజకీయ కక్షలతో ఆయనపై కేసులు పెట్టారన్నది అందరికీ తెలుసు. చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే కోర్టు నుంచి స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారు. దమ్ముంటే.. అంత నిజాయితీ పరుడైతే విచారణను ఎదుర్కోవాలి’ అని వరప్రసాద్ చంద్రబాబుకు సవాల్ విసిరారు. జాతీయ, అంతర్జాతీయ సర్వేల్లో సైతం ఏపీ అవినీతి గురించి ప్రస్తావించిన అంశాన్ని ఈ సందర్భంగా వరప్రసాద్ గుర్తు చేశారు. -
మోదీ సర్కారు చట్టం.. ఇక అవినీతి కేసులు మటుమాయం!
సాక్షి, న్యూఢిల్లీ : భారత అవినీతి నిరోధక చట్టంలో సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో ఓ బిల్లును ప్రవేశపెట్టగా వారం క్రితం రాజ్యసభలో ఆ బిల్లుకు కొన్ని సవరణలు సూచించారు. మంగళవారం ఆ బిల్లు లోక్‌సభ పరిశీలనకురాగా దాన్ని సభ్యులు యథాతథంగా ఆమోదించారు. అవినీతి ఆరోపణలపై కేసును నమోదుచేయడం దగ్గరి నుంచి దర్యాప్తు జరిపి దోషుల్ని తేల్చడం, అనంతరం వారికి శిక్షలు విధించడం వరకున్న పలు నిబంధనల్లో సవరణలు తీసుకొచ్చారు. దేశంలో రోజురోజుకు అవినీతి కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తీసుకొచ్చిన ఈ సవరణ చట్టం వల్ల శిక్షలు ఎక్కువ పడి కేసులు తగ్గుతాయా? లేదా? అన్న అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించాలి. ఇంతకుముందు ప్రభుత్వాధికారి లంచం తీసుకోవడం అంటే ‘ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకుండా ఓ వ్యక్తికి పని చేయడం కోసం అతని నుంచి డబ్బు లేదా ఇతర రూపాల్లో విలువైన వస్తువులను అక్రమంగా తీసుకోవడం’ అవినీతికి విస్తత నిర్వచనం. ఈ నిర్వచనానికి ‘టెస్ట్ ఆఫ్ ఇంటెన్షన్’ అనే పదాన్ని జోడించారు. ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటే అది ఏ ఉద్దేశంతో తీసుకున్నారో అంటే, లంచంగానే తీసుకున్నారా? అన్న అంశాన్ని దర్యాప్తు సంస్థ ముందుగా తేల్చాలి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఇక ముందు ఎవరిపై కేసులు దాఖలు చేయడానికి వీల్లేదు. అంటే ఆస్తులపై దాడులు జరిపి ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ కేసులు దాఖలు చేయడానికి వీల్లేదు. లంచం తీసుకున్నారా, లేదా ? అన్న అంశం ప్రాతిపదికనే కేసులు దాఖలు చేయాలి. అంతేకాకుండా ఓ అధికారి తన నిజాయితీని పక్కన పెట్టి బాధ్యతా రాహిత్యంగా ఓ వ్యక్తికి అనసరమైన ప్రయోజనం కలిగించారా? అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారానే లంచం తీసుకున్నారా, లేదా అన్న అభిప్రాయానికి రావాలి. ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకుండా ఓ వ్యక్తి నుంచి లంచంగా లేదా అక్రమ పద్ధతిలో డబ్బు లేదా ఇతర విలువైన వస్తువును తీసుకోవడమే అవినీతి అని పాత చట్టం సులభంగా నిర్దేశిస్తోంది. ఈ నిర్వచనం ప్రకారమే బోఫోర్స్ దగ్గరి నుంచి 2జీ స్కామ్ వరకు, కామన్వెల్త్ గేమ్స్ నుంచి కోల్‌స్కామ్ వరకు కేసులను నమోదు చేసి విచారించారు. కొత్త సవరణల ప్రకారం అధికారులపై కచ్చితమైన అనుమానాలున్నా అవినీతి కేసును నమోదు చేయరాదు. విచారించాకే కేసును నమోదు చేయాలి. విచారించేందుకు కూడా సంబంధిత ఉన్నతాధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ కొత్త నిబంధన తెచ్చారు. సదరు అధికారి అనుమతిస్తే విచారణ జరపాల్సి ఉంటుంది. లంచం తీసుకోవడమే కాకుండా లంచం ఇవ్వడాన్ని కూడా నేరంగా పరిగణిస్తూ చట్టాన్ని సవరించడం మరీ దారుణం. ప్రస్తుతం లంచాలిచ్చే వారిపై లంచాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలపై మాత్రమే కేసు పెట్టే అధికారం ఉండగా, అంటే దర్యాప్తు సంస్థ కేసు పెట్టాలి అనుకుంటేనే పెట్టే అవకాశం ఉండింది. సంస్థలు, కంపెనీలపైనే లంచం ఇచ్చినందుకు కేసు పెట్టారే తప్ప, సామాన్య పౌరులపై కేసులు ఎప్పుడు పెట్టలేదు. ఇప్పుడు లంచం ఇవ్వడం కూడా నేరమే అవుతుంది కనుక లంచం ఇచ్చిన వారిపై కూడా తప్పనిసరి కేసు పెట్టాల్సిందే. కేసు పెడతారన్న భయంతో అవినీతిపై ఫిర్యాదు చేయడానికే ప్రజలు ముందుకు రారన్నది అందరికి తెల్సిందే. లంచం ఇచ్చేలా తనపై తీవ్రమైన ఒత్తిడి చేశారని, ఇక ఏమాత్రం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లోనే లంచం ఇవ్వాల్సి వచ్చిందంటూ లంచం ఇచ్చిన వారు నిరూపించుకోగలిగితేనే శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు. అది ఎంత మందికి సాధ్యం అవుతుంది? ఎన్ని కేసుల్లో సాధ్యం అవుతుంది? ఎమ్మెల్యేలు, మంత్రులు సహా ప్రభుత్వ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించేందుకు ‘సంబంధిత అధికారి’ నుంచి అనుమతి తీసుకోవాలని సవరణలో ప్రభుత్వం పేర్కొంది. ఆ సంబంధిత అధికారి ఎవరో మాత్రం వెల్లడించలేదు. కేంద్రంలోని లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తాలు అనుమతి మంజూరు చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. 2013 నాటి లోక్‌పాల్, లోకాయుక్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆమోదించనే లేదు. ఎప్పుడు ఆమోదించాలి. అది ఎప్పుడు అమల్లోకి వచ్చేను? అవినీతి రహిత సమాజంగా మారుస్తానన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం, అది సాధ్యం కాదనుకొని అవినీతి కేసుల రహిత దేశంగా మారుద్దామని తీర్మానించికుందా? -
రాఫెల్ డీల్ : అది నకిలీ మకిలి
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నకిలీ రాఫెల్ వివాదాన్ని సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం రెండు ప్రభుత్వాల మధ్య జరిగిందని, ఇందులో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం లేనే లేదని స్పష్టం చేశారు. రాహుల్ ఆరోపణలు సత్యదూరమని తేటతెల్లమైందన్నారు. మోదీ సర్కార్‌పై పోరాడేందుకు ఎలాంటి అంశాలు లేని కాంగ్రెస్ దిక్కుతోచక లౌకికవాదానికి ప్రమాదం ఏర్పడిందని గగ్గోలు పెడుతోందని దుయ్యబట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కీలక రాష్ట్రాలైన యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ మూడవ, నాలుగవ స్ధానంలో నిలవనుందని జైట్లీ జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 225 స్ధానాల్లోనే నేరుగా బీజేపీతో తలపడేందుకు సిద్ధమైందన్నారు. మిగిలిన స్ధానాల్లో పోటీచేయకుండా మిత్రపక్షాలకు ఆయా స్ధానాలను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఫేస్బుక్ పోస్ట్‌లో జైట్లీ పేర్కొన్నారు. ఇక యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి గత ప్రభుత్వాలు సైతం ధరల వివరాలను బహిర్గతం చేయలేదని గుర్తుచేశారు. దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఆయుధాల ధరలను వెల్లడించదన్నారు. -
ఆధారాలు చూపిస్తా.. ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తారా?
పొందూరు: ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ చేసిన అక్రమాలను ఆధారాలతో చూపిస్తా... అతనిని సస్పెండ్ చేయగలరా? అని వైఎస్సార్సీపీ శ్రీకా కుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడును సూటిగా ప్రశ్నించారు. స్థానిక పట్టుశాలీ కల్యాణ మండపంలో వైఎస్సార్సీపీ బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన అ నంతరం రవికుమార్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆగస్టు 15న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రిని కలిసి ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలపై సమాచారమందిస్తానని తెలిపారు. నదీతీర ప్రాంతాలైన నిమ్మతొర్లాడ, జీకే వలస, ముద్దాడ పేట, దూసి, గోపీనగరం, సింగూరు, పురుషోత్తపురం, పెద్దసవలాపురం, యరగాం గ్రామాల్లో ఇసుక ర్యాంపులను అనధికారంగా ప్రారంభించి ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. మైనింగ్, లిక్కర్, భూ మి, ఇసుక మాఫియాలకు అండగా నిలుచొని అక్రమాలకు పాల్పడటం శోచనీయమని చెప్పారు. ఇసుక ర్యాంపుల వ్యవహారంలో వైఎస్సార్సీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని, ముఖ్యంగా తనకు ఉన్నాయని ఆధారాలతో నిరూపిస్తే బహిరంగంగా ఉరి తీయండని సవాలు విసిరారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి జిల్లాల్లో భూములను విప్ ఎలా సంపాదించారని ప్రశ్నించారు. శిక్షణ కార్యక్రమంలో శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వెంకట చిరంజీవి నాగ్, ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధీ, మండల పార్టీ అ«ధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, పట్టణ అధ్యక్షుడు గాడు నాగరాజు, రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి బిఎల్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి లోలుగు కాంతారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గంట్యాడ రమేష్, ఎంపీటీసీ సభ్యులు కోరుకొండ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై లంచం ఇచ్చిన వారూ శిక్షార్హులే
న్యూఢిల్లీ: లంచం తీసుకున్న వారితోపాటు లంచం ఇచ్చిన వారు కూడా ఇకపై నేరస్తులే. ఇందుకు గాను వారికి ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అవినీతి నిరోధక (సవరణ) బిల్లును రాజ్యసభ గురువారం ఆమోదించింది. అవినీతి వ్యతిరేక చట్టానికి చేసిన కొన్ని సవరణలతో సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ‘ఉద్దేశపూర్వకంగా చేసే ఫిర్యాదుల నుంచి ఉన్నతాధికారులకు, వారు రిటైరైన తర్వాత కూడా రక్షణ కల్పించటం తోపాటు అవినీతి కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఇందులో పలు నిబంధనలను చేర్చాం’ అని ఆయన చెప్పారు. ‘తాజా సవరణ ద్వారా లంచం ఇవ్వజూపిన వారికి కనీసం మూడేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బలవంతంగా ఎవరైనా లంచం ఇవ్వజూపితే సదరు అధికారి ఆ విషయాన్ని పై అధికారులకు వారంలోగా తెలియజేయాలి. అధికారికి లంచం లేదా ఇతరత్రా లబ్ధి చేకూ రుస్తామంటూ హామీ ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు జరిమానా విధించేందుకు వీలుంటుంది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎటువంటి కేసులకు సంబంధించి కూడా ప్రభుత్వ అధికారులపై పోలీసులు విచారణ చేపట్టరాదు’ అని తెలిపారు. ఆర్థిక నేరగాళ్ల బిల్లు ఆమోదం ‘పరారైన ఆర్థిక నేరగాళ్ల బిల్లు–2013’ను లోక్‌సభ ఆమోదించింది. ‘దీంతో నేరాలకు పాల్పడే సంస్థలు, వ్యక్తుల లేదా బినామీ దారుల ఆస్తులను జప్తు చేసుకునే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. పరారైన వారి నుంచి డబ్బు రాబట్టుకునేందుకు బ్యాంకులకు ప్రభుత్వం సాయపడుతుంది’ అని ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. -
మోసాలు.. మోపెడు
అధికార పార్టీ అండ ఉంది. ఏంచేసినా చెల్లుతుందనే నమ్మకముంది. ఇంకేముంది మోపెడ్‌పై సైతం వందలాది క్వింటాళ్ల ధాన్యం తరలించేసినట్లు బిల్లులు సృష్టించి దోచేసుకునే ధైర్యం వారికుంది. పౌర సరఫరాల శాఖలో తప్పుడు రవాణా బిల్లులు సైతం ‘పాస్’ చేయించుకొనే ‘ప్రసన్నాంజనేయుడి’ పవర్ అది. నందిగామ మార్కెట్‌యార్డులో ధాన్యం దోపిడీ తీరు ఇది. సాక్షి, అమరావతిబ్యూరో : టీవీఎస్–ఎక్స్ఎల్ మోపెడ్ వాహనంపై ఎన్ని బస్తాలు తీసుకెళ్లవచ్చు? మహా అయితే 10 బస్తాల వరకు సాధ్యపడవచ్చు. అదే ఆటో రిక్షాలో ఓ 20 బస్తాలు.. ఇక ఇండికా కారు అనుకోండి 30 బస్తాలు సరే. కానీ.. నందిగామ మార్కెట్‌యార్డు నుంచి ఓ టీవీఎస్ మోపెడ్ వాహనంపై ఏకంగా 713 బస్తాలు, టాటా ఇండికా కారులో 463 బస్తాలు, ఆటో రిక్షాలో 537 బస్తాలు సరఫరా చేసినట్లు నిసిగ్గుగా రికార్డులు రాసేశారు. ఇదొక్కటే కాదు ఒక లారీలో ఏకంగా 1203 బస్తాలు సరఫరా చేయడం ఒక్క ‘ప్రసన్నాంజనేయ’ గ్రామైక్య సంఘానికే చెల్లింది. అధికార పార్టీ నాయకుల అండదండలతో పీపీసీ కమిటీ సభ్యురాలు ధాన్యం రవాణా పేరిట చేసిన అడ్డగోలు దోపిడీని చూస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. ఇంత జరిగినా, ప్రభుత్వ సొమ్మును అక్రమంగా లూటీ చేసినా పౌరసరఫరాల శాఖాధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లో వెళితే.. రవాణా చేశారిలా.. మార్కెట్ యార్డుల్లో పీపీసీ కమిటీల ద్వారా సేకరించిన చేసిన ధాన్యాన్ని సాధారణంగా పౌరసరఫరాల సంస్థ టెండర్ల ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్న ట్రాన్స్పోర్టర్లు సరఫరా చేస్తుంటారు. కాగా, నందిగామ మార్కెట్‌యార్డులో ప్రసన్నాంజనేయ గ్రామైక్య సంఘం పేరిట సేకరించిన ధాన్యాన్ని కూడా టెండరు దక్కించుకున్న అన్నపూర్ణ లారీ ట్రాన్స్‌పోర్టు సరఫరా చేసినట్లు రికార్డుల్లో చూపెట్టారు. కానీ ఇక్కడ ధాన్యం సరఫరా చేసేందుకు లారీలను ఉపయోగించకపోగా నిబంధనలకు విరుద్ధంగా టీవీఎస్ మోపెడ్, ఆటో రిక్షాలు, ఇండికా కారు, రవాణాశాఖ కార్యాలయ చరిత్రలో లేని సీరిస్ నంబర్ల పేరిట ఉన్న లారీల్లో సరఫరా చేసేశారు. ఆ వాహనాల నంబర్ల మీదే బిల్లులురూపొందించారు. లారీల్లో సరఫరా చేసిన ధాన్యం కన్నా ఇతర వాహనాల్లో సరఫరా చేసిన ధాన్యమే ఎక్కువగా ఉండటం గమనార్హం. అయితే ఇవేవీ పౌరసరఫరాల సంస్థ అధికారులకు పట్టలేదు. పైగా వారు రూపొందించిన తప్పుడు రవాణా బిల్లులకు ఆమోదం తెలిపి పరోక్షంగా ప్రభుత్వ ఖజానాను దోచుకోవడానికి సహకరించారు. రూ. 33.81లక్షల దోపిడీ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని భద్రపరిచేందుకు స్థానికంగా ఉండే పౌరసరఫరాల గోదాములకు తరలిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం లారీల ద్వారానే జరుగుతుంది. కానీ నందిగామ మార్కెట్ యార్డు నుంచి తరలించిన ధాన్యం మాత్రం అధిక భాగం లారీల్లో కాకుండా సాధారణ వాహనాల్లో అది కూడా టీవీఎస్–50, ఆటో రిక్షా, టాటా ఇండికా కారు, ట్రాక్టర్ లాంటి వాటిపై వేలాది బస్తాలను తరలించినట్లు చూపెట్టారు. 1992 మోడల్‌కు చెందిన టీవీఎస్–50ఎక్స్ఎల్( అ్క07 8544) పై 13 ్ర టిప్పులు చొప్పున ∙Ðð ¬త ్తం 7000 బస్తాలను సరఫరా చే సిన ట్లు రి కారు ్డల్లో ^è ప గా.. రవాణా శా ఖ రి కారు ్డల్లో లేని అ్క20 6770 నంబరు గల లారీ ద్వారా 15 ట్రిప్పులు చొప్పున సుమారు 9వేల బస్తాలు, ఏపీఎస్టీ 1234 లారీ ద్వారా 2,500 బస్తాలు సరఫరా చేసినట్లు ప్రసన్నాంజనేయ సంఘం రికార్డుల్లో చూపింది. ఈ రెండు లారీల నంబర్లు రవాణా శాఖ రికార్డుల్లోనే లేకపోవడం విశేషం. ఇలా లేని లారీలు ఉన్నట్లుగా.. రైతుల వద్ద సేకరించని ధాన్యాన్ని సరఫరా చేసినట్లు రికార్డులు సృష్టించి నాలుగేళ్ల వ్యవధిలో రవాణా చార్జీల పేరిట రూ. 33.81 లక్షలు దోచుకున్నారు. గన్నీ బ్యాగ్‌ల డబ్బును వదల్లేదు నందిగామ మార్కెట్‌యార్డు కమిటీలో నాలుగేళ్ల కాలంలో ‘ప్రసన్నాంజనేయ’ పరపతి సంఘం చెబుతున్నవన్నీ దొంగ లెక్కలేనని తేలింది. వారు ధాన్యాన్ని సరఫరా చేసినట్లు చూపుతున్న వాహనాలు కొన్ని లేకపోవడం.కొన్నింటిలో సరఫరా చేయడానికి సాధ్యం కాని వాహనాలు ఉండటం చూస్తే 90 శాతం వరకు ధాన్యాన్ని రైతుల వద్ద కొనుగోలు చేయనేలేదని సుస్పష్టమవుతోంది. అయితే వారు ధాన్యం సేకరించినట్లుగా.. వాటికి కొత్త బ్యాగుల్లో నింపినట్లుగా చూపెట్టారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి ఒక్కో బ్యాగ్‌కు రూ. 15ల చొప్పున వసూలు చేశారు. వారు చెబుతున్న లెక్కల ప్రకారం మొత్తం 1.53,705.6 క్వింటాళ్లకు గానూ 3,84,262 బ్యాగులు(50 కేజీల బస్తా బ్యాగులు) కొనుగోలు చేయడానికి రూ. 57.63 లక్షల వరకు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపారు. కానీ వారు ఎలాంటి బ్యాగులు కొనకుండా ఆ డబ్బునూ నిసిగ్గుగా నొక్కేశారు. -
విద్యార్థుల సొమ్ముకు వేశారు కన్నం
చీరాల: అవినీతికి, అక్రమాలకు కాదేది అనర్హం అన్నట్లు విద్యాశాఖ వ్యవహరిస్తోంది. విద్యాశాఖలో ఇప్పటికే అనేక అవినీతి వ్యవహారాలు బట్టబయలైనా సిబ్బందిలో ఎటువంటి మార్పులు కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ శాఖలో మరో అక్రమ వ్యవహారం బయటపడింది. బస్సు సౌకర్యం లేని గ్రామాలు, దూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు నెలకు రూ.300 చొప్పున విద్యాశాఖ ప్రతి విద్యార్థికి చెల్లిస్తుంది. జిల్లాలో ప్రధానంగా పర్చూరు ప్రాంతంలో పాఠశాలలకు, గ్రామాలకు మధ్య చాలా దూరం ఉండడంతో విద్యార్థులు వ్యయప్రయాసలతో చదువుకోవాల్సి వస్తుంది. వీరి కోసం విద్యాశాఖ ఇటువంటి అవకాశం కల్పించింది. చీరాల నియోజకవర్గంలో పాఠశాలలన్నీ కిలోమీటరు దూరంలోనే ఉండి బస్సు సౌకర్యం కూడా ఉన్నప్పటికీ నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు నయాపైసా కూడా చెల్లించకుండానే పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ కలిసి సొమ్ము స్వాహా చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. 2017–18 విద్యా సంవత్సరంలో వేటపాలెం మండలం నాయనిపల్లి పడమర స్కూల్లో 41 మంది విద్యార్థులకు దూర ప్రాంతం నుంచి వస్తున్నట్లుగా, వారికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేనట్లుగా రికార్డుల్లో సృష్టించి రూ.1.68 లక్షల నిధులు మింగేశారు. అయితే ఇక్కడ కిలోమీటరులోపే ప్రాథమిక పాఠశాల ఉంది. కానీ ఎక్కువ దూరం ఉన్నట్లుగా చూపించి డబ్బులు కాజేశారు. అలానే దేశాయిపేటలో 30 మంది విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదని, రవాణా సౌకర్యం కింద రూ.90 వేలు డ్రా చేసి విద్యార్థులకు దక్కనివ్వలేదు. వేటపాలెం ఓఆర్ఎస్ (ప్రాథమిక పాఠశాల) ఏడుగురు విద్యార్థులకు రవాణా సౌకర్యం కింద రూ.12,900, కొత్తపేట యానాది సంఘం యూపీ స్కూల్లో రవాణా సౌకర్యం కింద తొమ్మిది మంది విద్యార్థులకు మొత్తం రూ.15,900 చొప్పున మొత్తం కలిపి రూ.2,25,600 గత మార్చిలో డ్రా చేసి బిల్లులన్నీ స్వాహా చేశారు. నిబంధనలు ఇవీ... ఈ జీవో ప్రకారం మండల పరిధిలోని కిలోమీటరు దూరంలో ఎటువంటి ప్రభుత్వ పాఠశాల లేకుండా ఆ పాఠశాలలోని వారు కిలోమీటరు పక్కన ఉన్న పాఠశాలలో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు రవాణా సౌకర్యం కింద రూ.300 చెల్లించాల్సి ఉంది. అది కూడా బస్సు సౌకర్యం లేని ప్రాంతాలకు మాత్రమే. ఆర్టీసీ బస్సు పాసులు అందించాలనే నిబంధన ఉంది. అలానే యూపీ పాఠశాల విద్యార్థులకు 2 కిలోమీటర్లు దాటి మరో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారికి రవాణా సౌకర్యం చొప్పున ప్రతి విద్యార్థికి రూ.300 చెల్లిస్తుంది. అలానే హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులకు మూడు కిలోమీటర్లు దాటి వెళున్న వారికి రూ.300 చొప్పున అందిస్తుంది. వేటపాలెం మండలంలో ప్రతి కిలోమీటరుకు ప్రాథమిక పాఠశాల, రెండు కిలోమీటర్లలో యూపీ స్కూల్స్, మూడు కిలోమీటర్ల దూరంలో హైస్కూల్ ఉన్నాయి. చివరకు చీరాల నుంచి ఒంగోలుతో పాటు ఈ పాఠశాలకు ఆర్టీసీ బస్ సౌకర్యం ఉంది. అయినా దూర ప్రాంతాల నుంచి వస్తున్నట్లు నమ్మించారు. బయటపడిందిలా... ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏటా గణనీయంగా పడిపోవడంతో బడిబాట పేరుతో విద్యార్థులను పాఠశాలలో చేర్పించాలని విద్యాశాఖ ఆదేశించింది. అలానే విద్యార్థుల సంఖ్య తగిన రీతిలో లేకపోతే ఆ పాఠశాలను తొలగిస్తున్నారు. దీంతో విద్యాసంవత్సరం మొదటి సంవత్సరంలోనే ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి విద్యార్థులను చేర్పించేందుకు మొదటలో ఉపాధ్యాయులు ఒక్కొక్కరు రూ.500లు చొప్పున ఖర్చు పెట్టి విద్యార్థులను తీసుకువచ్చేందుకు ఆటోలు ఏర్పాటు చేశారు. అయితే రవాణా చార్జీల కింద వచ్చిన నిధులలో ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన రూ.500 ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయుడికి, ప్రధానోపాధ్యాయుడికి మధ్య వివాదం తలెత్తడంతో ఈ అవినీతి వివాదం బట్టబయలైంది. ఎంఈఓ ఏమంటున్నారంటే.... వేటపాలెం మండల ఎంఈఓ ఏకాంబరేశ్వరరావు ఈ అక్రమ వ్యవహారంపై మాట్లాడుతూ విద్యార్థులకు రవాణా కింద చెల్లించాల్సిన నగదు దుర్వినియోగం అయినట్లు తన దృష్టికి వచ్చిందని, దానిపై విచారిస్తున్నట్లు తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
హంగూ..ఆర్భాటాలకే టీడీపీ సర్కార్ పెద్దపీట
-
రాష్ట్రంలో మహిళలకు రక్షణలేకుండా పోయింది
-
అన్నం లెక్కల్లో తిరకాసు!
పేదవాడికి కడుపునిండా నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని రాష్ట్రప్రభుత్వం అంటోంది. కేవలం రూ.5 నామమాత్రపు ధరకు అల్పాహారం, భోజనం సరఫరా చేస్తున్నామని, ఇందుకోసం కోట్లాది రూపాయలు సబ్సిడీ భారం మోస్తున్నామని ఆర్భాటం చేస్తోంది. క్యాంటీన్ల నిర్మాణంలోనే పెద్దఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి. కాగా ఇప్పుడు నిర్వాహకులు అధికారులు కూడబలుక్కొని తప్పుడు లెక్కలతో భారీ అవినీతికి తెరలేపుతున్నారనే అనుమానాలు సర్వత్రా రేకెత్తుతున్నాయి. క్యాంటీన్ల నిర్వహణలో పారదర్శకత లోపించడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. కడప సెవెన్‌రోడ్స్: మూడు రోజు ల క్రితం జిల్లాలోని కడప, ప్రొద్దుటూరులో ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు పెడుతున్నారు. ఒక్కోపూట 500 మంది చొప్పున రోజుకు 1,500 మందికి ఆహారం సరఫరా చేస్తున్నామని కడప మున్సిపల్ కమిషనర్ లవన్న అంటున్నా రు. అయితే క్యాంటీన్లో పనిచేస్తున్న సిబ్బంది మాత్రం పూటకు 300మందికి మాత్రమే ఆహారం సరఫరా చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇలా అధికారులు, సిబ్బంది చెబుతున్న మాటలకు పరస్పరం పొంతన లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. సిబ్బంది చెబుతున్న విధంగా పూటకు 300 చొప్పున రోజుకు మూడు పూటల కలిపి 900మందికి టిఫెన్లు, భోజ నాలు సరఫరా చేసి 1,500మందికి సరఫరా చేసినట్లు బిల్లులు చూపి ఆ మేరకు ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసే అవకాశం లేకపోలేదని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు. టొకెన్లు కనిపించవ్! ప్రజలు డబ్బు చెల్లించినపుడు ఎలాంటి టోకెన్లు ఇవ్వకపోవడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోంది. ఇలా డబ్బు తీసుకుని అలా పేపర్ ప్లేట్లు ఇచ్చేస్తున్నారు. ఇందువల్ల ఖచ్చితత్వం లోపిస్తోంది. ఒక వ్యక్తి మూడు పూటలా తింటే క్యాంటీన్ నిర్వాహకులకు రూ.25 ఖర్చు వస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో వ్యక్తిపై రూ.60 సబ్సిడీ నిర్వాహకులకు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇక ఒక్కో వ్యక్తి మూడు పూటలా చెల్లించే రూ.15లను కలిపితే రూ.75లు వస్తుంది. ఇందులో క్యాంటీన్ నిర్వాహకులకు అయిన రూ.25 ఖర్చును తీసి వేస్తే రూ.50 ఉంటుంది. భోజనం రవాణా, నిర్వహణకు మరో రూ.10 వేసుకున్నా రూ.40 నికరంగా మిగులుతుంది. మూడు పూటలా కలిపి 600 మందిని అధికంగా చూపెడితే రూ.24వేలు మిగులుతుంది. అంటే రోజుకు 900 మందికే ఆహారం సరఫరా చేస్తూ 1,500 మందికి చేశామని దొంగ లెక్కలు రాసుకోవడం ద్వారా రోజుకు రూ.24వేలు నొక్కేస్తున్నారు. ఒక కౌంటర్..భారీగా క్యూ అవకతవకలకు అవకాశం లేకుండా క్యాంటీన్ నిర్వహణ పారదర్శకంగా జరగాలంటే కంప్యూటర్ బిల్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలంటున్నారు. ఇందువల్ల రోజుకు ఎంతమంది క్యాంటీన్లో భోజనం చేస్తున్నారో స్పష్టంగా తెలిసిపోతుంది. క్యాంటీన్‌కు ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. అయితే ఒక కౌంటర్ మాత్రమే ఉండడంతో చాలాసేపు క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తోంది. కనుక రెండు కౌంటర్లు ఏర్పాటు చేస్తే సౌలభ్యంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాగునీరు లేక అవస్థలు కడప జెడ్పీ ఆవరణంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లో తాగునీరు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. భోజనం చేస్తున్న సమయంలో గొంతు పట్టుకుంటే అందుబాటులో నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. నామమాత్రపు ధరకే భోజనాన్ని అందిస్తున్న ప్రభుత్వం తాగునీటి విషయాన్ని పట్టించుకోకపోవడం సబబు కాదంటున్నారు. క్యాంటీన్ ఆవరణంలో పారిశుద్ధ్యం కూడా లోపించింది. అన్నం ప్లేట్లు ఇష్టానుసారంగా పడేసి ఉండడం కనిపించింది. చేతులు కడుక్కునే నీళ్లే తాగునీరు క్యాంటీన్లో సమస్యల గురించి మున్సిపల్ కమిషనర్ లవన్నను ‘సాక్షి’ వివరణ కోరింది. ఇందుకు ఆయన బదులిస్తూ పూటకు 500 మందికి ఆహారాన్ని సరఫరా చేస్తున్నామన్నారు. క్యాంటీన్లో ప్రజలు చేతులు కడుక్కుంటున్న నీళ్లనే తాగాలన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా డీఈని నియమించామని చెప్పారు. అన్న పేరు చెడగొట్టవద్దు పేదవాడికి తక్కువ ధరకే అన్నం సరఫరా చేయడం మంచిదే. క్యాంటీన్‌కు వచ్చిన వారు భోజనం లభించక వెనుదిరిగి పోయే పరిస్థితి వద్దు. నిర్వహణలో పారదర్శకత పాటించడం ద్వారా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలి. ఎన్టీఆర్ పేరు చెడగొట్టవద్దు. – కొండూరు జనార్దన్‌రాజు, కడప నిర్ణీత సమయమంతా భోజనం పెట్టాలి ఉదయం టిఫెన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశిత వేళలను ప్రకటించింది. ఆ సమయాల్లో ఎంతమంది వచ్చినా భోజనం పెట్టాలి. అలాకాకుండా మేం ఇంతమందికి మాత్రమే పెడతామనడం సరైంది కాదు. ప్రతిరోజు చాలామంది భోజనం లభించక వెనుకదిరిగిపోతున్నారు. – ఎన్.వెంకట శివ, సీపీఐ నగర కార్యదర్శి, కడప -
దేవుడి సొమ్ము.. ‘గోవింద’!
కర్నూలు(న్యూసిటీ): దేవదాయ, ధర్మదాయ శాఖ పరిధిలోని పలు ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు జరిగే పూజలు, బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవాలు తదితర వాటికి పూజా సామగ్రి కొనుగోలు, ఇతరత్రా ఖర్చులపై సమగ్రంగా ఆడిట్ జరగటం లేదని విమర్శలు వస్తున్నాయి. ఏటా ఆలయాలకు వచ్చే కానుకలు, గదుల నిర్మాణం, అన్నదానానికి వచ్చే విరాళాలు సైతం లక్షలాది రూపాయలు పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. 1999 – 2000 ఆర్థిక సంవత్సరం నుంచి 2013–14 వరకు 42 దేవాలయాల నిధుల వినియోగానికి సంబంధించి 8,381 అభ్యంతరాలు వచ్చాయి. వీటికి నిర్వహించిన ఆడిట్లో రూ.3,81,98,817లు పెండింగ్ పడింది. వీటిలో దేవాలయాల కాంట్రిబ్యూషన్ ఫీజు, ఆడిట్ ఫీజు, ఇతరత్రా రసీదులను కార్యనిర్వహణాధికారులు చూపలేదని ఆడిట్ అధికారులు పెండింగ్ పెట్టారు. ఆరేళ్లుగా అటకెక్కిన ఆడిట్ జిల్లాలో ఆరేళ్లుగా దేవాలయాలకు ఆడిట్ సక్రమంగా జరగలేదు. నామమాత్రంగా జరిగిన ఆడిట్‌కు సంబంధించి వచ్చిన అభ్యంతరాలకు కార్యనిర్వహణాధికారులు సరైన లెక్కలు, బిల్లులు చూపలేదని సమాచారం. ఆడిట్ పూర్తయిన వివరాలు, అభ్యంతరాల రిపోర్టును కర్నూలులోని దేవదాయ, ధర్మదాయ సహాయ కమిషనర్, ఉపకమిషనర్ కార్యాలయాలకు ఈఓలు అందజేయాల్సి ఉంటుంది. కానీ ఆరేళ్లుగా ఒక్క ఆడిట్ రిపోర్టు గానీ, అభ్యంతరాల వివరాలను గానీ అందజేయకపోవడం గమనార్హం. 2012–13లో ఉపకమిషనర్‌గా పని చేసిన సాగర్‌బాబు హయాంలో గానీ, 2013–17 మధ్య పనిచేసిన గాయత్రీదేవి హయాంలో గానీ ఎలాంటి ఆడిట్ రిపోర్టులూ అందలేదు. ప్రస్తుతం ఉన్న ఉపకమిషనర్ డి.దేములుకు కూడా ఏడాది దాటినా ఒక్క కార్యనిర్వహణాధికారీ అందజేయకపోవడం గమనార్హం. జిల్లాలో మొత్తం 3,880 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో 6ఏ గ్రూపు దేవాలయాలు 10, అలాగే 6బీ గ్రూపు దేవాలయాలు 88 ఉన్నాయి. వీటితో పాటు 6సీ గ్రూపు దేవాలయాలు 3,780 ఉన్నాయి. చాలా ఆలయాలకు మాన్యం భూముల కౌలు, తలనీలాలు, టెంకాయల విక్రయ వేలం, ఇతరత్రా వేలం పాటల ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. అలాగే శ్రావణ, కార్తీక, మాఘ మాసాలు, దసరా ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో మంచి ఆదాయం సమకూరుతోంది. భక్తుల సౌకర్యార్థం గదుల నిర్మాణం, అన్నదానం కోసం దాతలు విరాళాల రూపంలో లక్షలాది రూపాయలను అందజేస్తున్నారు. ఆదాయం బాగా ఉన్న ఆలయాల్లో అవినీతి కూడా అదే స్థాయిలో ఉంటోంది. భక్తులకు సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనుల పేరిట అధికారులు, ఆలయ కమిటీలు కలిసి నిధులు స్వాహా చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఆడిట్ సమయంలో చాలావరకు తప్పుడు బిల్లులు బయటపడుతున్నాయి. ఈ సమయంలో ఈఓలు ఆడిట్ అధికారులకు ముడుపులు ఇస్తూ మేనేజ్ చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. కమిషనర్ దృష్టికి ఆడిట్ బాగోతం తూతూ మంత్రంగా జరుగుతున్న ఆడిట్ వ్యవహారం దేవదాయ శాఖ కమిషనర్ వై.వి. అనురాధ దృష్టికి వెళ్లింది. దీంతో 6ఎ గ్రూపు దేవాలయాల్లో కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆధికారులతో ఆడిట్ చేయిస్తున్నారు. ఇప్పటికైనా సమగ్రంగా ఆడిట్ జరిగితే తప్పుడు లెక్కల బాగోతం బయటపడే అవకాశముంది. ఆడిట్ లోపాలు వాస్తవమే ఆలయాల ఆదాయం, ఖర్చులపై ఆడిట్ సక్రమంగా జరగటం లేదు. ఈఓలు ఆరేళ్లుగా మా కార్యాలయానికి ఆడిట్ రిపోర్టులు సమర్పించటం లేదు. వేలాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అందువల్లే ఆడిట్ జనరల్ అధికారులతో 6ఎ గ్రూపు దేవాలయాల్లో ఆడిట్ చేయిస్తున్నారు. ఇటీవల మహానంది దేవస్థానంలో ఆడిట్ చేశారు. ఇక్కడ అనేక తప్పుడు బిల్లులు బయట పడ్డాయి. డి.దేములు, ఉపకమిషనర్ -
అంతా అనుకున్నట్లే జరిగింది...
లాహోర్: అవెన్ ఫీల్డ్ కేసులో జైలు పాలైన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మర్యమ్‌లు అప్పుడే ఒకరోజు జైలు జీవితం గడిపేశారు. లాహోర్ ఎయిర్‌పోర్ట్‌లోనే నవాజ్‌ను అదుపులోకి తీసుకుని నేరుగా రావల్పిండిలోని అదియాలా జైల్‌కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జైల్లో ఆయనకు బీ క్లాస్ ట్రీట్మెంట్ను అందిస్తున్నట్లు సమాచారం. బీ క్లాస్ వసతులు.. పాక్‌లో నేరం తీవ్రత ఆధారంగా జైల్లో సదుపాయాల కల్పన ఉండదు. ఎంతటి నేరాలు చేసినా.. సోసైటీలో అప్పటిదాకా వారికి ఉండే హోదా, వారి ఆర్థిక స్థితిగతులు, విద్యార్హతలు ఆధారంగానే ట్రీట్మెంట్ అందుతుంది. అయితే ఏ క్లాస్ కాకుండా బీ క్లాస్ గదులను నవాజ్‌కు కేటాయించటం చర్చనీయాంశంగా మారింది. గదిలో ఓ మంచం, ఓ కుర్చీ, చెంబు, మరుగుదొడ్డి సదుపాయం మాత్రమే ఉంటాయి. ఒకవేళ న్యాయస్థానం అనుమతిస్తే.. గదిలో ఫ్రిజ్, ఏసీ, టీవీ సదుపాయాలను కల్పిస్తారు. అయితే మరియమ్‌కు మాత్రం ఊరటనిచ్చిన అధికారులు.. సీహాలా రెస్ట్ హౌజ్‌కు తరలించి తాత్కాలిక సబ్‌జైలును ఏర్పాటు చేశారు. జైల్లో నవాజ్‌కు బీ కేటగిరీ సదుపాయాలు కల్పించటంపై పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) కార్యకర్తలు మండిపడుతున్నారు. పనామా పత్రాలు, అవినీతి కేసుల్లో, లండన్‌లో అక్రమాస్తుల సంపాదన.. తదితర ఆరోపణలు రుజువు కావటంతో అకౌంటబిలిటీ కోర్టు.. నవాజ్ షరీఫ్(68)కు పదేళ్లు, ఆయన కూతురు మర్యమ్(44) ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. షరీఫ్ భార్య అనారోగ్యం కారణంగా లండన్‌లోనే కుటుంబం ఎక్కువగా గడుపుతోంది. అయితే జూలై 25న జరగబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం ఆయన, మర్యమ్‌లు తిరిగి శుక్రవారం స్వదేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాలు, ఉత్కంఠ పరిస్థితుల మధ్య అకౌంటబిలిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసి.. జైలుకు తరలించారు. అరెస్ట్‌కు ముందే షరీఫ్ తనపై చేస్తున్న కుట్రను వివరిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేయటం తెలిసిందే. -
అన్నా క్యాంటీన్ల అంచనాలు పెంచి కోట్లు కొట్టేశారు
-
నల్లమిల్లి... అంతా కల్లబొల్లి
అనపర్తి/బిక్కవోలు/పెదపూడి: అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కల్లబొల్లి మాటలపై నమ్మకం లేని వారంతా ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతుండడంతో ఆ పార్టీలో ఆందోళన ప్రారంభమైంది. అడుగడుగునా అవినీతి కార్యక్రమాలతో ఆయన అనుచరులు చెలరేగిపోతున్న తీరుకు విసుగుచెందిన పలువురు ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. వీరంతా ప్రత్యామ్నాయంగా వైఎస్సార్ సీపీ వైపు అడుగులు వేయడంతో నియోజకవర్గ ముఖచిత్రం మారిపోతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. టీడీపీకి చెందిన పెదపూడి–1 ఎంపీటీసీ సభ్యురాలు గుణ్ణం వనిత ఎమ్మెల్యే అవినీతిపై గతంలో గళం విప్పిన విషయం విదితమే. నియోజకవర్గంలోని పెదపూడి, ఏపీత్రయం, పైన, వెంకటాపురం, నల్లమిల్లి, పెదరాయవరం, మర్రిపూడి తదితర గ్రామాల్లో ఆయన అనుచరులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో భారీగా చేరారు. రంగంపేట మండలంలో టీడీపీకి చెందిన రిమ్మలపూడి వెంకటేశ్వరరావు వైఎస్సార్సీపీలోకి మొదటిగా చేరారు. అనంతరం రంగంపేట మండలం టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు మంగిన రాంబాబు పార్టీలో చేరారు. త్వరలో పెదపూడి1 ఎంపీటీసీ సభ్యురాలు గుణ్ణం వనిత చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో టీడీపీకి కంచుకోటగా నిలిచే ఒక బలమైన సామాజికవర్గం వైఎస్సార్సీపీలో చేరడానికి ముందడుగు వేస్తుండడంతో టీడీపీ పునాదులకు బీటలు వారనున్నాయి. అనపర్తిలో బలమైన సామాజికవర్గ ప్రతినిధి చాలా కాలంగా ఎమ్మెల్యేకు దూరం ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, ఎమ్మెల్యేకు మధ్య అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరాయి. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి వచ్చింది. దీనికితోడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలేవీ అమలు కాకపోవడంతో ప్రజల్లో చోటుచేసుకున్న అసంతృప్తి ఆ పార్టీని పూర్తిగా ముంచేస్తుందన్న భయంతో అరకొరగా ఉండే నేతలు కూడా దూరంగా ఉండడంతో ఎమ్మెల్యే వర్గంలో కలకలం రేపుతోంది. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ బుధవారం నుంచి అనపర్తి నియోజకవర్గంలో ప్రారంభించనున్న పాదయాత్రలో చేరికలు వరుస కట్టనున్నాయని ఆ పార్టీలోని వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు. అన్నింటా అవినీతి చెద... రంగంపేట, అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండలాల్లో ‘నీరు చెట్టు’ పథకంలో మట్టిని అక్రమంగా అమ్ముకుని కాసులు పోగేసుకున్నారనే అరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని ఒక్కో బ్రాందీ షాపు నుంచి సుమారు రూ.2 లక్షలు వరకు మామూళ్లు ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు తీసుకుంటున్నట్టు, ధాన్యం కోనుకోగలు కేంద్రాల నుంచి కూడా బస్తాకు సుమారు రూ.40 వరకు కమీషన్‌గా అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. -
మంత్రి నారాయణ ఖాతాలోకి వేల కోట్లు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లుగా సమర్థవంతమైన అవినీతి పాలన నడుస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అవినీతిని సమర్థవంతంగా పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. అర్బన్ హౌసింగ్ స్కీమ్‌లో సుమారు 30 వేల కోట్ల అవినీతి జరిగిందని, మట్టి-నీరు పథకంలో మరో 30 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇసుక తవ్వకాల ద్వారా వేల కోట్లు దోచేస్తున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల ద్వారా అవినీతి చేసుకోమంటూ కిందస్థాయి నేతలకు అనుమతి ఇచ్చేశారని దుయ్యబట్టారు. 'సర్వశిక్షా అభియాన్‌కు కేంద్రం ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. విద్యకు 30 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారు. వీటిలో 8 నుంచి 9 వేల కోట్లు చేతులు మారుతున్నాయి. విద్యకు కేటాయించిన నిధులన్నీ మంత్రి నారాయణ పరమవుతున్నాయి. అంతేకాకుండా సర్వశిక్షాఅభియాన్‌లో పోస్టులు అమ్ముకుంటున్నారు. దేశంలో ఎన్ఆర్జీఎస్ కింద సంవత్సరానికి 40వేల కోట్లు కేటాయిస్తే 9వేల కోట్లు కేవలం ఏపీకి ఇస్తున్నారు. జీవో 51 ద్వారా 10 ప్రాజెక్టులను తాకట్టు పెట్టి 6500 కోట్లు తేవాలని చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఉపాధి హామీ పథకాలుగా మారిపోయాయి' అని సోము వీర్రాజు ఆరోపించారు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, ఎల్ఈడీ బల్బులు, ఇల్లులు, 24 గంటల కరెంట్, నీరు చెట్టు, ప్రధాన మంత్రి భీమా, మరుగుదొడ్లు వంటి వాటిని కేంద్రమే భరిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అవీనీతికి పాల్పడుతోంది. ఆ సొమ్ముతో రాష్ట్రంలోని ఉన్న ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేయొచ్చు. బీజేపీ బలం పెరుగుతుందనే టీడీపీ నేతలు మా పార్టీ నాయకులపై దాడులు చేయిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 20 వేల కోట్ల అప్పు తెచ్చారు. ఇంత అప్పు ఉండగా మళ్లీ అప్పు తేవడానికి సిద్ధమయ్యారు. సీఎం అప్పులకు సిద్ధమౌతుంటే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఏంచేస్తున్నారు. పైగా సీఎం సభలకు రాకపోతే ప్రభుత్వ పథకాలు ఇవ్వమంటూ ప్రజలను బెదిరిస్తున్నా'రని సోము వీర్రాజు మండిపడ్డారు. -
చంద్రబాబు పాలనపై అధ్యయనం జరగాలి
-
మస్టర్లలో మాయ
అనంతపురం టౌన్: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్)లో అక్రమాలు యథేచ్ఛగా చోటు చేసుకుంటున్నాయి. కూలీలకు పని కల్పించడం పక్కన పెడితే కొందరు సీనియర్ మేట్లు, క్షేత్రసహాయకులు ఈ పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఉపాధి హామీ పథకం అమలు కోసం జిల్లా వ్యాప్తంగా 12 క్లస్టర్లుగా విభజించారు. ప్రతి క్లస్టర్‌కూ ఒక ఏపీడీతోపాటు ప్రతి మండలానికీ ఏపీఓలు, ఎంపీడీఓలు ఉపాధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. మస్టర్లలో నమోదైన కూలీలే క్షేత్రస్థాయిలో పనులు చేస్తున్నారా లేదా అని సరిపోల్చాలి. అయితే అధికారులు క్షేత్రస్థాయిలో ఉపాధి పనుల పరిశీలనకు వెళ్లిన దాఖాలాలే కనిపించడం లేదు. ధర్మవరం క్లస్టర్లో మూడేళ్లుగా బినామీ పేర్లను మస్లర్లలో నమోదు చేసి బిల్లులు డ్రా చేస్తున్నా అధికారులు గుర్తించలేదు. ఒకవేళ వారి దృష్టికి వచ్చినా చేతివాటాలు ప్రదర్శిస్తూ ‘మమ’ అనిపిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. గుంతకల్లు మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి కూలీలు పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్లిన సమయంలో అధికారులు ఉపాధి పనులను పరిశీనకు వెళ్తున్నారంటూ ఇటీవలే ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ♦ కనగానపల్లి మండలం గుంతపల్లికి చెందిన ఓ మహిళకు 12133201516000 140 నంబరుపై ఉపాధి కూలీ జాబ్‌కార్డు ఉంది. ఈమె 2014 నుంచి 2018 మార్చి 22 వరకు దశల వారీగా ఉపాధి పనికి వెళ్లినట్లు నమోదు చేసి రూ.70 వేల వరకు నిధులు డ్రా చేశారు. వాస్తవానికి ఈమె హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సు. అయినా ఈమె ఉపాధి పనులకు వస్తున్నట్లు మస్టర్లలో నమోదైంది. ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి మడకశిర ప్రాంతంలోని ఒక జూనియర్ కళాశాలలో లెక్చరర్. ఈయన పేరిట సైతం మస్టర్లో కూలీగా పేరు మోదు చేసి నిధులు దండుకున్నారు. మండల అధికారులతో క్షేత్ర సహాయకులు కుమ్మక్కై బోగస్ మస్టర్లు సృష్టించి బినామీ కూలీల పేర్లతో నిధులు కొల్లగొడుతున్నట్లు స్పష్టమవుతోంది. ♦ గుంతకల్లు మండలం నాగసముద్రం, కసాపురం, వెంకటాంపల్లి గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి పనుల వద్ద కూలీల వివరాలను ఈ – మస్టర్లలో నమోదు చేయడంలేదు. సాంకేతిక లోపం ఉండడంతో మ్యానువల్ మస్టర్లలోనే వివరాలను నమోదు చేసి అప్డేట్ చేస్తున్నారు. ఇదే అక్కడి ఉపాధి హామీ సిబ్బందికి కలిసివచ్చింది. మ్యానువల్ మస్టర్లను సైతం పని ప్రదేశంలోకి తీసుకురారు. దీంతో 100 మంది కూలీలు పనులకు హాజరైతే మరో 20–30మంది బినామీ కూలీల పేర్లను నమోదు చేసి నిధులను డ్రా చేస్తున్నారు. ఇక్కడ ఏకంగా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారి పేర్లను నమోదు చేసినట్లు తెలుస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం పనులకు హాజరు కాకపోయినా ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు మస్టర్లలో నమోదు చేసి ఉపాధి నిధులు పక్కదారి పట్టించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – జ్యోతిబసు, డ్వామా పీడీ -
నవాజ్ షరీఫ్‌కు 10 ఏళ్లు జైలు శిక్ష
ఇస్లామాబాద్ : అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. షరీఫ్ తనయ మర్యమ్, అల్లుడు కెప్టెన్ సర్దార్లు కూడా ఈ కేసులో దోషులుగా తేలారు. పనామా కుంభకోణంలో బయటపడ్డ షరీఫ్ అవినీతి బాగోతంపై పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. షరీఫ్‌పై మొత్తం నాలుగు అవినీతి కేసులు ఉన్నాయి. వీటిలో లండన్ అవెన్ఫీల్డ్లోని నాలుగు ఫ్లాట్ల కేసు ఒకటి. కాగా, తీర్పును వారం రోజుల పాటు వాయిదా వేయాల్సిందిగా షరీఫ్ కోర్టును కోరగా న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. ఈ మేరకు ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం పలు దఫాలుగా కేసును విచారిస్తూ వస్తోంది. శుక్రవారం కేసులో తీర్పును వెలువరించిన న్యాయమూర్తి నవాజ్ షరీఫ్ 10 ఏళ్ల ఖైదుతో పాటు 8 మిలియన్ పౌండ్ల జరిమానా విధించారు. మర్యమ్‌కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 2 మిలియన్ పౌండ్ల జరిమానా, సర్దార్కు ఒక ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, తీర్పు నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్లు పాకిస్తాన జాతీయ పత్రిక డాన్ పేర్కొంది. కోర్టు ప్రసారాలను లండన్ నుంచి షరీఫ్ ఫ్యామిలీ లైవ్‌లో తిలకించినట్లు రిపోర్టులు కూడా వస్తున్నాయి. -
విజయ డెయిరీ గాలికి.. హెరిటేజ్ డెయిరీకి అందలం..
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతి కోరల్లో కూరుకుపోయిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. టీడీపీ నేతలు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతులను పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహిస్తూ హ్యాపీగా ఉంటున్నారని మండిపడ్డారు. నయవంచన దీక్షలను ఆపి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. చిత్తూరు డెయిరీని గాలికి వదిలేసిన చంద్రబాబు సొంత హెరిటేజ్ డెయిరీని అందలం ఎక్కించారని ఆరోపించారు. చిత్తూరులోని చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. -
విద్య.. విక్రయాలయాలు
పైన మీరు చదివింది నిజమే.. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాలయాలను మనం ఇప్పుడు ఇలానే అనాలేమో. ఎందుకంటే ప్రస్తుతం ఇవి వ్యాపార కేంద్రాలుగా మారాయి. సామాన్యులను భయపెట్టేస్తున్నాయి. ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చే మామూళ్ల మత్తులో విద్యాశాఖజోగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదేమంటే విద్యార్థుల తల్లిదండ్రులు రాతపూర్వక ఫిర్యాదు ఇస్తేనే చర్యలు తీసుకుంటామంటున్నాయని, ఏ పాఠశాల ఎంత ఫీజు వసూలు చేస్తుందన్న విషయం వారికి తెలియదా? అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. చిత్తూరుఎడ్యుకేషన్: జిల్లాలోని కొన్ని ప్రైవేటు వి ద్యాసంస్థలు ఏటా ఇష్టానుసారం ఫీజులు పెంచు తూ వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఎల్కేజీ, యూకేజీ చదువులకే రూ.వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తుండడంతో పాటు, యూని ఫామ్, టై, బెల్డు, షూ, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు తమ వద్దే కొనాలంటూ అందిన కాడికి దోచుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. జిల్లాలో మొత్తం 894 ప్రైవేటు, 150 కార్పొరేట్ పాఠశాలలున్నాయి. వీటిలో అధిక శాతం పాఠశాలల్లో ఎల్కేజీకి రూ.8 వేలు నుంచి రూ.12 వేల వరకు, పదోతరగతికి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నాయి. అక్కడితో సరిపెట్టుకోక అడ్మిషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాఠశాల అభివృద్ధి, పరీక్ష రుసుములు పేరిట రూ.వేలకు వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అ యితే అందుకు తగ్గట్లు సౌకర్యాలు మాత్రం లేవు. విద్యా వ్యాపారం ప్రభుత్వం ముద్రించిన ఇంగ్లిషు మీడియం పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉన్నా వాటి జోలికి వెళ్లడం లేదు. ఆరో తరగతి నుంచి ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలే వాడాలని నిబంధన ఉన్నా దాన్ని పట్టించుకోవడం లేదు. ఐఐటీ, ఒలింపియాడ్, ఇతర కారణాలు చెబుతూ కొన్ని యాజమాన్యాలు ఇతర పుస్తకాలను విక్రయిస్తున్నాయి. ఇలా ఒక్కో తరగతి పుస్తకాల సెట్‌కు రూ.1,500 నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇవే కాకుండా నోటుపుస్తకాలు, షూస్, టై, బెల్ట్ ఇలా అన్ని పాఠశాలల్లో కొనాల్సిందే. కనిపించని పేరెంట్స్ కమిటీలు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించడానికి, విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడానికి పాఠశాల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీ లించడానికి పేరెంట్స్ కమిటీని విధిగా ఏర్పాటు చేయాల్సిఉంది. కానీ ఎక్కడా పేరెంట్స్ కమిటీలు కనిపించడం లేదు. ఊసే లేని ఫీజుల నియంత్రణ కమిటీ ఫీజుల నియంత్రణకు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా డీఈఓ, జెడ్పీ సీఈఓ ,సభ్యులుగా సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ శాఖల అధికారులు వ్యవహరించాలి. అయితే జిల్లాలో ఈ కమిటీ నియామకం జరగలేదని తెలుస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించడానికి ప్రభుత్వం 2014లో జీఓ నంబర్ 91ని తీసుకొచ్చింది. ఈ జీఓ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణాల్లో రూ.12 వేలు ఫీజులు వసూలు చేయాల్సి ఉంది. ఎక్కడా ఈ జీఓ అమలు చేయలేదు. కార్పొరేట్ రూటే సపరేట్ కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో నర్సరీ నుంచి యూకేజీ వరకు పిల్లలకు ఫీజు రూ.15 వేలు ఉండగా, రెండు జతల యూనిఫామ్ రూ.2 వేలు, టై, బెల్ట్, బ్యాడ్జ్‌లకు రూ.500, రెండు రకాల షూలకు రూ.850, నోటు పుస్తకాలకు రూ.500, బ్యాగ్ రూ.500, లంచ్‌బాక్స్ రూ.300, తదితర ఖర్చులు కలుపుకుని సుమారు రూ.5 వేలు అవుతోంది. ఇది కేవలం నర్సరీ నుంచి యూకేజీ విద్యార్థికే. ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థులకు ఏ స్థాయిలో ఫీజులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎంఈఓలకు ఆదేశించాం అధిక ఫీజులు వసూలు చేయడం, పాఠశాలల్లో నోటుపుస్తకాలు, స్టేషనరీ అమ్మడం చట్టరీత్యానేరం. ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చే యాలని ఎంఈఓలను ఆదేశించాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల తల్లిదండ్రులు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే సబం«ధిత పాఠశాలపై చర్యలు తీసుకుంటాం. – పాండురంగస్వామి, డీఈఓ -
ఫోర్జరీ.. మిస్టరీ
వెంకటాచలం: టీడీపీ అధికారం చేపట్టిన నాలుగేళ్లలో జిల్లాలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు. నీరు–చెట్టు, 14వ ఆర్థిక సంఘం, ఉపాధి హామీ నిధులు అన్నిచోట్ల దుర్వినియోగం అవుతున్నాయి. వెంకటాచలం మండలం అనికేపల్లి పంచాయతీలో అవినీతి, అక్రమాలు మరో మెట్టుపైనే ఉంటున్నాయి. ఆ గ్రామ పంచాయతీ ఎప్పుడూ వివాదాల్లో ఉం టూనే ఉంది. అయినా లెక్కచేయకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే అనికేపల్లి పంచాయతీలో ఫోర్జరీ తీర్మానాల సృష్టికర్త గతంలో ఆ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తేనని బలమైన అనుమానాలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తాను కార్యదర్శిగా పనిచేసిన సమయంలో చేసిన అక్రమాల కారణంగా సస్పెండ్ అయ్యాడు. కొన్ని రోజుల తరువాత విధులను చేపట్టి అనికేపల్లిలోనే పదవీ విరమణ చేసిన వ్యక్తి ఫోర్జరీ సంతకాలు చేసి తీర్మానాలు సిద్ధం చేశారని గ్రామంలో ప్రచారం జరుగుతోం ది. మంత్రి సోమిరెడ్డి అండతోనే నిధుల దుర్వి నియోగానికి ఫోర్జరీ సంతకాలకు కూడా వెనుకాడటం లేదని టీడీపీ నాయకులే చర్చించుకున్నారు. వీడని రికార్డుల మిస్టరీ గతేడాది మార్చి 22న తేదీన ఆ గ్రామ కార్యదర్శిగా ఉన్న రవిచంద్ర బదిలీ కాగా ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించిన సీహెచ్ మధుసూదనరావుకు పంచాయతీ రికార్డులు అప్పగించారు. అప్పటి నుంచి పంచాయతీలో జరిగే అక్రమాలు, అభియోగాలతో 15 నెలల వ్యవధిలో నలుగురు పంచాయతీ కార్యదర్శులు మారారు. ఈ ఏడాది మే నెల ఒకటో తేదీ నుంచి మళ్లీ మధుసూదనరావు ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ మధ్య కాలంలో బాధ్యతలు స్వీకరించిన వసుధ, వీరయ్య, శ్రీనివాసులు ఎవరూ కూడా మధుసూదనరావు వద్ద నుంచి రికార్డులు స్వీకరించలేదు. పంచాయతీలో రికార్డులు, తీర్మానాలు లేకుండా పనులు చేస్తూ నిధులు దుర్వినియోగా నికి పాల్పడుతున్నారంటూ గ్రామస్తులు, వైఎస్ఆర్సీపీ నాయకులు గత 15 నెలల నుంచి పోరాడుతూనే ఉన్నారు. మండల స్థాయిలో ఈఓపీఆర్డీ, ఎంపీడీఓ నుంచి డీపీఓ, కలెక్టర్ వరకు అందరికీ ఫిర్యాదులు చేశారు. పంచాయతీలో నిధుల దుర్వి నియోగంపై విచారణ జరపాలని గతేడాది జనవరి 30న కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు పలువురు వార్డుసభ్యులు, గ్రామస్తులు రాతపూర్వకంగా ఫి ర్యాదు చేసినా ఇప్పటికీ చర్యలు చేపట్టలేదని గ్రా మస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనికేపల్లి గ్రామస్తులు గత నెల 20వ తేదీన పంచాయతీలో జరిగే అక్రమాలపై ఆందోళన చేపట్టడంతో అధికారులు గ్రామానికి చేరుకున్నారు. మూడు రోజుల్లో రికార్డులను పరిశీలించి అక్రమాలపై ఉన్నతాధికారులకు పంపుతామని ఈఓపీఆర్డీ ర వీంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చి న మూడు రోజుల్లోనే పంచాయతీ కార్యాలయంలో చోరీ జరిగిందనే డ్రామా మొదలుపెట్టారు. కార్యాలయంలో ఉన్న బీరువాలో రికార్డులు చోరీ చేశారని ఇన్చార్జి కార్యదర్శిగా ఉన్న మధుసూదనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన మరుసటి రోజు నుంచి మధుసూదనరావు విధులకు రాకపోయినా ఎలాంటి చర్యలు లేవు. ఫోర్జరీ సంతకాలతో పనులు అనికేపల్లి పంచాయతీలో ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయల పనులకు టీడీపీ నాయకులు తెగబడిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చిం ది. ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శిగా వ్యవహరిం చిన జి.శ్రీనివాసులు సంతకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఫోర్జరీ చేసి తీర్మానాలను సిద్ధం చేశా రు. రుర్భన్ పథకం కింద రూ.6 కోట్లతో మం జూరైన నాలుగు సిమెంట్ రోడ్ల నిధుల కోసం ఈ తీర్మానాలకు తెగపడ్డారు. ఈ విషయాన్ని ఇన్చార్జి కార్యదర్శిగా వ్యవహరించిన జి.శ్రీనివాసులు లిఖి తపూర్వకంగా రాసివ్వడంతో వెలుగులోకి వచ్చిం ది. ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. కమీషన్ల కోసం ఫోర్జరీ సంతకాలతో పనులు చే యించిన వారిపై చర్యలు చేపడతామని హామీ ఇ వ్వడంతో ఆందోళన విరమించిన విష యం తెలి సిందే. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ సక్రమంగా జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. విచారణ చేపడుతున్నాం అనికేపల్లి పంచాయతీ రికార్డుల విషయంపై విచారణ జరుగుతోంది. రికార్డులు, నిధుల దుర్వినియోగంపై డీఎల్పీఓ సమగ్ర విచారణ జరుపుతున్నారు. విచారణ పూర్తయిన తరువాత విషయాలు వెల్లడిస్తాం. – సత్యనారాయణ, డీపీఓ -
ఎమ్మెల్యేకు ‘ధన’సన్మానం
ధర్మవరం: ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనాలు పెంచింది. దీంతో అంగన్వాడీ సిబ్బంది ఎమ్మెల్యే సూర్యనారాయణను ఘనంగా సన్మానించడం విమర్శలకు తావిస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ నాలుగు రోజుల క్రితమే ధర్మవరం సీడీపీవో పద్మావతి సస్పెండ్ అయ్యారు. అయినా ఐసీడీఎస్‌లో అవినీతి చెదలు పేట్రేగిపోతోంది. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు రూ.10,500, ఆయాలకు రూ.6,000 వేతనాలు పెంచిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనాలు పెంచారని, ధర్మవరం ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలోని అంగన్వాడీలంతా ఎమ్మెల్యే సూర్యనారాయణను సన్మానించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడువుగా ధర్మవరం మండలంలోని ఓ టీడీపీ నాయకుడి భార్య అయిన అంగన్వాడీ టీచర్, అంగన్వాడీల సంఘం నాయకురాలు రంగంలోకి దిగింది. ఎమ్మెల్యేకు సన్మానం చేయాలంటే ఖర్చు అవుతుంది. అందుకే ఒక్కో అంగన్వాడీ టీచర్ రూ.100, ఆయాలు రూ.50 చొప్పున డబ్బులు ఇవ్వాలని హుకుం జారీ చేసింది. లేదంటే ఎమ్మెల్యేకు చెబుతామంటూ బెదిరింపులకూ దిగింది. చేసేదిలేక ఒక్కో అంగన్వాడీ టీచర్ రూ.100, ఆయాలు రూ.50 చొప్పున డబ్బులను సదరు నాయకురాలికి అందజేశారు. ఇంకా కొందరు ఆలస్యంగా ఇస్తామని చెప్పా రు. ధర్మవరం ఐసీడీఎస్ పరిధిలోని ధర్మవరం పట్టణం, రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లో దాదాపు అంగన్వాడీ టీచర్లు 354 మంది, ఆయాలు 350 మంది వరకు ఉన్నారు. ఒక్కొక్కరితో రూ.100, రూ.50 చొప్పున వసూలు చేయగా రూ.52,900 నగదు వసూలైంది. కానీ శనివారం ధర్మవరం మార్కెట్‌యార్డులో ఎమ్మెల్యే సూర్యనారాయణ సమక్షంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యేను పూలమాలలు, నాలుగు శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే సూర్యనారాయణకు సన్మానం చేసేందుకు, కేక్, కుర్చీలు, బ్యానర్ తదితర వాటికి అంతా కలిపి రూ.5 వేలు కూడా కాకపోవడం గమనార్హం. సమావేశంలో అంగన్వాడీలందరికీ భోజన ఏర్పాట్లను కూడా ఎమ్మెల్యే ఖర్చులతోనే చేయించారు. కానీ అంగన్వాడీ కార్యకర్తలతో రూ.100, ఆయాలతో రూ.50 చొప్పున ముక్కుపిండి వసూలు చేశారు. ఇదేమని అడిగేవారు లేకపోవడంతోపాటు ప్రస్తుతం సీడీపీవో సస్పెండ్‌కు గురికావడంతో అంగన్వాడీల సంఘం నాయకురాలిది ఇష్టారాజ్యమైంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని పలువురు భావిస్తున్నారు. -
ప్రజాస్వామ్యానికి పాతర
డోన్ : టీడీపీ పాలనలో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నారని, డోన్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల అరాచకాలు, అవినీతి, అక్రమాల మూలంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్, స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ‘అరాచకాలు అంతం కావాలి.. ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి’ అనే నినాదంతో శనివారం డోన్ పట్టణంలోని బుగ్గన స్వగృహం నుంచి పాతబస్టాండు వరకు వేలాది మందితో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాతబస్టాండులో జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, దిలీప్ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో బుగ్గన మాట్లాడారు. టీడీపీ నాయకుల అక్రమాలు, అన్యాయాలపై నిప్పులు చెరిగారు. కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస సంఘటనల మూలంగా నియోజకవర్గ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోందన్నారు. పట్టణ నడిబొడ్డున రౌడీషీటర్లు కన్నతండ్రిని కిరాతకంగా హతమార్చడం, చిన్న విషయానికే కొందరు డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డిని పొట్టనబెట్టుకోవడం దారుణమన్నారు. ప్రేమపేరుతో నిండు గర్భిణీని హతమార్చిన నిందితునికి అధికార పార్టీ నాయకులు వంతపాడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మునిసిపల్ టెండర్ల సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేసినా పోలీసులు చోద్యం చూశారన్నారు. ప్రజావైద్యశాల వీధిలో ఒక యువకున్ని కత్తులతో పొడిచినా, కేవీఎస్ ఆసుపత్రి వద్ద ఓ వ్యక్తిపై అధికార పార్టీ మద్దతుదారులు అమానుషంగా దాడిచేసినా పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని నిలదీశారు. అడుగడుగునా కబ్జాలు డోన్‌లోని టైలర్స్ కాలనీ, పేరంటాలమ్మ , గంగమ్మ మాన్యం భూములతో పాటు నాయీబ్రాహ్మణులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను టీడీపీ నాయకులు కబ్జా చేశారని బుగ్గన అన్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించుకొన్న బేస్‌మట్టాలను టీడీపీ వారు నేలమట్టం చేయడం దారుణమన్నారు. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు సైతం వారి కబ్జాకోరల్లో చిక్కుకున్నాయన్నారు. సంక్షేమ పథకాల ఫలాలు సామాన్య, పేద ప్రజలకు అందకుండా పంది కొక్కుల్లా మింగేశారని విమర్శించారు. నీరు–చెట్టు, వాటర్షెడ్లు, ఉపాధి హామీ నిధులతో పాటు మరుగుదొడ్ల బిల్లులను సైతం దిగమింగారన్నారు. ఫ్లైఓవర్ కింద నిరుపేద వ్యాపారుల పొట్టకొట్టి రూ.36వేలు, రూ.26వేల చొప్పున అక్రమంగా కిరాయి వసూలు చేస్తోంది ఎవరో టీడీపీ నాయకులే చెప్పాలన్నారు. చెరువుల్లోని మట్టిని రైతుల పంట పొలాలకు ఇవ్వకుండా బయట విక్రయించి లక్షలాది రూపాయలను అక్రమంగా ఆర్జిస్తున్నారని విమర్శించారు. పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయింపు డోన్ నియోజకవర్గంలో ప్రజలకు స్వేచ్ఛ, ఆస్తులకు రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారంటూ బుగ్గన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డోన్ పోలీస్ స్టేషన్ ఎదుట మండుటెండలో బైఠాయించారు. నియోజకవర్గంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, ఆక్రమణలను అరికట్టి.. ప్రజలు స్వేచ్ఛగా జీవించేందుకు అవకాశం కల్పించాలని పోలీసు అధికారులను కోరారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ టీడీపీ నాయకుల అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. సీఐ రాజగోపాల్ నాయుడు, ఎస్ఐ చంద్రబాబు నాయుడు, నర్సింహులు, శ్రీధర్ తదితరులు ఆయనతో చర్చించి.. నూతన డీఎస్పీ ఖాదర్‌బాషతో మాట్లాడవలసిందిగా ఆహ్వానించారు. ఇందుకు బుగ్గన సమ్మతించి డీఎస్పీతో మాట్లాడారు. అనంతరం శాంతిభద్రతల పరిస్థితిపై వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మల్లెంపల్లె రామచంద్రుడు, కోట్రికె హరికిషన్, చంద్రశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, దినేష్ గౌడ్, ఆర్ఈ రాజవర్దన్, పోస్ట్రుపసాద్, వెంకోబారావ్, రామచంద్రారెడ్డి, నర్సింహరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వెంకటాపురం చిన్నమాదన్న, మద్దిలేటి, రఫీ, బుర్రు శేఖర్, దారా ప్రతాప్‌రెడ్డి, తాడూరు లచ్చప్ప, అనుంపల్లె వెంకటరాముడు, నాగన్న, ఎద్దుపెంట శ్రీను, జయరాముడు, రామలింగడు, తిరుమల్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, దేవేంద్రరెడ్డి, భాస్కర్‌రెడ్డి, తొర్రెడ్డి, ఓబులాపురం సుధాకర్ యాదవ్, శివారెడ్డి, పెద్దనర్సింహులు, సుధాకర్ రెడ్డి, హనుమన్న, చిరంజీవి, గంగన్న, లక్ష్మిపల్లె ఓబులేస్, పెద్ద తిమ్మారెడ్డి, నాయుడు, ధనుంజయ, మద్దిలేటి, గోసానిపల్లె మధుసూదన్‌రెడ్డి, కొచ్చెర్వు కృష్ణారెడ్డి, రమణయ్యశెట్టి, చింతలపేట గంగాధర్‌రెడ్డి, మాధవస్వామి, చిన్నమల్కాపురం బద్దల నాగరాజు, సుబ్బరాయుడు, శివయ్య, రామనాయుడు, లక్ష్మన్న, వలిసెల హనుమంతరెడ్డి, కటిక వేణు, ఎద్దుపెంట వెంకటేశ్వర్లు, మహేశ్వరరెడ్డి, ప్యాపిలి మండల నాయకులు బోరెడ్డి శ్రీరామ్‌రెడ్డి, బోరా మల్లికార్జునరెడ్డి, ఊటకొండ గోపాల్‌రెడ్డి, కమతం భాస్కర్‌రెడ్డి, బాబయ్య, శ్రీనివాసరెడ్డి, రంగన్న, బోరెడ్డి రఘు, జలదుర్గం శ్రీను, రసూల్, బాలవెంకటేశ్, సీమ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వసూల్ రాజా..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆయన ఓ పోలీస్ అధికారి. పైగా ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఇంకేముంది..! ఆయన ఆడిందే ఆట.... పాడిందే పాటగా నడుస్తోంది. చీమకుర్తిలో మకాం వేసి అక్రమ వసూళ్ల పర్యవేక్షణ ఆయన పని. క్వారీల్లో జరిగే యాక్సిడెంట్లను బయటకు రాకుండా చూస్తారు. ప్రతిఫలంగా పెద్ద ఎత్తున ముడుపులు అందుకుంటారు. క్వారీ, ఫ్యాక్టరీ యజమానులు, ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ల మధ్య నిత్యం ఆయన పంచాయితీలు చేస్తారు. అందుకే అందరూ ఆయనకు నెల మామూళ్లు క్రమం తప్పకుండా సమర్పిస్తారు. ఒక్క చీమకుర్తి, మద్దిపాడు ప్రాంతాల నుంచి ఆయనకు వచ్చే నెల రాబడి రూ.35 లక్షల పైమాటే. చాలా కాలంగా ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే ఆయన విధుల్లో ఉంటున్నారు. ఇంతకు ముందు ఆయన చీమకుర్తిలో విధులు నిర్వహించారు. ఇప్పుడు ఇదే ప్రాంతంలో అంతకు మించిన పదవిలో ఉన్నారు. సీఎం సామాజికవర్గం పేరు చెప్పి ఉన్నతాధికారుల మాటలను కూడా ఆయన పెడచెవిన పెడతారు. ప్రజా సమస్యలను ఏ మాత్రం పట్టించుకోరు. ఇక ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులుగా ఉన్న బాధితులు స్టేషన్‌కు వస్తే ఆయన ఏ మాత్రం స్పందించరు. సదరు అధికారి వసూళ్ల పర్వాన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని వర్గాల వారు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. సొంత శాఖ నుంచే ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పది నిమిషాల పాటు ఆయన స్టేషన్లో కూర్చుంటే కింది స్థాయి సిబ్బంది ఆయన గురించి గుసగుసలాడుకోవడం కనిపిస్తోంది. చీమకుర్తి ప్రాంతంలో 60 క్వారీలు, వాటికి అనుబంధంగా మరో 30 క్వారీలు కలిపితే మొత్తం 90 క్వారీలు ఉన్నాయి. నెలకు ఒక్కో క్వారీ నుంచి రూ.15 వేలు ఆ పోలీస్ అధికారికి మామూలు కింద సమర్పించాల్సిందే. ఇక 70 కంకర మిల్లులు ఉండగా ఒక్కో కంకర మిల్లుకు రూ.5 వేల చొప్పున ఆయనకు నెల మామూలు ఇవ్వాల్సిందే. ఇక 300 ఫ్యాక్టరీలలో ఒక్కో ఫ్యాక్టరీ నుంచి నెలకు రూ.2 వేలు చొప్పన సదరు అధికారి జేబులోకి వెళ్లాల్సిందే. ఈ లెక్కన క్వారీల పరిధిలో నెలకు రూ.13.50 లక్షలు, ఫ్యాక్టరీల పరిధిలో రూ.6 లక్షలు, 70 కంకర మిల్లుల పరిధిలో రూ.3.50 లక్షలు చొప్పున మొత్తం నెలకు రూ.21 లక్షలు సదరు పోలీస్ అధికారికి నెల మామూళ్ల కింద చెల్లిస్తున్నారు. ఇక క్వారీ యాక్సిడెంట్లు, లారీ ట్రాన్స్‌పోర్టు వసూళ్లు తదితర వాటిని కలిపితే నెలకు రూ.6 నుంచి రూ.7 లక్షల వరకు సమర్పించాల్సిందే. చీమకుర్తి కాకుండా మద్దిపాడు పరిధిలో ఉన్న 90 ఫ్యాక్టరీలు నెలకు రూ.5 వేలు చొప్పున రూ.4.50 లక్షలు, గ్రానైటు అక్రమ రవాణాకు సంబంధించి మరో రూ.5 లక్షలు కలిపి నెలకు దాదాపు రూ.10 లక్షలు ఆ పోలీస్ అధికారికి ముట్ట చెప్పాల్సిందే. ఈ లెక్కన నెలకు రూ.40 లక్షలకు తగ్గకుండా పోలీస్ అధికారి అక్రమ వసూళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. గ్రానైట్ క్వారీల ప్రమాదాలు జరిగినప్పుడు ఆయనే ముందుండి పంచాయితీలు చేస్తారు. కేసులు నమోదు కాకుండా చూస్తారు. మూడు నెలల క్రితం చీమకుర్తి పరి«ధిలోని ఓ క్వారీలో పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. పత్రికల వారికి ఇదే విషయాన్ని పోలీసులు చెప్పారు. అయితే వాస్తవంగా గ్రానైట్ క్వారీల్లో పేలుళ్ల కోసం ఏర్పాటు చేసిన పేలుడు పదార్థాలు ఉరుములు, మెరుపులతో పేలడంతో క్వారీలో ఇద్దరు కార్మికులు చనిపోయినట్లు ఆ తర్వాత తెలిసింది. చీమకుర్తి ప్రాంతంలో గ్రానైట్ క్వారీల్లో జరిగే ప్రమాదాలు బయటకు రాకుండా సదరు పోలీసు అధికారి అన్నీ తానై చూసుకుంటారు. వీటితో పాటు చీమకుర్తి ప్రాంతంలో ట్రాన్స్‌పోర్టు గొడవలు సైతం ఆయనే పరిష్కరిస్తుంటారు. సదరు అధికారి చీమకుర్తిలో మకాం వేయడానికి ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధమే కారణమన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది. ఈయనతో అనుబంధాన్ని పెంచుకున్న సదరు మహిళ కొంత కాలం ఒంగోలుకే మకాం మార్చినట్లు తెలుస్తోంది. అధికార పార్టీతో ఎనలేని అనుబంధాన్ని పెంచుకున్న సదరు పోలీసు అధికారి పోలీసు ఉన్నతాధికారులను ఖాతరు చేయడన్న ప్రచారం ఉంది. తన సామాజిక వర్గానికి చెందిన ఒంగోలు ఎమ్మెల్యేతో పాటు సీఎం సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో ఈయన ఆడిందే ఆటగా సాగుతోంది. ఆయన అధికార పార్టీ మద్దతుదారులకు మాత్రమే అందుబాటులో ఉంటారని ఆశాఖకు చెందిన పలువురు పేర్కొంటుండడం గమనార్హం. -
దేవుడి శాఖలో దొంగల పెత్తనం!
సాక్షి, హైదరాబాద్: ఆయన సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ దేవాలయానికి కార్యనిర్వహణాధికారి. గతంలో ఉత్తర తెలంగాణలోని ఓ దేవాలయంలో అక్రమాలకు పాల్పడ్డందుకు సస్పెండ్ కూడా అయ్యారు. కానీ పైరవీలు, మామూళ్లతో తిరిగి ఉద్యోగంలో చేరి.. అనతికాలంలో పెద్ద దేవాలయంలో ఈవోగా చేరారు. దేవాలయానికి దాతలు ఇచ్చే విరాళాలను నొక్కేయడమే కాకుండా ప్రసాదం సామగ్రి కొనుగోళ్లలోనూ చేతివాటం చూపి విజిలెన్స్‌కు చిక్కారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ మంత్రి ఆదేశించినా అమలుకాలేదు. ఇప్పుడాయనను ఏకంగా డిప్యూటీ కమిషనర్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఉత్తర తెలంగాణలోని ఓ ప్రముఖ శైవక్షేత్రం కార్యనిర్వహణాధికారి ఆయన. నిబంధనల ప్రకారమైతే 2011లో గ్రేడ్–1 ఈవోగా పదోన్నతి వచ్చి.. అసిస్టెంట్ కమిషనర్ హోదాలో రిటైర్ కావాల్సి ఉంది. కానీ 2003లోనే గ్రేడ్–1 ఈవోగా పదోన్నతి పొంది.. ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ హోదాకు వచ్చారు. తీవ్ర అవినీతి ఆరోపణలున్న ఆ అధికారి తాజాగా రిటైర్ కావాల్సి ఉంది. కానీ ఆయనను మరో రెండేళ్లపాటు కొనసాగించాలంటూ ఇద్దరు ఉన్నతాధికారులు ఫైలును సీఎం కార్యాలయానికి పంపారు. దేవాదాయశాఖ మంత్రి వ్యతిరేకించినా ఆ ఫైలు ముందుకు కదలడం గమనార్హం. ...దేవాదాయ శాఖలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇది. ఆ శాఖ మంత్రి మాటను కూడా లెక్కచేయకుండా.. ఓ ఉన్నతాధికారి, సచివాలయంలోని మరో ఉన్నతాధికారి కలసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైనమిది. కాసుల కోసం అవినీతి అధికారులతో కుమ్మక్కవుతున్న సదరు ఉన్నతాధికారులు.. అడ్డగోలుగా పదోన్నతులు ఇచ్చేస్తున్నారు. పదవీ విరమణ పొందాల్సిన వారినీ మరింత కాలం కొనసాగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై ఇతర అధికారులు ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. అడ్డగోలు పదోన్నతులు, కొనసాగింపుల కారణంగా కింది అధికారులకు పదోన్నతుల్లో జాప్యం జరిగే పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. విచ్చలవిడిగా అక్రమాలు ఉత్తర తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రం ఈవోగా పనిచేస్తున్న అధికారి ఈ నెలాఖరుకు పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఆయన రిటైరైతే ఆ స్థానంలో మరో అధికారికి, ఆ అధికారి ఖాళీ చేసే అసిస్టెంట్ కమిషనర్ స్థానంలోకి కింది అధికారికి పదోన్నతి లభిస్తుంది. కానీ ఇప్పుడున్న అధికారికే మరో రెండేళ్లు పదవీకాలం పొడిగించే దిశగా రం గం సిద్ధమైంది. వాస్తవానికి ఆ అధికారి అక్రమంగా పదోన్నతి పొందారంటూ ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోంది. 2011లో గ్రేడ్–1 ఈవోగా పదోన్నతి పొందాల్సిన ఆయన 2003లోనే పొందారు. దీంతో అర్హత లేకున్నా డిప్యూటీ కమిషనర్ స్థాయికి వచ్చా రు. దీన్ని సరిచేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా శాఖ కమిషనర్ 2016లో ప్రభుత్వాన్ని కోరగా.. 2017లో అనుమతి వచ్చింది. కానీ దానిని అమలు చేయకుండా ఇప్పటికీ పెండింగ్‌లో పెట్టడంతోపాటు తాజాగా మరో రెండేళ్లు కొనసాగించే ప్రయత్నం జరుగుతోంది. ఇక దేవాదాయ శాఖలో తీవ్ర అవినీతి ఆరోపణలు మూటగట్టుకుని, ఇప్పటికే ఓసారి సస్పెండైన అధికారికి తాజాగా డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఆ అధికారి అవినీతిపై ఇటీవల కొందరు భక్తులు దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దాంతో శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించినా అధికారులు బేఖాతరు చేశారు. పైగా కీలక పదవిని కట్టబెట్టారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్‌కు ఈ అవకతవకలన్నీ తెలిసినా.. నిస్సహాయంగా ఉండిపోయే పరిస్థితి ఉందని దేవాదాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘చంద్రబాబు దోపిడీకి గునపాలు సరిపోవు’
సాక్షి, తూర్పుగోదావరి/కాకినాడ: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా అంచనాలకు అందనిరీతిలో అవినీతి బాగోతం జరుగుతోందన్నారు. మంగళవారం ఉదయం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. లెక్కలు ఎందుకు మారాయి?.. ‘పోలవరం ప్రాజెక్టు విషయంలో రోజుకోసారి లెక్కలు మారుతున్నాయి. ప్రాజెక్టు వ్యయం రూ.16 వేల కోట్ల నుంచి అమాంతం రూ. 53 వేల కోట్లకు పెరిగింది. ఎందుకు?.. ఏ ప్రాజెక్టు అయినా చంద్రబాబుకు ఉపాధిహామీ పథకమే. ఆయన దోపిడీకి గునపాలు చాలవు. పెద్ద పెద్ద ప్రొక్లెయినర్లు కావాలి. దోపిడీలో చంద్రబాబుకు ఏకంగా ఆస్కార్ ఇవ్వొచ్చు’ అని సోమువీర్రాజు పేర్కొన్నారు. బాబు ఓ అధర్మ చక్రవర్తి అని, అధర్మపోరాటమే చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. 2019లో చంద్రబాబుకు ఎలాంటి శాస్తి జరగాలో అదే జరిగి తీరుతుందన్నారు. నన్నయ్య వర్సిటీ కోసం టీడీపీ కేవలం కాంపౌండ్ వాల్ మాత్రమే కట్టిందన్నారు. విజభన హామీలపై బీజేపీ కట్టుబడి ఉందని, 2019 ఎన్నికల్లో పొత్తుల అంశంపై ఇప్పుడే ఏం చెప్పలేమని వీర్రాజు అన్నారు. ‘మోదీ లేకుంటే చంద్రబాబు జీరో’ -
ఉప ఎన్నికలు వచ్చే అవకాశం: విజయసాయి రెడ్డి
సాక్షి, శ్రీకాకుళం : ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసిన స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశముందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ సభ్యుల సమావేశాలకు పార్టీ నేత ధర్మాన ప్రసాదరావుతో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ విధానాలు, నిర్లక్ష్యం కారణాంగానే ఉత్తరాంధ్ర వెనుకబడిందని విమర్శించారు. నాలుగేళ్లయినా వంశధార ఫేజ్ 2 పనులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అవినీతికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ప్రాజెక్టులు పూర్తి కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్ అవినీతి ధనార్జనతో 3 లక్షల కోట్లు దోచుకుని, విదేశాల్లో దాచుకున్నా.. సంతృప్తి చెందడం లేదని.. అందుకే రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చిన వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందని తెలిపారు. ధర్మాన మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత లేదని విమర్శించారు. శ్రీకాకుళంలో హుద్‌హుద్ తుఫాన్లో ఇళ్లు కోల్పోయిన వారికి.. ఇళ్లు కేటాయించలేని అసమర్ధత టీడీపీ ఎమ్మెల్యేల సొంతమన్నారు. ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరగడంతో.. అవి బయటపడకూడదనే పేదలకు ఇళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. -
కౌన్సిలర్లే అవినీతి పరులు
ఎమ్మెల్యే కురుగొండ్ల వివాదాస్పద వ్యాఖ్యలు వెంకటగిరి: వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు ఇచ్చిన కమీషన్లు తమ పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్లకే అందాయని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. శనివారం ఆయన పట్టణంలోని పాలకేంద్రం సెంటర్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికలు, టీవీ చానళ్లలో తనను అవినీతి పరుడిగా చిత్రిస్తూ వచ్చిన కథనాలపై ఆయన ఘాటుగా స్పందించారు. నాలుగేళ్లలో వెంకటగిరిలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని, వీటికి సంబంధించి కాంట్రాక్టర్ల నుంచి తానేమీ తీసుకోలేదన్నా రు. అనంతరం అక్కడే ఉన్న మున్సిపల్ కాంట్రాక్టర్ సుబ్రహ్మణ్యంనాయుడుతో కమీషన్లు తీసుకున్న వ్యక్తుల పేర్ల చెప్పాలని హుకుం జారీ చేశారు. దీంతో సుబ్రహ్మణ్యంనాయుడు తటపటాయిస్తూ కౌన్సిల ర్లు, చైర్పర్సన్లకు కమీషన్లు ఇచ్చానని వెల్లడించారు. కాగా ఎవరెంత తీసుకున్న విషయాన్ని త్వరలో తేల్చేస్తానని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. అయితే అక్కడే ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు, పలువురు కౌన్సిలర్లు మిన్నకుండిపోయారు. ‘సాక్షి’పై అక్కసు ‘సాక్షి’ టీవీలో గురువారం ప్రసారమైన ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కథనం, ‘సాక్షి’ దినపత్రికలో నీరు–చెట్టు పథకంలో జరి గిన అవినీతిపై వస్తున్న కథనాలపై ఎమ్మె ల్యే అక్కసు వెళ్లగక్కారు. తప్పు జరిగి ఉంటే తనను ప్రశ్నించాలన్నారు. కార్యక్రమంలో వెంకటగిరి ఏఎంసీ చైర్మన్ పులి కొల్లు రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సి.గంగాప్రసాద్, కౌన్సిలర్ పి.విశ్వనాథ్, ఆవుల ప్రహ్లాద, కె.చెంగారావ్, కె.రమేష్, ఎం.బాబు పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలనలో అవినీతిని నిరూపిస్తాం
-
ముఖ్యనేత జేబుల్లోకి కమీషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి వరదలై పారుతోంది. అందినంత దండుకోవడమే ప్రభుత్వ పెద్దలు పనిగా పెట్టుకున్నారు. తాజాగా మూడు ఎత్తిపోతల పథకాల పనులను తనకు బాగా కావాల్సిన కాంట్రాక్టర్లకు అప్పగించి, రూ.375 కోట్లు కొల్లగొట్టేందుకు ‘ముఖ్య’నేత స్కెచ్ వేశారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో భాగమైన అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, భైరవానితిప్ప(బీటీపీ) ఎత్తిపోతల, పత్తికొండ ఎత్తిపోతల పథకాల్లో అంచనా వ్యయాలను విపరీతంగా పెంచేసి, టెండర్లు పిలిచారు. అస్మదీయ కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించారు. ముఖ్యనేతకు కావాల్సిన కాంట్రాక్టు సంస్థలు తప్ప ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా బెదిరింపులకు దిగారు. చివరకు అస్మదీయ కాంట్రాక్టు సంస్థలు అధిక ధరలతో సింగిల్ బిడ్లను దాఖలు చేశాయి. వాటిని ఆమోదించాలంటూ అధికారులపై ముఖ్యనేత ఒత్తిడి తెచ్చారు. చేసేది లేక.. నిబంధనలకు విరుద్ధమైనా సింగిల్ బిడ్లను ఆమోదించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. టెండర్ నోటిఫికేషన్ జారీ చేయకముందే అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల పథకంలో అంచనా వ్యయాన్ని రూ.205.54 కోట్లు, భైరవానితిప్ప ఎత్తిపోతల పథకంలో రూ.42.78 కోట్లు, పత్తికొండ ఎత్తిపోతల పథకంలో రూ.77.93 కోట్ల మేర పెంచేసినట్లు సాక్షాత్తూ జలవనరుల శాఖ అధికారులే చెబుతున్నారు. ఈ విషయంలో 2017–18 స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లను(ఎస్ఎస్ఆర్)ను కూడా ముఖ్యనేత పట్టించుకోలేదు. మూడు పథకాల్లో అంచనా వ్యయాలను రూ.326.25 కోట్లు పెంచినట్లు స్పష్టమవుతోంది. సింగిల్ బిడ్లను ఆమోదించాలట! అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యనేతకు బాగా కావాల్సిన కాంట్రాక్టు సంస్థ 4.65 శాతం అధిక ధరలకు(ఎక్సెస్) సింగిల్ బిడ్‌ను దాఖలు చేసింది. బీటీపీ ఎత్తిపోతల పథకం పనులకు అధికార పార్టీ ఎమ్మెల్సీ బినామీ సంస్థ 4.32 శాతం అధిక ధరలకు బిడ్ దాఖలు చేసింది. పత్తికొండ ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యనేతతో అనుబంధం ఉన్న కంపెనీ 4.52 శాతం అధిక ధరలకు బిడ్ దాఖలు చేసింది. ముఖ్యనేత ఒత్తిడి మేరకు సింగిల్ బిడ్లను ఆమోదించి.. ఆయా సంస్థలకు పనులు అప్పగించాలని కమిషనర్ ఆఫ్ టెండర్స్‌కు జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. తాను ఎంపిక చేసిన సంస్థలకే పనులు దక్కేలా చక్రం తిప్పిన ముఖ్యనేత.. టెండర్లను ఖరారు చేయాలంటూ సీవోటీపై ఒత్తిడి తెస్తున్నారు. సింగిల్ బిడ్ దాఖలైన టెండర్లను నిబంధనల మేరకు రద్దు చేసి మళ్లీ టెండర్లు నిర్వహించాలి. కానీ, సింగిల్ బిడ్ దాఖలైన టెండర్లను ఆమోదించాలంటూ సీవోటీపై ముఖ్యనేత ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యనేత జేబుల్లోకి కమీషన్లు మూడు ఎత్తిపోతల పథకాల అంచనా వ్యయాలను పెంచడం వల్ల అస్మదీయ కాంట్రాక్టర్లకు రూ.326.25 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. అధిక ధరలకుపనులను అప్పగించడం వల్ల అదనంగా మరో రూ.49.13 కోట్ల మేర లాభం వస్తుంది. అంటే ఖజానాపై రూ.375.38 కోట్ల భారం పడుతుంది. కాంట్రాక్టర్లతో ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ సొమ్ముంతా కమీషన్ల రూపంలో ముఖ్యనేత జేబుల్లోకి చేరనుంది. -
అవినీతి చీకట్లో విద్యుత్ రంగం
-
కొలిక్కిరాని ఐకేపీ కుంభకోణం
తణుకు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవినీతి బట్టబయలైనా కనీసం విచారణ చేపట్టేందుకు అధికారులు ముందుకు రావడంలేదు. ఐకేపీ కుంభకోణం వ్యవహారంలో డ్వాక్రా మహిళల అనుమానాలను నివృత్తి చేయలేకపోతున్నారు. ఇరగవరం మండలం కత్తవపాడు గ్రామంలో ఇటీవల వెలుగు చూసిన ఐకేపీ కుంభకోణంలో ఇప్పటి వరకు బా«ధ్యులపై చర్యలు తీసుకోకపోగా కనీసం విచారణ కూడా చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు బహిరంగమే అయినా సంబంధిత అధికారులు మాత్రం నోరు మెదపడంలేదు. మరోవైపు గతంలో ఇదే మండలంలో వెలుగు చూసిన ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన మండలస్థాయి మాజీ నాయకుడి పాత్రపైనా డ్వాక్రా మహిళలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పాత్రపైనా అనుమానాలు గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళల పేరుతో పాలకొల్లు ఇండియన్ బ్యాంకులో నకిలీ ఖాతాలు సృష్టించిన వైనంపైనా అధికారులు ఇప్పటివరకు విచారణ చేపట్టకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ధాన్యం కొనుగోలులో దళారీగా వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుడితోపాటు మరికొందరి తీరుపైనా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2015 నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.10 కోట్ల మేర ఇదే తరహాలో నగదు లావాదేవీలు నిర్వహించినప్పటికీ దీనిపై విచారణ చేపట్టాల్సిన అధికారులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత ఖాతాదారులు లేకుండానే ఖాతాలు ప్రారంభించడంతో పాటు డ్రా చేసిన సమయంలో సైతం వారు లేకుండానే నగదు చెల్లించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2015 ఖరీఫ్ నుంచి 2017 వరకు సుమారు 392 మంది ఖాతాల ద్వారా సుమారు రూ.10 కోట్ల మేర లావాదేవీలు జరిగాయి. ఒక్కో ఖాతాదారుడి ఖాతాలో రూ.లక్ష నుంచి రూ.12 లక్షల వరకు జమచేసి అనంతరం డ్రా చేసినట్లు తెలుస్తోంది. సొమ్ము బదిలీ వ్యవహారం ఎఫ్‌టీవో (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) సంఖ్య ద్వారా స్పష్టమవుతోంది. జిల్లావ్యాప్తంగా.. ఇరగవరం మండలం కత్తవపాడు గ్రామంలో వెలుగు చూసిన ఐకేపీ కుంభకోణం ఇప్పుడు జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన నేతలు తమ బంధువుల పేరుతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి తమకు అనుకూలంగా ఉండే డ్వాక్రా మహిళలను సభ్యులుగా చేర్చి వారిపేరుతో ఈ తరహా వ్యవహారం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మండలాల్లో సైతం ఇదే తరహాలో ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా రైతులు ధాన్యం అమ్మే సమయంలో రైతు పట్టాదారు పుస్తకం, రుణార్హత కార్డు లేదా స్వయంగా ధ్రువీకరణ పత్రం అందజేయాలి. అయితే వ్యవసాయంతో సంబంధంలేని వ్యక్తులను రైతులుగా గుర్తించి వారి పేరుతో ఖాతాలు ప్రారంభించిన వ్యవహారం ఇప్పుడు ధుమారం రేపుతోంది. సాధారణంగా బ్యాంకు ఖాతా తెరవడానికి బ్యాంకు అధికారులు ఎన్నో నిబంధనలు చెబుతారు. ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసుకునే సమయంలో సైతం ఖాతాదారుడు తప్పనిసరిగా ఉండాలనే షరతులు పెడతారు. అయితే ఇక్కడ మాత్రం సంబంధిత ఖాతాదారుడు లేకుండానే పెద్ద మొత్తంలో నగదు చెల్లించడం వెనుక బ్యాంకు అధికారుల ప్రమేయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత మహిళలతో కొందరు టీడీపీ పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. -
గుండె గు‘బిల్లు’!
సాక్షి, అమరావతి: నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో విద్యుత్ రంగంపై చిమ్మచీకట్లు అలుముకున్నాయి. బిల్లులు తగ్గిస్తామని చెప్పిన మాట దేవుడెరుగు.. ఈ నాలుగేళ్లల్లో పేదవాడి కరెంట్ బిల్లులు నాలుగు రెట్లు పెరిగాయి. అవసరం లేకున్నా ప్రైవేటు విద్యుత్‌ను కొన్నారు. వేల కోట్లు దోచుకున్నారు. ఏపీ జెన్కో ఉత్పత్తిని దారుణంగా దెబ్బతీశారు. బొగ్గు దగ్గర్నుంచి, థర్మల్ కాంట్రాక్టుల వరకూ.. ట్రాన్స్‌కో లైన్ల దగ్గర్నుంచి సోలార్ ప్లాంట్ల వరకూ ఇష్టారాజ్యంగా దోపిడీ కళ్లకు కట్టినట్టు కన్పిస్తోంది. రాష్ట్రంలో ఈ నాలుగేళ్ల కాలంలో మూడుసార్లు విద్యుత్ చార్జీలు పెరిగాయి. దీంతో ప్రజలపై పడిన ఈ భారం రూ.1,787 కోట్లు. 2015–16లో రూ.800 కోట్లు, 2016–17లో రూ.745 కోట్లు, 2017–18లో రూ.242 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచారు. ఇవి ప్రత్యక్షంగా పెరిగినవి మాత్రమే. ఇక పరోక్షంగా ప్రజల నుంచి మరో రూ.2,800 కోట్లు పిండుకుందీ ప్రభుత్వం. అంతేకాదు.. 2016– 17లో శ్లాబుల వర్గీకరణ (క్రితం ఏడాది 900 యూనిట్లు కాల్చిన వారిని అధిక టారిఫ్‌లోకి తేవడం) వల్ల 70 లక్షల మందిపై అదనపు భారంవేసి, రూ.1,200 కోట్ల మేర దొంగ దెబ్బ కొట్టింది. అలాగే, 2017–18లో డిమాండ్ చార్జీలు పెట్టి రూ.900 కోట్ల మేర పరోక్ష వడ్డన చేసింది. 2018–19లో ఇంకో రూ.700 కోట్ల మేర పరోక్ష రాబడికి పూనుకుంది. రైతన్నకూ టోకరా.. దివంగత మఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం అందుబాటులోకి వచ్చింది. 2014 నాటికి రాష్ట్రంలో 16 లక్షల వ్యవసాయ పంపు సెట్లున్నాయి. ఈ నాలుగేళ్లల్లో ఏటా సగటున 75వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం నాలుగేళ్లల్లో కేవలం 50 వేల పంపుసెట్లు మంజూరు చేసింది. వీటిల్లో చాలావరకూ సోలార్ పంపుసెట్ల వైపు మళ్లించింది.తాము అధికారంలోకి వస్తే ఏడుకు బదులు 9గంటలపాటు పగటిపూట విద్యుత్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. నాలుగేళ్లుగా కనీసం ఏడు గంటలు కూడా ఇవ్వడంలేదు. విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పించిన నివేదికల ప్రకారం ఏటా వ్యవసాయానికి కేవలం 9 వేల మిలియన్ యూనిట్లు కేటాయిస్తోంది. ఇంత మొత్తానికే సబ్సిడీ మంజూరు చేస్తోంది. నిజానికి 16 లక్షల పంపుసెట్లకు రోజుకు ఏడు గంటల విద్యుత్ ఇస్తే ఏడాదికి 16,280 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం మాత్రం కేవలం 9 వేల మిలియన్ యూనిట్లే ఇస్తోంది. దీన్నిబట్టి రోజుకు కేవలం 4 గంటలకు మించి వ్యవసాయ విద్యుత్ ఇవ్వడంలేదని స్పష్టమవుతోంది. అలాగే, దళితుల ఉచిత్ విద్యుత్ కనెక్షన్లను కుదించింది. మొత్తం 14 లక్షల దళిత కుటుంబాలకుగాను 8.5లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను నిలిపివేసింది. ఈ పథకానికి దాదాపు రూ.900 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని పంపిణీ సంస్థలు పట్టుబడితే కేవలం రూ.124 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. మిగులు పేరుతో దోపిడీ రాష్ట్ర విభజన నాటికి ఏపీలో 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉందని, దీన్ని అధిగమించి ఏడాదికి 10 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ సాధించా మని ప్రభుత్వం చెబుతోంది.దీన్ని సాకుగా చూపించి అవసరంలేకున్నా అధికరేట్లకు ప్రైవేటు విద్యుత్ కొను గోళ్లను ప్రోత్సహించింది. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత 1,600 మెగావాట్ల కృష్ణపట్నం, 600 మెగావాట్ల ఆర్టీపీపీ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు.. ఏడాదికి రాష్ట్ర విద్యుత్ వినియోగం 49 వేల మిలియన్ యూనిట్లు దాటడంలేదు. కానీ, పరిశ్రమలు వస్తాయని, డిమాండ్ పెరుగుతుందని ఏడాదికి 65 వేల మిలియన్ యూనిట్లకు లెక్కగట్టింది. దీనికోసం తనకు నచ్చిన, కమీషన్లు ఇచ్చే ప్రైవేటు ప్రాజెక్టుల నుంచి విద్యుత్‌ను అ«త్యధికంగా కొనుగోలు చేసింది. అలాగే, మార్కెట్లో యూనిట్ రూ.2కు లభిస్తున్నా, విద్యుత్ సంస్థలు సగటున యూనిట్ రూ.5పైనే కొనుగోలు చేశాయి. రాష్ట్రానికి అవసరమైన 49 వేల మిలియన్ యూనిట్లలో 38,325 మిలియన్ యూనిట్లను ఏపీ జెన్కో థర్మల్, హైడల్ ద్వారా అందుకునే వీలుంది. ఈ విద్యుత్ సగటున రూ.4 లోపే లభిస్తుంది. కానీ, జెన్కో విద్యుత్‌ను ఏటా సగటున 22వేల మిలియన్ యూనిట్లకే పరిమితం చేసి ప్రతీఏటా 25 వేల మిలియన్ యూనిట్ల మేర ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేశారు. దీనివల్ల ఏటా రూ.12వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. బొగ్గునూ వదల్లేదు.. 2014లో విదేశీ బొగ్గు కాంట్రాక్టులను పొడిగిం చడం, ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు తగ్గినా పాత రేట్లకే కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం వెనుక ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు అందాయనే ఆరోపణలున్నాయి. దాదాపు 3.5 మిలియన్ టన్నుల బొగ్గును అవసరం లేకున్నా ఆర్డర్లు ఇవ్వడంవల్ల రూ.755 కోట్ల మేర అవి నీతి జరిగిందనే విమర్శలొచ్చాయి. ఆ తర్వాత కృష్ణపట్నంకు లక్ష టన్నుల బొగ్గు ఆర్డర్లు ఇవ్వడం, మరికొన్ని ప్లాంట్లకూ విదేశీ బొగ్గు దిగుమతికి జరిగిన గోల్‌మాల్‌లో రూ.400 కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలున్నాయి. ప్రతీ ప్రాజెక్టులోనూ ముడుపులే.. - 2015లో దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు (టాటాకు), నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు (బీజీఆర్) 800 మెగావాట్ల విస్తరణ కాంట్రాక్టుల్లో రూ.2,600 కోట్ల మేర ఎక్కువ అంచనాలు వేసి దోచుకున్నట్టు తీవ్ర ఆరోపణలొచ్చాయి. - తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో మెగావాట్ రూ.5.8 కోట్లకే ఈపీసీ కాంట్రాక్టులు ఇస్తే, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇదే తరహా ప్రాజెక్టులకు ఏకంగా మెగావాట్‌కు రూ.6.2 కోట్ల మేర కట్టబెట్టింది. పైగా ఈ రెండు సంస్థలకే కాంట్రాక్టులు ఇచ్చేందుకు వారికి అనుకూలంగా నిబంధనలు పెట్టడం విమర్శలకు దారి తీసింది. అలాగే.. - అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద ఏర్పాటుచేసిన 500 మెగావాట్ల సోలార్ కాంట్రాక్టు పనుల్లోనూ రూ.500 కోట్ల మేర చేతివాటం బహిర్గతమైంది. ఇక్కడ ఎన్టీపీసీ నిబంధనలకు విరుద్ధంగా మూడు కాంట్రాక్టు సంస్థలకు అధిక రేట్లకు కాంట్రాక్టు ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. - ట్రాన్స్‌కో విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్ల ఏర్పాట్లలో అంతులేని అవినీతి తేటతెల్లమైంది. మంత్రులు, ముఖ్యమంత్రి స్వయంగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. నన్నూరు–జమ్మలమడుగు 400 కేవీ లైన్‌కు సంబంధించి రాయి పడినట్టు టాటా సంస్థ తప్పుడు బిల్లులు పెట్టింది. రూ.10 కోట్ల అవినీతిలో పెద్దల భాగస్వామ్యం ఉందని విజిలెన్స్ విభాగం కూడా నిర్థారించింది. - ప్రైవేటు పవన, సౌర విద్యుత్ కొనుగోళ్లలో అవినీతిపై బాబు ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ లేకున్నా 2 వేల మెగావాట్ల పవన, సౌర విద్యుత్‌ను ఏకంగా 25 ఏళ్లకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం, దీనివల్ల రూ.35వేల కోట్ల నష్టం జరుగుతుందని విద్యుత్ వర్గాలు ఏపీఈఆర్సీ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. మొదట్లో ఈ విద్యుత్ వద్దంటూ అభ్యంతరం చెప్పిన ప్రభుత్వం.. మూడు నెలల్లోనే మళ్ళీ కావాలని ఏపీఈఆర్సీకి తెలపడం విశేషం. సీఎంతో రాయబారం జరిగిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు షాక్ కొడుతున్నాయి. అధికారంలోకి వస్తూనే కరెంట్ చార్జీలు తగ్గిస్తాను. – 2014 ఎన్నికల్లో చంద్రబాబు మాటలు.. ఎన్నికలకు ముందు ఒక్కో ఇంటికీ రెండు నెలలకు రూ.100 కరెంట్ బిల్లు వచ్చేది. ఇప్పుడు నెలనెలా ఒక్కో ఇంటికీ రూ.500 నుంచి రూ.3వేల దాకా బిల్లు వస్తోంది. నేరుగా కొంత.. దొడ్డిదారిన మరికొంత విద్యుత్ చార్జీల బాదుడే బాదుడు. – అధికారంలోకి వచ్చిన తర్వాత.. -
లాబీయింగ్‌లో అవినీతికి పాల్పడలేదు
న్యూఢిల్లీ: పౌర విమానయాన రంగంలో కీలకమైన 5/20 నిబంధన తొలగింపు కోసం చేసిన లాబీయింగ్‌లో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ‘చట్టబద్ధం కాని చెల్లింపులు’ జరపలేదని మలేసియాకి చెందిన ఎయిర్ఏషియా గ్రూప్ స్పష్టం చేసింది. సక్రమమైన మార్గంలోనే అన్ని అనుమతులూ పొందామని పేర్కొంది. అంతర్జాతీయ రూట్ల లైసెన్సు కోసం అధికారులకు లంచాలు ఎరగా వేసి, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారంటూ ఎయిర్ఏషియా ఇండియాతో పాటు గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌పై ఆరోపణలున్న నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆరోపణలపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ‘అన్ని అనుమతులూ సక్రమమైన మార్గంలోనే పొందాం. ఇందుకు ఏడాది పైగా పట్టింది. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే దిశగా.. 5/20 నిబంధనను తొలగించాలని ఏవియేషన్ రంగంలోని ఇతర సంస్థలతో కలిసే లాబీయింగ్ చేశాం. ఇదంతా చట్టబద్ధంగానే జరిగింది. చట్టవిరుద్ధంగా ఎలాంటి చెల్లింపులు జరపలేదు‘ అంటూ ఏఏజీబీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. దేశీ విమానయాన సంస్థలు విదేశీ సర్వీసులు నడపాలంటే కనీసం అయిదేళ్ల పాటు కార్యకలాపాల అనుభవంతో పాటు 20 విమానాలు ఉండాలంటూ 5/20 నిబంధన నిర్దేశిస్తోంది. కొత్త కంపెనీలకు ప్రతిబంధకంగా ఉన్న దీన్ని 2016లో ఎత్తివేశారు. ఎయిర్ఏషియా ఇండియా భారత్‌లో 2014లో కార్యకలాపాలు ప్రారంభించింది. -
నీరు చెట్టు, హౌసింగ్ ఫర్ అల్ పథకాల్లో 30 కోట్ల అవినీతి
-
అవినీతికి పాల్పడుతూ.. ధర్మ పోరాటమా?
సాక్షి, ప్రొద్దుటూరు : రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడుతూ.. ధర్మపోరాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నీరు చెట్టు, హౌసింగ్ ఫర్ అల్ పథకాల్లో చంద్రబాబు 30 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై నిపుణులతో విచారణ చేపట్టి ఆయనపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు, పట్టణాలకు కేంద్రం నిధులు అందజేస్తున్నా.. చంద్రబాబు కేంద్రం గురించి మాట్లాడటం లేదన్నారు. కడప ఉక్కు పరిశ్రమపై టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఆమరణ దీక్ష చేపట్టడం సిగ్గుచేటని సోము వీర్రాజు విమర్శించారు. జిల్లాలో చక్కెర ప్యాక్టరీ, రమేశ్ ఇంటి సమీపంలోని పాలకేంద్రం గురించి ఏ రోజైనా ప్రస్తావించాడా అంటూ విరుచుకుపడ్డారు. రాయలసీమ నికర జలాల గురించి పోరాడితే బాగుంటుందని సూచించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు బీజేపీ బాధ్యతని పేర్కొన్నారు. -
మహిళలకు పగ్గాలిస్తే.. అవినీతి తగ్గుముఖం!
ప్రభుత్వాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగిన కొద్దీ అవినీతి తగ్గుముఖం పడుతుందని అంటున్నారు వర్జీనియా టెక్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. జర్నల్ ఆఫ్ ఎకనమిక్ బిహేవియర్ అండ్ ఆర్గనైజేషన్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. దాదాపు 125 దేశాల నుంచి సేకరించిన వివరాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అంతేకాకుండా.. అన్నిస్థాయుల్లోనూ మహిళల భాగస్వామ్యం ఉండటం అవసరమని ఈ అధ్యయనం చెబుతోంది. యూరప్ స్థానిక సంస్థల్లో మహిళలు ఎక్కువగా ఉన్న చోట్ల లంచం ఇవ్వాల్సిన అవసరం చాలా తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త చందన్ ఝా, సుదుప్తా సారంగి అంటున్నారు.ప్రభుత్వ విధాన నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలు పురుషుల కంటే భిన్నంగా ఆలోచించడం తక్కువ అవినీతికి కారణం కావచ్చునని వీరు అంచనా వేస్తున్నారు. మహిళా నేతలు కుటుంబం, మహిళల సంరక్షణ తదితర అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారని ఇవి కాస్తా ఆర్థిక, సాంస్కృతిక, వ్యవస్థాగతమైన అంశాలపై ప్రభావం చూపడం వల్ల అవినీతి తక్కువవుతుందని అంచనా. అవినీతి విషయంలో మహిళలకు, పురుషులకు ఉన్న వ్యత్యాసంపై ఇప్పటివరకూ తగిన పరిశోధన జరగకపోయినా మహిళలు ఎక్కువగా ఉన్నచోట అవినీతి తక్కువగా ఉంటుందని గత పరిశోధనలూ చెబుతున్నాయని అంటున్నారు వీరు. గుండె సమస్యలకు నిద్రలేమి కారణం! కౌమార వయసులోని పిల్లలు తగినంత సేపు నిద్రపోకపోయినా.. నాణ్యమైన నిద్ర కాకపోతే... భవిష్యత్తులో వారికి గుండెజబ్బులు లేదంటే అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు మాస్జనరల్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్ శాస్త్రవేత్తలు. అంతేకాకుండా ఇలాంటి పిల్లల్లో కొలెస్ట్రాల్ మోతాదు ఎక్కువగా ఉండటమే కాకుండా పొట్ట ప్రాంతంలో కొవ్వు ఎక్కువగా నిల్వ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు. నిద్రకు ఊబకాయానికి సంబంధం ఉందని గతంలోనే కొన్ని పరిశోధనలు స్పష్టం చేయగా ఇతర ఆరోగ్య సమస్యల గురించి తెలిసింది మాత్రం ఇప్పుడే అని శాస్త్రవేత్తలు వివరించారు. 1999 – 2002 మధ్య కాలంలో సేకరించిన కొన్ని వేల మంది పిల్లలను దాదాపు ఇరవై ఏళ్లపాటు పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చినట్లు వివరించారు. పిల్లల సగటు నిద్ర సమయం 441 నిమిషాల నుంచి 7.35 గంటల వరకూ ఉండగా కేవలం 2.2 శాతం మంది అవసరమైన దానికంటే ఎక్కువ సమయం నిద్రపోయినట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. కాంక్రీట్‌కు క్యారెట్, బీట్రూట్ శక్తి వినడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది ఈ వార్త. భవన నిర్మాణానికి మనం వాడే కాంక్రీట్ మరింత దృఢంగా మారేందుకు క్యారెట్లు, బీట్రూట్ బాగా ఉపయోగపడతాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ రెండు కాయగూరల నుంచి సేకరించే నానో ప్లేట్లెట్లు జోడిస్తే కాంక్రీట్ మరింత దృఢంగా మారుతుందని బ్రిటన్‌లోని లాంకస్టర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించారు. క్యారెట్, బీట్రూట్ల నారలోని నానోప్లేట్లెట్లు కాంక్రీట్‌లో సిలికేట్ల మోతాదును పెంచడం ద్వారా దృఢత్వానికి దోహదపడిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మహమ్మద్ షఫీ తెలిపారు. కాంక్రీట్‌ను గట్టి పరిచేందుకు ఈ ఏడాదిలో మొదట్లో కొంతమంది శాస్త్రవేత్తలు గ్రాఫీన్‌ను ఉపయోగించారని.. దీంతో పోలిస్తే తాము అభివృద్ధి చేసిన పద్ధతి చాలా చౌక, పర్యావరణానికి హాని కలిగించనిది కూడా అని షఫీ వివరించారు. స్కాట్లాండ్ కంపెనీ సెల్లూకాంప్ ఈ రెండు కాయగూరలను ప్రాసెస్ చేసిన తరువాత వృథాగా పారబోసే వ్యర్థాల నుంచి నానో ప్లేట్లెట్లను వేరు చేసి అందించిందని వివరించారు. కాంక్రీట్‌కు ఈ ప్లేట్లెట్లను కలిపినప్పుడు దృఢత్వం పెరగడం మాత్రమే కాకుండా ప్రతి ఘనపు మీటర్ కాంక్రీట్ తయారీకి అవసరమయ్యే సిమెంట్ మోతాదు 40 కిలోల వరకూ తగ్గిందని వివరించారు. -
రికార్డు స్థాయిలో నియోజకవర్గంలో అవినీతి
యర్రగొండపాలెం: రాష్ట్రంలో అవినీతి ఎంత ఉందో అంతకు మించి నియోజకవర్గంలో అవినీతి తాండవమాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. స్థానిక రాజీవ్ అతిథి గృహం ఆవరణలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో అవినీతి రాజ్యం ఏలుతోందని, అధికార టీడీపీకి చెందిన నాయకులు ఏమీ మిగల్చడం లేదని, వారు మరుగుదొడ్లను సైతం వదలడం లేదని, జన్మభూమి కమిటీల పేరుతో ఈ దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో టీడీపీ పాలన అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాము ఎంతో అభివృద్ధి సాధించామని ప్రగల్బాలు పలుకుతూ పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లామని, వందల కోట్లు నిధులు తీసుకొని వచ్చి ఎనలేని అభివృద్ధి సాధించామని ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే డేవిడ్‌రాజు నిధులు మంజూరు కాకపోయిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకుంటూ తిరుగుతున్నారని ఆయన అన్నారు. సీఎం కంటే రెండాకులు ఎక్కువే: నియోజకవర్గ ఎమ్మెల్యే డేవిడ్‌రాజు సీఎం కంటే రెండాకులు ఎక్కువగా చదివారని, 11వ పర్యాయం జిల్లాకు వచ్చిన సీఎం నారా చంద్రబాబునాయుడు 2019 మే నాటికి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా జిల్లా ప్రజలకు నీరు అందిస్తామని ప్రకటిస్తే, ఎమ్మెల్యే మాత్రం 2018 నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని అనడం ఎంత వరకు సమంజసమని ఆయన అన్నారు. సీఎం రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతుంటే, ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు మాయమాటలు చెప్తున్నారని ఆయన అన్నారు. ప్రజల్లో వారికి విశ్వసనీయత లేకుండా పోయిందని, ఒక పార్టీపై గెలిచి డబ్బుల సంచుల కోసం మరో పార్టీలోకి వెళ్లిన వారికి విశ్వసనీయత ఎక్కడ నుంచి వస్తుందని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, రూ.35 కోట్లతో సీసీ రోడ్లు అభివృద్ధి పరిచామంటున్నారని ఎక్కడ అభివృద్ధి పరిచారో చూపించాలని ఆయన అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్, 12వ ఆర్థిక సంఘం కింద మంజూరైన నిధులతో నాసిరకం రోడ్లు వేసి డబ్బులు దోచుకున్నారని ఆయన అన్నారు. పెద్దదోర్నాలలో బస్టాండ్ నిర్మాణం, పెద్దారవీడు మండలంలో కేంద్రీయ విద్యాలయం, 11 గ్రామాలకు సాగర్ నీటి పథకం, యర్రగొండపాలెంలో మోడల్ డిగ్రీ కళాశాల తదితర అభివృద్ధి పనులు తామే తీసుకొని వచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. పెద్దదోర్నాల బస్టాండ్ కోసం స్థలసేకరణకు రూ.7.70 లక్షలు తన సొంత నిధులను రోడ్లు, భవనాల శాఖకు చెల్లించి ఆ స్థలాన్ని ఆర్టీసీకి అప్పచెప్పారని, కేంద్రీయ విద్యాలయం ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి అవిరళ కృషి చేసి పెద్దారవీడు మండలంలో ఏర్పాటు చేయించారని, సాగర్ నీటి పథకం, మోడల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు జరిగినప్పుడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైనది ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ఎవరు ఏ మేరకు అభివృద్ధి చేశారో బహిరంగంగా చర్చించుకోవటానికి ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు. లేని డిగ్రీతో రాళ్లపై ఎక్కుతున్నారు: తనకు లేని డిగ్రీతో ఎమ్మెల్యే డేవిడ్‌రాజు శిలాఫలకాలపై పేరుముందు డాక్టర్ అని చెక్కించుకుంటున్నారని ఆయన అన్నారు. ఆయనకు డాక్టరేట్ ఇచ్చిన సంస్థ ఒక బోగస్ సంస్థ అని, అది ఎక్కడుందో ఆయనకు కూడా తెలియదని, రూ.2 లక్షలు ఇచ్చి పీహెచ్డీ డిగ్రీ తెచ్చుకున్నారని ఆయన అన్నారు. ఈ విషయం గురించి కలెక్టర్‌కు ఫిర్యాదు కూడా చేశామని, దీనిపై విచారణ జరిపించాలని తాము కోరామని ఆయన అన్నారు. ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల అధ్యక్షులు దొంతా కిరణ్‌గౌడ్, ఉడుముల శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్.జబీవుల్లా, బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మూడమంచు బాలగురవయ్య, నియోజకవర్గ అధికార ప్రతినిధి నర్రెడ్డి వెంకటరెడ్డి, నవోదయ పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు కందూరి గురుప్రసాద్, నాయకులు బి.వి.సుబ్బారెడ్డి, అరుణాబాయి, రోషిరెడ్డి, దండా శ్రీనివాసరెడ్డి, బాలచెన్నయ్య పాల్గొన్నారు. -
ఇక సీబీఐ చేతికి..
చీపురుపల్లి విజయనగరం : గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్ఈసీఎస్)లో వినియోగదారుల డబ్బు రూ.1.71 కోట్లు పక్కదోవ పట్టిన వ్యవహారం సీబీఐ చేతికి చేరింది. నిధులు గల్లంతైన విషయమై ఇంతవరకు ఆంధ్రాబ్యాంకులో ఉన్నత స్థాయి విజిలెన్స్ విచారణ పూర్తి చేసుకున్న అనంతరం కేసు సీబీకి అప్పగించారు. స్థానిక ఆంధ్రాబ్యాంకులో 2015 జూలై నుంచి 2017 జూలై వరకు క్యాషియర్‌గా పని చేసిన వి.సంతోషిరాము ఆ నిధుల గల్లంతుకు ప్రధాన కారకుడిగా గుర్తించి సీబీఐ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. దీంతో సీబీఐ అధికారులు సంతోషిరాము నివాసం, ఆర్ఈసీఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చి విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం పర్లాకిమిడిలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న సంతోషిరాము నివాసంలో పలు పత్రాలను సీబీఐ అధికారులు సీజ్ చేసినట్లు తెలిసింది. అలాగే ఆర్ఈసీఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చి పలు ఓచర్లు తీసుకెళ్లారు. ఆర్ఈసీఎస్ పరిధిలో గల చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల్లో వినియోగదారులు నుంచి విద్యుత్ బిల్లుల రూపంలో వసూలు చేసి ఆ డబ్బును ప్రతిరోజూ ఆంధ్రాబ్యాంకులో ఉన్న ఆర్ఈసీఎస్ ఖాతాలో జమ చేస్తుంటారు. అలా జమ చేసిన డబ్బులో 133 ఓచర్లకు సంబంధించిన రూ.1.71 కోట్లు డబ్బు ఆంధ్రాబ్యాంకులో ఉన్న క్యాషియర్ సంతోషి రాము జమ చేయకుండా పక్కదారి పట్టించాడు. 2017 ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలో జరిగిన నిధుల గల్లంతు విషయాన్ని ఆర్ఈసీఎస్ అధికారులు అత్యంత ఆలస్యంగా 2018 మార్చిలో గుర్తించారు. దీంతో ఆర్ఈసీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు ఆంద్రాబ్యాంక్ అధికారులు విచారణ చేపట్టి డబ్బులు గల్లంతైన విషయాన్ని రెండు నెలలు తరువాత గుర్తించి సీబీఐకి కేసు అప్పగించారు. ఆర్ఈసీఎస్ అధికారులను విచారించనున్న సీబీఐ.... వినియోగదారుల నుంచి వసూలు చేసే డబ్బు ప్రతిరోజూ బ్యాంకుకు జమ చేసిన వ్యవహారానికి సంబంధించి ఆర్ఈసీఎస్ ఉద్యోగులను సీబీఐ విచారించనున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే నలుగురు ఆర్ఈసీఎస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే సీబీఐ అధికారులు పట్టణానికి వచ్చి విచారణ చేపట్టడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అధికారులు వచ్చారు.... సీబీఐ అధికారులు ఆర్ఈసీఎస్కు వచ్చారు. తమ సిబ్బంది ఆంధ్రాబ్యాంకులో జమ చేసిన డబ్బుకు సంబంధించిన ఓచర్లు అడిగారు. ఆంధ్రాబ్యాంకు ఉద్యోగి నివాసానికి కూడా వెళ్లినట్లు తెలిసింది. తమకు తెలిసిన పూర్తి సమాచారం ఇచ్చాం. – పి.రమేష్, ఎండీ, ఆర్ఈసీఎస్ -
దాహార్తి..కక్కుర్తి
ఐటీడీఏ ఆధ్వర్యంలో చెంచుగూడెంలో నీటి సౌకర్యం కోసం చేసిన పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఏసీబీ రంగంలోకి దిగింది. లోతు తక్కువ బోర్లకు ఎక్కువ వేసినట్లు నమోదు చేయడం, టెండర్ సూచనలకు విరుద్ధంగా ఇతర కంపెనీల మోటార్లు వినియోగించడం, నాసిరకం పనులతో నిధుల స్వాహాకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీకి చెందిన ఎస్టీ సెల్ నాయకుని ఫిర్యాదుతోనే ఏసీబీ విచారణ కోసం సమాచారం సేకరించనుంది. మాచర్ల టౌన్: గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పరిధిలోని చెంచుగూడెంలలో చెంచుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం రూ.11.12 కోట్లు మంజూరు చేసింది. గుంటూరు జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో 43 చెంచుగూడెంలలోని 5,764 మంది చెంచులకు, ప్రకాశం జిల్లాలోని ఏడు మండలాల పరిధిలోని 71 గూడెంలలోని 11,084 మందికి, కర్నూలు జిల్లాలోని 14 మండలాల పరిధిలోని 17 గూడెంలలోని 3,717 మంది చెంచుల కోసం నిధుల కేటాయించారు. మూడు జిల్లాల పరిధిలోని 131 గూడెంలకు చెందిన 20,565 మంది చెంచుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు నిధులు కావాలని శ్రీశైలం ఐటీడీఏ అధికారులు తీర్మానం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.11.20 కోట్లు ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో బోర్లు వేసి, మోటార్లు బిగించి, ట్యాంక్‌లు నిర్మించి పైప్‌లైన్ పనులు చేయాలని ఇంజినీరింగ్ శాఖ ఐటీడీఏకు ప్రతిపాదనలు పంపింది. ప్రతిపాదనలకు విరుద్ధంగా పనులు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జియాలజిస్టుల వద్ద కొన్ని చోట్ల వెయ్యి అడుగుల లోతుకు బోర్లు వేయాలని నివేదికలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నివేదికలకు అనుగుణంగా వెయ్యి అడుగులకు బదులు కొన్ని చోట్ల 240, మరికొన్ని చోట్ల 500 అడుగుల వరకు బోర్లు వేసి వెయ్యి అడుగులకు బిల్లులు రాసుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఒక్కొక్క బోరు విషయంలో రూ.60వేలు వ్యత్యాసముంది. గుంటూరు జిల్లాలో 43 బోర్లకు తక్కువ లోతు బోర్లు వేయడం వలన రూ.25.80 లక్షలు ప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యే అవకాశముంది. అంచనాలలో సూచించిన టెక్స్మో కంపెనీ మోటారుకు బదులుగా అంబూజా మోటార్లను వేశారు. ఇనుప పైప్‌లైన్‌కు బదులుగా లబ్బర్ పైప్‌లైన్ వేశారు. నీటి ట్యాంకులను కొన్ని చోట్ల కొలతలకు విరుద్ధంగా, మరికొన్ని చోట్ల నాసిరకంగా వేసినట్లు సమాచారం. జియాలజిస్టు నివేదిక లేకుండానే.. కొన్ని చోట్ల జియాలజిస్టు నివేదిక ఇవ్వకుండా బోర్లు పాయింట్ పెట్టని చోట్ల బోర్లు వేశారు. బొల్లాపల్లి, రేమిడిచర్ల, దుర్గి మండలంలోని నిదానంపాడు, వెల్దుర్తి మండలంలోని మండాది వంటి గ్రామాల్లో 500 అడుగుల వరకు బోర్లు వేసినా నీరు రావటం లేదు. వెయ్యి అడుగులకు బదులుగా తగ్గించి వేసిన బోర్లలో అనేక చోట్ల బోర్లు బావులు నీరు రాక నిరుపయోగంగా ఉన్నాయి. ఈ అక్రమాలపై వీటీడీఏ ఉపాధ్యక్షుడు, టీడీపీ ఎస్టీసెల్ నియోజకవర్గ అధ్యక్షుడు మండ్లి గురవయ్య పలు శాఖల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐటీడీఏ పీఓ, ఈఈ, డీఈ, ఏఈ, గుంటూరు జిల్లా కలెక్టర్, ఇటీవల గుడిపాడు చెరువుకు విచ్చేసిన జిల్లా జేసీ, ఏసీబీ అధికారులకు అక్రమాలపై ఫిర్యాదు చేశారు. దీనికి అవినీతి నిరోధకశాఖ అధికారులు స్పందించారు. సోమవారం గురవయ్యను గుంటూరుకు పిలిపించి అక్రమాల వివరాల అడిగి తెలుసుకున్నారు. దీనిపై విచారణకు ఏసీబీ అధికారులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై గురవయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏసీబీ అధికారులతో చర్చించిన విషయం వాస్తవమేనన్నారు. ఏసీబీ వారు విచారణ కోసం మరికొంత సమాచారం కావాలన్నారని చెప్పారు. సమాచార హక్కు చట్టం కింద ఇప్పటికే అర్జీ పెట్టానని, ఆ సమాచారం అందిన వెంటనే ఏసీబీ వారికి అందజేసి విచారణకు సహకరిస్తానని వివరించారు. -
సాక్షిగా నేను నిలబడతా
విజయనగరం మున్సిపాలిటీ : సాక్షిగా నేను నిలబడతా, కౌన్సిల్‌కు దమ్ముంటే ఇప్పటి వరకు నేను ఇచ్చిన డిసెంట్ నోట్లపై విచారణ జరిపించండి. పాలకవర్గం, అధికార యంత్రాంగం చేస్తున్న అవినీతి నిజాలు నిగ్గు తేలుతాయని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన సీనియర్ కౌన్సిలర్ ఎస్వీవీ రాజేష్ సవాల్ విసిరారు. గురువారం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశం వాడీవేడీగా సాగింది. అజెండాలోని 23 అంశం చర్చకు వచ్చిన సమయంలో గ్రాడ్యుయేటెడ్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్స్ను 12 నెలల కాలపరిమితికి నియమించుకోవడంపై రాజేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ చైర్మన్‌కు ఆ అంశాన్ని వ్యతిరేకిస్తూ డీసెంట్ నోట్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ మొత్తం 12 మంది ఇన్స్పెక్టర్ల నియామకాల్లో అవతవకలు చోటు చేసుకున్నాయని, డబ్బులు తీసుకుని నియామకాలు చెపట్టారని ఆరోపించారు. వారిని పంపిణీ చేసే విశాఖకు చెందిన సినెర్జీ ఎంటర్ప్రైజెస్ సంస్థ స్వయానా మున్సిపల్ ఇంజినీర్ రాజేంద్రకృష్ణ బినామీ సంస్థగా పేర్కొన్నారు. ఈ నియామకాల ద్వారా అవకతవకలు చోటు చేసుకోవడంతో పాటు భవిష్యత్‌లో భారీ అవినీతి చోటు చేసుకునే అవకాశం ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. నకమహాలక్ష్మి ఇన్చార్జి కమిషనర్‌గా ఉన్న సమయంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టణంలో అభివృద్ధి స్తంభించటానికి బినామీలే కారణమంటూ తూర్పరబట్టారు. ప్రతిపక్షం డిసెంట్ నోట్ ఇవ్వడంపై స్పందించిన అధికార పార్టీ కౌన్సిలర్లు కేవలం అధికారులను బెదిరించేందుకు ఇలాంటి నోట్ ఇస్తున్నారని మాటల దాడికి దిగడంతో స్పందించిన ప్రతిపక్ష కౌన్సిలర్ ధీటుగా సమాధానమిచ్చారు. తాను ఇప్పటి వరకు ఇచ్చిన డీసెంట్ నోట్లపై విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. ఇంజినీరింగ్ అధికారులపై విరుచుకుపడ్డ కౌన్సిల్.. మున్సిపాలిటీని ప్రగతి పథంలో నడిపించాల్సిన ఇంజినీరింగ్ అధికారుల తీరుపై గురువారం మున్సిపల్ కౌన్సిల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నెలల తరబడి వీధి దీపాలు వెలగకున్నా కుంటి సాకులతో నెట్టుకురావడంపై 21వ వార్డు కౌన్సిలర్ గేదెల ఆదినారాయణ ఆగ్రహంతో ఊగిపోయారు. రూ.200లకే మంచి నీటి కుళాయిల మంజూరుపై మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మండిపడ్డారు. ఈ సమయంలో మున్సిపల్ ఇంజినీర్ రాజేంద్రకృష్ణ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా, చైర్మన్ అవసరం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ అధికారుల తీరుతో కౌన్సిలర్లు తలదించుకోవాల్సి వస్తోంది. లొసుగులు లేకుంటే టెండర్లను కౌన్సిల్‌కు చూపడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఏసీ సంతకాలు చేసిన టెండర్లను కౌన్సిల్లో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. అసలు మున్సిపాలిటీలో ఏపీఎండీపీ స్కీం, అమృత్ స్కీంల అమలుపై అవగాహన ఉందా అంటూ ప్రశ్నించారు. ఇంజినీరింగ్ అధికారుల నిర్వాకంతో అభివృద్ధి పనుల్లో జాప్యం చోటు చేసుకుంటుందని, నిధులు వినియోగంలో నిర్లక్ష్యం వహించడంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మంజూరైన కోట్లాది నిధులు వెనక్కి మళ్లిపోయే పరిస్థితి దాపురించిందని ఇలా అయితే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఎప్పటికి జరుగుతుందని 1వ వార్డు కౌన్సిలర్ సోము స్రవంతి ప్రశ్నించారు. స్వయానా జిల్లా కలెక్టర్ వార్డుల్లో పర్యటించడం చూస్తుంటే కౌన్సిల్ పనితనం ఏంటో ప్రజలకు సందేశం వెళ్లిపోయిందని, మున్సిపాలిటీలో అధికారులు పని చేస్తున్నారా అంటూ 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామారావు నిలదీశారు. సమావేశంలో లైటింగ్ సమస్యపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ టి.వేణుగోపాలరావు మాట్లాడుతూ రానున్న రెండు మూడు రోజుల్లో శతశాతం వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్, అసిస్టెంట్ కమిషనర్ కె.కనకమహాలక్ష్మి, ఇతర కౌన్సిల్ సభ్యులు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
అడిగింది ఇవ్వకుంటే కూల్చేస్తాం !
విజయవాడలో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి వెరిఫికేషన్‌కు వెళ్లే అధికారులు అనుమతుల పేరుతో అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంలో అంతులేని అవినీతి చోటుచేసుకుంటుందని ఫిర్యాదులు వస్తున్నా.. సాక్షాత్తు వీఎంసీ ఇతర విభాగాల సిబ్బంది చెబుతున్నా, అధికారులలో ఎలాంటి మార్పురాకపోగా మరింతగా విజృంభిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పటమట: ఆ విభాగంలో అంతా పకడ్బందీగా జరుగుతుంది. ఇల్లుకట్టాలనుకున్న సామాన్యుల కలను అధికారులు వెరిఫికేషన్ పేరుతో కల్లగా మారుస్తున్నారని, భవన నిర్మాణానికి అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు పొందినప్పటికీ కొంతమంది టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు ఓఉన్నతాధికారి సహకారంతో అందినకాడికి దండుకుంటూ వెరిఫికేషన్‌లో అనుకూల/ప్రతికూల రిపోర్టులు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తమను సంతృప్తి పరచకపోతే అన్ని రకాల అనుమతులు ఉన్నా అప్పోసొప్పో చేసి కట్టుకుంటున్న నిర్మాణాలను కూల్చివేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అనుమతులకు విరుద్దంగా ఎలాంటి నిర్మాణాలు జరిగినా అధికారులకు లంచాలు ముట్టచెబితే చూసీచూడనట్లు వ్యవహరిస్తారని ఆరోపణలు. అడ్డగోలు దోపిడీ.. చుట్టుగుంట వద్ద ఏలూరు రోడ్డు వెంబడి జరుగుతున్న ఓ ఇంటి నిర్మాణ అనుమతులకు సంబంధించి పోస్ట్ వేరిఫికేషన్‌కు వెళ్లిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ తాను రిపోర్టు చేస్తేనే అనుమతి వస్తుందని, అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలంటే రూ. 3 లక్షలు ఇచ్చుకోవాల్సిందేనని పట్టుపట్టడంతో వెలగపూడిలోని సెక్రటేరియట్‌లోని ఓ సీనియర్ ఉద్యోగి రాయభారంతో రూ.1.25 లక్షలకు బేరం కుదిరింది. సకాలంలో భవన యజమాని సొమ్ములు చెల్లించకపోవటంతో గత వారం డీవియేషన్స్ జరుగుతున్న ప్రాంతాన్ని కూల్చేయటానికి వెళ్లగా అప్పటికప్పుడు రూ. 75వేలు చెల్లిస్తేగానీ కూల్చకుండా వదిలేశారని సమాచారం. రామలింగేశ్వరనగర్‌లోని ఎస్టీపీ ప్లాంట్‌కు సమీపంలో ఓ భవన నిర్మాణానికి సంబంధించి పోస్ట్ వెరిఫికేషన్‌కు వెళ్లిన అధికారులను మెప్పించకపోవటంతో నిర్మాణ అనుమతికి సంబందించి కొర్రిపెట్టి ఇంటి నిర్మాణాన్ని నిలుపుదల చేశారు. వెరిఫికేషన్‌కు వెళ్లిన అధికారుల బృందం రూ. 2 లక్షలు డిమాండ్ చేయగా తానెందుకు చెల్లించాలని భవన యజమాని ప్రశ్నించటంతో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతుందని, ఇలా నిర్మా ణం చేపడితే కూల్చేస్తామని, తమకు ‘సహకరిం చకపోతే’ కూల్చేస్తామని అధికారులే బెది రింపులకు దిగుతున్నారని బా«ధితుడు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నగరంలోని అన్ని ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నా వీఎంసీ ఉన్నతాధికారి దృష్టిసారింకచకపోవటంపై పలు అనుమానాలకు తావిస్తోంది. వీఎంసీ ఆదాయానికి గండి.. నగర పాలక సంస్థ పరిధిలో భవనాలకు ఇంటి పన్న వేసే సమయంలో ప్లింత్ ఏరియా, నిర్మాణం స్వభావం, ఉపయోగవిధానం(రెసిడెన్షియల్/కమర్షియల్/ఇతర), పరిశీలించి అధికారులు పన్ను లు విధించాల్సి ఉండగా ఆయా నిర్మాణాల వద్దకు పోస్ట్ వెరిఫికేషన్ సర్వేకు వెళ్తున్న అధికారులు కొలతల్లో, కేటగిరీల్లో మాయాజాలం చేస్తున్నారు. కొంతమంది వాణిజ్యప్రాంతాల్లో భవనాలు నిర్మిం చి కేవలం నివాస ప్రాంతాలుగానే పన్ను చెల్లింపులు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. భవన నిర్మాణ యజమానుల నుంచి అధికారులు ప్రత్యేకంగా పన్నులు తగ్గించేలా ‘రహస్య’ ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీనివల్ల నగర పాలక సంస్థకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతుంది. వన్‌టౌన్‌లోని అత్యంత రద్దీగా ఉండే ప్రదేశంలో జరుగుతున్న ఓ భవన నిర్మాణం పోస్ట్ వెరిఫికేషన్‌కు వెళ్లిన పట్టణ ప్రణాళిక అధికారులు చెప్పిన విషయాలు విన్న ఆ భవన నిర్మాణ యజమానికి అధికారుల డిమాండ్ విని దిమ్మతిరిగిపోయింది. 150 గజాల స్థలంలో ఆన్లైన్లో అనుమతి పొంది జీప్లస్–2 నిర్మాణం చేసుకుంటుండగా, ప్లాన్‌లో చూపిన విధంగా మెట్లు సక్రమంగా లేవని, పోర్టికో నాలుగు అడుగులు ముందుకు వచ్చిందని డీవియేషన్స్ ఉన్న ప్రాంతాన్ని కూల్చేస్తామని, ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణం జరుగుతుందని ఓ అధికారి రూ.5లక్షలు డిమాండ్ చేశారు. స్థానిక కార్పొరేటర్ సహాయంతో ఎమ్మెల్సీని కలిస్తే చివరికి రూ.1.5 లక్షలకు సెటిల్మెంట్ జరిగినట్లు సమాచారం. -
నిప్పు నాయుడికి ఆ హక్కు లేదు : విజయసాయి రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తనకు నోటీసులు పంపించందంటూ వస్తున్న మీడియా కథనాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వీ విజయసాయి రెడ్డి బుధవారం స్పందించారు. తనకు టీటీడీ నుంచి ఇంతవరకూ ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. తనకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదని, అందులో ఏం ఉందో తెలియదని పేర్కొన్నారు. 4 సంవత్సరాలు టీడీడీ బోర్డులో సభ్యుడిగా తాను పని చేసిన విషయాన్ని ఈ సందర్భంగా విజయసాయి గుర్తు చేశారు. తనకు తెలిసినంత వరకూ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ చట్టం కిందకు టీటీడీ వస్తుందని అందులో ఒక స్పెషల్ చాప్టర్ ప్రకారం టీటీడీకి నోటీసులు ఇచ్చే అధికారం లేదని అన్నారు. ఒకవేళ ఇస్తే అవి నోటీసులుగా పరిగణలోకి తీసుకోలేమని తేల్చిచెప్పారు. కావాల్సిన సమాచారం కోసం వ్యక్తిని అభ్యర్థించగల హక్కు మాత్రమే టీటీడీకి ఉంటుందని తెలిపారు. ‘టీటీడీ సొమ్మును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దోపిడీ చేశాడు. దోచుకున్నాడు. తవ్వుకొనిపోయాడు. ఆయన కొడుకు ఈ సొమ్మును విదేశాలకు తరలించాడు. ఇదే నా ప్రధాన ఆరోపణ. నా ఆరోపణకు సోర్స్ ఏదని ప్రశ్నించే అధికారం మీకు లేదు. ఎప్పుడూ నిప్పు అని చెప్పుకునే నిప్పు నాయుడు, పప్పు నాయుడిలపై సీబీఐ విచారణ జరగాలి. విచారణలో మీరు నిర్ధోషులని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటా. సీఎం, మంత్రి హోదాల్లో ఉన్న మీరు, మీ తనయుడు స్వయంగా సీబీఐ విచారణకు సిద్ధపడాలి. అధికారంలో ఉన్నామని మీరు చేసే తాటాకు చప్పుళ్లుకు మేం భయపడం. ఆరోపణలపై స్పందించాలని 13 గంటలు గడువు ఇస్తే 240 గంటల తర్వాత టీటీడీ ద్వారా స్పందిస్తారా?. అంతా చక్కదిద్దుకుని టీటీడీ నుంచి నోటీసులు ఇప్పిస్తారా?. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మీ అవినీతి లెక్కలను వైఎస్సార్ సీపీ తేల్చుతుంది. నేను చెప్పినప్పుడే హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంట్లో సీబీఐ సోదాలు జరిగివుంటే నేల మాళిగల్లో దాచిన అవినీతి సొమ్ము బయటపడేది. మీ నాలుగేళ్ల అవినీతి పాలనను ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారే తగిన బుద్ధి చెబుతారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, ఎలాంటి తప్పు చేయకుంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలి. సెక్షన్ 160 ప్రకారం నోటీసులు పంపితే చట్టబద్దంగా సమాధానం ఇస్తాను. నాకు నోటీసులు ఇచ్చే హక్కు నిప్పు నాయుడు, పప్పు నాయుడు, టీటీడీలకు లేవు. ఈవీఎం టాంపరింగ్ పై ఈరోజు కాదు ఏప్పటినుంచో అన్ని పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అధికారం అనుభవించి ఇవాళ మాట్లాడటం చంద్రబాబు భయానికి నిదర్శనం.’ అని విజయసాయి సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. విజయసాయి విచారణకు డిమాండ్ చేసిన 14 అంశాలు : 1. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తం పట్నం ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలు 2. ప్రకటనకు ముందే రాజధాని భూములను బినామీలతో కొనిపించటం 3. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల్లో అవినీతి 4. అమరావతి భూ కుంభకోణం 5. బాబు విదేశీ పర్యటనలు, బాబు కుమారుడి విదేశీ పర్యటనలు, బాబు కుటుంబం విదేశీ పర్యటనలు 6. కాల్ మనీ సెక్స్ రాకెట్ 7. ఓటుకు కోట్లు కేసు 8. ఐఎంజీ భారత్ స్కాం 9. అగ్రిగోల్డ్ స్కాం 10. బాబు కుటుంబ ఆస్తులు, హెరిటేజ్ ఆస్తులు, లోకేశ్ బాబు సంపాదన 11. తిరుమలలో అరాచకాలు 12. సింగపూర్ కంపెనీలకు రాజధాని భూముల అప్పగింత 13. నీరు చెట్టు పథకంలో అవినీతి 14. భూ సేకరణలో అరాచకాలు -
ప్రజలే టోపీ వేశారు : సిద్ధు
మైసూరు: తమ ఐదేళ్ల పాలనలో విధానసౌధలో అవినీతి కనిపించలేదని, ఒకవేళ అక్కడ అవినీతి జరుగుతున్నట్లు అనిపిస్తే అవినీతిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సీఎం కుమారస్వామికి సీఎల్పీ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య సూచించారు. మంగళవారం మైసూరు కువెంపు నగర్లో వరుణ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సిద్ధరామయ్య మాట్లాడారు. విధానసౌధలో తాండవిస్తున్న అవినీతిని అరికట్టడానికి తమకు కొంత వ్యవధి కావాలంటూ సీఎం కుమారస్వామి సోమవారం చేసిన వాఖ్యలపై పైవిధంగా స్పందించారు. ఐదేళ్ల పాలనలో విధానసౌధలో తమకు కనిపించని అవినీతి సీఎం కుమారస్వామికి కనిపిస్తుంటే, మీ హయాంలో దానిని నిర్మూలించాలంటూ సూచించారు. ముఖ్యమంత్రి పదవిపై తమకు ఆసక్తి లేదని కాంగ్రెస్ నేతలే బలవంతంగా తమకు ముఖ్యమంత్రి పదవి అప్పగించారంటూ కుమారస్వామి చేసిన వాఖ్యలపై స్పందించడానికి నిరాకరించారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కకపోవడంతో నేతల్లో చెలరేగిన అసంతృప్తి ప్రస్తుతం సమసిపోయిందని చెప్పారు. షాకింగ్‌గా అనిపించలేదు రాజకీయంగా మొదటి జీవితాన్ని,పునర్జీవితాన్ని అందించిన చాముండేశ్వరి నియోజకవర్గ ఫలితాలు మీడియాకు షాకింగ్ అనిపించి ఉండొచ్చేమో కానీ తమకు మాత్రం అలా అనిపించలేదంటూ సిద్ధరామయ్య తెలిపారు. బాదామిలో విజయం సాధించినా రాజకీయంగా, వ్యక్తిగతంగా విడదీయరాని అనుబంధం కలిగిన చాముండేశ్వరిలో ఓడిపోవడం ఒకింత బాధ కలిగించిందన్నారు. ఇవే తమకు చివరి ఎన్నికలని వచ్చే విధానసభ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పోటీ చేయడం లేదంటూ స్పష్టం చేశారు. పార్టీ వ్యవహారాల్లో మాత్రం పాల్గొంటానని తెలిపారు. ప్రజలే టోపీ వేశారు ఈ సందర్భంగా తమను మైసూరు పేటెతో సన్మానించడానికి ఓ కార్యకర్త ప్రయత్నించగా చాముండేశ్వరి ఎన్నికల్లో ప్రజలే ఓడించి పెద్దటోపీ వేసి సన్మానించారని మరోసారి టోపీ వేయించుకోవడం ఇష్టం లేదంటూ ఎన్నికల్లో తమ ఓటమితో చమత్కరించారు. తనకు మరోసారి టోపీ వేయవద్దనడంతో కార్యక్రమంలో నవ్వులు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా మంత్రి పుట్టరంగశెట్టికి– సిద్ధుకి మధ్య చతురోక్తులు నడిచాయి. -
పాలమూరు ప్రాజెక్టులో రూ.1000 కోట్ల అవినీతి
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకుంటోందని పదేపదే అనడం సరైంది కాదని అన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఓపెన్‌కట్ పంప్‌హౌస్‌ను నిర్మించే అవకాశం ఉన్నా అండర్ గ్రౌండ్ పంప్‌హౌస్ ఎందుకు నిర్మిస్తున్నారో సాగునీటి మంత్రి హరీశ్ రావు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల నుంచి భూమిని సేకరించాలన్నదే తమ డిమాండ్ అని అన్నారు. హరీశ్‌రావు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై ఆరోపణలు చేయడం మానుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
పోలవరం..గరం గరం
-
పోలవరం పనుల్లో మరో అవినీతి పర్వం
-
బాబు పాలనలోఅవినీతిపై బీజేపీ న్యాయ పోరాటం
-
పోలవరంలో.. మరో అవినీతి రత్నం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో అవినీతి పర్వమిది. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్(జలాశయం పనులు)లో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్(ఈసీఆర్ఎఫ్– రాతి, మట్టికట్ట) మిగిలిన పనుల పూర్తికి 809.53 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా అంచనా వ్యయాన్ని రాష్ట్రప్రభుత్వం అమాంతం మూడింతలు.. అంటే రూ.2,400 కోట్లకుపైగా పెంచింది. అంతేగాక ఈ పనులను లంప్సమ్(ఎల్ఎస్)–ఓపెన్ విధానంలో రత్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనే సంస్థకు నామినేషన్ పద్ధతిపై కట్టబెట్టింది. కేవలం సీఎం చంద్రబాబునాయుడు నోటిమాటపైనే ఈ పనుల్ని కట్టబెట్టేయడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) అనుమతి తీసుకోలేదు.. సరికదా కనీసం రాష్ట్ర జలవనరులు, ఆర్థిక శాఖ ఆమోదం కూడా లేకుండానే ఆ సంస్థకు పనులు అప్పగించడం గమనార్హం. 2015–16 ధరల ప్రకారం ఈసీఆర్ఎఫ్ పనుల విలువ రూ.1,417.73 కోట్లు కాగా, ఇందులో ఇప్పటివరకు 608.2 కోట్లు ఖర్చు చేశారు. ఆ మేరకు మరో రూ.809.53 కోట్లు మాత్రమే వ్యయం చేయాల్సి ఉండగా.. ఇప్పుడీ పనుల అంచనా వ్యయాన్ని రూ.2,400 కోట్లకుపైగా పెంచేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు, మంత్రి దేవినేని ఉమాకు భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పనులను రత్నాకు అప్పగించేందుకే సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళుతున్నారు.ఆ సంస్థ పనులు ప్రారంభించాక బిల్లులు చెల్లించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అక్రమంగా నామినేషన్ పద్ధతిపై అప్పగించడాన్ని కేబినెట్లో ఆమోదముద్ర వేయించి సక్రమం చేసుకునేలా వ్యూహం రచించారు. ముడుపుల బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడం.. ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తి చేయడంలో సర్కారు వైఫల్యంపై ప్రజలను ఏమార్చడానికి ఈసీఆర్ఎఫ్ పునాది గోడ(డయా ఫ్రమ్ వాల్) పూర్తవడంతోనే ప్రాజెక్టు పూర్తయినట్లుగా చిత్రీకరించడానికిగాను భారీ ఎత్తున పైలాన్ ఆవిష్కరించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవడంపై అధికారవర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. ఈసీఆర్ఎఫ్ పనులు రత్నాకు అప్పగించడంతో హెడ్ వర్క్స్‌లో పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టినట్లయింది. ప్రధాన కాంట్రాక్టర్ అయిన టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ ‘కమీషన్ ఏజెంట్’ పాత్రకు పరిమితం కానుంది. పునాది పనుల్లోనే భారీగా ముడుపులు.. పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసేది ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌లోనే. జలాశయంలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి అంటే 194.6 టీఎంసీలకు చేరాక.. వరద నీటిని స్పిల్ వే ద్వారా నదిలోకి మళ్లిస్తారు. ఈసీఆర్‌ఎఫ్‌ను 2,454 మీటర్ల పొడవున మూడు భాగాలుగా(564 మీటర్ల పొడవున గ్యాప్–1, 1750 మీటర్ల పొడవున గ్యాప్–2, 140 మీటర్ల పొడవున గ్యాప్–3) నిర్మించేందుకు గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించడానికి ఎగువన 2,050 మీటర్ల పొడవుతో ఒక కాఫర్ డ్యామ్(మట్టికట్ట), దిగువన 1,417 మీటర్ల పొడవున మరో కాఫర్ డ్యామ్ నిర్మించాలి. 2015–16 ధరల ప్రకారం ఈ పనుల విలువ రూ.1,417.73 కోట్లు. ఈసీఆర్ఎఫ్ పునాది గోడ నిర్మాణ పనులకోసం ఇప్పటికే రూ.462.2 కోట్లు ఖర్చు చేశారు. కాఫర్ డ్యామ్‌ల నిర్మాణానికి పునాది(జెట్ గ్రౌటింగ్) పనులకు రూ.146 కోట్లకుపైగా బిల్లులు చెల్లించారు. అంటే కేవలం పునాది పనులకోసమే 608.2 కోట్ల వ్యయమైంది. ఈసీఆర్ఎఫ్ పునాది గోడ పనుల బిల్లులు ఎల్ అండ్ టీ–బావర్, కాఫర్ డ్యామ్ పనుల బిల్లులు కెల్లర్ సంస్థకు చెల్లించడం ద్వారా ముఖ్యనేత భారీగా కమీషన్లు రాబట్టుకున్నారు. ఈ లెక్కన ఈసీఆర్ఎఫ్, కాఫర్ డ్యామ్ పనుల వ్యయం రూ.809.53 కోట్లే. కానీ ఈ పనుల అంచనా వ్యయాన్ని అంతకు మూడింతలు.. అంటే రూ.2,400 కోట్లకుపైగా పెంచేయడానికి రంగం సిద్ధం చేశారు. ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ పోయి.. ఈసీఆర్ఎఫ్ పనులను తొలుత ఎల్ అండ్ టీ సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కానీ కమీషన్లపై బేరం కుదరకపోవడంతో షాపూర్జీ పల్లోంజీని ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ తెరపైకి తెచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈలోగా మంత్రి దేవినేని ఉమా జోక్యం చేసుకుని తన మిత్రుడు ఎం.ఎం.ఎల్.నరసింహంకు చెందిన రత్నా ఇన్ఫ్రాస్టక్చర్ ప్రాజెక్ట్స్‌కు అప్పగించాలని ప్రతిపాదించారు. కమీషన్ల లెక్క తేలడంతో అదే సంస్థకు పనులు అప్పగించాలని జలవనరులశాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే కేంద్రం జారీ చేసిన పీపీఏ గెజిట్ నోటిఫికేషన్లో సెక్షన్9(1) ప్రకారం.. పీపీఏ అనుమతి లేకుండా కొత్త కాంట్రాక్టర్‌కు నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించకూడదని జలవనరులశాఖ అధికారులు తేల్చిచెప్పారు. దాంతో అధికారులపై మండిపడిన సీఎం.. నోటిమాటపై రత్నాకు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు అప్పగించేశారు. లంప్సమ్(ఎల్ఎస్)–ఓపెన్ విధానంలో నామినేషన్‌పై పనులప్పగించడం వల్ల.. నిర్దేశించిన పనులకంటే ఎక్కువగా చేసినట్లు చూపితే ఆ మేరకు అదనంగా బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని జలవనరులశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా సూచనల మేరకు ఆదివారం ఈసీఆర్ఎఫ్ పనుల వ్యవహారంలో ట్రాన్స్ట్రాయ్ వద్ద ఉన్న యంత్రాలను రత్నా సంస్థ స్వాధీనం చేసుకున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘన పోలవరం హెడ్‌వర్క్స్‌లో స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనుల్లో రూ.1,196 కోట్ల విలువైన పనులను 60సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్ నుంచి తొలగించిన ప్రభుత్వం, వాటి అంచనా వ్యయాన్ని రూ.1,483 కోట్లకు పెంచేసి.. గతేడాది నవంబర్ 27న జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌ను కేంద్రం తప్పుబట్టింది. దాంతో ఈ వివాదం నుంచి గట్టెక్కేందుకు పాత ధరకే నవయుగ సంస్థ ఆ పనులు చేయడానికి ముందుకొచ్చిందని సీఎం ప్రకటించారు. టెండర్ల వివాదం నేపథ్యంలో గత జనవరి 11న విజయవాడలో పీపీఏ సర్వసభ్య సమావేశం జరిగింది. పోలవరం పనుల్లో కాంట్రాక్టర్‌ను తొలగించాలన్నా.. కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలన్నా తమ అనుమతి తీసుకోవాలన్న నిబంధనలను పీపీఏ సీఈవో సౌమిత్రి హల్దార్ గుర్తుచేశారు. ఖజానాపై భారం పడదని.. ఒకవేళ అదనపు భారం పడితే రాష్ట్రప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇవ్వడంతో ఆ పనులను నవయుగకు నామినేషన్‌పై అప్పగించడానికి పీపీఏ అనుమతిచ్చింది. కానీ పీపీఏ కళ్లకు గంతలుకట్టి అప్పట్లో రూ.1,243.67 కోట్ల విలువైన పనులను ఆ సంస్థకు నామినేషన్‌పై కట్టబెట్టారు. గతనెల పదిన స్పిల్ వే, స్పిల్ ఛానల్‌కు సంబంధించి మిగిలిన రూ.921.87 కోట్ల విలువైన పనులను పీపీఏ అనుమతి తీసుకోకుండానే అదే సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్‌తో మార్చి 3, 2013న ఈపీసీ విధానంలో ప్రభుత్వం చేసుకున్న కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేయకుండా.. తాజాగా నామినేషన్ పద్ధతిలో అప్పగించిన పనులకు ఎల్ఎస్–ఓపెన్ విధానాన్ని వర్తింపజేయడం నిబంధనలకు విరుద్ధం. దీనివల్ల ఖజానాపై తీవ్రభారం పడుతుందని జలవనరులు, ఆర్థిక శాఖ అధికారులు ఆందోళన వ్యక్తపరిచినా చంద్రబాబు బేఖాతరు చేయడం గమనార్హం. -
బాబు అవినీతిపై న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: టీడీపీ పాలనలో జరుగుతున్న అవినీతిపై న్యాయపరంగా పోరాటం చేయాలని బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు. అవినీతి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా కన్నా లక్ష్మీనారాయణ బాధ్యత చేపట్టాక ఆదివారం తొలిసారి రాష్ట్ర పార్టీ పదాధికారులు, జిల్లా పార్టీ అధ్యక్షుల సమావేశం విజయవాడలో జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన, జరుగుతున్న అవినీతిపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంత పేదలకు కేంద్ర ప్రభుత్వం 7.87 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ పథకంలో భారీగా అవినీతి మొదలు పెట్టారని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు, బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణలో కేంద్రం నిధులతో చదరపు అడుగుకు రూ. 1,000తో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇస్తుంటే.. ఏపీలో మాత్రం చదరపు అడుగుకు రూ. 2400 దాకా ఖర్చవుతుందంటూ లెక్కలు చెబుతున్నారని.. కేంద్రమిచ్చే సాయానికి తోడు పేదల నుంచి రూ. 6–7 లక్షల దాకా వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంపై సమావేశంలో చర్చించారు. షేర్వాల్ టెక్నాలజీ పేరుతో ఇళ్లనిర్మాణ పనులు కేవలం రెండు మూడు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించి నిరుపేదల నుంచి ప్రభుత్వ పెద్దలు వందల కోట్లు దోచుకునే పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై సాక్ష్యాధారాలతో కేంద్ర విజిలెన్స్ సంస్థలను ఆశ్రయించడంతో పాటు న్యాయపరంగా పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో జరుగుతున్న అవినీతిపై మండలాల వారీగా, జిల్లాల వారీగా ఆధారాలతో విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర నిధులతో చేపడుతున్న నీరు–చెట్టు పనులు, రాజధాని నిర్మాణంలో చోటుచేసుకుంటున్న అవినీతి అంశాలపై న్యాయ, చట్టపరమైన పోరాటాలకు అవకాశాలను పరిశీలించాలని.. అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించాలని సమావేశంలో తీర్మానించారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల వారీగా ప్రభుత్వ అవినీతిపై పోరాటం సాగించనున్నారు. అమిత్‌షా రాష్ట్ర పర్యటన... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జూలై ప్రథమార్థంలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. కనీసం రెండు రోజులు ఆయన రాష్ట్ర పర్యటన సాగే అవకాశం ఉంటుందని అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ నేతలకు వివరించారు. వచ్చే సాధారణ ఎన్నికల విషయంలో పార్టీ నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి పార్టీని సన్నద్ధం చేసేందుకు జిల్లా అధ్యక్షులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కన్నా సూచించారు. 12 నుంచి 21 వరకు విశేష సంపర్క్ అభియాన్ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమలను మేధావులకు, విద్యావంతులకు తెలియజేప్పేందుకు ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు విశేష సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి తెలిపారు. పదాధికారుల భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ ముఖ్యనేతలు ఒక్కొక్కరు కనీసం 25 మంది ప్రముఖలను కలిసి కేంద్ర పథకాలను వివరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలు జిల్లాల వారీగా పర్యటిస్తారని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా మహా న్యూస్ చానల్ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ, ఆ చానల్‌ను పార్టీ బహిష్కరించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. యువతను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్న విధానాలను తెలిపేందుకు జూన్ 23న యువమోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు జరపాలని నిర్ణయించామన్నారు. జూన్ 21, 22, 23వ తేదీల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటిస్తారని సురేష్‌రెడ్డి తెలిపారు. -
‘వసూళ్లు’ ఆగేనా..?
నిర్మల్ : పోలీసులు.. అంటే సమాజాన్ని తన కుటుంబంగా భావించి రక్షించేవారు. ఎన్ని ఆటంకాలొచ్చినా విధి నిర్వహణలో శాంతిభద్రతల కోసమే శ్రమించేవారు. ప్రజారక్షణలో ప్రాణాలను కూడా త్యాగం చేసిన పోలీసులూ ఉన్నారు. తెలం గాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసుగా ప్రజల్లో కలిసి పోయి సేవకులుగామారిన పోలీసులూ ఉన్నారు. కానీ కొంతమంది ‘వసూలు రాజా’లతో మొత్తం శాఖకే మచ్చ ఏర్పడుతోంది. ఇన్నేళ్లు కొంతమంది పోలీసులు గుట్టుగా సాగించిన మామూళ్ల దందా ఇటీవల బహిర్గతమైంది. రెండురోజుల క్రితం ‘వసూల్‌రాజా’ల జాబితా బయటపడడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. డీజీపీ విడుదల చేసినట్లుగా చెబుతున్న ఈ జాబితాలో జిల్లా నుంచి ఇద్దరు కానిస్టేబుళ్ల పేర్లు మాత్రమే ఉన్నాయి. కానీ.. జిల్లాలో ఇంకా చాలామంది ఇలా మామూళ్లు వసూలు చేసిచ్చే వాళ్లు ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎస్పీ సి.శశిధర్‌రాజు సీరియస్‌గా స్పందించారు. మామూళ్ల తీసుకోవడంతోపాటు ఇచ్చిన వారిపైనా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. కాదేదీ వసూళ్లకనర్హం.. ఇసుక, గుట్కా, గంజాయి అక్రమ రవాణా, పేకాట, మట్కా కేసులతో పాటు భార్యాభర్తలు, అన్నదమ్ములు, బంధువుల గొడవలు.. ఇలా ఏ సమస్య ఉన్నా.. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే పోలీసులూ ఉన్నారు. సమస్య పరిష్కరించాలం టూ వచ్చిన వాళ్ల నుంచి కాసులను రాబట్టిన సంఘటనలూ ఉన్నాయి. తమకు సంబంధం లేని వ్యవçహారాల్లోనూ తలదూర్చి పైసలు వసూలు చేసిన దాఖలాలూ గతంలో ఉన్నాయి. కొన్ని సంఘటనల్లో కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలోనే సమస్యలు పరిష్కరించేస్తుంటే.. మరికొన్ని కేసులు ఆపై స్థాయిలో ‘సెటిల్’ అవుతున్నాయి. మద్యం మస్తు.. జిల్లాలోని మద్యం దుకాణాలు పోలీసుశాఖకు ఆర్థిక వనరులుగా నిలుస్తున్నాయి. మద్యం వ్యా పారుల నుంచే పెద్దమొత్తంలో నెలసరి మామూళ్లు పోలీసులకు అందుతున్నాయి. పట్టణాల్లో రూ.10–15వేల మధ్య ఒక్కో మద్యం దుకాణం నుంచి మామూళ్లు అందుతున్నట్లు అంచనా. మండలాల్లోనూ ఇంచుమించు ఇదే స్థాయిలో వసూలు చేస్తున్నారు. కాస్త ఎక్కువ గిరాకీ ఉండే దుకాణం నుంచి ఎక్కువ మొత్తంలో మామూళ్లు రాబడుతున్నట్లు తెలిసింది. నెల కాగానే ఈ డబ్బులు సంబంధిత అధికారులకు చేరుతున్నాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే.. నిర్మల్‌లో మాత్రం ప్రత్యేకంగా స్టేషన్లలో ‘కలెక్టర్లు’, ‘వసూలు రాజా’లు లేరు. ఎప్పటికప్పుడు వేరే సిబ్బందితో ఈ కలెక్షన్ కొనసాగుతున్నట్లు తెలిసింది. కాసులు కురిపిస్తున్న ఇసుక.. జిల్లాలో ప్రధానంగా ఇసుకదందా వ్యాపారులతో పాటు పోలీసు, రెవెన్యూశాఖలకూ కాసులు కురిపిస్తోంది. కళ్లెదుటే నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తుంటే.. తమకేం పట్టనట్లుగా సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్నారు. పోలీసులు అడపాదడప ఒకట్రెండు ట్రాక్టర్లను పట్టుకోవడం, జరిమానాలు వేసి వదిలేయడం సర్వసాధారణంగా మారింది. ఈ తలప్పి ఎందుకన్నట్లుగా గ్రామాల్లో వేలం ద్వారా ఇసుక తవ్వకాలను దక్కించుకున్న వ్యాపారులు నేరుగా ఎస్సైలతోనే మాట్లాడుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ఇసుక మామూళ్లు పోలీసుశాఖతో పాటు రెవెన్యూ శాఖకూ ముడుతున్నట్లు సమాచారం. సెటిల్మెంట్లు.. రూరల్‌పోలీస్ స్టేషన్లలో ఇసుకక్వారీలు ఆదాయ వనరులుగా మారితే.. పట్టణ పోలీస్స్టేషన్లలో కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, గొడవలు.. తదితర కొట్లాటల కేసులను సెటిల్ చేస్తూ కాసులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. భార్యాభర్తల గొడవల్లోనూ కౌన్సెలింగ్‌ల పేరిట పైసలు ఆశిస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు కూడా నమోదు చేయకుండా కొంతమంది పోలీస్ అధికారులు సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపణలున్నాయి. పట్టణ పోలీస్స్టేషన్లతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ‘ఆదాయం’ ఉన్నట్లు అంచనా. ఈక్రమంలో చాలామంది ఎస్సైలు తమకు రూరల్ ఏరియాలకే కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. ‘మామూళ్లు’ ఆగేనా.. వైన్సులు, బార్లు, ఇసుక వ్యాపారులు, మట్కాజూదరులు, బంగారు దుకాణాలు, కల్లు సొసైటీలు.. తదితర వ్యాపార సంఘాలు, ఇతరత్రా పరిశ్రమల నుంచి నెలసరి మామూళ్లు అందుతున్న విషయం మొన్నటి జాబితాతో బహిర్గతమైంది. జిల్లాలోనూ ఈతంతు ఏళ్లుగా కొనసాగుతున్న విషయం కూడా బహిరంగ రహస్యమే. కానీ.. ఇటీవల డీజీపీ నిఘా వేయించి.. వసూలు రాజాల పేర్లు బయటపెట్టించినట్లు జాబితాతో సహా వచ్చింది. సదరు జాబితాలో జిల్లా నుంచి ఇద్దరు కానిస్టేబుళ్ల పేర్లు ఉండడంతో ఎస్పీ శశిధర్‌రాజు సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లాలో ఏస్థాయిలోనూ మామూళ్లు తీసుకోవడం, వసూలు చేయడం చేస్తే చర్యలు తప్పవన్నారు. మామూళ్లు తీసుకోవడంతో పాటు ఇచ్చేవారిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈమేరకు జిల్లాలో మామూళ్ల పర్వం ఆగుతుందా.. జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసులుగా ఎన్నో మంచి పనులు చేపట్టిన పోలీసులపై పడ్డ ‘వసూళ్ల’ మచ్చ తొలగుతుందా.. వేచిచూడాల్సిందే. తీసుకున్నా.. ఇచ్చినా చర్యలు సమాజంలో శాంతిభద్రతల కోసం పోలీసుశాఖ శ్రమిస్తోంది. అవినీతికి తావులేకుండా వ్యవస్థ పనిచేస్తోంది. ఎవరైనా పోలీస్ అధికారులు, సిబ్బంది డబ్బులు అడిగినా.. వీరికి డబ్బులు ఇచ్చినా.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని హోటళ్లు, వైన్సులు, బార్, రెస్టారెంట్లు, లాడ్జీలు ఇతరత్రా వ్యాపారాల యజమానులు పోలీసులకు డబ్బులు ఇవ్వడం మానుకోవాలి. పోలీసులెవరైనా డబ్బులు అడిగితే 83339 86939 ఫోన్‌నంబర్‌కు మెసేజ్, లేదా వాట్సప్ చేయాలి. – సి.శశిధర్‌రాజు, ఎస్పీ -
‘కలెక్టర్లు’ ఏరివేత మొదలైంది ఇక్కడే..
సాక్షి, హైదరాబాద్: పోలీసు విభాగానికి సంబంధించి వసూల్ రాజాలు రాష్ట్ర వ్యాప్తంగా 391 మంది ఉన్నారు. రాజధానిలోని మూడు కమిషనరేట్ల హైదరాబాద్ పరిధిలోనే తక్కువ మంది ‘కలెక్టర్లు’ పని చేస్తున్నారు. అయినప్పటికీ ఉన్నతాధికారులు సిటీ అధికారుల వ్యవహారశైలిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. నగరంలో రెండేళ్ల క్రితమే ‘కలెక్టర్ల’ను బదిలీలు చేసినప్పటికీ, దందాలు వద్దని స్పష్టం చేసినప్పటికీ ఇంకా కొనసాగడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నా రు. ఈ అవినీతి వ్యవహారాలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏరివేత మొదలైంది ఇక్కడే... రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి సిబ్బంది, అధికారుల అవినీతిపై దృష్టి పెట్టారు. స్టేషన్ ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా రూ. 75 వేలు మంజూరు చేస్తున్న ఆయన ‘కలెక్షన్స్’ విధానాన్ని పారదోలాలని భావించారు. దీంతో 2015 లోనే అవినీతి నిరోధక చర్యలు ప్రారంభించిన ఆయనసిటీలో ఉన్న వసూల్ రాజాలపై దృష్టి పెట్టారు. నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ ద్వారా లోతుగా ఆరా తీయించి, దాదాపు 100 మందితో కూడిన జాబితానురూపొందించారు. వీరిని సిటీ ఆర్డ్మ్ రిజర్వ్ విభాగానికి బదిలీ చేయించారు. దాదాపు రెండేళ్ల క్రితమే ఏరివేత మొదలైనా ఇప్పటికీ కలెక్టర్లు ఉండటాన్ని, బదిలీ అయిన వారూ తమ హవా నడిపించడాన్నీ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. మిగిలిన కమిషనరేట్లు, జిల్లాల్లో కంటే ప్రక్షాళన చేసినప్పటికీ సిటీలో వసూల్ రాజాల వ్యవస్థ కొనసాగడం పోలీసు ఉన్నతాధికారుల్ని కలవరపెడుతోంది. ఎస్సైల కోసమూ వసూళ్లు... రాచకొండలో 24, సైబరాబాద్‌లో 13 మంది కలెక్టర్లు ఉండగా... హైదరాబాద్‌లో ఈ సంఖ్య 11గా ఉంది. సిటీలో మొత్తం 60 ఠాణాలు ఉండగా.. ఎనిమిదింటిలోనే ఈ కలెక్టర్ల విధానం కొనసాగుతోంది. సాధారణంగా ఈ కలెక్టర్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా వ్యవహరించే ఇన్స్పెక్టర్లు, డివిజన్లకు నేతృత్వం వహించే ఏసీపీల కోసం పని చేస్తుంటారు. వారి ఆదేశాలు, సూచనల మేరకు వసూళ్లకు పాల్పడతారు. అయితే నగరంలోని కొందరు కలెక్టర్లు సబ్–ఇన్స్పెక్టర్ల కోసమూ పని చేస్తుండటం కొసమెరుపు. ప్రధానంగా వైన్‌షాపులే పోలీసులకు ఆదాయ వనరులుగా మారాయి. వారు చేస్తున్న ఉల్లంఘనలు, అతిక్రమణలను పట్టించుకోకుండా వదిలేయడం, చర్యలు తీసుకోకుండా పరోక్షంగా సహకరించడం కోసమే వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత కల్లు దుకాణాలు, అర్ధరాత్రి వరకు నడిచే హోటళ్లు, వ్యాపార సంస్థలు, బిల్డర్స్ నుంచి కలెక్టర్లు నెల వారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు, గోదాముల వద్ద వసూలు చేయడానికి ఏకంగా ఓ ఏఎస్సై స్థాయి అధికారే కలెక్టర్‌గా మారిపోయారు. బదిలీ అయినా ‘పట్టు’ తప్పకుండా... వసూల్ రాజాలనే ఆరోపణలతో బదిలీ అయిన సిబ్బంది సైతం ఆయా ఠాణాల పరిధిలో తమ ‘పట్టు’ సడలకుండా జాగ్రత్త పడుతున్నారు. పశ్చిమ మండల పరిధిలోని ఓఠాణాకు కలెక్టర్‌గా వ్యవహరించిన హెడ్–కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు గతంలో సీఏఆర్ హెడ్–క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. అయినా తన పంథా మార్చుకోని, ‘పట్టు’ సడలనివ్వని ఈ కలెక్టర్ తన ఏజెంట్‌ను రంగంలోకి దింపాడు. అదే ఠాణాలో సెక్షన్ డ్యూటీ నిర్వహిస్తున్న ఓ హోంగార్డు ద్వారా వసూళ్లు కొనసాగిస్తున్నాడని తాజా పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. ఇదే జోన్‌లోని మరో ఠాణాలో ఏకంగా గస్తీ విధులు నిర్వర్తించే బ్లూకోల్ట్స్ కానిస్టేబులే కలెక్టర్‌గా మారిపోయాడు. నగరంలో ఉన్న కలెక్టర్లలో నలుగురు హోంగార్డులు, ఐదుగురు కానిస్టేబుళ్ళు, ఒక హెడ్–కానిస్టేబుల్, ఓ ఏఎస్సై ఉన్నారు. ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు... ఈ కలెక్టర్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు అప్రమత్తమయ్యారు. ఎవరైనా పోలీసులు మామూళ్లు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్లు, ఈ–మెయిల్ ఐడీలు ఏర్పాటు చేశారు. ఇలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తున్నారు. హైదరాబాద్: 9490616555, ( cphydts@gmail.com) సైబరాబాద్: 9490617444, (cpcybd@gmail.com) రాచకొండ: 9490617111, ( cp@rck.tspolice.gov.in) -
సీఎం ముఖ్య కార్యదర్శిపై ఆరోపణలు
లక్నో: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ముఖ్య కార్యదర్శి ఎస్పీ గోయల్‌పై అవినీతి ఆరోపణలు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. గవర్నర్ రామ్ నాయక్ స్వయంగా జోక్యం చేసుకుని యోగికి లేఖ రాయటం, ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేయటంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఆరోపణలు.. హర్దోయ్‌లో పెట్రోల్ బంక్ ఏర్పాటు విషయంలో అభిషేక్ గుప్తా అనే వ్యాపారవేత్త.. గోయల్‌ను సంప్రదించాడు. అయితే రోడ్డు వెడల్పు కోసం అదనపు స్థలం(ఒక్క అడుగు) కోరినందుకు గోయల్ రూ. 25 లక్షలు డిమాండ్ చేశారన్నది అభిషేక్ ఆరోపణ. ఈ మేరకు గవర్నర్ రామ్ నాయక్‌కు అభిషేక్ ఏప్రిల్ 18వ తేదీన ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నర్ ఏప్రిల్ 30వ తేదీన సీఎం యోగి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తూ ఓ లేఖ రాయగా, సీఎం యోగి దర్యాప్తుకు ఆదేశించారు. అయితే ఎలా జరిగిందో తెలీదుగానీ గురువారం రాత్రి ఈ లేఖ తాలూకూ ఫోటో ఒకటి వైరల్ కావటంతో దుమారం మొదలైంది. గోయల్ మాత్రం అవినీతి ఆరోపణలను తోసిపుచ్చినప్పటికీ, అభిషేక్ మాత్రం తన దగ్గర ఆధారాలున్నాయని వాదించటంతో విషయం రాజకీయ మలుపు తిరిగింది. ప్రధాన కార్యదర్శి రాజీవ్ కుమార్‌ను పిలిపించుకుని ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎం యోగి కోరారు. మరోవైపు సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చివర్లో... అభిషేక్ గుప్తాను శుక్రవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడున్నర గంటలుగా విచారణ చేపట్టి ఆ ఆరోపణలు అబద్ధమని తేల్చారు. ‘అభిషేక్ గతంలో పలువురి బీజేపీ నాయకుల పేర్లను వాడుకుని కాంట్రాక్టర్లను, అధికారులను బెదిరించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు గోయల్ లంచం కోరారని చేసిన ఆరోపణలు వాస్తవం కాదని తేలింది’ అని పేర్కొన్నారు. మరోపక్క అభిషేక్ క్షమాపణలు చెప్పినట్లు ఉన్న వీడియో టేపు ఒకదానిని సీఎం ఆఫీస్ మీడియా సలహాదారు మృత్యుంజయ్ కుమార్ విడుదల చేయటం విశేషం. రాత్రికి రాత్రే కేసు?... గురువారం రాత్రి గవర్నర్ రామ్ నాయక్ రాసిన లేఖ తాలూకు ఫోటో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. అయితే అదే రాత్రి యూపీ బీజేపీ విభాగం అభిషేక్‌పై ఫిర్యాదు చేసింది. బీజేపీ నేతల పేర్లు వాడుకుంటూ అభిషేక్ దందాలు చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో శుక్రవారం ఉదయం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ప్రశ్నించారు. అభిషేక్ సోదరి, అతని తాత సీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే అభిషేక్‌ను పోలీసులు విడిచిపెట్టిన తర్వాత వారు ఆందోళన విరమించారు. పోలీసులు మాత్రం అభిషేక్‌పై నమోదైన కేసుల దర్యాప్తు కొనసాగుతుందని చెబుతున్నారు. -
బాబు పాలన బాగోలేదు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి విశృంఖలమైందని, సమర్థవంతమైన పాలనను అందించడంలో ఆయన దారుణంగా విఫలమయ్యారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ గ్రూపునకు చెందిన తెలుగు వెబ్సైట్ ‘సమయం’ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ(ఒపీనియల్ పోల్)లో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా పోల్ నిర్వహించినట్లు ‘సమయం’ తెలిపింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో, ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో, రాజధాని నిర్మాణంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని 60 శాతం మందికి పైగా ప్రజలు తమ మనోగతాన్ని వెల్లడించారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం అమరావతికి ఉపయోగ పడలేదని తేల్చారు. ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ జోక్యం పెరిగిందని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. టీడీపీలోకి ఫిరాయించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం సరికాదని 80 శాతం మంది సూచించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఎవరికి ఓటేస్తారు? అనే ప్రశ్నకు వైఎస్ జగన్మోహన్రెడ్డికే తమ ఓటని సర్వేలో పాల్గొన్న అత్యధిక శాతం మంది స్పష్టం చేయటం గమనార్హం. -
అడ్డగోలు బదిలీలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయుల సాధారణ బదిలీలకు ముందే అడ్డగోలుగా ‘విచక్షణ’ బదిలీలు జరుగుతున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము కోరుకున్న చోట పోస్టింగ్ కోసం కొందరు, అధికంగా హెచ్ఆర్ఏ (ఇంటి అద్దె భత్యం) పొందవచ్చని మరికొందరు, మారుమూల ప్రాంతాల్లో ఉండటం ఇష్టం లేక పట్టణ ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు అధికారులను, రాజకీయ నేతలను పట్టుకుని ఈ ‘విచక్షణ’ బదిలీలు చేయించుకుంటున్నట్టు ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. కొందరు అధికారులు లక్షల కొద్దీ ముడుపులు పుచ్చుకుని ఇష్టారాజ్యంగా బదిలీలు చేస్తున్నారని.. దీనివల్ల ఇతర టీచర్లకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ బదిలీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. వాస్తవానికి ఈ బదిలీల వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే అధికారులను హెచ్చరించారు. ‘టీచర్ల విచక్షణ బదిలీలతో ప్రభుత్వం అభాసుపాలవుతోంది. అత్యవసరమైతే తప్ప అలాంటి బదిలీలు వద్దు. బదిలీల షెడ్యూల్ జారీ చేశాక ఎట్టి పరిస్థితుల్లో విచక్షణ బదిలీలు చేయవద్దు..’ అని స్పష్టం చేశారు. అయినా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఈనెల 6వ తేదీన బదిలీల షెడ్యూల్ విడుదలయ్యాక కూడా పాత తేదీలతో అడ్డగోలుగా బదిలీలు చేసినట్టు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. 400కు పైగా బదిలీలు! విచక్షణ బదిలీల పేరుతో ఇప్పటివరకు దాదాపు 400 మంది టీచర్లు బదిలీ పొందినట్టు విద్యాశాఖ అధికారులే పేర్కొంటున్నారు. ఇందులో ఆయా జిల్లాల పరిధిలో 300 మందిని బదిలీ చేయగా.. మరో వంద మందిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాల పరిధిలోని పట్టణ ప్రాంతాలకు బదిలీ కోసం రూ.2 లక్షల వరకు, అంతర్ జిల్లా బదిలీలకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. రాజకీయ పలుకుబడి, డబ్బులు.. సాధారణ బదిలీల్లో తాము కోరుకున్న స్థానాలు రాకపోవచ్చని భావించిన కొందరు ఉపాధ్యాయులు.. రాజకీయ నాయకులతో పరిచయాన్ని, డబ్బు, పరపతిని ఉపయోగించుకుని కోరుకున్న చోటికి బదిలీ చేయించుకోగలిగారని అంటున్నారు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు ముట్టజెప్పాల్సి వచ్చిందని పోస్టింగులు సాధించుకున్న ఉపాధ్యాయులు తోటి ఉపాధ్యాయులతో చెప్పుకుంటుండటం గమనార్హం. ఓ కీలక అధికారి, కొందరు నేతలను పట్టుకుంటే కావాల్సిన చోటికి బదిలీ చేయించుకోవచ్చని, తమకు తెలిసిన ఏయే టీచర్ ఎంత ‘ఖర్చు’ పెట్టుకుని బదిలీ చేయించుకున్నారని ఉపాధ్యాయుల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇక కొందరు నేతలు అధిక హెచ్ఆర్ఏ వర్తించే ప్రదేశాలను ముందే గుర్తించి.. ఆయా చోట్ల పోస్టింగ్ ఇప్పించేందుకు పలువురు టీచర్లతో బేరాలు కూడా కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. టీచర్లు వెళ్లి చేరితేనే.. ఇతర జిల్లాల నుంచి ఒక్క రంగారెడ్డి జిల్లాకే 35 మంది టీచర్లు బదిలీ చేయించుకున్నారు. పాత రంగారెడ్డి జిల్లా పరిధిలోకి మరో 13 మంది టీచర్ల బదిలీలు జరిగాయి. ఇవన్నీ బయటకు వచ్చిన వివరాలే. ఇంకా టీచర్లు వెళ్లి స్కూళ్లలో చేరితే తప్ప తెలియని విధంగా బదిలీల ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. గతంలో ఎవరినైనా విచక్షణ బదిలీ చేయాలనుకుంటే జీవో రూపంలో ఉత్తర్వులు వెలువడేవి. కానీ ఇప్పుడు మెమో రూపంలో బదిలీలు చేస్తున్నారు. దీంతో సదరు టీచర్లు ఆయా పాఠశాలలకు వెళ్లి చేరితే తప్ప బదిలీ అయినట్టు బయటికి తెలియడం లేదు. ఇలా హైదరాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, మెదక్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి 200 మందికిపైగా టీచర్లకు బదిలీలు జరిగినట్టు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పటివరకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), పండిట్లు, పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్లను విచక్షణ బదిలీలు చేయగా.. ఈసారి పెద్ద సంఖ్యలో ప్రధానోపాధ్యాయులూ ఇలా బదిలీ అయ్యారు. ఒక్క వరంగల్ జిల్లా పరిధిలోనే నలుగురిని ఇలా పట్టణ ప్రాంతానికి బదిలీ చేసినట్టు తెలిసింది. ఇప్పటివరకు జరిగిన బదిలీలతోపాటు మరో 200 వరకు బదిలీల ఫైళ్లు ఉన్నట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. గల్లంతవుతున్న పోస్టులు స్థానిక, ఓపెన్ కోటాలలో 80:20 పద్ధతిన పోస్టులు భర్తీ చేయాలి. కానీ విచక్షణ బదిలీలతో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో స్థానికేతరుల సంఖ్య పెరిగిపోయిందని, దీనివల్ల స్థానికులకు పోస్టులు మిగలకుండా పోయే పరిస్థితి నెలకొందని అంటున్నారు. అంతేకాదు అక్రమ బదిలీలతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 30 శాతం హెచ్ఆర్ఏ కలిగిన ప్రదేశాలు (ఖాళీలు) భర్తీ అయిపోయాయని చెబుతున్నారు. మరోవైపు అడ్డదారి బదిలీల ఆర్డర్లు పట్టుకుని వస్తున్న టీచర్లతో అధికారులు గందరగోళంలో పడుతున్నారు. ఇలా పోస్టింగ్ ఆర్డర్లు పట్టుకుని వస్తున్న వారి కారణంగా.. ఖాళీల సంఖ్య మారిపోతుండటంతో తరచూ మార్పులు చేయాల్సి వస్తోందని ఓ ఉన్నతాధికారి వాపోవడం గమనార్హం. మరోవైపు అడ్డదారి బదిలీలపై నిరసన తెలిపినా ప్రభుత్వంగానీ, ఉన్నతాధికారులుగానీ పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. సీఎంవో బదిలీలు రద్దు చేయాలి ‘‘అక్రమ బదిలీలను ప్రోత్సహించడం సరికాదు. ఇలా ఇప్పటివరకు చేసిన బదిలీలన్నింటినీ రద్దు చేయాలి. దీనిపై కొందరు టీచర్లు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. విచక్షణ బదిలీల కోసం ఇంకా 200 ఫైళ్లు ఉన్నట్టు తెలిసింది..’’ – భుజంగరావు, ఎస్టీయూ అధ్యక్షుడు ఇక కౌన్సెలింగ్ ఎందుకు? ‘‘ప్రభుత్వమే అడ్డదారిలో బదిలీలు చేస్తే.. ఇంకా కౌన్సెలింగ్ ఎందుకు? ఇప్పటివరకు చేసిన బదిలీలను రద్దు చేయాలి. ఆయా స్థానాలు అర్హులైన వారికి దక్కేలా చూడాలి..’’ – రవి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి -
వసూల్ రాజాలు..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : పోలీస్‌శాఖలో అవినీతి సర్వసాధారణం. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు మామూళ్లకు అతీతులు కాదనే విషయం బహిరంగ రహస్యమే. కానీ పోలీస్స్టేషన్లలో ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులకు నెలానెలా మామూళ్లు వసూలు చేసి అందించే ప్రత్యేక వ్యవస్థ ఉందని చాలా మందికి తెలియదు. పోలీస్స్టేషన్ల పరిధిలో గుట్టుగా సాగే ఈ వ్యవహారం గురువారం బట్టబయలైంది. రాష్ట్రంలో ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో మామూళ్లు వసూలు చేసే పోలీసుల వివరాలను నిఘా వర్గాలు సేకరించాయి. జిల్లాల్లో పోలీస్స్టేషన్ల వారీగా ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులకు మామూళ్లు వసూలు చేసి ఇచ్చే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐల జాబితాను రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డికి అందజేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 391 మంది పోలీసులతో కూడిన ఈ జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాలకు చెందిన 19 మంది ఐడీ పార్టీ, క్రైం పార్టీ పోలీసుల పేర్లు కూడా ఉండడం విశేషం. ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎవరు ఎవరి కోసం మామూళ్లు వసూలు చేస్తారనే వివరాలు, పోలీసుల పేర్లు, గుర్తింపు నెంబర్‌తో సహా పోలీస్ పెద్దల దృష్టికి వచ్చింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం నుంచి పలు సామాజిక వె»Œబ్సైట్లలో కూడా ‘అవినీతి పోలీసుల చిట్టా’ పేరుతో 391 మంది పోలీసుల జాబితా చక్కర్లు కొట్టింది. దీంతో పోలీసులు అభాసుపాలయ్యారు. ఈ వివరాలన్నీ అధికారికమే కావడంతో పోలీస్స్టేషన్లలో ‘కలెక్టర్’ల పేరుతో గుట్టుగా సాగే మామూళ్ల వసూలు వ్యవహారం బట్టబయలైంది. ఆదిలాబాద్ టౌన్‌తోపాటు మండలాల్లో... ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆరు పోలీస్స్టేషన్లలో మామూళ్లు వసూలు చేసే వ్యవస్థ కొనసాగుతోందని పోలీస్ నిఘా వర్గాల నివేదికలో తేలింది. ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు వసూల్‌రాజాలుగా నిలిచారు. మావల, ఆదిలాబాద్ రూరల్, ప్రస్తుతం వన్‌టౌన్‌కు అటాచ్ అయిన మహిళా పోలీస్స్టేషన్లలో కానిస్టేబుళ్లు పై అధికారులకు మామూళ్లు వసూలు చేసే పనిలోనే ఉంటారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తాంసి మండలంలో వసూళ్ల కోసం ఓ హెడ్ కానిస్టేబుల్‌ను నియమించారు. తాంసి పరిధి దాటితే మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా ఉంది. ఇక్కడ పాటన్‌బోరి ప్రాంతం పేకాట, మట్కా, సట్టా వంటి జూదానికి పెట్టింది పేరు. ఇక్కడ ఆడేందుకు కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ నుంచి కూడా కస్టమర్లు వస్తున్నందున తాంసి పోలీసులకు సరిహద్దు వద్ద పండుగే. ఈ నేపథ్యంలో ఇక్కడ పనిచేసే ఎస్హెచ్ఓకు మామూళ్లు వసూలు చేసి ఇచ్చేందుకు ఏకంగా ఓ హెడ్‌కానిస్టేబులే పనిచేస్తుండడం గమనార్హం. మంచిర్యాల జిల్లాలో 8మంది.. పోలీస్ అక్రమాలకు పేరుమోసిన మంచిర్యాల జిల్లాలో ఎనిమిది మంది పోలీసులు శాంతిభద్రతలను గాలికి వదిలి మామూళ్లు వసూళ్లకు పనిచేస్తున్నారు. ఆదాయం అధికంగా ఉండే పోలీస్స్టేషన్లతో పాటు కొత్త పోలీస్స్టేషన్లలో కూడా ఎస్ఐ, సీఐ స్థాయి అధికారులు ఈ వసూల్‌రాజాల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం విశేషం. అధికాదాయ వనరులున్న జైపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏకంగా ఏఎస్ఐకే ఈ బాధ్యతలు అప్పగించినట్లు పోలీస్ నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఇక జిల్లాలో అక్రమ దందాలకు నిలయంగా మారిన జన్నారం పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ మామూళ్లు వసూలు చేసే పనిలో ఉన్నాడట. బెల్లంపల్లి పోలీస్‌స్టేషన్‌లో కూడా హెడ్ కానిస్టేబుల్‌కే సంబంధిత ఉన్నతాధికారి వసూళ్ల డ్యూటీ అప్పగించారు. హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ఓ హోంగార్డు కూడా ఇదే పనిలో ఉండడం గమనార్హం. లక్సెట్టిపేట, కోటపల్లి, తాండూర్లలో కానిస్టేబుళ్లు వసూళ్ల దందా సాగిస్తున్నారు. కాగజ్‌నగర్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లకు డ్యూటీ కుమురంభీం జిల్లాలో ప్రధాన ఆదాయవనరు కాగజ్‌నగర్. ఇక్కడ అక్రమ దందాలకు అడ్డూ అదుపూ ఉండదు. ఇక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఉన్నతాధికారి పోస్టు కోసం భారీ ప్రయత్నాలు సాగుతాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఒక్క పోలీసుతో మామూళ్ల వసూలు కష్టం. అందుకే ఇద్దరు కానిస్టేబుళ్లకు వసూళ్ల బాధ్యతలు అప్పగించినట్లు పోలీస్ ఇంటలిజెన్స్ వర్గాలు నిగ్గు తేల్చాయి. ఆసిఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్‌కు వసూళ్ల పనిలో ఉన్నాడు. నిర్మల్ జిల్లా పరిధిలోని ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్, ముథోల్‌లో కానిస్టేబుల్ వసూళ్ల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిగతా మండలాల్లో సక్రమమేనా..? ఉమ్మడి జిల్లాలో 70 మండలాలు ఉన్నాయి. ఆదిలాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాలల్లో ఒకటికి మించి పోలీస్స్టేషన్లు కొనసాగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మండలాలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా పోలీస్స్టేషన్లు ఉన్నాయి. కానీ పోలీస్ ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచిల నుంచి విడుదలైనట్లు చెపుతున్న వసూల్‌రాజాల జాబితాలో జిల్లాకు చెందిన 19 మంది పోలీసుల పేర్లే ఉన్నాయి. దీన్నిబట్టి మిగతా పోలీస్స్టేషన్లలో అన్నీ సక్రమమే అనుకుంటే పొరబాటే. అక్రమాలకు అలవాటుపడ్డ పోలీస్ అధికారులు కొన్ని చోట్ల ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి వసూలు చేస్తుంటే, మరికొన్ని చోట్ల నేరుగానే రంగంలోకి దిగుతున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో ఇటీవల తరచూ పోలీస్స్టేషన్లలో ఎస్ఐ, సీఐల మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇంకా కుదురుకోని కొందరు అధికారులు వసూళ్ల కోసం ప్రత్యేకంగా పోలీసులను నియమించుకోలేదు. ఆదాయ వనరులు అధికంగా ఉన్న పోలీస్స్టేషన్లకు సీఐ, ఎస్ఐల బదిలీల్లో చేతులు మారే లక్షల రూపాయలను బట్టే వారి ఆదాయం ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వసూల్‌రాజాల డ్యూటీ ఏంటంటే... స్టేషన్ ‘కలెక్టర్’గా పిలవబడే వసూల్‌రాజా అంటే ఆ స్టేషన్ పరిధిలో అందరికీ హడలే. పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగే అక్రమాలన్నీ ఈ స్టేషన్ ‘కలెక్టర్’ల కనుసన్నల్లోనే సాగుతాయి. మద్యం దుకాణాలు, బార్లు, గుడుంబా తయారీదారులు, కల్లు సొసైటీల నుంచి ప్రతినెలా ముందుగానే నిర్ధేశించిన మేరకు వసూలు చేయడం జరుగుతుంది. ఎస్హెచ్ఓలు నేరుగా మాట్లాడి సెటిల్ చేసే సివిల్ వివాదాలకు సంబంధించి కూడా క్యాష్ కలెక్షన్ బాధ్యత వీరిదే. సంబంధిత స్టేషన్ అధికారికి ‘రైట్‌హ్యాండ్’గా వ్యవహరించే ఈ స్టేషన్ ‘కలెక్టర్’ అంటే అక్కడ పనిచేసే ఇతర పోలీసులకు కూడా హడలే. -
ఇదీ పోలీస్ వసూల్ రాజాల జాబితా
ఎంతో కాలంగా పోలీస్ వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతి డొంక కదిలింది. శాఖలో ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ దాకా వసూళ్లకు పాల్పడుతున్న వారి జాబితాను డీజీపీ కార్యాలయం ప్రకటించింది. వీరిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇదీ వసూల్ రాజాల జాబితా సైబరాబాద్: 13 మంది రాచకొండ: 24 మంది హోంగార్డులు: 6 కానిస్టేబుళ్లు: 24 హెడ్–కానిస్టేబుళ్లు: 6 ఏఎస్సై: 1 భువనగిరి ఏసీపీకి ఆరుగురు ‘కలెక్టర్లు’ సాక్షి, సిటీబ్యూరో: కలెక్టర్... పోలీసు విభాగంలోనూ అనధికారికంగా ఈ పోస్టు ఉంటుంది. సబ్–ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, ఏసీపీలకు నెల వారీ, కొన్ని ప్రత్యేక కేసుల్లో మామూళ్లు కలెక్ట్ చేసి ఇవ్వడం ఇతడి బాధ్యత. సాధారణంగా హోంగార్డు, కానిస్టేబుల్ స్థాయి అధికారులే కలెక్టర్లుగా ఉంటుంటారు. అయితేనేం... ఆ ఠాణా, డివిజన్లో అతడే పవర్ఫుల్. షాడో ఇన్స్పెక్టర్, ఏసీపీలుగా వ్యవహరిస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ వసూల్‌రాజాల జాబితాను డీజీపీ కార్యాలయం రూపొందించింది. ఇందులో సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో పని చేస్తున్న వారు 37 మంది ఉన్నారు. ఆరుగురు కలెక్టర్లను ఏర్పాటు చేసుకున్న భువనగిరి ఏసీపీ జితేందర్‌రెడ్డి వసూళ్ల పర్వంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు డీజీపీ కార్యాలయం తయారు చేసిన జాబితా స్పష్టం చేస్తోంది. సిటీ టు స్టేట్.. ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి 2014లో రాష్ట్ర అవతరించిన తర్వాత హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆపై ఏడాదిలోపే అవినీతి నిరోధక చర్యలు ప్రారంభించిన ఆయన సిటీలో ఉన్న వసూల్ రాజాలపై దృష్టి పెట్టారు. స్పెషల్ బ్రాంచ్ ద్వారా లోతుగా ఆరా తీయించి, దాదాపు 100 మందితో కూడిన జాబితాను రూపొందించారు. వీరిని సిటీ ఆరడ్మ్ రిజర్వ్ విభాగానికి బదిలీ చేయించారు. ఇప్పుడు డీజీపీగా మహేందర్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో ఉన్న కలెక్టర్లపై ఆరా తీయాల్సిందిగా నిఘా విభాగాన్ని ఆదేశించారు. దాదాపు రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన ఇంటెలిజెన్స్ వింగ్ 391 మందితో కూడిన జాబితాను రూపొందించి గత నెల 23న డీజీపీకి సమర్పించింది. అగ్రస్థానంలో జితేందర్‌రెడ్డి... ఈ 391 మందిలో సైబరాబాద్‌కు చెందిన వారు 13 మంది, రాచకొండ కమిషనరేట్లలో పని చేస్తున్న వారు 24 మంది ఉన్నారు. వీరిలో హోంగార్డు నుంచి అసిస్టెంట్ సబ్–ఇన్స్పెక్టర్ వరకు వివిధ హోదాలకు చెందిన అధికారులు ఉన్నారు. భువనగిరి ఏసీపీ ఎం.జితేందర్‌రెడ్డి ఏకంగా ఆరుగురు కలెక్టర్లను ఏర్పాటు చేసుకుని రెండు కమిషనరేట్లలోనూ అగ్రస్థానంలో నిలిచారు. ఈయన తన డ్రైవర్‌గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్‌తో పాటు బి.రామారంలో ఇద్దరు, భువనగిరి టౌన్లో ఇద్దరు, బీబీనగర్‌లో ఒకరు కలెక్టర్లను ఏర్పాటు చేసుకున్నారు. చౌదరిగూడెం ఇన్స్పెక్టర్ లింగం ఏకంగా ఏఎస్సై స్థాయి అధికారినే వసూల్ రాజాగా మార్చుకున్నారు. దుండిగల్, జీడిమెట్ల ఇన్స్పెక్టర్లకు ముగ్గురు చొప్పున, షాద్‌నగర్, పహాడీషరీఫ్, భువనగిరి, బీబీనగర్, వలిగొండ, యాదగిరిగుట్ట రూరల్, మల్కాజ్గిరి ఇన్స్పెక్టర్లకు ఇద్దరు చొప్పున కలెక్టర్లు ఉన్నారు. చేయించిన వారిపై చర్యలేవీ? ఈ కలెక్టర్లు అంతా ప్రధానంగా రెస్టారెంట్లు, బార్స్, వైన్‌షాపులు, పబ్స్ తదితర వ్యాపార సంస్థల నుంచి నెలవారీ, కొన్ని కేసుల్లో బాధితులు, నిందితులతో పాటు వారి సంబం«ధీకుల నుంచి మామూళ్లు వసూలు చేస్తుంటారు. జాబితాను అన్ని జిల్లాల ఎస్పీలకు, పోలీసు కమిషనరేట్ల కమిషనర్లకు ఈ–మెయిల్ రూపంలో పంపించిన డీజీపీ వసూల్ రాజాలను ఏఆర్ విభాగానికి బదిలీ/ఎటాచ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయితే వసూలు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తూ వసూలు చేయించిన వారిని విస్మరించడం ఎంత వరకు న్యాయమని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా వ్యవహరించే సదరు పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్/ఎస్సై లేదా డివిజన్ ఏసీపీలు/డీఎస్పీల ఆదేశాల మేరకే, వారికోసమే వసూళ్లు జరుగుతాయని, అందులో కలెక్టర్లకూ కొంత మొత్తం ముడుతుందని చెప్తున్నారు. నేరం చేసిన వారిపై వేటు వేస్తున్న ఉన్నతాధికారులు దానికి ప్రేరేపించిన వారిని వదిలేయడం ఏమిటని అంటున్నారు. కలెక్టర్లను నియమించుకున్న వారి పైనా చర్యలు తీసుకోవాలని, అప్పుడే సమస్య పునరావృతం కాకుండా ఉంటుందని పేర్కొంటున్నారు. మామూళ్లు అడిగితే ఫిర్యాదు చేయండి తమ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా మామూళ్ళు అడిగితే నేరుగా తనకే ఫిర్యాదు చేయాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు అంజనీ కుమార్, వీసీ సజ్జనార్ గురువారం కోరారు. హోటళ్ళు, రెస్టారెంట్స్, వైన్ షాపులు, బార్స్, లాడ్జిలు, పబ్స్, ఇతర వ్యాపార సంస్థలు, గేమింగ్ జోన్స్, పార్లర్స్, కేఫ్‌లు తదితరాలు నిబంధనలకు అనుగుణంగానే పని చేయాలని స్పష్టం చేశారు. అలా కాకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయా సంస్థల వద్ద ఎవరైనా పోలీసులు మామూళ్ళు డిమాండ్ చేస్తే హైదరాబాద్ పరిధికి చెందిన వారు 9490616555, సైబరాబాద్ వారు 9490617444 నెంబర్లకు వాట్సాప్ ద్వారా, లేదా హైదరాబాద్‌కు చెందిన వారు (cphydts@gmail. com), సైబరాబాద్వారు(cpcybd@gmail.com)కు ఈ–మెయిల్ చేయడం ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ మేరకు గురువారం ఇరువురు కమిషనర్లు ప్రకటనలు విడుదల చేశారు. -
ఆలయ ఉద్యోగుల ‘స్వామి’ భక్తి
హైదరాబాద్ నగరంలో అదో ప్రముఖ దేవాలయం. నిత్యం వేల మంది భక్తులతో కిటకిటలాడుతుంటుంది. అక్కడ దాదాపు పదేళ్లుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగిదే ఇష్టారాజ్యం. ప్రసాదాల తయారీకి సంబంధించిన బాధ్యత అతనిది. స్టోర్స్ నిర్వహణ తప్ప మరో పని చేయడు. సరుకుల కొనుగోలు పేరుతో రూ.లక్షలు స్వాహా చేస్తున్నాడు. అతనిపై ఎన్ని ఫిర్యాదులొచ్చినా ఈగవాలనీయకుండా స్థానిక ఎమ్మెల్యే కాపాడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం ఓ ఉన్నతాధికారి అతన్ని ఆ విధుల నుంచి తప్పించారు. అతని అక్రమాలపై కమిషనర్ కార్యాలయానికి నివేదిక సమర్పించాడు. కానీ, ఇన్ని రోజులు ఏం చేశావంటూ అనూహ్యంగా ఆ ఉన్నతాధికారికే మెమో జారీ చేశారు. అతనో సీనియర్ అసిస్టెంట్. రెడ్‌హిల్స్‌లోని వేణుగోపాలస్వామి దేవాలయంలో నియమితుడయ్యాడు. ఇది 6సి కేడర్ దేవాలయం, కానీ నిబంధనలకు విరుద్ధంగా కొద్దిరోజుల్లోనే ఏకంగా 6ఏ కేడర్‌లోని పెద్ద దేవాలయంలోకి మారిపోయాడు. ఇంకేముంది, ఆలయ ఆదాయాన్ని దొంగబిల్లులతో కొల్లగొట్టడమే కాకుండా, తనలాంటి కొందరు ఉద్యోగులతో ముఠా ఏర్పాటుచేసి అక్రమ నియామకాలు, పెద్ద దేవాలయాలకు బదిలీలు, అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన వారికి తిరిగి పోస్టింగ్స్ ఇప్పించటం.. ఒకటేమిటి, ఉన్నతాధికారులనే బెదిరించే స్థాయికి ఎదిగాడు. సాక్షి, హైదరాబాద్: అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన దేవాదాయ శాఖలో కొందరు కిందిస్థాయి ఉద్యోగుల ఆగడాలు తీవ్రమయ్యాయి. ఏళ్లుగా అదే దేవాలయంలో పాతుకుపోయి స్థానిక ఎమ్మెల్యే, పలుకుబడి కలిగిన నేతలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని దేవాలయాల సొమ్ము యథేచ్ఛగా స్వాహా చేస్తున్నారు. దేవాదాయ శాఖలో ఆలయ సిబ్బంది బదిలీలు జరిగి 12 ఏళ్లు గడిచింది. దీంతో కొందరు 12 ఏళ్లుగా ఒకే దేవాలయంలో పనిచేస్తున్నారు. స్థానిక నేతలతో పరిచయాలు పెంచుకుని వారి అండతో రెచ్చిపోతున్నారు. ఇటీవల వేములవాడ, బాసర, సికింద్రాబాద్ గణేశ్ దేవాలయం, విజయనగర్ కాలనీ హనుమాన్ దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, కాళేశ్వరం, కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం... ఇలా చాలా చోట్ల సిబ్బంది వ్యవహారం దేవాదాయశాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయ సత్రంలో ఓ ఉద్యోగి తాగుబోతుల సేవలో తరించి ఆలయానికే తలవంపులు తెచ్చాడు. వేములవాడలో స్టోర్స్ బాధ్యత చూసే ఓ ఉద్యోగి నెయ్యి కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డట్టు వెలుగు చూసింది. సికింద్రాబాద్‌లోని ఓ పెద్ద దేవాలయంలో సరుకులు ఖాళీ అయినట్టు తప్పుడు రిపోర్టులు తయారు చేసి, మళ్లీ సరుకులు కొన్నట్టు తప్పుడు బిల్లులు పెట్టి డబ్బులు దండు కున్న తీరును విజిలెన్సు అధికారులు గుర్తించారు. సిబ్బందిపై చర్యలకు సిఫారసు చేయగా స్థానిక నేతలు అడ్డుకుని వారిపై ఈగవాలనీయకుండా చేశారు. పాతనగరంలోని ఓ దేవాలయంలో ఉద్యోగి అక్రమాలను గుర్తించిన ఉన్నతాధికారి అతడిని మరో దేవాలయానికి ఉన్నఫళంగా మార్చి అతనిపై చర్యలకు సిఫారసు చేశారు. సిబ్బంది అక్రమాలపై ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆ అధికారికే మెమో జారీ చేశారు. అమీర్‌పేట్‌లోని ఓ దేవాలయంలో ఓ ఉద్యోగి స్వామివారి వస్త్రాలను గల్లం తు చేస్తూ దుకాణాలకు అమ్ముతున్నట్టు తేలింది. కానీ చర్యలు మాత్రం తీసుకోలేదు. వరంగల్‌లోని ఓ ప్రముఖ దేవాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఓ జూనియర్ ఆర్టిస్టుకు సాయంత్రం చీకటిపడ్డాక పూర్ణకుంభం స్వాగతం ఇప్పించారు. నగరంలో దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న దుకాణాల అద్దెలను ఇష్టారాజ్యంగా కాజేస్తున్నారు. లెక్కలేనన్ని అక్రమాలు.. ఏ కేడర్ ఆలయంలో ఉద్యోగి విధుల్లో చేరాడో తిరిగి అదే కేడర్ ఆలయానికే బదిలీ చేయాలనేది నిబంధన. పోస్టింగ్ పొందిన ఆలయంలో ఖాళీల ఆధారంగా మాత్రమే పదోన్నతి కల్పించాలని కూడా చట్టం చెబుతోంది. కానీ, చిన్న దేవాలయంలో ఉద్యోగంలో చేరి, స్వల్ప సమయంలోనే పెద్ద దేవాలయాలకు అక్రమంగా బదిలీ చేయించుకుని పదోన్నతులు పొందుతున్న పైరవీకారులైన ఉద్యోగుల సంఖ్య దేవాదాయ శాఖలో చాంతాడంత ఉంది. ఖాళీలలో సంబంధం లేకుండా అక్రమంగా పదోన్నతులు పొంది సహాయ కమిషనర్లు అయినవారూ ఉండడం ఇక్కడ విడ్డూరం. నిబంధనలు ఏం చెబుతున్నాయి ఇతర ప్రభుత్వ విభాగాల తరహాలో దేవాదాయశాఖలో కూడా సిబ్బంది బదిలీలపై నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. దేవాదాయ చట్టం సెక్షన్ 35 ప్రకారం ఉద్యోగుల బదిలీలు చేయాలి. 6సీ కేడర్ దేవాలయం ఉద్యోగులను సంబంధిత సహాయ కమిషనర్, 6బి కేడర్ ఆలయాల్లో ఉప కమిషనర్, 6ఏ కేడర్ పెద్ద దేవాలయాల్లో ఉద్యోగులను కమిషనర్ బదిలీ చేయొచ్చు. 2006లో అప్పటి ప్రభుత్వం దేవాదాయ శాఖ ప్రక్షాళనలో భాగంగా సిబ్బందిని పెద్ద సంఖ్యలో బదిలీ చేసింది. కానీ విధివిధానాలు స్పష్టంగా లేవని, బదిలీ సరికాదని కొందరు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించి వాటిని నిలుపుదల చేయించుకున్నారు. కానీ నాలుగేళ్ల తర్వాత బదిలీ సక్రమమేనన్న తీర్పు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు బదిలీ ఊసే లేకుండా పోయింది. -
‘మామూళ్ల’ పోలీసులకు స్థానచలనం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో అవి నీతిని రూపుమాపే దిశగా అడుగులు పడు తున్నాయా? మామూళ్ల కోసం సామాన్య ప్రజ లను, వ్యాపారులను, ఇతర వర్గాలను వేధిస్తున్న క్షేత్రస్థాయి పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారా?.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ నివేదిక ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ‘మామూళ్లు’వసూలు చేస్తున్న ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టే బుళ్లు, హోంగార్డుల గురించి జిల్లా స్థాయిలో నివేదికలు తెప్పించుకున్న డీజీపీ.. వారిపై సమగ్ర విచారణ జరిపినట్లు ఈ నివేదిక పేర్కొంటోంది. స్పెషల్ పార్టీలు, ఐడీ పార్టీల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వారందరినీ ఆయా జిల్లాలు, కమిషనరేట్ల హెడ్క్వార్టర్లకు బదిలీ చేయాలని డీజీపీ ఆదేశించినట్టుగా ఉన్న అంశాలు పోలీసు శాఖలో సంచలనం సృష్టిస్తు న్నాయి. ఇది వాస్తవమైనదే అయి ఉండాలని.. ఈ చర్యలు అవినీతి రహిత ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు బాటలు వేసినట్టేననే ఆశాభావం వ్యక్తమవు తోంది. ఇంతకీ ఆ నివేదికలో ఏముందంటే.. 391 మందిపై బదిలీ వేటు: రాష్ట్రవ్యాప్తంగా పైఅధికారులకు ‘ఫండ్ కలెక్టర్లు’గా పనిచేస్తున్న ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు కలిపి 391 మందిని ఆయా హెడ్క్వార్టర్లకు బదిలీ చేయాలని డీజీపీ కార్యాలయం పేరిట ఉత్త ర్వులు వెలువడినట్టు ఆ నివేదికలో ఉంది. జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో మామూళ్ల వ్యవస్థ పనిచేస్తున్నట్టు పేర్కొ న్నారు. ఎస్సైల నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకు ఈ సిబ్బందిని ఫండ్ కలెక్టర్లుగా నియమిం చుకుని మామూళ్లు వసూలు చేస్తున్నట్టు పొందుపరిచారు. గత నెల 25న ఈ నివేదిక రాష్ట్ర పోలీస్ శాఖకు అందినట్టుగా చెబుతున్నారు. సెటిల్మెంట్లు, ఇసుక దందాలు ఎస్సైలు, ఇన్స్పెక్టర్లు, డీఎస్పీ/ఏసీపీల కోసం ఈ ‘వసూల్ రాజాలు’ప్రతి నెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్టు ఆయా పోలీస్స్టేషన్లు, సర్కిల్, సబ్డివిజన్ల పేర్లతో సహా నివేదికలో పొందుపరిచారు. ఇసుక దందాలు, భూ దందాలు, నిందితులతో కలసి సెటిల్మెంట్లు, మద్యం దుకాణాల నుంచి వసూళ్లు, గ్యాంబ్లింగ్ అడ్డాల నుంచి మామూళ్ల సేకరణ.. ఇలా పలు రకాలుగా ప్రతీ నెలా అధికారులకు వసూలు చేసిపెడుతున్నట్టు పేర్కొన్నారు. ఇలా ‘వసూల్ రాజా’లను ఏర్పాటుచేసుకున్న జాబితాలో సూర్యాపేట జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ కమిషనరేట్, నిజామాబాద్ కమిషనరేట్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అధికారికంగా ధ్రువీకరించని పోలీస్ శాఖ మామూళ్ల వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా తీసుకున్నట్టుగా ఉన్న ఈ నిర్ణయంపై అధికారికంగా రాష్ట్ర పోలీసు కార్యాలయం ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. దీనికి సంబంధించి సోషల్ మీడియాతో పాటు పలు న్యూస్ చానళ్లలో ప్రసారమైన కథనాలపై స్పందించడానికి అధికారులు నిరాకరించారు. దీనిపై రాష్ట్ర పోలీసు శాఖ ముఖ్య కార్యాలయాన్ని సంప్రదించగా... ఆ జాబితా అనధికారికమని, దానిపై అధికారికంగా ఎలాంటి స్పందనా ఉండదని పేర్కొనడం గమనార్హం. -
అవినీతి ఖాకీలు...!
-
అవినీతి ఖాకీల జాబితా.. తీవ్ర కలకలం!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీసుశాఖలో అవినీతి ఖాకీల జాబితా తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని అతినీతిపరులైన పోలీసులు వీరేనంటూ తాజా జాబితా విడుదల చేయడం వైరల్ అవుతోంది. పోలీసు స్టేషన్ల వారీగా అవినీతిపరులైన పోలీసుల జాబితాను రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి విడుదల చేశారు. స్టేషన్ల వారీగా 391మంది పేర్లను ఈ జాబితాలో పేర్కొన్నారు. అత్యధికంగా 40మంది అవినీతి పోలీసులతో సూర్యాపేట ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. రాచకొండలో 24మంది, వికారాబాద్‌లో 27మంది, భద్రాద్రిలో 35మంది అవినీతి ఖాకీలు ఉన్నట్టు డీజీపీ కార్యాలయం తన నివేదికలో తెలిపింది. నిజామాబాద్‌లో 29మంది, సంగారెడ్డిలో 25మంది, కరీంనగర్లో 34మంది అవినీతిపరులైన పోలీసులు ఉన్నారు. అవినీతిపరుల జాబితాలో అత్యధికంగా కానిస్టేబుల్సే ఉన్నారు. ఉద్యోగం చిన్నదైనా కొందరు హోంగార్డ్స్ అవినీతిలో దూసుకుపోతున్నారు. ఇక నాలుగు జిల్లాల్లో అవినీతిపరులైన ఖాకీలే లేరని ఈ నివేదికలో పేర్కొనడం గమనార్హం. భూపాలపల్లి, జనగాం, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పోలీసుల అవినీతి సున్నా అని పోలీసు పెద్దలు తేల్చారు. కిందిస్థాయి పోలీసు ఉద్యోగులే అవినీతిపరుల జాబితాలో ఎక్కువగా ఉన్నారు. ఒక్క ఎస్సై పేరు కూడా లేకుండా ఈ జాబితాను డీజీపీ కార్యాలయం రూపొందించడం విస్మయ పరుస్తోంది. ఒక్క ఎస్సై, అంతకుపైస్థాయి అధికారి పేరు లేకుండా పోలీసు పెద్దలు జాబితా రూపొందించారు. 391మంది ఖాకీలు మామూళ్లు రాబడుతూ.. వసూళ్ల దందా చేస్తూ అవినీతికి పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశాలు జారీచేశారు. -
బయోడేటా కాదు.. బ్యాలెన్స్ షీటు ముఖ్యం..!
సాక్షి, విశాఖపట్నం : నోట్లకు ఓటు వేయడం అంటే అవినీతికి లైసెన్స్ ఇవ్వడమేనంటూ మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని చూస్తే గుండే ఆగిపోయే పరిస్థితి నెలకొందని, ఈ ప్రభావం వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై కూడా పడే అవకాశం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ రాజకీయ పార్టీ తమ సిద్ధాంతాలు, ప్రజల పట్ల అంకితభావం గల వారిని కాకుండా కేవలం 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగే వారినే అభ్యర్థులుగా నిలబెడుతున్నాయంటూ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే బయోడేటా కాకుండా బాలన్స్ షీట్ చూపించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇలా ఓటుకు కోసం నోట్లు పంపిణీ చేసే నేతలు నిజాయితీగా పనిచేస్తారని ఆశించడం ప్రజల పొరపాటే అవుతుందని.. అందుకే ‘మార్పు అనేది ప్రజల నుంచే ప్రారంభం కావాలని, అధికార పార్టీలు మారితే ప్రయోజనం ఉండబోదు’ అన్న లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మాటలను రామకృష్ణ ఉటంకించారు. రాజకీయ వ్యభిచారం జరుగుతోంది... తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకుల్లో, ఏటీఎంలలో నగదు లభించడం లేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్న రామకృష్ణ.. ‘వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసమే 2 వేల కోట్ల రూపాయలను ఇక్కడున్న రాజకీయ నాయకులు రహస్య స్థావరాలకు తరలించారని’ ఒక కేంద్రమంత్రి స్వయంగా చెప్పారంటే రాజకీయ వ్యభిచారం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. డబ్బు సంపాదించడం కోసం అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు ఎంతటి ద్రోహులో.. నోట్లు తీసుకుని ఓటు వేసే ప్రజలు సైతం అంతటి ద్రోహులేనంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవినీతి పెరుగుతూనే ఉంది.. ఒక సర్వేలో భాగంగా.. గత నాలుగేళ్లలో అవినీతి పెరిగినట్లు 65 శాతం మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారని రామకృష్ణ తెలిపారు. ఏసీబీ అధికారులు చిన్న చిన్న ఉద్యోగులపై కేసులు నమోదు చేస్తున్నారే గానీ.. భారీ అవినీతి తిమింగళాలను ఏమీ చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడితే తప్ప గెలవలేని పరిస్థితులు ఉన్నంతకాలం అవినీతి లేని పాలన అందించడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. ఈ రోజుల్లో అన్నింటా విజృంభిస్తున్న అవినీతికి సాధారణ ప్రజలే కారణమని పేర్కొన్నారు. విద్యార్థి నాయకులే రాజకీయాల్లోకి.. గతంలో విద్యార్థి నాయకులుగా ఉన్నవారే తదుపరి రాజకీయాల్లో మేటి నాయకులుగా ఎదిగేవారని రామకృష్ణ అన్నారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, సీఎం కేసీఆర్ వంటి వారు ఆవిధంగానే రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని పేర్కొన్నారు. ధన రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, ప్రజలు పోరాటం చేయలేని పక్షంలో పారిశ్రామిక వేత్తలే రాజకీయ పార్టీలను సొంతం చేసుకునే ప్రమాదం ఉందని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాసేవకు కాకుండా అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా రాజకీయాలను భావించడం దురదృష్టకరమైన విషయమని రామకృష్ణ విచారం వ్యక్తం చేశారు. -
‘అంచనాలకు’ మించి అవినీతి!
సాక్షి, పెద్దపల్లి : భూసేకరణలో అంచనాలు భారీగా పెంచి అక్రమాలకు పాల్పడ్డ ఆర్డీవో వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. అంచనాలకు మించి అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేలుతోంది. వేలు, లక్షలు కాదు ఏకంగా కోట్లాది రూపాయలకు ఎసరుపెట్టిన అధికారుల తీరు ఆశ్చర్యపరుస్తోంది. ప్రభుత్వానికి సరెండర్ చేసిన పెద్దపల్లి ఆర్డీవో అశోక్‌కుమార్ ఉదంతమే జిల్లాలో భూసేకరణలో భారీ కుంభకోణాలకు సజీవ తార్కాణంగా నిలుస్తోంది. లక్షలాది ఎకరాల భూ సేకరణ కాళేశ్వరం ప్రాజెక్ట్, సింగరేణి విస్తరణలో భాగంగా జిల్లాలో లక్షలాది ఎకరాల భూసేకరణ అవసరం పడింది. కమాన్‌పూర్, రామగిరి, మంథని, రామగుండం మండలాల పరిధిలో సింగరేణి ఓసీపీల నిర్మాణానికి వేలాది ఎకరాల భూమిని సేకరించారు. ఇప్పటికీ అక్కడక్కడా భూసేకరణ కొనసాగుతూనే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జిల్లాలోనే అధికభాగం జరుగుతోంది. సుందిళ్ల, అన్నారం, గోలివాడ, మేడారంలలో బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, సొరంగమార్గాలు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాల కోసం వేలాది ఎకరాల భూసేకరణ ఏళ్లుగా సాగుతోంది. దాదాపు పూర్తయింది. అధికారుల చేతివాటం లక్షలాది ఎకరాల భూసేకరణ చేతిలో ఉండడంతో సంబంధిత అధికారుల చేతివాటాన్ని ప్రదర్శించడం మొదలెట్టారు. వీఆర్వో, తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలో అధికారులు అంచనాలు పెంచి పరిహారంలో వాటాలు తీసుకున్నట్లు సంవత్సరాలుగా ఆరోపణలున్నాయి. పెద్దపల్లి ఆర్డీవో అశోక్‌కుమార్ వ్యవహారంతో అవి నిజమని తేలాయి. భూ నిర్వాసితులకు చెల్లించే పరిహారంలో వాటాలు కోరడం ఇక్కడ మామూలే. మామూళ్లు ఇస్తేనే పరిహారం వచ్చేట్లు చేయడం, లేదంటే చెప్పులరిగేలా తిరిగినా పరిహారం ఇవ్వకపోవడం బహిరంగరహస్యమే. ఇదంతా ఒక ఎత్తయితే ముందే ఒప్పందం చేసుకొని అంచనాలను భారీగా పెంచి కొంతమంది పెద్దలు వాటాలు పంచుకున్నారు. ఇందుకోసం ఏజెంట్ల వ్యవస్థను సృష్టించారు. ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల గండికొట్టారు. రూ.2 కోట్ల నుంచి రూ.25 కోట్లు జిల్లాలో భూసేకరణ, పరిహారం చెల్లింపులో జరుగుతున్న అవినీతి భాగోతం ఏరకంగా ఉందో రామగిరి మండలం జల్లారం ఉదంతం చూస్తే అర్థమవుతుంది. సింగరేణి భూసేకరణలో భాగంగా జల్లారంలో వ్యవసాయభూమికి రూ.2 కోట్లు పరిహారంగా చెల్లించాల్సి ఉండగా, ఇంటిస్థలాలుగా చూపి ఏకంగా రూ.25 కోట్ల పరిహారం కాజేయడానికి రంగం సిద్దం చేశారు. దీనికోసం ఆ ప్రాంతంలో కొంతమంది ఏజెంట్లును ఏర్పాటు చేసుకొని, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. జల్లారంతో పాటు గోలివాడ, మేడారంలలో భూసేకరణలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈ మొత్తం తతంగంలో కోట్లాది రూపాయలు స్వాహా చేయడానికి రంగం సిద్దం కావడం, అధికారుల విచ్చలవిడి అవినీతికి అద్దం పడుతోంది. భూసేకరణలో అక్రమాలకు కలెక్టర్ శ్రీదేవసేన చెక్ పెట్టారు. పెద్దపల్లి ఆర్డీవో అశోక్‌కుమార్ వ్యవహారంలో తీగలాగి డొంకను కదిలించారు. ఆర్డీవోపై గత కలెక్టర్ల హయంలోనూ ఆరోపణలు రాగా, అప్పుడు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జల్లారంలో అంచనాలు భారీగా రూ.25 కోట్లకు పెంచడంతో, విచారణకు ఆదేశించిన కలెక్టర్, మిగిలిన కుంభకోణాలకు కూడా వెలికితీయగలిగారు. ధర్మారం మండలంలోని చామనపల్లి, మల్లారం, సాయంపేట, మేడారం నిర్వాసితులకు జిల్లా కలెక్టర్ రూ.23 కోట్ల 91 లక్షల 57 వేల 875 ఆమోదించగా, రూ.5,74,13,826 అదనంగా, మొత్తం రూ.29,65,71,701 ఆర్డీవో పరిహారంగా చెల్లించారు. అలాగే అంతర్గాం మండలం గోలివాడలో అనర్హులు 45 మందికి రూ.1 కోటి 02 లక్షల 12 వేలు చెల్లించారు. ఈ మూడు వ్యవహారాల్లో అవినీతి అక్రమాలకు బాధ్యుడు కావడంతో ఆర్డీవో అశోక్‌కుమార్‌పై వేటువేసినట్లు కలెక్టర్ తెలిపారు. అవినీతిలో మరింతమంది భూసేకరణలో అంచనాలు పెంచి అక్రమాలకు పాల్పడిన వ్యవహారం సంచలనం సృష్టిస్తుంటే, ఇలాంటి వ్యవహారాల్లోనే మరికొంతమంది రెవెన్యూ అధికారులున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రధానంగా రామగుండం, ధర్మారం, మంథని ప్రాంతాల్లోని రెవెన్యూ అధికారులు జల్లారం స్థాయిలో కాకున్నా, అంచనాలు పెంచి వాటాలు అందుకున్నట్లు అధికారిక వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. భూసేకరణ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి కలెక్టర్ సంకల్పంతో ఉండడంతో, ఈ అవినీతి అధికారుల వ్యవహారం కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది. -
పేరు మార్చడానికి పది వేలు
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని టి.నరసాపురం మండలం బండివారిగూడెం గ్రామంలో ప్రవల్లిక అనే మహిళ వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. స్థానికులైన కూరం పోతురాజు అల్లుడు శ్రీనివాస్ పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మార్పుకు ఆమె వద్దకు వెళ్లాడు. పేరు మార్చడానికి వీఆర్వో ససేమిరా కాదన్నారు. మరలా వెళ్లి ఆమెను కలవగా పది వేలు డిమాండ్ చేయటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో శ్రీనివాస్ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ పక్కా పథకం ప్రకారం సోమవారం ప్రవల్లికను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరింత సమాచారం రాబట్టడం కోసం ఏసీబీ అధికారులు టి.నరసాపురం తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు -
ఖాకీలకు అవినీతి మరక
రాజమహేంద్రవరం క్రైం: పోలీస్స్టేషన్లు సెటిల్మెంట్లకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసులు నమోదు చేసి కోర్టుకు పంపకుండా తమ స్వలాభం కోసం హౌస్ ఆఫీసర్లు ఇరువర్గాల వద్ద లంచాలు గుంజుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని దాదాపు ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సెటిల్మెంట్లు ఎక్కువగా కొనసాగుతున్నాయి. దీనికి తోడు స్థానిక రాజకీయ నేతల అంగీకారం లేనిదే ఆ నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లో హౌస్ ఆఫీసర్ విధులు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించాలంటే ఆయా నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకొని అనంతరం వారు చెప్పిన రేటు చెల్లించిన తరువాత పోస్టింగ్‌లు తీసుకోవలసి వస్తుందని పోలీస్ అధికారులే బహిరంగంగా చెబుతున్నారు. ఇలా చెల్లించిన మొత్తాన్ని రాబట్టుకోవాలని కొందరు పోలీస్ అధికారులు లంచాలకు పాల్పడుతున్నారు. ఏసీబీకీ చిక్కిన సౌత్‌జోన్ డీఎస్పీ అలాగే 2017 మే 31వ తేదీన రాజమహేంద్రవరం రూరల్, రాజవోలు గ్రామానికి చెందిన పాస్టర్ తాడికొండ విల్సన్ కుమార్, సామర్లకోటకు చెందిన కీర్తిప్రియ అనే మహిళ వద్ద ఇల్లు కొన్నాడు. ఇంటి అగ్రిమెంట్ చేసుకున్న తరువాత కీర్తిప్రియ ఇంటికి మరికొంత ఎక్కువ సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26వ తేదీన విల్సన్ కుమార్‌పై కీర్తిప్రియ ధవళేళ్వరం పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ కేసులో సౌత్‌జోన్ డీఎస్పీ నారా యణరావు, కీర్తిప్రియ వద్ద లంచం తీసుకొని వారికి అనుకూలంగా కేసు రాజీ చేసుకునే విధంగా విల్సన్ కుమార్‌పై వత్తిడి తెచ్చాడు. రూ.ఏడు లక్షల నష్టానికి విల్సన్, కీర్తిప్రియతో రాజీ చేసుకున్నాడు. కేసు రాజీ కుదుర్చుకున్న అనంతరం సౌత్‌జోన్ డీఎస్పీ పి.నారాయణరావు తన వద్ద ఉన్న కానిస్టేబుల్ రమేష్‌తో ఫోన్లు చేయిస్తూ రాజీ కుదుర్చుకున్న తరువాత తనకు రావలసిన వాటా రూ.2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో విల్సన్ కుమార్ రూ.50 వేలు డీఎస్పీకి, రూ.5 వేలు కానిస్టేబుల్ రమేష్‌కు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనిపై బాధితుడు విల్సన్ కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయంలో రూ.55 వేలు కానిస్టేబుల్ రమేష్‌కు ఇస్తుండగాఏసీబీ అధికారులు మే 31వ తేదీ గురువారం రాత్రి వలపన్ని పట్టుకున్నారు. ఈ లంచం కానిస్టేబుల్ రమేష్‌కు ఇవ్వాలని చెప్పి బయటకు వెళ్లిపోతున్న సౌత్‌జోన్ డీఎస్పీ పి.నారాయణరావును గేటు వద్ద అరెస్ట్ చేశారు. పోలీస్ శాఖలో కింది నుంచి పై స్థాయి వరకూ అవినీతి మయంగా మారింది. కొందరు అవినీతి పోలీస్ అధికారుల వలన మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. పట్టుబడిన పోలీస్ అధికారులు వీరే అవినీతికి పాల్పడుతూ పోలీస్ అధికారులు ఏసీబీకీ చిక్కుతున్నారు. 2016 మార్చి 15వ తేదీన రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఏఎస్సై రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అలాగే 2016 డిసెంబర్ 12వ తేదీన అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న జక్కి నాగేశ్వరరావు, హోమ్ గార్డు గంటి శ్రీనివాసరావు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవనిగడ్డ టెంపోరావుకు చెందిన ఒక కేసు విషయంలో రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. 2017 ఫిబ్రవరి 22వ తేదీన ద్రాక్షారామ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్న ఫజల్ రహ్మన్, రామచంద్రపురం మండలం కాపవరం గ్రామానికి చెందిన యనమదల భరత్ వద్ద ఒక కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడానికి, చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రెడ్ హేండెడ్‌గా చిక్కాడు. -
యోగిపై సొంత ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
లక్నో : కైరానా లోక్‌సభ ఉపఎన్నికలో విపక్షాల చేతిలో బీజేపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. పార్టీలోని అంతర్గత కలహాల వల్లే బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని కూడా వార్తలు వ్యాప్తి చెందాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ హర్దోయి ఎమ్మెల్యే శ్యామ్ ప్రకాశ్ సొంత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘అధికారులంతా అవినీతికి పాల్పడుతున్నారు. రైతులు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కలిగి ఉన్నారు. ఇలాంటి ఇంకెన్నో కారణాల వల్లే మేం ఓటమి చవిచూడాల్సి వచ్చింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం అన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోయిందంటూ శ్యామ్ ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కైరానా ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేస్తూ తన ఫేస్బుక్ పేజీలో ఒక పద్యం కూడా పోస్ట్ చేశారు. ‘మోదీ హవా కారణంగానే మీకు అధికారం దక్కించుకోగలిగారు గానీ ప్రజల మనసుల్ని గెలవలేకపోయారు. పగ్గాలు సంఘ్ చేతిలో ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రైనా నిస్సహాయులుగా మారారు. అధికారులు అవినీతిలో కూరుకుపోయారు. దాంతో ప్రజలు, ప్రజాప్రతినిధులు విసుగెత్తిపోయారు. ప్రభుత్వం గాడి తప్పింది. పాలన విఫలమైంది’ అంటూ సాగిన పద్యానికి తెలివైన వారికి ఇందులో కావాల్సిన సమాధానం దొరుకుతుందంటూ శ్యామ్ ప్రకాశ్ ముగింపునిచ్చారు. -
మైనర్ తిరకాసు
నంద్యాల: ఎన్నికలు వచ్చే సమయానికి ఆర్థికంగా బలోపేతం కావాలన్న టీడీపీ నేతల ఆలోచన..భారీ అక్రమాలకు తెరతీస్తోంది. ఇందుకు నంద్యాల డివిజన్లో జరుగుతున్న నీరు– చెట్టు పనులనే ఉదాహరణగా చెప్పవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా మేజర్ ఇరిగేషన్ శాఖ పరిధిలోని పనులను మైనర్ ఇరిగేషన్ ఈఈకి అప్పగించారు. తెలుగుగంగ, కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీల్లో వైఎస్సార్సీపీ నాయకులు ఉండడంతో వారికి పనులు దక్కనీయకుండా టీడీపీ నేతలు పక్కా వ్యూహం రచించారు. జిల్లా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి..ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి లైన్ క్లియర్ చేసుకున్నారు. నంద్యాల డివిజన్ పరిధిలో మూడేళ్లుగా నీరు–చెట్టు పనులు జరుగుతున్నాయి. వీటిని అధికార పార్టీకి చెందిన వారే చేస్తున్నారు. మైనర్ ఇరిగేషన్లో నంద్యాల డివిజన్లో సుమారు 5 వేలకు పైగా పనులు మంజూరు చేయించుకున్నారు. ఆ శాఖ ఆధ్వర్యంలో కుంటలు, చెరువుల పూడికతీత వంటి పనులు చేయాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా కేసీ కెనాల్, తెలుగుగంగకు చెందిన పనులు ఆ శాఖకు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్టులకు 12మంది ఈఈలు ఉన్నారు. ఈ అధికారులకు ఒక్కొక్కరికి 200 పనులు కూడా లేవు. అయితే మైనర్ ఇరిగేషన్లో ఒక్క ఈఈకే రూ.500 కోట్ల పనులు అప్పగించారు. ఇప్పటికే కుందూ పనులు చేస్తున్న మైనర్ ఇరిగేషన్ అధికారులు ఇవి చాలవన్నట్లు కేసీ కెనాల్ ఆయకట్టు పనులు కూడా దక్కించుకున్నారు. కేసీ కెనాల్, తెలుగుగంగలో పని చేస్తున్న ఈఈలు, డీఈలు, ఏఈలు పనులు లేక గోళ్లు గిల్లుకుంటుంటే మైనర్ ఇరిగేషన్ అధికారులేమో ఐదువేల పనులతో తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. పని తక్కువ.. ఆదాయం ఎక్కువ.. పని తక్కువ ఉండటం, ఆదాయం ఎక్కువగా ఉండటంతో అధికార పార్టీ నాయకుల కన్ను కుందూ వెడల్పు పనులపై పడింది. ఈ పనులు కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీకి అప్పగించాలి. అలా చేస్తే నీటి సంఘాల అధ్యక్షులకు ఈ పనులు ఇవ్వాల్సి వస్తుంది. నంద్యాల డివిజన్లో అధికంగా నీటి సంఘాల అధ్యక్షులు వైఎస్సార్సీపీకి చెందినవారే ఉన్నారు. వీరికి ఈ పనులను మైనర్ ఇరిగేషన్‌కు అప్పగించారు. ప్రస్తుతం జన్మభూమి కమిటీ సభ్యులు చేస్తున్నారు. సుమారు రూ.50కోట్ల పనులు జరుగుతుండగా..ఒక్కో పనికి 75 మీటర్ల చొప్పున రూ.8లక్షల నుంచి రూ.10లక్షల వరకు కేటాయిస్తున్నారు. ప్రొక్లెయిన్‌తో ఈ పనిని ఒక్కరోజులో చేసేస్తున్నారు. ఎక్కువ చేసినా ఇసుక వస్తుందనే ధైర్యంతో పనులు సాగిస్తున్నారు. తప్పుదోవ.. టీడీపీ నేతల సూచన మేరకు..నంద్యాలలోని మైనర్ ఇరిగేషన్ శాఖకు చెందిన ఓ కీలక అధికారి జిల్లా ఉన్నతస్థాయి అధికారులను తప్పుదోవ పట్టించారు. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను మైనర్ శాఖలో కూపారు. ఇప్పటికే ఈ అధికారి నీరు–చెట్టు పనుల్లో కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో పని చేసిన ఈ శాఖకు చెందిన అధికారి ఈ సీటు కోసం రూ.5కోట్లు ఖర్చుపెట్టడానికి కూడా సిద్ధపడినట్లు సమాచారం. అంతేకాకుండా తాను బదిలీ అయిన స్థానంలో ఇంకా జాయినింగ్ రిపోర్టు తీసుకోలేదంటే ఈ శాఖలో ఎంత అవినీతి జరుగుతుందో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. -
చిన్న చేపలే దొరికాయి
కొలంబో: గత వారం వెలుగులోకి వచ్చిన గాలే స్టేడియం పిచ్ ఫిక్సింగ్పై శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ స్పందించారు. ఈ ఉదంతంలో చిన్న చేపలే బలయ్యాయని... పెద్ద చేపలు తప్పించుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీలంక ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరిస్తున్న రణతుంగ... తమ దేశ క్రికెట్లో అవినీతి తారస్థాయికి చేరిందని, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఘటనలను నిరోధించడంలో ఐసీసీ విఫలమైందంటూ తీవ్రంగా విమర్శించారు. ఇలాంటివి చాలాకాలంగా సాగుతున్నాయని... వీటిపై తప్పనిసరిగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆల్ జజీరా చానెల్ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో గాలే టెస్టులో పిచ్ ట్యాంపరింగ్‌తో పాటు భారత్–ఇంగ్లాండ్, భారత్–ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టుల్లో స్పాట్ ఫిక్సింగ్ చోటుచేసుకున్నట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. దీనిపై ఐసీసీ విచారణ సైతం చేపట్టింది. మరోవైపు గాలే పిచ్ విషయంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఓ శ్రీలంక ఆటగాడు, సస్పెన్షన్‌కు గురైన గ్రౌండ్స్‌మన్ తరంగ ఇండికా, జిల్లా కోచ్ తరిందు మెండిస్‌లు చాలా చిన్నవారని రణతుంగ వివరించారు. ‘ఇందులో ఓ పెద్ద వ్యక్తి ప్రమేయం ఉంది. అతడిపై చర్యలు తీసుకోవాలి. ఇంత జరుగుతున్నా ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఏం చేస్తోంది? ఇలాంటివి అరికట్టలేకపోతే వారెందుకు? అందుకే కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రతిష్ఠ దెబ్బతింటోంది’ అంటూ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా శ్రీలంక క్రికెట్ చీఫ్‌గా తిరంగా సుమతిపాల హయాంలో వచ్చిన ఆరోపణలనూ ప్రస్తావించారు. ఐసీసీ ఇకపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. రణతుంగ... భారత్–శ్రీలంక మధ్య జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ అయిందంటూ గతేడాది ఆరోపణలు చేశారు. -
వామ్మో.. ఈశ్వరమ్మ!
సూళ్లూరుపేటరూరల్: క్యామెల్ సేవా సంస్థతో రూ.కోట్లు కాజేసిన సూళ్లూరుపేట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గరిక ఈశరమ్మ అవినీతి, అక్రమాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే నాబార్డు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను మోసగించి రూ.9.21 కోట్ల రుణం పొందారు. అందులో రూ.7.08 కోట్లు తిరిగి చెల్లించని కారణంగా నాబార్డు సంస్థ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధికారుల సాయంతో ఈశ్వరమ్మపై కేసు పెట్టడం, ఈ కేసులో ఆమెను మాజీ మంత్రి పరసా వెంకటరత్నం పోలీస్ కస్టడీ నుంచి తప్పించడం తెలిసిందే. తాజాగా మెప్మా ద్వారా మరుగుదొడ్ల సొమ్మును కాజేసినట్లు వెలుగులోకి వచ్చింది. దేవాలయం భూములను పట్టాలుగా ఇప్పిస్తానని అంకణానికి ఇంత చొప్పున వసూలు చేసిన విషయం వెలుగు చూసింది. ఆత్మగౌరవం అభాసుపాలు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ అని, రాష్ట్ర ప్రభుత్వంఆత్మగౌరవమని పేర్లు పెట్టి పేదలకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించే పథకానికి శ్రీకారం చుట్టితే ఈశ్వరమ్మ ఆ పథకాన్ని అభాసుపాల్జేసింది. సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని 16వ వార్డులో ఈశ్వరమ్మ మరుగుదొడ్లు నిర్మించే బాధ్యతను భుజానకెత్తుకుంది. ఈ పథకంలో ఒక్కో మరుగుదొడ్డికి ప్రభుత్వం రూ.15 వేలను మూడు విడతలుగా విడుదల చేసింది. నాగరాజపురం, వేనాటి మునిరెడ్డి లెప్రసీ కాలనీ, కాలువకట్ట గిరిజనులకు మొత్తం 68 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. పురపాలక సంఘ పరిధిలోని పొదుపు సమాఖ్య నాయకుల జాయింట్ అకౌంట్లో దీనికి సంబంధించిన సొమ్ము జమ అయ్యేది. ఈశ్వరమ్మ ఆ సమాఖ్య నాయకుల సహకారంతో సొమ్ము మొత్తం స్వాహా చేసింది. కానీ మరుగుదొడ్లు మాత్రం నిర్మించిన దాఖలాలు లేవు. లెప్రసీ కాలనీలో మరుగుదొడ్ల నిర్మాణానికి తెచ్చిన సిమెంట్ ఇటుకలను మళ్లీ తీసుకెళ్లి పోయింది. దీంతో ఆ కాలనీలోని 33 ఇళ్లకు ఒక్క మరుగుదొడ్డి కూడా నిర్మితం కాలేదు. గిరిజనకాలనీలో మరుగుదొడ్లు కట్టించిన దాఖలా లేదు. నాగరాజపురంలో చాలా మందికి కేవలం రూ.5 వేలు మాత్రమే చెల్లించింది. కొందరు తమ సొంత సొమ్ముతో మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్దేశం పక్కదారి పట్టింది. ఈ వ్యవహారంపై పురపాలక సంఘం ఏఈ ప్రవీణ్ మాట్లాతూ వెంటనే విచారణ జరిపిస్తామన్నారు. దేవాలయ భూములకు పట్టాలిప్పిస్తానని.. సూళ్లూరుపేటలోని నాగరాజపురంలో తడ మండలం వాటంబేడు శివాలయానికి చెందిన దేవుడి మాన్యం ఉంది. ఈ స్థలాన్ని చాలా మంది ఆక్రమించుకుని పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. వాటిల్లో క్యామెల్ సేవా సంస్థకు చెందిన రెండు పెద్ద భవనాలు కూడా ఉన్నాయి. దీంతో ఈశ్వరమ్మ ఇక్కడ ఆక్రమించుక్ను స్థలాలకు ప్రభుత్వం నుంచి పట్టా తెప్పిస్తానని మాయమాటలు చెప్పి స్థానికుల నుంచి ఒక్కో అంకణానికి రూ.100 చొప్పున సొమ్ము వసూలు చేసింది. ఏళ్లు గడుస్తున్నా ఇక్కడున్న వారిలో ఎవరికీ పట్టాలు వచ్చిన దాఖలాలు లేవు. అంధులనే కనికరం కూడా లేదు వీరిద్దరూ కళ్లు కనిపించని వృద్ధులు. ఈమె పేరు ఊరుబిండి శ్రీనివాసన్, చెల్లమ్మ దంపతులు. వీరికి పిల్లు లేరు. వీరికి 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం లెప్రసీ కాలనీలో ఇంటి స్థలం పట్టా ఇచ్చింది. వీరికి నేటికీ పక్కా ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు. ఇంత కాలం వీరు పరదా కప్పిన గుడిసెలో జీవిస్తూ వచ్చారు. ప్రస్తుతం సూళ్లూరుకు చెందిన బూదూరు వెంకటయ్య అనే బేల్దారి మేస్త్రీ తన సొంత ఖర్చులతో రేకుల ఇల్లు కటిస్తున్నాడు. శ్రీనివాసన్ దంపతులు వారానికి ఒక్కసారి సబ్ అర్బన్ రైల్లో చెన్నైకు వెళ్లి దేవాలయాల ముంగిట భిక్షమెత్తుకుంటారు. ఆ వచ్చిన డబ్బులతో వీరు కాలం వెల్లదీస్తున్నారు. అలాంటి వీరికి మరుగుదొడ్డి అవసరమైన సౌకర్యం. ఈశ్వరమ్మ వీరికి దొడ్డి కట్టిస్తానని ఇటుక రాళ్లను ఇంటి ముందు దించింది. కొన్ని రోజుల తర్వాత వాటిని తీసుకెళ్లి పోయింది. దీంతో నేటికీ ఈ ముసలి వారు పక్కనున్న కాళం గి నదినే ఆశ్రయిస్తూ కాలం గడుపుతున్నారు. -
ఒకే ఒక్కడు..రూ. వంద కోట్లు
శ్రీశైల క్షేత్రంలో మాస్టర్‌ప్లాన్ అమలులో భాగంగా చేపట్టిన రూ. కోట్ల అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతలు కాంట్రాక్ట్ ఇంజినీర్లకు అప్పగింతలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్ర పరిధిలో దాదాపు రూ. 150 కోట్ల పనులు చేపట్టగా ఒక ఏఈఈకి రూ. వంద కోట్ల పనుల బాధ్యతలు అప్పగించడం చూస్తుంటే ఏదో రహస్యం దాగి ఉందా అంటే.. అవుననే సమాధానం వస్తోంది. ఓ రాజకీయ నేత, రాష్ట్ర స్థాయి అధికారి అండదండలతో ఆయన ఇంజినీర్ విభాగంలోనే కీలకంగా మారారు. పనుల నాణ్యత గాలికొదిలేసి..కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతూ అక్రమార్జనకుపక్కా ప్లాన్ గీశారు. శ్రీశైలం టెంపుల్: భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ఇంజినీర్ విభాగం కీలకం. ఇంజినీంగ్ విభాగంలో ఈఈ, డీఈ ఏఈఈలు ఉండగా ప్రధానంగా ఏఈఈ (అస్టిసెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్)లు పనుల పర్యవేక్షణ చేస్తుంటారు. పనులకు సంబంధించి వీరు ప్లాన్ రూపొందించడం నుంచి కొలతలు, ఎస్టిమేషన్, డ్రాయింగ్ వేయాల్సి ఉంటుంది. శ్రీశైల దేవస్థానం అభివృద్ధిలో భాగంగా 8 మంది కాంట్రాక్ట్ ఏఈఈలను దేవదాయ శాఖ నియామకం చేసింది. వీరిలో ఏడుగురు దాదాపు రూ. 50 కోట్ల పనులు పర్యవేక్షిస్తుండగా, ఒక ఏఈఈ మాత్రం రూ.వంద కోట్ల పనులు పర్యవేక్షిస్తుండటంతో పలు అనుమానాలకు తావ్విస్తోంది. గుంటూరు జిల్లా నరసారావు పేటకు చెందిన ఆయనకు ఆ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత సిఫారసు మేరకు ఇక్కడ ఉద్యోగం వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో నరసారావుపేట మున్సిపాల్టీలో పని చేసే సమయంలో కూడా ఆయనపై పలు ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. శ్రీశైల క్షేత్ర పరిధిలో చేపట్టిన పనుల్లో అధికార పార్టీ నేతకు చెందిన ఓ కాంట్రాక్ట్ సంస్థ భారీ పనిని దక్కించుకుంది. ఆ పనిని పర్యవేక్షించడానికి ఆ ఉద్యోగికే బాధ్యతలు అప్పగించారు. ఇలా క్షేత్రంలో జరిగే పనుల్లో అధిక శాతం ఆయనకు అప్పగించడం వెనుక దేవస్థానం ఉన్నతాధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముగ్గురు అనర్హులు? 2013 మార్చిలో అప్పటి ఈఓ ఆజాద్ సమయంలో ఐదుగురు ఒప్పంద ఏఈఈలను తీసుకున్నారు. వారి మూడేళ్ల కాల పరిమితి ముగియడంతో కోర్టును ఆశ్రయించారు. దేవస్థానంలో ఏఈఈలుగా అవసరం ఉంటే వారికి ప్రా«ధాన్యత కల్పించాలని కోర్టు సూచించినా దేవదాయ శాఖ పట్టించుకోలేదు. 2017 మార్చి నెలల్లో భవన్‌కుమార్, రాజారామ్, ప్రణయ్, విష్ణుబాబు, ఆనంద్, సురేష్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, ప్రవళికను కాంట్రాక్ట్ పద్ధతిపై ఐదేళ్ల కాల పరిమితితో తీసుకున్నారు. కాగా వీరిలో ముగ్గురు పరీక్షలో ఉత్తీర్ణత కాకపోయినా రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు విధుల్లోకి తీసుకున్నట్లు సమాచారం. పనులపై పర్యవేక్షణ తప్పనిసరి శ్రీశైల క్షేత్రపరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పర్యవేక్షణ ఉంది. పనుల్లో నాణ్యత ఉండేలా చూస్తున్నాం. దేవస్థానం పరిధిలో 8 మంది ఏఈఈలు, ఇద్దరు డీఈలు, ఈఈ రామిరెడ్డి పర్యవేక్షణలో పనులు సాగుతున్నాయి. ఒక ఏఈఈకి రూ.100 కోట్ల పనులు అప్పగించడం పై స్థాయి అధికారుల నిర్ణయం మేరకే జరిగింది. – శ్రీనివాసరెడ్డి, డీఈ, శ్రీశైల దేవస్థానం -
‘హెచ్చుమీరుతున్న కోడెల కుటుంబ అవినీతి’
సాక్షి, విజయవాడ: స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కుటుంబ అవినీతిపై విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్ఎస్పీ గనులు, పశుగ్రాసం కొనుగోళ్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దానిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. కోడెల శివప్రసాద్ ట్యాగ్( కేఎస్టీ) పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 72 ప్యాకేజీల కింద పనులను విభజించి టెండర్లు నిర్వహించారని, తమకు అనుకూలమైన వారికే టెండర్ ఫారంలు ఇచ్చారని మండిపడ్డారు. కోడెల కుమారుడి నేతృత్వంలో అందరూ కలిసి రింగ్‌గా మారారని, 25 నుంచి 30 శాతం అధికంగా కోట్ చేశారన్నారు. 5 శాతం అధికం వేస్తే రివ్యూ కమిటీకి పంపుతారు.. కానీ అంతకన్నా అధికంగా వేసినా రివ్యూ కమిటీకి పంపలేదని తెలిపారు. టెండర్లు ఓపెన్ చేయకుండానే పనులు ఎలా ప్రారంభిస్తారని ఆయన ప్రశ్నించారు. నీటి పారుదల శాఖలో ఇది నిదర్శనమని, కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వంద కోట్ల పనుల్లో భారీగా అవినీతి జరుగుతోందన్నారు. మరో వైపు పశుగ్రాసం కొనుగోళ్లలోనూ అక్రమాలు జరిగాయన్నారు. 3500 ఎకరాల్లో గడ్డిని పెంచాలని, వాటిని కొనుగోలు చేయాలని నిర్ఱయించారన్నారు. పుశుసంవర్థక శాఖ ద్వారా టీడీపీ అనుయాయులు పేర్లతో గడ్డి కొనుగోళ్లు జరుపుతున్నారన్నారు. ఒక్కో ఎకరానికి ఇరవై వేల చొప్పున ఏడు కోట్ల రూపాయలు స్వాహా చేశారని తెలిపారు. అసలు ఏ రైతు తన పొలంలో గడ్డి పెంచారో చెప్పాలన్నారు. మొక్కజొన్న గడ్డలు, గడ్డి కలిపి సైలేజ్‌ను తయారు చేస్తున్నారని, కేంద్రం దీనికి 50 శాతం సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. కోడెల కుమార్తె విజయలక్ష్మి సైలేజ్ యంత్రాలను పెట్టి ఈ సబ్సిడీని కాజేస్తున్నారని వెల్లడించారు. పశువులు తినలేని సైలేజ్‌ను వీరు తయారు చేసి, బలవంతంగా రైతులకు అంటగడుతున్నారని మండిపడ్డారు. కోడెల కుటుంబం చేస్తున్న అవినీతి హెచ్చుమీరిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడుకు ఓ శాఖను, కుమార్తె ఓ శాఖను పంచుకుని అవినీతి పాల్పడుతున్నారని తెలిపారు. స్పీకర్‌గా ఉన్న కోడెల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. తన కుమార్తె, కుమారుడి అవినీతికి కోడెల బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. -
పశుగ్రాసం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగింది
-
ఆ..కేసు ఏమాయే?
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో సంచలనం సృష్టించిన దేవరకొండ సహకార బ్యాంకు బ్రాంచ్ అవినీతి అక్రమాల కేసు మరుగున పడింది. రూపాయి కాదు రెండు రూపాయలు కాదు.. ఏకంగా రూ.18 కోట్లు స్వాహా చేసినట్లు తేలింది. అక్రమాలు జరిగి ఆరేళ్లు గడిచినా నేటికీ నయాపైసా అక్రమార్కులనుంచి రికవరీ చేయలేదు. 2011 నుంచి 2013 సంవత్సరం వరకు మూడేళ్లు నిధులు పక్కదారి పట్టినా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో అక్కడి అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. చేయి కాలాకా..ఆకులు పట్టుకున్నట్లు..అంతా అయిపోయాక.. అక్రమార్కులపై పోలీస్ కేసులు నమోదు చేయించి సస్పెండ్ మాత్రం చేయించారు. ఇక..అంతటితోనే ఆపేశారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన ఉన్నతాధికారులు.. పక్కదారి పట్టినసొమ్మును మాత్రం రికవరీ చేయించలేదనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతిని ప్రోత్సహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధుల విషయంలో నిగ్గుతేల్చాల్సిన పాలకమండలి మాత్రం రెండు గ్రూపులుగా విడిపోయి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడంతోనే సరిపుచ్చుకుంటున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడేళ్లపాటు అక్రమాల పరంపర.. దేవరకొండ, తిమ్మాపూర్, మల్లెపల్లి, చిత్రియాల, డిండి, పీఏపల్లి, తవక్లాపూర్ సహకార సొసైటీల్లో 2011 నుంచి 2013 సంవత్సరం వరకు రుణాల మంజూరులో సిబ్బంది, అధికారులు చేతివాటం ప్రదర్శించారు. మొత్తంగా రూ.18 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంలో పాలకవర్గం, అధికారులు, రాష్ట్ర సహకార శాఖ కమిషనర్లు నాన్చుడు దోరణికి పాల్పడుతున్నారని గతంలో కొందరు డైరెక్టర్లు లోకాయుక్తాలో పిటిషన్ దాఖలు చేశారు. నాన్చుడు ధోరణికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమాలు వెలుగు చూసిన తొలుతలో దానికి బాధ్యుడిని చేస్తూ బ్రాంచ్ మేనేజర్‌ను సస్పెండ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన పాలకవర్గం.. తరువాత దానిపై అంత దృష్టి సారించలేదని ఆరోపణలు వచ్చాయి. అందరి ‘సహకారం’తోనే.. రూ.18 కోట్ల మేర జరిగిన అక్రమాలలో పాలకమండలి సభ్యులతో పాటు డీసీసీబీలో కీలకపాత్ర పోషిస్తున్న అధికారులకు కూడా సంబంధం ఉందనే అనుమానాలను పలువురు డైరెక్టర్లు వ్యక్తం చేసి ఆందోళన కూడా చేశారు. దీనికి పాలకవర్గం ఐదుగురు డైరెక్టర్లతో కూడిన ఫ్రాడ్ కమిటీని వేసి క్షేత్రస్థాయిలో విచారణ చేసి నివేదికను ఇవ్వాలని సూచించింది. కమిటీ దేవరకొండ, తిమ్మాపూర్, మల్లెపల్లి, చిత్రియాల, డిండి, పీఏపల్లి, తవక్లాపూర్ సొసైటీలలోని సభ్యులతోపాటు రుణాలను పొందినట్లు రికార్డులలో నమోదైన వారందరినీ విచారించింది. మొత్తం 17,91,44,139 రూపాయల మేరకు అక్రమాలు జరిగాయని తేల్చింది. ఆ నివేదికను డీసీసీబీకి అందించింది. అధికారులు, పాలకవర్గం అక్రమార్కులకు అండదండలు అందిస్తున్నారని, నాలుగేళ్లుగా అక్రమాలు జరుగుతుంటే పర్యవేక్షించిన అధికారులు చేసిన నిర్వాకం, సొమ్మును రికవరీ చేయడానికి బాధ్యులందరి ఆస్తులను అటాచ్ చేయాలని, వారిని ఉద్యోగాల నుంచి తప్పించి విచారణ చేయాలని పలు సందర్భాల్లో పాలకమండలి సమావేశాల్లో సభ్యులు ఆందోళన కూడా చేశారు. విచారణను సీబీఐకి గాని సీబీసీఐడీకి గాని అప్పగించాలని బోర్డు సమావేశంలో తీర్మానం చేసి పంపించినా ఫలితం లేకుండా పోయింది,. చివరకు కేసు రాష్ట్ర సహకార కమిషనర్ పరిధిలోకి రెండేళ్ల క్రితం వెళ్లింది. కానీ ఇప్పటివరకు కేసు.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందనే వాదన వినిపిస్తోంది. డీసీసీబీకి మాయని మచ్చ బాధ్యులనుంచి దుర్వినియోగం చేసిన ప్రజాధనాన్ని రికవరీ చేయడంలో ఎలాంటి పురోగతి లేదన్న ఆరోపణలను సహకార శాఖ ఎదుర్కొంటోంది. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు దేవరకొండ అక్రమాల కేసు చెరిపివేయలేని మచ్చని మిగిల్చింది. ఇప్పటికైన అధికారులు స్పందించి పక్కదారి పట్టించిన వారినుంచి ప్రజాధనాన్ని రికవరీ చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
అరాచక కూటమిపై పోరు: జైట్లీ
న్యూఢిల్లీ: త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ప్రధాని మోదీకి, ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న ‘అరాచక కూటమి’కి మధ్య ఉంటుందని కేంద్ర మంత్రి జైట్లీ అన్నారు. ఇటీవల కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న జైట్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్డీయే సర్కారుకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన ఆసుపత్రి నుంచే ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రాంతీయ పార్టీల కూటమి బీజేపీకి కాల్పనిక ప్రత్యామ్నాయమే తప్ప అసలైన ప్రత్యామ్నాయం కాబోదని జైట్లీ చెప్పారు. పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు, ఎన్నో తేడాలు ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటైనా.. ఆ కూటమి ఎక్కువ కాలం మనుగడ సాగించలేదన్నారు. ‘టీఎంసీ, డీఎంకే, టీడీపీ, బీఎస్పీ, జేడీఎస్ తదితర పార్టీలతో కలసి బీజేపీ గతంలో పనిచేసింది. వారు ఓ రోజు ఒక పార్టీకి మద్దతిస్తే మరుసటి రోజు మరో పార్టీకిస్తారు. 1996–98 మధ్య భారత్ ఫెడరల్ ఫ్రంట్లను చూసింది. అదొక విఫల విధానం’ అని జైట్లీ అన్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు కొన్ని జిల్లాలకే పరిమితమనీ, మరికొన్నింటికి రెండు మూడు రాష్ట్రాల్లో మాత్రమే ప్రాబల్యం ఉందన్నారు. కుంభకోణాల్లేని పాలనను అందించాం.. నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా తమ ప్రభుత్వ విజయాలను జైట్లీ వివరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గత నాలుగేళ్లలో అవినీతి కుంభకోణాలు లేని పాలనను అందించిందన్నారు. యూపీఏ కాలంలో ప్రపంచంలోనే అత్యంత బలహీన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్ పరిస్థితి నేడు ఎంతో మెరుగుపడిందన్నారు. శాసన, వ్యవస్థాగత మార్పుల ద్వారా మోదీ పారదర్శక విధానాలను తీసుకొచ్చారనీ, యూపీఏ కాలంలో లాగా కాకుండా ప్రస్తుతం పార్టీకి, దేశానికి ఒకరే నాయకుడు ఉన్నారని జైట్లీ అన్నారు. ప్రస్తుతం దేశం నిరాశ, నిస్పృహల నుంచి ఆశలు, ఆకాంక్షలవైపు వెళ్తోందన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ తదితర చర్యలతో అవినీతిని నిర్మూలించేందుకు, పన్నులు సక్రమంగా వసూలు చేసేందుకు తాము కృషి చేశామని జైట్లీ వివరించారు. -
ముడతలకు ప్యాక్
చిన్న వయసులోనే కొందరికి ముఖంపై చర్మం ముడతలు పడుతుంది. అవి పోవడానికి బోలెడన్ని చిట్కాలు ఉన్నాయి. మామిడి ఆకులను పొడి చేయాలి. అందులో మినప పొడి, ముల్తాన్ మిట్టీలను సమాన పాళ్లలో కలిపి, ఓ డబ్బాలో వేసి పెట్టుకోవాలి. ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, పాలతో కలిపి పేస్ట్‌లా చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. కొన్నాళ్లపాటు క్రమం తప్పకుండా ఇలా చేస్తే ముడతలు మాయమవుతాయి. అది మాత్రమే కాదు. బంగాళదుంప గుజ్జు, టొమాటో రసం, అరటిపండు గుజ్జు కూడా ముడతలు పోయేలా చేస్తాయి. క్యారెట్ రసంలో పాలు, బాదం పప్పు పేస్ట్ కలిపి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. కొన్నాళ్లపాటు వారానికి రెండు సార్లయినా ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది. బాదం నూనెతో మర్దనా చేసినా కూడా ముడతలు పోతాయి. -
‘హడావుడి చేయడం కాదు’
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరిగితే ఉత్పన్నమయ్యే తొలి ప్రశ్న.. ఎవరు చేశారని? అలాగాకుండా.. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఆ తప్పుకు ఆస్కారం ఎలా ఏర్పడిందని ప్రశ్నించడం సరైన పద్ధతి..’’అని మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. అంతేతప్ప కొందరు అధికారులను సస్పెండ్ చేసి తమాషా చేయడం, ఏడెనిమిది గంటల పాటు అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌లు, సమీక్షా సమావేశాలు, హడావుడి చేయడం సరికాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతి పెచ్చరిల్లుతోందని సెంటర్ ఫర్ మీడి యా స్టడీస్ సంస్థ విడుదల చేసిన నివేదికను ఉటంకిస్తూ.. సీనియర్ ఐఏఎస్ అధికారి సురేశ్ చందా చేసిన విమర్శలపై కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు సోమవారం హైదరాబాద్ లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో ‘తెలంగాణ ఎక్సలెన్సీ’ పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అవినీతి అంశంపై సురేశ్ చందా వ్యాఖ్యలు చేయగా కేటీఆర్, కడియం శ్రీహరి ప్రతిస్పందించారు. కొందరు నేతలు, అధికారులు అవినీతిపరులు ఉండవచ్చని.. అందరూ అవినీతి పరులే అన్నట్టుగా విమర్శించడంలో అర్థం లేదన్నారు. అధికారులు అర్థం చేసుకోవాలి..: కేటీఆర్ ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో పనులను త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తేవడం జరుగుతుందని, ఈ విషయాన్ని అధికారులు అర్థం చేసుకోవాలని కేటీఆర్ కోరారు. చాలా రాజకీయ పార్టీలు మళ్లీ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తాయని, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అదే ఐఏఎస్ అధికారుల సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, వారు ప్రజల మన్ననలు పొందుతారని చెప్పారు. రాజకీయ నాయకుల పదవీకాలం ఐదేళ్లు మాత్రమే ఉంటుందని, తదుపరి ఎన్నికల్లో తిరిగి గెలవడం కోసం ప్రజల పనులు చేయటానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కోరుకుంటున్న ‘మినిమమ్ గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ (స్వల్ప ప్రభుత్వం.. అధిక పాలన)’సాధన దిశగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండానే పౌర సేవలను అందుకునేలా పాలన ఉండాలన్నారు. ముఖ్యమంత్రి ప్రజాదర్బార్ నిర్వహించి గ్రామ, మండల స్థాయి అధికారులు మంజూరు చేయాల్సిన పింఛన్లను ఇక్కడి నుంచి మంజూరు చేస్తే విఫల ప్రభుత్వానికి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా గ్రామ, మండల స్థాయిలో జరగాల్సిన పనులు అక్కడే జరగాలని స్పష్టం చేశారు. తాను అమెరికాలో ఆరేళ్ల పాటు నివాసమున్నానని.. కేవలం డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం మాత్రమే అక్కడి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లానని చెప్పారు. ‘డీసెంట్రలైజ్ (వికేంద్రీకరణ), డిజిటలైజ్ (కంప్యూటరీకరణ), డెమొక్రటైజ్ (ప్రజాస్వామికరణ)’అనే ‘త్రీడీ’మంత్రంతో పాలన సాగిస్తే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి పరిపాలనా వికేంద్రీకరణ చేపట్టిందన్నారు. రాష్ట్రం గత రెండేళ్లుగా ఈఓడీబీలో అగ్రస్థానంలో ఉందని.. పరిశ్రమల ఏర్పాటుకు సత్వర అనుమతుల కోసం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. అందరినీ ఒకేగాటన కట్టొద్దు: కడియం కొందరు రాజకీయ నేతలు, అధికారులు అవినీతిపరులు కావొచ్చని.. అందరూ అవినీతిపరులేనని విమర్శించడంలో అర్థం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. శాసన వ్యవస్థ, అధికార గణం, న్యాయస్థానాల తీర్పులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని.. ఈ పరిస్థితిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, మరొకరిపై నెపం నెట్టేసి తప్పించుకోవడానికి ప్రయత్నించడం సరికాదని వ్యాఖ్యానించారు. వ్యవస్థలో అందరూ భాగస్వాములేనన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. తన తండ్రి వ్యవసాయ కూలీ అని, తనకు ఏ మాత్రం భూమి వారసత్వంగా రాలేదని కడియం పేర్కొన్నారు. 31 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎకరా పొలం కూడా సంపాదించలేకపోయానని.. 24 ఏళ్ల కిందే మంత్రి అయిన తనకు హైదరాబాద్‌లో రూ.కోటి విలువ చేసే ఇల్లు కూడా లేదన్నారు. నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నప్పుడు.. పక్షపాతంతోగానీ, ఎవరిపట్లనైనా ముందే ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండడంకానీ మంచిది కాదని ఐఏఎస్ అధికారులకు సూచించారు. ఫైళ్లను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకుని వెనక్కి పంపాలని.. మంత్రిగానీ, ముఖ్యమంత్రిగానీ తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. అవినీతి పెచ్చరిల్లుతోంది..: సురేశ్ చందా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఫ్లైఓవర్ కుప్పకూలి అమాయకులు మృతి చెందారని.. పోస్టుమార్టం అనంతరం ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడానికి ఆస్పత్రి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారని రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి సురేశ్ చందా పేర్కొన్నారు. అలా దేశవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో లంచాలు తీసుకోవడం సాధారణంగా మారిందని.. తెలంగాణ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదని వ్యాఖ్యానించారు. భారతదేశం సిఫార్సుల దేశమని.. సిఫార్సులు లేకుంటే ఇక్కడ ఏ పనీ జరగదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అందజేస్తున్న ‘తెలంగాణ ఎక్సలెన్సీ’పురస్కారాల కోసం సైతం సిఫార్సులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఇటీవల సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంస్థ విడుదల చేసిన సర్వే నివేదికను ఉటంకిస్తూ.. రాష్ట్రంలో గతేడాది 73 శాతం కుటుంబాలు ప్రభుత్వాధికారులకు లంచాలు ఇచ్చాయని, రాష్ట్రం అవినీతిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. రాజకీయ నాయకత్వం, ప్రభుత్వాధికారులు చొరవ తీసుకుంటేనే ఈ పరిస్థితిలో మార్పు సాధ్యమవుతుందన్నారు. రాజకీయ అవసరాల కోసం జరిగే అధికార దుర్వినియోగానికి అడ్డుకట్టపడాల్సి ఉందన్నారు. సాంకేతికంగా తాను ప్రభుత్వం నుంచి బయట ఉన్నానని, అందుకే ప్రభుత్వంలో ఏం జరుగుతోందో తనకు బాగా తెలుసుకునే అవకాశముందని పేర్కొన్నారు. లంచాల కోసం వేధిస్తున్నారు.. అధికారులు లంచాల కోసం కొర్రీలపై కొర్రీలు వేస్తూ బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధిస్తున్నారని.. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసే విధానంలో సంస్కరణలు అవసరమని సురేశ్ చందా పేర్కొన్నారు. బిల్లు సమర్పించిన రోజే చెల్లింపులు జరిపేలా ఆన్లైన్ విధానం తీసుకురావాలన్నారు. ప్రభుత్వ శాఖలు సంబంధం లేని ఏవేవో పత్రాలను కోరే విధానానికి స్వస్తి పలికి.. పంజాబ్ తరహాలో పౌర సేవలను సరళీకృతం చేయాలని సూచించారు. కొందరు అధికారులు కావాలని నెలల తరబడి ఫైళ్లను తమ వద్దే పెట్టుకుంటున్నారని.. అందువల్ల ఫైళ్ల కదిలికలను ఆన్లైన్ చేసి ఏ ఫైల్ ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉందో తెలుసుకునే సదుపాయాన్ని ప్రజలకు కల్పించాలని సూచించారు. రాష్ట్ర ఐటీ శాఖ చొరవ తీసుకుని బిల్లుల చెల్లింపులు, ఫైళ్ల కదిలికలు తదితర సేవలను ఆన్లైన్ చేయాలని కోరారు. పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి, ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ బీపీ ఆచార్య, సీనియర్ ఐఏఎస్‌లు శాలినీ మిశ్రా, అజయ్ మిశ్రా, రాజేశ్వర్ తివారీ, అధర్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. -
బిల్లులతో చిల్లు!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)కు ఇంటి దొంగలే కన్నం వేస్తున్నారు. భారీ పరిశ్రమల యజమానులతో కుమ్మక్కై కోట్లాది రూపాయల బిల్లును అక్రమంగా రద్దు చేసి సంస్థకు శఠగోపం పెడుతున్నారు. టీఎస్ఎస్పీడీసీఎల్ సంగారెడ్డి సర్కిల్ కార్యాలయం పరిధిలో తాజాగా వెలుగు చూసిన ఓ కుంభకోణం విద్యుత్ శాఖలో సంచలనం సృష్టిస్తోంది. సదాశివపేట మండలం బుదేర గ్రామంలో హైటెన్షన్ విద్యుత్ కనెక్షన్లు కలిగిన రెండు పరిశ్రమల యజమానితో సంగారెడ్డి సర్కిల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది కుమ్మక్కై గత పదేళ్లలో ఏకంగా రూ.26 కోట్ల బిల్లులను రద్దు చేసినట్లు సంస్థ యాజమాన్యం జరిపిన విచారణలో బహిర్గతమైంది. ఈ స్కాంతో సంబంధం ఉన్న నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండైన వారిలో సంస్థ కార్పొరేట్ కార్యాలయం జనరల్ మేనేజర్ మంజుల, సెంట్రల్ సర్కిల్ కార్యాలయం అకౌంట్స్ ఆఫీసర్ సత్తయ్య, సంగారెడ్డి సర్కిల్ కార్యాలయం అకౌంట్స్ ఆఫీసర్ చంద్రశేఖర్, మరో సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు. పదోన్నతిపై కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ కాకముందు సంగారెడ్డి సర్కిల్ కార్యాలయంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసిన మంజుల ఈ అక్రమాలకు సహకరించారని విచారణలో తేలింది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విభాగాల్లో ఓ ఉద్యోగిని మూడేళ్లకు మించి ఒకేస్థానంలో కొనసాగించరాదని స్పష్టమైన నిబంధనలున్నా, 10 ఏళ్లుగా సంగారెడ్డి సర్కిల్ కార్యాలయంలో తిష్టవేసిన అకౌంట్స్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సత్తయ్య గతేడాది రెండు నెలలపాటు మాత్రమే సంగారెడ్డిలో పని చేయగా, ఓ సంతకం చేశారని ఆరోపణలపై ఆయనను కూడా సస్పెండ్ చేయడం గమనార్హం. జర్నల్ ఎంట్రీతో దోచేశారు.. అన్ని వ్యాపార సంస్థల తరహాలోనే రాష్ట్ర విద్యుత్ సంస్థలూ డబుల్ ఎంట్రీ విధానంలో ఆర్థిక పద్దులు నిర్వహిస్తున్నాయి. వినియోగదారుల నుంచి రావాల్సిన బిల్లుల మొత్తాన్ని టీఎస్ఎస్పీడీసీఎల్ పద్దుల్లో డెబిట్‌గా చూపిస్తారు. ఒకసారి ఎంట్రీ చేసిన బిల్లు మొత్తాన్ని తప్పనిసరిగా వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిందే. అయితే ఏదైనా సాంకేతిక కారణాలతో విద్యుత్ బిల్లుల జారీలో పొరపాట్లు దొర్లినట్లు వినియోగదారులు ఫిర్యాదు చేస్తే సమగ్ర దర్యాప్తు జరిపి నిర్ధారించుకున్న తర్వాత జర్నల్ ఎంట్రీ (జేఈ) పేరుతో పద్దులను దిద్దుబాటు చేసి బిల్లులను తగ్గించే అధికారం సంస్థ అకౌంట్స్ విభాగం అధికారులకు ఉంటుంది. సాధారణంగా మీటర్లు జంప్ అయ్యాయని, తప్పుడు బిల్లింగ్ నమోదు చేశారని, చాలా కాలంగా డోర్ లాక్ ఉన్నా అడ్డగోలుగా బిల్లులు వేశారని వినియోగదారులు ఫిర్యాదు చేస్తుంటారు. సంస్థ నిబంధనల ప్రకారం జర్నల్ ఎంట్రీ విధానంలో బిల్లులను సరిదిద్దడానికి ముందు కనీసం జూనియర్ ఇంజనీర్ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి సాంకేతికంగా బిల్లింగ్‌లో తప్పులు జరిగినట్లు నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక వచ్చిన తర్వాతే జర్నల్ ఎంట్రీ విధానంలో తప్పును సరిదిద్దుకోవాలి. అయితే సంగారెడ్డి సర్కిల్ కార్యాలయంలోని కొందరు అధికారులు ఈ వెసులుబాటును దుర్వినియోగం చేయడం ద్వారా 2008 నుంచి ఇప్పటి వరకు ఒకే యజమానికి చెందిన రెండు పరిశ్రమల విద్యుత్ బిల్లులను పదుల సార్లు తగ్గించినట్లు విచారణలో తేలింది. సదరు పరిశ్రమల యజమాని కోర్టుకు వెళ్లాడనే కారణం చూపి డబుల్ ఎంట్రీ విధానంలో పలుమార్లు రూ.కోట్ల బిల్లులు రద్దు చేశారని బయటపడింది. బిల్లుల బకాయిలను కూడా సెటిల్మెంట్ పేరుతో పలుమార్లు తగ్గించారని, ఆ తర్వాత మళ్లీ కొత్త విద్యుత్ కనెక్షన్లు జారీ చేస్తూ పోయినట్లు సమాచారం. 10 ఏళ్లలో ఆ యజమానికి సంబంధించిన విద్యుత్ బిల్లులను పలుమార్లు తగ్గించడం ద్వారా సంస్థకు రూ.26 కోట్ల నష్టాన్ని కలిగించినట్లు నిర్ధారించారు. ఈ వ్యవహారంపై సంగారెడ్డి సర్కిల్ కార్యాలయ సూపరింటెండింగ్ ఇంజనీర్ రవికుమార్ వివరణ కోసం ‘సాక్షి’ ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
గెలుపుకోసం టీడీపీ కుయుక్తులు
కడప కార్పొరేషన్: ఈ నాలుగేళ్లలో విచ్చలవిడి అవినీతితో దోచుకున్న సొమ్మును ఎన్నికల్లో ఎదజల్లి గెలవాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పార్థసారథి తెలిపారు. శనివారం కడప నగరంలోని జయరాజా గార్డెన్లో కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల బూత్ కన్వీనర్లకు నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ బలోపేతానికి, ఎన్నికల్లో గెలుపొందడానికి శిక్షణ తరగతులు నిర్వహించడం ముఖ్యమన్నారు. గ్రామ, మండల, జిల్లా నాయకత్వాలతోపాటు బూత్ కమిటీలు కూడా చాలా ముఖ్యమని చెప్పారు. బూత్ కమిటీలు ప్రజలకు ఎంత చేరువైతే పార్టీకి అంత లాభం కలుగుతుందని చెప్పారు. అధికార టీడీపీ వైఎ‹స్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగిస్తోందని, బూత్ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని గుర్తెరిగి తొలగించిన ఓట్లతోపాటు, కొత్త ఓట్లను చేర్పించాలన్నారు. 2014లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదని, మన పార్టీ ఓటమి వల్ల నష్టపోయింది ప్రజలేనని తెలిపారు. చంద్రబాబు రాయలసీమ వాసులను రౌడీలు, గూండాలుగా, సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరిస్తూ కోస్తా ప్రజలను అభద్రతాభావానికి గురి చేస్తున్నారని, తద్వారా తన పార్టీకి మేలు చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎడారిగా ఉన్న రాయలసీమకు కృష్ణాజలాలు ఇవ్వాలనే సంకల్పం దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డిదేని తెలిపారు. పులివెందులకు నీళ్లిచ్చామని మంత్రులు దేవినేని ఉమా, ఆదినారాయణరెడ్డి చెప్పడం పట్ల విరుచుకుపడ్డారు. వారికి సిగ్గూ, లజ్జా ఉంటే ప్రాజెక్టులకు ఎవరెంత ఖర్చు చేశారో వివరించడానికి కడప సెంటర్లో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బలహీన వర్గాలు వారి కాళ్లపై వారు నిలబడేటట్లు చంద్రబాబు చేయడని, వారు అభివృద్ధి్ద చెందడం ఆయనకు ఇష్టం లేదన్నారు. వైఎస్ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ల వల్లే మైనార్టీలు అభివృద్ధి చెందారని తెలిపారు. మోదీ ప్రభుత్వంపై విశ్వాసం లేకే అవిశ్వాసం:విశ్వేశ్వర్‌రెడ్డి మోదీ ప్రభుత్వంపై విశ్వాసం లేకనే కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెట్టామని, తమ ఎంపీలు రాజీనామాలు చేశారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. బీజేపీపై ఇంతకంటే పెద్ద పోరాటం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. పార్టీ పునాదిని పటిష్టం చేయాల్సిన బాధ్యత బూత్ కన్వీనర్లు, సభ్యులపైనే ఉందని, కింది స్థాయిలో ఆర్గనైజేషన్ లేకపోవడంవల్లే 2014లో ఓటమి పాలయ్యామని తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన దేశంలోనే ఆదర్శవంతమైనదని, బాబు పాలనంతా వైఫల్యాలమయమేనన్నారు. నాలుగేళ్లపాటు బీజేపీతో సంసారం చేసి, మంత్రి పదవులు అనుభవించిన టీడీపీ వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీతో చిత్తశుద్దితో పోరాటం చేసింది తమ పార్టీయేనన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి బూత్‌లో మెజార్టీ తేవడమే లక్ష్యంగా పనిచేయాలి: వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రతి పోలింగ్ బూత్‌లో వైఎస్ఆర్సీపీకి మెజార్టీ తేవడమే లక్ష్యంగా బూత్ కన్వీనర్లు పనిచేయాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరుపుకోనందువల్లే 2014లో పార్టీ ఓటమిపాలైందని, 2019లో ఆ తప్పు పునరావృతం కాకూడదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, జన్మభూమి కమిటీల అరాచకాలు, స్థానిక సంస్థలు నిర్వీర్యమైన వైనం, నీరు–చెట్టులో అవినీతిని ప్రజలకు వివరించాలన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, పుత్తా నరసింహారెడ్డి పోటాపోటీగా ఇసుక అక్రమంగా తరలించి వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వైఎస్ చలువల్లే పుత్తా, ఆది నాయకులుగా ఎదిగారు– సురేష్‌బాబు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చలువ వల్లే మంత్రి ఆదినారాయణ రెడ్డి, పుత్తా నరసింహారెడ్డి నాయకులుగా ఎదిగారని వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు అన్నారు. ఎన్నికల్లో బూత్ కమిటీల పాత్ర చాలా కీలకమన్నారు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు చేయని తప్పుల్లేవని, చెప్పని అబద్దాలు లేవని అన్నారు. వైఎస్ఆర్ పథకాలే మన పార్టీకి శ్రీరామ రక్ష అన్నారు.దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడు చేయనన్ని ఉద్యమాలు వైఎస్ జగన్ చేశారని తెలిపారు. ప్రతి కార్యకర్తను ఆర్థికంగా బలోపేతం చేస్తాం: రవీంద్రనాథ్‌రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రతి కార్యకర్తను ఆర్థికంగా బలోపేతం చేస్తామని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 98.6 శాతం ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. అర్జునుడికి చిలక మాత్రమే కనిపించినట్లుగా బూత్ కన్వీనర్లకు తమ బూత్‌లోని వెయ్యి ఓట్లే కనిపించాలని అన్నారు. ఓటర్లను చైతన్యం చేయాలి: డా. సుధీర్‌రెడ్డి ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లను చైతన్యం చేయాల్సిన బాధ్యత బూత్ కన్వీనర్లపై ఉందని జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి అన్నారు. 1825 రోజులకు అంటే ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయని, ఓటుకు రూ.2వేలు ఇచ్చినా రోజుకు రూపాయి పదిపైసలు అవుతుందన్నారు. రూపాయి పది పైసలకు ఓటును అమ్ముకోవద్దని సూచించారు. బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ వస్తే 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇప్పించుకుంటామని తెలిపారు. ఎవరి సత్తా ఏమిటో ఎన్నికల్లోనే తెలుస్తుందని మంత్రి ఆదినారాయణరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బూత్ కమిటీ సభ్యుల శ్రమను పార్టీ విస్మరించదు:దుగ్గాయపల్లె బూత్ కమిటీ కన్వీన ర్లు, సభ్యుల శ్రమను, త్యాగాలను వైఎస్ఆర్సీపీ విస్మరించదని కమలాపురం సమన్వయకర్త దుగ్గాయçపల్లె మల్లికార్జునరెడ్డి అన్నారు. బూత్ లెవెల్లో పార్టీకి మెజార్టీ తీసుకురావాలసిన బాధ్యత బూత్ కన్వీనర్లదేనన్నారు. అంతకుముందు నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించి, వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వందేమాతరం గీతంతో శిక్షణతరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కడప శాసనసభ్యులు ఎస్బి అంజద్‌బాషా, ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా మధుసూధన్‌రెడ్డి, పార్టీ నాయకులు హర్షవర్ధన్‌రెడ్డి, అఫ్జల్ఖాన్ పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చాక ప్రతి పథకంలోనూ బూత్ కన్వీనర్ల పాత్ర: సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి పథకం అమలులోనూ బూత్ కన్వీనర్ల పాత్ర ఉంటుందని వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి, పార్టీ ప్రాంతీయ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీని సంస్థాగతంగా, శాస్త్రీయంగా అభివృద్ధి చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని, అందుకే రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ఎన్నికల్లో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గరు కలిసి పోటీ చేస్తే టీడీపీకి 5లక్షల 30వేల ఓట్లు ఎక్కువ వచ్చాయని, వైఎస్ఆర్సీపీకి విజయం అంచు వరకు వచ్చి జారిపోయిందని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు 7లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినప్పటికీ సీట్లు తక్కువ వచ్చాయని, బీజేపీ సూక్ష్మ స్థాయిలో కార్యకర్తలను దించి ఎన్నికలు ఎదుర్కొవడం వల్లే సీట్ల వారి సంఖ్య పెరిగిందని వివరించారు. వైఎస్ జగన్ అరుదైన లక్షణాలు ఉన్న వ్యక్తి అని తెలిపారు. తండ్రికి ఏమాత్రం తీసిపోని తనయుడని, ప్రజల కోసం ఆయనకంటే ఒక అడుగు ముందుకే వేస్తారని తెలిపారు. చంద్రబాబు జిత్తులమారి అని, అవినీతి, దోపిడీ, మోసాలే ఆయన నైజమన్నారు. -
మోదీ అంటేనే అవినీతి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అంటేనే అవినీతి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీలో మెజారిటీ సాధనకు మోదీ అవినీతిని ప్రోత్సహించారని ఆయన మండిపడ్డారు. కర్ణాటక ఉదంతంతో బీజేపీ, ఆరెస్సెస్‌లు గుణపాఠం నేర్చుకుంటాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, ఆరెస్సెస్‌లకు దేశంలోని వ్యవస్థలపై ఎలాంటి గౌరవం లేదని మండిపడ్డారు. శనివారం నాడిక్కడ రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌తో పాటు జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో, ఆయన ప్రోద్బలంతో నడిచిన వ్యవహారాన్ని కర్ణాటక ప్రజలు చూశారు. అవినీతికి వ్యతిరేకంగా మోదీ చేసే ప్రసంగాలు పూర్తి అబద్ధం. అసలు మోదీ అంటేనే అవినీతి. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే మోదీ కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలును, అవినీతిని ప్రోత్సహించారు. ఆయన దేశాన్ని నాశనం చేస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ నేతలు ఫోన్లో చేసిన బేరసారాలు ప్రస్తుతం బహిర్గతమయ్యాయి’ అని తెలిపారు. దేశం, వ్యవస్థలు, సుప్రీంకోర్టు కంటే ప్రధాని ఎక్కువేం కాదని వ్యాఖ్యానించారు. కర్ణాటక గవర్నర్ వజూభాయ్ రాజీనామా సమర్పించాలనడం మంచి ఆలోచనే అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలన్ని ఏకమై బీజేపీని ఓడించడం గర్వంగా ఉందనీ, ఇకపై దేశవ్యాప్తంగా దీన్నే పునరావృతం చేస్తామని రాహుల్ పేర్కొన్నారు. ‘యడ్యూరప్ప రాజీనామా అనంతరం జాతీయ గీతం ఆలపించకుండానే బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రోటెం స్పీకర్ సభనుంచి నిష్క్రమించారు. దేశంలోని వ్యవస్థలపై వాళ్లకు ఏమాత్రం గౌరవం లేదని దీన్నిబట్టే అర్థమవుతోంది. దేశంలో ప్రతి వ్యవస్థను నాశనం చేస్తున్న ఇలాంటి శక్తులతోనే ప్రస్తుతం మనం పోరాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు. దేశంలోని వ్యవస్థలను, ప్రజా తీర్పును ఎవ్వరూ అగౌరవపర్చలేరని కర్ణాటక ఉదంతంతో బీజేపీ, ఆరెస్సెస్‌లు తెలుసుకున్నాయన్నారు.