Maharshi Movie
-
టాలీవుడ్ నటుడిని సన్మానించిన మెగాస్టార్.. ఎందుకో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తన వంతు సాయంగా సమాజం కోసం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పేరిట సేవా కార్యక్రామాలు చేస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. గత 26 ఏళ్లుగా పేద ప్రజలకు ఉచితంగా రక్తనిధులు సమకూరుస్తున్నారు. అయితే చిరంజీవి అభిమానులు ప్రతి ఏటా రక్తదానం క్యాంపులు కూడా నిర్వహిస్తుంటారు. అలా బ్లడ్ బ్యాంక్ ప్రారంభం నుంచి రక్తదానం చేసే వారిలో నటుడు మహర్షి రాఘవ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి వరకు ఆయన వందసార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయనను మెగాస్టార్ అభినందించారు. ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. ఆయన సేవలను మెగాస్టార్ కొనియాడారు. రక్తదానం విషయంలో ప్రతి ఒక్కరూ రాఘవను ఆదర్శంగా తీసుకోవాలని చిరు ఆకాక్షించారు. ఇలాంటి దాతల వల్లే ఎంతోమందికి రక్తం అందిస్తున్నామని తెలిపారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. భోళాశంకర్ తర్వాత చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. MEGASTAR #Chiranjeevi garu felicitates Maharshi Raghava's milestone 100th Blood Donation at @CCTBloodBank Chiranjeevi Blood Bank Boss @KChiruTweets#MegastarChiranjeevi pic.twitter.com/q6yNNGDZSz — Chiranjeevi Army (@chiranjeeviarmy) April 18, 2024 -
మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో తండ్రి-కొడుకులంతా ఇంతేనా..!
మధ్య తరగతి కుటుంబం అంటేనే ప్రేమ, అప్యాయత, అనురాగాలు అంటారు. కానీ అవేవి బయటివారికి పెద్దగా కనిపించవు. ఎందుకంటే అక్కడ ప్రేమ కంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులే ఉంటాయి. దాంతో మనసులో ఎంత ప్రేమ ఉన్న వాటిని బయటికి కనబడనివ్వవు ఆర్థిక ఇబ్బందులు. అందుకే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో తరచూ అరుపులు, గొడవలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తండ్రి-కొడుకులకు అసలు పడదు. కానీ తండ్రికి కొడుకుపై ఎనలేని ప్రేమ, కొడుకుకు తండ్రి అంటే అంతులేని గౌరవం ఉంటాయి. అయితే కొడుకు భవిష్యత్తుపై దిగులుతో నాన్న కొడుకుపై చిరాకు పడతాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా తాను కన్న కలలను సాకారం చేసుకోని స్థితిలో తండ్రిపై అసహనంతో ఉంటాడు కొడుకు. మరి అలాంటి వారు ఎప్పుడు ఎదురుపడినా ఏం జరుగుతుంది. గొడవలే కదా. అది సాధారణంగా అన్ని మధ్య తరగతి కుటుంబాల్లో కనిపించేదే. అలాంటి పాత్రలు వెండితెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది. మరి మధ్యతరగతి తండ్రి-కొడుకుల బాండింగ్‌ను తెరపై ఆవిష్కరించిన చిత్రాలేవో ఓసారి చూద్దాం! తండ్రి, కొడుకుల సంఘర్షణే ‘నీది నాది ఒకటే కథ’: తండ్రి, కొడుకల మధ్య ఉండే సంఘర్షణ అందరి ఇళ్లలోనూ కామన్‌గా కనిపిస్తుంది. అలాంటిదే చాలా సినిమాల్లోనూ చూశాం. కానీ…తండ్రి, కొడుకుల మధ్య సంఘర్షణే కథాంశంగా వచ్చిన చిత్రం ‘నీది నాది ఒకటే కథ’. కొడుకు బాగా బతకాలి అని తపించే తండ్రి…మనకొచ్చిన పని చేసుకుంటూ జీవితంలో సాగిపోవాలి అని నమ్మే కొడుకు. ఈ లైన్‌ని అద్భుతంగా వెండితెరపై పండించారు దేవిప్రసాద్, శ్రీవిష్ణు. మధ్య తరగతి తండ్రి పాత్రలో దర్శకుడు దేవిప్రసాద్ పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి. విద్యలేని వాడు వింత పశువు అన్న నానుడి ఎప్పటి నుంచో సమాజంలో పాతుకుపోయింది. చదువుకోని వాడు వింత పశువేనా ? చదువురాని వాళ్లంతా పనిరాని వాళ్లేనా ? అని ప్రశ్నలు వేస్తే దర్శకుడు వేణు ఊడుగల తీసిన సినిమా…ప్రేక్షకులను థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడుతుంది. ప్రతి మధ్య తరగతి తండ్రి…ఆ మాటకొస్తే ప్రతి తండ్రి తన పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటారు. చదువులో వెనుక బడితే జీవితంలో వెనుక బడినట్టే అని ఆందోళన చెందుతారు. ఈ సంఘర్షణని బలంగా చూపించి, చర్చించారు ‘నీది నాది ఒకే కథ’లో. తండ్రిని అసలు లెక్కచేయని ‘మహర్షి’ చాలా బాగా చదవాలి, గొప్పవాడు కావాలని తపనపడే మధ్య తరగతి కొడుకులకు.. ధనవంతుల తనయులు అడ్డుపడుతుంటారు. డబ్బు, పలుకుబడితో ప్రతి విషయంలో వారిని తొక్కాలని చూస్తుంటారు. అలాంటి సంఘటన ఎదురైనప్పుడల్లా తండ్రిని తలచుకుని అసహనం వ్యక్తం చేస్తుంటాడు కొడుకు. ఓడిపోయిన తండ్రిగా చూస్తూ నాన్నను అసలు లెక్కచేయడు ఆ కొడుకు. ఆ తండ్రి కూడా కొడుకు కలలకు వారధి కాలేకపోతున్నానని మదనపడుతూ తననిన తాను ఓడిపోయిన తండ్రిగా చూసుకుంటాడు. అలా ఆ తండ్రి కొడుకుల మధ్య చూపులు తప్పా మాటలే ఉండవు. ఒకే ఇంట్లో ఉన్న ఆ తండ్రి-కొడుకుల మధ్య ఏడు సముద్రాలంత దూరం ఉంటుంది. అలాంటి పాత్రలను మహర్షిలో చాలా చక్కగా చూపించాడు ‘వంశీపైడిపల్లి’. ఆకలి రాజ్యం: దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు…ఆ పరిస్థితులను ఎత్తి చూపిన చిత్రం ఆకలి రాజ్యం. అదే సినిమాలో తండ్రి, కొడుకుల మధ్య సంఘర్షణని దర్శకుడు కె.బాలచందర్ అద్భుతంగా చూపించారు. తాను చెప్పినట్టుగా తనయుడు నడుచుకోవడం లేదని తండ్రి. తన దారిలో తనను వెళ్లనివ్వడం లేదని కొడుకు. ఆత్మాభిమానం విషయంలో ఇద్దరూ ఏమాత్రం తగ్గేది లేదంటారు. సుతిమెత్తగా తిట్టిపోసే తండ్రి ‘రఘువరన్ బీటెక్’: మిడిల్ క్లాస్ తండ్రులను ప్రేక్షకులకు బాగా చూపించిన చిత్రాల్లో రఘువరన్ బీటెక్ ఒకటి. ధనుష్ తండ్రిగా సముద్రఖని నటించారు. కొడుకేమో సివిల్ ఇంజినీర్ జాబ్ వస్తే మాత్రమే చేస్తానంటాడు. ఎన్నాళ్లు ఖాళీగా కూర్చుంటావని సుతిమెత్తగా తిట్టి పోస్తూ ఉంటా డు తండ్రి. ఇలాంటి నాన్నలు మనకి ప్రతి చోట కనిపిస్తూనే ఉంటారు. అందుకే ఈ క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ‘చిత్రలహరి’.. కొడుకు కోసం సైకాలజిస్ట్‌గా మారిన తండ్రి: మిడిల్ క్లాస్ అన్న మాటలోనే అసలు విషయం అంతా ఉంది. ఇటు పూర్ ఫ్యామిలీ కోటాలోకి వెళ్లలేరు. అటు రిచ్ ఫ్యామిలీస్ సరసన నిలబడలేరు. కుటుంబ పెద్ద ఏమాత్రం బ్యాలెన్స్ తప్పి ఆ ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. అందుకే…మిడిల్ క్లాస్ ఫాదర్స్‌లో పిల్లల కెరీర్ గురించి అంత ఎక్కువ తపన కనిపిస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే అరుపులు. తిట్లు. అవసరం అయితే నాలుగు దెబ్బలు కూడా ఉంటాయి. కానీ…ఎదిగిన కొడుకు ప్రేమ దెబ్బకి దిగాలు పడిపోతే అరుపులు, తిట్లు పని చేయవు. అప్పుడే నాన్న తనకు తాను సైకాలజిస్ట్ అయిపోతాడు. ఇలాంటి పాత్రని ‘చిత్రలహరి’ సినిమాలో అద్భుతంగా చూపించాడు దర్శకుడు కిషోర్ తిరుమల. సాయి ధరమ్ తేజ తండ్రిగా పోసాని కృష్ణ మురళి నటన అందరినీ ఆకట్టుకుంది. ఇడియట్: నాన్న తిడతాడు. నాన్న కోప్పడతాడు. ఓకే.. బాగానే ఉంది. మరి కొడుకేం చేస్తాడు? ఏమన్నా చేస్తే నాన్న ఎందుకు తిడతాడు చెప్పండి ? చాలా ఇళ్లలో జరిగేది ఇదే. కొడుకులు చాలా సందర్భాల్లో నాన్నలను లైట్ తీసుకుంటారు. ఆ తండ్రి అసహనం…ఈ తనయుడి టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఇడియట్ సినిమాలో ఇలాంటి నాన్నకి యాక్షన్ చెప్పేశాడు పూరి జగన్నాథ్. ‘కొత్త బంగారు లోకం’.. కొడుకుని కొప్పడని తండ్రి: నాన్నలకు కోపం ఉంటుంది నిజమే. కానీ…కొందరు నాన్నలకు తమ పెంపకం మీద ఎనలేని నమ్మకం ఉంటుంది. తమ కోపాన్ని, అసహనాన్ని, పిల్లల ముందు చూపించడానికి కూడా ఇష్టపడరు. ఈ టైప్ ఆఫ్ నాన్నలు మిడిల్ క్లాస్‌లో కనిపించడం తక్కువే. ఆ మాటకొస్తే తెలుగు సినిమాల్లోనూ తక్కువే. ‘కొత్త బంగారు లోకం’లో అలాంటి తండ్రి పాత్రకు ప్రకాశ్ రాజ్ ప్రాణం పోశారు. ‘అమ్మో ఒకటో తారీఖు’: ఇప్పటి దాకా పిల్లల మీద అరిచే తండ్రులను చూశాం. అవసరమైతే రెండు దెబ్బలు వేసే తండ్రులను చూశాం. మధ్య తరగతి కుటుంబం అంటేనే… ఒంటెద్దు బండి అనే అర్థం. అలాంటి ఒంటెద్దు లాంటి తండ్రిని కళ్ల ముందుంచిన చిత్రం ‘అమ్మో ఒకటో తారీఖు’. గోవింద రావు పాత్రలో ఎల్.బి.శ్రీరాం చెలరేగిపోయారు. చాలా మధ్య తరగతి కుటుంబాల్లో తాము పేద వాళ్లం కాదన్న భావన ఉంటుంది. కానీ అక్కడ ఉండేదల్లా పేదరికమే. ఆ పరిస్థితిని, మధ్య తరగతి కుటుంబాల్లోని వ్యక్తుల ఆలోచనని, ఇంటి పెద్ద పడే ఆవేదనని వెండితెరకెక్కించడంలో దర్శకులు ఇ.వి.వి.సత్యనారాయణ సక్సెస్ అయ్యారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో రేలంగి మామయ్య: మిడిల్ క్లాస్ డాడీస్ అనగానే…బీపీ కామన్ అన్నట్టుగా వాతావరణం ఉంటుంది. కానీ, కొందరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. ఆల్ ఈజ్ వెల్ పాలసీని బలంగా నమ్ముతారు. ఈ తరహా నాన్నలు నిజ జీవితంలో అరుదుగానే కనిపిస్తూంటారు. ఆమాట కొస్తే వెండితెర మీద కూడా అరుదే. అలాంటి తండ్రిని రేలంగి మామయ్య క్యారెక్టర్లో మనకు చూపించాడు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ దర్శకుడు. ఆ పాత్రకి తనదైన శైలిలో ప్రాణం పోశారు ప్రకాశ్ రాజ్. ‘పెళ్లి చూపులు’లో తండ్రికి చుక్కలు చూపించి విజయ్: హీరో కొంచెం అల్లరి చిల్లరిగా ఉంటేనే సినిమాకి అందం. అలాంటి హీరోని తండ్రి చివాట్లు పెడితేనే అసలు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ ఫార్ములాకి దర్శకులు పదును పెడుతూ ఉండటం వల్ల…మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలు సిల్వర్ స్క్రీన్‌పై బాగా పండుతున్నాయి. ‘పెళ్లి చూపులు’ చిత్రంలో అలాంటి డాడీ క్యారెక్టర్లో నవ్వులు పూయించాడు నటుడు కేదార్ శంకర్. ఇక హీరో విజయ్ దేవరకొండ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్దగా చదువు ఎక్కని బద్దకపు కొడుకుగా తండ్రికి చుక్కలు చూపించే పాత్రలో విజయ్ రెచ్చిపోయాడు. -
‘మహర్షి’ ఫేం నటుడు గురుస్వామి మృతి
కర్నూలు కల్చరల్: ‘మహర్షి’ ఫేం నటుడు, కర్నూలుకు చెందిన మిటికిరి గురుస్వామి (80) శుక్రవారం సాయంత్రం మరణించారు. ఆయనకు 15 రోజుల కిందట బ్రె యిన్ స్ట్రోక్ రాగా, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప త్రిలో చికిత్స పొంది, మూడు రోజుల కిందట కర్నూలు బాలాజీనగర్‌లోని స్వగృహానికి వచ్చారు. అప్పటి నుంచి ఇంట్లోనే వైద్యం చేయిస్తుండగా, మృతిచెందారు. గురుస్వామి బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. నాటకాలపై అభిరుచితో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ మంచి నటుడిగా ఎదిగారు. మహేష్‌బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ చిత్రంలో రైతు పాత్రలో అద్భుతంగా నటించి అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఆ తర్వాత వరుసగా భీష్మ, ఉప్పెన, వకీల్‌సాబ్, రిపబ్లిక్, చలో ప్రేమిద్దాం, రంగస్వామి... తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. చదవండి: ప్రకాష్ వ్యవహారంలో ‘లక్ష్మీ’ పాత్ర వివాదాస్పదం.. ట్విస్టులే ట్విస్టులు -
నటుడు గురుస్వామి మృతి
-
67th National Film Awards: తెలుగులో జెర్సీకి రెండు,మహర్షికి 3 అవార్డులు
-
Sakshi Excellence Award: వంశీకి జీవితాంతం రుణపడి ఉంటా: మహేశ్
-
Sakshi Excellence Award: వంశీకి జీవితాంతం రుణపడి ఉంటా: మహేశ్
అన్నదాతలు, సేవాభిలాషులు, దేశాన్ని కాపాడే సైనికులు, సాహసమే శ్వాసగా తీసుకునే పరాక్రమవంతులు, ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న సినీ తారలు... మరెందరో స్ఫూర్తి ప్రదాతలకు సాక్షి మీడియా గ్రూప్ సలాం చేస్తోంది. వారి ప్రతిభకు గుర్తింపుగా ఈనెల 17న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డులను అందజేసింది. అందులో భాగంగా 2019గాను మహేశ్‌బాబుకు మోస్ట్ పాపులర్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘థ్యాంక్యూ భారతీగారు.. మీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ‘మహర్షి’ చిత్రం మా అందరికీ చాలా ప్రత్యేకం. థ్యాంక్యూ ‘సాక్షి’ టీవీ.. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజులైంది.. ఇలాంటి ఓ అవార్డు ఫంక్షన్ చూసి. మా నిర్మాతలు అశ్వనీదత్, పీవీపీ, ‘దిల్’ రాజుగార్లకు థ్యాంక్స్.. ‘మహర్షి’కి పనిచేయడం మరచిపోలేని జ్ఞాపకం. 2020 అనే ఏడాదిని మేమందరం మిస్ అయిపోయాం.. మీరు అవార్డు ఇచ్చి మళ్లీ ఫంక్షన్స్ చేసుకునేలా చేశారు.. మా డైరెక్టర్ వంశీకి థ్యాంక్స్. ‘మహర్షి’ లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అన్నారు. భారతీగారు మాకు చాలా నమ్మకం ఇచ్చారు మహర్షి’ విడుదలై రెండున్నరేళ్లు అయింది.. ఈ అవార్డు మేం చేసిన పనికి గుర్తింపు మాత్రమే కాదు.. భారతీగారు మాకు చాలా నమ్మకం ఇచ్చారు.. మళ్లీ మంచి రోజులు వస్తాయని. ఇది నా ఒక్కడి అవార్డే కాదు.. మొత్తం మా టీమ్‌ది. నేను చేసిన ఐదు సినిమాల్లో నాలుగు సినిమాలు నిర్మించిన ‘దిల్’ రాజుగారు నా కుటుంబ సభ్యుల్లో ఒకరు. రాజు, శిరీష్, లక్ష్మణ్ గార్లకు కూడా థ్యాంక్స్. సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంటే కాదు.. మన సంస్కృతి. మళ్లీ ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడే రోజుల కోసం వేచి చూస్తున్నా. ‘మహర్షి’ ప్రొఫెషనల్‌గా నాకు ఎంత ఇచ్చిందో తెలియదు కానీ వ్యక్తిగతంగా మహేశ్‌బాబుని ఇచ్చింది. నాకు జీవితాంతం రుణపడి ఉంటారని మహేశ్ అన్నారు.. ఆ మాట నాది. నేను ‘మహర్షి’ కథ చెప్పిన రోజు ఆయన చెప్పారు.. ‘ఈ సినిమాకి చాలా అవార్డులు అందుకుంటారని.. ఆ మాటలన్నీ నిజమయ్యాయి.. నన్ను నమ్మినందుకు థ్యాంక్యూ సార్’. – వంశీ పైడిపల్లి, మోస్ట్ ఇన్స్పైరింగ్ మూవీ (మహర్షి) మహేశ్ వెన్నెముకగా నిలిచారు ఈ అవార్డుకి మా ‘మహర్షి’ సినిమాని ఎంపిక చేసిన ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతీగారికి థ్యాంక్స్. నాకెప్పుడూ ఓ ఎగై్జట్‌మెంట్ ఉంటుంది. మంచి సినిమా తీస్తే డబ్బులే కాదు.. గొప్ప గౌరవం తీసుకొస్తుందని నమ్ముతాను. ‘మహర్షి’ కథను వంశీ చెప్పినప్పుడు అదే నమ్మాను.. దానికి మహేశ్‌గారు వెన్నెముకగా నిలిచారు. ఈ సినిమా ప్రేక్షకులకే కాదు అవార్డ్స్, రివార్డ్స్ వరకూ వెళుతున్నందుకు థ్యాంక్స్. వంశీ పైడిపల్లి చెప్పినట్లు మాది పెద్ద ప్రయాణం. తన ఐదు సినిమాల్లో నాలుగు సక్సెస్‌ఫుల్‌గా చేశాం.. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది. మహేశ్‌గారితో కూడా మా బ్యానర్లో హ్యాట్రిక్ సాధించాం. – నిర్మాత ‘దిల్’ రాజు, మోస్ట్ పాపులర్ మూవీ (మహర్షి) -
మహేష్ మేనియా.. అక్కడ ‘మహర్షి’ దూకుడు తగ్గట్లేదుగా!
సందేశాత్మక చిత్రాలను ఎంపిక చేయడంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటాడు. ఈ తరహాలో మహేశ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం 'మహర్షి'. ఈ సినిమా కలెక్షనన్లు కొల్లగొట్టి మహేశ్ కెరీర్లో మరో బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. థియేటర్లో ఊపు ఊపిన ‘మహర్షి’ టీవీలో మాత్రం మొదట్లో టెలికాస్ట్ చేసినప్పుడు ఊహించిన స్థాయి టీఆర్పీ రేటింగ్ రాలేదు, కానీ మెల్లమెల్లగా ఊపందుకుంది. అలా ఇప్పుడు పదోసారి టెలీకాస్ట్ కాగా అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వచ్చింది. తొమ్మిది సార్లు ఈ చిత్రం మంచి టీఆర్పీ సాధించగా, పదోసారి 7.80 రేటింగ్స్‌తో సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా మహేశ్ సినిమాలకు ఒక సినిమా పదోసారి కూడా టీవీలో ప్రసారం అయ్యి ఈ రేంజ్లో టీఆర్పీను తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదంటున్నారు. ఇన్ని సార్లు టెలికాస్ట్ అయిన తర్వాత కూడా మళ్లీ అంత మంది చూడటమే కాకుండా మునపటి కంటే ఎక్కువ మందే ఈ సారి వీక్షించడం ఇదొక అరుదైన ఘటననే చెప్పాలి. అయితే మహర్షి సినిమాకు ఆ స్టామినా ఉందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇది వరకు మన రాకుమారుడు నటించిన ‘అతడు’ చిత్రం కూడా ఇదే తరహాలో మొదట మెల్లగా ప్రారంభమై, తర్వాత టీవీ ప్రేక్షకులను కట్టిపడేసిన సంగతి తెలిసిందే. 1st Time: 9.3 2nd time : 7.3 3rd Time: 6.13 4th time: 9.02 5th Time: 10.28 6th Time: 8.82 7th Time: 7.14 8th Time: 5.14 9th Time: 4.92 10th Time: 7.80** చదవండి: అప్పట్లో షారుక్ ఇచ్చింది ఇంకా నా పర్సులోనే ఉంది: ప్రియమణి -
మే9 : తెలుగు ఇండస్ట్రీకి చాలా సెంటిమెంట్..ఎందుకంటే..
మే9..టాలీవుడ్లో ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన రోజు ఇది. హీరో, హీరోయిన్లకు స్టార్ స్టేటస్‌తో పాటు దర్శక, నిర్మాతలక కాసుల వర్షం కురిపించిన రోజు. అందుకే క్యాలెండర్లో సంవత్సరాలు మారినా తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రం ఎప్పటికీ లక్కీ డేనే. ఎందుకంటే మే9న రిలీజైన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశాయి. నాటి జగదేకవీరుడు అతిలోకసుందరి నుంచి నిన్నటి మహర్షి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఈరోఉ (మే9)న విడుదలయినవే. మరి ఆ హిట్ చిత్రాలేంటో చూసేద్దామా? జగదేకవీరుడు అతిలోకసుందరి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా 1990 మే9న రిలీజైంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన చిరంజీవి, శ్రేదేవిలకు ఎంతటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా ఎవర్‌గ్రీన్‌గా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మూవీ రిలీజ్‌కు కొన్ని వారాల ముందే రాష్ట్రంలో వర్షాలు అతలాకుతలం చేశాయట. అయినా వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇళయరాజా సంగీతం సంగీత ప్రియులను ఆకర్షించి సినిమా విజయంలో భాగమైంది. గ్యాంగ్ లీడర్ విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం గ్యాంగ్ లీడర్. 1991లో విడుదలైన ఈ చిత్రం ముప్పైకి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. చిరంజీవికి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది కూడా ఈ సినిమానే. ఈ చిత్రంలోని మెగాస్టార్ నటన, స్టైల్, డ్యాన్స్ యూత్‌ను కట్టిపడేశాయి. ఈ చిత్రం విడుదలై నేటికి 30 ఏళ్లవుతుంది. అయిన ఇందులో చేయి చూడు ఎంత రఫ్ ఉందో.. రఫాడిస్తా అనే పవర్ ఫల్ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ప్రేమించుకుందాం రా వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ఈ చిత్రం 1997లో రిలీజైంది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా ఐశ్వర్యరాయ్‌ని అనుకున్నారట. అయితే అప్పటికే ఆమె నటించిన రెండు చిత్రాలు పరాజయం పాలవడంతో సెంటిమెంట్‌గా ఆమెను వద్దనుకున్నారట. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ అయిన సంగతి తెలిసిందే లవ్ స్టోరీస్‌లో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసింది ఈ చిత్రం. సంతోషం నాగార్జున, శ్రియ, గ్రేసీసింగ్, ప్రభుదేవా నటించిన ఈ చిత్రం 2002లో విడుదలైంది. ఈ సినిమా మ్యూజిక్ పరంగానూ సూపర్ హిట్ అయ్యింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి కొన్ని పాటలు రాయగా ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. నాగార్జున కెరియర్లోనే బెస్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిందీ ఈ చిత్రం. మహానటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మహానటి’. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది. ఆమె నటనకు గాను నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో విడుదలై క్లాసిక్ హిట్‌గా నిలిచింది. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, షాలినీ పాండేలు ఈ మూవీలో ముఖ్యపాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై ప్రియా దత్, స్వప్న దత్‌లు ఈ మూవీని నిర్మించారు. మహర్షి మహేష్‌బాబు హీరోగా మహర్షి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. -
మహర్షి... జెర్సీకి డబుల్ ధమాకా
67వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు సినిమా మెరుపులు మెరిపించింది. 2019వ సంవత్సరానికి గాను సోమవారం ఢిల్లీలో ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలుగు సినిమా 4 అవార్డులు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో సకుటుంబ వినోదం అందించిన బెస్ట్ పాపులర్ ఫిల్మ్‌గా మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ ఎంపికైంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నాని నటించిన ‘జెర్సీ’ (దర్శకత్వం గౌతమ్ తిన్ననూరి) అవార్డు గెలిచింది. ‘మహర్షి’ చిత్రానికి నృత్యాలు సమకూర్చిన రాజు సుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా, ‘జెర్సీ’కి ఎడిటింగ్ చేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా చారిత్రక కథాంశంతో మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం ‘మరక్కర్ – అరేబియన్ కడలింటె సింహం’ (మరక్కర్ – లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ), ఉత్తమ నటిగా కంగనా రనౌత్ (‘మణికర్ణిక’, ‘పంగా’) ఎంపికైతే, ఉత్తమ నటుడి అవార్డును తమిళ నటుడు ధనుష్ (చిత్రం ‘అసురన్’) – హిందీ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (‘భోన్స్లే’)లకు సంయుక్తంగా ప్రకటించారు. ఉత్తమ దర్శకుడిగా సంజయ్ పూరణ్ సింగ్ చౌహాన్ (హిందీ ‘బహత్తర్ హూరేన్’) ఎంపికయ్యారు. ఉత్తమ తమిళ చిత్రం అవార్డు కూడా వెట్రిమారన్ దర్శకత్వంలోని ‘అసురన్’కే దక్కగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, తెలుగు నటుడు నవీన్ పొలిశెట్టి నటించిన ‘చిఛోరే’ ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికైంది. సినిమాల నిర్మాణానికి అనుకూలమైన ‘మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్’ అవార్డును సిక్కిమ్ దక్కించుకుంది. ఇటీవల ‘ఉప్పెన’లో అందరినీ ఆకట్టుకున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’తో ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యారు. పార్తీబన్ నటించి, రూపొందించగా, వివిధ దేశ, విదేశీ చలనచిత్రోత్సవాలకు వెళ్ళిన తమిళ చిత్రం ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ (ఒక చెప్పు సైజు 7) స్పెషల్ జ్యూరీ అవార్డును గెలిచింది. అజిత్ నటించిన తమిళ ‘విశ్వాసం’కు ఇమాన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు. ఈసారి ఆస్కార్‌కు అఫిషియల్ ఇండియన్ ఎంట్రీగా వెళ్ళిన మలయాళ ‘జల్లికట్టు’ సినిమాటోగ్రఫీ విభాగం (గిరీశ్ గంగాధరన్)లో అవార్డు దక్కించుకుంది. కరోనా కారణంగా విడుదల ఆలస్యమైనా, ఉత్తమ చిత్రంగా నిలిచిన మోహన్‌లాల్ ‘మరక్కర్’ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డు సాధించింది. నిజానికి, గత ఏడాది మే నాటికే ఈ 2019 అవార్డుల ప్రదానం జరగాల్సి ఉంది. కానీ, కరోనా విజృంభణ నేపథ్యంలో అవార్డుల ప్రకటన – ప్రదానం ఇప్పటి దాకా ఆలస్యమైంది. జయహో... మలయాళం ఈ 2019 జాతీయ అవార్డుల్లో మలయాళ సినిమా పంట పండింది. ఫీచర్‌ఫిల్మ్ విభాగంలో ఉత్తమ చిత్రం, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్, గీతరచన, మేకప్, సినిమాటోగ్రఫీ సహా 9 అవార్డులు, నాన్–ఫీచర్‌ఫిల్మ్ విభాగంలో 2 అవార్డులు – మొత్తం 11 జాతీయ అవార్డులు మలయాళ సినిమాకు దక్కడం విశేషం. ఒకటికి రెండు తాజా నేషనల్ అవార్డుల్లో మలయాళ ‘మరక్కర్...’కు 3, మలయాళ ‘హెలెన్’కు 2, తమిళ ‘అసురన్’, ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’కు చెరి రెండేసి, హిందీ ‘తాష్కెంట్ ఫైల్స్’కు 2, తెలుగు చిత్రాలు ‘మహర్షి’, ‘జెర్సీ’ లకు చెరి రెండేసి అవార్డులు, మరాఠీ ‘ఆనందీ గోపాల్’కు 2, బెంగాలీ చిత్రం ‘జ్యేష్ఠ పుత్రో’కు 2 అవార్డులు రావడం గమనార్హం. అవార్డు మిస్సయ్యాం అనుకున్నాం – నాని ‘‘గత ఏడాది అంతా కరోనాతో గడిచిపోయింది. అవార్డ్స్ ఫంక్షన్లు ఏమీ లేవు. ‘జెర్సీ’కి అవార్డ్స్ మిస్ అయిపోయాం అనుకున్నాం. కానీ, ఇప్పుడు 67వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ‘జెర్సీ’కి రెండు అవార్డులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ‘జెర్సీ’తో పాటు అవార్డులు గెలుచుకున్న ‘మహర్షి’ చిత్ర బృందానికి కూడా కంగ్రాట్స్. జాతీయ అవార్డులు వచ్చిన ప్రతిసారీ వాటిలో మన తెలుగు సినిమాల సంఖ్య పెరగడం సంతోషంగా ఉంది.’’ శిల్పకు ధన్యవాదాలు ‘‘నాకీ అవార్డు రావడానికి కారణం దర్శకుడు కుమారరాజా. అలాగే శిల్ప (‘సూపర్ డీలక్స్’లో సేతుపతి చేసిన ట్రాన్స్‌జెండర్ పాత్ర పేరు). ఏ పాత్ర చేసినా అవార్డులు వస్తాయా? అని ఆలోచించను. శిల్ప రెగ్యులర్ పాత్ర కాదు. అలాగని నన్నేం ఇబ్బంది పెట్టలేదు. ‘నేను శిల్ప’ అనుకుని, లీనమైపో యా. అందుకే, కుమారరాజాకి, శిల్పకి థ్యాంక్స్.’’ – ఉత్తమ సహాయ నటుడు విజయ్ సేతుపతి ఆయనకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాను ‘‘నేను డైరెక్టర్ కావడానికి ఏడేళ్లు పట్టింది. రాహుల్‌గారు నన్ను నమ్మి ‘మళ్ళీ రావా’కి చాన్స్ ఇచ్చారు. నిర్మాతగా ఆయనకు అది తొలి సినిమా. ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం గ్రేట్. అందుకే ఆయనకు ఫోన్ చేసి ‘థ్యాంక్స్’ చెప్పాను. ‘జెర్సీ’ తీస్తున్నప్పుడు నా మనసులో ఒకటే ఉంది. ‘మంచి సినిమా తీయాలి’... అంతే. నేను రాసిన కథ ప్రేక్షకుల దగ్గరకు వెళ్లాలంటే మంచి నటుడు చేయాలి. నా కథను నానీ, శ్రద్ధా శ్రీనాథ్, బాలనటుడు రోనిత్... ఇలా ఇతర నటీనటులందరూ తమ నటనతో ఎలివేట్ చేశారు. సాంకేతిక నిపుణులు కూడా న్యాయం చేశారు.’’ – ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాకు ఇది హ్యాపీ మూమెంట్ – ‘దిల్’ రాజు ‘‘మహేశ్ వంటి స్టార్‌ని పెట్టుకుని వాణిజ్య అంశాలు మిస్ అవకుండా సందేశాత్మక చిత్రం తీయడం కష్టమైన పని. టీమ్ అంతా కష్టపడి చేశారు. అవార్డులకు వచ్చే ప్రైజ్ మనీని మంచి కార్యక్రమాలకు విరాళంగా ఇస్తా. మాకిది హ్యాపీ మూమెంట్’’ అన్నారు ‘మహర్షి’ నిర్మాతల్లో ఒకరైన ‘దిల్’ రాజు. ‘‘ఈ కథ విన్నప్పుడు మహేశ్ నా కెరీర్లోనే బెస్ట్ మూవీ అని, విడుదలయ్యాక నేను గర్వపడే సినిమా ‘మహర్షి’ అని ట్వీట్ చేశారు. ‘మహర్షి’కి బీజం వేసింది రచయిత హరి. నాతో పాటు హరి, అహిషోర్ సాల్మన్ రెండేళ్లు కష్టపడ్డారు’’ అన్నారు ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లి. -
జాతీయ అవార్డులు: దుమ్మురేపిన మహేశ్‌బాబు, నాని
జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు పరిశ్రమకు చెందిన రెండు సినిమాలు సత్తా చాటాయి. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో తెలుగు చిత్రసీమకు సంబంధించి మొత్తం ఐదు అవార్డులు వచ్చాయి. సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’కి మూడు అవార్డులు, న్యాచురల్ స్టార్ నాని సినిమా ‘జెర్సీ’కి రెండు అవార్డులు దక్కాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంతో మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అవార్డు లభించింది. దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించే ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం, ఉత్తమ నిర్మాణ సంస్థగా దిల్‌రాజుకు చెందిన శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ అవార్డులు పొందాయి. ఈ అవార్డు దక్కడంపై శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ హర్షం వ్యక్తం చేసింది. ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘జెర్సీ’ ఎంపికైంది. దీంతోపాటు ఉత్తమ ఎడిటర్‌గా నవీన్ నూలి జాతీయ అవార్డు దక్కించుకున్నారు. మొత్తం ఐదు అవార్డులు రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. దీనిపై ఆయా చిత్రబృందాలు సంతోషంలో మునిగాయి. గతేడాది ‘మహానటి’ చిత్రానికి కీర్తి సురేశ్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. We are happy to share that a very special film #Maharshi has won the National Award for Best Film Providing Wholesome Entertainer. Thank you @urstrulyMahesh garu, @DirectorVamshi, @allarinaresh, @hegdepooja, @thisisdsp and the entire team for making this an unforgettable film ! pic.twitter.com/tKV1B9ojr6 — Sri Venkateswara Creations (@SVC_official) March 22, 2021 -
మహేశ్ ‘పాల పిట్ట’పాటకు వార్నర్ స్టెప్పులు.. వైరల్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. లాక్డౌన్ సమయంలో భార్య, పిల్లలతో కలిసి అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్‌కు స్టెప్పులేసి దక్షిణాది సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే బాహుబలిలో ప్రభాస్ డైలాగ్ చెప్పి భారత సీనీ ప్రియుల మనసును దోచుకున్నాడు. (చదవండి : ‘ఆచార్య’గా మారిన డేవిడ్ వార్నర్.. వీడియో వైరల్) తర్వాత ఈ స్టార్ క్రికెటర్ రూటు మార్చి రీఫేస్ యాప్‌ను ఉపయోగించి అమితాబ్, బాహుబలిలో ప్రభాస్, మహర్షిలో మహేశ్‌బాబు, ‘ఆచార్య’లో చిరంజీవికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను రీఫేస్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అవి ఎంతగానో నెటిజన్లను ఆకట్టుకుంది. తాజాగా ఈ స్టార్ క్రికెటర్ మహేశ్‌బాబు సినిమా పాటకు స్టెప్పులేశాడు. మహేశ్ నటించిన ‘మహర్షి’ సినిమాలోని ‘పాల పిట్ట’ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ఈ పాటను రీఫేస్ యాప్‌తో ఛేంజ్ చేసి మహేశ్ బాబు వేసిన స్టెప్పులు వార్నర్ వేసినట్లుగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
మహర్షిగా అదరగొడుతున్న వార్నర్
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మహర్షిగా అదరగొడుతున్నాడు. అదేంటి మహర్షి సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించాడు.. వార్నర్ ఎక్కడి నుంచి వచ్చాడనేగా మీ డౌటు.. అక్కడికే వస్తున్నాం. లాక్డౌన్ కాలంలో ఎన్నో టిక్‌టాక్ వీడియోలతో అలరించిన వార్నర్ తాజాగా మరో ఫన్నీ వీడియోతో ముందుకొచ్చాడు. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన 'మహర్షి' సినిమా టీజర్‌ను ఎడిట్ చేశాడు. మహర్షిలా కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. సినిమాలోని కొన్ని సీన్స్‌లో మహేశ్ ముఖానికి బదులు వార్నర్ తన ఫొటోని యాడ్ చేసి డైలాగ్స్‌తో అలరించాడు.(చదవండి : ఎంజాయ్ మూడ్‌లో టీమిండియా.. రోహిత్ మాత్రం) 'మరికొన్ని గంటల్లో 2020 ముగుస్తుంది.. విషాదంతో నిండిన ఈ ఏడాదిలో చివరిరోజును హాయిగా నవ్వుకుంటూ ముగిద్దాం' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఏడాది కరోనా లాక్డౌన్ నుంచి తెలుగు సినిమా పాటలు, డైలాగులు, హీరోల హావభావాలతో వీడియో రూపొందించి అలరించాడు.ముఖ్యంగా టిక్‌టాక్ వీడియోలతో అటు తెలుగు ప్రజలకు.. ఇటు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. కాగా గాయంతో తొలి రెండు టెస్టులకు దూరమైన వార్నర్ మూడో టెస్టులో బరిలోకి దిగనున్నాడు. ఇరు జట్ల మధ్య జనవరి 7న సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరగనుంది.(చదవండి : ఆసీస్ భయంతోనే వార్నర్‌ను ఆడిస్తుందా?) View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
మహేశ్ కాదనడంతో చరణ్‌తో..
‘మహర్షి’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన తదుపరి చిత్రం మహేశ్ బాబుతోనే చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ మీట్లో మహేశ్‌తో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు కూడా. అయితే కారణాలు ఏంటో తెలియదు కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. వంశీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చినప్పటికీ పూర్తి స్క్రిప్ట్ పట్ల సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ చిత్రం నుంచి మహేశ్ డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు మహేశ్ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఆ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో అయోమయంలో పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ షాక్ నుంచి కోలుకొని రామ్ చరణ్ కోసం వంశీ పైడిపల్లి ఓ సబ్జెక్ట్‌ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి యాక్షన్ కథాంశంతో స్క్రిప్ట్‌ను సిద్దం చేసి త్వరలోనే మెగాపవర్ స్టార్‌ను కలిసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ మహేశ్ రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్‌నే చరణ్‌కు వినిపిస్తాడా లేక చరణ్ కోసం మరో కథను ఎంచుకున్నాడో తెలియదు. అంతేకాకుండా తన కారణంగా అప్సెట్ అయిన వంశీని శాంతపరిచే క్రమంలో ఈ సినిమాను మహేశే నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు సమచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఫిలింనగర్ సర్కిళ్లలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఇక వంశీ-చరణ్ కాంబినేషనలో వచ్చిన ‘ఎవడు’ సినిమా సపర్‌డూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: ‘అల..వైకుంఠపురములో’.. 1 బిలియన్ వ్యూస్ ‘ఇస్తా.. మొత్తం తిరిగి ఇచ్చేస్తా’ -
బాలీవుడ్‌కు షాక్ ఇచ్చిన సౌత్!
సౌత్ సినిమా తన పరిధిని విస్తరించుకుంటూ పోతుంది. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాలో నార్త్‌లో హవా చూపించగా, సాహోతో మరోసారి సౌత్ సినిమా బలం చూపించేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. శనివారం హ్యాష్‌ట్యాగ్ డే సందర్భంగా ట్విటర్ ఇండియా గత ఆరు నెలల కాలంలో ట్రెండ్ అయిన టాప్ ఐదు హ్యాష్‌ట్యాగ్‌లను ప్రకటించింది. ఈ లిస్ట్‌లో అజిత్ విశ్వాసం (#Viswasam) మొదటి స్థానంలో నిలిచింది. మరోసౌత్ సినిమా మహర్షి (#Maharshi) నాలుగో స్థానం సాధించటం విశేషం. రెండు మూడు స్థానాల్లో లోక్‌సభ ఎలక్షన్స్ 2019(#LokSabhaElections2019), క్రికెట్ వరల్డ్ కప్ 2019(#CWC19) ట్యాగ్లు నిలిచాయి. ఐదో స్థానంలో #NewProfilePic అనే హ్యాష్‌ట్యాగ్ నిలిచింది. ఈ ఐదు స్థానాల్లో రెండు సౌత్ సినిమాలకు స్థానం దక్కగా ఒక్క బాలీవుడ్ సినిమా కూడా కనిపించకపోవటం విశేషం. -
‘మహర్షి’ డిలీటెడ్ సీన్
సూపర్‌స్టార్ మహేష్ బాబు మహర్షి చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి..నేడు వందరోజుల పండుగను జరుపుకుంటోంది. వంశీ పైడిపల్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సామాజిక సందేశంతో కూడుకుని, కమర్షియల్ అంశాలతో ఉండటంతో బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టింది. సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో కొన్ని సీన్లకు కత్తెర వేశామని మూవీ ప్రమోషన్లలో చిత్రయూనిట్ పేర్కొన్నసంగతి తెలిసిందే. అయితే నేడు వందరోజులు అయిన సందర్భంగా.. ఈ మూవీ నుంచి తీసేసిన సన్నివేశాన్నిరిలీజ్ చేశారు. కాలేజ్‌లో గొడవకు సంబంధించిన ఈ సన్నివేశం అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది. మహర్షి తరువాత మహేష్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతూ.. సరిలేరు నీకెవ్వరూ చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు. -
గిఫ్ట్ సిద్ధం చేస్తున్న సూపర్ స్టార్!
మహర్షి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మహేష్ ఓ సర్ప్రైజ్ను సిద్ధం చేస్తున్నాడట. ఈ నెల 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఓ మైక్రో టీజర్‌తో పాటు మహేష్ లుక్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
శాటిలైట్ బిజినెస్‌లోనూ ‘సరిలేరు నీకెవ్వరు’
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఎఫ్ 2 సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా బిజినెస్ కూడా జరగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మహేష్ క్రేజ్‌తో పాటు దర్శకుడు అనిల్ ట్రాక్ రికార్డ్ ను చూసి భారీ ఆఫర్లే వచ్చాయట. ఫైనల్‌గా రూ.16.5 కోట్లకు సరిలేరు నీకెవ్వరు శాటిలైట్ హక్కులను సన్ నెట్వర్క్ సంస్థ సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మహేష్ గత చిత్రం మహర్షి శాటిలైట్ రైట్స్ రూ.12 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు ఇంత భారీ మొత్తానికి అమ్ముడై మహేష్ కెరీర్ బెస్ట్ రికార్డ్ సాధించటం విశేషం. -
మహర్షి సెలబ్రేషన్స్
‘మహర్షి’ చిత్రం తన కెరీర్లో చాలా స్పెషల్‌గా నిలిచిందని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు మహేశ్‌బాబు. ఈ సినిమా 50 రోజులు పూర్తి కావస్తోంది. దీంతో సూపర్‌హిట్ సంబరాలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయిక. అశ్వనీ దత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మించారు. మే 9న విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించిందని, 200 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఈ నెల 28న అర్ధశతదినోత్సవ వేడుకలను నిర్వహించనున్నామని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవల మహేశ్‌బాబు తన భార్యాపిల్లలు నమ్రత, గౌతమ్, సితారలతో కలిసి హాలిడే ట్రిప్ వెళ్లాను. ఈ ట్రిప్ తన తనయుడు గౌతమ్‌కి చాలా ప్రత్యేకమని మహేశ్ పేర్కొన్నారు. దానికి కారణం ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌ని ఈ కుటుంబం చూసింది. వరల్డ్ కప్ మ్యాచ్‌ని స్వయంగా స్టేడియమ్లో గౌతమ్ చూడటం ఇదే మొదటిసారి కాబట్టి తనకిది స్పెషల్ ట్రిప్ అన్నారు మహేశ్. -
సినిమా వార్తలు
-
డబ్బూ పేరు తెచ్చిన చిత్రం మహర్షి
‘‘మహేశ్ కెరీర్లో అత్యధిక షేర్ సాధించిన సినిమాగా ‘మహర్షి’ నిలిచింది. నైజాంలో ఇంకో రెండు, మూడు రోజుల్లో 30 కోట్ల షేర్‌ను టచ్ చేయబోతున్నాం. ఈ సంవత్సరం సంక్రాంతికి ‘ఎఫ్2’తో పెద్ద హిట్ సాధించాం. సమ్మర్లో ‘మహర్షి’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాం. ఈ రెండు సక్సెస్‌లు ఇచ్చిన కిక్‌తో ఇంకో మూడు సినిమాలతో రాబోతున్నాం’’ అని ‘దిల్’ రాజు అన్నారు. మహేశ్‌బాబు, పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందిన ‘మహర్షి’ సూపర్ హిట్‌గా నిలిచి 100 కోట్ల షేర్ క్రాస్ చేసింది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతల్లో ఒకరైన ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘నేను ఫస్ట్ టైమ్ ఇంకో రెండు పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లతో కలిసి పని చేయడానికి కారణం వంశీ కథ చెప్పినప్పుడు వచ్చిన ఎగై్జట్‌మెంట్. అదే నమ్మకంతో ఈ సినిమా బాధ్యత తీసుకున్నాను. ఒక సినిమా విషయంలో బాధ్యత తీసుకున్నప్పుడు ఆ సినిమా హిట్ అయితే వచ్చే కిక్కే వేరు. కొన్ని సినిమాలు డబ్బుతో పాటు మంచి పేరుని కూడా తెస్తాయి. అలాంటి చిత్రం ’మహర్షి’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రైతులను కలిసినప్పుడు ‘ఈ సినిమా తర్వాత రైతుల గురించి, వ్యవసాయం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేశారు’ అని చెప్పినప్పుడు వచ్చిన సంతృప్తి ఎంత డబ్బు వచ్చినా రాదు. త్వరలోనే వంశీతో మరో సూపర్ హిట్‌కి రెడీ అవుతున్నాం’’ అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ– ‘‘వై.ఎస్. జగన్‌గారు, నేను స్కూల్‌మేట్స్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాం. స్కూల్లో రెడ్ హౌజ్ కెప్టెన్‌గా వ్యవహరించేవారు. అప్పుడే ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఏపీ సీఎంగా జగన్‌గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ‘మహర్షి’ టీమ్ తరపున శుభాకాంక్షలు. నేనెప్పుడూ చూడనంత పెద్ద బ్లాక్ బస్టర్‌తో పాటు మహేశ్‌బాబు కెరీర్లోనే ల్యాండ్ మార్క్ మూవీగా ‘మహర్షి’ నిలిచింది. మేం ఎక్కడికెళ్లినా మాకు ఒక గుర్తింపునిచ్చారు అని చెమర్చిన కళ్లతో రైతులు అంటున్నారు’’ అన్నారు. -
175 కోట్లు కలెక్ట్ చేసిన ‘మహర్షి’
సూపర్‌స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన మహర్షి చిత్రం వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. మొదటి ఆట నుంచి డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం నిలకడగానే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ 175 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఓవర్సీస్లో మహర్షి అంతగా ప్రభావం చూపడం లేదని తెలుస్తోంది. వీకెండ్ వ్యవసాయం అనే కాన్సెప్ట్ జనాల్లోకి బాగానే చేరింది. ఆ మధ్య పొలాల్లో దిగి వీకెండ్ వ్యవసాయాన్ని చాలా మంది ఫాలో అయ్యారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మించారు. -
రైతులను సన్మానించిన ‘మహర్షి’ చిత్రబృందం
సాక్షి, నిర్మల్ : వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవలె ఈ మూవీ వందకోట్లను కలెక్ట్ చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం దర్శకుడు వంశీ పైడిపల్లి తన సొంత గ్రామమైన ఖానాపూర్లోని లక్ష్మీ థియేటర్లో సందడి చేశారు. అక్కడి రైతులకు మహర్షి సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. అంతేకాకుండా చిత్రయూనిట్ రైతులను ఘనంగా సన్మానించింది. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. తాను పుట్టిన ఊర్లోని సినిమా హాల్లో రైతులను సన్మానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. -
నెగిటివ్ టాక్‌తో వందకోట్లు.. వాడే సూపర్‌స్టార్!
సూపర్‌స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి.. వందకోట్లను కలెక్ట్ చేసినట్టు ప్రకటించారు. సినిమా ఫస్ట్ షో నుంచి మిక్స్డ్ టాక్ రాగ.. చిత్రయూనిట్ మాత్రం ఆహాఓహో అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తూ వస్తున్నారు. సినిమాకు మాత్రం కలెక్షన్లు భారీ స్థాయిలో వస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. అయితే ఈ చిత్రం వందకోట్ల షేర్‌ను కలెక్ట్ చేసినట్లు ప్రకటించిన తరువాత.. సూపర్‌స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. నెగెటివ్ టాక్, యావరేజ్ టాక్‌తో సైతం వందకోట్లను కలెక్ట్ చేయగల ఒకే ఒక్క హీరో మహేష్.. అందుకే మహేష్ బాబును సూపర్‌స్టార్ అంటారని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అయితే ఓవర్సీస్లో ఇప్పటివరకు మహర్షి రెండు మిలియన్ల డాలర్లను అందుకోలేకపోవడం ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు. ఓవర్సీస్ కలెక్షన్లతోనే సినిమా హిట్టా ఫట్టా అనే విషయాన్ని ఫిక్స్ అవుతుండగా.. ‘మహర్షి’ మాత్రం ఇప్పటికీ 1.8మిలియన్ డాలర్లను మాత్రమే వసూళ్లు చేసింది. Only Hero to Mark this #100CrShareForMaharshi with - ve talk. Superstar for a Reason.#Maharshi#MaharshiMania#100CrShareForMaharshi pic.twitter.com/yOP06trK1X — Prince Dinesh (@DINESH_SAMSANI) May 27, 2019 Hit talk tho yevadaina 100cr easy ga mark chestadu. But - ve talk tho mark chesey vade SUPERSTAR Avutadhu @urstrulyMahesh#100CrShareForMaharshi#Maharshi pic.twitter.com/a256Ipp5cd — Prince Dinesh (@DINESH_SAMSANI) May 27, 2019 -
పోర్చుగల్‌లో ఫ్యామిలీతో
కుటుంబంతో క్వాలిటీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు మహేశ్‌బాబు. ‘మహర్షి’ సక్సెస్ తర్వాత ఫ్యామిలీతో కలసి ఆయన ఫారిన్ ట్రిప్ వెళ్లిన సంగతి తెలిసిందే. 20 రోజుల పాటు సాగే ఈ ట్రిప్‌లో పోర్చుగల్, ఇంగ్లాండ్ చుట్టి రానున్నారు మహేశ్. ట్రిప్‌లోని ఆనంద క్షణాలను ఎప్పటికప్పుడు మహేశ్ సతీమణి నమ్రత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందులో కొన్ని ఫొటోలు. -
పంట పొలాల్లో ‘మహర్షి’ బృందం
పశ్చిమగోదావరి ,తాడేపల్లిగూడెంరూరల్ : సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా విజయోత్సవ సంబరాల్లో భాగంగా చిత్రంలో సహనటులు శనివారం మండలంలోని లింగారాయుడిగూడెం గ్రామంలో హల్చల్ చేశారు. మహర్షి చిత్రంలో వివిధ పాత్రల్లో నటించిన దిల్ రమేష్, గురుస్వామి, ఇ.వెంకటేశ్వరరావు, వేమూరి పరమేశ్వరశర్మ, సీనియర్ జర్నలిస్ట్, రైతు ఆర్వీ రమణ, ఎల్.రమేష్‌నాయుడు, వి.రామ్మోహన్రావు, వెంకట్రావు, డి.సుబ్బరాజు గ్రామంలో పర్యటించిన వారిలో ఉ న్నారు. గ్రామంలోని పంట పొలాల్లో వీరు కలియతిరిగారు. ఈసందర్భంగా రైతులతో సమావేశమయ్యారు. మహేష్‌బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు సింగం సుబ్బారావు, సింగం జగన్, సభ్యులు, గ్రామ రైతులు మిద్దే సత్యనారాయణ, మైనం వెంకటేశ్వరరావు ఉన్నారు. భూమిని నమ్ముకోవాలి.. అమ్ముకోకూడదు మహర్షి సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో నటిం చాను. నిజ జీవితంలో కూడా జర్నలిస్ట్‌గా పని చేసి అలసిపోయి 2014లో నా వృత్తికి రాజీ నామా చేశాను. స్వతహాగా రైతు కుటుంబం కావడంతో తిరిగి రైతుగా అడుగుపెట్టాను. మహర్షి సినిమాలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. నేడు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రభుత్వాలు గిట్టుబాటు ధరపై ఆలోచన చేయాలి. రైతు లేకపోతే సమాజం లేదు. రైతు పండించడం మానేస్తే ఆహార సంక్షోభం వస్తుంది. ఒకడికి తిండి పెట్టగలిగే వాడు రైతు. అటువంటి రైతు భూమిని నమ్ముకోవాలి తప్ప అమ్ముకోకూడదు.-ఆర్వీ రమణ, సీనియర్ జర్నలిస్ట్, తూ.గో.జిల్లా మహర్షిలో నటించడం అదృష్టం కర్నూలు జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించా ను. ఉద్యోగరీత్యా భీమవరంలో కొన్నాళ్లు పని చేశాను. షార్ట్‌ఫిల్మ్‌లో నన్ను చూసి మహర్షి సిని మాకు ఎంపిక చేశారు. ఈ సినిమా పుణ్య మాంటూ గోదావరి జిల్లాలకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాలోని ఒక సన్ని వేశం నన్ను బాధ కలిగించినా అనుభవాన్నిచ్చింది. సామాన్యుడిగా ఉన్న నన్ను గోచి, తువాలు ఇచ్చి కట్టుకోమన్నారు. యూనిట్ అం తా భోజనాలు చేస్తున్న సందర్భంలో నేను అక్కడకు వెళ్లగా టోకెన్ తెచ్చుకోవాలని చెప్పడంతో బాధ కలిగింది. డైరెక్టర్ చెప్పడంతో నా కు భోజనం పెట్టారు. – గురుస్వామి, రైతు పాత్రధారి, మహర్షి సినిమా 189 చిత్రాల్లో నటించా.. రైతు పడుతున్న ఇబ్బందులపై సినిమా తీ యడం శుభపరిణామం. నేను ఇప్పటివరకు 189 చిత్రాల్లో నటించాను. మహర్షి సినిమాలో నేను ఒక పాత్ర ధరించడం అదృష్టంగా భావిస్తున్నాను. రైతు పడుతున్న ఇబ్బందులే సినిమాల ద్వారా ప్రపంచానికి తెలియపరుస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి రైతాంగాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి. మహర్షి సినిమా చూసిన విదేశాల్లోని వారు సైతం వీకెండ్ వ్యవసాయం చేయడానికి హైదరాబాద్, పరిసరాల్లో అరెకరం, ఎకరం పొలం కోసం తాపత్రయపడటం గర్వించదగ్గ విషయం.– దిల్ రమేష్, మహర్షి సినిమా పాత్రధారి -
రైతే నిజమైన రాజు
బంజారాహిల్స్: దేశానికి అన్నం పెట్టే రైతే నిజమైన రాజు అని మహర్షి సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్‌రాజు అన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఉలవచారు రెస్టారెంట్ 6వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం రెస్టారెంట్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు దర్శకుడు వంశీ, నిర్మాత దిల్‌రాజు పంచె, కండువాలు కప్పి సన్మానించారు. అనంతరం రైతులకు రెస్టారెంట్‌లోని ఉలవచారు బిర్యానీ, రాజుగారి కోడిపలావ్, కోనసీమ కోడివేపుడు, గద్వాల్ పలావ్, రొయ్యల వేపుడు వంటి వాటిని వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఉలవచారు రెస్టారెంట్ నిర్వాహకులు వినయ్ నరహరి, విజయ్ రెడ్డిలు పాల్గొన్నారు. -
హాలిడే జాలిడే
తీరిక లేకుండా పని చేయడం. తీరికగా ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేయడం మహేశ్‌బాబు స్టైల్. తాజాగా ‘మహర్షి’ సినిమాతో పెద్ద సక్సెస్ అందుకున్నారాయన. సినిమా ప్రమోషన్స్‌లో కూడా చాలా చురుకుగా పాల్గొన్నారు. ఇప్పుడు వర్క్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకొని హాలిడేకు వెళ్లారని తెలిసింది. ఈ హాలిడేలో పోర్చుగల్, ఇంగ్లాండ్ దేశాలు చుట్టి వస్తారట. ముందు పోర్చుగల్‌లో హాలిడే ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటిస్తారట. జూన్ 15 మళ్లీ ఇండియా తిరిగి రానున్నారని తెలిసింది. వచ్చే నెల మొదట్లో ఇంగ్లాండ్‌లో ప్రపంచకప్ స్టార్ట్ కానుంది. అక్కడ ఇండియా మ్యాచ్‌లను మహేశ్ చీర్ చేస్తారేమో చూడాలి. తిరిగి రాగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారు మహేశ్. -
మహర్షి విజయోత్సవ వేడుక
-
యాంకర్ హేమంత్ కారుకు ప్రమాదం
సాక్షి, విజయవాడ : ప్రముఖ టీవీ యాంకర్, నటుడు, ఆర్జే హేమంత్ కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం నుంచి అతడు సురక్షితంగా బయటపడ్డాడు. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్డు వద్ద హేమంత్ కారు ఓ గేదెను ఢీ కొట్టింది. దీంతో కారు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఆ సమయంలో అతడే కారు డ్రైవ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా విజయవాడలో ‘మహర్షి’ సక్సెస్ మీట్ కార్యక్రమం పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కథ వినగానే హిట్ అని చెప్పా
‘‘వంశీ పైడిపల్లి ‘మహర్షి’ కథ చెప్పగానే ఈ సినిమా హిట్ అని చెప్పా. డెహ్రాడూన్‌లో షూటింగ్ మొదటి రోజే ‘పోకిరి’కి రెండింతల హిట్ అవుతుందని చెప్పా. నా 25వ సినిమా ఇంత హిట్ కావడం చాలా హ్యాపీ. ఈ సినిమాలో స్టూడెంట్‌గా చేయడం బాగా కిక్ అనిపించింది’’ అని మహేశ్‌బాబు అన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మహర్షి’. అశ్వినీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మించారు. మే 9న రిలీజైన ఈ చిత్రం విజయోత్సవ వేడుకను విజయవాడలోని సిద్ధార్థ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్లో శనివారం నిర్వహించారు. మహేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘మహర్షి’లో చేసిన రిషి నాకు బాగా నచ్చిన క్యారెక్టర్. విజయవాడ వచ్చి కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని, ఇక్కడ ఫంక్షన్ చేస్తే ఆ ఫీలే వేరు. నేను ముందుగా అనుకోకపోయినా నా సినిమా హిట్ అయినప్పుడల్లా అమ్మ నన్ను పిలుస్తోంది ఇక్కడికి. రాఘవేంద్రరావు మామయ్యగారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ‘రాజకుమారుడు’ సినిమా సమయంలో అన్నీ తానే అయి, ఓ స్నేహితుడిలా నాకు నటన నేర్పినందుకు రుణపడి ఉంటాను. ముగ్గురు గొప్ప నిర్మాతలు నా సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. అశ్వినీదత్‌గారు నా మొదటి సినిమా, 25వ సినిమా చేయటం చాలా సంతోషం. సినిమాలో పనిచేసిన నరేష్, పూజా, అందరికీ కృతజ్ఞతలు. సినిమాలో మంచి క్యారెక్టర్ చేసిన గురుమూర్తి (వృద్ధ రైతు పాత్ర చేసిన వ్యక్తి) గారి ఆశీస్సులు, దీవెనల వల్లే సినిమాకు ఇంత హిట్ లభించింది. నాన్నగారి అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మీకు నచ్చితే ఎంతలా ఆదరిస్తారో నాకు బాగా తెలుసు. వారం రోజుల్లోనే ఇంత పెద్ద హిట్ చేసినందుకు ధన్యవాదాలు. మీకు చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం చేయగలను? ఆంధ్రా హాస్పిటల్ రామారావుగారు ఇంతకు ముందు చెప్పారు.. పిల్లలు సర్జరీ సమయంలో నా పేరు వినగానే సంతోషంగా ఫీల్ అవుతున్నారని. నా జీవితంలో ఇదే గొప్ప కాంప్లిమెంట్. పిల్లల జీవితాలను కాపాడటం చాలా గొప్ప విషయం. చాలా గొప్పగా చెబుతున్నా.. మీలాంటి వారితో పని చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నా’’ అన్నారు. ‘‘బుద్ధ పౌర్ణమి రోజు మహేశ్‌బాబు అభిమానులకు గొప్ప పండగ. త్రిమూర్తులైన నిర్మాతలకు అభినందనలు. మహేష్ 25వ సినిమా హిట్ కావడంపై నా వందో సినిమా కన్నా ఎక్కువగా సంతోషపడుతున్నా. వంశీ సమాజానికి ఉపయోగపడే సినిమా తీశారు. రైతులు, స్నేహితుడు, సంపాదన వంటి విషయాలను బాగా చూపారు. మహేశ్ నన్ను మామయ్యా అంటే ఇష్టపడతాను, అలానే పిలవాలని కోరుకుంటాను’’ అన్నారు రాఘవేంద్రరావు. ‘‘దేశంలో మనమందరం చల్లగా ఉన్నామంటే కారణం ఇద్దరే. ఒకరు జవాన్, మరొకరు రైతు. అటువంటి రైతుల గురించి సినిమా తీసినందుకు చాలా సంతోషం. ఈ సినిమాను రైతులకు అంకితం చేస్తున్నాను. సినిమా కోసం మూడేళ్ల పాటు మహేశ్‌తో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. ‘అల్లరి’ నరే‹శ్ చేసిన రవి పాత్ర ఈ సినిమాకు చాలా ముఖ్యమైనది. ఇటువంటి సినిమా చేసే అవకాశం కలిగించిన దిగ్గజ నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా హిట్ కావడానికి సహకరించిన నా టీమ్‌కు రుణపడి ఉంటాను. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమా హిట్‌కి కీలక పాత్ర అయింది’’ అన్నారు వంశీ పైడిపల్లి. ‘‘ఇద్దరు విజయవాడ టైగర్స్‌తో కలసి సినిమా చేయటం చాలా ఆనందంగా ఉంది. మే 1న (ప్రీ రిలీజ్ ఫంక్షన్లో) కాస్త ఎక్కువగా మాట్లాడాను అనుకున్నవారికి సినిమా హిట్‌తో నేను మాట్లాడింది నిజమని అర్థమై ఉంటుంది. మహేశ్ నాకు మరో సినిమాకి డేట్స్ ఇస్తే అదే నాకు పెద్ద గిఫ్ట్’’ అన్నారు ‘దిల్’ రాజు.‘‘మహేశ్‌బాబుతో నేను చేసిన ‘రాజకుమారుడు’ ఇక్కడ అలంకార్ థియేటర్లో 100 రోజులు, 4 ఆటలతో ఆడి రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ‘మహర్షి’ వాటిని మించి బాగా అడుతోంది. అమెరికాలో కొత్త రికార్డ్ నెలకొల్పుతోంది. వంశీ, సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు అశ్వినీదత్. ‘‘సినిమాను హిట్ చేసిన కనకదుర్గమ్మకు, మహేశ్‌బాబుకు కృతజ్ఞతలు. సినిమా రిలీజ్ కాకుండానే హిట్ అవుతుందని సక్సెస్ మీట్ డేట్‌ను ప్రకటించాను. ఇక మీదట బాబును ‘మహర్షి’ మహేశ్ అని పిలవాలి. సూపర్ స్టార్ అన్నది బిరుదు. మహర్షి అన్నది బాధ్యత. వంశీ తన టీమ్‌తో కష్టపడి గొప్ప విజయాన్ని అందించారు’’ అన్నారు పీవీపీ. ఈ వేడుకలో దర్శకులు వైవీఎస్ చౌదరి, అనిల్ రావిపూడి, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, నటులు పృథ్వీరాజ్, శ్రీనివాస్‌రెడ్డి, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, వైఎస్సార్సీపీ నేత భవకుమార్ తదితరులు పాల్గొన్నారు. – ‘సాక్షి’, విజయవాడ -
కనకదుర్గమ్మ గుడిలో ‘మహర్షి’ టీమ్
సాక్షి, విజయవాడ : సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’ ఇటీవల విడుదలై.. ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్ర బృందం శనివారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. హీరో మహేశ్‌బాబు సహ సినిమాకు సంబంధించిన పలువురు ప్రముఖులు ఆలయాన్ని దర్శించుకొని.. కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో మహర్షి చిత్రబృందానికి అధికారులు స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో మహేష్‌బాబు కనిపించడంతో ఆయనన చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పలువురు పోటీపడ్డారు. -
‘రెడ్డిగారి అబ్బాయి’గా మహేష్ బాబు!
ప్రస్తుతం మహర్షి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సూపర్‌స్టార్ మహేష్ బాబు త్వరలో తదుపరి చిత్రాన్ని స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఎఫ్ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తెర మీదకు వచ్చింది. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘రెడ్డిగారి అబ్బాయి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. -
దేశాన్ని రక్షించేది రైతు, సైనికుడే :మహేష్‌బాబు
మేడ్చల్‌రూరల్: ‘మహర్షి’ మహేష్‌బాబు శుక్రవారం కండ్లకోయలో ప్రత్యక్షమయ్యారు. ఇక్కడి సీఎంఆర్ విద్యా సంస్థల ఆడిటోరియంలో చిత్రం సక్సెస్ మీట్‌ను విద్యార్థులతో ఏర్పాటు చేశారు. చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి కలిసి పాల్గొన్న ప్రిన్స్.. విద్యార్థులతో సినిమా విజయాన్ని పంచుకున్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు హీరో, దర్శకులు సమాధానాలిచ్చారు. మహేష్‌బాబు తన చదువు, సినిమాలు, రియల్ లైఫ్ గురించి ఎన్నో విశేషాలను వివరించారు. మన సంస్కృతి వ్యవసాయమని, దేశాన్ని రక్షించేది రైతు, సైనికుడేనన్నారు. సెలవులు లేకుండా కష్టపడేది వీరిద్దరేనని, వారికి కావల్సింది సానుభూతి కాదని గౌరవమని మహేష్ పేర్కొన్నారు. ‘మహర్షి’ సినిమాలో ‘తాతా నాకు వ్యవసాయం నేర్పుతావా’ అన్న డైలాగ్ ప్రతీ ఒక్కరిని కదిలించిందని, దానికి కారణం మన కుటుంబాలు వ్యవసాయంతో ముడిపడి ఉండటమేనన్నారు. వంశీ ‘మహర్షి’ సినిమా తనతో చేయడానికి తన రెండు సినిమాలు పూర్తయ్యే వరకు వేచి ఉన్నాడని వివరించారు. ఇప్పటి వరకు తాను చేసిన సినిమాల్లో మహర్షిలోని ‘రిషి’ పాత్ర ఎంతో గొప్పదిగా భావిస్తున్నాన్నారు. ఒక కంపెనీ సీఈఓ అయితే మీరు ఉద్యోగుల కోసం ఏం చేస్తారని ఓ విద్యార్థి అడగ్గా.. తనకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించడం తప్ప ఏమీ తెలియదని సమాధానమిచ్చారు. తన చదువు మొత్తం చెన్నైలో సాగిందని, అందుకే తనకు ఇక్కడ ఎక్కువ మంది మిత్రులు లేరని, తనకు మంచి మిత్రుడు వంశీ పైడిపల్లి అని మరో విద్యార్థి ప్రశ్నకు సమాధానంమిచ్చారు. అనంతరం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మహేశ్‌బాబును సత్కరించారు. కార్యక్రమంలో సీఎంఆర్ విద్యా సంస్థల కార్యదర్శి గోపాల్‌రెడ్డి, ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మహేష్ ఆ దర్శకుడికి ఓకె చెప్పాడా?
ఇటీవల మహర్షి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు, వరుసగా యంగ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మహర్షి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సూపర్‌స్టార్ త్వరలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా మహేష్ రెగ్యులర్ స్టైల్‌కు భిన్నంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా మహేష్ ఓకె చేసినట్టుగా తెలుస్తోంది. గీత గోవిందం సినిమాతో ఘనవిజయం సాధించిన పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు మహేష్ ఓకె చెప్పాడట. పరశురామ్ చెప్పిన లైన్ నచ్చటంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడట. అయితే ఈ వార్తలపై మహేష్ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. -
మరోసారి కాలర్ ఎగరేస్తున్నా
‘‘నా 20 ఏళ్ల సినీ ప్రయాణంలో, నా 25 సినిమాల జర్నీలో ఈ రోజు పొందిన ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు మహేశ్‌బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందిన చిత్రం ‘మహర్షి’. ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్రధారి. సి. అశ్వనీదత్, పీవీపీ, ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న రిలీజైంది. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో బుధవారం సాయంత్రం ప్రేక్షకులను కలిసింది ‘మహర్షి’ చిత్రబృందం. మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘నా సూపర్ హిట్ సినిమాలు సుదర్శన్ థియేటర్లో రిలీజయ్యాయి. నా 25వ చిత్రం ‘మహర్షి’ కూడా ఇక్కడ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని ఘనవిజయం చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు థ్యాంక్స్. ఈ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడూ ఇలానే ఉండాలి. మీ అందరి కోసం మరోసారి (ఈ మధ్య జరిగిన ‘మహర్షి’ సక్సెస్‌మీట్‌లో కాలర్ ఎగరేశారు) కాలర్ ఎగరేస్తున్నాను’’ అన్నారు. ‘‘మహేశ్ 25వ సినిమా ‘మహర్షి’కి నేను దర్శకుడ్ని కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు వంశీ పైడిపల్లి. ‘‘ఈ నెల 18న విజయవాడలో సక్సెస్‌మీట్ నిర్వహిస్తాం’’ అన్నారు ‘దిల్ రాజు. ‘‘ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘మహర్షి’ని చూసి ‘‘వ్యవ సాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం ఇది. మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి, నిర్మాతలతోపాటు చిత్రబృందానికి అభినందనలు’’ అని ట్వీట్ చేశారు. ‘‘మీ మాటలు మాకు స్ఫూర్తినిస్తున్నాయి. ధన్యవాదాలు సార్’’ అని బదులుగా మహేశ్ ట్వీట్ చేశారు. -
ఇంతకంటే గొప్ప గౌరవం ఉంటుందా? : మహేష్
మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన మహర్షి చిత్ర టీంకు అభినందనలు తెలిపారు. హీరో మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లిలను ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన మహేష్ బాబు, వెంకయ్యనాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ అభినందన నాకు వ్యక్తిగంతంగానే కాదు, మా చిత్ర యూనిట్‌కు కూడా ఎంతో గౌరవం, మీ ప్రశంసలు మరిన్ని ఇలాంటి చిత్రాలు చేసేందుకు ప్రేరణ కలిగించిం’ అంటూ మహర్షి టీం తరువాత కృతజ్ఞతలు తెలియజేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మహర్షి. ఈ మూవీ మహేష్ 25వ సినిమా కూడా కావటంతో మరింత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందించారు. గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. టాక్ పరంగా నిరాశపరిచిన కలెక్షన్ల పరంగా మాత్రం మహర్షి సంచలనాలు నమోదు చేస్తోంది. Sir.. This is such an honour for me personally & our whole team... it can't get better than this. Thank you Sir, your words have inspired us to keep doing more films like "Maharshi".. on behalf of Team Maharshi... humbled, Sir. 🙏🙏🙏 https://t.co/ML50Cf6QgJ — Mahesh Babu (@urstrulyMahesh) 14 May 2019 -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహర్షి సినిమా దర్శకనిర్మాతలు
-
‘మహర్షి’ రిస్క్ చేస్తున్నాడా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మహర్షి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. అయితే సినిమాకు యునానిమస్‌గా పాజిటివ్ టాక్ మాత్రం రాలేదు. ముఖ్యంగా సినిమా లెంగ్త్ విషయంలో విమర్శలు గట్టిగానే వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహర్షి టీం మరికొన్ని సీన్స్‌ను యాడ్ చేసేందుకు రెడీ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ ఇంటికి రిషి (మహేష్ బాబు) వెళ్లే సీన్ నిడివి పెంచటంతో పాటు సెకండ్ హాఫ్లోనూ రెండు సన్నివేశాలను యాడ్ చేయనున్నారట. ఇప్పటికే లెంగ్త్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న మహర్షి సినిమాకు రిపీట్ ఆడియన్స్ కోసం చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన మహర్షి సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టుగా నిర్మాతలు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి రికార్డుల మీద కన్నేసిన చిత్రయూనిట్ సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. -
బీఎస్ఎన్లో ఉద్యోగం చేసి 2003లో రిటైరై..
కర్నూలు(గాయత్రీ ఎస్టేట్): ‘ఆ రోజు మీరు ఎవరో తెలియదన్నాను బాబు.. నేను ఇంకెన్నేళ్లు బతుకుతానో నాకు తెలియదు.. బతికినంత కాలం నువ్వు గుర్తుంటావు.., ఇంత చేసిన నీకు మేమేమి ఇవ్వగలం.. మేము పుట్టినప్పటి నుంచి నమ్ముకున్నది ఒక్కటే.. దీన్ని మాత్రమే నీకు ఇవ్వగలం..’ ఇటీవలే విడుదలైన మహర్షి సినిమాలోని ఈ డైలాగులు విన్న ప్రతి ప్రేక్షకుడూ రైతుల గురించి ఆలోచించకుండా ఉండలేడు. రైతు వేషధారణలో ఉండి ఈ పలుకులు పలికిందెవరో కాదు.. కర్నూలుకు చెందిన రంగ స్థల కళాకారుడు మిటికిరి గురుస్వామి. ఈయన పొలంలో ఉండి కథానాయకుడు మహేష్‌బాబుతో చెప్పిన డైలాగులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వెల్దుర్తికి చెందిన గురుస్వామి బీఎస్ఎన్లో ఉద్యోగం చేసి 2003లో రిటైర్డ్ అయ్యారు. ఇంటి సమస్యల నుంచి బయటపడడానికి నాటకరంగం వైపు అడుగులు వేశారు. అవే అడుగులు సాంఘిక నాటకాలు, లఘుచిత్రాలతో సినీ రంగంలోకి నడిపించాయి. కుటుంబ నేపథ్యం.. వెల్దుర్తికి చెందిన ఆదెమ్మ, బాలన్న దంపతుల ఐదుగురు సంతానంలో గురుస్వామి ఒకరు. పెద్ద కుటుంబం కావడంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడేవారు. వాటి నుంచి బయటపడేందుకోసం గురుస్వామి నాటకాల వైపు దృష్టి సారించారు. ఎస్ఎస్ఎల్సీ చదివిన ఈయన 1960లో ‘నేటి విద్యార్థి’ నాటకంలో మొదటిసారి నటించారు. 1964లో బీఎస్ఎన్లో చిరుద్యోగిగా చేరి సీసీఎస్‌గా 2003లో పదవీ విమరణ చేశారు. ఈ మధ్య కాలంలో చాలా నాటకాల్లో నటించారు. రిటైర్డ్ అయిన తర్వాత లఘుచిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కర్నూలు బాలాజీ నగర్లో నివాసం ఉంటున్నారు. ‘ఆయుష్మాన్‌భవ’ నటనతోనేసినిమా చాన్స్.. అజీజ్ దర్శకత్వంలో వచ్చిన ఆయుష్మాన్‌భవ లఘుచిత్రంలో గురుస్వామి, ఆయన మిత్రుడు పరమేష్‌శర్మ నటించారు. తర్వాత వీరు మహర్షి చిత్రం నిర్మిస్తున్న ఎస్వీసీ కార్యాలయానికి వెళ్లి తాము నటించిన ఆయుష్మాన్‌భవ చిత్రాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ హరికి చూపించి ఏదో ఒక అవకాశం ఇప్పిం చాలని కోరగా కో డైరెక్టర్ రాంబాబు ఆడిషన్స్‌కు పిలిచి ఓకే చేశారు. హీరో మహేష్‌బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి, కెమెరామెన్ మోహన్ ముందు వేషం కట్టగా వారు సంతృప్తి చెందడడంతో గురుస్వామికి మహర్షి సినిమాలో నటించే అవకాశం దక్కింది. చిత్ర యూనిట్‌తో మూడు నెలల పాటు ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియో, రామోజీ ఫిల్మ్ సిటీ, తమిళనాడులోని పొలాచి, కేరళలో జరిగిన సినిమా షూటింగ్లో 25 రోజలు పాల్గొన్నాడు. మంచి నటనతో చిత్ర యూనిట్‌తో పాటు ప్రేక్షకులను మెప్పించారు. కర్నూలు కళారంగానికి గర్వకారణంగా నిలిచారు. మహర్షి సినిమా దర్శక నిర్మాతలతో గురుస్వామి, కుటుంబ సభ్యులు కళారంగ ప్రతి కు‘రాయలసీమ రత్నం’ పురస్కారం గురుస్వామి పలు పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించి మంచి కళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. అసుర గణం, ఎవ్వనిచే జనించి, పుటుక్కు జర జర డుబుక్కుమే, యధారాజా త«థా ప్రజా, కుర్చీ తదితర సాంఘిక నాటకాల్లో నటించి మెప్పించారు. ప్రముఖ రంగస్థల కళాకారులు బుర్రా సుబ్రమణ్యశాస్త్రి, బీసీ కృష్ణ లాంటివారితో వేమన, సక్కుబాయి, చింతామణి లాంటి పౌరాణిక నాటకాల్లోనూ నటించి ఔరా అనిపించుకున్నారు. ప్రముఖ జాన పద రచయిత డాక్టర్ వి.పోతన్న రచించిన ‘ఎట్టా సేయాలబ్బా’లో నటించడంతో పాటు దాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేయించి నాగపూర్‌లో విదేశీయుల ముందు సైతం నటించి పేరు తెచ్చుకున్నారు. పూజ వర్సెస్ వంశీ, రామానుజాచార్యులు, సంకల్పం, రైతన్న, ఆయుష్మాన్ భవ తదితర లఘు చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు. గురుస్వామి కళా ప్రతిభను గుర్తించిన కర్నూలు టీజీవీ కళాక్షేత్రం ‘రాయలసీమ రత్నం’ పురస్కారంతో సత్కరించింది. గొప్ప అనుభూతిని ఇచ్చింది.. సినీ రంగంలో అవకాశం వస్తుందని ఊహించలేదు. సమస్యల నుంచి ఆలోచనలను మరల్చుకోడానికి నాటకరంగం వైపు అడుగులు వేసినప్పటికీ ఇష్టంతోనే నటించాను. వెల్దుర్తికి చెందిన వెంకట నరసు నాయుడి స్ఫూర్తితో బుర్రా సుబ్రమణ్య శాస్త్రి, బీసీ కృష్ణ, సంజన్న లాంటి ప్రఖ్యాత నటులతో కలిసి నటించడం ఎప్పటికీ మరిచిపోలేను. వెంకటనరసు నాయుడికి ఇచ్చిన రాయలసీమ రత్నం పురస్కారం నేను అందుకోవడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి. ఊహించని విధంగా మహర్షి సినిమాలో నటించే అవకాశం రావడం చాలా సంతోషాన్నిచ్చింది.– గురుస్వామి, కళాకారుడు -
మహర్షి సక్సెస్ మీట్
-
ఫ్యాన్సే కాదు.. నేనూ కాలర్ ఎగరేస్తున్నా
‘‘నా కెరీర్లో ‘మహర్షి’ స్పెషల్ ఫిల్మ్. నా బిగ్గెస్ట్ హిట్స్‌ని వారంలో దాటేయబోతున్నాం. దీనికి మించిన ఆనందం నాకు లేదు. సినిమాను సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు, మా నాన్నగారి(కృష్ణ) అభిమానులకు, నా అభిమానులకు హ్యాట్సాఫ్’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. సి. అశ్వనీదత్, పీవీపీ, ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడులైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో మహేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘ఈ రోజు మదర్స్ డే (ఆదివారం). నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఎప్పుడూ సినిమా రిలీజ్‌కు ముందు అమ్మ ఇంటికి వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్లు ఉంటుంది. అమ్మ ఆశీస్సులు నాకు చాలా ముఖ్యం. అందువల్లే ‘మహర్షి’ సినిమా ఇంత సక్సెస్ అయ్యింది. అందుకే అమ్మలకు ఈ సినిమా సక్సెస్‌ను అంకితం ఇస్తున్నాం. ‘మహర్షి’ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో వంశీ మాట్లాడుతూ నాన్నగారి అభిమానులు, నా అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరుగుతారని అన్నాడు. వాళ్లు (అభిమానులు) కాలర్ ఎత్తారు వంశీ... ఇవాళ నేను కూడా కాలర్ ఎత్తాను. దత్‌గారు నన్ను ఎప్పుడూ ప్రిన్స్ బాబు అని పిలుస్తుంటారు. విపరీతంగా నచ్చినప్పుడు మాత్రం మహేశ్ అని పిలుస్తారు. ఆ పేరు కోసం ఎప్పుడూ వేచి చూస్తుంటాను. ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ మహేశ్ అని దత్‌గారు అనడంతో చాలా సంతోషంగా అనిపించింది’’ అన్నారు. అశ్వనీదత్ మాట్లాడుతూ– ‘‘కృష్ణగారు హిట్సాధించిన ఎక్కువ సినిమాలు రైతు నేపథ్యంలో తెరకెక్కినవే. ఇప్పుడు మహేశ్ 25వ సినిమా రైతుల నేపథ్యంలో తెరకెక్కడం సంతోషంగా ఉంది. ఈ సినిమా సంచలన విజయానికి కారణం మహేశ్‌బాబు, వంశీలే. మే 9న వైజయంతీ బ్యానర్లో విడుదలైన మూడు సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి గౌరవం తీసుకువచ్చినందుకు గర్వంగా ఉంది. ‘దిల్’ రాజును చూస్తే డి.రామానాయుడుగారు గుర్తుకువస్తారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నానంటే సీనియర్ ప్రొడ్యూర్స్ నుంచి నేను పొందిన ప్రేరణే కారణం. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో నేను మాట్లాడిన మాటలు నిజమైనందుకు సంతోషంగా ఉంది. ఫస్ట్ వీక్‌లోనే మహేశ్‌గారి కెరీర్‌లోని రికార్డులను క్రాస్ చేయబోతున్నాం. ఈ సినిమా విజయం ఎంత పెద్దదో ఇప్పుడే చెప్పలేం’’ అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మా అమ్మగారే. ‘మహర్షి’ సక్సెస్ క్రెడిట్లో 80శాతానికిపైగా మహేశ్‌గారికే చెందుతుంది. అశ్వనీదత్‌గారు, పీవీపీగారు బాగా సపోర్ట్ చేశారు. డైరెక్టర్‌గా నాకు జన్మనిచ్చిన ‘దిల్’ రాజుగారికి థ్యాంక్స్. ఇది మైండ్లకు చెప్పే సినిమా కాదు. మనసులకు చెప్పే సినిమా అని చెప్పాను. మనసుతో సినిమా చూసి ఇంత ఆనందాన్ని మాకు ఇస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘మహేశ్‌గారు పర్ఫెక్షన్కి నిదర్శనం. నేను సీరియస్ క్యారెక్టర్స్‌ను చేయగలనని నమ్మిన వంశీ, మహేశ్‌లకు థ్యాంక్స్. ఇవాళ మా నాన్న(దర్శక–నిర్మాత ఈవీవీ సత్యనారాయణ) ఉండి ఉంటే చాలా సంతోషంగా ఫీలయ్యేవారు. ఒక డైరెక్టర్‌గా ఆయన గర్వపడేవారు. ఎందుకంటే ఆయన డైరెక్టర్ కంటే ముందు రైతు. ఆ రైతుగా ఇంకా గర్వపడేవారు. హిట్ అన్న పదం విని నాలుగేళ్లు అయ్యింది. ‘మహర్షి’ సక్సెస్‌తో నాకు అనిపించింది... సక్సెస్‌కు కామాలే ఉంటాయి... ఫుల్‌స్టాప్‌లు ఉండవు’’ అన్నారు. ‘‘మహేశ్ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ చిత్రం. కథకు తగ్గట్టు సినిమాను తీస్తాడు వంశీ. పెద్ద సినిమాను ఎంత ప్రేమించి తీస్తారో, చిన్న సినిమానూ అంతే ప్రేమించి తీస్తారు ‘దిల్’ రాజు. అశ్వనీదత్ వంటి సీనియర్ ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి అవసరం’’ అని పోసాని కృష్ణమురళి అన్నారు. ‘‘రైతుల గురించి చర్చించిన ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉండటం హ్యాపీ’’ అన్నారు పృధ్వీ. ‘‘నేను కర్నూలులో స్టేజ్ ఆర్టిస్టుని. షార్ట్స్ఫిల్మ్స్లో నటిస్తున్న నన్ను చూసి దర్శకుడు వంశీ నాకు మహేశ్‌బాబుతో కలిసి నటించే అవకాశం ఇచ్చారు’’ అని రైతు పాత్ర చేసిన గురుస్వామి అన్నారు. నటులు శ్రీనివాసరెడ్డి, కమల్ కామరాజు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గీత రచయిత శ్రీ మణి, వీఎఫ్ఎక్స్ నిపుణుడు యుగంధర్ మాట్లాడారు. -
మహర్షి సక్సెస్ మీట్లో కాలర్ ఎగరేసిన మహేష్
-
కెరీర్ బిగ్గెస్ట్ హిట్: కాలర్ ఎగరేసిన మహేశ్
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు కాలర్ ఎగరేశాడు. మహర్షి మూవీని బ్లాక్‌బస్టర్ హిట్ చేసినందుకు చిత్రబృందంతోపాటు అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. హైదరాబాద్‌లోని నొవాటెల్ హోటల్లో జరిగిన మహర్షి సక్సెస్ మీట్లో మహేష్‌తోపాటు మూవీ టీమ్ అంతా పాల్గొంది. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లి భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత మాట్లాడిన మహేష్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపాడు. మూడు భారీ నిర్మాణసంస్థలు కలిసి తన 25 సినిమా నిర్మించడం, అది పెద్ద హిట్ కావడం చాలా సంతోషానిచ్చిందన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌కి, నటుడు అల్లరి నరేష్‌కి స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పాడు. తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్‌ని మహర్షి ఒక వారంలో దాటేయబోతోందన్నమహేష్బాబు.. సక్సెస్ మీట్లో కాలర్ ఎగరేశాడు. -
మహర్షి సినిమా సక్సెస్ మీట్
-
‘మహేష్ బాబూ.. నేను ఆడపిల్లగా పుడితే’
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డివైడ్ వచ్చినా ఈ సినిమా వసూళ్లు పరంగా మాత్రం సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఈసందర్భంగా చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ తో పాటు అల్లరి నరేష్, ఇతర నటీనటులు దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్‌లు, ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. దర్శకుడు వంశీ పైడిపల్లి టేకింగ్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందంటూ కితాబిచ్చారు. నేనే గనక ఆడపిల్లనైతే మహేష్ బాబు పెళ్లి చేసుకునే వరకు వదిలిపెట్టే వాడిని కాదంటూ నవ్వులు పూయించారు. మహేష్ అందం చూస్తే మొగాళ్లకు అసూయ కలుగుతుందంటూ ఆకాశానికెత్తేశారు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. -
మహేష్ అందం చూస్తే మొగాళ్లకు అసూయ
-
‘మహర్షి’ అక్కడ చాలా వెనకపడ్డాడు!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం మహర్షి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతోంది. మహేష్ నటించిన 25 వ సినిమా కావటంతో పాటు భారీ హైప్ క్రియేట్ అవ్వటంతో మంచి వసూళ్లు రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా ఓవర్సీస్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోతోంది. సాధారణంగా మహేష్ బాబు సినిమాలకు ఓవర్సీస్లో మంచి క్రేజ్ ఉంటుంది. అయితే మహర్షి సినిమా విషయంలో ఆ క్రేజ్ కనిపించటం లేదన్న టాక్ వినిపిస్తోంది. తొలి రోజే మిలియన్ డాలర్ మార్క్‌ను ఈజీగా సాధిస్తుందని అనుకున్నారు. కానీ మహర్షికి మిలియన్ డాలర్ల మార్క్ అందుకోవడానికి మూడు రోజుల సమయం పట్టింది. అంతేకాదు తొలి రోజు ఓవర్ సీస్లో నాన్ బాహుబలి రికార్డ్లను బద్ధలు కొడుతుందన్న అంచనాల మధ్య రిలీజ్ అయిన మహర్షి సినిమా ఖైదీ నంబర్ 150, భరత్ అనే నేను, స్పైడర్ సినిమాల కంటే చాలా వెనకపడింది. టాక్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ఫుల్‌రన్ లోనూ మహర్షి రికార్డ్ విషయంలో వెనకబడటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. -
నమ్రత.. డిప్రెషన్లో ఉన్నావా; వెళ్లిపోవచ్చు!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మహర్షి సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 24.6 కోట్ల షేర్ సాధించింది. ఈ క్రమంలో మహర్షి సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తూ మహేష్ బాబు- డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుటుంబాలు పార్టీ చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ మూవీ మహర్షి. ఇంతటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన వంశీ పైడిపల్లికి ధన్యవాదాలు. వాట్ ఏ నైట్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్ట్ చేశారు. దీంతో మహర్షి తప్పక చూడాల్సిన సినిమా అంటూ మహేష్ అభిమానులు కామెంట్ చేస్తుండగా.. ఓ నెటిజన్ మాత్రం ఈ ఫొటోల్లో నమ్రత లుక్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘నమ్రత నువ్వెందుకు కొంచెం అయినా మేకప్ వేసుకోవు. ఏదైనా ఫోబియాతో బాధ పడుతున్నావా లేదా డిప్రెషన్లో ఉన్నావా’ అని ట్రోల్ చేశాడు. ఇందుకు స్పందనగా..‘ గౌరవ్ మేకప్ వేసుకున్న మహిళలనే నువ్వు ప్రేమిస్తావనుకుంటా. ఇకపై ఆలోచనా సరళికి సరిపోయే వాళ్లనే ఫాలో అవ్వు ఓకేనా. అలా అయితేనే ఇలాంటివి చూడకుండా ఉండగలవు!!! కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు వెళ్లిపోవచ్చు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఇది’ అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. దీంతో అందం అనేది మనసుకే తప్ప శరీరానికి కాదు. మహేష్ ఇప్పటికీ 25 ఏళ్ల యువకుడిలా కనిపించడం వెనుక మీ శ్రమ ఉంది. గౌతం, సితారాల పెంపకంలో మీ పాత్ర అమోఘం. అయినా మేకప్ వేసుకున్నంత మాత్రాన అందంగా ఉన్నారనడం అవివేకం. అతడికి మంచి కౌంటర్ ఇచ్చారు మేడమ్’ అని నెటిజన్లు నమ్రతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా 1993లో మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్న నమ్రత బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వంశీ సినిమాలో తనతో కలిసి నటించిన మహేష్ బాబును ప్రేమించిన ఆమె.. 2005లో అతడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram Super duper successful #maharshi❤️❤️❤️thanku @directorvamshi for an epic blockbuster 💖💖💖whatta night 👏👏👏👏 A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on May 10, 2019 at 1:21pm PDT -
మహేశ్ కెరీర్లో మహర్షి ల్యాండ్ మార్క్
‘‘మహర్షి’ సినిమా కమర్షియల్‌గా నాన్ ‘బాహుబలి’ రికార్డులతో తెలుగు ఇండస్ట్రీలో టాప్ గ్రాసర్‌గా నిలుస్తుందని అనుకుంటున్నా. ఈ సమ్మర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ఈ చిత్రం నిలుస్తుంది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. మహేశ్‌బాబు, పూజాహెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మించిన ఈ సినిమా గురు వారం విడుదలైంది. శుక్రవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘నేను ముందుగా ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మొదటిరోజు అన్ని సెంటర్స్‌లో మహేశ్‌బాబు కెరీర్లోనే హయ్యెస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేశ్ అభిమానులకు ధన్యవాదాలు. శుక్రవారం సెలవు కాకున్నా నెల్లూరులో ఉదయం 9 థియేటర్స్ హౌస్‌ఫుల్ అయ్యాయి. మహేశ్ కెరీర్‌కు ‘మహర్షి’ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవుతుంది. గురువారం విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 24కోట్ల 61 లక్షల రూపాయల షేర్‌ను సొంతం చేసుకుంది’’ అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – ‘‘ఇదొక హార్ట్ హిట్టింగ్ ఫిల్మ్. ఈ విజయం నా రాబోయే చిత్రాలకు మంచి ఎనర్జీ ఇచ్చింది. నాకు ఫస్ట్‌టైమ్ డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేసి అభినందిస్తున్నారు. మహేష్ ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు, ఫ్యా¯Œ ్స నిజం చేశారు. ఇండస్ట్రీ నుండి ఎన్నో కాల్స్ వస్తున్నాయి. మోస్ట్ స్పెషల్ కాల్ చిరంజీవిగారిది. ఆయన ఫోన్ చేయడంతో ఎవరండీ అన్నాను. ‘నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను’ అనగానే గూస్ బమ్స్ వచ్చాయి. మే 9న చిరంజీవిగారి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా రిలీజైన రోజు నుంచి నాకు సినిమాలపై ప్యాష¯Œ మొదలైంది. అదేరోజున ‘మహర్షి’ రిలీజ్ అవడం, అశ్వనీదత్‌గారు కూడా ఈ సినిమాతో అసోసియేట్ అవడం మర్చిపోలేనిది. ఇది నా జీవితంలో ఓ మెమొరబుల్ మూమెంట్. వినాయక్‌గారి ‘ఆది’ సినిమా చూసి సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాను. అలా నా కెరీర్లో ఒక ఇంపార్టెంట్ పర్స¯Œ అయిన వినాయక్‌గారు ఫోన్ చేసి అభినందించడం కూడా ఒక హైపాయింట్’’ అన్నారు. ‘‘మహర్షి’ సినిమాని సక్సెస్ చేసిన తెలుగు ఆడియ¯Œ ్సకి ధన్యవాదాలు. మహేష్‌గారి ల్యాండ్‌మార్క్ ఫిల్మ్‌లో నేను కూడా భాగమైనందుకు హ్యాపీగా ఉంది. ‘పాలపిట్ట..’ సాంగ్‌కి స్క్రీన్ కనపడకుండా పేపర్స్ వేయడం చాలా థ్రిల్లింగ్‌గా అన్పించింది’’ అన్నారు పూజాహెగ్డే. దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ మహేష్‌గారు కమర్షియల్ ఎంటర్టైనర్స్తో పాటు సోషల్ మెసేజ్ ఉన్న సినిమా చేయడం చాలా గ్రేట్. మహేష్‌గారి 25వ సినిమా ‘మహర్షి’, ఎన్టీఆర్‌గారి 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’, సూర్య 25వ సినిమా ‘సింగం’ చిరంజీవిగారి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ఇలా.. అందరి ల్యాండ్ మార్క్ ఫిలింస్‌లో భాగమవ్వటం గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు. -
‘మహర్షి’ సినిమా సక్సెస్‌మీట్
-
‘మహర్షి’ తొలి రోజు వసూళ్లు ఎంతంటే!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా మహర్షి. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చినా భారీ వసూళ్లు సాధించింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కావటం, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే స్థాయిలో జరగటంతో మహర్షి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 24.6 కోట్ల షేర్ సాధించింది. (చదవండి : ‘మహర్షి’ మూవీ రివ్యూ) ఓవర్ సీస్‌తో పాటు ఇతర రాష్ట్రాల వసూళ్లు కూడా కలుపుకుంటే ఈ లెక్క 30 కోట్ల మార్క్‌ను చేరుతుందని భావిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. అల్లరి నరేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, జయసుథ ఇతర కీలక పాత్రల్లో నటించారు. #Maharshi Day1 AP, TS Nizam - 6.38 Cr Ceeded - 2.89 Cr UA - 2.88 Cr East - 3.2 Cr West - 2.47 Cr Krishna - 1.39 Cr Guntur - 4.4 Cr Nellore - 1 Cr AP, TS Day 1 Share - 24.6 Cr#Maharshi #SSMB25#EpicBlockbusterMaharshi pic.twitter.com/ZRw8U9dVnp — BARaju (@baraju_SuperHit) 10 May 2019 -
‘మహర్షి’లో బాలనటుడు మనోడే!
జంగారెడ్డిగూడెం: భవిష్యత్తులో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కోరిక అని ‘మహర్షి’ చిత్రంలోని బాల నటుడు చక్రి తెలిపాడు. మహేష్‌బాబు నటించిన ‘మహర్షి’ చిత్రంలో బాల నటుడిగా నటించిన 9 సంవత్సరాల చక్రి గురువారం చిత్రం విడుదల సందర్భంగా స్థానిక లక్ష్మీ థియేటర్‌కు వచ్చాడు. చిత్రం చూసేందుకు వచ్చిన చక్రి కొద్ది సేపు విలేకరులతో ముచ్చటించాడు. తానిప్పటి వరకు 37 చిత్రాల్లో బాల నటుడిగా నటించినట్లు చెప్పాడు. మిర్చి, కృష్ణం వందే జగద్గురుం, ద్వారక, గుంటూరోడు, స్పీడున్నోడు, నేనొక్కడినే, బ్రహ్మోత్సవం, మనం, రోజులు మారాయి వంటి విజయవంతమైన చిత్రాల్లో చక్రి నటించాడు. మహర్షి చిత్రంలో మహేష్‌బాబుతో ఓ సన్నివేశంలో చక్రి మహర్షి చిత్రంలో హీరో మహేష్‌బాబుకు సపోర్ట్‌గా ఉండే బాలనటుడిగా నటించాడు. ఈ చిత్రంలో చక్రి మూగవాని పాత్ర. తాను తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో నిజాం పేట శ్రద్ధ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నట్లు చెప్పాడు. తన అన్న విష్ణు చరణ్ 8వ తరగతి చదువుతున్నాడని, తమ్ముడు కృష్ణ చరణ్ యూకేజీ చదువుతున్నట్లు తెలిపాడు. విశేషమేమిటంటే విష్ణు చరణ్, కృష్ణ చరణ్‌లు బాలనటులే. విష్ణుచరణ్ 20 చిత్రాల్లో నటిం చాడని, కృష్ణచరణ్ రెండు చిత్రాల్లో నటించి నట్లు చెప్పాడు. జంగారెడ్డిగూడెంలోని ఉప్పలమెట్టపై తన అత్త, మామయ్యలు లక్ష్మి, ప్రశాంత్‌లు ఉంటున్నారని అక్కడికి వచ్చిన ట్లు తెలిపాడు. తన తండ్రి సతీష్ నాయుడు హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఫొటో స్టూడియో ఏర్పాటు చేసుకుని స్టిల్ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నారని, తన తల్లి ధనశ్రీ గృహిణి అని తెలిపాడు. తన తండ్రి సొంత ఊరు తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేటకాగా, తల్లిది ద్వారకాతిరుమల అని వివరించాడు. -
‘గుడ్ లక్ మై లవ్ మహేశ్’
హైదరాబాద్: ‘మహర్షి’ సినిమా చిత్రీకరణ సమయంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఎంతగా కష్టపడ్డారో కళ్లారా చూశానని ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'ప్రేక్షకులకు ఓ అద్భుతమైన చిత్రాన్ని కానుకగా ఇవ్వడానికి నువ్వు పడిన కష్టాన్ని నేను చూశా, ఇప్పుడు ప్రపంచం ఆ కష్టాన్ని చూడబోతోంది. గుడ్ లక్ టు మై లవ్ మహేశ్. ‘రిషి’ పాత్ర నాకెంతగా నచ్చిందో ప్రేక్షకులకి కూడా అంతేలా నచ్చుతుందని ఆశిస్తున్నా’అని పేర్కొన్నారు. నమత్ర మహేశ్‌ను ఆలింగనం చేసుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. మహేశ్ నమ్రత వెనక దాక్కుని ఆలింగనం చేసుకున్నట్లుగా ఉన్న ఈ ఫోటో సామాజికమాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మహర్షి’ తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్‌తో దూసుకుపోతోంది. -
‘మహర్షి’ మూవీ రివ్యూ
టైటిల్ : మహర్షి జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : వంశీ పైడిపల్లి నిర్మాత : దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావటంతో దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సూపర్‌స్టార్ అందుకున్నాడా..? మహేష్ కెరీర్లో మహర్షి మెమరబుల్ సినిమాగా మిగిలిపోయిందా? కథ : మహర్షి కథ ఫారిన్లో ప్రారంభమవుతుంది. రిషి (మహేష్ బాబు) ఆరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తరువాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐఈటీలో జాయిన్ అయిన రిషికి, రవి (అల్లరి నరేష్), పూజ (పూజా హెగ్డే)లు పరిచయం అవుతారు. ముగ్గురి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావటంతో ముగ్గురూ విడిపోతారు. ప్రపంచాన్ని గెలవలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్లిపోతాడు. తండ్రి మరణంతో ఇండియా తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజ్‌లో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి, వివేక్ మిట్టల్(జగపతి బాబు)ను కలిసి గ్యాస్ పైప్ లైన్ పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించక పోవటంతో రిషి.. రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు..? ఈ ప్రయాణంలో ఏం ఏం కోల్పోయాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫామెన్స్తో రిషి పాత్రలో జీవించాడు. ఎమోషన్స్, యాక్షన్‌తో పాటు కామెడీ టైమింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించిన ప్రిన్స్ సూపర్బ్ అనిపించాడు. మరో కీలక పాత్రలోనటించిన అల్లరి నరేష్ కూడా తనదైన నటనతో మెప్పించాడు. కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. కామెడీకే పరిమితమైపోయిన నరేష్‌కు ఇది మంచి బ్రేక్ అనే చెప్పాలి. హీరోయిన్ పూజా హెగ్డే తన పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. లుక్ పరంగా మంచి మార్కులు సాధించారు. విలన్ జగపతిబాబు మరోసారి స్టైలిష్ లుక్‌లో మెప్పించాడు. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, జయసుధ, సాయి కుమార్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ: మహేష్ 25 సినిమా కోసం భారీ కథను సిద్ధం చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. అయితే ఈ కథలో చర్చిన అంశాలన్ని శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఖైదీ నంబర్ 150 లాంటి సినిమాలో చర్చించినవే కావటంతో కాస్త రొటీన్‌గా అనిపిస్తుంది. కథనం విషయంలోనూ దర్శకుడు కాస్త తడబడ్డాడు. సుదీర్ఘంగా సాగే నేరేషన్ అక్కడక్కడా బోర్ ఫీలింగ్ కలిగిస్తుంది. అయితే సూపర్ స్టార్ అభిమానులను మాత్రం వంశీ పూర్తి స్థాయిలో అలరించాడు. మహేష్‌లోని హీరోయిజం, ఎమోషనల్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ ఇలా అన్నింటిని వెండితెర మీద ఆవిష్కరించాడు. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. గత చిత్రాల్లో పాటలు ఎలా ఉన్న నేపథ్య సంగీతంతో మెప్పించే దేవీ ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ అంచనాలను అందుకోలేకపోయాడు. కేయు మోహనన్ సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్ లుక్ తీసుకువచ్చింది. అమెరికా సీన్స్‌తో పాటు, గ్రామీణ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లోనూ కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. దాదాపు మూడు గంటల నిడివి ప్రేక్షకులను బోర్ ఫీల్ అయ్యేలా చేస్తోంది. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ సినిమా కావటంతో నిర్మాతలు ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా సినిమాను తెరకెక్కించారు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు అవసరానికి మించి ఖర్చు చేశారు. ప్లస్ పాయింట్స్: మహేష్ బాబు, అల్లరి నరేష్ నటన ఎమోషనల్ సీన్స్ యాక్షన్ సీన్స్ ఎమోషనల్ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : సినిమా నిడివి రొటీన్ స్టోరీ అక్కడక్కడా స్లో నేరేషన్ సంగీతం -సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
మహేష్‌బాబు అభిమాని దుర్మరణం
ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్) : ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతానికి గురై హీరో మహేష్‌బాబు అభిమాని మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం ధవళేశ్వరంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఇండస్ట్రియల్ కాలనీకి చెందిన హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి యర్రంశెట్టి రాజీవ్ (27) మహర్షి విడుదల సందర్భంగా.. ఐరన్ ఫ్రేమ్‌తో కూడిన ఫ్లెక్సీ కట్టేందుకు మరో వ్యక్తితో కలసి.. మురళీకృష్ణ థియేటర్ పక్కన బిల్డింగ్‌పైకెక్కాడు. ఫ్లెక్సీ ఫ్రేమ్ విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురైన రాజీవ్ ఒక్కసారిగా బిల్డింగ్‌పై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడు. -
టికెట్ రేట్ల పెంపుకి ప్రభుత్వం కారణం కాదు
‘‘కొన్ని సినిమాలు చూసినప్పుడు ‘వావ్.. ఎంత మంచి సినిమా చేశారు.. ఎంత బాగా తీశారు’ అనిపిస్తుంది. ‘మహర్షి’ నా సినిమా కాకపోయినా, మా సంస్థ ఈ సినిమాతో అసోసియేట్ కాకపోయినా కూడా నేను అలాగే ఫీలయ్యేవాణ్ణి. ‘మహర్షి’ గ్రేట్ సినిమా అని అందరూ అంగీకరిస్తారు’’ అని ‘దిల్’ రాజు అన్నారు. మహేశ్‌బాబు, పూజా హెగ్డే జంటగా, ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా పతాకాలపై సి.అశ్వినీదత్, ‘దిల్’ రాజు, పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు పంచుకున్న విశేషాలు... ► మహేశ్‌గారి కెరీర్‌లోని టాప్ సినిమాల లిస్టులో ‘మహర్షి’ కూడా ఉంటుంది. ‘మహర్షి’ ప్రీ రిలీజ్ వేడుకలో నేను చెప్పినట్టు.. ‘ఈ సినిమా ఎంత సక్సెస్ కావాలని ఆశపడుతున్నారో అంతే కోరుకోండి’ అని అభిమానులకు చెప్పాను. అది అతి నమ్మకంతో చెప్పలేదు. ఈ సినిమాతో నా ప్రయాణం, కథ, ప్రీ రిలీజ్‌కి ముందే సినిమా చూడటంతో నమ్మకంతోనే ఆ మాట చెప్పాను. ► అశ్వినీ దత్‌గారి పేరు కూడా ఈ సినిమాతో అసోసియేట్ అయి ఉంది. మే 9న ఆయన సంస్థలో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి’ సినిమాలు విడుదలై హిట్ అయ్యాయి. పీవీపీగారు కూడా ప్యాషన్‌తో ఈ సినిమాతో అసోసియేట్ అయ్యారు. ఈ సినిమాతో వంశీ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉంటాడు. మ్యాజిక్ క్రియేట్ చేసే సినిమా ఇది. ఈ మాట కూడా అతి నమ్మకంతో అనడం లేదు. ► భారీ బడ్జెట్‌తో చేసిన సినిమా కావడం వల్ల పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. ఐదో షో కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ జీఓ వల్ల 8 గంటలకే షోలు పడతాయి. మామూలుగా తెలంగాణలో 8 గంటల షోల ట్రెండ్ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెల్లవారుజామున 5 గంటలకే షోలు స్టార్ట్ అవుతాయి. మేం అనుమతి ఇస్తే వాళ్లు అర్ధరాత్రి ఒంటి గంటకు కూడా షోలు మొదలుపెడతారు. ► తెలంగాణ ప్రభుత్వం కాకుండా, థియేటర్ల ఓనర్లే కోర్టు ద్వారా టికెట్ రేట్ల పెంపుకు అనుమతి తెచ్చుకున్నారు. అలాగే ఆంధ్రాలోనూ పెరిగాయి. తెలంగాణలో రూ.80 టికెట్ రూ.100 చేశారు. రూ.100ది రూ.125 చేశారు. మల్టీప్లెక్స్‌ల వారు రూ.150 ఉన్న చోట రూ.200 చేశారు. రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, వైజాగ్, కర్నూలు... ఇలా అక్కడ రూ. 200 ఉంది. మల్టీప్లెక్స్‌లలో బెంగుళూరులో వీకెండ్లో రూ.300–500 ఇచ్చేంత ప్రొవిజన్ ఉంది. తెలంగాణలో అది లేదు. తెలుగు స్టేట్స్లో లిమిటేషన్ ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచిందని కొన్ని మీడియాల్లో తప్పుడు వార్తలు రాశారు. ► ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతికి సినిమాలు విడుదలైనప్పుడు రేట్లను పెంచుకోవచ్చు. కానీ తెలంగాణలో అది ఇది వరకు లేదు. పక్క రాష్ట్రాల వారితో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ కనీసం పెరగాలి కదా అని థియేటర్ల వాళ్లు వెళ్లి టిక్కెట్ల పెంపునకు అనుమతి తెచ్చుకున్నారు. ► ఒకప్పుడు సక్సెస్ఫుల్ సినిమా జర్నీకి జూబ్లీ వేడుకలు జరిగాయి. ఆ తర్వాత అవి 100 రోజులయ్యాయి. ఇప్పుడు ‘బాహుబలి’ లాంటి సినిమాకు కూడా 50 రోజులే అవుతున్నాయి. ఒక గ్రేట్ సినిమా వచ్చినా రెవెన్యూ అనేది మేజర్‌గా తొలి నాలుగు రోజులే ఉంటుంది. ఆ వీకెండ్స్ ఉన్న రెవెన్యూ మెయిన్‌గా సాగుతోంది. ఇప్పుడు అందరూ సినిమాను ఫాస్ట్‌గా చూడాలనేది ఒకటి, రెండోది పైరసీ వల్ల డ్యామేజ్ ఎక్కువగా జరుగుతోంది. ఎంత కంట్రోల్ చేసినా పైరసీ వస్తూనే ఉంది. అలాంటప్పుడు పెద్ద సినిమాల టార్గెట్ రీచ్ కావాలంటే టికెట్ ధరల పెంపు తప్పదు. ► నేను ఖర్చు పెట్టింది, వచ్చింది... ఇలాంటి నిజాలు ఎవరికి తెలుసు? ఎవరికీ తెలియకుండా, ఎవరికి కావాల్సినవి వాళ్లు రాసుకుంటున్నారు. నిజానిజాలు ఏంటన్నది నాకు తెలుసు. నా పార్టనర్లకు తెలుసు. ఈ సినిమా బడ్జెట్ ఎంత అనేదాని మీద చాలా విషయాలు ఉంటాయి. లాంగ్ ప్రాజెక్టులకు డ్యామేజ్లు పడతాయి. వడ్డీలు కావొచ్చు, అనుకోని అంశాలు కావొచ్చు... వాటన్నింటినీ బడ్జెట్లోకి తీసుకోలేం. ► ప్రపంచవ్యాప్తంగా 2000 స్క్రీన్లున్నాయి. ఆన్లైన్ బుకింగ్‌లో ఎక్స్ట్రార్డినరీ పుల్లింగ్ ఉంది కాబట్టి, ఒక థియేటర్ ఫుల్ అయితే, పక్క థియేటర్ వాళ్లను అడిగినా సినిమా వేస్తారు. ‘బాహుబలి’ తర్వాత అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న సినిమా ‘మహర్షి’. రెవెన్యూ ఎంత వస్తుందనేది చూడాలి. -
ఐటీ సోదాలు.. లైట్ తీసుకున్న దిల్ రాజు
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టికెట్ ధరల పెంపు వివాదం కొనసాగుతుండగానే చిత్ర నిర్మాత దిల్ రాజు ఆఫీస్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. భారీ బడ్జెట్ తో ముగ్గురు నిర్మాతలు సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా కావటంతో మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. (చదవండి : దిల్ రాజు ఆఫీస్‌లో ఐటీ సోదాలు ) బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగిందన్న ప్రచారం జరుగుతుండటంతో ఐటీ అధికారులు దిల్ రాజు ఆఫీసులో సోదాలు చేశారు. ఈ విషయంపై స్పందించిన దిల్ రాజు ఐటీ దాడులు కామన్ అంటూ లైట్ తీసుకున్నారు. పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో ఇలాంటి దాడులు జరుగుతాయని అదేం పెద్ద విషయం కాదన్నారు. (చదవండి : టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వం సీరియస్ ) -
సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం పెంచలేదు
-
టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వం సీరియస్
సాక్షి, హైదరాబాద్ : గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న మహర్షి సినిమా కొత్త వివాదాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. ఎక్స్ ట్రా షోస్‌తో పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి లభించిందంటూ చిత్రయూనిట్ ప్రకటించటంపై తెలంగాణా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. టికెట్ రేట్ల పెంపుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేందటూ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే చిత్రయూనిట్ టికెట్ రేట్ల పెంచడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ విషయంపై స్పందించిన సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్... టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి.. కానీ కోర్టు డైరెక్షన్ వల్ల నిన్న కొన్ని థియేటర్ యాజమాన్యాలు వాళ్లంతట వాళ్లే రేట్లు పెంచినట్లు తెలిసిందని చెప్పారు. 79 థియేటర్లు రేట్లు పెంచినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.. వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామన్నారు. ఈ విషయంపై కోర్టులో పిటిషన్ వేస్తున్నట్టు తెలిపారు. సామాన్యులు కూడా సినిమా చూడాలి అంటే రేట్లు తక్కువ గానే ఉండాలన్నారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించాడు. జగపతి బాబు మరోసారి స్టైలిష్ విలస్‌గా అలరించనున్నాడు. -
దిల్ రాజు ఆఫీస్‌లో ఐటీ అధికారుల సోధాలు
-
దిల్ రాజు ఆఫీస్‌లో ఐటీ సోదాలు
మహర్షి సినిమాకు తెలంగాణలో ఎక్స్ట్రా షోస్‌కు అనుమతిపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. భారీ బడ్జెట్ సినిమా కావటంతో ఎక్స్ట్రా షోస్ వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అనుమతించాల్సిందిగా కోరామని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని తెలిపారు. అదే సమయంలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు కోర్టు అనుమతించినట్టుగా తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి లేదంటూ తేల్చి చెప్పేసింది. (చదవండి : ‘మహర్షి’ పర్మిషన్ల రగడ) తాజాగా దిల్ రాజు ఆఫీస్‌లో ఐటీ అధికారులు సోధాలు చేశారు. రేపు సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో సినిమా బడ్జెట్, బిజినెస్, కలెక్షన్లపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనే పలు భారీ చిత్రాల రిలీజ్ సమయంలో నిర్మాతల ఆఫీసులు, ఇళ్లపై ఐటీ సోదాలు జరిగాయి. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించాడు. జగపతి బాబు మరోసారి స్టైలిష్ విలస్‌గా అలరించనున్నాడు. -
‘మహర్షి’ పర్మిషన్ల రగడ
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనిదత్, పీవీపీలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా మీద ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునే ప్లాన్‌లో ఉంది చిత్రయూనిట్. ఎక్స్ట్రా షోస్ వేయటంతో పాటు టికెట్ రేట్లు పెంచేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే ఎక్స్ట్రా షోస్ వేసుకునేందుకు, టికెట్లు రేట్లు పెంచేందుకు అనుమతులు వచ్చినట్టుగా చిత్రయూనిట్ చెపుతోంది. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా కనబడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఉదయం 8 గంటల నుంచి షోస్ వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. కానీ కొన్ని థియేటర్లలో ఉదయం 7గంటల 30 నిమిషాల షోకు అడ్వాన్స్ బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక టికెట్ రేట్ల పెంపు విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చినట్టుగా చిత్రయూనిట్ చెపుతున్నా పర్మిషన్‌కు సంబంధించిన పత్రాలను బయటపెట్టడం లేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేటు పెంచేందుకు తాము అనుమతిచ్చినట్టుగా వచ్చిన వార్తలను ఖండించింది. మరి ఈ పరిస్థితుల్లో మహర్షి టీం క్లారిటీ ఏమైనా ఇస్తుందేమో చూడాలి. -
మహర్షి హైలెట్స్
-
హైదరాబాద్‌లో పెరిగిన సినిమా టికెట్ ధరలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి సినిమా టికెట్ ధరలు పెరిగాయి. ‘మహర్షి’సినిమా విడుదల నేపథ్యంలో థియేటర్లు టికెట్ల ధరలు పెంచాయి. దీనికి థియేటర్ల యాజమాన్యాల సంఘం ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు సమాచారం. ఈ పెంపు 9వ తేదీ నుంచి రెండు వారాలపాటు అమలులో ఉంటుంది. నగరంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.30, మల్టీప్లెక్స్‌ల్లో రూ.50 చొప్పున పెంచుతున్నట్లు తెలిపాయి. కానీ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో మాత్రం ఈ పెంపుదల రూ.62 వరకు ఉండటం గమనార్హం. కాగా, మహేశ్‌బాబుకు చెందిన ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో మాత్రం ఇప్పటికే టికెట్‌పై రూ.200, రూ.300 వసూలు చేస్తుండటం గమనార్హం. మహర్షి సినిమాకు మాత్రం ఏఎంబీలో ఎలాంటి పెంపుదల లేదు. నగరంలో టికెట్ల రేట్లు పెంపుదలకు ప్రభుత్వం అనుమతిచ్చిందంటూ వస్తున్న వార్తలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పందించారు. మ హర్షి సినిమా విడుదల సందర్భంగా ప్రభుత్వం టికెట్ల పెంపుదలకు ఎవరికీ ప్రత్యేకంగా అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి.. థియేటర్ పాత ధర కొత్త ధర సింగిల్ స్క్రీన్ రూ.80 రూ.110 మల్టీప్లెక్స్ రూ.130 రూ.180 ప్రసాద్ ఐమ్యాక్స్ రూ.138 రూ.200 -
‘మహర్షి’పై తెలంగాణ ప్రభుత్వం ఔదార్యం
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాపై తెలంగాణ ప్రభుత్వం ఔదార్యం చూపింది. రెండు వారాల పాటు రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించేందుకు అనుమతిచ్చింది. ఈనెల 9 నుంచి 22 వరకు ఉదయం 8-11 గంటల మధ్యలో ఒక షో అదనంగా ప్రదర్శించేందుకు తాత్కాలిక అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి రాజీవ్ త్రివేది మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. నిర్మాత దిల్ రాజు అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహర్షి సినిమా ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ జారీచేసింది. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించాడు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, జయసుథ, మీనాక్షి దీక్షిత్, రాజేంద్రప్రసాద్, ముఖేష్ రుషి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. కాగా, స్పెషల్ షోలకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నిర్మాతలు కోరినప్పటికీ ఇంకా ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. టిక్కెట్ ధరల పెంపు మహర్షి సినిమా విడుదల నేపథ్యంలో నగరంలోని సాధారణ థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు టికెట్ ధరలను పెంచాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 80 రూపాయలున్న టికెట్ ధరను110 రూపాయలకు పెంచగా, మల్టీఫ్లెక్స్ లో ఒక్కో టికెట్ పై 50 రూపాయలు పెంచారు. అయితే టికెట్ ధరలను ప్రభుత్వ ఉత్తర్వులతోనే పెంచినట్లు యాజమాన్యాలు తెలిపాయి. పెరిగిన ధరలను ఈ శుక్రవారం నుంచి రెండు వారాలపాటు అమలు చేయనున్నట్లు వెల్లడించాయి. జీఎస్టీ, థియేటర్ నిర్వహణ ఖర్చులు భారం కావడంతో కొత్త సినిమాల విడుదల సందర్భంగా రెండు వారాలపాటు టికెట్ ధరల పెంపునకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా. ఈ మేరకు అనుమతించిందని తెలిపాయి. నిబంధనలకు లోబడి టికెట్ ధరలు పెంచుకోవచ్చని ప్రభుత్వం సూచించినట్టు పేర్కొన్నాయి. మంత్రి తలసాని విస్మయం సినిమా టికెట్ల ధరల పెంచడానికి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతులతో సింగిల్ స్క్రీన్ థియేటర్ లో 80 నుండి 110 రూపాయలు, మల్టిఫ్లెక్స్ థియేటర్ లలో 138 నుండి 200 రూపాయల వరకు సినిమా టికెట్ల ధరలను పెంచినట్లు పలువురు థియేటర్ల యాజమాన్యాలు చెప్పినట్లుగా వివిధ ప్రసార మాధ్యమాలలో చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచిన దాఖలాలు లేవని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని మంత్రి తెలిపారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం కొనసాగించడం పట్ల మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. -
ఒకే రోజు ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్‌లతో!
ప్రస్తుతం టాలీవుడ్ పూజా హెగ్డే హవా నడుస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోలందరూ పూజతో కలిసి నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కెరీర్లో ఒక్క బిగ్ హిట్ లేకపోయినా పూజా హెగ్డే ఇమేజ్ మాత్రం తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్ సరనస హీరోయిన్గా నటించిన ‘అరవింద సమేత’ ఇప్పటికే రిలీజ్ కాగా, మహేష్ సరసన నటించిన ‘మహర్షి’ ఈ నెల 9న రిలీజ్ కానుంది. ప్రభాస్‌కు జోడిగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. తాజాగా మహర్షి ప్రమోషన్ సందర్భంగా టాప్ స్టార్స్‌తో కలిసి నటించటంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు పూజా హెగ్డే. అరవింద సమేత, మహర్షి, ప్రభాస్ సినిమాలు ఒకేసారి షూటింగ్ జరగటంతో పూజా..ఒకే రోజు ముగ్గురు హీరోలతో కలిసి నటించాల్సి వచ్చిందట. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు ఎన్టీఆర్‌తో అరవింద సమేత, తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు మహేష్ మహర్షి, రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకు ప్రభాస్ సినిమాల షూటింగ్లో పాల్గొన్నారట. ఈ షెడ్యూల్స్ సమయంలో రోజుకు కేవలం నాలుగు గంటల మాత్రమే నిద్రపోయేందుకు సమయం దొరికేదట. కాస్త కష్టమనిపించినా ఒకేసారి ముగ్గురు టాప్ హీరోలతో కలిసి నటించటం ఆనందంగా ఉందన్నారు పూజ. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే హీరోయిన్లు గా నటించిన మహర్షి ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈమూవీ మహేష్ 25వ సినిమా కావటంతో ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. -
మొత్తానికి మహేష్‌కు టిక్కెట్లు దొరికేశాయ్!
‘మహర్షి’తో బిజీగా ఉన్న సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రిలాక్స్ అయినట్టున్నారు. ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్న మహేష్.. ఆదివారం సాయంత్రం ఏఎమ్‌బీలో ప్రత్యక్షమయ్యారు. మహర్షి ప్రమోషన్స్‌లో భాగంగా.. అవేంజర్స్ చిత్రాన్ని వీక్షించారా అన్న ప్రశ్నకు మహేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చి అందర్నీ నవ్వించారు. ఏఎంబీలో తాను టిక్కెట్లు అడిగితే.. హౌస్‌ఫుల్ అయ్యాయని టిక్కెట్లు దొరకడం లేదని మహేష్ అన్నారు. మొత్తానికి ఆదివారం సాయంత్రం ఏఎమ్‌బీలో ‘అవేంజర్స్ ఎండ్‌గేమ్’ను వీక్షించినట్లు మహేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. ఏఎమ్‌బీలో మొదటి చిత్రం అంటూ.. సినిమా బాగా నచ్చిందని.. ఏఎమ్‌బీ ఎక్స్పీరియన్స్ బాగుందని.. ఏఎమ్‌బీ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. పూజాహెగ్డే హీరోయిన్గా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షి మే 9న థియేటర్లలో సందడి చేయనుంది. My first at @amb_cinemas ...#AvengersEndgame!! Loved the film and the experience ..Thankyou team AMB... You guys rock!!! 👍👍👍👏👏👏 pic.twitter.com/GlDOCqgBYq — Mahesh Babu (@urstrulyMahesh) May 5, 2019 -
వైరల్ అవుతున్న మహేష్-నమ్రత ఫోటో
సూపర్‌స్టార్ మహేష్ బాబు తన 25వ సినిమా ‘మహర్షి’ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన చిత్రబృందం.. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీ అయింది. మహేష్.. తన సతీమణి నమ్రతతో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అభిమానుల కామెంట్లతో ఈ పిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నమ్రత ఈ పిక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే క్షణాల్లో అది వైరల్ అయింది. ఇది పాత ఫోటోనా? ప్రస్తుతం దిగిన ఫోటోనా అని అడిగిన ప్రశ్నకు.. ఇది నాలుగు రోజుల క్రితం దిగిన ఫోటోనే.. అంటూ బదులిచ్చారు. రిలీజ్‌కు ముందే సినిమా హిట్టు అని తెలిసి తల ఎత్తుకున్న అన్నా వదిన.. ఏఎంబీ మాల్ మీ కంటే యంగ్ గా కనిపిస్తోంది.. ఇలా రకరకాల కామెంట్లతో ఇన్స్టాగ్రామ్ హోరెత్తిపోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షి చిత్రం.. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఇకనుంచి నా ఫ్యాన్స్‌కీ అది మ్యాజికల్ డేట్ అవుతుంది
20 ఏళ్లు.. 25 సినిమాలు. హీరోగా మహేశ్‌బాబు జర్నీ ఇది. ఈ జర్నీలో మహేశ్ ఎప్పటికీ మరచిపోలేని తీయని జ్ఞాపకం ఒకటి ఉంది. ఆ విషయంతో పాటు మహేశ్‌బాబు ఇంకా చాలా విశేషాలు చెప్పారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, ‘దిల్’రాజు, పీవీపీ నిర్మించిన ‘మహర్షి’ ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు చెప్పిన విశేషాలు. ► మహర్షి’ సినిమా చేయడానికి కారణం? కథ విని, చాలా ఎగై్జట్ అయ్యాను. సినిమాలో కాలేజ్ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ అని, కాన్ఫిడెంట్‌గా చేద్దాం అని వంశీ పైడిపల్లితో చెప్పాను. ఎందుకంటే హీరోగా 20 ఏళ్లు పూర్తయింది. 25 సినిమాలు చేశాను. ఇప్పుడు మళ్లీ కాలేజ్ స్టూడెంట్ అంటే నమ్మేలా ఉండాలి. ఆ ఎపిసోడ్ దాదాపు 45 నిమిషాలు ఉంటుంది. అందుకే దాన్ని మేం బాగా డీల్ చేశాం. సినిమాలో అది నా ఫెవరెట్ పోర్షన్. సినిమా చూస్తున్నప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాను. ఆడియన్స్‌కు కూడా తప్పకుండా నచ్చుతుంది. ► వంశీ ఈ కథతో మీ కోసం రెండేళ్లు వెయిట్ చేయడం గురించి? నిజానికి ఓ 20 నిమిషాలు కథ విని వంశీని పంపించేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఆ టైమ్‌లో నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. దాదాపు 40 నిమిషాలు కథ చెప్పాడు. బాగా నచ్చింది. ముందు ఇచ్చిన కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాతే మీ సినిమా ఉంటుంది అని చెప్పాను. ‘పర్లేదు. వెయిట్ చేస్తాను. ఆ వెయిటింగ్ గ్యాప్‌లో కథకు ఇంకా మెరుగులు దిద్దుతాను’ అని చెప్పాడు. మీరు తప్ప ఈ సినిమాలో హీరోగా ఎవరూ కనిపించడం లేదు అన్నాడు. వంశీ కన్విక్షన్‌కు హ్యాట్సాఫ్. అతనితో వర్క్ చేయడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ► 25వ సినిమా ‘మహర్షి’ అని ముందే ప్లాన్ చేశారా? నేను చేయాల్సిన సినిమాలు ఉండటం. వంశీ వెయిట్ చేయడం. ఇలా అన్నీ కలిసి ‘మహర్షి’ నా కెరీర్లో 25వ సినిమా అయింది. 25వ సినిమాగా ఇదే చేయాలని ప్లాన్ చేసి చేయలేదు. ‘మహర్షి’లో మంచి డెప్త్ ఉంది. ఈ మధ్య కాలంలో ఆడియన్స్ ఇలాంటి సినిమాను చూసి ఉండరు. ఫ్యామిలీ ఎమోషన్స్, క్లాస్, మాస్, యూత్.. హీరో ఫ్యాన్స్.. ఇలా అన్ని యాంగిల్స్‌ని కవర్ చేశాడు వంశీ. ► ఈ మధ్య మీరు సోషల్ మేసేజ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది? అదేం కాదు. ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను’ సినిమాల్లో మంచి మెసేజ్ ఉంది. అలాంటి సినిమాల్లో నటించడం నాకు హ్యాపీగా ఉంది. అలాగే ‘మహర్షి’ సినిమాలో కూడా ఓ పవర్ఫుల్ పాయింట్ ఉంది. అది ఇప్పుడే చెప్పి ప్రేక్షకుల ఎగై్జట్‌మెంట్ తగ్గించేయను. ► ‘శ్రీమంతుడు’ సినిమాలో దత్తత అనే పాయింట్ ఉంది. ఇందులోనూ అలాంటి పాయింట్ ఏదైనా? ఉంటుంది. ఓ పవర్ఫుల్ పాయింట్‌ను టచ్ చేశాం. సినిమా రిలీజ్ రోజున ఆడియన్స్ ఎగై్జట్ అవుతారని అనుకుంటున్నాం. ఆ పాయింట్ రైతుల సమస్యల గురించా? అనే విషయం ఇప్పుడే చెప్పలేను. థియేటర్స్‌లో చూడాల్సిందే. ► ఈ సినిమాలో మూడు లుక్స్‌లో కనిపిస్తున్నారు. మీ ఫేవరెట్ లుక్ ఏది? ఇంతకు ముందు ఒకే లుక్‌లో సినిమాలు చేస్తున్నానని అన్నారు. ఈ సినిమాలో మూడు లుక్స్ ఉంటాయి. స్టూడెంట్‌లా, రైతులా, బిజినెస్‌మన్‌లా కనిపిస్తాను. ఏ లుక్ ట్రై చేసినా అది ఆ సినిమా, అందులో క్యారెక్టర్ ప్రకారమే ఉంటుంది. అలాగే లుక్ మార్చడమంటే హెయిర్ స్టయిల్ మార్చడం, గడ్డం పెంచడం తప్ప కొత్తగా ఏమీ ఉండదు (నవ్వుతూ). ► ఇది మల్టీ ప్రొడ్యూసర్స్ సినిమా.. అనుకున్న బడ్జెట్ కన్నా కాస్త ఎక్కువైనట్లుంది? అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీగారికి ముగ్గురూ నిర్మించారు. ‘మహర్షి’ చాలా పెద్ద స్కేల్ సినిమా. ఇంత బాగా రావడానికి వాళ్ల ముగ్గురి సపోర్ట్ చాలా ఉంది. సినిమాలో హీరో న్యూయార్క్‌లో సీఈవో. అంటే కార్లు, హెలికాప్టర్లు కావాలి. అప్పుడు అనుకున్నదానికంటే ఖర్చు ఎక్కువ అయ్యింది. ప్రొడ్యూసర్స్ బాగా సపోర్ట్ చేశారు. కొన్ని కీలక సన్నివేశాలను విలేజ్‌లో షూట్ చేద్దాం అనుకున్నాం. కుదర్లేదు. సెట్ వేశాం. ఆ సీన్స్‌లో ప్రతిరోజూ దాదాపు వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులు కావాల్సి వచ్చింది. డిసెంబర్లో షూట్ చేశాం. 5 గంటలకు సూర్యుడు వెళ్లిపోతాడు. లైట్ ఫెయిల్ అవుతుంది. ఆ షెడ్యూల్ మరో పది రోజులు పెరిగింది. ఇలాంటి కారణాలు ఉన్నాయి. ► ఇక మీ నుంచి ఏడాదికి కనీసం రెండు సినిమాలు అశించవచ్చా? ఈ రోజుల్లో సినిమా అనేది టఫ్ టాస్క్ అయిపోయింది. నాన్నగారి టైమ్‌లో 300– 350 సినిమాలు వరకూ చేశారు. ఇప్పుడు 25వ సినిమానే పెద్ద ల్యాండ్‌మార్క్ ఫిల్మ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరో విషయమేటంటే పెద్ద సినిమా చేయాలంటే కనీసం 8 నుంచి 10 నెలలు సమయం పడుతుంది. ఒక పర్ఫెక్ట్ ప్రొడక్ట్ ఇవ్వడానికి అంత సమయం పడుతుంది. పెద్ద సినిమా షూటింగ్ అంటే అన్ని పనులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక పెద్ద సినిమా ఐదారు నెలల్లో వస్తే అద్భుతమే. ‘భరత్ అనే నేను’ తర్వాత నెల రోజుల కంటే ఎక్కువ టైమ్ తీసుకోలేదు నేను. వెంటనే ‘మహర్షి’ స్టార్ట్ చేశాం. ► వంశీతో వర్క్ంగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వంశీ కథ ఎలా చెప్పాడో అలానే తీశాడు. కథను చాలా క్లారిటీగా కమ్యూనికేట్ చేస్తాడు. అది నా పెర్ఫార్మెన్స్ అయినా కూడా కావొచ్చు. బాగా చేశాడు. సినిమా రిలీజైన తర్వాత వంశీకే పేరు వస్తుంది. అంత బాగా తీశాడు. చాలా ఎక్స్ట్రార్డినరీగా తీశాడు. ఈ కథను రెండేళ్లు రాశాడు. స్క్రిప్ట్‌పై ఎంత టైమ్ స్పెండ్ చేస్తే అవుట్‌పుట్ అంత బాగా వస్తుంది అంటాం. ఈ సినిమాకు అలా జరిగింది. ► 20 ఏళ్ల జర్నీ గురించి ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో కొందరు దర్శకులకు థ్యాంక్స్ చెప్పి, కొందరు దర్శకుల పేర్లు ప్రస్తావించకపోవడానికి కారణం? ఆ ఈవెంట్‌కు వచ్చే ముందు దాదాపు 16 గంటలు ప్రయాణం చేసి యూరప్ నుంచి వచ్చాను. స్టేజ్ మీద నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్ వచ్చారు. ఆ హడావిడిలో మర్చిపోయాను. అది నా మిస్టేక్. దర్శకుడు పూరి జగన్నాథ్‌కు థ్యాంక్స్. ‘పోకిరి’ నన్ను సూపర్‌స్టార్‌ని చేసిన ఫిల్మ్. అలాగే దర్శకుడు సుకుమార్‌గారికి థ్యాంక్స్. ‘1: నేనొక్కడినే’ క్లాసిక్ కల్ట్ సినిమా నా కెరీర్లో. వన్నాఫ్ మై ఫెవరేట్ డైరెక్టర్ సుకుమార్. ► అలాగే కొందరు దర్శకులు కథ రెడీ చేసుకున్నాక వెయిట్ చేయలేకపోతున్నారు అనే కామెంట్ కూడా చేశారు? వంశీ రెండేళ్లు వెయిట్ చేశాడని అతన్ని అభినందించడానికి, పొగడటానికి అన్న మాట అది. సుకుమారుగారి గురించి కామెంట్ చేశాననట్లు రాశారు. సుకుమార్‌గారిని పాయింట్ అవుట్ చేసి అన్నది కాదు. సుకుమార్‌గారు నాకు స్పెషల్ డైరెక్టర్. భవిష్యత్‌లో మేం కచ్చితంగా కలిసి సినిమా చేస్తాం. ► హిట్టయిన డైరెక్టర్స్ పేర్లు మాత్రమే ప్రీ–రిలీజ్ వేడుకలో చెప్పారనే విమర్శ ఉంది.. సక్సెస్.. ఫెయిల్యూర్ అని కాదు. నా కెరీర్ గ్రాఫ్‌లో ఈ దర్శకుల సినిమాలు చాలా కీలకం. అందుకే వాళ్ల పేర్లు చెప్పాను. ‘మురారి’ అనే సినిమా నటుడిగా నాకు చాలా క్రూషియల్. మహేశ్ యాక్ట్ చేయగలడు అని చెప్పిన సినిమా అది. ‘ఒక్కడు’ నన్ను స్టార్‌ని చేసింది. ‘అతడు’ సినిమా నాకు యూఎస్‌లో మార్కెట్‌ని ఓపెన్ చేసింది. ‘పోకిరి’ సినిమా తర్వాత సూపర్‌స్టార్ అన్నారు. ఇవన్నీ నాకు ముఖ్యమైన సినిమాలు. ఇప్పుడు నా జర్నీలో ‘మహర్షి’ 25వ సినిమా. అంతేకానీ హిటై్టన డైరెక్టర్స్ పేర్లు చెప్పడమే అని కాదు. ► ‘శ్రీమంతుడు’ సినిమాతో ‘మహర్షి’కి పోలికలు ఉన్నాయి అంటున్నారు? ఈ సినిమాకు, ‘శ్రీమంతుడు’ సినిమాతో సంబంధం లేదు. సినిమా చూస్తే తెలుస్తుంది. టీజర్ అప్పుడు పోల్చి చూశారేమో.. ట్రైలర్ వచ్చిన తర్వాత అలాంటి కామెంట్స్ ఏం వినబడలేదు. ► 25 సినిమాలు చేశారు. మీ కెరీర్లో మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ అంటే ఏది చెప్తారు? నాన్నగారితో ‘మురారి’ మార్నింగ్ షో సినిమా చూశాను. అది కూడా హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో. ‘మురారి’ సినిమా క్లైమాక్స్ తర్వాత నా భుజంపై నాన్నగారు చేయి పెట్టారు. అదే నా మోస్ట్ మెమొరబుల్ మూమెంట్. సినిమా బాగుందా? బాలేదా? అలా ఏం చెప్పలేదు. భుజంపై చేయి వేసి అలా తడిమారు.. అంతే. ‘మహర్షి’ సినిమా గురించి నాన్నగారు ఏం చెబుతారో అని ఇంట్రెస్ట్‌గా వెయిట్ చేస్తున్నాను. ► మే 9న చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి? మే 9 నిజంగా మ్యాజికల్ డేట్. అశ్వనీదత్ గారికి రెండు బ్లాక్‌బస్టర్ సినిమా (జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి)లు ఉన్నాయి. ఇక నుంచి మా అభిమానులకు కూడా ఆ డేట్ మ్యాజికల్‌గా మారబోతోంది. ► బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే సినిమాలు అంగీకరిస్తాను అంటున్నారు.. బ్రౌండ్ స్క్రిప్ట్ ముఖ్యం. అరగంట కథ విని ఎగై్జట్ అవ్వడం కన్నా మూడు గంటలు స్క్రిప్ట్ విని చేయడం మంచిది. షూటింగ్‌లోకి దిగిన తర్వాత స్క్రిప్ట్ గురించి మళ్లీ డిస్కషన్స్ ఉండకూడదని నా ఫీలింగ్. నేను గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకున్నాను. ‘స్పైడర్, బ్రహ్మోత్సవం’ సినిమాలు 20 నిమిషాల నరేషన్ విన్నప్పుడు ఎగై్జట్ అయ్యాను. సేమ్ టైమ్ షూటింగ్లో దిగినప్పుడే నాకు తెలిసిపోయింది. మన లోపల ఉన్న భయం చెప్పేస్తుంది. ఆ తప్పులు మళ్లీ రిపీట్ చేయకూడదు అనుకుంటున్నాను. ఇక మీదట డిటైల్డ్ స్క్రిప్ట్ ఉండి.. కథ నచ్చితేనే సినిమా చేస్తాను. ► బోయపాటి శ్రీను, త్రివిక్రమ్, రాజమౌళిలతో మీరు సినిమాలు చేయాల్సి ఉందేమో? రాజమౌళిగారు, నేను ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. కేఎల్ నారాయణగారు నిర్మాత. నా కమిట్మెంట్స్, ఆయన కమిట్మెంట్స్ పూర్తయినప్పుడు మా కాంబినేషన్లో సినిమా ఉంటుంది. త్రివిక్రమ్‌గారితో కూడా చర్చలు జరుగుతున్నాయి. ► హిస్టారికల్ సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉందా? హిస్టారికల్ సినిమాలు చేయాలంటే నాకు భయం. రాజమౌళిగారిలాంటి దర్శకులు కన్విన్స్ చేసినప్పుడు చేస్తాను. ► అడవి శేష్‌తో ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ సినిమా గురించి? అడవి శేష్ ‘గూఢచారి’ సినిమా చూశాను. నచ్చింది. అలాంటి ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనుకున్నాం. సోనీ పిక్చర్స్‌వారు కలసి పని చేద్దాం అని వచ్చారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తాం. నాకు నచ్చిన అన్ని కథలను నేను చేయలేను. వీలైతో వాటిలో కొన్నింటిని నిర్మిస్తాను. ► మీ సినిమాలు వేరే భాషలో విడుదల కాకపోయినా ఒక్క తెలుగులోనే మీ మార్కెట్ 150 కోట్ల వరకూ ఉంటుంది. అది గర్వంగా ఉంటుందా? ప్రౌడ్గాను ఉంది. అలాగే టెన్షన్‌గానూ ఉంది. థియేట్రికల్ బిజినెస్ 130 కోట్లు వరకూ జరిగినప్పుడు కలెక్షన్స్ 150–160 కోట్లు ఉన్నప్పుడే బయ్యర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. అలా ఉండాలంటే సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అయి తీరాలి. వేరే ఆప్షన్ లేదు. ► మేడమ్ తుస్సాడ్స్వాళ్లు తయారు చేసిన మీ స్టాచ్యూ చూసి మీ వైఫ్, పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారు? నమ్రతా రియాక్షన్ కంటే సితార మా పాప రియాక్షన్ మాత్రం ప్రైస్‌లెస్. స్టాచ్యూ అంటే ఏదో అనుకుంది కానీ చూసి షాక్ అయింది. ఫస్ట్ టైమ్ ఆ బొమ్మను చూసినప్పుడు తను ఇచ్చిన రియాక్షన్ మర్చిపోలేనిది. ► దర్శకుడు సుకుమార్‌తో మీ సినిమా సడన్‌గా ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? సుకుమార్‌గారు, నేను ముందు సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ వరుసగా అన్నీ సోషల్ మెసేజ్‌లు, ఇంటెన్స్ సినిమాలు చేస్తున్నాను అనిపించింది. అందుకే అనిల్ రావిపూడిగారి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని అనుకున్నాను. నాకు కొత్తగా, ఫ్రెష్‌గా నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినట్లు ఉంటుందనుకున్నాను. అదే సుకుమార్‌గారితో చెప్పను. చెరో సినిమా చేశాక మళ్లీ కలిసి సినిమా చేద్దామనుకున్నాను. ► అనిల్ రావిపూడి సినిమా మీ ఫ్యాన్స్ సలహా మేరకు అంగీకరించారా? ‘మహర్షి’ తర్వాత అనిల్‌తో సినిమా చేయా లన్నది నా ఛాయిస్. ఆ సినిమా జూన్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ‘దూకుడు’ తర్వాత ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ చేయలేదు. ఇలాంటి సినిమా నేను చేసి చాలా రోజులు అయింది. మైనపు బొమ్మ ఆవిష్కరణలో భార్యాపిల్లలతో మహేశ్ -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మహర్షి’
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి రిలీజ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ లాంటి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ బడా ప్రాజెక్ట్ అదే స్థాయిలో విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. మహర్షి.. మహేష్ 25వ సినిమా కూడా కావటంతో అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు సెన్సార్ టీం. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, జయసుథ, మీనాక్షి దీక్షిత్, రాజేంద్ర ప్రసాద్, ముఖేష్ రుషి ఇలా భారీ తారాగణం నటిస్తున్నారు. -
కోలీవుడ్‌కు మహర్షి?
ఏదైనా సినిమా రిలీజై మంచి హిట్ సాధించినప్పుడు ఆ సినిమాను తమ భాషలో రీమేక్ చేయాలనుకుంటారు హీరోలు. కానీ ‘మహర్షి’ కొంచెం ఫాస్ట్‌గా ఉన్నాడు. రిలీజ్ కాకముందే రీమేక్ అవ్వడానికి రెడీ అవుతున్నాడని తెలిసింది. కెరీర్లో 25వ సినిమా కోసం ‘రిషి’గా మారి ‘మహర్షి’ సినిమా చేశారు మహేశ్‌బాబు. మే 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ కాకముందే ‘మహర్షి’ రీమేక్ కాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను తమిళంలో విజయ్ రీమేక్ చేయనున్నారని తెలిసింది. ఆల్రెడీ మహేశ్ చేసిన ‘ఒక్కడు, పోకిరి’ సినిమాల తమిళ రీమేక్స్‌లో విజయ్ నటించారు. రెండూ పెద్ద హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు ‘మహర్షి’ రీమేక్‌లో నటిస్తే ఇది మూడో సినిమా అవుతుంది. ఈ సినిమాను ఎవరు రూపొందిస్తారు? నిర్మిస్తారు అన్న సంగతి తెలియాల్సి ఉంది. -
మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
-
మహేష్, పూరీల మధ్య ఏం జరిగింది..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మహర్షి. ఈసినిమా మహేష్ 25 సినిమా కూడా కావటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చిత్రయూనిట్ కూడా అదే స్థాయిలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తుంది. బుధవారం అభిమానుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో తనకు సక్సెస్ ఇచ్చిన ఒక్కో దర్శకుడికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపాడు మహేష్. తొలి చిత్ర దర్శకుడు రాఘవేంద్ర రావు నుంచి కొరటాల శివ వరకు అందరిని గుర్తుపెట్టుకొని థ్యాంక్స్ చెప్పిన సూపర్ స్టార్. తన కెరీర్లో కీలకమైన రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ పేరు మాత్రం చెప్పలేదు. పోకిరి సినిమాతో మహేష్‌ను సూపర్ స్టార్‌ను చేసిన పూరి, తరువాత బిజినెస్‌మేన్‌తో మరో హిట్ ఇచ్చాడు. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన పోకిరి లాంటి సినిమా మహేష్‌కు నిజంగానే గుర్తుకు రాలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూరి... మహేష్ హీరోగా జనగణమన అనే సినిమాను చాలా కాలం కిందటే ఎనౌన్స్ చేశాడు. అయితే ఏళ్లు గడుస్తున్న ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఈ సినిమా విషయంలోనే మహేష్, పూరిల మధ్య దూరం పెరిగిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే వేదిక మీద పూరి జగన్నాథ్ పేరు చెప్పని మహేష్ తరువాత ట్విట్టర్ ద్వారా పూరికి థ్యాంక్స్ చెప్పాడు. Missed mentioning an important person in my speech today. In my 25 films journey, it was #Pokiri that made me a Superstar. Thank you so much @purijagan !!! Thanks for giving me Pokiri 🤗 A film that will always be remembered. — Mahesh Babu (@urstrulyMahesh) 1 May 2019 కేవలం పూరినే కాదు మహేష్ బాబుకు సరికొత్త ఇమేజ్ తీసుకువచ్చిన వన్ నేనొక్కడినే సినిమా దర్శకుడు సుకుమార్ పేరును కూడా ప్రస్థావించలేదు మహేష్. మహర్షి తరువాత మహేష్, సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. కథా కథనాలపై ఏకాభిప్రాయం రాకపోవటంతో ఈ ప్రాజెక్ట్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు మహేష్. ఇలా తనతో సన్నిహితంగా లేని దర్శకుల పేర్లను మహేష్ పక్కన పెట్టేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
మహేశ్‌బాబు ప్రపంచాన్ని ఏలేస్తాడు
‘‘ప్రపంచాన్ని ఏలేస్తాడు మా మహేశ్‌బాబు. ‘మహర్షి’ ట్రైలర్ చూశారు కదా.. అదిరిపోయింది కదా. 25వ సినిమా అయినా వయసు 25లానే ఉన్నాడు మహేశ్. ప్రతి ఆర్టిస్ట్‌కి కెమేరా ఫేవర్ యాంగిల్ ఒకటుంటుంది. మహేశ్‌కు మాత్రం 360 డిగ్రీస్ ఎక్కడ పెట్టినా అందంగానే కనిపిస్తాడు. అందుకే సింగపూర్‌లో తన మైనపుబొమ్మ పెట్టారు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయికగా, ‘అల్లరి’ నరేష్ కీలక పాత్రలో నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా పతాకాలపై ‘దిల్’ రాజు, సి.అశ్వినీదత్, పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్, ఆడియో ఫంక్షన్లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘మహర్షి’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. చిన్నోడు నా మీద కోపంగా పూలకుండీ తన్నాడు. ఆ సినిమా (సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు) ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో మీకు తెలుసు. ఈ సినిమాతో మళ్లీ అన్ని రికార్డులను తన్నేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘మా అన్నయ్య వెంకటేశ్‌గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఏ సెట్‌కి వెళ్లినా, ఏ ఫంక్షన్‌కి వచ్చినా సినిమా సూపర్‌హిట్ అంటుంటారు.. అది పెద్ద సెంటిమెంట్. ఇక్కడికొచ్చినందుకు థ్యాంక్స్ సర్. యంగర్ జనరేషన్ హీరోల్లో నేను అభిమానించేది విజయ్ దేవరకొండని. తన పనిని నేను ఇష్టపడతాను. ఈ పాతిక సినిమాల జర్నీలో నేను థ్యాంక్స్ చెప్పాల్సిన డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు. ‘రాజకుమారుడు’తో నన్ను పరిచయం చేసిన రాఘవేంద్రరావుగారికి నేనెప్పుడూ రుణపడి ఉంటా. నేను యాక్ట్ చేయగలను అని నిరూపించిన సినిమా ‘మురారి’. ఇందుకు కృష్ణవంశీగారికి థ్యాంక్స్. నన్ను స్టార్‌ని చేసిన సినిమా ‘ఒక్కడు’. థ్యాంక్యూ వెరీమచ్ గుణశేఖర్ సార్. నన్ను కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గర చేసిన సినిమా ‘అతడు’. ఇందుకు త్రివిక్రమ్‌గారికి ధన్యవాదాలు. నా లైఫ్‌లో ఓ టర్నింగ్ పాయింట్ ‘దూకుడు’.. దానికి శ్రీను వైట్లగారికి థ్యాంక్స్. ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను’తో రెండుసార్లు లైఫ్ ఇచ్చిన కొరటాల శివ సార్‌కి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇప్పుడు ‘మహర్షి’ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఈ సినిమా 20 నిమిషాల కథ వినగానే రెండు సినిమాల తర్వాత ఈ సినిమా చేయాల్సి వస్తుందన్నాను. పర్లేదు సార్... రెండేళ్లైనా మీకోసం వేచి చూస్తాను, మీరు తప్ప ఈ కథలో నేనెవర్నీ ఊహించలేదు అన్నాడు. అందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను వంశీ. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ డైరెక్టర్ వద్ద కథ ఉన్నా రెండు నెలలు ఆలస్యమైతే వేరే హీరోల వద్దకు వెళ్లిపోతారు. ఇక్కడ ఎవరు చేసే పనులు వాళ్లు చేయాలని నా ఫీలింగ్. యాక్టర్ యాక్టింగ్ చేయాలి.. డైరెక్టర్ డైరెక్షనే చేయాలి. ఈ 25 సినిమాల జర్నీ, ఈ 20 ఏళ్ల జర్నీలో మీరు (అభిమానులు) చూపించిన ప్రేమ, అభిమానానికి మాటలు రావడం లేదు.. చేతులెత్తి దండం పెడుతున్నా. ఈ అభిమానం, ప్రేమ ఇంకో పాతిక సినిమాలు, ఇంకో ఇరవై ఏళ్లు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. సి. అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘ఆనాటి ‘అగ్నిపర్వతం’ నుంచి ఘట్టమనేని కుటుంబంతో ఎన్నో హిట్ సినిమాలు తీశా. మహేశ్‌బాబుని ‘రాజకుమారుడు’ చిత్రంతో పరిచయం చేశా. ఈ రోజు ఈ సినిమా అనుకోకుండా మే 1న ప్రీ రిలీజ్ ఫంక్షన్, మే 9న రిలీజ్ అవుతోంది. గతంలో నా రెండు సినిమాలు ‘జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి’కి కూడా అలాగే జరిగింది. యంగ్ అండ్ డైనమిక్ టాలెంటెడ్ ‘దిల్’రాజు, పీవీపీగార్లతో కలిసి ‘మహర్షి’ సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మహేశ్‌గారి 25వ సినిమాని మూడు పెద్ద బ్యానర్స్ కలిసి చేశాం. ఈ నెల 9న మీకు అద్భుతమైన సినిమాని ఇస్తున్నామని నమ్మకంతో ఉన్నాం. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ‘ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టారు’ అని నాకు ఫోన్లు, మెసేజ్‌లు వస్తున్నాయి. ‘ఊపిరి’ తర్వాత వంశీ ఈ ఐడియాని మహేశ్‌గారికి చెప్పారు. ఇది చేయాలా? వద్దా? అనే చిన్న డైలమాలో ఉన్నారు మహేశ్. కానీ అదే ఎనర్జీతో పూర్తి కథ రాసి మహేశ్‌గారిని ఒప్పించారు. ఈ కథ నేను చేస్తున్నాను అని మహేశ్‌గారు చెప్పినప్పుడు వంశీ కళ్లలో నీళ్లు తిరిగాయి. మొన్నే సినిమా చూపించాడు. క్లైమాక్స్ చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. లాస్ట్ డే షూటింగ్లో.. అందరి హీరోలతో నేను క్లోజ్‌గా ఉంటా... కానీ, మహేశ్‌గారు షేక్‌హ్యాండ్ మాత్రమే ఇచ్చారు. ఎవరికైనా అంతే. లాస్ట్ డే అందరికీ హగ్ ఇచ్చాను.మహేశ్‌కి ఇవ్వాలా? వద్దా? అని అలా మలుపు తిరుగుతుంటే.. మహేశ్‌గారు చేతులు చాపి నాకు హగ్ ఇవ్వరా? అన్నారు. అది గ్రేట్ మూమెంట్’’ అన్నారు. ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ– ‘‘ఈ ప్రయాణం మూడేళ్లకిందట మొదలైంది. అప్పుడే ‘మహర్షి’ ఐడియా చెప్పాడు వంశీ. ‘ఊపిరి’ రిలీజ్ రోజు రాత్రి మేమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అప్పుడే మహేశ్‌గారు కాల్ చేసి మంచి సినిమా తీశారంటూ నన్ను, వంశీని అభినందించారు. ‘ఊపిరి’ విడుదలైన 9వ రోజు వంశీ వెళ్లి మహేశ్‌గారికి లైన్ చెప్పాడు.. పూర్తి స్క్రిప్ట్ తీసుకుని రమ్మన్నారాయన. ఈ రోజు తక్కువ మాట్లాడతాను. మే 18న విజయవాడలో సక్సెస్‌మీట్ పెట్టాం, అక్కడ ఎక్కువ మాట్లాడతాను’’ అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ– ‘‘ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో హీరో ఇంట్రడక్షన్ సన్నివేశాల్లో పేపర్స్ విసిరేసిన రోజులున్నాయి. ఫ్యాన్స్ టికెట్టు కొన్నప్పుడు ఏం కోరుకుంటారో మా అందరికీ తెలుసు. అశ్వినీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ గార్లకి కృతజ్ఞతలు. ఈ నెల 9 సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌కి గుర్తుండిపోయే రోజు అవుతుంది. మహేశ్‌గారు యాక్టర్‌గానే సూపర్స్టార్కాదు. ఒక వ్యక్తిగా సూపర్‌స్టార్’’ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘మహేశ్‌బాబు అభిమానిగా ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇంటర్మీడియట్ నుంచి మావోడు అనుకుంటుండే. నేను సినిమాలు చూడటం ‘మురారి’తో స్టార్ట్ చేశా. బాల్కనీలో చూశా. టికెట్ల కోసం పడే కష్టాలు.. అమ్మాయిల క్యూ తక్కువ ఉంటుంది.. వారి ద్వారా టికెట్లు తెప్పించుకునేవాణ్ణి. ‘పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి’ చూసి విజయ్ అద్భుతంగా చేశాడు అని మహేశ్‌బాబుగారు చేసిన ట్వీట్ చదవగానే ఫిదా అయిపోయా. మీరు ట్వీట్ చేసే మంచి సినిమాలు చేయాలని ఆశ. ఈ నెల 9న నా బర్త్‌డే రోజు ‘మహర్షి’ రిలీజ్ అవుతుండటంతో ఒత్తిడిలా అనిపిస్తోంది. పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో పూజా హెగ్డే, దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, హీరోలు ‘అల్లరి’ నరేశ్, సుధీర్‌బాబు, నిర్మాత అనీల్ సుంకర, నటులు పోసాని కృష్ణమురళి, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, కెమెరామేన్ కె.యు.మోహనన్, పాటల రచయిత శ్రీమణి తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను సార్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మహర్షి. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్‌గా జరుగుతుంది. ఈ సందర్భంగా మహర్షి చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ను బట్టి గెలవడమే అలవాటుగా ఉన్న ఓ యువకుడి కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను సార్, ఇక్కడ ఏవడి బరువు వాడే మోసుకోవాలి, అమ్మాయి కాఫీకి పిలిచిందని లైఫ్ రిస్క్ చేయలేముగా, గతంలో ఎక్కడున్నాం.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం.., ఓడిపోతామనే భయంతో దిగితే ఎప్పటికీ గెలవలేం.. అంటూ మహేశ్ పలికే డైలాగులు అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. రిషి పాత్రలో మహేశ్‌ను మూడు డిఫరెంట్ షెడ్స్‌లో చూపించారు. జీవితంలో గెలవడమంటే సంపాదించడమేనా? అని ప్రకాశ్ రాజ్, ఇప్పటి నుంచి ఓడిపోవడం అలవాటు చేసుకో అని జగపతిబాబు చెప్పే డైలాగులు కూడా సినిమాపై హైప్‌ను పెంచేలా ఉన్నాయి. ట్రైలర్ చివర్లో మహేశ్ నాగలి పట్టుకుని ఉన్న సన్నివేశాల్ని చూపించారు. ఒకవైపు ఫన్నీగా, మరోవైపు కథపై ఆసక్తి పెంచేలా ట్రైలర్ సాగింది. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజాహెగ్డే నటిస్తున్నారు. ఈ మూవీని దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మహేష్ కోసం విజయ్, వెంకీ
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనిదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఇప్పటికే అన్ని కార్యాక్రమాలు పూర్తి చేసుకున్న మహర్షి మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ మహేష్ 25వ సినిమా కూడా కావటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు మరింత పెంచేలా భారీ ప్రీ రిలీజ్ కు ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. బుధవారం సాయంత్రం నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో అభిమానుల సమక్షంలో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు సీనియర్ హీరో వెంకటేష్‌తో పాటు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అంతేకాదు మహేష్‌తో గతంలో వర్క్ చేసిన దర్శకులలో చాలా మంది ఈ వేడుకకు హాజరవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. -
‘పాలపిట్ట’ మహర్షి సాంగ్ వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ అవైటింగ్ మూవీ ‘మహర్షి’లోని మరోసాంగ్‌ను సోమవారం విడుదల చేసింది చిత్ర యూనిట్. హీరోయిన్ పూజా హెగ్డేతో మహేష్ చాలా అందంగా స్టెప్పులేశాడు. దీంతో మహేష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. శ్రీమణి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, రాహుల్ సిప్లి గంజ్, ఎం.ఎం.మానసి పాడిన ‘పాల పిట్టలో వలపు.. నీ పైట మెట్టుపై వాలిందే ..’ అంటూ సాగే పాట ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తోంది. అటు క్యాచీ బీట్స్‌తో మ్యూజిక్ లవర్స్‌ను కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘మహర్షి’ మూవీలోని 5వ లిరికల్ సాంగ్ ఇది. ప్రిన్స్ మహేష్‌తో పూజా తొలిసారి జత కట్టిన ఈ మూవీలో అల్లరి నరేష్, జగపతి బాబు, మీనాక్షి దీక్షిత్ ప్రధాన పాత్రల్లో నటించగా, మే 9న ఈ సినిమా రిలీజవుతున్నసంగతి తెలిసిందే. -
అప్పుడు తండ్రి.. ఇప్పుడు విలన్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మహేష్ 25వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తదుపరి చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడు మహేస్. కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు సూపర్ స్టార్. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో మహేష్‌కు ప్రతినాయకుడిగా జగపతి బాబు కనిపించనున్నారు. శ్రీమంతుడు సినిమాలో మహేష్‌కు తండ్రిగా కనిపించిన జగ్గుభాయ్, ఇప్పుడు ప్రతినాయకుడిగా అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మహర్షిలోనూ జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్‌కు కూడా రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మహేష్‌కు జోడిగా లక్కీ బ్యూటీ రష్మిక మందన్న నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మే లో లాంచనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.