Murder Attempt on YS Jagan
-
లోకేష్‌ను కలిసిన జగన్‌పై దాడి కేసు నిందితుడు
విజయవాడ, సాక్షి: వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఏ1 నిందితుడు వేముల సతీష్, మంత్రి నారా లోకేష్‌ను కలిశాడు. శనివారం ఉదయం లోకేష్ నిర్వహించే ప్రజాదర్బాకు వెళ్లి.. ఆయనతో ఫొటో దిగాడు. వైఎస్ జగన్ హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సతీష్‌కు టీడీపీతో లింకులు ఉన్నాయంటూ వైఎస్సార్సీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అయితే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచాక.. సతీష్ లోకేష్‌ను కలిసేందుకు యత్నించాడు. అయితే ఎందుకనో అది కుదరలేదు. తాజాగా ఓ టీడీపీ నేత సహకారంతోనే ఈ అపాయింట్మెంట్ దక్కినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఏప్రిల్ 13వ తేదీ రాత్రి విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుండగా నాటి సీఎం జగన్‌పై దాడి జరిగింది. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ పక్కకు తిరగడంతో అదృష్టతవశాత్తూ ఆయన కంటికి పైన భాగంలో మాత్రమే గాయమైంది. ఈ కేసులో ఏప్రిల్ 18వ తేదీన వేముల సతీష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. నెల్లూరు జైలుకు తరలించారు. అయితే ఇందులో పొలిటికల్ కాన్స్పిరసీ (రాజకీయ కుట్ర) ఉందని పోలీసులు సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు జగన్‌ను హత్య చేయాలనే కుట్రతోనే వేముల సతీష్ పదునైన రాయితో దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత మే 28వ తేదీన విజయవాడ కోర్టు కండిషనల్ బెయిల్ ఇవ్వడంతో సతీష్ బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతనికి పలువురు టీడీపీ నేతలు మద్దతుగా నిలవడం విశేషం. -
సీఎం జగన్‌పై హత్యాయత్నాన్ని ఖండిస్తూ యూకేలో ప్రవాసాంధ్రులు నిరసన
సాక్షి,అమరావతి: చంద్రబాబుకు ఏ దురుద్దేశమూ లేకపోతే ఇటీవల అమరావతి పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తూ సీఎం జగన్‌ను రాళ్లతో కొట్టండి అని ఎందుకు అన్నారో సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ యూకే సోషల్ మీడియా సభ్యులు భూమిరెడ్డి కార్తీక్ టీడీపీని డిమాండ్ చేశారు. బాబు అన్న కొద్ది గంటల్లోనే సీఎం జగన్‌పై హత్యాయత్నం జరిగిందని గుర్తు చేశారు. దీనిని వైఎస్సార్సీపీ యూకే విభాగం తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం యూకేలో సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటనను ఖండిస్తూ నిరసన చేపట్టారు. కార్తీక్ మాట్లాడుతూ.. విజయవాడలో సీఎం జగన్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారని, దాన్ని చంద్రబాబు ఓర్చుకోలేక పోయారని అన్నారు. యాత్ర ఇలాగే సాగితే టీడీపీకి రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించే సీఎం జగన్‌పై ఘాతుకానికి తెగబడ్డారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ కచి్చతంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. పాలెం క్రాంతి కుమార్ రెడ్డి, మలిరెడ్డి కిషోర్, వడ్డూరి అప్పాజీ, వీర పులిపాకల, వజ్రాల రాజశేఖర్, భీమిరెడ్డి ప్రతాప్, మాదిరెడ్డి శ్రీకాంత్, వెంకట్ రమణ మామిడిశెట్టి, వంశీ కృష్ణా రెడ్డి కూకటి, గుండం సాయి తేజ తదితరులు పాల్గొన్నారు. -
‘కోడి కత్తి తగిలి ఇద్దరు చనిపోయారని మీ ఈనాడు పత్రికే రాసింది కదా?’
సాక్షి, కాకినాడ: 2018 అక్టోబర్‌లో విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే.. కోడి కత్తి కేసు అని చంద్రబాబు, ఎల్లో మీడియా ఎగతాళి చేశాయని మండిపడ్డారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు. చంద్రబాబు ఎప్పుడైనా కోడి కత్తి చూశారా? అని ప్రశ్నించారు. ఎంత పదునుగా ఉంటుందో ఓసారి టచ్ చేసి చూడండి అని హెచ్చరించారు. ఈ మధ్య కోడి కత్తి తగిలి ఇద్దరు చనిపోయారని మీ ఈనాడు పత్రికే రాసింది చూసుకోండి అని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. 'వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని ఛార్జిషీటు పేర్కొంది. దీనిపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉంది. ఈనాడు కథనంలో దీనిపై తీర్పు కూడా ఇచ్చేశారు. తీర్పులు ఇవ్వడానికి మీరెవరూ? మీకు ఏం హక్కుఉంది. నిందితుని వాంగూల్మంతో తీర్పులు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఈనాడు అచ్చేస్తుంది. ఎన్ఐఎ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయమని కోరితే మీకు ఇబ్బంది ఏంటి? మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు. ఈ సంఘటనను చులకనగా తీసిపడేస్తే చంద్రబాబును కాపాడొచ్చు అని మీ దుర్బుద్ధి కాదా? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు బాధ్యత లేదా? నిందితుడి కత్తి భుజానికి కాకుండా మెడకు తగిలి ఉంటే పరిస్ధితి ఏంటి?' అని కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ‘చంద్రబాబు, లోకేశ్‌ను తరిమికొడతాం’ -
వైఎస్ జగన్‌పై దాడి కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం
సాక్షి, అమరావతి: గత ఏడాది విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దు చేస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది. నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎన్ఐఏ వేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఎన్ఐఏ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం శ్రీనివాస్ బెయిల్ రద్దు చేసింది. అయితే నిందితుడు బెయిల్‌పై అప్పీలు చేసుకునే అవకాశాన్ని న్యాయస్థానం కల్పించింది. శ్రీనివాస్‌కు ఈ ఏడాది మే 22న బెయిల్ మంజూరు కాగా, 25న జైలు నుంచి విడుదల అయ్యాడు. దీంతో కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ....హైకోర్టులో అభ్యర్థించారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్న విషయాన్ని కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, అసలు బెయిల్ మంజూరుకు కారణాలు కూడా తెలపలేదన్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటన పౌర విమానయాన భద్రత చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచన పరిధిలోకి వస్తుందని, ఈ చట్టంలోని సెక్షన్ 6ఏ ప్రకారం బెయిల్ మంజూరుకు కారణాలు చెప్పడం తప్పనిసరని కోర్టుకు విన్నవించారు. 2018 అక్టోబర్ 25న వైఎస్ జగన్‌పై శ్రీనివాసరావు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని... హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న సమయంలో విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఆయనపై దాడి జరిగింది. -
శ్రీనివాసరావు బెయిల్ పొడగింపు
సాక్షి, విజయవాడ : గత ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నానికి పాల్పడిన జె.శ్రీనివాసరావు బెయిల్‌ను ఎన్ఐఏ కోర్టు పొడగించింది. జూలై 12 వరకు బెయిల్‌ను పొడగిస్తూ ఏఐఏ కోర్టు తీర్పు వెల్లడించింది. బుధవారం విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో శ్రీనివాసరావును పోలీసులు ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలంటూ అధికారులు కోర్టును కోరారు. విచారణ చేపట్టిన ధర్మాసనం శ్రీనివాస్‌రావు బెయిల్‌ను వచ్చే నెల 12 వరకు పొడగించింది. 2018 అక్టోబర్ 25న వైఎస్ జగన్‌పై శ్రీనివాసరావు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని... హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న సమయంలో ఎయిర్ పోర్ట్ లాంజ్ లో ఆయనపై దాడి జరిగింది. -
శ్రీనివాసరావు బెయిల్ రద్దు చేయండి
సాక్షి, అమరావతి: గత ఏడాది వైఎస్ జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నానికి పాల్పడిన జె.శ్రీనివాసరావుకు ఎన్ఐఏ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.సిద్ధిరాములు బుధవారం హైకోర్టును అభ్యర్థించారు. ఈ కేసుకు సంబంధించిన కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే శ్రీనివాసరావుకు ఎన్ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్న విషయాన్ని కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. అసలు బెయిల్ మంజూరుకు కారణాలు కూడా తెలియచేయలేదన్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటన పౌర విమానయాన భద్రత చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచన పరిధిలోకి వస్తుందని, ఈ చట్టంలోని సెక్షన్ 6ఏ ప్రకారం బెయిల్ మంజూరుకు కారణాలు చెప్పడం తప్పనిసరని ఆయన వివరించారు. ఆ తరువాత శ్రీనివాసరావు తరఫు న్యాయవాది మట్టా జయకర్ వాదనలు వినిపించారు. -
శ్రీనివాసరావు బెయిల్‌ను రద్దు చేయండి..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఏపీ హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పిటిషన్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని, కావున అతని బెయిల్‌ను రద్దు చేయాల్సిందిగా ఎన్ఐఏ పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై హైకోర్టు త్వరలోనే విచారణ జరిపే అవకాశం ఉంది. కాగా వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో శ్రీనివాసరావు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన మే 25న రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. బెయిల్ పత్రాలు అందడంతో జైలు అధికారులు శ్రీనివాసరావుని విడుదల చేశారు. -
జైలు నుంచి శ్రీనివాసరావు విడుదల
సాక్షి, తూర్పు గోదావరి జిల్లా(రాజమండ్రి) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శనివారం విడుదలయ్యాడు. బెయిల్ పత్రాలు అందడంతో జైలు అధికారులు శ్రీనివాసరావుని విడుదల చేశారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'ఆ రోజు సంఘటన అనుకోకుండా జరిగింది. నేను నార్కో అనాలసిస్ టెస్ట్ కూడా సిద్ధం. వైఎస్ జగన్‌పై కావాలని దాడి చేయలేదు. రైతులు, మహిళలు, ఇతర సమస్యల గురించి వైఎస్ జగన్‌తో మాట్లాడాలనుకున్నాను' అంటూ శ్రీనివాస్ నీతి కబుర్లు చెప్పాడు. తానొక చెఫ్‌నని అందుకే ఆరోజు తన వద్ద మూడు కత్తులు, ఫోర్క్ ఉన్నాయని తెలిపాడు. -
శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌పై వాదనలు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు ఎన్ఐఏ కోర్డులో హాజరుపరిచారు. విచారణలో భాగంగా రిమాండ్‌లో ఉన్న శ్రీనివాస్ జ్యూడిషీయల్ రిమాండ్ ఇవాల్టితో ముగియనున్న విషయం తెలిసిందే. తనకు ఆరోగ్యం సరిగా లేదని, చికిత్సం కోసం బెయిల్ మంజూరు చేయాలని శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. లేఖ ద్వారా న్యాయమూర్తికి బెయిల్ పిటిషన్‌పై గతంలోనే విన్నవించిన విషయం తెలిసిందే. ఆయన పిటిషన్‌పై కోర్టు నేడు తుది నిర్ణయం తీసుకోనుంది. -
శ్రీనివాసరావుతో అపరిచితుల మంతనాలు!
జైలు నుంచి ఆస్పత్రికి.. ఆస్పత్రి నుంచి జైలుకు.. అంతా గోప్యమే ఎన్నో అనుమానాలకు దారితీస్తున్న అధికారుల తీరు సాధారణ వార్డులో చికిత్స అని చెప్పి ప్రత్యేక సౌకర్యాలున్న ఐసీయూకు తరలింపు మామూలు జ్వరానికి ఇంత హడావుడి ఎందుకు? ఆస్పత్రి అంతా కెమేరాలున్నా.. ఒక్క ఐసీయూలో మాత్రం లేవు ముందస్తు ప్రణాళికలో భాగంగా టీడీపీ పెద్దలు కలిసినట్లు సమాచారం జైలులో అయితే రికార్డుల్లో నమోదవుతుందని ఆస్పత్రి ఎంపిక? కేసును తప్పుదారి పట్టించే వ్యూహాలు పన్నుతున్నట్లు అనుమానాలు రాజమహేంద్రవరం క్రైం/ముమ్మిడివరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ముద్దాయిగా శిక్ష అనుభవిస్తున్న జనుపల్లి శ్రీనివాసరావును జైలు నుంచి ఆస్పత్రికి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు మాత్రం వైరల్ ఫీవర్ అని చెబుతున్నారు. అయితే అంత హడావుడిగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి రెండు రోజులపాటు అక్కడే ఉంచి పలువురు అపరిచిత వ్యక్తులతో మాట్లాడించడం వెనుక కుట్ర దాగుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మీడియాకు విషయం తెలియడంతో బుధవారం రాజమహేంద్రవరం త్రీటౌన్ సీఐ శేఖర్‌బాబు ఆధ్వర్యంలో ఎస్కార్ట్ పోలీసులు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని బందోబస్తు మధ్య సెంట్రల్ జైల్‌కు తరలించారు. ఈ నెల 22వ తేదీ సోమవారం శ్రీనివాసరావును ప్రభుత్వ అస్పత్రికి తీసుకువచ్చినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేష్ కిశోర్, ఆర్ఎంఓ డాక్టర్ పద్మశ్రీ, అతనికి చికిత్స అందించిన డాక్టర్లు నాయక్, చంద్రశేఖర్‌లు పేర్కొన్నారు. అతనికి డెంగీ, మలేరియా, టైఫాయిడ్, హెచ్ఐవీ వంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మలేరియా వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించి చికిత్స అందించినట్లు డాక్టర్ నాయక్ పేర్కొన్నారు. శ్రీనివాసరావుకు హార్ట్ ఎటాక్ లక్షణాలున్నాయని, ఇతర వ్యాధులు ఉన్నట్లు మీడియాలో వస్తున్నవన్నీ వదంతులేనని, అతను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు స్పష్టం చేశారు. గోప్యత పాటించిన జైలు అధికారులు... శ్రీనివాసరావును ఆస్పత్రికి తరలించిడంతో అటు జైలు అధికారులు, ఇటు ఆస్పత్రి వర్గాలు మొదటి నుంచి మీడియాను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆస్పత్రిలో శ్రీనివాసరావు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియనీయకుండా గుట్టుగా ఉంచారు. సాధారణ ఖైదీల వార్డులో చికిత్స అందిస్తున్నట్లు మొదట సమాచారం ఇచ్చారు. అయితే సకల సౌకర్యాలు, ఏసీ ఉన్న ఐసీయూ వార్డులో ఉంచారు. ఆస్పత్రిలో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమేరాలు ఉన్నప్పటికీ శ్రీనివాసరావును ఉంచిన ఐసీయూలో మాత్రం కెమేరాలు లేకపోవడం గమనార్హం. సాధారణ జ్వరానికి ఐసీయూలో ఎందుకు ఉంచారనే ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం ఇవ్వడం లేదు. మీడియా కంట పడకుండా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అప్పటికే మీడియా చేరుకోవడంతో శ్రీనివాసరావు ముఖానికి టవల్ చుట్టి పోలీస్ ఎస్కార్ట్ కారు ఎక్కించి జైలుకు తరలించారు. ముందస్తు జాగ్రత్తతో మంతనాలు.. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండడంతో శ్రీనివాసరావును టీడీపీ పెద్దలు, పలువురు అపరిచిత వ్యక్తులు ఆస్పత్రిలో కలిసినట్లు తెలుస్తోంది. సెంట్రల్ జైలులో ములాఖత్ కోసం ఎవరు కలసినా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వారి పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలు మొత్తం జైలు రికార్డుల్లో నమోదవుతాయి. అలా నమోదు కాకుండా ముందస్తు జాగ్రత్తలతో మంతనాలు చేసేందుకు ప్రభుత్వ ఆస్పత్రిని వేదికగా చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసుకు సంబంధించిన వివరాలు బయటపెట్టకుండా ఏవిధంగా వ్యవహరించాలనే అంశాలపై శ్రీనివాసరావుతో చర్చించి ఉంటారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్ష్యాలు తారుమారు చేసి కేసును తప్పుదారి పట్టించేందుకు వ్యూహం పన్నుతున్నట్టు, ఇందుకు కొంతమంది జైలు, ఆస్పత్రి వర్గాలు సహకరించినట్టుగా భావిస్తున్నారు. కాగా, శ్రీనివాసరావును ఆస్పత్రికి తీసుకెళ్లడంతో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేల్లంకలో తల్లిదండ్రులు తాతారావు, సావిత్రి, సోదరుడు సుబ్బరాజు ఆందోళనకు గురయ్యారు. సుబ్బరాజు ఆస్పత్రికి వెళ్లి సోదరుడిని పరామర్శించాడు. -
జనుపల్లి శ్రీనివాసరావుకు అనారోగ్యం..!
సాక్షి, తూర్పు గోదావరి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌రావు తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. అతన్ని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. శ్రీనివాస్ ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై.. టీడీపీ నేతకు చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేసే శ్రీనివాసరావు పదునైన కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే సీఎం చంద్రబాబుతో పాటు డీజీపీ, మంత్రులు, టీడీపీ నేతలు తెరపైకి వచ్చి నిందితుడు శ్రీనివాసరావు వైఎస్ జగన్ అభిమానే అంటూ తప్పుడు ప్రచారం చేశారు. హత్యాయత్నాన్ని చాలా తేలిగ్గా తీసిపారేశారు. ఈ కేసును తొలుత రాష్ట్ర ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. అయితే, ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఈ కేసును శ్రీనివాసరావు ఒక్కడికే పరిమితం చేసి, సూత్రధారులు, కుట్రదారులను తప్పించారు. చివరకు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించారు. అయితే, ఈ కేసులో ఇంకా ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తి కాకుండానే చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు ఈ కేసును మొదటి నుంచీ తప్పుదోవ పట్టించేలా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారి మహ్మద్ సాజిద్‌ఖాన్ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి : మా విచారణ పూర్తికాలేదు) -
మా విచారణ పూర్తికాలేదు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం కేసులో ఇంకా తమ విచారణ పూర్తి కాలేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారి మహ్మద్ సాజిద్‌ఖాన్ వెల్లడించారు. ఇంకా ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తి కాలేదని తెలిపారు. సీఎం చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు ఈ కేసును మొదటి నుంచీ తప్పుదోవ పట్టించేలా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కుట్ర కోణమేదీ లేదని ఏకంగా ఎన్ఐఏ తేల్చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎన్ఐఏ అధికారులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై.. టీడీపీ నేతకు చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేసే శ్రీనివాసరావు పదునైన కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే సీఎం చంద్రబాబుతో పాటు డీజీపీ, మంత్రులు, టీడీపీ నేతలు తెరపైకి వచ్చి నిందితుడు శ్రీనివాసరావు వైఎస్ జగన్ అభిమానే అంటూ తప్పుడు ప్రచారం చేశారు. హత్యాయత్నాన్ని చాలా తేలిగ్గా తీసిపారేశారు. సిట్ కూడా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఈ కేసును శ్రీనివాసరావు ఒక్కడికే పరిమితం చేసి, సూత్రధారులు, కుట్రదారులను తప్పించారు. ఎన్ఐఏకు మొదట్నుంచీ సహాయనిరాకరణే.. చివరకు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణ చేపట్టిన ఎన్ఐఏకు.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖ పోలీసులు సహాయ నిరాకరణ చేశారు. కేసు వివరాలు సైతం ఎన్ఐఏ అధికారులకు వెల్లడించలేదు. సీఎం చంద్రబాబు స్వయంగా ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. ఓ దశలో సుప్రీంకోర్టుకు సైతం వెళ్లాలని యోచించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు విశాఖ పోలీసులు ఓ దశలో ఏకంగా కోర్టుకు కూడా ఈ కేసు సీడీ ఫైల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఎన్ఐఏ ప్రధాన దర్యాప్తు అధికారి (సీఐవో) మహ్మద్ సాజిద్‌ఖాన్‌తో సహా అధికారుల బృందాన్ని విశాఖ పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. చివరకు న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో చార్జిషీట్ ఫైల్ తీసుకుని ఎన్ఐఏ విచారణ చేపట్టింది. ఆ ఫైల్లోని వివరాలు ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. పదేపదే తప్పుడు ప్రకటనలు.. సీఎం చంద్రబాబు సిట్ మాదిరే ఈ కేసులో ఏమీ లేదంటూ ఎన్ఐఏ తేల్చేసిందని ఇష్టారీతిన పదేపదే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బహిరంగసభల్లో కోడికత్తి కేసుపై ఎన్ఐఏ వాళ్లు ఏం పీకారు.. మేం చెప్పిందే వాళ్లూ చెప్పారంటూ అసత్య ప్రకటనలు చేస్తున్నారు. దీనిపై ఎన్ఐఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మేమింకా ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తి చేయలేదని సీఐవో సాజిద్ ఖాన్ వెల్లడించారు. విచారణ కొనసాగుతున్న దశలో.. వివరాలేమీ చెప్పలేమన్నారు. -
జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ కీలక నిర్ణయం
-
ఇకపై ‘ఇన్ కెమెరా’ విచారణ
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన కేసు విచారణను ఇకపై ఇన్ కెమెరా ద్వారా చేపట్టాలని విజయవాడలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు నిర్ణయించింది. ఈ కేసుకు సంబంధించిన ఇరుపక్షాల న్యాయవాదులు తప్ప, మరెవ్వరూ కూడా ఈ కేసు విచారణ సమయంలో కోర్టులో ఉండరాదని స్పష్టంచేసింది. అలాగే, ఇకపై ఈ కేసుకు సంబంధించి కోర్టులో జరిగే విచారణపై ఎలాంటి వార్తలు రాయడంగానీ, ప్రసారం చేయడంగానీ చేయరాదని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. చార్జిషీట్‌కు ప్రత్యేక కోర్టు నెంబర్ కేటాయించక ముందే ఈ చార్జిషీట్ బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో గత విచారణ సమయంలోనే న్యాయమూర్తి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ నిర్వహణకు ఆదేశాలిస్తానని సూచనప్రాయంగా చెప్పారు. ఈ కేసు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ ముగియడంతో అతన్ని పోలీసులు ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. విచారణ ప్రారంభం కాగానే, న్యాయమూర్తి ఎన్ఐఏ చట్టంలోని సెక్షన్ 17(3) ప్రకారం ఈ కేసును ఇకపై ఇన్ కెమెరా (కేసుకు సంబంధించిన వారి సమక్షంలోనే విచారణ జరపడం) ద్వారా విచారణ చేపడతామంటూ ఉత్తర్వులు జారీచేయడం ప్రారంభించారు. కేసు విచారణ వేగవంతం అయ్యేందుకు, అలాగే నిష్పాక్షికంగా విచారణ జరిగేందుకు ఈ విచారణ తోడ్పతుందని న్యాయమూర్తి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, సాక్షులు, నిందితుడు, పీపీలు, న్యాయవాదుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు తరఫు న్యాయవాది మట్టా జయకర్ చార్జిషీట్లోని అంశాలు పత్రికల్లో వచ్చాయంటూ, వాటి కాపీలను న్యాయమూర్తికి ఇచ్చారు. ఈ ఉత్తర్వులు జారీచేసిన తరువాత కోర్టు హాలులో ఉన్న ఇతర కక్షిదారులు, న్యాయ విలేకరులు, ఇతర రిపోర్టర్లు, న్యాయవాదులను బయటకు పంపేశారు. -
శ్రీనివాస్‌కు రిమాండ్ పొడిగింపు
సాక్షి, విజయవాడ : ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు ఎన్ఐఏ కోర్టు రిమాండ్ పొడిగించింది. శ్రీనివాస్ తరఫున న్యాయవాది సలీం బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా.. శుక్రవారం వాదనలు విన్న ఎన్ఐఏ కోర్టు.. బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 26కు వాయిదా వేసింది. నిందితుడి రిమాండ్‌ను మార్చి 8 వరకు పొడిగించింది. -
కుట్రలు... కుతంత్రాలు...
అధికారమే పరమావధిగా లెక్కలేనన్ని కుట్రలు చేస్తున్నారు. తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న వైఎస్సార్సీపీని ఎదుర్కొనలేక కుయుక్తులకు తెగబడుతున్నారు. ఆ పార్టీ అధినేతపై హత్యాయత్నం నుంచి తాజాగా జిల్లాలోని వివిధ నేతలకు వస్తున్న బెదిరింపులు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఓ వైపు తమకు వ్యతిరేకులైనవారి ఓట్లను తొలగించేందుకు దొంగసర్వేలు చేపట్టడం... వాటిని అడ్డుకున్నవారిని అడ్డగోలుగా అరెస్టు చేయడం... చివరకు జిల్లా నాయకుల్లో భయోత్పాతాన్ని సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నం... ఇవన్నీ పాలకపక్షం అనుసరిస్తున్న దుస్సంప్రదాయానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రజా క్షేత్రంలో తిరుగులేని శక్తిగా అవతరిస్తున్న వైఎస్సార్సీపీని అణగదొక్కడానికి అధికార తెలుగుదేశం పార్టీ అడుగడుగునా కుట్రలకు పాల్పడుతోంది. విజయనగరం జిల్లాలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు వచ్చిన అపూర్వ ప్రజాదరణను చూసినప్పటి నుంచీ ఈ దుశ్చర్యలు మొదలయ్యాయి. ప్రతిపక్ష పార్టీని దెబ్బకొట్టాలని... అవసరమైతే ముఖ్యులనుహతమార్చాలని పన్నాగాలు రచించింది. గతేడాది సెప్టెంబర్ 24న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం, కొత్తవలస మండలం, చింతలపాలెంలో అడుగుపెట్టింది. పాదయాత్ర జిల్లాలో అడుగుపెట్టిన తొలిరోజే 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుని జగన్ చరిత్ర సృష్టించారు. అక్కడ జరిగిన బహిరంగకు వచ్చిన జనం చూసి అధికార పార్టీ కన్నుకుట్టింది. అక్కడి నుంచి ప్రతి నియోజకవర్గంలోనూ అదే ప్రభంజనం కొనసాగింది. ఆ జన ఉప్పెనను చూసిన అధికారపక్షం జగన్‌ను ఎలాగైనా ఆపాలని అప్పటికే చేసిన నిర్ణయాన్ని ఇక ఆలస్యం చేయకుండా అమలుచేసేలా పథకం రచించింది. సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలం, పాయకపాడు నుంచి గతేడాది అక్టోబర్ 25న హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి వెళ్లిన జగన్‌పై వీఐపీ లాంజ్‌లో శ్రీనివాసరావు అనే యువకుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. యావత్ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం మొత్తం ఉలిక్కిపడింది. కానీ గంటలోనే రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ ఈ విషయంపై చాలా తేలిగ్గా మాట్లాడారు. కోడికత్తికే ఇంత రాద్ధాంతమేంటని చులకనచేశారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యం జిల్లాలో టీడీపీ మరోకుట్రకు తెరదీసింది. ప్రైవేటు సంస్థలను నియమించుకుని గ్రామాల్లో సర్వే మొదలుపెట్టింది. ప్రతిపక్షానికి అనుకూలంగా ఎవరైనా తమ ప్రశ్నలకు బదులిస్తే వారిని భయపెట్టడం ఈ సర్వే బృందాల ప్రధాన విధి. టీడీపీకి ఓటెయ్యకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రచారం చేయించింది. అయినా లొంగని వారిని గుర్తించి వారి ఓట్లు జాబితాల్లో లేకుండా చేయాలని కుట్ర పన్నింది. జిల్లా వ్యాప్తంగా 700 మంది సర్వే బృందాలను రంగంలోకి దించి ఈ ప్రక్రియను పోలీసుల అండతో జరిపిస్తోంది. దీనిపై ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర డీజీపీకి వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సర్వేల పేరుతో ఓట్లు తొలగించే ప్రక్రియ చేపడుతున్న వారిని అడ్డుకున్నందుకు జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్, (చిత్రంలో) తాజాగా బెదిరింపులను ఎదుర్కొన్న ఇందుకూరి రఘురాజు. పార్టీ నేతల అక్రమ అరెస్టులు ఓటర్ల జాబితాల్లో పేర్ల గల్లంతే లక్ష్యంగా సాగుతున్న సర్వేపై అనుమానం వచ్చి వైఎస్సార్సీపీ నేతలు సర్వే బృందాలను అడ్డుకున్నారు. అదే వారు చేసిన నేరంగా పరిగణించి జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావును ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు ఆయనపై లేకపోయినా అరెస్ట్ చేయించింది. అతనితో పాటు మరికొంత మంది పార్టీ నాయకులను గత నెల 25న అక్రమంగా అరెస్ట్ చేసి భయానక వాతావరణాన్ని జిల్లాలో సృష్టించింది. అరెస్ట్ చేసిన తర్వాత మజ్జి శ్రీనివాసరావును శృంగవరపుకోట నియోజకవర్గం జామి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టుల ద్వారా ప్రతిపక్షం స్ధైర్యాన్ని దెబ్బతీయాలని ప్రభుత్వం చూసింది. పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మల్లా మారడం విమర్శలకు దారితీసింది. చంపేస్తామంటున్నా అదే నిర్లక్ష్యం ఇప్పుడు శృంగవరపుకోట నియోజకవర్గం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి రఘురాజుపై హత్యకు కుట్ర జరుగుతున్నా... దానిని కూడా తేలిగ్గా తీసుకుని, నిందితులను రక్షిస్తున్నారు. నెల రోజులుగా రఘురాజుకు కొందరు వ్యక్తులు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరిస్తుంటే ఆయన ఎస్‌కోట పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఫోన్ నంబర్ల ఆధారంగా నాలుగు రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి గురించి ఎలాంటి వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. చివరికి ఆకతాయిల పనిగా తేల్చేసి, కేసును నీరుగార్చేశారు. హత్య చేయడానికి తమకు రూ.3 కోట్లు ఇస్తామన్నారని ఫోన్లో బెదిరించిన వారిని అంత తేలికగా ఎలా వదిలేశారని అడిగితే పోలీసుల నుంచి సరైన సమాధానం రావడం లేదు. రేపేదైనా జరగరానిది జరిగితే దానికి ఈ ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహిస్తారా అని ప్రతిపక్షం అడుగుతున్నా వారిలో చలనం లేదు. -
రేపటితో ముగియనున్న శ్రీనివాస్ రిమాండ్
సాక్షి, విజయవాడ : వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు సంబంధించి సోమవారం అతని తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అతని తరఫు న్యాయవాదులు సలీం, మట్టాజయకర్‌లు గురువారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో శ్రీనివాస్‌ను కలిశారు. ప్రాణానికి ప్రమాదముందని లాయర్లు చెప్పినా, ఏమైనా పర్లేదు బెయిల్ మాత్రం కావాలని శ్రీనివాస్ పట్టుబట్టాడు. తనను బయటకి తీసుకురావాలని శ్రీనివాస్ లాయర్లని కోరాడు. ధానేలంకలో శ్రీనివాస్ తల్లిదండ్రులతో అతడి తరఫు లాయర్లు మాట్లాడారు. రేపటితో శ్రీనివాస్ రిమాండ్ గడువు ముగియనుంది. ఎన్ఐఏ కోర్టులో శ్రీనివాస్‌ను పోలీసులు హాజరుపరచనున్నారు. -
రేపటితో ముగియనున్న శ్రీనివాస్ రిమాండ్
-
కోడి కత్తో... నారా వారి కత్తో తేలుతుంది
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హత్యాయత్నం కేసులో నిజంగా టీడీపీ నేతల చేతులకు రక్తం అంటక పోతే ఎన్ఐఏ విచారణకు ఆటంకాలెందుకు సృష్టిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటు పార్టీ కోఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ అధికారి మహ్మద్ ఇక్బాల్ సూటిగా ప్రశ్నించారు. ఎన్ఐఏ విచారణతో డొంకంతా కదులుతోందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌పై హత్యాయత్నం జరిగితే... ‘తమ్ముళ్లూ... అది కోడికత్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎగతాళి చేసి మాట్లాడారని, అది కోడి కత్తో... నారా కత్తో త్వరలో తేలుతుందని ఇక్బాల్ హెచ్చరిక చేశారు. ఎన్ఐఏ విచారణకు సహకరించకుండా అడ్డుకోవడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు, డీజీపీ ఇద్దరూ కేసును తప్పు దోవ పట్టించేయత్నం చేశారని ఇక్బాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ ప్రకటనతో గరుడ ఫ్లెక్సీ, మడతలు లేని లేఖను సృష్టించారు కాబట్టే రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తే నిజాలు నిగ్గు తేలవని హైకోర్టును ఆశ్రయించామని, ఇది కేంద్రం పరిధిలో ఉందని పౌర, విమానయాన చట్టం ప్రకారం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఎన్ఐఏకి అప్పగించాలని తెలిసినా చంద్రబాబు ఎన్నో అడ్డంకులు సృష్టించారన్నారు. చివరికి హైకోర్టు ఆదేశాలతో ఎన్ఐఏకి కేసును అప్పగించక తప్పలేదన్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక కుట్ర కోణం ఉందని, నిందితుడు శ్రీనివాసరావును ఎవరెవరు ప్రోత్సహించారో తేలాల్సి ఉందని ఎన్ఐఏ స్పష్టం చేసిందన్నారు. చంద్రబాబు తాను స్వయంగా అబద్ధాలు చెప్పడమే కాక, డీజీపీతోనూ చెప్పించారని, అప్పట్లో వికటాట్టహాసం చేసిన చంద్రబాబు ఇపుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ఇక్బాల్ ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ చౌదరి నేర చరిత్ర కలిగిన శ్రీనివాసరావును ఎలా పనిలో పెట్టుకున్నాడనే దానిపై కూడా ఎన్ఐఏ విచారణ చేపడుతుందని ఇక్బాల్ తెలిపారు. ఇన్ని అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు ఇంకా ప్రజలను మభ్యపెట్టి, నయవంచన చేసినట్లు మాట్లాడుతున్నాడంటే ఎక్కడ ఆ కత్తి నారా కత్తిగా మారి తన మెడ మీద వేలాడుతుందోనని భయపడుతున్నాడన్నారు. ఈ కేసులో డొంక కదులుతోందని తెలిసే చంద్రబాబు తన దావోస్ పర్యటనను రద్దు చేసుకుని లోకేష్‌ను పంపించారని అన్నారు. దర్యాప్తు కొనసాగాలని ఎన్ఐఏ చెబుతుంటే... దర్యాప్తు ముగిసిందని చెప్పడం ఏమిటని మండిపడ్డారు. సీఎంగా వైఎస్ ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకో చంద్రబాబూ! దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎలా వ్యవహరించారో చంద్రబాబు గుర్తు చేసుకోవాలని ఇక్బాల్ సూచించారు. పరిటాల రవి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు డిమాండ్ చేస్తే వైఎస్ వెంటనే ఆదేశించారన్నారు. ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగినపుడు కనీస బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు ప్రజలకు తన మొహం చూపించే అర్హతే లేదని, ఆయన నల్లగుడ్డ కప్పుకుని ప్రజల ముందుకు రావాలని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళలను ఇప్పటికే చంద్రబాబు మోసం చేశారని, పసుపు–కుంకుమ పేరుతో పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చినందుకు తల ఎక్కడ పెట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు. -
‘కోడి కత్తో.. నారా కత్తో తేలుతుంది’
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని టీడీపీ నేతలు కోడి కత్తి అంటూ ఎగతాళి చేశారని, దర్యాప్తు జరిగితే కోడి కత్తో.. నారా కత్తో తేలుతుందని వైఎస్సార్ సీపీ నేత ఇక్బాల్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ఐఏ దర్యాప్తును అడ్డుకోవటం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఏపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆడే అబద్ధాలు చూసి ప్రజలు విస్తుపోతున్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, ఏపీ డీజీపీ కేసును తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశారన్నారు. ప్రజలకు మొహం చూపించడానికి చంద్రబాబుకు అర్హత లేదని విమర్శించారు. చంద్రబాబు నల్ల చొక్కా వేసుకోవటం కాదు.. మొహానికి నల్లరంగు పూసుకోవాలంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదాను నిర్వీర్యం చేసింది చంద్రబాబేనన్నారు. వైఎస్సార్ సీపీ పోరాటం వల్లే హోదా సజీవంగా ఉందని తెలిపారు. -
‘కోడి కత్తో.. నారా కత్తో తేలుతుంది’
-
అవకాశం రాగానే దాడి చేశాడు...
-
వైఎస్ జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే
-
జగన్‌ను చంపడమే శ్రీనివాసరావు లక్ష్యం
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను చంపాలన్న ఉద్దేశంతోనే ఆయనపై శ్రీనివాసరావు అలియాస్ చంటి కత్తితో దాడికి పాల్పడ్డారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తేల్చింది. జగన్‌ను అంతమొందించాలనే మెడపై పొడిచేందుకు శ్రీనివాసరావు ప్రయత్నించాడని, ఈ ప్రక్రియలో జగన్‌కు తన ఎడమ చేయి పై భాగంలో గాయమైందని స్పష్టం చేసింది. విశాఖపట్నం విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లోకి వెళ్లేందుకు సాధారణ ప్రజానీకానికి అనుమతి ఉండదని, అందువల్ల నిందితుడు సెల్ఫీ పేరుతో లోనికి ప్రవేశించాడని తెలిపింది. జగన్‌పై దాడి చేసేందుకు శ్రీనివాసరావు సరైన సమయం కోసం ఎదురు చూశాడని వివరించింది. ముందస్తు పథకంలో భాగంగానే 2018 జనవరిలో కోడి పందేల సందర్భంగా తన ఊరికి సమీపంలో కత్తిని సంపాదించాడని పేర్కొంది. ఈ విషయాలన్నింటినీ జనవరి 12 నుంచి 18 వరకు తాము చేపట్టిన విచారణలో శ్రీనివాసరావు స్వయంగా వెల్లడించాడని ప్రత్యేక కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది. శ్రీనివాసరావు చర్యలు పౌర విమానయాన చట్టంలోని సెక్షన్ 3ఏ(1)(ఏ) కింద చట్ట వ్యతిరేక కార్యకలాపాల పరిధిలోకి వస్తాయంది. అంతేకాక జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడం ద్వారా ఐపీసీ సెక్షన్ 307 కింద కూడా నేరానికి పాల్పడ్డారంది. ఈ నేరాలను విచారణ నిమిత్తం స్వీకరించాలని కోర్టును కోరింది. పౌర విమానయాన చట్టం కింద శ్రీనివాసరావును ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరుతూ కేంద్రానికి దరఖాస్తు చేశామని తెలిపింది. అనుమతి రాగానే ఆ విషయాన్ని కోర్టుకు నివేదిస్తామంది. జగన్‌ను చంపాలన్న కుట్ర ఎవరిది? ఎవరి ప్రేరణతో శ్రీనివాసరావు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు? తదితర అంశాలపై సీఆర్పీసీ సెక్షన్ 173(8) కింద దర్యాప్తును కొనసాగిస్తామని కోర్టుకు నివేదించింది. ఇలా అన్ని అంశాలను క్రోడీకరిస్తూ జనవరి 23న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఈ కేసు ప్రధాన దర్యాప్తు అధికారి మహ్మద్ సాజిద్ ఖాన్ చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షుల వివరాలు, సేకరించిన డాక్యుమెంట్లను జత చేశారు. ఈ చార్జిషీట్‌కు ప్రత్యేక కోర్టు ప్రొవిజినల్ క్రిమినల్ నెంబర్(పీఆర్సీ) కేటాయించాల్సి ఉంది. అనుబంధాలను మినహాయిస్తే, ఈ చార్జిషీట్ 9 పేజీలుంది. జగన్ రాకపోకలపై కన్ను... శ్రీనివాసరావు విమానాశ్రయంలో తిరిగేందుకు ఫ్యూజన్ ఫుడ్స్ యాజమాన్యం ఎయిర్పోర్ట్ అధికారులకు దరఖాస్తు చేసింది. ఎంట్రీ పాస్‌ను అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు. ఈ పాస్ కోసం దరఖాస్తు చేసినప్పుడు శ్రీనివాసరావు అనేక కీలక విషయాలను దాచి పెట్టాడు. తనపై కేసు విషయాన్నీ మరుగునపెట్టాడు. దీని గురించి అధికారులూ విచారణ చేయలేదు. మరోవైపు ఉత్తరాంధ్రలో జగన్ చేసిన పాదయాత్రను శ్రీనివాసరావు చాలా జాగ్రత్తగా గమనిస్తూ వచ్చాడు. అలాగే విశాఖ విమానాశ్రయం నుంచి ఆయన రాకపోకలను కూడా పరిశీలించాడు. ప్రతివారం హైదరాబాద్ వెళ్లేందుకు జగన్ విశాఖ విమానాశ్రయానికి వచ్చేవారు. ఈ సమయంలోనే జగన్‌పై దాడి చేయాలని శ్రీనివాసరావు ప్రణాళికలు రచించారు. కోడి పందేలకు ఉపయోగించే కత్తిని ఇందుకోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. తన ఈ ప్రణాళికను అమలు చేసేందుకు వైఎస్సార్ సీపీ వారితో మాట్లాడి జగన్‌తో తనకు సెల్ఫీ తీసుకునే అవకాశం ఇప్పించేలా చేయాలని ఫ్యూజన్ ఫుడ్స్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న యువతిని అడిగాడు. అక్టోబర్ 25న జగన్ విశాఖ విమానాశ్రయం వస్తున్నారని, ఆ రోజున సెల్ఫీ తీసుకోవచ్చునని ఆ యువతి శ్రీనివాసరావుకు చెప్పింది. ఆరోజున విమానాశ్రయం చేరుకున్న జగన్ నేరుగా వీఐపీ లాంజ్‌లోకి వెళ్లారు. ఆయన వెంట పీఏతో పాటు పార్టీ నేతలు కూడా ఉన్నారు. కొద్దిసేపటి తరువాత ఫ్యూజన్ ఫుడ్స్ సిబ్బంది జగన్, ఇతర నేతలకు కాఫీ, టీ అందించారు. అవకాశం రాగానే దాడి చేశాడు... శ్రీనివాసరావు ఫ్యూజన్ ఫుడ్స్ యూనిఫాం ధరించి, వీఐపీ లాంజ్‌లోకి అడుగుపెట్టే సమయంలో కత్తిని గుర్తించకుండా ఉండేందుకు చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్లాడు. జగన్‌కు ఎడమ వైపు నిల్చున్నాడు. సమయం రాగానే చంపేందుకు ఆయన మెడపై కత్తితో దాడికి ప్రయత్నించారు. ఈ ప్రక్రియలో జగన్ ఎడమ చేయికి గాయమైంది. ఆ వెంటనే ప్రొటోకాల్ అధికారులు, స్థానిక పోలీసులు, సీఐఎస్ఎఫ్ అధికారులు లాంజ్‌లోకి వచ్చి శ్రీనివాసరావును పట్టుకుని విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ సెక్యూరిటీ హోల్డ్ ఏరియా(ఎస్హెచ్ఏ) వైపు తీసుకెళ్లారు. ఈ విషయాలన్నింటినీ శ్రీనివాసరావు మా ఇంటరాగేషన్‌లో వెల్లడించారు. 3.5 సెంటీమీటర్ల లోతుగా గాయం... దాడి తరువాత జగన్ విమానాశ్రయంలో ఉన్న అపోలో హెల్త్ డెస్క్ డాక్టర్ వద్ద చికిత్స తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడికి చేరుకోగానే జగన్ నేరుగా సిటీ న్యూరో సెంటర్‌కు వెళ్లారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్సను అందించారు. 3.5 సెంటీమీటర్ల లోతుగా గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. ఆ మేర చికిత్స అందించి, 26వ తేదీ మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశారు. శ్రీనివాసరావు తన చర్యల ద్వారా పౌర విమానయాన చట్టం కింద నిర్ధేశించిన నేరాలకు పాల్పడ్డారని చార్జీషీట్లో ఎన్ఐఏ పేర్కొంది జగన్‌పై హత్యాయత్నం కేసు 8కి వాయిదా విజయవాడ లీగల్: జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణను ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం పూర్తి అదనపు ఇన్చార్జి జడ్జి అచ్యుత పార్థసారథి ఈ నెల 8కి వాయిదా వేశారు. నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెమోలపై కౌంటర్ అండ్ వాదనల నిమిత్తం న్యాయమూర్తి వాయిదా వేశారు. -
క్షేత్ర స్థాయి దర్యాప్తు ఆధారంగా చార్జిషీట్
-
ఉద్దేశ పూర్వకంగానే జగన్‌పై హత్యాయత్నం
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై గత ఏడాది అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఉద్దేశ పూర్వకంగా జరిగిందేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చి చెప్పింది. ఆ దాడి గురి తప్పకపోయుంటే మరణం సంభవించి ఉండేదని, అందుకే జగన్‌పై జరిగిన దాడిని రాష్ట్ర పోలీసులు హత్యాయత్నంగా పరిగణిస్తూ, ఆ మేరకు ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారని వివరించింది. విమానాశ్రయంలో చట్ట విరుద్ధంగా, ఉద్దేశ పూర్వకంగా ఏదైనా ఉపకరణాన్ని, ఆయుధాన్ని ఉపయోగించి హింసకు పాల్పడటం ద్వారా ఎవరైనా తీవ్రంగా గాయపడినా, మరణించినా అది పౌర విమానయాన చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచన పరిధిలోకి వస్తుంది. జగన్‌పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), ఎన్ఐఏలు ఇచ్చిన సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, విశ్లేషించిన తర్వాతే ఇది పౌర విమానయాన చట్టం కింద చట్ట వ్యతిరేక కార్యకలాపాల పరిధిలోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక అభిప్రాయానికి వచ్చిందని ఎన్ఐఏ వివరించింది. ఇందుకు అనుగుణంగానే ఈ ఘటనపై దర్యాప్తును తమకు అప్పగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలుకు గడువు జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ గుడిసేవ శ్యాంప్రసాద్ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్ఐఏలను ఆదేశించారు. తాజాగా ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా, అటు ఎన్ఐఏ, ఇటు కేంద్ర ప్రభుత్వం తరఫున ఎన్ఐఏ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్.ప్రవీణ్‌కుమార్ దాఖలు చేసిన కౌంటర్‌ను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) బొప్పుడి కృష్ణమోహన్ న్యాయమూర్తి ముందు ఉంచారు. ఈ కౌంటర్‌కు తిరుగు సమాధానం ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) డి.రమేశ్ గడువు కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను ఫిబ్రవరి 12కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ, ఈ వ్యాజ్యంలో తమనూ ప్రతివాదిగా చేర్చుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశామని, దానిని అనుమతించాలని కోర్టును కోరారు. దీనిపై ఎస్‌జీపీ రమేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పగా, న్యాయమూర్తి అంగీకరించారు. క్షేత్ర స్థాయి దర్యాప్తు ఆధారంగా చార్జిషీట్ ‘ఈ విషయంలో కేంద్రం చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంది. ఎన్ఐఏ చట్టంలోని సెక్షన్ 6(5) కింద ఉన్న అధికారాన్ని ఉపయోగించి ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం ఎంత మాత్రం కాదు. ఎన్ఐఏ చట్టంలోని సెక్షన్ 6 (6) ప్రకారం ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర పోలీసులు ఎన్ఐఏకు అందజేయాలి. అయితే ఈ కేసులో మేం పలుమార్లు అభ్యర్థించినా, ఎన్ఐఏ ఆదేశించినా కూడా రాష్ట్ర పోలీసులు ఇప్పటి వరకు రికార్డులు, డాక్యుమెంట్లను తమకు సమర్పించలేదంది. దీంతో క్షేత్ర స్థాయి దర్యాప్తు ఆధారంగా దర్యాప్తు అధికారి ఈ నెల 23న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయండి’ అని ఎన్ఐఏ హైకోర్టును అభ్యర్థించింది. -
హత్యాయత్నం కేసు: కౌంటర్ దాఖలు చేసిన ఎన్ఐఏ
సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటన కేసును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లదంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. వెంటనే ఎన్ఐఏ విచారణపై స్టే విధించాలని ప్రభుత్వం ఈ పిటిషన్లో పేర్కొంది. అయితే ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరగ్గా.. తక్షణమే విచారణను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం వాదించింది. గత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్‌పై ఎన్ఐఏ అధికారులు కౌంటర్ దాఖలు చేయగా.. తమ వాదనను వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం మరింత గడువు కోరింది. దీంతో ఈ కేసు విచారణను కోర్టు ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. హైకోర్టులో ఎన్ఐఏ చార్జ్‌షీట్ దాఖలు చేసే సమయం దగ్గరపడుతుండటంతో టీడీపీ ప్రభుత్వం ఈ కేసును నిలువరించేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎన్ఐఏకు ఇవ్వాలని సిట్ అధికారులను హైకోర్టు ఆదేశించినప్పటికీ వారిలో ఎలాంటి చలనం లేదు. హైకోర్టు తుదితీర్పు వచ్చేంతవరకు ఎన్ఐఏకు సహకరించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఖరాఖండిగా ప్రకటించేసింది. -
శాంతి లేదు.. భద్రత కానరాదు
శాంతిభద్రతల పరిరక్షణలో కీలక భూమిక పోషించే పోలీసులు తమ భుజాలపై అధికార పార్టీ సొంత అజెండా మోయాల్సి వస్తోంది. ప్రభుత్వ సేవల్లో మునిగితేలిన ఫలితంగా విధి నిర్వహణలో తీవ్రవైఫల్యాలు వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో శాంతి లేదు.. భద్రత కానరాదు అంటూ ప్రజలు ఆవేదన చెందే పరిస్థితి దాపురించింది. శాంతిభద్రతలు అడుగంటడంతో ఆంధ్రప్రదేశ్ అభద్రత.. ఆందోళన.. ఆవేదనకు చిరునామాగా మారిపోయింది. సర్కారు ఘోర వైఫల్యాలతో పోలీసుల ప్రతిష్ట మసకబారుతోంది. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, ఇతర నేరాలు పెరిగిపోయాయి. మహిళలపై లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు రెట్టింపయ్యాయి. మైనర్ బాలికలపైన అత్యాచారాలు పెచ్చరిల్లాయి. టీడీపీ నాలుగున్నరేళ్ల పాలనలో ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను మట్టుపెట్టడం, వారిపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఉన్న నారాయణరెడ్డిని 2017 మేలో పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రత్యర్థులు దారుణంగా హత్య చేయడం దీనికి పరాకాష్ట. సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును నీరుగార్చారన్న అపఖ్యాతిని పోలీసులు మూటగట్టుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో గతేడాది అక్టోబర్ 25న కత్తితో హత్యాయత్నం చేసిన ఘటనలో పోలీసులు, ప్రభుత్వం స్పందించిన తీరు ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఘటన జరిగిన గంటకే డీజీపీ ఠాకూర్ స్పందించిన తీరు కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉందని న్యాయ నిపుణులు సైతం తీవ్రంగా తప్పుపట్టడం గమనార్హం. సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో చేసిన వెకిలి వ్యాఖ్యలు సైతం కేసు దర్యాప్తుపై ప్రభావితం చూపాయి. ఈ కేసులో సిట్ కుట్ర కోణం వైపు దృష్టి పెట్టకుండా నిందితుడు శ్రీనివాసరావు చుట్టూనే దర్యాప్తును పరిమితం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించాలని వైఎస్సార్సీపీ నేతలు కోర్టును ఆశ్రయించడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ కేసును విచారిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఎన్ఐఏకు సహకరించడం లేదు. విమానాశ్రయంలోనూ నిర్బంధం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ 2017, జనవరి 26న విశాఖలో తలపెట్టిన కొవ్వొతుల నిరసనకు సంఘీభావంగా వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ని విమానాశ్రయం రన్‌వేపైనే అడ్డుకున్న పోలీసుల తీరును ప్రజలు తప్పుబట్టారు. అమరావతిలో 2017 ఫిబ్రవరి 11న నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంట్‌కు హాజరయ్యేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను గన్నవరం విమానాశ్రయంలో దౌర్జన్యంగా అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలో రకరకాల ప్రాంతాల్లో తిప్పి హైదరాబాద్‌లో వదిలిపెట్టడం వివాదాస్పదమైంది. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన మాజీ మంత్రి ముద్రగడను ఇంటి నుంచి బయటకు రాకుండా అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డితోపాటు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణలను పలుమార్లు అరెస్టులు చేసిన తీరు విమర్శలకు తావిచ్చింది. రాష్ట్రమంతా టెర్రర్.. రాజధాని అమరావతిలో తమ అడుగులకు మడుగులొత్తకపోతే బెదిరింపులు, అక్రమ కేసులతో ప్రభుత్వం టెర్రర్ పుట్టిస్తోంది. భూసమీకరణకు భూములు ఇవ్వని రైతులపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని సైతం విస్మయానికి గురిచేశాయి. తమ మాట వినని రైతుల అరటి తోటలు, ఇతర పంట పొలాలు తగలబెట్టించిన టీడీపీ నేతలు భయాందోళనలు సృష్టించారు. తమ సమస్యలను పరిష్కరించాలని న్యాయపోరాటాలు చేసిన వివిధ వర్గాల ప్రజలను, ఉద్యోగులను ప్రభుత్వం పోలీసులతో అణచివేసింది. సర్కారు ఆదేశాలతో పోలీసులు సమస్యలపై నినదించిన ప్రజల గొంతు నొక్కేశారు. శాంతియుత నిరసనలు తెలిపినవారిపై లాఠీలు విరుచుకుపడ్డాయి. డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కిన పాపానికి అక్రమ కేసులు బనాయించారు. సీఆర్పీసీ 144, 151లతోపాటు పోలీస్ యాక్ట్ 30లను విచ్చలవిడిగా ప్రయోగించి అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేశారు. మూడేళ్లుగా పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు పోలీసుల హడావుడితో ఉలిక్కిపడుతోంది. కాలుష్య కారక ఆక్వా ఫుడ్‌పార్కు వద్దని ప్రజలు నిర్వహిస్తున్న ఉద్యమాన్ని అణచివేస్తున్న పోలీసులు కేసులతో భయపెడుతున్నారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు 11 ఏళ్లనాటి ప్యాకేజీనే ఇస్తామంటూ పోలీసులను ప్రయోగించి భయాందోళనలు సృష్టిస్తోంది. పోలవరం ప్రాజెక్టు, పురుషోత్తపట్నం ఎత్తిపోతల కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వని ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి పరిహాసం చేస్తోంది. ఎన్కౌంటర్ల కలకలం.. రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లు పోలీసులపై కౌంటర్లు వేసేలా మారాయి. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2015, ఏప్రిల్‌లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లను కాల్చి చంపారు. వారిని పోలీసులే పట్టుకుని హత్య చేశారంటూ పౌరహక్కుల నేతలు ఆరోపణలు చేశారు. 2018, జూలై 25న పోలీసులు, ఎర్రచందనం స్మగ్లర్ల నడుమ మరోమారు కాల్పుల్లో ఒక స్మగ్లర్ మృతి చెందాడు. ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో మల్కన్‌గిరి లో 2016, అక్టోబర్ 24 నుంచి నాలుగు రోజులపాటు పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. వారిలో 11 మందికి పైగా గిరిజనులు ఉండటం విమర్శలకు తావిచ్చింది. తాజాగా గతేడాది సెప్టెంబర్ 23న విశాఖ మన్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేయడంతో భద్రతా వైఫల్యం, నిఘా నీరుగారిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసును కేంద్ర దర్యాప్తు బృందం చేపట్టింది. కత్తులు దూస్తున్న రౌడీయిజం రాష్ట్రంలో రౌడీయిజం కత్తులు దూస్తోంది. రాష్ట్రంలో రౌడీ, కేడీ, డెకాయిట్, సస్పెక్ట్ (హిస్టరీ) షీట్లు ఏకంగా 28,381 మందిపై ఉండటం కలవరపాటుకు గురిచేస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే అత్యధిక హిస్టరీ షీట్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కృష్ణా జిల్లాలో 4,236 మందిపైన, గుంటూరు జిల్లాలో 3,984 మందిపైన హిస్టరీ షీట్లు ఉన్నాయి. దశాబ్ద క్రితం సద్దుమణిగిన రౌడీయిజం మళ్లీ కోరలు చాస్తోంది. వ్యాపారుల నుంచి బలవంతపు వసూళ్లు, భూసెటిల్మెంట్లు, రాజకీయ ప్రత్యర్థుల హత్యలే లక్ష్యంగా వెర్రితలలు వేస్తోంది. పోలీసులు అటువైపు కన్నెత్తి చూడట్లేదు. కొన్ని సంఘటనలను పరిశీలిస్తే.. గుంటూరులో మాజీ రౌడీషీటర్ బసవల వాసు (38) దారుణ హత్యకు గురైన తీరు సంచలనం సృష్టించింది. పోలీస్‌స్టేషన్‌కు దగ్గరలోనే రెస్టారెంట్లో భోజనం చేసి బయటకు వచ్చిన వాసును స్కార్పియోలో వచ్చిన ప్రత్యర్థులు రెప్పపాటులోనే విచక్షణారహితంగా నరికేశారు. విజయవాడ సింగ్‌నగర్‌లో ఒక బార్ వద్ద రౌడీషీటర్ కట్లా వేణుగోపాలరావు అలియాస్ కల్నాయక్ కత్తులతో దాడి చేసి గంధసిరి వెంకటేశ్వరరావును హతమార్చాడు. రౌడీషీటర్ కల్నాయక్పై 20 ఏళ్లలో 16 కేసులు ఉండటంతో పోలీసులు నగర బహిష్కరణ విధించినప్పటికీ అతను నిర్భయంగా వచ్చి హత్య చేయడం గమనార్హం. కర్నూలు జిల్లా నంద్యాలలోని నడిరోడ్డుపై పట్టపగలే రౌడీషీటర్ రాఘవేంద్రను మరో రౌడీషీటర్ గుమ్మపాలెం బద్రి హత్య చేశాడు. విశాఖ మద్దిలపాలెంలోని సింగర్ బార్ వద్ద రౌడీషీటర్ మళ్ళ వెంకటరమణను తోటి రౌడీషీటర్ హతమార్చాడు. మహిళలను అగౌరపరచడంలో టాప్ రాష్ట్రంలో మహిళలను కించపరచడం, వేధించడం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, కిడ్నాప్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. జాతీయ నేర నమోదు సంస్థ నివేదిక ప్రకారం.. మహిళలపై రాష్ట్రంలో 2016లో 16,362 నేరాలు జరగ్గా 2015లో 15,967 నేరాలు జరిగాయి. మహిళలపై నేరాల్లో ఏపీ దేశంలోనే 8వ స్థానంలో ఉండటం గమనార్హం. మహిళల అక్రమ రవాణాలోనూ రాష్ట్రం ఏడో స్థానంలో ఉంది. ఎస్సీలపై జరిగిన నేరాల్లో ఐదు, ఎస్టీలపై నేరాల్లో నాలుగు, ఆర్థిక నేరాల్లో పది, సైబర్ నేరాల్లో ఆరో స్థానంలో ఉంది. మొత్తం నేరాలన్నింటిలో కలిపి ఏపీ 13వ స్థానంలో ఉంది. రైల్వే నేరాల్లో ఆరో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రైల్వే నేరాల్లో దేశంలో ఏపీ ఆరో స్థానంలో నిలిచింది. ఇటీవల జాతీయ నేర నమోదు విభాగం(ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించిన నేరాల చిట్టా చూస్తే విస్తుపోవాల్సిందే. 2016లో జరిగిన రైల్వే నేరాలను గమనిస్తే.. ఏపీలో రైళ్లలో హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, స్మగ్లింగ్ హడలెత్తిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) పరిధిలో 2014లో 1,786 కేసులు, 2015లో 1,809 కేసులు, 2016లో 1,893 కేసులు నమోదయ్యాయి. ఏపీలోని రైళ్లలో గంజాయి, బంగారం, సుంకం చెల్లించని విలువైన సామాగ్రి స్మగ్లింగ్ జరుగుతున్న తీరు పోలీసులకు సవాలుగా మారింది. బెట్టింగ్‌లకు బ్రేక్ పడలేదు.. రాష్ట్రంలో పెద్దఎత్తున సాగుతున్న బెట్టింగ్ మాఫియాకు బ్రేక్ పడటంలేదు. క్రికెట్ బెట్టింగ్ మాఫియాకు అధికార పార్టీ అండదండలు ఉండటంతో పోలీసులు కన్నెత్తి చూడటంలేదు. బెట్టింగ్‌లు వేలాది కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. చంద్రబాబు గత పాలనలో హైదరాబాద్‌లో మొదలైన క్రికెట్ బెట్టింగ్‌లు క్రమంగా రాష్ట్రమంతా విస్తరించాయి. పల్లెల నుంచి పట్టణాల వరకు బెట్టింగ్‌ల కోసం ప్రత్యేకంగా బుకీలున్నారు. చిన్నపాటి పాన్‌షాపుల నుంచి ఫైవ్‌స్టార్ హోటళ్ల వరకు బుకీలకు నిలయాలుగా మారిపోయాయి. రాజకీయ, ఆర్థిక పలుకుబడి కలిగిన పలువురి అతిథిగృహాలు క్రికెట్ సీజన్లో బుకీలకు విందు, మందు, పొందుతో ఆతిథ్యమిచ్చే షెల్టర్జోన్లుగా మారిపోతున్నాయి. చివరకు ముంబైలోని అండర్‌వరల్డ్ డాన్ల వరకు అండదండలు ఉండటంతో బెదిరింపులు, కిడ్నాప్‌లకు బెట్టింగ్‌లు దారితీస్తున్నాయి. పేకాట శిబిరాలకు కూడా టీడీపీ నేతలే నిర్వాహకులుగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రెచ్చిపోతున్న ‘పచ్చ’ నేతలు - విశాఖపట్నం, గన్నవరం విమానాశ్రయాల్లో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అక్కడి సిబ్బందిపై వీరంగం సృష్టించిన తీరు విమర్శలకు తావిచ్చింది. ఆయన తమ్ముడు, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి గతంలో తమ దివాకర్ ట్రావెల్స్ బస్సును ఆపారన్న ఉక్రోశంతో హైదరాబాద్ ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి వెళ్లి అక్కడ అధికారిని కొట్టడం పెనుదుమారం సృష్టించింది. తాజాగా అనంతపురం జిల్లాలోని ప్రబోధానంద ఆశ్రమంపై జేసీ అనుచరుల దాడి ఉద్రిక్తతకు దారితీసింది. - నిజాయితీగా విధులు నిర్వర్తించిన మహిళా తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో దాడిచేసినప్పటికీ ఆమెకు న్యాయం చేయడంలో ప్రభుత్వం పచ్చపాతం చూపింది. సీఎం చంద్రబాబు పట్టించుకోకపోవడంతో మరింత రెచ్చిపోతున్న చింతమనేని అధికారులు, పోలీసులు, కార్మికులు, విలేకరులు, రాజకీయ నాయకులపై దాడులపర్వాన్ని కొనసాగిస్తున్నారు. - విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం విధులకు ఆటంకం కలిగించి దుర్భాషలాడటంతోపాటు ఆయన గన్‌మెన్‌పై దౌర్జన్యం చేసినా ఎలాంటి కేసులు, క్రమశిక్షణా చర్యలూ లేవు. - పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం ఎస్ఐ శ్రీనివాస్, రైటర్‌ను నిర్బంధించి దుర్భాషలాడిన టీడీపీ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మరో ఎనిమిది మందిపై తçప్పనిసరి పరిస్థితిలో కేసు నమోదు చేసినా చట్టపరమైన చర్యలు లేవు. - నెల్లూరులో సీఐని తాట తీస్తానంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దుర్బాషలాడినా ఎలాంటి చర్యలూ లేవు. - పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు జనచైతన్య యాత్ర సమయంలో ఫుడ్‌పార్కు విషయంలో నిరసన తెలిపిన మహిళలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. - స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం తన అనుచరులతో నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే కాంట్రాక్టర్ పర్సంటేజీ(మామూళ్లు) ఇవ్వలేదనే కారణంతో దాడి చేసి వర్క్‌షాపు షెడ్డును కూల్చేసి, సామాగ్రిని ధ్వంసం చేసి ఎదురుకేసులు పెట్టిన ఘటన విమర్శలకు తావిచ్చింది. - అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లిలో సుధమ్మ అనే మహిళపై టీడీపీ గ్రామ సర్పంచ్ నాగరాజు, జన్మభూమి గ్రామ కమిటీ సభ్యుడు చంద్ర మూకుమ్మడిగా దాడి చేసి దారుణంగా కొట్టిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. ఎర్రచందనం స్మగ్లింగ్.. గంజాయి సాగు అటు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్, ఇటు ఏవోబీలో గంజాయి సాగు పోలీసులకు సవాలుగా మారాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధానికి ప్రత్యేక టాస్క్ఫోర్సు ఏర్పాటు చేసినప్పటికీ అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. మరోవైపు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో సాగవుతున్న గంజాయిని అరికట్టడంలోనూ ఇదే కథ. గంజాయి తోటలను ధ్వంసం చేస్తామంటూ మూడేళ్లుగా కార్యాచరణ ప్రకటిస్తున్న పోలీసులు మిగిలిన శాఖలను సమన్వయం చేసుకోవడంలో ఫలితం సాధించలేకపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి అమరావతికి, హైదరాబాద్‌కు, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్ లకు గంజాయి స్మగ్లింగ్ అవుతున్నా చెక్‌పోస్టుల్లోని సిబ్బంది, ప్రత్యేక బృందాలు గంజాయి స్మగ్లింగ్‌ను చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. ఖాకీ వనంలో కీచకులు.. త్యాగాలకు మారుపేరైన ఖాకీవనంలో కొందరు కలుపుమొక్కలుగా మారి చేస్తున్న అసాంఘిక కార్యకలాపాలు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు తెస్తున్నాయి. కొందరు పోలీసులే దందాలు, మాఫియాలను నడపడంతోపాటు హత్యలు చేయించడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడంతో పోలీస్ శాఖ పరువుపోయింది. విశాఖ డీఎస్పీ రవిబాబు గతంలో చేయించిన ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మరో హత్య చేయించి దొరికిపోవడం పోలీస్ శాఖను జనంలో పలుచన చేసింది. భార్యాభర్తల వివాదం పరిష్కారంలో కృష్ణా జిల్లా కూచిపూడి ఎస్ఐగా పనిచేసిన గుడివాడ అనిల్ అతి వల్ల మొవ్వ మండలం కోసూరు శివారు తురకపాలెం గ్రామానికి చెందిన వీరంకి శ్రీహరి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సాయం కోసం పోలీసుస్టేషన్‌కు వచ్చిన వివాహిత ఫోన్ నెంబర్‌ను తీసుకున్న నూజివీడుకు చెందిన ఎస్ఐ వెంకటకుమార్ తన కోరిక తీర్చకుంటే వివాహిత భర్తను కేసులో ఇరికిస్తానంటూ నీచంగా ప్రవర్తించిన వైనం ప్రతి ఒక్కరినీ విస్మయపరిచింది. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఎస్ఐ విజయకుమార్ నూజివీడుకు చెందిన ఒక బ్యూటీపార్లర్ నిర్వాహకురాలితో వివాహేతర సంబంధం నెరపడంతో ఆ ఫొటోలు, వీడియోను ఆమె భర్త సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఆ ఎస్ఐ సస్పెండ్ అయ్యాడు. మచిలీపట్నం సహోద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదు చేసిన పోస్టల్ ఉద్యోగిని నుంచి రూ.25 వేలు లంచం తీసుకున్న ఎస్ఐ అశ్వక్పై క్రమశిక్షణ వేటు పడింది. తిరుపతిలో కుటుంబ వివాదాలపై ఫిర్యాదు చేసిన వివాహితతో ఫోన్లో తరచూ మాట్లాడుతూ తన రూమ్‌కు రావాలని కోరిన సీఐపై ఆమె అధికారులకు ఫిర్యాదు చేయడంతో సస్పెండ్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం, క్రమశిక్షణారాహిత్యం కారణంగా ఏపీఎస్పీ బెటాలియన్ (మంగళగిరి) అసిస్టెంట్ కమాండెంట్ పీఎన్డీ ప్రసాద్ సస్పెండ్ అయ్యాడు. విజయవాడ బస్టాండులో అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. -
శ్రీనివాసరావు రిమాండ్ పొడగింపు
-
శ్రీనివాస్‌కు ఫిబ్రవరి 8 వరకు జుడీషియల్ రిమాండ్
-
నిందితుడు శ్రీనివాస్‌కు ప్రత్యేక బ్యారక్
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన కేసులో నిందితుడు శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శుక్రవారం ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన రెండు మెమోలను విచారించిన కోర్టు.. శ్రీనివాస్‌కు ఫిబ్రవరి 8 వరకు జుడీషియల్ రిమాండ్ విధించింది. నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు తరలించాలని అధికారులను ఆదేశించింది. సెంట్రల్ జైల్లో శ్రీనివాస్‌కు ప్రత్యేక బ్యారక్‌తో పాటు పెన్ను, పుస్తకం, న్యూస్ పేపర్ అందించాలని అతని తరఫు న్యాయవాదులు కోరగా.. అందుకు ఎన్ఐఏ కోర్టు అంగీకరించింది. -
జగన్‌పై హత్యాయత్నం కేసు: కోర్టులో ఛార్జీషీట్ దాఖలు
-
జగన్‌పై హత్యాయత్నం కేసులో తుది చార్జిషీట్ దాఖలు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు బుధవారం ఎన్ఐఏ కోర్టులో తుది చార్జిషీట్ దాఖలు చేశారు. దీంతోపాటు పలు డాక్యుమెంట్లను సైతం సమర్పించారు. తదుపరి దర్యాప్తును కొనసాగించి ఆధారాలను సమర్పిస్తామని ఎన్ఐఏ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు నివేదించారు. కాగా, వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావు తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన రెండు మెమోలపై తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా పడింది. శ్రీనివాసరావు రాసిన 22 పేజీల లేఖను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుందని, ఆ లేఖను తమకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అతడి తరఫున న్యాయవాది మెమో దాఖలు చేశారు. అలాగే శ్రీనివాసరావును విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకునే విషయంలో ఎన్ఐఏ అధికారులు తమకు సరైన సమాచారం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. తమ ప్రమేయం లేకుండా జరిగిన విచారణకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకోరాదంటూ మరో మెమో దాఖలు చేశారు. జైలు అధికారులు తీసుకున్నారని నిందితుడే చెప్పాడు ఈ సందర్భంగా నిందితుడు శ్రీనివాసరావు తరఫున న్యాయవాది మట్టా జయకర్ వాదనలు వినిపిస్తూ నిందితుడు రాసిన 22 పేజీల లేఖను అతని ఇష్టానికి విరుద్ధంగా ఎన్ఐఏ అధికారులు తీసుకున్నారని చెప్పారు. న్యాయమూర్తి స్పందిస్తూ నిందితుడిని కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు.. తాను స్వయంగా అడిగినప్పుడు పుస్తకం రాశానని, దాన్ని జైలు అధికారులు తీసుకున్నారని శ్రీనివాసరావు స్పష్టంగా చెప్పాడని గుర్తు చేశారు. జయకర్ వాదనలను కొనసాగిస్తూ.. శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకునే రోజున జైలు లోపల, బయట ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ సమయంలో ఎన్ఐఏ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జోక్యం చేసుకుంటూ నిందితుడు రాసిన లేఖను దర్యాప్తులో భాగంగా జైలు అధికారుల నుంచి తీసుకున్నామని చెప్పారు. నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని పిటిషనర్లు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఈ కేసులో తాము చార్జిషీట్ దాఖలు చేస్తున్నామని, ఆ లేఖను చార్జిషీట్‌తోపాటు కోర్టు ముందుంచుతున్నామన్నారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలను చదవకుండానే నిందితుడి తరఫున న్యాయవాది ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. న్యాయవాదుల సమక్షంలో శ్రీనివాసరావును విచారించాలని ప్రత్యేక కోర్టు ఆదేశించిందని తెలిపారు. నిందితుడి తరఫున న్యాయవాది సలీం ఫోన్ నెంబర్ తెలుసుకుని, నిందితుడిని ఎక్కడకు తీసుకెళుతున్నాం? ఎక్కడ విచారిస్తాం? ఎన్ని గంటలకు విచారిస్తాం? తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలియచేశామన్నారు. సలీంకు చేసిన ఫోన్ కాల్స్‌కు సంబంధించిన స్క్రీన్షాట్లను సైతం కోర్టు ముందుంచారు. ఎవరిని పడితే వారిని అనుమతించడం సాధ్యం కాదు విచారణ సమయంలో శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు బాగా చూసుకున్నారని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. విచారణ సమయంలో ఎవరిని పడితే వారిని అనుమతించడం సాధ్యం కాదని, శ్రీనివాసరావు తరఫున న్యాయవాదులమని చెప్పి వచ్చి, అతడికి ఏదైనా హాని తలపెడితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. ఈ కేసులో మీడియా ట్రయిల్ జరుగుతోందని, విచారణకు సంబంధించిన వివరాలను సలీం మీడియాకు తెలియచేశారని కోర్టుకు నివేదించారు. అందువల్ల ఈ కేసును బహిరంగంగా కాకుండా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ద్వారా విచారించాలని కోరారు. నిరాధార ఆరోపణలతో నిందితుడి తరఫున దాఖలు చేసిన మెమోలను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ రెండు మెమోలపై ఉత్తర్వులను ఈ నెల 25న వెలువరిస్తానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఈ కేసులో అటు రాష్ట్ర పోలీసుల సిట్, ఇటు ఎన్ఐఏ అధికారులు నిష్పాక్షికంగా దర్యాప్తు జరపడంలేదని, ఈ కేసులో వారు ఏ పత్రాల మీద ఆధారపడుతున్నారో వాటిని తమకు అందచేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ శ్రీనివాసరావు తరఫున మరో మెమో దాఖలైంది. ఈ మెమోపై స్పందించాలని ఎన్ఐఏ ప్రత్యేక పీపీని న్యాయమూర్తి ఆదేశించారు. -
‘చంద్రబాబుకు హత్య రాజకీయాలు అలవాటే’
సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు హత్య రాజకీయాలు అలవాటేనని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో చంద్రబాబుపై అనుమానాలు బలపడుతున్నాయని ఆయన అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని తాము కోరితే.. చంద్రబాబు సిట్ వేసి కేసును నీరుగార్చే యత్నం చేశారని మండిపడ్డారు. ఎన్ఐఏ విచారణకు సిట్ సహకరించడం లేదని తెలిపారు. ఈ కేసులో కుట్రకోణంపై విచారణ జరపాలని ఎన్ఐఏ చార్జీషీట్ దాఖలు చేస్తే.. కేసు హైకోర్టు పరిధిలో ఉందని చెప్పి సిట్ అధికారులు వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారని చెప్పారు. ఎన్ఐఏ విచారణను చంద్రబాబు పదేపదే అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంతో టీడీపీ నేతలకు సంబంధం లేకుంటే.. ఎన్ఐఏ విచారణను అడుగడుగునా ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే దాన్ని తప్పుదోవ పట్టిస్తారా అని ప్రశ్నించారు. నీచపు ఆలోచనలతోనే చంద్రబాబు సర్కార్ ముందుకెళ్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ఎన్ఐఏ విచారణకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
‘కుట్ర ప్రకారమే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం’
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం కుట్ర ప్రకారమే జరిగిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈ కేసును నీరుగార్చడానికే రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని విమర్శించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుపడుతుంది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఎన్ఐఏ విచారణలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పాత్ర బయటకు వస్తుందనే భయం కనిపిస్తోందని ఆరోపించారు. అందుకే సిట్ దర్యాప్తు మాత్రమే ఫైనల్ కావాలనే భావనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోందన్నారు ఎన్ఐఏ విచారణను ఆపేందుకు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేఖ రాశారని తెలిపారు. ఈ కేసులో ఆధారాలను ఎన్ఐఏకు ఇవ్వకుండా ఉండేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పదేపదే ఎన్ఐఏ విచారణకు చంద్రబాబు అడ్డుపడటం చూస్తుంటే ఈ కేసులో ఆయన పాత్ర ఉందనేది స్పష్టమవుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు తీరును అంతా గమనిస్తున్నారని.. ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. చంద్రబాబుకు ఇతర పార్టీల నేతలు టైం ఇవ్వని పరిస్థితి.. ఇంకా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రంలో సమస్యలను వదిలి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని.. కానీ ఆయనతో మీటింగ్ అంటే ఇతర పార్టీల నేతలు టైం ఇవ్వని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా.. స్వప్రయోజనాల కోసమే ఆయన ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఈవీఎంలు వద్దని అంటున్నారని.. అయితే 2014లో ఆయన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే గెలిచారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబును కలసి వచ్చిన తర్వాత టీజీ వెంకటేశ్ జనసేనతో పొత్తు అంటూ మాట్లాడతారని.. కానీ ఆ కొద్ది సేపటికే టీజీపై చంద్రబాబు అసహనం అని లీకులు ఇస్తారని వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన అంతా ఒక్కటేనని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమికి చంద్రబాబు సాకులు వెతుక్కునే పనిలో పడినట్టుగా కనిపిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. -
ఎన్ఐఏ విచారణకు ఎందుకు సహకరించడం లేదు?
-
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం; ఎన్ఐఏ చార్జిషీట్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బుధవారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తికి చార్జిషీట్‌ను సమర్పించింది. నిందితుడు శ్రీనివాసరావు జైలులో రాసుకున్న 22 పేజీల పుస్తకాన్ని చార్జిషీట్‌తో పాటు జత చేసింది. చార్జిషీట్ కాపీని ఎవరికీ అందకుండా చూడాలని, గోప్యంగా ఉంచాలని కోర్టు సిబ్బందిని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జునుమిల్లి శ్రీనివాసరావును ఏ1 నిందితుడిగా పేర్కొన్నట్టు సమాచారం. కుట్రకోణంపై విచారణ కొనసాగిస్తామని కోర్టుకు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. చార్జిషీట్లో ఏముందో ఈ నెల 25న తెలిసే అవకాశముంది. ఈ కేసులో పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా అత్యవసరంగా చార్జిషీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిందితుడి తరఫున న్యాయవాది మట్టా జయకర్ ప్రశ్నించారు. -
ఎన్ఐఏ కోర్టులో విచారణ ఆపాలని పిటిషన్
-
ఎన్ఐఏ విచారణ ఆపాలంటూ ప్రభుత్వం పిటిషన్
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటన కేసును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్‌షీట్ దాఖలు చేసే సమయం దగ్గరపడుతుండటంతో టీడీపీ ప్రభుత్వం ఈ కేసును నిలువరించేందుకు కుట్రలకు పాల్పడుతూనే ఉంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎన్ఐఏకు ఇవ్వాలని సిట్ అధికారులను హైకోర్టు ఆదేశించినప్పటికీ వారిలో ఎలాంటి చలనం లేదు. హైకోర్టు తుదితీర్పు వచ్చేంతవరకు ఎన్ఐఏకు సహకరించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఖరాఖండిగా ప్రకటించేసింది. తాజాగా హత్యాయత్నం కేసు విచారణను ఆపాలంటూ ఎన్ఐఏ కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. హత్యాయత్నానికి సంబంధించిన కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందున ఎన్ఐఏ విచారణ ఆపాలని పిటిషన్లో పేర్కొంది. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును కావాలనే రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని న్యాయవాది వెంకటేశ్ శర్మ ఆరోపించారు. ఎన్ఐఏ చార్జ్‌షీట్ దాఖలు చేస్తే.. అసలు కుట్ర దారులు బయటికొస్తారనే భయంతోనే కేసును అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ కుట్రలను న్యాయపరంగా ఎదుర్కొంటామని వెంకటేశ్ శర్మ స్పష్టం చేశారు. -
‘కుట్ర కత్తి’పై బాబుకెందుకు భయం పట్టుకుంది..!
సాక్షి, తూర్పు గోదావరి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శల వర్షం కురిపించారు. వైఎస్ జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగినపుడు సింపుల్‌గా మాట్లాడిన చంద్రబాబు నేడు ఎన్ఐఏ విచారణ వద్దంటూ ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు. దొరికిపోతాననే భయంతోనే బాబు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్థికి కేంద్రంలోని బీజేపీ పాటుపడుతోందని అన్నారు. సర్వశిక్ష అభియాన్ కింద కస్తూర్బా పాఠశాలకు కేంద్రం 600 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. మోరంపూడిలో ఫ్లైఓవర్ నిర్మాణానికి, హార్టికల్చర్ సబ్ సెంటర్లకు నిధులను కూడా కేంద్రమే ఇచ్చిందన్నారు. అగ్రవర్ణాల పేదలకు కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తే.. దానిలో నుంచి కాపులకు ఏపీలో 5 శాతం రిజర్వేషన్లు ఎలా ఇవ్వగలదని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాజకీయ వ్యవస్థలో ఉన్న సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించాలని హితవు పలికారు. చంద్రబాబు పరిపక్వత లేని నిర్ణయంతో సమాజంలోని రెండు వర్గాల మధ్య దూరం పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు, అగ్రవర్ణాలకు చిచ్చు..! అధికారం కోసమే అగ్ర అగ్రవర్ణాల రిజర్వేషన్లలో 5 ఐదు శాతం కాపులకు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. బాబు అగ్రవర్ణాలు, కాపుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘గతంలో మాల మాదిగల మధ్య, మొన్నటికి మొన్న బీసీలు, కాపుల మధ్య గొడవ పెట్టారు. బాబు మోసాన్ని కాపులు గమనించాలి’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని తాను ఎవరికి లేఖ రాయలేదని అన్నారు. ఇక్కడ ఉన్న శాంతి భద్రతలపై మాత్రమే హోం మంత్రికి లేఖ రాశానని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలపై స్వయంగా మంత్రి అయ్యన్న పాత్రుడే చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేసిన సహాయంపై మంత్రి మాటలకన్నా ఇంకేం ఆధారం కావాలని చురకలంటించారు. -
ఎన్ఐఏ విచారణపై స్టే విధించేందుకు నిరాకరించిన హైకోర్టు
-
ఎన్ఐఏ దర్యాప్తును అడ్డుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించిన దర్యాప్తును అడ్డుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిందని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) బొప్పుడి కృష్ణమోహన్ హైకోర్టుకు నివేదించారు. అందుకే న్యాయస్థానం ఆదేశించినా కూడా ఎన్ఐఏకు రికార్డులివ్వకుండా ఏపీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. పైగా తమను రికార్డులివ్వాలని కోరుతున్నారని.. ఇది చాలా విచిత్రంగా ఉందన్నారు. ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించగానే ఆ కేసుకు సంబంధించిన రికార్డులివ్వాలని చట్టంలో స్పష్టంగా ఉన్నా.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కాగా, రికార్డులన్నింటినీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించే విషయంలో తమ ప్రయోజనాలను పరిరక్షించాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అభ్యర్థించింది. దీనికి హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. అయితే ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గుడిసేవ శ్యాంప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా వాదనలు వాడిగా వేడిగా సాగాయి. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, ఎన్ఐఏను దర్యాప్తు చేయాలన్న కేంద్ర హోంశాఖ ఆదేశాలను సవాలు చేశామని, అంతేకాక రికార్డులను ఎన్ఐఏకి ఇవ్వాలని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) బొప్పుడి కృష్ణమోహన్ వాదనలు వినిపిస్తూ, ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోందని, చట్ట ప్రకారం ఎన్ఐఏ దర్యాప్తునకు సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులపై ఉందని వివరించారు. ఎన్ఐఏకు దర్యాప్తు అప్పగించాలన్నది కేంద్రం స్వీయ నిర్ణయం కాదని, హైకోర్టు ఆదేశాల మేరకు తీసుకున్న నిర్ణయమన్నారు. వాడీ వేడిగా వాదనలు.. ఏజీ స్పందిస్తూ, తాము దర్యాప్తును నిలుపుదల చేయాలని కోరడం లేదని, తమ ప్రయోజనాలను పరిరక్షించాలని మాత్రమే తాము కోరుతున్నామని చెప్పారు. ఎన్ఐఏ దర్యాప్తునకు ఎందుకు ఆదేశిస్తున్నారో కారణాలు చెప్పలేదని, కేవలం ఘటన తీవ్రత దృష్ట్యా అని మాత్రమే కేంద్ర హోంశాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొందని వివరించారు. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన రికార్డులను సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరారు. కృష్ణమోహన్ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశించినా ఎన్ఐఏకు రికార్డులు ఇవ్వకుండా, తమను రికార్డులివ్వాలని కోరడం విచిత్రంగా ఉందన్నారు. దర్యాప్తును అడ్డుకోవడానికే ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. ఈ సమయంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, తాము కేవియట్ దాఖలు చేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయినా ప్రభుత్వం తమకు నోటీసు ఇవ్వకుండానే పిటిషన్ దాఖలు చేసిందన్నారు. ఏజీ స్పందిస్తూ, తమ పిటిషన్‌తో వారికి ఏం సంబంధం లేదని, ఈ వ్యవహారంలో ఆళ్ల థర్డ్ పార్టీ అని చెప్పారు. దీనికి సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ, జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఎమ్మెల్యే పిల్ దాఖలు చేసినపుడు తమకు సంబంధం లేకుండా ఎలా పోతుందని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య వివాదమని, అధికరణ 131 ప్రకారం కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే పిటిషన్ దాఖలు చేయాలన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టిస్తోందన్నారు. అనంతరం న్యాయమూర్తి, కేవియట్ కేసుల విచారణ జాబితాలో లేదని, అందువల్ల దాన్ని జాబితాలోకి వచ్చేలా చూసుకోవాలని సుధాకర్‌రెడ్డికి సూచించారు. -
టీడీపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు
-
హైకోర్టులో టీడీపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన కేసులో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టే పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం స్టేను నిరాకరిస్తూ కేసును కొట్టివేసింది. ఈ నెల 30లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటివరకు చేసిన దర్యాప్తు వివరాలను కోర్టు ముందు పెట్టాలని ఎన్ఐఏకు ఆదేశాలు జారీ చేసింది. -
హర్షవర్ధన్‌ను విచారించిన ఎన్ఐఏ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలకంగా భావిస్తున్న ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు విచారించారు. గత ఏడాది అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కత్తి దూసి హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావు ఫ్యూజన్‌ఫుడ్స్‌లో పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ రెస్టారెంట్ కేంద్రంగానే కుట్ర జరిగిందనేది అందరూ అనుమానించినా.. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు హర్షవర్ధన్ జోలికే వెళ్లలేదు. సీఎం చంద్రబాబు కుటుంబానికి సన్నిహితుడైన హర్షవర్ధన్‌తో కనీసం మాట్లాడేందుకు సాహసించలేదు. అయితే ఎన్ఐఏ నోటీసులు అందుకున్న తర్వాత హర్షవర్ధన్ పత్తాలేకుండా పోయారు. ఇదే విషయమై సాక్షిలో వార్త వచ్చిన దరిమిలా.. తనకు యాక్సిడెంట్ అయి ఇంట్లోనే కదల్లేని స్థితిలో ఉన్నానని ఎన్ఐఎ అధికారులకు హర్షవర్ధన్ సమాచారమిచ్చారు. దీంతో ఎన్ఐఏ అధికారులే రెండు రోజుల కిందట గాజువాకలోని అతని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. ఆయన చెప్పిన వివరాలను మొత్తం రికార్డు చేశారు. శ్రీనివాసరావు ఎలా పరిచయం, ఎన్వోసీ లేకుండా ఎలా ఉద్యోగంలోకి తీసుకున్నారు. అతను రెస్టారెంట్లోనే కత్తులు దాచినా ఎందుకు గమనించలేదని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. -
విచారణ ముమ్మరం
అది 2018 అక్టోబర్ 25. నయవంచక పాలనపై సమరభేరి మోగిస్తూ... ప్రజాసమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర అశేష జనవాహిని నడుమ విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువలో సాగుతోంది. ఆ రోజు మొదటిపూట యాత్ర పూర్తి చేసుకుని హైదరాబాద్‌లో కోర్టుకు హాజరయ్యేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు అధినేత చేరుకున్నారు. ఇంతలో ఓ దుండగుడు ఆయన్ను హతమార్చేందుకు కత్తితో దాడిచేశాడు. అనుకోని సంఘటనతో ఆయన చుట్టూ ఉన్నవారు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. దానికి సంబంధించిన కేసు నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు ప్రయత్నిస్తుంటే... ఎన్ఐఏ మాత్రం కేసు మూలాల దర్యాప్తులో తలమునకలై ఉంది. సాక్షిప్రతినిధి, విజయనగరం: రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న నాయకుడు, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి. ఆయన్ను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలన్నదే ప్రత్యర్థుల వ్యూహం. అందుకు వేదికయ్యింది విశాఖ ఎయిర్‌పోర్టు. రెస్టారెంట్లో పనిచేసే ఓ యువకుడిని అందుకు పావుగా వాడుకున్నారు. వాడిచేత హతమార్చాలని యత్నించారు. కానీ ఆ కుట్ర ఫలించలేదు. ప్రజల ఆశీస్సులు, భగవంతుని కృపవల్ల అంత పెద్ద గండం నుంచి జగన్ బయటపడగలిగారు. అంతటి నాయకుడిపై జరిగిన హత్యాయత్నం కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. చకచకా కేసు విచారణ సాగిస్తోంది. దానిలో భాగంగా ప్రత్యక్ష సాక్షులను శనివారం విశాఖ పిలిపించి విచారించింది. వారిలో జిల్లాకు చెందిన సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కూడా ఉన్నారు. వీరిద్దరూ ఎన్ఐఏకు తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. అసలేం జరిగిందంటే... రాష్ట్రంలో సాగుతున్న నయవంచక పాలనపై సమరభేరి మోగిస్తూ... ప్రజలు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు విపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర 294వ రోజైన గతేడాది అక్టోబర్ 25న సాలూరు నియోజకవర్గంలోని మక్కువ మండలంలో కొనసాగింది. చప్పబుచ్చమ్మపేట క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరం నుంచి పాదయాత్ర ప్రారంభించిన జగన్ పాయకపాడు మీదుగా మక్కువ మండల కేంద్రం శివారు వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి చేరుకుని ముగించారు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన వెంట సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, పార్టీ జిల్లా రాజకీయవ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కూడా ఉన్నారు. జగన్‌తో సెల్ఫీ దిగే నెపంతో దగ్గరకు వచ్చిన శ్రీనివాసరావు అనే దుండగుడు కోడి పందాలకు వాడే పదునైనకత్తితో జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో జగన్ భుజానికి తీవ్ర గాయమైంది. ఈ సమయంలో అక్కడే ఉన్న మజ్జి శ్రీనివాసరావు, మరికొందరు పార్టీ నేతలు కలిసి నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు ఉపయోగించిన ఆయుధాన్ని మాత్రం స్థానిక పోలీసులకు ఇవ్వలేదు. ఎయిర్‌పోర్టు భద్రతా విభాగం అధికారులకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మొదటినుంచీ అనుమానాలు ప్రతిపక్షనేతపై హత్యాయత్నం ఘటనపై రాష్ట్ర ప్ర భుత్వం, డీజీపీ స్పందించిన తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక్కడి పోలీసుల దర్యాప్తుపై నమ్మకం కోల్పోయిన వీరు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ‘సిట్’ అధికారులకు మజ్జి శ్రీను, రాజన్నదొర ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదు. అనంతర పరిణామాల్లో కేసు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) చేతికి వెళ్లింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ దర్యాప్తు చేస్తుండటంతో మరలా పార్టీ ఆదేశాలను అనుసరించి వీరు ఎన్ఐఎకు సహరించేందుకు సిద్ధపడ్డారు. మరోవైపు ఎన్ఐఏ కూడా విచారణకు హాజరుకావాల్సిందిగా వీరికి నోటీసులు జారీచేయడంతో విశాఖ వెళ్లి అక్కడి ఎన్ఐఏ అధికారుల బృందానికి పూర్తిగా వాంగ్మూలం ఇచ్చారు. ఎన్ఐఏ ఎప్పుడు పిలిచినా విచారణకు రావడానికి తాము సిద్ధమని, తమ నాయకుడిపై జరిగిన హత్యాయత్నం వెనుక ఎంతటి పెద్దవాళ్లున్నా వారికి చట్టప్రకారం శిక్షపడేలా ఎన్ఐఏ చేస్తుందనే నమ్మకం తమకుందని తెలిపారు. సామాన్యుల పరిస్థితేంటి ఎవరిపై హత్యాయత్నం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలి. కానీ ఓ పార్టీకి అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే ప్రభుత్వమే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం ఎందుకు చేయాలనుకుంటోందో ప్రజలు అర్ధం చేసుకోవాలి. చట్టప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎన్ఐఏను నియమించింది. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడి కేసు దర్యాప్తును అడ్డుకోవడానికి న్యాయ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయడం, ఎన్ఐఏకు సహకరించకపోవడం చూస్తుంటే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఎన్ఐఏ ద్వారా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. – పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు. కుట్రదారులంతా బయటికొస్తారు ఆ రోజు ఎయిర్‌పోర్టులో జరిగిన ప్రతి విషయాన్నీ ఎన్ఐఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. వారు మా వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఎన్ఐఏ విచారణను అడ్డుకోమని, విచారణే వద్దని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వేస్తే న్యాయస్థానం వారికి అనుకూలంగా స్పందించకుండా వాయిదా వేయడాన్ని స్వాగతిస్తున్నాం. జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును నీరుగార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఘటన వెనుక ఉన్న రాష్ట్ర పెద్దలు, కుట్ర దారులంతా ఎన్ఐఏ విచారణ ద్వారా బయటకు రావడం తథ్యం. – మజ్జి శ్రీనివాసరావు, జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త, విజయనగరం -
ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ను రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు, తదనుగుణంగా ఎన్ఐఏ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను చట్ట విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్, ఎన్ఐఏ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రస్తుతం హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై హౌస్‌మోషన్ (న్యాయమూర్తి ఇంటి వద్ద)రూపంలో విచారణ జరపాలని అభ్యర్థించారు. అయితే హౌస్‌మోషన్‌గా విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. అత్యవసరంగా విచారించాల్సినది ఈ వ్యాజ్యంలో ఏమీ లేదని తేల్చి చెప్పింది. సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం నుంచి హైకోర్టు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై ఆ రోజు న్యాయమూర్తి ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. హత్యాయత్నం చిన్న విషయం... జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో చాలా చిన్న విషయంగా అభివర్ణించింది. ఇంత చిన్న విషయంపై కేంద్ర ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. శాంతి, భద్రతల వ్యవహారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని, ఇందులో జోక్యం చేసుకునే అధికారం కేంద్రానికి లేదని తన 13 పేజీల పిటిషన్లో పేర్కొంది. ఎన్ఐఏ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించినపుడు అందుకు కారణాలను తెలియచేయాలంది. అయితే ఈ కేసు విషయంలో తన ఉత్తర్వులో ఎటువంటి కారణాలను పేర్కొనలేదని తెలిపింది. జగన్‌పై జరిగిన దాడిని చాలా చిన్న విషయంగా తాము భావిస్తున్నామని తెలిపింది. దీనికీ పౌర విమానయాన భద్రతకూ ఎటువంటి సంబంధం లేదని వివరించింది. కేంద్ర హోంశాఖ ఉత్తర్వు, ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ చట్ట విరుద్ధమని, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని ఆరోపించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తునకు సంబంధించిన రికార్డులను, ఇతర మెటీరియల్‌ను స్వాధీనం చేయాలని ఎన్ఐఏ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తున్నామని తెలిపింది. ఈ కేసులో ఉన్న అత్యవసరం దృష్ట్యా దీనిపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు, ఎన్ఐఏ ఎఫ్ఐఆర్కు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించింది. -
ఠాణేల్లంకలో ఎన్ఐఏ విచారణ
ముమ్మిడివరం/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన జనుపల్లి శ్రీనివాసరావు స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేల్లంకలో రెండో రోజు శనివారం కూడా ఎన్ఐఏ అధికారులు విచారణ నిర్వహించారు. గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న ఎన్ఐఏ బృందం.. సీఐ మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో మరో ముగ్గురు అధికారులు శుక్రవారం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను విచారించారు. రెండో రోజు శనివారం ఠాణేల్లంకలో వీఆర్వో భాస్కరరావు సమక్షంలో శ్రీనివాసరావుకు ఉత్తరం రాసిన సోదరి విజయదుర్గను, జగన్‌తో కలిసి ఉన్న ఫ్లెక్సీ వేయించిన శ్రీనివాసరావు స్నేహితుడు, విజయదుర్గ రాసిన ఉత్తరాల జిరాక్స్ కాపీలు తీసిన జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు జె.శివసుబ్రహ్మణ్యంను విచారించారు. శ్రీనివాసరావు ప్రవర్తనపై గ్రామంలో పలువురు యువకులను విచారించారు. నిందితుడి తండ్రి తాతారావు, తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజులకు సంబంధించి ఆస్తి వివరాలు, బ్యాంకు అకౌంట్లు, ఇతర ఆర్థిక లావాదేవీలపై విచారణ చేశారు. నిందితుడిపై గతంలో ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలు, ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగంలో చేరే సమయంలో ఎన్ఓసీ కోసం శ్రీనివాసరావు పోలీస్‌స్టేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడా.. లేదా.. తదితర వివరాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని పోలీసులను కోరినట్లు తెలిసింది. మీరైనా నిజాయితీతో విచారించి దోషులను పట్టుకోండి ‘మీపై నమ్మకంతో వచ్చాం.. ఏం జరిగిందో మొత్తం చెబుతాం.. నిజాయితీతో విచారణ చేపట్టి దోషులను పట్టుకోండి. కుట్రదారులను, సూత్రధారులను బయటపెట్టండి’ అంటూ ఎన్ఐఏ అధికారులను వైఎస్సార్సీపీ నేతలు కోరారు. శనివారం మధ్యాహ్నం ఎన్ఐఏ బృందం ఎదుట వారు విచారణకు హాజరయ్యారు. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై హత్యాయత్నం జరిగిన సమయంలో వీవీఐపీ లాంజ్‌లో ఉన్న నేతలందరినీ సాక్షులుగా పేర్కొంటూ ఎన్ఐఏ నోటీసులిచ్చింది. విచారణకు ముందు మళ్ల విజయప్రసాద్ నివాసంలో భేటీ అయిన వైఎస్సార్సీపీ నేతలు ఎన్ఐఏ తాత్కాలిక కార్యాలయంలో సరైన వసతులు లేనందున వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ నివాసంలో విచారణకు హాజరుకావాలని అధికారులు సమాచారమిచ్చారు. ఈ మేరకు పార్టీ నేతలు విచారణకు హాజరయ్యారు. ముగ్గురు అధికారుల బృందం ఒక్కొక్కరితో కనీసం పావుగంట సేపు విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరించింది. ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర, మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కరణం ధర్మశ్రీ, నేతలు మజ్జి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, కేకే రాజు, ఎ.సుధాకర్, జియ్యాని శ్రీధర్, కొండా రాజీవ్‌గాంధీ విచారణకు హాజరయ్యారు. ‘ఆ రోజు ఏం జరిగిందో వివరించాం.. ఎన్ఐఏ అధికారులైనా నిజాలు నిగ్గు తేలుస్తారని భావిస్తున్నాం’ అని నేతలు మీడియాతో చెప్పారు. -
బయటపడుతున్న సిట్ విచారణలో డొల్లతనం
-
హత్యాయత్నం కేసు : ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
-
హత్యాయత్నం కేసు : ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
సాక్షి, విజయవాడ : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. శనివారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఈ పిటిషన్‌కు లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఎన్ఐఏ విచారణను అడ్డుకోవాలని భావించిన చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నానికి బ్రేక్ పడింది. దొడ్డి దారిన ఆర్డర్ తెచ్చే ప్రయత్నం : జగన్ తరఫు న్యాయవాది ఏపీ ప్రభుత్వం హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసి దొడ్డి దారిన ఆర్డర్ తెచ్చే ప్రయత్నం చేసిందని జగన్ తరఫు న్యాయవాది సుజాత శర్మ అన్నారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసిందని ఆమె మీడియాకు వివరించారు. హత్యయత్నం జరిగిన చోటు కేంద్రం పరిధిలో ఉందని చంద్రబాబు మాట్లాడారని, ఇప్పుడేమో కుట్ర ఎక్కడ భయటపడుతుందోనని, ఎన్ఐఏ విచారణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో నిజాన్ని బయటకు రాకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ కేసు విషయంలో సోమవారం తమ వాదనలు బలంగా వినిపిస్తామని చెప్పారు. -
రికార్డులన్నీ ఎన్ఐఏకు ఇవ్వండి
విజయవాడ లీగల్/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/రాజమహేంద్రవరం క్రైం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసుకు సంబంధించి పూర్తి రికార్డులు, మెటీరియల్ ఆబ్జెక్టులను ఎన్ఐఏకు అప్పగించాలని రాష్ట్ర పోలీసులను న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన రికార్డులు, మెటీరియల్ ఆబ్జెక్టులను తమకు ఇవ్వకుండా ఏపీ పోలీసులు సహాయనిరాకరణ చేస్తున్నారని ఎన్ఐఏ అధికారులు న్యాయస్థానంలో గురువారం ప్రత్యేక మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. రికార్డులు ఇవ్వకపోవడంతో నిబంధనల మేరకు 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయలేకపోతున్నామని, దాంతో నిందితుడికి బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఎన్ఐఏ అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మెమోపై విచారించిన విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి రాష్ట్ర పోలీసులు ఇప్పటిదాకా చేసిన దర్యాప్తు వివరాలతో కూడిన నివేదిక, ఆ కేసుకు సంబంధించిన రికార్డులు, మెటీరియల్ ఆబ్జెక్టులను ఎన్ఐఏ అధికారులకు అందజేయాలని విశాఖపట్నం పోలీసు అధికారులను ఆదేశించింది. దీంతో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ తమ దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు మార్గం సుగమమైంది. నిందితుడు శ్రీనివాసరావును విజయవాడ కోర్టుకు తీసుకొస్తున్న ఎన్ఐఏ అధికారులు 25 వరకు నిందితుడి రిమాండ్ పొడిగింపు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు ఈ నెల 25 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడు వారం రోజుల ఎన్ఐఏ కస్టడీ శుక్రవారంతో ముగిసింది. దాంతో ఎన్ఐఏ అధికారులు అతడిని విజయవాడలోని ప్రత్యేక కోర్టలో శుక్రవారం హాజరుపరిచారు. నిందితుడి వైద్య పరీక్షల రిపోర్టులను కూడా దాఖలు చేశారు. ఎన్ఐఏ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారా... ఏమైనా ఇబ్బందులు పెట్టారా అని నిందితుడు శ్రీనివాసరావును న్యాయమూర్తి ప్రశ్నించారు. తనను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదని శ్రీనివాసరావు బదులిచ్చాడు. నిందితునికి ప్రాణహాని ఉందని, విజయవాడ జిల్లా జైలు సురక్షితం కాదని అతడి తరఫు న్యాయవాది సలీం న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయమూర్తి నిందితుడిని జైలులో పరిస్థితుల గురించి అడగ్గా, తనకు విజయవాడ జైలు అయినా రాజమండ్రి జైలు అయిన ఇబ్బంది లేదని తెలిపాడు. దాంతో అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తాను తప్ప మరే న్యాయవాది శ్రీనివాసరావును కలవకూడదంటూ అతడి తరఫు న్యాయవాది సలీం కోర్టులో మెమో దాఖలు చేశారు. తాను లేని సమయంలో శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు 30 గంటలపాటు విచారించారని, ఆ వివరాలను కోర్టువారు పరిగణనలోకి తీసుకోరాదని కోరారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు స్పందిస్తూ.. శ్రీనివాసరావును విచారించడానికి వారంరోజుల కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను అతనికి అందజేయగా విచారణకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని నిందితుడు లిఖితపూర్వకంగా పేర్కొన్నాడని తెలిపారు. శ్రీనివాసరావును కస్టడీకి తీసుకున్న అనంతరం ఫోన్ ద్వారా అతడి తరఫు న్యాయవాది సలీంకు సమాచారం ఇచ్చామని న్యాయస్థానానికి తెలిపారు. 22 పేజీల లేఖపై 23న వాదనలు నిందితుడు శ్రీనివాసరావు విశాఖపట్నం జైలులో రాసిన 22 పేజీల లేఖను జైలు సూపరింటెండెంట్ తీసుకున్నారని అతడి తరఫు న్యాయవాది సలీం న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఆ లేఖను తనకు ఇప్పించాలని కోరుతూ మెమో దాఖలు చేశారు. దీనిపై ఎన్ఐఏ తరఫున ప్రత్యేక పబ్లిక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపించారు. ఆ 22 పేజీల లేఖను కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ ప్రధాన అధికారికి అప్పగించాలని కోరారు. ఆ తరువాతే ఆ లేఖ కాపీని నిందితుడి తరఫు న్యాయవాదికి ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు. దీనిపై ప్రత్యేక మెమో దాఖలు చేయాలని ఎన్ఐఏ తరఫున వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసు విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. కొనసాగుతున్న ఎన్ఐఏ విచారణ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. విశాఖపట్నంలోనే మకాం వేసిన ఎన్ఐఏ అధికారులు గురు, శుక్రవారాల్లో ఘటనాస్థలం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్, పక్కనే ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. కైలాసగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్ఐఏ తాత్కాలిక కార్యాలయంలో కొద్దిరోజులుగా సాక్షులను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ జియ్యాని శ్రీధర్‌ను శుక్రవారం రెండున్నర గంటలపాటు విచారించారు. మూడు రోజుల క్రితం శ్రీధర్‌ను పిలిపించి వైఎస్ జగన్‌పై హత్యాయత్న ఘటన సమయంలో ఏం జరిగిందో వివరాలు నమోదు చేసుకున్న ఎన్ఐఎ అధికారులు శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. ఆ రోజు ఏం జరిగింది? హత్యాయత్నం సమయంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, విచారణకు హాజరు కావాల్సిందిగా ఎన్ఐఏ నుంచి నోటీసులు అందుకున్న మిగిలిన వైఎస్సార్సీపీ నేతలు శనివారం హాజరుకానున్నట్టు సమాచారం. ఆరోగ్యం కుదుటపడ్డాక విచారణకు సహకరిస్తా: హర్షవర్దన్ చౌదరి జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలకంగా భావిస్తున్న తెలుగుదేశం పార్టీ నేత, ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ చౌదరి ఇప్పటివరకు పత్తాలేకుండా పోయిన సంగతి తెలిసిందే. ఎన్ఐఏ విచారణకు హర్షవర్దన్ గైర్హాజరుపై శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో హర్షవర్దన్ శుక్రవారం ఎన్ఐఏ అధికారులకు అందుబాటులోకి వచ్చాడు. తనకు యాక్సిడెంట్ అయి కదల్లేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉన్నానని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత విచారణకు వచ్చి సహకరిస్తానని సమాచారం పంపాడు. ఎన్ఐఎ అధికారులు శుక్రవారం గాజువాకలోని హర్షవర్దన్ ఇంటికి వెళ్లి వీలైనంత త్వరగా విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం. జైలులో శ్రీనివాసరావుకు ప్రత్యేక సెల్ వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును విజయవాడ నుంచి రోడ్డు మార్గం ద్వారా శుక్రవారం రాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పటిష్టమైన బందోబస్తు మధ్య తరలించారు. నిందితుడికి ప్రాణహాని ఉన్న దృష్ట్యా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఇతర ఖైదీలతో కలపకుండా ప్రత్యేకమైన సెల్(గది)లో అతడిని ఉంచుతున్నట్లు జైలు సూపరింటెండెంట్ సాయిరామ్ ప్రకాశ్ తెలిపారు. అతడిని సాధారణ ఖైదీల మాదిరిగానే పరిగణిస్తామని, అయితే ప్రాణహాని ఉందని నిందితుడు కోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు అతడిని ప్రత్యేక సెల్లో ఉంచి, నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక గార్డును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. -
సిట్ తీరుపై ఎన్ఐఎ కోర్టు ఆగ్రహం
-
సిట్ సహాయ నిరాకరణపై కోర్టు ఆగ్రహం..
-
సిట్ సహాయ నిరాకరణపై కోర్టు ఆగ్రహం..
విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో సిట్ సహాయ నిరాకరణపై ఎన్ఐఎ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు సిట్ సహకరించడం లేదని ఎన్ఐఎ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. సిట్ వద్ద ఉన్న వివరాలు, ఆధారాలను ఎన్ఐఎకు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సిట్ ఏసీసీ నాగేశ్వరరావుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు ఈ నెల 25 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే ఎన్ఐఏ దాఖలు చేసిన మెమోపై వాదనలు ఈనెల 23న వింటామని పేర్కొంది. వారం రోజుల ఎన్ఐఏ కస్టడీ ముగియడంతో శ్రీనివాసరావుకు అంతకుముందు అధికారులు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత అతడిని కోర్టులో హాజరుపరిచారు. శ్రీనివాసరావుకు విజయవాడలో భద్రత లేదని అతడి తరపు న్యాయవాది సలీమ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాదిని వివరణ కోరగా రక్షణ కల్పించలేమని ఒప్పుకున్నారు. దీంతో నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. దాంతో శ్రీనివాసరావును రాజమండ్రి జైలుకు తరలించారు. -
శ్రీనివాసరావుకు జ్యుడిషియల్ రిమాండ్
-
శ్రీనివాసరావుకు జ్యుడిషియల్ రిమాండ్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన జనుపల్లి శ్రీనివాసరావుకు ఎన్ఐఏ కోర్టు ఈ నెల 25 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దర్యాప్తుకు రాష్ట్ర పోలీసులు, సిట్ అధికారులు సహకరించడం లేదని ఎన్ఐఏ దాఖలు చేసిన మెమోపై వాదనలు ఈనెల 23న వింటామని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏ, సిట్ అధికారులను ఆదేశించింది. (ఎన్ఐఏకు సిట్ సహాయ నిరాకరణ) వారం రోజుల ఎన్ఐఏ కస్టడీ ముగియడంతో శ్రీనివాసరావుకు అంతకుముందు అధికారులు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత అతడిని కోర్టులో హాజరుపరిచారు. ఎన్ఐఏ అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయమూర్తి అడగ్గా.. ఏం లేదని శ్రీనివాసరావు సమాధానమిచ్చాడు. మీడియాతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలన్న నిందితుడి విజ్ఞప్తిని తిరస్కరించారు. శ్రీనివాసరావుకు విజయవాడలో భద్రత లేదని అతడి తరపు న్యాయవాది సలీమ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాదిని వివరణ కోరగా రక్షణ కల్పించలేమని ఒప్పుకున్నారు. దీంతో నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పటిష్ట భద్రత నడుమ నిందితుడిని రాజమండ్రికి తీసుకెళుతున్నారు. (ఎన్ఐఏ విచారణకు హర్షవర్ధన్ గైర్హాజరు) -
ఎన్ఐఏకు సిట్ సహాయ నిరాకరణ
సాక్షి, అమరావతి బ్యూరో, విజయవాడ లీగల్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం కేసు విచారణకు సంబంధించి రాష్ట్ర పోలీసులు, సిట్ అధికారులు తమకు ఏమాత్రం సహకరించడం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. ఈ మేరకు ఎన్ఐఏ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గురువారం విజయవాడ ఎన్ఐఏ న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. వాదనలను విన్న అనంతరం దీనిపై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. వైఎస్ జగన్‌పై గత ఏడాది అక్టోబరు 25న జరిగిన హత్యాయత్నం తీవ్ర సంచలనం సృష్టించింది. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్లు స్పందిస్తూ కేసును తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కేసు విచారణను స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తెలిసిందే. అనంతరం ఈ కేసుపై విచారణను ఎన్ఐఏకు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చినట్లు కేంద్ర హోం శాఖ న్యాయస్థానానికి నివేదించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చేపట్టిన విచారణకు సంబంధించిన రికార్డులు, మెటీరియల్, వస్తువులను ఎన్ఐఏకు అప్పగించాలని విశాఖ పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే విశాఖ పోలీసులు కేసుకు సంబంధించిన రికార్డులను ఇంతవరకు తమకు అప్పగించకుండా సహాయ నిరాకరణ చేయడంపై ఎన్ఐఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విశాఖ పోలీసులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ తమకు కేసు రికార్డులు, మెటీరియల్, ఆబ్జెక్ట్స్అందించడం లేదని పేర్కొంది. 23లోగా చార్జిషీట్ దాఖలు చేయకుంటే నిందితుడికి బెయిల్! విశాఖ పోలీసు అధికారులు నిందితుడు శ్రీనివాసరావుకు సహకరిస్తున్నారని, తమ విచారణకు మాత్రం సహకరించడం లేదని ఎన్ఐఏ స్పష్టం చేసింది. ఈ కేసులో 90 రోజుల్లోగా అంటే ఈ నెల 23లోగా తాము చార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉందని, లేదంటే నిందితుడు శ్రీనివాసరావు బెయిల్‌పై బయటకు వచ్చే అవకాశం ఉందని ఎన్ఐఏ న్యాయస్థానానికి నివేదించింది. ఈ కేసులో తాము ఎఫ్ఐఆర్ దాఖలు చేసి చాలా రోజులైనా రాష్ట్ర పోలీసు అధికారులు విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని తెలిపింది. రికార్డులు లేకుండా చార్జ్‌షీట్ దాఖలు చేయలేమని కోర్టు దృష్టికి తెచ్చింది. కేసుకు సంబంధించిన రికార్డులు, మెటీరియల్, ఆబ్జెక్ట్లను తమకు అప్పగించేలా విశాఖ పోలీసులను ఆదేశించాలని ఎన్ఐఏ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. మరోవైపు వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు కస్టడీ శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో నేడు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని మరో వారం రోజులు పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ కోరే అవకాశం ఉంది. కుట్ర కోణం వెలుగులోకి వస్తోందనే... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే సూత్రధారులని స్పష్టమవుతోంది. ఈ హత్యాయత్నం కేసులో కుట్ర కోణం వెలుగులోకి వస్తే తమ బండారం బట్టబయలవుతుందని బెంబేలెత్తుతూ రాష్ట్ర పోలీసుల ద్వారా కేసు విచారణను తప్పుదారి పట్టిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ ఈ కేసు విచారణను చేపట్టడంతో సహాయ నిరాకరణ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాజ్యాంగ సూత్రాలను కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం బరితెగించడం విస్మయపరుస్తోంది. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణను కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేపడితే తమ కుట్ర బట్టబయలవుతుందని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ విచారణకు అనుమతిస్తూ గతంలో ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా ఉపసంహరించుకుంది. ఈమేరకు 2018 నవంబరు 8న ప్రత్యేక జీవో జారీ చేసింది. జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణను సీబీఐ చేపట్టకుండా అడ్డుకునేందుకే హడావుడిగా ఈ జీవో ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ‘ఎన్ఐఏ’పై సహాయ నిరాకరణ అస్త్రం న్యాయస్థానం ఆదేశాలతో జగన్‌పై హత్యాయత్నం కేసును విచారిస్తున్న ఎన్ఐఏను సైతం సీఎం చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించడం న్యాయ నిపుణులను విస్మయపరిచింది. ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తూ చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాయడంపై జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ హత్యాయత్నం సూత్రధారులను రాష్ట్ర ప్రభుత్వం రక్షించేందుకు యత్నిస్తోందన్నది దీనిద్వారా మరింతగా ప్రస్పుటమైంది. రాష్ట్ర పోలీసుల సహాయ నిరాకరణపై ఎన్ఐఏ తాజాగా న్యాయస్థానంలో మెమో దాఖలు చేయడం గమనార్హం. రికార్డులను తారుమారు చేసే అవకాశం? న్యాయస్థానం ఆదేశించిన తరువాత నిబంధనల ప్రకారం జగన్‌పై హత్యాయత్నం కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను రాష్ట్ర పోలీసులు ఎన్ఐఏకు అప్పగించాలి. కానీ విశాఖపట్నం పోలీసులు ఇంతవరకు ఆ పని చేయకపోవడం విస్మయపరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బెయిల్‌పై తరలించి మట్టుబెట్టే కుట్ర? వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటన జరిగిన వెంటనే కేసు విచారణ చేపట్టిన విశాఖపట్నం పోలీసులు ఉద్దేశపూర్వకంగానే రెండు నెలలు దాటినప్పటికీ చార్జ్‌షీట్ దాఖలు చేయలేదు. మరోవైపు ఈనెల 9న విచారణ చేపట్టిన ఎన్ఐఏకు రికార్డులు అందించకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారు. దీంతో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేయడంలో జాప్యం జరుగుతోంది. ఈ నెల 23 వరకు ఇలాగే వ్యవహరించి నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ వచ్చేలా చూడాలన్నది ప్రభుత్వ పెద్దల వ్యూహంగా ఉంది. బెయిల్‌పై శ్రీనివాసరావు బయటకు వస్తే తరువాత ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అంతు చిక్కకుండా ఉంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఇప్పటికే నిందితుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. భద్రత లేని బాహ్య ప్రపంచంలోకి శ్రీనివాసరావును తరలించి మట్టుబెట్టేందుకు కుట్ర పన్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ఐఏ దర్యాప్తుపై హైకోర్టుకు సర్కారు! సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణకు ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానంలో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ఐఏ దర్యాప్తుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు అంతా సిద్ధం చేసింది. ప్రస్తుతం హైకోర్టుకు సంక్రాంతి సెలవులు కావడంతో శుక్రవారం లేదా శనివారం హౌస్‌మోషన్ (న్యాయమూర్తి ఇంటి వద్ద విచారణ జరపడం) రూపంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. హౌస్‌మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరిస్తే సోమవారం కోర్టు పునఃప్రారంభమయ్యాక ఈ వ్యవహారంపై వాదనలు వినాలని అభ్యర్థించనుంది. హౌస్‌మోషన్ రూపంలో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తులంతా శనివారం లేదా ఆదివారం అమరావతి చేరుకునే వీలుంది. ఎన్ఐఏ తన దర్యాప్తును ఎప్పుడో ప్రారంభించినందున హౌస్‌మోషన్ రూపంలో విచారణ జరిపే అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. సీఎంతో డీజీపీ ఠాకూర్ భేటీ ఎన్ఐఏ దర్యాప్తుపై సీఎం చంద్రబాబు గురువారం డీజీపీ ఠాకూర్‌తో ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాసినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించి దర్యాప్తును అడ్డుకునే విషయం ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
ఎన్ఐఏ విచారణ.. పత్తా లేకుండా పోయిన హర్షవర్ధన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలకంగా భావిస్తున్న టీడీపీ నాయకుడు, విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి ఎన్ఐఏ విచారణకు గైర్హాజరయ్యారు. కేసు విచారణలో భాగంగా విశాఖలోని కైలాసగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ప్రాంగణంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకున్న ఎన్ఐఏ అధికారులు 3 రోజులుగా సాక్షులను విచారిస్తున్నారు. హత్యాయత్నం జరిగిన గతేడాది అక్టోబర్ 25న ఘటనాస్థలంలో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను కూడా సాక్షులుగా పేర్కొంటూ నోటీసులు పంపగా.. వైఎస్సార్సీపీ కార్యాలయంలో పనిచేసే కృష్ణకాంత్, మాజీ కార్పొరేటర్ జియ్యాని శ్రీధర్ 2 రోజులక్రితం హాజరయ్యారు. నోటీసులందుకున్న మిగతా వైఎస్సార్సీపీ నేతలు సైతం 2 రోజుల్లో విచారణకు హాజరవుతామని సమాచారమిచ్చారు. అయితే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న టీడీపీ నేత, ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి మాత్రం పత్తా లేకుండా పోయారు. ఈ నెల 15 తర్వాత విచారణకు హాజరుకావాలంటూ ఎన్ఐఏ అధికారులు ఆయన ఇంటికి నోటీసులు పంపినట్టు సమాచారం. గురువారం ఆయన హాజరుకావొచ్చని భావించారు. నిజానికి ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ కేంద్రంగానే కుట్ర జరిగిందని, హర్షవర్ధన్ చౌదరికి తెలియకుండా శ్రీనివాసరావు.. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసేంతటి ఘాతుకానికి తెగబడడన్న వాదనలు బలంగా వినిపించినా.. పోలీసులు, సిట్ అధికారులు హర్షవర్ధన్ జోలికే పోలేదు. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏవిచారణకు హర్షవర్ధన్ చౌదరి హాజరైతే కీలక సమాచారం రాబట్టవచ్చన్న వాదనలు వినిపించాయి. దీంతో గురువారమే హర్షవర్ధన్ విచారణకు హాజరు కావొచ్చన్న ప్రచారంతో పెద్దఎత్తున మీడియా ఎన్ఐఏ తాత్కాలిక కార్యాలయం వద్ద గుమిగూడింది. అయితే హర్షవర్ధన్ సహా రెస్టారెంట్లో పనిచేసే సిబ్బంది ఎవ్వరూ హాజరుకాలేదు. పైగా హర్షవర్ధన్ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతోపాటు కొద్దిరోజులుగా పత్తా లేకుండా పోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల మంత్రి యనమల నగరానికి వచ్చినప్పుడు హల్చల్ చేశాడని, ఆ తర్వాత నుంచి కానరావట్లేదని టీడీపీ నేతలే చెప్పుకొస్తుండడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల అండతోనే హర్షవర్ధన్ పత్తా లేకుండా పోయారన్న వాదన వినిపిస్తోంది. దీనిపై ఎన్ఐఏ వర్గాలు మాట్లాడుతూ.. ఒకటి, రెండు రోజులు చూసి అప్పటికీ హర్షవర్ధన్ విచారణకు రాకుంటే ఏం చేయాలో నిర్ణయిస్తామని చెప్పాయి. -
ఎన్ఐఏ విచారణకు అడ్డుతగులుతున్న ఏపీ ప్రభుత్వం
-
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు.. సీఎం-డీజీపీ భేటీ
సాక్షి, అమరావతి : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై ఏపీ ప్రభుత్వం అడుగడునా అడ్డుతగులుతోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు డీజీపీ ఠాకూర్ భేటీ అయ్యారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై జరిగిన హత్య కేసును ఎన్ఐఏకు అప్పగించడం, హైకోర్టులో వేసిన పిటిషన్ చర్చించినట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం రేపు హైకోర్టులో పిటిషన్ వేయాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన విచారణకు ఏపీ సిట్ అధికారులు సహకరించకపోవడంపై ఆగ్రహించిన ఎన్ఐఏ అధికారులు విజయవాడ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు.. ఎన్ఐఏ విచారణకు సిట్ నిరాకరణ
సాక్షి, విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం అడ్డుతగులుతోంది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ చేపట్టినా కేసు రికార్డులు అందజేసేందుకు సిట్ నిరాకరిస్తోంది. ఎన్ఐఏకు అప్పగించిన ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను అప్పగించేందుకు ఏపీ సిట్ అధికారులు నిరాకరిస్తున్నారు. ఈమేరకు ఎన్ఐఏ అధికారులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ తీరుపై మండిపడ్డ ఎన్ఐఏ అధికారులు పిటిషన్ దాఖలు చేయడంతో.. కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. -
ఏం జరిగిందో చెప్పండి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం ఘటన కేసు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు దూకుడు పెంచారు. ముందుగా నిందితుడు శ్రీనివాసరావును కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకుని, విశాఖపట్నం విమానాశ్రయంలోని ఘటనా స్థలానికి తీసుకువచ్చి విచారణ చేపట్టిన అధికారులు ఇప్పుడు ఆ కేసులోని సాక్షుల విచారణను ముమ్మరం చేశారు. విశాఖ నగరం కైలాసగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ప్రాంగణంలో నాలుగు రోజులుగా ఎన్ఐఏ అధికారులు మకాం వేశారు. అక్కడే తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. సంక్రాంతి సెలవులు కూడా లేకుండా నిర్విరామంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బయటి నుంచి కాఫీ తేవొద్దన్నారు వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను కూడా సాక్షులుగా పేర్కొంటూ విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో పనిచేసే కృష్ణకాంత్‌ను మంగళవారం మధ్యాహ్నం ఎన్ఐఏ అధికారులు పిలిపించి రెండుగంటలకు పైగా విచారించారు. అదేవిధంగా వైఎస్సార్సీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ జియ్యాని శ్రీధర్‌ను మంగళవారం సాయంత్రం పిలిపించి విచారించారు. ‘‘ఉత్తరాంధ్రలో ప్రజా సంకల్పయాత్ర నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేసినప్పుడు మా ఇంటి నుంచి నేనే కాఫీ తీసుకువెళ్లేవాడిని. హత్యాయత్న ఘటనకు సరిగ్గా వారం ముందే బయటి నుంచి కాఫీ వద్దంటూ ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ చౌదరితో చెట్టాపట్టాలు వేసుకుతిరిగే ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వేణుగోపాల్ అడ్డుకున్నారు. మా ఇంటి నుంచి తెచ్చిన కాఫీని సర్వ్ చేసిన ఇద్దరు ఎయిర్ ఇండియా సిబ్బందిని వారంపాటు సస్పెండ్ చేశారు. ఫ్యూజన్ ఫుడ్స్ నుంచే తేవాలని షరతు విధించారు. సరిగ్గా ఆ వారమే ప్రతిపక్ష నేతపై శ్రీనివాసరావు కత్తితో దాడి చేశాడు’’ అని శ్రీధర్ ఎన్ఐఏ అధికారులకు వివరించారు. ‘‘కేసు దర్యాప్తు చేసిన ‘సిట్’ అధికారులు, విశాఖ పోలీస్ ఉన్నతాధికారులు మాకు ఏమాత్రం సహకరించలేదు. ఆ కేసు గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు. అందుకే మీరైనా ఏం జరిగిందో చెప్పండి’’ అని ఎన్ఐఎ అధికారులు విచారణకు హాజరైన సాక్షులతో అన్నట్టు సమాచారం. ఆ లేఖపైనా విచారణ నిందితుడు శ్రీనివాసరావు వద్ద లభ్యమైనట్టు పోలీసులు చెబుతున్న 11 పేజీల లేఖపై కూడా ఎన్ఐఏ అధికారులు విచారణ సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే లేఖలో 2 పేజీలు రాసినట్టు చెబుతున్న ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్లో శ్రీనివాసరావు సహోద్యోగి రేవతీ ప్రసాద్‌ను అధికారులు బుధవారం పిలిపించి సుదీర్ఘంగా విచారించారు. ఆ లేఖ ఎవరు రాశారు? నిజంగా నువ్వే రాశావా? వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన సమయంలో లేఖ శ్రీనివాసరావు వద్దనే ఉందా? లేదా? ఆ తర్వాత పుట్టించారా? ఇలా పలు కోణాల్లో రేవతీ ప్రసాద్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. హర్షవర్దన్ చౌదరికి నోటీసులు జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలకంగా భావిస్తున్న టీడీపీ నాయకుడు. ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని టి.హర్షవర్దన్ చౌదరి సహా రెస్టారెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఇతర సాక్షులు మొత్తం 15మందిని గురు, శుక్రవారాల్లో విచారణకు హాజరు కావాల్సిందిగా ఎన్ఐఏ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. హర్షవర్దన్ చౌదరిని ప్రశ్నిస్తే కీలక సమాచారం లభ్యమవుతుందని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. -
ఎన్ఐఏ రావడానికి వీల్లేదు
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలోకి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రావటానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసుపై దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రం హక్కులను కేంద్రం లాక్కొంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు సోమవారం తన స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు చేరుకున్నారు. రెండు రోజులపాటు గ్రామంలోనే ఉండి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. అమరావతికి తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సొంత గ్రామంలో పండుగ జరుపుకునే సంప్రదాయాన్ని తన భార్య భువనేశ్వరి 20 ఏళ్ల క్రితమే ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. సంక్రాంతిని అడ్డం పెట్టుకుని జూదాలు ఆడడం మంచిది కాదన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కూడా చెయ్యని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టామన్నారు. ప్రస్తుతం ఏపీలో వందశాతం అభివృద్ధి చేశామని, సమస్యలన్నీ పరిష్కరించామని తెలిపారు. ఇక ఉన్నవన్నీ వ్యక్తిగత సమస్యలేనని చెప్పారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఎన్ఐఏ చేపడుతున్న విచారణపై విలేకరులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోకి ఎన్ఐఏ రాకూడదన్నారు. రాష్ట్రానికి ఉన్న హక్కులను కేంద్రం లాక్కుంటోందని ఆరోపించారు. హక్కుల కోసం పోరాడుతామన్నారు. షర్మిల తెలంగాణలో ఎందుకు ఫిర్యాదు చేశారో? వైఎస్ షర్మిలకు ఏమైందని తెలంగాణలో ఫిర్యాదు చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదనడం సమంజసం కాదన్నారు. షర్మిల తెలంగాణలో ఎందుకు ఫిర్యాదు చేశారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎవరూ వేలెత్తి చూపని క్యారెక్టర్ తనదని పేర్కొన్నారు. మీరు ఎప్పుడూ పొత్తులు లేకుండా ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు కదా? ఈసారి ఎవరితో పొత్తుపెట్టుకోనున్నారు? అని ఓ విలేకరి ప్రశ్నించగా... టీడీపీ ఒంటరిగా కూడా పోటీచేసిందని, ఒకసారి వెనక్కి వెళ్లి చూడమన్నారు. ‘రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిందని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. ఇప్పుడు బీజేపీ విభజన హామీలను అమలు చేయలేదు. అందుకే కాంగ్రెస్‌తో కలిశాం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం రూ.75 వేల కోట్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు ఇబ్బందులే ఉండేవి కావన్నారు. కేసీఆర్‌తో కలిసి ప్రత్యేకహోదా తీసుకొస్తామని వైఎస్ జగన్ చెబుతున్నారని, మరి ప్రధాని నరేంద్రమోదీని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. -
‘ఎయిర్‌పోర్టులోకి కత్తి ఎలా వచ్చింది.. ఎవరు తెచ్చారు’
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఐదోరోజు విచారించింది. నిందితుడి విచారణ న్యాయవాదుల సమక్షంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఐదోరోజు విచారణలో భాగంగా నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును న్యాయవాది సలీం సమక్షంలో విశాఖపట్నంలోని కైలాసగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విచారించారు. (కొనసాగుతున్న శ్రీనివాస్ విచారణ) శ్రీనివాస్ 20 మంది యువతులతో మాట్లాడిన కాల్ డేటా వివరాలపై ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారని న్యాయవాది సలీం తెలిపారు. ‘ఎయిర్‌పోర్టులోకి కత్తి ఎలా వచ్చింది. ఎవరు తెచ్చారు’ అనే అంశాలపై శ్రీనివాస్‌కు ప్రశ్నించారని పేర్కొన్నారు. శ్రీనివాస్ కాల్ డేటాను అధికారులు పరిశీలించారని చెప్పారు. మిగిలిన రెండు రోజులు శ్రీనివాస్‌ను ఎక్కడ విచారస్తారనేది ఎన్ఐఏ ఇంకా చెప్పలేదని సలీం బుధవారం మీడియాకు చెప్పారు. కాగా, వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన రోజు ఎయిర్ పోర్ట్ లాంజ్ వద్ద ఉన్న ఇద్దరి వ్యక్తుల నుంచి ఎన్ఐఏ అధికారులు వివరాలు సేకరించినట్టు సమాచారం. -
కొనసాగుతున్న శ్రీనివాస్ విచారణ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తమ కార్యాలయంలో నాలుగో రోజు విచారిస్తోంది. న్యాయవాదుల సమక్షంలో నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాసరావుతో పాటు పలువురిని ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఆధారాలు ముందుంచి నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాసరావు చెప్పే విషయాలను రికార్డ్ చేస్తున్నారు. ఎన్ఐఏ డీఐజీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. మరో మూడు రోజుల పాటు నిందితుడు ఎన్ఐఏ కస్టడీలో ఉండనున్నాడు. ఎన్ఐఏ అధికారులతో కూడిన మరో బృందం విశాఖపట్నంలో విచారణ జరుపుతోంది. శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి బాగుందని అతడి తరపు న్యాయవాది సలీం తెలిపారు. విచారణ కోసం శ్రీనివాస్‌ను మరోసారి విశాఖపట్నం తీసుకెళ్లే అవకాశం లేదని, మిగతా మూడు రోజులు హైదరాబాద్‌లోనే విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. (వైఎస్ జగన్‌పై హత్యాయత్నం వెనుక ఎవరున్నారు?) -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం వెనుక ఎవరున్నారు?
సాక్షి, అమరావతి/సాక్షి,హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారించింది. విశాఖ విమానాశ్రయంలో గతేడాది అక్టోబర్ 25న హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావును కస్టడీకి తీసుకున్న ఎన్ఐఏ మూడో రోజు పలు కీలక అంశాలపై ప్రశ్నించినట్టు సమాచారం. తొలుత హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాక విచారణ కొనసాగించారు. మాదాపూర్‌లోని ఎన్ఐఏ కార్యాలయంలో శ్రీనివాస్‌రావును అతని న్యాయవాది సమక్షంలోనే ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. జగన్‌పై హత్యాయత్నం ఎందుకు చేశావు.. వెనుక ఎవరున్నారనే దానిపై విచారించారు. శ్రీనివాసరావు కాల్ డేటాను పరిశీలించి, వాటికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పలు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. ఒక్క సంవత్సరంలో వందలాది సిమ్ కార్డులు, పదుల సంఖ్యలో సెల్ఫోన్లు మార్చడం వెనకున్న ఆంతర్యమేంటని ప్రశ్నించినట్టు తెలిసింది. టీడీపీ నేతతో శ్రీనివాసరావు ఫోన్ కాల్స్‌పై దృష్టి: జగన్‌పై హత్యాయత్నం చేయడానికి ముందుగా జరిగిన బ్యాంకు లావాదేవీలపై ఆరా తీసినట్టు తెలిసింది. ఎయిర్ పోర్టులో ఫ్యూజన్‌ఫుడ్స్ యజమాని వద్ద పనికి కుదిర్చిందెవరు? సంబంధిత టీడీపీ నేతతో శ్రీనివాస్‌రావుకు జరిగినట్టు భావిస్తున్న ఫోన్ కాల్స్ సంభాషణలపైనా దర్యాప్తు అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లేందుకు ఇచ్చే అనుమతి పాస్ తాత్కాలికమైనా క్రిమినల్ కేసులున్న వ్యక్తికి ఎలా ఇచ్చారు? తాత్కాలిక పాస్ ఇప్పించిందెవరన్న అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పాస్‌కు సిఫారసు లేఖతో పాటు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులు ఎవరన్నది ఎన్ఐఏ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. హత్యాయత్నం చేయడానికి ఎవరైనా పురిగొల్పారా? అనే కోణంపై దృష్టి సారించినట్టు తెలిసింది. విచారణలో భాగంగా నిందితుడు చెప్పిన వివరాలను రికార్డు చేశారు. శ్రీనివాసరావు కస్టడీలో నాల్గో రోజైన మంగళవారం మరోసారి విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లేందుకు ఎన్ఐఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం శ్రీనివాసరావును తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. నేర స్థలంలో మరికొన్ని అదనపు వివరాలు సేకరించే విషయంపై ఎన్ఐఏ అధికారులు దృష్టిసారించారు. ఎన్ఐఏ డీఐజీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగింది. -
లోతుగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు సోమవారం హైదరాబాద్‌లో విచారించారు. న్యాయవాదుల సమక్షంలో అతడిని ప్రశ్నించారు. ఎన్ఐఏ డీఐజీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగింది. నిందితుడి స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేశారు. వైఎస్ జగన్‌పై దాడి ఎందుకు చేశావు, దాడి వెనుక ఎవరున్నారనే దానిపై లోతుగా విచారించారు. శ్రీనివాసరావు కాల్ డేటాను పరిశీలించి, దీనిపై ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. నేటితో నిందితుడి మూడో రోజు కస్టడీ ముగిసింది. క్రైం సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా రేపు మరోసారి విశాఖపట్నం విమానాశ్రయానికి తీసుకెళ్లి విచారించే అవకాశముందని తెలుస్తోంది. నిందితుడిని వారం రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం ఉదయం అతడిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం విశాఖపట్నంలో అతడిని విచారించారు. (శ్రీనివాసరావుపై ఎన్ఐఏ ప్రశ్నల వర్షం) -
ఎన్ఐఏ విచారణపై ఉలుకెందుకు?
ఒంగోలు సిటీ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసును ఎన్ఐఏ విచారిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు ఉలుకెందుకని వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ప్రశ్నించారు. దీనిపై ప్రధానికి సీఎం లేఖ రాయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆదివారం ఒంగోలులోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్ఐఏ దర్యాప్తుతో ప్రభుత్వ పెద్దల కుట్రలు బయటకొస్తాయన్న ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రత్యేక హోదాపై లేఖ రాయడానికి నాలుగేళ్ల ఎనిమిది నెలలపాటు స్పందించని చంద్రబాబు.. ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏకి అప్పగించిన గంటల వ్యవధిలోనే స్పందించి ప్రధానికి లేఖ రాయడం భయం పట్టుకున్నందువల్లేనని వైవీ అన్నారు. ఈ కుట్ర వెనుక సీఎం, డీజీపీ స్థాయి వారితోపాటు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల పాత్ర ఉందన్నారు. ఎన్ఐఏ విచారణను ఎలా ఆపాలి, ఎలా అడ్డుకోవాలని చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే చిన్న సంఘటనగా చంద్రబాబు, డీజీపీ పేర్కొనడం వెనుక ఆంతర్యాలున్నాయని, నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తేనే ఈ కుట్రలోని వ్యక్తులు, పాత్రధారుల వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. న్యాయంకోసం హైకోర్టును ఆశ్రయించామన్నారు. చంద్రబాబుకు హైకోర్టుపై గౌరవ, మర్యాదలు లేవన్నారు. హైకోర్టు ఎన్ఐఏ విచారణకు కేసును ఇవ్వమంటే చంద్రబాబు అవసరం లేదని కోర్టు ఆదేశాల్నే ధిక్కరించే పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. ఎన్ఐఏ ఈ కేసులోని పెద్దలను కుట్రదారుల నిగ్గు తేలుస్తుందని, అప్పుడు తెలుస్తుంది ఇది కోడికత్తా.. చంద్రన్న కత్తా అనేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో దోపిడీ, రాక్షస పాలన సాగుతోందన్నారు. వ్యవస్థల్ని చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నారని, రాష్ట్రాన్ని అన్నివిధాలుగా భ్రష్టు పట్టించారని విమర్శించారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. -
జగన్‌పై హత్యాయత్నం కుట్రలో బాబు పాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కుట్రలో సీఎం చంద్రబాబు పాత్ర ఉంది కాబట్టే.. ఎన్ఐఏ విచారణతో నిజాలు బయటపడతాయని ఆయనకు చెమటలు పడుతున్నాయని రాష్ట్ర బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. ఘటన విశాఖ విమానాశ్రయంలో జరిగింది కాబట్టి.. అది కేంద్రం పరిధిలోదని చెప్పి కేసు విచారణతో తమకు సంబంధం లేదన్న చంద్రబాబు.. ఇప్పుడు కేసును ఎన్ఐఏ విచారిస్తుంటే ఎందుకు అంతలా ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కో ఇన్చార్జ్ సునిల్ దియోధర్, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆదివారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్‌పై దాడి కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు వ్యవహారశైలిపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమల హత్య కేసును ఎన్ఐఏకు అప్పగించినప్పుడు ఎన్ఐఏపై విశ్వాసం వ్యక్తం చేసిన బాబు.. జగన్ కేసు విచారణకొచ్చే సరికి రాష్ట్ర సంబంధాల్లో కేంద్రం జోక్యం ఎందుకు? అని అంటున్నారని ధ్వజమెత్తారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న బాబు : కన్నా ఒకే విషయంపై రోజుకోరకంగా మాట్లాడుతున్న చంద్రబాబు పరిస్థితి చూస్తే ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు అర్థమవుతోంది. జగన్‌పై దాడి కేసుతో తమకు సంబంధం లేదని ఘటన జరిగిన రోజు మీడియా ముందు చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆ కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగిస్తే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మానసిక వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు సీఎంగా ఉండడం ప్రమాదకరం. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో 600 హామీలు ఇచ్చి అన్ని వర్గాలను మోసం చేశారు. బీజేపీకి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్: సునిల్ దియోధర్ ‘కేంద్రం ఏపీకి ఏం చేయలేదంటూనే ఇప్పటి వరకు చేసిన మేలుపై పరోక్షంగా ప్రచారం కల్పిస్తున్న చంద్రబాబే ఏపీ బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్. కేంద్రం ఇచ్చిన నిధులను జన్మభూమి కమిటీలోని దొంగలు దోచుకుంటూ.. గజదొంగైన చంద్రబాబుకు దోచిపెడుతున్నారు. అమిత్‌షా ఈ నెల 18 కడప, ఫిబ్రవరి ఒకటిన వైజాగ్‌లలో పర్యటించి పార్టీశ్రేణులతో సమావేశమవుతారు. అప్పుడు మంచివి.. ఇప్పుడు చెడ్డవా? : జీవీఎల్ తన ప్రత్యర్థులపై ఎన్ఐఏ, సీబీఐలు కేసులు నమోదు చేస్తే దర్యాప్తు సంస్థలన్నీ బాగా పనిచేసినట్టు.. తన మనుషులపై కేసులు పెడితే మాత్రం బాబు సహించరు. ఏకంగా సీబీఐనే రాష్ట్రంలో నిషేధించారంటే చంద్రబాబు ఏ స్థాయిలో తప్పులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. -
నిందితుడు శ్రీనివాసరావుపై ఎన్ఐఏ ప్రశ్నల వర్షం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం /హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఆదివారం విశాఖపట్నంలో విచారించారు. అనంతరం విమానంలో హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి తరలించారు. విజయవాడ కోర్టు అనుమతితో శనివారం ఎన్ఐఏ సిబ్బంది శ్రీనివాసరావును తమ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. విజయవాడ జైలు నుంచి అదేరోజు అర్ధరాత్రి దాటాక విశాఖపట్నం బక్కన్నపాలెంలోని ఏపీఎస్పీ బెటాలియన్‌కు తీసుకొచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు శ్రీనివాసరావును అతడి న్యాయవాది అబ్దుల్ సలీం సమక్షంలో విచారించారు. తర్వాత తెల్లచొక్కా, నల్ల ప్యాంటు ధరించిన నిందితుడిని అక్కడి నుంచి 3.45 గంటల సమయంలో ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ వాహనంలో విశాఖపట్నం విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడ అతడికి ముసుగు వేసి ఎయిర్‌పోర్టులోకి తీసుకెళ్లారు. లోపలకు వెళ్లాక ముసుగు తొలగించారు. క్రైం సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరిగిన వీఐపీ లాంజ్‌లోకి శ్రీనివాసరావును వెంటబెట్టుకుని వెళ్లారు. అక్కడ అతడిని పలు అంశాలపై ప్రశ్నించారు. ఘటన జరిగిన తీరుతెన్నులను ఆరా తీశారు. ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లోని నేరస్థలం, కత్తిని భద్రపరిచిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీనివాసరావు పనిచేసిన తెలుగుదేశం పార్టీ నేత హర్షవర్దన్ ప్రసాద్ చౌదరికి చెందిన ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్‌కు తీసుకెళ్లారు. దాదాపు 20 నిమిషాలపాటు అక్కడ ఉన్నారు. రెస్టారెంట్లో నిందితుడు విధులు నిర్వహించిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఏయే పనులు చేసేవాడివని ప్రశ్నించారు. వారిద్దరూ అక్కడ లేరు నిందితుడు శ్రీనివాసరావును విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో విచారణకు తీసుకొచ్చిన సమయంలో ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని, టీడీపీ నేత హర్షవర్దన్ ప్రసాద్ చౌదరి అక్కడ లేరు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్‌పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వేణుగోపాల్ కూడా లేరు. నిందితుడిని ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చే సమయంలోనూ విశాఖపట్నం పోలీసు అధికారులెవరూ వెంట రాలేదు. హైదరాబాద్‌కు తరలింపు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో శ్రీనివాసరావును దాదాపు రెండు గంటల పాటు ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా దుబాయ్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో నిందితుడిని వెంటబెట్టుకుని హైదరాబాద్‌కు పయనమయ్యారు. శ్రీనివాసరావు వెంట ఎన్ఐఏ అధికారులు సాజిద్ మహ్మద్, ప్రసాద్, మరో అధికారి ఉన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి భారీ బందోబస్తు మధ్య శ్రీనివాసరావును మాదాపూర్‌లోని ఎన్ఐఏ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. వారంరోజుల పాటు నిందితుడిని కస్టడీకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం వెనుకున్న కారణాలు, సూత్రధారుల పాత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు మాదాపూర్ కార్యాలయంలోనే విచారణ జరుపనున్నట్టు తెలిసింది. ముందుగా అనుకున్నట్టు విజయవాడ లేదా విశాఖపట్నంలోనే నిందితుడిని విచారించాలని భావించారు. అయితే, అక్కడి పరిస్థితులు అనుకూలించకపోవడంతో తమ కార్యాలయంలోనే విచారించడం మంచిదని నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా మాదాపూర్‌లోని కార్యాలయంలోనే మిగిలిన విచారణ కొనసాగించాలని యోచిస్తున్నారు. నన్ను హైదరాబాద్‌కు రమ్మన్నారు శ్రీనివాసరావును హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారిస్తామని, విచారణ సమయంలో అక్కడికి రావాలని అధికారులు తనకు చెప్పారని నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది అబ్దుల్ సలీం పేర్కొన్నారు. తాను సోమవారం ఉదయం హైదరాబాద్ పయనమవుతున్నానని తెలిపారు. ఆదివారం విశాఖ ఏపీఎస్పీ బెటాలియన్‌లో ఎన్ఐఏ అధికారులు తన సమక్షంలో శ్రీనివాసరావును విచారించారని, ప్రతిపక్ష నేత జగన్‌ను హత్యచేయాలని ఎందుకు ప్రయత్నించావు, దీని వెనక ఎవరున్నారని ప్రశ్నించారని అబ్దుల్ సలీం చెప్పారు. -
హత్యాయత్నం కేసు.. ఎన్ఐఏ రీ కనస్ట్రక్షన్
సాక్షి, విశాఖపట్నం : ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటన కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు రీ కనస్ట్రక్షన్ చేస్తున్నారు. విచారణలో భాగంగా నిందితుడు శ్రీనివాస్‌రావును ఆదివారం విశాఖపట్నంకు తీసుకొచ్చిన ఎన్ఐఏ అధికారులు అనంతరం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. విశాఖ విమానాశ్రయంలో నిందితుడు పనిచేసిన టీడీపీ నేత హర్షవర్థన్ చౌదరికి చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌తో పాటు వీవీఐపీ లాంజ్‌ను పరిశీలించారు. నిందితుడ్ని తీసుకెళ్లి మరీ ఘటన జరిగిన తీరుతెన్నులను తెలుసుకున్నారు. కోడిపందాల కత్తిని భద్రపర్చిన ప్రదేశంపై కూడా ఆరా తీశారు. అంతకుముందు విశాఖలోని సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో నిందితుడు న్యాయవాది సలీం సమక్షంలో విచారణ జరపాలని అధికారులు భావించారు. కానీ తమ విచారణకు ఈ ప్రదేశం అనువైంది కాదని భావించి మరో చోటుకు తరలించేందుకు ఉన్నతాధికారుల అనుమతిని కోరారు. దీనికి సమ్మతి లభించడంతో నిందితుడు శ్రీనివాస్ రావును హైదరాబాద్‌లోని ఎన్ఐఏ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. -
రహస్యప్రాంతానికి శ్రీనివాస్ రావు
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు రహస్యప్రాంతానికి తరలించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలతో వైఎస్ జగన్‌పై దాడి కేసు దర్యాప్తును చేపట్టిన ఎన్ఐఏ.. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారణను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం నిందితుడి తరపు లాయర్ అబ్దుల్ సలీమ్‌ను విశాఖబక్కన్నపాలెం సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్‌కు రావాలని సూచించారు. అయితే ఇక్కడ అధికారులు ఎలాంటి విచారణ జరపలేదని న్యాయవాది సలీమ్ మీడియాకు తెలిపారు. శ్రీనివాసరావును విచారించేందుకు బక్కన్నపాలెంలోని సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ సరైన ప్రాంతం కాదని అధికారులు భావిస్తున్నట్లు చెప్పారు. అందువల్ల నిందితుడిని విచారణ కోసం మరో ప్రాంతానికి తరలించడానికి ఉన్నతాధికారుల అనుమతిని కోరారని పేర్కొన్నారు. అనుమతులు లభించిన వెంటనే శ్రీనివాసరావును హైదరాబాద్ లేదా మరో ప్రాంతానికి తరలిస్తారని స్పష్టం చేశారు. శ్రీనివాస్ రావును హైదరాబాద్‌కు తరలించిన అధికారులు అనంతరం ఢిల్లీ లేక ముంబైకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
‘చంద్రబాబు.. మీకెందుకు భయం?’
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ చర్యలు చేపడితే మీకెందుకు భయం అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని చంద్రబాబు డ్రామాగా చిత్రీకరించారంటూ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని, అనేక సందర్భాల్లో ఆయన మాట మార్చారని అన్నారు. ఏపీలో ఉన్నది అధ్వాన్న ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కైన వారు వేలకోట్ల రుణాలు లబ్ధిపొంది విదేశాలకు పారిపోయారని ఆరోపించారు. ఏపీలో ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించారు. అవినీతి, అసూయతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. -
ఎన్ఐఏ అదుపులోకి శ్రీనివాసరావు
సాక్షి, అమరావతి బ్యూరో/లబ్బీపేట (విజయవాడ తూర్పు)/సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జె. శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శనివారం తమ అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ జగన్‌పై దాడి కేసు దర్యాప్తును హైకోర్టు ఆదేశాలతో చేపట్టిన ఎన్ఐఏ.. నిందితుడిని విచారించేందుకు అనుమతించాలని కోరుతూ శుక్రవారం విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం విజయవాడ జిల్లా జైలులో ఉన్న శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించి అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.నాంచారయ్య పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ నివేదికను అధికారులకు డాక్టర్ల బృందం అందజేసింది. కాగా, అవసరమైతే నార్కో ఎనాలసిస్ పరీక్షలకైనా తాను సిద్ధమేనని నిందితుడు చెప్పినట్లు అతని తరఫు న్యాయవాది సలీం జైలు వద్ద మీడియాకు తెలిపారు. న్యాయవాది సమక్షంలో విచారణ చేపట్టాలని న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారన్నారు. విశాఖకు నిందితుడి తరలింపు? నిందితుడు శ్రీనివాసరావును ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. ఎన్ఐఏ అధికారులు ఇందుకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. మరోవైపు.. విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు శనివారం రాత్రి నిందితుడ్ని విశాఖకు తీసుకొస్తున్నట్లు అక్కడి పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’కి చెప్పారు. కానీ, రాత్రి వరకు అతనిని తీసుకురాలేదు. దీంతో శనివారం అర్థరాత్రి తర్వాత లేదా ఆదివారం ఉదయానికి తీసుకొస్తారని సమాచారం. విమానాశ్రయంలో టీడీపీ నేత హర్షవర్థన్ చౌదరికి చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌తో పాటు వీవీఐపీ లాంజ్‌లోకి నిందితుడ్ని తీసుకెళ్లి, ఘటన జరిగిన తీరుతెన్నులను ఎన్ఐఏ అధికారులు పరిశీలిస్తారని తెలుస్తోంది. -
రాష్ట్రంపై కేంద్రం పెత్తనమా?
సాక్షి, అమరావతి: విమానాశ్రయంలో భద్రతా వ్యవహారాల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, అక్కడ జరిగే ఘటనలపై విచారణ జరిపే బాధ్యత మాత్రం తమదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విమానాశ్రయంలో కేంద్రం విఫలమైనా దానిపై దర్యాప్తు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు. చంద్రబాబు శనివారం ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రం అధికారాన్ని కేంద్రం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. హత్యాయత్నం జరిగిన ఎయిర్‌పోర్టు తమ పరిధిలో లేదని, కేంద్రం పరిధిలో ఉందని చెప్పి ఇప్పుడు కేంద్రం ఆధీనంలోని ఎన్ఐఏ విచారణను ఎలా తప్పుపడతారని ప్రశ్నించగా... ఎయిర్‌పోర్టులో భద్రత మాత్రమే కేంద్రం చూసుకోవాలని, అక్కడ శాంతిభద్రతలు విఫలమైతే వాటిపై తాము దర్యాప్తు చేస్తామన్నారు. రాష్ట్ర సార్వభౌమాధికారాన్ని కేంద్రం హరిస్తోందని ఆరోపించారు. తమ పరిధిలోని అంశాలపై కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుందని అన్నారు. రాష్ట్రాల వ్యవహారాల్లో ఎన్ఐఏ జోక్యం చేసుకుంటోందని గతంలో మోదీ విమర్శించారని, ఇప్పుడు ఆయనే ఏపీలోకి ఎన్ఐఏను పంపుతున్నారని మండిపడ్డారు. అందుకే సీబీఐకి సాధారణ సమ్మతిని వెనక్కి తీసుకున్నామని, అవినీతి ఆరోపణలు ప్రధానమంత్రిపైనా ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఎన్ఐఏ ఎవరని నిలదీశారు. దీనిపై కోర్టుకెళతామని, జాతీయ స్థాయిలో చర్చకు పెడతామని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో 50 మందిని చంపారు రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షం సహకరించలేదని చంద్రబాబు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో పరిటాల రవి సహా 50 మందిని హత్య చేశారని ఆరోపించారు. రూ.6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని తమను విమర్శిస్తున్నారని, రాష్ట్ర బడ్జెట్ కూడా అంతలేదని చెప్పారు. తమ అవినీతిపై విచారణ జరిపి, జైల్లో పెడతామంటున్నారని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడిస్తారో జగన్, కేసీఆర్, మోదీ కలిసి చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఇచ్చిన హామీ చూసి భయపడి పెన్షన్ పెంచామంటున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ చెప్పేవి నవ రత్నాలు కాదని, నవగ్రహాలని ఆరోపించారు. మాది చిన్నపార్టీ ఈబీసీ రిజర్వేషన్లు చేసే ముందు కేంద్రం ఎవరినీ సంప్రదించలేదని, ఏ రాష్ట్రంతోనూ మాట్లాడలేదని, ప్రజలను సిద్ధం చేయకుండా ఉన్నట్టుండి ఇలాంటివి ఎలా చేస్తారని చంద్రబాబు నిలదీశారు. కాపు రిజర్వేషన్ల గురించి తమ ప్రతిపాదనలను ఒప్పకోలేదని, తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ల గురిచి ఒప్పుకోలేదని కానీ ఈబీసీలకు ఇచ్చారని విమర్శించారు. తనకు ప్రధానమంత్రి పదవి వద్దని చెబుతున్నానని, గతంలో తీసుకోమన్నా తీసుకోలేదని, తమది చిన్న పార్టీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పింఛన్‌తో వృద్ధులకు గౌరవం రెండు చేతులూ లేని దివ్యాంగులకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇస్తామని సీఎం చెప్పారు. ఇళ్లు, ఫించన్లు, రేషన్ వందశాతం ఇవ్వగలిగామన్నారు. రూ.1,000 పింఛన్‌తో వృద్ధులను గౌరవిస్తున్నారని, ఇప్పుడు రూ.2000 పింఛన్‌తో వారిని చూసుకోవడానికి పోటీ పడతారని అన్నారు. ఏపీలో లోటు బడ్జెట్ ఉన్నా కేసీఆర్ కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తేల్చిచెప్పారు. «ఒకేరోజు రెండు పెద్ద సంస్థలు రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని తెలిపారు. జిల్లా ప్రణాళికలను 21 నుంచి విడుదల చేస్తామని, త్వరలో రాష్ట్రస్థాయి ప్రణాళికను వెల్లడిస్తామన్నారు. ఎన్ఐఏ విచారణను ఉపసంహరించండి ప్రధానమంత్రి మోదీకి సీఎం చంద్రబాబు లేఖ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వును వెనక్కి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రధానమంత్రికి ఐదు పేజీల లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ కేసును ఎన్ఐఏ విచారణకు అప్పగించారని తప్పుపట్టారు. -
నెత్తుటి సిరాతో.. ‘జిత్తుల’ లేఖ
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణను వ్యతిరేకిస్తూ ఈ కేసు సంగతి తామే చూసుకుంటామని కేంద్ర ప్రభుత్వాన్ని దబాయించేలా టీడీపీ సర్కారు లేఖ రాయడంపై రాజకీయ పరిశీలకులు, న్యాయ నిపుణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఈ దారుణ హత్యా యత్నం వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనే అనుమానాలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయని పేర్కొంటున్నారు. ఎయిర్పో ర్టులో భద్రత బాధ్యత కేంద్రానిది, విచారణ మాత్రం తాము చూసుకుంటామంటూ సీఎం వింత వ్యాఖ్యలు చేయడంపై అంతా విస్తుపోతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభమై చురుగ్గా సాగుతుండటంతో తమ బండారం బయటపడుతుందనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇలా వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ కేసు దర్యాప్తు అంశం కేంద్ర పరిధిలోకి రాదని, ఇది చాలా చిన్న కేసు అని బుకాయించేలా ప్రధానికి శనివారం రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. దీన్ని కేంద్ర, రాష్ట్ర సంబంధాలుగా చిత్రీకరిస్తూ రాష్ట్రం అధికారాలపై దురాక్రమణగా సీఎం అభివర్ణించడాన్ని తప్పుబడుతున్నారు. విమానాశ్రయాల్లో స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ, విదేశీ చొరబాట్లపైనే ఎన్ఐఏ విచారణ జరపాలని చట్టంలో ఉందటూ సీఎం చంద్రబాబు వక్రీకరిస్తూ అవాస్తవాలు చెప్పడం గమనార్హం. చిన్న కేసులు, ఆర్థికపరమైన కేసులు మినహా హత్యాయత్నాలు, హత్యలు, లాంటి తీవ్రమైన కేసుల విచారణను ఎన్ఐఏ చేపట్టకూడదని చెప్పడం చంద్రబాబుకే సాధ్యమని పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు. కేసును నీరుగార్చేలా సీఎం, డీజీపీ వ్యాఖ్యలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో పక్కా ప్రణాళిక ప్రకారమే హత్యాయత్నం జరిగిందని కేసుపై తొలుత దర్యాప్తు జరిపిన సిట్ అధికారులు సైతం హైకోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఎయిర్‌పోర్టులో ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే డీజీపీ, మంత్రులు, టీడీపీ నేతలు స్పందిస్తూ దీన్ని అభిమాని చేసిన దాడిగా చిత్రీకరిస్తూ వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు కేంద్ర సంస్థతో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ న్యాయ పోరాటం చేసింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఠాకూర్ కేసు విచారణను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయడాన్ని నివేదించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించలేరని తెలిపింది. కేంద్ర పౌర విమానయాన భద్రతా చట్టం, ఎన్ఐఏ చట్టాలను ఉటంకిస్తూ ఈ కేసు దర్యాప్తును కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని కోరింది. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ కేంద్ర హోంశాఖ స్పందనను కోరింది. విమానాశ్రయంలో జరిగిన ఈ హత్యాయత్నం కేసును చట్ట ప్రకారం ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ న్యాయస్థానానికి తెలియచేయడం, రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ చురుగ్గా విచారిస్తుండటంతో కుట్రదారులు ఆందోళన చెందుతున్నట్లు న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్ఐఏ దర్యాప్తు చేయాల్సిందేనంటున్న చట్టం నిజానికి విమానాశ్రయంలో హత్యాయత్నాలు, హత్యలు, దాడుల కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసులు చేపట్టకూడదని ఎన్ఐఏ చట్టం సెక్షన్ 6 స్పష్టం చేస్తోంది. ఇక విమానాశ్రయంలో ఏదైనా ఆయుధం, వస్తువుతో హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడితే ఎన్ఐఏ విచారణ పరిధిలోకి వస్తాయని పౌర విమానయాన భద్రతా చట్టంలో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ చర్యలు భారత సమాఖ్య వ్యవస్థ విధానానికి విరుద్ధమని చంద్రబాబు అవాస్తవాలు చెప్పడం సీఎం స్థాయిని దిగజార్చిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఎలా దర్యాప్తు చేపడుతుందని చంద్రబాబు తన లేఖలోప్రధానిని ప్రశ్నించారు. విమానాశ్రయం అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థ. అక్కడ జరిగిన హత్యాయత్నం కేసు విచారణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకే వస్తుందన్న విషయాన్ని చంద్రబాబు ఎందుకు గుర్తించలేదని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మాలేగావ్ అల్లర్ల కేసులో ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌పై ఎన్ఐఏ ఉన్నతాధికారి ఒకరు ఒత్తిడి తెచ్చారంటూ ఓ ప్రతికలో వచ్చిన వార్తను చంద్రబాబు ప్రస్తావిస్తూ ఎన్ఐఏ నిబద్ధతను ప్రశ్నించారు. మరి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం సానుభూతికోసమేనంటూ స్వయంగా సీఎం చంద్రబాబుతోపాటు డీజీపీ బహిరంగ వ్యాఖ్యలు చేసిన తరువాత రాష్ట్ర పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు ఎలా నిర్వహిస్తారని నిపుణులు నిలదీస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు ఎన్ఐఏ విచారణ పరిధిలోకే వస్తుందని కేంద్ర పౌర విమానయాన భద్రతా చట్టం–1982, ఎన్ఐఏ చట్టాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. విమానాశ్రయాల్లో భద్రత, రక్షణకు విఘాతం కలిగించే నేరాలపై దర్యాప్తు బాధ్యత పూర్తిగా ఎన్ఐఏదేనని పౌర విమానయాన భద్రతా చట్టంలోని సెక్షన్ 3(ఎ), 5(ఎ)లు స్పష్టం చేస్తున్నాయి. విమానాశ్రయాల్లో భద్రతకు భంగం కలిగించే చర్యలు, హత్యాయత్నాలు, దాడులు తదితర కేసులను ఎన్ఐఏ విచారించాలని వివరంగా పేర్కొన్నారు. ఏదైనా విమానాశ్రయంలో ఎవరైనా చట్ట విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా ఏదైనా ఆయుధాన్నిగానీ వస్తువునుగానీ ఉపయోగించిన కేసులను ఎన్ఐఏ విచారించాలి. హింసాత్మక చర్యలకు పాల్పడి ఎవరినైనా గాయపరిచినా, హత్యలకు పాల్పడినా ఆ కేసులు ఎన్ఐఏ దర్యాప్తు పరిధిలోకే వస్తాయి. కుట్ర కోణాన్ని వెలికి తీసే సెక్షన్లను చేర్చకుండా... ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేయాలని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం తన కనుసన్నల్లో మెలిగే వారికి దీన్ని అప్పగించి వ్యూహాత్మకంగా విచారణను నీరుగార్చేందుకు యత్నించింది. 2018 అక్టోబరు 25వతేదీ మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో నిందితుడు శ్రీనివాసరావు హత్యాయత్నానికి ఒడిగట్టాడు. అయితే ప్రాథమిక విచారణ కూడా పూర్తికాకముందే అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకే డీజీపీ ఠాకూర్ విలేకరుల సమావేశం నిర్వహించి ‘సానుభూతి కోసమే నిందితుడు శ్రీనివాసరావు జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు’ అని ప్రకటించేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మంత్రులు అదే మాట చెప్పుకొచ్చారు. సాయంత్రం 7 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ‘సానుభూతి కోసమే ఈ హత్యాయత్నం చేయించారు’ అని బాధ్యతారాహిత్యంగా కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా ప్రకటన చేశారు. విమానాశ్రయంలోని తన రెస్టారెంట్లో నిందితుడికి ఏడాదికిపైగా ఆశ్రయం ఇచ్చిన టీడీపీ నేత హర్షవర్థన్ చౌదరిని సిట్ అధికారులు సరిగా విచారించ లేదు. నిందితుడు శ్రీనివాసరావుకు ఏరోడ్రోమ్ ఎంట్రీ పర్మిట్(ఏఈపీ) జారీకి అవసరమైన నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)కు సంబంధించి కూడా విశాఖ పోలీస్ కమిషనర్ తప్పుడు ప్రకటనలు చేశారు. ఈ హత్యాయత్నం వెనుక ఉన్న కుట్ర కోణాన్ని ఛేదించేందుకు అవసరమైన ‘సెక్షన్ 120–బి’ చేర్చనేలేదు. హత్యాయత్నం కేసులో అసలు సూత్రధారుల పాత్ర బట్టబయలు కాకుండా కేవలం శ్రీనివాసరావుకే పరిమితం చేసేలా ప్రభుత్వ ముఖ్యనేత ఆదేశాలతో పోలీసులు కథ నడపడం తెలిసిందే. -
ఎన్ఐఏ విచారణ.. టీడీపీలో వణుకు!
సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణ ప్రారంభించడం.. టీడీపీ నేతల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగిస్తూ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు శుక్రవారం ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించడం సరైనది కాదనీ, దీనిపై ప్రభుత్వానికి పలు అభ్యంతరాలు ఉన్నాయని ఐదు పేజీల లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్ఐఏకు ఎలా అప్పగిస్తారని కేంద్రాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. దాడి ఘటన విచారణను ఎన్ఐఏకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రీకాల్ చేయాలని లేఖలో ప్రధాని మోదీని కోరారు. చంద్రబాబు లేఖపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు తీరుతో దాడి ఘటనలో నిజంగానే టీడీపీ పాత్ర ఉన్నదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. జగన్‌పై హత్యాయత్నంలో టీడీపీ హస్తం ఉందని మొదటినుంచి ప్రతిపక్ష వైస్సార్సీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఎన్ఐఏ విచారణలో అసలు వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే చంద్రబాబు విచారణకు సహరించడంలేదని వైఎస్సార్సీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌పై దాడిలో టీడీపీ పాత్ర లేకపోతే ఎన్ఐఏ విచారణకు ఆ పార్టీ సహకరించాలి, కానీ అందుకు భిన్నంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుండటం పరిశీలకుల్ని విస్మయ పరుస్తోంది. ఎన్ఐఏ దర్యాప్తు మొదలైన నాటినుంచి టీడీపీ సర్కారు, ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు.. పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ దర్యాప్తు అనగానే చంద్రబాబు సర్కారు ఎందుకు వణికిపోతోందని, ఈ కేసులో టీడీపీ పాత్ర ఏమాత్రం లేనిపక్షంలో ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్ఐఏ దర్యాప్తుకు సహకరించడం లేదని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. చంద్రబాబు తప్పేమీ లేనప్పడు ఎన్ఐఏ విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారని నిలదీస్తున్నారు. -
ఎన్ఐఏ విచారణకు వ్యతిరేకంగా.. మోదీకి చంద్రబాబు లేఖ
సాక్షి, అమరావతి: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణను అడ్డుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు లేఖ రాశారు. జగన్‌పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏ విచారణ చేపట్టడంపై ఏపీ ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడం సరికాదనీ, ఎన్ఐఏ విచారణను రీకాల్ చెయ్యాలని మోదీని కోరారు. కేసు విచారణను అడ్డుకునేందుకు పలు అభ్యంతరాలను చూపుతూ ఐదుపేజీల లేఖను మోదీకి రాశారు. నిందితుడు శ్రీనివాసరావుని వారం రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా చంద్రబాబు లేఖపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. దాడితో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేకపోతే ఎన్ఐఏ విచారణకు ఎందుకు బయపడుతున్నారని ఆపార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. -
ఎన్ఐఏ అదుపులో శ్రీనివాస్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక భద్రత నడుమ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. (ఎన్ఐఏ కస్టడీకి శ్రీనివాసరావు) శ్రీనివాసరావును విచారణ నిమిత్తం రోడ్డు మార్గం గుండా హైదరాబాద్ ఎన్ఐఏ కార్యాలయానికి తరలించనున్నారు. అక్కడే వారం రోజుల పాటు నిందితుడిని అధికారులు విచారించనున్నారు. నిందితుడిని వారం రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిందితుడికి మూడురోజులకోసారి వైద్యపరీక్షలు చేయించాలని, అతని న్యాయవాది సమక్షంలోనే విచారించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.