Jofra Archer
-
IPL 2025: బ్రూక్ బాటలో మరో ముగ్గురు విదేశీ స్టార్లు..?
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుండగా ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు, ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ క్యాష్ రిచ్ లీగ్ నుంచి వైదొలిగాడు. జాతీయ జట్టు సేవలకు సిద్దమయ్యేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు బ్రూక్ తెలిపాడు. బ్రూక్‌ను గత డిసెంబర్లో జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. బ్రూక్ ఐపీఎల్ నుంచి వైదొలగడం ఇది వరుసగా రెండోసారి. గత సీజన్లోనూ బ్రూక్ ఇలాగే పొంతన లేని కారణాలు చెప్పి క్యాష్ రిచ్ లీగ్ నుంచి వైదొలిగాడు. గత సీజన్లో కూడా ఢిల్లీనే బ్రూక్‌ను కొనుగోలు చేసింది. ఆ సీజన్లో బ్రూక్ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి వైదొలిగినా, అసలు కారణాలు వేరే అని తెలిసింది. ఆ సీజన్ వేలంలో తక్కువ ధర (రూ. 4 కోట్లు) పలికినందుకు బ్రూక్ వైదొలిగాడట. 2023 సీజన్లో బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 13.25 కోట్ల రికార్దు ధర వెచ్చింది సొంతం చేసుకుంది. 2024 వేలంలోనూ బ్రూక్ ఇదే స్థాయి మొత్తాన్ని ఆశించగా.. నిరాశ ఎదురైంది.కాగా, బ్రూక్ తాజా నిర్ణయంతో బీసీసీఐ అతనిపై నిషేధం విధించే అవకాశం ఉంది. బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం.. వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడు సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి వైదొలిగితే రెండేళ్ల బ్యాన్ పడుతుంది. మరి బ్రూక్‌పై ఐపీఎల్ నిర్వహకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.బ్రూక్ ఎపిసోడ్ బయటికి వచ్చాక మరో ముగ్గురు విదేశీ స్టార్లు ఐపీఎల్-2025 నుంచి వైదొలుగుతారని ప్రచారం జరుగుతుంది. వీరిలో ఆసీస్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, ఇంగ్లండ్ సీమర్ జోఫ్రా ఆర్చర్ ఉన్నారని సమాచారం.ఆర్చర్ జాతీయ విధుల దృష్ట్యా ఐపీఎల్‌కు డుమ్మా కొడతాడని తెలుస్తుంది. ఇంగ్లండ్ హోమ్ సమ్మర్‌కు ముందు ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ గాయపడటంతో ఆర్చర్‌ను ఐపీఎల్ నుంచి వైదలగాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది హోం సమ్మర్లో ఇంగ్లండ్ టెస్ట్‌ల్లో భారత్‌ను ఢీకొట్టాల్సి ఉంది. ఆర్చర్‌ను 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 12.5 కోట్లకు కొనుగోలు చేసింది.ఆడమ్ జంపా విషయానికొస్తే.. ఇతన్ని ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 2.4 కోట్లకు సొంతం చేసుకుంది. జంపా కూడా జాతీయ విధుల పేరుతో ఐపీఎల్‌కు డుమ్మా కొట్టనున్నాడని తెలుస్తుంది. జంపా 2024 సీజన్లోనూ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. గత సీజన్లో జంపా రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాల్సి ఉండింది.మిచెల్ స్టార్క్ విషయానికొస్తే.. గత సీజన్లో అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్‌ను ఈ ఏడాది మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 11.75 కోట్లకు దక్కించుకుంది. 2025 సీజన్‌కు ముందు స్టార్క్ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి వైదొలుగుతాడని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఐపీఎల్ 2025 తర్వాత ఆస్ట్రేలియా సౌతాఫ్రికాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడాల్సి ఉంది. ఇదే కారణం చేత స్టార్క్ తదితర ఆసీస్ టెస్ట్ జట్టు సభ్యులు ఐపీఎల్ నుంచి వైదొలుగుతారని సమాచారం. -
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన జోఫ్రా ఆర్చర్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో (Afghanistan) ఇవాళ (ఫిబ్రవరి 26) జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England) పేసర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో ప్రస్తుతానికి (6 ఓవర్లు) మూడు వికెట్లు తీసిన ఆర్చర్.. తొలి వికెట్‌తో ఓ భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో 50 వికెట్ల మార్కును చేరుకునేందుకు ఆర్చర్‌కు కేవలం 30 మ్యాచ్‌లు మాత్రమే అవసరమయ్యాయి. గతంలో ఈ రికార్డు జేమ్స్ ఆండర్సన్ పేరిట ఉండేది. ఆండర్సన్ 31 వన్డేల్లో 50 వికెట్ల మార్కును తాకాడు. ఇంగ్లండ్ బౌలర్లు స్టీవ్ హార్మిసన్ 32, స్టీవ్ ఫిన్ 33 వన్డేల్లో 50 వికెట్లు తీశారు. వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక మాజీ స్పిన్నర్ అజంతా మెండిస్ పేరిట ఉంది. మెండిస్ కేవలం 19 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని తాకాడు. మెండిస్ తర్వాత నేపాల్ బౌలర్ సందీప్ లామిచ్చేన్ (22 మ్యాచ్‌ల్లో) అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయిని తాకాడు.వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు..అజంత మెండిస్-19 మ్యాచ్లుసందీప్ లామిచ్చేన్-22అజిత్ అగార్కర్-23మెక్క్లెనగన్-23కుల్దీప్ యాదవ్-24మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జోఫ్రా ఆర్చర్ ధాటికి ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆర్చర్.. 11 పరుగుల వద్ద గుర్భాజ్‌ను (6), 15 పరుగుల వద్ద సెదికుల్లా అటల్‌ను (4).. 37 పరుగుల వద్ద రహ్మత్ షాను (4) ఔట్ చేశాడు. అయితే ఇబ్రహీం జద్రాన్, కెప్టెన్ హష్మతుల్లా షాహిది నాలుగో వికెట్‌కు 103 పరుగులు జోడించి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌కు జీవం పోశారు. హష్మతుల్లా 40 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం జద్రాన్..అజ్మతుల్లా ఒమర్జాయ్ (29 నాటౌట్) సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జద్రాన్‌కు ఇది వన్డేల్లో ఆరో సెంచరీ. జద్రాన్ 2023 వరల్డ్‌కప్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించాడు. జద్రాన్ సెంచరీ పూర్తయ్యాక అజ్మతుల్లా బ్యాట్‌ను ఝులిపిస్తున్నాడు. లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో సిక్సర్.. మార్క్ వుడ్ బౌలింగ్‌లో వరుసగా బౌండరీ, సిక్సర్లు సాధించాడు. ప్రస్తుతం అజ్మతుల్లా 24 బంతుల్లో బౌండరీ, 3 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. 37.3 ఓవర్ల అనంతరం ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 201/4గా ఉంది. -
CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్‌గా అతడే: ఆసీస్ మాజీ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ఎనిమిది జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆతిథ్య వేదికలకు చేరుకుని ఐసీసీ టోర్నమెంట్‌కు సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఇక ఈ మెగా ఈవెంట్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్(Pakistan) దక్కించుకోగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్(Dubai)లో తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది.ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ సెమీ ఫైనలిస్టులు, ఫైనలిస్టులు, విజేతపై తమ అంచనాలు తెలియజేశారు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ టీమిండియాను టైటిల్ ఫేవరెట్‌గా పేర్కొనగా.. పాకిస్తాన్ లెజెండరీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ ఈసారి కూడా భారత్- పాక్ ఫైనల్లో తలపడతాయని జోస్యం చెప్పాడు.ఇక ఓవరాల్‌గా మెజారిటీ మంది భారత్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా టాప్-4కు చేరతాయని అంచనా వేశారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్(Michael Clarke) సైతం ఈ ఐసీసీ ఈవెంట్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025లో అత్యధిక పరుగుల, వికెట్ల వీరులు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, టోర్నీ విజేతపై తన అంచనాలు తెలియజేశాడు.టాప్ రన్ స్కోరర్, లీడింగ్ వికెట్ టేకర్‌గా వారే‘‘ఈసారి టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవబోతోంది. వాళ్ల కెప్టెన్ ఫామ్‌లోకి వచ్చాడు. అంతేకాదు.. ఈసారి అతడే చాంపియన్స్ ట్రోఫీలో టాప్ రన్‌స్కోరర్ కాబోతున్నాడు. అతడు మునుపటి లయను అందుకోవడం సంతోషంగా ఉంది. టీమిండియాకు అతడి సేవలు అవసరం.ఇక ఈసారి ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలవబోతున్నాడు. అయితే, ఇంగ్లండ్ జట్టు ప్రదర్శనపై మాత్రం నేను ఎక్కువగా అంచనాలు పెట్టుకోలేదు. అయితే, ఆర్చర్ మాత్రం ఓ సూపర్‌స్టార్. అందుకే అతడే ఈసారి లీడింగ్ వికెట్ టేకర్ అని చెప్పగలను.‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా హెడ్ఇక ఈ టోర్నమెంట్లో ట్రవిస్ హెడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవుతాడు. ప్రస్తుతం అతడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో గతేడాది అదరగొట్టాడు. ఇటీవల టెస్టుల్లోనూ దుమ్ములేపాడు. అయితే, శ్రీలంక పర్యటనలో కాస్త వెనుకబడినట్లు అనిపించినా మళ్లీ త్వరలోనే బ్యాట్ ఝులిపించగలడు.అయితే, ట్రవిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ స్థాయిలో ప్రదర్శన ఇచ్చినా.. ఈసారి ఆస్ట్రేలియా మాత్రం ఫైనల్లో ఓడిపోతుందని అనిపిస్తోంది. ఏదేమైనా హెడ్ మాత్రం హిట్టవ్వడం ఖాయం. నిజానికి అతడి బౌలింగ్ కూడా బాగుంటుంది. కానీ.. బౌలింగ్‌లో అతడి సేవలను ఆస్ట్రేలియా ఎక్కువగా ఉపయోగించుకోవడం లేదు’’ అని మైకేల్ క్లార్క్ బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో అతన అభిప్రాయాలు పంచుకున్నాడు. క్లార్క్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా.. విరాట్ కోహ్లి అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈసారి కింగ్ కోహ్లినే టాప్ రన్‌స్కోరర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలుస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ పాల్గొంటున్నాయి.చదవండి: ఐపీఎల్ 2025లో SRH షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌లు ఇవే..! -
తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ
టీమిండియాతో తొలి వన్డేకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తమ తుది జట్టును బుధవారం ప్రకటించింది. జోస్ బట్లర్(Jos Buttler) కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో మాజీ సారథి జో రూట్(Joe Root)కు స్థానం కల్పించింది. దీంతో.. వన్డే ప్రపంచకప్-2023 తర్వాత అతడు తొలిసారిగా వన్డే ఫార్మాట్ బరిలో దిగనున్నాడు.కాగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్(India vs England)లు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే టీ20 సిరీస్ ముగియగా.. బట్లర్ బృందం సూర్యకుమార్ సేన చేతిలో 4-1తో చిత్తుగా ఓడి.. సిరీస్‌ను కోల్పోయింది. కేవలం రాజ్‌కోట్ టీ20లో మాత్రమే గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది.ఓపెనర్లుగా వారేఈ క్రమంలో ఇరుజట్ల మధ్య నాగ్‌పూర్ వేదికగా గురువారం(ఫిబ్రవరి) వన్డే సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తాజాగా తమ తుదిజట్టును వెల్లడించింది. తొలి వన్డేలో ఓపెనర్లుగా బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ తమ స్థానాలను పదిలం చేసుకోగా.. జో రూట్ వన్‌డౌన్‌లో ఆడనున్నాడు. దాదాపు పదిహేను నెలల విరామం తర్వాత రూట్ తిరిగి రాగా.. కెప్టెన్ బట్లర్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో లియామ్ లివింగ్‌స్టోన్- జాకొబ్ బెతెల్ జోడీ కొనసాగనుంది.ముగ్గురు సీమర్లతోమరోవైపు.. తొలి వన్డేలో ఇంగ్లండ్ ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగనుంది. జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్సేలతో పాటు సకీమ్ మహమూద్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తమ వెటరన్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను ఆడించనుంది.మ్యాచ్ ఆరంభ సమయం ఇదేఇక భారత్- ఇంగ్లండ్ మధ్య కటక్ వేదికగా రెండో వన్డే ఆదివారం(ఫిబ్రవరి 9) జరుగనుండగా.. అహ్మదాబాద్‌లో ఆఖరి వన్డే(ఫిబ్రవరి 12) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. భారత కాలమానం ప్రకారం భారత్- ఇంగ్లండ్ మధ్య మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై నిమిషాలకు వన్డే మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరుజట్లకు ఈ సిరీస్ ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. వరుస చేదు అనుభవాల తర్వాతఇదిలా ఉంటే.. బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు గత రెండు వన్డే సిరీస్‌లను కోల్పోయింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల చేతిలో ఓటమిపాలైంది. ఇక వన్డే వరల్డ్‌కప్-2023లోనూ ఇంగ్లండ్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమై అప్రదిష్టను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజా సిరీస్‌లో రోహిత్ సేనకు ఏమేర పోటీ ఇవ్వనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఇంగ్లండ్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన బ్రెండన్ మెకల్లమ్‌కు తొలుత టీ20 సిరీస్‌లో చేదు అనుభవం ఎదురైంది. అయినప్పటికీ వన్డే సిరీస్‌లోనూ అదే దూకుడును కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు మేనేజ్మెంట్ చెప్పడం విశేషం. టీమిండియాతో తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టుబెన్ డకెట్, ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకొబ్ బెతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్. చదవండి: ఐసీసీ టోర్నీ తర్వాత రోహిత్ గుడ్‌బై? కోహ్లికి మాత్రం బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్! -
మళ్లీ అర్చర్ ట్రాప్‌లో చిక్కుకున్న శాంసన్.. వీడియో వైరల్
స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన శాంసన్.. ఇప్పుడు రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో కూడా అదే తీరును కనబరిచాడు. ఓపెనర్‌గా వచ్చిన సంజూ.. ఆరు బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అదిల్ రషీద్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా సంజూ మూడు మ్యాచ్‌లలోనూ అర్చర్ బౌలింగ్‌లోనే ఔట్ కావడం గమనార్హం.మూడు మ్యాచ్‌లలోనూ బౌన్సర్లతోనే అర్చర్ బోల్తా కొట్టించాడు. తొలి మ్యాచ్‌లో 26 పరుగులు చేసిన శాంసన్.. రెండో టీ20లో కేవలం 5 పరుగులు చేశాడు. మొత్తంగా మూడు టీ20ల్లో శాంసన్ కేవలం 34 పరుగులు మాత్రమే చేశాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రెండు వరుస సెంచరీలతో శాంసన్ చెలరేగిన సంగతి తెలిసిందే.ఐదేసిన వరుణ్..ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో మెరిశాడు. తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. లివింగ్ స్టోన్(43), జోస్ బట్లర్(24) పరుగులతో రాణించారు.చదవండి: IND vs ENG: ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. 14 నెలల తర్వాత షమీ రీ ఎంట్రీpic.twitter.com/RIibDW354u— rohitkohlirocks@123@ (@21OneTwo34) January 28, 2025 -
భారత్‌తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు
టీమిండియాతో రెండో టీ20కి ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. తొలి టీ20లో ఆడిన జట్టులో ఒక మార్పుతో చెన్నై బరిలో దిగనున్నట్లు తెలిపింది. కాగా కోల్‌కతాలో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న పేస్ బౌలర్ గస్ అట్కిన్సన్పై వేటు వేసిన ఇంగ్లండ్ టీమ్ మేనేజ్మెంట్.. అతడి స్థానాన్ని నాలుగు అంతర్జాతీయ టీ20లు ఆడిన ఓ పేసర్‌తో భర్తీ చేయడం విశేషం.బ్యాటర్ల వైఫల్యంతాజా భారత పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ టీమిండియాతో తొలుత ఐదు టీ20లు.. అనంతరం మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టీ20 జరిగింది. ఇందులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది.బట్లర్ అర్ధ శతకం చేసినాఓపెనర్లు ఫిల్ సాల్ట్(0) డకౌట్ కాగా.. బెన్ డకెట్(4) కూడా విఫలమయ్యాడు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ జోస్ బట్లర్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 44 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 68 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మిగతా వాళ్ల నుంచి అతడికి సహకారం అందలేదు.హ్యారీ బ్రూక్(17), జోఫ్రా ఆర్చర్(12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేయగా.. లియామ్ లివింగ్‌స్టోన్(0), జాకబ్ బెతెల్(7), జేమీ ఓవర్టన్(2) దారుణంగా విఫలమయ్యారు. ఇక లోయర్ ఆర్డర్లో గస్ అట్కిన్సన్(2), ఆదిల్ రషీద్(8*), మార్క్‌వుడ్(1) కూడా కాసేపైనా క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది.12.5 ఓవర్లలోనే ఖేల్ ఖతంఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 12.5 ఓవర్లలోనే ఖేల్ ఖతం చేసి.. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై జయభేరి మోగించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లలో సంజూ శాంసన్(26) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ(34 బంతుల్లో 79) సుడిగాలి ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ(19*), హార్దిక్ పాండ్యా(3*) నాటౌట్‌గా నిలిచారు.ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 21 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్ 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, అట్కిన్సన్ మాత్రం కేవలం రెండు ఓవర్లలోనే ఏకంగా 38 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై వేటు వేసిన యాజమాన్యం.. 29 ఏళ్ల రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సేకు తుదిజట్టులో చోటు కల్పించింది.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శనివారం రెండో టీ20 జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ఆరంభం అవుతుంది.టీమిండియాతో రెండో టీ20కి ఇంగ్లండ్ తుదిజట్టు:బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెతెల్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.చదవండి: అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
Ind vs Eng: ‘అదృష్టం వల్లే గెలిచారు’... జోఫ్రా ఆర్చర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం
ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్(Jofra Archer)పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్లుగా ఇంగ్లండ్ బ్యాటర్ల అసమర్థతను బాగానే కప్పి పుచ్చుతున్నావు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.దమ్ముంటే రెండో టీ20(India vs England)లో సత్తా చూపించాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆర్చర్‌ను ట్రోల్ చేస్తున్నారు. టీమిండియా చేతిలో ఓటమిపై స్పందిస్తూ.. ఆర్చర్ ఒకింత వింత వ్యాఖ్యలు చేయడం ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే..టీమిండియా ఘన విజయంఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ ఆరంభం కాగా.. బుధవారం మొదటి మ్యాచ్ జరిగింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సాగిన ఈ టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో బట్లర్ బృందాన్ని చిత్తు చేసింది.ఆకాశమే హద్దుగా అభిషేక్ శర్మఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బౌలర్ల విజృంభణ కారణంగా ఇంగ్లండ్‌ను 132 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. లక్ష్య ఛేదనలోనూ అదరగొట్టింది. మరో 43 బంతులు మిగిలి ఉండగానే 133 పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసింది. ఓపెనర్లలో సంజూ శాంసన్(20 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.సుడిగాలి ఇన్నింగ్స్‌తో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 20 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న అభిషేక్ శర్మ.. మొత్తంగా 34 బంతుల్లో 79 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లతో పాటు ఏకంగా ఎనిమిది సిక్సర్లు ఉండటం విశేషం.అయితే, ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక వన్‌డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ 19, హార్దిక్ పాండ్యా 3 పరుగులతో అజేయంగా నిలిచి లక్ష్యాన్ని పూర్తి చేశారు.జోఫ్రా ఆర్చర్‌కు వికెట్లుఇక టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లలో రెండు జోఫ్రా ఆర్చర్‌కు దక్కాయి. సంజూ శాంసన్‌తో పాటు.. సూర్యకుమార్ యాదవ్‌లను ఈ రైటార్మ్ పేసర్ అవుట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం జోఫ్రా ఆర్చర్ మాట్లాడుతూ.. అదృష్టం వల్లే టీమిండియా గెలిచిందన్న అర్థంలో వ్యాఖ్యానించాడు.అదృష్టం వల్లే గెలిచారు‘‘ఈరోజు మ్యాచ్‌లో మిగతా బౌలర్లతో పోలిస్తే పరిస్థితులు నాకు కాస్త అనుకూలంగానే ఉన్నాయి. మావాళ్లలో అందరూ బాగానే బౌలింగ్ చేశారు. అయితే, టీమిండియా బ్యాటర్ల అదృష్టం వల్ల వారికి భంగపాటు ఎదురైంది.టీమిండియా బ్యాటర్లు ఆడిన చాలా బంతులు గాల్లోకి లేచాయి. కానీ.. మేము సరిగ్గా క్యాచ్‌లు పట్టలేకపోయాం. తదుపరి మ్యాచ్‌లో మాత్రం కచ్చితంగా ఇలాంటి పొరపాట్లు చేయబోము. అన్ని క్యాచ్‌లు ఒడిసిపడతాం. అప్పుడు నలభై పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయేలా చేస్తాం’’ అని జోఫ్రా ఆర్చర్ చెప్పుకొచ్చాడు.నిజానికి తొలి టీ20లో అభిషేక్ శర్మ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను మాత్రమే ఇంగ్లండ్ ఫీల్డర్లు జారవిడిచారు. తిలక్ వర్మ కూడా ఓసారి బంతిని గాల్లోకి లేపినా.. అదేమీ అంత తేలికైన క్యాచ్ కాదు. ఈ రెండు తప్ప టీమిండియా బ్యాటర్లు క్యాచ్‌లకు ఎక్కువగా అవకాశం ఇవ్వనే లేదు.అయినప్పటికీ అదృష్టం వల్లే టీమిండియా బ్యాటర్లు తప్పించుకున్నారంటూ ఆర్చర్ వ్యాఖ్యానించడం.. అభిమానుల ఆగ్రహానికి ప్రధాన కారణం. మరోవైపు.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రం తమ బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయామంటూ.. భారత బౌలర్లకు క్రెడిట్ ఇవ్వడం గమనార్హం.చదవండి: Rohit Sharma: వింటేజ్ ‘హిట్‌మ్యాన్’ను గుర్తు చేసి.. మరోసారి విఫలమై! -
అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్
టీమిండియాతో తొలి టీ20లో ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) స్పందించాడు. పరుగులు రాబట్టేందుకు వీలుగా ఉన్న పిచ్ మీద సత్తా చాటలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యామన్న బట్లర్.. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపిందని తెలిపాడు. ఏదేమైనా భారత బౌలర్లు అద్భుతంగా ఆడారని.. తదుపరి మ్యాచ్‌లో తాము తిరిగి పుంజుకుంటామని పేర్కొన్నాడు.అర్ష్‌దీప్ అదరగొడితే..కాగా ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇండియా- ఇంగ్లండ్ మధ్య బుధవారం తొలి మ్యాచ్ జరిగింది. కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో జరిగిన పోరులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్లలో ఫిల్ సాల్ట్(0)ను డకౌట్ చేసిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. అనంతరం బెన్ డకెట్(4)ను కూడా పెవిలియన్‌కు పంపాడు.వరుణ్ విశ్వరూపం ప్రదర్శించాడుఅర్ష్దీప్తో పాటు మిస్టరీ స్పిన్నర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) కూడా విశ్వరూపం ప్రదర్శించాడు. వరుస బంతుల్లో లివింగ్‌స్టోన్(0)తో పాటు హ్యారీ బ్రూక్(17)ను అవుట్ చేశాడు. అదే విధంగా.. కొరకాని కొయ్యగా మారిన కెప్టెన్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మిగతా వాళ్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ కేవలం 132 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా ఆది నుంచే దూకుడు కనబరిచింది. అభిషేక్ శర్మ ధనాధన్సంజూ శాంసన్ (20 బంతుల్లో 26) వేగంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. అభిషేక్ శర్మ అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 34 బంతుల్లోనే ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 79 పరుగులు చేశాడు.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(0) విఫలం కాగా.. తిలక్ వర్మ(19), హార్దిక్ పాండ్యా(3) నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. అభిషేక్ ధాటికి 12.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్ల నష్టానికి టీమిండియా 133 పరుగులు చేసింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి.. 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఒత్తిడి పెంచలేకపోయాం.. ఓటమికి కారణం అదేఈ నేపథ్యంలో జోస్ బట్లర్ స్పందిస్తూ.. ‘‘టీమిండియాపై ఒత్తిడి పెంచలేకపోయాం. నిజంగా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక మా జట్టులోని కొంత మంది.. కొందరు భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. వాస్తవానికి.. వికెట్ బాగానే ఉంది. ఫాస్ట్ స్కోరింగ్ గ్రౌండ్ ఇది.కానీ మేము ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. టీ20 క్రికెట్లో మేము మరింత దూకుడుగా బ్యాటింగ్ చేస్తాం. అయితే, అల్ట్రా- అగ్రెసివ్ జట్టుతో పోటీలో ఈరోజు వెనుకబడిపోయాం. ఏదేమైనా టీమిండియాతో పోరు రసవత్తరంగా ఉంటుంది. తదుపరి మ్యాచ్‌లలో కచ్చితంగా రాణిస్తాం. ప్రతీ వేదికపై విభిన్న పిచ్ పరిస్థితులు ఉంటాయి.జోఫ్రా ఆర్చర్ సూపర్స్టార్మా జట్టులో జోఫ్రా ఆర్చర్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అతడొక సూపర్‌స్టార్. ప్రత్యర్థిని కచ్చితంగా భయపెట్టగలడు. ముందుగా చెప్పినట్లు మేము తిరిగి పుంజుకుంటాం’’ అని పేర్కొన్నాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే తమకు ఓటమి ఎదురైనట్లు బట్లర్ చెప్పుకొచ్చాడు.కాగా తొలి టీ20లో ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ సంజూ, సూర్య రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు. అభిషేక్ శర్మ వికెట్‌ను ఆదిల్ రషీద్ దక్కించుకున్నాడు. ఇక ఇండియా- ఇంగ్లండ్ మధ్య చెన్నై వేదికగా శనివారం రెండో టీ20 జరుగనుంది.చదవండి: NADA: డోపింగ్ పరీక్షలు.. బుమ్రా, సూర్య, పంత్, సంజూ శాంసన్.. ఇంకా..𝗔 𝗱𝗼𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗻𝗴 𝘀𝗵𝗼𝘄 𝗮𝘁 𝘁𝗵𝗲 𝗘𝗱𝗲𝗻 𝗚𝗮𝗿𝗱𝗲𝗻𝘀! 💪 💪#TeamIndia off to a flying start in the T20I series, sealing a 7⃣-wicket win! 👏 👏Follow The Match ▶️ https://t.co/4jwTIC5zzs#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/hoUcLWCEIP— BCCI (@BCCI) January 22, 2025 -
వేలంలోకి లేటుగా వచ్చేశాడు.. కట్ చేస్తే! రూ. 12.50 కోట్లు కొట్టేశాడు
ఐపీఎల్-2025 మెగా వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై కాసుల వర్షం కురిసింది. వేలానికి ఒక్క రోజు ముందు ఎంట్రీ ఇచ్చిన ఆర్చర్ అనూహ్యంగా భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఆర్చర్‌ను రూ. 12.50 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ కొనుగోలు చేసింది.రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన జోఫ్రా కోసం తొలుత లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. ఆ తర్వాత పోటీలోకి రాజస్తాన్ రాయల్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆఖరికి ముంబై ఇడియన్స్, ఎల్ఎస్జీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆర్చర్‌ను రాజస్తాన్ సొంతం చేసుకుంది.ఆర్చర్ గత సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కాగా ఈ ఆక్షన్ కోసం బీసీసీఐ తొలుత షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో ఆర్చర్‌కు చోటు దక్కలేదు. ఆ తర్వాత ఇంగ్లండ్ నుంచి ఎన్వోసీ మంజారు కావడంతో ఆఖరినిమిషంలో ఆర్చర్ పేరును వేలంలోకి బీసీసీఐ చేర్చింది. ఐపీఎల్లో ఇప్పటివరకు 40 మ్యాచ్‌లు ఆడిన ఆర్చర్ 48 వికెట్లు పడగొట్టాడు. -
ఆఖరి నిమిషంలో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన డేంజరస్ బౌలర్
ఐపీఎల్-2025 మెగా వేలానికి సర్వం సిద్దమైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో నవంబర్ 24, 25 తేదీల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలాన్ని నిర్వహించనున్నారు. అయితే ఆఖరి నిమిషంలో ఈ మెగా వేలంలోకి ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ ఎంట్రీ ఇచ్చాడు.ఈ ఆక్షన్ కోసం బీసీసీఐ తొలుత షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో ఆర్చర్‌కు చోటు దక్కలేదు. గత కొంత కాలంగా గాయాలతో సతమతవుతున్న ఆర్చర్‌కి ఐపీఎల్లో ఆడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తొలుత అనుమతి ఇవ్వలేదు. దీంతో అతడిని బీసీసీఐ పరిగణలోకి తీసుకోలేదు.కానీ ఇప్పుడు ఆర్చర్ ఈసీబీతో చర్చించినట్లు తెలుస్తుంది. అతడికి ఐపీఎల్లో ఆడేందుకు ఈసీబీ ఎన్వోసీ మంజారు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ మెగా వేలంలో 576వ ఆటగాడిగా ఆర్చర్‌ను బీసీసీఐ చేర్చింది.అయితే భారత క్రికెట్ బోర్డు అతడి బేస్ ప్రైస్‌ను మాత్రం వెల్లడించలేదు. అతడు రూ. 2 కోట్ల కనీస ధర ఉన్న సెట్లో ఉండే అవకాశముంది. ఈ ఇంగ్లండ్ ప్రీమియర్ బౌలర్ గత సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.ఇక ఆర్చర్‌తో పాటు యూఎస్ఎ స్టార్ బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్, బరోడా ఆల్‌రౌండర్ హార్దిక్ తమోర్ కూడా వేలం జాబితాలోకి బీసీసీఐ చేర్చింది. మరోవైపు భారత ఆల్‌రౌండర్ దీపక్ హుడాను అనుమానిత బౌలింగ్ జాబితాలో బీసీసీఐ చేర్చింది.చదవండి: IND vs AUS: బ్రో అక్కడ ఉన్నది డీఎస్పీ.. లబుషేన్‌కు ఇచ్చిపడేసిన సిరాజ్! వీడియో -
ఐపీఎల్-2025 వేలంలో పాల్గొనని ఇద్దరు స్టార్లు..!
ఐపీఎల్ 2025 మెగా వేలం సెప్టెంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు వేలం ప్రారంభంకానుంది. ఈసారి వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇందులో 366 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 208 మంది విదేశీ ఆటగాళ్లు. మరో ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు. ఈసారి వేలం మొత్తం 204 స్లాట్లకు జరుగనుండగా.. 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది.ఈసారి మెగా వేలంలో ఇద్దరు స్టార్ ప్లేయర్ల పేర్లు కనిపించలేదు. ఇంగ్లండ్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్, ఆస్ట్రేలియాకు చెందిన కెమరూన్ గ్రీన్ వేలంలో తమ పేర్లు నమోదు చేసుకోలేదు. ఆర్చర్ జాతీయ జట్టుకు సేవలందించేందుకు వేలానికి దూరంగా ఉండగా.. గ్రీన్ సర్జరీ కారణంగా వేలంలో పాల్గొనడం లేదు. ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ 2023 మెగా వేలంలో రూ. 8 కోట్లకు సొంతం చేసుకోగా.. గ్రీన్‌ను ఆర్సీబీ 2024 వేలంలో రూ. 17.5 కోట్లకు దక్కించుకుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈసారి వేలంలో పాల్గొని ఉంటే మరోసారి భారీ మొత్తం దక్కేది.మెగా వేలంలో పాల్గొనని మరో ముగ్గురు స్లార్లు..బెన్ స్టోక్స్జేసన్ రాయ్శిఖర్ ధవన్అత్యంత పిన్నవయస్కుడు..ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్లలో అత్యంత పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీ. 13 ఏళ్ల ఈ బీహార్ చిన్నోడు జూనియర్ క్రికెట్లో సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్శించాడు. ఇక వేలంలో పాల్గొనబోయే అత్యంత పెద్ద వయస్కుడిగా జిమ్మీ ఆండర్సన్ ఉన్నాడు. ఆండర్సన్ 41 ఏళ్ల వయసులో వేలంలో పాల్గొని తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.వేలంలో పాల్గొనబోయే ఆసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు..ఉన్ముక్త్ చంద్ (యూఎస్ఏ)అలీ ఖాన్ (యూఎస్ఏ)బ్రాండన్ మెక్‌ముల్లెన్ (స్కాట్లాండ్)ఈ ముగ్గురు 30 లక్షల బేస్‌ప్రైజ్ విభాగంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.క్యాప్డ్, అన్క్యాప్డ్ ప్లేయర్ల వివరాలు..భారతీయ క్యాప్డ్ ప్లేయర్లు- 48విదేశీ క్యాప్డ్ ప్లేయర్లు- 193అసోసియేట్ దేశాలకు చెందిన ప్లేయర్లు- 3భారతీయ అన్క్యాప్డ్ ప్లేయర్లు- 318విదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు- 12మొత్తం- 574వివిధ బేస్ ధర విభాగాల్లో పాల్గొననున్న ఆటగాళ్లు..రూ. 2 కోట్లు- 81 మంది ఆటగాళ్లురూ. 1.5 కోట్లు- 27రూ. 1.25 కోట్లు- 18రూ. కోటి- 23రూ. 75 లక్షలు- 92రూ. 50 లక్షలు- 8రూ. 40 లక్షలు- 5రూ. 30 లక్షలు- 320మొత్తం- 574 -
ఇంగ్లండ్ హ్యాట్రిక్.. ముగ్గురూ క్లీన్ బౌల్డ్
ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ట్రావిస్ హెడ్ (23 బంతుల్లో 59; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఊచకోత కోయడంతో 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (41), జోష్ ఇంగ్లిస్ (37) ఓ మోస్తరు పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్‌స్టోన్ 3, జోఫ్రా ఆర్చర్, సకీబ్ మహమూద్ తలో 2, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ పడగొట్టారు.లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆసీస్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 19.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. సీన్ అబాట్ 3, హాజిల్‌వుడ్, జంపా చెరో 2, బార్ట్లెట్, గ్రీన్, స్టోయినిస్ తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో లివింగ్‌స్టోన్ (37), ఫిలిప్ సాల్ట్ (20), సామ్ కర్రన్(18), జోర్డన్ కాక్స్ (17), జేమీ ఓవర్టన్ (15), సాకిబ్ మహమూద్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 సెప్టెంబర్ 13న జరుగుతుంది.A terrific video by England on team's hat-trick against Australia last night. 👌pic.twitter.com/tZzlLT8vbS— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2024ఇంగ్లండ్ హ్యాట్రిక్ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీమ్ హ్యాట్రిక్ వికెట్లు తీసింది. ఆసీస్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి రెండు బంతులకు.. 19వ తొలి బంతికి ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లు తీశారు. 18వ ఓవర్లో సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్లను జోఫ్రా ఆర్చర్.. 19వ ఓవర్ తొలి బంతికి కెమరూన్ గ్రీన్‌ను సాకిబ్ మహమూద్ ఔట్ చేశారు. ఈ ముగ్గురూ క్లీన్ బౌల్డ్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడినప్పటికీ ఇదొక్కటే చెప్పుకోదగ్గ ప్రదర్శన.4,4,6,6,6,4 by Travis Head against Sam Curran in a single over. - The ruthless version of Head is scary! 🤯pic.twitter.com/QfFQCwgHN9— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2024ట్రవిస్ హెడ్ ఊచకోతఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ తన సహజ సిద్దమైన హిట్టింగ్తో ఇంగ్లండ్ బౌలర్లను భయపెట్టారు. హెడ్.. సామ్ కర్రన్ వేసిన ఓ ఓవర్లో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఇందులో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. హెడ్.. ఆసీస్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. హెడ్ కంటే ముందు పాంటింగ్, డేనియల్ క్రిస్టియన్, ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్ ఒకే ఓవర్లో 30 పరుగులు బాదారు.చదవండి: హెడ్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్ -
ప్రపంచంలో ఆ ఐదుగురే అత్యుత్తమ బౌలర్లు..!
ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ప్రపంచంలో తాను మెచ్చిన ఐదుగురు అత్యుత్తమ బౌలర్ల జాబితాను ప్రకటించాడు. ఈ జాబితాలో రషీద్ టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానాన్ని ఇచ్చాడు. ఆతర్వాత ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్, న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ట్రెంట్ బౌల్ట్, ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్, పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ అఫ్రిదికి చోటిచ్చాడు. ఆదిల్ ప్రపంచంలో నంబర్ వన్ బ్యాటర్‌గా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఎంపిక చేశాడు.కాగా, ఆదిల్ రషీద్ ఎంపిక చేసిన బౌలర్లలో మిచెల్ స్టార్క్ అందరి కంటే ఎక్కువ అంతర్జాతీయ వికెట్లు కలిగి ఉన్నాడు. స్టార్క్ తన కెరీర్లో ఇప్పటివరకు 673 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ తర్వాత అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. బౌల్ట్ ఇప్పటిదాకా 611 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరి తర్వాతి స్థానంలో బుమ్రా ఉన్నాడు. బుమ్రా తన కెరీర్లో ఇప్పటివరకు 397 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తర్వాతి స్థానంలో షాహిన్ అఫ్రిది ఉన్నాడు. అఫ్రిది ఖాతాలో 313 వికెట్లు ఉన్నాయి. ఆదిల్ ఎంపిక చేసిన అత్యుత్తమ బౌలర్ల జాబితాలో చివరి స్థానంలో జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు. ఆర్చర్ అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 115 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. -
T20 WC 2024: 47 పరుగులకే ఆలౌట్.. వరల్డ్‌కప్‌లోనే అతిపెద్ద విజయం
టీ20 ప్రపంచకప్-2024 గ్రూప్ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఒమన్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి సూపర్-8 ఆశలను సజీవం చేసుకుంది.కాగా వరల్డ్‌కప్-2024లో భాగంగా ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్‌లతో కలిసి ఇంగ్లండ్ గ్రూప్-బిలో ఉంది. అయితే, తొలి రెండు మ్యాచ్‌లలో ఈ డిఫెండింగ్ చాంపియన్‌కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి.స్కాట్లాండ్తో మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోగా.. రెండో మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో సూపర్-8కు అర్హత సాధించాలంటే ఒమన్‌తో శుక్రవారం(ఉదయం 12.30 నిమిషాలకు ఆరంభం) నాటి మ్యాచ్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో నిలిచింది.ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు ఆదిల్ రషీద్(4/11), జోఫ్రా ఆర్చర్(3/12), మార్క్ వుడ్(3/12) చెలరేగడంతో ఒమన్ 47 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు 13.2వ ఓవర్లోనే ఆలౌట్ అయింది. View this post on Instagram A post shared by ICC (@icc)టీ20 ప్రపంచకప్ చరిత్రలో అతిపెద్ద విజయం ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం పందొమ్మిది బంతుల్లోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(3 బంతుల్లో 12), కెప్టెన్ జోస్ బట్లర్(8 బంతుల్లో 24 నాటౌట్), జానీ బెయిర్ స్టో(2 బంతుల్లో 8 నాటౌట్) దంచికొట్టారు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ విల్ జాక్స్(7 బంతుల్లో 5) పర్వాలేదనిపించగా.. 3.1 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్ 50 పరుగులు చేసింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఒమన్‌ను చిత్తుగా ఓడించింది. 101 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించి మెన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అతిపె ద్ద విజయం నమోదు చేసింది. అలా అయితేనే సూపర్-8కుకాగా గ్రూప్-డి నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్-8 బెర్తు ఖరారు చేసుకోగా.. ఇంగ్లండ్ తమ తదుపరి మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అంతేగాకుండా స్కాట్లాండ్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో తప్పక ఓడిపోవాలి.లేదంటే ఇంగ్లండ్ సూపర్-8 చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచి, స్కాట్లాండ్ ఓడినా నెట్‌రన్‌రేటు కీలకం(ఇంగ్లండ్ 3 పాయింట్లు, +3.081), స్కాట్లాండ్ ఐదు పాయింట్లు +2.164))గా మారుతుంది. చదవండి: T20 World Cup 2024: వరల్డ్‌కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది? View this post on Instagram A post shared by ICC (@icc) -
ఇంగ్లండ్ టి20 జట్టులో జోఫ్రా ఆర్చర్
గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సంతరించుకున్న పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఏడాది తర్వాత మళ్లీ ఇంగ్లండ్ జట్టులోకి వచ్చాడు. టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే ఇంగ్లండ్ జట్టును మంగళవారం ప్రకటించారు. ఆర్చర్ పునరాగమనం చేయగా... జోస్ బట్లర్ కెపె్టన్‌గా కొనసాగుతాడు. మొయిన్ అలీ, బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, స్యామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లే, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లే, మార్క్ వుడ్ జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు. -
Bengaluru: స్టంప్ బ్రేక్ చేసిన జోఫ్రా ఆర్చర్.. వీడియో వైరల్
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ప్రస్తుతం కర్ణాటక జట్టుకు ఆడుతున్నాడు. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుంటున్నాడు! అదేంటీ.. ఆర్చర్.. కర్ణాటక టీమ్‌లో ఎలా? అని ఆశ్చర్యపోతున్నారా?! ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ కౌంటీ చాంపియన్‌షిప్‌నకు సన్నద్ధమయ్యే క్రమంలో ససెక్స్, లంకాషైర్ జట్లు ఇండియాకు వచ్చాయి. బెంగళూరులో పదిరోజుల పాటు జరుగనున్న శిక్షణా శిబిరంలో పాల్గొననున్నాయి. ఈ క్రమంలో ససెక్స్ ఆటగాడు, ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా బెంగళూరుకు విచ్చేశాడు. ససెక్స్- కర్ణాటక(అండర్ 19, అండర్ 23 ప్లేయర్లు కలగలిసిన టీమ్) జట్ల మధ్య తొలి రోజు ఆటకు దూరంగా ఉన్న అతడు.. శుక్రవారం బరిలోకి దిగాడు. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా కర్ణాటక జట్టులోకి వచ్చి మార్నింగ్ సెషన్లో రెండు వికెట్లు పడగొట్టాడు. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌల్ చేసిన ఆర్చర్ దెబ్బకు స్టంప్ బ్రేక్ అయిపోయింది. ఇక మరో సందర్భంలో బ్యాటర్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని పెవిలియన్‌కు పంపాడు. ఈ రెండు సందర్భాల్లోనూ కర్ణాటక తరఫున.. తమ బ్యాటర్లను జోఫ్రా ఆర్చర్ అవుట్ చేసిన వీడియోలను ససెక్స్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా గాయం కారణంగా ఐపీఎల్-2023 టోర్నీ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయిన జోఫ్రా ఆర్చర్(ముంబై ఇండియన్స్).. ఇంతవరకు మళ్లీ కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. కుడి మోచేతి గాయంతో బాధపడుతున్న అతడు.. టీ20 ప్రపంచకప్-2024 నాటికి ఇంగ్లండ్ జట్టుతో చేరే అవకాశం ఉంది. Jofra’s taken another wicket and broken the stump! 🚨 pic.twitter.com/9L7X2u4PEt — Sussex Cricket (@SussexCCC) March 15, 2024 Wicket - Alsop out lbw, b Archer The KSCA XI’s newest addition looks like a decent player tbf. 😅 pic.twitter.com/KXOTr6AgRI — Sussex Cricket (@SussexCCC) March 15, 2024 -
IPL 2024: క్యాష్ రిచ్ లీగ్‌కు దూరం కానున్న స్టార్ పేసర్.. కారణం?
ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ విషయంలో ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగం కావొద్దని అతడికి ఈసీబీ సూచించినట్లు తెలుస్తోంది. కాగా బార్బడోస్‌కు చెందిన 28 ఏళ్ల రైటార్మ్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్-2023 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. గతేడాది అతడిని ఎనిమిది కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది ముంబై ఫ్రాంఛైజీ. గాయం కారణంగా ఐపీఎల్-2022 సీజన్ మొత్తానికి దూరమవుతాడని తెలిసినా పెద్ద మొత్తం అతడి కోసం పక్కకు పెట్టింది. అయితే, ఐపీఎల్-2023కి అతడు అందుబాటులోకి వచ్చినా.. ఆశించిన మేర ఆర్చర్ సేవలను వినియోగించుకోలేకపోయింది. గాయాల బెడద కారణంగా అతడు సింహభాగం మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజా ఎడిషన్‌లో కేవలం ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆర్చర్.. రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. తనపై ఖర్చు పెట్టిన మొత్తానికి న్యాయం చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 వేలానికి ముందు ముంబై అతడిని విడుదల చేసింది. అయితే, ఆర్చర్ వేలంలో పాల్గొనాలని భావించినా ఈసీబీ అందుకు అడ్డు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు..‘‘ఆర్చర్ పునరాగమనం చేయాలని కోరుకుంటున్న ఈసీబీ.. అతడిని ఏప్రిల్, మే మొత్తం తమ పర్యవేక్షణలోనే ఉండాలని భావిస్తోంది. ఒకవేళ అతడు వేలంలో పాల్గొంటే కచ్చితంగా ఏదో ఒక ఐపీఎల్ జట్టు అతడిని కొనుగోలు చేయడమే కాకుండా ఖర్చు తగ్గ ఫలితం పొందాలని ఆశిస్తుంది. కాబట్టి.. వరల్డ్‌కప్-2024 జూన్‌లోనే ప్రారంభమవుతున్న కారణంగా పని భారాన్ని తగ్గించుకునే వీలు ఉండకపోవచ్చు. అందుకే అతడు ఈసారి ఐపీఎల్‌కు దూరంగా ఉండనున్నాడు’’ అని ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫో తన కథనంలో పేర్కొంది. కాగా జోఫ్రా ఆర్చర్ టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు ఈసీబీతో రెండేళ్లకు గానూ కొత్త ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో తమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆర్చర్‌కు ఈసీబీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 కోసం భారత్‌కు వచ్చిన జోఫ్రా ఆర్చర్ మోచేయి గాయం కారణంగా..వారంలోపే తిరిగి యూకేకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. కాబట్టి తమ పేసర్ ఫిట్నెస్ విషయంలో రిస్క్ తీసుకునేందుకు బోర్డు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. చదవండి: భారత్‌కు తిరిగి వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
IPL 2024: స్టార్ బౌలర్‌కు షాక్.. 11 మందిని వదిలేసిన ముంబై
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ 11 మంది ఆటగాళ్లను వేలానికి వదిలేసింది. కెప్టెన్‌గా రోహిత్‌ను కొనసాగించిన ముంబై.. స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు షాకిచ్చింది. ఆర్చర్‌తో పాటు మరో 10 మందిని ముంబై మేనేజ్మెంట్ వేలానికి వదిలేసింది. ముంబై ఇండియన్స్ వదిలేసిన ఆటగాళ్లు వీరే.. క్రిస్ జోర్డాన్ జోఫ్రా ఆర్చర్ డువాన్ జన్సెన్ హృతిక్ షోకీన్ అర్షద్ ఖాన్ రమణదీప్ సింగ్ రాఘవ్ గోయల్ ట్రిస్టన్ స్టబ్స్ జై రిచర్డ్సన్ రిలే మెరిడిత్ సందీప్ వారియర్ ముంబై ఇండియన్స్ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే.. రోహిత్ శర్మ (కెప్టెన్) జస్ప్రీత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్ పీయూష్ చావ్లా డెవాల్డ్ బ్రెవిస్ తిలక్ వర్మ టిమ్ డేవిడ్ రొమారియో షెపర్డ్ (ట్రేడింగ్) అర్జున్ టెండూల్కర్ విష్ణు వినోద్ నేహాల్ వధేరా షమ్స్ ములానీ కుమార్ కార్తికేయ ఆకాష్ మధ్వల్ జాసన్ బెహ్రెండార్ఫ్ -
CWC 2023: ప్రపంచకప్ జట్టుతో స్టార్ పేసర్
స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇంగ్లండ్ ప్రపంచ కప్ జట్టుతో పాటు భారత్‌కు బయల్దేరనున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ చీఫ్ సెలక్టర్ లూక్ రైట్ వెల్లడించాడు. ఆర్చర్ గాయం నుంచి పూర్తి కోలుకోనప్పటికీ.. ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఇంగ్లండ్ జట్టుతో పాటు ఉంటాడని ప్రకటించాడు. టీమ్‌తో ఉంటూనే ఆర్చర్ రిహాబ్‌లో కొనసాగుతాడని పేర్కొన్నాడు. ప్రపంచకప్ జట్టులో దురదృష్టవశాత్తు ఎవరైనా గాయపడితే ఆర్చర్ అందుబాటులో ఉంటాడని తెలిపాడు. జట్టుతో పాటు ఉంటే ఆర్చర్ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని, అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తే వరల్డ్‌కప్‌లో ఏ సమయంలోనైనా అతని సేవలు వినియోగించుకుంటామని అన్నాడు. ఆర్చర్ త్వరగా కోలుకునేందుకు తమ మెడికల్ టీమ్ చేయాల్సిందంతా చేస్తుందని తెలిపాడు. ఇంగ్లండ్ వరల్డ్‌కప్ జట్టును ప్రకటించే సందర్భంలో లూక్ రైట్ ఈ విషయాలను వెల్లడించాడు. కాగా, ఇంగ్లండ్ సెలెక్టర్లు నిన్న ప్రపంచకప్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన జట్టులో సెలెక్టర్లు ఓ కీలక మార్పు చేశారు. స్టార్ బ్యాటర్ జేసన్ రాయ్‌పై వేటు వేసి యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతున్న రాయ్.. ఎంతకీ కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే, ఆర్చర్ గత కొన్ని నెలలుగా వేర్వేరు గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఆర్చర్ గాయాల జాబితాలో కుడి మోచేతి ఫ్రాక్చర్ ప్రధానమైంది. ఈ గాయం కారణంగానే అతను ప్రతిష్టాత్మక యాషెస్ సహా పలు కీలక సిరీస్‌లు, ఐపీఎల్‌ను మిస్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్చర్ గాయాల నుంచి కోలుకుంటూ రిహాబ్‌లో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ సెలెక్టర్ల తాజా నిర్ణయంతో ఆర్చర్ ఇంగ్లండ్ జట్టుతో పాటు వరల్డ్‌కప్‌కు వేదిక అయిన భారత్‌కు వెళ్తాడు. ఇంగ్లండ్ ప్రపంచ కప్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జో రూట్, డేవిడ్ మలాన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లే, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, డేవిడ్ విల్లీ, సామ్ కర్రన్ ట్రావెలింగ్ రిజర్వ్: జోఫ్రా ఆర్చర్ -
స్టోక్స్ రీఎంట్రీ.. ఇంతలోనే ఇంగ్లండ్ టీమ్‌కు ఓ బ్యాడ్ న్యూస్
వరల్డ్‌కప్ నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చాడన్న శుభవార్త తెలిసిన నిమిషాల వ్యవధిలోనే ఇంగ్లండ్ జట్టుకు ఓ బాధాకరమైన వార్త కూడా తెలిసింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇంగ్లండ్ వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని ఇంగ్లండ్ సెలెక్టర్ లూక్ రైట్ చెప్పకనే చెప్పాడు. మోచేతి గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆర్చర్‌ను న్యూజిలాండ్ సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదని.. ఆర్చర్‌తో తమకు ఉన్న దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా అతని విషయంలో హడావుడి నిర్ణయాలు తీసుకోలేమని రైట్ తెలిపాడు. ఆర్చర్‌ను న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక చేయనప్పటికీ, అతను ట్రావెలింగ్ రిజర్వ్‌గా (రిజర్వ్ ఆటగాడి) ఇంగ్లండ్ జట్టుతో పాటు ఇండియాకు బయల్దేరతాడని పేర్కొన్నాడు. ఆర్చర్ విషయంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చాలా జాగ్రత్తగా ఉందని, ఒకవేళ అతను వరల్డ్‌కప్ సెకండాఫ్ సమయానికి ఫిట్నెస్ నిరూపించుకోగలిగితే జట్టుతో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టునే దాదాపుగా వరల్డ్‌కప్‌కు కూడా ఎంపిక చేయవచ్చని హింట్ ఇచ్చాడు. ఇదే వరల్డ్‌కప్‌కు తమ ప్రొవిజనల్ స్క్వాడ్ అని కూడా తెలిపాడు. ఇదిలా ఉంటే, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ వరల్డ్‌కప్‌లో తమ తొలి మ్యాచ్‌ను అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్‌తో ఆడుతుంది. దీనికి ముందు ఆ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తోనే 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్, తదుపరి 4 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ సెలెకర్లు రెండు వేర్వేరు జట్లను కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఈ పర్యటనలో తొలి టీ20 ఆగస్ట్ 30న, రెండోది సెప్టెంబర్ 1న, మూడోది సెప్టెంబర్ 3న, నాలుగో టీ20 సెప్టెంబర్ 5న జరుగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 8న తొలి వన్డే, సెప్టెంబర్ 10న రెండో వన్డే, సెప్టెంబర్ 13న మూడో వన్డే, సెప్టెంబర్ 15న నాలుగో వన్డే జరుగనున్నాయి. న్యూజిలాండ్ పర్యటన కోసం ఇంగ్లండ్ టీ20 జట్టు.. జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, జాన్ టర్నర్, ల్యూక్ వుడ్ న్యూజిలాండ్ పర్యటన కోసం ఇంగ్లండ్ వన్డే జట్టు.. జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్ ప్రొవిజనల్ స్క్వాడ్.. జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ -
రూ. 8 కోట్లు పెడితే మధ్యలోనే వదిలివెళ్లాడు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు!
IPL 2023: ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌పై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ మండిపడ్డాడు. కోట్లు కుమ్మరించి కొనుక్కుంటే ముంబై ఇండియన్స్‌కు అతడి వల్ల ఏమి ఒరిగిందని ప్రశ్నించాడు. ముంబై తనపై వెచ్చించిన ఒక్క రూపాయికి కూడా ఆర్చర్ న్యాయం చేయలేదని.. అతడికి రూ. 8 కోట్ల మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ముందే తెలిసినా ఐపీఎల్-2022 వేలంలో భాగంగా 8 కోట్లు పెట్టి ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్‌ను కొనుగోలు చేసింది. ఫిట్నెస్ సమస్యలతో బాధ పడుతున్న ఆర్చర్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడని తెలిసినా అతడి కోసం భారీ మొత్తం వెచ్చించింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 లీగ్ ద్వారా ఈ ఏడాది ఆరంభంలో టీ20 క్రికెట్లో తిరిగి అడుగుపెట్టిన ఆర్చర్.. ఎంఐ కేప్‌టౌన్ జట్టుకు ఆడాడు. జోఫ్రా ఆర్చర్ ఈ క్రమంలో ఐపీఎల్-2023 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి తిరిగి వచ్చాడు. ఎన్నో అంచనాలతో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన అతడు 5 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు వికెట్లు తీశాడు. తర్వాత గాయం తిరగబెట్టడంతో మే 9న స్వదేశం ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు. 8 కోట్లు పెడితే ఏం దక్కింది? ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ జోఫ్రా ఆర్చర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిడ్ డేకు రాసిన కాలమ్‌లో.. ‘‘జోఫ్రా ఆర్చర్ వల్ల ముంబై ఇండియన్స్ ఎలాంటి అనుభవం చవిచూసిందో తెలుసు కదా! ఈ సీజన్ నుంచి మాత్రమే అతడు అందుబాటులో ఉంటాడని తెలిసినా గాయపడిన అతడిని కొనుగోలు చేసింది. అతడి కోసం భారీ మొత్తం వెచ్చించింది. కానీ ప్రతిఫలంగా వారికి ఏం లభించింది? అతడు 100 శాతం ఫిట్నెస్ సాధించకలేకపోయాడు. కనీసం ఈ విషయం గురించి ముందే ఫ్రాంఛైజీకి సమాచారం ఇవ్వాల్సింది. అపుడైనా వాళ్లకు.. అతడి సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేమని తెలిసేది. టోర్నీ మధ్యలో చికిత్స కోసమని స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఈసీబీ స్వయంగా చెప్పింది. నిజానికి ఈసీబీ కంటే ముంబై ఫ్రాంఛైజీనే ఆర్చర్‌కు ఎక్కువ మొత్తం చెల్లిస్తోంది. కానీ అతడు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించాడు. యూకేకు తిరిగి వెళ్లినపుడే ఫ్రాంఛైజీ పట్ల అతడి నిబద్ధత ఎలాంటిదో అర్థమైంది’’ అని గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అసలు ఆర్చర్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయినా నష్టమేమీ లేదని పేర్కొన్నాడు. చదవండి: అది కూడా కీలకమే.. పాపం రాజస్తాన్ ఆ విషయం మర్చిపోయినట్టుంది! -
ఆసీస్‌తో ప్రతిష్టాత్మక సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్!
England Vs Australia: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ గాయపడ్డాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా లంకాషైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆండర్సన్.. సోమర్‌సెట్‌తో మ్యాచ్ సందర్భంగా గజ్జల్లో నొప్పితో విలవిల్లాడాడు. ఓల్డ్ ట్రఫోర్డ్‌లో గురువారం నాటి తొలి రోజు ఆటలోనే నొప్పి కారణంగా వైదొలిగాడు. మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో లంకాషైర్- సోమర్సెట్ మధ్య మ్యాచ్ డ్రా అయిన తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆండర్సన్ గాయం గురించి ఆదివారం ప్రకటన చేసింది. అప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం 40 ఏళ్ల ఆండర్సన్ ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. అయితే, జూన్ 1న ఐర్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ ఆడనున్న ఏకైక టెస్టు నాటికి అతడు జట్టుతో చేరతాడా లేదా అన్న విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొంది. విజయవంతమైన ఫాస్ట్‌బౌలర్ ఇదిలా ఉంటే.. ఆండర్సన్ ప్రస్తుత పరిస్థితి గురించి లంకాషైర్ కోచ్ గ్లెన్ చాపెల్ బీబీసీతో మాట్లాడుతూ.. నొప్పి తీవ్రత ఎక్కువగా ఏమీ లేదని, త్వరలోనే అతడు కోలుకుండాటని చెప్పాడు. కాగా జూన్ 16 నుంచి చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఆడనున్న ఐదు మ్యాచ్‌ల యాషెస్ టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కాగా ఆండర్సన్ టెస్టు క్రికెట్లో 685 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన ఫాస్ట్‌బౌలర్‌గా కొనసాగుతున్నాడు. వారితో పాటు తాజాగా ఇక ఇప్పటికే ఇంగ్లండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, ఓలీ స్టోన్, బ్రైడన్ కార్స్ తదితరులు గాయాల బారిన పడగా.. తాజాగా ఆండర్సన్ సైతం ఈ జాబితాలో చేరిపోయాడు. ఇదిలా ఉంటే 2021-22 యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఐదింట నాలుగు విజయాలతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ముందుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌నైనా డ్రా చేసుకుని ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ గండం నుంచి బయటపడింది. ఈ నేపథ్యంలో ఈసారి పోరు మరింత రసవత్తరంగా మారనుంది. ఇక యాషెస్ కంటే ముందు ఆస్ట్రేలియా ఇంగ్లండ్ వేదికగా టీమిండియాతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడనుంది. జూన్ 7-11 వరకు మ్యాచ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: పనిష్మెంట్.. అంపైర్లతో రాణా అలా.. వైరల్! ఎందుకో ప్రతిదానికీ ఇలా! వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని -
ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం! జోర్డాన్ ఎంట్రీ
ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా అర్చర్ ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అర్చర్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో తన స్వదేశానికి పయనమయ్యాడు. ఇక అర్చర్ స్థానాన్ని ఇంగ్లండ్ స్టార్ పేసర్ క్రిస్ జోర్డన్‌తో ముంబై ఇండియన్స్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. రూ.2 కోట్ల కనీస ధరకు జోర్డన్‌తో ముంబై ఇండియన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. "దురదృష్టవశాత్తూ మిగిలిన మ్యాచ్‌లకు జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు. ఆర్చర్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేందుకు ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. అతడి స్థానాన్ని క్రిస్ జోర్డాన్ భర్తీ చేయనున్నాడు" అని ముంబై ఇండియన్స్ ట్విటర్లో పేర్కొంది. కాగా ఈ ఏడాది సీజన్లో జోఫ్రా అర్చర్ అంతగా అకట్టుకోలేకపోయాడు. 5 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 9.50 ఏకానమితో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక టీ20 స్పెషలిస్టు బౌలర్‌గా పేరుందిన క్రిస్ జోర్డన్ జట్టులో చేరడం ముంబైకు మరింత బలం చేకూరుస్తుంది. ఇంగ్లండ్ తరపున 87 టీ20లు ఆడిన జోర్డాన్ 96 వికెట్లు పడగొట్టాడు. ఇక మంగళవారం ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్‌కు జోర్డాన్ అందుబాటులో ఉండనున్నాడు. చదవండి: చాలా బాధగా ఉంది.. కానీ క్రెడిట్ మొత్తం అతడికే: శిఖర్ ధావన్ -
అర్జున్ నయం.. ఆర్చర్‌ను నమ్మి తప్పు చేశాడా!
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఘోర వైఫల్యం కొనసాగుతుంది. బుధవారం పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆర్చర్ బౌలింగ్‌ను ఒక ఆట ఆడుకున్నారు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆర్చర్ 56 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పైగా ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్నాడు. ఆర్చర్ వీక్నెస్ ఏంటో తెలిసిన లివింగ్‌స్టోన్ హ్యాట్రిక్ సిక్సర్లతో స్వాగతం పలికాడు. దీంతో దెబ్బకు ఆర్చర్ ఐపీఎల్లో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో ఒక మ్యాచ్‌లో వికెట్ లేకుండా అత్యధిక పరుగులు సమర్పించుకోవడం ఆర్చర్‌కు ఇదే తొలిసారి. అసలు వేస్తుంది ఆర్చరా లేక దేశవాలీ క్రికెటర్ ఎవరైనానా అన్న సందేహం కలిగింది. ఏ మాత్రం పసలేని బౌలింగ్‌తో ఆర్చర్ ముంబై ఇండియన్స్‌ను ముంచాడు. జాసన్ బెహండార్ఫ్‌ను కాదని ఆర్చర్‌ను నమ్మి రోహిత్ తప్పు చేశాడు. పూర్తిగా గతి తప్పిన బౌలింగ్‌తో ఆర్చర్ మ్యాచ్‌లో ఇబ్బందులు ఎదుర్కోవడం స్పష్టంగా కనిపించింది. ఇక ఆర్చర్ బౌలింగ్ చూశాకా అర్జున్ టెండూల్కర్ నయం అని చాలామంది అభిమానులు అభిప్రాయపడ్డారు. మూడు మ్యాచ్‌లు ఆడిన అర్జున్ 9.3 ఎకానమీతో మూడు వికెట్లు తీశాడు. అయితే ఆర్చర్‌తో పోలిస్తే అర్జున్ బౌలింగ్ బెటర్‌గా ఉందని.. అతనికి అవకాశం ఇచ్చినా బాగుండేదని పేర్కొన్నారు. Liam Livingstone hits 6,6,6 vs Jofra Archer in 3 balls. Liam Livingstone - What a beast, what a striker! pic.twitter.com/Pnx91jGohd — CricketMAN2 (@ImTanujSingh) May 3, 2023 చదవండి: సమయం వస్తే ధోనినే చెప్తాడు.. ప్రతీసారి ఎందుకీ చర్చ! -
ఆర్చర్ ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే.. అగమ్యగోచరంగా ముంబై ఇండియన్స్ పరిస్థితి
ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 16) జరుగనున్న డబుల్ హెడర్ మ్యాచ్‌ల్లో తొలుత (మధ్యాహ్నం 3:30 గంటలకు) ముంబై ఇండియన్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడేలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించగా.. ముంబై 3 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో (ఆర్సీబీ, సీఎస్కే) ఘోర పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడినట్లు కనిపిస్తున్న ముంబై టీమ్‌కు రిలాక్స్ అయ్యే లోపే మరో షాక్ తగిలింది. తొలి మ్యాచ్ సందర్భంగా గాయపడి, ఆ తర్వాత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఆ జట్టు స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కేకేఆర్‌తో మ్యాచ్‌కు సైతం అందుబాటులో ఉండేలా కనిపించడం లేదు. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ఆర్చర్ సంసిద్దతపై అతని సహచరుడు టిమ్ డేవిడ్ ఓ క్లూ వదిలాడు. ఆర్చర్ ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు టిమ్ తెలిపాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ఆర్చర్ అందుబాటులో ఉండేది లేనిది చివరి నిమిషం వరకు చెప్పలేమని పేర్కొన్నాడు. శనివారం ఆర్చర్ కొద్దిసేపు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడని, అనంతరం నెట్స్‌లో భారీ షాట్లు సైతం ఆడాడని, అయినా ఇదంతా అతను మెడికల్ టీమ్ పర్యవేక్షనలో చేస్తుండటం కొంత ఆందోళనకరమేనని చెప్పుకొచ్చాడు. మరోవైపు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన కేకేఆర్‌ను ఢీకొనడం పెద్ద ఛాలెంజ్‌తో కూడుకున్న పని అని, ఇలాంటి ప్రత్యర్ధిపై బలమైన బౌలింగ్ ఆప్షన్స్ లేకపోత చాలా కష్టమవుతుందని తెలిపాడు. గత 3 మ్యాచ్‌ల్లో 200 ప్లస్ స్కోర్ చేసిన కేకేఆర్‌ను నిలువరించాలంటే తమ బౌలింగ్ పటిష్టంగా ఉండాలని, మ్యాచ్ సమయానికి ఆర్చర్ అందుబాటులోకి వస్తే, తమ విజయావకాశాలు మెరుగవుతాయని అన్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న రింకూ సింగ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణాలను నిలువరించడం తమకు కత్తి మీద సామే అవుతుందని పేర్కొన్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
MI VS CSK: 32.25 కోట్లు పెట్టి కొన్నారు, పక్కకు పెట్టారు.. ఎందుకు..?
ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య భారీ అంచనాల నడుమ నిన్న (ఏప్రిల్ 8) జరిగిన ఆసక్తికర సమరంలో ఓ విషయం హైలైట్ అయ్యింది. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న ఆటగాళ్లను ఇరు ఫ్రాంచైజీలు బెంచ్‌కే పరిమితం చేసి పెద్ద సాహసమే చేశాయి. ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్ (రూ. 8 కోట్లు) లేకుండా, సీఎస్కే మొయిన్ అలీ (రూ. 8 కోట్లు), బెన్ స్టోక్స్ (రూ. 16.25 కోట్లు) లేకుండా బరిలోకి దిగి అభిమానులతో పాటు విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి. వీరు ముగ్గురు తుది జట్టులో లేకపోవడానికి గల కారణాలను సంబంధిత కెప్టెన్లు టాస్ సమయంలో వెల్లడించినప్పటికీ, అవి పొంతనలేనివిగా తెలుస్తోంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తమ ఆటగాడు ఆర్చర్ గాయపడ్డాడని తొలుత చెప్పి, ఆతర్వాత ముందు జాగ్రత్త చర్యగా అతనికి రెస్ట్ ఇచ్చామని చెప్పగా.. సీఎస్కే సారధి ధోని తమ ఆటగాళ్లు మొయిన్ అలీ స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడని, స్టోక్స్ మడమ గాయంతో బాధపడుతున్నాడని తెలిపాడు. 32.25 కోట్లు పెట్టి కొన్న ఆటగాళ్ల విషయంలో కెప్టెన్లు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో సదరు ఆటగాళ్ల ప్రదర్శనతో సంతృప్తి చెందని ఫ్రాంచైజీలు ఉద్దేశపూర్వకంగానే గాయాల సాకు చూపించి వారి తప్పించినట్లు తెలుస్తోంది. మొయిన్ అలీ గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసి 17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 23 పరుగులు చేయగా, లక్నోపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (13 బంతుల్లో 19; 3 ఫోర్లు, 4-0-26-4) అదరగొట్టాడు. మొయిన్ అలీ నిజంగా అనారోగ్యం బారిన పడ్డాడని వదిలేస్తే, ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తాడనుకున్న స్టోక్స్ మాత్రం ఆడిన 2 మ్యాచ్‌ల్లో తేలిపోయి, తనపై గంపెడాశలు పెట్టుకున్న ఫ్రాంచైజీని, అభిమానులను దారుణంగా నిరాశపరిచాడు. స్టోక్స్ గుజరాత్‌పై 6 బంతుల్లో ఫోర్ సాయంతో 7 పరుగులు, లక్నోపై 8 బంతుల్లో ఫోర్ సాయంతో 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆర్చర్ విషయానికొస్తే, భారీ అంచనాల నడుమ ఓ సీజన్ ముందుగానే బుక్ చేసి పెట్టుకున్న ఈ ఇంగ్లీష్ బౌలర్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక నిరాశపరిచాడు. భారీ అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లు కనీసం నామమాత్ర ప్రదర్శన కూడా చేయకుండా చేతులెత్తేస్తుండటంతో ఫ్రాంచైజీ వారిని తప్పించే సాహసం చేయక తప్పలేదు. అయితే, ఈ విషయంలో ముంబై మాట అటుంచితే, సీఎస్కే మాత్రం సత్ఫలితం రాబట్టిందనే చెప్పాలి. మొయిన్ అలీ, స్టోక్స్ లేకపోయిన టెస్ట్ ప్లేయర్‌గా ముద్రపడిన వెటరన్ అజింక్య రహానే (27 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు)ను తుది జట్టులోకి తీసుకునే సీఎస్కే సక్సెస్ సాధించింది. అతనితో పాటు జడేజా (3/20), సాంట్నర్ (2/28), తుషార్ దేశ్‌పాండే (2/31), మగాలా (1/37), రుతురాజ్ గైక్వాడ్ (40 నాటౌట్) రాణించడంతో ముంబై ఇండియన్స్‌పై ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
అదే జరిగితే పుండు మీద కారం చల్లినట్లే..!
ఐపీఎల్ 16వ సీజన్‌ను ఐదుసార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఎప్పటిలాగే ఓటమితో ప్రారంభించింది. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. గాయాల కారణంగా బుమ్రా, జై రిచర్డ్సన్ లాంటి టాప్ బౌలర్లు ముంబై ఇండియన్స్‌కు దూరమవ్వడం జట్టు ఓటమిపై ప్రభావితం చేసింది. అయితే తాజాగా ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా మోచేతి గాయంతో బాధపడుతున్నాడని.. శనివారం రాత్రి సీఎస్కేతో మ్యాచ్‌కు అతను దూరమయ్యాడంటూ మాజీ క్రికెటర్ బద్రీనాథ్ తన యూట్యూబ్ చానెల్లో పేర్కొన్నాడు. సొంత స్టేడియంలో మ్యాచ్ ఆడబోతున్న ముంబై ఇండియన్స్‌కు ఇది షాకింగ్ లాంటి వార్త. మోచేతి గాయంతో బాధపడుతున్న ఆర్చర్ సీఎస్కేతో మ్యాచ్‌కు దూరమయినట్లు తెలుస్తోంది. ఇది సీఎస్కేకు సానుకూలాంశంగా మారనుంది. అయితే జోఫ్రా ఆర్చర్ గాయంపై ముంబై ఇండియన్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. ఒకవేళ ఆర్చర్ గాయం నిజమైతే మాత్రం ముంబై ఇండియన్స్‌కు ఇది పుండు మీద కారం చల్లినట్లే అవుతుంది. కాగా ఆర్చర్ ఆర్సీబీతో మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 4 ఓవర్లు వేసి 33 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే ఆర్చర్ ప్రస్తుతం ముంబైకి ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. అయితే జోఫ్రా ఆర్చర్ గాయంపై ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ క్లారిటీ ఇచ్చాడు. జట్టులో ఉన్న ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉన్నారని.. ఎవరు గాయపడలేదు. ఎవరైనా ఆటగాడు గాయపడినా ముంబై ఇండియన్స్ అధికారికరంగా ప్రకటించేవరకు వేచి చూడడం మంచిది అంటూ తెలిపాడు. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, జై రిచర్డ్‌సన్‌లు అందుబాటులో లేకపోవడంతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ బలహీనంగా తయారైంది. -
కోహ్లి దెబ్బకు ఆర్చర్‌కు చిప్ దొబ్బినట్లుంది!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ శుభారంభం చేసింది. ముంబై ఇచ్చిన 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే చేధించింది. కోహ్లి(82 నాటౌట్), డుప్లెసిస్(73 పరుగులు) విధ్వంసానికి లక్ష్యం కాస్త చిన్నదైపోయింది. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 148 పరుగులు జోడించడంతో ఆర్సీబీకి విజయం సులువైంది. ఇక కోహ్లి ఈ మ్యాచ్‌లో తన చేజింగ్ పవర్ ఏంటో చూపించాడు. 49 బంతుల్లో 6 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 82 పరుగులు నాటౌట్ అజేయంగా నిలిచాడు. ఈ సంగతి పక్కనబెడితే.. మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లి దెబ్బకు ఆర్చర్‌కు మైండ్ దొబ్బినట్లు ఉంది. ఎందుకంటే మ్యాచ్‌లో ఆర్చర్‌కు కోహ్లి చుక్కలు చూపించాడు. దీనికి తోడు టి20 క్రికెట్లో ఇప్పటివరకు కోహ్లికి ఆర్చర్ 64 బంతులు వేయగా.. కోహ్లి 85 పరుగులు పిండుకున్నాడు. ఒక్కసారి కూడా కోహ్లిని ఔట్ చేయలేకపోయాడు. ఇక ఫోటో ఎలా ఉందంటే.. కోహ్లి తన బౌలింగ్‌ను ఉతికి ఆరేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక పిచ్‌పై కూలబడి తనలో తాను నవ్వుకుంటూ వింత ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కనిపిస్తుంది. నిజానికి అది కాకపోయినప్పటికి వెనకాల కోహ్లి ఉండడంతో ఫ్యాన్స్‌తో కోహ్లి దెబ్బకు ఆర్చర్‌కు చిప్ దొబ్బినట్లుంది అంటూ క్యాప్షన్ జత చేశారు. అయితే ఆర్చర్ అలా ఫన్నీ ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే ఫోటోగ్రాఫర్ ఇలా క్లిక్‌మనిపించాడు. Pic of the day 🥵🔥@imVkohli 👑 • @RCBTweets pic.twitter.com/hoEKmSFf0E — Virat Kohli Trends (@Trend_Virat) April 2, 2023 చదవండి: Virat Kohli: ఆర్సీబీ ఓపెనర్‌గా అరుదైన రికార్డు.. -
IPL 2023: జోఫ్రా ఆర్చర్‌తో బుమ్రా ముచ్చట్లు! వీడియో వైరల్
Jasprit Bumrah and Jofra Archer: ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ ఒక్క చోట చేరారు. మహిళా ప్రీమియర్ లీగ్-2023 ఫైనల్ వీక్షించేందుకు తరలివచ్చిన వీరిద్దరిని ఒకే ఫ్రేమ్‌లో చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బుమ్రా, ఆర్చర్ డెడ్లీ కాంబో చూసే అవకాశం మాత్రం ఈసారికి లేదని ఉసూరుమంటున్నారు. కాగా వెన్నునొప్పి తిరగబెట్టిన కారణంగా బుమ్రా ఇప్పటికే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సహా ఐపీఎల్-2023 సీజన్ మొత్తానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కీలక బౌలర్ సేవలను కోల్పోనుంది. అయితే, రైట్ ఆర్మ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రూపంలో వారికి సరైన ఆప్షన్ లభించింది. ఈ ఏడాది అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందేహాల నడుమ ముంబైలో వాలిపోయి అభిమానులను ఖుషీ చేశాడీ ఇంగ్లండ్ బౌలర్. ఇదిలా ఉంటే.. డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్లోనే ముంబై ఇండియన్స్ వుమెన్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఆర్చర్‌తో బుమ్రా ముచ్చట్లు ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఆదివారం నాటి మ్యాచ్‌ను వీక్షించేందుకు ముంబై ఇండియన్స్ పురుషుల జట్టు బ్రబౌర్న్ స్టేడియానికి తరలివచ్చింది. హర్మన్ సేనను చీర్ చేస్తూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సహా పలువురు ముంబై క్రికెటర్లు సందడి చేశారు. ఈ క్రమంలో జోఫ్రాతో బుమ్రా ముచ్చటిస్తున్న దృశ్యాలను ఫ్రాంఛైజీ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పటికే అర మిలియన్‌కు పైగా లైకులు సాధించింది. దీనిపై స్పందించిన ముంబై పల్టన్ ఫ్యాన్స్.. ‘‘బుమ్రాకు రీప్లేస్‌మెంట్‌గా జోఫ్రా.. కానీ మీ డెడ్లీ కాంబో చూసే అవకాశం లేకుండా పోయింది. బుమ్రా భాయ్ కూడా ఆడితే బాగుంటుంది’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్‌ను 8 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 2 నాటి మ్యాచ్‌తో ముంబై తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో ఆర్చర్(గతంలో రాజస్తాన్ రాయల్స్) ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ విన్నర్‌గా ముంబై ఇండియన్స్ అవతరించి చరిత్ర సృష్టించింది. చదవండి: BCCI: భువనేశ్వర్‌కు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. ఇక మర్చిపోవడమే! Shikhar Dhawan: 'మా నాన్న కొట్టాడు.. నేను హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను' WPL 2023: అవార్డులు ఎవరికి? విన్నర్ ప్రైజ్‌మనీ ఎంతంటే! పీఎస్ఎల్ చాంపియన్ కంటే చాలా ఎక్కువ! View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
న్యూజిలాండ్‌కు వెళ్లనున్న బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తనను దీర్ఘకాలంగా వేధిస్తున్న వెన్ను సమస్యను పరిష్కరించుకునేందుకు న్యూజిలాండ్‌కు బయలుదేరనున్నాడని తెలుస్తోంది. బీసీసీఐ మెడికల్ టీమ్, ఎన్సీఏ మేనేజర్లు బుమ్రా వెన్నుకు చికిత్స చేసేందుకు రోవన్ షౌటెన్ అనే న్యూజిలాండ్ సర్జన్‌ను రెకమెండ్ చేసినట్లు సమాచారం. బుమ్రాకు చికిత్స అందించబోయే సర్జన్.. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కోలుకోవడంలో కీలకంగా వ్యవహరించాడని, ఈ కారణంగానే బుమ్రాను కూడా అతనికే రెకమెండ్ చేస్తున్నామని బీసీసీఐకి చెందిన కీలక అధికారి ఒకరు తెలిపారు. బుమ్రా.. క్రైస్ట్‌చర్చ్ వెళ్లేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్లు సదరు అధికారి వెల్లడించాడు. బుమ్రాకు ఇప్పుడే సర్జరీ అయితే కోలుకునేందుకు 20 నుంచి 24 వారాల సమయం పట్టవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే బుమ్రా ఐపీఎల్‌తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ వీలైనంత త్వరగా బుమ్రాకు చికిత్స చేయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐదు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా.. సర్జరీ జరిగితే ఓవరాల్‌గా ఏడాది కాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నట్లవుతుంది. ఇదిలా ఉంటే, బుమ్రా గైర్హాజరీలో బీసీసీఐ ఉమేశ్ యాదవ్‌పై అధికంగా ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆసీస్‌తో మూడో టెస్ట్‌కు షమీకి విశ్రాంతిని ఇచ్చి మరీ ఉమేశ్‌కు అవకాశం కల్పించినట్లు స్పష్టమవుతోంది. -
IPL 2023: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. బుమ్రా లేకపోయినా..!
Jofra Archer: ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందింది. 2022 మెగా వేలంలో 8 కోట్లు కుమ్మరించి కొనుక్కున్న స్టార్ పేసర్, ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ 2023 సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడని కన్ఫర్మ్ అయ్యింది. రానున్న సీజన్‌కు మరో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆర్చర్‌కు సంబంధించిన ఈ వార్త ముంబై ఇండియన్స్ యజమాన్యానికి, ఫ్యాన్స్‌కు భారీ ఊరట కలిగిస్తుంది. ఆర్చర్ పూర్తి సీజన్నుకు అందుబాటులో ఉంటాడన్న విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో పాటు ముంబై ఇండియన్స్ వర్గాలు ధృవీకరించాయి. ఈసీబీ, ఎంఐ యాజమాన్యం సంయుక్తంగా ఆర్చర్ వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేస్తాయని వెల్లడించాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టుతో పాటు ఉన్న ఆర్చర్.. అక్కడ 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ తర్వాత నేరుగా భారత్‌కు చేరుకుంటాడని స్పష్టం చేశాయి. కాగా, జోఫ్రా ఆర్చర్ గాయాల కారణంగా దాదాపు 18 నెలలపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇది తెలిసి కూడా ఎంఐ యాజమాన్యం ఆర్చర్‌ను 2022 ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. గాయం తర్వాత ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆర్చర్.. అంతకుముందు కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. రీఎంట్రీలో సౌతాఫ్రికాతో జరిగిన ఓ వన్డేలో ఆర్చర్ ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ ఆర్చర్ అద్భుతంగా రాణించాడు. ఎస్ఏ20 ఇనాగురల్ లీగ్‌లో ఆర్చర్ ముంబై ఇండియన్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన ఎంఐ కేప్‌టౌన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
దక్షిణాఫ్రికా గడ్డపై అర్చర్ సరికొత్త చరిత్ర.. 30 ఏళ్ల రికార్డు బద్దలు
దక్షిణాఫ్రికా గడ్డపై ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోప్రా అర్చర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. దక్షిణాఫ్రికాలో ప్రోటీస్ జట్టుపై వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా అర్చర్ నిలిచాడు. కింబర్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో అర్చర్ దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో 9.1 ఓవర్లు బౌలింగ్ చేసిన జోఫ్రా.. 40 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను అర్చర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ పేరిట ఉండేది. 1993లో దక్షిణాఫ్రికాలో ప్రోటీస్‌తో జరిగిన ఓ వన్డేలో అక్రమ్ 16 పరుగులకే 5 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్‌తో 30 ఏళ్ల అక్రమ్ రికార్డును అర్చర్ బ్రేక్ చేశాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రెండో మ్యాచ్‌లోనే అర్చర్ ఈ ఘనత సాధించడం విశేషం. ఇక అర్చర్‌కు వన్డేల్లో ఇదే కెరీర్ బెస్ట్ కూడా. తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా.. అదే విధంగా విదేశీ గడ్డపై వన్డేల్లో అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా అతడు నిలిచాడు.అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ పేరిట ఉండేది. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో క్రిస్ వోక్స్ 45 పరుగులిచ్చి 6 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్‌లో 40 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టిన అర్చర్.. 12 ఏళ్ల వోక్స్ రికార్డు బ్రేక్ చేశాడు. చదవండి: IND vs NZ: 'తీవ్రంగా నిరాశపరిచాడు.. స్పిన్నర్లను ఎదుర్కోవడం నేర్చుకోవాలి’ -
తిట్టినోళ్లే మెచ్చుకున్నారు.. శెభాష్ జోఫ్రా ఆర్చర్
ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తాను ఫామ్‌లోకి వస్తే ఎలా ఉంటుందో సౌతాఫ్రికా జట్టుకు రుచి చూపించాడు. గాయంతో ఆటకు దూరమైన ఆర్చర్ దాదాపు రెండేళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే తొలి వన్డేలో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆర్చర్ 81 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. అతని కెరీర్లో కూడా ఇవే అత్యంత చెత్త గణాంకాలు. రీఎంట్రీలో చెత్త ప్రదర్శనపై విమర్శలు రావడంతో కెప్టెన్ బట్లర్ ఆర్చర్‌ను తర్వాతి మ్యాచ్‌కు పక్కనబెట్టాల్సి వచ్చింది. అయితే ఆర్చర్ ఆ మాత్రానికే కుంగిపోలేదు. రెండేళ్ల పాటు ఆటకు దూరంగా ఉన్న అతను ఇలాంటి ఇబ్బందులను చాలానే ఎదుర్కొన్నాడు. ఇంతలో ఇంగ్లండ్ వరుసగా రెండో వన్డేలోనూ ఓటమిపాలై సిరీస్‌ను సౌతాఫ్రికాకు కోల్పోయింది. కనీసం మూడో వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఇంగ్లండ్ భావించింది. దీంతో జోఫ్రా ఆర్చర్‌ను మళ్లీ తుది జట్టులోకి తీసుకున్నాడు బట్లర్. ఆర్చర్‌పై ఉన్న నమ్మకంతోనే అతన్ని తుది టీంలోకి ఎంపిక చేశామని టాస్ సమయంలో బట్లర్ పేర్కొన్నాడు. బట్లర్ మాటలను ఆర్చర్ నిజం చేసి చూపించాడు. రెండేళ్ల పాటు ఆటకు దూరమైన ఆర్చర్ రెండు మ్యాచ్‌ల వ్యవధిలోనే తన పేస్ పదునును తిరిగి అందుకున్నాడు. 9.1 ఓవర్లలో 40 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లతో సౌతాఫ్రికాను శాసించాడు. ఆర్చర్ వన్డే కెరీర్లో ఇదే బెస్ట్ స్పెల్‌గా నిలిచిపోనుంది. తొలి వన్డేలో ధారాళంగా పరుగులిచ్చుకొని తిట్టించుకున్న ఆర్చర్.. వారి నోటితోనే మళ్లీ మెచ్చుకునేలా చేశాడు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రానా తనను తక్కువ చేసి చూడొద్దని పరోక్షంగా హెచ్చరించాడు. ఇక కీలకమైన వన్డే వరల్డ్‌కప్‌కు ముందు ఆర్చర్ ఫామ్‌లోకి రావడం ఇంగ్లండ్‌కు సానుకూలమని చెప్పొచ్చు. ఒక్కసారి అతను ఫామ్‌లోకి వచ్చాడంటే ఆపడం ఎవరి తరం కాదు. అందుకే మ్యాచ్‌లో బట్లర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచినప్పటికి తన అవార్డును ఆర్చర్‌కు ఇచ్చి అతనిపై ఉన్న గౌరవాన్ని పరోక్షంగా చాటుకున్నాడు. చదవండి: శతకాలతో చెలరేగిన బట్లర్, మలాన్.. ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం 'ఆ విషయాలు పెద్దగా పట్టించుకోను.. భవిష్యత్తుకు డోకా లేనట్లే' -
శతకాలతో చెలరేగిన బట్లర్, మలాన్.. ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం
సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం లభించింది. ఇప్పటికే సౌతాఫ్రికా సిరీస్‌ను చేజెక్కించుకున్న సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 59 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కెప్టెన్ జాస్ బట్లర్, ఓపెనర్ డేవిడ్ మలాన్‌లు శతకాలతో విరుచుకుపడడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగుల భారీ స్కోరు చేసింది. బట్లర్(127 బంతుల్లో 131, ఆరు ఫోర్లు, 7 సిక్సర్లు), డేవిడ్ మలాన్(114 బంతుల్లో 118, ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) చెలరేగగా.. చివర్లో మొయిన్ అలీ 23 బంతుల్లో 41 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 43.1 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. హెన్రిచ్ క్లాసెన్ 80 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రీజా హెండ్రిక్స్ 52, టెంబా బవుమా 35 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ ఆరు వికెట్లతో టాప్ లేపగా.. ఆదిల్ రషీద్ మూడు వికెట్లు తీశాడు. ఇక ప్లేయర్ ఆఫ్ మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును జాస్ బట్లర్ దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ ఈ సిరీస్‌తో ఏదైనా లాభపడిందంటే అది ఆర్చర్ రూపంలో మాత్రమే. గాయంతో చాలాకాలం పాటు జట్టుకు దూరమైన జోఫ్రా ఆర్చర్ రీఎంట్రీ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. అయితే తన విలువేంటో మూడో వన్డేలో చూపించాడు. ఆరు వికెట్లతో ప్రొటిస్ నడ్డి విరిచాడు. కీలకమైన వన్డే వరల్డ్‌కప్‌కు ముందు ఆర్చర్ ఫామ్‌లోకి రావడం ఇంగ్లండ్‌కు శుభసూచకం అని చెప్పొచ్చు. -
రెండేళ్ల తర్వాత పునరాగమనం.. వన్డే కెరీర్లో చెత్త రికార్డు
ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దాదాపు రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులో పునరాగమనం చేశాడు. అయితే రీఎంట్రీలో ఆర్చర్ నాసిరకం బౌలింగ్ ప్రదర్శించాడు. 10 ఓవర్లు వేసిన ఆర్చర్ 81 పరుగులు సమర్పించుకొని కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. ఆర్చర్ వన్డే కెరీర్లోనే ఇవి అత్యంత చెత్త గణాంకాలుగా నమోదయ్యాయి. 678 రోజుల తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆర్చర్ ఒక ఓవర్లో 20 పరుగులకు పైగా సమర్పించుకున్నాడు. ఒక వన్డే మ్యాచ్‌లో ఆర్చర్ ఒక ఓవర్లో ఇన్ని పరుగులు ఇచ్చుకోవడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత క్రికెట్ ఆడడంతో ఆర్చర్ బౌలింగ్ లైనప్ కాస్త గాడిన పడాల్సి ఉంది. అయితే వేన్ పార్నెల్ రూపంలో ఒక వికెట్ తీయడం ఆర్చర్‌కు కాస్త ఊరట అని చెప్పొచ్చు. ఇక 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ జట్టుకు ఆర్చర్ కీలక బౌలర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. అప్పటిలోగా మునుపటి ఫామ్ అందుకుంటాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సొంతగడ్డపై వన్డే సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్‌కు సౌతాఫ్రికా షాక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. వాండర్ డుసెన్ (117 బంతుల్లో 111 పరుగులు, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో మెరవగా.. డేవిడ్ మిల్లర్ 53 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటై 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్ జేసన్ రాయ్(91 బంతుల్లో 113 పరుగులు, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు సెంచరీ వృథాగా మారింది. డేవిడ్ మలన్(59 పరుగులు)మినహా మిగతావారు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయలేకపోయారు. ప్రొటిస్ బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే నాలుగు వికెట్లు పడగొట్టగా.. సిసందా మగల మూడు, కగిసో రబడా రెండు, తబ్రెయిజ్ షంసీ ఒక వికెట్ తీశాడు. A message from Jofra to you! 🗣 pic.twitter.com/Kj2S7mE0VA — England Cricket (@englandcricket) January 27, 2023 చదవండి: ఏ మాత్రం తగ్గని ధోని మేనియా 'గడిచిన 18 నెలలు కష్టకాలంగా అనిపించింది' -
బేబీ ఏబీడీ విధ్వంసం.. ముంబై ఇండియన్స్ టీమ్ శుభారంభం
మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన ఎంఐ కేప్‌టౌన్ టీమ్ శుభారంభం చేసింది. లీగ్ ఇనాగురల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన పార్ల్ రాయల్స్‌ను ఢీకొట్టిన కేప్‌టౌన్ జట్టు.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కేప్‌టౌన్.. జోఫ్రా ఆర్చర్ (3/27), ఓలీ స్టోన్ (2/31), డుయన్ జన్సెన్ (1/16) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (42 బంతుల్లో 51; 6 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (31 బంతుల్లో 42; 4 ఫోర్లు, సిక్స్) మాత్రమే రాణించారు. అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేప్‌టౌన్ టీమ్.. బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ (41 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం ధాటికి 15.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బ్రెవిస్ అజేయమైన అర్ధశతకంతో రాయల్స్ బౌలింగ్‌ను తునాతునకలు చేయగా.. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సామ్ కర్రన్.. 16 బంతుల్లో 2 సిక్సర్లు, ఫోర్ సాయంతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. బ్రెవిస్.. రస్సీ వాన్ డర్ డస్సెన్ (3 బంతుల్లో 8 నాటౌట్; సిక్స్) సాయంతో మ్యాచ్‌ను ముగించాడు. రాయల్స్ బౌలర్లలో కోడి యుసఫ్, రామోన్ సిమండ్స్కు తలో వికెట్ లభించింది. లీగ్‌లో తదుపరి మ్యాచ్ డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో సూపర్ జెయింట్స్)-జొహనెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్) జట్ల మధ్య ఇవాళ (జనవరి 11) జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభంకానుంది. -
అరివీర భయంకరుడు వచ్చేస్తున్నాడు.. ఇంగ్లండ్‌ను ఆపడం కష్టమే..!
Jofra Archer Returns To England ODI Squad: ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు శుభవార్త అందింది. గాయం కారణంగా దాదాపు రెండేళ్ల పాటు జట్టుకు దూరంగా ఉన్న స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో (27, 29, ఫిబ్రవరి 1) సౌతాఫ్రికాతో జరిగే 3 వన్డేల సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎంపిక చేసిన 14 మంది సభ్యుల బృందంలో జోఫ్రా చోటు దక్కించుకున్నాడు. జోఫ్రా.. 2021 మార్చిలో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ (ఇండియాపై) ఆడాడు. మోచేయి, వెన్నెముక సర్జరీలు చేయించుకున్న జోఫ్రా.. సుదీర్ఘకాలం తర్వాత ఇటీవలే ఓ వార్మప్ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఇంగ్లండ్ లయన్స్-ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ మధ్య జరిగిన ఆ మ్యాచ్‌లో లయన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జోఫ్రా మునుపటి వేగాన్ని కొనసాగిస్తూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగా ఈసీబీ జోఫ్రాను సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసింది. కాగా, జోఫ్రా అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుండటంతో ముంబై ఇండియన్స్ జట్టు కూడా సంబురాల్లో మునిగిపోయింది. 2022 ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఫ్రాంచైజీ.. జోఫ్రా గాయం కారణంగా అందుబాటులో ఉండడని తెలిసినా 8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. జోఫ్రా గాయాల నుంచి కోలుకోవడంతో ఐపీఎల్ 2023 సీజన్ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. ఇదిలా ఉంటే, ఫార్మాట్లకతీతంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇంగ్లండ్.. జోఫ్రా చేరికతో మరింత బలపడుతుంది. ఇదివరకే పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ కలిగిన ఇంగ్లండ్ టీమ్.. జోఫ్రా ఎంట్రీతో పట్టపగ్గాల్లేకుండా పోతుంది. ఫార్మాట్ ఏదైనా ఇకపై ఇంగ్లండ్‌ను ఆపడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ తాజాగా పాక్‌ను వారి సొంతగడ్డపై 3-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. అంతకుముందు జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో బట్లర్ సేన.. ఇదే పాక్‌ను ఫైనల్లో మట్టికరిపించి రెండోసారి జగజ్జేతగా అవతరించింది. సౌతాఫ్రికా టూర్‌కు ఇంగ్లండ్ జట్టు.. జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, మొయిన్ ఆలీ, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డక్కెట్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, ఫిలిప్ సాల్ట్, ఓల్లీ స్టోన్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్ -
ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు!
ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా అర్చర్ ఇప్పుడు పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాడు. దాదాపు రెండేళ్ల తర్వాత తొలి సారిగా అర్చర్ బౌలింగ్ చేశాడు. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు అబుదాబి వేదికగా ఇంగ్లండ్ లయన్స్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ లయన్స్‌కు అర్చర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు బౌలింగ్ వేసిన అర్చర్ వికెట్లు ఏమీ సాధించకుండా 38 పరుగులు ఇచ్చాడు. అయితే తన పేస్ బౌలింగ్‌తో మాత్రం ఇంగ్లండ్ ఓపెనర్‌ను జాక్ క్రాలీ ముప్పు తిప్పలు పెట్టాడు. కాగా 2021లో అర్చర్ మోచేయికి గాయమైంది. అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇక పాకిస్తాన్ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఇక డిసెంబర్1న రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్ ఐపీఎల్-2022 మెగా వేలంలో అర్చర్‌ను ముంబై ఇండియన్స్ రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా అతడు ఈ ఏడాది సీజన్‌కు దూరమయ్యాడు. ఇక గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అర్చర్ వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబై తరపున ఆడనున్నాడు. అంతకన్నా ముందు దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై కేప్ టౌన్ తరపున అర్చర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా ముంబై కేప్ టౌన్ జట్టును కూడా ముంబై ఇండియన్స్ యాజమాన్యమే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. Jofra Archer perfectly fit and join England team for practice session .#mumbaiindians #IPLretention @JofraArcher #IPLAuction #Mumbai #VijayHazareTrophy #FIFAWorldCup #JoeRoot #BlackStars #BlackStars pic.twitter.com/ehRmOluSCj — Vk Raju (@rajubai93) November 23, 2022 -
‘చేతికి రెండు సర్జరీలు.. వచ్చేందుకు ఎదురుచూస్తున్నా..కానీ’
ఐపీఎల్-2022 మెగా వేలంలో ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా అర్చర్‌ను ముంబై ఇండియన్స్ రూ. 8 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక మోచేయి గాయంతో బాధపడుతున్న ఆర్చర్ గతేడాది నుంచి చాలా అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్-2022 సీజన్‌కు అందుబాటులో ఉండనని ఆర్చర్ ముందే ప్రకటించాడు. అయినప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్,రాజస్థాన్ రాయల్స్‌తో పోటీపడి మరి ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆర్చర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఆర్చర్ ఈ సీజన్లో ఆడనున్నాడని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలు అన్నీ ఆవాస్తమని తెలుస్తోంది. అతడు మోచేయికి రెండు శస్త్రచికిత్సలు జరగడంతో మరింత కాలం విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపినట్లు సమాచారం. దీంతో అతడు ఐపీఎల్-2022కు దూరం కావడం ఖాయం అనిపిస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్-2023 సీజన్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా తాజాగా ముంబై ఇండియన్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్చర్ పాల్గొన్నాడు. "ముంబై ఇండియన్స్‌తో నా ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఎదరు చూస్తున్నాను. ముంబై ఒక గొప్ప ఫ్రాంచైజీ. అటువంటి ఫ్రాంచైజీలో భాగమైనందుకు సంతోషిస్తున్నాను. మహేల జయవర్ధనే నా మొదటి కోచ్‌లలో ఒకరు. మా జట్టు ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తుంది అని ఆశిస్తున్నాను. నేను బహుశా ఈ సీజన్‌కు దూరం కావొచ్చు. ముంబై జట్టు ఎప్పుడూ ఒక కుటంబంగా ఉంటుంది. అందుకే జట్టు ఐదు టైటిళ్లు సాధించింది. పొలార్డ్ పదేళ్ల పాటు ముంబై జట్టులోనే ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్" అని అర్చర్ పేర్కొన్నాడు. చదవండి: శ్రీలంకపై దుమ్మురేపాడు..‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా అయ్యర్! -
IPL 2022: ఖుషీలో ముంబై ఇండియన్స్.. రాడనుకున్న ఆర్చర్ వచ్చేస్తున్నాడు..!
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ జోఫ్రా అర్చర్‌ను ముంబై ఇండియన్స్ 8 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. అయితే తాను ఈ సీజన్‌కు అందుబాటులో ఉండనని ఆర్చర్ ముందే ప్రకటించాడు. ఈ విషయం తెలిసినా ముంబై ఇండియన్స్ యాజమాన్యం అతనిపై భారీ మొత్తం వెచ్చించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. బుమ్రా- ఆర్చర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందని, అందుకే తమకు నష్టం వాటిల్లినా ఆర్చర్‌ను సొంతం చేసుకున్నామని ఫ్రాంచైజీ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే, ఈనెల 26 నుంచి ఐపీఎల్ 15వ ఎడిషన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ అభిమానులకు ఓ శుభవార్త అందింది. రాడనుకున్న స్టార్ ఆల్‌రౌండర్ ఆర్చర్ ఈ సీజన్ నుంచే అందుబాటులో ఉంటాడని ముంబై యాజమాన్యం పరోక్ష సంకేతాలు పంపింది. మైదానంలో ఆర్చర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పరుగుల ప్రవాహం చూసేందుకు ఇకపై ఆగలేమంటూ అంటూ రాసుకొచ్చింది. దీని బట్టి చూస్తే ఆర్చర్ ఈ సీజన్ నుంచే బుమ్రాతో కలిసి బంతి పంచుకోవడం ఖాయమని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (12 కోట్లు), కీరన్ పొలార్డ్ (6 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (8 కోట్లు), ఇషాన్ కిషన్ (15.25 కోట్లు), టిమ్ డేవిడ్ (రూ. 8.25 కోట్లు), జోఫ్రా ఆర్చర్ (రూ. 8 కోట్లు), డేవిడ్ బ్రెవిస్ (3 కోట్లు), డేనియల్ సామ్స్ (రూ. 2.60 కోట్లు), తిలక్ వర్మ(1.70 కోట్లు), మురుగన్ అశ్విన్ (1.60 కోట్లు), టైమల్ మిల్స్ (1.50 కోట్లు), జయ్‌దేవ్ ఉనద్కత్ (1.30 కోట్లు), రిలే మెరెడిత్ (కోటి), ఫాబియన్ అలెన్ (75 లక్షలు), మయాంక్ మార్కండే ( 65 లక్షలు), సంజయ్ యాదవ్ (50 లక్షలు), బాసిల్ థంపి (30 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (30 లక్షలు), ఆర్యన్ జుయల్ (20 లక్షలు), హృతిక్ షోకీన్ (20 లక్షలు), మహ్మద్ అర్షద్ ఖాన్ (20 లక్షలు), అన్మోల్ప్రీత్ సింగ్ (20 లక్షలు), రాహుల్ బుద్ది (20 లక్షలు), రమణ్ దీప్ సింగ్ (20 లక్షలు). చదవండి: IPL 2022: సంగక్కర తొండాట.. అమాంతం పెరిగిపోయిన ఆర్చర్ ధర..! View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
పంజాబ్‌లో ఆప్ "స్వీప్"ను ఆర్చర్ ముందే ఊహించాడా..?
Did Archer Predict AAPs Clean Sweep In Punjab: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 2022 ఇవాళ (మార్చి 10) వెలువడిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని బంపర్ మెజర్టీతో జయకేతనం ఎగురవేసి, ప్రత్యర్ధి పార్టీలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీదల్, బీజేపీలకు షాకిచ్చింది. మొత్తం 117 అసెంబ్లీ సీట్లు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 90కి పైగా సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగుతుంది. ఈ క్రమంలో ఇవాళ ఆప్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. YES! 😎 #AAPSweepsPunjab https://t.co/MAD1Wxzca0 — AAP (@AamAadmiParty) March 10, 2022 అవును, ఆప్ పంజాబ్‌ను ఊడ్చేసింది అంటూ.. ఆ పార్టీ ఇవాళ మధ్యాహ్నం 12:55 గంటలకు ఓ ట్వీట్ చేసింది. ఆప్ నిజంగానే పంజాబ్‌ను ఊడ్చేసింది కదా.. ఇందులో విశేషమేముందని అనుకుంటున్నారా..? ఇక్కడే ఆప్ ఓ ట్విస్ట్ ఇచ్చింది. గతంలో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ చేసిన ఓ ట్వీట్‌ను ఈ పోస్ట్‌కి ట్యాగ్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఆర్చర్ చేసిన ఆ ట్వీట్లో స్వీప్ అని పేర్కొని ఉంది. దీన్నే పంజాబ్‌లో తాము సాధించిన విజయంతో లింక్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. March 24th ? — Jofra Archer (@JofraArcher) March 1, 2013 ఆర్చర్ గతంలో చేసిన చాలా ట్వీట్లు యాదృచ్చికంగా నిజానికి దగ్గరగా ఉండటంతో ఆప్ చేసిన ఈ ట్వీట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. 2013 మార్చిలో ఆర్చర్.. మార్చ్ 24? అని ట్వీట్ చేయగా, 2020వ సంవత్సరం అదే రోజు కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో లాక్డౌన్ ప్రకటన వెలువడింది. అలాగే అదే ఏడాది మార్చి 22న ఆర్చర్ లైట్స్ ఔట్ అని ట్వీట్ చేయగా, 2020 అక్టోబర్ 30న పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా ముంబైని చీకటి కమ్మేసింది. Come on russia! — Jofra Archer (@JofraArcher) June 22, 2014 ఇక కమాన్ రష్యా అంటూ ఆర్చర్ 2014 జూన్ 22న ట్వీట్ చేయగా, ఈ ఏడాది ఫిబ్రవరి 24న పుతిన్ సైన్యం ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించింది. ఇలా ఆర్చర్ చేసిన ట్వీట్లు యాదృచ్చికంగా ఏదో ఒక సందర్భంతో ముడిపడి ఉండటంతో నెటిజన్లు అతన్ని అభినవ నోస్ట్రడామస్ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. ఇదిలా ఉంటే, ఇవాళ ప్రకటించిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ జయకేతనం ఎగురవేయడంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్.. పంజాబ్ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్‌ను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటోను కేజ్రీవాల్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. इस इंक़लाब के लिए पंजाब के लोगों को बहुत-बहुत बधाई। pic.twitter.com/BIJqv8OnGa — Arvind Kejriwal (@ArvindKejriwal) March 10, 2022 చదవండి: IPL 2022: సంగక్కర తొండాట.. అమాంతం పెరిగిపోయిన ఆర్చర్ ధర..! -
IPL 2022: సంగక్కర తొండాట.. అమాంతం పెరిగిపోయిన ఆర్చర్ ధర..!
ఐపీఎల్ 2022 మెగా వేలం రెండో రోజు(ఫిబ్రవరి 13) సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ డైరెక్టర్ కుమార సంగక్కర వింత ప్రవర్తన పలు అనుమానాలకు తావిచ్చింది. ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా అర్చర్‌కు సంబంధించి లైవ్ అక్షన్ జరుగుతుండగా సంగక్కర ప్రవర్తించిన తీరుపై ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రత్యర్ధి జట్లకు సైగలు చేస్తూ.. ఆర్చర్ ధర అమాంతంగా పెరిగిపోయేలా చేసిన సంగక్కర చీటింగ్‌కు పాల్పడ్డాడని సోషల్‌మీడియా కోడై కుస్తుంది. ఇందుకు తగిన ఆధారాలు కూడా లభించడంతో అభిమానులు సంగక్కరపై విమర్శలు గుప్పిస్తున్నారు. దిగ్గజ ఆటగాడిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా ప్రవర్తించడమేంటని ప్రశ్నిస్తున్నారు. Sanga was trying to convince other teams to increase the bid 😏 pic.twitter.com/H6GRKU1Myk — ᧁꪖꪊ᥅ꪖꪜ (@ImGS_08) February 13, 2022 వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు ఆసక్తికరంగా సాగుతుండగా, ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్ విభాగంలో వేలంలోకి వచ్చాడు. అయితే, ఆర్చర్ ఈ సీజన్లో ఆడడని తెలిసి కూడా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అతని కోసం పోటీ పడటం మొదలెట్టాయి. వేలంలో ఆర్చర్ ధర 6 కోట్ల వద్దకు రాగానే రాజస్థాన్ పాకెట్లో డబ్బులు అయిపోవడంతో ఆ ఫ్రాంచైజీ డైరెక్టర్ కుమార సంగక్కర చీటింగ్‌కు పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమకు దక్కని ఆర్చర్‌కు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ముంబై ఇండియన్స్‌తో పోటీ పడాలని సన్ రైజర్స్‌కు సైగలు చేశాడు సంగక్కర. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో సంగక్కరపై ముప్పేట దాడి మొదలైంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చీటింగ్ పాల్పడటానికి సిగ్గు లేదా అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సంగక్కరపై ఐపీఎల్ పాలక మండలి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, అర్చర్ విషయంలో పట్టువదలని ముంబై ఇండియన్స్ అతన్ని 8 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. అతడు ఐపీఎల్ 2022 సీజన్‌కు అందుబాటులో ఉండడని తమకు తెలుసని, బుమ్రా- ఆర్చర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందని భావించి, వచ్చే ఏడాది కోసమే ఆర్చర్‌ను సొంతం చేసుకున్నామని ముంబై యాజమాన్యం వివరణ ఇవ్వడం కొసమెరుపు. చదవండి: IPL 2022: మిశీ భాయ్, నీ సేవలకు సలాం.. ఢిల్లీ జట్టు ఎప్పటికీ నీదే..! -
వేలంలోకి అతడు వచ్చేశాడు.. రికార్డులు బద్దలు అవ్వాల్సిందే!
ఐపీఎల్లో ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి పునరాగమనం చేయనున్నాడు. ఐపీఎల్-2022 సీజన్ మెగా వేలంలో జోఫ్రా ఆర్చర్ రూ. 2 కోట్ల బేస్ ధరగా తన పేరును నమోదు చేసుకున్నాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో గాయం కారణంగా ఆర్చర్ పాల్గొనడం అనుమానమేనని బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు తెలిపింది. 2023,2024 ఐపీఎల్ సీజన్లలో ఆర్చర్ పాల్గొనే అవకాశం ఉన్నందున ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అతడి పేరును నమోదు చేసింది. కాగా ఆర్చర్ గత కొన్ని సీజన్ల నుంచి రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలం ముందు ఆర్చర్‌ని రాజస్తాన్ రాయల్స్ రీటైన్ చేసుకోలేదు. ఇక అర్చర్తో పాటు మరో 44 మంది ఆటగాళ్లు పేర్లును కొత్తగా రిజిస్టర్ చేసుకున్నారని బీసీసీఐ పేర్కొంది. దీంట్లో ఆసీస్ స్టార్ ఆటగాడు ఖవాజా కూడా ఉన్నాడు. ఈ వేలంలో మొత్తం 1258 ఆటగాళ్లు తమ పేర్లును నమోదు చేసుకున్నారు. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. చదవండి: IPL 2022: ఆ డబ్బుతో మొదట ఐఫోన్, సెకండ్ హాండ్ కారు కొన్నా.. అందులో ఏసీ లేదు: సిరాజ్ -
'ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఆటగాళ్లు కావాలి.. వస్తే ఫ్రీ బీర్'
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 11వ సీజన్) చివరి అంకానికి చేరుకుంది. శుక్రవారం పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ సిక్సర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే సిడ్నీ సిక్సర్స్‌కు పెద్ద కష్టం వచ్చి పడింది. ఆ జట్టులోని ఆటగాళ్లు వరుసగా కోవిడ్ బారిన పడడంతో.. ఫైనల్ మ్యాచ్‌కు నిఖార్సైన 11 మంది ఆటగాళ్లు కరువయ్యారు. బుధవారం అడిలైడ్ స్ట్రైకర్స్ తో జరిగిన ప్లేఆఫ్‌కు ఒక ఆటగాడు తక్కువ కావడంతో అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న జే లెంటెన్ను తుది జట్టులో ఆడించింది. అయితే మొయిసిస్ హెన్రిక్స్ సారధ్యంలోని సిడ్నీ సిక్సర్స్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి.. పెర్త్ స్కార్చర్స్‌తో తుదిపోరుకు సిద్ధమైంది. చదవండి: BBL 2021-22: మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు.. ఆఖరి బంతికి డ్రామాలేంటి?! ఈ సందర్భంగా సిడ్నీ సిక్సర్స్ ఆటగాడు డేనియల్ క్రిస్టియన్ ఒక ఫన్నీ ట్వీట్ చేశాడు.'' పెర్త్ స్కార్చర్స్‌తో శుక్రవారం బీబీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాం. మా జట్టులో కొందరు కరోనా బారిన పడ్డారు. దీంతో ఫైనల్‌కు సరైన ఆటగాళ్లు లేరు.. మాకు కరోనా లేని ఆటగాళ్లు ఫైనల్ ఆడేందుకు కావాలి.. వస్తే వారికి ఫ్రీగా బీర్ కొనిపెడతా. మార్వెల్ స్టేడియంలో గురువారం సాయంత్రం 6:30 గంటలకు మా వార్మప్ ప్రారంభమవుతుంది. ఈలోపు వస్తే జట్టులో చోటుతో పాటు కప్ గెలిచిన తర్వాత ఫ్రీ బీర్ తాగొచ్చు. కానీ ఒక కండీషన్.. టెస్టు క్రికెటర్లకు మాత్రం చాన్స్ లేదు'' అంటూ ట్వీట్ చేశాడు. డేనియల్ క్రిస్టియన్ ఫన్నీ ట్వీట్‌కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్లు స్పందించారు. ''ఫైనల్ ఆడేందుకు నేను సిద్ధం.. కానీ బౌలింగ్‌లో 4 ఓవర్ల కోటా బౌలింగ్‌కు గ్యారంటీ ఇస్తానంటేనే..'' అంటూ డివిలియర్స్ పేర్కొన్నాడు. '' సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఆడేందుకు కూడా రెడీ.. కానీ మీకు ఆల్రేడీ ఉన్న సబ్‌స్టిట్యూట్‌లకు డబ్బులు చెల్లించాలేమో'' అంటూ ఆర్చర్ రీట్వీట్ చేశాడు. చదవండి: Racial Discrimination: ఆ క్లబ్లో నల్లజాతి క్రికెటర్లకు చోటు లేదా? ఇదేం వివక్ష ఇక డిపెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ టోర్నీ ఆరంభం నుంచి అదరగొట్టింది. వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగపెట్టింది. ఇప్పటికే మూడుసార్లు బీబీఎల్ టైటిల్(2011, 2020,2021) దక్కించుకున్న సిడ్నీ సిక్సర్స్.. తాజాగా నాలుగో టైటిల్‌పై కన్నేసింది. Shout out to anyone* in Melbourne that wants a game of cricket tomorrow night. My team is struggling to get 11 covid free, fit players on the park. Warm up starts at 6.30pm at Marvel Stadium. Free beer afterwards, potentially out of a large cup. DM if keen *no test cricketers — Dan Christian (@danchristian54) January 27, 2022 -
ఈ ఏడాది ఐపీఎల్‌కి దూరంగా కానున్న స్టార్ ప్లేయర్లు వీరే..!
Most Of England Players Including Gayle To Skip IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్‌కి ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు సామూహికంగా డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ సారి జరగబోయే మెగా వేలంలో మొత్తం 1214 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. కొందరు ఇంగ్లండ్ క్రికెటర్లు మాత్రం లీగ్‌పై అనాసక్తి కనబర్చారు. వేలం కోసం 30 మంది ఇంగ్లండ్ ప్లేయర్లు రిజిస్టర్ చేసుకోగా.. జో రూట్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, సామ్ కర్రన్ వంటి స్టార్ క్రికెటర్లు దూరంగా ఉన్నారు. అయితే బెయిర్ స్టో, టామ్ కర్రన్, ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్ వంటి ప్లేయర్లు ఐపీఎల్ వేలం కోసం తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. మరోవైపు వెస్టిండీస్ స్టార్ బ్యాటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సైతం క్యాష్ రిచ్ లీగ్‌కు డుమ్మా కొట్టాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి లీగ్‌లో కొనసాగుతున్న గేల్.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అతను ఐపీఎల్ మెగా వేలం కోసం తన పేరు నమోదు చేసుకోలేదని సమాచారం. కాగా, వీరితో పాటు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా ఐపీఎల్‌పై అనాసక్తి కనబర్చాడు. తొలుత అతను లీగ్‌లో పాల్గొంటానని ప్రకటించినప్పటికీ.. నిర్ణీత గడువు సమయానికి పేరును నమోదు చేసుకోలేదు. ఇదిలా ఉంటే, వేలంలో పాల్గొనబోయే 1214 మంది ఆటగాళ్లలో 896 మంది భారతీయ క్రికెటర్లు కాగా.. 318 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో 270 మంది క్యాప్డ్ (జాతీయ జట్టు తరఫున ఆడినవారు), 903 మంది అన్క్యాప్డ్ (జాతీయ జట్టుకు ఆడని వారు), 41 మంది అసోసియేట్ ప్లేయర్లు ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా ఆస్ట్రేలియా(59)కు చెందిన వారు కాగా, ఆ తర్వాత సౌతాఫ్రికా (48), శ్రీలంక (36), ఇంగ్లండ్ (30), న్యూజిలాండ్ (29), అఫ్ఘానిస్థాన్ (20) దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. నేపాల్ (15), యూఎస్ఏ (14), నమీబియా (5), ఒమన్ (3), భూటాన్ (1), యూఏఈ (1), నెదర్లాండ్స్ (1), స్కాట్లాండ్ వంటి అసోసియేట్ దేశాల ఆటగాళ్లు సైతం మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చదవండి: IPL 2022: మెగా వేలంలో కోట్లు కొల్లగొట్టేది వీళ్లే.. -
ఐపీఎల్-2022కు స్టార్ బౌలర్ దూరం!
ఐపీఎల్-2022 సీజన్ కోసం మెగా వేలం ఫిబ్రవరిలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మెగా వేలానికి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. గాయంతో గత కొద్ది రోజులుగా బాధపడుతున్న ఆర్చర్ ఐపీఎల్-2021 సీజన్‌కు కూడా దూరమయ్యాడు. కాగా ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు జోఫ్రా ఆర్చర్ గత కొన్నేళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2022 సీజన్ మెగా వేలం ముందు ఆర్చర్‌ని రాజస్తాన్ రీటైన్ చేసుకోలేదు. దీంతో మెగా వేలంలో అతడి కోసం చాలా జట్లు పోటీపడతాయని అంతా భావించారు. అయితే తాజాగా రెండోసారి ఆర్చర్ చేతికి శస్త్రచికిత్స జరిగింది. దీంతో అతడికి 15 నెలలపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు దృవీకరించింది. "ఆర్చర్ కుడి చేయికి రెండవ ఆపరేషన్ డిసెంబర్ 11న లండన్‌లో జరిగింది. అతడి ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. కానీ అతడు తిరిగి క్రికెట్ ఫీల్డ్‌లో అడుగుపెట్టడానికి కాస్త సమయం పడుతుంది. ఇక రానున్న సిరీస్‌లు అన్నింటికీ ఆర్చర్ అందుబాటులో ఉండడు" అని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు పేర్కొంది. కాగా గాయం కారణంగా ఆర్చర్ గత 9నెలలగా ఇంగ్లండ్ జట్టుకు దూరంగా ఉన్నాడు. దీంతో ప్రతిష్టాత్మక యాషీస్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. చదవండి: IND Vs SA: అతడు ప్రపంచ స్ధాయి బౌలర్.. సౌతాఫ్రికాకు ఇక చుక్కలే! -
ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ.. కీలక ఆటగాడు దూరం
లండన్: న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరగనున్న రెండు టెస్టుల సిరీస్ ముందు ఇంగ్లండ్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మోచేతికి శస్త్రచికిత్స కారణంగా ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నాలుగు వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. సర్జరీ కారణంగా జూలై వరకు అతడు జాతీయ జట్టు తరఫున క్రికెట్ ఆడే అవకాశం లేదు. గత జనవరి నుంచి గాయాల బారీన పడుతూ వస్తున్న ఆర్చర్ టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మరోసారి గాయపడడంతో టోర్నీ మధ్యలోనే లండన్‌కు వెళ్లిపోయాడు. వైద్యులు అతన్ని పరీక్షించి శస్త్ర చికిత్స నిర్వహించారు. దీంతో ఐపీఎల్ 14వ సీజన్‌కు ఆర్చర్ దూరమవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్నట్లే కనిపించిన ఆర్చర్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్చర్‌కు గతవారం మోచేతి గాయం మళ్లీ తిరగబెట్టింది. స్పెషలిస్ట్ వైద్యుల సలహా మేరకు ఆర్చర్ శుక్రవారం శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఈసీబీ బుధవారం వెల్లడించింది. కాగా తాజాగా మరోసారి ఆర్చర్ గాయంతో దూరం కానుండడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బగా పరిగణించవచ్చు. కాగా ఆర్చర్ ఇంగ్లండ్ తరపున 13 టెస్టుల్లో 42 వికెట్లు.. 17 వన్డేల్లో 30 వికెట్లు.. 12 టీ20ల్లో 14 వికెట్లు తీశాడు. చదవండి: ఆర్చర్‌కు తిరగబెట్టిన గాయం... కోచ్ అసహనం -
ఇంగ్లండ్‌కు భారీ షాక్: న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఆర్చర్ దూరం
లండన్: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా దూరమయ్యాడు. మోచేతి గాయం తిరగబెట్టడంతో వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. గాయం కారణంగా భారత్ పర్యటన, ఐపీఎల్‌లకు దూరమైన ఆర్చర్.. కౌంటీ క్రికెట్లో ససెక్స్ తరపున పునరాగమనం చేశాడు. మళ్లీ గాయం తిరగబెట్టడంతో కేవలం ఐదు ఓవర్లు బౌలింగ్ చేసిన వెంటనే మైదానాన్ని వీడాడు. ఇంగ్లాండ్, ససెక్స్ సీమర్ జోఫ్రా ఆర్చర్ వచ్చే నెల న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. బౌలింగ్ చేసేటప్పుడు అతని కుడి మోచేయి నొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్ చివరి రెండు రోజులలో బౌలింగ్ చేయలేకపోయాడని ఈసీబీ వివరించింది. ఇంగ్లండ్,న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ జూన్ 2న లార్డ్స్ మైదానంలో ప్రారంభంకానుంది. చదవండి: శ్రీలంక ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత -
ఆర్చర్‌కు తిరగబెట్టిన గాయం... కోచ్ అసహనం
లండన్: ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు మోచేతి గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో ఆర్చర్ ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. కాగా ఆర్చర్ ఇంతకముందు కూడా మోచేతి గాయంతోనే భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. మోచేతికి సర్జీరీ చేయించుకోవడంతో ఐపీఎల్ 14వ సీజన్‌కు అందుబాటులోకి రాలేదు. ఈ ఏడాది జనవరిలో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్‌కు కూడా ఆర్చర్ ఇదే కారణంతో దూరమయ్యాడు. తాజాగా గాయం నుంచి కోలుకొని ససెక్స్ తరపున కౌంటీ మ్యాచ్‌లు ఆడుతూ ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. ససెక్స్ తరపున కౌంటీ చాంపియన్‌షిప్ ఆడుతున్న ఆర్చర్ మంచి ప్రదర్శన కనబరుస్తూ వికెట్లు తీస్తున్నాడు. బనానా ఇన్‌స్వింగర్.. సాట్నర్... ఇలా రకరకాల వేరియేషన్స్ చూపిస్తూ సరికొత్త ఆర్చర్లా కనిపించాడు. అయితే కెంట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శనివారం ఆర్చర్ ఐదు ఓవర్లు వేసిన తర్వాత గాయం తిరగబెట్టడంతో మళ్లీ బౌలింగ్ వేయలేకపోయాడు. ఇదే విషయమై ససెక్స్ కోచ్ ఇయాన్ సాలిస్బరీ అసహనం వ్యక్తం చేశాడు.'' ఆర్చర్‌కు గాయం తిరగబెట్టింది. ఈరోజే బౌలింగ్ చేయలేకపోయాడు.. రేపు చేస్తాడని గ్యారంటీ లేదు. కానీ ఆర్చర్‌ను బౌలింగ్ చేయమని చెప్పలేం. దానికి ఈసీబీ అనుమతి అవసరం. ససెక్స్‌ను విజేతను చేయాలని ఆర్చర్ భావించాడు. కానీ ఇది మా చేతుల్లో లేదు.. ఈసీబీ అనుమతి ఇస్తేనే ఆర్చర్ బౌలింగ్‌కు వస్తాడు.''అంటూ తెలిపాడు. కాగా టీమిండియాతో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. గాయం తిరగబెట్టడంతో ఆర్చర్ ఈ సిరీస్ ఆడడం అనుమానమే. అయితే టీమిండియాతో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది చూడాలి. ఇప్పటికే ఐపీఎల్లో ఆడిన ఇంగ్లండ్ ప్లేయర్లకు టీమిండియాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. తాజాగా ఆర్చర్‌కు గాయం తిరగబెట్టడం ఈసీబీని ఆందోళనకు గురిచేస్తుంది. కాగా ఆర్చర్ ఇంగ్లండ్ తరపున 13 టెస్టుల్లో 42 వికెట్లు.. 17 వన్డేల్లో 30 వికెట్లు.. 12 టీ20ల్లో 14 వికెట్లు తీశాడు. చదవండి: మొన్న బనానా ఇన్‌స్వింగర్; నేడు స్నార్టర్.. నువ్వు సూపర్ ఆర్చర్ బనానా ఇన్‌స్వింగర్.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్ -
మొన్న బనానా ఇన్‌స్వింగర్; నేడు స్నార్టర్.. నువ్వు సూపర్
లండన్: ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన పునరాగమనాన్ని బలంగా చాటుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి గాయాలతో సతమతమవుతూ వచ్చిన ఆర్చర్ టీమిండియాతో జరిగిన సిరీస్‌లో మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 14వ సీజన్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. తాజాగా గాయాల నుంచి కోలుకున్న ఆర్చర్ కౌంటీ క్రికెట్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ససెక్స్ తరపున ఆడుతున్న ఆర్చర్ తన వికెట్ల వేటను కొనసాగిస్తున్నాడు. మొన్న సర్రీతో జరిగిన మ్యాచ్‌లో బనానా ఇన్‌స్వింగర్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఔట్ చేసిన ఆర్చర్ మరో అద్బుత బంతితో మెరిశాడు. కెంట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గురువారం ఆర్చర్ డేనియలల్ బెల్ రూపంలో తొలి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత అతని నాలుగో ఓవర్లో జాక్ క్రాలీని బుట్టలో వేసుకున్నాడు. 143 కిమీ వేగంతో ఆర్చర్ విసిరిన ఆ బంతి క్రాలీ బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ వికెట్ కీపర్ చేతుల్లో పడింది. దీనికి సంబంధించిన వీడియోను ససెక్స్ క్రికెట్ తన ట్విటర్లో షేర్ చేసింది. ''ఆర్చర్ ఆన్ ఫైర్.. ధట్స్ ఏ స్నార్టర్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఆర్చర్ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. కాగా ఆర్చర్ త్వరలోనే ఇంగ్లండ్ జట్టుతో కలవనున్నాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌తో పాటు టీమిండియాతో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లోనూ ఆర్చర్ అడే అవకాశం ఉంది. అంతేగాక రానున్న టీ20 ప్రపంచకప్‌లో ఆర్చర్ ఇంగ్లండ్ బౌలింగ్ విభాగంలో కీలకం కానున్నాడు. చదవండి: ఆర్చర్ బనానా ఇన్‌స్వింగర్.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్ "That's a SNORTER!" 🎙️🔥 Two wickets already for @JofraArcher! 🤩 pic.twitter.com/HbaAthQv6h — Sussex Cricket (@SussexCCC) May 13, 2021 -
ఆర్చర్ బనానా ఇన్‌స్వింగర్.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్
లండన్: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు 2021 ఏడాది అంతగా కలిసిరాలేదు. జనవరి నుంచి వరుసగా గాయాల బారిన పడుతూ జట్టులోకి రావడం... పోవడం చేస్తున్నాడు. టీమిండియాతో జరిగిన టెస్టు, టీ20 సిరీస్‌లో ఆడిన ఆర్చర్ మోచేతి గాయంతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఆర్చర్‌కు శస్త్ర చికిత్స అవసరం పడడంతో స్వదేశానికి వెళ్లిపోవడంతో ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 14వ సీజన్‌కు కూడా దూరమయ్యాడు. తాజాగా సర్జరీ అనంతరం ప్రాక్టీస్ ఆరంభించిన ఆర్చర్ ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడుతూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సెకండ్ ఎలెవెన్ చాంపియన్‌షిప్ ఆడుతున్న ఆర్చర్ ససెక్స్ సెకండ్ ఎలెవెన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా సర్రీ సెకండ్ ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్చర్ అద్బుత బౌలింగ్‌తో మెరిశాడు. క్రికెట్లో అరుదుగా కనిపించే బనానా ఇన్‌స్వింగర్ వేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించి అతను వికెట్ తీయగా.. బ్యాటింగ్ చేస్తున్న ఎన్ఎమ్జే రీఫిర్ నోరెళ్లబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోనూ సెసెక్స్ క్రికెట్ తన ట్విటర్లో షేర్ చేసింది. '' ఆర్చర్ ఈజ్ బ్యాక్.. నాట్ ఏ బ్యాడ్ డెలివరీ..'' అంటూ లాఫింగ్ ఎమోజీతో క్యాప్షన్ జతచేసింది. ఇక బనానా డెలివరీ అంటే బౌలర్ బంతిని విడుదల చేయగానే కాస్త ఎత్తులో వెళుతూ సీ షేప్‌గా మారుతుంది. అది పిచ్ మీద పడగానే ఇన్‌స్వింగ్ లేదా ఔట్ స్వింగ్ అయి యార్కర్‌లా మారుతుంది. ఒకవేళ ఆ బంతిని బ్యాట్స్‌మన్ వదిలేస్తే బౌల్డ్.. లేకపోతే ఎల్బీగా వెనుదిరగడం ఖాయం. ఇక బనానా ఇన్‌స్వింగర్ అంటే మనకు గుర్తుచ్చేది టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. రివర్స్ స్వింగ్ రాబట్టడంలో మంచి పేరున్న పఠాన్ బనానా డెలివరీలు వేయడంలోనూ తన ప్రత్యేకతను చూపించాడు. చదవండి: Jofra Archer: ఫుల్ రిథమ్‌లో జోఫ్రా ఆర్చర్ Not a bad delivery! 😅 Two wickets for @JofraArcher against Surrey's second XI yesterday, including this one... ☄️ pic.twitter.com/vBc5s09l4B — Sussex Cricket (@SussexCCC) May 7, 2021 -
Jofra Archer: ఫుల్ రిథమ్‌లో జోఫ్రా ఆర్చర్
లండన్: చేతి వేలికి సర్జరీ చేయించుకుని కొన్ని వారాల విరామం తర్వాత ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్న ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఫుల్ రిథమ్‌లో బౌలింగ్‌ను ఆరంభించాడు. ఈ మేరకు నెట్ సెషన్లో ఆర్చర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను కౌంటీ జట్టు ససెక్స్ ట్వీటర్లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆర్చర్ బౌన్సర్‌తో బౌలింగ్‌ను ప్రారంభించగా, ఆ బౌన్సర్‌ను తప్పించుకునే క్రమంలో బ్యాట్స్‌మన్ అదుపు తప్పి కిందపడ్డాడు. కాగా, ఇన్‌టైమ్‌లో సదరు బ్యాట్స్‌మన్ తప్పించుకోవడంతో అతనికి ఎటువంటి గాయం కాలేదు.,. వచ్చేవారం ఆర్చర్ తన పూర్తిస్థాయి ట్రైనింగ్‌ను ఆరంభించినున్నట్లు ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ససెక్స్ ఆటగాడైన ఆర్చర్.. క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపింది. గత నెలలో భారత్‌తో సిరీస్‌లో ఆర్చర్ చేతికి గాయమైంది. దాంతో సర్జరీ అనివార్యం కావడంతో ఆర్చర్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్‌కు ప్రధాన బౌలింగ్ ఆయుధమైన ఆర్చర్ దూరం కావడంతో ఆ జట్టు అతని లోటును పూడ్చటంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. How many runs would you get off this @JofraArcher over? 👀 pic.twitter.com/rWx3bkSpbo — Sussex Cricket (@SussexCCC) April 27, 2021 -
రాజస్తాన్‌కు మరో షాక్.. స్టార్ ఆటగాడు దూరం
చెన్నై: రాజస్తాన్ రాయల్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 14వ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. భారత్‌తో జరిగిన సిరీస్‌లో గాయంతోనే బరిలోకి దిగిన ఆర్చర్ వన్డే సిరీస్ మధ్యలోనే శస్త్ర చికిత్స కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు. ఆర్చర్ చేతి వేలికి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించగా.. ఐపీఎల్ తొలి అంచె పోటీలకు ఆర్చర్ దూరమైనా.. రెండో అంచె పోటీలకు అందుబాటులో ఉంటాడని అంతా భావించారు. కానీ ఆర్చర్ గాచం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని తాజాగా వైద్యులు నిర్థారించారు. దీంతో ఐపీఎల్ 14వ సీజన్‌కు ఆర్చర్ పూర్తిగా దూరమైనట్లు ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ బెన్ స్టోక్స్ గాయపడి సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇక బయోబబూల్‌లో ఉండలేనంటూ లియామ్ లివింగ్‌స్టోన్ అర్థంతరంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. తాజాగా ఆర్చర్ కూడా దూరమవ్వడంతో రాజస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక ఐపీఎల్ 14వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఫేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములు.. ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. చదవండి: రాజస్తాన్ రాయల్స్‌కు కొత్త ఆటగాడు.. రాత మారుతుందా! ఇలా అయితే ఐపీఎల్ నుంచి మొదటగా వెళ్లేది వాళ్లే -
ఇంత దారుణమా.. సోషల్ మీడియాను బహిష్కరించాల్సిందే!
లండన్: ఇటీవల కాలంలో ఇంగ్లండ్ క్రికెటర్లపై సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఎక్కువగా కావడంతో ఆ జట్టు పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అసహనం వ్యక్తం చేశాడు. తన సహచర క్రికెటర్లు జోఫ్రా ఆర్చర్,. మొయిన్ అలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత అందుకు సోషల్ మీడియా బాయ్‌కాట్ ఒక్కటే మార్గమని ఒక సందేశాన్ని ఇచ్చాడు. దీనికి ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ అంతా కలిసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.ఇంగ్లండ్‌కు చెందిన స్వానిసా, బర్మింగ్హమ్, స్కాట్ చాంపియన్స్, రేంజర్స్ ఫుట్‌క్లబ్‌లలోని పలువురు ఆటగాళ్లు తరుచు జాతి వివక్షకు గురౌతున్నారు. వారిపై జాతి వివక్ష వేధింపులు సోషల్ మీడియా వేదికగా ఎక్కువ కావడంతో ఆ ప్లాట్‌ఫామ్‌ను బహిష్కరించేందుకు తమ కార్యాచరణను ముమ్మరం చేశారు. ఇప్పుడు అదే బాటలో నడవాలని ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ను కూడా బ్రాడ్ కోరుతున్నాడు. ఆన్లైన్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలంటే సోషల్ మీడియా బహిష్కరణ ఒక్కటే మార్గమన్నాడు. అలా చేస్తేనే స్ట్రాంగ్ మెస్సేజ్ ఇచ్చినట్లు అవుతుందని బ్రాడ్ తెలిపాడు. ఇది చాలా దారుణమైన అంశమని, దీనిపై ఆ యాప్ క్రియేటర్స్ అయినా చర్యలు తీసుకోవాలన్నాడు. సోషల్ మీడియా పోస్టులు పబ్లిక్‌లోకి వచ్చేముందు వారు జవాబుదారీగా ఉండాలన్నాడు. కాగా, జోఫ్రా ఆర్చర్‌పై కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో జాతి వివక్ష పోస్టులు పెట్టగా, ప్రస్తుతం ఐపీఎల్లో భాగంగా భారత్‌లో ఉన్న మొయిన్ అలీపై బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మొయిన్ అలీ క్రికెటర్ కాకపోయుంటే.. సిరియాకు వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడంటూ'' ట్విటర్లో సంచలన కామెంట్స్ చేశారు. ఈ తరహా పోస్టులను అరికట్టాలంటే సోషల్ మీడియాను బహిష్కరించడమే మార్గమని బ్రాడ్ అంటున్నాడు. ఈ క్రమంలోనే జట్టు మొత్తం కలిసి వస్తే ఒక గట్టి సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుందన్నాడు. -
ఐపీఎల్ 2021: అది మాకు ఎదురుదెబ్బే: సంగక్కార
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా సోమవారం(ఏప్రిల్ 12వ తేదీ) రాజస్తాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్‌లు ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడనున్నాయి. గత సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది. అదే ఊపును ఈ సీజన్లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. కాగా, రాజస్తాన్ ప్రధాన బౌలర్ జోఫ్రా ఆర్చర్ లేకపోవడం ఆ జట్టును కలవరపరుస్తోంది. ఇదే విషయాన్ని రాజస్తాన్ రాయల్స్ కొత్త డైరెక్టర్ కుమార సంగక్కార స్పష్టం చేశాడు. తమ జట్టులో ఆర్చర్ లేకపోవడం చాలా పెద్ద లోటని పేర్కొన్నాడు. అది కచ్చితంగా తమ జట్టుకు భారీ ఎదురుదెబ్బని పేర్కొన్న సంగక్కార.. తమ ప్రణాళికలు అమలు చేస్తేనే పంజాబ్ కింగ్స్‌ను నిలువరించగలమన్నాడు. పీటీఐతో మాట్లాడిన సంగక్కార.. ‘ సంజూ శాంసన్(కెప్టెన్), నేను ఒక్క విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. ఆర్చర్ మాకు పెద్ద బలం. ఈసారి అతను అందుబాటులో లేకపోవడంతో గట్టి దెబ్బతగిలినట్టయ్యింది’ అని పేర్కొన్నాడు. గత నెలలో భారత్‌తో సిరీస్‌లో ఆర్చర్ చేతికి గాయమైంది. దీనికి సుదీర్ఘ విశ్రాంతి అవసరం కావడంతో ఐపీఎల్లో ఆడటంపై స్పష్టత లేదు. ఈ టోర్నీ మధ్య నుంచి కలుస్తాడనకున్నా అది సాధ్యపడేలా కనుబడటం లేదు. ఆర్చర్ స్థానాన్ని క్రిస్ మోరిస్‌తో పూడ్చాలని భావిస్తోంది రాజస్తాన్. ఈ ఏడాది జరిగిన వేలంలో మోరిస్‌కు 16 కోట్లు పైగా చెల్లించి రాజస్తాన్ తీసుకుంది. -
ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ
అహ్మదాబాద్: ఇప్పటికే టెస్టు సిరీస్, టీ20 సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు. మోచేతి గాయంతో వన్డే సిరీస్ నుంచి ఆర్చర్ వైదొలిగాడు. ఆదివారం ఇంగ్లండ్ ప్రకటించిన వన్డే జట్టులో ఆర్చర్‌కు చోటు దక్కలేదు. 14 మందితో కూడిన జట్టును ప్రకటించగా అందులో ఆర్చర్‌కు విశ్రాంతి ఇస్తూ ఇంగ్లండ్ టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. దాంతో ఆర్చర్ స్వదేశానికి పయనం కావడానికి సిద్ధమయ్యాడు. మార్చి 23(మంగళవారం) నుంచి పుణెలో ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఆర్చర్ స్థానంలో జాక్ బాల్ కానీ, క్రిస్ జోర్డాన్‌లను కానీ తుది జట్టులో ఆడించాలని ఇంగ్లండ్ యోచిస్తోంది. కాగా, ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంగ్లండ్ ప్రకటించిన ప్రాబబుల్స్‌లో వీరికి ఇంకా చోటు కల్పించలేదు. వన్డే సిరీస్‌కు వీరు రిజర్వ్ ఆటగాళ్లగానే ఉన్నారు. ఆర్చర్ గాయంతో ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్‌లో ఆందోళన మొదలైంది. ఆర్చర్ ఎప్పటికి కోలుకుంటాడనే దానిపై స్పష్టత లేకపోవడంతో రాజస్తాన్ డైలమాలో పడింది. ఐపీఎల్ ఆరంభపు మ్యాచ్‌లకు ఆర్చర్ అందుబాటులో ఉండటం లేదు. ఇంగ్లండ్ వన్డే జట్టు ఇదే.. ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, బెయిర్ స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కరాన్, టామ్ కరాన్, లివింగ్ స్టోన్, మ్యాట్ పార్కిన్సన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, మార్క్ వుడ్ -
బ్యాట్ విరిగిపోతుందని మూడేళ్ల కిందటే ఊహించాడా..?
అహ్మదాబాద్: భారత్‌తో జరిగిన నాలుగో టీ20 ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ బ్యాట్ విరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంగ్లండ్ గెలుపునకు 3 బంతుల్లో 10 పరుగులు కావాల్సిన తరుణంలో శార్ధూల్ వేసిన బంతిని భారీ షాట్ ఆడే క్రమంలో ఆర్చర్ బ్యాట్ విరిగిపోయింది. క్రికెట్లో బ్యాట్ విరగిపోవడం అనేది సాధారణమైన విషయమే అయినప్పటికీ.. ఆర్చర్ ఈ ఘటనను మూడేళ్ల కిందటే ఊహించాడా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆర్చర్ మూడేళ్ల కిందట( 2018 మార్చి 7న) ఓ ట్వీట్ చేస్తూ.. "ఇంగ్లండ్‌లో ఎవరైనా మంచిగా బ్యాట్ రిపేర్ చేసే వాళ్లు ఉన్నారా" అంటూ తన సోషల్ మీడియా ఫాలోవర్స్‌ను కోరాడు. ఈ ట్వీటే ప్రస్తుతం నెటిజన్లను తికమక పెడుతుంది. ఆర్చర్‌కు భవిష్యత్తు ముందుగానే తెలుసిపోతుందా అనే అంశంమే వారి తికమకకు కారణం. గతంలో కూడా అతను చాలా సందర్భాల్లో వివిధ అంశాలకు సంబంధించిన విషయాలను ముందే ఊహించినట్టుగా ట్వీట్ చేసేవాడు. చాలామంది అతనిని 'క్రికెట్ నోస్ట్రడామస్'గా పిలుస్తుంటారు. కాగా, భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టీ20లో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించి, 2-2తో సిరీస్‌ను సమం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన ఆఖరి మ్యాచ్ ఇదే వేదికగా ఆదివారం జరుగనుంది. -
పట్టించుకోని ఆర్చర్.. షాక్ తిన్న మొయిన్ అలీ
అహ్మదాబాద్: టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 8 వికెట్లతో ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. జేసన్ రాయ్ 49 పరుగులతో రాణించగా.. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' జోఫ్రా ఆర్చర్ కీలక మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఆర్చర్ చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విషయంలోకి వెళితే.. మ్యాచ్ విజయం అనంతరం.. ఇంగ్లండ్ ఆటగాళ్లు సంతోషంలో మునిగిపోయారు. ఒకరినొకరు హగ్ చేసుకుంటూ కంగ్రాట్స్ చెప్పుకుంటున్నారు. ఇంతలో అదిల్ రషీద్ వద్దకు వచ్చిన ఆర్చర్ అతన్ని హగ్ చేసుకొని కంగ్రాట్స్ చెప్పాడు. రషీద్ వెనుకే ఉన్న మొయిన్ అలీ కూడా ఆర్చర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నించాడు. అయితే ఆర్చర్ మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తూ అలీని పట్టించుకోలేదు.. దీంతో మైండ్ బ్లాంక్ అయిన అతను ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఈ చర్య సోషల్ మీడియాలో ఆసక్తి కలిగించింది. తుది జట్టులో రషీద్‌కు చోటు దక్కడంతో తొలి టీ20లో అలీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఇది చూసిన నెటిజన్లు మాత్రం తమదైశ శైలిలో కామెంట్లు చేశారు. ఆర్చర్, అలీ మధ్య విభేదాలు ఉన్నాయని.. అందుకే ఆర్చర్ అలీని పట్టించుకోలేదని.. ఇద్దరి మధ్య ఏవేనై పాత గొడవలున్నాయేమో అంటూ పేర్కొన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రెయాస్ అయ్యర్ (67 పరుగులు) మినహా ఎవరు ఆకట్టుకోలేదు. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే చేధించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం(మార్చి 14న) జరగనుంది. చదవండి: పంత్ కళ్లు చెదిరే సిక్స్.. ఈసారి ఆర్చర్ వంతు సుందర్, బెయిర్ స్టో గొడవ.. అంపైర్ జోక్యం Ouch pic.twitter.com/IOWFIW3Z1g — Maara (@QuickWristSpin) March 12, 2021 -
పంత్ కళ్లు చెదిరే సిక్స్.. ఈసారి ఆర్చర్ వంతు
అహ్మదాబాద్: టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రివర్స్ స్కూప్ షాట్‌కు ఫేవరెట్‌గా మారిపోయాడు. మొన్నటికి మొన్న నాలుగో టెస్టులో జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ షాట్ ఆడిన సంగతి తెలిసిందే. తాజాగా తొలి టీ20లో భాగంగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో మరోసారి రివర్స్ స్కూప్ షాట్ ఆడిన పంత్ కళ్లు చెదిరే సిక్సర్ కొట్టాడు. ఇన్నింగ్స్ 3వ ఓవర్లో 5వ బంతిని పంత్ మొత్తం మొకాళ్ల మీదకు వంగి రివర్స్ స్కూప్లో బ్యాట్‌ను పైకిలేపి థర్డ్‌మన్ దిశగా గాల్లోకి లేపాడు. అంతే సెకన్ల వ్యవధిలో బంతి బౌండరీ లైన్ ఆవల పడింది. పంత్ షాట్‌కు ఆర్చర్ కాసేపు షాక్ అయ్యాడు.. కచ్చితంగా అతని మదిలో అండర్సన్ గర్తుకు వచ్చే ఉంటాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకముందు నాలుగో టెస్టులోనూ అండర్సన్ బౌలింగ్‌లో పంత్ ఇదే తరహా షాట్ ఆడాడు. కాగా కోహ్లి అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్(23 బంతుల్లో 21; 2 ఫోర్లు,1 సిక్స్) ఆరంభం నుంచి మంచి టచ్‌లోనే కనిపించాడు. కానీ స్టోక్స్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే పంత్ తర్వాత ఏ బ్యాట్స్‌మెన్ సరిగా ఆడకపోవడం.. శ్రెయాస్ అయ్యర్ ఒంటరి పోరాటంతో భారత్ 20 ఓవర్లలో 124 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 15.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. చదవండి: కోహ్లి డకౌట్; ఉత్తరాఖండ్ పోలీస్ వార్నింగ్ పంత్‌ను వదిలేశాం.. మీరు వదిలేస్తే మంచిది: రోహిత్ A.U.D.A.C.I.O.U.S! 👌😎 Statutory Warning: Do not try this unless you are @RishabhPant17! ⚡️⚡️@Paytm #TeamIndia #INDvENG Watch how Rishabh reverse-scooped Jofra Archer for a six! 🎥👇 — BCCI (@BCCI) March 12, 2021 -
ఐపీఎల్లో ప్రత్యర్థులు.. అక్కడ మాత్రం మిత్రులు
లండన్: ఆసీస్ విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్, ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్.. విండీస్ విధ్వంసం ఆండీ రసెల్ ఒక జట్టుకు ఆడడం ఎప్పుడైనా చూశారా. అంతర్జాతీయంగా వేర్వేరు జట్లకు ఆడే వీరు ఐపీఎల్ సహా ఇతర లీగ్‌ల్లోనూ ప్రత్యర్థులుగా తలపడ్డారు. అయితే త్వరలోనే వీరు ముగ్గురు ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.. కాకపోతే హండ్రెడ్ 2021 టోర్నమెంట్ వరకు ఆగాల్సిందే. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా హండ్రెడ్ 2021 టోర్నమెంట్‌ను నిర్వహించనున్నాయి. వాస్తవానికి గతేడాది జూన్‌లోనే ఈ టోర్నమెంట్ జరగాల్సింది. కానీ కరోనా మహమ్మారితో టోర్నీ నిర్వహణ వాయిదా పడింది. తాజాగా ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత జూలై 2021లో ఈ టోర్నీ ఆరంభం కానుంది. కాగా టోర్నీలో పురుషులతో పాటు మహిళల మ్యాచ్‌లు కూడా సమానంగా జరగనున్నాయి. హండ్రెడ్ 2021 పేరుతో నిర్వహించనున్న ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. బర్మింగ్హమ్ ఫోనిక్స్, ట్రెంట్ రాకెట్స్, ఓవల్ ఇన్విసిబల్స్, సౌతర్న్ బ్రేవ్, లండన్ స్పిరిట్, వేల్ష్ ఫైర్, నార్తన్ సూపర్ చార్జర్స్, మాంచెస్టర్ ఒరిజనల్స్ టోర్నీలో జట్లుగా ఉండనున్నాయి. కాగా జోఫ్రా ఆర్చర్, వార్నర్, ఆండీ రసెల్‌లు సౌతర్న్ బ్రేవ్‌లో ఆడనున్నారు. అయితే వార్నర్ గజ్జల్లో గాయం కారణంగా ఐపీఎల్ ఆడేది అనుమానంగా ఉంది. 6-9 నెలల విశ్రాంతి అవసరం అని స్వయంగా వార్నరే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్లో వార్నర్ ఎస్ఆర్హెచ్కు, ఆర్చర్ రాజస్తాన్ రాయల్స్‌కు, ఆండీ రసెల్ కేకేఆర్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: సన్‌రైజర్స్‌కు వార్నర్ షాక్ ఇవ్వనున్నాడా! That's it for The Hundred Men's Draft 2021! 🖋️ Happy with how your team is looking? 👇 pic.twitter.com/j7c2KdMHSJ — The Hundred (@thehundred) February 23, 2021 -
చెన్నై పిచ్ అత్యంత దారుణమైంది: జోఫ్రా ఆర్చర్
చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌కు వేదికగా నిలిచిన చెన్నై పిచ్‌పై ఇంగ్లండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్లో చూసిన అత్యంత దారుణమైన పిచ్‌ల్లో చెన్నైపిచ్ ముందు వరుసలో నిలుస్తుందని వ్యాఖ్యానించాడు. ఆఖరి రోజు పిచ్ మరింత మందకొడిగా మారిపోయి నిర్జీవంగా ఉండిదన్నాడు. చివరి రోజు ఆటలో లంచ్‌కు ముందు డ్రింక్స్ బ్రేక్‌లోపే తమ జట్టు విజయం సాధిస్తుందని ఆశించానని, పిచ్ నిర్జీవంగా మారడంతో మ్యాచ్ ఫలితం మరింత ఆలస్యమైందని పేర్కొన్నాడు. ఐదో రోజు పిచ్ స్వరూపం ఎలా మారినా తమ బౌలర్ జిమ్మి ఆండర్సన్ మాత్రం అద్భుతమైన రివర్స్ స్వింగ్‌ను రాబట్టి మ్యాచ్‌ను త్వరగా ముగించాడంటూ అండర్సన్‌పై ప్రశంశల వర్షం కురిపించాడు. అండర్సన్ తన చివరి స్పెల్‌ను 5–3–6–3తో ముగించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 227 పరుగుల తేడాతో పర్యాటక జట్టు చేతిలో ఓటమిపాలై నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 0-1 తేడాతో వెనకపడింది. కాగా, ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్‌కు కూడా చెన్నై మైదానమే వేదిక కానుంది. అయితే ఇంగ్లండ్ జట్టు ఫాలో అవుతన్న రొటేషన్ పద్దతి కారణంగా ఈ మ్యాచ్‌లో ఆండర్సన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. -
టీమిండియాకు జో రూట్ వార్నింగ్
చెన్నై: టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కాకుండానే మాటల యుద్ధం మొదలైంది. జోఫ్రా ఆర్చర్ తన అస్త్ర శస్త్రాలతో టీమిండియా భరతం పట్టేందుకు సిద్ధమవుతున్నాడని.. భారత ఆటగాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ కెప్టెన్ జో రూట్ హెచ్చరించాడు. ఈ సందర్భంగా ప్రాక్టీస్ సమయంలో జోఫ్రా ఆర్చర్ వేసే బంతులు మంచి రిథమ్‌తో బులెట్ కంటే వేగంగా వస్తున్నాయని తెలిపాడు. జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్మెన్లకు ఇబ్బంది పడడం ఖాయమని పేర్కొన్నాడు. చదవండి: టీమిండియాతో చేరాను: హార్దిక్ పాండ్యా కాగా ఆర్చర్‌కు టీమిండియా పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. ఐపీఎల్ 13వ సీజన్ తర్వాత లంకతో జరిగిన సిరీస్‌కు ఆర్చర్ దూరంగా ఉన్నాడు. గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన ఆర్చర్ 14 మ్యాచ్‌ల్లో 20 వికెట్లతో మంచి ప్రదర్శన కనబరిచాడు. కాగా సీనియర్ బౌలర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లతో పాటు ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్, ఓలీ స్టోన్స్లతో పటిష్టంగా ఉన్న జట్టులోకి ఆర్చర్ రాకతో మరింత బలోపేతంగా తయారైంది. కాగా రేపు జరగబోయే తొలి టెస్టుకు ఎవరికి అవకాశం వస్తుందనేది చూడాల్సి ఉంది. చదవండి: ఐపీఎల్: ఆసీస్ ఆటగాళ్లకు సీఏ కీలక సూచన ఇక బెన్‌స్టోక్స్ విషయంపై రూట్ స్పందిస్తూ.. స్టోక్స్ గురించి మీకందరికి తెలిసిందే. అతను ఫాంలో ఉంటే.. బంతి అతని చేతికి దొరకడమే ఆలస్యం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడు. లంకతో సిరీస్‌కు దూరమైనా.. అతను మానసికంగా టీమిండియాతో ఆడడానికి సంసిద్ధం అయ్యాడు. ఇక బ్యాటింగ్ విషయంలో నేను చాలా సెల్ఫిష్‌గా ఉంటా.. ముందు కెప్టెన్‌గా నేను రాణిస్తేనే.. జట్టు రాణిస్తుందన్నది నా నమ్మకం. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రేపటి నుంచి జరగబోయే తొలి టెస్టు రూట్‌కు 100వ మ్యాచ్ కావడం విశేషం. లంకతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రూట్ ఒక డబుల్ సెంచరీ, సెంచరీ సహా మొత్తం 426 పరుగులతో సూపర్ ఫామ్‌ను ప్రదర్శించడంతో ఈ సిరీస్‌లో అందరి కళ్లు రూట్‌పైనే ఉన్నాయి. -
'నేను బౌలింగ్‌కు వస్తే గేల్ సెంచరీ చేయలేడు'
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో గేల్ క్లీన్‌బౌల్డ్ అయి ఒక్క పరుగుతో సెంచరీ చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఒక్క పరుగు దూరంలో అవుటాయన్న కోపంతో గేల్ అసహనం వ్యక్తం చేస్తూ చేతిలోని బ్యాట్‌ను విసిరేయడం వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు క్రిస్ గేల్‌పై అంపైర్లు చర్య తీసుకున్నారు. అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. అయితే గేల్‌ను ఔట్ చేసిన ఆర్చర్‌కు ప్రశంసలతో పాటు గేల్ అభిమానుల నుంచి తిట్లు కూడా అందాయి. (చదవండి : తప్పు ఒప్పుకున్న గేల్) తాజాగా గేల్‌ను 99 పరుగుల వద్ద అవుట్ చేయడంపై జోఫ్రా ఆర్చర్ ట్విటర్లో స్పందించాడు. ఇలాంటివి తాను గతంలోనూ ఎన్నో చూశానని.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను 99 పరుగుల వద్ద అవుట్ చేస్తే ఆ మజా వేరుగా ఉంటుందని ఆర్చర్ తెలిపాడు. ఈ సందర్భంగా తాను గతంలో గేల్నుద్దేశించి చేసిన ట్వీట్స్‌ను మరోసారి గుర్తు చేశాడు. ' నేను బౌలింగ్‌కు వస్తే గేల్‌ను సెంచరీ చేయనివ్వనని నాకు ముందే తెలుసు'.. ' క్రిస్ గేల్.. కమాన్ మ్యాన్ .. ఇలాంటి విషయాలకు హర్ట్ కావడం ఏంటి' అంటూ ట్వీట్స్ ఉన్నాయి. pic.twitter.com/7OIi92jfCm — Simran (@CowCorner9) October 30, 2020 వాస్తవానికి ఇందులో మొదటి ట్వీట్ 2013.. ఫిబ్రవరి, 22న.. రెండో ట్వీట్ 2016,మార్చి 31న చేశాడు. ఆర్చర్ చేసిన ఈ రెండు ట్వీట్స్ శుక్రవారం గేల్ ఇన్నింగ్స్‌కు సరిగ్గా సరిపోయాయి. ప్రస్తుతం ఆర్చర్ చేసిన పాత ట్వీట్స్ వైరల్‌గా మారాయి. ఆర్చర్ ట్వీట్స్‌పై రాజస్తాన్ యాజమాన్యం స్పందిస్తూ.. ఆర్చర్ చెప్పింది ఈరోజు 100 శాతం నిజమైంది అంటూ ట్వీట్ చేశారు. ఇక చివర్లో గేల్ నువ్వు ఇప్పటికీ యునివర్స్‌ల్ బాస్‌వే అంటూ ఆర్చర్ ట్వీట్ చేయడం విశేషం.(చదవండి : బ్యాట్ విసిరేసిన గేల్..) I know if I was bowling I know he wasn't getting da 100 — Jofra Archer (@JofraArcher) February 22, 2013 Cg don't hurt yourself boy — Jofra Archer (@JofraArcher) March 31, 2016 Still the boss @henrygayle pic.twitter.com/bV1y3Azijp — Jofra Archer (@JofraArcher) October 30, 2020 -
స్టోక్స్ సూపర్‌మేన్.. మరి ఆర్చర్
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో శుక్రవారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించడంతో ప్లేఆఫ్ బెర్త్ పోటీ రసవత్తరంగా మారిపోయింది. కేవలం నాలుగో స్థానం కోసం పంజాబ్, రాజస్తాన్, కేకేఆర్, ఎస్ఆర్హెచ్లు పోటీ పడుతున్నాయి. ఈ నాలుగు జట్లలో ఏం జట్టు ప్లేఆఫ్ చేరుతుందనేది సోమవారంతో తేలనుంది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్, శామ్సన్‌లు బ్యాటింగ్‌లో ఇరగదీసి విజయం అందించడంతో హీరోలుగా మారిపోయారు. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో గేల్‌ను ఆర్చర్ ఔట్ చేయడంతో అతను హీరోగా మారిపోయాడు. (చదవండి : శామ్యూల్స్‌కు మతి చెడింది : వార్న్) దీనికి రాజస్తాన్ యాజమాన్యం తమ ట్విటర్లో వినూత్నమైన పోస్ట్‌తో ముందుకొచ్చింది. రాజస్తాన్ విజయానికి గట్టి పునాది వేసిన బెన్ స్టోక్స్‌ను సూపర్‌మేన్‌గా, శామ్సన్ను మార్వెల్ సిరీస్‌లోని డాక్టర్ స్ట్రేంజ్‌గా, ఇక ఆర్చర్‌ను గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్ హీరోగా అభివర్ణిస్తూ ట్వీట్ చేసింది. పంజాబ్‌తో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో స్టోక్స్, శామ్సన్‌లు బ్యాటింగ్‌లో మెరిస్తే.. ఆర్చర్ స్వింగ్‌లో ఉన్న గేల్ వికెట్‌ను తీసుకున్నాడు. అంతేకాదు ఈ సీజన్లో 19 వికెట్లతో రబడ తర్వాత లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Tricks & Treats! 🙌#Halloween with the Royals. 🎃#HallaBol | #RoyalsFamily | #HappyHalloween pic.twitter.com/Nwju9AaJAv — Rajasthan Royals (@rajasthanroyals) October 31, 2020 -
ఐపీఎల్: క్రిస్ గేల్‌కు షాక్
అబుదాబి: క్రిస్ గేల్‌కు కోపం వచ్చింది. ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ కావడంతో ‘యూనివర్సల్ బాస్’ యమ సీరియస్ అయ్యాడు. అసహనంతో బ్యాట్‌ను నెలకేసి కొట్టాడు. ఐపీఎల్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన లీగ్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున బరిలోకి దిగిన గేల్ తనదైన శైలిలో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు తర్వాత చెలరేగిపోయాడు. జట్టును భారీ స్కోరు దిశగా నడిపిస్తున్న దశలో గేల్ జోరుకు రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బ్రేక్ వేశాడు. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్న గేల్‌ను అద్భుత యార్కర్‌తో ఔట్ చేశాడు. దిగ్భ్రాంతికి గురైన గేల్ తన బ్యాట్‌ను కసిగా నేలకేసి విసిరికొట్టాడు. తర్వాత బ్యాట్ హేండిల్‌కు తన హెల్మెట్ తగిలించి నిరాశగా మైదానం వీడాడు. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించడంతో గేల్ ఇన్నింగ్స్ వృధా అయింది. తప్పు ఒప్పుకున్న గేల్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు క్రిస్ గేల్‌పై అంపైర్లు చర్య తీసుకున్నారు. అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. మైదానంలో భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే గేల్.. బ్యాట్‌ను విసిరికొట్టడంతో అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే చేసింది తప్పేనని అంగీకరించడంతో మ్యాచ్ ఫీజులో కోతతో అంపైర్లు సరిపెట్టారు. వెయ్యి సిక్సర్ల మైలురాయి టి20 క్రికెట్లో వెస్టిండీస్ క్రికెట్ స్టార్ క్రిస్ గేల్ సరికొత్త చరిత్ర లిఖించాడు. 1000 సిక్స్‌ల మైలురాయి సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో వరుసగా పొలార్డ్ (690), మెకల్లమ్ (485), షేన్ వాట్సన్ (467), ఆండ్రూ రసెల్ (447) ఉన్నారు. ఐపీఎల్లో 349 సిక్స్‌లు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డు చెక్కు చెదరలేదు. ఇప్పటివరకు ఐపీఎల్లో అతడు 349 సిక్సర్లు బాదాడు. ప్రపంచంలో జరుగుతోన్న మరే టి20 లీగ్‌లోనూ ఎవరూ ఇన్ని సిక్స్‌లు కొట్టలేదంటే గేల్ సత్తా ఎలాంటిదో అర్థమవుతోంది. పొట్టి ఫార్మాట్లో అందుకే ‘సిక్సర పిడుగు’గా అతడు వెలుగొందుతున్నాడు. (చదవండి: రాజస్తాన్ రాయల్స్ ఊపిరి పీల్చుకుంది) -
'బయోబబుల్ నరకం.. కౌంట్‌డౌన్ మొదలెట్టా'
దుబాయ్ : ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 13వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో రాజస్తాన్ తరపున 12 మ్యాచ్‌లాడిన ఆర్చర్ 17 వికెట్లతో స్థిరంగా రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్ బయోసెక్యూర్ బబుల్ వాతావరణంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. లీగ్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లంతా బయోసెక్యూర్‌లోనే గడపాల్సి ఉంటుంది. తాజాగా బయోసెక్యూర్ బబుల్ నుంచి బయటపడేందుకు తాను కౌంట్‌డౌన్ మొదలెట్టినట్లు ఆర్చర్ పేర్కొన్నాడు. బ్రిటీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పాల్గొన్న ఆర్చర్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. (చదవండి : సూర్య అద్భుతం.. కానీ నిరాశలో ఉన్నాడు) 'నేను ఫ్రీ అయ్యేందుకు కౌంట్‌డౌన్ మొదలుపెట్టా. గత కొన్ని నెలలుగా బయో సెక్యూర్ బబుల్ అనే నరకంలో ఉంటున్నాని.. త్వరలోనే అందులోంచి బయటపడుతున్నందుకు సంతోషంగా ఉంది. ఒక ఏడాది క్యాలెండర్లో ఎన్నో మ్యాచ్‌లు ఆడే నేను ఈ ఏడాది మాత్రం రోజుల ఎంత త్వరగా గడుస్తాయా అని ఆలోచిస్తున్నా. ఏవైనా సిరీస్‌లు ఆడేటప్పుడు బయోసెక్యూర్ బబుల్‌తో కేవలం హోటల్, మైదానానికి పరిమితం కావాల్సి వస్తుంది. ఖాళీ స్టేడియాల్లో ఆడడం అనేది నాకు ఏదోలా అనిపిస్తుంది. నాకు తెలిసినంతవరకు బయోబబుల్‌లో అందరికన్నా ఎక్కువగా గడిపింది నేనే అనుకుంటున్నా. కరోనా వల్ల బయోబబుల్‌లో ఉంటున్నా తనకు ఫ్యామిలీ వెంట ఉన్నా.. స్వేచ్చ అనేది మాత్రం దూరమైపోయింది. కొద్ది రోజుల్లో ఐపీఎల్ ముగిసిపోతుందిగా.. అందుకే కౌంట్‌డౌన్ మొదలుపెట్టా 'అని తెలిపాడు. వాస్తవానికి ఐపీఎల్ ప్రారంభం కాకముందు ఇంగ్లండ్ టీమ్ వెస్టిండీస్‌తో సిరీస్ ఆడిన విషయం విధితమే. ఆ సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్ కూడా పాల్గొన్నాడు. విండీస్‌తో జరిగిన సిరీస్ కూడా బయోసెక్యూర్ బబుల్ వాతావరణంలోనే జరిగింది. అప్పటినుంచి ఆర్చర్ బయోబబుల్ సెక్యూర్‌లో గడిపాడు. అయితే బయో బబుల్ నిబంధనలు ఉల్లఘించినందుకు ఆర్చర్‌పై రెండో టెస్టులో వేటు కూడా పడింది. ఆ తర్వాత ఐపీఎల్లో ఆడేందుకు వచ్చిన ఆర్చర్ అదే వాతావరణంలో ఉండడంతో అసహనం వ్యక్తం చేశాడు. ఇక లీగ్‌లో రాజస్తాన్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన రాజస్తాన్ 5 విజయాలు, ఏడు ఓటములతో 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు చేరడం కొంచెం కష్టమే అయినా.. మిగిలిన రెండు మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలవడంతో పాటు రన్‌రేట్‌ను కూడా గణనీయంగా మెరుగుపరుచుకోవాలి. అంతేకాదు తనకంటే ముందున్న ఎస్ఆర్హెచ్, కేకేఆర్, పంజాబ్‌లు మిగిలిన మ్యాచ్‌లు ఓడిపోతేనే రాజస్తాన్‌కు ప్లేఆఫ్ చేరే అవకాశం ఉంటుంది. కాగా రాజస్తాన్ తన తర్వాతి మ్యాచ్‌లో శుక్రవారం కింగ్స్ పంజాబ్‌తో తలపడనుంది. (చదవండి : పాండ్యా, క్రిస్ మోరిస్ మాటల యుద్ధం) -
వారిదే టైటిల్.. ఆర్చర్ జోస్యం నిజమయ్యేనా?
దుబాయ్: ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన బౌలింగ్‌తోనే కాదు.. తన ట్వీట్ల ద్వారాను ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఆర్చర్ ఎప్పుడో చెప్పింది వాస్తవ రూపం దాల్చడంతో అతని ట్వీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రధానంగా క్రికెట్లో ఏది జరిగినా ఆర్చర్ ముందే చెప్పాడనే ట్వీట్ మన ముంగిట నిలుస్తూ ఉంటుంది. అయితే అందులో వాస్తవం ఎంతనేది ఆర్చర్‌కే తెలియాలి. నిజంగానే ఆర్చర్ టైమ్ మిషీన్ ఉందా అని ప్రశ్న కూడా అభిమానులు మనసుల్లో ఇప్పటికీ మెదులుతూనే ఉంది. (సల్మాన్ పాత ట్వీట్ వైరల్!) ప్రస్తుత ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ రాజస్తాన్ తరఫున ఆడుతున్న ఆర్చర్ ఒక అద్భుతమైన క్యాచ్‌ను పట్టాడు. కార్తీక్ త్యాగి వేసిన 11 ఓవర్ నాల్గో బంతిని భారీ షాట్ ఆడిన ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్.. బౌండరీ లైన్ కు కాస్త ముందు ఆర్చర్ ఒంటి చేత్తో క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ క్యాచ్‌ను పట్టడం కష్టసాధ్యమనుకున్న తరుణంలో ఆర్చర్ దాన్ని అందుకుని శభాష్ అనిపించాడు. అసాధారణమైన క్యాచ్‌లను పట్టడం క్రికెట్లో ఒకటైతే, ఈ విషయాన్ని ఆర్చర్ దాన్ని ముందుగా చెప్పడమే ఆసక్తికరంగా మారింది. 2014లో ఆర్చర్ ఒక ట్వీట్ చేశాడు. అది ‘క్యాచ్ ఆఫ్ ది ఐపీఎల్’ అని ఆర్చర్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. వారిదే టైటిల్.. ఆర్చర్ జోస్యం ఐపీఎల్ 13 సీజన్ తుది దశకు చేరుకుంది. అయితే ఈ సీజన్ టైటిల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలుస్తుందని రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ జోస్యం చెప్పాడు. అయితే ఈ ఇంగ్లండ్ పేసర్ చెప్పింది ఇప్పుడు కాదు... ఆరేళ్ల క్రితం. కింగ్స్ పంజాబ్ టైటిల్ గెలుస్తుందని 2014లో ట్వీట్ చేశాడు. ఆర్చర్ 2014లో చేసిన ట్వీట్ కింగ్స్ పంజాబ్ ఇటీవలే రీ ట్వీట్ చేసింది. కింగ్స్ పంబాబ్ ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌ల్లో గెలవగా, అందులో ఐదు వరుసగా గెలిచినవే. వరుస ఐదు ఓటముల తర్వాత పంజాబ్ పుంజుకుని ఇలా ప్లే ఆఫ్ రేసులోకి రావడంతో పంజాబ్‌దే టైటిల్‌ను అంతా అనుకుంటున్నారు. 2014లో ఫైనల్‌కు చేరిన కింగ్స్ పంజాబ్.. కేకేఆర్ చేతిలో చతికిలబడింది. ఈసారి కచ్చితంగా టైటిల్‌ను కింగ్స్ పంజాబ్ ఎగురేసుకుపోతుందని ఒక సెక్షన్ వర్గం అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది అంత సీన్లేదని అంటున్నారు. ప్రధానంగా సెకండ్ లెగ్‌లో కింగ్స్ పంజాబ్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. అదే సమయంలో ఆర్చర్ ఎప్పుడో ట్వీట్ చేసిన మరొకసారి ప్రత్యక్షం కావడం, దాన్ని కింగ్స్ పంజాబ్ రీట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మరి పంజాబ్ టైటిల్ గెలుస్తుందా.. ఆర్చర్ జోస్యం నిజమవుతుందా అనేది చూడాలి. ఆర్చర్ జోస్యం నిజమవుతుందా.. లేదా అనేది కూడా కింగ్స్ పంజాబ్‌కు ప్రశ్నగానే ఉంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఆర్చర్ ట్వీట్‌ను రీట్వీట్ చేసింది కింగ్స్ పంజాబ్.(వచ్చే ఏడాది కూడా ధోనీ సారథ్యంలోనే!) #Jofradamus at it again 🔮#SaddaPunjab #IPL2020 #KXIP #KXIPvSRH https://t.co/UI6jrPl03B — Kings XI Punjab (@lionsdenkxip) October 24, 2020 -
బుమ్రా యాక్షన్..ఆర్చర్ రియాక్షన్!
అబుదాబి: రాజస్తాన్ రాయల్స్- ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఆదివారం ఆసక్తికర మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్తాన్ సునాయాసంగా ఛేదించింది. తమ బ్యాటింగ్‌లో పవర్ చూపెట్టిన రాజస్తాన్.. ముంబై ఇండియన్స్‌ను రప్ఫాడించింది. బెన్ స్టోక్స్(107 నాటౌట్; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ శాంసన్(54 నాటౌట్; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స్‌లు)లు చెలరేగిపోవడంతో రాజస్తాన్ 18.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది.ఈ జోడి అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో రాజస్తాన్ అలవోకగా విజయం సాధించింది.(నవదీప్ సైనీ అనుమానమే?) అయితే మ్యాచ్‌కు ముందు రాజస్తాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను కాపీ చేశాడు. బుమ్రా తరహాలో బంతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని మెల్లగా రనప్ తీసుకునే యాక్షన్‌ను ఆర్చర్ అనుకరించాడు. ఆ క్రమంలోనే తన నవ్వును ఆపులేకపోయాడు ఆర్చర్. దీన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. బుమ్రాను ఆర్చర్ అనుసరించే యత్నం చేశాడని క్యాప్షన్‌ను ఇచ్చింది. ఇది మరొకసారి క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించింది. ఈ సీజన్లో వీరిద్దరూ ప్రస్తుతం టాప్-5లో కొనసాగుతున్నారు. ఆర్చర్-బుమ్రాలు తలో 17 వికెట్లు సాధించారు. ఆర్చర్ 12 మ్యాచ్‌ల్లో 6.71 ఎకానమీతో 17 వికెట్లు సాధించగా, బుమ్రా 11 మ్యాచ్‌ల్లో 7.52 ఎకానమీతో 17 వికెట్లు తీశాడు. View this post on Instagram That moment when Archer was trying to do a Bumrah 😉 #Dream11IPL #RRvMI A post shared by IPL (@iplt20) on Oct 25, 2020 at 11:32am PDT -
ఆర్చర్ ఆరేళ్ల క్రితం మాట.. ఇప్పుడెలా సాధ్యం?
అబుదాబి: జోఫ్రా ఆర్చర్.. ఇంగ్లండ్ జట్టు ప్రధాన పేసర్. గతేడాది వరల్డ్‌కప్‌లో చోటు దక్కించుకోవడంతో పాటు ఆశించిన స్థాయిలోనే రాణించాడు ఆర్చర్. అయితే ప్రపంచకప్ ఫైనల్ అనంతరం ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ పాత ట్వీట్లు అభిమానుల్లో ఆసక్తిని రేకిత్తించాయి. ‘6 బంతులు16 పరుగులు’ అని చేసిన ట్వీట్ ప్రపంచకప్ అనంతరం చర్చకు దారీ తీసింది. వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ సూపర్ ఓవర్లో 15 పరుగులు చేసింది.. న్యూజిలాండ్ లక్ష్యం ఆరు బంతుల్లో 16 పరుగులు. మరి దీన్ని ముందే ఊహించే ఆర్చర్ ట్వీట్ చేశాడా అనేది అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అతనికి సూపర్ నేచురల్ పవర్స్ ఏమైనా ఉన్నాయా? అనే సందేహాన్ని కలిగించాయి. అటు తర్వాత ఐర్లాండ్‌తో నాలుగు రోజుల టెస్ట్ సందర్భంగా కూడా మరోసారి అతని పాత ట్వీట్లు చర్చనీయాంశమయ్యాయి. ఇలా అతను చేసిన చాలా ట్వీట్లే వైరల్‌గా మారాయి.(రప్ఫాడించిన రాజస్తాన్ ) ఎప్పుడో ఫలాన అంటూ ట్వీట్ చేయడం, అది మన కళ్ల ముందు తాజాగా కనిపించడం జరుగుతూ ఉండటమే కాకుండా వైరల్‌గా మారడం మనం చూస్తున్నాం. ఆర్చర్లో టైమ్ మిషీన్ ఏమైనా ఉందా? అనే అనుమానం మరొకసారి కల్గింది. ప్రస్తుత ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ రాజస్తాన్ తరఫున ఆడుతున్న ఆర్చర్ ఒక అద్భుతమైన క్యాచ్‌ను పట్టాడు. కార్తీక్ త్యాగి వేసిన 11 ఓవర్ నాల్గో బంతిని భారీ షాట్ ఆడిన ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్.. బౌండరీ లైన్ కు కాస్త ముందు ఆర్చర్ ఒంటి చేత్తో క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ క్యాచ్‌ను పట్టడం కష్టసాధ్యమనుకున్న తరుణంలో ఆర్చర్ దాన్ని అందుకుని శభాష్ అనిపించాడు. ఆరేళ్ల క్రితం ఐపీఎల్ క్యాచ్ మాట అసాధారణమైన క్యాచ్‌లను పట్టడం క్రికెట్లో ఒకటైతే, ఈ విషయాన్ని ఆర్చర్ దాన్ని ముందుగా చెప్పడమే ఆసక్తికరంగా మారింది. 2014లో ఆర్చర్ ఒక ట్వీట్ చేశాడు. అది ‘క్యాచ్ ఆఫ్ ది ఐపీఎల్’ అని ఆర్చర్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. అప్పటికి ఆర్చర్ అంతర్జాతీయ అరంగేట్రమే జరగలేదు. గతేడాది ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన ఆర్చర్.. 2018లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. ఐపీఎల్లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆర్చర్ అదరగొట్టాడు. రెండేళ్ల క్రితం ముంబై ఇండియన్స్‌తో జరిగిన తన అరంగేట్రం మ్యాచ్‌లో ఆర్చర్ మూడు వికెట్లు సాధించి శభాష్ అనిపించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ జట్టుకు ఆడటమే కాకుండా ప్రధాన పేసర్‌గా మారిపోయాడు. ఇంగ్లండ్ వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆర్చర్ చేసే ట్వీట్లే అందర్నీ ఆలోచింప చేస్తున్నాయి. ఆర్చర్ ఏమైనా మాయలు ఉన్నాయా.. అని అభిమానులు తమలో తాము చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో జరగబోయేది ఆర్చర్‌కు ముందే ఎలా తెలుస్తుంది అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ భారీ విజయాన్ని సాధించింది. ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్తాన్ సునాయాసంగా ఛేదించింది. తమ బ్యాటింగ్‌లో పవర్ చూపెట్టిన రాజస్తాన్.. ముంబై ఇండియన్స్‌ను రప్ఫాడించింది. బెన్ స్టోక్స్(107 నాటౌట్; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ శాంసన్(54 నాటౌట్; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స్‌లు)లు చెలరేగిపోవడంతో రాజస్తాన్ 18.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది.ఈ జోడి అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో రాజస్తాన్ అలవోకగా జయకేతనం ఎగురవేసింది. — Jofra Archer (@JofraArcher) May 19, 2014 -
ఆరుసార్లు ఆర్చర్‌కే దొరికేశాడు..!
దుబాయ్: ఆర్చర్ సిద్ధంగా ఉండు.. తాడో పేడో తేల్చుకుందాం.. ఇది ఐపీఎల్ ఆరంభ సమయంలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నమాట. అంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో ఎక్కువసార్లు ఆర్చర్ బౌలింగ్‌లో ఔటైన వార్నర్.. దాన్ని ఐపీఎల్లో సరిచేయాలని చూశాడు. ఆర్చర్‌పై పైచేయి సాధించేందుకు క్యాష్ రిచ్ లీగ్ టోర్నీని ఉపయోగించుకోవాలనుకున్నాడు. కానీ ఆర్చర్‌పై వార్నర్ పైచేయి సాధించలేకపోయాడు. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్చర్ బౌలింగ్‌లోనే వార్నర్ ఔటయ్యాడు. ఇక్కడ ఒక మ్యాచ్‌లో రాజస్తాన్ విజయం సాధిస్తే, రెండో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో వార్నర్ 48 పరుగులు సాధించి ఆర్చర్ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా, నిన్నటి మ్యాచ్‌లో వార్నర్ నాలుగు పరుగులే చేసి ఆర్చర్‌కు దొరికిపోయాడు.ఎక్స్ ట్రా స్వింగ్‌తో వేసిన బంతికి స్లిప్‌లో ఉన్న స్టోక్స్ కు క్యాచ్ ఇచ్చి వార్నర్ పెవిలియన్ చేరాడు. (బ్రదర్ కాస్కో.. నిన్ను టీజ్ చేస్తా: రాహుల్ చాహర్) కాగా, పరిమిత ఓవర్ల క్రికెట్లో భాగంగా దాదాపు నెలన్నర సమయంలో ఆర్చర్ బౌలింగ్‌లో వార్నర్ ఆరుసార్లు ఔటయ్యాడు. గతనెల్లో ఇంగ్లండ్-ఆసీస్ జట్ల మధ్య జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో భాగంగా వార్నర్ ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లకు గాను నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఆర్చర్‌కే చిక్కేశాడు. సెప్టెంబర్ 4వ తేదీ(ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్) నుంచి అక్టోబర్ 23వ(ఐపీఎల్ మ్యాచ్) తేదీ మధ్యలో వీరు ముఖాముఖి పోరులో ఏడుసార్లు తలపడితే ఆరుసార్లు ఆర్చర్‌కే ఔట్ కావడం గమనార్హం. వీరిద్దరు ముఖాముఖి పోరులో తలపడే అవకాశం ఇప్పట్లో లేదు. ఎస్ఆర్హెచ్-రాజస్తాన్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరినట్లయితే అప్పుడు మరొకసారి వీరు తలపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే వార్నర్‌పై ఆర్చర్‌దే పైచేయి అయ్యింది. ఓవరాల్‌గా పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో వార్నర్‌కు మంచి రికార్డే ఉంది. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన వార్నర్‌కు ఆ జట్టు తరపున అద్భుతమైన రికార్డు కల్గి ఉన్నాడు.2014లో సన్‌రైజర్స్ తరపున మొదటిసారి ఆడిన వార్నర్.. 528 పరుగులతో టాప్ 4లో స్థానం సంపాదించాడు. తర్వాత వరుసగా 2015లో 562 పరుగులు, 2016లో 848 పరుగులు, 2017లో 641 పరుగులు, 2019లో 692 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్ సీజన్లలో అత్యధిక పరుగులు మూడు సార్లు సాధించి ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఏకైక విదేశీ ఆటగాడిగా వార్నర్ రికార్డు నెలకొల్పాడు. 2015లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన వార్నర్.. మరుసటి ఏడాది 2016లో జట్టుకు టైటిల్ అందించాడు. -
టాప్-20 ఫాస్టెస్ట్ బాల్స్.. ఒక్కడే 16
దుబాయ్: రెండేళ్ల క్రితం ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రాజస్తాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ముంబై ఇండియన్ప్‌తో మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు సాధించి శభాష్ అనిపించాడు. తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ ఉత్తమ గణాంకాల్ని నమోదు చేశాడు. ఆపై ఇంగ్లండ్ జట్టుకు కీలకంగా మారిన ఈ పేసర్.. ఆ జట్టు తొలిసారి వరల్డ్‌కప్ గెలవడంలో కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఎక్స్ట్రా బౌన్స్‌తో పాటు వైవిధ్యమైన బంతులు, యార్కర్లతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్న జోఫ్రా ఆర్చర్.. ఈ ఏడాది ఐపీఎల్లో మూడు మ్యాచ్‌ల్లో కలిపి మూడు వికెట్లు మాత్రమే సాధించాడు. కానీ వేగంలో మాత్రం దడపుట్టిస్తున్నాడు ఆర్చర్. అంతకంతకూ తన వేగాన్ని పెంచుకుంటూ మిగతా జట్లకు సవాల్ విసురుతున్నాడు. (చదవండి: ‘అతనే మా ఆయుధం.. దడ పుట్టిస్తాడు: వార్న్) ఈ సీజస్‌లో ఇప్పటివరకూ టాప్-20 ఫాస్టెస్ట్ డెలివరీల లిస్టులో ఆర్చర్వే 16 ఉన్నాయంటే అతని వేగం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో 150కి.మీ, అంతకంటే వేగంతో వేసిన బంతులు మూడు ఉండగా, 147 కి.మీ వేగంగా కంటే ఎక్కువ వేసినవి మరో 13 బంతులు ఉన్నాయి. ఓవరాల్‌గా చూస్తే ఫాస్టెస్ట్ బంతుల్ని ఎక్కువ వేసిన బౌలర్లలో ఆర్చర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ సీజన్లో 150 కి.మీ వేగాన్ని దాటిన బౌలర్ ఆర్చర్ కావడం ఇక్కడ మరో విశేషం. ఇక ఆర్సీబీ పేసర్ నవదీప్ సైనీకి కూడా టాప్-20 ఫాస్టెస్ట్ డెలివరీల లిస్టులో చోటు దక్కింది. ఈ సీజన్లో సైనీ వేసిన వేగవంతమైన బంతి 147. 92కి.మీగా నమోదైంది. ఇప్పటివరకూ ఐపీఎల్ ఆడుతున్న భారత ఆటగాళ్లలో సైనీదే వేగవంతమైన బంతి కావడం గమనార్హం. ఇక దక్షిణాఫ్రికా క్రికెటర్ అన్రిచ్ నోర్త్జే, ఆసీస్ పేసర్ హజిల్‌వుడ్‌లకు కూడా టాప్-20 ఫాస్టెస్ట్ బాల్స్ లిస్టులో చోటు దక్కింది. నోర్త్జే 147.33, 148.92 కి.మీ వేగంతో బంతులు వేయగా, హజిల్‌వుడ్ 147. 32 కి.మీ వేగంతో టాప్-20లో చేరాడు. -
‘అతనే మా ఆయుధం.. దడ పుట్టిస్తాడు: వార్న్
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్.. ఆ జట్టుతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. గతంలో తాను కెప్టెన్‌గా ఉండగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన తొలినాటి జ్ఞాపకాలతో పాటు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో షార్జాలోని అనుభవాల్ని షేర్ చేసుకున్నాడు. ప్రత్యేకంగా 1998లో సచిన్ తుపాన్ ఇన్నింగ్స్ ఇప్పటికీ తనకు పీడకలగానే ఉంటుందన్నాడు. ఇక రాజస్తాన్ రాయల్స్‌కు మెంటార్‌గా వ్యవహరించడంతో గొప్ప అనుభూతిని తీసుకొచ్చిందన్నాడు. (చదవండి: అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్) స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్‌లను వీక్షించడంతో పాటు హెడ్ కోచ్ మెక్ డొనాల్డ్, కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లతో మాట్లాడుతూ వారితో చర్చించడం గొప్పగా ఉందన్నాడు. తమ జట్టులో స్మిత్ కెప్టెన్సీ స్టైల్‌ను కొనియాడిన వార్న్.. జోఫ్రా ఆర్చర్ గురించి ప్రధానంగా ప్రస్తావించాడు. తమ జట్టుకు ప్రధాన బౌలింగ్ ఆయుధం జోఫ్రా ఆర్చర్ అని ప్రశంసించాడు. ప్రత్యర్థులకు దడపుట్టిస్తూ పైచేయి సాధించడంలో ఆర్చర్‌ది భిన్నమైన శైలి అని వార్న్ ప్రస్తావించాడు.ఇక సంజూ శాంసన్ కూడా మ్యాచ్‌ను శాసింగల సామర్థ్యం ఉన్న ఆటగాడని కొనియాడాడు. రెండు దశాబ్డాల క్రితం షార్జా ఎడారిలో సచిన్‌తో నాకు ఎదురైన అనుభవం ఇప్పటికీ పీడకలే. మమ్మల్ని చీల్చి చెండాడిన సచిన్ మాకు చేదు జ్క్షాపకాల్ని మిగిల్చాడు. ప్రత్యేకంగా నన్ను టార్గెట్ చేసి రెచ్చిపోయిన తీరు ఇప్పటికీ నాకు గుర్తు. ఆనాటి రెండు సచిన్ ఇన్నింగ్స్‌లు ఇప్పటికీ చిరస్మరణీయమే. నాకు ఇక్కడ ఎదురైన చేదు అనుభవాల్ని చెరిపేశాను. ఇక్కడ ప్రతీ జ్ఞాపకాన్ని మది నుంచి తీసేశాను. ఇప్పుడు రాజస్తాన్ రాయల్స్ కోసం ఇక్కడికి రావడంతో వాటిని మళ్లీ గుర్తుకొస్తున్నాయి. ఈ సీజన్లో షార్జాలో ఆడే మ్యాచ్‌లను రాజస్తాన్ గెలుస్తుంది. మా ప్రధాన బౌలింగ్ ఆయుధం ఆర్చర్. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ కూడా మాకు బలం. శాంసన్ టాలెంటెడ్ క్రికెటర్. నేను స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్‌లను వీక్షిస్తున్నాను. హెడ్ కోచ్, స్మిత్‌లతో వ్యూహాలని షేర్ చేసుకుంటున్నాను. ఇది గొప్పగా అనిపిస్తోంది’ అని వార్న్ పేర్కొన్నాడు. -
హాఫ్ సెంచరీ ముంగిట గిల్ ఔట్!
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైటరైడర్స్ ఇన్నింగ్స్ ఎక్కువగా మెరుపులు లేకుండానే కొనసాగుతోంది. కోల్‌కతా ఓపెనర్లలో గిల్ మరోసారి సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే, 34 బంతుల్లో 47 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి చేరువైన గిల్‌ను జోఫ్రా ఆర్చర్ బోల్తా కొట్టించాడు. రిటర్న్ క్యాచ్ ద్వారా పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్ నరైన్ మాత్రం మరోసారి విఫలమయ్యాడు. ఆరంభం నుంచి పెద్దగా మెరుపులు లేకుండా సాగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌లో 36 పరుగులకు చేరుకోగానే ఉనాద్కట్ బౌలింగ్‌లో సునీల్ నరైన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణాతో కలిసి గిల్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు ఒక వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. పవర్‌ప్లే ముగిసిన తర్వాత గిల్, రాణాలు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే తెవాటియా వేసిన 10 ఓవర్లో చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన నితీష్ రాణా క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 98గా ఉంది. ఇక ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు ఐపీఎల్లో 21 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో రాజస్తాన్ 10, కేకేఆర్ 10 విజయాలతో సమానంగా ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. రాజస్తాన్‌పై కేకేఆర్ అత్యధిక స్కోరు 190, అత్యల్ప స్కోరు 125గా ఉంది. కాగా కేకేఆర్‌పై రాజస్తాన్ అత్యధిక స్కోరు 199 పరుగులు, అత్యల్ప స్కోరు 81గా ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచ్‌ల్లో కోల్‌కతా 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రాజస్తాన్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. -
సప్రైజ్ ఇవ్వనున్న రాజస్తాన్ రాయల్స్!
మొన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై అనూహ్య రీతిలో రాజస్తాన్ రాయల్స్ గెలిచిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్ జట్టు ఓడిపోతుంది అనుకున్న చివరి నిమిషంలో జోఫ్రా ఆర్చర్, రాహుల్ తివాటియా జట్టును అనూహ్యా రీతిలో గెలిపించారు. తివాటియా 31 బంతుల్లో 53 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరచగా, తరువాత వచ్చిన ఆర్చర్ మూడు బంతుల్లో 2 సిక్స్‌లు కొట్టి 13 రన్స్ చేసి జట్టును గెలిపించారు. దీంతో వీరిద్దరిని కోల్కత్తా నైట్ రైడర్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో ఓపెనర్స్‌గా దించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన రాజస్తాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం ఒక కండీషన్ పెట్టింది. తివాటియాను, ఆర్చర్‌ను ఓపెనర్స్‌గా దించాలని కోరుకుంటే తాము చేసిన ట్వీట్‌కు 3000 రీ ట్వీట్స్ రావాలని అప్పుడే వారిని ఓపెనర్స్‌గా దించుతామని ప్రకటించింది. ‘ఆర్టీ 3000 టు మేక్ తివాటిరా, జోఫ్రా ఓపెన్ ది బ్యాటింగ్ టు నైట్’ అని రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసింది. ఇప్పటి వరకు 2020 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ 2 మ్యాచ్‌లు గెలవగా, నేడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌ను గెలవాలని కసిగా ఉంది. ఎప్పుడు మిడిల్ బ్యాట్స్‌మెన్‌గా బరిలో దిగే తివాటియా మొన్న పంజాబ్ జట్టుపై చివరిలో దిగి ఒక్క ఓవర్లోనే 5 సిక్స్‌లు కొట్టి జట్టును గెలిపించాడు. అతనితో పాటు ఆర్చర్కూడా ఆ మ్యాచ్‌లో అదరగొట్టాడు. దీంతో వారిద్దరిని ఓపెనర్స్‌గా దించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. చదవండి: ఆఖరి ఓవర్లలో... ఆరేశారు -
ఆర్చర్ రెచ్చిపోతాడని అప్పుడు ఊహించలేదు
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్ సందర్భంగా మంగళవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్(ఆర్ఆర్) ఆటగాడు జోఫ్రా ఆర్చర్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. మొదట శామ్సన్ సిక్సర్లతో రెచ్చిపోగా.. చివర్లో ఆర్చర్ ఎన్గిడి బౌలింగ్‌లో నాలుగు సిక్సర్లు బాది తనలోనూ మంచి ఆల్‌రౌండర్ ఉన్నాడని చెప్పకనే చెప్పాడు. ఆర్చర్ విధ్వంసంతో మొదటిసారి ఈ ఐపీఎల్లో 200 స్కోరు దాటేసింది. ఆసీస్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్ తన అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న ఆర్చర్ బ్యాటింగ్‌లో ఇలా రెచ్చిపోతాడని బహుశా రాజస్తాన్ జట్టు కూడా ఊహించి ఉండదు. చెన్నైతో మ్యాచ్ అనంతరం ఆర్ఆర్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆర్చర్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు.(చదవండి : ‘ధోని కాకుండా వేరేవాళ్లైతే పరిస్థితేంటి’) 'జోఫ్రా అద్భుతమైన బ్యాటింగ్ కనబరిచాడు. అయితే నిజానికి మ్యాచ్‌కు ముందురోజు నేను ప్రాక్టీస్‌లో బిజీ ఉండగా.. ఆర్చర్ నా వద్దకు వచ్చి.. స్మిత్ నువ్వు నెట్స్ నుంచి బయటికి వెళ్లు.. నేను హిట్టింగ్ ప్రాక్టీస్ చేయాలి.. అదేంటి బౌలింగ్ ప్రాక్టీస్ చేయకుండా.. హిట్టింగ్ చేస్తానని చెప్పడమేంటని అనుకున్నా. కానీ మ్యాచ్‌లో ఇలా విధ్వంసం సృష్టిస్తాడని అప్పుడు నేను ఊహించలేకపోయా. బ్యాటింగ్‌కు వచ్చిన ఆర్చర్ మొదటి నాలుగు బంతులను సిక్సులుగా మలవడం ఆశ్చర్యం కలిగించింది. ఆర్చర్ బౌలింగ్‌లోనే కాదు.. బ్యాటింగ్‌లోనూ ఇరగదీస్తాడని ఆ క్షణమే అనుకున్నా.. అద్భుతమైన బ్యాటింగ్‌తో మా జట్టుకు మంచి కిక్ ఇచ్చాడంటూ' చెప్పుకొచ్చాడు. అయితే చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లుగా స్టీవ్ స్మిత్, యశస్వి జైశ్వాల్ రావడం తెలిసిందే. జోస్ బట్లర్ గైర్హాజరీలో స్మిత్ ఓపెనర్‌గా రావాల్సి వచ్చింది. అయితే ఆసీస్‌తో సిరీస్ ముగిసిన తర్వాత జోస్ బట్లర్ కాస్త ఆలస్యంగా దుబాయ్ చేరుకున్నాడు. నిబంధనల ప్రకారం ఏ ఆటగాడైనా 6రోజులు క్వారంటైన్ తప్పనిసరి. కానీ బీసీసీఐ రూల్స్ సవరించి 36 గంటల క్వారంటైన్ విధించిన్పటికి బట్లర్ మ్యచ్‌కు రెండు రోజులు ముందే దుబాయ్ చేరుకున్నాడు. దీంతో మొదటి మ్యాచ్‌కు బట్లర్ దూరమవ్వాల్సి వచ్చింది. బట్లర్ తరువాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా అనే విషయంపై స్మిత్‌ను అడగ్గా.. 'చూద్దాం.. ఇప్పటికైతే జట్టు కూర్పు బలంగా ఉంది.. తర్వాతి మ్యాచ్‌లో ఇదే జట్టు కొనసాగవచ్చంటూ' పేర్కొన్నాడు. చెన్నైపై విజయంతో జోష్ మీదున్న రాజస్తాన్ సెప్టెంబర్ 24న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో తలపడనుంది. -
'ఆర్చర్ రెడీగా ఉండు .. తేల్చుకుందాం'
దుబాయ్ : డేవిడ్ వార్నర్.. విధ్వంసానికి పెట్టింది పేరు. అతను ఫామ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు ఇక చుక్కలే. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విదేశీ ఆటగాళ్లలో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా వార్నర్ రికార్డు నెలకొల్పాడు. 2018లో ఏడాది నిషేదంతో క్రికెట్ దూరంగా ఉన్న వార్నర్ 2019లో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో అద్భుత ప్రదర్శనతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2020 సీజన్‌కు గానూ మళ్లీ కెప్టెన్‌గా ఎంపికైన వార్నర్ 2016ను పునరావృతం చేస్తాడేమో చూడాలి. ఇప్పటికే ఐపీఎల్ 13వ సీజన్ ఆడేందుకు దుబాయ్‌కు చేరుకున్న వార్నర్ సన్‌రైజర్స్ జట్టుతో కలిశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా దుబాయ్‌లో అడుగుపెట్టిన వార్నర్ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. (చదవండి : 'ధోని.. నిజంగా నువ్వు అద్భుతం') 'రెండేళ్ల తర్వాత సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా పనిచేయబోతున్నా. గత ఐదేళ్లుగా జట్టుతో పాటే కొనసాగుతున్నా కాబట్టి జట్టులోని ఆటగాళ్ల గురించి మాట్లాడేందుకు ఏం లేదు. కెప్టెన్‌గా నా విధులను సక్రమంగా నిర్వహిస్తూనే బ్యాట్స్‌మన్‌గా అన్నిఅస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నా. ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా ఇక్కడికే చేరుకోవడం.. మంచి ప్రాక్టీస్ కూడా లభించడం జరిగింది. ఇక మొదటి మ్యాచ్‌కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. అతని బౌలింగ్‌లో ఐదు సార్లు ఔటయ్యాను. ఆర్చర్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. ఈ సందర్భంగా ఆర్చర్ రెడీగా ఉండు తేల్చుకుందాం' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ మొదటి మ్యాచ్ ఆర్సీబీతో సెప్టెంబర్ 21న తలపడనుంది. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, బెయిర్ స్టో, బిల్లీ స్టాన్లేక్, రషీద్ ఖాన్ వంటి విదేశీ ఆటగాళ్లు బలంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్ స్వదేశీ ఆటగాళ్లో ఒక్క భూవీ తప్ప పెద్ద పేరున్న ఆటగాళ్లు లేకపోవడం పెద్ద లోటుగా చెప్పొచ్చు. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన వార్నర్‌కు ఆ జట్టు తరపున అద్భుతమైన రికార్డు ఉంది. అంతేగాక 2015లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన వార్నర్.. మరుసటి ఏడాది 2016లో జట్టుకు టైటిల్ అందించాడు. ఇక బ్యాట్స్‌మెన్‌గా లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు. 2014లో సన్‌రైజర్స్ తరపున మొదటిసారి ఆడిన వార్నర్.. 528 పరుగులతో టాప్ 4లో స్థానం సంపాదించాడు. తర్వాత వరుసగా 2015లో 562 పరుగులు, 2016లో 848 పరుగులు, 2017లో 641 పరుగులు, 2019లో 692 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్ సీజన్లలో అత్యధిక పరుగులు మూడు సార్లు సాధించి ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఏకైక విదేశీ ఆటగాడిగా వార్నర్ రికార్డు నెలకొల్పాడు. -
ఆర్చర్‌కు నెగెటివ్
మాంచెస్టర్: ‘బయో సెక్యూర్’ నిబంధనలను ఉల్లంఘించి వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు దూరమైన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మళ్లీ జట్టుతో కలిశాడు. మంగళవారం అతడికి నిర్వహించిన రెండో కరోనా టెస్టులోనూ నెగెటివ్ అని తేలడంతో జట్టుతో కలిసేందుకు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు అనుమతినిచ్చింది. -
జరిమానాతో సరి...
లండన్: ‘బయో సెక్యూరిటీ’ నిబంధనలు ఉల్లంఘించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆగ్రహానికి గురైన పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు ఊరట లభించింది. ఆర్చర్ గత ప్రవర్తనను దృష్టిలో ఉంచుకొని ఈ సారికి జరిమానాతో సరి పెట్టాలని ఈసీబీ నిర్ణయించింది. ఆర్చర్ తన తప్పును అంగీకరించడంతో మూడో టెస్టు కోసం అతడిని జట్టులోకి ఎంపిక చేసింది. తొలి టెస్టు ముగిశాక సౌతాంప్టన్‌నుంచి రెండో టెస్టు వేదిక మాంచెస్టర్‌కు వెళ్లే సమయంలో ఆర్చర్ దారిలోనే ఉన్న తన ఇంటికి వెళ్లొచ్చాడు. ఇలా రక్షణ వలయాన్ని దాటడంపై ఆగ్రహించిన ఈసీబీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ వెంటనే అతడిని రెండో టెస్టు నుంచి తప్పించింది. ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించింది. ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గైల్స్ శుక్రవారం చేపట్టిన విచారణలో ఇంగ్లండ్ ప్లేయర్ల సంఘం ప్రతినిధి, ఆర్చర్ ఏజెంట్ పాల్గొన్నారు. గట్టి హెచ్చరికతో పాటు జరిమానా విధించామని ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే జరిమానా ఎంతనేది మాత్రం ఈసీబీ అధికారికంగా వెల్లడించలేదు. ఈ మొత్తం రెండో టెస్టు మ్యాచ్ ఫీజుతో సమానమైన సుమారు 15వేల పౌండ్లు (రూ. 14 లక్షలు) కావచ్చని సమాచారం. ఇప్పటికే ఒక కోవిడ్ పరీక్షకు ఆర్చర్ హాజరు కాగా, రిపోర్ట్ నెగెటి వ్గా వచ్చింది. రెండో పరీక్షలో కూడా ఇదే ఫలితం వస్తే అతను మంగళవారం జట్టుతో చేరతాడు. -
‘బుడగ’ దాటి బయటకొచ్చాడు...
మాంచెస్టర్: కరోనా నేపథ్యంలో పలు కట్టుబాట్లతో, ‘బయో సెక్యూరిటీ’ మధ్య కట్టుదిట్టంగా సాగుతున్న ఇంగ్లండ్, వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో అనూహ్య ఘటన! ఇంగ్లండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ జట్టు నిబంధనలు ఉల్లంఘించాడు. అనుమతించిన చోటుకు కాకుండా ‘బయో సెక్యూర్ బబుల్’ను దాటి బయటకు వెళ్లాడు. దాంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గురువారం తక్షణ క్రమశిక్షణ చర్యగా రెండో టెస్టు ఆరంభానికి ముందు అతడిపై వేటు వేసింది. బుధవారం రాత్రి ప్రకటించిన 13 మంది సభ్యుల జట్టులో ఉన్న ఆర్చర్‌ను తప్పించి అతని స్థానంలో స్యామ్ కరన్‌ను ఎంపిక చేసింది. నిబంధనల ప్రకారం ఆర్చర్ ఇప్పుడు ఐదు రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ సమయంలో అతనికి రెండు సార్లు కోవిడ్–19 పరీక్షలు నిర్వహిస్తారు. రెండు సార్లు కూడా నెగిటివ్‌గా తేలితేనే జట్టుతో చేరేందుకు అనుమతిస్తారు. ఈ టెస్టు సిరీస్‌లో ఆటగాళ్లు, సిబ్బంది అంతా జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలను వాడుతున్నారు. మ్యాచ్ వేదికల్లో మాత్రమే ఇవి పని చేస్తాయి. అయితే తొలి టెస్టు ముగిసిన సౌతాంప్టన్‌నుంచి రెండో టెస్టు జరిగే మాంచెస్టర్ వరకు ఆటగాళ్లు విడివిడిగా ప్రయాణించేందుకు అనుమతించారు. మధ్యలో భోజనం కోసం మాత్రం ఆగవచ్చు. ఇదే దారిలో ఉన్న ‘బ్రైటన్’లో ఆర్చర్ ఫ్లాట్ ఉంది. అతను సుమారు గంట సేపు తన ఇంటికి వెళ్లినట్లు బయటపడింది. అయితే అక్కడ ఉన్నంత సేపు ఎవరితోనూ సన్నిహితంగా మెలగలేదని, సొంతిల్లు సహజంగానే సురక్షితం కాబట్టి ప్రమాదం ఉండదని ఆర్చర్ భావించినట్లు అతని సన్నిహితుడొకరు వెల్లడించారు. చర్య తప్పలేదు... కోవిడ్–19 బారిన పడకుండా ఈ టెస్టు సిరీస్‌ను విజయవంతంగా నిర్వహించడంలో ఇంగ్లండ్ బోర్డు తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. కఠిన నిబంధనలతో కూడిన ‘బయో బబుల్’ వివరాలు వెల్లడించిన తర్వాతే ఇంగ్లండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక్కో టెస్టుపై 20 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 190 కోట్లు) ఆదాయం ముడిపడి ఉంది. ఇలాంటి స్థితిలో నిబంధనలు ఉల్లంఘించడం తీవ్రమైన తప్పుగా ఈసీబీ పరిగణించింది. ఆర్చర్ ‘మతి లేని పని’ చేశాడంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ ఆథర్టన్ తీవ్రంగా విమర్శించారు. ‘క్షమించండి’ నేను చేసిన తీవ్రమైన తప్పును మన్నించమని కోరుతున్నా. నా చర్యతో నాతో పాటు జట్టు సభ్యులు, మేనేజ్మెంట్ను కూడా ప్రమాదంలో పడేశాను. నా తప్పును అంగీకరిస్తూ బయో సెక్యూర్ బబుల్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నా. సిరీస్ కీలక దశలో టెస్టుకు దూరం కావడం చాలా బాధగా ఉంది. నా పొరపాటుతో ఇరు జట్లను నిరాశపర్చినందుకు మళ్లీ సారీ’ – ఆర్చర్ -
ప్రేక్షకులు వద్దు.. మనమే ‘కేక’ పెట్టిద్దాం
లండన్: కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ అమలవుతున్న తరుణంలో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న క్రీడా ఈవెంట్లపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ ఆడటానికి అనుమతులు వచ్చినా అది ప్రేక్షకులు లేకుండానే నిర్వహించే దిశగా ఆయా క్రీడా సమాఖ్యలు ఆలోచన చేస్తున్నాయి. దీనిని కొందరు వ్యతిరేకిస్తుండగా, మరి కొందరు సమర్ధిస్తున్నారు. అసలు ప్రేక్షకులు లేకుండా మజానే ఉండదనే అభిప్రాయాన్ని మెజార్టీ సభ్యులు వ్యక్తం చేస్తుండగా, ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మాత్రం అదిరిపోయే సలహా ఇచ్చాడు. ఇప్పటివరకూ ఎవరికీ తట్టని ఒక ఆలోచనతో ఆర్చర్ ముందుకొచ్చాడు. (‘నన్ను ఎందుకు తీశావని ధోనిని అడగలేదు’) ఈ సంక్షోభంలో ప్రేక్షకులు అవసరం లేదంటూనే వారి చేసే గోల మాత్రం ఉండాలంటున్నాడు. అదేంటి స్టేడియాల్లో జనాలు లేకుండా సందడి ఎలా వస్తుందని అనుకుంటున్నారా.. అందుకు చక్కటి ఉపాయం చెప్పేశాడు. క్రీడలు పునరుద్ధించబడ్డ తర్వాత స్టేడియాల్లో ప్రేక్షకులు చేసే గోలను ఆడియో రూపంలో ఏర్పాటు చేస్తే మనం వారు ఉన్నట్లే ఫీలవుతామని అంటున్నాడు. ‘మనం స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండా ఎందుకు ఆడలేం. ఆడొచ్చు. ఎలా అంటే మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఆడియో ప్లే చేద్దాం. చప్పట్లు, ఈలలతో స్టేడియాలను ఊదరగొట్టేలా చేద్దాం. దాంతో మ్యాచ్‌లు ఆడే క్రికెటర్లకు తప్పకుండా ఊపు వస్తుంది. అది కూడా ఎలా ఉండాలంటే వాస్తవిక మ్యాచ్‌లను తలపించేలా ఉండాలి’ అని ఆర్చర్ పేర్కొన్నాడు. క్రికెట్ టోర్నీలు నిర్వహించినా ఎంత సురక్షితం నిర్వహిస్తే అంత మంచిదన్నాడు. (ఐసీసీ ట్రోల్స్‌పై అక్తర్ సీరియస్ రియాక్షన్) -
‘నా ప్రపంచకప్ పతకం కనిపించడంలేదు’
లండన్: లాక్డౌన్ సమయంలో ఇతర క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో చాలెంజ్‌లు విసురుకుంటుంటే ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మాత్రం కనిపించకుండా పోయిన వన్డే ప్రపంచకప్ పతకాన్ని వెతికే పనిలో పడ్డాడు. వారం రోజులుగా ఇంట్లో అణువణువూ వెతికానని అయినా తన ప్రపంచకప్ పతకం దొరకలేదని అసహనం వ్యక్తం చేశాడు. కొన్ని రోజుల క్రితమే ఆర్చర్ తన పాత ఇంటిని వదిలి కొత్త ఇంటికి చేరాడు. తాను పాత ఇంటిలో ఉన్నప్పుడు ఒక చిత్రపటానికి పతకాన్ని వేలాడదీశానని... అయితే కొత్త ఇంటిలో ఆ చిత్ర పటం ఉంది కానీ తన మెడల్ మాత్రం లేదన్నాడు. -
అంత సులభంగా ఎలా మాట్లాడతారో!
లండన్: ‘జాతి వివక్ష’ అంశాన్ని తేలిగ్గా పరిగణించరాదని, వ్యాఖ్యలు చేసే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇంగ్లండ్ యువ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అన్నాడు. గతంలో తనకు ఎదురైన అనుభవాల గురించి మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. ‘ఒక వ్యక్తిని ఉద్దేశించి అంత సులభంగా జాతి వివక్ష వ్యాఖ్యలు ఎలా చేస్తారో అర్థం కాదు. ఇలా చేయడం వల్ల వారేం పొందుతారో! మరెవరికీ తరచుగా ఈ అనుభవం ఎదురై ఉండదేమో. ఇలాంటి చర్యలపై కూడా నేను చాలా ఆలోచించాకే స్పందిస్తుంటా. ఇది ఎంతమాత్రం ఆమోదించదగినది కాదు. దీనిఐ సరైన రీతిలో చర్యలు తీసుకోవాల్సిందే’ అని 24 ఏళ్ల ఆర్చర్ పేర్కొన్నాడు. గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఓటమి అనంతరం స్టేడియంలో ప్రేక్షకుడు ఒకరు ఆర్చర్‌పై అదే పనిగా జాతి వివక్ష వ్యాఖ్యలకు తెగబడ్డాడు. దీంతో అతనిపై రెండేళ్లపాటు న్యూజిలాండ్‌లో జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లు చూడకుండా నిషేదం విధించారు. (చదవండి: మ్యాక్స్‌వెల్ ‘భారతీయ నిశ్చితార్థం’) (‘కోహ్లికి అలా సూచించడంలో అర్థం లేదు’) -
రాజస్తాన్ రాయల్స్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13వ సీజన్ ఆరంభానికి ఇంకా నెలకు పైగా సమయం ఉండగానే రాజస్తాన్ రాయల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత రెండు సీజన్ల నుంచి రాజస్తాన్ రాయల్స్ విజయాల్లో ముఖ్య భూమిక పోషించిన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. రాబోవు ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. మోచేతి గాయం కారణంగా ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌తో పాటు శ్రీలంకతో టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్న ఆర్చర్.. ఐపీఎల్‌కు సైతం అందుబాటులో ఉండటం లేదు. సుదీర్ఘంగా క్రికెట్ ఆడుతున్న ఆర్చర్‌కు కనీసం రెండు నెలలు విశ్రాంతి అవసరం. దాంతో ఇంగ్లండ్ ఆడబోయే పలు సిరీస్‌లతో పాటు ఐపీఎల్ నుంచి ఆర్చర్ తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడిన ఆర్చర్.. మిగతా మూడు మ్యాచ్‌లకు విశ్రాంతిలో ఉన్నాడు. తన కుడి మోచేతికి పుండ్లు పడటంతో ఆ సిరీస్‌లో మ్యాచ్ మాత్రమే ఆడాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతోనే జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా ఆర్చర్ లేడు. అదే సమయంలో మార్చి 19 నుంచి శ్రీలంకతో ఆరంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ కూడా ఆర్చర్‌ను పక్కన పెట్టారు. 2018లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఆర్చర్.. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ సీజన్లో 15 వికెట్లతో రాణించిన ఆర్చర్.. 2019 సీజన్లో 11 వికెట్లతో మెరిశాడు. ఈ సీజన్ ఐపీఎల్ మార్చి 29వ తేదీ నుంచి ఆరంభం కానుంది. -
క్రికెట్ అభిమానిపై రెండేళ్ల నిషేధం..!
వెల్లింగ్టన్: సాధారణంగా ఫీల్డ్‌లో ‘అతి’గా ప్రవర్తించిన సందర్భాల్లో క్రికెటర్లు నిషేధానికి గురవడం చూస్తూ ఉంటాం. అయితే కాస్త చిత్రంగా అనిపించినా ఒక క్రికెట్ అభిమానిపై రెండేళ్ల నిషేధం పడింది. న్యూజిలాండ్‌కు చెందిన క్రికెట్ అభిమాని ఇంగ్లండ్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్‌పై అసభ్యకర రీతిలో దూషించడంతో అతనిపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు ఆఖరి రోజు ఆటలో ఆర్చర్‌పై ఆక్లాండ్‌కు చెందిన ఒక అభిమాని వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఆగకుండా మరింత అవమానించేలా మాట్లాడాడు. దీనిపై అప్పట్లోనే పెద్ద దుమారం లేచినా అతన్ని పట్టుకుని పనిలో పడింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. ఎట్టకేలకు ఆక్లాండ్ చెందిన 28 ఏళ్ల వ్యక్తిగా గుర్తించిన న్యూజిలాండ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అతనిపై రెండేళ్ల పాటు క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికి స్టేడియాలకు రాకుండా నిషేధం విధించినట్లు న్యూజిలాండ్ క్రికెట్ ప్రతినిధి ఆంటోని క్రుమ్మీ తెలిపాడు. 2022 వరకూ అతనిపై నిషేధం అమల్లో ఉంటుందన్నారు. ఇక్కడ న్యూజిలాండ్‌లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లు చూడటానికి కానీ, దేశవాళీ మ్యాచ్‌లు చూడటానికి కానీ అతనికి అనుమతి ఉండదు. ఒకవేళ ఈ నిషేధ సమయంలో అతను మ్యాచ్‌లు చూడటానికి యత్నిస్తే యాక్షన్ తీవ్రంగా ఉంటుందని క్రుమ్మీ స్పష్టం చేశాడు. -
‘జోఫ్రా ఆర్చర్ మా క్రికెటరే’
మౌంట్ మాంగని (న్యూజిలాండ్): ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌పై చేసిన జాత్యహంకర వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. చాలా కాలంగా వినపడని వర్ణ వివక్ష వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ క్రికెట్లో వినిపించడం కలవరపెడుతున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆర్చర్ టార్గెట్ చేస్తూ పలువురు జాత్యంకార వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఆర్చర్ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు తెలియజేయడంతో సదరు పెద్దలు దీనిపై ఆగ్రహంగా ఉన్నారు. ఆర్చర్‌పై జాత్యహంకర వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని, అందుకు తాము క్షమాపణ చెబుతున్నామని న్యూజిలాండ్ క్రికెట్ పేర్కొన్నప్పటికీ ఇంగ్లండ్ మాత్రం కాస్త గుర్రుగానే ఉంది. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు డైరెక్టర్ ఆష్లే గైల్స్ మాట్లాడుతూ.. ‘ ఇది నిజంగా చాలా దురదృష్టకరం. మన సమాజంలో ఈ తరహా వ్యాఖ్యలు ఇంకా వినిపించడం సిగ్గుచేటు. స్టేడియంలోని కొంతమంది ఆర్చర్‌పై వర్ణ వివక్ష వ్యాఖ్యలకు దిగారు. స్కోరు బోర్డు ఏరియాకు సమీపంలో కూర్చొని ఉన్న పలువురు ఆర్చర్‌ను దూషించారు. ఇది చాలా నేరం. ఈ విషయంలో ఆర్చర్‌కు మా పూర్తి మద్దతు ఉంటుంది. నాపై జాత్యహంకర వ్యాఖ్యలు చేసి అవమానించారని ఆర్చర్ ట్వీట్ చేయడం చాలా బాధనిపించింది. ఆర్చర్ మా జట్టులో సభ్యుడే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. క్రికెట్లో జాత్యహంకర వ్యాఖ్యలకు చోటు లేదు. ఆర్చర్‌కు మేము అండగా ఉంటాం’ అని గైల్స్ పేర్కొన్నాడు. బార్బోడాస్కు చెందిన ఆర్చర్.. ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతంలో వెస్టిండీస్ తరఫున జూనియర్ స్థాయిలో క్రికెట్ ఆడిన ఆర్చర్.. ఆ తర్వాత ఇంగ్లండ్ ఆడటానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే వరల్డ్‌కప్‌తోపాటు యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ గెలిచిన మ్యాచ్‌ల్లో ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 65 పరుగుల తేడాతో గెలిచింది. -
ఆర్చర్‌కు వింత అనుభవం..
లండన్: చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సాధించిన క్రికెటర్ జోఫ్రా ఆర్చర్. ఇంగ్లండ్ వన్డే వరల్డ్‌కప్ సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన ఆర్చర్ ఇప్పుడు ఆ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు. మరొకవైపు ట్వీట్లతో అభిమానుల్ని అలరిస్తూ ఉంటాడు కూడా. ఇక ఆర్చర్ చెప్పే జోస్యం అయితే దైవ సంభూతలకే సాధ్యం అన్నట్టుగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తూ ఎప్పుడో రెండు-మూడేళ్ల కిందట ఆర్చర్ చేసిన ట్వీట్లు ఇటీవల కాలంలో బాగా వైరల్ అయ్యాయి. దాంతో ఆర్చర్‌కు ఒక ప్రత్యేకమైన హోదా కూడా అభిమానులు కట్టబెట్టేశారు. కాగా, తాజాగా ఆర్చర్‌కు వింత అనుభవం ఎదురైంది. తన యూట్యూబ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వీడియో కోసం కొన్ని ప్రశ్నలు ఇవ్వమంటూ ఆర్చర్ ట్వీటర్ వేదికగా సాయం కోరితే అతన్ని ఆడేసుకున్నారు నెటిజన్లు. అసలు ఆర్చర్ ఊహించని ప్రశ్నలు ఇచ్చారు అభిమానులు. అందులో కొన్ని ఎలా ఉన్నాయో చూద్దాం. పిజ్జాస్ను స్క్వేర్ బాక్స్‌ల్లోనే ఎందుకు తీసుకొస్తారనే ప్రశ్న బాగుంటుందని ఒక అభిమాని సూచించగా, షార్క్ కంటే వేగంగా స్విమ్ చేసి బాయ్ ఎప్పటికైనా జన్మిస్తాడా అనే ప్రశ్నను మరొకరు ఇచ్చారు. ఇక ఫేవరెట్ సింగ్.. దించక్ పూజానా రాణు మోండలా అనే ప్రశ్నను మరొక అభిమాని సూచించాడు. చేపకు దాహం వేస్తుందా అనే ప్రశ్నను మరొకరు పేర్కొన్నారు. ఇలా నెటిజన్లు తమకిష్టమైన ప్రశ్నలు ఇచ్చి ఆర్చర్ తలపట్టుకునేలా చేశారు. -
అందుకు జోఫ్రా ఆర్చరే కారణం: స్టోక్స్
లండన్: తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటున్నాడు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్. వరల్డ్‌కప్ దగర్నుంచీ, యాషెస్ సిరీస్ వరకూ ఎవరో ఒకరు గాయపడితే తుది జట్టులో చోటు దక్కించుకున్న ఆర్చర్ తానేమిటో నిరూపించుకోవడంలో వెనుకడుగు వేయడం లేదు. ఇంగ్లండ్ వరల్డ్‌కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆర్చర్.. యాషెస్ సిరీస్‌లో సైతం సత్తాచాటాడు. ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్‌లో ఆర్చర్ 22 వికెట్లు సాధించి సిరీస్ సమం కావడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఇదే విషయాన్ని ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కూడా ఒప్పుకున్నాడు. ‘మేము తిరిగి రేసులోకి వచ్చామంటే అది ఆర్చర్ వల్లే. తొలి టెస్టు కోల్పోయిన సమయంలో ఆర్చర్ రాక మాకు మరింత బలాన్ని ఇచ్చింది. మూడో టెస్టు, ఐదో టెస్టుల్లో గెలిచామంటే ఆర్చరే కారణం. నేను క్రికెట్ ఆడుతున్న సమయం నుంచి చూస్తే ఆర్చర్ వంటి నైపుణ్యం ఉన్న బౌలర్‌ను చూడలేదు. ఆర్చర్ మా జట్టులో ఉండటం నిజంగా మా అదృష్టం. యాషెస్‌ను కోల్పోకుండా సమం చేశామంటే అందులో ఆర్చర్ పాత్ర చాలా ఎక్కువ. అందులో ఎటువంటి సందేహం లేదు. బిగ్‌బాష్ లీగ్‌తో తెరపైకి వచ్చిన ఆర్చర్.. అనుభవాన్ని కూడాగట్టుకుంటూ తన మార్కును చూపెడుతున్నాడు. నిలకడగా 90 మైళ్ల వేగంతో బంతులు సంధించడం అంటే మాటలు కాదు. ప్రపంచంలో ఎంతటి గొప్ప క్రికెటర్‌కైనా ఆర్చర్ ఒక ప్రమాదకర బౌలరే’ అని స్టోక్స్ పేర్కొన్నాడు. -
స్మిత్ రాణించినా... ఇంగ్లండ్‌దే పైచేయి
లండన్: అత్యద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మాజీ కెపె్టన్ స్టీవ్ స్మిత్ (145 బంతుల్లో 80; 9 ఫోర్లు, సిక్స్) మరో కీలక ఇన్నింగ్స్ ఆడినా యాషెస్ సిరీస్ ఐదో టెస్టులో ఆ్రస్టేలియా వెనుకబడింది. ఇక్కడి ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు 69 పరుగుల ఆధిక్యం దక్కింది. శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 271/8తో ప్రారంభమైన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 294 పరుగుల వద్ద ముగిసింది. మిచెల్ మార్‡్ష (5/46) ఐదు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియాను పదునైన బంతులతో పేసర్ జోఫ్రా ఆర్చర్ (6/62) వణికించాడు. లబషెన్ (48; 10 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 69 పరుగులు జోడించి స్మిత్ జట్టును నిలబట్టే ప్రయత్నం చేశాడు. యాషెస్‌లో వరుసగా పదో అర్ధ సెంచరీ సాధించాడు. కరన్ (3/46) సైతం ప్రతాపం చూపడంతో ఆసీస్ ఎక్కువసేపు పోరాడలేకపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ వికెట్లేమీ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. -
ఆర్చర్.. నీ పాస్‌పోర్ట్ చూపించు!
మాంచెస్టర్: ఆసీస్-ఇంగ్లండ్ జట్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే సిరీస్ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా యాషెస్ సిరీస్. ఈ సిరీస్‌ను ఆటగాళ్లు ఎంత సీరియస్‌గా తీసుకుంటారో, అభిమానులు కూడా అంతే జోష్ కనబరుస్తారు. కొన్ని సందర్భాల్లో అభిమానుల అనుచిత ప్రవర్తన కూడా హద్దులు దాటుతూ ఉంటుంది. ఇప్పటికే ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను చీటర్ అంటూ అభిమానులు ఎగతాళి చేయగా, తాజాగా ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ప్రారంభమైన యాషెస్ సిరీస్ నాల్గో టెస్టులో భాగంగా జోఫ్రా ఆర్చర్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ అభిమానులు తిట్ల దండకం అందుకున్నారు. ప్రధానంగా ఆర్చర్ బార్బోడాస్ నుంచి వచ్చి ఇంగ్లండ్‌కు ఆడటాన్ని ప్రస్తావించారు. ‘ ఈ బార్బోడాస్ హెరిటేజ్ టెస్టు చాలా చప్పగా ఉంది’ అంటూ ఇద్దరు ఆసీస్ అభిమానులు ఎద్దేవా చేశారు. ‘అసలు నీకు పాస్‌పోర్ట్ ఉందా. ఒకసారి నీ పాస్‌పోర్ట్ చూపించు’ అంటూ ఎగతాళిగా మాట్లాడారు. ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్‌కు సమీపంగా కూర్చొని ఉన్న సదరు ఆసీస్ అభిమానులు ఇలా అనుచితంగా ప్రవర్తించడాన్ని కొంతమంది అథారిటీ దృష్టికి తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఆపై వారిని బయటకు పంపించేశారు యాషెస్ నిర్వాహకులు. నాల్గో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(0), మార్కస్ హారిస్(13)లు నిరాశపరిచినప్పటికీ లబుషేన్(67) బాధ్యతాయుతంగా ఆడాడు. యాషెస్‌లో మరో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అటు తర్వాత స్టీవ్ స్మిత్(60 బ్యాటింగ్) సైతం అర్థ శతకం సాధించడంతో ఆసీస్ గాడిలో పడింది. స్మిత్, ట్రావిస్ హెడ్(18 బ్యాటింగ్)లు క్రీజ్‌లో ఉన్నారు. -
‘స్మిత్.. నిన్ను ఔట్ చేయడానికే ఇక్కడ లేను’
మాంచెస్టర్: ‘నన్ను ఔట్ చేయడంలో చాలా మంది ఇంగ్లిష్ బౌలర్లు సక్సెస్ అయ్యారు... కానీ ఆర్చర్ కాదు. నేను గాయపడ్డ టెస్టులో కూడా నేనేమీ ఆర్చర్‌కు వికెట్ ఇవ్వలేదు కదా’ అని ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ స్పందించగా, అందుకు ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ‘నువ్వు అసలు మూడో టెస్టులో ఆడనప్పుడు నేను ఎలా ఔట్ చేస్తా. ఆ టెస్టులో నేను తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీశా. నేనేమీ ఏ ఒక్కరినో ఔట్ చేయడానికి ఇక్కడ లేను. నీ వికెట్ తీయడానికి మాత్రమే క్రికెట్ ఆడటం లేదు. యాషెస్ సిరీస్ గెలవాలన్నదే మా కోరిక. అందులో నీ వికెట్ ఉందా.. లేదా అనేది కాదు. నేను యాషెస్ సిరీస్‌ను గెలవాలనుకుంటున్నా. నిన్న ఔట్ చేయడానికి నా ముందు చాలా సమయం ఉంది ’ అని ఆర్చర్ చాలెంజ్ విసిరాడు. సాధారణంగా ఆసీస్ క్రికెటర్లు మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడంలో సిద్ధహస్తులు. అటువంటిది ఇటీవల అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆర్చర్ తన బౌలింగ్ రుచిని చూపిండమే కాదు... మాటల వేడి కూడా ఇలానే ఉంటుందంటూ ఆసీస్‌కు హెచ్చరికలు పంపాడు. యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆర్చర్ వేసిన అత్యంత వేగవంతమైన బౌన్సర్‌ను తప్పించుకునే క్రమంలో స్మిత్ గాయపడ్డాడు. బంతి మెడకు తగలడంతో స్మిత్ అక్కడికక్కడే కూలబడిపోయాడు. అయితే తనకు గాయమైన మరుక్షణం ఫిలిప్ హ్యూస్ విషాదం కళ్లముందు కదలాడిందని స్మిత్ తాజాగా చెప్పుకొచ్చాడు. అయితే తనకు ఆర్చరే ప్రధాన ప్రత్యర్థి అని పలువురి విశ్లేషించిన నేపథ్యంలో స్మిత్ స్పందిస్తూ.. నాకు ఆర్చర్ ఒక్కడే టార్గెట్ కాదు. నన్ను ఔట్ చేయడంలో చాలా మంది ఇంగ్లిష్ బౌలర్లు సక్సెస్ అయ్యారు. ఆర్చర్‌కు నేనేమీ చిక్కలేదు’ కదా పేర్కొన్నాడు. దీనిపై ఆర్చర్ కౌంటర్ ఎటాక్‌కు దిగాడు. -
ఆరు బీర్లు తాగినట్లు ఉందని చెప్పా: స్మిత్
లండన్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన రెండో టెస్టులో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన అత్యంత వేగవంతమైన బౌన్సర్‌ను తప్పించుకునే క్రమంలో స్మిత్ గాయపడ్డాడు. బంతి మెడకు తగలడంతో స్మిత్ అక్కడికక్కడే కూలబడిపోయాడు. అయితే తనకు గాయమైన మరుక్షణం ఫిలిప్ హ్యూస్ విషాదం కళ్లముందు కదలాడిందని స్మిత్ తాజాగా చెప్పుకొచ్చాడు. 'బంతి తగలగానే నా మెదుడులో కొన్ని విషయాలు పరుగెత్తాయి. ముఖ్యంగా నాకు ఎక్కడ గాయం అయింది అని కంగారుపడ్డా. ఆ సమయంలో ఫిలిప్ హ్యూస్ విషాదం గుర్తుకు వచ్చింది. అప్పుడు ఏం జరిగిందో అందరికి తెలుసు. దీంతో కొంత ఆందోళనకు గురయ్యా. కొద్ది సమయం తర్వాత నేను బాగానే ఉన్నాను. ఇక మధ్యాహ్నం అంతా మానసికంగా కూడా బాగానే ఉన్నాను' అని స్మిత్ తెలిపాడు. 'మొదటి ఇన్నింగ్స్‌లో గాయపడిన తర్వాత రెండోసారి బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. అయితే సాయంత్రం డాక్టర్ వచ్చి ఎలా ఉంది అని అడిగినపుడు మాత్రం గత రాత్రి ఆరు బీర్లు తాగిన ఫీలింగ్ ఉంది అని చెప్పా. అపుడు నాకు అలాగే అనిపించింది. మరో రెండు రోజులు కూడా అలాగే ఉంది. కొన్ని ఘటనలు ఆలా జరుగుతాయి. ఏదేమైనా మంచి టెస్ట్ మ్యాచ్ మిస్ అయ్యా' అని స్మిత్ పేర్కొన్నాడు. అయితే తనకు ఆర్చరే ప్రధాన ప్రత్యర్థి అని పలువురి విశ్లేషించిన నేపథ్యంలో స్మిత్ స్పందించాడు. నాకు ఆర్చర్ ఒక్కడే టార్గెట్ కాదు. నన్ను ఔట్ చేయడంలో చాలా మంది ఇంగ్లిష్ బౌలర్లు సక్సెస్ అయ్యారు. నేను గాయపడ్డ టెస్టులో కూడా ఆర్చర్‌కు వికెట్ ఏమీ ఇవ్వలేదు కదా’ అని స్మిత్ బదులిచ్చాడు. గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమైన స్మిత్.. నాల్గో టెస్టుకు స్మిత్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. -
‘ఆర్చర్.. డేల్ స్టెయిన్‌ను తలపిస్తున్నావ్!’
హెడింగ్లీ: ఇంగ్లండ్ యువ బౌలర్ జోఫ్రా ఆర్చర్ యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో ఇంగ్లండ్ తరుపున అరంగేట్రం చేసిన ఈ బౌలర్ తొలి మ్యాచ్‌లోనే ఆసీస్ బ్యాట్స్‌మెన్ వెన్నుల్లో వణుకుపుట్టించాడు. తాజాగా మూడో టెస్టులో కంగారు బ్యాట్స్‌మెన్‌ను ఠారెత్తించాడు. గురువారం ప్రారంభమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆర్చర్ ఆరు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. అయితే మ్యాచ్ అనంతరం ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆర్చర్‌ను ఆకాశానికి ఎత్తాడు. ‘కొత్త బంతితో ఆర్చర్ బౌలింగ్ విధానం చూస్తుంటే నాకు డేల్ స్టెయిన్ గుర్తుకువస్తున్నాడు. వేగంతో పాటు పేస్‌లో వైవిద్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. పిచ్, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేస్తున్నాడు. ఆర్చర్ ఇప్పుడే ప్రపంచ శ్రేణి బౌలర్‌ను తలపిస్తున్నాడు’అంటూ వార్నర్ పేర్కొన్నాడు. అరంగేట్రపు టెస్టులోనే ఐదు వికెట్లన సాధించిన ఆర్చర్ అందరి మన్ననలను పొందాడు. లార్డ్స్ టెస్టులోనే ఆర్చర్ వేసిన షార్ట్ బాల్ ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ మెడకు తగిలి గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయం కారణంగానే మూడో టెస్టుకు స్మిత్ దూరమైన విషయం తెలిసిందే. చదవండి: అచ్చం స్మిత్‌లానే..! ఆర్చర్‌పై ఆసీస్ మాజీ బౌలర్ ప్రశంసలు -
అచ్చం స్మిత్‌లానే..!
లీడ్స్: యాషెస్ సిరీస్ రెండో టెస్టు మూడో రోజు ఆటలో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తన బ్యాటింగ్ శైలితో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ బౌలర్లు ఆఫ్‌సైడ్ బంతులు సంధించే క్రమంలో వాటిని స్మిత్ వదిలేసి క్రమంలో సరికొత్త టెక్నిక్‌ను ఫాలో అయ్యాడు. అది అభిమానుల్లో నవ్వులు పూయించింది. అయితే డ్రాగా ముగిసిన ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ బ్యాటింగ్ చేయలేదు. ఆర్చర్ బౌలింగ్‌లో మెడకు బలంగా తాకడంతో స్మిత్ తన రెండో ఇన్నింగ్స్‌కు దూరం కావాల్సి వచ్చింది. కాగా, ఇరు జట్ల మధ్య మూడో టెస్టుకు సన్నద్ధమైన సందర్భంలో ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అచ్చం స్మిత్ ఏ రకంగా బంతుల్ని విడిచిపెట్టాడో దాన్ని ఆర్చర్ అనుసరించాడు. ఈ వీడియోను క్రికెట్ డాట్ కామ్ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. గురువారం ఇరు జట్ల మధ్య లీడ్స్‌లో యాషెస్ మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు స్మిత్ దూరమయ్యాడు. Is that Jofra Archer or Steve Smith in the nets at Headingley? #Ashes @alintaenergy pic.twitter.com/RT5ADoSUjr — cricket.com.au (@cricketcomau) August 22, 2019 -
ఆర్చర్‌ను మెచ్చుకున్న ఆసీస్ దిగ్గజ బౌలర్
లీడ్స్ : ఇంగ్లండ్ యువ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై ఆస్ట్రేలియా లెజండరీ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘టెస్టుల్లో పదునైన పేస్‌తో పాటు కచ్చితత్వంతో బౌలింగ్ చేయాలి. అప్పుడే విజయం సాధిస్తాం. ఆర్చర్ ఆ పనిని చాలా సులువుగా చేస్తున్నాడు. అతడి బౌలింగ్ చాలా సహజసిద్దంగా ఉంటుంది. ఆర్చర్ రనప్, క్రీజును వదిలే క్రమం అన్నీ ఎక్కువ స్ట్రెస్ లేకుండా చాలా సింపుల్‌గా ఉంటాయి. టాప్ పేస్‌తో లాంగ్ స్పెల్ బౌలింగ్ చేస్తున్నాడు. అదే విధంగా బౌలింగ్ వేగంలో చాలా వేరియేషన్స్ చూపిస్తున్నాడు. ఆర్చర్ పేస్ బౌలింగ్‌కు అనుభవం తోడైతే ఎన్నో రికార్డులు సృష్టిస్తాడు’అంటూ ఆర్చర్‌ను మెక్‌గ్రాత్ ఆకాశానికి ఎత్తాడు. ఇక యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆర్చర్ అరంగేట్రం చేశాడు. అరంగేట్రపు తొలి టెస్టులోనే ఆర్చర్ రెచ్చిపోయాడు. బుల్లెట్ వంటి బంతులతో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను గెలిపించినంత పనిచేశాడు. ఇక అదే మ్యాచ్‌లో ఆర్చర్ పదునైన బౌన్సర్‌కు ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ గాయపడ్డాడు. అయితే స్మిత్ గాయంతో విలవిల్లాడుతుంటే ఆర్చర్ ప్రవర్తించిన తీరుపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, పలువురు ఆసీస్ మాజీ క్రికెటర్లు, అభిమానులు మండిపడిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మెక్‌గ్రాత్ ఆర్చర్‌ను ప్రశంసించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. -
ప్చ్.. మూడో టెస్టుకు దూరమే
హెడింగ్లీ : ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ యాషెస్ మూడో టెస్టుకూ దూరమయ్యాడు. గాయం కారణంగా తొలి టెస్టు నుంచి అర్థంతరంగా తప్పుకున్న అండర్సన్, లార్డ్స్ టెస్టులోనూ ఆడలేదు. అయితే మూడు టెస్టుకు అందుబాటులో ఉంటాడని ఇంగ్లీష్ ఫ్యాన్స్ భావించినప్పటికీ చివరికి నిరాశే ఎదురైంది. ఈ నెల 22 నుంచి హెడింగ్లీ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టు కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) 12 మంది సభ్యులతో కూడిన జాబితాను సోమవారం ప్రకటించింది. అయితే అండర్సన్ గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్తి ఫిట్నెస్ సాధించలేదని, దీంతో అతడికి మరికొన్ని రోజులు విశ్రాంతినివ్వాలని భావించినట్లు ఈసీబీకి చెందిన ఓ అధికారి తెలిపాడు. అయితే ఆగస్టు 20 నుంచి నార్త్ క్రికెట్ క్లబ్లో జరగబోయే ఓ కౌంటీ మ్యాచ్‌లో అండర్సన్ పాల్గొంటాడని ఆ అధికారి తెలిపాడు. ఈ మ్యాచ్‌లో అండర్సన్ ఫిట్నెస్ ఓ అవగాహన ఏర్పడుతుందని పేర్కొన్నాడు. ఇక ఈ స్టార్ బౌలర్ స్థానంలో రెండో టెస్టులో చోటు దక్కించుకున్న జోఫ్రా ఆర్చర్ తన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. దీంతో మూడో టెస్టుకు ఆర్చర్‌ను ఎంపిక చేశారు. హెడింగ్లీ టెస్టులో ఇంగ్లండ్ బౌలింగ్ దళానికి ఆర్చర్ నాయకత్వం వహించనున్నాడు. ఇక గత టెస్టులో అనూహ్యంగా మొయిన్ అలీ స్థానంలో చోటు దక్కించుకున్న జాక్ లీచ్ అంచనాల మేర రాణించాడు. దీంతో మూడో టెస్టుకు కూడా అలీని పక్కకు పెట్టి లీచ్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్ జట్టు బౌలింగ్‌లో రాణిస్తున్నప్పటికీ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతోంది. ఇన్నింగ్స్‌కు ఒకరిద్దరూ మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయం సాధించగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో మూడో టెస్టులో గెలిచి సిరీస్‌పై మరింత పట్టు బిగించాలని ఆసీస్ ఆరాటపడుతుండాగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది. యాషెస్ మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు జో రూట్(సారథి), జోఫ్రా ఆర్చర్, బెయిర్ స్టో, స్టువార్ట్ బ్రాడ్, బర్న్స్, జోస్ బట్లర్, స్యామ్ కరన్, డెన్లీ, జాక్ లీచ్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్ -
‘నేనైతే అలా చేసేవాడిని కాదు’
హైదరాబాద్ : ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 148.7 కిలోమీటర్ల వేగంతో సంధించిన షార్ట్ బంతిని ఆడే క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ గాయపడిన విషయం తెలిసిందే. స్మిత్ మెడకు గాయం కావడంతో అతడు విలవిల్లాడాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే స్మిత్ గాయపడిన సమయంలో ఆర్చర్ ప్రవర్తించిన తీరుపట్ల పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తోటి క్రీడాకారుడు గాయంతో విలవిల్లాడుతుంటే ప్రవర్తించే తీరు ఇదా? అంటూ ఆర్చర్‌పై మండిపడ్డాడు. (చదవండి: ఇదేనా మీరిచ్చే గౌరవం: ప్రధాని ఆగ్రహం) ‘క్రికెట్లో బౌన్సర్లు అనేవి చాలా సాధారణం. కొన్ని సార్లు ఆ బంతులకు బ్యాట్స్‌మెన్ గాయాలపాలవుతారు. కానీ బ్యాట్స్‌మన్ గాయంతో బాధపడుతున్నప్పడు బౌలర్‌గా అతడి దగ్గరికి వెళ్లి మాట్లాడి, అతడి పరిస్థితి తెలుసుకోవడం కనీస మర్యాద. ఆ మర్యాద ఆర్చర్ విషయంలో కనిపించలేదు. స్మిత్ గాయంతో విలవిల్లాడుతుంటే నవ్వుతూ దూరంగా వెళ్లిపోయాడు. తొటి క్రీడాకారుడు గాయంతో బాధపడుతుంటే ప్రవర్తించే తీరు ఇదా?. నేనైతే అలా చేసేవాడిని కాదు. నా బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్ గాయపడితే అందరికంటే ముందే అతడి దగ్గరికి చేరుకొని. గాయం గురించి వాకబు చేసేవాడిని’అంటూ అక్తర్ ట్వీట్ చేశాడు. ఇక అక్తర్ ట్వీట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించారు. ‘నువ్వు చెప్పింది నిజమే. కానీ అంతలా ఆగ్రహం వ్యక్తం చేయకుండా. సున్నితంగా చెప్పొచ్చు కదా’అంటూ యువీ పేర్కొన్నాడు. ఇక గాయం కారణంగా యాషెస్ రెండో టెస్టు చివరి రోజు ఆటకు స్మిత్ దూరమైన విషయం తెలిసిందే. మూడో టెస్టుకు కూడా అందుబాటులో ఉండేది అనుమానంగానే కనిపిస్తోంది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం స్మిత్ గాయం నుంచి కోలుకుంటున్నాడని.. మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని ధీమా వ్యక్తం చేస్తోంది. చదవండి: ‘వారు క్రికెట్ లవర్సే కాదు’ స్టీవ్ స్మిత్ ఇస్మార్ట్ ఫీల్డ్ డ్యాన్స్! -
ఇంగ్లండ్‌కు మరో పరీక్ష
లండన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో సొంతగడ్డపై తొలి టెస్టులో భారీ తేడాతో ఓటమి పాలైన ఇంగ్లండ్‌కు మరో పరీక్ష. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో బుధవారం నుంచి ఆ జట్టు ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో తలపడనుంది. వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఊపులో యాషెస్ బరిలో దిగిన ఆతిథ్య జట్టుకు మొదటి టెస్టులో తలబొప్పి కట్టింది. తమతో పోలిస్తే బలహీనంగా ఉన్న ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూల్చేలా కనిపించిన ఇంగ్లండ్ తర్వాత స్టీవ్ స్మిత్‌ను అడ్డుకోలేక చేతులెత్తేసి ఏకంగా 251 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌కు అసలు ముప్పు స్మిత్‌తోనే. ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్ గాయంతో దూరమైనందున యువ పేసర్ జోఫ్రా ఆర్చర్ టెస్టు అరంగేట్రం ఖాయమైంది. దీనికిముందే ఆల్‌రౌండర్ మొయిన్ అలీపై వేటు వేసిన ఇంగ్లండ్... 12 మంది సభ్యుల జట్టులో స్పిన్నర్ జాక్ లీచ్‌కు చోటిచ్చింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ జో రూట్ పైనే భారం వేసింది. ఓపెనర్లు జాసన్ రాయ్, రోరీ బర్న్స్లతో పాటు బట్లర్, బెయిర్‌స్టో రాణిస్తేనే ప్రత్యర్థికి సవాల్ విసరగలుతుంది. పునరాగమనంలో స్మిత్ రెండు శతకాలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా లయ అందుకుంటే కంగారూలకు తిరుగుండదు. ఉస్మాన్ ఖాజా, ట్రావిస్ హెడ్, మాధ్యూ వేడ్‌లతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. కమిన్స్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తుండగా, స్పిన్నర్ లయన్ తన బాధ్యతలు నెరవేరుస్తున్నాడు. పేసర్ ప్యాటిన్సన్కు విశ్రాంతినిచ్చిన ఆస్ట్రేలియా... మిషెల్ స్టార్క్, హాజల్‌వుడ్‌లతో 12 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ టెస్టులోనూ ఓడితే సిరీస్‌లో ఇంగ్లండ్ పుంజుకోవడం కష్టమే. యాషెస్ చరిత్రలో తొలి టెస్టు ఓడినా ఆ జట్టు సిరీస్ నెగ్గిన సందర్భాలు (1981, 2005) రెండే ఉండటం గమనార్హం. -
అద్భుతాలు ఆశించొద్దు: ఆర్చర్
లండన్: యాషెస్ సిరీస్ ద్వారా టెస్టు ఫార్మాట్లో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్న ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. తాను గతం కంటే ఎక్కువగానే ఈ ఫార్మాట్లో అడుగుపెట్టడానికి రెడీ అయ్యానన్నాడు. అయితే తన నుంచి అద్భుతాలు ఆశించొద్దని ఒత్తిడిని తగ్గించుకునే యత్నం చేశాడు. తనకు ఏ ఫార్మాట్ క్రికెట్ అయినా ఒకటేనని , ఇక్కడ ఫలాన ఫార్మాట్లో ఆడతానని నిబంధనలు ఏమీ లేవన్నాడు. లార్డ్స్ వేదికగా జరుగనున్న రెండో టెస్టులో కూడా ఇంగ్లండ్ బౌలర్ల భరతం పడతామని, ఒకవేళ ఆర్చర్ వచ్చినా తాము ధీటుగానే బదులిస్తామని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఆర్చర్ మాట్లాడుతూ.. లాంగర్ వ్యాఖ్యలను తాను పెద్దగా పట్టించుకోనన్నాడు. మరొకవైపు తన టెస్టు అరంగేట్రంపై ఆర్చర్ మాట్లాడుతూ.. ‘ నేను వైట్‌బాల్ క్రికెట్ కంటే కూడా రెడ్‌బాల్ క్రికెట్ ఎక్కువ ఆడా. దాంతో టెస్టు ఫార్మాట్ భయం లేదు. నేను రెడ్‌బాల్ ఎక్కువ ఆడాననే విషయం అభిమానులకు తెలియకపోవచ్చు. నేను ససెక్స్‌తో క్రికెట్‌ను ఆరంభించినప్పుడు ఆడింది రెడ్‌బాల్ క్రికెటే. మానసికంగా బలంగా లేనప్పుడు అసలు మనం ఎవరనే ప్రశ్న తలెత్తుంది. నేను టెస్టు ఫార్మాట్లో ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా’ అని ఆర్చర్ తెలిపాడు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా ఆర్చర్ నిలిచాడు. ఆపై సెకండ్ ఎలెవన్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ససెక్స్ సౌత్ తరఫున ఆడిన ఆర్చర్ ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సాధించడమే కాకుండా సెంచరీతో మెరిశాడు. ఇదిలా ఉంచితే, గత 11 నెలల కాలంలో ఆర్చర్ కేవలం ఒక్క రెడ్‌బాల్ క్రికెట్ మాత్రమే ఆడటమే చర్చనీయాంశమైంది. యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆర్చర్‌కు తుది జట్టులో చోటు కల్పించినా ఎన్ని ఓవర్లు నిలకడగా బౌలింగ్ చేయగలడు అనేది ఇంగ్లండ్ మేనేజ్మెంట్ను ఆలోచనలో పడేసింది. గాయం కారణంగా రెండో టెస్టుకు సైతం జేమ్స్ అండర్సన్ దూరం కావడంతో ఆర్చర్ ఎంపిక అనేది ఖాయంగా కనబడుతోంది. బుధవారం ఇంగ్లండ్-ఆసీస్ జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. -
స్మిత్‌కు అతనే సరైనోడు: వార్న్
లండన్: ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ టెస్టు అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. యాషెస్ సిరీస్‌లో భాగంగా బుధవారం లార్డ్స్ వేదికగా ఆరంభం కానున్న రెండో టెస్టులో ఆర్చర్ ఆడటం దాదాపు ఖాయంగానే కనబడుతోంది. ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్ గాయం కారణంగా రెండో టెస్టుకు సైతం దూరం కావడంతో ఆర్చర్ తుది జట్టులో ఎంపికకు మార్గం సుగుమమైంది. తొలి టెస్టుకు ఎంపిక చేసిన జట్టులోనే ఆర్చర్ ఉన్నప్పటికీ, చిన్నపాటి గాయం కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకోలేపోయాడు. అయితే సెకండ్ ఎలెవన్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లిష్ కౌంటీ జట్టు ససెక్స్ తరఫున ఆడిన ఆర్చర్ ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో చెలరేగిన ఆర్చర్.. బ్యాటింగ్‌లో శతకంతో ఆకట్టుకున్నాడు. దాంతో అతని ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. ఫలితంగా రెండో టెస్టు కోసం ప్రకటించిన 12 మంది సభ్యులతో కూడిన జట్టులో ఆర్చర్ తిరిగి చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే యాషెస్ తొలి టెస్టులో రెండు భారీ శతకాలు సాధించి ఆసీస్ ఘన విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టీవ్ స్మిత్‌ను నిలువరించాలంటే ఆర్చర్‌ను రంగంలోకి దింపాలన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్చర్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమని వార్న్ అభిప్రాయపడ్డాడు. స్మిత్ చాలెంజ్‌కు ఇంగ్లండ్ ధీటుగా బదులివ్వాలంటే ఆర్చర్ రంగ ప్రవేశం అనివార్యమన్నాడు. ‘ స్మిత్‌ను నిలువరించే ప్రణాళిక ఆర్చర్ వద్ద కచ్చితంగా ఉంటుంది. సుమారు 145 కి.మీ వేగంతో బంతుల్ని ఆర్చర్ సంధిస్తున్నాడు. ఆర్చర్ సవాల్‌ను స్మిత్ ఎదుర్కోవడం కష్టమే. రెండో టెస్టుకు అండర్సన్ దూరమయ్యాడు. దాంతో ఆర్చర్ అవసరం ఇంగ్లండ్‌కు ఉంది. అతని బౌలింగ్‌లో వేడి ఏమిటో ఇప్పటికే చూపించాడు. అంతకముందు స్మిత్-ఆర్చర్లు ఇద్దరూ ఒకే నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. ఐపీఎల్లో ఇద్దరూ రాజస్తాన్ రాయల్స్‌కు ఆడారు. దాంతో స్మిత్ ఆట తీరుపై ఆర్చర్‌కు ప్రణాళిక ఉంటుంది. ఆర్చర్ ఎక్స్ట్రా పేస్‌తో బ్యాట్స్‌మెన ఇబ్బందులు పెడతాడు. దాంతో పాటు అతని బౌలింగ్‌లో వేగం కూడా నియంత్రణలో ఉంటుంది. యాషెస్‌లో మంచి ఫామ్‌లో ఉన్న స్మిత్‌ను ఆపాలంటే ఆర్చర్ సరైనోడు’ అని వార్న్ తెలిపాడు. -
బౌలింగ్, బ్యాటింగ్‌లో చెలరేగిన ఆర్చర్
వుడ్మెన్ కోట్: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ జోఫ్రా ఆర్చర్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లోనూ చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న సెకండ్ ఎలెవన్ చాంపియన్‌షిప్ సౌత్ గ్రూప్‌లో ససెక్స్ షైర్ తరఫున ఆడుతున్న ఆర్చర్ ఆరు వికెట్లతో సత్తాచాటగా, ఆపై బ్యాటింగ్‌లో సెంచరీతో మెరిశాడు. మంగళవారం గ్లౌసెష్టర్షైర్తో ప్రారంభమైన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆర్చర్ ఆరు వికెట్లను నేలకూల్చాడు. అతని ధాటికి గ్లౌసెష్టర్ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడిపోయారు. దాంతో తన తొలి ఇన్నింగ్స్‌లో గ్లౌసెష్టర్ షైర్ 79 పరుగులకే చాపచుట్టేసింది. అటు తర్వాత బ్యాటింగ్‌లో ఆరో స్థానంలో వచ్చిన ఆర్చర్ 99 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 108 పరుగులు సాధించాడు. గ్లౌసెష్టర్ బౌలర్లకు పరీక్షగా నిలుస్తూ సెంచరీతో కదం తొక్కాడు. దాంతో ససెక్స్ షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 322 పరుగులు చేసింది. తన రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన గ్లౌసెష్టర్ 199 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ ఐదు వికెట్లలో ఆర్చర్ వికెట్ సాధించాడు. దాంతో యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆర్చర్ ఆడటం దాదాపు ఖాయమనట్లే కనబడుతోంది. యాషెస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఆర్చర్‌ను తీసుకున్నా తొలి టెస్టులో ఆడే అవకాశం రాలేదు. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్లు ఉండటంతో ఆర్చర్‌కు చోటు దక్కలేదు. అండర్సన్ రెండో టెస్టుకు గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో ఆర్చర్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. వన్డే వరల్డ్‌కప్‌లో 20 వికెట్లు సాధించి ఇంగ్లండ్ టైటిల్ సాధించడంలో ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. ఆ మెగా టోర్నీలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. -
పాపం పృథ్వీ షా.. ఎంత దురదృష్టవంతుడో..!
భారత యువ క్రికెటర్ పృథ్వీ షాపై బీసీసీఐ నిషేదం నవంబర్ వరకు కొనసాగనుండటంతో షాకు తీవ్ర నిరాశ ఎదురైంది. గత సంవత్సరం అక్టోబర్‌లో డోపింగ్ పరీక్షలో షా విఫలమవడంతో అతడిపై బీసీసీఐ 8 నెలలపాటు నిషేధం విధించింది. మార్చి 16 నుంచి నవంబర్ వరకు కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 2015లో చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ‘పాపం షా.. దురదృష్టవంతుడు’ అన్న ట్వీట్ ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా సరిపోవటంతో క్రికెట్ అభిమానులు దాన్ని వెలికితీసి మరీ వైరల్ చేస్తున్నారు. గతంలోనూ ఆర్చర్ చేసిన చెప్పిన జోస్యం నిజమైంది. అతను ఊహించినట్టుగానే వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చిన ఇంగ్లండ్ జట్టు టైటిల్ గెలిచింది. చదవండి: అంతా నా తలరాత.. : పృథ్వీషా డోపింగ్ టెస్టులో విఫలమయిన పృథ్వీపై నిషేధం కొనసాగుతుందని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. నిషేధం నవంబర్ వరకు కొనసాగుతుందన్న విషయం తెలిసిన పృథ్వీ షా భావోద్వేగంగా ట్వీట్ చేశాడు. తన దగ్గుమందు ఇంత పని చేస్తుంది అనుకోలేదని కలత చెందాడు. చిన్నపాటి అజాగ్రత్త వల్ల శిక్ష అనుభవిస్తున్నానన్నాడు. మిగతా క్రీడాకారులు తనను చూసైనా జాగ్రత్తపడతారని భావిస్తున్నానన్నాడు. చిన్న మందులైనా సరే క్రీడాకారులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. పృథ్వీ షా గత సంవత్సరం అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. -
స్టోక్స్‌కు ప్రమోషన్.. ఆర్చర్ అరంగేట్రం
లండన్: అడ్డంకులు ఎన్ని ఎదురొచ్చినా ప్రతిభ ఉంటే విజయం సాధించొచ్చని జోఫ్రా ఆర్చర్ మరోసారి నిరూపించాడు. జోఫ్రా ఆర్చర్ ప్రతిభ ఇంగ్లండ్‌కు అవసరమున్ననేపథ్యంలో నిబంధనలను సవరించి మరీ జట్టులోకి చోటు కల్పించారు. ఇంగ్లండ్ ప్రపంచకప్ జట్టులో అవకాశం కల్పించిన ఇంగ్లండ్ సెలక్టర్లు.. తాజాగా యాషెస్ సిరీస్ కోసం కూడా ఎంపిక చేశారు. ఆస్ట్రేలియాతో జరగబోయే యాషెస్ సిరీస్ తొలి టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. జోయ్ రూట్ సారథ్యంలోని 14 మంది సభ్యులతో కూడిన జాబితాను ప్రకటించిన సెలక్టర్లు.. అనూహ్యంగా ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్‌కు తిరిగి వైస్ కెప్టెన్‌గా బాధ్యతలను అప్పగించింది. ఐర్లాండ్ టెస్టులో అరంగేట్రం చేసిన జేసన్ రాయ్‌ను యాషెస్ సిరీస్‌కూ ఎంపిక చేశారు. గత మ్యాచ్‌కు విశ్రాంతినిచ్చిన జోస్ బట్లర్, అండర్సన్, బెన్ స్టోక్స్‌లు తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు. అంతేకాకుండా టీ20ల్లో, తాజా ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన జోఫ్రా ఆర్చర్ ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేయనున్నాడు. అండర్సన్, బ్రాడ్‌లకు తోడు క్రిస్ వోక్స్ తోడవడంతో ఇంగ్లండ్ బౌలింగ్ మరింత బలోపేతమైంది. ఇక తొలిసారి ప్రపంచకప్ గెలిచి జోరుమీదున్న ఇంగ్లండ్ అదే ఉత్సాహంలో యాషెస్ సాధించేయాలని తెగ ఆరాటపడుతోంది. తొలిటెస్టుకు ఇంగ్లండ్ జట్టు: జోయ్ రూట్(కెప్టెన్), మొయిన్ అలీ, జిమ్మీ అండర్సన్, జోఫ్రా ఆర్చర్, బెయిర్ స్టో, స్టువార్ట్ బ్రాడ్, బర్న్స్, బట్లర్, స్యామ్ కరన్, జోయ్ డెన్లీ, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, ఓల్లీ స్టోన్, క్రిస్ వోక్స్ -
‘పెయిన్ కిల్లర్స్‌తోనే ప్రపంచకప్ ఆడాను’
లండన్ : ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలవడంలో ఆ జట్టు పేసర్ జోఫ్రా ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపించిన ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి ఇంగ్లండ్‌కు విజయాన్నందించాడు. ఆడిన తొలి ప్రపంచకప్‌లోనే జట్టుకు అందని ద్రాక్షగా మిగిలిన మెగా టైటిల్‌ను అందించాడు. అయితే ఈ టోర్నీ ఆద్యాంతం పక్కటెముకల నొప్పితో విలపించినట్లు ఆర్చర్ ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. పెయిన్ కిల్లర్లు లేనిదే ఆడలేని పరిస్థితి ఏర్పడిందని తన బాధను వెల్లడించాడు. విశ్రాంతి తీసుకునే పరిస్థితి కూడా లేదని, జట్టు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చాడు. అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లో ఈ నొప్పి మరింత తీవ్రమైందని కానీ అప్పటికే జట్టు క్లిష్ట పరిస్థితిలో ఉందన్నాడు. ‘తీవ్ర నొప్పితో విలవిలలాడాను. అదృష్టవశాత్తు ఆ నొప్పి నుంచి త్వరగానే కోలుకున్నాను. కానీ అది వర్ణించలేని బాధ. అఫ్గాన్ మ్యాచ్ అనంతరం పెయిన్ కిల్లర్స్ లేనిదే ఆడలేని పరిస్థితి నెలకొంది. కనీసం విశ్రాంతి తీసుకునే పరిస్థితి కూడా లేదు.’ అని ఆర్చర్ చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ అద్భుత ప్రదర్శనతో యాషెస్ టెస్ట్ సిరీస్ ఎంపికైన ఈ యువ పేసర్.. ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. -
ఆర్చర్.. టైమ్ మిషన్ ఉందా ఏందీ?
ప్రపంచకప్ ఫైనల్ అనంతరం ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ పాత ట్వీట్లు అభిమానుల్లో ఆసక్తిని రేకిత్తించాయి. అతనికి సూపర్ నేచురల్ పవర్స్ ఏమైనా ఉన్నాయా? అనే సందేహాన్ని కలిగించాయి. తాజాగా ఐర్లాండ్‌తో నాలుగు రోజుల టెస్ట్ సందర్భంగా కూడా మరోసారి అతని పాత ట్వీట్లు చర్చనీయాంశమయ్యాయి. 2013లో చేసిన ట్వీట్లలో ఆర్చర్ చెప్పినట్లు ఇప్పుడు జరుగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘6 బంతులు16 పరుగులు’ అని చేసిన ట్వీట్ ప్రపంచకప్ అనంతరం చర్చకు దారీ తీసింది. వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ సూపర్ ఓవర్లో 15 పరుగులు చేసింది.. న్యూజిలాండ్ లక్ష్యం ఆరు బంతుల్లో 16 పరుగులు. మరి దీన్ని ముందే ఊహించే ఆర్చర్ ట్వీట్ చేశాడా అనేది అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అలాగే 2014లో లార్డ్స్‌కు వెళ్తున్నాం.. 2015లో సూపర్ ఓవర్‌ను పట్టించుకోవడం లేదని ట్వీట్ చేశాడు. ఇవి కూడా ప్రపంచకప్ ఫైనల్ పరిస్థితులనే తలపించాయి. 2015లో ‘ఐర్లాండ్ లుకింగ్ గుడ్’ అని చేసిన ట్వీట్ మరోసారి ఈ తరహా చర్చకు దారితీసింది. బుధవారం నుంచి ప్రారంభమైన నాలుగు రోజుల టెస్ట్‌లో ఐర్లాండ్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 85 పరుగులకే కుప్పకూల్చింది. అయితే ఇది ఊహించే ఆర్చర్ 2015లో ట్వీట్ చేశాడా? అని అభిమానులు మళ్లీ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ట్వీట్‌ను క్రికెట్ ఐర్లాండ్ రీట్వీట్ చేయడం గమనార్హం. దీంతో ఆర్చర్ నీ దగ్గర ఏమైనా టైం మిషన్ ఉందా? అని ఒకరు.. ‘ఆర్చర్ జ్యోతిష్యం చెప్పరాదు’ అని మరొకరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్) :) https://t.co/hSPNT9iv9v — Cricket Ireland (@Irelandcricket) July 24, 2019 -
‘మా వాడు క్రికెట్‌ను ఏలుతాడు’
లండన్ : జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ అభిమానులకు తప్ప మిగతా ప్రపంచానికి అంతగా తెలియని వ్యక్తి. కానీ ఇప్పుడు అతడి పేరు విశ్వమంతా మారుమోగుతోంది. అదృష్టం కొద్ది జట్టులోకి వచ్చి ఏకంగా తన జట్టుకు తొలిసారి ప్రపంచకప్‌నే అందించాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా సూపర్ ఓవర్ వేసి ఇంగ్లండ్‌కు ప్రపంచకప్ అందించిన ఆర్చర్‌పై అతడి తండ్రి ఫ్రాంక్ ఆర్చర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఏదో ఒక రోజు ఆర్చర్ క్రికెట్‌ను ఏలుతాడని పేర్నొన్నాడు. ఇక తన కొడుకుపై నమ్మకంతో సూపర్ ఓవర్ అవకాశం ఇచ్చిన సారథి ఇయాన్ మోర్గాన్‌ను కృతజ్ఞతలు తెలిపాడు. ‘ఆడేది తొలి ప్రపంచకప్, అంతకుముందు ఎక్కువగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేదు. అయినా సూపర్ ఓవర్లో ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా జట్టును జగజ్జేతగా నిలిపాడు. దేశం గర్వించేలా చేశాడు. జట్టు సభ్యులు, కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సూపర్ ఓవర్లో నీషమ్ సిక్సర్ కొట్టిన వెంటనే ఏ బౌలర్ అయినా ఆత్మరక్షణలోకి పడతాడు. కానీ, ఆర్చర్ మాత్రం దానిని అధిగమించాడు. గొప్ప ఆటగాళ్ళు మాత్రమే అలా చేయగలరు. క్రెడిట్ మొత్తం కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కే దక్కుతుంది. అతడిపై పెట్టుకున్న విశ్వాసాన్ని తిరిగి చెల్లించాడు. ఆర్చర్ ఆట ఇప్పుడే ప్రారంభమైంది. క్రికెట్‌కు మైఖెల్ జోర్డాన్(దిగ్గజ బాస్కెట్ బాల్ ఆటగాడు) అవుతావని అనేవాడిని. బాస్కెట్ బాల్‌ను జోర్డాన్ శాసించినట్టు.. ఆర్చర్ ఏదో ఒక రోజు క్రికెట్‌ను ఏలుతాడు’అంటూ ఫ్రాంక్ ఆర్చర్ ఉద్వేగంగా పేర్కొన్నాడు. -
ఆ సలహానే పని చేసింది: ఆర్చర్
లండన్: వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్ కప్ అంచుల వరకూ వెళ్లి చతికిలబడటం వెనుక ఆ జట్టు ఆటగాళ్ల తప్పిదాలు ఒకటైతే, అంపైరింగ్ నిర్ణయాలు కూడా కీలక పాత్ర పోషించాయనే చెప్పాలి. కివీస్ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో భాగంగా 49 ఓవర్ నాల్గో బంతిని స్టోక్స్ లాంగాన్ మీదుగా భారీ షాట్ కొట్టగా బౌండరీకి కొన్ని అంగుళాల ముందు బౌల్ట్ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే తనను తాను నియంత్రించుకోవడంలో విఫలమై బౌండరీ లైన్ తొక్కాడు. దాంతో ఔట్ కాస్తా సిక్స్ అయిపోయింది. ఇక చివరి ఓవర్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఓవర్ త్రో రూపంలో ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు రావడంతో మ్యాచ్ టై అయ్యింది. ఫలితంగా సూపర్ ఓవర్ ఇంగ్లండ్ 15 పరుగులు చేస్తే, కివీస్ కూడా అన్నే పరుగులు స్కోరును సమం చేసింది. కాకపోతే బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు. ఇదిలా ఉంచితే, సూపర్ ఓవర్‌ను తనకు ఇవ్వడంపై ఒకింత ఆందోళనకు గురైనట్లు జోఫ్రా ఆర్చర్ తెలిపాడు. ‘ నేను సూపర్ ఓవర్ వేయడానికి వెళ్లే ముందు స్టోక్స్ వచ్చి కూల్‌గా ఉండమని చెప్పాడు. నువ్వు గెలుపు-ఓటములు గురించి పట్టించుకోకు. అదేమే నీ ప్రతిభను తగ్గించదు అని ధైర్యం ఇచ్చాడు. ఆ సలహాతోనే నేను స్వేచ్ఛగా బౌలింగ్ వేశా. అదే సమయంలో జో రూట్ కూడా వచ్చి కొన్ని స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పాడు. నాపై ప్రతీ ఒక్కరూ నమ్మకం ఉంచడంతోనే నేను బౌలింగ్‌ను నియంత్రణతో వేశా. నేను ఒకటే అనుకున్నా. ఒకవేళ మేము ఓటమి పాలైతే ప్రపంచం అక్కడితో ఆగిపోదు అనే విషయం నాకు తెలుసు’ ఆర్చర్ తెలిపాడు. ఇక నా రెండు నెలల ఇంగ్లండ్ కెరీర్లో ఇదే అత్యుత్తమమని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌కు జట్టుకు ప్రాతినిథ్యం వహించడం ఒకటైతే, వరల్డ్‌కప్‌లో జట్టులోకి రావడం, వరల్డ్‌కప్‌లో ఆడటం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమన్నాడు. -
ఆర్చర్‌కు సూపర్ పవర్ ఉందా?
లండన్: నాటకీయ పరిణామాల మధ్య ఇంగ్లండ్ వరల్డ్‌కప్ గెలవడం ఒకటైతే, ఆ దేశ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఎప్పుడో ఆరేళ్ల క్రితం చేసిన ట్వీట్ ఇప్పడు హాట్ టాపిక్‌గా మారడం మరొకటి. అది కూడా ఎంతలా అంటే ఆర్చర్‌కు సూపర్ నేచురల్ పవర్స్ ఏమైనా ఉన్నాయా అనేంతగా అభిమానుల్లో ఆసక్తికి దారి తీసింది. 2013లో ఆర్చర్ ఒక ట్వీట్ చేశాడు. అందులో 16 పరుగులు, 6 బంతులు అని ఉండటమే చర్చనీయాంశమైంది. తాజా వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తుది పోరులో భాగంగా ఇంగ్లండ్ సూపర్ ఓవర్లో 15 పరుగులు చేసింది. అంటే న్యూజిలాండ్ లక్ష్యం ఆరు బంతుల్లో 16 పరుగులు. మరి దీన్ని ముందే ఊహించే ఆర్చర్ ట్వీట్ చేశాడా అనేది అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్న. మరొక సందర్భంలో అంటే ఏడాది వ్యవధిలో ఆర్చర్ మరో ట్వీట్ చేశాడు. ‘ మేము లార్డ్స్‌కు వెళ్లాలనుకుంటున్నా’ అని పోస్ట్ చేశాడు. 2015లో మరొక ట్వీట్ చేస్తూ అందులో ‘సూపర్ ఓవర్‌ను పట్టించుకోవడం లేదు’ అని పేర్కొన్నాడు. ఆర్చర్ చేసిన ఒకనాటి ట్వీట్లు ఇప్పటి వరల్డ్‌కప్‌కు దాదాపు సరిపోలడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ ఆర్చర్ భవిష్యత్తుకు అతనే జ్యోతిష్కుడు’ అని ఒకరు ట్వీట్ చేయగా, ‘కాలజ్ఞాని, నిజమైన దేవుడు’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ‘కలలు నిజం అంటే ఇదే. అందుకు సంబంధించిన ఆధారాలు ఇక్కడ ఉన్నాయి. నీలో సూపర్ నేచురల్ పవర్ ఉంది’ అని మరొకరు పేర్కొన్నారు. ఇలా ఆర్చర్ చేసిన ట్వీట్లు తాజా సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారడం, అందుకు అభిమానుల్ని అనూహ్య మద్దతు లభించడం విశేషం. ఒక ఈ వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు ఆర్చర్. 2019 వరల్డ్‌కప్ సీజన్లో 20 వికెట్లతో సత్తాచాటాడు. ఇది ఒక వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధికంగా నమోదైంది. -
అనూహ్యంగా వచ్చాడు.. టాప్ లేపాడు!
లండన్: జోఫ్రా ఆర్చర్.. వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్ ముందుగా ప్రకటించిన జాబితాలో ఈ పేరు లేదు. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ పేసర్ డేవిడ్ విల్లే గాయపడితే ఆర్చర్‌కు అనూహ్యంగా చోటు దక్కింది. వెస్టిండీస్ తరఫున అండర్-19 క్రికెట్ ఆడి, ఆపై ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించడం ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిన విషయం. ప్రధానంగా ఇంగ్లిష్ కౌంటీల్లో సత్తాచాటడంతో ఆర్చర్ పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించే వరకూ ఈ క్రికెటర్ పేరు ఎవరికీ పెద్దగా కూడా తెలియదు. అయితే ఐపీఎల్లో ఫర్వాలేదనిపించినా, ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్టులో చోటు దక్కించుకోవడం అంత ఈజీ కాదు. అందులోనూ వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన జట్టులో స్థానం సంపాదించడమంటే మాటలు కాదు. ఏది ఏమైనా ఇంగ్లండ్ వరల్డ్‌కప్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్నా ఆ జట్టు అంచనాల్ని నిజం చేశాడు. ఇంగ్లండ్ జట్టులో ప్రధాన పేసర్ పాత్ర పోషిస్తూ వరల్డ్‌కప్ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అదే సమయంలో ఒక వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. 2019 సీజన్లో 20 వికెట్లతో సత్తాచాటాడు. ఇది ఒక వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధికం. అదే సమయంలో మార్క్ వుడ్(18) రెండో స్థానంలో నిలిచాడు. ఒక వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధి వికెట్లు సాధించిన జాబితాలో ఆర్చర్, మార్క్ వుడ్‌ల తర్వాత స్థానాల్లో క్రిస్ వోక్స్(16 వికెట్లు, 2019 వరల్డ్‌కప్), ఇయాన్ బోథమ్(16 వికెట్లు, 1992 వరల్డ్‌కప్), ఆండ్రూ ఫ్లింటాఫ్(14 వికెట్లు, 2007 వరల్డ్‌కప్)లు ఉన్నారు. -
వైరల్ : క్లీన్‌బౌల్డ్‌తో సిక్సర్ చూశారా?
లండన్ : క్లీన్‌బౌల్డ్ అయిన తర్వాత సిక్సర్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును బంతి వికెట్లను తాకి మరి నేరుగా బౌండరీలైన్ బయట పడింది. బహుషా క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి సిక్సర్ చూసి ఉండరు. వికెట్ అయిన తర్వాత సిక్సర్ ఎలా అవుతుందంటారా? అవును అది సిక్సర్ కాదు వికెటే! కానీ కళ్లను మైమరిపించే ఈ అబ్బురం తాజా ప్రపంచకప్‌లోనే చోటుచేసుకుంది. శనివారం ఇంగ్లండ్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం ఔరా అనిపించింది. ఇంగ్లండ్ సంచలనం జోఫ్రా ఆర్చర్ మహత్యంతోనే ఇది జరిగింది.. చరిత్రకెక్కింది. (చదవండి: బంగ్లాపై ఇంగ్లండ్ అదరహో) ఇంతకు ముందు బ్యాట్స్‌మన్ హెల్మెట్‌కు తాకి సిక్సర్ వెళ్లడం చూశాం కానీ.. ఇలా బెయిల్స్ తాకి సిక్సర్‌గా వెళ్లడం మాత్రం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ ఈ బంతికి బలవ్వగా.. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఆర్చర్ ఏకంగా గంటకు 144 కిలోమీటర్ల వేగంతో లైన్ అండ్ లెంగ్త్‌తో బంతిని వేయడంతో అది వికెట్లను తాకి నేరుగా 59 మీటర్ల దూరంలో ఉన్న బౌండరీలో పడింది. ఇక ఈ డెలివరి పట్ల ఆర్చర్ తెగ ఆనందపడిపోయాడు. ఇంత వరకు ఇలాంటిది ఎప్పుడు చూడలేదని, ఇది తన వేగానికి సంకేతమని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 106 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ట్వీట్ చేయడంతో నెట్టింట హల్చల్ చేస్తోంది. -
ఇంగ్లండ్ క్రికెటర్లకు జరిమానా.. పాక్‌కు కూడా
నాటింగ్‌హామ్: ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దురుసుగా ప్రవర్తించిన ఇంగ్లండ్ క్రికెటర్లు జేసన్ రాయ్, జోఫ్రా ఆర్చర్లకు ఐసీసీ జరిమానా విధించింది. అంతేకాకుండా స్లో ఓవర్ రేట్ కారణంగా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆతిథ్య ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పాక్ సారథి సర్ఫరాజ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు, జట్టులోని మిగతా సభ్యుల ఫీజులో 10 శాతం జరిమానా విధించారు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సందర్భంగా 14వ ఓవర్లో జేసన్ రాయ్ మిస్ ఫీల్డింగ్ అనంతరం అంపైర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో రాయ్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు. ఇదే మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు 15 శాతం కోత విధించారు. అంతేకాకుండా వీరిద్దరికీ జరిమానాతో పాటు చెరో డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ జత చేసింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు మ్యాచ్ రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. -
మెరిసిన మరో మెరుపుతీగ
-
ఆర్చర్ వచ్చేశాడు
లండన్: ఇంగ్లండ్ ప్రపంచకప్ జట్టుకు జోఫ్రా ఆర్చర్ ఎంపికయ్యాడు. సస్సెక్స్ పేసర్ ఇటీవల జరిగిన ఐపీఎల్లో ఆకట్టుకున్నాడు. అనంతరం పాకిస్తాన్‌తో సిరీస్‌లోనూ ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. జన్మతః బార్బడోస్‌కు చెందిన ఈ పేసర్ గత మార్చిలోనే ఇంగ్లండ్ తరఫున ఆడేందుకు అర్హత సంపాదించాడు. ఇప్పుడు ఆలస్యంగానైనా ప్రపంచకప్ బెర్తు కొట్టేశాడు. అయితే ఇంగ్లండ్ ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్న పేసర్ డేవిడ్ విల్లీ, స్పిన్నర్, బ్యాట్స్‌మన్ జో డెన్లీలకు చోటు దక్కలేదు. ఈ నెల 30న జరిగే ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ తలపడుతుంది. దీనికంటే ముందు 25న ఆసీస్‌తో, 27న అఫ్గానిస్తాన్‌తో వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇంగ్లండ్ జట్టు: మోర్గాన్ (కెప్టెన్), జేసన్ రాయ్, బెయిర్‌స్టో, మొయిన్ అలీ, బట్లర్, జో రూట్, టామ్ కరన్, బెన్ స్టోక్స్, డాసన్, ప్లంకెట్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, విన్సీ, వోక్స్, మార్క్ వుడ్. -
వరల్డ్‌కప్ ఇంగ్లండ్ జట్టులో భారీ మార్పులు
లండన్: మరికొద్ది రోజుల్లో సొంతగడ్డపై ఆరంభం కానున్న వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్ జట్టు భారీ మార్పులతో కూడిన జట్టును తాజాగా ప్రకటించింది. ముందనుకున్న ప్రపంచకప్ జట్టులో ఉన్న డేవిడ్ విల్లీ, జో డేన్లీ, అలెక్స్ హేల్స్‌పై వేటు వేశారు. ప్రదర్శన ఆధారంగా విల్లీ, డెన్లీలపై వేటు పడితే, డ్రగ్ టెస్టులో విఫలం కావడంతో అలెక్స్ హేల్స్‌ను జట్టు నుంచి తప్పిస్తూ ఇంగ్లండ్ సెలక్టర్లు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం 15 మందితో కూడిన తుది జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. ఈ జట్టులో సెలక్టర్లు అనూహ్యంగా ఆల్ రౌండర్ జోఫ్రా ఆర్చర్‌కు చోటు కల్పించారు. గత నెలలో ఇంగ్లండ్ సెలక్టర్లు ప్రకటించిన ప్రిలిమినరీ జట్టులో జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్ కోసం ఆటగాళ్ల జాబితాను మార్చుకోవడానికి మే 23వ తేదీ వరకు ఆయా క్రికెట్ జట్లకు అవకాశం ఉండటంతో పలు మార్పులు చేసింది ఈసీబీ. ఆర్చర్‌తో పాటు సెలక్టర్లు లియామ్ డాసన్, జేమ్స్ విన్సీలను వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేశారు. వరల్డ్‌కప్ ఇంగ్లండ్ జట్టు ఇదే ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జోనీ బెయిర్ స్టో, జాసన్ రాయ్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, లియామ్ ప్లంకెట్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్, జేమ్స్ విన్సీ, టామ్ కురాన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్ -
ఆర్చర్‌కు కాస్త ఆనందం.. మరి కాస్త బాధ
లండన్: రాజస్తాన్ రాయల్స్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు కాస్త ఊరట కలిగించే వార్త. తొలిసారి ఇంగ్లండ్ జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. పాకిస్తాన్, ఐర్లాండ్‌లతో తలపడబోయే ఇంగ్లండ్ జట్టులో ఆర్చర్‌కు అవకాశం కల్పించారు. అయితే ప్రపంచకప్‌కు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. వచ్చే నెల 30 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టులో అనూహ్యంగా జోయ్ డెన్లీ చోటు దక్కించుకున్నాడు. ఈ ఐసీసీ మెగా ఈవెంట్ స్వదేశంలో జరుగుతుండటంతో ఇంగ్లండ్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే సెలక్టర్లు ప్రకటించిన ప్రపంచకప్ జాబితాలో గత కొంతకాలంగా విశేషంగా రాణిస్తున్న పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కి చోటు దక్కలేదు. బార్బడోస్‌కు చెందిన ఆర్చర్ ఇంగ్లండ్‌కు వలస వచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్థానికత కారణంగా ఇన్ని రోజులు ఆర్చర్‌ను పక్కకు పెట్టారు. అయితే నిబంధనలను సవరించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. పాకిస్తాన్, ఐర్లాండ్ సిరీస్‌లకోసం ఆర్చర్‌ను ఎంపిక చేసింది. పాకిస్తాన్, ఐర్లాండ్ సిరీస్‌ల కోసం సెలక్టర్లు తనను ఎంపిక చేయడం పట్ల ఆర్చర్ ఆనందం వ్యక్తం చేశాడు. జాతీయ జట్టుకు ఆడటం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ప్రపంచకప్ జట్టులో తాను లేకపోవడం కాస్త బాధ కలిగించిందని.. అయితే ఐర్లాండ్, పాక్ సిరీస్‌లలో విశేషంగా రాణించి సెలక్టర్ల మెప్పు పొందుతానని ధీమా వ్యక్తం చేశాడు. -
ఆర్చర్.. అదిరిందిపో!
హోబర్ట్ : కరేబియన్ స్టార్ జోఫ్రా ఆర్చర్ బౌండరీ లైన్ వద్ద అదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మంగళవారం బ్రిస్బెన్హీట్-హోబర్ట్ హరికేన్స్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జోఫ్రా అద్భుత ఫీల్డింగ్ అదరగొట్టాడు. బ్రిస్బెన్ హీట్ ఇన్నింగ్స్‌లో జేమ్స్ ఫాల్క్‌నర్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతిని ఓపెనర్ మ్యాక్స్ బ్రియాంట్ లాంగాన్‌లో భారీ షాట్ ఆడాడు. అందరూ పక్కా సిక్స్ అని భావించారు. కానీ ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న ఆర్చర్.. చిరుతలా పరుగెత్తి బౌండరీ లైన్ వద్ద ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. ఈ సమయంలో సమన్వయం కోల్పోతున్ననట్లు గ్రహించిన ఆర్చర్ బంతిని గాల్లోకి విసిరేసి తిరుగొచ్చి అందుకున్నాడు. రెప్పపాటులో జరిగిన ఈ ఫీట్‌తో మైదానంలో ఆటగాళ్లు, అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇక బ్యాట్స్‌మన్ మ్యాక్స్ బ్రియాంట్ (7) నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిది. ఆర్చర్ ఈ అద్భుత క్యాచ్‌తో పాటు క్రిస్‌లిన్(10),రేన్షా(0)ల వికెట్లను పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బెన్ హీట్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన హరికేన్స్ 14.2 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. JOFRA ARCHER STOP IT 😲😲#BBL08 | @BKTtires pic.twitter.com/ZjkGB7BjVp — cricket.com.au (@cricketcomau) 29 January 2019 -
రాజస్తాన్ బ్యాట్స్‌మన్ చెత్త రికార్డు
జైపూర్ : ఐపీఎల్-11 సీజన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ సీజన్‌తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వెస్టిండీస్ యువ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ మూడు సార్లు డకౌట్ కాగా.. ఇందులో రెండు గోల్డెన్ డక్‌లుండటం విశేషం. దీంతో అరంగేట్ర సీజన్లో ఇలా మూడు సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల సరసన ఆర్చర్ చేరాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలా విన్సెంట్ (2011), రామ్‌పాల్(2013), గ్రాండ్‌హోమ్(2017)లు ఈ అప్రతిష్ట్రను మూటగట్టుకోగా తాజాగా ఆర్చర్ ఈ సీజన్లో ఈ చెత్త రికార్డును నమోదు చేశాడు. -
‘ఆ క్రెడిట్ మొత్తం జోస్ బట్లర్‌దే కాదు’
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో రాజస్తాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాలు సాధించడంతో ప్లే ఆఫ్‌పై ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముంబైతో కీలకమైన మ్యాచ్‌లో జోస్ బట్లర్‌తో పాటు జోఫ్రా ఆర్చర్ రాణించడం వల్లే రాజస్తాన్ విజయం సాధ్యమైందని అంటున్నాడు భారత దిగ్గజ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్. ఆ క్రెడిట్ మొత్తం బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ ఇవ్వడం సరైనది కాదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ఆ విజయంలో ఇద్దరికీ సమాన క్రెడిట్ ఇస్తేనే బాగుంటందన్నాడు. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ పొదుపుగా బౌలింగ్ వేసిన విషయాన్ని శ్రీకాంత్ గుర్తు చేశాడు. ఆర్చర్ తన కోటా నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయడమే కాకుండా 14 డాట్ బాల్స్ వేసి జట్టు విజయంలో తనవంతు పాత్రను సమర్ధవంతంగా పోషించాడన్నాడు. ‘బౌలర్లు వేగంగా బంతులు వేస్తూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తుంటే అది క్రికెట్లో ఆహ్లాదకర దృశ్యమే. అయితే ఐపీఎల్లో బౌలర్లకు అంత అదృష్టం లేదు. వారి కృషికి తగిన గుర్తింపు లభించడంలేదు. జోఫ్రా ఆర్చర్ వంటి బౌలర్ ఎంత కష్టపడినా ప్రశంసలన్నీ బ్యాట్స్‌మెన్‌కే దక్కుతున్నాయి. ఆర్చర్, బట్లర్‌లే రాజస్థాన్ జట్టు బలం. ఆర్చర్ బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేస్తుంటే, బట్లర్ పరుగులతో జట్టును గెలిపిస్తున్నాడు. కేవలం బట్లర్‌కే క్రెడిట్ ఇవ్వడం తగదు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరి కృషి వల్లే రాజస్తాన్ గెలిచింది’ అని శ్రీకాంత్ తెలిపాడు. -
ఉత్కంఠ పోరులో రాయల్స్‌దే విజయం
-
రసవత్తర పోరులో రాజస్తాన్‌దే విజయం
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. సంజూ శాంసన్(52), బెన్ స్టోక్స్(40), కృష్ణప్ప గౌతమ్(33 నాటౌట్)లు రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఓపెనర్లు అజింక్యా రహానే(14), రాహుల్ త్రిపాఠి(9)లు నిరాశపరిచినా, శాంసన్-స్టోక్స్‌లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి 10 పరుగులు కావాల్సిన తరుణంలో కృష్ణప్ప గౌతమ్ ఫోర్, సిక్సర్‌తో జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ముంబైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ లూయిస్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఆపై మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్, ఫస్ట్ డౌన్ ఆటగాడు ఇషాన్ కిషన్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ 129 పరుగులు జత చేశారు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్(72;47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్(58;42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే వీరు ఐదు పరుగుల వ్యవధిలో వరుసగా పెవిలియన్ చేరడంతో ముంబై స్కోరు మందగించింది. రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా ఔట్ కాగా, పొలార్డ్(21 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. ఇక చివర్లో కృనాల్ పాండ్యా(7)హార్దిక్ పాండ్యా(4), మిచెల్ మెక్లీన్గన్(0) నిరాశపరిచారు. ఈ మ్యాచ్‌లో ముగ్గురు ముంబై ఆటగాళ్లు గోల్డెన్ డక్‌గా ఔట్ కావడం గమనార్హం. ఎవిన్ లూయిస్, రోహిత్ శర్మ, మెక్లీన్గన్లు ఆడిన తొలి బంతికే పెవిలియన్ చేరారు. దాంతో ముంబై ఇండియన్స్ రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు సాధించగా, కులకర్ణి రెండు వికెట్లు తీశాడు. ఉనాద్కత్‌కు వికెట్ లభించింది. ఇది రాజస్తాన్‌కు మూడో విజయం కాగా, ముంబైకు నాల్గో ఓటమి. -
అరంగేట్రంలోనే అదరగొట్టాడు..
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అరంగేట్రం చేసిన రాజస్తాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ముంబై ఇండియన్ప్‌తో మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు సాధించి శభాష్ అనిపించాడు. తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ ఉత్తమ గణాంకాల్ని నమోదు చేశాడు. ముంబైతో మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా వికెట్‌ను తన తొలి ఐపీఎల్ వికెట్‌గా ఆర్చర్ ఖాతాలో వేసుకున్నాడు. 19 ఓవర్ తొలి బంతికి కృనాల్ ఔట్ చేసిన ఆర్చర్..ఆపై నాలుగు, ఐదు బంతుల్లో వరుసగా హార్దిక్ పాండ్యా, మెక్లీన్గన్లను బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా రాజస్తాన్ తరపున అరంగేట్రం చేసి మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన మూడో బౌలర్‌గా గుర్తింపు సాధించాడు. అంతకుముందు రాజస్తాన్ తరపున అరంగేట్ర చేసి మెరిసిన బౌలర్లలో అమిత్ సింగ్( 2009లో కింగ్స్ పంజాబ్‌పై) 9 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించగా, అటు తర్వాత కెవిన్ కూపర్(2012లో కింగ్స్ పంజాబ్‌పై) 26 పరుగులిచ్చి నాలుగు వికెట్లు సాధించాడు. ఇప్పుడు ఆ ఇద్దరి తర్వాత స్థానాల్లో జోఫ్రా ఆర్చర్ నిలిచాడు. ముంబైతో మ్యాచ్‌లో ఆర్చర్ 23 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించిన సంగతి తెలిసిందే. ఇంతకీ జోఫ్రా ఆర్చర్ ఎవరు..? -
ముంబై ఇండియన్స్ బ్యాటింగ్
-
జోఫ్రా ఆర్చర్ అరంగేట్రం
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.. ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇప్పటివరకూ రాజస్తాన్ రాయల్స్ ఐదు మ్యాచ్‌లు ఆడగా రెండు విజయాల్ని మాత్రమే నమోదు చేసింది. ఇక ముంబై ఇండియన్స్ నాలుగు ఆడి ఒకదాంట్లో మాత్రమే గెలుపొందింది. పాయింట్ల పట్టికలో రాజస్తాన్, ముంబై జట్లు వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంచితే, ఐపీఎల్లో జోఫ్రా ఆర్చర్ అరంగేట్రం చేయబోతున్నాడు. వెస్టిండీస్ క్రికెటరైన జోఫ్రా ఆర్చర్‌ను ఈ ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ దక్కించుకుంది. ఆర్చర్‌కు రూ. 7.20 కోట్ల రికార్డు ధర చెల్లించి రాయల్స్ కొనుగోలు చేసింది. ఇంతకీ జోఫ్రా ఆర్చర్ ఎవరు..? వెస్టిండీస్ అండర్-19 క్రికెట్ జట్టులో సభ్యుడిగా కొనసాగుతున్న జోఫ్రా ఆర్చర్‌ను ఒక్కసారిగా స్టార్‌ను చేసింది మాత్రం ఇంగ్లిష్ కౌంటీ చాంపియన్‌షిప్. ట్వంటీ 20 స్పెషలిస్టుగా ముద్రపడిన ఆర్చర్.. 2016లో ససెక్స్ తరపున ఆడటానికి సంతకం చేశాడు. 2017 సంవత్సరానికి సంబంధించి ఇంగ్లిస్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ తరపున అత్యధిక వికెట్లను సాధించి సత్తా చాటుకున్నాడు. మరొకవైపు ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా హోబార్ట్ హరికేన్స్‌కు ప్రాతినిథ్య వహించిన ఆర్చర్.. తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు సాధించి ఆకట్టుకున్నాడు. బీబీఎల్‌లో 10 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు సాధించి తనదైన ముద్రను వేశాడు. గంటకు 140 కి.మీపైగా వేగంతో బౌలింగ్ వేయడమే ఆర్చర్‌కు అదనపు బలం. ప్రధానంగా యార్కర్లు, బౌన్సర్లు సంధించడంలో దిట్ట. 34 ట్వంటీ 20 మ్యాచ్‌ల్లో 40కి పైగా వికెట్లు సాధించాడు. మరొకవైపు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌లో చేసే అతని టీ 20 స్టైక్‌రేట్ 145. 45 గా ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఈ 22 ఏళ్ల బార్బోడాస్ క్రికెటర్‌కు భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంది. అయితే ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న జోఫ్రా ఆర్చర్ ఎంత వరకూ రాణిస్తాడో చూడాలి. -
కాస్ట్లీ క్రికెటర్.. ఐపీఎల్‌కు అనుమానమే!
సాక్షి, స్పోర్ట్స్: ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికిన వెస్టిండీస్ పేస్ బౌలర్, స్పీడ్ సెన్సేషన్ జోఫ్రా ఆర్చర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)కు దూరమయ్యాడు. పీఎస్ఎల్లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ విండీస్ క్రికెటర్ అనారోగ్యం కారణంగా తాజా సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు క్వెట్టా గ్లాడియేటర్స్ ట్వీట్ చేసింది. పీఎస్ఎల్లో రెండు మ్యాచ్‌లాడిన జోఫ్రా ఆర్చర్.. 2/30, 3/23 తో ఆకట్టుకున్నాడు. కడుపులో ఏదో సమస్య కారణంగా పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న విండీస్ బౌలర్ ఐపీఎల్లో ఆడతాడా లేదా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలే ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఎవరూ ఊహించని రీతిలో ఫాస్ట్ బౌలర్ ఆర్కర్ను రాజస్థాన్ రాయల్స్ రూ.7.2 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుండగా.. ఈ విండీస్ పేసర్ కోలుకుని అందుబాటులోకి వస్తాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. మరోవైపు తన ఆరోగ్య పరిస్థితిపై ఆర్చర్ ఏ విధంగానూ స్పందించడం లేదు. బౌలింగ్‌లో తనకు దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డెల్ స్టెయిన్ ఆదర్శమని ఆర్చర్ చెబుతుంటాడు. -
జోఫ్రా ఆర్చర్‌పై భారత అభిమానుల ఆగ్రహం
సాక్షి, స్పోర్ట్స్ : ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికి అందరి కళ్లను తనవైపు తిప్పుకున్న వెస్టిండీస్ అండర్-19 క్రికెటర్ జోఫ్రా ఆర్చర్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్చర్ కనీస ధర రూ.40 లక్షలు ఉండగా రూ.7.20 కోట్ల ధరకు రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. దీంతో ఆర్చర్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అయితే ఆర్చర్ భారత ద్వేషి అని, ముఖ్యంగా ధోనిని విమర్శిస్తూ గతంలో ట్వీట్లు చేశాడని భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. జోఫ్రా గతంలో చేసిన ట్వీట్స్‌ను తొలిగించినప్పటికి వాటి స్క్రీన్ షాట్లతో నిలదీస్తున్నారు. ఆర్చర్ భారతీయులు నాశనం కావలని, ధోని తనకు తానే స్మార్ట్ అని భావిస్తున్నాడని, ధోని లూల్ అంటూ ఆ ట్వీట్లలో పేర్కొన్నాడు. భారత నాశనాన్ని కోరుకున్న క్రికెటర్‌కు ఐపీఎల్లో అవకాశమివ్వడేమిటని రాజస్తాన్ రాయల్స్ జట్టును అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ ఆడాలంటే ముందుగా భారత దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. విండీస్ అనమాక క్రికెటరైన ఆర్చర్ బిగ్‌బాష్ లీగ్‌లో రాణించి గుర్తింపు పొందాడు. బార్బోడాస్ జట్టు తరుపున బంతి, బ్యాట్‌తో సత్తా చాటడంతో ఐపీఎల్ వేలంలో కోట్లు పలికాడు. Don't let him play till he apologizes MSD — Rohit Joshi (@rpjoshi648) 29 January 2018 -
జోఫ్రా ఆర్చర్‌కు 'రికార్డు' ధర
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అనేది అనామక క్రికెటర్లను సైతం రాత్రికి రాత్రికే కోటీశ్వరుల్ని చేస్తుందనేది మరోసారి రుజువైంది. వెస్టిండీస్ అండర్-19 క్రికెట్ జట్టులో సభ్యుడిగా కొనసాగుతున్న జోఫ్రా ఆర్చర్‌ను ఒక్కసారిగా స్టార్‌ను చేసింది ఈ ఐపీఎల్ సీజన్. ఐపీఎల్-11కు సంబంధించి ఈ రోజు బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో ఆర్చర్‌కు రూ. 7.20 కోట్ల రికార్డు ధర పలికింది. ఇటీవల కాలంలో అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ సత్తాచాటుతున్న బార్బోడాస్కు చెందిన ఆర్చర్‌ను అత్యధిక మొత్తం చెల్లించి రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఆర్చర్ కనీస ధర రూ. 40 లక్షలు ఉండగా ఒకేసారి రికార్డు స్థాయిలో కోట్లను వెచ్చించి మరీ రాయల్స్ కొనుగోలు చేసింది. ఇంతకీ జోఫ్రా ఆర్చర్ ఎవరు..? ట్వంటీ స్పెషలిస్టుగా ముద్రపడిన ఆర్చర్..2016లో ససెక్స్ తరపున ఆడటానికి సంతకం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. 2017 సంవత్సరానికి సంబంధించి ఇంగ్లిస్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ తరపున అత్యధిక వికెట్లను సాధించి సత్తా చాటుకున్నాడు. కాగా, గత రెండు నెలల నుంచి అతనికి మరింత స్టార్ డమ్ వచ్చి పడింది. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా హోబార్ట్ హరికేన్స్‌కు ప్రాతినిథ్య వహించిన ఆర్చర్..తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు సాధించి ఆకట్టుకున్నాడు. బీబీఎల్‌లో 10 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు సాధించి తనదైన ముద్రను వేశాడు. గంటకు 140 కి.మీపైగా వేగంతో బౌలింగ్ వేయడమే ఆర్చర్‌కు అదనపు బలం. ప్రధానంగా యార్కర్లు, బౌన్సర్లు సంధించడంలో దిట్ట. 34 ట్వంటీ 20 మ్యాచ్‌ల్లో 40కి పైగా వికెట్లు సాధించాడు.మరొకవైపు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌లో అతని టీ 20 స్టైక్‌రేట్ 145. 45 గా ఉంది. వీటిన దృష్టిలో పెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఈ 22 ఏళ్ల క్రికెటర్‌కు భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంది.