Aishwarya Rai
-
ఐశ్వర్య ఫోన్ చేస్తే టెన్షన్ వచ్చేస్తుంది: అభిషేక్ బచ్చన్
అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇటీవలే 'బి హ్యాపీ' చిత్రంతో ఓటీటీ ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో కూతురి గెలుపు కోసం పాటుపడే తండ్రిగా కనిపించాడు. అయితే తండ్రయ్యాక రొమాంటిక్ సీన్లలో నటించడానికి ఇబ్బందిగా ఉందని.. దానివల్ల అలాంటి సన్నివేశాలున్న సినిమాలను వదిలేసుకుంటున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఉత్తమ నటుడిగా తొలి అవార్డ్ఇకపోతే 'ఐ వాంట్ టు టాక్' (I want to Talk) చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా షోషా రీల్ అవార్డు అందుకున్నాడు. ఉత్తమ నటుడిగా నేను గెల్చుకున్న తొలి అవార్డు ఇదేనంటూ అభిషేక్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంతలో హీరో అర్జున్ కపూర్.. ఐ వాంట్ టు టాక్ (నేను నీతో మాట్లాడాలి) అని ఎవరు అన్నప్పుడు నువ్వు టెన్షన్ పడతావు? అని ప్రశ్నించాడు.పెళ్లయితే తెలుస్తుందిఅందుకు అభిషేక్.. నీకింకా పెళ్లి కాలేదు కదా.. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు దానికి ఆన్సరేంటో నీకే తెలుస్తుంది. నా భార్య ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అన్నప్పుడు ఒత్తిడిగా ఫీలవుతాను. ప్రత్యేకంగా మాట్లాడాలని ఫోన్ చేసిందంటే కచ్చితంగా మనం సమస్యలో ఇరుక్కున్నట్లే లెక్క అని సరదాగా చెప్పాడు. కాగా అభిషేక్, ఐశ్వర్య రాయ్ 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఆరాధ్య జన్మించింది. కాగా అభిషేక్- ఐశ్వర్య విడిపోతున్నట్లు పలుమార్లు రూమర్లు రాగా.. అవి నిజం కాదని నటుడు క్లారిటీ ఇచ్చాడు.చదవండి: నీదీ నాది ఒకే కథ.. బంధువులే అసభ్యంగా.. ఏడ్చేసిన వరలక్ష్మి -
అభిషేక్ - ఐశ్వర్యపై విడాకుల రూమర్స్.. ఇకపై తెరపడినట్లే!
బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌పై గత కొన్ని నెలలుగా విడాకుల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అనిల్ అంబానీ కుమారుడి పెళ్లి సమయంలోనూ వీరిద్దరు విడిపోనున్నారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ బర్త్ డే రోజు ఆలస్యంగా విషెస్ చెప్పడంతో మరోసారి డివోర్స్ వార్తలు వినిపించాయి. అలా ఏదో ఒక సందర్భంలో వీరిద్దరిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి.విడాకుల వార్తల నేపథ్యంలో స్టార్ కపుల్ బాలీవుడ్ డైరెక్టర్ కుమారుడి పెళ్లిలో సందడి చేశారు. దర్శకుడు అశుతోష్ గోవారికర్ కుమారుడి పెళ్లిలో జంటగా కనిపించారు. చాలా రోజుల తర్వాత ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ఓ శుభ కార్యానికి హాజరు కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి నుంచైనా విడాకుల వార్తలకు చెక్ పెట్టినట్లు పడుతుందని భావిస్తున్నారు. ఐశ్వర్య, అభిషేక్ పెళ్లికి హాజరైన ఫోటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ పెళ్లికి అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, కిరణ్ రావ్, గాయత్రీ ఒబెరాయ్, జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్‌ముఖ్, విద్యా బాలన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ లాంటి సినీతారలు హాజరయ్యారు. అశుతోష్ కుమారుడు కోణార్క్ మార్చి 2న నియతిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.అభిషేక్-ఐశ్వర్యల పెళ్లి 2007లో జరిగింది. వీరిద్దరికి 2011లో ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె జన్మించారు. జూలై 2024లో అనంత్ అంబానీ పెళ్లి నుంచి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌పై విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా ఈ జంట పెళ్లికి హాజరవ్వడంతో ఆ వార్తలకు దాదాపు చెక్ పడినట్లే. View this post on Instagram A post shared by Aishwarya Rai Team🇲🇺 (@aishwarya_raifan) -
భర్తకు విషెస్ చెప్పిన ఐశ్వర్య రాయ్.. ఎప్పటిలాగే ఆలస్యంగా!
బాలీవుడ్ అత్యంత క్రేజ్ ఉన్న జంటల్లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ ఒకరు. ఇవాళ అభిషేక్ తన 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తాజాగా తన భర్తకు బర్త్ డే విషెస్ తెలిపింది. అభిషేక్ బచ్చన్ చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. మీకు ఎల్లప్పుడు ఆనందం, ఆరోగ్యం, ప్రేమతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.సినిమాల విషయానికొస్తే అభిషేక్ బచ్చన్.. గతేడాది ఐ వాంట్ టూ టాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. షూజిత్ సర్కార్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీలో అభిషేక్ విభిన్నమైన పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది.ఐశ్వర్య రాయ్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రాల్లో నటించింది. ఇందులో చియాన్ విక్రమ్, రవి మోహన్, శోభితా ధూళిపాల, త్రిష కృష్ణన్, కార్తీ, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో నటించారు.ఐశ్వర్య- అభిషేక్‌పై రూమర్స్..కాగా.. గతేడాది అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహ వేడుకల్లో జంటగా కనిపించారు. ఇద్దరూ విడివిడిగా వేడుకలో కనిపించడంతో ఈ జంట విడిపోతున్నారంటూ పెద్దఎత్తున రూమర్స్ వినిపించాయి. అంతకుముందు కూతురు ఆరాధ్య పుట్టిన రోజు వేడుకల్లో అభిషేక్ కనిపించకపోవడంతో డివోర్స్ తీసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ ఈ జంట ఈ వార్తలపై స్పందించలేదు.జంటగా పార్టీకి హాజరుబాలీవుడ్ జంట ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని ఏళ్ల తరబడి నుంచి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. గతేడాదిలో మరింత బలపడ్డాయి. కానీ వీరిద్దరు ఓ పార్టీలో ఫ్రెండ్స్‌తో కలిసి సెల్ఫీలు దిగారు. అందులో అభిషేక్, ఐశ్వర్యతో పాటు ఐష్ తల్లి బృంద్య రాయ్ కూడా ఉన్నారు. దీంతో విడాకుల రూమర్స్‌కు చెక్ పడింది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్.. అనుకున్నదే జరిగిందిగా..!
-
కెరీర్లో ఎక్కువ ఫ్లాపులే.. ఆస్తులు మాత్రం కోట్లలో..
సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు. చాన్స్‌ల కోసం ఏళ్లుగా ఎదురుచూసే వాళ్లు చాలానే ఉంటారు. బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లకి మాత్రం ఫస్ట్ చాన్స్ ఈజీగా వచ్చేస్తుంది. కానీ వచ్చిన అవకాశం వినియోగించుకోకుంటే..వాళ్లను కూడా పట్టించుకోరు. వారసత్వంగా వచ్చి.. వెనక్కి వెళ్లిన నటులు చాలా మందే ఉన్నారు. మరికొంతమందికి మాత్రం ఎన్ని ఫ్లాపులు వచ్చిన అవకాశాలు వస్తునే ఉంటాయి. వరుస సినిమాలు తీస్తూ కోట్ల ఆస్తులను కూడబెడుతుంటారు. అలాంటి వారిలో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) ఒక్కరు. ఆయన సీనీ కెరీర్లో అత్యధిక ఫ్లాపులే ఉంటాయి. కానీ ఆస్తుల విషయంలో మాత్రం స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గలేదు. నేడు(ఫిబ్రవరి 5) అభిషేక్ బచ్చన్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన ఆస్తులపై ఓ లుక్కేద్దాం.విశాలవంతమైన విల్లాలుఅభిషేక్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 280 కోట్లకు పైగా ఉంటుందట. ఇందులో ఎక్కువగా సొంతంగా సంపాదించుకున్నదే అట. తండ్రి వారసత్వంగా వచ్చే ఆస్తులు కలిపిస్తే..ఇది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. సినిమాలపై వస్తే డబ్బును ఎక్కువగా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో పెట్టుబడిగా పెట్టాడట. అలాగే దుబాయ్‌లో ఓ విలాసవంతమైన విల్లా కొనుగోలు చేశాడు. అభిషేక్ దుబాయ్ వెళ్ళినప్పుడు ఇక్కడే ఉంటాడు. దీని ధర 16 కోట్ల రూపాయలు. ‘బాంద్రా-కుర్లా’ కాంప్లెక్స్, 5 BHK అపార్ట్‌మెంట్‌తో సహా అనేక ప్రదేశాలలో పెట్టుబడులు పెట్టారు. ఈ హీరోకి క్రీడలంటే ప్రత్యేక ఆసక్తి. అందుకే జైపూర్ పింక్ పార్టనర్స్ (ప్రో కబడ్డీ), చెన్నైయిన్ FC (ఫుట్‌బాల్) పెట్టుబడి పెట్టారు.లగ్జరీ కార్లుఅభిషేక్ దగ్గర రోల్స్ రాయిస్ ఫాంటమ్, బెంట్లీ కాంటినెంటల్ జీటీ(3.29 కోట్లు), ఆడి ఏ8ఎల్, మెర్సిడెస్-బెంజ్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130X లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్‌పై కూడా భారీగా డబ్బు పెట్టాడల. ముంబైలో పలు చోట్ల ఓపెన్ ఫ్లాట్లు కూడా కొనుగోలు చేశారట. మొత్తంగా అభిషేక్ ఆస్తులు 280 కోట్లకు పైనే ఉంటుందట. అయితే భార్య ఐశ్వర్య రాయ్(Aishwarya Rai)తో పోలీస్తే మాత్రం అభిషేక్ ఆస్తులు విలువ చాలా తక్కువేనట. ఐశ్వర్య మొత్తం ఆస్తుల విలువ రూ.776 కోట్ల వరకు ఉంటుందట.నటనకు ప్రశంసలు కానీ..బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్.. కెరీర్లో ఎక్కువగా ఫ్లాపులనే చవి చూశడు. ఆయన తొలి సినిమా రెఫ్యూజీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సంపాదించుకుంది. అయితే నటన పరంగా మాత్రం అభిషేక్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత అభిషేక్ నటించిన 8 సినిమాలు వరుసగా ఫ్లాపులు అయ్యాయి. అయినా కూడా అభిషేక్‌ని చాన్స్‌లు వచ్చాయి. ధూమ్ సినిమాతో అభిషేక్‌కి తొలి బ్లాక్ బస్టర్ దక్కింది. బంటీ ఔర్ బబ్లీ మూవీతో సోలో హీరోగా హిట్ కొట్టాడు. ఆ తర్వాత మళ్లీ ఫ్యాపులు వచ్చాయి. ధూమ్ 3, హ్యాపీ న్యూ ఇయర్, ఐ వాంట్ టు టాక్ వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆయన గులాబ్ జామున్, డ్యాన్సింగ్ డాడ్‌తో పాటు ధూమ్ 4 చిత్రాల్లో నటిస్తున్నాడు. -
భర్తతో పార్టీకి వెళ్లిన ఐశ్వర్యరాయ్.. అభిషేక్‌తో సెల్ఫీలు
బాలీవుడ్ జంట ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని ఏళ్ల తరబడి నుంచి పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాదైతే ఈ పుకార్లు మరింత బలపడ్డాయి. వాళ్లు కలిసి ఉండట్లేదని, విడాకులు తీసుకోవడం ఒక్కటే మిగిలిందని ప్రచారం జరిగింది. అయితే ఇదంతా ట్రాష్.. అందులో నిజమే లేదని ఫోటోలతో సమాధానం చెప్పారు ఐష్- అభిషేక్.భర్తతో పార్టీకి వెళ్లిన ఐశ్వర్యవీరిద్దరూ తాజాగా ఓ పార్టీకి కలిసి వెళ్లారు. ఇద్దరూ నలుపు రంగు దుస్తులే వేసుకున్నారు. పార్టీలో ఫ్రెండ్స్‌తో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ మేరకు ఓ ఫోటోను ఎంటర్ప్రెన్యూర్ అను రంజన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో అభిషేక్, ఐశ్వర్యతో పాటు ఐష్ తల్లి బృంద్య రాయ్ కూడా ఉన్నారు. అందరూ కెమెరా వైపు చూస్తూ నవ్వులు చిందించారు. నటి ఆయేషా జుల్క సైతం ఐష్ దంపతులతో దిగిన సెల్ఫీలు షేర్ చేసింది.ఐష్ చేస్తోందదేఇది చూసిన నెటిజన్లు చాలా బాగుంది.. ఈ ఒక్క ఫోటోతో చాలామంది మెదళ్లలో ఉన్న అనుమానాన్ని పటాపంచలు చేశావు, ధైర్యవంతులైన వారు సమస్య నుంచి తప్పించుకోవడానికి విడాకులు ఎంచుకోరు. ఆ సమస్య నుంచి బయటపడే పరిష్కారం కోసం ఆలోచిస్తారు. ఈ దంపతులు కూడా అదే చేస్తున్నారు. ఐష్, తన తల్లితోపాటు భర్తతో కలిసి ఓ పార్టీకి వెళ్లడమే అందుకు నిదర్శనం అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Anu Ranjan (@anuranjan1010) చదవండి: నీలాంటి భర్త దొరకడం చాలా అదృష్టం.. అమలాపాల్ -
ఐశ్వర్య డ్రెస్సింగ్‌పై దారుణంగా ట్రోలింగ్ : ‘బచ్చన్’ పేరు తీసేసినట్టేనా?
అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ లుక్‌పై మరోసారి విమర్శలు చెలరేగాయి. తాజాగా దుబాయ్‌లో జరిగిన గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్‌లో ఐశ్వర్య ప్రసంగించింది. ఈ సందర్బంగా ఆమె ధరించిన రాయల్ బ్లూ గౌను ధరించింది. ఈ ఔట్ఫిట్లో ఎలిగెంట్ లుక్‌తో, ఆల్ టైం ఫేవరెట్ ఓపెన్ హెయిర్, ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నప్పటికీ, కొంతమంది అభిమానులు, నెటిజనులను మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్ ఈవెంట్లో పలువురు ప్రముఖ మహిళలతో కలిసి ఐశ్వర్య వేదికను పంచుకున్నారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కోచర్ లెహంగా,నేవీ బ్లూ లాంగ్ ట్రైలింగ్ జాకెట్లో ఆమె మెరిసిపోయింది. అయితే ‘అదేమి స్టైల్...మాంత్రికుడి దుస్తుల్లా ఉన్నాయంటూ’ డిజైనర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల రాణిని రోజు రోజుకు మరింత ముసలిదానిలా తయారు చేస్తున్నారు అంటూ వాపోయారు. ప్రెగ్నెన్సీ అప్పటినుంచి ఆమె స్టైలింగ్‌లో చాలా మార్పు లొచ్చాయనీ, మరీ ఓల్డ్ లుక్ కనిపిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొంపదీసి ఈ డ్రెస్‌ను జయాబచ్చన్ డిజైన్ చేసిందా అంటూ ఫన్నీగా కమెంట్ చేశారు.మరోవైపు బాలీవుడ్ క్యూట్ కపుల్ ఐశ్వర్య, అభిషేక్ విడాకుల వ్యవహారం మీడియాలో తరచుగా కథనాలు వెలుడుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్లో స్క్రీన్ పైన ఐశ్వర్యరాయ్ పక్కన ఇంటిపేరు ‘బచ్చన్’ను తొలగించడం కూడా చర్చకు దారి తీసింది. ‘బచ్చన్’ పేరు లేదు అంటే విడాకులు ఖాయమేనా? లేక పొరబాటున జరిగిందా అనే సందేహంలో అభిమానులు పడిపోయారు. మరికొందరు నెటిజన్లు ఐశ్వర్య చాలా అందంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. మహిళల సాధికారతపై ఆమె చేసిన ప్రసంగానికి ఫిదా అయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్ ఒక యువ అభిమానితో పోజులివ్వడం విశేషంగా నిలిచింది. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో జిగిన ఫ్యాషన్ వీక్‌లో రెడ్ గౌనుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు స్టైలింగ్లోని లోపాలపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. -
విడాకుల వార్తల వేళ అభిషేక్ సంచలన కామెంట్స్
-
ఆ విషయంలో ఐశ్వర్యకి థ్యాంక్స్: అభిషేక్ బచ్చన్
‘‘నేను బయటకు వెళ్లి సినిమాలు చేస్తున్నానంటే అది నిజంగానే నా అదృష్టం. మా కుమార్తె ఆరాధ్య యోగక్షేమాలను నా భార్య ఐశ్వర్యా రాయ్ చూసుకుంటూ ఇంట్లోనే ఉంటోంది. ఆ విషయంలో తనకు థ్యాంక్స్ చెబుతున్నాను’’ అని హీరో అభిషేక్ బచ్చన్ అన్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ–‘‘కుటుంబం విషయంలో ఐశ్వర్య ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. ఆమె వల్లే నేను సినిమాలపై పూర్తీగా దృష్టి పెడుతున్నాను. ఈ రోజుల్లో పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నారు.నేను పుట్టిన తర్వాత మా అమ్మ జయా బచ్చన్ సినిమాలు మానేశారు. భర్త, పిల్లలు, కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వాలని ఆమె అనుకుని ఆ నిర్ణయం తీసుకున్నారు. మా నాన్న అమితాబ్ బచ్చన్ సినిమాలతో బిజీగా ఉండి రాత్రి ఏ సమయంలో ఇంటికి వచ్చినా సరే.. నా గదిలోకి వచ్చి నన్ను చూసి వెళ్లేవారు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ నా స్కూల్లో జరిగే ప్రతి ఫంక్షన్ కు, నా బాస్కెట్ బాల్ cటీలకు నాన్న వచ్చేవారు. తల్లిదండ్రులుగా మనం పిల్లలకు స్ఫూర్తిని ఇవ్వాలి. అలాగే వారి నుంచి ప్రేరణ ΄పొందాలి. ప్రపంచంలోని తల్లిదండ్రులపై నాకు అమితమైన గౌరవం ఉంది.తల్లి బాధ్యతలు మరెవరూ చేయలేరు. తండ్రికి కూడా ఎంతో ప్రేమ, బాధ్యతలు ఉంటాయి. కానీ వాటిని పైకి చూపించడు. వయసు పెరిగేకొద్దీ పిల్లలకు తండ్రి ప్రేమ అర్థమవుతుంది’’ అని చె΄్పారు అభిషేక్. కాగా అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యా రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరు విడాకులు తీసుకోనున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అభిషేక్ బచ్చన్ మాటలతో ఆ వార్తలకు చెక్ పడిందని బాలీవుడ్ టాక్. -
కూతురు బర్త్ డేకు రాని అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్య విడాకులు కన్పర్మా?
-
స్టార్ హీరోతో ముద్దు సీన్స్.. తప్పుకున్న ఐశ్వర్య రాయ్!
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. కెరీర్లో రాణించాలంటే అన్ని రకాల సినిమాలు చేయాల్సిందే. ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్‌లో నటిస్తేనే ఎక్కువ అవకాశాలు వస్తాయని కొంతమంది నమ్ముతారు. అది కొంతవరకు వాస్తవం కూడా. అయితే అలాంటి సీన్స్ చేస్తేనే అవకాశాలు వస్తాయనుకోవడం తప్పే. ఎలాంటి ఎక్స్‌ఫోజింగ్ చేయకుండా కేవలం తమ నటనతోనే ఆకట్టుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అయితే ఏ సినిమా ఎంచుకోవాలి, ఇండస్ట్రీలో ఎలా నిలబడాలని అనేది సదరు హీరోయిన్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కొంతమంది పెద్ద సినిమాలో నటించే అవకాశం వచ్చినా..తమ పాత్ర నచ్చపోతే సున్నితంగా తిరస్కరిస్తారు. మరికొంత మంది పెద్ద ప్రాజెక్ట్ కదా అని కాంప్రమైజ్ అవుతారు. కానీ బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ మాత్రం ముద్దు సన్నివేశాలు ఉన్నాయని రెండు భారీ హాలీవుడ్ సినిమాలనే వదులుకుంది. స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చినా.. సున్నితంగా ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది.ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయని.. 2000 సంవత్సరంలో ఐశ్వర్యరాయ్‌కి బాలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉంది. వరుస సినిమాలు హిట్ కావడంతో హాలీవుడ్లో కూడా నటించే అవకాశం వచ్చింది. బ్రైడ్ అండ్ ప్రిజుడీస్, మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్ లాంటి హాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్ర పోషించి, తనదైన నటనతో ఆకట్టుకుంది. అదే సమయంలో ఆమె కెరీర్‌ని మలుపు తిప్పే రెండు భారీ హాలీవుడ్ సినిమా అవకాశాలు వచ్చాయట. కానీ కిస్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని రిజెక్ట్ చేసిందట. హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’లో హీరోయిన్గా నటించే అవకాశం ముందుగా ఐశ్యరకే వచ్చిందట. అయితే కథలో భాగంగా ఆమె హీరోతో ఇంటిమేట్ సీన్స్‌తో పాటు ముద్దు సన్నివేశాల్లో కూడా నటించాలని చెప్పారట. హీరోతో కిస్ సీన్ చేయడం ఇష్టం లేక ఐశ్వర్య ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. దీంతో ఆ చాన్స్ ఏంజలినా జోలీ కొట్టేసింది.లిప్ లాక్ సీన్ ఉందని మరో చిత్రం..ఐశ్వర్య మరో హాలీవుడ్ చిత్రాన్ని కూడా ఇలానే వదులకుందంట. హాంకాక్( Hancock) చిత్రంలో విల్ స్మిత్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న చాన్స్ ఐశ్వర్యకు వచ్చిందంట. అయితే అందులో విల్ స్మిత్‌తో లిప్‌లాక్ చేసే సీన్ ఉందంట. అలాంటి సన్నివేశాల్లో నటించడం ఇష్టంలేక ఐశ్వర్య ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. డేట్స్ కూడా ఖాలీగా లేకపోవడం మరో కారణమని ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. -
సల్మాన్ కంటే అతనే బెటర్.. నాకైతే నరకం చూపించాడు: మాజీ గర్ల్‌ఫ్రెండ్
బాలీవుడ్ సల్మాన్ ఖాన్‌పై ఆయన మాజీ ప్రియురాలు సోమీ అలీ షాకింగ్ కామెంట్స్ చేసింది. అతన్ని ప్రముఖ గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్ణోయ్‌తో పోల్చింది. అతనికంటే సల్మాన్ ఖాన్ చాలా ప్రమాదమని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా బాలీవుడ్లో తన ఎదుర్కొన్న పరిస్థితులు, అనుభవాలను పంచుకుంది. గతంలో సోమీ అలీ.. సల్మాన్‌తో దాదాపు ఎనిమిదేళ్ల పాటు రిలేషన్లో ఉన్నారు.సల్మాన్ ఖాన్ కంటే గ్యాంగ్‌స్టార్ బిష్ణోయ్ చాలా బెటర్ అని సోమీ అలీ అన్నారు. సల్మాన్ నాతో వ్యవహరించిన విధంగా.. మరెవరితోనూ ప్రవర్తించలేదని తెలిపింది. సంగీతా బిజ్లానీ, కత్రినా కైఫ్‌తో మంచిగా వ్యవహరించినట్లు.. నాతో అలా ఉండలేదని పేర్కొంది. గతంలో ఒకసారి ఐశ్వర్యరాయ్తోనూ అసభ్యకరంగా ప్రవర్తించాడని.. అతని వల్లే ఆమె భుజానికి గాయం కూడా అయిందని వెల్లడించింది. కానీ కత్రినాతో ఎలా వ్యవహరించాడో తనకు తెలియదని సోమీ చెప్పింది. ఒకసారి సల్మాన్ నన్ను కొడుతుంటే పనిమనిషి తలుపులు వేసి కాపాడిందని గుర్తు చేసుకుంది. అందుకే సల్మాన్ కంటే లారెన్స్ బిష్ణోయ్ బెటర్ అని సోమీ అలీ చెప్పింది.గతంలో నటి టబు తన పరిస్థితిని చూసి బాధపడిన సందర్భాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. నన్ను చూసి టబు ఏడ్చిందని.. కానీ ఆ సమయంలో నేను ఎలా ఉన్నానో కనీసం చూడటానికి కూడా సల్మాన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సల్మాన్ ఖాన్‌తో తాను పడిన కష్టాలు పూర్తిగా తన తల్లికి, కొంతమంది సన్నిహితులకు మాత్రమే తెలుసని సోమీ వెల్లడించింది. ప్రస్తుతం ఒక పుస్తకాన్ని రాసే పనిలో ఉన్నానని.. అందులో ప్రతి విషయాన్ని వివరిస్తానని సోమీ తెలిపింది. -
మామయ్య కోసం మెసేజ్.. రూమర్స్‌కు ఫుల్స్టాప్ పెట్టిన ఐశ్వర్య
లెజండరీ యాక్టర్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11న 82వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎందరో ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వయసు మీద పడుతున్నా ఇప్పటికీ అదే ఉత్సాహంతో నటిస్తూ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. అందుకే చాలామంది నటీనటులకు బచ్చన్ ఆదర్శం. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కూడా సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. అయితే, అమితాబ్ ఫ్యాన్స్ అందరూ ఐశ్వర్య రాయ్ చెప్పే విషెష్ కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆమె నుంచి అమితాబ్‌కు మెసేజ్ వెళ్లింది. దీంతో వారి అభిమానులు సంతోషిస్తున్నారు.అమితాబ్ బచ్చన్ కుటుంబంలో పలు విభేదాలు ఉన్నాయని చాలా రూమర్స్ వచ్చాయి. అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్‌కు ఐశ్వర్య, ఆరాధ్య విడివిడిగా రావడంతో విభేదాలు తీవ్రమయ్యాయి. దీంతో బచ్చన్ కుటుంబంతో ఆమెకు మాటలు లేవని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే, తన మామయ్య అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పి అలాంటి పుకార్లకు ఐశ్వర్య ఫుల్స్టాప్ పెట్టింది. ఈమేరకు సోషల్‌మీడియాలో ఆరాధ్యతో అమితాబ్ దిగిన పాత ఫొటోను నిన్న రాత్రి 11:30 గంటలకు ఆమె పోస్ట్ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు దాదాజీ అంటూ.. ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె పంచుకుంది. దీంతో అభిమానులు చాలా సంతోషించారు. ఒక్క మెసేజ్‌తో రూమర్స్‌కు ఫుల్స్టాప్ పెట్టిందంటూ ఐశ్వర్యను ప్రశంసిస్తున్నారు. ఐశ్వర్య చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
ఐశ్వర్యను దూరం పెట్టిన బిగ్‌బీ? నటి ఏమందంటే..?
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో అంతర్గత విభేదాలున్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. బిగ్‌బీ తనయుడు అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారని రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఐష్‌కు, తన అత్త జయా బచ్చన్‌కు సఖ్యత లేదని కూడా ఓ గాసిప్!ఐశ్వర్యను పట్టించుకోని బిగ్‌బీ?ఈ విషయంలో సోషల్ మీడియా అంతా ఐష్‌కు సపోర్ట్‌గా ఉండగా బిగ్‌బీ కుటుంబాన్ని తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో ఓ యాంకర్ సైతం అమితాబ్‌ను విమర్శించింది. ఆయన తన కూతురికి అండగా ఉంటాడు కానీ కోడలు ఐశ్వర్యను మాత్రం అస్సలు పట్టించుకోడు. కూతురు, కొడుకు ఫోటోలు షేర్ చేస్తుంటారే తప్ప ఐష్ అవార్డు పొందితే దాని గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడరు అని ఆరోపించింది. ఈ వీడియో సీనియర్ నటి సిమి గరెవాల్ కంట్లో పడింది.ఇక చాలు ఆపండని నటి వార్నింగ్బచ్చన్ కుటుంబం గురించి మీకసలు ఏదీ తెలియదు.. ఇక చాలు, ఆపేయండి అని వార్నింగ్ ఇచ్చింది. కాగా సిమి గరెవాల్.. మేరా నామ్ జోకర్ సినిమాతో పాపులారిటీ దక్కించుకుంది. సిద్దార్థ, కభి కభీ, కార్జ్ వంటి చిత్రాల్లో నటించింది.చదవండి: Krystle DSouza: రెండు రోజులు బ్రేక్ లేకుండా షూటింగ్.. కింద పడిపోయినా వదల్లేదు! -
సూపర్‌స్టార్ కాళ్లకు మొక్కిన ఐశ్వర్యరాయ్ కూతురు.. వీడియో వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ఇటీవల దుబాయ్‌లో జరిగిన సైమా వేడుకల్లో మెరిసింది. గతేడాది పొన్నియిన్ సెల్వన్‌తో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో నటనకు గానూ ఐశ్వర్య లీడ్ రోల్ ఉత్తమనటిగా(క్రిటిక్స్) సైమా అవార్డ్‌ను సొంతం చేసుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌తో కలిసి వేదికపై అవార్డును అందుకుంది.ఈ వేడుకకు హాజరైన ఐశ్వర్య కూతురు ఆరాధ్య తన తల్లిని చూసి పరుగెత్తుకుంటూ స్టేజీ వద్దకు వచ్చింది. తన తల్లిని గట్టిగా కౌగిలించుకుని అభినందించింది. అదే సమయంలో అక్కడే ఉన్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కాళ్లకు ఆరాధ్య నమస్కరించింది. ఆయన పాదాలకు మొక్కిన ఆరాధ్య ఆశీస్సులు తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్‌లో ఐశ్వర్యరాయ్ నటించింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రంలో తన నటనకు గానూ ఫీమేల్ లీడ్ రోల్ (క్రిటిక్స్) విభాగంలో ఉత్తమ నటిగా ఎంపికైంది. కాగా.. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాలను మణిరత్నం తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
దుబాయ్ లో సైమా 2024 అవార్డ్స్ ప్రదానోత్సవం...తారల సందడి (ఫొటోలు)
-
తల్లిని కెమెరాలో బంధిస్తున్న ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య (ఫోటోలు)
-
ఐశ్వర్యనే ఆదర్శం అంటున్న మామ్ దీపికా!
బాలీవుడ్ స్వీట్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ పండంటి పాపాయికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆడబిడ్డకు తండ్రి కావాలనే రణవీర్ కోరిక నెరవేరింది. అయితే దీపికా తన ముద్దుల తనయ పెంపకం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను ఫాలో కానుందని సమాచారం. విషయం ఏమిటంటే...సాధారణంగా చంటిపాపాయి పుట్టినపుడు ఇంట్లో అమ్మమ్మలు, నాన్నమ్మలు, ఇతర పెద్దవాళ్లు తల్లీ బిడ్డల రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంటారు. చంటిబిడ్డకు నలుగు పెట్టి నీళ్లు పోయడం, పాపాయికి పాలు పట్టించడం, బాలింతకు ఎలాంటి ఆహారం పెట్టాలి లాంటి జాగ్రత్తలు, బాధ్యతలు వాళ్లవే. మకొంతమంది తమ పాపాయిని జాగ్రత్తగా చూసేందుకు ఒక ఆయమ్మను, నానీనో పెట్టుకుంటారు. చాలామంది సెలబ్రిటీలు లక్షలు ఖర్చుపెట్టి మరీ నానీలను నియమించకుంటారు. కానీ దీపికా మాత్రం ఐశ్వర్య, అలియా భట్, అనుష్క శర్మ పేరెంటింగ్ స్టైల్‌ను ఫాలో అవుతోందట. బాలీవుడ్ లైఫ్ కథనం ప్రకారం దీపిక నానీని ఏర్పాటు చేసుకోకూడదని నిర్ణయించింది. స్వయంగా తానే చిన్ని దీపిక బాధ్యతలను చూసుకోనుందిట.ఆలియానే ఆదర్శంమరో విషయం ఏమిటంటే పాప ఫోటోను మరికొన్ని పాటు రివీల్ చేయకుండా గోప్యంగా ఉంచాలని భావిస్తోందట. కొంచెం పెద్దయ్యాక మాత్రమే తన బేబీని ప్రపంచానికి పరిచయం చేయాలని భావిస్తోంది. ఈ విషయంలో ఆలియాను ఫాలో కానుందట. ఐశ్వర్య తన కుమార్తె పుట్టినపుడు నానీనీ పెట్టుకోలేదట. ఇందుకు ఆమె అత్తగారు జయా బచ్చన్ కూడా 'హ్యాండ్-ఆన్-మామ్' అంటూ పొగిడింది కూడా. ఆ తరువాత అనుష్క శర్మ , అలియా భట్ ఇదే బాటలో నడిచిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ‘బాస్! నేనూ వస్తా..’! ఆంబులెన్స్ వెనక దౌడుతీసిన కుక్క, వైరల్ వీడియో -
మరోసారి విడాకుల రూమర్స్.. అభిషేక్ రియాక్షన్ ఇదే!
బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ గురించి గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లిలోనూ వీరిద్దరు విడివిడిగా ఫోటోలకు ఫోజులివ్వడంతో మరోసారి ఇదే చర్చ మొదలైంది. అయితే తాజాగా అభిషేక్‌కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో తమపై వస్తున్న విడాకాల రూమర్స్‌పై చివరికీ అభిషేక్ బచ్చన్ స్పందించాల్సి వచ్చింది. అయితే ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురు కాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు.అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. 'నేను దాని గురించి మీతో చెప్పడానికి ఏమీ లేదు. మీరందరూ ఇప్పటికే ఈ విషయాన్ని బయటపెట్టారు. మీరు ఇదంతా ఎందుకు చేస్తారో నాకు అర్థమైంది. మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలి. ఏం ఫర్వాలేదు.. మేము సెలబ్రిటీలం కాబట్టి ఇలాంటివి తీసుకుంటాం. నాకు పెళ్లయింది క్షమించండి' అన్నాడు అతను తన ఉంగరాన్ని చూపించాడు. దీంతో తమపై వస్తున్న రూమర్లకు మరోసారి చెక్ పెట్టారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో కొత్తదా? పాతదా అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా.. అభిషేక్, ఐశ్వర్య 2007లో వివాహం చేసుకున్నారు. 2011లో వీరికి కూతురు ఆరాధ్య జన్మించారు. వీరిద్దరూ జంటగా ధాయి అక్షర్ ప్రేమ్ కే, కుచ్ నా కహో, గురు, ధూమ్- 2, రావణ్ లాంటి చిత్రాల్లో నటించారు. -
ఐశ్వర్య-అభిషేక్‌ల విడాకుల రూమర్.. ఆ డాక్టరే కారణమా? (ఫొటోలు)
-
ఐశ్వర్యరాయ్‌తో విడాకుల రూమర్స్..
బాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ జంట ఒకటి. ఈ జంటకు ఆరాధ్య అనే ఓ కూతురు కూడా ఉన్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఐశ్వర్యరాయ్ ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి హాజరయ్యారు. తన అభిషేక్ బచ్చన్‌తో కలిసి పెళ్లి వేడుకలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలోనూ వైరలయ్యాయి.అయితే గత కొన్నేళ్లుగా ఈ జంటపై విడాకుల రూమర్స్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్యరాయ్ బర్త్ డే రోజు ఆలస్యంగా విష్ చేయడంతో అప్పట్లోనే.. వీరిద్దరు డివోర్స్ తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఆరాధ్య పుట్టినరోజు సైతం ఇలాంటి రూమర్స్ బీటౌన్‌లో వైరలయ్యాయి.తాజాగా అభిషేక్ బచ్చన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఐశ్వర్యరాయ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు అభిషేక్ మాట్లాడిన వీడియో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వీడియోను డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇటీవల సినీతారలపై డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరలవుతోన్న సంగతి తెలిసిందే. ఓ నెటిజన్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో మరోసారి విడాకుల చర్చ మొదలైంది. అయితే ఇది ఫేక్ వీడియో అంటూ ఐశ్వర్య, అభిషేక్ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. View this post on Instagram A post shared by aishwaryafan (@aishwaryaraireall) -
ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య ఎంత ఎదిగిపోయిందో! (ఫోటోలు)
-
ఐశ్వర్య- అభిషేక్ దాగుడుమూతలు.. కలిసున్నారా? విడిపోయారా?
బాలీవుడ్ జంట ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారట! కొన్ని నెలల నుంచి ఈ వార్త జోరీగలా సోషల్ మీడియా అంతటా తిరుగుతోంది. కలిసి కనిపించకపోతే విడాకులనేస్తారా? మా కాపురంలో నిప్పులు పోస్తున్నారేంటని హీరో అభిషేక్ బచ్చన్ ఎప్పటిలాగే ఇటీవల సైతం మండిపడ్డాడు. తాము బాగానే ఉన్నామని తెలియజేస్తూ.. ఒకరి బర్త్‌డేకి మరొకరు ఆలస్యంగానైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.ఫంక్షన్‌కు వేర్వేరుగాఅయినా ఎక్కడో తేడా కొడుతుంది అని ఫ్యాన్స్ అనుకుంటూనే ఉన్నారు. వీరి అనుమానాలను నిజం చేస్తూ ఐశ్వర్య తన కూతురు ఆరాధనను తీసుకుని అనంత్ అంబానీ పెళ్లికి వెళ్లింది. అలా అని అభిషేక్ వెళ్లలేదా? అంటే వెళ్లాడు. తన తల్లిదండ్రులు జయ- అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఫంక్షన్‌కు వెళ్లాడు. ఇది చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు. కుటుంబమంతా కలిసి రాకుండా ఇలా సెపరేట్‌గా వచ్చారేంటి? వీళ్లు కలిసి లేరని ఇక్కడే అర్థమవుతోందోని ఎవరికి వారే అనుకున్నారు. విడాకుల పోస్టుపై అభిషేక్ ఆసక్తిపెళ్లికి కలిసి వెళ్లలేదు, కలిసి ఫోటోలూ దిగలేదు.. కానీ లోపలికి వెళ్లాక మాత్రం ఐష్- అభిషేక్ పక్కపక్కనే కూర్చుని కబుర్లాడినట్లు ఓ ఫోటో కూడా బయటకు వచ్చింది. దీంతో వీరి వ్యవహారం ఎవరికీ ఓ పట్టాన అర్థం కావడం లేదు. ఇంతలోనే తాజాగా అభిషేక్ ఓ విడాకుల పోస్టును లైక్ చేశాడు. అందులో ప్రేమ కష్టంగా మారితే.. అని రాసుంది.50 ఏళ్ల తర్వాత కూడా..ఇంకా ఏమని ఉందంటే.. విడాకులు తీసుకోవడం ఎవరికీ అంత ఈజీ కాదు. కానీ కొన్ని సార్లు జీవితం మనం అనుకున్నట్లు సాగదు. దశాబ్దాలపాటు కలిసుండి వేరుపడితే ఆ బాధను ఎలా తట్టుకుంటున్నారు? 50 ఏళ్ల తర్వాత కూడా విడిపోవడానికి మొగ్గుచూపుతున్నారు. దీనికి అనేక రకాల కారణాలున్నాయని అందులో రాసుకొచ్చారు. పత్రికలో వచ్చిన వ్యాసాన్ని దీనికి జత చేశారు. ఈ పోస్టును అభిషేక్ లైక్ చేయడంతో.. మళ్లీ విడాకుల చర్చ మొదలైంది.చదవండి: ప్రియుడితో పెళ్లి.. అనుకున్నది సాధించానంటున్న హీరోయిన్ -
అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్.. డిస్కషన్ మాత్రం విడాకుల గురించి!
శుభమా అని అంబానీ కొడుకు పెళ్లి జరుగుతుంటే విడాకుల గురించి మాట్లాడుతున్నాం ఏంటా అని మీరు అనుకోవచ్చు. కానీ సోషల్ మీడియాలో చర్చంతా దీని గురించే నడుస్తోంది. గత కొన్నాళ్లుగా విశ్వ సుందరి ఐశ్వర్యా రాయ్ విడాకుల గురించి అప్పుడప్పుడు పుకార్లు వినిపించాయి. కానీ అలాంటిదేం ఉండకపోవచ్చని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అంబానీ పెళ్లి వల్ల ఇదే నిజమేనా అనే సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: అనంత్- రాధిక వెడ్డింగ్.. ఒక్క పాటకు రూ.25 కోట్లా!)ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కనివినీ ఎరుగని రీతిలో జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, క్రీడ ప్రముఖులు పెళ్లిలో సందడి చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి కూడా మహేశ్ బాబు, రామ్ చరణ్, వెంకటేశ్ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇదే వేడుకకు ఐశ్వర్యా రాయ్ మాత్రం భర్తతో కాకుండా విడిగా వచ్చింది.అంబానీల పెళ్లిక కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య రాయ్ రాగా.. ఈమె భర్త అభిషేక్ బచ్చన్ మాత్రం తన కుటుంబంతో కలిసి విచ్చేశాడు. ఇది చూస్తే ఐశ్వర్యా రాయ్ విడాకుల వార్త నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం భార్యభర్తలు విడివిడిగా ఉంటున్నారు కాబట్టి ఇలా విడిగా వచ్చారా అని సందేహాలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తే గానీ నెటిజన్లు ఊరుకోరేమో?(ఇదీ చదవండి: 'భారతీయుడు 2'.. ఆయనకు తప్ప అందరికీ నష్టమే!) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఆ ప్రశ్న అడగడంతో ఐష్‌కు కోపమొచ్చింది!
ఐశ్వర్య రాయ్.. అప్పట్లో సినిమా ఇండస్ట్రీనే షేక్ చేసింది. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ పొన్నియన్ సెల్వన్ 1, 2 చిత్రాల్లో మాత్రం తళుక్కుమని మెరిసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. కెరీర్ తారాస్థాయిలో ఉన్న సమయంలో ఇంగ్లీష్‌లోనూ సినిమాలు చేసింది. ఇటు బాలీవుడ్, అటు హాలీవుడ్‌ను ఏకకాలంలో హ్యాండిల్ చేసింది. అయితే ఐష్.. హాలీవుడ్‌కు షిఫ్ట్ కానుందంటూ కొన్నేళ్ల క్రితం ఓ వార్త వైరల్‌గా మారింది. దీని గురించి హీరోయిన్ను ప్రశ్నించగా ఆమె మండిపడింది. ఏమంటున్నారు? నేనలా చెప్పానా? ఏ ఇంటర్వ్యూలో అన్నానో చెప్పండి. ముందు ఆ వీడియో చూపించిన తర్వాతే మాట్లాడదాం.. అని ఫైర్ అయింది.మీరు ప్రశ్నలు అడగండి.. కాదనను.. కానీ ఆల్రెడీ నేను ఏదో చెప్పేసినట్లు స్టేట్మెంట్లు ఇవ్వొద్దు. తమిళ, బెంగాలీ, హిందీ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నాను. అలాగే ఇంగ్లీష్ చిత్రాల్లోనూ వర్క్ చేస్తున్నాను. అక్కడ పని చేస్తున్నాను కదా అని హాలీవుడ్‌కు వెళ్లిపోతాననుకోవడం కరెక్ట్ కాదు అని ఆగ్రహించింది. ఐశ్వర్య గతంలో చేసిన కామెంట్లు ప్రస్తుతం మరోసారి వైరలవుతున్నాయి.చదవండి: పెళ్లి తర్వాత ప్రేమ ఉండదు.. భార్యతో సంతోషం కూడా..: నటుడు -
కజ్రారే సాంగ్.. లైవ్‌లో డ్యాన్స్ మర్చిపోలేనన్న అమితాబ్..
కొన్ని పాటలు ఎవర్గ్రీన్.. ఎప్పుడు విన్నా ఎక్కడలేని ఉత్తేజం వస్తుంది. అలాంటి పాటే కజ్రారే.. కజ్రారే..! 2005లో వచ్చిన బంటీ ఔర్ బబ్లీ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ ఇది. అప్పట్లో ఈ సాంగ్ ఓ రేంజ్లో మార్మోగిపోయింది. అందులో అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్ నటించారు. అయితే ఈ పాట రిలీజయ్యే సమయానికి వారికింకా పెళ్లి కాలేదు.. అది వేరే విషయం!ఎంతో పాపులర్..బంటీ ఔర్ బబ్లీ సినిమా రిలీజై 19 ఏళ్లు అయిన సందర్భంగా బిగ్‌బీ ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు. ఓ అభిమాని కజ్రారే సాంగ్ ఫోటోను షేర్ చేయగా దానిపై అమితాబ్ స్పందిస్తూ.. ఆ పాట ఎంత పాపులర్ అయిందో! ఇప్పటికీ ఆ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది. మర్చిపోలేని విషయం ఏంటంటే.. భయ్యూ(అభిషేక్)తో కలిసి స్టేజీపై ఈ పాటకు లైవ్‌లో డ్యాన్స్ చేశాను అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేశాడు. ఐశ్వర్య పేరు ప్రస్తావించాల్సింది!కాగా 2006 జరిగిన ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో అమితాబ్, అభిషేక్‌తో పాటు ఐశ్వర్య రాయ్.. స్టేజీపై కజ్రారే పాటకు డ్యాన్స్ చేశారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్న బిగ్‌బీ.. ఐశ్వర్య పేరు కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అసలు మీరు, మీ కుమారుడు ఈ పాటకు అవసరం కూడా లేదు. ఐశ్వర్య లేకపోతే ఎవరూ చూసేవారు కూడా కాదు, అలాంటిది తననే మర్చిపోయారా? అని విమర్శిస్తున్నారు. సీక్వెల్..బంటీ ఔర్ బబ్లీ విషయానికి వస్తే యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమాలో అభిషేక్ హీరోగా రాణి ముఖర్జీ హీరోయిన్గా నటించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి 2022లో సీక్వెల్ కూడా వచ్చింది. ఇందులో అభిషేక్‌కు బదులుగా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. అలాగే రాణీ ముఖర్జీ, సిద్దాంత్ చతుర్వేది, శర్వారి వాఘ్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ చిత్రం అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. the song became so popular that it still regenerates attention and love .. and the best moments with the song, Bhaiyu, were when we performed this live on stage .. 🙏🤣🤣 https://t.co/vKuMM7ipIN— Amitabh Bachchan (@SrBachchan) May 27, 2024 చదవండి: ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్ -
కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య.. ఫొటోస్ వైరల్! (ఫొటోలు)
-
చేతికట్టు తొలగించి కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్
ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సినీ తారలు, సెలిబ్రిటీస్ సరికొత్త డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై మెరిశారు. కేన్స్‌లో ఎంతమంది కనిపించినా సరే.. అందరి చూపులు ఐశ్వర్య రాయ్ మీదే ఉంటాయి. ఈ క్రమంలో ఆమె చేతికి గాయం ఉండటంతో ఫ్యాన్స్ షాకయ్యారు. అయినా సరే గాయంతోనే ఈ వేడుకకు తన కుమార్తెతో ఐశ్వర్య వెళ్లారు. కానీ, రెడ్ కార్పెట్‌పై ఆమె ఎలా కనిపించనున్నారో అని లక్షలాది మంది అభిమానులు ఎదురుచూశారు. ఏది ఏమైనా నెటిజన్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్య తన గ్లామర్‌ను జోడించింది. డిఫరెంట్ ఫ్యాషన్ సెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో ఆమె మరొసారి సక్సెస్ అయ్యారు. ఐశ్వర్యను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. 77వ ఫిల్మ్ ఫెస్టివల్లో బ్లాక్, వైట్, గోల్డెన్ కాంబినేషన్లో ఉండే గౌనులో ఐశ్వర్య కనిపించారు. ప్రముఖ డిజైనర్ 'ఫల్గుణి షేన్ పీకాక్' వారు డిజైన్ చేసిన డ్రెస్‌ను ఆమె ధరించారు. గాయం వల్ల తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి కనిపించిన ఐశ్వర్య ప్రస్తుతానికి తొలగించింది. కానీ, ఆదే చేతికి తెల్లని కట్టు కనిపిస్తుంది. వాస్తవంగా ఆమె చేతిక తీవ్రమైన గాయమే అయినట్లు తెలుస్తోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గత 20 ఏళ్ల నుంచి ఆమె పాల్గొంటుంది. అందుకే ఆమె ఈసారి కూడా అక్కడ అడుగుపెట్టింది. దీంతో చాలా మంది అభిమానులు ఐశ్వర్యను ప్రశంసిస్తున్నారు. ఆమెలో ఉన్న డెడికేషన్‌కు చాలామంది ఫిదా అవుతున్నారు.Breathtaking Beauty ✨ Her Walk 🔥#AishwaryaRai #AishwaryaRaiBachchan #AishwaryaAtCannes #Cannes2024 #CannesQueenAishwarya #Cannes pic.twitter.com/KxgxW1GyQs— Aishwarya Rai Fan (@Ram_TamilNadu_) May 16, 2024 -
ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
బాలీవుడ్ నటి ఐశ్వరరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ తల్లి అయ్యాక కూడా ఆమె అదే గ్లామర్‌ని మెయింటెయిన్ చేస్తూ యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా ఉంటుంది. ఆమె కూతురు ఆరాధ్య కూడా తల్లి అందాన్ని పుణికి పుచ్చుకున్నట్లు ఆకర్షణీయంగా ఉంటుంది. స్టైయిలిష్ దుస్తులతో కెమెరాకి చిక్కి అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. ఇటీవల్ల ఏ వేడుకలోనైన ఈ క్యూట్ మామ్ అండ్ డాటర్స్ ఇద్దరు కలిసే సందడి చేస్తున్నారు. ఫ్రాన్స్ వేదికగా ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు ఈ ఈవెంట్‌కు హాజరై సందడి చేస్తున్నారు. ఆ వేడుకలో పాల్గొనేందుకు బయలు దేరుతూ మంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇలా కెమెరాకు చిక్కారు తల్లికూతుళ్ల ద్వయం. అయితే ఆమె చేతికి బ్యాండేజ్ వేసుకుని కనిపించడంతో ఆమెకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక కూతురు ఆరాధ్య తల్లి చేతికి గాయం అయ్యిందని ఆమె టోట్ బ్యాగ్‌ని తాను తీసుకుని అమ్మకు కాస్త ఉపశమనం కలిగించింది. తల్లి కూతుళ్లు ఇద్దరు మంచి స్టయిలిష్ డ్రెస్‌లతో స్టన్నింగ్ లుక్‌లో కనిపించారు. ఐశ్వర్య ఫ్యాంటుపై లూయిస్ విట్టన్ ట్రెంట్ కోట్లో అబ్బరపర్చగా, ఆరాధ్య నల్లటి ఫ్యాంటుపై తెలుపు స్పీకర్లతో కూడిన స్వెట్షర్ట్లో ఉంది. ఇక్కడ ఐశ్వర్య గూచీ బ్లాక్ లెదర్ టోట్ బ్యాగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ బ్రాండ్ బ్యాగ్ ధరలు అత్యంత ఖరీదైనవి. ఇక్కడ ఐశ్వర్యరాయ్ బ్యాగ్ టోట్ ధర ఏకంగా రూ. 80, 000/ పలుకుతుందట. ఈ కేన్స్ ఈవెంట్లో ఎప్పుడూ స్పెషల్ అట్రాక్షన్‌గా ఐశ్వర్య రాయ్ నిలుస్తుంటుంది. ఆమెను భారతదేశంలోని కేన్స్ రాణి అని చెప్పొచ్చు. అంతేగాదు ఆమె అభిమానులు 2024 కేన్స్‌లో ఐశ్వర్యరాయ్ లుక్ ఎలా ఉంటుందా అని ఆత్రతగా ఎదురుచూస్తున్నారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (చదవండి: మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు) -
గాయపడిన ఐశ్వర్య రాయ్.. అయినా అక్కడికి ప్రయాణం
ప్రతి సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కొత్త కళ తెచ్చేది బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 25 వరకు కొనసాగుతున్న ఈ వేడుకులలో భారత్ తరపున పాల్గొనేందుకు తాజాగా ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి కేన్స్‌కు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో ఆమె కనిపించారు. కానీ, తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి ఉండటంతో చాలా మంది అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఆమె చేతికి తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. ఐశ్వర్యకు ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఆమె గాయం గురించి పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు. ఒక అభిమాని ఇలా అన్నాడు, 'OMG ఆమె గాయపడిన చేతులతో కేన్స్‌లో ఎలా నడుస్తుంది. కేన్స్ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య నడుస్తూ ఉంటే ఆ కార్యక్రమానికే అందం వస్తుంది. కానీ, ఈసారి ఆ రెడ్ కార్పెట్‌పై ఆమె నడవగలదా అంటూ వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కేన్స్‌లో ఆమె లుక్ కోసం ఎదురు చూస్తున్నామని మరొకరు తెలిపారు. ఐశ్వర్య చేతికి అయిన గాయానాకి గల కారణాలు మాత్రం తెలియలేదు.ఐశ్వర్య రాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2002లో తొలిసారి మెరిసింది. ఆ సమయంలో భారీ బంగారు ఆభరణాలతో నీతా లుల్లా డిజైన్ చేసిన చీరలో రెడ్ కార్పెట్ మీద మొదటిసారి కనిపించింది. అదె సంవత్సరంలో ఆమె నటించిన దేవదాస్ సినిమా ఆ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. షారూఖ్ ఖాన్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీతో ఆమె కేన్స్‌లో పాల్గొంది. అప్పటి నుంచి దాదాపు ప్రతి సంవత్సరం ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో ఆమె రెడ్ కార్పెట్‌పై తన అందంతో కట్టిపడేస్తుంది.ఐశ్వర్యతో పాటు అదితి రావు హైదరీ, శోబితా ధూళిపాళ, కియారా అద్వానీ కూడా కేన్స్‌లో కనిపించనున్నారు. ఊర్వశి రౌతేలా ఇప్పటికే కేన్స్‌లో పింక్ లుక్‌లో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఐశ్వర్య కూతురేనా? గుర్తుపట్టలేకుండా ఉందే..
అందాల తార ఐశ్వర్యరాయ్- బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ దంపతుల గారాలపట్టి.. ఆరాధ్య. ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా ఆమెతో పాటే వెళ్తుంది ఆరాధ్య. అటు ఐష్ కూడా కూతురి స్కూల్ ఈవెంట్స్‌కు తప్పక హాజరువుతుంది. ఇక అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు బాలీవుడ్ తారలు హాజరైన సంగతి తెలిసిందే! అందులో బచ్చన్ ఫ్యామిలీ కూడా ఉంది. అభిషేక్, ఐష్, ఆరాధ్య ఈ సెలబ్రేషన్స్‌ను తెగ ఎంజాయ్ చేశారు. గెటప్ మార్చింది.. అయితే ఎప్పుడు చూసినా నుదుటిపై జుట్టు ఉండేలా హెయిర్‌కట్ చేసుకునే ఆరాధ్య ఈసారి మాత్రం లుక్కు మార్చింది. నుదుటన పాపిట తీసి హెయిర్ లీవ్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆరాధ్య గెటప్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. 'ఆ నుదుటి మీద కురులు(బ్యాంగ్స్) లేకపోతే ఆరాధ్య ఎంత బాగుందో.. ఈ పిల్ల అచ్చం ఆమె అమ్మలాగే ఉంది.' అచ్చం తల్లిలాగే.. 'యవ్వనంలో ఐశ్వర్య ఎలా ఉండేదో.. సేమ్ టు సేమ్.. అలాగే ఉంది. ఇంత క్యూట్‌గా ఉన్న పాప ఎందుకని అలా బ్యాంగ్స్తో తన ముఖాన్ని దాచుకుందో..', 'ఏంటి ? ఈమె ఆరాధ్యనా? నిజంగా గుర్తుపట్టలేకున్నాం. తన కొత్త హెయిర్‌స్టైల్ చాలా బాగుంది. ఎంతో ఎదిగిపోయినట్లుగా కనిపిస్తోంది' అని కామెంట్లు చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011 నవంబర్ 16న ఆరాధ్య జన్మించింది. Look at my two girls 😍 they look so beautiful 😻 #AishwaryaRaiBachchan #AishwaryaRai pic.twitter.com/hDE73iuXzQ — AISHWARYA RAI 💙 (@my_aishwarya) March 3, 2024 The family ❤️. Beautiful #AishwaryaRai with Aradhya pic.twitter.com/h4O8HWs4TE — अपना Bollywood🎥 (@Apna_Bollywood) March 4, 2024 చదవండి: తెలుగు సినిమాల్లో కనిపించట్లే.. అవకాశాలు రావడం లేదా? -
ఐశ్వర్యను ప్లాస్టిక్ అనేసిన హీరో.. దాని పరిణామాలు దారుణంగా..
ఒక్కసారి నోరు జారితే అంతే సంగతులు.. సరదాగా అన్నా, సీరియస్‌గా అన్నా ఆ మాటలను వెనక్కు తీసుకోలేరు. కొన్నిసార్లు అనుకోకుండా మాట్లాడే పదాలే పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీకి ఇలాగే జరిగింది. 2014లో ఇతడు కాఫీ విత్ కరణ్ షోకి వెళ్లాడు. అక్కడ ర్యాపిడ్ ఫైర్ సెషన్లో భాగంగా యాంకర్ ప్లాస్టిక్ అన్న పదం ప్రస్తావించగానే ఇమ్రాన్ ఐశ్వర్యరాయ్ పేరు చెప్పాడు. అందరూ షాక్ ఇంకేముంది.. ఐశ్వర్య అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. మా హీరోయిన్ నీ కంటికి ప్లాస్టిక్‌లా కనిపిస్తోందా? అని చెడుగుడు ఆడుకున్నారు. నిజానికి తను ఐశ్వర్య పేరు చెప్పగానే లొకేషన్లో ఉన్నవారంతా షాకయ్యారట! ఈ ఆన్సర్ ఉంచుదామా? తీసేద్దామా? అని అడిగితే సెట్లో ఉన్నవాళ్లు అలాగే ఉండనీయమని చెప్పారని అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నాడు ఇమ్రాన్. దాని వల్ల ఎదురైన పరిణామాలను(ట్రోలింగ్‌ను) చాలాకాలం పాటు భరించాల్సి వచ్చిందన్నాడు. అదొక గేమ్.. తప్పుగా అనుకోవద్దు ఈ విషయం గురించి గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను ఐశ్వర్యరాయ్‌కు పెద్ద అభిమానిని. నేను తప్పు ఉద్దేశంతో అనలేదు. నేను ఆమెను ఎంతగానో అభిమానిస్తాను. షోలో యాంకర్ ఒక వస్తువు పేరు చెప్పగానే నన్ను ఎవరో ఒక సెలబ్రిటీల పేర్లు చెప్పమన్నారు. అందుకే ఆమె పేరు చెప్పానే తప్పితే అంతకు మించి ఏ ఉద్దేశమూ లేదు. దీన్ని అనవసంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు' అని వివరణ ఇచ్చాడు ఇమ్రాన్ హష్మీ. చదవండి: దేవిశ్రీప్రసాద్ ఇంట పండగ వాతావరణం.. తండ్రయిన సింగర్ సాగర్ -
ఐశ్వర్యరాయ్‌పై రాహుల్ కామెంట్స్.. సిద్దరామయ్యకు బీజేపీ కౌంటర్
ఢిల్లీ: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, సినీ నటి ఐశ్వర్యరాయ్‌పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ నేతలు, ప్రముఖ సింగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాహుల్‌కు కౌంటర్ కూడా ఇచ్చారు. కాగా, భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ప్రసంగించిన రాహుల్ గాంధీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్.. దేశాన్ని నడిపించే వ్యక్తులను అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దూరంగా ఉంచారని విమర్శలు చేశారు. అదే సమయంలో బాలీవుడ్ సెలబ్రిటీలు అయిన అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్లను అయోధ్యకు ఆహ్వానించారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే మీరు రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూశారా. అందులో ఒక్కరైనా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖాలను చూశారా. కానీ ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్, ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కానీ దేశాన్ని నిజంగా నడిపించే వ్యక్తులను మనం అంత గొప్ప కార్యక్రమంలో చూడలేదు. వాళ్లు దేశాన్ని ఎప్పటికీ నియంత్రించలేరని గుర్తుంచుకోవాలి. కనీసం రాష్ట్రపతి కూడా లేకపోవడం ఆయా వర్గాలను అవమానించడమేనని తేల్చి చెప్పారు. పారిశ్రామికవేత్తలు, అమితాబచ్చన్‌ను ఆహ్వానించడం ద్వారా జనాభాలో మిగతా 73 శాతం మందికి ప్రాముఖ్యత లేదని చెప్పినట్టేనని మండిపడ్డారు. దీంతో, రాహుల్ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. Congress Clown Prince @RahulGandhi now has a dangerous & creepy obsession with successful & self-made women. Frustrated by constant rejections by Indians, Rahul Gandhi has sunk to a new low of demeaning India's Pride Aishwarya Rai. A fourth-generation dynast, with zero… pic.twitter.com/6TA442wWTZ — BJP Karnataka (@BJP4Karnataka) February 21, 2024 ఇక, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ, సింగర్ సోనా మహాపాత్ర స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ కామెంట్స్‌పై కర్ణాటక బీజేపీ స్పందిస్తూ.. దేశంలో కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించకపోవడంతో రాహుల్ మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో రాహుల్‌కే తెలియడం లేదు. రాహుల్ కన్నడిగులను అవమానించారని మండిపడింది. కన్నడ ఆత్మగౌరవం గురించి మాట్లాడే సీఎం సిద్దరామయ్య.. రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తారా? అని ప్రశ్నించింది. సాటి కన్నడ వ్యక్తి(ఐశ్వర్యరాయ్)ని రాహుల్ అవమానిస్తుంటే సీఎం సిద్దరామయ్యా చూస్తూ ఎలా ఊరుకుంటారని మండిపడింది. మహిళలను కూడా కించపరిచే స్థాయికి తిరగజారాడంటూ వ్యాఖ్యలు చేసింది. మరోవైపు.. రాహుల్ వ్యాఖ్యలపై సింగర్ సోనా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా రాజకీయ నాయకులు(రాహుల్ గాంధీ) తమ స్వలాభం కోసం ప్రసంగాల్లో మహిళలను కించపరచడం ఏంటి? అని ప్రశ్నించారు. What’s with politicians demeaning women in their speeches to get some brownie points in a sexist landscape?Dear #RahulGandhi ,sure someone has demeaned your own mother, sister similarly in the past & irrespective you ought to know better? Also, #AishwaryaRai dances beautifully.🙏🏾 — Sona Mohapatra (@sonamohapatra) February 21, 2024 -
స్టార్ జంటపై విడాకుల రూమర్స్.. భర్తలాగే సింపుల్‌గా చెప్పేసింది!
బాలీవుడ్ మోస్ట్ ఫేమస్ జంటల్లో ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ ఒకరు. ఈ మాజీ ప్రపంచసుందరి బాలీవుడ్ హీరోను పెళ్లాడింది. వీరిద్దరికీ ఆరాధ్య అనే కూతురు ఉంది. 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీపై ఇటీవల పెద్దఎత్తున రూమర్స్ వస్తున్నాయి. ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎందుకంటే గతంలో ఐశ్వర్యరాయ్ తన కూతురితో కలిసి 50వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. ఆ సమయంలో కేవలం ఆమె తన తల్లి, కుమార్తెతో మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా ఆరోజు అత్తమామలు ఎవరూ కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. అభిషేక్ కూడా చాలా సింపుల్‌గా రెండు ముక్కల్లో ఒక పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే కాకుండా ఎంతో ఇష్టంగా ఐశ్వర్య ఇచ్చిన ఉంగరాన్ని కూడా ప్రస్తుతం అభిషేక్ ధరించడం లేదని తెలిసింది. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటోందన్న వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే వీటిపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. ఈ వార్తలను ఖండించలేదు కూడా. అయినప్పటికీ సోషల్ మీడియాలో రూమర్స్ ఏమాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ పెట్టిన పోస్ట్‌తో అలాంటి వాటికి చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ హీరో, ఐశ్వర్యారాయ్ భర్త తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్, సినీతారలు పలువురు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. తమ అభిమాన హీరో బర్త్‌డే కావడంతో ఉదయం నుంచి బాలీవుడ్ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ తన భర్తకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. తన కూతురు, భర్తతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో పంచుకుంది. అంతే కాకుండా అభిషేక్ బచ్చన్ చిన్నప్పటి ఫోటోను షేర్ చేసింది. ఐశ్వర్యరాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇదిగో మీకివే నా జన్మదిన శుభాకాంక్షలు. మీరు చాలా సంతోషం, ప్రేమ, ప్రశాంతత, శాంతి, ఆరోగ్యంతో ఉండాలని.. ఆ దేవుడు ఆశీర్వాదంతో ఎల్లప్పుడు మీరు ప్రకాశిస్తూ ఉండాలని కోరుకుంటున్నా' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే గతంలో ఐశ్వర్యరాయ్ బర్త్ డే సందర్భంగా అభిషేక్ ఇలానే సింపుల్‌గా విషెస్ చెప్పారు. ఐశ్వర్య కూడా కాస్తా లేటైనా భర్తకు అదే తరహాలో విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు తమ అభిమాన హీరోకు హ్యాపీ బర్త్ డే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో ఈ ఒక్క పోస్ట్‌తో విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక సినిమాల విషయాకొస్తే గతేడాది పొన్నియిన్ సెల్వన్ చిత్రాలతో ఐశ్వర్యరాయ్ మెప్పించింది. అభిషేక్ సైతం గతేడాది గూమర్ చిత్రంతో అలరించాడు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
ఆ స్టార్ కపుల్‌పై విడాకుల రూమర్స్.. ఆ పోస్టే కారణమా?
సినీ తారలపై రూమర్స్ ఎక్కువగా వింటుంటాం. ప్రస్తుతం సోషల్ మీడియా రోజుల్లో అవీ కాస్తా ఎక్కువగానే వస్తున్నాయనే చెప్పాలి. లవ్, బ్రేకప్, పెళ్లి, విడాకులు ఇలా రోజు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. బాలీవుడ్లో అయితే ఇలాంటివీ మరీ ఎక్కువే. గత కొద్ది రోజులుగా బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌పై విడాకులు తీసుకుంటున్నట్లు తెగ చర్చ నడుస్తోంది. ఇటీవల అభిషేక్ చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. అభిషేక్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. “విఫలమవుతుందనే భయం మీ కలలను నాశనం చేస్తుంది. ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటే మీ కలలను నిర్మిస్తుంది' అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటున్నారా? అన్న చర్చ మరోసారి మొదలైంది. అయితే గతంలోనూ ఈ జంటపై చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. (ఇది చదవండి: నాలుగేళ్లుగా డేటింగ్.. రహస్యంగా నిశ్చితార్థం?) విడాకుల రూమర్స్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వివాహాబంధంలోకి అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయింది. ఈ జంటకు ఆరాధ్య అనే కుమార్తె కూడా ఉంది. ఇటీలస ఆరాధ్య స్కూల్ డే ఈవెంట్‌కు ఐశ్వర్య మాత్రమే హాజరైంది. దీంతో విడాకుల రూమర్స్ వచ్చాయి. ఆ తర్వా బిగ్ బితో కలిసి ప్రొ కబడ్డీ ఆటను చూసేందుకు కూడా రావడంతో రూమర్స్‌కు బ్రేక్ పడింది. అంతే కాకుండా ఓ ఈవెంట్లో అభిషేక్ బచ్చన్.. పెళ్లి ఉంగరం ధరించకుండా రావడంతో మరోసారి రూమర్స్ వైరలయ్యాయి. అయితే తాజాగా అభిషేక్ చేసిన పోస్ట్ వల్ల మరోసారి విడాకుల మ్యాటర్ తెరపైకి వచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫెయిల్యూర్‌పై పోస్ట్ పెట్టడమేనని తెలుస్తోంది. ఈ పోస్ట్ ద్వారానే విడాకులకు హింట్ ఇచ్చారని నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై ఇంతవరకు అభిషేక్, ఐశ్వర్య ఎవరూ స్పందించలేదు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో మెప్పించింది. మరోవైపు చిరంజీవి విశ్వంభరలో నటించనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. కాగా.. అభిషేక్ బచ్చన్ సైతం ఇటీవలే గూమర్ చిత్రంతో నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. -
ప్రపంచ సుందరి పోటీలకు వేదికగా భారత్
న్యూఢిల్లీ: భారత్ త్వరలో ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు వేదిక అవనుంది. ఈ ఏడది జరిగే 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తన అధికారిక ఎక్స్(ట్విటర్)లో ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ నిర్ణయంతో 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారత్ వేదికగా నిలవనుంది. చివరిసారిగా 1996లో బెంగళూరులో భారత్‌లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారు. Chairman of Miss World, Julia Morley CBE stated "Excitement fills the air as we proudly announce India as the host country for Miss World. A celebration of beauty, diversity, and empowerment awaits. Get ready for a spectacular journey! 🇮🇳 #MissWorldIndia #BeautyWithAPurpose — Miss World (@MissWorldLtd) January 19, 2024 ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని భారత్ కన్వెన్షన్ సెంటర్, ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. మార్చి 9న నిర్వహించే మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. కేవలం అందం మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పును తీసుకొచ్చే సామర్థ్యం, తెలివితేటలు ఉన్నవారిని గుర్తించి సత్కరించడం దీని ముఖ్య ఉద్దేశం. గతంలో భారత్‌కు చెందిన ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ తదితరులు మిస్ వరల్డ్‌గా ఎంపికయ్యారు. ఇదీచదవండి.. మోదీ భావోద్వేగం -
మణిరత్నం భారీ స్కెచ్.. మరో సూపర్ హిట్ ఖాయమేనా!
మల్టీ స్టార్ చిత్రాలకు కేరాఫ్‌గా అడ్రస్ దర్శకుడు మణిరత్నం. అదేవిధంగా క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేయడంలో ఈయన దిట్ట. చాలాకాలం క్రితమే రజనీకాంత్, మమ్ముట్టి, అరవింద్‌స్వామి హీరోలుగా దళపతి చిత్రాన్ని తెరకెక్కించి సూపర్‌హిట్ కొట్టారు. అదేవిధంగా ఆ మధ్య శింబు, అరుణ్‌విజయ్, అరవిందస్వామి, ప్రకాష్రాజ్వంటి స్టార్ నటులతో సెక్క సివంద వానన్ చిత్రాన్ని రూపొందించి సక్సెస్ సాధించారు. ఇటీవల విక్రమ్, జయంరవి, కార్తీ, విక్రమ్ ప్రభు, శరత్‌కుమార్, ప్రకాష్‌రాజ్, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి వంటి నటీనటులతో రెండు భాగాలుగా తెరకెక్కించిన పొన్నియిన్‌సెల్వన్ చిత్రాలు అనూహ్య విజయాలను సాధించాయి. తాజాగా మణిరత్నం మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. మణిరత్నం, కమలహాసన్ కాంబినేషన్లో గత 37 ఏళ్ల క్రితం నాయకన్ చిత్రం రూపొందించి ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్లో థగ్స్ లైఫ్ అని భారీ గ్యాంగ్స్టర్స్ కథా చిత్రం రూపొందుతోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ చిత్రంలో జయంరవి, దుల్కర్ సల్మాన్, గౌతమ్ కార్తీక్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఇకపోతే నటి త్రిష ఇందులో హీరోయిన్గా నటించబోతున్నట్లు ప్రచారంలో ఉంది. కాగా నటి ఐశ్వర్యారాయ్ థగ్స్ లైఫ్‌లో నటించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. తాజాగా ఈ వరుసలో ప్రముఖ మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మీ పేరు వచ్చి చేరింది. ఈ విషయాన్ని నిర్మాతల వర్గం ఇటీవల అధికారికంగా వెల్లడించింది. ఈ ముగ్గురు పొన్నియిన్‌సెల్వన్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. దీనికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో ఇది మరో పొన్నియిన్ సెల్వన్ చిత్రం కానుందా? అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కమలహాసన్ గెటప్, విడుదల చేసిన టీజర్ థగ్స్ లైఫ్ చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలను పెంచేస్తున్నాయి. -
విశ్వనటుడితో మాజీ ప్రపంచసుందరి.. ఆ క్రేజీ ప్రాజెక్ట్‌లోనే!
కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్ గతేడాది కథానాయకుడిగా నటించి, నిర్మించిన విక్రమ్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అదేవిధంగా తెలుగులో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న కల్కీ చిత్రంలో కమలహాసన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో మరోసారి నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ కాంబోలో తెరకెక్కనున్న భారీ చిత్రం ఈ నెలలోనే సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనకి థగ్స్ లైఫ్ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియోను ఇటీవల విడుదల చేయగా.. అందులో కమలహాసన్ తన శత్రువులతో తన పేరు రంగరాయ శక్తివేల్ నాయకన్. కాయల్ పట్టికారన్( కాయల్పట్టికి చెందిన వాడిని) అని చెప్పే డైలాగ్స్ థగ్స్ లైఫ్ చిత్రంపై అంచనాలు మరింత పెంచేశాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో త్రిష, కమలహాసన్‌కు జంటగా నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఈ భారీ క్రేజీ చిత్రంలో దర్శకుడు మణిరత్నం అభిమాన నటి, మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ నటించబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే కమలహాసన్, ఐశ్వర్యారాయ్ కలిసి నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. త్రిష, జయంరవికి గానీ, దుల్కర్సల్మాన్కుగానీ జంటగా నటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో దుల్కర్సల్మాన్, జయంరవి, త్రిష ముఖ్యపాత్రలు పోషించనున్నారు. -
ఐశ్వర్యరాయ్‌తో వివేక్ ప్రేమాయణం.. నటుడు ఏమన్నాడంటే?
కొన్ని ప్రేమకథలు సుఖాంతం అవుతే మరికొన్ని ప్రేమకథలు మధ్యలోనే ఆగిపోతాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు వివేక్ ఒబెరాయ్- ఐశ్వర్యరాయ్ లవ్‌స్టోరీ రెండో కోవలోకి చెందుతుంది. వీరు గాఢంగా ప్రేమించుకున్నారు, కట్ చేస్తే ఇద్దరూ చెరొకరిని పెళ్లి చేసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే ఐష్‌తో తన కొడుకు ప్రేమాయణం గురించి మొదట్లో ఏమీ తెలియలేదన్నాడు సురేశ్ ఒబెరాయ్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'చాలా విషయాలు నాకసలు తెలియనే తెలీదు. వివేక్ ఎప్పుడూ నాతో ఓపెన్‌గా చెప్పలేదు. రాము (రామ్ గోపాల్ వర్మ)యే అదంతా నాతో చెప్పాడు. ఐశ్వర్యతో లవ్.. వద్దని వారించా రాము కంటే ముందు కూడా ఎవరో చెప్పినట్లు గుర్తు. కానీ తను ఏదైతే చేస్తున్నాడో అది వెంటనే ఆపేయమని చెప్పాను. ఎందుకనేది అతడికి అర్థమయ్యేలా వివరించాను' అని చెప్పుకొచ్చాడు. ఇక సల్మాన్ ఖాన్‌తో బ్రేకప్ చెప్పిన వెంటనే వివేక్‌తో ప్రేమలో పడింది ఐష్. కానీ వీరి బంధం కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఎంతో త్వరగా బ్రేకప్ చెప్పుకున్నారు. కొన్నేళ్ల తర్వాత హీరో అభిషేక్ బచ్చన్‌ను పెళ్లాడి అమితాబ్ ఇంటికి కోడలిగా వెళ్లింది ఐశ్వర్య రాయ్. ఎవరీ సురేశ్- వివేక్.. సురేశ్ ఒబెరాయ్ విషయానికి వస్తే ఈయన సహజ నటుడు. ఏడేళ్ల వయసులోనే తొలిసారిగా ఆడపిల్ల వేషంలో రంగస్థలంపై అడుగుపెట్టాడు. డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాడు. మిర్చ్ మసాలా, ఐత్బార్, లావారిస్, ఘర్ ఏక్ మందిర్ వంటి చిత్రాల్లో విలక్షణ పాత్రలు పోషించాడు. తెలుగులో మరణ మృదంగం వంటి సినిమాలు చేశాడు. ఇటీవలే యానిమల్ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో మెరిశాడు. ఈయన తనయుడు వివేక్ ఒబెరాయ్.. రక్త చరిత్ర, క్రిష్ 3 వంటి పలు సినిమాల్లో నటించాడు. పీఎమ్ నరేంద్రమోది బయోపిక్‌లో ప్రధాని మోది పాత్రను పోషించాడు. తాజాగా ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. చదవండి: దావూద్ పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్.. ఒక్క ఫోటోతో జీవితం నాశనం! -
భర్త, మామతో ఈవెంట్‌కు వెళ్లిన ఐశ్వర్య రాయ్.. కాకపోతే!
బాలీవుడ్ దంపతులు ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ ఈ మధ్య ఎక్కువగా బయట కలిసి కనిపించడం లేదు. ఐశ్వర్య పుట్టినరోజున కూడా చాలా లేట్‌గా బర్త్‌డే విషెస్ తెలిపాడు అభిషేక్. అది కూడా ఏదో పైపైనే చెప్పినట్లు కనిపించింది. దీంతో నెటిజన్లు బచ్చన్ కుటుంబంలో ఏదో జరుగుతోందని అనుమానపడ్డారు. ఈ అనుమానాలు ఈమధ్య మొదలైనవి కాదు. కొన్నేళ్ల నుంచే వీళ్లు విడిపోతున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. గతంలో సదరు పుకార్లను కొట్టిపారేశాడు అభిషేక్. ఇటీవల పొన్నియన్ సెల్వన్ 2 రిలీజైన సమయంలోనూ ఐశ్వర్యను చూసి గర్వపడుతున్నానని ట్వీట్ చేశాడు. ఇంటి నుంచి బయటకు? అయినప్పటికీ ఈ రూమర్స్ ఆగిపోలేదు. పైకి ఏదో కవరింగ్ చేస్తున్నారు కానీ అసలు విషయం వేరే ఉందని అనుమానిస్తున్నారు. ఇకపోతే ఈసారి ఏకంగా ఐశ్వర్య.. తన కూతురిని తీసుకుని బచ్చన్ ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అత్తగారు జయాబచ్చన్‌తో చాలాఏళ్లుగా మాటలు లేవని, భర్తతోనూ విభేదాలు రావడంతో ఆ కుటుంబంతో తెగదెంపులు చేసుకున్నట్లు సదరు వార్తల సారాంశం. ఈ క్రమంలో అభిషేక్- ఐశ్వర్య కలిసి కనిపించారు. వీరిద్దరూ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈవెంట్‌కు చెరో కారులో.. అయితే ఐశ్వర్య, తన తల్లి బృంద్య రాయ్‌తో కలిసి ఓ కారులో రాగా.. అభిషేక్, తన తండ్రి అమితాబ్ బచ్చన్‌తో కలిసి మరో కారులో ఈవెంట్‌కు హాజరయ్యారు. కారు దిగగానే ఐశ్వర్య.. బిగ్‌బీని పలకరించింది. అటు అభిషేక్.. భార్యపై చేయి వేసి ఆమెతో సరదాగా మాట్లాడుతూ లోనికి వెళ్లిపోయాడు. ఈవెంట్లోనూ బిగ్‌బీ, అభిషేక్, ఐశ్వర్య సరదాగా స్టెప్పులు వేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భర్తతో పాటు అదే కారులో వెళ్లింది ఐశ్వర్య. ఇది చూసిన జనాలు ఇదేం ట్విస్టు అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by AISHVERSE 💌 (@theaishverse) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) చదవండి: అపర్ణకు కంగ్రాట్స్ చెప్పిన నయనతార.. ఎందుకో తెలుసా..? -
బాలీవుడ్లో టాప్ 15 అత్యంత అందమైన నటీమణులు వీరే (ఫొటోలు)
-
ఐశ్వర్యరాయ్ పై నోరుజారిన అబ్దుల్ రజాక్
-
Aishwarya Rai 50th Birthday: ఐశ్వర్య రాయ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Aishwarya Rai Birthday : నీలి కళ్ల సుందరి ఐశ్వర్య రాయ్ 50వ పుట్టినరోజు.. ప్రత్యేకమైన ఫోటోలు
-
బిగ్‌బీకి ఐశ్వర్య బర్త్‌డే విషెస్.. జయా బచ్చన్‌ను డిలీట్ చేసిందేంటి?
సెలబ్రిటీలు ఏం చేసినా అందులో తప్పొప్పులు వెతకడానికి జనాలు సిద్ధంగా ఉంటారు. తాజాగా ఐశ్వర్యరాయ్ ఓ పోస్ట్ పెట్టగా చాలామంది దాన్ని తప్పుపడుతున్నారు. అక్టోబర్ 11న అమితాబ్ బచ్చన్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఐశ్వర్య ఒక రోజు ఆలస్యంగా మామగారికి బర్త్‌డే విషెస్ చెప్పింది. ఎల్లప్పుడూ భగవంతుడి ఆశీర్వాదాలు మీకు ఉండునుగాక అంటూ తన కూతురు ఆరాధ్యతో బిగ్‌బీ దిగిన ఫోటోను షేర్ చేసింది. అంతా బాగుంది కానీ ఈ ఫోటోను జూమ్ చేసి, క్రాప్ చేసి మరీ పెట్టింది. అత్తను కూడా ఫోటోలో నుంచి డిలీట్ ఈ విషయం ఎలా తెలిసిందంటే? బిగ్‌బీకి అతడి మనవరాలు నవ్య నవేలి నందా(శ్వేతా బచ్చన్ కూతురు) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫుల్ ఫోటో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇందులో బిగ్‌బీ, జయా బచ్చన్, నవ్య, అగస్త్య, ఆరాధ్య ఉన్నారు. ఇదే ఫోటోను తీసుకున్న ఐశ్వర్య తన అత్తతో సహా అందరినీ క్రాప్ చేసి అవతల పడేసింది. బిగ్‌బీ, ఆరాధ్య మాత్రమే ఉండేలా ఎడిట్ చేసింది. దాన్ని సోషల్ మీడియాలో వదిలింది. ఇది చూసిన జనాలు ఏదో తేడా కొడుతోందని కామెంట్లు చేస్తున్నారు. ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యను లైట్ తీసుకున్నారా? అయితే ఆమె అభిమానులు మాత్రం అది అంత పెద్ద విషయమే కాదని కొట్టిపారేస్తున్నారు. ప్రతి ఏడాది బిగ్‌బీ, ఆరాధ్య.. వీళ్లిద్దరు ఉన్న ఫోటో మాత్రమే పోస్ట్ చేస్తుందని, అందులో భాగంగానే ఇలా చేసిందని అంటున్నారు. కాగా ఇటీవల జయా బచ్చన్, శ్వేతా బచ్చన్ పారిస్ ఫ్యాషన్ వీక్‌కు హాజరయ్యారు. ఈ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య రాయ్‌తో పాటు, నవ్య కూడా ర్యాంప్ వాక్ చేసింది. జయ, శ్వేత.. నవ్యను ఎంకరేజ్ చేస్తూ ఆమెలో ఉత్సాహాన్ని నింపారు, కానీ ఐశ్వర్యను మాత్రం లైట్ తీసుకున్నారు. అందుకే ఈసారి ఐశ్వర్య వారి ఫోటోలను కట్ చేసి కేవలం తన కూతురు మాత్రమే కనిపించేలా ఫోటో పోస్ట్ చేసిందని ఫ్యాన్స్ గెస్ చేస్తున్నారు. ఇకపోతే ఐశ్వర్య రాయ్ చివరగా పొన్నియన్ సెల్వన్ సినిమాలో కనిపించింది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
చిరంజీవి, ప్రభాస్ సినిమాలో ఐశ్వర్యరాయ్ బచ్చన్
-
రోజూ చేపలు తింటే ఐశ్వర్యరాయ్ లాంటి కళ్లు.. వివాదంలో మంత్రి
ముంబై: మహారాష్ట్ర బీజేపీ మంత్రి తన దురుసు వ్యాఖ్యలతో వివాదంలో చిక్కకున్నారు. రోజు చేపలు తింటే హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కళ్లు లాగా అందంగా ఉంటాయని పేర్కొంటూ నోరుజారారు. నందుర్బార్ జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సమావేశంలో రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి విజయ్ కుమార్ గవిత్ మాట్లాడుతూ.. రోజూ చేపలను తినే వ్యక్తుల చర్మం మృదువుగా మారుతుందని, కళ్లు మెరుస్తాయని అన్నారు. తమ వైపు ఎవరూ చూసిన వెంటనే ఆకర్షితులవుతారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ‘ఐశ్వర్యరాయ్ గురించి నేను మీకు చెప్పలేదు కదూ.. ? ఆమె మంగళూరులోని సముద్ర తీరానికి సమీపంలో నివసించేది. ఐశ్యర్య రోజూ చేపలు తినేది. మీరు ఆమె కళ్ళు చూశారా? రోజూ చేపలు తింటే మీ కళ్లు కూడా టైశ్వర్యరాయ్ లాగే అందంగా తయారవుతాయి. చేపలో కొన్ని రకాల నూనెలు ఉంటాయి. అవి మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి.’ అని మంత్రి చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై మంత్రి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేయకుండా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని ఎన్సీపీ ఎమ్మెల్యే అమోల్ మిత్కారీ మండిపడ్డారు. మరో బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే స్పందిస్తూ ‘నేను రోజు చేపలు తింటాను. నా కళ్లు కూడా అలాగే ఉండాలి. దీనిపై ఏమైనా పరిశోధన ఉందా? అనే విషయంపై మంత్రిని ప్రశ్నిస్తానని’ చెన్నారు. చదవండి: స్నేహితుడి కుమార్తెపై అత్యాచారం.. సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం म्हणून ऐश्वर्या रॉयचे Aishwarya Rai डोळे आणि त्वचा सुंदर आहे - आदिवासी विकास मंत्री VijayKumar Gavit#vijaykumargavit #aishwaryaraibachchan #aishwaryarai #adiwasi #maxmaharashtra@AishwaryaWeb @DrVijayKGavit pic.twitter.com/2kFhmgSRBk — Max Maharashtra (@MaxMaharashtra) August 21, 2023 -
దేవదా... నా నటన నచ్చిందా?
సినిమాలలోని పాపులర్ సీన్లను రీక్రియేట్ చేసి ఆనందించడం మనకు కొత్త కాదు. సంజయ్‌లీలా బన్సాలీ ‘దేవదాస్’ సినిమాలో ‘పారు’ పాత్రలోని ఐశ్వర్యారాయ్‌ని అనుకరిస్తూ కైరా ఖన్నా అనే బాలిక చేసిన వీడియో తాజాగా వైరల్ అయింది. ఐకానిక్ సినిమాలలోని పాపులర్ సీన్లను అనుకరిస్తూ కైరా చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ‘జిస్ వక్త్ తుమ్హారే సాథ్ హోతి హమ్ ఉస్ వక్త్ బద్నామి కా బీ డర్ నహీ లగ్తా’ ‘దస్ సాల్ పహ్లే తుమ్హరే నామ్ కా దియా జలాయ థా మైనే. ఉసే ఆజ్ తక్ బుజ్నే నహీ దియా’... ఇలా ‘దేవదాస్’ సినిమాలోని ‘పారు’ పాపులర్ డైలాగ్‌లతో ‘వావ్’ అనిపించింది కైరా ఖన్నా. ‘డైలాగుల నుంచి ఎక్స్ప్రెషన్ వరకు అద్భుతం’ ‘అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ ఉన్న కైరాకు బాలీవుడ్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంది’... అంటూ నెటిజనులు కైరా ఖన్నాపై ప్రశంసల వర్షం కురిపించారు. -
ఐశ్వర్యారాయ్ గురించి అడగగానే విక్రమ్ రియాక్షన్
-
టాప్ పెయిడ్ హీరోయిన్ల లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిందెవరో తెలిస్తే..షాక్‌వుతారు
Trisha Krishnan సౌత్ ఇండియన్ సినిమాలో హీరోయిన్ల్ హవా కొనసాగుతోంది. ఒకర్ని మించి ఒకరు పలుభాషల హీరోయిన్లు తమ సత్తా చాటుకుంటున్నారు అందం, అభినయంతో స్టార్ హీరోలకు ధీటుగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఏ-లిస్ట్ హీరోలు సినిమా చేయడానికి చాలా ఎక్కువ ఫీజు తీసుకుంటారు. ఇదంతా ఒకప్పటి మాట. ఇపుడిక సౌత్ టాప్ హీరోయిన్లు ఫీజు చాలా మంది బాలీవుడ్ నటుల ఫీజు కంటే ఎక్కువే అనడంలో ఎలాంటి సందేహంలేదు. తాజాగా ఈ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ల లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది త్రిష కృష్ణన్. ఫిన్‌క్యాష్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం, మణిరత్నం చిత్రం 'పొన్నియన్ సెల్వన్' తర్వాత త్రిష స్టార్ వాల్యూ ఒక రేంజ్లో పెరిగిందట. త్రిష తన నెక్ట్స్ మూవీకి రూ. 10 కోట్లు వసూలు చేస్తుందని, తద్వారా సౌత్ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా అవతరించింది. త్రిష త్వరలో విజయ్ దళపతితో కలిసి 'లియో' చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రాన్నిఅక్టోబర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 14 ఏళ్ల విరామం తర్వాత విజయ్, త్రిష జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. (15 ఏళ్ల స్టార్టప్ సీఈవోకి లింక్డ్ఇన్లో నిషేధమా? ట్వీట్ వైరల్) మల్టీ స్టారర్ 'పొన్నియన్ సెల్వన్' రెండు భాగాలుగా విడుదలైంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్న ఈ చిత్రంలో త్రిష ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించింది. ఈ మూవీల్లోతన అద్భతమైన నటనతో ఆకట్టుకుంది. అంతకుమంచిన అందంతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. కాగా టాలీవుడ్ టాప్ స్టార్ సమంత రూత్ ప్రభు 'సిటాడెల్ ఇండియా' కనిపించనుంది. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప లోని ఐటెం సాంగ్ 'ఊ అంటావా' తో సామ్ పాపులారీటీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో తన ఫీజును పెంచిందని, ‘సిటాడెల్ ఇండియా’ వెబ్ సిరీస్ కోసం 10 కోట్ల రూపాయలను ఛార్జ్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ధృవీకరణ ఏదీ లేదు. (హైదరాబాద్‌లో 38 శాతం ఇళ్లు అమ్ముడు పోవడం లేదట!ఎందుకో తెలుసా?) -
ఐశ్వర్య సరే... అతడు ఎవరు?
‘షాహిద్ కపూర్ ఎవరు?’ అనే ప్రశ్నకు ‘బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు’ అని జవాబు చెప్పడానికి అట్టే టైమ్ పట్టదు. హీరో కావడానికి ఎంత టైమ్ పట్టిందో తెలియదుగానీ, బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు షాహిద్. కొరియోగ్రాఫర్ షియామక్ దావర్ డ్యాన్స్ ట్రూప్‌లో పని చేస్తున్న కాలంలో సుభాష్ ఘాయ్ ‘తాళ్’ సినిమాలో ఐశ్వర్యరాయ్ నృత్యం చేసిన ‘జంగిల్ మే బోలే కోయల్ కుక్కూ’ పాటలో డ్యాన్సర్లలో ఒకరిగా అవకాశం వచ్చింది. బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆరోజు గురించి ఆర్జే రోహిణికి ఇంటర్వ్యూ ఇస్తూ ‘వరస్ట్ అండ్ ది బెస్ట్ డే ఆఫ్ మైలైఫ్’ అని చెప్పాడు షాహిద్. అందాలతార పక్కన డ్యాన్స్ చేసే అవకాశం అదృష్టమే కదా...మరి ‘వరస్ట్ డే’ అంటాడు ఏమిటి! అనే డౌట్ రావచ్చు. విషయం ఏమిటంటే ఆరోజు షూటింగ్‌కు వస్తున్న షాహిద్ బైక్ మీది నుంచి పడ్డాడు. అదీ విషయం. ‘తాళ్’ సినిమా పాటలో ‘షాహిద్ ఎక్కడ?’ అంటూ నెటిజనులు సెర్చింగ్ మొదలు పెట్టారు. ఐశ్వర్యరాయ్ పక్కన ఉన్న అలనాటి షాహిద్ ఫొటో వైరల్ అయింది. -
ఆ శుభదినాన తల్లితో కలిసి.. ఐశ్వర్యరాయ్ ఫోటో వైరల్.. గంటల వ్యవధిలోనే
అందమంటే ఏంటీ? అని హఠాత్తుగా పది మందిని అడిగితే.. కనీసం ఐదుగురు ఐశ్వర్య రాయ్ పేరు చెబుతారట. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే ఓ విషయం ఇది. నిజమే.. భువి నుంచి దిగి వచ్చినట్టుండే ఐశ్వర్య రాయ్ అత్యంత ప్రసిద్ధ మోడల్స్ లో ఒకరు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్.. అటుపై బాలీవుడ్, హాలీవుడ్.. ఎన్నో సినిమాలు.. మరెన్నో పాత్రలు. ఇదీ ఐశ్వర్య కెరియర్. ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫోటో ఇది. 21 years ago aishwarya rai gave one of her best performances ever. pic.twitter.com/HLDx9KKzyV — ً (@SheethalS5) July 13, 2023 ఈ ఫొటోను చూస్తూ ‘ఇది అంతర్జాల విందు’ అన్నారు ఒక యూజర్. 21 సంవత్సరాల వయసులో ‘మిస్ వరల్డ్’ అందాల కిరీటాన్ని గెలుచుకుంది ఐశ్వర్యరాయ్. ఆ శుభదినాన తల్లితో కలిసి ఫ్లోర్ మ్యాట్‌పై కూర్చొని భోజనం చేస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. how can someone who has seen this, not be an aishwarya rai stan ?#aishwaryarai • #devdas pic.twitter.com/MmvHSIzGZT — 𝒂𝒚𝒖𝒔𝒉𝒊. (@_ayushi_saran) July 13, 2023 భారతీయతకు, భారతీయ భోజన సంప్రదాయాలకు అద్దం పట్టే ఫొటో ఇది. పాపులర్ పేజ్ ‘హిస్టారిక్ విడ్స్’లో షేర్ చేసిన ఈ ఫొటో గంటల వ్యవధిలోనే 2.6 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘సో...ప్యూర్ అండ్ జెన్యూన్’‘మన విలువలు, సంప్రదాయాలు భూమాతను, భోజన సంప్రదాయాలను గౌరవిస్తాయి’... ఇలా నెటిజనులు రకరకాలుగా స్పందించారు. Gorgeous Aishwarya Rai in Her Early Age. pic.twitter.com/qTUK8Jr58R — 🫶𝙌𝙃𝘿❤️🔥 (@QHDposts) July 10, 2023 ఐశ్వర్యారాయ్ నవంబర్ 1 న కర్ణాటకలోని మంగుళూరులో జన్మించారు. 1994లో మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు. అప్పటినుంచి ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2007లో అభిషేక్ బచ్చన్ ను వివాహామాడి అమితాబ్ ఇంట కోడలిగా అడుగుపెట్టారు. 21 Years of Aishwarya Rai as Iconic Paro. ❤#AishwaryaRaiBachchan #21YearsOfDevdas https://t.co/CvKCHCMztn pic.twitter.com/2pwbHEIGVM — Name! why? (@Whatever820082) July 12, 2023 -
ఇట్లుంటరన్నమాట!
మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో చూడడానికి ఫొటో ఆల్బమ్‌లు ఉన్నాయి. మరి వయసు పైబడిన తరువాత ఎలా ఉంటామో చూడడానికి ఏమీలేవు. ‘ఎందుకు లేవు’ అంటూ రంగంలోకి దిగాడు ఏఐ ఆర్టిస్ట్ షాహిద్. ‘మిడ్‌జర్నీ’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి బాలీవుడ్ అందాల కథానాయికలు దీపిక పదుకోణ్, కత్రినా కైఫ్, ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ.. .మొదలైన వారిని బామ్మలుగా మార్చేశాడు. ‘వావ్ రే వావ్’ అంటూ ఈ ఫొటోలు నెట్లో బాగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసి కొందరు తత్వంలోకి దిగి ఇలా అన్నారు... ‘భౌతిక అందం అశాశ్వతం. అంతఃసౌందర్యమే శాశ్వతం’ -
కేన్స్ ఫెస్టివల్లో ఐశ్వర్య రాయ్, ఊర్వశి.. నెటిజన్స్ ట్రోల్స్!
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఆమె ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసింది. ఈ వేడుకల్లో సినీతారలు ప్రత్యేక దుస్తుల్లో తళుక్కున్న మెరిశారు. ఐశ్వర్యారాయ్‌తో పాటు మరో నటి ఊర్వశి రౌతేలా సైతం రెడ్ కార్పెట్‌లో డిఫరెంట్ లుక్‌లో కనిపించింది. అయితే ఈ వేడుకల్లో ఐశ్వర్య రాయ్ ధరించిన డ్రెస్‌పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. సోషల్ మీడియాలో వైరల్) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ఈ మాజీ ప్రపంచ సుందరి వెండి గౌన్‌లో తళుక్కున మెరిసింది. ఆమె ధరించిన ఈ వెండి డ్రెస్‌పై కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మీరు డిజైనర్‌ను మార్చండి అంటూ కొందరు కామెంట్స్ చేయగా.. వెండి హుడీ ఏంటి విడ్డూరంగా అంటూ మరొకరు అభిప్రాయపడ్డారు. అయితే మరికొందరు మాత్రం ఫ్యాషన్‌ను మరోస్థాయికి తీసుకెళ్లారంటూ ఐశ్వర్యారాయ్‌ను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ ఫొటోలు వైరలవుతున్నాయి. (ఇది చదవండి: బాలీవుడ్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం..!) ఇక మరోవైపు నిన్న ఊర్వశి రౌతేలా ధరించిన నెక్లెస్‌పై కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పింక్ కలర్ డ్రెస్‌లో బార్బీ బొమ్మలా వచ్చిన ఊర్వశి.. మెడలో మాత్రం మొసలి డిజైన్‌తో తయారు చేసిన నెక్లెస్‌ను ధరించింది. చెవి రింగులు కూడా అలాంటివే పెట్టుకోవడంతో నెటిజన్లు ట్రోల్ చేశారు. ‘ఆ నెక్లెస్ కిందపడితే నిజంగా మొసలి అనుకొని భయపడతారేమో జాగ్రత్త అని కామెంట్స్ చేశారు. బ్లూ కలర్ లిప్‌స్టిక్ వేసుకున్న ఊర్వశి వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
అజిత్ డబుల్ రోల్.. ఇందులో నటించే ఇద్దరు హీరోయిన్లు ఎవరంటే?
హీరో అజిత్ తాజా చిత్రంపై చాలాకాలంగా రకరకాల చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట్లో ఈ చిత్రానికి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఆ తరువాత ఆయన్ని తొలగించారు. అందుకు కారణం అజిత్ అని, కాదు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌న్స్ అని రకరకాల ప్రచారం జరిగింది. ఏది ఏమైనా ప్రస్తుతం మగిళ్ తిరుమేణి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. జూన్ నుంచి షూటింగ్ కూడా మొదలు కాబోతోందని తాజా సమాచారం. దీనికి విడా మయర్చి టైటిల్‌ను కూడా అధికారికంగా యూనిట్ వర్గాలు ప్రకటించాయి. అంతా బాగానే ఉంది. కానీ, ఈ క్రేజీ చిత్రంలో నటించే హీరోయిన్ ఎవరనేది ప్రకటించలేదు. మొదట్లో హీరోయిన్ త్రిష అని ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాలేదు. విడా మయర్చి చిత్రం గురించి తాజాగా మరో స్టన్నింగ్ అప్ డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో అజిత్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారన్నదే ఆ ప్రచారం. అయితే ఆయనతో రొమాన్స్ చేసే ఆ ఇద్దరు భామలెవరన్నదే ఆసక్తితో కూడిన ప్రశ్న. ఈ విషయంలో ఒక ఆసక్తికరమైన ప్రచారం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట. ఈ పాత్రల కోసం ఐశ్వర్య రాయ్, త్రిష, కంగనా రనౌత్‌లలో ఇద్దరిని ఎంపిక చేసే ప్రయత్నంలో చిత్ర వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా త్రిష మరోసారి ఇందులో అజిత్‌తో జత కట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి కొద్ది రోజుల్లోనే హీరోయిన్ల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. చదవండి: రూమ్‌కు రమ్మని రెండుసార్లు పిలిచాడు.. నిర్మాతపై నటి ఆరోపణలు -
హీరో విక్రమ్‌తో మరోసారి జతకట్టనున్న ఐశ్వర్య రాయ్
క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేయడంలో దర్శకుడు మణిరత్నం దిట్ట. ఇంతకుముందు రజనీకాంత్, మమ్ముట్టి, అరవింద్ స్వామి కాంబినేషన్లో దళపతి చిత్రం చేసిన ఈయన ఆ తరువాత శింబు, అరవిందస్వొమి, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, జ్యోతిక, అదితి రావు తదితరులు కాంబోలో చెక్క చివంద వానం తాజాగా విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు వంటి ప్రముఖ తారాగణంతో పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్స్ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ముఖ్యంగా పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రంలో మాజీ ప్రేమికులైన విక్రమ్, ఐశ్వర్యరాయ్ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా కమల్ హాసన్ కథానాయకుడిగా ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, దీని తర్వాత మరో క్రేజీ కాంబినేషన్లో చిత్రం చేయబోతున్నట్లు తాజా సమాచారం. అదే పొన్నియిన్ సెల్వన్ క్రేజీ కాంబినేషన్. క్లియర్‌గా చెప్పాలంటే నటుడు విక్రమ్, ఐశ్వర్య రాయ్ హీరో హీరోయిన్లుగా చిత్రం చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈ కాంబినేషన్లో ఇంతకుముందు మణిరత్నం రావణన్ అనే చిత్రం చేసిన విషయం తెలిసిందే. కమలహాసన్‌తో చేసే చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విక్రమ్, ఐశ్వర్య రాయ్‌ల కాంబోలో చిత్రం మొదలయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే. -
'పొన్నియిన్ సెల్వన్' ఇదేందయ్యా...అదుర్స్ అన్నారుగా
-
ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య ఎంత పెద్దది అయ్యిందో చూడండి!
-
నువ్వు కూతుర్ని చూసుకో, ఐశ్వర్యను సినిమాలు చేయనివ్వు..
ఐశ్వర్యరాయ్ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే! అప్పటికి, ఇప్పటికి ఆమె అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలోనూ తన అందంతో, హావభావాలతో అదరగొట్టింది. హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చాడు ఐశ్వర్య భర్త, హీరో అభిషేక్ బచ్చన్. చిత్రయూనిట్ కృషి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని కొనియాడాడు. ఐశ్వర్యను చూసి గర్వపడుతున్నానని ట్విటర్లో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌కు ఓ నెటిజన్్ స్పందిస్తూ.. 'ఇప్పటికైనా తెలిసిందిగా! నువ్వు ఆరాధ్యను చూసుకో, తనను మరిన్ని సినిమాలు చేయనివ్వు' అని కామెంట్ చేశాడు. దీనికి అభిషేక్ స్పందిస్తూ.. 'నేనేమైనా వద్దన్నానా? సర్, తను ఏది చేయాలనుకున్నా అందుకు నా అనుమతి అవసరం లేదు. అందులోనూ తనకు నచ్చిన పనులు చేయాలనుకుంటే నేనెందుకు వద్దంటాను' అని రిప్లై ఇచ్చాడు. అతడి సమాధానం విని సంతోషం వ్యక్తం చేసిన ఫ్యాన్స్.. 'చాలా బాగా చెప్పారు సర్, అలాగే మీరిద్దరు కూడా కలిసి సినిమా చేస్తే చూడాలని ఉంది' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా అభిషేక్, ఐశ్వర్య.. గురు, ధూమ్ 2, రావన్, ఉమ్రావో జాన్ వంటి పలు చిత్రాల్లో కలిసి నటించారు. వీరు 2007లో పెళ్లి చేసుకోగా 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. ఇటీవల అభిషేక్- ఐశ్వర్య విడిపోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఐశ్వర్య ఒక్కరే పార్టీలకు, ఫంక్షన్లకు హాజరవుతుండటంతో వీరిమధ్య దూరం పెరిగిందని ప్రచారం జరిగింది. కానీ అదంతా వదంతి మాత్రమేనని కొట్టిపారేశాడు అభిషేక్. ఓ నెటిజన్ మై ఫేవరెట్ పీపుల్ అని ఐశ్వర్య, ఆరాధ్యల ఫోటో షేర్ చేయగా దీనిపై అభిషేక్ స్పందిస్తూ నాకు కూడా ఫేవరెట్ అని కామెంట్ చేశాడు. దీంతో వీరి విడాకుల రూమర్స్‌కు చెక్ పడినట్లైంది. Let her sign??? Sir, she certainly doesn’t need my permission to do anything. Especially something she loves. — Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) April 29, 2023 చదవండి: భారీగా సంపాదిస్తున్న సామ్, ఒక్క పోస్టుకు ఎన్ని లక్షలంటే? -
సౌత్ వర్సెస్ బాలీవుడ్.. ఐశ్వర్యరాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘ఓ సినిమాను నేనెప్పుడూ దక్షిణాది, ఉత్తరాది అని విభజించి చూడలేదు. ఏ సినిమా అయినా అది భారతీయ సినిమాగానే భావిస్తాను’’ అన్నారు ఐశ్వర్యా రాయ్. ‘ఈ మధ్య కాలంలో బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమాల పాపులారిటీ ఎక్కువగా ఉందనీ, ఉత్తరాదిపై దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆధిపత్యం చలాయిస్తుందనీ కొందరు అనుకుంటున్నారు. వీటిని మీరు అంగీకరిస్తారా?’ అనే ప్రశ్నలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్యకి ఎదురయ్యాయి. దీనిపై ఐశ్వర్యా రాయ్ స్పందిస్తూ– ‘‘ఏ రంగంలో అయినా పోటీ ఉన్నట్లే చిత్ర పరిశ్రమలోనూ ఒక ఇండస్ట్రీకి మరొక ఇండస్ట్రీకి మధ్య పోటీ ఉంటుంది. అయితే కళాకారుల మధ్య అలాంటి భేదాలుండవు. నేనెప్పుడూ దక్షిణాది, ఉత్తరాది అని విడిగా చూడలేదు. ఏ సినిమా అయినా భారతీయ చిత్రంగానే భావిస్తాను. ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చలాయిస్తుందనే అభిప్రాయాన్ని అంగీకరించను. ఒకచోట అవకాశాలు రాకపోతే మరొక చోట ప్రయత్నించవచ్చు. అక్కడ కూడా రాకపోతే వేరే ఇండస్ట్రీలోకి వెళ్లొచ్చు. కళకు, కళాకారులకు ఎక్కడైనా గౌరవం ఉంటుంది. పని చేసే ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవచ్చు. దక్షిణాదిలో మణిరత్నంగారు, శంకర్‌గారు.. వంటి పెద్ద దర్శకులతో మంచి సినిమాలు చేసే అవకాశం నాకు వచ్చింది’’ అన్నారు ఐశ్వర్య. -
దిల్ రాజు మాటలకు ఐశ్వర్య రాయ్ ఎలా నవ్వుతుందో చుడండి..
-
రాజమౌళి ఆ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారు: మణిరత్నం
‘‘నేను ఇదివరకే చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. రాజమౌళికి థ్యాంక్స్. ఎందుకంటే ‘బాహుబలి’ రెండు భాగాలుగా రాకపోయిఉంటే ‘పొన్నియిన్ సెల్వన్’(పీఎస్)తెరకెక్కేది కాదు. ఈ విషయాన్ని రాజమౌళితో కూడా చెప్పాను.‘పొన్నియిన్ సెల్వన్’ను రెండు భాగాలుగా తీసే దారిని తను చూపించాడు. చారిత్రాత్మక సినిమాలను తీసే ఆత్మవిశ్వాసాన్ని సినిమా ఇండస్ట్రీకి రాజమౌళి ఇచ్చా రు. భారదేశ చరిత్ర ఆధారంగా చాలామంది ఇప్పుడు సినిమాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అన్నారు డైరెక్టర్ మణిరత్నం. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మీ ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. సుభాస్కరన్, మణిరత్నం నిర్మించిన ఈ చిత్రంలోని రెండో భాగం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఈ నెల 28న రిలీజ్ కానుంది. నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మణిరత్నం మాట్లాడుతూ– ‘‘పొన్నియిన్ సెల్వన్’ తీయడానికి కారణమైన సుభాస్కరన్, వాయిస్ ఓవర్ ఇచ్చిన చిరంజీవి, తెలుగులో సినిమాను రిలీజ్ చేస్తున్న ‘దిల్’రాజుగార్లకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నా గురువు మణిరత్నంతో మరో అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ వచ్చినందుకు టీమ్‌కు శుభాకాంక్షలు’’ అన్నారు విక్రమ్. ‘‘ఒకేసారి రెండు విభాగాలు చిత్రీకరించి, తొలి భాగం రిలీజ్ చేసిన ఆరు నెలల తర్వాత రెండో భాగాన్ని రిలీజ్ చేస్తానన్న గుండె ధైర్యం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎవరూ రెండు విభాగాలను ఒకేసారి చిత్రీకరించలేదు. మణిరత్నంగారి ధైర్యానికి హ్యాట్సాఫ్’’ అన్నారు ‘జయం’ రవి. ‘‘భారతదేశ చరిత్ర తెలియాలని మణిరత్నంగారు ఈ సినిమా తీశారు’’అన్నారు కార్తీ. ‘‘పొన్నియిన్ సెల్వన్’ మ్యాజికల్ వరల్డ్’’ అన్నారు ఐశ్వర్యారాయ్. ‘‘హైదరాబాద్ నాకు రెండో ఇల్లు’’ అన్నారు త్రిష. ‘‘పొన్నియిన్ సెల్వన్ పార్టు 2’లో అద్భుతం చూడబోతున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ఈ కార్యక్రమంలో శోభిత, ఐశ్వర్యాలక్ష్మీ, ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్, సుహాసినీ మణిరత్నం, లైకా ప్రొడక్షన్స్ హెడ్ తమిళ కుమరన్, లైకా డిప్యూటీ ౖచైర్మన్ ప్రేమ్ పాల్గొన్నారు. -
ఐశ్వర్యరాయ్‌తో విడాకులు? అభిషేక్ బచ్చన్ ట్వీట్ వైరల్
విశ్వసుందరి ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ల వైవాహిక జీవితం గురించి కొద్దిరోజులుగా తరచూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిమధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు ప్రస్తుతం బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ముంబైలో జరిగిన నీతా-ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంఛ్ ఈవెంట్‌కు ఐష్ అభిషేక్ లేకుండా కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్లడంతో వీరి విడాకుల అంశం మరోసారి చర్చకు వచ్చింది. కొంతకాలంగా సినిమా ఫంక్షన్లు, పార్టీలు, ఈవెంట్లకు ఐశ్వర్య ఒక్కతే హాజరవుతుంది. లేదా కూతుర్ని వెంటేసుకొని వెళ్తుంది. దీంతో ఐష్-అభిషేక్‌ల మధ్య పొసగడం లేదని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా ఈ అనుమానాలను అభిషేక్ ఖండించారు. ఓ ఈవెంట్లో ఆరాధ్యతో కలిసి ఉన్న ఐశ్వర్యరాయ్ ఫోటోను షేర్ చేస్తూ.. ఓ నెటిజన్ మై ఫేవరెట్ పీపుల్(My Fav People)అని పేర్కొనగా..దీనికి అభిషేక్ స్పందిస్తూ.. నాకు కూడా ఫేవరెట్(Mine Too) అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఐశ్వర్య-అభిషేక్ విడిపోనున్నారనే వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. కాగా 2007లో ప్రేమ వివాహం చేసుకున్న ఐష్-అభిషేక్‌లకు కూతురు ఆరాధ్య సంతానం. My fav people ❤️♥️ @juniorbachchan pic.twitter.com/hAoODtjuTD — Shruti (@Shrutibwb) April 1, 2023 -
బీటలు వారిన బంధం.. భర్తకు ఐశ్వర్య రాయ్ విడాకులు?
బాలీవుడ్‌లోని బ్యూటిఫుల్ కపుల్స్ లిస్టులో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యరాయ్ జంట అగ్రస్థానంలో ఉంటుంది. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఈ మధ్య ఎక్కువగా కలిసి కనిపించడం లేదు. చాలా కార్యక్రమాలకు, పార్టీలకు ఐశ్వర్య ఒంటరిగానో లేదంటే కూతురిని తీసుకునో వెళుతోంది. కానీ భర్త అభిషేక్‌తో మాత్రం కనిపించడం లేదు. ఇటీవల ముంబైలో జరిగిన నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచ్ ఈవెంట్‌కు కూడా ఐశ్వర్య తన గారాలపట్టి ఆరాధ్యతో కలిసి వెళ్లింది. వీరి వెంట అభిషేక్ మాత్రం వెళ్లలేదు. కేవలం ఈ ఒక్క ప్రోగ్రామ్ అనే కాదు చాలా సందర్భాల్లో ఐశ్వర్య వెంట అభిషేక్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వీరిద్దరి మధ్య ఏవో గొడవలు జరిగి ఉండొచ్చని నెటిజన్లు సందేహిస్తున్నారు. వీరు విడాకులు తీసుకోబోతున్నారేమోనంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే వీరు విడిపోతున్నారంటూ వార్తలు రావడం ఇదేం కొత్తేమీ కాదు. 2014లోనూ వీరిద్దరి బంధం చెడింది, విడాకులు తథ్యం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై అభిషేక్ స్పందిస్తూ.. ఓకే, నేను విడాకులు తీసుకుంటున్నానని నమ్ముతున్నాను. ఈ విషయం నాకు గుర్తుచేసినందుకు థ్యాంక్స్. పనిలో పనిగా నా రెండో పెళ్లి ఎప్పుడో కూడా మీరే చెప్పండి అని వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చి రూమర్స్‌కు చెక్ పెట్టాడు. కాగా ఐశ్వర్య, అభిషేక్ 2007 ఏప్రిల్ 20న పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. -
‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అజిత్ సరసన సాయి పల్లవి! ఎంపిక చేశారా? లేక సస్పెన్స్‌గా ఉంచారా?
నటుడు అజిత్ తన వయసుకు దగ్గ పాత్రలో నటించడం ప్రారంభించి చాలా కాలమైంది. ఆయనకు జతగా నటించే హీరోయిన్ల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆమధ్య వివేకం చిత్రంలో కాజల్ అగర్వాల్, విశ్వాసం చిత్రంలో నయనతార, వలిమై చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి అజిత్ సరసన నటించారు. తాజాగా విడుదలైన తుణివు చిత్రంలో మలయాళ భామ మంజువారియర్ నటించారు. వీళ్లందరూ వయసులో సీనియర్ నటీమణులే అనేది గమనార్హం. కాగా తుణివు చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో అజిత్ ఇప్పుడు తన 62వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్‌శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం షూటింగ్ వచ్చే నెల ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం. అయితే ఇందులో అజిత్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. కారణం పలువురు ప్రముఖ హీరోయిన్ల పేర్లు ప్రచారంలో ఉండడమే. ముందుగా నయనతార నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే చిత్రంలో హీరోయిన్ పాత్ర ఆమె స్థాయికి తగ్గట్టుగా లేకపోవడంతో ఆమె నటించడం లేదని ప్రచారం జరిగింది. ఆ తర్వాత త్రిష తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆమె కూడా ఇందులో నటించడం లేదని సమాచారం. అదేవిధంగా ఇటీవల నటి ఐశ్వర్యరాయ్ అజిత్ సరసన నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నటి సాయిపల్లవి పేరు వినిపిస్తోంది. విషయం ఏమిటంటే వీరిలో ఏ ఒక్కరి పేరు ఇప్పటివరకు చిత్ర వర్గాలు ప్రకటించలేదు. చిత్రం షూటింగ్ దగ్గర పడుతుండడంతో చిత్ర వర్గాలు అసలు హీరోయిన్ ఎంపిక చేశారా, చేస్తే ఆ విషయాన్ని సస్పెన్స్‌గా ఉంచారా? అనే చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. -
ఐశ్వర్య రాయ్‌కి లీగల్ నోటీసులు!
మాజీ విశ్వసుందరి, సినీ నటి ఐశ్వర్యరాయ లీగల్ నోటీసులు అందాయి. నాసిక్‌లోని తన భూమిక ఏడాది కాలంగా ఆమె పన్ను చెల్లించని నేపథ్యంలో రెవెన్యూ శాఖ తాజాగా ఐశ్వర్యకు నోటీసులు జారీ చేసింది. వివరాలు.. నాసిక్‌లో జిల్లాలోని సిన్నార్‌లో ఐశ్వర్య పేరు మీదహెక్టారు భూమి ఉందట. ఈ భూమి సంబంధించి ఐశ్వర్య ఏడాది కాలం నుంచి పన్ను చెల్లించలేదు. దీంతో జిల్లా యంత్రాంగంలోని రెవెన్యూ అధికారులు జనవరి 9న ఐశ్వర్యకు లీగల్ నోటీసులు ఇచ్చారు. చదవండి: పఠాన్ మూవీ రన్ టైం లాక్.. ‘బెషరమ్ రంగ్’ పాటకు 3 సెన్సార్ కట్స్! దీని ప్రకారం ఐశ్వర్య రూ. 21, 960 వేలు చెల్లించాల్సి ఉందట. కాగా మండల తాహసిల్థా ఆమెతో మరో 1200 వందల మందికి తాసిల్దార్ ఈ నోటీసులు ఇచ్చారని సమాచారం. ఇందులో పలువురు సినీ సెలబ్రెటీలు, బడా వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది మార్చి చివరి నాటికి పన్ను బకాయిలు వసూలు చేయాలని మహారాష్ట్రలోని భూ రెవెన్యూ విభాగానికి ఆదేశాలు అందాయి. అందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. చదవండి: అమలాపాల్‌కు చేదు అనుభవం, వివాదాస్పదంగా టెంపుల్ సంఘటన! -
ఆనందంలో ఐశ్వర్యను హగ్ చేసుకున్న అభిషేక్, ఆకట్టుకుంటున్న వీడియో
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సంతోషం పట్టలేక తన భార్య, నటి ఐశ్వర్యరాయ్‌ని హగ్ చేసుకున్ను వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. కాగా రీసెంట్గా జరిగిన ప్రో కబడ్డి ఫినాలే మ్యాచ్ చూసేందుకు భార్య ఐశ్వర్య, కూతురు ఆరాధ్యతో కలిసి పాల్గొన్నాడు అభిషేక్. ఈ 9వ సీజన్లో అభిషేక్ టీం జైపూర్ పింక్ పాంథర్ గెలిచి టైటిల్ గెలుచుకుంది. తన టీం గెలవడంతో అభిషేక్ ఆనందంలో మునిగిపోయాడు. పట్టలేని సంతోషంలో ఉన్న అభిషేక్ పక్కనే ఉన్న భార్య ఐశ్వర్యను గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చదవండి: రామ్ చరణ్‌పై ‘కింగ్ ఖాన్’ ఆసక్తికర వ్యాఖ్యలు కాగా అభిషేక్, ఐశ్వర్యలు విడాకులు తీసుకోబోతున్నారని, వారి వైవాహిక జీవితంలో కలతలు వచ్చాయంటూ కొద్ది రోజులుగా తరచూ వీరి విడాకుల రూమర్స్ బి-టౌన్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సంతోషాన్ని అభిషేక్ భార్యతో షేర్ చేసుకోవడం.. ఐశ్వర్య కూడా భర్తను చీర్ చేసిన ఈ వీడియో వారి ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంది. అంతేకాదు విడాకుల గురించి వస్తున్న పుకార్లకు ఈ వీడియోతో చెక్ పడిందంటూ ఈ జంట ఫ్యాన్స్, ఫాలోవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఐశ్వర్య రాయ్, అభిషేక్‌లు 2007లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
Aishwarya Rai Photos: అందాల ఐశ్వర్య బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
పొన్నియిన్ సెల్వన్ మరో రికార్డ్.. బాలీవుడ్ సినిమాను దాటేసిన కలెక్షన్స్!
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా ది కశ్మీర్ ఫైల్స్ వసూళ్లను అధిగమించింది. (చదవండి: పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్లు.. ఐదురోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?) కేవలం విడుదలైన తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.355 కోట్ల వసూళ్లు రాబట్టింది. వరల్డ్‌వైడ్ ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం సాధించిన రూ.340 కోట్ల మార్కును దాటేసింది. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. విక్రమ్, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
ఐశ్వర్యతో విడాకులా..రెండో పెళ్లి ఎప్పుడు?.. అభిషేక్ ట్వీట్ వైరల్
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ గతంలో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. 2014లో ఐశ్యర్యరాయ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు రావడంతో అప్పట్లో అభిషేక్ ఆసక్తికర ట్వీట్ చేశారు. వాటిపై స్పందిస్తూ 'నేను విడాకులు తీసుకుంటానని నమ్ముతున్నా. ఈ విషయం నాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. రెండో పెళ్లి విషయం కూడా మీరే చెప్పండి. థ్యాంక్స్ అంటూ ట్విటర్లో అభిషేక్ రాసుకొచ్చారు. (చదవండి: పొన్నియన్ సెల్వన్: అమ్మకానికి ఐశ్వర్య రాయ్, త్రిషల నగలు) కాగా... అభిషేక్, ఐశ్వర్యరాయ్ జంట 20 ఏప్రిల్ 2007లో ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లయిన నాలుగేళ్లకు అమ్మాయి పుట్టగా ఆరాధ్య అని పేరు పెట్టారు. అప్పట్లో 2014లో ఇద్దరూ విడిపోవాలనుకున్నట్లు రూమర్లు పెద్దఎత్తున వ్యాపించాయి. గతంలో ఈ బాలీవుడ్ జంటపై వచ్చిన వార్తలపై ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ ప్రస్తావించారు. అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. 'ఐశ్వర్యతో నా జీవితాన్ని ఎలా నడిపించాలో నిర్దేశించడానికి మూడో వ్యక్తి చెప్పేందుకు అంగీకరించను. నేను ఎంతగా ప్రేమిస్తున్నానో ఆమెకు తెలుసు.. ఆమె నన్ను ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు.' అని అన్నారు. Ok…. So I believe I’m getting divorced. Thanks for letting me know! Will you let me know when I’m getting re-married too? Thanks. #muppets — Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) May 16, 2014 -
థియేటర్ వద్ద పొన్నియన్ సెల్వన్ తారల సందడి.. అభిమానుల కోలాహాలం
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ 'పొన్నియిన్ సెల్వన్-1'. కల్కి కృష్ణ మూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. అందులో ఇవాళ మొదటి భాగం విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్రాన్ని చూసేందుకు వచ్చిన నటీనటులు చైన్నైలోని ఓ థియేటర్ వద్ద సందడి చేశారు. చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి మొదటి రోజు మొదటి షోను ఎంజాయ్ చేశారు. అభిమాన నటీనటులు థియేటర్లకు రావడంతో ఫ్యాన్స్ టపాసులు కాలుస్తూ హోరెత్తించారు. (చదవండి: పొన్నియన్ సెల్వన్: ఐశ్వర్యరాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘చియాన్’ విక్రమ్, ఐశ్వర్య రాయ్, ‘జయం’ రవి, త్రిష, కార్తి లాంటి అగ్ర నటులు ఈ సినిమాలో నటించారు. మణిరత్నం దర్శకత్వం, భారీ తారగణంతో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ భారీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. #ChiyaanVikram #PonniyinSelvan #FDFS #Aadithakarikalan pic.twitter.com/dtbiCPF2xw — Kavi Kumar (@KaviKum42539573) September 30, 2022 -
పొన్నియన్ సెల్వన్: ఐశ్వర్యరాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1’. పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపొందింది. ‘చియాన్’ విక్రమ్, ఐశ్వర్య రాయ్, ‘జయం’ రవి, త్రిష, కార్తి వంటి అగ్ర నటులతో తెరకెక్కిన ఈ సినిమా నేడు (సెప్టెంబర్ 30న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మణిరత్నం దర్శకత్వం, భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. చదవండి: పొన్నియన్ సెల్వన్’పై ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ, మండిపడ్డ సుహాసిని భారీ అంచల మధ్య నేడు విడుదలైన మూవీ తొలి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలోని ప్రధాన పాత్రల పారితోషికం హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో దాదాపు అందరు అగ్ర నటీనటులే ఉన్నారు. దీంతో ఎవరి పారితోషికం ఎంతనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పలు తమిళ వెబ్సైట్లు పొన్నియన్ సెల్వన్ నటీనటుల పారితోషికాలకు సంబంధించిన కథనాలు వెలువరించింది. వాటి ప్రకారం ఈ సినిమా కోసం చియాన్ విక్రమ్ రూ. 12 కోట్లు తీసుకున్నాడట. చదవండి: వెండి తెరపై నారీ ముద్ర.. సత్తా చాటుతున్న లేడీ డైరెక్టర్స్ అలాగే ఐశ్వర్య రాయ్ రూ. 10 కోట్లు, జయం రవి రూ. 8 కోట్లు, కార్తి రూ. 5 కోట్లు తీసుకోగా త్రిష రూ. 2.5 కోట్లు అందుకుందని సమాచారం. జయం రవి కంటే కార్తికి ఎక్కువ క్రేజ్ ఉన్నప్పటికీ. ఈ సినిమాలో జయం రవికి దక్కిన పాత్ర కారణంగా ఆయనకి ఎక్కువ మొత్తం ఇచ్చారని అంటున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్‌పై సుభాస్కరన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహామాన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. -
PS-1 Twitter Review: ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ ట్విటర్ రివ్యూ
‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ (PS–1’). మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ నిర్మించాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం ‘PS–1’ నేడు(సెప్టెంబర్ 30) విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం నాలుగేళ్ల విరామం తర్వాత చేసిన సినిమా... అందులోను ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో పొన్నియన్ సెల్వన్ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘పొన్నియన్ సెల్వన్’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. Such grand and stunning visuals 🔥😲 Can't imagine how #ManiRatnam sir completed both parts in just 155 days ! May his lifelong dream & efforts get great result 👍🏻#PonniyinSelvan #PonniyanSelvan1#PS1 #PonniyinSelvanFDFS#PonniyinSelvanFDFS pic.twitter.com/6nGSZsmTUd — vamsi Krishna (@vamsi2131) September 30, 2022 విజువల్స్ ఎఫెక్ట్స్ , మ్యూజిక్ చాలా బాగున్నాయని చెబుతున్నారు. ‘అద్భుతమైన విజువల్స్ ఉన్న ఇలాంటి సినిమాను మణిరత్నం కేవలం 155 రోజుల్లో రెండు భాగాలను ఎలా తెరకెక్కించారో ఊహించుకోవడం కష్టమే. అతని డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది సాధ్యమై ఉండొచ్చు. మణిరత్నం కష్టానికి ఫలితం దక్కిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #PonniyinSelvan #PS1 1st Half Good 2nd Half Flat / Average 2.5-2.75/5 Top Highlights #Vikram #Karthi #Trisha BGM — RR (@rrking99) September 30, 2022 ఫస్టాఫ్ బాగుందని, సెకండాప్ యావరేజ్‌గా ఉందని చెబుతూ 2.5-2.75 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్. విక్రమ్, కార్తి, త్రిషల యాక్టింగ్‌తో పాటు ఏఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతం బాగుందని చెబుతున్నారు. Better 2nd half Overall one time watch 2.25/5#PS1 #PonniyinSelvan — Albitthar Appanna (@ulfha_reddy) September 30, 2022 #PonniyinSelvanFDFS #PS1 #PonniyinSelvanReview Comparison Between Bahubali and Ponniyin Selvan Bahubali - Mass PS1 - Class That's the tweet. Mani rathnam take a bow. You have satisfied fully. Waiting for part 2. — Santhosh (@Santhos43177339) September 30, 2022 #PS1 1st Half : A Classic of Epic proportions is unfolding in front of your eyes.. Dir #Maniratnam magic.. What a story and screen play.. @Karthi_Offl is brilliant and fun and occupies most screen time.. @chiyaan lives his character.. His acting in pre-interval.. 🔥 — Ramesh Bala (@rameshlaus) September 30, 2022 #PS1 #PonniyinSelvan spectacular movie 5/5 #Maniratnam visualization amazing #ARR rocks #AdhityaKarikalan terror #Vanthiyathevan so sweat #ArunmozhiVarman Majestic #Nadhini no words #kundavai real chola queen — ilangovan chandran (@ilangovanchand2) September 30, 2022 PS is political drama with complex characterisation. This was been said from the start. There won't be any air bending fight sequences and commerical elements. It's pure story based & characters driven movie.#Ponniyinselvan #PS1 — Renu🌠 (@crazy4musics) September 30, 2022 #PS1 Overall A Period Action Film that had potential but ends up as an underwhelming watch! Interesting storyline with good music and visuals but is wasted by flat narration with absolutely no highs/emotional connect needed for this genre Rating: 2.25-2.5/5 #PonniyinSelvan — Venky Reviews (@venkyreviews) September 30, 2022 -
పొన్నియన్ సెల్వన్: ఐశ్వర్యరాయ్ పాత్రపై శరత్ కుమార్ కామెంట్స్
శరత్‌కుమార్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ప్రముఖ నటుడు, అఖిల భారత సమత్తువ పార్టీ అధ్యక్షుడు. కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు అన్ని రకాల పాత్రలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు భాషల్లో 22 చిత్రాల్లో నటిస్తున్న ఏకైక నటుడు అని చెప్పవచ్చు. మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థలతో కలిసి మెడ్రాస్ టాకీస్ సంస్థ నిర్మించిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఇందులో నటుడు శరత్‌కుమార్ పెరియపళవేట్టరైయర్ పాత్రలో నటించారు. ఈ చిత్రం తొలి భాగం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నటుడు శరత్‌కుమార్ బుధవారం ఉదయం చెన్నైలో మీడియాతో సమావేశమయ్యారు. ఈ చిత్రంలో నటించడం తన అదృష్టమని పేర్కొన్నారు. చోళరాజుల ఇతివృత్తంతో కూడిన పొన్నియిన్ సెల్వన్ చరిత్ర తెలిసిన నవల అన్నారు. దీన్ని సంపూర్ణంగా తెరకెక్కించాలంటే 10 భాగాలకు పైగా పడుతుందన్నారు. అయితే మణిరత్నం ప్రధాన పాత్రలను, ప్రధాన అంశాలను మిస్ కాకుండా తాను అనుకున్న విధంగా అద్భుతంగా మలిచారన్నారు. దీనికి లైకా సంస్థ ప్రయత్నం చాలా ఉందన్నారు. అసాధారణమైన ఈ చిత్రాన్ని మణిరత్నం తన ప్రయత్నంతో సుసాధ్యం చేశారన్నారు. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో సుందర్ చోళన్ రాజుకు మిత్రుడు పెరియ పళవేట్టరైయర్ పాత్రలో నటించానని తెలిపారు. ఇది చోళరాజ్యానికి సంరక్షణకు భద్రుడు పాత్ర అన్నారు. నందిని అనే కపటధారిణి పాత్రలో ఐశ్వర్యారాయ్ నటించారు. ఇందులో తన అందానికి వశం కావడం, ఆమెను వివాహమాడటంతో జరిగే పరిణామాలు చిత్రంలో చూడాలన్నారు. చోళరాజుల చరిత్ర తెలియని వారికి ఈ చిత్రం పలు విషయాలను తెలియజేస్తుందన్నారు. తంజావూరులో ప్రసిద్ధి గాంచిన పెరియ కోవిల్ (ఆలయం) చోళరాజు నిర్మించిన విషయం తెలిసిందే. నున్నారు సముద్రాలను దాటి రాజ్యాలను గెలిచిన చోళ సామ్రాజ్యం కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్ అన్నారు. ప్రస్తుతం తాను పలు భాషల్లో 22 చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. నటుడిగా ఇది సెకెండ్ ఇన్నింగ్స్? అని అడుగుతున్నారని, అయితే తాను తొలి ఇన్నింగ్సే పూర్తి కాలేదని అన్నారు. సినిమాలతో బిజీగా ఉండడం వల్ల రాజకీయ పార్టీ పరమైన పనులకు ఆటంకం కలగడం లేదా అన్న ప్రశ్నకు ఇప్పుడు రాజకీయాలు సామాజిక మాధ్యమాల్లోనే నడుస్తున్నాయని అన్నారు. తన కార్యకర్తలతో జూమ్ మీటింగ్‌లతో టచ్‌లోనే ఉంటున్నానని, ప్రజా వ్యతిరేక విధానాలను తన గొంతు వినిపిస్తునే ఉంటున్నదని శరత్‌కుమార్ చెప్పారు. -
పొన్నియన్ సెల్వన్: అమ్మకానికి ఐశ్వర్య రాయ్, త్రిషల నగలు
తమిళసినిమా: ప్రస్తుతం సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఇందుకు కారణాలు అనేకం. ప్రధాన కారణం చిత్ర కథ దివంగత ప్రఖ్యాత రచయిత కల్కి కలం నుంచి జారువాలిన నవల పొన్నియిన్ సెల్వన్. నాలుగు దశాబ్దాలకు పైగా ఈ నవల ప్రతులను అనేక మంది అనేకసార్లు ముద్రిస్తూనే ఉన్నారు. అంతగా తమిళ ప్రజల మనసుల్లో మమేకమై పోయింది ఈ నవల. మరో విశేషం ఏంటంటే దీనిని ఎంజీఆర్ నుంచి కమలహాసన్ వరకు చిత్రంగా మలచాలని ప్రయత్నించారు. చదవండి: Indira Devi: మహేశ్ బాబు తల్లి మృతి.. చిరంజీవి సంతాపం చివరికి దర్శకుడు మణిరత్నం దీన్ని తెరకెక్కించారు. విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు, శరత్‌కుమార్, ప్రభు, పార్తీబన్, జయరాం, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య, లక్ష్మి వంటి ముఖ్య తారలు నటించారు. ఏఆర్ రెహామాన్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రం తొలిభాగం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రచా ర కార్యక్రమాల్లో భాగంగా వివిధ రాష్ట్రాలను చుట్టేస్తోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ముంబయికి చెందిన నటి ఐశ్వర్యారాయ్ కూడా ప్రతి ప్రచార కార్యక్రమంలోనూ పాల్గొంటున్నారు. చదవండి: ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైన ‘బింబిసార’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్! ఇంకా చెప్పాలంటే ఆమె యూనిట్‌కు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మారిపోయారు. అదే విధంగా ఇందులో నటించిన హీరోలు ఐశ్వర్యారాయ్‌తో ఫొటోలు దిగడం, అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ చిత్రంపై మరింత హైప్‌ను పెంచేస్తున్నాయి. కాగా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది రాజుల నేపథ్యంలో రూపొందిన చిత్రం. ఇందులో నటి ఐశ్వర్యారాయ్ నందినిగానూ, త్రిష కుందవై రాణిగానూ నటించారు. ఆ పాత్రల కోసం వీరిద్దరూ ధరించిన ఆభరణాలను వేలం వేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. -
‘ఐశ్వర్య, త్రిషలపై చాలాసార్లు సీరియస్ అయ్యా, అలా వార్నింగ్ కూడా ఇచ్చా’
దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర బృందం ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాతో ముచ్చటించిన ఆయన సెట్స్‌లో కొన్నిసార్లు స్టార్ హీరోయిన్స్ అయిన ఐశ్వర్యరాయ్, త్రిషలపై సీరియస్ అయ్యానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. చదవండి: జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘ఆది’ రీరిలీజ్! ఎప్పుడంటే.. షూటింగ్ సమయంలో త్రిష, ఐశ్యర్యరాయ్‌లతో కాస్తా ఇబ్బంది పడ్డానని, అందుకే వారిపై పలుమార్లు అరిచానన్నారు.‘ఈ చిత్రంలో త్రిష, ఐశ్వర్యల సన్నివేశాలు, డైలాగ్స్ సీరియస్‌గా కొనసాగుతాయి. షూటింగ్ చేస్తున్నప్పుడు వారిద్దరి మధ్య ఆ సీరియస్‌నెస్ వచ్చేది కాదు. దానికి కారణం సెట్స్‌లో వారిద్దరి మధ్య ఉన్న స్నేహం. అందువల్ల వారి సీన్స్ సరిగా వచ్చేవి కాదు. వారిద్దరి సీన్స్ చేసేటప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. అసలు అనుకున్నట్టు సీన్స్ వచ్చేవి కాదు. వాటికి చాలా టైం పట్టేది. దీంతో సినిమా అయిపోయేవరకు వారిని మాట్లాడుకోవద్దని వార్నింగ్ కూడా ఇచ్చాను. చదవండి: అప్పుడే ఓటీటీకి రంగ రంగ వైభవంగా! దసరాకు స్ట్రీమింగ్, ఎక్కడంటే.. అయినా వారు వినకపోవడంతో కొన్నిసార్లు ఇద్దరిని ఇద్దరిపై కోప్పడాల్సి వచ్చింది’ అని ఆయన చెప్పుకొచ్చారు. భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, జయం రవి, హీరో కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభితా ధూలిపాళ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని రూపొందించారాయన. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. -
‘పొన్నియిన్ సెల్వన్’ ప్రీ రిలీజ్ వేడుకలో మెరిసిన ఐశ్వర్యరాయ్ (ఫొటోలు)
-
అప్పుడు పెళ్లి ఆగిపోతుందేమోనని భయపడ్డా!
‘‘నలభై రెండేళ్లుగా మీరు (ప్రేక్షకులు) నాపై చూపించిన ప్రేమని ‘పొన్నియిన్ సెల్వన్’పై చూపించండి. ఈ సినిమా ఓ పది శాతం షూటింగ్ చెన్నైలో జరిగితే మిగిలినదంతా రాజమండ్రి, హైదరాబాద్‌లో చేశాం.. కాబట్టి ఇది మీ (తెలుగు) సినిమా.. మీరు ఆదరించాలి’’ అని నటి సుహాసినీ మణిరత్నం అన్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ (‘పీయస్–1’). మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ నిర్మించాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం ‘పీయస్–1’ ఈ నెల 30న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘దిల్’ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో సుహాసినీ మణిరత్నం మాట్లాడుతూ– ‘‘పెళ్లికి ముందు మణిరత్నంగారు ఓ పెద్ద బ్యాగ్ నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. అందులో ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఐదు భాగాలుగా ఉంది. చదివి ఒక్క లైన్లో కథ చెప్పమన్నారు. నేను ఐదు భాగాలను చదివి ఐదు లైన్లుగా రాసి ఇచ్చాను. ఇలాగేనా రాసేది? అన్నారాయన. అప్పుడు మా పెళ్లి ఆగిపోతుందేమో? అని భయపడ్డాను.. కానీ పెళ్లయింది. మా పెళ్లయిన 34 ఏళ్లకి ‘పొన్నియిన్ సెల్వన్’ తీశారాయన. దానికి ముఖ్య కారణమైన సుభాస్కరన్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. ఐశ్వర్యా రాయ్ మాట్లాడుతూ– ‘‘పొన్నియిన్ సెల్వన్’ టీమ్‌తో ఇక్కడ ఉండటం గర్వంగా ఉంది. ప్రతిభావంతులైన మంచి యూనిట్‌తో పని చేయడం గౌరవంగా ఉంది. నా తొలి సినిమా (‘ఇద్దరు’) మణిరత్నం సార్‌తో చేశాను. ఆయన కలల ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’లోనూ భాగం కావడం హ్యాపీ’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ రోజుల్లో ఒక హీరోని పెట్టుకుని సినిమా తీయా లంటే చుక్కలు కనిపిస్తున్నాయి.. అలాంటిది ఇంతమంది హీరోలు, హీరోయిన్లని పెట్టి మణిరత్నంగారు ‘పొన్నియిన్ సెల్వన్’ని రెండు భాగాలుగా తీయడం గ్రేట్. ఇప్పుడు సినిమాకు ప్రాంతం, భాషతో సంబంధం లేదు.. బాగుంటే ఇండియా మొత్తం ఆదరిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కార్తికేయ 2’ చిత్రాల్లా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ కూడా ఇండియా మొత్తం అద్భుతం సృష్టిస్తుందని నమ్ముతున్నాను. ఇండియాలో రెహమాన్‌గారు ఉన్నారని చెప్పుకునేందుకు భారతీయుడిగా గర్వపడతాం’’ అన్నారు. ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ– ‘‘38 ఏళ్ల క్రితం నా ప్రయాణం తెలుగులో ప్రారంభమైంది. రమేశ్ నాయుడు, చక్రవర్తి, రాజ్–కోటి, సత్యంగార్లు సంగీతానికి ఒక పునాది వేశారు. ఇన్నేళ్లుగా నా సంగీతాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాని అందరూ చూసి, ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘‘పొన్నియిన్ సెల్వన్ ’ లాంటి మంచి టీమ్‌తో పని చేయడం హ్యాపీ. చాన్స్ ఇచ్చిన మణిరత్నం సార్‌కి థ్యాంక్స్’’ అన్నారు త్రిష. ‘‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో అందరూ హీరోలే, అందరూ హీరోయిన్లే. నా డ్రీమ్ డైరెక్టర్ మణిరత్నంగారు అంత అద్భుతంగా మా పాత్రలను తీర్చిదిద్దారు’’ అన్నారు విక్రమ్. ‘‘మణిరత్నంగారి నలభై ఏళ్ల కల ఈ సినిమా. ఇది ‘బాహుబలి’ సినిమాలా ఉంటుందా? అని అడుగుతున్నారు. ఒక ‘బాహుబలి’ని మనం చూశాం.. ఇంకో ‘బాహుబలి’ అవసరం లేదు. ఇండియాలో ఎన్నో కథలు ఉన్నాయి.. వాటిని మనం ప్రజలకు చెప్పాలి. ఇలాంటి ఒక గొప్ప సినిమాని మీరు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు కార్తీ. ‘‘మా నాన్న ఎడిటర్ మోహన్‌గారు ‘హిట్లర్, హనుమాన్ జంక్షన్, క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ వంటి చిత్రాలు నిర్మించారు. ‘పొన్నియిన్ సెల్వన్’ ఒక అద్భుతం’’ అన్నారు ‘జయం’ రవి. ఐశ్వర్యా లక్ష్మి, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
పొన్నియన్ సెల్వన్ ఆ నటితో చేద్దామనుకున్నా: మణిరత్నం
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని రూపొందించారాయన. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల మొదటి భాగం షూటింగ్ పూర్తవ్వగా.. అందుకు సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా పొన్నియిన్ సెల్వన్ సినిమా కోసం ప్రచార కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసింది చిత్రబృందం. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. (చదవండి: పొన్నియన్ సెల్వన్- పార్ట్ 2 ఎప్పుడో చెప్పేసిన మణిరత్నం) అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాయ్ పాత్ర కోసం మీరు ఎవరినైనా ఎంపిక చేయాలనుకున్నారా అని అడిగిన ప్రశ్నకు మణిరత్నం స్పందించారు. ఆ పాత్రకు అప్పట్లో రేఖను ఎంపిక చేయాలనుకున్నట్లు తన మనసులో మాటను బయటపెట్టారు దర్శకధీరుడు మణిరత్నం. తొలిసారి కమల్ హాసన్‌తో కలిసి ఈ చిత్రాన్ని తీయాలనుకున్నట్లు తెలిపారు. 1994, 2011లో ఈ చిత్రం చేయడానికి ప్రయత్నించగా.. ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా టేకాఫ్ కాలేదని వివరించారు. కాగా పొన్నియన్ సెల్వన్ -1లో ఐశ్వర్రాయ ద్విపాత్రాభినయం చేస్తోంది. నందిని, ఆమెకు మూగ తల్లిగా మందాకిని దేవి పాత్రల్లో కనిపించనుంది. జూలైలో ఐశ్వర్య పాత్రకు చెందిన నందిని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి సంబంధించి యుద్ధ సన్నివేశాలను ఎక్కువ భాగం థాయ్‌లాండ్‌లో చిత్రీకరించారు. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, శోభితా ధూళిపాళ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. -
ఐశ్వర్య రాయ్‌పై నెటిజన్ల ప్రశంసల వర్షం, ఏం చేసిందంటే..
మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. సెప్టెంబర్ 30న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సందర్భందగా నిర్వహించిన ట్రైలర్ ఈవెంట్‌కు ‘తలైవా’ రజనీకాంత్, ‘లోకనాయకుడు’ కమల్ హాసన్‌లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. అలాగే ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, త్రిష, కార్తీ, ప్రభు తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవెంట్లో రజనీ పట్ల ఐశ్వర్య వ్యవహరించిన తీరుపై నెటిజన్లు, ‘తలైవా’ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: నాకు ఫోన్ కొనివ్వడానికి మా నాన్న అప్పు చేశారు: బిగ్‌బాస్ నేహా చౌదరి ఈ సందర్భంగా ఈవెంట్లో రజనీకాంత్‌ను చూసిన ఐశ్వర్య వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి పలకరించడమే కాదు ఆయన కాళ్లకు నమస్కరించింది అభిమానం చాటుకుంది. వెంటనే ఆమెను లేపిన రజనీ తనను ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆతర్వాత ఒకరికి ఒకరు చేతులు జోడించి నమస్కారం తెలుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అంతేకాదు రజనీ పట్ల ఐశ్వర్య చూపించిన గౌరవానికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ‘అందలోనే కాదు సంస్కారంలోనూ ఐశ్వర్యకు ఎవరు సాటిలేరు’, ‘ఐశ్వర్యే కాదు ఆమె మనసు కూడా చాలా అందమైనది’ అంటూ ఐశ్పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. కాగా శంకర్ ‘రోబో’ చిత్రంలో రజనీకి జోడిగా ఐశ్వర్య నటించిన సంగతి తెలిసిందే. చదవండి: ఆస్పత్రి బెడ్‌పై షణ్ముఖ్ జశ్వంత్, ఫ్యాన్స్ ఆందోళన It happened guys. Aishwarya Rai touched Rajinikanth's feet 😍#AishwaryaRaiBachchan #Rajinikanth#PonniyinSelvanpic.twitter.com/FMjj9SIYFJ https://t.co/220rrV1wMj — Aishwarya as Nandini(PonniyinSelvan)'ll b Historic (@badass_aishfan) September 6, 2022 -
అందాల ఐశ్వర్యను అలాంటి పాత్రలో ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?
తమిళసినిమా: అందం, అభినయానికి మారు పేరు నటి ఐశ్వర్యారాయ్. కథానాయికగా హిందీ, తెలుగు, తమిళం వంటి భాషా చిత్రాల్లో నటించి మేటి నటిగా పేరు తెచ్చుకున్నారు. దర్శకుడు మణిరత్నం కోలీవుడ్‌కు పరిచయం చేసిన నటి ఐశ్వర్యారాయ్ అన్న విషయం తెలిసిందే. ఆమె మణిరత్నంను గురువుగా భావిస్తారు. కాగా కథానాయకిగా పరిచయం చేసిన ఆయనే ఐశ్వర్యారాయ్‌ను ఇప్పుడు ప్రతినాయకిగా చూపిస్తూ ఆమెలోని నటిని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తాజా సమాచారం. మణిరత్నం ఏ చిత్రాన్ని చేసినా దాంట్లో ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. అలా తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్. ఇందులో విక్రమ్, కార్తీ, జయంరవి, జయరాం, ఐశ్వర్యారాయ్, త్రిష వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. మణిరత్నం మద్రాస్ టాకీస్ సంస్థ, లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం, రవివర్మ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం తొలి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇందులో నటి ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు, అందులో ఒకటి ప్రతినాయిక పాత్ర అని తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పొన్నియన్ సెల్వన్ చిత్రంపై అంచనాలు, ఆసక్తి మరింత పెరుగుతున్నాయి. -
సల్మాన్‌పై మరోసారి విరుచుకుపడ్డ మాజీ ప్రేయసి
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై అతడి మాజీ ప్రేయసి సోమి అలీ మరోసారి విరుచుకుపడింది. సల్మాన్‌తో పదేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన సోమి బ్రేకప్ అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పి అమెరికా చెక్కేసింది. ప్రస్తుతం ఓ ఎన్జీవోతో కలిసి పనిచేస్తున్న ఆమె సమయం వచ్చినప్పుడల్లా సల్మాన్‌ను టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే సల్మాన్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె తాజాగా మరోసారి విమర్శలు గుప్పించింది. తనతో సహా ఇతర మహిళలను సల్మాన్ కొట్టేవాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చదవండి: ‘లైగర్’లో ముందుగా ఆమెను హీరోయిన్గా అనుకున్నా: పూరీ ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మైనే ప్యార్ కియా’ పోస్టర్ షేర్ చేస్తూ.. సల్మాన్‌ను ఉమెన్ బీటర్(మహిళలను కొట్టే వ్యక్తి) అని ప్రస్తావించింది. ‘సల్మాన్ ఖాన్‌ను గొప్పగా కీర్తించడం మానేయండి. అతనో శాడిస్ట్. ఎంతటి శాడిస్టో మీకు తెలియదు. తరచూ అమ్మాయిలు కొడుతూంటాడు. నాతో సహా ఎంతోమంది మహిళలపై అతడు చేయి చేసుకున్నాడు’ అంటూ ఆమె రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమైంది. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ని ఓ పార్టీలో సల్మాన్ కొట్టినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: మంచు లక్ష్మికి అరుదైన గౌరవం, 100 మంది మహిళల్లో ఒకరిగా.. కాగా పాకిస్తాన్లో పుట్టిన సోమీ అలీ అమెరికాలో స్థిరపడింది. ‘మైనే ప్యార్ కియా’ సినిమా చూసి సల్మాన్‌ను ఇష్టపడి ఇండియాకు వచ్చింది. ముంబైలో దిగిన ఆమె ఇటూ అవకాశాలను చేజిక్కించుకోవడంతో పాటు మోడల్‌గా కెరీర్‌ను బిజీ చేసుకుంది. ఈ క్రమంలో సల్మాన్ మనసు దోచుకున్న ఆమె పదేళ్ల పాటు అతడితో రిలేషన్లో ఉంది. ఆ తరువాత వచ్చిన మనస్పర్థల కారణంగా సల్మాన్‌కు బ్రేకప్, సినిమాలకు గుడ్‌బై చెప్పి తిరిగి అమెరికా వెళ్లిపోయింది. అప్పటి నుంచి సింగిల్‌గా ఉంటున్న సోమీ ‘నో మోర్ టియర్స్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా మానవ అక్రమ రవాణా బాధితుల్ని కాపాడుతూ వస్తోంది. -
Ponniyin Selvan: రాజమౌళి వల్లే ధైర్యం వచ్చింది
‘‘పొన్నియిన్ సెల్వన్’ తీయడం గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ప్రముఖ దర్శకుడు మణిరత్నం అన్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగాన్ని ‘పీయస్–1’ని సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ చిత్రంలోని ‘చోళ చోళ..’ అనే పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో మణిరత్నం మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ, అది ఎందుకనేది చెప్పను. తర్వాత మీకే తెలుస్తుంది. రాజమౌళిగారి వల్లే ఇలాంటి (పొన్నియిన్ సెల్వన్) చిత్రాలు తీయగల మనే ధైర్యం వచ్చింది. రెండు భాగాలుగా ఇలాంటి సినిమాలు తీసి మెప్పించవచ్చని నిరూపించారు. అందుకు ఆయనకు థ్యాంక్స్. నా బిడ్డలాంటి ఈ చిత్రం తెలు గులో ఇక ‘దిల్’ రాజుగారిదే’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మణిరత్నంగారి ‘అమృత’ సినిమా వల్లే నిర్మాతగా మారి, 50 చిత్రాలు నిర్మించాను. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్’ని రిలీజ్ చేసే చాన్స్ ఇచ్చిన మణిరత్నంగారికి థ్యాంక్స్’’ అన్నారు. విక్రమ్ మాట్లాడుతూ– ‘‘మణి సార్‌తో గతంలో ‘రావణ్’ సినిమా చేశాను. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్’. మణిగారితో సినిమా అంటే కల నెరవేరడం వంటిది. మణిగారు, శంకర్‌గారితో సినిమా చేస్తే ఇక రిటైర్ అవ్వొచ్చని అనుకున్నాను.. అంత అద్భుతమైన చిత్రాలు చేస్తారు’’ అన్నారు. కార్తీ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను. వెయ్యేళ్ల క్రితం జరిగిన చరిత్రను చూపించేందుకు రాబోతున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో దాదాపు 50 పాత్రలుంటాయి.. నేనూ భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు తనికెళ్ల భరణి. ‘‘అన్ని భాషల్లో నటించి, పాన్ ఇండియన్ నటుడు అవడం వేరు. కానీ దక్షిణాది నుంచి తన మేకింగ్ ఆఫ్ స్టైల్‌తో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిన ఏకైక వ్యక్తి మణిరత్నంగారు’’ అన్నారు ప్రకాశ్‌రాజ్. ‘‘కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను సినిమాగా తెరకెక్కించాలని ఎంజీఆర్, కమల్ వంటి వారెందరో ప్రయత్నించారు. కానీ మణిరత్నంగారి వల్లే సాధ్యం అయింది’’ అన్నారు నాజర్. సుహాసినీ మణిరత్నం మాట్లాడుతూ– ‘‘ఇది మీ డ్రీమ్ ప్రాజెక్టా? అంటే కాదు ఇష్టమైన చిత్రం అని మావారు (మణిరత్నం) అన్నారు. నేను ఆయన్ను ఇష్టపడ్డాను. ఆయన ఈ చిత్రాన్ని ఇష్టపడ్డారు. అంటే మీరు (ప్రేక్షకులు) కూడా ఈ చిత్రాన్ని ఇష్టపడాలి (నవ్వుతూ)’’ అన్నారు. -
సెట్లో నుంచి హీరోయిన్ను ఎత్తుకెళ్లిపోయా: హీరో
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తాజాగా కేస్ తో బంతా హై అనే కామెడీ షోలో పాల్గొన్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో హోస్ట్ రితేష్ దేశ్‌ముఖ్.. అభిషేక్ బచ్చన్ సెట్స్‌లో కొన్ని వస్తువులు దొంగతనం చేశాడని సరదాగా ఆరోపించాడు. దీనికి అభిషేక్ స్పందిస్తూ.. అవును, గురు సెట్స్‌లో ఐశ్వర్య రాయ్‌ను ఎత్తుకెళ్లిపోయాను అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే గురు సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్, ఐశ్వర్య ప్రేమలో పడ్డారు. ఆ వెంటనే 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2012లో కూతురు ఆరాధ్య జన్మించింది. చదవండి: 'బింబిసార'లో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా? మూడు రోజుల్లో సీతారామం ఎంత రాబట్టిందంటే? -
మరోసారి తల్లికాబోతున్న ఐశ్వర్య?.. వీడియో వైరల్
అందాల తార ఐశ్వర్యరాయ్ మరోసారి గర్భవతి అయ్యిందా? అంటూ కొద్ది రోజులుగా బి-టౌన్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గతంలోనూ ఐష్ రెండోసారి తల్లికాబోతుందంటూ వార్తలు వచ్చినా ఈసారి మాత్రం కాస్తా గట్టిగానే వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఇటీవల విమానాశ్రయంలో కనిపించిన ఐశ్వర్య వీడియోనే. ముంబై విమానాశ్రయంలో భర్త అభిషేక్ బచ్చన్, కూతరు ఆరాధ్యలతో కలిసి ఐశ్వర్య దర్శనం ఇచ్చింది. చదవండి: నటికి షాకిచ్చిన కొత్త బాయ్‌ఫ్రెండ్, 2 గంటల పాటు ఎయిర్ పోర్టులోనే.. ఇందులో ఐష్ కాస్తా బొద్దుగా, పొట్ట భాగంగా ముందుకు ఉన్నట్లుగా అనిపించింది. అంతేకాదు ఈ వీడియోలో ఆమె తన పొట్టను దాచే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా కనిపించడంతో అందరూ ఆమె ప్రెగ్నెంట్ అని ఫిక్స్ అయిపోయారు. దీంతో తాను మరోసారి గర్భవతి అయ్యిందని, అందుకే పొట్ట భాగాన్ని కవర్ చేసుకుంటుందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పొరపాటు పడ్డ ఈ సారి మాత్రం ఐష్ నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యిందంటూ ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. ‘బచ్చన్ ఫ్యామిలీ బుల్లి వారసుడు రావాలని, ఆరాధ్య పాపకు తమ్ముడు వస్తున్నాడు’ అంటూ ఆ వీడియోకు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తన ప్రెగ్నెన్సీ రూమర్లపై ఐష్ స్పందించకపోవడం గమనార్హం. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే బచ్చన్ ఫ్యామిలీ స్పందించేవరకు వేచి చూడక తప్పదు. కాగా 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌లకు వివాహం కాగా.. 2011 నవంబర్ 16న వీరికి ఆరాధ్య జన్మించింది. Is Aishwarya Rai Bachchan pregnant? Viral videos, pictures spark speculations Read @ANI Story | https://t.co/jeCE6Ilkqi#AishwaryaRai #AishwaryaRaiBachachanPregnant #AbhishekBachchan #Bollywood pic.twitter.com/Lzf58ir3qE — ANI Digital (@ani_digital) July 20, 2022 -
ఒక్క పాట కోసం 300 మంది డ్యాన్సర్లు.. 25 రోజులు చిత్రీకరణ
Ponniyin Selvan: 25 Days Shoot With 300 Dancers: ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. ఈ చిత్రం పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా రూపొందింది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో విక్రమ్, కార్తీ ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఇదివరకు సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర అప్డేట్ తెలిసింది. భారీ చారిత్రక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక పాటను సుమారు 300 మంది డ్యాన్సర్స్‌తో చిత్రీకరించారు. ఈ 300 మంది డ్యాన్సర్స్‌తో సుమారు 25 రోజులపాటు షూటింగ్ చేశారని సమాచారం. ఈ డ్యాన్సర్స్‌లో 100 మందిని ప్రత్యేకంగా ముంబై నుంచి రప్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 30న వరల్డ్‌వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో -
ప్రతీకారానికి అందమైన రూపం.. ఐశ్వర్య రాయ్ లుక్
Aishwarya Rai Ponniyin Selvan First Look Poster: ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 1955లో కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడా మణిరత్నం. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమాలోని నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన విక్రమ్, కార్తీ పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేలా ఉన్నాయి. తాజాగా ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్‌ను బుధవారం (జులై 6) రివీల్ చేసింది చిత్రబృందం. 'ప్రతీకారానికి అందమైన రూపం. నందిని.. పళవూరు రాణి' అంటూ సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్య రాయ్ క్యారెక్టర్‌ను ప్రకటించారు. ఇందులో మనోహరమైన రూపంతో పగ, ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న పళవూరు రాణి నందినిగా ఐశ్వర్య రాయ్ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్లో ఐశ్వర్య రాయ్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ప్రపంచంలోనే ఖరీదైన వజ్రం తమన్నా సొంతం.. కోట్లలో ఆస్తులు.. ఏ దేశపు మహారాణి.. గొడుగు కొనుక్కోడానికి డబ్బులు లేవా ? Vengeance has a beautiful face! Meet Nandini, the Queen of Pazhuvoor! #PS1 releasing in theatres on 30th September in Tamil, Hindi, Telugu, Malayalam and Kannada. 🗡@madrastalkies_ #ManiRatnam @arrahman pic.twitter.com/HUD6c2DHiv — Lyca Productions (@LycaProductions) July 6, 2022 -
Fashion: కాన్స్.. మన తారల లుక్ అదుర్స్! డ్రెస్ ఎంపికలోనే అంతా!
ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకునే వేదిక అది.. అందం, హుందాతనం కలిసి నడిచే కార్పెట్ అది. అందరి చూపులను తమ వైపు పడేలా చేయాలంటే అందుకు తగిన డ్రెస్ ఎంపిక ఎంతో ప్రత్యేకంగా ఉండాలి. సమయం, సందర్భం, సీజన్... ఇలా వేడుకకు తగిన నియమాలనూ పాటించాలి. ఇవన్నీ మన కళ్లకు కడుతుంది కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్. రెడ్ కార్పెట్‌పైన మన తారలు వెదజల్లిన జిలుగులు ఇవి.. దీపికా పదుకోన్ సబ్యసాచి డిజైనర్ శారీ ధరించిన దీపిక రెడ్‌కార్పెట్‌పై హుందాతనాన్ని ప్రదర్శించింది. ఈ ఫిల్మోత్సవంలో దీపికా పదుకోన్ తన ఫ్యాషన్ పరంపరను కొనసాగించింది. లేత అకుపచ్చ రంగులో ఉన్న గౌన్ నిండా పింక్ గులాబీలు, ఆకులతో ఆమె నవ్వులతో పోటీపడుతున్నట్టుగా ఉన్నాయి. మ్యాచింగ్ బూట్లు మరింత ఆకర్షణీయంగా అమరాయి. ఐశ్వర్యా బచ్చన్ ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌజ్ ‘డోల్స్ అండ్ గబ్బానా’ డిజైనర్ బ్లాక్ శాటిన్ గౌన్‌ను ధరించింది ఐశ్వర్యాబచ్చన్. అంచు భాగం వెడల్పాటి ఫ్లేర్‌తో, అందమైన పువ్వులతో డిజైన్ చేసిన ఈ గౌన్ విశేషంగా ఆకట్టుకుంది. వెస్ట్రన్ పార్టీలో ఫ్లోరల్స్కున్న ఘనతను ఇలా చాటింది. పూజా హెగ్డే లెబనీస్ ఫ్యాషన్ బ్రాండ్ మైసన్ గేయన్నా బాల్ గౌన్‌తో కాన్స్‌లో సందడి చేసింది పూజా హెగ్డే. ఫెదర్ డిజైన్ ఈ గౌన్ ప్రత్యేకతను మరింత పెంచింది. పొనీటెయిల్, లాంగ్ హ్యాంగింగ్స్‌తో సింపుల్ అనిపించే ఆహార్యంతో ఆకట్టుకుంది పూజా. తమన్నా డిజైనర్స్ గౌరీ అండ్ నైనిక రూపొందించిన గౌనులో తమన్నా రెడ్ కార్పెట్‌పైన సందడి చేసింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో శాటిన్ నెక్లైన్తో తన రూపాన్ని మరింతగా హైలైట్ చేసింది. నర్గిస్ ఫక్రీ టర్కీ డిజైనర్ నెడ్రెట్ టాసిరోగ్లు రూపొందించిన బేబీ పింక్ కలర్ షిమ్మర్ డ్రెస్‌లో రెడ్ కార్పెట్‌పైన నడిచింది నర్గీస్ ఫక్రీ. హాల్టర్ నెక్ ఈ డ్రెస్ ప్రత్యేకత. నడుము వరకు సరైన ఫిటింగ్‌తో ఉన్న గౌన్ కింది భాగమంతా వెడల్పాటి ఫ్లెయర్తో ఆకట్టుకుంది. అదితీరావు హైదరీ ఇండియన్ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన స్లీవ్డ్ బ్లాక్ గౌన్‌ను ధరించి ఫిల్మోత్సవంలో పాల్గొంది అదితీరావు హైదరీ. ఫ్లోరల్ లేస్, క్రూ నెక్, ఎంబ్రాయిడరీ ఈ డ్రెస్ ప్రత్యేకతలు. అంతేకాదు గౌన్ హైలైట్ అయ్యేలా డిజైనర్ బ్రాండ్ బెల్ట్, రాయల్ బెంగాల్ టైగర్ గోల్డ్ యాక్ససరీస్.. కార్పెట్‌పైన స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఊర్వశి రౌతేలా టోనీ వార్డ్ కోచర్ నుండి తీసుకున్న తెల్లటి రఫుల్డ్ గౌన్‌లో రెడ్ కార్పెట్ మీద మెరిసింది ఊర్వశి రౌతేలా. రఫుల్స్‌తో విప్పారినట్టుగా ఉన్న గౌన్‌ను నడుము, భుజం వద్ద జత కలిపిన డిజైన్ డ్రెస్‌కి మరింత అందాన్నిచ్చింది. చదవండి👉🏾 Catherine Tresa: ఈ హీరోయిన్ ధరించిన అంగ్రఖా కుర్తా ధర 32వేలు! డ్రెస్ ప్రత్యేకత ఇదే! -
అంత లావైందేంటి? ఐశ్వర్యరాయ్ ప్రెగ్నెంటా?
ఇరవై ఏళ్లుగా కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటోంది ఐశ్వర్యరాయ్. ఇన్నేళ్లలో ఒకటీరెండు సార్లు మినహా ప్రతిసారి ఐష్ లుక్‌తో అదరగొట్టింది. ఈ సారి రంగురంగుల పువ్వులతో డిజైన్ చేసిన నలుపు రంగు పొడవాటి గౌనులో రెడ్ కార్పెడ్పై మెరిసిందామె. ఆమెను అలా చూసిన ఫ్యాన్స్ బ్యూటిఫుల్, దేవత అని కీర్తించారు. కానీ కొందరు మాత్రం ఎప్పటిలాగే ఆమెను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. 'డ్రెస్‌లో ఐశ్వర్యరాయ్ చాలా బాగుంటుంది. కానీ ఈ సారి ఎందుకో కొంత లావైనట్లు కనిపిస్తోంది. బహుశా గర్భం దాల్చడం వల్లో లేదంటే వయసు మీద పడటం వల్లో బొద్దుగా మారినట్లుంది' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 'మరీ అతిగా ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుని అందాన్ని నాశనం చేసుకున్నావ్', 'ముసలామెవైపోయావు, నీకింక తల్లి పాత్రలు మాత్రమే వస్తాయి', 'సడన్‌గా ఇంత లావైపోయిందేంటి?' అని మరికొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెను హేళన చేస్తున్నారు. కాగా కాన్స్ ఫెస్టివల్లో తళుక్కుమని మెరిసిన ఐశ్వర్య ఆదివారం నాడు భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి ముంబైకి తిరిగి వచ్చేసింది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) చదవండి 👇 నటితో ఎఫైర్ పెట్టుకో, ఫేమస్ చేస్తామన్నారు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ ఎన్ని లక్షలు గెలుచుకుందో తెలుసా? -
కాన్స్ చిత్రోత్సవాల్లో ఐశ్వర్యరాయ్.. బ్యూటిఫుల్, దేవత అంటూ ప్రశంసలు
రంగు రంగుల పువ్వులతో డిజైన్ చేసిన నలుపు రంగు పొడవాటి గౌనులో ఐశ్వర్యా రాయ్ కాన్స్ రెడ్ కార్పెట్‌పై మెరిశారు. 20 ఏళ్లుగా ఈ బ్యూటీ కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇన్నేళ్లల్లో ఒకటీ రెండు సార్లు మినహా ఐష్ ప్రతి లుక్ ఆకట్టుకుంది. ఈసారి కూడా ఆమె లుక్‌కి ప్రశంసలు లభించాయి. ‘ఆల్ టైమ్ క్వీన్, బ్యూటిఫుల్, దేవత, అదుర్స్..’ ఇలా ఐష్ లుక్‌ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్యతో కలిసి ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు ఐశ్వర్య. ఈ ఉత్సవాల్లో తన స్నేహితురాలు, హాలీవుడ్ స్టార్ ఇవా లంగోరియాని కలిశారు ఐష్. ఆరాధ్యను ఇవా హత్తుకోగా, ఇవా కుమారుడు శాంటిగోని ఉద్దేశించి ‘హ్యాండ్సమ్’ అన్నారు ఐశ్వర్యా రాయ్. ‘‘నా ఆల్‌టైమ్ ఫేవరెట్ పర్సన్’’ అంటూ ఐశ్వర్యతో తాను దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇవా లంగోరియా. ఈ నెల 17న ఆరంభమైన కాన్స్ చలన చిత్రోత్సవాలు 28 వరకూ జరుగుతాయి. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) చదవండి 👇 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పెద్ద సినిమాలు, అవేంటంటే? ఎన్టీఆర్ అభిమానులపై హైదరాబాద్ పోలీసులు లాఠీచార్జ్ -
12 ఏళ్ల తర్వాత రజినీతో నటించనున్న ఐశ్వర్యరాయ్
హీరో రజినీకాంత్– హీరోయిన్ ఐశ్వర్యారాయ్ మరోసారి జోడీ కడుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. వీరిద్దరూ తొలిసారి జంటగా నటించిన చిత్రం ‘రోబో’. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2010లో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రజనీ–ఐష్ జోడీకి మంచు మార్కులే పడ్డాయి. ‘రోబో’ రిలీజైన పుష్కరానికి (పన్నెండేళ్లు) మరోసారి వీరు జోడీగా నటించనున్నారని టాక్. రజినీకాంత్ నటించనున్న 169వ సినిమాకి నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట నెల్సన్. ఇందులో రజినీకి జోడీగా ఐశ్వర్య కనిపించబోతున్నారని భోగట్టా. ఈ జోడీ మరోసారి మ్యాజిక్‌ను క్రియేట్ చేయడం ఖాయం అంటోంది కోలీవుడ్. త్వరలోనే ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ కీలక పాత్ర చేయనున్నారని టాక్. -
ఆమె బయోపిక్‌లో నటించాలనుంది: మాళవిక మోహనన్
Malavika Mohanan Would Like To Act In Aishwarya Rai Biopic Movie: ఐశ్వర్య రాయ్ బయోపిక్‌లో నటించాలనుందనే కోరికను హీరోయిన్ మాళవిక మోహనన్ వ్యక్తం చేశారు. మాళవిక మోహనన్ 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత కోలీవుడ్‌లో తొలిసారిగా రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన 'పేట' చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తెలుగులో విడుద కాగా ఆ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా ధనుష్‌తో జత కట్టిన 'మారన్' చిత్రం ఈ నెల 11వ తేదిన విడుదల కానుంది. ఇందులో నటించిన అనుభవాన్ని మాళవిక మీడియాతో పంచుకుంటూ తాను ఇంతకుముందు నటించిన చిత్రాలు అన్నింటికంటే పూర్తి నిడివి గల పాత్రను ఈ చిత్రంలోనే చేశానన్నారు. సోషల్ మీడియా రాతలు కష్టం కలిగిస్తున్నా, అలాంటివి మంచి అనుభవం కూడా అని పేర్కొన్నారు. ఐశ్వర్యరాయ్ బయోపిక్‌తో చిత్రాన్ని నిర్మిస్తే అందులో నటించాలను ఉందన్నారు. ఇదిలా తన గ్లామర్ ఫొటోలతో తరచుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు మాళవిక మోహనన్. ఆ మధ్య బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌తో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు తెగ షికార్లు చేసిన సంగతి తెలిసిందే. -
'పొన్నియన్ సెల్వన్' రిలీజ్ డేట్ ప్రకటన.. సూపర్బ్‌గా ఐశ్వర్య రాయ్, త్రిష పోస్టర్స్
Mani Ratnam Ponniyin Selvan Movie Release Date Out With Posters: ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్' చిత్రం. మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మొదటి భాగం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది సెప్టెంబర్ 30న 'పొన్నియన్ సెల్వన్' పార్ట్ 1ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. Wishing our Producer Allirajah Subaskaran a very happy birthday! The Golden Era comes to the big screens on Sept 30th! 🗡#PS1 #PS1FirstLooks @LycaProductions pic.twitter.com/60XRY8egM6 — Madras Talkies (@MadrasTalkies_) March 2, 2022 దీంతోపాటు ఐశ్వర్య రాయ్, త్రిష, విక్రమ్, జయం రవి, కార్తీ ఫస్ట్ లుక్‌లను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లలో ఐశ్వర్య రాయ్, త్రిష యువరాణుల్లాగా కనిపించగా విక్రమ్, జయం రవి యుద్ధ వీరుల్లాగా దర్శనమిచ్చారు. ఇక కార్తీ విభిన్నమైన లుక్‌లో అలరించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాకు ఆస్కార్ గ్రహిత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్ ఏమేరకు సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. -
ఐశ్వర్యరాయ్‌పై అగ్గిమీద గుగ్గిలమవుతున్న నెటిజన్లు
గానకోకిల, భారతరత్న గ్రహీత లతా మంగేష్కర్ మరణవార్త సంగీతప్రియులనే కాదు యావత్ ప్రజానీకాన్ని శోకసంద్రంలో ముంచివేసింది. ఆమె లేని లోటును ఎవరూ పూడ్చలేరంటూ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కాస్త ఆలస్యంగా నివాళులు అర్పించింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ ఆమె ఫోటోను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. లతాజీ ఆదివారం నాడు (ఫిబ్రవరి 6న) మరణిస్తే ఇంత ఆలస్యంగా స్పందిస్తారా? అని నెటిజన్లు ఆమెను చెడామడా తిడుతున్నారు. ఏంటి, ఇప్పుడు నిద్ర లేచారా? మీకీవార్త ఇప్పుడు తెలిసిందా? అని ఫైర్ అవుతున్నారు. అయితే ఐశ్వర్య ఫ్యాన్స్ మాత్రం ఆమెను వెనకేసుకొస్తున్నారు. తను ఎక్కువగా ఫోన్ వాడదని, అందువల్లే లేట్‌గా పోస్ట్ పెట్టి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
వ్యక్తిగత విమర్శలు.. శాపనార్థాలు పెట్టిన జయా బచ్చన్
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగతున్నాయి. పలు కీలక అంశాలపై విపక్షాలు.. అధికార పార్టీని.. ఇరుకున పెడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాజ్యసభలో వ్యక్తిగత దూషణలు చోటు చేసుకున్నాయి. సమాజ్‌వాద్ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభ వేదికగా శాపనార్థాలు పెట్టారు. ఓ ఎంపీ జయా బచ్చన్‌ను ఉద్దేశించి.. వ్యక్తిగత విమర్శలు చేయడంతో.. సహనం కోల్పోయిన జయా బచ్చన్.. సదరు ఎంపీని శపించారు. ఆ వివరాలు.. మాదక ద్రవ్యాల కట్టడికి సంబంధించిన బిల్లుపై సోమవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సమయంలో జయా బచ్చన్ ఎవరిని టార్గెట్ చేసి.. విమర్శించలేదు కానీ.. ట్రెజరీ బెంచీలపై ఆరోపణలు చేశారు. అంతేకాక అధికారంలో ఉన్న వారు విపక్షాల వాదనలు పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. (చదవండి: లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ) ఈ సందర్భంగా భువనేశ్వర్ కల్ అధ్యక్షతన జరిగిన సభను ఉద్దేశించి జయా బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘మీరు న్యాయంగా ఉండాలి. ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు. మీ నుంచి మేం ఏం ఆశిస్తాం.. సభలో ఏం జరుగుతుందో చూస్తున్నారా.. మనం చర్చించడానికి చాలా అంశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఓ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చింది. దానిలో ఉన్న లోటుపాట్లను మనం చర్చించి.. ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు తెలియజేయాలి’’ అంటూ జయా బచ్చన్ ప్రసంగించసాగారు. (చదవండి: మీ తీరు మారకపోతే.. మార్చాల్సి ఉంటుంది: మోదీ) జయా బచ్చన్ ఇలా మాట్లాడుతుండగా.. బీజేపీ ఎంపీ రాకేశ్ సిన్హా.. ఆమె కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావించి.. ఆరోపణలు చేశారు. పనామా పేపర్స్ వ్యవహారంలో జయా బచ్చన్ కోడలు.. ఐశ్వర్య రాయ్ ఈడీ విచారణకు హాజరైన సంఘటనను ప్రస్తావించారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన జయా బచ్చన్.. ‘‘త్వరలోనే మీ జీవితంలోకి దుర్దినాలు రాబోతున్నాయి. మీకిదే నా శాపం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక.. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని జయా బచ్చన్ డిమాండ్ చేశారు. చదవండి: సెల్ఫీ కోసం ఆరాటం.. అభిమానిని తోసేసిన సీనియర్ నటి -
ఐశ్వర్య రాయ్‌కు ఈడీ సమన్లు.. ఎందుకంటే ?
Aishwarya Rai Got ED Notices In Panama Paper Case: పనామా పేపర్ల లీక్ కేసు బచ్చన్ కుటుంబానికి కష్టాలు తెచ్చిపెట్టాయి. ఈ వ్యవహారంలో నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఇవాళ (డిసెంబర్ 20) ఢిల్లీలోని లోక్‌నాయక్ భవన్లో తమ ఎదుట హాజరు కావాలని ఈడీ ఆదేశించినట్లు సమాచారం. ఈడీ ఆదేశాల ప్రకారం అధికారుల ముందు ఇవాళ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈడీ అధికారులు ప్రశ్నల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ పనామా పేపర్స్ కేసులో భారత్ నుంచి సుమారు 500 మందికి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఇందులో నాయకులు, నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పనామా పేపర్ల కేసుపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈడీ అధికారులు దేశంలోని పలువురు ప్రముఖులను విచారణలో చేర్చారు. అందులో భాగంగా నెల రోజుల క్రితం అభిషేక్ బచ్చన్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేయగా అధికారుల ముందు హాజరయ్యారు. ఈడీ అధికారులకు అభిషేక్ కొన్ని పత్రాలను అందజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్‌కు సమన్లు జారీ కావడం చర్చనీయంగా మారింది. -
నన్ను ట్రోల్ చేయండి.. నా కూతురి జోలికొస్తే ఊరుకోను: హీరో
Abhishek Bachchan Lashes Out At Trolls Attacking Daughter Aaradhya: సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్తైనా క్షణాల్లో వైరలవుతుంది. వారితో పాటు వాళ్ల ఫ్యామిలీపై కూడా జనాల అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు ఇబ్బందిగానూ అనిపిస్తుంది. తమ అంచనాలకు తగ్గట్లు వారితో ఏమాత్రం మార్పులు కనిపించినా జనాలు తెగ ట్రోల్ చేసేస్తుంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితే బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్‌లకు సైతం ఎదురైంది. ఇటీవలె కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లిన బచ్చన్ ఫ్యామిలీ ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంట పడింది. ముఖ్యంగా ఆరాధ్య నడకపై అందరి ఫోకస్ వెళ్లింది. ఐశ్వర్య ఎప్పుడూ కూతురి చేయి పట్టుకొనే నడిపించడం, ఆరాధ్య వంకరగా నడుస్తుందంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న అభిషేక్ బచ్చన్.. తన కూతురి నడకపై చేస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు. నేను పబ్లిక్ ఫిగర్‌ని. నన్ను ఎంతైనా ట్రోల్ చేయండి పడతాను. కానీ నా కూతుర్ని అనేడానికి మీకు హక్కు లేదు. దమ్ముంటే ఆ మాటలు నా ఎదురుగా వచ్చి అనండి అంటూ ట్రోలర్స్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం అభిషేక్ చేసిన ఈ కామెంట్స నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
Aaradhya Birthday:ఆరాధ్య పదో బర్త్‌డే.. మాల్దీవుల్లో బచ్చన్ ఫ్యామిలీ చిల్లింగ్
బాలీవుడ్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కుమార్తె ఆరాధ్య ముగ్గురు మాల్దీవుల్లో చిల్ అవుతున్నారు. నవంబర్ 13న ఈ ముగ్గురు ముంబై విమానాశ్రయంలో కెమెరాలకు చిక్కారు. అభిషేక్, ఐశ్వర్య నుదిటిపై తిలకంతో క్యాజువల్స్ వేర్స్‌లో కనిపించారు. బచ్చన్ వంశం కుటుంబ సెలవుల కోసం మాల్దీవులకు వెళ్లినట్లు తెలిసిందే. ఈ దంపతుల కుమార్తె ఆరాధ్య నవంబర్ 16న 10 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. అయితే కూతురు బర్త్‌డేను మాల్దీవుల్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) ఐశ్వర్య రాయ్ మాల్దీవుల దీవుల్లో చిల్ అవుతున్న దృశ్యాన్ని ఇన్‌స్టా గ్రామ్‌లో పంచుకున్నారు. ఆ స్నాప్‌ను షేర్ చేసి, 'సన్ బ్రీజ్ అండ్ ప్యారడైజ్' అని క్యాప్షన్ ఇచ్చారు. అభిషేక్ కూడా దీవుల నుంచి ఒక చిత్రాన్ని షేర్ చేస్తూ 'మేల్కొల్పడానికి చెడు దృశ్యం కాదు' అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) గత సంవత్సరం, 2020లో, ఐశ్వర్య సోషల్ మీడియాలో ఆరాధ్యతో ఉన్న ఒక అందమైన స్నాప్‌ను షేర్ చేశారు. అందులో, " నా జీవితపు సంపూర్ణ ప్రేమ, నా ప్రియమైన దేవదూత ఆరాధ్యా.. నేను నిన్ను ఎప్పటికీ, నిత్యం, అనంతంగా ప్రేమిస్తాను. నేను తీసుకుంటున్న ప్రతి శ్వాస నీకోసమే అయినందుకు దేవుడికి కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యూ లవ్' అంటూ 9వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆరాధ్య నవంబర్ 16, 2011లో జన్మించింది. -
రెండోసారి గర్భవతి అయిన ఐశ్వర్యరాయ్?వీడియోతో లీక్!
Is Aishwarya Rai Bachchan Pregnant For Second Time: అందాల తార ఐశ్వర్యరాయ్ మరోసారి గర్భవతి అయ్యిందా? బచ్చన్ ఫ్యామిలీకి మరో వారసుడు రానున్నాడా అనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్య.. భర్త అభిషేక్, కూతురు ఆరాధ్యలతో కలిసి మీడియా కంటపడింది. ఆ సమయంలో ఒక్కసారిగా చేతిలో ఉన్న హ్యండ్‌బ్యాగ్‌ని ఐశ్వర్య పొత్తి కడుపుకి అడ్డుగా పెట్టుకుంది. అంతేకాకుండా కూతురు ఆరాధ్యను సైతం దగ్గరికి తీసుకుంది. బెల్లీని చాలా వరకు దాచి ఉంచే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీంతో ఐశ్వర్య రెండోసారి గర్భవతి అయ్యిందనే రూమర్స్‌కి బలం చేకూరినట్లయ్యింది. అయితే ఇప్పటివరకు ఐశ్వర్య కాని, బచ్చన్ ఫ్యామిలీ కానీ ఈ విషయంపై స్పందించలేదు. కాగా 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌లకు వివాహమైంది. 2011 నవంబర్ 16న వీరికి ఆరాధ్య జన్మించింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఐష్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ ఫిక్షన్ స్టోరీ ‘పొన్నియన్ సెల్వన్’లో నటిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. View this post on Instagram A post shared by Koimoi.com (@koimoi) -
తెల్లటి దుస్తుల్లో అదరగొట్టిన అందాల ఐశ్యర్య రాయ్...
-
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిపోయిన ఐశ్యర్యా రాయ్
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ మరోసారి ర్యాంప్‌పై దేవతలా మెరిసిపోయింది. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో కాస్మెటిక్ బ్రాండ్ లోరియల్ అక్టోబర్ 3న నిర్వహించిన ఈవెంట్లో వైట్ కలర్ దుస్తుల్లో ర్యాంప్ వ్యాక్ చేసి అక్కడున్నవారినందరినీ మెస్మరైజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న సెలబ్రిటీ మహిళలతో ఈఫిల్ టవర్ దగ్గర నిర్వహించిన ఈవెంట్లో ఐశ్యర్య రాయ్ సందడి ట్రెండింగ్‌లో నిలిచింది. ‘లే డిఫైల్ లోరియల్ పారిస్ 2021 విమెన్స్ వేర్ సమ్మర్ 2022 షో’ పారిస్‌లో ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత, వేధింపులకు వ్యతిరేకంగా ప్రచారం థీమ్‌తో ఈ ఏడాది ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్టు ఎల్ ఓరియల్ పారిస్ గ్లోబల్ బ్రాండ్ ప్రెసిడెంట్ డెల్ఫిన్ విగుయర్-హోవాస్సే ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను లోరియల్ పారిస్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈఫిల్ టవర్ బ్యాక్ గ్రౌండ్లో ప్రముఖ యాక్టర్స్ హెలెన్ మిరెన్, కేథరీన్ లాంగ్‌ఫోర్డ్, గాయని కెమిలా కాబెల్లో, అంబర్ హర్డ్ తదితర ప్రపంచవ్యాప్త సూపర్ సూపర్ మోడల్స్ తో ఈ వేడుక జరుపుకోవడం విశేషం. ఈ ఈవెంట్ కోసం ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్ , కుమార్తె ఆరాధ్యతో కలిసి గత వారమే పారిస్ వెళ్లింది. ఈ క్రమంలో అభిషేక్ ఒక వీడియోను కూడా షేర్ చేశాడు. కాగా 2018, 2019 లో ఫ్యాషన్ వీక్‌లో కూడా ఐశ్వర్య మెరిసిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) When she walk around the corner looks like a diamond in the water 💧 I know this girl make me crazy this love is a natural love ❤️ #AishwaryaInParis #AishwaryaRaiBachchan #AishwaryaRai pic.twitter.com/xZwz7IuU4P — Aishwarya Rai (@my_aishwarya) October 3, 2021 View this post on Instagram A post shared by L'Oréal Paris Official (@lorealparis) -
పొన్నియిన్ సెల్వెన్: ఐష్‌తో ప్రత్యేకంగా భారీ పాట, 400 మందితో..
‘డోలా రే డోలా’, ‘కజ్రారే’, ‘తాళ్ సే తాళ్ మిలా’ వంటి పాటల్లో ఐశ్వర్యారాయ్ డ్యాన్స్ అదుర్స్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఐష్‌ని అలాంటి మరో పాటలో చూసే అవకాశం ఉంది. మణిరత్నం దర్శకత్వంలో రపొందుతున్న ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో యువరాణి నందిని పాత్ర చేస్తున్నారు ఐశ్వర్యారాయ్. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సినిమా సెట్లో ఐశ్వర్యపై ఓ భారీ పాటను చిత్రీకరించారని సమాచారం. చదవండి: ‘ఆ సన్నివేశాలు ఎంజీఆర్, జయలలితలను కించపరిచేలా ఉన్నాయి’ ఈ పాట కోసం స్పెషల్‌గా రిహార్సల్స్ కూడా చేశారట ఐశ్వర్య. కాస్ట్యమ్స్ విషయంలోన కేర్ తీసుకున్నారట. ఇంకో విశేషం ఏంటంటే... ఈ పాటలో ఐశ్వర్యతో పాటు నాలుగు వందల మందికిపైగా డ్యాన్సర్లు కనిపిస్తారని టాక్. గతంలో చేసిన ‘డోలా రే డోలా’, ‘కజ్రారే’, ‘తాళ్ సే తాళ్ మిలా’ పాటలకు ఐశ్వుర్య చప్పట్లు అందుకున్నారు. ఈ పాటలో నృత్యానికి ప్రేక్షకుల నుంచి మరోసారి ఆమె చప్పట్లు అందుకోవడం ఖాయం అంటున్నారట చిత్రయూనిట్. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, త్రిష తదితరులు నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. -
‘ఐశ్యర్య రాయ్‌కి నటన రాదు, బ్యాడ్ యాక్టింగ్‌కు ఉదాహరణ ఆమె’
Russell Peters Comments On Aishwarya Rai Acting: మాజీ విశ్వ సుందరి, లేడీ సూపర్ స్టార్ ఐశ్వర్యరాయ్ బచ్చన్‌పై కమెడియన్ రస్సెల్ పీటర్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐశ్యర్య రాయ్ బ్యాడ్ యాక్టింగ్‌కు సరైన ఉదాహరణ అంటూ విమర్శించాడు. కాగా రస్సెల్ పీటర్స్ కెనడాకు చెందిన స్టాండప్ కమెడియన్, నిర్మాత. అయితే ఐశ్యర్య ఎన్నో సినిమాల్లో నటించి భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ‘హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాసు, జోధా అక్భర్, గుజారిష్’ వంటి చిత్రాల్లో తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలా హీరోయిన్గా, విశ్వ సుందరిగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ఆమెపై రస్సెల్ పీటర్స్ గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. ఆ సమయంలో అక్షయ్ బచ్చన్ కుటుంబానికి క్షమాపణలు కోరాడు. చదవండి: సిద్ధార్థ్ శుక్లా మృతి: ఆసుపత్రిలో చేరిన బిగ్‌బాస్ బ్యూటీ కాగా అక్షయ్ ఇండో-కెనడియన్ చిత్రంలో నటించిన ఈ మూవీ వచ్చి పదేళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ సమయంలో చోటుచేసుకున్న ఈ సంఘటన మరోసారి తెరపైకి వచ్చింది. 2011 వచ్చిన ఇండో-కెనడియన్ సినిమా ‘స్పీడీ సింగ్స్’ ప్రమోషన్లో భాగంగా రస్సెల్ పీటర్స్ ఇండియాకు వచ్చాడు. ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో జరిగిన ఈ మూవీ కార్యక్రమంలో రస్సెల్ మాట్లాడుతూ.. బాలీవుడ్ పరిశ్రమ, ఐశ్వర్య రాయ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు అతడు ‘నాకు బాలీవుడ్ పరిశ్రమ అంటే నచ్చదు. హిందీ సినిమాల్లో అంతా చెత్త ఉంటుంది. జస్ట్ టెర్రిబుల్. ఇది నా ఓపినియన్. కానీ బాలీవుడ్ సినిమాలకు, నటీనటులకు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. నా జీవిత కాలంలో ఇంతవరకు నేను బాలీవుడ్ సినిమా చూడలేదు. ఎందుకంటే నాకు వారి పాటలు, డ్యాన్స్‌లు, నటన అంటే అసలు నచ్చదు’ అంటూ విమర్శించాడు. చదవండి: భర్తపై దీపికా ఫిర్యాదు, రణవీర్ రొమాంటిక్ రిప్లై అంతేగాక ‘బ్యాడ్ యాక్టింగ్‌కు ఐశ్వర్యరాయ్ పర్ఫెక్ట్ ఉదహరణ. ఈ విషయాన్ని తను చాలా సార్లు రుజువు చేశారు. కేవలం తన అందమైన మొహంతోనే సూపర్ స్టార్ అయ్యారు. ఎలాగు ఆమె మంచి నటి కాకపోయిన అందమైన మొహం ఉంది అది చాలదా?. మంచి ఉద్యోగం, చివరకు అభిషేక్ బచ్చన్ ఆమెను తల్లిని చేయగలిగాడు’ అంటూ అసభ్య వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత అతడు చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందిగా పలు మహిళ సంఘాలు డిమాండ్ చేసిన రస్సెల్ మాత్రం క్షమపణలు కోరనని ఖరాఖండిగా చెప్పాడు. కాగా ఈ మూవీ తను ఓ భాగం అయినందున్న అక్షయ్ కుమార్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యలను రస్సెల్ తరపున క్షమపణలు కోరాడు. కాగా ప్రస్తుతం ఐశ్వర్య మణిరత్నం తాజా సినిమా ‘పొన్నియన్ సెల్వన్’ నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో విక్రమ్, జయం రవి, కార్తి, త్రిషతో పాటు పలువరు అగ్ర నటీనటులు భాగమవుతున్నారు. -
అభిషేక్‌కు గాయాలు.. హాస్పిటల్‌కు రాని ఐశ్వర్యరాయ్?
ముంబై : ప్రముఖ బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ గాయాలపాలైనట్లు సమాచారం. కొన్ని రోజుల కిందట ఓ సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ఆయన చేతికి గాయమైంది. తాజాగా ఆ గాయం మరోసారి తిరగబడటంతో ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై బచ్చన్ ఫ్యామిలీ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉండగా కూతురు శ్వేతా బచ్చన్‌తో కలిసి అమితాబ్ బచ్చన్ లీలావతి హాస్పిటల్‌కు వెళ్లారు. అయితే ఐశ్వర్యరాయ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో అభిషేక్ బచ్చన్ మరోవైపు అభిషేక్‌ను పరామర్శించడానికి ఐశ్వర్య హాస్పిటల్‌కు రాకపోవడం ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆమె మణిరత్నం డైరెక్షన్లో పొన్నియన్ సెల్వం అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్లో ఉన్న ఐశ్వర్య ఆదివారం రాత్రి ముంబైకి చేరుకుంది. కాగా ప్రస్తుతం అభిషేక్ బాబ్ బిస్వాస్, దాస్వి చిత్రాల్లో నటిస్తున్నారు. చదవండి: 'ఓ హీరోను టార్గెట్ చేసి బెదిరించడం కరెక్ట్ కాదు' షాకింగ్: నటి ప్రియాంక పండిట్ న్యూడ్ వీడియో లీక్, స్పందించిన నటి -
ఐశ్వర్యా, అభిషేక్‌లను కలిసిన నటి వరలక్ష్మీ.. పోస్ట్ వైరల్
మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న ఐశ్వర్యా రాయ్‌ని నటుడు శరత్‌కుమార్, ఆయన కుమార్తె, నటి వరలక్ష్మి కలిశారు. ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి, ఆనందం వ్యక్తం చేశారు వరలక్ష్మి. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
షూటింగ్ సమయంలో ధోతీ జారిపోతూ ఉండేది: షారుఖ్
దేవదాస్.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం. పారూ- దేవదాస్‌ల అమర ప్రేమకు దృశ్యరూపమైన ఈ హృద్యమైన ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. విషాదాంతంతో ముగిసే ఈ సినిమా భగ్న ప్రేమికుల హృదయానికి అద్దం పట్టింది. షారుఖ్, మాధురీదీక్షిత్(వేశ్య పాత్ర), ఐశ్వర్యారాయ్ పోటీపడి మరీ నటించి తమ తమ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్లో ఒకటిగా ఈ మూవీని పదిలం చేసుకున్నారు. ఇక సంజల్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామా విడుదలై 19 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. ఈ మేరకు సోమవారం ఇన్‌స్టా వేదికగా.. ‘దేవదాస్’ సినిమా షూటింగ్ సమయం నాటి పలు ఫొటోలను షేర్ చేశాడు. ‘‘అర్ధరాత్రి వరకు షూటింగ్‌లు... పొద్దుపొద్దున్నే నిద్రలేవడం.. అబ్బో ఎన్నో కష్టాలు.. అయితే అవన్నీ మంచి అవుట్‌పుట్‌ను ఇచ్చాయి... ఇందుకు కారణం.. దిగ్గజ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్, జాకీ ష్రాఫ్, కిరణ్ ఖేర్... ఇంకా టీం మొత్తం కలిసికట్టుగా పనిచేయడమే... అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని సహచర నటుల పట్ల ప్రేమను కురిపించాడు. అదే విధంగా... షూటింగ్ సమయంలో ధోతీ ఎప్పుడూ జారిపోతూ ఉండేదని, అన్నింటి కంటే తాను ఎదుర్కొన్న పెద్ద సమస్యే అదేనంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇక మాధురీ దీక్షిత్ సైతం.. ‘‘19 ఏళ్లు గడిచినా ఆ జ్ఞాపకాలు ఇంకా కొత్తగానే ఉన్నాయి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ సంజయ్’’ అని సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు చెప్పారు. అదే విధంగా ఇటీవల మరణించిన, ‘దేవదాస్’ దిలీప్ కుమార్(1955 నాటి సినిమా)ను ఈ సందర్భంగా మరోసారి నివాళి అర్పించారు. View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) -
విశ్వ సుందరి కిరీటం.. నేలపై కూర్చొని భోజనం.. ఐష్ ఓల్డ్ ఫోటో వైరల్
ఐశ్వర్యరాయ్.. అందానికే పర్యాయపదం ఈ పేరు. కుర్రకారు మొదలుకుని సినీ నిర్మాతల వరకూ ఆమె అందానికి ఆకర్షితులే. ప్రతి ఒక్కరు అందాన్ని ఆమెతో పోల్చి చెబుతారు. అలాంటి అందమైన స్త్రీ భూమ్మీద మరొకరు ఉండరని అంటుంటారు. ఈ పిల్లికళ్ల బ్యూటీ 1994లోమిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. మిస్ వరల్డ్ అయిన తర్వాత ఆ కిరీటంతోనే కింద కూర్చొని భోజనం చేసింది ఐశ్యర్య. ఈ అరుదైన ఫొటోను ప్రముఖ నటి అమీజాక్సన్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చెయ్యగా అది వైరల్ అవుతుంది. అందులో మిస్ వరల్డ్ కిరీటంతోనే మెరూన్ కలర్ చీరలో తల్లి బృందాతో కలిసి నేలపై కూర్చుని స్వహస్తాలతోనే భోజనం చేస్తున్నారు. 1994 లో మిస్ ఇండియా పోటీలో ఐశ్వర్య మొదటి రన్నరప్. ఆమె కిరీటాన్ని సుష్మితా సేన్ చేతిలో కోల్పోయింది. తరువాత, ఇద్దరూ వరుసగా మిస్ వరల్డ్ మరియు మిస్ యూనివర్స్ కిరీటాలను గెలుచుకున్నారు. అమీ జాక్సన్ కూడా 2009లో మిస్ టీన్ వరల్డ్‌గా గెలుపొందారు. అంతేకాదు..2010 లో మిస్ ఇంగ్లాండ్ టైటిల్ పోటీల్లో రన్నరప్ కిరీటాన్ని గెలుపొందారు. 6 ఏళ్లకే మోడల్ గా కెరీర్ ప్రారంభించిన అమీ పలు సినిమాల్లో కూడా నటించారు. View this post on Instagram A post shared by Nineties Violet 🔮 (@90s.violet) -
ఐశ్.. 75 లక్షల చీర కట్టింది.. మరి శిల్పా, కరీనా ఏమైనా తక్కువా!?
వెబ్‌డెస్క్: సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని మధుర జ్ఞాపకం అంటే వివాహమే. ఒంటరిగా సాగుతున్న జీవన ప్రయాణంలో భాగస్వామి అడుగుపెట్టడంతో జీవితం పరిపూర్ణమైనట్లుగా భావిస్తారు చాలా మంది. అచ్చంగా మన సొంతమయ్యే తోడుతో బంధం ఏర్పడే ఆ అపురూప ఘట్టం ఎంతో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు పెళ్లిరోజున ఎలాంటి దుస్తులు, ఆభరణాలు ధరించాలి.. ఆపాదమస్తకం ఎలా తయారు కావాలి అన్న విషయాల గురించి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. తమ స్తోమతకు తగ్గట్లుగా బడ్జెట్లో అన్ని ప్లాన్ చేసుకుంటారు. ఇక సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. అయితే, మనలాగా ఆర్థిక లెక్కల గురించి ఎక్కువగా ఆలోచించకుండా పెళ్లిరోజు మరింత అందంగా కనబడేందుకు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఐశ్వర్యారాయ్ మొదలు ప్రియాంక చోప్రా వరకు పలువురు హీరోయిన్లు ధరించిన దుస్తులు, వాటి ఖరీదు తదితర వివరాలు తెలుసుకుందాం. డిజైన్లు నచ్చితే.. అచ్చంగా అవేకాకపోయినా అలాంటి వాటిని పోలిన దుస్తుల్లో మెరిసిపోయేందుకు రెడీ అవ్వొచ్చు కదా. ఏమంటారు?! రూ. 75 లక్షల ఖర్చు! మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్, బిగ్ బీ అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ 2007, ఏప్రిల్ 20న వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. తమ ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకువచ్చిన ఈ జంట.. పెళ్లిరోజున సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు. మంగళూరు భామ అయిన ఐశ్వర్యారాయ్.. తమ సంస్కృతికి పెద్దపీట వేస్తూ.. నీతా లుల్లా డిజైన్ చేసిన కాంజీవరం చీర ధరించింది. బంగారు తీగలు, స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో నిండిన చీర ఖరీదు దాదాపు రూ. 75 లక్షలట. అప్పటి వరకు ఒక పెళ్లికూతురు ధరించిన అత్యంత ఖరీదైన అవుట్‌ఫిట్ ఇదేనని ఫ్యాషన్ నిపుణుల మాట. మరి ఐశ్వర్యారాయ్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా! ‘సాగరకన్య’ చీర ధర అరకోటి! ఫ్యాషన్ ప్రియుల మనసు దోచుకోవడంతో బాలీవుడ్ భామ శిల్పాశెట్టి ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. 2009లో రాజ్‌కుంద్రాను వివాహమాడిన ఈ ‘సాగరకన్య’.. పెళ్లినాడు తరుణ్ తహిలియాని రూపొందించిన అవుట్‌ఫిట్ ధరించారు. ఇందులో దాదాపు 8000 స్వరోవ్స్కీ క్రిస్టల్స్ ఇమిడిఉన్నాయట. దాని ధర రూ. 50 లక్షలు అని ఫ్యాషన్ వర్గాల భోగట్టా. ‘సవ్యసాచి’ డిజైన్‌తో ఆకట్టుకున్న అనుష్క బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ- టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. 2017లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట.. పెళ్లిరోజున తమ వస్త్రధారణ మరింత స్పెషల్‌గా ఉండేలా చూసుకున్నారు. సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన అవుట్ఫిట్లలో అభిమానులకు కన్నులవిందు చేశారు. ఆనాడు అనుష్క ధరించిన పేస్టల్ కలర్ లెహంగా ఖరీదు సుమారు 30 లక్షల రూపాయలట. అత్యంత ఖరీదైన, అందమైన దుస్తుల్లో సోనం! ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్‌గా గుర్తింపు పొందింది స్టార్ కిడ్ సోనం కపూర్. సినిమాలతో పాటు తన వస్త్రధారణ పట్ల తన అభిరుచితో ఎంతో మంది అభిమానం చూరగొన్న ఈ భామ.. 2018లో ప్రియుడు, వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆమె ధరించిన దుస్తులు టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యాయి. అనురాధా వకీల్ రూపొందించిన ఎరుపు రంగు అవుట్‌ఫిట్‌లో మెరిసిపోయిన సోనం.. దీనికోసం సుమారు 70- 90 లక్షల రూపాయలు ఖర్చు చేసిందట. పిగ్గీచాప్స్ సైతం తనదైన స్టైల్లో.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా- అమెరికన్ సింగర్ నిక్ జోనస్ వివాహం 2018లో జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో రెండేసి సార్లు పెళ్లిప్రమాణాలు చేసిన ఈ జంట.. తమదైన శైలి డిజైన్లతో ఆకట్టుకున్నారు. పెళ్లి సందర్భంగా పిగ్గీచాప్స్ ధరించిన ఎరుపు వర్ణం గల లెహంగా ఖరీదు సుమారు 18 లక్షల రూపాయలట. దీప్‌వీర్.. రెండు కళ్లుచాలవంటే నమ్మరు! బీ-టౌన్లో అత్యంత రొమాంటిక్ కపుల్‌గా పేరొందిన జంట దీపికా పదుకొనె- రణ్వీర్ సింగ్. సుమారు ఐదేళ్ల పాటు ప్రణయ బంధంలో మునిగితేలిన దీప్‌వీర్ 2018లో ఇటలీలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. దక్షిణాది, ఉత్తరాది పద్ధతుల్లో వివాహం చేసుకున్న ఈ జంట పెళ్లినాడు సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా ముస్తాబయ్యారు. సవ్యసాచి డిజైన్ చేసిన అవుట్ఫిట్లు ధరించి అభిమానుల మనసు దోచుకున్నారు. ‘‘సదా సౌభాగ్యవతి భవ’’ అని దేవనాగరి లిపితో దుపట్టాపై లిఖించుకున్న దీపికా.. తన లెహంగా కోసం దాదాపు 9 లక్షలు ఖర్చుపెట్టారట. ఇక వీరే కాదు.. కరీనా కపూర్(50 లక్షలు), ఊర్మిళా మటోంద్కర్(నాలుగున్నర లక్షలు), బిపాసా బసు(4 లక్షలు), దియా మీర్జా(3 లక్షలు), ఇషా డియోల్(3 లక్షలు) వంటి నటీమణులు సైతం స్పెషల్ డేను అందమైన దుస్తులు ధరించి మరింత స్పెషల్‌గా మార్చుకున్నారు. చదవండి: తాను అక్రమ సంతానాన్ని అని తెలుసుకున్న ‘లోకి’ ఏం చేయబోతున్నాడు? -
ఐశ్వర్యరాయ్‌కి జిరాక్స్ కాపీలా ఉంది కదూ..
ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది స్నేహా ఉల్లాల్. అచ్చం ఐశ్వర్యరాయ్‌లా కనిపించడం ఆమెకు మరింత ప్లస్ అయ్యింది. దీంతో అతి తక్కువ టైంలోనే తక్కువ టైంలో పాపులారిటీ సంపాదించుకుంది. జూనియర్ ఐశ్వర్యగా యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదిందచుకుంది ఈ ముద్దుగుమ్మ. అయిలా కెరీర్ పరంగా మాత్రం ఈ అమ్మడికి అంతగా కలిసిరాలేదు. వివిధ భాషల్లో దాదాపు 20 వరకు సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. దీంతో అడపాదడపా సినిమాలు చేస్తూ ముందుకెళ్తుంది ఈ భామ. తాజాగా స్నేహ ఉల్లాల్ షేర్ చేసిన ఓ ఫోటో ఆమెను మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. బ్రైడల్ ఫోటో షూట్లో పాల్గొన్న స్నేహ ఉల్లాల్..నుదుటన పాపిట బిళ్ల, జుంకీలు, చేతి రింగ్‌తో అచ్చం జోధా అక్భర్‌లో ఐశ్వర్యరాయ్‌లా ఉంది. ఈ ఫోటోను స్నేహ ఉల్లాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. ఐశ్వర్యకు జిరాక్స్ కాపీలా ఉందే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. స్నేహ ఉల్లాల్ ఇటీవలె ‘ఎక్స్పైరీ డేట్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇటీవలె బ్యాక్‌లెస్ ఫోటోను షేర్ చేసి ఇది ‘నేను కాదు.. కానీ నేనే కావచ్చు’ అంటూ ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sneha Ullal (@snehaullal) చదవండి : ఛాన్స్ వస్తే ఆ హీరోతో డేటింగ్‌కు వెళ్తా : రష్మిక ప్రముఖ తెలుగు యాంకర్‌పై సోనూసూద్ ప్రశంసలు.. కారణమిదే.. -
నువ్వే మా ప్రపంచం, హ్యాపీ బర్త్‌డే: ఐశ్వర్య రాయ్
అలనాటి అందాల హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ఇంట బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం (మే 23న) ఐశ్వర్య తల్లి వృందా రాయ్ 70వ వడిలోకి అడుగు పెట్టింది. కోవిడ్ వల్ల ఈ వేడుకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఇంట్లోనే బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేసింది. అయితే ఈ సెలబ్రేషన్లో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాలు పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఐశ్వర్య ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) ఇందులో వృంద ఎదురుగా మూడు బ్యూటిఫుల్ కేకులతో పాటు అందమైన పూలు పరుచుకుని ఉన్నాయి. 'డార్లింగ్ మమ్మీకి హ్యాపీ బర్త్‌డే. నువ్వే మా ప్రపంచం. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం.. ఆ భగవంతుడు మా దేవతను చల్లగా చూడాలి' అని ఐశ్వర్య క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఐశ్వర్య కూతురు ఆరాధ్య తన అమ్మమ్మను గాఢంగా హత్తుకున్న ఫొటోతో సహా భర్త అభిషేక్ బచ్చన్‌తో కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటో అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పలువురూ ఐశ్వర్య తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: ఆ రోజు రాత్రి ఐశ్వర్య ఇంటికి వెళ్లిన సల్మాన్.. దూకి చస్తానని బెదిరించి.. ఈ చిన్నారిని గుర్తుపట్టారా?.. ఇప్పడు ఆమె ఓ స్టార్ యాంకర్ -
ఆ రోజు రాత్రి ఐశ్వర్య ఇంటికి వెళ్లిన సల్మాన్.. దూకి చస్తానని బెదిరించి..
సల్మాన్ ఖాన్.. పెళ్లి ప్రస్తావన లేకుండా అతని పేరు వినపడదు.. అతను అనుకున్నట్టే జరిగి ఉంటే ఈ పాటికి పెళ్లి చేసుకునేవాడేమో! జరగకపోవడానికి స్వయంకృతాపరాధమే కారణం అంటారు అతని శ్రేయోభిలాషులు కూడా! కోరి వచ్చిన ప్రేమైశ్యర్యాన్ని కాపాడుకోలేకపోయిన అభాగ్యుడు అని వ్యాఖ్యానిస్తారు!! ఐశ్యర్య రాయ్‌ను ప్రేమించాడు.. ఆమె ఆత్మగౌరవాన్ని లెక్కచేయనంతగా! అందుకే ఆ ప్రేమ ముక్కలైపోయింది!! ఐశ్యర్య సినిమాల్లోకి అడుగుపెట్టేనాటికే సల్మాన్ ఖాన్ సూపర్‌స్టార్. అతనికి ఆమె పరిచయం అయ్యేనాటికే సల్మాన్.. సోమి అలీ ప్రేమికుడు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలూ గుప్పుమన్నాయి. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ కోసం సంజయ్ లీలా భన్సాలీ హీరోయిన్ను వెదుకుతున్నాడు. ఐశ్యర్యను సూచించాడు సల్మాన్. సంజయ్‌కీ నచ్చి ఐశ్యర్య కథానాయికగా ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ షూటింగ్ మొదలుపెట్టేశాడు. అది పూర్తయ్యేసరికి సల్మాన్, ఐశ్వర్య ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. ఐశ్వర్యా నంబర్ వన్ నాయిక అయిపోయి అవకాశాలు వరుస కట్టాయి. సల్మాన్ .. ఐశ్యర్యను ఇష్టపడుతున్నాడనే నిజం సోమి అలీకి తెలిసి.. మనసు విరిగి అమెరికా వెళ్లిపోయింది. రాకపోకలు.. సల్మాన్ తనపై కురిపిస్తున్న ప్రేమ.. అతని అపురూపం ఐశ్వర్యను ఆశ్చర్యపరిచాయి. ఆమెకు అతను తన కుటుంబాన్నీ పరిచయం చేశాడు. సల్మాన్ చెల్లెళ్లు అల్విర, అర్పితతో ఐశ్వర్యకు దోస్తీ బాగా కుదిరింది. ఎప్పుడు సమయం దొరికినా సల్మాన్ వాళ్లింటికి వెళ్లి కాలక్షేపం చేసేది. అంతకుముందే సల్మాన్ ప్రేమ వ్యవహారాలు, సోమి అలీతో పెళ్లి వార్తా తెలిసి ఉండడంతో తమ కూతురు సల్మాన్‌తో చనువుగా ఉండడం నచ్చలేదు ఐశ్వర్య తల్లిదండ్రులకు. ఆ విషయంలో ఆమెను వారించారు. అతను అలాంటివాడు కాదని ఆమె వాళ్లతో వాదించింది. విభేదించి తను విడిగా అపార్ట్మెంట్ తీసుకొని అందులో ఉండసాగింది. అభద్రత.. ఐశ్వర్య.. సల్మాన్‌తో ఎంత చనువుగా ఉన్నా పెళ్లి మాట వచ్చేసరికి ఔనని కాని, కాదని కాని తేల్చకుండా మౌనంగా ఉండిపోయేదిట. అతనేమో ఆ ప్రేమను పెళ్లితో కట్టిపడేసుకుందామనుకున్నాడు. దాంతో ఆమె సైలెన్స్ సల్మాన్‌ను అభద్రతకు గురిచేసింది. ఐశ్వర్య ఆలోచన వేరు. సల్మాన్‌ను పెళ్లి చేసుకోవాలని ఉన్నా.. అప్పుడప్పుడే మొదలైన స్టార్‌డమ్‌నూ అప్పుడే వదులుకోవాలని లేదు ఆమెకు. అందుకే సల్మాన్ ప్రశ్నకు ఐశ్వర్య మౌనమే సమాధానమయ్యేది. ఒకరోజు రాత్రి.. ఉన్నపళంగా ఐశ్వర్య ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నాడు సల్మాన్. ఆమె ఫ్లాట్ తలుపులను దబదబా బాదసాగాడు. అతని ఆవేశం అర్థమైన ఐశ్వర్య తలుపులు తీయలేదు. అతనూ వెనక్కి తగ్గలేదు . తెల్లవారు జాము మూడు గంటల వరకు అలా తలుపులు కొడుతూనే ఉన్నాడు చేతుల్లోని చర్మం చిట్లి రక్తం కారుతున్నా. ఆ చప్పుడు చుట్టుపక్కల వాళ్లకు అంతరాయం కలిగినా పోలీస్ కంప్లయింట్ ఇచ్చే ధైర్యం చేయలేదు వాళ్లు. ఆఖరకు తలుపులు తెరవకపోతే ఆ పదిహేడో అంతస్తు (ఆ అపార్ట్మెంట్లో ఐశ్వర్య ఫ్లాట్ పదిహేడో అంతస్తులోనే ఉంది) నుంచి దూకి చచ్చిపోతానననీ బెదిరించాడట సల్మాన్. అప్పుడు తలుపులు తీసింది ఐశ్వర్య అని ఆ సంఘటనకు సాక్ష్యంగా ఉన్న ఆ అంతస్తు వాసుల మాట. తర్వాత ఆ సంఘనట మీద ఐశ్వర్య వాళ్ల నాన్న కృష్టరాజ్ రాయ్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడట. ‘ఐశ్వర్య వాళ్ల నాన్న పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన మాట నిజమే. ప్రేమలో ఇలాంటివి సహజం. పోలీస్ కంప్లయింట్ ఇచ్చినందుకు ఐశ్వర్య ఫాదర్ మీద నాకేం కోపం లేదు. ఆయన చేసింది కరెక్టే’ అని చెప్పాడు సల్మాన్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. అక్కడితో ఆగలేదు.. ఒకసారి చల్తే చల్తే సినిమా షూటింగ్ జరుగుతుంటే వెళ్లి ఐశ్వర్య మీద అరిచాడట. అడ్డొచ్చిన ఆ సినిమా నిర్మాత, హీరో షారూఖ్ ఖాన్‌నూ దుర్భాషలాడాడని అప్పటి వార్తలు. ఈ రభస ఎందుకని చివరకు ఆ సినిమా నుంచి ఐశ్వర్యను తొలగించి ఆ స్థానంలో రాణి ముఖర్జీని తీసుకున్నారట. అలా సల్మాన్ సెట్స్ మీదకు వచ్చి గొడవ చేయడం ఆమె కెరీర్‌నే కాదు ఆమె వ్యక్తిత్వాన్నీ గాయపరిచాయి. ప్రేమ పేరుతో సల్మాన్ తనను ఆస్తిగా భావించడాన్ని భరించలేకపోయింది ఐశ్వర్య. దాదాపు మూడేళ్ల ఆ బంధనాన్ని 2002, మార్చిన తెంచేసుకుంది. ‘తాగి తిట్టినా, కొట్టినా సహించాను. వేరే అమ్మాయిలతో తిరిగినా ప్రశ్నించలేదు. ఆ సహనం నా ఆత్మాభిమానానికే ఎసరు పెడ్తుంటే ఊరుకోలేను కదా. అందుకే ఆ రిలేషన్‌ను వద్దనుకున్నాను. బ్రేకప్ తర్వాత కూడా చాలా సార్లు ఫోన్లు చేసి బూతులు తిట్టేవాడు. నేను పనిచేస్తున్న ప్రతి నటుడితో నాకు సంబంధం అంటగట్టాడు. ఈ జీవితంలో అదొక పీడకల. నా ఆత్మగౌరవం, నా సంక్షేమం కోసం లైఫ్‌లోనే కాదు సినిమాల్లో కూడా అతని భాగస్వామ్యాన్ని వద్దనుకున్నా. భవిష్యత్‌లో అతనితో నటించే సమస్యే లేదు’ అని ఓ పత్రికా ఇంటర్వ్యూలో చెప్పింది ఐశ్వర్య. ‘ఐశ్వర్య మీద చేయిచేసుకున్నానడం అబద్ధం. బాధేస్తే.. కోపమొస్తే నన్ను నేను హింసించుకుంటాను. ఒక్క సుభాష్ ఘాయ్‌ని తప్ప ఇప్పటివరకు నేనెవరీ కొట్టలేదు. అతనిక్కూడా వెంటనే క్షమాపణ చెప్పేశా’ అంటాడు సల్మాన్. ఏది ఏమైనా అతని దురుసు ప్రవర్తనతోనే ఆ ప్రేమ కథ బ్రేక్ అయిందని సల్మాన్ అభిమానులూ ఒప్పుకునే సత్యం. - ఎస్సార్ -
‘ఏం అర్హత ఉందని నీకు ఇంత అందమైన భార్య?’
సెలబ్రిటీలకు సోషల్ మీడయా చాలా ముఖ్యం. అభిమానులకు అందుబాటులో ఉండాలంటే ప్రస్తుతం సోషల్ మీడియానే బెస్ట్ ఆప్షన్. అయితే దీని వల్ల మేలు ఎంత ఉంటుందో ఒక్కోసారి చెడు కూడా అంతే జరుగుతుంది. సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలు ఎదుర్కొనే ప్రధాన సమస్య ట్రోలింగ్, నెగిటివ్ కామెంట్స్. కొందరు దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే.. మరి కొందరు మాత్రం గట్టిగానే కౌంటర్ ఇస్తారు. ఈ జాబితాలో ప్రథమ వరుసలో ఉంటారు అభిషేక్ బచ్చన్. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యేవారిలో జూనియర్ బచ్చన్ ఒకరు. అయితే తనను విమర్శించేవారిని ఊరికే వదిలి పెట్టరు అభిషేక్. తగిన సమాధానం చెప్పి నోరు మూయిస్తారు. తాజాగా ట్విట్టర్ వేదికగా మరోసారి ట్రోలింగ్‌కు గురయ్యారు అభిషేక్ బచ్చన్. కొద్ది రోజుల క్రితం అభిషేక్ తన కొత్త సినిమా బిగ్ బుల్ ట్రైలర్‌ని ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ సమయంలో ఓ యూజర్.. ‘‘మీరు అన్ని విషయాల్లో చాలా బాగుంటారు. కానీ ఒక్క విషయంలో మిమ్మల్ని చూస్తే ఈర్ష కలుగుతుంది. అదేంటి అంటే మీకు చాలా అందమైన భార్య లభించింది. అంతటి సౌందర్యరాశిని భార్యగా పొందే అర్హత మీకు లేదు’’ అంటూ కామెంట్ చేశాడు సదరు యూజర్. ఇందుకు అభిషేక్ ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ‘‘మీ అభిప్రాయానికి థాంక్యూ బ్రదర్.. ఊరికే ఆసక్తి కొద్ది అడుగుతున్నాను.. నీవు ఇప్పుడు చాలా మంది పెళ్లి కాని వారిని ట్యాగ్ చేశావ్.. వీరిలో ఇలియాన, నిక్కి వీరంతా నాకు తెలుసు.. కానీ నువ్వెవరు.. అసలు నీ అర్హత ఏంటి’’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీనిపై మిగతా నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అభిషేక్ ట్రోలర్స్‌ని మీరు హ్యాండిల్ చేసే తీరు సూపర్బ్’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. Ok. Thank you for your opinion. Just curious.. who are you referring to because you’ve tagged a whole load of people? I know Ileana & Niki aren’t married that leaves the rest of us (Ajay, Kookie, Sohum) soooo... P.S- will get back to you about @DisneyplusHSVIP ‘s marital status. — Abhishek Bachchan (@juniorbachchan) March 20, 2021 ప్రస్తుతం అభిషేక్ నటిస్తున్న బిగ్ బుల్ చిత్రం 1992లో జరిగిన స్టాక్ మార్కెట్ స్కామ్ ఆధారంగా తెరకెక్కించారు. ఈ ఏడాది ఏప్రిల్ 8న విడుదలవుతున్న ఈ చిత్రంలో అభిషేక్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఇలియాన, నికితా దత్తా, మహేష్ మంజ్రేకర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
నీ కూతురి చేయి ఎప్పుడు వదులుతావు?
ఐశ్వర్యరాయ్‌కు ఆరాధ్య ఒక్కతే కూతురు ప్రస్తుతానికి. ఐశ్వర్యరాయ్‌కు ఆరాధ్యే కూతురు. ఐశ్వర్యారాయ్ ఆరాధ్యను అనుక్షణం తన కూతురు అనుకుంటూ ఉంటుంది. ఏమిటి.. చెప్పిందే చెప్తున్నాం అనుకుంటున్నారా? ఐశ్వర్యరాయ్ బయట ఎక్కడ కనిపించినా కూతురి చేయి పట్టుకోకుండా కనిపించదు. లేదా కూతురి చేతిని వదలకుండా పట్టుకుని ఉంటుంది. దీని మీద ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో కూడా కూతురి చేతిని పట్టుకునే కనిపించింది. ‘నీ కూతురి చేతిని నువ్వెప్పుడు వదిలిపెడతావ్?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏం జరిగిందంటే మణిరత్నం సినిమా కోసం గత మూడు నాలుగు వారాలుగా ఐశ్వర్యా రాయ్ తన భర్త, కూతురుతో చెన్నైలో ఉంది. షూటింగ్ పని అయ్యాక రెండు రోజుల క్రితం ముంబై ఎయిర్పోర్ట్ చేరుకుంది. బయటికొచ్చే సమయంలో యధావిధిగా కూతురి చేతిని పట్టుకుని ఉంది. ఎయిర్‌పోర్టులో నుంచి బయటకు వచ్చి కారు ఎక్కే వరకు ఆరాధ్య చేతిని ఆమె వదల్లేదు. వారిద్దరి వెనుక అభిషేక్ బచ్చన్ నడుస్తూ కనిపించాడు. ఆరాధ్యకు ఇప్పుడు 9 ఏళ్లు. తొమ్మిదేళ్ల అమ్మాయి తనకు తానుగా ఆడొచ్చు. పరిగెత్తుకుంటూ వచ్చి కార్ ఎక్కవచ్చు. లేదా అటూ ఇటూ దిక్కులు చూస్తూ నడవొచ్చు. కాని ఐశ్వర్య ఇవేమి అలౌ చేయదు. కూతురి చేయి తన చేతిలో ఉండాల్సిందే. ఇప్పుడే కాదు. ఆరాధ్య తో ఆమె ఎప్పుడు బయటకు వచ్చినా, ఆరాధ్య స్కూల్‌కు ఆరాధ్యతో వెళ్లినా ఐశ్వర్య తన కూతురి చేతిని విడువదు. దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ‘ఐశ్వర్య చాలా పొసెసివ్’ అని ఒకరంటే ‘ఐశ్వర్య చాలా ప్రొటెక్టివ్’ అని ఒకరన్నారు. ‘అయ్యో... ఆ అమ్మాయి చేయి వదలొచ్చు కదా’ అని ఒకరంటే ‘కూతురికి ఎన్నేళ్లు వస్తే ఆమె చేయి వదులుతుందో’ అని మరొకరన్నారు. పిల్లల పెంపకంలో చేయి పట్టుకుని నడిపించడం ఉంటుంది.. చేయి వదిలి నేర్పించడం ఉంటుంది... ఐశ్వర్య ఈ దారిని ఎందుకు ఎంచుకుందో అనేవారు ఉంటారు. మరోవైపు ఆరాధ్య ఎప్పుడు బయటకు వచ్చినా పాపరాజిలు తమ కెమెరాలతో వెంటబడుతుంటారు. ఆమె చేయి వదిలితే వారు పలకరిస్తే ఏం మాట బయటకు వస్తుందో అదెక్కడికి దారి తీస్తుందోనని ఆమె అనుకుంటూ ఉండొచ్చా? లేదా భద్రత రీత్యా పాప చేయి వదలదా? ఏమో. కాని ఆమెలా అనునిత్యం పిల్లల చేయి పట్టుకుని కనిపించే బాలీవుడ్ సెలబ్రిటీలు లేరు. -
ఆ సీన్లో ఆడ ఏనుగులనే ఎందుకు వాడారో తెలుసా?
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ల పీరియాడికల్ డ్రామా మూవీ ‘జోదా అక్బర్’ విడుదలై నిన్నటికి 13 ఏళ్లు. నిర్మాత అశుతోష్ గోవరికర్ నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. హృతిక్, ఐశ్వర్యరాయ్‌లకు ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో హృతిక్, ఐశ్యర్యల నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరల్లేదు. మొఘల్ కాలంలోని జోధా అక్భర్‌ల నిజమైన ప్రేమకథా ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం భారతీయ చిత్రపరిశ్రమలో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రంలోని సన్నివేశంలో డైరక్టర్ భారీ సంఖ్యలో ఏనుగులను ఉపయోగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ కోసం నిర్మాత అశుతోష్ గోవరికర్ కేవలం వంద ఆడ ఏనుగులు మాత్రమే కావాలని చెప్పినట్లు ఈ సందర్భంగా సహా నిర్మాత సునీత గౌవరికర్ తెలిపారు. ఓ పాత వీడియోను ఆమె షేర్ చేస్తూ.. నిర్మాత అశుతోష్ ఈ మూవీలో ఉపయోగించే ఏనుగులు కేవలం ఆడవే అయ్యిండాలని చెప్పారు. ఇందుకు ఆయనకు వంద ఆడ ఏనుగులు కావాలని డిమాండ్ చేసినట్లు ఈ వీడియోలో ఆమె చెప్పుకొచ్చారు. అయితే అశుతోష్ నిర్ణయం విని ఆమె షాకయ్యానన్నారు. వెంటనే వంద ఆడ ఏనుగులే కావాలంటున్నారని ఆయను అడగడంతో ఆయన చెప్పిన సమాధానికి ఆశ్చర్యపోయానని చెప్పారు. దీనికి ఆయన మగ ఏనుగులు తొందరగా కోపానికి లోనవుతాయి. వాటివల్ల షూటింగ్‌లోని ప్రజలందరికి ప్రమాదం ఉండోచ్చని, అందుకే కేవలం 100 ఆడ ఏనుగులతోనే షూటింగ్ చేయాలనుకున్నట్లు ఆయన సమాధానం ఇచ్చారన్నారు. అంతేగాక ఆ ఏనుగులు అన్ని కూడా ఒకే పరిమాణంలో ఉండాలని తనతో చెప్పారన్నారు. షూటింగ్లో ఆయన వాటిని ఆ పేరు కూడా పెట్టారని వాటిన ఆ పేరుతోనే పిలిచేవారని పేర్కొన్నారు. అయితే ఆయన ప్రతి విషయంలో ఆశుతోష్ పర్‌ఫక్ట్‌గా ఉంటారడానికి ఈ సంఘటన మరోసారి రుజువు చెసిందని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే హీరో హృతిక్ రోషన్ కూడా మూవీ కొన్ని సన్నివేశాలను షేర్ చేస్తూ ఈ చిత్రం సమయంలోని జ్ఞపకాలను గుర్తు చేసుకున్నారు. ‘ఓ వ్యక్తి ఈ చిత్రం నటించడమంటే సాధారణ విషయం కాదు. మొదట ఆశుతోష్ నాతో ఈ మూవీ గురించి చెప్పినప్పడు బయపడ్డాను. నాతో పాటు ఓ వెయ్యి మంది సైనికులను ఆయన ఎలా నడిపించగలడు అనుకున్న. చివరికి ఆయన చేశారు’ అంటూ హృతిక్ రాసుకొచ్చారు. -
‘మీరు సారీ చెప్తారా.. దేవుడి లీల’
భార్యాభర్తలు అన్నాక గొడవలు సహజం. తర్వాత ఒకరికొకరు క్షమాపణలు కొరతారు. కొన్ని సార్లు ఎవరు తప్పు చేస్తే వారే ముందుగా సారీ చెప్తారు. వివాహ బంధంలో ఇవన్నీ సహజం. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండదు. అయితే తమ మధ్య గొడవలు వస్తే ముందుగా తానే సారీ చెప్తాను అంటున్నారు అందాల నటి ఐశ్యర్య రాయ్. అభిషేక్‌తో గొడవపడితే తానే ముందుగా క్షమాపణలు కోరతానని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. అయితే ఇది పాత వీడియో. దీనిలో కపిల్ శర్మ, ఐశ్యర్య రాయ్, నవజోత్ సింగ్ సిద్ధు ఉన్నారు. ఇక వీడియో విషయానికి వస్తే కపిల్ శర్మ, ఐశ్వర్యని ఉద్దేశించి.. ‘అభిషేక్‌తో గొడవపడితే.. ముందుగా ఎవరు క్షమాపణలు కోరతారు’ అని ప్రశ్నిస్తాడు. వీరి సంభాషణ పూర్తి కాకముందే నవజోత్ మధ్యలో కల్పించుకుని.. ‘అసలు ఇలాంటి ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదు. అభిషేకే ముందుగా సారి చెప్తాడు’ అంటారు. (చదవండి: అందం, అణకువల కలబోత) View this post on Instagram A post shared by @aishwariarai_georgia on Oct 20, 2020 at 12:32am PDT దాంతో ఐశ్యర్య ‘అలా ఏం కాదు. తనతో గొడవపడితే ముందుగా నేనే సారీ చెప్తాను. గొడవను కొనసాగించడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నేనే క్షమాపణ చెప్తాను’ అని తెలిపారు. ఈ సమాధానం విని కపిల్ శర్మ ఒక్క నిమిషం స్టన్ అవుతాడు. ‘మీరు సారీ చెప్తారా.. ఇంత అందమైన భార్య క్షమాపణలు కోరడం అంటే నిజంగా దేవుడి లీలే’ అంటాడు. దాంతో ఐశ్వర్యతో పాటు అక్కడ ఉన్నవారంతా నవ్వుతారు. అభిషేక్, ఐశ్వర్యల వివాహం 2007లో జరిగింది. వీరికి ఓ కుమార్తె ఆద్యా ఉన్నారు. ఇక తాజాగా ఐశ్యర్య పుట్టిన రోజు సందర్భంగా అభిషేక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక వీరిద్దరు గులాబ్‌జామూన్ అనే చిత్రంలో నటించనున్నారు. -
21 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ.. అయితే ఏంటి?!
(వెబ్ స్పెషల్): ‘‘ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా.. అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతుల్తో నరికేస్తా’’ అంటూ ప్రణయ బంధంలో మునిగిపోయిన జంట భావావేశాన్ని చక్కగా వర్ణించాడో సినీకవి. ఒక లైలా- మజ్నూ, ఒక రోమియో- జూలియట్, ఒక సలీం- అనార్కలి.. ఇలా అనాదికాలం నుంచి నేటి స్మార్ట్ యుగం వరకు దాదాపుగా ప్రతీ లవ్‌స్టోరీలోనూ ప్రేమికులు అచ్చంగా ఇవే పదాలు కాకపోయినా.. ఇదే అర్థంతో కూడిన పాటలు పాడుకుని ఉంటారు. అవును మరి.. ప్రేమలో ఉన్న మాధుర్యం అలాంటిది. కుల, మత, జాతి, వర్గాలకు ఆఖరికి వయస్సుకు అతీతంగా ఎవరిపై ఎప్పుడు ప్రేమ పుడుతుందో చెప్పడం కాస్త కష్టమే. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ప్రేమకథలు ఎక్కువగానే ఉన్నాయి. అంతేకాదు తమకంటే తక్కువ వయస్సున్న పురుషులను పెళ్లాడిన, ప్రేమిస్తున్న సెలబ్రిటీలు కూడా చాలా మందే ఉన్నారు. వారిలో కొందరు.. పిగ్గీచాప్స్ మెచ్చిన వరుడు! ప్రియాంక చోప్రా(38).. ఇరవై ఏళ్ల క్రితమే ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికల్లోకెక్కింది. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న ఈ అందాల భామ ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టింది. ఎన్నో ఆటుపోట్లు చవిచూసి స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్‌పై తన అందం, అభినయంతో కుర్రకారుకు ఆరాధ్య దేవతగా మారిపోయిన పిగ్గీచాప్స్.. తనకంటే పదేళ్లు చిన్నవాడైన హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌పై మనసు పారేసుకుంది. హాలీవుడ్‌లోనూ సత్తా చాటి గ్లోబల్‌స్టార్‌గా ఎదిగిన ఆమె ఓ అవార్డు ఫంక్షన్‌కు నిక్‌తో కలిసి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచింది. (చదవండి: ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ వీరే) ఈ జంటను చూసినవాళ్లంతా ఇదంతా డేటింగ్లో భాగమేనని, నిక్ అప్పటికే మాజీ మిస్ యూనివర్స్ ఒలీవియా కల్పోతో పాటు ప్రముఖ సింగర్ సెలీనా గోమెజ్‌తోనూ ప్రేమాయణం నడిపి ఉండటంతో.. ప్రియానిక్ పెళ్లిదాకా వస్తారా అంటూ అనేక సందేహాలు వ్యక్తం చేశారు. అయితే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ 2018 డిసెంబరులో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వయసు వ్యత్యాసం కారణంగా ఎన్నోసార్లు విపరీతమైన ట్రోలింగ్ బారినపడినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా రోజురోజుకీ తమ బంధాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారీ స్టార్ కపుల్. సుస్మితా సేన్ వలచిన ఘనుడు! ఇండియాకు తొలి మిస్ యూనివర్స్ కిరీటాన్ని తెచ్చిపెట్టిన సుస్మితా సేన్(44) ప్రస్తుతం రోహమన్ షాల్ అనే యువ మోడల్‌తో ప్రేమలో ఉన్నారు. దాదాపుగా రెండేళ్లుగా వీరి బంధం కొనసాగుతోంది. అంతకుముందు చాలా మందితో డేటింగ్ చేసినప్పటికీ సుస్మిత ఎవరితోనూ తన బంధాన్ని పెళ్లిపీటల వరకు తీసురాలేదు. అయితే రోహమన్ విషయంలో మాత్రం ఆమె సీరియస్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అందంతో పాటు మంచి మనసున్న ‘తల్లి’అయినటువంటి సుస్మిత ఇద్దరు కూతుళ్లు(దత్తత) రీనీ, అలీషాలకు అతడు తండ్రి ప్రేమను పంచుతుండటమే ఇందుకు కారణమట. అందుకే తనకంటే దాదాపు పదిహేనేళ్లు చిన్నవాడైనప్పటికీ రోహమన్‌ను పెళ్లాడేందుకు సుస్మిత సుముఖంగానే ఉందంటూ బీ-టౌన్ టాక్. అయితే అది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఎదురు చూడాల్సిందే. మలైకా మనసు దోచిన అర్జున్! చయ్య.. చయ్య పాటతో కుర్రకారును ఉర్రూతలూగించిన మలైకా అరోరా(46).. ‘కెవ్వు కేక’ పాటతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైపోయింది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుందీ భామ. వీరిద్దరికి అర్హాన్ ఖాన్ అనే పేరు గల టీనేజ్ కొడుకు కూడా ఉన్నాడు. అయితే అర్బాజ్‌తో వైవాహిక బంధం కొనసాగిస్తున్న తరుణంలోనే నటుడు అర్జున్ కపూర్‌తో ఆమె పరిచయం.. అంతలోనే భర్త సైతం వేరే మహిళకు దగ్గరకావడంతో వీరిరువురి మధ్య దూరం పెరిగింది. దీంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుందీ జంట. ఇక అప్పటి వరకు గుట్టుగా తిరిగిన ప్రేమపక్షులు మలైకా- అర్జున్‌కు పూర్తి స్వేచ్ఛ వచ్చినట్లయింది. అయితే తమ ప్రణయ బంధం ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండానే.. కలిసి డిన్నర్లు చేస్తూ, టూర్లతో వెళ్తూ ఫొటోగ్రాఫర్లకు బాగా పనిచెప్పారు. అయితే మలైకా పెళ్లి- విడాకుల కంటే కూడా.. అర్జున్ కన్నా ఆమె వయసులో పన్నెండేళ్లు పెద్దది కావడం మూలాన్నే ఎక్కువసార్లు ట్రోలింగ్ బారిన పడింది. ఇక ఇటీవల అర్జున్- మలైకా ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా తేలడంతో రావడంతో ట్రోల్స్ శృతిమించాయి. అయినా వీటిని ఏమాత్రం లెక్కచేయకుండా ఈ లవ్‌బర్డ్స్ ముందుకు సాగుతున్నారు. అన్నట్లు అర్జున్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమారుడన్న సంగతి తెలిసిందే. కలల రాకుమారుడిని భర్తగా పొందిన నమ్రత మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్(48) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వెండితెరపై నటిగా ప్రస్థానం ప్రారంభించిన నమ్రత పలు దక్షిణాది సినిమాల్లోనూ కనిపించారు. అయితే అనతికాలంలోనే నటనకు గుడ్‌బై చెప్పి.. టాలీవుడ్ సూపర్‌స్టార్, అమ్మాయిల కలల రాజకుమారుడైన మహేష్ బాబును ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఆమె తన భర్త కంటే మూడేళ్లు పెద్దవారు. ఇక వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు గౌతం కృష్ణ, సితార. కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే నమ్రత తన ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. అందాల రాశి ఐశ్వర్య అభీకే సొంతం! అందానికే అసూయ పుట్టించే అందం ఐశ్వర్యా రాయ్(46) సొంతమనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి అందగత్తెను పెళ్లి చేసుకోవాలని చాలా మంది ఉవ్విళ్లూరారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ అయితే ఆమె ప్రేమ కోసం పిచ్చివాడైపోయాడట. కానీ ఈ మాజీ మిస్ వరల్డ్‌ను వివాహమాడే అదృష్టం మాత్రం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్‌నే వరించింది. వీరిద్దరు కలిసి నటించిన‘గురు’సినిమా సెట్లో తన దగ్గర ఉన్న ఓ ఉంగరాన్ని బహూకరించి.. ఐష్‌కు ప్రపోజ్ చేసిన అభిషేక్.. ఆమె అంగీకారం లభించగానే పెద్దల్ని ఒప్పించి పెళ్లిచేసుకున్నాడు. వీరిరద్దరికి ఆరాధ్య అనే ముద్దుల కూతురు ఉంది. అన్నట్లు అభిషేక్.. ఐశ్వర్య కంటే రెండేళ్లు చిన్నవాడు. ఇక వీళ్లతో పాటు పలువురు హాలీవుడ్ నటీమణులు కూడా వయస్సులో తమకంటే చిన్నవాళ్లైన పురుషులతో బంధం కొనసాగిస్తున్నారు. గేబ్రియెల్ యూనియన్- డ్వేన్ వాడే దంపతులు(9 ఏళ్ల వ్యత్యాసం), షకీరా- గెరాడ్ పిక్(10 ఏళ్లు), కోర్ట్నీ కర్దాషియాన్- యూనస్ బెడ్జిమా(14 ఏళ్లు), జడా పింకెట్ స్మిత్- ఆగస్ట్ అల్సీనా(21 ఏళ్లు), లీసా బానెట్- జాసన్ మొమోవా దంపతులు(12 ఏళ్లు) తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. -
ఓ అనామకుడా.. నీపై జాలి వేస్తోంది
బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్య కరోనా పాజిటివ్‌తో ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య, ఆరాధ్యలకు చికిత్సానంతరం నెగటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రిలో ఉన్నప్పటికీ తన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పుటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు అమితాబ్. బిగ్ బి కుటుంబానికి చాలామంది ధైర్యం చెబుతున్నారు. కొందరైతే పూజలు కూడా చేస్తున్నారు. కానీ ‘కరోనాతో చనిపోతావ్ అమితాబ్’ అని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కి అమితాబ్ స్పందిస్తూ – ‘‘మిస్టర్ అనామకుడా.. కరోనాతో నేను చనిపోతానని అంటున్నావు. నీ గురించి తెలియడానికి కనీసం నీ తండ్రి పేరు కూడా రాయలేదు.. ఎందుకంటే.. నీ తండ్రి ఎవరో నీకు తెలియదు. నేను బతకవచ్చు లేదా చనిపోవచ్చు. ఒకవేళ నేను చనిపోతే నన్ను దూషించడానికి నీకు పని దొరకదు. నాలాంటి ఓ ప్రముఖుని పేరుపై ఇలాంటి వార్తలు సృష్టించడం వల్ల నీపై జాలేస్తోంది. దేవుని దయ వల్ల నేను బతికితే.. 9 కోట్ల నా ఫాలోయర్ల ప్రేమతో నువ్వే తుడిచి పెట్టుకుపోతావు. నీ గురించి వారికింకా తెలియపరచలేదు. కానీ చెబుతాను. ఆ తర్వాత ప్రపంచం మొత్తంలో పశ్చిమం నుంచి తూర్పు వరకు.. ఉత్తరం నుంచి దక్షిణం వరకు నిన్ను వెతుకుతారు.. అడ్డుకుంటారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘టోక్ దో సాలే కో’ (వదిలేయండి వాణ్ణి) అన్నారు. -
నా కంట్లో కన్నీళ్లు ఆగడం లేదు: అమితాబ్
ముంబై : బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్య బచ్చన్ కరోనా నుంచి కోలుకొని సోమవారం ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇటీవల కరోనా సోకిన వీరిద్దరూ కొన్ని రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండగా తరువాత స్పల్ప లక్షణాలు కనిపించడంతో ఈ నెల 17న ముంబైలోని నానావతి ఆప్పత్రిలో చేరారు. తాజాగా నిర్వహించిన కోవిడ్ పరీక్షలల్లో ఇద్దరికి నెగటివ్ రావడంతో సురక్షితంగా తమ నివాసానికి చేరుకున్నారు. కాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు సైతం జూలై 11న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ వీరు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడూ బిగ్‌బీ ట్విటర్ ద్వారా వెల్లడిస్తున్నారు. (వాళ్లిద్దరూ డిశ్చార్జ్ అయ్యారు : అభిషేక్) ఈ క్రమంలో తన కోడలు, మనవరాలు కరోనా నెగిటివ్‌తో డిశ్చార్జ్ అయ్యారనే విషయం తెలిసి కళ్లలో నీళ్లు ఆగలేదని బిగ్ బీ అన్నారు. ఈ మేరకు అమితాబచ్చన్ ట్వీట్ చేశారు. ‘ఐశ్వర్య, ఆరాధ్య కోలుకొని ఇంటి వెళ్లారు. నా కంట్లో కన్నీళ్ళు ఆగడం లేదు. మనవరాలు నన్ను ఆలింగనం చేసుకుని ఎడవొద్దని చెప్పింది.. ’మీరు త్వరలోనే ఇంటికి వస్తారు’ అని తను నాకు భరోసా ఇచ్చింది. తన నమ్మకమే నిజం అవ్వాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఇక బిగ్ బీ కూడా త్వరగా కోలుకొని ఇంటికి వెళ్లాలని అభిమానులు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. (ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యరాయ్, ఆరాధ్య) T 3607 - T 3607 - अपनी छोटी बिटिया , और बहुरानी को ,अस्पताल से मुक्ति मिलने पर ; मैं रोक ना पाया अपने आंसू 🙏 प्रभु तेरी कृपा अपार , अपरम्पार 🙏🙏 — Amitabh Bachchan (@SrBachchan) July 27, 2020 -
అది నకిలీ వార్త
‘‘కరోనా పరీక్షల్లో నాకు నెగటివ్ వచ్చిందనే వార్తల్లో నిజం లేదు’’ అని బిగ్ బి అమితాబ్ బచ్చన్ అన్నారు. అమితాబ్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్యలు కరోనా బారిన పడి, చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమితాబ్‌కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ వచ్చిందని, కోవిడ్ 19 నుంచి ఆయన కోలుకున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కూడా సంతోషించారు. దీనిపై అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ– ‘‘తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నాకు నెగిటివ్ వచ్చిందనే వార్త తప్పు.. ఇది బాధ్యతారాహిత్యంతో కూడుకున్న ప్రచారం.. నకిలీ వార్త.. పూర్తిగా అబద్ధం’’ అని ట్వీట్ చేశారు. -
ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యరాయ్, ఆరాధ్య
ముంబై : కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న ఐశ్వర్యరాయ్(46), ఆమె కుమార్తె ఆరాధ్య(8) శుక్రవారం ఆస్పత్రిలో చేరారు. వైరస్ లక్షణాలు స్పల్పంగా కనిపించడంతో నిన్న సాయంత్రం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈనెల 12 ఐశ్వర్యర్యాయ్, ఆరాధ్యకు కరోనా సోకిన విషయం తెలిసిందే. వైరస్ లక్షణాలు లేకపోవడంతో గత అయిదు రోజులుగా వైద్యుల సూచనతో వారు ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. (ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్) మరోవైపు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ఆయన కొడుకు సైతం జూలై 11న కరోనా బారిన పడి నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కరోనా తేలినప్పటి నుంచి బిగ్‌బీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఆరోగ్య సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. తాము త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్న అభిమానులు, సన్నిహితులందరికి బిగ్‌బీ ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. (కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అభిషేక్ ట్వీట్) -
కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అభిషేక్ ట్వీట్
ముంబై : బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. శనివారం అమితాబ్, ఆయన తనయుడు అభిషేక్‌లకు కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, నేడు ఆయన కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు పాజిటివ్‌గా తేలింది. మరోవైపు బిగ్‌బీ సతీమణి జయబచ్చన్‌కు మాత్రమే కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం అమితాబ్, అభిషేక్‌ల ఆరోగ్యం నిలకడగానే ఉందని నానావతి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితిపై అభిషేక్ ట్విటర్ వేదికగా స్పందించారు. (ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్) ‘ఐశ్వర్య, ఆరాధ్యలకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిద్దరు ప్రస్తుతం ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. బీఎంసీ వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తుంది. నా తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులకు కరోనా నెగిటివ్‌గా తేలింది. మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు. వైద్యులు నిర్ణయం తీసుకునేవరకు నేను, నా తండ్రి ఆస్పత్రిలోనే ఉంటాం. దయచేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా, క్షేమంగా ఉండండి. అన్ని నియమాలు పాటించండి’ అని అభిషేక్ కోరారు. (నటుడి కుటుంబంలో నలుగురికి కరోనా) Aishwarya and Aaradhya have also tested COVID-19 positive. They will be self quarantining at home. The BMC has been updated of their situation and are doing the needful.The rest of the family including my Mother have tested negative. Thank you all for your wishes and prayers 🙏🏽 — Abhishek Bachchan (@juniorbachchan) July 12, 2020 My father and I remain in hospital till the doctors decide otherwise. Everyone please remain cautious and safe. Please follow all rules! — Abhishek Bachchan (@juniorbachchan) July 12, 2020 -
ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్
-
ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ బిగ్‌బీ ఇంట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. శనివారం రోజున అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమితాబ్ కోడలు ఐశ్వర్య రాయ్, మనువరాలు ఆరాధ్యకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. బిగ్‌బీ కుటుంబ సభ్యులందరికీ కరోనాకు సంబంధించిన టెస్టులను నిర్వహించగా.. నిన్నటి రోజున కేవలం అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌కి సంబంధించిన రిపోర్ట్స్ మాత్రమే వచ్చాయి. అందులో కొన్ని ఫలితాలు ఈ రోజు రాగా.. వాటిలో ఐశ్వర్య, ఆమె కూతురు ఆరాధ్యలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. అయితే ఇప్పటికే అమితాబ్ ఇంటిని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. బిగ్‌బీ అమితాబ్, అభిషేక్ బచ్చన్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన వెంటనే ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. (అమితాబ్, అభిషేక్‌లకు కరోనా) -
‘మీ ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు’
బాలీవుడ్ చిత్రపరిశ్రమ గౌరవంగా ‘మాస్టర్ జీ’ అని పిలుచుకునే సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ (71) శుక్రవారం తెల్లవారుజామున ముంబైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్యర్య రాయ్, సరోజ్ ఖాన్ మృతికి సంతాపం తెలిపారు. ‘తాల్’ సినిమాలోని రామ్తా జోగి షూటింగ్ సెట్లో తీసిన ఫోటోని షేర్ చేశారు. ‘నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరకుంటున్నాను. సినీ పరిశ్రమలో డ్యాన్స్ మాస్టర్‌గా మీరు అంటే అందరికి ఎంతో గౌరవం, ఆరాధన, అభిమానం. నిజంగా మీరు లెజెండ్. మీతో నాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీ గైడెన్స్‌లో డ్యాన్స్ చేయడం ఎంతో సంతోషంగా భావించేదాన్ని. మీరు మాపై చూపిన ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాం. మీ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా భగవంతుడిని వేడుకుంటున్నాను’ అంటూ ఐశ్వర్య ఇన్స్టాగ్రామ్ వేదికగా సరోజ్‌ఖాన్‌కు నివాళులర్పించారు. ఐశ్వర్య కెరీర్లో మైలు రాళ్లుగా నిలిచిన నింబొడ(హమ్ దిల్ దే చుకే సనమ్), డోలా రే డోలా (దేవదాస్), రామ్తా జోగి (తాల్), బార్సో రే (గురు) వంటి పాటలకు సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ చేశారు.(సినీ మువ్వల సివంగి) -
జిరాక్స్ రాయ్
దేవుడికి నమూనాల అవసరం ఉంటుందా! ఆయన క్రియేటర్. అచ్చులు.. మూసలతో దేన్నీ రిపీట్ చెయ్యడు. ప్రతిదీ దేనికదే కొత్తది తయారవుతుందక్కడ. మరేమిటి.. ఐశ్వర్యారాయ్‌కి ఇక్కడిన్ని జిరాక్స్ కాపీలు?! రాయ్‌కి, ‘దేవ్’కి మధ్య ఒప్పందం జరిగిందా! ఇరవై ఏళ్ల క్రితం ఐశ్వర్యారాయ్ ఎలా ఉండేవారు? ఇప్పుడున్నట్లే ఉండేవారు. పెద్దగా ఛేంజ్ లేదు ఆమెలో ఎందుకో మరి! కిందికి వచ్చే ముందే పైన దేవుడితో డీల్ కుదిరి ఉండాలి. ‘స్వామీ.. నన్నెప్పటికీ ఒకేలా ఉంచండి’ అని ఐష్ అడిగితే.. ‘అలా కుదరదు గానీ అమ్మాయీ.. ఎవ్రీ ఇయర్ ఎక్కడో ఒక చోట నీలాంటి అమ్మాయిలు ‘పాప్–అప్’ అయి (పైకి లేస్తూ) అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు’ అని దీవించి ఉంటాడు ఆ దైవమాత్రుడు.. ఈ మానవకన్యను. ‘మిస్‌వరల్డ్’ అయినప్పుడు ఐశ్వర్య వయసు 21. తొలి సినిమా ‘ఇరువుర్’లో 24. పెళ్లి నాటికి 34. ఇన్ని ఏజ్లలోనూ ఇప్పటికీ ఐశ్వర్య ఒకేలా కనిపించడానికి ఆమె రూపంలో ఎప్పుడూ ఎవరో ఒకరు ఈ భువిపై మనకు సాక్షాత్కరిస్తూ ఉండటం ఒక కారణం అయి ఉండాలి. కొత్తగా అమ్యూజ్ అమృత అనే అమ్మాయి ఐశ్వర్యలా టిక్‌టాక్‌లో దర్శనం ఇస్తోంది. 2002 నాటి ‘కండుకొండైన్ కండుకొండైన్ (నేను కనుగొన్నాను. నేను కనుగొన్నాను) అనే తమిళ చిత్రంలో మమ్ముట్టికి, ఐశ్వర్యకు మధ్య చిన్న సంభాషణ ఉంది. ఆ సంభాషణను టిక్‌టాక్‌లో అమ్యూజ్ అమృత ఇమిటేట్ చేశారు. ఆ మాట్లాడ్డం, మాట్లాడుతూ పాజ్లు ఇవ్వడం, కళ్లు తిప్పడం, పెదవులు కదల్చడం.. సేమ్ జిరాక్స్ ప్రింటే ఐశ్వర్యకు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. అందులో శుద్ధ సంప్రదాయ కర్ణాటక ఐశ్వర్యలా కనిపించే అమృత తన ఇన్స్టాగ్రామ్ లో ‘మిలే సుర్ మేరా తుమ్హారా’ అన్నట్లు.. భారతదేశంలోని భిన్న సంస్కృతులలో ఐశ్వర్య హావభావాలతో కనిపిస్తుంది. అమ్యూజ్ అమృతను చూస్తే ఐశ్వర్య ఎలా ఫీల్ అవుతారో కానీ.. స్నేహా ఉల్లాల్‌ని చూసినప్పుడు మాత్రం ‘అరె!!’ అనుకున్నారట. ఐశ్వర్య ఫస్ట్ కాపీ స్నేహా ఉల్లాల్. ‘లక్కీ : నో టైమ్ ఫర్ లవ్’ (2005) చిత్రంతో సడన్‌గా ఉల్లాల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు.. ‘ఎక్కడ వెతికి పట్టుకున్నాడు ఈ అమ్మాయిని సల్మాన్?’ అని అంతా అనుకున్నారు. అందులో హీరో సల్మానే. ఐశ్వర్య తన ప్రేమను కాదన్నందుకు ఆమెకు పోటీగా సల్మాన్ ఏడు లోకాలు వెతికి ఉల్లాల్‌ను పట్టుకొచ్చాడని ఆ సినిమాతో పాటే రూమర్లూ రిలీజ్ అయ్యాయి. మస్కాట్‌లో పుట్టిన ఈ మంగుళూరు అమ్మాయి మన తెలుగులో కూడా నటించింది. ‘ఉల్లాసంగా.. ఉత్సాహంగా’, ‘సింహా’లలో లీడ్ రోల్స్ ఉల్లాల్వి. చక్కగా కుందనపు ఐశ్వర్యారాయ్‌లా ఉందనుకున్నారు ప్రేక్షకులు. ఆ మాట నచ్చినట్లు లేదు ఉల్లాల్‌కి. ‘‘మీరు అచ్చు ఐశ్వర్యలా ఉంటారని అంతా అంటుంటారు కదా..’’ అని ఒక ఇంటర్వూ్యలో అడిగిన ప్రశ్నకు.. ‘‘ఐశ్వర్యా! ఎవరూ?!’’ అని చికాకు పడ్డారు కూడా. మరీ ఉల్లాల్లా అచ్చుగుద్దినట్లు ఐశ్వర్యలా లేకపోయినా.. ‘ఆనందం’ (2001) సినిమాలో హీరోయిన్ రేఖా వేదవ్యాస్, అదే ఏడాది విడుదలైన ‘ఇట్లు.. శ్రావణి, సుబ్రహ్మణ్యం’లో తనూరాయ్ కొన్ని యాంగిల్స్‌లో ఐశ్వర్యను గుర్తుకు తెచ్చారు. ఏళ్లు గడిచాయి. ఐశ్వర్యలా కనిపించిన ఉల్లాల్, రేఖ, తనూరాయ్ మారిపోయారు కానీ, ‘అసలు ప్రతి’ ఐశ్వర్య మాత్రం అలానే ఉండిపోయారు. మరాఠీ నటి మానసీ నాయక్, బెంగాలీ నటి మిష్టీ చక్రవర్తిలో కూడా ఐశ్వర్య పోలికలు ఉంటాయి. అమ్యూజ్ అమృతకు కాస్త సీనియర్లు మానసీ, మిష్టి. మామూలుగానే మనిషిని పోలిన మనిషి కనిపించినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఇక ఐశ్వర్యలాంటి వాళ్లు ఏడాదికొకరు అన్నట్లు ప్రత్యక్షం అవుతుంటే ఐశ్వర్యకు వయసు పెరుగుతుందా? వన్నె తగ్గుతుందా? ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లో నటిస్తున్నారు ఐశ్వర్య. ఎన్ని గ్యాపులతో ఎన్ని సినిమాల్లో నటించినా ఐశ్వర్యకు అది ఎంట్రీనే తప్ప రీ–ఎంట్రీ అవకపోవడానికి ఆమె కాలాతీత అభినయ సౌందర్యం కానీ, ఆమె సౌందర్యాభినయం గానీ ఆమెలో ప్రధాన పాత్రను పోషిస్తూ ఉండి ఉండొచ్చు. -
జూలై నుంచి షురూ?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో మణిరత్నం తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ ఒకటి. విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, ‘జయం’ రవి, త్రిష ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చారిత్మ్రాతక చిత్రం ఇది. తమిళ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కరోనా వల్ల అన్ని సినిమాల్లానే ఈ సినిమా చిత్రీకరణ కూడా ఆగిపోయింది. అయితే జూలై నెలాఖరు నుంచి ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం పాండిచ్చేరిలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. నెలరోజుల పాటు ఈ భారీ షెడ్యూల్ జరగనుందట. విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తీ ఈ షెడ్యూల్లో పాల్గొంటారట. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్. -
అందం, అణకువల కలబోత
ప్రస్తుతం ఇంటర్నెట్లో ‘థ్రోబ్యాక్’ చాలెంజ్ ట్రెండ్ అవుతోంది. దీనిలో భాగంగా సోషల్ మీడియా వేదికగా నెటిజనులు ఎన్నో విలువైన, అద్భుతమైన, అపురూప చిత్రాలను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో అందాల రాణి, మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌కు సంబంధించిన ఓ అరుదైన ఫోటోను షేర్ చేశారు నెటిజనులు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరలవుతోంది. ఐశ్వర్య రాయ్ సింప్లిసిటీకి నెటిజనులు ఫిదా అవుతున్నారు. ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన తర్వాత తీసిన ఫోటో ఇది. దీనిలో ఆమె, తన తల్లి బ్రిందా రాయ్‌తో కలిసి కింద కూర్చుని భోజనం చేస్తున్నారు. తలపైన ప్రపంచ సుందరి కిరీటం ధరించినప్పటికి ఓ సాధారణ యువతిలా నేలపై కూర్చుని భోజనం చేయడం నిజంగా విశేషమే. దాంతో ‘అందం, అణకువల కలబోతకు నిదర్శనం ఈ ఫోటో’ అంటూ తెగ ప్రశంసిస్తున్నారు నెటిజనులు. (‘తన మాటలకు గర్వంగా ఉంది’) ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఐశ్వర్య రాయ్.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత కల్కి కష్ణమూర్తి రచించిన పాపులర్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ పీరియాడికల్ చిత్రంలో విక్రమ్, కార్తి, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. (స్వర్ణయుగం మొదట్లో..) -
ప్రముఖ టీవీ హోస్ట్‌కు చీర కట్టిన ఐశ్వర్యరాయ్
ముంబై : మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ప్రముఖ హాలీవుడ్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రేకు చీర కట్టుకోవటం ఎలాగో నేర్పుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన ఆ సీన్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. 2005లో ఐశ్వర్యరాయ్.. ఓప్రా షోలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా ఐశ్వర్య ఈ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ పింక్ కలర్ శారీని ఆమె ఓప్రాకు బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా దాన్ని ఆమెకు కట్టారు. చీరలో తాను అందంగా కనిపిస్తున్నానని ఓప్రా సంతోషం వ్యక్తం చేశారు. ఈ షోలో ఐశ్వర్య మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, ఆతిథ్యం గురించి చెప్పారు. ( ‘ఐశ్వర్య విషయంలో దురదృష్ట వంతుడిని’ ) కామ సూత్ర పుట్టిన గడ్డనుంచి వచ్చానంటూ తనను తాను పరిచయం చేసుకున్నారు. కాగా, 2009లో ఐశ్వర్య, అభిషేక్‌లు భార్యభర్తలుగా ఓప్రా షోలో పాల్గొన్నారు. 2012లో భారత్‌కు వచ్చిన ఓప్రాకు అభిషేక్ బచ్చన్ దంపతులు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను ఓప్రా కలుసుకున్నారు. నిండైన చీరతో దర్శనిమిచ్చారు. -
అందగత్తెలంతా ఒక్కచోట చేరారు
లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. టైం పాస్ కోసం ఎక్కువ సమయం ఇంటర్నెట్లోనే గడుపుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడ ఏదో ఒక చాలెంజ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది కదా. తాజాగా ‘థ్రోబ్యాక్’ చాలెంజ్ నడుస్తోంది. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్‌తో వర్తమానం గందరగోళం అయ్యింది.. భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తోస్తుంది. మరి గతం.. చేదు,తీపి జ్ఞాపకాలతో నిండి ఉంటుంది కదా. అందుకే ఈ థ్రోబ్యాక్ చాలెంజ్ బాగా ట్రెండ్ అవుతుంది. గతించిన కాలానికి చెందిన ఎన్నో అద్భుతమైన, అందమైన, విలువైన జ్ఞాపకాలు మరో సారి తెర మీదకు వస్తున్నాయి.(రెండు నెలల తర్వాత బయటకు..) ఈ క్రమంలో ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. భారతీయ అందానికి ప్రతికలుగా నిలిచిన అందాల రాణులంతా ఓ చోట చేరిన ఈ చిత్రం నెటిజనుల మనసు దోచుకుంది. ఈ ఫోటోలో సుస్మితా సేన్(మిస్ యూనివర్స్ 1994), ఐశ్వర్య రాయ్(మిస్ వరల్డ్ 1994), డయానా హేడెన్(మిస్ వరల్డ్ 1997 ), యుక్తా ముఖి(మిస్ వరల్డ్ 1999), లారా దత్తా(మిస్ యూనివర్స్ 2000), ప్రియాంక చోప్రా(మిస్ వరల్డ్ 2000), దియా మీర్జా(మిస్ ఆసియా పసిఫిక్ 2000) ఈ ఫోటోలో ఉన్నారు. చరిత్ర సృష్టించిన మహిళల చిత్రాన్ని మరో సారి తెర మీదకు తెచ్చినందుకు నెటిజనులు కృతజ్ఞతలు తెలిపుతున్నారు.(‘ఆ అద్భుతానికి నేటితో 20 సంవత్సరాలు’) View this post on Instagram 👑 A bevy of beauties! From left to right: Sushmita Sen - Miss Universe 1994 Priyanka Chopra - Miss World 2000 Lara Dutta - Miss Universe 2000 Yukta Mookey - Miss World 1999 Dia Mirza - Miss Asia Pacific 2000 Diana Hayden - Miss World 1997 Aishwarya Rai - Miss World 1994 @sushmitasen47 @priyankachopra @larabhupathi @yuktamookhey @diamirzaofficial @dianahaydensays @aishwaryaraibachchan_arb #missasiapacific #missworld #missuniverse #missindia #missfeminaindia #femina #beautypageant #beautyqueen #beautyqueens #laradutta #laraduttabhupathi #diamirza #diamirzaofficial #priyankachopra #priyankachoprajonas #priyankachoprafans #priyankachopra_nour #priyankachoprateam #aishwaryarai #aishwaryaraibachan #aishwarya #aish #aishwaryaraibachchan #sushmitasen #sushmitasenfanclub #sushmitasen47 #yuktamookhey #dianahayden #missworld1994 #missuniverse1994 A post shared by @ retrobollywood on May 13, 2020 at 12:00am PDT -
‘ఐశ్వర్య విషయంలో దురదృష్ట వంతుడిని’
షారుక్ ఖాన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్లు బాలీవుడ్లో స్టార్ హీరో, హీరోయిన్. అయితే వీరిద్దరూ కలిసి ఎన్ని సినిమాలు చేశారంటే టక్కున నోటితో చెప్పేయొచ్చు. అవి కూడా హ్యాపీ ఎండింగ్ లేని ప్రేమకథలే. మరో విషయం ఏంటంటే వీరిద్దరూ నటించిన మొదటి సినిమాలోనే అన్నాచెల్లెల్లుగా కనిపించారు. ఇక దీనిపై షారుక్ మాట్లాడుతూ.. మాజీ ప్రపంచ సుందరికి నేను అన్నగా నటించినందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని ఓ ఆవార్డు కార్యక్రమంలో వెల్లడించాడు. అంతేగాక ఐశ్వర్యతో నటించే అవకాశం వచ్చినా దాన్ని తాను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యానంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. కాగా ఈ కార్యక్రమంలో షారుక్, ఐశ్వర్యకు ఆవార్డును ప్రదానం చేశాడు. (కరోనా : షారుక్ సాయం.. అభినందించిన మంత్రి) Aishwarya's speech after receiving the award from SRK. (Part 1) Mentions Hema Malini, Zeenat Aman, Rekha, Madhuri Dixit, Kajol. "We love you and miss you Sri ji" #LuxGoldenRoseAwards pic.twitter.com/adB9IBGepI — Stevie Budd (@Oxynom) November 18, 2018 అనంతరం షారుక్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ఐశర్య విషయంలో నేను చాలా దురదృష్ట వంతుడిని. ప్రపంచ సుందరి అయిన ఐశ్వర్యకు మా మొదటి చిత్రం ‘జోష్’లో సోదరుడిగా నటించాను. అందులో మేమీద్దరం కవల పిల్లలం. అంతేకాదు కవలలుగ నటించిన మా ఇద్దరిని చూసి ఒకేలా ఉన్నారంటూ అందరూ చెప్పేవారు. ఇప్పటికీ కూడా మేమీద్దరం ఒకేలా ఉంటామన్న భ్రమలోనే ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సంజయ్ లీలా భాన్సాలీ దర్శకత్వంలో వచ్చిన వీరిద్దరి రెండవ చిత్రం ‘దేవదాస్’ గురించి చెబుతూ.. ‘‘ ఇందులో మేము ప్రేమికులుగా నటించాం. కానీ ఈ సినిమాలో నేను, తనని విడిచి పెట్టాను. తిరిగి నేను ఐశ్వర్యను ప్రేమించినప్పటికీ అప్పటికి ఆమె నన్ను విడిచి పెట్టింది. ఇక ఆ తర్వాత ఐశ్వర్య నన్ను ప్రేమించే అవకాశమే రాలేదు(తెరపై). అయితే ఒక్క విషయంలో మాత్రం అదృష్టవంతుడి కనీసం ఒక్కసారైనా తెరపై ఐశ్వర్యను ప్రేమించే అవకాశం వచ్చింది’’ అంటూ చమత్కారించాడు. -
రోబో: హీరోయిన్ ఐశ్వర్య.. మరి హీరో ఎవరు?
సాక్షి, చెన్నై: సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ సృష్టించిన అద్భుత సృష్టి ‘రోబో’ . రజనీ సరసన అందాల తార ఐశ్వర్యరాయ్ నటించారు. విజువల్ వండర్‌గా నిలిచిన చిత్రం మరెన్నో చిత్రాలకు ప్రేరణగా నిలిచింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలై పదేళ్లు కావస్తోంది. మలేషియాలో జరిగిన ‘రోబో’ ఆడియో ఫంక్షన్లో రజనీకాంత్ స్పీచ్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్ అయింది. అయితే లాక్డౌన్ కారణంగా అనేక పాత, కొత్త విషయాలను తెలుసుకుంటున్న నెటిజన్లకు రజనీకి సంబంధించిన ఈ పాత వీడియో కంటపడింది. దీంతో పూర్తి వినోదత్మకంగా ఉన్న ఆ వీడియోను తెగ లైక్ చేస్తుండటంతో మరోసారి వైరల్ అవుతోంది. ఆ విశేషాలు మీకోసం.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే? ‘నేను ఒక రోజు బెంగళూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లాను. ఆ ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్న నందూలాల్ అనే ఓ 60 ఏళ్ల వ్యక్తి నన్ను చూసేందుకు వచ్చాడు. అప్పుడు ఈ విధంగా మా మధ్య సంభాషణ జరిగింది. నందులాల్: ఏంటయ్యా రజనీ, మీ జుట్టుకు ఏమైంది. రజనీ: రాలిపోయింది సర్. అయినా ఇప్పుడు దీని గురించి ఎందుక లేండి? నందులాల్: మీరు రిటైర్ అయ్యాక ఏం చేస్తున్నారు? రజనీ: నేను రిటైర్ కాలేదు. సినిమాల్లో నటిస్తున్నాను నందులాల్: అవునా? ఏ సినిమా రజనీ: రోబో, ఐశ్వర్యరాయ్ హీరోయిన్గా నటిస్తున్నారు నందులాల్: ఐశ్వర్యరాయ్‌ది ఏం అందం అండి, ఇంతకీ ఆ చిత్రంలో హీరో ఎవరు? రజనీ: హీరో నేనే (చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూనే) నందులాల్: ఓ పది నిమిషాలు తదేకంగా నన్ను చూసి, మీరు హీరోనా? వెంటనే ఆయన కుమారులు వచ్చి నాన్న రజనీకాంత్ ఇప్పటికే హీరో పాత్రలలోనే నటిస్తున్నారు అని చెప్పారు. అయితే నందులాల్ వాళ్ల ఇంటికి వెళ్లాక ఆయన కుమారులతో ఇలా అన్నారంట. అరేయ్ ఐశ్వర్యరాయ్ కి అసలు ఏమైంది? అభిషేక్ బచ్చన్ ఎక్కడికి వెళ్లి పోయాడు? అమితాబచ్చన్ ఏం చేస్తున్నాడు? బట్టతల ఉన్న రజినీకాంత్ కి ఐశ్వర్య రాయ్ తో నటించే అవకాశం ఎలా వచ్చింది? అంటూ ప్రశ్నించారట. ఈ సందర్భంగా ఐశ్వర్యకు ఒక్కటి చెప్పదల్చుకున్నాను. నా పక్కన హీరోయిన్గా నటించేందుకు ఒప్పుకున్న ఐశ్వర్యకు కృతజ్ఞతలు’ అంటూ రజనీ పేర్కొనడంతో ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన వారందరూ పగలబడి నవ్వుకున్నారు. చదవండి: కరోనాపై పోరులో చిరంజీవి తల్లి డీడీ నంబర్ వన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_911254541.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అందుకే తప్పుకున్నా
మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, కార్తీ, ‘జయం’ రవి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ’పొన్నియిన్ సెల్వన్’. ప్రముఖ రచయిత కల్కి కష్ణమూర్తి రచించిన పాపులర్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో అమలా పాల్ కూడా నటించాల్సి ఉంది. కానీ షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారామె. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా చేయకపోవడానికి గల కారణాన్ని తెలిపారామె. ‘మనకి ఆఫర్ చేసిన అన్ని సినిమాల్లో నటించలేము. ’పొన్నియిన్ సెల్వన్’లోని పాత్రకు నేను సరిపోను అనిపించింది. న్యాయం చేయలేము అనిపించినప్పుడు చేయకపోవడం ఉత్తమం. అందుకే ఆ సినిమా నుంచి బయటకు వచ్చేశాను. మణిరత్నంగారి సినిమాలో నటించే అవకాశం మళ్లీ వస్తుందని భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు అమలా పాల్. -
వావ్.. వాటే బ్యూటీ.. ఐష్ జిరాక్సే
ఐశ్వర్యరాయ్.. అందానికి కేరాఫ్ అడ్రస్. అందం అంటే ఆమెదే. కుర్రకారు మొదలుకుని సినీ నిర్మాతల వరకూ ఆమె అందానికి ఆకర్షితులే. ప్రతి ఒక్కరు అందాన్ని ఆమెతో పోల్చి చెబుతారు. అలాంటి అందమైన స్త్రీ భూమ్మీద మరొకరు ఉండరని అంటుంటారు. కానీ ఉన్నారు. ఆమే మారాఠీ నటి మనసి నాయక్. ఐశ్యర్యరాయ్ లాంటి కళ్లు, అందం గల మనసి నాయక్.. ఇటీవల సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. ఆమె చేసిన టిక్‌టాక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె ఫోటోలు, వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు అచ్చం ఐశ్యర్యరాయ్ లాగే ఉన్నారని పొగిడేస్తున్నారు. ఇక తనను ఐశ్యర్యరాయ్‌తో పోల్చడంతో తెగ సంబరపడిపోతుంది మనసి నాయక్. ఐశ్వర్యరాయ్ సినిమాలోని పాటలకు టిక్‌టాక్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆమె వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు అచ్చం ఐశ్యర్యరాయ్లా ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. ‘ఐశ్యర్యరాయ్ డూబ్లికేట్’, , ‘ఐశ్యరాయ్ జిరాక్స్’, , ‘యంగ్ ఐశ్యర్యరాయ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మనసి నాయక్ ప్రముఖ మరాఠి నటి. ‘బాగ్తోయి రిక్షావాలా’ అనే ఐటమ్ సాంగ్‌లో నటించి ఫేమస్ అయ్యారు. తర్వాత జబర్దాస్త్, టార్గెట్, కుటుంబ్, టీన్ బేకా ఫాజిటి ఐకా తదితర మరాఠి చిత్రాలలో నటించారు. 4 మిలియన్ల మంది ఆమె టిక్‌టాక్ వీడియోలను ఫాలో అవుతున్నారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 9,43,537 మంది ఫాలోవర్స్ ఉన్నారు. View this post on Instagram I love sharing My tiktok videos For My fans 🤗💋❤ And yes I love to Be Desi🇮🇳 because I have it naturally in me...😉 Good morning Instagram Family ☕👸 #ManasiNaik #BeingMe #Inspire #Motivate #IndianBeauty #smile #Eyes #Actor #performer #Love #PardeepManasi #couplegoals #DesiGirl🇮🇳 #Sunshine #Indian #Traditional A post shared by Manasi Naik (@manasinaik0302) on Feb 24, 2020 at 8:19pm PST -
పొన్నియిన్.. శోభితా ఇన్
చోళసామ్రాజ్యంలో రాణిగా స్థానం సంపాదించారు హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల. ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పీరియాడికల్ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. విక్రమ్, కార్తి, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్ ఈ సినిమాలో ప్రధానతారాగణం. వీరితో పాటు తాజాగా శోభితా ధూళిపాళ్ల కూడా ఈ చిత్రంలో చోటు సంపాదించారు. ‘‘మణిరత్నంగారి దర్శకత్వంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు శోభిత. కూచిపూడి, భరతనాట్యంలో ఎంతో ప్రావీణ్యత, నైపుణ్యం ఉన్న ఓ రాణి పాత్రలో శోభిత నటించబోతున్నారని టాక్. నిజజీవితంలోనూ శోభితా మంచి క్లాసికల్ డ్యాన్సర్ అనే సంగతి తెలిసిందే. -
అమాయకత్వం ఏమాత్రం తగ్గలేదు: బిగ్‌బీ
బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ నేడు 44వ వడిలోకి అడుగుపెట్టాడు. తల్లిదండ్రులు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, భార్య ఐశ్వర్యరాయ్, కూతురు ఆరాధ్యల సమక్షంలో అభిషేక్ తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. ఇక అభిషేక్‌కు ఇష్టమైన వాటి నమూనాతో ప్రత్యేక కేక్‌ను తయారు చేయించింది అందాల సుందరి ఐశ్వర్య. ‘హ్యాపీ బర్త్‌డే బేబీ.. ప్రేమతో’ అంటూ నవ్వులు చిందిస్తున్న ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. అతని సోదరి శ్వేతా బచ్చన్ గత స్మృతులను గుర్తు చేసుకుంటూ వాళ్లిద్దరూ కలిసి చిన్నప్పుడు సైకిల్‌తో ఆడుకున్న ఫొటోలను పంచుకుంటూ బర్త్‌డే గ్రీటింగ్స్ తెలిపింది. ఇది అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. (అమితాబ్‌కు బిగ్ ఫ్యాన్‌ని) ఇక అమితాబ్ బచ్చన్ పుట్టినరోజును పురస్కరించుకుని భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ‘ఆరోజు ఫిబ్రవరి 5. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆ రోజంతా వాడి రాకకోసం ఎంతో ఆదుర్దాగా ఎదురు చూశాను. ఎట్టకేలకు వాడు జన్మించాడు. అభిషేక్ ఈ లోకంలోకి అడుగుపెట్టడంతో అందరం ఆనందంలో తేలియాడుతూ సంబరాలు జరుపుకున్నాం’ అని ఎమోషనల్ అయ్యాడు. పిల్లలు ఎంత ఎదిగినా కన్నవాళ్ల కంటికి ఇంకా చిన్నపిల్లల్లాగే కనబడుతారనేది అమితాబ్ విషయంలో మరోసారి నిరూపితమైంది. ‘నేటితో అతనికి 44 సంవత్సరాలు. కానీ నా కంటికి ఇంకా చిన్నపిల్లోడే. చిన్ననాటి అమాయకత్వం అభిషేక్‌కు ఇప్పటికీ పోలేదు. బహుశా పోదేమో కూడా’ అని రాసుకొచ్చాడు. చదవండి: ముద్దు మురిపాలు -
స్వర్ణయుగం మొదట్లో..
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. మదరాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై మణిరత్నం, సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన గురువారం వెల్లడైంది. ‘స్వర్ణయుగం మొదట్లో..’ అంటూ ఈ సినిమా టైటిల్‌ను, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. మణిరత్నం చేసే అన్ని సినిమాలకు దాదాపు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుంటారు. ఈ చిత్రానికి కూడా ఆయనే స్వరకర్త. జయమోహన్ మాటల రచయిత. మణిరత్నం, కుమారవేల్ సంయుక్తంగా ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రల్లో ఐశ్వర్యారాయ్, త్రిష, విక్రమ్, కార్తీ, ‘జయం’రవి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ థాయ్‌ల్యాండ్‌లో జరుగుతోంది. కార్తీ, ‘జయం’ రవిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. -
మేం తీసుకోం.. పబ్లిసిటీ కోసం చిల్లర చేష్టలు
పట్నా: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకుల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. తేజ్ ప్రతాప్ భార్య ఐశ్వర్యారాయ్ తండ్రి, ఆర్జేడీ నేత చంద్రికా రాయ్ లాలూ కుటుంబంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఇబ్బంది పెట్టేందుకు ఇంటికి బాంబులు పంపించేరేమో అని వియ్యంకుల తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఐశ్వర్య అత్తింటి నుంచి వచ్చిన వస్తువులను తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. కాగా తనకు విడాకులు కావాలంటూ తేజ్ ప్రతాప్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పట్నా ఫ్యామిలీ కోర్టులో నమోదైన విడాకుల కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ క్రమంలో అత్తింటి వారు తనను తీవ్రంగా హింసించి ఇంటి నుంచి గెంటివేశారని ఐశ్వర్యారాయ్ తన అత్త రబ్రీదేవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా పెళ్లి సమయంలో తమ కూతురికి ఇచ్చిన ఖరీదైన కానుకలు, వస్తువులు తిరిగి ఇచ్చేయాలంటూ ఐశ్వర్య తల్లి పూర్ణిమా దేవి... వుమన్ హెల్్పలైన్ ద్వారా వియ్యంపురాలు రబ్రీదేవికి నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో లాలూ నివాసం నుంచి రెండు వ్యాన్లు సామాన్లతో గురువారం ఐశ్వర్య పుట్టింటికి చేరుకున్నాయి. అయితే ఐశ్వర్య తండ్రి చంద్రికా రాయ్ మాత్రం వాటిని అన్లోడ్ చేయనివ్వలేదు. దీంతో రెండు వాహనాలు రాత్రంతా అక్కడే ఉండిపోయాయి.(‘జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి.. ఫోన్ లాక్కొన్నారు’) ఈ విషయం గురించి చంద్రికా రాయ్ మాట్లాడుతూ... ‘చట్ట ప్రకారం మెజిస్ట్రేట్, పోలీసుల ముందు ఆ సామాన్లను ప్యాక్ చేయాల్సి ఉంటుంది. అలా వాళ్లకు వాళ్లే పంపిస్తే వాటిని నేనెందుకు స్వీకరించాలి. మాకు హాని చేసేందుకు అందులో మద్యం బాటిళ్లు, పేలుడు పదార్థాలు పెట్టారేమో అని లాలూ కుటుంబంపై సందేహం వ్యక్తం చేశారు. ఇక చంద్రికా రాయ్ వ్యాఖ్యలపై లాలూ కుమార్తె, ఎంపీ మిసా భారతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టప్రకారమే తాము సామాన్లను వెనక్కి పంపామని.. అయితే చంద్రికా రాయ్ మాత్రం పబ్లిసిటీ కోసం చిల్లరగా ప్రవర్తిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలైన ఐశ్వర్యరాయ్‌తో గతేడాది మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే అనతికాలంలోనే వీరి కాపురంలో కలతలు చెలరేగడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. తండ్రి చంద్రికా రాయ్‌తో ఐశ్వర్యా రాయ్(ఫైల్ ఫొటో) -
ఆరు గంటలకు టేక్
ఉదయం మూడు గంటలకే మేకప్ చైర్లో కూర్చుని, ఆరు గంటలకల్లా షూట్‌కు సిద్ధంగా ఉంటున్నారట కార్తీ, ‘జయం’ రవి. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాని దర్శకుడు మణిరత్నం ఆర్డర్ ఇది. ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఆయన దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ థాయ్‌ల్యాండ్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్తీ, ‘జయం’ రవిలపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సూర్యోదయం సన్నివేశాలను తీస్తున్నారట మణిరత్నం. ఇది చారిత్రాత్మక చిత్రం కావడంతో నటీనటులు గెటప్పులు భిన్నంగా ఉంటాయి. అందుకే కార్తీ, ‘జయం’ రవి ఉదయం మూడు గంటలకల్లా మేకప్ రూమ్‌కి ఎటెండ్ అయిపోతున్నారు. అలాగే సహజమైన లైటింగ్‌లో సన్నివేశాలను తీయాలని మణిరత్నం ప్లాన్ చేసుకున్నారట. అందుకని ఉదయం 6 గంటలకు ఫస్ట్ షాట్‌కి టేక్ చెబుతున్నారట. సూర్యాస్తమయం లోపు షూటింగ్ ప్యాకప్ చెబుతున్నారని సమాచారం. ఈ భారీ షెడ్యూల్ ఫిబ్రవరి వరకు థాయ్‌ల్యాండ్‌లోనే జరుగుతుందట. ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత త్రిష, విక్రమ్‌లపై సన్నివేశాలను ప్లాన్ చేశారట. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ప్రచారం జరుగుతోంది. -
‘జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి.. ఫోన్ లాక్కొన్నారు’
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీపై కేసు నమోదైంది. రబ్రీదేవీ తనను హింసించారని ఆరోపిస్తూ.. లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యారాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనకు విడాకులు కావాలంటూ తేజ్ ప్రతాప్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పట్నా ఫ్యామిలీ కోర్టులో నమోదైన విడాకుల కేసు విచారణలో భాగంగా తేజ్ ప్రతాప్ భార్య ఐశ్వర్య... తేజ్‌కు గంజాయి సేవించే అలవాటు ఉందని, డ్రగ్స్‌కు బానిస అయి తనను వేధించేవాడని సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తేజ్ కుటుంబ సభ్యులు వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో భర్తతో సహా తన అత్త రబ్రీదేవి సైతం తనను వేధింపులకు గురిచేశారని ఐశ్వర్యరాయ్ పోలీసులను ఆశ్రయించారు. తేజ్‌ప్రతాప్ విడాకులకు పట్టుబట్టడంతో రబ్రీదేవి తనను తీవ్రంగా కొట్టి బయటకు నెట్టివేశారని పేర్కొన్నారు. మెసేజ్ రావడంతో కిందకు వచ్చాను... ‘నేను నా గదిలో టీవీ చూస్తున్న సమయంలో నా ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. నన్ను, నా కుటుంబ సభ్యులను కించపరుస్తూ తేజ్ మద్దతుదారులు పట్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో పోస్టర్లు అతికించారని తెలిసింది. వెంటనే కిందకు దిగి ఈ విషయం గురించి మా అత్తగారిని నిలదీశాను. నా తల్లిదండ్రుల పరువు తీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించాను. వెంటనే తను నన్ను అసభ్యంగా తిట్టడం మొదలుపెట్టారు. నా జుట్టు పట్టుకుని లాగుతూ.. కిందపడేశారు. తల, మోకాళ్లు, పాదాలపై కర్రతో కొట్టారు. బంగ్లా నుంచి గెంటివేసే ముందు చెప్పులు కూడా తొడుక్కోనివ్వలేదు. నా ఫోన్, ఇతర వస్తువులు లాక్కొన్నారు’ అంటూ సర్కులర్ రోడ్డు నివాసం బయట ఏడుస్తూ ఐశ్వర్య విలేకరులతో గోడు వెళ్లబోసుకున్నారు. ఈ క్రమంలో తన తండ్రి చంద్రికారాయ్ సహా ఇతర కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్యారాయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం రబ్రీ దేవిపై కేసు నమోదు చేశారు. ఇక బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలైన ఐశ్వర్యరాయ్‌తో గతేడాది మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. -
వారోత్సవం!
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌కి ఇది ఫన్ టైమ్. ఆల్రెడీ ఐశ్వర్యారాయ్ ఇంట జరిగిన దీపావళి వేడుకలు బాలీవుడ్ వీధుల్లో బాగానే ప్రతిధ్వనించాయి. ఇంతటితో ఐశ్వర్య సెలబ్రేషన్స్‌కు ఫుల్స్టాప్ పడలేదు. ఎందుకంటే నవంబర్ 1న ఆమె పుట్టినరోజు. ఈ వేడుకల కోసం భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యలతో కలిసి రోమ్ వెళ్లనున్నారామె. అక్కడ దాదాపు వారం రోజుల పాటు ఉండేలా అభిషేక్ ఈ హాలిడేని ప్లాన్ చేశారు. పనిలో పనిగా తాను ప్రచారకర్తగా ఉన్న ఓ ఉత్పత్తికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని, నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రీ–బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సందడి చేస్తారు ఐశ్వర్య. ఇలా నవంబర్ మొదటి వారం అంతా ఐశ్వర్య సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారు. తిరిగొచ్చాక మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో తాను చేయనున్న పాత్ర కోసం కసరత్తులు మొదలుపెడతారామె. అభిషేక్ బచ్చన్ కూడా ‘బిగ్ బుల్’ సినిమాతో బిజీ అవుతారు. -
ఐశ్వర్యను ఇంట్లోకి అనుమతించారు
పట్నా: నాటకీయ పరిణామాల మధ్య బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య రాయ్‌ను ఇంటిలోనికి అనుమతించారు. కోడలి నిరసనతో రబ్రీ దేవి దిగివచ్చారు. వివాహమైన కొద్ది నెలలకే తేజ్ ప్రతాప్ విడాకులు కోరుతూ.. కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాక భార్యతో విడాకులు ఇప్పిస్తేనే ఇంటికి వస్తానంటూ.. వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తన భర్త డ్రగ్స్‌కు బానిసయ్యాడని ఆరోపించిన ఐశ్యర్య మొదటి సారి అత్తింటివారు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. అత్త రబ్రీ దేవి, ఆడపడుచు మీసా భారతి తనకు ఆహారం కూడా పెట్టకుండా వేధించడమే కాక ఇంట్లో నుంచి గెంటేశారని తెలిపారు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాల్సిందిగా అత్తింటి బయట కూర్చుని నిరసన తెలిపారు ఐశ్వర్య. ఆమె తండ్రి చంద్రికా రాయ్ కూడా ఐశ్వర్యతో పాటు కూర్చుని.. తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా మరికొందరు కలిసి రబ్రీ దేవి ఇంటి ముందు ధర్నాకు దిగారు. లాలూ, రబ్రీ దేవిలకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. దాంతో రంగంలోకి దిగిన డీజీపీ గుప్తేశ్వర్ పాండే వివాదాన్ని పరిష్కరించడంతో సోమవారం మధ్యాహ్నం ఐశ్వర్యను ఇంట్లోకి అనుమతించారు. రబ్రీ దేవి, మీసా భారతి తనను వేధిస్తున్నారని.. తిండి కూడా పెట్టడం లేదని ఐశ్వర్య ఆరోపించిన సంగతి తెలిసిందే. మీసా భారతి మూలంగానే తనకు, తన భర్తకు మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని ఐశ్వర్య ఆరోపించారు. రబ్రీదేవి సమక్షంలోనే మీసా భారతి తనను ఇంటి నుంచి గెంటేశారని వాపోయిన సంగతి తెలిసిందే. -
తిండి కూడా పెట్టకుండా వేధించారు
సాక్షి, పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య రాయ్ అత్తింటి వారిపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, తన అత్త రబ్రీదేవి తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆడపడుచు మిసా భారతి తీవ్రంగా గృహహింసకు పాల్పడ్డారని, తనకు తిండికూడా పెట్టకుండా వేధించడంతోపాటు చివరకు తన సంసార జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన భర్త తేజ్ ప్రతాప్, మరిది తేజస్వి ప్రతాప్ యాదవ్ మధ్య విబేధాలు సృష్టించడానికి భారతి ప్రయత్నిస్తున్నారని ఐశ్వర్య పేర్కొన్నారు. రబ్రీ దేవి తన కుమార్తె పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఐశ్వర్య తండ్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రిక రాయ్ ఆరోపించారు. దీనపై కేసు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించిన ఆయన తన కుమార్తెకు అత్తగారి ఇంట్లో అన్ని హక్కులు పొందాలని కోరుకుంటున్నామన్నారు. (ఆదివారం సాయంత్రం వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు) మరోవైపు రాజ్యసభ సభ్యురాలు మిసా భారతి ఐశ్వర్యా రాయ్ ఆరోపణలను ఖండించారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉంటున్న తాను ఆమెను ఎలా వేధించగలను అని ప్రశ్నించారు. తానెపుడు ఆమెను సోదరిలా భావించానంటూ ఐశ్యర్య ఆరోపణలు నిరాధారమైనవనీ కొట్టిపారేశారు. తల్లిదండ్రుల ఆదేశాల మేరకే ఇదంతా చేస్తోందనీ, తద్వారా తన ఆరోపణలకు మరింత బలం చేకూరాలని భావిస్తోందన్నారు. కాగా 2018, మే నెలలో అంగరంగ వైభవంగా ఐశ్వర్య, తేజ్ ప్రతాప్ వివాహం జరిగింది. అయితే, కొద్ది నెలలకే వీరిద్దరి మధ్య కలతలు మొదలయ్యాయి. తన భర్త తేజ్ ప్రతాప్ డ్రగ్స్‌కు బానిసయ్యాడని ఆరోపించిన ఐశ్వర్య గృహ హింస నుంచి తనను కాపాడాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అలాగే గత ఏడాది నవంబర్‌లో తేజ్ ప్రతాప్ విడాకుల కోసం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య, ఆమె తండ్రి చదవండి : కన్నీటితో మెట్టినింటిని వీడిన ఐశ్వర్య.. -
డబుల్ యాక్షన్
‘జీన్స్’ సినిమాలో ఐశ్వర్యా రాయ్ ద్విపాత్రాభినయం చేశారు. అయితే నటించింది ఒక్క పాత్రలోనే. రెండు పాత్రలూ చేసినట్టు కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో మ్యాజిక్ చేశారు. కానీ ఈసారి నిజంగానే ద్విపాత్రాభినయం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వమ్’. తమిళ ఫేమస్ నవల ‘పొన్నియిన్ సెల్వమ్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్ నెగటివ్ షేడ్స్‌లో కనిపిస్తారని తెలిసిందే. తాజాగా ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలిసింది. చోళుల నాశనాన్ని కోరుకునే రాణి నందినిగా ఐష్ నటిస్తారు. అలానే నందిని తల్లి మందాకిని అనే మూగ పాత్రలోనూ కనిపిస్తారట. ‘నా కెరీర్లోనే చాలెంజింగ్ సినిమా ఇది’ అంటూ ఐష్ ఈ సినిమా గురించి ఆల్రెడీ పేర్కొన్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, నయనతార, కీర్తీ సురేశ్, అనుష్క, అమలా పాల్, పార్తిబన్ ముఖ్య పాత్రల్లో నటిస్తారని సమాచారం. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం అవుతుంది. -
అడవుల్లో వంద రోజులు!
రాజుల ఆహార్యం గొప్పగా ఉంటుంది. అందుకే రాజుల కథలతో వచ్చే సినిమాల కోసం హీరోలు తమ లుక్‌ను మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తమిళ హీరోలు విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి తమ లుక్స్‌ను మార్చుకోబోతున్నారు. చోళ సామ్రాజ్య నేపథ్యంతో కూడుకున్న నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇందులో విక్రమ్, ఐశ్వర్యారాయ్ నటించనున్నారు. విక్రమ్, కార్తీ, జయం రవి, పార్తిబన్, కీర్తి సురేష్, అమలాపాల్ ప్రధాన పాత్రధారులనే ప్రచారం జరుగుతోంది. అమితాబ్ బచ్చన్, మోహన్‌బాబు కూడా కీలక పాత్రలు చేయనున్నారని కోలీవుడ్ టాక్. సినిమాలోని రాజుల పాత్రకు తగ్గట్లు జుట్టు మీసాలు, గెడ్డాలు పెంచుకోమని మణిరత్నం ఈ సినిమాలో నటించే కీలక పాత్రధారులకు చెప్పారట. ఆల్రెడీ విక్రమ్, కార్తీ వంటి నటులు ఈ పని స్టార్ట్ చేశారని కోలీవుడ్ టాక్. ఈ సినిమా షూటింగ్ నవంబరులో మొదలు కానుందని తెలిసింది. ముందుగా థాయ్‌ల్యాండ్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట టీమ్. వంద రోజుల పాటు అక్కడి అడవుల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారని తెలిసింది. -
రాణీ త్రిష
చోళుల కాలానికి వెళ్లేందుకు హీరోయిన్ త్రిష ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన ప్రముఖ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ భారీ మల్టీస్టారర్ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించే వారి జాబితా గురించి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా హీరోయిన్ త్రిష ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయబోతున్నారని చెన్నై కోడంబాక్కమ్ వర్గాల సమాచారం. త్రిష చేయబోయేది ఓ రాణి పాత్ర అట. ఇప్పటివరకు ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యారాయ్ మాత్రమే ఫైనలైజ్ అయిన సంగతి తెలిసిందే. మోహన్‌బాబు, అనుష్క, ‘జయం’ రవి, కీర్తీ సురేశ్, అమలాపాల్, రాశీఖన్నా... ఇలా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలో పన్నెండు పాటలు ఉండబోతున్నాయని తెలిసింది. రచయిత వైరముత్తు ఈ చిత్రంలోని పాటలన్నింటినీ రాయబోతున్నారట. అందుకోసం ఆయన పదవ శతాబ్దానికి చెందిన సాహిత్యంపై ప్రత్యేకమైన పరిశోధనలు చేస్తున్నారని టాక్. ఈ సినిమా చిత్రీకరణ డిసెంబరులో ప్రారంభం కానుందట. -
గంజాయ్ తాగేవాడు.. గాగ్రా, చోలీ వేసేవాడు!
పట్నా: బిహార్ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజ్‌ప్రతాప్ యాదవ్‌కు గంజాయి సేవించే అలవాటు ఉందని, డ్రగ్స్‌కు బానిస అయిన ఆయన నిత్యం తనను వేధించేవాడని అతని భార్య ఐశ్వర్య రాయ్ తెలిపారు. భర్తకు డ్రగ్స్ అలవాటు ఉందని పెళ్లయిన కొత్తలోనే తనకు తెలిసిందని, డ్రగ్స్ మత్తులో అతను శివుడి అవతారంగా చెప్పుకొనేవాడని ఆమె వెల్లడించారు. ఈ మేరకు పట్నా ఫ్యామిలీ కోర్టులో నమోదైన విడాకుల కేసులో ఆమె సమాధానం ఇచ్చారు. మహిళలపై గృహ నిరోధ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలని కోరుతూ కోర్టులో ఆమె అభ్యర్థన దాఖలు చేశారు. ‘తేజ్ శ్రీకృష్ణుడిగా, రాధగా దుస్తులు ధరించేవాడు. పెళ్లయిన కొద్దిరోజులకే అతను దేవతలుగా, దేవుళ్లుగా దుస్తులు ధరిస్తాడని తెలుసుకొని షాక్ అయ్యాను. ఒకసారి డ్రగ్స్ మత్తులో అతను గాగ్రా, చోలీ ధరించి.. మేకప్ వేసుకొని, విగ్గు పెట్టుకొని రాధగా తయారయ్యాడు’ అని ఆమె తెలిపారు. 2018 మేలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల తనయుడైన తేజ్ ప్రతాప్ సింగ్, ఐశ్వర్యరాయ్ పెళ్లయింది. గత ఏడాది నవంబర్‌లో భార్య నుంచి తనకు విడాకులు కావాలని తేజ్ కోర్టులో కేసు వేశాడు. ‘తేజ్ ప్రవర్తన గురించి తన అత్తకు, ఆడపడుచులకు చెప్పేదాన్ని.. వాళ్లు విని ఇలాంటి ప్రవర్తన పునరావృతం కాదని చెప్పేవాళ్లు. కానీ తేజ్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు ఉండకపోయేది. గంజాయి భోలేబాబాకు ప్రసాదమని, దానిని ఎలా మానాలని ఒకసారి తేజ్ నాతో చెప్పాడు’ అని ఆమె వివరించారు. తనకు పెద్దగా చదువులేదని, వండిపెట్టి.. పిల్లల్ని కనడమే తన బాధ్యత అని తేజ్ తనను వేధించేవాడని ఆమె తెలిపారు. తేజ్, అతని కుటుంబసభ్యులు తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నా.. తానింకా అత్తవారింటిలో వారితో కలిసే ఉంటున్నట్టు ఆమె పేర్కొన్నారు. -
షూటింగ్ సమయంలో కలుసుకునే వాళ్ళం..
సినిమా: నటుడు అజిత్ కోలీవుడ్ స్టార్. నటి ఐశ్వర్యారాయ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్. అయితే వీరిద్దరికి పరిచయం ఒక్క చిత్రంలో జరిగింది. అదే కండుకొండేన్ కండుకొండేన్. రాజీవ్‌మీనన్ తెరకెక్కించిన ఆ చిత్రం విడుదలై కొన్నేళ్లు అయ్యింది. ఆ చిత్రంలో అజిత్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించలేదు. అయినా ఇప్పుడు సడన్‌గా నటి ఐశ్వర్యారాయ్ అజిత్‌ను పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఇటీవల చెన్నైలో మెరిసిన ఈ సుందరి దర్శకుడు మణిరత్నం, నటుడు అజిత్‌ల గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో నటిస్తున్నా, దక్షిణాదిలో తమిళం తప్ప ఇతర భాషల్లో నటించడానికి ఇష్టపడని నటి ఐశ్వర్యారాయ్. కోలీవుడ్ చిత్రాల్లో నటించడానికి కారణం దర్శకుడు మణిరత్నం అన్నది అందరికి తెలిసిందే. ఐష్‌ను కోలీవుడ్‌కు పరిచయం చేసింది ఈ దర్శకుడే. అందుకే ఆయనంటే ఈమెకు గౌరవం. త్వరలో మణిరత్నం తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న భారీ చారిత్రక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్‌లో ఈ మాజీ ప్రపంచ సుందరి కూడా ఉన్నారు. దీని గురించి ఐష్ మాట్లాడుతూ.. మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించనున్నానని తెలిపింది. మణిరత్నంతో కలిసి చాలా కాలంగా సినీ పయనం చేస్తున్నాననీ, ఆయనతో పనిచేయడం గొప్పగా భావిస్తున్నానని చెప్పింది. ఆయన తన గురువని పేర్కొంది. తగిన సమయంలో మణిరత్నమే ఆ చిత్ర వివరాలను వెల్లడిస్తారని చెప్పింది. నటుడు అజిత్ గురించి మీ అభిప్రాయం ఏమిటని అడుగుతున్నారనీ, ఆయన చాలా సౌమ్యుడు అని పేర్కొంది. ఇంకా చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తి అని అంది. అభిమానుల మధ్య ఆయన సంపాదించుకున్న ప్రేమ, తన విజయాలను చూస్తుంటే సంతోషంగా ఉందని చెప్పింది. అందుకు అజిత్ అర్హుడని పేర్కొంది. కండుకొండేన్ కండుకొండేన్ చిత్రంలో నటించినప్పుడు ఆయనతో తనకు ఎక్కువ సన్నివేశాలు లేకపోయినా, షూటింగ్ సమయంలో కలుసుకునే వారమని చెప్పింది. అంతే కాదు ఆయన కుటుంబ సభ్యులను కలుసుకున్న తీపి గుర్తులు ఉన్నాయని అంది. మళ్లీ అజిత్‌ను కలిస్తే ఆయన సాధించిన విజయాలకు శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటున్నానని ఐశ్వర్యరాయ్ పేర్కొంది. -
రాణి నందిని
ఎందరో తమిళ దర్శకులు ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను స్క్రీన్ మీద చూపించాలని అనుకున్నారు. కానీ మణిరత్నం ఫైనల్‌గా ఆ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, కీర్తీ సురేశ్, అమలాపాల్ నటించనున్నారని సమాచారం. మోహన్‌బాబుని కూడా ఓ కీలక పాత్రకు మణిరత్నం సంప్రదించారు. ఇక ఈ సినిమాలో చేస్తున్నాను అని ఐష్ స్పష్టం చేశారు. అయితే తన పాత్ర ఎలా ఉండబోతోందో మాత్రం ఆమె బయటపెట్టలేదు. ఈ సినిమాలో ఐష్ నెగటివ్ షేడ్స్‌లో కనిపిస్తారని సమాచారం. చోళరాజ్యానికి చెందిన కోశాధికారి పెరియ పళువెట్టారియార్ భార్య నందిని పాత్రలో కనిపిస్తారట ఐష్. అధికార దాహంతో చోళ రాజ్యం కుప్పకూలిపోవడానికి భర్తను తప్పు దోవలో నడిపించారట నందిని. మరి నందినీగా ఐష్ నటిస్తే ఆమె భర్తగా నటించేది ఎవరు? అంటే.. ఆ పాత్రను మోహన్‌బాబు చేయనున్నారట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్ భావోద్వేగం!
సాక్షి, చెన్నై : తమిళ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆలయాలు, మహోన్నతుల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని మాజీ ప్రపంచ సుందరి, హీరోయిన్ ఐశ్వర్యారాయ్ అన్నారు. తాను తెరంగేట్రం చేసింది కోలీవుడ్‌లోనేనని, తనకు గౌరవం తెచ్చిన తమిళ నేలకు వందనం చేస్తున్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చాలాకాలం తర్వాత ఐశ్వర్య బుధవారం చెన్నైకి వచ్చారు. ఈ సందర్భంగా చెన్నై, తమిళ సంప్రదాయాలు, కోలీవుడ్ గురించి మాట్లాడారు. ‘ఇక్కడి వాతావరణం, ఆహారపు అలవాట్లు, ప్రేమ, ఆప్యాయత, నేను తిరిగిన నేలను జీవితాంతం గుర్తుంచుకుంటా’ అని చెప్పుకొచ్చారు. కాగా 1994లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న ఐశ్వర్యా రాయ్.. టాప్ డైరెక్టర్ మణిరత్నం సినిమా ‘ఇద్దరు’తో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అనంతరం బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హీరో అభిషేక్ బచ్చన్‌తో పెళ్లి తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఐశ్... తన తదుపరి సినిమాలో నెగెటివ్ రోల్లో కనిపించనున్నారు. 10వ శతాబ్ధానికి చెందిన కథతో మణిరత్నం తెరకెక్కిస్తున్న సినిమాలో రాజ్యాధికారం కోసం కుట్రలు చేసే నందిని అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు. విక్రమ్, శింబు, జయం రవిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అమలాపాల్ కీలక పాత్రలో నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.