ntr biopic
-
బాలయ్య కొత్త సినిమా లుక్!
ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో నిరాశపరిచిన నందమూరి బాలకృష్ణ లాంగ్ గ్యాప్ తరువాత కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ గెటప్‌లో కనిపించబోతున్నాడు. షూటింగ్ సమయంలో ఓ అభిమానితో బాలయ్య దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో చిత్రయూనిట్ అధికారికంగా లుక్‌ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్, గడ్డంతో ఉన్న బాలయ్య ఈ సినిమాలో అభిమానులను ఫుల్‌గా ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్‌లు నిరాశపరచటంతో బాలయ్య అభిమానులు ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కమర్షియల్ దర్శకుడిగా పేరున్న కేయస్ రవికుమార్ డైరెక్షన్లో బాలకృష్ణ సక్సెస్‌ట్రాక్‌లోకి వస్తాడని భావిస్తున్నారు. -
బాలయ్యా.. ఈ సినిమా కూడా లేదా?
నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ సినిమాలు బాలకృష్ణకు భారీ షాక్ ఇచ్చాయి. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ బయోపిక్ బాలయ్యకు భారీ నష్టాలతో పాటు అదే స్థాయిలో చెడ్డపేరు కూడా తెచ్చిపెట్టింది. దీంతో తదుపరి చిత్రాల విషయంలో ఆలోచనలో పడ్డాడు బాలకృష్ణ. ముందుగా ప్రకటించిన బోయపాటి శ్రీను సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసి.. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్‌తో మాస్ యాక్షన్ సినిమాకు రెడీ అయ్యాడు. అయితే తాజా సమాచారం ప్రకారం కేయస్ రవికుమార్ సినిమాను కూడా బాలయ్య చేయటం లేదట. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రవికుమార్ చెప్పిన కథతో సినిమా చేస్తే సమస్యలు వస్తాయన్న ఆలోచనతో సినిమాను ఆపేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలతో నందమూరి అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంది. -
బాలయ్య సినిమాకు భారీగా కోత
ఎన్టీఆర్ బయోపిక్‌తో నిరాశపరిచిన నందమూరి బాలకృష్ణ, త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కారణంగా కాస్త గ్యాప్ ఇచ్చిన బాలయ్య త్వరలోనే ఈసినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. గతంలో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ కావటంతో హ్యాట్రిక్ కాంబినేషన్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని భావించారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు రిలీజ్ అయిన తరువాత సీన్ పూర్తిగా మారిపోయింది. రెండు భాగాలు డిజాస్టర్ కావటం, అదే సమయంలో బోయపాటి తెరకెక్కించిన వినయ విధేయ రామకు కూడా బ్యాడ్ టాక్ రావటంతో బాలయ్య సినిమా విషయంలో ఆలోచనలో పడ్డారు. ముందుగా 60 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించాలని భావించినా.. ఇప్పుడు అంత బడ్జెట్ వర్క్అవుట్ కాదేమో అన్న భావనలో ఉన్నారట. అందుకే బడ్జెట్లో భారీగా కోత పెట్టినట్టుగా తెలుస్తోంది. 40 కోట్ల లోపే సినిమాను పూర్తి చేసేందుకు స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ మార్పులు ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి. -
తారక్ ట్వీట్‌పై నందమూరి అభిమానుల్లో చర్చ
ఈ జనరేషన్ హీరోలు ఇగోలను పక్కన పెట్టి ఇతర హీరోల సినిమాల విషయంలో పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. అంతేకాదు అవసరమైతే తమ వంతు సాయంగా సినిమా ప్రమోషన్ల విషయంలో కూడా భాగం పంచుకుంటున్నారు. తాజాగా నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. రిలీజ్ రోజే సినిమా చూసిన తారక్, చిత్రయూనిట్లో ఒక్కొక్కరిని పేరు పేరునా అభినందించాడు. (చదవండి : జెర్సీ టీంపై జూ. ఎన్టీఆర్ ట్వీట్) అయితే ఇప్పుడే ఇదే నందమూరి అభిమానుల్లో తీవ్ర చర్చకు కారణమైంది. ఇటీవల నందమూరి బాలకృష్ణ హీరోగా స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్‌ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. అయితే తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ సమయంలో టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది సినిమా బాగుందంటూ ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య సూపర్ అంటూ పొగిడాడు. కానీ తారక్ మాత్రం సినిమా గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. (చదవండి : మహానాయకుడి మాటే ఎత్తని ఎన్టీఆర్) కథానాయకుడు ప్రీ రిలీజ్‌కు హాజరైన తారక్ తరువాత ఆ సినిమా గురించి ఎక్కడ స్పందించలేదు. రిలీజ్ తరువాత ఎలాంటి ట్వీట్ చేయలేదు. దీంతో బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య ఇంకా దూరం అలాగే ఉందన్న వాదన వినిపిస్తోంది. హరికృష్ణ మరణం తరువాత అంతా ఒక్కటయ్యారన్న సందేశం అభిమానుల్లోకి పంపేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. అయినా ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో తారక్ స్పందించిన తీరును బట్టి ఇంకా అన్ని సర్దుకోలేదని భావిస్తున్నారు ఫ్యాన్స్. -
వర్మచెప్పిన ఎన్టీఆర్ కథ
ఎన్టీఆర్ జీవితంలో వెన్నుపోట్ల వెనుక ఉన్న కథను ప్రేక్షకులకు చెప్తానని ప్రకటించిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తాను అనుకున్నది చేసి చూపించాడు. ఎన్టీఆర్ జీవితంలో అందరికీ తెలియాల్సిన క్రూరపథకాలు ఉన్నాయని ఈ సినిమాతో చెప్పాడు. పత్రికలు ఈ విషయాలను ఎప్పుడూ రాయలేదని తొక్కిపెట్టాయని చాటింపు వేశాడు. నిజం నివురుకప్పి ఉన్నా ఎప్పుడో ఒకసారి అగ్నిని వెదజల్లుతుందని ఈ సినిమాతో తేల్చి చెప్పేందుకు ప్రయత్నించాడు. ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న కష్టకాలాన్ని, దుఃఖకాలాన్ని, ఆయనను క్షోభకు గురి చేసిన కాలాన్ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో తెర మీదకు తీసుకువచ్చి గతకాలపు జర్నీ చేయించాడు. వర్తమానం పట్ల ప్రేక్షకులకు ఆలోచన కలిగించాడు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో మినహా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం భారీ ఓపెనింగ్స్‌తో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ (ట్యాగ్ లైన్ అసలు కథ) విడుదలైంది. ఏపీలో విడుదల కోర్టు పరిధిలో ఉంది. కథ విషయానికొస్తే... ఇది ఎన్టీఆర్ కథనా లేదా లక్ష్మీ పార్వతి కథనా లేదా లక్ష్మీపార్వతికి తెలిసిన ఎన్టీఆర్ కథనా లేక లోకానికి తెలియని ఎన్టీఆర్ కథనా అనేది సినిమా చూశాకనే ప్రేక్షకులకు తెలుస్తుంది. నిన్నమొన్న వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు (కథానాయకుడు, మహానాయకుడు) వదిలిపెట్టిన అనేక విషయాలు ఈ సినిమాలో కనిపించాయని ప్రేక్షకులు అనుకుంటారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అనే అభిమాని ఎంటరైనప్పటి నుంచి ఎన్టీఆర్ మరణించే వరకు జరిగిన సంఘటనలు ఈ సినిమాలో ప్రధాన కథ. సినిమా కథ ప్రకారం ‘మనదేశం’ పార్టీ స్థాపించి తెలుగువారి విజేతగా నిలిచిన ఎన్టీఆర్ (సినిమాలో నటుడు విజయకుమార్) 1989లో మొదటిసారి ఓడిపోయినప్పుడు చేదు పరిస్థితులు ఎదుర్కొంటాడు. సొంత కుటుంబం, తను నిర్మించుకున్న రాజకీయ కుటుంబం ఒక్కసారిగా దూరం కావడంతో పలకరించే దిక్కు లేక ఇక రాజకీయాలు వద్దు, జీవితాన్ని ఏదో ఒకలా బతికేస్తానని అనుకుంటాడు. ఆ సమయంలో ఆయన జీవితంలోకి వస్తుంది లక్ష్మీపార్వతి (నటి యజ్ఞా శెట్టి). ఆయన జీవిత చరిత్రను రాయడమే తన జీవితాశయమని చెప్పి ఎన్టీఆర్ మనసు ఆకట్టుకుంటుంది. ‘మీరు మామూలు మనిషి కాదు స్వామీ, మీలో చాలా గొప్ప శక్తి ఉంది’ అని ఆయన్ని ఉత్తేజపరుస్తుంది. అలా అడుగుపెట్టిన ఆమె రోజురోజుకూ∙ఆయన జీవితానికి ఎంత దగ్గరయిందీ ఈ క్రమంలో కుటుంబ సభ్యులందరూ ఆమెని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందీ కథలో చూపిస్తారు. ఇదంతా ఫస్ట్‌హాఫ్‌లో ఉంటుంది. అయితే వారి బంధాన్ని అప్పటి మీడియా సహకారంతో ఎన్టీఆర్ అల్లుడైన బాబు (సినిమాలో శ్రీతేజ్) లక్ష్మీపార్వతిపై విషం చిమ్మడంతో కథపై పట్టు బిగియటం సెకండ్ హాఫ్‌లో మొదలవుతుంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల తరపున రాయబారిలా ఎన్టీఆర్ వద్దకు వెళ్లిన బాబు మీరు చేస్తున్నది తప్పు అని ఎన్టీఆర్‌ను హెచ్చరిస్తాడు. అప్పటి నుంచి బాబుని దూరం పెడతాడు ఎన్టీఆర్. ఆ టైమ్‌లో ఎన్టీఆర్‌ని ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా చేయమని అడుగుతాడు ఒక ఆత్మీయ నటుడు. ఆ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఆ సినిమా 100 రోజుల వేడుక తిరుపతిలో భారీగా చేస్తున్నానని ఆ నటుడు ఆహ్వానితుల జాబితాని ఎన్టీఆర్‌కి చూపిస్తాడు. ఆ జాబితాలో లేని లక్ష్మీపార్వతి పేరుని ఎన్టీఆర్ స్వయంగా రాస్తాడు. అది తెలుసుకున్న బాబు ఎలాగైనా ఆ సభకి ఆమె రాకుండా అడ్డుకునేందుకు కుటుంబ సభ్యులందర్నీ ఎన్టీఆర్ వద్దకు తీసుకొచ్చి, ఆమె సభకి వచ్చినా ఫర్వాలేదు కానీ, స్టేజ్‌పైకి రానివ్వద్దని ఆంక్షలు విధిస్తాడు. సరేనన్న ఎన్టీఆర్ తిరుపతి సభలో ఆమె గురించి ప్రస్తావించడమే కాక ఆమెను అర్ధాంగిగా స్వీకరిస్తున్నానని సభాముఖంగా తెలియజేస్తాడు. దాంతో కుటుంబ సభ్యులతో పాటు అందరూ నివ్వెరపోతారు. అక్కడి నుంచి బాబు తన రాజకీయ చదరంగాన్ని ప్రారంభిస్తాడు. ఆమెను అనేకసార్లు దూషించిన బాబు ఆమెకే ఫోను చేసి, సంధి చేసుకుని ఎన్టీఆర్‌కి మళ్లీ దగ్గరవుతాడు. 1994లో మళ్లీ ఎన్టీఆర్ తన చరిష్మాతో అత్యధిక సీట్లు గెలుచుకుని సీఎంగా పగ్గాలు చేపడతాడు. ఇది ఓర్వలేని బాబు ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడం కోసం ఎలాంటి కుట్రలు పన్నాడు? ఎంతమందిని పావులుగా వాడుకున్నాడు? మీడియాని ఎలా హస్తగతం చేసుకున్నాడు? సీఎంగా ఉన్న ఎన్టీఆర్‌ని ఎలా వెన్నుపోటు పొడిచాడనేది ప్రీ క్లైమాక్స్. సినిమాలో వైశ్రాయ్ ఉదంతాన్ని ఎమోషనల్‌గా చూపించాడు వర్మ. 74 ఏళ్ల వయస్సులో ఒక సీఎం పదవిలో ఉండి ఎంతో జీవితాన్ని చూసిన ఎన్టీఆర్ ఏడుస్తూ ఉండే సంఘటన చూసిన ఎవరైనా చలించిపోతారు. ‘సొంత కొడుకులు, సొంత కూతుళ్లు, అల్లుళ్లు, నా బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలు నన్ను వెన్నుపోటు పొడిచారు. చెప్పులతో దాడి చేశారు. ఆ సంఘటన జరిగిన రోజునే నేను చచ్చిపోయాను లక్ష్మీ’ అని ఎన్టీఆర్ అంటారు. విశ్లేషణ ఇది దర్శకుడు వర్మ తాను పరిశోధించి తాను యదార్థమని తలిచి చెప్పిన కథ. ఎన్టీఆర్ వంటి ఓ గొప్పనాయకుడు ఎందుకు ఒంటరివాడయ్యారు? ఆ సమయంలో లక్ష్మీ పార్వతికి ఎలా దగ్గర అయ్యారు? వారి మధ్య ప్రేమ చిగురించడానికి దారితీసిన సంఘటనలు ఏంటి? లక్ష్మీపార్వతి మీద ఎన్టీఆర్ కుటుంబం ఎలాంటి కుట్రలు చేసింది? ఆ కుట్రలకు ముఖ్య కారకులు ఎవరు? ఎన్టీఆర్ మరణానికి కారణమైన వెన్నుపోటు వెనక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? వంటి అంశాలను ప్రేక్షకుల కళ్లకు కట్టేట్టు చూపించారు. ఎవరెలా చేశారంటే... పాత్రల ఎంపిక విషయంలో వర్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎన్టీఆర్ పాత్ర చేసిన రంగస్థల నటుడు పి.విజయ్ కుమార్ ఆహార్యం, హావభావాలు, డైలాగ్ డెలివరీ అచ్చం ఎన్టీఆర్‌ను తలపించింది. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి ఆకట్టుకుంది. ఎన్టీఆర్ పట్ల ప్రేమ, అమాయకత్వం, బాధ, వేదన, అవమాన భారం.. ఇలా అన్ని భావాలను అద్భుతంగా పలికించింది. బాబు పాత్ర చేసిన శ్రీతేజ్ సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. వెన్నుపోటు రాజకీయాలు చేసే కుటిల రాజకీయ నాయకుడిగా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించే లా ఉన్నాయి. సాంకేతిక నిపుణుల పనితీరు... నిజజీవిత కథలను తెర మీద మలచడం వర్మకు బాగా తెలుసు. అందుకు నిదర్శనం ఆయన తీసిన ‘రక్తచరిత్ర‘, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘వంగవీటి’ తదితర చిత్రాలు. ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో వర్మ ఈ కథను నడిపారు. ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ సంగీతం, నేపథ్య సంగీతం మరో ప్లస్ పాయింట్. రమ్మీ అందించిన ఫోటోగ్రఫీ చాలా కొత్తగా ఉంది. డైలాగులు... ► నా 70 ఏళ్ల జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు వాడిని నేను నమ్మడం.. ► పాముకు పాలుపోసి పెంచినా అది విషంతోనే కాటేస్తుంది.. వాడూ అంతే... ► జీవితం ఎప్పుడు ఎందుకు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు ► మీరు నా పిల్లలు అయ్యుండి కూడా వాడితో చేరారా సిగ్గు లేకుండా ఛీ.. ► తమ్ముళ్లూ.. వాడి మాట వినకండి.. మీకు నేనున్నా.. ధైర్యంగా బయటకు రండి ► ఇక పార్టీలో ఏ నిర్ణయమైనా నాకు తెలీయకుండా జరగడానికి వీల్లేదు. ► అబద్ధానికి నోరు పెద్దది.. అన్యాయానికి చేతులు పెద్దవి. తారాగణం: విజయ్ కుమార్, యజ్ఞాశెట్టి, శ్రీతేజ్ దర్శకత్వం: రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు నిర్మాత: రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి సంగీతం: కల్యాణీ మాలిక్ -
‘నా కొడుకు లోకేష్ మీద ఒట్టేసి చెపుతున్నా’
-
‘నా కొడుకు లోకేష్ మీద ఒట్టేసి చెపుతున్నా’
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సంబంధించి మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు. తొలి ట్రైలర్లో ఎన్టీఆర్‌కు జరిగిన అవమానాలను చూపించిన వర్మ తాజా ట్రైలర్లో లక్ష్మీ పార్వతి ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాల మీద దృష్టి పెట్టాడు. ఎన్టీఆర్‌కు దగ్గరైన తరువాత లక్ష్మీ పార్వతిని.. ఎన్టీఆర్ కుటుంబం సభ్యులు ఎలా అవమానించారు, ఆమె మీద ఎలాంటి విష ప్రచారం చేశారు అన్న విషయాలను ఈ ట్రైలర్లో చూపించారు. ‘వాడూ నా పిల్లలూ కలిసి, నన్ను చంపేశారు’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభించిన వర్మ తరువాత ఎన్టీఆర్ వెన్నుపోటు కారణమైన పరిణామాలను చూపించాడు. లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ నుంచి దూరం చేయడానికి ఎలాంటి కుట్రలు జరిగాయన్న విషయాలను ట్రైలర్లో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ సంచలనాలు నమోదు చేయటంలో రెండో ట్రైలర్ కూడా యూట్యూబ్ లో రికార్డు సృష్టింస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. తన సోషల్ మీడియా పేజ్‌లో ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ ‘ఇది స్వర్గం నుంచి ఎన్టీఆర్ విసిరిన లక్ష్మీ ఆటం బాంబ్’ అంటూ ట్వీట్ చేశారు. -
బాలకృష్ణ మానేద్దాం అనుకుంటున్నాడట!
సుధీర్ఘ సినీ కెరీర్లో నందమూరి బాలకృష్ణ నిర్మాణ రంగం మీద దృష్టి పెట్టలేదు. కానీ తన తండ్రి బయోపిక్ నిర్మించాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో తాను నిర్మాతగా మారితే బాగుంటుందని భావించారు. అందుకే ఎన్బీకే ఫిలింస్ బ్యానర్‌ను స్థాపించి యన్.టి.ఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా నిర్మించారు. అయితే ఈ రెండు సినిమాలకు దారుణమైన ఫలితాలు రావటంతో నిర్మాణ రంగంలో కొనసాగటంపై బాలయ్య ఆలోచనలో పడ్డారట. ఇప్పటికే బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాను తానే స్వయంగా నిర్మిస్తున్నట్టుగా బాలకృష్ణ ప్రకటించాడు. తాజా సమాచారం ప్రకారం ఆ సినిమాను కూడా బయటి బ్యానర్లోనే చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తొలి ప్రయత్నమే తేడా కొట్టడంతో ఇక నిర్మాతగా కొనసాగకపోవటమే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి నిజంగానే బాలయ్య నిర్మాణ రంగం నుంచి తప్పుకుంటాడా..? లేదా అన్న విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
'మహా నాయకుడు' టిక్కెట్లు ఫ్రీ
-
'మహా నాయకుడు' కోసం టీడీపీ తిప్పలు
సాక్షి, గుంటూరు: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన 'మహా నాయకుడు' సినిమాను ప్రమోట్ చేసేందుకు టీడీపీ నాయకులు తంటాలు పడుతున్నారు. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని సాక్షాత్తూ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో అధికార పార్టీ నాయకులకు తిప్పలు తప్పడం లేదు. అధినేత ఆదేశాలను శిరసావహించేందుకు టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో వారిని ధియేటర్లకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జుల ద్వారా ఉచితంగా టికెట్లు పంపిణీ చేసి ప్రేక్షకులను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉచితంగా టిక్కెట్లు ఇచ్చినా సినిమా చూడటానికి ఆసక్తి చూపకపోవడంతో బతిమాలి జనాన్ని ధియేటర్లకు పంపుతున్నారు. అంతేకాదు జనాన్ని తరలించేందుకు వాహనాలు కూడా సమకూర్చారు. ప్రేక్షకులకు టిక్కెట్లు పంపిణీ చేస్తూ గుంటూరు ఆరండల్‌పేటలో గురువారం కొందరు టీడీపీ నాయకులు ‘సాక్షి’ కెమెరా కంటపడ్డారు. ఎన్టీఆర్ జీవిత కథను రెండు భాగాలు తెరకెక్కించి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయినట్టు వార్తలు వస్తున్నాయి. గతవారం విడుదలైన 'మహా నాయకుడు' కూడా బాక్సాఫీస్ వద్ద నిరసపడటంతో దీన్ని ప్రమోట్ చేసే బాధ్యత చంద్రబాబు తీసుకున్నారు. తన పాత్రను సానుకూలంగా చూపించి, నాదెండ్ల భాస్కరరావు క్యారెక్టర్‌ను ప్రతికూలంగా చూపించడంతో ఈ సినిమాను ప్రమోట్ చేయాలని టీడీపీ నాయకులను చంద్రబాబు స్వయంగా ఆదేశించారు. టీడీపీ డబ్బులిస్తుంది: బచ్చుల అర్జునుడు చంద్రబాబు ఆదేశానుసారం ఎన్టీఆర్ మహనాయకుడు సినిమాకు సంబంధించి ప్రతి నియోజకవర్గ పరిధిలోని ధియోటర్లలో 50 శాతం టికెట్లు కేటాయించే విధంగా డిస్ట్రిబ్యూటర్లతో పార్టీ అధినాయకత్వం మాట్లాడటం జరిగిందని టీడీపీ నేత బచ్చుల అర్జునుడు వెల్లడించారు. పార్టీలో అన్ని విభాగాల నాయకులకు, కార్యకర్తలకు సినిమాను చూపించాలని కోరారు. 50 శాతం టిక్కెట్లకు పార్టీ డబ్బులు చెల్లిస్తుందని టీడీపీ కార్యకర్తలకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. టిక్కెట్లు సరిగా పంచుతున్నారా, లేదా అనే దానిపై విజిలెన్స్ పర్యవేక్షణ కూడా ఉంటుందని తెలిపారు. ‘యన్‌టిఆర్ మహానాయకుడు’ మూవీ రివ్యూ -
మహానాయకుడి పరిస్థితి మరీ దారుణం!
తెలుగు హీరోలు ఈ మధ్య ఓవర్సీస్లో హవా చాటుతూ టాలీవుడ్ క్రేజ్ పెంచేస్తూ ఉన్నారు. మనోళ్లు అక్కడ మూడు, నాలుగు మిలియన్లు వసూళ్లు చేసేస్తున్నారు. అయితే ఇలా మన హీరోలు జోరు కొనసాగిస్తూ ఉంటే.. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రాలు మాత్రం అక్కడ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంటున్నాయి. గతేడాది వచ్చిన భారీ చిత్రాల్లో కూడా కొన్ని చిత్రాలు పరాజయం పాలవ్వగా.. ఈ ఏడాది వచ్చిన పెద్ద సినిమాలు మాత్రం వరుసగా బోల్తా కొట్టేస్తున్నాయి. భారీ డిజాస్టర్ మూవీ లిస్ట్‌లోకి ఎగబడి మరీ వచ్చేస్తున్నాయి. ఈ ఏడాది వచ్చిన కథానాయకుడు, వినయ విధేయ రామ చిత్రాలు డిస్ట్రిబ్యూటర్లుకు దారుణంగా నష్టాలు తెచ్చి అత్యంత చెత్త సినిమాలుగా రికార్డులు సృష్టించాయి. అయితే గత శుక్రవారం విడుదలైన మహానాయకుడు ఆ రెండు చిత్రాలతో పోటీపడి అత్యంత చెత్త సినిమాగా రికార్డుకెక్కేందుకు సిద్దమైంది. ఈ మహానాయకుడు కలెక్షన్లు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఈ మూవీ కనీసం నాలుగు కోట్లు కూడా వసూళ్లు చేయలేదని సమాచారం. బాలయ్య లాంటి పెద్ద హీరోకు ఇది మాత్రం ఘోర పరాభావమే. ఇక ఓవర్సీస్లో అయితే ఈ చిత్రం మరి ఘోరంగా దెబ్బతిందని తెలుస్తోంది. అత్యంత భారీ డిజాస్టర్ మూవీగా మహానాయకుడు రికార్డును.. ఈ ఏడాదిలో మరే చిత్రం అధిగమించకపోవచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి. -
మహానాయకుడి మాటే ఎత్తని ఎన్టీఆర్
నందమూరి బాలకృష్ణ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం కూడా ఆశించిన అంచనాలు అందుకోవటంలో ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఈ సినిమాను కాపాడేందుకు ఒక వర్గం గట్టిగానే ప్రయత్నిస్తుందన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు ఒకే వేదిక మీదకు రావటంతో సినిమా జనాల్లో ఆసక్తి నెలకొంది. (చదవండి : బాబాయ్ స్పీచ్.. అబ్బాయ్ పాట్లు!) యన్.టి.ఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అస్సలు స్పందించలేదు. కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు. కానీ మహానాయకుడు రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే బాలకృష్ణ, ఎన్టీఆర్.. 118 సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఒకే వేదిక మీద కలుసుకోవటంతో ఎన్టీఆర్ సినిమాపై స్పందిస్తాడని నందమూరి అభిమానులు ఎదురుచూశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం దాదాపు ఏడు నిమిషాల ప్రసంగంలో యన్‌టిఆర్ బయోపిక్ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. కేవలం బాలయ్యకు స్వాగతం, కృతజ్ఞతలు మాత్రమే చెప్పి పూర్తిగా 118 సినిమా గురించే మాట్లాడారు. చిత్రయూనిట్లో ప్రతీ ఒక్కరిని పేరు పేరునా ప్రశంసించిన జూనియర్, బాబాయ్ సినిమా గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. -
‘మహానాయకుడు’ ఇంతగా దిగజారిపోయిందా..?
పశ్చిమగోదావరి, నిడదవోలు రూరల్: ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాకు ప్రజల నుంచి ఆశించినంతగా స్పందన లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి డ్వాక్రా మహిళలు, టీడీపీ నాయకులు కోసం ఉచిత షోలు వేస్తున్నారు. ఈనెల 25 ఉదయం, మ్యాట్నీ షోలతో పాటు, 26న నాలుగు షోలలో కూడా తమ పార్టీ నేతలకు, డ్వాక్రా మహిళలకు 50 శాతం టికెట్లు కేటాయించాలన్న టీడీపీ అదేశాలతో ఉషా పిక్చర్ డిస్ట్రిబ్యూటర్స్ సినిమా థియేటర్ల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆయా పట్టణాల్లోని కౌన్సిలర్లతో పాటు టీడీపీ నాయకులు, డ్వాక్రా యానిమేటర్లు, డ్వాక్రా మహిళలకు సినిమా చూపించేందుకు ఏర్పాట్లు చేశారు. సినిమాను టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రాజకీయ ప్రయోజనాల కోసం తీయడంతోపాటు చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాన్ని తెరకెక్కించకపోవడంతో సినిమా డిజాస్టర్ అయిందని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులతో జరిగిన టెలి కాన్ఫరెన్స్‌లో ఈ సినిమాను అందరికీ చూపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించటంతో టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఉచిత షోలు వేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఇప్పటికే డ్వాక్రా మహిళలను టీడీపీ కార్యక్రమాలను ప్రచారం చేసేందుకు సాధికార మిత్రలుగా నియమించారు. ఇటీవల పోలవరం, అమరావతి చూసేందుకు బస్సుల్లో తరలించగా, ఇప్పుడు సినిమాలకు తప్పనిసరిగా రావాలని ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. డ్వాక్రా గ్రూపులకు ఇచ్చిన పోస్ట్ పెయిడ్ చెక్కుల విషయంలో ఎక్కడ ఇబ్బంది పెడతారోనని తప్పని పరిస్థితుల్లో వారి మాట వినాల్సి వస్తోందని డ్వాక్రా సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సినిమాశుల్కం
స్థలము : అమరావతిలోని ఇంకో ‘బొంకుల’ దిబ్బ (బాబు ప్రవేశించును) చంద్రబాబు: సాయం కాలమైంది. కాసేపట్లో ప్రజా ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్సు ఉంది. మహా నాయకుడు సినిమా గురించి వాళ్ళేం మాట్లాడతారోనని బెంగగా ఉంది. వాళ్లు నోళ్లు విప్పకముందే నాలుగు ఝాడిస్తే సరి. ఎవరా వస్తున్నది.. నా ప్రియ బామ్మర్ది బాలయ్య బాబులా ఉన్నాడు. ఇవాళ ఎన్టీఆర్ బయోపిక్కు రెండో పార్టు రిలీజై ఉంటుంది. ఈపాటికి కలెక్షన్ల రిపోర్టు బయటికి వచ్చే ఉంటుంది. ఇతగాడి వైఖరి చూస్తే ఈ బొమ్మ కూడా చీదేసినట్టే కనబడుతుంది. ఇతణ్ణి కొంచెం ఓదార్చక తప్పదు. ఆలి వంక చుట్టము ఆప్త బంధువు అన్నారు. ఆపై వియ్యంకుడు కూడానాయే. (బాలయ్య బాబు ప్రవేశించును ) ఏమివాయ్ మై డియర్ బాలయ్య బాబూ, ముఖం వేల వేసినావ్? బాల: ఇక మీర్నాతో మాట్లాడకండి. మీరు చెప్పినట్టు తియ్యడం వల్లే మన సినిమా అంత ఘోరంగా చంకనాకిపోయిందంటున్నారు మీడియా వాళ్లు. చంద్ర: నాన్సెన్స్ .. మొదట్నించీ నేను అనుమానిస్తూనే ఉన్నాను. ఈ మీడియా వాళ్లకి, ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్లకి నన్ను చూస్తే గిట్టదు. అందుచేత బొమ్మ పోయిందంటున్నారు. లేకపోతే నువ్వేమిటి, సినిమా ఫెయిల్ కావడమేమిటి? వాళ్లని అసలు లెక్క చెయ్యకు. బాల: మీ వల్ల నాకు వచ్చిందల్లా మీడియా వాళ్లని లెక్క చెయ్యకపోవడం ఒక్కటే. అసలు ఫస్టు పార్టు దొబ్బేసినప్పుడే మీ దగ్గర మొత్తుకున్నాను. ఎప్పుడూ కబుర్లు చెప్పడమే కానీ ఆదుకుంటానని ఒక్క సారయినా ఒక్క ముక్క చెప్పిన పాపాన పోయినారూ? చంద్ర: డామిట్.. ఇలాంటి మాటలంటేనే నాకు కోపం వొస్తుంది. మొన్నటికి మొన్న నీ శాతకర్ణి సినిమాకి నూటికి నూరు శాతం వినోదప్పన్ను మినహాయింపు ఇవ్వలేదూ? ఎన్టీఆర్ బయోపిక్కు ఫస్టు పార్టు కథానాయకుడుకి తెలంగాణలో ఇవ్వకపోయినా ఆంధ్రాలో స్పెషల్ షోలకి పెర్మిషన్ ఇవ్వలేదూ? వారం రోజులపాటు రోజుకి ఆరు షోలు చొప్పున వేసుకుని దున్నుకొమ్మని చెప్పలేదూ? ఇంతా చేస్తే ఆదుకోలేదని తప్పుపడుతు న్నావ్? దిసీజ్ బేస్ ఇన్గ్రాటిడ్యూడ్ బావా! బాల: ఎన్ని చేస్తే ఏం లాభం .. ఫస్టు పార్టుకి పెద్ద బొక్కే పడిందిగా బావగారూ! చంద్ర: ముందు బూతులు ఆపవయ్యా మగడా! బాల: (కళ్ళు తుడుచుకొనును) మీకేం తెలుసు బావగారూ నా ఆవేదన? ఫస్టు పార్టుకి మనం ఇచ్చిన హైప్ వల్ల ఫ్యాన్సీ రేట్లకి కొనుక్కున్న వాళ్ళంతా కోట్లు కోట్లు నష్టపోయి నెత్తిన చెంగేసుకున్నారు. మా నష్టాన్ని భర్తీ చేస్తావా, ఛస్తావా అని నా పీకల మీద కూర్చున్నారు. ఒక దశలో చెప్పిన రోజుకి రెండో పార్టు రిలీజు చెయ్యగలుగుతానా లేదా అని డౌటు కూడా వచ్చేసింది. మొత్తానికి కిందా మీదా పడి రెండో పార్టు రిలీజు చేసేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇప్పుడు చూడండి, కథానాయకుడు కథని అడ్డం తిప్పితే మహా నాయకుడు మహా దెబ్బ కొట్టింది. మళ్లీ మీరే చక్రం వేసి ఒడ్డున పడెయ్యాలి బావగారూ! చంద్ర: ఏం చెయ్యమంటావ్ బాలయ్య బావా.. పోనీ, మన పార్టీ సభ్యులంతా సకుటుంబ సపరివార సమేతంగా విధిగా టిక్కెట్లు కొనుక్కుని రెండో పార్టు చూడా లని హుకుం జారీ చెయ్యమంటావా ? బాల: సముద్రంలో కాకి రెట్టంత ఆ కలెక్షన్ ఏం సరిపోతుంది బావగారూ! (అని నాలి క్కరుచుకొనును) చంద్ర: సరేగానీ ఈ గండం గడిచే ఉపాయం చెబుతాను. వింటావా? బాల: మీ శలవు ఎప్పుడు తప్పాను? డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు , థియేటర్ ఓనర్లు, ఆఖరికి కేంటీన్, కార్లూ, స్కూటర్ల కాంట్రాక్టర్లు కూడా నన్ను పీక్కు తినేస్తున్నారు. వీళ్ల బారినుంచి మీరే నన్ను కాపాడాలి. చంద్ర: అయితే నేనో ఉపాయం చెబుతాను. నేను కూడా హైదరాబాద్ వస్తాను. వీళ్ళందరితో ఓ మీటింగ్ పెట్టు. బాల: మీరు వస్తే బతికాను. వాళ్లకి వచ్చిన నష్టంలో సగం మీరు భర్తీ చేస్తారని చెప్పేద్దామా? చంద్ర: ఓరి నా పిచ్చి బామ్మర్దీ.. అన్ని కోట్లు నేనెక్కడ్నించి తెచ్చి పోస్తాను? ఎలాగూ ఎలెక్షన్లు వస్తున్నాయి కదా.. వాళ్లెవర్నీ పార్టీ ఫండ్ అడగబోమనీ, అసలు వాళ్ల జోలికే రాబోమనీ హామీ ఇచ్చేద్దాం. దెబ్బకి శాంతిస్తారు. బాల: ఆహా.. మీ బుర్రే బుర్ర బావగారూ! (గురజాడ అప్పారావు గారికి క్షమాపణలతో..) వ్యాసకర్త: మంగు రాజగోపాల్, సీనియర్ పాత్రికేయుడు -
ఎన్టీఆర్ బయోపిక్‌పై కంగన షాకింగ్ కామెంట్స్
మణికర్ణిక సినిమా విషయంలో కంగన, క్రిష్‌ల మధ్య తలెత్తిన వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవల క్రిష్ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు(కథానాయకుడు, మహానాయకుడు) బాక్సాఫీస్ వద్ద నిరాశను మిగిల్చిన సంగతి తెలిసిందే. మణికర్ణిక చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలోనే క్రిష్, ఎన్టీఆర్ బయోపిక్కు దర్శకత్వం వహించడానికి అంగీకరించారు. తాజాగా క్రిష్ గురించి ఓ మీడియా సంస్థతో మాట్లాడిన కంగన, క్రిష్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్ల గురించి విన్నాను. ఇవి జీరో రికవరీగా నిలిచాయి. ఆ నటుడి జీవితంలో ఈ చిత్రం మచ్చగా మిగులుతుంది. క్రిష్‌ను నమ్మినందుకు బాలకృష్ణను చూస్తుంటే నాకు బాధగా ఉంది. నేను క్రిష్‌ను ద్రోహం చేశానని చాలా మంది విమర్శలు చేశారు. నా వ్యక్తిత్వంపై దాడి చేయడమే కాకుండా.. నిందలు వేస్తూ రాబందుల్లా పీక్కు తిన్నారు. నాపై అనాలోచితంగా విమర్శలు చేసినవారు ఇప్పుడేమంటారు?. కమర్షియల్‌గా మణికర్ణిక చిత్రం విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. అటువంటి చిత్రంపై విమర్శలు చేస్తారా?. క్రిష్‌తో కొన్ని పెయిడ్ మీడియా సంస్థలు కూడా నాపై బురదజల్లడం సిగ్గుచేటు. స్వాతంత్ర సమరమోధులు.. ఇటువంటి వారి కోసం రక్తం ధారపోసినందుకు నిజంగా బాధగా ఉంద’ని కంగన తెలిపారు. -
ఏన్టీఅర్కి రెండో వెన్నుపోటు ఘట్టం మిస్ అయ్యిందేం?
-
బేతాళ కథ : ఎన్టీఆర్ బయోపిక్‌లో బాబు వెన్నుపోటు ఎందుకు లేదు?
పట్టు వదలని విక్రమార్కుడు రోజూలాగే శ్మశానినికి వచ్చాడు. ఏదో ఆలోచిస్తూ..రోబోలా...బేతాళుడు వేలాడుతోన్న చెట్టుదగ్గరకు వెళ్లి..బేతాళుని కిందకు దించి భుజాలకెత్తుకున్నాడు. విక్రమార్కుడి మౌనాన్ని గమనించిన బేతాళుడు ‘ ఏం విక్రమార్కా...ఎలక్షన్లలో ఏ పార్టీ తరపునా టికెట్ రాని వాడిలా ఏమిటోయ్ అంత నిరుత్సాహంగా ఉన్నావీవేళ‘ అన్నాడు. బేతాళా...అసలే చికాగ్గా ఉంది..నువ్వు కానీ నా మీద సెటైర్లు వేశావనుకో ఇదే కత్తి తీసుకుని నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను‘ అని కోప్పడ్డాడు విక్రమార్కుడు. బేతాళుడి పైశాచికంగా నవ్వి... దెయ్యాలనేం నరుకుతావు కానీ..ఇప్పుడో కథ చెబుతాను..విని నేనడిగిన ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పు.సమాధానం తెలిసుండీ కూడా సమాధానం చెప్పలేదనుకో ఏం జరుగుతుందో తెలుసు కదా‘ అని వెటకారంగా చూశాడు బేతాళుడు. విక్రమార్కుడికి మండుకొచ్చింది. సోది లేకుండా సూటిగా కథ చెప్పకపోయావో..నీ ఆత్మే వెయ్యి వక్కలవుతుందని ఎదురు దాడి చేశాడు. బేతాళుడు తమాయించుకుని విక్రమార్కా కథ చెప్పడానికి ముందు నాదో చిన్న డౌటు..బయోపిక్ అంటే ఏంటి? అని అడిగాడు. విక్రమార్కుడు బేతాళుడికేసి చూసి అది కూడా తెలీదా..జీవిత కథ. అంటే నువ్వు పుట్టిందగ్గర నుంచి నువ్వు బాల్చీ తన్నేసే వరకు నీగురించి చెప్పేదంతా నీ బయోపిక్ అన్నమాట.అలాగే ఎవరి బయోపిక్కులైనా ..అని ఆగాడు. బేతాళుడు అర్ధమైనట్లు చూసి.. అయితే ఇపుడు నందమూరి బాలకృష్ణ తన నాన్నగారు నందమూరి తారకరామారావు జీవితాన్ని రెండు భాగాలుగా తీస్తానన్నారు కదా. అందులో మొదటి భాగం కథానాయకుడు ఆ మధ్యన విడుదలైంది.ఇపుడు రెండో భాగం మహానాయకుడు విడుదలైంది. అయితే ఇందులో ఎన్టీఆర్ జీవితంలో అత్యంత కీలకమైన చివరి ఘట్టం ఎందుకు లేదు? ఎన్టీఆర్ రెండో పెళ్లి గురించి కానీ..ఆ తర్వాత ఆయన మళ్లీ సిఎం అయిన సంగతి కానీ..ఆ తర్వాత ఆయన పదవి పోగొట్టుకుని కొంతకాలానికి చనిపోవడం గురించి కానీ బయోపిక్ లో ఎందుకు చూపించలేదు? ఎన్టీఆర్ జీవితాన్ని కొంతభాగమే చూపించి బయోపిక్ అని ఎలా అన్నారు? అని బేతాళుడు నిలదీశాడు. విక్రమార్కుడు సాలోచనగా చూసి..బేతాళా నువ్వన్నట్లు ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఆయన చనిపోయే వరకు ఆయన జీవితంలో చోటు చేసుకున్న ముఖ్యమైన అంశాలన్నీ చూపించాల్సిందే. అయితే అలా చూపిస్తే బాలకృష్ణ వియ్యంకుడు చంద్రబాబు కొంపలంటుకుంటాయి. ఎందుకంటే.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో నాదెండ్ల భాస్కర రావు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. దాన్ని మహానాయకుడులో చూపించారు. 1989 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్ ని అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్లు అవమానించారు. దాంతో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో మళ్లీ అడుగు పెట్టనని ఎన్టీఆర్ శపథం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా..స్పీకర్ వారిపై అనర్హత వేటు వేయకపోవడానికి నిరసనగా జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి దూరంగా ఉన్నట్లే..నాడు ఎన్టీఆర్ కూడా అసెంబ్లీకి రానని భీష్మించుకుని కూర్చున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఇంచుమించు ఇంటికే పరిమితమయ్యారు.ఆ సమయంలోనే ఆయన జీవిత చరిత్ర రాయడానికి వచ్చిన లక్ష్మీపార్వతి ..ఎన్టీఆర్ కు సన్నిహతమయ్యారు. ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నట్లు 1993లో మేజర్ చంద్రకాంత్ వందరోజుల ఫంక్షన్ లో ఎన్టీఆర్ ప్రకటించారు. లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ పెళ్లిని వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు..ఈ వయసులో ఎన్టీఆర్ పెళ్లి చేసుకుంటే ఇక పార్టీ కార్యాలయానికి తాళాలు వేసుకోవలసిందేనని పార్టీ నేతలతో అన్నారు కూడా. అయితే ఒకసారి నిర్ణయం తీసుకుంటే తన మాట తానే వినని ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడమే కాదు..సతీ సమేతంగా 1994 ఎన్నికల ప్రచారానికి ఉరికారు. కొత్త దంపతులను చంద్రబాబు అండ్ కో ఆమోదించకపోవచ్చుకానీ..కోట్లాది మంది ఆంధ్రులు ఆశీర్వదించారు. తెలుగుదేశం అనూహ్య విజయం సాధించడమే కాదు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఈ పరిణామంతో కంగారు పడ్డ చంద్రబాబు నాయుడు లక్ష్మీపార్వతి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ..ఏకంగా ఎన్టీఆర్ కుర్చీపైనే కన్నేశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే చాపకింద నీరులా చంద్రబాబు నాయుడు కొద్ది పాటి ఎమ్మెల్యేలను కూడగట్టి వెన్నుపోటుకు వ్యూహరచన చేశారు. ఆ ఎమ్మెల్యేలను తీసుకుని వైస్రాయ్ హోటల్ లో క్యాంప్ పెట్టారు. నిజానికి చంద్రబాబుతో పది పదిహేను మంది ఎమ్మెల్యేలే ఉన్నా..చంద్రబాబు అనుకూల మీడియా అంతా కలిసి చంద్రబాబు వద్ద వందమందికి పైనే ఎమ్మెల్యేలు ఉన్నారని అసత్యాలు ప్రచారం చేసింది. రోజు రోజుకీ చంద్రబాబు శిబిరంలో వచ్చి చేరే వారి సంఖ్య పెరుగుతోందని ఊదరగొట్టారు.ఇది నిజమేననుకున్న తటస్థ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు శిబిరంలో చేరారు. చాలా మంది చేరకుండా ఎన్టీఆర్ కి మద్దతుగానే ఉండిపోయారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు తన వైపు తిప్పుకుని వెన్నుపోటు డ్రామాకి వ్యూహరచన చేశారు. ఈ సమయంలోనే వైస్రాయ్ హోటల్ వచ్చిన ఎన్టీఆర్ పై ..చంద్రబాబు నేతృత్వంలో..ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సాక్షిగా ఎన్టీఆర్ పై చెప్పులు వేశారు. ఆ అవమానంతో..తాను ఆక్షణానే చనిపోయానని చెప్పుకున్న ఎన్టీఆర్..ఆ తర్వాత మానసికంగా తీవ్రంగా కృంగిపోయారు. ఆ మనస్తాపంలోనే అనారోగ్యం పాలయ్యారు. ఎన్టీఆర్ కుర్చీని చెరబట్టిన చంద్రబాబు నాయుడు..ఎన్టీఆర్ స్థాపించిన పార్టీనీ..ఆ పార్టీ గుర్తునూ..చివరకు పార్టీ బ్యాంకు ఖాతాలోని డబ్బులనూ సొంతం చేసుకున్నారు.ఈ అవమానాలే అభిమానధనుడైన ఎన్టీఆర్ ప్రాణాలు తీశాయి. ఒక వేళ ఎన్టీఆర్ చనిపోయేవరకు మహానాయకుడిలో ఎన్టీఆర్ జీవితాన్ని చూపించవలసి వస్తే.. చంద్రబాబు చేసిన దుర్మార్గాలు..వెన్నుపోటు ప్రహసనం..ఆ కుట్రలో ఎన్టీఆర్ తనయుడు..మహానాయకుడు హీరో నందమూరి బాలకృష్ణ చేసిన సాయం అన్నీ చూపించాల్సి వస్తుంది. నిజానికి నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు ..కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనలో సాగింది. కానీ చంద్రబాబు వెన్నుపోటు మాత్రం..అన్నీ తానే అయి చంద్రబాబు కుట్రనుఅమలు చేశారు.దానికి ఒక వర్గం మీడియా అంతా కొమ్ముకాసింది. అసత్య కథనాలతో..అవమానాలతో అంతా కలిసి ఎన్టీఆర్ ను పరోక్షంగా చంపేశారు.ఈ కఠిన వాస్తవాలు చూపిస్తే..రాజకీయంగా చంద్రబాబుకీ.. నటుడు..రాజకీయ నాయకుడిగా బాలయ్యకూ కూడా ఇబ్బందే. అందుకే ఎన్టీఆర్ జీవితాన్ని చంద్రబాబుకు నచ్చిన మేరకే..బాలయ్య చూపించారు. ఆ తర్వాతి జీవితం ఎలా ఉందో చెప్పలేదు. కాకపోతే ఈ జీవితాన్ని ఇపుడు రామ్ గోపాల్ వర్మ తాను చూపిస్తానంటున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో... బాలయ్య ఎన్టీఆర్ జీవితం ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మొదలవుతుందని రామ్ గోపాల్ వర్మ అనడంలోనే..ఇపుడు నేను చెప్పిన కుట్రలన్నింటినీ తెరపైకి ఎక్కిస్తారని అర్ధం చేసుకోవాలి.‘అని విక్రమార్కుడు ముగించారు. మా బేతాళ లోకం లో కూడా ఇంతటి పైశాచిక క్రీడలు ఉండవయ్యా బాబూ అని బేతాళుడు వణుకుతూ అనేసి..విక్రమార్కుడి సమాధానానికి సంతృప్తి చెంది విక్రమార్కుడి భుజాలపై మాయమై తిరిగి చెట్టుకు వేలాడాడు. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి వీడియో సాంగ్
యన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు నిరాశపరచటంతో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మరో సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆసక్తి మరింత పెరిగింది. బాలకృష్ణ నిర్మించిన బయోపిక్‌లో చూపించని చాలా నిజాలు లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చూడొచ్చని ప్రేక్షకుల ఎదురుచూస్తున్నారు. వర్మ కూడా తను తెరకెక్కిస్తున్నదే అసలు కథ అంటూ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తున్నారు. ఇప్పటికే టీజర్ ట్రైలర్లతో పాటు లిరికల్ వీడియోలతో ఆకట్టుకున్న రామ్ గోపాల్ వర్మ, రేపు మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు. సినిమాలో ‘నీ ఉనికి నా జీవితానికి అర్థం’ అనే పాట వీడియోను రేపు ఉదయం 9 గంటల 27 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించాడు. ఈ పాటను ఎన్టీఆర్‌కు ఎన్నో సూపర్ హిట్ పాటలను ఆలపించిన లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారని తెలిపారు. First song video of #LakshmisNTR to release tomorrow sunday at 9.27 AM ..Sung by the legendary S P Balasubramaniam,who sang almost all the super hit songs of NTR pic.twitter.com/qpM4LoB75j — Ram Gopal Varma (@RGVzoomin) 23 February 2019 -
మహానాయకుడి పరిస్థితి మరీ దారుణం
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు నిరాశపరుస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్ సీస్లో ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. మహానాయకుడు ప్రీమియర్ షోస్‌తో కేవలం ఒక లక్షా పద్నాలుగు వందల అరవై డాలర్ల వసూళ్లు మాత్రమే సాధించినట్టుగా ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ జీవీ వెల్లడించారు. (మూవీ రివ్యూ : యన్.టి.ఆర్ మహానాయకుడు) గత నెల రిలీజ్ అయిన కథానాయకుడు ప్రీమియర్ షోస్‌కు నాలుగు లక్షలకు పైగా వసూళ్లు వచ్చాయి. కథానాయకుడు రిజల్ట్ ప్రభావంతో పాటు ఎన్టీఆర్ రాజకీయ జీవితంలోని సంఘటనలను నిష్పాక్షికంగా చూపించే ధైర్యం ‘యన్‌టిఆర్’ టీంకు లేదన్న అభిప్రాయానికి ప్రేక్షకులు ముందే వచ్చేయటంతో మహానాయకుడు కలెక్షన్లు భారీగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఈ సినిమా కోటి రూపాయల షేర్ కూడా సాధించలేకపోయిందన్న టాక్ వినిపిస్తోంది. కథానాయకుడు సినిమాకు ఫుల్‌రన్‌లో రూ. 50 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే మహానాయకుడుకు కూడా భారీ నష్టాలు తప్పవంటున్నారు విశ్లేషకులు. -
మహానాయకుడు.. ఇంతకీ హీరో ఎవరు?
సాక్షి, హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానాయకుడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మహానేత తనయుడు, హీరో నందమూరి బాలకృష్ణ స్వయంగా నటించి, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా విడుదల చేశారు. కథానాయకుడు బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టడంతో... మహానాయకుడుపై మేకర్స్ ప్రత్యేక దృష్టి సారించి ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవ కథ కన్నా.. పార్టీ ప్రయోజనాలే ముఖ్యంగా భావించి ఈ చిత్రాన్ని తీయడంతో ఇది కూడా ప్రేక్షకులకు రుచించలేదు. కథకు మూలమైన నాయకుడి పాత్రను తగ్గించి మరోపాత్రకు ప్రాధాన్యత కల్పించడంతో అభిమానులు పెదవి విరుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రంపై తమదైన శైలిలో రివ్యూలిస్తున్నారు. మొదటి భాగంలో సృజనకంటే భజన ఎక్కువై బోర్లాపడ్డ నేపథ్యంలో రెండో పార్ట్‌నైనా క్రిష్ బాగా తీస్తామనుకున్నామని, కానీ విలనీ భారమంతా నాదెండ్ల భాస్కరరావు నెత్తిన పెట్టేసి సినిమాను లాగించేసాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టడం ఘన విజయం సాధించడం ఆ తరువాత ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి మళ్లీ దాన్ని గెలుచుకోవడం అనేది స్టోరీ లైన్‌గా తీసుకున్న దర్శకుడు దాన్ని ప్రేక్షకుల మెదళ్లలోకి ఎక్కించలేకపోయాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఈ సినిమాలో హీరో ఎన్టీఆరా? లేక చంద్రబాబా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంత మాత్రానికి ఈ సినిమా ఆ మహానాయకుడి కథ అని చెప్పడం దేనికి.. చంద్రబాబు బయోపిక్ అంటే సరిపోయేది కదా? అని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబు.. ఎన్టీఆర్కే కాదు నందమూరి అభిమానులకు వెన్నుపోటు పొడిచారని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే.. ఉరిశిక్షకు బదులు మహానాయుకుడు సినిమా చూపించాలని, సినిమాకు వెళ్లేవారు జండూబామ్ తీసుకెళ్లాలని ట్రోల్ చేస్తున్నారు. #Mahanayakudu worest film of the year #NTRBiopic ya cbn biopic nayana em ayina undha My review 0.5/5#NTRMahayanakudu #NTRమహానాయకుడు #NTRKathanayakudu #Mahanayakudureview #NTRBiopic — Fasaaak (@Fasaaak1) February 22, 2019 #Mahanayakudu Collections Gurinchi Aduguthunte 2009 Elections Gurinchi Chepthunarenti N Fans 😞😂 — #Mr.© (@PremCharaNN) February 23, 2019 NTR gari #BIOPIC ani cheppi veellu enti @ncbn garini highlight chestunnaru? Oho! Ippudu artham ayyindi, election campaign anna maata. 👍 Ento ee cinemalu!#Mahanayakudu Ayina balakrishna garu ela oppukonnaru abba ee cinema cheyadaniki ?😕 — Anandit - The one who spreads the joy (@SonOfTheGUNtur) February 22, 2019 #Mahanayakudu fell short of expectations..They just tried 2 show the raise of NTR with some over the top dialogues..Abrupt ending made it even more disappointed for those who have been waiting for years 2 witness the history of legend NTR☹️ @DirKrish @RanaDaggubati — Uday Raj (@udayraj_1) February 22, 2019 బాలయ్య బాబు ఏదో సినెమా లో అంటాడు కసి తీరకపోతే సచ్చిన శవాన్ని లేపి మరీ చంపుతా అని. కన్న తండ్రి మీద ఎందుకురా అయ్య అంత కసి. బావ తో కలసి ఒక సారి, క్రిష్ తో కలసి పార్ట్ పార్ట్ గా, ఇంకా ముందు ముందు ఎన్ని సార్లో. #Mahanayakudu — Sanjay - Indian (@pepparsalt9) February 22, 2019 -
ఎన్టీఆర్ బయోపిక్కు వెన్నుపోటు
సాక్షి, హైదరాబాద్ : కథానాయకుడు బోల్తా కొట్టడంతో... మహానాయకుడుపై మేకర్స్ ప్రత్యేక దృష్టి సారించి ఉంటారని అందరూ అనుకున్నారు. అయితే.. అందరి ఊహాగానాలకు భిన్నంగా సాగిన ఈ సినిమా అభిమానులను ఆశ్చర్యంలో ముంచింది. బయోపిక్ అంటే కత్తిమీద సాము లాంటిది. ఉన్నది ఉన్నట్లు చూపిస్తే.. కొందరికి రుచించకపోవచ్చు. కొన్ని వాస్తవాలను దాచిపెట్టినా... అసలు ఏమాత్రం పొంతనలేని, జరగని సంఘటనలు జరిగినట్టు చూపించడమే కాకుండా ఈ సినిమాలో కథకు మూలమైన నాయకుడి పాత్రను తగ్గించి మరోపాత్రకు ప్రాధాన్యత కల్పించడంతో అసలు బయోపిక్ అర్థాన్నే మార్చడం గమనార్హం. బాలీవుడ్లో వచ్చిన ‘సంజు’ గమనిస్తే అందులో సంజయ్ దత్ కావాలని ఎలాంటి తప్పు చేయలేదనీ, పరిస్థితులే అతన్ని అలా మార్చేశాయనీ, తప్పంతా మీడియాదేనని, సంజు మంచి బాలుడు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సంజు పాత్రలో రణ్‌బీర్ అద్భుత నటనకు ప్రశంసలైతే వచ్చాయి. కానీ, సినిమా కథ, కథనాలపై ఘాటు విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తెలుగులో బయోపిక్ ట్రెండ్ రావడానికి కారణం మహానటి. అలనాటి మహానటి సావిత్రి జీవితం గురించి, ఆమె చివరి రోజుల్లో మద్యానికి బానిసవ్వడం, ఆమె మరణానికి దారితీసిన కారణాలు అందరికీ తెలిసిందే. అయితే ‘మహానటి’లో సావిత్రిలోని మంచి గురించి, చెడు గురించి చెప్పారు కాబట్టే.. ఆ చిత్రాన్ని ఆదరించి పట్టం కట్టారు. అయితే ఆమెలోని చెడును కూడా ప్రేక్షకులు ఒప్పుకునేట్టు చేసి.. ఆ పరిస్థితిలో ఎవరైనా అలాగే చేస్తారులే.. అని ప్రేక్షకుల చేతే అనిపించేలా చేయగలగడం దర్శకుడి గొప్పదనం. అందుకే మహానటి అంతటి విజయాన్ని సొంతంచేసుకుని.. ఆ మహానటికి నిజమైన నివాళిగా ‘మహానటి’ చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాకుండా కథను ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా చెప్పడమే కాకుండా ఆ పాత్రను వేస్తున్న నటీనటులు అందులో పరకాయ ప్రవేశం చేయాలి. అప్పుడే ప్రేక్షకులు ఆ పాత్రను నమ్ముతారు. పాత్రతో పాటే లీనమవుతారు. ఇలా మహానటికి అన్నీ కుదరడంతో తెలుగు తెరపై బయోపిక్‌లకు మార్గదర్శకంగా నిలిచింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్‌ది స్వర్ణ యుగమని అందరికీ తెలిసిందే. తిరుగులేని కథానాయకుడిగా ప్రజల్లో దేవుడిగా ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనాలు సృష్టించారు. అయితే ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయనకు ఎదురైన అనుభవాలు, లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించడం.. చంద్రబాబు వెన్నుపోటు పొడవడం, చివరగా ఆయన మరణం... ఇదంతా వెండితెరపైన చూపిస్తే ఎన్టీఆర్ బయోపిక్ సక్సెస్ అయ్యేదేమో. అలా కాకుండా వారు మెచ్చిన వాటిని ఎంపిక చేసుకుని నచ్చినట్టుగా తెరకెక్కిస్తే సహజంగానే ప్రేక్షకుల ఆదరణ లభించదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల విడుదలైన యాత్ర సినిమా కూడా ప్రేక్షకులను కదిలించిందంటే.. కథ, కథనంలో ఉన్నఆ పట్టు.. ఆ పాత్రను అంతగా పోషించిన కథానాయకుడు పాత్రలో జీవించారు. సినిమాలో భావోద్వేగాలు పండటంతోనే సినిమా అందరిని ఆకట్టుకుంది. సినిమా పక్క దారి పట్టకుండా వారు ఏం చెప్పదలుచుకున్నారో అదే చెప్పారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్‌గా చెప్పుకుంటున్న కథానాయకుడు, మహానాయకుడులో అవి లోపించాయి. కథను తమకు నచ్చినట్టుగా మార్చడంతో అసలు విషయాలను కావాలనే దాచిపెట్టినట్టు ప్రేక్షకుల ముందు ఇట్టే తేలిపోయింది. తెరపై ఎన్టీఆర్ పాత్రను పండించడం పక్కన పెడితే, ప్రేక్షకులను సినిమాలో లీనం చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కోవలసివచ్చింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానాయకుడు పూర్తిగా గాడి తప్పడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఇది ఎన్టీఆర్ గురించి తీసిన సినిమా? లేక చంద్రబాబును పైకెత్తడానికి తీసిన సినిమా? అన్న అనుమానం సగటు ప్రేక్షకుడికి వస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విడుదల చేసిన ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితంలో అత్యంత దుర్భరమైన వెన్నుపోటు ఘటనను చూపించకపోవడం కావాలనే పక్కన పెట్టినా... విలన్ పాత్రలో ఉండాల్సిన వ్యక్తిని హీరో పాత్రలో చూపించడం ప్రేక్షకులకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ప్రధాన ఘట్టంగా నిలిచిన వెన్నుపోటు ఘటనలో ముద్దాయిని చూపించకపోయినప్పటికీ ఎన్టీఆర్, ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ ఒక మునిగిపోతున్న నావగా చిత్రీకరించడమే కాకుండా ఆ నావను ఒడ్డుకుచేర్చి కాపాడిన మహోన్నత వ్యక్తిగా బాబును చిత్రీకరించారు. ఈ వక్రీకరణలు మింగుడుపడని అభిమానులు సోషల్‌మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకుడికి బాబు మహానాయకుడా..లేక ఎన్టీఆర్ మహానాయకుడా అన్న సందేహం వస్తుంది. కథను కథనాన్ని గమనిస్తే బాబుకోసం ఈబయోపిక్ ను బలిపెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతో సహజంగానే అందరి దృష్టి ఇప్పుడు వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై పడింది. సినిమాను ప్రకటించినప్పటి నుంచి సాధారణ ప్రేక్షకుడు సైతం.. వర్మ తీస్తున్న సినిమాపైనే ఆసక్తి చూపించాడన్న సంగతి తెలిసిందే. మహానాయకుడు ఎక్కడ ముగిసిందో.. ఎన్టీఆర్ జీవితంలో అసలు కథ ఎప్పుడు మొదలైందో.. అక్కడి నుంచే వర్మ తన సినిమాను ప్రారంభించడమే అందరి దృష్టిలో పడటానికి కారణం. మహానాయకుడులో ఆకాశానికెత్తేసిన చంద్రబాబు.. అసలు రంగు వర్మ తీసిన సినిమాల్లో బయటపడుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు చలోక్తులు విసురుకుంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ అంటూ హడావిడి సృష్టించిన బాలయ్య.. తన బావకు ఏదో మేలు చేద్దామని చేసిన ప్రయత్నం వృథా అయిందని ఆయన అభిమానులే పెదవి విరుస్తున్నారు. చదవండి : ‘యన్‌టిఆర్ మహానాయకుడు’ రివ్యూ ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ మూవీ రివ్యూ -
‘యన్‌టిఆర్ మహానాయకుడు’ రివ్యూ
టైటిల్ : యన్.టి.ఆర్ మహానాయకుడు జానర్ : పొలిటికల్ డ్రామా తారాగణం : నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి రానా, విద్యాబాలన్, సచిన్ కేద్కర్ తదితరులు సంగీతం : ఎం.ఎం.కీరవాణి దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి నిర్మాత : బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి నటించిన ‘యన్‌టిఆర్ కథానాయకుడు’ దారుణ పరాజయం కావడంతో.. రెండో భాగం ‘మహానాయకుడు’పై ఆ ప్రభావం పడింది. భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్స్ ఉన్నా.. ఈ మూవీపై అంచనాలు మాత్రం క్రియేట్ చేయలేకపోయారు. ప్రస్తుతం ప్రీ రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్‌ను పరిశీలిస్తే .. ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో సైతం ఆసక్తి లేనట్టు కనబడుతోంది. మరి ఇలాంటి పరిస్థితిలో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యన్‌టిఆర్ మహానాయకుడు’ ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. కథ మొదటి భాగంలో చూపించని ఎన్టీఆర్ బాల్యం, బసవ తారకంతో వివాహాన్ని చూపిస్తూ.. మళ్లీ కథానాయకుడు సినిమాను గుర్తు చేస్తూ.. తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టే చోట మొదటి భాగాన్ని ముగించగా అక్కడి నుంచే మహానాయకుడు మొదలవుతుంది. (సాక్షి రివ్యూస్) తన పార్టీకి సంబంధించిన చిహ్నాన్ని రూపొందిస్తూ.. రెండో భాగం ప్రారంభం కాగా.. తన రాజకీయ ప్రచారం.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం.. నాదెండ్ల భాస్కర్ రావు ఘటనతో ఫస్ట్ హాఫ్‌ను ముగించగా.. ఎన్టీఆర్ ఢిల్లీ వెళ్లడం.. రాష్ట్రపతిని కలవడం.. మళ్లీ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం.. ఇక చివరగా బసవ తారకం మరణించడంతో.. సినిమాను ముగించేశారు. నటీనటులు తొలిభాగంలోనే ఎన్టీఆర్‌గా నటించిన బాలయ్యపై విమర్శలు వచ్చాయి. అయితే ఈ సారి పూర్తి రాజకీయ నేపథ్యంలో సాగగా.. బాలయ్య వయసుకు తగ్గ పాత్ర కావడంతో.. ‘ఎన్టీఆర్’లా బాగానే నటించాడు. మరీ ఎన్టీఆర్‌ను మరిపించేంతగా కాకపోయినా.. అసెంబ్లీలో ఎన్టీఆర్‌ను అవమానపరిచే సన్నివేశాల్లో బాలయ్య తన నటనతో మెప్పించాడు. (సాక్షి రివ్యూస్) ఇక బాలయ్య తరువాత చెప్పుకోవాల్సిన పాత్ర విద్యాబాలన్‌దే అవుతుంది. బసవతారకం పాత్రలో ఆమె నటించిన తీరు కథానాయకుడు సినిమాలో చూసేశాం. మహానాయకుడులో కూడా బసవతారకం పాత్రలో విద్యాబాలన్ మరోసారి మెప్పించారు. ఇక వీరిద్దరిని మినహాయిస్తే.. చంద్రబాబు పాత్రలో రానా, నాదెండ్ల భాస్కర్‌రావు పాత్రలో సచిన్ కేద్కర్‌లు ఆకట్టుకున్నారు. మిగతా పాత్రలు తమ పరిధి మేరకు నటించారు. విశ్లేషణ యన్‌టిఆర్ సినీ జీవితం పూల పాన్పులా గడిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన రాజకీయ అరంగేట్రం.. సాధించిన విజయం.. అటుపై నాదేండ్ల వ్యవహారం.. మళ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి రావడం.. మళ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం.. అటుపై ‘వెన్నుపోటు’ ఘటన చోటుచేసుకోవడం.. ఇక చివరి క్షణాల్లో ఎన్టీఆర్ క్షోభ పడటం.. ఎన్టీఆర్ స్వర్గస్తులు కావడం.. స్థూలంగా చెప్పాలంటే ఇదే ఎన్టీఆర్ జీవితం. (సాక్షి రివ్యూస్) అయితే ఇవన్నీ ఉన్నది ఉన్నట్లు తీసే సాహసం బాలయ్య ఎలాగూ చేయలేడు. అలా చేయలేకే బయోపిక్ ముసుగులో తమకు నచ్చింది.. మెచ్చింది మాత్రమే తీసి.. కథానాయకుడుతో చేతులు కాల్చుకున్నారు. ఇక ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన మహానాయకుడు మీద సగటు ప్రేక్షకుడికి కూడా ఎలాంటి ఆసక్తి లేదంటేనే.. ఈ చిత్రాన్ని బాలయ్య ఏవిధంగా తీసి ఉంటాడో ఓ అంచనాకు వచ్చేశారని అర్థమవుతోంది. అందరూ అనుకున్నట్లే.. ఎన్టీఆర్ జీవితాన్ని మొత్తం చూపించకుండా అసంపూర్తిగా వదిలేశారు. బసవతారకం పాత్రతో సినిమాను చెప్పిస్తూ.. ఆమె మరణంతో మహానాయకుడును ముగించారు. అయితే ఎన్టీఆర్ చివరి ఘట్టం జోలికి పోకుండా నాదెండ్లను విలన్‌గా చూపెట్టి మహానాయకుడు సినిమాను చుట్టేశారు. నాదెండ్ల వ్యవహారంలో బాబు కీలకపాత్ర పోషించి ప్రజాస్వామ్యాన్ని, ఎన్టీఆర్‌ను, టీడీపీని రక్షించినట్లు.. చంద్రబాబే అసలు హీరో అన్నట్లు చూపించారు. ఇక సినిమాలో అక్కడక్కడా భావోద్వేగాలు బాగానే పండాయి. (సాక్షి రివ్యూస్) కీరవాణి తన నేపథ్య సంగీతంతోనే కొన్ని సన్నివేశాలు ఎలివేట్ చేశారు. మాటల రచయితగా సాయి మాధమ్ బుర్రా మరోసారి తన కలానికి పదును పెట్టారు. దారి కొత్తదే అయినా.. ఒక్కసారి అడుగు వేశాక.. దారి మన కిందే ఉండాలిగా లాంటి మాటలు ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అన్ని బాగానే కుదిరాయి. ప్రస్తుతం చంద్రబాబు వెన్నుపోటు అంశంపై చర్చలు జరుగుతుండటంతో.. మహానాయకుడులో చూపిన కథ ప్రేక్షకులను అంతగా మెప్పించడం కష్టమే. అయితే ఎన్టీఆర్ మిగిలిన జీవితాన్ని కూడా తెలుసుకోవాలంటే.. వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను చూడాల్సిందే. మహానాయకుడులో నాదెండ్ల వ్యవహారం కీ రోల్ కాగా.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్రబాబు వెన్నుపోటు అంశం కీలకం కానుంది. ఈ మూడు చిత్రాలతో తెరపై ఎన్టీఆర్ జీవితగాథ సంపూర్ణంగా చూసినట్టవుతుంది. ప్లస్ పాయింట్స్ : కొన్ని ఎమోషనల్ సీన్స్ సంగీతం మైనస్ పాయింట్స్ : సెకండాఫ్ సాగదీత అసంపూర్తి కథ బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్ చదవండి : ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ మూవీ రివ్యూ -
వర్మకు థ్యాంక్స్ చెప్పిన రానా
ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ మహానాయకుడు. తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావటంతో రెండో భాగాన్ని పెద్దగా ప్రమోషన్ లేకుండా సైలెంట్ రిలీజ్ చేస్తున్నారు. రేపు (22-02-2019) ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై వర్మ తనదైన స్టైల్లో సెటైర్లు వేస్తున్నాడు. ఈ రోజు ఉదయం నుంచి వరుస ట్వీట్లతో వేడి పెంచుతున్న రామ్ గోపాల్ వర్మ.. చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపిస్తున్న రానాని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ మహానాయకుడులోని రానా క్యారెక్టర్ ఫోటోనూ పోస్ట్ చేసిన వర్మ ‘రానా.. నువ్వు ఒరిజినల్ కన్నా ఒరిజినల్‌గా కనిపిస్తున్నావ్’ అంటూ ట్వీట్ చేశాడు. వర్మ ఉద్దేశం ఏదైనా రానా మాత్రం వర్మ ట్వీట్‌ను పాజిటివ్‌గానే తీసుకున్నాడు. వర్మ కామెంట్‌కు రిప్లై ఇస్తూ కృతజ్ఞతలు తెలిపాడు. Thank you — Rana Daggubati (@RanaDaggubati) 21 February 2019 -
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పై ఉలిక్కి పడ్డ చంద్రబాబు
-
లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై చంద్రబాబు ఉలిక్కిపాటు..
సాక్షి, అమరావతి : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాపై టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉలిక్కిపడుతున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి సీఎం చంద్రబాబు ఏకంగా పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో ప్రస్తావించడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని, కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు సూచించారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని అందరూ చాటిచెప్పాలని, అందుకే ‘మహా నాయకుడు, కథానాయకుడు’ సినిమాలు అందరికీ స్ఫూర్తిదాయకమన్న చంద్రబాబు వాస్తవాలను వక్రీకరించేవారికి ప్రజలే గుణపాఠం చెబుతారని ముక్తాయించారు. కాగా ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు తన లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీఆర్‌పై వస్తున్న మరో చిత్రం మహానాయకుడులో నిజాయితీతో తీసిన ఎన్టీఆర్ బయోపిక్ ఏదంటూ దర్శకుడు వర్మ నిర్వహించిన ట్విటర్ పోల్‌కు భారీ స్పందనతో పాటు, నెటిజన్లు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కే జై కొట్టారు. -
‘యన్‌టిఆర్ మహానాయకుడు’ ట్రైలర్ విడుదల
-
ఆ ఘటనే కేంద్రంగా ’మహానాయకుడు’ ట్రైలర్!
నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ, నటిస్తున్న సినిమా యన్.టి.ఆర్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం కథానాయకుడు బాలకృష్ణను తీవ్రంగా నిరాశపరచడంతో పాటు.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో ‘యన్‌టిఆర్ మహానాయకుడు’ ను విడుదల చేసేందుకు బాలయ్య సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్. ఎన్టీఆర్ రాజకీయం అరంగేట్రంతో మొదలైన ఈ ట్రైలర్.. ఇందిరా గాంధీ, నాదెండ్ల భాస్కర్‌రావు, చంద్రబాబు నాయుడు తదితరుల పాత్రలతో నిండుగా ఉంది. ‘ఇచ్చిన ప్రతీ మాటపై నిలబడాలి... ఆన్‌డోర్ ఆన్‌టైమ్.... రాజకీయాల కోసం కాదు.. మీ ఇంటి పసుపులా ఉండటానికి వచ్చా’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుండగా... ‘చెప్పెటోడు ఉండాలి లేకుంటే ఆరు కోట్ల మంది ఆయన పక్కన ఉన్నా లాభం లేదంటూ’ రానా చెప్పే డైలాగులు సినిమా ఎలా ఉండబోతుందోనన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా అనారోగ్య కారణాల రీత్యా ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లడం... ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్‌రావు అధికారం చేజిక్కుంచుకోవడం వంటి సీన్లు చూస్తుంటే సినిమా మొత్తం నాదెండ్లను టార్గెట్ చేసినట్లుగానే అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైన ‘ఆగస్టు సంక్షోభం’ చుట్టూనే సినిమా మొత్తం కేంద్రీకృతమైనట్లుగా ఈ ట్రైలర్ ద్వారా తెలుస్తోంది కాగా ఎన్టీఆర్ తిరిగి అధికారం చేపట్టడమే ప్రధానంగా ‘మహానాయకుడు’ సాగితే... వెన్నుపోటే ప్రధాన అంశంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించడంతో ఈ రెండు సినిమాలు ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. -
‘మహానాయకుడు’తో పాటు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్
ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కిన ‘యన్‌టిఆర్-మహానాయకుడు’ ఫిబ్రవరి 22న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర ట్రైలర్‌ను ప్రేమికుల రోజున విడుదల చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. తాజాగా మహానాయకుడు రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయడంతో.. తన సినిమా ట్రైలర్‌ను కూడా ఆ మూవీతో పాటు చూడండి అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ‘ఫిబ్రవరి 14న 9.27గంటలకు ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాము. థియేట్రికల్ ట్రైలర్‌ను ఫిబ్రవరి 22న మహానాయకుడుతో పాటు విడుదల చేస్తాము. మహానాయకుడు చూడటానికి వచ్చిన వారు మా మూవీ ట్రైలర్‌ను కూడా చూడొచ్చు’ట్విటర్లో పేర్కొన్నాడు. Trailer of #LakshmisNTR releasing 14 th feb 9.27 AM and Theatrical Trailer will release on Feb 22nd with Mahanayakudu ..So whoever comes to the theatre to see Mahanayakudu can see the trailer of #LakshmisNTR 💐 — Ram Gopal Varma (@RGVzoomin) February 12, 2019 -
‘మహానాయకుడు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి, నటించిన చిత్రం ‘యన్‌టిఆర్ కథానాయకుడు’.. సంక్రాంతి బరిలోకి దిగి ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. తీవ్ర నష్టాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు ‘యన్‌టిఆర్ మహానాయకుడు’ ని సిద్దం చేస్తున్నాడు బాలకృష్ణ. మొదటి భాగం చేదు అనుభవాన్ని మిగల్చగా.. రెండో భాగంపై చిత్రయూనిట్ శ్రద్ద పెట్టినట్టు సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలోనే ‘మహానాయకుడు’ని విడుదల చేయాల్సి ఉండగా.. కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రమైనా విజయం సాధిస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. -
థియేటర్లో ‘యాత్ర’.. డిజిటల్లో ‘యన్.టి.ఆర్’
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్ యాత్ర సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కథతో తెరకెక్కిన యాత్ర సినిమా రేపు (శుక్రవారం) థియేటర్లలో రిలీజ్ అవుతుండగా నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యన్.టి.ఆర్ కథానాయకుడు రేపే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన యన్.టి.ఆర్ కథానాయకుడుకి డివైడ్ టాక్ రావటమే కాదు కలెక్షన్ల పరంగా కూడా తీవ్రంగా నిరాశపరచింది. దీంతో రెండో భాగం యన్.టి.ఆర్ మహానాయకుడు రిలీజ్‌పై చిత్రయూనిట్ ఆలోచనలో పడిందన్న ప్రచారం జరుగుతోంది. మహానాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ్ దర్శకుడు. Stream #NTRKathanayakudu from tomorrow on @PrimeVideoIN.#NandamuriBalakrishna @vidya_balan @DirKrish @RanaDaggubati @iSumanth @NBKFilms_ @VaaraahiCC @vishinduri @mmkeeravaani @sahisuresh @gnanashekarvs @USTelugu @LahariMusic pic.twitter.com/gviz10SxUA — NBK FILMS (@NBKFilms_) 7 February 2019 -
‘స్వర్గంలో ఉన్న ఎన్టీఆరే అలా చేయమన్నారు’
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ‘యన్.టి.ఆర్’ మూవీపై మాటల దాడిని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దివంగత ఎన్టీఆర్ ఆశీస్సులు.. తాను తెరకెక్కిస్తున్న బయోపిక్కు మాత్రమే ఉంటాయని పదే పదే చెపుతున్న వర్మ, తాజాగా మరిన్ని ఆసక్తికర ట్వీట్లు చేశారు. తానే తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయాలన్న విషయాన్ని స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ తనకు సూచించారని ట్వీట్ చేశాడు వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ థియట్రికల్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయబోయేది ‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ రిలీజ్ డేట్‌ను ప్రకటించటంపై ఆధారపడి ఉంది. మహానాయకుడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడే ట్రైలర్ రిలీజ్ చేయాల్సిందిగా స్వర్గం నుంచి ఎన్టీఆర్ నాకు సందేశం ఇచ్చారు. యన్.టి.ఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన 24 నిమిషాల తరువాత లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ చేయాలని ఎన్టీఆర్ నాకు వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఆయన సొంత కొడుకు కథానాయకుడును కాకుండా భార్య లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను మాత్రమే ఆశీర్వదిస్తారు అనటానికి కథానాయకుడు రిజల్టే నిదర్శనం. ఎన్టీఆర్ మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్‌ల మధ్య పోటీని ఆయన స్వాగతిస్తారు’ అంటూ ట్వీట్ చేశాడు వర్మ. బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ రిలీజ్ డేట్‌పై సందిగ్ధత ఏర్పడింది. తొలి భాగం డిజాస్టర్ కావటంతో రెండో భాగం రిలీజ్ విషయంలో చిత్రయూనిట్ ఆలోచనలో పడ్డారు. ఇదే అదునుగా వర్మ తన మాటలు, ట్వీట్లతో లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు కావాల్సినంత ప్రమోషన్ చేసుకుంటున్నాడు. Main theatrical trailer of #LakshmisNTR will release on a date depending upon when #Mahanayakudu release date will be announced only because of technical psychological and much above all emotional reasons 😔😔😔 — Ram Gopal Varma (@RGVzoomin) 31 January 2019 Release date of #LakshmisNTR trailer will be announced the moment when release date of #Mahanayakudu is announced and this only because NTR from heaven instructed me to do so — Ram Gopal Varma (@RGVzoomin) 31 January 2019 NTR from heaven warned me to release the trailer of #LakshmisNTR within exactly 24 minutes of the official announcement of the release date of #Mahanayakudu — Ram Gopal Varma (@RGVzoomin) 31 January 2019 The very fact that NTR did not bless his own son’s #Kathanayakudu is proof that he will only and only bless his wife’s #LakshmisNTR and the proof of that will be the clash between the releases of #Mahanayakudu and #LakshmisNTR .. May NTR Bless🙏 — Ram Gopal Varma (@RGVzoomin) 31 January 2019 -
‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ వచ్చేదెప్పుడు..?
నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న సినిమా యన్.టి.ఆర్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం ఇప్పటికే రిలీజ్ అయ్యింది. యన్.టి.ఆర్ కథానాయకుడు పేరుతో రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశపరచటంతో రెండో భాగం రిలీజ్ విషయంలో చిత్రయూనిట్ ఆలోచనలో పడ్డారు. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించినా.. ఇప్పుడు ఆలస్యమయ్యేలా ఉంది. యన్.టి.ఆర్ మహానాయకుడు సినిమాను వారం ఆలస్యంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్టుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా మరింత ఆసల్యం కానుందని తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్టుగా కాకుండా ఫిబ్రవరి 22న సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే చిత్రయూనిట్ మాత్రం ఇంతవరకు రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. -
‘యన్.టి.ఆర్’పై తేజ ఏమన్నాడంటే..!
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ యన్.టి.ఆర్ కథానాయకుడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ముందుగా తేజను దర్శకుడిగా తీసుకున్నారు. ముహూర్తం షాట్ చిత్రీకరణ కూడా జరిగిన తరువాత తేజ తప్పుకోవటంతో ప్రాజెక్ట్ క్రిష్ చేతిలోకి వెళ్లింది. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడిన తేజకు యన్.టి.ఆర్ కథానాయకుడికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అయితే ఈ విషయంపై స్పందించిన తేజ.. తాను ‘సీత’ సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో ఇంకా ఆ సినిమా చూడలేదని చూసిన తరువాత స్పందిస్తానంటూ సమాధానమిచ్చారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. -
నాలుగు సినిమాలతో నందమూరి హీరో.!
నందమూరి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న యంగ్ హీరో కల్యాణ్ రామ్. కెరీర్లో అతనొక్కడే, పటాస్ లాంటి హిట్స్ ఉన్నా కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా మాత్రం ఇంతవరకు పడలేదు. అయితే సక్సెస్ విషయం పక్కన పెడితే ఈ యంగ్ హీరో ఈ ఏడాది ఓ ఇంట్రస్టింగ్ ఫీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ జనరేషన్ హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా చేయడానికి కష్టపడుతుంటే కల్యాన్ రామ్ ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో అలరిస్తున్నాడు. కల్యాణ్ రామ్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన యన్.టి.ఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సీక్వల్గా రూపొందుతున్న యన్.టి.ఆర్ మహానాయకుడులో కల్యాణ్ రామ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఇక కేవీ గుహన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న 118 కూడా మార్చిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇటీవల ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాను కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నాడు నందమూరి హీరో. -
బాలయ్యతో బోయపాటి సినిమాకు ముహూర్తం ఫిక్స్
సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతోంది. ‘యన్.టి.ఆర్’ తరువాత బోయపాటి దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నట్టుగా బాలయ్య ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభకానుందని తెలుస్తోంది. ఇటీవల వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బోయపాటి టాక్ పరంగా నిరాశపరిచినా.. భారీ వసూళ్లు సాధించి మాస్ ఆడియన్స్‌లో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అదే జోరులో బాలయ్యతో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు బోయపాటి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లక్ష్మీస్ ఎన్టీఆర్.. మరో అప్డేట్ ఇచ్చిన వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోనే కీలక ఘట్టాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎన్నో వివాదాలకు కేంద్రబింధువైంది. ఇప్పటికే టీడీపీ వర్గాలు వర్మ సినిమాపై మండిపడుతున్నారు. అయితే వర్మ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఇప్పటికే రెండు పాటలతో పాటు కీలక పాత్రల దారులను పరిచయం చేసిన వర్మ మరో అప్డేట్ ఇచ్చాడు. అంతేకాదు వర్మ ప్రకటనలకే పరిమితమయ్యాడా..? నిజంగానే సినిమా తీస్తున్నాడా అన్న అనుమానాలకు కూడా తెర దించాడు. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆన్‌లోకేషన్ స్టిల్స్‌ను రిలీజ్ చేశాడు వర్మ. ఎన్టీఆర్ ఇంట్లో పార్టీ నాయకులు అంతా భోజనం చేస్తున్న స్టిల్‌తో పాటు మరో స్టిల్‌ను రిలీజ్ చేశాడు. వర్మ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉంటునే తనదైన స్టైల్లో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా కానిచ్చేస్తున్నాడు. ఈ నెలాఖరున లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్‌ను రిలీజ్ చేసి ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. A pic from #LakshmisNTR TheTrueStory pic.twitter.com/U3RN11pYnW — Ram Gopal Varma (@RGVzoomin) 21 January 2019 -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తెలుగు రంగస్థల నటుడు..!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు జీవితంలోని కొన్ని కీలక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. వర్మ కూడా తనదైన స్టైల్లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచాడు. ఇప్పటికే రెండు లిరికల్ వీడియోలను రిలీజ్ చేసి తన ఉద్దేశం ఏంటో..? సినిమా ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేశాడు. తాజాగా వర్మ.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఎన్టీఆర్ పాత్రధారిని పరిచయం చేశాడు. ఇప్పటికే చంద్రబాబు, లక్ష్మీ పార్వతి పాత్రల్లో కనిపించబోయే నటుల ఫోటోలను రిలీజ్ చేసిన వర్మ, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన పాత్రలో కనిపించబోయే నటుడి టీజర్‌ను రిలీజ్ చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఎన్టీఆర్ గా కనిపిస్తున్న నటుడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రంగస్థల కళాకారుడని వెళ్లడించాడు వర్మ. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన, డైలాగ్ డెలవరీ కోసం కొన్ని నెలలుగా అతడికి శిక్ష ఇస్తున్నామని తెలిపాడు. Contrary to some reports the person who is playing NTR In #LakshmisNTR is a telugu theatre actor from West Godavari who I put under training for months to catch NTR’s body language , demeanour , speech pattern etc https://t.co/TX6APEvZ1o — Ram Gopal Varma (@RGVzoomin) 19 January 2019 -
‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ మరోసారి వాయిదా!
నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బయోపిక్ మూవీ యన్.టి.ఆర్. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం యన్.టి.ఆర్ కథానాయకుడు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై డివైడ్ టాక్ రావటంతో రెండో భాగం రిలీజ్ విషయంలో చిత్రయూనిట్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ముందుగా రెండో భాగం యన్.టి.ఆర్ మహానాయకుడు సినిమాని జనవరి 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాదన్న ఉద్దేశంతో రిలీజ్ డేట్‌ను ఫిబ్రవరికి మార్చారు. ఫిబ్రవరి 7న యన్.టి.ఆర్ మహానాయకుడు రిలీజ్ అవుతుందని ప్రకటిస్తూ రిలీజ్ డేట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాదన్న ఉద్దేశంతో రిలీజ్ డేట్‌ను మరోసారి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. యన్.టి.ఆర్ మహానాయకుడు సినిమాను వారం ఆలస్యంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
భారీ డిజాస్టర్ దిశగా ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోపిక్ మూవీ యన్.టి.ఆర్ కథానాయకుడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటంతో అదే స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఎన్టీఆర్ సినిమాను దాదాపు రూ. 70 కోట్లకు అమ్మినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు తొలి రోజు నుంచి డివైడ్ టాక్ రావటంతో కలెక్షన్ల ఆశించిన స్థాయిలో రాలేదు. సంక్రాంతి సెలవులను కూడా యన్.టి.ఆర్ క్యాష్ చేసుకోలేకపోయింది. గత బుధవారం రిలీజ్ అయిన ఈ సినిమా తొలి వారాంతానికి ఇంకా రూ. 20 కోట్ల మార్క్ షేర్ కూడా సాధించలేదని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో యన్.టి.ఆర్ కథానాయకుడు బ్రేక్ ఈవెన్ సాధించటం సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పండుగ సెలవులు కూడా అయిపోవటంతో కలక్షన్లపై మరింత డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యన్.టి.ఆర్ కథానాయకుడు భారీ డిజాస్టర్‌గా మిగిలే అవకాశలే ఎక్కువగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. -
లక్ష్మీపార్వతి పాత్ర రివీల్ చేసిన ఆర్జీవీ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసి సంచలనం సృష్టించాయి. ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రకటన చేసినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో ఏ పాత్రల్లో ఎవరు కనిపిస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. అయితే తాజాగా లక్ష్మీపార్వతి పాత్ర ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞ శెట్టి నటిస్తుందని చెప్పిన వర్మ.. ఆ పాత్రకు సంబంధించి పలు ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. యజ్ఞ శెట్టి గతంలో వర్మ దర్శకత్వం వహించిన ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రంలో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పాత్రలో నటించారు. ఈ చిత్రాని సంబంధించిన రెండో పాటలో ‘అబద్దాలుగా చెలామణి అవుతున్న నిజాలను.. నిజాలుగా మసిపూసుకున్న అబద్దాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయడమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ధ్యేయమ’ని చెప్పిన వర్మ.. సినిమాను త్వరలోనే సినిమాను విడుదల చేయనన్నట్టు తెలిపారు. నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతుండగా ఆ సినిమాలో చూపించని ఎన్నో నిజాలు తన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఉంటాయని రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. జీవీ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణీ మాలిక్ సంగీతమందిస్తున్నారు. -
సినిమా కాదు.. ఒక లైఫ్ చూసినట్టు అనిపించింది: కృష్ణ
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన బయోపిక్ మూవీ ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి స్పందనే వస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ దంపతులు ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. ‘నందమూరి బాలకృష్ణ రూపొందించిన యన్.టి.ఆర్ బయోపిక్ చూశాను. చాలా బావుంది. సినిమా చూసినట్లు కాకుండా ఒక లైఫ్ చూసినట్టు అనిపించింది. బాలకృష్ణ.. ఎన్టీఆర్‌లా వందశాతం కనిపించారు. ఆయన వేసిన అన్నీ గెటప్స్‌లోనూ బావున్నారు. కచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు. విజయ నిర్మల మాట్లాడుతూ - ` ఈ బయోపిక్‌లో బాలకృష్ణను చూస్తుంటే ఎన్టీఆర్‌ను చూసినట్టే అనిపించింది. సినిమా చాలా బావుంది. చాలా సంతోషం`` అన్నారు. నరేష్ విజయకృష్ణ మాట్లాడుతూ - ``యన్.టి.ఆర్` బయోపిక్ అనౌన్స్ అయినప్పుడు ఇందులో ఓ అవకాశం వస్తుందా! అని ఆసక్తిగా ఎదురుచూశాను. ఈ బయోపిక్‌లో వేషం వేయాలని నన్ను అడిగినప్పుడు చాలా సంతోషం వేసింది. అది కూడా బి.ఎ.సుబ్బారావు వేషం. ఆ సన్నివేశాలను నేను చేస్తున్నప్పుడు థ్రిల్ ఫీలయ్యాను. మా అమ్మ తొలి సినిమా ఆయనతోనే నటించారు. అలాగే నేను ప్రేమ సంకెళ్లు సినిమా సమయంలో ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను. దర్శకుడు క్రిష్ ఈ సినిమాతో గ్రేట్ డైరెక్టర్ నుండి లెజెండ్రీ డైరెక్టర్ అయ్యారు’ అన్నారు. -
‘యన్.టి.ఆర్’ వర్సెస్ ‘వీవీఆర్’
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఎవరి అభిమానుల గ్రూప్ వారికి ఉంటుంది. అసలే నాగబాబు-బాలయ్య వివాదం అగ్గిరాజేస్తుంటే.. ఎన్టీఆర్, వీవీఆర్ అంటూ అయితే గత రెండ్రోజులుగా నందమూరి, మెగా ఫ్యాన్స్ తాకిడి మరీ ఎక్కువైంది. మొన్న రిలీజైన ఎన్టీఆర్ కథానాయకుడిపై ట్రోలింగ్స్ హోరెత్తగా.. ఈరోజు రిలీజ్ అయిన రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’పై ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. ఓల్డేజ్ ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ ఫర్వాలేదనిపించినా.. ఎన్టీఆర్ యువకుడిగా ఉన్న పాత్రలో బాలయ్య అరాచకంగా కనిపించాడని విమర్శలు వచ్చాయి. ఏదేమైనా యన్.టి.ఆర్ సినిమాకు కొంత డివైడ్‌టాక్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ బయోపిక్ మీద మాత్రం ట్రోలింగ్స్ ఆగడం లేదు. యువకుడిగా ఎన్టీఆర్ ఉండే సన్నివేశాల్లోనైనా జూ.ఎన్టీఆర్ యాక్ట్ చేస్తే బాగుండేదనే కామెంట్స్ వినిపించాయి. ఇక నేడు (జనవరి 11) ప్రపంచవ్యాప్తంగా వినయ విధేయ రామ ప్రేక్షకుల ముందుకు రాగా.. సినిమా బాలేదని ఓ వైపు ట్రోల్స్ జరుగుతుండగా.. రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ మూవీ అంటూ మరోవైపు టాక్ ప్రచారం జరుగుతోంది. ఫ్యాన్స్ వారి అభిమాన హీరోల సినిమాలను ప్రమోట్ చేసుకుంటే ఏ బాధ లేదు కానీ, పక్కవారి సినిమాలపై అదే పనిగా ట్రోల్స్ చేస్తుండటంతో ఎంతో కొంత కలెక్షన్లపై ప్రభావం చూపుతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి ‘వీవీఆర్’పై జెన్యూన్ టాక్ తెలియాలంటే ఇంకొంచెంసేపు ఆగాల్సిందే. -
‘యన్.టి.ఆర్’లో ఏదో వెలితి..!
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన బయోపిక్ మూవీ ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’. సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ఎన్నో చర్చలకు దారితీసిన యన్‌టిఆర్, బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నా.. సాధారణ ప్రేక్షకులు మాత్రం ఏదో వెలితి ఉందన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సినిమాలో నందమూరి తారక రామారావు బాల్యానికి సంబంధించిన సన్నివేశాలు లేకపోవటం.. తొలిసారి ఎన్టీఆర్, ఎల్వీ ప్రసాద్‌లు ఎక్కడ కలిసారు.. ఎల్వీ ప్రసాద్ ఎందుకు ఎన్టీఆర్‌కు సినిమా అవకాశం ఇస్తా అన్నారు.. అన్న విషయాలు చూపించకపోవటం లాంటివి కథ అసంపూర్తిగా విన్న భావన కలిగిస్తాయి. ఎన్టీఆర్ యువకుడిగా కనిపించే సీన్స్‌లో బాలయ్య లుక్‌పై అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. సెకండ్ హాఫ్లోనూ అలాంటి సన్నివేశాలు చాలా కనిపిస్తాయి. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుల పరిచయం, ఎన్టీఆర్ తన కుమార్తెను చంద్రబాబు నాయుడికి ఇచ్చి వివాహం చేయటం లాంటి కీలకమైన సంఘటనలకు కూడా సినిమాలో చోటివ్వలేదు. ఎక్కువగా బాలకృష్ణను వివిధ గెటప్‌లలో చూపించేందుకే సమయం కేటాయించారు. సీతా రామ కళ్యాణం సినిమాలో రావణాసురుడిని దశకంఠుడిగా చూపించేందుకు ఏకంగా 20 గంటల పాటు రెప్ప కూడా వేయకుండా ఎన్టీఆర్ ఒకే స్టిల్‌లో నిలబడ్డట్టుగా చూపించటం అంత నమ్మశక్యంగా అనిపించదు. ఎన్టీఆర్ కెరీర్లో ఘనవిజయం సాధించిన చిత్రాలను మాత్రమే ప్రస్తావిస్తూ ఫెయిల్యూర్స్‌ను పక్కన పెట్టేయటంతో డ్రామా మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక దాన వీర శూర కర్ణ సినిమాలో ఎన్టీఆర్ అనర్గళంగా చెప్పిన ‘ఏమంటివి ఏమంటివి’ డైలాగ్‌ను బాలయ్య చెప్పకుండా కేవలం ఎన్టీఆర్ వాయిస్‌కు యాక్ట్ చేయటం కూడా అభిమానులను నిరాశపరిచే అంశమే. -
బాబును విలన్‌గా చూపించడం బాలకృష్ణ వల్ల కాదు
సాక్షి, తిరుమల: సీఎం చంద్రబాబునాయుడును ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాలో విలన్‌గా చూపించడం బాలకృష్ణ వల్ల కాదని దివంగతనేత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తెలిపారు. బుధవారం తిరుమల శ్రీవారిని విరామ సమయంలో ఆమె దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి ఆమెకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయం వెలుపల ఆమె మాట్లాడుతూ బాలకృష్ణ రెండు, మూడు పార్టులుగా సినిమా తీసినా ఎన్టీఆర్ జీవిత చరిత్ర సగమే ఉంటుందన్నారు. నిర్భయంగా ఎన్టీఆర్ అనుభవించిన ఆత్మక్షోభ రాంగోపాల్‌వర్మ తీస్తారన్నారు. 23 సంవత్సరాలుగా ఎన్టీఆర్‌కు జరిగిన అవమానంపై పోరాడుతున్నానన్నారు. చంద్రబాబు వెన్నుపోటు చర్యవల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, నా కుటుంబం మొత్తాన్ని తనవైపు తిప్పుకుని నన్ను దూరం చేశాడన్నారు. ఎన్టీఆర్ కుటుంబం నన్ను ఒప్పుకోలేదని విమర్శించారని, కానీ ప్రభుత్వం వచ్చినప్పుడు నన్ను అందరూ అంగీకరించారన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ స్థాపించారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జగన్ ఉన్నారు కాబట్టే ఆయనతో పాటు పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు. శ్రీవారి ఆశీస్సులతో ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగిసిందన్నారు. సంకల్పయాత్ర అనంతరం గురువారం తిరుమలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజా ఆశీస్సులతో వైఎస్ జగన్ అఖండ విజయాన్ని సాధించాలని ఆకాంక్షించానన్నారు. ప్రజలకు అన్యాయం చేస్తున్నవారిని, అవినీతికి పాల్పడుతున్న వారిని ప్రజావ్యవస్థ నుంచే తొలగివెళ్లేలా చేయాలని స్వామివారిని కోరానన్నారు. రాష్ట్రానికి నూతన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలన్నారు. 2 రోజుల క్రితం విడుదల చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్లోని పాట తనను విమర్శించే విధంగా ఉందన్నారు. -
అభిమానులతో కలిసి సినిమా చూసిన బాలయ్య
-
‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ మూవీ రివ్యూ
టైటిల్ : యన్.టి.ఆర్ కథానాయకుడు జానర్ : బయోపిక్ తారాగణం : బాలకృష్ణ, విద్యాబాలన్, దగ్గుబాటి రాజా, కల్యాణ్ రామ్, రానా, సుమంత్ సంగీతం : ఎం.ఎం.కీరవాణి దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి నిర్మాత : బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌లలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి సినిమా ఘనవిజయం సాధించటంతో ఇప్పుడు మరో మహానటుడి జీవిత కథ వెండితెర మీద అలంరించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు సినీరంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన నందమూరి తారక రామారావు జీవితకథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తండ్రి పాత్రలో నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్న యన్.టి.ఆర్ కథానాయకుడు, ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో బాలయ్య తొలిసారిగా నిర్మాతగానూ మారుతుండటంతో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలు యన్.టి.ఆర్ కథానాయకుడు అందుకుందా.? తండ్రి పాత్రలో బాలయ్య మెప్పించాడా..? క్రిష్ దర్శకుడిగా మరోసారి సత్తా చాటాడా..? కథ : ఎన్టీఆర్ సినీ జీవితం తెరచిన పుస్తకం అందుకే దర్శకుడు దశాబ్దాలుగా జనాలకు తెలిసిన విషయాలే సినిమాటిక్‌గా వెండితెర మీద చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ కు ఆయన భార్యతో ఉన్న అనుబంధం ఆమె మాటకు ఎంత విలువ ఇస్తారన్న విషయాలను చూపించారు. ఎన్టీఆర్ బాల్యానికి సంబంధించిన అంశాల జోలికి పోకుండా డైరెక్ట్‌గా సినీ జీవితంతో కథను మొదలుపెట్టాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న బసవ రామ తారకం(విద్యాబాలన్) పరిచయంతో సినిమా ప్రారంభమవుతుంది. ఆమె ఎన్టీఆర్ ఆల్బమ్‌ను చూస్తుండగా అసలు కథ స్టార్ట్ అవుతుంది. రామారావు (బాలకృష్ణ) రిజిస్టర్ ఆఫీస్‌లో మంచి ఉద్యోగం వచ్చినా అక్కడి పరిస్థితులు లంచాలకు అలవాటు పడిన అక్కడి ఉద్యోగుల పద్దతులు నచ్చక చేరిన మూడు వారాల్లోనే ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. గతంలో రామారావు వేసిన నాటకం చూసిన ఎల్వీ ప్రసాద్ (జిష్షు) సినిమా అవకాశం ఇస్తాననటంతో ఆయన్ను కలిసేందుకు మద్రాస్ బయల్దేరుతాడు. అలా మద్రాసు చేరిన రామారావు సినీ ప్రయాణం ఎలా మొదలైంది. మొదట్లో నటుడిగా ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులేంటి. అక్కినేని నాగేశ్వర్రావు (సుమంత్)తో ఆయన అనుబంధం. వెండితెర వేల్పుగా ఎన్టీఆర్ ఎదిగిన తీరు. ఆయన్ను రాజకీయాలవైపు నడిపించిన పరిస్థితులే సినిమా కథ. చివరగా ఎన్టీఆర్ రాజకీయ పార్టీని ప్రకటించటంతో తొలి భాగాన్ని ముగించారు. నటీనటులు : సినిమా అంతా ఒక్క ఎన్టీఆర్ పాత్ర చుట్టూనే తిరగటంతో ప్రతీ ఫ్రేమ్‌లో బాలయ్యే తెర మీద కనిపిస్తారు. ఒక రకంగా నందమూరి అభిమానులకు ఇది పండగలాంటి సినిమా. అయితే ఎన్టీఆర్ యువకుడిగా ఉన్నప్పటి పాత్రలో బాలయ్య లుక్ అంతగా ఆకట్టుకునేలా లేదు. నటన పరంగా మాత్రం బాలకృష్ణ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. కాస్త వయసైన పాత్రలో బాలయ్య లుక్, పర్ఫామెన్స్ బాగుంది. సినిమాలో మరో కీలక పాత్ర ఎన్టీఆర్ సతీమణి బసవ రామ తారకం. ఆ పాత్రకు విద్యాబాలన్ లాంటి నటిని ఎందుకు తీసుకున్నారో సినిమా చూస్తే అర్ధమవుతుంది. తన పర్ఫామెన్స్తో ఆ పాత్ర స్థాయిని ఎంతో పెంచారు విద్యాబాలన్. సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నారు. సినిమాలో కాస్త ఎక్కువ సేపు కనిపించే మరో పాత్ర ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమ్ రావుది. ఈ పాత్రలో చాలా కాలం తరువాత దగ్గుబాటి రాజా వెండితెర మీద కనిపించాడు. లక్ష్మణుడి లాంటి తమ్ముడిగా రాజా నటన మెప్పిస్తుంది. అక్కినేని పాత్రలో ఆయన మనవడు సుమంత్ జీవించాడనే చెప్పాలి. ఆ పాత్రకు మరొకరిని ఊహించుకోలేనంత స్థాయిలో ఆ పాత్రలో ఒదిగిపోయాడు సుమంత్. ఇతర పాత్రల్లో ఎంతో మంది హేమా హేమీల్లాంటి నటులు కనిపించారు. ప్రతీ ఒక్కరు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అయితే ఏ పాత్ర ఒకటి రెండు నిమిషాలకు మించి తెర మీద కనిపించదు. విశ్లేషణ : యన్.టి.ఆర్ లాంటి మహానటుడి జీవిత కథను వెండితెర మీద ఆవిష్కరించే బృహత్తర బాధ్యతను తీసుకున్న దర్శకుడు క్రిష్, నందమూరి అభిమానులను దృష్టిలో పెట్టుకొని సినిమాను తెరకెక్కించాడు. కథా కథనాల మీద కన్నా బాలయ్య అభిమానులను అలరించే ఎలివేషన్ షాట్స్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఎన్టీఆర్ కథను తెలుసుకోవాలనుకున్న ప్రేక్షకులను నిరాశపరిచినా.. ఫ్యాన్స్‌ను మాత్రం మెప్పించాడు. ముఖ్యంగా కృష్ణుడిగా ఎన్టీఆర్ తెరమీద కనిపించే సన్నివేశానికి థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎన్టీఆర్, బసవ రామ తారకంల మధ్య వచ్చే సన్నివేశాలను తన స్టైల్లో ఎంతో ఎమోషనల్‌గా చూపించాడు దర్శకుడు. అక్కడక్కడా కథను కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాకు ప్రధాన బలం కీరావాణి సంగీతం. పాటలతో పాటు నేపథ్యం సంగీతంతో సన్నివేశాల స్థాయిని పెంచారు కీరవాణి. రచయిత సాయి మాధవ్ బుర్రా మనసును తాకే మాటలతో మెప్పించారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫి సినమాకు రిచ్ లుక్ తీసుకువచ్చింది. బాలయ్య హీరోగానే కాక నిర్మాతగాను మంచి మార్కులు సాధించారు. ఎన్టీఆర్ కథను అభిమానులకు అందించేందుకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు. ప్లస్ పాయింట్స్ : బాలయ్య, విద్యాబాలన్ నటన ఎన్టీఆర్, బసవ రామ తారకంల మధ్య వచ్చే సన్నివేశాలు సంగీతం మాటలు మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్‌లో బాలకృష్ణ లుక్ సాగదీత సన్నివేశాలు సినిమా లెంగ్త్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘ఎందుకు.. ఎందుకు.. లక్ష్మీ పార్వతి ఎందుకు..’
ఓ వైపు నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ.. నటించిన యన్.టీ.ఆర్ కథానాయకుడు విడుదలకు సిద్దమవుతుండగా.. రామ్‌గోపాల్ వర్మ తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో సంచలనం రేపుతున్నారు. వెన్నుపోటు సాంగ్ అంటూ రిలీజ్ చేసిన మొదటి సాంగ్ ఎన్నో వివాదాలకు ఆజ్యంపోసింది. చివరకి కేసులు పెట్టుకునేదాక పోయింది. అయితే వెనుకడుగు వేస్తే.. ఆర్జీవీ ఎలా అనిపించుకుంటారు. మళ్లీ తన చిత్రంలోని రెండో సాంగ్‌ను రిలీజ్ చేసేశారు. అంతేనా.. ఈ పాట చివర్లో తన గాత్రంతో ఉన్న సంభాషణలు వింటే కొందరికి వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ‘అబద్దాలుగా చెలామణి అవుతున్న నిజాలను.. నిజాలుగా మసిపూసుకున్న అబద్దాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయడమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ధ్యేయం. ఇరవై సంవత్సరాలకి పైగా నిజానికి అబద్దమనే బట్టలు తొడిగి.. వీధులెంట తిప్పుతున్న వెన్నుపోటు దారుల అందరి బట్టల్ని ప్రజల కళ్ల ముందు చింపి అవతలపారేసి.. నిజం బట్టల్ని ఒక్కొక్కటిగా మెల్లిగా విప్పి .. దాన్ని మళ్లీ పూర్తి నగ్నంగా చూపించడమే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉద్దేశం’ అంటూ వర్మ తన స్టైల్లో చెప్పాడు. ఎందుకు ఎందుకు అంటూ జయసుధ, జయప్రధ, శ్రీదేవి ఉండగా.. లక్ష్మీ పార్వతి ఎందుకు అంటూ.. సీబీఎన్, ఎన్బీకే, దగ్గుబాటి ఉండగా.. లక్ష్మీ పార్వతి ఎందుకు అంటూ ఎన్నో కోణాల్లోంచి ప్రశ్నలను సంధించారు. సిరాశ్రీ ఈ పాటను రాయగా.. కళ్యాణీ మాలిక్, శ్రీ కృష్ణ ఆలపించారు. ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
మోక్షజ్ఞ ఎంట్రీపై బోయపాటి క్లారిటీ
నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతున్న యువ కథానాయకుడు మోక్షజ్ఞ. చాలా రోజులుగా మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్‌ఎంట్రీపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతోనే మోక్షజ్ఞ పరిచయమవుతాడన్న ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో ఆ ఆలోచనను వాయిదా వేశారు. తరువాత ఎన్టీఆర్ బయోపిక్‌లో మోక్షజ్ఞ తళుక్కుమంటాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై కూడా నందమూరి ఫ్యామిలీ స్పందించలేదు. అయితే గతంలో మోక్షజ్ఞ తొలి చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉంటుందన్న వార్తల వినిపించాయి. తాజాగా వినయ విధేయ రామ ప్రమోషన్ సందర్భంగా ఈ వార్తలపై స్పందించిన బోయపాటి.. మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని తాను డైరెక్ట్ చేయబోవటం లేదన్నారు. తాను ఆ సినిమాను డైరెక్ట్ చేస్తే అభిమానులు అంచనాలు తారా స్థాయికి చేరతాయని, తొలి సినిమాకు ఆ స్థాయి అంచనాలు కరెక్ట్ కాదన్నారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుండగా తన తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ హీరోగా ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. -
ఉతికి ఆరేయటమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ధ్యేయం : వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో వివాదాలకు కారణమైన ఈ సినిమా నుంచి రెండో పాట ‘ఎందుకు?’ను ఈరోజు సాయంత్రం విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. తొలి పాట ‘వెన్నుపోటు’తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన వర్మ, రెండో పాటలో ఎలాంటి వివాదాలకు తెర తీస్తాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన టీజర్లోనూ వర్మ మరో బాంబు పేల్చబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు. ‘ఈ పాటలోని ప్రశ్నల వెనుక అబద్దాలుగా చెలామణీ అవుతున్న నిజాలను, నిజాలుగా మసిపూసుకున్న అబద్ధాలని బండకేసి కొట్టి ఉతికి ఆరేయటమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ధ్యేయం’ అంటూ వర్మ మాటలతో రిలీజ్ చేసిన టీజర్లో జయసుధ, జయప్రద, శ్రీదేవి లాంటి వారందరినీ వదలి ఆ లక్ష్మీ పార్వతిని ఎందుకు..? అనే లిరిక్స్‌తో పాట కాన్సెప్ట్‌ను కూడా రివీల్ చేశారు. నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతుండగా ఆ సినిమాలో చూపించని ఎన్నో నిజాలు తన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఉంటాయని రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. జీవీ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణీ మాలిక్ సంగీతమందిస్తున్నారు. Here’s a teaser trailer of Endhuku ? Song from #LakshmisNTR ..Full song releasing today at 5 PM pic.twitter.com/WctXXLNbpK — Ram Gopal Varma (@RGVzoomin) 8 January 2019 -
చరిత్ర పాఠాలు చదువుకున్నట్టుంది
‘‘చిన్నప్పటి నుంచి నాలో తాతగారి పోలికలున్నాయని చాలా మంది చెప్పేవారు. కానీ తాతగారిలా నటించే అవకాశం దొరకలేదు. ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ చిత్రంలో 25నుంచి 60 సంవత్సరాల వరకూ తాతగారిలా ఐదు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తాను. నా ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది’’ అని సుమంత్ అన్నారు. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించి, నిర్మించిన చిత్రం ‘యన్.టి.ఆర్’. దివంగత ముఖ్యమంత్రి, నటుడు యన్టీ రామారావు జీవితం ఆధారంగా రూపొందించిన ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు పాత్రని ఆయన మనవడు సుమంత్ పోషించారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ... ► ఎన్టీఆర్‌గారి బయోపిక్ తీస్తున్నారు అని విన్నాను కానీ అందులో తాతగారి పాత్ర ఉంటుంది, అది నా వరకూ వస్తుంది అనే ఆలో^è న కూడా చేయలేదు. క్రిష్ కలిసి సీన్స్ అన్నీ వివరించాడు. తను కేవలం దర్శకుడు మాత్రమే కాదు తెలుగు ఇండస్ట్రీకి విద్యార్థి కూడా. క్రిష్ న్యాయం చేయగలడని నాకు గట్టి నమ్మకం ఉంది. అతనికి కమర్షియాలిటీ, ఆర్ట్‌కి బ్యాలెన్స్ కుదర్చడం బాగా తెలుసు. ఒకవేళ క్రిష్, బాలకృష్ణగారు లేకుంటే ఈ సినిమా చేసేవాణ్ని కాదేమో? ► ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఆలోచన లేదు. క్రిష్ చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం తాతగారి క్యారెక్టర్ చాలా హానెస్ట్‌గా, డిగ్నిఫైడ్‌గా చూపించాను. నాకు ఆ డౌటే లేదు. ఇది కేవలం సపోర్టింగ్ రోల్ అని యాక్సెప్ట్ చేయాలి. ► తాతగారి పాత్ర చేస్తున్నాను అని తాతగారిని అనుకరించడమో, మిమిక్రీ చేయడమో చేయలేదు. యూ ట్యూబ్‌లో ఒకే ఒక్క ఇంటర్వ్యూ చూశా. అదే ఈ సినిమాకు నా హోమ్ వర్క్. ఈ పాత్ర చేయగలను అనే నమ్మకం నాలో మొదటి నుంచీ ఉంది. చిన్నప్పటి నుంచి ఆయనతో పెరిగాను కాబట్టి ఆయన అలవాట్లు నాకు కొన్ని వచ్చేశాయి. ఆయన చాలా గొప్ప పరిశీలకుడు. నాకు కూడా అదే వచ్చింది. సినిమాలో ఏదీ కావాలని ప్రత్యేకంగా చేయలేదు. సహజంగా ఉండటానికి ప్రయత్నించాను. ► ఎప్పుడో ‘యువకుడు’ సినిమా టైమ్‌లో క్లీన్ షేవ్ చేశాను. మళ్లీ వేరే సినిమాల్లో ట్రై చేయలేదు. ‘యన్.టి.ఆర్’ చిత్రానికి ఫస్ట్ డే మేకప్‌లో చిన్న చిన్న ఇబ్బందులున్నా తర్వాత అంతా సాఫీగా సాగిపోయింది. యాక్టింగ్ పరంగా ఏ దశలోనూ కష్టంగా అనిపించలేదు. మేకప్ పరంగా 60 ఏళ్ల వయసు పాత్రప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ► యన్టీఆర్గారితో తాతగారు పంచుకున్న అనుంబంధం గురించి చెబుతూనే ఉండేవారు. కానీ నేను విన్నది ఏదీ స్క్రిప్ట్‌లో లేవు. నాకు తెలియని చాలా విషయాలు ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను. అది కొత్తగా, ఎగై్జటింగ్‌గా అనిపించాయి. హిస్టరీ క్లాసులకు వెళ్లినట్టు అనిపించింది. ► తాతగారి బయోపిక్ గురించి ఏం ఆలోచించలేదు. మా చిన్నమావయ్య (నాగార్జున)గారు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు చూద్దాం. నా లాస్ట్ సినిమా ‘ఇదంజగత్’ నిరాశ పరిచింది. రిలీజ్ కూడా సరిగ్గా జరగలేదు. ‘మళ్ళీరావా’ కంటే ముందే ఒప్పుకున్న సినిమా అది. ‘యన్.టి.ఆర్’ తర్వాత రాబోతున్న సినిమాపై కూడా పూర్తి నమ్మకంతోఉన్నాను. -
సెన్సార్ పూర్తి.. బరిలోకి దిగడానికి రెడీ!
ఈ సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తున్నా.. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ ఎఫ్2, సూపర్‌స్టార్ రజనీకాంత్ పేట కూడా రంగంలోకి దిగడానికి సిద్దమయ్యాయి. అయితే వీటిలో ఏ సినిమాలకు ప్రేక్షకులు పట్టంకడతారో చూడాలి. ఎన్టీఆర్ జీవిత చరిత్రగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ కథానాయకుడిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక బోయపాటి శ్రీను సినిమా అంటే మాస్కు పండుగే. భారీయాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన వినయ విధేయ రామపై మాస్లో భారీ హైప్ క్రియేట్ అయింది. వినోధ భరితంగా రాబోతోన్న ఎఫ్2, రజనీ తనదైన స్టైల్, మ్యానరిజంతో నటిస్తూ వస్తున్న పేట ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. అయితే వీటిలో ఎలాంటి కట్లు లేకుండా ఎన్టీఆర్ కథానాయకుడు మూవీకి యూ.. పేటా, ఎఫ్2లకు యూ/ఏ సర్టిఫికేట్లు లభించాయి. ఇక వినయ విధేయ రామ చిత్రం సెన్సార్ పూర్తి కావాల్సిఉంది. కథానాయకుడు అన్నింటికంటే ముందుగా (జనవరి 9న) విడుదల కానుండగా.. పేట జనవరి 10న, వినయ విధేయ రామ జనవరి 11న, ఎఫ్2 జనవరి 12న విడుదల కానున్నాయి. -
‘యన్.టి.ఆర్’లో జూనియర్ ఎందుకు నటించలేదంటే..!
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న బయోపిక్ మూవీ యన్.టి.ఆర్. నందమూరి బాలకృష్ణ తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్, సుమంత్, రానాలతో పాటు పలువురు నందమూరి కుటుంబ సభ్యులు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపించింది. తాజాగా ఈ విషయంపై కల్యాణ్ రామ్ స్పందించారు. యన్.టి.ఆర్‌లో తారక్ నటించలేదని క్లారిటీ ఇచ్చారు. ముందుగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను తీసుకోవాలని భావించినా.. ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని చిన్న పాత్రలో తారక్‌ను చూపించటం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే బాలకృష్ణ.. యన్.టి.ఆర్‌లో తారక్‌ను తీసుకోలేదన్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ సినిమాను వారాహి చలనచిత్రం, విబ్రీ మీడియా లతో కలిసి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు. -
‘యన్.టి.ఆర్’లో బాలయ్య ఎవరంటే..?
నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న సినిమా యన్.టి.ఆర్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా తొలి భాగం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో ఏ పాత్రల్లో ఎవరెవరు కనిపించనున్నారో ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే బాలకృష్ణ పాత్రలో ఎవరు కనిపించనున్నారు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. బాలకృష్ణ చిన్నప్పటి పాత్రను ఆయన మనవడు చేస్తున్నట్టుగా ప్రకటించిన హీరో అయ్యాక కనిపించే సన్నివేశాల్లో ఆ పాత్ర ఎవరు చేశారన్నది ఆసక్తికరంగా మారింది. ముందుగా బాలయ్య పాత్రలో ఆయన తనయుడు మోక్షజ్ఞ నటిస్తున్నారన్న ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారట. తండ్రి పాత్రతో పాటు తన పాత్రలోనూ తానే కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. మరి అసలు విషయం తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
క్రిష్ చెడ్డవాళ్లను ఎలా చూపించాడో : మోహన్ బాబు
-
క్రిష్ చెడ్డవాళ్లను ఎలా చూపించాడో : మోహన్ బాబు
నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ సినిమా ఆడియో వేడుక నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ సన్నిహితులు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నటుడు మోహన్ బాబు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వేడుకలో ప్రసంగించిన మోహన్ బాబు చివర్లో ‘క్రిష్.. యు డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్.. మా అన్నయే కనిపిస్తున్నాడు. ఎక్కడ సినిమాను ప్రారంభించావో.. ఎక్కడ ఫినిష్ చేశావో తెలియదు. దాన్లో చెడ్డవాళ్లను కూడా మంచి క్యారెక్టర్స్ చేశావో. ఎవరెవరిని ఎలా చేశావో నాకు తెలియదు’ అంటూ ముగించారు. బాలకృష్ణ స్వయంగా తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణిగా కనిపించనున్నారు. టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, ప్రణీత, శాలినీ పాండే, శ్రియ, పాయల్ రాజ్‌పుత్ అలనాటి అందాల భామలుగా కనిపించనున్నారు. కల్యాణ్ రామ్, సుమంత్, కైకాల సత్యనారాయణ, ప్రకాష్ కోవెలమూడి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు.. నమ్మలేని నిజాలు!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీ రామారావు జీవితకథను తెరకెక్కించాలంటే రాంగోపాల్ వర్మే తీయాలని సీనియర్ జర్నలిస్ట్, సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు నడింపల్లి సీతారామరాజు అభిప్రాయపడ్డారు. రాముడు గురించి సినిమా తీయాలంటే రామూనే తీయాలన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ‘వెన్నుపోటు’ పాటను విడుదల చేయనున్నట్టు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. మరోవైపు బాలకృష్ణ హీరోగా నటించిన ‘కథానాయకుడు’ సినిమా ఆడియో కూడా ఈరోజు సాయంత్రమే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నటుడు, బీజేపీ నేత త్రిపురనేని చిట్టిబాబు, సీతారామరాజు పాల్గొన్నారు. చివరి రోజుల్లో ఎన్టీఆర్ అనుభవించిన క్షోభపై చిట్టిబాబు మాట్లాడుతూ.. ‘అధికారంతో పాటు కుటుంబాన్ని తనకు చంద్రబాబు దూరం చేశాడని ఎన్టీఆర్ చాలా బాధ పడ్డారు. తన కుమారుల్లో అత్యంత ఇష్టుడైన హరికృష్ణను కూడా దూరం చేయడంతో మరింత కుంగిపోయారు. చంద్రబాబు రాజకీయ జీవితమే వెన్నుపోటుతో మొదలైంది. కుతూహలమ్మకు వెన్నుపోటు పొడిచి నాయకుడయ్యారు. ప్రజాపోరాటాలు చేసి నాయకుడు కాలేదు. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోవడంతో గోడ దూకి టీడీపీలోకి వచ్చేశాడు. 30 ఏళ్లు పోరాడిన కాంగ్రెస్ పార్టీతో మళ్లీ ఇప్పుడు చేతులు కలిపాడు. ఎన్టీఆర్‌ను క్షోభ పెట్టి, ఆయనపై చెప్పులు వేయించిన చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. చరిత్రలో జరిగిన విషయాలన్నీ బాలకృష్ణకు తెలుసు. లక్ష్మీపార్వతి కారణంగా నందమూరి వంశం నాశనమైపోతుందన్న భ్రమను ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో చంద్రబాబు కల్పించారు. పార్టీని, కుటుంబాన్ని కాపాడతానని నమ్మించడంతో ఎన్టీఆర్ వారసులు చంద్రబాబు వెనుక నడిచారు. చంద్రబాబు చేసిన ద్రోహం గురించి తెలిసినా ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలో ఎన్టీఆర్ వారసులు ఉన్నార’ని వెల్లడించారు. చివరి ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? ఎన్టీఆర్ మొదటి, చివరి ఇంటర్వ్యూలు తనకు ఇచ్చారని సీతారామరాజు వెల్లడించారు. లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోబోతున్నట్టు తనకు ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పారని తెలిపారు. తిరుపతిలో మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్ జరిగినప్పుడు బహిరంగంగా ఈ విషయాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. అయితే ఎన్టీఆర్ ఈ విషయాన్ని ప్రకటించకుండా చంద్రబాబు ఒత్తిడి చేసినా, పెద్దాయన వినిపించుకోలేదన్నారు. ‘నేను చేసింది తప్పా అని ఎన్టీఆర్ తర్వాత నన్ను అడిగారు. నేను తప్పేంలేదని చెప్పాను. దీనిపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు కూడా మిమ్మల్ని పిలిచి కుప్పంలో ఎన్నికల ప్రచారం చేయించారు. రాష్ట్రమంతా తిప్పారు. మిమ్మల్ని అభినందించారు. కేబినెట్లో తనకు మంచి పదవిక ఇమ్మని లక్ష్మీపార్వతితో మీకు చెప్పించారు. ఇవన్నీ మీకు తెలుసు. మీరు మాతో ఒకరని చెప్పారు. పెళ్లి విషయంలో రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ఆదర్శమని నాతో చెప్పారు. లక్ష్మీపార్వతి వల్ల ఎన్టీఆర్‌కు ఎటువంటి హాని జరగలేదు. వాస్తవానికి ఎన్టీఆర్ ఒక్కరికే కాదు ఆయన కుటుంబం మొత్తానికి వెన్నుపోటు జరిగింది. ఇవాళ నాకు తెలిసి ఎన్టీఆర్ కుటుంబంలో ఒక్క బాలకృష్ణ తప్పా ఎవరి ఆర్థిక పరిస్థితి బాలేదు. ఎన్టీఆర్ ఇళ్లు అన్ని అమ్మేశారు. ఆయనకు సంబంధించినవి ఏవీ లేకుండా చేశారు. ఎన్టీఆర్ తర్వాత హరికృష్ణను వెన్నుపోటు పొడిచారు. ఆయన చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఓ పెళ్లిలో హరికృష్ణను కలిశాను. తమ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశారని ఆయన ఎంతో బాధ పడ్డారు. కథానాయకుడు సినిమాలో హరికృష్ణ కుమారులను తీసుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. మలక్‌పేట నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని హరికృష్ణ అనుకున్నారు. కేసీఆర్‌తో మాట్లాడినట్టు కూడా నాతో చెప్పారు. ఆయనకు కేబినెట్ పదవికి కూడా నిర్ణయమైంది. నేను రవాణా శాఖ మంత్రిగా పనిచేశాను మీకు అదే పదవి ఇస్తానని కేసీఆర్ తనతో అన్నారని హరికృష్ణ చెప్పారు. ఎందుకంటే వీరిద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉంది. హరికృష్ణను మళ్లీ పైకి తీసుకువాలన్న భావన ఇంట్లోవారి కన్నా కేసీఆర్‌కే వచ్చింది. ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతోనే కేసీఆర్ తన కుమారుడికి తారక రామారావు అని పేరు పెట్టుకున్నారు. రాజకీయాలను అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్ ఏమీ సంపాదించలేదు. బయోపిక్‌లను తీయడంలో రాంగోపాల్ వర్మ ఎక్స్పెర్ట్. ఆయన తెరకెక్కించే సినిమాలో వాస్తవాలు చూపిస్తారని నమ్ముతున్నాన’ని సీతారామరాజు వివరించారు. -
ఎన్టీవార్
-
యన్.టి.ఆర్ : విద్యాబాలన్ లుక్
నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న బయోపిక్ యన్.టి.ఆర్. బాలయ్య టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా తొలి భాగం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. తాజాగా ఎన్టీఆర్ సతీమణి బసవతారం పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటి విద్యా బాలన్ లుక్‌ను రివీల్ చేశారు. హర్మోనియం వాయిస్తున్న విద్యాలుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో ఎన్టీఆర్ పోషించిన రావణాసురుడి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. డిసెంబర్ 21న అభిమానుల సమక్షంలో ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు. -
‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ వాయిదా..!
నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న బయోపిక్ మూవీ యన్.టి.ఆర్. క్రిష్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. తొలి భాగం కథానాయకుడులో ఎన్టీఆర్ సినీ జీవిత విశేషాలు. రెండో భాగం మహానాయకుడులో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం చూపించనున్నారు. ముందు ఈ రెండు భాగాలను రెండు వారాల గ్యాప్‌తో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. తొలి భాగం యన్.టి.ఆర్ కథానాయకుడు జనవరి 9న, యన్.టి.ఆర్ మహానాయకుడు జనవరి 24న రిలీజ్ చేస్తున్నట్టుగా పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. తాజాగా యన్.టి.ఆర్ మహానాయకుడు రిలీజ్‌ను వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ముందుగా ప్రకటించినట్టుగా జనవరి 24న కాకుండా మరో రెండు వారాలు ఆలస్యంగా ఫిబ్రవరి 7న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. -
యన్.టి.ఆర్ : ఒకటా..? రెండా..?
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న బయోపిక్ యన్.టి.ఆర్. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు యన్.టి.ఆర్ కథానాయకుడు, యన్.టి.ఆర్ మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తొలి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితం, రెండో భాగంలో ఎన్టీఆర్ రాజకీయ జీవితాలను చూపిస్తారన్న ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగా రెండు టైటిల్ లోగోలతో పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. కానీ తాజాగా యన్.టి.ఆర్ ఒక్క సినిమా గానే రిలీజ్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగా తాజాగా చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పాట, పోస్టర్స్ సినిమా ఒక భాగమా రెండు భాగాలా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇటీవల రిలీజ్చేసిన ఎన్టీఆర్ సెకండ్ సింగిల్ పూర్తి రాజకీయ నేపథ్యంలోనే చూపించారు. తాజాగా ట్రైలర్ ఆడియో, రిలీజ్ డేట్లను ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లోనూ ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా ఉన్న గెటప్‌నే చూపించారు. అంతేకాదు టైటిల్ కింద కథానాయకడు ట్యాగ్ లేకపోవటం కూడా అనుమానాలకు కారణమైంది. దీంతో యన్.టి.ఆర్ ఒక సినిమాగా వస్తుందా..? లేక రెండు సినిమాలుగానా అన్న చర్చ జరుగుతోంది. ఈ విషయం పై కార్లిటీ రావాలంటే చిత్రయూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
యన్.టి.ఆర్ : 16న ట్రైలర్.. 21న ఆడియో
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ యన్‌టిఆర్ బయోపిక్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ స్టిల్స్‌తో పాటు రెండు పాటలను కూడా విడుదల చేశారు. తాజాగా చిత్ర టైలర్, ఆడియో రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. యన్.టి.ఆర్ ట్రైలర్ లాంచ్ డిసెంబర్ 16న హైదరాబాద్‌లో, ఆడియో రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 21న నందమూరి తారకరామారావు పుట్టిన ఊరు నిమ్మకూరులో జరగనున్నాయి.ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి ఈ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా యన్.టి.ఆర్ కథానాయకుడు, యన్.టి.ఆర్ మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా వస్తుంది. విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, లెజెండరీ కైకాల సత్యనారాయణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
మూడు భాషల్లో ‘మణికర్ణిక’
వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం మణికర్ణిక. టాలీవుడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాకు కొంత భాగం కంగనా కూడా దర్శకత్వం వహించారు. అనేక వివాదాలు, మరెన్నో వాయిదాల తరువాత షూటింగ్ పూర్తి చేసుకున్న మణికర్ణిక ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 18న ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. దర్శకుడు తెలుగు వాడు కావటంతో పాటు చారిత్రక కథ కావటంతో ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. హిందీ పాటు ఇతర భాషల్లోనూ జనవరి 25నే మణికర్ణికను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే జనవరి 24న క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న యన్.టి.ఆర్ మహానాయకుడు రిలీజ్ కానుంది. మరి ఒకే దర్శకుడు తెరకెక్కించిన రెండు సినిమాలు ఒక్క రోజు రిలీజ్ చేసే సాహసం చేస్తారో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
‘యన్.టి.ఆర్’ నుంచి మరోపాట
నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా యన్.టి.ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ సినీ ప్రయాణానికి సంబంధించిన పాటను రిలీజ్ చేయగా తాజాగా ఎన్టీఆర్ రాజకీయా జీవితానికి సంబంధించిన మరో పాటను విడుదల చేశారు. ఎక్కువగా సంస్కృత పదాలతో గంభీరంగా ఉన్న ఈ పాటకు శివ దత్త, రామకృష్ణ, కీరవాణిలు సాహిత్యంమందించగా శరత్ సంతోష్, మోహన భోగరాజు, కీరవాణి, కాల భైరవ, శ్రీనిధి తిరుమలలు ఆలపించారు. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్యాబాలన్‌తో పాటు ఎంతో మంది టాలీవుడ్ నటీమణులు సందడి చేయనున్నారు. బాలకృష్ణ వారాహి చలనచిత్రం, విబ్రీ మీడియా బ్యానర్లతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
‘యన్.టి.ఆర్’లో మరో బ్యూటీ
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా యన్.టి.ఆర్. తండ్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలయ్య టైటిల్ రోల్లో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్‌తో పాటు శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, సామిత్రిగా నిత్యా మీనన్, కృష్ణకుమారిగా మాళవిక నాయర్, ప్రభగా శ్రియ,జయసుధ పాయల్ రాజ్‌పుత్, జయప్రధ హన్సికలు నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ లిస్ట్‌లో మరో బ్యూటీ వచ్చి చేరింది. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ కూడా యన్టిఆర్లో నటించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య, ఈషా కాంబినేషన్లో పలు సన్నివేశాలు చిత్రీకరించారట. అయితే ఈషా ఎవరి పాత్రలో కనిపించనుందన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం యన్‌టిఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘యన్.టి.ఆర్’ తొలి పాట..!
బాలకృష్ణ హీరోగా నందమూరి తారకరామరావు జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈసినిమా తొలిభాగం యన్.టి.ఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఆదివారం తొలి పాటను రిలీజ్ చేశారు. రచయితలు శివ శక్తిదత్తా, కే రామకృష్ణలు పూర్తి సంస్కృత పదాలతో గంభీరమైన పాటను రచించారు. కీరవాణి సంగీత సారధ్యంలో బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్ ఈ గీతాన్ని ఆలపించారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రానా, సుమంత్, సత్యనారాయణలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
‘ఎన్టీఆర్’లో ‘ఆర్ఎక్స్100’ భామ!
నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ.. నటిస్తోన్న చిత్రం ‘ఎన్టీఆర్’. నందమూరి తారకరామారావు జీవిత గాథను రెండు భాగాలుగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి. సినీ జీవితాన్ని కథానాయకుడిగా, రాజకీయ జీవితాన్ని మహానాయకుడిగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన భాగాన్ని ప్రస్తుతం షూట్ చేస్తోండగా.. ఇందులో ఇప్పటికే పలుతారలు జాయిన్ అయ్యారు. అలనాటి అందాల తార శ్రీదేవి పాత్రలో రకుల్‌ప్రీత్ సింగ్, మహానటి సావిత్రిగా నిత్యా మీనన్, జయప్రద పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా.. మరికొన్ని పాత్రలకు ఇంకొంత మంది హీరోయిన్లను పరిశీలిస్తున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు సహజనటి జయసుధ పాత్రలో ‘ఆర్ఎక్స్100’ భామ పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జయసుధ కాంబినేషన్లో వచ్చిన డ్రైవర్ రాముడు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా వీరి కాంబినేషన్లో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. ‘ఎన్టీఆర్’ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతుండగా.. డైరెక్టర్ క్రిష్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. -
బాలయ్య యాక్షన్.. ఎన్టీఆర్ వాయిస్..!
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా యన్.టి.ఆర్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్కు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా రెండు భాగాలుగా జనవరిలో రిలీజ్ కానుంది. తొలి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితం, రెండో భాగంలో ఆయన రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ ప్రసంగాలను ప్రత్యేకంగా చూపించనున్నారట. ఎంతో ఆవేశంగా సాగే ఎన్టీఆర్ ప్రసంగాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అందుకే సినిమాలో ఆ సన్నివేశాలకు మరింత స్కోప్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఆ సన్నివేశాల్లో బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో కనిపించినా.. డబ్బింగ్ మాత్రం చెప్పటం లేదట. అప్పట్లో ఎన్టీఆర్ చేసిన ప్రసంగాల వాయిస్కే బాలయ్య యాక్ట్ చేస్తారట. అంటే బాలయ్య తెర మీద కనిపించినా గొంతు మాత్రం సీనియర్ ఎన్టీఆర్‌దే వినిపిస్తుందనమాట. ప్రస్తుతం ఈ ప్రచారం టాలీవుడ్ లో గట్టిగానే జరుగుతోంది. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
‘ఎన్టీఆర్’ మహానాయకుడు వాయిదా పడింది!
నందమూరి బాలకృష్ణ నిర్మిస్తూ, నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత గాథను వెండితెరపై రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినీ జీవితాన్ని ‘కథానాయకుడు’గానూ, రాజకీయ జీవితాన్ని ‘మహానాయకుడు’గానూ విడుదల చేయనున్నారు. అయితే గతంలో ఈ రెండు పార్ట్‌లకు సంబంధించిన రిలీజ్ డేట్స్ (జనవరి 9, 24)ను ప్రకటించింది చిత్రబృందం. అయితే తాజాగా ఈ సినిమాను కొన్న బయ్యర్లు చేసిన విజ్ఞప్తిని చిత్రయూనిట్ పరిగణలోకి తీసుకుందని సమాచారం. ఈ రెండు పార్ట్‌లకు రెండు వారాలే గ్యాప్ ఉంటే నష్టపోయే అవకాశం ఉందని బయ్యర్లు ఆందోళన చేశారని, వారి విజ్ఞప్తి మేరకు రెండో పార్ట్ ‘మహానాయకుడు’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. ఇంతకు ముందే ‘మహానాయకుడు’ విడుదల వాయిదా కానుందని ప్రచారం సాగినా.. వాటిపై మేకర్స్ రియాక్ట్ కాలేదు. మరి ఇప్పుడైనా చిత్రయూనిట్ వీటిపైన స్పందించి అధికారికంగా ప్రకటిస్తుందో లేదో చూడాలి. -
మేకప్‌మేన్‌గా స్టార్ రైటర్..!
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా యన్.టి.ఆర్. రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న ఈ మూవీ తొలిభాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, రెండో భాగంలో రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’లో ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా కీలక పాత్రలో నటించనున్నారట. ఎన్టీఆర్ వ్యక్తిగత మేకప్‌మేన్‌గా పనిచేసిన పీతాబరం పాత్రలో సాయి మాధవ్ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ను తెలుగు ప్రేక్షకులకు ఆరాధ్యుడిగా మార్చిన కృష్ణుడి మేకప్‌ను వేసింది పీతాంబరమే. అందుకే ఆయన పాత్రుకు సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉందన్న టాక్వినిపిస్తోంది. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ వాయిదా పడనుందా..?
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా యన్.టి.ఆర్. నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా తొలి భాగం యన్.టి.ఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రెండవ భాగం యన్.టి.ఆర్ మహానాయకుడు జనవరి 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే రెండు సినిమా మధ్య గ్యాప్ తక్కువగా ఉండే కలెక్షన్ల పై ప్రభావం పడుతుందని భావిస్తున్నారట నందమూరి ఫ్యాన్స్. అందుకే రెండవ భాగాన్ని పోస్ట్‌పోన్ చేయాల్సిందిగా చిత్రయూనిట్‌పై ఒత్తిడి తెస్తున్నారట. మరి అభిమానుల కోరిక మేరకు యన్.టి.ఆర్ టీం సినిమాను వాయిదా వేస్తుందేమో చూడాలి. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుండగా అక్కినేని పాత్రలో సుమంత్, ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతమందిస్తున్నారు. -
వైస్రాయ్ కుట్రలో భాగం పంచుకున్నవాడు బాలకృష్ణ!
పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని దొడ్డి దోవన దక్కించుకున్న చంద్రబాబుతో వైస్రాయ్ హోటల్ కుట్రలో భాగం పంచుకున్నవాడు బాలకృష్ణ. ఇప్పుడు తండ్రి జీవితాన్ని గొప్పగా తెరకు ఎక్కిస్తానని బయలుదేరడం విడ్డూరం కాదా? ఎన్టీఆర్‌పై సినిమా ద్వారా బాలకృష్ణ ఏం కోరుకుంటున్నాడు? బాబు నాయకత్వంలో ఎన్టీఆర్‌కు తాము చేసిన ద్రోహం ఎక్కడా కనపడకూడదు. అదే సమయంలో ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అని చూపించి టీడీపీకి లాభం చేకూరే విధంగా సినిమా ఉండాలి. ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి ముగింపు పలికి ఇప్పుడు ఆయన నామ జపం చేస్తున్న బాబు చిత్తశుద్ధి ఎంతో.. తండ్రి పట్ల బాలకృష్ణ భక్తి శ్రద్ధలు కూడా అంతే. మహానటి సావిత్రి జీవితం ఇటీవలే తెరకెక్కింది. చాలావరకు వాస్తవానికి దగ్గరగా ఉంది ఆ సినిమా అని అందరూ చెప్పుకున్నారు. ఆ సినిమా తీసిన వాళ్ళు తప్పకుండా సావిత్రి జీవితానికి సంబంధించి అన్ని కోణాలనూ జాగ్రత్తగా పరిశీలించి, అధ్యయనం చేసి ఉంటారు. ఎందుకంటే ఒక మహానటి జీవితాన్ని తెరకు ఎక్కించాలన్న సదుద్దేశం తప్ప ఆ సినిమా నిర్మాతలకు వేరే ప్రయోజనాలు ఏమీ ఉండవు కాబట్టి. మహానటి సావిత్రి జీవించి లేరు, ఆమె వారసులెవరికీ సావిత్రి పేరు వాడుకుని ఇప్పుడు ఏదో లబ్ధి పొందాలన్న దుగ్ధ ఉండి ఉండదు. అసలా చిత్ర నిర్మాణంతో సావిత్రి కుటుంబానికి ఎటువంటి సంబంధమూ లేదు. కాబట్టి ఆ సినిమాలో నిజాయితీ కనిపిస్తుంది. అందుకే అందరి మన్ననలూ పొందింది. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఏమిటీ సినిమా గోల అని విసుక్కోవచ్చు ఎవరయినా. నిజమే.. ఎన్నికలు తరుముకొస్తున్నాయి. తెలంగాణాలో ఎన్నికల కోడి ముందే కూసింది. డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి, దాని వెనువెంటనే 2019 ఏప్రిల్, మే నెలల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకూ, లోక్ సభకూ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటినుంచో ఎన్నికల వేడి కొనసాగుతున్నది. ఏపీలో ఎన్నికలు జరిగేలోపే రానున్న రెండు సినిమాలను ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉంది. ఎన్నికలకు సినిమాలకు ఏమిటి సంబంధం అన్న ప్రశ్న వేయవచ్చు ఎవరయినా. నిజమే సాధారణంగా ఎన్నికల సమయంలో నిర్మాతలెవరూ తమ సినిమాలను విడుదల చెయ్యాలని కోరుకోరు. ఎన్నికల హడావుడిలో పడి జనం తమ సినిమాలు చూడరన్న అభిప్రాయం వారిది. అయితే ఇప్పుడు ఒక రెండు సిని మాలు మాత్రం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే వస్తున్నాయి. మొదటగా ఒకే సినిమా రాజ కీయ అవసరాల కోసం ప్రారంభమైంది. అయితే దాని వెనువెంటనే ఇంకో సినిమా అదే ఇతివృత్తానికి దగ్గరగా రాబోవడం గమనార్హం. మహా నటుడి ఆత్మ క్షోభించనుందా? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, వేలాది మందికి రాజకీయ జన్మఇచ్చిన ఎన్టీఆర్ మరణించిన 22 సంవత్సరాలకు ఆయన జీవితాన్ని వెండితెరకు ఎక్కించాలన్న ఆలోచన ఆయన కొడుకు, సినిమా హీరో, టీడీపీ శాసన సభ్యుడు, ఏపీ సీఎం బావమరిది, ఆ రాష్ట్ర మంత్రి మామ బాలకృష్ణకు వచ్చింది. తండ్రిని అప్రజాస్వామిక పద్ధతిలో పదవి నుంచి దింపి మానసిక క్షోభకు గురిచేసి, ఆయన అకాల మరణానికి పరోక్షంగా కారకుడయిన కొడుకే తండ్రి జీవితాన్ని తెరకు ఎక్కించబూనుకోవడం విడ్డూరం. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని దొడ్డిదో వన దక్కించుకున్న బాబుతో వైస్రాయ్ హోటల్ కుట్రలో భాగం పంచుకున్నవాడు బాలకృష్ణ. ఇప్పుడు ఆయన తండ్రి జీవితాన్ని గొప్పగా తెరకు ఎక్కిస్తానని బయలుదేరడం విడ్డూరం కాక మరేమిటి? దేశానికి ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశం ఉన్న ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి ముగింపు పలికి ఇప్పుడు ఆయన విగ్రహాలకు దండవేసి ఆయన నామ జపం చేస్తున్న బాబు చిత్తశుద్ధి ఎంతో.. తండ్రి పట్ల బాలకృష్ణ భక్తి శ్రద్ధలు కూడా అంతే. మహానటి సావిత్రి సినిమా తీసిన వాళ్ళకీ, ఎన్టీఆర్ మీద సినిమా తీయబోతున్న ఆయన కొడుక్కీ ఏ మాత్రం పోలిక లేదు. అక్కడ నిజాయితీగా ఒక మహానటి జీవితాన్ని జనం ముందు ఉంచే ప్రయత్నం జరిగితే ఇక్కడ ఒక మహానటుడి ఆత్మ క్షోభించే రీతిలో మరో సినిమా నిర్మాణం జరగబోతున్నది. ఒకసారి తప్పు చేస్తే దిద్దుకునే అవకాశమే ఉండదా ఇక, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉంటుందా అని ఎవరయినా బాలకృష్ణ ప్రయత్నాన్ని సమర్ధించవచ్చు. కానీ, ఎన్టీఆర్ రాజకీయ పతనానికి మూలకారకుడయిన బాబు కానీ, అందుకు సహకరించి దాన్ని విజయవంతం చేసిన బాలకృష్ణ కానీ ఈ 22 ఏళ్ళలో ఏ ఒక్కసారయినా ఆనాడు ఎన్టీఆర్‌ను గద్దెదించి మేం తప్పుచేశాం అని చెంపలు వేసుకున్నారా? ఎన్టీఆర్ పేరిట బాలకృష్ణ సినిమా అనగానే మరో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అని ఇంకో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. ఈ రెండు సినిమాల్లో నిజంగా ఎవరు ఏ మేరకు వాస్తవంగా తీస్తారు, ఎవరు ఎటువంటి వక్రీకరణలకు పాల్పడుతారు అన్నది చూడాల్సి ఉంది. పరిపూర్ణ జీవిత చిత్రణకు మంగళమేనా? బాలకృష్ణ సినిమా షూటింగ్ మొదలయింది. తండ్రి పాత్ర బాలకృష్ణ తానే పోషిస్తున్నాడు. ఇందులో బాబు పాత్రకు మరో నటుడు రానాను ఎంపిక చేసారు. ఇంచుమించు తనను బాబులాగా కనిపించేటట్టు మేకప్ బాగానే చేశారు. అంటే ఎన్టీఆర్ సినిమా ఆయన జీవితంలోకి బాబు ప్రవేశించేంత వరకూ కథ ఉంటుందన్నమాట. అయితే మరి వైస్రాయ్ ఎపిసోడ్, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు, ఆయన మరణం వరకూ జరిగిన పరిణామాలు అన్నీ ఈ సినిమాలో ఉంటాయా? ఉంటే బాలకృష్ణ తీస్తున్న ఈ సినిమా దర్శకుడు క్రిష్ నిజాయితీగా వాస్తవాలను తెరకు ఎక్కిస్తాడా? ఇప్పటికే ఒక దర్శకుడు తేజ ఈ సినిమా దర్శకత్వం నుంచి తప్పుకున్నాడు. కారణం అందరికీ తెలిసిందే నిర్మాత చెప్పినట్టు వినడం కుదరక తప్పుకున్నాడని ప్రచారం. ఎన్టీఆర్ సినిమా ద్వారా నిర్మాత బాలకృష్ణ ఏం కోరుకుంటున్నాడు? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇక్కడ. సమాధానం కోసం పెద్దగా వెతుక్కోనక్కర లేదు. బాబు నాయకత్వంలో ఎన్టీఆర్‌కు తాము చేసిన ద్రోహం ఎక్కడా కనపడకూడదు అదే సమయంలో ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అని చూపించి టీడీపీకి లాభం చేకూరే విధంగా సినిమా ఉండాలి. ఎన్టీఆర్ పుట్టుక నుంచి మరణం దాకా తెరకు ఎక్కిస్తే చాలా వివాదాస్పద అంశాలు తెరకు ఎక్కించాల్సి వస్తుంది. అందుకని ఆయన జీవితం చివరి దాకా కాకుండా 60 ఏళ్ళు నిండగానే రాజకీయరంగ ప్రవేశం చేసి 1983లో తొలిసారి ఘన విజయం సాధించి అధికారంలోకి రావడంతో సినిమా ముగుస్తుందని సినీ పరిశ్రమ వర్గాలే చెపుతున్నాయి. అంటే ఆయన నట జీవితం మాత్రమే ఈ సినిమాలో మనం చూస్తాం. పోనీ ఇంకాస్త దూరం వెళ్లి నాదెండ్ల భాస్కర్‌రావు తిరుగుబాటును విఫలం చేసి తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టేవరకూ చూపించవచ్చునని చెపుతున్నారు. బహుశా ఇదే జరగొచ్చు. ఎందుకంటే నాదెండ్ల భాస్కర్‌రావు తిరుగుబాటు ఎపిసోడ్ ఉంటేనే బాబు పాత్రకు ప్రాముఖ్యత వస్తుంది. కానీ అక్కడో ఇక్కడో ముగించేస్తే ఎన్టీఆర్ జీవితాన్ని పరి పూర్ణంగా చూపించినట్టు కాదు. వెన్నుపోటును చూపించే నిజాయితీ ఎవరిది? అందుకే రాంగోపాల్ వర్మ మరో సినిమా తీయడానికి సిద్ధపడ్డట్టున్నాడు. బాలకృష్ణ సినిమా ఎక్కడ ముగిసి పోతుందో అక్కడి నుంచి ఆయన సినిమా మొదలవుతుందని చెప్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలో ముఖ్యమయిన ఘట్టాలన్నీ అక్కడి నుంచే మొదలవుతాయి. ఎన్నెన్ని మలుపులు, ఎన్ని మెరుపులు ఎన్ని మరకలు అన్నీ ఆ తరువాతి అధ్యాయంలోనే మనకు కనిపిస్తాయి. 1984లో తిరుగుబాటును చిత్తుచేసి ఇందిరాగాం«ధీ అంతటి మహా నాయకురాలు ఒక మెట్టు దిగొచ్చి అధికారం తిరిగి తనకు అప్పగించేట్టు చేసుకున్న దగ్గరి నుంచీ, సొంత అల్లుడి చేతుల్లోనే ఘోరమయిన వెన్నుపోటు పొడిపించుకుని కొద్ది మాసాలకే చనిపోయేవరకూ ఎన్టీఆర్ జీవితం అంతా ఉద్వేగభరితమే. అందులో 85 –89 మధ్య కాలంలో ఆయన పాలన తీరు, వివాదాస్పద నిర్ణయాలు, 89లో ఓటమి ఆ తరువాత సొంత కుటుంబం నుంచే ఎదుర్కొన్న నిరాదరణ, అనారోగ్యం, రాజకీయ అవమానాలు, లక్ష్మీపార్వతి ఆయన జీవితంలో ప్రవేశించడం, ఆమెతో పెళ్లి, మళ్ళీ 1994లో కాంగ్రెస్‌ను మట్టి కరిపించి సొంత అల్లుడి అంచనాలనే తారుమారు చేసి అద్భుత విజయం సాధించి అధికారాన్ని తిరిగి కైవసం చేసుకున్న తీరు అన్నీ రసవత్తర ఘట్టాలే. ఇవన్నీ రాంగోపాల్ వర్మ సినిమాలో ఉండే అవకాశం చాలా ఉంది. ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో చూపించే నిజాయితీ బాలకృష్ణ సినిమాకు ఉండదు. ఏ రకంగా చూసినా రాంగోపాల్ వర్మ సినిమా మాత్రమే ఎన్టీఆర్ అభిమానులను సంతృప్తిపరుస్తుందని చెప్పాల్సిన పని లేదు. మొత్తానికి ఎన్టీఆర్ జీవితం మొత్తం సమగ్రంగా తెలియాలంటే రెండు సినిమాలూ చూడాలి. అయితే ఆత్మకథలు రాసుకునే వాళ్లకు ఎంత నిజాయితీ ఉండాలో జీవిత చరిత్రలు రాసేవాళ్ళు, తెరకెక్కించే వాళ్ళూ వాస్తవాల చిత్రీకరణలో అంతే నిజాయితీ ఉండాలి. వివాదాస్పద సినీ ప్రముఖుడు రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్‌కు ఎంత న్యాయం చేస్తాడో చూడాలి. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ఔను.. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారు : వర్మ
ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారనే అభిప్రాయం కొందరిలో ఉంది.. మీ ఒపీనియన్? వర్మ: అవును. వెన్నుపోటు పొడిచారు. ఎంతో స్ట్రాంగ్‌గా ఉండే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అంత సులువుగా ఎలా ప్రవేశించగలిగారు? వర్మ: అప్పుడు ఆయన జీవితంలో ఓ శూన్యం ఏర్పడింది. పరిస్థితుల ప్రభావం వల్ల ఆ శూన్యం. ఆ సమయంలో మానసిక స్థితి ఓదార్పు కోరుకునే అవకాశం ఉంది. అలాంటి టైమ్‌లోనే లక్ష్మీపార్వతిగారు ఆయన జీవితంలోకి ప్రవేశించారు. ఒక ఎమోషనల్ స్టేట్‌లో ఇది జరిగి ఉంటుందని నా అభిప్రాయం. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ప్రారంభించిన సందర్భంగా దర్శకుడు రాంగోపాల్ వర్మంతో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. ఎన్టీఆర్ కథను లక్ష్మీపార్వతి యాంగిల్లో చెప్పాలని మీకు ఎందుకు అనిపించింది? ఆమె మీద ఉన్న అభిమానమా? వర్మ: నాకు లక్ష్మీపార్వతిగారి మీద ఎలాంటి ఇంప్రెషన్ లేదు. ఇలా చెప్పడానికి ముఖ్యకారణం ఏంటంటే ఎన్టీఆర్‌గారు మహా మహా అందగత్తెలతో నటించారు. అలాంటి ఆయనకు ఈవిడ ఎక్కడ దొరికారా? అని ఫస్ట్ ఫీలింగ్. ఇంకో డౌట్ ఏంటంటే ఎన్టీఆర్‌గారు ఆ అందగత్తెలను పెళ్లి చేసుకోకుండా ఈవిణ్ణి చేసుకోవడమేంటి? అనిపించేది. అలా లక్ష్మీపార్వతిగారి మీద నా ఫీలింగ్ నెగటివ్ ఇంప్రెషన్‌తో స్టార్ట్ అయింది. పొలిటికల్‌గా కూడా ఆవిడ్ని పెద్దగా ఫాలో అవ్వలేదు. కానీ ఎన్టీఆర్ పెద్ద స్టార్‌గా మనందరికీ తెలుసు. ఆయన్ని అభిమానించాం. ఆయన మాట్లాడే విధానం మనకు తెలుసు. పాలసీల కోసం ఆయన తీసుకున్న స్టెప్స్‌ని మనం ఎక్కడా చూడలేదు. అందరూ ఆయన్ను పొగుడుతారు. ఎక్స్ట్రార్డినరీ మనిషి, మేధస్సు కలిగిన మనిషి. మొత్తం పొలిటికల్ సిస్టమ్‌నే మార్చేశారు అంటుంటారు. అయితే ‘ఈ ఒక్క విషయంలో... ’ అని అంటారు. ఈ ఒక్క విషయంలో అంటే? అనే విషయాన్ని సిన్సియర్‌గా ఆలోచించడం మొదలు పెట్టా. ఆ విషయాన్నే సినిమాగా తీయాలనుకున్నా. ‘ఆ ఒక్క విషయం’ గురించి చాలా సర్వేలు చేసి ఉంటారు. మీకెలాంటి ఫీడ్‌బ్యాక్ వచ్చింది? ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి మనుషులని కలవడం స్టార్ట్ చేశాను. ఎన్టీఆర్‌గారు ఉన్నప్పుడు పని చేసిన ఆఫీసర్స్, స్టాఫ్, ఆయనతో పరిచయం ఉన్న చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడాను. ఒక మనిషి గురించి ఐదుగుర్ని అడిగితే ఐదుగురు ఐదు రకాలుగా చెబుతారు. ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం అని మనం చెప్పలేం. ఏది నిజం అని తెలియదు. చిట్టచివరిగా నాకో ప్రత్యక్ష సాక్షి దొరికారు. ఆయనే ఎన్టీఆర్‌గారు. ఆయన చనిపోయే వారం రోజుల ముందు ఓ వీడియోలో లక్ష్మీపార్వతిగారి గురించి ఎక్స్ట్రార్డినరీ గౌరవాభిమానాలతో మాట్లాడారు. అప్పుడు నాకు అనిపించిందేంటంటే.. వీళ్లందరూ ఆయన ఎంతో గొప్ప మనిషి అంటారు. మరి ఆయనే గౌరవించే మనిషిని తప్పుబట్టడం లాజికల్‌గా తప్పు కదా. అప్పుడు కొంచెం డీప్‌గా వెళ్లి, ఆమె మీద ఎందుకు నెగటివ్ దృష్టి వచ్చింది? ఎంతసేపూ ఆవిడ గురించి బయటవాళ్లు చెప్పిన మాటలు వింటున్నాం కానీ ఎన్టీఆర్ దృష్టిలో ఆమె ఏంటి? అని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని బయోపిక్ అనలేమేమో? ఆయన జీవితంలో లక్ష్మీపార్వతి ఎంటరైనప్పటి నుంచి ఈ సినిమా మొదలవుతుందా? బయోపిక్ అనేది ఆ వ్యక్తి తాలూకు సక్సెస్ అయినా ఉండాలి, ప్రోగ్రెస్ టు సక్సెస్ అయినా ఉండాలి. గాంధీ బయోపికే తీసుకుందాం.. బ్రిటిష్ అనే విలన్ ఉన్నాడు. బ్రిటిష్ లేకపోతే ఆ బయోపిక్‌కి ఆ విలువ ఉండదు. అలాగే ఎన్టీఆర్ చాలా స్ట్రగుల్ అయ్యి సక్సెస్ సాధించారా అంటే నాకు చాలా డౌట్. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి చేతులు కట్టుకుని సినిమా ఆఫీసుల బయట నిలబడి ఉంటారా? అనిపిస్తుంది. ఆయన పుట్టుకతోనే చాలా సక్సెస్ఫుల్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ‘మేము మేము’ అని అనేవారు. ఎంతో ఆత్మవిశ్వాసం, ఎంతో కన్విక్షన్ లేకపోతే అలా ఉండలేరు మనుషులు. ఒకవేళ స్ట్రగుల్ ఉన్నా కూడా మనం నోటీస్ చేయగలిగే స్ట్రగుల్ ఉండదని నా ఉద్దేశం. స్ట్రగుల్ ఫర్ సక్సెస్ లేకుండా, విలన్ లేకుండా బయోపిక్ ఎలా వస్తుంది? ఆయన లైఫ్‌లోకి శత్రువులు వచ్చి ఉంటే లక్ష్మీపార్వతిగారి రాకతో వచ్చి ఉండాలి. ఆ శత్రువులు ఎవరనేది నేను చెప్పను. అది రకరకాల పరిస్థితుల వల్ల అవ్వచ్చు. ఆవిడ జీవితంలో ప్రవేశించినప్పటి నుంచి విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎవరి జీవితంలో అయినా వాళ్ళు కలిసిన మనుషులు, జరిపిన సంభాషణలు, జరిగిన సంఘటనలు వాళ్ల జీవితాన్ని పూర్తి చేస్తాయి. నా దృష్టిలో రామారావుగారి లైఫ్‌లో అలాంటి డైనమిక్ ఫేజ్ లక్ష్మీ పార్వతిగారు ఎంటరైనప్పటి నుంచే. దాంట్లో మీకు ఆనందం ఉండచ్చు, దుఃఖం ఉండచ్చు. మోసం, కోపం ఏదైనా ఉండచ్చు. ఆ ఫేజ్‌లో అవన్నీ ఉన్నాయి. నా సినిమా బయోపిక్ కాదు.. ఒక ఘట్టం. లక్ష్మీ పార్వతిగారు ప్రవేశించినప్పటి నుంచి ఒక ఘట్టం స్టార్ట్ అయింది అంటాను. లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడం కరెక్టేనంటారా? ఆయన వ్యక్తిగత నిర్ణయాన్ని జడ్జ్ చేయడానికి నేనెవర్ని? ఆయనకు ఎవరు నచ్చారు? ఎందుకు నచ్చారు? ఏ కారణంతో మరో పెళ్లి చేసుకున్నారు అన్నది ఆయన నిర్ణయం. మనం ఎవరం అడగటానికి? మనం రామారావుగారిని గౌరవిస్తే ఆయన గౌరవించే వాళ్లను గౌరవించడం మన బాధ్యత అన్నది నా పాయింటాఫ్ వ్యూ. ఆ విధంగా మీకు లక్ష్మీ పార్వతిగారి మీద గౌరవం ఉంది అంటారు. 100 శాతం. అలాగే నేను గౌరవిస్తానని ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఏకీభవిస్తానని కాదు. గౌరవం వేరు, ఏకీభవించడం వేరు. అసలు ఈ సినిమాలో హీరో ఎవరు? నిజం. సినిమాలో నిజమే కథానాయకుడు. ఇద్దరి లవ్ గురించే ఎక్కువ స్టోరీ ఉంటుందా? లవ్ అనే పదం చాలా వేగ్ అయిపోయింది. ప్రతిదానికి వాడే పదం అయిపోయింది. ఈ పదాలు దాటి వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చూపించాలన్నదే ఈ సినిమా తీయాలనుకోవడానికి ముఖ్య కారణం. ఆ బంధాన్ని చూపించడం కోసం మీరు లక్ష్మీపార్వతి నుంచి విషయాలు తెలుసుకున్నారా? నా ఉద్దేశంలో వాళ్లిద్దరూ సోల్‌మేట్స్. ఆవిడ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. చాలా మాట్లాడేశారు. దాచేయాలనుకుంటే నాతో కూడా పంచుకోరు కదా. ఆవిడతో ప్రత్యేకంగా మాట్లాడి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. చాలా పుస్తకాలు, ఆర్టికిల్స్ చదివాను. రామారావుగారు పాలసీ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆవిడ ఏ పనిలోనూ కలగజేసుకోలేదని ఓ ఆఫీసర్ చెప్పారు. ఇంకొకరేమో ప్రతిదాంట్లో కలగజేసుకునేవారు అన్నారు. ఇప్పుడు ఎవరు కరెక్ట్? ఎవరు తప్పు అని ఎలా చెప్పగలం? మరి మీరు ఎలా చూపించబోతున్నారు? బాగా దగ్గరిగా ఉండి సలహా ఇవ్వడం వేరు, కలగజేసుకోవడం వేరు అంటాను. మన అభిప్రాయాలను వేరే వాళ్ల మీద రుద్దడం అనేది నా దృష్టిలో కలగజేసుకోవడం. లక్ష్మీపార్వతిగారు అలా ఇంటర్ఫియర్ అయ్యారంటే అప్పుడు రామారావుగారి ఆలోచన ఏమైనట్టు? ఆయన్ను అనాలా? ఈవిడ్ని అనాలా? ఒకవైపేమో ఎన్టీఆర్ చాలా గొప్పవాడు అంటూ ఆయన మీద పార్టీలు నడుపుతున్నారు. ఆయన ఆమె మాట విని రాష్ట్రానికి సంబంధించిన పనులు చేస్తున్నారంటే ఎవరి తప్పు? లక్ష్మీ పార్వతిదా? ఎన్టీఆర్‌దా? నా పాయిం టాఫ్ వ్యూలో అడుగుతున్నా. ఒకరు చెబితే ఇన్ఫ్లుయన్స్ అయ్యే గుణం ఎన్టీఆర్‌కి ఉందంటారా? అస్సలు కాదు. ఆయన చాలా విజనరీ. ఆయన అనుకున్నది ఆయన చేస్తాడు. అందరూ కూడా చేతులు కట్టుకొని ఓట్లు అడుక్కుంటుంటే ఒరేయ్ ఓట్లు వేయకపోతే మీ ఖర్మ అని స్పీచ్‌లు ఇచ్చి మరీ గెలిచిన వ్యక్తి ఆయన. ఎవరి మాట వినరు అని ఓ పేరుంది. అనుకున్నదే చేస్తారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని తగ్గించి లక్ష్మీపార్వతిని గ్లోరిఫై చేస్తే గొడవలు ఏమైనా అవుతాయంటారా? గొడవలంటే ఏం చేస్తారు? మహా అంటే టీవీల్లో అరుస్తారు. అంతకు మించి ఏమీ ఉండదు. ఈ సినిమాను ఆపాలంటే స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్‌గారే ఆపాలి. మీ ఇంటి దగ్గరకు వచ్చి గొడవలు లాంటివి? మా ఇంటికి వచ్చినా అరుస్తారు.. అంతే. అరిచేవాళ్లు ఏమీ చేయలేరు. లక్ష్మీపార్వతిని ఎక్కువగా చూపించాలని మీరు అనుకుంటున్నారని కొందరు ఊహిస్తున్నారు. ఆవిడ్ని ఎక్కువగా చూపిస్తే ఎవరికి ఉపయోగమో నాకు అర్థం కావడం లేదు. సడన్‌గా లక్ష్మీపార్వతిగారు ఇంకో పార్టీ పెట్టేస్తారా? లక్ష్మీపార్వతిగారి మీద ఈ సినిమా తీయడం లేదు. లక్ష్మీపార్వతిగారితో ఆయనకున్న సంబంధం మీద సినిమా తెరకెక్కిస్తున్నా. సెంట్రల్ క్యారెక్టర్ లక్ష్మీపార్వతిగారు అయితే కాదు. సెట్స్ మీద ఉన్న ఎన్టీఆర్ బయోపిక్ ఆయన ముఖ్యమంత్రి అవ్వడంతో పూర్తవుతాయట. ఈ సినిమా దానికి సీక్వెల్‌గా ఉంటుంది అంటారా? 100 శాతం అనుకోవచ్చు. బయోపిక్ అనేది పుట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఉండేది. వాళ్ల ఉద్దేశమేంటో నాకు తెలియదు. అలాగే ఆ సినిమాల గురించి నేను మాట్లాడకూడదు. నేను విన్నది ఏంటంటే.. రామారావుగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిపోతుందట. నా సినిమా దాని తర్వాత మొదలవుతుంది. ఈ మూడు సినిమాలు చూస్తే ఎన్టీఆర్ బయోపిక్ చూసేసినట్టే. ఆ విధంగా రామారావుగారికి న్యాయం చేసినట్టే. పబ్లిక్ పర్సనాలిటీ చనిపోయాక ఆ వ్యక్తి గురించి సాధారణంగా నెగటివ్‌గా మాట్లాడరు. అయితే ఈ సినిమాలో అలాంటి అంశాలు కొన్ని ఉండొచ్చేమో? నెగటివ్ అనేది మనిషి చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. ఏ పరిస్థితుల్లో ఒక మనిషి అలా చేయాల్సి వచ్చింది? ఆ పరిస్థితి తెలిసిన వాడికి అది నెగటివ్‌గా అనిపించకపోవచ్చు. అలాగని పాజిటివ్‌గానూ అనిపించకపోవచ్చు. నెగటివ్ అంటే క్రిమినల్ ఆలోచనతో చేశాడా? స్వార్థంతో చేశాడా? ఒక యాక్ట్ జరిగినప్పుడు మనం మనకు తోచినట్టుగా ఏదేదో ఊహించుకుంటాం. ఇందుకు చేశారు... అందుకు చేశారని. అక్కడ ఏ ఉద్దేశంతో చేశారన్నది మనకు అర్థం అయినప్పుడు హిస్టారికల్ కోణం వస్తుంది. రెగ్యులర్ ఫార్మాట్ మూవీలో ఉన్నట్టు పాటలు, ఫైట్లు? ఫైట్లు, కామెడీ ఉండవు. పాటలు ఉంటాయి. అవి కూడా కేవలం బ్యాగ్రౌండ్లో వస్తుంటాయి. పొయిటిక్గా ఉంటాయి. కల్యాణి మాలిక్ మ్యూజిక్ డైరెక్టర్. ఒక పాట రికార్డ్ చేశాం. మీరు పాడబోతున్నారా? లేదు. ఆ విషయంలో మీరు ఆనందించవచ్చు. ‘కత్తులతో సావాసం..’ అని ‘రక్త చరిత్ర’లో పాడారు. వాయిస్ బాగానే ఉంటుంది కదా? నా వాయిస్ కొంతమందికి నచ్చుతుంది. కొంతమంది ‘నీ వాయిస్‌తో పెట్టకు రా బాబు’ అంటుంటారు. మీ పాత హిట్స్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ఓ రియలిస్టిక్ ఈవెంట్‌తో సినిమా తీస్తున్నా అని ప్రకటించగానే ఓ బజ్ క్రియేట్ అవ్వడం ఎలా అనిపిస్తోంది? నా పాయింట్ ఏంటంటే.. తనకు వచ్చిన గొప్ప రోల్ వల్ల ఓ ఆర్టిస్ట్ గొప్ప యాక్టర్ అవుతాడు. తను టేకప్ చేసిన సబ్జెక్ట్ వల్ల దర్శకుడు గొప్పవాడు అవుతాడు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్‌లో ఉన్న విషయం వల్ల వీడు ఈ ప్రాజెక్ట్‌ని బాగా టేకప్ చేయగలడు, బాగా హ్యాండిల్ చేయగలడు అనిపిస్తుంది. దాంట్లో నుంచి బజ్ వస్తుంది. అదే నేను ఇంట్రస్ట్ లేని వేరే ఏదైనా సబ్జెక్ట్ టేకప్ చేస్తే ఇంత ఉండకపోవచ్చు. ఇది ప్రపంచంలోని అందరి దర్శకులకు వర్తిస్తుంది. ‘గాడ్ ఫాదర్’ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా 40 సినిమాలు తీస్తే, నాకు గుర్తున్నవి నాలుగే. ఎందుకంటే ఆ 4 సినిమాల సబ్జెక్ట్ డిఫరెంట్‌గా, ఇంట్రస్ట్‌గా ఉండటమే. ఎన్టీఆర్ మీద రెండు సినిమాలు వస్తున్నాయి. వాటిలో వారసులు నటిస్తున్నారు. మీ సినిమాలో లేరు. ఎందుకని? వారసుల పాత్రలు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో కనిపించవు. కానీ వాళ్ల ప్రస్తావన ఉంటుంది. వాళ్ల వ్యక్తిగతం మాత్రం ఉండదు. అందుకే నాకు అవసరంలేదనిపించింది. పాత్రకు తగ్గ నటీనటులను తీసుకుంటాను. స్టార్స్ అయ్యుండాల్సిన అవసరం లేదు. సినిమా తీస్తున్నా అని వాళ్లను పర్మిషన్ అడిగారా? లేదు. ఈ సినిమాకు అవసరం కూడా లేదు. అడగలేదు అంటున్నారంటే.. ఈ సినిమా వాళ్లకు వ్యతిరేకం అనుకోవచ్చా? వ్యతిరేకం కాదు. నా స్క్రిప్ట్‌కు అవసరం లేదంతే. మరి.. లక్ష్మీపార్వతి పర్మిషన్ అడిగారా? ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్న వ్యక్తి గురించి సినిమా తీసేటప్పుడు పర్మిషన్ అవసరంలేదు. అందుకే అడగలేదు. ఇందులో ఎవరెవరి పాత్రలు ఉంటాయి? అప్పుడు లక్ష్మీపార్వతిగారు ఎన్టీఆర్ జీవితంలోకి ఎంటరయ్యాక ఉన్న పాత్రలన్నీ ఉంటాయి. అయితే వాటి గురించి ఇప్పుడు చెప్పను. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా కారణంగా పొలిటికల్‌గా వచ్చే ఎన్నికల్లో ఏదైనా మార్పు వస్తుందంటారా? అసలు నేను అంత దూరం ఆలోచించలేదు. ఒకవేళ ప్రాజెక్ట్ మధ్యలో ఆపేసే పరిస్థితులు వస్తే..? ఆపను. ఈ ప్రాజెక్ట్‌కి స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయి. ఆయన తప్ప ఈ ప్రాజెక్ట్‌ని ఎవరూ ఆపలేరు. ఎన్టీఆర్ పేరు పలికినప్పుడల్లా స్వర్గంలో ఉన్నారు అంటున్నారు. మీకెలా తెలుసు.. ఆయన స్వర్గంలోనే ఉన్నారని? నాకు దేవుడు చెప్పాడు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి స్వర్గానికి వెళ్లకపోతే ఇక స్వర్గానికి ఎవరు వెళ్తారు? ఆయన్ను అంత పాజిటివ్‌గా చూస్తున్నారా? అవును.. 100 శాతం. రాజకీయాల్లో పెను మార్పుకి కారణమైన వ్యక్తి. అనుకున్నది సాధించగల ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి. మీరు ఆడవాళ్లను ‘సెక్స్ సింబల్’లా మాత్రమే చూస్తారని కొందరి ఫీలింగ్? కొందరిది కాదు అందరిదీ. నా ఫీలింగ్ కూడా అదే. అంటే.. స్త్రీ అంటే అంతేనా? వాళ్ల టాలెంట్ ఇంపార్టెంట్ కాదా? ఎన్నో సాధిస్తున్నారు కదా? సాధించేది ఎవరైనా సాధిస్తారు. ఏదైనా సాధించాలంటే అది జెండర్‌తో సంబంధం లేదు. స్త్రీ పైలట్ అవ్వగలదు, ఇంకోటి అవ్వగలదు. ఇంకోటి సాధించగలదు. అది మగవాడు కూడా అచీవ్ చేస్తాడు. అయితే స్త్రీకి ఉన్న మహా శక్తి ఏంటంటే.. అట్రాక్షన్. కానీ మగవాడు ఎప్పటికీ స్త్రీలా ఆకర్షణీయంగా అవ్వలేడు. స్త్రీ అంత అందంగా ఉండలేడు. అందుకే స్త్రీలను పొగుడుతాను కానీ కించపరచాలనే ఉద్దేశంతో అనను. అసలు స్త్రీలను ఎప్పుడూ తక్కువ దృష్టితో చూడను, చూడలేను. ‘మీటూ’ అంటూ తమపై జరిగిన లైంగిక దాడులను బయటకు చెప్పుకోవడానికి ఫీమేల్ ఆర్టిస్టులు వెనకాడటంలేదు? ఎవరి దగ్గరైనా మీరు తేడాగా ప్రవర్తించి ఉంటే అది బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పటివరకూ చాలామంది పేర్లు బయటకు వచ్చాయి. నా పేరు ఎక్కడైనా వినిపించిందా? నేను ఏ ఆర్టిస్టునీ ఎప్పుడూ దేనికీ ఫోర్స్ చేయలేదు. నా లైఫ్‌లో ఒక స్త్రీని బలవంత పెట్టడం కానీ తనతో తప్పుగా ప్రవర్తించడం కానీ చేయలేదు.. చేయను కూడా. చెడుగా ప్రవర్తించే మగవాళ్లను ఏమంటారు? స్త్రీలంటే వాళ్లకు గౌరవం లేదు. యాక్చువల్‌గా ‘మీటూ’ అంటే ఓన్లీ సెక్సువల్ హెరాస్మెంట్ మాత్రమే కాదు. ‘నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను’ అనే పొగరు కొందరు మగవాళ్లకు ఉంటుంది. ఆ పొగరుతో స్త్రీలను తక్కువగా చూస్తారు.. వేధిస్తారు. అది ‘మీటూ’ ఉద్యమానికి దారి తీసింది. దీనివల్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు అనే అవగాహన స్త్రీలకు వస్తుంది. నేను ‘మీటూ’కి పూర్తిగా మద్దతు తెలుపుతున్నాను. ‘మీటూ’ వల్ల మార్పొస్తుందనుకుంటున్నారా? చాలా మంచి ఉద్యమం. ఇప్పుడు మగవాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తారు అనుకుంటున్నాను. కొంత మార్పు తప్పకుండా వస్తుందని అనిపిస్తోంది. అదే విధంగా చాలా ఉద్యమాల్లా ‘మీటూ’ కూడా శ్మశాన వైరాగ్యం అవుతుందేమో. కొన్ని రోజుల్లో దీన్ని కూడా మరచిపోయే అవకాశం ఉంది. మీరు దేవుణ్ణి విమర్శిస్తారు. మరోవైపు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కోసం ఏకంగా తిరుమల వెళ్లారు. మళ్లీ తెలివిగా ఆ ఎన్టీఆరే వెళ్లేలా చేశారన్నారు? ఇలా మాటలు తిప్పే నేర్పు ఎక్కడ్నుంచి వస్తుంది? ఏం తింటారు? తిండి తింటే తెలివితేటలు రావు. అసలు శ్రద్ధగా తిండి తినడం, పిల్లల్ని కనడం, వాళ్లని పెంచడం లాంటి వాటితో నేను నా టైమ్‌ని వేస్ట్ చేసుకోను. నా టైమ్‌ని తెలివితేటలు ఎలా పెంచుకోవాలా? అని ఆలోచించుకోవడానికి మాత్రమే స్పెండ్ చేస్తాను. నేను పుస్తకాలు విపరీతంగా చదువుతాను. చదవడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. సమాజం ఎంతో విలువనిచ్చే పెళ్లి వేస్ట్ అంటారా? సమాజం అంటే ఏంటి? మనుషులే కదా? ఎక్కడో ఎవరో ఏదో అంటారు. మీరు గుడ్డిగా పాటిస్తారు. నేను గుడ్డివాణ్ణి కాదు.. కళ్లున్నాయి. ఒకసారి పెళ్లి చేసుకున్నారుగా? అప్పుడు గుడ్డివాణ్ణి. ఆ తర్వాత జ్ఞానోదయం అయింది. నూటికి 99 మంది పాటించే దాన్ని మీరెందుకు తప్పు అంటారు? నేను చాలా స్పెషల్ కాబట్టి. స్పెషల్ అనుకోవడం వల్ల స్పెషల్ అవుతారా? లేక మీ స్వభావమే అంతా? అటెన్షన్ సీకింగ్ అంటే ఇష్టం. నేను పొద్దున నిద్ర లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకోబోయే వరకూ నాకు ఆనందాన్ని ఇచ్చే పనులే చేస్తుంటాను. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారనే అభిప్రాయం కొందరిలో ఉంది.. మీ ఒపీనియన్? అవును. వెన్నుపోటు పొడిచారు. ఎంతో స్ట్రాంగ్‌గా ఉండే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అంత సులువుగా ఎలా ప్రవేశించగలిగారు? అప్పుడు ఆయన జీవితంలో ఓ శూన్యం ఏర్పడింది. పరిస్థితుల ప్రభావం వల్ల ఆ శూన్యం. ఆ సమయంలో మానసిక స్థితి ఓదార్పు కోరుకునే అవకాశం ఉంది. అలాంటి టైమ్‌లోనే లక్ష్మీపార్వతిగారు ఆయన జీవితంలోకి ప్రవేశించారు. ఒక ఎమోషనల్ స్టేట్‌లో ఇది జరిగి ఉంటుందని నా అభిప్రాయం. ఫైనల్లీ.. మీరన్నట్లు అన్నీ నిజాలే చెబుతారా? నిజం మాత్రమే చెప్పాలని తీస్తున్నాను. – డి.జి. భవాని -
తిరుమల: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రెస్ మీట్
-
ఎన్టీఆర్‌పై వర్మ ఆసక్తికర కామెంట్స్
సాక్షి, తిరుమల: స్వర్గలోకంలో ఉన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, దివంగత సీఎం నందమూరి తారక రామారావు ఆశీస్సులు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకే ఉంటాయని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. నిజాలు నిరూపించగలిగే రూపంలో ఈ సినిమా ఉండబోతోందని స్పష్టం చేశారు. తిరపతిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి, చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి, జీవీ ఫిలిమ్స్ బ్యానర్ అధినేత బాలగిరి, చిత్ర యూనిట్‌తో కలిసి హాజరైన ఆయన అనంతరం సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా’ అంటూ మొదలెట్టిన వర్మ, సినిమాపై ఆసక్తి రేపేలా పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ‘ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకొని కొందరు ఓట్లు అడుగుతున్నారు. వారందరి అసలు నిజాలు ఈ సినిమాలో చూపిస్తా. ఎన్టీఆర్‌కు సంబంధించి విషయాలను తెలుసుకుంటున్న సమయంలో లక్ష్మీపార్వతి గురించి ఆయన చెప్పిన ఓ పాత వీడియోను చూశా. తిరుపతి వెంకన్నపై ఎన్టీఆర్‌కు ఎలాంటి నమ్మకం, ఎమోషన్స్ ఉన్నాయో లక్ష్మీపార్వతిపై కూడా అంతే ఉన్నాయి. ఆ మహా మనిషి చరిత్ర గురించి సినిమాను ఎవరైనా తీయవచ్చు కానీ అసలు నిజమైంది ఏదో ప్రజలే నిర్ణయిస్తారు. ఈ సినిమా నిజం కాబట్టి ఎన్టీఆర్ ఆశీస్సులు మా సినిమాకే ఉంటాయి. ఇక ఈ సినిమాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. అసలు రాజకీయం కోసం ఈ సినిమాను తీయటం లేదు. నిజం కోసమే తప్పా ఏ పార్టీ కోసం ఈ చిత్రం ఉండదు. ఈ సినిమాను జనవరి 24న రిలీజ్ చేస్తాం’ అంటూ వర్మ పేర్కొన్నారు. 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా: లక్ష్మీ పార్వతి తనకు జరిగిన అన్యాయంపై సినిమా రావడం ఆనందంగా ఉందని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ‘ఆ మహానుభావుడి అసలు చరిత్రను ఎవరూ బయటకి తీయడం లేదని బాధపడేదానిని. అసలు చరిత్ర తెలపాలని 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాను. చివరి రోజుల్లో ఆయనకు జరిగిన అన్యాయం, ముఖ్యంగా ఆరోజు జరిగిన అవమానం తెలుగు ప్రజలకు తెలిపేలా సినిమా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ తెలియదు. కానీ ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయం, ఆయన పడిన బాధను తెలపండి. ఎన్టీఆర్ ఆస్తులను ఆయన కొడుకులు తీసుకున్నారు. కానీ నేను ఆయన నుంచి పోరాట స్పూర్తిని తీసుకున్నాను’ అంటూ లక్ష్మీ పార్వతి వివరించారు. -
నిజాలు నిరూపించగలిగే రూపంలో ఈ సినిమా ఉండబోతోంది
-
20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా: లక్ష్మీ పార్వతి
-
నిరూపించగలిగే నిజాలతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలననానికి తెర తీశారు. నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ సమయంలో తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ రోజు (శుక్రవారం) ఉదయం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతితో కలిసి తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న వర్మ సాయంత్రం సినిమాకు సంబంధించిన విశేషాలను వెల్లడించనున్నట్టుగా ప్రకటించారు. అయితే అంతకు ముందే అభిమానుల కోసం ఓపెన్ ఛాలెంజ్ పేరుతో ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. ఈ మెసేజ్‌లో సినిమా తీసేందుకు కారణమైన పరిస్థితులు. సినిమా ఎవరి కోణంలో తెరకెక్కించబోతున్నారు. లక్ష్మీ పార్వతి తో కలిసి తిరుమల దర్శనానికి వెల్లడానికి కారణం. సినిమా నిర్మాణ వెనుక రాజకీయ ఉద్దేశాలు లాంటి అంశాలను వెల్లడించారు. అంతేకాదు కథ కోసం లక్ష్మి పార్వతితో పాటు ఆమె శత్రువులతోనూ చర్చించినట్టుగా వెల్లడించారు వర్మ. సినిమాను ఎన్టీఆర్ మీద ఉన్న గౌరవంతోనూ తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపిన వర్మ జనవరి 24న సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. -
‘ఎన్టీఆర్’లో హరికృష్ణ లుక్ ఇదే
స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన మరో పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, ఆయన కుమారుడు హరికృష్ణగా కళ్యాణ్‌రామ్ ఉన్న ఫొటోను దసరా సందర్భంగా బయటకు వదిలారు. బాలకృష్ణ ఠీవిగా కూర్చుని వుండగా కళ్యాణ్‌రామ్ ఆయన పక్కన వంగి ఉన్నట్టుగా బ్లాక్ అండ్ వైట్ ఫొటో అభిమానులకు కనువిందు చేస్తోంది. ‘విజయం మీది.. విజయరథ సారధ్యం నాది.. నీడలా వెన్నంటి వుంటా నాన్నగారూ’ అంటూ డైలాగ్ కూడా పెట్టారు. నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ, నటిస్తోన్న ఈ సినిమా రెండు భాగాలుగా(కథానాయకుడు, మహానాయకుడు)గా రానుంది. విద్యాబాలన్, దగ్గుబాటి రానా ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయకుడు జనవరి 9, మహానాయకుడు జనవరి 24న విడుదల కానున్నాయి. -
‘యన్.టి.ఆర్’లో విద్యాబాలన్ లుక్
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా యన్.టి.ఆర్. బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ కనిపించనున్నారు. తాజాగా సినిమాలో ఆమెలుక్ను రివీల్ చేస్తూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు విద్యా. మేకప్ రూమ్‌లో అద్దం ముందు కూర్చున్న తన ఫోటోకు ‘నేనేం చూస్తున్నాను..?’ అన్న కామెంట్‌ను యాడ్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండంగా కల్యాణ్ రామ్.. హరికృష్ణగా, రానా దగ్గుబాటి.. చంద్రబాబు నాయుడిగా, సుమంత్.. నాగేశ్వరరావు పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాను 2019 జనవరిలో రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. -
బాలయ్య ఎన్టీఆర్‌కు పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్