IPL 2018
-
విండీస్‌తో టెస్టుల్లో విఫలం! ఖరీదైన కారు కొన్న టీమిండియా క్రికెటర్.. ధర ఎంతంటే!
టీమిండియా పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. విలాసంతమైన మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ ఎస్‌యూవీకి యజమాని అయ్యాడు. కాగా 2010లో ఐపీఎల్లో అడుగుపెట్టిన సౌరాష్ట్ర క్రికెటర్ ఉనాద్కట్.. అదే ఏడాది భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు కెరీర్లో టీమిండియా తరఫున 4 టెస్టులు, 8 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఉనాద్కట్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 3, 9, 14 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ టూర్-2023లో భాగంగా టెస్టుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన ఈ రైట్ ఆర్మ్ ఫాప్ట్బౌలర్.. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వన్డే ఆడే అవకాశం దక్కించుకున్నాడు. రూ. కోటి! విండీస్‌తో ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో కేసీ కార్టీ వికెట్ తీసి రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇక కరేబియన్ దీవి పర్యటన తర్వాత జయదేవ్ ఉనాద్కట్ తాజాగా కాస్ట్లీ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు రూ. కోటి వరకు Mercedes-Benz GLE SUVని అతడు సొంతం చేసుకున్నట్లు సమాచారం. బ్లాక్ ఫినిషింగ్‌తో మెరిసిపోతున్న కారును ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో ఉనాద్కట్ క్రికెట్బాల్పై సంతకం చేసి షో రూం నిర్వాహకులకు ఇవ్వడం విశేషం. ఈ అత్యాధునిక కారులో పనోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు ఏడు ఎయిర్‌బ్యాగులు ఉంటాయి. ఇక SUV కొనుగోలు చేసిన సందర్భంగా.. భార్యతో కలిసి కారు వద్ద ఉనాద్కట్ దిగిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లో 11.50 కోట్లు! ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2018 వేలం సందర్భంగా జయదేవ్ ఉనాద్కట్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయిన విషయం తెలిసిందే. ఈ పేసర్ కోసం రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ ఏకంగా 11.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఆ సీజన్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఉనాద్కట్ రికార్డు సృష్టించాడు. చదవండి: కోహ్లితో పాటు ప్రపంచకప్ గెలిచి.. ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్ నుంచి ఇప్పుడిలా! -
ఐపీఎల్ వేలం: నమ్మకద్రోహం, మోసం.. చాలా బాధపడ్డాను!
IPL 2022 RCB Player Harshal Patel: హర్షల్ పటేల్.. ఐపీఎల్-2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తరఫున అరంగేట్రం చేశాడు. 2015 సీజన్లో 17 వికెట్లు పడగొట్టి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత 2018-2020 మధ్య ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అనంతరం మళ్లీ ఆర్సీబీకి ఆడే అవకాశం దక్కించుకున్న హర్షల్ 2021 ఎడిషన్‌లో 32 వికెట్లు కూల్చి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. జట్టును ప్లే ఆఫ్స్ చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. అంతేగాక టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశం దక్కించుకున్నాడు. అయితే రిటెన్షన్ సమయంలో ఆర్సీబీ అనూహ్యంగా హర్షల్‌ను వదిలేసింది. దీంతో అతడు మెగా వేలం-2022లోకి రాగా ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడి 10.75 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ విషయం గురించి హర్షల్ తాజాగా బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2018 వేలం సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకున్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘2018 వేలం జరుగుతున్న సమయంలో.. నా కోసం ఎవరో ఒకరు బోర్డు ఎత్తుతారని ఆశగా ఎదురు చూశాను.. నిజానికి అప్పుడు నేను డబ్బు గురించి ఏమాత్రం ఆలోచించలేదు. కేవలం ఆడే అవకాశం దక్కితే చాలనుకున్నా. అంతకుముందే వేర్వేరు ఫ్రాంఛైజీలకు చెందిన ఓ ముగ్గురు నలుగురు ఆటగాళ్లు నన్ను తమ జట్టు కోసం కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్పారు. కానీ ఎవరూ ఆ పని చేయలేదు. ఆ సమయంలో నాకు ఎదురైన అనుభవం చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. నమ్మకద్రోహానికి గురైనట్లు, మోసానికి గురయ్యానన్న భావన మనసును మెలిపెట్టింది. కొన్ని రోజుల పాటు దాని గురించే ఆలోచించాను. చాలా బాధపడ్డాను. కానీ ఆ తర్వాత ఆటపై మాత్రమే దృష్టి సారించి ముందుకు సాగాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్ మెగా వేలం-2022లో ఆర్సీబీ తనను భారీ ధరకు కొనుగోలు చేసిన తర్వాత విరాట్ కోహ్లి సంతోషంగా తనకు మెసేజ్ చేశాడన్న హర్షల్ పటేల్.. తనకు నిజంగానే లాటరీ తగిలిందని అతడితో చెప్పినట్లు పేర్కొన్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి👉🏾RCB Vs RR: మొన్న 68 పరుగులకే ఆలౌట్.. అక్కడేమో అత్యల్ప స్కోరు 73..! -
'రషీద్ వస్తే అంతు చూస్తా అన్నాడు'
ఢిల్లీ : కరోనా నేపథ్యంలో ఆటకు విరామం దొరకడంతో టీమిండియా టెస్టు క్రికెటర్ మయాంక్ అగర్వాల్ 'ఓపెన్ నెట్స్ విత్ మయాంక్' పేరుతో చాట్‌షో నిర్వహిస్తున్నాడు. వరుస చాట్ షోలతో క్రికెటర్లను ఇంటర్య్వూ చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. తాజగా మయాంక్ ఐపీఎల్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ సహచర ఆటగాళ్లైన కేఎల్ రాహుల్, క్రిస్ గేల్‌తో చాట్ షో నిర్వహించాడు. చాట్ సందర్భంగా రాహుల్, గేల్లు ఐపీఎల్ బెస్ట్ మూమెంట్స్‌ను షేర్ చేసుకున్నారు. ('అల్లా దయ.. నాకు కరోనా సోకలేదు') రాహుల్ స్పందిస్తూ.. '2018 ఐపీఎల్లో నేను కింగ్స్ లెవెన్‌కు ఆడుతున్న సమయంలో క్రిస్ గేల్ కూడా జట్టులో ఉన్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ విధ్వంసం ఇంకా నా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. నాకు బాగా గుర్తు.. ఆరోజు గేల్ మంచి ఆకలి మీద ఉన్నాడు. ఆ సీజన్లోనే అత్యధిక పరుగులు చేయాలనే ఉత్సాహంతో ఆడుతున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న గేల్ ఈ సమయంలో రషీద్ ఖాన్ బౌలింగ్‌కు వస్తే అతని అంతు చూస్తా అని పేర్కొన్నాడు. ఎందుకంటే నాకు స్పిన్నర్ బౌలింగ్ రావడం ఇష్టం లేదని.. నా ముందు ఆధిపత్యం చలాయిస్తే చూస్తూ ఊరుకోనని తెలిపాడు. 14 ఓవర్ వేసిన రషీద్ బౌలింగ్‌లో వరుసగా 4 సిక్స్‌లు కొట్టి గేల్ తన మాటను నిలబెట్టుకున్నాడు. నేను చూసిన మూమెంట్స్‌లో దీనినే ది బెస్ట్ అంటా' అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. కాగా కరోనాతో ఆటకు బ్రేక్ రావడంతో ఫిట్నెస్ను ఎలా కాపాతున్నావని క్రిస్ గేల్‌ని మయాంక్ ప్రశ్నించాడు. ' నేను జార్జ్ ఫ్లాయిడ్ , జాన్సెనా కంటే ఫిట్‌నెస్‌గానే ఉన్నా' అంటూ గేల్ నవ్వుతూ పేర్కొన్నాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో క్రిస్ గేల్ 11 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 104 పరుగులు సాధించాడు. ఆ సీజన్లో రాహుల్ అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అయితే జట్టుగా విఫలమైన కింగ్స్ లెవెన్ పంజాబ్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఐపీఎల్ 13వ ఎడిషన్‌లో కింగ్స్ ఎలెవెన్‌కు కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 కరోనా దృష్యా వాయిదా పడింది. అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్ నిర్వహణ వాయిదా పడితే దాని స్థానంలో ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.('ఆసియా కప్ కచ్చితంగా జరుగుతుంది') -
సన్‌రైజర్స్‌కు ధావన్ షాక్?
న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ ఇవ్వబోతున్నడనే వార్తలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. వచ్చే ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్కు ధావన్ వీడ్కోలు పలుకుతున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ వహిస్తున్న ముంబై ఇండియన్స్‌కు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు సమాచారం. వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్ ధావన్ ఆడబోతున్నట్లు.. ముంబై మిర్రర్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. 2013 నుంచి సన్‌రైజర్స్‌తో కలిసి కొనసాగుతున్న ధావన్.. తనకు సహచర క్రికెటర్లు కోహ్లి(17 కోట్లు), రోహిత్‌శర్మ(15 కోట్లు), ధోని(15 కోట్లు) పోలిస్తే 5.2 కోట్లు మాత్రమే దక్కతుండటమే అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం భారత జట్టులో శిఖర్ ధావన్ రెగ్యులర్ ఓపెనర్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన స్థాయికి తగిన ఫీజు రావడం లేదని గబ్బర్ అసంతృప్తితో ఉన్నాడట. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వీడేందుకు తాను అనుకూలంగా ఉన్నానని ఫ్రాంచైజీ యాజమాన్యంతో ధావన్ చెప్పినట్టు తెలుస్తోంది. భారత జట్టులో టాప్-4 స్థానంలో ఉన్న తనను ఎందుకు రిటైన్ చేసుకోలేదని హైదరాబాద్ కోచ్ టామ్ మూడీతో శిఖర్ అంతకు ముందు వాదించాడట. గత ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ అతడిని రిటైన్ చేసుకొని ఉంటే రూ.12 కోట్లు లేదా రూ.8.5 కోట్లు దక్కేవి. అలా కాకుండా ఆ జట్టు డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్‌ను రిటైన్ చేసుకుంది. గబ్బర్ను రైట్ టు మ్యాచ్ కింద తీసుకుంది. దీంతో తనకు ప్రాధాన్యం లేదని గబ్బర్ భావిస్తున్నట్లు సమాచారం.ఒకవేళ ముంబై ఇండియన్స్‌తో చర్చలు సఫలమైతే ధావన్ ముంబై ఇండియన్స్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే రోహిత్‌తో కలిసి ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్‌గా బరిలో దిగే అవకాశాలున్నాయి. -
అవన్నీ రూమర్లే: భజ్జీ
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ నాటికి తాను జట్టు మారతానన్న వార్తలపై చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందించాడు. తాను జట్టు మారే యోచనలో లేనని, ఒకవేళ మారే పక్షంలో ముందుగానే చెబుతానని స్పష్టం చేశాడు. తాను జట్టు మారడానికి యత్నిస్తున్నట్లు రూమర్లలో ఎటువంటి వాస్తవం లేదన్నాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ 10 సీజన్లు ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడిన హర్భజన్ గత సీజన్లో చెన్నై జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఎంఎస్ ధోని నేతృత్వంలోని సీఎస్కే.. ఐపీఎల్ 11 ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ -12లో హర్భజన్ ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడతాడని, కుదరని పక్షంలో ఆ టీమ్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తాడని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే అలాంటి వదంతులు నమ్మవద్దని భజ్జీ కోరాడు. 'చెన్నై జట్టులో నాకు ఏ ఇబ్బంది లేదు. గొప్ప ఫ్రాంచైజీకి ఆడటాన్ని గౌరవంగా భావిస్తా. ఒకవేళ వేరే జట్టుకు మారాలనుకుంటే నేనే చెబుతా. తన విషయాలకు సంబంధించి నన్ను మించిన న్యూస్ సోర్స్ లేదు’ అని భజ్జీ తెలిపాడు. -
‘ధోని వార్తా పత్రికలు చదవొద్దన్నాడు’
ముంబై: వార్తా పత్రికలు చదవొద్దని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని సలహాలిచ్చాడని యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఓ టీవీ షో ఫైనల్ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యర్ మాట్లాడుతూ.. ‘భారత జట్టులో చేరిన తర్వాత వార్తా పత్రికలు చదవడం మానెయ్యాలని, సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ధోని సలహా ఇచ్చాడు. ప్రతీ ఒక్కరి జీవితంలో ఓ భాగమైన సోషల్ మీడియాకు దూరంగా ఉండటం కష్టమే. కానీ వాటి విషయంలో జాగ్రత్తపడుతున్నా’ అని చెప్పుకొచ్చాడు. ఇక తనకు ముందు నుంచి తెలిసిన ఓ అమ్మాయి ఐపీఎల్ వేలంలో తర్వాత తనకు దగ్గరవ్వాలని ప్రయత్నించిందని అయ్యర్ తెలిపాడు. అంతకు ముందెప్పుడూ తన గురించి పట్టించుకోలేదని. వేలం జరిగిన వెంటనే మెసేజ్ చేసిందన్నాడు. తొలుత తన ఎంపిక పట్ల సంతోషంగా ఉందని భావించానని కానీ తర్వాత ఆమె మాట్లాడడానికి బాగా ప్రయత్నించిందని తెలిపాడు. దీంతో ఆమె డబ్బు చూసి దగ్గరవ్వాలని ప్రయత్నించినట్లు తనకు అర్థమైందని పేర్కొన్నాడు. ఇక అయ్యర్ ఈ సీజన్ ఐపీఎల్లో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రాతినిథ్యం వహించిన ఈ 23 ఏళ్ల ఆటగాడు.. 14 ఇన్నింగ్స్‌లో 411 పరుగులు చేశాడు. అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి గంభీర్ తప్పుకుంటే.. సారథ్య బాధ్యతలు చేపట్టి ముందుకు నడిపించిన విషయం తెలిసిందే. -
‘వార్నర్ లేడని నా పిల్లలు ఏడ్చారు’
హైదరాబాద్ : బాల్ ట్యాంపరింగ్ ఉదంతం ప్రపంచ క్రికెట్‌ను కలవరపాటుకు గురిచేసింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనతో ఆస్ట్రేలియా అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డెవిడ్ వార్నర్, యువ ఆటగాడు బాన్ క్రాఫ్ట్‌లపై ఆ దేశ క్రికెట్ బోర్డు నిషేదం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిషేదంతో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌కు సైతం స్మిత్, వార్నర్‌లు దూరమయ్యారు. వీరి గైర్హాజరితో భారత అభిమానులు చాలా బాధపడ్డారు. ముఖ్యంగా హైదరాబాదీలు వార్నర్ జట్టులో లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అభిమానులే కాదు తన పిల్లులు సైతం కంటతడి పెట్టారని టీమిండియా మాజీ క్రికెటర్, సన్‌రైజర్స్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. ప్రముఖ హోస్ట్ గౌరవ్ కపూర్ ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్’ షోలో పాల్గొన్న లక్ష్మణ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘వార్నర్ ఈ సీజన్ ఐపీఎల్ ఆడటం లేదనే విషయం తెలుసుకొని నా పిల్లలు సర్వజిత్, అచింత్యాలు చాలా బాధపడ్డారు. వారు వార్నర్‌ను అభిమానిస్తారు. సన్‌రైజర్స్‌కు ఆడటానికి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వారికి వార్నర్‌తో గట్టి బంధం ఏర్పడింది. అతను జట్టులో ఎంత కీలకమో వారికి తెలుసు. ట్యాంపరింగ్ వివాదాన్ని టీవీల్లో చూసి.. తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి కూడా వారు చాలా బాధపడ్డారు.’ అని చెప్పుకొచ్చారు. వార్నర్ స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టు పగ్గాలు చేపట్టి.. ఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే. ఇక వార్నర్ 2016 ఐపీఎల్ సీజన్లో బ్యాటింగ్‌లో, కెప్టెన్‌గా రాణించి సన్‌రైజర్స్‌కు టైటిల్ అందించాడు. -
చెన్నై సూపర్ కింగ్సే టాప్!
లండన్: స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కారణంగా రెండేళ్ల పాటు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది సీజన్లో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగి ఆరంభం నుంచి గొప్ప ప్రదర్శన చేసి ఆఖరికి కప్పు ఎగరేసుకుపోయింది. తద్వారా తన ఐపీఎల్ టైటిల్స్ సంఖ్యను సీఎస్కే మూడుకు పెంచుకుంది. దాంతో పాటు ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ విలువలో కూడా గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది చెన్నై సూపర్‌కింగ్స్ బ్రాండ్ విలువ రూ. 445కోట్లకు పైగా చేరుకుంది. దాంతో ఇప్పటివరకూ ఐపీఎల్లో అత్యంత విలువైన బ్రాండ్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ అధిగమించింది. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.425కోట్ల బ్రాండ్ వాల్యూతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక మూడో స్థానంలో రూ. 370 కోట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉండగా, తర్వాత స్థానాల్లో ముంబై ఇండియన్స్ ఆర్సీబీ, ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్తాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లు ఉన్నాయి. ఈ మేరకు లండన్‌కు చెందిన వాల్యుయేషన్ కంపెనీ బ్రాండ్ ఫినాన్స్ ఒక నివేదికను విడుదల చేసింది. 2010, 2013లో బ్రాండ్ విలువలో అగ్రస్థానంలో నిలిచిన చెన్నై... ఈ ఏడాది కూడా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. మరొకవైపు ఐపీఎల్ బ్రాండ్ విలువ 5.3 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. లీగ్ ఆరంభంలో ఐపీఎల్ విలువ 3 బిలియన్ డాలర్లు ఉండగా, అది క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఇక పదకొండో సీజన్లో ఐపీఎల్ బ్రాండ్ విలువ 37శాతం పెరిగినట్లు సదరు కంపెనీ తెలిపింది. -
నా బంగారమే నన్ను మార్చేసింది: ధోని
ముంబై : తండ్రి అయినప్పటి నుంచి క్రికెటర్‌గా తనలో మార్పు వచ్చిందో.. లేదో కానీ.. వ్యక్తిగా మాత్రం ఎంతో మారానని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తెలిపాడు. ఈ మార్పుకు తన కూతురు, గారలపట్టీ జీవానే కారణమని అభిప్రాయపడ్డాడు. వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ నోరు విప్పని ధోని.. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ షోలో తన కూతురితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ‘కూతుర్లందరూ వారి తండ్రులను ఇష్టపడుతారు.. కానీ నా విషయంలో అలా జరగలేదు. జీవా పుట్టినప్పుడు నేను అక్కడలేను. ఎక్కువ సమయం క్రికెట్లోనే గడచిపోయేది. ఈ మధ్యలో నా పేరు చెప్పి ఇంట్లోవాళ్లు తనకు భయం చెప్పేవారు. జీవా అన్నం తినకపోతే నాన్న వస్తున్నాడు అని చెప్పి బెదిరించే వారు. ఏదైనా అల్లరి పనులు చేస్తున్నా ఇలాగే చేసేవారు. దీంతో నాన్న అనగానే ఏదో తెలియని భయాన్ని ఆమెలో కల్పించారు. నేను దగ్గరకు తీసుకోవాలని చూస్తే భయపడుతూ దూరంగా ఉండేదని’ ధోని చెప్పుకొచ్చాడు. ఆ దూరాన్ని ఈ ఐపీఎల్.. ఈ సీజన్ ఐపీఎల్‌తో జీవాతో ఆ దూరం తగ్గిందని ధోని సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఈ సీజన్లో నా కూతురితో గడిపే సమయం ఎక్కువగా దొరికింది.నా వెంట ఉన్నప్పుడు ఎప్పుడూ గ్రౌండ్‌కు వెళ్లాలని మాత్రమే అడిగేది. అక్కడ జట్టు సహచరుల పిల్లలతో ఎంతో సరదాగా ఆడుకునేది. నేను 1.30, 2.30, 3 గంటలకు లేచేవాడిని. జీవా మాత్రం 9 గంటల్లోపే లేచి బ్రేక్‌ఫాస్ట్ చేసుకుని, పిల్లలతో ఆడుకునేది. అది చూసినప్పుడు నాకు ఎంతో ఉల్లాసంగా ఉండేది.’ అని ధోని మురిసిపోయాడు. క్రికెట్‌ను జీవా ఎంతగా ఇష్టపడుతుందో తెలియదు కానీ, ఏదో ఒకరోజు ఆమెను మ్యాచ్ ప్రజెంటేషన్‌కు తీసుకువస్తానన్నాడు. అప్పుడు అన్నింటికీ ఆమే సమాధానమిస్తుందని ధోని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ సమయంలో తాను జిమ్‌లో కన్న తన రూమ్‌లో ఉన్న రోలర్ మీదనే కసరత్తులు చేసేవాడినన్నాడు. ఈ సీజన్లో ధోని సారథ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ టూర్‌కు సమయం ఉండటంతో ఈ ఖాళీ సమయాన్ని ధోని తన కూతురితో ఆస్వాదిస్తున్నాడు. -
అందుకే నా బ్యాటింగ్ ఆర్డర్ అలా: ధోని
ముంబై: ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్న చెన్నై.. చివరకు టైటిల్‌తో ఘనంగా ముగింపునిచ్చింది. తుది పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పైచేయి సాధించిన ధోని అండ్ గ్యాంగ్.. టైటిల్‌ను ముద్దాడింది. ఈ టైటిల్‌ను సాధించడంలో కెప్టెన్ ధోని కీలక పాత్ర పోషించాడు. ప్రధానంగా బ్యాటింగ్‌లో ముఖ్య పాత్ర పోషించి చెన్నైకు ముచ్చటగా మూడో టైటిల్‌ను అందించాడు. కాకపోతే, ఐపీఎల్-11 సీజన్లో బ్యాటింగ్ ఆర్డర్‌ను పదేపదే మార్చుకోవడంపై ధోని స్పందించాడు. ‘నేను టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్న సమయంలోనే ఫిట్నెస్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఐపీఎల్‌కు ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. ఈ సీజన్లో ఐపీఎల్ జట్టు కోసం చర్చించాల్సిన సందర్భంలో నా బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకోవాలనే ఆలోచనకు వచ్చా. అందుకు నా వయసు ఒక కారణం. ఓవరాల్ ఐపీఎల్లో నా బ్యాటింగ్ ఆర్డర్లో కింది స్థానాల్లో వచ్చిన సమయాల్లో నేను పెద్దగా రాణించలేదు. అందుకు ఈ సీజన్లో సాధ్యమైనంత వరకూ బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రావాలని ఫిక్సయ్యా. నాకు మా జట్టు గెలవడమే ముఖ్యం. దానిలో భాగంగానే ప్రణాళికలు సిద్దం చేసుకున్నాం. ముఖ్యంగా గేమ్‌లో ఓవర్ల ఆధారంగా నా బ్యాటింగ్ ఆర్డర్‌ను 3,4,5 స్థానాలకు మార్చుకుంటూ వచ్చా. మా జట్టు దిగువ స్థాయి బ్యాటింగ్‌ను కూడా సమతూకంగా ఉండేలా చూసుకున్నాం. దాంతో నా బ్యాటింగ్ ఆర్డర్‌ను ముందుకు తీసుకురావడానికి చాన్స్ దొరికింది’ అని ధోని తెలిపాడు. -
గర్ల్‌ఫ్రెండ్‌తో సందీప్ శర్మ నిశ్చితార్థం!
పాటియాలా: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సందీప్ శర్మ త్వరలో ఇంటివాడు కాబోతున్నాడు. తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని సందీప్ శర్మ తాజాగా వెల్లడించాడు. ఈ మేరకు తన కాబోయే భార్య దిగిన ఫొటోను సందీప్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్ పేరు తాషా సాత్విక్‌గా సందీప్ తెలిపాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తాషా.. తరచుగా సందీప్‌ను అభినందిస్తూ ట్వీట్లు చేస్తుంది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. గతంలో కింగ్స్ పంజాబ్ తరపున సందీప్ ఆడే క్రమంలో.. తాషా తన ప్రేమను వ్యక్త పరిచినట్లు సమాచారం. అందుకు సందీప్ కూడా అంగీకారం తెలపడంతో ఎట్టకేలకు ఈ జంట కలిసి జీవితాన్ని పంచుకునేందుకు మార్గం సుగమైంది. గతేడాది వరకు కింగ్స్ ఎలెవన్ తరఫున సత్తా చాటిన సందీప్ శర్మ.. ఈ సీజన్ సన్‌రైజర్స్ తరఫున బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. -
ఫైనల్‌కు కళ్లప్పగించేశారు...
ముంబై: క్రికెట్లో ఐపీఎల్ ఓ సంచలనం. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టీవీ వీక్షకుల ఆదరణలో లీగ్ కొత్త రికార్డును అధిగమించింది. గత నెల 27న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను ఏకంగా ఒక్క స్టార్ టీవీ నెట్వర్క్ చానళ్లలోనే 16 కోట్ల మందికి పైగా వీక్షించారు. దూరదర్శన్‌లో చూసిన వీక్షకులు దీనికి అదనం. అలా డీడీలో కాకుండానే అత్యధిక వీక్షక రికార్డును ఈ ఫైనల్ నమోదు చేసింది. గత ఏడాది టైటిల్ పోరును 12 కోట్ల 10 లక్షల మంది తిలకించారు. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది 32 శాతం వీక్షకులు పెరగడం పెద్ద విశేషం. ఈసారి డిజిటల్ వీక్షకులు కూడా ఐపీఎల్ తుదిపోరుపై కన్నేశారు. గతంతో పోలిస్తే... హాట్‌స్టార్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై 19 శాతం వీక్షకులు పెరిగారు. ఈ ఏడాది స్టార్ నెట్వర్క్ ప్రాంతీయ భాషల వ్యాఖ్యానంపై ఎక్కువగా కసరత్తు చేసింది. స్టార్‌కు చెందిన 8 చానళ్లలో స్థానిక వ్యాఖ్యానం ఉండటంతో వీక్షకులు గతంకంటే బాగా పెరిగారు. -
యువీకి భజ్జీ అదిరిపోయే పంచ్!
హైదరాబాద్: టీమిండియా సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్‌కు స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ అదిరిపోయే పంచ్‌ఇచ్చాడు. ట్విటర్లో ఎప్పుడూ ఫన్నీ ట్వీట్స్‌తో అభిమానులను అలరించే భజ్జీ.. ఈ సారి తన సహచర ఆటగాడు చేసిన ఓ ట్వీట్‌పై సెటైరిక్‌గా స్పందించాడు. ముంబైలోని కరెంట్ కోతలకు చికాకు పడ్డ యువీ రెండు రోజుల క్రితం ‘బంద్రాలో కరెంట్ పోయి గంటైంది.. తెప్పించగలరా?’ అని ట్వీట్ చేశాడు. దీనికి భజ్జీ బిల్లు కడితే కరెంట్ వస్తుందని బదులిస్తూ చమత్కరించాడు. భజ్జీ ఫన్నీ రిప్లే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ఇద్దరు పంజాబ్ ఆటగాళ్లు చాలా కాలం టీమిండియా ఆడారు. ఈ ఐపీఎల్ సీజన్లో హర్భజన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 13 మ్యాచ్‌ల్లో భజ్జీ 7 వికెట్లు పడగొట్టి జట్టు టైటిల్ గెలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇక యువరాజ్ కింగ్స్‌పంజాబ్ తరుపున బరిలోకి దిగి తీవ్రంగా నిరాశ పరిచాడు. 8 మ్యాచ్‌లు ఆడిన యువరాజ్ కేవలం 65 పరుగులు మాత్రమే చేశాడు. Lights Out in Bandra for over an hour now ... can we get it back please ?!?! 😐 — yuvraj singh (@YUVSTRONG12) June 4, 2018 Badshah bill time par diya karo 😜😜😂😂 https://t.co/qHcWnktKtU — Harbhajan Turbanator (@harbhajan_singh) June 4, 2018 -
ప్రేయసిని పెళ్లాడిన క్రికెటర్
బెంగళూరు : కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్‌మన్, కర్టాటక రంజీ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ ఓ ఇంటివాడయ్యాడు. సోమవారం తన ప్రేయసి అషితా సుధ్‌ను వివాహమాడాడు. ఈ పెళ్లికి టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా మయాంక్ ఆగర్వాల్‌తో పాటు స్నేహితులతో దిగిన ఫొటోలను కేఎల్ రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఐదు నెలల క్రితం ఆషిత సూద్‌కు మయాంక్ అగర్వాల్ ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే. అషితా ఒప్పుకోవడం... ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు సైతం వీరి పెళ్లికి అంగీకరించడంతో అతికొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మయాంక్ అగర్వాల్ పంజాబ్ తరుపున మొత్తం 11 మ్యాచ్‌లాడి 120 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్ ఆరంభంలో మంచి ప్రదర్శన కనబర్చిన పంజాబ్ ఆ తర్వాత వరుస ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దేశవాళీ క్రికెట్లో మయాంక్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత్-ఏ జట్టులో చోటు దక్కలేదు. రంజీల్లో కర్ణాటక తరపున బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్ ఈ ఏడాది రంజీల్లో 2,141 పరుగులు సాధించాడు. దీంతో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్‌గా అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. -
గబ్బర్ కబడ్డీ పోజ్.. ఎందుకంటే
ముంబై : టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మైదానంలో వినూత్నంగా సంబరాలు చేసుకుంటూ అభిమానులను అలరిస్తుంటాడు. క్యాచ్ పట్టిన అనంతరం తొడ కొడుతూ ధావన్ ఇచ్చే కబడ్డీ పోజ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ పోజ్ వెనుక ఉన్న కథను ఇటీవల గబ్బర్ చెప్పుకొచ్చాడు. గౌరవ్ కపూర్ ‘బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్’ షోలో పాల్గొన్న ధావన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కబడ్డీ పోజ్‌పై స్పందిస్తూ.. ‘ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ నుంచి ఇది ప్రారంభమైంది. షేన్ వాట్సన్ క్యాచ్ పట్టుకున్న అనంతరం తొలి సారి ఈ పోజ్ ఇచ్చాను. కబడ్డీ ఆటను నేను ఆస్వాదిస్తాను. కబడ్డీ నాకు ఎంతో వినోదాన్ని ఇస్తుంది. నా హృదయం నుంచి వచ్చిన పోజ్ కావడంతో ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చింది. బౌండరీ లైన్ వద్ద నిలబడితే.. కబడ్డీ స్టైల్ పోజ్ ఇవ్వాలని అభిమానులు అడుగుతుంటారు.’ అని గబ్బర్ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే షోలో తనకు గబ్బర్ అనే పేరు ఎలా వచ్చిందో కూడా ధావన్ తెలియజేశాడు. చదవండి: ‘గబ్బర్’ కథ చెప్పిన ధావన్ -
అవును.. బెట్టింగ్‌కు పాల్పడ్డా!
థానె: గత ఐదారేళ్లుగా క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ అంగీకరించారు. అయితే ఇటీవల ముగిసిన ఐపీఎల్–11వ సీజన్లో మాత్రం దాని జోలికిపోలేదని అన్నారు. ఈమధ్యే గుట్టురట్టయిన ఐపీఎల్ బెట్టింగ్ ముఠా కేసులో ఆయన శనివారం థానె పోలీసుల ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఐపీఎల్లో బెట్టింగ్‌కు పాల్పడిన దావూద్ అనుచరుడు, బుకీ సోనూ జలన్ అరెస్టయిన నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని శుక్రవారం పోలీసులు అర్బాజ్‌కు సమన్లు పంపిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ వ్యవహారంలో మే 15న జలన్ సహా నలుగురు అరెస్టయ్యారు. సోనూను విచారిస్తుండగా జలన్‌తో అర్బాజ్ ఖాన్కున్న సంబంధం, బెట్టింగ్ వివరాలు వెల్లడయ్యాయి. బెట్టింగ్‌లో జలన్కు రూ.2.80 కోట్లు కోల్పోయిన అర్బాజ్, ఆ మొత్తాన్ని ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో జలన్ నుంచి బెదిరింపులు కూడా వచ్చినట్లు విచారణలో తేలింది. అటు, బెట్టింగ్‌లో ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు భాగస్వామ్యముందని పోలీసులకు జలన్ వెల్లడించారు. ఆయన కూడా విచారణకు హాజరుకావాలని త్వరలోనే సమన్లు జారీచేస్తామని పోలీసులు తెలిపారు. ఆ నిర్మాత ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సినీ నిర్మాణ, పంపిణీ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. బెట్టింగ్ వల్లే మలైకాతో విడాకులు! బెట్టింగ్ వ్యసనమే అర్బాజ్ వైవాహిక జీవితాన్ని నాశనం చేసినట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌లో పాల్గొనవద్దని భార్య మలైకా అరోరా ఎంత నచ్చజెప్పినా అర్బాజ్ పెడచెవిన పెట్టినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అప్పటికే దెబ్బతిన్న వారి సంబంధాలు బెట్టింగ్ వల్ల మరింత క్షీణించాయని వెల్లడించాయి. సోదరులు సల్మాన్‌ఖాన్, సొహైల్ ఖాన్లు కూడా అర్బాజ్ అలవాటును మాన్పించేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు తెలిసింది. విడిపోతున్నామని 2016లోనే ప్రకటించిన అర్బాజ్–మలైకా దంపతులకు గతేడాది నవంబర్‌లో విడాకులు మంజూరయ్యాయి. తమ విడాకులపై వచ్చిన పలు కట్టుకథలను వారు ఖండించారు. విడిపోయిన తరువాత కూడా వారిద్దరు 15 ఏళ్ల కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్నేహపూర్వకంగానే మెలుగుతున్నారు. -
గబ్బర్-గేల్ ఒక్కటై ఇరగదీశారు! వైరల్
సాక్షి స్పోర్ట్స్: అద్భుతమైన ఆటతోపాటు విలక్షణమైన యాటిట్యూడ్‌తోనూ అభిమానుల్ని అలరించడంలో ముందుంటారు జమైకన్ క్రిస్‌గేల్, ఇండియన్ ‘గబ్బర్’ శిఖర్ ధావన్! మొన్నటి ఐపీఎల్లో వేర్వేరు జట్ల తరఫున ఆడిన ఈ దిగ్గజాలు.. వేదిక మారగానే ఒక్కటైపోయారు. ఇటీవల ముంబైలో జరిగిన సియాట్ అవార్డుల ఫంక్షన్లో ‘జుమ్మా..చుమ్మా..’ పాటకు స్టెప్పులేసి ఇరగదీశారు. గబ్బర్-గేల్ల సందడి వీడియో వైరల్ అయింది. జమైకన్ దలేర్ మెహంది: పంజాబీ స్టైల్లో తలపాగా ధరించిన క్రిస్ గేల్‌ను ధావన్ పొగడ్తలతో ముంచెత్తాడు. ‘‘చూడండి.. జమైకా దలేర్ మెహందితో సెల్ఫీదిగా. మనసంతా బోలో తారారారా..’’అని గబ్బర్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్ 2018లో కింగ్స్ లెవెన్ పంజాబ్ తరుఫున 11 మ్యాచ్‌లు ఆడిన గేల్.. ఒక సెంచరీ, రెండు అర్థసెంచరీలతో మొత్తం 368 పరుగులు చేశాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్‌గా 16 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన శిఖర్ ధావన్ నాలుగు హాఫ్ సెంచరీలతో మొత్తం 497 పరుగులు చేశాడు. -
ధోనికి, నాకు బాగా కలిసొచ్చింది..!
సాక్షి, చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -11లో ఒక్కో జట్టుది ఒక్కో అనుభవం. అయితే విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు మాత్రం ఈ సీజన్ ప్రత్యేకమని చెప్పవచ్చు. అసలే రెండేళ్ల నిషేధం తర్వాత రీఎంట్రీ ఇచ్చినా.. తొలి యత్నంలోనే ఎంఎస్ ధోని సేన కప్పు ఎగరేసుకుపోయింది. తమ జట్టు కప్పు నెగ్గిన నేపథ్యంలో టీమిండియా సీనియర్ క్రికెటర్, చెన్నై ప్లేయర్ హర్భజన్ సింగ్ కొన్ని మధురస్మృతులను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ‘అదే స్టేడియం (ముంబైలోని వాంఖేడె)లో మేము 2011లో జరిగిన వన్డే ప్రపంచ కప్ సాధించాం. కానీ ఐపీఎల్లో పదేళ్లపాటు ప్రత్యర్థులుగా ఉన్న మేము 11వ సీజన్లో ఒకే జట్టు తరఫున ఆడతామనుకోలేదు. ఈ విధంగా ప్రస్తుతం కప్పు నెగ్గుతామని ఊహించలేకపోయాం. వాంఖేడె మాకు కలిసొచ్చిందని’ ఎంఎస్ ధోని, చెన్నై ఐపీఎల్ అని ట్యాగ్ చేస్తూ భజ్జీ ట్వీట్ చేశాడు. భజ్జీ చేసిన ఈ ట్వీట్ విశేష స్పందన వస్తోంది. వేల సంఖ్యలో రీట్వీట్లు, లైక్స్‌తో హర్భజన్ ట్వీట్ వైరల్ అవుతోంది. కాగా, చెన్నై జట్టు ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్‌కు ఇంతకాలం ప్రాతినిథ్యం వహించిన అంబటి రాయుడు, హర్భజన్లు ఐపీఎల్ 11లో చెన్నైకి ఆడారు. దీంతో నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టు సభ్యులుగా రాయుడు, భజ్జీలు నిలిచారు. గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన వీరు మూడు పర్యాయాలు ఐపీఎల్ నెగ్గిన జట్టులో సభ్యులు. Same ground where we won the World Cup 2011 together and never imagine we would be playing together in ipl for the same team and winning it after 10 years playing against each other’s...Wankhede lucky venue for us ? @msdhoni @ChennaiIPL @IPL 🥇🏆🏏💪 pic.twitter.com/4Bkgt4Xnil — Harbhajan Turbanator (@harbhajan_singh) 30 May 2018 -
ప్రముఖ బుకీ అరెస్టు
ముంబై : ముంబై కేంద్రంగా పలు రాష్ట్రాల్లో కోట్ల రూపాయల ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్‌ను నిర్వహిస్తున్న ప్రముఖ బుకీని మంగళవారం నాడు థానే పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ముంబైలోని దొంబివాలా ప్రాంతంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న థానే దోపిడీ వ్యతిరేక విభాగానికి చెందిన పోలీసులు ఆ ప్రాంతంలో దాడి చేసి బుకీని అరెస్టు చేశారు. అతడి నుంచి ల్యాప్‌టాప్‌లను, పదుల సంఖ్యలో మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. నిందితుడు దేశంలోనే టాప్‌మోస్ట్ బుకీ సోను జలాన్ అలియాస్ సోను మలాద్గా పోలీసులు ప్రకటించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జలాన్ ఈ ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్‌లు నిర్వహించడానికి సోషల్ మీడియా ద్వారా కొన్ని లింకులను పంపించేవాడు. ఇతర ఏజెన్సీలకు, పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం. బెట్టింగ్‌లో పాల్గొనాలనుకునే వారు ఆ లింకుల ద్వారా బెట్టింగ్ పెడతారు. ఇలా పెట్టినవారికి జలాన్‌కు సంబంధించిన వ్యక్తుల ద్వారా కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది. జలాన్ దొంబివాలా పరిసరాలలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాలను కూడా బెట్టింగ్‌కు అడ్డగా మార్చుకున్నాడని తెలిపారు. -
అందుకే చెన్నై గెలిచింది : గంభీర్
సాక్షి, న్యూఢిల్లీ : ఐపీఎల్-11 విజేత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యంపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. సీఎస్కే యాజమాన్యం తమ కెప్టెన్ ధోనీని క్రికెట్ బాస్‌గా భావిస్తుందని.. ఫీల్డ్‌లో అతనికి పూర్తి స్వేచ్చను ఇవ్వడం ద్వారా ఒత్తిడిని తగ్గించి తద్వారా విజయాల్ని తమ ఖాతాలో వేసుకుంటుందని పేర్కొన్నాడు. ఈ కారణంగానే ఆ జట్టు ఏడుసార్లు ఫైనల్‌కు చేరడమే కాకుండా మూడుసార్లు విజేతగా నిలిచిందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ వంటి టోర్నమెంట్లో ఒక కెప్టెన్‌గా విజయవంతమవ్వాలంటే ఆటగాళ్లతో పాటు యాజమాన్యం సహకారం కూడా ఎంతో ముఖ్యమని గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఐపీఎల్ చాలా ఖరీదైన వ్యాపారమని.. ఫ్రాంచైజీ ఫీజు, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది జీతాలు, ప్రయాణ ఖర్చులు అంటూ యాజమాన్యం ఎంతో ఖర్చు పెడుతుందని గంభీర్ ఒక ప్రముఖ పత్రికలో రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు. అన్నిటికంటే ఇక్కడ ఇగోకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లోని వివిధ జట్ల యజమానులు అందరు వేర్వేరు వ్యాపారాల్లో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించారని.. అయితే క్రికెట్‌ను కూడా ఒక వ్యాపారం లాగే భావిస్తారని.. పెట్టుబడికి తగిన లాభం వచ్చిందా లేదా అనే విషయం మీదే వారికి ఎక్కువ శ్రద్ధ ఉంటుందని ఘాటుగా విమర్శించాడు. క్రికెటర్లలాగా వారు కూడా ఓటమిని ద్వేషిస్తారని.. విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ఇష్టపడతారే గానీ.. ఒకవేళ వారి సలహాల వల్ల ఓటమి ఎదురైనపుడు అందుకు తగిన కారణాలు చూపితే వారి ఇగో దెబ్బతింటుందని పరోక్షంగా తమ జట్టు యాజమాన్య తీరును ఎండగట్టాడు. ‘కొన్ని మ్యాచ్‌ల తర్వాత కెప్టెన్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నా.. యాజమాన్యం నాకు మామూలు ఆటగాడిగానూ అవకాశం ఇవ్వలేదు. మీరెందుకు ఆ తర్వాత ఢిల్లీ జట్టులో ఆడలేదని కొందరు ఇప్పటికీ అడుగుతున్నారు. అయితే వాస్తవం వేరేలా ఉంది. ప్రధాన ఆటగాళ్లయిన రబడ, క్రిస్ మోరిస్‌లకు గాయాలు కావడంతో పాటు కొందరు ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేశారు. దీంతో జట్టు వరుస వైఫల్యాలు చవిచూడాల్సి వచ్చింది. కీలక ఆటగాళ్లు సరైన సందర్భాల్లో రాణించకపోవడంతో ఈ సీజన్లో ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన నాలో ఒత్తిడిని పెంచడంతో విఫలమయ్యానని’ గంభీర్ పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్లో ఢిల్లీ కేవలం 10 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. -
విమానంలో కింగ్స్ సందడి
సాక్షి, చెన్నై : ఐపీఎల్ –2018 సుల్తాన్‌గా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించిన విషయం తెలిసిందే. అద్భుతమైన ఫీల్డింగ్, బౌలింగ్ , బ్యాటింగ్‌తో ధోని సేన అభిమానుల మన్ననల్ని అందుకుంది. చెన్నైకి చేరుకున్న కింగ్స్ సేనకు బ్రహ్మరథం పట్టే రీతిలో అభిమాన లోకం ఆహ్వానం పలికింది. చెన్నైలోని ఓ హోటళ్లో ప్రముఖులు, కింగ్స్ ప్రతినిధులతో సంబరాలు చేసుకున్నారు. అయితే, ముంబై నుంచి చెన్నైకు వచ్చే సమయంలో విమానంలో కింగ్స్ సేన సంబరాల్లో మునిగాయి. ముంబైలో మ్యాచ్ ముగించుకుని సోమవారం జట్టు సభ్యులు చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. వాట్సన్‌తో పైలట్ , ఐపీఎల్ కప్‌తో ఆనందం వీరంతా జెట్ ఎయిర్ వేస్‌లో పయనించారు. క్రికెటర్లు తమ విమానంలో పయనిస్తుండడంతో ముందుగానే జెట్ ఎయిర్వేస్ విమాన సిబ్బంది ఏర్పాట్లు చేసుకున్నారు. సొంత గడ్డ చెన్నైలో అడుగు పెట్టనున్న ధోని సేనతో కలిసి విమానంలో విజయోత్సవ ఆనందాన్ని పంచుకున్నారు. కేక్ కట్ చేశారు. కప్‌ను విమాన పైలట్, ఎయిర్ హోస్టస్‌లు చేత బట్టి ఆనందంలో ఉబ్బితబ్బిబ్బ య్యారు. క్రికెటర్లతో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సంబరాల్ని హోరెత్తించారు. కేక్ తినిపిస్తున్న బ్రేవో ,కేక్ కట్ చేస్తున్న వాట్సన్ -
నాకు ఎదురు తిరిగింది రాయుడొక్కడే
-
రాయుడు Vs భజ్జీ : ఎన్నోసార్లు సారీ చెప్పా
న్యూఢిల్లీ : టీమిండియా ఆటగాళ్లు హర్భజన్ సింగ్, అంబటి రాయుడు ఐపీఎల్ ఆరంభం నుంచి 2017 సీజన్ వరకు ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడి ఆ జట్టు మూడు సార్లు టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాకతాళీయమో, యాదృచ్ఛికమో కానీ తాజా సీజన్లో సైతం ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకే జట్టు తరుపున బరిలోకి దిగారు. ఈ సీజన్లో వీరిని చెన్నైసూపర్ కింగ్స్ కొనుగోలుచేసింది. చెన్నై టైటిల్ నెగ్గడంలో ఈ ఇద్దరు తమవంతు పాత్ర పోషించారు. అయితే ఈ ఇద్దరి ఆటగాళ్లు 2016 సీజన్లో మైదానంలో ఒకరినొకరు దూషించుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకే జట్టుకు చెందిన ఆటగాళ్లు గొడవపడటం చాలా అరుదు. కానీ రైజింగ్ పుణెతో జరిగిన ఓ మ్యాచ్‌లో ఫీల్డింగ్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ భజ్జీ రాయుడిపై గట్టిగా అరిచాడు. దీనికి రాయుడు తిరగబడటంతో వెనక్కి తగ్గిన భజ్జీ క్షమాపణలు కోరాడు. అయినా రాయుడు శాంతించకుండా దురుసుగా ప్రవర్తించాడు. ఈ వాగ్వాదంపై తాజాగా ‘భజ్జీ బ్లాస్ట్ విత్ సీఎస్కే షో’లో ఈ స్టార్ క్రికెటర్లు స్పందించారు. ముందుగా ఈ ఘటనను గుర్తు చేసుకున్న రాయుడు ఈ విషయంలో భజ్జీని ఎన్నోసార్లు క్షమాపణలు కోరానన్నాడు. అసలు ఆ సమయంలో ఎందుకు అలా ప్రవర్తించానో తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. భజ్జీ మాట్లాడుతూ.. ‘నేను ఎంతోమందితో కొట్లాడాను, కానీ ఎవరు నాకు ఎదురు తిరగలేదు. రాయుడొక్కడే నాతో గొడవపడ్డాడు. మైదానంలో ఇలాంటివి సహజమే. నేను సైతం ఎంతోమంది సీనియర్లతో గొడవపడ్డాను. ఆ సమయంలో క్షమాపణలు తెలియజేస్తే సమస్య ఉండదు.’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు. రాయుడు క్షమాపణలు చేప్పాల్సిన పనిలేదన్నాడు. ఐపీఎల్లో నాలుగు సార్లు టైటిల్ నెగ్గిన ఆటగాళ్లుగా రోహిత్ శర్మతో కలిసి ఈ ఇద్దరు ఆటగాళ్లు రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
అసలు చాపెల్ ఎవడు : గేల్ ఫైర్
ముంబై : ఐపీఎల్-11 సీజన్లో తన బ్యాట్‌తో అభిమానులను అలరించాడు వెస్టిండీస్ విధ్వంసకర్ బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్. అయితే ఓ చానెల్ ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ పేరును ప్రస్తావిస్తే చిర్రుబుర్రులాడాడు. 2016 బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా గేల్ మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి విమర్శలు ఎదుర్కొన్నా విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటనపై ఇయాన్ చాపెల్ స్పందిస్తూ.. గేల్‌ను ప్రపంచ వ్యాప్తంగా నిషేదించాలన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్‌లో అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా సైతం గేల్‌కు 10 వేల యూఎస్ డాలర్లు జరిమానాగా విధించింది. అనంతరం బిగ్ బాష్ లీగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఘటనలు ఏమైనా జరిగితే మాత్రమే జోక్యం చేసుకుంటామని, ఆటగాళ్ల నియమాకాల విషయం మాత్రం తమకు సంబంధం లేదని, బిగ్ బాష్‌లీగ్‌లో గేల్ ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ పేర్కొనడంతో గేల్‌కు ఊరట లభించింది. అసలు అప్పుడేం జరిగిందంటే.. 2016 బిగ్ బాష్ లీగ్ సందర్భంగా హోబార్ట్ హరికేన్స్-మెల్బోర్న్ రెనగేడ్స్ మ్యాచ్ అనంతరం మహిళా జర్నలిస్టు పట్ల గేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం టెన్ స్పోర్ట్స్ ప్రజెంటర్ మెలానీ మెక్‌లాఫిలిన్ గేల్‌ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. గేల్ ఇన్నింగ్స్ గురించి కొన్ని ప్రశ్నలు అడగ్గా.. గేల్ స్పందిస్తూ.. 'నువ్వు చేసే ఈ ఇంటర్వ్యూ కోసమే నేను చాలా బాగా బ్యాటింగ్ చేశాను. నీ కళ్లు చాలా అందంగా ఉన్నాయి. మనం కలిసి డ్రింక్స్‌కు వెళ్దామా.. మరీ సిగ్గుతో పొంగిపోకు బేబి' అని అన్నాడు. తాజాగా ఈ వివాదాన్ని గుర్తు చేస్తూ సదరు రిపోర్టర్ ఇయన్ చాపెల్ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. అసలు ఇయాన్ చాపెల్ ఎవడని గేల్ ఘాటుగా సమాధానమిచ్చాడు. ఐపీఎల్ ఫైనల్‌పై స్పందిస్తూ.. రెండు బీకర జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూడకుండా ఉంటామా అని, 179 పరుగులు సాధించిన సన్‌రైజర్స్ గెలుస్తుందనుకున్నానని, కానీ షేన్ వాట్సన్ అద్భుత ఇన్నింగ్స్‌తో చెన్నైని గెలిపించాడని గేల్ పేర్కొన్నాడు. క్రీజులో పరుగుల తీయడానికి వెనకడుగేస్తారన్న ప్రశ్నకు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవసరమైతే నాలుగు పరుగులు కూడా తీస్తానన్నాడు. ఈ సీజన్ కింగ్స్‌పంజాబ్ తరపున బరిలోకి దిగిన గేల్.. ప్రారంభ మ్యాచుల్లో విధ్వంసం సృష్టించినా చివర్లో తడబడటంతో ఆ జట్టు లీగ్ దశ నుంచే నిష్క్రమించిన విషయం తెలిసిందే. -
మోస్ట్ పాపులర్ నేనేనేమో: రషీద్ ఖాన్
ముంబై: ఒకరి విజయం వందలమందికి స్ఫూర్తినిస్తుంది. నిత్యం బాంబుల మోతమోగే అఫ్ఘాన్ నేలపై క్రికెట్ ఓనమాలు దిద్దిన రషీద్ ఖాన్.. ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎదిగిన తీరు, స్వదేశంలో శాంతి నెలకొనాలని తపిస్తున్న వైనం అభిమానుల మనసుల్లో అతని స్థానాన్ని మరింతగా పదిలం చేశాయి. గత సీజన్ కంటే ఐపీఎల్ 2018లో అత్యుత్తమ గణాంకాలను నమోదుచేసి, అటు అంతర్జాతీయంగానూ రాణించిన రషీద్‌కు సియాట్ ‘‘బౌలర్ ఆఫ్ ది ఇయర్’’ అవార్డు కూడా దక్కింది. సోమవారం రాత్రి ముంబైలో జరిగిన వేడుకలో అవార్డు స్వీకరించిన ఈ యువ స్పిన్నర్.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీక్రెట్ ఆఫ్ సక్సెస్: ‘‘టీ20 క్రికెట్లో ఆటను ఆస్వాదించడమే అతిప్రధానమైన విషయం. ఎంతలా ఎంజాయ్ చేస్తే, మన పెర్ఫామెన్స్ అంత బాగుంటుంది. ఎప్పుడైతే భయం మొదలవుతుందో, ఇబ్బందులు తప్పవు. స్పిన్‌ను సమర్థవంతంగా ఆడగలిగిన విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ లాంటి ఉద్ధండులకు బౌలింగ్ చేసినప్పుడు కూడా నేను స్థిరంగానే ఉన్నా. వాళ్ళ వికెట్లు పడగొట్టడంతో నా ధైర్యం రెట్టింపైంది. వచ్చే నెలలో ఇండియాతో అఫ్ఘాన్ ఆడబోయే టెస్ట్ మ్యాచ్‌లోనూ ఇదే యాటిట్యూడ్‌తో ఆడతా.. సచిన్ ట్వీట్ ఓ స్వీట్ షాక్: కోల్‌కతాతో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో నా ప్రదర్శనను అందరూ మెచ్చుకున్నారు. మ్యాచ్ అనంతరం స్టేడియం నుంచి హోటల్‌కు బస్‌లో వెళ్లేటప్పుడు నా స్నేహితుడొకరు ఓ స్క్రీన్ షాట్ పంపాడు. చూస్తే.. సచిన్ ట్వీట్. అది చదివి చిన్నపాటి షాక్‌కు గురయ్యానంటే నమ్మండి! రియాక్ట్ కావడానికి రెండు గంటలు పట్టింది. మరి, క్రికెట్ దేవుడిలాంటి సచిన్.. నన్ను పొగడటమంటే మాటలా!! ఆయన ప్రశంస నన్ను మరింత ఉత్తేజపర్చింది. మోస్ట్ పాపులర్..: ‘ఇండియాలో క్రికెటర్ల పాపులారిటీ ఏంటో చూస్తూనే ఉన్నారు.. మరి అఫ్ఘనిస్తాన్‌లో కూడా ఇలాంటి గుర్తింపే ఉంటుందా?’ అన్న ప్రశ్నకు రషీద్ ఖాన్... ‘‘ఇప్పటివరకు తెలిసిందేమంటే.. మా దేశాధ్యక్షుడి తర్వాత అఫ్ఘాన్‌లో మోస్ట్ పాపులర్ వ్యక్తిని నేనేనేమో..’’ అని చమత్కరించాడు. యుద్ధ బాధితుడు: యుద్ధ బాధితులైన రషీద్ ఖాన్ కుటుంబం.. నాటి సంక్షోభ సమయంలో కొన్నాళ్లపాటు పాకిస్తాన్లో తలదాచుకున్నారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత తిరిగి స్వస్థలం నంగార్హర్(అఫ్ఘనిస్తాన్)కు వెళ్లిపోయారు. పాక్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీని స్ఫూర్తిగా తీసుకోవడమేకాదు.. అతని బౌలింగ్ యాక్షన్నే రషీద్ అనుకరిస్తాడు. -
‘వర్మ కంపెనీ’ పేరుతో బెట్టింగ్ నిర్వహణ
కడప అర్బన్ : అంతర్రాష్ట్ర క్రికెట్ బుకీలుగా ఎదిగిన ఇద్దరు రాష్ట్రంలోని పలు జిల్లాల వారికి మోస్ట్ వాం టెడ్‌గా ఉన్నారు. కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఐసీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌ను ఈనెల 27న లైవ్‌లో చూస్తూ బెట్టింగ్‌కు నిర్వహిస్తూ పోలీ సులకు చిక్కారు.రూ. 60 లక్షల మేరకు విలువైన నగదు, కారు, ఇతర సామగ్రితో పట్టుబడ్డారు. వీరు సాధారణ గుమాస్తాలుగా తమ జీవితాలను ప్రారంభించి ‘వర్మ కంపెనీ’ పేరుతో రూ. 15 కోట్లు ఇప్పటి వరకు బెట్టింగ్‌లకు పాల్పడి విలాసవంతమైన జీవితాలను గడిపారు. వీరి కోసం కడప పోలీసులతో పాటు, హైదరాబాద్, అనంతపురం, ధర్మవరం, పశ్చిగోదావరి, నెల్లూరు జిల్లా పోలీసులు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల విచారణలో వెల్లడైన విషయాలివి.. వర్మ కంపెనీ వ్యవస్థాపక, నిర్వాహకుడుగా వ్యవహరిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ముదునూరి అశోక్ వర్మ అలియాస్ వర్మ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ ఒక కన్స్ట్రక్షన్ సంస్థలో గుమాస్తాగా ఉద్యోగంలో చేరాడు. 2013లో ఒక క్రికెట్ బుకీ పరిచయమయ్యాడు. అతని వద్ద గుమాస్తాగా చేరి బెట్టింగ్ చేయడంలో నైపుణ్యం సంపాదించాడు. తర్వాత 2016లో ప్రొద్దుటూరుకు చెందిన ప్రధాన బుకీతో పరిచయం ఏర్పడింది. అతనితోపాటు, మరికొందరితో కలిసి ‘వర్మ కంపెనీనీ ఏర్పాటు చేశాడు. అంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల్లోని వందల మంది సబ్ బుకీల ద్వారా పంటర్లను (బెట్టింగ్ ఆడేవారు) దించి వారి ద్వారా బెట్టింగ్ జరుపుతున్నాడు. తద్వారా సంపాదించిన సొమ్ముతో హైదరాబాదు, విజయవాడల్లో ఆస్తులు సంపాదించినట్లు విచారణలో తేలింది. ఇతనిపై కడప, నెల్లూరు, అనంతపురం, ధర్మవరంలలో క్రికెట్ బెట్టింగ్ కేసులు కలవు. ఇతన్ని అరెస్టు చేసేందుకు హైదరాబాద్, అనంతపురం, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల పోలీసులు చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన పెన్మస్థ రవివర్మ అలియాస్ రవి పదవ తరగతి వరకు చదువుకుని అదే గ్రామంలో ఎరువుల దుకాణంలో గుమస్తాగా చేరాడు. తర్వాత 2014లో క్రికెట్ బుకీతో పరిచయం ఏర్పడి అతని వద్ద గుమాస్తాగా చేరి బెట్టింగ్ చేయడంలో నైపుణ్యం సంపాదించాడు. 2016లో అశోక్‌వర్మ ప్రొద్దుటూరుకు చెందిన ప్రధాన బుకీతో పరిచయమై వర్మ కంపెనీలో బెట్టింగ్ వివరాలు చేసేవాడు. ఇందుకుగాను ఇతనికి సంస్థ ద్వారా నెలకు రూ. 1.50 లక్షల జీతం, సంస్థ ఆదాయంలో కొంత వాటా ఇస్తారు. ఇతనిపై కడప, అనంతపురం, ధర్మవరంలలో క్రికెట్ బెట్టింగ్ కేసులు ఉన్నాయి. గంజాయి వ్యాపారం కూడా... క్రికెట్ మ్యాచ్‌లలో హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణం, బెంగళూరు, గోవా, కడప, ప్రొద్దుటూరులలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని అమాయకులు, విద్యార్థులను బెట్టింగ్ కూపంలోకి దించి వారిని మోసం చేసి పెద్ద మొత్తంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో గంజా యి వ్యాపారం కూడా చేస్తున్నట్లు తెలిసింది. వీరికి ప్రొద్దుటూరు, భీమవరం, గుంటూరు, హైదరాబాద్‌లకు చెందిన మరికొందరు ప్రధాన బుకీలతో, మహరాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉండే బెట్టింగ్ దందా నడిపించే సేట్లతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. వీరద్దరూ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ. 15 కోట్లు బెట్టింగ్ లావాదేవీలు జరిపినట్లు, గెలిచిన, ఓడిపోయిన వారికి మద్య లావాదేవీలను హవాలా మార్గం ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు, బెట్టింగ్ ద్వారా సంపాదించిన సొమ్ముతో విలాసవంతమైన జీవితాలను గడుపుతూ జల్సాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తెలిసింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ బెట్టింగ్.. అశోక్‌వర్మ, రవివర్మ కడప తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలోని అక్కాయపల్లెలో ఒక అద్దె ఇంటి ఆవరణంలో ఆదివారం సాయంత్రం చెన్నై సూపర్‌కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ జట్ల మధ్య జరిగిన లైవ్ మ్యాచ్‌ను టీవీలో చూస్తూ బెట్టింగ్‌లను కాశారని, 26 సెల్ఫోన్లు కలిగిన కమ్యూనికేటర్ ద్వారా, ఆరు సెల్ఫోన్లలో మాట్లాడుతూ అందులోని అప్లికేషన్స్ ద్వారా బెట్టింగ్ రేటు తెలుపుతూ ల్యాప్‌టాప్‌లో సాఫ్ట్వేర్ ద్వారా వివరాలు నమోదు చేసుకుంటూ ఉండగా సమాచారం అందిందని జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసరెడ్డి విలేకరులకు తెలిపారు. సోమవారం విలేకరుల ఎదుట అరెస్టు అయిన బుకీలను హాజరు పరిచారు.ఎస్పీ బాబూజీ అట్టాడ ఆదేశాల మేరకు సీసీఎస్ డీఎస్పీ జి.నాగేశ్వర్‌రెడ్డి, కడప డీఎస్పీ షేక్ మాసుంబాష, అర్బన్ సీఐ దారెడ్డి భాస్కర్‌రెడ్డి, తాలూకా ఎస్ఐ ఎన్.రాజరాజేశ్వర్‌రెడ్డి, సీసీఎస్ ఎస్ఐ రాజారెడ్డి, సిబ్బందితో కలిసి నిందితులను అరెస్టు చేశారన్నారు. వారి వద్ద నుంచి రూ. 35,05,000 నగదు, 26 సెల్ఫోన్లు కలిగిన కమ్యూనికేటర్, ల్యాప్‌టాప్, ఆరు సెల్ఫోన్లు, టీవీ, కారు, నాలుగు కిలోల గంజాయి, బెట్టింగ్‌కు సంబంధించిన ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారన్నారు. ఈ సంఘటనలో నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన డీఎస్పీలు, సీఐ, ఎస్ఐలు, తాలూకా ఏఎస్ఐ వర్మ, హెడ్ కానిస్టేబుల్ మురళి, కానిస్టేబుళ్లు శివప్రసాద్, కిరణ్‌బాబు, సురేష్‌రెడ్డి, సుబ్బయ్య, సీసీఎస్ సిబ్బంది ఏఎస్ఐ మల్లయ్య, హెడ్ కానిస్టేబుల్ విశ్వనాథరెడ్డి, కానిస్టేబుళ్లు సుధాకర్‌రెడ్డి, ప్రభు, బాష, హోం గార్డు నాయక్‌లను ఆయన అభినందించారు. -
సన్‌రైజర్స్ మెరుపులు సరిపోలేదు
సన్‌రైజర్స్ హైదరాబాద్.... ఐపీఎల్లో అత్యధిక విజయాలరేటు నమోదు చేసిన జట్టు... లీగ్ దశలో టేబుల్ టాపర్... ప్లే ఆఫ్ బెర్తు దక్కించుకున్న మొదటి జట్టు... అత్యల్ప స్కోర్ల మ్యాచ్‌ల్లోనూ అలవోక విజయాలు... పటిష్ట బౌలింగ్ దళం... కానీ కీలక సమయంలో తడబాటు... చివర్లో లయ కోల్పోయి గెలుపునకు దూరంగా జరిగింది. ఫలితంగా ఐపీఎల్ ట్రోఫీని చెన్నై చేతుల్లో పెట్టేసింది. సాక్షి, హైదరాబాద్: కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్.. బౌలర్లు రషీద్‌ఖాన్, భువనేశ్వర్‌ల ప్రదర్శనలతో ఎలాగైనా ట్రోఫీ ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాదేనని ఆశించిన అభిమానులకు చివర్లో నిరాశ ఎదురైంది. టోర్నీ ఆసాంతం ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించిన సన్ బౌలింగ్ బృందం చివర్లో చెన్నై సూపర్‌కింగ్స్ ముందు కుదేలైంది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన హైదరాబాద్ ఎప్పటిలాగే ఒకరిద్దరు బ్యాట్స్మెన్లపై ఆధారపడటంతో ఫైనల్ ఫలితం మరోలా వచ్చింది. వాట్సన్ మెరుపు సెంచరీతో చెన్నై 8 వికెట్లతో గెలిచి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. లీగ్ దశలో వరుసగా తొలి 11 మ్యాచ్‌ల్లో కేవలం రెండే పరాజయాలు. హైదరాబాద్ జోరుకు ఇది నిదర్శనం. కానీ తర్వాత లయను కోల్పోయిన సన్ చివరి 6 మ్యాచ్‌ల్లో రెండే విజ యాలు సాధించింది. బౌలింగ్ ప్రదర్శనలు బాగున్నప్పటికీ బ్యాట్స్‌మెన్ తీరు మారకపోవడంతో రైజర్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. ప్రతి మ్యాచ్‌లో ఏ ఒక్కరో కనబరిచిన అద్భుత ప్రతిభ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. మంచి కెప్టెన్ దొరికాడు... 2016లో సన్‌రైజర్స్ టైటిల్ గెలవడంలో నాటి కెప్టెన్ డేవిడ్ వార్నర్ కీలకం. బాల్ ట్యాంపరింగ్ కారణంగా వార్నర్ ఐపీఎల్‌కు దూరమవడంతో అనూహ్యంగా కెప్టెన్సీ దక్కించుకున్న న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్... దాదాపు వార్నర్‌ను మరిపించాడు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ భారాన్ని ఒక్కడే మోశాడు. 52.50 సగటుతో 735 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. ఇందులో 8 అర్ధసెంచరీలు ఉండటం విశేషం. కానీ మరో ఎండ్‌లో శిఖర్ ధావన్ (497) నిలకడలేమి కొనసాగింది. లీగ్ దశలో అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నప్పటికీ కీలకమైన ప్లేఆఫ్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్లోనూ ధావన్ పేలవంగా ఆడాడు. వికెట్ కీపర్లు సాహా, శ్రీవత్స్ గోస్వామి కూడా రాణించలేకపోయారు. మిడిలార్డర్లో షకీబుల్ హసన్, మనీశ్ పాండే తమ స్థాయికి తగిన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. చివర్లో ఫైనల్ మ్యాచ్‌లో యూసుఫ్ పఠాన్ తన పాత ఫామ్‌ను అందుకున్నాడు. ఈ సీజన్లో ఇదే అతని ఉత్తమ ప్రదర్శనగా చెప్పవచ్చు. బౌలింగే బలం.. రాయల్ చాలెంజర్స్‌పై 146, రాజస్తాన్ రాయల్స్‌పై 151, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 132, ముంబై ఇండియన్స్‌పై 118 పరుగుల స్వల్ప స్కోర్లను నమోదు చేసిన సన్‌రైజర్స్ ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఘనవిజయాలే సాధించింది. దీనికి కారణం సన్ బౌలింగ్ బృందమే. బ్యాట్స్‌మెన్ విఫలమైన చోట పేసర్లు భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్... స్పిన్నర్ రషీద్ ఖాన్ చెలరేగిపోయారు. అసాధ్యమనుకున్న చోట అద్భుత విజయాలను అందించారు. ఈ సీజన్లో కౌల్, రషీద్‌ఖాన్ చెరో 21 వికెట్లను దక్కించుకుని అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. పర్పుల్ క్యాప్ దక్కించుకున్న టై (24) వీరికన్నా కేవలం 3 వికెట్లు మాత్రమే ఎక్కువ సాధించాడు. షకీబుల్‌హసన్ (14 వికెట్లు), సందీప్ శర్మ (12) కూడా రాణించారు. ప్లే ఆఫ్ నుంచే పతనం... లీగ్ దశలో అంతా అనుకున్నట్టే జరిగింది. కానీ ప్లేఆఫ్స్‌కు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. బెంచ్ బలాన్ని పరీక్షిస్తున్నట్లు విలియమ్సన్ జట్టులో మార్పులు చేయడం కష్టాల్ని తెచ్చిపెట్టింది. బాసిల్ థంపి, కార్లోస్ బ్రాత్‌వైట్ కెప్టెన్ అంచనాల్ని అందుకోలేకపోయారు. బెంగళూరుతో మ్యాచ్‌లో థంపి ఏకంగా 70 పరుగులు సమర్పించుకొని చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ప్లే ఆఫ్ నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ ఆడిన బ్రాత్‌వైట్ చెన్నైతో జరిగిన క్వాలిఫయర్‌లో 18 పరుగులిచ్చి విజయాన్ని దూరం చేశాడు. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో అతను కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. అంతకుముందు 118 పరుగుల్ని కూడా నిలుపుకున్న సన్‌రైజర్స్ నాకౌట్ 4 మ్యాచ్‌ల్లో రెండుసార్లు 170కి పైగా స్కోరు చేసి కూడా గెలవలేకపోయింది. మరోవైపు విలియమ్సన్, శిఖర్ మినహా సన్ బ్యాట్స్‌మెన్ యూసుఫ్ (15 మ్యాచ్‌ల్లో 260), మనీశ్ పాండే (15 మ్యాచ్‌ల్లో 284), షకీబ్ (17 మ్యాచ్‌ల్లో 239) ఎవరూ కూడా 30 సగటును సాధించలేకపోవడం వారి వైఫల్యాన్ని సూచిస్తుంది. -
సూపర్ కింగ్స్‌కు ఘన స్వాగతం
చెన్నై: చెన్నైలో ఒకే ఒక మ్యాచ్ ఆడి వెళ్లిపోయిన వారి అభిమాన జట్టు ఇప్పుడు ఏకంగా టైటిల్‌తోనే తిరిగొచ్చింది. అందుకే వారూ వీరనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో అభిమానులు తమ సూపర్ కింగ్స్‌కు అపూర్వ రీతిలో స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. ఆదివారం మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ధోని సోమవారం పూర్తి జట్టుతో చెన్నైకి తరలి వెళ్లింది. విమానాశ్రయం, హోటల్ వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఫ్యాన్స్ తమ కింగ్స్‌కు స్వాగతం చెప్పారు. జట్టు యజమాని, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ ఇచ్చిన ప్రైవేట్ డిన్నర్‌కు ఆటగాళ్లంతా రాత్రి హాజరయ్యారు. మరోవైపు జట్టు సీఈఓ కేఎస్ విశ్వనాథన్ స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం గుడిలో వెంకటేశ్వర స్వామి ముందు ఐపీఎల్ ట్రోఫీని ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. -
ధోనితో బ్రావో త్రీ రన్స్ చాలెంజ్
-
ధోనీ vs బ్రేవో : గెలిచిందెవరు?
సాక్షి, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ -11వ సీజన్లో త్రీ రన్స్ చాలెంజ్ బాగా పాపులర్ అయింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనితో ఆ జట్టు ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో ఈ పోటీలో పాల్గొన్నారు. మరి ఇద్దరిలో గెలిచిందెవరూ?. ఇంకెవరు వయసు మీద పడుతున్నా యువ ఆటగాళ్లకు సవాలు విసురుతున్న ధోనినే నెగ్గాడు. అవును. ధోని, బ్రేవోలు ఇద్దరు హోరాహోరీగా వికెట్ల మధ్య పరుగులు తీశారు. అయితే, బ్రేవో కంటే కొన్ని ఇంచ్‌ల ముందు క్రీజులో బ్యాట్‌ను పెట్టిన ధోని గెలుపొందాడు. అవార్డుల ప్రధానోత్సవం తర్వాత చాలాసేపు చెన్నై ఆటగాళ్లంతా మైదానంలో సందడి చేస్తూ గడిపారు. ఈ సమయంలోనే బ్రేవో-ధోనిల మధ్య త్రీ రన్స్ ఛాలెంజ్ నిర్వహించారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను చూసేయ్యండి. -
ఇతను లక్కీ అయితే.. అతను అన్ లక్కీ
హైదరాబాద్ : ఐపీఎల్-11 సీజన్ ఫైనల్ అనంతరం ఇద్దరి ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ తుది పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్లతో విజయాన్నందుకొని టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే చెన్నై టైటిల్ నెగ్గడానికి ఆ జట్టు లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మనే కారణమని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. కాకతాళీయమో, యాదృచ్ఛికమో కానీ గత మూడు సీజన్లుగా కరణ్ శర్మ ఏ జట్టులో ఉంటే ఆ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. 2016 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిగా ఆ జట్టు చాంపియన్‌గా నిలిచింది. 2017లో ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగగా ఈ జట్టు సైతం ట్రోఫిని సొంతం చేసుకుంది. ఇప్పుడు చెన్నైతో ఈ సెంటిమెంట్ మూడోసారి కలిసొచ్చింది. టోర్నీ ఆరంభంలోనే ఈ విషయాన్ని వెల్లడించిన అభిమానులు అది నిజమవ్వడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇక ఈ సీజన్లో కరణ్ శర్మ 6 మ్యాచ్‌లు ఆడగా చెన్నై 5 మ్యాచ్‌లు నెగ్గి ఒకటి మాత్రమే ఓడింది. ఇక ఫైనల్లో అనూహ్యంగా బజ్జీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన కరణ్ శర్మ ధోని తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ధోని వ్యూహంలో భాగంగా వైడ్ బంతి వేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్(47)ను బోల్తా కొట్టించాడు. దీంతో భారీ భాగస్వామ్యాన్ని అడ్డుకున్నట్లైంది సన్‌రైజర్స్ అన్‌లక్కీ గాయ్.. ఇక చెన్నైకి కరణ్ శర్మ లక్కీ ప్లేయర్ అయితే.. సన్‌రైజర్స్‌కు యువ కీపర్ శ్రీవత్స్ గోస్వామి అన్ లక్కీ గాయ్‌గా మిగిలిపోయాడని సన్ అభిమానులు అభిప్రాపడుతున్నారు. ఈ సీజన్లో గోస్వామి ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఒక్కటంటే ఒక్క మ్యాచే గెలిచింది. అది కూడా తానడిన తొలి మ్యాచ్ మినహా వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో వృద్దిమాన్ సాహ తుది జట్టులోకి రాగా ఈ మ్యాచ్ సన్‌రైజర్స్ గెలుపొందింది. అభిమానులు ఈ లెక్కలే చెబుతూ సన్‌రైజర్స్ అన్ లక్కీ గాయ్ గోస్వామి అంటూ ట్రోల్ చేస్తున్నారు. Delhi, Punjab and Bangalore should target Karn Sharma in upcoming IPL auction to win their 1st IPL title. — Tejas Satam (@tejassatam95) May 28, 2018 -
‘భారత పౌరసత్వం’పై రషీద్ స్పందన..
ముంబై : ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అఫ్గానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్.. ఇప్పడు హాట్ టాపిక్ అయ్యాడు. తన అద్భుత స్పిన్ మ్యాజిక్కు తోడు, మెరుపు బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అతడికి భారత క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోయారు. దీంతో కొందరు అభిమానులు రషీద్‌కు భారత పౌరసత్వం ఇచ్చి.. టీమిండియాలోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని కూడా స్పందించిన విషయం తెలిసిందే. దీనిపై అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అతీఫ్ మషల్ ఓ ట్వీట్ చేశాడు. ‘‘రషీద్ ఖాన్ కోసం ఆఫర్ చేస్తున్నవారందరికీ థ్యాంక్స్. ప్రపంచ వ్యాప్తంగా అతడికెంత డిమాండ్ ఉందో నాకు తెలుసు. కానీ, అతడు ఎక్కడికీ వెళ్లడు. ఎందుకంటే.. అతడు అఫ్గానిస్తాన్ దేశస్థుడిగానే గర్వపడుతున్నాడు’’ అని ట్వీట్ చేశాడు. అందుకు రషీద్ ఖాన్ బదులిస్తూ ..‘ఖచ్చితంగా.. మిస్టర్ చైర్మన్. నేను అఫ్గానిస్తాన్ పౌరుడిగా గర్వపడుతున్నాను. నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. నా దేశం కోసం పోరాడుతాను. మేము శాంతిని వ్యాప్తి చేయాలనుకుంటున్నాం.. ఎందుకంటే అది మా దేశానికి చాలా అవసరం’ అంటూ రషీద్ బదులిచ్చాడు. Sure Mr. Chairman, @mashalAtif I am proud Afghan and I will stay in my country and will work and fight for our nation. We spread peace and our country needs us. — Rashid Khan (@rashidkhan_19) 26 May 2018 -
అతని వల్లే ఓడాం: టామ్ మూడీ
ముంబై: ఐపీఎల్-11 సీజన్ ఫైనల్లో తమ ఓటమికి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సనే కారణమని సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం మూడీ మాట్లాడుతూ.. ‘వాట్సన్ ఇన్నింగ్స్ ప్రత్యేకం. మేం పోరాడే లక్ష్యాన్ని నిర్ధేశించాం. కానీ తన ప్రత్యేకమైన ఆటతో మా విజయాన్నిలాగేసుకున్నాడు. ఈ సీజన్ అద్భుతంగా సాగింది. మేం ఇంట (హోం గ్రౌండ్), బయట అద్భుతంగా రాణించాం. కొన్ని మ్యాచ్‌లు ఓడినప్పటికి టోర్నీలో మాపై అంతగా ప్రభావం చూపలేదు. కేన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తనలోని మూడు కోణాలను ప్రపంచానికి చాటి చెప్పాడు. రషీద్ గొప్ప క్రికెటర్. భారత అభిమానులు మాత్రమే కాదు ప్రపంచం మొత్తం అతని మాయలో పడిపోయింది. బౌలింగ్‌లోనే కాదు.. మైదానంలోని అతని కమిట్మెంట్ చాలా గొప్పది’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఆదివారం జరిగిన ఫైనల్లో షేన్ వాట్సన్ అద్భుత సెంచరీతో చెన్నై టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. -
ధోని ఖాతాలో మరో రికార్డు
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభంలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డులకెక్కిన ఎంఎస్ ధోని.. సన్‌రైజర్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డును నెలకొల్పాడు. కరణ్ శర్మ బౌలింగ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను స్టంపౌట్ చేయడం ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్టంపౌట్లు చేసిన వికెట్ కీపర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు. ఇది ధోనికి ఓవరాల్ ఐపీఎల్లో 33 స్టంపింగ్. ఫలితంగా ఐపీఎల్లో అత్యధిక స్టంపింగ్ జాబితాలో ఇప్పటివరకూ అగ్రస్థానంలో ఉన్న రాబిన్ ఉతప్ప(32)ను ధోని అధిగమించాడు. ఆ తర్వాత స్థానాల్లో దినేష్ కార్తీక్(30), సాహా(18)లు ఉన్నారు. రెండేళ్ల నిషేధం తర్వాత రంగంలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ పునరాగమనాన్ని ఘనంగా చాటింది. అసాధారణ ఆటతీరుతో ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఆదివారం ముంబైలో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది. -
ఓటమిపై స్పందించిన వార్నర్
ముంబై : చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి చెంది తృటిలో టైటిల్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరాజయంపై సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం ట్విటర్ వేదికగా తన సహచర ఆటగాడు షేన్ వాట్సన్ ప్రదర్శనను కొనియాడిన వార్నర్.. సన్‌రైజర్స్ ఆటగాళ్ల పోరాటాన్ని ప్రశంసించాడు. ‘నా సహచర ఆటగాడు షేన్‌వాట్సన్ విజృంభణను చూడటం అద్బుతంగా ఉంది. ఫలితాన్ని పక్కన పెడితే.. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరడం గొప్ప విషయం.’ అని ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌కు అభిమానులు ముగ్దులయ్యారు. ఈ సీజన్లో నీవు లేవు వార్నర్.. వచ్చే సీజన్లో కప్ సన్రైజర్స్దేనని, ఫైనల్లో నీవిలువేంటో తెలిసిందని, నీవు ఉంటే కనీసం 200 లక్ష్యాన్నైనా నిర్ధేశించేవారని కామెంట్ చేస్తున్నారు. ఇక బాల్ ట్యాంపరింగ్‌తో ఏడాది నిషేదం ఎదుర్కొంటున్న వార్నర్‌ను బీసీసీఐ ఐపీఎల్‌కు అనుమతించని విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఫైనల్లో షేన్ వాట్సన్ అద్భుత సెంచరీతో సీఎస్కే టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. Seriously good knock by @ShaneRWatson33 well done mate simply amazing to watch. Not the result @SunRisers wanted but you have to pat yourselves on the back and say well done for the way you played throughout the tournament 👍 — David Warner (@davidwarner31) May 27, 2018 Welcome Back @davidwarner31 pic.twitter.com/Tj3W9SthLC — Faiyaz kaif (@Faiyazkaif1) May 28, 2018 -
ఐపీఎల్లో ఫ్లాప్ స్టార్స్
సాక్షి, ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11వ సీజన్ ముగిసింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ ఫైట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది. ఈ సీజన్ వేలంలో ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తారనుకున్న ఆటగాళ్ల కోసం ప్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. అయితే కోట్లు పెట్టిన ఆటగాళ్లు విఫలం కావడంతో ఆయా ప్రాంఛైజీలు వరుస ఓటములను చవిచూశాయి. వేలానికి కోట్లు కుమ్మరించిన ఆటగాళ్లు అంచనాలు అందుకోవడంలో ఘోరంగా చతికిలబడ్డారు. సదరు ఆటగాళ్ల పేలవ ప్రదర్శనతో జట్టు అవకాశాలను కోల్పయింది. వేలంలో కోట్లు పలికి ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన టాప్ 5 ఆటగాళ్లు వీరే. అరోన్ ఫించ్( కింగ్స్ లెవన్ పంజాబ్) టీ20 ఫార్మాట్లో ప్రత్యేకంగా స్థానమున్న ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్‌ను కింగ్స్ లెవన్ పంజాబ్ పోటీపడి రూ. 6.2 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది. కానీ, ఈ సీజన్లో అరోన్ ఒక్క మ్యాచ్‌లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు. సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. కొన్ని మ్యాచ్‌ల్లో మిడిలార్డర్‌గా, మరికొన్ని మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగడంతో ఆటతీరుపై ప్రభావం పడింది. మొత్తంగా ఈ సీజన్లో 134 పరుగులు మాత్రమే ఫించ్ చేయగలిగాడు. గ్లెన్ మాక్స్వెల్(ఢిల్లీ డేర్‌డెవిల్స్) సుడిగాలి ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లను అమాంతం మలుపు తిప్పగల ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్. దీంతో మ్యాక్స్‌వెల్‌ను దక్కించుకునేందుకు ప్రాంచైజీలు పోటీపడ్డాయి. ఐపీఎల్లో మంచి అనుభవం కూడా ఉండడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ. 9 కోట్లు పోసి వేలంలో దక్కించుకుంది. కానీ మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించడంలో దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్లో కేవలం 169 పరుగులు సాధించి, 5 వికెట్లు మాత్రమే తీశాడు. బెన్‌స్టోక్స్(రాజస్తాన్ రాయల్స్) 10 వ సీజన్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఫైనల్ వరకు చేరిందంటే దానికి కారణం ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్. అదే జోరు ఈ ఏడాది కొనసాగిస్తాడని ఆశించిన రాజస్తాన్ రాయల్స్ జట్టుకు అతను షాకిచ్చాడు. ఐపీఎల్-11 సీజన్ ఆటగాళ్ల వేలంలో అత్యధికంగా రూ.12.5 కోట్ల ధర పలికిన స్టోక్స్.. ఈ ధరకు న్యాయం చేయలేకపోయాడు. ఆల్‌రౌండర్‌గా పేరొందిన స్టోక్స్ 196 పరుగులు చేసి, 8 వికెట్లు తీశాడు. మనీశ్ పాండే(సన్‌రైజర్స్ హైదరాబాద్) ఈ ఏడాది జరిగిన వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మనీశ్ పాండేను రూ.11.5 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే జట్టు తనపై పెట్టుకున్న ఆశల్ని మాత్రం మనీశ్ నెరవేర్చలేకపోయాడు. పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లు మినహాయిస్తే.. మిగతా మ్యాచుల్లో మనీశ్ పాండే స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యాడు. తమ జట్టు కోసం ఆడకుండా.. ప్రత్యర్థి జట్టు గెలుపు కోసం మనీశ్‌కు కష్టపడుతున్నాడని సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పేలేయాయి. ఈ టోర్నీలో మనీశ్ కేవలం 284 పరుగులు మాత్రమే చేశాడు. జయ్‌దేవ్ ఉనాద్కత్(రాజస్తాన్ రాయల్స్) ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక ధర రూ.11.5 కోట్లు పలికిన భారత ఆటగాడు జయ్‌దేవ్ ఉనాద్కత్. టీ20ల్లో స్పెషలిస్ట్ బౌలర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉనాద్కత్‌ను రాజస్తాన్ రాయల్స్ భారీ మొత్తంతో కొనుగోలు చేసింది. గత సీజన్లో పుణె తరపున 12 మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో అదరగొట్టడంతో ఉనాద్కత్‌పై రాజస్థాన్ కోట్లు కుమ్మరించింది. కానీ ఈ సీజన్లో అతడు పేలవ ప్రదర్శన చేసి రాజస్థాన్ అంచనాలను తలక్రిందు చేశాడు. ఈ టోర్నీలో ఉనాద్కత్ 11 వికెట్లు మాత్రమే తీశాడు. -
తొలి ఆటగాడిగా వాట్సన్
ముంబై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సన్ కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఐపీఎల్ ఫైనల్స్‌లో భాగంగా ఛేజింగ్‌లో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా వాట్సన్ రికార్డు సృష్టించాడు. ఆదివారంతో ముగిసిన ఐపీఎల్-11 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తుది పోరులో వాట్సన్(117 నాటౌట్) అజేయ శతకం సాధించాడు. ఫలితంగా ఓవరాల్ ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ పోరు లక్ష్య ఛేదనలో శతకం బాదిన మొదటి ఆటగాడిగా వాట్సన్ గుర్తింపు సాధించాడు. అంతకముందు ఐపీఎల్ ఫైనల్ పోరు ఛేదనలో అత్యధిక స్కోరు చేసిన వారిలో మనీష్ పాండే(94-2014), మన్వీందర్ బిస్లా(89-2012), క్రిస్ గేల్(76-2016)లు మాత్రమే ఉన్నారు. అయితే ఐపీఎల్ ఫైనల్స్‌లో శతకం సాధించిన రెండో ఆటగాడిగా వాట్సన్ నిలిచాడు. గతంలో వృద్ధిమాన్ సాహా ఐపీఎల్ ఫైనల్లో సెంచరీ సాధించాడు. 2014 ఐపీఎల్ ఫైనల్లో కింగ్స్ పంజాబ్ తరపున ఆడిన వృద్ధిమాన్ సాహా(115 నాటౌట్)..కేకేఆర్‌పై సెంచరీ సాధించాడు. -
సిద్దార్థ్ కౌల్ చెత్త రికార్డు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ సిద్దార్థ్ కౌల్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఓవరాల్ ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్లో అత్యధిక పరుగులు సమర్పించుకుని చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఈ సీజన్లో సిద్దార్థ్ కౌల్ ఇచ్చిన పరుగులు 547, కాగా, ఆ తర్వాత స్థానంలో డ్వేన్ బ్రేవో ఉన్నాడు. ఐపీఎల్-11వ సీజన్లో బ్రేవో 533 పరుగులు ఇచ్చాడు. ఇలా ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న జాబితాలో సిద్దార్థ్ కౌల్, బ్రేవోలు వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉండగా, ఉమేశ్ యాదవ్(508-2013) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మెక్లీన్గన్(507-2017) నాల్గో స్థానంలో ఉండగా, ఆపై మళ్లీ డ్వేన్ బ్రేవో(497-2013; 494-2016) రెండు సార్లు అత్యధిక పరుగుల్ని సమర్పించుకున్నాడు. -
సన్‌రైజర్స్‌పైనే ‘రైజింగ్’
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11వ సీజన్లో ఐదు శతకాలు నమోదయ్యాయి. అందులో నాలుగు శతకాలు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పైనే రావడం ఒకటైతే, ఆ నాలుగు సందర్భాల్లోనూ ప్రత్యర్థి ఆటగాళ్లు అజేయం నిలవడం మరొకటి. సన్‌రైజర్స్‌పై ఫైనల్ పోరులో షేన్ వాట్సన్(117 నాటౌట్) శతకం బాదగా, అంతకుముందు క్రిస్ గేల్(104 నాటౌట్), అంబటి రాయుడు(100 నాటౌట్), రిషబ్ పంత్(128 నాటౌట్)లు హైదరాబాద్‌పై సెంచరీలు సాధించి అజేయంగా నిలిచారు. పటిష్టమైన బౌలింగ్ లైనప్ కల్గిన సన్‌రైజర్స్‌పై వీరంతా ఆధిపత్యం చెలాయించి సెంచరీలతో సత్తాచాటారు. వాట్సన్ అరుదైన ఘనత ఈ ఐపీఎల్ సీజన్లో సీఎస్కే ఆటగాడు షేన్ వాట్సన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక సీజన్లో రెండు సెంచరీలు సాధించిన నాల్గో ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. లీగ్ దశలో రాజస్తాన్ రాయల్స్‌పై వాట్సన్(106) సెంచరీ నమోదు చేయగా.. ఫైనల్లో సన్‌రైజర్స్‌పై శతకంతో మెరిశాడు. అంతకుముందు ఒక సీజన్లో రెండు, అంతకంటే సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి ముందంజలో ఉన్నాడు. 2016లో కోహ్లి నాలుగు శతకాలు ఆకట్టుకోగా, 2011లో క్రిస్ గేల్ రెండు సెంచరీలు సాధించాడు. 2017లో హషీమ్ ఆమ్లా రెండు శతకాల్ని నమోదు చేయగా, తాజాగా వారి సరసన వాట్సన్ చేరాడు. -
చెన్నై.. విజిల్ పొడూ మా..!!
సాక్షి, ముంబై : రెండేళ్ల తర్వాత ఐపీఎల్లో పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి సత్తా చాటింది. మిస్టర్ కూల్ ధోని కెప్టెన్సీలో సగర్వంగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. హోం గ్రౌండ్లో మ్యాచ్‌లు చూడలేకపోయామనే తమిళ అభిమానుల బాధను టైటిల్ సాధించి ఇట్టే మాయం చేసి.. వారి చేత విజిల్స్ వేయించింది. సీనియర్ల జట్టు అంటూ ఎగతాళి చేసిన వారి ముందే గెలిచి నిలిచింది. అంతేకాకుండా కొత్తగా జట్టులో చేరిన ముంబై మాజీ ఆటగాళ్లు హర్భజన్, అంబటి రాయుడులకు నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచామనే అనుభూతిని అందించింది. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్న ధోనీ జట్టుపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది. జట్టులో భాగస్వాములైన చెన్నై ఆటగాళ్ల విజయానందం వారి మాటల్లోనే.. అంబటి రాయుడు చెన్నై జట్టుకు ఆడడం అదృష్టంగా భావిస్తున్నాను. కష్టపడినందుకు ఫలితం దక్కింది. తొలుత వికెట్ కొంచెం నెమ్మదించింది. కానీ తర్వాత అంతా సర్దుకుంది. ఈ విజయంలో నా వంతు పాత్ర పోషించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. రవీంద్ర జడేజా చాంపియన్స్ టీమ్‌లో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఫైనల్ మ్యాచ్‌లో మా ఆట తీరు ఎంతో గొప్పగా ఉంది. రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మేము చాంపియన్లుగా ఈ సీజన్‌కి ముగింపు పలికాము. లుంగి ఎంగిడి డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం బాధ్యతతో కూడుకున్నది. నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు. ఈ మ్యాచ్ చాలా అద్భుతంగా సాగింది. అద్భుతమైన ఈ విజయాల్లో భాగస్వాములయ్యే అవకాశం అందరికీ రాదు. ప్రస్తుతం నేను ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నాను. హర్భజన్ సింగ్ ఇది నాకు నాలుగో ఐపీఎల్ టైటిల్. అద్భుతమైన ఛేజింగ్ ద్వారా మేము విజయాన్ని దక్కించుకున్నాము. ధోని వ్యూహాల్ని చక్కగా అమలు చేశాడు. ఫింగర్ స్పిన్నర్‌తో పోల్చినపుడు ఐపీఎల్లో రిస్ట్ స్పిన్నర్స్కే ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం లభిస్తోంది. వచ్చే సీజన్ నుంచి ఈ ఆనవాయితీ మారుతుందనుకుంటా. కర్ణ్ శర్మచాలా బాగా ఆడాడు. డ్వేన్ బ్రావో ఇదొక ప్రత్యేకమైన సందర్భం. రెండేళ్లుగా ఒక్కొక్కరం ఒక్కో టీమ్‌లో ఉన్నాం. సీఎస్కే పునరాగమనం ద్వారా మళ్లీ ఒక చోటికి చేరాం. ఈ టీమ్‌లో కొందరు కొత్త ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఒక ఆటగాడికి అనుభవం అనేది ఎంత ముఖ్యమో వాట్సన్ మరోసారి నిరూపించాడు. అతను ప్రపంచ స్థాయి ఆటగాడు. వట్టూ నీ ఇన్నింగ్స్ ఎంతో ప్రత్యేకం. శార్దూల్ ఠాకూర్ గతేడాది ఐపీఎల్ ఫైనల్లో(రైజింగ్ పుణె తరపున) ఆడే అవకాశం లభించింది. కానీ టైటిల్ సాధించలేకపోయాం. ప్రస్తుతం ఈ విజయంతో నాకు ప్రపంచాన్ని జయించినట్టుగా ఉంది. ఇదే ఆఖరు మ్యాచ్.. కనుక డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేయాలనే ఆలోచనతో నా మైండ్ నిండిపోయింది. నా ప్రణాళికను చక్కగా అమలు చేయడం ద్వారా టాప్ విన్నింగ్‌లో భాగస్వామిని అయినందుకు ఎంతో గర్వంగా ఉంది. -
కేకేఆర్, ముంబైల సరసన..
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ ఫైట్‌లో సీఎస్కే ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది. ఫలితంగా మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచి ముంబై ఇండియన్స్ సరసన చెన్నై నిలిచింది. కాగా, లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచి ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడం చెన్నైకు ఇది రెండోసారి. అంతకుముందు 2011 ఐపీఎల్లో లీగ్ దశలో రెండో స్థానంలో ఉన్న సీఎస్కే టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గెలిచి ఐపీఎల్ టైటిల్‌ను గెలిచింది. ఇదిలా ఉంచితే, ఇలా లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచి ఐపీఎల్ టైటిల్స్‌ను రెండుసార్లు గెలిచిన జట్ల జాబితాలో కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు మాత్రమే ఉన్నాయి. 2012, 2014లో కేకేఆర్ లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచి టైటిల్స్‌ను సాధించగా, 2013, 2015 సీజన్లలో ముంబై ఇండియన్స్ కూడా ఇదే తరహాలో ట్రోఫీలు సొంతం చేసుకుంది. తాజాగా సీఎస్కే టైటిల్‌ను కైవం చేసుకోవడంతో కేకేఆర్, ముంబై ఇండియన్స్‌ల సరసన నిలిచింది. -
సూపర్ కింగ్స్ కొత్త రికార్డు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ కొత్త రికార్డు నమోదు చేసింది. ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నాలుగుసార్లు గెలిచి నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఐపీఎల్-11లో లీగ్ దశలో సన్‌రైజర్స్‌పై రెండుసార్లు విజయం సాధించిన ధోని అండ్ గ్యాంగ్.. ఆ తర్వాత క్వాలిఫయర్-1, ఫైనల్ మ్యాచ్‌ల్లో సైతం విజయ ఢంకా మోగించింది. ఫలితంగా ఒక సీజన్లో ఒక జట్టుపై అత్యధికంగా నాలుగుసార్లు గెలిచిన తొలి జట్టుగా సీఎస్కే చరిత్ర సృష్టించింది. అదే సమయంలో సన్‌రైజర్స్ ఒక సీజన్లో ఒక జట్టుపై అత్యధిక సార్లు ఓటమి పాలైన అపప్రథను మూటగట్టుకుంది. ఆదివారం సన్‌రైజర్స్‌తో జరిగిన ఫైనల్ పోరులో చెన్నై 8 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సీఎస్కే విజయంలో షేన్ వాట్సన్(117;57 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు) ముఖ్య భూమిక పోషించాడు. -
ఐపీఎల్ విజేత చెన్నై; ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో రెండేళ్ల నిషేధం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2018 విజేతగా నిలిచింది. ‘మిస్టర్ కూల్’ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని జట్టుకు ఇది మూడో ట్రోఫీ. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ సేన 8 వికెట్ల తేడాతో గెలుపొంది కప్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంలో షేన్ వాట్సన్(57 బంతుల్లో 117) వీరబాదుడుకు తోడు మరో సెంటిమెంట్ కూడా కలిసొచ్చిందని చెన్నై సారధి చెప్పుకొచ్చాడు. నంబర్ 7: ‘‘ఫైనల్స్ అన్నాక ప్రతి ఒక్కరూ రకరకాల గణాంకాలను వల్లెవేస్తుంటారు. నా వరకైతే నంబర్ 7 సెంటిమెంట్ కీలకంగా అనిపించింది. ఇవాళ తేదీ మే 27. సాధించాల్సిన స్కోరు 179, నా జెర్సీ నంబర్ కూడా 7. అన్నింటికంటే మించి చెన్నై టీమ్ ఫైనల్స్‌కు రావడం ఇది 7వసారి. అన్ని చోట్లా 7 ఉంది. అలా కలిసొచ్చింది(నవ్వులు). అఫ్కోర్స్, సెంటిమెంట్ల సంగతి ఎలా ఉన్నా టీమ్ పెర్ఫామెన్స్ అనేది విజయానికి అతి ప్రధానం’’ అని చెప్పాడు ధోని. ప్యాడ్స్ కట్టుకోవద్దని చెబుతా: కీలకమైన ఫైనల్స్‌లో చెన్నై ఓపెనర్ ఫ్యాప్ డుప్లిసిస్(10) స్కోరుకే అవుటయ్యాడు. అప్పటికే డ్వేన్ బ్రేవో ప్యాడ్లు కట్టుకుని సిద్ధమైపోవడంతో వన్ డౌన్లో అతనే వస్తాడేమో అనిపించింది. కానీ ఆర్డర్ ప్రకారం రైనానే వచ్చాడు. దీనిపై ధోనీ వివరణ ఇస్తూ.. ‘‘బ్రేవోని సిద్ధంగా ఉండమని నేనేమీ చెప్పలేదు. తనంతట తానే ప్యాడ్స్ కట్టుకుని రెడీ అయిపోయాడు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాలని అనుకోనేలేదు. ఈసారి అలా ప్యాడ్స్ కట్టుకోవద్దని బ్రేవోని చెబుతా..’’ అని ధోనీ చమత్కరించాడు. నేడు చెన్నైకి..: ఈ సీజన్లో సొంతగడ్డపై ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన సూపర్ కింగ్స్ జట్టు సోమవారం చెన్నైకి వెళ్లనుంది. గెలిచినా, ఓడినా చెన్నై వెళ్లి అభిమానుల్ని కలుసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు ధోనీ చెప్పాడు. కావేరీ ఆందోళనల నేపథ్యంలో సీఎస్కే హోం గ్రౌండ్ చెన్నై నుంచి పుణెకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్ బౌలర్లు రషీద్, భువీలపై ధోనీ ప్రశంసలు కురిపించాడు. ‘‘మిస్టరీ బౌలర్ రషీద్లాగే భువనేశ్వర్ కూడా చాలా తెలివైన బౌలర్. కాబట్టి ప్రత్యర్థి జట్టులో మమ్మల్ని ఇబ్బందిపెట్టేవారు ఒకరికంటే ఎక్కువే ఉన్నారు. అయితే వాట్సన్ స్టన్నింగ్ ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది’’ అని మిస్టర్ కూల్ వివరించాడు. మ్యాచ్ రిపోర్ట్: ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నై 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (36 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యూసుఫ్ పఠాన్ (25 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం చెన్నై 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఐపీఎల్ ఫైనల్లో ఛేదనలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా వాట్సన్ గుర్తింపు పొందగా, సురేశ్ రైనా (24 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 57 బంతుల్లోనే 117 పరుగులు జోడించడం విశేషం. -
వాట్సన్.. నీకిదే వందనం!
సాక్షి, ముంబై : ‘సింహంతో వేట.. నాతో ఆట’ రెండూ ప్రమాదకరమే.. అన్నచందంగా సాగింది షేన్ వాట్సన్ బ్యాటింగ్... తొలి 10 బంతుల్లో స్కోరు 0... కానీ తర్వాతి 57 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో ఏకంగా 117 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బలమైన బౌలింగ్ జట్టుగా పేరున్న సన్‌రైజర్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడిన వాట్సన్.. చెన్నై జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న ధోనీ జట్టు, షేన్ వాట్సన్‌పై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు అభినందనలు. ప్రపంచంలోనే పెద్ద టీ20 టోర్నమెంట్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్ టైటిల్‌కు మీరు అర్హులు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న చెన్నై ఆటగాళ్లకు శుభాభినందనలు. ఈ విజయం తమిళనాడు ప్రజలందరికీ చెందుతుందంటూ’.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ చెన్నై జట్టును ప్రశంసలతో ముంచెత్తాడు. ‘సూపర్ కోచ్... సూపర్ కెప్టెన్.. సూపర్ టోర్నమెంట్లో సూపర్ విజయాన్ని అందుకుందంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ట్వీట్ చేశాడు. ‘అద్భుతమైన ప్రదర్శన చేసిన షేన్ వాట్సన్.. నీకిదే నా వందనం. మనందరికీ ఎంతో ఇష్టమైన క్రికెట్ పండుగ ముగిసింది. లవ్ యూ ఇండియా’ అంటూ ఆసీస్ క్రికెట్ దిగ్గజం మాథ్యూ హెడెన్ వాట్సన్‌ను అభినందించారు. ‘ఈ సీజన్లో సన్‌రైజర్స్ ఆటతీరు పట్ల నాకెంతో గర్వంగా ఉంది. మమ్మల్ని పోత్సహించిన అభిమానులకు, సన్‌రైజర్స్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. షేన్ వాట్సన్ చాలా అద్భుతంగా ఆడాడు. మీరు(సీఎస్కే) ఈ విజయానికి అర్హులంటూ’.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు. ‘సీఎస్కే మూడోసారి ఐపీఎల్ టైటిల్ సాధించడంలో షేన్ వాట్సన్ కీలక పాత్ర పోషించాడు’ అంటూ ఐసీసీ అభినందించింది. Congratulations Chennai Superkings on becoming deserving champions of the biggest T20 tournament in the world. Brilliant throughout the tournament and the wonderful people from Chennai and whole of TN deserve this @ChennaiIPL . #IPL2018Final — Virender Sehwag (@virendersehwag) May 27, 2018 Super Coach ... Super Captain ... Winning a Super Tournament ... #IPL2018Final — Michael Vaughan (@MichaelVaughan) May 27, 2018 Very very special performance @ChennaiIPL @ShaneRWatson33 take a bow mate...#crushedit God Bless you all as our beloved festival of @IPL comes to a conclusion. Love you India❤️❤️❤️ pic.twitter.com/sDHeLJucwq — Matthew Hayden AM (@HaydosTweets) May 27, 2018 A @ShaneRWatson33 special guides @ChennaiIPL to their third @IPL title! 🏆 #IPL2018Final #CSKvSRH pic.twitter.com/VguMr6T8SQ — ICC (@ICC) May 27, 2018 Very proud of the way @SunRisers played in this IPL, I thank each and every member of the @SunRisers family for their efforts and support. Absolutely brilliant knock from Shane Watson and many congratulations to @ChennaiIPL on a well-deserved victory #IPLfinal2018 — VVS Laxman (@VVSLaxman281) May 27, 2018 -
ఐపీఎల్–11 అవార్డులు, విశేషాలు
ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్–రూ.10 లక్షలు) విలియమ్సన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్–735 పరుగులు) పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్–రూ. 10 లక్షలు) ఆండ్రూ టై (కింగ్స్ ఎలెవన్ పంజాబ్–24 వికెట్లు) పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ (రూ. 10 లక్షలు): ట్రెంట్ బౌల్ట్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్) ఎమర్జింగ్ ప్లేయర్ (రూ. 10 లక్షలు): రిషభ్ పంత్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్–684 పరుగులు) మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (రూ. 10 లక్షలు): సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) సూపర్ స్ట్రయికర్: సునీల్ నరైన్ (నెక్సా కారు–కోల్‌కతా నైట్‌రైడర్స్) స్టయిలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ (రూ. 10 లక్షలు): రిషభ్ పంత్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్) నయీ సోచ్ సీజన్ అవార్డు: చెన్నై కెప్టెన్ ధోని (రూ. 10 లక్షలు) ఫెయిర్ ప్లే అవార్డు: ముంబై ఇండియన్స్ ఉత్తమ మైదానం: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా (రూ. 50 లక్షలు) రన్నరప్: సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 12 కోట్ల 50 లక్షలు) విన్నర్: చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 20 కోట్లు) ఆరెంజ్ క్యాప్ అందుకున్న విలియమ్సన్ విశేషాలు... 735 విలియమ్సన్ చేసిన పరుగులు. ఒక ఐపీఎల్ సీజన్లో 700కు పైగా పరుగులు చేసిన ఐదో ఆటగాడు. గతంలో కోహ్లి (973–2016లో), వార్నర్ (848–2016లో), క్రిస్ గేల్ (733–2012లో), మైక్ హస్సీ(733-2013) ఈ ఘనత సాధించారు. 40తో ఈ సీజన్లో చెన్నై, రైజర్స్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌లు కూడా గెలిచింది. ఐపీఎల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. 4 రాయుడు, హర్భజన్ ఐపీఎల్ టైటిల్స్ సంఖ్య. 3 ముంబై తరఫున సాధించగా ఇది నాలుగోది. రోహిత్ శర్మ (4) కూడా నాలుగు టైటిల్స్ గెలిచాడు. 3 కరణ్ శర్మ వరుసగా మూడేళ్లు మూడు వేర్వేరు జట్ల తరఫున ఐపీఎల్ విజయాల్లో భాగమయ్యాడు. సన్‌రైజర్స్ (2016), ముంబై (2017), చెన్నై (2018). 150 కెప్టెన్‌గా టి20ల్లో ధోనికి ఇది 150వ విజయం. మరే కెప్టెన్ కూడా 100 మ్యాచ్‌లు గెలిపించలేదు. -
ధోని గారాల పట్టి..స్పెషల్ అట్రాక్షన్
-
మూడోసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గిన చెన్నై
-
సాధించెన్నై...
రిటర్న్ ఆఫ్ సూపర్ కింగ్స్... పునరాగమనం అంటే ఎంత ఘనంగా ఉండాలో చెన్నై నిరూపించింది. వివాదంతో లీగ్‌కు రెండేళ్లు దూరమై, వేలంలో మూడు పదుల ఆటగాళ్లతో అంకుల్స్ జట్టుగా ముద్ర పడి, సీజన్లో సొంతగడ్డపై ఒక్క మ్యాచ్‌కే పరిమితమై కూడా ఆ జట్టు అద్భుతాన్ని చేసింది. తమకే సాధ్యమైన రీతిలో విజయయాత్ర కొనసాగించి మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. నాయకుడిగా తనేమిటో మళ్లీ మళ్లీ చూపించిన ధోని మార్గనిర్దేశనంలో, మదరాసీల అభిమాన జనం ప్రోత్సాహంతో విజిల్ పొడు అంటూ గెలుపు ఈల వేసింది. తొలి 10 బంతుల్లో 0 పరుగులు... ఒక టి20 మ్యాచ్‌లో ఇంతటి చెత్త ఆరంభం ఏ బ్యాట్స్‌మన్ కూడా చేసి ఉండడు. కానీ షేన్ వాట్సన్ అలాగే ఆడాడు. కానీ ఆ తర్వాత అతను వీర విధ్వంసం సృష్టించాడు. తర్వాతి 47 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సర్లతో ఏకంగా 117 పరుగులు బాది చెన్నైని విజేతగా నిలిపాడు. ప్రధాన బౌలర్లు భువనేశ్వర్ (0/17), రషీద్ (0/24)లను జాగ్రత్తగా ఆడి మిగిలిన బౌలర్లపై విరుచుకుపడాలనుకున్న చెన్నై వ్యూహం అద్భుతంగా పని చేసింది. ఫలితంగా తుది పోరు ఏకపక్షంగా మారిపోయి ఈ సీజన్లో రైజర్స్పై చెన్నై స్కోరు 4–0గా మారిపోయింది. బలమైన బౌలింగ్ అండగా, కెప్టెన్ విలియమ్సన్ బ్యాటింగ్ ముందుండి నడిపించగా... ఫైనల్ వరకు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది పోరులో మాత్రం చేతులెత్తేసింది. చిన్న మైదానమైన వాంఖెడేలో ముందుగా భారీ స్కోరు చేయడంలో తడబడిన ఆ జట్టు లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కూడా విఫలమైంది. ఈ సీజన్లో అతి స్వల్ప స్కోర్లను కూడా రక్షించుకోగలిగిన జట్టుకు తుది పోరులో మాత్రం అది సాధ్యం కాలేదు. అసలు మ్యాచ్‌లో సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్ వైఫల్యం రైజర్స్‌ను దెబ్బ తీసింది. విలియమ్సన్ స్ఫూర్తిదాయక నాయకత్వం జట్టును ఫైనల్ వరకు చేర్చినా చివరకు నిరాశ తప్పలేదు. ముంబై: మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఐపీఎల్లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నై 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (36 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యూసుఫ్ పఠాన్ (25 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం చెన్నై 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఐపీఎల్ ఫైనల్లో ఛేదనలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా వాట్సన్ గుర్తింపు పొందగా, సురేశ్ రైనా (24 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 57 బంతుల్లోనే 117 పరుగులు జోడించడం విశేషం. పఠాన్, బ్రాత్‌వైట్ మెరుపులు... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఆరంభంలోనే గోస్వామి (5) వికెట్ కోల్పోయింది. లేని రెండో పరుగు తీసే ప్రయత్నంలో అతను ఔటయ్యాడు. ఇన్‌గిడి మెయిడిన్ వేయడంతో తొలి 4 ఓవర్లు ముగిసేసరికి జట్టు 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే చహర్ వేసిన ఐదో ఓవర్లో విలియమ్సన్ 6, 4 కొట్టి జోరు పెంచాడు. ఆ తర్వాత బ్రేవో బౌలింగ్‌లోనూ విలియమ్సన్ వరుస బంతుల్లో 4, 6 బాదాడు. మరోవైపు శిఖర్ ధావన్ (25 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. అయితే జడేజా తొలి ఓవర్లోనే ధావన్ బౌల్డ్ కావడంతో 51 పరుగుల రెండో వికెట్ (40 బంతుల్లో) భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో కెప్టెన్, షకీబ్ (23; 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడారు. జడేజా ఓవర్లో వీరిద్దరు 2 ఫోర్లు, సిక్స్‌తో 17 పరుగులు రాబట్టారు. బ్రేవో ఓవర్లో మళ్లీ రెండు ఫోర్లు కొట్టి దూసుకుపోతున్న విలియమ్సన్కు ఎట్టకేలకు కరణ్ శర్మ బ్రేక్ వేశాడు. దూరంగా వెళుతున్న బంతిని ముందుకొచ్చి ఆడే ప్రయత్నంలో అతను స్టంపౌటయ్యాడు. అయితే దూకుడు తగ్గనివ్వని షకీబ్, పఠాన్ 22 బంతుల్లో 32 పరుగులు జత చేశా రు. రైనా అద్భుత క్యాచ్‌కు షకీబ్ వెనుదిరగ్గా, హుడా (3) విఫలమయ్యాడు. ఈ దశలో పఠాన్, బ్రాత్‌వైట్ బ్యాటింగ్ దూకుడు రైజర్స్‌కు మెరుగైన స్కోరు అందించింది. వీరిద్దరు భారీ షాట్లతో 18 బంతుల్లోనే 34 పరుగులు జోడించారు. తొలి 10 ఓవర్లలో 73 పరుగులు సాధించిన హైదరాబాద్... తర్వాతి 10 ఓవర్లలో 105 పరుగులు చేయడం విశేషం. భారీ భాగస్వామ్యం... ఛేదనను చెన్నై చాలా నెమ్మదిగా ప్రారంభించింది. భువనేశ్వర్ తొలి ఓవర్‌ను మెయిడిన్ వేయగా... కుదురుకునేందుకు వాట్సన్ చాలా సమయం తీసుకున్నాడు. ఇదే ఒత్తిడిలో డు ప్లెసిస్ (10) వెనుదిరగడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అయితే వాట్సన్, రైనా కలిసి ప్రశాంతంగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. సందీప్ ఓవర్లో వరుసగా 6, 4 బాది తొలిసారి టచ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత అతడిని ఆపడం సన్‌రైజర్స్ వల్ల కాలేదు. కౌల్ తన తొలి ఓవర్లో 16 పరుగులు సమర్పించుకోవడంతో చెన్నై జోరు మొదలైంది. 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 80 పరుగులకు చేరింది. తర్వాతి రెండు ఓవర్లలో రెండు సిక్సర్ల సహాయంతో చెన్నై 24 పరుగులు రాబట్టింది. అనంతరం సందీప్ శర్మ వేసిన ఓవర్లో ఏకంగా 27 పరుగులు రావడంతో సూపర్ కింగ్స్ విజయం దాదాపుగా ఖాయమైంది. రైనా ఔటైనా... 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం వాట్సన్ చివరి వరకు నిలిచాడు. అతనికి రాయుడు (16 నాటౌట్) సహకరించడంతో 9 బంతులు మిగిలి ఉండగానే విజయం పూర్తయింది. ఆ ఓవర్... సందీప్ శర్మ 13వ ఓవర్ వేయడానికి ముందు చెన్నై లక్ష్యం 48 బంతుల్లో 75 పరుగులు. ఒకటి, రెండు వికెట్లు పడితే ఒత్తిడి పెరిగే అవకాశం ఉండేది. కానీ వాట్సన్ వరుస బంతుల్లో 4, 6, 6, 6, 4 బాదడంతో మ్యాచ్ చెన్నై వైపు పూర్తిగా మళ్లింది. మరో వైడ్‌తో కలిసి ఈ ఓవర్లో సందీప్ 27 పరుగులిచ్చాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: శ్రీవత్స్ గోస్వామి రనౌట్ 5; ధావన్ (బి) జడేజా 26; విలియమ్సన్ (స్టంప్డ్) ధోని (బి) కరణ్ శర్మ 47; షకీబ్ (సి) రైనా (బి) బ్రేవో 23; యూసుఫ్ పఠాన్ నాటౌట్ 45; దీపక్ హుడా (సి) సబ్–షోరే (బి) ఇన్‌గిడి 3; బ్రాత్‌వైట్ (సి) రాయుడు (బి) శార్దుల్ ఠాకూర్ 21; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–13, 2–64, 3–101, 4–133, 5–144, 6–178. బౌలింగ్: చహర్ 4–0–25–0, ఇన్‌గిడి 4–1–26–1, శార్దుల్ ఠాకూర్ 3–0–31–1, కరణ్ శర్మ 3–0–25–1, బ్రేవో 4–0–46–1, జడేజా 2–0–24–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: వాట్సన్ నాటౌట్ 117; డు ప్లెసిస్ (సి అండ్ బి) సందీప్ శర్మ 10; రైనా (సి) గోస్వామి (బి) బ్రాత్‌వైట్ 32; రాయుడు నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–16, 2–133. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–17–0, సందీప్ శర్మ 4–0–52–1, సిద్ధార్థ్ కౌల్ 3–0–43–0, రషీద్ ఖాన్ 4–1–24–0, షకీబ్ 1–0–15–0, బ్రాత్‌వైట్ 2.3–0–27–1. ‘మేం చేసిన స్కోరు గెలిచేందుకు సరిపోతుందని భావించినా ఆ తర్వాత పిచ్ మారిపోయింది. తొలి 5–6 ఓవర్లతో పాటు మ్యాచ్‌లో చాలా భాగం ముందంజలోనే ఉన్నాం. కానీ వాట్సన్ అంతా మార్చేశాడు. సీజన్ మొత్తం బాగా ఆడి ఇలా ఓడిపోవడం నిరాశగా ఉంది. మా కుర్రాళ్లు చాలా బాధపడుతున్నారు. అయితే మేం గెలవకపోయినా బాగా పోరాడాం. నాణ్యమైన బౌలింగ్ వనరులు ఉండటం అదృష్టం. అయితే వెనుదిరిగి చూస్తే కొన్ని గుర్తుంచుకునే క్షణాలు ఉన్నా చివరకు ఓటమే దక్కింది. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా బాధ్యతగా రాణించడం సంతృప్తిగా ఉంది. జట్టు ఫైనల్ చేరడం సమష్టి కృషిగానే భావిస్తా’ – కేన్ విలియమ్సన్ ‘రషీద్లాగే భువనేశ్వర్ కూడా చాలా తెలివైన బౌలర్. కాబట్టి ప్రత్యర్థి జట్టులో మమ్మల్ని ఇబ్బందిపెట్టేవారు ఒకరికంటే ఎక్కువే ఉన్నారు. మా బ్యాటింగ్ చాలా బాగా సాగింది. బలమైన మిడిలార్డర్‌ను నమ్ముకున్నాం. ప్రతీ విజయం ప్రత్యేకమే. ఏ ఒక్కటో గొప్పదని చెప్పలేను. నా దృష్టిలో వయసనేది ఒక అంకె మాత్రమే. 33 ఏళ్ల రాయుడు మా ప్రధాన బ్యాట్స్‌మన్. 19–20 ఏళ్ల కుర్రాళ్లు కాకపోయినా మైదానంలో చురుగ్గా ఉండగలవాళ్లే కావాలి. మాకు వయసుకంటే మా ఆటగాళ్ల గురించి, వారి ఫిట్నెస్ గురించి చక్కటి అవగాహన ఉంది కాబట్టి దానికి తగినట్లుగా వ్యూహాలు రూపొందించాం. గెలిచినా, ఓడినా చెన్నై వెళ్లి అభిమానులను కలుసుకోవాలని ముందే నిర్ణయించుకున్నాం. ఇప్పుడు కప్‌తో చెన్నైకి తిరిగి వెళుతున్నాం.’ – ఎమ్మెస్ ధోని (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తుది పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి టైటిల్‌ను సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై విజయంలో షేన్ వాట్సన్(117 నాటౌట్; 57 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు) కీలక పాత్ర పోషించాడు. ఈ ఐపీఎల్లో వాట్సన్‌కు ఇది రెండో సెంచరీ. అతనికి జతగా సురేశ్ రైనా(32; 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో చెన్నై సునాయాసంగా గెలుపొందింది. ఇది చెన్నైకు మూడో ఐపీఎల్ టైటిల్. మరొకవైపు ఫైనల్ ఫైట్‌లో బౌలింగ్‌లో పూర్తిగా విఫలమైన సన్‌రైజర్స్ రన్నరప్‌గానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సీఎస్కే 16 పరుగుల వద్ద డుప్లెసిస్(10) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో వాట్సన్-రైనాల జోడి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించింది. పవర్ ప్లే వరకూ ఆచితూచి ఆడిన వీరిద్దరూ అటు తర్వాత రెచ్చిపోయారు. ప్రధానంగా వాట్సన్ బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడ్డాడు. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన వాట్సన్.. ఆపై మరో 18 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సందీప్ శర్మ వేసిన 13 ఓవర్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 27 పరుగుల్ని పిండుకున్నాడు. దాంతో చెన్నై స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఇదే ఊపును కొనసాగించిన వాట్సన్ కడవరకూ క్రీజ్‌లో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. విన్నింగ్ షాట్‌ను అంబటి రాయుడు(16 నాటౌట్; 19 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) బౌండరీతో ముగించడంతో చెన్నై శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. అంతకుముందు సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ ఆటగాళ్లలో కేన్ విలియమ్సన్(47; 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, శిఖర్ ధావన్(26; 25 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్), షకిబుల్ హసన్(23; 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించారు. చివర్లో యూసఫ్ పఠాన్(45 నాటౌట్; 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులకు తోడు, బ్రాత్‌వైట్(21;11 బంతుల్లో 3 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 13 పరుగుల వద్ద ఓపెనర్ శ్రీవాత్సవ్ గోస్వామి(5) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో ధావన్-విలియమ్సన్ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి 51 పరుగుల భాగ్వాస్వామ్యాన్ని సాధించిన తర్వాత ధావన్ రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన ధావన్ బౌల్డ్ అయ్యాడు. ఆపై విలియమ్సన్-షకిబుల్‌ల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ 37 పరుగులు జత చేసిన తర్వాత విలియమ్సన్ మూడో వికెట్‌గా ఔటయ్యాడు. అటు తర్వాత షకిబుల్ హసన్, దీపక్ హుడాలు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో సన్‌రైజర్స్ 144 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను నష్టపోయింది. అయితే యూసఫ్ పఠాన్ ఆదుకోవడంతో సన్‌రైజర్స్ 170 పరుగుల మార్కును దాటింది. -
సన్‌రైజర్స్‌పై మూడోసారి..
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లేలో మరోసారి తడబడింది. సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఆరు ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 35 పరుగులు చేసింది. ఈ సీజన్లో చెన్నైకు ఇది నాల్గో అత్యల్ప స్కోరు కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మూడోసారి కావడం గమనార్హం. అంతకుముందు సన్‌రైజర్స్‌తో హైదరాబాద్‌లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సీఎస్కే పవర్ ప్లేలో 27 పరుగులు సాధించగా, క్వాలిఫయర్-1లో సీఎస్కే 33 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌లో చెన్నై 35 పరుగులకే పరిమితమై మరోసారి పేలవ ప్రదర్శన చేసింది. తుది పోరులో సన్‌రైజర్స్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సీఎస్కే 16 పరుగులకే తొలి వికెట్‌ను నష్టపోయింది. సందీప్ శర్మ బౌలింగ్‌లో డుప్లెసిస్(10) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సురేశ్ రైనా- వాట్సన్‌ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. సన్‌రైజర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సీఎస్కే తన పవర్ ప్లేలో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. -
ఐపీఎల్ ఫైనల్; సీఎస్కే లక్ష్యం 179
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సన్‌రైజర్స్ ఆటగాళ్లలో కేన్ విలియమ్సన్(47; 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, శిఖర్ ధావన్(26; 25 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్), షకిబుల్ హసన్(23; 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించారు. చివర్లో యూసఫ్ పఠాన్(45 నాటౌట్; 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులకు తోడు, బ్రాత్‌వైట్(21;11 బంతుల్లో 3 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 13 పరుగుల వద్ద ఓపెనర్ శ్రీవాత్సవ్ గోస్వామి(5) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో ధావన్-విలియమ్సన్ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి 51 పరుగుల భాగ్వాస్వామ్యాన్ని సాధించిన తర్వాత ధావన్ రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన ధావన్ బౌల్డ్ అయ్యాడు. ఆపై విలియమ్సన్-షకిబుల్‌ల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ 37 పరుగులు జత చేసిన తర్వాత విలియమ్సన్ మూడో వికెట్‌గా ఔటయ్యాడు. అటు తర్వాత షకిబుల్ హసన్, దీపక్ హుడాలు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో సన్‌రైజర్స్ 144 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను నష్టపోయింది. అయితే యూసఫ్ పఠాన్ ఆదుకోవడంతో సన్‌రైజర్స్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. చెన్నై బౌలర్లలో ఎన్గిడి, కరణ్ శర్మ, బ్రేవో, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్లు తలో వికెట్ తీశారు. -
ఐపీఎల్ చరిత్రలో ఐదో ఆటగాడిగా..
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో ఏడొందలకు పైగా పరుగులు సాధించిన ఐదో ఆటగాడిగా విలియమ్సన్ గుర్తింపు సాధించాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్లో మ్యాచ్ ద్వారా విలియమ్సన్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఈ సీజన్లో విలియమ్సన్ సాధించిన పరుగులు 735. చెన్నైతో ఫైనల్ మ్యాచ్‌లో విలియమ్సన్(47) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. కాగా, అంతకుముందు విరాట్ కోహ్లి(973-2016), డేవిడ్ వార్నర్(848-2016), మైక్ హస్సీ(733-2013)లు తలో ఒకసారి ఏడొందలకు పైగా పరుగులను సాధించగా, క్రిస్ గేల్(733-2012; 708-2013) రెండు సార్లు ఈ ఘనతను సాధించాడు. -
ఐపీఎల్: చెన్నైకి ఛేజింగ్ గండం!
ముంబై : ఐపీఎల్-11 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. ఇప్పటికి 7 సార్లు ఫైనల్‌కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం రెండు సార్లు మాత్రమే టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. 2010లో ముంబై ఇండియన్స్, 2011లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరులతో జరిగిన ఫైనల్లో గెలిచి చెన్నై వరుసగా ట్రోఫీలందుకుంది. అయితే ఈ రెండు మ్యాచ్‌ల్లో చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని గెలుపొందింది. కోల్‌కతాతో జరిగిన 2012 ఫైనల్లో ఛేజింగ్‌కు మొగ్గు చూపిన చెన్నై ఓటమి చవిచూసింది. ముంబై ఇండియన్స్‌తో 2015 సీజన్ ఫైనల్లో సైతం ఫీల్డింగ్ ఎంచుకొని మరో పరాజయం చవిచూసింది. ఇక తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ధోని సేన ఛేజింగ్‌కే మొగ్గు చూపింది. ఈ లెక్కన చెన్నై ఛేజింగ్ గండంలో చిక్కుకుంటుందా.. లేక చరిత్రను తిరగరాస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. గత పది సీజన్ల ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువగా గెలుపొందడం ఇక్కడ మరో విశేషం. సన్‌రైజర్స్‌కు కలిసొచ్చెనా.. 2009 సీజన్ టైటిల్ నెగ్గిన హైదరాబాద్ జట్టు డెక్కెన్ చార్జర్స్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసి విజయం సాధించింది. 2016 సీజన్లో వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ సైతం తొలుత బ్యాటింగ్ చేసే టైటిల్ నెగ్గింది. ఈ లెక్కన హైదరాబాద్‌కు కలిసొస్తుందా అన్ని విషయం కూడా చర్చనీయాంశమైంది. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని
-
టాస్ గెలిచిన ధోని.. ఐపీఎల్ విజేత ఎవరో?
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ ట్రోఫీ కోసం తుది సమరంలో సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం నగరంలోని వాంఖేడే వేదికగా జరుగుతున్న ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని.. ముందుగా సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పునరాగమనంలోనూ ఘనమైన రికార్డును నిలబెట్టుకుంటూ ఫైనల్ చేరిన ధోని జట్టు, అసలు అంచనాలే లేని స్థితి నుంచి అద్భుతంగా పైకెదిగిన విలియమ్సన్ సేన. ఎవరు గెలిచినా ఈ సీజన్కది ప్రత్యేక ముగింపే. ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే రెండు లీగ్ మ్యాచ్‌లు, మొదటి క్వాలిఫయర్‌లో హైదరాబాద్‌పై చెన్నైదే పైచేయి. తక్కువ స్కోర్లను కాపాడుకుంటూ, భారీ లక్ష్యాలను అందుకుంటూ మిగతా ప్రత్యర్థులందరినీ చుట్టేసిన సన్‌రైజర్స్‌కు... సూపర్ కింగ్స్ ఒక్కటే కొరకరాని కొయ్యగా మిగిలింది. బ్యాట్స్‌మెన్ అనూహ్య ఇన్నింగ్స్‌లు, ఆల్‌రౌండర్ల అండ, బౌలర్ల నిలకడతో దుర్భేద్యంగా ఉన్న చెన్నైని ఓడించాలంటే హైదరాబాద్ సమష్టిగా శక్తికి మించి ఆడాల్సిందే. భీకర బౌలింగ్ వనరులున్నప్పటికీ ప్రత్యర్థి జట్టులో ఎవరో ఒక బ్యాట్స్‌మన్ అసాధారణంగా ఆడుతుండటంతో సూపర్ కింగ్స్‌ను సన్‌రైజర్స్ లొంగదీసుకోలేకపోతోంది. లీగ్ మ్యాచ్‌లలో రెండుసార్లూ అంబటి రాయుడు దెబ్బ కొట్టగా, క్వాలిఫయర్‌లో ఆ పనిని డు ప్లెసిస్ చేశాడు. సమ ఉజ్జీలైన రెండు జట్ల మధ్య ఈ మూడు ఇన్నింగ్స్‌లే తేడా చూపాయి. ప్రణాళికతో ముందునుంచే అప్రమత్తం అయితే ఫైనల్లోనూ ఇలా జరగకుండా చూసుకోవచ్చు. కీలకమైన వాట్సన్, రాయుడితో పాటు రైనా, డు ప్లెసిస్లను త్వరగా ఔట్ చేస్తే చెన్నై జోరును తగ్గించినట్లవుతుంది. ధోని, బ్రేవోలపైకి రషీద్ ఖాన్‌ను ప్రయోగించి ఫలితం రాబట్టొచ్చు. లీగ్ దశలో బ్యాటింగ్ భారాన్నంతా మోసిన కెప్టెన్ విలియమ్సన్ రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. ఫైనల్లో రాణించి కప్ అందిస్తే అతడికి ఈ సీజన్ మరపురానిదిగా మిగిలిపోతుంది. యూసుఫ్ పఠాన్ ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. ఆల్‌రౌండర్లు షకీబ్, బ్రాత్‌వైట్, బౌలర్లు భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్, రషీద్ ఇప్పటివరకు నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఏది ఏమైనా ఫైనల్ పోరు ఆసక్తికరం. ఇరు జట్లు బలంగా ఉండటంతో కప్ ఎవరు సాధిస్తారో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. -
ఐపీఎల్ టైటిల్ సీఎస్కేదే : షేన్ వార్న్
సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్-11 సీజన్ టైటిల్ చెన్నైసూపర్ కింగ్స్‌దేనని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్‌వార్న్ అభిప్రాయపడ్డాడు. ఆదివారం ముంబై వాంఖెడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య తుది సమరం జరగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం తాను ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు వార్న్ తెలిపాడు. ఇరు జట్లకు విషెస్ తెలియజేస్తూ తన ఆల్‌స్టార్ టీమ్‌ను ట్విటర్ వేదికగా ప్రకటించాడు. చివర్లో ఈ ఫైనల్లో తన అంచనా ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ గెలస్తుందని పేర్కొన్నాడు. తన ఆల్‌స్టార్ జట్టులో జోస్ బట్లర్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, ఆండ్రూ రస్సెల్, రషీద్ ఖాన్, ఆండ్రూ టై, కుల్దీప్, బ్రుమాలకు చోటిచ్చాడు. ఈ జట్టును అంగీకరిస్తారా అని అభిమానులను ప్రశ్నించాడు. అయితే ఈ జట్టులో అద్భుత కెప్టెన్సీతో సన్‌రైజర్స్‌ను ఫైనల్‌కు చేర్చిన కేన్ విలియమ్సన్ చోటివ్వకపోవడాన్ని అభిమానులు తప్పు బట్టారు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన విలియమ్సన్కు చోటు లేకపోవడం ఏమిటని ఓ అభిమాని వార్న్‌ను నిలదీశాడు. ఇంకొందరు కోహ్లి, పంత్‌ల కన్నా విలియమ్సన్ ఎంతో బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రపంచ గొప్ప బ్యాట్స్‌మన్ డివిలియర్స్ లేనిది గొప్ప జట్టు ఎలా అవుతుందని ఇంకొందరు మండిపడుతున్నారు. ఇక ఫైనల్ విజయంపై సైతం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొప్ప ప్రదర్శన ఇచ్చిన జట్టు నెగ్గుతుందని చురకలంటించారు. Good luck to both teams in the IPL final tonight, here’s my “All star team” from this years IPL Butler Rahul Virat Pant Dhoni Pandya Russell R.Khan Tye Kuldeep Bumra Agree ? I think CSK will win ! — Shane Warne (@ShaneWarne) 27 May 2018 No place for Kane Williamson who is the highest run getter of #IPL2018 😂 — Abhishek Agarwal (@abhishek2526) 27 May 2018 Best team to win a match — Venk Chand (@venkyish) 27 May 2018 -
వాంఖడే వార్.. గెలుపెవరిది?
-
ఐపీఎల్ విజేతకు ఎన్ని కోట్లు?
ముంబై: క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ పండుగ నేటి(ఆదివారం)తో ముగియనుంది. ఐపీఎల్ టైటిల్ కోసం నగరంలోని వాంఖేడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. మరి ఐపీఎల్ విజేతకు ఇచ్చే మొత్తం ఎంతో తెలుసా..? అక్షరాలా రూ. 20 కోట్లు. గెలిచిన జట్టు కెప్టెన్‌కు ఈ మొత్తాన్ని చెక్ రూపంలో అందజేస్తారు. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.12.5 కోట్ల క్యాష్ ప్రైజ్ అందుతుంది. అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన ప్లేయర్‌కు రూ. 10 లక్షల చెక్‌తోపాటు ట్రోఫీని బహుకరిస్తారు. అదే సమయంలో సీజన్లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ దక్కించుకున్న బౌలర్‌కి కూడా రూ.10 లక్షల ఇవ్వనుండగా, ఎక్కువ పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న బ్యాట్స్‌మన్‌కి రూ.10 లక్షలు అందజేయనున్నారు. ఎమర్జింగ్ ప్లేయర్‌గా ఎంపికైన ఆటగాడికి రూ.10 లక్షల ప్రైజ్ మనీ దక్కుతుంది. ఈ సీజన్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి.. భవిష్యత్తులో అంతర్జాతీయ స్టార్‌గా మారే అవకాశం ఉన్న ఆటగాణ్ని ఎమర్జింగ్ ప్లేయర్‌గా ఎంపిక చేస్తారు. మరొకవైపు ఏడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన క్రీడా మైదానాలకు రూ.50 లక్షల చెక్‌తో పాటు ట్రోఫీని అందజేస్తారు. ఏడు కంటే తక్కువ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన క్రికెట్ స్టేడియంలకు రూ.25 లక్షల నగదు బహుమతితో పాటు ట్రోఫీ బహుకరిస్తారు. -
గబ్బర్ అనే పేరు ఎలా వచ్చిందో చెప్పిన ధావన్
-
‘గబ్బర్’ కథ చెప్పిన ధావన్
న్యూఢిల్లీ : టీమిండియా డాషింగ్ ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్‌ను అందరు ముద్దుగా గబ్బర్ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే. మైదానంలోనైనా.. ఆఫ్‌ది ఫీల్డ్ అయినా ఈ ఢిల్లీ ఆటగాడు గబ్బర్గానే అందరికి సుపరిచితం. అయితే ఈ గబ్బర్ అనే పేరు ఎలా వచ్చిందో.. దాని వెనుక ఉన్న కథ ఎంటో ఇటీవల ధావన్ తెలియజేశాడు. ప్రముఖ యాంకర్ గౌరవ్ కపూర్ నిర్వహించే బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ అనే వెబ్ సిరీస్‌లో గబ్బర్ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. గబ్బర్ నిక్‌నేమ్ అలా.. గబ్బర్ అనే పేరు తన ఢిల్లీ జట్టు మాజీ కెప్టెన్ విజయ్ దాహియా పెట్టినట్లు ధావన్ పేర్కొన్నాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్న రోజుల్లో తాను ఎక్కువగా హిందీ బాలీవుడ్ విలన్ డైలాగ్‌లు చెప్పేవాడినని, దీంతో తనను గబ్బర్‌గా పిలవడం ప్రారంభించారని తెలిపాడు. ఇక ఒక దశలో క్రికెట్ నుంచి దూరం కావాలనుకున్నానని కూడా చెప్పాడు. తన కెరీర్ ముగిసిందని, తన తండ్రి వ్యాపారాన్ని చూసుకుందామని నిర్ణయించుకున్న తరుణంతో తన కోచ్ మరో అవకాశం ఇచ్చాడని ధావన్ గుర్తు చేసుకున్నాడు. ఇక తన భార్య తన బలమని చెప్పుకొచ్చాడు. ఇక ఆస్ట్రేలియాతో అరంగేట్ర టెస్టులో గబ్బర్ సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. 2013 చాంపియన్స్ ట్రోఫీ భారత్ నెగ్గడంలో ధావన్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీ అత్యధిక పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలవడమే కాకుండా గోల్డెన్ బ్యాట్‌ను సైతం అందుకున్నాడు. -
వాంఖడే వార్
-
ఐపీఎల్ ఫైనల్; మీ ఓటు ఎవరికి?
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రోజ రాత్రి 7 గంటలకు వాంఖెడే మైదానం వేదికగా జరిగే తుదిపోరులో విజయం ఏ జట్టు వరిస్తుందోనని క్రికెట్ అభిమానులు అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు. లీగ్ దశలో పైచేయి సాధించిన ధోని సేనను ఓడించి కప్ అందుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. హైదరాబాద్‌పై తమ ఆధిపత్యం కొనసాగించి విజేతగా నిలవాలని సూపర్స్ కింగ్స్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఐపీఎల్ తుది సమరంపై సామాజిక మాధ్యమాల్లో విశేషంగా చర్చ జరుగుతోంది. ఇది బిర్యానీ, సాంబార్ మధ్య పోటీగా వర్ణిస్తున్నారు. సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ ట్యాగ్ ట్విటర్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అటు బెట్టింగులు కూడా భారీ స్థాయిలో జరిగే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా ఫైనల్ పోరు ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా జరిగి వినోదాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
విమర్శలపై ‘కూల్’గా స్పందించిన ధోని
-
అందుకే ధోని ‘కెప్టెన్ కూల్’.. వైరల్!
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-11లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో చెన్నై 2 వికెట్ల తేడాతో విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించినా విన్నింగ్ టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ధోని చాలా తెలివిగానే కాదు చాకచక్యంగా వివరణ ఇచ్చి విమర్శల నోళ్లు మూయించాడనంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు ధోని బంతినివ్వలేదు. సీనియర్ బౌలర్‌కు బంతినివ్వకపోవడం సరైన నిర్ణయం కాదని, ఎందుకు భజ్జీకి బంతిని ఇవ్వలేదని ధోనిపై విమర్శలు వచ్చాయి. దీనిపై ధోని మీడియాతో మాట్లాడుతూ.. ‘నా ఇంట్లో చాలా కార్లు, బైకులున్నాయి. అయితే ఒకేసారి వాటిని ఏ విధంగా నేను నడపగలను. అవసరాన్ని బట్టి ఏ వాహనం వాడాలో ఎక్కడ, ఎప్పుడు ఉపయోగించాలో తెలియాలి. అదేవిధంగా జట్టులో ఆరేడుగురు బౌలర్లు ఉన్నప్పటికీ.. పరిస్థితికి తగ్గట్లుగా బౌలర్‌కి బంతినివ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో హర్భజన్‌కు బంతనివ్వడం సరైనది కాదని భావించాను. వాస్తవానికి ఏ ఫార్మాట్‌ను పరిగణనలోకి తీసుకున్నా భజ్జీ సీనియర్, అనుభవజ్ఞుడని అందరికీ తెలిసిందేనని’ ధోని వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందుకే ధోని గ్రేట్ కెప్టెన్ అయ్యాడంటూ ‘మిస్టర్ కూల్’ క్రికెటర్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే 19.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించి ఫైనల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆపై క్వాలిఫయర్-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించిన సన్‌రైజర్స్ ఫైనల్లో చెన్నైతో అమీతుమీ తేల్చుకోనుంది. ఆదివారం (నేటి) రాత్రి 7 గంటలకు ముంబైలోని వాంఖెడే మైదానం వేదికగా చెన్నై, సన్‌రైజర్స్ జట్లు తలపడనున్నాయి. -
మనీష్ అన్నా.. ప్లీజ్...
ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తమ తమ ఫేవరెట్ టీమ్‌ల గురించి, ఆటగాళ్ల గురించి కొందరు అనుకూలంగా పోస్టులు పెడితే, ట్రోలింగ్ మాత్రం అంతకు మించే జరుగుతూ వస్తోంది. సన్‌రైజర్స్ ప్లేయర్ మనీష్ పాండేను టార్గెట్ చేస్తూ వేస్తున్న జోకులకు కోదవు లేకుండా పోతోంది. రూ.11 కోట్లతో ఫ్రాంఛైజీ కొనుగోలు చేస్తే.. కనీసం పరుగులు చెయ్యకపోతుండటం, దానికి తోడు మైదానంలో క్యాచ్‌లు వదిలేస్తూ ఫీల్డింగ్‌లో పేలవమైన ప్రదర్శన ఇచ్చాడు.(అఫ్ కోర్స్ ఒక మ్యాచ్‌లో 57 పరుగులు.. ఒకటి రెండు అద్భుతమైన క్యాచ్‌లను వాళ్లు పరిగణనలోకి తీసుకోలేదు). దీంతో ఫేస్‌బుక్‌లోని కొన్ని ట్రోలింగ్ పేజీలు అతన్ని దారుణంగా ఏకీపడేశాయి. సినిమాల్లోని ఫన్నీ డైలాగులన్నింటిని మనీష్‌కు ఆపాదించి మెమెలు సృష్టించాయి. అది తట్టుకోలేక పాండే సైతం ఘాటుగానే బదులిచ్చాడు. చివరాఖరికి రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో అతన్ని జట్టులోకి తీసుకోకపోవటం హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్న వారు లేకపోలేదు. అయితే నేటి ఫైనల్ నేపథ్యంలో మళ్లీ పాండేపై ట్రోల్ మొదలైపోయింది. ‘ప్లీజ్.. మనీష్ అన్నా ఇవాళ మ్యాచ్‌కు దూరంగా ఉండూ’... ‘విలియమ్సన్ సర్ పాండే అన్నకు ఇవాళ కూడా రెస్ట్ చాలా అవసరం’... ‘మనీష్ అన్న ఇన్ కప్ అవుట్’.. ఇలాంటి కామెడీ డైలాగులు పేలుతున్నాయి. ఇది చాలదన్నట్లు మరో అంశంలో కూడా అతను బుక్కయ్యాడు. అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జెర్సీ ఉన్న ఫోటోలనే ఇంకా కవర్ ఫోటోగా ఉంచటంతో ఏకీపడేస్తున్నారు. ఇది కాస్త ఆలస్యంగా గమనించిన కొందరు.. ఇంకా ఆ టీమ్‌లోనే ఉన్నాడనుకుంటున్నాడా? అంటూ కొందరు, మ్యాచ్‌ల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ అంతే బద్ధకమా? అని మరికొందరు, అది నెక్స్ట్ సాల్(వచ్చే ఏడాది) జెర్సీ.. అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో అతనికి మద్ధతుగా నిలుస్తున్న వారు కూడా ఉన్నారు. -
రణస్థలం
-
ఐపీఎల్: ఆమెనే బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ స్టార్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లు చూసేవారికి ఆమె సుపరిచితురాలు. ప్రతిరోజు ప్రత్యర్థి జట్లు మారతాయి. కానీ మ్యాచ్ ఉంటే చాలు ఆమె స్టేడియంలో ప్రత్యక్షమవుతారు. ఆమె మరెవరో కాదు స్పోర్ట్స్ జర్నలిస్ట్, కామెంటెటర్ మయాంతి లాంగర్. టీమిండియా క్రికెటర్ స్టూవర్ట్ బిన్నీ భార్యగా తొలుత ప్రపంచం ఆమెను గుర్తించినా, ప్రస్తుతం తన ప్రొఫెషనల్ వర్క్‌తో ఆమె ఆకట్టుకుంటున్నారు. మయాంతిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కామెంటెటర్ డీన్ జోన్స్ ట్విటర్ వేదికగా ప్రశంసల జల్లులు కురిపించారు. ఐపీఎల్లో తాను ఎంతో మంది గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను. కానీ అందరిలోనూ మయాంతి లాంగర్ బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ స్టార్ అని కితాబిచ్చారు. ఆమె తన వృత్తిపట్ల ఎంతో నిబద్దతతో ఉంటారని, గ్రేట్ జాబ్ మయాంతి అని ట్వీట్లో రాసుకొచ్చారు మాజీ క్రికెటర్ డీన్ జోన్స్. ఐపీఎల్లో మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగే చర్చలో ఆమె తన విలువైన అభిప్రాయాలను షేర్ చేసుకోవడం చూస్తూనే ఉంటాం. యాంకర్, కామెంటెటర్ మయాంతి లాంగర్ భర్తే క్రికెటర్ బిన్నీ అంటూ నెటిజన్లు తరచుగా కామెంట్లు చేయడం తెలిసిందే. As much as I have loved working with many of the greats on this @IPL. Our BEST and BIGGEST STAR is @MayantiLanger_B !!! She is soooo good at her job. And all of us at @StarSportsIndia #kentcricketlive & #SelectDugout are in awe of how good she is! Great job Mayanti 👏🏻👏🏻👏🏻 pic.twitter.com/8Z5ukO6vUW — Dean Jones (@ProfDeano) 26 May 2018 -
తీవ్ర నిరాశకు లోనయ్యాం.. కానీ!: ధోని
ముంబై: ఇక్కడి వాంఖెడే మైదానం వేదికగా ఆదివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ ట్రోఫీ కోసం తుది సమరంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఓ వైపు అంచనాలు లేకుండా బరిలోకి దిగి, బలమైన జట్లకు సైతం షాకిస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరింది. కాగా.. ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని సారథ్యంలో చెన్నై జట్టు పునరాగమనంలోనూ తొలి ప్రయత్నంలోనే మరోసారి ఫైనల్ చేరింది. తుది సమరం ఫైనల్ నేపథ్యంలో ఎంఎస్ ధోని మీడియాతో షేర్ చేసుకున్న విషయాలను ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారిక ట్వీటర్లో పోస్ట్ చేసింది. ధోని ఏమన్నాడంటే.. ‘ఆరంభంలో కాస్త టెన్షన్ ఉన్న మాట వాస్తవం. అయితే టోర్నీలో మ్యాచ్‌లు ఆడుతున్న కొద్దీ మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. దాంతోపాటు చెన్నై ఆటగాళ్లు ప్రొఫెషనల్‌గా, ఎమోషనల్‌గా మారారు. అయితే రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై జట్టు ఐపీఎల్ ఆడుతోంది. కానీ చెన్నైలో మ్యాచ్‌లు జరగకపోవడం మమ్మల్ని చాలా నిరాశకు గురిచేసింది. చెన్నై ఫ్యాన్స్ తమ సొంత మైదానంలో మా ఆటను చూడాలనుకున్నారు. అయితే ఒక్క గేమ్ ఆడినందుకైనా సంతోషంగా ఉన్నాం. ప్రొఫెషన్ పట్ల అంకిత భావంతో ఉన్నవారు ఎక్కడైనా రాణిస్తారన్న నమ్మకం మాకుంది. టీమ్ ఏ ఒక్కరిపైనా ఆధారపడకుండా సమష్టిగా ఆడితే తమదే విజయమని’ ధోని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ వారు పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆడిన 9 సీజన్లు చెన్నైకి కెప్టెన్‌గా చేసిన ధోని తమ జట్టును 7 పర్యాయాలు ఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే. రెండుసార్లు చెన్నైని విజేతగా నిలిపాడు ధోని. -
చెన్నైలో మ్యాచ్‌లు జరగకపోవడం నిరాశకు గురిచేసింది
-
ఐపీఎల్-11 విజేతగా నిలిచేదెవరో ?
-
అతడు ఏబీని తలపించాడు
ఈ సీజన్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే మళ్లీ ఫైనల్లో ఆడేందుకు సిద్ధమయ్యాయి. టోర్నీలో మిగతా జట్లకంటే మేటి జట్లే టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. ఐపీఎల్ చరిత్రలో సాధారణంగా రెండో స్థానంలో నిలిచిన జట్లే ఎక్కువ సార్లు టైటిల్స్ గెలిచాయి. ఇది చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభసూచకం. దీంతో చెన్నై అభిమానులు మరోసారి మన జట్టే టైటిల్ గెలుస్తుందనే ఆత్మవిశ్వాసంతో ఉండొచ్చు. పునరాగమనాన్ని టైటిల్‌తో ఘనంగా చాటుతుందనే అంచనాలు సూపర్ కింగ్స్ అభిమానుల్లో ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గెలిచి నేరుగా ఫైనల్ చేరిన చెన్నై ఒక దశలో ఓటమికి దగ్గరైంది. డు ప్లెసిస్ అద్వితీయ పోరాటంతో చివరకు గెలిచింది. అయితే ఫైనల్లో ఫామ్‌లో ఉన్న రాయుడిని కాదని డు ప్లెసిస్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తుందని నేననుకోను. ఇది అంత తెలివైన పని కాదు. బౌండరీలు, సిక్సర్లు బాదే అతన్ని మిడిలార్డర్లోనే కొనసాగించాలి. ఛేదనలో చెన్నై బ్యాటింగ్ ఆర్డర్‌కు తిరుగులేదనే చెప్పాలి. ఎలాంటి ప్రత్యర్థి ఎదురైనా... ఎంతటి పెద్ద స్కోరున్నా... చెన్నై బ్యాట్స్‌మెన్ ఛేదించగలరు. ఇలాంటి జట్టుకు స్వల్ప స్కోరు చేసినా... నిలబెట్టుకునే సన్‌రైజర్స్ ఎదురైంది. హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ చెన్నై సూపర్ కింగ్స్‌తో పోలిస్తే అంత పటిష్టమైందేమీ కాదు. ఓపెనర్ ధావన్, కెప్టెన్ విలియమ్సన్లపైనే సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆధార పడి ఉంది. మిగతా వారున్నప్పటికీ వాళ్లెవరూ వీళ్లిద్దరిలా నిలకడగా ఆడలేరు. పరిస్థితులకు తగ్గట్లు ఆదుకోలేరు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన కీలకపోరులో ‘వన్ మన్ ఆర్మీ షో’తో హైదరాబాద్ గెలవగలిగింది. ఒకే ఒక్కడు రషీద్ ఖాన్ మొదట బ్యాటింగ్‌లో, తర్వాత బౌలింగ్‌లో సన్‌రైజర్స్ ఆశలను నిలబెట్టాడు. ముఖ్యంగా అతను డివిలియర్స్ ఆడే ఫ్లిక్ షాట్లతో ఆకట్టుకున్నాడు. అతని బ్యాటింగ్‌లో ఈ షాట్లే అత్యుత్తమం. ఇక బౌలింగ్‌లోనూ తన మాయాజాలంతో మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చాడు. ఇది సరిపోదన్నట్లు అద్భుతమైన రనౌట్, రెండు క్యాచ్‌లతో రషీద్ మెరిశాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన నితీశ్ రాణాను బుల్లెట్ వేగంతో విసిరిన త్రోతో రనౌట్ చేశాడు. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్‌ను ఫైనల్లోకి తెచ్చిందే రషీద్ ఖాన్. మైదానంలో అతని సత్తా, సామర్థ్యం అమోఘం. ఇదే రీతిలో ఫైనల్లోనూ చెలరేగితే సన్‌రైజర్స్ కొత్త చరిత్ర లిఖించడం ఖాయం. -
ముంబైలో నేడు ఐపీఎల్–11 ఫైనల్
47 రోజులపాటు హోరాహోరీ పోరాటాలు...లీగ్, ప్లే ఆఫ్ సహా 59 మ్యాచ్‌లు...8 జట్లు... 100 మందిపైగా ఆటగాళ్లు...4 శతకాలు... 101 అర్ధ శతకాలు...1,621 బౌండరీలు... 853 సిక్సర్లు...మైమరిపించిన ఫీల్డింగ్ విన్యాసాలు...ఔరౌరా అనిపించిన క్యాచ్‌లు...కళ్లు చెదరగొట్టిన మెరుపు ఇన్నింగ్స్‌లు...ఉత్కంఠతో కుదిపేసిన ఛేదనలు...కట్టిపడేసిన బౌలింగ్ మాయాజాలాలు...ఊహకందని సారథుల వ్యూహాలు...మైదానంలో రంగురంగుల హంగులు...చీర్ లీడర్ల నృత్యాల హొయలు...నరనరాన అభిమానం నింపుకొన్న ప్రేక్షక గణాలు...నగర నగరాన జన సందోహ నీరాజనాలు...51వ రోజున 60వ మ్యాచ్...ట్రోఫీని ముద్దాడేందుకు ఒకే ఒక్క విజయం...ముంబైలో మహా సంగ్రామం... నేడే... ఐపీఎల్–11 తుది సమరం... ముంబై: సారథే మనోబలంగా బరిలో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్... నాయకుడు వేసిన బాటలో నెగ్గుకొచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ముంబైలోని వాంఖెడే మైదానం వేదికగా ఆదివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ ట్రోఫీ కోసం తుది సమరంలో తలపడనున్నాయి. పునరాగమనంలోనూ ఘనమైన రికార్డును నిలబెట్టుకుంటూ ఫైనల్ చేరిన ధోని జట్టు, అసలు అంచనాలే లేని స్థితి నుంచి అద్భుతంగా పైకెదిగిన విలియమ్సన్ సేన. ఎవరు గెలిచినా ఈ సీజన్కది ప్రత్యేక ముగింపే. ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే రెండు లీగ్ మ్యాచ్‌లు, మొదటి క్వాలిఫయర్‌లో హైదరాబాద్‌పై చెన్నైదే పైచేయి. తక్కువ స్కోర్లను కాపాడుకుంటూ, భారీ లక్ష్యాలను అందుకుంటూ మిగతా ప్రత్యర్థులందరినీ చుట్టేసిన సన్‌రైజర్స్‌కు... సూపర్ కింగ్స్ ఒక్కటే కొరకరాని కొయ్యగా మిగిలింది. బ్యాట్స్‌మెన్ అనూహ్య ఇన్నింగ్స్‌లు, ఆల్‌రౌండర్ల అండ, బౌలర్ల నిలకడతో దుర్భేద్యంగా ఉన్న చెన్నైని ఓడించాలంటే హైదరాబాద్ సమష్టిగా శక్తికి మించి ఆడాల్సిందే. ‘ఒక్కరి’తోనే పడుతోంది దెబ్బ... భీకర బౌలింగ్ వనరులున్నప్పటికీ ప్రత్యర్థి జట్టులో ఎవరో ఒక బ్యాట్స్‌మన్ అసాధారణంగా ఆడుతుండటంతో సూపర్ కింగ్స్‌ను సన్‌రైజర్స్ లొంగదీసుకోలేకపోతోంది. లీగ్ మ్యాచ్‌లలో రెండుసార్లూ అంబటి రాయుడు దెబ్బ కొట్టగా, క్వాలిఫయర్‌లో ఆ పనిని డు ప్లెసిస్ చేశాడు. సమ ఉజ్జీలైన రెండు జట్ల మధ్య ఈ మూడు ఇన్నింగ్స్‌లే తేడా చూపాయి. ప్రణాళికతో ముందునుంచే అప్రమత్తం అయితే ఫైనల్లోనూ ఇలా జరగకుండా చూసుకోవచ్చు. కీలకమైన వాట్సన్, రాయుడితో పాటు రైనా, డు ప్లెసిస్లను త్వరగా ఔట్ చేస్తే చెన్నై జోరును తగ్గించినట్లవుతుంది. ధోని, బ్రేవోలపైకి రషీద్ ఖాన్‌ను ప్రయోగించి ఫలితం రాబట్టొచ్చు. అయితే, ఎప్పటిలానే హైదరాబాద్ బ్యాటింగ్ సామర్థ్యం మరోసారి ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. శుక్రవారం క్వాలియఫర్–2లో రషీద్ ఇన్నింగ్స్ లేకుంటే కథ అక్కడితోనే ముగిసిపోయేది. దీంతోపాటు తుది జట్టు కూర్పుపైనా దృష్టి పెట్టాల్సి ఉంది. తీవ్రంగా నిరాశ పరుస్తున్న మనీశ్ పాండేను కాదని దీపక్ హుడాను, పేసర్ సందీప్ శర్మ స్థానంలో ఖలీల్ అహ్మద్‌ను, కీపర్ గోస్వామి బదులు వృద్ధిమాన్ సాహాను ఆడించి గత మ్యాచ్‌కు ఏకంగా మూడు మార్పులతో బరిలో దిగింది. ఈ మూడు ప్రయోగాలు పెద్దగా ఫలించలేదు. ఓపెనర్‌గా సాహా ఫర్వాలేదనిపించినా కీపింగ్‌లో విఫలమయ్యాడు. ఈసారి పోటీ చెన్నైతో కాబట్టి ధావన్‌తో పాటు ఓపెనింగ్‌కు దిగేదెవరో చూడాలి. లీగ్ దశలో బ్యాటింగ్ భారాన్నంతా మోసిన కెప్టెన్ విలియమ్సన్ రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. ఫైనల్లో రాణించి కప్ అందిస్తే అతడికి ఈ సీజన్ మరపురానిదిగా మిగిలిపోతుంది. యూసుఫ్ పఠాన్ ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. ఆల్‌రౌండర్లు షకీబ్, బ్రాత్‌వైట్, బౌలర్లు భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్, రషీద్ ఇప్పటివరకు నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. సందీప్ శర్మ మళ్లీ తుది జట్టులోకి రావొచ్చు. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ కావాలనుకుంటే హుడా స్థానంలోకి పాండే వస్తాడు. సమృద్ధిగా వనరులు... నమ్మదగిన ఓపెనర్లు, ఎలాంటి మ్యాచ్‌నైనా అనుకూలంగా ముగించగల కెప్టెన్, అతడికి తోడుగా నిలకడైన ఆల్‌రౌండర్లు, పదునైన పేసర్లు, పదో నంబరు వరకు బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు... ఇలా ఏ విధంగా చూసినా చెన్నై పెద్ద పర్వతంలా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో బిల్లింగ్స్‌ను కాదని డు ప్లెసిస్‌కు చోటివ్వడాన్ని మొదట అందరూ తప్పుబట్టారు. కానీ, అతడు ఆడిన ఇన్నింగ్స్‌తో ముక్కున వేలేసుకున్నారు. ఈ ఒక్క ఉదాహరణ సూపర్ కింగ్స్ స్థాయేమిటో చెబుతోంది. పేసర్లు ఇన్‌గిడి, దీపక్ చహర్ అద్భుతంగా రాణిస్తున్నారు. శార్దుల్ ఠాకూర్ స్థానంపై అనుమానం ఉన్నా క్వాలిఫయర్–1లో తన బ్యాటింగ్ జట్టును నిలబెట్టింది. జడేజా ఎలాగూ ఉంటాడు. ఎటొచ్చీ... సీనియర్ స్పిన్నర్ హర్భజన్ స్థానమే డోలాయమానంలో ఉంది. హైదరాబాద్‌పై అతడికి ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు. బ్యాటింగ్‌లో కీలక సమయంలో బంతులు వృథా చేసి పేలవంగా రనౌటయ్యాడు. మార్పు అవసరం లేదని ధోని భావిస్తేనే భజ్జీకి మరో అవకాశం దక్కుతుంది. కాదంటే మరో బౌలర్‌ను తీసుకుంటారు. ఈ పోరాటం ఆసక్తికరం ఇన్‌గిడి * విలియమ్సన్ చహర్ *ధావన్ భువనేశ్వర్*రాయుడు రషీద్ * ధోని, బ్రేవో విశ్లేషణ సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలకం: కేన్ విలియమ్సన్, శిఖర్ ధావన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ బలం: కెప్టెన్ బ్యాటింగ్, రషీద్, భువీ బౌలింగ్ బలహీనత: బ్యాటింగ్‌లో తడబాటు ప్రత్యేకత: మూడేళ్లలో రెండోసారి ఫైనల్ చేరిక చెన్నై సూపర్‌కింగ్స్ కీలకం: అంబటి రాయుడు, షేన్ వాట్సన్, డుప్లెసిస్, బ్రేవో, ధోని బలం: ఓపెనర్లు, కెప్టెన్, ఆల్‌రౌండర్లు బలహీనత: నాణ్యమైన బౌలింగ్‌కు తలొంచడం ప్రత్యేకత: లీగ్‌లో 9 సార్లు పాల్గొని 7 సార్లు ఫైనల్ చేరిన జట్టు లీగ్‌లో ముఖాముఖి రికార్డు ►రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ విజేత చెన్నైనే. (మొదటి మ్యాచ్‌లో నాలుగు పరుగులతో, రెండో దాంట్లో 8 వికెట్లతో గెలుపు) ►క్వాలిఫయర్ –1లో రెండు వికెట్లతో సూపర్‌కింగ్స్ జయభేరి. తుది జట్లు (అంచనా) సన్‌రైజర్స్: విలియమ్సన్ (కెప్టెన్), ధావన్, సాహా, యూసుఫ్ పఠాన్, పాండే/హుడా, షకీబ్, బ్రాత్‌వైట్, రషీద్ ఖాన్, భువనేశ్వర్, సిద్ధార్ధ్ కౌల్, సందీప్‌శర్మ/ఖలీల్/థంపి. సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్), రాయుడు, వాట్సన్, డు ప్లెసిస్, రైనా, బ్రేవో, జడేజా, హర్భజన్/కరణ్‌శర్మ, దీపక్ చహర్, ఇన్‌గిడి, శార్దుల్. -
రషీద్ ప్రదర్శనపై వార్నర్ ఏమన్నాడంటే!
హైదరాబాద్ : ఐపీఎల్-11 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరిగిన క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ విజయం సాధించి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వన్ మ్యాన్ షోతో అదరగొట్టిన అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ సన్‌రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. బంతితోనే కాకుండా బ్యాట్‌తోను మెరిసి ఔరా అనిపించాడు. రషీద్ ప్రదర్శన పట్ల సోషల్ మీడియా వేదికగా అభిమానులు, దిగ్గజ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్ డెవిడ్ వార్నర్ సైతం ఈ యువ సంచలనం ప్రదర్శన పట్ల ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రషీద్ ఫోటోని పోస్ట్ చేసిన వార్నర్.. ఆ ఫొటోకు ‘‘ఇక చెప్పేందుకు ఏమీ లేదు. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ గొప్ప ప్రదర్శన. ఈ కుర్రాడిని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇక మనం ఫైనల్స్‌కి వచ్చేశాం. ఫైనల్స్‌లో మన జట్టును చూసేందుకు ఎదురుచూస్తున్నా. అది ఒక గొప్ప మ్యాచ్ కావాలని ఆశిస్తున్నా..’’ అంటూ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. వార్నర్ కామెంట్ పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ మ్యాచ్‌కు రావాలని, ఆడకపోయిన దగ్గరుండి విజయాన్ని ఆస్వాదించాలని సన్ అభిమానులు వార్నర్‌ను కోరుతున్నారు. కీలక బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో సన్‌రైజర్స్ స్వల్ప స్కోర్‌కు పరిమితమవుతుందునుకున్న తరుణంలో రషీద్ మెరుపులతో పోరాడే లక్ష్యాన్ని నిర్ధేశించాడు. కేవలం 10 బంతుల్లో 4 సిక్స్‌లు,2 ఫోర్లతో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. లక్ష్య చేధనలో దిగిన కోల్‌కతా దూకుడుగా ఆరంభించగా.. మరోసారి రషీద్ బాధ్యత తీసుకున్నాడు. నాలుగు ఓవర్లు వేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక అద్భుత ఫీల్డింగ్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ కీలక బ్యాట్స్‌మన్ నితీష్ రాణాను పెవిలియన్‌కు చేర్చాడు. చివర్లో రెండు అద్భుత క్యాచ్లందుకొని సన్‌రైజర్స్‌కు విజయాన్నందించాడు. Not much more needs to be said, #freak what a game bat and ball. So proud of this young man. Into the finals now for @sunrisershyd and can’t wait to see the boys out there in the final. Gonna be a great game. @rashid.khan19 #orangearmy A post shared by David Warner (@davidwarner31) on May 25, 2018 at 8:14pm PDT -
ఐపీఎల్ : ఎవరికి సెంటిమెంట్ కలిసొస్తుంది?
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11వ సీజన్ ఆదివారం(మే 27)తో ముగియనుంది. రేపటి టైటిల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సీఎస్కే విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించగా, క్వాలిఫయర్-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించి సన్‌రైజర్స్ తుది బెర్తును ఖాయం చేసుకుంది. అయితే ఈ రెండు జట్లను ఒక సెంటిమెంట్ బలంగా ఊరిస్తోంది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ చివరి స్థానంలో నిలిచిన ప్రతిసారీ రెండో స్థానంలో ఉన్న జట్టే విజేతగా నిలిచింది. 2011లో చెన్నై, 2013లో ముంబయి, 2014లో కోల్‌కతా జట్లు విజేతగా అవతరించాయి. ప్రస్తుత సీజన్లో లీగ్ దశ ముగిసే సరికి సీఎస్కే రెండో స్థానంలో నిలిచింది. దీని ప్రకారం ధోని సేన విజేతగా నిలవాలి. అదే సమయంలో సన్‌రైజర్స్ కు కూడా ఒక సెంటిమెంట్ ఉంది. గత సీజన్ సెంటిమెంట్ పునరావృతమైతే సన్‌రైజర్స్ హైదరాబాద్‌నే ఐపీఎల్ ట్రోఫీ వరించాలి. 2017 సీజన్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది సీజన్లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న తొలి రెండు జట్లే ఫైనల్‌కు చేరాయి. అంతేకాకుండా టాప్ ప్లేస్‌లో ఉన్న జట్టుకే టైటిల్ దక్కింది. ఆ సీజన్లో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో ఉన్న అప్పటి జట్టు రైజింగ్ పుణెతో క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఓటమిపాలైంది. క్వాలిఫైయర్-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఇక ఫైనల్లో పుణెతో తలపడి ఉత్కంఠ పోరులో ముంబై టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్లో టాప్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం రెండో స్థానంలో ఉన్న ధోని సారథ్యంలోని చెన్నైసూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. మళ్లీ క్వాలిఫయర్-2 మ్యాచ్ కూడా అప్పటిలా కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. దీని ప్రకారం చూస్తే సన్‌రైజర్స్ కప్‌ను గెలవాలి. మరి ఈ సెంటిమెంట్ ఫైట్‌లో విజయం ఎవర్ని వరిస్తుందో చూడాలి. -
మాకు ఆశ్చర్యం కల్గించలేదు: యూసఫ్ పఠాన్
కోల్‌కతా: ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద ఆటగాడు రషీద్ ఖాన్ బ్యాట్‌తో చెలరేగడం ప్రతీ ఒక్కర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. అయితే రషీద్ ఖాన్ బ్యాట్‌ను ఝుళిపించడం సన్‌రైజర్స్ శిబిరాన్ని ఎంతమాత్రం ఆశ్చర్యపరచలేదని అంటున్నాడు వెటరన్ క్రికెటర్ యూసఫ్ పఠాన్. ‘రషీద్ బ్యాట్‌తో మెరుపులు మెరిపించడం మమ్మల్ని ఆశ్చర్య పరచలేదు. అతను చాలా సందర్భాల్లో సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ప్రధానంగా బిగ్‌బాష్ లీగ్‌తో పాటు మిగతా ఫ్రాంచైజీలకు ఆడేటప్పుడు కూడా రషీద్ బ్యాట్ అలరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అతని సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది. అందుకే అతన్ని ఒక స్థానం ముందుకు ప్రమోట్ చేశాం. సన్‌రైజర్స్ పెట్టుకున్న నమ్మకాన్ని రషీద్ నిలబెట్టాడు. రేపు రెండు అత్యుత్తమ జట్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది. ఇందులో ఎవరైతే ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారో వారిదే విజయం’ అని యూసఫ్ పేర్కొన్నాడు. -
ధోనిలా హెలికాప్టర్ షాట్ కొట్టాడు..
కోల్‌కతా: ఐపీఎల్లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రషీద్ ఖాన్ కొట్టిన హెలికాప్టర్ గురించే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. హెలికాప్టర్ షాట్లకు పెట్టింది పేరు మహేంద్ర సింగ్ ధోని.. అయితే తాజాగా రషీద్ ఖాన్ కూడా హెలికాప్టర్ షాట్‌ను అవలీలగా కొట్టిపారేశాడు. కోల్‌కతాతో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కనీసం 150 పరుగులు మార్కును చేరడమే కష్టమనిపించిన తరుణంలో రషీద్ చెలరేగి ఆడాడు. 10 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో అలరించాడు. అందులోనూ హెలికాప్టర్ షాట్‌ను ఇక్కడ మరో విశేషం. కేకేఆర్ బౌలర్ ప్రసీద్ కృష్ణ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీని రషీద్ ఖాన్ స్వేర్ లెగ్ మీదుగా సిక్సర్‌గా కొట్టాడు. బంతిని హెలికాప్టర్ షాట్ ఆడే క్రమంలో ఆఫ్ స్టంప్ వైపుకు జరిగి హిట్ చేయడంతో అది సిక్సర్‌గా వెళ్లింది. దీనిపై కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని కొట్టే హెలికాప్టర్‌తో పోల్చాడు. మరొకవైపు సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానిస్తూ.. షాట్ ఆఫ్ ఇన్నింగ్స్‌గా అభివర్ణించాడు. -
రషీద్ ఖాన్ హెలికాప్టర్ షాట్..!
-
ఐపీఎల్ చరిత్రలో ఎనిమిదో ఆటగాడిగా..
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో శిఖర్ ధావన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో నాలుగు వేల పరుగులు పూర్తిచేసుకున్న ఆటగాళ్ల జాబితాలో ధావన్ చేరిపోయాడు. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్(34) ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా ఐపీఎల్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా ధావన్ గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం ధావన్ 4,032 పరుగులతో కొనసాగుతున్నాడు అతని కంటే ముందు నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో సురేశ్ రైనా(4,953), కోహ్లి(4,948), రోహిత్ శర్మ(4,493), గౌతం గంభీర్(4,217), రాబిన్ ఉతప్ప(4,129), ఎంఎస్ ధోని(4,016), డేవిడ్ వార్నర్(4,014)లు ఉన్నారు. -
జీర్ణించుకోవడం చాలా కష్టం: దినేశ్ కార్తీక్
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో ఓటమి చెందడం పట్ల కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందన్నాడు. తాజా సీజన్ ఆద్యంతం తాము ఆకట్టుకున్నప్పటికీ కీలక మ్యాచ్‌లో పరాజయం చెందడం ఒకింత నిరాశను మిగిల్చిందన్నాడు. సన్‌రైజర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంచి ఆరంభం లభించినప్పటికీ, కొన్ని చెత్త షాట్లతో పాటు ఒక రనౌట్ తమ ఓటమిపై ప్రభావం చూపిందన్నాడు. ‘ఇది మాకు మంచి టోర్నమెంట్. కానీ ఫినిషింగ్ బాలేదు. ఛేజింగ్ చేసే సమయంలో మాకు గొప్ప ఆరంభం లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. కొన్ని చెత్త షాట్లు మా కొంప ముంచాయి. నాతోపాటు నితీష్ రాణా, రాబిన్ ఉతప్పలు మ్యాచ్‌ను ముగిస్తే బాగుండేది.. అలా జరగలేదు. దాంతో ఓటమి చూడాల్సి వచ్చింది. సన్‌రైజర్స్ మాకంటే మెరుగ్గా రాణించి గెలుపును సొంతం చేసుకుంది. ఈ ఐపీఎల్లో యువ క్రికెటర్లు వారికి వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నారు’ అని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. -
ఐపీఎల్ ప్రసార సిగ్నల్స్‌ను దొంగిలించి..
ఇండోర్: ఐపీఎల్ బెట్టింగ్ తారాస్థాయికి చేరిందనడానికి తాజా ఘటనే ఉదాహరణ. ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసార సిగ్నల్స్‌ను దొంగిలించి మరీ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా టీవీల్లో కొన్ని సెకన్లు ఆలస్యంగా మ్యాచ్ ప్రసారమవుతుంది. దీన్నే ఆసరాగా చేసుకున్న ఈ బెట్టింగ్ బృందం.. సిగ్నల్స్‌ను దొంగిలించడం ద్వారా టీవీల్లో ప్రసారం కావడానికి ఎనిమిది సెకన్ల ముందే మ్యాచ్ గమనాన్ని తెలుసుకుని కోట్లలో బెట్టింగ్‌లకు పాల్పడుతోంది. క్రికెట్ బెట్టింగ్ టిప్స్ ఫర్ ఫ్రీ పేరు ఒక వెబ్‌సైట్‌ను తెరిచిన ఈ ముఠా.. మ్యాచ్ ఫీడ్‌ను మళ్లించి ఈ సైట్లో ఉంచుతోంది. మధ్యప్రదేశ్ పోలీసులు ఈ రాకెట్‌ను బట్టబయలు చేశారు. ఈ ముఠా దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి ప్రధాన సూత్రధారి అంకిత్ జైన్ అలియాస్ మున్నూ జాకీగా అనుమానిస్తున్నారు. అతన్ని విదిషాలో అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇండోర్ సైబర్ సెల్ ఎస్పీ జితేందర్ సింగ్ తెలిపారు.