Vijaya Sai Reddy
-
విజయసాయిరెడ్డి రాజీనామా పై వైఎస్ జగన్ రియాక్షన్
-
Vijaysai Reddy: అందుకే గుడ్‌బై చెప్పారా?
వైఎస్సార్సీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వ రాజీనామా, రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం సంచలనమైనదే. పార్టీ అధినేత జగన్‌కు అత్యంత నమ్మకస్తుడైన నేత, రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వ్యక్తి ఈయన. రాజీనామా చేసినప్పటికీ వైఎస్ కుటుంబంతో అనుబంధం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని చెప్పడం ఆసక్తికరమైందే. రాజీనామా సందర్భంగా ఆయన జగన్‌పై తన విశ్వాసాన్ని వ్యక్తం చేయడం, అభిమానంగా మాట్లాడటం ఆ తర్వాత వైసీపీ స్పందన రాజకీయాలలో కొత్త ఒరవడిగా ఉన్నాయి. వైఎస్సార్సీపీపై కానీ, జగన్‌పై కానీ ఆయన వీసమెత్తు విమర్శ చేయకుండా గౌరవంగా బయటకు వెళ్లడం మంచి పరిణామం. మరోవైపు..ఆమోదయోగ్యం కానప్పటికీ తాము విజయసాయి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు వైఎస్సార్‌షీపీ ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఇక విజయసాయి రాజీనామా సరైన నిర్ణయమేనా?. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా చేయవచ్చా?. ఏదో బలమైన కారణం లేకుండానే ఇలా చేసి ఉంటారా?. అనే ప్రశ్నలు తలెత్తడమూ సహజమే. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన చాలా సంయమనంగానే వ్యవహరించారు. తెలుగుదేశం జాకీ మీడియా ఎంత రెచ్చగొట్టినా ఆయన ఆవేశపడలేదు. తాను అబద్దాలు చెప్పడం లేదని ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పారు. అంతేకాక తనపై అసత్య కథనాలు రాసిన టీడీపీ మీడియాపై పరువు నష్టం దావా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాకినాడ సీపోర్టు వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, దానిపై కూడా పరువు నష్టం కేసు ఉంటుందని తెలిపారు. విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని చెబుతున్నారు. దానికోసం పార్లమెంటు సభ్యత్వాన్ని వదలుకోనవసరం లేదు.ఈ మధ్యకాలంలోనే ఆయన ఒకటి, రెండు పార్లమెంటరీ కమిటీలకు ఛైర్మన్‌గా కూడా నియమితులయ్యారు. అంటే ఆయన యాక్టివ్‌గా ఉండదలిచే ఆ పదవులను తీసుకున్నట్లే కదా! మరి ఇంతలోనే ఏమైంది?. ఇంతకుముందు ముగ్గురు ఎంపీలు బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్యలు రాజ్యసభకు రాజీనామా చేశారు. వారిలో బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరి తిరిగి అదే సీటు పొందగలిగారు. బీదా, మోపిదేవిలు టీడీపీ ప్రలోభాలకు ఆకర్షతులయ్యో, రెడ్‌బుక్‌కు భయపడో ఆ పార్టీ చెప్పినట్లు విన్నారు. ఆర్.కృష్ణయ్య బీజేపీలో చేరి సీటు తెచ్చుకున్నారు. అంటే బీజేపీ గేమ్ ప్లాన్ ప్రకారం ఈయన రాజీనామా చేసినట్లు కనబడుతుంది. ఒరిజినల్‌గా మొదటి నుంచి వైఎస్సార్సీపీలోఉన్నది మోపిదేవే. ఆయనకు రాష్ట్రంలో ఏదో పదవి ఇస్తామని టీడీపీ ఆశ చూపిందని అంటారు. మరో సీటు లోకేష్‌కు సన్నిహితుడని చెబుతున్న వివాదాస్పద వ్యక్తి సానా సతీష్ కు దక్కింది. ఈ రాజీనామాల ద్వారా రాజ్యసభలో టీడీపీ తిరిగి ఎంటర్ కాగలిగింది. బహుశా టీడీపీ రాజకీయ వ్యూహాన్ని గమనించిన బీజేపీ తను అడ్వాంటేజ్ పొందాలని అనుకుని ఉండాలి. మొత్తం 11 సీట్లు వైఎస్సార్సీపీ(YSRCP) ఖాతాలో ఉండగా, ఆ ముగ్గురితో పాటు ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో నాలుగు సీట్లను వైసీపీ కోల్పోయినట్లయింది. మరో ఎంపీ అయోద్య రామిరెడ్డి కూడా రాజీనామా చేయవచ్చని వదంతులు వచ్చినా, ఆయన ఖండించారు. వర్తమాన రాజకీయాలలో అధికారం లేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో, అధికారం ఉంటే ఎలా పెత్తనం చేయవచ్చన్న దానికి ఈ పరిణామాలు ఉదాహరణగా నిలుస్తాయి. విజయసాయి మీడియా సమావేశంలో చేసిన రెండు వ్యాఖ్యలు గమనించదగినవి. గవర్నర్ పదవికి ఆశపడి తాను రాజీనామా చేయలేదని తొలుత చెప్పారు. ఆ తర్వాత గవర్నర్ పదవిని బీజేపీ ఆఫర్ చేస్తే అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. భవిష్యత్తులో ఏ పదవి చేపట్టబోనని ప్రకటించినట్లుగా లేదు. అలాగే తనకంటే శక్తి కలిగిన వ్యక్తికి ఈ పదవి వస్తుందని అభిప్రాయపడ్డారు. అంటే దాని అర్ధం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎవరైనా ప్రముఖుడు ఈ సీటు పొందబోతున్నారా అనే సందేహం వస్తుంది. ఇది ఒక ఆపరేషన్ అయి ఉంటుందని, బీజేపీ పాత్ర ఉండవచ్చని ఎక్కువ మంది భావిస్తున్నారు. ప్రత్యేకించి.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపిన వైనం ఇందుకు ఆధారంగా నిలుస్తుంది. అలాగే చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత వైరం లేదని, పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని ఆయన అంటున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ దాడులు, కేసులకు భయపడి రాజకీయాలకు దూరం అవ్వాలని భావించారా? అంటే పూర్తిగా అవునని చెప్పలేం. గతంలో జగన్‌తో పాటు ఇంతకన్నా పెద్ద కేసులనే ఆయన ఎదుర్కొన్నారు. ఏడాదిపాటు జైలులో ఉండడానికి కూడా ఆయన వెనుకాడలేదు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో ప్రముఖ నేతగా ఉండి రెండుసార్లు ఎంపీ అయ్యారు. టీడీపీ నేతలు కాని, టీడీపీ మీడియా కాని ఆయనపై ఇప్పటికీ విమర్శలు కొనసాగించాయంటే ఆ పార్టీలోని వారితో కాంటాక్ట్ ఏర్పడ లేదనుకోవచ్చు!. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ స్నేహ హస్తం అందించినట్లు అనిపిస్తుంది. బీజేపీ, జనసేన పార్టీలు ఈయనపై విమర్శలు చేయడం లేదు. టీడీపీకి తెలియకుండానే ఈ కధ నడించిందని అంటున్నారు. బీజేపీలో చేరడానికి తెలుగుదేశం అనుమతి తీసుకోవాలన్నట్లు ఆ పార్టీ జాకీ మీడియా అధినేత ఒకరు చెబుతున్నా, బీజేపీ అంత బలహీనంగా లేదేమో అనిపిస్తోంది. ఆ మాటకు వస్తే చంద్రబాబే పదే, పదే మోదీ, అమిత్ షాలను ఆకాశానికి ఎత్తేస్తున్న తీరు చూస్తే ఆయనకు ఏదో భయం పట్టుకుందన్న అనుమానం కలుగుతోంది. మరో వైపు ఎల్లో మీడియాలోని ఒక భాగం విజయసాయికి అనుకూలంగా కథనాలు ఇస్తోంది. ఆయనపై సానుభూతి కురిపిస్తోంది. విజయసాయి వైసీపీలో పదవులు కూడా నిర్వహించారు. పార్టీలో అంతర్గత విబేధాలు ఉండవచ్చని కొందరు చెబుతున్నా, వాటి గురించే రాజకీయాలనుంచి తప్పుకోవాలనే ఆలోచనకు వచ్చే భీరువు ఆయన కాదు. ఏ రాజకీయ పార్టీలోనైనా చిన్నవో, పెద్దవో సమస్యలు ఉంటాయి.అయినా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వాటికి ప్రాధాన్యత ఉండదు. కాకపోతే ఎవరైనా పార్టీని వీడడానికి అలాంటివాటిని సాకులుగా చూపుతారు. ఆ మాట కూడా విజయసాయి చెప్పలేదు. టీడీపీ జాకీ మీడియా అధినేత చేసిన కొన్ని ఆరోపణలకు ఈయన సమాధానం చెప్పి ఉండాల్సింది. ఆ మీడియా అధినేతను విజయసాయి కలిసింది వాస్తవమా? కాదా? బీజేపీలో చేరాలని యత్నించారా? అన్నదానిపై స్పష్టత ఇవ్వగలగాలి. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మరీ నీచంగా ఇప్పుడు కూడా విజయసాయిపై ఆరోపణలు చేయడం ద్వారా ఒక సంకేతం ఇచ్చింది. విజయసాయి పై టీడీపీ అదే కక్షతో ఉందని, ఆయన ఇలా రాజీనామా చేస్తారని టీడీపీ కూడా ఊహించలేకపోయిందన్నది ఒక విశ్లేషణగా ఉంది. ఒకవేళ బీజేపీ పెద్దలు ఈ సీటు తమదే అన్నప్పుడు చంద్రబాబు కాదనగలుగుతారా? అనేది ప్రశ్న. అలాకాక టీడీపీనే ఈ సీటు తీసుకుంటే పరిస్థితి మరో రకంగా ఉండవచ్చు. గతంలో 2019లో టీడీపీ ఓడిపోగానే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. చంద్రబాబే వారిని పంపించి తన దూతలుగా పెట్టుకున్నారని అంటారు. కాని జగన్ అలాంటి దొంగ రాజకీయాలు చేయరని మరోసారి తేటతెల్లమైంది. ఎందుకంటే వైఎస్సార్సీపీ ఎంపీలను ఎవరిని ఆయన బీజేపీలోకి పంపలేదు. పార్టీ వీడిన వారు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లారు. వారిలో ఇద్దరు టీడీపీలో చేరారు. దీనిని బట్టి అర్థం అయ్యేదేమిటంటే, అలాంటి కుట్ర రాజకీయాలు, లొంగుబాటు రాజకీయాలు జగన్ చేయరని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆపరేషన్ లో బీజేపీ పెద్దల హస్తం ఉండవచ్చని, ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ మాజీ ఎంపీ పాత్ర ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ లు ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి వైఎస్సార్సీపీ నేతలను వేధిస్తున్న నేపద్యంలో వాటినుంచి కాస్త ఉపశమనం పొందడానికి విజయసాయి ఇలా చేసి ఉండవచ్చా? అనేది పలువురి డౌటుగా ఉంది. కాని అలాంటివాటికి తాను భయపడనని ఆయన చెబుతున్నారు. విజయసాయి ఏ కారణంతో రాజకీయాలకు దూరం అయినట్లు చెబుతున్నా, భవిష్యత్తులో ఆయన ఏమి చేస్తారో చెప్పలేం. ఈ రాజీనామా ప్రభావం వైఎస్సార్సీపీ(YSRCP)పై ఏ మేరకు ఉండవచ్చన్నది చర్చ. తొలుత కొంత దిగ్భాంతికి గురవుతారు. ఏమై ఉంటుందని చర్చించుకున్నారు. విజయసాయి మీడియా సమావేశంలో జగన్ బలం గురించి చెప్పిన తీరు విన్నాక పార్టీ క్యాడర్ లో యథా ప్రకారం ఆత్మస్థైర్యం వచ్చింది. తనలాంటి వారిని వెయ్యిమందిని జగన్ తయారు చేయగలరని ఆయన అనడమే ఇందుకు ఉదాహరణ. అంతేకాక విజయసాయి ప్రత్యక్షంగా ప్రజలతో నిత్యం సంబంధాలు నెరపే వ్యక్తికాదు. 2024లో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి తప్పనిసరి స్థితిలోనే పోటీ చేశారు. ఓటమి తర్వాత మళ్లీ అటువైపు వెళ్లలేదు. ఆ రకంగా చూస్తే ప్రజల కోణంలో పెద్దగా తేడా ఏమి ఉండదు. కార్యకర్తలు అప్పుడే విజయసాయి వెళ్లిపోయినా పార్టీకి ఏమీ కాదని ధైర్యంగా చెప్పడం ఆరంభించారు. కొద్దిరోజుల పాటు చర్చించుకుని ఈ విషయాన్ని వదలివేయడం సహజంగానే జరుగుతుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు వంటివారు సైతం ఇలాంటి సమస్యలు ఎదుర్కున్నారు. ఇందిరాగాంధీ కేబినెట్ లో పనిచేసిన జగ్ జీవన్ రామ్,కాసుబ్రహ్మానందరెడ్డి,సి.ఎమ్.లుగా చేసిన దేవరాజ్ అర్స్, మర్రి చెన్నారెడ్డి వంటి వారు కొంతకాలం ఆమెకు రాజకీయంగా దూరం అయ్యారు. తిరిగి ఆమెకు ఉన్న ప్రజాదరణను గమనించి ఆమె పార్టీలోనే చేరారు. ఉమ్మడి ఏపీ శాసనసభలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్.టి.ఆర్.పక్కనే కూర్చుని ఉన్న ఉప నేత రఘుమారెడ్డి 1994 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. తండ్రి మరణం తర్వాత వైఎస్ జగన్(YS Jagan) ఒంటరిగానే రాజకీయ జీవితాన్ని ఆరంభించి ఒక పెద్ద పార్టీని తయారు చేసుకుని గెలుపు,ఓటములను చవిచూశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ల కూటమి అనూహ్యంగా అధికారంలోకి వచ్చినా, ఇప్పటికీ జగన్ అంటే భయపడే పరిస్థితిలోనే ఆ పార్టీలు ఉన్నాయి. చదవండి: దటీజ్ జగన్.. పగవాడైనా ఒప్పుకోవాల్సిందే!మళ్లీ వచ్చే ఎన్నికలలో జగనే గెలుస్తారేమోనని ఆ పార్టీల నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అందువల్లే ఎలాగొలా వైఎస్సార్సీపీని, జగన్ ను బలహీనపర్చాలని టీడీపీ అనేక వ్యూహాలు పన్నుతోంది. వాటిలో ఎక్కువ భాగం కుటిల రాజకీయాలే అనే సంగతి తెలిసిందే. ఈలోగా బీజేపీ తన గేమ్ తాను ఆడుతోంది. అయినా జగన్ తొణకలేదు.బెణకలేదు. ఎందరు ఎదురు నిలబడ్డా తనదారిలోనే వెళ్లే నేత ఆయన. సోనియాగాంధీ అత్యంత శక్తిమంతంగా ఉన్న రోజులలోనే తనకు రిస్క్ ఉందని తెలిసినా, ఆమె కక్ష సాధింపుతో జైలు ప్రమాదం ఉంటుందని పలువురు హెచ్చరించినా జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి కుట్రలు పన్నినా వాటిని ఎదుర్కున్నారే తప్ప తలవంచలేదు. ఈ పదిహేనేళ్ల రాజకీయంలో ఎన్నో కష్టాలు, కడగండ్లు ఎదుర్కున్న జగన్.. వచ్చే నాలుగున్నరేళ్లు కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడడానికి సన్నద్దమవుతున్నారు. అదే ఆయన బలం అని చెప్పాలి. ఆ గుండె ధైర్యాన్ని చూసే కార్యకర్తలు స్పూర్తి పొందుతుంటారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పార్టీ నుంచి ఎవరు వెళ్లినా నష్టమేమీ లేదు: వంగా గీత
సాక్షి, కాకినాడ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ కలిగిన నాయకుడు అని చెప్పుకొచ్చారు పార్టీ నాయకురాలు వంగా గీతా. ఇదే సమయంలో విజయసాయి రెడ్డి రాజీనామా బాధాకరమని అన్నారు. పార్టీ నుంచి ఎవరూ వెళ్లిపోయినా వారి లోటు తీర్చలేము అంటూ వ్యాఖ్యలు చేశారు.గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వంగా గీతా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డి రాజీనామా బాధాకరం. పార్టీలో ముఖ్యమైన, కీలకమైన వ్యక్తి విజయసాయి రెడ్డి. పార్టీ నుండి ఎవరూ వెళ్ళినా.. వారి లోటు తీర్చలేము. పార్టీ నుండి ఎవరూ బయటకు వెళ్ళినా వైఎస్సార్సీపీ కొనసాగుతుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా దృఢమైన నాయకుడు. ప్రజాదరణ ఉన్న వ్యక్తి. అధికార మార్పిడి జరిగినప్పుడు ఆయా పార్టీల నుండి వ్యక్తులు బయటకు వెళ్ళడం.. మరి కొందరు చేరడం నిరంతర ప్రక్రియ. ఇది కొనసాగుతూనే ఉంటుంది. పార్టీ అధినేత నడిచే విధానంపై పార్టీ ఉనికి ఉంటుంది. వైఎస్ జగన్‌పై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అంటూ కామెంట్స్ చేశారు.ఇదే విషయమై అంతకుముందు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘విజయసాయి రెడ్డి రాజీనామా గురించి ఆయనే చెప్పారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని మాట్లాడారు. తన లాంటి వారిని వెయ్యి మందిని వైఎస్ జగన్ తయారు చేయగలరని సాయిరెడ్డి చెప్పారు. పార్టీ మారే వారిని వద్దని చెబుతాము.. అలాంటి వారిని ఆపలేం కదా?. నాయకులను ఏ విధంగా తయారు చేయాలో వైఎస్ జగన్‌కు తెలుసు’ అంటూ కామెంట్స్ చేశారు. -
విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: విజయసాయిరెడ్డి రాజీనామాపై వైఎస్సార్సీపీ స్పందించింది. ‘‘మేము మీ నిర్ణయాన్ని ఆమోదించనప్పటికీ, మీ నిర్ణయాన్ని గౌరవిస్తాము. మా పార్టీ ఆవిర్భావం నుండి మీరు మా పార్టీకి బలమైన మూలస్తంభాలలో ఒకరిగా ఉన్నారు. కష్టాలు, విజయాలు రెండింటిలోనూ మీరు మాతో నిలబడే ఉన్నారు. ఇప్పుడు పార్టీ నుండి వైదొలగాలనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము’’ అని వైఎస్సార్సీపీ పేర్కొంది.‘‘హార్టికల్చర్‌లో మీ అభిరుచిని కొనసాగించడానికి.. రాజకీయాల నుండి వైదొలగాలనే మీ నిర్షయానికి మేము గౌరవిస్తున్నాము. పార్టీకి మీరు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భవిష్యత్తులో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము’’ అని వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. "Even though we do not approve your decision, we still respect your choice. You’ve been one of the pillars of strength for our party since its inception, standing with us through both tough times and triumphs. We respect your decision to step away from politics to pursue your… https://t.co/NCoaEYxCEq— YSR Congress Party (@YSRCParty) January 25, 2025 -
రాజకీయాల నుంచి తప్పు కుంటున్నా: విజయసాయిరెడ్డి
-
రాజకీయాలకు గుడ్ బై
-
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి : రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నానని వైఎస్సార్సీపీ రాజ్యసభా పక్ష నేత వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని.. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తి గతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని.. ఎవరూ ప్రభావితం చేయలేదని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.‘నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్‌కు, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు సదా కృతజ్ఞుడిని. జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్టీ ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనో ధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు కుటుంబంతో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్‌తో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. పార్టీ శ్రేణుల విస్మయం..వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత వి.విజయ సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించడం బాధాకరమని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. తాను ప్రలోభాలకు లొంగలేదని సాయిరెడ్డి పేర్కొన్నప్పటికీ... వైఎస్సార్సీపీ బలంతో గెలిచి ఇంకా మూడున్నరేళ్లు పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం పరోక్షంగా కూటమి పార్టీలకు లబ్ధి చేకూరుస్తుంది కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే... ఆయన రాజీనామా చేసిన స్థానంలో మళ్లీ పోటీ చేసి గెలిచేంత సంఖ్యా బలం ప్రస్తుతం వైఎస్సార్సీపీకి లేదు. అంటే దీని అర్థం.. బీజేపీ, టీడీపీలకు చెందిన వారు ఎంపీలుగా ఎన్నికయ్యేందుకు ఈ చర్య పరోక్షంగా ఉపకరిస్తుందని విశ్లేషిస్తున్నారు. అధికారం కోల్పోయి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ గొంతుకను మరింత బలంగా వినిపిస్తూ ప్రజల తరఫున పోరాడాల్సిన తరుణంలో ఇలా రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించడం.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి నిర్ణయించుకోవటాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు తప్పుబడుతున్నాయి. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.…— Vijayasai Reddy V (@VSReddy_MP) January 24, 2025 -
నేడు జమిలి ఎన్నికలపై జేపీసీ తొలి సమావేశం
-
కేవీరావుపై పరువు నష్టం దావా వేస్తా: విజయసాయిరెడ్డి
సాక్షి,హైదరాబాద్:కాకినాడ సీ పోర్టు అమ్మకం విషయంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ముగిసింది. విచారణ అనంతరం ఈడీ ఆఫీసు నుంచి బయటికి వచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘నన్ను మొత్తం 25 ప్రశ్నలు అడిగారు. కర్నాటి వెంకటేశ్వర్ రావు(కేవీరావు) ఫిర్యాదు మీద విచారణ చేశారు. ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ మీద ఈడీ కేసు నమోదు చేసింది. విక్రాంత్ రెడ్డికి కాకినాడ సీ పోర్ట్ గురించి కేవీ రావుతో మాట్లాడాలని నేను చెప్పినట్లు ఆరోపించారు. కేవీ రావు ఎవరో నాకు తెలియదు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు.ప్రజా ప్రతినిధిగా నా వద్దకు ఎంతో మంది వస్తారు.కానీ కాకినాడ సీ పోర్ట్ విషయంలో నేను ఎవరికి ఫోన్ చేయలేదు. కేవీరావు తిరుమలకు వచ్చి దేవుడి ముందే నిజాలు చెప్పాలి. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. కాకినాడ పోర్ట్ షేర్ ట్రాన్స్‌ఫర్‌కు నాకు సంబంధం లేదు. కేవీరావు మీద సివిల్ డిఫమేషన్ వేస్తాను. నాకు సంబంధం లేని విషయంలో నా పై ఆరోపణలు చేశారు.సండూరు పవర్ పెట్టుబడులపై వెరిఫై చేసి మళ్లీ పిలిస్తే సమాధానం చెప్తానని చెప్పను. విక్రాంత్‌రెడ్డి సుబ్బారెడ్డి కొడుకుగానే తెలుసు ఆయనతో నాకేం సంబంధం’అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ విచారించిందినా స్టేట్మెంట్ ఈడి అధికారులు రికార్డ్ చేశారుడిడి అధికారులు నన్ను 25 ప్రశ్నలు అడిగారుకేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసిందికేవీ రావు నాకు తెలియదు అని చెప్పానుఅతనికి నాకు ఎలాంటి సంబంధం లేదుకాకినాడ సీ పోర్ట్ విషయం లో కేవీ రావు కు ఎక్కడ నేను ఫోన్ చెయ్యాలేదుకేవీ రావు ను తిరుమల కు రమ్మని చెప్పమని చెప్పండి అని చెప్పానునేను తప్పు చేస్తే ఏ శిక్ష కైనా నేను సిద్ధంమే నెల 2020 లో నేను ఫోన్ చేసానని కేవి రావు చెపుతున్నాడుకాల్ డేటా తీసి నేను కాల్ చేశాను లేదో చూసుకోవచ్చునేను ఎక్కడ కూడా కేవీ రావు కు ఫోన్ చెయ్యాలేదుకేవీ రావు ను ఈడీ విచారణ కు పిలవండి అని కోరానురంగనాధ్ కంపెనీ నీ ప్రభుత్వం కి ఎవ్వరు పరిచయం చేసారని ఈడీ ప్రశ్నించిందినాకు సంబంధం లేదు అని చెప్పానునేను ఒక సాధారణ మైన ఎంపీ నీ మాత్రమేశ్రీధర్ అండ్ సంతాన్ కంపెనీ ఎవ్వరు ఆపాయింట్ చేసారో నాకు తెలియదు అని చెప్పానుశరత్ చంద్ర రెడ్డి తో ఉన్న సంబంధాలు కూడా అడిగారుకుటుంబ రీలేషన్ అని చెప్పానుకాకినాడ సీ పోర్ట్ విషయం లో నాకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారులుక్ ఔట్ నోటీసుల ఫై నేను ఢిల్లీ హైకోర్టు కు వెళ్ళానుకేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు కేసు అయితే నేను సివిల్ అండ్ క్రిమినల్ సూట్ వేస్తానని ఈడీ కి చెప్పానువిక్రాంత్ రెడ్డి తెలుసా అని అడిగారువిక్రాంత్ రెడ్డి తో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరుపలేదుసండుర్ పవర్ కంపెనిలో 22 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీలు గురించి అడిగారుకొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ట్రాన్సాక్షన్స్ గురించి ఇప్పుడు చెప్పడం కుదరదు అని చెప్పాను -
మేము న్యూట్రల్..ఎన్డీఏ కాదు,ఇండియా కాదు: విజయసాయిరెడ్డి
సాక్షి,విశాఖపట్నం:నలభైనాలుగు సంవత్సరాల అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఉపయోగిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కరెంటు చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ పోరుబాట పోస్టర్‌ను మంగళవారం(డిసెంబర్24) మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్,బూడి ముత్యాల నాయుడులతో కలిసి విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు.మేము ఎన్డీఏ కాదు.. ఇండియా కూటమి కాదు..మేము మొదటి నుంచి న్యూట్రల్‌గానే ఉన్నాంరాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యంమేము మొదటి నుండి చెప్తున్నాం జమిలి ఎన్నికలు వస్తాయనిజమిలి జేపీసీలో నేను కూడా ఒక సభ్యుడునిజేపీసీలో ప్రతి రాష్ట్రంలోి పర్యటిస్తుంది.. ప్రతి రాజకీయ పార్టీని కలుస్తుందిజేపీసీకి పార్టీ వైఖరిని వైఎస్ జగన్ స్పష్టం చేస్తారువిద్యుత్ ఛార్జీల పెంపుపై 27న నిరసనలు: గుడివాడ అమర్నాథ్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలుఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీల రూపాయి కూడా పెంచమని హామీ ఇచ్చారుఅధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారుఅధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 15 వేలకు కోట్లకు పైగా భారాన్ని మోపారువైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తాంవచ్చే నెల నుంచి రూపాయిన్నర వరకు యూనిట్ పై భారం పడుతుందిఆరు నెలల కాలంలో 75 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారుసంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదునాణ్యమైన విద్యుత్తు విద్య, వైద్యాన్ని అందిస్తామని చెప్పి నాణ్యమైన మద్యాన్ని అందజేస్తున్నారు -
జేపీసీలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
ఢిల్లీ : జమిలి బిల్లుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)లో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. జమిలి బిల్లుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ జేపీసీ కమిటీలో రాజ్యసభ నుంచి 12మందికి చోటు కల్పించింది. ఆ 12మందిలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు(జమిలి ఎన్నిక బిల్లును)ను లోక్‌సభ శుక్రవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఇప్పటికే మంగళవారం దిగువ సభలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశ పెట్టగా.. ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉందని విపక్షాలు ఆరోపించాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) పంపాలని డిమాండ్ చేయడంతో లోక్‌సభ జేపీసీకి పంపింది. మరోవైపు లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది.. మొత్తం 31 మందితో కూడిన జేపీసీ జాబితాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పీపీ చౌధరిని ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించారు.కమిటీలో అనురాగ్ ఠాకూర్, అనిల్ బలూనీ, సంబిత్ పాత్రా, శ్రీకాంత్ ఏక్‌నాథ్‌షిండే, సుప్రియా సూలే, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, సెల్వ గణపతి తదితరులకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (రాజ్యసభ నుంచి), బాలశౌరి(జనసేన), హరీష్ బాలయోగి(టీడీపీ), సీఎం రమేష్(రాజ్యసభ నుంచి)లకు జేపీసీలకు అవకాశం ఇచ్చారు. -
ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన సాగుతోంది: విజయసాయిరెడ్డి
సాక్షి,ఢిల్లీ: ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన సాగుతోందని, కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అసలు పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. సోమవారం(డిసెంబర్ 16) రాజ్యాంగంపై రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆదేశసూత్రాలను ఉల్లంఘిస్తున్న టీడీపీ ప్రభుత్వం రూ.86 వేల కోట్లు దారి మళ్లించిందని ఆరోపించారు. తామెప్పుడూ నిధులను మళ్లించలేదన్నారు. అనేక స్కీమ్‌ల ద్వారా పేద ప్రజలకు నిధులు చేరవేశామని గుర్తు చేశారు.రాజ్యసభలో విజయసాయిరెడ్డి పూర్తి స్పీచ్..టీడీపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది86 వేల కోట్ల రూపాయలు దారి మళ్ళించారని తప్పుడు ఆరోపణలు చేశారుటీడీపీ లోక్‌సభ తప్పుడు ప్రచారం చేసిందిమేము ఎప్పుడు ఎక్కడ నిధులు మళ్లించలేదువిద్యా దీవెన, వసతి దీవెన, కళ్యాణమస్తు, పెన్షన్ కానుక, అమ్మ ఒడి, చేయూత, జగనన్న తోడు ద్వారా కోట్లాదిమంది ఎస్సీ ఎస్టీలు , బీసీలు ప్రయోజనం పొందారువిజయవంతంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లు అమలు చేసిందిటీడీపీ రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలను ఉల్లంఘిస్తోందిమేము ఎక్కడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదుచట్టబద్ధంగా పోలీసులు చంద్రబాబునాయుడును అరెస్టు చేశారుకోర్టు చంద్రబాబు నాయుడును రిమాండ్ చేసిందిప్రభుత్వం కేవలం కేసు ఫైల్ చేసిందికేసు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుందిరాజ్యాంగ విరుద్ధం అయితే కోర్టు ఆయనను రిమాండ్ ఎందుకు పంపుతారుస్టిల్స్ స్కాంలో 370 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారుషెల్ కంపెనీల ద్వారా ఈ డబ్బును స్వాహా చేశారుప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధం రైతు భరోసాను అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధంఇంగ్లీష్ మీడియంను నిషేధించారుప్రజలకు కాకుండా కేవలం బంధువుల కోసమే దీన్ని అమలు చేస్తున్నారుఎన్టీఆర్ను వెన్నుపోటుపోవడమే రాజ్యాంగ విరుద్ధంఆర్టికల్ 46 ప్రకారం అణగారిన వర్గాలకు విద్యను ప్రోత్సహించాలని ఉందిమేము అమలు చేసిన పథకాలను టీడీపీ ఆపివేసిందికులం మతం ఆధారంగా ప్రజలను తీయడమే రాజ్యాంగ విరుద్ధంఇది టీడీపీ కొనసాగిస్తుందినాటి కేసులను ఉపసంహరించుకుంటున్నారు..ఇది రాజ్యాంగ విరుద్దమేముఖ్యమంత్రి తనపై కేసులను విత్ డ్రా చేసుకుంటున్నారుఅధికారం ఉంది కదా అని కేసులను విత్ డ్రా చేసుకుంటున్నారుమహిళలపై నేరాలు పెరిగిపోతున్న పట్టించుకోవడం లేదంటే అది రాజ్యాంగ విరుద్ధమేవిజయవాడలో వరద నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది24 గంటల సమయం ఉందని వరదలు వదిలేయడంతో అనేకమంది చనిపోయారుప్రజలను కాపాడకుండా వారిని గాలికి వదిలేసారుకాగా, సోమవారం ఉదయం రాజ్యసభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీలో కూటమి నేతల ప్రలోభాలపై ప్రశ్నల వర్షం కురిపించారు విజయసాయిరెడ్డి. వైఎస్సార్సీపీ నేతలను కుట్రపూరితంగా, ప్రలోభాలకు గురి చేసి తమ పార్టీలోకి లాక్కురని టీడీపీపై విమర్శలు చేశారు.నేడు రాజ్యసభలో ఎంపీలుగా సాన సతీష్, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా నూతన ఎంపీల ప్రమాణం నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ ప్రలోభాలపై రాజ్యసభలో ఆయన ప్రశ్నించారు. ప్రలోభాలతోనే వైఎస్సార్సీపీకి చెందిన నేతలను టీడీపీ లాక్కుందని అన్నారు. టీడీపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఈ క్రమంలో కల్పించుకున్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్.. ఈ వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లవని చెప్పారు. -
2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధమవ్వాలి: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెడుతోందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో రైతులకు మద్దుతుగా వైఎస్సార్సీపీ చేపట్టిన రైతు పోరాటానికి విశేష స్పందన లభించింది. కూటమికి దోచుకోవడమే కావాలి.. ప్రజలతో సంబంధం లేదన్నారు.విశాఖ నగరంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయ సాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్, బుడి ముత్యాల నాయుడు , ధర్మశ్రీ, వదురు కళ్యాణి, ఎంపీ తనూజ రాణి, కేకే రాజు, మళ్ళ విజయ ప్రసాద్, వాసుపల్లి గణేష్, కాయల వెంకట రెడ్డి, చెంగల వెంకట్రావు, కొండ రాజీవ్, తైనల విజయ కుమార్, చొక్కాకుల వెంకట రావు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు.అనంతరం, ఎంపీ విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ..‘ఉత్తరాంధ్రకు తిరిగి రావడం చాలా సంతోషం. గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయం వేదికగా విజయం సాధించామో మళ్ళీ అదే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓడిపోయామనే ఆందోళన అవసరం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరితో కలిసి ముందుకు సాగాలి. కార్యకర్తలకు వైఎస్ జగన్ అండగా ఉంటారు. వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటారు. నిత్యం కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలి.జమిలి ఎన్నికలు వస్తాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరుగుతుంది. 2027 ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలి. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు వస్తాయి. అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పెరుగుతాయి. మూడు స్థానాల్లో ఒక స్థానం మహిళకు వస్తుంది. మహిళలకు వైఎస్ జగన్ తగిన ప్రాధాన్యం ఇస్తారు. నాకు విశాఖ నుంచి పోటీ చేసే ఆలోచన లేదు. పార్టీని గెలిపించడమే నా పని అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ..‘పార్టీ జిల్లా కార్యాలయం ఎండాడలో ఉంది. నగర పార్టీ కార్యాలయం మద్దిలపాలెంలో నూతనంగా ఏర్పాటు చేశారు. నగర కార్యాలయం అందరికీ అందుబాటులో ఉంటుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెడుతుంది. రైతు పోరాటానికి విశేషమైన స్పందన లభించింది. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా వైఎస్ జగన్ సంస్కరణలు ప్రవేశ పెట్టారు. ఆరు నెలల్లో చంద్రబాబు 72వేల కోట్లు అప్పు తెచ్చి, సంక్షేమానికి 200 కోట్లు ఖర్చు చేశారని అన్నారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘నూతన కార్యాలయం ప్రారంభోత్సవం చాలా సంతోషం. పార్టీ చేసే పోరాటాలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. 27వ తేదీన కరెంట్ చార్జీలు పెంపుపై నిరసన కార్యక్రమం ఉంది. కూటమికి ప్రజలతో సంబంధం లేదు. మీడియాను పట్టుకొని హడావుడి చేస్తోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.అరకు ఎంపీ తనూజ రాణి మాట్లాడుతూ..అందరం కష్టపడి పని చేద్దాం. వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దాం. కూటమి పాలనలో నిత్యవసర ధరలు, కరెంట్ ఛార్జీలు పెరిగాయి. వైఎస్సార్సీపీ బలం కార్యకర్తలే అని చెప్పారు. -
ఏపీలో 427 ‘ఉద్యం సఖి’ లబ్ధిదారులు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో ‘ఉద్యం సఖి’ పథకం కింద 427 మంది లబ్ధిదారులున్నారని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సహాయ మంత్రి శోభ కరన్ ద్లాజే తెలిపారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఎంఎస్ఈలను స్థాపించిన మహిళలు ఈ ‘ఉద్యం సఖి’ పోర్టల్‌లో నమోదు చేసుకుని ఆ పథకం లబ్ధిని పొందుతున్నట్లు కేంద్ర మంత్రి శోభ కరన్ ద్లాజే పేర్కొన్నారు. ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోలేదు.. విశాఖపట్నంలో మార్కెటింగ్ టెర్మినల్ పునర్నిర్మించడానికి సవరించిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోకుండా సమీక్షించారని పెట్రోలియం, సహజవాయువులు సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. 2014 జూలైలో రూ.250కోట్ల అంచనాతో ప్రారంభించిన మార్కెటింగ్ టెర్మినల్ తొలగించిన విషయంపై రాజ్యసభలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని ప్రశి్నంచారు. 2014లో పునరుద్ధరణ ప్రతిపాదనకు రూ.247కోట్లు మంజూరు చేయగా..ఆ పనులు డ్రాప్ అయ్యాయని కేంద్ర మంత్రి రాతపూర్వకంగా తెలిపారు. సౌభాగ్య పథకం కింద.. సౌభాగ్య పథకం కింద రాష్ట్రంలో 1,81,930 కుటుంబాలకు విద్యుత్తు అందించారని కేంద్ర విద్యుత్తు సహాయ మంత్రి శ్రీపద్ నాయక్ తెలిపారు. రాజ్యసభలో సౌభాగ్య పథకం కింద ఎన్ని గ్రామాలకు విద్యుత్తు అందిస్తున్నారని ఎంపీ పరిమళ్నత్వాని అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా బదులిచ్చారు. అర్సెనిక్ కాలుష్యం బారిన ఏపీలోని 7 జిల్లాలు.. దేశవ్యాప్తంగా ఆర్సెనిక్ కాలుష్యాన్ని 25 రాష్ట్రాల్లోని 230జిల్లాలు ఎదుర్కొంటున్నాయని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ ఎస్.నిరంజన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన మౌఖికంగా సమాధానమిచ్చారు. ఏపీలో ఏడు జిల్లాలున్నట్లు తెలిపారు. ఆర్సెనిక్ కాలుష్యం వలనే భూగర్భ జలాలు కలుíÙతం అవుతున్నట్లు సమాచారం ఉందని కేంద్ర మంత్రి వివరించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021–22 నుంచి 2023–24 మధ్య 1.27 కోట్ల మంది విద్యార్థులు సమగ్ర శిక్ష పథకం ద్వారా లబ్ధి పొందారని వైఎస్సార్సీపీ ఎంపీలు డాక్టర్ గుమ్మ తనూజరాణి, మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు. అంతేగాక గత మూడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో రూ.867.60 కోట్ల వ్యయంతో 2,032 ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ ల్యాబ్స్, 4,678 స్మార్ట్ తరగతులు ప్రారంభించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. నెల్లూరు–చెన్నై హైవేని విస్తరించండి కలకత్తా–చెన్నై జాతీయ రహదారి–16 నెల్లూరు నుంచి చెన్నై వరకు రహదారిని 4–లైన్ నుంచి 6–లై¯Œన్గా మార్పు చేయాలని.. ప్రత్యేక అధికరణం 377 ద్వారా తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రస్తావించారు. ఇందులో భాగంగా కృష్ణపట్నం ఓడరేవు, శ్రీ సిటీ, మేనకూరు వంటి పారిశ్రామిక ప్రాంతాలుండడంతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని ఎంపీ గుర్తు చేశారు. హైవే విస్తరణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎంపీ పేర్కొన్నారు. ఏపీలో గత మూడేళ్లలో ప్రధానమంత్రి ముద్రా యోజన కింద నిరర్ధక ఆస్తుల సంఖ్య ఏడాదికేడాదికి తగ్గిందని వైఎస్సార్సీపీ ఎంపీలు పీవీమిధున్ రెడ్డి, డాక్టర్ గుమ్మ తనూజరాణి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరి్థక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ( ఎస్ఎల్బీసీ)ప్రకారం, ఈ కేటగిరీ కింద ఎనీ్పఏలు 2021–22లో 16.09%, 2022–23 లో 11.52%, 2023–24లో 4.68% కి తగ్గాయని కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. -
ఇండియా కూటమికి ‘దీదీ’ సరైన నాయకురాలు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ:ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి సరైన నాయకురాలు పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీయేనని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి సోమవారం(డిసెంబర్ 9) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘ఇండియా కూటమికి నాయకత్వం వహించేందుకు అవసరమైన రాజకీయ, ఎన్నికల అనుభవం ‘దీదీ’కి కావల్సినంత ఉంది. 42 లోక్‌సభ సీట్లున్న అతిపెద్ద పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి దీదీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆమె నాయకత్వ పటిమ రుజువవుతూనే ఉంది’అని విజయసాయిరెడ్డి కొనియాడారు.Hon’ble West Bengal Chief Minister Didi Mamta Ji is an ideal candidate to lead the INDIA alliance as she has the required political and electoral experience to head an alliance. Didi is also the CM of a large state with 42 Lok Sabha seats and has proven herself time and again.…— Vijayasai Reddy V (@VSReddy_MP) December 9, 2024ఇదీ చదవండి: టార్గెట్ కాంగ్రెస్..మమత రాజకీయం ఫలించేనా..? -
ఇప్పుడేం సమాధానం చెబుతావ్ బాబూ?: విజయసాయి ట్వీట్
సాక్షి, అమరావతి: తనపై చేసిన ఆరోపణలకు చంద్రబాబు సమధానం చెప్పాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘‘విశాఖ కంటెయినర్లో వెయ్యి టన్నుల డ్రగ్స్ దొరికిందంటూ చంద్రబాబు కుట్ర రాజకీయాలల్లో భాగంగా దుష్ప్రచారం చేశారు. రాష్ట్రం గంజాయి, డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందని రాద్ధాంతం చేశారు. ఓటర్లను మోసగించేందుకు పోలింగ్‌కు నెలన్నర ముందు పెద్దఎత్తున దుష్ప్రచారం చేశాడు’’ అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.ఇదీ చదవండి: సీజ్ ద పోర్ట్‘‘ఇప్పుడు ఆ కంటైనర్‌లో డ్రగ్స్ లేవని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్ధ ప్రకటించింది.. బ్రెజిల్ అధ్యక్షుడికి, నాకు లింకు పెట్టి మరీ అప్పుడు తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, అతని పచ్చకుల మీడియా ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?’’ అంటూ ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.నాపై చేసిన ఆరోపణలకు సమాదానం చెప్పు చంద్రబాబు..! @ncbn చంద్రబాబు కుట్ర రాజకీయల్లో భాగంగావిశాఖ కంటైనర్ లో వెయ్యి టన్నుల డ్రగ్స్ దొరికిందని, రాష్ట్రం గంజాయి, డగ్స్ అడ్డాగా మారిపోయిందని, ఓటర్లను మోసగించేందుకు పోలింగ్ కు నెలన్నర ముందు పెద్దఎత్తున దుష్ప్రచారం చేసాడు. ఇప్పుడు ఆ…— Vijayasai Reddy V (@VSReddy_MP) December 8, 2024 -
చంద్రబాబు, కేవీ రావుపై హైకోర్టులో పరువునష్టం దావా వేస్తా
-
కేవీరావు, చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తా: విజయసాయి
సాక్షి, ఢిల్లీ: చంద్రబాబుకు మతి భ్రమించి ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకు ముఖ్యం కాదు.. వైఎస్ జగన్‌పై కక్ష తీర్చుకోవడమే ఆయనకు టార్గెట్ అంటూ ధ్వజమెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్‌తో సహా వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా బాబు పాలన సాగుతుందన్నారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమన్న విజయసాయిరెడ్డి.. కూటమి పాలనపై చర్చ జరగకుండా ఏదోక అంశాన్ని తీసుకొస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కాకినాడ పోర్టును ఏడీబీ నిధులతో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగంలోని పోర్టును చంద్రబాబు ప్రైవేట్ పరం చేశారు. మలేషియా ప్రధానమంత్రి మహాతిర్ మహమ్మద్ తనయుడు కొంటున్నారని చంద్రబాబు చెప్పారు. ఆ ముసుగులో కేవీ రావుకు కాకినాడ పోర్టు కట్టబెట్టారు. కేవీ రావుని దొడ్డిదారిన సీఎండీ స్థానంలో కూర్చోబెట్టారు. కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచి దర్యాప్తు జరపాలి. చంద్రబాబు జేబు సంస్థ సీఐడీ ద్వారా కాకుండా సీబీఐ ద్వారా దర్యాప్తు జరపాలి’’ అని విజయసాయి డిమాండ్ చేశారు.‘‘అందరినీ క్రిమినల్ అంటాడు.. కానీ, చంద్రబాబే ఒక క్రిమినల్. కేవీరావు ఒక బ్రోకర్.. చంద్రబాబుకు చెంచా. ప్రజలను మభ్యపెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగుతోంది. కేవీరావుకు అన్యాయం జరిగిఉంటే అప్పుడే కోర్టులను ఆశ్రయించొచ్చు. కేవీరావును విక్రాంత్‌రెడ్డి భయపెట్టాడని ప్రచారం చేస్తున్నారు. కేవీరావుకు ఫోన్ చేసినట్లు, బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయా?. బ్రోకర్ పనులు చేసే కేవీరావును విక్రాంత్‌రెడ్డి భయపెట్టారంటే నమ్మొచ్చా?. కాకినాడ పోర్టును తన బినామీ కేవీరావుకు కట్టబెట్టడానికే బాబు నాటకాలు. నాపై లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరమేంటి?. కేవీరావు, చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తా’’ అని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. -
ఆ ఎఫ్ఐఆర్ బాబు సర్కార్ చౌకబారు ఎత్తుగడ.. విజయసాయి ట్వీట్
సాక్షి, ఢిల్లీ: కులవాది కేవీ రావు తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ చంద్రబాబు సర్కార్ చౌకబారు ఎత్తుగడ అంటూ వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. రాష్ట్రంలోని వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి వెన్నుపోటుదారుడు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం. అబద్ధాలు చెప్పేందుకు కేవీ రావు నాలుగు సంవత్సరాల ఆరు నెలలు ఎందుకు వేచి చూశారు?. నేను కాల్ చేశానని, బెదిరించానని నిరూపించడానికి ఆధారాలు ఉన్నాయా?’’ అంటూ విజయసాయిరెడ్డి నిలదీశారు.‘‘వాల్యుయేషన్ ఎప్పుడు చర్చలకు లోబడే ఉంటుంది?. నాకు ఆ రెండు సీఏ సంస్థలతో ఎలాంటి సంబంధం లేదు. ఈ సంస్థల భాగస్వాములెవరో నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియదు. కేవీ రావు చంద్రబాబు రాజకీయ తొత్తు. 1997లో ఏడిబీ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ పోర్టును ఏర్పాటు చేసింది. కానీ ఆ తర్వాత విదేశీ పెట్టుబడిదారులకు అమ్మేసి ప్రైవేటీకరణ చేశారు. దొడ్డిదారిన కేవీ రావును చైర్మన్‌గా నియమించారు. చంద్రబాబు, కేవీ రావు ఇద్దరు కులవాదులే’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.1/2: Who is this liar KV Rao? He is nobody, I haven't met him or seen him. He is a stooge propped up by TDP to file a false case against me. The FIR is a script of some masala Telugu Movie. I will go behind liar KV Rao for malicious prosecution and defamation.Further his money…— Vijayasai Reddy V (@VSReddy_MP) December 4, 2024కిమ్ జోన్ ఉన్‌లా చంద్రబాబు..చంద్రబాబు నియంతృత్వ ధోరణితో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపులకు దిగుతున్నారంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. ‘‘దక్షిణ భారత కిమ్ జోన్ ఉన్‌లా చంద్రబాబు తయారయ్యారు. చంద్రబాబు విధానాలకు ఎల్లో మీడియా వంత పాడుతోంది. ప్రతిపక్ష పార్టీల నాయకుల కార్యకర్తల జీవితాలను, స్వేచ్ఛను ప్రమాదంలో పెట్టారు. ఏపీ పోలీసులు వాగ్నర్ గ్రూప్ తరహాలో ప్రైవేటు సైన్యంలో చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు. ఏపీ పోలీసులు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి తప్ప టీడీపీ రాజ్యాంగం ప్రకారం కాదు...చంద్రబాబు ప్రభుత్వం అణిచివేత చర్యలు ఆయన పిరికితనానికి నిదర్శనం. ఆయన చేస్తున్న రాజకీయ ప్రతీకారానికి ఎలాంటి జస్టిఫికేషన్ లేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ల సంబరాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలు తమ జీవితాలను భయం భయంగా గడుపుతున్నారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా అణిచివేశారు. జీవించే హక్కును అధికార పార్టీ దయదాక్షిణ్యల పైన ఆధారపడేలా చేశారు’’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.1/2 : The oppression by AP Govt. under @ncbn of thousands of people shows how scared he is. It shows his cowardice, his insecurity and his inferiority complex. Chandrababu is resorting to political vengence that even he cannot justify. He cannot look at himself in the mirror.…— Vijayasai Reddy V (@VSReddy_MP) December 4, 2024 -
ఏపీలో 58.8% మహిళలకు రక్తహీనత
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో 58.8% మంది 15–49 ఏళ్ల వయసున్న మహిళల్లో రక్తహీనత అధికంగా ఉందని కేంద్రం తెలిపింది. ఈ సంఖ్య జాతీయంగా 57% ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లో వెల్లడైందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిచ్చారు. ఏపీలోని మహిళల్లో ఆహారపు అలవాట్లు, విటమిన్ సీ తగినంతగా తీసుకోకపోవడం కారణంగా రక్తహీనత ఎక్కువగా ఉందని వివరించారు. సూక్ష్మ పోషకాల అవసరాలు తీర్చేందుకు, మహిళలు, చిన్నారుల్లో రక్తహీనతను నియంత్రించేందుకు అంగన్వాడీ కేంద్రాలకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. 2024 మార్చికి ఫోరి్టఫైడ్ బియ్యం పంపిణీలో ఏపీ 100% కవరేజీ సాధించిందని, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనలో భాగంగా ఏపీలో 1.32 కోట్ల మంది మహిళలకు బలవర్ధక బియ్యం అందించినట్లు తెలిపారు. ఏపీలో 13,280 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తైంది దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 3.16 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి అయ్యిందని పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ లలన్‌సింగ్ తెలిపారు. వీటిలోని ఏపీలో 13,280 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి అయ్యిందని పేర్కొన్నారు. మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. అలాగే, దేశ వారసత్వాన్ని పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన ఏక్తా మాల్ ఒకటి ఏపీకి మంజూరు చేసినట్లు ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల సహాయ మంత్రి జితిన్ ప్రసాద లిఖితపూర్వకంగా బదులిచ్చారు. కాగా, ఏపీలో 18,913 మంది మహిళా పోలీసులు ఉన్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఎంపీ తనుజా రాణి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కడప స్టీల్‌ప్లాంట్ అంశం మా ముందు లేదు కడప స్టీల్‌ప్లాంట్ అంశం తమ వద్ద లేదని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. మంగళవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో విభజన చట్టంలో కడప స్టీల్‌ప్లాంట్ హామీ ఉందని, దీని ఏర్పాటుపై కేంద్రం ఏం చేస్తుందని ఎంపీ బాలÔౌరి ప్రశి్నంచగా పై విధంగా మంత్రి బదులిచ్చారు. ‘దిశ’ను రాష్ట్రపతి అనుమతికి స్వీకరించారు: కేంద్రం రాష్ట్రంలో మహిళల భద్రత కోసం మాజీ సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చిన ‘దిశ’చట్టం రాష్ట్రపతి పరిశీలనకు అనుమతి కోసం స్వీకరించారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ‘దిశ’ఏ దశలో ఉందని ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్నించగా..కేంద్ర మంత్రి సంజయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘దిశబిల్లు–2019’సవరణల తర్వాత కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిందన్నారు. సవరణ చేసిన ఈ బిల్లు రాష్ట్రపతి పరిశీలనకు అనుమతించారని తెలిపారు. చట్ట ప్రకారం, రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రాల నుంచి స్వీకరించబడిన బిల్లులు నోడల్ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లతో సంప్రదించి తదుపరి ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అన్ని నోడల్ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల వారి సలహాలు, సూచనలు స్వీకరించారని తెలిపారు. మహిళా భద్రతా విభాగం, హోం మంత్రిత్వ శాఖ పరిశీలనలను మరింత స్పష్టత కోసం ఏపీ ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. -
స్టీల్ ప్లాంట్ అంశం.. మంత్రి కుమారస్వామికి వైఎస్సార్సీపీ ఎంపీల వినతి పత్రం
సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వినతిపత్రం సమర్పించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్సీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని వినతిపత్రం సమర్పించారు వైఎస్సార్సీపీ ఎంపీలు. పార్టీలు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి అయోధ్య రెడ్డి, సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని హామీ ఇచ్చిన కేంద్రమంత్రి కుమారస్వామి. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 15 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల ప్రతీక. 20వేల మంది ఉద్యోగులకు మించి అక్కడ పనిచేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలి. అప్పులను వాటాలుగా బదిలీ చేయాలి’ అని కామెంట్స్ చేశారు. Met Hon’ble Minister for Steel Shri H.D. Kumaraswamy Garu along with @YSRCParty MPs to urge reconsideration of Visakhapatnam Steel Plant’s privatization. Minister assured that VSP will remain a PSU and ₹15,000 crore will be pumped in for revival. RINL, a Navratna & Telugu pride,… pic.twitter.com/D9lalIywBR— Vijayasai Reddy V (@VSReddy_MP) December 2, 2024 -
కాంగ్రెస్ వలసవాద మనస్తత్వానికి ఇదే ఉదాహరణ : ఎంపీ విజయసాయిరెడ్డి
ఢిల్లీ: పార్లమెంట్లో కాంగ్రెస్ వ్యవహార శైలిపై రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి విదేశీ దర్యాప్తు సంస్థలపై ఉన్న నమ్మకం.. మన దర్యాప్తు సంస్థలపై లేకపోవడం దౌర్భాగ్యమని అన్నారాయన.ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కాంగ్రెస్ అసత్య ప్రచారానికి దిగింది. లోక్‌సభ వాయిదా తీర్మానంతో ఆయన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో తమ సొంత పార్టీ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్ వ్యవహారాన్ని పక్కన పెడుతోంది. దీనిని బట్టే ఆ పార్టీ అర్ధసత్యాలు ప్రచారం చేస్తోందని అర్థమవుతోంది.ఆ పార్టీకి భారత దర్యాప్తు సంస్థలపై లేని నమ్మకం విదేశీ దర్యాప్తు సంస్థలపై ఉండడం మన దౌర్భాగ్యం. విదేశీ దర్యాప్తు సంస్థలపై కాంగ్రెస్‌కు ఉన్న నమ్మకం.. వాళ్ల వలసవాద మనసత్వానికి ఉదాహారణ నిలుస్తోంది’ అని ట్వీట్లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.The Congress’ adjournment motion in the Lok Sabha conveniently targets @ysjagan garu while conspicuously shielding their own CM in Chhattisgarh. This selective narrative exposes Congress’ penchant for telling only half the story. Their faith in foreign agencies over Indian…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 27, 2024 -
ఏపీలో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు: విజయసాయిరెడ్డి
-
ఏపీలో పత్తి కొనుగోలులో జాప్యం: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,ఢిల్లీ:ఏపీలో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని,పత్తి కొనుగోలులో జాప్యం జరుగుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో సోమవారం(నవంబర్ 25) ఆయన ఒక పోస్టు చేశారు. ‘పత్తి ధరలు పడిపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో కేవలం 20 పత్తి కొనుగోలు కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి.కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.కొంత తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేసేలా సీసీఐకి ఆదేశాలు ఇవ్వాలి’అని విజయసాయిరెడ్డి కోరారు. -
AP: రాష్ట్రం ఒప్పందం సెకీతోనే కదా?: మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంపై టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత, ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రక్షణశాఖ రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. వైఎస్సార్సీపీ తరపున రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి హాజరయ్యారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) తనంతకు తాను అత్యంత చౌకగా యూనిట్ విద్యుత్ రూ.2.49తో ఇస్తామని ముందుకొచ్చిందన్నారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం అని, ఇందులో లంచాలకు తావెక్కడ ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సెకీతోనే ఒప్పందాలు జరిగాయి తప్ప.. అదానీతో కాదని తేల్చిచెప్పారు. కావాలనే టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందన్నారు. పోలవరంపై భిన్న వ్యాఖ్యలుఅనంతరం లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం విషయంలో ఇటీవల మంత్రుల నుంచి భిన్నమైన స్టేట్మెంట్స్ వస్తున్నాయన్నారు. మొదట్లో ఉన్న ఎత్తు ఇప్పుడు ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఈ విషయంపై పార్లమెంట్లో చర్చిస్తామన్నారు. పునర్విభజన చట్టంలోని అనేక హామీలను కేంద్రం అమలు చేయలేదని విమర్శించారు. ఈ హామీలను అమలు చేయాలని కోరామన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దని అఖిలపక్షం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ సమావేశాల్లోనే కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపిందన్నారు. మైనార్టీలకు అన్యాయం జరగకుండా, వారి పక్షాన వైఎస్సార్సీపీ నిలబడుతుందన్నారు. ఇప్పటికే వక్ఫ్ బిల్లుపై రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి తమ పార్టీ వైఖరేమిటో తెలిపారన్నారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు కఠిన విధానాలు అవసరమని చెప్పామన్నారు.‘సోషల్’ అరెస్టులపై గొంతెత్తుతాంకూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి వైఎస్సార్సీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై దారుణంగా వ్యవహరిస్తున్నారని, అక్రమంగా అరెస్టులు చేస్తున్న విషయాన్ని అఖిలపక్షం దృష్టికి తీసుకెళ్లామని మిథున్‌రెడ్డి తెలిపారు. సోషల్ మీడియా పోస్టులపై కార్యకర్తలపై పెట్టాల్సిన సెక్షన్లు కాకుండా.. సంబంధం లేని సెక్షన్లు నమోదు చేస్తూ జైలుకు పంపుతున్న విషయాన్ని వివరించామన్నారు. దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో గొంతెత్తుతామని చెప్పారు. -
అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ
సాక్షి,ఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభమవనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేవం నిర్వహిస్తోంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం ఆదివారం(నవంబర్ 24) సమావేశమైంది. అఖిలపక్ష సమావేశానికి పలు పార్టీల ఫ్లోర్‌లీడర్లతో పాటు వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి , లోక్ సభపక్ష నేత మిథున్‌రెడ్డి హాజరయ్యారు.పోలవరం ఎత్తు , ప్రత్యేక హోదా, వక్ఫ్ బిల్లు , విశాఖ స్టీలు ప్రైవేటీకరణ అంశాలను వైఎస్సార్సీపీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు లేవనెత్తనున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల అక్రమ కేసులను నేతలు ప్రస్తావించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పార్లమెంట్లో గళం విప్పనున్నారు.కాగా, సోమవారం(నవంబర్ 25) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవనున్నాయి. డిసెంబర్ 20దాకా సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ చట్టం సవరణ బిల్లు, ఒకే దేశం ఒకే ఎన్నికలు(జమిలి ఎన్నికలు) బిల్లులతో పాటు మరో 16 బిల్లులను ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వక్ఫ్, జమిలి ఎన్నికల చట్టాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: మహాయుతి దెబ్బకు ఎల్వోపీ సీటు గల్లంతు -
ఏబీఎన్ రాధాకృష్ణకు ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్
సాక్షి, తాడేపల్లి : ఏబీఎన్ రాధాకృష్ణకు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా సవాల్ విసిరారు. రాధాకృష్ణ! బహిరంగ చర్చకు నేను రెడీ. నీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా! ఫేస్ టు ఫేస్.. కౌంటర్‌కు ఎన్ కౌంటర్..నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా? అయినా నీ పక్షపాత టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతికి నేను రావాలా!ఢిల్లీలో ఎన్జీవోలు, మేధావులు, జర్నలిస్టులు, అన్ని టీవీ చానల్స్ అందరిని ఆహ్వానించి ప్రజావేదిక మీద విశ్రాంత న్యాయమూర్తుల సమక్షంలో చర్చించుకుందాం! నేను ఐక్యరాజ్యసమితి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడైనా రెడీ!.ఎవరి చిత్తశుద్ధి ఏంటో తేల్చుకుందాం. తగ్గేదేలే! భయపడేదేలే!. గత 5 ఏళ్లలో మద్యం, ఖనిజ సిండికేట్ బ్రోకర్లు,మిగతా ఇతరత్రా డీల్స్ లో మీ బాస్ పేరు చెప్పి వసూళ్లు చేసి వారికి ఇవ్వకుండా ఎంత తీసుకున్నావో అన్ని అంశాలు కూలంకషంగా చర్చిద్దాం! రాధాకృష్ణ! బహిరంగ చర్చ కు నేను రెడీ. నీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా! ఫేస్ టు ఫేస్.. కౌంటర్ కు ఎన్ కౌంటర్.. నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా? అయినా నీ పక్షపాత టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతి కి నేను రావాలా! ఢిల్లీ లో NGO లు, మేధావులు, జర్నలిస్టులు, అన్ని tv చానెల్స్ ని అందరిని ఆహ్వానించి…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2024 జర్నలిస్ట్ కాలనీలో నువ్వుండే ప్యాలస్, నేనుండే బాడుగిళ్ళు కూడా చూపిద్దాం!. ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్డులో నువ్వు కొన్న నూరు కోట్ల విలువ చేసే స్థలం దాంట్లో ఇంకో రెండు వందలకోట్లతో కట్టుతున్న ఆఫీస్ భవంతి కూడా పరిశీలిద్దాం. రాధాకృష్ణ! నీ పత్రిక, టీవీని ఏ పునాదులపైన నిర్మించుకున్నావో మరువద్దు. నష్టాలు వస్తున్నాయని ఇప్పటికీ అమెరికా వెళ్లి ఎన్నారైల దగ్గర చందాలు తెచ్చుకోవడం వాస్తవం కాదా! కలర్ బ్లైండ్ నెస్ లాగా మీ కళ్లకు కొందరే కనిపిస్తారు. మిగతావాళ్లంతా నీవేం అన్నా పడాలి.నీకోసం సెటిల్మెంట్ల సంపాదనకు ఉపయోగపడాలి అనుకొనే స్వార్ధపూరిత మైండ్ మీది.సుద్దులు చెప్పడం మానుకో. ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయి!.రాధాకృష్ణా! ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కలంతో పోరాడి ఇందిరా గాంధీని వణికించిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ వ్యవస్థాపకుడు రామ్ నాథ్ గోయెంకా గుర్తున్నాడా?.ఆనాడు ఆయన చేసిన సాహసం వల్లే దేశంలో కాంగ్రేసేతర ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఊపిరి పోసుకుంది. గోయెంకా వారసులు ఇప్పటికీ మీడియాను నమ్ముకుని సాధారణ జీవితాలు గడుపుతున్నారు. 92 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆస్తులు, నీ నెల రోజుల సెటిల్ మెంట్ల సంపాదనతో సరిపోవంటే నీవెంత అవినీతిపరుడివో వేరే చెప్పాలా?’ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. -
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు విజయసాయిరెడ్డి సవాల్
సాక్షి, తాడేపల్లి: 'ఆంధ్రజ్యోతి'కి ఉత్తమ జర్నలిస్ట్ సాంప్రదాయాలు పాటించమని, మా స్పందన కూడా ప్రసారం చెయ్యాలని చెప్పా.. నువ్వు అసలు చిత్తశుద్ధి కలిగిన వృత్తిపరమైన పాత్రికేయుడివేనా? అంటూ ఎక్స్ వేదికగా ఏబీఎన్ రాధాకృష్ణను వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.‘‘నన్ను 2012లో సీబిఐ అరెస్ట్ చేసినప్పుడు మా ఇల్లు, ఆఫీస్ రైడ్ చేసి ఫైల్స్, అన్నిపత్రాలు స్వాధీనం చేసుకుని పూర్తిస్థాయి విచారణ జరిపారు. 12 నెలలు, కాంగ్రెస్-టీడీపీ కుట్రలో భాగంగా, జైల్లో గడిపాను. "ఆదాయానికి మించి ఆస్తులు" అభియోగాలు లేవు. నా పైన పెట్టిన సెక్షన్లు కుట్ర, ప్రేరేపణ, ఖాతా లెక్కల ఫడ్జింగ్ మాత్రమే. నీలాగ మోసగాడినో, దోపిడీదారునో, బ్లాక్ మైలర్ నో, వీలర్ డీలర్ నో కాదు. గుర్తుంచుకో!’’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు...నీలాగా మద్యం సిండికేట్ బ్రోకర్ల దగ్గర, ఖనిజాల సిండికేట్ బ్రోకర్ల దగ్గర ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు చెప్పి వారికీ ఇవ్వాలని నెల నెలా కోట్లకు కోట్లు నేను తీసుకోలేదు. ఇప్పుడు 2024లో విజయసాయి రెడ్డి అనే నేను నువ్వు చెప్పే భూదందాలు, భూముల ఆక్రమణలు పై సిబిఐ, ఈడీ విచారణకు సిద్ధం. నువ్వు సిద్ధమేనా వేమూరి రాధాకృష్ణా? ఇద్దరం కలసి జాయింట్‌గా కేంద్రవిచారణా సంస్థలకు విచారణకు పిటిషన్ పెట్టుకుందాం! సిద్ధమా!. సాధారణ విలేకరిగా ఇంత సంపద పోగేసుకున్నావ్, సీఏ చదివిన ఆడిటర్‌గా ప్రాక్టీసుతో ఈ స్థాయికి నేను వచ్చాను. ఎవరెలా సంపాదించారో తెలుగు ప్రాంతాల బయట నాతో చర్చకు సిద్ధమా? రాధాకృష్ణా’’ అంటూ విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు.1/2 ఈరోజు ఆంధ్రజ్యోతి బ్రేక్ ఫాస్ట్ న్యూస్ లో వేమూరి రాధాకృష్ణ ఉవాచ: "గుడిని మింగేది సుబ్బారెడ్డి, లింగాన్ని మింగేది సాయిరెడ్డి. భూమిని మింగిన రాక్షసులు"పలుసార్లు మీ 'ఆంధ్రజ్యోతి' కి ఉత్తమ జర్నలిస్ట్ సాంప్రదాయాలు పాటించమని, మా స్పందన/జవాబు కూడా ప్రసారం చెయ్యాలని చెప్పాను.…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 15, 2024 ‘‘22 ఏళ్ల క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రికను సాధారణ విలేకరివి అయినా రాధాకృష్ణ.. ఆంధ్రజ్యోతి స్థాపకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు కేఎల్ ఎన్ ప్రసాద్ వారసుల నుంచి సొంతం చేసుకుని 2002 అక్టోబర్‌లో మొదలెట్టి కొద్ది సంవత్సరాల్లోనే దాదాపు 20 ఎడిషన్లు పెట్టేస్థాయికి ఎదిగింది. నూజివీడు సీడ్స్ యజమాని మండవ ప్రభాకర రావు, విజై ఎలెక్ట్రికల్స్ నాటి యజమాని దాసరి జై రమేష్ వంటి పారిశ్రామికవేత్తలకు వాటాలు ఉన్నట్టు చెప్పి మరెందరో రహస్య పెట్టుబడిదారులను మోసం చేసి నువ్వు ఈ పత్రికను వేలాది కోట్ల రూపాయల సంపదగా దాన్ని మార్చుకున్న తీరు తెలుగునేలనే అపూర్వం. అనితర సాధ్యం’’ అంటూ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. ఇదీ చదవండి: కూటమికి కళ్లు నెత్తికెక్కాయి.. ఏపీ బీజేపీలో తిరుగుబాటు స్వరం -
టీడీపీకి మాయని మచ్చ.. చరిత్ర క్షమించదు: విజయసాయిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కొందరు పచ్చ నేతలు పుట్టుకతోనే చంద్రబాబుకు విధేయులమని చెప్పుకోవడం సిగ్గుచేటు.. ప్రజలను వంచించడమే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు ‘వీర విధేయుల్లో' కొందరు 30 ఏళ్ల నాటి ఎన్టీఆర్–లక్ష్మీ పార్వతికి అత్యంత సన్నిహితులనేది వాస్తవం, చారిత్రక పరిణామం. దాచేస్తే దాగని, మార్చలేని సత్యం! వీరు 1994-96 కాలంలో ఫిరాయింపుదారులు. ప్రజలకు మీడియాకు గుర్తుండదనుకోవడం వారి అజ్ఞానం. తాము పుట్టుకతోనే చంద్రబాబుకు విధేయులమని చెప్పుకోవడం సిగ్గుచేటు మరి ప్రజలని వంచించడమే.వీళ్ళలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దాడి వీరభద్రరావు, మాకినేని పెదరత్తయ్య, కె.ప్రతిభా భారతి, కిమిడి కళావెంకటరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, చిక్కాల రామచంద్రరావు, పరిటాల రవి, గాదె లింగప్ప, ముక్కు కాశి రెడ్డి, గౌతు శివాజీ, గద్దె బాబు రావు. ఎన్టీఆర్ గారికి వెన్నుపోటుపొడిచి బహిష్కరణకు గురియైన వాళ్లలో చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, అశోకగజపతి రాజు ఉన్నారు. ఈ నేతల్లో 90 శాతానికి పైగా ఎన్టీఆర్ మరణించాక 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ (ఎల్పీ) ఒక్క సీటూ దక్కించుకోకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా చంద్రబాబు పార్టీలో చేరి 1997–2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ మంత్రివర్గం సభ్యులుగా, కొందరు ఎంపీలుగా, మరి కొందరు పార్టీ పదవులు పొందారు. మాయని మచ్చ-చరిత్ర క్షమించదు’ అంటూ కామెంట్స్ చేశారు. నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు ‘వీర విధేయుల్లో' కొందరు 30 ఏళ్ల నాటి ఎన్టీఆర్–లక్ష్మీ పార్వతికి అత్యంత సన్నిహితులనేది వాస్తవం, చారిత్రక పరిణామం. దాచేస్తే దాగని, మార్చలేని సత్యం! వీరు 1994-96 కాలంలో ఫిరాయింపుదారులు. ప్రజలకు మీడియాకు గుర్తుండదనుకోవడం వారి అజ్ఞానం. తాము పుట్టుకతోనే…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 15, 2024 -
ప్రజల భద్రత కాదు.. పోలీసుల ప్రాధాన్యతలు మారిపోయాయి: విజయసాయిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏపీ పోలీసులు తమ వనరులను టీడీపీ రాజకీయ ఎజెండాకు మళ్లిస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భద్రతను పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్రంలో పోలీసుల ప్రాధాన్యతలు మారిపోయాయి. మహిళలపై అఘాయిత్యాలు, సైబర్ నేరాలు పెరుగుతున్నా వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏపీ పోలీసులు తమ వనరులను టీడీపీ రాజకీయ ఎజెండాకు మళ్లిస్తున్నారు. 680 మంది వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు అందించారు. 147 కేసులు నమోదు చేసి, 49 మందిని అరెస్టు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భద్రతను పక్కన పెట్టారు’ అని ఘాటు విమర్శలు చేశారు. The priorities of the AP Police are misplaced. Amid rising crimes against women and increasing cybercrimes, the AP police is diverting significant resources to further TDP’s political agenda—serving notices to 680 YCP social media activists, filing 147 cases, and arresting 49…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 14, 2024 -
బాబు బ్యాండ్ మేళం ప్రచారం మళ్లీ మొదలు: విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో చంద్రబాబు పాలనపై సెటైరికల్ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో చంద్రబాబు బ్యాండ్ మేళం ప్రచారాలు మళ్లీ మొదలయ్యాయని ఎద్దేవా చేశారు. అలాగే, గతంలలో మాదిరిగానే అవే గ్రాఫిక్ అభివృద్ధి పనులు, అవే లక్షల కోట్ల గ్రాఫిక్ పెట్టుబడులు అంటూ కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు బ్యాండ్ మేళం ప్రచారాలు మళ్లీ మొదలయ్యాయి. చంద్రబాబు (2014-19) మధ్య కాలంలో ఎల్లో పత్రికల నిండా వందల వేల లక్షల కోట్ల పెట్టుబడులు, అభివృద్ధి పనులు అని అమరావతిని సింగపూర్‌లా మార్చేస్తామని ఒక్కటే ప్రచారాలు, డప్పులు, భాజాబజంత్రీలతో హడావిడి చేశారు. చివరికి 2019 ఎన్నికల చివరి నాటికి పెట్టుబడులు, అభివృద్ధి శూన్యం. మరి ఏం చేశాడో చెప్పుకోలేని పరిస్థితి చంద్రబాబుది..ఇప్పుడు మళ్లీ అదే మొదలైంది. అవే యెల్లో పత్రికలు.. అవే గ్రాఫిక్ అభివృద్ధి పనులు...అవే లక్షల కోట్ల గ్రాఫిక్ పెట్టుబడులు...ఇవేవీ వాస్తవరూపం దాల్చవు. యెల్లో మీడియా గ్రాఫిక్స్‌లో మాత్రమే ఉంటాయి. అందుకే అనేది చంద్రబాబువి ఉత్తిత్తి బ్యాండ్ ప్రచారాలు అని అంటూ సెటైర్లు వేశారు.చంద్రబాబు బ్యాండ్ మేళం ప్రచారాలు మళ్లీ మొదలయ్యాయి. చంద్రబాబు (2014-19) మద్య కాలంలో ఎల్లో పత్రికల నిండా వందల వేల లక్షల కోట్ల పెట్టుబడులు, అభివృద్ధి పనులు అని అమరావతి ని సింగపూర్ లా మార్చేస్తామని ఒక్కటే ప్రచారాలు, డప్పులు, బాజాభజంత్రీలతో హడావిడి చేసారు. చివరికి 2019 ఎన్నికల…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 13, 2024 -
బాబు మాటలు ఉత్త డాబు అని తెలిపోయింది: విజయసాయిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పాలన తీరుపై మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సీఎం చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే.. అని కామెంట్స్ చేశారు. చంద్రబాబు చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు.వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే!. విశాఖ అభివృద్ధి గురించి చంద్రబాబు చెప్పే మాటలు ఉత్త డాబు అని తెలిపోయింది.. విశాఖ నగరానికి కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన కేటాయింపులు లేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. అమరావతి మీద ఉన్న ప్రేమ.. ఆదాయాలు తెచ్చిపెట్టే మిగిలిన నగరాలపై లేకపోవడం చంద్రబాబు చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే!విశాఖ అభివృద్ధి గురించి చంద్రబాబు చెప్పే మాటాలు ఉత్త డాబు అని తెలిపోయింది.. విశాఖ నగరానికి కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన కేటాయింపులు లేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. అమరావతి మీద ఉన్న ప్రేమ... ఆదాయాలు…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 13, 2024 -
పాలన చేతగాక చేతులెత్తేసిన బాబు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు, లోకేష్ చేస్తున్నది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఏపీలో పాలన చేతకాక చంద్రబాబు చేతులెత్తేశాడని కామెంట్స్ చేశారు.ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా.. చంద్రబాబు.. పాలన చేతకాక చేతులెత్తేశాడు.అక్రమ కేసులు.. నిర్బంధాలు.. చిత్రహింసలు.. రాజకీయ హత్యలు.చంద్రబాబు రాష్ట్రంలో కొత్త రాజకీయ క్రీడకు తెర లేపాడు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ చేస్తున్నది 'ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్'(వ్యవస్థీకృత నేరం).ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. 40ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు.. పాలన చేతకాక చేతులెత్తేశాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు.. ..పాలన చేతకాక చేతులెత్తేశాడు...అక్రమ కేసులు..... నిర్బంధాలు..... చిత్రహింసలు....రాజకీయ హత్యలు...చంద్రబాబు రాష్ట్రంలో కొత్త రాజకీయ క్రీడకు తెర లేపాడు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ చేస్తున్నది 'ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్'(వ్యవస్థీకృత…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 10, 2024 -
చంద్రబాబును నడిపేది, నడిపించేది అతనే...
-
నడిపేది..నడిపించేది లోకేష్.. ఇది వాస్తవం: విజయసాయిరెడ్డి
సాక్షి,తాడేపల్లి:నిజానికి,వాస్తవానికి చాలా తేడా ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం(నవంబర్ 9) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘చెప్పిన అబద్దాలు మళ్ళీ చెప్పకుండా ఉత్తిత్తి హామీలు, సూపర్ డూపర్ సిక్స్‌తో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడన్నది ‘నిజం’. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా అన్ని తానై నడిపేది, నడిపించేది లోకేష్ అన్నది ‘వాస్తవం’. నిజానికి-వాస్తవానికి మధ్య ఉన్న ఆ సన్నటి గీతని అర్ధం చేసుకోవడం ‘ప్రజాధర్మం’ అని ట్వీట్ చేశారు.నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది! చెప్పిన అబద్దాలు మళ్ళీ చెప్పకుండా ఉత్తిత్తి హామీలతో సూపర్ డూపర్ సిక్స్ తో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడన్నది "నిజం".చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా అన్ని తానై నడిపేది, నడిపించేది లోకేష్ అన్నది "వాస్తవం".నిజానికి - వాస్తవానికి మధ్య ఉన్న ఆ…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 9, 2024 ఇదీ చదవండి: పాషాణ ప్రభుత్వం.. దుర్మార్గ రాజ్యం -
చంద్రబాబు ఎప్పటికీ మారడు: విజయసాయిరెడ్డి
సాక్షి,తాడేపల్లి: ప్రపంచం ఎంతో మారింది కానీ చంద్రబాబు మారడని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం(నవంబర్ 8) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు. పోస్టులో బాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.‘చంద్రబాబు పుట్టినప్పటి నుంచి అవే అబద్ధాలు..అవే మోసాలు..జ్ఞానం కలగాల్సిన వయసులో కూడా ఏ మాత్రం సంకోచించకుండా,వెనుకాడకుండా పాపాలు చేస్తూనే ఉన్నాడు. నరకం ఇతనికి చాలదు. యముడు బాబు కోసం ప్రత్యేక లోకాన్ని సృష్టించాల్సిందే. ఆ యముడిని కూడా తప్పుదారి పట్టిస్తాడేమో’అని చంద్రబాబుపై విజయసాయిరెడ్డి తన ట్వీట్లో సెటైర్లు వేశారు. ప్రపంచం ఎంతో మారింది. కానీ చంద్రబాబు మారడు. పుట్టిన దగ్గర నుండీ అవే అబద్ధాలు, అవే మోసాలు. జ్ఞానం కలగాల్సిన వయస్సులో కూడా ఏమాత్రం సంకోచించక, వెనకాడకుండా పాపాలు చేస్తూనే వున్నాడు. నరకం ఇతనికి చాలదు...యముడు ప్రత్యేక లోకాన్ని సృష్టించాల్సిందే. ఆ యముడ్ని కూడా తప్పు దారి… pic.twitter.com/Q98AJpktSD— Vijayasai Reddy V (@VSReddy_MP) November 8, 2024 ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు -
స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు చేతులెత్తేశారు: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో సమస్యలపై పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్నామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు చేతులెత్తేశారన్నారు. రెండు లక్షల కోట్ల విలువచేసే స్టీల్ ప్లాంట్‌ను కారు చౌకగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం’’ అని మరోసారి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.విశాఖలో ఏర్పాటు చేసే ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాన్ని చంద్రబాబు విజయవాడకు తీసుకెళ్లారు. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే మా ఉద్దేశ్యం. త్వరలో ఉత్తరాంధ్రలో ఉన్న 34 అసెంబ్లీ స్థానాలు 44 స్థానాలకు పెరగనున్నాయి. ఉత్తరాంధ్రలో అన్ని స్థానాలను గెలుచుకుంటాము. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాము. వారికి ఎటువంటి కష్టం రానివ్వం’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: అప్రజాస్వామిక పాలనలో.. ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం: వైఎస్సార్సీపీ -
పవన్, బాబుపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
-
కూటమిలో పవన్ స్థాయి అది: ఎంపీ విజయసాయి రెడ్డి
విశాఖపట్నం, సాక్షి: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వం మండిపడ్డారు. రెండు రోజుల్లో కూటమి ప్రభుత్వం 100 మందిని అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ సీఎం చంద్రబాబు చేసే పాపాలు నాగుపాములై లోకేష్‌ను కాటేస్తాయి. చంద్రబాబు చేసే పాపానికి పదింతలు శిక్ష లోకేష్ అనుభవిస్తారు. అధికారం శాశ్వతం కాదనే అంశాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంగించి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది. పవన్ కళ్యాణ్‌ను కూటమిలో ద్వితీయ శ్రేణి పౌరునిగా చూస్తున్నారు. అధికారంలోకి రాక ముందు పవన్ కళ్యాణ్ కాళ్లు లోకేష్ పట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పిన మాట వినోద్దు అంటూ అధికారులకు లోకేష్ చెబుతున్నారు. లోకేష్ కోసం పవన్ కళ్యాణ్‌ను, కాపు జాతిని చంద్రబాబు తొక్కి పెడుతున్నారు. పవన్‌పై మందకృష్ణ మాదిగ విమర్శలు చంద్రబాబు మార్కు రాజకీయానికి నిదర్శనం. లోకేష్ రాజకీయ ఎదుగుదల కోసం పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు తొక్కిపెడుతున్నారు. లోకేష్‌ను సీఎం చేయడం కోసం 25 శాతం ఉన్న కాపులను పవన్ కళ్యాణ్‌ను ప్రణాళిక బద్ధంగా పక్కకుపెడుతున్నారు. ఋషికొండ అద్భుతమైన కట్టడం.. ఆ భవనం రాష్ట్రానికి తలమానికం. రుషికొండ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియని మూర్ఖుడు, అసమర్ధుడు చంద్రబాబు. ఋషికొండ భవనాలపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. జమిలీ ఎన్నికలు కచ్చితంగా వస్తాయి. పార్లమెంటు, ఎమ్మెల్యే స్థానాలు కచ్చితంగా పెరుగుతాయి. 2027 తర్వాత మేమే మళ్లీ అధికారంలోకి వస్తాం’’ అని అన్నారు.చదవండి: తస్సుమనిపించిన పవన్ ఢిల్లీ పర్యటన! -
‘బాబును కలిశాకే పవన్‌ను మందకృష్ణ తిట్టింది’
సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిసిన సంగతి తెలిసిందే. అయితే బాబుతో గంటపాటు మాట్లాడి బయటకు వచ్చిన మందకృష్ణ.. పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ వ్యాఖ్యలు మాదిగ మహిళలను అవమానించినట్లే ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందంటే అది హోంమంత్రినే కాదు, ప్రభుత్వం, చంద్రబాబును అన్నట్లే కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే బాబును కలిసిన తర్వాత మందకృష్ణ.. పవన్‌ను ఎందుకు తిట్టాడన్న సందేహం ఆయన అభిమానులకు రాలేదంటారా అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. పవన్ అభిమానులు కృష్ణ మాదిగని తిడుతున్నారు కానీ.. ఆయనతో తిట్టించిన చంద్రబాబును ఒక్క మాట కూడా అనడం లేదని తెలిపారు. ఇదే చంద్రబాబు మార్క్ రాజకీయమని అన్నారు.చంద్రబాబుని కలిసి ఆయనతో ఓక్క గంట మాట్లాడిన తరువాత బయటికి వచ్చి కృష్ణ మాదిగ పవన్ కళ్యాణ్ ను తిట్టారు.బాబుని కలిసిన తర్వాత ఎందుకు పవన్ ని తిట్టాడు అన్న సందేహం రాలేదంటారా పవన్ కళ్యాణ్ అభిమానులకు? కృష్ణ మాదిగని తిడుతున్నారు కాని కృష్ణ మాదిగ చేత పవన్ కళ్యాణ్ ని తిట్టించిన చంద్రబాబు…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2024 -
జమిలి ఎన్నికలంటూ.. దోచుకోవడానికి టీడీపీ సిద్ధమైందా?: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,తాడేపల్లి : కూటమి నేతల దారుణాల్ని చూసి తాము టీడీపీకి ఎందుకు ఓటు వేశామా? అని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జమిలి ఎన్నికలపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పాలనపై ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.ఎక్స్ వేదికపై ఎంపీ విజయసాయిరెడ్డి ఏమన్నారంటే.. ‘టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు తమ్ముళ్ల, దందాలు, దోపిడీలు, మోసాలు, హత్యలు చూసి టీడీపీకి ఎందుకు వేశామా అని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..? ఏపీలో ఏదో రకంగా నాలుగున్నర సంవత్సరాలు బతికి బట్టకట్టాలని, టీడీపీ తాపత్రయమా..? ఏపీలో ఏదో రకంగా నాలుగున్నర సంవత్సరాలు బతికి బట్టకట్టాలని, టీడీపీ తాపత్రయమా..?జమిలి....జమిలి.. 2027లో ఎన్నికలంటూ సమాచారం వస్తున్న నేపథ్యంలో ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచుకోవడంలో టీడీపీ నిమగ్నమైందా ? టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు తమ్ముళ్ల, దందాలు, దోపిడీలు,…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 4, 2024 జమిలి.. జమిలి.. 2027లో ఎన్నికలంటూ సమాచారం వస్తున్న నేపథ్యంలో ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచుకోవడంలో టీడీపీ నిమగ్నమైందా ? టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు తమ్ముళ్ల, దందాలు, దోపిడీలు, మోసాలు, హత్యలు చూసి టీడీపీకి ఎందుకు వేశామా అని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..?కూటమి పార్టీల ముఖ్యనాయకులు, కార్యకర్తల మధ్య సయోధ్య లేక అవినీతి దొంగసొమ్ము వాటాలు పంచుకోవడంలో అంతర్గత కుమ్ములాటలతో ఐదునెలల పాలనలోనే ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో మతిమరుపు వ్యాధితో చంద్రబాబు సతమతమౌతూ లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నంలో ఉన్నారా ?అరాచకాలకు పాల్పడుతున్న క్యాడర్, క్రమశిక్షణ లేని ఎమ్మెల్యేలు మంత్రులు, నిద్రాణవస్థలోకి చేజారిన అధికార యంత్రాంగం వల్ల చంద్రబాబు కేంద్రానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారా? ’ అని ట్వీట్లో పేర్కొన్నారు. -
వక్ఫ్ సవరణ బిల్లుకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విజయవాడ: ముస్లిం సంప్రదాయాలకు విరుద్దంగా ఉన్న వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈద్గా మైదానంలో జమాతే ఈ ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో జరిగిన వక్ఫ్ పరిరక్షణ మహాసభలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్ ఎప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తారన్నారు.‘‘ఈ బిల్లును కేబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యతిరేకించలేదు. వక్ఫ్ సవరణలో 8 అంశాలను వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. వైఎస్సార్సీపీ తరఫున మేము డీసెంట్ నోట్ కూడా ఇచ్చాం. ముస్లింల తరఫున వైఎస్సార్సీపీ ఎప్పుడూ నిలబడే ఉంటుంది. వక్ఫ్ బోర్డుకు ఎలా ఆదాయం పెంచాలో, ఎలా ఖర్చు పెట్టాలో అధికారం ఉంటుంది. కానీ ఆ అధికారాలను తొలగించాలనే అంశాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కామన్ ఫండ్‌ని ఏడు నుంచి ఐదు శాతానికి తగ్గించడానికి కూడా వైఎస్సార్సీపీ వ్యతిరేకం’’ అని విజయసాయిరెడ్డి చెప్పారు.‘‘రైల్వే శాఖకు 4.88 లక్షల హెక్టార్లకు పైగా భూమి ఉంది. ఆ భూముల్లో చాలా భాగం వక్ఫ్ బోర్డు ఆక్రమించుకుందంటూ కొందరు చేస్తున్న ఆరోపణలు తప్పు. కుట్రపూరితంగా వక్ఫ్ బోర్డు మీద ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను వైఎస్సార్సీపీ ఖండిస్తోంది. వక్ఫ్ బోర్డు భూములే 50 శాతం ఆక్రమణలకు గురయ్యాయి. 9.40 లక్షల ఎకరాల భూములు వక్ఫ్ బోర్డుకు ఉంటే అందులో 5 లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో ఎక్కువ భూములను ఆక్రమించారు. ఆ ఆక్రమణదారులకే భూములను కట్టబెట్టాలనే నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.‘‘ముస్లిం సంస్థలకు నాన్ హిందువులు విరాళాలు ఇవ్వకూడదన్న బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. ముస్లింలు ఇతరులకు విరాళం ఇవ్వవచ్చు. ఇతరులు మాత్రం వక్ఫ్ బోర్డుకు ఇవ్వకూడదనటం చాలా అన్యాయం. వక్ఫ్ బోర్డు సీఈవోగా గతంలో ముస్లింలే ఉండేవారు. ఇప్పుడు నాన్ ముస్లింలు కూడా సీఈవోగా ఉండొచ్చని ఈ బిల్లులో నిర్ణయం తీసుకోవటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ముస్లింల హక్కులకు భంగం కలిగిస్తే మేము సహించం. వైఎస్ జగన్ ఆదేశాలతో మేము ముస్లింల హక్కుల కోసం పోరాడతాం’’ అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. -
అధికారంలో ఉన్నది ‘అన్న’ కాదు.. శకుని : ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అన్న కాదు.. శకుని అని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఎక్స్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘నా ప్రియమైన జెండా కూలీల్లారా. మీలో నేనొకడ్ని. మనం ముందుగా పోరాటం చేయాల్సింది బానిసత్వం నుంచి విముక్తి కోసం...ఎందుకంటే లాభాల్లో వాటా మన కూలీలకు ఇవ్వరుగా..??! కూలీలకు కూలీ మాత్రమే గిడుతుంది. ఎంత కొట్టుకున్న ఉపయోగం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అన్న కాదు, శకుని.1/2: నా ప్రియమైన జెండా కూలీల్లారా. మీలో నేనొకడ్ని. మనం ముందుగా పోరాటం చేయాల్సింది బానిసత్వం నుంచి విముక్తి కోసం...ఎందుకంటే లాభాల్లో వాటా మన కూలీలకు ఇవ్వరుగా..??!కూలీలకు కూలీ మాత్రమే గిడుతుంది. ఎంత కొట్టుకున్న ఉపయోగం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అన్న కాదు, శకుని.2/2:… pic.twitter.com/yZiUyaGX9z— Vijayasai Reddy V (@VSReddy_MP) November 3, 2024 వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి అయన ఆశీస్సులతో నేను కేంద్రంలో మంత్రినయితే చట్టసవరణ చేసి కార్మికులను/కూలీలను లాభాల్లో భాగస్వాముల్ని చేస్తూ లాభాల్లో 10% వాటా ఇస్తూ, దాన్ని తప్పనిసరి చేస్తూ, దానిపై పన్ను మినహాయింపు చేస్తాం’ అని ట్వీట్లో పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో ఎవరూ ఊహించని విజయం సాధిస్తాం : ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,తిరుపతి : వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎవరూ ఊహించని విధంగా విజయం సాధిస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయని విజయసాయిరెడ్డి పేర్కొ న్నారు. ఇవాళ(ఆదివారం) చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అంటే మూఢ నమ్మకం కాదు, ప్రజలకు సేవలు చేస్తూ, దళిత గోవిందం, సోషలిస్టు భావజాలం ప్రజలకు తీసుకువెళ్ళిన నాయకుడు భూమన కరుణాకరరెడ్డి.తిరుపతి నగరం గత ఐదేళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందింది. భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలల్లో ఎన్నో దారుణాలు జరిగాయి. ‘2027 చివరిలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విజయం సాధిస్తాం. ఆ ఎన్నికల్లో భూమన కరుణాకరరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపిస్తారు’ అని అన్నారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది : సజ్జల రామకృష్ణ రెడ్డిచంద్రబాబు ప్రమాణ స్వీకారం మొదలైన నుంచి రాష్ట్రంలో అరాచకాలు మొదలయ్యాయిఒక మాఫీయ రాజ్యం ఏలుతున్నారుఅభివృద్ధి, సంక్షేమం ఎక్కడ కనిపించడం లేదురాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అరాచకం చేస్తున్నారుపార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు4 నెలల్లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరిగాయి. మనం చూస్తూనే ఉన్నాంఅడ్డంగా దోచుకుని జేబులు నింపు కుంటున్నారువ్యక్తిత్వ హననం చేస్తున్నారుమదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనపై ఏదో రాద్దాంతం చేశారుతిరుమల లడ్డు ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం చేశారువైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్రమ కట్టడాలు చేయలేదు. కరకట్ట అక్రమ కట్టడంలో చంద్రబాబు ఉంటున్నారువైఎస్ జగన్ కట్టించిన ఋషి కొండ భవనాలు చూసి చంద్రబాబు సంతోపడ్డాడుఅసెంబ్లీ భవనాలు చూస్తే నీ పాలన అర్థం అవుతుందివైఎస్ జగన్ చేసిన వేల కోట్ల సంక్షేమంతో నీవు పోల్చుకోగలవా చంద్రబాబుసూపర్ సిక్స్ ఎక్కడా అమలు లేదుఈ ఐదు నెలల్లో 53వేల కోట్లు అప్పు చేశాడు చంద్రబాబురోజు అప్పు చేస్తున్నాడు చంద్రబాబు, ఏమై పోతున్నాయివైఎస్ జగన్ చేసిన అప్పులు నిర్మాణాత్మకంగా ఉన్నాయిపార్టీ బలోపేతానికి,జవసత్వాలు పార్టీ నిర్మాణం చేస్తాంబలమైన పార్టీ కార్యకర్తలు పార్టీగా ఈసారి అధికారంలోకి రాగానే చేస్తాంఈ నేలపై చంద్రబాబుకు ఏ రోజు మమకారం లేదు ఎన్నికలు కూడా త్వరగా వచ్చేట్లు ఉన్నాయిపటిష్టమైన కార్యకర్తలతో పార్టీని సిద్ధం చేస్తున్నాం. ఇదే మా తొలిఅడుగుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి నేతృత్వంలో మరింత బలోపేతం చేస్తాంరానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే విజయంరాబోయే రోజుల్లో అన్ని స్థానాలు గెలిచి తీరుతాం : ఎంపీ వైవీ సుబ్బారెడ్డివైఎస్ జగన్ ఎన్నో అభిృవృద్ధి చారిత్రాత్మక కార్యక్రమాలు చేశారుఈరోజు ప్రజలు కు సంక్షేమం దూరం అయిందిసిక్స్ ప్యాక్ హామీలు అని చెప్పి మోసం చేశారు చంద్రబాబుడైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబుదేవుడును కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకున్నారో చూశాంవిశాఖకు వెళ్ళి ఋషి కొండ నిర్మాణలు చూస్తున్నారుసంపద సృష్టిస్తున్నాం అంటూనే..16 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంపద సృష్టిస్తే , ప్రవేట్ పరం చేస్తున్నారు చంద్రబాబురాష్ర్ట వ్యాప్తంగా 4 పోర్టులు నిర్మాణము చేస్తే చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారురాబోయే రోజుల్లో కార్యకర్తలు మరింత గుర్తింపు ఇస్తాం2027 లోనే జమీలి ఎన్నికలు రాబోతున్నాయిమళ్ళీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేద్దాం. తిరుపతి నగరం ఎంతో అభివృద్ధి చేసిన ఘనత భూమన దేదివంగత నేత వైఎస్సార్‌తో పాదయాత్రలో పాలు పంచుకున్న నేతలు ఈ స్టేజిపై భూమన కరుణాకరరెడ్డి, అంబటి రాంబాబుభూమన కరుణాకరరెడ్డి జీవితం అంతా వైఎస్ఆర్ కుటుంబం తోనే..ఆయనలో ఉన్న నాయకత్వ పటిమ రాబోయే...రోజుల్లో అన్ని స్థానాలు గెలిచి తీరుతాంప్రజా ఉద్యమం తిరుపతి నుంచే ప్రారంభమైంది : తిరుపతి ఎంపీ గురుమూర్తి,క్షేత్ర స్థాయిలో ప్రజల్లో ప్రజా ఉద్యమం తిరుపతి నుంచే ప్రారంభం అయ్యిందిరెడ్ బుక్ పాలన, చాప్టర్ 1, చాప్టర్ 2, 3 పేరుతో ప్రజలను , వైఎస్సార్సీపీ శ్రేణులును ఏవిధంగా ఇబ్బంది పెడుతున్నారో చూస్తూనే ఉన్నాంభూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో తిరుపతి పార్లమెంట్ స్థానం పరిధిలో అన్ని స్థానాలు గెలిచి తీరుతాంప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం: చెవిరెడ్డి మోహిత్ రెడ్డిభూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో మరింత ఐక్యంగా పనిచేస్తాంకూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతుంది. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాంఆదర్శ నగరంగా తిరుపతి : విజయనంద రెడ్డి, చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జిపార్టీ బలోపేతానికి అందరూ ఐక్యంగా కృషి చేస్తాంభూమన కరుణాకరరెడ్డి తిరుపతి నగరం అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిపారుఐక్యమే మన బలం, మన ఆయుధం: అంబటి రాంబాబుభూమన కరుణాకరరెడ్డి అద్బుత పుస్తక పఠన శక్తి ఉన్న నాయకుడుఉమ్మడి చిత్తూరు జిల్లా లో అన్ని స్థానాలు గెలుపుకు కృషి చేస్తారుదేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డిప్రజాస్వామ్య దేశం లో గెలుపు ఓటములు సహజంఐక్యమే మన బలం, మన ఆయుధంప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతుందిమద్యం దుకాణాలు తెరవక ముందే టిడిపి నేతలు దుకాణాలు తెరిచారువీటి అన్నింటినీ ప్రజలు దృష్టికి తీసుకువెళ్లాలి.. ప్రజలు బంగారు పళ్ళెంలో పెట్టీ మనకు అధికారం ఇస్తారుపవన్ కళ్యాణ్ మహిళలకు అన్యాయం జరిగితే సంహించను చెప్పిన వ్యక్తి ఈరోజు ఎక్కడరోజుకో హత్య , అత్యాచారం జరుగుతోందిచంద్రబాబు పాలనలో ఏమి జరిగినా ప్రశ్నించరా.. మీ నోటికి ప్లాస్టర్ తీయండిమీ బాధ్యత గుర్తు చేస్తున్నాంసీపీఐ, సీపీఎంతో పవన్ పొత్తు పెడితే చేగువేరా గుర్తుకు వస్తాదిబిజెపితో పొత్తు లో భాగంగా సనాతన ధర్మం గుర్తుకు వస్తుందిచంద్రబాబు ఋషి కొండ భవనాలు చూసి ఆశ్చర్య పోతున్నదుచంద్రబాబు ఈ భవనాలు చూసి సిగ్గు పడాలిజగన్ మోహన్ రెడ్డి ఈరోజు కాలర్ ఎగరేసుకుని చెప్పండి రుషికొండ అద్భుత భవనాలు కట్టాడు అని చెప్పండిఋషి కొండ లో ప్రభుత్వ భవనాలు కడితే విలాస భవనాలు అంటూ చంద్రబాబు విష ప్రచారం చేశారుశర వేగంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతోందిరెడ్ బుక్ కు మా కుక్క కూడా భయ పడదుయువతరం ఈరోజు ముందుకు వచ్చిందిచంద్రబాబు సొంత జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని స్థానాలు గెలుస్తుందిఐక్యత మన ఆయుధం, విజయమే మన లక్ష్యంరాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి25 ఏళ్ల చిన్న వయస్సు యువకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ను ఓడించడానికి అన్ని పార్టీలు కృషి చేశారు25 ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రగిరిలో చంద్రబాబు రంగంలోకి దించారుఆరు రోజులు లోకేష్ పాదయాత్ర చేసి మోహిత్ ఓటమికోసం పనిచేశాడుచిన్న యువకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ను ఓడించడానికి ఇన్ని కుట్రలు చేశారుచంద్రగిరి నియోజకవర్గం లో ఈరోజు 25 మంది ఎమ్మెల్యేలు పాలిస్తున్నారు విద్యార్థి దశ నుంచే భూమన నాయకత్వం పటిమ చూపారు: డాక్టర్ శిరీష, మేయర్ తిరుపతికరోనా సమయంలో మూడు సార్లు కరోనా బారిన పడ్డా వెనకడు వేయలేదుకరోనా సమయంలో అనాథ శవాలను దహనం చేసారు, సాక్షాత్తు దేశ ప్రధాని మోది నుంచి ప్రశంశలు అందుకున్నారు భూమన కరుణాకరరెడ్డిమేయర్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు అవకాశం కల్పించారుజిల్లా అధ్యక్షుడు గా ఆయన నాయకత్వం లో పనిచేస్తాంకోరుముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే కామెంట్స్..జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రతి కుటుంబం ఆలోచన చేస్తోందికష్టకాలంలో అండగా నిలిచే వ్యక్తి భూమన కరుణాకరరెడ్డికేటీఆర్ నాతో ఒక మాట అన్నారు.. దేశంలో 40 శాతం ఓటు వచ్చి ఓటమి చెందడం బాధగా ఉంది అన్నారు40 శాతం ఓటింగ్ వచ్చిన నాయకుడు జగన్మోహన్రెడ్డిరాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏవిధంగా ఉందో ప్రజలు అందరికీ తెలుసు: నారాయణస్వామిసజ్జలు రామకృష్ణా రెడ్డి పై తప్పుడు కేసులు పెట్టీ ఇబ్బందులు పెడుతున్నారుజగన్ మోహన్ రెడ్డి ఒక్కరే పార్టీచంద్రబాబు బీసీ లకు ఎప్పుడు రాజ్యసభ సీటు ఇవ్వలేదు, జగన్ మోహన్ రెడ్డి రాజ్య సభ సీటు ఇచ్చారుఈరోజు వాళ్ళు అమ్ముడు పోయారుకార్యకర్తలు మనోభావాలు దెబ్బతీయొద్దుచంద్రబాబు ఎదిరించే వాళ్ళు లేరు అంటున్నారు ఎల్లో మీడియా..ఎన్టీఆర్ లాంటి వాళ్ళనే నిలువునా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబుమేనేజ్ మెంట్ లో దిట్ట చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ, బిజెపి, విజయమ్మ, షర్మిలమ్మ ను మేనేజ్ చేస్తున్నాడుసారాయి ఇస్తాను అని చెప్పి, వీధి వీధి కు అమ్మకం చేస్తున్నారు చంద్రబాబుదేశంలో 51 శాతం ఓటు వచ్చి గెలిచిన ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి, 40 శాతం ఓట్లు వచ్చి ఓడిన ప్రజలు వెన్నంటే ఉన్నారుసర్వేలు చేయొద్దు , పేద వాడికోసం పాటుపడుతున్న జగన్ మోహన్ రెడ్డి కు అండగా నిలుద్దాంసనాతన ధర్మం గురించి మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఎంతో అధ్బుతంగా చెప్పారు, యూట్యూబ్ లో చూడండిసనాతన ధర్మం అంటే ఏమిటి అనేది పవన్ కళ్యాణ్‌కు పూర్తిగా తెలీదు చంద్రబాబు ఈ జిల్లా వాడని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నాం: ఆర్కే రోజాసూపర్ సిక్స్ కాదు, సూపర్ చీటింగ్ చేస్తున్నాడుజగన్ అన్న మనకు అండగా నిలవాలికూటమి ప్రభుత్వం మెడలు వంచాలితప్పుడు ప్రచారం వల్ల మనం ఓడి పోయాముచంద్రబాబు చెప్పిన ఉచితం లో ఉచితం లేదు..చంద్రబాబు ఈ జిల్లాలో పుట్టాడు అంటే జిల్లా ప్రజలు సిగ్గు పడాలిసూటిగా ప్రశ్నిస్తున్న.. రెడ్ బుక్ అంటూ మీ కొడుకు ఏవిధంగా వేధిస్తున్నడో చూస్తున్నాంచంద్రబాబు పాలనలో నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడు పవన్ కళ్యాణ్సూపర్ సిక్స్ అమలు కావడం లేదుసంక్షేమ పథకాలు లేవురాష్ట్రంలో మహిళలు , చిన్నారులు పై అత్యాచారాలు జరుగుతున్నాయివిజయవాడ నగరం నీట ముంచేశారు చంద్రబాబుపులిహోర పొట్లాలు కు 360 కోట్లు ఖర్చు చేశారు అని దోచుకున్నారుచంద్రబాబు విష ప్రచారం వల్లనే ఓటమి చెందాము,ఈ రాక్షస పాలన అంతం చేయాలిఈరోజు నుంచి రెట్టించిన ఉత్సాహం దూసుకు వెళ్దాంప్రశ్నించే పార్టీ అని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారుతొక్కి నారతీస్త మని చెప్పిన పవన్ కళ్యాణ్ కు ప్రజలే నొక్కి తాట తీస్తారుజగన్ మోహన్ రెడ్డి ను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి కృషి చేయాలికుల మతాలకు అతీతంగా జగన్మోహన్రెడ్డి కృషి చేశారునేను కార్యకర్తలు మనిషిని: భూమన కరుణాకరరెడ్డిచంద్రబాబు నాయుడుతో ఢీ కొట్టడము అంటే ఎప్పుడు సిద్ధమేకార్యకర్తలు కోసమే నిలబడతానునేను గ్రూపులు కట్టడానికి రాలేదు.. ఒక నేతగా కాదు.. కార్యకర్తలకు అండగా నిలుస్తానునియోజకవ్గంలో ఇన్చార్జి కు అనుగుణముగా పనిచేస్తావైఎస్.రాజారెడ్డి శిష్యుడిగా .. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో నడిచిన వాడిని, వైఎస్ జగన్మోహన్రెడ్డితో పనిచేస్తున్న వాడినిఅహంకారంతో పనిచేయను అని ప్రమాణం చేస్తున్నావైఎస్ఆర్ కుటుంబం తో 49 ఏళ్లుగా పనిచేస్తున్నావయసు సడలుతున్నా.. మొక్కవోని ధైర్యంతో పనిచేస్తాజగన్ మోహన్ రెడ్డి మళ్ళీ సిఎంగా పని చేస్తాపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలు, సలహాలు, పాటిస్తూ మందుకు వెళ్తానుఅనివార్య కారణాల వల్ల ఈ సమావేశం కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దూరంగా ఉన్నారు.. ఆయన ఒక సందేశం పంపించారుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యారాయణ సందేశంలను చదివి వినిపించిన భూమన కరుణాకరరెడ్డిఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ఒక సందేశం పంపించారుఎల్లో మీడియా దీనిపై విష ప్రచారం చేస్తోందిరాజకీయమే నాకు ఊపిరినేను కార్యకర్తగా ఉంటాను, పార్టీ పటిష్ఠం వేగవంతం చేయడానికి పనిచేస్తాజగన్ను మళ్లీ సీఎం చేసేందుకు కృషి చేస్తా -
బాబుకు మాటలెక్కువ, చేతలు తక్కువ.. విజయసాయి చురకలు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు మాటలెక్కువ, చేతలు తక్కువని మరోసారి చాటుకున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎక్స్ వేదిగా సీఎం చంద్రబాబు తీరును ఎండగట్టారు. ఏ ప్రభుత్వానికైనా రోడ్ల మరమ్మత్తులు అన్నది ఓ నిరంతర కార్యక్రమం.. దాని ప్రచారానికి, ఆర్భాటాలకి ప్రభుత్వ ధనం వృధా చేయడం చంద్రబాబు నైజం అంటూ మండిపడ్డారు.‘‘రాష్ట్రానికే తలమానికంగా ఉన్న వైజాగ్ స్టీల్ గురించి మాత్రం ముఖ్యమంత్రి నోరు మెదపడు. ఉత్తరాంధ్ర వాసుల ఆశలపై నీళ్లు జల్లేలా కార్మికులను, సంఘాలను చంద్రబాబు తప్పుబడుతున్నారు. మీ తుప్పు బట్టిన ఆలోచనలకి ఉచిత గ్యాస్ లబ్ధిదారుల్లో అరకోటి మందికి ఎగనామం పెట్టడం తెలుసు. మరి వైజాగ్‌ను అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచన ఎక్కడ చంద్రబాబూ?’’ అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.చంద్రబాబుకు మాటలెక్కువ, చేతల తక్కువని మరోసారి చాటుకున్నారు..ఏ ప్రభుత్వానికైనా రోడ్ల మరమ్మత్తులు అన్నది ఓ నిరంతర కార్యక్రమం/ప్రక్రియ. దాని ప్రచారానికి, ఆర్భాటాలకి ప్రభుత్వ ధనం వృధా చేయడం చంద్రబాబు నైజం. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న వైజాగ్ స్టీల్ గురించి మాత్రం ముఖ్యమంత్రి నోరు…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 2, 2024 -
ఏటీఎంలా పోలవరం..చంద్రబాబుపై విజయసాయిరెడ్డి వ్యంగ్య ట్వీట్
-
బాబు వచ్చాడు.. భవిష్యత్ అంధకారమే: విజయసాయిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ధరల పెరుగుదలతో పేద మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే, విద్యుత్ చార్జీలు పెంచేందుకు చంద్రబాబు సిద్దం అవుతున్నాడని కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా.. బాబు వచ్చాడు.. ధరలు ఆకాశాన్నంటాయి. కూరగాయలు కొండెక్కి.. మాంసం ధరలు మండిపోతూ.. పప్పులు నిప్పయ్యాయి. ఒకదాని ధర పెరిగిందని మరోదానితో సర్దుకునే పరిస్థితి లేక ఇంటి ఖర్చు అమాంతం పెరిగిపోయింది.పేద, మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు పట్టించుకోవడం లేదు. మరోవైపు సామాన్యుడిపై విద్యుత్ చార్జీలు పెంచేందుకు చంద్రబాబు సిద్దం అవుతున్నాడు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటి నినాదం కాస్తా.. ఇప్పుడు బాబు వచ్చాడు-భవిష్యత్తు అంధకారం నినాదంగా మారిపోయింది అంటూ కామెంట్స్ చేశారు. బాబు వచ్చాడు.. ధరలు ఆకాశాన్నంటాయి. కూరగాయలు కొండెక్కి ....మాంసం ధరలు మండిపోతూ.....పప్పులు నిప్పయ్యాయి. ఒకదాని ధర పెరిగిందని మరోదానితో సర్దుకునే పరిస్థితి లేక ఇంటి ఖర్చు అమాంతం పెరిగిపోయింది. పేద మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు పట్టించుకోవడం లేదు. మరోక వైపు…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 31, 2024 -
విజయసాయి రెడ్డికి అరుదైన అవకాశం...
-
చంద్రబాబుది ఎప్పుడూ దుర్బుద్ధే: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,అమరావతి : చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను ఏటీఎంలా వినియోగిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రావడం ఆలస్యం పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్ట్ నిధులను దారి మళ్లించడమే కాక ప్రాజెక్ట్‌కు చంద్ర గ్రహణం పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును తగ్గిస్తే తాగు,సాగు నీటి అవసరాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు దుర్భుద్ధిని గ్రహించి తగిన గుణపాఠం చెప్పాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. చంద్రబాబు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు. అధికారంలోకి రావడం ఆలస్యం-పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు. ప్రాజెక్టు నిధులను దారిమళ్లించడమే కాక ప్రాజెక్టుకు చంద్ర గ్రహణం పట్టిస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తే తాగు, సాగు నీటి…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 31, 2024 -
కరువు, చంద్రబాబు కవల పిల్లలు : ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,అమరావతి: చంద్రబాబు, కరువు అవిభక్త కవలలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని బంధం ఉందని అన్నారుఏపీలో వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది. ఈ మేరకు రాష్ట్రంలోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నంబరు15 జారీచేసింది. ఈ జీవోపై ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. బాబు వస్తే కరువు వస్తుందిచంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేది నానుడి. ఈ ఏడాది నైరుతి అనుకూలించినా రాయలసీమలో కరువు నీడలు వెంటాడుతున్నాయి. ఐదు జిల్లాలలో 54 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి. వైయస్సార్సీపి…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 30, 2024బాబు వస్తే కరువు వస్తుంది.చంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేది నానుడి. ఈ ఏడాది నైరుతి అనుకూలించినా రాయలసీమలో కరువు నీడలు వెంటాడుతున్నాయి. ఐదు జిల్లాలలో 54 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి.వైఎస్సార్సీపీ హయాంలో రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని పక్కన పెట్టి రైతుల ఉసురు తీసుకుంటున్నారు’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో తాండవించిన కరువు.. కాగా, రాష్ట్రంలో దుర్భిక్షం మొదలైంది. వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది.వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది. రాష్ట్రంలోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో నంబరు 15 జారీచేసింది. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉన్న ఈ మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపింది. 27 మండలాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు, 27 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. కలెక్టర్లు ఆయా జిల్లా గెజిట్లలో కరువు మండలాలను నోటిఫై చేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. -
రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసకర.. రాక్షస పాలన : ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,అమరావతి : చంద్రబాబు పాలనపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన విధ్వంసకర,రాక్షసంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనా కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలబెట్టారన్నారు. .వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రాన్ని 'హరిత ఆంధ్రప్రదేశ్'గా..ఆరోగ్య ఆంధ్రప్రదేశ్'గా... 'విద్యా ఆంధ్రప్రదేశ్'గా తీర్చిదిద్దితే.. నేడు ఈ టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా.. మద్యాంధ్రప్రదేశ్‌గా.. అనారోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చేస్తున్నారు’అని ఎక్స్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసకర... రాక్షస పాలన. జగన్ గారు గత ఐదేళ్ల పాలనా కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలబెట్టారు. ముఖ్యంగా నాడు రాష్ట్రాన్ని 'హరిత ఆంధ్రప్రదేశ్'గా.. 'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్'గా... 'విద్యా ఆంధ్రప్రదేశ్'గా తీర్చిదిద్దితే.. నేడు ఈ టీడీపీ ప్రభుత్వం…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 29, 2024 -
బెయిల్ రద్దు కుట్రలో భాగమౌతారా?: విజయసాయిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈడీ జప్తు చేసిన, హైకోర్టు స్టే విధించిన సరస్వతి పవర్ షేర్లను ట్రాన్స్ఫర్ చేస్తే వైఎస్ జగన్‌కు ఇబ్బందులు ఎదురై బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని తెలిసినా షర్మిల రాజకీయ కుట్రలో భాగస్వామిగా మారి కుట్రపూరితంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. దీనిపై వైఎస్ జగన్ రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జీల న్యాయ సలహాను షర్మిలకు పంపించినా పెడచెవిన పెట్టారని చెప్పారు. ఏ చెల్లి అయినా ఇలా చేస్తుందా? అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్సార్ చనిపోయిన పదేళ్లకు.. షర్మిలకు వివాహమైన 20 ఏళ్ల తరువాత తాను వ్యాపారాల ద్వారా సంపాదించిన వాటిల్లో రూ.200 కోట్లు ఇచ్చిన అన్న పట్ల.. తన సొంత ఆస్తిలో 40 % ఇవ్వటానికి సిద్ధపడిన అన్నపై కనీస కృతజ్ఞత లేకపోగా నువ్వు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏమిటంటే.. చంద్రబాబుతో కలసి బెయిల్ రద్దు చేసే కుట్రలు పన్నటమేని షర్మిలను విమర్శించారు. మీరు తాజ్‌మహల్, విప్రో కావాలని అడిగితే ఇచ్చేస్తారా షర్మిలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కుయుక్తులను షర్మిల తెలుసుకోవాలని హితవు పలికారు. అతి మంచితనం వల్లే జగన్ అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియాతో కలిసి నిర్వహించే మీడియా సమావేశాల్లో ప్రజా సమస్యల కంటే జగన్‌పై దూషణలకే షర్మిల 95 శాతం ప్రాధాన్యమిస్తోందన్నారు. తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికే ఇదంతా అని షర్మిల చెప్పడం అబద్ధమని, చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికే అన్నపై కుయుక్తులు పన్నుతూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తనపై, వైవీ సుబ్బారెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలు, ఆస్తుల విషయంలో జగన్‌పై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. షర్మిలది ఆస్తి తగాదా కాదని, అధికారానికి సంబంధించిందన్నారు. జగన్‌ను తిరిగి సీఎం కాకుండా చేయాలన్నదే షర్మిల ఆలోచనని, చంద్రబాబు ఇచ్చిన అజెండాతోనే ఆమె పనిచేస్తున్నారన్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నా, కేంద్రంలో ఆ పార్టీకి ఎన్డీఏ వ్యతిరేకమైనా, ఆమె బాబుతో లాలూచీపడి జగన్‌పై కుట్రలు చేస్తోందన్నారు. షర్మిల మాటలను ప్రజలు నమ్మరుతల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తి ప్రజలకు ఏం లబ్ధి చేకూరుస్తారని ప్రశ్నించడం, జగన్‌ను నమ్మొదని చెప్పడం ఎంత ద్రోహమో, అన్యాయమో తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని షర్మిలకు సూచించారు. చంద్రబాబు మాటలనే ఆమె వల్లిస్తున్నారని, ఆయన అజెండాను నెత్తిన పెట్టుకున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ కోటిన్నర కుటుంబాలకు, 80 లక్షల మంది అక్క చెల్మెమ్మలకు ఆసరా ఇచ్చారని, 45 లక్షల మందికి అమ్మ ఒడి అమలు చేశారని, అలాంటి సీఎం దేశంలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ఇంత మందికి మేలు చేసిన జగన్ సొంత ఇంట్లో తల్లి, చెల్లికి అన్యాయం చేస్తారని కుట్రపూరితంగా చెబుతుంటే ఎవరు నమ్ముతారని షర్మిలను నిలదీశారు. మహిళల్లో జగన్ పట్ల వ్యతిరేకత పెంచాలనే చంద్రబాబు దుర్మార్గ అజెండాకు షర్మిల సహకరిస్తోందన్నారు. తండ్రి మృతికి కారణమైన బాబుతో దోస్తీదివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మృతికి కారణమైన చంద్రబాబుతో కలిసి షర్మిల కుట్రలు చేయడం దుర్మార్గమని సాయిరెడ్డి పేర్కొన్నారు. తన తండ్రి మరణానికి చంద్రబాబే కారణమని షర్మిల గతంలో అనేకసార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘రాజశేఖర్‌రెడ్డి మరో 15 రోజుల్లో దుర్మార్గమైన చావు చస్తాడని’ అంతకుముందు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకోవాలన్నారు. వైఎస్ మరణానికి చంద్రబాబే కారణమని దీన్ని బట్టి అర్థం కావడం లేదా? అని నిలదీశారు. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం, పసుపు చీర కట్టుకుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించడం, చర్చలు జరపడం, కుట్రలు చేయడం... ఇంతకన్నా అమానవీయ ప్రవర్తన ఉంటుందా? అని ప్రశ్నించారు. శంకర్రావు, ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని వాడుకుని జగన్‌ను తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపిన విషయం మరిచిపోయారా? అని షర్మిలను ప్రశ్నించారు. జగన్ మోచేతి నీళ్లు తాగుతూ అనుకూలంగా మాట్లాడుతున్నామని తనను, వైవీ సుబ్బారెడ్డిని షర్మిల విమర్శించడం సహేతుకం కాదన్నారు. శత్రువుకు మేలు చేసేందుకు సొంత అన్ననే వేటాడి, వెంటాడి కాటేసే చెల్మెమ్మ షర్మిల మినహా ఎక్కడా చూడలేదన్నారు. వైఎస్ఆర్ ఆత్మ క్షోభకు కారణమైన షర్మిల ఎల్లో మీడియా ముందు పెట్టే కన్నీటికి విలువ లేదన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయని చంద్రబాబు ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించే కుట్రలకు షర్మిలను వాడుకుంటున్నాడని విమర్శించారు.దేశంలో ఇలాంటి అన్న ఉంటాడా?వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపకం జరిగిందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్కు వచ్చిన ఆస్తులను కుమారుడు, కుమార్తెకు ఆయన జీవించి ఉన్నప్పుడే పంచారని తెలిపారు. విజయలక్ష్మీ మినరల్స్, కోడూరు మిల్స్, కోడూరు ఆఫీసు ఆస్తులు, బైరైటీస్ మినరల్స్ స్టాక్స్, 25 మెగావాట్ల సరస్వతి పవర్, ఎస్ఆర్ఎస్ హైడ్రో, 51 ఎకరాల ఇడుపులపాయ భూములు, 79 ఎకరాల శెట్టిగుంట ఆస్తులు, 7.6 ఎకరాల పులివెందుల భూములు, బంజారాహిల్స్‌లోని 280 గజాలు, విజయవాడలోని రాజ్యువరాజ్ థియేటర్లు షర్మిలకు అప్పగించారని చెప్పారు. వైఎస్ జగన్ తనకు వచ్చిన ఆస్తులను అభివృద్ధి చేశారన్నారు. జగన్ నెలకొల్పిన భారతీ సిమెంట్స్ కోసం తొలుత రూ.1,400 కోట్లు అప్పు చేశారని, ఆ తర్వాత తీర్చారని తెలిపారు. సాక్షి మీడియా మొదట్లో నష్టాన్ని చవిచూసిందన్నారు. ఈ నష్టాలు, అప్పులను షర్మిల ఎప్పుడూ పంచుకోలేదన్నారు. ఇవన్నీ జగన్ తన దక్షతతో అభివృద్ధి చేసి, లాభాల్లోకి నడిపించారని గుర్తు చేశారు. ఆయన అభివృద్ధి చేశారు కాబట్టే వాళ్ల పేర్లు పెట్టారని, తానే ఆ పేర్లు సూచించానని వెల్లడించారు. ఆమెకు ఏదైనా కంపెనీ నచ్చితే ఎవరైనా ఇస్తారా? అని ప్రశ్నించారు. జగన్ ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే ఆస్తుల పంపకాలు ఏ విధంగా జరిగాయో తెలుస్తుందన్నారు. అమ్మ తటస్థతపై సందేహాలు!తన అసంబద్ధ చర్యలు కుమారుడి బెయిల్ రద్దు పరిస్థితికి దారి తీసే ప్రమాదం ఉందని తెలిసినా ఆ కుట్రలకు వైఎస్ విజయమ్మ పరోక్షంగా సహకరించడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. విజయమ్మ తటస్థతపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.విజయమ్మను మొదటి నుంచి భావోద్వేగాలకు గురి చేసి షర్మిల ప్రభావితం చేస్తున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టమైందని నెటిజన్లు, ప్రజలు చర్చించుకుంటున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా సరస్వతి షేర్ల ట్రాన్స్ఫర్ పత్రాలపై సంతకాలు చేయడం.. పలు సందర్భాల్లో షర్మిలకు అనుకూలంగా వ్యవహరించడం ఆమె తటస్థ వైఖరిని ప్రశ్నార్థకంగా మార్చినట్లు చర్చించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సైతం కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న సమయంలో విదేశాల నుంచి విజయమ్మ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వీడియో సందేశాన్ని విడుదల చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలను సమానంగా చూడాల్సిన అమ్మ ఒకవైపే మొగ్గడం సరికాదని పేర్కొంటున్నారు. నీ అత్యాశ, కుతంత్రాల్లో అమ్మను కూడా పావుగా వాడుకున్నావు. తప్పుడు ప్రకటనలకు అమ్మను ఓ సాక్షిగా, అమలుకర్తగా చేశావంటూ వైఎస్ జగన్ తన సోదరికి రాసిన లేఖను గుర్తు చేస్తున్నారు. ‘క్షమార్హం కాని అక్రమ చర్యల్లో అమ్మను భాగం చేశావు. గత కొద్ది సంవత్సరాలుగా అమ్మను భావోద్వేగాలకు నువ్వు వాడుకుంటున్న విషయం జగమెరిగిన సత్యం. నీ సొంత వ్యూహాల్లో అమ్మను భాగం చేశావు. కోర్టు అనుమతి లేకుండా షేర్లను బదిలీ చేస్తే నాకు న్యాయపరమైన సమస్యలు వస్తాయని తెలిసీ బదలాయింపు చేశావు. అంతేకాక షేర్ సర్టిఫికెట్లు, షేర్ ట్రాన్స్ఫర్ ఫారాలు పోయినట్లుగా అమ్మ చేత తప్పుడు ప్రకటనలు ఇప్పించావు. అంతిమంగా అక్రమ పద్ధతిలో వాటాలను బదలాయింపు చేశావు. దీనివల్ల కుమారుడిగా నాకు న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా నీ చర్యల్లో భాగస్వామి అయింది. ఆమె తటస్థతపై ప్రశ్నలు తలెత్తున్నాయి. అంతేకాక ఆమె ఒకవైపే ఉందన్న భావన కలిగిస్తోంది...’ అని తీవ్ర ఆవేదనతో వైఎస్ జగన్ లేఖ రాయటాన్ని నెటిజన్లు, ప్రజలు ఉదహరిస్తున్నారు.కొద్దిరోజులుగా వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ సందేహాలకు బలం చేకూరుస్తున్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. -
వైఎస్ జగన్‌కు ఎంపీ విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు
సాక్షి,తాడేపల్లి: తనను వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా నియమించటం పట్ల పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఆదివారం(అక్టోబర్ 27) ఎక్స్(ట్విటర్) వేదికగా ఒక ట్వీట్ చేశారు.‘ఉతరాంధ్ర ప్రజల బలమైన గొంతుకగా పనిచేస్తా. ప్రజల సమస్యలు పరిష్కరింపజేయడంలో కృషి చేస్తా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే అంశంతో పాటు ఉత్తరాంధ్రలో పెండింగ్‌లో ఉన్నమౌలిక సదుపాయాల కల్పన సమస్యల పరిష్కారానికి పనిచేస్తా’అని విజయసాయిరెడ్డి తెలిపారు. Grateful to @YSRCParty President Sri @ysjagan garu for entrusting me with the role of Regional Coordinator for North Andhra, including Vizag. I pledge to be a strong voice for the people of Uttarandhra, ensuring your concerns are heard and addressed. Whether it be the…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 27, 2024 ఇదీ చదవండి: వైఎస్‌జగన్‌కు షర్మిల రాసిన లేఖ బాబుకు ఎలా చేరింది -
జగన్ బెయిల్ రద్దు చేయడానికే మీ కుట్రలు
-
‘జగన్‌కు షర్మిల రాసిన లేఖ బాబుకు ఎలా చేరింది?’
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్ మళ్లీ సీఎం కాకూడదనే అజెండాతోనే షర్మిల పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆస్తి తగాదా అయితే పరిష్కరించుకోవచ్చు.. ఆమెది ఆస్తి తగాదా కాదు.. అధికారం కోసం తగాదా అంటూ ఆయన ధ్వజమ్తెతారు.చంద్రబాబుతో కలిసికుట్ర..‘‘షర్మిల ప్రెస్మీట్లు 95 శాతం జగన్‌ను విమర్శించడానికే.. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే షర్మిల ప్రెస్మీట్లు. షర్మిల.. బాబుతో కలిసి పనిచేస్తున్నారు. తల్లికి, చెల్లికి అన్యాయం అంటూ చంద్రబాబు చెప్పించారు. జగన్‌పై మహిళల్లో వ్యతిరేకత రావాలని బాబు మాట్లాడిస్తున్నారు. జగన్‌కు షర్మిల రాసిన లేఖ చంద్రబాబుకు ఎలా చేరింది?’’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ మరణానికి ముందు బాబు మాటలు గుర్తులేవా?‘‘వైఎస్సార్ ఘోరమైన మరణం పొందుతారని చంద్రబాబు అన్నారు. వైఎస్సార్ మరణానికి ముందు చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తులేదా?. ప్రత్యర్థికి మేలు చేసేందుకు సొంత అన్నకు అన్యాయం చేస్తున్నారు. ఎల్లో మీడియాతో కలిసి జగన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మీ తండ్రి మరణానికి కారణమైన వ్యక్తులతో చేతులు కలుపుతారా?. చంద్రబాబుతో కలిసి జగన్‌పై కుట్ర పన్నడం న్యాయమేనా?. షర్మిల చేసే పనికి దివంగత వైఎస్సార్ ఆత్మ క్షోభిస్తుంది.’’ అని విజయసాయిరెడ్డి చెప్పారు.బాబు మేలు కోసం సొంత అన్ననే మోసం చేస్తావా?‘‘చంద్రబాబు అత్యంత దుర్మార్గుడు.. ఆయనతో స్నేహం ఎంతమాత్రం మంచిది కాదు. వైఎస్సార్ మృతికి కారణమైన కాంగ్రెస్,బాబుతో చేతులు కలుపుతారా?. మీ అన్నను జైల్లో పెట్టి హింసించిన కాంగ్రెస్‌లో ఉంటారా?. చంద్రబాబు మేలు కోసం సొంత అన్నను మోసం చేస్తారా?. ఇలాంటి విషపు పామును ఎక్కడా చూడలేదు. వైఎస్సార్ ఉన్నప్పుడే జగన్, షర్మిలకు ఆస్తులు పంచారు. చెల్లిపై ప్రేమతో జగన్ తన ఆస్తిలో 40 శాతం వాటా ఇస్తామన్నారు. కోర్టు కేసుల పరిష్కారం తర్వాత ఇస్తామన్నారు. కానీ మీరు రిటర్న్ గిఫ్ట్‌గా ఏం ఇచ్చారు?. షేర్ ట్రాన్స్ఫర్ డీడ్స్, జగన్ సంతకాలు లేకుండా దొంగ సంతకాలతో నిబంధనలు ఉల్లంఘించారు. జగన్‌ను జైలుకు పంపడానికే చంద్రబాబుతో షర్మిల లాలూచీ పడ్డారు...షేర్ ట్రాన్స్ఫర్ అయితే జగన్ బెయిల్ రద్దు అవుతుంది.ఈ విషయం తెలిసే జగన్ బెయిల్ క్యాన్సిల్ అయ్యేలా కుట్ర చేశారు. జగన్‌ను జైలుకు పంపడమే చంద్రబాబు, షర్మిల లక్ష్యం. నష్టాలతో నడిచిన సంస్థలను జగన్ లాభాల్లోకి తెచ్చారు. నష్టాల్లో ఉన్నప్పుడు షర్మిల ఏం చేశారు? జగన్ అతి మంచితనం ఆయనకు అనర్థాలను తెచ్చిపెడుతోంది.’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: గురి తప్పిన బాణం వెనుక..! -
డ్రోన్లపై బాబు గొప్పలు చెప్పు కోవడంపై విజయసాయిరెడ్డి చురకలు
-
స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం: ఎంపీ విజయ సాయి రెడ్డి
-
కేంద్రాన్ని ఒప్పించడంలో బాబు విఫలం: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇదే సమయంలో కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయడం లేదన్నారు.వైఎస్సార్సీపీ ఎంపీ, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి బుధవారం రాత్రి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం. అవసరమైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత ప్రారంభమైంది. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. దస్పల్లా, ఎన్సీసీ భూములతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా ఎటువంటి అభ్యంతరం లేదు.డయేరియా బాధితులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. డయేరియాతో 14 మంది మరణించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాను. పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తాం. దీపావళి తర్వాత రీజినల్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరిస్తాను. పార్టీ బలోపేతం కోసమే రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు మార్పు జరిగింది అని కామెంట్స్ చేశారు. -
ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా ఘన్‌శ్యామ్ తివారీ
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎథిక్స్ (నైతిక విలువల) కమిటీ ఛైర్మన్‌గా బీజేపీకి చెందిన ఘన్‌శ్యామ్ తివారీ నియమితులయ్యారు. అక్టోబర్ 10 నుంచి ఈ కమిటీ మనుగడలోకి వస్తుందని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తెలిపారు. ఎథిక్స్ కమిటీలో వైఎస్సార్సీపీ ఎంపీ వై.విజయసాయి రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. ప్రమోద్ తివారీ (కాంగ్రెస్), డెరెక్ ఒబ్రియాన్ (తృణమూల్ కాంగ్రెస్), తిరుచ్చి శివ (డీఎంకే), సంజయ్ సింగ్ (ఆప్), శస్మిత్ పాత్రా (బీజేడీ), ప్రేమ్‌చంద్ గుప్తా (ఆర్జేడీ), మేధా విశ్రామ్ కులకర్ణి, దర్శనా సింగ్ (బీజేపీ)లు కమిటీలోని ఇతర సభ్యులు. రాజ్యసభలో ఎంపీల ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే ఎథిక్స్ కమిటీ పరిశీలించి నిర్ణయాలు వెలువరిస్తుంది. అలాగే విజయసాయి రెడ్డిని రవాణా, పర్యాటక, సాంస్కృతిక స్టాండింగ్ కమిటీ నుంచి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల స్టాండింగ్ కమిటీకి మారుస్తూ ధన్‌ఖడ్ ఆదేశాలు జారీచేశారు. -
టీడీపీ సోషల్ మీడియా పోస్టులపై విజయసాయిరెడ్డి ఫైర్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ సోషల్ మీడియా పోస్టులపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ‘‘తెలుగు దొంగల పార్టీ (పేరుకు తగినట్లుగానే) జ్ఞానం, మర్యాద, అవగాహన లేని పోకిరీలను, పనికిమాలిన కులగజ్జి గాళ్లని, గూండాలని, గోహంతకులని, హిందూ వ్యతిరేకులని, నాస్తికులని, రేపిస్టులని, టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, విపక్ష నాయకులు పెట్టిన పోస్టులు మీద వ్యక్తిగత దూషణలతో, బూతుపదాలతో కించపరుస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడానికి "నెలసరి చెల్లింపు" పద్దతిలో నియమించుకున్న అనైతిక రాజకీయపార్టీ.’’ అంటూ ట్వీట్ చేశారు.‘‘వీరి తల్లితండ్రులు పెట్టిన అసలు పేర్లతో కాకుండా నకిలీపేర్లతో (చివరన రెడ్డి, శర్మ, షెట్టి, యాదవ్, రాజు వగైరా) తగిలించుకుంటారు. వీరి బజారు ప్రవృత్తి, దిగజారుడుతనం ఎలా ఉంటుందంటే(ఉదాహరణకు స్వాతి చౌదరి వారి రాతల్లో శ్వేతారెడ్డి అవుతుంది). పోలీస్, న్యాయవ్యవస్థలకు దొరకకుండా పని చేస్తారు. ఈ క్యారక్టర్ లేని కిరాయి పేటిఎమ్ బ్యాచ్ దైర్యం ఉంటే అసలు పేర్లతోనే పోస్టులు పెట్టొచ్చు. వీరి వ్యాఖ్యలు టీడీపీ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని తెలుసుకోవాలి...వారి ముఠా నాయకుడి దృష్టిలో పడాలని పోటీపడి హద్దులుమీరి వ్యాఖ్యలు/పోస్టులు పెడతారు. ఓ కిరాయి మనుషుల్లారా, మీ ఇద్దరు బాసుల కోసం మీరు మరీ దిగజారిపోవద్దు’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.తెలుగు దొంగల పార్టీ (పేరుకు తగినట్లుగానే) జ్ఞానం, మర్యాద, అవగాహన లేని పోకిరీలను, పనికిమాలిన కులగజ్జి గాళ్లని, గూండాలని, గోహంతకులని, హిందూవ్యతిరేకులని, నాస్తికులని, రేపిస్టులని, టీడీపీ సోషల్ మీడియా లో పోస్టులు పెట్టడానికి, విపక్ష నాయకులు పెట్టిన పోస్టులు మీద వ్యక్తిగత దూషణలతో,…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 11, 2024 -
‘కమీషన్లు, ముడుపులు.. ‘దారి’తప్పిన టీడీపీ ఎమ్మెల్యేలు’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్యేల అవినీతిపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీలో కమీషన్లు, ముడుపులు, దందాలతో టీడీపీ ఎమ్మెల్యేలు దారితప్పారంటూ ట్వీట్ చేశారు. 90 శాతం మంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి పరాకాష్టకు చేరడంతో నాలుగు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక ప్రభావం పడిందన్న విజయసాయి.. పోస్టింగులకు ఒక రేటు, మద్యంలో నెలమామూళ్లు, వెంచర్లలో కమీషన్లు, కాంట్రాక్టర్ల దగ్గర పెర్సెంటేజిలు, ప్రొటెక్షన్ మనీ, అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు బరితెగించారంటూ దుయ్యబట్టారు.‘‘గత ప్రభుత్వ హయాంలో టీడీపీ గూఢచారులుగా ప్రవర్తించిన అధికారులకు క్లీన్ చిట్లు, మంచిరాబడి ఉన్న పోస్టింగులు, పదోన్నతులు. మద్యంషాపుల దరఖాస్తుల్లో టీడీపీ ఎమ్మెల్యేలు సిండికేట్ అయ్యి సర్కార్ ఖజానాకు గండి. లిటిగేషన్లు, నోటిదురుసులు, వ్యభిచారాలు, ఆమ్యామ్యాలు, మాఫియాలు, దందాలు, బ్లాక్‌మెయిలింగ్, వెంచర్లు, మద్యం.. దేన్నీ వదలకుండా టీడీపీ ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా దిగమింగే దాంట్లో పూర్తి నిమగ్నం’’ అంటూ టీడీపీ నేతల్ని విజయసాయిరెడ్డి ఏకిపారేశారు.ఇదీ చదవండి: చంద్రబాబుకి నిజం అంటే భయం.. అందుకే : ‘‘ఐదు సంవత్సరాల తర్వాత అవకాశం దొరికినప్పుడు మేం మింగితే తప్ప్పేమిటి.. మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అని అడ్డంగా సమర్ధించుకుంటున్న తెలుగు తమ్ముళ్లు. టీడీపీ ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలఫై చంద్రబాబు స్పందించి సమాధానం చెప్పాలి. లేనట్లయితే ప్రజాభీష్టం మేరకు శ్వేతపత్రం సమర్పించి విచారణకు ఆదేశించాలి’’ అని ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.ఏపీలో కమీషన్లు, ముడుపులు, దందాలతో దారితప్పిన టీడీపీ ఎమ్మెల్యేలు. ~90% మంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి పరాకాష్టకు చేరడంతో 4 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక ప్రభావం. ~పోస్టింగులకు ఒక రేటు, మద్యంలో నెలమామూళ్లు, వెంచర్లలో కమీషన్లు, కాంట్రాక్టర్ల దగ్గర పెర్సెంటేజిలు,…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 10, 2024 -
ఈవీఎంల ట్యాంపరింగ్ పై విజయసాయిరెడ్డి ట్వీట్
-
ఏయూ ర్యాగింగ్‌లో టీడీపీ నేతల కుమారులు?: ఎంపీ విజయసాయి రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. చంద్రబాబు పాలనలో ఏయూ వర్సిటీలో మళ్లీ ర్యాగింగ్ రక్కసి పురుడు పోసుకుంది.. అక్కడ దారుణం జరుగుతున్నా ప్రభుత్వం నిద్రపోతుందా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకుల సుపుత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తోందన్నారు.ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘ఆంధ్ర యూనివర్శిటీలో కొంతకాలంగా లేని ర్యాగింగ్ రక్కసి మళ్లీ పురుడు పోసుకుని విద్యార్ధినిలు నేరుగా మీడియా ముందుకి రావడంతో బట్టబయలు అయ్యింది. హాస్టల్ రూమ్స్‌లో అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్ విద్యార్థినులపై దురుసుగా ప్రవర్తిస్తూ కొంతమంది సీనియర్లు ఇబ్బంది పెట్టి వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెట్టారు.ఆంధ్రయూనివర్శిటీలో కొంతకాలంగా లేని ర్యాగింగ్ రక్కసి మళ్లీ పురుడు పోసుకుని విద్యార్ధినిలు నేరుగా మీడియా ముందుకి బట్టబయలు అయ్యింది. హాస్టల్ రూమ్స్ లో అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్ విద్యార్థినులపై దురుసుగా ప్రవర్తిస్తూ కొంతమంది సీనియర్లు ఇబ్బంది పెట్టి వీడియోలు తీసి…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 8, 2024దీనిపై స్పందించిన కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. మాకు డ్యాన్స్ రాదని చెబితే.. అబ్బాయిల దగ్గరకు వెళ్లి నేర్చుకుని రమ్మని సీనియర్లు ఇబ్బంది పెట్టారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 10 మంది విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్ చేసింది. బాధిత విద్యార్ధినిల తల్లిదండ్రుల మనోవేదన అర్థం చేసుకోండి. టీడీపీ నాయకుల సుపుత్రులు కూడా దీనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. టీడీపీ ప్రభుత్వం నిద్రపోతుందా? అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ సినీ పరిశ్రమ నుండి రాలేదా?: వైఎస్సార్సీపీ శ్యామల -
చంద్రబాబు నైజం ఇది.. విజయసాయి రెడ్డి సెటైర్లు
సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సెటైరికల్ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సూపర్ సిక్స్ ఇస్తే ఏంటి? ఇవ్వకపోతే ఏంటి? మనకు కావాల్సింది రాష్ట్రాన్ని దోచుకోవడం అంటూ ఘాటు విమర్శలు చేశారు. కులం, మతం అంటూ అగ్గి రాజేసి అందులో చలి కాచుకోవాలి అంటూ కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..చంద్రబాబు నైజం ... సూపర్ సిక్స్ ఇస్తే ఏమి, ఇవ్వకపోతే ఏమి…నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగితే మనకేంటి, పెరగకపోతే మనకేంటి…టమాటా 100 అయితే మనకేంటి, 200 అయితే మనకేంటి... ఇసుక టన్ను 2000 అయితే మనకేం, 4000 అయితే మనకేంటి…మరో 4 సంవత్సరాల తర్వాత ప్రజలకి దొంగహామీలిచ్చి, మభ్యపెట్టి, మోసగించి, ఓట్లు వేయించుకోవచ్చు! మనకి కావాల్సింది రాష్ట్రాన్ని దోచుకోవడం, కులం, మతం అంటూ అగ్గి రాజేసి అందులో చలి కాపుకోవడమే అంటూ విమర్శించారు. చంద్రబాబు @ncbn నైజం ... సూపర్ సిక్స్ ఇస్తే ఏమి, ఇవ్వకపోతే ఏమి…నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగితే మనకేంటి, పెరగకపోతే మనకేంటి…టమాటా 100 అయితే మనకేంటి, 200 అయితే మనకేంటి... ఇసుక టన్ను 2000 అయితే మనకేం, 4000 అయితే మనకేంటి…మరో 4 సంవత్సరాల తర్వాత ప్రజలకి దొంగహామీలిచ్చి,…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 8, 2024ఇది కూడా చదవండి: వరద సాయం డబ్బు ఏమైంది: మార్గాని భరత్ -
చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ఫైర్
-
జీతాలు నిల్లు..పబ్లిసిటీ ఫుల్లు: విజయసాయిరెడ్డి సెటైర్లు
సాక్షి,తాడేపల్లి:జీతాలు చెల్లించని చంద్రబాబు ప్రభుత్వంపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి మంగళవారం(అక్టోబర్8) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘రూ.400 కోట్లు ఇస్తున్నట్టు జీఓ విడుదల అయింది.ఈ విషయాన్ని కుల మీడియా ఫ్రంట్ పేజీలో తాటికాయంత అక్షరాల్లో రాసింది.టీవీల్లో రోజంతా బ్రేకింగ్ న్యూస్ నడిచాయి.నిధులు మాత్రం హుళక్కయ్యాయి.చంద్రబాబు కుతంత్రాలు ఇలాగే ఉంటాయి.సమగ్ర శిక్షలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు లేవు.ప్రాణాలు రక్షించే 108, 104 సిబ్బంది 6 వేల 500 మందికి జులై నుంచి నయా పైసా విదల్చలేదు.వీరే కాదు అనేక డిపార్టుమెంట్లలో వేల మంది చిరుద్యోగుల జీవితాల్లో దసరా,దీపావళి పండుగలు వస్తున్నా చిమ్మచీకట్లు తొలగిపోలేదు.ఇదీ చంద్రబాబు మార్కు పాలన.దీనిని మార్పు అనాలంట’అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: పవన్‌కల్యాణ్‌పై కేఏ పాల్ ఫిర్యాదు -
కూటమి నిర్వాకాలపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీటాస్త్రాలు
-
చంద్రబాబు.. ఉచిత ఇసుక ఎక్కడ?: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,తాడేపల్లి : కూటమి ప్రభుత్వ నిర్వాహాకాలపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా, ఇసుక మాఫియాపై చంద్రబాబును నిలదీశారు విజయసాయిరెడ్డి. కూటమి ప్రభుత్వంలో ఇసుక కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మికుల జీవన ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇసుక టన్ను ధర రూ.475కే అందితే.. కూటమి హయాంలో టన్ను ఇసుక ధర రూ.3వేలు పలుకుతుందన్నారు. ఇక చంద్రబాబు ప్రకటించిన ఉచిత ఇసుక పథకం నీటిమీద రాతల్లా తయారైందని విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు.With TDP, the devil always lies in the detail. On one hand, Chandrababu @ncbn promises free Sand on the other hand TDP is causing sand scarcity in the state affecting the livelihood of lakhs of construction workers. The cost of sand has spiked to ₹3,000/tonne now instead of the…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 7, 2024 -
ఊసరవెల్లి రాజకీయాల్లో బాబే ఫస్ట్: ఎంపీ విజయసాయి రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలంటూ సెటైరికల్ కామెంట్స్ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు తన అవసరాలకు తగినట్టుగా చంద్రబాబు వేషాలు మారుస్తుంటారని ఎద్దేవా చేశారు.వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం! పవిత్ర రంజాన్, మిలాది-ఉన్-నభి అయిపోయాయి. పవిత్ర దసరా అయిపోవస్తుంది..తదుపరి (Next)..అర్జంట్‌గా బైబిల్ కావాలి ఏక్కడ, ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్..పవిత్ర క్రిస్మస్ వస్తుందిగా వేషం మార్చాలి.. ఊసరవెల్లి రాజకీయాలు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం! పవిత్ర రంజాన్, మిలాది-ఉన్-నభి అయిపోయాయి. పవిత్ర దసరా అయిపోవస్తుంది .....తదుపరి (Next).......అర్జంట్ గా బైబిల్ కావాలి ఏక్కడ, ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్....... పవిత్ర క్రిస్మస్ వస్తుంది గా వేషం మార్చాలి.....ఊసరవెల్లి రాజకీయాలు.@ncbn— Vijayasai Reddy V (@VSReddy_MP) October 6, 2024ఇది కూడా చదవండి: శ్రీవారి నిధుల దోపిడీకి బాబు సర్కారు స్కెచ్ -
జాబులు పోవాలంటే బాబే కదా రావాలి: విజయసాయిరెడ్డి
సాక్షి,తాడేపల్లి: జాబులు పోవాలంటే ఎవరు రావాలి? చంద్రబాబే కదా? అని ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కుపరిపశ్రమలో ఉద్యోగాలు తొలగించడంపై విజయసాయిరెడ్డి శుక్రవారం(అక్టోబర్ 4) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. విశాఖ స్టీల్‌లో తొలి విడతగా 4 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారని విజయసాయిరెడ్డి తెలిపారు. ‘జాబ్ పోవాలి అంటే ఎవరు రావాలి? చంద్రబాబే కదా? సంపద సృష్టి, బాబు వస్తే జాబు.. అంటే ఇదేనా తెలుగు తమ్ముళ్లూ? ఇది ప్రైవేటీకరణకు మరో మెట్టు కాదా బాబూ ....చంద్రబాబూ ?’అని విజయసాయిరెడ్డి తన ట్వీట్లో ప్రశ్నించారు. ఇదీ చదవండి: వంచించిన చంద్రబాబు.. దగాపడ్డ రైతన్న -
తిరుమల జోలికి వెళ్లొద్దు.. చంద్రబాబుకు విజయసాయి వార్నింగ్
సాక్షి, అమరావతి: తిరుమల జోలికి వెళ్లొద్దంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ‘‘మీ కుళ్లు రాజకీయాలకు దేవుడిని వాడుకోవద్దు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే నాశనమైపోతారు’ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.చంద్రబాబు! @ncbn, “తిరుమల జోలికి వెళ్లొద్దు" మీ కుళ్లురాజకీయాలకు దేవుడిని వాడుకోవద్దు. హిందుమనోభావాలు దెబ్బతీస్తే నాశనమైపోతారు!https://t.co/mYi2pFSWFL— Vijayasai Reddy V (@VSReddy_MP) October 3, 2024మరోవైపు, పురందేశ్వరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ‘తిరుమల లడ్డూ ప్రసాదాల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కనీస ఇంగితజ్ఞానం లేకుండా అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను తప్పు పడుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా అగౌరవపరుస్తూ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం. కోర్టు ధిక్కారం... ఆమెపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.’ అని ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఇదీ చదవండి: నాలుగు నెలల్లోనే.. అన్నింటా విఫలం: వైఎస్ జగన్‘పురందేశ్వరి మొత్తం మీద సుప్రీంకోర్టుదే తప్పు అని తేల్చారు. చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏదైనా అనొచ్చంట... ఏమమ్మా! మరి న్యాయవ్యవస్థ కూడా రాజ్యాంగ వ్యవస్థే కదా! తమరికి తెలియదా? అంత చిన్న విషయానికే న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తారా? అని చిరాకు పడిపోయారు పురందేశ్వరి. ఆమెది భావాతీతమైన ఆవేదన అనుకోవాలి మరి.కోర్టులు, దేవుడి కంటే చంద్రబాబే గొప్పవాడు అన్నట్లుంది పురందేశ్వరి వైఖరి. ఈ వందేళ్లలో తిరుమల ఆలయానికి నారా, నందమూరివారు చేసిన డ్యామేజీ మరి ఎవరూ చేయలేదు. ఇంకెన్ని ఘోరాలు చూడాలో గోవిందా... గోవిందా.. లడ్డూ ప్రసాదాల విషయంలో చంద్రబాబు హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు.’ అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. -
రాజకీయాలకు దేవుడ్ని, మతాన్ని వాడుకుంటావా బాబు: విజయసాయి రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి వెన్నుపోటుదాడులు రాజకీయ లబ్ధి కోసం దేవుడిని, మతాన్ని వాడుకుంటారన్ని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఇదే సమయంలో చంద్రబాబు రాజకీయ అజ్ఞాని అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘హిందూ మతాన్ని నమ్మడం, వాడుకోవడం.. ఈ రెండు వేరు వేరు. నిజమైన హిందువు.. దేవుని, హిందూ మతాన్ని నమ్ముకుంటాడు. రాజకీయ అజ్ఞాని, చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారులు రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్లు, దేవుడినీ, మతాన్ని వాడుకుంటారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. హిందూ మతాన్ని నమ్మడం ,,, వాడుకోవడం ... ఈ రెండు వేరు వేరు.......నిజమైన హిందువు దేవుని, హిందూ మతాన్ని నమ్ముకుంటాడు ,,, రాజకీయ అజ్ఞాని ,,, చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారులు రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్లు ,,, దేవుడినీ ,,, మతాన్ని వాడుకుంటారు… @ncbn— Vijayasai Reddy V (@VSReddy_MP) October 1, 2024ఇది కూడా చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టు -
బాబు, లోకేష్.. ఇతరుల సంతోషాన్ని ఓర్వలేరు: విజయసాయి రెడ్డి
సాక్షి, తాడేపల్లి: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ వంటి వ్యక్తులు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దు:ఖిస్తుంటారని కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ క్రమంలోనే వారిద్దరిపై సెటైర్లు వేశారు.ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా.. నారద ముని ఒక రోజు శ్రీకృష్ణుడిని అడిగాడు..“ప్రభూ! చంద్రబాబు, అయన సుపుత్రుడు లోకేష్ ఎల్లప్పుడు దుఃఖంలో ఎంచుకుంటున్నారు?"శ్రీకృష్ణుడు అద్భుత రీతిలో జవాబు ఇస్తూ, "ప్రతి మనిషికి ఆనందాలు ఉంటాయి. కానీ, చంద్రబాబు మరియు లోకేష్ లాంటి వారు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తుంటారు!’ అంటూ కామెంట్స్ చేశారు. నారద ముని ఒక రోజు శ్రీకృష్ణుడిని అడిగాడు..“ప్రభూ! చంద్రబాబు, అయన సుపుత్రుడు లోకేష్ ఎల్లప్పుడు దుఃఖంలో ఎందుకుoటున్నారు?"శ్రీకృష్ణుడు అద్భుత రీతిలో జవాబు ఇస్తూ, "ప్రతి మనిషికి ఆనందాలు ఉంటాయి. కానీ, చంద్రబాబు మరియు లోకేష్ లాంటి వారు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తుంటారు!…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 29, 2024అంతకుముందు కూడా చంద్రబాబు పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సంపద సృష్టి లేదు-40 ఏళ్ల అనుభవం లేదు, వంకాయ లేదు.. అంతా దోపిడీనే!!. మళ్ళీ 3000 వేలకోట్ల అప్పు. ఎక్కడకి పోతుంది ఈ డబ్బు అంతా?. కార్పోరేషన్స్‌కి గ్యారంటీ ఇచ్చి తెచ్చిన అప్పుతో కలిపి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు తెచ్చిన అప్పు దాదాపు 50 వేలకోట్ల పై మాటే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి జీతాలు చెల్లించాక, ఖజానాలో ఉన్న డబ్బు దాదాపు 7000 కోట్లు. అది కాకుండా కేంద్రం నుండి వివిధ పద్దుల కింద వచ్చిన డబ్బు కూడా ఉంది.పిల్లలు తినే గోరుముద్దతో సహా వైఎస్ జగన్ 38 సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటి చంద్రబాబు నడవడం లేదు. పాత బిల్లులు చెల్లించడం లేదు. 7800 కోట్ల రూపాయల వరద నష్టం అని అంచనా వేసి కేంద్రానికి నివేదిక 10 రోజుల క్రితమే పంపినా, ఇప్పటి వరకు సాయం గురించి ప్రకటన రాలేదు. దోపిడీ .. దోపిడీ .. దోపిడీ.. మోసం..మోసం.. మోసం.. దగా.. దగా..దగా’ అంటూ మండిపడ్డారు.ఇది కూడా చదవండి: Vizag Steel Plant: ఒకేసారి 4 వేల మంది తొలగింపు!.. రోడ్డెక్కిన ఉక్కు కార్మికులు -
బాబు అంటేనే దగా, మోసం: ఎంపీ విజయసాయి రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే దోపిడీ, మోసం.. దగా అంటూ ఘాటు విమర్శలు చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. సంపద సృష్టి లేదు.. ఏదీ లేదు అంటూ సెటైర్లు వేశారు. అలాగే, బాబు ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తోందన్నారు.ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘సంపద సృష్టి లేదు-40 ఏళ్ల అనుభవం లేదు, వంకాయ లేదు.. అంతా దోపిడీనే!!. మళ్ళీ 3000 వేలకోట్ల అప్పు. ఎక్కడకి పోతుంది ఈ డబ్బు అంతా?. కార్పోరేషన్స్‌కి గ్యారంటీ ఇచ్చి తెచ్చిన అప్పుతో కలిపి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు తెచ్చిన అప్పు దాదాపు 50 వేలకోట్ల పై మాటే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి జీతాలు చెల్లించాక, ఖజానాలో ఉన్న డబ్బు దాదాపు 7000 కోట్లు. అది కాకుండా కేంద్రం నుండి వివిధ పద్దుల కింద వచ్చిన డబ్బు కూడా ఉంది.పిల్లలు తినే గోరుముద్దతో సహా వైఎస్ జగన్ 38 సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటి చంద్రబాబు నడవడం లేదు. పాత బిల్లులు చెల్లించడం లేదు. 7800 కోట్ల రూపాయల వరద నష్టం అని అంచనా వేసి కేంద్రానికి నివేదిక 10 రోజుల క్రితమే పంపినా, ఇప్పటి వరకు సాయం గురించి ప్రకటన రాలేదు. దోపిడీ .. దోపిడీ .. దోపిడీ.. మోసం..మోసం.. మోసం.. దగా.. దగా..దగా’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: దేవుడా.. ఏపీని రక్షించు! -
సీఎం చంద్రబాబుపై ఎంపీ విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లతో ధ్వజం
-
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై బాబుకు ఏ భావోద్వేగాలు ఉండవు: విజయసాయిరెడ్డి
సాక్షి, తాడేడేల్లి: కపటం, నయవంచనలను మారుపేరైన చంద్రబాబుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసివేసినా, విక్రయించినా ఏ భావోద్వేగాలు ఉండవని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రి 64 ప్రభుత్వ రంగ సంస్థలను అణాకాణీకి అమ్మేసిన చరిత్ర చంద్రబాబుదని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి స్పందిసతూ.. విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం చేస్తామని "కులమీడియా" లో లీకులు ఇస్తూ కార్మికులను గందరగోళంలోకి నెడ్తున్నారని మండిపడ్డారు. 4,200 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడం చూస్తే చంద్రబాబు కల్లబొల్లి మాయోపాయాలు అర్థమవుతాయని అన్నారు. కాంట్రాక్టు కార్మికులు లేకుండా ఉక్కు ఫ్యాక్టరీ నడవదని, దాన్నో సాకుగా చూపి అమ్మకానికి పెట్టాలన్నది చంద్రబాబు క్షుద్ర ప్రణాళికగా పేర్కొన్నారు.కపటం, నయవంచనలను మారుపేరైన చంద్రబాబుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసివేసినా, విక్రయించినా ఏ భావోద్వేగాలు ఉండవు. ఉమ్మడి ఆంధ్ర సిఎంగా 64 ప్రభుత్వ రంగ సంస్థలను అణాకాణీకి అమ్మేసిన చరిత్ర చంద్రబాబుది. విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం చేస్తామని "కులమీడియా" లో లీకులు ఇస్తూ కార్మికులను…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 28, 2024 -
వరద బాధితులకు అన్యాయం.. నష్టపరిహారం ఎక్కడ..?
-
అచ్చం నాయుడికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి
-
అచ్చెన్నాయుడు.. ఈ జన్మకి నీ కోరిక తీరదు: ఎంపీ విజయసాయి రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడిపై సెటైరికల్ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయని అన్నారు. ఇదే సమయంలో టీడీపీ అనే కులపార్టీలో చేరేందుకు ప్రయత్నించానా? అంటూ ప్రశ్నించారు.ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా.. అచ్చంనాయుడూ! దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె! చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్. అచ్చి.. బుచ్చి.. కచ్చి.. అని ఆట పట్టించేవారట కదా! దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. మోకాలికి బోడి గుండుకు లంకె పెడుతుంటావు. నా విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నావు. విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కులపార్టీలో చేరేందుకు ప్రయత్నించానా?.అచ్చెన్నా.. నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా!. భ్రమల లోకంలో గెంతులేయాలనుకుంటే, గో.. ఆన్.. నిన్ను ఆపేదెవరు. జత ఎద్దులకుండే బలం ఉంది నీ ఒక్కడికి. మేథో శక్తికి, అడ్డం-నిలువుకు మధ్య ఉండే తేడా తెలియక పోవడం వల్లే మీతో ఈ సమస్యంతా’ అంటూ కామెంట్స్ చేశారు. అచ్చంనాయుడూ! దేముడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె! చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్. అచ్చి.. బుచ్చి... కచ్చి... అని ఆట పట్టించేవారట కదా! దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. మోకాలికి బోడి గుండుకు… pic.twitter.com/G0UoqnGsQJ— Vijayasai Reddy V (@VSReddy_MP) September 26, 2024ఇది కూడా చదవండి: చంద్రబాబు కుట్రకు పోలీసు వత్తాసు -
YSRCP నేతలను టీడీపీ ప్రలోభపెడుతోంది