Zaheer Khan
-
మాకు సొంత మైదానం.. కానీ ఇక్కడ..: జహీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Ziants) ఓడిపోవడాన్ని ఆ జట్టు మెంటార్ జహీర్ ఖాన్ (Zaheer Khan) జీర్ణించుకోలేకపోతున్నాడు. పంజాబ్ కింగ్స్ గెలుపునకు పరోక్షంగా పిచ్ క్యూరేటరే కారణమంటూ విస్మయకర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా లక్నో మంగళవారం పంజాబ్‌తో తలపడ్డ విషయం తెలిసిందే.లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. టాస్ గెలిచిన పంజాబ్.. లక్నో జట్టును తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఏకనా వికెట్‌పై పరుగులు రాబట్టేందుకు లక్నో బ్యాటర్లు తడబడ్డారు.అయితే, 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి లక్నో కష్టాల్లో పడిన వేళ నికోలస్ పూరన్ (44), ఆయుశ్ బదోని (41), అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 27)బ్యాట్ ఝులిపించారు. ఈ ముగ్గురి ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగలిగింది.16.2 ఓవర్లలోనే..ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (8) వికెట్ కోల్పోయినప్పటికీ పంజాబ్ అద్బుత రీతిలో పుంజుకుంది. వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రన్ సింఘ్ (34 బంతుల్లో 69) మెరుపు అర్ధ శతకంతో రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52), నేహాల్ వధేరా (25 బంతుల్లో 43) అజేయంగా నిలిచి జట్టు గెలుపును ఖరారు చేశారు. ఈ ముగ్గురి విజృంభణ కారణంగా 16.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి పంజాబ్ లక్నోపై ఘన విజయం సాధించింది.మాకు సొంత మైదానం..ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం లక్నో మెంటార్, టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. లక్నో తమకు సొంత మైదానం అయినా.. పిచ్ క్యూరేటర్ మాత్రం పంజాబ్‌కు మేలు చేయడం నిరాశపరిచిందన్నాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ... ‘‘సొంత మైదానంలో మ్యాచ్ అంటే.. అక్కడి జట్టుకే కాస్త ఫేవర్‌గా ఉంటుంది.కానీ ఇక్కడ పంజాబ్ క్యూరేటర్ ఉన్నారుకానీ ఈ విషయంలో లక్నో క్యూరేటర్ చేసిన పని వల్ల.. ఇది హోం మ్యాచ్ అన్న భావనే రాలేదు. ఇక్కడి వికెట్ ఇలాగే ఉంటుందేమో బహుశా!.. ఇక్కడ పంజాబ్ క్యూరేటర్ ఉన్నారనిపించింది. ఈ మ్యాచ్‌లో నాకు అన్నింటికంటే ఇదే ఎక్కువ నిరాశను కలిగించింది.క్యూరేటర్ మమ్మల్నే కాదు లక్నో అభిమానులను కూడా నిరాశకు గురిచేశారు. సొంతగడ్డపై లక్నో గెలుస్తుందని వారంతా భావించారు. కానీ ఇలా జరిగిపోయింది. జట్టుగా మేము పటిష్టంగా ఉన్నాము. మ్యాచ్‌లో ఓడిపోయామన్న వాస్తవాన్ని మేము అంగీకరిస్తున్నాం.వినూత్న రీతిలో.. ముందడుగుఅయితే, సొంతమైదానంలో ఓటమి కాస్త ఎక్కువ బాధించింది. ఇక్కడ మాకు ఇంకో ఆరు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మేము కచ్చితంగా మెరుగ్గా రాణిస్తామనే నమ్మకం ఉంది. సంప్రదాయ పద్ధతులను కాస్త పక్కనపెట్టి.. వినూత్న రీతిలో.. ముందడుగు వేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము’’ అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.రహానే కూడా ఇలాగేకాగా లక్నో పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని చెప్తారు. కానీ పంజాబ్‌తో మ్యాచ్‌లో లక్నో స్పిన్నర్లకు పెద్దగా కలిసిరాలేదు. రవి బిష్ణోయి, మణిమరన్ సిద్దార్థ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా.. దిగ్వేశ్ సింగ్ రాఠీ మాత్రం రెండు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. పంజాబ్ బౌలర్లలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, రిస్ట్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆరంభమ్యాచ్‌లో ఓటమి తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే కూడా.. ఈడెన్ గార్డెన్స్ పిచ్ గురించి ఇదే తరహా వ్యా ఖ్యలు చేసిన విషయం తెలిసిందే.చదవండి: లక్నో బౌలర్ ఓవరాక్షన్.. భారీ షాకిచ్చిన బీసీసీఐStatement victory ✅Skipper's second 5⃣0⃣ this season ✅Consecutive wins ✅Punjab Kings cap off a perfect day 🙌#TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/HSrX8KwiY4— IndianPremierLeague (@IPL) April 1, 2025 -
మొన్న అలా.. ఇప్పుడిలా! లక్నో జట్టు యజమాని చర్య వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో వివిధ ఫ్రాంఛైజీ యజమానుల తీరు భిన్నంగా ఉంటుంది. అయితే గత సీజన్లో వివాదాస్పదంగా నిలిచి వార్తలలోకి ఎక్కిన యజమాని ఎవరంటే.. నిస్సందేహంగా లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజయ్ గోయెంకా(Sanjeev Goenka)నే. గత సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓడిపోయిన తర్వాత గోయెంకా స్టేడియంలోనే నిలబడి రాహుల్‌పై విమర్శలు గుప్పించారు.నాటి కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul)తో గోయెంకా చేసిన ఈ యానిమేటెడ్ చాట్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. గోయెంకా వ్యవహార శైలిపై అప్పట్లో అనేకమంది విమర్శలు గుప్పించారు. దీని ఫలితంగా చివరికి రాహుల్ ఫ్రాంచైజ్ నుంచి తప్పుకొన్నాడనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు తర్వాత మెగా వేలంలో భారత్ వికెట్టుకీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను లక్నో రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు ఖర్చు కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించింది. కానీ ఈ వికెట్ కీపర్-బ్యాటర్ తన పూర్వ ఫ్రాంచైజ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో తడబడ్డాడు. పంత్ ఆరు బంతులు ఆడి చివరికి తన ఖాతాను కూడా తెరవకుండా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో లక్నో పరాజయం చవిచూసిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా మళ్ళీ అదే రీతిలో కెప్టెన్ పంత్, ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్‌తో సమావేశమయ్యారు.Hyderabad conquered ✅Win secured ✅#LSG get their first 𝐖 of #TATAIPL 2025 with a comfortable victory over #SRH 💙Scorecard ▶ https://t.co/X6vyVEvxwz#SRHvLSG | @LucknowIPL pic.twitter.com/7lI4DESvQx— IndianPremierLeague (@IPL) March 27, 2025ఈసారి వీరి సంభాషణ కొద్దిగా స్నేహపూర్వకంగా వాతావరణంలో జరిగినట్లు కనిపించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు గోయెంకా మాజీ కెప్టెన్ కెఎల్ రాహుల్‌తో చేసిన వివాదాస్పద సంభాషణ తో పోలుస్తూ ఈ వీడియో ని బాగా వైరల్ చేసారు.పంత్‌ను గట్టిగా కౌగిలించుకొనిఅయితే ఈసారి కథనం నాటకీయ మలుపు తీసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై లక్నో పూర్తి ఆధిపత్యం చెలాయించి సొంత గడ్డ పై ప్రత్యర్థి ని అయిదు వికెట్ల తేడాతో.. అదీ ఇంకా 23 బంతులు మిగిలి ఉండగానే ఓడించింది. దీంతో గోయెంకా ఆనందాన్ని పట్టలేక కెప్టెన్ రిషబ్ పంత్‌ను గట్టిగా కౌగిలించుకోవడం కనిపించింది. గత సంవత్సరం రాహుల్ కెప్టెన్సీలో ఇదే జట్టుపై ఓటమి తర్వాత గోయెంకా జరిపిన సంభాషణకు.. తాజా దృశ్యాలు పూర్తి విరుద్ధంగా కనిపించాయి. గోయెంకా ప్రవర్తనలో ఈ మార్పును అభిమానులు గ్రహించి సోషల్ మీడియాలో ఈ సంభాషను పోలుస్తూ మీమ్లతో ముంచెత్తారు. ఈ సందర్భంగా భారత మాజీ పేసర్, లక్నో బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్ కూడా నవ్వుతూ కనిపించారు. ఈ విజయం లక్నో ఫ్రాంచైజ్ లోని అందరికీ చాలా ఉపశమనం ఇచ్చినట్టు స్పష్టంగా కనిపించింది.Sanjiv Goenka gives a tight hug to Rishabh Pant. pic.twitter.com/yHcnCCmxXP— Mufaddal Vohra (@mufaddal_vohra) March 27, 2025 వ్యక్తిగత ఒడిదుడుకుల మధ్య పంత్ కెప్టెన్సీతన జట్టును విజయపథంలో నడిపించినప్పటికీ, రిషబ్ పంత్ బ్యాటింగ్ ఫామ్ ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. వ్యక్తిగతంగా చూస్తే తన తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన పంత్ ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 15 పరుగులు చేసాడు. అయితే, బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ పై ముందుగా బౌలింగ్ చేయాలన్న పంత్ దృఢ సంకల్పం అతని నాయకత్వ ధోరణిని చెప్పకనే చెబుతుంది.చదవండి: Kavya Maran: క్యాచ్ డ్రాప్.. చిన్న పిల్లలా కేరింతలు.. కానీ పాపం ఆఖరికి! -
పాకిస్తాన్ సూపర్ హిట్ పాటను పాడిన పంత్.. షాకైన జహీర్ ఖాన్.. వైరల్ వీడియో
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్-2025 కోసం సన్నాహకాలు మొదలుపెట్టాడు. గత వారమంతా సోదరి వివాహ వేడుకలతో బిజీగా గడిపిన పంత్.. నిన్ననే తన కొత్త ఐపీఎల్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో కలిశాడు. పంత్‌ను ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ గతేడాది జరిగిన మెగా వేలంలో రికార్డు ధరకు (రూ. 27 కోట్లు) సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఓ ఆటగాడికి లభించిన అత్యధిక ధర ఇదే. పంత్‌ను ఎల్ఎస్జీ యాజమాన్యం కెప్టెన్‌గా కూడా ఎంపిక చేసింది. గత సీజన్ వరకు కెప్టెన్‌గా ఉండిన కేఎల్ రాహుల్‌ను లక్నో యాజమాన్యం మెగా వేలానికి ముందు వదిలేసింది. రాహుల్‌ను వేలంలో ఢిల్లీ కొనుగోలు చేసింది. లక్నో.. ఐపీఎల్ 2025 సీజన్‌ను మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలుపెడుతుంది. ఈ మ్యాచ్ విశాఖలో జరుగనుంది.2022లో గుజరాత్‌తో పాటు ఐపీఎల్ అరంగేట్రం చేసిన లక్నో మూడు సీజన్లలో ఒక్క టైటిల్ కూడా గెలువలేదు. తొలి రెండు సీజన్లలో మూడో స్థానంలో సరిపెట్టుకున్న లక్నో.. గత సీజన్లో పేలవ ప్రదర్శన చేసి ఏడో స్థానంలో నిలిచింది. కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ నాయకత్వంలో ఈ సారైనా టైటిల్ సాధించాలని లక్నో అభిమానులు కోరుకుంటున్నారు. మరి పంత్ లక్నో ఆశలను నిజం చేస్తాడో లేక నీరుగారుస్తాడో వేచి చూడాలి.Part-time wicketkeeper-batter. Full-time karaoke singer 🎤 pic.twitter.com/mFf2BC77e3— Lucknow Super Giants (@LucknowIPL) March 15, 2025ఇదిలా ఉంటే, పంత్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో పంత్ పాకిస్తాన్ సూపర్ హిట్ పాట 'అఫ్సానే'ను పాడుతూ కనిపించాడు. పాకిస్తానీ బ్యాండ్ యంగ్ స్టన్నర్స్కు చెందిన ఈ పాటను పంత్ అద్భుతంగా పాడాడు. పంత్‌లో సింగింగ్ టాలెంట్ చూసి లక్నో మెంటార్ జహీర్ ఖాన్ షాక్‌కు గురయ్యాడు. పంత్ పాట పాడుతుండగా జహీర్ అతన్ని చూస్తూ ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం తమ సోషల్‌మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఈ వీడియోకు పార్ట్ టైమ్ వికెట్‌కీపర్ బ్యాటర్.. ఫుల్ టైమ్ కరావోకే సింగర్ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. పంత్ సింగింగ్ టాలెంట్‌కు జనాలు ముగ్దులవుతున్నారు. చిన్న పిల్లాడిలా, ఎప్పుడూ ఏదో ఒక కోతి పని చేస్తూ ఉండే పంత్‌లో ఇంత టాలెంట్ ఉందా అని ముక్కున వేలేసుకుంటున్నారు.కాగా, 27 ఏళ్ల పంత్ 2022వ సంవత్సరం చివర్లో కారు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పంత్ కెరీర్ ముగుస్తుందని అంతా అనుకున్నారు. అయితే పంత్ మొక్కవోని మనో ధైర్యంతో గాయాలను జయించి పునర్జన్మ సాధించాడు. రీఎంట్రీలో పంత్ గతం కంటే మెరుగ్గా ఆడుతున్నాడు. గతేడాది ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చిన పంత్.. ఆ సీజన్లో ఢిల్లీ తరఫున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం పంత్ భారత జట్టుకు కూడా ఎంపికై టీ20 వరల్డ్‌కప్-2025, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచాడు.2016లో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన పంత్.. వరుసగా ఎనిమిది సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. పంత్ ఐపీఎల్లో 111 మ్యాచ్‌లు ఆడి 148.93 స్ట్రయిక్‌రేట్‌తో3284 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు..రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హిమ్మత్ సింగ్, ఎయిడెన్ మార్క్రమ్, ఆయుశ్ బదోని, అబ్దుల్ సమద్, యువరాజ్ చౌదరీ, షాబాజ్ అహ్మద్, మిచెల్ మార్ష్, అర్శిన్ కులకర్ణి, ఆర్ఎస్ హంగార్గేకర్, మాథ్యూ బ్రీట్జ్కీ, నికోలస్ పూరన్, ఆర్యన్ జుయల్, రవి భిష్ణోయ్, మయాంక్ యాదవ్, ఆకాశ్‌దీప్, మణిమారన్ సిద్దార్థ్, షమార్ జోసఫ్, ఆవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మొహిసిన్ ఖాన్, ఆకాశ్ మహారాజ్ సింగ్, దిగ్వేశ్ రతీ -
షమీ చెత్త రికార్డు.. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే..
టీమిండియా వెటరన్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammad Shami) చెత్త రికార్డు నమోదు చేశాడు. పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్‌లో ఆరంభ ఓవర్లోనే ఏకంగా ఐదు వైడ్‌బాల్స్(Five Wides) వేశాడు. తద్వారా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇన్నింగ్స్ ఆరంభ ఓవర్లోనే అత్యధికంగా ఐదు అదనపు పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు.విజయంతో ఆరంభంఅంతేకాదు.. వన్డేల్లో భారత్ తరఫున ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్ పేరిట ఉన్న మరో చెత్త రికార్డును షమీ సమం చేశాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో దుబాయ్‌లో తమ తొలి మ్యాచ్ ఆడిన టీమిండియా విజయంతో ఈ మెగా టోర్నీని ఆరంభించింది.డాట్ బాల్స్, వైడ్లుతాజాగా అదే వేదికపై చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత ఫీల్డింగ్ చేయగా.. వెటరన్ పేసర్ షమీ బౌలింగ్ అటాక్ ఆరంభించాడు. అయితే, తొలి బంతిని బాగానే వేసిన ఈ రైటార్మ్ పేసర్ రెండో బంతిని వైడ్‌గా వేశాడు. అనంతరం పరుగు ఇవ్వని షమీ.. ఆ తర్వాత మళ్లీ వరుసగా రెండు వైడ్లు వేశాడు. ఆ మరుసటి బంతికి పరుగులేమీ ఇవ్వని షమీ.. అనంతరం ఒక పరుగు ఇచ్చి.. మళ్లీ డాట్ బాల్ వేశాడు.కానీ ఆ తర్వాత మళ్లీ రెండు రెండు వైడ్లు వేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త అసహనానికి గురయ్యాడు. అయితే, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం షమీని ఉత్సాహపరుస్తూ మరేం పర్లేదు అన్నట్లుగా ఊరటకలిగించాడు. ఇక ఆఖరి బంతిని డాట్ బాల్‌గా వేసిన షమీ తొలి ఓవర్లో వరుసగా 0 Wd 0 Wd Wd 0 1 0 Wd Wd 0 నమోదు చేశాడు. అలా మొత్తంగా పదకొండు బాల్స్ వేశాడు.అత్యధిక వైడ్ బాల్స్ వేసిన క్రికెటర్ల జాబితాలోతద్వారా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇలా ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే అత్యధిక వైడ్ బాల్స్ వేసిన క్రికెటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. షమీ పాక్‌తో మ్యాచ్‌లో ఐదు వైడ్‌బాల్స్ వేయగా.. అంతకు ముందు జింబాబ్వే క్రికెటర్ టినాషే పన్యంగర 2004లో బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఏకంగా ఏడు వైడ్ బాల్స్ వేసి ఈ జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక వన్డేల్లో తొలి ఓవర్లో టీమిండియా తరఫున అత్యధిక బాల్స్ వేసిన బౌలర్ల జాబితాలో షమీ ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్ సరసన చేరాడు.ఇదిలా ఉంటే.. పాక్‌తో మ్యాచ్‌లో భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. ఆరంభంలోనే షమీ కాస్త నిరాశపరిచినా ఆ తర్వాత పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మరోవైపు.. యువ పేసర్ హర్షిత్ రాణా, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్నారు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసే సరికి పాకిస్తాన్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. పది ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి కేవలం 52 పరుగులే చేసింది. ఇందులో బాబర్ ఆజం(23) రూపంలో హార్దిక్ పాండ్యా కీలక వికెట్ తీయగా.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమైన మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. అక్షర్ పటేల్ డైరెక్ట్ త్రో కారణంగా వికెట్ సమర్పించుకుని పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు.పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో తొలి ఓవర్లో ఐదు వైడ్ బాల్స్ వేయడం ద్వారా షమీ పేరిట నమోదైన చెత్త రికార్డులు👉చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇన్నింగ్స్ ఆరంభ ఓవర్లో అత్యధిక వైడ్లు వేసిన రెండో బౌలర్.👉వన్డేల్లో వైడ్స్, నో బాల్స్‌తో కలిపి తొలి ఓవర్లోనే అత్యధిక బంతులు బౌల్ చేసిన మూడో బౌలర్. ఈ జాబితాలో జహీర్ ఖాన్ వాంఖడే వేదికగా 2003లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో పదకొండు బంతులు వేసి ముందు వరుసలో ఉండగా.. ఇర్ఫాన్ పఠాన్ వెస్టిండీస్‌తో 2006లో కింగ్స్టన్ వేదికగా ఈ చెత్త గణాంకాలు నమోదు చేశాడు. చదవండి: ICC CT 2025 India vs Pakistan Updates: అప్డేట్లు -
చరిత్రకెక్కిన జడేజా.. జహీర్ రికార్డు బ్రేక్.. అరుదైన జాబితాలో చోటు
న్యూజిలాండ్‌తో మూడో టెస్టు సందర్భంగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్‌ను జడ్డూ అధిగమించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.ముంబై వేదికగా మూడో టెస్టు ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బెంగళూరు, పుణె వేదికగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య టీమిండియాను న్యూజిలాండ్ ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ముంబై వేదికగా శుక్రవారం నామమాత్రపు మూడో టెస్టు మొదలైంది.వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు.. సొంతగడ్డపై ఇప్పటికే భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన టామ్ లాథమ్ బృందం విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో మూడో టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఆకాశ్ దీప్ శుభారంభం.. అదరగొట్టిన వాషీస్పిన్కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బౌలర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ప్రభావం చూపుతున్నారు. ఆట తొలిరోజు భోజన విరామ సమయానికి ముందు వాషీ.. కివీస్ కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(28), మిడిలార్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(5) రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు. మరోవైపు.. పేసర్ ఆకాశ్ దీప్ డేంజరస్ ఓపెనర్ డెవాన్ కాన్వే(4)ను అవుట్ చేసి శుభారంభం అందించాడు.లంచ్ తర్వాత వికెట్ల వేట మొదలుపెట్టిన జడ్డూఈ క్రమంలో లంచ్ బ్రేక్‌కు ముందు న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. అయితే, భోజన విరామం తర్వాత జడ్డూ తన బౌలింగ్ పదునుపెంచాడు. క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్లను ఇబ్బంది పెడుతున్న విల్ యంగ్(71)ను తొలుత పెవిలియన్‌కు పంపిన జడేజా.. అనంతరం టామ్ బ్లండెల్(0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్(17)ను అవుట్ చేశాడు. తద్వారా జడ్డూ టెస్టుల్లో 312 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.టీ బ్రేక్ సమయానికి కివీస్స్కోరు ఎంతంటే?ఈ నేపథ్యంలో భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్(311), ఇషాంత్ శర్మ(311)లను జడ్డూ అధిగమించాడు. వీరిద్దరి రికార్డును బ్రేక్ చేస్తూ టాప్-5లో చోటు సంపాదించాడు. ఇదిలా ఉంటే.. టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు1. అనిల్ కుంబ్లే(స్పిన్నర్)- 619 వికెట్లు2. రవిచంద్రన్ అశ్విన్(స్పిన్నర్)- 533 వికెట్లు3. కపిల్ దేవ్(పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్)- 434 వికెట్లు4. హర్భజన్ సింగ్(స్పిన్నర్)- 417 వికెట్లు5. రవీంద్ర జడేజా(స్పిన్నర్)- 312 వికెట్లు.చదవండి: IPL 2025 Retentions: జాక్‌పాట్ కొట్టిన ఆటగాళ్లు వీరే..! -
లక్నో జట్టు ‘గేమ్ ఛేంజర్’ అతడే: ఎమ్ఎస్కే ప్రసాద్
జహీర్ ఖాన్ రాకతో లక్నో సూపర్ జెయింట్స్ రాత మారబోతుందని ఆ జట్టు టాలెంట్ సెర్చ్ డైరెక్టర్, టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ అన్నాడు. ఈ రివర్స్ స్వింగ్ కింగ్‌ను గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం ఉన్న జహీర్ మార్గదర్శనంలో లక్నో అద్భుత విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.లక్నో మెంటార్‌గా జహీర్ నియామకంకాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ తమ కొత్త మెంటార్‌గా భారత మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్‌ను నియమించిన విషయం తెలిసిందే. జహీర్ ఈ జట్టుతో చేరుతున్నట్లుగా గత కొంత కాలంగా వార్తలు వినిపించగా... టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా బుధవారం అధికారికంగా ప్రకటించారు. మెంటార్‌గా ప్రధాన జట్టుకే పరిమితం కాకుండా ప్రతిభాన్వేషణ, కొత్త ఆటగాళ్లను తీర్చిదిద్దే అదనపు బాధ్యతలను కూడా జహీర్‌కు లక్నో యాజమాన్యం అప్పగించింది.క్యాష్ రిచ్ లీగ్‌లోకి 2022లో లీగ్‌లోకి ప్రవేశించిన లక్నో సూపర్ జెయింట్స్‌కు రెండేళ్లు గౌతమ్ గంభీర్ మెంటార్‌గా వ్యవహరించగా.. కేఎల్ రాహుల్ సారథ్యంలోని ఈ జట్టు రెండుసార్లు ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఆ తర్వాత మెంటార్ బాధ్యతల నుంచి గంభీర్ తప్పుకోగా.. 2024 సీజన్లో లక్నో పేలవ ప్రదర్శన కనబర్చింది. ఈ క్రమంలో గంభీర్ స్థానాన్ని జహీర్‌తో భర్తీ చేసింది యాజమాన్యం.అత్యుత్తమ బౌలర్ రాక మాకు శుభ పరిణామంఈ నేపథ్యంలో ఎమ్ఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘లక్నో జట్టుకు ఇదొక శుభవార్త. జహీర్ ఖాన్ వంటి మేటి క్రికెటర్ మెంటార్‌గా రావడం మంచి పరిణామం. జహీర్ నెమ్మదస్తుడు. కూల్‌గానే తనకు కావాల్సిన ఫలితాలను రాబట్టుకోగల సమర్థత ఉన్నవాడు. ఆట పట్ల అతడికి విశేష జ్ఞానం ఉంది. ఐపీఎల్లో జహీర్ కెరీర్ ఇలాటీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో అత్యుత్తమంగా రాణించిన ఘనత అతడి సొంతం. ఐపీఎల్‌లోనూ తనకు గొప్ప అనుభవం ఉంది. లక్నో జట్టుకు అతడు గేమ్ ఛేంజర్ కాబోతున్నాడు’’ అని స్పోర్ట్స్కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా భారత అత్యుత్తమ పేస్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న జహీర్ 2017 వరకు ఐపీఎల్ ఆడాడు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ జట్ల తరఫున మొత్తం 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు పడగొట్టిన అతను ఆ తర్వాత కూడా ఐపీఎల్‌తో కొనసాగాడు. 2018–2022 మధ్య ఐదేళ్ల పాటు జహీర్ ఖాన్ ముంబై ఇండియన్స్ టీమ్‌కు డైరెక్టర్, ఆ తర్వాత హెడ్ ఆఫ్ గ్లోబల్ డెవలప్‌మెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక ఐపీఎల్-2025లో లక్నో మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.చదవండి: ఒక్కడి కోసం అంత ఖర్చు పెడతారా? లక్నో జట్టు ఓనర్ -
లక్నోకు కొత్త మెంటార్.. కేఎల్ రాహుల్‌పై గోయెంకా కామెంట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ తమ కొత్త మెంటార్ పేరును ప్రకటించింది. టీమిండియా రివర్స్ స్వింగ్ కింగ్ జహీర్ ఖాన్ తమ జట్టుకు మార్గ నిర్దేశనం చేయనున్నట్లు తెలిపింది. ఈ దిగ్గజ పేసర్‌తో జతకట్టడం సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఐపీఎల్-2023లో లక్నో మెంటార్‌గా ఉన్న భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్.. ఈ ఏడాది ఆ జట్టును వీడిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో గౌతీ తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్ గూటికి చేరుకోగా.. లక్నో అతడి స్థానాన్ని అలాగే ఖాళీగా ఉంచింది. ఈ నేపథ్యంలో తాజాగా జహీర్ ఖాన్‌ను తమ మెంటార్‌గా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా లక్నో ఫ్రాంఛైజీ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా జహీర్‌కు లక్నో జెర్సీ(నంబర్ 34)ని ప్రదానం చేశాడు.రివర్స్ స్వింగ్ కింగ్‌కు 102 వికెట్లుకాగా మహారాష్ట్రకు చెందిన 45 ఏళ్ల జహీర్ ఖాన్ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లో రీఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన ఈ లెఫ్టార్మ్ పేసర్... పది సీజన్లలో 100 మ్యాచ్‌లు ఆడి 7.58 ఎకానమీతో 102 వికెట్లు పడగొట్టాడు.అనంతరం కోచ్ అవతారమెత్తిన జహీర్ ఖాన్.. తొలుత ముంబై ఇండియన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పనిచేశాడు. 2018- 2022 మధ్య కాలంలో ఆ ఫ్రాంఛైజీతో ప్రయాణం చేసిన ఈ దిగ్గజ బౌలర్.. రెండేళ్ల విరామం అనంతరం మళ్లీ ఐపీఎల్లో అడుగుపెట్టాడు. కాగా లక్నో బౌలింగ్ కోచ్‌గా ఉన్న సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ మోర్నీ మోర్కెల్ ఇటీవలే టీమిండియా బౌలింగ్ శిక్షకుడిగా నియమితుడైన విషయం తెలిసిందే.కేఎల్ రాహుల్‌పై గోయెంకా కామెంట్ఈ నేపథ్యంలో లక్నో మెంటార్‌గా వ్యవహరించడంతో పాటు ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని కూడా జహీర్ పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇక జస్టిన్ లాంగర్ ఈ జట్టుకు హెడ్‌కోచ్‌గా ఉండగా.. లాన్స్ క్లూస్నర్, ఆడం వోగ్స్ అతడికి డిప్యూటీలుగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. లక్నో కెప్టెన్సీకి కేఎల్ రాహుల్ గుడ్‌బై చెప్తున్నాడనే వార్తల నడుమ.. సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ.. అతడు తమ కుటుంబంలోని వ్యక్తి లాంటివాడని తెలిపాడు. అయితే, తమ కెప్టెన్ మార్పు గురించి వస్తున్న వార్తలపై స్పందించేందుకు నిరాకరించాడు. మరోవైపు.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఈ ఏడాది చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే.చదవండి: భారత స్టార్ క్రికెటర్ గుండెలో రంధ్రం.. సర్జరీ తర్వాత ఇలా..Zaheer, Lucknow ke dil mein aap bohot pehle se ho 🇮🇳💙 pic.twitter.com/S5S3YHUSX0— Lucknow Super Giants (@LucknowIPL) August 28, 2024 -
లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్..?
లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెలాఖరులో జహీర్ పేరును అధికారికంగా ప్రకటించవచ్చని సమాచారం. జహీర్, ఎల్ఎస్జీ యాజమాన్యం మధ్య ప్రస్తుతం ఆర్ధిక పరమైన చర్చలు సాగుతున్నట్లు తెలుస్తుంది. ప్యాకేజీ కాస్త అటూ ఇటైనా డీల్‌కు ఓకే చెప్పాలనే జహీర్ భావిస్తున్నాడట. అన్నీ కుదిరితే జహీర్ ఎల్ఎస్జీలో మెంటార్షిప్తో పాటు బౌలింగ్ కోచ్ స్థానాన్ని కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. గౌతమ్ గంభీర్, మోర్నీ మోర్కెల్ టీమిండియా కోచింగ్ బాధ్యతలు చేపట్టాక ఎల్ఎస్జీ మెంటార్షిప్, బౌలింగ్ కోచ్ పదవులు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. జహీర్ స్వతహాగా ఫాస్ట్ బౌలర్ కావడంతో బౌలింగ్ కోచ్ పదవిని కూడా అతనికే కట్టబెట్టాలని ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ భావిస్తుందట. రెండు పదవులు రానుండటంతో ఈ డీల్ పట్ల జహీర్ కూడా సానుకూలంగా ఉన్నాడని సమాచారం.వాస్తవానికి జహీర్ టీమిండియా బౌలింగ్ కోచ్ పదవి ఆశించాడని టాక్. అయితే గంభీర్ పట్టుబట్టడంతో ఆ పదవి మోర్నీ మోర్కెల్‌కు దక్కిందని తెలుస్తుంది. కాగా, ప్రస్తుతం లక్నో హెడ్ కోచ్‌గా జస్టిన్ లాంగర్, అసిస్టెంట్ కోచ్‌లుగా ఆడమ్ వోగ్స్, లాన్స్ క్లూసెనర్, జాంటీ రోడ్స్ ఉన్న విషయం తెలిసిందే.జహీర్ గురించి వివరాలు..జహీర్ గతంలో ముంబై ఇండియన్స్ కోచింగ్ టీమ్‌లో పని చేశాడు. 45 ఏళ్ల జహీర్ టీమిండియా తరఫున 92 టెస్ట్‌లు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. జహీర్ ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 100 గేమ్‌లు ఆడాడు. జహీర్ చివరిగా 2017లో ఐపీఎల్ ఆడాడు.లక్నో సూపర్ జెయింట్స్ విషయానికొస్తే.. ఈ ఫ్రాంచైజీ 2022, 2023 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరి, 2024 సీజన్లో చేరలేకపోయింది. లక్నో.. గుజరాత్ టైటాన్స్‌తో కలిసి 2022 ఐపీఎల్ సీజన్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.ఐపీఎల్ 2025 విషయానికొస్తే.. బీసీసీఐ ఈ నెలాఖరులోగా ఆటగాళ్ల రిటెన్షన్ రూల్స్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఫ్రాంచైజీలు ఆర్టీఎం ఆప్షన్ సహా ఆరు రిటెన్షన్స్ చేసుకోవచ్చని ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన మీటింగ్‌లో ఫ్రాంచైజీలు భారీ వేలాన్ని రద్దు చేయాలని కోరినప్పటికీ బీసీసీఐ ప్రస్తుతానికి అందుకు అనుకూలంగా లేదని టాక్. -
లెఫ్టాండర్స్ టెస్టు, వన్డే అత్యుత్తమ జట్లు ఇవే!
క్రికెట్లో ఎడమచేతి వాటం ఉన్న ఆటగాళ్లు చాలా తక్కువే మందే ఉంటారు. అందులోనూ అత్యుత్తమంగా రాణించేవాళ్లు ఇంకా తక్కువ. అయితే, ఆ జాబితాలో ఈ 22 మందికి తప్పక చోటు ఉంటుంది అంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్! ఒకరోజు ఆలస్యంగానైనా సరే.. లెఫ్టాండర్లకు తాను ఇచ్చే ట్రిబ్యూట్ ఇదేనంటూ బుధవారం ఓ ట్వీట్ చేశాడు.ప్రపంచ టెస్టు, వన్డే అత్యుత్తమ లెఫ్టాండర్లతో కూడిన తన తుదిజట్లను ప్రకటించాడు వసీం జాఫర్. టెస్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్, శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కరకు చోటిచ్చిన ఈ ముంబై బ్యాటర్.. వెస్టిండీస్ ఆల్‌టైమ్ గ్రేట్ బ్రియన్ లారాను వన్‌డౌన్ బ్యాటర్‌గా ఎంచుకున్నాడు.ఇక నాలుగో స్థానంలో సౌతాఫ్రికాకు చెందిన గ్రేమ్ పొలాక్, ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా అలెన్ బోర్డర్, విండీస్ గ్రేట్ సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్, ఆసీస్ ఆడం గిల్క్రిస్ట్లకు చోటు ఇచ్చాడు వసీం జాఫర్. ఇక బౌలింగ్ విభాగంలో ముగ్గురు సీమర్లు వసీం అక్రం(పాకిస్తాన్), జహీర్ ఖాన్(టీమిండియా)తో పాటు మిచెల్ జాన్సన్/చమిందా వాస్/ట్రెంట్ బౌల్ట్‌లలో ఒకరిని ఎంచుకుంటానని తెలిపాడు. కెప్టెన్‌గా ఆసీస్ లెజెండ్ ఈ జట్టులో ఒకే స్పిన్నర్, టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా స్థానం ఇచ్చాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా అలెన్ బోర్డర్‌ను ఎంచుకున్న వసీం జాఫర్.. వికెట్ కీపర్‌గా గిల్‌క్రిస్ట్‌కు అవకాశం ఇచ్చాడు. ఇక ఈ జట్టులోని ఓపెనర్లు హెడెన్, సంగక్కర టెస్టుల్లో వరుసగా 8,625, 12, 400 పరుగులు సాధించారు. అదే విధంగా.. లారా 11,953 రన్స్ స్కోరు చేయడంతో పాటు.. ఫస్ల్‌క్లాస్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో 501 రన్స్ నాటౌట్, టెస్టుల్లో 400 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆల్‌టైమ్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇక పొలాక్ ఆడింది కేవలం 23 టెస్టులే అయినా.. అతడి సగటు 60.97. మరోవైపు.. కెప్టెన్ అలెన్ బోర్డర్ టెస్టుల్లో 11,174 పరుగులతో ఓవరాల్‌గా పదకొండవ స్థానంలో ఉన్నాడు. మిగిలిన వాళ్లలో గ్యారీఫీల్డ్ సోబర్స్ ఎనిమిది వేలకు పైగా పరుగులతో పాటు.. 235 వికెట్లు తీసి సత్తా చాటాడు. వికెట్ కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్ 47.60 సగటు కలిగి ఉండటంతో పాటు ఏకంగా 416 డిస్మిసల్స్లో భాగమయ్యాడు.వసీం జాఫర్ లెఫ్టాండర్స్ అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్మాథ్యూ హెడెన్, కుమార్ సంగక్కర, బ్రియన్ లారా, గ్రేమ్ పొలాక్, అలెన్ బోర్డర్(కెప్టెన్), గ్యారీఫీల్డ్ సోబర్స్, ఆడం గిల్‌క్రిస్ట్, వసీం అక్రం, జహీర్ ఖాన్, మిచెల్ జాన్సన్/చమిందా వాస్/ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ యాదవ్.ఇక వన్డే జట్టు విషయానికొస్తే.. మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా), సనత్ జయసూర్య(శ్రీలంక), కుమార్ సంగక్కర(శ్రీలంక- వికెట్ కీపర్), బ్రియన్ లారా(కెప్టెన్), యువరాజ్ సింగ్(టీమిండియా ఆల్‌రౌండర్), మైకేల్ బెవాన్(ఆస్ట్రేలియా), వసీం అక్రం(పాకిస్తాన్), జహీర్ ఖాన్(టీమిండియా), కుల్దీప్ యాదవ్(టీమిండియా)లను వసీం జాఫర్ ఎంపిక చేసుకున్నాడు. అన్నట్లు ఆగష్టు 13న లెఫ్టాండర్స్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వసీం జాఫర్ ఈ టీమ్స్‌ను సెలక్ట్ చేశాడన్నమాట!చదవండి: కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన రోహిత్ శర్మ -
భారత బౌలింగ్ కోచ్ రేసులో జహీర్ ఖాన్? (ఫొటోలు)
-
టీమిండియా బౌలింగ్ కోచ్ రేసులో ఊహించని పేరు! జహీర్ కాదంటే..
టీమిండియా కొత్త కోచ్ గౌతం గంభీర్ సహాయక సిబ్బందిలో ఎవరెవరికి చోటు దక్కనుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. గంభీర్ స్వయంగా బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడనే వార్తల నడుమ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే వ్యక్తి ఇతడేనంటూ కొత్త పేరు తెరమీదకు వచ్చింది.టీ20 ప్రపంచకప్-2021 నుంచి టీ20 ప్రపంచకప్-2024 దాకా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. పొట్టి ప్రపంచకప్ గెలిచి తన బాధ్యతలకు ఘనంగా వీడ్కోలు పలికాడు ద్రవిడ్.ఈ క్రమంలో 2007, 2011 వరల్డ్‌కప్ విన్నర్ గౌతం గంభీర్‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌ల పదవీకాలం కూడా ముగిసిన విషయం తెలిసిందే.వీరి స్థానంలో గంభీర్ తనకు నచ్చిన వాళ్లను ఎంపిక చేసుకుంటాడని, ఈ విషయంలో బీసీసీఐ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చిందనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్(సౌతాఫ్రికా), అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్(కేకేఆర్‌లో గౌతీ సహచరుడు), బౌలింగ్ కోచ్‌గా వినయ్ కుమార్‌ను గౌతీ ఎంచుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.అయితే, తాజాగా ఇందుకు సంబంధించి మరో కొత్త వార్త వినిపిస్తోంది. వార్తా సంస్థ ANI అందించిన వివరాల ప్రకారం.. బౌలింగ్ కోచ్ విషయంలో బీసీసీఐ తమ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.ఫాస్ట్ బౌలర్ వినయ్ కుమార్‌కు బదులు మరో దిగ్గజ పేసర్, గంభీర్‌తో కలిసి ఆడిన జహీర్ ఖాన్ వైపు బోర్డు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ప్రపంచకప్ జట్టులో సభ్యుడైన ఈ ముంబై బౌలర్ కోచ్ అయితే జట్టుకు ప్రయోజనకంగా ఉంటుందని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ జహీర్ ఖాన్ ఇందుకు సుముఖంగా లేకపోతే.. లక్ష్మీపతి బాలాజీ పేరును కూడా బోర్డు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వినయ్ కుమార్ విషయంలో మాత్రం కరాఖండిగా నో చెప్పినట్లు బీసీసీఐ వర్గాలు ANIతో పేర్కొన్నాయి.కాగా టీమిండియా తరఫున 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడిన జహీర్ ఖాన్.. ఆయా ఫార్మాట్లలో 311, 282, 17 వికెట్లు తీశాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ రికార్డు సాధించాడు.ఇక చెన్నైకి చెదిన లక్ష్మీపతి బాలాజీ అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 43 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 8 టెస్టులు, 30 వన్డేలు, 5 టెస్టులాడి ఆయా ఫార్మాట్లలో 27, 34, 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా బాలాజీ బౌలింగ్ కోచ్ రేసులోకి రావడం విశేషం. ఇక బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ ఊహాగానాలకు తెరపడదు. -
హెడ్‌కోచ్‌గా గంభీర్.. బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్ బెటర్!
‘‘గంభీర్ పట్టిందల్లా బంగారమే అవుతుంది. అతడు ఏ జట్టుతో చేరితే.. ఆ జట్టు విజయాలు సాధిస్తుంది. అసలు టీమిండియాకు విదేశీ కోచ్‌ల అవసరమే లేదు.ఇండియాలోనే ఎంతో మంది ప్రతిభావంతులైన కోచ్‌లు ఉన్నారు. ద్రవిడ్ తర్వాత.. భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్ కంటే అత్యుత్తమ ఆప్షన్ ఇంకొకటి ఉంటుందనుకోను.అతడొక అద్భుతమైన ఆటగాడు. గొప్ప కోచ్ కూడా కాగలడు. ప్రస్తుతం టీమిండియాకు హెడ్ కోచ్‌గా అతడే సరైనోడు. గంభీర్ తొలుత లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా ఉన్నాడు.అతడి మార్గ నిర్దేశనంలో లక్నో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. తర్వాత కేకేఆర్‌కు మెంటార్‌గా వెళ్లాడు. ఆ జట్టు ఏకంగా చాంపియన్‌గా నిలిచింది.గంభీర్‌ది అత్యద్భుతమైన క్రికెటింగ్ మైండ్. ప్రత్యర్థి జట్టును కచ్చితంగా అంచనా వేసి అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించడంలో దిట్ట. తనతో కలిసి ఆడిన అనుభవం నాకుంది.కలిసే భోజనం చేసేవాళ్లం. ఆట గురించి చర్చించుకునే వాళ్లం. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య స్నేహ బంధం ఉంది. టచ్‌లోనే ఉంటాం’’ అని పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ అన్నాడు.భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మాత్రమే సరైన ఆప్షన్ అని నొక్కి వక్కాణించాడు. అతడి మార్గదర్శనంలో టీమిండియా మరింత పటిష్టంగా మారుతుందని కమ్రాన్ అక్మల్ పేర్కొన్నాడు.బౌలింగ్ కోచ్‌గా వారిలో ఒకరు బెటర్ఇక గంభీర్ ప్రధాన కోచ్‌గా ఉంటే.. ఆశిష్ నెహ్రా లేదంటే జహీర్ ఖాన్లలో ఒకరిని బీసీసీఐ తమ బౌలింగ్ కోచ్‌గా ఎంచుకోవాలని సూచించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ కమ్రాన్ అక్మల్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్నాడు. ఈ నేపథ్యంలో అతడి వారసుడిగా గౌతం గంభీర్ ఎంపిక దాదాపుగా ఖాయమైపోయింది.మెంటార్‌గా మాత్రమేఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు మెంటార్‌గా పనిచేశాడు గౌతీ. అయితే, కోచ్‌గా మాత్రం అతడికి అనుభవం లేదు. ఇక వరల్డ్‌కప్ టోర్నీలో విజయ వంతంగా ముందుకు సాగుతున్న టీమిండియా గురువారం సూపర్-8 దశలో తొలి మ్యాచ్ ఆడనుంది. అఫ్గనిస్తాన్‌తో బార్బడోస్ వేదికగా తలపడనుంది. -
టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు భార్య అనుష్కతో కోహ్లి చక్కర్లు.. ఫొటోలు వైరల్
-
Gudi Padwa 2024: భార్యతో కలిసి గుడిపడ్వా సెలబ్రేషన్స్‌లో జహీర్ ఖాన్ (ఫోటోలు)
-
Ind vs Eng: ఛాన్స్ ఇస్తే ఇలాగేనా ఆడేది?.. వేటు తప్పదు!
Ind vs Eng Test series 2024: ఇంగ్లండ్‌తో టెస్టుల్లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆట తీరును భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ విమర్శించాడు. వరుసగా అవకాశాలు ఇచ్చినా.. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తొందరపాటు చర్యలతో అనవసరంగా వికెట్ పారేసుకుంటున్నాడని జహీర్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు రంజీ ట్రోఫీ-2024లో ఆడిన ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు. కానీ తొలి రెండు టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. హైదరాబాద్‌లో కేవలం 48 పరుగులకే పరిమితమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... విశాఖపట్నంలోనూ వైఫల్యాన్ని కొనసాగించాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 56 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ రెండు సందర్భాల్లోనూ ఒక్కసారి కూడా జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్.. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ తీరును విమర్శిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగే సత్తా ఉండి కూడా అనసరపు షాట్లకు పోయి విశాఖలో వికెట్ సమర్పించుకున్నాడంటూ పెదవి విరిచాడు. ఎందుకంత తొందర? ‘‘జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు మనం ఎలాంటి పాత్ర పోషించాలన్న అంశం మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. శ్రేయస్ అయ్యర్ మాత్రం ఇవేమీ పట్టనట్టు కనిపించాడు. ఆండర్సన్ అప్పటికే తన స్పెల్ పూర్తి చేశాడు. ప్రత్యర్థి జట్టులో ఒక్క ఫాస్ట్ బౌలర్ మాత్రమే ఉన్నాడు. అతడి తర్వాత స్పిన్నర్లు అటాకింగ్‌కు వస్తారని తెలుసు. నిజానికి అయ్యర్ స్పిన్ ఆడటంలో టాప్ క్లాస్ బ్యాటర్. అయినా కూడా.. తొందరపడ్డాడు. స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించాలనే తొందరలో తనకు మేనేజ్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు ఆదుకోలేకపోయాడు’’ అని జహీర్ ఖాన్ అయ్యర్‌కు చురకలు అంటించాడు. వేటు తప్పదు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి తిరిగి వస్తే ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టుల్లో సెలక్టర్లు శ్రేయస్‌కు ఉద్వాసన పలకడం ఖాయమని జహీర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా గతేడాది కాలంగా టెస్టుల్లో శ్రేయస్ అయ్యర్ ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేకపోయాడు. వరుస అవకాశాలు ఇస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఇక విశాఖపట్నం మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి ఆరంభమే అందుకున్నా ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్లీ బౌలింగ్‌లో తొందరపడి వికెట్ పారేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా- ఇంగ్లండ్ ప్రస్తుతం చెరో విజయంతో 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. చదవండి: SAT20 League 2024: సన్‌రైజర్స్ పేసర్ సంచలనం.. ఫైనల్ చేరిన డిఫెండింగ్ చాంపియన్ -
Ind vs Eng: టీమిండియా గెలిచింది... కానీ అదొక్కటే సమస్య!
India vs England, 2nd Test: ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో గెలుపొంది ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది టీమిండియా. విశాఖపట్నం మ్యాచ్‌ను విజయంతో ముగించి.. హైదరాబాద్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. దీంతో టీమిండియాకు కాస్త ఊరట లభించినట్లయింది. అయితే, రెండో టెస్టులో గెలుపుతో జోరు మీదున్న రోహిత్ సేన తదుపరి మ్యాచ్‌లో మరింత జాగ్రత్తగా ఆడాలని భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ హెచ్చరించాడు. ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యం ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశాడు. గెలిచాం కానీ.. అదొక్కటే ఆందోళనకరం ఈ మేరకు జియో సినిమా షోలో భాగంగా రెండో టెస్టులో భారత బ్యాటర్ల ఆట తీరును విశ్లేషిస్తూ.. ‘‘సిరీస్‌లో అప్పటికే ఒక మ్యాచ్ ఓడి వెనుకబడి ఉన్నపుడు... దానిని కచ్చితంగా 1-1తో సమం చేయాలనే కసి, దూకుడు కనిపించాలి. నాకు తెలిసి ప్రతి ఒక్క ఆటగాడి నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టేందుకు రోహిత్ కృషి చేశాడు. అయితే, మన బ్యాటింగ్ ఆర్డర్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఇలాంటి పిచ్‌ల మీద.. మనవాళ్లు ఇంతకంటే ఎన్నో రెట్లు మెరుగ్గా బ్యాటింగ్ చేయడం మనం చూశాం. ఇంగ్లండ్ సమిష్టిగా ఆడింది నిజానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా బ్యాటింగ్ చేసింది. కేవలం ఒక్క ఆటగాడు మాత్రమే అర్ధ శతకం బాదినా.. 300 పరుగుల స్కోరుకు చేరువైంది. జట్టుగా ఆడటం వల్ల వచ్చిన ఫలితం అది. అయితే, టీమిండియా తరఫున రెండు అద్భుతమైన ఇన్నింగ్స్ చూడటం మనకు భారీ ఊరటనిచ్చే అంశం. యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ గొప్ప ఇన్నింగ్స్ ఆడారు. ఏదేమైనా మన బ్యాటర్లు మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది’’ అని జహీర్ ఖాన్ విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ(209)తో మెరవగా.. శుబ్‌మన్ గిల్ శతకం(104) బాదాడు. ఇక టీమిండియా ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్టు మొదలుకానుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఇందుకు వేదిక. టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు ►టీమిండియా స్కోరు(తొలి ఇన్నింగ్స్): 396-10 (112 ఓవర్లలో) ►ఇంగ్లండ్ స్కోరు(తొలి ఇన్నింగ్స్): 253-10 (55.5 ఓవర్లలో) ►టీమిండియా స్కోరు(రెండో ఇన్నింగ్స్): 255-10 (78.3 ఓవర్లలో) ►ఇంగ్లండ్ విజయ లక్ష్యం: 399 రన్స్ ►లక్ష్యాన్ని ఛేదించలేక 292 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌట్ ►విజేత: 106 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా చదవండి: Ind vs Eng: అలాంటి పిచ్‌లు అవసరమా అన్న గంగూలీ.. ద్రవిడ్ కౌంటర్! -
రజత్ పాటిదార్ అరంగేట్రం.. జహీర్ చేతుల మీదగా! ఫోటోలు వైరల్
మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ టీమిండియా తరపున టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశాడు. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత తుది జట్టులో పాటిదార్ చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత్ తరపున టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన 310 ఆటగాడిగా రజత్ నిలిచాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ చేతుల మీదగా పటిదార్ క్యాప్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆల్ ది బెస్ట్ రజత్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా రజత్ పాటిదార్‌కు దేశీవాళీ క్రికెట్లో ఘనమైన రికార్డు ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 55 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్.. 4000 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు నిరాశ ఎదురైంది. తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్.. అంతర్జాతీయ అరంగేట్రం కోసం మరి కొంత కాలం వేచి చూడల్సిందే. తుది జట్లు: భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్ Congratulations to Rajat Patidar who is all set to make his Test Debut 👏👏 Go well 👌👌#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/FNJPvFVROU — BCCI (@BCCI) February 2, 2024 -
'రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్.. ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తాడు'
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్న ఇరు జట్లు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో చెమటోడ్చుతున్నాయి. అయితే టెస్టు సిరీస్‌కు ఆరంభానికి ముందే ఇరు జట్లు ఊహించని షాక్‌లు తగిలాయి. ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్ టెస్టు సిరీస్ నుంచి వైదొలగగా.. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇక తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ వ్యక్తిగత ప్రదర్శనతో పాటు కెప్టెన్‌గా కూడా రాణిస్తాడని జహీర్ థీమా వ్యక్తం చేశాడు. "రోహిత్ శర్మ అద్భుతమైన నాయకుడు. జట్టులోని ప్రతీ ఆటగాడికి మద్దతుగా ఉంటాడు. రోహిత్ తన కెప్టెన్సీతో మొత్తం జట్టును ప్రభావితం చేస్తాడు. అదే అతడి కెప్టెన్సీలో స్పెషల్ క్వాలిటీ. అతడు ఇప్పటికే తన కెప్టెన్సీని నిరూపించుకున్నాడు. వరల్డ్‌కప్‌లో అతడు జట్టును నడిపించిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌లో కూడా అదే పంథాలో జట్టును నడిపిస్తాడు. రోహిత్ ఈ సిరీస్‌లో కెప్టెన్సీ పరంగానే కాకుండా బ్యాట్‌తో కూడా రాణిస్తాడు. ఇప్పటికే ఇంగ్లండ్‌పై ఎన్నో అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. కాబట్టి ప్రస్తుత సిరీస్‌లో కూడా రోహిత్ తన మార్క్ చూపిస్తాడని ఆశిస్తున్నానని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జహీర్ పేర్కొన్నాడు. చదవండి: Jasprit Bumrah: 'బజ్‌బాల్‌తో నాకు సంబంధం లేదు.. ఏమి చేయాలో నాకు తెలుసు' -
పంత్ తిరిగొచ్చి ఐపీఎల్లో అదరగొట్టినా.. టీమిండియాలో చోటు కష్టం
T20 WC 2024- Rishabh Pant: రిషభ్ పంత్ టీమిండియా పునరాగమనం గురించి భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్ జట్టులోకి తిరిగి వచ్చినా.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో మాత్రం అతడికి చోటు దక్కడం కష్టమన్నాడు. కాగా డిసెంబరు 30, 2022లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న ఈ వికెట్ కీపర్.. ఫిట్నెస్ సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 సీజన్ ఆరంభం నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా పంత్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ తాజా ఎడిషన్ ముగిసిన తర్వాత అంటే.. జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్-2024 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రదర్శనను బట్టే బీసీసీఐ సెలక్టర్లు.. వరల్డ్‌కప్ ఆడే భారత జట్టును ఎంపిక చేయనున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్‌లో టీమిండియా వికెట్ కీపర్ ఎవరన్న అంశంపై బోర్డు ఇప్పటికీ నిర్ణయానికి రాలేకపోతోంది. ఇషాన్ కిషన్‌కు బీసీసీతో విభేదాలు తలెత్తాయన్న తరుణంలో.. ఇటీవల అఫ్గనిస్తాన్‌తో ముగిసిన సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో జితేశ్ శర్మ, సంజూ శాంసన్‌లకు స్వదేశంలో జరిగిన ఈ టీ20 సిరీస్ ఆడే అవకాశం దక్కింది. అయితే, పంత్ తిరిగి వస్తే వీరి భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ పేసర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. టీ20 జట్టులో పంత్ పునరాగమనం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘రిషభ్ పంత్ జీవితంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ ఆటగాడిగా ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం అంత సులువేమీ కాదు. పంత్ తిరిగి మైదానంలో అడుగుపెడితే అందరికీ సంతోషమే. కఠిన సవాళ్లను దాటి ఇక్కడిదాకా చేరుకున్నాడు. అయితే, ప్రస్తుతం తను పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించడమే అన్నికంటే ముఖ్యం. ఆతర్వాత రెగ్యులర్‌గా క్రికెట్ ఆడాలి. ఆటలో మునుపటి లయను అందుకోవాలి. దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత కమ్‌బ్యాక్ ఇవ్వడం అది కూడా అంతటి ఘోర ప్రమాదం తర్వాత పూర్తిగా కోలుకుని తిరిగి రావడం అంటే కష్టంతో కూడుకున్న పనే.. ఇవన్నీ ఆలోచిస్తే గనుక.. పంత్ ఐపీఎల్లో అద్భుతంగా ఆడినా.. సెలక్టర్లు అతడిని టీ20 ప్రపంచకప్-2024 జట్టులో ఆడించే రిస్క్ చేస్తారని అనుకోవడం లేదు’’ అని జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. చదవండి: చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు, బ్యాటర్లు.. తొలిరోజే 302 రన్స్ ఆధిక్యం! తిలక్ రీ ఎంట్రీతో.. -
సౌతాఫ్రికా వెన్ను విరిచిన బుమ్రా.. టెస్టుల్లో 4 అరుదైన రికార్డులు
Ind vs SA 2nd Test Day 2: Jasprit Bumrah Records: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం రెండు వికెట్లకే పరిమితమైన ఈ స్పీడ్‌స్టర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. న్యూలాండ్స్ పిచ్ మీద 63/3 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆతిథ్య ప్రొటిస్ జట్టుకు బుమ్రా ఆరంభం నుంచే చుక్కలు చూపించాడు. ముందు రోజు ట్రిస్టన్ స్టబ్స్ రూపంలో వికెట్ దక్కించుకున్న బుమ్రా.. రెండో రోజు ఆట మొదలైన తొలి ఓవర్లో(17.6వ ఓవర్)నే డేవిడ్ బెడింగ్‌హామ్‌ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. ఆ తర్వాత మరో నాలుగు ఓవర్ల అనంతరం కైలీ వెరెనెను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం మార్కో జాన్సెన్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసిన ఈ రైటార్మ్ పేసర్.. కేశవ్ మహరాజ్ వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకుని ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఈ క్రమంలో లుంగి ఎంగిడీని అవుట్ చేసిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగించిన బుమ్రా ఖాతాలో ఆరో వికెట్ జమైంది. ఈ నేపథ్యంలో.. సౌతాఫ్రికాతో రెండో టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా నాలుగు అరుదైన రికార్డులు సాధించాడు. అవేంటంటే.. 1. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ 2. SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్. 3. సౌతాఫ్రికాలో అత్యధికసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రెండో భారత బౌలర్. 4. న్యూలాండ్స్ పిచ్ మీద టెస్టుల్లో అత్యధిక వికెట్లు కూల్చిన రెండో బౌలర్(ఏకైక భారత బౌలర్). బుమ్రా కంటే ముందు ఈ ఘనతలు సాధించిన బౌలర్లు 1. సౌతాఫ్రికాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్లు 45 - అనిల్ కుంబ్లే 43 - జవగళ్ శ్రీనాథ్ 38* - జస్ప్రీత్ బుమ్రా 35 - మహ్మద్ షమీ 30 - జహీర్ ఖాన్. ⭐⭐⭐⭐⭐ A 5-star performance from #JaspritBumrah in the 2nd innings, as he picks up his 4th witcket of the morning! Will his 9th Test 5-fer lead to a historic win for #TeamIndia? Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hjDyvSAJc3 — Star Sports (@StarSportsIndia) January 4, 2024 2. SENA దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్లు 7 - కపిల్ దేవ్ 6 - భగవత్ చంద్రశేఖర్ 6 - జహీర్ ఖాన్ 6 - జస్ప్రీత్ బుమ్రా. 3. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్స్ తీసిన భారత బౌలర్లు 3 - జవగళ్ శ్రీనాథ్ 3 - జస్ప్రీత్ బుమ్రా 2 - వెంకటేష్ ప్రసాద్ 2 - ఎస్ శ్రీశాంత్ 2 - మహ్మద్ షమీ. 4. న్యూలాండ్స్ పిచ్(కేప్‌టౌన్) మీద అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్లు 25 - కొలిన్ బ్లైత్ (ఇంగ్లండ్) 18 - జస్ప్రీత్ బుమ్రా (భారత్)(న్యూలాండ్స్ పిచ్ మీద ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్) 17 - షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) 16 - జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్) 15 - జానీ బ్రిగ్స్ (ఇంగ్లండ్) బుమ్రా ధాటికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రాకు ఆరు వికెట్లు దక్కగా.. ముకేశ్ కుమార్ రెండు, ప్రసిద్ కృష్ణ, సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు. -
రెండ్రోజులు అక్కడే పెట్టిన అరటిపండును శ్రీశాంత్ తిన్నాడు! ఆఖరికి లోదుస్తులు కూడా..
Sreesanth Once Ate Two-Day Old Banana: ‘మానే కాక(రమేశ్ మానే) అప్పట్లో టీమిండియాతో ప్రయాణించేవాడు. మసాజ్ చేయడంతో పాటుగా పూజలు కూడా చేస్తుండేవాడు. నిజానికి శ్రీశాంత్‌కు ‘మూఢనమ్మకాలు’ ఎక్కువ. తనలాంటి ఫాస్ట్బౌలర్ను నేనైతే ఎప్పుడూ చూడలేదు. మానే కాక.. పూజ సమయంలో అగర్బత్తీలను అరటిపండుకు కుచ్చి నిలబెట్టేవాడు. రెండ్రోజులైనా అదే తిన్నాడు అయితే, శ్రీశాంత్ నమ్మకాల గురించి తెలిసిన ఓ క్రికెటర్ అతడిని ఆటపట్టించాలని భావించాడు. శ్రీశాంత్.. నువ్వు గనుక ఇప్పటికిప్పుడు అరటిపండు తింటే ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీస్తావు తెలుసా అని ఊరించాడు. అప్పటికే ఆ అగర్బత్తీలు పెట్టిన అరటిపండు అక్కడ పెట్టి రెండ్రోజులు అయింది. అయినా శ్రీశాంత్ దానిని తిన్నాడు. వికెట్లు తీయాలనే కోరికతో అలా చేశాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. భారత మాజీ పేసర్ శ్రీశాంత్ గురించి చెప్పుకొచ్చాడు. జియో సినిమా షోలో భాగంగా.. టీమిండియా ఆటగాళ్ల వింత నమ్మకాల గురించి ప్రస్తావన రాగా 2006 నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. అందుకే అలా చేశాడు కాగా నాడు ఆ అరటిపండు తిన్న శ్రీశాంత్ అప్పటి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఐదు వికెట్లు తీశాడు. జమైకాలో వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగా మొత్తంగా 49 పరుగులు ఇచ్చి ఈ మేరకు వికెట్లు పడగొట్టాడు. వాళ్లైతే ఆఖరికి లోదుస్తులు కూడా ఇక ఇదే షోలో పాల్గొన్న టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. భారత క్రికెటర్లలో చాలా మందికి ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు. రంజీ ఆడే రోజుల్లో కొంతమంది ఏదైనా ఒకరోజు ఐదు వికెట్లు తీస్తే.. ఆ బట్టలు.. ఆఖరికి లోదుస్తులు కూడా ఉతక్కుండా ఉంచుకునే వాళ్లని తెలిపాడు. అదృష్టం తమతో పాటు అలాగే అతుక్కుపోవాలని ఇలా చేసే వాళ్లని చెప్పుకొచ్చాడు. శ్రీశాంత్ ఒక్కడికే కాకుండా చాలా మందికి ఇలాంటి నమ్మకాలు ఉంటాయని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా కేరళకు చెందిన శ్రీశాంత్ ప్రస్తుతం జింబాబ్వే ఆఫ్రో టీ10లీగ్‌తో బిజీగా ఉన్నాడు. చదవండి: ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఇంత మొండితనం పనికిరాదు! -
'కోహ్లి వల్లే జహీర్ కెరీర్‌కు ముగింపు'.. మాజీ క్రికెటర్ క్లారిటీ
టీమిండియా మాజీ కెప్టెన్.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ గురించి వంక పెట్టాల్సిన పని లేదు. మైదానంలో పాదరసంలా కదిలే కోహ్లి ఎన్నోసార్లు స్టన్నింగ్ క్యాచ్‌లు తీసుకున్నాడు. ఎక్కువ సందర్భాల్లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన కోహ్లి కొన్నిసార్లు క్యాచ్‌లు వదిలేశాడు. అందులో అమూల్యమైన క్యాచ్‌లు కూడా ఉన్నాయి. సోమవారం వెస్టిండీస్‌తో ముగిసిన రెండో టెస్టులో సిరాజ్ బౌలింగ్‌లో కోహ్లి ఒక సింపుల్ క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ సందర్భంగా రెండో టెస్టుకు కామెంటేటర్లుగా వ్యవహరించిన ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్లు 2014లో కోహ్లి మిస్ చేసిన క్యాచ్ గుర్తుచేసుకున్నారు. కోహ్లి వల్లనే తన టెస్టు కెరీర్ ముగిసిపోయిందని జహీర్ అన్నట్లు ఇషాంత్ పేర్కొన్నాడు. ఇషాంత్ మాట్లాడుతూ.. ''2014లో మేము న్యూజిలాండ్ పర్యటనకు వచ్చాం. బేసిన్ రిజర్వ్ బ్యాక్ వేదికగా జరిగిన టెస్టులో మూడో రోజు ఆటలో మెక్కల్లమ్ ట్రిపుల్ సెంచరీతో మెరిశాడు. అయితే జహీర్ ఖాన్ బౌలింగ్‌లో కోహ్లి 9 పరుగుల వద్ద మెక్కల్లమ్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడవడంతో బతికిపోయిన మెక్కల్లమ్ ఆ తర్వాత 300 పరుగులు బాదాడు. దీంతో కోహ్లి.. ''ఇదంతా తన వల్లే'' అంటూ తెగ ఫీలయ్యాడు. లంచ్ విరామం సమయంలో జహీర్ వద్దకు వచ్చిన కోహ్లి సారీ చెప్పాడు. దీనికి జహీర్ బదులిస్తూ.. ''ఏం పర్లేదు తర్వాతి బంతికి ఔట్ చేద్దాం'' అని పేర్కొన్నాడు. టీ విరామ సమయంలో కోహ్లి మరోసారి జహీర్‌కు సారీ చెప్పగా.. ''నా కెరీర్ నీ వల్లే ముగిసిపోనుంది'' అంటూ బాంబు పేల్చాడు. అయితే ఇషాంత్ వ్యాఖ్యలను తప్పుబట్టిన జహీర్ వివరణ ఇచ్చుకున్నాడు. ''నా కెరీర్ నీవల్లే ఎండ్ అయిందని నేను అనలేదు. ఇషాంత్ నా వ్యాఖ్యలను వక్రీకరించాడు(నవ్వుతూ). ఇంతవరకు టీమిండియా ఆడిన టెస్టుల్లో 300 పరుగులు చేసిన ఆటగాడి క్యాచ్‌లను ఇద్దరే మిస్ చేశారు. మొదట కిరణ్ మోరే క్యాచ్ జారవిడవడంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ గ్రహం గూచ్ ట్రిపుల్ సెంచరీ చేశాడు. కిరణ్ మోరే తర్వాత ఆ ఘనత సాధించింది కోహ్లినే. 9 పరుగుల వద్ద మెక్కల్లమ్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి జారవిడవడంతో అతను ట్రిపుల్ సెంచరీ చేశాడు. అందుకే నా కెరీర్ నీవల్లే ఎండ్ కాబోతుంది అంటూ జోక్ చేశాను. కానీ కోహ్లి మాత్రం ప్లీజ్ అలా అనొద్దు.. నాకు చాలా బాధగా ఉంది.. కానీ క్యాచ్ జారవిడవడం వల్ల పరుగులు వచ్చేశాయి. అని అన్నాడు. దీంతో నేను పర్లేదు.. ఈ విషయాన్ని ఇక్కడితో మరిచిపో అంటూ కోహ్లికి సర్ది చెప్పాను.'' అంటూ జహీర్ ఖాన్ తెలిపాడు. ఇక అప్పటి మ్యాచ్‌లో జహీర్ ఖాన్ ఐదు వికెట్లు తీసినప్పటికి 51 ఓవర్లలో 170 పరుగులు ఇచ్చుకున్నాడు. మెక్కల్లమ్ 302 పరుగులు, బీజే వాట్లింగ్, జేమ్స్ నీషమ్‌లు సెంచరీలతో చెలరేగారు. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 680 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో(105 పరుగులు) మెరిసినప్పటికి మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: Lionel Messi: 'మెస్సీని చూసేందుకు 808 మేకలు'.. అద్బుతాన్ని చూసి తీరాల్సిందే -
యాదృచ్ఛికమో లేక విచిత్రమో.. ఈ ఇద్దరు టీమిండియా మాజీ పేసర్లు..!
జెంటిల్మెన్ గేమ్ క్రికెట్లో ఒకరితో ఒకరికి సరిపోలిన గణాంకాలు ఉండటం సర్వ సాధారణం. ఉదాహరణకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సాధించిన కొన్ని రికార్డులను ప్రస్తుత టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అచ్చం అదే తరహాలో సాధించడం మనం చూశాం. ఇలాంటి సరిపోలిన ఘటనలు క్రికెట్లో కోకొల్లలు. అయితే ఇప్పుడు మనం చూడబోయే సరిపోలిన గణాంకాలను మాత్రం క్రికెట్ అభిమానులు కనివినీ ఎరిగి ఉండరు. ఇద్దరు భారత బౌలర్లకు సంబంధించి ఒకేలా ఉన్న ఈ గణాంకాలు చూసి జనాలు నివ్వెరపోతున్నారు. కెరీర్లు మిగిసే నాటికి సేమ్ టు సేమ్ ఉన్న గణాంకాలు చూసి అభిమానులు అవాక్కవుతున్నారు. పేస్ బౌలర్లైన జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ.. తమతమ కెరీర్లలో ఒకేలా 311 టెస్ట్ వికెట్లు పడగొట్టారు. ఇద్దరు బౌలర్ల విషయంలో ఇలా జరగడం చాలా కామన్. అయితే ఇద్దరూ 11 సార్లు 5 వికెట్ల ఘనత, ఓసారి 10 వికెట్ల ఘనత సాధించి.. స్వదేశంలో 104 వికెట్లు, ఇతర దేశాల్లో 207 వికెట్లు పడగొట్టి ఉండటం మాత్రం విచిత్రమే. విండీస్‌తో రెండో టెస్ట్ సందర్భంగా జహీర్, ఇషాంత్ హిందీ కామెంట్రీ బాక్స్‌లో ఉండగా.. బ్రాడ్‌కాస్టర్ ఈ గణాంకాలను తెరపైకి తెచ్చాడు. ఇది చూసి జహీర్, ఇషాంత్‌లు సైతం ఆశ్చర్యపోయారు. తమకు కూడా తెలీని ఈ విషయం క్రికెట్ ప్రపంచానికి తెలియజేసినందుకు వారు బ్రాడ్‌కాస్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో.. ఇదెక్కడి విచిత్రం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే ఆఖరి రోజు 8 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. అదే విండీస్ గెలవాలంటే మరో 289 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్లు ఉన్న ఊపును చూస్తే ఇది అంత ఆషామాషీ విషయం కాదని తెలుస్తోంది. ఇప్పటికే తొలి టెస్ట్ గెలిచిన భారత్ 2 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ కూడా గెలిస్తే 2-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తుంది. -
అండర్సన్ కంటే జహీర్ ఖాన్ బెస్ట్ బౌలర్: ఇషాంత్
భారత క్రికెట్లో మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌కు ప్రత్యేక స్ధానం ఉంది. తన అద్భుత బౌలింగ్‌తో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఈ రివర్స్ స్వింగ్ కింగ్ దాదాపు దశాబ్దం పాటు భారత క్రికెట్‌కు తన సేవలు అందించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో 21 వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన జాక్... అన్ని ఫార్మాట్లలో కలిపి 610 వికెట్లు తీసుకున్నాడు. అయితే మరోసారి ఈ దిగ్గజ పేసర్‌పై టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా రణ్వీర్ అల్లాబాడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాంత్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్, జహీర్ ఖాన్‌లో ఎవరు అత్యుత్తమ బౌలర్ అని రణ్వీర్ ప్రశ్నించాడు. అందుకు బదులుగా ఇషాంత్ ఏమీ ఆలోచింకుండా అండర్సన్ కంటే జహీర్ గొప్ప బౌలర్‌ను అని చెప్పుకొచ్చాడు. కాగా అండర్సన్ కూడా ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. తన కెరీర్లో ఇప్పటి వరకు 180 టెస్టులు, 194 వన్డేలు ఆడిన అండర్సన్ వరుసగా 269, 686 వికెట్లు పడగొట్టాడు. అతడి టెస్టు కెరీర్లో ఏకంగా 32 ఫైవ్ వికెట్ల హాల్స్ ఉన్నాయి. "జిమ్మీ అండర్సన్ బౌలింగ్ శైలి కాస్త బిన్నంగా ఉంటుంది. అతడు టాప్ క్లాస్ బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అతడు ఎక్కువ భాగం తన కెరీర్లో ఇంగ్లండ్‌లోనే ఆడాడు. ఇంగ్లండ్ పిచ్‌లకు పేసర్లు అనుకూలిస్తాయి, అదే భారత్‌లో ఆడి వుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. నా వరకు అయితే అండర్సన్ కంటే జాక్(జహీర్ ఖాన్) బెస్ట్ బౌలర్" అని ఇషాంత్ పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్ టూర్‌కు ముందు చాహల్ కీలక నిర్ణయం.. మరో లీగ్‌లో ఆడేందుకు! -
అతడి సేవలను సన్‌రైజర్స్ సరిగ్గా వాడుకోవడం లేదు! కనీస మద్దతు లేకుండా..
IPL 2023 SRH: టీమిండియా యువ సంచలనం, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ సేవలను సన్‌రైజర్స్ హైదరాబాద్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుందని భారత మాజీ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ అన్నాడు. లోపం ఎక్కడ ఉందో అర్థం కావడం లేదని వాపోయాడు. కాగా నెట్ బౌలర్‌గా సన్‌రైజర్స్ జట్టులో చేరిన ఉమ్రాన్.. తన అద్భుతమైన ఆట తీరుతో అనతికాలంలోనే ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. Photo Credit : IPL Website నెట్ బౌలర్‌గా వచ్చి..! ఏకంగా టీమిండియాలో కచ్చితమైన వేగంతో బంతులు విసిరే ఈ స్పీడ్‌స్టర్ ఐపీఎల్-2021 సీజన్లో కేకేఆర్‌తో మ్యాచ్ ద్వారా రైజర్స్ తరఫున అరంగేట్రం చేశాడు. గతేడాది 14 ఇన్నింగ్స్‌లో 22 వికెట్లు పడగొట్టిన అతడు.. అదే ఏడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఉమ్రాన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం ఏడు మ్యాచ్‌లు ఆడిన అతడు 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 29 నాటి మ్యాచ్ తర్వాత అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. కెప్టెన్‌కే తెలియదట ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ మాట్లాడుతూ.. ఉమ్రాన్ ఆడకపోవడం వెనుక కారణమేమిటో తెలియదని వ్యాఖ్యానించాడు. మార్కరమ్ తీరు పలు సందేహాలకు తావిచ్చింది. ఈ క్రమంలో జియో సినిమా షోలో జహీర్ ఖాన్ ఈ విషయంపై స్పందించాడు. ఉమ్రాన్ విషయంలో సన్‌రైజర్స్ ఎందుకిలా?! ‘‘సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ ఉమ్రాన్ సేవలను సరిగ్గా వాడుకోలేకపోతోంది. ఇందుకు కారణమేమిటో మాత్రం తెలియడం లేదు. యువ సీమర్లను జట్టులో ఉంచుకున్నపుడు.. వారికి అవసరమైన సమయంలో అన్ని రకాలుగా మద్దతుగా నిలబడాలి. లోపాలను సరిచేసుకునేందుకు సరైన వ్యక్తితో మార్గదర్శనం చేయించాలి. కానీ దురదృష్టవశాత్తూ ఉమ్రాన్ విషయంలో ఫ్రాంఛైజీ ఇవేమీ చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఈ సీజన్లో అతడి ఆట తీరు, పలు మ్యాచ్‌లకు పక్కన పెట్టిన విధానం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది’’ అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. వాళ్లిద్దరు సూపర్ ఇదిలా ఉంటే.. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, హైదరాబాదీ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పవర్ ప్లేలో అద్భుతాలు చేస్తున్నారని జహీర్ కొనియాడాడు. పెద్దగా కష్టపడకుండా బ్యాటర్లను తిప్పలు పెడుతూ అనుకున్న ఫలితాలు రాబడుతున్నారంటూ షమీ, సిరాజ్‌లను కొనియాడాడు. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లలో 23 వికెట్లు తీసిన షమీ.. పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. ఇక సిరాజ్ 13 మ్యాచ్‌లలో 17 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ ఓడిపోయి పదో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: రూ. 8 కోట్లు పెడితే మధ్యలోనే వదిలివెళ్లాడు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు! ఇది క్రికెట్ షోనా? లేదంటే.. అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ..! సిగ్గుండాలి! -
'సమస్య మళ్లీ మొదటికే.. పరిష్కారం చూపకుంటే ప్రమాదం'
భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ టీమిండియా క్రికెట్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కీలకమైన వన్డే వరల్డ్‌కప్‌కు ముందు అయ్యర్ గాయపడడం.. అవకాశమిచ్చిన సూర్యకుమార్ వరుసగా విఫలం కావడం 2019 ప్రపంచకప్ సీన్‌ను రిపీట్ చేస్తుందన్నాడు. వన్డేల్లో కీలకమైన నాలుగో స్థానంలో కచ్చితమైన పరిష్కారం చూపెట్టకపోతే ప్రమాదం పొంచి ఉందంటూ పేర్కొన్నాడు. జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. ''మెగా ఈవెంట్ జరిగి నాలుగేళ్లు ముగిసింది. ఈ నాలుగేళ్లలో నాలుగో స్థానం కోసం ఎంతోమంది పోటీ పడ్డారు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో మరో వరల్డ్‌కప్ జరగనుంది. కానీ సమస్య మాత్రం అలాగే ఉంది. బ్యాటింగ్ ఆర్డర్‌పై కచ్చితంగా మరోసారి సమీక్షించుకోవాలి. మళ్లీ నాలుగో స్థానంలో ఆడే బ్యాటర్‌ని గుర్తించాలి. ఇదే సమస్య 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో కూడా ఎదురైంది. నాలుగు సంవత్సరాల తర్వాత కూడా మనం అదే సమస్య గురించి మాట్లాడుకుంటున్నాం. నాలుగో స్థానంలో ఆడించేందుకు శ్రేయాస్ అయ్యర్‌ను గుర్తించారని నాకు తెలుసు. అతను ఆ బాధ్యతను కూడా చక్కగా నిర్వర్తించాడు. కానీ అయ్యర్ ప్రస్తుతం గాయం బారిన పడ్డాడు. ఒకవేళ అయ్యర్ గాయం నుంచి కోలుకోకపోతే ఈ సమస్య నుంచి బయటపడడానికి పరిష్కార మార్గాలను వెతకాల్సిన అవసరం ఉంటుంది'' అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఇక అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిధ్యమివ్వనుంది. సొంతగడ్డపై మెగాటోర్నీ జరగనుండడంతో టీమిండియా ఫెవరెట్ హోదాలో బరిలోకి దిగనుంది. 12 ఏళ్ల క్రితం భారత్‌లోనే జరిగిన వన్డే ప్రపంచకప్‌ను ధోని సారధ్యంలోని టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అభిమానుల కలను నెరవేర్చింది. తాజాగా మరోసారి వన్డే ప్రపంచకప్ జరగనుండడంతో ఈసారి కూడా అదే ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం జట్టు పరిస్థితి చూస్తే అనుకున్నంత మెరుగ్గా లేదు. ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్ అందుకు నిదర్శనం. ముఖ్యంగా బ్యాటింగ్‌లో టీమిండియా చాలా మెరుగుపడాల్సి ఉంది. రోహిత్, గిల్, కోహ్లిలు రాణించాల్సిన అవసరం ఉంది. మిడిలార్డర్లో సూర్యకుమార్/శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా అంతంత మాత్రంగానే ఆడుతున్నారు. ఇక ఆల్‌రౌండర్ జడేజా వన్డేల్లో తన ముద్ర చూపించాల్సిన అవసరం ఉంది. షమీ, సిరాజ్, కుల్దీప్లతో బౌలింగ్ మాత్రం కాస్త పటిష్టంగానే కనిపిస్తుంది. వరల్డ్‌కప్ సమయానికి వీరికి బుమ్రా జత కలిస్తే మాత్రం బౌలింగ్‌లో భారత్‌కు తిరుగుండదు. చదవండి: బ్యాటర్ కొంపముంచిన బంతి.. వీడియో వైరల్ NZ Vs SL: పాపం రచిన్ రవీంద్ర! షిప్లే విశ్వరూపం.. 10 ఓవర్లలోనే లంక.. -
అతడి వికెటే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్.. లేదంటేనా?
టీమిండియా స్వదేశంలో నాలుగేళ్ల తర్వాత తొలి సిరీస్ పరాభావాన్ని చవిచూసింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 21 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత జట్టు.. 1-2 తేడాతో సిరీస్‌ను కొల్పోయింది. మార్చి 2019 తర్వాత స్వదేశంలో టీమిండియాకు ఇదే తొలి సిరీస్ ఓటమి. ఇక ఆఖరి వన్డే ఓటమిపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ స్పందించాడు. కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోవడమే ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. కాగా 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్..248 పరుగులుకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో 50 బంతులు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ 32 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లితో కలిసి మూడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని రాహుల్ నెలకొల్పాడు. "ఈ రన్ ఛేజింగ్‌లో టీమిండియా ఎక్కువ భాగం మ్యాచ్‌ను తన కంట్రోల్లోనే ఉంచుకుంది. కానీ కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోవడం మ్యాచ్ ఒక్క సారిగా ఆసీస్ వైపు మలుపు తిరిగింది. అదే సమయంలో అక్షర్ పటేల్ కూడా రనౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో విరాట్‌పై కాస్త ఒత్తిడి పెరిగింది. అందుకే అతడు కాస్త దూకుడుగా ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. చెన్నై లాంటి పిచ్‌పై ఒక్క వికెట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలదు. అయితే మ్యాచ్‌ను మరింత దగ్గరగా తీసుకువెళ్లాలి. అది భారత ఇన్నింగ్స్‌లో కనిపించలేదు. మొదటి నుంచే భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నించారు. అది రాహుల్‌ను చూస్తే అర్దమవుతుంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ అవుట్ అయ్యే ముందు భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నించాడు. అతడు బలవంతంగా షాట్లు ఆడినట్లు తెలుస్తుంది" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: మ్యాచ్ ఓడిపోయినా రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. -
మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే!
మన దేశంలో రెండు వినోద ప్రధానాంశాలు.. క్రికెట్- సినిమా. చాలా మంది క్రికెట్‌ను ఓ మతంలా ఆరాధిస్తే.. సినిమాను ప్రేమించే వాళ్లూ కోకొల్లలు. ఈ రెండిటి మధ్య.. ముఖ్యంగా బాలీవుడ్- క్రికెట్ మధ్య విడదీయరాని అనుబంధం ఉందని ఇప్పటికే ఆయా రంగాల సెలబ్రిటీలు పలువురు నిరూపించారు. ప్రేమ పక్షుల్లా విహరిస్తూ పాపరాజీలకు పని కల్పించిన వారు కొందరైతే.. ప్రణయాన్ని వైవాహిక బంధంగా మార్చుకుని పెళ్లిపీటలెక్కిన వారు మరికొందరు. ఆ జాబితాలో తాజాగా క్రికెటర్ కేఎల్ రాహుల్- బీ-టౌన్ సెలబ్రిటి అతియా శెట్టి జంట కూడా చేరిన విషయం తెలిసిందే. మరి ఈ ‘లవ్‌బర్డ్స్’ కంటే ముందు వివాహ బంధంతో ముడిపడి సక్సెస్ అయిన క్రికెట్- బాలీవుడ్ జోడీలు ఎవరంటే! మన్సూర్ అలీ ఖాన్ పటౌడ్- షర్మిలా ఠాగోర్ భారత క్రికెట్లో లెజండరీ ఆటగాడిగా పేరొందిన మన్సూర్ అలీ ఖాన్ పటౌట్ అలియాస్ టైగర్ పటౌడీ. పిన్న వయసులోనే టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన టైగర్ మనసును గెలుచుకున్న మహరాణి.. షర్మిలా ఠాగోర్. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ఆమె.. టైగర్‌ను పెళ్లాడి నవాబుల కోడలైంది. ఇరు కుటుంబాల అంగీకారంతో 1968లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు ముగ్గురు సంతానం. కుమారుడు సైఫ్ అలీఖాన్, కుమార్తెలు సోహా, సబా. హర్భజన్ సింగ్- గీతా బస్రా భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు భజ్జీ. కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూసిన టర్బోనేటర్.. 2011 ప్రపంచకప్ విజయంలో తన వంతు సాయం చేశాడు. తన ఆటతో అభిమానులను ముగ్ధుల్ని చేసిన ఈ ఆఫ్ స్పిన్నర్.. బాలీవుడ్ నటి గీతా బస్రా కొంటెచూపులకు బౌల్డ్ అయ్యాడు. ది ట్రెయిన్, దిల్ దియా హై వంటి సినిమాల్లో నటించిన గీతను 2015లో పంజాబీ సంప్రదాయంలో అంగరంగవైభవంగా పెళ్లాడాడు. వీరికి కుమార్తె హినయ హీర్ ప్లాహా, కుమారుడు జోవన్వీర్ సింగ్ ప్లాహా సంతానం. యువరాజ్ సింగ్- హాజిల్ కీచ్ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎన్నో రికార్డులు సృష్టించి కెరీర్లో శిఖరాగ్రాలను చూసిన యువరాజ్ సింగ్- నటి హాజిల్ కీచ్ ప్రేమ ముందు మాత్రం తలవంచాడు. క్యాన్సర్ బాధితుడైన యువీని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన హాజిల్.. 2016లో అతడితో కలిసి పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. వీరి ప్రేమకు గుర్తుగా కుమారుడు ఓరియన్ ఉన్నాడు. కాగా సల్మాన్ ఖాన్- కరీనా కపూర్ జంటగా నటించిన బాడీగార్డ్ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా హాజిల్ నటించింది. జహీర్ ఖాన్- సాగరికా ఘట్కే టీమిండియా 2011 వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన లెఫ్టార్మ్ పేసర్ జహీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టెస్టు క్రికెట్లో టీమిండియా తరఫున మూడు వందల వికెట్లు తీసిన జాక్.. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎక్కువగా బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడే జహీర్ ఖాన్.. 2017లో స్వయంగా తనే తన వివాహ ప్రకటన చేశాడు. బాలీవుడ్ నటి సాగరిక ఘట్కేను ప్రేమించి పెళ్లాడనున్నట్లు వెల్లడించాడు. హాకీ నేపథ్యంలో సాగే ‘చక్ దే ఇండియా’ సినిమాలో ప్రీతి పాత్రలో నటించిన అమ్మాయే సాగరిక! విరాట్ కోహ్లి- అనుష్క శర్మ టీమిండియా స్టార్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రేమకథ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ షాంపూ యాడ్‌లో అనుష్కను చూసిన ఈ పరుగుల వీరుడు తన మనసు పారేసుకున్నాడు. తమ బంధాన్ని బాహాటంగానే ప్రకటించిన విరుష్క జోడీ.. దాదాపు ఎనిమిదేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2017 డిసెంబరులో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి దాంపత్యానికి గుర్తుగా కుమార్తె వామిక జన్మించింది. హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్ పాండ్యా.. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం క్యాష్ రిచ్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అరంగేట్ర సీజన్లోనే తమ జట్టును విజేతగా నిలిపి.. భారత జట్టులో పునరాగమనం చేయడంతో పాటుగా భవిష్యత్తు సారథిగా మన్ననలు అందుకుంటున్నాడు. ఇక హార్దిక్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. సెర్బియా మోడల్, బీ-టౌన్ నటి నటాషా స్టాంకోవిక్‌తో ప్రేమలో పడిన అతడు.. 2019లో తనతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు పెళ్లి చేసుకున్న ఈ జంట.. అంతకంటే ముందే కుమారుడు అగస్త్యకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించింది. కాగా నటాషా ప్రకాశ్ ఝా దర్శకత్వం వహించిన సత్యాగ్రహ సినిమాతో నటిగా గుర్తింపు పొందింది. కేఎల్ రాహుల్- అతియా శెట్టి టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్- బాలీవుడ్ వెటరన్ నటుడు సునిల్ శెట్టి గారాల పట్టి అతియా శెట్టితో చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉన్నాడు. 2019లో ప్రేమలో పడ్డ వీళ్లిద్దరు 2021లో తమ బంధం గురించి అందరికీ తెలిసేలా సోషల్ మీడియా వేదికగా ఫొటోలు పంచుకున్నారు. ఇక రాహుల్ బిజీ షెడ్యూల్ కారణంగా వివాహాన్ని వాయిదా వేసుకున్న ఈ జంట.. ఎట్టకేలకు జనవరి 23, 2023లో పెళ్లిపీటలెక్కింది. సునిల్ శెట్టికి చెందిన ఖండాలా ఫామ్‌హౌజ్‌లో వీరి వివాహం అత్యంత సన్నిహితుల నడుమ జరిగింది. ఇదిలా ఉంటే అజాహరుద్దీన్- సంగీత బిజ్లానీ పెళ్లి చేసుకున్నప్పటికీ బంధాన్ని కొనసాగించలేకపోయారు. ఇక రవిశాస్త్రి- అమృతా సింగ్, సౌరవ్ గంగూలీ- నగ్మా, రవిశాస్త్రి- నిమ్రత్ కౌర్ తదితరుల పేర్లు జంటలుగా వినిపించినప్పటికీ వీరి కథ సుఖాంతం కాలేదు. -వెబ్‌డెస్క్ చదవండి: Mohammed Shami: షమీకి ఏడాదికి రూ. 7 కోట్లు! నెలకు 10 లక్షల భరణం ఇవ్వలేరా? కోర్టు కీలక ఆదేశాలు అర్జున్ దగ్గర అన్నీ ఉన్నాయి.. నా దగ్గర నువ్వు ఉన్నావు, చాలు నాన్న: సర్ఫరాజ్ ఖాన్ -
పుణెలోని బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం.. గ్రౌండ్ ఫ్లోర్లో జహీర్ ఖాన్ రెస్టారెంట్
పుణె: మహారాష్ట్రలోని పూణె నగరంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లుల్లా నగర్ చౌక్ ప్రాంతంలోని మార్వెల్ విస్టా భవనం టాప్ ఫ్లోర్‌లోని వెజిటా రెస్టారెంట్లో ఉదయం 8.45 నిమిషాలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేశాయి. మూడు ఫైరింజన్లు, వాటర్ ట్యాంకర్లను రంగంలోకి దింపినట్లు పుణె అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. Fire breaks out at the top floor of Marvel Vista building in Lulla Nagar Chowk in Pune, Maharashtra pic.twitter.com/y2Y9YQTVFu — The Jamia Times (@thejamiatimes) November 1, 2022 ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇందులో మంటల ధాటికి కాలిపోతున రెస్టారెంట్ రూఫ్, కీటికీలు కూలి కిందపడిపోవటం కనిపిస్తోంది. అయితే ఈ ప్రమాద సమమంలో రెస్టారెంట్ మూసివేసి ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించించలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇదే బిల్డింగ్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ కూడా ఉన్నట్లు తెలిసింది. చదవండి: ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిన మంటలు #Pune: Massive fire breaks out inside a home at Marvel Vista, a G+7 storey building in Lullanagar, Kondhwa Two water tankers and three fire brigades responded immediately and reached the spot#PuneFire #Fire pic.twitter.com/81x5aVnaGd — Free Press Journal (@fpjindia) November 1, 2022 -
'ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు.. ఫాస్ట్ బౌలర్ అవ్వు'
టీమిండియాలోకి చాలా మంది ఫాస్ట్ బౌలర్లు వచ్చి వెళ్లారు. కొందరు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటే.. కొంతమంది మాత్రం ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. క్రికెట్‌ను అమితంగా అభిమానించే మన దేశంలో టాప్ క్లాస్ బౌలర్లుగా వెలుగొందిన వారిలో స్పిన్నర్లే ఎక్కువ. స్పిన్నర్లు ఎంత ప్రభావం చూపించినప్పటికి ఒక తరానికి ఒక్కో ఫాస్ట్ బౌలర్ భారత్ పేస్ దళాన్ని నడిపించారు. 1970,80వ దశకంలో కపిల్ దేవ్ లాంటి దిగ్గజ ఆల్‌రౌండర్.. ఇక 90వ దశకంలో జగవల్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్ లాంటి పేసర్లు టీమిండియాను నడిపించారు. ఇక మిలీనియం ఆరంభంలో టీమిండియాలోకి కొత్త బౌలర్ వచ్చాడు. మొదట్లో పెద్దగా రాణించకపోయినప్పటికి గంగూలీ అండతో వరుసగా అవకాశాలు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత దాదాపు దశాబ్దంన్నర కాలం పాటు టీమిండియా బౌలింగ్‌లో పెద్దన్న పాత్ర పోషించాడు. అతనే టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్. క్రికెట్‌పై ఉన్న అభిరుచి అతన్ని ఇంజనీర్ నుంచి క్రికెటర్‌గా మార్చింది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మాజీ లెఫ్టార్మ్ పేసర్, ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని జట్టు 2011 వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. యువతకు రోల్ మోడల్, ఫాస్ట్ బౌలర్ 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో తనదైన ముద్ర వేశాడు. భారత అత్యుత్తమ బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్. ఇవాళ(అక్టోబర్ 8న) తన 44వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇంజనీర్ నుంచి క్రికెటర్‌గా.. జహీర్ ఖాన్ క్రికెటర్ గా మారిన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జహీర్ 1978 అక్టోబర్ 8న మహారాష్ట్రలోని శ్రీరాంపూర్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. మహారాష్ట్రలోని ఒక చిన్న పట్టణానికి చెందిన అతను టీమిండియాలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు. తన ప్రారంభ విద్యను శ్రీరాంపూర్‌లోని హింద్ సేవా మండల్ న్యూ మరాఠీ ప్రాథమిక పాఠశాలలో.. ఆ తర్వాత కేజే సోమయ్య సెకండరీ పాఠశాలలో చదివాడు. తదనంతరం జహీర్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. జహీర్‌కు క్రికెట్‌పై ఉన్న మక్కువ చూసి అతని తండ్రి ఫాస్ట్ బౌలర్‌గా మారమని సలహా ఇచ్చాడు. ''దేశంలో చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు.. నువ్వు ఫాస్ట్ బౌలర్‌గా తయారయ్యి టీమిండియాకు సేవలందించు అని జహీర్ తండ్రి పేర్కొన్నాడు. తండ్రి మాటలను ఆదర్శంగా తీసుకున్న జహీర్ తర్వాత వెనుదిరిగి చూడలేదు. జహీర్ 'జకాస్' అయ్యాడు.. జహీర్ ఖాన్‌ను క్రికెటర్‌గా తయారు చేయాలనే ఉద్దేశంతో అతని తండ్రి ముంబైకి తీసుకొచ్చాడు. ఇక్కడే జహీర్ ఖాన్ 'జాక్' పేరుతో క్రికెట్ కెరీర్ ప్రారంభించాడు. జింఖానా క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో జహీర్ ఏడు వికెట్లు తీసి వార్తల్లో నిలిచాడు. ఇక్కడే జహీర్ ఖాన్ MRF పేస్ ఫౌండేషన్‌కు చెందిన టీఏ శేఖర్ దృష్టిలో పడ్డాడు. తన వెంట జహీర్‌ను చెన్నైకి తీసుకెళ్లాడు. జహీర్ ఫస్ట్ క్లాస్, ఆపై అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టగలిగాడు. 2011 ప్రపంచ కప్ హీరోగా.. అలాగే, 28 ఏళ్ల తర్వాత భారత జట్టు వన్డే ప్రపంచకప్‌ను గెలవడానికి జహీర్ ఖాన్ కూడా ప్రధాన కారణం. 2011 ప్రపంచకప్‌లో టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో జహీర్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రపంచకప్‌లో 21 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్ చరిత్రలో జహీర్ పేరిట మొత్తం 44 వికెట్లు నమోదయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్లో జహీర్ 610 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 311 వికెట్లు..వన్డేల్లో 282 వికెట్లు పడగొట్టిన జహీర్ 17 టి20లు ఆడి 17 వికెట్లు తీశాడు. ✅ The second-highest wicket-taker in international cricket among Indian pace bowlers ✅ India's joint-highest wicket-taker in ODI World Cups#OnThisDay A happy 44th birthday to Zaheer Khan, the pace spearhead who starred in 🇮🇳's 2011 World Cup triumph 🥳 — ESPNcricinfo (@ESPNcricinfo) October 8, 2022 3⃣0⃣9⃣ international games 👍 6⃣1⃣0⃣ international wickets 👌 2⃣0⃣1⃣1⃣ World Cup-winner 🏆 Birthday wishes to the former #TeamIndia speedster @ImZaheer. 🎂 👏 pic.twitter.com/a2ta0LtgWg — BCCI (@BCCI) October 8, 2022 Celebrating Zaheer Khan's birthday 🎊 He was the joint-highest wicket-taker in the 2011 @cricketworldcup, picking up 21 in nine matches at 18.76 👏 WATCH his every wicket from the tournament 📽️ #BowlersMonth pic.twitter.com/Xifpd8UYna — ICC (@ICC) October 7, 2020 -
అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్ ఖాన్: పాక్ మాజీ క్రికెటర్
India Vs South Africa T20 Series 2022: ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్ సింగ్.. వెస్టిండీస్ టూర్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌లో ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలో ఆసియా కప్-2022 టీ20 టోర్నీకి ఎంపికైన ఈ యువ పేసర్.. మెగా టోర్నీలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లో క్యాచ్ నేలపాలు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇక ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్ నేపథ్యంలో విశ్రాంతి తీసుకున్న అర్ష్.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ప్రొటిస్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన అర్ష్‌దీప్ తిరువనంతపురం వేదికగా జరిగిన టీ20లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బంతిని స్వింగ్ చేస్తూ.. సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తద్వారా ప్రొటిస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలకంగా వ్యవహరించి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అర్ష్‌దీప్ సింగ్ మరో జహీర్ ఖాన్ ఇక అదే జోష్‌లో మిగిలి ఉన్న మరో రెండు మ్యాచ్‌లకు సిద్ధమవుతున్నాడు ఈ ఫాస్ట్‌బౌలర్. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ అర్ష్‌దీప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన బౌలర్. నా అభిప్రాయం ప్రకారం టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికేశాడు. అర్ష్‌దీప్ సింగ్ పేస్‌లో వైవిధ్యం.. బంతిని స్వింగ్ చేయగల నైపుణ్యం అతడిని ప్రత్యేకంగా నిలిపాయి. మానసికంగా కూడా తను ఎంతో బలవంతుడు. తన శక్తిసామర్థ్యాలేమిటో అతడికి బాగా తెలుసు. వాటిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో కూడా పూర్తి అవగాహన ఉంది. సౌతాఫ్రికాతో తొలి టీ20లో రీలీ రొసోవ్, డికాక్‌ను అవుట్ చేసిన తీరు బాగుంది. నువ్వు సూపర్ అయితే, డేవిడ్ మిల్లర్ వికెట్ మాత్రం అద్భుతం. ఇన్‌స్వింగర్‌తో అతడిని బోల్తా కొట్టించాడు. ఇంత చిన్న వయసులోనే అర్ష్‌దీప్ రాణిస్తున్న తీరు అమోఘం. టీమిండియాకు జహీర్ ఖాన్ లాంటి లెఫ్టార్మ్ పేసర్ సేవలు అవసరమైన తరుణంలో అతడు వచ్చాడు’’ అంటూ 23 ఏళ్ల అర్ష్‌దీప్ సింగ్‌పై కమ్రాన్ అక్మల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో సైతం అర్ష్‌దీప్‌నకు చోటు దక్కిన విషయం తెలిసిందే. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఈ యువ పేసర్... 17 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Pak Vs Eng 6th T20: పాక్ బౌలర్లకు చుక్కలు.. 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో సాల్ట్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో పాక్ చిత్తు National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. -
ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి ప్రమోషన్
ఫైవ్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. తమ నాన్ ప్లేయింగ్ బృందంలో కీలక మార్పులు చేసింది. ప్రధాన కోచ్ మహేళ జయవర్థనేతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ జహీర్ ఖాన్‌కు ప్రమోషన్ కల్పించి అత్యంత కీలక బాధ్యతలు అప్పజెప్పింది. జయవర్దనేకు ముంబై ఇండియన్స్ (ఎంఐ) గ్రూప్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పదవి అప్పజెప్పిన యాజమాన్యం.. జహీర్ ఖాన్‌ను గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా ప్రమోట్ చేసింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. 🚨 Head Coach ➡️ Global Head of Performance 🌏 We are delighted to announce Mahela Jayawardene as our Global Head of Performance 🙌💙#OneFamily #MumbaiIndians #MIemirates #MIcapetown @MIEmirates @MICapeTown @MahelaJay pic.twitter.com/I4wobGDkOQ — Mumbai Indians (@mipaltan) September 14, 2022 ఎంఐ యాజమాన్యం ఖాళీ అయిన జయవర్ధనే, జాక్‌ల స్థానాలకు త్వరలో భర్తీ చేయనుంది. జయవర్ధనే 2017 నుంచి ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ గా పని చేస్తుండగా.. జహీర్ ఖాన్ 2019లో ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. 🚨 Director of Cricket Operations ➡️ Global Head of Cricket Development 🌏 Let's welcome ZAK as our Global Head of Cricket Development 🙌#OneFamily #MumbaiIndians #MIemirates #MIcapetown @MIEmirates @MICapeTown @ImZaheer pic.twitter.com/VBfzzrBG6J — Mumbai Indians (@mipaltan) September 14, 2022 జయవర్ధనే, జహీర్ ఖాన్ కొత్త బాధ్యతలేంటి.. ఎంఐ గ్రూప్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్గా బాధ్యతలు చేపట్టనున్న జయవర్ధనే.. కొత్త పాత్రలో ముంబై ఇండియన్స్ (ఐపీఎల్) తో పాటు ఎంఐ ఎమిరేట్స్ (ఇంటర్నేషనల్ లీగ్ టీ20), ఎంఐ కేప్‌టౌన్ (సౌతాఫ్రికా) ఫ్రాంచైజీలకు సంబంధించిన కోచింగ్ స్టాఫ్‌కు మార్గదర్శకుడిగా వ్యవహరిస్తాడు. అలాగే మూడు జట్ల స్టాఫ్, ప్లేయర్స్ రిక్రూట్మెంట్, స్ట్రాటజిక్ ప్లానింగ్ తదితర వ్యవహారాలు పర్యవేక్షిస్తాడు. జహీర్ విషయానికొస్తే.. ఇతను మూడు ఫ్రాంచైజీల ప్లేయర్స్ డెవలప్మెంట్, ప్రోగ్రామ్ డెవలప్మెంట్, అలాగే న్యూ టాలెంట్ అన్వేషణ వంటి పలు కీలక బాధ్యతలు చూస్తాడు. -
Ind Vs Eng: పంత్ సెంచరీ.. ద్రవిడ్ రియాక్షన్ అదుర్స్.. వైరల్
India Vs England 5th Test- Rishabh Pant- Rahul Dravid: రిషభ్ పంత్.. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌కు సారథ్యం వహించి కెప్టెన్‌గా శెభాష్ అనిపించుకున్నా.... బ్యాటర్‌గా మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో పంత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. రానున్న టీ20 ప్రపంచకప్-2022 జట్టులో చోటు కూడా ఇవ్వకూడదంటూ పలువురు మాజీ క్రికెటర్లు పంత్ ఆట తీరుపై విరుచుకుపడ్డారు. కట్ చేస్తే.. ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టులో రిషభ్ పంత్ తనదైన శైలిలో అద్భుతంగా రాణించాడు. టీ20 ఫార్మాట్ సంగతి ఎలా ఉన్నా టెస్టుల్లో తన తరహా ఇన్నింగ్స్‌తో జట్టును పటిష్ట స్థితిలో నిలిపి అందరి చేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి టీమిండియా క్లిష్ట పరిస్థితిలో ఉన్న వేళ శతకంతో రాణించాడు. రవీంద్ర జడేజా మరో ఎండ్‌లో సహకారం అందిస్తుండగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అయితే, పంత్‌పై విమర్శలు వచ్చిన సమయంలో టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడికి అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు పంత్. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 111 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 146 పరుగులు చేశాడు. దీంతో ద్రవిడ్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు. డగౌట్లో కూర్చుని మ్యాచ్ వీక్షిస్తున్న ద్రవిడ్ ఒక్కసారిగా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో చిరునవ్వులు చిందిస్తూ పంత్‌ను అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక పంత్ సెంచరీ ఇన్నింగ్స్‌పై ద్రవిడ్ రియాక్షన్ గురించి టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి అద్భుతమైన ఇన్నింగ్స్ చూసినపుడు ఎవరికైనా భావోద్వేగాలు నియంత్రించుకోవడం కష్టమే. సాధారణంగా ద్రవిడ్ ఎప్పుడూ ఇలా రియాక్ట్ అవ్వడు’’ అని క్రిక్‌బజ్ షోలో వ్యాఖ్యానించాడు. చదవండి: MS Dhoni Knee Problem: మోకాలి నొప్పులతో బాధపడుతున్న ధోని.. ట్రీట్మెంట్ ఖర్చు 40 రూపాయలు! Ind Vs Eng 5th Test: అసలు అంచనాలే లేవు... అయినా కూడా నువ్వు మరోసారి! ఎన్నాళ్లో ఇలా? Rishabh Pant, you beauty! 🤩💯 Is there a more exciting Test cricketer in the modern game?! 🔥 Tune in to Sony Six (ENG), Sony Ten 3 (HIN) & Sony Ten 4 (TAM/TEL) - (https://t.co/tsfQJW6cGi)#ENGvINDLIVEonSonySportsNetwork #ENGvIND pic.twitter.com/Qvn3eDYw9Z — Sony Sports Network (@SonySportsNetwk) July 1, 2022 -
'ఒత్తిడిని హార్ధిక్ ఛాలెంజ్‌గా తీసుకుంటాడు'
టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒత్తిడిని సవాల్‌గా తీసుకుంటాడని జహీర్ కొనియాడాడు. రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో భారత్ 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆరంభంలోనే వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన టీమిండియాను హార్ధిక్ పాండ్యా అదుకున్నాడు. 31 బంతుల్లో హార్ధిక్ 46 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దినేష్ కార్తీక్‌తో కలిసి ఐదో వికెట్‌కు 65 పరుగుల కీలక బాగాస్వామ్యాన్ని నమోదు చేశాడు.ఇక దినేష్ కార్తీక్ 27 బంతుల్లోనే 55 పరుగులు చేసి భారత్ 169 పరుగుల చేయడంలో కీలక పాత్ర పోషించాడు. "హార్ధిక్ తను ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. అతడు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేయాలని కోరుకుంటున్నాను. హార్ధిక్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ వస్తే మరింత అద్భుతంగా రాణిస్తాడు. ఆరంభంలో వికెట్లు కోల్పోయినప్పడు, అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. ఐపీఎల్లో కూడా ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతంగా రాణించాడు. అతడు అటువంటి ఒత్తిడి పరిస్థితులను ఛాలెంజ్‌గా తీసుకుని ఆడుతాడు. అదే అతడి బ్యాటింగ్ స్టైల్" అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. చదవండి: ENG vs NED: నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోస .. బంతి కోసం చెట్లు, పుట్టల్లోకి -
Ind Vs SA: మూడో టీ20.. అతడిని తప్పక జట్టులోకి తీసుకోండి.. లేదంటే!
India Vs South Africa 3rd T20: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో రెండు వరుస పరాజయాలు మూటగట్టుకుంది టీమిండియా. తద్వారా రిషభ్ పంత్ సారథ్యంలోని భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-2 తేడాతో వెనకబడిపోయింది. ఇక ఈ సిరీస్ గెలవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి. లేదంటే సఫారీ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌లలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం చేజారుతుంది. అంతేగాక హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో ఇంత వరకు వరుస సిరీస్‌లు గెలిచిన టీమిండియా జోరుకు బ్రేక్ పడుతుంది. ఇక ఢిల్లీ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసినప్పటికీ బౌలర్లు తేలిపోవడంతో 7 వికెట్ల తేడాతో పరాజయం తప్పలేదు. రెండో మ్యాచ్‌లో బ్యాటర్ల వైఫల్యం ప్రభావం చూపింది. ఇక బౌలర్లలో సీనియర్ సీమర్ భువనేశ్వర్ కుమార్(4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు) ఒక్కడే ఆకట్టుకున్నాడు. అతడే ఎక్స్‌ఫ్యాక్టర్.. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ మూడో టీ20 తుది జట్టు కూర్పు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అతడు టీమిండియాకు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారతాడని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో మాట్లాడిన జహీర్ ఖాన్.. ‘‘తదుపరి మ్యాచ్‌లో ఉమ్రాన్‌ను ఆడించాలి. అతడి ఎక్స్ట్రా పేస్ జట్టుకు ఉపయోగపడుతుంది. ఐపీఎల్లో అతడి ప్రదర్శనను మనమంతా చూశాము. టీ20 లీగ్‌లో ప్రొటిస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌ను ఉమ్రాన్ అవుట్ చేసిన విధానం అమోఘం. తన వేగవంతమైన బంతితో మిల్లర్‌ను బోల్తా కొట్టించాడు. భారత జట్టులో ఉమ్రాన్ చేరిక తప్పకుండా ప్రభావం చూపుతుంది’’ అని తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అందుకే ఉమ్రాన్‌ను జట్టులోకి తీసుకోవాలి! ఇక టీమిండియా- దక్షిణాఫ్రికా మధ్య మూడో టీ20 విశాఖపట్నంలోని వైఎస్సార్(డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం) స్టేడియంలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జహీర్ ఖాన్.. ‘‘అక్కడి మైదానం చిన్నది. కాబట్టి స్పిన్నర్లు ఒత్తిడిలో కూరుకుపోవచ్చు. కాబట్టి ఉమ్రాన్ వంటి పేసర్‌ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా జూన్ 14న ఇరు జట్లు మూడో టీ20 మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. ఇక ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్-2022లో 22 వికెట్లు పడగొట్టి క్రీడా ప్రముఖుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా సిరీస్ నేపథ్యంలో తొలిసారిగా టీమిండియాకు సెలక్ట్ అయ్యాడు. అయితే, మొదటి రెండు మ్యాచ్‌లలోనూ అతడిని బెంచ్‌కే పరిమితం చేయడం గమనార్హం. చదవండి: Rishabh Pant: అదే మా పొరపాటు.. అందుకే ఓడిపోయాం.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే! 💬 💬 "A dream come true moment to get India call up." Umran Malik speaks about the excitement on being a part of the #TeamIndia squad, Day 1 at the practice session, his idols and goals ahead. 👍 👍 - By @28anand Full interview 🎥 🔽 #INDvSA | @Paytm pic.twitter.com/V9ySL4JKDl — BCCI (@BCCI) June 8, 2022 -
ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. గాయం నుంచి కోలుకున్న స్టార్ ఓపెనర్
ఐపీఎల్-2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ గాయం నుంచి కోలుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2 (శనివారం)న రాజస్తాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు ఇషాన్ అందుబాటులో ఉండనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లో 81 పరుగులు సాధించాడు. అయితే ముంబై ఇన్నింగ్స్ 18వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ వేసిన యార్కర్.. కిషన్ ఎడమ కాలి బొటనవేలికి బలంగా తాకింది. క్రీజులో పరుగులు తీయడానికి కిషన్ ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడి ఢిల్లీ ఇన్నింగ్స్‌లో పూర్తిగా ఫీల్డ్‌లోకి రాలేదు. తరువాత అతడిని స్కానింగ్‌కి పంపగా.. గాయం అంత తీవ్రమైనది కాదని తేలింది. ఈ నేపథ్యంలో కిషన్ ఫిట్నెస్గా ఉన్నాడని ముంబై క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్ ఖాన్ తెలిపాడు.“ఇషాన్ కిషన్ పూర్తి స్థాయి ఫిటెనెస్ సాధించాడు. అతడు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తున్నాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌కు కిషన్ అందుబాటులో ఉంటాడు’’ అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), అన్మోల్ప్రీత్ సింగ్, రాహుల్ బుద్ధి, రమణదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్, బాసిల్ థంపి, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్, జోఫ్రా ఆర్చర్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్, టైమల్ మిల్స్, అర్షద్ ఖాన్, డేనియల్ సామ్స్, డెవాల్డ్ బ్రెవిస్, ఫాబియన్ అలెన్, కీరన్ పొలార్డ్, సంజయ్ యాదవ్, ఆర్యన్ జుయల్ మరియు ఇషాన్ కిషన్. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు! 👉 Playing at CCI 👉 Bowling strategies 👉 Sky's fitness update ZAK answers a range of questions in the pre-match PC! 🗣️💙#OneFamily #DilKholKe #MumbaiIndians #MIvRR @ImZaheer https://t.co/3OecmfnIN5 — Mumbai Indians (@mipaltan) April 1, 2022 -
అతడు ప్రపంచ స్ధాయి బౌలర్.. సౌతాఫ్రికాకు ఇక చుక్కలే!
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు భారత్ అన్ని విధాలా సిద్దమవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదే విధంగా భారత్ పేస్ విభాగం అద్భుతంగా ఉంది అని అతడు కొనియాడాడు. "ప్రపంచ స్థాయి అద్బుతమైన బౌలర్లలో బుమ్రా ఒకడు. ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు విజయం సాధించింది. ఈ పర్యటనల్లో బుమ్రా తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇక భారత బౌలింగ్ విభాగం అద్భుతమైనది. అదే విధంగా టెస్ట్‌ల్లో భారత్ విజయాల్లో జట్టు పేస్ బౌలింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచస్ధాయి బ్యాటర్లను కూడా బోల్తా కొట్టించే బౌలర్లు భారత జట్టులో ఉన్నారు. అనుభవజ్ఞులైన పేసర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ ఉండడం జట్టుకు మరింత బలం చేకూరుతుంది" అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా 2018లో సౌతాఫ్రికా పర్యటనలోనే జస్ప్రీత్ బుమ్రా టెస్ట్‌ల్లో ఆరంగట్రేం చేశాడు. చదవండి: IPL 2022 Auction: 39 బంతుల్లో 79.. పంజాబ్ కింగ్స్ వదులుకొని తప్పుచేసింది -
Zaheer Khan: ఈశాతో సహజీవనం.. కానీ పెళ్లివరకు రాలేదు.. సాగరిక మాత్రం
Zaheer Khan Love Life Marriage: జహీర్ ఖాన్.. క్రికెట్‌ను ఇష్టపడేవాళ్లు అమితంగా అభిమానించే ఫాస్ట్బాలర్ ‘కిస్నా.. ది వారియర్ పోయెట్’ హిందీ సినిమా ఫేమ్ ఈశా శర్వాణి ప్రేమలో క్లీన్బోల్డ్ అయిపోయాడు!! అయితే ఆ ప్రేమ.. పెళ్లిదాకా రాకుండానే బ్రేక్ అయింది. మరో బాలీవుడ్ తార, ‘చక్ దే ఇండియా ఫేమ్’ సాగరిక ఘాట్గే.. జహీర్ ఖాన్‌కు భార్య అయింది. ఆ బ్రేకప్.. ఈ పెళ్లి .. రెండూ ఇవ్వాళ్టి ‘మొహబ్బతే’ కథనంలో.. దాదాపు పదహారేళ్ల కిందట.. ఒక ఫంక్షన్లో ఒకరికొకరు పరిచయం అయ్యారు జహీర్, ఈశా. ఆ రోజు నుంచే మంచి స్నేహితులుగా మారారిద్దరూ. ప్రేమెప్పుడూ ఫ్రెండ్షిప్తోనే మొదలవుతుంది. ఈ ఇద్దరి స్నేహం కూడా ప్రేమైంది నెమ్మదిగా. ఒకరోజు జహీర్ చెప్పాడు ఈశాతో.. ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అని. ఈశాలో సంబ్రమాశ్చర్యం. నిజానికి ఆ మాట తానూ చెప్పాలనుకుంది. ఆ తీపి కబురు జహీర్ నోటివెంట రావడంతో వెంటనే ఓకే చెప్పేసింది. అప్పటి నుంచి ఆ ప్రేమ క్రికెట్ స్టేడియంలో జహీర్‌ను ప్రోత్సహించే ఈశా థమ్సప్స్లో.. అతన్ని ప్రశంసించే ఆమె చప్పట్లలో.. ఉత్సాహపరచే కేరింతల్లో.. ఈశా షూటింగ్ ప్యాకప్ అయ్యాక ఇద్దరూ కలసి చేసే డిన్నర్ డేట్స్.. హ్యాంగవుట్స్లలో కనిపించేది. తెల్లవారి మీడియాలో ప్రచురణ అయ్యేది.. ప్రసారమయ్యేది. సహజీవనం.. ‘చోరీ చోరీ ఛుప్ ఛుప్ కే.. ఎంతకాలమని ఉంటాం? మన గురించి మనమే మీడియాలో ఎన్నని రూమర్లను కంటాం.. వింటాం? చలో కలసి ఉందాం’ అనుకున్నారు. ఒకే ఇంట్లో కలసి ఉండడం మొదలుపెట్టారు. అలా వాళ్ల అనుబంధానికి అధికారతను అపాదించుకున్నారు. వాళ్లనుకున్నట్లుగా వదంతులకు చెక్ పడలేదు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొత్త రూమర్లు ప్రారంభమయ్యాయి. 2011 వరల్డ్ కప్ సమయంలో ఇండియా ఆడే మ్యాచ్‌ల పట్ల క్రికెట్ అభిమానులు ఎంత ఉత్కంఠభరితంగా ఉన్నారో ఈ జంట పెళ్లి రూమర్ పట్లా అంతే ఉత్కంఠతతో ఎదురు చూశారు. వాళ్లందరినీ నిరాశపరుస్తూ జహీర్, ఈశా తమ ప్రేమానుబంధం నుంచి బయటకు వచ్చారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు కలసి నడిచిన ఆ ప్రయాణాన్ని పెళ్లి పీటల మీదకు చేర్చకుండానే రద్దు చేసుకున్నారు. బ్రేకప్‌కు కారణమేంటో ఇద్దరూ చెప్పలేదు. మీడియా ఎంత ప్రశ్నించినా మౌనంతో దాటవేశారే కానీ ఇద్దరిలో ఎవరూ పెదవి విప్పలేదు. ఈశానే తర్వాతెప్పుడో ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఔను మేమిద్దరం విడిపోయాం. అయినా జహీర్ నాకెప్పటికీ మంచి స్నేహితుడే’ అని చెప్పింది. సాగరిక కలిసింది.. భగ్న ప్రేమ జహీర్‌ను బాగానే బాధించింది అని చెప్తారు అతని సన్నిహితులు. అందులోంచి బయటపడడానికి క్షణం తీరికలేకుండా గడపడం మొదలుపెట్టాడట. క్రికెట్‌తోపాటు ఫ్రెండ్స్‌తో పార్టీలు.. అవుటింగ్‌లు అతని షెడ్యూల్లో భాగమైపోయాయి. సరిగ్గా ఆ సమయంలోనే బాలీవుడ్లో మంచి బ్రేక్ కోసం చూస్తోంది సాగరిక ఘాట్గే. ఈ ఇద్దరూ తమ కామన్ ఫ్రెండ్ ఇంట్లో ఒకరికొకరు తారసపడ్డారు. పరిచయాలయ్యాయి. సాగరిక మాట తీరుకు ముచ్చటపడ్డాడు జహీర్. ఆమె నవ్వు ఆమెతో స్నేహం పెంచుకునేలా ఆకర్షించింది అతణ్ణి. అందుకే తక్కువ కాలంలోనే మంచి స్నేహితులైపోయారిద్దరూ. ఫ్రెండ్స్ సర్కిల్లో కలుసుకునే .. ఫ్రెండ్స్ గ్రూప్స్‌తో అవుటింగ్స్‌కి వెళ్లే ఈ ఇద్దరూ క్రమంగా ఇద్దరూ కలసుకోవడం.. ఇద్దరే హాలిడేస్‌ను ఆస్వాదించడం మొదలుపెట్టారు. అలా ప్రేమలో పడిపోయారు. యువరాజ్ సింగ్ పెళ్లికి జంటగా హాజరై తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు జహీర్, సాగరిక. తర్వాత వాళ్ల ప్రేమ గురించి జహీర్.. ట్విట్టర్లోనూ పోస్ట్ చేశాడు. జీవితమంతా సాగరిక చెంతే గడపాలని నిర్ణయించుకున్నాడు అతను. సాగరికతో నిశ్చితార్థం చేసుకున్నాడు. అప్పుడు సాగరికా సోషల్ మీడియాలో తన ప్రేమను ప్రకటించింది.. తన నిశ్చితార్థపు ఫొటోను పోస్ట్ చేస్తూ పార్టనర్స్ ఫర్ లైఫ్ హ్యాష్ ట్యాగ్ ఎంగేజ్డ్ అనే క్యాప్షన్‌తో. 2017, నవంబర్ 23న ఆ జంట తమ ప్రేమను పెళ్లితో స్థిరపర్చుకుంది. -ఎస్సార్ చదవండి: Ashes: 77 బంతుల్లో 12 ... 207 బంతుల్లో 26 పరుగులు.. స్టోక్స్, బట్లర్ పాపం.. View this post on Instagram A post shared by Sagarika Ghatge Khan (@sagarikaghatge) -
సెలక్టర్ల నిర్ణయం సరైందేనని షోయబ్ నిరూపించాడు: టీమిండియా మాజీ క్రికెటర్
Zaheer Khan Comments on Shoaib Malik: పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌పై టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి.. సెలక్టర్ల నిర్ణయం సరైందేనని నిరూపించాడని కొనియాడాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2021లో భాగంగా షార్జా వేదికగా మంగళవారం కివీస్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. టాస్ ఓడిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు... కెప్టెన్ బాబర్ ఆజమ్ (9), ఫఖర్ జమాన్ (11) సహా హఫీజ్ (11) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఆ తర్వాత రిజ్వాన్ (34 బంతుల్లో 33; 5 ఫోర్లు) కూడా పెవిలియన్ చేరడంతో.. పాక్ ఒక దశలో 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన షోయబ్ మాలిక్ 20 బంతుల్లో ఒక సిక్సర్, రెండు ఫోర్ల సాయంతో 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడికి తోడైన ఆసిఫ్ అలీ వరుస షాట్లు కొట్టడంతో మరో 8 బంతులుండగానే పాకిస్తాన్ లక్ష్యం పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో జహీర్ ఖాన్ క్రిక్‌బజ్ లైవ్‌లో మాట్లాడుతూ షోయబ్ మాలిక్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘షోయబ్ మాలిక్ లాంటి సీనియర్ ఆటగాళ్లను ఎందుకు జట్టులోకి తీసుకుంటారని అభిమానులు తరచుగా అడుగుతుంటారు కదా. ఇదిగో ఇందుకే వారిని ఆడిస్తారు. ఒత్తిడిని ఎలా జయించాలో వారికి తెలుసు. వాళ్లకు ఓపిక ఎక్కువగా ఉంటుంది. తీవ్ర ఒత్తిడిలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలరు. అన్నింటి కంటే ఈ లక్షణాలే ముఖ్యం. చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన షోయబ్ మాలిక్.. ఈరోజు సెలక్టర్ల నిర్ణయం తప్పుకాదని నిరూపించాడు’’ అని కితాబిచ్చాడు. కాగా సోహైబ్ మక్సూద్ను గాయం కావడంతో చివరి నిమిషంలో షోయబ్ పాక్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో పాకిస్తాన్‌కు వరుస విజయాలు అందిస్తున్న కెప్టెన్ బాబర్ ఆజంను కూడా జహీర్ ఖాన్ ప్రశంసించాడు. ‘‘ఒకప్పుడు పాకిస్తాన్ జట్టు అంటే ఇదీ అని ఒక అంచనా వేయలేకపోయేవాళ్లం. కానీ... బాబర్ ఆజం చాలా కామ్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడు. పాకిస్తాన్ క్రికెట్‌కు కొత్త దారి చూపిస్తున్నాడు’’ అని కొనియాడాడు. కాగా టీ20 వరల్డ్‌కప్ సూపర్-12లో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్‌పై వరుస విజయాలతో పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కు చేరువవుతోంది. చదవండి: T20 World Cup: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. అతడు టోర్నీ నుంచి అవుట్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); View this post on Instagram A post shared by ICC (@icc) -
టీమిండియా కోచ్ రేసులో 'ఆ ముగ్గురు'.. విదేశీయులకు నో ఛాన్స్ అన్న బీసీసీఐ..!
BCCI Unlikely To Appoint Foreign Coach For Team India : టీ20 ప్రపంచకప్‌తో ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుండడంతో అతని వారసుడు ఎవరనే అంశంపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ వర్గాలు ఓ క్లారిటీ ఇచ్చాయి. టీమిండియా తదుపరి కోచ్‌గా విదేశీయులకు ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పాయి. కోచ్ రేసులో భారత మాజీ ఆటగాళ్లే ఉంటారని సూచనప్రాయంగా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి అత్యంత సన్నిహితులైన ముగ్గురు టీమిండియా దిగ్గజ ఆటగాళ్ల పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే స్వచ్చంధంగా కోచ్ పదవిపై నిరాసక్తత కనబర్చడంతో వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ల పేర్లు బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరు ముగ్గురికి ఐపీఎల్లో వివిధ ఫ్రాంఛైజీల తరఫున కోచింగ్ అనుభవం కూడా ఉండడంతో.. ఎవరో ఒకరికి రవిశాస్త్రి వారసుడిగా పట్టం కట్టడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా కోచ్ పదవికి విదేశీ కోచ్ ఫార్ములా వర్కవుట్ కాదని, అందులోనూ బోర్డు పరిశీలనలో ఉన్న రికీ పాంటింగ్, మహేల జయవర్దనే, టామ్ మూడీ లాంటి వాళ్లు ఫుల్ టైమ్ కోచ్‌గా పని చేసేందుకు అయిష్టత ప్రదర్శిస్తున్నారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, గతంలో నలుగురు విదేశీయులు టీమిండియా కోచ్‌లుగా పని చేసిన సంగతి తెలిసిందే. తొలుత జాన్ రైట్, ఆతర్వాత గ్రెగ్ ఛాపెల్, గ్యారీ కిర్‌స్టెన్, డంకన్ ఫ్లెచర్ భారత జట్టు హెడ్ కోచ్‌లుగా బాధ్యతలు నిర్వర్తించారు. చదవండి: కోల్‌కతా ఓపెనర్ వెంకటేష్ అయ్యర్‌కు బంపర్ ఆఫర్.. -
19 ఏళ్ల చెత్త రికార్డు బద్దలు.. జహీర్ తర్వాత బుమ్రానే
లార్డ్స్: భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పాత సమస్య మళ్లీ ముందుకొచ్చి నట్లుంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఏకంగా 13 నోబాల్స్ వేశాడు. ఈ నేపథ్యంలో అతను ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు. ఇంతకముందు 2002లో జహీర్‌ఖాన్ విండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 13 నోబాల్స్ వేశాడు. ఆ తర్వాత మరే భారత బౌలర్ ఇన్ని నోబాల్స్ వేయలేదు. మళ్లీ 19 ఏళ్ల తర్వాత బుమ్రా ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో 13 నోబాల్స్ వేసి జహీర్‌తో సమానంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా 26 ఓవర్లు వేసి 79 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డ్రాగా ముగుస్తుందా లేక ఫలితం వస్తుందా అన్నది నాలుగో రోజు ఆటపై ఆధారపడి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వేగంగా ఆడి ఇంగ్లండ్‌కు ఎంత టార్గెట్ విధిస్తుందనేది చూడాలి. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (321 బంతుల్లో 180 నాటౌట్; 18 ఫోర్లు) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ సాధించగా... జానీ బెయిర్‌స్టో (107 బంతుల్లో 57; 7 ఫోర్లు) రాణించాడు. సిరాజ్‌కు 4, ఇషాంత్‌కు 3 వికెట్లు దక్కాయి. మూడో రోజు ఆట చివరి ఓవర్ చివరి బంతికి అండర్సన్‌ను షమీ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఆట ముగిసింది. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. -
వైరల్: కన్నీరు పెట్టిస్తున్న రాజ్ కౌశల్ చివరి పోస్ట్
ప్రముఖ నటి, యాంకర్ మందిరా బేడి భర్త, నిర్మాత రాజ్ కౌశల్ ఇవాళ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ ప్రముఖులు, సినీ నటీనటులు ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్ కౌశల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన చివరి పోస్టు వైరల్‌గా మారింది. ఈ ఆదివారం వీకెండ్ సందర్భంగా ఆయన స్నేహితులు, భార్య మందిర బేడీతో సందడి చేసినట్లు కౌశల్ తన చివరి పోస్టులో రాసుకొచ్చారు. ఇది చూసి ఆయన ఫాలోవర్స్, స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా గత ఆదివారం మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఆయన భార్య సాగరిక ఘాట్కే, నటి నేహా దూపియా, అంగద్ బేడి, భార్య మందిరా బేడిలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘సూపర్ సండే, సూపర్ ఫ్రెండ్స్, సూపర్ ఫన్’ అంటూ షేర్ చేశారు. అది చూసి ‘మూడు రోజుల క్రితమే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపిన కౌశల్ ఇలా మృత్యువాత పడటం తీవ్రం కలచివేస్తోంది’, ‘ఇదే ఆయన చివరి పోస్టు అని తలచుకుంటే కన్నీరు ఆగడం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే ఫొటోను నేహా దూపియా షేర్ చేస్తూ భావోద్యేగానికి లోనయ్యారు. View this post on Instagram A post shared by Raj Kaushal (@rajkaushal) ‘రాజ్ ఈ ఫొటోను మనం ఎప్పటికి గుర్తుండిపోయే జ్ఞాపకం గుర్తుగా తీసుకున్నాము. కానీ నువ్వు మా మధ్య ఎప్పటికి ఉండవనే విషయాన్ని నమ్మలేకపోతున్నా’ అంటూ మై స్ట్రాంగ్ లేడీ, ఈ సమయంలో నిన్ను ఓదార్చడానికి నాకు మాటలు రావడం లేదంటూ మందిరా, ఆమె కుమారుడు వీర్, కూతురు తారాలను ఉద్దేశిస్తూ తన పోస్టులో రాసుకొచ్చారు. అదే విధంగా రాజ్ కౌశల్ తన కుమారుడు వీర్, కూతురు తారాలతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిన కౌశల్ పోస్టులు కూడా ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Neha Dhupia (@nehadhupia) చదవండి: Mandira Bedi: ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత -
‘కేఎల్ రాహుల్ కంటే అతడిని ఆడిస్తేనే మంచిది’
ముంబై: ఇంగ్లండ్‌తో జరుగనున్న నిర్ణయాత్మక ఐదో టీ20లో భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వాలని టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ అన్నాడు. కేఎల్ రాహుల్ స్థానంలో అతడికి తుది జట్టులో చోటు కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా, వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్‌ను ఆడించాలని పేర్కొన్నాడు. రెండో టీ20 ద్వారా అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్, ఆ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకుని ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడో టీ20(4 పరుగులు)లో అదే స్థాయిలో సత్తా చాటలేకపోయాడు. ఇక గజ్జల్లో గాయం కారణంగా నాలుగో మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో శనివారం నాటి మ్యాచ్‌కు ముందు జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగితే బాగుంటుంది. నిజాయితీగా చెప్పాలంటే, ఒకవేళ ఇషాన్ కిషన్ గాయం నుంచి కోలుకున్నట్లయితే, కేఎల్ రాహుల్ స్థానంలో అతడిని ఆడించాలి. ఒత్తిడిలోనూ దూకుడుగా ఆడగలడు. ఇక, వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్‌ను ఆడిస్తే బెటర్’’ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ఈ సిరీస్‌లో 4 మ్యాచ్‌లలోనూ కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. అతడు నమోదు చేసిన స్కోర్లు వరుసగా 1,0,0,14. -
బుల్లెట్ కంటే వేగంగా దూసుకొచ్చింది
జహీర్ ఖాన్.. టీమిండియా బౌలింగ్ దళానికి దశాబ్దానికి పైగా నాయకత్వం వహించాడు. 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన జహీర్ ఖాన్ 92 టెస్టుల్లో 311, 200 వన్డేల్లో 282, 17 టీ20ల్లో 17 వికెట్లు తీశాడు. 2011 ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో జహీర్ పాత్ర కూడా చాలా ఉంది. ఆ ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లాడిన జహీర్ 21 వికెట్లు తీశాడు. ముఖ్యంగా జహీర్ 2006 నుంచి 2014 వరకు భారత జట్టుకు ప్రధాన బౌలర్‌గా వ్యవహరించాడు. (చదవండి : డేవిడ్ వార్నర్ ఇన్.. బర్న్స్ అవుట్) తాజాగా ఐసీసీ జహీర్ ఖాన్‌కు సంబంధించి త్రో బ్యాక్ థర్స్డే పేరిట ఒక వీడియోనూ ట్విటర్లో షేర్ చేసింది. ఆ వీడియోలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ .. టీమిండియా బౌలింగ్ కొనసాగుతుంది. అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ వా క్రీజులో ఉన్నాడు... బంతి టీమిండియా బౌలర్ జహీర్ ఖాన్ చేతిలో ఉంది. జహీర్ వేసిన బంతి బులెట్ వేగంతో దూసుకొచ్చి వికెట్లను గిరాటేయడంతో స్టీవా దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఆ వేగం ఎంత అంటే.. బంతి దాటికి మూడు వికెట్లు చెల్లాచెదురయ్యాయి. అయితే ఈ మ్యాచ్ ఏ టోర్నీలో జరిగింది.. ఏ సంవత్సరం జరిగిందో చెప్పాలంటూ క్యాప్షన్ జత చేసింది. చాలా మంది నెటిజన్లు ఆ మ్యాచ్ 2000వ సంవత్సరం.. ఐసీసీ నాకౌట్ చాంపియన్స్ ట్రోపీలో జరిగిందని కామెంట్లు చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐసీసీ నాకౌట్ చాంపియన్స్ ట్రోపీలో క్వార్టర్ ఫైనల్లో ఆసీస్, టీమిండియా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 46.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. పాంటింగ్ 46, మైఖెల్ బెవన్ 42 పరుగులు చేయగా.. మిగతవారు విఫలం కావడంతో 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెన్యాలో జరిగిన ఈ టోర్నీలో న్యూజిలాండ్, భారత్‌ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. కాగా ఫైనల్లో కివీస్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలి మేజర్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా ఈ టోర్నీ ద్వారానే జహీర్ ఖాన్‌తో పాటు డాషింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. #ThrowbackThursday ➜ When a young Zaheer Khan went through the gate of an experienced Steve Waugh! What a peach 🔥 Can you guess this game and year? 😉 pic.twitter.com/BQfGlr0FAR — ICC (@ICC) December 31, 2020 -
శుభవార్త చెప్పిన జహీర్ ఖాన్!
మాజీ ఇండియన్ క్రికెటర్ జహీర్‌ఖాన్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. త్వరలోనే వారి ఇంట్లోకి మూడో మనిషి రాబోతున్నారు. జహీర్ ఖాన్ బాలీవుడ్ నటి సాగరిక గాట్గేను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ యూఏఈలో ఉన్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఐపీఎల్ జరుగుతుండగా జహీర్‌ఖాన్ ముంబై ఇండియన్స్ జట్టుకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్(డీసీఏ)గా పనిచేస్తున్నారు. జహీర్‌ఖాన్ తన పుట్టినరోజు వేడుకలను కూడా ముంబై ఇండియన్స్ జట్టుతో కలసి దుబాయ్‌లోనే జరుపుకున్నారు. ఈ సందర్భంగా జహీర్ గురించి వర్ణించాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం కోరగా జహీర్ అందరితో సంప్రదించి వారి అభిప్రాయాలను సేకరించి నిర్ణయాలను తీసుకుంటాడని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ఇక టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తాను తండ్రికాబోతున్నట్లు, వచ్చే ఏడాది జనవరిలో వారి ఇంటికి ఒక అతిధి రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: రషీద్ ఖాన్ భార్య అనుష్క శర్మ! -
వారిద్దరి కెప్టెన్సీలో చాలా పోలికలు: జహీర్
న్యూఢిల్లీ: సౌరవ్ గంగూలీ-ఎంఎస్ ధోనిలు ఇద్దరూ భారత క్రికెట్ జట్టును ఉన్నత శిఖరంలో నిలిపిన కెప్టెన్లు. వీరిలో సౌరవ్ గంగూలీది దూకుడు స్వభావం అయితే, ధోని మాత్రం మిస్టర్ కూల్. కాగా, వీరిద్దరి కెప్టెన్సీలో చాలా దగ్గర పోలికలున్నాయినని అంటున్నాడు టీమిండియా మాజీ పేసర్ జహీర్‌ఖాన్. ప్రధానంగా యువ క్రికెటర్లకు అండగా నిలిచే విషయంలో గంగూలీ,ధోనిలు దాదాపు ఒకే విధంగా ఆలోచిస్తారని జహీర్ పేర్కొన్నాడు. తనలాంటి ఎంతో మంది క్రికెటర్లకు గంగూలీ నుంచి ఎలాంటి మద్దతు లభించిందో, ఆ తర్వాత తరానికి ధోని కెప్టెన్సీలో కూడా అలాంటి మద్దతే లభించిందన్నాడు. ప్రతీ దశాబ్దానికి భారత క్రికెట్లో కెప్టెన్సీ మార్పు అనేది సహజంగానే జరుగుతూ వస్తుందన్నాడు. (ఆ వరల్డ్‌కప్ అంతా పెయిన్ కిల్లర్స్‌తోనే..!) ‘కెరీర్ మొదట్లో ఏ క్రికెటర్‌కైనా సీనియర్ల మద్దతు అవసరం. ముఖ్యంగా జట్టుకు సారథులుగా ఉండేవారి నమ్మకాన్ని ఏర్పరుచుకోవాలి. మనలోని ప్రతిభకు కెప్టెన్ల మద్దతు తోడైతే ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక సీనియర్ల అండ జూనియర్లకు ఎంతో అవసరం. గంగూలీ, ధోనిలు ఇద్దరూ చాలాకాలంపాటు భారత జట్టును నడిపించారు. ఇద్దరిలో చాలా సారూప్యతలు ఉన్నాయి. కెరీర్ తొలినాళ్లలో దాదా ఇచ్చిన మద్దతు మరువలేను. అయితే ధోని చేతికి పగ్గాలు వచ్చినప్పుడు జట్టులో అంతా సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్నవాళ్లను ముందుకు నడిపించడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఒక్కొక్కరుగా సీనియర్లు తప్పుకుంటుంటే.. అప్పుడు యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేసుకుంటూ జట్టును ముందుకు సాగించిన తీరు అద్భుతం. అచ్చం గంగూలీలానే ధోని యువ ఆటగాళ్లకు అండగా ఉన్నాడు. దాంతోనే అద్భుతమైన ఫలితాలు సాధించాడు’ అని జహీర్ తెలిపాడు. (ధోనికి మద్దతుగా కైఫ్.. రాహుల్ వద్దు!) -
జహీర్ ఖాన్ సరసన ఇషాంత్
వెల్లింగ్టన్: ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ ఐదు వికెట్లతో మెరిశాడు. మిగతా పేస్ బౌలర్లు రాణించని చోట ఇషాంత్ రాణించడంతో కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కట్టడి చేయగలిగింది. ఓపెనర్లు టామ్ లాథమ్, టామ్ బ్లన్‌డెల్, సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్లతో పాటు టెయిలెండర్లు టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్‌ల వికెట్లను ఇషాంత్ పడగొట్టి ఈ ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడం ఇషాంత్‌కు ఇది 11వ సారి. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక ఐదు వికెట్లు తీసిన రెండో భారత పేసర్‌గా జహీర్ సరసన ఇషాంత్ చేరాడు. జహీర్ 92 టెస్టుల్లో 11 సార్లు ఐదు వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ 97 టెస్టుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్(23) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక విదేశీ గడ్డపై ఎక్కువ సార్లు ఐదు వికెట్లు(9) పడగొట్టిన మూడో టీమిండియా బౌలర్‌గా లంబూ నిలిచాడు. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో కపిల్ దేవ్(12), అనిల్ కుంబ్లే(10)లు ఉన్నారు. ఇక కివీస్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు కూడా ఆడటం సందేహంగానే ఉన్నా...చివరకు సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇషాంత్ జట్టుతో చేరిన విషయం తెలిసిందే. చదవండి: ఇషాంత్ జోరు... ఆధిక్యం 51 నుంచి 183కు.. -
అదే బుమ్రా వైఫల్యానికి కారణం: జహీర్
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ మూడు వన్డేల సిరీస్‌లో వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇలా ఒక సిరీస్‌లో బుమ్రా వికెట్ కూడా తీయకపోవడం ఇదే మొదటిసారి. తన కెరీర్లో అతను ఇప్పటివరకూ 16 సిరీస్‌లు ఆడగా, ఇటీవల స్వదేశంలో ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ల్లో కూడా మూడు మ్యాచ్‌ల్లో కలిపి ఒకటే వికెట్ పడగొట్టాడు. దాంతో బుమ్రాపై విమర్శల వర్షం కురుస్తోంది. అయితే బుమ్రా బౌలింగ్ వైఫల్యంపై ఇప్పటికే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అండగా నిలవగా, ఇప్పుడు టీమిండియా మాజీ పేసర్ జహీర్‌ఖాన్ సైతం మద్దతుగా నిలిచాడు. బుమ్రా ఒక ప్రమాదకర బౌలర్ అంటూనే మరింత దూకుడుగా అతను బౌలింగ్ చేయాల్సి ఉంటుందన్నాడు. ఈ క్రమంలోనే బుమ్రా ఎందుకు విఫలమయ్యాడో విశ్లేషించాడు. (ఇక్కడ చదవండి: బుమ్రాకు మద్దతిచ్చిన కివీస్ కెప్టెన్) ‘ అతి తక్కువ సమయంలోనే బుమ్రా ఒక కీలక బౌలర్‌గా మారిపోయాడు. బుమ్రా బౌలింగ్‌ను ఆడాలంటే ప్రత్యర్థి జట్లలో వణుకు పుడుతోంది. బుమ్రా ఒక ప్రత్యేకతను చాటుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. బుమ్రా బౌలింగ్‌లో రిథమ్ ఏమీ తగ్గలేదు. కానీ అవతలి ఆటగాళ్లు బుమ్రాను జాగ్రత్తగా ఆడాలనే తలంపుతో బరిలోకి దిగుతున్నారు. ఒక వన్డే మ్యాచ్‌లో బుమ్రా ఓవర్లలో 35 పరుగులు వచ్చినా ఫర్వాలేదు కానీ వికెట్‌ను ఇవ్వకూడదనే ధోరణితో దిగుతున్నారు. దాంతో బుమ్రాను ఆచితూచి ఆడుతున్నారు. అదే సమయంలో మిగతా బౌలర్లపై ఎటాక్‌కు దిగుతున్నారు. దాంతోనే బుమ్రా వికెట్లను సాధించడం కష్టమవుతుంది. ఇక బుమ్రా తన బౌలింగ్‌కు మరింత పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. తన బౌలింగ్‌ను రక్షణాత్మక ధోరణితో ఆడుతున్నారనే విషయం బుమ్రాకు కూడా తెలుసు. దాంతో వికెట్లను ఏ విధంగా సాధించాలి అనే దానిపై బుమ్రా దృష్టి నిలపాలి. బ్యాట్స్‌మెన్ తప్పులు చేసే విధంగా బౌలింగ్‌కు పదును పెట్టాలి. ఎందుకంటే బుమ్రా బౌలింగ్‌ను జాగ్రత్తగా ఆడుతూ వికెట్లు ఇవ్వకుండా ఉండటానికే ప్రత్యర్థి జట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయనే విషయం స్పష్టంగా కనబడుతోంది. దీనిపై బుమ్రా ఫోకస్ పెట్టి మరింత దూకుడైన బౌలింగ్‌ను రుచిచూపించాలి’ అని జహీర్ పేర్కొన్నాడు. -
'పాండ్యా తొందరపడకు.. సమయం చాలా ఉంది'
ముంబై : గత కొంతకాలంగా వెన్నునొప్పితో సతమతమవుతున్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విదేశాల్లో శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. దీంతో గతేడాది సెప్టెంబరు నుంచి జట్టుకు దూరమైన పాండ్యా గాయం నుంచి కోలుకొని నెల క్రితమే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.న్యూజిలాండ్-ఎ జట్టుకు హార్దిక్‌ను మొదట ఎంపిక చేసినా ఫిట్నెస్ పరీక్షలో ఫెయిలవడంతో జట్టు నుంచి అతని పేరును తొలగించారు. ప్రస్తుతం ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో హార్దిక్ శిక్షణ పొందనున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ హార్దిక్ పాండ్యాకు ఒక సలహా సూచించాడు. 'ఐపీఎల్‌కు ఇంకా ఎంతో సమయం ఉంది. అప్పటిలోగా నువ్వు 120 శాతం ఫిట్నెస్తో బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే.. గాయాలతో జట్టుకు దూరమైన తర్వాత పునరాగమనం ముఖ్యం కాదు. జట్టులో ప్రదర్శన ఏ స్థాయిలో ఉందనేదే పరిగణనలోకి తీసుకుంటారు. గాయాలతో జట్టుకు దూరమైనప్పుడు ఎంతో అసహనంతో ఉంటాం. కానీ.. ఓపికతో ఉంటేనే తిరిగి కోలుకోగలం. మన శరీరం మాట మనం వినాలి. అందుకే ఇప్పుడు నీకు ఓపిక అనేది చాలా అవసరం' అని జహీర్ పేర్కొన్నాడు. సహాయ సిబ్బంది, ఫిజియో, ట్రైనర్స్‌తో పాటు వైద్య సిబ్బంది మాటను పాండ్యా వినాల్సిన అవసరం ఉందని జహీర్ పేర్కొన్నాడు. (ఇంకా కోలుకోని హార్దిక్ పాండ్యా) కాగా న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా ప్రదర్శనపై జహీర్ స్పందించాడు.'న్యూజిలాండ్‌ను సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసి భారత్ సత్తాచాటింది. టీమిండియా 5-0తో విజయం సాధించడం ఎంతో గొప్ప విషయం. ప్రస్తుతం కివీస్ క్లిష్ట సమయంలో ఉంది. భారత్‌ను ఎదుర్కోవడానికి వారు ఇతర మార్గాలు అన్వేషించాలి. బుధవారం నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్ కూడా కివీస్‌కు సవాలుగా నిలవనుంది. టీమిండియా ఇదే జోరుని కొనసాగిస్తూ వన్డే, టెస్టు సిరీస్‌లను గెలచుకోవాలని కోరుకుంటున్నా. జట్టును గాయాలు వేధిస్తున్నా రిజర్వ్ బెంచ్ ఎంతో పటిష్ఠంగా ఉంది. ఈ విషయంలో జట్టు దిగులు చెందాల్సిన అవసరం లేదని' జహీర్ చెప్పుకొచ్చాడు.('వారి ఆటతీరు చిన్నపిల్లల కంటే దారుణం') -
హార్దిక్ హాస్యం.. జహీర్ గట్టి కౌంటర్
-
త్వరలోనే మైదానంలో అడుగుపెడతాను
-
హార్దిక్ హాస్యం.. జహీర్ గట్టి కౌంటర్
టీమిండియా క్రికెటర్లలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ హార్దిక్ పాండ్యా. తాను చేసే పనులతో ప్రతీసారి వార్తల్లో హైలెట్ నిలుస్తాడు. తాజాగా టీమిండియా దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ బర్త్‌డే సందర్భంగా హార్దిక్ చేసిన ట్వీట్ వివాదస్పదంగా మారింది. దీనిపై హార్దిక్ విమర్శకులు, జహీర్ ఖాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా హార్దిక్ ట్వీట్‌పై జహీర్ స్పందించాడు. ‘ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందకు హార్దిక్‌కు ధన్యవాదాలు. అయితే నీలా బ్యాటింగ్ నేనెప్పటికీ చేయలేను. కానీ ఈ మ్యాచ్‌లో(హార్దిక్ పోస్ట్ చేసిన మ్యాచ్ వీడియో) నువ్వు నా నుంచి ఎదుర్కొన్న తర్వాతి బంతి వలే నా పుట్టినరోజు చాలా బాగా జరిగింది’ అంటూ హార్దిక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. అదేవిధంగా బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రతీ ఒక్కరికి జహీర్ ధన్యవాదాలు తెలిపాడు. కాగా.. జహీర్ బర్త్‌డే సందర్భంగా ‘ ‘హ్యాపీ బర్త్‌డే జాక్.. నేనిక్కడ కొట్టినట్టు నువ్వు కూడా మైదానం బయటకి దంచి కొడతావనే ఆశిస్తున్నా’అంటూ ఓ దేశవాళీ మ్యాచ్‌లో జహీర్ బౌలింగ్‌లో హార్దిక్ సిక్సర్ కొట్టిన వీడియోను జతచేసి ట్వీట్ చేశాడు. దీనిపై జహీర్ ఖాన్ అభిమానులు మండిపడ్డారు. ‘ముందు జహీర్లా టీమిండియాకు ప్రపంచకప్ తీసుకరా’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక హార్దిక్ లండన్‌లో వెన్నునొప్పి గాయానికి శస్త్రచికిత్స చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్నానని.. త్వరలోనే మైదానంలోకి అడుగుపెడుతానిని హార్దిక్ పేర్కొన్నాడు. అయితే గాయం తీవ్రత, జరిగిన శస్త్ర చికిత్సను పరిశీలిస్తే ఐదు నెలల పాటు హార్దిక్ విశ్రాంతి అవసరముంటుందుని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. -
హార్దిక్ అహంకారానికి నిదర్శనమిదే!
ఓ టీవీలో షోలో మహిళలపై అసభ్యకరమైన రీతిలో మాట్లాడి విమర్శల పాలైన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. మరోసారి అలాంటి విమర్శలనే ఎదుర్కొంటున్నాడు. టీమిండియాలో సక్సెస్ఫుల్ బౌలర్‌గా గుర్తింపు పొందిన మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా జహీర్‌కి పుట్టిన రోజు శుభాక్షాంక్షలు చెప్పే క్రమంలో హార్దిక్ ఓ వీడియోను షోర్ చేశాడు. ఆ వీడియోనే అతనిని తీవ్ర విమర్శల పాలు చేసింది. నెటిజన్ల ఆగ్రహానికి గురిచేసింది. జహీర్ బౌలింగ్‌లో హర్థిక్ బౌండరి సాధించినది ఆ వీడియో పరమార్థం. దీంతో సీనియర్ ఆటగాడికి నువ్విచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. హార్దిక్ అహంకారానికి ఇదే నిదర్శనమంటూ ఘాటు కామెంట్లతో విమర్శిస్తున్నారు. గత కొంతకాలంగా వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు సర్జరీ పూర్తయిన విషయం తెలిసిందే. ఇటీవల సర్జరీ నిమిత్తం లండన్ వెళ్లాడు. దాంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు నుంచి హార్దిక్‌కు విశ్రాంతి ఇచ్చారు. Happy birthday Zak ... Hope you smash it out of the park like I did here 🤪😂❤️❤️ @ImZaheer pic.twitter.com/XghW5UHlBy — hardik pandya (@hardikpandya7) October 7, 2019 -
ఆ జ్ఞాపకాలన్ని మధురాతిమధురం!
ముంబై: సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం నాటి చిరస్మరణీయ ఘట్టాన్ని ఎవరు మరచిపోగలరు! 2011, ఏప్రిల్ 2న కులశేఖర బౌలింగ్‌లో ధోని కొట్టిన భారీ సిక్సర్‌తో భారతావని పులకించింది. ‘ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టయిల్, ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్’... అంటూ సాగిన రవిశాస్త్రి వ్యాఖ్యానం ఇప్పటికీ మన చెవుల్లో మోగుతూనే ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా అదే రోజు అదే ముంబైలోని వాంఖడే మైదానంలో నాటి జట్టులోని కొందరు సభ్యులు దానిని గుర్తు చేసుకొని సంబరపడ్డారు. నేడు ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఇక్కడే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లలో ఉన్న క్రికెటర్లు ఇచ్చోటనే... అంటూ తమ చిరకాల స్వప్నం నెరవేరిన రోజును తలచుకున్నారు. ముంబై మెంటార్లు సచిన్ టెండూ ల్కర్, జహీర్‌ఖాన్‌లతో యుువరాజ్ సింగ్ సెల్ఫీ దిగగా... మరో వైపు చెన్నై ఆటగాళ్లు ధోని, రైనా, హర్భజన్ కలిసి ఫోటోను పంచుకున్నారు. వరల్డ్ కప్ గెలిచిన రోజును పురస్కరించుకొని ప్రత్యేక వీడియో విడుదల చేసిన సచిన్ ప్రస్తుత జట్టు సభ్యులకు సందేశమిచ్చాడు. ‘త్వరలోనే మరో వరల్డ్ కప్ రాబోతోంది. మీలో ఎవరూ ఆడబోతున్నారో నాకు తెలీదు. కానీ ఎవరు ఆడినా గెలుపును కానుకగా తీసుకురండి. మీ జెర్సీలపై చూస్తే మూడు ప్రపంచ కప్ విజయాల స్టార్లు కనిపిస్తాయి. ఇప్పుడు ఆ సంఖ్యను నాలుగును చేయడం మీ చేతుల్లోనే ఉంది’ అని సచిన్ ఈ వీడియోలో వ్యాఖ్యానించాడు. గౌతం గంభీర్ కూడా బురదతో నిండిన తన ఫైనల్ మ్యాచ్ జెర్సీ ఫోటోను పెట్టి ‘కొన్ని జ్ఞాపకాల పుటలు మట్టితో అలంకరిస్తేనే బాగుంటుంది’ అని పోస్ట్ చేశాడు. -
జహీర్ ఖాన్ వల్లే..
న్యూఢిల్లీ: తన బౌలింగ్‌ను మరింత మెరుగుపరుచుకోవడానికి మాజీ పేసర్ జహీర్ ఖానే కారణమని టీమిండియా పేసర్ సిద్దార్థ్ కౌల్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లబోయే భారత జట్టులో చోటు దక్కించుకున్న సిద్ధార్థ్ కౌల్.. జహీర్ సూచనలతో తన బౌలింగ్‌లో పదును పెరిగిందన్నాడు. ‘నా తొలి ప్రాధాన్యం దేశవాళీ క్రికెట్‌కే. పంజాబ్ తరఫున చేసిన ప్రదర్శనలే జాతీయ జట్టులో అవకాశం దక్కేలా చేశాయి. న్యూజిలాండ్‌లో భారత్-ఏ తరఫున బౌలింగ్ చేశా. అక్కడి పిచ్‌లపై పూర్తి అవగాహన ఉంది. ఎప్పుడూ జట్టు గెలుపు కోసమే కష్టపడతా. నా మార్గనిర్దేశకుడు జహీర్ ఖాన్ నేతృత్వంలో నా బౌలింగ్‌ను మరింత పటిష్టం చేసుకున్నా. ఆయన చక్కని సలహాలు ఇస్తారు. బంతులు విసిరేటప్పుడు సింపుల్‌గా ఉండాలని సూచిస్తారు. ఆయన నాతో చాలా సమయం గడిపారు. నా బౌలింగ్ గురించి నోట్స్ రాసుకున్నారు. బంతులు విసిరేటప్పుడు ఏ కండరాలు ఉపయోగించాలి, ఏ ప్రాంతాల్లో బంతులు వేయాలో చెప్పారు. భారత్-ఎ తరఫున న్యూజిలాండ్ వెళ్లేటప్పుడూ ఆయనతో మాట్లాడాను. ఆ సలహాలు అద్భుతంగా ఉపయోగపడ్డాయి’ అని తెలిపాడు. ఇక భారత-ఎ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించి మాట్లాడుతూ.. రాహుల్ సర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనకు క్రికెట్‌పై ఉన్న నాలెడ్జ్‌ను వెలకట్టలేం. ఆయన సలహాలు నాకెంతగానో ఉపయోగపడ్డాయి’ అని కౌల్ చెప్పుకొచ్చాడు. -
కుర్రాళ్ల లీగ్‌కు జహీర్, సునీల్ శెట్టి శ్రీకారం
న్యూఢిల్లీ: భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కుర్రాళ్ల కోసం నిర్వహించనున్న కొత్త క్రికెట్ లీగ్‌లో చేయిచేయి కలిపారు. జాతీయ స్థాయిలో ఫెరిట్ క్రికెట్ బాష్ పేరుతో (ఎఫ్‌సీబీ) వీరిద్దరు కలిసి లీగ్ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. 15 ఏళ్లు పైబడిన బాలల కోసం మొత్తం 22 నగరాల్లో ప్రతిభాన్వేషణ పోటీలు నిర్వహిస్తారు. రెండు రౌండ్లుగా జరిగే ఈ సెలక్షన్ క్రికెట్ పోటీల ద్వారా చివరకు 224 మందిని ఎంపిక చేస్తారు. వీరికి రూ. లక్ష చొప్పున ఫీజుగా చెల్లిస్తారు. వీరందరిని కలిపి 16 జట్లను తయారు చేస్తారు. ఇలా ఏర్పడిన ఈ 16 జట్లకు అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు, కోచ్‌లు శిక్షణ ఇస్తారు. చివరకు 15 ఓవర్ల చొప్పున మ్యాచ్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందులో అసాధారణంగా రాణించిన 14 మందిని ఆస్ట్రేలియాలో క్లబ్ స్థాయి క్రికెట్ టోర్నీ ఆడేందుకు అక్కడికి తీసుకెళ్తారు. -
మరోసారి క్రికెట్ ఫీల్డ్‌లోకి జహీర్
న్యూఢిల్లీ: ఒకప్పటి భారత క్రికెట్ జట్టు ప్రధాన పేసర్ జహీర్ ఖాన్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. వచ్చే నెలలో షార్జాలో ఆరంభం కానున్న టీ10 లీగ్‌లో జహీర్‌ఖాన్ ఆడనున్నాడు. ఈ టోర్నీ నవంబర్ 23 నుంచి ఆరంభం కానుంది. తొలి ఎడిషన్‌లో వీరేంద్ర సెహ్వాగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ లీగ్‌లో భారత్ నుంచి అప్పుడు ఒక్కడే ఆడగా ఈసారి మాత్రం పలువురు భాగస్వామ్యం అవుతున్నారు. జహీర్ ఖాన్, ప్రవీణ్ కుమార్, ఆర్పీ సింగ్, ఆర్ఎస్ సోధి, సుబ్రమణ్యం బద్రీనాథ్‌తో పాటు మరో ముగ్గురు ఆడనున్నారు. ‘టీ10 రెండో ఎడిషన్‌లో హై ప్రొఫైల్ కల్గిన ఎనిమిది మంది భారత క్రికెటర్లు ఆడటం చాలా సంతోషకరం. రానున్న కాలంలో ఈ లీగ్‌లో దేశవిదేశాలకు చెందిన ఎక్కువ ఆటగాళ్లను ఆకర్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది’ అని లీగ్ ఛైర్మన్ షాజీ ఉల్ ముల్క్ తెలిపారు. -
జహీర్ కొంచెం బరువు తగ్గబ్బా!
కోల్‌కతా : ఆదివారంతో 40వ ఏట అడుగుపెట్టిన టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్‌కు అటు మాజీ క్రికెటర్లు, ఇటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ విషెస్‌ను తెలియజేశారు. అయితే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన ట్వీటే ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ‘హ్యాపీ బర్త్‌డే జహీర్.. నీకు ఈ ఏడాది మంచి జరగాలి. దయచేసి కొంచెం బరువు తగ్గవు.. నీవు భారత బలం’ అని చమత్కరిస్తూ విషెస్ తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక జహీర్ గంగూలీ కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. సౌరవ్ గంగూలీ సారథ్యంలో 36 టెస్టులు, 88 వన్డేలతో మొత్తం 124 మ్యాచ్‌లాడిన జహీర్ 232 వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ స్వింగ్ బౌలరైన జహీర్.. 2000లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టాడు. Happy birthday @ImZaheer zed K.. have a great year ...please loose some weight...u were India’s strength 🤝 — Sourav Ganguly (@SGanguly99) October 7, 2018 స్వింగ్‌తో తన బౌలింగ్ వైవిధ్యాన్ని చాటుకున్నాడు. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరినప్పటికి న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. మొత్తం కెరీర్లో 200 వన్డేలు, 92 టెస్టులు, 17 టీ20లాడిన జహీర్ వన్డేల్లో 282, టెస్టుల్లో 311, టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత ఆటగాళ్లలో జహీర్ నాలుగోవాడు. అతని కన్నా ముందు అనిల్ కుంబ్లే, శ్రీనాథ్, అజిత్ అగార్కర్లున్నారు. ఇక జహీర్‌కు తన టీమ్మెట్స్ సెహ్వాగ్, లక్ష్మణ్, భజ్జీ, ఆర్పీసింగ్, కైఫ్‌లు సైతం విషెస్ తెలిపారు. -
‘వారే నాకు స్ఫూర్తి, ధైర్యం’: టీమిండియా క్రికెటర్
క్రికెట్లో లెఫ్టార్మ్ పేసర్ల పాత్ర ఎంతో కీలకం. సర్ గార్ఫీల్డ్ సోబర్స్, వసీం ఆక్మమ్, చమింద వాస్, జహీర్ ఖాన్ ఇలా ఎంతో మంది లెఫ్టార్మ్ బౌలర్లు సుదీర్ఘ కాలం వారి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. జహీర్ ఖాన్, అశిష్ నెహ్రాలు రిటైర్మెంట్ అనంతరం టీమిండియాలో లెఫ్టార్మ్ పేసర్ స్థానం ఖాళీ అయింది. బరిందర్ శ్రాన్, జయదేవ్ ఉనద్కత్, అంకిత్ చౌదరీలు జట్టులోకి వచ్చినా అంతగా ఆకట్టుకోలేదు. ఒకానొక సమయంలో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ టీమిండియాకు లెఫ్టాండ్ బౌలర్ ఎంతో అవసరమని సెలక్టర్లకు విన్నవించుకున్నాడు. ఈ తరుణంలో సెలక్లర్లను ఆకట్టుకుంటూ జట్టులోకి వచ్చాడు రాజస్తాన్ ఆటగాడు ఖలీల్ అహ్మద్. మరి ఆసియా కప్‌లో మంచి ప్రదర్శన కనబర్చి జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటాడా లేక అలా వచ్చి ఇలా వెళ్లి పోతాడా వేచిచూడాలి. సాక్షి, స్కోర్స్ట్: టీమిండియాకు ఆడాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు.. కానీ కొందరు మాత్రమే సుసాధ్యం చేసుకుంటారు. కన్న కలను సాకారం చేసుకొని రోహిత్ శర్మ నేతృత్వంలో ఆసియా కప్‌కు ఎంపికైన జట్టులో చోటు దక్కించుకున్నాడు రాజస్తాన్ ఆటగాడు ఖలీల్ అహ్మద్. టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ తనకు ఆదర్శమని, అండర్ -19, భారత్-ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచారని ఈ యువ క్రికెటర్ వివరించారు. ప్రస్తుతం అత్యుత్తమ ఆటను ప్రదర్శించి జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. ఆసియాకప్‌లో ఆడే అవకాశం వస్తే తానేంటో నిరూపించుకుంటానని స్పష్టంచేశాడు. భారత్ ‘ఏ’తరుపున 17 మ్యాచ్‌లు ఆడిన ఖలీల్ 28 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా ఏ, దక్షిణాఫ్రికా ఏ లపై చేసిన అత్యత్తమ ప్రదర్శనతోనే టీమిండియా తరుపున ఆడే అవకాశం లభించిందని అభిప్రాయపడ్డాడు. జహీర్ భాయ్ చెప్పినవన్నీ డైరీలో నోట్ చేసుకున్నా.. ‘2016లో ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడటం నాకు ఎంతో లాభించింది. నా స్పూర్తి జహీర్ ఖాన్. అతడిలా గొప్ప బౌలర్ కావాలని కలలు కన్నాను. ఈ దిగ్గజ ఆటగాడు చెప్పిన ప్రతీ సలహా, సూచన డైరీలో నోట్ చేసుకున్నా. నాకు ఏ సందేహం వచ్చినా ధైర్యంగా అడిగేవాడిని. యూఏఈ వేదికగా జరుగనున్న ఆసియాకప్‌లో కూడా ఎలా ఆడాలో అతడి సూచనలు డైరీలో నోట్ చేసుకుంటాను. అందరూ నన్ను మరో జహీర్ అంటున్నారు. జహీర్ లెజెండ్ క్రికెటర్. అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఒకరు స్థానాన్ని నేను భర్తీ చేయడమేంటి? తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటాను. జహీర్ ఖాన్ కంటే ఎక్కువ వికెట్లు తీస్తాను(నవ్వుకుంటూ)’ అంటూ ఖలీల్ పేర్కొన్నాడు. ద్రవిడ్ అంటే ధైర్యం ‘గెలుపోటముల గురించి ఆలోచించకు, నీ ఆట నువ్వు ఆడు’ అంటూ రాహుల్ ద్రవిడ్ ఎప్పుడూ ప్రోత్సహించేవాడని ఈ యువ ఆటగాడు తెలిపాడు. ద్రవిడ్ పక్కనుంటే ఎంతో ధైర్యంగా ఆడతామని, ఎల్లప్పుడూ ప్రోత్సహించేవాడని వివరించాడు. వందశాతం కష్టపడతానని, భారత్ తరుపున్న ఆడటం ఎంతో గౌరవంగా భావిస్తున్నాని పేర్కొన్నాడు. ఆసియాకప్‌కు ఎంపిక కావడం పట్ల తన తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపాడు. -
అఫ్గాన్ టెస్ట్: అశ్విన్ రికార్డు
సాక్షి, బెంగళూరు: అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ముందుగా బ్యాట్స్‌మెన్ చెలరేగగా, అనంతరం బౌలర్లు చకచకా వికెట్లు తీస్తు విజయాన్ని దగ్గర చేస్తున్నారు. భారత బౌలర్ల ధాటికి మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసేలా ఉంది. ఇక ఈ చారిత్రక టెస్ట్‌లో పలు రికార్డులు సృష్టిస్తున్న టీమిండియా ఆటగాళ్లు, తాజాగా భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మరో మైలు రాయిని అందుకున్నాడు. అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో అస్గార్ స్టానిక్జాయ్ వికెట్ తీసి.. తద్వారా భారత్ తరపున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్(92 టెస్టుల్లో 311 వికెట్లు) రికార్డును అధిగమించాడు. అశ్విన్ 58 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించటం విశేషం. 100 వికెట్ల క్లబ్లో ఉమేశ్ యాదవ్ టీమిండియా పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ తొలి ఇన్నింగ్స్‌లో రహ్మత్ షాను ఔట్ చేయడంతో టెస్ట్‌ల్లో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా ఈ ఘనత సాధించాడు. 37 టెస్టుల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు: అనిల్ కుంబ్లే- 619 వికెట్లు (132 టెస్టుల్లో) కపిల్ దేవ్ - 434 వికెట్లు (131 టెస్టుల్లో) హర్భజన్‌సింగ్- 417 వికెట్లు (103 టెస్టుల్లో) అశ్విన్-315 వికెట్లు (ప్రస్తుతానికి) (58 టెస్టుల్లో) జహీర్‌ఖాన్-311 వికెట్లు (92 టెస్టుల్లో) -
గోల్ కొట్టబోతున్న గృహిణి
షారుఖ్ ఖాన్ ‘చక్ దే ఇండియా’ హాకీ టీమ్‌లో కనిపించి, గత నవంబరులో క్రికెటర్ జహీర్ ఖాన్ని పెళ్లి చేసుకుని గృహిణి జీవితంలోని కొత్త బాధ్యతల్లో మునిగితేలుతున్న సాగరికా ఘాట్గే.. త్వరలోనే ఫుట్‌బాల్ టీమ్‌లో కనిపించబోతున్నారు! మరాఠీ దర్శకుడు మిలింద్ ఉకే తీస్తున్న ‘మాన్సూన్ ఫుట్‌బాల్’ చిత్రంలో ఫుట్‌బాల్ టీమ్‌గా ఏర్పడిన గృహిణుల జట్టులో ఒక సభ్యురాలి పాత్రతో సాగరిక తిరుగులేని ఒక గోల్ కొట్టడం కోసం ప్రస్తుతం ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. ‘‘సాగరిక ఈ సినిమాకు నా బెస్ట్ చాయిస్. ఆమెకూ ఈ సబ్జెక్టు నచ్చింది’’ అని చెప్తున్న ఉకే.. చూస్తుంటే సాగరిక చుట్టూనే తన కథను అల్లుకున్నట్లు కనిపిస్తోంది. చిత్రం షూటింగ్ జూలైలో మొదలవుతోంది. ఈలోపే సాగరిక ఒక ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా తనని తాను తీర్చిదిద్దుకుంటున్నారు. 2007లో ఛక్ దే తర్వాత ఫాక్స్, మిలే న మిలే హమ్, రష్, ప్రేమచి గోష్ట (మరాఠీ), జీ భర్ కె జీ లీ, దిల్ దారియాన్ (పంజాబీ), ఇరాద (2017) చిత్రాలలో సాగరిక నటించారు. ఇప్పుడీ ‘మాన్సూన్ ఫుట్‌బాల్’.. పెళ్లయ్యాక తొలిసారి ఆమె నటిస్తున్న చిత్రం. సాగరిక మరాఠీ యువతి. కొల్హాపూర్‌లో పుట్టారు. ఎనిమిదేళ్ల వరకు అక్కడే ఉన్నారు. తర్వాత రాజస్థాన్‌లోని అజ్మీర్ వెళ్లి, అక్కడి ‘మాయో కాలేజ్ గర్స్›్ల స్కూల్’ లో చదివారు. సాగరిక నేషనల్ లెవెల్ హాకీ ప్లేయర్ కూడా. ఆ ప్రతిభ కారణంగానే ఆమెకు ఛక్ దే ఇండియాలో అవకాశం వచ్చింది. విరాట్, అనుష్కలా.. సాగరిక, జహీర్లది లవ్ మ్యారేజ్. క్షణమైనా ఒకరినొకరు విడిచి ఉండలేని ఈ జంట.. తొలిసారి కళ్లు కళ్లు ఎక్కడ కలుపుకుందో ఎవరికీ తెలియని ఒక మిస్టరీ! -
జహీర్ బయోపిక్‌లో ఆ హీరో బెటర్!
ముంబై: బయోగ్రాఫికల్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నవేళ అలాంటివి మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ బయోపిక్‌ను కూడా తెరకెక్కాలని ఆయన సతీమణి సాగరిక ఘట్గే ఆశిస్తోంది. జహీర్ బయోపిక్‌లో హీరో రణబీర్ కపూర్ అయితేనే పక్కాగా సూటవుతాడని, అతను మాత్రమే పాత్రకు న్యాయం చేయగలడని ఆమె అన్నారు. ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్న ఈ జంటను మీడియా పలకరించిన సమయంలో సాగరిక తన మనసులో మాటను బయటపెట్టారు. రణబీర్ నటించిన సంజయ్ దత్ బయోపిక్ ‘సంజూ’ జూన్ 29న విడుదలకానున్న సంగతి తెలిసిందే. మరి జహీర్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు నిర్మాతలు ముందుకొస్తారా, లేక సాగరికానే నిర్మిస్తారా, అందులో నటించేందుకు రణబీర్ అంగీకరిస్తాడా.. ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్నలు. కాగా, సాగరిక ప్రస్తుతం ‘మాన్సూన్ ఫుట్‌బాల్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గృహిణులు అంతా కలిసి ఒక ఫుట్‌బాల్ జట్టుగా ఏర్పడటమనే స్ఫూర్తిదాయక ఇతివృత్తంలో ఆ సినిమా తెరకెక్కుతున్నది. జహీర్‌ను మనువాడిన తర్వాత సాగరిక నటిస్తోన్న తొలి సినిమా ఇదే! -
ఇది జహీర్ ఖాన్ వీర ప్రేమ కథ
ప్రేమ ఒక అనిర్వచితమైన అనుభూతి. దానికి మరింత బలం చేకూర్చేది పెళ్లి. ప్రతి ఒక్కరూ తమ పెళ్లికి దారి తీసిన సంఘటనలను మర్చిపోలేరు. అది సెలబ్రిటీలు అయినా సరే సామాన్యులు అయినా సరే. వారి పెళ్లి గురించి చెప్పమంటే మొదటగా సిగ్గు పడతారు. తర్వాత ఒక్కో విషయాన్ని సినిమా స్టోరీలా వివరిస్తారు. తాజాగా ఓ సెలబ్రిటీ ప్రేమ జంట తమ లవ్ జర్నీని వీడియో తీసి రిలీజ్ చేసింది. ఆ ప్రేమ పక్షులు ఎవరో కాదు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ నటి సాగరిక ఘట్గేలు. ఈ జంట పెళ్లి అయిన దగ్గర నుంచి అందరి చూపు వారిపైనే. వారు ఎటూ వెళ్లిన అందరూ ఓ లుక్కేస్తారు. దానికి కారణం అప్పట్లో వీరి లవ్ స్టోరి హాట్ టాపిక్‌గా మారడం. ఈ ప్రేమ పక్షులు వారి పెళ్లి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ వీడియో చేశారు. ఆ వీడియోలో ఇంట్లో వారి ప్రేమ విషయాన్ని చెప్పడానికి పడిన కష్టాలను వివరించారు. వీడియోలో జహిర్ ఖాన్ మాట్లాడుతూ... ‘ఇప్పటి వరకు సాగరిక ఏమి మారలేదు. నేను ప్రేమించినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. నేను మొదటగా మా ప్రేమ విషయాన్ని చెప్పడానికి సాగరిక వాళ్ల నాన్న దగ్గరకి వెళ్లాను. అంతకు ముందే నాకు వారి అమ్మతో పరిచయం ఉంది. దీంతో పెద్దగా భయపడలేదు. సాగరిక వాళ్ల నాన్నను తొలిసారి కలిసిప్పుడు15-20 నిమిషాలు మాట్లాడుతాడు అనుకున్నా, కానీ ఆయన నాతో మూడు గంటలపాటు మాట్లాడారు. అన్ని గంటలు అప్పటి పరిస్తితులపైనే మా చర్చ జరింది’ అని గుర్తుచేసుకుంటూ నవ్వేశాడు జహీర్ ఖాన్. ఇక సాగరిక మాట్లాడుతూ.. ‘నేను మొదటగా జహీర్ ఖాన్ కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్లినప్పుడు కాస్త భయపడ్డాను. వారు చాలా గంభీరంగా ఉంటారు. మనం వారిని ఎంత గౌరవిస్తామో, వారు మనల్ని అంతకు మించి గౌరవిస్తారు. మనుషులు గంభీరం కానీ మనసులు మాత్రం మంచివి అని లవ్ స్టోరీ చెబుతూ సిగ్గు పడింది ఈ హిరోయిన్. ఆ వీడియోకి సాగరిక ‘ఇది జహీర్ ఖాన్, సాగరికల లవ్ జర్నీ’ అని టైటిల్ కూడా పెట్టింది. కింది స్థాయి నుంచి కష్ట పడి వచ్చిన వాళ్లు నాకు ఎక్కువగా తెలియదు. కానీ ఆ గుణం జహీర్లో చూశా. అందరూ జహీర్‌ను ఇష్ట పడుతారు దానికి కారణం అతను మంచి వాడు. అతను నాకు దొరకడం నిజంగా లక్కీ అని సెలవిచ్చింది ఈ బాలీవుడ నటి. -
ఇది జహీర్ ఖాన్ లవ్ స్టోరీ
-
వారి హనీమూన్ ఫొటోలు వచ్చేశాయ్!
ముంబై: ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన జహీర్ ఖాన్, సాగరికా ఘట్గే దంపతులు విదేశాల్లో విహరిస్తున్నారు. నవంబర్ 23న సన్నిహితుల నడుమ వీరు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ దంపతులు ప్రస్తుతం మాల్దీవుల్లో హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మల్దీవుల్లోని అయదా రిసార్ట్ లో బస చేస్తున్న ఈ దంపతులు కలిసి అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. నీలాకాశం నేలమీదకొచ్చినట్టు ఉండే సముద్రతీరాలు, అందమైన సూర్యోదయాల్లో గడుపుతూ.. తమ కొత్త జీవితపు మధురిమలను పోగేసుకుంటున్నారు. ఈ మేరకు మాల్దీవుల్లో ఈ జంట ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను అభిమానుల కోసం ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటున్నారు. అందంగా ఉన్న ఈ ఫొటోలను నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. Star gazing and some lovely dinner on the cruise . Thank you for the most lovely surprise @discoversoneva 😊 A post shared by Sagarika (@sagarikaghatge) on Dec 10, 2017 at 7:27am PST Say hello to my early morning friend 😊😍 A post shared by Sagarika (@sagarikaghatge) on Dec 9, 2017 at 9:01pm PST Thrilled to have completed our first dive . See the happy faces 🌊 @zaheer_khan34 A post shared by Sagarika (@sagarikaghatge) on Dec 8, 2017 at 2:42am PST Decided to 🚲 instead @discoversoneva #islandlife #sonevajani A post shared by Sagarika (@sagarikaghatge) on Dec 10, 2017 at 10:14pm PST ❤️ A post shared by Sagarika (@sagarikaghatge) on Dec 10, 2017 at 8:19am PST Soaking in the calmness of the ocean A post shared by Zaheer Khan (@zaheer_khan34) on Dec 11, 2017 at 5:03am PST Mrs enjoying the setting sun A post shared by Zaheer Khan (@zaheer_khan34) on Dec 8, 2017 at 5:03am PST All the trainers @prosport_fit here’s the most dedicated trainee of yours . A post shared by Zaheer Khan (@zaheer_khan34) on Dec 9, 2017 at 3:44am PST -
విరాట్-అనుష్కల డ్యాన్స్ అదిరింది!
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ సాగరికను మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఇటీవల పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరి వెడ్డింగ్ రిసెప్షన్ సోమవారం సాయంత్రం ముంబైలోని తాజ్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు క్రికెట్ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. జహీర్ ఖాన్ రాయల్ బ్లూ డ్రెస్ ధరించగా, సాగరిక గోల్డెన్ బెనారసి లెహంగాలో అందంగా మెరిసిపోయింది. అయితే ఈ వేడుకలో ప్రేమ పక్షులు విరాట్ కోహ్లి-అనుష్క శర్మలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తమ డ్యాన్స్‌తో అక్కడకొచ్చిన వారిని ఆనందంలో ముంచెత్తారు. ప్రస్తుతం వారిద్దరూ అదరగొట్టిన డ్యాన్స్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖ క్రికెటర్లు హాజరయ్యారు.ప్రధానంగా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు యువరాజ్ సింగ్ తన భార్య హజల్కీచ్తో కలిసి హాజరయ్యాడు. వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్, సానియా మీర్జా, అజిత్ అగార్కర్ తదితరులు జహీర్ రిసెప్షన్‌కు హాజరైన వారిలో ఉన్నారు. -
జహీర్ వెడ్డింగ్ రిసెప్షన్లో విరాట్-అనుష్కల డ్యాన్స్
-
జహీర్, సాగరికల రిసెప్షన్ వేడుకలు
-
ఒక్కటైన జహీర్-సాగరిక
ముంబై: టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి, బాలీవుడ్ నటి సాగరిక ఘట్గేను జహీర వివాహం చేసుకున్నాడు. గురువారం ఉదయం జహీర్-సాగరికలు రిజస్టర్ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్ళి ఫొటోలను జహీర్ స్నేహితురాలు, స్పోర్ట్ ఫిట్నెస్ స్టూడియో మార్కెటింగ్ హెడ్ అంజనా శర్మ షేర్ చేశారు. నవంబర్ 27న ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ అండ్ టవర్‌లో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సెలబ్రెటిలతో పాటు, జహీర్ ఖాన్ స్నేహితులు హాజరుకానున్నారు. వివాహ రిసెప్షన్‌కి సంబంధించిన ఆహ్వానపత్రికను సాగరిక స్నేహితురాలు, చక్ దే ఇండియాలో ఆమె సహనటి విద్యా మాల్వంకర్ షేర్ చేసింది. -
జహీర్ సలహా ఎప్పటికీ మరిచిపోను: కోహ్లి
న్యూఢిల్లీ:గత కొన్నేళ్లుగా భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లి-బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్నారనే వార్తలు కూడా బాగా ఊపందుకున్నాయి. అయితే అనుష్క శర్మతో రిలేషన్షిప్ లో భాగంగా మూడేళ్ల క్రితం మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఇచ్చిన సలహా తనకు ఎంతగానో ఉపయోగపడిందని కోహ్లి తాజాగా పేర్కొన్నాడు. '2014 ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా అనుష్క శర్మ నాతో పాటే వచ్చింది. ఆ సిరీస్ లో నేను సరిగా రాణించలేకపోయా. దాన్ని టార్గెట్ చేస్తూ ఒక వర్గం నెటిజన్లు మాపై విమర్శల వర్షం కురిపించారు. నేను రాణించకపోవడానికి అనుష్క శర్మ రావడమే కారణమంటూ సెటైర్లు గుప్పించారు. నేను విఫలమైన ప్రతీసారి అనుష్కను టార్గెట్ చేస్తూ వార్తలు రాశారు. అదే క్రమంలో నాకు ఫ్యాషన్ పై మోజు పెరిగిందంటూ ఛలోక్తులు విసిరారు. నా వైఫల్యాలకు అనుష్కను నిందిస్తున్న సమయంలో ఓసారి జహీర్ ఖాన్ తో మాట్లాడా. అప్పుడు అతను ఓ విషయం చెప్పాడు. నీవు ఏదీ దాచాలని ప్రయత్నించకు. నువ్వు దాచేందుకు యత్నిస్తే ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రహస్యంగా ఉంచడానికి నువ్వు నేరం చేయలేదు కదా అని జహీర్ చెప్పాడు. ఆనాటి జహీర్ మాటలే నాకు చాలా ఉపయోగపడ్డాయి. మాపై నిందలు వేస్తున్న సమయంలో జహీర్ తో మాట్లాడం ఎంతో ఊరటనిచ్చింది'అని కోహ్లి తెలిపాడు. -
త్వరలో ఇంటివాడు కానున్న జహీర్
న్యూఢిల్లీ:టీమిండియా మాజీ స్పీడ్‌స్టార్ జహీర్ ఖాన్ త్వరలో ఇంటివాడు కానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తన ప్రియురాలు, బాలీవుడ్ నటి సాగరిక ఘాట్గెతో నిశ్చితార్థం చేసుకున్న జహీర్.. వచ్చే నవంబర్ లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. అయితే అదే నెలలో రెండు వేర్వేరు వేడుకల్ని చేసుకోవడానికి జహీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. తొలుత ముంబైలో, ఆపై పుణెలో వేడుకల్ని చేసుకోనున్నట్లు జహీర్ స్నేహితులు తెలిపారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట.. గత కొన్ని నెలల క్రితం జరిగిన క్రికెటర్ యువరాజ్ సింగ్-నటి హజల్ కీచ్ వివాహ వేడుకకు హాజరు కావడంతో వారిద్దరూ డేటింగ్ ఉన్నారనే విషయం మరింత బలపడింది. ఆ క్రమంలోనే తమపై వస్తున్న రూమర్లకు ఏప్రిల్ నెలలో నిశ్చితార్థంతో ఫుల్ స్టాప్ పెట్టారు. ఏప్రిల్ 25 తేదీన సాగరికతో నిశ్చితార్థం అయిన విషయాన్ని జహీర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. 'మీ భార్య ఎంపికలపై నవ్వకండి. ఎందుకంటే అందులో మీరు కూడా ఉన్నారు. ఇక నుంచి జీవితాంతం భాగస్వాములం’ అని సాగరిక చేతికి ఉంగరం పెట్టిన ఫొటోను జహీర్ ట్వీట్ చేశాడు. -
ద్రవిడ్, జహీర్లకు షాక్!
-
ద్రవిడ్, జహీర్లకు షాక్!
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్లకు గట్టి షాక్ తగిలింది. ఇటీవల బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా నియమించబడ్డ ద్రవిడ్, జహీర్లకు అది మూన్నాళ్ల ముచ్చెటే అయ్యింది. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి కోరినట్లే అసిస్టెంట్ కోచ్ గా సంజయ్ బంగర్, బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ లను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రకటించింది. వీరిద్దరూ వచ్చే వరల్డ్ కప్ వరకూ కొనసాగుతారని స్పష్టం చేసింది. మరొకవైపు ఫీల్డింగ్ కోచ్ గా ఆర్ శ్రీధర్ నియామకం కూడా దాదాపు ఖరారైనట్లే కనబడుతోంది. ముందుగా సచిన్ , గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్ లను రవిశాస్త్రికి సహాయకులు నియమించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై రవిశాస్త్రి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు పెద్దగా అనుభవం లేని జహీర్ ఖాన్ వద్దంటూ పట్టుబట్టాడు. అదే సమయంలో వినోద్ రాయ్ నేతృత్వంలోని సీవోఏ కూడా ద్రవిడ్, జహీర్ ల ఎంపికపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ప్రధాన కోచ్ బాధ్యతను సీఏసీకి అప్పచెబితే, మరో ఇద్దర్ని తెరపైకి తీసుకురావడాన్ని తప్పుబట్టింది. మరొకవైపు ప్రధాన కోచ్ కే సహాయక సిబ్బందిని నియమించుకునే స్వేచ్ఛ ఉందంటూ రవిశాస్త్రికి అండగా నిలిచింది. దాంతో అనేక తర్జన భర్జనల తరువాత సమావేశమైన బీసీసీఐ వర్కింగ్ కమిటీ.. రవిశాస్త్రి కోరినట్లే భరత్ అరుణ్, సంజయ్ బంగర్‌లను ఎంపిక చేసింది. అయితే రాహుల్, ద్రవిడ్ లను విదేశీ కన్సల్టెంట్లుగా కొనసాగించాలనుకుంటే దానికి తాను అభ్యంతర చెప్పనని రవిశాస్త్రి తెలిపాడు. తనకు ఏమి కావాలో బుర్రలో ఉందన్నాడు. అయితే, ద్రవిడ్, జహీర్ లకు ఏమైనా బాధ్యతలు అప్పచెబుతారనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు. -
ద్రవిడ్, జహీర్లకు కుంబ్లే పరిస్థితే..
ముంబై: భారత క్రికెట్ మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తరహాలోనే బీసీసీఐ ద్రవిడ్, జహీర్‌లను ఘోరంగా అవమానిస్తోందని సీఓఏ మాజీ సభ్యుడు రామ చంద్రగుహా ఆగ్రహాం వ్యక్తం చేశాడు. రామచంద్ర గుహా గత జూన్‌లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పరిపాలక కమిటీ (సీఓఏ) అభ్యర్థిత్వానికి రాజీనామ చేశారు. డ్రామను తలపిస్తూ సాగిన భారత్ హెడ్ కోచ్ ఎంపికను రామచంద్రగుహా తప్పుబట్టాడు. కుంబ్లే, ద్రవిడ్, జహీర్ గొప్ప ఆటగాళ్లని, ఎన్నోవిజయాలు అందించారని వారిని అవమానాలకు గురిచేయవద్దని పేర్కొన్నారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) రవిశాస్త్రీ హెడ్ కోచ్‌గా, ద్రవిడ్, జహీర్‌ను విదేశీ పర్యటనలకు బౌలింగ్, బ్యాటింగ్ కన్సల్టెంట్లుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. పరిపాలక కమిటీ (సీఓఏ) హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికపైనే ఆమోద ముద్ర వేసింది. అయితే బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్, బ్యాటింగ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ల నియామకంపై కమిటీ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. జట్టు సహాయక సిబ్బందిని ఈనెల 22న రవిశాస్త్రిని సంప్రదించాకే నియమించే అవకాశం ఉంది. అయితే బోర్డు చెబుతున్నట్టుగా విదేశీ పర్యటనలోనైనా జహీర్, ద్రవిడ్ జట్టుతో పాటు ఉంటారా? అనే విషయంలో కమిటీ స్పష్టతనివ్వడం లేదు. ఈ విషయంపై స్పందించిన రామచంద్ర గుహా కోచ్ ఎంపికలో రాజకీయలు చేయడం బాధించిందని, కుంబ్లేకు ఎదురైన పరిస్థితే ద్రవిడ్, జహీర్‌కు ఎదురవుతుందని వరుస ట్వీట్లు పోస్టు చేశాడు. గతంలో కూడా రామచంద్ర గుహా బీసీసీఐని ఉద్దేశించి తన రాజీనామాలో ప్రశ్నించారు. క్రికెటర్లు కోచ్, కామెంటేటర్ల ఎంపికలో భాగస్వామ్యులవుతున్నారని హార్షబోగ్లేను తప్పించడంలో కోహ్లీ పాత్రను గుర్తు చేశారు. Kumble, Dravid and Zaheer were true greats of the game who gave it all on the field. They did not deserve this public humiliation. — Ramachandra Guha (@Ram_Guha) 16 July 2017 The shameful treatment of Anil Kumble has now been compounded by the cavalier treatment of Zaheer Khan and Rahul Dravid. — Ramachandra Guha (@Ram_Guha) 16 July 2017 -
జహీర్, ద్రవిడ్ అనుమానమేనా!
రవిశాస్త్రి ఎంపికకే సీఓఏ ఆమోదం న్యూఢిల్లీ: టీమిండియా కోచ్‌ల నియామక ప్రక్రియ అనేక మలుపులు తిరుగుతోంది. శనివారం సమావేశమైన పరిపాలక కమిటీ (సీఓఏ) హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికపైనే ఆమోద ముద్ర వేసింది. అయితే బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్, బ్యాటింగ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ల నియామకంపై కమిటీ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. జట్టు సహాయక సిబ్బందిని ఈనెల 22న రవిశాస్త్రిని సంప్రదించాకే నియమించే అవకాశం ఉంది. సమావేశంలో వినోద్ రాయ్, డయానా ఎడుల్జీలతో పాటు బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి పాల్గొన్నారు. అయితే బోర్డు చెబుతున్నట్టుగా విదేశీ పర్యటనలోనైనా జహీర్, ద్రవిడ్ జట్టుతో పాటు ఉంటారా? అనే విషయంలో కమిటీ స్పష్టతనివ్వడం లేదు. శాస్త్రి వేతనంపై కమిటీ కోచ్ రవిశాస్త్రికి, సహాయక సిబ్బందికి ఎంత మొత్తం ఇవ్వాలనే విషయంపై నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటయ్యింది. ఇందులో డయానా ఎడుల్జీ, బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, సీసీవో జోహ్రి, కార్యదర్శి అమితాబ్ చౌదరీ సభ్యులుగా ఉంటారు. ఈనెల 19న వీరు తొలిసారిగా సమావేశం కానున్నారు. తమ ప్రతిపాదనలతో ఈ కమిటీ 22న సీఓఏకు నివేదిక ఇస్తుంది. టీమ్ మేనేజర్ కోసం దరఖాస్తుల ఆహ్వానం ముంబై: సహాయక సిబ్బంది ఎంపిక ఇంకా నలుగుతుండగానే బీసీసీఐ.. టీమ్ మేనేజర్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 21లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిౖకైన వారు ఏడాది కాలం పాటు పదవిలో ఉంటారని, అభ్యర్థులు ఫస్ట్ క్లాస్/అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ల్లో ఆడిన అనుభవం ఉండాలని కోరింది. -
ద్రవిడ్, జహీర్ లపై నిర్ణయం పెండింగ్!
ముంబై:భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి నియామకాన్ని మాత్రమే సమర్ధిస్తున్న బీసీసీఐ పాలకుల కమిటీ(సీవోఏ) మరోసారి ఆ విషయాన్ని స్ఫష్టం చేసింది. భారత క్రికెట్ బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్, విదేశాల్లో బ్యాటింగ్ కన్సల్టెంట్ గా రాహుల్ ద్రవిడ్ కు బాధ్యతలు అప్పచెబుతూ బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) తీసుకున్న నిర్ణయం ఇంకా పెండింగ్ లోనే ఉందని సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ తాజాగా స్పష్టం చేశారు. ఈ మేరకు జాతీయ న్యూస్ ఛానలె రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జహీర్, ద్రవిడ్ ల నియామకంపై మాట్లాడారు. వారి ఎంపికకు సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. జూలై 22వ తేదీన వారి పదవులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం సీఏసీ ఎంపిక చేసిన ప్రధాన కోచ్ రవిశాస్త్రి నియమాకాన్ని మాత్రమే అధికారంగా ధృవీకరించినట్లు వినోద్ రాయ్ తెలిపారు.రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్ ల విషయంపై సమీక్ష జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. కేవలం ప్రధాన కోచ్ ను మాత్రమే ఎంపిక చేయాల్సిన సీఏసీ.. మరో అడుగు ముందుకేసి బౌలింగ్ , బ్యాటింగ్ కన్సల్టెంట్ లను ఎంపిక చేయడం సీవోఏకు ఆగ్రహం తెప్పించింది. దీనిలో భాగంగానే ఆ ఇద్దరి ఎంపికను పెండింగ్ లో పెట్టింది. -
జహీర్ బాధ్యతలు ఐదు నెలలే: గంగూలీ
కోల్‌కతా: టీమిండియా బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఎంపికైన జహీర్ ఖాన్ ఏడాదిలో 150 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటారని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. దీంతో జహీర్ జట్టుకు పూర్తి స్థాయి బౌలింగ్ కోచ్ కాదనే విషయంలో స్పష్టత వచ్చినట్టయ్యింది. అటు బీసీసీఐ కూడా ఇప్పటికే జహీర్ నియామకం ఆయా పర్యటనల వారీగా సేవలందించే వరకేనని పేర్కొంది. మరోవైపు తాను కేవలం వంద రోజుల వరకే సేవలందించగలనని జహీర్ స్పష్టం చేసినా... సీఏసీ ఒత్తిడి మేరకు తనతో 150 రోజుల ఒప్పందం కుదిరింది. ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని నియమించిన అనంతరం సహాయక కోచ్‌లుగా జహీర్, రాహుల్ ద్రవిడ్‌ల ఎంపిక అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. జహీర్ స్థానంలో పూర్తి స్థాయి కోచ్‌గా భరత్ అరుణ్‌ను తీసుకోవాలని రవిశాస్త్రి గట్టిగా పట్టుబడుతున్నారు. -
బౌలింగ్ కోచ్‌గా జహీర్ సరిపోడు: రవిశాస్త్రి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కోచ్‌ల విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బౌలింగ్ కోచ్ ఎంపిక పట్ల హెడ్ కోచ్ రవిశాస్త్రి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తనకు మద్దతుగా ఉండే వ్యక్తిని బౌలింగ్ కోచ్‌గా తీసుకోవాలని రవిశాస్త్రి భావిస్తున్నాడు. గతంలో భారత బృందానికి బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన భరత్ అరుణ్‌ను తీసుకోవాలనే పట్టుపడుతున్నట్లు సమాచారం. దీనిపై మాట్లాడటానికి హెడ్ కోచ్‌గా ఎన్నికైన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా రవిశాస్త్రి బౌలింగ్ కోచ్ పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గురువారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్యూలో రవిశాస్త్రి మాట్లాడారు. 'జహీర్ ఉత్తమైన బౌలర్. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ బౌలింగ్ కోచ్‌గా పనిచేయడానికి కావాల్సినంత అనుభవం మాత్రం లేదని' అన్నారు. అనుభవం లేకపోతే ఏంజరుగుతుందో కోచ్‌గా పనిచేసిని కుంబ్లే విషయంలో చూశాం' అని పేర్కొన్నాడు. కానీ భరత్ అరుణ్ విషయంలో అలా కాదని విదేశాల్లో అపార అనుభవం ఉందన్నాడు. జహీర్ ఏడాదిలో 250 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. అది సాధ్యపడుతుందా? అని ప్రశ్నించాడు. ఒక వేళ కోచ్‌గా పనిచేసే ఉద్దేశం ఉంటే అరుణ్‌తో కలిసి సలహాదారుడిగా పనిచేయాలని సూచించాడు. అదే విధంగా జహీర్ ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున తన బాధ్యతలనుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను బీసీసీఐ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా బోర్డుకు వృధా ఖర్చు అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. భారత జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్‌గా జహీర్‌ఖాన్ ఎంపికైన విషయం తెలిసిందే. -
జహీర్ రికార్డును బ్రేక్ చేసిన జడేజా
బర్మింగ్‌హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సాధించాడు. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లను సాధించిన ఘనతను జడేజా సొంతం చేసుకున్నాడు. గురువారం బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో ఒక వికెట్ తీయడం ద్వారా భారత్ తరపున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు. తద్వారా జహీర్ ఖాన్ రికార్డును జడేజా బ్రేక్ చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకూ తొమ్మిది మ్యాచ్ లు ఆడిన జడేజా 16 వికెట్లు సాధించాడు. దాంతో ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన జహీర్ 15 వికెట్ల ఘనతను సవరించాడు. ఆ తరువాత స్థానాల్లో హర్భజన్ సింగ్(14), సచిన్ టెండూల్కర్(14), ఇషాంత్ శర్మ(13), భువనేశ్వర్ కుమార్ (12)లు ఉన్నారు. ఇదిలా ఉంచితే భారత్ ఖాతాలో మరో ఘనత చేరింది. ఈ టోర్నమెంట్లో 11 నుంచి 40 ఓవర్ల మధ్యలో అత్యధిక వికెట్లను సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. అంతకుముందు పాకిస్తాన్ పేరిట ఉన్న రికార్డును భారత్ అధిగమించింది. భారత్ 19 వికెట్లతో తొలి స్థానాన్ని ఆక్రమించగా, పాకిస్తాన్ 18 వికెట్లతో రెండో స్థానంలో ఉంది. -
బౌలింగ్ కోచ్‌గా ఉండేందుకు సిద్ధమే!
న్యూఢిల్లీ: అవకాశమిస్తే భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తెలిపాడు. ‘భారత బౌలింగ్ కోచ్ అనేది బాధ్యతాయుతమైన పని. ఇప్పటికైతే ఆ ఆలోచన లేకున్నా అవకాశం వస్తే మాత్రం తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే నా కెరీర్లో చేసిన పనే అక్కడా చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా నా సలహాలు కావాలనుకుంటే ఇవ్వడానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఇక ఈ విషయమై బీసీసీఐతో మాట్లాడానా? లేదా? అనే విషయం ఇప్పుడు చెప్పలేను’ అని 38 ఏళ్ల జహీర్ తెలిపాడు. భారత్ తరఫున 92 టెస్టు మ్యాచ్‌లాడిన జహీర్ 311 వికెట్లు పడగొట్టాడు. -
జహీర్ 'దిగి' వస్తాడా?
న్యూఢిల్లీ: గతేడాది భారత ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లే బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఏడాది కాలానికి భారత జట్టుకు కుంబ్లేను కోచ్ గా నియమించింది బీసీసీఐ. అయితే అదే సమయంలో జట్టుకు బౌలింగ్ కోచ్ కూడా ఉండే బాగుంటుందని బీసీసీఐ భావించింది. దానిలో భాగంగానే కుంబ్లేను ప్రధాన కోచ్ గా ఎంపిక చేసిన తరువాత జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ చేయమంటూ బీసీసీఐ ప్రతిపాదన పంపింది. కాగా, జహీర్ నుంచి బీసీసీఐకు దిమ్మే తిరిగే సమాధానం అందిందట. తాను కేవలం పార్ట్ టైమ్ కోచ్ గా మాత్రమే చేస్తానని చెప్పిన జహీర్.. అందుకు నాలుగు కోట్లు రూపాయిలు డిమాండ్ చేశాడట. 100 రోజుల పాటు బౌలింగ్ కోచ్ గా ఉండేందుకు నాలుగు కోట్లు డిమాండ్ చేశాడు. ప్రస్తుతం భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి బీసీసీఐ దరఖాస్తుల్నిఆహ్వానించిన నేపథ్యంలో కుంబ్లేకు ఎటువంటి పొడిగింపు లేదనేది అర్ధమవుతోంది. అదే క్రమంలో భారత జట్టు బౌలింగ్ కోచ్ గురించి మరొకసారి ప్రస్తావన వచ్చింది. ఇటీవల కుంబ్లే, విరాట్ కోహ్లిలు జహీర్ ను బౌలింగ్ గా నియమించాలంటూ ప్రతిపాదించిన నేపథ్యంలో అతను గతంలో ఎంత డబ్బు డిమాండ్ చేశాడో అనే విషయం మరొకసారి తెరపైకి వచ్చింది. ఒకవేళ జహీర్ ను బౌలింగ్ కోచ్ గా చేయడానికి ఒప్పుకుంటే ఈసారి ఎంత డబ్బులు డిమాండ్ చేస్తాడో మరి. ఫుల్ టైమ్ కోచ్ గా పని చేయాలంటే ఇంకెంత భారీగా అడుగుతాడో తెలియక అని బీసీసీఐ తర్జన భర్జన పడుతుంది.. అసలు జహీర్ ను ఎంపిక చేసేందుకు ముందుకు వెళదామా? వద్దా?అనే యోచనలో బీసీసీఐ పెద్దలు ఉన్నారు. మరొకవైపు ప్రధాన కోచ్ ను ఎంపిక చేసిన తరువాత మాత్రమే జహీర్ గురించి ఆలోచిస్తే మంచిదని బోర్డు అభిప్రాయంగా ఉంది. -
జహీర్ ఎంగేజ్మెంట్ కు కోహ్లీ జంట
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. మొదట్లో రహస్యంగా ఉన్నవీరి ప్రేమాయణం గత కొద్ది రోజులుగా బాహటంగానే వ్యక్తపరుస్తున్నారు. గత సంవత్సరం క్రికెటర్ యువరాజ్ సింగ్ పెళ్లిలో ఆడి పాడి సందడి చేసిన ఈ జంట తాజాగా మాజీ క్రికెటర్ జహీర్‌ఖాన్- సాగరిక ఎంగేజ్ మెంట్ కు హాజరయ్యారు. ఈ వేడుకలో వీరిద్దరూ చేతులో చేయివేసుకోని మరి రావడం విశేషం. ఐపీఎల్ జరగుతున్న సమయంలోనే జహీర్ సాగిరికలు ఎంగేజ్ మెంట్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తవించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సచిన్-అంజలి, రోహిత్ శర్మ రితికాలు పాల్గొన్నారు. -
బౌలింగ్ కోచ్‌గా జహీర్‌ను నియమించాలి
న్యూఢిల్లీ: మాజీ పేసర్ జహీర్‌ఖాన్‌ను భారత్ బౌలింగ్ కోచ్‌గా నియమించాలని స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే, బ్యాటింగ్ కోచ్‌గా సంజయ్ బంగర్ లు ఉండగా బౌలింగ్ కోచ్ స్థానం ఖాళీగా ఉంది. ఈ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం జహీర్ ఖాన్‌కు ఉందని బజ్జీ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘భారత్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా జహీర్ బెస్ట్ ఆప్షన్ అని ఇది నా అభిప్రాయమని’ బజ్జీ ట్వీట్ చేశాడు. ఐపీఎల్-10 లో జహీర్‌ఖాన్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రిటైర్మెంట్ తీసుకున్నా తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఈ సీజన్ లోఐపీఎల్100 వికెట్ల క్లబ్బులో చేరిన జహీర్ 11 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్ల పడగొట్టాడు. అయితే భారత జట్టుకు బౌలింగ్ కోచ్ లేకపోవడంతో జట్టు ప్రధాన కోచ్ కుంబ్లే అదనపు భారం మోయాల్సి వస్తుంది. ఇక రిటైర్మెంట్ అనంతరం జహీర్ కోచ్‌గా చేయడానికి సిద్దం అని చాల సార్లు ప్రకటించాడు. 2011 ప్రపంచ కప్ భారత జట్టు విజయంలో జహీర్ కీలకపాత్ర పోశించాడు. 92 టెస్టులు ఆడిన జహీర్ 311 వికెట్లు పడగొట్టాడు. ఇక 311 వన్డేలు ఆడి 282 వికెట్లు తీశాడు. @ImZaheer would be the best option for indian fast bowling coach in my opinion..Great mind #Greatfella — Harbhajan Turbanator (@harbhajan_singh) 23 May 2017 -
జహీర్‌ఖాన్ ఐపీఎల్ ‘సెంచరీ’
ఢిల్లీ: రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సీనియర్ క్రికెటర్ జహీర్‌ఖాన్ బౌలింగ్‌లో పదును ఏమాత్రం తగ్గలేదు. 38 ఏళ్ల వయసులోనూ సత్తా చాటుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో వంద వికెట్లు పడగొట్టి మరోసారి మెరిశాడు. ఫిరోషా కోట్లా మైదానంలో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అతడీ ఘనత సాధించాడు. అజింక్య రహానేను క్లీన్‌బౌల్డ్ చేసి ఐపీఎల్ వందో వికెట్ మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన పదో బౌలర్‌గా, 8వ భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ ఐపీఎల్ సీజన్లో 10 మ్యాచుల్లో 10 వికెట్లు పడగొట్టాడు. లలిత్ మలింగ(152), అమిత్ మిశ్రా(134), హర్భజన్ సింగ్(127), పియూష్ చావ్లా(123), డ్వేన్ బ్రావొ(122), భువనేశ్వర్ కుమార్(108), ఆశిష్ నెహ్రా(106), వినయ్ కుమార్(101), రవిచంద్రన్ అశ్విన్(100) ఇంతకుముందు ఐపీఎల్లో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్నారు. 92 టెస్టులు ఆడిన జహీర్‌ఖాన్ 32.94 సగటుతో 311 వికెట్లు పడగొట్టాడు. 200 వన్డేలు ఆడి 282 వికెట్లు తీశాడు. 17 టి20ల్లో 17 వికెట్లు దక్కించుకున్నాడు. -
జహీర్ ఎంతో సహాయం చేశాడు: షమీ
న్యూఢిల్లీ: భారత పేసర్ మహ్మద్ షమీ తన బౌలింగ్ తో ఛాంపియన్స్ ట్రోఫిలో సత్తా చాటుతాననే విశ్వాసం వ్యక్తం చేశాడు. బౌలింగ్ లో మెళుకవలు నేర్చుకోవడానికి భారత మాజీ పేసర్, ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ ఎంతగానో సహాయం చేశాడని పేర్కొన్నాడు. జూన్ 1 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫిలో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కడంతో మహ్మద్ షమీ మీడియాతో ఉద్వేగానికి లోనయ్యాడు. జహీర్ ఇచ్చిన సూచనలు బెస్ట్ బౌలర్ గా తీర్చిదిద్దాయని షమీ వ్యాఖ్యానించాడు. సాధారణంగా మాజీ క్రికెటర్లతో మాట్లడినప్పుడే విలువైన సూచనలు లభిస్తాయని కానీ జహీర్ తో మాట్లడితే అంత కన్నా ఎక్కువ చిట్కాలు లభించాయని షమీ తెలిపాడు. దేశంలో చాల మంది క్రికెటర్లున్నారని వారందరికీ ఐపీఎల్ చక్కని వేదికా అని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ టోర్నమెంట్ లో ఆడే ముందు ఐపీఎల్ లో ఆడిన 8-10 మ్యాచ్ లు తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని షమీ పేర్కొన్నాడు. 'దాదాపు రెండు సంవత్సరాలుగా జట్టుకు దూరమయ్యాను. ఈ రెండు సంవత్సరాలు నా బలం-ఫిట్ నెస్ పై దృష్టి సారించాను. నా బలహీనతలను సరిదిద్దుకున్నాను. దీనికోసం బరువు కూడా తగ్గాను. ఛాంపియన్స్ ట్రోఫిలో సత్తా చాటుతాననే నమ్మకం ఉంది. నా ప్రతిభ చాటలనే కసి మీద ఉన్నానని' మహ్మద్ షమీ ఉద్వేగంగా వ్యాఖ్యానించాడు. ఇక మహ్మద్ షమీ 2015 లో జరిగిన వరల్డ్ కప్ అనంతరం ఏ అంతర్జాతీయ వన్డే టోర్నమెంట్లో పాల్గొనలేదు. -
మరో విజయం కోసం...
⇒నేడు గుజరాత్‌తో తలపడనున్న ఢిల్లీ ⇒ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే విజయం తప్పనిసరి ⇒ లయన్స్‌కు చావోరేవో న్యూఢిల్లీ: వరుస పరాజయాలకు అడ్డుకట్టవేసి చివరి మ్యాచ్‌లో గెలుపుబాట పట్టిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ గురువారం గుజరాత్ లయన్స్‌తో తలపడనుంది. ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే ప్రతీ మ్యాచ్ నెగ్గాల్సిన స్థితిలో ఉన్న ఢిల్లీ.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లో త్రుటిలో విజయాన్ని కోల్పోయిన గుజరాత్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గాలని బరిలోకి దిగనుంది. వరుస ఓటములకు చెక్... ఈ సీజన్లో ఢిల్లీ జట్టు ఆటతీరు అంతంతమాత్రంగానే ఉంది. తొలి మ్యాచ్‌లో ఓడిన తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి జోరు చూపించింది. ఆ తర్వాత నుంచి జట్టు ఆటతీరు తీసికట్టుగా మారింది. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యంతో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. దీంతో కేవలం నాలుగు పాయింట్లతో పట్టికలో అట్టడుగుస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో కెప్టెన్ జహీర్ ఖాన్ జట్టుకు దూరమవడం ఎదురుదెబ్బగా పరిణమించింది. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడిన ఢిల్లీ అనూహ్యంగా పుంజుకుంది. జట్టు బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. కెప్టెన్ కరుణ్ నాయర్ జట్టును ముందుడి నడిపాడు. సంజూ సామ్సన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కోరే అండర్సన్, క్రిస్ మోరిస్ తలో చేయి వేశారు. దీంతో ఆరు పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలోకి ఎగబాకింది. తాజా విజయంతో ఢిల్లీకి ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగయ్యాయి. నాకౌట్‌కు డేర్డెవిల్స్అర్హత సాధించాలంటే మిగతా ఐదు మ్యాచ్‌ల్లో కచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది. అయితే వీటిలో నాలుగు మ్యాచ్‌లు సొంతగడ్డపై జరుగుతుండడం జట్టుకు సానుకూలాంశం. జట్టు బ్యాటింగ్ విషయానికొస్తే ఈ సీజన్లో సంజూ సామ్సన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 34కిపైగా సగటుతో 313 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర సెంచరీ కూడా ఉండడం విశేషం. తర్వాతి స్థానాల్లో శ్రేయస్ అయ్యర్ (190 పరుగులు), రిషబ్ పంత్ (184 పరుగులు) ఆకట్టుకున్నారు. మరోవైపు గత మ్యాచ్‌లో సత్తాచాటిన కరుణ్, అండర్సన్ అదే జోరును చూపించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇక క్రిస్ మోరిస్ ఆకట్టుకుంటున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీశాడు. బ్యాట్‌తోను జోరు చూపిస్తూ సిసలైన అల్‌రౌండర్‌గా మోరిస్ మెరుగవుతున్నాడు.ప్యాట్ కమిన్స్ (9 వికెట్లు), అమిత్ మిశ్రా (8) ఫర్వాలేదనిపిస్తున్నారు. జయంత్ యాదవ్ మంచి ఎకానమీ రేటుతో ఆకట్టుకున్నా వికెట్లు తీయడంలో విఫలమవుతున్నాడు. కగిసో రబడ, మహ్మద్ షమీ రాణించాల్సి ఉంది. చివరిమ్యాచ్‌లో అమిత్ మిశ్రా.. హైదరాబాద్‌ను కట్టడి చేయడంతో ప్రత్యర్థి 200 పరుగుల మార్కును చేరుకోలేకపోయింది. ఈ సీజన్లో ఢిల్లీ–గుజరాత్ ఒక్కసారి కూడా తలపడలేదు. గత సీజన్లో రెండుసార్లు తలపడిన ఇరుజట్లు చెరోసారి విజయం సాధించాయి. గుజరాత్ డీలా... మరోవైపు గత సీజన్లో అద్భుత విజయాలతో ఆకట్టుకుని మూడోస్థానంలో నిలిచిన గుజరాత్ .. ఈసీజన్లో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. ఇప్పటివరకు పది మ్యాచ్‌లాడిన గుజరాత్ కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించగా.. ఏడు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఓవరాల్‌గా పట్టికలో ఏడోస్థానంలో కొనసాగుతోంది. అయినప్పటికీ గుజరాత్‌కు ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయి. మిగిలన నాలుగు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించడంతోపాటు మిగతా జట్ల మ్యాచ్‌ల ఫలితాలు కలిసి వచ్చినట్లయితే నాకౌట్‌పోరుకు అర్హత సాధించే అవకాశముంది. ఈ క్రమంలో ఆ జట్టు ప్రతీ పోరును చావోరేవోలాగా భావించాల్సి ఉంటుంది. మరోవైపు ముంబై ఇండియన్స్, పుణే సూపర్‌జెయింట్‌తో జరిగిన చివరి మ్యాచ్‌ల్లో కొద్ది తేడాలో విజయం కోల్పోయిన గుజరాత్ ఈ మ్యాచ్‌లో నెగ్గాలని కసి మీద ఉంది. జట్టు బ్యాటింగ్ విషయానికొస్తే విధ్వంసక ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ (319 పరుగులు), కెప్టెన్ సురేశ్ రైనా(318 పరుగులు) జట్టు వెన్నెముకలా నిలిచారు. జట్టు తరఫును పరుగుల వరద పారిస్తున్నా కీలక దశలో సహచరుల నుంచి సహకారం అందడం లేదు. వీరితోపాటు దినేశ్ కార్తిక్ (221 పరుగులు), ఆరోన్ ఫించ్ (200 పరుగులు) సత్తాచాటుతున్నారు. ఇషన్ కిషన్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. అయితే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, డ్వేన్ స్మిత్ బ్యాట్ ఝులిపించాల్సిన అవమసరముంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే కేరళ కుర్రాడు బాసిల్ థంప్సి 8 వికెట్లతో ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు పుణేతోమ్యాచ్లో ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ప్రదీప్ సాంగ్వాన్ రాణించాడు. తొలి ఓవర్లోనే కీలకమైన రెండు వికెట్లు తీసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నాడు. ఇదే తరహా ప్రదర్శన పునరావృతం చేయాలని జట్టు ఆశిస్తోంది. అండ్రూ టై జట్టుకు దూరం కావడం ఎదురుదెబ్బగా పరిణమించింది. కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే 12 వికెట్లు తీసిన టైని భర్తీ చేసే పేసర్లు గుజరాత్‌కు లభించడం లేదు. శార్దుల్ ఠాకూర్, జడేజా, ఫాల్క్‌నర్ బంతితోనూ సత్తా చాటాల్సిన అవసరముంది. -
జహీర్ ఖాన్ దూరం..
న్యూఢిల్లీ: ఇప్పటికే వరుస ఓటములతో సతమవుతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ కు ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ దూరమయ్యాడు. గాయం కారణంగా గత మ్యాచ్ నుంచి వైదొలిగిన జహీర్ ఖాన్.. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ కు అందుబాటులోకి వస్తాడని తొలుత భావించారు. అయితే అతను ఇంకా గాయం నుంచి కోలుకోలేకపోవడంతో హైదరాబాద్ తో మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్లు డేర్ డెవిల్స్ యజమాన్యం స్పష్టం చేసింది. అతని స్థానంలో కరుణ్ నాయర్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. కాగా, జహీర్ గాయంపై వైద్య బృందం స్పష్టత ఇచ్చిన తరువాతే మాత్రమే అతను మిగతా మ్యాచ్ ల్లో పాల్గొనే అంశం తేలనుంది. -
ఐపీఎల్ అవ్వగానే పెళ్లి చేసుకుంటామోచ్!
గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న సాగరికా ఘట్గే, జహీర్ ఖాన్ ఎట్టకేలకు ఒక్కటవుతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ప్రేమపక్షులుగా విహరిస్తూ.. బయటకు ఏమీ చెప్పకుండా గడిపిన ఈ జంట ఇటీవలే తాము నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించి విస్మయంలో ముంచెత్తారు. తాము నిశ్చితార్థం చేసుకున్నట్టు టీమిండియా మాజీ క్రికెటర్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ సారథి జహీర్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జహీర్ పెళ్లాడబోతున్న బాలీవుడ్ భామ సాగరికా ఘట్గే తాజాగా నోరు విప్పింది. మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ పలు విషయాలు వెల్లడించింది. ‘మా నిశ్చితార్థం కోసం జాక్ (ప్రేమగా జహీర్‌ను ఇలా పిలుస్తుంది) చాలా రోజులుగా రహస్యంగా ప్లాన్ చేశాడు. నిజంగా నాకు విషయం తెలియనే తెలియదు. ఒక అద్భుతమైన రింగ్‌ను నాకోసం తెచ్చి ఇచ్చాడు. ఆ సందర్భాన్ని నేను మాటల్లో వర్ణించలేను. మా మధ్య ఓ ప్రత్యేక అనుభూతిగా అది నిలిచిపోతుంది’ అని సాగరిక తెలిపింది. మరీ పెళ్లెప్పుడు చేసుకుంటున్నారంటే.. ఐపీఎల్ అవ్వగానే పెళ్లి పీఠలు ఎక్కుతామని చెప్పింది. ‘ఐపీఎల్ ముగియగానే మేం పెళ్లి గురించి చర్చించుకుంటాం. ఇప్పుడు ఐపీఎల్ కోసం జాక్ బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇది అయిపోగానే... మేం పెళ్లి తేదీలు, వేడుకల గురించి ప్లాన్ చేసుకుంటాం’ అని ఆమె వివరించింది. -
తప్పులో కాలేసిన అనిల్ కుంబ్లే
ఢిల్లీ : భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కెప్టెన్ జహీర్ ఖాన్ త్వరలో ఓ ఇంటివాడు కానున్న విషయం తెలిసిందే. తన ప్రియురాలు, బాలీవుడ్ నటి సాగరిక ఘాట్గెతో జహీర్ నిశ్చితార్థం సోమవారం జరిగింది. సాధారణంగానే ప్రముఖ క్రికెటర్ కావడంతో జహీర్‌కు పెద్ద మొత్తంలో శుభాకాంక్షలు అందాయి. అయితే జహీర్‌తో పాటూ అతనికి కాబోయే భార్యకు కూడా ట్విట్టర్లో జహీర్ అభిమానులు, పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇక్కడే మాజీ ప్రముఖ క్రికెటర్, ప్రస్తుత భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే పప్పులో కాలేశారు. సాగరిక ఘాట్గెకి విష్ చేయబోయి ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్‌కి శుభాకాంక్షలు తెలిపారు. సాగరికా ఘోష్, సాగరిక ఘాట్గె పేర్లు ఒకేలా ఉండటంతో ఈ పొరపాటు జరిగింది. అయితే కొద్దిసేపటికే అసలు విషయం తెలుసుకున్న కుంబ్లే వెంటనే తన ట్విట్ని తొలగించి, మరో ట్విట్ చేశారు. అందులో సాగరికా ఘోష్‌ను ట్యాగ్ చేసిన స్థానంలో సాగరిక ఘాట్గెను ట్యాగ్ చేసి పోస్ట్ చేశాడు. అయితే ఒక్క అనిల్ కుంబ్లేనే కాకుండా ఇంకా చాలా మంది సాగరికా ఘోష్‌కు విషెస్ చెబుతూ ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి పంపిన విషెస్ కూడా సాగరిక ఘోష్కే చేరాయి. పెద్ద ఎత్తున పెళ్లి శుభాకాంక్షలు రావడంతో జర్నలిస్ట్ సాగరిక ఘోష్ అవాక్కయ్యారు. అయ్యో సార్ నేను ఇద్దరు పిల్లల తల్లిని. మీరు తప్పు సాగరికాకి మీ విషెస్ పంపారు.. అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. -
'ఆ ఫాస్ట్ బౌలర్.. హాకీకి క్లీన్ బౌల్డ్'
ముంబై: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సందర్భం వచ్చినప్పుడల్లా తనదైన శైలిలో ట్వీట్ల వర్షం కురిపించే టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. నిశ్చితార్థం చేసుకున్న మాజీ టీమ్మేట్ జహీర్ ఖాన్‌కు అభినందనలు తెలిపాడు. పేసర్ అయిన జహీర్ హాకీకి క్లీన్ బౌల్డయ్యాడంటూ చమత్కరించాడు. 'జహీర్‌కు అభినందనలు. అతను హాకీకి క్లీన్ బౌల్డయ్యాడు. ఇద్దరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నా' అంటూ వీరూ ట్వీట్ చేశాడు. జహీర్ తన ప్రియురాలు, బాలీవుడ్ నటి సాగరిక ఘాట్గెతో నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమెతో దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. ఆమె చక్ దే ఇండియా సినిమాలో హాకీ క్రీడాకారిణిగా నటించింది. దీంతో వీరూ పైవిధంగా కామెంట్ చేశాడు. మాజీలు సౌరభ్ గంగూలీ, రవిశాస్త్రి తదితరులు జహీర్‌కు అభినందనలు తెలిపారు. జహీర్ ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఓ వైపు ఐపీఎల్ మ్యాచ్‌లతో బిజీగా ఉంటూనే ప్రియురాలితో నిఖాను పక్కా చేసుకున్నాడు. -
జహీర్ ఖాన్ నిశ్చితార్థం...
-
జహీర్ ఖాన్ నిశ్చితార్థం...
భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కెప్టెన్ జహీర్ ఖాన్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. తన ప్రియురాలు, బాలీవుడ్ నటి సాగరిక ఘాట్గెతో జహీర్ నిశ్చితార్థం సోమవారం జరిగింది. ‘మీ భార్య ఎంపికలపై నవ్వకండి. ఎందుకంటే అందులో మీరు కూడా ఉన్నారు. ఇక నుంచి జీవితాంతం భాగస్వాములం’ అని సాగరిక చేతికి ఉంగరం పెట్టిన ఫొటోను జహీర్ ట్వీట్ చేశాడు. Never laugh at your wife's choices. You are one of them !!! Partners for life. #engaged @sagarikavghatge pic.twitter.com/rUOtObFhiX — zaheer khan (@ImZaheer) 24 April 2017 -
ఈసారైనా రాత మారేనా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జరిగిన ప్రతిసారీ దాదాపుగా ‘అనామక’ జట్టుగా అందరి దృష్టిలో నిలిచేది ఢిల్లీ డేర్‌డెవిల్స్ (డీడీ) అంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పటిదాకా జట్టు స్వరూపాన్ని పరిశీలిస్తే ఇందులో ఆడిన ఆటగాళ్ల పేరు ప్రఖ్యాతులకేమీ తక్కువ లేదు. సెహ్వాగ్, గంభీర్, వార్నర్, డి విలియర్స్, జయవర్ధనే, దిల్షాన్, మోర్కెల్ ఇలా ఉద్ధండులే ఈ జట్టు తరఫున గతంలో పోరాడారు. అయితే రెండు సార్లు సెమీస్‌కు చేరడం మినహా డీడీ సాధించిందేమీ లేదు. ఎప్పుడూ కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగడం.. చేదు అనుభవాలను చవిచూడటం అలవాటుగా మారింది. గత సీజన్లో పర్వాలేదనిపించినా ఈసారి డుమిని, డి కాక్ అందుబాటులో లేకపోవడం.. దాదాపుగా కొత్త ఆటగాళ్లతో సీజన్‌ను ప్రారంభించబోతున్న ఢిల్లీ జట్టు అందరి అంచనాలను మించి రాణిస్తుందో.. లేదో మరి! సాక్షి క్రీడా విభాగం ఐపీఎల్ ఆరంభమైన 2008తో పాటు మరుసటి ఏడాది కూడా ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ఫుల్ జోష్‌గా కనిపించింది. వీరేంద్ర సెహ్వాగ్ నేతృత్వంలో జట్టు ఆ రెండు పర్యాయాలు సెమీఫైనల్స్‌కు దూసుకువచ్చింది. అయితే ఆ తర్వాత జరిగిన ఏడు సీజన్లలో డీడీ ఆట పూర్తిగా గతి తప్పి చిట్టచివరి స్థానాల కోసం పోటీ పడాల్సి వచ్చింది. 2012లో జరిగిన ఐదో సీజన్లో మాత్రం ప్లేఆఫ్స్‌కు చేరగలిగింది. ఇక చివరి మూడు సీజన్లలో 2014లో ఎనిమిదో స్థానం ఆ తర్వాత 7, 6వ స్థానాల్లో నిలిచింది. గత సీజన్లో కూడా రూ.16 కోట్లు పెట్టి కొనుక్కున్న యువరాజ్ సింగ్, రూ. 7.5 కోట్లు పెట్టి కొన్న ఏంజెలో మాథ్యూస్ సహా చాలా మంది ఆటగాళ్లను తప్పించింది. అయితే రూ.8.5 కోట్లు పెట్టి పవన్ నేగిని కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. జహీర్ ఖాన్‌కు పగ్గాలు అప్పగించి ప్యాడీ ఆప్టన్ హెడ్ కోచ్‌గా, బ్యాటింగ్ మెంటార్‌గా రాహుల్ ద్రవిడ్‌ను నియమించుకుంది. దీంతో తమ తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి సంచలనం సృష్టించింది. కచ్చితంగా ప్లే ఆఫ్‌కు చేరుతుందని అంతా భావించారు. అయితే ఆ తర్వాత రెండు మ్యాచ్‌లనే గెలిచి 14 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఈసారి పవన్ నేగి, టి20ల్లో నంబర్‌వన్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్‌లతో పాటు దాదాపు సగం జట్టును కూడా వదులుకుని ఆశ్చర్యపరిచింది. కానీ ఈసారి కాస్త జాగ్రత్తగా ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నట్టే కనిపిస్తోంది. ఆశలు రేకెత్తిస్తున్న బ్యాటింగ్ విభాగం: రాహుల్ ద్రవిడ్ మెంటార్‌గా సేవలందిస్తున్న ఈ జట్టులో నైపుణ్యం కలిగిన యువ ఆటగాళ్లున్నారు. శ్రేయస్ అయ్యర్, కరుణ్ నాయర్, సంజూ శామ్సన్, రిషభ్ పంత్ తమ ఆటతీరును గణనీయంగా మెరుగుపర్చుకున్నారు. వీరంతా భారత్ ‘ఎ’ తరఫున కూడా ఆడటంతో ద్రవిడ్ శిక్షణ రాటుదేల్చింది. వీరు నిలకడగా రాణిస్తే జట్టుకు ప్రయోజనమే. అయితే చెప్పుకోదగ్గ స్వదేశీ ఆల్‌రౌండర్ జట్టులో లేడు. దీంతో మోరిస్, అండర్సన్, మాథ్యూస్, బ్రాత్‌వైట్‌పై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంది. లోయర్ ఆర్డర్లోనూ బ్యాటింగ్ చేయగల సత్తా జట్టుకు ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో జహీర్‌తో పాటు షమీ, ఈసారే జట్టులోకి వచ్చిన పేసర్ రబడ, కమిన్స్‌తో పాటు స్పిన్నర్ అమిత్ మిశ్రా కీలకం కానున్నారు. మార్పులే దెబ్బతీస్తున్నాయి: ప్రతీ సీజన్‌కు జట్టు కొత్త రూపుతో బరిలోకి దిగుతుండటం విజయావకాశాలను దెబ్బతీస్తోంది. దీనికి తోడు కెప్టెన్ జహీర్ ఖాన్ చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉన్నాడు. అతడి ఫిట్నెస్ ఏస్థాయిలో ఉందో తెలియాల్సి ఉంది. దీనికి తోడు సీజన్ ఆరంభానికి ముందే స్టార్ బ్యాట్స్‌మెన్ జేపీ డుమిని వ్యక్తిగత కారణాలతో, క్వింటాన్ డి కాక్ గాయంతో దూరం కావడం జట్టును షాక్‌లో ముంచింది. వీరిద్దరి గైర్హాజరీ డీడీ అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. రెండు సార్లు సెమీఫైనల్స్‌కు...: 2008, 2009 సీజన్లో మెరుగ్గా ఆడిన ఢిల్లీ జట్టు సెమీఫైనల్స్‌కు చేరి ఆకట్టుకున్నా... రాజస్తాన్ రాయల్స్, దక్కన్ చార్జర్స్లపై ఓడింది. ఇక 2012లో కోల్‌కతా, చెన్నై జట్లతో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో ఓడింది. ఈసారి పరిస్థితి...: రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో జట్టు పరిస్థితి ఈసారి మెరుగుపడుతుందనే ఆశతో ఫ్రాంచైజీ యాజమాన్యం ఉంది. ముఖ్యంగా ప్లే ఆఫ్‌లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ఆడనుంది. జట్టు: స్వదేశీ ఆటగాళ్లు: జహీర్ (కెప్టెన్), షమీ, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సంజూ శామ్సన్, మయాంక్ అగర్వాల్, అంకిత్ బానే, జయంత్ యాదవ్, సౌరభ్ తివారి, షాబాజ్ నదీమ్, కరుణ్ నాయర్, సీవీ మిలింద్, ఖలీల్ అహ్మద్,, ఆదిత్య తారే, మురుగన్ అశ్విన్, అమిత్ మిశ్రా, శశాంక్ సింగ్, ప్రత్యూష్ సింగ్, నవదీప్ సైని. విదేశీ ఆటగాళ్లు: రబడ, కమిన్స్, మోరిస్, మాథ్యూస్, కోరె అండర్సన్, బ్రాత్‌వైట్, బిల్లింగ్స్. -
సాగరిక-జహీర్‌ల ప్రేమాయణం?
ముంబై: భారత క్రికెట్ తో బాలీవుడ్ బంధం విడదీయలేనిదిగానే చెప్పొచ్చు. భారత క్రికెటర్లతో బాలీవుడ్ భామలు ప్రేమాయణం నడిపిన సందర్భాల్లో చాలానే ఉన్నాయి. ఇందులో కొంతమంది జంటలుగా ఒక్కటైతే, మరికొంతమంది ప్రేమతోనే వారి బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే తాజాగా టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్-బాలీవుడ్ నటి సాగరిక ఘట్గెలు ప్రేమాయణం సాగిస్తున్నరనే వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. గతేడాది నవంబర్ లో టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్-హాలీవుడ్ నటి హజల్ కీచ్ ల పెళ్లికి జహీర్-సాగరికాలు హాజరుకావడం అప్పట్లో చర్చనీయాంశమైంది. 'చక్ దే ఇండియా' ఫేమ్ సాగరికతో జహీర్ ప్రేమలోపడ్డాడని రూమర్లు వెలుగుచూశాయి. అయితే తాజాగా ఇందుకు మరింత బలాన్నిస్తూ సాగరిక నటించిన సినిమా 'ఇరాదా' ప్రమోషన్ లో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి జహీర్ హాజరయ్యాడు. దాంతో ఆ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారనే అనుమానం మరింత బలపడింది. ఈ కార్యక్రమానికి యువరాజ్ సింగ్ తన భార్య హజల్ కీచ్ తో కలిసి హాజరుకాగా, మరో ఇద్దరు వెటరన్ క్రికెటర్లు ఆశిష్ నెహ్రా, అజిత్ అగార్కర్ లు కూడా ఈ వేదికపై మెరిశారు. రియల్ లైఫ్ లో కాదు కదా: యువీ శుక్రవారం 'ఇరాదా' సినిమా విడుదల సందర్భంగా సాగరికకు యువరాజ్ సింగ్ ముందుగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సినిమా హిట్ కావాలనే ఆకాంక్షించిన యువీ.. సాగరికను ఆట పట్టించే యత్నం చేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ లో సాగరికను ఉద్దేశిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశాడు. 'చక్ దే ఇండియా మూవీ హాకీ క్రీడాకారిణిగా నటించిన నీవు, భారత్ క్రికెట్ వైస్ కెప్టెన్ తో డేటింగ్ చేసి పాత్రను పోషించావు. ఇంతవరకూ బాగానే ఉంది. ఈ డేటింగ్ అనేది నిజ జీవితంలో లేదు కదా!'అని యువీ చమత్కరించాడు. మరి యువీ ఏ ఉద్దేశంతో అలా అన్నాడో అతనికే తెలియాలి. -
'అతని నుంచే టెక్నిక్స్ నేర్చుకున్నా'
విశాఖ:ఉప ఖండంలోని పిచ్‌ల్లో బౌలింగ్ ఎలా చేయాలో అనే దాని గురించి తనకు భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఎన్నో విషయాలు చెప్పినట్లు ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ స్పష్టం చేశాడు. గతంలో భారత పర్యటనకు వచ్చినప్పుడు జహీర్‌ను అడిగి ఎన్నో టెక్నిక్స్ నేర్చుకున్నట్లు బ్రాడ్ తాజాగా పేర్కొన్నాడు. 'ఇప్పటికీ నాకు గుర్తుంది. నాలుగు సంవత్సరాల క్రితం భారత్ పర్యటనలో జహీర్ నుంచి బౌలింగ్ పాఠాలు నేర్చుకున్నా. ప్రధానంగా భారత తరహా పిచ్‌లపై బౌలింగ్ ఎలా చేస్తే ఫలితాన్ని సాధిస్తాం అనేది జహీర్ ను అడిగి తెలుసుకున్నా. నాతో పాటు అండర్సన్(జిమ్మీ)కూడా జహీర్ నుంచి టెక్నిక్స్ తెలుసుకున్నాడు. మనం ఇన్ స్వింగర్ వేసేటప్పుడు వేయే పద్ధతులు ఇక్కడ అవలంభించాలి అనేది జహీర్ ను అడిగాం. బ్యాట్స్‌మన్ ఊరించే విధంగా స్లో బంతిని సంధించి, అదే క్రమంలో ఇన్ స్వింగ్ రాబట్టడం గురించి జహీర్ నుంచి ట్రిక్స్ తెలుసుకున్నాం. భారత్ రెండో ఇన్నింగ్స్ లో భాగంగా పూజారాను అండర్సన్ ఇదే తరహాలో బోల్తా కొట్టించాడు' అని బ్రాడ్ పేర్కొన్నాడు. -
భారత క్రికెటర్లకు జహీర్ సూచన!
న్యూఢిల్లీ: రాబోవు క్రికెట్ సీజన్లో భారత జట్టు పదమూడు టెస్టులు ఆడనుంది. స్వదేశంలో జరిగే సిరీస్‌ల్లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా దేశాలతో భారత క్రికెట్ జట్టు భారీ సంఖ్యలో మ్యాచ్‌లకు సిద్ధమవుతుంది. అయితే ఇలా భారీ ఎత్తున టెస్టు మ్యాచ్‌లు ఆడటం కచ్చితంగా సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు ఒక శుభపరిణామని మాజీ పేసర్ జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా, ఇంతటి భారీ స్థాయిలో క్రికెట్ ఆడాల్సి రావడం ఆటగాళ్ల కెరీర్లో అరుదుగా జరుగుతూ ఉంటుందని, దాన్ని ప్రతీ ఒక్క భారత క్రికెటర్ ఛాలెంజ్‌గా తీసుకోవాలని సూచించాడు. తమ కెరీర్లో క్రికెటర్ల ప్రతిభ మరింత మెరుగుపడాలన్నా, వారి గ్రాఫ్ పడిపోవాలన్నా ఇటువంటి సీజన్లే నిర్ణయిస్తు ఉంటాయన్నాడు. 'క్రికెటర్లకు ఇదే నా సలహా. మీరు సానుకూల ధోరణితో ఉంటే మీ రిథమ్‌ను అంది పుచ్చుకుంటారు. ఈ తరహా అవకాశం అన్నిసార్లూ రాదు. ఇది ప్రతీ ఒక్కరికి కీలక సిరీస్ అని కచ్చితంగా చెప్పగలను. గతంలో నాకు ఒకసారి ఇదే తరహా అవకాశం ఉంది. అది నా అంతర్జాతీయ కెరీర్‌కు చాలా మేలు చేసింది' అని జహీర్ తన జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాడు. -
సన్ ‘షైన్’ అయిందిలా...
► హైదరాబాద్ సంచలన ప్రదర్శన ► గెలిపించిన బౌలింగ్ వ్యూహం ► కెప్టెన్ నాయకత్వ పటిమతో విజయం డేవిడ్ వార్నర్ మినహా బ్యాటింగ్‌లో మరో మెరుపు లేదు... ధావన్ పేరుకు 501 పరుగులు చేసినా అతి సాధారణ స్ట్రైక్‌రేట్ వాటి విలువను తగ్గించింది. ఇక ఇతర బ్యాట్స్‌మెన్ అంతా కలిపి టోర్నీలో చేసింది రెండే అర్ధ సెంచరీలు... అయినా సరే బ్యాట్స్‌మెన్ ఆటగా పేరుబడ్డ టి20ల్లో హైదరాబాద్ విజేతగా నిలవగలిగింది. వరుస పరాజయాలతో ప్రారంభించిన తర్వాత కొన్ని చక్కటి ప్రదర్శనలతో ప్లే ఆఫ్ వరకు చేరినా ఆ జట్టుపై అందరికీ అపనమ్మకమే... కానీ రైజర్స్ అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసి చూపించింది. ‘బ్యాటింగ్ మ్యాచ్‌లు గెలిపిస్తుంది... కానీ బౌలింగ్ టోర్నీలు గెలిపిస్తుంది’ అని ఫైనల్ అనంతరం విశ్లేషకులు చేసిన వ్యాఖ్య ఈ జట్టుకు సరిగ్గా సరిపోతుంది. తమ బౌలర్లను చివరి వరకు బలంగా నమ్మిన కెప్టెన్ వారి నుంచి కావాల్సిన ఫలితాన్ని రాబట్టాడు. ఫలితంగా అంచనాలకు అందరి రీతిలో రాణించిన రైజర్స్ ఐపీఎల్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. సాక్షి క్రీడా విభాగం:- ఐపీఎల్లో సన్‌రైజర్స్ 2013లో అడుగు పెట్టింది. తొలిసారే ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించి ఆకట్టుకుంది. అయితే తర్వాతి రెండు సీజన్లు అదే ప్రదర్శనను పునరావృతం చేయడంలో విఫలమైంది. దాంతో 2014, 2015లలో ఆ జట్టు అనామకంగానే కనిపించింది. గత ఏడాది అయితే టీమ్ వైపు స్పాన్సర్లు కూడా పెద్దగా ఆకర్షితులు కాలేదు. కొన్ని స్వల్ప మార్పులు మినహా ఈసారి కూడా దాదాపు అదే జట్టు ఉండటంతో రైజర్స్పై ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. పైగా తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో ఇక పాత కథే పునరావృతం అవుతుందేమో అనిపించింది. అయితే ఆ తర్వాత జట్టు ఒక్కసారిగా పైకి ఎగసింది. ముంబై, గుజరాత్, పంజాబ్లపై సాధించిన వరుస విజయాలు జట్టులో ఉత్సాహాన్ని నింపాయి. వర్షం బారిన పడిన మ్యాచ్‌లో సొంతగడ్డపై పుణే చేతిలో ఓడటం కాస్త బ్రేక్ వేసింది. అయితే హైదరాబాద్‌లో రెండు, వైజాగ్‌లో రెండు కలిపి వరుసగా నాలుగు విజయాలతో సన్ దూసుకుపోయింది. అప్పటికే దాదాపుగా ప్లే ఆఫ్‌కు చేరువ కావడంతో తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో మూడు పరాజయాలు ఎదురైనా ఇబ్బంది ఎదురు కాలేదు. అయితే టాప్-2లో లేకపోవడంతో ఫైనల్ కోసం రెండు మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. ఐదు రోజుల వ్యవధిలో వేర్వేరు వేదికల్లో మూడు నాకౌట్ మ్యాచ్‌లలో గెలుపొందడం నిజంగా అద్భుతం. దీనిని సాధించడంలో జట్టులో సమష్టి కృషి కనిపించింది. కెప్టెన్ కమాల్... ఐపీఎల్ మ్యాచ్‌లలో విరాట్ కోహ్లికి లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఇచ్చేందుకు జహీర్ ఖాన్ భయపడ్డాడు, సురేశ్ రైనాకు ధైర్యం సరిపోలేదు, చివరకు ధోని కూడా రిస్క్ తీసుకోవడానికి ఇష్ట పడలేదు. కానీ బెంగళూరుతో మ్యాచ్‌లో ‘చిన్న’స్వామి స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం అంటే పెద్ద సాహసమే. ఈ సాహసమే రైజర్స్‌కు టైటిల్ అందించిందని ప్రత్యర్థి కోచ్ వెటోరి చెప్పడం వార్నర్ ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. వార్నర్‌కు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో పెద్దగా అనుభవం లేదు. స్యామీ, సంగక్కర, ధావన్‌ల విఫల ప్రయత్నాల తర్వాత గత ఏడాది మధ్యలో వార్నర్‌ను కెప్టెన్‌ను చేసిన యాజమాన్యం ఈసారి చాలా ముందుగానే అతని పేరును ప్రకటించింది. ఒక్క వివాదం లేదు, తప్పుడు కూత కూయలేదు, కీలక సమయాల్లో ప్రత్యర్థి స్లెడ్జింగ్ చేసినా చిరునవ్వే సమాధానమైంది. నాయకత్వంలో జట్టుకు ఫెయిర్ ప్లే అవార్డు... డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ ఇంత గొప్పగా సాగుతుందని ఎవరూ ఊహించలేదు. మైదానం బయట అతని గత చరిత్రను, గొడవలను బట్టి వార్నర్‌ను అంచనా వేసినవారికి అతను తన సమర్థతతోనే సమాధానం చెప్పాడు. ముఖ్యంగా ‘మూగభాష’తోనే ముస్తఫిజుర్‌ను వాడుకున్న తీరు అతని నాయకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. కీలక సమయాల్లో, సరిగ్గా గురి చూసి కొట్టినట్లుగా బంగ్లా బౌలర్‌ను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ఇక బ్యాట్స్‌మెన్‌గా 848 పరుగులతో తిరుగులేని ఆటతీరు కనబర్చిన వార్నర్ సన్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు. లోపాలున్నా... వార్నర్, బౌలర్ల వ్యక్తిగత ప్రదర్శనలు రైజర్స్ జట్టులోని ఇతర లోపాలు కనిపించకుండా చేశాయి. ఆలస్యంగా జట్టుతో చేరిన యువరాజ్ సింగ్ రెండు మ్యాచ్‌లు మినహా తన స్థాయికి తగిన ఆటను కనబర్చలేదు. విదేశీ ఆటగాళ్లు మోర్గాన్, విలియమ్సన్ ఇద్దరూ విఫలం కాగా... ఆల్‌రౌండర్‌గా హెన్రిక్స్ ఫర్వాలేదనిపించాడు. ఫీల్డింగ్‌లో తీవ్ర ఒత్తిడి సమయంలో అతను పట్టిన 11 క్యాచ్‌లు కీలక వికెట్లను అందించాయి. ఇక యువ ఆటగాడు దీపక్ హుడా 17 మ్యాచ్‌లు ఆడినా కేవలం 144 పరుగులతో అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచాడు. బౌలింగ్‌కంటే బిపుల్ శర్మ బ్యాటింగ్ రెండో క్వాలిఫయర్‌లో జట్టుకు పనికొచ్చింది. అయితే కొన్ని సమస్యలు సీజన్లో అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా... సమష్టితత్వం, సరైన వ్యూహాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. మన ఆటపై మనకు నమ్మకం ఉన్నప్పుడు గెలిచేందుకు ‘ఫ్యాన్సీ టీమ్’లాగా హడావిడి చేయాల్సిన అవసరం లేదని నిరూపించింది. ఇద్దరూ ఇద్దరే... గాయంతో నెహ్రా ఆడింది 8 మ్యాచ్‌లే... బరీందర్ ఆకట్టుకున్నా అద్భుతమైన బౌలర్ కాదు. ఇలాంటి స్థితిలో ఇద్దరు బౌలర్లు మొత్తం రైజర్స్ భారాన్ని మోశారు. ‘పర్పుల్ క్యాప్’ గెలుచుకున్న భువనేశ్వర్ (23 వికెట్లు)కు తోడుగా తనదైన శైలిలో కటర్లతో ముస్తఫిజుర్ (17) చెలరేగడం జట్టు విజయాలను సులువు చేసింది. ముఖ్యంగా ప్రత్యర్థి ఇన్నింగ్స్‌లో చివరి నాలుగు ఓవర్లు అంటే వీరిద్దరికి ఎదురు నిలిచి పోరాడటమే! 90 శాతానికిపైగా మ్యాచ్‌లలో వీరిద్దరు డెత్ ఓవర్లలో తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి జట్టును గెలిపించారు. ఒక దశలో ముగ్గురు లెఫ్టార్మ్ స్పిన్నర్లను తుది జట్టులో ఉంచి కూడా సన్ ఫలితం రాబట్టగలగడం, బౌల్ట్‌లాంటి స్టార్‌కు ఒకే మ్యాచ్‌లో అవకాశం రావడం ఆ జట్టు బౌలింగ్ బలానికి అద్దం పడుతుంది. ఎడమచేతి వాటం బౌలర్లు ప్రత్యేకమంటూ వేలంలో వారిపై దృష్టి పెట్టామని చెప్పిన లక్ష్మణ్ ముందుచూపు జట్టును విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించింది. -
అది సర్వ సాధారణం: జహీర్ ఖాన్
కోల్‌కతా:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఘోర పరాజయాన్ని ఆ జట్టు కెప్టెన్ జహీర్ ఖాన్ లైట్‌గా తీసుకున్నాడు. ప్రతీ జట్టూ ఏదొక సందర్భాల్లో క్లిష్టపరిస్థితిని ఎదుర్కొనక తప్పదని, అలాంటి పరిస్థితినే తాము కూడా చవిచూశామన్నాడు. ఈ పరాజయం తమకు ఓ గుణపాఠంగా ఉపయోగపడుతుందన్నాడు. ఈ టోర్నీ ఇంకా ఆరంభ దశలో ఉండటంతో తమకు మంచి రోజులు మిగిలే ఉన్నాయని సంగతిని గుర్తించుకోవాలన్నాడు. ఒక మ్యాచ్‌లో ఓటమితోనే తమ పని ముగిసిపోయిందంటూ రాయడం ఎంతమాత్రం సరికాదని జహీర్ పేర్కొన్నాడు. ఆటలో గెలుపు, ఓటములు సర్వ సాధారణమని పేర్కొన్న జహీర్.. తమ కుర్రాళ్లు ఫీల్డ్‌లో చురుగ్గా కదిలిన తీరుతో సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నాడు. తమది యువకులతో నిండిన జట్టు కాబట్టి వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నాడు. నిన్నటి మ్యాచ్‌కు జేపీ డుమినీ అందుబాటులో లేని విషయాన్ని జహీర్ ఈ సందర్బంగా గుర్తు చేశాడు. -
'రిటైర్మెంట్ నిర్ణయంపై బాధలేదు'
టీమిండియా సీనియర్ పేసర్ ఆశీష్ నెహ్రా లేటు వయసులో అదరగొడుతున్నాడు. 36 ఏళ్ల నెహ్రా ఆసియా కప్, టి-20 ప్రపంచ కప్‌లలో సత్తాచాటి శభాష్ అనిపించుకున్నాడు. నెహ్రా ప్రదర్శన భారత్ మాజీ పేసర్ జహీర్ ఖాన్ ను ఆకట్టుకుంది. తనకు స్ఫూర్తినిచ్చిందని జహీర్ చెప్పాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను వైదొలిగినందుకు బాధగా లేదని 37 ఏళ్ల జహీర్ చెప్పాడు. ఈ ఐపీఎల్ సీజన్లో చివరిసారి ఆడనున్న జహీర్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. 'అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాలని నేను తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నా. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. దీనికే కట్టుబడి ఉంటాను. నెహ్రా రాణించినందుకు సంతోషంగా ఉంది. నాకు స్ఫూర్తి కలిగించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆడుతున్నా. యువ బౌలర్లకు సలహాలు ఇస్తూ సీజన్‌ను ఆస్వాదిస్తా' అని జహీర్ అన్నాడు. ఐపీఎల్ వల్ల బౌలర్లకు పెద్దగా ఉపయోగం ఉండదని జహీర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ప్రదర్శనతో బౌలర్లు అంతర్జాతీయ వన్డేలు, టెస్టులకు ఎంపిక కావడం కష్టమని చెప్పాడు. బౌలర్లకు భిన్నమైన నైపుణ్యాలు ఉండాలని పేర్కొన్నాడు. వన్డేలు, టెస్టులతో పోలిస్తే టి-20 ఫార్మాట్ పూర్తిగా భిన్నమైదని అన్నాడు. -
డేర్‌డెవిల్స్ కెప్టెన్‌గా జహీర్
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొమ్మిదో సీజన్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు పేసర్ జహీర్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఢిల్లీ తరఫున జహీర్‌కు ఇది రెండో సీజన్ కాగా.. గత సీజన్లో డుమిని కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ కొత్త బాధ్యతలపట్ల జహీర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. కచ్చితంగా ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లతో మంచి ఫలితాలను సాధిస్తాను. తమ శక్తిసామర్థ్యాల మేరకు అందరూ ఆడితే నిలకడైన ఫలితాలు వస్తాయి’ అని జహీర్ అన్నాడు. మరోవైపు టీమ్ మెంటార్ రాహుల్ ద్రవిడ్ కూడా జహీర్ నియామకాన్ని హర్షించారు. చాలాకాలంగా జహీర్ సమర్థవంతమైన నాయకుడిగా కొనసాగుతున్నాడని, భారత క్రికెట్‌ను అనుసరించేవారికి జహీర్ ప్రభావమేమిటో తెలుస్తుందని గుర్తు చేశారు. -
జహీర్ కు కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 సీజన్ కు సంబంధించి ఢిల్లీ డేర్ డేవిల్స్ కెప్టెన్‌గా భారత మాజీ పేసర్ జహీర్‌ఖాన్ నియమించబడ్డాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున వరుసగా రెండో సంవత్సరం ఆడుతున్న జహీర్ కు సారథిగా కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఆ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్.. రాబోవు ఐపీఎల్ సీజన్ లో జహీర్ ను కెప్టెన్ గా ఎంపిక చేసినట్లు స్పష్టం చేసింది.. దీనిపై ఆ జట్టు సలహాదారు రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ఆటలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జాక్ లో నాయకత్వ లక్షణాలకు కొదవలేదని పేర్కొన్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్న జహీర్ నియామకం పట్ల యాజమాన్యం సంతృప్తిగా ఉందన్నాడు. ఈ సందర్భంగా జహీర్ కు ముందుగా ద్రవిడ్ అభినందనలు తెలియజేశాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన జహీర్.. 200 వన్డేల్లో 281 వికెట్లు తీయగా, 92 టెస్టుల్లో 311 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరపున 17 ట్వంటీల్లో 17 వికెట్లు తీశాడు. -
జహీర్‌ఖాన్‌కు సన్మానం
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పేసర్ జహీర్ ఖాన్‌ను ఆదివారం ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఘనంగా సత్కరించింది. ఐదో వన్డే ముగిసిన అనంతరం ఎంసీఏ తరఫున జహీర్‌కు సచిన్ టెండూల్కర్ ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన జహీర్, తన కెరీర్లో అండగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలిపాడు. మరోవైపు రైతుల సంక్షేమం కోసం గతంలో ఎంసీఏ ప్రకటించిన రూ. కోటి చెక్‌ను కూడా స్థానిక క్రికెటర్లు రోహిత్ శర్మ, రహానేలతో కలిసి ఎంసీఏ అధ్యక్షుడు శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు అందజేశారు. -
'బౌలింగ్ కోచ్ గా చేయాలని ఉంది'
ముంబై: భారత క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా చేయాలని ఉందంటూ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన జహీర్ ఖాన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇప్పటికే పుణేలో హోటల్ వ్యాపారంతో బిజిగా ఉన్న జహీర్.. ఫుడ్ అండ్ బేవరేజ్ సెక్టార్ లోకి అడుగుపెట్టే ఆలోచనలో నిమగ్నమయ్యాడు. కాగా, జాతీయ క్రికెట్ జట్టుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జహీర్.. టీమిండియాకు బౌలింగ్ కోచ్ గా చేయాలని ఉందని కూడా తెలిపాడు. 'భారత జాతీయ జట్టుకు బౌలింగ్ కోచ్ గా పనిచేయాలని ఉంది. ఈవిషయంలో చాలా ఓపెన్ గా ఉన్నాను. ఇప్పటికే నన్ను కలిసిన పలువురు బౌలర్లకు సలహాలు కూడా ఇస్తున్నాను. ప్రస్తుతానికి పెళ్లి, రాజకీయాలు అనే వాటి గురించి ఆలోచించడం లేదు(నవ్వుతూ). రాబోవు రోజుల్లో నా నుంచి కొత్తగా ఏమైనా వినవచ్చు''అని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోనున్న విషయాన్ని ముందుగానే తన తల్లి దండ్రులతో పాటు, తన స్నేహితులైన సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ లకు తెలిపినట్లు జహీర్ తెలిపాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (311) తీసుకున్న నాలుగో బౌలర్ గా జహీర్ గుర్తింపు పొందాడు. -
కమ్ బ్యాక్ కింగ్
జహీర్ 15 ఏళ్ల ఉజ్వల కెరీర్లో కోట్లాది అభిమానుల ఆశలు, కోరికలు, అంచనాలు ఉన్నాయి. వాటన్నింటినీ అందుకుంటూ, దాటుకుంటూ జహీర్ ఖాన్... భారత్ అందించిన అత్యుత్తమ ఎడమ చేతివాటం పేసర్‌గా నిలిచాడు. కఠోర శ్రమ, పోరాటతత్వంతో గాయాలను వెనక్కి తోసి పడ్డ ప్రతీసారి పైకి లేచి తనేంటో నిరూపించుకున్నాడు. కొత్త మిలీనియంలో విదేశీ గడ్డపై టీమిండియా సాధించిన అత్యుత్తమ విజయాల్లో అతనిదే సింహభాగం. జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించిన కొత్తలో ‘పాకిస్తాన్ వసీం అక్రమ్‌కు భారత్ సమాధానం’ అని బ్యానర్లు కనిపించాయి. ధోని అయితే ఒక సారి ‘బౌలింగ్ సచిన్’ అంటూ తన ప్రశంసలతో ముంచెత్తాడు. సరిగ్గా ఈ ఉపమానాలే అన్వయించకపోయినా...భారత క్రికెట్‌కు సంబంధించి జహీర్ కచ్చితంగా దిగ్గజ ఆటగాడు. నిస్సందేహంగా గత రెండు దశాబ్దాల్లో భారత బెస్ట్ పేస్ బౌలర్ అయిన ఖాన్... ఇప్పటి యువ పేసర్లందరికీ మార్గదర్శి, గురుతుల్యుడు. బౌలింగ్‌లో పాక్ పేసర్లను స్ఫూర్తిగా తీసుకున్నా... ప్రవర్తనలో ఎన్నడూ వివాదాలకు అవకాశం ఇవ్వని అతను జెంటిల్మెన్ క్రికెటర్. సాధారణ నేపథ్యం చెరకు పంటకు ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలోని శ్రీరాంపూర్ జహీర్ స్వస్థలం. ఫోటోగ్రాఫర్ అయిన తండ్రి, టీచర్ తల్లి అతడిని చదువు వైపు ప్రోత్సహించారు. ఇంటర్లో 85 శాతం మార్కులు తెచ్చుకున్న తర్వాత జహీర్ సైనికుడిగా జాతీయ డిఫెన్స్ అకాడమీలో చేరాలనే కోరికతో ఎంట్రన్స్‌కు హాజరయ్యాడు. అయితే దాని ఫలితం రాక ముందే జహీర్లోని బౌలింగ్ ప్రతిభను గుర్తించిన తండ్రి అడ్డు చెప్పలేదు. దాంతో 17 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ క్రికెట్‌పై దృష్టి పెట్టి సాధన చేసిన అతను కోటి ఆశలతో ముంబైకి చేరుకున్నాడు. అక్కడి నేషనల్ క్రికెట్ క్లబ్, క్రాస్ మైదాన్‌లో రెగ్యులర్‌గా ఆడటం మొదలు పెట్టాడు. స్థానిక పురుషోత్తం షీల్డ్ టోర్నీలో అద్భుత బౌలింగ్‌తో అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంబై అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్న అనంతరం ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో చేరడంతో జహీర్ బౌలింగ్ పదును తేలింది. ముంబై రంజీ జట్టులో చోటు దక్కకపోయినా... ఎంఆర్ఎఫ్ కోచ్ శేఖర్ సిఫారసుతో బరోడా టీమ్‌లో అవకాశం దక్కింది. కేవలం ఒక్క ఏడాది ఫస్ట్ క్లాస్ సీజన్‌కే అతను భారత జట్టులోకి ఎంపిక కావడం విశేషం. స్టార్ బౌలర్‌గా... ‘2000 సంవత్సరంలో నాకంటే అతను ఎంతో అత్యుత్తమ బౌలర్‌గా కనిపించాడు. నేను చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సెలక్షన్ కమిటీ చైర్మన్ చందూబోర్డేకు చెప్పి జహీర్‌ను ఎంపిక చేయమన్నాను’... ఇదీ నాటి మన నంబర్‌వన్ పేసర్ శ్రీనాథ్ చెప్పిన మాట. కనీసం 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసే లెఫ్టార్మ్ పేసర్ లభించడం భారత్ అదృష్టమని అప్పట్లో చాలా చర్చ జరిగింది. జహీర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మూడేళ్ల పాటు టెస్టు, వన్డే విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2001లో కాండీ టెస్టులో లంకపై 7 వికెట్లు తీసి భారత్‌ను గెలిపించడం కీలక మలుపు. 2002లో ఇంగ్లండ్‌లో చారిత్రక నాట్‌వెస్ట్ సిరీస్ విజయంలో 14 వికెట్లతో టాపర్‌గా నిలిచాడు. గాయాల బెడద ఒకటి కాదు రెండు కాదు...ఎన్నో సార్లు జహీర్ గాయంతో జట్టుకు దూరం కావడం, మళ్లీ ఫిట్ అయి తిరిగి రావడం రొటీన్‌గా మారింది. మరో బౌలర్‌నైతే భారత్ భరించలేకపోయేదేమో గానీ జహీర్ స్థాయికి అతను ఎప్పుడు వచ్చినా జట్టులో చోటు సిద్ధంగా ఉండేది. ముఖ్యంగా 2006 వార్సెష్టర్‌షైర్ కౌంటీకి ఆడిన తర్వాత రనప్ తగ్గించిన అతను అత్యంత ఫిట్‌గా మారి మళ్లీ టీమిండియా ప్రధాన అస్త్రంగా మారాడు. అదే ఏడాది దక్షిణాఫ్రికా సిరీస్‌లో రాణించిన జహీర్ కెరీర్లో 2007 ఇంగ్లండ్ సిరీస్ మేలిమలుపు. ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్టులో 9/134 సహా మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచి భారత్‌కు 21 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ విజయం అందించాడు. గాయాలు ఇబ్బంది పెట్టినా మైదానంలో దిగినప్పుడు మాత్రం అతను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ప్రమాదకారిగా మారాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్... వేదిక ఏదైనా భారత బౌలింగ్ ప్రధానాస్త్రంగా పలు చిరస్మరణీయ విజయాలు అందించిన జహీర్ రికార్డులు చరిత్రలో నిలిచి ఉంటాయి. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (311) తీసుకున్న నాలుగో బౌలర్ జహీర్. కుంబ్లే (619), కపిల్‌దేవ్ (434), హర్భజన్ (417) మాత్రమే జహీర్ కంటే ముందున్నారు. - సాక్షి క్రీడావిభాగం -
టీమిండియా సీనియర్ బౌలర్ గుడ్ బై
-
అతడు నా ఫేవరేట్ బౌలర్: ప్రభాస్
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన పేస్ బౌలర్ జహీర్ ఖాన్ ను టీమిండియా ఆటగాళ్లు, సెలబ్రిటీలు పొగడ్తలతో ముంచెత్తారు. జహీర్ మంచి బౌలర్ అని కితాబిచ్చారు. జట్టుకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత అతడి కెరీర్ ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. జహీర్ ఖాన్ ను శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్ సందేశాలు పోస్ట్ చేశారు. ఎవరేం ట్వీట్ చేశారంటే.... హర్భజన్ సింగ్: జహీర్ ఉత్తమ బౌలర్. సహృదయుడు. నా సోదరుడికి మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. లవ్ యూ జకీ.. సురేశ్ రైనా: పెర్ ఫెక్ట్ జంటిల్ మన్. బిగ్ బ్రదర్. సరైన నిర్ణయం తీసుకున్నాడు. గుడ్ లక్ ఫర్ న్యూ ఇన్నింగ్స్ వీవీఎస్ లక్ష్మణ్: జహీర్ ఖాన్ తో ఆడడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. దేశం కోసం ఆడుతూ ఆటను ఆస్వాదించాం. అతడి క్రికెట్ కెరీర్ అద్భుతం అనిల్ కుంబ్లే: అత్యుత్తమ ప్రతిభ చూపిన అద్భుత బౌలర్. అతడి భవిష్యత్ కెరీర్ బాగా సాగాలని కోరుకుంటున్నా హీరో ప్రభాస్: క్రికెట్ లో నాకు బాగా ఇష్టమైన బౌలర్లలో జహీర్ ఖాన్ ఒకడు. One of my all time favorite bowler in Cricket @ImZaheer -
'కూలెస్ట్ పేస్ బౌలర్లలో అతడు ఒకడు'
ముంబై: తనకు తెలిసిన కూలెస్ట్ పేస్ బౌలర్లలో జహీర్ ఖాన్ ఒకడని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. సవాల్ ను స్వీకరించడంలో అతడెప్పుడూ ముందుండే వాడని తెలిపాడు. చాలా సందర్భాల్లో బ్యాట్స్ మెన్ పై అతడు పైచేయి సాధించాడని గుర్తు చేసుకున్నాడు. తన కెరీర్ లో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న జహీర్ ఖాన్.. ఇందులోనూ విజయవంతం అవుతాడని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. రిటైర్మెంట్ తర్వాత అతడి కెరీర్ బాగా సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు జహీర్ ఖాన్ నేడు ప్రకటించాడు. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా కూడా అతడికి శుభాకాంక్షలు తెలిపారు. One of the coolest pace bowlers I know. He was a bowler who could 'out think' the batsman most of the times. Always up for a challenge (1/2) — sachin tendulkar (@sachin_rt) October 15, 2015 I am sure he will do well as he begins a new chapter in his life. Wishing @ImZaheer all success in his retired life (2/2) — sachin tendulkar (@sachin_rt) October 15, 2015 -
టీమిండియా సీనియర్ బౌలర్ గుడ్ బై
ముంబై: టీమిండియా సీనియర్ బౌలర్ జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ కు నేడు వీడ్కోలు పలికాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు జహీర్ ఖాన్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి జహీర్ రిటైర్ అవుతున్నాడని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ముందుగా ట్వీట్ చేశారు. 'జహీర్ ఖాన్ ఈరోజు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. రిటైర్మెంట్ తర్వాత అతడి కెరీర్ బాగా సాగాలని ఆకాంక్షిస్తున్నా' అంటూ శుక్లా ట్విటర్ లో పోస్ట్ చేశారు. 2002 నుంచి జహీర్ ఖాన్ తన ఫేవరేట్ బౌలర్ అని పేర్కొన్నారు. ఐపీఎల్ లో అతడు ఆడతాడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 37 ఏళ్ల జహీర్ ఖాన్ టీమిండియా 2011లో వన్డే ప్రపంచకప్ సాధించడంలో కీలకభూమిక పోషించాడు. ఈ మెగా టోర్నిలో 21 వికెట్లు పడగొట్టి ఆఫ్రిదితో కలిసి టాప్ బౌలర్ గా నిలిచాడు. గత మూడునాలుగేళ్లుగా గాయాల కారణంగా భారత జట్టులోకి వస్తూపోతున్న ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఇంటర్నేషనల్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. 2000లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టులో అరంగ్రేటం చేశాడు 200 వన్డేల్లో 282 వికెట్లు తీశాడు 3 వన్డే వరల్డ్ కప్ లలో 23 మ్యాచ్ లు ఆడి 44 వికెట్లు తీశాడు 92 టెస్టుల్లో 311 వికెట్లు పడగొట్టాడు టెస్టుల్లో 11 సార్లు 5 వికెట్లు, ఒకసారి 10 వికెట్లు తీశాడు 17 టి20 మ్యాచ్ లు ఆడి 17 వికెట్లు దక్కించుకున్నాడు -
అక్టోబర్ 7 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: జహీర్ ఖాన్ (క్రికెటర్), యుక్తా ముఖి (మాజీ ప్రపంచ సుందరి, నటి) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. ఈ సంఖ్యకి జ్ఞాన, మోక్షకారకుడు కేతువు అధిపతి కావడం వల్ల నిరంతరం ఆలోచనలతో తత్వ విచారణ చేస్తుంటారు. వీరి పుట్టిన తేదీ కూడా 7 కావడం వల్ల కేతుప్రభావం వీరిపై అధికంగా ఉంటుంది. మానవాతీత శక్తులు, అతీంద్రియ శక్తుల మీద అభిలాష కలుగుతుంది. మంచి విశ్లేషకులుగా, సద్విమర్శకులుగా పేరు తెచ్చుకుంటారు. వీరు ఈ సంవత్సరం ఏకాంతంగా గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. విదేశాలకు వెళ్లాలన్న కోరిక నెరవేరుతుంది. విదేశీ మిత్రుల సాయంతో సౌఖ్యవంతమైన జీవితం గడుపుతారు. ఈ గురు, కుజ, శుక్రుల కలయిక వల్ల ఆస్తికి సంబంధించిన ప్రణాళికలు ఫలప్రదం అవుతాయి. అవివాహితులకు వివాహం, సంతానం లేనివారికి సంతానప్రాప్తి కలుగుతాయి. వీరు ఈ సంవత్సరం కుటుంబానికి ఎంతో విలువ ఇస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నర్సులు, డాక్టర్లు, పురోహితులు, జ్యోతిష్యులు, అధ్యాపకులకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. లక్కీ నంబర్స్: 1,2,6,7; లక్కీ కలర్స్: గ్రే, పర్పుల్, బ్లూ, శాండిల్, ఎల్లో. లక్కీ డేస్: ఆది, సోమ, బుధ, శుక్రవారాలు. సూచనలు: సిద్ధపురుషులు, సాధువులు, పూజారులు, ఇమామ్‌లు, పాస్టర్లను ఆదరించి, గౌరవించడం వల్ల వీరికి వాక్శుద్ధి, సిద్ధి కలుగుతాయి. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా...
న్యూఢిల్లీ: రాబోయే ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చి... జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, పేసర్ జహీర్ ఖాన్ భావిస్తున్నారు. ఈ టోర్నీలో రాణించడం ద్వారా మరోసారి తమ అంతర్జాతీయ కెరీర్‌ను పునఃసమీక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ యువీని రికార్డు స్థాయిలో రూ. 16 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ‘క్యాన్సర్ చికిత్స తర్వాత నాకు కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురయ్యాయి. చాలా కష్టపడి వాటిని సమర్థంగా ఎదుర్కొన్నా. ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నా. ఇటీవల దేశవాళీల్లో కూడా మెరుగ్గా ఆడా. కాబట్టి ఐపీఎల్లో రాణిస్తాననే నమ్మకం ఉంది. దీనిద్వారా జాతీయ జట్టులోకి రావాలని భావిస్తున్నా’ అని యువరాజ్ పేర్కొన్నాడు. మరోవైపు ఢిల్లీకి ఆడనున్న జహీర్ కూడా ఐపీఎల్ సరైన వేదిక అని చెప్పాడు. ‘మళ్లీ క్రికెట్ ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. కొంత కాలం క్రికెట్‌కు దూరంగా ఉండటం తో గాడిలో పడాలి. జాతీయ జట్టులోకి రావాలంటే ఐపీఎల్ మొదటి అడుగు. ఒక్కో మ్యాచ్‌లో నాణ్యమైన ప్రదర్శనతో ముందుకెళ్తా. మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌తో కలిసి పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి డీడీ తరఫున మా జైత్రయాత్ర కొనసాగిస్తాం’ అని జహీర్‌ఖాన్ వ్యా ఖ్యానించాడు. -
టెస్టు జట్టులో గంభీర్ కు చోటు
ముంబై: టీమిండియా బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్ మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. ఏడాదిన్నర తర్వాత అతడికి జట్టులో చోటు దక్కింది. టెస్టు జట్టులో గంభీర్ కు స్థానం కల్పించారు. ఇంగ్లండ్ తో జరగనున్న టెస్టు సిరీస్ కు ఎంపిక చేసిన 18 మంది ఆటగాళ్లలో గంభీర్ కూడా ఉన్నాడు. వెటరన్ బౌలర్ జహీర్‌ఖాన్ కు మొండిచేయి చూపారు. గాయం కారణంగా అతడిని పక్కనబెట్టారు. ఆరుగురు ఫాస్ట్ బౌలర్లకు చోటు కల్పించారు. రాజస్థాన్ కు చెందిన పొడగరి పేసర్ పంకజ్ సింగ్ కు కూడా పిలుపువచ్చింది. జూలై 19 నుంచి ఇంగ్లండ్ తో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. జట్టు: ధోని(కెప్టెన్), విజయ్, ధావన్, గంభీర్, పూజారా, రహానే, కోహ్లి, రోహిత్ శర్మ, జడేజా, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, షమీ, ఈశ్వర్ పాండే, ఇషాంత్ శర్మ, స్టువార్ట్ బిన్నీ, ఆరోన్, సాహా, పంకజ్ సింగ్. -
జహీర్ స్థానంలో ప్రవీణ్
ముంబై: గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన జహీర్‌ఖాన్ స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు ప్రవీణ్ కుమార్‌ను తీసుకుంది. గతంలో బెంగళూరు, పంజాబ్ జట్ల తరఫున ఆడిన ఈ యూపీ పేసర్‌ను ఈ ఏడాది వేలంలో ఎవరూ కొనలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. అయితే అనుకోని విధంగా తనని అదృష్టం తలుపుతట్టింది. జహీర్ స్థానంలో అనుభవజ్ఞుడైన బౌలర్ కావాలని భావించిన ముంబై... భారత మాజీ బౌలర్ ప్రవీణ్‌ను తీసుకుంది. ముంబై డ్రెస్‌లో ప్రవీణ్ ఉన్న ఫొటోను కెప్టెన్ రోహిత్ ట్విట్టర్లో పెట్టాడు. -
జహీర్‌ఖాన్ స్థానంలో ప్రవీణ్ కుమార్
ముంబై: గాయం కారణంగా ఐపీఎల్-7కు దూరమైన జహీర్‌ఖాన్ స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు ప్రవీణ్ కుమార్‌ను తీసుకుంది. గతంలో బెంగళూరు, పంజాబ్ జట్ల తరఫున ఆడిన ఈ పేసర్‌ను ఈ ఏడాది వేలంలో ఎవరూ కొనలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. అయితే అనుకోని విధంగా తనని అదృష్టం తలుపుతట్టింది. జహీర్ స్థానంలో అనుభవజ్ఞుడైన బౌలర్ కావాలని భావించిన ముంబై... కుమార్‌ను తీసుకుంది. ఢిల్లీ బాట్స్ మన్ సౌరభ్ తివారి కూడా గాయంతో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. -
ఐపీఎల్లో పాకిస్థాన్ సంతతి స్పిన్నర్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ సంతతికి చెందిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్... ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడనున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరపున అతడు బరిలోకి దిగనున్నాడు. ఢిల్లీ తరపున ఆడుతున్న ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్-నిలె గాయపడడంతో అతడి స్థానంలో తాహిర్‌ను తీసుకున్నారు. దీనికి ఐపీఎల్ సాంకేతిక సంఘం ఆమోదముద్ర వేసింది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో తాహిర్ ఆడనున్నాడు. ఏప్రిల్ 21న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాథన్ గాయపడ్డాడు. జహీర్‌ఖాన్, సౌరవ్ తివారి కూడా గాయాలతో ఐపీఎల్‌కు దూరమయ్యారు. -
కెరీర్ ముగిసినట్లే(నా)?
పభావం చూపలేకపోతున్న జహీర్ గాయాల తర్వాత తగ్గిన పదును కపిల్‌దేవ్ తర్వాత భారత్‌కు ఆ స్థాయి పేస్ బౌలర్‌గా నిలిచిన జహీర్ ఖాన్ ఇప్పుడు తన పదును కోల్పోయాడా ? విదేశీ గడ్డపై టీమిండియా సాధించిన చరిత్రాత్మక, చిరస్మరణీయ విజయాల్లో జట్టును నడిపించిన జహీర్ బౌలింగ్‌లో కళ తప్పిందా? ఈ పేసర్ తనదైన స్థాయిలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టి ఎన్నాళ్లైంది? ఇకపై అతను భారత బౌలింగ్ భారాన్ని మోయగలడా? యువ పేసర్లు తమ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మళ్లీ మునుపటి మెరుపులు చూపించగలడా? లేక తన పరుగును ఆపివేస్తాడా! - సాక్షి క్రీడా విభాగం నిస్సందేహంగా కపిల్ తర్వాత భారత అత్యుత్తమ పేసర్ జహీర్ ఖాన్. అలాంటి గొప్ప బౌలర్ 120-125 కి.మీ. వేగంతో బౌలింగ్ చేస్తూ జట్టులో కొనసాగడం నేను చూడలేను - ద్రవిడ్ మూడేళ్ల తర్వాత... ఎప్పుడో 2010 అక్టోబర్‌లో జహీర్ ఖాన్ ఆఖరి సారిగా ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత గత వారం వెల్లింగ్టన్లో ప్రత్యర్థి స్కోరు 600 దాటాక, 51 ఓవర్లు వేస్తే గానీ మరోసారి 5 వికెట్లు దక్కలేదు. ఈ మధ్య కాలంలో అతను ఆడిన 18 టెస్టుల్లో జహీర్ ప్రదర్శన నామమాత్రంగానే ఉంది. అప్పుడప్పుడు వికెట్లు తీయగలిగినా...ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఆధిక్యం ప్రదర్శించే స్థాయిలో అతని బౌలింగ్ ఎప్పుడూ లేదు. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లలో గతంలో అద్భుత బౌలింగ్‌తో ఎన్నో విజయాలు అందించిన జహీర్ ఇప్పుడు ఒక సాధారణ బౌలర్‌గా మారిపోయాడు. ఇప్పుడు ఆనాటి వేగమూ లోపించింది. ‘నిస్సందేహంగా కపిల్ తర్వాత భారత అత్యుత్తమ పేసర్ జహీర్ ఖాన్. అలాంటి గొప్ప బౌలర్ 120-125 కి.మీ. వేగంతో బౌలింగ్ చేస్తూ జట్టులో కొనసాగడం నేను చూడలేను’ అని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించడం జహీర్ ప్రస్తుత పరిస్థితిని సూచిస్తోంది. వెంటాడిన గాయాలు జహీర్ ఖాన్ కెరీర్ ఆసాంతం గాయాలతోనే సహవాసం చేశాడు. నిలకడగా రాణిస్తూ, జట్టుకు అండగా నిలుస్తున్నాడని కనిపించిన ప్రతీసారి... గాయంతో మ్యాచ్‌నుంచి తప్పుకోవడమో, ఫిట్నెస్ లేక ఆటకు దూరం కావడమో తరచూ జరిగింది. 2003-04లో ఆస్ట్రేలియాలో తొలి సారి కండరాల గాయం జహీర్ జోరుకు రెండేళ్ల పాటు బ్రేక్ వేసింది. ఆ తర్వాత ‘పునరాగమనం’ అనే పదం అతనికి విశేషణంగా మారిపోయింది. ఎప్పుడు తిరిగి జట్టులోకి వచ్చినా...మళ్లీ కొన్నాళ్లకే మరో కొత్త గాయంతో ఖాన్ జట్టుకు దూరమయ్యాడు. తనకు ఎన్ని శస్త్ర చికిత్సలు జరిగాయో జహీర్ కూడా లెక్క పెట్టకపోవచ్చు! ఫ్రాన్స్‌లో ప్రత్యేక శిక్షణ ద్వారా ఫిట్నెస్ను మెరుగు పర్చుకొన్న అతను దాదాపు ఏడాది విరామం తర్వాత ఇటీవలే దక్షిణాఫ్రికా పర్యటనతో మళ్లీ జట్టులోకి వచ్చాడు. నడిపించలేని నాయకుడు దక్షిణాఫ్రికాలాంటి బౌన్సీ వికెట్లపై జహీర్ ఖాన్ ఎంతో కీలకమని, సీనియర్‌గా అతని అనుభవం యువ బౌలర్లకు అండగా నిలుస్తుందనే కారణంతోనే అతడిని ఎంపిక చేశారన్నది వాస్తవం. అయితే జూనియర్లకు మార్గదర్శిగా నిలవడం మాట ఎలా ఉన్నా...తన సాధారణ ఆటతో మాత్రం జహీర్ నిరాశ పర్చాడు. జొహన్నెస్‌బర్గ్‌లో 223 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన అతను, డర్బన్‌లో 2 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. ముఖ్యంగా 450కి పైగా పరుగుల లక్ష్యాన్ని సఫారీలు దాదాపుగా ఛేదించారంటే కీలక సమయాల్లో జహీర్ విఫలం కావడం కూడా ఒక కారణం. ఇక న్యూజిలాండ్‌లో ఆక్లాండ్‌లో అతను ప్రభావం చూపలేకపోగా, రెండో టెస్టు మ్యాచ్‌లో 5 వికెట్లు తీసినా అప్పటికే మ్యాచ్‌పై జట్టు పట్టు కోల్పోయింది. ఈ నాలుగు టెస్టుల్లో 16 వికెట్లు తీయగలిగినా...వెల్లింగ్టన్లో ఇషాంత్ తరహాలో ఏ దశలో కూడా కూడా జహీర్ ప్రమాదకరంగా కనిపించలేదు. సత్తా ఉందా... గత 8 ఇన్నింగ్స్‌లలో నాలుగు సార్లు అతను 26.3, 34, 30, 51 ఓవర్ల చొప్పున బౌలింగ్ చేయడం చూస్తే ఫిట్నెస్పరంగా అతను బాగున్నట్లే లెక్క! అయితే ఆట మాత్రం నిరాశాజనకంగానే ఉంది. ఈ ఏడాది జూన్‌లో భారత్ ఇంగ్లండ్‌లో ఐదు టెస్టులు ఆడనుంది. ‘జహీర్ ఆ ఐదు టెస్టులు ఆడగలడా అన్నదే నా సందేహం. చివరి వరకు తీవ్రంగా కష్ట పడుతూ ఆడాలని అతనూ అనుకోడు. కాబట్టి వచ్చే సిరీస్ గురించి స్వయంగా జహీర్, సెలక్టర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని ద్రవిడ్ సూచించారు. అయితే భారత బౌలింగ్ మాజీ కోచ్ ఎరిక్ సిమన్స్, పాక్ దిగ్గజం వసీం అక్రమ్ మాత్రం జహీర్ ఇంకా భారత్‌కు ఉపయోగ పడగలడని అంటున్నారు. ‘జహీర్ వేగం గురించి ఆలోచించనవసరం లేదు. అతను ప్రధానంగా స్వింగ్, వైవిధ్యం ఉన్న బౌలర్. ఎలాగూ కొత్త బౌలర్లు ఫాస్ట్‌గానే బౌలింగ్ చేస్తారు కాబట్టి జహీర్‌ను ఫాస్ట్ బౌలర్ కోణంలో కాకుండా ఒక కీలక బౌలర్‌గానే భావిస్తే కెరీర్ చివర్లో రిచర్డ్ హ్యాడ్లీ తరహాలో ఫలితాలు ఇవ్వగలడు’ అని సిమన్స్ విశ్లేషిస్తే...‘ఈ వయసులో ఇన్ని సార్లు పునరాగమనం చేయగలిగాడంటే అది సాధారణ విషయం కాదు. అతను మైదానంలో ఉంటే యువ బౌలర్లకు ఎంతో లాభిస్తుంది’ అని అక్రమ్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తు ఏమిటి... భారత్ తరఫున జహీర్ వన్డేలు, టి20 మ్యాచ్‌లు ఆడి దాదాపు ఏడాదిన్నర దాటింది కాబట్టి ఈ ఫార్మాట్లో అతను ఆడే అవకాశాలు దాదాపుగా లేనట్లే. ఇక మిగిలింది టెస్టులే. జహీర్ ప్రస్తుతం 36 ఏళ్లకు చేరువవుతున్నాడు. ఒక పేసర్ ఈ వయసులో టెస్టు క్రికెట్ ఆడటం అంత సులభం కాదు. 92 టెస్టుల్లో 311 వికెట్లు పడగొట్టిన అతను వ్యక్తిగత మైలురాయి వంద టెస్టులకు చేరువగా ఉన్నాడు. జూన్‌లో ఇంగ్లండ్‌లో సిరీస్‌కు ఐపీఎల్ ప్రదర్శనే ప్రామాణికం కాకపోయినా అతని ఫిట్నెస్ను పరిశీలించేందుకు సెలక్టర్లకు ఒక అవకాశంలాంటిది. మన దేశంలో వ్యక్తిగత మైలురాళ్లకు ఉండే ప్రాధాన్యతను బట్టి చూస్తే జహీర్ మిగిలిన ఎనిమిది టెస్టులు ఆడే అవకాశం రావచ్చు. లేదంటే స్వయంగా తానే తన ఆటను విశ్లేషించుకున్నా అతని కెరీర్ చివరి దశకు చేరుకుందనే చెప్పవచ్చు. కుర్రాళ్లు ఎదురుచూస్తున్నారు భారత టెస్టు జట్టులో స్థానం కోసం బాగా పోటీ ఉంది. ప్రస్తుతం జహీర్, ఇషాంత్, షమీ నిలకడగా తుది జట్టులో ఉంటున్నారు. భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, వరుణ్ ఆరోన్, ఈశ్వర్ పాండే... ఇలా బెంచ్ మీద తుది జట్టులో స్థానం ఎదురుచూస్తున్న వారి జాబితా పెద్దగానే ఉంది. ఈ నేపథ్యంలో జహీర్ మీద ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంది. ప్రదర్శన బాగుంటేనే బౌలింగ్ నాయకుడిగా సహచరుల నుంచి గౌరవం దక్కుతుంది. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో జహీర్‌పై ఇషాంత్ శర్మ నోరుపారేసుకున్నాడు. నిజానికి జహీర్ మంచి ఫామ్‌లో ఉండి, నిలకడగా రాణిస్తుంటే ఇషాంత్ అంత సాహసం చేసేవాడు కాదు. కాబట్టి తనకంటే జూనియర్ల ముందు చులకన కావడం కంటే గౌరవంగా తప్పుకోవడమే మేలేమో..! -
300 వికెట్ల క్లబ్బులో జహీర్ ఖాన్
వెటరన్ బౌలర్ జహీర్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో 300 వికెట్లు తీసి ఆ ఘనత సాధించిన నాలుగో భారతీయుడిగా చరిత్ర పుటల్లో నిలిచాడు. జొహాన్నెస్బెర్గ్లో సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన జహీర్, రెండో ఇన్నింగ్స్‌లో జాక్వెస్ కలిస్‌ను ఔట్ చేసి 300వ వికెట్ సాధించాడు. అల్లాటప్పా బ్యాట్స్‌మన్‌తో కాకుండా, కలిస్ లాంటి స్టార్ బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ ఘనతను మరింత ఆనందంగా అనుభవించాడు. 300వ వికెట్ తీయగాన డ్రెసింగ్ రూంలో ఉన్న తన సహచరుల వైపు చూతులు ఊపాడు. జహీర్ వేసిన ఇన్సైడ్ ఎడ్జ్ బాల్‌ను జడ్జి చేయడంలో పొరబడిన కలిస్, వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో జహీర్ ఖాన్ లేటు వయసులో ఘాటైన విజయం సాధించాడు. ఇప్పటివరకు భారతీయ బౌలర్లలో అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (413) మాత్రమే 300 వికెట్లు సాధించిన ఘనత పొందగా ఇప్పుడు జహీర్ ఖాన్ కూడా వారి సరసన చేరినట్లయింది. అయితే ఫాస్ట్ బౌలర్లను మాత్రమే చూసుకుంటే కేవలం కపిల్ దేవ్, తర్వాత జహీర్ ఖాన్ మాత్రమే 300 వికెట్లు దాటారు. మిగిలిన ఇద్దరూ స్పిన్నర్లు కావడం విశేషం. -
సౌతాఫ్రికా 244 ఆలౌట్:భారత్ కు 36 పరుగుల ఆధిక్యం
జోహన్స్‌బర్గ్:భారత్ బౌలర్లు జూలు విదల్చడంతో సఫారీలు చతికిలబడ్డారు. భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ తమ మొదటి ఇన్నింగ్స్ లో 244 పరుగులకే ఆలౌటయ్యారు. ఇషాంత్ శర్మ కట్టుదిట్టమైన బౌలింగ్ కు , వెటరన్ ఆటగాడు జహీర్ ఖాన్ నిప్పులు చెరిగే బంతులు సంధించడంతో సౌతాఫ్రికా ఆటగాళ్లు నానా తంటాలు పడ్డారు. సౌతాఫ్రికా ఆటగాళ్లలో గ్రేమ్ స్మిత్ (68), ఆమ్లా(36), పీటర్ సన్ (21), ఫిలిండర్ (59) పరుగుల మినహా పెద్దగా ఎవరూ ఆకట్టుకోలేదు. మరో భారత్ బౌలర్ మహ్మద్ సమీకి రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 280 పరుగులకు ఆలౌటైంది. క్రమం తప్పకుండా వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. -
ఎవరిది పైచేయి?
పరిస్థితులు, పిచ్‌లు, రికార్డులు... అన్నీ దక్షిణాఫ్రికాకే అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి రెండు టెస్టుల సిరీస్‌లో భారత్‌పై ఆతిథ్య జట్టే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ లైనప్‌కు... భారత యువ బ్యాట్స్‌మెన్‌కు ఈ సిరీస్‌లో అసలైన పోరు జరగబోతోంది. అదే సమయంలో వ్యక్తుల మధ్య పోటీ కూడా ఆసక్తికరమే. ఈ సిరీస్‌లో అలాంటి ఆసక్తికర సమరాలను పరిశీలిస్తే... సాక్షి క్రీడావిభాగం దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన టెస్టు జట్టులో జహీర్‌ఖాన్ పేరు కనిపించగానే... సఫారీ శిబిరం, ముఖ్యంగా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అప్రమత్తమయ్యాడు. క్రికెట్లో సాధారణంగా ఎప్పుడూ కొన్ని రైవలరీస్ ఉంటాయి. అలాంటి వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగింది స్మిత్, జహీర్‌ల పోరాటం. ఈ సిరీస్‌లో భారత్ గెలవాలంటే అన్ని విభాగాల్లోనూ నిలకడగా ఆడాలి. జట్టంతా సమష్టిగా రాణించడం ముఖ్యం. అయితే ఇందులో కొన్ని వ్యక్తిగత పోరాటాల్లో భారత క్రికెటర్లు పైచేయి సాధించాలి. గ్రేమ్ స్మిత్ vs జహీర్ జహీర్ ఇప్పటి వరకూ స్మిత్‌ను ఆరుసార్లు అవుట్ చేశాడు. ప్రపంచ క్రికెట్లో స్మిత్‌ను అవుట్ చేయడంలో సక్సెస్ రేట్ అందరికంటే ఎక్కువగా జహీర్‌కే ఉంది. అందుకే దీని గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. అయితే స్టార్ క్రికెటర్లిద్దరూ దీనిని కొట్టిపారేశారు. ‘స్మిత్‌ను ఒక్కడినే లక్ష్యం చేసుకోవడమేమీ లేదు. దక్షిణాఫ్రికా జట్టులో నాణ్యమైన బ్యాట్స్‌మెన్ చాలా మంది ఉన్నారు. కాబట్టి నిలకడగా రాణించడం ముఖ్యం’ అని జహీర్ అన్నాడు. ‘అసలు ఇది పట్టించుకోవాల్సిన పనిలేదు. ప్రతి బౌలర్ ఎన్నో కొన్నిసార్లు ప్రతి బ్యాట్స్‌మన్‌నూ అవుట్ చేస్తాడు’ అని స్మిత్ కొట్టిపారేశాడు. బయట మాటలు ఎలా ఉన్నా... స్మిత్‌పై జహీర్ పైచేయి సాధించడం చాలా ముఖ్యం. ఆరంభంలోనే జహీర్... ఫామ్‌లో ఉన్న స్మిత్‌ను అవుట్ చేస్తే భారత్ మానసికంగా పైచేయి సాధిస్తుంది. ఆమ్లా, కలిస్ vs ఇషాంత్ దక్షిణాఫ్రికా విజయాల్లో కీలక ఆటగాళ్లు ఆమ్లా, కలిస్. ఈ ఇద్దరూ కుదురుకున్నారంటే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు. కలిస్, ఆమ్లా జోడీ వేగంగా ఆడదు. కానీ భారీ భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడంలో ఈ ఇద్దరూ దిట్ట. మరోవైపు ఇషాంత్ దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో ప్రదర్శన ద్వారా టెస్టుల్లో తుది జట్టులో తన స్థానాన్ని దాదాపుగా ఖరారు చేసుకున్నాడు. జహీర్ తర్వాత భారత లైనప్‌లో అతనే అనుభవజ్ఞుడు. కాబట్టి ఈ ఇద్దరినీ నియంత్రించాల్సిన బాధ్యత ఇషాంత్ది. డివిలియర్స్, డుప్లెసిస్ vs షమీ దక్షిణాఫ్రికా మిడిలార్డర్లో అత్యంత కీలక ఆటగాళ్లు డివిలియర్స్, డుప్లెసిస్. ఈ ఇద్దరూ వేగంగా ఆడటంలో దిట్ట. ప్రత్యర్థి బౌలర్లు తేరుకునేలోపే చకచకా పరుగులు చేసి స్కోరుబోర్డు మీద భారీ మొత్తం చూపించేస్తారు. ఇక భారత బౌలర్ షమీ ఇటీవలీ కాలంలో పెద్ద సంచలనం. ముఖ్యంగా వెస్టిండీస్‌తో స్వదేశంలో సిరీస్‌లో రివర్స్ స్వింగ్ ద్వారా సంచలన ఫలితాలు రాబట్టాడు. దక్షిణాఫ్రికాలోనూ వన్డేల్లో రాణించాడు. టెస్టుల్లో మిడిలార్డర్లో సఫారీ జోడీని రివర్స్ స్వింగ్‌తో కట్టడి చేయాల్సిన బాధ్యత షమీది. స్టెయిన్ vs భారత టాప్ ఆర్డర్ టెస్టు మ్యాచ్‌ల్లో వికెట్లు ఎలా ఉండబోతున్నాయో వన్డేల్లోనే దక్షిణాఫ్రికా శాంపిల్ చూపించింది. తెల్ల బంతితోనే బౌన్సర్ల వర్షం కురిపించిన స్టెయిన్... తనకు బాగా నచ్చిన పచ్చిక పిచ్‌లపై ఎర్రబంతితో ఎలా నిప్పులు చెరుగుతాడో ఊహించుకుంటేనే ఆందోళన చెందే పరిస్థితి. ప్రస్తుత క్రికెట్లో స్టెయిన్ కంటే ప్రమాదకర బౌలర్ లేడు. తనని సమర్థంగా ఎదుర్కొని భారత టాప్ ఆర్డర్ ఎలాంటి ఆరంభం ఇస్తుందనేది సిరీస్‌లో అత్యంత కీలక అంశం. మురళీ విజయ్, శిఖర్ ధావన్‌లకు పెద్దగా అనుభవం లేదు. అసలు ధావన్ భారత్ బయట టెస్టు మ్యాచ్ ఆడటం కూడా ఇప్పుడే. స్టెయిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే సాంకేతిక నైపుణ్యం వీరికి ఉందా అనేది ప్రశ్నార్థకమే. అయితే పుజారా విషయంలో మాత్రం సగటు భారత అభిమాని చాలా అంచనాలతో ఉన్నాడు. భారత మిడిలార్డర్ vs మోర్కెల్, ఫిలాండర్ దక్షిణాఫ్రికా ఒకవేళ నలుగురు పేసర్లతో బరిలోకి దిగినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ముగ్గురు పేసర్లతోనే ఆడితే స్టెయిన్‌తో పాటు మోర్కెల్, ఫిలాండర్ తుది జట్టులోకి వస్తారు. ఈ ఇద్దరూ కూడా బాగా ప్రమాదకరమైన బౌలర్లు. మోర్కెల్ బౌన్స్‌ను నమ్ముకుంటే... ఫిలాండర్ స్వింగ్‌తో సంచ లనాలు సృష్టిస్తున్నాడు. సచిన్ రిటైర్మెంట్ తర్వాత భారత్ ఆడబోతున్న తొలి సిరీస్ ఇది. మాస్టర్ స్థానంలో కోహ్లి నాలుగో స్థానంలో రావడం దాదాపుగా ఖాయమే. రోహిత్, రహానే, ధోని మిడిలార్డర్లో మిగిలిన బ్యాట్స్‌మెన్. నిజానికి ఈ నలుగురూ నాణ్యమైన బ్యాట్స్‌మెనే అయినా... దక్షిణాఫ్రికా పిచ్‌లపై ఓపిగ్గా గంటల తరబడి క్రీజులో నిలబడాలి. ఈ ఓపిక ఈ నలుగురికి ఉందా అనేదే పెద్ద ప్రశ్న. రోహిత్, కోహ్లి, ధోని ముగ్గురూ వన్డేల్లో తేలిపోయారు. షార్ట్‌పిచ్ బంతులను ఆడటంలో తమ బలహీనతలను బయటపెట్టుకున్నారు. కాకపోతే టెస్టుల్లో కావలసినంత సమయం ఉంటుంది. దీనిని వినియోగించుకుంటారో లేదో చూడాలి. -
సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం
ముంబై: జట్టులో చోటు కోల్పోయిన ఏడాది కాలం అనంతరం మరోసారి పేసర్ జహీర్ ఖాన్‌కు అవకాశమొచ్చింది. వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనకు టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న జహీర్.. తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెబుతున్నాడు. ఈ సీజన్లో ఆడిన మూడు రంజీ మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసిన 35 ఏళ్ల ఈ పేసర్ తన చివరి టెస్టును గతేడాది డిసెంబర్లో ఇంగ్లండ్‌పై ఆడాడు. ‘సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. నా చివరి పునరాగమనం కూడా దక్షిణాఫ్రికాపైనే జరిగింది. అక్కడ నాకు మంచి జ్ఞాపకాలున్నాయి. ఈసారి కూడా మెరుగ్గానే రాణిస్తానని అనుకుంటున్నాను. ఈనెల 28 నుంచి విదర్భతో రంజీ మ్యాచ్ ఆడుతున్నాను. సఫారీ పర్యటనకు ముందు ఈ మ్యాచ్ ద్వారా మంచి ప్రాక్టీస్ లభిస్తుందనుకుంటున్నాను. గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పుడు ఎంతో ఆలోచించాను. నా ఫిట్నెస్ మెరుగుపరుచుకుని తిరిగి జట్టులో చోటు సాధిస్తానా? లేదా? అని ప్రశ్నించుకున్నాను. సాధిస్తాననే నమ్మకంతో శారీరకంగా ఎంతోశ్రమించాను. చాలామంది ట్రైనర్లు, ఫిజియోలతో సంప్రదించాను. ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లి ఈ స్థాయిలో ఉండగలిగాను’ అని జహీర్ అన్నాడు. విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మహ్మద్ షమీ రాణించిన తీరు అద్భుతమని కొనియాడాడు. కొత్త బంతితోనే కాకుండా పాత బంతితోనూ సత్తా చూపగలిగాడని అన్నాడు. -
ముగ్గురి కథ ముగిసినట్లేనా?
ముంబై: జాతీయ జట్టులోకి పునరాగమనం చేయాలనుకుంటున్న డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్, పేసర్ జహీర్ ఖాన్, స్పిన్నర్ హర్భజన్ సింగ్‌లకు బీసీసీఐ షాకిచ్చింది. 2013-14 ఏడాది కోసం ఎంపిక చేసిన ఒప్పంద ఆటగాళ్ల జాబితా నుంచి ఈ ముగ్గుర్ని తొలగించింది. దీంతో వీళ్ల కెరీర్ ఇక ముగిసినట్టేనని ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తం 25 మందితో బోర్డు ఒప్పందం చేసుకోనుంది. కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్న సచిన్ ఈ సీజన్లో రెండు టెస్టులు ఆడినందుకు అతన్ని గ్రేడ్ ‘ఎ’లో కొనసాగించారు. గ్రేడ్-ఎ ఆటగాళ్లకు కోటి, గ్రేడ్-బి, సి క్రికెటర్లకు వరుసగా 50, 25 లక్షల చొప్పున చెల్లిస్తారు. ఆటగాళ్ల కాంట్రాక్టుల జాబితా గ్రేడ్-ఎ: సచిన్, ధోని, కోహ్లి, రైనా, అశ్విన్. గ్రేడ్-బి: గంభీర్, యువరాజ్, ఓజా, ఇషాంత్, మురళీ విజయ్, ధావన్, ఉమేశ్, పుజారా, జడేజా, భువనేశ్వర్, రోహిత్. గ్రేడ్-సి: దినేశ్ కార్తీక్, మిశ్రా, వృద్ధిమాన్ సాహా, రహానే, రాయుడు, వినయ్, షమీ, ఉనాద్కట్, మోహిత్ శర్మ. -
రాణించిన జహీర్
హుబ్లి: భారత పేస్ బౌలర్ జహీర్ ఖాన్ ఎట్టకేలకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచాడు. చివరి రోజు జహీర్ (4/59) చెలరేగడంతో మూడో అనధికారిక టెస్టులో వెస్టిండీస్ ‘ఎ’పై భారత్ ‘ఎ’ జట్టు ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జహీర్‌తో పాటు అభిషేక్ నాయర్ (2/45) కీలక వికెట్లు తీశాడు. మ్యాచ్ నాలుగో రోజు శనివారం 116/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన వెస్టిండీస్ 73.5 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌటైంది. దేవ్‌నారాయణ్ (180 బంతుల్లో 99; 13 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా, ఫుదాదిన్ (101 బంతుల్లో 49; 5 ఫోర్లు) కొద్ది సేపు అండగా నిలిచాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. ఆఖరి రోజు 38.5 ఓవర్లలో 103 పరుగులు మాత్రమే జోడించి విండీస్ చివరి 7 వికెట్లు కోల్పోయింది. జహీర్‌ఖాన్ రెండు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లతో విండీస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఎనిమిది పరుగుల వ్యవధిలో విండీస్ చివరి 4 వికెట్లు కోల్పోగా, హామిల్టన్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాకపోవడంతో జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. తాజా ఫలితంతో మూడు టెస్టు మ్యాచ్‌ల ఈ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. తొలి టెస్టులో విండీస్ నెగ్గగా, రెండో టెస్టు డ్రా అయింది. ఈ మ్యాచ్‌తో జహీర్ ఖాన్, గంభీర్ కొంత వరకు తమ ఫామ్‌ను అంది పుచ్చుకోగా, సెహ్వాగ్ మాత్రం అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. -
బ్రాత్‌వైట్ సెంచరీ
షిమోగా: భారత్ ‘ఎ’-వెస్టిండీస్ ‘ఎ’ జట్ల మధ్య రెండో అనధికార టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఎలాగూ ఫలితం డ్రా అని తెలిసిన తర్వాత వెస్టిండీస్ ‘ఎ’ జట్టు ఏ మాత్రం ప్రయోగాలకు పోకుండా మ్యాచ్‌ను బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు ఉపయోగించుకుంది. ఓపెనర్ బ్రాత్‌వైట్ (247 బంతుల్లో 104; 15 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... దేవ్‌నారాయణ్ (142 బంతుల్లో 93; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) ఏడు పరుగుల తేడాతో శతకాన్ని కోల్పోయాడు. ఈ ఇద్దరి రాణింపుతో నాలుగో రోజు శనివారం వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భార్గవ్ భట్ రెండు వికెట్లు తీసుకోగా... జహీర్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 406 పరుగులు చేయగా... భారత్ 359 పరుగులకే పరిమితమైంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్టు గెలిచిన వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఆఖరి టెస్టు 9 నుంచి హుబ్లీలో జరుగుతుంది. -
తొలిరోజు జహీర్ విఫలం
షిమోగా: తొమ్మిది నెలలుగా గాయంతో బాధపడుతూ... ఫిట్నెస్ కోసం పాకులాడుతున్న భారత స్టార్ పేసర్ జహీర్ ఖాన్ ఎట్టకేలకు బరిలోకి దిగాడు. వెస్టిండీస్‌తో బుధవారం ప్రారంభమైన రెండో అనధికార టెస్టులో భారత్ ‘ఎ’ తరఫున బరిలోకి దిగిన జహీర్ (1/44) ఆకట్టుకోలేకపోయాడు. మిగిలిన బౌలర్లు కూడా అంతంత మాత్రంగానే రాణించడంతో.... వెస్టిండీస్ ‘ఎ’ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. బ్రాత్‌వైట్ (82), ఫుదాదిన్ (63) అర్ధసెంచరీలు చేయడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్సలో 90 ఓవర్లలో 6 వికెట్లకు 283 పరుగులు చేసింది. జాన్సన్ (36 నాటౌట్), మిల్లర్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. జవహర్లాల్ నెహ్రు స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో పావెల్ (33) విఫలమైనా... బ్రాత్‌వైట్ నిలకడగా ఆడాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించారు. ఎడ్వర్డ్స (18), డియోనరైన్ (12) వెంటవెంటనే అవుట్‌కావడంతో కరీబియన్ జట్టు 98 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. బ్రాత్‌వైట్‌తో జత కలిసిన ఫుదాదిన్ మెరుగ్గా ఆడాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్న ఈ జోడి వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరింది. తర్వాత జాన్సన్ నిలకడను కనబర్చినా... వాల్టన్ (30) ఆట చివర్లో అవుటయ్యాడు. మిల్లర్ పరుగులు చేయకున్నా వికెట్‌ను కాపాడుకుంటూ రోజును ముగించాడు. జహీర్ ఖాన్, షమీ, రసూల్ తలా ఓ వికెట్ తీయగా.. భార్గవ్ భట్‌కు మూడు వికెట్లు దక్కాయి.