September
-
విద్యుత్ బకాయిలు రూ. 30,777 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) లకు విద్యుత్ వినియోగదారుల నుంచి రావాల్సిన విద్యుత్ బిల్లుల మొండి బకాయిలు గతేడాది సెప్టెంబర్ 30 నాటికి ఏకంగా రూ. 30,777 కోట్లకు ఎగబాకాయి. రూ. 50 వేలు, ఆపై కరెంట్ బిల్లులు బకాయిపడిన వినియోగదారుల నుంచి రావాల్సిన బకాయిలివి. అందులో టీజీఎస్పీడీసీఎల్కు రావాల్సిన బకాయిలు రూ. 17,405.04 కోట్లకాగా టీజీఎన్పిడీసీఎల్కు రావాల్సిన బకాయిలు రూ. 13,372.61 కోట్లుగా ఉన్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్) 2025–26లో ఈ విషయాన్ని డిస్కంలు వెల్లడించాయి. ఎల్టీ కేటగిరీ వినియోగదారుల నుంచి టీజీఎస్పీడీసీఎల్కు రూ. 630.05 కోట్లు, టీజీఎన్పిడీసీఎల్కు రూ.320.66 కోట్లు కలిపి మొత్తం రూ.950.71 కోట్ల బాకాయిలు రావాల్సి ఉంది. ఇక హెచ్‌టీ కేటగిరీ వినియోగదారులు టీజీఎస్పీడీసీఎల్కు రూ.16,774.98 కోట్లు, టీజీఎన్పిడీసీఎల్ రూ.13,051.95 కోట్లు కలిపి మొత్తం రూ.29,826.93 కోట్లు బకాయిపడ్డారు. సర్కారు వారి బకాయిలే అత్యధికం.. మొత్తం బకాయిల్లో రూ. 29,826.93 కోట్లు హెచ్‌టీ కేటగిరీ వినియోగదారులవే. వాటిలో అత్యధిక బకాయిలు ప్రభుత్వం నుంచే రావాల్సి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రాష్ట్ర విద్యుత్ రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారమే డిస్కంలకు వివిధ ప్రభుత్వ శాఖలు రూ. 28 వేల కోట్లపైనే బకాయిపడ్డాయి. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకాలు, వీధిదీపాలు, తాగునీటి సరఫరా పథకాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో ఏటేటా బకాయిలు పెరిగిపోయాయి. టపటపా పేలిన ట్రాన్స్ఫార్మర్లు గతేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య రాష్ట్రవ్యాప్తంగా 52,202 డిస్త్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దగ్ధమయ్యాయి. కేవలం 6 నెలల్లోనే 50 వేలకుపైగా ట్రాన్స్ఫార్మర్లు దగ్ధం కావడం ఓవర్‌లోడ్ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 28,996 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోగా.. టీజీఎన్పిడీసీఎల్ పరిధిలో మొత్తం 24,132 ట్రాన్స్ఫార్మర్లు దగ్ధమయ్యాయి. మరోవైపు అదే కాలానికి విద్యుత్ వినియోగదారులకు సంబంధించిన మొత్తం 2,79,939 విద్యుత్ మీటర్లు దగ్ధం కావడం లేదా పాడయ్యాయి. 6 నెలల్లో 316 మంది బలి గతేడాది ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య రాష్ట్రంలో విద్యుదాఘాతంతో 316 మంది మృతిచెందగా 105 మంది గాయపడ్డారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 99 మంది, టీజీఎన్పిడీసీఎల్ పరిధిలో 217 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 34, కామరెడ్డిలో 20, మహబూబాబాద్, కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో చెరో 19 మంది మరణించారు. పాత కేసులు కలుపుకుని ఈ కాలంలో టీజీఎస్పీడీసీఎల్ 138 మంది, టీజీఎన్పిడీసీఎల్ 165 మంది మృతుల కుటుంబాలకు చెరో రూ. 5 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాయి. ఇక విద్యుత్ సరఫరా అంతరాయాలకు సంబంధించి మొత్తం 5,23,762 ఫిర్యాదులను రెండు డిస్కంలు అందుకున్నాయి. మరోవైపు 53,633 విద్యుత్ చౌర్యం కేసులు నమోదవగా అందుకు సంబంధించి రూ. 65.04 కోట్ల జరిమానాలను డిస్కంలు విధించాయి. 28లోగా అభ్యంతరాలు తెలపండి: టీజీఈఆర్సీ డిస్కంల ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలపై ఈ నెల 28లోగా అభ్యంతరాలు, సలహాలను పంపించాలని టీజీఈఆర్సీ బహిరంగ ప్రకటన జారీ చేసింది. మార్చి 19న హన్మకొండలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందీరంలో, 21న హైదరాబాద్‌లోని టీజీఈఆర్సీ కార్యాలయం(విద్యుత్ నిలయం)లో బహిరంగ విచారణ నిర్వహిస్తామని వెల్లడించింది. -
జీడీపీ మందగమనం వ్యవస్థీకృతం కాదు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి తగ్గుముఖం పట్టడం అన్నది.. వ్యవస్థీకృతం కాదని (ఆర్థిక వ్యవస్థ అంతటా) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి మెరుగైన మూలధన వ్యయాల మద్దతుతోతగ్గిన మేర డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) భర్తీ అయ్యి మోస్తరు స్థాయికి వృద్ధి చేరుకుంటున్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.4 శాతానికి పడిపోవడం తెలిసిందే. ఇది ఏడు త్రైమాసికాల కనిష్ట రేటు కావడం గమనార్హం. జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు 6.7 శాతంగా ఉంది. ‘‘ఇది వ్యవస్థ అంతటా మందగమనం కాదు. ప్రభుత్వం వైపు నుంచి వ్యయాలు, మూలధన వ్యయాలు లోపించడం వల్లే. క్యూ3లో ఇవన్నీ సర్దుకుంటాయి. భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా వచ్చే ఏడాది, తర్వాత కూడా కొనసాగుతుంది’’అని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆర్థిక మంత్రి చెప్పారు. అంతర్జాతీయ డిమాండ్ స్తబ్దుగా ఉండడం ఎగుమతుల వృద్ధిపై ప్రభావం చూపించినట్టు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి పెద్ద ఎత్తున మూలధన వ్యయాలు చేయకపోవడం, కొన్ని రంగాల్లో తగ్గిన కార్యకలాపాలు వృద్ధిపై ప్రభావం చూపించడం తెలిసిందే. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.11.11 లక్షల కోట్ల మూలధన వ్యయాలను కేంద్రం లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 37.3 శాతమే ఖర్చు చేసింది. చర్యలు తీసుకుంటున్నాం.. ‘‘దేశ ప్రజల కొనుగోలు శక్తి మెరుగుపడుతోంది. అదే సమయంలో వేతనాల్లోనూ మందగమనం ఆందోళనలు నెలకొన్నాయి. ఈ అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇవి దేశ వినియోగంపై ప్రభావం చూపించగలవు. ప్రతి సవాలు నుంచి అవకాశాలను చూసే ప్రధాన మంత్రి మనకు ఉన్నారు. కరోనా సమయంలో ఎదురైన సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని సంస్కరణలు తీసుకొచ్చాం. ఆ సమయంలో ఐదు మినీ బడ్జెట్లను ప్రవేశపెట్టాం. విడిగా ప్రతి ఒక్కటీ తనవంతు మద్దతునిచి్చంది’’అని మంత్రి సీతారామన్ వివరించారు. -
EPFO: కొత్తగా 18.81 లక్షల మందికి పీఎఫ్
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు సెప్టెంబర్‌లో 18.81 లక్షల మంది పెరిగారు. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 9.33 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఉపాధి అవకాశాల పెరుగుదలను ఇది సూచిస్తోంది. వీరిలో 9.47 లక్షల మంది కొత్త సభ్యులు.క్రితం ఏడాది ఇదే నెల కంటే 6.22 శాతం పెరిగారు. సభ్యుల్లో 8.36 లక్షల మంది 18–25 ఏళ్లలోపు వారే (60 శాతం) కావడం గమనార్హం. అంటే వీరు మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు అర్థం చేసుకోవచ్చు. 14.10 లక్షల మంది సభ్యులు సెప్టెంబర్ నెలలో ఈపీఎఫ్‌వో పరిధిలోనే ఒక సంస్థ నుంచి మానేసి, మరో సంస్థలో చేరారు.వార్షికంగా క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే ఇది 18 శాతం అధికం. కొత్త సభ్యుల్లో 2.47 లక్షల మంది మహిళలు ఉన్నారు. 9 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ నెల మొత్తం మీద నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.70 లక్షలుగా ఉంది. ఇది కూడా 12 శాతం అధికం. 21 శాతం మహారాష్ట్ర నుంచే.. సెప్టెంబర్ నెలలో నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర నుంచే 21.20 శాతం మంది ఉన్నారు. ఇక కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యాన, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ నుంచి విడిగా 5 శాతం కంటే ఎక్కువ సభ్యులు చేరారు. నైపుణ్య సేవలు, ట్రేడింగ్–వాణిజ్య సంస్థలు, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, వస్త్రాల తయారీ, క్లీనింగ్, స్వీపింగ్ సేవలు, హాస్పిటళ్లలో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. -
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 7 శాతం అప్
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో సగటున 7 శాతం పెరిగినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌టైగర్ తెలిపింది. దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో ఇళ్ల ధరలు 7– 57 శాతం మధ్య పెరిగాయని.. అతి తక్కువ వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైనట్టు ప్రకటించింది. హైదరాబాద్ మార్కెట్లో చదరపు అడుగు ధర రూ.7,050కు పెరిగింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.6,580గా ఉంది. అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ధరల పెరుగుదల 57 శాతంగా ఉంది. అక్కడ చదరపు అడుగు ధర రూ.8,017కు చేరింది. డిమాండ్ పెరగడమే ధరల వృద్ధికి కారణమని వివరించింది. ‘‘ఆర్బీఐ గడిచిన 10 పాలసీ సమీక్షల్లో రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించడం ధరలపై మరింత ఒత్తిడికి దారితీసింది. రేట్ల తగ్గింపు లేకపోవడంతో డెవలపర్లు రుణాలపై అధిక వడ్డీ చెల్లింపులు చేయాల్సి వచి్చంది. ఇది ఇళ్ల ధరల అందుబాటుపై ప్రభావం చూపించింది’’అని ప్రాప్‌టైగర్ నివేదిక తెలిపింది. ఇతర పట్టణాల్లో ధరల పెరుగుదల.. → బెంగళూరులో ఇళ్ల ధరలు సెప్టెంబర్ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 15 శాతం పెరిగి చదరపు అడుగు రూ.7,512కు చేరింది. → చెన్నైలో 22 శాతం మేర ధరలు పెరిగాయి. చదరపు అడుగు రూ.7,179కు చేరుకుంది. → కోల్‌కతాలో ఇళ్ల ధరలు చదరపు అడుగు రూ.5,844కు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని ధరతో పోల్చి చూస్తే 22 శాతం అధికం. → ముంబైలో ధరలు 21 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.12,590గా నమోదైంది. → పుణెలో 18 శాతం వృద్ధితో చదరపు అడుగుకు రూ.6,953కు చేరింది. → అహ్మదాబాద్ పట్టణంలో ధరలు 21 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.4,736గా నమోదైంది. బలంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇళ్ల ధరలు స్థిరంగా పెరుగుతుండడం దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో బలాన్ని, వృద్ధి అవకాశాలను తెలియజేస్తున్నట్టు బీపీటీపీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్) హరీందర్ దిల్లాన్ పేర్కొన్నారు. నాణ్యమైన ప్రాపరీ్టలకు అధిక డిమాండ్ నెలకొనడం ఢిల్లీ ఎన్సీఆర్, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లో ధరల పెరుగుదల అధికంగా ఉండడానికి కారణమని చెప్పారు. దక్షిణాది మార్కెట్లలో కొత్త ఇళ్ల ప్రారం¿ోత్సవాలు తగ్గడం మార్కెట్లో దిద్దుబాటును సూచిస్తున్నట్టు బీసీడీ గ్రూప్ సీఎండీ అంగద్ బేదీ తెలిపారు. -
సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు ఎంతంటే..
అక్టోబర్ 1న విడుదలైన ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. భారతదేశ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సెప్టెంబర్‌లో రూ. 1.73 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో (2023 సెప్టెంబర్) జీఎస్టీ వసూళ్లు మొత్తం 1.62 లక్షల కోట్లు.2023 సెప్టెంబర్ కంటే కూడా 2024 సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు 6.5 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 2024 ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు 1.75 లక్షల కోట్లు. గత నెలలో వ్యాపార కార్యకపాల ద్వారా ఆదాయం 5.9 శాతం (రూ.1.27 లక్షల కోట్లు) పెరిగింది. వస్తువుల దిగుమతుల ద్వారా కూడా ఆదాయం 8 శాతం (రూ.45,390 కోట్లు) పెరిగింది. మొత్తం మీద గత ఏడాది సెప్టెంబర్ కంటే కూడా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
బాహు‘బుల్’ ఐపీఓలొస్తున్నాయ్!
ఇప్పటిదాకా వచ్చినవి ఒక రేంజ్.. ఇకపై వచ్చేవి వేరే లెవెల్! అడుగుపెడితే మార్కెట్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే!! ఇప్పటికే సెపె్టంబర్లో ఇన్వెస్టర్లు ఐపీఓల వర్షంలో ముద్దవుతుండగా.. రాబోయే రెండు నెలల్లో బాహుబలి ఆఫర్లు మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. దేశంలో రెండో బడా కార్ల కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా అతిపెద్ద ఇష్యూగా రికార్డు బ్రేక్ చేయనుంది. ఇక ఫుడ్–గ్రాసరీ డెలివరీ దిగ్గజం స్విగ్గీ రెండో మెగా స్టార్టప్ ఆఫర్‌గా నిలవనుంది. ఈ రెండింటికీ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక మెగా ఐపీఓల జాతరకు రంగం సిద్ధమైంది. దక్షిణకొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్ ఐపీఓకు సెబీ తాజాగా ఆమోదం తెలపడంతో పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ కనీసం 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరించనుంది. హ్యుందాయ్ ఇండియా మాతృ సంస్థ (ప్రమోటర్) హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో కొంత వాటాను, అంటే 14.22 కోట్ల షేర్లను విక్రయిచనుంది. తాజా ఈక్విటీ షేర్లు ఏవీ జారీ చేయడం లేదు. ఈ ఇష్యూ పూర్తయితే ఎల్ఐసీ రికార్డును బద్దలవుతుంది. 2022లో ఎల్ఐసీ ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్లను సమీకరించింది. ఇప్పటిదాకా ఇదే దలాల్ స్ట్రీట్‌లో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్.రెండు దశాబ్దాల తర్వాత... దేశీ వాహన పరిశ్రమలో ఇదో సరికొత్త మైలురాయిగా నిలవనుంది. 2003లో జపాన్ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ లిస్టింగ్ అయిన రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ దేశీయంగా ఒక కార్ల కంపెనీ ఐపీఓకు వస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. అమ్మకాల పరంగా దేశంలో రెండో అతిపెద్ద కార్ల కంపెనీగా నిలుస్తున్న హ్యుందాయ్ ఇండియా మార్కెట్ క్యాప్ (విలువ) 18–20 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం మారుతీ మార్కెట్ విలువ దాదాపు 48 బిలియన్ డాలర్లు. కాగా, అక్టోబర్‌లో హ్యుందాయ్ ఐపీఓ వస్తుందని సమాచారం. 1996లో భారత్‌లోకి అడుగుపెట్టిన హ్యుందాయ్.. వివిధ కార్ల విభాగాల్లో 13 మోడల్స్ విక్రయిస్తోంది. గత నెలలో ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఐపీఓ ద్వారా రూ.6,145 కోట్ల సమీకరించడంతో పాటు బంపర్ లిస్టింగ్ నేపథ్యంలో హ్యుందాయ్ మెగా ఇష్యూపై ఇన్వెస్టర్లు గురిపెడుతున్నారు. స్విగ్గీ డెలివరీ రెడీ...ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీకి కూడా సెబీ నుంచి ప్రాథమిక ఆమోదం లభించింది. సెబీ కొన్ని మార్పుచేర్పులు సూచించడంతో తుది డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను కంపెనీ త్వరలో దాఖలు చేయనుంది. ఏప్రిల్‌లో వాటాదారుల ఆమోదం ప్రకారం ఈ మెగా ఇష్యూ ద్వారా రూ.10,414 కోట్లను స్విగ్గీ సమీకరించనుంది. ఇందులో రూ.3,750 కోట్లను తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా కంపెనీ సమీకరించనుంది. మిగతా మొత్తాన్ని ప్రస్తుత ఇన్వెస్టర్లు కొంత వాటాను విక్రయించి సొమ్ము చేసుకోనున్నారు. తుది ఆమోదం మేరకు ఇష్యూ సైజు 1.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11,700 కోట్లు) ఉండొచ్చని అంచనా. 2014లో ఆరంభమైన స్విగ్గీ ప్రస్తు తం ఫుడ్ డెలివరీతో పాటు క్విక్ కామర్స్ (ఇన్‌స్టామార్ట్), హైపర్ లోకల్ లాజిస్టిక్స్ విభాగాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ 13 బిలియన్ డాలర్లుగా అంచనా. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1.09 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. 4,700 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, జొమాటో 2021లో బంపర్ లిస్టింగ్‌తో బోణీ చేసింది. రూ.9,375 కోట్లు సమీకరించింది. రూ.76 ఇష్యూ ధర కాగా, 60% ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయింది. రెండేళ్లలో జొమాటో షేరు రూ.46 కనిష్ట స్థాయి నుంచి 520 శాతం (ప్రస్తుత ధర 286) ఎగబాకడం విశేషం. కాగా, స్విగ్గీ ఐపీఓ నవంబర్‌లో ఉండొచ్చనేది మార్కెట్ వర్గాల సమాచారం.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
బ్యాంకులకు ఆరు రోజులు వరుస సెలవులు
బ్యాంకులు ప్రజల దైనందిన జీవితంలో భాగంగా మారాయి. ఎంత ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఏదో ఒక పని కోసం బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటోంది. ఈ క్రమంలో బ్యాంకులు ఏ రోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయి.. ఎప్పుడు సెలవులు ఉంటాయన్నది తెలుసుకోవడం చాలా అవసరం.ప్రతి నెలలో ఉన్నట్లుగానే సెప్టెంబరు నెలలోనూ ఆది, రెండు, నాలులో శనివారాలతో పాటు పండుగలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఇటీవలే గణేష్ చతుర్థి సందర్భంగా చాలా నగరాల్లో బ్యాంకులు మూతపడ్డాయి. తాజాగా శుక్రవారం (సెప్టెంబర్ 13) నుంచి ఆరు రోజులుపాటు వరుస సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు దేశవ్యాప్తంగా కాక ఆయా ప్రాంతాలను బట్టి ఉన్నాయి.ఇదీ చదవండి: ‘స్టార్ ధన వృద్ధి’.. బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్ఆర్బీఐ విడుదల చేసిన సెప్టెంబర్ బ్యాంక్ హాలిడే లిస్ట్ ప్రకారం.. సెప్టెంబర్ 13 నుండి 18 వరకు బ్యాంక్ సెలవులు ఉండబోతున్నాయి. ఏయే రోజుల్లో ఎక్కడెక్కడ సెలవుందో చూడండి..» సెప్టెంబర్ 13 రామ్‌దేవ్ జయంతి తేజ దశమి సందర్భంగా రాజస్థాన్‌లో సెలవు» సెప్టెంబర్ 14 రెండో శనివారం దేశవ్యాప్తంగా హాలిడే» సెప్టెంబర్ 15 ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు» సెప్టెంబర్ 16 ఈద్ ఈ మిలాద్ సందర్భంగా చాలా ప్రాంతాల్లో సెలవు» సెప్టెంబర్ 17 ఇంద్ర జాతర సందర్భంగా సిక్కింలో హాలిడే» సెప్టెంబర్ 18 శ్రీ నారాయణగురు జయంతి సందర్భంగా కేరళలో సెలవుసెలవు రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. ఎక్కువ రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి బ్యాంకుల్లో పనులు ఉన్నవారు వీటికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నందున ఖాతాదారులు వీటిని విగియోగించుకోవచ్చు. -
వాతావరణం లో అపరిచిత ధోరణులు
వాన రాకడ, ప్రాణం పోకడ తెలియదంటారు. కొన్నేళ్లుగా మన దేశంలో వానాకాలం ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పటిదాకా కొనసాగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు అకాలంలో భారీ వానలు, సీజన్ మధ్యలో విపరీతమైన ఎండలు పరిపాటిగా మారాయి. వాతావరణ తీరుతెన్నుల్లో ఈ భారీ మార్పులు భారత్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాల సీజన్ తీరుతెన్నులే మారిపోతున్నాయి. సీజనల్ వానలు సాధారణంగా జూన్ తొలి, లేదా రెండో వారంలో మొదలై సెపె్టంబర్లో తగ్గుముఖం పడతాయి. కానీ ఈ క్రమం కొన్నేళ్లుగా భారీ మార్పుచేర్పులకు లోనవుతోంది. వానలు ఆలస్యంగా మొదలవడం, సెప్టెంబర్‌ను దాటేసి అక్టోబర్ దాకా కొనసాగడం పరిపాటిగా మారింది. దాంతో ఖరీఫ్ పంటలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. సరిగ్గా చేతికొచ్చే వేళ వానల కారణంగా దెబ్బ తినిపోతున్నాయి. ప్రస్తుత వర్షాకాల సీజన్ కూడా అక్టోబర్ దాకా కొనసాగవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలు గుబులు రేపుతున్నాయి. ఇదంతా వాతావరణ మార్పుల తాలూకు విపరిణామమేనని సైంటిస్టులు చెబుతున్నారు... భారత్‌లో వర్షాకాలం రాకపోకల్లో మార్పులు ఒకట్రెండేళ్లలో మొదలైనవేమీ కాదు. పదేళ్లుగా క్రమంగా చోటుచేసుకుంటూ వస్తున్నాయి. ఏటా పలు రాష్ట్రాల్లో భయానక వరదలకే గాక తీవ్ర పంట నష్టానికీ దారి తీస్తున్నాయి. ఈ ధోరణి దేశ ఆహార భద్రతకు కూడా సవాలుగా పరిణమిస్తోంది. దీన్ని ఎదుర్కోవాలంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు పద్ధతులను మార్చుకోవడం మినహా ప్రస్తుతానికి మరో మార్గాంతరమేదీ లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ‘‘మన దేశంలో వర్షాలకు ప్రధాన కారణమైన నైరుతీ రుతుపవనాల కదలికలు కొన్నేళ్లుగా బాగా మందగిస్తున్నాయి. వాటి విస్తరణే గాక ఉపసంహరణ కూడా నెమ్మదిస్తూ వస్తోంది. మనం ఒప్పుకోక తప్పని వాతావరణ మార్పులివి. మన సాగు పద్ధతులనూ అందుకు తగ్గట్టుగా మార్చుకోవాల్సిందే’’ అని చెబుతున్నారు. అంతా గందరగోళమే... సీజన్లో మార్పుచేర్పుల వల్ల ఉత్తర, పశ్చిమ భారతాల్లో కొన్నేళ్లుగా భారీ వర్షపాతం నమోదవుతోంది. గుజరాత్, రాజస్తాన్‌లలో గత దశాబ్ద కాలంగా సగటున ఏకంగా 30 శాతం అధిక వర్షపాతం నమోదవడమే ఇందుకు తార్కాణం. ఆ ప్రాంతాల్లో గతంలో లేని భారీ వర్షాలు ఇప్పుడు మామూలు దృశ్యంగా మారాయి. ఇక గంగా మైదాన ప్రాంతాల్లో అక్టోబర్ దాకా కొనసాగుతున్న భారీ వానలు ఉత్తరాఖండ్, యూపీ, బిహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో పంటల సీజన్‌నే అతలాకుతలం చేసేస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో అక్టోబర్ తొలి వారంలో పంట కోతలు జరుగుతాయి. అదే సమయంలో వానలు విరుచుకుపడుతున్నాయి. ‘‘దాంతో కోతలు ఆలస్యమవడమే గాక పంట నాణ్యత కూడా తీవ్రంగా దెబ్బ తింటోంది. మొత్తంగా వరి, మొక్కజొన్న, పప్పుల దిగుబడి బాగా తగ్గుతోంది’’ అని కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎని్వరాన్‌మెంట్ అండ్ వాటర్‌లో సీనియర్ ప్రోగ్రాం లీడ్ విశ్వాస్ చితాలే అన్నారు. ఆహార భద్రతకూ ముప్పు వర్షాలు సీజన్‌ను దాటి కొనసాగడం వల్ల ఖరీఫ్ పంటలు దారుణంగా దెబ్బ తింటున్నాయి. ఈ ఖరీఫ్‌లో దేశవ్యాప్తంగా 408.72 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. ఈసారి వర్షాలు అక్టోబర్ దాకా కొనసాగుతాయన్న అంచనాలు ఇప్పట్నుంచే గుబులు రేపుతున్నాయి. ఇది తీవ్ర పంట నష్టానికి, తద్వారా దేశవ్యాప్తంగా బియ్యం, పప్పుల కొరతకు దారి తీయడం తప్పకపోవచ్చంటున్నారు. → ఇలా సీజన్ దాటాక కొనసాగిన భారీ వర్షాలు, వరదల దెబ్బకు 2016 నుంచి 2022 మధ్యలో దేశవ్యాప్తంగా మొత్తమ్మీద 3.4 కోట్ల హెక్టార్ల సాగు విస్తీర్ణంలో పంటలు దారుణంగా దెబ్బ తిన్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. → వాతావరణ మార్పుల దెబ్బకు 2022లో భారత్‌లో జీడీపీ వృద్ధిలో 8 శాతం క్షీణత నమోదైంది. 7.5 శాతం సంపద హరించుకుపోయింది. → సాధారణంగా సెపె్టంబర్ తర్వాత భారీ వర్షాలు కురవని పశి్చమ భారతదేశం ఈ మార్పులకు తాళలేకపోతోంది. అక్కడి నీటి నిర్వహణ వ్యవస్థ ఈ వరదలను తట్టుకోలేకపోతోంది. → ఈ సరికొత్త వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు వినూత్న పద్ధతులు అవలంబించాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. → డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం, ఇటు వరదలను, అటు కరువు పరిస్థితులను సమర్థంగా తట్టుకునే వంగడాలను అందుబాటులోకి తేవడం, వినూత్న వ్యవసాయ పద్ధతులను అవలంబించడం తప్పదంటున్నారు.మన నిర్వాకమే...! మనిషి నిర్వాకం వల్ల తీవ్ర రూపు దాలుస్తున్న వాతావరణ మార్పులే వానల సీజన్లో తీవ్ర హెచ్చుతగ్గులకు ప్రధాన కారణమని సైంటిస్టులు చెబుతున్నారు. → సముద్రాల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాతావరణంలో తేమ శాతం పెరుగుతోంది. భారీ వర్షాలు, వరదలకు దారి తీస్తోంది. → ఎల్ నినో, లా నినా వంటివి పరిస్థితులను మరింత దిగజారుస్తున్నాయి. → ఎల్ నినోతో వర్షాకాలం కుంచించుకుపోయి పలు ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది. → లా నినా వల్ల వర్షాలు సుదీర్ఘకాలం కొనసాగి వరదలు పోటెత్తుతున్నాయి. → సాగు, నీటి నిర్వహణతో పాటు దేశంలో సాధారణ జన జీవనమే తీవ్రంగా ప్రభావితమవుతోంది.85 శాతం జిల్లాలపై ప్రభావం మన దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు గత పదిహేనేళ్లలో ఏకంగా ఐదు రెట్లు పెరిగిపోయాయి. ఈ ధోరణి దేశవ్యాప్తంగా ఏకంగా 85 శాతం పై చిలుకు జిల్లాలను ప్రభావితం చేస్తోంది. వరదలు, తుఫాన్లు, కరువులు, తీవ్ర వడగాడ్పులతో కిందామీదా పడుతున్నట్టు ఐపీఈ–గ్లోబల్, ఎస్రి–ఇండియా సంయుక్త అధ్యయనం తేలి్చంది. అయితే వీటిలో సగానికి పైగా జిల్లాల్లో గతంలో తరచూ వరద బారిన పడేవేమో కొన్నేళ్లుగా కరువుతో అల్లాడుతున్నాయి. కరువు బారిన పడే జిల్లాలు ఇప్పుడు వరదలతో అతలాకుతలమవుతున్నాయి! గత 50 ఏళ్ల వాతావరణ గణాంకాలను లోతుగా విశ్లేíÙంచిన మీదట ఈ మేరకు వెల్లడైంది. వాతావరణ మార్పుల వల్ల దేశానికి ఎదురవుతున్న ముప్పును ఇవి కళ్లకు కడుతున్నాయని అధ్యయనం పేర్కొంది. ఇంకా ఏం చెప్పిందంటే... → పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2036 నాటికి ఏకంగా 147 కోట్ల మంది భారతీయులు తీవ్ర వాతావరణ పరిస్థితుల ప్రభావానికి లోనవుతారు. → దేశంలోని తూర్పు, ఈశాన్య, దక్షిణాది ప్రాంతాల్లో తీవ్ర వరదలు పరిపాటిగా మారతాయి. → ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్నాటకల్లో కరువు పరిస్థితులు పెరిగిపోతాయి. శ్రీకాకుళం, గుంటూరు, కర్నూలు, కటక్ (ఒడిశా) వంటి జిల్లాల్లో ఈ మార్పులు కొట్టొచి్చనట్టు కని్పస్తున్నాయి. → ఏపీతో పాటు ఒడిశా, బిహార్, గుజరాత్, రాజస్తాన్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, అసోం, యూపీల్లో 60 శాతానికి పైగా జిల్లాలు తరచూ ఇటు కరువు, అటు వరదలతో కూడిన తీవ్ర వాతారణ పరిస్థితుల బారిన పడుతున్నాయి. → త్రిపుర, కేరళ, బిహార్, పంజాబ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కరువు ప్రాంతాల్లో వరదలు, వరద ప్రాంతాల్లో కరువులు పరిపాటిగా మారతాయి. → బెంగళూరు, పుణే, అహ్మదాబాద్, పటా్న, ప్రయాగ్‌రాజ్ వంటి నగరాలు, వాటి పరిసర ప్రాంతాలు ఈ ‘కరువు–వరద’ ట్రెండుతో అతలాకుతలమవుతున్నాయి. → గత శతాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సగటున 0.6 డిగ్రీ సెల్సియస్ మేరకు పెరిగిపోవడమే ఈ విపరీత వాతావరణ పరిస్థితులకు ప్రధాన కారణం.ఏం చేయాలి? → వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు పసిగడుతూ సాగు తీరుతెన్నులను కూడా తదనుగుణంగా మార్చుకోవడం ఇకపై తప్పనిసరి. → ఇందుకోసం సమీకృత క్లైమేట్ రిస్క్ అబ్జర్వేటరీ (సీఆర్ఓ), ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లైమేట్ ఫండ్ (ఐసీఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. → ప్రతి సీజన్లోనూ వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా పంటలను మార్చుకుంటూ వెళ్లాలి. → జాతీయ, రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయిల్లో పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు ప్రణాళికలను మార్చుకోవాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సెప్టెంబర్ మాసం... ఐపీఓల వర్షం!
స్టాక్ మార్కెట్ జోరు నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ నెలలో ఇష్యూల వర్షం కురవనుంది. 2010 సెప్టెంబర్‌లో అత్యధికంగా 15 ఐపీఓలతో రికార్డు నమోదైంది. ప్రస్తుతం ప్రైమరీ మార్కెట్లో జోరు చూస్తుంటే ఈ ఏడాది ఆ 14 ఏళ్ల రికార్డు బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది.వరుస ఐపీఓలతో సెప్టెంబర్ నెలలో స్టాక్ మార్కెట్ కళకళలాడనుంది. ఇప్పటికే గాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్, బాజార్ స్టయిల్ రిటైల్ ఇష్యూలు పూర్తయ్యాయి. ఇంకా అనేక ఇష్యూలు నిధుల సమీకరణ బాటలో ఉన్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో పాటు నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్, గరుడా కన్స్ట్రక్షన్స్, మన్బా ఫైనాన్స్ సహా అనేక కంపెనీలు పబ్లిక్ ఇష్యూల మోత మోగించనున్నాయి. దీంతో 2010 సెప్టెంబర్ నెల 15 ఐపీఓల రికార్డు తుడిచిపెట్టుకుపోవచ్చనేది మార్కెట్ వర్గాల అంచనా. ఇన్వెస్టర్ల నుంచి పటిష్టమైన డిమాండ్‌కు సెకండరీ మార్కెట్లో నెలకొన్న ఉత్సాహం తోడవడంతో మరిన్ని కంపెనీలు ఐపీఓల బాట పట్టేందుకు దోహదం చేస్తోందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు చెబుతున్నారు. ‘వచ్చే కొన్ని వారాల్లో చాలా కంపెనీలు పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్నాయి. ఇటీవలి ఐపీఓలకు బలమైన డిమాండ్‌తో పాటు దేశీయ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి నిధుల ప్రవాహం తగినంతగా ఉండటం కూడా దీనికి ప్రధాన కారణం‘. మరోపక్క తాజా ఇష్యూలు లిస్టింగ్‌లోనూ, ఆ తర్వాత కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలు పంచడం మార్కెట్లో మరింత జోష్ నింపుతోంది’ అని కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎండీ వి. జయశంకర్ పేర్కొన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో నిధుల వెల్లువ... ఈ ఏడాది ఇప్పటిదాకా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ.55,300 కోట్ల నిధులను ఐపీఓల్లో కుమ్మరించారు. మరోపక్క, సెకండరీ మార్కెట్లో రూ.2,700 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. రూ. 6,560 కోట్ల బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ భారీ ఇష్యూ 9న మొదలవుతోంది. దీని ప్రైస్ బ్యాండ్ రూ.66–70. టోలిన్స్ టైర్స్ రూ.230 కోట్ల నిధుల కోసం 9న మార్కెట్ తలుపుతడుతోంది. ఇక పీఎన్ గాడ్గిల్ జ్యువెల్లర్స్ రూ.228–240 ధరల శ్రేణితో ఈ నెల 10న ఐపీఓకు వస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన రూ.11,893 కోట్ల విలువైన 14 ఐపీఓలే ఇటీవలి కాలంలో అత్యధికంగా నిలుస్తున్నాయి. 2024 ఆగస్ట్‌లో 10 కంపెనీలు రూ.17,076 కోట్ల నిధులను సమీకరించాయి. ‘మెరుగైన వ్యాపారావకాశాల నేపథ్యంలో భారత కార్పొరేట్ సంస్థలు ప్లాంట్ల విస్తరణతో పాటు కంపెనీల కొనుగోళ్ల జోరు పెంచాయి. మరోపక్క, పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు ఆడిట్ చేసిన ఆర్థిక ఫలితాల గడువు ఆరు నెలలు మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్నెల్ల గడువు సెప్టెంబర్‌తో ముగియనుంది. ఈలోపు ఐపీఓ పూర్తి చేయకపోతే, మళ్లీ ఆడిట్ చేయడంతో పాటు ఐపీవో ముసాయిదా దర ఖాస్తు పత్రాలను మా ర్చాల్సి ఉంటుంది. దీనివల్ల ఇష్యూ జాప్యానికి దారితీస్తుంది. అందుకే కంపెనీలు వరుసకడుతున్నాయి’ అని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ రవి శంకర్ చెప్పారు.ఎగబడుతున్న ఇన్వెస్టర్లు.. లిస్టింగ్‌లో అసాధారణ లాభాలిస్తుండటంతో ఇటీవలి కాలంలో మార్కెట్లోకి ఏ ఐపీఓ వచ్చినా రిటైల్ ఇన్వెస్టర్లు ఎగబడిపోతున్నారు. ఈ నెల 4న ముగిసిన రూ.168 కోట్ల గాలా ప్రెసిషన్ ఇష్యూ 201 రెట్లు అధికంగా సబ్‌్రస్కయిబ్ అయింది. బాజార్ స్టయిల్‌కు 41 రెట్ల స్పందన లభించింది. అంతక్రితం ఎకోస్ మొబిలిలిటీకి 64 రెట్లు సబ్‌్రస్కిప్షన్ లభించింది. అంతేకాదు, ఇది 32 శాతం ప్రీమియంతో లిస్టయింది కూడా. ప్రీమియర్ ఎనర్జీస్ 87 శాతం, ఓరియంట్ టెక్నాలజీస్ 48 శాతం చొప్పన లిస్టింగ్ లాభాలను పంచాయి. ఆగస్ట్‌లో లిస్టయిన 8 ఐపీఓల సగటు లాభం 36 శాతం కావడం గమనార్హం.మార్కెట్ రికార్డులు, ఐపీఓల వరదతో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆగస్ట్‌లో 41.4 లక్షల డీమ్యాట్ ఖాతాలు జత కావడంతో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 17.1 కోట్లకు దూసుకెళ్లింది. ఇది ఆల్‌టైమ్ రికార్డు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
3 నుంచి ప్రధాని బ్రూనై, సింగపూర్ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సెప్టెంబర్ మొదటి వారంలో సింగపూర్, బ్రూనై దేశాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 3–4వ తేదీల్లో ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. భారత ప్రధాని ఒకరు బ్రూనైలో పర్యటించడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు 40 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రధాని అక్కడికి వెళ్తున్నారన్నారు. బ్రూనై నుంచి ప్రధాని సెప్టెంబర్ 4–5 తేదీల్లో సింగ్‌పూర్‌ను సందర్శిస్తారని చెప్పారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహా్వనం మేరకు మోదీ ఈ పర్యటన చేపట్టనున్నారని జైశ్వాల్ వివరించారు. -
సెప్టెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ఏకంగా 14 రోజులు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఈ నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మూసివేతలలో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ సెలవుదినాలు ఉన్నాయి.►5 సెప్టెంబర్: శ్రీమంత శంకరదేవుని తిథి (అస్సాంలో బ్యాంకులు సెలవు)►7 సెప్టెంబర్: వినాయక చవితి, శనివారం►8 సెప్టెంబర్: ఆదివారం►13 సెప్టెంబర్: రామ్‌దేవ్ జయంతి (రాజస్థాన్‌లో బ్యాంకులు సెలవు)►14 సెప్టెంబర్: రెండవ శనివారం►15 సెప్టెంబర్: ఆదివారం ►16 సెప్టెంబర్: మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్ (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు) ►17 సెప్టెంబర్: ఇంద్ర జాత్ర (సిక్కింలో బ్యాంకులు సెలవు)►18 సెప్టెంబర్: శ్రీ నారాయణగురు జయంతి (కేరళలో బ్యాంకులు సెలవు)►21 సెప్టెంబర్ 21: శ్రీ నారాయణగురు సమాధి (కేరళలో బ్యాంకులు సెలవు)►22 సెప్టెంబర్: ఆదివారం►23 సెప్టెంబర్: బలిదాన్ డే (హర్యానాలో బ్యాంకులు సెలవు)►28 సెప్టెంబర్: నాల్గవ శనివారం ►29 సెప్టెంబర్: ఆదివారంబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
గ్యాస్ నుంచి ఆధార్ వరకు.. వచ్చే నెలలో మార్పులు
ఆగస్ట్ నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతోంది. ప్రజల ఆర్థిక స్థితిని నేరుగా ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన మార్పులు సెప్టెంబర్ నుండి జరగబోతున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధరల నుండి ఆధార్ అప్డేట్ వరకు రానున్న మార్పులు, కొత్త క్రెడిట్ కార్డ్ నియమాలు మీ బడ్జెట్‌ను ఎలా ప్రభావితం చేస్తాయో ఇక్కడ చూద్దాం..ఎల్పీజీ ధరలుప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన ఎల్పీజీ ధరలను సవరించడం సర్వసాధారణం. ఈ సర్దుబాట్లు వాణిజ్య, డొమెస్టక్ గ్యాస్ సిలిండర్లపై ప్రభావం చూపుతాయి. గత నెలలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.8.50 పెరిగింది. జూలైలో రూ.30 తగ్గింది. మరోసారి సెప్టెంబర్‌లో ఎల్పీజీ సిలిండర్ల ధర మార్పుపై అంచనాలు ఉన్నాయి.సీఎన్జీ, పీఎన్జీ రేట్లుఎల్పీజీ ధరలతో పాటు, చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF), సీఎన్జీ, పీఎన్జీ ధరలను కూడా సవరిస్తాయి. అందువల్ల, ఈ ఇంధనాల ధరల సవరణలు కూడా సెప్టెంబర్ మొదటి రోజున జరుగుతాయి.ఆధార్ కార్డ్ ఉచిత అప్‌డేట్ఆధార్ కార్డ్‌లను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14. ఈ తేదీ తర్వాత, ఆధార్ కార్డ్‌లకు నిర్దిష్ట అప్డేట్లు చేసుకునేందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత ఆధార్ అప్డేట్ల కోసం గతంలో జూన్ 14 వరకే గడువు విధించగా దాన్ని సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు.క్రెడిట్ కార్డ్ నియమాలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ యుటిలిటీ లావాదేవీల ద్వారా ఆర్జించే రివార్డ్ పాయింట్లపై సెప్టెంబర్ 1 నుండి పరిమితిని ప్రవేశపెడుతోంది. ఇకపై ఈ లావాదేవీలపై కస్టమర్లు నెలకు గరిష్టంగా 2,000 పాయింట్లను మాత్రమే పొందగలరు. థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా చేసిన విద్యాపరమైన చెల్లింపులకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ లభించవు.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సెప్టెంబర్ 2024 నుండి క్రెడిట్ కార్డ్‌లపై చెల్లించాల్సిన కనీస చెల్లింపును తగ్గిస్తోంది. అలాగే పేమెంట్ విండో 15 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా, యూపీఐ, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో రూపే క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్లు ఇతర చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ల మాదిదే రివార్డ్ పాయింట్స్ అందుకుంటారు.మోసపూరిత కాల్స్ నియమాలుమోసపూరిత కాల్స్, సందేశాలపై సెప్టెంబర్ 1 నుండి కఠినమైన నిబంధనలు ఉండవచ్చు. ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ట్రాయ్ టెలికాం కంపెనీలను ఆదేశించింది. 140 మొబైల్ నంబర్ సిరీస్‌తో ప్రారంభమయ్యే టెలిమార్కెటింగ్ కాల్స్, వాణిజ్య సందేశాలను సెప్టెంబర్ 30 నాటికి బ్లాక్‌చెయిన్ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (DLT) ప్లాట్‌ఫారమ్‌కి మార్చడానికి ట్రాయ్ కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది.డియర్నెస్ అలవెన్స్కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సెప్టెంబరులో డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును ప్రకటించనుందని ఊహాగానాలు ఉన్నాయి. ప్రభుత్వం డీఏని 3 శాతం పెంచవచ్చు. అంటే ప్రస్తుతం 50% ఉన్న డీఏ 53 శాతానికి పెరిగే అవకాశం ఉంది. -
5 డోర్ల థార్ ‘రాక్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మహీంద్రా అయిదు డోర్ల థార్ రాక్స్ భారత్‌లో ఎంట్రీ ఇచి్చంది. ప్రారంభ ధర ఎక్స్‌షోరూంలో రూ.12.99 లక్షలు. సెప్టెంబర్ 14 నుంచి టెస్ట్ డ్రైవ్ కోసం రాక్స్ అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 3 నుంచి బుకింగ్స్ ప్రారంభం. దసరా నుంచి డెలివరీలు ఉంటాయి. 2 లీటర్ ఎం–స్టాలియన్ టీజీడీఐ పెట్రోల్ ఇంజన్, 2.2 లీటర్ ఎం–హాక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్‌లో ఆరు వేరియంట్లలో రేర్ వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ డ్రైవ్ట్రెయిన్తో లభిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంచుకోవచ్చు. 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, కీ లెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, 644 లీటర్స్ బూట్ స్పేస్ వంటి హంగులు ఉన్నాయి. -
సెప్టెంబర్ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి మొదలు పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసింది. దీనిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి ఈ నెలాఖరుకు తుది కీ విడుదల చేసే వీలుంది. మరోవైపు జిల్లాల వారీగా పోస్టులు, డీఎస్సీ పరీక్ష రాసిన వారి వివరాలను క్రోడీకరిస్తున్నారు. రోస్టర్ విధానం, వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై అధికారులు దృష్టి పెట్టారు. పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించడం వల్ల ఫలితాలను తేలికగా వెల్లడించే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఫైనల్ కీ విడుదల చేసిన రోజు.. లేదా మర్నాడు ఫలితాలను వెల్లడించే వీలుంది. ఆ తర్వాత వారం రోజుల్లో సీనియారిటీ జాబితాను రూపొందించే యోచనలో ఉన్నారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవల పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 3,29,897 మంది దరఖాస్తు చేస్తే, 2,79,957 మంది పరీక్ష రాశారు. కేంద్రీకృత ప్రక్రియరోస్టర్ విధానం, జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించిన డేటా, ఇతర అంశాలన్నీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ పరిధిలోనే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతీ జిల్లాలోనూ టీచర్ పోస్టుకు ముగ్గురు చొప్పున మెరిట్ పద్ధతిన ఎంపిక చేసి, ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపాలని నిర్ణయించారు. జిల్లా ఎంపిక కమిటీ ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తుంది. వ్యక్తిగత వివరాల విచారణ నివేదికలను తెప్పించేందుకు అన్ని జిల్లాల పోలీసు అధికారులకు కేంద్ర కార్యాలయం నుంచే జాబితాలు పంపాలని భావిస్తున్నారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ మూడోవారంలో ముగించి, జిల్లా కేంద్రాల్లో నియామక ప్రక్రియను నాలుగోవారం నుంచి మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఒక వేళ ఇది ఆలస్యమైతే అక్టోబర్ మొదటి వారంలో నియామక ప్రక్రియ ఉండవచ్చని ఓ అధికారి తెలిపారు. ఏదేమైనప్పటికీ అక్టోబర్ చివరి నాటికి నియామక ఉత్తర్వులను అభ్యర్థులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉప వర్గీకరణ అంశంపై సందేహాలు..కొత్తగా భర్తీ చేసే అన్ని ఉద్యోగ నియామకాల్లో షెడ్యూ ల్డ్ కులాల ఉప వర్గీకరణను అమలు చేస్తామని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల శాసనసభలో తెలిపా రు. అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తెస్తామన్నారు. అ యితే, డీఎస్సీ నోటిఫికేషన్‌ను వర్గీకర ణపై తీర్పు రాక ముందే ఇచ్చారు. కాబట్టి ఈ నియామకాలకు వర్గీకర ణ అంశం చేరిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయ ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అ యితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ వర్గీకరణ అంశం ముందుకొస్తే అనుకున్న తేదీల్లో ఉపాధ్యాయ నియామకాలు కష్టమేనని అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. -
నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబర్ నెల కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబర్ నెల కోటాను మంగళవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందాక ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు, వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలో ఆగస్టు నెల గదుల కోటాను ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు, తిరుమల–తిరుపతి శ్రీవారి సేవ కోటాను ఈ నెల 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ టికెట్లు మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ టికెట్లు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. క్యూ బాట గంగమ్మ ఆలయం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 69,870 మంది స్వామివారిని దర్శించుకున్నారు. కానుకల రూపంలో హుండీలో రూ.4 కోట్లు సమరి్పంచారు. దర్శన టికెట్లు లేని వారికి స్వామివారి దర్శనం 24 గంటల సమయం పడుతోంది. -
జూలై–సెప్టెంబర్‌కల్లా లా నినో
న్యూఢిల్లీ: రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, అసాధారణ వాతావరణ పరిస్థితులను మోసుకొచి్చన 2023–24 ఎల్‌నినో సీజన్ ఈసారి జూలై–సెపె్టంబర్‌కల్లా లా నినోగా మారొచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) తాజా కబురు చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వరసగా 11వ నెల(ఏప్రిల్) అత్యుష్ణ నెలగా రికార్డులకెక్కింది. సముద్రజలాల ఉపరితల ఉష్ణోగ్రతలూ గత 13 నెలలుగా అత్యధిక స్థాయిల్లో నమోదవుతున్నాయని డబ్ల్యూఎంఓ పేర్కొంది. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు వేడిగా ఉండటంతో సంభవించే ఎల్ నినో పరిస్థితులే దీనంతటికీ కారణమని డబ్ల్యూఎంఓ తెలిపింది. అడవుల నరికివేత, కాలుష్యం వంటి మానవ కార్యకలాపాలకుతోడు హరిత వాయువులు ఈ పరిస్థితులకు ప్రధాన కారణంగా నిలిచాయి. ఇంకా కొనసాగుతున్న ఎల్‌నినో కారణంగా భారత్, పాకిస్తాన్సహా దక్షిణాసియాలోని కోట్లాది మంది జనం దారుణమైన వేడిని చవిచూశారు. అయితే జూలై–సెపె్టంబర్‌కల్లా ఎల్‌నినో తగ్గిపోయి లా నినో వచ్చేందుకు 60 శాతం అవకాశముందని, ఆగస్ట్–నవంబర్‌కల్లా అయితే 70 శాతం అవకాశముందని డబ్ల్యూఎంఓ తాజాగా అంచనావేసింది. ఈసారి మళ్లీ ఎల్‌నినో పుంజుకునే అవకాశాలు లేవని తేలి్చచెప్పింది. ఎల్‌నినో కారణంగా భారత్‌లో వర్షపాతం భారీగా తగ్గిపోవడం, లా నినో కారణంగా విస్తారంగా వర్షాలు కురవడం తెల్సిందే. ఆగస్ట్–సెపె్టంబర్ కల్లా భారత్‌లో లా నినో పరిస్థితులు ఏర్పడి చక్కటి వర్షాలు కురుస్తాయని ఇటీవల భారత వాతావరణ శాఖ అంచనావేయడం విదితమే. భారత్‌లో 52 శాతం సాగుభూమి వర్షాధారితం కావడంతో భారతరైతులకు వర్షాలకు అవినాభావ సంబంధం ఏర్పడింది. ‘‘ 2023 జూన్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. మహాసముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలది వచ్చే నెలల్లో కీలక భూమిక’’ అని డబ్ల్యూఎంఓ ఉప ప్రధాన కార్యదర్శి కో బారెట్ అన్నారు. -
తిరుగులేని జియో.. భారీగా పెరిగిన యూజర్లు
న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ యూజర్ల సంఖ్య మరో 34.7 లక్షలు పెరిగి మొత్తం 44.92 కోట్లకు చేరింది. అటు పోటీ సంస్థ భారతి ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ 13.2 లక్షలు పెరగ్గా వొడాఫోన్ ఐడియా యూజర్లు 7.5 లక్షలు తగ్గారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ బుధవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం భారతి ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య 37.77 కోట్లుగా, వొడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్స్ సంఖ్య 22.75 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం వైర్లెస్ సబ్స్క్రైబర్స్ సంఖ్య 115 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంతాల్లో యూజర్ల సంఖ్య 63 కోట్లకు, గ్రామీణ ప్రాంతాల్లో సబ్స్క్రైబర్స్ సంఖ్య 52 కోట్లకు చేరింది. 88.5 కోట్లకు బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు.. ట్రాయ్ గణాంకాల ప్రకారం మొత్తం బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య ఆగస్టులో 87.65 కోట్లుగా ఉండగా సెప్టెంబర్ ఆఖరు నాటికి 88.5 కోట్లకు చేరింది. టాప్ 5 సర్వీస్ ప్రొవైడర్ల మార్కెట్ వాటా 98.35 శాతంగా ఉంది. ఇందులో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (45.89 కోట్లు), భారతి ఎయిర్టెల్ (25.75 కోట్లు), వొడాఫోన్ ఐడియా (12.65 కోట్లు), బీఎస్ఎన్ఎల్ (2.51 కోట్లు) ఉన్నాయి. -
ఈపీఎఫ్‌వోలో కొత్తగా 17 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సెపె్టంబర్ నెలలో 17.21 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకుంది. ఆగస్ట్‌లో కొత్త సభ్యులతో పోలిస్తే నికరంగా 21,745 మంది పెరిగినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ నెల పేరోల్ గణాంకాలను కేంద్ర కారి్మక శాఖ సోమవారం విడుదల చేసింది. క్రితం ఏడాది సెపె్టంబర్ నెలలో కొత్త సభ్యుల గణాంకాలతో పోల్చి చూసినా కానీ, 38,262 మంది నికరంగా పెరిగారు. సెప్టెంబర్ నెలలో 8.92 లక్షల మంది తమ పేర్లను మెదటిసారి ఈపీఎఫ్‌వో కింద నమోదు చేసుకున్నారు. సుమారు 11.93 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరారు. వీరు తమ ఈపీఎఫ్ ఖాతాను పాత సంస్థ నుంచి కొత్త సంస్థకు బదిలీ చేసుకున్నారు. కొత్త సభ్యుల్లో 59 శాతం మంది వయసు 18–25 ఏళ్లలోపు ఉంది. అంటే కొత్త సభ్యుల్లో అధిక శాతం మంది ఉద్యోగ మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించిన వారని తెలుస్తోంది. ఇక ఈపీఎఫ్‌వో నుంచి వైదొలిగిన సభ్యుల సంఖ్య సెపె్టంబర్లో 3.64 లక్షలుగా ఉంది. ఆగస్ట్ నెలతో పోల్చి చూసినప్పుడు 12.17 శాతం తగ్గింది. 2023 జూన్ నుంచి నెలవారీగా సభ్యుల వైదొలగడం తగ్గుతూ వస్తోంది. 35 శాతం మహిళలు కొత్తగా చేరిన 8.92 లక్షల మంది సభ్యుల్లో మహిళలు 3.30 లక్షలుగా ఉన్నారు. ఇందులో 2.26 లక్షల మంది మహిళలు మొదటి సారి ఈపీఎఫ్‌వో కిందకు వచ్చిన వారు కావడం గమనార్హం. సెపె్టంబర్లో అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హర్యానా రాష్ట్రాల నుంచి కొత్త సభ్యులు నమోదయ్యారు. ఈ రాష్ట్రాల నుంచి 57.42 శాతం మంది సభ్యులుగా ఉన్నారు. నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర వాటాయే 20.42 శాతంగా ఉంది. చక్కెర పరిశ్రమలు, కొరియర్ సేవలు, ఐరన్ అండ్ స్టీల్, ఆస్పత్రులు, ట్రావెల్ ఏజెన్సీల్లో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 2018 ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఈపీఎఫ్‌వో గణాంకాలను విడుదల చేస్తుండడం గమనార్హం. -
వాట్సాప్ యూజర్లకు షాక్! 71.1 లక్షల అకౌంట్లపై నిషేధం
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) గత సెప్టెంబర్ నెలలో భారత్‌కు చెందిన 71.1 లక్షల వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. ఈ ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ విడుదల చేసిన తాజా ఇండియా నెలవారీ నివేదిక ప్రకారం.. వాట్సాప్ సెప్టెంబర్‌లో ఐటీ నిబంధనలకు అనుగుణంగా 71.1 లక్షల ఖాతాలను నిషేధించింది. 2023 సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీల మధ్య 71,11,000 ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ పేర్కొంది. వీటిలో 25,71,000 అకౌంట్లను వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకముందే ముందస్తుగా బ్యాన్ చేసినట్లు వివరించింది. ఇదీ చదవండి: బిగ్ డీల్స్: రూ.15 వేల కంటే తక్కువకే బెస్ట్ 5జీ ఫోన్లు! వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటిపై వాట్సాప్ తీసుకున్న సంబంధిత చర్యలు, అలాగే ప్లాట్ఫామ్లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి వాట్సాప్ చేపట్టిన సొంత నివారణ చర్యలు తదితర వివరాలు ‘యూజర్ సేఫ్టీ రిపోర్ట్’లో ఉన్నాయి. ఈ రిపోర్ట్ ప్రకారం.. సెప్టెంబర్ 1 నుంచి 30 మధ్య గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ నుంచి వాట్సాప్‌కు ఆరు ఆర్డర్లు రాగా అన్నింటినీ పరిష్కరించింది. కాగా వాట్సాప్ గత ఆగస్టులో 74 లక్షల ఖాతాలను నిషేధించింది. వీటిలో 35 లక్షల ఖాతాలను ముందస్తుగా బ్యాన్ చేసింది. -
ఎస్బీఐ కార్డ్ క్యూ2 ఫర్వాలేదు
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డు వ్యాపారంలోని ఎస్బీఐ కార్డ్ సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.603 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.526 కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసినప్పుడు 22 శాతం పెరిగి రూ.4,221 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం 28 శాతం వృద్ధి చెంది రూ.1,902 కోట్లకు చేరింది. ఇతర వనరుల రూపేణా ఆదాయం 21 శాతం అధికంగా రూ. 2,186 కోట్లు సమకూరింది. కంపెనీ రుణ ఆస్తుల నాణ్యత స్వల్పంగా క్షీణించింది. స్థూల రుణాల్లో వసూలు కాని నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 2.43 శాతానికి పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.14 శాతంగానే ఉన్నాయి. నికర ఎన్పీఏలు సైతం 0.78 శాతం నుంచి రూ.0.89 శాతానికి పెరిగాయి. క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 23.3 శాతంగా ఉంది. సెపె్టంబర్ చివరికి నికర విలువ 11,130 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్ చివరికి వినియోగంలో ఉన్న కార్డులు 1.79 కోట్లుగా ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎస్బీఐ కార్డ్ షేరు 2 శాతానికి పైగా లాభపడి రూ.791 వద్ద ముగిసింది. -
Vestian: హౌసింగ్‌లో భారీగా సంస్థాగత పెట్టుబడులు
న్యూఢిల్లీ: నివాస రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల (ఇనిస్టిట్యూషనల్) పెట్టుబడులు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో భారీగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన పెట్టుబడులు 174 మిలియన్ డాలర్లు (రూ.1,444 కోట్లు)తో పోల్చి చూస్తే, 71 శాతం వృద్ధితో 298 మిలియన్ డాలర్లు (రూ.2,473కోట్లు)గా నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమ మొత్తం మీద సెపె్టంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 679.9 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించినట్టు ఈ నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన 374 మిలియన్ డాలర్లతో పోల్చి చూసినప్పుడు 82 శాతం వృద్ధి నమోదైంది. అగ్రగామి సంస్థలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరుతున్నాయని వెస్టియన్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఇది ఆఫీస్ వసతులకు డిమాండ్‌ను పెంచుతుందన్నారు. ఫలితంగా రానున్న త్రైమాసికాల్లో పెట్టుబడులు పెరగొచ్చని అంచనా వేశారు. సెపె్టంబర్ త్రైమాసికంలో వచ్చిన సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో 71 శాతం దేశీ ఇన్వెస్టర్లు సమకూర్చినవి. విదేశీ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 27 శాతం పెట్టుబడులు వచ్చాయి. సెపె్టంబర్ క్వార్టర్లో అత్యధికంగా ఇనిస్టిట్యూషనల్ పెట్టుబడులను నివాస ప్రాజెక్టులే దక్కించుకున్నాయి. వీటి వాటా 44 శాతంగా ఉంది. వాణిజ్య రియల్ ఎస్టేట్ ఆస్తుల్లోకి 24 శాతం పెట్టుబడులు వెళ్లాయి. ఆఫీస్ ఆస్తులు 164 మిలియన్ డాలర్లు, ఇండ్రస్టియల్ వేర్‌హౌసింగ్ ఆస్తులు 190 మిలియన్ డాలర్ల చొప్పున సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించాయి. -
సాగర్ సిమెంట్‌కు నష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ తయారీలో ఉన్న సాగర్ సిమెంట్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.10 కోట్ల నికర నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.43 కోట్ల నష్టం నమోదైంది. ఎబిటా రూ.60 కోట్లు, ఎబిటా మార్జిన్ 10 శాతంగా ఉంది. టర్నోవర్ రూ.474 కోట్ల నుంచి రూ.587 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో సాగర్ సిమెంట్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో గురువారం 1.13 శాతం అధికమై రూ.250.55 వద్ద స్థిరపడింది. -
వోల్టాస్ లాభం రూ.36 కోట్లు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ కంపెనీ వోల్టాస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.36 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.6 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం. దీంతో పోలిస్తే పనితీరు మెరుగుపడినట్టు తెలుస్తోంది. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,833 కోట్ల నుంచి రూ.2,364 కోట్లకు వృద్ధి చెందింది. రెడీమబుల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీలు) జారీ చేయడం ద్వారా రూ.500 కోట్లు సమీకరించాలని వోల్టాస్ బోర్డు నిర్ణయించింది. చైన్నై, గుజరాత్‌లోని వాఘోడియాలో నూతన ప్లాంట్లపై ఈ నిధులను వ్యయం చేయనున్నట్టు తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో వోల్టాస్ షేరు ఒక శాతం లోపు పెరిగి రూ.839 వద్ద ముగిసింది. -
మైనస్‌లోనే టోకు ధరలు..
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023 సెప్టెంబర్‌లో అసలు పెరక్కపోగా (2022 ఇదే నెలతో పోల్చి) మైనస్ (–) 0.26 శాతంగా నమోదయ్యింది. టోకు ధరల సూచీ మైనస్‌లోనే కొనసాగడం ఇది వరుసగా ఆరవ నెల. ఏప్రిల్ నుంచీ నెలకొన్న ఈ తరహా ధోరణిని ప్రతి ద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే..: ప్రతి ద్రవ్యోల్బణానికి రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, మినరల్ ఆయిల్స్, టెక్స్టైల్స్, బేసిక్ మెటల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ ధరలు తాజా సమీక్షా నెల్లో (2022 సెప్టెంబర్ ధరలతో పోలి్చతే) తగ్గడమే కారణమని వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. విభాగాల వారీగా చూస్తే... ఫుడ్ ఆరి్టకల్స్: ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 3.35 శాతానికి తగ్గింది. అంతక్రితం రెండు నెలలూ ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రెండంకెల్లో కొనసాగింది. ఆగస్టులో 10.60 శాతంగా ఉంది. తాజా సమీక్షా నెల్లో కూరగాయల ధరలు 15 శాతం తగ్గాయి. ఆగస్టులో వీటి పెరుగుదల రేటు 48.39 శాతంగా ఉంది. ఆలూ ధరలు 25.24 శాతం తగ్గాయి. అయితే పప్పులు (17.69%), ఉల్లి (55.05%) ధరలు సెప్టెంబర్‌లో పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 3 నెలల కనిష్ట స్థాయిలో 5.02 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. ఫ్యూయెల్ అండ్ పవర్: ఈ రంగంలో ప్రతి ద్రవ్యోల్బణం 3.35 శాతంగా ఉంది. తయారీ: మొత్తం సూచీలో మెజారిటీ వాటా గత ఈ రంగంలో ధరల తగ్గుదల 1.35%గా నమోదైంది. ఇక పెరిగే అవకాశం.. సెప్టెంబర్ వరకూ టోకు ధరల సూచీలో తగ్గుదల నమోదయినప్పటికీ, ఇకపై పెరిగే అవకాశమే ఉందన్నది నిపుణుల వాదన. అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ధరలు, వర్షాభావం ఖరీఫ్ పంటపై అనిశ్చితి ధోరణి ఇందుకు కారణం కావచ్చని కేర్ఎడ్జ్ చీఫ్ ఎకనమిస్ట్ రజనీ సిన్హా పేర్కొన్నారు. -
ఎగుమతులు 3 శాతం డౌన్..
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెసెప్టెంబర్‌లో ఎగుమతులు 2.6 శాతం క్షీణించి 34.47 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో ఎగుమతులు 35.39 బిలియన్ డాలర్లు. కమోడిటీల ధరలు తగ్గుముఖం పట్టడంతో వరుసగా 10వ నెల దిగుమతుల భారం కాస్త తగ్గింది. శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం .. దిగుమతులు 15% క్షీణించి 53.84 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత సెసెప్టెంబర్‌లో ఇవి 63.37 బిలియన్ డాలర్లు. సెప్టెంబర్‌లో దేశ వాణిజ్య లోటు 19.37 బిలియన్ డాలర్లకు దిగి వచి్చంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెసెప్టెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 8.77% క్షీణించాయి. 211.4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇదే వ్యవధిలో దిగుమతులు 12.23% తగ్గి 326.98 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఫలితంగా వాణిజ్య లోటు 115.58 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతులపై ఆశాభావం.. అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నప్పటికీ సెసెప్టెంబర్ గణాంకాలు ఎగుమతులపరంగా ఆశావహ అవకాశాలను సూచిస్తున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. మిగతా ఆరు నెలల్లో ఎగుమతులు సానుకూల వృద్ధి నమోదు చేయగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్, మే, జూన్, జూలైలో క్షీణత రెండంకెల స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం సింగిల్ డిజిట్ స్థాయికి దిగి వచి్చందని సునీల్ పేర్కొన్నారు. 2023లో అంతర్జాతీయంగా వాణిజ్యం 0.8 శాతమే పెరగవచ్చని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంచనా వేసినప్పటికీ ఎగుమతులపరంగా భారత్ మెరుగ్గా రాణిస్తోందని సునీల్ చెప్పారు. ఆగస్టు గణాంకాల సవరణ.. కేంద్రం ఆగస్టు ఎగుమతుల గణాంకాలను 34.48 బిలియన్ డాలర్ల నుంచి 38.45 బిలియన్ డాలర్లకు సవరించింది. అలాగే దిగుమతులను 58.64 బిలియన్ డాలర్ల నుంచి 60.1 బిలియన్ డాలర్లకు మార్చింది. సెసెప్టెంబర్ 15న విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో ఎగుమతులు అంతక్రితం ఏడాది అదే వ్యవధితో పోలిస్తే 6.86 శాతం క్షీణించినట్లు నమోదు కాగా.. తాజా సవరణతో 3.88 శాతం పెరిగినట్లయ్యింది. మరిన్ని విశేషాలు.. ► గత నెల ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో 12 రంగాలు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ముడిఇనుము, కాటన్ యార్న్, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ, ఫార్మా, ఇంజినీరింగ్ ఉత్పత్తులు వీటిలో ఉన్నాయి. ► దిగుమతులపరంగా చూస్తే 30లో 20 రంగాలు ప్రతికూల వృద్ధి కనపర్చాయి. వెండి, ఎరువులు, రవాణా పరికరాలు, బొగ్గు, విలువైన రాళ్లు, క్రూడ్, రసాయనాలు, మెషిన్ టూల్స్ వీటిలో ఉన్నాయి. ► చమురు దిగుమతులు 20.32 శాతం క్షీణించి 14 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దిగుమతులు 22.81 శాతం తగ్గి 82.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అటు పసిడి దిగుమతులు 7% పెరిగి 4.11 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రథమార్ధంలో 9.8% పెరిగి 22.2 బిలియన్ డాలర్లకు చేరాయి. -
ధరలు అదుపు.. పరిశ్రమల పరుగు!
న్యూఢిల్లీ: భారత్ తాజా ఆర్థిక గణాంకాలు పూర్తి ఊరటనిచ్చాయి. అధికారికంగా విడుదలైన సమాచారం ప్రకారం, ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ పాలసీ సమీక్షా నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 5.02 శాతంగా నమోదయ్యింది. గడచిన మూడు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం మైనస్ 2 లేదా ప్లస్ 2తో 6 శాతం వద్ద ఉండాలి. అయితే తమ లక్ష్యం 4 శాతమేనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవలి తన పాలసీ సమీక్ష సందర్భంగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక పారిశ్రామిక రంగ వృద్ధికి సంబంధించిన సూచీ (ఐఐపీ) ఆగస్టులో 10.3 శాతం వృద్ధిని చూసింది. గడచిన 14 నెలల్లో ఈ స్థాయి వృద్ధి రేటు ఎన్నడూ నమోదుకాలేదు. 2023–24లో సగటును 5.4 శాతం ద్రవ్యోల్బణం ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. రిటైల్ ధరల తీరు చూస్తే... ఒక్క ఆహార ధరల విషయానికి వస్తే, రెండంకెల్లో (గత ఏడాది సెప్టెంబర్‌తో పోల్చి) ధరలు పెరిగిన వస్తువుల్లో తృణధాన్యాలు (10.95 శాతం), పప్పులు (16.38 శాతం), సుగంధ ద్రవ్యాలు (23.06 శాతం) ఉన్నాయి. మాంసం, చేపలు (4.11 శాతం), గుడ్లు (6.42 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (6.89 శాతం), పండ్లు (7.30 శాతం), కూరగాయలు (3.39 శాతం), చక్కెర, సంబంధిత ఉత్పత్తులు (4.52 శాతం), నాన్–ఆల్కాహాలిక్ బేవరేజెస్ (3.54 శాతం), ప్రెపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ (4.96 శాతం), ఫుడ్ అండ్ బేవరేజెస్ (6.30 శాతం) ఉత్పత్తులో పెరుగుదల రేటు ఒకంకెకు పరిమితమైంది. కాగా, ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ధరలు పెరక్కపోగా 14.04% తగ్గడం గమనార్హం. రంగాల వారీగా పారిశ్రామిక ఉత్పత్తి పురోగతి ఆగస్టు నెలల్లో తయారీ రంగం 9.3 శాతం పురోగతి (2022 ఆగస్టు నెలతో పోల్చి) సాధించింది. విద్యుత్ రంగం 15.3 శాతం, మైనింగ్ 12.3%, భారీ పెట్టుబడులకు, యంత్ర సామాగ్రి కొనుగోళ్లకు ప్రతిబింబంగా ఉండే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో 12.6 శాతం వృద్ధి నమోదయ్యింది. అయితే రిఫ్రిజరేటర్లు, ఎయిర్కండీషర్లకు సంబంధించి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో మాత్రం వృద్ధిలేకపోగా 5.7 శాతం క్షీణత నెలకొంది. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్ నాన్– డ్యూరబుల్స్ రంగంలో మాత్రం వృద్ధి రేటు 9 శాతంగా ఉంది. -
సెప్టెంబర్‌లో కార్యాలయ ఉద్యోగ నియామకాలు తగ్గుదల
ముంబై: ఐటీ, బీపీవో, ఎఫ్ఎంసీజీ తదితర రంగాల్లో ప్రతికూల ధోరణులతో.. కార్యాలయ ఉద్యోగుల (వైట్ కాలర్) నియామకాలు సెప్టెంబర్‌లో 8.6 శాతం తగ్గాయి. ఆగస్ట్ నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో నియామకాలు 6 శాతం పెరిగినట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ సర్వే నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్‌లో మొత్తం 2,835 మంది కోసం నియామక ప్రకటనలు వెలువడ్డాయి. అంతక్రితం నెలలో 3,103 ఉద్యోగాలకు ప్రకటనలు విడుదలైనట్టు ఈ నివేదిక తెలిపింది. ప్రతి నెలా తన పోర్టల్‌పై వెలువడే పోస్టింగ్‌ల ఆధారంగా నౌకరీ డాట్ కామ్ ఈ నివేదికను విడుదల చేస్తుంటుంది. అంతర్జాతీయంగా అనిశి్చత పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రంగంలో నియామకాలు గత కొన్ని నెలలుగా తగ్గుతూ వస్తున్న విషయాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. బీపీవో/ఐటీఈఎస్ రంగంలో 25 శాతం, ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో 23 శాతం చొప్పున నియామకాలు క్షీణించాయి. ‘‘ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం కొనసాగుతూనే ఉంది. బ్యాంకింగ్ రంగలో బలమైన వృద్ధి ఉండడం ఆశావహం. మొత్తం మీద సీక్వెన్షియల్‌గా 6 శాతం వృద్ధిని చూడడం అన్నది భారత ఉద్యోగ మార్కెట్ బలంగా ఉందన్న దాన్ని సూచిస్తోంది’’అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. ఆతిథ్యరంగం , రవాణా నియామకాల పరంగా మెరుగైన వృద్ధిని చూశాయి. ఈ రంగాలకు సంబంధించి ముంబైలో ఎక్కువ జాబ్ ఆఫర్లు ఉన్నట్టు నౌకరీ తెలిపింది. సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), హెల్త్‌కేర్ రంగాల్లో 7 శాతం నియాకాల వృద్ధి నమోదైంది. బ్రాంచ్ మేనేజర్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ నిపుణులకు డిమాండ్ నెలకొంది. ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో రంగాల్లో 6 శాతం వృద్ధి కనిపించింది. కొత్త ఉద్యోగ నియామకాల్లో మెట్రోలతో పోలిస్తే, ఇతర పట్టణాల్లో వృద్ధి నెలకొంది. -
సెప్టెంబర్‌లో ఫార్మా వృద్ధి స్వల్పం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఫార్మా మార్కెట్ వృద్ధి సెప్టెంబర్‌లో 2.1 శాతానికే పరిమితమైంది. 2022 సెప్టెంబరులో పరిశ్రమ ఏకంగా 13.2 శాతం వృద్ధి సాధించింది. ఆల్ ఇండియా ఆరిజిన్ కెమిస్ట్స్, డి్రస్టిబ్యూటర్స్ ప్రకారం.. అధిక బేస్, పరిమాణం పెరుగుదలలో సవాళ్ల కారణంగా దేశీయ ఔషధ రంగం 2023 సెప్టెంబర్‌లో వరుసగా ఐదవ నెలలో తక్కువ సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసింది. గత నెలలో ధర, కొత్త ఉత్పత్తుల విడుదల ద్వారా మొత్తం వృద్ధి సాధ్యమైంది. 2023 జనవరి–సెప్టెంబరులో దాదాపు స్థిరంగా 5–6 శాతం వృద్ధి నమోదైంది. ఇండియా రేటింగ్స్ ఫార్మా మార్కెట్ వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 10–11 శాతం ఉంటుందని అంచనా వేసింది. పరిమాణం 2022 సెప్టెంబర్‌లో 4.5 శాతం పెరిగితే, గత నెలలో 5.6 శాతం క్షీణించింది. ధరలు గతేడాది 6.6 శాతం, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 4.8 శాతం దూసుకెళ్లాయి. నూతన ఉత్పత్తుల పెరుగుదల 2022 సెప్టెంబర్‌లో 1.9 శాతం ఉంటే, గత నెలలో ఇది 2.9 శాతం నమోదైంది. మొత్తంగా భారతీయ ఫార్మా మార్కెట్ సగటు వృద్ధి సంవత్సరానికి 6.5 శాతం వద్ద ఆరోగ్యంగా ఉంది. -
సెప్టెంబర్‌లో సేవల రంగం భేష్ - 13 సంవత్సరాల్లో ఇదే గరిష్టం!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం సెప్టెంబర్‌లో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టులో 60.1 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో 61కి ఎగసింది. గడచిన 13 సంవత్సరాల్లో ఈ స్థాయికి ఎప్పుడూ ఇండెక్స్ పెరగలేదు. పటిష్ట డిమాండ్ పరిస్థితులు, కొత్త బిజినెస్, ఉపాధి అవకాశాలు సేవల రంగానికి దన్నుగా ఉన్నాయని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటిలిజెన్స్‌లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. బిజినెస్ ఆశావహ దృక్పదం మెరుగుపడుతోందని కూడా ఆమె పేర్కొన్నారు. కాగా, ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన సేవల రంగం సూచీ వరుసగా 26 నెలల నుంచీ వృద్ధి బాటన కొనసాగుతోంది. దాదాపు 400 మంది సేవల రంగ కంపెనీల ప్రతినిధుల ప్యానల్‌కు పంపిన ప్రశ్నలకు సమాధానాల ప్రాతిపదికన ఈ సూచీ కదలికలు ఉంటాయి. సేవలు, తయారీ కలిపినా సానుకూలమే.. కాగా, సేవలు, తయారీ రంగాలతో కూడిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ ఆగస్టులో 60.9 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో 61కి ఎగసింది. గడచిన 13 సంవత్సరాల్లో చూస్తే, సెప్టెంబర్‌లో భారత్ వస్తు, సేవలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ తరహా పరిస్థితి ఈ 13 సంవత్సరాల కాలంలో ఇది రెండవసారి. కాగా, ఒక్క తయారీ రంగానికి సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఆగస్టులో 58.6 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో ఐదు నెలల కనిష్టస్థాయి 57.5కు పడింది. ఈ రంగానికి సంబంధించి సెప్టెంబర్‌లో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి నెమ్మదించినట్లు పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. దాదాపు 400 మంది తయారీదారుల ప్యానెల్లో కొనుగోలు చేసే మేనేజర్లకు పంపిన ప్రశ్నాపత్రాల ప్రతిస్పందనల ప్రాతిపదికన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పీఎంఐ మదింపు జరుగుతుంది. నేడు ఆర్బీఐ కీలక పాలసీ నిర్ణయాలు మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడురోజుల కీలక ద్వైమాసిక సమావేశాలు నేటితో (6వ తేదీ) ముగుస్తున్నాయి. ఈ భేటీ కీలక నిర్ణయాలను గవర్నర్ మీడియాకు శుక్రవారం వెల్లడిస్తారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్బీఐ ఈ సమావేశాల్లో కూడా యథాతథంగా 6.5 శాతం వద్దే కొనసాగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇదే జరిగితే వరుసగా నాలుగు ద్వైమాసిక సమావేశాల నుంచి యథాతథ రేటును కొనసాగించినట్లు అవుతుంది. -
డీజిల్ అమ్మకాల్లో అదే ధోరణి
న్యూఢిల్లీ: డీజిల్ అమ్మకాల్లో క్షీణత కొనసాగుతూనే ఉంది. సెపె్టంబర్ నెలలోనూ 3% తక్కువగా విక్రయాలు నమోదయ్యాయి. ఆగస్ట్‌లోనూ డీజిల్ అమ్మకాలు 3.2% తగ్గడం గమనించొచ్చు. ఏటా జూన్ నుంచి మొదలయ్యే నాలుగు నెలల వర్షాకాల సీజన్లో డీజిల్ అమ్మకాలు తక్కువగా నమోదవుతుంటాయి. ఇక పెట్రోల్ విక్రయాలు 5.4% పెరిగాయి. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కె టింగ్ కంపెనీలు హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్ ఉమ్మడి గణాంకాలు ప్రతి నెలా విడుదల అవుతుంటాయి. వీటి ప్రకారం సెపె్టంబర్లో డీజిల్ అమ్మకాలు 5.81 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో 5.99 మిలియన్ టన్నుల మేర అమ్మకాలు ఉండడం గమనార్హం. ముఖ్యంగా సెపె్టంబర్ నెలలో మొదటి 15 రోజుల్లో డీజిల్ అమ్మకాలు 5 శాతం తగ్గగా, తర్వాతి 15 రోజుల్లో వర్షాలు లేకపోవడంతో పుంజుకున్నాయి. ఇక ఆగస్ట్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే డీజిల్ అమ్మకాలు 2.5 శాతం పెరిగాయి. ఆగస్ట్ నెలలో డీజిల్ విక్రయాలు 5.67 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం చొప్పున డీజిల్ అమ్మకాలు పెరిగాయి. జూన్ నుంచి తగ్గుతూ వస్తున్నాయి. పెట్రోల్ విక్రయాలు సెప్టెంబర్ నెలలో 2.8 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 5.4 శాతం వృద్ధి కనిపించింది. ఆగస్ట్ నెలలో మాత్రం పెట్రోల్ విక్రయాలు ఫ్లాట్‌గా ఉన్నాయి. -
భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. సెప్టెంబర్‌లో ఎంతొచ్చాయంటే..
దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. గడిచిన ఆగస్టు నెలకు సంబంధించి సెప్టెంబర్‌లో వసూలు చేసిన ఆగస్టు స్థూల వస్తు, సేవల పన్ను జీఎస్టీ 10 శాతం పెరిగి రూ.1,62,712 కోట్లకు చేరుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ స్థూల జీఎస్టీ వసూళ్లు గతేడాది కంటే 11 శాతం వృద్ధితో రూ. 1.65 లక్షల కోట్లుగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో మొత్తం స్థూల వసూళ్లు ఇప్పటివరకు రూ. 9.92 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ఇవి అంతకు ముందు సంవత్సరం కంటే 11 శాతం అధికం. 2023 మార్చిలో లావాదేవీలకు సంబంధించి ఏప్రిల్ నెలలో అత్యధికంగా రూ. 1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో పన్ను చెల్లింపులు పుంజుకోవడంతో అత్యధిక వసూళ్లు వచ్చాయి. దేశీయ లావాదేవీల (సర్వీస్ ఇంపోర్ట్స్ సహా) ఆదాయం సెప్టెంబరు నెలలో అంతకు ముందు సంవత్సరం కంటే 14 శాతం ఎక్కువగా వచ్చింది. ఇక ఈనెలలో వసూలైన స్థూల జీఎస్టీ ఆదాయం రూ. 1,62,712 కోట్లు కాగా ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.29,818 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ. 37,657 కోట్లు. అలాగే ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 83,623 కోట్లు, వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన మొత్తం రూ.41,145 కోట్లు. అదే విధంగా సెస్ రూపంలో వసూలైంది రూ.11,613 కోట్లు కాగా ఇందులో రూ.881 కోట్లు వస్తువుల దిగుమతిపై వసూలు చేశారు. తెలంగాణలో రికార్డుస్థాయి వృద్ధి ఇక రాష్ట్రాలవారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 17 శాతం వార్షిక వృద్ధితో రూ.25,137 కోట్లు వసూలైంది. రెండవ స్థానంలో నిలిచిన కర్ణాటక రూ. 11,693 కోట్లు (20 శాతం వృద్ధి) నమోదు చేసింది. తమిళనాడు కలెక్షన్లు రూ.10,481 కోట్లు (21 శాతం వృద్ధి), గుజరాత్లో జీఎస్టీ వసూళ్లు రూ.10,129 కోట్లు (12 శాతం వృద్ధి) నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణ రికార్డు స్థాయిలో వార్షిక వసూళ్లలో 33 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 5,226 కోట్లు వసూలు చేయడం విశేషం. -
ఫెస్టివ్ సీజన్: మారుతి కార్లపై భారీ తగ్గింపు
ఫెస్టివ్ సీజన్ సందర్బంగా దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి తన కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. సెప్టెంబర్ 2023లో మారుతీ సుజుకి కార్ లవర్స్ కోసం భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.మారుతి పాపులర్ మోడల్స్ ఆల్టో కే10, S-ప్రెస్సో, వ్యాగన్ఆర్, ఈకో, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా వంటి పాపులర్ మోడల్స్ దాదాపు 60వేల దాకా తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో మంత్లీ సేల్స్ పరంగా టాప్ పొజిషన్లో నిలిచిన మారుతి, పండుగ సీజన్లో సేల్స్ మరింత పెంచుకోవడంపై ఫోకస్ చేసింది. ఈ నెలలో మారుతి సుజుకి మోడల్స్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్లు ఇప్పుడు చూద్దాం. (జీ20 సమ్మిట్: మెగా రైల్వే అండ్ షిప్పింగ్ ప్రాజెక్ట్‌పై ఉత్కంఠ) మారుతి సుజుకి స్విఫ్ట్ ఐకానిక్ కారు కొనుగోలుపై రూ.60,000 వరకు ప్రయోజనాలు లభ్యం. ఇందులో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. అదనంగా సెలక్టెడ్ ట్రిమ్‌లపై రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. (బంగారం ధర దిగింది: కిలో వెండి ధర ఎలా ఉందంటే?) మారుతి సుజుకి డిజైర్: రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందుబాటులో ఉంది. కానీ ఎలాంటి నగదు ప్రయోజనాన్ని అందించలేదు. అలాగే ఎక్స్ఛేంజ్ బోనస్ పెట్రోల్ ట్రిమ్‌లకు మాత్రమే అనేది గమనించాలి. ( సెలెరియో: కారుపై రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.40,000 క్యాష్ డిస్కౌంట్, రూ.4,000 కార్పొరేట్ బెనిఫిట్‌ను అందిస్తోంది.అలాగే మారుతి సుజుకి ఆల్టో K10పై రూ.54,000 వరకు డిస్కౌంట్. ఇందులో బ్రాండ్ రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్‌తో కలిపి రూ.35,000 వరకు క్యాష్ బెనిఫిట్ లభ్యం. వ్యాగన్ఆర్: మారుతికి చెందిన మరో పాపులర్కారుపై రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.35,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తుంది. అదనంగా రూ.4,000 కార్పొరేట్ బోనస్ డీల్ కూడా పొందవచ్చు. (ఉత్తరాఖండ్ వరదలు:పెద్ద మనసు చాటుకున్న అనంత్ అంబానీ) -
సనాతన దినోత్సవంగా సెప్టెంబర్ 3
న్యూయార్క్: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ నేత ప్రియాంక ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే.. భారత్‌లో సనాతన ధర్మంపై ఇలాంటి వివాదాస్పద పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికాలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా జరుపుకోవాలని కెంటకీలోని లూయిస్విల్లే నగర మేయర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేశారు. US city declares September 3 as Sanatana Dharma Day https://t.co/YCCgNFK5Q9 — IndiaToday (@IndiaToday) September 6, 2023 లూయిస్‌విల్లేలోని హిందూ దేవాలయంలో జరిగిన మహా కుంభాభిషేకం వేడుకలో డిప్యూటీ మేయర్ బార్బరా సెక్స్టన్ స్మిత్ అధికారిక ప్రకటనను అందరికి చదివి వినిపించారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 3న సనాతన ధర్మం రోజుగా జరుపుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు చిదానంద సరస్వతి, పరమార్థ నికేతన్ అధ్యక్షుడు రిషికేశ్, శ్రీశ్రీ రవిశంకర్, భగవతీ సరస్వతి, లెఫ్టినెంట్ గవర్నర్ జాక్వెలిన్ కోల్మన్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కైషా డోర్సీ, పలువురు ఆధ్యాత్మిక నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సనాతన ధర్మంపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కర్ణాటక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనిపై సనాతనీయుల మారణహోమానికి పిలుపునిస్తున్నారని బీజేపీ ఆరోపించడంతో దేశస్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ఇదీ చదవండి: మరో వివాదం: ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్' వంతు -
ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ తొలి భేటీ ఎప్పుడంటే..?
ఢిల్లీ: ఇండియా కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం ఈ నెల 13న జరగనుంది. దేశ రాజధానిలోని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంట్లో భేటీ కానున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా.. నేడు(మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి ప్రచార కమిటీ మొదటిసారిగా సమావేశమవనుంది. ఇండియా కూటమికి ప్రచార కమిటీని 19 మందితో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఆ కమిటీకి మరో ఇద్దరు సభ్యులను కొత్తగా చేర్చారు. డీఎంకేకు చెందిన తిరుచి శివ, పీడీపీకి చెందిన మహబూబ్ బేగ్‌ను నూతనంగా ఆ కమిటీలో చేర్చారు. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసి ఐక్యంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కూటమి ఇప్పటికే పాట్నా, బెంగళూరు, ముంబయిలో సమావేశాలు కూడా నిర్వహించింది. ఈ భేటీల్లో కూటమి ఏర్పాటు, దాని నియమాలు, లక్ష్యాలపై చర్చించుకున్నారు. తాజాగా ముంబయిలో జరిగిన భేటీలో కూటమికి ఓ సమన్వయ కమిటీతో పాటు ప్రచార కమిటీని కూడా నియమించారు. ఇవి కూటమి సభ్యులను సమన్వయ పరచడంతోపాటు ఎన్నికల ప్రచార వ్యూహాలను నిర్ణయిస్తాయి. వచ్చే నెల నుంచి కూటమి చెందిన పార్టీల ప్రచారాలు ప్రారంభం కానున్నాయి. ఇదీ చదవండి: బీజేపీ vs ఇండియా: ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్ -
జీ-20 ఎఫెక్ట్: ఈ తేదీల్లో పలు మెట్రో స్టేషన్లు రద్దు
ఢిల్లీ: జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ ముస్తాబవుతోంది. సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికారులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమావేశాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఢిల్లీ మెట్రోపై ఆంక్షలను విధించారు అధికారులు. భద్రతా నిర్వహణ దృష్ట్యా కొన్ని స్టేషన్లను మూసివేస్తామని అధికారులు తెలిపారు. దేశ విదేశాల నుంచి నేతలు జీ 20 సమావేశాలకు హాజరుకానున్నారు. దాదాపు 25 దేశాలకు చెందిన లీడర్లతో సహా వివిధ ప్రపంచస్థాయి సంస్థల నాయకులు ఢిల్లీకి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఢిల్లీ మెట్రోలోని కొన్ని స్టేషన్లను ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూసివేయనున్నారు. In order to maintain foolproof security arrangements during the G20 Summit, scheduled to be held in Delhi from September 9 to 10, the Delhi Police metro unit asked the Chief Security Commissioner to close some metro station gates that open towards the VVIPS Route/venue of… pic.twitter.com/5ssPc9xepz — ANI (@ANI) September 4, 2023 ఢిల్లీలోని మోతీ బాగ్, భికాజీ కామా ప్లేస్, మునిర్కా, ఆర్కే పురం, ఐఐటీ, సదర్ బజార్ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ధౌలా కువాన్, ఖాన్ మార్కెట్, జన్‌పథ్, భికాజీ కామా ప్లేస్ మెట్రో స్టేషన్లను సున్నితమైన ప్రదేశాల జాబితాలో ఉంచారు. దీనితో పాటు వేదికకు సమీప స్టేషన్ అయిన సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ పూర్తిగా మూసివేయనున్నారు. ఢిల్లీలో మిగిలిన స్టేషన్లు సాధారణంగా నడుస్తాయని అధికారులు తెలిపారు. ఈ నెల 4-13 వరకు స్మార్ట్ కార్డ్ సేవలను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చినట్లు ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపారు. ఇంతకుముందు కూడా ఈ సేవలు ఉన్నప్పటికీ ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశాల దృష్ట్యా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌పై ఇప్పటికే ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఉదయనిధి ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్ ఏమన్నారంటే -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
తిరుమల: అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం కలెక్టర్, ఎస్పీ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్, టీటీడీలోని అన్నివిభాగాల అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 18న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా శ్రీనివాస సేతు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనం, తిరుమలలో విశ్రాంతి గృహాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని, వారికి సంతృప్తికరంగా వాహనసేవల దర్శనంతోపాటు మూలమూర్తి దర్శనం కల్పిస్తామని చెప్పారు. బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించమని, స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే అనుమతిస్తామని వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసినట్టు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలు నిర్మించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల్లోని భక్తులకు రోజుకు వెయ్యి మంది చొప్పున బ్రహ్మోత్సవ దర్శనం చేయిస్తామని తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా సెప్టెంబరు 22న గరుడసేవ నాడు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు చేస్తామన్నారు. సమావేశంలో కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ హరిత, ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, డీఎల్వో వీర్రాజు, అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆర్టీసీ ఇన్చార్జ్ ఆర్ఎం జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుర్తుంచుకోండి, సెప్టెంబర్ నెలలో ఈ పనులు పూర్తి చేయండి..లేకపోతే మీకే నష్టం!
ప్రతి నెల మొదటి రోజు ప్రారంభంతో ఆర్ధికపరమైన మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటిలాగే సెప్టెంబర్ నెలలో సైతం ఈ మార్పులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా రూ.2,000 నోట్ల డిపాజిట్లు.. ఎక్ఛేంజ్, చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఆధార్ నెంబర్‌ను జత చేయడం, ఉచితంగా ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవచ్చు. వీటితో పాటు.. రూ.2,000 ఎక్ఛేంజ్‌కు చివరి రోజు ఈ ఏడాది మే 19న ఆర్బీఐ రూ.2,000 నోట్ల ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రజలు 2023 సెప్టెంబర్ 30 వరకు వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది. మే 23 నుంచి ఏదైనా బ్యాంకు శాఖను సందర్శించి ఈ నోట్లను మార్చుకోవచ్చని ఒక ప్రకటనలో చెప్పింది. అయితే, జులై 20న ప్రారంభమైన లోక్‌సభ సమావేశాల్లో నోట్ల మార్పిడి గడువు పెంచే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో నోట్ల ఉపసంహరణకు ఆర్బీఐ 4నెలల సమయం ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకు మాత్రమే రూ.2,000 నోట్లు ఎక్ఛేంజ్, డిపాజిట్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఆ గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఆధార్ నంబర్ తప్పని సరి కేంద్ర ఆర్ధిక శాఖ మార్చి 31 నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై), నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ వంటి చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టిన చందాదారులకు నో యువర్ కస్టమర్ (కేవైసి)ని అప్డేట్ చేయడానికి ఆధార్ నంబర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఆ గడువు సెప్టెంబర్ 30 వరకు ఆరు నెలల గడువు ఇచ్చింది. పొదుపు దారులు ఆధార్‌ను నెంబర్‌ను జత చేయకపోతే అక్టోబర్ 1నుండి పెట్టుబడులను కొనసాగించడం అసాధ్యం ట్రేడింగ్ చేయాలంటే తప్పని సరిగా సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మార్చి నెలలో స్టాక్ మార్కెట్లో ఇప్పటికే ట్రేడింగ్ నిర్వహిస్తున్న ( existing holders) వారు తప్పని సరిగా వారి డిమ్యాట్ అకౌంట్‌కు ఒక లబ్దిదారుని వివరాల్ని జత చేయాల్సి ఉంటుంది. ఆ గడువు తేదీ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉంది. ఉచితంగా ఆధార్ అప్డేట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జూన్ నెలలో ఆధార్‌లో ఏదైనా మార్పులు చేర్పులను ఉచితంగా చేసుకోనే గడువును పొడిగించింది. ఆ గడువు సెప్టెంబర్ 14 మాత్రమే ఉందని ఆధార్ ట్వీట్ చేసింది. యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ నిబంధనలు - షరతులు సెప్టెంబరు 1 నుండి యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు వార్షిక రుసుము రూ. 10,000 ప్లస్ జీఎస్టీ నుండి రూ. 12,500 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.10,000 విలువైన వోచర్ బెన్ఫిట్స్ను నిలిపివేస్తుంది. రూ. 1,00,000 నెలవారీ ఖర్చులపై 25,000 ఎడ్జ్ రివార్డ్ పాయింట్ల నెలవారీ ప్రయోజనాల్ని సైతం నిలిపివేస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. సీనియర్ సిటిజన్ల కోసం (SBI WeCare FD) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కోసం గడువును పొడిగించింది. ఎస్బీఐ వీకేర్ పథకంలో 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల మధ్య కాలవ్యవధిలో పెట్టుబడి దారులైన సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇక ఈ పథకంలో చేరే గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఐడీబీఐ అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ ఐడీబీఐ బ్యాంక్ తన ప్రత్యేక పిక్స్డ్ డిపాజిట్ పథకం అమృత్ మహోత్సవ్ లో చేరే గడువు పొడిగించిన విషయం తెలిసిందే. రెండు టెన్యూర్ల కాలానికి 7.10శాతం నుండి 7.65 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. గడువు తేదీ సైతం సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ పథకంలో, సీనియర్ సిటిజన్లు సాధారణ వ్యక్తులతో పోలిస్తే అధిక వడ్డీ రేట్లు పొందుతారు. చదవండి👉 ‘యాంకర్ గూబ గుయ్యిమనేలా కౌంటరిచ్చిన ఆనంద్ మహీంద్రా’ -
వినాయక చవితి సెప్టెంబర్ 18నే
సాక్షి, హైదరాబాద్: ఈ సంవత్సరం వినాయక చవితి పర్వదినాన్ని సెప్టెంబర్ 18 సోమవారం రోజునే నిర్వహించుకోవాలని తెలంగాణ విద్వత్సభ ప్రకటించింది. శోభకృత్నామ సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్థి రోజునే మధ్యాహ్నం వరకు చవితి తిథి ఉన్నందున అదే రోజున వినాయక చవితిగా నిర్వహించుకోవాలని నిర్ధారించినట్టు తెలంగాణ విద్వత్సభ అధ్యక్షులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతిలు ఓ ప్రకటనలో తెలిపారు. చవితి తిథి 18న ఉదయం 9.58కి ఆరంభమై 19వ తేదీ ఉదయం 10.28కి ముగుస్తుందని తెలిపారు. దీని ప్రకారం చవితి తిథి మధ్యాహ్నం సమయానికి 18నే ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ కార్యాలయాలకు, ప్రభుత్వ సలహాదారులకు తెలిపినట్టు వెల్లడించారు. జూలై 22, 23 తేదీల్లో వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో జరిగిన షష్ఠమ విద్వత్సమ్మేళనంలో వందమంది సిద్ధాంతుల సమక్షంలో పండుగల తేదీలను ఖరారు చేసినట్టు పేర్కొన్నారు. చదవండి: Hyderabad: నా ఫ్లెక్సీలు తొలగిస్తారా?.. కార్పొరేటర్‌పై కేసు నమోదు -
పండగ సీజన్..బీఅలర్ట్: సెప్టెంబరులో బ్యాంకు సెలవులెన్నో తెలుసా?
Bank holidays in Septembe 2023: సెప్టెంబరులో ఏకంగా 16 రోజులు బ్యాంకులు పనిచేయవు. ముఖ్యంగా పండుగ సీజన్ కావడంతో ఆగస్టు లో 14 సెలవులతోపోలిస్తే సెప్టెంబరులో 16కు పెరిగాయి. వీటిల్లో శని, ఆదివారాలతో పాటు వివిధ పండుగల సెలవులు కూడా ఉన్నాయి. ఈ సెలవులను దృష్టిలో పెట్టుకుని ఖాతాదారులకు తమ తమ బ్యాంకు పనులును చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలను యథావిధిగా వినియోగించుకోవచ్చు. కేంద్ర బ్యాంకు ఆర్బీఐ విడుదల చేసిన బ్యాంక్ సెలవుల జాబితాను చూద్దాం. 2023 సెప్టెంబర్‌లో బ్యాంక్ సెలవులు సెప్టెంబర్ 3: ఆదివారం సెప్టెంబర్ 6 : శ్రీ కృష్ణ జన్మాష్టమి, కొన్ని ప్రాంతాల్లో సెలవు. సెప్టెంబర్ 7: జన్మాష్టమి సెప్టెంబర్ 9: రెండో శనివారం. సెప్టెంబర్ 17: ఆదివారం సెప్టెంబర్ 18: వినాయక చవితి(కొన్ని ప్రాంతాల్లో) సెప్టెంబర్ 19: వినాయక చవితి కొన్ని ప్రాంతాల్లో సెలవు సెప్టెంబర్ 20: వినాయక చవితి రెండో రోజు, నౌఖై (ఒడిశా) సెప్టెంబర్ 22: శ్రీ నారాయణ గురు సమాధి డే సెప్టెంబర్ 23: నాలుగో శనివారం, మహారాజ హరి సింగ్ జయంతి సెప్టెంబర్ 24: ఆదివారం ప్టెంబర్ 25: శ్రీమత్ సంకరాదేవ జయంతి సెప్టెంబర్ 27: ఈద్-ఈ- మిలాద్ సెప్టెంబర్ 29: ఇంద్రజాత్ర, జమ్ముకశ్మీర్‌లో సెలవు -
సెప్టెంబర్ మూడోవారంలో ‘కానిస్టేబుల్’ ఫలితాలు?
సాక్షి, హైదరాబాద్: ‘కానిస్టేబుల్ తుది ఎంపిక జాబితా’ సెప్టెంబర్ మూడోవారంలో విడుదల కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడిపై పోలీస్ నియామక మండలి కసరత్తు ముమ్మరం చేసింది. పోలీస్‌శాఖలోని వివిధ విభాగాలు, జైళ్లశాఖ, అగ్నిమాపకశాఖ, రవాణా, ఎక్సైజ్‌శాఖల్లో కలిపి మొత్తం 16,929 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే తుదిరాత పరీక్షలో అర్హత సాధించిన వారి ఫలితాలు మే 30న పోలీస్ నియామకమండలి వెల్లడించడం తెలిసిందే. జూన్ 1వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారు. గత కొన్ని రిక్రూట్మెంట్ల మాదిరిగానే ఈసారి కూడా ముందుగానే ఎస్ఐ పోస్టుల తుది ఎంపిక జాబితాను బోర్డు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారి నియామక ప్రక్రియ తుదిదశలో ఉంది. ప్రస్తుతం ఎస్బీ ఎంక్వైరీ, మెడికల్ టెస్ట్ నడుస్తోంది. ఈ నెలాఖరు నాటికి ఎస్ఐల శిక్షణ ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు కానిస్టేబుల్ ఫలితాలపై దృష్టి సారించారు. మొత్తం 1,01,600 మంది అభ్యర్థులు తుది అర్హత సాధించిన వారిలో ఉన్నారు. వీరికి సంబంధించిన అన్ని రికార్డులు, ఆయా జోన్లు, పోలీస్, రెవెన్యూ జిల్లాలు, సామాజికవర్గాల వారీగా ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. తుది పోటీలో ఉన్న వారిలో ప్రతి ఆరుగురు అభ్యర్థుల్లో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తం ప్రక్రియ ముగిసేందుకు మరో మూడు నుంచి నాలుగు వారాలు సమయం పడుతుంది. -
సెప్టెంబరులో స్టార్ట్?
‘డాన్‌శీను’, ‘బలుపు’, ‘క్రాక్’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో కొత్త సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను సెప్టెంబరులో స్టార్ట్ చేసేలా చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్స్ పాత్రల కోసం మృణాల్ ఠాకూర్, పూజాహెగ్డే వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్‌గా ఫిక్స్ అవుతారా? లేకుంటే వేరే హీరోయిన్ ఈ ప్రాజెక్టులో యాడ్ అవుతారా? అన్నది తెలియాలి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు రవితేజ ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగిల్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం అక్టోబరు 20న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
ఇక జియో ఫైనాన్షియల్ సర్వీసులు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తమ ఫైనాన్షియల్ సర్వీసుల విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీయనుంది. ఇందుకు వాటాదారులు, రుణదాతలు తాజాగా ఆమోదముద్ర వేశారు. తొలుత రిలయన్స్ స్ట్రాటజిక్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఎస్ఐఎల్) పేరుతో విడదీయనున్న కంపెనీని తదుపరి జియో ఫైనాన్షియల్ సర్వీసులుగా మార్పు చేయనున్నారు. వాటాదారుల సమావేశంలో ఈ ప్రతిపాదనకు 99.99 శాతం ఓట్లు లభించినట్లు ఆర్ఐఎల్ వెల్లడించింది. కాగా.. ఆర్ఐఎల్ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ షేరుకీ రూ. 10 ముఖ విలువగల ఆర్ఎస్ఐఎల్ షేరును జారీ చేయనున్నారు. తదుపరి ఆర్ఎస్ఐఎల్.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(జేఎఫ్ఎస్ఎల్)గా ఆవిర్భవించనుంది. సెప్టెంబర్‌కల్లా లిస్టింగ్ జెఫరీస్ రీసెర్చ్ వివరాల ప్రకారం జేఎఫ్ఎస్ఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో సెప్టెంబర్‌కల్లా లిస్ట్‌కానుంది. ఇందుకు అప్పటికల్లా అన్ని అనుమతులూ లభించగలవని అభిప్రాయపడింది. కంపెనీ వెనువెంటనే రుణ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. అసెట్ మేనేజ్మెంట్, జీవిత, సాధారణ బీమా విభాగాలకు నియంత్రణ సంస్థల అనుమతులను కోరనుంది. వీటిని 12–18 నెలల్లోగా పొందే వీలున్నట్లు జెఫరీస్ పేర్కొంది. ఫైనాన్షియల్ సర్వీసుల విభాగాన్ని విడదీసేందుకు గతేడాది అక్టోబర్‌లో ఆర్ఐఎల్ గ్రూప్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్ఐఎల్కు పూర్తి అనుబంధ సంస్థగా ఆర్ఎస్ఐఎల్ వ్యవహరిస్తోంది. ఆర్బీఐ వద్ద రిజిస్టరై డిపాజిట్లు సమీకరించని ప్రధాన ఎన్‌బీఎఫ్‌సీగా కొనసాగుతోంది. ఈ వార్తల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు 1.2 శాతం బలపడి రూ. 2,448 వద్ద ముగిసింది. కామత్‌కు బాధ్యతలు ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో కేవీ కామత్‌ను జేఎఫ్‌ఎస్‌ఎల్‌కు నాన్ఎగ్జిక్యూటివ్గా చైర్మన్‌గా ఆర్ఐఎల్ ఎంపిక చేసింది. 2021–22లో ఈ విభాగం రూ. 1,536 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 27,964 కోట్ల సంయుక్త ఆస్తులను కలిగి ఉంది. బ్రోకింగ్ సంస్థ మెక్వారీ వివరాల ప్రకారం జియో ఫైనాన్షియల్ విలువ రూ. 1.52 లక్షల కోట్లకుపైనే. దేశీయంగా ఐదో అతిపెద్ద ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థగా నిలవనుంది. -
సెప్టెంబర్‌లో భారత్‌కు బైడెన్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చే సెప్టెంబర్‌లో మొదటిసారిగా భారత్‌కు రానున్నారు. భారత్‌లో జరిగే జి–20 శిఖరాగ్రంలో ఆయన పాల్గొంటారని సహాయ మంత్రి (దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలు) డొనాల్డ్ లూ తెలిపారు. పర్యటనకు సంబంధించిన సన్నాహాలు సాగుతున్నాయన్నారు. జి–20 అధ్యక్షస్థానంలో ఉన్న భారత్ నాయకత్వ లక్షణాలు మరింత విస్తృతమై బలమైన దేశంగా నిలుస్తోందన్నారు. అమెరికా–భారత్ సంబంధాల్లో వచ్చే ఏడాది అత్యంత కీలకం కానుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా అపెక్, జపాన్ జి–7తోపాటు క్వాడ్ కూటమి సదస్సులు వచ్చే ఏడాది జరగనున్నాయి. వీటి తో భారత్–అమెరికా మరింత సన్నిహితమయ్యే అవకాశాలు పెరుగుతాయని లూ అన్నారు. -
వర్క్‌ఫ్రం హోం చాలు.. ఇక ఆఫీసుకు రండి..!
కార్పొరేట్ కంపెనీలు రిమోట్ వర్కింగ్ విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. కోవిడ్–19 కష్టకాలంలో తమ ఉద్యోగులను ఇంటి నుంచి లేదా అనువైన ప్రదేశం నుంచి పనిచేసేందుకు అనుమతినిచ్చిన సంస్థలు.. ఇప్పుడు వారిని కార్యాలయానికే వచ్చి పనిచేయమంటున్నాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం, అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్–2022 (బీఎల్ఎస్) నివేదిక ఈ అంశాలను వెల్లడించింది. గత ఏడాది ఆగస్టు 1 నుంచి సెపె్టంబర్ 30 వరకు చేసిన సర్వేలో గతంలో వర్క్‌ఫ్రం హోం విధానాన్ని అవలంభించిన ప్రైవేట్‌రంగ సంస్థల్లో 72.5 శాతం ఆ విధానానికి స్వస్తి పలికాయని తేలింది. అంతకు ముందు 2021 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య చేసిన సర్వేలో ఈ సంఖ్య 60.1 శాతంగా ఉంది. అంటే సుమారు ఏడాది కాలంలో 12.4 శాతం కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానానికి స్వస్తి చెప్పాయి. కార్యాలయాల్లో ఉద్యోగులకు కల్పించే వివిధ రకాల సేవల ఖర్చును తగ్గించుకునేందుకు 2021లో సిబ్బందిని ఇంటి నుంచే పనిచేయమన్న కంపెనీలు 2022లో తిరిగి కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నట్టు బీఎల్ఎస్ నివేదిక పేర్కొంది. - సాక్షి, అమరావతి తగ్గుతున్న టెలీ వర్కింగ్ విధానం 2021లో పలు కంపెనీలు తమ సిబ్బందిలో గరిష్టంగా 80 శాతం, కనిష్టంగా 40 శాతం టెలి/రిమోట్ వర్కింగ్‌కు అవకాశం కల్పించినట్టు బీఎల్ఎస్ నివేదిక పేర్కొంది. అయితే, 2022లో టెలీసరీ్వస్ సేవలు గరిష్టంగా 42 శాతానికి పడిపోయినట్టు వెల్లడించింది. ఉత్పాదకతపై రిమోట్ వర్క్ ప్రభావం బీఎల్ఎస్–2022 నివేదిక ప్రకారం ఇన్ఫర్మేషన్ రంగంలో వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న వారు తిరిగి కార్యాలయానికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి వారిలో కొత్తగా కెరీర్ ప్రారంభించిన వారు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఎందుకంటే వారు మహమ్మారి కాలంలో కొత్త పనివిధానానికి అలవాటుపడ్డారని తేల్చారు. కార్యాలయాలకు వెళ్లాల్సివస్తే అత్యధికులు కంపెనీని వదిలేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. సిబ్బంది వర్క్ ఫ్రం హోమ్ విధానంలో సేవలు అందిస్తే ఉత్పాదకత తక్కువగా ఉంటుందని ఇటీవల కంపెనీల యాజమాన్యాలు భావిస్తుండడంతో, కార్యాలయాల నుంచి పనిచేసేవారికే ఉద్యోగాలు ఉంటాయని ఆయా కంపెనీలు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయని బీఎల్ఎస్ పేర్కొంది. వస్తారా.. వదిలేస్తారా.. ♦ కార్యాలయానికి దూరంగా ఉండి పనిచేస్తే సిబ్బంది శక్తిసామర్థ్యాలను అంచనా వేయలేమని చాలా కంపెనీలు భావిస్తున్నట్టు బీఎల్ఎస్ నివేదిక పేర్కొంది. ♦ నైపుణ్యం గల సిబ్బందిని సంస్థ విడిచి వెళ్లకుండా ఉంచేందుకు కార్యాలయ పని విధానమే బెస్ట్‌గా యాజమాన్యాలు భావిస్తున్నాయి. ♦ ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు సిబ్బందిని సామూహికంగా తొలగిస్తున్నాయి. దాంతో ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు కంపెనీలు తమ సిబ్బందిని తిరిగి రావాలని కోరుతున్నాయి. ♦ అయితే, చాలామంది ఉద్యోగులు రిమోట్ వర్కింగ్ సంస్కృతికి అలవాటుపడి కార్యాలయాలకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. ♦ ఈ విధానం ఇష్టం లేని ఉద్యోగులు రాజీనామా చేసినా కంపెనీలు సానుకూలంగా తీసుకుంటున్నట్టు నివేదిక పేర్కొంది. ఉద్యోగులు ‘‘రావాలనుకుంటున్నారా లేదా వెళ్లాలనుకుంటున్నారా’’ అని ఆప్షన్లను ఎంచుకునే అవకాశం కంపెనీలు కల్పించడం గమనార్హం. -
11 శాతం పెరిగిన సూక్ష్మ రుణాలు
న్యూఢిల్లీ: సూక్ష్మ రుణ పరిశ్రమ (మైక్రోఫైనాన్స్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో 11 శాతం అధికంగా రూ.71,916 కోట్ల రుణాలను పంపిణీ చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రుణాల పంపిణీ రూ.64,899 కోట్లుగా ఉంది. మొత్తం రుణాల సంఖ్య 1.81 కోట్లుగా కాగా, క్రితం ఏడాది ఇదే కాలంలో మొత్తం పంపిణీ చేసిన రుణాల సంఖ్య 1.85 కోట్లుగా ఉంది. ద్వితీయ త్రైమాసికానికి సంబంధించి గణంకాలను మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ నెట్వర్క్ (ఎంఫిన్) విడుదల చేసింది. పరిశ్రమ మొత్తం రుణ పోర్ట్‌ఫోలియో విలువ రూ.3 లక్షల కోట్లకు చేరింది. మొత్తం 12 కోట్ల రుణ ఖాతాలకు సేవలు అందిస్తోంది. ‘‘మైక్రోఫైనాన్స్ పరిశ్రమ స్థూల రుణ పోర్ట్‌ఫోలియో (జీఎల్పీ) రూ.3,00,974 కోట్లకు చేరింది. 2021 సెప్టెంబర్ చివరికి ఉన్న రూ.2,43,737 కోట్లతో పోలిస్తే 23.5 శాతం వృద్ధి చెందింది’’ అని ఈ నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో పంపిణీ చేసిన ఒక్కో రుణం సగటున రూ.40,571గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12 శాతం పెరిగింది. ఒక వంతు వాటా పీఎస్‌బీలదే ఈ మొత్తం రుణాల్లో 13 ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) సంయుక్తంగా 37.7 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐ) 36.7 శాతం వాటా (రూ.1,10,418 కోట్లు) కలిగి ఉన్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సూక్ష్మ రుణాల్లో 16.6 శాతం వాటా (రూ.50,029) ఆక్రమించాయి. ఇక ఎన్బీఎఫ్సీలు 7.9 శాతం, ఇతర సూక్ష్మ రుణ సంస్థలు 1.1 శాతం మేర రుణాలను పంపిణీ చేసి ఉన్నాయి. మైక్రోఫైనాన్స్ యాక్టివ్ (సకాలంలో చెల్లింపులు చేసే) రుణ ఖాతాలు గత 12 నెలల్లో (సెప్టెంబర్‌తో అంతమైన చివరి) 14.2 శాతం పెరిగి 12 కోట్లకు చేరాయి. తూర్పు, ఈశాన్యం, దక్షిణాది ప్రాంతాలు మొత్తం సూక్ష్మ రుణాల్లో 63.9 శాతం వాటా కలిగి ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడు ఎక్కువ వాటా ఆక్రమిస్తోంది. -
ఈపీఎఫ్‌వో కిందకు కొత్తగా 16.82 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి సెప్టెంబర్ నెలలో కొత్తగా 16.82 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఇందుకు సంబంధించి గణాంకాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే కొత్త సభ్యుల్లో 9 శాతానికి పైనే వృద్ధి నమోదైంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిస్లేనియస్ చట్టం కింద కొత్తగా 2,861 సంస్థలు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 16.82 లక్షల మంది కొత్త సభ్యుల్లో 9.34 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో కిందకు వచ్చారు. అంటే వీరికి కొత్తగా ఉపాధి లభించింది. మిగిలిన సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరిన వారు కావడం గమనార్హం. ఇక కొత్త సభ్యుల్లో 18–21 ఏళ్ల వయసు నుంచి 2.94 లక్షల మంది, 21–25 ఏళ్ల వయసు నుంచి 2.54 లక్షల మంది ఉన్నారు. 25 ఏళ్ల వయసులోపు వారే 58.75 శాతంగా ఉన్నారు. ఈపీఎఫ్ కవరేజీ నుంచి వైదొలిగే సభ్యుల సంఖ్య గడిచిన మూడు నెలల్లో క్రమంగా తగ్గుతూ వస్తోంది. నెలవారీగా చూస్తే సెప్టెంబర్‌లో ఇలా ఈపీఎఫ్‌వో నుంచి వెళ్లిపోయిన వారు 9.65 శాతం తక్కువగా ఉన్నారు. సెప్టెంబర్ నెలలో చేరిన మహిళలు 3.50 లక్షల మంది (26.36 వాతం)గా ఉన్నారు. వార్షికంగా చూస్తే 7 శాతం వృద్ధి నమోదైంది. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది చేరారు. -
పారిశ్రామిక రంగానికి ‘సెప్టెంబర్’ ఊరట
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం సెప్టెంబర్‌లో కొంత సానుకూల ఫలితాన్ని సాధించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సమీక్షా నెల్లో 3.1 శాతం (2021 ఇదే నెలతో పోల్చి) పెరిగింది. తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాలు సెప్టెంబర్‌లో మంచి ఫలితాలను అందించినట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పే ర్కొంది. ఆగస్టులో ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా 0.7% క్షీణతను నమోదుచేసుకుంది. జూలై లో వృద్ధి కేవలం 2.2%. అయితే 2021 సెప్టెంబర్‌లో పారిశ్రామిక వృద్ధి 4.4 శాతంకన్నా, తాజా వృద్ధి రేటు తక్కువగానే ఉండడం గమనార్హం. ► తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు దాదాపు 70 శాతం వెయిటేజ్ కలిగిన తయారీ రంగం సమీక్షా నెల్లో 1.8 శాతం పురోగమించింది. 2021 ఇదే నెల్లో వృద్ధి 4.3 శాతం. ► విద్యుత్: ఈ రంగం వృద్ధి రేటు 11.6%గా ఉంది. 2021 ఇదే నెల్లో ఈ రేటు కేవలం 0.9%. ► మైనింగ్: వృద్ధి 8.6% నుంచి 4.6%కి తగ్గింది. ► క్యాపిటల్ గూడ్స్: ఉత్పత్తి 10.3 శాతం పెరిగింది. 2021 ఇదే నెల్లో ఈ రేటు 3.3 శాతం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: 4.5% క్షీణించింది. గతేడాది ఈ నెల్లో 1.6% వృద్ధి జరిగింది. ఆరు నెలల్లో 7 శాతం పురోగతి కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (2022–23, ఏప్రిల్–సెప్టెంబర్) ఐఐపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదైంది. -
సెయిల్‌కు రూ. 329 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఉక్కు తయారీ సంస్థ సెయిల్ సెప్టెంబర్ క్వార్టర్‌కు భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఏకంగా రూ.329 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం రూ.26,642 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సెయిల్ రూ.4,339 కోట్ల లాభాన్ని ప్రకటించడం గమనార్హం. ఆదాయం కూడా అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.27,007 కోట్లు గా ఉంది. ప్రధానంగా వ్యయాలు రూ. 21,289 కోట్ల నుంచి రూ.27,201 కోట్లకు పెరిగాయి. 4.30 మిలియన్ టన్నుల స్టీల్‌ను కంపెనీ తయారు చేసింది. క్రితం ఏడాది క్యూ2లో 4.28 మిలియన్ టన్నుల స్టీల్ విక్రయించగా, తాజాగా ముగిసిన త్రైమాసికంలో 4.21 మిలియన్ టన్నులుగా ఉంది. -
లాభాల్లో ప్రభుత్వ రంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది(2022–23) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌గా జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 4% వృద్ధితో రూ. 5,229 కోట్లను అధిగమించింది. ఇది ఒక క్వార్టర్‌కు కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 5,023 కోట్లు ఆర్జించింది. ఆదాయం రూ. 19,283 కోట్ల నుంచి రూ. 19,344 కోట్లకు బలపడింది. షేరుకి రూ. 3 చొప్పున రెండో మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఈ కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 5.17% నుంచి 4.38%కి, నికర ఎన్పీఏలు 1.72% నుంచి 1.27%కి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో పీఎఫ్సీ షేరు ఎన్ఎస్ఈలో 1.3 శాతం క్షీణించి రూ. 117 వద్ద ముగిసింది. -
దాదాపు 27 లక్షల ఖాతాలపై వేటువేసిన వాట్సాప్
సాక్షి,ముంబై: మెటాకు చెందిన ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ ఈ నెలలో కూడా పెద్ద ఎత్తున ఖాతాలపై వేటు వేసింది. సెప్టెంబర్ 30 వరకు ఏకంగా 26 లక్షల 85 వేల భారతీయుల వాట్సాప్ ఖాతాలను నిషేధించింది.సెప్టెంబర్ నివేదిలో సంబంధిత వివరాలను సంస్థ వెల్లడించింది. ఇందులో 8 లక్షలకుపైగా వాట్సాప్ అకౌంట్లనుఎలాంటి ఫిర్యాదలు రాకముందే తొలగించినట్లు వాట్సాప్ పేర్కొంది. ఫేక్ వార్తలు, తప్పుడు సమాచారాన్ని నిరోధించే క్రమంలో తప్పుడు, నకిలీ ఖాతాలను బ్యాన్ చేసింది. అలాగే భారత ఐటీ రూల్స్ 2021కి (IT Rules 2021) అనుగుణంగా లక్షలాదిగా వాట్సాప్ అకౌంట్లను నిలిపి వేస్తుంది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఏకంగా 26 లక్షల 85 వేల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్లు తన నెలవారీ నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు 2022 సెప్టెంబర్ యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌ను భారత ఐటీ మంత్రిత్వ శాఖకు అందించింది. అలాగే సెప్టెంబర్‌లో 666 ఫిర్యాదులు అందగా, 23 మందిపై మాత్రమే చర్యలు తీసుకున్నట్టు ప్రకటించింది. గ్రీవెన్స్ ఛానెల్ ద్వారా వినియోగదారుల ఫిర్యాదులకు ప్రతిస్పందించడం, వాటిపై చర్యలు తీసుకోవడంతో పాటు, ప్లాట్‌ఫారమ్‌లో హానికరమైన కంటెంట్‌ను నివారిస్తున్నామని, ఎందుకంటే హాని జరిగిన తరువాత గుర్తించడం కంటే ముందునేగా నివారించడానికే తమ ప్రాధాన్యత వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. -
బాహుబలి ‘సిప్’ ప్రతి నెలా రూ.12,000 కోట్లపైనే
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టే విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎంతో పరిణతి చూపిస్తున్నారు. ఇటీవలి కాలంలో మార్కెట్లలో అస్థిరతలతో సంబంధం లేకుండా ప్రతి నెలా నికర సిప్ పెట్టుబడులు క్రమంగా పెరుగుతూ ఉండడం దీన్నే సూచిస్తోంది. గత నాలుగు నెలలుగా నెలవారీ సిప్ పెట్టుబడుల రాక రూ.12,000 కోట్లపైనే నమోదవుతోంది. ఆగస్ట్‌లో సిప్ పెట్టుబడులు అత్యధికంగా రూ.12,693 కోట్లకు చేరాయి. ఒక నెలలో ఇదే గరిష్ట సిప్ పెట్టుబడులు ఇవి. ఈ ఏడాది మే నెలకు రూ.12,286 కోట్లు, జూన్‌లో రూ.12,276 కోట్లు, జూలైలో రూ.12,140 కోట్ల చొప్పున సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.11,863 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో సిప్ పెట్టుబడులు రూ.61,258 కోట్లకు చేరాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద సిప్ పెట్టుబడులు రూ.1.24 లక్షల కోట్లుగా ఉన్నాయి. క్రమబద్ధమైన పెట్టుబడులు.. సిప్ ద్వారా ప్రతి నెలా పెట్టుబడులు పెట్టడం వల్ల మార్కెట్ల ర్యాలీల్లో పాల్గొనొచ్చు. అదే సమయంలో మార్కెట్లలో కరెక్షన్ల సమయంలోనూ కొనుగోలుకు అవకాశం లభిస్తుంది. ఏకమొత్తంలో పెట్టుబడికి ఈ వెసులుబాటు ఉండదు. అందుకని సిప్ రూట్లో పెట్టుబడుల వల్ల దీర్ఘకాలంలో అస్థిరతలను సులభంగా అధిగమించి రాబడులు పొందేందుకు వీలుంటుంది. ఈ వెసులుబాటే సిప్‌కు ఆదరణ పెంచుతోంది. వేతన జీవులు ప్రతి నెలా క్రమం తప్పకుండా సిప్ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సిప్ అన్నది పొదుపు అలవాటును ప్రోత్సహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని సిప్ ఆస్తులు (పెట్టుబడులు) 2022 మర్చి చివరికి రూ.5.76 లక్షల కోట్లుగా ఉంటే, ఆగస్ట్ చివరికి రూ.6.4 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. వార్షికంగా సిప్ ఆస్తులు 30 శాతం మేర పెరిగాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణ ఆస్తుల వృద్ధి కంటే ఇది రెండు రెట్లు అధికంగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వద్ద నమోదైన మొత్తం సిప్ ఖాతాలు ఆగస్ట్ చివరికి 5.72 కోట్లుగా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ప్రధానంగా సిప్ పెట్టుబడులపైనే ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే 43 మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఉమ్మడిగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో రూ.64.935 కోట్ల ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించగా, ఇందులో రూ.61,258 కోట్లు సిప్ రూపంలో రావడం దీన్నే తెలియజేస్తోంది. వచ్చే 18-24 నెలల్లో సిప్ ద్వారా ప్రతి నెలా వచ్చే పెట్టుబడులు రూ.20,000 కోట్లకు చేరతాయని భావిస్తున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేటు వెల్త్ ఎండీ, సీఈవో ఆశిష్ శంకర్ పేర్కొన్నారు. -
ధరల మంట.. పరిశ్రమలకు సెగ! దడపుట్టిస్తున్న ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి బుధవారం వెలువడిన అధికారిక గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా తొమ్మిదవ నెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతం వద్ద కట్టడి పరిధి దాటి నమోదయ్యింది. పైగా ఆగస్టులో 7శాతం ఉంటే, సెప్టెంబర్‌లో 7.41శాతానికి (2021 ఇదే నెల ధరలతో పోల్చి) పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతమే. ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వృద్ధిలేకపోగా 0.8 శాతం క్షీణించింది. సామాన్యునిపై ధరల భారం రిటైల్ ద్రవ్యోల్బణ బాస్కెట్లో కీలక ఆహార విభాగం ధరలు సెప్టెంబర్‌లో తీవ్రంగా పెరిగాయి. మొత్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టం... 7.41 శాతం పెరగ్గా, ఒక్క ఫుడ్ బాస్కెట్ ఇన్ఫ్లెషన్ 8.60 ( ఆగస్టులో 7.62 శాతం) శాతానికి చేరింది. కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. అక్టోబర్, నవంబర్‌ల్లోనూ ద్రవ్యోల్బణం ఎగువబాటనే పయనిస్తే, తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 సమయంలో ఆర్బీఐ రెపో రేటును మరో అరశాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలలుగా ద్రవ్యోల్బణం కట్టడిలో ఎందుకు లేదన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ త్వరలో ఒక నివేదిక సమర్పిస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 18 నెలల కనిష్టానికి పారిశ్రామిక రంగం ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి గడచిన 18 నెలల్లో ఎన్నడూ లేని తీవ్ర పతన స్థాయి 0.8 శాతం క్షీణతను చూసింది. 2021 ఫిబ్రవరిలో ఐఐపీలో 3.2 శాతం క్షీణత నమోదయ్యింది. తాజా సమీక్షా నెల్లో సూచీలో దాదాపు 60 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం కూడా 0.7శాతం క్షీణతను (2021 ఇదే నెలతో పోల్చి) చూసింది. గత ఏడాది ఇదే కాలంలో తయారీ ఉత్పత్తి వృద్ధి రేటు 11.1శాతం. మైనింగ్ ఉత్పాదకత 23.3 శాతం వృద్ధి నుంచి 3.9 శాతం క్షీణతలోకి జారింది. విద్యుత్ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 16 శాతం నుంచి 1.4 శాతానికి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు 20శాతం నుంచి 5శాతానికి పడిపోయింది. -
ఈక్విటీల్లోకి రూ.14,000 కోట్లు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సెప్టెంబర్ నెలలోనూ పురోగతి చూపించింది. ఈక్విటీ పథకాలు గత నెలలో నికరంగా రూ.14,100 కోట్లను ఆకర్షించాయి. దాదాపు అన్ని రకాల ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడులు వచ్చాయి. సెక్టోరల్ పథకాల్లోకి అత్యధికంగా రూ.4,418 కోట్లు వచ్చాయి. ఈక్విటీల్లో ప్యాసివ్ ఫండ్స్ రూ.13,623 కోట్లను ఆకర్షించ గా, ఈటీఎఫ్‌లు రూ.10,808 కోట్లను రాబట్టాయి. మిడ్‌క్యాప్, ఫ్లెక్సీక్యాప్ విభాగాలు ఒక్కోటీ రూ. 2,000 కోట్లకు పైనే పెట్టుబడులను ఆకర్షించాయి. డెట్ విభాగంలోకి రూ.65,373 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డెట్‌లో మనీ మార్కెట్, లిక్విడ్ ఫండ్స్ పథకాలకు ఆదరణ లభించింది. అన్ని ఏఎంసీల పరిధిలోని నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) సెప్టెంబర్ చివరికి రూ.39.88 లక్షల కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఏడాది సెప్టెంబర్ నాటికి ఉన్న రూ.3 6.73 లక్షల కోట్లతో పోలిస్తే 8 శాతానికి పైగా ఏయూఎం పెరిగింది. ఇక ఈ ఏడాది ఆగస్ట్ చివరికి ఉన్న రూ.39.33 లక్షల కోట్ల నుంచి స్వల్పంగా వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) సెప్టెంబర్ నెలకు సంబంధించి తాజా గణాంకాలను సోమవారం విడుదల చేసింది. సిప్ పెట్టుబడులు.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు సెప్టెంబర్‌లో కొత్త శిఖరాలకు చేరాయి. రూ.12,976 కోట్ల పెట్టుబడులు సిప్ రూపంలో వచ్చాయి. ఆగస్ట్‌లో ఇలా వచ్చిన పెట్టుబడులు12,694 కోట్లుగా ఉన్నాయి. సిప్ ఖాతాలు కూడా 5.84 కోట్లకు పెరిగాయి. సిప్ ఖాతాలకు సంబంధించి మొత్తం నిర్వహణ ఆస్తులు రూ.6.39 లక్షల కోట్లకు చేరాయి. పరిశ్రమ వ్యాప్తంగా ఫోలియోల సంఖ్య 13.81 కోట్లకు చేరుకుంది. ఒక పథకంలో ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే గుర్తింపు నంబర్/ఖాతాను ఫోలియోగా చెబుతారు. సిప్ మరింత బలపడుతుంది.. సిప్ రూపంలో సెప్టెంబర్‌లో వచ్చిన మొత్తం రూ.12,976 కోట్లకు చేరుకుందని, రానున్న నెలల్లో ఈ మొత్తం రూ.13వేల కోట్లను దాటుతుందని యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. గత కొన్ని నెలలుగా మార్కెట్ ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు ఒత్తిళ్లను ఎదుర్కొన్నట్టు చెప్పారు. అయినప్పటికీ చిన్న ఇన్వెస్టర్లు మ్యూచువల్ఫండ్స్ పెట్టుబడుల పట్ల నమ్మకాన్ని చూపించినట్టు తెలిపారు. సిప్‌ను దీర్ఘకాలంలో సంపద సృష్టికి సాధనంగా వారు చూస్తున్నట్టు పేర్కొన్నారు. -
‘సహనానికి పరీక్ష’, యూట్యూబ్ యూజర్లకు భారీ షాక్!
ప్రముఖ వీడియో షేరింగ్ దిగ్గజం యూజర్లకు యూట్యూబ్ భారీ షాక్ ఇచ్చింది. యూజర్ల సహనానికి పరీక్ష పెడుతూ సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచి సైలెంట్‌గా కొత్త యాడ్ ఫార్మాట్‌ను ప్రారంభించింది. ఈ కొత్త యాడ్ ఫార్మాట్ ప్రకారం.. యూట్యూబ్ ప్రీమియం తీసుకోని యూట్యూబ్ ఫ్రీ వెర్షన్ యూజర్లకు అదనంగా యాడ్స్ జోడించింది. యూట్యూబ్ ఫ్రీ వెర్షన్ వాడే వారికి వీడియో ఆరంభంలో 2యాడ్స్ మాత్రమే కనిపించేవి. కానీ ఇకపై యూజర్ల సహనానికి మరింత పరీక్ష పెట్టేలా 5యాడ్స్‌ను తీసుకొని రానుంది. ఇప్పటికే ఈ కొత్త యాడ్ మోడల్ ఎంపిక చేసిన యూజర్లకు ప్లే అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ యూజర్ తాను వీడియో చూస్తున్నప్పుడు 5యాడ్స్ ప్లే అవుతున్నాయి. ఆ యాడ్స్ పట్ల అసౌకర్యానికి గురవుతున్నామని, వివరణ ఇవ్వాలని కోరుతూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌పై యూట్యూబ్ యాజమాన్యం స్పందించింది. ఇలా 5 యాడ్స్ ప్లే అయితే వాటిని బంపర్ యాడ్స్ అంటారు. ఒక్కోటి 6 సెకన్లు ఉంటుందని వివరణిచ్చింది. ప్రస్తుతం ఈ నిర్ణయంపై యూట్యూబ్ యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ ఉద్యోగుల గుండెల్లో గుబులే: అతిపెద్ద కోతలకు తెర!
న్యూఢిల్లీ:గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ భారీ తొలగింపులకు తెరతీసింది. మహమ్మారి ప్రారంభమై నప్పటినుండి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. వాల్ స్ట్రీట్ టైటన్ ఈ నెల (సెప్టెంబరు) నుండి అనేక వందల మందిని తొలగించాలని యోచిస్తోందట. కోవిడ్ తరువాత ఇది భారీ తొలగింపు అని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. గోల్డ్‌మన్ ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ సోమవారం నివేదించింది. అయితే దీనిపై వ్యాఖ్యానించేందుకు గోల్డ్‌మన్ ప్రతినిధి నిరాకరించారు. మొత్తం సంఖ్య కొన్ని మునుపటి కంటే తక్కువే అయినప్పటికీ, ఈ సెప్టెంబరు నుంచి వందల సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయనుంది. కోవిడ్ సంక్షోభం తరువాత ఇదే అతిపెద్ద కోత అని అంచనా. ఆదాయాలు భారీగా తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, ఈ సంవత్సరం బ్యాంక్ ఆదాయాలు 40శాతానికి మించి పడిపోనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలైలో నియామకాలని తగ్గించడంతోపాటు, ఉద్యోగుల వార్షిక పనితీరు సమీక్షించాలని సంస్థ నిర్ణయించింది. సమీక్ష అనంతరం సాధారణంగా ఫెర్ఫామెన్స్ చెత్తగా ఉన్న సిబ్బందిని తొలగించనుంది. అలాగే అట్రిషన్ కారణంగా కోల్పోయిన సిబ్బందిని భర్తీ చేసే ప్రక్రియను కూడా తగ్గిస్తున్నట్టు సంస్థ సీఎఫ్‌వో డెనిస్ కోల్మన్ ఒక సందర్బంలో వెల్లడించారు. కంపెనీ రెండో త్రైమాసికం ముగింపు నాటికి సంస్థలో 47వేల ఉద్యోగులుండగా, రెండేళ్ల క్రితం 39,100 ఉద్యోగులు ఉన్నారు. అలాగే గత 12 నెలలుగా ఎస్అండ్పీ 500 ఫైనాన్షియల్స్ ఇండెక్స్ 7.5 శాతం క్షీణతతో పోలిస్తే గోల్డ్‌మ్యాన్ షేర్లు ఈ ఏడాది 10 శాతానికిపైగా పతనం కాగా గత ఏడాది క్రితం కంటే దాదాపు 15 శాతం క్షీణించాయి. -
Hyderabad: సెప్టెంబర్ గండం.. గ్రేటర్ వాసుల వెన్నులో వణుకు
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ వస్తోందంటేనే గ్రేటర్ వాసుల వెన్నులో వణుకు పుడుతోంది. ఏటా ఇదే నెలలో కుండపోత వర్షాలు లోతట్టు ప్రాంతాలు, జలాశయాలకు ఆనుకొని ఉన్న బస్తీలు, ప్రధాన రహదారులను నిండా ముంచుతున్నాయి. 1908వ సంవత్సరంలో మూసీ మహోగ్రరూపం దాల్చి నగరంలో సగభాగం తుడిచిపెట్టేసిన వరదలు కూడా ఇదే నెలలో.. సెప్టెంబర్ 28న సంభవించినట్లు చరిత్ర స్పష్టం చేస్తోంది. ఇక 2000, 2016 సంవత్సరాల్లోనూ ఇదే నెలలో కుండపోత వర్షాలు సిటీని అతలాకుతలం చేశాయి. చరిత్ర పుటల్లో హైదరాబాద్ వరదల ఆనవాళ్లివీ.. ►1591 నుంచి 1908 వరకు 14సార్లు వరద ప్రవాహంలో నగరం చిక్కుకుంది. ►1631, 1831, 1903లలో భారీ వరదలతో సిటీలో ధన, ప్రాణ నష్టం సంభవించాయి. ►1908 సెప్టెంబరు వరదలతో 2 వేల ఇళ్లు కొట్టుకుపోయాయి.15 వేల మంది మృతి చెందారు. 20 వేల మంది నిరాశ్రయులయ్యారు. వారం రోజుల పాటు జనజీవనం స్తంభించింది. ►1631లో కుతుబ్ షాహీ ఆరో పాలకుడు అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో సంభవించిన వరదలకు నగరంలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు ధ్వంసం అయ్యాయి. మూసీ చుట్టు ప్రక్కల ఉన్న ఇళ్లు వరదలకు కొట్టుకుపోయాయి. ►1831లో అసఫ్ జాహీ నాలుగో మీర్ ఫరుకుందా అలీఖాన్ నాసరుదౌలా పాలనా కాలంలోనూ వరదలు సంభవించాయి. నిర్మాణంలో ఉన్న చాదర్‌ఘాట్ వంతెన కొట్టుకుపోయింది. ►ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ పాలనా కాలం 1903లో సెప్టెంబర్ నెలలోనే భారీ వర్షాలకు నగరం అతలాకుతలమైంది. ఇక 1968, 1984, 2000, 2007, 2016, 2020లలో కురిసిన భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మూసీ నిండుగా ప్రవహించింది. చదవండి: (విలవిలలాడిన ఐటీ సిటీ.. ‘గ్రేటర్’ సిటీ పరిస్థితి ఏంటి?) 1908.. సెప్టెంబరు 28న కొట్టుకుపోయిన సిటీ.. మూసీ నది 60 అడుగుల ఎత్తున ప్రవహిస్తూ మహోగ్ర రూపం దాల్చింది. కేవలం 36 గంటల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అఫ్జల్‌గంజ్ వద్ద నీటి మట్టం 11 అడుగులు. వరదనీరు ఇటు చాదర్‌ఘాట్ దాటి అంబర్‌పేట బుర్జు వరకు.. అటు చార్మినార్ దాటి శాలిబండ వరకు పోటెత్తింది. చంపా దర్వాజా ప్రాంతంలోకి చేరడంతో అక్కడే ఉన్న పేట్లబురుజుపైకి వందల సంఖ్యలో జనం ఎక్కారు. రెండు గంటల్లోనే నీటి ప్రవాహానికి పేట్లబురుజు కొట్టుకుపోయింది. వందల మంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. సెప్టెంబరు 28న సాయంత్రానికి వర్షం తగ్గుముఖం పట్టింది. జనం హాహాకారాలు చేశారు. వేల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. నాటి పాలకుడు నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలినడక జనం మధ్యకు వచ్చారు. వరద బాదితుల కోసం సహాయక చర్యలు చేపట్టాలని ప్రధాన మంత్రి మహారాజా కిషన్ ప్రసాద్‌ను ఆదేశించారు. నిరాశ్రయులకు తమ సంస్థానంలోని అన్ని భననాలను ప్రజల కోసం తెరిచిఉంచాలని కోరారు. పురానీ హవేలీతో పాటు అన్ని ప్యాలెస్‌ల్లో వైద్య శిబిరాలు, అన్న దానం ప్రారంభించారు. అన్ని «శాఖల సిబ్బందిని వరద బాధితుల సహాయం కోసం పని చేయాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. నాటి నుంచి సెప్టెంబర్ నెల వచ్చిందంటే నగర ప్రజలు వరదలకు భయపడుతూనే ఉన్నారు. -
ఢిల్లీ టూ సిమ్లా: విమాన టికెట్ ధర కేవలం రూ. 2480
ముంబై: రెండున్నరేళ్ల విరామం తర్వాత రాజధాని నగరం ఢిల్లీ నుంచి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభంకానున్నాయి. విమానయాన సంస్థ అలయన్స్ ఎయిర్ అధికారికంగా వెల్లడించింది. ఢిల్లీ-సిమ్లా మధ్య సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్టు మంగళవారం ప్రకటించింది. సెప్టెంబర్ 6 నుంచి ప్రతిరోజు ఈ సర్వీసు ఉంటుందని వెల్లడించింది. కేవలం రూ. 2,480 పరిచయ ధరను ఆఫర్ చేస్తోంది. ఈ విమానం ఉదయం 6.25 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి 7.35 గంటలకు సిమ్లా జుబ్బర్హట్టి విమానాశ్రయానికి చేరుకుని తిరిగి 8 గంటలకు ఢిల్లీకి చేరుకుని 9.10 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని సంస్థ తెలిపింది. న్యూఇండియాను అనుసంధానించే క్రమంలో టైర్-2/టైర్-3 పట్టణాల మధ్య ఆయా సిటీ హబ్‌లతో మెరుగైన ఎయిర్ కనెక్టివిటీని అందించే ప్రయత్నంలో ఢిల్లీ-సిమ్లా విమానాలను ప్రారంభించామని అలయన్స్ ఎయిర్ తెలిపింది. ఇది ఉత్తర భారతదేశంలో కనెక్టివిటీని విస్తరింప జేస్తుందని అలయన్స్ ఎయిర్ డిప్యూటీ ఇంజనీర్ యష్ వర్ధన్ సింగ్ అన్నారు. సెప్టెంబర్ 6నుంచి ప్రతీ రోజూ విమానాలు నడుస్తాయన్నారు. కాగా ఈ మార్గంలో అలయన్స్ ఎయిర్ తొలిసారిగా 2017 జూలైలో విమానాన్ని నడిపింది. ఆ తర్వాత పలు కారణాలతో ఈ సర్వీసును నిలిపివేసింది. -
ఖాతాదారులకు అలర్ట్, సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఎన్నిరోజులు సెలవులంటే!
ఆర్బీఐ ప్రతినెల బ్యాంక్ హాలిడేస్‌ను ప్రకటిస్తుంది. సెప్టెంబర్ నెలలో సైతం బ్యాంక్‌లకు ఎన్ని రోజులు సెలవులనేది అంశంపై స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్‌లో రెండు, నాలుగో శనివారం, ఆదివారాలతో సహా 13 రోజుల పాటు దేశంలోని బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకారం, సెప్టెంబర్‌లో వారాంతాలు కాకుండా 8 రోజులు బ్యాంకుకు సెలవులని పేర్కొంది. అయితే ఈ సెలవులు ఆయా రాష్ట్రాల్ని బట్టి మారుతుంటాయని, బ్యాంక్ ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తించాలని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్‌లో రాష్ట్రాల వారీగా గణేష్ చతుర్థి, కర్మ పూజ, మొదటి ఓనం, తిరువోణం, ఇంద్రజాతర, శ్రీ నారాయణ గురు జయంతి వంటి ఇతర సందర్భాల్లో బ్యాంకులకు హాలిడేస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో దేశ వ్యాప్తంగా ఎన్నిరోజులు సెలవులున్నాయో తెలుసుకుందాం. సెప్టెంబర్‌లో బ్యాంకు సెలవులు సెప్టెంబర్ 1, 2022 (గురువారం): గణేష్ చతుర్థి (2వ రోజు) - పనాజీ సెప్టెంబర్ 6, 2022 (మంగళవారం): కర్మ పూజ - రాంచీ సెప్టెంబర్ 7, 2022 (బుధవారం): మొదటి ఓనం - కొచ్చి, తిరువనంతపురం సెప్టెంబర్ 8, 2022 (గురువారం): తిరువోణం - కొచ్చి, తిరువనంతపురం సెప్టెంబర్ 9, 2022 (శుక్రవారం): ఇంద్రజాతర - గ్యాంగ్‌టక్ సెప్టెంబర్ 10, 2022 (శనివారం): శ్రీ నారాయణ గురు జయంతి - కొచ్చి, తిరువనంతపురం సెప్టెంబర్ 21, 2022 (బుధవారం): శ్రీ నారాయణ గురు సమాధి దినోత్సవం - కొచ్చి, తిరువనంతపురం సెప్టెంబర్ 26, 2022 (సోమవారం): నవరాత్రి స్తాప్నా / మేరా చౌరెన్ హౌబా ఆఫ్ లైనింగ్తౌ సనమహి - ఇంఫాల్, జైపూర్ సెప్టెంబర్ 2022లో వారాంతపు సెలవులు: సెప్టెంబర్ 4, 2022: ఆదివారం సెప్టెంబర్ 10, 2022: రెండో శనివారం సెప్టెంబర్ 11, 2022: ఆదివారం సెప్టెంబర్ 18, 2022: ఆదివారం సెప్టెంబర్ 24, 2022: నాలుగో శనివారం సెప్టెంబర్ 25, 2022: ఆదివారం -
గుడ్ న్యూస్: ఐఫోన్ 14 వచ్చేస్తోంది, అదికూడా ఊహించని ధరలో
టెక్ దిగ్గజం యాపిల్ లేటెస్ట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న ఐఫోన్ లవర్స్‌గా గుడ్‌న్యూస్. ఐఫోన్14 సెప్టెంబర్ 7న లాంచ్ చేయనుందట. సాధారణంగా ఒక స్పెషల్ ఈవెంట్లో సెప్టెంబరు తొలి అర్థ భాగంలో తాజా ఐఫోన్లను ఆవిష్కరిస్తుంది.ఐఫోన్‌తోపాటు ఉత్పత్తులను ప్రకటించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే మరో గ్రాండ్ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది యాపిల్. ఈ మేరకు ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్టుసమాచారం. కొత్త ఐఫోన్‌ను ఆవిష్కరించడం లాంచింగ్ వారం తర్వాత స్టోర్లలో తాజా ఉత్పత్తులను విడుదల చేస్తుంది. ఇందులో భాగంగానే ఐఫోన్14ను కూడా సెప్టెంబర్ 7 లాంచ్ చేసి. సెప్టెంబర్ 16నుంచి రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంచనుంది. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం దీంతోపాటు మూడు కొత్త ఆపిల్ వాచ్ మోడల్‌లు , అనేక కొత్త వెర్షన్లు మాక్‌లు ,ఐప్యాడ్లు లాంచ్ చేయనుంది. అంతేకాదు దాదాపు ఐఫోన్ 13 రేటుకే ఐ ఫోన్ 14ను తన యూజర్లకుఅందించనుంది.ఈవెంట్ సమయంపై వ్యాఖ్యానించడానికి ఆపిల్ ప్రతినిధి నిరాకరించారు. -
తిరుమల: సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
-
ఐఫోన్ 14: ఐఫోన్ లవర్స్‌కు తీపికబురు
సాక్షి, ముంబై: ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు తీపి కబురు అందింది. ఎన్నాళ్లోనుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 14 సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 13న లాంచ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు నివేదికలు హల్ చల్ చేస్తున్నాయి. తాజా నివేదికల ప్రకార ఐఫోన్ 14 సిరీస్‌ను సెప్టెంబర్ 13న లాంచ్ చేయబోతోంది. ప్రీఆర్డర్లు సెప్టెంబర్16 నుండి ప్రారంభమవుతాయని,సెప్టెంబరు 23నాటికి షిప్మెంట్లు ప్రారంభం కానున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఆపిల్ అధికారికంగా ఈ తేదీలను ధృవీకరించలేదు. ఈ సెప్టెంబరులో ఆపిల్ వాచ్ సిరీస్ 8తో పాటు ఐఫోన్ 14 సిరీస్‌ను, AirPods ప్రోను లాంచ్ చేయనుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో , ఐఫోన్ 14 ప్రో మాక్స్ అనే న ఆలుగు వేరియంట్లలో తీసుకురానుంది. ఐఫోన్ 13తో పోలిస్తే ఐఫోన్ 14 ధన 100 డాలర్లు ఖరీదైనదిగా ఉండనుందట. అయితే ఆపిల్ అధికారికంగా ఈ తేదీలను ధృవీకరించలేదు. కొత్త ఐఫోన్‌ను, ఇతర ఉత్పత్తులను సాధారణంగా ప్రతి సంవత్సరం సెప్టెంబరులో నిర్వహించే స్పెషల్ ఈవెంట్లో లాంచ్ చేస్తున్న సంగతి తెలిసిందే. pic.twitter.com/nRiKRIZcAT — DuanRui (@duanrui1205) July 8, 2022 -
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల టికెట్లు ఎప్పుడంటే..
తిరుమల: సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను గురువారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. జూలై 12, 15, 17 తేదీల్లోని రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను బుధవారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. చదవండి: (రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. చరిత్రలో ఇది రెండోసారి) -
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి అంతంతే!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి సెప్టెంబర్‌లో స్వల్పంగా 3.1 శాతంగా (2020 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. మైనింగ్ రంగం మెరుగైన ఫలితాన్ని నమోదుచేసుకుంది. బేస్ ఎఫెక్ట్ దన్నుతో గడచిన ఆరు నెలలుగా (2021 మార్చి నుంచి ) రెండంకెల్లో ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి, తన ధోరణిని కొనసాగించకుండా తక్కువ వృద్ధి రేటుకు పడిపోవడం ఆందోళన పారిశ్రామిక రంగానికి సంబంధించి ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎలా అంటే... 2020 సెప్టెంబర్‌లో సూచీ 124.1 పాయింట్ల వద్ద ఉంది. 2021 సెప్టెంబర్‌లో సూచీ 127.9 పాయింట్లకు ఎగసింది. అంటే వృద్ధి 3.1 శాతమన్నమాట. 2019లో సూచీ 122.9 వద్ద ఉంది. కరోనా ముందస్తు కాలంతో పోల్చినా సూచీల్లో పురోగతి ఉన్నా... ఇది అతి స్వల్పంగా మాత్రమే ఉండడం గమనించాల్సిన అంశం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం ఈ గణాకాలను విడుదల చేసింది. ముఖ్యాంశాలు ఇవీ... ► మొత్తం ఐఐపీలో దాదాపు 77.63 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం సెప్టెంబర్‌లో 2.7 శాతం పురోగమించింది. ► మైనింగ్ రంగం వృద్ధి రేటు 8.6 శాతంగా ఉంది. ► విద్యుత్ ఉత్పత్తి కేవలం ఒక శాతం పెరిగింది. ► భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగం కేవలం 1.3 శాతం లాభపడింది. 2020 ఇదే కాలంలో ఈ రంగం అసలు క్షీణతలో ఉంది. ► కన్జూమర్, నాన్ కన్జూమర్ గూడ్స్ ఉత్పత్తి క్షీణతలో ఉండడం గమనార్హం. రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ తయారీ 2021 సెప్టెంబర్‌లో 2 శాతం క్షీణించింది. నిత్యావసరాలకు సంబంధించి (ఎఫ్ఎంసీజీ) నాన్ కన్జూమర్ గూడ్స్ ఉత్పత్తులు 0.5 శాతం క్షీణించాయి. ► మొత్తం ఐఐపీలో దాదాపు 44 శాతం వాటా కలిగిన ఎనిమిది రంగాల మౌలిక పరిశ్రమల గ్రూప్ 4.4 శాతం పురోగమించింది. సహజవాయువు ఉత్పత్తి 27.5 శాతం పురోగతి సాధిస్తే, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తి 6% ఎగసింది. ఇక సిమెంట్ ఉత్పత్తి 10.8 శాతం పెరిగింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 1.7% క్షీణించింది. ఎరువుల రంగం స్వల్పంగా 0.02% పురోగమించింది. విద్యుత్ ఉత్పత్తి కూడా ఇదే విధంగా 1% పెరిగింది. స్టీల్ రంగం పనితీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇక బొగ్గు ఉత్పత్తి వృద్ధి రేటు 8.1%. -
ద్రవ్యలోటు రూ.5.26 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) సెప్టెంబర్ ముగిసే నాటికి రూ.5.26 లక్షల కోట్లకు చేరింది. బడ్జెట్లో నిర్దేశించుకున్న లక్ష్యంతో పోల్చితే ఈ పరిమాణం 35 శాతానికి చేరింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. 2021–22లో రూ.15,06,812 కోట్ల వద్ద ద్రవ్యలోటు ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనావేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలతో పోల్చితే ఇది 6.8 శాతం. అంచనాలతో పోల్చితే సెప్టెంబర్ నాటికి ద్రవ్యలోటు రూ.5,26,851 కోట్లకు (35 శాతం) చేరిందన్నమాట. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ద్రవ్యలోటు పరిస్థితి అదుపులో ఉండడం గమనార్హం. కరోనా కష్టాల నేపథ్యంలో పడిపోయిన ఆదాయాలు– పెరిగిన వ్యయాల నేపథ్యంలో గత ఏడాది ఇదే కాలానికి ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్ అంచనాలను దాటి ఏకంగా 114.8 శాతానికి ఎగసింది. 2020–21లో 3.5 శాతం తొలి (బడ్జెట్) అంచనాలను మించి ద్రవ్యలోటు 9.3 శాతానికి ఎగసింది. తాజా సమీక్షా కాలానికి సంబంధించి ముఖ్య గణాంకాలను పరిశీలిస్తే... 2020–21తో పోల్చితే పురోగతి ► 2021 సెప్టెంబర్ నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.10.99 లక్షల కోట్లు. బడ్జెట్ మొత్తం ఆదాయ అంచానల్లో ఈ పరిమాణం 55.5 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే కాలంలో బడ్జెట్ మొత్తం ఆదాయ అంచనాల్లో సెప్టెంబర్ నాటికి ఒనగూరింది కేవలం 25.2 శాతమే కావడం గమనార్హం. మొత్తం ఆదాయాల్లో పన్నుల విభాగం నుంచి తాజా సమీక్షా కాలానికి (2021 సెప్టెంబర్ నాటికి) వచ్చింది రూ.9.2 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాల్లో ఇది 59.6 శాతం. అయితే గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే కాలానికి బడ్జెట్ మొత్తం పన్ను వసూళ్ల అంచనాల్లో సెప్టెంబర్ నాటికి ఒనగూరింది కేవలం 28 శాతమే కావడం గమనార్హం. ► ఇక సమీక్షా కాలంలో ప్రభుత్వ వ్యయాలు రూ.16.26 లక్షల కోట్లు. 2021–22 బడ్జెట్ మొత్తం వ్యయ అంచనాల్లో ఇది 46.7 శాతం. వెరసి ద్రవ్యలోటు సెప్టెంబర్ నాటికి రూ.5.26 లక్షల కోట్లకు చేరిందన్నమాట. సెప్టెంబర్‌లో మౌలిక రంగం స్పీడ్ 4.4 శాతం ఎనిమిది మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్ ఉత్పత్తి సెప్టెంబర్‌లో 4.4 శాతం పెరిగింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ఈ ఎనిమిది రంగాల వృద్ధితీరు 2020లో కేవలం 0.6 శాతం. అప్పటి అతి తక్కువ లో బేస్ పరిస్థితిలో కూడా మౌలిక రంగం కేవలం 4.4 శాతం పురోగమించడం గమనార్హం. లో బేస్ కారణంతోనే 2021 ఆగస్టులో వృద్ధిరేటు భారీగా 11.5 శాతంగా ఉంది. మౌలిక రంగాల తీరు సమీక్షా నెల్లో వేర్వేరుగా చూస్తే... సహజవాయువు ఉత్పత్తి 27.5 శాతం పురోగతి సాధిస్తే, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తి 6 శాతం ఎగసింది. ఇక సిమెంట్ ఉత్పత్తి 10.8 శాతం పెరిగింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 1.7 శాతం క్షీణించింది. ఎరువుల రంగం స్వల్పంగా 0.02 శాతం పురోగమించింది. విద్యుత్ ఉత్పత్తి కూడా ఇదే విధంగా 0.3 శాతం పెరిగింది. స్టీల్ రంగం పనితీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇక బొగ్గు ఉత్పత్తి వృద్ధి రేటు 8.1 శాతం. -
సెప్టెంబర్‌లో 16,570 కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు
ముంబై: దేశవాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో 16,570 కొత్త కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని అధికారిక గణాంకాలు తెలిపాయి. తద్వారా దేశంలో ప్రస్తుతం కార్యకలాపాలను సాగించే(యాక్టివ్) కంపెనీల మొత్తం సంఖ్య 14.14 లక్షలకు చేరింది. కేంద్ర కార్పొరేట్ వ్యవవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఈ సెప్టెంబర్ 30వ తేది నాటికి దేశంలో మొత్తం 22,32,699 కంపెనీలు రిజి్రస్టేషన్ చేసుకున్నాయి. వీటిలో 7,73,070 కంపెనీలు మూతబడ్డాయి. 2,298 సంస్థలు క్రియాశీలకంగా పనిచేయడం లేదు. 6,944 కంపెనీలు దివాళ ప్రక్రియలో ఉన్నాయి. 36,110 కంపెనీలు వివిధ సమస్యలతో మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్‌లో కనిష్టంగా 3,209 కంపెనీలు రిజిస్ట్రేషన్లు జరిగాయని, నాటి నుంచి నెలవారీ కంపెనీల రిజిస్ట్రేషన్లు పెరుగుతూ వచ్చాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గతేడాది సెపె్టంబర్ రిజిస్ట్రేషన్లు 16,641 తో పోలిస్తే తాజా సమీక్ష నెలలో రిజిస్ట్రేషన్లు తగ్గినా, ఈ ఏడాది ఆగస్ట్‌తో పోలిస్తే ఈ సంఖ్య 25 శాతం అధికంగా ఉంది. -
జీఎస్టీ వసూళ్లు @ రూ.1,17,010 కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సెపె్టంబర్లో ఐదు నెలల గరిష్టస్థాయిలో రూ.1,17,010 కోట్లుగా నమోదయ్యాయి. అలాగే వసూళ్లు రూ.లక్ష కోట్ల పైబడ్డం ఇది వరుసగా మూడవనెల. 2021–22 ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో (2021అక్టోబర్–మార్చి2022) కేంద్రానికి ఆదాయాలు గణనీయంగా మెరుగుపడతాయన్న విశ్వాసాన్ని తాజా గణాంకాలు కల్పిస్తున్నాయి. తాజా వసూళ్లు 2020 సెపె్టంబర్ వసూళ్లతో (రూ.95,480 కోట్లు) పోలి్చతే 23 శాతం అధికం. 2019 సెప్టెంబర్ వసూళ్లతో (రూ.91,916 కోట్లు) పోలి్చతే 27 శాతం అధికం. ఏప్రిల్‌లో వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1.41 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అటు తర్వాత ఈ స్థాయిలో (రూ.1.17 లక్షల కోట్లు) వసూళ్లు ఇదే తొలిసారి. సెపె్టంబర్ మొత్తం వసూళ్లు రూ.రూ.1,17,010 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.20,578 కోట్లు. స్టేట్ జీఎస్టీ రూ.26,767 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.60,911 కోట్లు. సెస్ రూ.8,754 కోట్లు. -
సెప్టెంబర్ వరకూ కేంద్ర రుణం రూ.7.02 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: కేంద్రం ఆదాయ వ్యత్యాసం భర్తీలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) బాండ్ల జారీ ద్వారా 7.02 కోట్లు సమీకరించింది. అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకూ రూ.5.03 లక్షల కోట్ల రుణ సమీకరణ జరపనుంది. ఆర్థిక శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 2021–22 బడ్జెట్ నిర్దేశాల ప్రకారం– కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12.05 లక్షల కోట్ల స్థూల మార్కెట్ రుణ సమీకరణ జరపాల్సి ఉంది. ఇందులో మొదటి ఆరు నెలల్లోనే రుణ లక్ష్యంలో 60 శాతం అంటే దాదాపు రూ.7.24 లక్షల కోట్ల సమీకరణ చేయాల్సి ఉంది. అయితే సమీకరణ లక్ష్యం కొంత తగ్గింది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును కొంత మేర భర్తీ చేయడానికి మార్కెట్ నుంచి కేంద్రం రుణ సమీకరణలు జరుపుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 9.3 శాతంగా ఉంది. 2021–22లో జీడీపీలో 6.8 శాతం(రూ.15,06,812 కోట్లు)ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. అయితే 8శాతం దాటిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై ముగిసే సరికి రూ.3.21 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2021–22 వార్షిక బడ్జెట్ అంచనాలతో పోల్చితే ఇది 21.3 శాతం. ద్రవ్యలోటు కట్టడికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థికవేత్తలు కొందరు ఉద్ఘాటిస్తుండగా, కేవీ కామత్ లాంటి ప్రముఖ బ్యాంకర్లు ఈ విషయంలో కొంత సాహస వైఖరిని కేంద్రం ప్రదర్శించవచ్చని సూచిస్తున్నారు. -
ఈనెల్లోనే ప్రధాని మోదీ అమెరికా పర్యటన!
న్యూఢిల్లీ: సెపె్టంబర్ చివరినాటికి ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. క్వాడ్ దేశాల నేతల తొలి ముఖాముఖి భేటీ ఎక్కడ జరగాలన్న విషయం కొలిక్కివస్తే మోదీ అమెరికా పర్యటన ఖరారవుతుందన్నారు. ఈనెల 22–27మధ్య జరిగే అవకాశమున్న ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఐరాస జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించడం, క్వాడ్ సమావేశాల్లో పాల్గొనడం, జోబైడెన్‌తో ముఖాముఖి జరపడం ఉంటాయని సదరు వర్గాలు తెలిపాయి. నిజానికి ఈ సమావేశంపై ఇప్పటికే నిర్దిష్ట ప్రకటన రావాల్సిఉండగా, పదవి నుంచి దిగిపోతానన్న జపాన్ ప్రధాని సుగా ప్రకటనతో సమావేశం డైలమాలో పడింది. సుగా ప్రకటనతో క్వాడ్ సమావేశమే కాకుండా త్వరలో జరగాల్సిన ఇండో–జపాన్ సమావేశం కూడా సందిగ్ధంలో పడింది. ఇప్పటికి రెండేళ్లుగా ఈ సమావేశం వాయిదా పడుతూ వస్తోంది. పరిస్థితులు అనుకూలించి మోదీ అమెరికా పర్యటన ఖరారైతే చేయాల్సిన ఏర్పాట్లపై ఇండో అమెరికా అధికారులు చర్చలు జరిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్ చెప్పాలనే ఉద్దేశంతో అమెరికా క్వాడ్‌ను ఏర్పాటుచేసింది. గత మార్చిలో క్వాడ్ నేతల ఆన్లైన్ సమావేశం జరిగింది. -
ఢిల్లీలో కుంభవృష్టి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని అనూహ్య వర్షం ముంచెత్తింది. గత 19 ఏళ్లలో సెప్టెంబర్ నెలలో ఒకే రోజులో ఇంతటి భారీ వర్షం కురవడం ఇదే తొలిసారి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర సమయానికల్లా ఏకంగా 112.1 మిల్లీమీటర్ల వర్షపాతంతో వరుణుడు హస్తినను కుంభవృష్టితో తడిసి ముద్దయ్యేలా చేశాడు. ఢిల్లీలో చాలా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కేవలం మూడు గంటల్లోనే 75.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాణక్యపురి, ఐటీవో, రోహతక్ రోడ్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షపునీరు భారీ స్థాయిలో చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. ‘కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల రుతుపవనాల రీతిలో స్వల్ప మార్పులొస్తున్నాయి. అందుకే ఇలాంటి కుండపోత వర్షాలను మేం కూడా ముందుగా అంచనావేయలేకపోతున్నాం. ఏడో తేదీ నుంచి ఇదే స్థాయిలో వర్షం పడే అవకాశం ఉంది’ అని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఉన్నతాధికారి ఒకరు బుధవారం చెప్పారు. వర్షం సాధారణ స్థాయిలో కురిస్తే భూగర్భ జలాల మట్టం పెరిగే ప్రయోజనం ఉందని, కానీ ఇలా కుంభవృష్టి వర్షాలతో వరదనీరు లోతట్టు ప్రాంతాలను ముంచేయడం తప్ప మరే లాభం లేదని వాతావరణ నిపుణులు వివరించారు. -
సెప్టెంబర్‌లో 12 బ్యాంక్ హాలీడేస్!
Bank Holidays September 2021: వచ్చే నెలలో 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. రెండో, నాలుగో శనివారం, ఆదివారాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 12 క్లోజింగ్ డేస్ రానున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వీటిలో దాదాపు ఎక్కువగా మిగతా రాష్ట్రాల పండుగలే ఉండడం విశేషం. సెప్టెంబర్ 8 తిథి ఆఫ్ శ్రీమంత శంకర్దేవ సెప్టెంబర్ 9 తీజ్(హరిటలికా) సెప్టెంబర్ 10 వినాయక చవితి సెప్టెంబర్ 11 గణేశ్ చతుర్థి (2వరోజు) సెప్టెంబర్ 17 కర్మ పూజ సెప్టెంబర్ 20 ఇంద్రజాతర సెప్టెంబర్ 21 శ్రీ నారాయణ గురు సమాధి డే చదవండి: హ్యాండ్‌క్యాష్.. అయినా ఈఎంఐలే ఎందుకు? పై లిస్ట్‌లో కేవలం వినాయక చవితి పండుగ నాడు మాత్రమే దేశవ్యాప్తంగా బ్యాంక్ లావాదేవీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. తిథి ఆఫ్ శ్రీమంత శంకర్దేవకు గువాహటి, తీజ్ సందర్భంగా గ్యాంగ్‌టక్‌లోని అన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 10న అగర్తల, ఐజ్వాల్, భోపాల్, డెహ్రాడూన్, ఐజ్వాల్, భోపాల్, చంఢీగఢ్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, కొత్త ఢిల్లీ, పట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురంలో తప్ప దాదాపు అన్ని రాష్ట్రాల్లో వినాయక చవితికి సెప్టెంబర్ 10న బ్యాంకులు మూతపడనున్నాయి. అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగపూర్, పనాజీ గణేష్చతుర్థి మొదటి రోజుకు, పనాజీలో రెండో రోజుకు కూడా బ్యాంక్ సెలవులు తీసుకోనున్నాయి. కర్మపూజకుగానూ పనాజీ, ఏప్రిల్ 17న కర్మపూజలో భాగంగా రాంచీ, ఇంద్రజాతర కోసం గ్యాంగ్‌టక్, శ్రీ నారాయణ గురు సమాధి డే కొచ్చి-తిరువంతపురంలో బ్యాంకులు సెలవు పాటించనున్నాయి. సెప్టెంబర్ 11 గణేశ్ చతుర్థి (2వరోజు) సెలవు.. రెండో శనివారం కారణంగా ఓవర్ లాప్స్ కానుంది. ఆర్బీఐ సాధారణంగా తన సెలవులను మూడు కేటగిరీలకు విభజిస్తుంది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, హాలీడే అండర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ యాక్ట్ ప్రకారం బ్యాంకులకు సెలవుల్ని నిర్ధారిస్తుంది ఆర్బీఐ. సెప్టెంబర్ 5 – ఆదివారం, సెప్టెంబర్ 11 – రెండవ శనివారం, సెప్టెంబర్ 12 – ఆదివారం, సెప్టెంబర్ 19 – ఆదివారం, సెప్టెంబర్ 25 – నాల్గవ శనివారం, సెప్టెంబర్ 26 – ఆదివారం.. బ్యాంకుల సాధారణ సెలవులు. -
త్వరలోనే థర్డ్ వేవ్!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ దాదాపు ముగిసిపోయి, మహమ్మారి వ్యాప్తి ప్రస్తుతం కొంత నెమ్మదించినప్పటికీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. సెప్టెంబర్–అక్టోబర్ నెలల మధ్య ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోందని వెల్లడించింది. థర్డ్ వేవ్ తీవ్రతను తగ్గించాలంటే కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, సాధ్యమైనంత ఎక్కువ మందికి త్వరగా టీకా ఇవ్వాలని సూచించింది. కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్(ఎన్ఐడీఎం) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజాగా తన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) సమర్పించింది. మూడో వేవ్‌లో పెద్దలకు ఉన్నట్లే చిన్నారులకు సైతం కరోనా ముప్పు ఉంటుందని తెలిపింది. భారీ సంఖ్యలో పిల్లలు వైరస్ బారినపడితే చికిత్స అందించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది.చదవండి: Andhra Pradesh: ఇళ్లకు సుముహూర్తం కొత్త వేరియంట్లతో ముప్పు జనాభాలో 67 శాతం మందిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా యాంటీబాడీలు పెరిగితే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించినట్లేనని నిపుణుల కమిటీ గతంలో అభిప్రాయపడింది. ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే మాత్రం హెర్డ్ ఇమ్యూనిటీపై ఆశలు వదులుకోవాల్సిందేనని తాజాగా తెలిపింది. ఒకసారి సోకిన కరోనా ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా శరీరంలో పెరిగిన రోగ నిరోధక శక్తి నుంచి కొత్త వేరియంట్లు తప్పించుకొనే అవకాశం ఉంటుందని పేర్కొంది. కొత్త వేరియంట్ల ప్రభావం నుంచి కాపాడుకోవడానికి వీలుగా సామూహిక నిరోధకత సాధించడానికి జనాభాలో 80–90 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించింది. కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సన్నద్ధం కావాలని తెలిపింది. సామూహిక నిరోధకత సాధించేదాకా.. భారత్‌లో ఇప్పటిదాకా 7.6 శాతం మందికే (10.4 కోట్లు) పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ జరిగిందని నిపుణుల కమిటీ తెలిపింది. వ్యాక్సినేషన్లో వేగం పెంచకపోతే థర్డ్ వేవ్‌లో నిత్యం 6 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని తేల్చిచెప్పింది. ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా సామూహిక నిరోధకత (హెర్డ్ ఇమ్యూనిటీ) సాధించేదాకా కరోనాలో కొత్త వేవ్‌లు వస్తూనే ఉంటాయని వైద్య నిపుణులు అంచనా వేశారని గుర్తుచేసింది. కరోనా నియంత్రణ నిబంధనలను ఎత్తివేయడాన్ని బట్టి ఇండియాలో థర్డ్ వేవ్ మూడు రకాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఐఐటీ–కాన్పూర్ నిపుణులు గతంలో తెలిపారు. ఒకటి.. థర్డ్ వేవ్ అక్టోబర్‌లో గరిష్ట స్థాయికి చేరుతుంది. నిత్యం 3.2 పాజిటివ్ కేసులు వెలుగు చూస్తాయి. రెండోది.. అధిక తీవ్రత కలిగిన కొత్త వేరియంట్లు పుట్టుకురావడంతో థర్డ్ వేవ్ సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ప్రతిరోజూ 5 లక్షల కేసులు బయటపడతాయి. ఇక మూడోది.. అక్టోబర్ మాసాంతంలో థర్డ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుతుంది. నిత్యం 2 లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతాయి. వైరస్‌లో మార్పులు.. పిల్లలకు సవాలే థర్డ్ వేవ్‌లో పెద్దల కంటే పిల్లలే అధికంగా ప్రభావితం అవుతారని చెప్పడానికి ఇప్పటివరకైతే తగినంత సమాచారం లేదని నిపుణులు కమిటీ వివరించింది. కరోనా వైరస్‌లో క్రమంగా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి అవి పిల్లలకు పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది. పిల్లల కోసం కరోనా వ్యాక్సిన్లు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని గుర్తుచేసింది. ఒకవేళ చిన్నారులకు కరోనా సోకినా అసలు లక్షణాలేవీ కనిపించకపోవడం, స్వల్పంగా కనిపించడం వంటివి ఉంటాయని వివరించింది. వారు అప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు లేదా ప్రత్యేక అవసరాలు ఉన్నవారైతే పరిస్థితి తీవ్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన చిన్నారుల్లో 60–70 శాతం మంది ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు లేదా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే కావడం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న తర్వాత పిల్లల్లో అపాయకరమైన ఎంఐఎస్–సి(మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్) తలెత్తే అవకాశం ఉందని నిపుణుల కమిటీ తన నివేదికలో తెలియజేసింది. చదవండి:Andhra Pradesh: వెనకబాటు నుంచి వెన్నెముకగా..! ప్రమాదకరమైన వేరియంట్ పుట్టుకొస్తేనే థర్డ్ వేవ్ కరోనాలో డెల్టా కంటే ఎక్కువ తీవ్రత కలిగిన కొత్త వేరియంట్ ఉద్భవిస్తే థర్డ్ వేవ్ నవంబర్‌లో గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని ఐఐటీ–కాన్పూర్‌కు చెందిన ప్రముఖ సైంటిస్టు మహీంద్ర అగర్వాల్ సోమవారం చెప్పారు. ఇది సెప్టెంబర్ ఆఖరు నాటికి పూర్తి క్రియాశీలకంగా మారుతుందని అన్నారు. డెల్టా కంటే ప్రమాదకరమైన వేరియంట్ పుట్టుకురాకపోతే థర్డ్ వేవ్ దాదాపు రానట్లేనని అగర్వాల్ స్పష్టం చేశారు. ఒకవేళ ఇలాంటి కొత్త వేరియంట్ బయటపడితే మూడో వేవ్‌లో నిత్యం 1.5 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. -
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు సెప్టెంబర్‌లో ...
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సెప్టెంబర్ రెండవ వారంలో నిర్వహించేం దుకు ఇంటర్మీడియెట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. అయితే పరీక్ష విద్యార్థుల ఐచ్ఛికమేనని అధికారులు తెలిపారు. మరో వారంలో పరీక్షల షెడ్యూల్డ్ విడుదల చేస్తామని బోర్డు వర్గాలు తెలిపాయి. గతేడాది పదో తరగతి ఉత్తీర్ణత సాధించి, ఇంటర్లో చేరిన వారు దాదాపు 4.70 లక్షల మంది ఉన్నారు. వాస్తవానికి ఈ ఏడాది మార్చిలో వీరికి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలి. కరోనా కార ణంగా వీలు కాకపోవడంతో వారందరినీ ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేశారు. అయితే, పరీక్షలు లేకపోతే భవిష్యత్‌లో సమస్యలు ఎదురవుతాయనే ఆందోళన కొందరు విద్యార్థుల నుంచి వ్యక్తమైంది. జాతీయ పోటీ పరీక్షలకు మార్కులే కొలమానంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష కోరుకునే వారికి కరోనా నియంత్రణలోకి వచ్చిన తర్వాత పరీక్షలు పెడతామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత తగ్గిందని ఇటీవలే వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో పరీక్షలు పెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అయితే ద్వితీయ సంవత్సరం సిలబస్ చాలా వరకు పూర్తయిందని, ఈ సమయంలో మొదటి సంవత్సరం పరీక్షలకు వెళ్లడం కష్టమనే వాదన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది. పరీక్షలు జరపాలంటే కనీసం 15 రోజుల ముందు షెడ్యూల్ ఇవ్వాలి. నిబంధనల ప్రకారం షెడ్యూల్ తర్వాత పరీక్షలకు నెల రోజుల గడువు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, పరీక్షలు ఇంకా ఆలస్యమైతే తమకు ఇబ్బందిగా ఉంటుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. -
సెప్టెంబర్ లో తెలంగాణలో రాహుల్ పర్యటన
-
సెప్టెంబర్ నుంచి టీటీడీ అగరబత్తులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల శ్రీవారికి వినియోగించిన పూలు.. తిరిగి పరిమళాలు వెదజల్లేలా టీటీడీ కార్యాచరణ రూపొందించింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ ఆలయాల్లో వాడిన పుష్పాలతో సుగంధాలు వెదజల్లే అగరబత్తులు తయారు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోగా, ఆ సంస్థ ఏడు రకాల బ్రాండ్లతో అగరబత్తులు తయారు చేసి ఇస్తోంది. నో లాస్ నో గెయిన్ ప్రాతిపదికన ఆ సంస్థ అగరబత్తులను టీటీడీకి అందిస్తోంది. వీటిని తిరుమల, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురంతో పాటు టీటీడీ ఆలయాల్లో విక్రయానికి అందుబాటులో ఉంచుతారు. సెప్టెంబర్ తొలి వారంలో తిరుమలలో తొలి విడతగా వీటి విక్రయాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గో సంరక్షణకు వినియోగించాలని నిర్ణయించారు. -
సెప్టెంబర్‌కల్లా పిల్లలకు వ్యాక్సిన్!
న్యూఢిల్లీ: భారత్‌లో పిల్లలకు కోవిడ్–19 వ్యాక్సిన్ ఈ సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. అదే జరిగితే కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఇదో ముఖ్య ఘట్టంగా మారుతుందని అన్నారు. జైడస్ క్యాడిలా కంపెనీ జైకోవ్–డీ పిల్లలపై వ్యాక్సిన్ ప్రయోగాలు పూర్తి చేసి డేటా కూడా సమర్పించిందని, అత్యవసర అనుమతి కోసం ఎదురు చూస్తోందని చెప్పారు. భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్ (2–18 ఏళ్ల లోపు పిల్లలకు) ఆగస్టు లేదంటే సెప్టెంబర్ నాటికి పూర్తి అవుతాయని, అదే సమయానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అదే విధంగా ఫైజర్ వ్యాక్సిన్ భారత్‌కు సెప్టెంబర్ నాటికి వస్తే వెంటనే పిల్లలకి వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు పెట్టవచ్చునని గులేరియా ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఆయన వివిధ వార్తా సంస్థలకు విడివిడిగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. భారత్‌లో జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా ఇప్పటివరకు 42 కోట్లకు పైగా టీకా డోసుల్ని ఇచ్చారు. ఇంచుమించుగా 6% జనాభా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలై ఇన్నాళ్లయినా 18 ఏళ్ల లోపు వారికి మాత్రం టీకా ఇంకా అందుబాటులోకి రాలేదు. పశ్చిమ దేశాల్లో పిల్లలకి ఫైజర్ టీకా ఇప్పటికే ఇవ్వడం మొదలుపెట్టగా... మోడర్నా వ్యాక్సిన్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా 18 ఏళ్ల లోపు వయసు వారికి టీకాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో చురుగ్గా ప్రయోగాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నాటికి పిల్లల కోసం ఒకటి కంటే ఎక్కువ వ్యాక్సిన్లే అందుబాటులోకి వస్తాయని గులేరియా చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి 18–30 శాతం పెరగడానికి 11–17 ఏళ్ల వయసు వారే కారణమని, వాళ్లు కరోనా క్యారియర్లుగా మారుతున్నారని ఇటీవల లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో తేలింది. భారత్‌లో పిల్లలకి వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైతే వైరస్ వ్యాప్తికి గణనీయంగా అడ్డుకట్ట పడుతుందని డాక్టర్ రణ్‌దీప్ గులేరియా చెప్పారు. బూస్టర్ డోస్ అవసరమే కరోనా వైరస్‌లో తరచూ జన్యుపరంగా మార్పులు చోటు చేసుకుంటూ ఉండటంతో భవిష్యత్‌లో బూస్టర్ డోసులు ఇవ్వాల్సిన అవసరం రావచ్చునని గులేరియా చెప్పారు. కరోనా వ్యాక్సిన్లు ప్రభావం తగ్గిపోయి రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తే సెకండ్ జనరేషన్ కోవిడ్–19 వ్యాక్సిన్ల (బూస్టర్ డోసులు) అవసరం వస్తుందని అన్నారు. ఇప్పటికే బూస్టర్ డోసులపై ప్రయోగాలు జరుగుతున్నాయని.. ఈ ఏడాది చివరి నాటికి బూస్టర్ డోసులు ఇవ్వాల్సిన అవసరం రావచ్చునని, అందుకే అప్పటికల్లా జనాభా మొత్తానికి వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందని గులేరియా చెప్పారు. -
GST: 9 నెలల తర్వాత తగ్గిన ఆదాయం
న్యూఢిల్లీ : కోవిడ్ ఆంక్షల ఎఫెక్ట్, కరోనా భయాలు, తగ్గిపోయిన ఉపాధి అవకాశాలు ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపాయి. దీంతో తొమ్మిది నెలల తర్వాత గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ వసూళ్లు లక్ష కోట్లకు దిగువన నమోదు అయ్యాయి. జూన్ నెలకు సంబంధించి కేంద్రానికి రూ.92,849 కోట్ల జీఎస్టీ ఆదాయమే వచ్చింది. అయితే గతేడాది జూన్‌తో పోలిస్తే ఈసారి జీఎస్టీ ఆదాయం 2 శాతం పెరగడం కొంత మేరకు ఊరట నిచ్చింది. చివరి సారిగా 2020 సెప్టెంబరులో కేంద్రానికి జీఎస్టీ ద్వారా రూ. 95,480 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత ఆదాయం తగ్గలేదు. ఆఖరికి కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగిన ఏప్రిల్, మేలలోనూ లక్షకు పైగానే ఆదాయం వచ్చింది. అయితే మే లో దాదాపు దేశం మొత్తం లాక్డౌన్ , కఠిన కోవిడ్ ఆంక్షలు కొనసాగాయి. దీంతో జన జీవనం స్థంభించి పోయింది. మే చివరి నుంచి సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా... చాలా మంది ఉపాధి కోల్పోవడం, డెల్టా వేరియంట్ భయాలు కొనసాగుతుండంతో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. దీంతో వస్తు సేవల పన్ను వసూళ్లు తగ్గాయి. కోవిడ్ సెకండ్ వేవ్‌కి ముందు జీఎస్టీ వసూళ్లు మేలో రూ. 1.02 లక్షల కోట్లు, ఏప్రిల్‌లో రూ.1.41 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. మరోవైపు ఈ వే బిల్లులు కూడా మందగించాయి. 2021 మేలో 3.99 కోట్ల బిల్లులు రాగా అంతకుముందు ఏప్రిల్‌లో ఈ సంఖ్య 5.88 కోట్లుగా ఉంది. -
ఉద్యోగులకు డీఏ బకాయిల చెల్లింపు ఎప్పుడు? ఎంత ?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న 7వ వేతన ఒప్పందానికి సంబంధించి కీలక సమాచారం అందింది. కరువు భత్యం ఎప్పుడు చెల్లించాలనే అంశంపై కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరులో 7వ వేతన ఒప్పందం సిఫార్సుల ప్రకారం ప్రస్తుతం బేసిక్‌పై 17 శాతంగా ఉన్న డీఏను 28 శాతానికి పెంచనున్నారు. అయితే ఈ పెరిగిన డీఏను సెప్టెంబరు నెల జీతంలో కలిసి ఇస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. సవరించిన డీఏతోనే కాకుండా గతంలో మూడు దఫాలుగా వాయిదా పడిన డీఏ బకాయిలు, పెన్షనర్లరకు సంబంధించి డీఆర్ బకాయిలు కూడా సెప్టెంబరులోనే చెల్లించనున్నట్టు తెలుస్తోంది. పెంపు ఇలా ఉండొచ్చు ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం కరువు భత్యానికి సంబంధించి క్లాస్ వన్ ఆఫీసర్లకి రూ. 11,880 నుంచి రూ. 37,554 వరకు పెరగవచ్చని అంచనా. అదే విధంగా లెవల్ 13కి సంబంధించి రూ. 1,23,100 నుంచి రూ. 2,15,900ల వరకు పెంపు ఉండొచ్చు, లెవల్ 14 విషయంలో రూ. 1,44,200 నుంచి రూ. 2,18,200 వరకు ఉండవచ్చు. జులై టూ సెప్టెంబర్ కరోనా సంక్షోభం కారణంగా 2020 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం వాయిదా వేసింది కేంద్రం. మరోవైపు 7వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, కరువు భత్యం పెంపు తదితర అంశాలపై అనేక సిఫార్సులు చేస్తూ కేంద్రానికి నివేదిక అందించింది. దీంతో జులై1 నుంచి 7వ వేతన ఒప్పందం ప్రకారం పెరిగిన జీతంతో కలిసి డీఏలు చెల్లిస్తారనే ప్రచారం జరిగింది. అయితే కేంద్రం డీఏ , జీతాల చెల్లింపును మరోసారి వాయిదా వేసింది. -
పెట్టుబడులకు ‘బంగారం’!
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి తీవ్రత, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడులకు పసిడి ఆకర్షణీయంగా నిలిచింది. మూడవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి రూ.2,426 కోట్ల నికర పెట్టుబడులు వచ్చినట్లు భారత్ మ్యూచువల్ ఫండ్స్ సంఘం (యాంఫీ) తాజా గణాంకాలు తెలిపాయి. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ⇔ 2019 జూలై–సెప్టెంబర్ మధ్య గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన మొత్తం కేవలం రూ.172 కోట్లే. ⇔ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి క్యూ2లో రూ.5,957 కోట్ల నికర పెట్టుబడులు వస్తే, ఇందులో గోల్డ్ ఈటీఎఫ్‌లదే అధిక మొత్తం. ⇔ నెలవారీగా చూస్తే, జనవరిలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.202 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో ఈ పెట్టుబడుల విలువ రూ.1,483 కోట్లుగా ఉంది. అయితే రూ.195 కోట్ల ఉపసంహరణలు జరిగాయి. లాభాల స్వీకరణ దీనికి కారణం. ⇔ ఇక ఏప్రిల్ (రూ.731 కోట్లు), మే (రూ.815 కోట్లు), జూన్ (రూ.494 కోట్లు), జూలై (రూ.921 కోట్లు), ఆగస్టు (రూ.908 కోట్లు), సెప్టెంబర్ (రూ.597 కోట్లు)లో నికర పెట్టుబడులు కొనసాగాయి. ⇔ గోల్డ్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న మొత్తం విలువ (ఏయూఎం) సెప్టెంబర్ 2020 నాటికి రూ.13,590 కోట్లు. 2019 సెప్టెంబర్ ముగింపునాటికి ఈ విలువ రూ.5,613 కోట్లుగా ఉంది. ఆర్థిక అనిశ్చితే కారణం.. ప్రపంచవ్యాప్తంగా ఒడిదుడుకుల మార్కెట్‌ను ఇన్వెస్టర్లు చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులకు పసిడే సురక్షితమైనదని భావిస్తున్నారు. మార్కెట్లు దాదాపు రికవరీ బాటన నడుస్తూ, కోవిడ్–19 ముందస్తు స్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ అనిశ్చితి తొలగిపోని పరిస్థితి కొనసాగుతుండడం ఇక్కడ గమనార్హం. గోల్డ్ ఈటీఎఫ్‌ల పెట్టుబడులు గత ఏడాది కాలంగా మంచి రిటర్న్స్ అందించడానికి ఆర్థిక అనిశ్చితే కారణం. దీనికి ప్రస్తుతం కరోనా మహమ్మారి కూడా తోడయ్యింది. అమెరికా ఎన్నికలు, ఫలితాలు రానున్న రెండు నెలల్లో ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు సురక్షితమైన హెడ్జింగ్ సాధనంగా గోల్డ్ ఈటీఎఫ్లనే ఎంచుకుంటారని భావిస్తున్నాం. అంతక్రితం రెండు నెలలతో పోల్చితే, సెప్టెంబర్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు తగ్గినా, ఇక్కడ పాజిటివ్ అవుట్‌లుక్ మాత్రమే కనబడుతోంది. కోవిడ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా తిరిగి పెరుగుతుండడం, ఉద్దీపన చర్యలతో వ్యవస్థలోకి వస్తున్న అధిక ద్రవ్య లభ్యత (లిక్విడిటీ), కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న తక్కువ వడ్డీరేట్ల విధానం వంటి అంశాల వల్ల పెట్టుబడులు సురక్షిత సాధనమైన పసిడిలోకే మళ్లే అవకాశాలే ఉన్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్లు లేదా ఫిజికల్ గోల్డ్‌వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారని భావిస్తున్నాం. – దివామ్ శర్మ, గ్రీన్ పోర్ట్‌ఫోలియో సహ వ్యవస్థాపకులు -
కోవిడ్–19 చికిత్స: సెప్టెంబర్‌లో పెరిగిన బీమా క్లెయిమ్స్
న్యూఢిల్లీ: కోవిడ్–19 చికిత్సకు సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సంఖ్య సెప్టెంబర్‌లో పెరిగింది. సమీక్షా నెలలో మొత్తం ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను పరిశీలిస్తే, వీటిలో కోవిడ్–19 చికిత్స సంబంధిత క్లెయిమ్స్ 40 శాతానికి ఎగశాయని తమ గణాంకాల విశ్లేషణలో వెల్లడైనట్లు ఈ రంగంలో దిగ్గజ అగ్రిగేటర్ పాలసీబజార్ డాట్ కామ్ పేర్కొంది. నెలల వారీగా ఈ శాతాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు వెల్లడించింది. దీనిప్రకారం, మేలో ఈ రేటు కేవలం 8 శాతం ఉంటే, జూలై, ఆగస్టుల్లో వరుసగా 23, 34 శాతాలకు చేరింది. పాలసీబజార్ డాట్ కామ్‌లో ఆరోగ్య బీమా విభాగం చీఫ్ అమిత్ ఛబ్రా వివరించిన అంశాల్లో ముఖ్యమైనవి పరిశీలిస్తే... ► కోవిడ్–19 చికిత్స క్లెయిమ్స్ దాఖలు చేసిన వారిలో అత్యధికులు 60 సంవత్సరాలవారు ఉన్నారు. తరువాతి శ్రేణిలో 41 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు్కలు ఉన్నారు. చదవండి: ఆ నష్టం రూ.1.25 లక్షల కోట్లు ►కరోనా కేసుల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లోనే భారీగా పెరిగింది. రికవరీ కూడా అధికంగా ఉంది. ►ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ మధ్య చూస్తే, మొత్తం ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌లో కోవిడ్–19 చికిత్స క్లెయిమ్స్ వాటా 26 శాతంగా ఉంది. నాన్–కోవిడ్–19 విషయంలో ఈ రేటు 74 శాతంగా ఉంది. ఈ విభాగంలోకి గుండె, ఊపిరితిత్తులు, నాడీ సంబంధ సమస్యలు వచ్చాయి. ►క్లెయిమ్‌లకు సంబంధించి విలువ సగటున రూ.1,18,000గా ఉంది. అయితే ఒక్క 46–50 మధ్య వయస్సువారి విషయంలో క్లెయిమ్ విలువ గరిష్టంగా రూ.2.19 లక్షలుగా ఉంది. ►బీమా రెగ్యులేటరీ సంస్థ– ఐఆర్డీఏఐ కోవిడ్–19 ప్రత్యేక పాలసీలకు అనుమతినిచ్చిన తొలి నెలల్లో వీటి కొనుగోలుకు డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు సమగ్ర హెల్త్ కవర్ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్–10 బీమాల వైపు నుంచి మరింత సమగ్ర ప్రణాళికలవైపు మారడానికి ప్రజలకు అనుమతినిస్తూ, ఐఆర్డీఏఐ ఇచి్చన అనుమతులు హర్షణీయం. ►నెలవారీ ప్రీమియం పేమెంట్ విధానానికి అనుమతించడం హర్షించదగిన మరో కీలకాంశం. ఇప్పుడు 35 సంవత్సరాల ఒక వ్యక్తి రూ.1,000 నుంచి రూ.1,500 నెలకు చెల్లించి కోటి రూపాయల వరకూ బీమా కవర్ పొందగలుగుతున్నాడు. ►నాన్–కోవిడ్–19 క్లెయిమ్స్ విషయానికి వస్తే, ఆసుపత్రుల్లో బెడ్ల వినియోగం ఇప్పుడు గణనీయంగా పెరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన రోగులు ఇప్పుడు చికిత్స, ఆపరేషన్లకోసం పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో చేరుతుండడమే దీనికి కారణం. ►పెద్దల్లో కంటి సంబంధ ఇబ్బందులు ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. 61 సంవత్సరాలు పైబడి ఆరోగ్య బీమా ఉన్న సీనియర్ సిటిజన్లలో దాదాపు 20 శాతం కంటి సంబంధ చికిత్సలకు బీమా సౌలభ్యతను వినియోగించుకుంటున్నారు. తగ్గనున్న ఆసుపత్రుల లాభం :క్రిసిల్ కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణ లాభం సుమారు 35–40% తగ్గనుందని క్రిసిల్ నివేదిక పేర్కొంది. వైరస్ భయంతో ప్రజలు ఆసుపత్రులకు వెళ్ళకపోవడం,చికిత్సలను వాయిదా వేసుకోవడం దీనికి ప్రధాన కారణంగా తెలిపింది. ఏజెన్సీ.. రేటింగ్ ఇచి్చన 36 ఆసుపత్రులతో కలిపి మొత్తం 40 హాస్పిటల్స్‌ను విశ్లేషించి రూపొందిన ఈ నివేదిక ప్రకారం.. కోవిడ్ కేసులు ఎక్కువగా వచి్చనప్పటికీ వీటి ద్వారా పొందిన మార్జిన్ తక్కువగా ఉంది. అయితే ఈ కేసుల నుంచి అదనంగా 15–20 శాతం ఆదాయం సమకూరింది. లాక్డౌన్, ప్రయాణ సడలింపులతో జులై నుంచి రోగుల రాక క్రమంగా మెరుగు పడుతూ వచి్చంది. -
బాగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు జూలై-సెప్టెంబర్ కాలంలో 35 శాతం తగ్గినట్టు రియల్ ఎస్టేట్ రంగ సమాచార విశ్లేషణా సంస్థ ‘ప్రాప్‌ఈక్విటీ’ తెలిపింది. ఈ కాలంలో 50,983 యూనిట్లు (ఇల్లు/ఫ్లాట్) అమ్ముడు పోయినట్టు ఈ సంస్థ విడుదల చేసిన డేటా తెలియజేస్తోంది. కానీ అంతక్రితం ఏడాది ఇదే కాలంలో అమ్ముడుపోయిన ఇళ్ల యూనిట్ల సంఖ్య 78,472గా ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణెలో మార్కెట్లలో ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో నమోదైన విక్రయాలు 24,936 యూనిట్లతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో రెట్టింపయ్యాయని ఈ సంస్థ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన పట్టణాల్లో సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు వార్షికంగా చూస్తే 46% తగ్గి 29,520 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ గత వారం ఓ నివేదికను విడుదల చేసిన విషయం గమనార్హం. ‘‘భారత రియల్ ఎస్టేట్ రంగం కొంత మేర కోలుకుంటోంది. సెప్టెంబర్ త్రైమాసికంతో చాలా ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. పలు పథకాలు, ఆఫర్ల మద్దతుతో డెవలపర్లు తమ నిల్వలను గణనీయంగా తగ్గించుకోగలరు. పండుగల సీజన్లోకి ప్రవేశించాము. ఆఫర్లు, తగ్గింపులు, ఆకర్షణీయమైన చెల్లింపుల పథకాల మద్దతుతో ఈ రికవరీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నాము’’ అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, ఎండీ సమీర్ జసూజా తెలిపారు. (చదవండి: ఇంటి నుంచి పనిచేసినా పన్ను పడుద్ది!) -
సెప్టెంబర్‌లో ఆటోరంగం అమ్మకాల స్పీడ్
కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డవున్‌ల ఎత్తివేత నేపథ్యంలో వాహన పరిశ్రమ నెమ్మదిగా పుంజుకుంటోంది. ఈ బాటలో ఇప్పటికే ట్రాక్టర్ల విక్రయాలు ఊపందుకోగా.. గత నెల(సెప్టెంబర్)లో ద్విచక్ర వాహన అమ్మకాలు జోరందుకున్నాయి. అంతేకాకుండా కార్ల విక్రయాలు సైతం వేగమందుకున్నాయి. ఇకపై ఆటో రంగం మరింత బలపడనున్న అంచనాలు వాహన తయారీ కంపెనీలకు డిమాండ్‌ను పెంచుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం.. బజాజ్ ఆటో జూమ్ గత నెలలో బజాజ్ ఆటో వాహన విక్రయాలు అంచనాలను మించడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 3,033 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం దూసుకెళ్లింది. రూ. 3,114 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ సైతం మెరుగైన అమ్మకాలను సాధించగలదన్న అంచనాలు ఈ కౌంటర్‌కు సైతం డిమాండ్‌ను పెంచాయి. వెరసి ఎన్ఎస్ఈలో తొలుత టీవీఎస్ మోటార్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 490ను తాకింది. ప్రస్తుతం 3.6 శాతం లాభంతో రూ. 485 వద్ద ట్రేడవుతోంది. అమ్మకాలు భళా సెప్టెంబర్‌లో బజాజ్ ఆటో మొత్తం 4.41 లక్షల వాహనాలను విక్రయించింది. ఇది 10 శాతం వృద్ధికాగా.. ద్విచక్ర వాహన అమ్మకాలు 20 శాతం పెరిగి దాదాపు 4.09 లక్షలకు చేరాయి. వీటిలో ద్విచక్ర వాహన ఎగుమతులు 16 శాతం ఎగసి 1.85 లక్షల యూనిట్లను దాటాయి. కాగా.. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు గత నెలలో 31 శాతం జంప్‌చేసి 1.6 లక్షల యూనిట్లను అధిగమించగా.. ఎస్కార్ట్స్ లిమిటెడ్ ట్రాక్టర్ల విక్రయాలు 9 శాతం బలపడి 11,851 యూనిట్లను తాకాయి. ఇదే ఇధంగా ఎంఅండ్ఎం సైతం 17 శాతం అధికంగా 43,386 ట్రాక్టర్ల అమ్మకాలను సాధించింది. -
అమెరికా వీసాలకు అంతా రెడీ!
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదువు కోవాలనుకునే భారత విద్యార్థులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. స్టూడెంట్, అకడమిక్ ఎక్స్ఛేంజ్ విజిటర్ వీసాల దరఖాస్తు ప్రక్రియను పరిమితంగా ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈనెల 17న హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాల్లోని యూఎస్ ఎంబసీల్లో ఈ ప్రక్రియ మొదలుకానుందని హైదరాబాద్‌లోని కాన్సులేట్ శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో పరిమిత స్థాయిలోనే ఈ ప్రక్రియ చేపడుతున్నట్టు వివ రించింది. శీతాకాల సెమిస్టర్ (ఫాల్ సెమిస్టర్) ప్రారంభమయ్యే సమయానికి తమ వద్ద చాలా తక్కువ అపాయింట్మెంట్లు మాత్రమే ఉన్నందున.. వాటి కోసం వచ్చే అన్ని విజ్ఞప్తు లనూ పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. తరగతులు ఎప్పుడు మొదలవుతాయి? అపాయింట్మెంట్ల కోసం విజ్ఞప్తులు ఎప్పుడు అందాయనే ప్రాతిపదికన వాటిని పరిశీలిస్తామని, ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులు వేచి చూడాలని సూచించింది. తొలుత ఆగస్టు 12వ తేదీకి ముందు వచ్చిన అత్యవసర విద్యార్థి, ఎక్స్ఛేంజ్ విజిటర్ అభ్యర్థనలను పరిశీలించి వీసా అపాయింట్ మెంట్లను ఇస్తామని పేర్కొంది. ఆ తర్వాత అందుబాటులో ఉన్న అవకాశాలు, అవస రాన్ని బట్టి రెండు వారాల ముందు అపాయింట్మెంట్లు ఇస్తామని తెలిపింది. అమెరికాలో చదవాలనుకుంటున్న విద్యా ర్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్స్ తమ తరగతులు మొదలుకావడానికి 3 వారాల కంటే ముందు మాత్రమే అపాయింట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అపా యిం ట్మెంట్ వివరాలను ఎప్పటికప్పుడు తమ వెబ్సైట్లో సరిచూసుకోవాలని పేర్కొంది. ఆ వీసా సర్వీసుల నిలిపివేత యథాతథం.. సాధారణ ఇమిగ్రెంట్, నాన్ ఇమిగ్రెంట్ వీసా సర్వీసుల నిలిపివేత మాత్రం యథాతథంగా కొనసాగుతుందని, వీలైనంత త్వరగానే సాధారణ వీసా సర్వీసులను మొదలుపెట్టే అవకాశాలున్నా.. దానికి సంబంధించిన తేదీని మాత్రం వెల్లడించలేమని కాన్సులేట్ తెలి పింది. గతంలో ఎమ్మార్వీ ఫీజు కట్టినవారు ఏడాదిలోగా దానిని ఇంటర్వూ్య అపాయింట్ మెంట్ షెడ్యూల్ కోసం ఉపయోగించు కోవచ్చునని స్పష్టం చేసింది. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారు ‘ఎమర్జెన్సీ అపాయింట్మెంట్’కోసం సూచించిన మార్గ దర్శకాలను పాటించాలని సూచించింది. ఇక హెచ్1బీ, హెచ్2బీ, హెచ్4, ఎల్, కొన్ని జే కేటగిరీల దరఖాస్తుదారులు తాము అపాయిం ట్మెంట్ పొందడానికి వీలుందో లేదో పరిశీ లించిన తర్వాత అందుకు విజ్ఞప్తి చేయాలని స్పష్టంచేసింది. అమెరికా వెళ్లేందుకు తమకు ఏ వీసా కేటగిరి సరిపోతుందని అనేది డైరెక్టరీలో సరిచూసుకోవాలని సూచించింది. కాగా, హైదరాబాద్ నుంచి దాదాపు 8వేల మంది విద్యార్థులకు అమెరికా వెళ్లే అవకాశం లభించ నుందని సమాచారం. వీసా అపాయింట్ మెంట్లు, ఇంటర్వూ్యలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 1 నుంచి వీసాల జారీకి అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. -
10న ‘ఫైనల్’ చేశారు
ముంబై: గత పుష్కరకాలంగా ఐపీఎల్ నిరాటంకంగా జరుగుతోంది. దక్షిణాఫ్రికాలో జరిగినా... పుట్టింట్లో నిర్వహించినా... విజేత మాత్రం ‘సూపర్ సండే’లోనే తేలింది. కానీ ఈసారి ఆనవాయితీ మారింది. ఫైనల్ ఆదివారం కాకుండా మంగళవారం నిర్వహించనున్నారు. లీగ్ చరిత్రలో తొలిసారి ఈ మార్పు చోటుచేసుకుంది. ఆదివారం ఎక్కడివారక్కడే ఉండి వర్చువల్ పద్ధతిలో జరిగిన ఐపీఎల్ పాలకమండలి (గవర్నింగ్ కౌన్సిల్–జీసీ) సమావేశంలో ఆట కోసం మూడు వేదికల్ని, గరిష్టంగా యూఏఈకి వెళ్లే ఫ్రాంచైజీ ఆటగాళ్లను ఖరారు చేశారు. దుబాయ్, అబుదాబి, షార్జా స్టేడియాల్లో 53 రోజుల పాటు మెరుపుల టి20లు జరుగుతాయి. 24 మంది ఆటగాళ్లతో కూడిన ఫ్రాంచైజీలు అక్కడికి ఈ నెలలోనే బయల్దేరతాయి. ముందుగా అన్నట్లు నవంబర్ 8న కాకుండా నవంబర్ 10న ఫైనల్ నిర్వహిస్తారు. భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా డ్రాగన్ స్పాన్సర్‌షిప్‌పై వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ఈ సీజన్లో పాత స్పాన్సర్లనే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ‘వివో ఐపీఎల్–2020’కి సంబంధించిన కీలక నిర్ణయాలను జీసీ వెలువరించింది. యూఏఈలో ఐపీఎల్ టోర్నీ నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి అనుమతి లభించిందని ఆదివారం రాత్రి వార్తలు వచ్చినా... బీసీసీఐ మాత్రం ఇంకా అనుమతి రాలేదని... ఈ వారంలో గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశముందని తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇవీ ప్రధానాంశాలు... ► యూఏఈలో జరిగే ఐపీఎల్–13వ సీజన్ సెప్టెంబర్ 19న మొదలవుతుంది. దీపావళికి (నవంబర్ 14న) నాలుగు రోజుల ముందుగా నవంబర్ 10న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ∙మ్యాచ్‌ల సమయం మారింది. రాత్రి 8 గంటలకు కాకుండా అరగంట ముందుగా గం. 7.30 నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. 53 రోజుల షెడ్యూల్లో 10 రోజులు మాత్రం ఒకే రోజు రెండేసి మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ∙రెండు మ్యాచ్‌లు ఉన్న రోజున మాత్రం తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 3.30న మొదలవుతుంది. ఐపీఎల్లో పాల్గొనే ఫ్రాంచైజీలు ఈ నెల 26 తర్వాత అక్కడికి బయలు దేరతాయి. ఒక్కో జట్టు గరిష్ట పరిమితి 24 మంది ఆటగాళ్లు. ► కరోనా మహమ్మారి దృష్ట్యా టోర్నీ మధ్యలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆ ఆటగాళ్లను సబ్స్టిట్యూట్లతో భర్తీ చేసుకునే వెసులుబాటు ఉంది. ► మొదట ప్రేక్షకుల్లేకుండానే పోటీలు జరుగుతాయి. కొన్ని మ్యాచ్‌లు జరిగాక అక్కడి స్థానిక ప్రభుత్వ ఆమోదం లభిస్తే కొంతమందికి ప్రవేశం కల్పిస్తారు. ► భారత స్టార్ ఆటగాళ్లయినా... విదేశీ ప్లేయర్లయినా... అందరూ చార్టెడ్ విమానాల్లోనే యూఏఈకి చేరుకోవాలి. ► నిష్ణాతుల ఆధ్వర్యంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) రూపొందిస్తారు. జీవరక్షణ వలయం (రక్షిత బుడగ) ఏర్పాటు కోసం టాటా గ్రూప్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ► యూఏఈ హాస్పిటళ్లకు చెందిన స్పెషాలిటీ డాక్టర్లతో కూడిన ఉన్నతస్థాయి వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. ► ఐపీఎల్ స్పాన్సర్లు యథాతథంగా 2020 సీజన్లోనూ కొనసాగుతారు. ► గత ఐపీఎల్ సమయంలో నిర్వహించినట్లుగా ఈసారీ టోర్నీ చివరి దశలో మహిళల టి20 చాలెంజ్ టోర్నీని నిర్వహిస్తారు. యూఏఈలోనే ఈ టోర్నీ జరుగుతుంది. మూడు మహిళల జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు (మూడు లీగ్ మ్యాచ్‌లు, ఒక ఫైనల్) ఉంటాయి. -
సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌లో ఆసీస్ పర్యటన!
మెల్బోర్న్: పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించే అవకాశం ఉంది. రెండు వారాల్లోపే ముగిసే ఈ పర్యటనలో ఇంగ్లండ్‌తో ఆసీస్ జట్టు మూడు టి20లు, మూడు వన్డేలను ఆడనుంది. సెప్టెంబర్ 4, 6, 8 తేదీల్లో టి20 మ్యాచ్‌లను... అనంతరం సెప్టెంబర్ 10, 12, 15 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు నిర్వహించాలనుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లన్నీ సౌతాంప్టన్, మాంచెస్టర్లలోనే జరిగే అవకాశం ఉంది. -
ప్రేక్షకులతో రష్యా గ్రాండ్‌ప్రి!
స్పీల్బర్గ్ (ఆస్ట్రియా): కరోనా విజృంభణతో నాలుగు నెలలు ఆలస్యంగా ఆరంభమైన ఫార్ములావన్ (ఎఫ్1) తాజా సీజన్లో వీలైనన్ని ఎక్కువ రేసులను నిర్వహించేందుకు నిర్వాహకులు వడివడిగా అడుగులేస్తున్నారు. అంతేకాకుండా ప్రేక్షకులతో నిర్వహించేందుకు కూడా సిద్ధమయ్యారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే తాజా సీజన్లో... సెప్టెంబర్ 27న సోచి నగరంలో జరిగే రష్యా గ్రాండ్‌ప్రిలో ప్రేక్షకులను అనుమతించే అవకాశముంది. ఇప్పటికే ఎనిమిది రేసులతో కొత్త క్యాలెండర్‌ను విడుదల చేసిన ఎఫ్1 నిర్వాహకులు... తాజాగా వాటికి మరో రెండు రేసులను జోడించారు. ఇటలీలోని ముగెల్లో వేదికగా సెప్టెంబర్ 13న టస్కన్ గ్రాండ్‌ప్రి, సెప్టెంబర్ 27న రష్యా గ్రాండ్‌ప్రి జరగనున్నాయి. దాంతో ఈ ఏడాది జరిగే రేసుల సంఖ్య పదికి చేరింది. టస్కన్ గ్రాండ్‌ప్రి ఎఫ్1 క్యాలెండర్లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. అంతే కాకుండా ఎఫ్1 జట్లల్లో అత్యంత విజయవంతమైన ఫెరారీ జట్టు తమ 1000వ రేసును టస్కన్ గ్రాండ్‌ప్రితో పూర్తి చేసుకోనుంది. -
సెప్టెంబర్ నుంచి రామగుండం ఎరువుల ఉత్పత్తి!
సాక్షి, న్యూఢిల్లీ: రామగుండం ఎరువులు, రసాయనాల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్) సెప్టెంబరు నెలాఖరు నుంచి ఎరువుల ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి మన్ సుఖ్ మాండవీయకు సంబంధిత అధికారులు నివేదించారు. దేశంలోని ఐదు ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ ప్రక్రియపై మంత్రి ఆ శాఖ అధికారులతో కలసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గోరఖ్ పూర్, బరౌనీ, సింధ్రీలోని హిందూస్తాన్ ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్ ప్లాంట్లు, రామగుండం ఎరువులు రసాయనాల సంస్థ, తాల్చేర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ప్లాంట్లపై సమీక్ష జరిగింది. కర్మాగారాల ఆర్థిక ప్రగతి, ఇతర అభివృద్ధి అంశాలపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కర్మాగారాల పునరుద్ధరణ పనులను సత్వరం పూర్తి చేసేందుకు సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రామగుండం ఎరువుల రసాయనాల కర్మాగారం అభివృద్ధి పనులు ఇప్పటికే 99.53% పూర్తయ్యాయని, కరోనా వైరస్ సంక్షోభం తలెత్తిన కారణంగా కొన్ని చిన్న పనుల్లో కాస్త జాప్యం జరిగిందని ఈ సమావేశంలో అధికారులు మంత్రికి తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరుకల్లా రామగుండం ప్లాంట్‌లో ఎరువుల ఉత్పాదన మొదలవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. అలాగే గోరఖ్‌పూర్ ఎరువుల కర్మాగారం పనులు 77%, సింధ్రీ ప్లాంట్ పనులు 70%, బరౌనీ కర్మాగారం పనులు 69% పూర్తయ్యాయని అధికారులు వివరించారు. గోరఖ్ పూర్, సింధ్రీ, బరౌనీ ప్లాంట్లు వచ్చే ఏడాది మే నెలలోగానే పూర్తవుతాయన్నారు. ఒడిశాలోని తాల్చేర్ ఎరువుల కర్మాగారంలో ప్రస్తుతం ప్రాజెక్టు అవకాశాలపై అంచనా, డిజైన్ల రూపకల్పన పని కొనసాగుతోందని చెప్పారు. -
సెప్టెంబర్‌లో కొత్త విద్యా సంవత్సరం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కొత్త విద్యా సంవత్సరాన్ని జూలైకి బదులు సెప్టెంబర్‌లో ప్రారంభించాలని, అప్పుడే విద్యా సంస్థలు తెరవాలని యూజీసీ నిపుణుల కమిటీ పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెల నుంచే కాలేజీలను, స్కూళ్లను మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అకడమిక్ అంశాలు, ఆన్లైన్ విద్య తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు యూజీసీ రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. హరియాణా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆర్సీ కుహద్ నేతృత్వంలోని కమిటీ లాక్డౌన్ నేపథ్యంలో యూనివర్సిటీల్లో పరీక్షల నిర్వహణ, ప్రత్యామ్నాయ చర్యలపై అధ్యయనం చేసింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) వైస్ చాన్స్‌లర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మరో కమిటీ ఆన్లైన్ పరీక్షలపై అధ్యయనం చేసింది. శుక్రవారం ఆ కమిటీలు యూజీసీకి తమ నివేదికలను అందజేశాయి. అందులో కుహద్ నేతృత్వంలోని కమిటీ విద్యా సంవత్సరాన్ని జూలైకి బదులు సెప్టెంబర్‌లో ప్రారంభించాలని సిఫారసు చేసింది. ఇక నాగేశ్వర్రావు కమిటీ యూనివర్సిటీల్లో కావాల్సినంత మౌలిక సదుపాయాలు ఉంటే ఆన్లైన్ పరీక్షలు నిర్వహించవచ్చని సూచించింది. చదవండి: 18,514మందికి కరోనా పరీక్షలు -
పెలికాన్ @ తెలినీల్లాపురం
సాక్షి, హైదరాబాద్: కొన్ని పక్షులు ప్రపంచమంతా ప్రయాణం చేస్తాయి. కొందరు పక్షి ప్రేమికులు పక్షుల కోసం ప్రపంచం అంతా ప్రయాణాలు చేస్తారు. టూర్లందు బర్డ్ వాచింగ్ టూర్లు వేరయా.. అన్నట్టుగా వీరి అనుభవాలు ఉంటాయి. నగరానికి చెందిన జయలక్ష్మి.. తాను చేసిన ఓ టూర్ గురించి చెప్పిన విశేషాలు వింటే.. పక్షుల కిలకిలరావాలు మదిలో ప్రతిధ్వనిస్తాయి. తాను వెళ్లిన వలస పక్షుల కేంద్రం గురించి జయలక్ష్మి పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. సైబీరియా నుంచి వచ్చే చుట్టాలు.. ఏటా మన దగ్గరకు వచ్చి పిల్లలకు రెక్కలు వచ్చాక తీసుకు వెళ్లిపోతాయి. పుట్టింటికి ఆడపిల్ల వచ్చినట్లు, పుట్టింటి వాళ్లను సంతోషపెట్టినట్లు ఊరంతటినీ అలరిస్తాయి పెలికాన్(గూడబాతు), పెయింటెడ్ స్టార్క్(ఎర్ర జడ పిట్ట). ఈ వలస పక్షులు సైబీరియా నుంచి తెలుగు రాష్ట్రానికి వస్తాయి. ఆ రావడం ఊరికే రావు. ఏరియల్ సర్వే చేస్తాయి. నీటి చెరువులు, దట్టమైన చెట్లు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని మరీ విడిదికి సిద్ధమవుతాయి. అలా పదిహేనేళ్ల నుంచి శ్రీకాకుళంలోని తేలినీలాపురాన్ని కొత్త విడిదిగా మార్చుకున్నాయి వలస పక్షులు. తేలి నీలాపురం శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరాన ఉంది. వైజాగ్– కోల్‌కతా రైల్వే లైన్లో నైపడ స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం. పెద్దగా ప్రచారానికి నోచుకుని ఈ అందమైన ప్రదేశం.. పక్షి ప్రేమికుల పాలిట స్వర్గధామం అనే చెప్పాలి. టెక్కలి పట్టణంలో బస చేసి తెల్లవారు జామునే బయలుదేరి తేలినీలాపురం బర్డ్ సాంక్చురీకి బయలు దేరితే గూడు వదిలి ఆహారానికి బయలుదేరే పక్షులు కనువిందు చేస్తాయి. ఆకాశంలో రెక్కలు విచ్చుకున్న పక్షుల తోరణాలను చూడాల్సిందే తప్ప వర్ణించలేం. ఆరు నెలల ఆవాసం.. చేపలే ఆహారం.. ఈ పక్షుల రాక ఏటా సెప్టెంబర్ నెలలో మొదలవుతుంది. అక్టోబర్ ఆఖరుకి పూర్తిగా వచ్చేస్తాయి. చెట్ల కొమ్మల మీద దట్టమైన గూళ్లు కట్టుకుని ఆరు నెలల ఆవాసానికి సిద్ధమైపోతాయి. గుడ్లు పెట్టి, పొదిగి, మార్చి నాటికి తిరుగు ప్రయాణమవుతాయి. ఏప్రిల్ ఆఖరుకి అన్ని పక్షులూ వెళ్లిపోతాయి. ‘ఈ పక్షులు ఇక్కడికే ఎందుకు వస్తున్నాయి’ అని ఓ స్థానికుడిని అడిగినప్పుడు అతడు చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. వాతావరణంతోపాటు ఆహారం సమృద్ధిగా ఉన్న చోటుకే తొలి ప్రాధాన్యం. మంచి చేపలు దొరికే ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటాయి. ఇవి ఇతర పక్షుల్లా గింజలను తినవు. పెద్ద పక్షులు ఒక్కోటి రోజుకు నాలుగు నుంచి ఆరు కిలోల చేపలను తింటాయి. తేలినీలాపురానికి చుట్టు పక్కల రెండున్న కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎనిమిది చెరువులు ఉన్నాయి. ఇక ఇక్కడ చింతచెట్లు ఎక్కువ. దాంతో పెద్ద గూళ్లు కట్టుకోవడానికి అనువుగా ఉంటాయి. అందుకే ఈ పక్షులు ఈ గ్రామానికి వస్తున్నాయని చెప్పాడు. ఎంపిక ఆడపక్షిదే ఏ పక్షితో జతకట్టాలనే నిర్ణయం ఆడపక్షిదే. ఒకసారి జత కట్టి గూడులో నివసించడం మొదలైన తర్వాత గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లలను పోషించే వరకు ఆ పక్షుల సహచర్యం కొనసాగుతుంది. ఒక సీజన్‌కి అవి నాలుగు గుడ్ల వరకు పెడతాయి. అయితే వాటిలో పొదిగి పిల్లలయ్యేది సగం గుడ్లే. ఈ గుడ్లు పొదగడానికి పాతిక నుంచి ముప్పై రోజులు పడుతుంది. పెలికాన్లు గుడ్లను పొదగడంలో మగ–ఆడ పక్షులు రెండూ భాగం పంచుకుంటాయి. ఒక పక్షి గుడ్ల మీద ఉంటే మరో పక్షి ఆహారం తెస్తుంది. ఇవి ఆహారం కోసం ఉదయం ఏడు గంటలకే బయలుదేరి పది గంటలకు తిరిగి గూటికి చేరతాయి. మరో విడత మూడు గంటలకు వెళ్లి ఐదు గంటలకు గూళ్లను చేరతాయి. సూర్యుడి కిరణాలు నిట్టనిలువుగా పడుతున్నప్పుడు చూపు చెదురుతుంది. నీటిలో కదలాడే చేపల ఆనవాళ్లు దొరకడం కష్టం. అందుకే ఇలా టైమింగ్స్ సెట్ చేసుకున్నాయవి. వాచ్ టవర్ తేలినీలాపురం చిన్న గ్రామం. వలస పక్షుల సీజన్లో ఇళ్లకంటే పక్షుల గూళ్లే ఎక్కువగా కనిపిస్తాయి. నాలుగు వందలకు పైగా గూళ్లు ఉంటాయి. ఏడాదికి 500లకు పైగా పిల్ల పక్షులు ఇక్కడ పుట్టి సైబీరియాకు ప్రయాణమవుతాయని అంచనా. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టిన 40 అడుగుల వాచ్ టవర్ ఉంది. ఈ టవర్ మీద నుంచి చూస్తే మన చుట్టూ పక్షులే. వాటి కువకువలు రకరకాలుగా ఉంటాయి. అవి చేసే శబ్దాల్లో తేడాలుంటాయి. పక్షుల కలయిక సందర్భంలో ఒక రకంగా, గుడ్లను పొదిగేటప్పుడు ఒక రకమైన శబ్దం, పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు మరో రకమైన శబ్దం చేస్తాయి. అవి వెళ్లిపోతుంటే తమ పిల్లలు వదిలిపోతున్నట్లు బాధగా ఉంటుందని చెప్పారు గ్రామస్తులు. ముక్కు పొడవు పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షులకు ముక్కు పొడవుగా ఉంటుంది. నీటి మీద ఎగురుతూ నీటి లోపలున్న చేపల జాడ పడతాయి. ఒక్కసారిగా నీటిలోకి దూరి ఈదుతూ వెళ్లి ముక్కుతో చేపలను పట్టుకొస్తాయి. చేపలతోపాటుగా వచ్చిన నీటిని వదిలేసి చేపలను మాత్రం గొంతుకు ఉన్న సంచిలో వేసుకుంటాయి. ఆ చేపలు గూటిలో ఉన్న పిల్లల కోసం. అలా పిల్ల పక్షులను 45 రోజులు పోషిస్తాయి. పెలికాన్ కానీ పెయింటెడ్ స్టార్క్ కానీ పేరుకు పక్షులే కానీ ఎంత బలంగా ఉంటాయంటే.. గుడ్ల మీద దాడి చేసిన ఒక మోస్తరు జంతువులను కూడా ముక్కుతో పొడిచి, కాళ్లతో తన్ని తరిమేస్తాయి. ఈ పక్షులు తొమ్మిది కిలోల బరువుంటాయి. రెక్కలు చాచాయంటే... ఆ చాచిన రెక్కల పొడవు రెండు నుంచి మూడున్నర మీటర్లు ఉంటుంది. పెద్ద పక్షులకు నీటిపాము దొరికిందంటే చాలు.. మనం కళ్లు మూసి తెరిచేలోపు ఒక్క గుటకలో మింగేస్తాయి. వీటి జీవితకాలం పదిహేను నుంచి పాతికేళ్లు. త్రేతాయుగపు శివలింగం తేలినీలాపురం టూర్లో భాగంగా ‘రావి వలస’ను కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ ఉన్న శివలింగం ఇరవై రెండు అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఆ శివుడికి గుడి కట్టాలని టెక్కలి రాజు ముందుకొచ్చాడని, అప్పుడు శివుడు తనను గుడిలో బంధించవద్దని, తనను తాకిన గాలి గ్రామమంతటా వ్యాపించాలని చెప్పాడంటారు. ఇప్పుడు కూడా అక్కడ గుడి లేదు. కానీ శివలింగంపై భాగాన్ని చూడడానికి వీలుగు మెట్ల నిర్మాణం ఉంది. పై నుంచి పూజాదిక్రతువులు నిర్వహించుకోవచ్చు. రాముడు ఇక్కడ పర్యటించాడని, ఇక్కడి ఔషధ వృక్షాల గురించి అధ్యయనం చేయడానికి రాముడి ఆస్థాన వైద్యుడు ఇక్కడే ఉండిపోయాడని కూడా చెబుతారు. -
మరింత క్షీణించిన పారిశ్రామికోత్పత్తి
సాక్షి, ముంబై: ఆర్థిక మందగమనంపై ఆందోళన కొనసాగుతుండగానే, పారిశ్రామిక పురోగతి మైనస్‌లోకి జారుకోవడం మరింత భయపెడుతోంది. సెప్టెంబరు ఐఐపీ డేటా మరింత పతనమై వరుసగా రెండో నెలలో కూడా క్షీణతనునమోదు చూసింది. సెప్టెంబరు ఐఐపీ డేటా -4.3 శాతంగా ఉంది. గత నెలలో 1.1శాతంతో పోలిస్తే పారిశ్రామికోత్పత్తి సూచీ అంచనా వేసిన దానికంటే దిగువకు చేరింది. గత ఏడాది సెప్టెంబరు నెల ఐఐపీ డేటా 4.5 శాతంగా ఉంది. గణాంక విభాగం విడుదల చేసిన డేటా ప్రకారం మైనింగ్, తయారీ, విద్యుత్ ఇలా అన్ని విభాగాల్లో ఉత్పత్తి తగ్గుదల కనిపించింది. ఇది తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తుంది. పెట్టుబడి డిమాండ్ 20.7 శాతానికి పతనమైంది. ఎనిమిది మౌలిక సదుపాయాల రంగాలను సూచించే కోర్ సెక్టార్ డేటా -5.2 శాతం వద్ద 14 సంవత్సరా కనిష్టానికి చేరింది. పారిశ్రామిక ఉత్పత్తిలో కోర్ సెక్టార్ వాటా 40 శాతం. పారిశ్రామిక వృద్ధిలో నిరంతర మందగమనం కారణంగా ఆర్బీఐ డిసెంబరులో పాలసీ రివ్యూలో మరోసారి రేటు కోత వెళ్లక తప్పదని నిపుణులు అంచనావేస్తున్నారు. -
సెప్టెంబర్‌లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్ధూల జీఎస్టీ వసూళ్లు గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 2.67 శాతం తగ్గి రూ 91,916 కోట్లుగా నమోదయ్యాయి. ఈ మొత్తంలో కేంద్ర జీఎస్టీట రూ 16,630 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్టీ రూ 22,598 కోట్లు, రూ 45,069 ఉమ్మడి జీఎస్టీ వసూళ్లుగా రికార్డయ్యాయని అధికారులు వెల్లడించారు. రూ 7620 కోట్లు సెస్‌గా రాబట్టినట్టు తెలిపారు. ఉమ్మడి జీఎస్టీ వసూళ్ల నుంచి ప్రభుత్వం రూ 21,131 కోట్లు సీజీఎస్టీగా, రూ 15,121 కోట్లను రాష్ట్ర జీఎస్టీగా సెటిల్ చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. సెప్టెంబర్‌లో జీఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ 37,716 కోట్లు, రాష్ట్రాలకు రూ 37,719 కోట్లు సమకూరాయని తెలిపింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి జీఎస్టీ వసూళ్లు 7.82 శాతం మేర పెరగ్గా, దిగుమతులపై జీఎస్టీ తగ్గుముఖం పట్టిందని మొత్తం జీఎస్టీ వసూళ్లు 4.9 శాతం పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
మరోసారి మారుతి అమ్మకాలు ఢమాల్!
సాక్షి,ముంబై: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) అమ్మకాల్లో ఈ నెలలో కూడా కుదేలైంది. తాజా గణాంకాల ప్రకారం అమ్మకాలలో 24.4 శాతం క్షీణించింది. సెప్టెంబర్‌లో 1,22,640 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ 1,62,290 యూనిట్లను విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన ఎగుమతులు కూడా క్షీణించాయని ఎంఎస్ఐ ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో దేశీయ అమ్మకాలు 26.7 శాతం క్షీణించి 1,12,500 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది (2018, సెప్టెంబర్‌లో) 1,53,550 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆల్టో, వాగన్ఆర్లతో కూడిన మినీ కార్ల అమ్మకాలు 20,085 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే నెలలో 34,971 యూనిట్లు, 42.6 శాతం తగ్గాయి. కాంపాక్ట్ సెగ్మెంట్ అమ్మకాలు, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో మరియు డిజైర్ వంటి మోడల్స్ 22.7 శాతం క్షీణించి 57,179 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో 74,011 కార్లు ఉన్నాయి. మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అంతకుముందు 6,246 యూనిట్లతో పోలిస్తే 1,715 యూనిట్లను విక్రయించింది. అదేవిధంగా, విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగాతో సహా యుటిలిటీ వాహనాల అమ్మకాలు 21,526 యూనిట్ల వద్ద స్వల్పంగా తగ్గాయి. అంతకుముందు ఏడాది ఇవి 21,639 గా ఉంది. సెప్టెంబరులో ఎగుమతులు 17.8 శాతం తగ్గి 7,188 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే నెలలో 8,740 యూనిట్లు నమోదయ్యాయి. దీంతో పండుగ సీజన్లో నేపథ్యంలో ఆగస్టు మాసంతో పోలిస్తే సెప్టెంబరులో విక్రయాలు పెరుగుతాయనే ఆటో కంపెనీల ఆశలపై తాజా లెక్కలు నీళ్లు చల్లాయి. -
మారుతి ఎస్-ప్రెస్సోఈ నెల 30న లాంచ్
సాక్షి, ఢిల్లీ : దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ తన లేటెస్ట్ హాచ్ బ్యాక్ ఎస్-ప్రెస్సో వాహనాన్ని ఈ నెల (సెప్టెంబర్) 30న లాంచ్ చేస్తోంది. ఈ మేరకు మారుతి కంపెనీ మీడియాకు ఆహ్వానాలు పంపుతోంది. ఇటీవల ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఎంట్రీ లెవల్ కారు గా దీన్ని ప్రదర్శించింది. నాలుగు వేరియంట్లలో ఈ కారును మార్కెట్లోకి విడుదల చేస్తోంది. మారుతి సుజుకి స్పోర్టీ లుక్‌లో వుస్తున్న ఎస్-ప్రెస్సో ఫీచర్లపై అంచనాలు ఇలా వున్నాయి. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, పవర్ 68హెచ్‌పి, టార్క్ 90 ఎన్ఎమ్, మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. దీంతోపాటు సీఎన్జీ మోడల్‌ను కూడా ఆవిష్కరించనుంది. ఇక ధర విషయానికి వస్తే ప్రారంభ ధర రూ .4 లక్షలు నిర్ణయించవచ్చని అంచనా. -
ఐఫోన్ 11 ఆవిష్కరణ.. త్వరలోనే
అమెరికా స్మార్ట్‌పోన్ దిగ్గజం ఆపిల్ తన తదుపరి ఐఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనుందట. ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 11ను సెప్టెంబర్‌లో లాంచ్ చేయనుందని తాజా లీక్‌ల ద్వారా తెలుస్తోంది. సెప్టెంబర్ రెండవ వారంలో ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌ను 11 ప్రొ, 11 ఆర్, 11 మాక్స్ పేరుతో మూడు మోడళ్లలో లాంచ్ చేయనుంది. 5జీ టెక్నాలజీ అప్‌గ్రేడ్, ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి ఫీచర్లతో వీటిని తీసుకురానుందని సమాచారం. సాధారణంగా సెప్టంబరు మాసంలో తన ఫ్లాగ్షిప్ డివైస్‌లను లాంచ్ చేయడం ఆపిల్ ఆనవాయితీగా పాటిస్తూ వస్తోంది. ఈ సాంప్రదాయాన్ని గత రెండేళ్లుగా మిస్ అవుతూ వస్తోంది. 2017 లో, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ సెప్టెంబరులో విడుదల చేయగా , ఐఫోన్ ఎక్స్‌ను నవంబర్‌లో తీసుకొచ్చింది. అయితే 2018 లో, ఐఫోన్ ఎక్స్ సెప్టెంబరులో, లోయర్-ఎండ్ ఐఫోన్ ఎక్స్ అక్టోబర్‌లో ప్రారంభించింది. 2019లో మాత్రం సెప్టెంబర్ సెంటిమెంట్‌ను ఫాలో కావాలని ఆపిల్ భావిస్తోందట. మరోవైపు అమెరికా చైనా ట్రేడ్‌వార్ నేపథ్యంలో సెప్టెంబరు 1 నుంచి అమెరికాలో చైనా దిగుమతులపై 10శాతం సుంకాల విధింపు ప్రకటన చైనాలో ఆపిల్ విక్రయాలపై ప్రభావం చూపుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. తాజాగా సుంకాల విధింపును డిసెంబరు వరకు వాయిదా వస్తూ ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకుంది. -
జియో ఫైబర్ సంచలనం: బంపర్ ఆఫర్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ అధినేత, సీంఎడీ ముకేశ్ అంబానీ మరోసారి సంచలనం సృష్టించారు. ముఖ్యంగా జియో గిగా ఫైబర్ సేవలకు సంబంధించి అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా ఆఫర్లను ప్రకటించడం విశేషం. టెలికాం రంగంలో జియో మాదిరిగాగానే అతి తక్కువ ధరకే ఫైబర్ సేవలను భారతీయ వినియోగదారులకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. ముఖ్యంగా రానున్న 18 నెలలో అప్పుల్లేని కంపెనీగా రిలయన్స్ అవతరించనుందని ముకేశ్ ప్రకటించడం విశేషం. జియో 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి దేశవ్యాప్తంగా జియో ఫైబర్ సేవలను అందుబాటులోకి తెస్తామని అంబానీ వెల్లడించారు. 100 ఎంబీపీఎస్ నుంచి 1జీబీ పీఎస్ వరకు డేటా ఉచితం. అలాగే వెల్ కం ప్లాన్ కింద కస్టమర్లకు 4కే ఎల్డీ టీవీ, 4జీ హెచ్డీ సెట్‌టాప్‌బాక్స్ పూర్తిగా ఉచితం అందిస్తామన్నారు. తద్వారా 5 లక్షల కుటుంబాలకు ఉచిత ఫైబర్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. జియో ఫైబర్ సబ్‌స్క్రైబర్స్‌కు ల్యాండ్ లైన్ ద్వారా ఇంటి నుంచి అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందించనుంది. రూ.500 లకే అమెరికా, కెనడాకు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ప్రీమియం కస్టమర్లు ఇంటివద్దే ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రాతిపదికన కొత్త సినిమాలు చూసే అవకాశం కల్పిస్తామన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు జియో.కాం ద్వారా సెప్టెంబరు 5నుంచి అదుబాటులో వుంటాయని తెలిపారు. అలాగే రానున్న 12 నెలల్లో జియో ఫైబర్ భారీగా విస్తరిస్తుందని పేర్కొన్న అంబానీ, బ్రాడ్‌బాండ్ సిగ్నల్ వచ్చేలా సెట్‌టాప్ బాక్స్‌ను సిద్ధం చేశామని స్పష్టం చేశారు. జియో ఫైబర్‌నెట్ ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈ క్లౌడ్ కనెక్టివిటీ అందజేస్తామని తెలిపారు. ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌తో జత కట్టినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా, కుమారుడు, ఆకాశ్ జియో ఫైబర్ సంచలన వివరాలను అందిస్తూ వేదికపై సందడి చేశారు. ముఖ్యంగా జియోతో హై ఎండ్ వీడియో కాన్ఫరెన్స్ ఎలా చేయవచ్చో లైవ్‌గా చేసి చూపించారు. ఇషా, ఆమె సోదరుడు ఆకాశ్ అంబానీ. ఈ సందర్భంగా ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ..మన ఇంట్లో ఉన్న టీవీ స్క్రీన్ల పైనే వీడియో కాలింగ్ ద్వారా ఒకేసారి నలుగురితో మాట్లాడవచ్చో ప్రదర్శించారు. ప్రపంచంలో ఏమూలనున్నవారితోనైనా వీడియో కాలింగ్, కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకోవచ్చని తెలిపారు. మల్టీ ప్లేయర్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. గిగా ఫైబర్‌లో ఉండే ఏఆర్, వీఆర్ తో షాపింగ్ అనుభవాన్ని పొందవచ్చన్నారు. ఇంటి వద్దనుంచే మనకు సరిపడే దుస్తుల షాపింగ్ చేయవచ్చని తెలిపారు. అంతేకాదు ఇంట్లో థియేటర్ అనుభవాన్ని ఎలా పొందవచ్చో కూడా చూపించారు. జియో సీఈవో కిరణ్ కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. -
మౌలికరంగం నెమ్మది!
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక రంగం వృద్ధి సెప్టెంబర్‌లో మందగించింది. వృద్ధి రేటు 4.3 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 4.7 శాతం. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి.మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో 40.27 శాతం వాటా ఉన్న ఎనిమిది విభాగాలనూ వేర్వేరుగా చూస్తే... ఎరువులు: 2.5 శాతంగా వృద్ధి నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటులో అసలు వృద్ధిలేకపోగా –7.7 శాతం క్షీణతలో ఉంది. సిమెంట్: వృద్ధి 0.1 శాతం నుంచి 11.8 శాతానికి ఎగసింది. విద్యుత్: ఈ విభాగంలో కూడా వృద్ధి 3.2 శాతం నుంచి 8.2 శాతానికి చేరింది. బొగ్గు: వృద్ధి 10.4 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గింది. రిఫైనరీ ప్రొడక్టులు: 8.1 శాతం నుంచి 2.5 శాతానికి డౌన్ స్టీల్: 3.7 శాతం నుంచి 3.2 శాతానికి మైనస్ క్రూడ్ ఆయిల్: 0.1 శాతం వృద్ధి –4.2 శాతం క్షీణతలోకి జారింది. సహజ వాయువు: 6.3 శాతం వృద్ధి నుంచి –1.8 శాతం క్షీణతలోకి పడింది. -
జోరందుకున్న ఎయిర్ జర్నీ
ముంబై: దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య గతనెలలో గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 114 లక్షల మంది దేశీ విమానాల్లో ప్రయాణం చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా విడుదలచేసిన డేటా ద్వారా వెల్లడైంది. ఏడాది ప్రాతిపదికన 18.95 శాతం వృద్ధి రేటు నమోదైంది. అంతకు ముందు ఏడాది సెప్టెంబర్‌లో 95.83 లక్షల మంది ప్రయాణికులు దేశీ విమానాల్లో ప్రయాణం చేశారు. గతనెలలో ఎయిర్ ట్రాఫిక్ పెరగడానికి.. భారీ డిస్కౌంట్ ఆఫర్లు, పండుగల సీజన్ కావడమే ప్రధాన కారణమని డీజీసీఏ విశ్లేషించింది. నెంబర్ వన్ స్థానంలో ఇండిగో అత్యధిక ప్రయాణికులతో ఇండిగో మరోసారి రికార్డు సృష్టించింది. గతనెలలో 49.20 లక్షల మంది ప్రయాణీకులతో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. మార్కెట్ వాటా 43.20%గా నమోదైంది. ఆ తరువాత స్థానంలోని జెట్ ఎయిర్వేస్ మార్కెట్ వాటా 14.2%కి పరిమితమైంది. ఈ ఎయిర్‌లైన్స్‌లో 16.13 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. స్పైస్ జెట్ ప్రయాణికుల సంఖ్య 13.63 లక్షలు కాగా, మార్కెట్ వాటా 12 శాతం. 13.45 లక్షల మంది ప్రయాణికులతో ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా మార్కెట్ వాటా 11.8 శాతంగా నమోదైంది. -
జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు అందనున్న వేతనం
సాక్షి, న్యూఢిల్లీ : సమస్యలతో సతమతమవుతున్న ప్రైవేట్ ఎయిర్‌లైనర్ జెట్ ఎయిర్వేస్ సెప్టెంబర్ వేతనంలో 25 శాతాన్ని ఈనెల 25న అందచేయనుంది. పైలట్లు, ఇంజనీర్లు, సీనియర్ మేనేజ్మెంట్ సిబ్బందికి వేతనాలు జమ చేస్తామని సంస్థ పేర్కొంది. గత నెలలో మిగిలిన 75 శాతం వేతన చెల్లింపును ఎప్పుడు చేపడతారనేది వెల్లడించకపోవడం గమనార్హం. 16,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్న జెట్ ఎయిర్వేస్ ఆగస్ట్ నుంచి పైలట్లు, ఇంజనీర్లు, సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో జాప్యం చేస్తోంది. వేతన బకాయిని వీలైనంత త్వరలో చెల్లిస్తామని జెట్ ఎయిర్వేస్ సీపీఓ రాహుల్ తనేజా పేర్కొన్నారు. ఇక ఆగస్ట్ వేతనాన్ని సెప్టెంబర్ 11, 26 తేదీల్లో చెల్లించనున్నట్టు గతంలో కంపెనీ వెల్లడించింది. ఆయా తేదీల్లో పూర్తి వేతనం చెల్లించలేకపోయిన సంస్థ సెప్టెంబర్ వేతనాన్ని అక్టోబర్ 9కి క్లియర్ చేసింది. వేతన సమస్యను పరిష్కరించేందుకు జెట్ ఎయిర్వేస్ ఛైర్మన్ నరేష్ గోయల్ నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్‌తో సంప్రదింపులు జరిపారని కంపెనీ పేర్కొంది. -
3.8శాతం పడిపోయిన ఐఐపీ సూచీ
సాక్షి, న్యూఢిల్లీ: సెప్టెంబర్ త్రైమాసికంలో పారిశ్రామిక ఉత్పాదక సూచీ (ఐఐపి) ఇడెక్స్ క్షీణించింది. శుక్రవారం ప్రకటించిన డేటా ప్రకారం ఐఐపీ ఇండెక్స్ సెప్టెంబరులో 3.8 శాతానికి పడిపోయింది. గత నెలలో ఇది 4.3 శాతంగా నమోదైంది. అయితే ఉత్పాదన ఉత్పత్తి ఇండెక్స్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన 2.5శాతం వృద్ధిని సాధించింది. గత ఏడాది ఇదే నెలలో 3.4 శాతంగా ఉండగా, గత ఆగస్టులో 3.1 శాతంగా ఉంది. సెప్టెంబరులో విద్యుత్ ఉత్పత్తి గత ఏడాది 5.1 శాతంశాతంతో పోలిస్తే 3.4 శాతం పెరిగింది. మైనింగ్ ఉత్పత్తి 7.9 శాతం( సంవత్సరం ప్రాతిపదికన) పెరిగింది. -
సెప్టెంబర్ 20 తర్వాతే కేబినెట్ విస్తరణ
-
సెప్టెంబర్ 20 తర్వాతే కేబినెట్ విస్తరణ
సాక్షి, న్యూఢిల్లీ: నేడో, రేపో అంటూ వార్తలొస్తున్నప్పటికీ.. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఆగస్టు 30, 31న మంత్రిత్వ శాఖలు, విభాగాల వారీగా సమీక్షలు, మంత్రుల అపాయింట్మెంట్లు ఇప్పటికే ఖరారైపోయాయి. మరోవైపు రాష్ట్రపతి భవన్ సమాచారం మేరకు సెప్టెంబర్ 1న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుపతి పర్యటన ఖరారైంది . ఇక సెప్టెంబర్ 2 బక్రీద్ కావడంతో ప్రభుత్వ సెలవు దినం. అందువల్ల ఆ నాలుగు రోజుల్లో విస్తరణ దాదాపుగా ఉండనట్లే.. సెప్టెంబర్ 3న మోదీ చైనా పర్యటనకు వెళ్తున్నారు. చైనాలో జరిగే బ్రిక్స్ సదస్సు, మయన్మార్ పర్యటన ముగించుకుని సెప్టెంబర్ 7న ప్రధాని భారత్‌కు తిరిగి రానున్నారు. ఇదే సమయంలో సెప్టెంబర్ 5 నుంచి 20 వరకూ శ్రాద్ధ(అశుభ) దినాలు. ఆ రోజుల్లో కొత్త పనులు, మంచి పనులు చేపట్టరు. అందువల్ల సెప్టెంబర్ 20 తర్వాతే కేబినెట్ విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది. చైనా పర్యటనకు ప్రధాని మోదీ న్యూఢిల్లీ: వచ్చే నెల 3 నుంచి 5 మధ్య చైనాలో జరిగే బ్రిక్స్ దేశాల సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతారని విదేశాంగ శాఖ మంగళవారం ప్రకటించింది. జియామెన్ నగరంలో ఈ సదస్సు జరగనుంది. డోక్లాం వివాదం సద్దుమణిగిన తరువాతి రోజే ఈ ప్రకటన వెలువడటం గమఔఉర్హం. ‘చైనా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జియామెన్‌లో జరిగే 9వ బ్రిక్స్ సదస్సుకు ప్రధాని హాజరవుతారు’ అని విదేశాంగ శాఖ పేర్కొంది. -
రైల్వే ఈ టికెట్లపై గుడ్‌న్యూస్
న్యూడిల్లీ: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. డీమానిటైజేషన్ తరవాత డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో రైల్వే ఈ టికెట్లపై ఉపసంహరించుకున్న సర్వీసు చార్జ్‌ను గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ప్రయాణికుల సౌలభ్యంకోసం భారత రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు వరకు బుక్ చేసుకున్న టిక్కెట్లపై సర్వీసు చార్జ్ మినహాయింపు కొనసాగనుందని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఐఆర్సీటీసీలో రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి సర్వీస్ చార్జ్ మినహాయింపు సెప్టెంబర్ 2017వరకు కొనసాగనుంది. తాజా ఆదేశాలప్రకారం సెప్టెంబరు 30 వరకు ఆన్లైన్లో రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి సర్వీస్ ఛార్జ్ ఉండదు. తద్వారా తమకు రూ.500కోట్ల నష్టం వాటిల్లనుందని రైల్వే శాఖ అంచనా వేసింది ఈ మేరకు ఈ నష్టాన్ని తిరిగి చెల్లించాలని కోరుతూ రైల్వే మంత్రిత్వశాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్టు వెల్లడించింది. పెద్దనోట్ల రద్దు అనంతరం మొదట 2016 నవంబర్ 23 నుంచి సర్వీస్ చార్జ్ మినహాయింపు ప్రకటించింది. ఆ తర్వాత ఈ అవకాశాన్ని ఏడాది మార్చి 31 వరకు కల్పించారు. అనంతరం ఈ గడువును మరో మూడు నెలలపాటు అంటే 2017, జూన్ 30వరకు పొడిగించింది. సాధారణంగా ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసుకుంటే రూ. 20 నుంచి రూ. 40 వరకు సర్వీస్ చార్జ్ అయ్యే సంగతి తెలిసినదే. -
జీఎస్టీ అమలు సెప్టెంబర్‌కు మార్చండి!
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలుపై చెలరేగుతున్న అనేక ఊహాగానాలకు తోడు తాజాగా విమానయాన మంత్రిత్వశాఖ లేఖ జరింత చేరింది. ఒకవైపు దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి గూడ్స అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్( జీఎస్టీ)ను అమలు చేసేందుకు కేంద్రం సన్నద్ధమతోంది. మరోవైపు కొత్త పరోక్ష పన్నుల విధానం అమలుకు కొంత సమయంకావాలని భావిస్తోంది. ఈ మేరకు రెవెన్యూ కార్యదర్శికి ఒక లేఖను కూడా రాసింది. దీంతోపాటు జీఎస్టీ పన్నుల విధానం ఆందోళన వ్యక్తం చేసింది. జీఎస్టీ అమలు గడువును సెప్టెంబర్‌కు పెంచాల్సిందిగా కోరుతూ విమానయాన మంత్రిత్వశాఖ ఆర్థికమంత్రిత్వ శాఖకు ఈ లేఖ రాసింది. జూలైలో జీఎస్టీ పన్నుల ను అమలు చేయడం కష్టంగా ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే అంతర్జాతీయ విమానాలకు, కనెక్టింగ్ విమానాలకు ఒకేపన్ను రేటు అమలు చేయాలని కూడా మంత్రిత్వ శాఖ రెవెన్యూ సెక్రటరి హస్ముఖ అధియాకు రాసిన లేఖలో కోరింది. అంతేకాదు జీఎస్టీ వల్ల అంతర్జాతీయ ప్రయాణాలు, ఇన్పుట్ పన్ను క్రెడిట్లకు సంబంధించి విదేశీ సంస్థలకంటే అంతర్జాతీయ ఎయిర్ లైన్లకు లాభదాయకంగా ఉండనుందని లేఖలో పేర్కొన్నారు. ప్రపంచ టికెటింగ్ వ్యవస్థలో మార్పును ప్రభావితం చేస్తాయని ఎయిర్‌లైన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందుకే జిఎస్టి అమలుకు తమకు మరింత సమయం ఇవ్వాలని ఆర్ధిక మంత్రిత్వ శాఖ కోరిందని ఏవియేషన్ మినిస్ట్రీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. సోమవారం ఈ లేఖ రాసినట్లు ఈ అధికారి తెలిపారు. కాగా దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిరవేస్ సహా కొన్ని దేశీయ విమానయాన సంస్థలు కూడా జీఎస్టీ అమలుకు సహా కొన్ని దేశీయ విమానయాన సంస్థలు, తమకుకొంత సమయం కావాలని అభిప్రాయపడ్డాయి. ఇప్పటికే వివిధ వర్గాలు వారు జీఎస్టీఅమలుకు మరింత గడువునుకోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. అయితే రెవెన్యూ కార్యదర్శి హాస్ముఖ్ ఆధియాకుజూలై 1, 2017నుంచి జీఎస్టీ అమలు వాయిదాకానుందన్న వార్తలను ట్విట్టర్ ద్వారా ఖండించిన సంగతి తెలిసిందే. -
సెప్టెంబర్‌లో మౌలిక రంగం జోరు..!
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక విభాగాలతో కూడిన మౌలిక రంగం సెప్టెంబర్‌లో మంచి పనితీరును ప్రదర్శించింది. ఈ నెలలో ఐదు శాతం వృద్ధి నమోదయ్యింది. ఇది మూడు నెలల గరిష్ట స్థాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో వృద్ధి 3.7 శాతంగా నమోదయ్యింది. 2016 ఆగస్టులో రేటు 3.2 శాతం. సిమెంట్, స్టీల్, రిఫైనరీ పరిశ్రమల ఉత్పత్తుల జోరు గ్రూపుకు సానుకూలమైంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో 38 శాతంగా ఉన్న ఈ ఎనిమిది పారిశ్రామిక విభాగాలనూ వేర్వేరుగా పరిశీలిస్తే... ఊపు నిచ్చిన రంగాలు... రిఫైనరీ ప్రొడక్టులు: వార్షికంగా చూస్తే వృద్ధి 0.5% నుంచి 9.3%కి ఎగసింది. స్టీల్: వృద్ధి 16.3 శాతంగా నమోదయ్యింది. 2015 ఇదే నెలలో ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా -0.9 శాతం క్షీణత నమోదయ్యింది. సిమెంట్: ఈ రంగంలో -1.6 శాతం క్షీణత 5.5 శాతం వృద్ధికి మారింది. వృద్ధి తగ్గినవి మూడు ఎరువులు: ఈ రంగంలో వృద్ధి 18.3 శాతం నుంచి 2.0 శాతానికి పడిపోయింది. విద్యుత్: వృద్ధి 11.4 శాతం నుంచి 2.2 శాతానికి పడిపోయింది. క్షీణతలో... బొగ్గు: 2.1 శాతం వృద్ధి -5.8 శాతం క్షీణతలోకి జారింది. క్రూడ్ ఆయిల్: -0.1 శాతం క్షీణత నుంచి -4.1 శాతం క్షీణతకు పడిపోయింది. సహజవాయువు: ఈ రంగంలోనూ 0.9% వృద్ధి -5.5 శాతం క్షీణతకు మళ్లింది. ఆరు నెలల్లో... ఇక ఆర్థిక సంవత్సరంలో గడచిన ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) ఎనిమిది రంగాలనూ చూస్తే.. వృద్ధి 2.6 శాతం నుంచి 4.6 శాతానికి ఎగసింది. -
ఆర్బీఐకు మరో ఛాన్స్: దిగొచ్చిన ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : మరోసారి రిజర్వు బ్యాంకు ఆఫ్ రేట్ల కోతకు అవకాశం కల్పిస్తూ, రిటైల్ ద్రవ్యోల్బణం చల్లటి కబురు అందించింది. ఆహార ఉత్పత్తుల ధరలు కిందకి దిగి రావడంతో సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.31శాతంగా నమోదై 13 నెలల కనిష్ట స్థాయికి దిగొచ్చినట్టు వెల్లడైంది. ఆగస్టు నెలలో ఈ ద్రవ్యోల్బణం 5.05శాతంగా ఉంది. వరుసగా రెండు నెలల పాటు ఈ ద్రవ్యోల్బణం పడిపోయినట్టు ప్రభుత్వ అధికారిక డేటా ప్రకటించింది. వినియోగదారుల ధరలకు అనుగుణంగా ఈ ద్రవ్యోల్బణాన్ని కొలుస్తారు. గత నెల 5.91శాతంగా ఉన్న ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం ఆశ్చర్యకరంగా 3.88శాతానికి దిగిజారినట్టు వెల్లడైంది. 2016-17 ఆర్థిక సంవత్సంలో మొదటిసారి రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించిన 5 శాతం కంటే తక్కువగా నమోదకావడం విశేషం. అయితే ఈ ద్రవ్యోల్బణంలో చక్కెర, మిఠాయి ధరలు మరింత ప్రియంగా మారి, 25.77శాతంగా రికార్డు అయ్యాయి. పప్పుల ద్రవ్యోల్బణం 14.33 శాతంగా, దుస్తులు,ఫుట్‌వేర్ ద్రవ్యోల్బణం 5.19శాతం, ఇంధన ద్రవ్యోల్బణం 3.07శాతంగా ఉన్నాయి. ఈ ద్రవ్యోల్బణం 5 శాతం కంటే కిందకి పడిపోవడం ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ద్రవ్యవిధాన కమిటీకి మరోసారి రేట్ల కోతకు అవకాశం కల్పిస్తున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. 50 బేసిస్ పాయింట్లు వరకు ఈ ఏడాది రేటుకు కోత పడుతుందని అంచనావేస్తున్నారు. కిందటి పాలసీలో కూడా ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని కమిటీ మార్కెట్ విశ్లేషకులకు ఆశ్చర్యకరంగా రేటు కోత ప్రకటిస్తూ దీపావళి కానుక అందించారు. అంచనావేసిన దానికంటే ఎక్కువగా పారిశ్రామికోత్పత్తి పడిపోయినట్టు డేటా విడుదలైన తర్వాతి రోజే రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినట్టు వెల్లడైంది. -
టాప్ గేర్ లో టాటా మోటార్స్ గ్లోబల్ సేల్స్
ముంబై: ప్రముఖ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ సెప్టెంబర్ గ్లోబల్ హోల్ సేల్ అమ్మకాల్లో టాప్ గేర్ లో దూసుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా లక్ష యూనిట్లకు పైగా వాహనాలను విక్రయించినట్టు బీఎస్ ఈ ఫైలింగ్ లో తెలిపింది. జాగ్వార్ లాండ్ రోవర్ అమ్మకాలతో కలిపి మొత్త వాహనాల 5.35 శాతం వృద్ధితో 1,02,289 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 97,102 యూనిట్లను విక్రయించినట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. ప్యాసింజర్ కార్ల విభాగంలో గ్లోబల్ సేల్స్ గణనీయంగా పెరిగాయి. ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో 7.2 వృద్ధిని సాధించింది. గత ఏడాది 63,334 యూనిట్లను విక్రయించగా ఈ ఏడాది 67,895 యూనిట్ల అమ్మకాలు చేపట్టింది. లగ్జరీ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు గత ఏడాది ఇదే నెలలో 51,074 యూనిట్లతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో 3.6 శాతం వృద్ధిని సాధించింది. 52,914 వాహనాలను విక్రయించింది. వాణిజ్య వాహనాల అమ్మకాల్లో 1.85 శాతం వృద్ధితో 33.768 యూనిట్లకు విక్రయించింది. గత ఏడాది ఇవి 34, 394 యూనిట్లుగా ఉన్నాయి. -
జోరుగా వాహన విక్రయాలు..
న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు సెప్టెంబర్‌లో 20 శాతం మేర ఎగశాయి. గత నాలుగున్నరేళ్లలో ఈ స్థాయి అమ్మకాలు నమోదుకావడం ఇదే తొలిసారి. దీనికి యుటిలిటీ వాహన విక్రయాల పెరుగుదల, కొత్త మోడళ్లు, పండుగ సీజన్ వంటి అంశాలు బాగా అనుకూలించాయి. సియామ్ గణాంకాల ప్రకా రం.. పీవీ విక్రయాలు సెప్టెంబర్‌లో 2,78,428 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో పీవీ అమ్మకాలు 2,32,170 యూనిట్లుగా ఉన్నాయి. కాగా 2012 మార్చిలో పీవీ విక్రయా లు 2,95,403 యూనిట్లుగా నమోద య్యాయి. యుటిలిటీ వాహన అమ్మకాలు సెప్టెంబర్‌లో 48,467 యూనిట్ల నుంచి 38 శాతం వృద్ధితో 66,851 యూనిట్లకు ఎగశాయి. కార్ల విక్రయాలు 15 శాతం వృద్ధితో 1,69,590 యూనిట్ల నుంచి 1,95,259 యూనిట్లకు చేరాయి. -
అమ్మకాల్లో మారుతీ పరుగులు
ముంబై : దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాల్లో దూసుకెళ్లింది. సెప్టెంబర్ నెలలో ప్రయాణికుల వాహనాల అమ్మకాల్లో 31.1 శాతం వృద్ధిని నమోదుచేసి, 1,49,143 యూనిట్లగా రికార్డు చేసింది. వీటిలో అత్యధికంగా దేశీయ అమ్మకాలు ఉండటం విశేషం. గతేడాది ఇదే నెలలో మారుతీ సుజుకీ ఇండియా కేవలం 1,13,759 యూనిట్లను మాత్రమే విక్రయించింది. దేశీయ అమ్మకాలు గతేడాది 1,06,083 యూనిట్లు ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 1,37,321 యూనిట్లుగా నమోదయ్యాయి. జూలై అమ్మకాలను సైతం మారుతీ సుజుకీ అధిగమించింది. గత కొన్ని నెలలుగా అమ్మకాల ఒత్తిడిలో ఉన్న మిని సెగ్మెంట్ కార్లు వాగన్ ఆర్, ఆల్టో మోడల్స్ సైతం అమ్మకాల్లో దూసుకెళ్లాయి. ఈ వాహనాలు 24.8 శాతం జంప్ అయి, 44,395 యూనిట్లుగా నమోదుచేశాయి. కాంపాక్ట్ సెగ్మెట్ కార్లు స్విఫ్ట్, రిట్జ్, సెలెరియో, బాలెనో, డిజైర్లు కూడా 12.3 శాతం ఎగిసి, 50,324 యూనిట్లను అమ్మినట్టు మారుతీ సుజుకీ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా మిడ్ సైజ్ సెడాన్ సియాజ్ కార్లు గతేడాది కంటే అత్యధికంగా 52.5 శాతం పెరిగి 6,544 యూనిట్లుగా రికార్డుచేసినట్టు తెలిపింది. వాణిజ్య వాహనాలు, ఎగుమతులు కూడా సెప్టెంబర్ నెలలో ఎగిసినట్టు వెల్లడించింది. -
టారో : 25 సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) త్వరలోనే స్థిరాస్తులపై పెట్టుబడులు పెడతారు. అనూహ్యమైన సంఘటనలు ఎదురవుతాయి. చిరకాల స్వప్నాలు నెరవేరుతాయి. కెరీర్లో ముందడుగు వేయాలనుకున్న వారికి పోటాపోటీగా అవకాశాలు వస్తాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో తేల్చుకోలేకపోతారు. దూర ప్రయాణాలకు వెళతారు. కుటుంబ సభ్యులతో అపార్థాలు తలెత్తవచ్చు. లక్కీ కలర్: గోధుమరంగు వృషభం (ఏప్రిల్ 20 - మే 20) కొత్త పని లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఉన్నత చదువులు చదవాలనుకుంటున్న విద్యార్థులకు కోరుకున్న కోర్సుల్లో సీటు దొరికే అవకాశాలు ఉన్నాయి. తీరిక దొరకనంత పని చేతినిండా ఉంటుంది. పని ఒత్తిడి పెరగడంతో అలసట చెందుతారు. సహోద్యోగుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు. అనూహ్యమైన సందేశాన్ని అందుకుంటారు. లక్కీ కలర్: ముదురు నారింజ మిథునం (మే 21 - జూన్ 20) ప్రశాంతత కోరుకుంటారు. అయినవారితో విభేదాలు కలవరానికి గురిచేస్తాయి. త్వరలోనే ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి. గత పరిచయాల ద్వారా లబ్ధి పొందుతారు. ఇప్పటి వరకు మీరు పడిన శ్రమ వృథా కాదు. దానికి తగిన ఫలితాలు లభించడం మొదలవుతుంది. గడ్డు కాలం నుంచి గట్టెక్కుతారు. నెమ్మదిగా పరిస్థితులన్నీ చక్కబడతాయి. సునాయాసంగా సమస్యలను అధిగమిస్తారు. లక్కీ కలర్: నీలం కర్కాటకం (జూన్ 21 - జూలై 22) కొత్త జీవితానికి నాంది పలుకుతారు. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధిస్తారు. భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. చాలాకాలంగా కొనసాగుతున్న అప్పులు తీర్చేస్తారు. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. పని ఒత్తిడి నుంచి విరామం కోరుకుంటారు. ధ్యానం ద్వారా శక్తి పుంజుకుంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: ముదురాకుపచ్చ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) కలల సాకారానికి మీరు సాగిస్తున్న కృషి సరిపోదని గుర్తిస్తారు. చేపట్టిన బృహత్తర కార్యాన్ని పూర్తి చేయడం సాధ్యమేనా అని సంశయిస్తారు. అయితే, దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కుటుంబ సభ్యులకు మరింత సమయాన్ని కేటాయిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అందివస్తాయి. లక్కీ కలర్: నారింజ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ఆర్థిక లాభాలు కలిసొస్తాయి. విందు వినోదాల్లో గడుపుతారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. చేతిలో ఉన్న పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అవరోధాలు తొలగుతాయి. దురదృష్టవంతుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు ఎదురయ్యే సూచనలున్నాయి. లక్కీ కలర్: పసుపు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) అనిశ్చితిని వదులుకుంటేనే లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. తాత్సారం చేయకుండా తగిన వాటిని అందిపుచ్చుకోవడం ద్వారా ఘన విజయాలు సాధించగలరు. అనూహ్యమైన సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆనందంలో ఓలలాడిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. లక్కీ కలర్: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. పెట్టుబడుల నుంచి లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే సూచనలు ఉన్నాయి. సామాజికంగా పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాలకు ఉదారంగా విరాళాలు ఇస్తారు. విద్యార్థులు అమోఘమైన ఫలితాలను సాధిస్తారు. లక్కీ కలర్: గులాబి ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) అద్భుతమైన అవకాశాలను అందుకుంటారు. ఉద్విగ్నభరితమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇంటా బయటా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఆచితూచి అంతిమ నిర్ణయం తీసుకుంటారు. వివాహితులకు జీవిత భాగస్వామితో పొరపొచ్చాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. చాకచక్యంగా పరిస్థితిని చక్కదిద్దుకుంటారు. లక్కీ కలర్: ముదురు నారింజ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. వైద్య సహాయం తీసుకోవడం అనివార్యమయ్యే సూచనలు ఉన్నాయి. ఆహార విహారాల్లో మార్పులతో పరిస్థితి చక్కబడుతుంది. అనవసరమైన వాదులాటల వల్ల మనశ్శాంతికి దూరమవుతారు. పాతబాకీలను పూర్తిగా చెల్లిస్తారు. కఠిన నిర్ణయాలతో జీవిత భాగస్వామికి మనస్తాపం కలిగించే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: తెలుపు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) విద్యార్థులకు పూర్తిగా సానుకూలమైన కాలం. పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లోని వారు తెలివితేటలతో రాణిస్తారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. నాయకత్వ పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. అనూహ్యంగా ఒక ఆశ్చర్యకరమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. శ్వాసకోశ వ్యాధులు ఇబ్బంది పెట్టవచ్చు. లక్కీ కలర్: పసుపు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) పని ఒత్తిడికి దూరంగా గడపాలనుకుంటారు. బద్ధకంతో పనులను వాయిదా వేస్తారు. మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ జీవిత భాగస్వామి నుంచి గొప్ప సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు. ప్రేమ వ్యవహారాలు సంతోషభరితంగా సాగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. వారాంతంలో బంధు మిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. లక్కీ కలర్: వెండిరంగు - ఇన్సియా, టారో అనలిస్ట్ -
టారో : 18 సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) విదేశాల నుంచి శుభవార్తలను అందుకుంటారు. ఆశించిన ఫలితాలను సాధించడానికి అప్రమత్తతతో అడుగు ముందుకేస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారి ఆశలు ఫలిస్తాయి. అసంపూర్ణంగా వదిలేసిన పనులను పూర్తి చేయాల్సి వస్తుంది. మీరు సాధించిన విజయాలను చూసి కొందరు అసూయ చెందుతారు. దీనివల్ల కొంత మనశ్శాంతి దెబ్బతింటుంది. లక్కీ కలర్: నలుపు వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఒకేసారి చాలా అవకాశాలు అందుబాటు లోకి వస్తాయి. ఎంపిక విషయంలో డోలాయమానంలో పడతారు. లక్ష్య సాధన కోసం ధైర్యసాహసాల తో ముందడుగు వేయాల్సి ఉంటుంది. పిరికితనాన్ని, మొహ మాటాన్ని విడిచిపెడితేనే ఆశించిన ఫలితాలను అందుకోగలుగుతారు. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉంటాయి. లక్కీ కలర్: మీగడ రంగు మిథునం (మే 21 - జూన్ 20) గ్రహానుకూలత బలంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసంతో రాణిస్తారు. క్లిష్టమైన పనులను సైతం పూర్తిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. విజయపథంలో ముందుకు సాగుతారు. ప్రేమానుబంధాలలో పొరపొచ్చాలు చిరాకు కలిగించవచ్చు. ఇబ్బందికరమైన సంబంధాల నుంచి తప్పుకుంటేనే మేలు. లక్కీ కలర్: బంగారు రంగు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) ఇంట్లో భారీ మార్పులు చేపడతారు. జీవన శైలిలో, ఆరోగ్య జాగ్రత్తల్లో కూడా మార్పులు అనివార్యంగా మారుతాయి. ఏవో తెలియని భయాలు వెన్నాడుతాయి. భవిష్యత్తు ఆశాజనకంగానే ఉంటుంది. ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. అయితే, రుణాల జోలికి పోకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడమే క్షేమం. మానసిక కుంగుబాటును అధిగమిస్తారు. లక్కీ కలర్: వెండి రంగు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) కొత్తగా ప్రేమలో పడతారు. ప్రేమ వ్యవహారాల్లోకి దిగడం మీ జీవిత లక్ష్యంగా ఎన్నడూ అనుకుని ఉండరు కాని, నచ్చిన వ్యక్తి తారసపడటంతో పిచ్చిగా ప్రేమలో మునిగిపోతారు. కెరీర్లో మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులను అనివార్యతతో కాకుండా, అంతులేని తపనతో ఇష్టంగా పూర్తి చేస్తారు. ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. లక్కీ కలర్: ముదురు నారింజరంగు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) అరుదైన గొప్ప అవకాశం అందివస్తుంది. ఇల్లు, వాహనం కొనడం వంటి చిరకాల కోరికలు నెరవేరుతాయి. విలాస వస్తువులను పొందగల ఆర్థికబలాన్ని సంతరించుకుంటారు. దుర్వ్యసనాలను అదుపులో ఉంచుకోవాల్సిన పరిస్థితి అనివార్యమవుతుంది. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరమవుతుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు. లక్కీ కలర్: ముదురు ఎరుపు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) కెరీర్లో గొప్ప ఉన్నతిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో విజయపథంలో దూసుకుపోతారు. మీ పురోగతిలోని వేగం ఇతరులను ఆశ్చర్యపరుస్తుంది. మీ క్రమశిక్షణ, అంకితభావాలే మీ అభివృద్ధికి సోపానాలవు తాయి. బంధుమిత్రులతో పొరపొచ్చాలు రావచ్చు. విభేదాలకు, వివాదాలకు దూరంగా ఉంటేనే మంచిది. లక్కీ కలర్: నేరేడురంగు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) కలలను సాకారం చేసుకునే ప్రయత్నాల్లో ఉంటారు. కొత్త జీవితానికి నాంది పలకాలనుకుంటారు. కొత్త ఆలోచనలతో వ్యాపారాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటారు. ఒక మహిళ ద్వారా మీకు అదృష్టం కలిసొస్తుంది. కొత్తగా మీరు ప్రారంభించబోయే వ్యాపారాల్లో మహిళను భాగస్వామిగా చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. లక్కీ కలర్: లేత ఊదా ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) సాదాసీదాగా సాగిపోతున్న జీవితంలో కుదుపులు ఎదురవుతాయి. ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా మీరు సునాయాసంగా పరిస్థితులను అధిగమిస్తారు. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. రిస్కు తీసుకోవడానికి తటపటాయించకుండా ముందుకు సాగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. విహార యాత్రలకు వెళతారు. వ్యాపార విస్తరణకు సంబంధించి జ్యోతిషులను సంప్రదిస్తారు. లక్కీ కలర్: ముదురు ఊదా మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) ఉద్యోగులకు మంచి పదోన్నతులు, వేతన పెంపు ఉంటాయి. వ్యాపారరంగంలో అవకాశాలు కొంత వరకు తగ్గుతాయి. త్వరలోనే భారీ లాభాలు తెచ్చిపెట్టే అవకాశాలు అందివస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ధ్రువతారలా వెలుగొందు తారు. చేపట్టిన పనులను విజయ వంతంగా పూర్తి చేస్తారు. మరొకరితో కొత్తగా ప్రేమలో పడతారు. లక్కీ కలర్: ముదురు ఎరుపు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) ఎలాంటి సవాళ్లు ఎదురైనా ధీమాగా ఎదుర్కొంటారు. త్వరలోనే ఆర్థిక లాభాలు కూడా అందివస్తాయి. ఈలోగా దాచుకున్న సొమ్మును ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి అనూహ్యంగా కొన్ని ప్రతిపాదనలు రావచ్చు. అయితే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే మేలు. లక్కీ కలర్: ముదురు నారింజరంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) సంకల్ప బలంతో అనుకున్న లక్ష్యాలను అవలీలగా సాధిస్తారు. చాకచక్యంగా వ్యవహరించి, సమస్యల నుంచి బయట పడతారు. దేనినైనా ‘కాదు’ అనకుండా అన్నింటికీ సంసిద్ధంగా ఉండటాన్ని అలవరచు కోవడం మంచిది. ఇలాంటి సర్వసన్నద్ధతే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. ఒంటరిగా ఉంటున్న వారు ప్రేమలో పడతారు. ప్రేమానుబంధాల పట్ల సంతోషంగా ఉంటారు. లక్కీ కలర్: నీలం - ఇన్సియా, టారో అనలిస్ట్ -
సెప్టెంబర్ 17 ఉత్సవం ఎవరి సొంతం?
-
టారో : 11 సెప్టెంబర్ నుంచి 17 సెప్టెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) కోరుకున్న రంగంలో పురోగతి సాధిస్తారు. అధికారం పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో తలమునకలుగా ఓలలాడుతారు. వ్యాపార లావాదేవీల్లో భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటారు. సంప్రదాయాలకు విలువ నిస్తారు. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లి కుదిరే సూచనలు ఉన్నాయి. ఇదివరకటి పెట్టుబడుల ద్వారా మంచి లాభాలను అందుకుంటారు. లక్కీ కలర్: ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) సరైన మార్గాన్ని ఎంపిక చేసుకుంటారు. విజయపథంలో ముందుకు సాగుతారు. బంధు మిత్రులతో పాత వివాదాలను పరిష్కారం చేసుకుంటారు. యోగ్యత గల వ్యక్తికి మనసిస్తారు. ఏది ప్రాప్తమో అదే దక్కుతుందని తెలుసుకుంటారు. మీకు చెందని వాటి కోసం వెంపర్లాడటం మానుకుంటారు. ఆరోగ్య పరిస్థితిలో పురోగతి సాధిస్తారు. లక్కీ కలర్: నేరేడు రంగు మిథునం (మే 21 - జూన్ 20) పూర్తిగా కలిసొచ్చే కాలం ఇది. కెరీర్, ప్రేమ వ్యవహారాల్లోను పరిస్థితులు పూర్తి సంతృప్తి కరంగా ఉంటాయి. పరస్పర విరుద్ధమైన అంశాలలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం అనివార్యంగా మారుతుంది. ద్వైదీభావాన్ని విడనాడితే పురోగతి సాధించగలరు. విశిష్టమైన మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. కళా సాహితీ రంగాల్లో మీ పేరు ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటాయి. లక్కీ కలర్: ముదురు పసుపు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) జీవితంలో కీలకమైన ముందంజ వేసేందుకు అవకాశం లభిస్తుంది. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. ఇతరుల్లోనూ గుర్తింపు లభిస్తుంది. ఎదుట ఉన్న అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. అది మీ కెరీర్‌ను మలుపు తిప్పి, మిమ్మల్ని విజయ పథంలోకి చేరుస్తుంది. ఆశించిన ఆర్థిక లాభాలు దక్కుతాయి. శుక్ర, శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే క్షేమం. లక్కీ కలర్: మీగడ రంగు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. సృజనాత్మక ఆలోచనల ద్వారా ఆర్థిక లబ్ధి పొందుతారు. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండటం మంచిది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తుల ప్రభావం నుంచి సమర్థంగా బయటపడతారు. ఆశించిన లక్ష్యాలను సునాయాసంగా సాధిస్తారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. లక్కీ కలర్: నారింజ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీ కారణంగా మీ సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులు ఆర్థిక లబ్ధి పొందుతారు. సృజనాత్మకమైన మీ ఆలోచనలు విజయవంతం అవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడం అనివార్యంగా మారుతుంది. ఊపిరితిత్తుల సమస్యలు బాధపెట్టే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: లేత గోధుమ రంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) తలపెట్టిన పనులు ఒక కొలిక్కి వస్తాయి. పలుకుబడి గల వ్యక్తి ఒకరు మీకు అండగా నిలుస్తారు. కెరీర్లో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో తలమునకలుగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోతారు. సంయమనం కోల్పోకుండా మౌనాన్ని ఆశ్రయిస్తే, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తేలికగా బయటపడగలుగుతారు. విదేశీ ప్రయాణాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: లేత నీలం వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) పోరాట పటిమను చాటుకుంటారు. విజేతగా నిలుస్తారు. సంఘర్షణలకు దూరంగా ఉంటారు. ఇతరులకు సాయం చేయడంలో సంతృప్తి పొందుతారు. క్రమశిక్షణను మరింత పెంచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లుతారు. ప్రేమానుబంధాలపై పునరాలోచనలో పడతారు. కొత్త వ్యూహాలతో కొత్త పనులు తలపెడతారు. అనూహ్యమైన సంఘటనలు ఆనందం కలిగిస్తాయి. లక్కీ కలర్: నారింజ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తారు. పని ఒత్తిడికి దూరంగా దూర ప్రయాణాలు చేస్తారు. ప్రేమానుబంధాలను మరింత బలోపేతం చేసుకుంటారు. జీవితంలో ప్రశాంతతను ఆస్వాదిస్తారు. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. పిల్లల పురోగతికి గర్వంతో ఉప్పొంగిపోతారు. లక్కీ కలర్: తెలుపు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) ఆర్థిక లాభాలు పొందుతారు. పేరు ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. అవరోధాలను అధిగమించి కెరీర్లో ఎదుగుదల సాధిస్తారు. అప్రమత్తతను కోల్పోకుండా, నిదానమే ప్రధానం అన్న రీతిలో సాగుతూ అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. ప్రేమానుబంధాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతాయి. సౌందర్య పోషణ వ్యాపారాలు కలిసొస్తాయి. లక్కీ కలర్: లేత గులాబి కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) అనిశ్చితిలో ఊగిసలాడతారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రేమ జంటలకు పెళ్లిళ్లయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన తోడు దొరికే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో లౌక్యంగా నెట్టుకురావడం మంచిది. విపరీతమైన పని ఒత్తిడికి దూరంగా కాసింత విరామం తీసుకోవాలని బలంగా కోరుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. లక్కీ కలర్: గోధుమ రంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) భయ సంకోచాలను విడిచిపెట్టి, మరింత ఆచరణాత్మకంగా ముందంజ వేస్తారు. విద్యారంగంలో పెట్టుబడులు పెడతారు. ఇతరుల ప్రభావానికి దూరంగా ఉండటం మంచిది. మిమ్మల్ని పొగిడే వ్యక్తులే మీ గురించి దుష్ర్పచారం సాగించే అవకాశాలు చాలా ఉన్నాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధ్యానంపై దృష్టి సారిస్తారు. లక్కీ కలర్: నాచు రంగు - ఇన్సియా, టారో అనలిస్ట్ -
టారో : 4 సెప్టెంబర్ నుండి 10 సెప్టెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) జీవిత భాగస్వామితో సామరస్యంగా మెలగడం మంచిది. అనవసరమైన ఆందోళనలకు గురవుతారు. వాదోపవాదలలో తలదూర్చకుండా ఉంటేనే క్షేమం. త్వరలోనే ఆశ్చర్యకరమైన శుభవార్త వింటారు. జీవితంలో ఒక మెట్టు పైకి ఎదుగుతారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు, విడిపోయే పరిస్థితులు తప్పకపోవచ్చు. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. లక్కీ కలర్: గోధుమరంగు వృషభం (ఏప్రిల్ 20 - మే 20) సాహసోపేతమైన కార్యక్రమాలను చేపడతారు. కొత్త భాగస్వాములతో కలసి కొత్త వ్యాపారాలకు నాంది పలుకుతారు. నూతన భాగస్వామ్యంతో వ్యాపారాలు లాభాల బాటలో పరుగులు తీస్తాయి. పొదుపు చేయడానికి అనుకూలమైన కాలం. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండటం మంచిది. పార్టీలకు దూరంగా ఉండటం, ఆహారంపై శ్రద్ధ వహించడం క్షేమం. లక్కీ కలర్: ఆకుపచ్చ మిథునం (మే 21 - జూన్ 20) గత కర్మల ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. కోర్టు తీర్పులు, అధికారుల నిర్ణయాలకు అనుకూలంగా వస్తాయి. జీవితంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. విజయపథంలో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే రిస్కు తీసుకోక తప్పదని గ్రహిస్తారు. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. లక్కీ కలర్: పసుపు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) అలుపెరుగకుండా కఠోరంగా పరిశ్రమించినందుకు మిమ్మల్ని మీరే అభినందించుకుంటారు. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవితంలో సమాధానం దొరకని చాలా ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తారు. ధైర్యంగా మీ పనిని మీరు కొనసాగిస్తారు. కొన్ని చిన్న చిన్న విషయాల్లో జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు తలెత్తవచ్చు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: బంగారురంగు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) ఆర్థికంగా అన్ని విధాలా కలిసొచ్చే కాలం ఇది. మీ పురోగతి ఇతరులకు అసూయ కలిగిస్తుంది. ఇదివరకే చేపట్టిన పనులకు సంబంధించిన ఫలితాల కోసం చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో నిరీక్షిస్తారు. తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ చూపాల్సి వస్తుంది. పని ఒత్తిడికి దూరంగా విహారయాత్రలకు వెళతారు. ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. లక్కీ కలర్: ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ఇప్పటి వరకు శ్రమించిన కొనసాగిస్తున్న పని మీద ఆసక్తి కోల్పోతారు. నిర్లిప్తతకు లోనవకుండా, పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవడం మంచిది. ప్రేమానుబంధాల పట్ల ఓపికగా వ్యవహరిస్తూ వస్తున్న మీరు, ఇప్పుడొక స్పష్టతకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితులను ఆచి తూచి అదుపు చేయాల్సి ఉంటుంది. లక్కీ కలర్: నాచు రంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) సృజనాత్మక ఆలోచనలతో ముందంజ వేస్తారు. ఇతరుల పట్ల మీ దృక్పథాన్ని మార్చుకోవడం ద్వారా చిరకాల లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ప్రస్తుత ఒడిదుడుకులన్నీ ఒక దశ మాత్రమే. నెమ్మదిగా పరిస్థితి చక్కబడి, భవిష్యత్తు ఉజ్వలంగా వెలుగొందుతుంది. అలాగని రాత్రికి రాత్రే ధనవంతులైపోతామనే భ్రమలు పెట్టుకోకండి. చేపట్టిన పనులను శ్రద్ధగా పూర్తి చేయండి. ఫలితాలు వాటంతట అవే వస్తాయి. లక్కీ కలర్: నేరేడు రంగు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) అభద్రతాభావంతో ఆందోళన చెంది కుంగిపోతారు. భద్రతగా అనిపించని చోట్ల పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే క్షేమం. వృత్తి, ఉద్యోగాల్లోను, వ్యాపారాల్లోను మార్పులు అనివార్యం అవుతాయి. విద్యార్థులు కొత్త కోర్సులను ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆడుతూ పాడుతూ ఉంటేనే అలసట లేకుండా పనులు పూర్తిచేయగలమని తెలుసుకుంటారు. విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. లక్కీ కలర్: బంగారు రంగు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారు. ఆత్మవిశ్వాసంతో కార్యసాధనలో సఫలీకృతులవుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. బంధువుల కారణంగా అనవసర భారం నెత్తిన పడే అవకాశాలు ఉన్నాయి. వివాదాలను పరిష్కరించుకుంటారు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి. లక్కీ కలర్: ఊదా మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) ఆర్థికపరంగా అద్భుతంగా కలిసొస్తుంది. పని ప్రదేశంలో పునర్నిర్మాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలోని ఒక మహిళ కారణంగా అదృష్టం కలిసొస్తుంది. గతంలోని చేదు అనుభవాలను మరచిపొండి. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. విజయపథంలో దూసుకుపోతారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: పసుపు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) చిరకాల స్వప్నాలు నెరవేరుతాయి. ఆస్తిపాస్తులు, సంపద మీకెన్నడూ సమస్య కానే కాదు. ప్రతి రోజునూ కొత్తగా మొదలుపెడతారు. విందు వినోదాల్లో, వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. చాలాకాలం తర్వాత పాత మిత్రులను కలుసుకుంటారు. పని ఒత్తిడి పెరిగి దాని ప్రభావం ఆరోగ్యం మీద పడే అవకాశాలు లేకపోలేదు. గతానుభవాల నేపథ్యంలో ఆత్మవిమర్శ చేసుకుంటారు. లక్కీ కలర్: నేరేడు రంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) పరస్పర విరుద్ధమైన అంశాలలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. ఇంటా బయటా తీరిక దొరకడం దుర్లభంగా ఉంటుంది. వృత్తిపరమైన నైపుణ్యాలతో అనితరసాధ్యమైన వ్యాపార విజయాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే పోటీలో ముందంజలో ఉంటారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తవచ్చు. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. లక్కీ కలర్: గులాబి - ఇన్సియా, టారో అనలిస్ట్ -
సెప్టెంబర్ నుంచి ఎయిర్కోస్టా సర్వీసుల పెంపు
గన్నవరం: విమాన సంస్థ ఎయిర్కోస్టా సెప్టెంబర్ నుంచి కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి సర్వీసులను పెంచనుంది. ప్రస్తుతం నడుస్తున్న బెంగళూరుకు మరో అదనపు సర్వీస్ తో పాటు విశాఖపట్నం వరకు సర్వీసులను విస్తరించనుంది. సెప్టెంబర్ 11 నుంచి హైదరాబాద్ మీదుగా జైపూర్‌కు కొ త్త సర్వీస్ ప్రారంభించనుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఉదయం సర్వీస్ 7.15కు ఇక్కడ్నుంచి బయలుదేరి 8.15కు బెంగళూరు చేరుకుంటుంది. అక్కడినుంచి వైజాగ్‌కు 10.10 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అదే విమానం సాయంత్రం 18.15కు వైజాగ్‌లో బయలుదేరి 19.50కు బెంగళూరు చేరుకుని, అక్కడినుంచి రాత్రి 21.25కు గన్నవరం చేరుకుంటుంది. రెండవ సర్వీస్ ఉదయం 10.30కు వైజాగ్ నుంచి బయలుదేరి బెంగళూరు మీదుగా 13.35కు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి 15.00కు బయలుదేరి బెంగళూరు మీదుగా సాయంత్రం 17.55కు వైజాగ్‌కు చేరుకుంటుంది. ఉదయం 8.00కు ఇక్కడి నుంచి బయలుదేరి 08.50కు హైదరాబాద్ చేరుకుని కొద్ది విరామం అనంతరం బయలుదేరి 11.15కు జైపూర్‌కు చేరుకుంటుం ది. తిరిగి జైపూర్ నుంచి సాయంత్రం 16.00కు బయలుదేరి హైదరాబాద్ మీదుగా రాత్రి 21.15కు ఇక్కడికి చేరుకుంటుందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. -
వరసిద్ధుడి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ముమ్మరం
కాణిపాకం(ఐరాల): కాణిపాకంలో వెలసిన వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 21 రోజుల పాటూ జరిగే స్వామివారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఏర్పాట్లను ఈఓ పూర్ణచంద్రారావు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన ఆలయం ముందు, ఆలయ పరిసరాల్లో భారీ కటౌట్లు, విద్యుత్ దీపాలంకరణలు, విద్యుత్ కటౌట్లు, ఆర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే స్వామి వారి ప్రతిమలు, స్వాగత బోర్డులు, అలాగే దేవస్థాన పరిధిలోని నిత్యాన్నదాన కేంద్రాలు, వసతి గృహ సముదాయాలు, కల్యాణ కట్ట భవనాల వద్ద వసతులు ఏర్పాటు చేస్తున్నారు. మరగదాంబికా సమేత మణికంఠేశ్వర ఆలయం, వరదరాజ స్వామి ఆలయం, సుపథ మండపం, ఆన్వేటి మండపం, రాజ గోపురం, మూషిక మండపాలకు రంగులు వేస్తున్నారు. -
సెప్టెంబర్ 6 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
-
సెప్టెంబర్ 6 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
సాక్షి, అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాలను సెప్టెంబర్ 6 నుంచి 10వ తేదీ వరకూ నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో ప్రధానంగా జీఎస్టీ బిల్లు ఆమోదంతోపాటు ఇతర అంశాలను చర్చించనున్నారు. విజయవాడలో శనివారం ఏపీ సీఎం చద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. ఇక నుంచి తాను ఈ-గవర్నెన్స్‌కు ప్రాధాన్యతనిస్తానని, పరిపాలనలో ఐఓటీని ఉపయోగిస్తానని, డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటానని సీఎం చెప్పారు. మంత్రులు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని, శాఖలు, సమస్యలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీని దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. -
అసెంబ్లీ మూడు రోజులే!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ మూడోవారంలో జరిగే అవకాశముంది. ఇవి మూడు రోజులపాటు మాత్రమే జరగనున్నట్టు సమాచారం. శాసనసభ సమావేశాలు గత మార్చిలో జరిగాయి. ఆరు నెలల్లోగా సభ తిరిగి సమావేశం కావాల్సి ఉంది. ఆ మేరకు సెప్టెంబర్ 29వ తేదీలోగా సభ తిరిగి సమావేశం కావాల్సి ఉంది. కాగా జీఎస్టీ బిల్లును ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదించడం తెలిసిందే. ఆ బిల్లును మెజారిటీ రాష్ట్రాలు ఆమోదిస్తేనే అమల్లోకి వస్తుంది. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్ని రాష్ట్రాల సీఎంలకు ఈ మేరకు లేఖలు రాశారు. దీంతో ఆ బిల్లు ఆమోదం నిమిత్తం రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరచాల్సి ఉంది. పనిలో పనిగా వర్షాకాల సమావేశాలను కూడా నిర్వహించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. స్పీకర్ కోడెలకు ఉండే వీలును బట్టి తేదీల ఖరారు..: చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్ని ఐదు రోజులపాటు మాత్రమే నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి మూడు రోజులపాటే ఈ సమావేశాలను నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం. శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు సెప్టెంబర్ ఒకటి నుంచి పదో తేదీ వరకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగే కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమావే శాల్లో పాల్గొనే అవకాశముంది. ఆ తరువాత లేదా అంతకుముందుగా కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ వివిధ దేశాల్లో పర్యటించనుంది. ఈ బృందంలో స్పీకర్ కోడెల కూడా ఉంటారని సమాచారం. ఆయన పర్యటననుబట్టి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీల్ని ఖరారు చేస్తారు. -
వచ్చే నెలలో 'అప్పట్లో ఒకడుండేవాడు'
నారా రోహిత్ తాజా చిత్రం 'అప్పట్లో ఒకడుండేవాడు' పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సెప్టెంబరు నెలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. గత సినిమాలు నిరాశ పరచడంతో నారా వారబ్బాయి ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాక్. హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో జరిగే ఈ కథలో రోహిత్ ముస్లిం యువకుడిగా కనిపించనున్నారట. 'అయ్యారే' ఫేమ్ సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రోహిత్ సరసన తానియా హోప్ కథానాయికగా నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. -
శాంసంగ్ గెలాక్సీకి పోటీగా ఎల్జీ ఫోన్
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ గెలాక్సీ నోట్7 కు పోటీగా దక్షిణ కొరియా దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇంక్ సెప్టెంబర్ లో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. గతేడాది అక్టోబర్‌లో మార్కెట్లోకి వచ్చిన వీ10 ఫోన్ల విజయంతో, వీ20 డివైజ్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఎల్జీ వెల్లడించింది. ఈ కొత్త డివైజ్‌లు కంపెనీని నిరాశపరుస్తున్న అమ్మకాల నుంచి బయటపడేస్తాయని.. శాంసంగ్ గెలాక్సీ నోట్7కు పోటీగా నిలబడతాయని ఆశాభావం వ్యక్తంచేస్తోంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో గూగుల్ తాజా వెర్షన్ నోగట్తో రాబోతున్న మొదటి ప్రొడక్ట్ ఇదే కాబోతుందని తెలిపింది. అయితే ఈ వీ20 డివైజ్ ఎలా ఉండబోతుంది..ఏ రేంజ్ మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నారు.. ప్రత్యేకతలు ఏ విధంగా ఉండబోతున్నాయనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఎల్జీకి ప్రత్యర్థులుగా ఉన్న స్మార్ట్‌ఫోన్ రారాజులు శాంసంగ్, యాపిల్లు తమ కొత్త డివైజ్‌లను త్వరలోనే మార్కెట్లోకి ఆవిష్కరించబోతున్నారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తన తర్వాతి గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం మార్కెట్లోకి తీసుకురాబోతుండగా.. యాపిల్ ఇంక్ తన కొత్త ఐఫోన్‌ను సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టనుంది. ఎల్జీ కలిగిఉన్న రెండు ప్రీమియం ఫోన్ సిరీస్‌లు, మార్చిలో లాంచ్ చేసిన జీ5 ఫోన్, ఆశించిన దానికంటే తక్కువ స్థాయిలో అమ్మకాలు నమోదుచేసి కంపెనీని నిరాశపర్చాయి. దీంతో ఈ దక్షిణ కొరియా దిగ్గజం వరుసగా ఐదో త్రైమాసికం ఏప్రిల్-జూన్ కాలంలో కూడా నిర్వహణ నష్టాలనే నమోదుచేసింది. వీ10 డివైజ్ విజయంతో, కొత్త ప్రొడక్ట్ ను మార్కెట్లోకి ఆవిష్కరిస్తామని ఎల్జీ ప్రకటించింది. ఈ కొత్త ప్రొడక్ట్, మూడో త్రైమాసికంలో తమ ప్రదర్శనను మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తంచేస్తోంది. -
న్యూ రీ-డిజైన్డ్ ఐఫోన్ ఎప్పుడొస్తుందో తెలుసా?
లాస్ ఏంజెల్స్ : యాపిల్ నుంచి సెప్టెంబర్‌లో రాబోతున్న రీడిజైన్ కొత్త ఐఫోన్ కోసం వేచిచూస్తున్నారా..? అయితే మీరు మరికొంత కాలం పాటు వేచిచూడాల్సిందే. ఐఫోన్ 10వ వార్షికోత్సవాన్ని యాపిల్ 2017లో జరుపుకోబోతుందంట. ఆ సెలబ్రేషన్స్ లోనే కొత్తగా రీడిజైన్ చేసిన ఫోన్‌ను ప్రవేశపెడతారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సెప్టెంబర్‌లో తీసుకొచ్చే ఫోన్, ఐఫోన్7 కాదంట. చిన్న చిన్న మార్పులతోనే ఐఫోన్ 6ఎస్ఈని మార్కెట్లోకి తీసుకొస్తారని ఓ జర్మన్ వెబ్సైట్ పేర్కొంటోంది. అయితే కంప్లీట్ రీడిజైన్ ప్రొడక్ట్‌ను యాపిల్ తన 10వ వార్షికోత్సవంలోనే ఆవిష్కరిస్తుందని యాపిల్ అనలిస్టు క్రియేటివ్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ టిమ్ బజరిన్ తెలిపారు. అయితే దాన్ని పేరు కూడా ఐఫోన్8గా ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ బిగ్ రీడిజైన్ ఫోన్లో చాలా కొత్త ఫీచర్లుంటాయని, వైర్లెస్ చార్జింగ్, గ్లాస్ బాడీ అరౌండ్ మెటల్ ఫ్రేమ్, కెమెరా ఇంఫ్రూవ్‌మెంట్, ఎక్కువ మెమరీ, అమోలెడ్ 4కే స్క్రీన్లు ఈ బిగ్ రీ-డిజైన్ ప్రొడక్ట్‌లో ఉండబోతున్నాయని చెబుతున్నారు. 2017 రిలీజ్ ఐఫోన్, రెండేళ్ల మేజర్ డిజైన్ అప్ గ్రేడ్స్ కు అంతరాయం కల్గిస్తుందని పేర్కొంటున్నారు. 2014లో ఐఫోన్6తో యాపిల్ లాస్ట్ అప్ గ్రేడ్ చేపట్టింది. ఐఫోన్లలో ఇదే బెస్ట్ సెల్లింగ్ ఐఫోన్ గా నిలిచింది. తర్వాత ఏడాదిన్నరకి అదేమాదిరి డిజైన్‌తో మరో ఐఫోన్ 6ఎస్‌ను లాంచ్ చేసింది. డిజైన్‌లో పెద్దగా మార్పులు లేనప్పటికీ, కొన్ని కొత్త ఫీచర్లను ఈ ఫోన్‌కు యాపిల్ జోడించింది. మరోవైపు యాపిల్ బిగ్ రీ-డిజైన్ 2017కు పోస్ట్ పోన్ అయిందని చైనీస్ తయారీదారులు సూచిస్తున్నట్టు జర్మన్ యాపిల్ న్యూస్ సైట్ పేర్కొంది. అదేవిధంగా ప్రొడక్ట్ అప్ గ్రేడ్ కాలం కూడా ఇక మూడేళ్లు కాబోతుందని నిక్కీ ఆసియన్ రివ్యూ రిపోర్టు పేర్కొంది. సెప్టెంబర్ 16న ఐఫోన్ 6ఎస్ఈ ప్రవేశపెడతారని, దాంతో పాటు కొత్త ఐప్యాడ్, యాపిల్ వాచ్, ఐఓఎస్10ను ఆవిష్కరిస్తుందని తెలుస్తోంది. తర్వాత రాబోతున్న ఐఫోన్లన్నీ యాపిల్ ఏ10 ప్రాసెసర్, 2/4జీ ర్యామ్ వేరియంట్లు, బిగ్గర్ బ్యాటరీస్లతో ఉంటాయట. అలాగే సెప్టెంబర్‌లో వచ్చే ఫోన్ రెండు వేరియంట్లలో కాదంట. మూడు వేరియంట్లలో ఈ ఫోన్ వస్తుందట. -
మాల్యాకు మరో చిక్కు
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు బకాయిపడి, తప్పించుకుని తిరుగుతున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు ఇచ్చిన వ్యక్తిగత హాజరు మినహాయింపును ఢిల్లీ కోర్టు ఎత్తివేసింది. సెప్టెంబర్ 9న కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఫిర్యాదు మేరకు కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. ఫారిన్ ఎక్చ్సేంజ్ రూల్స్ ఉల్లఘించించారనే ఆరోపణల కింద విజయ్ మాల్యా కచ్చితంగా కోర్టులో హాజరుకావాలని పేర్కొంది. మనీ లాండరింగ్ కేసులో మాల్యాను ప్రకటిత నేరస్తుడిగా ప్రత్యేక కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్ కు సంబంధించి రూ.9000కోట్ల రుణాన్ని బ్యాంకులకు ఎగనామం పెట్టి మార్చిలో మాల్యా బ్రిటన్ కు చెక్కేశాడు. అయితే నిన్న ఇంగ్లండ్ లోని సిల్వర్ స్టోన్ లో జరుగుతున్న ఫార్ములా వన్ రేసింగ్ పోటీల్లో ఆయన సహారా ఫోర్స్ వన్ జట్టు సహ భాగస్వామి హోదాలో మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. జీవితం అనేది సాగిపోతుండాలి అనే వేదాంత ధోరణిలో మీడియాతో మాట్లాడారు. భారత ప్రభుత్వం తన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితిపై ఆయన పెదవి విరిచారు. వారంలో 6 రోజులు పనిచేస్తూ కొన్ని కిలోల మేర బరువు తగ్గానని, తానిప్పుడు ఫిట్‌గా ఉన్నానన్నారు. ఫైనాన్సియల్ కేసుల్లో విచారణ నిమిత్తం భారత్ కు తిరిగి రావాలని తామిచ్చే ఆదేశాలపై మాల్యా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరోపిస్తోంది. ఇటీవలే మాల్యాకు సంబంధించిన రూ.1,411 కోట్ల ప్రాపర్టీని ఈడీ అటాచ్ చేసింది. ఏప్రిల్ లో మాల్యా పాస్ పోర్టు కూడా రద్దు అయింది. -
సెప్టెంబర్‌లో కేసీఆర్ సుదర్శన యాగం?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరో యాగం తలపెట్టారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు సెప్టెంబర్ 7న గజ్వేల్‌లో సుదర్శన యాగం చేయాలని సీఎం అనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తెలియజేశారని సమాచారం. ఆ రోజు ఉదయం పూట యాగం నిర్వహించి, మధ్యాహ్నం ‘మిషన్ భగీరథ’ పథకం ద్వారా నియోజకవర్గానికి తాగునీటిని అందించే కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సమాచారం అధికారికంగా తెలియకున్నా.. పార్టీ వర్గాల్లో మాత్రం యాగంపై చర్చ జరుగుతోంది. -
యూఏఈలో మినీ ఐపీఎల్!
ముంబై: విదేశాల్లో మినీ ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. యూఏఈ లేదా ఉత్తర అమెరికాలో ఏదో ఓచోట ఈ లీగ్‌ను నిర్వహిస్తారని వార్తలు వస్తున్నా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే యూఏఈ సమయం భారత్‌కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడే జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ ప్రారంభంలో ఈ లీగ్‌ను జరపాలని భావిస్తున్నారు. అప్పటికి భారత జట్టు విండీస్ టూర్ ముగుస్తుంది. క్రికెట్ సలహా కమిటీ విస్తరణ విస్తరణలో భాగంగా గంగూలీ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ త్వరలో హై పెర్ఫార్మెన్స్ కమిటీ (హెచ్పీసీ)గా మారే అవకాశాలున్నాయి. సెప్టెం బర్లో జరిగే బోర్డు వార్షిక సమావేశంలో ఈ విషయమై చర్చించనున్నారు. హెచ్‌పీసీలో క్రికెట్ సలహా కమిటీయే కాకుండా సాంకేతిక కమిటీని కూడా విలీనం చేయనున్నారు. దీంట్లో ఆరుగురు సభ్యుల వరకు ఉంటారు. -
ఐఫోన్ 7తోనే యాపిల్ వాచ్2 ఎంట్రీ
ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్రాండ్ గా నిలిచిన యాపిల్ తన కొత్త ఐఫోన్ 7తో పాటే, యాపిల్ వాచ్2ను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోందట. సెప్టెంబర్ లో ఆవిష్కరించబోతున్న ఐఫోన్ 7తో పాటే దీన్ని తీసుకురాబోతుందని సమాచారం. మూడో త్రైమాసికం లోపల ఈ వాచ్ ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇరవై లక్షల యూనిట్లకు పెంచి, వాటి సరుకు రవాణా పెంచనుందని తెలుస్తోంది. రెండోతరం యాపిల్ వాచ్ ల చిప్స్, కాంపొనెంట్లను కూడా మూడో త్రైమాసికంలో ప్రారంభించాలనుకుంటోందని వెల్లడించాయి. ఇకముందు రాబోతున్న యాపిల్ వాచ్ లకు అంచనావేసిన దానికంటే ఎక్కువ డిమాండే ఉండబోతుందని.. అందుకే డిమాండ్ కు అనుగుణంగా వాటిని అందించాలని యాపిల్ భావిస్తోందట. అయితే ఇటీవల జరిగిన శాన్ ఫ్రాన్సిస్కో వార్షిక డెవలపర్ల సదస్సు డబ్ల్యూడబ్ల్యూసీలోనే ఈ వాచ్ ను ఆవిష్కరిస్తారని ముందస్తు రిపోర్ట్ లు పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ యాపిల్ వాచ్ 2ను ఈ సదస్సులో యాపిల్ తీసుకురాలేదు. ఐఫోన్ 7తో పాటే యాపిల్ వాచ్ 2ను తీసుకొచ్చేందుకే ఈ ఈవెంట్ లో దీన్ని ఆవిష్కరించలేదని రిపోర్టులు పేర్కొన్నాయి. ముందస్తు వాచ్ లకంటే యాపిల్ వాచ్ 2 డిజైల్ లో ఎలాంటి మార్పు లేదని, కానీ వాటికంటే 20 నుంచి 40శాతం పలుచగా ఉండబోతున్నాయని రిపోర్టులు నివేదించాయి. బ్యాటరీ సామర్థ్యాన్ని యాపిల్ పెంచిదని తెలిపాయి. సెల్యులార్ కనెక్టివిటీని ఈ వాచ్ సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. -
సెప్టెంబర్‌లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
నెల్లూరు : ప్రత్యేక హోదా అంశం ఇంకా కేంద్ర పరిశీలనలో ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నెల్లూరులో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.... ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పరిశ్రమలకు రాయతీ తదితర అంశాలపై నీతి ఆయోగ్ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తేదీలను వెల్లడిస్తామన్నారు. -
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు
-
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ మొదటి వారంలో 5 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. సచివాలయంలో సోమవారం సీఎం కేసీఆర్‌ను కలసిన ఉన్నతాధికారులు, మంత్రులతో ఈ మేరకు పేర్కొన్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడవగానే ప్రతీ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, ఆ పార్టీల నేతలకు ఏ మాత్రం ఓపిక లేకుండా అయిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రాణహిత-చేవెళ్లపై ప్రభుత్వం ఏం చెప్పినా వినిపించుకోకుండా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నట్లు సమాచారం. విపక్షాలకు ఘాటైన సమాధానం ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రజలకూ దీనిపై స్పష్టత ఇచ్చేందుకు తానే అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా వివరణ ఇస్తానని కేసీఆర్ పేర్కొన్నారని తెలిసింది. -
సెప్టెంబర్‌లో ‘పుర’ఎన్నికలు!
- ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సలహా హైదరాబాద్: జీహెచ్ఎంసీ తరహాలోనే రాష్ట్రంలో మరో 11 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న అంశంపై ‘పురం..పాలన శూన్యం’ శీర్షికతో సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ బి.నాగిరెడ్డి స్పందించారు. ఈ మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై ఆయన పురపాలక శాఖ నుంచి నివేదిక కోరారు. దీంతో రాష్ట్ర పురపాలక శాఖ డెరైక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌కు స్టేటస్ రిపోర్టును అందజేశారు. ఈ సందర్భంగా మరో 3 నెలల్లో ఎన్నికలకు సంబంధించిన కసరత్తు పూర్తిచేసి సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని ఎన్నికల కమిషనర్ పురపాలక శాఖకు సలహా ఇచ్చినట్లు సమాచారం. -
టోకు ధరలు ఐదేళ్ల కనిష్టం
సెప్టెంబర్‌లో 2.38 శాతం ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గిన ఫలితం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 2.38 శాతానికి పడిపోయింది. అంటే 2013 సెప్టెంబర్‌తో పోల్చితే పలు ఉత్పత్తుల టోకు ధరల మొత్తం 2014 సెప్టెంబర్‌లో కేవలం 2.38 శాతమే పెరిగాయన్నమాట. ఇంతే స్థాయిలో ధరలు పెరుగుదల రేటు నమోదు కావడం ఐదేళ్లలో ఇదే మొదటిసారి. టోకున ఆహార ఉత్పత్తులు ధరల స్పీడ్ తగ్గడం మొత్తం సూచీపై సానుకూల ప్రభావం చూపిందని గణాంకాలు పేర్కొన్నాయి. నాలుగు నెలల నుంచీ డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. ఆగస్టు నెలలో ఈ రేటు 3.74 శాతం. 2013 సెప్టెంబర్‌లో ఈ స్పీడ్ 7.05 శాతం. మంగళవారం నాడు విడుదల చేసిన సెప్టెంబర్ డబ్ల్యూపీఐ గణాంకాల ముఖ్యాంశాలు... విభాగాల వారీగా... మొత్తం డబ్ల్యూపీఐలో 14 శాతం వాటా ఉన్న ఆహార ఉత్పత్తుల ధరల విభాగంలో ద్రవ్యోల్బణం సెప్టెం బర్లో 33 నెలల కనిష్ట స్థాయిలో 3.52 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో ఈ రేటు 5.15 శాతం. 2013 ఆగస్టులో ఉన్న ధరతో పోల్చి 2014 ఆగస్టులో ఉల్లిపాయల ధరలు 44.7 శాతం తగ్గితే(వార్షిక ప్రాతిపదికన), 2014లో సెప్టెంబర్‌లో ఈ కమోడిటీ ధర ఏకంగా 58.12 శాతం తగ్గింది. కూరగాయల ధరలు 14.98 శాతం తగ్గాయి. అయితే ఆలూ ధర మాత్రం ఆగస్టులో 61.61 శాతం పెరిగితే, సెప్టెంబర్‌లో 90.23 శాతం ఎగసింది. గుడ్లు, మాంసం, చేపల ధరలు ఆగస్టులో 5.87 శాతం పెరిగితే సెప్టెంబర్‌లో ఈ పెరుగుదల రేటు 4.12 శాతమే ఉంది.మొత్తం సూచీలో దాదాపు 66 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో ఆగస్టుతో పోల్చితే 3.45% నుంచి 2.84 శాతానికి దిగివచ్చింది. రేట్ల కోతకు అవకాశం: పరిశ్రమలు రిటైల్, టోకు ధరలు దిగిరావడంతో ఆర్బీఐ పాలసీ వడ్డీరేట్లు తగ్గించడానికి ఇది సరైన అవకాశమని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వ చర్యలు ఫలించినట్లు ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు. -
రెండ్రోజులు ముందుగానే జీతాలు
దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో టీ సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 4 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సెప్టెంబర్ నెల వేతనాలు ఈ నెల 28వ తేదీనే అందనున్నాయి. అక్టోబర్ 2న బతుకమ్మ, 3వ తేదీన దసరా పండుగలను పురస్కరించుకుని ముందుగానే జీతాలు చెల్లించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా 28న వేతనాలు చెల్లించేందుకు ఆర్థికశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే 28వ తేదీ ఆదివారం కావడం గమనార్హం. ఆర్థికశాఖ దీన్ని గుర్తించక 28వ తేదీని ఖరారు చేసినట్లు కనబడుతోంది. 28వ తేదీ ఆదివారం వచ్చిన నేపథ్యంలో మరో రోజు ముందుకు జరిపి 27న జీతాలు చెల్లించే అవకాశాలున్నాయి. -
డేవిస్‌కప్ కమిట్మెంట్ అవార్డు విజేత?
ప్రాక్టీస్ బిట్స్ 1. యునెటైడ్ కింగ్‌డమ్‌లోని ఏ ప్రాంతం సెప్టెంబర్ 18న స్వాతంత్య్రం కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనుంది? ఎ) వేల్స్ బి) ఉత్తర ఐర్లాండ్ సి) స్కాట్లాండ్ డి) ఇంగ్లండ్ 2. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని-1 క్షిపణిని 2014, సెప్టెంబర్ 11న పరీక్షించారు. దీని పరిధి ఎంత? ఎ) 350 కిలోమీటర్లు బి) 700 కిలోమీటర్లు సి) 500 కిలోమీటర్లు డి) 1500 కిలోమీటర్లు 3. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డేవిస్ కప్ కమిట్మెంట్ అవార్డును ఏ భారతీయ టెన్నిస్ క్రీడాకారుడికి అందజేసింది? ఎ) యూకీ బాంబ్రీ బి) సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ సి) రోహన్ బోపన్న డి) మహేశ్ భూపతి 4. బ్లూమ్‌బర్గ్ మార్కెట్స్ మ్యాగజైన్ రూపొందించిన 50 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మహిళ? ఎ) నైనాలాల్ కిద్వాయ్ బి) చందా కొచ్చర్ సి) శిఖా వర్మ డి) అరుంధతీ భట్టాచార్య 5. 2014 సెప్టెంబర్‌లో అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో కొత్తగా నిర్మించిన భారత రాయబార కార్యాలయాన్ని ఎవరు ప్రారంభించారు? ఎ) అరుణ్‌జైట్లీ బి) సుష్మాస్వరాజ్ సి) హమీద్ అన్సారీ డి) నరేంద్ర మోడీ 6. ఇటీవల జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తొలి ఆసియా దేశం ఏది? ఎ) చైనా బి) ఇండోనేషియా సి) మలేషియా డి) జపాన్ 7. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో వెబ్సైట్ ‘క్రికెటర్ ఆఫ్ ది జనరేషన్’ అవార్డును ఎవరికి ప్రదానం చేసింది? ఎ) బ్రయాన్ లారా బి) షేన్ వార్న్ సి) జాక్వస్ కల్లిస్ డి) సచిన్ టెండూల్కర్ 8. మహిళల భద్రతకు ఉపయోగపడే రక్ష అనే మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించిన రాజకీయ పార్టీ ఏది? ఎ) కాంగ్రెస్ బి) భారతీయ జనతా పార్టీ సి) ఆమ్ ఆద్మీ పార్టీ డి) తృణమూల్ కాంగ్రెస్ 9. నూరుశాతం ఈ-అక్షరాస్యతను సాధించిన తొలి గ్రామ పంచాయతీగా ఘనత సాధించిన పల్లిచల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఎ) తమిళనాడు బి) కర్ణాటక సి) కేరళ డి) పశ్చిమెంగాల్ 10. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఎ) సెప్టెంబర్ 5 బి) సెప్టెంబర్ 6 సి) సెప్టెంబర్ 9 డి) సెప్టెంబర్ 8 11. ఫార్చూన్ మ్యాగజైన్ 350 గ్లోబల్ కంపెనీలతో రూపొందించిన ప్రపంచ అత్యంత ప్రశంసనీయ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన కంపెనీ? ఎ) యాపిల్ బి) అమెజాన్ సి) గూగుల్ డి) బెర్క్‌షైర్ హతవే 12. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిబంధనల ప్రకారం సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు కంపెనీలు మూడేళ్ల సగటు వార్షిక లాభాల ఆధారంగా ఆర్థిక సంవత్సరం లాభాల్లో కనీసం ఎంత శాతాన్ని ఖర్చు చేయాలి? ఎ) 1 శాతం బి) 2 శాతం సి) 3 శాతం డి) 4 శాతం 13. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014కు రాష్ట్రపతి ఎప్పుడు ఆమోద ముద్ర వేశారు? ఎ) మార్చి 1 బి) మార్చి 3 సి) మార్చి 5 డి) మార్చి 2 14. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గ్రేమ్ స్మిత్ ఏ దేశానికి 108 టెస్ట్‌ల్లో నాయకత్వం వహించాడు? ఎ) వెస్టిండీస్ బి) న్యూజిలాండ్ సి) ఇంగ్లండ్ డి) దక్షిణాఫ్రికా 15. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచ బిలియనీర్ల జాబితా-2014లో ముకేశ్ అంబానీ స్థానం? ఎ) 32 బి) 35 సి) 40 డి) 22 16. 16వ లోక్‌సభకు ఎన్నికలు ఎన్ని దశల్లో జరిగాయి? ఎ) 7 బి) 8 సి) 9 డి) 10 17. భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఏ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రచారకర్తగా ఎంపికయ్యారు? ఎ) మహారాష్ట్ర బి) గుజరాత్ సి) హర్యానా డి) ఉత్తరాఖండ్ 18. దేశంలోని మొదటి మైనారిటీ సైబర్ గ్రామాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఎ) రాజస్థాన్ బి) ఉత్తరప్రదేశ్ సి) మహారాష్ట్ర డి) పశ్చిమబెంగాల్ 19. ‘‘అంబేద్కర్: అవేకనింగ్ ఇండియాస్ సోషల్ కాన్షన్స్’’ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఎ) విజయ్ దర్దా బి) నరేంద్ర జాదవ్ సి) అరుంధతీ రాయ్ డి) వి.కె.మల్హోత్రా 20. ఆర్సెనీయ్ యాట్సెన్యుక్ ఏ దేశానికి ప్రధాని? ఎ) రష్యా బి) కజక్‌స్థాన్ సి) ఉక్రెయిన్ డి) బెలారస్ 21. బోర్ వైల్డ్‌లైఫ్ శ్యాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఎ) మహారాష్ట్ర బి) అస్సాం సి) కర్ణాటక డి) త్రిపుర 22. మైనారిటీల కోసం సమాన అవకాశాల కమిషన్ ఏర్పాటు చేయాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఎ) జస్టిస్ సచార్ కమిటీ బి) జస్టిస్ రంగనాథ్‌మిశ్రా కమిటీ సి) జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ డి) జస్టిస్ ముద్గల్ కమిటీ 23. కామరాజర్ పోర్ట్ అని ఏ నౌకా కేంద్రాన్ని పిలుస్తారు? ఎ) ట్యుటికోరన్ బి) ఎన్నోర్ సి) కొచ్చిన్ డి) మంగళూరు 24. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) డెరైక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు? ఎ) పీటర్ స్కాట్ బి) జూలియన్ హక్స్లీ సి) మార్కో లాంబర్టిని డి) మ్యాక్స్ నికోల్సన్ 25. ‘బిగ్ యాపిల్’ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఎ) వార్సా బి) మాడ్రిడ్ సి) బార్సిలోనా డి) న్యూయార్క్ 26. ఈ-మెయిల్‌ను ఎవరు కనుగొన్నారు? ఎ) సబీర్ భాటియా బి) బిల్‌గేట్స్ సి) రే టామ్లిన్సన్ డి) లారీ పేజ్ 27. మానవ శరీరంలోని ఎముకల సంఖ్య? ఎ) 212 బి) 206 సి) 222 డి) 215 28. విటమిన్ బి లోపం వల్ల ఏ వ్యాధి సంక్రమిస్తుంది? ఎ) రికెట్స్ బి) రేచీకటి సి) బెరిబెరి డి) ఆస్టియో మలేసియాత 29. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)ను ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? ఎ) 1975 బి) 1980 సి) 1985 డి) 1982 30. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరి స్థానంలో నియమితులయ్యారు? ఎ) బిల్‌గేట్స్ బి) స్టీవ్ బామర్ సి) స్టీవ్ జాబ్స్ డి) పాల్ అలెన్ 31. ఫిబ్రవరి 4ను ఏ దినంగా పాటిస్తారు? ఎ) ప్రపంచ క్షయ దినం బి) ప్రపంచ ఎయిడ్స్ దినం సి) ప్రపంచ కేన్సర్ దినం డి) ప్రపంచ మలేరియా దినం 32. 2014 ఆస్కార్ అవార్డుల్లో పది విభాగాల్లో నామినేషన్ పొందిన ఏ చిత్రానికి ఒక్క అవార్డూ రాలేదు? ఎ) గ్రావిటీ బి) అమెరికన్ హజిల్ సి) ఫాస్ట్ అండ్ ప్యూరియస్ డి) హీలియం 33. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా-2014లో అగ్రస్థానంలో ఉన్నది? ఎ) బిల్ గేట్స్ బి) కార్లోస్ సిమ్ సి) అమాన్సియా ఒర్టేగా డి) వారెన్ బఫెట్ 34. ఏ ప్రముఖ క్రికెటర్ విగ్రహాన్ని ఆంటిగ్వా రాజధాని సెయింట్ జాన్స్‌లో ఆవిష్కరించారు? ఎ) బ్రయాన్ లారా బి) సర్ గార్ఫీల్డ్ సోబర్స్ సి) క్లైవ్ లాయిడ్ డి) సర్ వివియన్ రిచర్డ్స్ 35. 2014 దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ను ఎవరు గెలుచుకున్నారు? ఎ) రోజర్ ఫెదరర్ బి) థామస్ బెర్టిచ్ సి) రఫెల్ నాదల్ డి) కీ నిషికోరి సమాధానాలు: 1) సి; 2) బి; 3) సి; 4) డి; 5) బి; 6) ఎ; 7) డి; 8) బి; 9) సి; 10) డి; 11) ఎ; 12) బి; 13) ఎ; 14) డి; 15) సి; 16) సి; 17) బి; 18) ఎ; 19) బి; 20) సి; 21) ఎ; 22) ఎ; 23) బి; 24) సి; 25) డి; 26) సి; 27) బి; 28) సి; 29) డి; 30) బి; 31) సి; 32) బి; 33) ఎ; 34) డి; 35) ఎ. -
రైళ్ల వేళల్లో మార్పులు
విశాఖపట్నం : రైళ్ల రాకపోకల వేళలు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మారబోతున్నాయి. ఇప్పటికే దురంతో ఎక్స్‌ప్రెస్‌తో బాటు పలు రైళ్ల రాకపోకలు మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరిన్ని రైళ్ల వేళలు మారినట్టు తూర్పుకోస్తా రైల్వే ప్రకటించింది. హౌరా/ హైదరాబాద్(ఈస్టుకోస్టు) ఎక్స్‌ప్రెస్ తెల్లవారుజామున 3.55 గంటలకు చేరుకుని 4.15 గంటలకు బయల్దేరుతుంది. మచిలీపట్నం/నరసాపురం నుంచి విశాఖకు వచ్చే ప్యాసింజర్ ఉదయం 8 గంటలకు చేరుతుంది. సాంత్రగచ్చి నుంచి ఛెన్నై సెంట్రల్ల్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ బుధ, శనివారాల్లో ఉదయం 8.10గంటలకు వచ్చి 8.30 గంటలకు బయలుదేరుతుంది. విజయవాడ-రాయగడ పాసింజర్ ఉదయం 8.20 గంటలకు వచ్చి 8.40 గంటలకు బయలుదేరుతుంది. హటియా-యశ్వంత్‌పూర్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ సోమ, బుధవారాల్లో, అసన్సోల్-చెన్నై ఎక్స్‌ప్రెస్ గురువారం, టాటానగర్-యశ్వంత్‌పూర్ వీక్లీఎక్స్ ప్రెస్ శనివారం, హటియా-యశ్వంత్‌పూర్ వీక్లీఎక్స్‌ప్రెస్ ఆదివారం నడిచే రైళ్లు ఉదయం 9.40 గంటలకు వచ్చి 10 గంటలకు బయలుదేరుతాయి. దన్బాద్/టాటానగర్ - అలెప్పిబొకారో ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.55 గంటలకు చేరుకొని 10.15 గంటలకు బయలుదేరుతుంది. నాందేడ్ / సంబల్పూర్ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ మంగ,బుధ,ఆదివారాల్లో 10.15 గంటలకు చేరుకొని 10.35 గంటలకు వెళుతుంది. సంబల్పూర్/నాందేడ్ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ సోమ,శుక్ర,ఆదివారాల్లో విశాఖకు రాత్రి 7.05 గంటలకు చేరుకొని 7.25 గంటలకు బయలుదేరుతుంది. విశాఖ-మచిలీపట్నం/నర్సాపూర్ పాసింజర్ రాత్రి 7.45 గంటలకు బయలుదేరుతుంది. మూడు కొత్త రైళ్లకు చోటు.... విశాఖ, విజయనగరం మీదుగా మరో మూడు కొత్త రైళ్లు పరుగులు తీయనున్నాయి. కొత్త రైళ్ల వేళలను కొత్త రైల్వే టైంటేబుల్లో పొందుపరిచింది. హౌరా- యశ్వంత్‌పూర్-హౌరా (22863/64), గాంధీధమ్-పూరి-గాంధీధమ్ (19453/54) రైళ్లు విజయనగరం మీదుగా ప్రయాణిస్తున్నాయి. విశాఖ మీదుగా టాటానగర్-బయ్యపానహలి(బెంగుళూర్)-టాటానగర్ (18111/12) ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది. టాటా నగర్-బయ్యపానహలి(బెంగుళూర్) ఎక్స్‌ప్రెస్ ప్రతీగురువారం టాటానగర్‌లో సాయంత్రం 6.35 గంటలకు బయలుదేరి శుక్రవారంఉదయం 9.40 గంటలకు విశాఖ చేరుకొని, తిరిగి 10 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటలకు చేరుకుంటుంది. బయ్యపానహలి (బెంగుళూర్)-టాటానగర్ ఎక్స్‌ప్రెస్ ప్రతీ ఆదివారం ఉదయం 9.15 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 7.55 గంటలకు విశాఖ చేరుకొని తిరిగి 8.15 గంటలకుబయలుదేరి సోమవారం మధ్యాహ్నం 12.35 గంటలకు టాటా చేరుతుంది. -
ఆధార్ నంబర్లు ఇస్తేనే రేషన్
చిత్తూరు (సెంట్రల్): జిల్లాలోని తెల్లరేషన్ కార్డు కలిగిన ల బ్ధిదారులు వారి కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధా నం చేస్తేనే సెప్టెంబర్ నెల నుంచి నిత్యావసర సరుకుల స రఫరా జరుగుతుందని, లేదంటే కట్ చేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి విజయరాణి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశమందిరంలో జిల్లాలోని సీఎస్ డీటీలు, గ్యా స్ డీలర్లతో గురువారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల న్నింటినీ ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని, ఈ నేపథ్యంలో ప్రజాపంపిణీ విధానంలో చౌకదుకాణాల ద్వారా పంపిణీ అవుతున్న నిత్యావసర సరుకులను పకడ్బందీగా పేదలకు అం దజేసేందుకు ఆధార్‌కార్డు అనుసంధానం తప్పని సరన్నా రు. జిల్లాలో ఇప్పటికే 90 శాతానికి పైగా రేషన్ కార్డుదారులు వారి కార్డులను ఆధార్‌తో అనుసంధానం పూర్తి చే శారన్నారు. మిగిలిన కార్డుదారులు కూడా ఈనెల 31వ తే దీ లోపు ఆధార్‌కార్డులతో రేషన్ కార్డులను అనుసంధానం పూర్తి చేయాల్సిన బాధ్యత సీఎస్ డీటీలదేనన్నారు. అలాగే గ్యాస్ వినియోగదారులు వారి గ్యాస్ సర్వీసు నెంబర్లతో ఆధార్‌కార్డులను అనుసంధానం చేయించుకోవాల్సిన అవసరముందని ఆమె తెలిపారు. డీలర్లు, సీఎస్డీటీలు సం యుక్తంగా ఆధార్ అనుసంధానం పూర్తి చేయించాలన్నా రు. ప్రధానంగా దీపం పథకం ద్వారా సిలిండర్ పొందిన గ్యాస్ వినియోగదారులు వారి కనెక్షన్లను ఆధార్‌తో అ నుంధానం చేయించుకుంటేనే గ్యాస్ సరఫరా చేస్తామన్నా రు. లేదంటే గ్యాస్ రాయితీ నిలిపి వేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో గ్యాస్‌డీలర్లు , ఏఎస్వో, సివిల్ సప్లరుుస్ ఉప తహశీల్దార్లు పాల్గొన్నారు. -
ఘట్కేసర్-పెద్ద అంబర్‌పేట ‘ఔటర్’ రెడీ
సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం వరంగల్- విజయవాడ హైవేలకు అనుసంధానం ప్రధాన రోడ్డుకు మెరుగులద్దుతున్న హెచ్ఎండీఏ సాక్షి, సిటీబ్యూరో: ఘట్కేసర్- పెద్ద అంబర్‌పేట మార్గంలోని 14 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్ కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ మార్గాన్ని అధికారికంగా ప్రారంభించి వాహనాల రాకపోకలను అనుమతించేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం తారామతిపేట, ఘట్కేసర్ జంక్షన్లలో విద్యుత్ లైటింగ్, సైనేజ్ బోర్డుల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధాన రహదారిపైకి జంతువులు రాకుండా రోడ్డు అంచుల్లో చెయిన్ లింక్ మెష్‌ను బిగిస్తున్నారు. పనుల్ని ఈ నెలాఖరులోగా పూర్తిచేసిన తరువాతే ముఖ్యమంత్రిని కలిసి ప్రారంభ తేదీని ఖరారు చేయాలని భావిస్తున్నారు. అయితే, ఘట్కేసర్- పెద్ద అంబర్‌పేట మార్గంలో సర్వీసుల రోడ్లు, ఇతర నిర్మాణాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వీటి పూర్తికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున నిర్మాణం పూర్తి చేసుకున్న 14 కి.మీ. మేర ప్రధాన రహదారిని వినియోగంలోకి తీసుకురావాలని కమిషనర్ నిర్ణయించారు. గత మార్చిలోనే ఈ మార్గంలో వాహనాల రాకపోకలను అనుమతించాలని భావించారు. పలుచోట్ల చిన్నచిన్న పనులు మిగిలిపోవడంతో పాటు సాధారణ ఎన్నికలు రావడంతో ప్రారంభాన్ని వాయిదా వేశారు. ప్రధాన హైవేలకు అనుసంధానం 14 కి.మీ. మేర ఔటర్ రింగ్‌రోడ్డు అందుబాటులోకి వస్తుండటంతో ప్రధానంగా వరంగల్ హైవేకు విజయవాడ జాతీయ రహదారితో అనుసంధానం ఏర్పడుతుంది. ఘట్కేసర్ జం క్షన్ వద్ద ఔటర్ పైకి ఎక్కిన వాహనం నేరుగా పెద్ద అంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారిని చేరుకోవచ్చు. ముఖ్యంగా వరంగల్- విజయవాడ, వరంగల్- బెంగళూరు, వరంగల్- ముంబై ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ఈ మార్గం ఎంతో ప్రయోజనకరం. ప్రస్తుతం వరంగల్ నుం చి వచ్చే సరుకు రవాణా వాహనాలు ఉప్పల్ మీదుగా నాగో లు, ఎల్బీనగర్ నుంచి వనస్థలిపురం, హయత్‌నగర్ గుండా పెద్ద అంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-9)ని చేరుకుంటున్నాయి. ఇప్పుడు ఔటర్ అందుబాటులోకి రావడంతో ఇక పై నగరంలోకి రాకుండా ఊరు బయ ట నుంచే ఆయా ప్రధాన రహదారులకు చేరుకుంటాయి. ప్రస్తుతం ఘట్కేసర్- పెద్ద అంబర్‌పేట మార్గం అందుబాటులోకి వస్తుండటంతో మొత్తం 158 కి.మీ ఔటర్ రింగ్ రోడ్డుకు గాను 21.4 కి.మీ.లు తప్ప ఔటర్ అంతా వినియోగంలోకి వచ్చినట్లవుతుంది. ఇంకా కండ్లకోయ జంక్షన్ వద్ద 1.1 కి.మీ. శామీర్‌పేట- కీసర (10.3కి.మీ), కీసర-ఘట్కేసర్ (10కి.మీ) రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. ఘట్కేసర్ వద్ద జరుగుతున్న ఆర్వోబీ పనులను కూడా వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఘట్కేసర్- పెద్దఅంబర్‌పేట వరకు నిర్మించాల్సిన సర్వీసురోడ్లను కూడా 2015 జనవరి నాటికి పూర్తిచేయాలని నిర్దేశించారు. నిలిచిపోయిన శామీర్‌పేట-కీసర మార్గానికి రూ.190 కోట్ల వ్యయ అంచనాతో ఇటీవలే టెండర్లు పిలిచారు. ఈ పనులను వచ్చే 15 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే, ప్రధాన మార్గాన్ని (మెయిన్ క్యారేజ్) మాత్రం వచ్చే 7 నెలల్లోనే పూర్తి చేయాలన్నది లక్ష్యమని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. -
చిగురంత ఆశ
రాయవరం : రెండేళ్లుగా ఊరిస్తున్న డీఎస్సీ సెప్టెంబర్ ఐదున జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. టెట్‌లో క్వాలిఫై అయినవారికి మాత్రమే డీఎస్సీలో అవకాశం కల్పిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. డీఎడ్, బీఎడ్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న నూతన బ్యాచ్ విద్యార్థులు డీఎస్సీకి అవకాశం కల్పించాలని ఆందోళన బాటపట్టారు. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. జిల్లాలో సుమారు 1,800 మంది డీఎడ్ చేస్తున్న వారు ఉండగా సుమారుగా 4,200 మంది బీఎడ్ శిక్షణ పూర్తి చేసుకుని పోటీ ప్రపంచంలో అడుగిడబోతున్నారు. గత మార్చి 16న జరిగిన టెట్‌లో 19,921 మంది బీఎడ్ పూర్తి చేసినవారు పాల్గొనగా డీఎడ్ పూర్తి చేసినవారు 2,234 మంది పాల్గొన్నారు. ఎస్జీటీ పోస్టుల్లో బీఎడ్‌కు అవకాశం ఉంటుందా?... డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటనతో బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీఎడ్ విద్యార్థులకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని టీడీపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. డీఎస్సీ 2014 నోటిఫికేషన్లోఎస్జీటీ పోస్టుల భర్తీలో తమకు అవకాశం కల్పిస్తారని బీఎడ్ అభ్యర్థులు ఆశిస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక విద్య బోధించేందుకు కనీసం రెండేళ్లు కాలపరిమితి ఉన్న ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన వారే అర్హులనే నిబంధన ఉండడంతో సెకండరీ గ్రేడ్ పోస్టుల భర్తీలో బీఎడ్ విద్యార్థులకు ఎలా అవకాశం కల్పిస్తారని డీఎడ్ అభ్యర్థ్ధులు ప్రశ్నిస్తున్నారు. ఎస్జీటీ పోస్టులను డీఎడ్ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. ఆ తీర్పును పునః సమీక్షించాలంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) నియమ నిబంధనలను మార్చాల్సి ఉంటుందని బీఎడ్ అధ్యాపకుడు బొడ్డపాటి సురేష్‌కుమార్ తెలిపారు. ఆమేరకు చర్యలు చేపడితేనే బీఎడ్ చేసినవారికి ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకొనే అవకాశం లభిస్తుంది. పెరిగిన ఖాళీల భర్తీ ఉంటుందా ? జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు నోటిఫికేషన్ సమయానికి ఏర్పడిన ఖాళీలను కూడా భర్తీ చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది 184 ప్రాథమికోన్నత పాఠశాలలను ఇంటిగ్రేటెడ్ పాఠశాలలుగా మార్చి ఎనిమిదో తరగతిని నూతనంగా ప్రవేశపెట్టారు. ఆయా పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఖాళీలు 1,211 ఈ ఏడాది మే నెలాఖరు నాటికి జిల్లాలో 1,211 పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా సమాచారం. 190 స్కూల్ అసిస్టెంట్లు, 884 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 118 భాషా పండితులు, 19 వ్యాయాయ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిసింది. -
రంగుల్లో ‘పింఛన్లు’
సెప్టెంబర్‌లో పెన్షన్లన్నీ రద్దు.. కొత్తగా అక్టోబర్‌లో మంజూరు సాక్షి, హైదరాబాద్: అర్హులకు మాత్రమే సామాజిక పింఛన్లు అందేలా చూడాలన్న లక్ష్యంతో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అన్ని రకాల సామాజిక భద్రతా పింఛన్లను సెప్టెం బర్లో రద్దు చేయాలని నిర్ణయించింది. వృద్ధాప్య, వితంతు, చేనేత, గీత కార్మికులు, అంగవైకల్యం కేటగిరీల కింద మొత్తం 30.87 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. అయితే ఇందులో ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురికిపైగా పెన్షన్లు పొందుతున్నట్లు సర్వే ల్లో వెల్లడికావడంతో వీటన్నింటినీ రద్దు చేసి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల పథకాన్ని పూర్తి పారదర్శకంగా అమలు చేయడం కోసం వారం పది రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నూతన రాష్ట్రంలో తీసుకొస్తున్న ఈ పథకానికి కొత్త పేరు పెట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ పథకం పేరును ఎంపిక చేయనున్నట్లు సమాచారం. పారదర్శకంగా ఎంపిక... పింఛన్లు పొందడానికి అర్హులైనవారిని ఎంపిక చేసే సమయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. లబ్ధిదారులను ఎంపిక చేసేటప్పుడు ముగ్గురు అధికారులు తనిఖీ చేస్తారని, అయినా బోగస్ పెన్షన్లు వస్తే.. ఆ ముగ్గురు అధికారులను బాధ్యులను చేసి, వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం మార్గదర్శకాల్లోనే స్పష్టం చేయనుంది. కొత్త పెన్షన్ కార్డులను అక్టోబర్‌లో మంజూరు చేస్తారు. పెన్షన్ల కోసం ఎంపికైన లబ్ధిదారుల పేర్లను గ్రామసభల్లో చదివి వినిపిస్తారని, అనంతరం ఆయా గ్రామ సర్పంచ్ల చేతుల మీదుగా కొత్త కార్డులను పించనుదారులకు ఇప్పిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే వృద్ధాప్య పింఛనుదారుల వయసు నిర్ధారణకు డాక్టర్లు ఇచ్చే సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోబోరని, వారి ఓటరు గుర్తింపు కార్డు, రేషన్‌కార్డుల్లో ఉన్న వయసును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారని వెల్లడించాయి. కాగా, కొత్తగా ఇచ్చే పెన్షన్లను వారం రోజులపాటు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం పింఛనుదారులకు ఏడు వేర్వేరు రంగుల్లో ఉండే కార్డులను మంజూరు చేసి, వారంలో ఒక్కోరోజు ఒక్కో రంగు కార్డువారికి పింఛను అందజేస్తారు. దీనివల్ల గ్రామాల్లో ఎక్కడా పించన్ల కోసం తొక్కిసలాట జరగదని, అంతేకాకుండా వచ్చిన వారందరికీ పెన్షన్ అందేందుకు ఇది ఉపయోగపడుతుందని అధికారవర్గాలు వివరించాయి. ఇవీ నిబంధనలు... కొత్త పెన్షన్లకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించనుంది. పించనుదారుల పిల్లలు ప్రభుత్వ లేదా ప్రైవేటుగా ఏ ఉద్యోగం చేస్తున్నా, ట్యాక్సీ వంటి వాహనాలు నడుపుతున్నా పెన్షన్ ఇవ్వరు. అలాగే ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి పించను ఇచ్చే విధానానికి కూడా స్వస్తి చెప్పాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆధార్‌కార్డును అనుసంధానం చేయడంతోపాటు చేతివేలి గుర్తులను తీసుకుంటారు. వృద్ధుల చేతివేలి గుర్తులు పడని పక్షంలో కళ్ల ఐరిస్ తీసుకోనున్నారు. 65 సంవత్సరాల వయసు దాటినవారికి మాత్రమే పెన్షన్లు మంజూరు చేయనున్నారు. కేంద్రం 60 ఏళ్ల వయసున్నవారికి వృద్ధాప్య పించన్లు అమలు చేయాలంటున్నా.. తెలంగాణలో భారీస్థాయిలో పెన్షన్లు ఇస్తున్నందున అది సాధ్యం కాదని అధికారులు తేల్చారు. జనాభా లెక్కల ప్రకారం మండలాల్లో ఉన్న వృద్ధుల సంఖ్యకు మించి దరఖాస్తులు వస్తే.. కంప్యూటర్ ఆ పేర్ల నమోదుకు అంగీకరించకుండా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు. కాగా, ఇకపై పించన్లను పోస్టాఫీసుల్లో లేదా అల్ట్రాబ్యాంకుల్లో, కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
మార్సిజం
ఎగిరి ఏ లోకాన ఉన్నాడో మన అంగారక యంత్రుడు, సెప్టెంబర్ నాటికి మార్స్‌ని చేరుకుంటాడని శాస్త్రవేత్తల అంచనా. చేరుకోవాలని ఇస్రోచైర్మన్ ప్రార్థన. అంతా సక్రమంగానే ఉన్నా, ఏమో దైవకృప వక్రంగా చిన్న వంపు తిరిగినా, ఇంత శ్రమా వృథా అవుతుందని ముందే ఆయన వెంకన్నని వేడుకుని వచ్చినట్లున్నారు. శాస్త్రజ్ఞులు, దైవజ్ఞులు ఎవరి తోవలో వారు తిరుగుతూ ఉంటారని అనుకుంటాం. అందుకే వారు అప్పుడప్పుడు డాక్టర్ కె.రాధాకృష్ణన్‌లా కక్ష్య తప్పడం మనకు వింతగా, విపరీతంగా అనిపిస్తుంటుంది. తప్పేం లేదు. అంగారక ప్రయాణానికీ, ఆధ్యాత్మిక ప్రయాణానికీ స్టీరింగ్ ఒక్కటే. తపన! అవతల ఏముందో తెలుసుకోవడం అంగారకం. అవతల ఎవరున్నారో తెలుసుకోవడం ఆధ్యాత్మికం. మరి తెలుస్తుందా? తెలియడం ముఖ్యం కాదు. తెలుసుకోవాలనుకోవడం ముఖ్యం. మనుషులు చూడండి. పైపైకి ఎగబాగడానికి ఎంతగా తపిస్తున్నారో! ముప్పై వేల ఉద్యోగం నుంచి డెబ్బై వేలకు. అర ఎకరం నుంచి ఆరు ఎకరాలకు. అద్దె ఇంటి నుంచి సొంత డ్యూప్లెక్స్కు. ఇండియా నుంచి యు.ఎస్.కు. భూగ్రహం నుంచి అంగారక గ్రహానికి. శాస్త్ర పరిశోధనలను అలా ఉంచండి. మామూలు మనుషులు కూడా మార్స్ మీదకు వెళ్లడానికి ఉత్సాహపడుతుండడం చూస్తుంటే అందరూ ఏ ఆధ్యాత్మిక ఆవరణంలోనో పరిభ్రమిస్తున్నట్లు అనిపిస్తుంది! ‘మార్స్ వన్’ ప్రాజెక్టు 2024లో ఇద్దరు మగవాళ్లను, ఇద్దరు ఆడవాళ్లను అంగారకుడి మీదకు తీసుకెళుతోంది. ఈలోపు అనేక రకాల పరీక్షలు పెట్టి అంతిమంగా ఆ నలుగురు అదృష్టవంతులను ఎంపిక చేస్తారు. ‘మార్స్ వన్’ అనేది ఈ ప్రయాణాన్ని ప్లాన్ చేసిన నెదర్లాండ్స్ ప్రైవేటు సంస్థ. ఇప్పటికి రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలోంచి తొలివిడత వడపోతలో వెయ్యి మంది ఔత్సాహికులను ఎంపిక చేశారు. అలా ఎంపికైన వారిలో అమెరికన్లు, కెనడియన్లు, ఇండియన్లు, రష్యన్లు ఎక్కువ మంది ఉన్నారు. సరే, వెళ్లినవాళ్లు తిరిగి భూమికి ఎప్పటికి చేరుకుంటారు? ఎప్పటికీ చేరుకోరు. అక్కడే ఒక కాలనీ ఏర్పాటు చేసుకుని. అందులోనే ఉండిపోతారు. వన్ వే టికెట్ అన్నమాట! మార్స్‌లో భూవాతావరణం ఉండదు. కొద్దిగా గాలి ఉంటుంది కానీ అది పీల్చుకోడానికి అనువైనది కాదు. తాగడానికి నీళ్లుండవు. ధ్రువప్రాంతాలో, అదీ మట్టిదిబ్బల అడుగుభాగాన గడ్డకట్టి ఉండే మంచు ఏ విధంగానూ వాడకానికి పనికొచ్చేది కాదు. ఇక తిండి. ఆ ఊసే ఎత్తొద్దు. రేడియేషన్ అత్యధికంగా ఉంటుంది. ‘చచ్చిపోతున్నాం బాబోయ్’ అని అరిచినా భూమి నుంచి అందే సహాయం ఏదీ ఉండదు. మరి అక్కడికి వెళ్లి ఏం చేస్తారు? అక్కడ ఉండి ఏం చేస్తారు? ఇదే ప్రశ్న ఒక బిబిసి విలేఖరి అడిగితే మార్స్ ప్రయాణానికి దర ఖాస్తు చేసుకున్న ఇండియన్ ఒకరు ఏమన్నారో తెలుసా? ‘‘భూమి కూడా అంతే కదా! ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? కారు ఆక్సిడెంట్లో నేను పోయినా పోవచ్చు. అలా నిరర్థకంగా మరణించడం నాకు ఇష్టం లేదు’’ అని!! మనిషి ఎన్ని విధాల ఎంత ఎత్తుకు ఎదిగినా అంతిమంగా కూడా అతడు చేరుకోవలసినదేదో అంతకన్నా ఎత్తులో కవ్విస్తూనే ఉంటుంది. ఏమిటది? ఛేదించాలనుకున్న శాస్త్ర విజ్ఞానమా? సాధించాలనుకున్న దైవసాన్నిధ్యమా? లేక రెండూ కలిసే దారిలో ఏ అనుగ్రహమూ లేక రాలిపడే ఉల్కలా పొందే విశ్వైక్యమా? ఏమైనా ఇప్పటి తరానిది మార్సిజం. దైవమూ, శాస్త్రమూ కలగలిసిన సమతూక సిద్ధాంతం. -
మళ్లీ ఎఫ్ఐఐల జోరు రూ. 11,000 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు
న్యూఢిల్లీ: మళ్లీ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్స్‌పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు. వెరసి సెప్టెంబర్ 2-22 మధ్య కాలంలో ఈక్విటీలలో నికరంగా రూ. 11,043 కోట్లను(173 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. అయితే మరోవైపు ఇదే సమయంలో రూ. 985 కోట్ల(15.9 కోట్ల డాలర్లు) విలువైన డెట్ సెక్యూరిటీలను నికరంగా విక్రయించారు. దీంతో దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో ఎఫ్ఐఐల నికర పెట్టుబడులు రూ. 10,058 కోట్లకు(156 కోట్ల డాలర్లు) పరిమితమయ్యాయి. ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా రఘురామ్ రాజన్ బాధ్యతలు స్వీకరించాక ఎఫ్ఐఐల పెట్టుబడులు పుం జుకోవడం గమనార్హం. అంతకుముందు ఆగస్ట్ నెలలో ఎఫ్ఐఐలు నికరంగా దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ. 16,000 కోట్ల(250 కోట్ల డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. డాలరుతో మారకంలో పతనమవుతున్న రూపాయి విలువను నిలువరించేందుకు రాజన్ చేపట్టిన చర్యలు ఎఫ్ఐఐల పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయని నిపుణులు విశ్లేషించారు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలను కొనసాగించడానికి నిర్ణయించడం కూడా దీనికి జత కలిసిందని పేర్కొన్నారు. ఫలితంగా ఈ నెలలో ఇప్పటివరకూ రూపాయి విలువ 350 పైసలు(5.3%) పుంజుకుని 62.23 వద్ద నిలిచింది. -
7న తెలంగాణ బంద్-శాంతి ర్యాలీ రద్దు
-
తొలగనున్న ఆధార్ కష్టాలు
చిలుకూరు, న్యూస్‌లైన్: ఆధార్ కార్డుల ప్రక్రియ సెప్టెం బర్ నుంచి ప్రారంభం కానున్నది. అం దుకోసం ప్రస్తుతం ఉన్న కేంద్రాలు కాక జిల్లాకు మరో 126 ఆధార్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీంతో జి ల్లాలో ఆధార్ కష్టాలు తొలగనున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకానికి, గతంలో కొనసాగుతున్న పథకాలకు తప్పని సరిగా ఆధార్ కార్డు పిన్ నంబర్ అనుసంధానం చేయడంతో ఆధార్ కార్డుకు అత్యంత ప్రాధాన్యత కలిగింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది వివిధ పథకాల ద్వారా లబ్ధిపొం దుతుండగా ఇప్పటి వరకు కేవలం 25 లక్షల మందికి మాత్రమే ఆధార్‌కార్డులు ఉన్నాయి. మిగిలిన10 లక్షల మంది లబ్ధిదారులు ఆధార్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ, ఓబీసీ విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే ఉపకార వేతనాలు పొం దాలంటే తప్పని సరిగా ఆధార్ కార్డును కలిగి ఉండాలి. అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో గర్భిణులకు అందిస్తున్న పారితోషికానికి ఆధార్‌కార్డు తప్పని సరి. గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీని నగదు బదిలీ రూపంలో అందజేసేందుకు ప్రభుత్వం ద్వారా పింఛన్లు పొందుతున్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు కూడా ఆధార్ కార్డు తప్పని సరిగా అవసరం. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది నుంచి ఆధార్ కార్డు ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తున్నా నేటికీ అర్హులైన లబ్ధిదారులందరికీ ఆధార్ కార్డు అందని పరిస్థితి దాపురించింది. ఆధార్ కార్డుల నమోదు బాధ్యతలు చేపట్టిన గుత్తేదారులు సరైన రీతిలో నమోదు ప్రక్రియను చేపట్టకపోవడం, దీనికితోడు ఆ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు చెల్లించపోవడం వంటి కారణాలతో ఆధార్ కార్డుల నమోదు కార్యక్రమం నత్తనడకన సాగుతూ వస్తున్నది. నూతనంగా మరో 126 కేంద్రాలు ఆధార్ కార్డు నమోదు ప్రక్రియను సెప్టెంబర్ నెలలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో అ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇటీవల జిల్లాకు 200 కేంద్రాలు మంజూరయ్యాయి. వాటిల్లో ఇప్పటికే 145 కేంద్రాలు ఏర్పాటు చేయగా మిగిలినవి రెండు రోజుల్లో అనుసంధానం చేసేందుకు అదికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆధార్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం జిల్లాకు నూతనంగా మరో 126 కేంద్రాలను మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా 2.70లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనాలు పొందుతుండగా, 6.34 లక్షల మంది సబ్సిడీ ద్వారా గ్యాస్ పొందుతున్నారు. అలాగే ఉపాధిహామీ పథకం ద్వారా 10 లక్షల మంది, ఐసీడీఎస్ ద్వారా జననీ సురక్ష పథకం కింద మరో 92 వేల మంది లబ్ధిపొందుతున్నారు. వీరందరికీ తప్పనిసరిగా ఆధార్ కార్డు అవసరం. వీరందరికీ కార్డులు అందజేసేందుకు ప్రభుత్వం కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. చిలుకూరుకు నాలుగు కేంద్రాలు చిలుకూరు మండలానికి త్వరలో నాలుగు ఆధార్ కేంద్రాలు కొత్తగా వస్తున్నాయి. వాటిని త్వరలో ప్రారంభిస్తాం. ఇప్పటి వరకు వచ్చిన ఆధార్ కేంద్రాల ద్వారా కేవలం లభ్ధిదారులకు మాత్రమే దించాం. కానీ, ఈ సారి ఇప్పటి వరకు ఆధార్ కార్డులు దిగనివారందరికీ కార్డులు అందజేస్తాం. - ఎన్. సూర్యనారాయణ, తహసీల్దార్, చిలుకూరు -
సెప్టెంబర్ ఒకటి నుంచి పోలో సీజన్
ఇండియన్ పోలో అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 22 వరకు రాష్ట్రంలో పోలో పోటీలు జరుగనున్నాయి. సికింద్రాబాద్‌లోని పోలో గ్రౌండ్లో జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశంలోని అత్యుత్తమ జట్లతో పాటు ప్రపంచ దేశాల నుంచి ఆటగాళ్లు రానున్నారని ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ మునీష్ శైబల్ పేర్కొన్నారు. సోమవారం తిరుమలగిరిలోని 554వ బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 దశల్లో జరిగే ఈ పోటీలు మొదట ఆగస్టు 15 నుంచి 31వరకు బెంగళూర్‌లో జరుగుతాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 22వరకు హైద్రాబాద్, సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 6 వరకు జైపూర్, అక్టోబర్ 7 నుంచి 13 వరకు నొయిడా, అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 8 వరకు ఢిల్లీ (ఐపీఏ చాంపియన్‌షిప్ కలిపి), డిసెంబర్ 11 నుంచి 31వరకు జోధ్‌పూర్, కోల్‌కతాల్లో, డిసెంబర్ 30 నుంచి ఏప్రిల్ 5వరకు జైపూర్, ఫిబ్రవరి 2 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీ, మార్చి 11 నుంచి ఏప్రిల్ 5వరకు ముంబై, ఏప్రిల్ 7వ తేది నుంచి 20 వరకు బెంగళూర్, సెప్టెంబర్ 15 నుంచి 22 వరకు జైపూర్‌లో పోలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్రీడల్లో గెలుపొందిన వారికి ప్రిన్స్ఆఫ్ బేరార్ కప్, బైసన్ కప్, ఆర్మీ కమాండర్స్ కప్ అందజే స్తారని ఆయన తెలిపారు.