birds
-
పచ్చని చిలుకలు తోడుంటే.. పాడే కోయిల వెంటుంటే!
గతంలో పల్లెలు అంటే చాలు ఠక్కున పక్షుల కిలకిలలు స్ఫురణకు వచ్చేవి. ఏ ఇంటి పెరట్లో అయినా ఒక జామ చెట్టు దానిమీద నిత్యం పారాడుతూ జామకాయలు కొరుకుతూ ఉండే చిలుకలు.. పొలంలో కల్లంలో.. ఇంటి ముందున్న కరెంటి వైర్ల మీద చిలుకలతోబాటు కోయిలలు.. లెక్కకుమిక్కిలిగా ఊరపిచ్చుకలు.. కత్తెర పిట్టలు.. పాలపిట్టల.. ఒకటేమిటి.. ఊరు అంటేనే మనుషుల కన్నా పక్షులే ఎక్కువగా ఉండేవి.. కానీ కాలం మారింది.. మారుతోంది.. వేలాది పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. మనిషి తాను బతకడం కోసం పక్షులను పొట్టనబెట్టుకుంటున్నాడు. ఎక్కడికక్కడ ఏర్పాటయ్యే సెల్ ఫోన్ టవర్ల కారణంగా పిచ్చుకలవంటి జీవాలు కనుమరుగైపోతున్నాయి.ఈ భూమి మనుషులకోసమే కాదు.. పశుపక్ష్యాదులు వంటి ఎన్నో జీవులకు ఆలవాలం.. కానీ మనిషి తన తెలివిని అతితెలివిగా మార్చి మిగతా జీవులన్నింటినీ మింగేస్తూ తానొక్కడే భూగోళాన్ని ఏలాలని చూస్తున్నాడు. ఆ క్రమంలోనే తూనీగలు.. నత్తగుల్లలు.. పలు రకాల చేపలు.. పిచుకలు వంటివి అంతరించిపోతున్నాయి. అయితే అందరూ ఇలా దారుణాలు చేస్తూ పోతుంటే ఎలా.. దిక్కులేనివాళ్లకు దేవుడే దిక్కు అన్నట్లుగా ఈ జీవాల రక్షణ కోసం ఎవరో ఒకరు ఉండే ఉంటారు.. దేవుడే ఎవరోఒకరికి బాధ్యత అప్పగించి ఉంటారు.. వాళ్ళే ఈ చిరు జీవుల రక్షణ బాధ్యతలు భుజానికి ఎత్తుకుంటారు. అనంతపురం పట్టణ యువత పక్షులను సంరక్షించేందుకు హోమ్ ఫర్ బర్డ్స్(Home For Birds) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అనిల్ కుమార్(Anil Kumar) అనే యువకుడి సారథ్యంలోనే ఈ బర్డ్స్ సొసైటీ పక్షులకు ఇళ్ళు నిర్మిస్తోంది.. అవును.. పక్షుల కోసం గూళ్ళు కడుతూ వాటిని చెట్లకు వేలాడతీస్తోంది. అంతేకాకుండా ఔత్సాహికులకు వాటిని ఉచితంగా ఇస్తోంది.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినూత్నమైన కార్యక్రమం చేపట్టాలని ఎలా అనిపించింది అనే ప్రశ్నకు అయన నా బాల్యంలో మా ఊళ్ళో... ఇంట్లో.. పొలంలో పెరట్లో ఎన్నో మొక్కలు చెట్లు ఉండేవి.. వాటిమీద రకరకాల పిచ్చుకలు.. పక్షులు సందడి చేసేవి.. వాటిని చూస్తూ ఆడుకునేవాళ్ళం .. ఇప్పుడు పట్టణాల్లో పారిశ్రామికీకరణ పెరిగింది.. ఎక్కడ చూసినా సెల్ ఫోన్ టవర్లు.. విద్యుత్ స్తంభాలు ఉంటున్నాయి తప్ప పక్షులు వాలెందుకు.. అవి గూళ్ళు కట్టుకునేందుకు చెట్లే కరువయ్యాయి. దీంతో అవి తమ సంతతిని వృద్ధి చెందించుకోలేక క్రమేణా తగ్గిపోతున్నాయి. వాటికి మళ్ళీ మనం గూళ్ళు కల్పించి.. ఆహారం అందిస్తే మళ్ళీ మనచుట్టూ తిరుగుతూ సందడి చేస్తాయి. అందుకే వాటిని మళ్ళీ ఆహ్వానించాలని భావించి అనంతపురం చుట్టుపక్కల ప్రతి ఇంటికి ఇలా గూళ్ళు అందిస్తున్నాం. రకరకాల పక్షులు తమ గూళ్ళను ఎలా రూపొందిస్తాయో. మేమూ అచ్చం అలాగే వాటిని తయారు చేసి పంచుతున్నాం. వీటిలో ఇప్పుడు పిచ్చుకలు.. పక్షులు నివాసం ఉంటున్నాయి.. ఇది చాలా సంతోషకరమైన అంశం అని అయన చెబుతున్నారు.హోమ్ ఫర్ బర్డ్స్ సొసైటీ సభ్యులు వీధుల్లో తిరుగుతూ పక్షుల అలికిడిని బట్టి.. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పక్షులు ఉంటున్నాయనేది ఒక సర్వే మాదిరి చేసి ఆయా ప్రాంతాల్లో అలంటి గూళ్ళు ఏర్పాటు చేస్తున్నారు.. స్కూళ్ళు.. విద్యాసంస్థలు.. కాలేజీలు.. పార్కులు.. పెద్దపెద్ద చెట్లు ఉన్న చోట్ల ఈ గూళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా వాటికీ నీళ్లు ఆహారం కూడా అందిస్తూ వాటి మనుగడకు ఎంతో దోహదం చేస్తున్నారు. పక్షి నిపుణులతో మాట్లాడి.. ఏయే జాతి పక్షులు ఎలాంటి గూళ్ళు కడతాయనేది తెలుసుకుని ఆమేరకు నాలుగు రకాల గూళ్ళు తయారు చేసి అందజేస్తున్నారు. ఈ సంస్థ పుణ్యాన ఇప్పుడు అనంతపురం చుట్టుపక్కల పక్షుల సంతతి పెరిగింది.. వాటి సందడి సైతం పెరిగింది. మనం బతుకుదాం.. చిరు జీవులను బతికిద్దాం :::సిమ్మాదిరప్పన్న -
నల్లమల.. వణ్యప్రాణుల ఖిల్లా
-
పాపం పాలపిట్ట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దసరా పండుగ పూర్తయ్యేది రంగురంగుల పాలపిట్టను దర్శించిన తర్వాతే. అందుకే అది రాష్ట్ర పక్షిగా కూడా అయ్యింది. అయితే, ఎంతో పవిత్రంగా భావించే పాలపిట్ట (Palapitta) ఈ మధ్య కనిపించటమే లేదు. దేశంలోని అంతరించిపోతున్న పక్షుల జాబితాలో పాలపిట్ట కూడా చేరిపోయింది. ‘రైతు నేస్తం’గా పిలిచే పాలపిట్ట పూర్తిగా అంతరించిపోకుండా కాపాడేందుకు తాజాగా ప్రభుత్వం నడుం బిగించింది.ప్రమాదం అంచున..ఆకర్షణీయమైన ప్రత్యేక రంగులతో ఇట్టే ఆకట్టుకునే రంగురంగుల పక్షి పాలపిట్ట. దీనిని ఇండియన్ రోలర్ (Indian roller), బ్లూ జే అని కూడా పిలుస్తారు. రెక్కలు విచ్చుకున్నప్పుడు ముదురు, లేత నీలం రంగు డామినేట్ చేస్తూ... తెలుపు, గోధుమ, నలుపు రంగులతో ఈ పక్షి ప్రత్యేకంగా కనిపిస్తుంది. మామూలు సమయంలో 30–34 సెం.మీ (12–13 అంగుళాలు), రెక్కలు విచ్చుకున్నప్పుడు 65–74 సెం.మీ (26–29 అంగుళాలు) పొడవు, 166–176 గ్రాముల బరువుతో చూడముచ్చటగా ఉంటుంది. ఏడాది క్రితం విడుదలైన ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ రిపోర్ట్’లో సంఖ్య తగ్గిపోతున్న పక్షి జాతుల్లో వీటిని కూడా చేర్చారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే వీటి సంఖ్య 30 శాతం తగ్గినట్లు వెల్లడైంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) నివేదికలో రెడ్ లిస్ట్ రీఅసెస్మెంట్ కోసం పాలపిట్టను సిఫార్సు చేశారు. తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, ఒడిశా, బిహార్ (Bihar) రాష్ట్రాల్లో కూడా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా గుర్తించారు. పాలపిట్ట పరిరక్షణకు ప్రణాళికపాలపిట్టల సంఖ్య తగ్గిపోవటానికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం, మొబైల్ టవర్ల ద్వారా వస్తున్న రేడియేషన్ (Radiation) అని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దసరా, ఉగాది పండుగల సమయంలో కొందరు వీటిని బంధించి పట్టణాల్లో ప్రదర్శించి డబ్బులు వసూలు చేస్తుండడం కూడా వాటికి ప్రాణసంకటంగా మారుతోంది. ప్రమాదాన్ని గుర్తించిన ప్రభుత్వం పాలపిట్టను రక్షించేందుకు చర్యలకు ఉపక్రమించింది. చదవండి: హైదరాబాద్ జూ పార్కు ఎంట్రీ టికెట్ ధరల పెంపుతాజాగా జరిగిన రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు సమావేశంలో పాలపిట్ట సంరక్షణకు ప్రణాళిక సిద్ధం చేయాలని అటవీ శాఖా మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. అటవీచట్టం షెడ్యూల్–4లో పాలపిట్ట ఉండడంతో దానిని బంధించడం, హింసించడం వంటివి చేస్తే నాన్‌బెయిలబుల్ కేసులతో పాటు మూడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేల వరకు జరిమానా విధించే వీలుంది. దీంతో పాలపిట్ట సంరక్షణకు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.రైతు నేస్తంపాలపిట్టలు రైతు నేస్తాలు. ఇవి వలస పక్షులు కావు. భారత్, ఇరాక్, థాయ్‌లాండ్‌లో అధికంగా కనిపిస్తాయి. చిన్న కప్పలు, మిడతలు, కీచురాళ్లు వంటి వాటిని వేటాడి తింటుంటాయి. వీటి జీవితకాలం 17–20 ఏళ్లు. చెట్ల తొర్రల్లో గూళ్లు పెట్టి మూడు నుంచి ఐదు గుడ్ల వరకు పెడతాయి. వీటి ప్రత్యుత్పత్తి కాలం వాటి ఆవాస ప్రాంతాలను బట్టి ఫిబ్రవరి–జూన్ నెలల మధ్యలో ఉంటుంది. ఈ పక్షులు పంట పొలాలు, తోటలు, ఉద్యా నవనాల్లో తెగుళ్లను ఆహారంగా తీసుకుంటాయి. పంటలను నష్టపరిచే కీటకాలు, సరీసృపాలు, ఉభయ చరాలను వేటాడి తింటూ రైతులకు పరోక్షంగా సహకారం అందిస్తాయి. అందుకే వీటిని రైతునేస్తాలు అని పిలుస్తారు.పంటల సాగు తగ్గటంవల్లే..కొంతకాలంగా పాలపిట్టలు అంతగా కనబడడం లేదు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ రియల్ ఎస్టేట్ విస్త రణ, నగరాలు, పట్టణాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం నిలిచిపోవడంతో వాటి ఆవాస ప్రాంతాలకు ఇబ్బందులు తలెత్తాయి. పంటల రక్షణకు పురుగుమందులు అధికంగా వినియోగించటం కూడా ఈ పక్షుల సంఖ్య తగ్గటానికి కారణం. – హరికృష్ణ ఆడెపు, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ అధ్యక్షుడు.పూర్తిగా అంతరించకపోవచ్చు..పాలపిట్టలు మను షులు, జనావాసా లకు దూరంగా ఉండేందుకు ఇష్టపడతాయి. అందువల్ల వాటి కచ్చితమైన సంఖ్యను తెలుసుకో వడం కష్టమే. పాలపిట్ట జాతి పూర్తిగా అంతరించిపోతుందని భావించడానికి లేదు. – డా. సాయిలు గైని, బయో డైవర్సిటీ నిపుణుడు. -
నోరులేని జీవుల ఆకలి తీర్చే అక్క!
-
కొమ్మ కొమ్మకో సన్నాయి.. కోటి రాగాలు ఉన్నాయి..
కొమ్మ కొమ్మకో సన్నాయి.. కోటి రాగాలు ఉన్నాయి.. అన్నట్లు కొత్తగూడ బొటానికల్ గార్డెన్స్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన బర్డ్స్ వాక్ కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. ఇందులో 55 మంది వీక్షకులు భాగస్వామ్యం కాగా.. 62 రకాల పక్షి జాతులను గుర్తించారు. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్, మేనేజర్ సుమల్ పర్యవేక్షణలో వివిధ రకాల థీమ్ పార్కులు, వృక్షపరిచయ క్షేత్రం, వర్చువల్ వైల్డ్‌లైఫ్ సఫారీ గురించి వీక్షకులకు వివరించారు.. – గచ్చిబౌలి పికిలిపిట్ట, షిక్రా, లొట్టకన్నుజిట్ట, నల్ల ఎట్రింత, అడవిరామదాసు, మగ నెమలి, ఆడ నెమలి, లకుముకి పిట్ట, టైగర్ స్వాలోటైల్ సీతాకోకచిలుక వంటి పక్షులను సందర్శకులు వీక్షించారు. రెండు రోజులపాటు నిర్వహించిన ‘బర్డ్స్‌వాక్’ లో 62 రకాల పక్షి జాతులను సందర్శకులు గుర్తించారు. కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్స్ ఈ కార్యక్రమానికి వేదికైంది. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్, మేనేజర్ సుమల్ పర్యవేక్షణలో 55 మంది వీక్షకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా పక్షిజాతుల పేర్లు, వాటి శాస్త్రీయ నామాలు, సహజమైన పేర్లు, వాటి అలవాట్లు, ప్రవర్తన గురించి పక్షుల నిపుణులు అపరంజని, ప్రవర్తన, మనోజ్ థామ్సన్, అబ్దుల్ వివరించారు. పాకెట్ గైడ్ ద్వారా పక్షులను ఎలా గుర్తించాలో, అవి ఎలాంటి శబ్దాలు చేస్తాయో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా పక్షులను తమ కెమెరాల్లో బంధించారు. జీవావరణ పరిరక్షణకు.. ప్రకృతి, జీవావరణ వ్యవస్థలో పక్షులు ప్రధాన భూమిక పోషిస్తాయని పక్షుల నిపుణులు సందర్శకులకు వివరించారు. విత్తనాల వ్యాప్తి, పర్యావరణ సమతుల్యతలో పక్షుల భాగస్వామ్యం ఎంతో కీలకమని, అందుకే ఆయా జాతుల మనుగడ మానవ మనుగడకు, ప్రకృతి మనుగడకు కీలకమన్నారు. ఎకో టూరిజమ్‌లో భాగంగా.. బొటానికల్ గార్డెల్స్లో బర్డ్స్‌వాక్ కార్యక్రమంలో భాగంగా అడవుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పక్షుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఫిబ్రవరి 23న వికారాబాద్‌లో, మార్చి 2న గజ్వేల్ ఫారెస్ట్‌లో బర్డ్స్ వాక్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాం. – రంజిత్‌నాయక్, ఎకో టూరిజమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ -
పిచ్చుక.. చేయాలి మచ్చిక..
పక్షిజాతుల మనుగడకు కేంద్ర బిందువులు కొలనులు, సరస్సులు, చెరువులు. గతంలో హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఈ నీటి స్థావరాలకు కొదువలేకపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి విభిన్న జాతుల పక్షులు సైతం వలస వచ్చేవి. కానీ ప్రస్తుత పట్టణీకరణ నేపథ్యంలో ఈ చెరువులు, కుంటలు మాయమవ్వడంతో పక్షి జాతుల మనుగడపై తీవ్ర ప్రభావం పడుతోంది. పిచ్చుకలను హౌస్ స్పారోస్ (Sparrow) అంటారు. అంటే ఇవి మనుషుల ఇళ్ల వద్దే చిన్న గూడు నిర్మించుకుని వాటి సంతతిని పెంచుకుంటాయి. పరోక్షంగా పిచ్చుకలను సాదు జంతువులుగానే పరిగణించవచ్చు. అయితే కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో ఈ పిచ్చుకలను ఆదరించే వారు తక్కువయ్యారు. చెట్లపైన, అడవుల్లో కన్నా ఇంటి ఆవాసాల్లో, బస్టాండ్లలో, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు, పార్కుల్లో, బాల్కనీల్లో ఇతర సురక్షిత ప్రాంతాల్లో ఇవి గూడు కట్టుకుంటాయి. ఆ అవకాశం నగరవాసులు ఇవ్వకపోవడంతో ఈ పిచ్చుకులు నగరాన్ని బహిష్కరిస్తున్నాయి. అక్కడక్కడ ఏసీ సందుల్లోనో, పార్కింగ్ ఏరియాలోనో గూళ్లు పెట్టుకున్నా సౌకర్యంగా లేవని నగరవాసులు వాటిని తొలగిస్తుండటం వీటి క్షీణతకు మరో కారణం. పరిరక్షించాల్సిన జాబితాలో.. పర్యావరణ పరిస్థితులను అంచనా వేయడంలో పక్షి జాతుల మనుగడను కూడా ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో నగర జీవవైవిధ్యం (Bio Diversity) పూర్తిగా దెబ్బతింటోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ పిచ్చుకల సంఖ్య భారీగా తగ్గపోయిందని ఆ రాష్ట్ర పక్షిగా పిచ్చుకను ఎంపిక చేసి వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. నాసిక్‌లోని మొహమ్ముద్ దిలావర్ అనే పక్షి ప్రేమికుడు పిచ్చుకల సంరక్షణ కోసం చేసిన కార్యక్రమాల ఫలితంగా ప్రతి ఏడాదీ మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఐరోపాలోని పట్టణాలు, నగరాల్లో పిచ్చుకలు ఎక్కువగా కనిపిస్తాయి. ఒక సర్వేలో భాగంగా యూకేలో గ్రామీణ ప్రాంతాల్లో 47 శాతం, పట్టణ ప్రాంతాల్లో 60 శాతం పిచ్చుకలు తగ్గాయని వెల్లడించారు. ఈ కారణాలతో ఈ జాతిని పరిరక్షించాల్సిన జాబితాలో చేర్చబడింది. యూరోపియన్ కన్జర్వేషన్ కన్సర్న్ జాతుల జాబితాలో చేర్చారు. ‘బ్రింగ్ బ్యాక్ స్పారోస్’.. నగరంలో యానిమల్ వారియర్స్ కన్సర్వేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పిచ్చుకల సంరక్షణ కోసం ఏడేళ్లుగా కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా ‘బ్రింగ్ బ్యాక్ స్పారోస్’ కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు 4 వేల పక్షి గూళ్లను పంపిణీ చేశాం. మా అంచనా ప్రకారం ఓ 30 వేల వరకూ పిచ్చుకలను మళ్లీ నగరంలోని ఇళ్లలోకి రప్పించగలిగాం. ముఖ్యంగా అమీన్పూర్, కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ పిచ్చుకలను సంరక్షించగలిగాం. ఇందులో భాగంగా నగరంలోని పార్కులతో కూడా కలసి పనిచేయనున్నాం. వీటికి ప్రాణాధారాలైన చెరువులను, కుంటలను నగరవాసులు కలుషితం చేయడం ఇప్పటికైనా మానేయాలి. పూజా సామాగ్రి పేరుతో ప్లాస్టిక్, ఇతర కలుషితాలను చెరువుల్లో వేయడం పరిపాటిగా మారింది. – ప్రదీప్, సొసైటీ వ్యవస్థాపకులు.ఆహార కొరత కూడా.. నగర వాతావరణంలో వాటి ఆహార లభ్యత తగ్గిపోయింది. భారత దేశంలో అత్యంత సాధారణ పట్టణ పక్షులలో పిచ్చుక ఒకటి.. కానీ అంతరించిపోతున్నాయి. గ్రామీణ వాతావరణంలోనూ వీటి మనుగడ ప్రశ్నార్థకంగానే మారింది. పంటపొలాల కోసం వినియోగించే క్రిమిసంహారకాలూ ఈ పిచ్చుకలను బలిగొంటున్నాయి. చదవండి: గురుమూర్తి ఫోన్లో ఏముంది?.. వెలుగులోకి విస్తుపోయే విషయాలుగతంలో ఈ పిచ్చుకల ఉనికిని అంచనా వేయడానికి తెలుగురాష్ట్రాలతో పాటు, ఢిల్లీ, బెంగళూరు, తమిళనాడులో సర్వే చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలోని యెల్లాంపేటలో బోన్ఫెరోని కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ విధానంలో చేసిన సర్వేలో భాగంగా వివిధ ట్రాన్సెక్ట్లలో పిచ్చుకల సాంద్రత హెక్టారుకు 15 నుంచి 335 వరకూ ఉందని నిర్ధారించారు. కానీ ఈ సంఖ్య ఇప్పటికి ఇంకా తగ్గిపోయింది. -
రెక్కలు తొడిగి .. రెపరెపలాడి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆకాశ వీధిలో రెక్కల్ని రెపరెపలాడిస్తూ వేలాది కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే వేలాది పక్షులు కాకినాడ–అంబేడ్కర్ కోనసీమ జిల్లాల నడుమ గల కోరంగి అభయారణ్యంలో విడిది చేస్తున్నాయి. రష్యా, చైనా, మంగోలియా, సైబీరియా, యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి అనేక రకాల జాతి పక్షులు ఏటా అక్టోబర్, నవంబర్ మధ్య కాకినాడ తీరానికి వస్తుంటాయి. కోరింగ అభయారణ్యం, సముద్ర మొగ ప్రాంతాల్లో మూడు నెలలపాటు మకాం వేసి తిరుగు పయనమవుతాయి. ఇలా వలస వచ్చే పక్షుల్లో ఏ దేశాల నుంచి.. ఏయే జాతి పక్షులు ఎన్ని వచ్చాయి, వాటిలో అరుదైన జాతి పక్షులు ఏవైనా ఉన్నాయా వంటి లెక్కలు అటవీ శాఖలోని వివిధ విభాగాల పర్యవేక్షణలో శాస్త్రవేత్తలు, బర్డ్ వాచర్స్ బృందాలుగా ఏర్పడి ఏసియన్ వాటర్ బర్డ్ కౌంట్ (అంతర్జాతీయ నీటిపక్షుల గణన) చేస్తుంటారు. కోరంగి అభయారణ్యం, కోనసీమ ప్రాంతాలకు వివిధ దేశాల నుంచి వచ్చిన వలస పక్షుల సర్వే ఈ నెలలో ముగిసింది.ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలైన బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బీఎన్హెచ్ఎస్), వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ బయోడైవర్సిటీ సొసైటీ, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీలకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు, సీనియర్ రీసెర్చ్ స్కాలర్స్ డాక్టర్ శివకుమార్, పాల్ ఆంథోనీ, శ్రీరామరెడ్డి తదితరుల సంయుక్త భాగస్వామ్యంతో వివిధ దేశాల నుంచి రెక్కలు కట్టుకుని వలస వచ్చిన పక్షులను లెక్కించారు.ఆ పక్షుల రాక సంతోషకరంఈ ఏడాది పక్షుల రాక కొంతమేర తగ్గినప్పటికీ.. అంతరించిపోయే పక్షి జాతుల జాబితాలో ఉన్న ఇండియన్ స్కిమ్మర్, గ్రేట్‌నాట్, రెడ్నాట్, యురేసియన్ ఆయుష్ క్యాచర్ జాతి పక్షులు ఈ సీజన్లో కోరంగి అభయారణ్యంలో ప్రత్యక్షం కావడం సంతోషం కలిగించే అంశంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రేట్‌నాట్ జాతి పక్షులు రష్యా, మంగోలియా, చైనా తదితర దేశాల నుంచి నాలుగైదేళ్ల తరువాత ఇక్కడ ప్రత్యక్షమయ్యాయి. ఈ జాతి పక్షి ఇక అంతరించిపోయినట్టేనని అనుకుంటున్న తరుణంలో రష్యా దేశపు ట్యాగ్‌తో ఈ సర్వేలో కెమెరాలకు చిక్కాయి. ఈ రెండు జాతుల పక్షులు కోరంగి అభయారణ్యంలోని భైరవపాలెం, హోప్ ఐలాండ్, ఏటిమొగ తదితర ప్రాంతాల్లో సర్వే బృందాల కెమెరాలకు కంటపడ్డాయి. యూరోపియన్ దేశాల నుంచి అరుదైన యురేసియన్ అయిస్ట్ క్యాచర్ జాతి పక్షులు కూడా ఈసారి అభయారణ్యంలో దర్శనమిచ్చాయి.సైబీరియన్ పక్షులదే మొదటిస్థానంకాకినాడ తీరానికి వచ్చిన మొత్తం విదేశీ విహంగాల్లో 5,144 పక్షులతో ‘లెసర్ సేండ్ ప్లోవర్’ అనే సైబీరియన్లు మొదటి స్థానంలో నిలిచాయి. 3,545 పసిఫిక్ గోల్డెన్ ఫ్లోవర్ జాతి పక్షులు రాగా.. వలస వచ్చిన పక్షుల్లో ఇవి ద్వితీయ స్థానాన్ని ఆక్రమించాయి. ఈ జాతి పక్షులు రష్యా, మంగోలియా, చైనా వంటి దేశాల నుంచి వలస వచ్చాయి. ఇవికాకుండా పులికాట్, కొల్లేరు ప్రాంతాలకు పెద్దఎత్తున వచ్చే గ్రేటర్ ఫ్లెమింగో జాతి పక్షులను కూడా గతం కంటే ఈ సీజన్లోనే ఎక్కువగా ఇక్కడ గుర్తించారు. ఈ పక్షులన్నీ కోరంగి అభయారణ్యంతో పాటు కోనసీమలోని మగసానితిప్ప, శాంక్రిమెంట్ ఐలాండ్, గచ్చకాయలపోర, పండి, పల్లం, ఎస్.యానాం, గాడిమొగ సముద్ర తీర గ్రామాల్లో సందడి చేస్తున్నట్టు గుర్తించారు.కడుపు నింపుకునేందుకే..వివిధ దేశాల్లోని పక్షుల ఆవాస ప్రాంతాలు మంచుతో కప్పివేయబడటంతో కడుపు నింపుకునేందుకు వేలాది కిలోమీటర్లు ప్రయాణించి వివిధ దేశాల నుంచి కోరంగి అభయారణ్యానికి విదేశీ పక్షులు వచ్చాయి. అరుదైన జాతి పక్షులను కూడా గుర్తించాం. ఇందులో అంతరించిపోయే జాతులకు చెందిన పక్షులు రావడం చాలా సంతోషకరం. – డి.మహేష్‌బాబు, రీసెర్చ్ సైంటిస్ట్, రాష్ట్ర కో–ఆర్డినేటర్, ఇండియన్ బర్డ్ కన్జర్వేషన్ నెట్వర్క్106 జాతులకు చెందిన 39,725 పక్షుల రాకఏటా వివిధ దేశాల నుంచి సీజనల్‌గా వచ్చే వలస పక్షులు ఈ సారి కాస్త వెనకడుగు వేశాయి. వరుస ప్రకృతి విపత్తులు ఇందుకు ఒక ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు విశ్లేషించి నివేదించారు. ఈ సీజన్లో వివిధ ఖండాల నుండి 106 జాతులకు చెందిన 39,725 పక్షులు వలస వచ్చాయని లెక్కలు కట్టారు.అరుదైన పక్షులొచ్చాయికోరంగి అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో పక్షుల గణన కోసం 12 బృందాలు పనిచేశాయి. ఒక్కో బృందంలోశాస్త్రవేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు, బర్డ్‌వాచర్స్, విద్యార్థులతో కలిసి ఐదుగురున్నారు. జిల్లాఅటవీశాఖాధికారి రవీంద్రనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన బృందాల్లోని 60 మంది ఏకకాలంలో ఈ సర్వే నిర్వహించారు. అరుదైన జాతి పక్షులను కూడా ఈ సర్వేలో గుర్తించారు.– ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, అటవీ రేంజర్, వైల్డ్‌లైఫ్, కోరింగ -
చిన్న పక్షితో 'పెద్ద పక్షి'కి ముప్పు
విమానం భారీగా ఉంటుంది. కానీ.. పక్షి మాత్రం చిన్నగా ఉంటుంది. అంతపెద్ద విమానానికి దీనివల్ల ఎందుకు ముప్పు వస్తుందని అంతా అనుకుంటారు. కానీ.. ఒక్కసారి విమానానికి పక్షి తగిలితే ఊహించని ఘోర ప్రమాదాలు సంభవిస్తాయి. రెక్కలు కట్టుకుని ఎగురుతున్న లోహ విహంగాలను చిన్న చిన్న పక్షులు ముప్పులోకి నెట్టేస్తున్నాయి. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదానికి పక్షులే ప్రధాన కారణమని తెలియడంతో భారత్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రమత్తమైంది. ఎయిర్ ఫీల్డ్ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. సాక్షి, విశాఖపట్నం: రెక్కలు కట్టుకుని ఎగురుతున్న లోహ విహంగాలను చిన్న చిన్న పక్షులు ముప్పులోకి నెట్టేస్తున్నాయి. రివ్వున ఎగిరేలోపు.. వాటికి ఎగిరే స్వేచ్ఛ లేదన్నట్టుగా పక్షులు వార్నింగ్ ఇస్తున్నాయి. ఎయిర్ పోర్టుల సమీపంలో పక్షుల కదలికలు విమాన ప్రమాదా లకు కారణమవుతున్నాయి. దక్షిణ కొరియాలో విమాన ఘోర ప్రమాదంలో 179 మృత్యువాత పడటానికి పక్షులే ప్రధాన కారణమని.. తెలిసిన తర్వాత భారత్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అప్రమత్తమైంది. దేశంలో ఇప్పటికే పక్షుల కారణంగా టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాలకే విమానాలు తిరిగి ల్యాండ్ అవుతున్న ఘటనలు పెరుగుతున్న తరుణంలో.. ఎయిర్ ఫీల్డ్ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా డీజీసీఏ అడుగులు వేస్తోంది. ఓ వైపు వన్యప్రాణి సంరక్షణకు చర్యలు తీసుకుంటూ.. మరోవైపు విమాన ప్రమాదాలు జరగకుండా రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.పే..ద్ద విమానానికి పక్షితో ముప్పా! విమానం భారీగా ఉంటుంది. కానీ.. పక్షి మాత్రం చిన్నగా ఉంటుంది. అంతపెద్ద విమానానికి దీనివల్ల ఎందుకు ముప్పు వస్తుందని అంతా అనుకుంటారు. కానీ.. ఒక్కసారి విమానానికి పక్షి తగిలితే ఊహించని ఘోర ప్రమాదాలు సంభవిస్తాయి. విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో పక్షుల కారణంగా అధిక ప్రమాదాలు జరుగుతుంటాయి. విమాన క్యాబిన్, ఇంజన్‌ను పక్షులు ఢీకొడితే అత్యంత ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి.విమానం పైకి ఎగిరినప్పుడు లేదా దిగుతున్నప్పుడు దాని ఇంజన్లు బలంగా లోపలికి గాలిని తీసుకుని బయటికి వదులుతుంటాయి. జా ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆ గాలికి సమీపంలోకి పక్షులు వస్తే అత్యంత వేగంగా తిరిగే ఎయిర్ క్రాఫ్డ్ ఇంజన్లు లోపలికి లాగేసుకుంటాయి. దాంతో ఇంజన్లు పాడైపోతుంటాయి. విమానం ఎగిరే సమయంలో ఇంజన్ లోపలికి పక్షులు వెళ్లిపోతే ఇంజన్ తిరగడం కొన్నిసార్లు ఆగిపోయి ఊహకందని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఫ్యాన్ థ్రస్ట్ ఆగిపోయినట్టు గుర్తిస్తే పైలట్ వెంటనే సమీపంలోని ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేసేస్తుంటారు. అంతేకాదు.. ఫ్లైట్ క్యాబిన్లో ఉన్న పైలట్ విండ్ షీల్డ్‌ను బలంగా పక్షులు ఢీ కొట్టినప్పుడు కూడా ప్రమాదాల తీవ్రత అధికంగా ఉంటుందని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. బలంగా కొట్టినప్పుడు పొరపాటున విండ్ షీల్డ్‌కి పగుళ్లు ఏర్పడితే విమానం ప్రమాదంలో పడినట్టేనని అంటున్నారు. అప్రమత్తమైన డీజీసీఏ భారత్‌లోనూ ఇటీవల పక్షుల కారణంగా విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. గతేడాది ఆగస్ట్‌లో గోవాలోని దబోలి ఎయిర్‌పోర్ట్‌లో పక్షి ఢీకొన్న తర్వాత విమానం ఇంజన్ నుంచి పొగలు రావడంతో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్‌ను హఠాత్తుగా నిలిపేసింది. ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే 2023లో 169 విమానాలకు పక్షుల కారణంగా స్వల్ప ప్రమాదాలు సంభవించడం గమనార్హం. విహంగాలతో లోహపు విహంగాలకు ప్రమాదాలు పెరుగుతుండటంతో డీజీసీఏ అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్టు సమీపంలో ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో విహంగాల ఉనికిని తప్పించే మార్గాలపై దృష్టి సారించింది. రన్‌వేల వెంట బిగ్గరగా శబ్దాలు వచ్చే బాణసంచా కాల్చడం, జోన్ గన్స్ ద్వారా భారీ శబ్దాలతో పక్షుల రాకను నియంత్రించడం, ఎయిర్ ఫీల్డ్ సమీపంలో వేప నూనె స్ప్రే చేయడం వంటి భిన్నమైన విధానాలను వినియోగించడంపై చర్చలు జరుపుతోంది. అంతేకాకుండా ఎయిర్‌పోర్టుకి 10 కి.మీ. పరిధిలో పక్షులు, వన్యప్రాణుల్ని ఆకర్షించే చెత్తా చెదారాలతో కూడిన ఆహారం, జంతు కళేబరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎయిర్‌పోర్టు వర్గాలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా కోళ్లు, మేకలు, ఇతర జంతు వధ జరగకుండా దృష్టి సారించాలని కూడా సూచించింది. అంతేకాకుండా ఈ సమస్యని శాస్త్రీయంగా పరిష్కరించేందుకు ఎయిర్‌పోర్టులు ప్రయత్నిస్తున్నాయి.నౌకాదళ సాయంతో చర్యలు పక్షుల అంతరాయం కలగకుండా వైజాగ్ ఎయిర్‌పోర్టులో నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నాం. ఎయిర్‌పోర్టు చుట్టూ కెనాల్ ఉంది. వేస్టేజ్ లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చెయ్యాలని కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌తో సమీక్షలు నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా తూర్పు నౌకాదళ వైమానిక బృందం సహాయంతోనూ వినూత్న విధానాల్ని అమల్లోకి తీసుకొచ్చాం. ఎందుకంటే విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం, నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగా పక్కç³క్కనే ఉన్నాయి. వీటిపక్కనే మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పక్షుల రాకపోకలు పెరుగుతుండటంతో విమాన సర్వసులకు అంతరాయం ఏర్పడుతోంది. నేవల్ ఫ్లైట్స్ కూడా ఎగిరేందుకు అంతరాయం కలుగుతున్న తరుణంలో ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు నేవల్ ఏవియేషన్ అధికారుల స్ప్రే డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐఎన్ఎస్ డేగా నుంచి వీటి ఆపరేషన్స్ నిర్వహించి.. పక్షులు ఎగరకుండా నియంత్రించే చర్యలు చేపడుతున్నాం. ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న చెట్లపై నీటిని స్ప్రే చేయడం ద్వారా రన్‌వే సమీపంలోకి పక్షులు రాకుండా నిలువరించగలం. – రాజారెడ్డి, వైజాగ్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ -
ముందే వచ్చిన విదేశీ అతిథులు
సాక్షి, పుట్టపర్తి: ఏటా ఫిబ్రవరిలో వీరాపురానికి వచ్చే విదేశీ పక్షులు ఈ ఏడాది నెల ముందుగానే వచ్చేశాయి. దీంతో శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో కర్ణాటక సరిహద్దున వీరాపురం ఇప్పుడు పక్షులతో కోలాహలంగా కనిపిస్తోంది. అరుదైన జాతిగా భావించే పెయింటెడ్ స్టార్క్ పక్షులు ఎక్కువగా వస్తాయి. ఈ పక్షులకు వీరాపురంతో 3 శతాబ్దాల అనుంబంధం ఉంది. ఏటా జనవరి చివర్లో సైబీరియా, రష్యా నుంచి ఇక్కడికి వలస వచ్చి చెరువు సమీపంలోని చెట్లపై గూళ్లు కట్టుకొని 6 నెలలు మకాం వేస్తాయి. సంతానోత్పత్తి చేసుకొని పిల్లలతో సహా వెళ్లిపోతాయి. వీటిని ఎర్రమూతి కొంగలంటారు. వాకబు చేసి వెళ్లి గుంపులుగా వస్తాయి.. సైబీరియాలో శీతాకాలం ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో సైబీరియా పక్షులు వేడిని వెతుక్కుంటూ భారత్, శ్రీలంక, థాయ్‌లాండ్, వియత్నాం, చైనా తదితర దేశాలకు పయనం అవుతాయి. ఆ క్రమంలోనే జనవరి చివరి వారంలో వీరాపురానికి వస్తాయి. ముందుగా కొన్ని పక్షులు ఇక్కడికి వచ్చి, చెరువులో నీరు, ఆహారాన్ని పరిశీలించి వెళ్లిపోతాయి. తర్వాత గుంపులు గుంపులుగా వస్తాయి. చెరువు చుట్టూ ఉన్న వందలాది చెట్లు ఈ పక్షులతో నిండిపోతాయి.సాగు ఆపి.. ఆదరిస్తూ..ఈ కొంగల రాకతో ఊరికి మేలు జరుగుతుందని వీరాపురంవాసులు నమ్ముతారు. వాటిని బంధువుల్లా ఆదరిస్తారు. ఎవరైనా వాటికి హాని తలపెడితే అందరూ ఒక్కటై, పెద్దల సమక్షంలో పంచాయితీ చేస్తారు. జరిమానా విధిస్తారు. కేసులు పెడతారు. చెరువును చారిత్రక సంపదగా ప్రకటించారు. చెరువు కింద 80 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు నీటితో సాగుచేస్తే నీరు తగ్గిపోయి మత్స్యసంపద అంతరించి పక్షులు రాకుండా పోతాయనే భయంతో గ్రామస్తులు చెరువు నీటితో సాగునే నిలిపివేశారు.ఎత్తు 3.5 అడుగులుసికొనిడే జాతికి చెంది పెయింటెడ్ స్టార్క్ శాస్త్రీయ పేరు ’మిక్టీరియాలూకోసిఫల’. ఎత్తు 3 అడుగుల నుంచి 3.5 అడుగుల వరకూ ఉంటాయి. ఎగరడానికి రెక్కలు విప్పినప్పుడు ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది. బరువు 3.5 కిలోల నుంచి 4 కిలోల వరకు ఉంటుంది. పెయింటెడ్ స్టార్క్ నీళ్లు గొంతు వరకు నింపుకొని పిల్ల పక్షులకు అందించేందుకు మళ్లీ మొత్తం నీరు బయటకు తీసి ఇవ్వడం ఆశ్చర్యం గొలుపుతుంది. ఆహారం కోసం ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే చెరువులు, పంట పొలాలకు వెళ్లి తిరిగి సాయంత్రం గూటికి చేరతాయి. ఒక గూడులో జంట పక్షులుంటాయి. గుడ్లు పెట్టి పిల్లలను చేసిన తర్వాత వాటి సంరక్షణ మగపక్షి చూసుకుంటే ఆడకొంగలు బయటకు వెళ్లి చెరువుల్లో వేటాడి చేపలు, నీళ్లు తీసుకొచ్చి పిల్లలకు అందిస్తాయి. అతిథుల్లా భావిస్తాం సైబీరియాతో పోలిస్తే వీరాపురంలో వేడి వాతావరణం ఉండటం, వేసవిలోనూ దగ్గరలోని చెరువుల్లో నీళ్లుండటంతో పక్షులు మా ఊరికే వస్తుంటాయి. కేవలం చేపలనే ఆహారంగా తీసుకుంటాయి. వాటిని మేం అతిథుల్లా భావిస్తాం. వాటికి ఎవరైనా హాని తలపెడితే శిక్ష తప్పదు. – ఎల్.లక్ష్మీపతి, వీరాపురం గ్రామ సర్పంచ్ సీజన్‌కు ముందే వచ్చేస్తున్నాయి నాలుగేళ్ల క్రితం వర్షాలు లేక చెరువులో నీళ్లు లేకపోవడంతో ఎర్ర కొంగలు రాలేదు. మూడేళ్ల నుంచి యథావిధిగా వస్తున్నాయి. ఈసారి సీజన్‌కు ముందే కొన్ని పక్షులు వచ్చి సర్వే చేసుకొని వెళ్లాయి. ఇప్పుడు గుంపులుగా వచ్చేస్తున్నాయి. – పురుషోత్తమ్‌రెడ్డి, ఎంపీపీ, చిలమత్తూరువీరాపురం ఇలా చేరుకోవచ్చువీరాపురం చిలమత్తూరు నుంచి 11 కిలోమీటర్లు, హిందూపురం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలులో హిందూపురం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లవచ్చు. బెంగళూరు – హైదరాబాద్ జాతీయ రహదారి మీదుగా కొడికొండ చెక్ పోస్టు చేరుకుని, అక్కడి నుంచి చిలమత్తూరు మీదుగా వీరాపురం చేరుకోవచ్చు. -
నీటి గలగలలు.. విహంగ కిలకిలలు
సాక్షి ప్రతినిధి, వరంగల్/నెట్వర్క్: తెలంగాణలో నీటి గలగలతోపాటు అరుదైన పక్షుల కిలకిలలు కూడా పెరుగుతున్నాయి. రక్షిత అడువులు, నదుల తీరాలు అరుదైన పక్షి జాతులకు ఆవాసంగా మారాయి. గోదావరి, కృష్టా, పెన్‌గంగా తీరప్రాంతాల్లో విదేశీ వలస పక్షుల సందడి పెరిగింది. ఇప్పటివరకు 432 పైగా పక్షి జాతులను గుర్తించారు. రష్యా, మంగోలియా, ఆఫ్రికా, ఆ్రస్టేలియా, వియత్నాం తదితర సుదూర ప్రాంతాల నుంచి పక్షులు తెలంగాణకు వలస వస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆదివారం జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని పక్షి జాతులపై ప్రత్యేక కథనం. అరుదైన జాతులు దేశంలో 566 అభయారణ్యాలు ఉంటే తెలంగాణలో 5,672 చ.కి.మీ.ల విస్తీర్ణంలో 9 ఉన్నాయి. పాకాల, ఏటూరునాగారం, ప్రాణహిత, కవ్వాల్, శివ్వారం, మంజీరా, పోచారం, కిన్నెరసాని, అమ్రాబాద్ అభయారణ్యాలు జీవవైవిధ్యానికి ఆలవాలంగా మారాయి. ఫారెస్ట్ వాగ్‌టెయిల్, బ్లాక్ బజా, లగర్ ఫాల్కన్, డస్కీ ఈగల్ ఔల్, స్పాట్ బెల్లీడ్ ఈగల్ ఔల్, స్మాల్ ప్రాటిన్కోల్, రెడ్ క్రస్టెడ్ పోచార్డ్స్, కామన్ కింగ్‌ఫిషర్, బ్లాక్ షోల్డర్డ్ కైట్, లీసర్ ప్లాంబాకక్ ఉడ్పికర్, ఓరియంటల్ హనీ బజర్డ్, ఇండియన్ కార్మోరన్ట్, స్పాటెడ్ ఔల్ట్, కామన్ హూప్, బ్రౌన్వుడ్ శ్రైక్, ఆశిక్రౌన్డ్ స్పారో లార్క్, ఎల్లో ఫ్రూటెడ్ గ్రీన్ పిజియన్, కామన్ హాక్ కుకూ, శిక్రా, చాంగెబ్ల్ హాక్ ఈగల్, పైడ్ కింగ్‌ఫిషర్, వైట్ ఐ బజర్డ్, సినిరియస్ టిట్, వైట్ త్రోటెడ్ కింగ్‌ఫిషర్, అలెగ్జాండ్రిన్ ప్యారకిట్, ఓరియంటల్ డార్టర్, బ్లాక్ హెడెడ్ హైబీస్, రివర్ టర్న్ తదితర జాతుల పక్షులు ఇక్కడ ఆవాసాలు ఏర్పరుచుకున్నట్లు గుర్తించారు. అమ్రాబాద్ రిజర్వ్‌లోనే 310 రకాల పక్షలు ప్రపంచంలో మొత్తం 10,906 పక్షి జాతులను ఇప్పటివరకు గుర్తించారు. వాటిలో 1,353 పక్షి జాతులు భారత్‌లో నివసిస్తున్నాయని జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడించింది. మొత్తం పక్షి జాతుల్లో ఇది 12.4 శాతం. తెలంగాణలో గతంలో 380 రకాల పక్షలను గుర్తించినట్లు నివేదికలు ఉన్నాయి. తాజాగా మరికొన్ని కొత్త జాతులను గుర్తించటంతో వాటి సంఖ్య 432కు పెరిగింది. నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్నే ఇప్పటివరకు 310 పక్షి జాతులను గుర్తించారు. రెండేళ్లుగా నల్లమలలో ఫారెస్ట్ వాగ్‌టెయిల్, బ్లాక్ బజా, లగర్ ఫాల్కన్, డస్కీ ఈగల్ ఔల్, స్పాట్ బెల్లీడ్ ఈగల్ ఔల్ వంటి అరుదైన పక్షులు సందడి చేస్తున్నాయి.తాడ్వాయి, ములుగు, వెంకటాపురం, గణపురం, రామప్ప, పాకాల, లక్నవరం ప్రాంతాల్లో అలెగ్జాండ్రిన్ ప్యారకిట్, ఓరియంటల్ డార్టర్, బ్లాక్ హెడెడ్ హైబీస్, రివర్ టర్క్ తదితర 122 రకాల పక్షులను గుర్తించినట్లు ఫారెస్టు కాలేజ్, రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రిసెర్స్ స్కాలర్స్ సాహిత్ చెప్యాల, నిఖిల్ బుసాయి ‘సాక్షి’కి తెలిపారు. కవ్వాల్, శివ్వారం, మంజీరా, ప్రాణహిత అభయారణ్యాల్లో కూడా ఇవి కనిపించినట్లు చెప్పారు. అయితే ఇసుక తవ్వకాలు, సింగరేణి బొగ్గు కార్యకలాపాలు, కాలుష్యం వంటి చర్యలు పక్షుల మనుగుడపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పంటపొలాల్లో వాడుతున్న క్రిమి సంహారకాలు పక్షులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి.వలస పక్షులకు విడిదిగా నల్లమల నల్లమల అటవీప్రాంతం అరుదైన వలస పక్షులకు విడిదిగా మారింది. అంతరించిపోతున్న పక్షులు సైతం ఇక్కడ కనిపించాయి. పక్షుల సంరక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. – మదన్‌రెడ్డి, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్, హైదరాబాద్.పక్షులకు ఆలవాలం మన అడవులు భూపాలపల్లి, ములుగు, ఏటూరునాగారం ప్రాంతాల్లో 122 రకాల పక్షులు కనిపించాయి. ఇందులో మూడు రకాల పక్షులపై పర్యావరణ మార్పుల ప్రభావం పడుతోంది. జీవవైవిధ్య పరిరక్షణపై ప్రభుత్వాలు ఇంకా శ్రద్ధ వహించాల్సి ఉంది. – సాహిత్ చెప్యాల, రిసెర్స్ స్కాలర్, ఎఫ్సీఆర్ఐ, ములుగు.310 రకాల పక్షులను గుర్తించాం నల్లమలలో ఇప్పటివరకు మొత్తం 310 రకాల పక్షులను గుర్తించాం. వీటిలో కొన్ని వలస పక్షులు, మరికొన్ని అత్యంత అరుదైన పక్షులు ఉన్నాయి. ఇక్కడ జీవవైవిద్యం పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీంతో క్రమంగా పక్షులు, వన్యప్రాణుల సంఖ్య పెరుగుతోంది. – రోహిత్ గోపిడి, ఐఎఫ్ఎస్ అధికారి, డీఎఫ్ఓ, నాగర్‌కర్నూల్ జిల్లా. -
జన్నారం: కవ్వాల్ టైగర్‌జోన్ రకరకాల పక్షులకు ఆవాసంగా మారింది.
-
బయోడైవర్సిటీ లాస్!
పక్షులు, జంతువుల సహజ ఆవాసాల తగ్గుదల... క్షీణిస్తున్న అడవులు, తగ్గుతున్న చెట్ల విస్తీర్ణం, పచ్చదనం... ఇంకా లోతుగా విశ్లేíÙస్తే ప్రపంచవ్యాప్తంగా వేగంగా సంభవిస్తున్న వాతావరణ మార్పుల ప్రభావంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. దీంతో వన్యప్రాణులు, పక్షి, జంతు, వృక్ష... ఇలా విభిన్న రకాల జాతులు క్రమంగా తగ్గిపోతున్నాయి.భారీ ప్రాజెక్టులు, అధిక విస్తీర్ణంలో వివిధరూపాల్లో పర్యావరణంపై, ఇతర రూపాల్లో ప్రభావం చూపేలా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అవసరానికి మించి సహజ వనరుల వినియోగం, గాలి, నీరు కాలుష్య బారినపడడం వంటి వాటి వల్ల జీవవైవిధ్యంపై ప్రభావం చూపడంతో పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ‘వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) లివింగ్ ప్లానెట్ రిపోర్ట్– 2024’నివేదిక ప్రకారం చూస్తే... ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లలో వన్యప్రాణుల జనాభా సగటు సైజ్ అనేది 73 శాతం మేర తగ్గిపోయింది. జూలాజిక్ సొసైటీ ఆఫ్ లండన్ (జెడ్ఎస్ఎల్) రూపొందించిన ‘ద లివింగ్ ప్లానెట్ ఇండక్స్’ నివేదికను గమనిస్తే...1970–2020 మధ్యలో వివిధ జంతు, పక్షు జాతుల్లో 85 శాతం ఫ్రెష్ వాటర్ పాపులేషన్, టెర్రస్టియల్ పాపులేషన్ 69 శాతం, మెరైన్ పాపులేషన్ 56 శాతం తగ్గినట్టుగా తేలింది. జీవవైవిధ్యమనేది భూమి, విభిన్న రకాల మొక్కలు, వృక్షజాతులు, జంతు, పక్షి జాతులు, వివిధ రకాల సూక్ష్మజీవులు (మైక్రో ఆర్గనిజమ్స్) తదితరాలతో కూడుకుని ఉంటుంది. – సాక్షి, హైదరాబాద్తెలంగాణలో చూస్తే..వివిధ రూపాల్లో వెల్లడైన వివరాలు, సమాచారం మేరకు చూస్తే తెలంగాణలో జీవవైవిధ్యా నికి వాటిల్లిన నష్టానికి ప్రధానంగా అడవులకు వాటిల్లుతున్న నష్టం, తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణం, అంతర్ గ్రహ మొక్కలు (ఇన్వెసివ్ ఎలియన్ స్పీషీస్) విపరీతంగా పెరుగుదల, మత్స్య రంగ అతి వినియోగం, కాలుష్య స్థాయిల పెరుగుదల, వాతావరణ మార్పులతో చోటుచేసుకుంటున్న పరిణామాలు వంటివి కారణమవుతున్నాయి. ⇒ 2023 జూన్ గణాంకాల ప్రకారం తెలంగాణలో 2 వేల మొక్కలు, వృక్షాల రకాలు, 5,757 జంతురకాలు ఉన్నట్టుగా తేలింది. సాధారణంగా జెనిటిక్ డైవర్సిటీ, స్పీషీస్ డైవర్సిటీ, ఎకోసిస్టమ్ డైవర్సిటీల ద్వారా జీవవైవిధ్యాన్ని పరిశీలిస్తారు. ⇒ 2023లో తెలంగాణలో 646 హెక్టార్ల సహజ అటవీ ప్రాంతం కోల్పోవాల్సి వచ్చింది. ఇండియన్ పంగోలిన్, మౌస్డీర్స్, మలబార్ పైడ్ హార్న్‌బిల్, బ్లాక్నెక్డ్ స్టోర్క్, రుడ్డి మంగ్యూస్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, సంద్కోల్ కార్ప్ వంటి జంతు, పక్షి రకాలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. స్లోత్బేర్, ఇండియన్ బైసన్, ఇండియన్ స్కిమ్మర్ బర్డ్ జాతులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జీవవైవిధ్యం ఏ స్థాయిలో ఉంది, ఎదురవుతున్న సమస్యలు, అందుకు కారణాలు ఏమిటి? తదితర అంశాలపై పర్యావరణ విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ అనలిస్ట్ డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్ తమ అభిప్రాయాలు, విశ్లేషణలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే...గ్రీన్‌కవర్ పెంచడమే బయో డైవర్సిటీ కాదుజీవవైవిధ్యం అంటే ఏమిటనేది అందరూ అర్థం చేసుకోవాలి. కేవలం గ్రీన్‌కవర్ పెంచడమే బయో డైవర్సిటీ కాదు అని గుర్తించాలి. విధాన నిర్ణేతలు, ప్రజాప్రతినిధులు కూడా గడ్డిభూములు, బీడుభూములు వంటివి కూడా పర్యావరణవ్యవస్థల పరిధిలోకి వస్తాయని గుర్తించాలి. చెట్లు అనేవి జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని మనమంతా గుర్తించాలి. భారీ ప్రాజెక్టులు, అధిక విస్తీర్ణంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల వల్ల పెద్దసంఖ్యలో చెట్ల తొలగింపు, గ్రీన్‌కవర్ తగ్గినప్పుడు జీవవైవిధ్యానికి నష్టం జరుగుతుంది.నగరాల్లోనూ రోడ్ల విస్తరణ, నిర్మాణపరమైన ప్రాజెక్టులు మొదలుపెట్టినప్పుడు వెంటనే ట్రీకవర్ తగ్గిపోయిన ప్రభావం తప్పకుండా జీవవైవిధ్యంపై పడుతుంది. పచ్చదనం పెంచేందుకు చేపట్టే కార్యక్రమాల సందర్భంగా గడ్డి మైదానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ విషయంపై తెలంగాణలో పెద్దగా దృష్టి సారిస్తున్న పరిస్థితులు అంతగా కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో తగినంత స్థాయిలో గడ్డిమైదాన ప్రాంతాలున్నాయి.వాటిని యుద్ధప్రాతిపదికన సంరక్షించాలి. అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యాల్లో మంచిస్థాయిలో జీవవైవిధ్యమనేది అలరారుతోంది. ఇదే పద్ధతిలో రాష్ట్రంలోని జాతీయపార్కులు, శాంక్చురీలలోనూ జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌లో దాదాపు పది, పన్నెండేళ్ల క్రితం నిర్వహించిన కాప్ సదస్సు తర్వాత జీవవైవిధ్యం కొంతమేర మెరుగైంది. రాష్ట్రంలో ఎంత మేర జీవవైవిధ్యాన్ని నష్టం జరిగింది, ఏ ఏ పక్షి, చెట్లు, జంతువుల రకాలు తగ్గిపోయాయనే దానిపై పూర్తిస్థాయిలో శాస్త్రీయ పరిశీలన, అధ్యయనమేదీ జరగలేదు. అందువల్ల ఎంతమేర నష్టం జరిగింది, ఏఏ జాతులు కనుమరుగు అవుతున్నాయనే దానిపై సాధికారికంగా వ్యాఖ్యానించేందుకు అవకాశం లేదు. –ఫరీదా తంపాల్, స్టేట్ డైరెక్టర్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫర్ నేచర్–ఇండియా రాష్ట్రంలో దిగజారుతున్న జీవ వైవిధ్యం కొంతకాలంగా రాష్ట్రంలో జీవవైవిధ్యం అనేది దిగజారుతోంది. అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. కొన్ని చెట్లు, మొక్కల రకాలు కూడా అంతరిస్తున్నాయి. ఊర పిచ్చుకలు, బోరుగ పిచ్చుకలు దాదాపుగా కనబడకుండాపోగా, కాకులు, ఇతర పక్షుల సంఖ్య కూడా క్షీణిస్తోంది. కప్పలు, కొన్నిరకాల చేపలు కూడా తగ్గిపోతున్నాయి. అడవుల తగ్గుదల ప్రభావం, చెట్లు, పచ్చదనం తగ్గిపోవడం వంటి కారణాల వల్ల జంతువులు, పక్షుల ఆవాసాలు, నివసించే ప్రదేశాలు కుచించుకుపోతున్నాయి. వాటికి సరైన ఆహారం దొరకడం లేదు. పక్షులు, ఇతర జంతువులు తాగేనీరే తక్కువ కాగా, అది అంతగా లభించడం లేదు. నగరం, పట్టణాల చుట్టుపక్కల పైపులైన్లతోనే ఇళ్లకు నీటి సరఫరా, ఉపరితలంపై ఉన్న నీరు కలుషితం కావడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. పక్షులు, జంతువులు వంటి వాటికి నీరు, ఆహారం దొరక్క ఆవాస ప్రాంతాలు, గుడ్లు, సంతానం పెంపొందించుకునే అవకాశం లేకపోవడంతో పక్షి, జంతుజాతులు తగ్గిపోతున్నాయి. ప్రధానంగా అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా ప్రాజెక్టులు, ఇతర రూపాల్లో నిర్మాణాలు పెరిగిపోవడం, అవసరానికి మించి సహజవనరుల అతి వినియోగం, గణనీయంగా పెరిగిన రోడ్ల విస్తరణ, వాహనాల రాకపోకలు పెరగడం, ఆన్‌రోడ్డు వెహికిల్సే కాకుండా ఇసుక, మైనింగ్, ఇతర అవసరాల కోసం నీరు, ఇతర ప్రదేశాల్లోకి వాహనాల ప్రవేశం నష్టం చేస్తోంది.2012లో హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ కాప్ సదస్సు తర్వాత జీవవైవిధ్య పరిరక్షణ, అటవీ సంరక్షణ చట్టాలను నీరుగార్చారు. పిచ్చుకలు, ఇతర తగ్గిపోతున్న పక్షి, జంతుజాతులను ఎలా సంరక్షించాలనే దానిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. – డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణరంగ విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ అనలిస్ట్ -
అవి క్రిస్మస్ పక్షులు.. వాటి కువకువలు సుమధుర సరాగాలు
పక్షుల కిలకిలారావాలు ఎవరినైనా మైమరపిస్తాయి. ఇక వాటి రూపం కూడా అమితంగా ఆకట్టుకుంటుంది. ఉత్తర అమెరికాలో క్రిస్మస్ సీజన్లో అందమైన వెర్మిలియన్ పక్షులు సందడి చేస్తుంటాయి. అందుకే వాటిని క్రిస్మస్ పక్షులని అంటారు. ఇవి ఎరుపురంగులో ఆకర్షణీయంగా ఉంటాయి.ఈ పక్షులను కార్డినల్స్ లేదా నార్తర్న్ కార్డినల్స్ అని కూడా పిలుస్తారు. క్రిస్మస్ రోజుల్లో ఈ పక్షులు తమ కువకువలను శ్రావ్యంగా వినిపిస్తాయి. ఈ పక్షులలోని ఆడ, మగ పక్షుల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది.నార్తర్న్ కార్డినల్స్ మగ, ఆడ పక్షుల మధ్య ప్రధాన వ్యత్యాసం వాటి రంగు. మగవెర్మిలియన్ ఎరుపు రంగులో ఉండగా, ఆడవి గోధుమ లేదా బూడిద రంగులో ఉంటాయి. వాటి తోక, శరీరంలోని కొన్ని భాగాలు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ పక్షులు పసుపు, తెలుపు రంగులలోనూ కనిపిస్తాయి.కార్డినల్స్ లేదా నార్తర్న్ కార్డినల్స్ వాటి ఈకల నుండి ఎరుపు రంగును స్వీకరిస్తాయి. వాటి తోక, ముక్కు కూడా ఎరుపు రంగులో ఉంటాయి. అవి తాము తినే ఆహరం నుంచి ఇటువంటి రంగును పొందుతాయి. ఇవితినే ఆహారంలోని కెరోటినాయిడ్లు వీటికి ఎరుపు, నారింజ, పసుపు, గులాబీ రంగులను అందిస్తాయి. ఈ రంగులన్నీ వాటి ఈకలలో ప్రతిబింబిస్తాయి. ఆడపక్షులలో ఎరుపు రంగుకు బదులుగా, పసుపు బూడిద రంగు ఎక్కువగా కనిపిస్తుంది. ఎరుపు రంగు తక్కువగా ఉంటుంది.నార్తర్న్ కార్డినల్స్ ప్రత్యేకత ఏమిటంటే వీటి కిలకిలారావాలు పాటల మాదిరిగా వినిపిస్తాయి. అవి భూమిపైకి దిగి పరిగెత్తేటప్పుడు కిలకిలారావాలు చేస్తాయి. ఆడ, మగ రెండూ పాడతాయి. అవి 24 రకాలుగా కిలకిలారావాలు చేస్తాయని పరిశోధనల్లో తేలింది.కార్డినల్స్ జీవితాంతం ఒక భాగస్వామితోనే కలసి ఉంటాయి. ఎప్పుడూ కలసే కనిపిస్తాయి. కలిసి గూడు కట్టుకుంటాయి. అయితే గుడ్లు పెట్టిన తర్వాత మగ పక్షులు గూడుకు దూరంగా ఉంటాయి. తరువాత ఆరెండూ తమ పిల్లపక్షులను ఎంతో శ్రద్ధగా పెంచుతాయి. వాటికి ఆహారం అందిస్తాయి.ఆడ కార్డినల్స్ ఎక్కువగా కిలకిలారావాలు చేస్తాయి. వేటగాళ్ళు తమ గూడును గుర్తించకుండా ఉండేందుకే అవి సందడి చేస్తాయని పరిశోధనల్లో తేలింది. అలాగే మగపక్షితో ఆహారం తీసుకురమ్మని చెప్పేందుకు అవి ప్రత్యేక శబ్దాలు కూడా చేస్తాయి.కొన్నిసార్లు ఈకలు లేని కార్డినల్స్ కూడా కనిపిస్తాయి. అవి ప్రతి సంవత్సరం తమ ఈకలను తొలగిస్తాయి. ఆ తర్వాత పాత వాటి స్థానంలో కొత్త ఈకలు వస్తాయి. ఈ మధ్య నుండే సమయంలో అవి ఈకలు లేని పక్షులుగా కనిపిస్తాయి. -
చిత్తడి నేలలో పుత్తడి పక్షులు
సూళ్లూరుపేట: నిండా నీళ్లతో కళకళలాడుతున్న పులికాట్ సరస్సులో అతిథి పక్షులు సందడి చేస్తున్నాయి. దేశంలోనే రెండో అతి పెద్ద సరస్సుగా పేరొందిన పులికాట్ సరస్సు అసలు పేరు ప్రళయ కావేరి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సరస్సు జలకళ సంతరించుకున్న వేళ.. ఎవరో పిలిచినట్టుగా రంగు రంగుల విహంగాలు సుదూర తీరాల నుంచి వచ్చి వాలిపోతున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ దాదాపు 250 చ.కి.మీ. వైశాల్యంలో సరస్సు వ్యాపించి ఉంది. వర్షాకాలంలో ఇది 460 చ.కి.మీ. వరకు పెరుగుతుంది. ప్రస్తుతం స్వర్ణముఖి, కాళంగి నదులతోపాటు పాముల కాలువ, కరిపేటి కాలువ, దొండ కాలువ, నెర్రి కాలువలు జోరుగా ప్రవహిస్తుండడంతో పులికాట్ సరస్సులోకి భారీగా నీరు చేరుతోంది. అతిథి పక్షుల ఆవాసాలుగా గ్రామాలు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నేలపట్టు, వెదురుపట్టు, శ్రీహరికోట, తడ తదితర ప్రాంతాల్లోని గ్రామాలన్నీ అతిథి పక్షులకు ఆవాసాలుగా మారాయి. ఇక్కడి చెట్లపై వలస పక్షులు గూళ్లు కట్టుకుని శీతాకాలమంతా ఇక్కడే ఉండిపోతాయి. గుడ్లుపెట్టి.. పిల్లలను పొదిగి.. అవి పెద్దవయ్యాక మార్చి, ఏప్రిల్ నెలల్లో తిరిగి విదేశాలకు పయనమవుతాయి. పక్షులు ఇక్కడ ఉన్నన్ని రోజులు పులికాట్ సరస్సును ఆహార కేంద్రంగా వినియోగించుకుంటాయి. సందర్శకుల సందడి పులికాట్ సరస్సుకు వలస పక్షుల రాక మొదలవడంతో సూళ్లూరుపేట–శ్రీహరికోట రోడ్డు వెంబడిగల చెట్లన్నీ కళకళలాడుతున్నాయి. వీటిని వీక్షించేందుకు పర్యాటకుల తాకిడి మొదలైంది. పక్షులను తమ కెమెరాల్లో బంధించేందుకు సందర్శకులు, బర్డ్ వాచర్స్ ఈ ప్రాంతంలోనే విడిది చేస్తున్నారు.152 రకాల పక్షుల రాక ఏటా పులికాట్ సరస్సుకు సుమారు 152 రకాల విహంగాలు సైబీరియా, నైజీరియా, రష్యా, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనాతో పాటు పలు యూరోపియన్ దేశాల నుంచి వలస వస్తుంటాయి. ఆ దేశాల్లో మంచు, చలి ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడికి వలస వస్తుంటాయి. శీతాకాలంలో ఇక్కడి వాతావరణం సమశీతోష్ణ స్థితి ఉండటంతో పులికాట్‌కు సరస్సుకు నీళ్లు చేరగానే పక్షులు వాలిపోతుంటాయి. పులికాట్ సరస్సుకు ఫ్లెమింగోలతో పాటు పెలికాన్స్, ఎర్రకాళ్ల కొంగలు, నారాయణ పక్షులు, నత్తగుల్ల కొంగలు, నీటికాకులు, తెల్ల కంకణాయిలు, నల్ల కంకణాయిలు, శబరి కొంగలు, నీల»ొల్లి కోడి, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్, పాము మెడ పక్షి, తెల్ల పరజలు భారీగా వస్తుంటాయి. చుక్కమూతి బాతులు, తెడ్డుముక్కు బాతులు వంటి బాతు జాతులే 20 రకాల వరకు ఇక్కడకు వస్తుంటాయి. సీగల్స్, ఇంకా పేరు తెలియని కొన్ని పక్షి జాతులు సైతం ఇక్కడకు వస్తున్నాయి. స్వదేశీ పక్షులు, స్వాతి కొంగలతోపాటు పలు కొంగజాతులు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. ఉప్పలపాడులో కిలకిలరకరకాల విదేశీ పక్షుల రాకతో గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, ఉప్పలపాడులోని వలస పక్షుల విడిది కేంద్రం సందడిగా మారింది. ఈ కేంద్రంలో గూడ బాతులు (పెలికాన్స్), ఎర్రకాళ్ల కొంగలు (పెయిడెంట్ స్టార్స్), నత్తగుల్ల కొంగలు (ఓపెన్‌బిల్) పచ్చటి చెట్లపై గుంపులు గుంపులుగా సేదతీరుతూ చూపురులను ఆకట్టుకుంటున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు. -
ఏ సీమ దానవో.. ఎగిరెగిరి వచ్చావు..
సాక్షి, హైదరాబాద్: ఆయా దేశాల్లో జీవించే పక్షులు అక్కడి ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు వివిధ దేశాలకు వలస వెళుతుంటాయి. కేవలం 12 సెం.మీ సైజు ఉండే ‘రెడ్–బ్రెస్టెడ్ ఫ్లైక్యాచర్’పేరుతో పిలిచే ఈ పక్షిది అద్భుత ప్రయాణం. ఈ పక్షులు వివిధ ఖండాలు, సముద్రాల మీదుగా ఎగురుతూ, వేలాది మైళ్లు ప్రయాణం చేసి హైదరాబాద్ మహానగరానికి వలస వస్తున్నాయి. ప్రస్తుతం తూర్పు ఐరోపా దేశాల్లో తీవ్రస్థాయిలో చలి పెరిగి, మంచుమయమై పోతున్న సమయంలో సమశీతోష్ణస్థితి ఉన్న దక్షిణాసియాలోని మనదేశానికి.. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌కు ఈ పక్షులు చేరుకుంటున్నాయి.ప్రతి ఏడాది నవంబర్ నుంచి మార్చి దాకా విదేశాలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో పక్షులు నగరానికి వలస వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు సత్ఫలితాలు ఇస్తోందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా...గతంలో వివిధ రకాల పక్షులకు, ప్రధానంగా వలస పక్షులకు ఆవాసంగా ఉన్న అమీన్పూర్ చెరువు పరిసర ప్రాంతాల్లో ఈ పక్షి దర్శనమిచ్చి పక్షి ప్రేమికులను ఆనందపరిచింది. సాధారణంగా పక్షులు ఎక్కడ గూడును ఏర్పాటుచేసుకుని పిల్లలి్నకంటాయో అక్కడికే మళ్లీ వలస వస్తాయని నిపుణులు చెబుతున్నారు.తాము గతంలో ఉన్న ప్రదేశంలో గూడు చెదిరినా, చెట్లు, నీళ్లు, పరిసరాల్లో మార్పులు సంభవించినా మళ్లీ అవి అక్కడకు రావని వెల్లడించారు. సాధారణంగా ఇది ‘బ్రీడింగ్ టైమ్’కాబట్టి ఇక్కడకు వచ్చి గూడు ఏర్పాటు చేసుకుని పిల్లల్ని పెడుతుంటాయని తెలిపారు. ఈ సందర్భంగా సాక్షి ప్రతినిధితో హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ అధ్యక్షుడు ఆడేపు హరికృష్ణ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వలసపక్షుల రాకపై ఆయన మాటల్లోనే... ‘ప్రస్తుతం నగరంలో ‘రెడ్–బ్రెస్టెడ్ ఫ్లై క్యాచర్’పక్షి కనువిందు చేస్తోంది. మనదేశానికి వలస రావడానికి కొన్నిరోజుల ముందు నుంచే బాగా ఆహారం తీసుకుని, శరీరంలో పెద్దమొత్తంలో కొవ్వు నిల్వ అయ్యేలా చూసుకుంటుంది. సముద్రాల మీదుగా ప్రయాణం సాగిస్తున్నపుడు ఈ కొవ్వునే ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. మరే దేశంలో లేని విధంగా మనదేశంలో 1,300 రకాల పక్షిజాతులున్నాయి. వీటిలో అత్యధికశాతం అంటే 70 శాతం దాకా వలస పక్షులు హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తుంటాయి. – ఆడేపు హరికృష్ణ ,అధ్యక్షుడు, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ -
‘అతిథులు’ ఆగయా..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రానికి విదేశీ వలస పక్షుల రాక మొదలైంది. ఇప్పటికే సంగారెడ్డి సమీపంలోని అభయారణ్యంతోపాటు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల సరస్సుకు విదేశీ పక్షులు వచ్చి సందడి చేస్తున్నాయి. వాటిలో నార్తర్న్ షావెలర్.. నార్తర్న్ పిన్‌టైల్.. రెడ్ హెడ్ బంటింగ్.. బ్లాక్ హెడ్ బంటింగ్.. బ్లూత్రోట్.. రోజీ స్టార్లింగ్.. అ్రల్టామెరైన్ ఫ్లైక్యాచర్.. బ్లూథ్రోట్ బర్డ్, వెస్టర్న్ మార్‡్ష హారియర్, లిటిల్ కంఫర్ట్ బర్డ్, కామన్ పోచార్డ్ తదితర పక్షులు ఉన్నాయి. వెచ్చని వాతావరణం ఉండటంతో.. యూరప్, రష్యా, పశ్చిమాసియా దేశాల్లో మంచుచలికాలం నుంచి తప్పించుకోవడం కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య తెలంగాణ ప్రాంతానికి విదేశీ పక్షులు వస్తున్నాయి. అక్కడితో పోలిస్తే వెచ్చని వాతావరణం ఉండటంతోపాటు తగినంత ఆహారం లభిస్తుండటం, సంతానోత్పత్తికి అనువైన పరిస్థితులు ఉండటంతో రాష్ట్రంలోని అభయారణ్యాలు, సరస్సులకు విచ్చేస్తున్నాయి.చిత్తడి నేలలు.. స్వచ్ఛమైన నీరు..మంజీరా వన్యప్రాణుల అభయారణ్యంలో జీవవైవిధ్యమున్న చిత్తడి నేతలు, గడ్డి భూములున్నాయి. మంజీరా డ్యాం ఎగువన.. సింగూరు ప్రాజెక్టు దిగువన ఉన్న ఈ జలాశయంలో సుమారు 20 వరకు చిన్న దీవులున్నాయి. అవి స్థానిక పక్షులతోపాటు విదేశీ పక్షులకు గమ్యస్థానంగా మారాయి. మరోవైపు పాకాల సరస్సు వద్ద లిటిల్ కోర్మోరెంట్, మైక్రో కార్బోనైజర్, ఇండియన్ కోర్మోరెంట్, ఫలక్రోకోరాక్స్, ఇండియన్ పాండ్ హెరాన్, ఏర్డియోలాగ్రై, గ్లోసీఇబీస్, ప్లెగడీస్ ఫాల్సినీలియస్ తదితర విదేశీ పక్షులు సంచరిస్తున్నాయి. ఈ సరస్సు కాలుష్యరహితం కావడంతో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. దీనిచుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో పచ్చని చెట్లు విదేశీ పక్షుల విడిదికి నిలయంగా మారాయి. పాకాల అభయారణ్యంలో ఎత్తయిన చెట్లతోపాటు సరస్సులో స్వచ్ఛమైన నీరు ఉండటం వల్ల ఈ ప్రాంతానికి విదేశీ పక్షులు వస్తున్నాయని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. వలసపక్షుల సంఖ్య తగ్గిపోతోంది.. మంజీరా అభయారణ్యంతోపాటు అమీన్పూర్ చెరువు, కిష్టారెడ్డిపేట్ చెరువు, పోచా రం అభయారణ్యానికి విదేశీ పక్షులు వచ్చా యి. ఏటా సైబీరియా, చైనా, రష్యా వంటి దేశాల నుంచి ఈ పక్షులు వస్తుంటా యి. పట్టణీకరణ కారణంగా చెరువులు అన్యాక్రాంతం అవుతుండటంతో విదేశీ వలసపక్షుల సంఖ్య తగ్గిపోతోంది. వా తావరణంలో వస్తున్న మార్పులు కూడా ఇందుకు కొంత కారణమవుతున్నాయి. -
రేర్ బర్డ్స్.. నో వర్డ్స్..
రాష్ట్రానికి, నగరానికి ఏడాది పొడవునా వలస పక్షుల రాకపోకలు ఉంటాయి. సమ్మర్లో కొద్దిగా మాత్రమే వస్తాయి. అయితే వర్షాకాలం నుంచి పెరుగుతూ.. వింటర్లో బాగా ఎక్కువగా 2, 3 రెట్లు ఎక్కువగా పక్షులు వలస వస్తాయి. ఒకప్పుడు ఇలాంటి వలస పక్షులకు నగరంలో చాలా స్పాట్స్ ఉన్నాయి. కానీ కాలక్రమంలో లేక్స్ కనుమరుగవుతుండడం వల్ల వీటికి ఆవాసాలు దొరకడం లేదు. చిరునామాలివే.. నగరం చుట్టు పక్కల పక్షుల వీక్షణకు వీలు కల్పించే ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు అమీన్పూర్లేక్, జనవాడ వైపు గండిపేట్లేక్, మోకిలా వంటి ప్రాంతాల్లో విపరీతంగా కనిపించేవి. ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. ఇప్పటికీ కాలుష్య కాసారాలుగా మారిన లేక్స్‌లో కూడా పక్షలు కనిపిస్తున్నాయి. వాటిని కాలుష్యరహితంగా మారిస్తే మరింత బాగా పెరుగుతాయి. సంజీవయ్య పార్క్ దగ్గర కూడా బోలెడు పక్షులు, డక్స్ ఉంటాయి. నగరంలో ప్రస్తుతం పక్షులు చూడాలంటే కెబిఆర్ పార్క్, బొటానికల్ గార్డెన్స్, సంజీవయ్య పార్క్‌లలో చూడొచ్చు. చుట్టుపక్కల చెరువుల్లో.. నగరం చుట్టుపక్కల అయితే.. అనంతగిరి హిల్స్ బెస్ట్. అక్కడకు వెళ్లినప్పుడల్లా ఒక్కోసారి ఒక్కో ఆశ్చర్యకరమైన పక్షి కనబడుతుందని పక్షి ప్రేమికులు అంటున్నారు. అదే కాక ఉస్మాన్‌సాగర్, కొడకంచి లేక్, కృష్ణారెడ్డి పేట్ చెరువు.. మంజీరా వైల్డ్‌లైఫ్ శాంక్చురీ, పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ, నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్, సింగూర్ డ్యామ్ కూడా బర్డ్స్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా చెప్పొచ్చు. ఇటీవల సిటీలోని కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లోని కాలనీ పార్క్స్‌లో కూడా బాగా పెరుగుతున్నాయి.సీజన్ స్పెషల్స్ ఇవే.. వానాకాలం మన సమీపానికి వచ్చే పక్షుల్లో రెయిన్ క్వాయిల్, పెయింటెడ్ ఫ్రాంకొలిన్, జాకొబిన్ కుకూ (దీనినే మాన్సూన్ బర్డ్ అని కూడా పిలుస్తారు. ఇది రుతుపవనాల ప్రారంభ సమయంలో వస్తుంది) వంటివి ఉన్నాయి. ఇవి మంజీరాలేక్, యంకతల.. వంటి సరస్సులు, పచ్చని పచి్చక బయళ్లలో కనిపిస్తాయి. ఇక శీతాకాలంలో వచ్చేవాటిలో వర్డియర్ ఫ్లై క్యాచర్, ఇండియన్ బ్లూ రాబిన్, బార్ హెడెడ్ గూస్ (ఇది సరస్సుల దగ్గర బాగా కనిపిస్తుంది. ప్రస్తుతం మంజీరాలేక్ దగ్గర దీనిని చూడొచ్చు. విదేశాల నుంచి హిమాలయాల మీదుగా ఈ పక్షి నగరానికి చేరుతుందట)తొలిసారిగా బర్డ్స్ పై బుక్.. మనకి చాలా చోట్ల పక్షులు కనిపిస్తాయి. కానీ అవేంటో వాటి ప్రత్యేకతలేమిటో తెలీదు. ఈ నేపథ్యంలో కొన్ని కామన్ బర్డ్స్ తీసి ఒక గైడ్‌లాగా ఇస్తే బాగుంటుందనీ, స్టూడెంట్స్‌కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ వాళ్లకి ఇస్తే ఉపయుక్తంగా ఉంటుందనే ఆలోచనతో తొలిసారిగా మన రాష్ట్రంలో పక్షుల వెరైటీలపై ఒక పుస్తకం రూపొందింది. రాష్ట్రంలో 430పైగా వెరైటీ పక్షులు ఉంటాయి. ఇందులో 252 రకాల పక్షుల ఫొటోలు, వాటి పేర్లు, విశేషాలు ఉంటాయి. రెగ్యులర్‌గా అనంతగిరికి ట్రెక్కింగ్‌కి వెళ్తుంటారు. అలాంటివారికి ఇవి ఇస్తే ఉపయుక్తం. ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలల విద్యార్థులకు లక్ష కాపీల వరకూ ఉచితంగా పంపిణీ చేయాలనే ఆలోచన చేస్తున్నారు. అమెరికా నేర్పిన అలవాటుగతంలో ఒకసారి అమెరికాలో కొంతకాలం ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో నేనున్న ప్రాంతానికి దగ్గరలో పెద్ద అడవి ఉండేది. అక్కడ రంగు రంగుల పక్షుల్ని కళ్లార్పకుండా చూడడం అలవాటైంది. ఇక్కడకు వచ్చాక సిటీలో పక్షులును అన్వేషిస్తూ.. సంజీవయ్య పార్క్‌కు తరచూ వెళ్లేవాడిని. ప్రస్తుతం విభిన్న ప్రాంతాలకు వెళ్లి పక్షుల్ని చూడడం ఒక నిత్యకృత్యం. ఈ అభిరుచితోనే హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ప్రారంభించాం. తాజాగా బర్డ్స్ మీద బుక్ లాంచ్ చేశాం. అంతేకాకుండా జనవరి నుంచి బర్డ్ అట్లాస్ పేరుతో వైవిధ్యభరిత కార్యక్రమం చేపడుతున్నాం. నగరం చుట్టుపక్కల విభిన్న ప్రాంతాల నుంచి దీనికి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఏ పక్షి ఎప్పుడు ఎలా కనిపిస్తుంది? అనేది రికార్డ్ చేసి ఒక మ్యాప్ తయారు చేయాలని ఆలోచన. అయితే దీన్ని పూర్తి చేయడానికి కనీసం ఏడాది పడుతుంది. – హరికృష్ణ, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ -
అందాల అడవి రైతు.. హార్న్‌బిల్
పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యం విభిన్న వన్యప్రాణులకు నెలవు. ఇక్కడి అరుదైన పక్షులు, జంతు జాతులు పర్యావరణ ప్రేమికుల్ని అబ్బురపరుస్తాయి. పక్షిజాతుల్లో అత్యంత అరుదైన జీవనశైలి హార్న్‌బిల్ (ఫారెస్ట్ ఫార్మర్) పక్షుల సొంతం. వీటి స్వభావం అచ్చంగా మనుషుల్ని పోలి ఉంటుంది. మగ పక్షులు కుటుంబ బాధ్యతను మోస్తూ.. ఆడ పక్షులకు అవసరమైన తిండిని సంపాదిస్తూ.. వాటిని గూడు దాటకుండా బాధ్యతగా చూసుకుంటాయి. వీటిని అడవి రైతులుగా పిలుస్తుంటారు. పొడవైన ముక్కు, తోకలతో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనపడతాయి. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం హార్న్‌బిల్ పక్షులు ఎత్తైన చెట్లలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ గూళ్లలో నివసిస్తాయి. మగ పక్షులు పితృస్వామ్యాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తూ కుటుంబ పోషణను చూసుకుంటాయి. తల్లి పక్షి గూడులో గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతుంది. పిల్లలతో కలిసి మూడు నెలలపాటు ఎటూ కదలకుండా గూట్లోనే ఉండిపోతుంది. మగ హార్న్‌బిల్ ఆ మూడు నెలలు ఆహారాన్ని సేకరించి.. గూట్లో ఉన్న తల్లి, పిల్ల పక్షులకు నోటిద్వారా అందిస్తుంది. ఆహారం కోసం తిరిగే సమయంలో మగ హార్న్‌బిల్ వేటగాళ్ల బారినపడినా.. ప్రమాదవశాత్తు మరణించినా గూటిలో ఉన్న తల్లి పక్షితోపాటు పిల్ల పక్షులు కూడా ఆకలితో చనిపోతాయే తప్ప ఇంకే ఆహారాన్ని ముట్టవు. దీంతోపాటు హార్న్ బిల్ పక్షుల దాంపత్య జీవనం ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఇవి జీవితాంతం ఒకే పక్షితో జత కడతాయే తప్ప మరే పక్షిని దరిచేరనివ్వవు. నాగాలాండ్‌లో ఏటా ఉత్సవం హార్న్‌బిల్ పక్షుల జీవన విధానానికి ముగ్ధులైన నాగాలాండ్ వాసులు వాటి పేరిట ఏటా 10 రోజుల పాటు ఉత్సవాన్ని జరుపుకుంటారు. నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమాకు 12 కిలోమీటర్లు దూరంలో గల కిసామాలోని గిరిజనులు హార్న్‌బిల్ ఉత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహిస్తారు. డిసెంబర్ 1నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవంలో చిన్నా పెద్డా తేడా లేకుండా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకుంటారు.రెండు రాష్ట్రాల పక్షి అరుణాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాలు రాష్ట్ర పక్షిగా హార్న్‌బిల్‌ను గుర్తించాయి. ఈ పక్షుల జీవన కాలం 40 నుంచి 50 సంత్సరాలని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. వీటి పొడవు 95 నుంచి 120 సెంటీమీటర్లు కాగా.. రెక్కలు విప్పినప్పుడు వీటి వెడల్పు 151 సెంటీమీటర్ల నుంచి 178 సెంటీమీటర్లు ఉంటుందని పేర్కొంటున్నారు. ఇవి సుమారు 4 కేజీల బరువు ఉంటాయి.ఫారెస్ట్ ఫార్మర్ హార్న్‌బిల్ మగ పక్షి పండ్లను సేకరించి తల్లి, పిల్లలకు ఆహారంగా అందిస్తుంది. గూడుకు చేరుకున్న పక్షి పండ్ల గింజలను తొలగించి మరీ పిల్లలు, తల్లి నోటికి అందిస్తుంది. అలా అందిస్తున్నప్పుడు.. అది వదిలేసిన గింజలు నేలపై పడి.. అడవిలో మొలకెత్తి చెట్లుగా ఎదుగుతాయి. అందుకే.. ఈ పక్షిని అడవి రైతుగా పేర్కొంటారు. -
కనువిందు చేస్తున్న విదేశీ వలస పక్షులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ప్రకృతి సౌందర్యం ప్రపంచం నలుమూలల పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. విదేశీ వలస పక్షులకు శీతాకాలపు ఆవాసాలుగా మారే ప్రదేశాలు ఉత్తరాఖండ్‌లో అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటి అసన్ కన్జర్వేషన్ రిజర్వ్. ఇది ప్రతియేటా అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వలస పక్షులకు సురక్షితమైన గమ్యస్థానంగా ఉంది.అక్టోబర్ వచ్చేసరికి సెంట్రల్ ఆసియా, సైబీరియా, కజకిస్తాన్, నేపాల్, భూటాన్, చైనా తదితర శీతల ప్రాంతాల నుండి వేలాది విదేశీ పక్షులు అసన్ కన్జర్వేషన్ రిజర్వ్‌కు తరలివస్తాయి. కఠినమైన శీతాకాలం నుండి తప్పించుకునేందుకు ఈ పక్షులు డెహ్రాడూన్‌లోని ఈ అందమైన ప్రదేశానికి వచ్చి నివసిస్తాయి. ఫిబ్రవరి చివరి నాటికి ఆరు వేలకుపైగా విదేశీ పక్షులు ఇక్కడికి తరలివస్తాయి. మార్చిలో అవి మళ్లీ తమ స్వస్థలాలకు తిరుగుముఖం పడతాయి. ఈసారి అక్టోబరులోనే 300లకు పైగా పక్షులు ఇక్కడికి చేరుకున్నాయి.రడ్డీ షెల్డక్, రెడ్ క్రెస్టెడ్ పోచార్డ్, కామన్ పోచార్డ్, యురేషియన్ విజియన్ వంటి పక్షులు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ అందమైన నీటి పక్షులను చూడటానికి పక్షి ప్రేమికులు ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడికి తరలివస్తుంటారు. అసన్ కన్జర్వేషన్ రిజర్వ్‌లో పక్షుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డెహ్రాడూన్ నుండి చక్రతా జాతీయ రహదారి మీదుగా హెర్బర్ట్‌పూర్ చేరుకోవచ్చు. అసన్ కన్జర్వేషన్ ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే గూగుల్ మొదటి ఒప్పందం -
నార్కోండం - మాయమైన మేకలు ఆసక్తికర కథనం
దట్టమైన అడవులు, కొండలు, బోలెడన్ని పక్షులు , మంచి నీటి సరస్సులు, అద్భుతమైన పగడపు దీవులతో నాగరికతకు దూరంగా ఒక దీవి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.ఆ దీవిలో ఒక విషపూరితం కాని పాము కూడా ఉందనుకోండి. అలాంటి ఒక దీవిని చూడాలని నేను ఎన్నో ఏళ్లగా అనుకుంటున్నాను. అయితే అనుకోకుండా ఒక రోజు నా కల నిజమైంది.అండమాన్ సముద్రములో 48 అడుగుల పడవపై నేను, మరో తొమ్మిది స్నేహితులు కలిసి నార్కోండం అనే ఒక నిద్రాణ అగ్నిపర్వతపు దీవిని పరిశీలించడం కోసం వెళ్ళాము.ఈ దీవిపై అతి కొద్దిమంది మాత్రమే కాలుమోపారు. ఆలా వెళ్లిన వారిలో నార్కోండం హార్నబిల్ అనే అరుదైన పక్షిని చూడటానికి వెళ్లిన పక్షి ప్రేమికులే ఎక్కువ. నార్కోండం హార్నబిల్ పక్షులు కేవలం 7 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణము కలిగిన ఈ నార్కోండం దీవిపై తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. కాకపోతే ఈ మధ్య కాలంలో సింగపూర్‌లోని పక్షులని అధ్యయనం చేసి ఒక సంస్థ ఈ జాతి ఆడ పక్షిని అక్కడ చూసినట్టు చెప్పారు. బహుశా ఎవరో కొన్నింటిని అక్రమంగా రవాణా చేసినట్టున్నారు.మా పడవ దీవి దక్షిణ అంచుని దాటి ఈశాన్య అంచున ఉన్న పోలీస్ పోస్ట్ అనే లంగరు వేసే చోటుకి చేరుకుంటూండగానే మాకు నార్కోండం హార్నబిల్ పక్షులు ఎగురుతూ కనిపించాయి. మా పడవ నుంచి చూస్తే 710 మీటర్ల ఎతైన ఆ అగ్నిపర్వతము ఆంతా దట్టమైన అడవితో నిండి ఉంది.ఈ దీవి భారత భూభాగ పరిధిలోకి వస్తుంది, అందుకే ఇక్కడ ఇండియన్ రిజర్వు బటాలిన్ వారి పారా మిలిటరీ పోలిసుల పోస్టు ఉంటుంది. ఒకప్పుడు ఏపుగా ఉండే బర్మా జీలుగ చెట్ల స్థానంలో ఇప్పుడు అక్కడ కొబ్బరి , అరటి , వక్క వంటి మనుషులకు ఉపయోగ పడే చెట్లు కనిపిస్తున్నాయి. ఆ దట్టమైన అడవిలో అనేక మేకలు మొక్కలను తింటూ హార్నబిల్ పక్షుల మనుగడకు ముప్పుగా తయారయ్యాయని ఒక కధనం విన్నాను.ఈ మేకలు ఆ దీవిపై సహజంగా కనిపించే ప్రాణులు కావు. ఈ మేకల వెనుక ఒక ఆసక్తికరమైన కధ ఉంది. 15 నుంచి 17వ శతాబ్దం మధ్యలో ఐరోపా నుండి అన్వేషక నావికులు ప్రపంచమంతా నౌకలలో ప్రయాణించే వారు. ఆ ప్రయాణంలో సుదూర ప్రాంతాల్లో ఉండే చిన్న దీవులు కనిపించినప్పుడు ఆ దీవుల్లో కొన్ని మేకలు, పందులు, కోళ్లు, కుందేళ్లు మరియు తాబేళ్లను వదిలి వెళ్లేవారు. ఆ దారిన వెళ్లే ఇతర నౌకలకు లేక దురదృష్టవశాత్తు పడవ మునిగిపోతే బ్రతికి బయటపడి దీవికి చేరుకున్నవారికి ఆహారముగా ఇవి ఉపయోగపడతాయని వారి ఉద్దేశం. 1899 లో ఏ. ఓ. హ్యూమ్ ఒక కధనంలో ఈ దీవిపై పందులు, మేకలు, కోళ్లను వదిలిపెట్టారు అని వ్రాసారు. కానీ మొదటిసారిగా ఎప్పుడు వాటిని అక్కడ వదిలారో ఎవరికీ కచ్చితంగా తెలియదు. ఆ కాలంలో వదిలిన వాటిని సముద్రపు దొంగలు లేక నావికులు ఆహారంగా తినేశారో లేక ఆ జంతువులే చనిపోయావో తెలియదు.అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇలా యాదృచ్ఛికంగా దీవులలో వదిలిన జంతువుల ఆ దీవులలోని జీవ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని ప్రభుత్వ అధికారులు నిర్మూలిస్తుండంగా, 1976 లో మన దేశ పోలీసులు రెండు జతల మేకలను ఈ దీవిపై పనిచేసే పోలీసుల ఆహారంకోసం ఉపయోగపడతాయని తీసుకువచ్చారు. ప్రతీరోజు మేక మాంసం తిని విసుగెత్తిపోయారో లేక తోటలను పెంచినట్టు ఆ దీవిలో మేకల పెంపకం పెద్ద వ్యాపారమే అయ్యిందో లేక మేకలు మిగతా దీవులలో వలె మేకలు నియంత్రణ లేకుండా చేయదాటిపోయాయో తెలియదు కానీ 1998 నాటికి ఆ దీవిపై దాదాపు 400 మేకలు చక్కగా భయంలేకుండా బ్రతుకుతూ కనిపించాయట!1990 దశాబ్దం మొదట్లో పక్షులను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు ఈ దీవిపై నుండి ఈ మేకలను నిర్మూలించాలని అడగడం మొదలుపెట్టారు. సాధారణంగా అగ్నిపర్వతం పరిసరాలు చిన్న రాళ్లతో నిండి ఉంటుంది. ఈ పర్వతంపై పెరుగుతున్న చెట్ల వేళ్ళు ఆ రాళ్లను ఒడిసి పట్టి ఉంచడం వలనే ఆ దీవిని ఒక్కటిగా ఉంచడం సాధ్యపడిందని కొందరు వాదిస్తారు. ముఖ్యంగా అత్తి జాతి చెట్లు ఈ రకంగా తమ వేళ్ళతో రాళ్ళని ఒడిసిపడతాయి. హార్నబిల్ పక్షుల ఆ చెట్ల పళ్ళను తమ పిల్లలకు ఆహారంగా ఉపయోగిస్తాయి. అయితే ఈ దీవిపై అపరిమితంగా పెరిగిపోయిన మేకలు, మొలకెత్తుతున్న అత్తి జాతి మొక్కలను తినడం మూలంగా, కొత్త చెట్లు పెరగడానికి అవకాశం లేక ఆ హార్నబిల్ పక్షుల ఆహారానికి ఇబ్బంది కలిగి తద్వారా వాటి మనుగడ ప్రమాదంలో పడింది. చివరికి మేకలు ఆ దీవికి ప్రమాదకారులుగా మారాయి. మేము ఈ దీవి చేరుకున్నాక, మూడు రోజులపాటు మేకల అడుగుల గుర్తుల కోసం, అవి తిని విసర్జించిన గుర్తుల కోసం, వాటి ఉనికిని తెలిపే ఏదైనా ఆధారాల కోసం దాదాపు ఆ దీవి మూడు వంతులు నడిచి పరిశీలించాము. ఆశ్చర్యంగా మాకు ఒక్క ఆధారం కూడా దొరకలేదు. బహుశా అధికారులు పక్షి శాస్త్రవేత్తలు అడిగినట్లే ఎంతో కష్టపడి వారి కోరిక తీర్చినట్టు ఉన్నారు. అయితే ఇక్కడ నివసిస్తున్న పోలీస్ మాత్రం, అంతకు ముందరి వారమే రెండు మేకలు కొండపైకి పరిగెడుతూ పారిపోవడం చూశామని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈ దీవిపైనా ఆ మేకల ప్రభావం తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి.రచయిత్రి: జానకి లెనిన్ఫోటోలు- రోహిత్ నానీవాడేకర్ -
నల్లమలలో పక్షుల కిలకిల
నల్లమల అంటేనే ఎన్నో వింతలు, విశేషాలకు పుట్టినిల్లు. జాతీయ జంతువైన పెద్దపులి నుంచి అరుదైన వన్యప్రాణులు, ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆధ్యాతి్మక కేంద్రాలైన ప్రముఖ పుణ్యక్షేత్రాలు, అద్భుత జలపాతాలు, పచ్చటి పర్వత సానువులు, దట్టమైన అడవుల అందాలు...ఇలా నల్లమల ఎన్నో అద్భుతాలకు ఆలవాలం. జీవ వైవిధ్యానికి పెట్టింది పేరైన నల్లమల తాజాగా దేశ, విదేశీ పక్షులకు స్థావరంగా మారింది. వేల కిలోమీటర్లు దాటుకుంటూ వలస పక్షులు నల్లమలకు చేరుకుని ఆవాసాలు ఏర్పరచుకుంటున్నాయి. నల్లమలలో పచ్చని చెట్లు, గలగల పారే సెలయేటి సవ్వడులు వలస పక్షులను మరింత ఆకర్షిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. – మహానందిబార్ హెడెడ్ గూస్ప్రపంచంలోనే అత్యంత ఎత్తుకు ఎగిరే పక్షి బార్ హెడెడ్ గూస్ అని చెబుతారు. ఇవి సంతానోత్పత్తి కోసం మ«ధ్య ఆసియాలోని పర్వత ప్రాంతాల నుంచి దక్షిణాసియాలోని ద్వీపకల్ప ప్రాంతానికి వస్తాయి. ఈ పక్షులు ఒకేసారి మూడు నుంచి పది గుడ్లు పెడతాయి. ఇవి అత్యంత ఎత్తయిన హిమాలయాల మీదుగా ఎగురుకుంటూ వలస వస్తాయి. ఎల్లో థ్రోటెడ్ బుల్బుల్ ఎంతో అందంగా కనిపించే అరుదైన పక్షిజాతుల్లో ఎల్లో థ్రోటెడ్ బుల్బుల్ ఒకటి. అంతరించిపోతున్న పక్షి జాతుల్లో ఇది ఒకటని ఆరి్నథాలజిస్టులు చెబుతున్నారు. ఇవి తాము సంచరించే ప్రాంతాలను చిన్న చిన్న సర్కిల్స్‌గా ఏర్పాటు చేసుకుంటాయి. కీటకాలను తింటాయి. భారత ద్వీపకల్పానికి చెందిన పక్షిజాతుల్లో ఇది ఒకటి. నిటారుగా ఉండే కొండ ప్రాంతాల్లో ఇవి నివసిస్తాయి. పక్షులనే ఆహారం తీసుకునే ‘‘హారియర్స్’’: విదేశీ పక్షిజాతుల్లో రకరకాల పక్షులు ఉంటాయి. వాటిలో పక్షులనే ఆహారంగా తీసుకునే హ్యారియర్స్ జాతి ఒకటి. ఇది ఆక్సిపిట్రిడి అనే వేటాడే పక్షి కుటుంబానికి చెందిన సర్కస్ జాతి. ఇవి మైదాన ప్రాంతాల్లో తిరుగుతూ పక్షులు, చిన్నచిన్న క్షీరదాలను ఆహారంగా తీసుకుంటాయి. యూరప్, పశ్చిమాసియా నుంచి నల్లమలకు వలస వస్తాయి. గ్రేటర్ ఫ్లెమింగోలుఫ్లెమింగో కుటుంబానికి చెందిన అతి పెద్ద జాతి గ్రేటర్ ఫ్లెమింగో. ఇవి ఉత్తర తీర ప్రాంతాలు, దక్షిణ ఐరోపా, హిమాలయ ప్రాంతాల్లో ఉంటాయి. తల, మెడ, రంగుల ఆధారంగా గ్రేటర్ ఫ్లెమింగో, అమెరికన్ ఫ్లెమింగోలుగా వర్గీకరిస్తారు. వీటి ఈకలు గులాబీ రంగులో ఉంటాయి.ఇండియన్ పిట్టచిన్న మొండితోకను కలిగి ఎంతో అందంగా కనిపించే పక్షి ఇండియన్ పిట్ట. ఇది దట్టమైన అడవుల్లోని నేలలపై, పొదల్లో ఉంటుంది. ఆకులు, చెత్తలో ఉండే క్రిమికీటకాలను ఆహారంగా తీసుకుంటుంది. గతంలో ఓ ఆంగ్లేయుడు ఈ పిట్ట(పక్షి)ని చూసి దీని పేరేంటి అని అడిగితే మన భారతీయులు ఇండియన్ పిట్ట అన్నారని, అందుకే ఇండియన్ పిట్టగా పేరు పడిపోయిందని పలువురు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఊలి నెక్డ్ స్టార్క్(ఉన్ని మెడ కొంగ)కొంగల్లో ఊలి నెక్డ్ స్టార్క్ ఒకటి. దీని మెడ వద్ద ఉన్నిలాగా ఉండటంతో దీన్ని ఉన్ని మెడ కొంగ అని పిలుస్తారు. వీటిలో ఆసియా, ఆఫ్రికన్ జాతులు అని రెండు రకాలు ఉంటాయి. నల్లమల ప్రాంతంలో ఆసియా జాతికి చెందినవి ఎక్కువగా సంచరిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. నంద్యాల జిల్లాలో అరుదైన పక్షులు పెద్దపులి, చిరుతపులులతో పాటు ఎన్నో అరుదైన వన్యప్రాణులు, వింతలు, విశేషాలకు నల్లమల నిలయం. నంద్యాల జిల్లాలోని నల్లమల, అహోబిలం ప్రాంతాల్లోని అడవుల్లో అరుదైన దేశీయ, విదేశీ వలస పక్షులు ఉన్నాయి. మేము చేసిన పరిశోధనల్లో 230 రకాల పక్షులను గుర్తించాము. ఒకే జిల్లాలో ఇన్ని రకాల పక్షులు ఉండటం ఎంతో విశేషమనే చెప్పాలి. – తరుణ్‌కుమార్ సింగ్, జూనియర్ సైంటిస్ట్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ వలసపక్షులకు కేంద్రంనల్లమలలో పెద్దపులులే కాదు. అరుదైన వన్యప్రాణులు, క్రిమికీటకాలు ఎన్నో ఉన్నాయి. పక్షుల్లో అనేక రకాల జాతులకు నంద్యాల జిల్లా పరిధిలోని నేలలు ఎంతో అనువైనవి. కొన్ని రకాల పక్షులు చిత్తడి నేలలంటే ఇష్టపడతాయి. ఎక్కడ తడినేలలు కనిపిస్తే అక్కడికి అన్నీ చేరి ఆహారాన్వేషణ చేస్తూ రైతులకు తెలియకుండా రైతు నేస్తాలుగా మారిపోతున్నాయి. – దూపాడు శ్రీధర్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ నంద్యాల జిల్లాలో 230 రకాల పక్షులు నంద్యాల జిల్లాలో 230 రకాల పక్షిజాతులు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. మనం నిత్యం చూసే చిలుకలు, కింగ్ ఫిషర్, కొంగలు, బాతులు, వడ్రంగిపిట్టలు, పిచ్చుకలు, పావురాలతో పాటు దేశ, విదేశాల నుంచి వచ్చే వలస పక్షులు సైతం ఈ ప్రాంత వాతావరణాన్ని ఇష్టపడుతున్నాయి. గడ్డిభూములు, కొండలు, చిత్తడి నేలలు ఇలా అన్ని రకాల నేలలు ఉండటంతో వివిధ రకాల పక్షులకు ఆహారం కూడా తేలికగా లభిస్తోంది. మనం నిత్యం చూసే పక్షి జాతులతో పాటు బార్ హెడెడ్ గూస్, హ్యారియర్స్, టరŠన్స్, ఎల్లో త్రోటెడ్ బుల్బుల్, ఇండియన్ పిట్ట, స్వాంపెన్, గ్రేటర్ ఫ్లెమింగోస్, డార్టర్ కార్మోరెంట్, స్పాట్ బిల్డ్ పెలికాన్, పాండ్ హెరాన్, రెడ్ నాప్డ్ హైబిస్, పర్పుల్ సన్ బర్డ్స్, వెయిట్ త్రోటెడ్ కింగ్ ఫిషర్, మార్స్ హారియర్, శాండ్ పైపర్, స్పాటెడ్ ఓలెట్, కాంబ్ డక్, బ్లూ టెయిల్డ్ బీ ఈటర్ లాంటి వాటితో పాటు రాత్రుళ్లు మాత్రమే కనిపించే నైట్‌జార్స్ వంటి అనేక రకాల పక్షులు నల్లమల పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. -
నల్లగబ్బిలం పువ్వును ఎప్పుడైనా చూశారా!
అరుదైన ఈ పువ్వు నల్లగా గబ్బిలంలా కనిపిస్తుంది. ఈ పూలు పూసే మొక్కలను దూరం నుంచి చూస్తే, మొక్కల మీద గబ్బిలాలు వాలి ఉన్నాయేమోననిపిస్తుంది. గబ్బిలం వంటి ఆకారం వల్లనే ఈ పువ్వుకు ‘బ్లాక్ బ్యాట్ ఫ్లవర్’ అనే పేరు వచ్చింది. కంద జాతికి చెందిన ఒక మొక్కకు ఈ పూలు పూస్తాయి. ఫ్రెంచ్ వర్తకుడు, కళాసేకర్త ఎడ్వర్డ్ ఆండ్రూ తొలిసారిగా ఈ పూల గురించి 1901లో రాసిన తన పుస్తకంలో వర్ణించాడు.ఈ పూల మొక్కలు బంగ్లాదేశ్, కంబోడియా, దక్షిణ చైనా, లావోస్, మలేసియా, మయాన్మార్, థాయ్‌లండ్ అడవుల్లో కనిపిస్తాయి. ఈ పూల కేసరాలు పిల్లి మీసాల్లా ఉంటాయి. రేకులు గబ్బిలం రెక్కల్లా ఉంటాయి. పన్నెండు అంగుళాల వెడల్పు, పది అంగుళాల పొడవుతో గబ్బిలం ఆకారంలో కొంత భయం గొలిపేలా ఉండటంతో ఈ పువ్వులను దక్షిణాసియా స్థానిక భాషల్లో ‘దెయ్యం పువ్వులు’ అని కూడా పిలుస్తారు. చైనీస్ సంప్రదాయ వైద్యంలో ఈ పువ్వులను కొన్ని ప్రత్యేక ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు.అతి పురాతన రైల్వేస్టేషన్..ఇది ప్రపంచంలోనే అతి పురాతన రైల్వేస్టేషన్. ఇక్కడి నుంచే తొలి పాసింజర్ రైలుబండి నడిచింది. ఇంగ్లండ్‌లో ఉన్న ఈ రైల్వేస్టేషన్ పురాతన భవంతిని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో లివర్‌పూల్ రోడ్ స్టేషన్‌ను 1830లో నిర్మించారు. లివర్‌పూల్ రోడ్ నుంచి మాంచెస్టర్ వరకు తొలి పాసింజర్ రైలు నడిచేది. లివర్‌పూల్ అండ్ మాంచెస్టర్ రైల్వే కంపెనీ తరఫున ఈ రైల్వేస్టేషన్‌ను జార్జ్ స్టీఫెన్సన్ అనే ఇంజినీరు నిర్మించాడు.ప్రస్తుతం మ్యూజియంగా మార్చిన ఈ పురాతన రైల్వేస్టేషన్ భవంతిలో రైల్వే మ్యూజియంతో పాటు సైన్స్ ప్లస్ ఇండస్ట్రీ మ్యూజియం, పిల్లల ఆట స్థలం వంటివి కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే తొలి పారిశ్రామిక నగరంలో మాంచెస్టర్ గత వైభవాన్ని తెలిపే వస్తువులను ఇక్కడ కొలువు దీర్చారు. పారిశ్రామిక విప్లవం నాటి పురాతన యంత్రపరికరాలను ఇందులో భద్రపరచారు. రైల్వే మ్యూజియంలో బొగ్గుతో నడిచే తొలినాటి ఆవిరి ఇంజిన్లను, ఆనాటి రైలు బోగీలను, వివిధ కాలాల్లో వచ్చిన మార్పులను ప్రతిబింబించే రైలు ఇంజిన్లను, బోగీలను భద్రపరచారు. ఈ మ్యూజియంను చూడటానికి పద్నాలుగేళ్ల లోపు పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నారు.అతిచిన్న లకుముకి పిట్ట..ఇది ప్రపంచంలోనే అతిచిన్న లకుముకి పిట్ట. అత్యంత అరుదైన పక్షుల్లో ఇది కూడా ఒకటి. పొడవాటి ఎర్రని ముక్కుతో రంగురంగుల శరీరంతో ఉండే ఈ పక్షి, చూడటానికి పిచుక పరిమాణంలో ఉంటుంది. ఫిలిప్పీన్స్ అడవుల్లో ఈ జాతి పక్షులు కనిపించేవి. ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త బెర్నార్డ్ జర్మెయిన్ డి లేస్పెడె 1799లో వీటిని తొలిసారిగా చూసినప్పుడు, ఇవి చిన్నసైజు కింగ్‌ఫిషర్ పక్షుల్లా కనిపించడంతో వీటికి ‘ఫిలిప్పీన్ డ్వార్ఫ్ కింగ్‌ఫిషర్’ అని పేరుపెట్టాడు.ఈ పక్షులు క్రమంగా తగ్గిపోయి, కనిపించడం మానేశాయి. ఈ పక్షులను స్థానికులు చివరిసారిగా 130 ఏళ్ల కిందట చూశారు. ఆ తర్వాత ఈ పక్షులు ఎవరికీ కనిపించకపోవడంతో ఇవి అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు కూడా భావించారు. ఫిలిప్పీన్స్ విహంగ శాస్త్రవేత్త మీగెల్ డేవిడ్ డి లియాన్ ఇటీవల దక్షిణ ఫిలిప్పీన్స్ అడవుల్లో ఈ పక్షులను గుర్తించి ఫొటోలు తీశాడు. -
నేచర్స్ లవింగ్లీ!
పొద్దుపొద్దున్నే లేవడం.. ఫోన్లు పట్టడం.. రీల్స్ చూడటం.. గేమ్స్ ఆడటం.. చాలా మంది పిల్లలు చేస్తున్న పనులు. ఫోన్ మోజులో పడి బయటి ప్రపంచాన్ని పట్టించుకోవడం మానేస్తున్నారు. ఎప్పుడూ ఫోన్లో బిజీగా ఉంటున్నారు. అయితే వీళ్లు మాత్రం చాలా ప్రత్యేకం. ప్రకృతిని ప్రేమిస్తూ.. ప్రకృతి ఒడిలో సేదతీరుతూ.. ప్రకృతిని పది మందికీ పరిచయం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. చిన్న వయసులోనే జీవ వైవిధ్యానికి ఉన్న ప్రాముఖ్యాన్ని లోకానికి చాటి చెబుతున్నారు. వారే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులైన అజ్మా ఖాన్, ఇబ్రహీం, నియో వెంకట్, అన్నవరపు సాతి్వక్. రెండేళ్లుగా ఎంతో శ్రమించి హెచ్‌పీఎస్‌లో ఉన్న జీవ వైవిధ్యాన్ని కళ్లకు కట్టేలా అద్భుతమైన ఫొటోలతో పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకం వెనుక ఉన్న వారి శ్రమ గురించి తెలుసుకుందాం.. కాంక్రీట్ అరణ్యంలో చాలావరకూ పక్షులు, కీటకాలు దాదాపు కనుమరుగవుతున్నాయి. దాదాపు 150 ఎకరాల్లో విస్తరించి ఉన్న హెచ్‌పీఎస్ బేగంపేట క్యాంపస్‌లో మాత్రం జీవవైవిధ్యం పరిఢవిల్లుతోంది. ఎన్నో రకాల జాతులు ఇక్కడ మనుగడ సాగిస్తున్నాయి. ఇటీవలే 12వ తరగతి పూర్తి చేసుకున్న వీరంతా రెండేళ్లుగా స్కూల్లోని జంతు జాతులపై తీవ్ర పరిశోధన చేశారు. పక్షులు, కీటకాలు, సీతాకోకచిలుకలు ఇలా ఎన్నో రకాల జీవులను తమ కెమెరాల్లో అద్భుతంగా బంధించారు. వాటన్నింటినీ విభాగాల వారీగా విభజించి, ఒక్కో జీవం గురించి వివరించారు. 71 జాతుల పక్షులు, 128 జాతుల కీటకాలు, 16 జాతుల సరీసృపాలు, మూడు జాతుల ఉభయచరాలను పుస్తకంలో పొందుపరిచారు.అనేక విషయాలు నేర్చుకున్నాం.. తమ ప్రాజెక్టులో భాగంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నామని వాళ్లు చెబుతున్నారు. సమా చారం సేకరణ సమయంలో చాలా మందితో మాట్లాడామని, వారంతా సహకరించారని పేర్కొన్నారు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నామని తెలిపారు. పక్షులు, కీటకాల సమూహంలో ఎలా ప్రవర్తిస్తున్నాయో తమకు అర్థమైందని వివరించారు. వాటిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. భవన నిర్మాణాల్లో మార్పు రావాలి.. పర్యావరణంలో ప్రతి జీవీ ముఖ్యమేనని, ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాల్లో జీవ జాతుల కోసం ఎలాంటి ఏర్పాట్లూ చేయట్లేదని, దీంతో అనేక పక్షి జాతులు అంతరించిపోతున్నాయని చెబుతున్నారు. జీవ వైవిధ్యం ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కలి్పంచడమే తమ పుస్తకం ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొంటున్నారు. తమ తోటి విద్యార్థులు కూడా తమను చూసి ప్రకృతిపై ప్రేమను పెంచుకున్నారని గుర్తుచేసుకున్నారు.చిన్నప్పటి నుంచి ఆసక్తితో.. ప్రకృతి అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. మా స్కూల్లో ఎన్నో జీవులు తారసపడుతుండేవి. వాటన్నింటినీ ప్రపంచానికి పరిచయం చేయాలని ఆలోచన ఉండేది. నాతో పాటు నాలాంటి ఆలోచన ఉన్న స్నేహితులతో కలిసి ఈ ప్రాజెక్టును పూర్తి చేశాం. స్కూల్లోని టీచర్లు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. – అజ్మా ఖాన్నెట్లో సరైన సమాచారం లేదు.. చాలా జీవుల గురించి ఇంటర్నెట్లో వెతికితే సరైన సమాచారం లభించట్లేదు. చాలాసార్లు తప్పుడు సమాచారం లభిస్తోంది. ఎలాగైనా వాటి గురించి సరైన సమాచారం అందించాలని అనుకున్నాం. అందుకే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాం. సమాచారం సేకరణకు ఎంతో కష్టపడ్డాం. – నియో వెంకట్ పర్యావరణం అంటే ఇష్టం.. పర్యావరణం అంటే ఇష్టం. పక్షులు, జంతువులు, వాటి సమూహంతో, మనుషులతో ఎలా ప్రవర్తిస్తాయో గమనిస్తుంటా. చేపలను పెంచడం అంటే ఇష్టం. ఇంట్లోనే సొంతంగా అక్వేరియం రూపొందించి, పలు రకాల చేపలను పెంచుకుంటున్నాను. రెడ్ టెయిల్ క్యాట్‌ఫిష్, టైగర్ ఆస్కార్, ఇరిడిసెంట్ ఆస్కార్, చెర్రీ బార్బ్ వంటి ఎన్నో చేపలను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. – ఇబ్రహీం వదూద్ అహ్మద్ దస్తగిర్కెమెరా ముఖ్యమైనది.. ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ఫోన్లు విస్తృతంగా వినయోగంలోకి వచి్చన తర్వాత ఫొటోలు, కెమెరాల గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. కెమెరాల్లో తీసిన ఫొటోలకు ప్రాముఖ్యత ఉంటుంది. వాటి విలువ తెలుస్తుంది. మంచి ఫొటో కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి ఉంటుంది. అప్పుడే అందమైన ఫొటోలు తీయడానికి అవకాశం ఉంటుంది. – సాతి్వక్ అన్నవరపు -
పక్షులను స్వేచ్ఛగా ఎగరనిద్దాం..
మనలో చాలా మంది పక్షులను పెంచుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువశాతం తమ ఆహ్లాదం కోసమే. నిజానికి పక్షులను ఆదరించాల్సింది మన ఆహ్లాదం కోసం కాదు, వాటి ఆనందం కోసం దగ్గరకు తీయాలి. వాటి రెక్కలు విరిచి పంజరంలో పెట్టి మనం చూస్తూ ఆనందించడం హేయమైన చర్య. స్వేచ్ఛగా ఎగరడం వాటి సహజ లక్షణం. అది వాటికి ప్రకృతి ఇచ్చిన హక్కు. ఆ హక్కును కాలరాసే అధికారం మనకు లేదు... అంటున్నారు మహారాష్ట్ర, పుణేలో నివసిస్తున్న రాధికా సోనావానే. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న రాధిక పక్షి సంరక్షకురాలిగా మారిన క్రమాన్ని ఆమె చాలా ఇష్టంగా వివరిస్తారు.‘‘ప్రస్తుతం నా ఉద్యోగరీత్యా పూనాలో ఉన్నాం. మా స్వస్థలం ఔరంగాబాద్. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ సలీం అలీ బర్డ్ సాంక్చురీకి ఎన్నిసార్లు వెళ్లానో లెక్కచెప్పలేను. పక్షుల మీద మమకారం ఏర్పడింది. నేను బర్డ్ లవర్ని బర్డ్ వాచర్‌ని మాత్రమే అనుకున్నాను. కానీ ఏ మాత్రం ముందస్తు ప్రణాళికలు లేకుండా అనుకోకుండా పక్షి సంరక్షకురాలినయ్యాను. పెళ్లి తర్వాత నా నివాసం ఔరంగాబాద్‌లోనే ఒక ఫ్లాట్‌లోకి మారింది.మా పొరుగింట్లో ఓ పెద్దాయన బాల్కనీలో బర్డ్ ఫీడర్, ఒక గిన్నెలో నీరు పెట్టడం చూసిన తర్వాత నాకూ ఆలాగే చేయాలనిపించింది. పుణేకి బదిలీ అయిన తర్వాత కూడా కొనసాగింది. ఇప్పుడు మా ఇంటి గార్డెన్ పక్షుల విహార కేంద్రమైంది. నాకు తోచిన గింజలు పెట్టి సరిపెట్టకుండా ఏ పక్షికి ఏమిఇష్టమో తెలుసుకోవడానికి పక్షుల జీవనశైలిని అధ్యయనం చేశాను. రామ చిలుకలకు వేరుశనగ పప్పులు ఇష్టం. గోరువంకలు అరటి పండు తింటాయి. రామ చిలుక ముక్కు పెద్దది.గోరువంక, పిచ్చుకల ముక్కులు చిన్నవి. ఆ సంగతి దృష్టిలో పెట్టుకుని ఫీడర్ బాక్సులు డిజైన్ చేయించాను. నేను పెట్టిన ఆహారాన్ని అవి ఇష్టంగా తింటున్నాయా లేదా, నేను చదివింది నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి బాల్కనీలో కూర్చుని శ్రద్ధగా గమనించేదాన్ని. అరటి పండు ముక్కలను చూడగానే గోరువంకలు సంతోషంగా పాటలు పాడడం మొదలుపెడతాయి. పాట పూర్తయిన తర్వాత తింటాయి. టైయిలర్ బర్డ్ అయితే పత్తి దూదిని చూడగానే రాగాలు మొదలుపెడుతుంది.గూడు కట్టుకోవడానికి పత్తి కనిపిస్తే దాని ఆనందానికి అవధులు ఉండవు. మనం సాధారణంగా కాకులను ఇష్టపడం. కానీ అవి చాలా హుందాగా వ్యవహరిస్తాయి. కాకులు, పిచుకలు, చిలుకలు, గోరువంకలు ఇతరులకు హాని కలిగించవు. పావురాలు అలా కాదు. వాటి ఆహారపు అలవాట్లు కూడా అంత సున్నితంగా ఏమీ ఉండవు. తమ ఆహారంలో ఇతరులను ముక్కు పెట్టనివ్వవు, ఇతరుల ఆహారాన్ని కూడా తామే తినేయాలన్నంత అత్యాశ వాటిది. పక్షి స్వేచ్ఛాజీవి..పెట్ డాగ్‌లాగా యజమానితో అనుబంధం పెంచుకోవడం పక్షుల్లో ఉండదు. స్వేచ్ఛగా విహరిస్తూ అనేక ప్రదేశాలకు వెళ్తుంటాయి. ఒక ప్రదేశంతో కానీ వ్యక్తితో కానీ అనుబంధం పెంచుకోవు. మా ఇంటికి వచ్చే నా అతిథుల్లో చిలుకలే ఎక్కువ. అలెగ్జాండ్రియన్ ΄్యారట్, ఇండియన్ రింగ్నెక్ ΄్యారట్లు తరచూ కనిపిస్తుంటాయి. సన్‌బర్డ్, వీవర్ బర్డ్ కూడా వస్తుంటాయి. కాలం మారేకొద్దీ అవి అప్పటి వరకు ఉన్న ప్రదేశాలను వదిలి తమకు అనువైన ప్రదేశాలకు వెళ్లిపోతుంటాయి.వాయు కాలుష్యం, వాతావరణంలో వస్తున్న మార్పులు కూడా పక్షుల వలసలకు కారణమే. సెల్ ఫోన్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా పక్షులు కంటి చూపును కోల్పోతున్నాయి. దాంతో అవి తమకు సురక్షితమైన ప్రదేశాలను వెతుక్కుంటూ ఎటుపోతున్నాయో తెలియడం లేదు. కరవు, అధిక వర్షాలు, యాసిడ్ వర్షాలు, అడవులలో చెట్లు నరకడం, మంటలు వ్యాప్తించడం... వాటికి ఎదురయ్యే ప్రమాదాలు. పక్షులు అడవిలో జీవించినంత ధైర్యంగా మనుషుల మధ్య జీవించలేవు.వాటికి మనుషులంటే భయం. ఆ భయాన్ని వదిలించి మచ్చిక చేసుకోవాలంటే వాటికి ఆహారాన్ని అందుబాటులో ఉంచడం ఒక్కటే మార్గం. ఆహారం కోసం ధైర్యం చేస్తాయి, క్రమంగా మన మీద నమ్మకం కలిగిన తర్వాత మన ఇంటిని తమ ఇంటిలాగా భావిస్తాయి. మా గార్డెన్‌కి రోజూ నలభై నుంచి యాభై పక్షుల వరకు వస్తుంటాయి. వాటి కోసం ఇంట్లో వంటగది, హాలు, బాల్కనీల్లో పక్షుల కోసం నీటి పాత్రలు పెట్టాను. దాహం వేసినప్పుడు నేరుగా దగ్గరలో ఉన్న నీటి పాత్ర దగ్గరకు వెళ్లిపోతాయి. పక్షులు మనతో మాట్లాడతాయి.రోజూ మా ఇంటి ఆవరణలో వినిపించే కిచకిచలన్నీ అవి నాకు చెప్పే కబుర్లే. కరోనా సమయంలో నా టైమ్ అంతా వీటి కోసమే కేటాయించాను. నన్ను నిత్య చైతన్యంగా ఉంచాయవి. నిజానికి పక్షి ప్రేమికులెవ్వరూ పక్షులను పంజరంలో బంధించరు. తమ సంతోషం కోసం పక్షులను పెంచే స్వార్థజీవులే ఆ పని చేస్తారు. దయచేసి పక్షులను బంధించవద్దు. వాటిని స్వేచ్ఛగా ఎగరనివ్వండి. చేతనైతే రోజుకు గుప్పెడు గింజలు, ఒక పండు పెట్టండి’’ అంటూ పక్షుల గురించి ఆసక్తికరమైన విషయాలెన్నో చెబుతారు రాధిక.ఇవి చదవండి: ఉర్దూ మీడియంలో చదివి.. 'నీట్' టాపర్‌గా..! -
తీర్పే బలం, బలగం
⇒ పొద్దు పొడవక ముందే భుజాన వెదురు గెడకు మావులు, సల్దికూడు (సద్దన్నం) క్యారేజీ తగిలించుకుని గోచీ పెట్టుకుని నడిచి వెళ్లి కొల్లేరులో తాటి దోనెలపై తిరిగి సహజసిద్ధంగా చేపలను వేటాడి మార్కెట్‌కు పోయి అయినకాడికి అమ్ముకుని బతుకు నెట్టుకొచ్చిన మట్టి మనుషులు ఒకనాడు. ⇒ సమాజంలో మిగిలిన వారిలాగానే కాలానికి అనుగుణంగా ఆధునికతను అందిపుచ్చుకుని చేపల చెరువులతో ఆదాయం ఆర్జించి అభివృద్ధివైపు అడుగులు వేసిన గట్టి మనుషులు నేడు.⇒ రాష్ట్రంలోని ఏలూరు–పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో నివసించే ప్రజల జీవన గమనాన్ని పరిశీలిస్తే గొప్ప సందేశాన్ని బాహ్య ప్రపంచానికి పంచుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కొల్లేరులో ఎదిరీదే బతుకుచిత్రమిదీ. జీవన విధానంలో మార్పులు వచ్చినా కొల్లేరులో మనిషి మారలేదు. వారి మనసూ మారలేదు. కార్పొరేట్ కల్చర్, కుట్రలు, కుతంత్రాలు వారిని ఏమాత్రం ప్రభావితం చేయలేదు.ఎన్ని కష్టాలొచ్చినా ఐక్యమత్యమే మహాబలం అనేదానికి కొల్లేరువాసులు నిలువెత్తు సాక్ష్యం. ఇది ఒకటి రెండేళ్లు కాదు. ఏకంగా 150 ఏళ్ల క్రితం నుంచి వారంతా ఒకే మాట, ఒకే బాట అనే తీరుతో ముందుకు సాగుతున్నారు. పరస్పర సహకారం, గ్రామాభివృద్ధికి తోడ్పాటు, వ్యక్తిగత తగాదాలు, కుటుంబంలోని పేచీలు ఇలా విషయం ఏదైనా సరే వారంతా గ్రామంలోనే నిర్ణయం తీసుకునే కట్టుబాటు ఇప్పటికీ కొనసాగుతోంది. – సాక్షి, అమరావతిఆకాశంలో విహరించే పక్షుల సమూహాలు...నీటిలో జలపుష్పాల పరుగులు ..చుట్టూ నీటి మధ్యలో దీవుల్లాంటి భువిపై వెలిసిన గ్రామాల్లో జీవనం సాగించే అ‘సామాన్యులు’. ఇది మంచినీటి సరస్సుగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘కొల్లేరు’తో పెనవేసుకున్న జీవరాశులతో సహజీవనం.కాంటూరు కుదింపునకు వైఎస్ సర్కారు తీర్మానంకొల్లేరు ఐదో కాంటూరు వరకు 77,138 ఎకరాల విస్తీర్ణాన్ని అభయారణ్యంగా ప్రకటించారు. దీన్ని మూడో కాంటూరుకు కుదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ 2008లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కాంటూరు పరిధి తగ్గించడం వల్ల 43,072 ఎకరాలు అభయారణ్యం పరిధి నుంచి బయటపడతాయి. వాటిలో పట్టా భూములు 14,932 ఎకరాలు, జిరాయితీ భూములు 5,510 ఎకరాలను వాటి హక్కుదారులకు అప్పగించగా మిగిలిన భూమిని పేదలకు పంచాలన్నది అప్పటి వైఎస్ ప్రభుత్వ సంకల్పం. కానీ పర్యావరణ, న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉండటంతో కాంటూరు కుదింపు జరగలేదు.వైఎస్ హయాంలో రూ.1300 కోట్లతో కొల్లేరులో ప్రత్యేక పునరావాస ప్యాకేజీని అమలు చేశారు. వైఎస్సార్ హయాంలో ప్రతిపాదించిన రెగ్యులేటర్ నిర్మాణ ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కదలిక వచ్చింది. కొల్లేరులోని సర్కారు కాలువపై కీలకమైన వంతెన నిర్మాణానికి వైఎస్సార్ హయాంలో నిధులు మంజూరు చేసినప్పటికీ ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దాన్ని చేపట్టలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ వంతెన నిర్మాణం పూర్తి చేయడం గమనార్హం.పెద్దొడ్డి మాటేశిరోధార్యం..కొల్లేరులో భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారు జీవించొచ్చు కానీ వారిలో భిన్నమైన మాటలు మాత్రం ఉండవు. వ్యక్తిగత, సామాజిక, రాజకీయ అంశాలైనా అక్కడ ఊరి పెద్దగా చెలామణి అయ్యే పెద్దొడ్డి (పెద వడ్డి) మాటే శిరోధార్యం. రెండు జిల్లాల్లోని 122 గ్రామాల్లోను ప్రజలందరూ కలిసి కొందరికి పెద్దరికం కట్టబెడతారు. తొలినాళ్లలో బయట వారి నుంచి రక్షణ కల్పించుకునేందుకు, వ్యక్తిగత ఇబ్బందుల నుంచి బయట పడేందుకు తమకు తాముగా సంఘాలు పెట్టుకుని నాయకులను (పెద్దొడ్డి) పెట్టుకునే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.గ్రామ పంచాయతీల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు అతీతంగా ఒక్కో గ్రామంలో నలుగురి నుంచి 12 మంది వరకు పెద్దొడ్డిలుంటారు. ఏ సమస్య వచ్చినా గ్రామం నడిబొడ్డున ఉండే చావిడి, ఆలయంలో పెద్దొడ్డిలను ఆశ్రయిస్తారు. సాధారణంగా అందరూ పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు వచ్చాక సాయంత్రం సమయంలో ఈ పంచాయతీలు నడుస్తుంటాయి. రెండు వైపులా వాదనలు విని స్థానిక న్యాయస్థానాలు మాదిరిగా వారిచ్చే తీర్పును ప్రజలు ఆచరిస్తారు. చిత్రం ఏమిటంటే పేచీలు పెట్టుకుని వారు పోలీస్ ఠాణాలు, బయటి వారి గడప తొక్కరు. దశాబ్దాలు గడిచినా అదే కట్టుబాటు ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం.ఒడిశా నుంచి వలసొచ్చి...విస్తరించిపొట్ట చేతపట్టుకుని రాష్ట్ర సరిహద్దులు దాటి ఒడిశా నుంచి వలసొచ్చిన 50 కుటుంబాలు శాఖోపశాఖలుగా విస్తరించి కొల్లేరులో గ్రామాలను నిర్మించాయి. దాదాపు 150 ఏళ్ల కిందట వచ్చిన వడ్డెర (వడ్డీలు) కులానికి చెందిన వలస జనం ప్రధానంగా చేపల వేటపైనే ఆధారపడి బతికేవారు. ఎటుచూసినా నీరు, మధ్య దిబ్బలాంటి ప్రాంతాల్లో దట్టమైన పొదలతో అడవికంటే భయంకరంగా ఉండే ఆ ప్రాంతంలో మానవమాత్రుడు ఉండటం కష్టంగా ఉండే రోజుల్లోనూ నాగరికతకు దూరంగా బతకడం మొదలైంది. పొదలు, తుప్పలను బాగుచేసి కొల్లేరులో దొరికే కిక్కిసకర్రలతో చిన్నపాటి గుడిసె (పాకలు) వేసుకుని జీవించేవారు.కొల్లేరు నీటి అడుగు దొరికే అలిపిరి కాయలు, కాలువ దుంపలను ఆహారంగా తినేవారు. కొల్లేరులో సహజసిద్ధంగా పెరిగే నల్లజాతి చేపలు పుష్కలంగా ఉండటంతో వాటిని వేటాడి బయట ప్రాంతాల్లో విక్రయించి కుటుంబాలను పొషించుకునే వారు. వడ్డీలతోపాటు సమీప ప్రాంతాల్లోని ఎస్సీలు కూడా కొల్లేరులో స్థిరపడి చేపల వేటపై జీవనం సాగిస్తున్నారు.జీవన చిత్రాన్ని మార్చేసిన చెరువులుకొల్లేరులో చేపల చెరువులు ఆ ప్రాంత వాసుల జీవన చిత్రాన్ని మార్చేశాయి. చిత్రం ఏమిటంటే కొల్లేరు వాసులు బతకడం కోసం గతంలో కొల్లేరులో చేపల చెరువులు తవ్వకపోతే ప్రభుత్వం కేసులు పెడితే...జనజీవనానికి ప్రమాదంగా పరిణమించిన కాలుష్యకారక చేపల చెరువులను తొలగించకపోతే కేసులు పెట్టాల్సిన పరిస్థితి వరకూ వచ్చింది. కొల్లేరులో చేపల వేటపైనే ఆధారపడిన వారికి మేలు చేసేలా సొసైటీలుగా ఏర్పడి ప్రభుత్వ భూముల్లో చెరువులు తవ్వుకునేలా 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నిర్ణయం తీసుకున్నారు.కొల్లేరు వాసులకు దానిపై అవగాహన కల్పిస్తూ శృంగవరప్పాడు గ్రామంలో తొలి సొసైటీ చెరువు తవ్వకానికి శంఖుస్థాపన చేశారు. సహజసిద్ధంగా చేపల వేటపై ఆధారపడి బతికే తమ పొట్ట కొట్టేందుకు ప్రభుత్వం సొసైటీ చెరువులు తవ్విస్తోందంటూ కొల్లేరు వాసులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. వారిని కట్టడి చేసేలా కేసులు పెట్టి, నిర్బంధంగా చెరువులు తవ్వేలా అప్పట్లో ప్రభుత్వం వ్యహరించింది. క్రమంగా సొసైటీల పేరుతో కొల్లేరులో ప్రాంతాలు విభజించుకుని కొల్లేరు వాసులు చేపలను వేటాడుకుని మెరుగైన జీవనానికి అలవాటు పడ్డారు.కొల్లేరుపై కన్నేసిన పొరుగు ప్రాంతాల వాళ్లు రంగంలోకి సొసైటీలకు డబ్బులు (లీజు)ఇచ్చి చెరువులు తవ్వి పెద్ద ఎత్తున చేపలసాగు చేపట్టడంతో పర్యావరణ సమస్య ఉత్పన్నమైంది. దీంతో పర్యావరణ సంస్థలు పోరాటంతో న్యాయస్థానాల ఆదేశాలతో ప్రభుత్వం కొల్లేరు పరిరక్షణకు 120 జీవో జారీచేయడం, చేపల చెరువుల తొలగింపునకు(కొల్లేరు ఆపరేషన్) నిర్వహించడం చకచకా జరిగిపోయింది.మగ బిడ్డకూ వాటా..రెండు జిల్లాల్లో తొమ్మిది మండలాల్లో విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో ఇప్పుడు 80 వేల కుటుంబాల్లో మూడు లక్షల 30 వేల మంది జీవిస్తున్నారు. రెండు లక్షల పది వేల మంది ఓటర్లున్న కొల్లేరులో ఉన్న సొసైటీలు, గ్రామాలు వారీగా ఉన్న చెరువుల ఆదాయం (లీజు)లో ప్రతీ కుటుంబంలోను పెద్దకు వాటాలు ఇస్తారు. పుట్టిన మగ బిడ్డకు కూడా వాటాలు వేస్తారు. కొల్లేరుకు అక్కడివారు వలసరాక ముందే కొల్లేటి కోటలో వెలసిన పెద్దింట్లమ్మ అమ్మవారే ఆయా ప్రాంత వాసులకు పెద్దదిక్కు. ప్రతీఏటా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. పెద్దయ్యాక వాటా ఇస్తారు. -
పిచ్చుకను కాపాడిన బుడతలు..! ఇంతకీ ఏం జరిగిందంటే?
మారుతున్న కాలక్రమేనా పిచ్చుకల జాతే కాదు.. మిగతా మూగ ప్రాణులన్నీ కూడా జాడ లేకుండా పోతున్నాయి. ఈ ఎండలో దాహానికి అలమటిస్తున్నాయి. అలాంటి ఘటనే ఓ పిచ్చుకకి జరగడంతో.. ఈ చిన్నారులు చేసిన గొప్పపనేంటో చూద్దామా!రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన ముగ్గురు చిన్నారులు బుధవారం ఓ పిచ్చుకను కాపాడి శభాష్ అనిపించుకున్నారు. వేసవి సెలవులు కావడంతో ఆడుకునేందుకు మండెపల్లికి చెందిన గదగోని నిహాంత్, హర్షిత్, త్రినయ్ సిరిసిల్లలోని బతుకమ్మఘాట్ వద్దకు బుధవారం వెళ్లారు.ఆ సమయంలో నీరు దొరక్క ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పిచ్చుకను గమనించి.. వెంటనే దాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వెంట తెచ్చుకున్న వాటర్‌బాటిల్ మూతలో నీరు పోసి తాగించారు. కొద్దిసేపు సపర్యాలు చేయడంతో తేరుకుంది. వెంటనే తుర్రన ఎగిరిపోయింది. పిచ్చుక ప్రాణాన్ని కాపాడిన చిన్నారుల సంతోషానికి అవధులు లేవు.ఇవి చదవండి: World Turtle Day: నారి.. తాబేలు మేలు కోరి! -
మిమిక్రీ చేసే పక్షులు!
అండమాన్ దీవుల్లో నేను, నా భర్త రోమ్ ఒక రోజు తెల్లవారుజామున రెండు పిల్లులు అరుస్తూ కొట్టుకుంటున్నట్టు వినిపించిన శబ్దాలకు నిద్ర లేచాము. నిద్ర కళ్ళతో బాల్కనీకి వెళ్లి అడవిలో ఆ శబ్దాలు వస్తున్న వైపు చూసాము. ఆశ్చర్యంగా ఆ రెండు శబ్దాలు చేస్తున్నది పొడుగు తోకల ఏట్రింత (రాకెట్ టైల్డ్ డ్రోంగో) అనే పక్షి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాము. ఒకసారి సముద్రపు గ్రద్ద వలె, మరోసారి దర్జీ పిట్టలా, మధ్యలో లారీ హార్న్ శబ్దాలను నమ్మశక్యం కానీ రీతిలో అనుకరిస్తున్న ఆ పక్షి అనుకరణలు గమనించాము. ఒక పక్షికి ఇంత అద్భుతమైన అనుకరణ (మిమిక్రీ) చేయవలసిన అవసరం ఏముంది?ఏట్రింతలు ఇతర జాతుల పక్షులతో కలిసి వేటాడుతూ ఉంటాయి. ఇతర పక్షుల జాతులతో కలిసి ఒక జట్టుగా ఏర్పడుట కోసమే ఇవి వాటి అరుపులను అనుకరిస్తాయని శ్రీలంక పక్షి శాస్త్రవేత్తలు భావిస్తారు. ఈ అనుకరణ యాదృచ్చికమో లేక కావాలని చేసే అనుకరణో కచ్చితంగా చెప్పడం కష్టం.ఇతర పక్షులు తమ ఆహారాన్ని తినే సమయంలో ఏట్రింతలు ఘాతుక పక్షుల ముప్పు లేకుండా కాపలా కాస్తుంటాయి . ఏదైనా ఘాతుక పక్షి దగ్గరగా వచ్చినట్లైతే ఆ ఘాతుక పక్షిపై మూకుమ్ముడిగా దాడి చేయడానికి ఇతర పక్షుల హెచ్చరిక అరుపులను అనుకరిస్తూ వాటిని ప్రోత్సాహిస్తాయిని భావిస్తారు.కొద్దిసేపటి క్రితం మేము ఒక జాలె డేగ, వంగ పండు పక్షిపిల్లని పట్టుకుని తింటూండటం చూసాము. దాని సమీపంలోనే నల్ల ఏట్రింత, జాలె డేగ అరుపులను అనుకరించినా, ఆ డేగ పట్టించుకోలేదు. దీనినినిబట్టి ఏట్రింతలు ప్రతీసారి మూకుమ్మడి దాడి కోసమే అనుకరిస్తాయని భావించలేము. కొన్ని సందర్భాలలో పక్షులు తమ చుట్టుపక్కల విన్న శబ్దాలను అనుకరించవచ్చు, ముఖ్యంగా అవి ఒత్తిడికి గురైనప్పుడు లేక మొదటి సారి ఆ శబ్దం విన్నప్పుడు ఆ విధంగా అనుకరించవచ్చు.చిలుకలు మరియు మైనా జాతి పక్షులు మనుషులను అనుకరించగలవు. ఇలా అనుకరించడం కోసం వాటికి చిన్నప్పటినుంచే తర్ఫీదు ఇస్తారు. అవి మనుషుల మాటలను సరిగ్గా అనుకరించగానే వాటికి ఆహారాన్ని బహుమానంగా ఇస్తూ ఈ విధంగా నేర్పిస్తుంటారు. చిలుకలు వాక్క్యూమ్ క్లీనర్ చేసే శబ్దాన్ని, టెలిఫోన్ రింగు, కుక్క అరుపులను కూడా అనుకరించగలవు. ఐన్స్టీన్అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆఫ్రికా దేశపు చిలుక, అమెరికాలోని నాక్స్విల్లె జూలోని తోడేళ్లు , చింపాంజీలు, కోళ్లు, పులులు మరియు ఇతర జంతువుల అరుపులను అనుకరించేది. ఈ అనుకరణ విద్య అవి సహజసిద్ధంగా బ్రతికే అడవుల్లో జీవించేందుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించవలసిన విషయము. అడవిలో సమూహంగా జీవించే చిలుకలు సామూహిక బంధాన్ని బలపర్చుకోవడానికి ఒకటినొకటి అనుకరించుకుంటూ ఉంటాయని ఆస్ట్రేలియాలోని డీకిన్ విశ్వవిద్యాలయలోని లారా కెల్లీ అన్నారు. అవే చిలుకలు పంజరంలో బంధించినట్లైతే వాటి సమీపంలోని మనుషులను అనుకరిస్తాయి. ప్రపంచంలో ఈ అనుకరణ విద్యలో ఆస్ట్రేలియాకి చెందిన "లైర్ బర్డ్" చాలా ప్రముఖమైన పక్షి . యూట్యూబ్‌లో ఒక వీడియోలో ఈ పక్షి, కార్ రివర్స్ చేసే శబ్దాన్ని, కెమెరా క్లిక్ శబ్దాన్ని, చైన్ సా , చెట్లు పడిపోయే శబ్దాన్ని, తుపాకి, వాద్య పరికరాలు, ఫైర్ అలారం, పసి పాపాల ఏడుపు, రైళ్లు, మనుషులు, ఈ విధంగా అనేక రకాలైన శబ్దాలను అనుకరించడం చూడవచ్చు. మగ పక్షులు ఆడ పక్షులను ఆకర్షించడానికి ఎంతో కష్టపడి అనేక రకాల శబ్దాలను అనుకరిస్తూంటాయి కనుక ఆడ పక్షులు ఏ మగ పక్షైతే ఎక్కువ శబ్దాలను అనుకరిస్తుందో దాన్ని భాగస్వామిగా ఎంచుకోవచ్చు అని కొందరు భావిస్తూంటారు. కానీ ఐరోపా జీవశాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని నిరూపించానికి ఎటువంటి ఆధారం దొరకలేదు అంటున్నారు. మరొక శూన్యవాద సిద్ధాంతం ప్రకారం ఈ అనుకరణ వలన ఎటువంటి ఉపయోగం ఉండదు, అది కేవలం సాధన మాత్రమే అని భావిస్తుంటారు. ఆఫ్రికాలోని కలహారి ఎడారిలో కనిపించే ఏట్రింతలు ఈ అనుకరణ విద్యని ఉపయోగించి తెలివిగా ఆహారాన్ని సంపాదించుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పక్షులు తమ పరిసరాల్లోని ఇతర పక్షులు లేక జంతువులు ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు, ఘాతుక పక్షులు లేక వాటిపై దాడి చేసే ఇతర జంతువులు అరుపులను అనుకరిస్తాయి. ఆ శబ్దాలను విన్న ఆ జంతువులు లేక పక్షులు భయంతో ఆహారాన్ని వదిలి వెళ్ళగానే ఏట్రింతలు ఆ ఆహారాన్ని దొంగిలిస్తాయి. ఇప్పటి వరకు “పక్షుల అనుకరణ” వలన అవి పొందే ప్రయోజనాలలో ఇది ఒక్కటే నిరూపితమైనది.ఈ అండమాన్ దీవుల్లో మేము చూసిన ఏట్రింత కూడా ఇదే విధంగా ఆహారంగా కోసం అనుకరిస్తుందా? ఇది తెలియాలంటే కొంత సమయం మరియు పరిశీలన అవసరం. ఈ అనుకరణ విద్యను ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లోని పక్షులు ప్రదర్శిస్తాయి కనుక ఈ చర్యని వివరించడానికి ఓకే వివరణ అన్నింటికీ వర్తింపచేయలేమని కెల్లీ అభిప్రాయపడతారు.ఈ ఆలోచనల మధ్యలో, డిష్ వాషర్లు, అంబులెన్సు శబ్దాలను కూడా అనుకరించే వాటి సామర్ధ్యానికి, ప్రకృతినే ఒక సంగీత వర్ణమాలగా ఉపయోగించే అద్భుతమైన నైపూణ్యానికి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. రచయిత - జానకి లెనిన్ ఫోటో క్రెడిట్: సుభద్రాదేవితెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewritersపుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
జార్ఖండ్‌లో బర్డ్ ఫ్లూ.. ఆరోగ్యశాఖ అప్రమత్తం!
జార్ఖండ్‌లో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. రాంచీలోని పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. హోత్వార్‌లోని ప్రాంతీయ పౌల్ట్రీ ఫామ్‌లో కేసులు నిర్ధారణ అయిన దరిమిలా పలు కోళ్లతో సహా నాలుగు వేల వివిధ రకాల పక్షులను అంతమొందించారు. వందలాది గుడ్లను ధ్వంసం చేశారు. ఏవియన్ ఫ్లూ(బర్డ్ ఫ్లూ) కనిపించిన ప్రాంతం నుంచి ఒక కిలోమీటరు పరిధిలో చికెన్, కోళ్లు, గుడ్లు అమ్మకాలను నిషేధించారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పౌల్ట్రీ ఫామ్‌లోని కోళ్లను శాస్త్రీయ పద్ధతుల ద్వారా తొలగించనున్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కోళ్లు, ఇతర పక్షులు, గుడ్లు కొనుగోళ్లు, అమ్మకాలపై పూర్తి నిషేధం ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జిల్లా వైద్యశాఖ అధికారులు బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతంలోని ఇంటింటికీ తిరుగుతూ అక్కడివారిని అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కూడా చనిపోయిన పక్షులు కనిపిస్తే తమకు తెలియజేయాలని ప్రజలను కోరింది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. -
పక్షుల నియంత్రణకు స్ప్రేడ్రోన్
విమానాల రాకపోకలకు పక్షులు తీవ్ర అంతరాయాన్ని కలిగిస్తున్నాయి. దీంతో తూర్పు నౌకాదళంలోని వైమానిక బృందం వినూత్న విధానాల్ని అమల్లోకి తీసుకొచ్చింది. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం, నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్‌ఎస్‌డేగా పక్కపక్కనే ఉన్నాయి. వీటి పక్కనే మడ అడవులు విస్తరించి ఉన్నాయి. అక్కడ నుంచి పక్షులు రాకపోకలు పెరుగుతుండటంతో.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నేవల్ ఫ్లైట్స్ కూడా ఎగిరేందుకు అంతరాయం కలుగుతున్న తరుణంలో ఈ సమస్యని పరిష్కరించేందుకు నేవల్ ఏవియేషన్ అధికారులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. స్ప్రే డ్రోన్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐఎన్ఎస్ డేగా నుంచి వీటి ఆపరేషన్స్ నిర్వహించి.. పక్షులు ఎగరనీయకుండా నియంత్రించనున్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న చెట్లపై నీటిని స్ప్రే చేస్తే.. రన్‌వే సమీపంలోకి పక్షులు రాకుండా నిలువరించగలమనీ.. తద్వారా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడదని తూర్పు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. – సాక్షి, విశాఖపట్నం -
Pudami Sakshiga : పైకి కనపడవు గానీ, ఈ బుజ్జి పిట్టల అల్లరి అంతా ఇంతాకాదు
వసంత రుతువు రాగానే చెట్లన్నీ పల్లవిస్తే, ఆ హరిత పల్లవాల లోంచి వినిపించే కోకిల గానం గురించి కవులు చెబుతారు. కాని, కాస్తంత ఆకుపచ్చదనం కనిపిస్తే చాలు, అనేక రకాల పక్షులు వచ్చి సంబరాలు చేసుకుంటాయి. జనావాసాల మధ్య పక్షులు ఏషియన్ గ్రీన్ బీ ఈటర్స్ పై సునీత పొత్తూరి ప్రత్యేక కథనం.. పచ్చని ప్రకృతికి బహుమతిగా మళ్లీ కొన్ని చెట్లనిద్దాం...చిన్ని పక్షిని పాడనిద్దాం -ఫైజ్ అహ్మద్ ఫైజ్ మేం టెర్రెస్ గార్డెన్ మొదలు పెట్టాక, మాకు ఈ చిన్ని అతిథుల సందడి పెరిగిందని చెప్పాలి. ఏషియన్ గ్రీన్ బీ ఈటర్స్(Asian green bee eaters)అన్ని రకాల పిట్టల లోనూ ఇదొక ఆకుపచ్చని ఆకర్షణ! ఈ మధ్య వీటి హాడావుడి ఎక్కువే అయింది. సాధారణ పిచుకల పరిమాణంలో ఉండే ఈ పక్షులు ఆకుపచ్చ రంగులో, కంఠం దగ్గర నీలంగాను, తలపైన పింగళవర్ణం(మిశ్రమ రాగి వర్ణం)తోను, తోక సన్నగా పుల్లలా సాగి, ఉంటుంది. తోక తో కలిపి 9 అంగుళాలు (పూర్వపుభాషలో అయితే జానా బెత్తెడు) ఉంటుంది. ఎంత తేలిక అంటే వెదురు కొమ్మ మీద అర డజను పిట్డలు దర్జాగావాలిపోతాయి! ఇందుకు అనుగుణం గా వాటి కాలి గోళ్లు కలసి ఉండటం వల్ల కొమ్మలపైన పట్డు నిలుస్తుందిట. కొమ్మ కదలకుండా ఒకదానికొకటి ఒరుసుకుని కూర్చున్న తీరు నులి వెచ్చని ఎండ లో చలి కాగుతున్నట్డుఉంటుంది.వెదురు మొక్క కొమ్మలకి అటు ఇటూ.. వాలి, పచ్చని తోరణంలా కనువిందు చేస్తుంటాయి. ఫ్లై కాచర్ అన్న పేరుకు తగ్గట్టు చిన్న చిన్న పురుగులను, తేనెటీగలనూ పట్టి తింటాయి. అయితే వేటాడే విధానం..అదొక కళ లా, ప్రత్యేకం గా ఉంటుంది. గాలిలో ఉండగానే తమ ఆహారాన్ని నోటికి అంకించుకుంటాయి. అలా అనిచటుక్కున మింగవు. నింపాదిగా ఇలా ఓ చెట్టుకొమ్మ మీద వాలి, తన ఆహారాన్ని పొడిచి వేరుచేసి తింటాయి. వీటి గూళ్లను మానవ సమూహాలకు దూరంగా లోతట్డు గా ఉండే పొదలు, గడ్డి భూములలో ఏర్పాటుచేసుకుంటాయిట. ఇవి వలస పక్షులు కావు. అంతరించి పోతున్న జాతుల లెక్కలోనూ లేవు. కాని,మాకు వానాకాలం లో కంటే, ఇలా శీతా కాలం లో మా ప్రాంతంలో ఎక్కువగా చూస్తాను. ఉదయం, సాయంత్రంవేళల్లో కోలహాలంగా గుంపులుగా వచ్చే వాటి అరుపు అనునాసికంగా, తంత్రీ వాద్యంలా ట్రిం...ట్రిం.. అంటూ ఉంటుంది. కొమ్మల మీదనుండి ఒక్కసారిగా ఎగిరి పోయేటప్పుడు చేసే శబ్దం మాత్రం అధికంగా ఉంటుంది. ఇది కాక, క్రిమి కీటకాలను వేటాడే పక్షుల నిత్య సందడి సూర్యోదయానికి ముందే మొదలౌతుంది. తేనె పిట్డలు, జిట్టంగి పిట్టలు, బుల్ బుల్(పిగిలి పిట్ట), తేనిటీగల్ని, పురుగుల్ని పట్టితినే పాసరైన్స్, వేటి కవే నిత్యంతమ కలకూజితాలతో- మధురారవాలతో ఉదయస్తమయాలు రాగరంజితం చేస్తుంటాయి. చలికాలం లో మా ముంగిట్లో ఉన్న కోవిదార చెట్టు (Bauhinia) సుందరంగా పూస్తుంది. వీటి మీద ఎగురుతూ తేనెపిట్టలు, passerines చేసే సందడి అంతా ఇంతా కాదు. కనిపించవు గాని, కొమ్మకొమ్మ కో సన్నాయీ...! ఆపిలుపులన్నీ పూలవేనేమో అనిపిస్తాయిసన్ బర్డ్స్ మందార పూలమీద అలా వాలి, ఇలా చటుక్కున తేనె సంగ్రహించి పోతుంటాయి. కెమెరాకి ‘యాక్షన్’ చెప్పేఅవకాశమే ఇవ్వవు. ఈ బుల్లి పిట్టలు గొంతు విప్పితే చెవులు చిల్లుపడాల్సిందే. పిట్ట కొంచెం కూత ఘనం అంటారుకదా.. అలా! పిగిలి పిట్టలు(Bulbul)- గుబురు తలల తో తోక కింద ఎర్రగా ఉండే ఈ పక్షులు మా టెర్రస్ పైన చేసే సందడి తక్కువేంకాదు. మీకు అలారం క్లాక్ అవసరం లేదు. తెల్లవారు జామునే మొదలు .. కిసకిసలు!బ్లాక్ రాబిన్– ఓ సారి నా నడక దారిలో ఓచిత్రం చూసాను. బ్లాక్ రాబిన్ తన ప్లమేజ్ లో ఆకుపచ్చని గడ్డిపరకలుటక్ చేసుకుని లాన్ లో తిరుగుతూ కనబడింది. ఫోటో తీద్దామనే ప్రయత్నం ఫలించలేదు. కింగ్ ఫిషర్ ఒకటి ఒకే సమయానికి దర్శనం ఇస్తూంటుంది. రివ్వున వాలి, కావలసినదేదో దొరకపుచ్చుకుని దూరంగా లైట్ స్తంభం మీదకి గెంతి .. కాస్త తాళి, ఎగిరెళ్లిపోతుంది. కన్నుమూసి తెరచేంతలోనే ఈ విన్యాసాలన్నీ..! ఒక నీలి ఈకను మాత్రం ఓసారి బహుమతి చేసింది. జిట్టంగి పక్షులు.– ఇళ్ల కప్పులెక్కి, ఈల వేస్తూ హెచ్చరిస్తూ సందడి చేస్తూంటాయి ఉదయాస్తమయాల వేళల్లో. సిల్వర్ బిల్ మునియాలు. గుంపుగా వచ్చి, తమ చిన్ని ముక్కులను నీటి లో తడుపుకొని, జలకాలాడుతూ తెగ సందడి చేస్తాయి. వెదురు ఆకులను ఒడుపుగా చీల్చి గూటికోసం తీసుకుని పోతూంటాయి. అరగదీసినట్లు నునుపు దేలిన ముక్కు(bill), పొట్ట భాగం లో స్కేలింగ్ వుండి కాస్త బ్రౌన్‌గా ఉండే ఈ పిచుకల్లాటి మునియాలు గార్డెన్ లో చెట్ల కొమ్మల్లో జంటలుగా వచ్చి వాలుతాయి. మన ఇళ్ల దగ్గర ప్రమాదస్థాయిలో బ్రీడింగ్ అవుతున్న మరో పక్షి పావురం. పావురాళ్లు గూడు పెట్టని చోటు లేదు. వాటి సంతతి పెరిగిపోతూనే ఉండటంతో, కొన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. పావురాలకు ధాన్యపు గింజలను వేయడం వల్ల సహజమైన ఆహారవేటను ఆపేసాయంటారు. ఏదేమైనా చిన్న చిన్నపావురాల కువకువలు మాత్రం బాగుంటాయి. ఇక పోతే కాకులూ, పిచికలూ ఒకప్పుడు మనకి సర్వసాధారణంగా కనిపించే పక్షులు. మన సంస్కృతి లో భాగం.పిచికలకు ముంగిట్లో ధాన్యపు కంకులను వేలాడదీసేవారు. కాకులు సరేసరి. మన పితృదేవతలు కాకిరూపం లోవచ్చి పిండం ముట్టి పోతాయని నమ్మకం.కాని ఇవీ ఇపుడు అరుదైపోయాయిఎక్కడపడితే అక్కడ విచక్షణారహితంగా సెల్ టవర్స్ నిర్మింవడం వల్ల, ఎలక్ట్రో మాగ్నటిక్ రేడియేషన్ కి, దాదాపు ఊర పిచుకలు తుడిచి పెట్డుకుని పోయాయి. అలాగే కాకులు కూడా, పట్టణీకరణ పేరుతో వాటి ఆవాసాలనుంచి,వాటికి అనుకూలమైన చోట గూళ్లు ఏర్పరుచుకుని, సంతానోత్పత్తి చేయడానికి వీలు లేకుండా తరిమి వేయబడ్డాయి. పక్షులు పర్యావరణానికి ఎంత మేలు చేస్తాయి అన్నది ప్రత్యేకించి ఎవరికీ చెప్పనక్కరలేదు. క్రిమి కీటకాల బెడదనుంచి పంటలను కాపాడ్డం తో బాటు, పాలినేషన్కు విత్తనాల విస్తరణకు పక్షుల ఉనికిఅవసరమన్నది అందరికీ తెలిసిన సంగతే. ప్రకృతిమీద జరిపిన తిరుగుబాటు వల్ల కలిగిన దుష్పరిణామం ఏమిటో చైనా ఉదంతం ఒకటి చెబుతారు. ఆహారధాన్యాలను పిచుకలు తింటున్నాయని, పిచుకలను పట్డి చంపిస్తారు చైర్మన్ మావో సమయంలో. తర్వాత వాటి పొట్ట కోసి చూసి తెల్లబోయారట శాస్త్రజ్ణులు. ఆహారధాన్యాల కంటే ఎక్కువ క్రిమి కీటకాలను పట్టి తింటాయనితెలిసి. ఆ తరవాత క్రిమికీటకాల అదుపు లేక పంట నష్టం తీవ్రమై కరవు సంభవించిందిట. మిడతలను చంపడానికి క్రిమి కీటకాల నాశకాలను వాడగా, ఫలితంగా భూమిలోని సారం తగ్గిపోయిందిట. ఇదొక గుణపాఠం. అయినా...మనిషి మారలేదు; ఆతని కాంక్ష తీరలేదు–అని సినీకవి తీర్పు ఇచ్చినట్టు జరిగేవి జరుగుతూనే ఉన్నాయి.ప్రకృతిలో సమతౌల్యతకు పక్షుల ఉనికి ఎంత అవసరమన్నది మానవాళికి అర్థం అయేసరికి, ఆధునీకరణ పేరుతో చాలా నష్టమే జరిగిందని చెప్పుకోవాలి. అందుచేత నేడు ఆవాసాల వద్ద ఎంతో కొంత గ్రీనరీ వుండేలా చూసుకోవడంసామాజిక బాధ్యత అయింది. రచయిత : సునీత పోతూరి ఫోటో : శ్యాం సుందర్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
సైబీరియన్ కొంగలు ఎక్కడ ?
-
పక్షులు డైనోసార్ల వంశమా?
డైనోసార్లకు సంబంధించిన విషయాలను మనం వింటూనే ఉంటాం. డైనోసార్లు భూమిపై మనుగడసాగించిన అతిపెద్ద జంతువులనే విషయం మనకు తెలిసిందే. సుమారు ఆరున్నర బిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ ఉల్క భూమిని తాకింది. ఫలితంగా డైనోసార్ల ఉనికి తుడిచిపెట్టుకుపోయింది. అయితే డైనోసార్ల వంశం ఇప్పటికీ భూమిపై ఇంకా సజీవంగా ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోతారు. ఇది వినడానికి వింతగా అనిపించినా ఇదే నిజం. పక్షులు డైనోసార్ల వంశం అని చెబుతారు. దీని వెనుకగల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పక్షులు డైనోసార్ల వంశానికి చెందినవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనిని అనుసరించి చూస్తే డైనోసార్లు ప్రపంచం నుంచి పూర్తిగా అంతరించిపోలేదు. డైనోసార్లు, పక్షులు కలిసి జీవించడమే దీనికి కారణం. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతం అయ్యాయి. అయితే పక్షులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాయి. అయితే శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి ఎటువంటి ప్రామాణిక రుజువును ఇంకా అందించలేదు. దీనిని నిరూపించడానికి భిన్నమైన సిద్ధాంతాలను వెలిబుచ్చారు. డైనోసార్ల శరీర నిర్మాణం.. పక్షుల శరీర నిర్మాణాన్ని పోలివుంటుందని తెలిపారు. నాడు జరిగిన మహా విపత్తు నుంచి పక్షులు ఎలా బతికాయనేదానికి శాస్త్రవేత్తలు ఇంకా ఖచ్చితమైన కారణం కనుగొనలేదు. అయితే గ్రహశకలం భూమిని ఢీకొన్న తర్వాత దంతాలు లేని పక్షులు మాత్రమే జీవించాయని వారు చెబుతున్నారు. దీనికి సరైన సిద్ధాంతం ఇంకా వెలువడలేదు. ఈ సిద్ధాంతాలను శాస్త్రవేత్తలు తమ పరిశోధనల నేపధ్యంలో వెల్లడించారు. -
చక్రవాకాలు: ఆ స్త్రీల కోసం మొసళ్లు కూడా తోడుగా
'పాస్‌పోర్ట్ లేని అతిథులు పక్షులు. అవి మనల్ని ఫుడ్ అడగవు. వెచ్చటి బెడ్‌రూమ్‌లూ అడగవు. తొణికిసలాడే నీటి తావూ, వాలడానికి విస్తారంగా చెట్లు ఉంటే చాలు. కాని అవి వచ్చినప్పుడు వాటిని నమిలి మింగుదామనుకుంటే?.. కుదరదు అంటున్నారు స్త్రీలు. కేవలం డజన్ మందే. ఒడిశాలోని అరాచండిలో ప్రతి శీతాకాలం వచ్చే అరుదైన పక్షులను కాపాడి తిరిగి ఇళ్లకు పంపుతారు.' అంతా కలిపి ఒకటిన్నర చదరపు కిలోమీటర్లు. తేమ మైదానాలు. భువనేశ్వర్ నుంచి గంటన్నర దూరంలో ఉన్న ‘బంకి’ అనే ఊళ్లో ఉంటాయి. వాటిని ‘అరాచండి మైదానాలు’ అని పిలుస్తారు. అక్కడకు ప్రతి సంవత్సరం చలికాలంలో చలి దేశాల నుంచి వలస పక్షులు వస్తాయి. బూడిద కొంగలు, వల్లంకి పిట్టలు, పెయింటెడ్ స్టార్క్స్, చక్రవాకాలు (రడీ షెల్డక్)... ఇంకా డజను రకాల పక్షులు వస్తాయి. సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో ఇవి వలస వచ్చి ఫిబ్రవరి–మార్చి నాటికి తిరిగి సొంత ప్రాంతాలకు మూట ముల్లె సర్దుకుని వెళ్లిపోతాయి. దేశం కాని దేశం ఎందుకు వస్తాయవి? మనుషుల్ని నమ్మి. ఆ నమ్మకం అందరూ నిలబెట్టుకోరు. కొందరు నిలబెట్టేందుకు నడుం కడతారు. ఆ పన్నెండు మంది ఈ మైదానాల పక్కనే ఉండే నిస్తిపూర్ అనే గ్రామంలో నివసించే సూర్యకాంతి మొహంతి అనే గృహిణి ఒకరోజు ఈ తేమ మైదానాల వైపు వచ్చింది. అక్కడ కొంతమంది వేటగాళ్లు ఈ అందమైన పక్షులు, వలస వచ్చిన అతిథులను వేటాడుతూ కనిపించారు. ఆమె మనసు వికలమైపోయింది. తమ ఊరిని ఈ పక్షులు క్షమిస్తాయా అనిపించింది. వెంటనే ఊళ్లో ఉన్న ఇతర గృహిణులకు ఈ విషయం చెప్పడం మొదలుపెట్టింది. ‘అందరం కలిసి పక్షులను కాపాడదాం’ అంది. చాలామంది పట్టించుకోలేదు. ‘లగాన్’ సినిమాలో ఒక్కొక్కరూ దొరికినట్టు కేవలం 12 మంది గృహిణులు అంగీకరించారు. వీరంతా తమ భర్తలకు విషయాన్ని చెప్పి ఒప్పించారు. భర్తలు అంగీకరించాక 12 మంది కలిసి ‘అరాచండి పక్షి సురక్షా సమితి’ గా ఏర్పడ్డారు. ఆ తర్వాత ఆ పక్షులకు వారే తల్లిదండ్రులు, కాపలాదారులు, సైనికులుగా మారారు. పక్షుల కోసమని.. ‘ఈ పక్షులు ఎంతో సున్నితమైనవి. కాలుష్యం బారిన పడితే చచ్చిపోతాయి. అందుకే పక్షులను చూడటానికి వచ్చే వారిని ఇక్కడ చెత్త వేయకుండా అడ్డుపడ్డారు. అలాగే పిక్నిక్ల పేరుతో వచ్చి హారన్లు కొట్టడం, పాటలు పెట్టి సౌండ్లు చేయడం కూడా నిరోధించాం. ఈ పక్షులు చుట్టుపక్కల పొలాల నుంచే ఆహారాన్ని పొందుతాయి. అందుకే రైతుల దగ్గరకు వెళ్లి క్రిమిసంహారక మందులు ఉపయోగించని సేంద్రియ పంటలే పండించమన్నాం. రైతులు మా వేడుకోలును మన్నించారు. పక్షులు ఉన్నంత కాలం ప్రతి రోజూ మేము ఈ ప్రాంతానికి వచ్చి కాపలా కాస్తాం. ప్లకార్డులు ప్రదర్శిస్తాం. చెత్త లేకుండా చూస్తాం’ అంటారు ఈ పన్నెండు మంది గృహిణులు. మొసళ్లు తోడయ్యాయి.. అయితే ఈ స్త్రీలకు మొసళ్లు కూడా తోడయ్యాయి. ఇక్కడి నీటిమడుగుల్లో మొసళ్లు ఉంటాయి. వేటగాళ్లు నీటి లోపలికి చొచ్చుకొచ్చి పక్షులను వేటాడకుండా ఈ మొసళ్ల భయం అడ్డుకుంటోంది. ‘మొసళ్లు పక్షులకు కాపలా ఉన్నప్పుడు మనుషులు ఉండటానికేమి?’ అంటారు ఈ స్త్రీలు. వీరి కృషి మెల్లగా పత్రికల ద్వారా ప్రభుత్వానికి తెలిసింది. అయినా సరే ప్రభుత్వం చేసే పని కన్నా ప్రజలు చేసే పనే ఎక్కువ ఫలితాన్ని ఇస్తోంది. ‘ఈ పక్షులను గమనిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. చక్రవాకాలు గొప్ప ప్రేమతో ఉంటాయి. ఒంటరి చక్రవాకాలను చూద్దామన్నా కనిపించవు. జంటగా ఉండాల్సిందే’ అంటారు ఈ స్త్రీలు. వీరి సేవకు ప్రభుత్వ మెచ్చుకోలుకన్నా ప్రకృతి ఆశీస్సులు తప్పక దొరుకుతాయి. ఇవి కూడా చదవండి: పక్షులు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు -
పక్షులు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా?
మనుషుల మానసిక ఆరోగ్యంపై పక్షుల ప్రభావం కూడా ఉంటుందని విన్నారా?. అసలు మన మానసిక పరిస్థితికి పక్షులకు లింక్ ఏంటీ. అవి ఎలా మన మనఃస్థితిని ప్రభావితం చేయగలవు అనే కదా సందేహం!. అయితే పరిశోధకులు మాత్రం వాటి వల్లనే మన మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి పక్షులను చూసే అవకాశం ఉండదు కదా! అని అడగొచ్చు దానికి శాస్త్రవేత్తలు ఏం అంటున్నారంటే.. పక్షులను చూడటం లేదా వీక్షించటం, వాటి కిలకిలరావాలను వినడం వంటివి చేస్తే తెలియకుండా మానసిక ప్రశాంతత చేకూరి సంతోషంగా ఉంటామని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్ల నిరాశ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఉత్ఫన్నం కావని అన్నారు. ఈ మేరకు సుమారు 13 వందల మందిని క్షుణ్ణంగా అధ్యయనం చేయగా...పక్షులను చూడటం, వాటి శబ్దాలను విన్న వారి మానసిక ఆరోగ్యం బాగున్నట్లు గమనించారు. పక్షులతో పనిగట్టుకుని గడపడం మొదలుపెట్టాక నెమ్మదిగా మెరుగుదల కనిపించింది. ముఖ్యంగా ఈ మెరుగుదలను డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిలోనూ, ఆరోగ్యవంతమైన వ్యక్తులలోనూ కనిపించాయన్నారు. అలాగే మరో అధ్యయనంలో పాల్గొన్న దాదాపు 295 మందిని పక్షులతో గడిపి తమ భావోద్వేగ స్థితిని స్వయంగా అంచనా వేసి చెప్పాలని కోరారు. వారంతా పక్షి పాటలను విన్నప్పటి నుంచి డిప్రెషన్ లక్షణాలు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. అంతేగాదు మతిస్థిమితం, మరచిపోవడం వంటి రుగ్మతలు కూడా తగ్గినట్లు వెల్లడించారని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, ప్రకృతితో గడపలేకపోయినా కనీసం పక్షుల కిలకిల రావాలను మనసును ఆహ్లాదపరిచి స్థిమ్మితంగా ఉండేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యంపై ప్రకృతి ప్రభావం చూపుతోందా? మానసిక ఆరోగ్యంపై ప్రకృతి చూపించే ప్రభావాన్ని సాఫ్ట్ ఫాసినేషన్గా చెప్పొచ్చు. మన దృష్టి ప్రకృతి వద్దకు వచ్చేటప్పటికీ విస్తృతంగా చూసేలా చేసి మెదడు తనను తాను రిఫ్రెష్ చేసుకునేలా చేస్తుంది. తద్వారా మానసిక ప్రశాంత పొంది, మతిమరుపు, మతిభ్రమించడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే తనకు తానుగా బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. అంతేగాదు ప్రకృతి దృశ్యాలు, శబ్దాలు మనలను రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేసి ప్రతికూల ఆలోచనలను దరిచేరనివ్వదు. ఈ పరిశోధన జర్నల్ ఆక్యుపేషనల్ అండ్ ఇన్విరాన్‌మెంటల్ మెడిసన్‌లో ప్రచురితమయ్యింది. సామాజిక ఆర్థిక పరిస్థితి సంబంధం లేకుండా పచ్చని ప్రదేశాలను సందర్శిస్తే..వారి మానసిక స్థితి మాత్రమేగాక, యాంటీహైపెర్టెన్సివ్, ఆస్తమా వంటి సమస్యలు తగ్గుతాయని అధ్యయనంలో తేలిందన్నారు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకైనా పక్షుల అభయారణ్యాలు, పర్వతాలు, బీచ్‌లు, సరస్సులు, నదులు వద్ద గడపండి అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: సోనియా గాంధీ మెచ్చిన 'పప్పు అన్నం'! బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
అత్యంత అరుదైన పక్షి! సగం ఆడ సగం మగ..!
గత వందేళ్లలో రెండోసారి అత్యంత అరుదైన పక్షి కనిపించిందని పరిశోధకుల బృందం పేర్కొంది. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ ఒటాగా జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్ కొలంబియాలో ఈ పక్షి జాతులను కనుగొన్నారు. ఆ పక్షికి సగం ఆకుపచ్చ అంటే ఒకవైపు ఆడ, మరొకవైపు సగం నీలం అంటే మరోవైపు మగ పక్షిలా ఈకలు ఉన్నాయి. దీన్ని శాస్త్రీయంగా ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫిక్ పక్షి అని పిలుస్తారు. ఇది ఆడ, మగ లక్షణాను ప్రదర్శిస్తుంది. అటువంటి పక్షుల్లో ఒకవైపు మగ ఈకలు ఉండి అందుకు అనుగుణంగా పురుష పునరుత్పత్తి అవయవాలు ఉంటాయి. అలాగే మరొక వైపు స్త్రీ ఈకలు ఉండి స్త్రీలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. అంతేగాదు ఈ పక్షిలో కణాలు ఆడ, మగ కణాలుగా విభజింపబడ్డాయట కూడా. ఇలా దాని జీవితాంతం కణాలు అలానే కొనసాగే అవకాశం ఉందన్నారు. అయితే ఇలా ఏ జాతి పక్షిలో ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫ్(ఆడ, మగ లక్షణాలు)ను చూడలేరన్నారు. ఈవిధంగా పక్షుల్లో అత్యంత అరుదుగా కనిపిస్తుంది. న్యూజిలాండ్‌లో ఇలాంటి పక్షిని తానింత వరకు చూడలేదని ఇది చాలా అద్భుతమైన విషయమని ప్రొఫెసర్ స్పెన్సర్ అన్నారు. ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆప్ ఫీల్డ్ ఆర్నిథాలజీలో ప్రచురితమయ్యాయి. వందేళ్లలో కనిపించిన వివిధ పక్షి జాతుల్లో ఇలా గైనండ్రోమోర్ఫిజం లక్షణాలను నమోదు చేసిన రెండో పక్షి ఇదే అని అన్నారు. ఈ పరిస్థితి స్త్రీ కణ విభజన సమయంలో ఏర్పడే లోపం కారణంగా ఇలాంటి పక్షులు పుట్టుకొస్తాయని అన్నారు. ఇక్కడ ఒక గుడ్డు, రెండు స్పెర్మ్‌ల ద్వారా రెండుసార్లు ఫలదీకరణం చెందితే ఇలా జరుగుతుందని ప్రొఫెసర్ స్పెన్సర్ వివరించారు. (చదవండి: రాత్రికి రాత్రే చెరువు మాయం చేసిన దుండగులు! తెల్లారేసరికి అక్కడ..!) -
నీలివర్ణంతో తళుక్కునే మెరిసే పాలపిట్ట.. అందుకే అంత స్పెషల్
పాల పిట్ట చుట్టూ ఎన్ని కథలో.. పసిడి పంటల్లే పచ్చని రంగునలుముకుంది, ఆకాశమళ్లే నీలి రంగు పులుముకుంది,అశ్వినీ మాసంలో అడుగులెడుతుంది,శుక్ల పక్షంలోశోభనిస్తుంది..పంటచేనుల్లో పరుగులెడుతుందివిజయ దశమికి విజయాలనిస్తుంది! ప్రపంచానితో పోటీ పడనంటుంది,నాగరికతతో నగరాలకు దూరమవుతుంది. అందాల హరివిల్లై విశ్వమంతా విస్తరించింది.పసిడి పరువాల విహంగం అద్భుతాల పాల పిట్ట !! దసరా రోజు.. పాలపిట్టను చూడకుంటే ఆ పండగకు అర్థమే లేదని చిన్న వెలతి ఉంటుంది. దాని ప్రత్యేకత అలాంటిది మరి! ఓటమి మీద గెలుపుకు నిదర్శనంగా చేసుకునే దసరా పండగ రోజు పాల పిట్టను చూస్తే ఎన్నో విజయాలతో పాటు సుఖ సంతోషాలు వరిస్తాయని అంటారు. అంటే పక్షులు కేవలం ప్రకృతిలో ఉండే ఒక జీవ రాశి మాత్రమే కాదు అవి మనుషుల జీవన విధానాలతో సంప్రదాయాలతో మమేకమై ఉంటాయి అన్నదానికి పాల పిట్ట ఒక ఉదాహరణ.అలాగని ఇది ఒక్క భారత దేశంలోనే కనిపించే పక్షి కాదు. కెనడా, అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా అద్భుతమైన పసిడి, నీలం లాంటి రంగుల కలయికతో కనిపిస్తుంది. భారత దేశంలో పాల పిట్టకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిచుట్టూ ఎన్నో వింతలు, విశేషాలు కూడా ముడిపడి ఉన్నాయి. పాలపిట్టతో మనిషికి యుగయుగాల సంబంధం ఉందంటే విడ్డూరమే కదా? కానీ ప్రతి యుగంలోనూ, పురాణ, ఇతిహాసాల్లో పాల పిట్ట ప్రస్తావన ఎదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది.దక్షిణ భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాల పిట్టను నీల కంఠ పక్షి అని పిలుస్తారు(నీల కంఠ అంటే శివుడికి ఉన్న మరో పేరు) దాని గొంతు విషం తాగిన తర్వాత మారిన శివుడి గొంతు (నీలం) రంగులో ఉండటమే కారణం. అలాగే త్రేతా యుగంలో రాముడు రావణాసురుని మీద యుద్దానికి వెళ్లే ముందు పాల పిట్ట ఎదురు వచ్చిందట. అందుకే రాముడు రావణాసురుడిని చంపిన రోజు చెడు మీద మంచి విజయం సాధించిన రోజుకి ఆదర్శంగా దసరాగా జరుపుకోవడం అనేది ఒక సంప్రదాయం అయ్యింది. అదే రోజు పాల పిట్టలు ఎక్కడ ఉన్నా గ్రామాల్లోని పంట చేన్లలో, ఊరి పొలిమేరల్లో తిరగడం జరుగుతుంది. అశ్విని మాసంలో (అక్టోబర్ నెల) లో పంటలు చేతికి వచ్చే కాలం, అదే సమయంలో నవరాత్రులు, దసరా పండగలు జరుపుకోవడం జరుగుతుంది. అందుకే ఈ పాల పిట్టలు ఆహారం కోసం ఆ సమయాల్లో ఊర్లలో పంట పొలాల్లో కనిపిస్తాయి. పండగలు వాటి ప్రత్యేకతలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండటం మనం ఆశ్చర్యపడాల్సిన విషయమే.ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేసినప్పుడు వారి ఆయుధాలన్నీ జమ్మీ చెట్టు మీద దాచి ఉంచుతారు. అప్పుడు ఇంద్రుడు పాల పిట్టలా మారి ఆ చెట్టు మీద పాండవుల ఆయుధాలకు రక్షణగా ఉన్నాడు అని కూడా చెప్పుకుంటారు. అందుకే దసరా రోజు ఆయుధ పూజ అంటే అన్ని కుల వృత్తుల వారు వారి వారి జీవన ఆధారాలకు సంబందించిన వాటికి పూజలు చెయ్యడం కూడా జరుగుతుంది. ఇలా ఒక్కో యుగంలో ఒక్కో ప్రాంతానికి చెందిన సంప్రదాయాలతో ఒకే నెలలో జరిగే పండుగలకు పాల పిట్టకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే పాల పిట్ట అనేది కేవలం ఒక పక్షి మాత్రమే కాదు అది మనుషుల సాంఘిక సమైక్యతను ప్రతిబింబిస్తుంది. ఒక భావోద్వేగం. పాల పిట్ట జీవన విధానం మనకు ఒక చిన్నపాటి పాఠం లాంటింది దాన్ని నిశితంగా పరీక్షిస్తే అది ఉదయం లేవగానే దాని చుట్టూ ఉన్న పరిస్థితులపైన నిఘా వేస్తుంది. ఎలాంటి అపాయాలు పొంచి ఉన్నాయి, అది నివసించే ప్రాంతం సురక్షితంగా ఉంటుందా? ఉండదా? అని విశ్లేషించుకుంటుంది. దాని పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది కానీ అవసరానికి అది దాని పరిమాణం రెండింతలు రెట్టింపు చేస్తుంది. పాల పిట్టలు ఎప్పుడు కూడా ఒక సమూహంలో ప్రయాణం చేస్తాయి అందువల్ల మిగతా బలవంతమైన పక్షులు దాడి చేసినప్పుడు కలిసి కట్టుగా పోరాడుతాయి. మనుషులు కూడా సామాజిక సాంఘిక జీవితంలో సంఘటితమై జీవించాలని అప్పుడే ఎలాంటి కష్టాలు వచ్చినా ఒకరికొకరు తోడుగా నిబడొచ్చు అని మనకు చూపిస్తాయి. పాల పిట్టల గొంతు దూకుడుగా ఉన్నా ఒకదానితో ఒకటి ఎంతో మృదు స్వభావంతో పలకరించుకుంటాయి. అందుకే పాల పిట్టలు నమ్మకానికి ఐక్యమత్యానికి ప్రతీకలు. ఎంతో ఎత్తులో ఎగురుతున్నా కూడా నెల మీద వాటి ఆహారం మీద దృష్టిని మాత్రం పోగొట్టుకోవు. వాటి కంటి చూపు చాలా సూక్షమైన క్రిమి కీటకాలను కూడా గుర్తిస్తాయి. ముఖ్యంగా పంట పొలాల్లో ఉండే చిన్న చిన్న వాన పాములు వీటి ఆహారం. చెట్లు వీటి ప్రాథమిక నివాస స్థలాలు అందుకే ఇవి ఎక్కువగా అడవుల్లో ఉద్యానవనాల్లో నివసిస్తాయి ఆహారం కోసం నీటి పరివాహక ప్రదేశాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయి. పక్షులు మన చుట్టూ కనిపించకపోవడం వల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ ఒక్కటే గుర్తొస్తుంది. కానీ అవి అంతరించిపోతున్నప్పుడు పర్యావరణ సమతుల్యం దెబ్బతిని మనుషుల జీవన ప్రమాణాలు కూడా మెల్లి మెల్లిగా అంతరించి పోతున్నాయనే విషయం చాలా ఆలస్యంగా అర్థమవుతుంది. ఒకప్పుడు గ్రామాల్లో విరివిగా విచ్చల విడిగా, చిన్న చిన్న నగరాలలోని ఉద్యానవనాల్లో చెట్ల మీద కనిపించిన పాల పిట్ట ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సమయంలో కనిపిస్తే మనం ఆశ్చర్యానికి గురవుతున్నాం. మరికొంత మంది వీటిని పంజరాల్లొ పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అంటే దానికున్న ప్రత్యేకతలు అలాంటివి. అలాగే మనం నాగరిత ముసుగులో అడవులను, చెట్లను దూరం చేస్తూ వాటి మీద ఆధారపడుతున్న పక్షులను జంతువులను కూడా దూరం చేసుకుంటున్నాము. రచయిత : ప్రదీప్ మాడురి ఫోటో : అల్బిన్ జాకబ్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
చిట్టి బాతు... బుజ్జి కొంగ..!
‘ఇంత ఉదయమే ఎక్కడికి బయలుదేరావు?’ అని చిట్టిబాతును అడిగింది బుజ్జి కొంగ. ‘మా అమ్మమ్మగారి ఇంటికి వెళ్తున్నాను’ చెప్పింది చిట్టి బాతు. ‘నేను కూడా వస్తాను. నన్నూ మీ అమ్మమ్మగారి ఇంటికి తీసుకువెళ్ళవా?’ అడిగింది బుజ్జి కొంగ. ‘నిన్ను మా అమ్మమ్మగారింటికి తీసుకెళ్లడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మీ అమ్మను అడుగు. అమ్మ వెళ్ళమంటే నాతో రా!’ అంది చిట్టి బాతు. ‘మా అమ్మ ఏమీ అనదు’ చెప్పింది బుజ్జి కొంగ. అయినా చిట్టి బాతు ‘అమ్మ ఒప్పుకుంటేనే’ అని పట్టుబట్టింది. ‘అయితే ఉండు.. క్షణంలో వెళ్లి అమ్మను అడిగొస్తాను’ అంటూ కొలను పక్కనే ఉన్న చెట్టు పైకి ఎగిరింది. కాసేపటి తర్వాత వచ్చి ‘అమ్మ వెళ్ళమంది’ అంది బుజ్జి కొంగ. ‘అయితే పదా’ అంటూ బుజ్జి కొంగను తన అమ్మమ్మ గారింటికి తీసుకువెళ్లింది చిట్టి బాతు. అమ్మమ్మ ఇద్దరినీ ఆప్యాయంగా ఆహ్వానించి చక్కటి విందును ఏర్పాటు చేసింది. చిట్టి బాతు, బుజ్జి కొంగ హాయిగా భోంచేసి.. చాలాసేపు ఆడుకున్నాయి. కబుర్లతో కాలక్షేపం చేశాయి. సమయమే తెలియలేదు. ఇక్కడ.. బుజ్జి కొంగ తల్లి ఆహారం సేకరించి కొంచెం వేగంగానే గూటికి చేరింది. వచ్చేటప్పటికి బుజ్జి కొంగ కనపడలేదు. చెట్టు పైనున్న మిగిలిన కొంగలను అడిగింది తన బిడ్డ గురించి. ‘ఉదయం నుండి బుజ్జి కొంగను చూడలేద’ని చెప్పాయి అవి. తన బిడ్డ కోసం అంతటా వెదికింది. ఎక్కడా కనబడలేదు. చివరకు చిట్టి బాతు తల్లినీ వాకబు చేసింది తన బిడ్డ గురించి. అది కూడా తనకు తెలియదనే చెప్పింది. దాంతో బుజ్జి కొంగ తల్లి ఏడుస్తూ తన గూటి కొమ్మపై కూర్చుంది. అంతలోకే చీకటి పడిపోయింది. చిట్టి బాతు అమ్మమ్మ ఇంట్లో ఉన్న బుజ్జి కొంగ గాభరా పడింది. ‘అమ్మో.. చీకటి పడిపోయింది.. త్వరగా మనిళ్లకు పోదాం పదా’అని చిట్టి బాతును తొందరపెట్టింది. ‘ఎందుకంత కంగారు? అమ్మకు చెప్పావ్ కదా.. నిదానంగా వెళ్దాంలే!’ అంది చిట్టి బాతు. ‘ఆ.. ఆ.. చెప్పానులే’ అనైతే అంది కానీ బయలుదేరే వరకు చిట్టి బాతును స్థిమితపడనివ్వలేదు. ఎట్టకేలకు రెండూ కలసి తిరుగుప్రయాణమయ్యాయి. ఇక్కడ.. చెట్టు కొమ్మ పై ఏడుస్తూ కూర్చున్న బుజ్జి కొంగ తల్లి చుట్టూ ఇతర పక్షులన్నీ చేరి ఓదార్చసాగాయి. అంతలోకే దూరం నుంచి చిట్టి బాతు, బుజ్జి కొంగ రావడం కనిపించింది. ఆత్రంగా చెట్టు మీద నుంచి కిందకు వాలింది కొంగ. అక్కడే కొలను దగ్గర చిట్టి బాతు తల్లి కూడా పిల్లల కోసం ఎదురుచూస్తూ ఉంది. దాన్ని చూడగానే ‘చూడు.. నీ బిడ్డ మాటమాత్రమైనా చెప్పకుండా నా బిడ్డను ఎలా తీసుకెళ్లిపోయిందో? తప్పు కదా! నేనెంత కంగారుపడ్డాను?’ అంది కాస్త కోపంగా.. బుజ్జి కొంగ తల్లి. ఆ మాటకు చిట్టి బాతు తల్లి చిన్నబుచ్చుకుంది. గబగబా పిల్లలకు ఎదురెళ్లి ‘బుజ్జి కొంగ వాళ్లమ్మకు చెప్పకుండా బుజ్జిని నీతో తీసుకెళ్లడం తప్పు కదూ? తనెంత గాభరా పడిందని.. బిడ్డ కనిపించక?’ అంటూ చిట్టి బాతును చీవాట్లేసింది వాళ్లమ్మ. ఆ మాటకు తెల్లబోయింది చిట్టి బాతు. ‘అదేంటీ వాళ్లమ్మకు చెప్పే వచ్చానందే నాతో! అమ్మమ్మ గారి దగ్గరికి నా కూడా వస్తానంటే మీ అమ్మకు చెప్పందే రావద్దు.. వెళ్లి చెప్పిరా అంటే నా ముందే చెట్టెక్కింది వాళ్లమ్మను అడగడానికి’ అని వాళ్లమ్మకు చెబుతూ వెంటనే బుజ్జి కొంగ వైపు తిరిగి ‘వెళ్లావ్ కదా.. అమ్మను అడగడానికి?’ అంది చిట్టి బాతు. తల దించుకుంది బుజ్జి కొంగ అబద్ధం చెప్పినందుకు. అప్పటికే అక్కడకు వచ్చిన బుజ్జి కొంగ తల్లి.. ఆ మాటలన్నీ విన్నది. ‘అలా అబద్ధం ఎందుకు చెప్పావ్?’ అంటూ కోప్పడింది. తన తప్పు గ్రహించిన బుజ్జి కొంగ.. అమ్మను చుట్టేసుకుని ‘నీకు చెప్పే వెళదామని మన గూటి దగ్గరకు వచ్చాను. కానీ నువ్వు లేకపోవడంతో వెంటనే కిందకు దిగి.. అమ్మను అడిగే వచ్చాను అని అబద్ధం చెప్పి చిట్టి బాతుతో వెళ్లిపోయాను. తప్పయిపోయింది అమ్మా.. ఇంకెప్పుడూ అబద్ధం చెప్పను’ అంటూ ఏడ్చేసింది. ‘చూడు.. నీ అబద్ధం వల్ల నేను కంగారుపడ్డమే కాదు.. చిట్టి బాతునూ ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానో! ఇక నుంచి అనుమతి కోసమే కాదు.. ఏం జరిగినా నిజమే చెప్పాలి.. సరేనా!’ అంటూ బిడ్డను సముదాయించింది బుజ్జి కొంగ తల్లి. ‘బిడ్డ కనపడకపోయేసరికి గాభరా పడ్డాను. ఆ గాభరాతోనే నిన్నూ రెండు మాటలన్నాను. తప్పు పట్టుకోకు’ అంటూ చిట్టి బాతునూ దగ్గరకు తీసుకుంది బుజ్జి కొంగ తల్లి. ‘హమ్మయ్య.. ఏమైతేనేం పిల్లలు జాగ్రత్తగా ఇంటికి చేరారు’ అనుకుంటూ వాళ్ల పిల్లలను తీసుకుని ఆ తల్లులు వాళ్ల వాళ్ల నివాసాలకు వెళ్లిపోయాయి. -
జంతువులను, పక్షులను ఫోటోలను తీయడం అంత ఈజీ కాదు (ఫోటోలు)
-
పక్షి ప్రపంచంలోని ఆసక్తికరమైన విషయాలు (ఫోటోలు)
-
"పక్షిజల" : పక్షుల పట్ల ఆసక్తే ప్రకృతి ప్రేమికురాలిగా మార్చింది!
పచ్చటి ఊరు వదిలి కాంక్రీట్ జంగిల్లోకి అడుగుపెట్టిన శుభా భట్‌కు బెంగళూరులోని ‘ఐఐఎస్సీ’ క్యాంపస్ రూపంలో ప్రకృతి ప్రపంచం దగ్గరైంది. ఎన్నో పక్షులు నేస్తాలు అయ్యాయి. ‘పక్షులను ప్రేమించడానికి వాటి శాస్త్రీయ నామాలతో పనిలేదు’ అని హాస్యానికి అన్నా శుభాభట్ విషయంలో అది నిజం. ఎన్నో పక్షులకు సంబంధించి శాస్త్రీయ నామాలు, పుట్టు పూర్వోత్తరాలు తెలియకపోయినా వాటిని ప్రేమించింది. పక్షులను చూస్తున్నంతసేపూ తనకు శుభ సమయమే. శాస్త్రీయ కోణం కంటే అనుభూతులు, భావోద్వేగాల కోణంలో రెండు వందల జాతుల పక్షులకు సంబంధించి తన పరిశీలనలను ‘పక్షి జల’ పేరుతో ఫొటో డాక్యుమెంటేషన్ చేసింది శుభా భట్... పెళ్లయిన తరువాత బెంగళూరు మహానగరంలోకి అడుగు పెట్టింది శుభా భట్. పచ్చని పల్లెటూరి నుంచి వచ్చిన తనకు వాహనాల రణగొణధ్వనులు తప్ప పక్షుల కిలకిలారావాలేవీ వినిపించేవి కాదు. దీంతో ఇంటి నాలుగు గోడల మధ్య నేషనల్ జాగ్రఫీ చానల్ చూడడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) క్యాంపస్‌లోకి అడుగు పెట్టడం మళ్లీ పుట్టింటికి వచ్చినట్లుగా అనిపించింది శుభా భట్‌కు. ఆమె భర్త నవకాంత్ భట్ పరిశోధకుడు. ఐఐఎస్సీ క్యాంపస్‌లోకి ఎన్నో పక్షులు వచ్చిపోతుంటాయి. వాటిలో ఎప్పుడూ వచ్చే పక్షులతో పాటు అరుదైన అతిథుల్లాంటి పక్షులు కూడా ఉంటాయి. దాహార్తితో ఉన్న పక్షుల కోసం తన ఇంటిముందు మట్టిపాత్రలో నీళ్లు పెట్టి దూరంగా కూర్చునేది. దురదృష్టవశాత్తు ఒక్క పక్షి కూడా వచ్చేది కాదు. క్యాంపస్‌లోనే మరో చోటికి మకాం మార్చినప్పుడు కూడా ఇంటిముందు మట్టి పాత్రలలో నీళ్లు పెట్టి కూర్చొనేది. ఈసారి మాత్రం అదృష్టం తలుపు తట్టింది. కాకులు, పిచ్చుకలు... రకరకాల పక్షులు వచ్చి నీళ్లు తాగి వెళ్లేవి. ఈ ఉత్సాహంతో మరిన్ని మట్టిపాత్రలు ఇంటి చుట్టూ పెట్టేది. పేరు తెలిసిన పక్షులతో పాటు బొత్తిగా అపరిచితమైన పక్షులూ వచ్చి నీళ్లు తాగి వెళ్లేవి. అవి నీళ్లు తాగే దృశ్యం శుభకు అపురూపంగా అనిపించేది. నీటికి, పక్షులకు మధ్య ఉండే సంబంధాన్ని గురించి లోతుగా ఆలోచించేలా చేసేది. ఒకరోజు ఒక పక్షి చెట్టు కొమ్మల్లో నుంచి రాలిపడుతున్న నీటిబిందువులలో ఆనందంగా జలకాలాడుతున్న దృశ్యం చూసిన తరువాత చెట్లపై కూడా నీళ్లు పోయడం అలవాటు చేసుకుంది. మొత్తానికైతే శుభ ఉండే ఇల్లు పక్షులకు నచ్చిన ఇల్లు అయింది. ‘ఇక్కడకి వస్తే మనకు ప్రమాదమేమీ లేదు’ అనే నమ్మకం వాటికి కలిగింది. కొన్ని సంవత్సరాల క్రితం కశ్మీర్‌కు చెందిన అరుదైన కశ్మీర్ ఫ్లైక్యాచర్ శుభ కంటపడింది. కర్ణాటక గడ్డపై అరుదైన కశ్మీర్ పక్షిని వీడియో రికార్డ్ చేసిన ఘనత దక్కించుకుంది శుభ. ఫొటోగ్రాఫర్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు శుభ. అయితే రకరకాల పక్షులు నీళ్లు తాగుతున్న అందమైన దృశ్యాలు కనువిందు చేస్తున్న రోజుల్లో కెమెరాను చేతుల్లోకి తీసుకుంది. ‘పక్షి జల’ పుస్తకంతో రచయిత్రిగా కూడా మారింది. ఈ పుస్తకాన్ని ఐఐఎస్సీ ప్రెస్ ప్రచురించింది. ‘పుస్తకం రాయాలని ఎప్పుడూ అనుకోలేదు. బాటనీ, బయోలజీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాకపోయినా ఈ పుస్తకం రాశానంటే కారణం ప్రకృతిపై నాకు ఉన్న ప్రేమ. దీంట్లో నా పరిశీలనలు, భావాలు, అనుభవాలు కనిపిస్తాయి. పక్షి జల చదివిన వాళ్లు ఎవరైనా తమ ఇంటి పరిసరాలలో పక్షుల దాహార్తిని తీర్చడానికి, వాటి జలకేళిని దర్శించడానికి నీటితో నిండిన మట్టిపాత్రలు ఏర్పాటు చేస్తే ఈ పుస్తకం ప్రయోజనం నెరవేరినట్లే’ అంటుంది శుభ. మనది కాని ప్రపంచంలోకి తొంగిచూడాలంటే అద్భుతశక్తులేవీ అవసరం లేకపోవచ్చుగానీ ఆసక్తి మాత్రం ఉండాలి. శుభా భట్‌కు ఆసక్తి అనే శక్తి ఉంది. ఆ ఆసక్తే ఆమెని పక్షుల ప్రపంచంలోకి వెళ్లేలా చేసింది. (చదవండి: పురిటి కోసం పక్షులు ఎంచుకున్న ప్రాంతం, విదేశాల నుంచి వస్తుంటాయి) -
హైదరాబాద్ లో 150 రకాల విదేశీ పక్షుల ప్రదర్శన ఎక్కడో తెలుసా (ఫొటోలు)
-
పురిటి కోసం విదేశాల నుంచి వస్తున్న పక్షులు.. ఎక్కడో తెలుసా?
తేలినీలాపురం.. సైబీరియా పక్షుల విడిది కేంద్రం. పురిటి కోసం పక్షులు ఎంచుకున్న ప్రాంతం. అల్లంత దూరం నుంచి పక్షులను చూడడం, చెట్టుపై వాలిన వాటి అందాలు గమనించడం సహజం. అవే పక్షులను దగ్గరగా చూస్తే..? వాటి ఆహారం, ఆహార్యం, అలవాట్లను తెలుసుకోగలిగితే..? చింత, రావి, తుమ్మ, గండ్ర, వెదురుపై వాలే అతిథి విహంగాల జీవన క్రమాన్ని అర్థం చేసుకోగలిగితే..? ఎంత బాగుంటుందో కదా. ఆ సరదాను తీర్చడానికి తేలినీలాపురంలో పక్షుల మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఆహార అన్వేషణ, ఆవాసాలపై జీవించే క్రమంలో ఆయా పక్షుల ప్రత్యేకతలను వివరంగా తెలియజేస్తూ పక్షుల బొమ్మలను ఏర్పాటు చేశారు. పెలికాన్ పెలికాన్ బాతు జాతికి చెందిన పక్షి. దీని బరువు సుమారు 8 కిలోలు ఉంటుంది. దీని నోరు పొడవు సుమారు 14 సెంటీమీటర్లు. దీని రెక్కల పొడవు సుమారు 118 ఇంచీలు, రోజుకు 4 కిలోల చేపల్ని తింటుంది. ఒకే సారి 2 కిలోల బరువు కలిగిన చేపను సునాయాశంగా తినగలిగే సామర్థ్యం ఉంది. దీని గుడ్డు బరువు సుమారు 150 గ్రాములు. ప్రతీ సీజన్‌కు 4 గుడ్లను మాత్రమే పెడుతుంది. దీని గుడ్డు 28 రోజుల్లో పిల్లగా పరిపక్వత చెందుతుంది. 3 నెలల్లో పిల్ల తల్లిగా మారుతుంది. దీని దవడ సంచి ఆకారంలో ఉంటుంది. గంటకు 100 కిలో మీటర్ల వేగంతో పయనిస్తాయి. రోజుకు సుమారు 4 సార్లు బయటకు వెళ్తూ ఆహారాన్ని తీసుకువస్తాయి. పెలికాన్ దవడ సంచి ఆకారంలో ఉంటుంది. ఈ దవడలో సుమారు 4 కిలోల వరకు చేపల్ని నిల్వ చేయగలవు. పిల్లలకు ఆహారాన్ని నోటి ద్వారా అందజేస్తాయి. దీని జీవిత కాలం సుమారు 29 సంవత్సరాలు. పెయింటెడ్ స్టార్క్ పెయింటెడ్ స్టార్క్ కొంగ జాతికి చెందిన పక్షి. దీని బరువు సుమారు 5 కిలోలు ఉంటుంది. దీని రెక్కల పొడవు 63 ఇంచీలు, ఇవి చిన్న చేపలు, పురుగులు, నత్తలు తింటాయి. కేవలం పావు కిలో వరకు మాత్రమే నోటిలో ఆహారాన్ని నిల్వ చేయగలుగుతాయి. తీసుకువచ్చిన ఆహారాన్ని గూడు మీద వేస్తే పిల్లలు తింటాయి. దీని నోటి పొడవు సుమారు 16 సెంటీ మీటర్లు. ఆహారం కోసం రోజుకు 2 సార్లు బయటకు వెళ్తుంటాయి. దీనికి సాధారణ దవడ మాత్రమే ఉంటుంది. దీని గుడ్డు సుమారు 75 గ్రాములు. ఇవి ఒక సీజన్లో 4 గుడ్లు మాత్రమే పెడతాయి. 28 రోజుల్లో గుడ్డును పిల్లగా పరిపక్వత చేస్తుంది. పిల్ల తల్లిగా మారాలంటే సుమారు 3 సంవత్సరాలు కాలం పడుతుంది. దీని జీవిత కాలం సుమారు 29 సంవత్సరాలు. 120 రకాల పక్షుల్లో కొన్నింటి ప్రత్యేకతలు.. పొడుగు ముక్కు ఉల్లంకి: ఈ పక్షి మట్టిలో ఆహార ఆన్వేషణకు బురద మట్టి ఇసుక నేలలో అనేక రకాలైన చిన్న పురుగులను కొక్కెం వంటి ముక్కుతో వేట కొనసాగిస్తుంది. ఈ పక్షి నమూనా మ్యూజియంలో ఏర్పాటు చేశారు. తెడ్డు మూతి కొంగ: ఈ పక్షి మూతి చెంచా ఆకారంలో ఉంటుంది. నీటి అడుగున ఉన్న చిన్న జీవులను వేటాడుతుంది. అర్ధ చంద్రాకారంలో గల మూతితో వేట కొనసాగిస్తుంది. పాము బాతు : బల్లెం వంటి ముక్కు ఆకారంతో ఈ పక్షి వేట కొనసాగిస్తుంది. మట్టి, నీటిలో పొడుచుకుంటూ ఆహారాన్ని సేకరిస్తుంది. రాజహంస: జల్లెడ మాదిరిగా ఉన్న ముక్కు కలిగిన ఈ రాజహంస సూక్ష్మ జీవులను సునాయాశంగా వేటాడుతుంది. ఈ పక్షి ముక్కులో ఒక రకమైన వడపోత పరికరం బిగించి ఉన్నట్లు ఉంటుంది. నత్తగుల్ల కొంగ: నత్తలను వేటాడడంలో ఈ పక్షి ముక్కు ఎంతో షార్ప్‌గా ఉంటుంది. నత్తలను గట్టిగా పట్టుకోవడంతో ఆహారాన్ని సంపాదించుకుంటాయి. మ్యూజియం చూసొద్దామా... టెక్కలి సమీపంలోని తేలినీలాపురంలొ ఈ మ్యూజియం ఉంది. ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి ఎంత దూరం 70 కిలోమీటర్లు ఉంటుంది. రవాణా: టెక్కలి వరకు రైలు సదుపాయం ఉంది. బస్సు సదు పాయం కూడా ఉంది. టెక్కలి నుంచి పూండి మార్గంలో ఉన్న ఈ ప్రదేశానికి బస్సులు, ఆటోలు కూడా ఉన్నాయి. సందర్శనీయ వేళలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. -
శీతాకాలం విడిది కోసం వలస వెళ్తున్న పక్షులు, వేలకిలోమీటర్ల ప్రయాణం
శీతాకాలం విడిది కోసం పక్షుల వలసలు మొదలయ్యాయి. దేశీయంగానూ ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు పక్షులు వలస వెళ్తాయి.ఎన్నో జాతుల పక్షులకు వలస వెళ్ళడం వాటి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. ప్రపంచ పక్షి జాతుల్లో సుమారు 40శాతం దాకా వలస వెళ్తాయని అంచనా. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. శీతోష్ణస్థితిలో ఏర్పడిన అననుకూల పరిస్థితుల వల్ల, ఆహారం కోసం, గుడ్లను పెట్టి పొదిగి సంతానాభివృద్ధికి, వ్యాధుల నుంచి రక్షణకు పక్షులు వలస వెళ్తాయి. వలసలో భాగంగా పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.వాతావరణం అనుకూలంగా మారిన తరవాత మళ్ళీ వెనుదిరుగుతాయి. ముఖ్యంగా శీతాకాలం విడిది కోసం సైబీరియా, నైజీరియా, రష్యా, టర్కీ, యూరప్ దేశాల నుంచి పక్షులు భారత్‌లోకి వలస వస్తుంటాయి. అయితే శీతాకాల విడిది కోసం వలస వచ్చే విదేశీ పక్షుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న పక్షి పేరు ఓనోన్ కుకూ. ఏప్రిల్29న ఆఫ్రికాలోని కెన్యాలో ఉన్న ఈ పక్షి ఈరోజు(శనివారం)మధ్యప్రదేశ్‌కి చేరుకుంది. అరేబియా సముద్రానికి 150 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తులో ఈ పక్షి ప్రయాణం సాగింది. మరో వారం రోజుల్లో ఇది 5వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు.దీనిలాగే ఇతర పక్షులు కూడా మార్గమధ్యంలో ఆహారం, విశ్రాంతి కోసం కొంతకాలం ఆగుతాయి. He is Onon a Cuckoo. This bird was in Kenya on 29th April. Today he is in Madhya Pradesh. He has completed his crossing of the Arabian Sea to India and, for good measure, flown another 600 km inland also. It is 5000 Kms flying in a week. Feel that amazing feat. @BirdingBeijing pic.twitter.com/SGfuGO3MkS — Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 4, 2020 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చే విభిన్న రకాల విదేశీ పక్షులను చూసేందుకు, కెమెరాలతో క్లిక్ మనిపించేందుకు బర్డ్ వాచర్లు క్యూ కడుతుంటారు. అయితే ఒకప్పుడు వందల సంఖ్యలో వచ్చే విదేశీ పక్షుల రాక క్రమక్రమంగా తగ్గుతోంది. ఈ పక్షులు ఆవాసాలుగా చేసుకునే చెరువులు ఆక్రమణలకు గురవడం, చెరువుల చుట్టూ నిర్మాణాలు పెరిగిపోతుండటంతో వాటి రాక క్రమంగా తగ్గిపోతోంది. 📢Today is the day! Let’s celebrate bird migration on #WorldMigratoryBirdDay! On their epic journeys, migratory birds help inspire many people and cultures along the way. Learn more about their migration & how you can protect them: ➡️https://t.co/SoAJkVyx3z pic.twitter.com/OIiFGSPaTp — World Migratory Bird Day (@WMBD) October 14, 2023 ప్రస్తుతం ఈ సీజన్లోనూ సిటీకి విదేశీ పక్షులు వచ్చినప్పటికీ మునుపటితో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువని బర్డ్వాచర్లు పేర్కొంటున్నారు. ఇలాగే కొనసాగితే రాను రాను ఈ సంఖ్య మరింత పడిపోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఈ బుజ్జి పక్షులు ఎంత ప్రమాదకరమో తెలుసా..?
-
బిల్డింగ్‌ను ఢీకొని 1000 పక్షులు ఎందుకు మృతిచెందాయి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
అమెరికాలోని చికాగోలో ఇటీవల ఒక్కరోజులో 1000 పక్షులు మృతి చెందడం సంచలనం కలిగించింది. ఆ పక్షులు శీతాకాలపు వలస కోసం దక్షిణ అమెరికా మైదానాలకు తరలివెళ్లాయి. అక్కడి నుండి ఉత్తర అమెరికాకు తిరిగి వస్తుండగా, చికాగోలోని మెక్కార్మిక్ ప్లేస్ సమీపంలో ఒకటిన్నర మైళ్ల వ్యాసార్థంలో పక్షులు చనిపోయి కుప్పలుగా పడిపోయాయి. స్థానికులు ఆ పక్షులకు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వాటి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పక్షులు ఇలా చనిపోవడానికి కారణం అవి భవనాన్ని ఢీకొని కింద పడిపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా చికాగో బర్డ్ కొలిజన్ మానిటర్స్ డైరెక్టర్ అన్నెట్ ప్రిన్స్ మాట్లాడుతూ భవనం సమీపంలో పక్షులు నేలకొరిగాయని తెలిపారు. వీటిలో మృతిచెందిన, గాయపడిన పక్షులు ఉన్నాయి. దాదాపు 1.5 మిలియన్ పక్షులు ఇక్కడి నుంచి వలస వెళుతుంటాయి. వీటిలో టేనస్సీ వార్బ్లెర్స్, హెర్మిట్ థ్రష్‌లు, అమెరికన్ వుడ్‌కాక్స్, ఇతర రకాల సాంగ్‌బర్డ్‌లు ఉంటాయి. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ అంటారియోలో కిటికీలకు తగిలి చనిపోయే పక్షులపై పరిశోధన చేసిన బ్రెండన్ శామ్యూల్స్.. కిటికీకి తగిలిన ప్రతి పక్షి చనిపోదని చెప్పారు. పక్షుల మరణాలకు గాలి, వర్షం, పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణం కావచ్చన్నారు. అమెరికన్ బర్డ్ కన్జర్వెన్సీకి చెందిన బ్రియాన్ లెంజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒక బిలియన్ పక్షులు గాజు కిటికీలను ఢీకొనడంతో చనిపోతున్నాయన్నారు. పక్షులు అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసినప్పుడు, భయపడి కిందపడి చనిపోతాయన్నారు. ఇటువంటి సందర్భాల్లో కొన్ని పక్షులు గాయపడతాయన్నారు. భవనాల లైట్లు స్విచ్ ఆఫ్ చేయడం పక్షుల మరణాలను తగ్గించడానికి ఒక మార్గంమని పేర్కొన్నారు చికాగోలో పక్షుల మరణాలపై 2021లో జరిపిన ఒక అధ్యయనంలో పెద్ద భవనాల్లో సగం లైట్లు ఆఫ్ చేయడం వల్ల పక్షుల ఢీకొనడం 6 నుంచి 11 రెట్లు తగ్గుతుందని తేలింది. ఇది కూడా చదవండి: బ్రిటన్ ధూమపాన రహితదేశం కానుందా? -
Pudami Sakshiga :పక్షిగూడు గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
“ఋతుపవనాలు అడవుల గుండా పయనిస్తున్నపుడు మన ప్రపంచంలోనే ఉన్న మరో చిన్న ప్రపంచంలోని ఆకర్షణ, రమ్యత చూసే కనులు పరవశమొందే హృదయం ఉన్న ఎవరినైనా మంత్రముగ్ధులను చేస్తుంది." - Dr. Salim Ali, eminant Ornithologist నిజమేనండి, పక్షుల ప్రపంచం ఎంతో అద్భుతమైనది. కొంచెం పరికించి చూస్తే ఆ చిన్ని ప్రపంచం లోని వింతలు విడ్డూరాలు మనకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి. పక్షులు చిన్నగా కనిపించినప్పటికీ అవి నివసించే తీరు వాటి జీవన విధానం మనకందరికీ ఎంతో ఆదర్శప్రాయం. ఆ చిన్ని గూటిలో ఎదుగుతున్న ఆకలితో ఉన్న పిల్లలు తమలో తాము సామరస్యంగా సర్దుబాటు చేసుకునే విధానం నిజంగా ఆశ్చర్యకరం. కుటుంబంలోని ఈ ఇచ్చి పుచ్చుకోవడం మనందరం అలవర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం. ఆ పక్షి ప్రపంచంలోకి వెళ్ళి అవి గూడు కట్టుకునే విధానం గురించిన కొన్ని విశేషాలని తెలుసుకుందామా! గూడు (ఇల్లు) మనందరి మౌళిక అవసరం. సాయంత్రమైతే చాలు ఎప్పుడు ఇంటికి చేరి కొంత సేదదీరుదామా అని మనమందరం ఎదురు చూస్తాం. కొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉన్నామంటే చాలు బెంగ పట్టుకుంటుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి చేరతామా అని మనసు గొడవ పెడుతూ ఉంటుంది. మరి పక్షులు సాయంత్రమైతే ఎక్కడికి వెళ్తాయి? ఇదేం ప్రశ్న గూటికి పోతాయి అనుకుంటున్నారు కదూ, అలా అనుకుంటున్నారంటే మీరు పప్పులో కాలేసినట్లే. పక్షులు జతకట్టి, గుడ్లు పెట్టి, పిల్లలను సాకే కాలంలోనే గూళ్ళు కట్టుకుంటాయి. మిగతా సమయాలలో గుబురుగా పెరిగిన పొదలలోనో, బొరియలు చెట్టు తొర్రలలోనో, కొమ్మ వంచలలో శత్రువుల బారిన పడకుండా ఉండేలా చూసుకుని పడుకుంటాయి. సంతానోత్పత్తి కాలంలో రకరకాల పక్షులు వివిధ రకాలుగా గూళ్లను కట్టుకుంటాయి. కొన్ని గడ్డి పరకలను అల్లిగూడు కడితే, కొన్ని ఆకులను కుట్టి గూటిని కడతాయి. పుల్లలు, పుడకలు, బూజు, గరిక, మట్టి వంటి వాటితో ఎలాంటి సివిల్ ఇంజనీరు సాయం లేకుండా తమంతట తామే గూటిని నిర్మించుకుంటాయి. కొన్ని చెట్ల కాండాలపై రంధ్రాలు చేసి గూడును కడితే, కొన్ని నేలలో బొరియలను తవ్వి గూటిని నిర్మించుకుంటాయి. నీళ్ళపై తేలియాడే గూళ్ళు, వేలాడే గూళ్ళు అబ్బో ఎన్నో రకాల గూళ్ళు. కొన్ని కప్పు లాగా ఉంటే మరికొన్ని సాసర్ లా. ఇంకొన్ని గూళ్లయితే నేల మీదే. ఇలా పక్షులు కట్టుకునే గూళ్లను గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందామనుకుంటుంటే చదవడం కొనసాగించండి మరి. ►తీతువ, తెల్ల బొర్ర నీటి కోడి వంటి నీటి పక్షులు నీటి అంచుకు దగ్గరగా ఆకులు, గడ్డితో నేల మీదే గూళ్ళు కట్టుకుంటాయి. గుడ్ల రంగు వాటిపై ఉండే మచ్చలు నేల, గడ్డి రంగులతో కలిసిపోయి శత్రువుల బారిన పడకుండా ఉంటాయి. కబోద పక్షి( నైట్ జార్) రాలిన ఆకులలోనే గుడ్లు పెడుతుంది. ► కాకులు, కొంగలు, గ్రద్దలు, పావురాలు పుల్లలతో గూడును నిర్మించుకుంటాయి. గూడు లోపల మెత్తని పీచు వంటి వాటిని పరిచి గుడ్లను పెడతాయి. ► చెట్ల తొర్రలలో గుడ్లగూబలు, కొమ్ముకసిరి (హార్న్ బిల్), చిలకలు, మైనాలు గూటిని ఏర్పాటు చేసుకుంటాయి. కంసాలి పిట్ట,వడ్రంగి పిట్టలు మొదట చెట్లకు రంధ్రాలు చేసి గూటిని నిర్మించుకుంటే, తరువాత చిలుకలు, మైనాలు వాటిని తమకు అనువుగా మార్చుకుంటాయి. మనం పాత ఇంటిని రీ మోడలింగ్ చేసుకున్నట్లు. ► కొమ్ము కసిరి గూడు కట్టుకుని పిల్లలను సాకే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. ఆడ మగ పక్షులు జతకట్టి గూటిని ఎంచుకోగానే ఆడ పక్షి ఆ తొర్రలో చేరి తన ముక్కు పట్టేంత ఖాళీ మాత్రం ఉంచి ద్వారాన్ని తన విసర్జకాలు, మట్టితో మెత్తి మూసేస్తుంది. ► గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లలకు కనీసం ఒక వారం వయసు వచ్చే వరకు ఆడ పక్షి అలా నిర్భందం లోనే ఉండిపోతుంది. ఈ నిర్భందం సమయంలో మగ పక్షే ఆహారాన్ని అందిస్తుంది. పిల్లలకు కనీసం వారం వయసు వచ్చాకకట్టిన గోడను ముక్కుతో పొడుచుకుని ఆడ పక్షి బయటకు వచ్చి, మరలా అడ్డుగోడను కట్టేస్తుంది. అక్కడి నుంచి అమ్మానాన్నలిద్దరు పిల్లలను సాకడంలో నిమగ్నమైపోతారు. ► పసరిక పిట్టలు (బీ ఈటర్స్), లకుముకి పిట్ట (కింగ్ ఫిషర్), కూకూడు పిట్ట (హూపో) వంటి పక్షులు కొంచెం ఎత్తైన నేల మీద మట్టిలో బొరియలు చేసుకుని లేదా కొండ అంచులలో బొరియలు తవ్వి గూడు కట్టుకుంటాయి. ► పికిలి పిట్టలు (బుల్బుల్), పిచ్చుకలు, వంగ పండు (గోల్డెన్ ఓరియల్), పసుపు జిట్ట (ఐయోర) వంటి పక్షులు కొమ్మ వంచలలో దొన్నె లాంటి గూటిని కట్టుకుంటాయి. ► చుక్కల జీనువాయి (మునియ) గడ్డితో గుండ్రటి బంతి లాంటి గూటిని కట్టుకుంటుంది. ఆకుల పోతడు (దర్జీ పిట్ట) ఆకుల అంచులను కలిపి గొట్టంలా కుట్టి గూడు పెడుతుంది. ► తేనె పిట్టలు ఆకులు, గడ్డి, బూజును వాడి వేలాడే గూటిని కడితే, గిజిగాడు (బాయా వీవర్) గడ్డి పోచలతో వేలాడే అందమైన గూటిని అల్లుతుంది. గిజిగాడు నీటి అంచులలో ఉన్న చెట్లపై బాగా వాలి ఉన్న కొమ్మల చివర గడ్డితో గూటిని అల్లుతుంది. ► మొదట గడ్డితో ముడి వేసి, చట్రాన్ని అల్లి మిగిలిన గూటిని అల్లుతుంది. ఇదంతా మగ పక్షి మాత్రమే చేస్తుంది. ఇలా అల్లిన గూటిని ఆడ పక్షి పరిశీలించి నచ్చితే జతకట్టి గూటిని నిర్మించడం కొనసాగిస్తాయి. ఆడపక్షి గుడ్లు పెట్టిన తర్వాత మగ పక్షి మరో గూటిని కట్టడం మొదలు పెడుతుంది. ఇలా సంతానోత్పత్తి కాలంలో రెండు నుండీ మూడు గూళ్లను కడుతుంది. ఒక వేళ ఆడపక్షికి గూడు నచ్చక పోతే పని మళ్ళీ మొదటికే, ఆ గూటిని పీకి కొత్త గూటిని అల్లాల్సిందే. ఈ గూటిని కట్టడానికి వెయ్యి దాకా గడ్డి పోచలు అవసరపడతాయట. గూడు పచ్చగా ఉన్నపుడే ఆడ పక్షి పరిశీలించేది, గూడు అల్లటం ఆలస్యం అయినా కధ మళ్ళీ మొదటికే. ఇంతే కాదు, నీటికాకులు, కొంగలు, పసరిక పిట్టలు, అడవి పిచ్చుకలు, వలస పక్షులు కలిసికట్టుగా కాలనీలుగా గూళ్ళు నిర్మించుకుంటాయి. పిల్లలను శత్రువుల బారినుండి సంరక్షించుకునేందుకు కాలనీ సహాయపడుతుంది. ఇక్కడ తమంతట తాము గూటిని నిర్మించుకోలేని కోకిల జాతి పక్షులను గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. కోకిల సొంతంగా గూటిని కట్టుకోలేదు, కాకి గూటిలోనో, బొంత పిచ్చుకల గూటిలోనో గుడ్లను పెడుతుంది. పిల్ల పెరిగి పెద్దదయిన తర్వాత గాని పెంచిన తల్లిదండ్రులకు తెలియదు. ఇలా పక్షులు రకరకాలుగా గూటిని నిర్మించుకునే విశేషాలు భలే గమ్మత్తుగా ఉన్నాయి కదూ! చాలా వరకు పక్షులు మే నుంచి సెప్టెంబరు లోపు అంటే వానలు పడి పురుగులు, గడ్డి, గడ్డి గింజలు, పళ్ళు ఎక్కువగా దొరికే కాలంలో గూటిని కట్టుకుని సంతానోత్పత్తిని చేస్తాయి. మీరు కొంచెం బద్దకం వీడి నాలుగడుగులు వేసి మీ చుట్టుపక్కల పరిశీలిస్తే తప్పకుండా ఒకటి రెండు గూళ్లను చూసే అవకాశం దక్కించుకోవచ్చు. ఏమిటి లేచే ప్రయత్నం చేస్తున్నారా? రచయిత : రవి కుమార్ ద్వాదశి, ravikumardwadasi@gmail.com తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
కౌజు పిట్టల గుడ్లకు అధిక డిమాండ్
-
Pudami Sakshiga : అంతరించిపోతున్న అరుదైన పక్షులు.. అక్రమంగా విదేశాలకు
ప్రపంచంలో జరుగుతున్న పర్యావరణ మార్పులతో ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. అదే కోవలో ఎన్నో పక్షిజాతులు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే పలు జాతులు అంతరించిపోయాయి. స్టేట్ అప్ బర్డ్స్ వార్షిక నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 48% పక్షుల జనాభా తీవ్రంగా తగ్గిపోయింది. మన దేశంలో ఇప్పటికే 50% పక్షుల జనాభా తగ్గిపోయింది. వాటిలో అరుదైన పక్షి ఆకుపచ్చ ముణియాలు కూడా ఉంది. ఈ రకం పక్షుల గురించి ఈ ఇంట్రెస్టింగ్ విశేషాలు మీకు తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా పక్షిజాతులు అంతరించిపోతున్నాయి. అక్రమ విదేశీ విక్రయాల వల్ల వీటి జనాభా తీవ్రంగా దెబ్బతింటుంది. మన దేశంలో దాదాపు 8 పక్షిజాతులు ఉన్నాయి. వీటిలో అత్యంత అరుదైన పక్షి ఆకుపచ్చ ముణియాలు. ఇవి ఆకారంలో చిన్నదిగా, బాహ్యబాగల్లో ఆకుపచ్చరంగుతో, ఉదరబాగల్లో లేత పసుపు వర్ణంతో,నలుపు తెలుపు చారాలతో (జీబ్రా స్ట్రిప్స్), ఎర్రటి కళ్ళు, ఎరుపు ముక్కుతో రామచిలుకను పోలిఉండటంతో చూడముచ్చటగా ఉంటుంది. అందుకే వీటి శాస్త్రీయ నామం Amandava formosa Formosa. అంటే లాటిన్ భాషలో అందంగా తయారైందని అర్థం. వీటిని గ్రీన్ స్ట్రాబెర్రీ ఫించ్, గ్రీన్ టైగర్ ఫించ్ అని కూడా పిలుస్తారు. ఆకుపచ్చ ముణియా,ఎరుపు ముణియా మాత్రమే ఎరుపు ముక్కు కలిగివుంటుంది. ఇది మరే ఇతర ముణియా జాతి పక్షుల్లో కనిపించని లక్షణం. బాల్యదశలోని పక్షులు గోధుమ వర్ణంలోనూ, ఉదరబాగంలో లేత పసుపు రంగుతో ఆకర్షణీయంగా కనబడుతోంది. ఇవి దాదాపు 10 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. మగ పక్షులు ఆడపక్షుల కంటే ప్రకాశవంతంగా ఉంటుంది. ఇవి మధ్య, దక్షిణ భారతదేశానికి మాత్రమే స్థానికమైన పక్షులు. పొద అడవులు, పొడి నేల , వ్యవసాయ నేల , చెరుకు ,మక్కజాన్న ,రాగులు , సజ్జల పంట పొలాల్లో విరివిగా వీటి ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది.పెద్ద పెద్ద ఆకులతోను లేదా చెరుకు ఆకుల మధ్య వీటి గూళ్ళును వేలాడదీస్తుంది. జనవరి నుండి మే నెలలో సంతానోత్పత్తి కొరకు 4-6 గుడ్లు పెట్టి 16-25 రోజుల వరకు ఆడ,మగ పక్షుల చేత పొదగబడుతుంది. ఆహార సేకరణ కొరకు చిన్న చిన్న గుంపులు గుంపులుగా వెళ్లి పంట పొలాల్లోని చీడ పురుగులను, చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటుంది. వీటి కూత హై పిచ్ గానంతో చెవులకు ఇంపుగా స్వీ...స్వీ అంటూ ముగుస్తుంది. ఆది నుండి అక్రమ రవాణ:- నిజానికి మనదేశంలో దాదాపు 250 దేశీయ అడవి పక్షులు,70 విదేశీ పక్షులు ,అక్రమ పక్షులవిక్రయం ( illegal bird trade ) లో ఉన్నాయి . ఇందులో ఆకుపచ్చ ముణియాలు ఆకర్షణగా కనిపించడంతో,మెలోడియస్ గానంతో, వేటగాళ్ల వలక సులభంగా చిక్కిపోవటం,పెంపరులతో స్నేహంగా మెలగడం,పెంచటం సులభ తరం కనుక పంజర పక్షులుగా మారాయి. 19 వ శతాబ్దంలో అహ్మదాబాద్ లోని ఒక కరప్షన్ ప్రాంతం అవడవత్ వీటి విక్రయానికి చిరునామాగా మారింది . అందువలనే వీటికి Green Avadavat అనే పేరు కూడా వచ్చింది. 1960 నుండి 1980 వరకు రెండు వేల ఆకుపచ్చ ముణియా పక్షుల మార్కెట్లలో బహిరంగంగా అమ్మకానికి గురైంది. దాదాపు 2000 నుంచి 3000 పక్షులు వరకు ప్రతియేటా ఇండియా నుంచి ఐరోపా ,ఉత్తర అమెరికా వంటి ఖండాంతర దేశాలకు అక్రమంగా ఎగుమతుల్లో తరలిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ తంతు 1980 నుండి యిప్పటి వరకు కొనసాగుతుంది. శతాబ్దాల నుంచి అక్రమ విదేశీ విక్రయాల వలన స్వేచ్చగా గాలిలో విహరించల్సిన పక్షులు ఇప్పుడు బాధిత పక్షులుగా పంజరాలకు పరిమితమైంది. ఆవాస విధ్వంసమే ప్రధాన ముప్పు:- ఈ పక్షులు మొదట్లో రాజస్థాన్ లోని మౌంట్ అభు కొండల్లో విరివిగా కనిపించేవి కానీ ఇప్పుడు వాటి ఉనికిని కోల్పోయి దక్షిణ భారతదేశానికి పరిమితమైంది. వీటిని సాంప్రదాయ వైద్య పద్దతిలో ఉపయోగించడం వలన జనాభా భారీగా తగ్గిందని అక్కడ ఆదివాసీ గిరిజన ప్రజలు చెబుతున్నారు.1980 లో అరకు లోయ పాదాల చెంత సుంకర మిట్ట ప్రాంతం ప్రధాన ఆవాస కేంద్రంగా పరిగణంపబడుతున్న సమయంలో అక్కడ బాక్సైట్ గనుల తవ్వకాల వలన ఆవాసం కోల్పోయి కనిపించకుండా పోయింది. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు మరియు పురుగు మందుల వాడకం వలన రసాయన పదార్థాలు జైవిక వ్యవస్థాపన జరిగి చనిపోతున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో నివాస విధ్వంసం, అక్రమ విదేశీ విక్రయాలు, పంజార పక్షులుగా బంధించడం, ఆహారం కోసం వేటాడం వంటివి ప్రధాన ముప్పులుగా ఉన్నాయి. చట్టాలున్న రక్షణ కరువైంది:- భారత ప్రభుత్వం వీటి పరిరక్షణ నిమిత్తం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ (1972) లో షెడ్యూల్ 4 లో చెర్చింది.1981లో ఆకుపచ్చ మునియాలు అమ్మకానికి బాన్ విధించింది. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండెంజర్డ్ స్పీసీస్ (CITES) లో అంతరించిపోతున్న పక్షుల జాబితాలో చోటుచేసుకుంది. స్టేట్ ఆఫ్ ఇండియా బర్డ్స్ 2020 నివేదిక ప్రకారం.. ఇది తీవ్ర భయాందోళనకు గురికావడం, నిర్లక్ష్యం మరియు తక్కువ సమృద్ధిలో ఉండటం చాలా ప్రమాదకరం,ఆందోళనకరం అని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ 3 వ అనుకూల ఆవాసం:- అడుగడుగునా అంతరాలు ఎదురుకొంటున్న పక్షికి అంధ్రప్రదేశ్ లోని గుడిస రిజర్వు ఫారెస్ట్ భారతదేశంలోనే 3 వ అతిపెద్ద అనుకూల ఆవాస కేంద్రంగా ఆశ్రయమిస్తుంది.అక్కడ సంతానోత్పత్తికి కూడా అనువైన ప్రాంతంగా మారింది. అంతే కాకుండా విశాఖపట్నంలోని దారకొండ మారేడుమిల్లి అడవుల్లో కూడా నాలుగు సైటింగ్స్ చేసినట్లు బర్డ్ వాచేర్స్ ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. పరిరక్షణ అవసరం :- ''ప్రపంచవ్యాప్తంగా ప్రమాద స్థితిలోన్న ఆకుపచ్చ మునీయాలు మరలా పచ్చదనం సంతరించుకోవాలంటే అడవులను పెంచాలి, అడవుల్లో వర్షపు నీతి నిల్వ కుంటలు ఏర్పాటుచేయాలి ,అడవుల్లో విజిలెన్స్ విభాగం తనిఖీ విధిగా చేయాలి , వీటి గుడ్లను పొదిగించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి ,వీటి ఆవాస మనుగడ పై పరిశోధనలు చేసేలా ప్రభుత్వాలు పూనుకోవాలి'' అని ఎస్వీ యూనీవర్సిటీ జువాలజి విభాగ ఆచార్య మారం రాజశేఖర్ తెలిపారు . - గిడ్డకింద మాణిక్యం అసోసియేట్ ప్రొఫెసర్, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి. ఫోటోగ్రాఫర్- అసీమ్ కొఠిలా డా. గుండులూరు స్వాతి,అసోసియేట్ ప్రొఫెసర్ జంతు శాస్త్ర విభాగం , ప్రభుత్వ డిగ్రీ కళాశాల పుత్తూరు. తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
మనుషులే కాదు, ఇప్పుడు పక్షులు కూడా విడాకులు
-
అచ్చం మనుషుల్లా..పక్షలు కూడా విడాకులు తీసుకుంటున్నాయట!
మనుషులకు ఏం తీసిపోం అన్నట్లుగా పకులు కూడా బిహేవ్ చేస్తున్నాయి. ఔను అవి కూడా మనుషుల మాదిరి విడాకులు తీసుకుంటున్నాయట. అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైందని పరిశోధకులు అంటున్నారు. అవి విడాకులు తీసుకునేందుకు దారితీసిన పరిస్థితులను చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు. అసలేం జరిగిందంటే..మనుషుల్లాగే పక్షలు కూడా తమ భాగస్వాములకు విడాకులు ఇస్తున్నట్లు పరిశోధకులు వివిధ జాతి పక్షులపై జరిపిన అధ్యయనాల్లో తేలిందట. ఈ మేరకు చైనా, జర్మనీకి చెందిన పరిశోధకులు దాదాపు 232 పక్షి జాతులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 90 శాతం కంటే ఎక్కువ పక్షి జాతులు సాధారణంగా ఒకే సహచరుడితో సంతానోత్పత్తి కాలం వరకు ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఐతే కొన్ని పక్షలు మాత్రం తమ సహచరుడు జీవించి ఉన్నప్పటికీ తదుపరి సంతానోత్పత్తి సీజన్లలో కొత్త భాగస్వామిని వెతుకుంటున్నాయని చెబుతున్నారు. ఈ ప్రవర్తనను 'విడాకులుగా' సూచించారు పరిశోధకులు. దీనికి ప్రధాన కారణం 'వలసలు' అని అన్నారు. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ పరిశోధకుడు డాక్టర్ జిటాన్ సాంగ్ మాట్లాడుతూ..సంతానోత్పత్తి కాలంలో పుట్టిన పక్షలు బాధ్యతలను మగపక్షులు చూడటంతో.. ఆడపక్షులు తదుపరి సంతానం కోసం వేరేవాటితో జత కట్టేందుకు వెళ్లిపోతున్నట్లు తెలిపారు. అలాగే సుదీర్ఘ దూరాలకు వలస వెళ్లినప్పుడూ తమ పాత భాగస్వామి కోసం వేచి ఉండకుండా కొత్త భాగస్వామితో జత కట్టేందుకు మొగ్గు చూపుతున్నట్లు గమనించారు. ఎక్కువ వలసలు వెళ్తున్న పక్షల జాతుల్లోనే ఈ విడాకుల రేటు అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలిందన్నారు. పునరుత్పత్తి లేదా వలసల కారణంగా అవి విడిపోతున్నాయని, కొత్త భాగస్వాములను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో కొన్ని పక్షులు మాత్రం తమ పాత భాగస్వామితో ఉండటం లేదా అవి లేనట్లయితే ఒంటరిగా ఉండిపోవటం జరుతుందని అన్నారు. దీనంతటికి కారణం మనిషేనని, అందువల్లే అవి మన మాదిరిగా విడిపోతున్నాయని చెబుతున్నారు పరిశోధకులు. తన స్వార్థ కోసం అభివృద్ధి పేరుతో చెట్లు నరకడం, వాటికి ఆవాసం లేకుండా చేయడం తదితర కారణాల రీత్యా అవి వలస బాటపట్టడంతో..పక్షలుకు కూడా ఆ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. (చదవండి: తెలుసా! గోళ్ల ఆకారాన్ని బట్టి మీరెలాంటి వారో చెప్పేయొచ్చు!) -
Pudami Sakshiga : అరుదైన పక్షి నల్ల ఏట్రింత గురించి ఈ విషయాలు తెలుసా?
సాయంత్ర సమయంలో పెరటి కంచెల పైన, కరెంటు తీగల మీద, పొదల మీద నిగనిగ లాడే కారు నలుపు రంగులో పిగిలి పిట్ట(బుల్ బుల్) పరిమాణంలో ఉండే సన్నని చురుకైన పక్షిని అదేనండి నల్ల ఏట్రింతను ఎప్పుడైనా గమనించారా? ఈ పేరు కొత్తగా ఉన్నా,నల్లపిట్ట, కత్తెర పిట్ట, పసుల పోలిగాడు, భరద్వాజము, పోలీసు పిట్ట, కొత్వాలు పిట్ట గా మీకు పరిచయం అయిన ఈ పక్షి గురించి తెలుసుకుందాం. ► నల్ల ఏట్రింత దాదాపుగా భారతదేశ మంతటా కనిపిస్తుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువ చురుగ్గా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పచ్చిక బయళ్ళలో, పంటపొలాల గట్ల పైన, పట్టణ ప్రాంతాల్లో పెరటి చెట్లపైన, తీగల మీద దీనిని మనం ఎక్కువగా గమనించవచ్చు. దీని తోక పొడుగుగా ఉండి చివరలో చీలి చూడటానికి కత్తెరను పోలి ఉండడంతో దీనిని కత్తెరపిట్ట, మంగలి పిట్ట అని కూడా పిలుస్తారు. ► ఇది మాంసాహారి. గాలిలో ఎగురుతూ మిడతలు, తూనీగలు, కందిరీగలు, తేనెటీగలను పట్టుకుని అది కూర్చునే చోటకు తీసుకుపోయి కాలి కింద నొక్కిపట్టి, పదునైన ముక్కుతో ముక్కలు చేసి మింగుతుంది.నలువైపులా గమనిస్తూ రివ్వున కిందకు దిగి నేలపై ఉన్న ఎరను పట్టుకుంటుంది. మేస్తున్న పశువులపై కూర్చుని అవి గడ్డిలో నడుస్తున్నపుడు గడ్డిలో నుంచి పైకి ఎగిరిన కీటకాలను పట్టుకుని ఆరగిస్తుంది. ► గోరింకలు, తెల్ల కొంగలతో పాటుగా దున్నుతున్న పొలాల్లో తిరుగుతూ బయట పడ్డ గొంగళీలను కీటకాలను తింటుంది. చాలా అరుదుగా తేళ్ళు, జెర్రెలను, చిన్న పక్షులను, గబ్బిలాలను వేటాడుతుంది. నల్ల ఏట్రింత దక్షిణ భారతంలో ఫిబ్రవరి, మార్చి నెలలలో, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఆగష్టు నెల వరకు సంతానోత్పత్తిని చేస్తాయి. ► జత కట్టే సమయంలో ఆడా, మగ పక్షులు ఉదయాన్నే చెట్ల చిటారు కొమ్మలపై వాలి పాటలు పాడతాయి. తమ రెక్కలు ముక్కులను జత చేస్తూ గాలిలో విన్యాసాలు చేస్తాయి. సాధారణంగా జత మధ్య బంధం సంతానోత్పత్తి కాలం వరకూ ఉంటుంది. జతకట్టిన రెండు పక్షులూ కలిసి కొమ్మ వంచలలో పలుచని కర్రలతో, గడ్డి పోచలతో దొన్నె లాంటి గూడును కడతాయి. ► పనస వంటి పెద్ద ఆకులున్న చెట్లను గూడు కట్టడానికి ఎంచుకుంటాయి. ఈ గూటిలో 3 నుండి 4 గుడ్లను పెట్టి తల్లిదండ్రులిద్దరూ రెండు వారాల పాటు పొదుగుతాయి. పిల్లలకు ఒక నెల పాటు ఆహారం అందించి రక్షించిన తర్వాత పిల్లలు గూటిని విడిచి పెడతాయి. వీటి పిల్లలు చాలా చురుకుగా ఉంటాయి. ► చిన్న ఆకు ముక్కలను తుంపి నేలపైకి వదిలి మధ్య గాలిలో ఎగురుతూ వాటిని పట్టుకుని ఆడుతూ తమ ఎగిరే పాటవాలను, వేటాడే నైపుణ్యాలను మెరుగు పరుచుకుంటుంది.గూడు కట్టిన సమయంలో గూటికి దగ్గరలో కాపలా ఉంటూ వేటాడే కాకి, గ్రద్ద, జాలె డేగ (షిక్రా) వంటి పెద్ద పక్షులను కూడా ఎదిరించి, తరిమివేస్తూ దూకుడు స్వభావం కలిగి ఉంటుంది. ► గూటిని పిల్లలని కాపాడుకోవటానికి పెద్ద పక్షులతో కూడా పోరాడే దాని ధైర్యం మిగిలిన చిన్న పక్షులను ఆ పరిసరాలలో గూడు కట్టుకునేలా ప్రోత్సహిస్తుంది. ఈ దూకుడు స్వభావంతో తన గూటిని కాపాడుకోవటమే కాక పావురాలు, గువ్వలు, పికిలి పిట్టలు, వంగ పండు (ఓరియల్) వంటి ఇతర పక్షులకు కూడా రక్షణగా నిలవడంతో కొందరు నల్ల ఏట్రింతను పోలీసు పిట్ట, కొత్వాలు పిట్ట అని కూడా పిలుస్తారు. ► నల్ల ఏట్రింత రకరకాలుగా కూస్తుంది. సాధారణంగా టీ-టూ అని అరుస్తుంది. అపుడపుడు జాలె డేగ (షిక్రా) ను అనుకరిస్తూ అరిచి మైనాల నుండీ తిండిని దొంగలిస్తుంది. మధ్య భారతదేశంలో, నల్ల ఏట్రింత పశువుల కొమ్ములపై వాలితే పశువుల కొమ్ములు వూడి పోతాయనే మూఢ నమ్మకం కూడా ఉంది. ► నల్ల ఏట్రింత పురుగులను, కీటకాలను ఆహారంగా తీసుకుంటూ రైతుకు పంటను కాపాడుకోవటంలో సహాయ పడుతుంది. కొందరు రైతులు ఏట్రింత కూర్చోవడానికై పొలాలలో కర్రలను కూడా ఏర్పాటు చేస్తారు.పరిమాణంలో చిన్నదైనప్పటికీ తన స్వభావంతో ఇటు రైతులకు, అటు తోటి పక్షులకు ఎంతో సహాయ పడే నల్ల ఏట్రింతను మెచ్చుకోకుండా ఉండగలమా!.. -రవికుమార్ ద్వాదశీ ఫోటోగ్రాఫర్- రేణుకా విజయ్‌రాఘవన్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
వేలాది పక్షుల మృతి.. పురుగు మందులే కారణం?
అసోంలోని బార్పేట జిల్లాలో వేలాది పక్షులు ఉన్నట్టుండి మృతి చెందిన విషయం కలకలం రేపుతోంది. వాటికి విషం పెట్టి చంపేశారని పలువురు భావిస్తున్నారు. ఈ చర్యకు బాధ్యులైన అరాచక శక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గ్రూప్ అరణ్యక్ డిమాండ్ చేసింది. పంటపొలాల్లో చచ్చిపడి.. విషప్రయోగంతో వేలాది పక్షులు మృతి చెందాయనే వార్త తెలియగానే పర్యావరణ సంరక్షణాభిషులు, పక్షిప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉంటున్న పర్యావరణ ప్రేమికుడొకరు మాట్లాడుతూ అసోంలోని బార్పేట్ జిల్లాలోని జానియా గ్రామంలో వేలాది పక్షులకు విషం ఇచ్చారని, అవి పంటపొలాల్లో చచ్చిపడివున్నాయని తెలిపారు. ‘కఠిన చర్యలు తీసుకోవాలి’ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం ఆ పక్షులు పంటపొలాల్లోని ధాన్యపు గింజలను తిన్నాక మృతి చెందాయి. పంటపొలాల నుంచి పక్షులను తరిమివేసేందుకే ఎవరో ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న అరణ్యక్ సిఈఓ డాక్టర్ విభాబ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తూ, విషం కారణంగా వేల సంఖ్యలో పక్షులు మృతి చెందడం తనను ఎంతో కలచివేస్తున్నదన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా అధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించాలన్నారు. పంటలకు పక్షులు చేసే మేలు ఇదే.. యంత్రాలతో పోల్చిచూస్తే పక్షులు పంట దిగుబడికి ఎంతో సాయపడతాయని డాక్టర్ విభాబ్ కుమార్ అన్నారు. పంటలకు నష్టం కలిగించే కీటకాలు,పురుగులను పక్షులు తింటాయని, ఫలితంగా పంటనష్ట నివారణ జరుగుతుందన్నారు. అదేవిధంగా పక్షుల కారణంగా పంటపొలాల్లో రసాయన మందుల వాడకం తగ్గుతుందన్నారు. పక్షులు పంటపొలాల్లో తిరుగాడుతూ.. పరపరాగ సంపర్కం చేస్తాయని, ఫలితంగా మొక్కల జాతుల ఉత్పత్తి మరింత సులభమవుతుందన్నారు. అందుకే ప్రతీఒక్కరూ పక్షులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది కూడా చదవండి: గుడ్లను యూరిన్‌లో ఉడికించి, ఉప్పుకారం జల్లి.. -
భారతదేశంలోని టాప్ 10 అందమైన పక్షులు
-
ప్రపంచంలోని టాప్ 10 ఆకర్షణీయమైన పక్షులు
-
డిగ్రీ చదివి చిన్నచిన్న ఉద్యోగాలు.. కౌజు పిట్టల పెంపకంతో లాభాలు
పిఠాపురం: కౌజు పిట్టల పెంపకం చేపట్టి అభివృద్ధి బాటలో నడుస్తున్నాడు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు రామరాఘవపురానికి చెందిన దొడ్డి సురేంద్ర. వ్యవసాయ కుటుంబానికి చెందిన సురేంద్ర గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. కొంతకాలం చిన్నచిన్న ఉద్యోగాలు చేసాడు. సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో కౌజు పిట్టల పెంపకం చేపట్టాడు. తక్కువ పెట్టుబడితో చిన్న కౌజు పిట్టల (క్వయిల్) ఫామ్ ప్రారంభించాడు. సొంత పొలంలోనే షెడ్లు వేసి 100 పిట్టల్ని పెంచడం ప్రారంభించాడు. రెండేళ్లలోనే ఆ ఫామ్ 10 వేల పిట్టల సామర్థ్యానికి పెరగ్గా.. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఐదారు వారాల్లోనే పెరుగుతాయి భారతదేశంలో కౌజు పిట్టల పెంపకం, విక్రయం, వాటిని చంపడంపై నిషేధం ఉండటంతో జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న కౌజు పిట్టల పెంపకం చేపడుతున్నారు రైతులు. ఒక కోడిని పెంచే స్థలంలో 8 కౌజు పిట్టలను పెంచవచ్చు. కొవ్వు తక్కువగా.. ప్రొటీన్లు, పోషకాలు ఎక్కువగా ఉండటంతో వీటిని తినడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు మాంసాహార ప్రియులు. ఐదు వారాల్లోనే ఇవి అమ్మకానికి సిద్ధమవడంతోపాటు గుడ్లు కూడా పెడతాయి. ఒక్కో కౌజు పిట్ట ఏడాదికి సుమారు 250 వరకు గుడ్లు పెడతాయి. వీటి మాంసం, గుడ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించాను సొంతంగా వ్యాపారం చేయాలనేది నా కోరిక. నా స్నేహితుల ద్వారా కౌజు పిట్టల పెంపకం గురించి తెలుసుకుని మా పొలంలో చిన్న పాక వేసి వీటి పెంపకం ప్రారంభించాను. ఏడాదిలోనే వ్యాపారం పెరిగింది. నెలకు 10 వేల పిట్టల్ని అమ్మే విధంగా పెంపకం చేస్తున్నాను. కోరుకొండ నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి ఇక్కడ పెంచుతున్నాను. ఒకరోజు పిల్ల ఒక్కొక్కటి రూ.9కి దొరుకుతుంది. ఒక్కొక్క పిల్ల పెంచడానికి రూ.20 వరకు ఖర్చవుతుంది. నెల రోజులు పెంచితే ఒక్కో పిట్ట రూ.45 నుంచి రూ.50 వరకు వస్తుంది. గుడ్లు పొదిగే యంత్రాలను కొనుగోలు చేసి సొంతంగా గుడ్లు కొని పిల్లల్ని ఇక్కడే తయారు చేయాలనుకుంటున్నాను. ఫంక్షన్లకు, డాబాలు, రెస్టారెంట్లకు వీటిని సరఫరా చేస్తున్నాం. – దొడ్డి సురేంద్ర, కౌజు పిట్టల పెంపకందారు డిమాండ్ బాగుంది కౌజు పిట్టలకు డిమాండ్ బాగుంది. క్వయిల్ ఫామ్‌లు తక్కువగా ఉండటం వల్ల వీటికి డిమాండ్ ఎక్కువ ఉంది. వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల పెద్దగా వైద్య అవసరాలు ఉండవు. మన వాతావరణంలో బాగా పెరుగుతాయి. కేవలం దాణా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. – డాక్టర్ హిమజ, పశు వైద్యాధికారి, గొల్లప్రోలు -
ఫన్నీ వీడియో: చిటికేస్తే.. రివ్వున వచ్చి వాలిపోవాలా?
-
ప్యారెట్స్..పేరెంట్స్.. 650 చిలుకలు,100 పిచ్చుకల ఆకలి తీరుస్తూ..
సాక్షి, ఏలూరు: ఉదయం, సాయంత్రం వేళల్లో రామచిలుకలు, పిచ్చుకల కిలకిలరావాలతో ఆ వీధి ఆహ్లాదకరంగా మారుతుంది. వందల సంఖ్యలో అక్కడి విద్యుత్ తీగలపై వాలి ఆహారం కోసం నిరీక్షిస్తుంటాయి. ఉదయం 7.30, సాయంత్రం 4 గంటలకు ఠంచనుగా ఈశ్వరరావు, పార్వతి దంపతులు అందించే మేతను ఆరగిస్తాయి. ఐదేళ్లుగా రామచిలుకలు, పిచ్చుకల ఆకలి తీరుస్తూ పక్షులపై తమ ప్రేమను చాటుతున్నారు కైకలూరుకు చెందిన ఈశ్వరరావు, పార్వతి దంపతులు. ప్రతి రోజూ సుమారు 650 రామచిలుకలు, 100 బంగారు రంగు పిచ్చుకలకు ఆహారాన్ని అందిస్తున్నారు. కైకలూరులోని వైఎస్సార్ నగర్లో ఉంటున్న ఈశ్వరరావు ఇంటి సమీపంలో ఉండే విద్యుత్ తీగలపై వాలి పచ్చటి తోరణాలను తలపిస్తాయి. పూటకు పది కేజీల చొప్పున బియ్యాన్ని కడిగి డాబాపై నాలుగు వరుసల్లో చిన్న చిన్న ముద్దలుగా ఉంచుతారు. పిచ్చుకలు తిన్న తరువాత ఒక్కసారిగా రామచిలుకలు గుంపుగా వచ్చి మేతను ఆరగిస్తాయి. గతంలో ముఠా పనిచేసి కొంతకాలంగా టీమాస్టర్‌గా పనిచేస్తున్న ఈశ్వరరావు ఇటీవల వైఎస్సార్ నగర్లో ఇంటిని నిర్మించుకున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు కాగా, వీరి సాయంతో రోజూ రూ.200 ఖర్చుతో చిలుకలకు ఆహారంగా ఒక్కో రోజు బియ్యంతో పాటు కొర్రలు, జామకాయలు అందిస్తున్నారు. చిలుక జాతులలో మూడింట ఒక వంతు అంతరించే ప్రమాదంలో ఉందని ఇటీవల అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి రెడ్‌లిస్టులో వెల్లడించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామచిలుకలకు ప్రతిరోజూ మేతను అందిస్తున్న ఈశ్వరరావు, పార్వతి దంపతుల సేవను పలువురు అభినందిస్తున్నారు. చిలుకలను దేవతలుగా భావిస్తాం అరుణాచలం దేవాలయానికి వెళ్లినప్పుడు రెండు చిలుకలు మా తలలపై తిరిగాయి. మా మామ మరణించే చివరి ఘడియల్లో గోడపై చిలుక బొమ్మ ముద్రించారు. ఈ ఘటనలతో చిలుకలను దేవతలుగా భావిస్తూ రోజూ మేతను అందిస్తున్నాం. వాటి సవ్వడులు మాకు ఎంతో ఆనందాన్నిస్తాయి. ప్రతిరోజూ 20 కేజీల బియ్యాన్ని సమకూర్చడం కష్టతరమవుతోంది. దాతలు బియ్యం అందించి సహకరించాలి. బియ్యం, మేత సాయం చేసే దాతలు 63048 72868, 93818 93450 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. – కొల్లి ఈశ్వరరావు, పార్వతి దంపతులు చదవండి: లేటు వయసులోనూ నీట్ రాశారు.. పేదలకు వైద్య సేవలు అందించాలని 69 ఏళ్ల విశ్రాంత ప్రొఫెసర్ సంకల్పం.. -
మరో అతిథికి చోటు: ప్రేమ పక్షులివి.. జీవిత కాలమంతా ఒక్క పక్షితో...
బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా): బెంగాల్ పులులు.. బంగారు బల్లులు.. గిరి నాగులు.. అలుగులు.. అరెంజ్ ఓకలీఫ్ సీతాకోక చిలుకలు వంటి అరుదైన జీవజాలానికి నిలయమైన పాపికొండలు అభయారణ్యంలో తాజాగా మరో అతిథికి చోటు దక్కింది. కొమ్ము కత్తిరి (ఇండియన్ హార్న్‌బిల్) పక్షులకు ఈ అభయారణ్యం అలవాలంగా మారింది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పరిధిలో గలగల పారే అందాల గోదావరికి ఇరువైపులా 1,01,200 హెక్టార్లలో పాపికొండలు అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ విలువైన వృక్షాలు, వివిధ జంతువులతో పాటు కొమ్ము కత్తిరి పక్షులు కిలకిలారావాలు ఆలపిస్తున్నాయి. కొన్నిచోట్ల వీటిని ఇబిరిత పక్షులని కూడా పిలుస్తారు. పొడవాటి ముక్కుతో ఉండే ఈ పెద్ద పక్షుల రెక్కలు నలుపు రంగులో ఉంటాయి. రెక్కల మధ్యలోని తెలుపు చారలు అవి ఎగురుతున్నప్పుడు మెరుస్తుంటాయి. పాపికొండలు అభయారణ్యంలో ఈ అరుదైన పక్షులు బాలాజీ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ కెమెరాకు చిక్కాయి. జీవితమంతా ఒక పక్షితోనే.. ఈ పక్షులు పండ్లు, పురుగులను ఆహారంగా తీసు కుంటాయి. ఇవి జీవిత కాలమంతా ఒక పక్షితోనే జత కడతాయి. వీటికి ప్రేమ పక్షులనే పేరు కూడా ఉంది. ఆడ, మగ పక్షులు జతగా ఉంటాయి. గుడ్లు పొదిగే సమయంలో ఆడ పక్షికి కావాల్సిన ఆహారం, గూడు సమకూర్చే బాధ్యత మగ పక్షి తీసుకుంటుంది. చెట్లలో సహజంగా ఉండే తొర్ర లనే ఇవి గూడుగా ఏర్పాటు చేసుకుని వాటిలో నివసిస్తాయి. హార్న్‌బిల్ ఆడ పక్షి సుమా రు 4 నెలలపాటు గూట్లోనే ఉంటూ గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఆ సమయంలో మగ పక్షులే ఆహారాన్ని తీసుకొచ్చి చెట్టు తొర్రల కన్నం ద్వారా ఆడ పక్షికి తినిపిస్తాయి. పిల్లలు పుట్టాక తల్లి, పిల్ల పక్షులకు సైతం ఆహారం తీసుకొచ్చి పెడుతుంటాయి. పోలవరం పరిసర ప్రాంతాల్లో.. పాపికొండలు అభయారణ్యంలో వీటిలో అత్యధికంగా 150 వరకు ఇండియన్ హార్న్‌బిల్ జాతి పక్షులు ఉన్నట్టు వైల్డ్‌లైఫ్ అధికారులు చెప్పారు. పోలవరం మండలంలోని శివగిరి, సిరివాక, పేరంటాలపల్లి, కొరుటూరు తదితర ప్రాంతాల్లో ఈ పక్షులు ఎక్కువగా సంచరిస్తున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల పలు గ్రామాలు ముంపు ప్రభావిత ప్రాంతాలుగా మారడంతో అనేక గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. దీంతో ఆయా గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ పక్షులు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే వీటి సంతతి పెరుగుతున్నట్టు గుర్తించామని వైల్డ్‌లైఫ్ అధికారులు వెల్లడించారు. వన్య ప్రాణుల సంరక్షణపై ప్రత్యేక చర్యలు పాపికొండల అభయారణ్యంలో జీవవైవిధ్యం పెరిగింది. అరుదైన జంతువులు, పక్షుల సంఖ్య కూడా పెరుగుతోంది. వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం సరిహద్దుల్లో బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేశాం. ప్రత్యేక బృందాల ద్వారా పహారా కాసే ఏర్పాట్లు చేశాం. వన్యప్రాణులను వేటాడాలని చూస్తే కఠిన శిక్షలు తప్పవు. – దావీద్‌రాజు నాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం -
అడవుల్లోకే వెళ్ళక్కర్లేదు!
వేసవి మధ్యాహ్నం, మండుటెండలు! పని మీద బయటకు వెళ్తూ ఉండగా, రోడ్డు మీద ఓ పక్షి పడిపోయి ఉంది. అయ్యో! చనిపోయినట్టుంది. మరీ రోడ్డు మధ్యన ఉందే, తీసి పక్కన గుబుర్లలో పడేద్దాం అనుకొని ఆ రంగు రంగుల పక్షిని చేతితో లేవ దీసాను. అది చనిపోలేదు! దాని గుండె చప్పుడు నాకు స్పష్టంగా తెలిసింది. 'అయ్యో! ఎండ దెబ్బకు పడిపోయినట్టు ఉంది. పని మీద ఎక్కడికో వెళ్తూ దీనిని వెంట తీసుకెళ్ళడం సాధ్యం కాదు. ఏం చేయాలో తెలియట్లేదే!' అని నిస్సహాయంగా పక్కనున్న ఫుట్ పాత్ మీద పెట్టేసి వెళ్ళిపోయాను. ఆ పిట్టకి ఏ సహాయం చెయ్యలేదు అన్న భావన చాలా రోజులు నన్ను తొలిచి వేసింది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున అంత రంగురంగుల పక్షి ఒకటి ఉండగలదు అన్న విషయం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇళ్ళల్లో పంజరాల్లో పెంచుకునే లవ్ బర్డ్స్ కే అన్ని రంగులు ఉంటాయి అనుకునే నాకు ఇలా బయట స్వేచ్ఛగా తిరిగే పక్షుల్లో కాకి, కోయిల, పావురం, పిచ్చుక , గోరింక కాని ఇటువంటి పక్షి పేరేమిటో తెలియలేదు. ఓ సంవత్సరం తరువాత మా అయిదేళ్ల అబ్బాయితో పాటు పక్షులను గమనించడం, వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టాను. కనీసం 20-30 రకాల పక్షులు మన చుట్టూ మనతో పాటే ఉంటాయని, అప్పటివరకు నేనే వాటిపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదని, అప్పుడు తెలిసింది హైదరాబాద్ నగరంలో కూడా పక్షులను గమనించే అవకాశాలు ఎన్నో ఉన్నాయని క్రమేపి నాకు అర్ధం అయ్యింది. బోలెడన్ని చెరువులు, కెబీఆర్ పార్క్ , సంజీవయ్య పార్క్ లాంటి ఉద్యానవనాలు, దట్టమైన చెట్లతో నిండిన ఉస్మానియా మరియు HCU లాంటి విశ్వవిద్యాలయ ప్రాంగణాల వంటి ప్రదేశాల్లో చెట్ల పై విహరించే పక్షులే కాక, చిత్తడి ప్రాంతాలలో నివసించే పక్షులు ఎన్నో మనకు కనిపిస్తాయి. చెరువుల వద్ద ఏడాది పొడవునా మనకు కనిపించే పక్షులలో నీటి కాకి(Cormorant), చుక్క ముక్కు బాతు (Indian Spot- billed Duck), తెల్ల బొర నీటి కోడి (White -breasted water hen) , ఊదా చెంచు కోడి (Grey-headed swamphen), నల్ల బొల్లి కోడి ( Eurasian Coot), గుడ్డి కొంగ (Indian Pond Heron) లాంటివి కొన్ని. ఇవే కాకుండా శీతా కాలంలో ఉత్తర అర్ధగోళంలో ఉన్న ప్రదేశాలలో తీవ్రమైన చలి నుండి తప్పించుకోవడానికి కొన్ని వేల మైళ్ళు ప్రయాణించి దక్షిణ భారత దేశానికి వచ్చే వలస పక్షులు కూడా కనువిందు చేస్తాయి. అటువంటి పక్షుల్లో ఒకటి నార్తెన్ షవెలర్. ఈ పక్షులు ఉత్తర ఆసియా నుంచి భారతదేశానికి ప్రయాణించి హైదరాబాద్ లో మనకు డిసెంబర్, జనవరి , ఫిబ్రవరి నెలలలో ఎక్కువ లోతు లేని కొన్ని చెరువులలో కనిపిస్తాయి. గత సంవత్సరం కాప్రా ఇంకా యాప్రాల్ చెరువుల్లో నేను మొట్ట మొదటి సారి వీటిని గుంపులు గుంపులుగా చూసి చాలా సంతోషించాను. అలానే శీతాకాలపు నెలలలో వలస వచ్చే పూకొంగలు (flamingo) కూడా అమీన్ పూర్ లాంటి చెరువుల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ నీటి లోతు ఎక్కువగా ఉన్నా, వాటికి అనుకూలమైన పరిసరాలు లేకున్నా, అక్కడ బస చెయ్యకుండా వేరే ప్రాంతాన్ని వెతుక్కునే ప్రయత్నంలో వెళ్ళిపోతాయి. పిట్టలకి ఎంత తెలివో కదా! పక్షుల గురించి నేర్చుకునే ప్రయాణంలో ఎప్పుడో నేను ఫుట్ పాత్ పై ఉంచి వెళ్ళిపోయిన పక్షి ఏంటో తెలిసింది. అది హిమాలయాల నుంచి దక్షిణ భారత దేశానికి వలస వచ్చే పొన్నంగి పిట్ట (Indian Pitta). 'పిట్ట కొంచెం ఆహార్యం ఘనం' అన్న నానుడికి తగ్గట్టు ఉంటుందని, ఈ పిట్టను హిందీలో 'నవ్ రంగ్'- (తొమ్మిది రంగులు కలది) అంటారు. ఉదయం మరియు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మాత్రమే ఒకటి, రెండు సార్లు దాని కూత వినిపిస్తుంది కాబట్టి, దానిని 'ఆరు మణి కురువి' (ఆరు గంటల పిట్ట) అని తమిళంలో అంటారు. ఇంతటి ఆసక్తికరమైన పక్షి సాధారణంగా దట్టమైన చెట్లున్న ప్రాంతాల్లో, నేలపై రాలిన ఆకుల నడుమ పురుగుల కోసం వెతుకుతూ కనిపించవచ్చని, అంత తేలికగా నగరం నడిబొడ్డున కనబడదన్న విషయం కూడా తరువాత తెలిసింది. కొన్ని సార్లు వాటి సుదీర్ఘ ప్రయాణంలో అలసిపోయి, నీరసించి నెలకొరగడం జరగవచ్చట. నేను చూసిన పిట్ట వేసవి ముదిరేలోపు దాని తిరుగు ప్రయాణం సాగిస్తూ, నేల రాలి ఉండవచ్చు అన్న సంగతి నాకు బోధపడింది. అలా జరిగినప్పుడు, అవి పుంజుకోవాలంటే నీడగా ఉన్న ప్రదేశంలో ఉంచి, కొంత గ్లూకోస్ కలిపిన నీరును పట్టించినట్టయితే, రెండు రోజుల్లో మళ్ళీ ప్రయాణానికి సిద్ధమయిపోతాయట. ఉదయం లేక సాయంత్ర సమయాల్లోనే మనకు ఎక్కడైతే అది నెలకొరిగిందో అక్కడికే తీసుకు వెళ్లి వదిలిపెట్టినట్టైతే, వాటి మానాన అవి వెళ్ళిపోతాయని పక్షి సంరక్షకులు చెబుతారు. ఒక్క చిన్న పిట్ట వెనుకే ఇన్ని విశేషాలుంటే, మరి మన దేశంలో ఉన్న వేల పక్షుల వెనుక ఎన్ని రహస్యాలు దాగున్నాయో అనిపించడం సహజం. పక్షుల గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉన్నవారికి సహాయపడటానికి వివిధ యా ప్స్ ఉన్నాయి. ఆ పక్షి సుమారుగా ఎంత పెద్దదో (కాకంత, పిచ్చుకంత, బాతంత), ఏ రంగులు కలదో, మనకు అది ఎక్కడ కనిపంచిందో (నీళ్లలో, తీగలపై, కొమ్మల మీద, నెల మీద ) - ఇటువంటి వివరాలను మనం యాప్ లో పొందు పరచినట్టైతే, మనం ఈ పక్షిని చూసిన ప్రాంతాన్ని(GPS location) బట్టి అది ఏ పక్షి అయ్యి ఉండచ్చో కూడా Merlin యాప్ సలహాల పట్టికను మనకు అందిస్తుంది. అంతే కాదండోయ్, ఆ పక్షుల అరుపులు, పాటల రికార్డింగులు కూడా మన వినగలిగే అవకాశం ఉంది. e -bird అన్న యాప్ మనకు ఇంకొన్ని విధాలుగా సహాయ పడుతుంది. పక్షులను గమనించడానికి ఏదైనా ఓ ప్రదేశానికి వెళ్తున్నట్టయితే, ఆ ప్రాంతంలో, ఆ ఋతువు /నెలలో ఏయే రకాల పక్షులు కనిపించగలవు అన్న జాబితా మనకు అందుబాటులో ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళినపుడు మనకు కనిపించిన పక్షుల పేర్లన్నీ యాప్ లోనే నమోదు చేసే వీలు కూడా ఉంది. మనం తయారు చేసిన జాబితా మనలా అక్కడికి వెళ్లాలని అనుకునే సందర్శకులకు కూడా ఉపయోగ పడుతుందన్నమాట. మరి, ఆలస్యమెందుకు? మన చుట్టూ ఎగురుతూ కనిపించే ఈ అద్భుత ప్రాణుల ప్రపంచంలోకి ప్రవేశించాలంటే అడవుల్లోకే వెళ్ళక్కర్లేదు. ఓ బైనాక్యులర్స్ చేతబట్టుకుని మీ పిట్ట గోడ వద్ద కూర్చుంటే చాలు. వాటి విన్యాసాలతో మీకు అవే స్వాగతం పలుకుతాయి! రచయిత: VS పవిత్ర ఫోటో గ్రాఫర్ : శ్రీరామ్ రెడ్డి -
ఈకల్లో విషం.. తాకితే మరణం.. రెండు రకాల విషపూరిత పక్షులు గుర్తింపు
కిలకిలరావాలతో అలరించే పక్షులంటే ఇష్టపడనివారు ఎవరుంటారు? బుల్లి పిట్టలను ఇంట్లో పెంచుకోవడం చాలామందికి ఒక చక్కటి అభిరుచి. పిట్టలకు ఆహారం, నీరు అందిస్తూ వాటి ఎదుగుదలను చూసి ఆనందిస్తుంటారు. పక్షులంటే మనుషులకు ప్రియనేస్తాలే. కానీ, ముట్టుకుంటే చాలు క్షణాల్లో ప్రాణాలు తీసే భయంకరమైన రెండు రకాల పక్షులను న్యూగినియా అడవుల్లో డెన్మార్క్ పరిశోధకులు గుర్తించారు. అవి వాటి ఈకల్లో విషం దాచుకుంటున్నట్లు కనిపెట్టారు. వాటిని ఇంట్లో పెంచుకోలేం, ఆహారం ఇవ్వలేం. విషపూరిత పక్షుల సమీపంలోకి వెళ్లడం కూడా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. ► అడవుల్లో విషపూరిత ఫలాలు, పదార్థాలను ఆరగించి, వాటిని న్యూరోటాక్సిన్లుగా మార్చి, తన రెక్కల్లో నిల్వ చేసుకొనే సామర్థ్యం ఈ పక్షుల్లో అభివృద్ధి చెందింది. ► విష ప్రభావాన్ని తట్టుకొని జీవించే శక్తి సమకూరింది. ► కాలానుగుణంగా వాటి శరీరంలో సంభవించిన జన్యుపరమైన మార్పులే ఇందుకు కారణమని డెన్మార్క్‌లోని నేచురల్ హస్టరీ మ్యూజియం ప్రతినిధి జాన్సన్ చెప్పారు. ► ఇటీవల న్యూగినియా అడవుల్లో పర్యటన సందర్భంగా ఈ పక్షులను గుర్తించామని ఒక ప్రకటనలో వెల్లడించారు. ► తాజాగా గుర్తించిన రెండు రకాల విషపూరిత పక్షులు రిజెంట్ విజ్లర్(పచీసెఫాలా స్లీ్కగెల్లీ), రఫోస్–నేప్డ్ బెల్బర్డ్(అలిడ్రియాస్ రుఫినుచా) అనే పక్షి జాతులకు చెందినవి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఈ జాతులు అధికంగా కనిపిస్తుంటాయి. ► సౌత్, సెంట్రల్ అమెరికాలో ఉండే డార్ట్ కప్పలు (గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్స్) అత్యంత విషపూరితమైనవి చెబుతుంటారు. ఈ కప్పలను తాకితే కొద్దిసేపట్లోనే మరణం సంభవిస్తుంది. ► డార్ట్ కప్పల్లోని విషం లాంటిదే ఈ పక్షుల్లోనూ ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు. ► పక్షుల్లో బాట్రాసోటాక్సిన్ అనే విషం అధిక మోతాదులో ఉందని సైంటిస్టులు పేర్కొన్నారు. ► ఇలాంటి విషమే గోల్డెన్ పాయిజన్ కప్పల చర్మంలో ఉంటుంది. ► విషం నిల్వ ఉన్న ఈ పక్షుల ఈకలను తాకితే కండరాల్లో పక్షవాతం లాంటిది ఏర్పడుతుంది. గుండె కొట్టుకోవడం ఆగిపోతోంది. చివరకు మృత్యువు కాటేస్తుంది. ఇదంతా క్షణాల వ్యవధిలోనే జరిగిపోతోంది. ► పక్షుల శరీరంలో సోడియం చానళ్లను క్రమబద్ధం చేసే ప్రాంతాల్లో మ్యుటేషన్స్(మార్పులు) వల్ల వాటిలో విషాన్ని తయారు చేసుకొని నిల్వచేసుకోవడంతోపాటు తట్టుకొనే శక్తి స్వతంత్రంగానే అభివృద్ధి చెందిందని సైంటిస్టులు పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యాగ్రి బర్డ్స్: పామును చూట్టుముట్టిన పక్షులు, వీడియో వైరల్
-
కొమ్మకొమ్మకో సన్నాయి!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : పోలంకి పిట్ట, పిగిలిపిట్ట, తేనె పిట్ట, నల్ల కొంగ, ఎర్ర గుడ్లగూబ, పెద్ద చిలుక, పసుపు పావురం.. ఈ పక్షులను ఎప్పుడూ చూడలేదు కదూ! చూడటం కాదు, కనీసం పేర్లు కూడా విననివారూ ఎక్కువే. వివిధ కారణాలతో పక్షుల సంఖ్య తగ్గిపోవడమే దీనికి కారణం. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని రిజర్వ్ ఫారెస్టులు, చెరువుల వద్ద ఏకంగా 446 రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. మన దేశంలో ప్రస్తుతమున్న 1,300 పక్షి జాతుల్లో మూడో వంతుకుపైగా తెలంగాణలో స్థిరనివాసం ఉండటంగానీ, వలస వచ్చిపోవడం గానీ జరుగుతోందని ‘స్టేట్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్’ తాజా నివేదిక వెల్లడించింది. నల్లమల, అనంతగిరి, గుబ్బల మంగమ్మ (అశ్వారావుపేట), పోచారం, కవ్వాల్, ఏటూరునాగారం, నర్సాపూర్ అటవీ ప్రాంతాల్లో చాలా జాతుల పక్షులు ఆవాసాలు ఏర్పర్చుకున్నట్టు తెలిపింది. కొత్త పక్షులకూ ఆవాసం.. మన రాష్ట్రంలో పలుచోట్ల కొత్తగా తలపై పింఛంతో ఠీవిగా కనిపించే బ్లాక్ బాజా (నల్లడేగ), మూరెడు తోక కలిగిన బ్లిత్స్ పారడైజ్ ఫ్లైక్యాచర్ (తోట పిగిలిపిట్ట)లను గుర్తించారు. వీటికితోడు అనంతగిరిలో బ్లూఅండ్ వైట్ ఫ్లైక్యాచర్ (నీలి– తెల్ల పిగిలిపిట్టలు), అశ్వారావుపేట గుబ్బలమంగమ్మ ఫారెస్ట్‌లో రూఫస్ వుడ్‌పెకర్ (ఒక రకం వడ్రంగి పిట్ట), కవ్వాల్‌లో మార్స్ హారియర్, ఇండియా కోర్సర్, బ్లాక్ బెల్లిట్, లాఫింగ్ డవ్, హార్ట్ స్పాటెడ్ వడ్రంగి పిట్ట తదితర వలస పక్షులను కొత్తగా గుర్తించారు. కొన్నేళ్లుగా మంచి వర్షాలు, వేసవిలో దాహార్తిని తీర్చేందుకు రిజర్వు ఫారెస్టుల్లో ఏర్పాట్లు చేయటంతో.. పక్షుల సంతతి, రాక పెరిగినట్టు నిపుణులు చెప్తున్నారు. నగరాలు, చెరువుల వద్ద.. ఆందోళనకరం జీవావరణ సమతుల్యతలో కీలకపాత్ర పోషించే పక్షుల మనుగడ పెద్దగా మనుషుల అలికిడి లేని అటవీ ప్రాంతాల్లో భేషుగ్గా ఉండగా.. నగరాలు, చెరువుల వద్ద ఆందోళనకరంగా ఉందని తేలింది. రిజర్వ్ ఫారెస్ట్‌లలో స్థానికంగా ఉన్నవాటికి తోడు కొత్త రకాల పక్షులు వచ్చి చేరుతున్నాయి. అదే పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని నిపుణులు చెప్తున్నారు. పక్షుల మనుగడకు తోడ్పడే పండ్లు, పూలచెట్ల స్థానంలో ఎలాంటి ప్రయోజనంలేని మొక్కల పెంపకం, భారీ నిర్మాణాలతో చెట్లు తగ్గిపోవడం, సెల్ టవర్లు, కర్బన ఇంధనాల కాలుష్యం వంటి కారణాలతో పావురాలు తప్ప మిగతా పక్షులేవీ పెద్దగా మనగలిగే పరిస్థితి లేదని ‘హైదరాబాద్ బర్డ్ పాల్స్’ సంస్థ ప్రతినిధి గోపాలకృష్ణ అయ్యర్ తెలిపారు. ఇక కొన్నేళ్లుగా చెరువుల సరిహద్దులు, కట్టల నిర్మాణాలు, వాటిపై వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం, ప్రకాశవంతమైన విద్యుత్ లైట్లు అమర్చడం వంటివాటితో.. వలస పక్షులతోపాటు ఇక్కడి నీటి పక్షులు గుడ్లు పెట్టి, సంతానోత్పత్తి చేయలేని పరిస్థితి ఏర్పడిందని అయ్యర్ వివరించారు. మనుషుల అలికిడి పెరగడం, వేట (పురుగులు, చిన్నచేపలు) దొరకడం కష్టమవడంతో ఆయా పక్షుల మనుగడకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఈ కారణాలతో.. అక్టోబర్ నుంచి మార్చి వరకు యూరప్, సైబీరియా, ఆ్రస్టేలియాల నుండి వలసవచ్చే పక్షుల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. చెరువుల పునర్నీర్మాణంలో పక్షుల మనుగడ అంశాన్ని మర్చిపోయి డిజైన్ చేయడమూ ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. ♦ కోకిల కిలకిలారావాలు, చిలుకల పలుకులు, పిచ్చుకల కిచకిచలతోపాటు ఏకంగా 304 రకాల పక్షుల సందడితో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రత్యేక జీవావరణ కేంద్రంగా మారింది. ఇక్కడ నల్లగద్ద, పోలంకి పిట్ట, తేనెపిట్ట, నల్లకొంగ, తోక పిగిలిపిట్ట, పెద్ద చిలుక, ఎర్ర గుడ్లగూబ తదితర పక్షులు ఆవాసం ఏర్పరచుకున్నాయి. ♦వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ప్రతి మొక్క ఆయుర్వేద గుణాలున్నదేనన్న పేరు పొందింది. ఈ అడవుల్లో 250 రకాల పక్షులు ఉన్నాయి. బండీడ్ బే కుకూ, బ్లూ బెయిర్డెడ్బీ ఈటర్, చెస్ట్నట్ టెయిల్డ్ స్టార్లింగ్, పొన్నంగి పిట్ట (ఇండియన్ పిట్ట) లతో పాటు చెవులపిల్లిని ఆహారంగా తీసుకునే కుందేటిసలవ గద్దలు వంటి పక్షు లు అనంతగిరి నుంచి ఉస్మా న్‌సాగర్ రిజర్వాయర్ వరకు సందడి చేస్తున్నాయి. డేంజర్ జోన్లో బుల్బుల్ పిట్ట.. ♦ చూసేందుకు ముద్దుగా, పలికితే వినసొంపుగా ఉండే బుల్బుల్ పిట్ట (ఎల్లో త్రోటెడ్ బర్డ్) అంతరించే స్థితికి చేరింది. దేశంలోపాటు మన రాష్ట్రంలోనూ వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వీటి నివాసం రాళ్లు, కొండ గుహలే. ♦ కుమురంభీం జిల్లా పెంచికల్‌పేట, బెజ్జూరులలో రాబందు (వల్చర్) సంరక్షణ కేంద్రం ఏర్పాటు కూడా ప్రయోజనం ఇవ్వలేదు. ప్రాణహిత తీరంలో రాబందుల పర్యవేక్షణ కోసం బయాలజిస్ట్, వాచర్‌ను నియమించి రోజూ ఒక ఆవును ఆహారంగా వదిలినా ఫలితం లేకపోవటంతో ఆ ప్రయత్నాలు ఇటీవలే ఉపసంహరించారు. ♦ జనగాం జిల్లా చిన్నమడూరు, పెద్ద మడూరు గ్రామాలకు ఏటా వచ్చే విదేశీ పక్షులకు అక్కడి కోతుల గుంపులు ప్రతిబంధకంగా మారాయి. ఈ ఏడాది వలస పక్షుల సంఖ్య భారీగా తగ్గింది. అడవుల్లో పక్షుల జోరు పెరిగింది తెలంగాణ అటవీ ప్రాంతంలో అన్నిరకాల స్థానిక పక్షు ల సంతతితోపాటు కొత్త పక్షుల వలస పెరిగింది. దేశీజాతి పక్షులు ఈ ప్రాంతానికి హిమాలయాలు మొదలుకుని ఈశాన్య భారత రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నాయి. అయితే అటవీ ప్రాంతాల్లో జన సందడిని మరింత తగ్గించే ప్రయత్నం చేయాల్సిన అవ సరం ఉంది. – మదన్‌రెడ్డి, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ చెరువుల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలి చాలా చోట్ల చెరువులకు మరమ్మతులు చేస్తూ వాటికి ఒడ్డు లేకుండా చేస్తున్నారు. కొన్నిచోట్ల అయితే చెరువుల నిర్వహణ ప్రైవేటు చేతుల్లోకి తీసుకుని వాకింగ్ ట్రాక్‌లు, విద్యుత్ లైట్లు వేస్తున్నారు. చుట్టుపక్కల చెట్లు కూడా లేకుండా పోతున్నాయి. వీటి ప్రభావం పక్షులపై తీవ్రంగా పడింది. విదేశీ వలస పక్షుల రాక తగ్గిపోయేందుకు కారణమైంది. – హరికృష్ణ అడపా, హైదరాబాద్ బర్డ్ పాల్స్ సంస్థ ప్రతినిధి -
జీవితంలో పరిగెడుతూ ప్రకృతిని ఆస్వాదించడం మర్చిపోయాం
ప్రస్తుత పోటీప్రపంచంలో మనమందరం పరిగెడుతున్నాము. పిల్లలు చదువుల కోసం, ఉద్యోగస్తులు సంపాదన కోసం, పెద్దవాళ్లు ఆరోగ్యం కోసం ఇలా పరిగెడుతూ మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించడం మర్చిపోయాం. పెరుగుతున్న ఎండలు, అకాల వర్షాలు, వణికిస్తున్న చలి ఇలా మనల్ని ఇబ్బంది పెడుతున్న వాతావరణం గూర్చి మాట్లాడుకుంటాం కానీ ఆ వాతావరణం వలన పర్యావరణం, జీవవైవిధ్యంలో వచ్చే మార్పులను గమనించము. మానవ మనుగడకు పర్యావరణ సమతుల్యత చాలా ముఖ్యం. ఈ సమతుల్యతను నిర్వహించడంలో జీవవైవిధ్యం ముఖ్య పాత్ర పోషిస్తూ, పర్యావరణ వ్యవస్థలోని మార్పులకు ముఖ్య సూచికగా నిలుస్తుంది. మన చుట్టూ సాధారణంగా కనిపించే మొక్కలు, చెట్లు, క్రిమికీటకాలు, పక్షులు, జంతువులు జీవవైవిధ్యంలో ఒక భాగం. వీటిని ప్రతిరోజూ చూస్తుండే మనం, చాలా అరుదుగా గమనిస్తూంటాం. చూడటానికి గమనించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. గమనించిన ప్రతి వివరము ఎక్కువ కాలం గుర్తుంటుంది. ప్రకృతిలోని జీవవైవిధ్యమును గమనించడం వలన పిల్లలకు, పెద్దలకు చాలా ఉపయోగములు ఉన్నవి. పక్షులను గమనించడం, పక్షి కూతలను విని ఆనందించడం మనుషుల మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం కనబరుస్తుందని ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలలో వెల్లడైనది. ఆల్బర్ట్ ఐంస్టీన్ 1949లోనే పక్షులు, తేనెటీగలలోని గమ్యాన్ని గుర్తించే సామర్ధ్యం తెలుసుకొనడం భౌతిక శాస్త్రంలో చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. విమానాల నుండి అట్టపెట్టెల వరకు ప్రకృతి నుండి ప్రేరేపింపబడిన వస్తువులు, పరికరములు, వాహనాలు మనం నిత్యం చూస్తుంటాం, ఉపయోగిస్తుంటాం. ప్రస్తుత విద్యావ్యవస్థ విధానాలు పిల్లలను ప్రకృతి నుండి దూరం చేస్తుంది. తరగతి గదులలో నేర్పించే చదువుకు ఉన్న ప్రాధాన్యత, ప్రకృతి పరిసరాలలోని జీవవైవిధ్యం గమనించడంలో కనిపించడంలేదు. పల్లెల్లో మారుతున్న జీవనవిధానాలు, నగరీకరణతో వస్తున్న మార్పుల వలన సహజమైన పర్యావరణ వ్యవస్థలు కనుమరుగవుతున్నవి. ప్రకృతి ఆధారిత అభ్యాసాన్ని, పర్యావరణ విద్యను విద్యావ్యవస్థలో ఏకీకృతం చేయడం వలన పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై మంచి ప్రభావం కనిపిస్తుంది. పరిసరాలలోని పక్షులు, ఋతువులు చెట్లు, మొక్కలలో ఋతు ప్రభావిత మార్పులు , సీతాకోకచిలుకలు, వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే చిమ్మెటలు ఇలా జీవవైవిధ్యంలోని అనేక ప్రాణులు, ఆ ప్రాణుల మధ్య సంబంధాలు, వివరములను పిల్లలు గమనించడం వలన ఒత్తిడి తగ్గి వారిలో సృజనాత్మకత మెరుగుపడుతుంది, విమర్శనాత్మకంగా ఆలోచించే గుణం పెంపొందుతుంది . సాంకేతిక విద్యతో పాటు పిల్లలకు ఇటువంటి అవకాశములు కల్పించడం వలన వారికి వాతావరణ మార్పులు, జీవవైవిధ్యమునకు కలుగుతున్న నష్టం, కాలుష్యం వంటి పర్యావరణ సమస్యలపై అవగాహన పెరిగి ఆ దిశలోని సవాళ్ళను ఎదుర్కొని శాస్త్రజ్ఞులుగా,బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. ఇది మనకు మన తరువాత తరాలకు అత్యంత అవసరం. ఎదుగుతున్న పిల్లలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన జీవితం అందించాల్సిన పెద్దలు కూడా పని ఒత్తిడికి తద్వారా వచ్చే మానసిక రుగ్మతలకు మినహాయింపు కాదు. ఇంగ్లాండ్ , నెదర్లాండ్స్ , అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో పెద్దవారిలో , పింఛనుదారులలో వచ్చే ఒత్తిడి, ఒంటరితనం ఇతర మానసిక సవాళ్ళను అధిగమించడానికి వ్యాయామంతో పాటు పక్షివీక్షణ కూడా తరుచుగా చేస్తుంటారు. ఇది మన వ్యవస్థలో చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. ఉపాధ్యాయులకు ప్రకృతి, జీవవైవిధ్యమునకు సంభందించిన శిక్షణ ఇవ్వడం చాలా అవసరం. పర్యావరణ విద్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పిల్లలలో మంచి మార్పు తేవడంలో ముఖ్యపాత్ర పోషించగలరు. పిల్లలకు, పెద్దలకు జీవవైవిధ్యంతో పరిచయం వలన పర్యావరణంఫై అవగాహన పెరిగి సహజ వనరులను పరిరక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. కానీ ఈ పరిచయానికి కావాల్సిన వనరులు తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదు. మదనపల్లె లోని రిషి వాలీ స్కూల్ పక్షులు గూర్చి అవగాహన పెంపొందించడానికి ఆర్నిథాలజీ (పక్షి శాస్త్రము) కోర్సు అందిస్తున్నది. అలాగే ఎర్లీ బర్డ్ (early-bird.in) ప్రాజెక్ట్ నుండి పక్షులకు సంబంధించిన కరదీపికను/చేపుస్తకమును ఉచితముగా పొందవచ్చును. పిల్లలకొరకు పక్షులకు సంబంధించిన ఆటలు,పోస్టర్లు కూడా ఎర్లీ బర్డ్ ఉచితముగా అందిస్తున్నది. జీవివైవిధ్యంపై అవగాహన పెంపొందించుట కొరకు బొంబాయి నాచురల్ హిస్టరీ సొసైటీ (bnhs.org) వివిధ ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ఆన్లైన్లో (https://academy.allaboutbirds.org/learning-games/) ఆటలతో పక్షులను పిల్లలకు పరిచయం చేస్తున్నారు. మొక్కలు, చెట్లపై ఆసక్తి ఉన్నవారు సీజన్ వాచ్ (https://www.seasonwatch.in) కార్యక్రమములో ఉచితముగా పాల్గొని అవగాహన పెంచుకోవచ్చు. ఇలా మన ఇంటినుండే ప్రకృతి, జీవవైవిధ్యంఫై అవగాహన పెంచుకుని తోటివారితో పంచుకునే సాంకేతికత, వనరులు మనకు చాలా అందుబాటులో ఉన్నవి. వీటిని ఉపయోగించుకుని మనకు, మన సమాజానికి ప్రకృతితో అనుబంధాన్ని పెంపొందించడం చాలా అవసరం. --- రాజశేఖర్ బండి -
అదిలాబాద్ కవ్వాల్ టైగర్ జోన్‌కు భారీగా విదేశీ పక్షులు
-
పర్యావరణంలో మీ పాత్ర?
పర్యావరణం బాగుంటే మనం బాగుంటాం. మనం బాగుండాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకోసం మీరు ఏమి చేస్తున్నారో మీకు మీరుగా ప్రశ్నలు వేసుకోండి. ఒకవేళ మీకు సరైన సమాధానం రాకపోతే ఈ కింద చెప్పుకున్న పనులు చేసేందుకు ప్రయత్నం చేయండి. ♦ ఈ పర్యావరణంలో జంతువులు, పక్షులు కూడా భాగమే కాబట్టి వాటికోసం ఆవాసాలు, చెట్ల మీద గూళ్లు ఏర్పాటు చేయడం. ♦ జల, మృత్తికా కాలుష్యాలను అరికట్టేందుకు ప్లాస్టిక్ సంచుల వినియోగం తగ్గించాలని ప్రచారం చేయడం. ♦ పాతవస్తువుల పునర్వినియోగం గురించి పిల్లలకు తెలియజేయటం. ♦ వీధులు,పార్కులు, ఇతర ప్రదేశాల్లో వ్యర్థాలను తీసిపారేయటం. ♦ వీలైతే పర్యావరణ భద్రత గురించిపాటలు, నాటికలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, వీలైనన్ని మొక్కలను నాటటం, నాటించటం. ♦ భూమిని, సహజవనరులను కాపాడుకోవటం ఎంతో అవసరం కాబట్టి ప్రతిరోజూ పర్యావరణ దినోత్సవంగానే భావించడం, అలా భావించాల్సిందిగా మన చుట్టుపక్కల వారికి కూడా చెప్పడం. ♦ మన భూమి భవిష్యత్తు రేపటి పౌరులైన పిల్లల చేతిలో ఉంది కాబట్టి పర్యావరణాన్ని, సహజవనరులను కాపాడాల్సిన బాధ్యతను గురించి వారికి తెలియజేసేందుకుపాఠశాలలో వివిధ రకాల ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. ♦ స్వచ్ఛత, కాలుష్యనివారణ, పర్యావరణం తదితర అంశాలకు సంబం ధించి కృషి చేస్తున్నవారిని, వాటికోసం ఎంతగానోపాటుపడుతున్నవారిని సత్కరించడం వల్ల ఇతరులు సైతం స్ఫూర్తిపొందే అవకాశముంది. ♦ పర్యావరణ హితం కోసం మన చుట్టుపక్కల చేపడుతున్న, జరుగుతున్న కార్యక్రమాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం. వీటి గురించి మీ మీ చుట్టూ ఉన్నవారు తెలుసుకునేందుకు మీరే సమాచార సారథిగా మారడం. ఇతరులకు ప్రేరణ అందించడం. -
Special Marriage : బ్యాండ్ బాజాలతో ఘనంగా చిలుక పెళ్లి!
పెళ్లి అనేది భారతీయ సంప్రదాయంలో ఒక గొప్ప వేడుక. పెద్దలు ఈ వేడుకను గొప్ప పవిత్ర కార్యంగా నిర్వహిస్తారు. అలాంటి సంప్రదాయరీతిలో ఇక్కడొక ఇద్దరు వ్యక్తులు రెండు పక్షులకు పెళ్లి చేశారు. ఈ వింత పెళ్లి మధ్యప్రదేశ్‌లోని కరేలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్‌లోని పిపారియాలో ఉండే రామ్‌స్వరూప్ పరిహర్ మైనా అనే పక్షిని కన్న కూతురి మాదిరిగా చూసుకుంటున్నాడు. అలాగే బాదల్ లాల్ విశ్వకర్మ చిలుకను కన్న బిడ్డలా ప్రేమగా చూసుకుంటున్నాడు. వారిద్దరూ తమ పక్షులకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. దీంతో ఆ ఇద్దరు తమ పక్షులకు హిందూ సంప్రదాయ పద్ధతిలో జాతకాలు చూసి మరీ భాజ భజంత్రీల నడుమ అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. ఆ పక్షులను రెండింటిని చిన్న కారులో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ పెళ్లి అంతటిని రామస్వరూప్ తన ఇంటిలో ఘనంగా నిర్వహించాడు. ఈ పెళ్లికి బాదల్ తరుఫున అతని గ్రామం నుంచి విజయ పటేల్, ఆదిత్య పటేల్, పితమ్ పటేట్, దేవి సింగ్ పటేల్, ఆశోక్ పటేల్, రాజు పటేల్, పురుషోత్తం శివన్య, సునీల్ పటేల్, విమేలేష్ పటేల తదితరులంతా హాజరయ్యారు. ఈ వింత పెళ్లిలో బరాత్ కూడా నిర్వహించడం విశేషం. ప్రస్తుతం అక్కడి గ్రామస్తులు ఈ పెళ్లి గురించే కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. (చదవండి: 17 గంటలపాటు ఆ శిథిలాల కిందే.. తమ్ముడి కోసం ఆ చిన్నారి..) -
రష్యా టూ నల్లమల.. 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి..
సాక్షి, ప్రకాశం: రష్యా నుంచి విదేశీ పక్షులు నల్లమల ప్రాంతానికి వచ్చాయి. రష్యా, మధ్య ఆసియా, ఉజ్బెకిస్తాన్, కజికిస్తాన్ దేశాల నుంచి సుమారు 8 వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ పక్షులు ప్రస్తుతం నల్లమలలో తిరుగుతున్నాయి. పెద్దదోర్నాల, రోళ్లపెంట ప్రాంతాల్లో వీటిని బయోడైవర్శిటీ శ్రీశైలం ఎఫ్ఆర్వో హాయత్ ఫొటోలు తీశారు. ప్రతి ఏడాది డిసెంబర్ మొదటి వారంలో పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి ఫిబ్రవరి నెలలో మళ్లీ సొంత గూటికి చేరతాయన్నారు. అరుదైన ఈ పక్షులు నల్లమలకే అందాలనిస్తున్నాయని చెప్పారు. మన దేశంలో నల్లమలలోని శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులోనే ఈ పక్షులు ఉన్నాయి. గడ్డి మైదానాలకు మాత్రమే ఈ పక్షులు వలస వస్తాయి. మిడతలు, చిన్నచిన్న పురుగులను తిని జీవిస్తాయి. ఈ సమయంలో మధ్య ఆసియాలో ఆహారం దొరకదు. దీంతో విడిది కోసం ఇక్కడికి వచ్చి ఆహారం తింటూ ఎండలు ప్రారంభం కాగానే వెళతాయి. డేగ జాతికి చెందిన ఈ పక్షులలో మాన్టెగ్యూస్ హారియర్, పాలిడ్ హారియర్, ఎరూషియన్ మార్స్ హారియర్ ముఖ్యమైనవి. నెల రోజుల పాటు కష్టపడి వీటి జీవనశైలిని పరిశీలించి ప్రత్యేక కెమెరాలతో ఫొటోలు తీసినట్టు హాయత్ తెలిపారు. -
వీరాపురానికి విదేశీ అతిథి
ఎక్కడ సైబీరియా...ఎక్కడ చిలమత్తూరు మండలంలోని వీరాపురం. దాదాపు 5 వేల కిలో మీటర్ల దూరం. ఎందులోనూ పొంతన ఉండదు. కానీ ఈరెండు ప్రాంతాలను ఓ పక్షి కలిపింది. అతిథిగా వచ్చి ఇక్కడి ప్రజల మనస్సు గెలుచుకుంది. ఈ ప్రాంతానికి గుర్తించి తెచ్చింది. అందుకే ఏటా జనవరి నుంచి ఫిబ్రవరిలోపు ఇక్కడ వచ్చి సందడి చేసే ఆ అతిథిగా కోసం వీరాపురం ఎదురుచూస్తోంది. సాక్షి, పుట్టపర్తి: వీరాపురం.. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో కర్ణాటక సరిహద్దున ఓ మారుమూల గ్రామం. కానీ ఆ గ్రామానికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. అదీ ఓ అతిథి వల్ల. అందుకే ఆ అతిథికి గ్రామస్తులు రాచమర్యాదలు చేస్తారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారు. వేడిని వెతుక్కుంటూ రష్యా దేశం సైబీరియన్ ప్రాంతానికి చెందిన స్టార్క్ పెయింటెడ్ పక్షులు (ఎర్రముక్కు కొంగలు). సమ శీతోష్ణస్థితి కలిగిన ప్రాంతాల్లో జీవిస్తాయి. ఈ క్రమంలోనే వచ్చే ఫిబ్రవరి నుంచి సైబీరియాలో చలికాలం ప్రారంభమవుతుంది. ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోతుంది. దీంతో వేడిని వెతుక్కుంటూ ఈ పక్షులు మైళ్ల దూరం ప్రయాణించి నుంచి ఏటా వీరాపురం వస్తుంటాయి. ముందుగా జనవరిలోనే కొన్ని పక్షులు వచ్చి ఇక్కడి వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తాయి. అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత తమ దేశానికి వెళ్లి మిగతా పక్షులతో తిరిగి వస్తాయి. ఇలా మన రాష్ట్రంలోని కొల్లేటి సరస్సు, తేలినీలాపురం, పులికాట్ సరస్సు, నేలపట్టుతో పాటు మన జిల్లాలోని చిలమత్తూరు మండలం వీరాపురం గ్రామానికి ఏటా సైబీరియన్ పక్షులు రావడం మూడు దశాబ్దాలుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆరు నెలల పాటు సందడి వీరాపురంలోని 188 ఎకరాల విస్తీర్ణంలో పురాతనమైన చెరువు ఉంది. దీని కింద 80 ఎకరాల ఆయకట్టుంది. దీని చుట్టూ వందలాది చెట్లు ఉండటంతో మూడు దశాబ్దాలుగా సైబీరియా నుంచి వేల సంఖ్యలో ఈ పక్షులు ఫిబ్రవరిలో ఇక్కడకు వస్తున్నాయి. ఇక్కడే గుడ్లు పొదిగి పిల్ల పక్షులు ఎగిరే దశకు చేరుకున్నాక (సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లోపు) తిరిగి స్వస్థలానికి వెళ్లిపోతాయి. వీటిని స్థానికులంతా ప్రేమగా ఎర్రముక్కు కొంగలంటారు. కొన్నేళ్లుగా వీరాపురంతో ఈ పక్షులు మమేకమయ్యాయి. అందువల్లే సీజన్లో పక్షులను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తుండగా... వీరాపురం కళకళలాడుతుంది. బంధువుల్లా ఆదరణ తమ గ్రామానికి ఖ్యాతి తెచ్చిన ఈ కొంగలను వీరాపురం వాసులు ప్రత్యేకంగా చూస్తారు. ఇళ్ల మధ్య చెట్లపైనే ఉంటూ 24 గంటలూ అరుస్తూ ఉన్నా వాటికి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వరు. అంతేకాకుండా వీరాపురం చెరువును చారిత్రక సంపదగా ప్రకటించారు. చెరువు కింద 80 ఎకరాల ఆయకట్టు ఉన్నా... ఈ చెరువు నీటితో వ్యవసాయం చేస్తే నీరు తగ్గిపోయి మత్స్యసంపద అంతరిస్తుందని, అప్పుడు సైబీరియన్ పక్షులకు ఆహారం లేకుండా పోతుందన్న భయంతో ఏకంగా చెరువు కింద ఆయకట్టులో వ్యవసాయం చేయడమే మానేశారు. మేలు జరుగుతుందని నమ్మకం ఈ కొంగల రాకతో ఊరికి మేలు జరుగుతుందని వీరాపురం వాసులు నమ్ముతారు. ఎవరైనా వాటికి హాని తలపెడితే అందరూ ఒక్కటవుతారు. వారిని పట్టుకుని గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ చేసి జరిమానా విధిస్తారు. కేసులు పెడతారు. సైబీరియా నుంచి సుమారు ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ కొంగలు వీరాపురం చేరుకుంటుండడం విశేషం. పోషణ భారం ఆడ కొంగలదే పెయింటెడ్ స్టార్క్ పక్షి చూడముచ్చటగా ఉంటుంది. సికొనిడే జాతికి చెంది ఈ పక్షి శాస్త్రీయ నామం ’మిక్టీరియాలూకోసిఫల’. ఎత్తు 3 నుంచి 3.5 అడుగులు. ఎగరడానికి రెక్కలు విప్పినప్పుడు ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది. బరువు సుమారు 3.5 కిలోల నుంచి 4 కిలోల వరకు ఉంటుంది. ఈ పక్షులు నీళ్లను గొంతు వరకు నింపుకొని పిల్ల పక్షులకు అందించేందుకు మొత్తం నీరు బయటకు తీసి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంటుంది. ఆహారం కోసం ఊరికి 50 కిలోమీటర్ల దూరంలోపు ఉండే చెరువులు, పంట పొలాల వైపు వెళ్లి తిరిగి సాయంత్రం గూటికి చేరుకుంటాయి. ఒక గూడులో జంట పక్షులుంటాయి. గుడ్లు పెట్టి పిల్లలు వచ్చాక వాటి సంరక్షణను మగపక్షి చూసుకుంటుంది. ఆడకొంగలు బయటకు వెళ్లి చెరువుల్లో వేటాడి చేపలు, నీళ్లు తీసుకొచ్చి పిల్లలకు అందిస్తాయి. అనువైన వాతావరణం సైబీరియాతో పోలిస్తే వీరాపురంలో వేడి వాతావరణం ఉండటం, వేసవిలోనూ దగ్గరలోని చెరువుల్లో నీళ్లుండటంతో పక్షులు మా ఊరికే వస్తుంటాయి. కేవలం చేపలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. తమ పిల్లలకు కూడా మేత తీసుకొస్తాయి. – ఎల్.లక్ష్మీపతి, వీరాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ పక్షులతో విడదీయరాని బంధం ఒంటరిగా వచ్చే ఈ పక్షులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లలతో పాటే తిరిగి సైబీరియా వెళ్లిపోతాయి. మా తాతల కాలం నుంచి ఈ పక్షులు వస్తున్నాయి. పక్షులతో మా గ్రామానికి విడదీయరాని అనుబంధం. ఏటా పక్షుల సీజన్ కోసం ఎదురు చూస్తుంటాం. – నరసింహారెడ్డి, వీరాపురం -
ఆస్ట్రేలియా అతిథులు వచ్చేశాయ్!
వెంకటాపురం(పెనుగంచిప్రోలు): వెంకటాపురంలో విదేశీ విహంగాల సందడి మొదలైంది. ‘ఆస్ట్రేలియా’లోని ఎర్రకాళ్ల కొంగలు (పెయింటెడ్ స్టాక్స్) పక్షి ప్రేమికులను పలకరిస్తున్నాయి. గ్రామస్తులకు కనువిందు చేస్తున్నాయి. కొల్లేరు తర్వాత ఇక్కడికే.. ఏటా ఈ పక్షులు వేల మైళ్లు ప్రయాణించి నవంబర్, డిసెంబర్ నెలల్లో గ్రామానికి చేరుకుంటాయి. అయితే ఈ ఏడాది విదేశీ పక్షులు సుమారు వెయ్యికి పైగా చేరుకొని నాలుగైదు రోజులవుతోంది. ఇవి ఆరు నెలల పాటు ఇక్కడి చెట్లపై ఆవాసాలు ఏర్పాటు చేసుకొని గుడ్లుపెట్టి, సంతానత్పోత్తి చేసుకుని మే చివరి వారంలోగానీ, జూన్‌లోగానీ తిరిగి తమ ప్రాంతానికి వెళ్తాయి. కొల్లేరు తర్వాత విదేశీ పక్షులు అధికంగా వచ్చేది వెంకటాపురం గ్రామానికే. ఇది పెనుగంచిప్రోలుకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది. పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలా విదేశీ పక్షుల రాకతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏటా గ్రామానికి వచ్చే పక్షులను గ్రామస్తులు పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలా చూసుకుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఈ పక్షుల కారణంగా గ్రామం పాడిపంటలు, సుఖ శాంతులతో వరి్ధల్లుతోందని వారి నమ్మకం. పక్షుల కోలాహలం రంగు రంగుల రెక్కలు, పొడవాటి ఎర్రని ముక్కు, పెద్ద కళ్లతో సందడి చేస్తున్నాయి. ముందుగా కొన్ని పక్షులు గ్రామానికి వచ్చి పరిసరాలు, ఆహార లభ్యత చూసుకొని అనువుగా ఉంటే వెనక్కు వెళ్లి తోటి పక్షులతో గ్రామానికి చేరుకుంటాయి. సమీపంలో దొరికే పుల్లలు, గడ్డిని తెచ్చి చెట్ల కొమ్మలపైకి చేర్చి గూళ్లు చేసి గుడ్లు పెడతాయి. గ్రామానికి తరలి వచ్చే విదేశీ పక్షుల సంరక్షణను పట్టించుకోవటం లేదు. గ్రామం మధ్య నుంచి వెళ్లే 11 కేవీ విద్యుత్ తీగల కారణంగా ఏటా పెద్ద సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. దీనిపై గ్రీన్ టీం నిర్వాహకులు జూటూరి అప్పారావు, వైఎస్సార్ సీపీ నేత గూడపాటి శ్రీనివాసరావు సహకారంతో గతంలో తీగలకు ప్లాస్టిక్ పైపులు అమర్చారు. అయితే ఇంకా పైపులు తొడగాల్సి ఉంది. కోతుల వల్ల పక్షుల ఆవాసానికి అవరోధం కలుగుతోంది. -
అంతరిస్తున్న అతిథి పక్షులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వలస పక్షులకు ముప్పు వచ్చి పడుతోంది. విదేశాల నుంచి కొల్లేరు వలస వచ్చే వైట్ బ్యాక్ట్ రాబందు, సైబీరియన్ క్రేన్, బెంగాల్ ఫ్లోరికన్ వంటి పక్షి జాతులు కనిపించడం లేదు. పెరుగుతున్న జనాభా.. తరుగుతున్న అడవులు.. మిరుమిట్లు గొలిపే కాంతులు.. ఆహార కొరత పక్షుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ప్రకృతిలో సంభవిస్తున్న మార్పులు, మానవ తప్పిదాల కారణంగా అరుదైన పక్షి జాతులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వైట్ బ్యాక్డ్ రాబందు విదేశాల నుంచి మన దేశానికి వచ్చే 29 పక్షి జాతులు ప్రమాదం అంచున ఉన్నట్టు పక్షి ప్రేమికుల పరిశీలనలో వెల్లడైంది. ఇప్పటికే 15 జాతుల పక్షులు అంతరించే జాబితాలో చేరాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) రెడ్ లిస్ట్ ద్వారా ప్రకటించింది. రాష్ట్రంలోని కొల్లేరు ప్రాంతానికి ఏటా దాదాపు 6 లక్షల పక్షులు వస్తుంటాయి. వీటిలో అనేక జాతులు ప్రమాదం అంచున ఉన్నాయని పక్షి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సైబీరియన్ క్రేన్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్.. సైబీరియన్ క్రేన్ కనిపించట్లేదు ఐయూసీఎన్ విడుదల చేసిన రెడ్‌లిస్ట్‌లో ఐత్య బేరీ, అటవీ గుడ్ల గూబ, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, బెంగాల్ ఫ్లోరికన్, సైబీరియన్ క్రేన్, స్నేహశీల లాఫ్టింగ్, వైట్ బ్యాక్ట్ రాబందు, రెడ్‌హెడ్ రాబందు, సన్న రాబందు, ఇండియన్ రాబందు, పింక్‌హెడ్ బాతు, హిమాలయ పిట్టను పూర్తిగా కనుమరుగవుతున్న జాబితాలో చేర్చారు. కలివికోడి జాడ కోసం కోసం పక్షి ప్రేమికులు కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ గాలిస్తున్నారు. అరుదైన కలివికోడి కనుమరుగవడానికి కారణాలెన్నో... జీవరాశులన్నీ ఆహారపు గొలుసులో భాగంగా ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. పూర్వం పశు కబేళాలను పీక్కు తినడానికి రాబందులు వచ్చేవి. వాటికి ఇప్పుడు ఆహార కొరత ఏర్పడింది. ఇటీవల ఆకాశ హరŠామ్యలలో అద్దాల గోడల వెనుక వెలిగే దీపాలను ఢీకొని అనేక పక్షులు మృత్యువాత పడుతున్నట్టు గుర్తించారు. ఎరువులు, పురుగు మందుల వాడకం, అయస్కాంత తరంగాలు, కరెంటు తీగలు, అడవుల్లో చెట్లు నరకడం, ధ్వని తరంగాలు, వేటగాళ్లు, వాయు, నీటి, భూమి కాలుష్యం పక్షి జాతుల అంతానికి కారణంగా మారుతున్నాయి. బెంగాల్ ఫ్లోరికన్ పక్షి ఆవాసాలు కోల్పోతున్నాయి పక్షులు తమ ఆవాసాలను కోల్పోతున్నాయి. ఇవి అక్షాంశాలు, రేఖాంశాల మధ్య సముద్ర తీరంలో ప్రయాణిస్తాయి. రసాయనాల వినియోగం పెరగడంతో వాటిని తిని పక్షులు మరణిస్తున్నాయి. పక్షులకు కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేయాలి. చెరువుల విస్తీర్ణం తగ్గడంతో వీటి మనుగడకు ప్రమాదం వాటిల్లుతోంది. పక్షులను రక్షించుకోవడం అందరి బాధ్యత. – డాక్టర్ వి.సంధ్య, జువాలజీ లెక్చరర్, కైకలూరు కొల్లేరులో పక్షులు -
కొల్లేరులో వలస పక్షుల సందడి
కైకలూరు(ఏలూరు జిల్లా): కిక్కిస పొదలు.. అందమైన జలదారుల నడుమ ప్రకృతి పంపిన రాయబారులు రాజహంసల్లా సందడి చేస్తున్నాయి. వలస పక్షులతో కొల్లేరు కళకళలాడుతోంది. శీతాకాలం విడిది కోసం సైబీరియా, నైజీరియా, రష్యా, టర్కీ, యూరప్ దేశాల నుంచి వలస పక్షులు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ విస్తరించిన కొల్లేరు ప్రాంతానికి చేరుకున్నాయి. అందరికీ విదేశీ పక్షులుగానే కనిపించే.. ఈ విహంగాలు కొల్లేరు ప్రాంత వాసులకు మాత్రం ఇంటి ఆడపడుచులుగా ఏటా ఇక్కడకు విచ్చేస్తాయి. 6 లక్షల పక్షుల రాక రాష్ట్రంలో కొల్లేరు అభయారణ్యం 77,185 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏటా కొల్లేరుకు దాదాపు 6 లక్షల విదేశీ పక్షులు వలస వస్తున్నాయి. అక్టోబర్‌లో వలసబాట పట్టే ఈ విహంగాలు ఇక్కడే సంతానోత్పత్తి చేసుకుని మార్చిలో తిరిగి పయనమవుతాయి. కొల్లేరు అభయారణ్యంలో 190 జాతులకు చెందిన పక్షులు జీవనం సాగిస్తున్నాయి. ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల విహార కేంద్రానికి పెలికాన్ పక్షులు వేలాదిగా రావడంతో దీనికి పెలికాన్ ప్యారడైజ్‌గా నామకరణం చేశారు. ఏలూరు రేంజ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో నాలుగు వారాలుగా పక్షుల లెక్కింపు జరుగుతోంది. డిసెంబర్ రెండో వారానికి దాదాపు స్వదేశీ, విదేశీ పక్షులు 5 లక్షల 20 వేలను గుర్తించారు. ఏటా శీతాకాలంలో విదేశీ వలస పక్షులు 6 లక్షలు, స్వదేశీ పక్షులు 3.50 లక్షల వరకు గుర్తిస్తున్నామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కొల్లేరు ప్రాంతంలో స్పాట్ బిల్డిన్ పెలికాన్, కామన్ శాండ్‌పైపర్, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్, గ్లోబీ ఐబీస్, పెయింటెడ్ స్టార్క్, రివర్ టర్న్, జకనా, లార్జ్ విజిటింగ్ డక్, ఓరియంటల్ డాటర్, కామన్ రెడ్ షంక్ వంటి 43 రకాల వలస పక్షులను ప్రస్తుతానికి అటవీ సిబ్బంది గుర్తించారు. వలస పక్షుల సంఖ్య పెరుగుతోంది ప్రకృతి అనుకూలించడంతో కొల్లేరుకు వచ్చే వలస పక్షుల సంఖ్య పెరుగుతోంది. ఏటా 6 లక్షల విదేశీ పక్షులు వలస వస్తుండగా.. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పక్షుల గణన జరుగుతోంది. పక్షుల ఆవాసాల కోసం అటవీ శాఖ కృత్రిమ స్టాండ్లను ఏర్పాటు చేస్తోంది. – ఎస్వీకే కుమార్, ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ రేంజర్, ఏలూరు -
పక్షో రక్షతి రక్షితః
చెట్లు బాగుంటేనే.. పక్షులు బాగుంటాయి. పక్షులు ఎంత బాగుంటే.. చెట్లు అంత బాగుంటాయి. పక్షుల్ని ఆధారంగా చేసుకుని చెట్లు తమ సంతానాన్ని వృద్ధి, విస్తరణ చేసుకుంటుంటే (పండ్లు, కాయల్ని పక్షులు తిని వాటిలోని విత్తనాలను వేరేచోట విసర్జించటం ద్వారా).. చెట్లనే ఆవాసాలుగా మార్చుకుని పక్షులు తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి. అందుకే.. వృక్ష ప్రేమికులు ‘వృక్షో రక్షతి రక్షితః’ అంటుంటే.. పక్షి ప్రేమికులు ‘పక్షో రక్షతి రక్షితః’ అంటున్నారు. సాక్షి, అమరావతి: దేశంలో గత 25 సంవత్సరాల్లో 126 పక్షి జాతుల ఉనికి స్థిరంగా ఉండటంతోపాటు కొంతమేర వృద్ధి రేటు కూడా నమోదైంది. మన జాతీయ పక్షి నెమలి మనుగడ సురక్షితంగా ఉండటమే కాకుండా.. 100 శాతం వృద్ధి కనిపిస్తోంది. మన ఆత్మీయ పక్షి పిచ్చుక పరిస్థితి కూడా ఆశాజనకంగానే ఉంది. స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ నివేదికలో ఈ విషయాలు స్పష్టమయ్యాయి. మన దేశంలో గుర్తించిన 1,300 పక్షి జాతుల్లో 867 పక్షి జాతుల ప్రస్తుత స్థితి, దీర్ఘకాలంలో వచ్చే మార్పుల గురించి ఈ నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో 52 శాతం పక్షి జాతుల ఉనికి ప్రమాదంలో పడింది. వేటాడి జీవించే పక్షులు, వలస పక్షులు, పశ్చిమ కనుమల్లో మాత్రమే కనిపించే పక్షులు బాగా తగ్గిపోతున్నట్టు తేలింది. ఈ నివేదికను దేశంలో 15 వేలకుపైగా ఉన్న పక్షుల వీక్షకులు (బర్డ్ వాచర్స్) ఇచ్చిన కోటి పరిశీలనల ఆధారంగా రూపొందించడం గమనార్హం. దీన్నిబట్టి పక్షుల పట్ల ఆసక్తి పెరిగి బర్డ్ వాచింగ్ (వీక్షణ)కు ఆదరణ పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. పక్షుల్ని రక్షించాలనే సంకల్పంతో.. పక్షుల్ని సంరక్షించాలనే సంకల్పంతో బెంగళూరుకు చెందిన ‘ఎర్లీ బర్డ్’ అనే సంస్థ బహుముఖ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ‘బర్డ్ వాచింగ్’ కాన్సెప్ట్ ముందుకు తీసుకెళుతోంది. బర్డ్ వాచింగ్‌ను కొత్తగా మొదలుపెట్టే వారికి పక్షుల పేర్లు, వాటి వివరాలు తెలిపే వనరులు పెద్దగా లేకపోవడం ఇబ్బంది కలిగించే అంశం. ఈ కొరత తీర్చడానికి బెంగళూరుకు చెందిన ‘ఎర్లీ బర్డ్’ అనే సంస్థ పిల్లలు, పెద్దలను ప్రకృతికి, పక్షులకు దగ్గర చేసే లక్ష్యంతో వివిధ రకాల వనరులను పలు భాషల్లో తయారు చేసి అందుబాటులోకి తెచ్చింది. పక్షుల పేర్లు, వాటి అలవాట్లు, వాటి జీవన విధానాల గురించి వివరించే రకరకాల ఆటలు, పాకెట్ గైడ్, పోస్టర్లు తెలుగుతో సహా వివిధ ప్రాంతీయ భాషల్లో తయారు చేశారు. మన పరిసరాల్లో కనిపించే పక్షులు, చిత్తడి నేలల్లో నివసించే పక్షులు, అడవుల్లో ఉండే పక్షులు, పచ్చిక బయళ్లు, గడ్డి మైదానాలు, పంట పొలాల్లో కనిపించే వాటి గురించి పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వారి పాకెట్ గైడ్ చిన్న పిల్లలకే కాకుండా పెద్దవాళ్లకి కూడా పక్షుల పేర్లు, వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ‘ఎర్లీ బర్డ్’ తమ పోస్టర్లు, పక్షులకు సంబంధించిన వనరులను ప్రభుత్వ పాఠశాలు, స్వచ్ఛంద సంస్థలకు ఉచితంగా అందిస్తోంది. ఇప్పటివరకు సుమారు 3 లక్షల మంది పిల్లల్ని చేరుకోగలిగారు. దీని వివరాలను www.early&bird.in/telugu/ వెబ్సైట్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బర్డ్ వాచర్స్ సహాయంతోనే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బర్డ్ వాచర్స్ అందించిన వివరాలతో పక్షుల వలస సమయాలు, వాటి సంఖ్యలో హెచ్చుతగ్గులు, అవి ఎదుర్కొంటున్న ముప్పు వంటి విషయాలను శాస్త్రవేత్తలు విశ్లేషించగలుగుతున్నారు. బర్ద్ వాచింగ్ ద్వారా సామాన్యులు కూడా శాస్త్రవేత్తలకు సహాయపడే అవకాశం లభించింది. ఈ అభిరుచితో బర్డ్ వాచర్స్ పరోక్షంగా పక్షుల పరిరక్షణకు తద్వారా ప్రకృతి పరిరక్షణకు సహాయపడగలుగుతున్నారు. బర్డ్ వాచింగ్తో మొబైల్, టీవీలకు దూరంగా పిల్లలు, పెద్దలు ప్రకృతిలో సమయం గడపడం వల్ల మానసిక, శారీరక ప్రయోజనాలు పొందుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. – చంద్రశేఖర్ బండి, బర్డ్ వాచర్ -
ఎయిర్‌పోర్టులో విమానాలకు పక్షుల బెడద
కృష్ణా (గన్నవరం): అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు పక్షుల బెడద తప్పడం లేదు. విమానాశ్రయ పరిసరాల్లో డంప్ చేస్తున్న జంతు కళేబరాలు, మాంసం వ్యర్థాలు, చెత్తాచెదారం కారణంగా పక్షుల సంచారం విపరీతంగా పెరిగింది. ఫలితంగా తరచూ విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో పక్షుల వల్ల తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. గతంలో ఇక్కడ పలుమార్లు విమానాలను పక్షులు ఢీకొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ సమయాల్లో విమానాలకు తృటిలో ప్రమాదాలు తప్పినా అధికారులు మాత్రం అప్రమత్తం కావడం లేదు. ఈ తరహా సంఘటనలు జరిగినప్పుడు విమానాశ్రయ పరిసరాల్లో ఆక్రమ చెత్త డంపింగ్ నివారణపై సమావేశాలు నిర్వహించి హడావుడి చేస్తున్న అధికారులు ఆచరణలో మాత్రం విస్మరిస్తున్నారు. విమానాశ్రయం చుట్టూ ఉన్న గ్రామాలు ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలను డంపింగ్ యార్డులుగా ఉపయోగిస్తున్నాయి. విమానాశ్రయ రన్‌వేకు అతిసమీపంలో ఉన్న కొత్తపేట వద్ద పాటిగోతుల్లో మాంసం దుకాణదారులు వ్యర్థాలను మూటలు కట్టి తీసుకువచ్చి పడవేస్తున్నారు. దీనికితోడు జంతు కళేబరాలు, చెత్తా చెదారం యథేచ్ఛగా ఇక్కడ డంప్ చేస్తున్నారు. దీంతో వీటి కోసం వచ్చే గద్దలు పక్కనే ఉన్న రన్‌వేపైకి చేరుతున్నాయి. రాజీవ్‌నగర్‌తో పాటు ఎయిర్‌పోర్టు తూర్పు వైపు ఉన్న వాగు కూడా పక్షుల సంచారానికి కారణమైంది. ఇంకా రాజీవ్‌నగర్ కాలనీ, బుద్ధవరం వైపు విమానాశ్రయ పరిసరాల్లో పారిశుద్ధ్యం మరీ అధ్వానంగా ఉంది. దీనికితోడు విజయవాడ హోటళ్లలోని వ్యర్థాలను రాత్రి వేళల్లో ఆటోల్లో తీసుకువచ్చి కేసరపల్లి, ఎయిర్‌పోర్టు పరిసరాల్లో డంప్ చేస్తున్నారు. వీటివల్ల పక్షుల సంచారం పెరిగి విమానాల రాకపోకల సమయంలో ఆటంకం ఏర్పడుతోంది. దీనితో పక్షులను బెదరకొట్టేందుకు ఎయిర్‌పోర్టు సిబ్బంది బాణసంచా ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది. గుణపాఠం నేర్వని అధికారులు గత పదేళ్ల వ్యవధిలో ఇక్కడ విమానాలను ఏడుసార్లకు పైగా పక్షులు ఢీకొన్నాయి. తరచూ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో పక్షుల వల్ల విమాన పైలెట్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పక్షులు ఢీకొనడం వల్ల ఇప్పటివరకు ఎయిరిండియా, స్పైస్‌జెట్, ఎయిర్కొస్తా, జెట్ ఎయిర్వేస్కు చెందిన విమానాలు సర్వీస్‌లు రద్దు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. పక్షులు ఢీకొన్నప్పుడు విమాన రెక్కలు, ఇంజన్ భాగాలు దెబ్బతిని సదరు విమాన సంస్థలకు రూ.కోట్లలో నష్టం కూడా వాటిల్లింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఎయిర్‌పోర్టు అధికారులు సమావేశాలు నిర్వహించి పక్షుల నివారణ, అక్రమ డంపింగ్ అరికట్టేందుకు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పంచాయతీ, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో అనధికార డంపింగ్ యథావిధిగా కొనసాగుతోంది. దీనితో విమానాలకు పక్షుల బెడద తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎయిర్‌పోర్టు పరిసరాల్లో మాంసం వ్యర్థాలు, జంతు కళేబరాలు, చెత్తాచెదారం డంప్ చేయకుండా చర్యలు తీసుకోవాలని విమాన ప్రయాణికులు కోరుతున్నారు. కొరవడిన ఎయిర్‌పోర్టు సహకారం విమానాశ్రయ పరిసర గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఎయిర్‌పోర్టు నుంచి సహకారం కొరవడింది. సామాజిక బాధ్యత పథకం కింద ఎయిర్‌పోర్టు అథారిటీ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు అవసరమైన సామగ్రిని అందించే వెసులుబాటు ఉంది. దీనికోసం ఏటా జరిగే పర్యావరణ సమావేశంలో ఎయిర్‌పోర్టు చుట్టూ ఉన్న బుద్ధవరం, కేసరపల్లి, అల్లాపురం, గన్నవరం గ్రామ పంచాయతీల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో చెత్త నిర్వహణకు రిక్షాలు, డస్ట్బిన్లు, ఎస్సీ, బీసీ ఏరియాల్లో డ్రైనేజీ నిర్మాణాలకు ఎయిర్‌పోర్టు అధికారులకు ప్రతిపాదనలు ఇస్తున్నప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహకారం అందించలేదని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పారిశుద్ధ్య నిర్వహణకు ఎయిర్‌పోర్టు అథారిటీ గ్రామ పంచాయతీలకు తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నారు. -
వి‘హంగామా’.. విదేశీ పక్షులతో ‘తేలుకుంచి’ పులకింత
సాక్షి, శ్రీకాకుళం: పచ్చని చెట్లు తెల్లటి దుప్పటి కప్పుకున్నాయా.. అన్నట్లు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామంలో విదేశీ పక్షులు కనువిందు చేస్తున్నాయి. మేఘాల పల్లకిలో వేల కిలోమీటర్లు అలుపూ సొలుపు లేకుండా పయనించి అబ్బురపరుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు చిత్ర విచిత్రమైన చప్పుళ్లతో చెట్లపై సందడి చేస్తున్నాయి. ఇవీ ప్రత్యేకతలు.. చెట్లపై కొమ్మలు, రెమ్మలు ఉంటే తప్ప గూడు ఏర్పాటు చేసుకోలేని ఈ పక్షులు గుడ్లు పెట్టేందుకు చెట్లనే ఆశ్రయిస్తుంటాయి. ఒక్కో పక్షి 2 నుంచి 6 గుడ్లు వరకు పెడుతుంటాయి. 27 నుంచి 30 రోజుల వరకు తల్లి పక్షి గుడ్లు పొదుగుతుంది. పొదిగిన రోజు నుంచి 36 రోజుల పాటు ఆహారాన్ని తీసుకువచ్చి అందించి సంరక్షిస్తాయి. పిల్ల పక్షులు ఎగిరేంత వరకు తల్లి పక్షి గానీ, మగ పక్షి గానీ గుళ్లలో కాపలాగా ఉంటాయి. ఏటా తొలకరి జల్లులు కురిసే జూన్‌లో సైబీరియా నుంచి వస్తోన్న ఈ పక్షుల అసలు పేరు ఓపెన్ బిల్ స్టార్క్స్ (నత్తగొట్టు కొంగలు, చిల్లు ముక్కు కొంగలు). శాస్త్రీయ నామం ‘అనస్థోమస్’. తూర్పు–దక్షిణాసియా ఖండంలో ముఖ్యంగా భారత్, శ్రీలంక నుంచి మొదలుకొని తూర్పు ప్రాంతంలో విస్తారంగా సంచరిస్తుంటాయి. వీటి జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. బాగా ఎదిగిన పక్షి 81 సెంటీమీటర్ల పొడవు, 11 కిలోల బరువు ఉంటుంది. రెక్కలు విప్పారినప్పుడు 149 సెంటీ మీటర్ల వరకు ఉంటుంది. పగలంతా తంపర భూములు, వరి చేలల్లో తిరుగుతూ చేపలు, నత్తలు, కప్పలు, పురుగులు, ఆల్చిప్పలను ఆహారంగా తీసుకుంటాయి. 6 నెలల పాటు పిల్లలతో గడిపిన పక్షులు పిల్లలు ఎగిరేంత బలం రాగానే డిసెంబర్, జనవరిలో తమ ప్రాంతాలకు పయనమవుతుంటాయి. మోడువారిన చెట్లపై నివసిస్తున్న పక్షులు ఆడపడుచుల్లా విదేశీ పక్షులు.. ఈ పక్షులను తేలుకుంచి గ్రామస్తులు తమ ఆడపడుచుల్లాగా భావిస్తుంటారు. గ్రామస్తులకు వాటితో విడదీయరాని అనుబంధం ఉంది. సకాలంలో పక్షులు గ్రామానికి చేరకపోతే ఇక్కడి ప్రజలు ఆందోళనపడుతుంటారు. ఏటా జూన్‌లో ఈ పక్షుల రాకతోనే నైరుతి పవనాలు ఆరంభమవుతాయని గ్రామస్తుల నమ్మకం. వీటి రాకతో తమ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండుతాయని వారి విశ్వాసం. తాము కూర్చున్న చోట పక్షులు వాలుతాయే తప్ప ఎవ్వరికీ ఎటువంటి హాని చేయవని, వీటిని వేటగాళ్ల బారినుంచి తామే రక్షిస్తుంటామని గ్రామస్తులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా పక్షులకు హాని తలపెట్టాలని చూస్తే గ్రామ కట్టుబాటు ప్రకారం ఆ వ్యక్తికి గుండు గీయించి ఊరేగిస్తారు. తిత్లీ, పైలాన్ తుఫాన్ తీవ్రతకు చెట్లు నేలకొరగడంతో విహంగాలకు తేలుకుంచిలో విడిదిలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఏడాదికి వీటి సంఖ్య 30–40% తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం పక్షులు గూళ్లు పెట్టేందుకు నానాపాట్లు పడుతున్నాయి. చెట్లనే ఆవాసాలుగా ఏర్పాటు చేసుకునే ఈ పక్షులు చెట్లు లేక గడ్డికుప్పలు, ఇళ్లపై, పంట పొలాల చాటున గూళ్లు పెట్టుకునేందుకు సిద్ధపడుతున్నాయి. రాత్రి సమయాల్లో విష పురుగులు బారినపడి పక్షులు మృతి చెందుతున్నాయి. పక్షులను సంరక్షించేందుకు గ్రామంలో చెట్లు పెంచాలని అధికారులకు తేలుకుంచి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
గుండెల్ని పిండేస్తున్న వీడియో.. స్పందించిన గడ్కరీ కార్యాలయం
వైరల్: గుండెల్ని పిండేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్లో వైరల్ అవుతోంది. రోడ్డు విస్తరణలో భాగంగా జేసీబీతో ఓ భారీ వృక్షాన్ని నేల్చకూల్చగా.. అంతకాలం ఆ చెట్టు మీద గూళ్లు కట్టుకుని జీవిస్తున్న పక్షులు చెల్లాచెదురు అయిపోయాయి. అంతకంటే బాధాకరం ఏంటంటే.. పాపం ఆ చెట్టు కిందే నలిగి కొన్ని చనిపోవడం. వైరల్ అయిన ఈ వీడియో.. కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం దాకా చేరడంతో చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు. వైరల్ అవుతున్న వీడియోలో కొన్ని పక్షులు ఎగిరిపోగా.. మరికొన్ని పక్షులు, పిల్ల పక్షులు మాత్రం సమయానికి ఎగరలేక ఆ చెట్టు కిందే నలిగి చనిపోయాయి. అక్కడున్న చాలామంది పక్షుల పరిస్థితిని చూస్తూ అరవడం వీడియోలో గమనించొచ్చు. It not about road widening.. It’s about “how we treat other living-beings on earth..” Hope concerned authorities must have taken needful legal action..#wilderness #UrbanEcology #nature #ConserveNature pic.twitter.com/aV16cIWmo8 — Surender Mehra IFS (@surenmehra) September 2, 2022 చెట్టు నెలకొరిగాక.. చనిపోయిన పక్షుల్ని బాధతో ఒకవైపుగా వేశారు స్థానికులు. ప్రస్తుతం ఈ విషాదకరమైన వీడియో వైరల్ అవుతోంది. దీంతో చాలామంది కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ట్యాగ్ చేస్తూ.. ఫిర్యాదులు చేశారు. మనుషులు ఎంత క్రూరంగా మారిపోయారో అని కామెంట్లు చేస్తున్నారు చాలామంది. దీనికి ఫలితం అనుభవించక తప్పదంటూ మరికొందరు కామెంట్లు చేశారు. అయితే.. ఈ ఘటన ఆగష్టు తొలివారంలోనే కేరళ మలప్పురం జిల్లా తిరురంగడి వీకే పడి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఐఎఫ్ఎస్ అధికారి సురేందర్ మెహ్రా ఈ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. క్రూరమైన ఈ పనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాన్ని కోరారు. మరోవైపు ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ కూడా ఈ వీడియోను పోస్ట్ చేసి తన అసంతృప్తి వెల్లగక్కారు. అటు ఇటు తిరిగి ఈ వీడియో కాస్త గడ్కరీ కార్యాలయానికి చేరింది. దీంతో.. Everybody need a house. How cruel we can become. Unknown location. pic.twitter.com/vV1dpM1xij — Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 2, 2022 నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయం స్పందించింది. విషయం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దాకా వెళ్లిందని, ఆయన వీడియో చూసి విచారం వ్యక్తం చేశారని తెలిపింది. సేవల్ వెట్‌ల్యాండ్స్ ఇంటర్నేషనల్ మూమెంట్ సీఈవో థామస్ లారెస్స్ ఫిర్యాదు మేరకు.. స్వయంగా స్పందించిన మంత్రి నితిన్ గడ్కరీ.. ఈ ఘటనకు సంబంధించిన కాంట్రాక్టర్‌ను, బాధ్యులైన వాళ్లను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. రంగంలోకి దిగిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్‌ను, స్థానిక అధికారులను కోరింది. మరోవైపు ఈ ఘటనపై కేరళ అటవీ శాఖ విభాగం స్పందించింది. ఆ చెట్టు కూల్చివేతలకు అనుమతులు లేకపోవడంతో జేసీబీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కేరళ అటవీ పరిరక్షణ శాఖ మంత్రిణేకే ససీంద్రన్ ఈ ఘటనను క్రూరమైన చర్యగా అభివర్ణించారు. తమ అనుమతులు లేకుండానే ఈ ఘటన జరిగిందని ఆయన నేషనల్ హైవేస్ అథారిటీపై ఆరోపణలు గుప్పించారు. ఇదీ చదవండి: మనిషి జీవితం నీటి బుడగ.. అందుకు ఉదాహరణే ఈ వీడియో -
మళ్లీ కూసిన గువ్వ
వలస పక్షుల కిల.. కిల.. రావాలతో శేషాచలం కళకళలాడుతోంది. రంగురంగుల ఈకలు.. చూడచక్కని ముక్కులతో.. కొమ్మరెమ్మలపై ఎగురుతూ.. నింగిలో ఆహ్లాదకరమైన విన్యాసాలు చేస్తూ.. వినసొంపైన కిల..కిల.. రావాలతో శేషాచలం అడవులకు వలస పక్షులు మరింత అందం తీసుకొచ్చాయి. ఇప్పటికే శేషాచల కొండల్లో 215 రకాల పక్షి జాతులుండగా.. ఇప్పుడు వలస పక్షులు వాటికి తోడయ్యాయి. మూడేళ్లుగా వర్షాలు బాగా కురుస్తుండటంతో శేషాచల అడవుల్లోని జంతువులకు, పక్షులకు ఆహారం సమృద్ధిగా లభిస్తోంది. దీనివల్లే ఉత్తర భారతదేశంతో పాటు వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి అరుదైన పక్షులు శేషాచలం బాట పట్టాయని శాస్త్రవేత్త కార్తీక్ చెప్పారు. వాటిలో కొన్నింటిని తన కెమెరాలో బంధించినట్లు తెలిపారు. –తిరుపతి అలిపిరి శేషాచలం చేరిన వాటిలో ప్రత్యేకమైనవి.. బ్లాక్ నేప్డ్ మోనార్క్ ఫ్లై క్యాచర్: సాధారణంగా ఈ రకంలో మగ పక్షులు బ్లూ కలర్‌లోనూ.. ఆడ పక్షులు గ్రే కలర్‌లోనూ ఉంటాయి. వీటికి సిగ్గు ఎక్కువ. స్ట్రీక్ త్రోటెడ్ ఉడ్‌పెకర్: ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. పచ్చగానూ.. తలపై ఆరెంజ్ కలర్ జుట్టుతోనూ దర్శనమిస్తుంటాయి. భారతదేశంలోని 12 రకాల ఉడ్ పెకర్స్లో ఈ జాతి అరుదైనది. గ్రీన్ ఇంపీరియల్ పీజియన్: అనేక ఏళ్ల తర్వాత ఇది కళ్యాణి డ్యాం ప్రాంతంలో కనిపించింది. అరుదైన పావురాల్లో ఇది ఒకటి. చైనా, మలేసియా, ఫిలిప్పీన్స్, నేపాల్‌లలో ఇవి కనిపిస్తుంటాయి. ఏసియన్ పారడైజ్ ఫ్లైక్యాచర్: చిన్న తల, పొడవాటి తోక, ఆరెంజ్ కలర్లో ఉండే ఈ పక్షి శేషాచలంలో అరుదుగా కనిపిస్తుంటుంది. చామల రేంజ్‌లోని కోటకాడపల్లి ప్రాంతంలో కెమెరాకు చిక్కింది. మధ్య ఆసియా దేశాల్లో ఈ పక్షులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇండియన్ స్కాప్స్ ఔల్: దక్షిణ ఆసియాలో కనిపించే గుడ్లగూబ ఇది. దీని అరుపులు చాలా వింతగా>.. భయాందోళనకు గురి చేస్తుంటాయి. దీని కళ్లు పెద్దగా ఉంటాయి. కళ్యాణి డ్యాం ప్రాంతంలో ఇటీవల ఇది దర్శనమిచ్చింది. ఎల్లో త్రోటెడ్ బుల్బుల్: పసుపు పచ్చగా.. ముద్దుగా కనిపించే ఈ పక్షులు ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంటాయి. చాలా అరుదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ఈ పక్షులు కపిలతీర్థం ప్రాంతంలో కనిపించడం విశేషం. టికెల్స్ బ్లూ ఫ్లైక్యాచర్: ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చిన అరుదైన జాతి పిట్ట ఇది. చిన్న ముక్కు, పసుపు రంగు గొంతు దీని ప్రత్యేకత. శేషాచలంలో ఈ పిట్టలు సందడి చేస్తున్నాయి. కాపర్ స్మిత్ బార్బెట్: ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’తో కాపర్ స్మిత్ బార్బెట్ను పోల్చవచ్చు. కాపర్ ప్లేట్‌పై సుత్తితో కొడితే ఎలా సౌండ్ వస్తుందో.. ఈ పిట్ట అరిస్తే అలా ఉంటుంది. వివిధ వర్ణాల్లో ఉండే ఈ పిట్ట.. తన అందంతో మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది. బ్లాక్ హుడెడ్ ఓరియోల్: పసుపు, నలుపు రంగుల్లో అందంగా ఉండే ఈ పక్షి ప్రస్తుతం శేషాచలంలో దర్శనమిస్తోంది. ఆరెంజ్ హెడెడ్ త్రష్: ఆరెంజ్ కలర్లో ఉన్న ఈ పక్షి బ్రహ్మదేవ గుండంలో కనిపించింది. ఇది హిమాలయ ప్రాంతం నుంచి వచ్చినట్లుగా కార్తీక్ చెప్పారు. అనేక ఏళ్ల తర్వాత.. శేషాచలంలో ఇప్పటి వరకు 180 రకాల పక్షులను ఫొటోలు తీశాను. ఈ ఏడాది కళ్యాణి డ్యాం, కపిలతీర్థం, మామండూరు, బాలపల్లి, కలివిలేటి కోన, బ్రహ్మదేవ గుండం, మొగిలిపెంట, చామల రేంజ్‌లోని తలకోన, కోటకాడపల్లి తదితర ప్రాంతాల్లో అరుదైన పక్షులు కనిపించాయి. చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ దర్శనమిచ్చాయి. – కార్తీక్, బర్డ్స్మెన్, తిరుపతి -
భారత్‌లో బయటపడ్డ అరుదైన డైనోసార్ల గుడ్లు!
భోపాల్: డైనోసార్లు(రాక్షస బల్లులు).. వీటి రూపం ఎలా ఉంటుందో సినిమాల ద్వారా అందరికీ పరిచయమే. భౌతికంగా ఈ జాతులు మిలియన్ల సంవత్సరాల కిందటే అంతరించినా.. ఈ భూమ్మీద వీటి అవశేషాలు శిలాజాల రూపంలో బయల్పడుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో అరుదైన రాక్షస బల్లుల గుడ్లను వెలికితీశారు పరిశోధకులు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలోని డైనోసార్ ఫోసిల్ నేషనల్ పార్క్ లో తవ్వకాలు చేపట్టారు. ఈ సందర్భంగా పది డైనోసార్ గుడ్ల అవశేషాలను వెలికితీశారు. ఇప్పటివరకు లభ్యమైన గుడ్లతో పోల్చితే ఇవి ఎంతో భిన్నంగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవన్నీ అసాధారణరీతిలో ఉన్నట్టు గమనించారు. సారోపోడ్ వర్గానికి చెందిన టిటానోసారస్ డైనోసార్లకు చెందినవిగా నిర్ధారించారు. ఓవమ్ ఇన్ ఓవో.. ఒక గుడ్డులోనే మరొక గుడ్డు ఏర్పడి ఉండడంతో రీసెర్చర్లు ఆశ్చర్యపోయారు. శాస్త్ర పరిభాషలో ఈ స్థితిని ‘ఓవమ్ ఇన్ ఓవో’ అంటారు. సాధారణంగా.. గుడ్డులోనే గుడ్డు ఉండడం అనే స్థితి పక్షుల్లో అధికంగా కనిపిస్తుందని. సో.. టిటానోసారస్ డైనోసార్లకు పక్షులకు మధ్య దగ్గరి సంబంధం ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.ధార్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో ఇప్పటికే 52 టిటానోసారస్ సారోపోడ్స్ డైనోసార్ గూడులను(పక్షుల మాదిరి) వెలికితీశారు. లక్షల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించి, ప్రతికూల వాతావరణం కారణంతోనే డైనోసార్లు అంతరించి పోయాయన్నది అందరికీ తెలిసిందే. -
పాపం ఆ పెద్దాయన చేసింది నేరమా? నెటిజన్స్ ఫైర్
Charged with unlawfully feeding wildlife: నేరాలు సైతం విచిత్రంగా ఉండొచ్చు. వాటి గురించి విన్నప్పుడు.. అసలు అది ఒక నేరమేనా అని సందేహం కలుగుతుంటుంది. ఇక్కడొక వ్యక్తి అలాగే విచిత్రమైన ఆరోపణలతో కటకటాల పాలయ్యాడు. యూఎస్‌లోని 71 ఏళ్ల డోనాల్డ్ అంటాల్ అనే వ్యక్తి తన ఇంటి ముందు కొన్ని పక్షుల కోసం ట్రైలు ఏర్పాటు చేశాడు. వాటిల్లో అవి తినే వేరుశనక్కాయలు, కొన్ని గింజలను ఆహారంగా పెడుతుంటాడు. ఐతే ఇదంతా నచ్చని పొరిగింటివారు అతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల అతన్ని అరెస్టు చేశారు. పైగా వన్యప్రాణులకు చట్టవిరుద్ధంగా ఆహారం పెడుతున్నాడంటూ అభియోగాలు మోపీ మరీ అరెస్టు చేశారు. పక్షుల కోసం చాలా ఆహార ట్రైలు పెడుతున్నాడు ఇది విలేజ్ ఆఫ్ సోడస్ పాయింట్ లోకల్ ఆర్డినెన్స్ ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించడమే అంటూ ఆరోపణల చేసి అరెస్టు చేశారు. అంతేకాదు ఈ ఆరోపణలతోటి ఆ వృద్ధుడిని ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో ఎట్టకేలకు పోలీసులు మంచి చేసేవారిని అరెస్టు చేయాలనుకుంటున్నారంటూ.. మండిపడుతున్నారు నెటిజన్స్. (చదవండి: అరటి పండు ఎంత పనిచేసింది.. 120 మందికి ఆసుపత్రిలో చేరిక) -
వావ్.. అద్భుతం.. చూసి నేర్చుకుందాం భయ్యా!
సాక్షి, హైదరాబాద్: మనిషి గమనించాలేగానీ అనంతమైన అద్భుతాలు, విశేషాలకు నిలయం ప్రకృతి. నేర్చుకోవాలేగానీ, ప్రతీ జీవన సూత్రం, ధర్మం ప్రకృతిలో ఇమిడి ఉంది. సాధారణంగా నిస్సహాయులకు, జవసత్త్వాలుడిగిన పెద్దలకు, తల్లీదండ్రులకు ..వారి వారసులు, పిల్లలు సేవలు చేయడం సహజం. అది మానవధర్మం కూడా. నేటి ఆధునిక సమాజంలో ఎంతమంది ఈ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ ఆహారాన్ని సేకరించుకోలేకపోతున్న ముసలి పక్షికి, బుజ్జి పక్షులు ఆహారాన్ని తెచ్చి పెట్టడం చూశారా. ఆకలితో ఉన్న పెద్ద పక్షులకు చక్కగా ఆహారాన్ని నోటికి అందిస్తున్న వీడియో విశేషంగా నిలుస్తోంది. అద్భుతం అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను హరి చందన (ఐఏఎస్) ట్విటర్లో షేర్ చేశారు. ప్రకృతి ధర్మాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్న యంగ్ బర్డ్స్ ని మీరు కూడా చూసేయండి! Young #birds feeding older 🐦 who are unable to search for #food. #lessons from #nature. pic.twitter.com/cmbzSKTen5 — Hari Chandana IAS (@harichandanaias) May 19, 2022 -
111 జీవో ఎత్తివేతతో జరిగేది ఇదే?
సాక్షి, హైదరాబాద్: సుదూర ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు ఏటా వలస వచ్చే రాజహంసలు.. బాతులు.. కొంగలు.. గోరింకలు.. డేగలు తదితర పక్షుల జాడ క్రమంగా కనుమరుగు కానుందా? జీవో 111 ఎత్తివేతతో సుందర జలాశయాల చుట్టూ గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, కాంక్రీట్ మహారణ్యం పెరిగి.. శబ్ద, వాయు కాలుష్యం, పక్షుల సహజ ఆవాసాలైన జలాశయాలను కాలుష్య కాసారంగా మార్చేయనుందా? ఈ ప్రశ్నలకు పర్యావరణ వేత్తలు, పక్షి ప్రేమికులు అవుననే సమాధానమిస్తున్నారు. ► సైబీరియా.. యూరప్.. ఆఫ్రికా.. మయన్మార్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ తదితర దేశాల నుంచి జంట జలాశయాలకు ఏటా అక్టోబరు నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో వేలాదిగా విభిన్న రకాల పక్షి ప్రజాతులు తరలివస్తాయి. హిమాయత్‌సాగర్‌కు సుమారు 200 వరకు గుజరాత్ నుంచి రాజహంసలు వలస రావడం పరిపాటే. మొత్తంగా ఈ జలాశయానికి 52 రకాలు, ఉస్మాన్‌సాగర్‌కు 92 రకాల పక్షి జాతులు వలస వస్తాయి. ► జలాశయాల చుట్టూ గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడిన పక్షంలో వలస పక్షులకు సమీప భవిష్యత్‌లో గడ్డు పరిస్థితులు తప్పవని పక్షి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. విభిన్న రకాల గోరింక ప్రజాతులకూ ఇక్కట్లేనని చెబుతున్నారు. సుమారు పదివేల కిలోమీటర్ల దూరం నుంచి వలసవచ్చే బార్‌హెడ్‌గూస్ (బాతు) జాడ కూడా కనిపించదని స్పష్టం చేస్తున్నారు. ఆఫ్రికా ఖండం నుంచి వలస వచ్చే పైడ్ క్రస్టెడ్ కకూ అనే పక్షి రాక ఉండదని చెబుతున్నారు. వలస వచ్చే ప్రధాన పక్షి జాతులివే: గుజరాత్ రాజహంసలు (గ్రేటర్ ఫ్లెమింగోలు), పిన్‌టెయిల్డ్ డక్(బాతు), షౌలర్,గార్గినే టేల్, హ్యారియర్స్ డేగలు, ఫ్లైక్యాచెస్, గోరింక ప్రజాతికి చెందిన రోజీపాస్టర్స్, స్టార్‌లింక్స్, భార్మెడోగూస్ బాతు, పైడ్ క్రస్టడ్ కకూ వీటిలో ప్రధానంగా కొంగలు, బాతులు, డేగలు, గుడ్లగూబలు, నీటికోళ్లు తదితర జాతులున్నాయి. (క్లిక్: ఈ పిల్లిని ఎలా రక్షిస్తారు? పోలీసు ఫేస్బుక్లో పోస్టు చేస్తూ..) నగరీకరణ, కాలుష్యం పెరిగితే కష్టమే జంటజలాశయాల చుట్టూ సమీప భవిష్యత్‌లో పట్టణీకరణ ప్రభావం, శబ్ద, వాయు కాలుష్యాలకు అవకాశం ఉంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వలస వచ్చే పక్షిజాతుల జాడ కనిపించదు. జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుంది. – డాక్టర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్, జంతుశాస్త్ర విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం -
బుజ్జి పిట్ట.. బుల్లి పిట్ట.. పక్షి ప్రేమికుల విలక్షణ ఆలోచన
అనకాపల్లి: సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ సమయం.. పశుపక్ష్యాదులకు గడ్డుకాలం. పల్లెల్లో పక్షులకు ఏదో రూపంలో ఆహారం, నీరు సమకూరుతాయి. పట్టణ ప్రాంతాల్లో జంగిల్ కాంక్రీట్ పుణ్యమా అని నీరు లభించడమే కష్టమవుతోంది. అందుకే పక్షి ప్రేమికులు వాటి కోసం విలక్షణంగా ఆలోచించారు. పట్టణాల్లో కూడా ఆహారం, నీరు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. పర్యావరణ పరిరక్షణకు విశేష సేవలందించిన కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ ఆధ్వర్యంలో సేవామూర్తులు పక్షులకు అండగా నిలుస్తున్నారు. చదవండి👉: 11 ఏళ్ల కిందట సంచలనం.. ఇప్పటి యువ ఐపీఎస్‌లకు పాఠమైంది.. పక్షి జాతిని కాపాడుకుందామని ప్రదర్శన చేస్తున్న విద్యార్థినులు నూనె డబ్బాను నాలుగు అరలుగా అమరిక చెట్ల వద్ద ఆహారం, నీటి సౌకర్యం గ్రీన్‌క్లబ్ వ్యవస్థాపకుడైన కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. తాను పని చేసే పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దే అలవాటు ఉన్న శ్రీధర్ మాస్టారు.. పర్యావరణ పరిరక్షణలో కూడా ముందుంటారు. వేసవి నేపథ్యంలో పట్టణంలో అక్కడక్కడా ఉండే చెట్ల వద్ద అలమంటించే పక్షులకు ఆహారం, నీటిని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నూనె డబ్బాలను సగానికి కోసి దాంట్లో నాలుగు అరలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క అరలో కొర్రలు, గంట్లు వంటి ఆహార పదార్థాలను, మరో అరలో నీటిని వేసి చెట్లకు కట్టించారు. నీటి బాటిళ్లను మట్టిపాత్రలకు అమర్చి పలు చోట్ల ఏర్పాటు చేశారు. పక్షిజాతిని కాపాడుకోవాలని పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొక్కకు అమర్చిన మట్టిపాత్ర పక్షుల కోసమే.. ఇప్పటికే చాలా పక్షిజాతులు అంతరించిపోయాయి. వేసవికాలంలో అవి పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నగరాల్లో పక్షులకు ఆహారం, మంచినీరు అందించే లక్ష్యంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. పక్షి జాతులకు ఎంతో కొంత సహాయం చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. ఈ మహాయజ్ఞంలో చాలా మంది పాలు పంచుకుంటున్నారు. – ఫణిభూషణ్ శ్రీధర్, క్లబ్ వ్యవస్థాపకుడు -
పక్షులన్నీ కలిసి రాకాసి పక్షిలా.. ఎందుకిలా..?
రోబో–2 చూశారుగా.. అందులో చిన్నచిన్న పక్షులన్నీ కలిసి ఓ భారీ రాకాసి పక్షిగా మారుతాయి.. ఇది కూడా దా దాపు అలాంటిదే.. ఇటీవల ఐర్లాండ్‌లోని లాక్ ఎనెల్ సరస్సు వద్ద మందలుమందలుగా ఎగురుతున్న ఈ బుల్లి పిట్టలు ఇలా ఓ భారీ పక్షి ఆకారాన్ని తలపించాయి. ఈ చిత్రాన్ని ఐరిష్ ఫొటోగ్రాఫర్ జేమ్స్ క్రాంబీ క్లిక్‌మని పించారు. పిట్టలు గుంపులుగా ఎగరడాన్ని ఆంగ్లంలో మర్మురేషన్ అంటారు. ఇంతకీ ఇవి ఎలా ఎందుకు కలిసి ఎగురుతాయో తెలుసా? ముఖ్యంగా తమను వేటాడే భారీ పక్షుల నుంచి భద్రత కోసమట.. వేలాదిగా ఉండటంతో.. ఒక్కదాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం వాటికి కష్టమవుతుందట. అంతేకాదు.. రాత్రి వేళల్లో వెచ్చదనం కోసం.. మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందన్న సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా ఇలా గుంపుగా ఎగురుతాయట. చదవండి: (ఈ మగ దోమలు చాలా మంచివి.. యవ్వనంలోకి వచ్చేలోపే చనిపోతాయట) -
తేనెపిట్ట మాటలు వింటారా?
అందరిలాగే ఒకానొక సమయంలో హమ్మింగ్ బర్డ్ గురించి విన్నది అనూష శంకర్. ఈ అతిచిన్న పక్షి అతి చురుకుదనం, గొంతు మార్చే నైపుణ్యం, ముక్కును తన రక్షణ కోసం ఆయుధంగా వాడే బలం...ఇలా ఎన్నో విషయాలు విన్నది అనూష. ఈ ఆసక్తి తనను పక్షుల ప్రేమికురాలిగా మార్చింది. పర్యావరణ వేత్త కావడానికి కారణం అయింది. పుణెలో పుట్టి పెరిగిన అనూష పైచదువుల కోసం చెన్నై వెళ్లింది. అక్కడ జంతుశాస్త్రం, బయోటెక్నాలజీలలో డిగ్రీ చేసింది. న్యూయార్క్‌లోని స్టోనీ బ్రూక్ యూనివర్శిటీలో ‘ఎకాలాజీ అండ్ ఎవల్యూషన్’ అనే అంశంపై పీహెచ్డీ చేసింది. ‘పక్షులకు సంబంధించి నాకు ఎన్నో సందేహాలు, ప్రశ్నలు ఉండేవి. వాటిని తీర్చే వ్యక్తులు, పుస్తకాలు ఉండేవి కాదు. ఈ లోటు వల్ల నాలో అన్వేషణ మొదలైంది. రకరకాల విషయాలను స్వయంగా తెలుసుకోవడంలో ఎంతో తృప్తి లభించింది’ అంటున్న అనూష తాను తెలుసుకున్న విషయాలను రచనలు, ఉపన్యాసాలు, వీడియోల రూపంలో జనాలలోకి తీసుకెళుతుంది. తన పరిశోధనలో భాగంగా అస్సాం అడవులలో ఒంటరిగా కొన్ని వారాలపాటు గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో అడవిలో చెట్లు, పుట్టలు, పక్షులు, జంతువులు తన ఆత్మీయనేస్తాలు అయ్యాయి. వాటితో మౌనసంభాషణ చేసేది. ఈ నేపథ్యంలోనే హమ్మింగ్ బర్డ్ గురించి ఆనోటా ఈనోటా ఎన్నో విషయాలు విన్నది. ఎన్నో పుస్తకాల్లో చదివింది అనూష. ఇదిమాత్రమే కాకుండా తానే స్వయంగా రంగంలోకి దిగింది. హమ్మింగ్ బర్డ్‌పై పది సంవత్సరాల పాటు పరిశోధన చేసింది. ఈక్వెడార్ క్లౌడ్ఫారెస్ట్... మొదలైన ఎన్నో ప్రాంతాలకు వెళ్లింది. ‘మన వ్యక్తిత్వవికాసానికి అవసరమైన పాఠాలు, ఆరోగ్యస్పృహకు సంబంధించిన అంశాలు హమ్మింగ్‌బర్డ్ జీవితం నుంచి విస్తృతంగా లభిస్తాయి’ అంటుంది అనూష. నిజమే మరి! అతి చిన్నదైన హమ్మింగ్ పక్షిలో జీవక్రియ శక్తివంతమైనది. దీనికి ఆ పక్షి తీసుకునే జాగ్రత్తలు కూడా ఒక కారణం. పరిమితమై శక్తితో అపరిమితమైన శక్తిని ఎలా సమకూర్చుకుంటుంది, అత్యంత ప్రతికూల వాతావరణంలో సైతం ఏ మాత్రం నష్టం జరగకుండా తనను తాను ఎలా కాపాడుకుంటుంది, ఎనర్జీ బడ్జెట్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటుంది... మొదలైన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు హమ్మింగ్‌బర్డ్ జీవితంలో ఉన్నాయి. మనం ఆ తేనెపిట్ట మాటలు విందాం... మన జీవితాలలో కూడా తేనెను నింపుకుందాం. -
చిన్ని ప్రాణుల చలివేంద్రాలు
సాక్షి, విశాఖపట్నం: వేసవి వచ్చిందంటే చాలు నీటి చుక్క కోసం అల్లాడిపోతాం. కాలు బయటపెడితే.. కాసిన్ని నీళ్లు ఎక్కడ దొరుకుతాయా అని ఆశగా వెదుకుతుంటాం. ఎప్పటికప్పుడు ఉష్ణతాపాన్ని తీర్చుకునేందుకు ఏదో రూపంలో నీటిని శరీరానికి అందిస్తుంటాం. అందుకే వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చాలాచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మరి మూగజీవాల పరిస్థితి ఏమిటి? చుక్క నీటి కోసం మైళ్ల దూరం ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. పక్షి జాతుల్లో కొన్ని అంతరించిపోవడానికి వేసవీ ఒక కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేమా? అని కెన్ ఫౌండేషన్ సభ్యులకు కలిగిన ఆలోచన.. నేడు నగరంలో వేలాది పశుపక్ష్యాదుల దాహార్తిని తీరుస్తోంది. 10 ఏళ్లుగా ఎన్నో జీవాలకు వేసవిలో ఊపిరిపోస్తోంది. సాధారణంగా పక్షుల శరీర సాధారణ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్. ఈ ఉష్ణోగ్రత దాటితే ఎక్కువ సేపు జీవించలేవు. అందుకే చాలా పక్షులు ఎక్కడ నీరు కనిపిస్తే అందులో మునకేస్తూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకుంటాయి. ప్రస్తుతం నగరంలో వేసవి నేపథ్యంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు సమీపిస్తోంది. ఈ తరుణంలో పక్షుల సంరక్షణకు నడుం బిగించింది నగరానికి చెందిన కెన్ ఫౌండేషన్. సేవే మార్గంగా.. విద్యార్థులు వలంటీర్లుగా.. సంస్థ అధ్యక్షుడు పుల్లేటికుర్తి సంతోష్ ఈ సంస్థ తరఫున వాటర్ బౌల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. 100 తొట్టెలతో ప్రారంభమై.. పక్షులను వేసవి తాపం నుంచి రక్షించి వాటి దాహార్తి తీర్చే ఉద్దేశంతో 2012లో కెన్ ఫౌండేషన్ నగరంలో వాటర్ బౌల్ పేరుతో సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలి ఏడాది ఫౌండేషన్ వలంటీర్లే నగరంలోని పలుచోట్ల 100 నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. ఆ వాటర్ బౌల్స్ వద్దకు పక్షులు, మూగజీవాలు వచ్చి నీటిని తాగుతుండటం చూసి నగర ప్రజలు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తామూ ఈ వాటర్ బౌల్ ప్రాజెక్ట్‌లో భాగస్వాములమవుతామని ముందుకువచ్చారు. దీంతో వాటర్ బౌల్ ప్రాజెక్ట్‌ను విస్తరించారు. పిచ్చుకలు, రామచిలుకలు, పావురాలు, కోయిలలు, కాకులతో పాటు ఉడుతలు, ఆవులు, కుక్కలు కూడా ఈ వాటర్ బౌల్స్ వద్దకు చేరుకుని తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి. సంస్థ చైర్పర్సన్ గీతానారాయణ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నీటి తొట్టెల ఖర్చును భరిస్తూ.. అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. 2017 వరకు 750 నీటి తొట్టెలు పంపిణీ చేయగా.. 2021 నాటికి ఆ సంఖ్య 1800 కు చేరింది. ఈ ఏడాది 150 నుంచి 200 వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నగరమంతా విస్తరణ నగరంలోని అనేక చోట్ల నుంచి జంతు ప్రేమికులు ఈ వాటర్ బౌల్స్‌ను తీసుకుని వెళ్తున్నారు. ఇంకా ఎవరైనా పక్షి ప్రేమికులుంటే మరికొన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెందుర్తి, విశాలాక్షినగర్, కొత్తవలస, స్టీల్‌ప్లాంట్, అనకాపల్లి, డాల్ఫిన్ నోస్... ఇలా శివారు ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు వచ్చి నీటితొట్టెలను తీసుకెళ్తున్నారు. ఈ నీటితొట్టెల్లో నీటిని నింపి మేడ చివర్లో కానీ, పెరడులో గానీ పెడితే పక్షులు అక్కడికి చేరి దాహాన్ని తీర్చుకుని ఉపశమనం పొందుతున్నాయి. ఐదేళ్లుగా సరఫరా చేసిన నీటి తొట్టెల వద్దకు ఎన్నో పక్షులు కాలంతో పనిలేకుండా వస్తుండటం విశేషం. ఉచితంగా అందిస్తాం.. వేసవి వస్తే మనుషుల కోసం అడుగడుగునా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ మూగజీవాల గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అందుకే మా ఫౌండేషన్ తరఫున వాటర్ బౌల్ ప్రాజెక్ట్ ప్రారంభించాం. ఇవి జంతువులకు, పక్షులకు చలివేంద్రాలు. నగరంలోని అనేక కళాశాలలు, ప్రైవేట్ సంస్థల్లో కూడా వీటిని ఏర్పాటుచేశాం. మూగ జీవాలను ప్రేమించేవారు ఎవ్వరు వచ్చినా.. ఉచితంగా నీటితొట్టెలు అందిస్తాం. ఆసక్తి ఉన్న వారు 98856 74949ను సంప్రదించవచ్చు. – పుల్లేటికుర్తి సంతోష్, కెన్ ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రజల స్పందన అనూహ్యం కెన్ ఫౌండేషన్ తరఫున ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. 100 చోట్ల పెట్టి వాటినే ప్రతి ఏటా కొనసాగించాలని భావించాం. అయితే.. నీటి తొట్టెలు చూసిన వారు ఇళ్ల వద్ద కూడా పెడతామని సంప్రదించారు. దీంతో ఆరేళ్లుగా దీన్ని కొనసాగిస్తున్నాం. – గీతానారాయణ్, చైర్పర్సన్, కెన్ ఫౌండేషన్ -
ఇది ‘టీల్’ గుంపు.. రెక్కలు విప్పి రెపరెపలాడుతూ
రెక్కలు విప్పి రెపరెపలాడుతూ ఆకాశమే హద్దుగా ఎగురుతున్నాయి విదేశీ విహంగాలు. సిలువ బాతుగా పిలిచే నలుపు రంగులో ఉండే టీల్ పక్షులు ఇలా గుంపులుగా విహరిస్తూ కనువిందు చేశాయి. ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే దారిలో కొల్లేరు వద్ద కనిపించిన దృశ్యమిది. –సాక్షి ఫొటోగ్రాఫర్, ఏలూరు(ప.గో.జిల్లా) -
వందలాది పక్షలు ఆకాశంలో విహరిస్తూ ఒకేసారి భూమిపై పడి చివరికి..: షాకింగ్ వీడియో
Hundreds Of Yellow Headed Blackbirds Falling From The Sky: ఇంతవరకు మనం జంతువులకు, పక్షులకు సంబంధించిన రకరకాల వైరల్ వీడియోలను చూశాం. అంతేకాదు వివిధ రకాల అందమైన పక్షులు సందడి చేసి అలరించిన వీడియోలను వీక్షించాం. గానీ ఒకేసారి పక్షలు మంద ఆకాశంలో విహరిస్తూ చనిపోవడం వీడియోల్లో చూసి ఉండం. అలాంటి సంఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...మెక్సికోలో పసుపు రంగు తలతో ఉన్న ఒకే రకమైన వందలాది పక్షలు ఆకాశంలో విహరిస్తూ చనిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోలో వందలాది పక్షలు మందగా ఆకాశంలో విహరిస్తూ ఉన్నట్టుండి ఒకేసారి భూమి మీద పడి విగత జీవులుగా మారిపోయాయి. అందులో కొన్ని నెమ్మదిగా తేరుకుని ఎగిపోయాయి కూడా. నిపుణలు మాత్రం బహుశా ఒక వేటాడే పక్షి ఈ పక్షలు మందను వేటాడి ఉండవచ్చు. అప్పుడు ఒకేసారి ఎగిరే క్రమంలో ఒక్కసారిగా కింద పడి చనిపోయి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ మేరకు యూకే సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ హైడ్రాలజీకి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ రిచర్డ్ బ్రౌటన్ మాట్లాడుతూ.. "పెరెగ్రైన్ లేదా హాక్ వంటి రాప్టర్ పక్షుల మందను వెంబడిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ క్రమంలో ఆ పక్షలు మంద బలవంతంగా కిందకు వెళ్లడంతో అవి చనిపోయాయి" అని అన్నారు. అంతేకాదు వీడియో ఫుటేజ్‌లో వందలాది పక్షలు వీధుల్లో హఠాత్తుగా పడిపోయినట్లు కనిపించింది. పైగా అందులో చాలా వరకు ఎగిరిపోగా...కొన్ని చెల్లాచెదురుగా పడిపోయి చనిపోయి ఉన్నాయి. అయితే ఈ వీడియోని వీక్షించిన నెటిజన్లు ఈ వీడియో వెనుక 5 జీ సాంకేతికత ఉందని కొందరు , మరికొందరేమో షార్ట్ సర్యూట్ జరడంతోనే అవి అలా పడిపోయాయి అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. WARNING: GRAPHIC CONTENT Security footage shows a flock of yellow-headed blackbirds drop dead in the northern Mexican state of Chihuahua pic.twitter.com/mR4Zhh979K — Reuters (@Reuters) February 14, 2022 (చదవండి: తొలిసారిగా పైలెట్ లేకుండానే దూసుకెళ్లిన హెలికాప్టర్.. ఎలాగో తెలుసా!!) -
కిలకిలరావాల రోజ్ పీటర్స్.. స్టేట్ గెస్ట్ హౌస్ ఏరియా కేరాఫ్ అడ్రస్
సాక్షి, విజయవాడ: విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంతం.. అక్కడ ఏ చెట్టుపై చూసినా పిట్టల గుంపులే. సెల్ టవర్లు, విద్యుత్ తీగలు ఇలా వాలేందుకు అనువుగా ఉన్న ప్రతిచోటా పక్షుల సందడే. సాయంత్రం అయిందంటే చాలు ఆ ప్రాంతం వేలాదిగా వచ్చే రోజ్ పీటర్స్ పక్షుల కిలకిలరావాలతో సందడిగా మారిపోతుంది. ఏటా ఇదే సీజన్లో వచ్చే ఈ పక్షులకు స్టేట్ గెస్ట్ హౌస్ ఏరియా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. – కందుల చక్రపాణి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, విజయవాడ) కూర్మం కాదు..కంద! సాక్షి, తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండల గ్రామం ఎరుకలపూడిలో ప్రకృతి రైతు ముళ్లపూడి రంగయ్య వ్యవసాయ క్షేత్రంలో కంద దుంప ఒకటి 17 కిలోల బరువు ఊరింది. ఇది చూడటానికి తాబేలు ఆకారాన్ని పోలినట్లు ఉంది. రంగయ్య తన ఇంటిదగ్గరి క్షేత్రంలో ప్రకృతి పద్ధతుల్లో రకరకాల పండ్లతోపాటు కందను సాగుచేస్తున్నారు. – ఎరుకలపూడి (తెనాలి) -
అటపాకలో విహంగ సోయగం
కైకలూరు: అరకేజీ బరువున్న చేపను అమాంతంగా మింగేసే పక్షిని మీరెప్పుడైనా చూశారా? వివిధ రంగుల కలబోత పక్షి ఉన్నట్లు మీకు తెలుసా.. చేపలను చిన్న చిన్న ముక్కలు చేసి పిల్లల నోటిలో పెట్టి మాతృత్వ ఆనందాన్ని పొందే అతిథి గురించి విన్నారా.. సహజత్వం ఉట్టిపడే పక్షుల బొమ్మలు, ముట్టుకుంటే మధురంగా వినిపించే ధ్వనులు ఇలా ఒకటేంటి అటపాక పక్షుల కేంద్రంలో.. ప్రతి దృశ్యాన్ని కనులారా చూసి ఆస్వాదించాల్సిందే. పెలికాన్ ప్యారడైజ్.. రాష్ట్రంలో పెలికాన్ ప్యారడైజ్‌గా పేరుపొందిన అటపాక పక్షుల విహార కేంద్రానికి శీతాకాలపు వలస విదేశీ పక్షుల రాక ఊపందుకుంది. కొల్లేరు ఆపరేషన్ తర్వాత ప్రకృతి తన సహజసిద్ధ వాతావరణాన్ని సంతరించుకోవడంతో.. 188 రకాల విదేశీ అతిథి పక్షులకు ఆవాసంగా మారి ప్రకృతి ప్రేమికులను పులకరింపజేస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మైళ్ల దూరాన్ని ఛేదించి పక్షులు కొల్లేరుకు చేరుకుంటున్నాయి. ఇకపోతే.. అటపాక పక్షుల కేం ద్రం వద్దకు వచ్చిన పర్యాటకుల పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు, ఊయల వం టివి రారమ్మని పిలుస్తుంటాయి. మ్యూజియంలో ఏర్పాటు చేసిన పక్షుల నమూనా బొమ్మలు సహజత్వం ఉట్టిపడేలా ఉంటాయి. కొల్లేరులో బోటుపై వెళుతూ పక్షులను దగ్గర నుంచి చూడడం జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టంగా నిలిచిపోతుంది. ఆలనా..పాలనా అటవీశాఖదే.. అటపాక పక్షుల కేంద్ర నిర్వహణ అటవీశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇక్కడ పక్షుల విహారానికి అనువుగా 280 ఎకరాల చెరువు ఉంది. అందులో 162 స్టాండ్లు ఉన్నాయి. వీటిపై పెలికాన్, పెయింటెడ్ స్టా్కక్, వైట్ ఐబీస్, కార్బొనెంట్ పక్షులు కొలువుదీరాయి. ఇప్పటికే పెలికాన్ పక్షులు సంతానోత్పత్తి చేశాయి. పక్షుల పిల్లల వయసు నెల రోజులు దాటింది. వాటి కేరింతలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బోటు షికారుకు రెండు బోట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సందర్శకులకు అనుమతిస్తారు. -
ఉత్సాహంగా బర్డ్ వాక్ ఫెస్టివల్
సాక్షి, మంచిర్యాల: బర్డ్ వాక్ ఫెస్టివల్‌కు విశేష స్పందన వచ్చింది. శనివారం తెల్లవారు జామున 5 గం. నుంచే అడవుల్లో సందర్శకుల సందడి మొదలైంది. పక్షులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు, వాటి కూతలు వినేందుకు వివిధ ప్రాంతాల నుంచి వంద మందికిపైగా పేర్లు నమోదు చేసుకోగా, అధికారులు కోవిడ్ కారణంగా 60 మందికే అనుమతి ఇచ్చారు. తొలి రోజు కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్, సిర్పూర్ టీ, బెజ్జూరు, పెంచికల్‌పేట అడవుల్లో బర్డ్ వాక్ కొనసా గింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, సిద్దిపేటతోపాటు ఇతర ప్రాంతాల పక్షి ప్రేమికులు అడవుల్లో కలియదిరిగారు. కెమెరాల్లో పక్షుల ఫొటోలను బంధించారు. ఆసిఫాబాద్ డీఎఫ్‌వో ఎస్.శాంతారామ్ మాట్లాడుతూ.. కరోనాతో అనేక మంది చాలా కాలం ఇంటికే పరిమితమయ్యారని అలాంటి వారు ప్రకృతితో గడిపేందుకు ఈ సందర్శన మంచి అవకాశమని అన్నారు. ఆదివారం కూడా ఈ ఫెస్టివల్ కొనసాగుతుంది. -
పిట్ట నడక.. చూద్దాం రండి!
సాక్షి, మంచిర్యాల: ‘‘ఓ పుల్లా, ఓ పుడకా, ఎండుగడ్డి, చిన్నకొమ్మ, చిట్టిగూడు.. పిట్ట బతుకే ఎంతో హాయి’’ అంటూ తన పాటతో పక్షుల జీవితాన్నో ఉత్సవం చేశాడు ప్రజావాగ్గేయకారుడు గోరటి. అలాంటి పక్షుల జీవితాన్ని చూడాలనుకునేవారికో మంచి అవకాశం బర్డ్‌వాక్ ఫెస్టివల్. సహజ సిద్ధ ఆవాసాల్లో పక్షుల కిలకిల రాగాలు, విభిన్న పిట్టల గుంపులు, జంట పక్షుల తుళ్లింతలను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం అటవీశాఖ కల్పిస్తోంది. ఈ నెల 8, 9న రెండోవిడత బర్డ్‌వాక్ ఫెస్టివల్‌ను ఆసిఫాబాద్ జిల్లా అటవీఅధికారులు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల పాటు కవ్వాల్ టైగర్ రిజర్వు, ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో ఈ బర్డ్‌వాక్ సాగనుంది. కాగజ్‌నగర్ అడవుల్లో పక్షుల సందడి పాలరాపుగుట్ట సహా... తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు అడవుల్లో పక్షుల ఆవాసాలు చూడొచ్చు. దేశంలో అంతరించిపోయే స్థితిలో ఉన్న పొడుగు ముక్కు రాబంధుల ఆవాసమైన పాలరాపుగుట్టతో సహా ఎంపిక చేసిన 21 ప్రాంతాల్లో ఈ బర్డ్ వాక్ జరగనుంది. సిర్పూర్, బెజ్జూరు, పెంచికల్‌పేట, మంచిర్యాల జిల్లా జన్నారం అడవుల్లో ఎన్నో అరుదైన పక్షులున్నాయి. 250పక్షి జాతులు సందర్శకులను కనువిందు చేయనున్నాయి. ఇప్పటికే కర్ణాటక, నాగ్‌పూర్, చంద్రాపూర్, హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ తదితర ప్రాంతాల నుంచి వన్యప్రాణి, ప్రకృతి ప్రేమికులు, వైల్డ్ ఫొటోగ్రాఫర్లు తమ ఆసక్తిని చూపించారు. రిజిస్ట్రేషన్ ఆధారంగా అవకాశం.. కోవిడ్ నేపథ్యంలో పరిమితంగా ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి అవకాశం కల్పిస్తున్నారు. ఒకరికి రూ.2వేలు ఫీజు. వివరాలకు డీఎఫ్‌వో (ఆసిఫాబాద్) 9440810099, ఎఫ్‌డీవో(జన్నారం) 9440810103 నంబరులో సంప్రదించవచ్చు. ఈ నెల 7న కాగజ్‌నగర్ అటవీ ఆఫీసులో నేరుగా మధ్యాహ్నం 3నుంచి 6గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. వీక్షకులకు అంతర్గత రవాణా, వసతి సౌకర్యం అటవీశాఖ కల్పిస్తుంది. పక్షుల సంరక్షణకు దోహదం పక్షుల సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజెప్పడంతో పాటు కొత్త పక్షుల గుర్తింపు, అధ్యయనం కోసం ఈ బర్డ్‌వాక్ దోహదపడుతుంది. ఎంపిక చేసిన ప్రాం తాల్లో సందర్శకులు అధికారుల సమక్షంలో పక్షులను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. వన్యప్రాణి నిపుణులు, వైల్డ్ ఫొటోగ్రాఫర్లు, పక్షి ప్రేమికులు పాల్గొనవచ్చు. – ఎస్.శాంతారామ్, జిల్లా అటవీ అధికారి, ఆసిఫాబాద్ -
ఇప్పటివరకు 25 వేల పక్షులు.. వావ్ వాట్ ఏ సీన్!
బరంపురం: నగర శివారులోని బహుదా నదీ తీరాన విదేశీ అతిథి పక్షులు సందడి చేస్తున్నాయి. తొలిసారిగా ఇక్కడికి విచ్చేస్తున్న విహంగాలను చూసి నగరవాసులు ఆనందం వ్యక్త చేస్తున్నారు. ఏటా శీతాకాలంలో గంజాం జిల్లా, బరంపురం దగ్గరలోని చిలికా సరస్సులో ఉన్న 24 దీవులకు విదేశాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో వలస పక్షులు వచ్చి, విడిది చేస్తుంటాయి. ఎప్పటిలాగే కాకుండా ఈ ఏడాది రికార్డు స్థాయిలో 185 జాతులకు చెందిన దాదాపు 10 లక్షల పక్షులు చిలికాకు చేరుకోవడంతో, వాటిలో కొన్నింటి నివాసం ఏర్పాటుకు కాస్త అడ్డంకి ఏర్పడింది. దీంతో విడిది కోసం సరస్సుకు సమీపంలోని బహుదా నదికి కొన్ని పక్షులు చేరుకుంటున్నట్లు సమాచారం. ఇదంతా చూస్తున్న అక్కడి వారు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే మరింత బాగుంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు 25 వేల పక్షులు నదీ తీరానికి చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల నదీ తీరంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును అక్కడి అడవిలోకి తరలించేందుకు వెళ్లిన బరంపురం అటవీ శాఖ అధికారుల ద్వారా అతిథి పక్షుల ఆచూకీ వెలుగులోకి రావడం విశేషం. ప్రస్తుతం నది పరిసర ప్రాంతాల్లో నివాసం ఏర్పరుచుకుని 25 వేల వరకు పక్షులు ఉన్నట్లు గుర్తించినట్లు డీఎఫ్ఓ అముల్యకుమార్ ప్రధాన్ తెలిపారు. చదవండి: కొన్ని రోజులు కాపురం చేసి ముఖం చాటేశాడు.. 44 రోజుల పాటు పగలు, రాత్రి.. చివరికి -
National Bird Day 2022: బుల్లి గువ్వా.. ఎక్కడమ్మా నీ సవ్వడి
సాక్షి, హైదరాబాద్: పొద్దున్నే లేవగానే ఉదయిస్తున్న సూర్యుడినీ, అప్పుడే విచ్చుకుంటున్న పువ్వుల్ని, పసి పాపల నవ్వుల్ని చూస్తే మనసుకు భలే హాయిగా ఉంటుంది కదా. అలాగే బాల్కనీలో కూర్చుని వేడి వేడి కాఫీ తాగుతూ చిరప్ చిరప్ అంటూ ఎగిరే బుజ్జి బుజ్జి పిట్టల్ని, పావురాల్ని, పిచ్చుకల్ని చూస్తోంటే వచ్చే ఆనందాన్ని మీరు ఎపుడైనా ఆస్వాదించారా? ఆ ఇపుడు అవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటారా? ఆ ఆవేదన నుంచి వచ్చిందే జాతీయ పక్షుల దినోత్సవం. అంతరించిపోతున్న పక్షుల్ని, కాపాడుకునేందుకు, పక్షుల అవసరం, ఉనికిపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతీ ఏడాది జనవరి 5న నేషనల్ బర్డ్ డే ని పాటిస్తాం. పెంపుడు జంతువులైన కోళ్లు, బాతులతో పాటు పావురాలు, నెమళ్లు, చిలుకలు, పిచ్చుకలు, కోకిల. కాకులు, వడ్రంగిపిట్టలు, గద్దలు, డేగలు తదితర పక్షులు జీవన పరిణామ క్రమంలో, మానవ జీవితాల్లో, మనుషుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. కానీ. పర్యావరణ వ్యవస్థలలో కాలానుగుణ మార్పులతో దురదృష్టవశాత్తూ చాలా పక్షులు అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా నశించిపోతున్న అడవులు, సెల్ టవర్లు, ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా పిచ్చుకలు పూర్తిగా కనుమరుగవుతున్న సందర్భంలో మనం ఉన్నాం. దీనికి తోడు చట్టవిరుద్ధమైన పెంపుడు జంతువుల వ్యాపారం కారంణంగా మరింత ప్రమాదం కలుగుతోంది. నిజానికి చాలా పక్షులు, పిట్టల పేర్లు నేటి తరానికి తెలియవు. కేవలం పుస్తకాల్లోనో, కంప్యూటర్ గ్రాఫిక్స్‌లోనో చూసి తెలుసుకోవాల్సిన దుస్థితి. భారత్‌లో తగ్గిపోతున్న పక్షుల జాబితాలో గద్దలు, రాబందులు, పిచ్చుకలు, ముందు వరుసలో నిలుస్తున్నాయి. ఉగాది సందేశాన్ని అందించే కోకిలమ్మను వెతుక్కోవాల్సిన పరిస్థితి. దేశవ్యాప్తంగా ఉన్న అనేక వాగులు, చెరువుల్లోకి వలస వచ్చే పక్షులు కూడా భారీ తగ్గుదల కనిపిస్తోందని పలు అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదే సమస్య జీవావరణ శాస్త్రవేత్తలను కలవర పెడుతోంది. అమెరికా, కెనడాల్లో 300 కోట్ల పక్షుల మాయమైపోయాయట. అలాగే ఒకప్పుడు ఆస్ట్రేలియా ఆగ్నేయ భాగంలో ఎక్కువగా కనిపించే రీజెంట్ హనీఈటర్ అనే పక్షి అంతరించిపోతున్న జీవ జాతుల జాబితాలోకి చేరిపోయింది. అంతేకాదు ఆడపక్షుల్ని తమ పాటతో ఆకట్టుకునే మేల్ హనీఈటర్ పక్షులు తమ సహజసిద్ధమైన పాటను కూడా మర్చిపోతున్నాయంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రోజుకురోజుకు ఈ ముప్పు మరింత ముంచుకొస్తోంది. ఒకప్పుడు పావురాలు ప్రేమ సందేశాల్ని పంపేందుకు మాత్రమే కాదు కీలక సమాచారాన్ని చేరవేసే వార్తాహరులుగా పనిచేశాయి. సప్తవర్ణ రంజితమై పురి విప్పి ఆడే నెమలి నాట్యం, చిలుకలు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. అలాగే గూడు కట్టుకోవడంలో చాలా పక్షుల నైపుణ్యానికి మన ఆధునిక ఇంజనీర్లు కూడా అబ్బురపడాల్సిందే. ఇక గిజిగాడు గూడు.. అదేనండి పిచ్చుక గూళ్లతో ప్రతీ పల్లె కళకళలాడుతూ ఉండేది. అంతేనా ఆకు ఈనెలతో తోకను చక్కగా అలంకరించుకునే చిలుకలు, చక్కటి గూడు అల్లుకునే బుజ్జిపిట్టలు.. అచ్చం చిన్నపిల్లల ఏడుపులా అరిచే పిట్టలు..అంతెందుకు పక్షిని చూసే కదా మన రైట్ బ్రదర్స్ విమానాల్ని సిద్ధం చేసింది. ఇలా మనం గమనించాలే గానీ ప్రకృతి అంతా టెక్నాలజీ మయం. ఇకనైనా కనుమరుగవుతున్న వందల జాతుల పక్షుల మనుగడ కోసం పక్షి ప్రేమికుల్లాగా కృషి చేద్దాం. అన్నట్టు బర్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్. తెలంగాణ అటవీ శాఖ బర్డ్ వాక్ సెకండ్ యానివర్సరిలో భాగంగా జనవరి 8-9 తేదీల్లో 250 కంటే ఎక్కువ రకాల పక్షులను చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. లెట్స్ గో అండ్ ఎంజాయ్.. -
కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం..బాతులు, కోళ్లను చంపేయండి!
తిరువనంతపురం: ఓవైపు కరోనా కేసులు.. మరోవైపు బర్డ్ ఫ్లూ విజృంభణ.. వైరస్ల బెడదతో కేరళ అతలాకుతలం అవుతోంది. కేరళలో బర్డ్ ఫ్లూ నిర్థారణ కావడం ఇది రెండోసారి. అలప్పుజ జిల్లాలో బర్డ్‌ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. బాతులు, కోళ్లను చంపాలని నిర్ణయించాయి. మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు విధించాయి. తకాళి పంచాయితీ పరిధితో పాటు హరిప్పడ్ మునన్సిపాలిటీలోనూ ఈ వైరస్‌ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ నియంత్రణ కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్ని కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటించిన అధికారులు.. వాహనాలు, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. సరిహద్దు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కిలోమీటరు పరిధిలో ఉన్న బాతులు, కోళ్లు, ఇతర పక్షులను చంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వలస పక్షులకు వైరస్ సోకిందో లేదో నిర్ధారించాలని అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్‌కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా జిల్లాలో బర్డ్ ఫ్లూ నివారణ చర్యలపై రోజువారీ నివేదిక సమర్పించాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు. చదవండి: ఒమిక్రాన్ అలజడి: భారత్‌లో మరో రెండు కేసులు.. -
మరో అందమైన మగ తోడు కనిపిస్తే భర్తకు విడాకులే..
న్యూఢిల్లీ: మనిషి జీవితంలో వివాహానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. జీవితంలో ఏదో ఒక దశలో తోడు అవసరం అవుతుంది. ఇది గమనించే మనకు పెళ్లి, పిల్లలు, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు పెద్దలు. అయితే దురదృష్టం కొద్ది విడాకులు అనే సౌలభ్యాన్ని కూడా ఏర్చర్చుకున్నాడు మనిషి. విడాకులు అనేది ఇద్దరు వ్యక్తులనే కాక.. రెండు కుటుంబాలను తీవ్రంగా బాధపెడుతుంది. అయితే దంపతులు విడిపోవాలనుకోవడానికి ప్రధాన కారణం.. వారి మధ్య మూడో వ్యక్తి ప్రవేశించడం. పిల్లలు ఎదుగుతున్న సమయంలో దంపతులు విడాకులు తీసుకుంటే అది పిల్లల భవిష్యత్‌పై చాలా తీవ్ర పరిణామాలు చూపిస్తుంది. ఇప్పుడు ఈ విడాకులు ముచ్చట ఎందుకంటే మనుషుల మాదిరే పక్షుల్లో కూడా విడాకులు సంప్రదాయం ఉందట. జంట పక్షి నచ్చకపోయినా.. వేరే పక్షి అందంగా కనిపించినా.. వెంటనే భాగస్వామికి విడాకులు ఇచ్చేస్తాయట. అలానే తప్పుడు భాగస్వామిని ఎన్నుకున్నట్లు భావించినప్పుడు కూడా విడాకులు తీసుకుంటాయట. ఈ విషయాలను ఓ ప్రముఖ పరిశోధకుడు తెలిపారు. (చదవండి: విడాకులపై పూనమ్ సంచలన వ్యాఖ్యలు, కాసేపటికే ట్వీట్ డిలీట్) కొన్ని సంవత్సరాల క్రితం, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ)లోని వన్యప్రాణి విభాగానికి చెందిన ప్రొఫెసర్ హెచ్ఎస్ఎ యాహ్యా ఉర్దూలో ఒక పుస్తకాన్ని రాశారు. గార్డ్-ఓ-పెష్ అనే తన 11వ పుస్తకంలో, పక్షుల మధ్య సంబంధాల గురించి పరిశోధనా వాస్తవాలను ముందుకు తెచ్చాడు. దీని వెనుక ఆయన 4 దశాబ్దాల పరిశోధన ఉంది. ప్రొఫెసర్ యాహ్యా 40 ఏళ్లకు పైగా పక్షులపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ పుస్తకంలో, ఆయన చాలా అసాధారణమైన వాస్తవాలను వెల్లడించారు. ప్రొ.యాహ్యా తన పరిశోధనల కోసం కాలిఫోర్నియా, స్కాట్లాండ్, సౌదీ అరేబియా తదితర అనేక దేశాలను సందర్శించారు. ముఖ్యంగా వార్బెట్ జాతుల పక్షులు, నార్కోండమ్ హార్న్ బిల్, ఖర్మోర్, తెల్ల రెక్కల బాతు మొదలైన వాటిపై ఆయన విస్తృత పరిశోధనలు చేశారు. (చదవండి: టెక్కీ దంపతులు.. 3 నెలలకే విడాకుల వరకు, ఎందుకిలా జరుగుతోంది?) ఈ పరిశోధనల అనంతరం ఆయన గుర్తించింది ఏంటంటే పక్షులు కూడా విడాకులు ఇస్తాయట. ప్రొఫెసర్ యాహ్యా పరిశోధన ప్రకారం, బయా పక్షులు అత్యధిక జంటలను ఏర్పరుస్తాయి. మగ పక్షి గూడు నిర్మాణం ప్రారంభించి.. అసంపూర్ణంగా వదిలివేస్తుంది. మిగిలిన గూడును జంటగా మారిన తర్వాత, మగ, ఆడ రెండూ కలిసి పూర్తి చేస్తాయి. రెండు కలిసి ఆ గూట్లో నివసిస్తాయి. (చదవండి: ఈ చెట్టు పిట్టలని చంపుతుంది.. కారణం తెలుసా!?) ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఆడ బయా పక్షికి.. తన సహచరుడి కంటే మెరుగైన మగతోడు దొరికినప్పుడు.. మొదటిదానిని వదిలి.. కొత్తగా దొరికిన తోడుతో వెళ్లిపోతుందట. ప్రొఫెసర్ యాహ్యా పరిశోధన ప్రకారం, పాలియాండ్రీ, అమెరికన్ మాకింగ్ బర్డ్స్ అనే జాతుల పక్షుల్లో ఆడ పక్షి.. ఒకదాని కంటే ఎక్కువ మగ పక్షులతో సంబంధం కలిగి ఉంటుందని తెలిపారు. బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ జాతుల పక్షులు కూడా ఇలానే ప్రవర్తిస్తాయట. ఒకటి కంటే ఎక్కువ మంది భాగస్వాములతో సంబంధాల కారణంగా స్త్రీ, పురుషుల మధ్య విడాకులు ఎలా సంభవిస్తాయో.. పక్షుల్లో కూడా ఇదే కారణంగా విడాకులు సంభవిస్తాయని ప్రొఫెసర్ యాహ్య తెలిపారు. (చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్‌సిరీస్ తర్వాత సమంత ఆ నిర్ణయం తీసుకుంది) అలానే పక్షులు తప్పుడు భాగస్వామిని ఎన్నుకున్నట్లు గ్రహించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడాకులు తీసుకుంటాయట. ఆడ పక్షికి.. మరో మగ పక్షి మరితం ఆకర్షణీయంగా కనిపిస్తే.. తన పాత భాగస్వామిని వదిలివేస్తుందట. అదే సమయంలో, భాగస్వామి ప్రమాదంలో గాయపడితే విడాకులు తీసుకుంటాయట. పక్షులు బలహీనమైన సహచరులను ఇష్టపడరట. మనుషుల్లాగే అవి కూడా తమ జీవితానికి భద్రతను కోరుకుంటాయట. చదవండి: మాస్క్‌లు లేవు.. భౌతిక దూరం బాధే లేదు... -
Global Warming: నరక కూపం.. బతుకులు ‘పిట్ట’ల్లా రాలిపోవడమే!
ప్రకృతి ఎంత అందమైనదో.. తేడాలొస్తే అంతే వికృతమైంది కూడా. ముప్పు ఏ రూపంలో ముంచుకొచ్చినా.. కనుచూపు మేర జీవరాశిని వదలకుండా మింగేస్తుంటుంది. అలా గ్లోబల్ వార్మింగ్ అనే ముప్పు.. చాప కింద నీరులా విస్తరించేసింది ఇప్పటికే. అందుకు ప్రత్యక్ష సాక్క్ష్యం.. సముద్రపక్షుల జనాభా ఊహించని రేంజ్లో తగ్గిపోవడం. సముద్ర తీరాన్ని ఆవాసంగా చేసుకున్న పక్షులకు.. ఆ తీరమే ఇప్పుడు నరక కూపంగా మారింది. అధిక ఉష్ణోగ్రతలు, ఆహార కొరత, భయానక వాతావరణ మార్పులు.. సముద్ర పక్షుల జనాభాను గణనీయంగా పడగొట్టేస్తోంది. వీటికి తోడు పక్షుల్లో సంతానోత్పిత్తి సామర్థ్యం తగ్గిపోతుండడం కలవరపెడుతోంది. ఫసిఫిక్ మహాసముద్రంలోని హవాయ్ దీవులు, బ్రిటిష్ ఐలెస్, మైన్ కోస్ట్ వెంట పక్షులు రాలిపోతున్నాయి. గుడ్లు పొదిగిన పక్షులు.. పిల్లల ఆకలి తీర్చలేక, మరోవైపు ఆకలికి తట్టుకోలేక అక్కడి నుంచి తరలిపోయే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో పిల్ల పక్షుల ప్రాణాలు పోతున్నాయి. గూడు కట్టడంలో ఇబ్బంది కామన్ ముర్రే, కాస్సిన్స్ అవుక్లెట్ జాతి పక్షుల జనాభా దారుణంగా పడిపోయింది. ఆహారం దొరక్కపోవడం, సముద్ర మట్టం పెరగడం, వానలు, తరచూ వచ్చే తుపాన్లు.. ఇలాంటి కారణాలు వాటి జనాభాను తగ్గించేస్తున్నాయని ప్రకటించింది వైల్డ్‌లైఫ్ సర్వీస్ సంస్థ. ►20 శతాబ్దం మధ్య నుంచి 70 శాతం సీబర్డ్ పాపులేషన్ తగ్గిపోయిందని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు. ►అయితే ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ మాగెల్లనిక్ పెంగ్విన్ మనుగడ కొనసాగిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పరిశోధకులు చెప్తున్నారు. ►1991 నుంచి సౌతాఫ్రికా తీరం వెంట మూడొంతుల సముద్రపక్షులు తగ్గిపోతున్నాయని నివేదికలు చెప్తున్నాయి. ►చేపల సంఖ్య తగ్గిపోతుండడం కూడా పక్షుల సామూహిక మరణాలకు ఓ కారణం. ►2010లో పశ్చిమ తీరం వెంట కామన్ ముర్రేస్ గుట్టలు కొట్టుకురావడం చూసిందే. ►మైన్ తీరం వెంబడి ఉండే ఐకానిక్ సీబర్డ్, అట్లాంటిక్ ఫఫ్ఫిన్లు.. సంతానొత్పత్తి తగ్గడం, ఆహార కొరతతో నరకం అనుభవిస్తున్నాయి. ►అలస్కా, చుగాచ్ నేషనల్ ఫారెస్ట్ దగ్గర్లోని బీచ్ దగ్గరికి 8 వేల పక్షులు విగత జీవులుగా కొట్టుకు వచ్చాయి. ►ఉత్తర సముద్రం వెంట వేల మైళ్ల దూరంలో ప్రతికూల వాతావరణం పక్షుల జనాభా తగ్గిపోవడానికి కారణం అవుతోంది. ►సముద్రం, ఆ వాతావరణ స్వచ్ఛతను తెలియజేసే సముద్ర పక్షులు తగ్గిపోతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. -
ఈ పక్షి భలే స్నానం చేస్తోంది ఎలాగో తెలుసా !!
కొన్ని పెంపుడు జంతువులను యజమానులు ప్రత్యేకంగా స్నానం చేయించడం వంటివ చేస్తారు. పైగా వాటికి మంచి జాగ్రత్తలు తీసుకుని మరీ చేయిస్తారు. అయితే పక్షులను పెంచేవాళ్లు కూడా వాళ్లే శ్రద్ధగా చేయించడం అవి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. కానీ కొన్ని పక్షులకు వాళ్ల యజమానులు స్నానం చేయించకపోయినప్పటికీ వాటంతట అవే మంచిగా ఆసక్తిగా స్నానం చేస్తాయి. (చదవండి: దగ్గు మందు అక్రమ రవాణ.. వైద్యుడితో సహా ఆరుగురు అరెస్ట్) నిజానికి సాధారణంగా పక్షులు వాటికి బాగా దాహం వేసినప్పుడో లేదా వేసవి కాలంలో వేడి తట్టుకోలేక కాసేపు నదుల వద్ద మునకలు వేస్తుంటాయి. ఆ తర్వాత ఆ నీటిని రెక్కలతో విదిలించుకోవడం వంటివి చేస్తుంటాయి. కానీ ఇక్కడొక పక్షి ఎంతో ఆసక్తిగా తనకు తానుగా స్నానం చేస్తుంది. పైగా షింక్లోని టాప్ వాటర్‌ని అది షవర్బాత్గా ఫీలవుతూ భలే ఆస్వాదిస్తూ స్నానం చేస్తుంది. ఈ మేరకు ఆ పక్షి యజమాని ఆ పక్షి చక్కగా స్నానం చేస్తున్న వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా లక్షల్లో వ్యూస్ లైక్‌లు వస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి (చదవండి: అవయవ దానంలో భారత్‌కు మూడో స్థానం) Bird taking a shower.. 😊 pic.twitter.com/ejaGBEI7PB — Buitengebieden (@buitengebieden_) November 27, 2021 -
వ్యక్తి చుట్టు కుప్పగా హాట్ చిప్స్.. ఫన్నీ వీడియో..
కాన్బెర్రా: సోషల్ మీడియాలో చాలా మంది వెరైటీ చాలెంజ్‌లు వేసుకుంటూ ఓవర్‌నైట్ ఫేమస్ అవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రైస్‌బకెట్ చాలెంజ్, ట్రీ చాలెంజ్ వంటి.. అనేక రకాల చాలెంజ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, మైఖేల్ బ్రోఖుయ్స్, మార్టిన్ సోకోలిన్స్కి జంట ఒక కొత్త రకం స్కిట్‌ను చేశారు. ఈ ఫన్నీ జంట.. ఎప్పటి కప్పుడు కొత్త ప్రయోగాలు, కామెడి స్కెచ్ వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. తాజాగా వీరు.. ఒక విచిత్రమైన వీడియోను తమ మార్టియండ్ అండ్ మైఖేల్ అనే ఇన్‌స్టాలో పోస్ట్‌చేశారు. ప్రస్తుతం దాన్ని చూసి నెటిజన్లు ఫన్నీగా ఫీలవుతున్నారు. ఈ వీడియోలో.. ఆస్ట్రేలియాలోని సర్ఫర్స్ ప్యారడైజ్ బీచ్‌లో మైఖేల్ తనను తాను.. హట్ చిప్స్‌తో కప్పించుకున్నాడు. దాదాపు 75వేలరూపాయల.. చిప్స్‌లను అతని చుట్టు కుప్పగా పోశారు. ఈ చిప్స్‌లను తినడానికి అక్కడి పక్షులు.. అతని చుట్టు కొన్ని వందల పక్షులు గుమిగూడాయి. పాపం.. అతను మాత్రం కదలకుండా ఒక శిల్పం మాదిరిగా ఉండిపోయాడు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘బలే.. ఫన్నీగా ఉంది..’..‘పాపం.. చిప్స్‌లో కప్పేసారుగా..’ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Marty and Michael (@martyandmichael) -
వండలూరు జంతు ప్రదర్శనశాలలో ‘వైరస్’ కలకలం..
సాక్షి, చెన్నై(తమిళనాడు): వండలూరు జంతు ప్రదర్శనశాలలో వైరస్ కలకలం రేపుతోంది. రెండురోజుల వ్యవధిలో తొమ్మిది నిప్పు కోళ్లు, ఒక ఆడ సింహం మరణించినట్టు గురువారం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యబృందాలు పరిశీలన ప్రారంభించాయి. కరోనా లాక్డౌన్ సమయంలో వండలూరులోని అన్నా జంతు ప్రదర్శనశాలలో వన్యప్రాణులపై కరోనా ప్రభావం పడిన విషయం తెలిసిందే. రెండు సింహాలు మరణించడం, మరికొన్ని కరోనా బారిన పడడం వెలుగు చూశాయి. దీంతో ఆ ప్రదర్శనశాల కొంతకాలం మూత పడింది. మళ్లీ ప్రస్తుతం సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం హఠాత్తుగా రెండు నిప్పు కోళ్ల మరణించాయి. వీటికి పోస్టుమార్టం నిర్వహించి..సేకరించిన నమూనాల్ని పరిశోధనకు పంపించారు. నివేదిక వచ్చేలోపు బుధవారం సాయంత్రం మరో ఏడు నిప్పు కోళ్లు మరణించడంతో వైరస్ కలవరం ఏర్పడింది. అలాగే, గతంలో కరోనా బారిన పడికోలుకున్న కవిత(22) అనే ఆడ సింహం అనారోగ్యంతో మరణించడంతో ఈ భయం మరింత పెరిగింది. అధికారులు ఇతర వన్య ప్రాణులు అనారోగ్యం బారిన పడకుండాముందు జాగ్రత్తలు చేపట్టారు. పరిశీలనలో టీకా ఉత్పత్తి కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని రాష్ట్రంలోని చెంగల్పట్టు, కున్నూరు కేంద్రాల్లో చేపట్టేందుకు కేంద్ర చర్యలు చేపడుతోందని ఆరోగ్యమంత్రి సుబ్రమణియన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 18 ఏళ్లు లోపువారికి టీకా డ్రైవ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసిందన్నారు. కాగా చెన్నైలో మాస్క్‌లు ధరించని 47 వేల మందిని గుర్తించి, వారి నుంచి రూ. 94 లక్షల మేరకు జరిమానాను రెండు రోజుల్లో వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు. చదవండి: చిన్నారిని కిడ్నాప్ చేయించిన మేనమామ -
జీవనయానం వలస ప్రయాణం
చరిత్ర గురించి చాలా నిర్వచనాలే ఉండొచ్చు. స్థూలంగా మానవుల వలస పరిణామాన్ని నమోదు చేసే కథనమే చరిత్ర. వలసలు లేకుండా మానవాళికి మనుగడ లేదు. చరిత్ర అంతా వలసల మయమే! ప్రకృతి సానుకూలత లేని ప్రదేశాలను విడిచిపెట్టి, సురక్షిత ప్రదేశాలకు వలస వచ్చిన మానవులు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నప్పుడు నాగరికతలు ఏర్పడ్డాయి. నాగరికతల పరిణామ క్రమంలో స్థిర నివాసాల సంస్కృతి వ్యాప్తిలోకి వచ్చినంత మాత్రాన మనుషుల వలసలు ఆగిపోలేదు. ప్రకృతి బీభత్సాల నుంచి, యుద్ధాల నుంచి, నియంతృత్వ పీడనల నుంచి, కరవు కాటకాల నుంచి వీలైనంత దూరంగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవడానికే మనుషులు ప్రయత్నిస్తారు. పుట్టిపెరిగిన చోట చాలీచాలని బతుకులను బలవంతంగా నెట్టుకొచ్చే కంటే, ఎంత దూరమైనా వెళ్లి బతుకులను బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో మెరుగైన జీవితాల కోసం మనుషులు తాము పుట్టి పెరిగిన ప్రదేశాలను విడిచిపెట్టి, దేశాలను దాటి వలసలు వెళుతూనే ఉన్నారు. వలసలు మనుషులకు మాత్రమే పరిమితం కాదు. భూమ్మీద మనుషులే కాకుండా, జలచర ఖేచరాదులు కూడా సానుకూల పరిసరాలను వెదుక్కుంటూ సుదూర ప్రదేశాలకు వలస వెళతాయి. ఇప్పుడు మన దేశంలో వలసపక్షుల కాలం మొదలైంది. ఖండాంతరాలను దాటి శరదృతువులో ఇక్కడకు చేరుకునే నానాజాతుల పక్షులు వసంత రుతువు వరకు ఉంటాయి. మనుషుల వలసలకు, పక్షుల వలసలకు తేడాలున్నాయి. మనుషులకు తాము పుట్టి పెరిగిన ప్రదేశం కంటే వలస వచ్చిన ప్రదేశమే సురక్షితంగా, తమ అభివృద్ధికి భేషుగ్గా ఉన్నట్లయితే, అక్కడే స్థిరపడిపోయి, తరతరాలుగా పాతుకుపోతారు. పాపం, పక్షులు అలా కాదు. వాటి వలసలన్నీ కేవలం రుతుధర్మాన్ని అనుసరించే సాగుతాయి. వలసల్లో పక్షుల క్రమశిక్షణ తిరుగులేనిది. కచ్చితంగా నిర్ణీత కాలానికి వస్తాయి.æఅంతే కచ్చితంగా నిర్ణీత కాలానికి తమ తమ నెలవులకు తిరిగి వెళ్లిపోతాయి. మనుషుల మాదిరిగా ఆస్తులు కూడబెట్టుకుని, శాశ్వతంగా ఉండిపోవాలనుకోవు. శరదృతువు ఆగమనంతోనే మన దేశంలోని ప్రధానమైన సరస్సుల వద్ద వలసపక్షుల సందడి మొదలవుతుంది. ఒడిశాలోని చిలికా, ఆంధ్రప్రదేశ్‌లోని పులికాట్, కొల్లేరు, గుజరాత్‌లోని నలసరోవర్, కేరళలోని కుమరకోమ్ వంటి సరస్సుల వద్దకు, పశ్చిమబెంగాల్లోని సుందర్బన్, అరుణాచల్‌లోని ఈగల్నెస్ట్ వంటి అభయారణ్యాలకు వందలాది జాతులకు చెందిన లక్షలాది వలస పక్షులు వస్తాయి. ధ్రువప్రాంతంలోని శీతల వాతావరణానికి దూరంగా, కాస్త వెచ్చగా ఉండే ప్రదేశాలకు ఈ పక్షులు వలస వస్తాయి. గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. గుడ్లు పెడతాయి. వాటిని పొదిగి పిల్లలు చేస్తాయి. పిల్లలకు రెక్కలు రాగానే, వాటితో కలసి వేసవి మొదలవుతుండగా తిరిగి వెళ్లిపోతాయి. వలసల్లో మనుషుల పద్ధతి కాస్త భిన్నం. తరతరాల కిందట మన దేశం నుంచి వలసవెళ్లిన మనవారు వివిధ దేశాల్లో పూర్తిగా స్థిరపడిపోయారు. కొన్ని దేశాల్లో అధికార పదవులనూ దక్కించుకున్నారు. అలాగని వలసలన్నీ సుఖప్రదమైన ప్రయాణాలు కావు. పక్షులకైనా, మనుషులకైనా వలసల్లో ఆటుపోట్లు, అడుగడుగునా ప్రమాదాలూ తప్పవు. ప్రకృతి వైపరీత్యాల నుంచి వలసపక్షులకు మార్గమధ్యంలో ఆపదలు ఎదురవుతుంటాయి. వాటన్నింటినీ అధిగమించి సానుకూల వాతావరణంలోకి వలస వచ్చి, గూళ్లు ఏర్పాటు చేసుకున్నా, వాటి మనుగడకు పూర్తి భద్రత ఉండదు. వేటగాళ్ల వలలకు, ఉచ్చులకు చిక్కి బలైపోతుంటాయి. ఇన్ని కష్టనష్టాల తర్వాత ప్రాణాలతో మిగిలినవి మాత్రమే తిరిగి తమ స్వస్థలాలకు సురక్షితంగా చేరుకోగలుగుతాయి. బతుకుతెరువు కోసం వలస వెళ్లే మనుషుల పరిస్థితీ అంతే! ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికులు దళారుల చేతిలో మోసపోయి, వెట్టి చాకిరి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడే పరిస్థితులు ఉన్నాయి. అనుకోని దుర్ఘటనల్లో అయినవారికి దూరంగా ప్రాణాలు పోగొట్టుకునే ఉదంతాలూ ఉన్నాయి. మంచు గడ్డకట్టే శీతల వాతావరణాన్ని తట్టుకునేందుకు ఏకకణ జీవి అమీబా మొదలుకొని, క్షీరదమైన మంచు ఎలుగుబంటి వంటి జీవులు శీతాకాలమంతా ఉన్న చోటనే కదలకుండా పడిఉండి సుప్తావస్థలో గడుపుతాయి. నిత్యచైతన్యశీలత కలిగిన పక్షులు ఇలా సుప్తావస్థలోకి జారుకోలేవు. అందుకే తమ స్వేచ్ఛా విహారానికి తగిన మెరుగైన పరిసరాలను అన్వేషిస్తూ వలసలు ప్రారంభిస్తాయి. వాతావరణం ఎంత ప్రతికూలంగా మారినా, ఎక్కడికక్కడే ఉండిపోయి సుప్తావస్థలోకి జారుకోవడం స్తబ్ధతకు పరాకాష్ఠ! ఇలాంటి స్తబ్ధత కొందరు మనుషుల్లోనూ ఉంటుంది. పరిస్థితుల్లోని మార్పులకు స్పందించకుండా, ఎలాంటి కదలికా లేకుండా శీతలనిద్రలోకి జారుకునే మనుషులు చరిత్ర ప్రవాహంలో ఆనవాళ్లే లేకుండా కొట్టుకుపోతారు. బలమైన ఆకాంక్షలతో వలసల బాట పట్టిన సమూహాలు, వ్యక్తులు చరిత్రగతిని మార్చేసిన ఉదంతాలు మనకు తెలుసు. ఎక్కడెక్కడి నుంచో ఈ దేశానికి వలస వచ్చిన సమూహాలు, ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుని, శతాబ్దాల తరబడి పాలన సాగించాయి. స్థానికులపై నిర్దాక్షిణ్యంగా అణచివేత సాగించాయి. ఉన్నత విద్య కోసం బ్రిటన్‌కు, ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లిన గాంధీజీ, తన వలస ప్రస్థానాన్ని స్వాతంత్య్రోద్యమానికి పునాదిగా మలచుకున్నారు. శ్వేతజాతీయుల వలస ఈ దేశాన్ని బానిసత్వంలోకి నెట్టేస్తే, గాంధీజీ వంటి జాతీయ నాయకుల వలస ఈ దేశ స్వాతంత్య్రానికి ఊపిరిపోసింది. అన్ని ప్రయాణాల్లో మాదిరిగానే వలసల్లోనూ ప్రమాదాలు అనివార్యం. అంతమాత్రాన వలసలు ఆగిపోవు, చరిత్రా ఆగిపోదు! -
మరో 23 జీవులు అంతరించిపోయాయి
మనుషుల విధ్వంసక చర్యల కారణంగా ఎన్నో జీవులు అంతరించి పోతున్నాయి. ఆ జాబితాలోకి తాజాగా మరో 23 జీవులు చేరాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత డిసెంబర్ 29న తుది ప్రకటన చేయనుంది. అంతరించిపోయిన జాబితాలో పండ్లను తిని జీవించే ఓ రకం గబ్బిలం, పదకొండు రకాల పక్షులు, మంచినీటి ఆల్చిప్పలు, రెండు రకాల చేపలు, పుదీనా జాతికి చెందిన ఓ మొక్క ఉన్నాయని అమెరికా ఇంటీరియర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇన్ని జీవులను ఒకేసారి అంతరించిపోయిన జాబితాలో ప్రకటించడం ఇదే మొదటిసారి అని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. మనుషులు సృష్టిస్తున్న కాలుష్యం మూలంగా ఏర్పడిన పర్యావరణ మార్పులు, ఆవాసాల ధ్వంసం కారణంగా ఆ జీవులు మనుగడ కోల్పోవడం వంటి కారణాలతో ఆ జీవులు ఇక కనపడకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనుషుల చర్యలు మరిన్ని జీవుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని, వన్యజీవులను కాపాడటానికి మరింత ఉత్సాహంగా, కలసికట్టుగా పనిచేయాలని అమెరికా ఇంటీరియర్ సెక్రటరీ డెబ్ హాలాండ్ అభిప్రాయపడ్డారు. 1970 నుంచి చూస్తే ఉత్తర అమెరికాలోని పక్షుల సంఖ్య 3 బిలియన్ల మేర తగ్గిపోయిందని తెలిపారు. చట్టంతో కాస్త మెరుగు.. అమెరికా అంతరించిపోతున్న జీవుల చట్టం (ఈఎస్ఏ) తీసుకొచ్చిన తర్వాత ఇతర జీవుల మనుగడలో కాస్త మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రక్షించాల్సిన జాబితాలో ఉన్న 54 జీవుల సంతతి సమృద్ధిగా ఉండటంతో వాటిని ఆ జాబితా నుంచి ఇటీవల తొలగించారు. వాటిలో అమెరికన్ పెరిగ్రిన్ ఫాల్కన్, బాల్డ్ ఈగిల్ ఉన్నాయి. మరో 56 జీవులను అంతరించిపోతున్న జాబితా నుంచి ‘ప్రమాదకర’ జాబితాకు తగ్గించారు. అమెరికా వ్యాప్తంగా ఈ జాబితాల్లో ప్రస్తుతం 1,600లకు పైగా జీవులు ఉన్నాయి. ఇక కానరాని.. దేవుడు పక్షి అంతరించిన పోయిన జాబితాలో ఉన్న పక్షుల్లో ఐవరీ బిల్ల్డ్ వడ్రంగి పిట్ట, వీనుల విందైన గొంతు కలిగిన ఓ రకం పిచ్చుక ఉన్నాయి. వడ్రంగి పిట్టను అమెరికా ప్రజలు దేవుడు పక్షిగా పిలుచుకునేవారు. ఆదేశంలోని వడ్రంగి పిట్ట జాతుల్లో ఇది పెద్దది. ఆ దేశ దక్షిణ ప్రాంతంలోని భారీ వృక్షాలు వీటి ఆవాసం. కలప కోసం, ఇతర అవసరాల కోసం ఆ వృక్షాలను నరికివేయడంతో వడ్రంగి పిట్టలు ఆవాసాలను కోల్పోయాయి. 1944 ప్రాంతంలో ఈశాన్య లూసియానా ప్రాంతంలో చివరిసారిగా ఇది కనిపించింది. ఇక శ్రావ్యమైన గొంతు కలిగిన పక్షుల్లో ఒకటిగా, అత్యంత అరుదైన దానిగా పేరుగాంచిన బాచ్‌మన్స్ వార్బ్లెర్ పిచ్చుక అమెరికాలో 1962లో చివరిసారిగా కనిపించింది. ఈ వలస పిచ్చుక 1981లో క్యూబాలో చివరిసారిగా కనిపించిన తర్వాత మళ్లీ దాని జాడ లేకుండా పోయింది. ఈ రెండింటిని 1967లో తొలిసారిగా అంతరించిపోయే జాబితాలో చేర్చగా.. ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయిన వాటిగా ప్రకటించారు. -
మానవ తప్పిదం: వడ్రంగి పిట్టలు ఇక కనుమరుగైనట్టే!
వడ్రంగి పిట్టలంటే తెలియని వారుండరు. ముఖ్యంగా పల్లెల్లో స్వేచ్ఛగా విహరిస్తూ సందడి చేస్తుంటాయి. అవి రాత్రి పూట తమ పొడవాటి ముక్కును పదును చేసుకోవటం కోసం చెట్టు బెరడను గీకుతూ ఒక రకమైన శబ్ధం చేస్తుంటాయి. పైగా ఇవి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా చూపరులను కట్టిపడేసేలా ఉంటాయి. అలాంటి ఈ వడ్రంగి పక్షులు ఇక లేవని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అసలేం జరిగిందో ఏమిటో తెలుసుకుందామా! న్యూయార్క్: వడ్రంగి పిట్టలాంటి కొన్ని అరుదైన ప్రసిద్ధ పక్షి జాతులు, కొన్ని రకాలైన చేపలతో సహా దాదాపు 23 రకాల జాతులు అంతరించిపోయినట్లు యూఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఈ 23 జాతులు అంతరించిపోయినట్లు మాత్రమే కనుగొన్నట్లు పేర్కొంది. కానీ క్రమంగా మొక్కలు, జంతువులు కూడా అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని వన్య ప్రాణి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు అవి అంతరించిపోవడానికి ఓ కారణంగా తెలిపారు. భవిష్యత్‌లో ఇలా అంతరించిపోయేది మనకు ఇక సాధారణం కావచ్చని చెబుతున్నారు. (చదవండి: ‘విమాన సేవలను తిరిగి పునరుద్ధరించండి’) ఇటీవల దశాబ్దాలుగా అర్కాన్సాస్, లూసియానా, మిసిపిప్పి, ఫ్లోరిడా వంటి ప్రాంతాలతోపాటు ఆఖరికి చిత్తడి నేలలు ఉండే ప్రాంతాల్లో కూడా చేసిన పరిశోధనల్లో వడ్రంగి పిట్టల ఆచూకీ లభించలేదని యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ యూఎస్‌లోని మొలస్క్లు (నత్తలు, పీతలు) ఉండే తాగునీటి సరస్సుల్లో ఎక్కువగా ఈ వడ్రంగి పిట్టలు ఉంటాయని తెలిపారు. చివరిసారిగా ఆ ప్రాంతంలోనే చూసినట్లు యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్ జీవ శాస్త్రవేత్త ఆంటోనీ ఆండి ఫోర్డ్ పేర్కొన్నారు. నీటి కాలుష్యం, పక్షుల ఈకల కోసం వాటిని చంపడం, అడవుల నరికివేత తదితర కారణాలతోపాటు మానవ తప్పిదాలే అవి అంతరించిపోవడానికి ప్రధాన కారణమని వెల్లడించారు. (చదవండి: పాకిస్తాన్ వైపుగా వెళ్తున్న గులాబ్ తుపాన్) -
మధుర భాషణం.. నిజమైన భూషణం
మాటే మంత్రము.. అవును.. మాట మంత్రమే కాదు.. మనకు, ఎదుటివారికి ఆనందాన్ని కలిగించే, కార్యసాధనకు ఉపకరించే అద్భుతమైన తంత్రం కూడా..!! పక్షులు కిలకిలా రావాలే చేయగలవు. కొన్ని జంతువులు భయంకరంగా గర్జించగలవు, కొన్ని జంతువులు జలదరించే తీరులో ఘీంకరించగలవు, కొన్ని జంతువులు కేవలం మొరగడం మాత్రమే చేయగలవు తప్ప మాట్లాడలేవు. ఏ జీవరాశికీ లేని వాక్కు అనే సంపద మానవులకు మాత్రమే ఉంది. వాక్కు అనేది మానవులకు భగవంతుడు ప్రసాదించిన అరుదైన వరం. అరుదుగా లభించినవాక్కు అనే వరాన్ని వివేచనతో, విచక్షణతో ఉపయోగిస్తూ, సందర్భోచితంగా సంభాషిస్తూ మన్నన పొందడం విజ్ఞత కలిగిన మానవుని లక్షణం. కిరీటాలు, భుజకీర్తులు, సువర్ణహారాలు, పరిమళభరిత ద్రవ్యాలతో చేసే స్నానం, చందన సుగంధ ద్రవ్యాలు శరీరానికి అద్దుకోవడం, సువాసనాభరితమైన పుష్పహారాలు ధరించడం లేదా చిత్ర విచిత్ర రీతుల్లో కురులను దువ్వుకోవడం అనేవి మానవునికి అలంకారాలుగా అందాన్నివ్వవు. ఉత్తమ సంస్కారం చేత అలవడిన మధురమైన వాక్కు ఒక్కటే అద్వితీయమైన అలంకారమై ప్రకాశిస్తుంది. ఒక మనిషిని సంఘంలో గౌరవించే విధానికి చాలావరకు మాటతీరు లేదా వాక్చాతురి కారణమౌతుంది. మృదువుగా సంభాషించే సౌజన్యశీలితో మాట్లాడడానికి సంఘంలో ఎవరైనా ఇష్టపడతారు. అహంకారాన్ని ప్రదర్శిస్తూ, ఎదుటివారిపై హుంకరిస్తున్న విధాన మాట్లాడితే, ఆ వ్యక్తి చెంత ఎవరూ చేరరు కదా..!! ‘‘మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది’’ అన్నది చిరకాలంగా మనకు తెలిసిన ఆర్యోక్తే కదా.. హితకరమైన మాటలు మాట్లాడే వ్యక్తి చాతుర్యం అన్ని సమయాల్లోనూ కార్యసాధకమై రాణిస్తుంది. మృదుభాషణం కలిగినవారు తమ మాటలతో ఎదుటివారిని నొప్పించకుండానే తమకు కావలసింది సాధించుకుంటారని చరిత్ర ఘంటాపథంగా చెబుతోంది. అయితే, మాటతీరు అన్నివేళలా మృదువుగా ఉంటే సరిపోదు. సందర్భాన్ని బట్టి, ఒక్కొక్కసారి అవతలివారితో మనం సంభాషించే విధానంలో కొంత గట్టిగానూ మాట్లాడవలసి రావచ్చు. వాగ్గేయ శిరోమణి త్యాగరాజు చెప్పినట్లు ‘సమయానికి తగు మాటలాడి’ అన్నచందాన సంభాషించి, ఎదుటివారిని మెప్పించగలగాలి. అయితే, సంభాషణా వైఖరి వారిని గాయపరిచేది గానూ, నొచ్చుకునేదిగానూ ఉండ కూడదు. విషయం వారికి అర్థమై, మన మనోగతాన్ని వారు గుర్తెరగాలి. ఏది ఏమైనా తూటాలవంటి మాటలకంటే, తేనెలు నిండిన తేటలతో మాట్లాడే మాటలే మన గెలుపును శాసిస్తాయి. అందరితో మిత్రత్వాన్ని సాధిస్తాయి. మనిషి మాటతీరు అతని చుట్టూ ఉండే మనుషులపై ప్రభావం చూపుతుంది. నోటినుంచి వచ్చే మాట ద్వారానే మనిషికీ మనిషికీ మధ్య సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. మాటలతో మనం సాధించ వలసిన కార్యాన్ని కూడా సులువుగా సాధించవచ్చు. మృదుభాషి, మితభాషి అందరికీ అనాదిగా అలవాటున్న పదాలే! మృదుభాషి అంటే మృదువుగా మాట్లాడేవాడనీ, మితభాషి అంటే అవసరమైతేనేగానీ నోరు విప్పడనీ అందరికీ అవగతమే. అయితే, చిరకాలంగా, ఎంతోమందిని గొప్పవారిగా, సంస్కారవంతులుగా నిలబెట్టిన అరుదైన సంభాషణా లక్షణం మరొకటి ఉంది. వాళ్ళంతా పూర్వభాషిగా భాసించడమే వారికున్న ప్రత్యేక గుణం. పూర్వభాషి అంటే, తానే ఎదుటివారితో చొరవ తీసుకుని ఆహ్లాదకరమైన తీరులో భాషించడం. ఎదుటివ్యక్తి తనకు అంతగా తెలియకపోయినా, ఎంతో చక్కటి వాక్కులతో అతన్ని ముందుగా మర్యాదగా పలకరించి, తరువాత అతనితో విషయాన్ని మృదువుగా వివరించడమే పూర్వభాషి లక్షణం. ఈ రకమైన మాటతీరు ఉన్నవారు అత్యంత ప్రతిభా వంతులుగా తమను తాము నిరూపించు కున్నట్లు చరిత్ర తెలియజేస్తోంది. ఆనాటి శ్రీరాముని నుంచి నేటి తరంలో విజయవంతమైన నాయకుల్లో అధిక శాతం పూర్వభాషులే. ఎటువంటి భేషజాన్నీ తనతో మాట్లాడేవారితో ప్రదర్శించని వ్యక్తిగా పూర్వభాషి గుర్తించబడతాడు. కొన్ని సందర్భాల్లో మాట్లాడే మాటే ఎదుటివారి హృదయాన్ని రంజింపజేసి, వారిని జయించే మంజులమైన వశీకరణ మంత్రమూ అవుతుంది. ఎందుకంటే, మాట అత్యంత శక్తిమంతమైనది. నాలుకపై నడయాడే ప్రతి పదానికీ ఒక ప్రత్యేకత ఉంది. పొరపాటున కాలు జారితే వెనుకకు తీసుకోవచ్చు, కానీ అధాటున నోరు జారితే, ఆ మాటను వెనుకకు తీసుకో లేమన్నది సత్యమైన విషయమే కదా..!! మాట్లాడే విధాన్ని బట్టి అది ఎదుటివారి మానసాన్ని గెలిచే విజయ సూచికగా పనిచేయగలదు. ఎందుకంటే మాట అనేది మనసుని తాకుతుంది. అది సుతారంగా, ఎదుటివారిని గౌరవించేలా ఉండాలి గానీ, వారి మనోభావాలను గాయపరిచేదిగా ఉండకూడదు. మాటే మనిషికి అనుకోకుండా ఎదురైన కష్టాన్నీ పోగొడుతుంది. ఎవరినైనా తప్పనిసరి పరిస్థితుల్లో సహాయం అడుగవలసి వచ్చినప్పుడు, వారితో లలితమైన రీతిలో సంభాషిస్తే, తోచినంత సహాయాన్నీ, తోడ్పాటును అవతలి వ్యక్తి మనకు అందించే అవకాశం ఉంది. అదేవిధంగా, మాటే మనిషికి కష్టాన్నికూడా తీసుకురావచ్చు. అహంకారంతో కూడిన సంభాషణా శైలి ఎప్పుడైనా సరే మనకు కష్టాలనూ తెచ్చిపెడుతుంది, మనకు శత్రువులనూ పెంచుతుంది. గొడ్డలితో నరకబడ్డ వృక్షమైనా మళ్ళీ చిగురిస్తుంది, కానీ, మాటలచేత మనసు ముక్కలైతే, మళ్ళీ పూర్వస్థాయిలో అనుబంధం పెరగదనేది ఋజువైన విషయమే కదా.. మనం మాట్లాడే మాట కోమలంగా ఉంటే ఎదుటివారి ఎదను పువ్వులా తాకుతుందని, అదే కటువుగా ఉంటే, కత్తిమొనలా వారిని గాయపరచి, వారితో ఉన్న స్నేహాన్నీ, సాన్నిహిత్యాన్నీ కూడా దూరం చేస్తుందన్న గౌతమ బుద్ధుని వాక్కులు అక్షర సత్యం. పదునైన ఈటెల పోటు కన్నా, కరుకైన మాటల పోటు ఎదుటివారి హృదయాలకు లోతైన గాయాన్ని చేస్తుంది. భారతదేశ ప్రధానిగా ఎన్నో విజయాలను సాధించిన ఘనులు లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన ఎంతో ప్రతిభాశాలిగా ఎన్నో విజయాలను సాధించడంలో ఆయన సంభాషణాశైలి ఉపకరించిందని సన్నిహితులు చెబుతారు. అమెరికా అధ్యక్షుల్లోనే అగ్రగణ్యునిగా వినుతికెక్కి, అప్రతిహత విజయాలను సాధించిన అబ్రహం లింకన్ కూడా మృదుభాషేనన్న విషయం గమనార్హం. మనిషి ఉత్థాన పతనాలను వారు మాట్లాడే మాటలే శాసిస్తాయి. ఉత్తమరీతిలో జీవన ప్రస్థానం సాగడానికి మంచి ఉపకరణంగా భాసిస్తాయి. నాలుకపై మాట్లాడే ప్రియమైన మాటలు అందరికీ సంతోషాన్ని కలిగిస్తాయి. మనల్ని మెచ్చుకునేలా చేస్తాయి. మనిషికి నలుగురిలో గౌరవాన్ని సంతరించేది సమయోచిత భాషణం..!! అదే, అందరినీ సన్నిహితులను చేసి, అలరించే విలువైన భూషణం..!! – వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి కొన్ని సందర్భాల్లో మాట్లాడే మాటే ఎదుటివారి హృదయాన్ని రంజింపజేసి, వారిని జయించే మంజులమైన వశీకరణ మంత్రమూ అవుతుంది. ఎందుకంటే, మాట అత్యంత శక్తిమంతమైనది. నాలుకపై నడయాడే ప్రతిపదానికీ ఒక ప్రత్యేకత ఉంది. పొరపాటున కాలు జారితే వెనుకకు తీసుకోవచ్చు, కానీ అధాటున నోరు జారితే, ఆ మాటను వెనుకకు తీసుకోలేమన్నది సత్యమైన విషయమే కదా..!! -
ప్రాణాలకు తెగించి చేసే దొంగతనానికి గుర్తింపు!
ఈ ప్రకృతిలో జీవుల మధ్య మనుగడ పోరాటం చాలా వైవిధ్యంగా సాగుతుంటుంది. సాధారణంగా పక్షుల్లో చాలా రకాలు గూడు కట్టుకోవడం కోసం చాలా కష్టపడుతుంటాయి. గడ్డి పోచలు, ఆకులతో పాటు చిన్న కట్టెపుల్లలను ఉపయోగించుకుంటాయి. అలాగే ఇంకొన్ని పక్షులు జంతువుల నుంచి జుట్టును తస్కరిస్తుంటాయి. ఈ క్రమంలో వాటి చేతిలో గాయపడడమో లేదంటే చనిపోవడమో జరుగుతుంది కూడా. సైంటిఫిక్‌గా ఈ చర్యకు ఇన్నాళ్లూ ఓ పేరంటూ లేదు. తాజాగా పక్షులు చేసే ఈ సాహసోపేతమైన చర్యకు ఓ పదం, అర్థం ఇచ్చారు సైంటిస్టులు. అసాధారణమైన ఈ ప్రవర్తనకు ‘క్లెప్టోట్రిచి’ అని పేరు పెట్టారు. ఇది ఒక గ్రీకు పదం.. దానికి దొంగిలించడం లేదా జుట్టు అనే రెండు అర్థాలూ వస్తాయి. అందుకే పక్షుల చర్యకు సరిపోతుందనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు. జులై 27న ఎకాలజీ(జీవావరణ శాస్త్రం)లో ఈ పదం చేర్చినట్లు ఇల్లినాయిస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆగష్టు 11న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భయపెడతాయి.. నిజానికి చలి ప్రాంతాల్లో పక్షులు ఎక్కువగా ఇలా జంతువుల వెంట్రుకలతో గూడులను నిర్మించుకుంటాయి. అంతేకాదు తెలివిని ప్రదర్శించి.. తమ శత్రువులను ఈ గూడుల ద్వారా భయపెడతాయి కూడా. ఎలాగంటే.. వేటాడే వాటికి ఈ గూడును ఏదో భయంకరమైన ప్రాణిగా కనిపించే రీతిలో తీర్చిదిద్దుతాయి ఆ పక్షులు. కుక్కలు, పిల్లులు, నక్కలు, రకూన్లు, ఆఖరికి మనుషుల నుంచి కూడా కొన్ని పక్షులు వెంట్రుకల్ని సేకరిస్తుంటాయి. పడుకున్నప్పుడో లేదంటే తింటున్నప్పుడో.. అదనుచూసి వెంట్రుకల్ని లాగేస్తాయి పక్షులు. ఇది చదవండి: కిడ్నీ మార్పిడిలో పాతవి ఎందుకు తీసేయరంటే.. క్లెప్టోట్రిచిలో భాగంగా.. దక్షిణ అమెరికాలో పామ్ స్విఫ్ట్ పక్షులైతే పావురాలు, చిలుకల నుంచి రెక్కలు దొంగిలించడం విశేషం. ఆస్రే్టలియాలో హనీఈటర్ బర్డ్.. కోవాలాల నుంచి వెంట్రుకలు దొంగతనం చేస్తాయి. ఇలాంటి ప్రవర్తనకు కారణం.. పక్షులు ఈ సేకరణను సులువైన మార్గంగా భావించడమేనని, కానీ, ప్రమాదాలను అంచనా వేయకుండా ఒక్కోసారి అవి ప్రాణాలను పొగొట్టుకుంటాయని యానిమల్ బిహేవియరిస్ట్ మార్క్ హౌబర్ చెప్తున్నారు. -
రైతు ఐడియా చూసి వావ్ అనాల్సిందే!.. ఫన్నీ వీడియో
సాక్షి,హైదరాబాద్: శతకోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు మనిషి తనకెదురయ్యే అపాయాలకు, కష్టాలకు మార్గాలను అన్వేషిస్తూనే ఉంటాడు. తనకున్న పరిధిలో ఎప్పటికపుడు అనేక ఉపాయాలను కనుక్కుంటూనే ఉంటాడు. ఇదొక నిరంతర ప్రక్రియ. ఆ అన్వేషణ, తపనే అనేక నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఆసక్తిని రేపుతోంది. కాకులు, ఇతర పక్షుల బెడదనుంచి తన పొలాన్ని తప్పించుకునేందుకు ఒక రైతు చేసిన ప్రయోగం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. స్ప్రింగ్ ద్వారా ఒక బొమ్మను నిరంతరం కదులుతూ ఉండేలా, పక్షులను అదిలిస్తున్నట్టుగా ఏర్పాటు చేశాడు. ఇది చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. అంతేకాదు కాకులేమోగానీ, మనుషులకు మాత్రం హార్ట్ ఎటాక్ రావడం గ్యారంటీ అంటూ చమత్కరిస్తున్నారు. కాగా సాధారణంగా పొలంలో పశువులు, ఇతర పక్షులనుంచి పంటను రక్షించుకునేందుకు దిష్టిబొమ్మలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. పంట చేతికొచ్చే సమయానికి పక్షులు, పశువులు తినకుండా, నరదిష్టి తగులకుండా పంట చేలల్లో రకరకాల దిష్టిబొమ్మలు పెడుతుంటారు. ఈ క్రమంలో ఇటీవల టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లు పోటోలు పొలంలో దిష్టి బొమ్మలుగా పెట్టుకున్న వైనం విచిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. O bhai saheb...did Ramsay brothers create this one??! crows ka toh nahi pata, insano ka heart attack guaranteed. https://t.co/sVFpd4bxo6 — Smita Sharma (@Smita_Sharma) July 12, 2021 -
‘నిథమ్’ క్యాంపస్ పక్షులకు నిలయం
రాయదుర్గం: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథమ్) క్యాంపస్ అనేక రకాల పక్షి జాతులకు నిలయంగా మారింది. శనివారం డెక్కన్ బర్డ్ వాచర్స్ సభ్యుల బృందం గచ్చిబౌలిలోని క్యాంపస్‌ను సందర్శించింది. క్యాంపస్‌లోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి 40 రకాల పక్షి జాతులు, అనేక రకాల సీతాకోకచిలుక జాతులను గుర్తించారు. ముఖ్యంగా ఇండియన్ స్పాట్ బిల్డ్ డక్, రెడ్వాటెడ్ ల్యాప్వింగ్, కాపర్స్ మిత్బార్బెట్ వంటి అరుదైన పక్షులు ఉన్నాయి. రెడ్ వాటెడ్ ల్యాప్వింగ్ పక్షి కాగా, సీతాకోక చిలుకల్లో సాధారణ చిరుత, సాదా పులిసీతాకోకచిలుక వంటివాటిని గుర్తించారు. డెక్కన్ బర్డర్స్ కార్యదర్శి సురేఖ మాట్లాడుతూ.. నిథమ్‌లోని పక్షుల ఫొటోలతో బర్డ్ ఆఫ్ నిథమ్ పేరిట ఓ మ్యాన్యువల్‌ను ప్రచురిస్తామని తెలిపారు. ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి పరిచేలా చూస్తామని వివరించారు. అనంతరం వారిని నిథమ్ డైరెక్టర్ చిన్నంరెడ్డి, ప్రిన్సిపల్ నరేంద్రకుమార్ సన్మానించారు. బృందంలో సభ్యులు షఫతుల్లా, నంద్‌కుమార్, బిడిచౌదరి, శిల్కాచౌదరి, డాక్టర్ శామ్యూల్ సుకుమార్ ఉన్నారు. ఇండియన్ స్పాట్ బిల్డ్ డక్ పక్షి కామన్ లియోపర్డ్ బటర్‌ఫ్లై -
మాస్క్‌లు లేవు.. భౌతిక దూరం బాధే లేదు...
‘పిట్ట బతుకూ ఎంత హాయి’ అంటూ ప్రముఖ రచయిత, గాయకుడు గోరటి వెంకన్న పాటందుకుంటే ఏదో అనుకున్నాం. కానీ ఈ పక్షుల సమూహాన్ని చూస్తుంటే ‘నిజమే ఎంత హాయి’ అనిపిస్తుంది ఎవరికైనా. మాస్క్‌లు లేవు... భౌతిక దూరం బాధే లేదు... మందు, మాకూ చింతే లేదు... వ్యాక్సినేషన్ గొడవ అంతకన్నా లేదు. ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అనే మాటను మరచిపోయి ఏడాదిన్నరకుపైనే దాటిపోయింది. సరదాగా మీలా కూర్చొని నాలుగు కబుర్లు... మనసారా నవ్వులు ఊసే లేదు. వరుస మరణాలు సంభవిస్తే ‘పిట్టల్లా రాలిపోతున్నారు’ అనే వాళ్లం. కానీ ఇప్పుడు మా ‘నవ’ జాతే కూలిపోతోంది... మీ కిలకిలా రావాలు ఎప్పటిలానే వసంత రుతువును తలపిస్తోంది. మీలో ఉరకలెత్తే ఆ ఉత్సాహం... సంతోషం మా సొంతమయ్యేదెప్పుడో... ‘ఉందిలే మంచి కాలం ముందూముందునా... అందరూ సుఖపడాలి నందానందనా’ అని ఆలపించుకుంటూ... ఆ కాలం కోసం ఎదురు చూస్తున్నామని గుమిగూడిన విహంగాల గుంపును చూసినవారు అభిలషించారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలోని గురజాడ అప్పారావు రోడ్డు మార్గంలో ఓ ఫ్లెక్సీ ఐరన్ రాడ్లపై ఈ దృశ్యం ‘సాక్షి’ కెమెరా కంటపడగానే ‘క్లిక్’మంది. – సత్యనారాయణ, సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం Photo Feature: రెడీ టు టేకాఫ్.. తిరుగు ప్రయాణానికి సిద్ధం -
Photo Story: రెడీ టు టేకాఫ్
సాక్షి, నిజామాబాద్: వేసవి విడిదికి వచ్చి, మూడు నెలల పాటు స్థానికులను అలరించిన విదేశీ పక్షులు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతానికి మార్చిలో ఆఫ్రికా నుంచి ఫ్లెమింగో, పెలికాన్, పెయింటెడ్ స్టోర్క్ తదితర రకాల పక్షులు వస్తాయి. ఇక్కడే గుడ్లను పొదిగి పిల్లలతో జూన్ నెలలో స్వస్థలాలకు వెళ్లిపోతాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం నూత్పల్లి గ్రామ శివారులో గురువారం విదేశీ పక్షుల సందడిని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. -
Color Mystery: కనిపించేదంతా ‘బ్లూ’ కాదు!
సాక్షి సెంట్రల్ డెస్క్: ఈ సీతాకోక చిలుక ఏ రంగులో ఉంది. అదేమిటి నీలి రంగులోనే కదా అంటారా? అక్కడే తప్పులో కాలేశారన్న మాట. అది మనకు నీలి రంగులో కనిపించడం అంతా మన దృష్టి భ్రమ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇదే కాదు జంతుజాలంలో 99 శాతం జీవుల్లో వేటిలోనూ నీలి రంగు అనేదే లేదని అంటున్నారు. మరి మన కళ్లముందు కనిపిస్తున్నా అది నీలి రంగు కాదనడం ఏంటి? అసలు ఏమిటీ రంగు మిస్టరీ అని సందేహాలు వస్తున్నాయా.. ఇదేంటో తెలుసుకుందామా? అప్పుడు కళ్లు లేవు.. కలర్ సమస్య లేదు! భూమ్మీద జీవం ఆవిర్భవించి వందల కోట్ల ఏళ్లు అవుతోంది. సుమారు 60 కోట్ల ఏళ్ల కిందటి వరకు ప్రాథమిక దశలోనే ఉన్న జీవులు వేటికీ కళ్లు లేవు. అప్పుడు జంతుజాలానికి రంగుల సమస్యే లేదు. ఆ తర్వాత జంతుజాలం అభివృద్ధి చెంది కళ్లు ఏర్పడ్డాయి. అందంగా కనబడేందుకు, తోడును ఆకట్టుకునేందుకు, కొన్నిసార్లు శత్రు జీవులను భయపెట్టేందుకు, లేదా వాటికి దొరక్కుండా తప్పించుకునేందుకు.. ఇలా వాటి అవసరానికి తగినట్టుగా రంగులు, డిజైన్లను సంతరించుకోవడం మొదలైంది. జంతుజాలంలో ఒక శాతమే.. సీతాకోక చిలుకలు సహా పలు రకాల జంతువులు మనకు నీలి రంగులో కనిపిస్తుంటాయి. కానీ చాలా వరకు నిజమైన నీలిరంగు కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తం జంతుజాలంలో ఒక శాతం కంటే తక్కువ మాత్రమే నీలి రంగులో ఉంటాయి. మరి ఎందుకిలా..? ‘నీలి రంగు’ సమస్యేంటి? ప్రతి రంగుకు సంబంధించి కొన్నిరకాల రసాయనాలు ఉంటాయి. వాటినే కలర్ పిగ్మెంట్స్ అంటారు. వీటిపై కాంతి పడినప్పుడు సంబంధింత రంగులను ప్రతిఫలిస్తాయి. దాంతో ఆ రంగు మన కంటికి కనిపిస్తుంది. జంతువుల్లోగానీ, మొక్కల్లోగానీ ఏవైనా భాగాల్లో ఏ రంగు పిగ్మెంట్స్ ఉంటే.. ఆ రంగు కనిపిస్తుంది. అన్ని జంతువులకు కూడా కలర్ పిగ్మెంట్స్ అవి తినే ఆహారం ద్వారానే అందుతాయి. జంతువులు ఏవైనా ప్రాథమిక ఆహారం మొక్కల నుంచే వస్తుంది. (మాంసాహార జీవులైనా కూడా అవి తినే జంతువుల ఆహారం మొక్కలే). ఇక్కడే అసలు తిరకాసు ఉంది. మొక్కల్లో నీలి రంగు పిగ్మెంట్స్ అత్యంత అరుదు. దాంతో జంతుజాలానికి ఆహారం నుంచి నీలి రంగు అందే అవకాశాల్లేవు. రంగే లేనప్పుడు.. ఎలా కనిపిస్తుంది? నీలం రంగు పిగ్మెంట్స్ అరుదు కావడంతో జంతుజాలం.. వాటిని సేకరించుకోవడం మానేసి, దృష్టి భ్రమపై ఆధారపడ్డాయి. కొన్ని రంగులు, రంగుల మిశ్రమాలను కొన్ని కోణాల్లో చూసినప్పుడు వేరే రంగులుగా భ్రమ కలుగుతుంది. ఈ తరహాలోనే నీలి రంగు కనిపించేలా కొన్ని జంతువులు ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. సీతాకోకచిలుక చేసే ట్రిక్ ఏంటి? నీలి రంగు రెక్కలు, అంచుల్లో నలుపు రంగుతో ‘బ్లూ మార్ఫో’ రకం సీతాకోకచిలుక చాలా అందంగా కనిపిస్తుంది. నిజానికి ఇది నీలి రంగులో ఉండదు. దీని రెక్కల్లో అత్యంత సన్నగా ఎగుడు, దిగుడు నిర్మాణాలు ఉంటాయి. ఈ రెక్కలపై పడిన కాంతి అక్కడికక్కడే ప్రతిఫలించి.. ఒక్క నీలి రంగు కాంతి మాత్రమే బయటికి కనబడేలా ఏర్పాటు ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే.. వేర్వేరు కోణాల్లో చూసినప్పుడు ఈ సీతాకోకచిలుక రెక్కలు రంగులు మారుతుంటాయి. మనం బాగా ఇష్టపడే నెమలి ఈకలు కూడా ఇలా మామూలుగా చూస్తే నీలి రంగులో మెరుస్తుంటాయి. కాస్త అటూ ఇటూ తిప్పితే వేర్వేరు రంగులు కనిపించడం మనకు తెలిసిందే. మరి అసలైన నీలి రంగు ఏది? ఏ వైపు నుంచి చూసినా కచ్చితంగా ఒకే స్థాయిలో నీలం రంగు కనిపిస్తే.. అది అసలైన నీలి రంగు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అసలైన రంగు పిగ్మెంట్స్ ఉన్నప్పుడు.. ఒకేస్థాయిలో రంగు కనిపిస్తుందని.. లేతగా, ముదురుగా మారడం కూడా ఉండదని వివరిస్తున్నారు. ఈ ‘ది ఓబ్రినా ఆలివ్‌వింగ్’ రకం సీతాకోక చిలుకలపై ఉండే నీలి రంగు పక్కా ఒరిజినల్ అని తేల్చారు. చదవండి: Harish Rao Birthday: వినూత్న బహుమతి -
‘ఎండి’పోతున్న పక్షులు
బరంపురం: వేసవి కారణంగా ప్రస్తుతం జిల్లాలో పెరుగుతున్న రోజువారీ ఉష్ణోగ్రతలకు చిలికా సరస్సులోని విదేశీ విహంగాలు మృత్యువాత పడుతున్నాయి. చిలికా వన్యప్రాణి సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో గత కొన్నిరోజుల నుంచి జరుగుతున్న సరస్సులోని విదేశీ పక్షుల లెక్కింపు ప్రక్రియ బుధవారం సాయంత్రం నాటికి పూర్తయింది. ఈ లెక్కన సరస్సులోని పలు దీవులు సహా సరస్సు పరిసర ప్రాంతాల్లో మొత్తం 59,687 పక్షులు నివశిస్తున్నట్లు అధికారులు తేల్చారు. వీటిలో 22,395 విదేశీ పక్షులు ఉండగా, మిగతా 39,292 పక్షులు స్థానిక పక్షులుగా అధికారులు గుర్తించారు. ఏటా నవంబర్‌లో శీతాకాలం సమీపించగానే విడిది కోసం విదేశాల నుంచి ఇక్కడి సరస్సుకి చేరుకునే ఈ అతిథి పక్షులు తిరిగి ఫిబ్రవరిలో వేసవి ప్రారంభం కాగానే తమ స్వదేశానికి బయలుదేరుతాయి. అయితే ప్రస్తుతం అనివార్య కారణాల వల్ల ఇక్కడే ఉండిపోయిన కొన్ని విదేశీ పక్షులు వేసవి ఉష్ణోగ్రతల కారణంగా చనిపోతున్నాయి. మృతి చెందుతున్న వాటిల్లో ఎక్కువగా ఫ్లెమింగో, పెలికాన్, బ్రాహ్మణి డక్ పక్షులు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. రోజూ 36 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ఈ ఉష్ణాన్ని ఈ పక్షులు తట్టుకోలేకపోతున్న కారణంగానే మృతి చెందుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, విదేశీ పక్షుల మరణాలు జరగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాలని పర్యాటకులు, యాత్రికులు కోరుతున్నారు. -
ఈ చెట్టు పిట్టలని చంపుతుంది.. కారణం తెలుసా!?
పిట్టది, చెట్టుది అవినాభావ సంబంధం.. పిట్టలు గూళ్లు కట్టుకుని బతకడానికి చెట్లు కావాలి.. గింజలు దూరంగా పడి చెట్లు విస్తరించడానికి పిట్టలు కావాలి.. కానీ ఆ చెట్లు, వాటి గింజలే పిట్టలకు ప్రాణాంతకమైతే..? పిట్టలన్నీ ఇష్టంగా వచ్చి గూళ్లు కట్టుకునే చెట్టే.. వాటి ప్రాణాలు పోవడానికి కారణమైతే..? అవును.. అలాంటి ఓ చెట్టు కథే ఇది. ఆ చెట్టు పేరు పిసోనియా. అన్ని చెట్లలా ఇదీ ఓ సాధారణ చెట్టే అయినా.. పక్షులు చనిపోవడానికి కారణమై ‘బర్డ్ క్యాచర్’ అనే పేరు తెచ్చుకుంది. మరి ఎందుకిలా జరుగుతోంది, కారణం ఏమిటో తెలుసా? మిగతా చెట్లలాగానే ఉన్నా.. ఆఫ్రికా, ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో పెరిగే ఈ పిసోనియా చెట్లు కూడా మిగతా సాధారణ చెట్ల లాంటివే. అన్నింటిలాగే పూలు పూస్తాయి, గుత్తులుగా గింజలు ఏర్పడుతాయి. ఇవి విషపూరితమో, మరో రకంగానో ప్రమాదం కలిగించేవో కాదు. ఈ చెట్టు గింజలకు అంటుకుపోయే జిగురు లాంటి పదార్థం ఉంటుంది, దానిపై సన్నని కొక్కేల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. చెట్టుపై వాలిన ఏవైనా పక్షులు, పురుగులకు ఈ గమ్, కొక్కాలు ఉన్న గింజలు అంటుకుని.. తర్వాత ఎప్పుడో దూరంగా రాలిపోతాయి. అలా దూరంగా పడిన గింజలు మొలకెత్తి పిసోనియా చెట్లు పెరుగుతాయి. ఇలా చెట్లు, మొక్కల జాతులు విస్తరించడం ప్రకృతిలో సహజమే. కానీ ఇక్కడే ఓ తిరకాసు ఉంది. ఆ గింజలతో.. పిసోనియా చెట్ల గింజలకు ఉండే జిగురు చాలా పవర్ఫుల్. పిట్టలేవైనా ఈ చెట్టుమీద వాలినప్పుడు ఆ గింజలు వాటి ఈకలకు అతుక్కుంటాయి. గుత్తులు గుత్తులుగా గింజలు ఉంటాయి కాబట్టి.. పిట్టలకు తల దగ్గరి నుంచి తోక దాకా అంటుకుంటాయి. వాటి బరువు వల్ల, ఈకలు అతుక్కుపోవడం వల్ల పక్షులు ఎగరలేకపోతాయి. ఎగిరినా కొంత దూరంలో కిందపడిపోతాయి. గింజలు ఎక్కువగా అతుక్కుంటే పెద్దగా కదల్లేని స్థితిలో పడిపోతాయి. చివరికి ఆహారం లేక చనిపోతాయి. లేకుంటే పాములు, ఇతర జంతువులకు ఆహారంగా మారిపోతాయి. పిట్టలు, చిన్న చిన్న పక్షులు అయితే.. పిసోనియా గింజల గుత్తులకు అలాగే అంటుకుపోతాయి. అలా వేలాడుతూనే చనిపోతాయి. చాలా చోట్ల పిసోనియా చెట్లకు పక్షుల డెడ్‌బాడీలు, అస్థి పంజరాలు వేలాడుతూ కనిపిస్తాయి. అందుకే వీటిని ‘బర్డ్ క్యాచర్స్’ అని పిలుస్తుంటారు. ఈ చెట్లంటే.. పక్షులకు ఎంతో ఇష్టం పిసోనియా చెట్ల కారణంగా ప్రాణాలు పోతున్నా కూడా.. చాలా రకాల పక్షులకు ఈ చెట్లంటే ఎంతో ఇష్టం. ఎక్కడా కూడా పక్షులు గూళ్లు పెట్టని పిసోనియా చెట్టు ఒక్కటి కూడా కనిపించదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాధారణంగా సముద్ర పక్షులు వలస వచ్చే సమయంలోనే పిసోనియా చెట్లు పూలు పూసి, గింజలు ఏర్పడుతాయి. ఆ టైంలో వలస పక్షులు పిసోనియా చెట్లపై గూళ్లు కట్టుకుని పిల్లల్ని పెడతాయి. ఈ పక్షి పిల్లలకు కొన్ని గింజలు అంటుకున్నా కూడా కింద పడిపోతాయి. సీషెల్స్ దేశంలోని కజిన్ ఐల్యాండ్స్‌లో విక్టోరియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు. పిసోనియా చెట్ల కారణంగా.. వైట్ టెర్న్స్ పక్షుల్లో నాలుగో వంతు, ట్రాపికల్ షీర్‌వాటర్స్ పక్షుల్లో పదో వంతు చనిపోతున్నాయని తేల్చారు. ఏటా లక్షల సంఖ్యలో పక్షులు మరణిస్తున్నట్టు గుర్తించారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ చదవండి: ఇదేం ముంగిస.. ఉన్నట్టుండి చస్తుంది.. మళ్లీ! వైరల్: అగ్ని పర్వతం పక్కనే వాలీబాల్ ఆట -
లోకంలో.. పలు కాకులు; ఆసక్తికర సంగతులు
లోకులు పలు కాకులు అనే సామెత మనకు తెలిసిందే. ఆ సామెత ఎలా ఉన్నా.. కాకుల్లో పలు రకాలు ఉన్నాయి. మనం సాధారణంగా కావ్ కావ్ మంటూ చెవులు చిల్లులు పడేలా అరిచే నల్ల కాకులనే చూస్తాం. కానీ కాకుల్లో కూడా అందమైనవి. ఆకట్టుకునే రంగుల్లో ఉన్నవి కూడా లోకంలో ఉన్నాయి. కార్విడె కుటుంబానికి చెందిన కాకుల్లో హౌస్ క్రోలని, రావెన్స్ అని, జాక్‌డా అని, మాగ్ పీ అని రకరకాలుగా ఉన్నాయి. వాటి వివరాలు ఓ సారి చూద్దాం. రుఫోస్ ట్రీపీ.. కాకి జాతిదే అయినా ఇది గోధుమ రంగులో ఉంటుంది. భారత ఉపఖండం దీని ఆవాసం. సాధారణ వర్షపాతం ఉండే ప్రాంతాలు, అడవులు, పట్టణాల్లోని ఉద్యానవనాల్లో ఇది కనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోతుంది. పళ్లు, గింజలు, కీటకాలు, చిన్న చిన్న జీవులు దీని ప్రధాన ఆహారం. వైట్ బెల్లీడ్ ట్రీ పీ.. తోక పొడుగ్గా, అందంగా ఉండే ఈ కాకి, ఎక్కువగా పశ్చిమ కనుమల్లో నివసిస్తుంది. రూఫోస్ ట్రీపీతో స్నేహం చేస్తుంది. జనావాసాలు అంటే దీనికి పడదు. గింజలు, కీటకాలు, సరీసృపాలు, ఎలుకలు దీని ఆహారం. కామన్ గ్రీన్ మాగ్పీ.. దేశంలోని పక్షి జాతుల్లో అందమైనది. పచ్చని రంగుతో చూడముచ్చటగా ఉంటుంది. పరిమాణంలో చిన్నగా ఉండే ఈ కాకి హిమాలయాల్లో, ఈశాన్య భారతంలో కనిపిస్తుంది. ఇండియన్ జంగిల్ క్రో.. రతదేశం మొత్తం ఈ కాకి కనిపిస్తుంది. హౌస్ క్రోకి దీనికి తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి నల్లగా, కొంచెం పెద్దగా ఉంటుంది. జంగిల్ క్రో అయినా జనావాసాలకు దగ్గరలోనే నివసిస్తుంది. లార్జ్ బిల్లెడ్ క్రో.. ది కూడా అడవి కాకిలాగే పెద్దగా ఉంటుంది. కానీ సైజులో తేడా కనిపిస్తుంది. భారత్, ఆగ్నేయ ఆసియా దేశాల్లోని కాకుల్లో ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఇది కూడా ప్రతిభ గలది. పరిస్థితులకు అనుకూలంగా మారుతుంది. యెల్లో బిల్లెడ్ బ్లూ మాగ్పీ.. వైట్ బెల్లీడ్ ట్రీ పీలాగే దీనికి కూడా పొడవైన తోక ఉంటుంది. కామన్ గ్రీన్ మాగ్పీలా అందంగా ఉంటుంది. భారత ఉపఖండంలోని ఉత్తర ప్రాంతాల్లో ఇది నివసిస్తుంది. నేలపై ఉండే ఆహారాన్ని సేకరించి కడుపునింపుకుంటుంది. బ్లాక్ హెడెడ్ జే.. హిమాలయాల్లో ఈ కాకి జాతి జీవిస్తుంది. నేపాల్, భూటాన్ వ్యవసాయ భూముల్లో కూడా అప్పుడప్పుడూ కనిపిస్తుంది. దీని తలపైన నల్లగా ఉంటుంది. యూరేసియన్ జేకి ఇది దగ్గరి చుట్టం. అదే పరిమాణంలో కూడా ఉంటుంది. హౌస్ క్రో.. పంచంలో అన్ని ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే కాకి ఇది. దీని ఆవాసాలు మనుషులకు చేరువలో ఉంటాయి. కాకి జాతుల్లో కర్ణకఠోరంగా కావ్ కావ్ మంటూ కూసే కాకి ఇదే. నల్లగా ఉన్నా.. కొంత భాగం బూడిద రంగులో మెరుస్తూ ఉంటుంది. కామన్ రావెన్.. కాకి జాతుల్లో పెద్ద వాటిల్లో ఇది ఒకటి. ఇది అత్యంత ప్రతిభ కలిగినది. తెలివైనది. అంతేగాక అవకాశవాది అనే పేరున్నది. వాయవ్య భారతంలో మాత్రమే కనిపిస్తుంది. రాజస్థాన్, పంజాబ్‌తో పాటు సమీపంలోని ఎడారుల్లో జీవిస్తుంది. వెస్ట్రన్ జాక్‌డా.. కాకి జాతిలో చిన్న రకం ఇది. ఉత్తర భారత దేశంలోని కశ్మీర్లో కనిపిస్తుంది. తిండి విషయంలో ఇది కూడా అవకాశవాదే. ఇది పలు రకాలైన ఆహారం భుజిస్తుంది. మొక్కలు, క్రిములు చివరకు వాన పాములు లాంటి వాటికి కూడా గుటుక్కుమనిపిస్తుంది. -
పక్షుల లెక్క 'తేలుద్దాం'
సాక్షి, అమరావతి: పక్షుల వైవిధ్యం గురించి తెలుసుకునేందుకు ‘గ్రేట్ బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్’ పేరిట ఏటా అంతర్జాతీయంగా నిర్వహించే పక్షుల గణనకు రాష్ట్రంలోనూ ఆదరణ పెరిగింది. ఫిబ్రవరి 11 నుంచి నాలుగురోజులపాటు నిర్వహిస్తున్న ఈ గణనలో రాష్ట్రానికి చెందిన పలు యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు భాగస్వాములయ్యాయి. తిరుపతి ఐఐటీ, ఎస్వీ యూనివర్సిటీ, ఏలూరులోని సర్ సీఆర్ఆర్ మహిళా కళాశాల, శ్రీకాకుళం జిల్లాలోని రెండు ప్రభుత్వ పాఠశాలలు, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖలోని ఇందిరాగాంధీ జూపార్క్ కూడా ఇందులో పాలుపంచుకుంటున్నాయి. అలాగే చిత్తూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని పలువురు వలంటీర్లు క్యాంపస్ పక్షుల గణనలో పెద్దఎత్తున పాల్గొంటున్నారు. విజయవాడ నేచర్ క్లబ్, విశాఖ కేంద్రంగా పనిచేసే ఎన్జీవో సంస్థలు డబ్ల్యూసీటీఆర్‌ఈ, ఈసీసీటీలకు చెందిన వలంటీర్లూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. రాష్ట్రంలో పక్షుల గణన కార్యక్రమంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్)–తిరుపతి కీలక భాగస్వామిగా పనిచేస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన పక్షుల గణనలో ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ, ఎస్వీ జూపార్క్, రీజనల్ సైన్స్ సెంటర్, కేంద్రీయ విద్యాలయం పాల్గొని 215 పక్షి జాతులను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా క్రమం తప్పకుండా.. ఏటా ఫిబ్రవరిలో జరిగే ఈ పక్షుల గణనలో వివిధ దేశాలకు చెందిన వేలాదిమంది పక్షుల అభిమానులు(బర్డ్ వాచర్స్) పాల్గొంటారు. ఇందులో భాగంగానే క్యాంపస్ బర్డ్ కౌంట్ పేరుతో విద్యా సంస్థలు, ఇతర సంస్థలు వాటి క్యాంపస్‌లలో పక్షుల గణన చేపడతాయి. పరిశీలకులు(బర్డ్ వాచర్స్) పక్షుల కదలికలను గమనించి వాటి ఫొటోలు తీసి https://birdcount.in/event/ cbc2021/ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అంతర్జాతీయంగా క్రమం తప్పకుండా జరిగే ఈ పక్షుల బర్డ్ కౌంట్‌లో 2013 నుంచి మన దేశంలోని సంస్థలు పాల్గొంటున్నాయి. క్యాంపస్ పక్షుల గణనలో గతేడాది ఐఐఎస్ఈఆర్ తిరుపతి దేశంలోనే మూడో క్యాంపస్‌గా నిలిచింది. పక్షుల వైవిధ్యం తెలుసుకునేందుకు దోహదం దేశంలో పక్షుల వైవిధ్యం గురించి తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. పక్షులపై అవగాహన ఉన్న ఎవరైనా 15 నిమిషాలపాటు వాటి కదలికలను గమనించి వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చు. ఈ సంవత్సరం రాష్ట్రం నుంచి వేలాదిమంది బర్డ్ వాచర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. – ఐఐఎస్ఈఆర్ సిటిజన్ సైన్స్ కో–ఆర్డీనేటర్ రాజశేఖర్ -
ఇలా అయితే పక్షులు బతకడం కష్టం
నల్లగండ్ల చెరువు.. నగర శివారు ప్రాంతం.. చుట్టూ జనావాసాలు తక్కువే. ఉదయం ఆ ప్రాంతానికి వచ్చిన స్థానికులకు చెరువు మధ్యలోని ఓ వెదురుచెట్టుపై ఓ కొంగ వేలాడుతూ కనిపించింది. వెంటనే నెట్లో వెతికి యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీకి ఫోన్ చేసి సమాచారామిచ్చారు. ఆ సంస్థకు చెందిన సంజీవ్ వర్మ, బాలాజీలు వచ్చి థర్మాకోల్ తెప్ప సాయంతో నీటిలో ప్రయాణించారు. పొడవాటి ముళ్లతో ఉన్న ఆ చెట్టుకొమ్మపై అతి కష్టమ్మీద నిలబడి గాయాలను లెక్కచేయకుండా ఐదు గంటలు యత్నించి కొంగను కాపాడారు. జనావాసాలకు దూరంగా ఉన్నప్పటికీ దారం గాలికి కొట్టుకొచ్చి చెట్టుకు చిక్కుకుంది. అది ఆ కొమ్మమీదకు వచ్చే పక్షుల ప్రాణాలను హరిస్తోంది. ఇలా ఇప్పటికే నగరం, శివారు ప్రాంతాల్లో వందల సంఖ్యలో పక్షులు చనిపోగా, పక్షి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరో రెండు మూడు వందల పక్షులను కాపాడారు. సాక్షి, హైదరాబాద్: జనవరి సమీపిస్తోందంటే చాలు వినీలాకాశం మరిన్ని రంగులనద్దుకుంటుంది. రంగురంగుల పతంగులతో కొత్త శోభను సంతరించుకుంటుంది. గాలిపటాలు ఎగరేయటం సరదానే. కానీ, పక్షులకు మాత్రం ప్రాణసంకటంగా మారింది. ఎదుటివారి గాలిపటాన్ని తెంపే ఉద్దేశంతో దానికి కొంతమేర వరకు మాంజా కడుతున్నారు. పతంగి తెగినప్పుడు గాలివాటానికి కొట్టుకుపోయి ఏ చెట్టు కొమ్మకో, సెల్టవర్కో చిక్కుకుంటోంది. ఆ విషయం గుర్తించని పక్షులు దానికి చేరువగా ఎగిరినప్పుడు వాటి రెక్కలకు దారం చుట్టుకుపోతోంది. విడిపించుకునే తొందరలో అటు, ఇటు ఎగిరేసరికి రెక్కలు తెగిపోయో, శరీరం కోసుకుపోయో పక్షులు చనిపోతున్నాయి. కొన్ని దారాలకే వేలాడుతూ తిండిలేక మరణిస్తున్నాయి. ఇలా ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో పక్షులు చనిపోతుండటంతో ప్రభుత్వం మాంజాను నిషేధించింది. కానీ, దాన్ని పట్టించుకోకుండా చాలామంది మాంజాను వాడుతూ పక్షుల మృతికి కారణమవుతున్నారు. ఏ చెట్టుకు చూసినా... ప్రస్తుతం నగరంలో ఏ చెట్టుకు చూసినా మాంజా దారపు పోగులు వేలాడుతున్నాయి. నిత్యం వాటికి పక్షులు చిక్కి విలవిలలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మాంజా ఫ్రీ నగరం చేసేందుకు యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ కార్యాచరణ చేపడుతోంది. జీహెచ్ఎంసీ, అగ్నిమాపక విభాగం, డిజాస్టర్ రెస్పాన్స్ టీంల చేయూతతో పక్షి ప్రేమికులను ఏకం చేస్తోంది. ఇందుకోసం సామాజిక వేదికల ద్వారా ప్రచారం ప్రారంభించింది. వారి వారి ఇళ్ల వద్ద ఉన్న చెట్లకు వేలాడుతున్న దారాలను తొలగించాలని కోరుతోంది. చెట్టు ఎక్కలేని పరిస్థితి ఉన్నా, సెల్‌టవర్లకు దారాలున్నా తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ సమాచారం ఇచ్చేందుకు కూడా సామాజిక మాధ్యమం ద్వారా ఓ వ్యవస్థ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉంది. దారం వేలాడుతున్న ప్రాంతాల వివరాలు, ఫొటోలు అందులో అప్లోడ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. త్వరలో ఇది ప్రారంభం కానుంది. డిజాస్టర్ రెస్పాన్స్ టీం, అగ్నిమాపక విభాగం సహకారం చాలా ప్రాంతాల్లో ఎత్తుగా ఉన్న చెట్లపైన పక్షులు దారాలకు చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. చిటారు కొమ్మల వరకు చేరుకోవటం కష్టంగా ఉండటంతో డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్, అగ్నిమాపక విభాగం బృందాలు నిచ్చెనల సాయంతో రక్షిస్తున్నారు. ఈ విషయంలో ఆ రెండు విభాగాలు చాలా సహకరిస్తున్నాయని యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీకి చెందిన అమర్నాథ్ పేర్కొన్నారు. -
కొత్తగా.. రెక్కలొచ్చెనా!
విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొత్త పక్షి జాతులు పక్షి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. వలస వచ్చే పక్షి జాతులు, నీటి బాతులు ఆకర్షిస్తున్నాయి. మనదేశంలోని పలు ప్రాంతాల నుంచే కాక, విదేశాల నుంచి ఇక్కడికి తరలివస్తున్న మొత్తం 156 రకాల పక్షి జాతులు వెలుగుచూశాయి. విజయవాడ నేచర్ క్లబ్ ఆధ్వర్యంలో కొందరు ఔత్సాహికులు తాజాగా పక్షుల గణన చేపట్టారు. ఆ వివరాలు ఈ కథనంలో మీకోసం.. సాక్షి, అమరావతి: కొల్లేరు, ఉప్పలపాడు, కొండకర్ల.. మన రాష్ట్రంలో పక్షులు, వలస పక్షులకు స్థావరాలివి. పక్షి ప్రేమికులు మన రాష్ట్రంలో ఎక్కువగా ఈ ప్రాంతాలనే సందర్శిస్తుంటారు. లేదంటే రాజస్తాన్, గుజరాత్ వంటి చిత్తడి నేలలు ఎక్కువ ఉండే ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇప్పుడు విజయవాడ పరిసరాల్లోని చిత్తడి నేలల్లోనూ కొత్త పక్షులు కనువిందు చేస్తున్నాయి. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు రికార్డుల్లో నమోదుకాని ఏడు రకాల కొత్త పక్షి జాతులు కనిపించాయి. సుదూర ప్రాంతాల నుంచి వలస వస్తున్న 25 విదేశీ పక్షి జాతులు దర్శనమిచ్చాయి. వీటితో కలిపి మొత్తం 156 రకాల పక్షి జాతులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. విజయవాడ నేచర్ క్లబ్ ఆధ్వర్యంలో నగర పరిసరాల్లోని చెరువులు, పంట పొలాల్లో చేపట్టిన తొలి విడత పక్షుల గణనలో వీటిని గుర్తించారు. కోకిల డేగ.. నామం బాతు.. విజయవాడ సమీపంలోని వెలగలేరు, కొండపావులూరు, నున్న, కవులూరు, పైడూరుపాడు, ఈడుపుగల్లు, ముస్తాబాద సహా 15 మంచినీటి చెరువులు, వాటి పరిసర ప్రాంతాలు, వాటి చుట్టుపక్కల పొలాల్లో ఇప్పటి వరకు పక్షుల గణన చేశారు. జిట్టంగి (బ్లైత్స్ పిపిట్), పెద్ద కంప జిట్ట (ఈస్టర్న్ ఓర్ఫియన్ వార్బ్లెర్), మెడను లింగాడు (యురేసియన్ వ్రైనెక్), కోకిల డేగ (క్రెస్టెడ్ గోషాక్), ఉడతల గెద్ద (పాలిడ్ హారియర్), నీలి ఈగపట్టు పిట్ట (వెర్డిటర్ ఫ్లైకాచర్), నూనె బుడ్డిగాడు (బ్లాక్ రెడ్‌స్టార్ట్) పక్షులను కొత్తగా కనుగొన్నారు. నీటి పక్షులు–బాతులు (మైగ్రేటరీ వాటర్‌ఫౌల్), నామం బాతు (స్పాటెడ్ యురేసియన్ వైజన్), సూదితోక బాతు (నార్తర్న్ పిన్‌టైల్), చెంచామూతి బాతు (నార్తర్న్ షోవెలర్) వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన 25 రకాల వలస పక్షులను గుర్తించారు. వీటిలో ఎక్కువ పక్షులు యూరోప్, రష్యా, మంగోలియా, సైబీరియా, చైనా నుంచి వలస వస్తున్నాయి. కొన్ని పక్షులు హిమాలయాలు, రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వలస వస్తున్నాయి. గుర్తించిన 152 పక్షుల్లో 14 రకాల జాతులు 1972 వన్యప్రాణ రక్షణ చట్టం షెడ్యూల్–1 పరిధిలో ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం వీటిని వేటాడితే శిక్షార్హులే. 30 రకాల జాతులు తగ్గిపోతున్న పక్షుల జాబితాలో ఉన్నాయి. అటవీ శాఖ సహకారం అటవీ శాఖ మూడు, నాలుగు సంవత్సరాలకోసారి నిర్వహించే సర్వే తప్ప నిర్దేశించిన ప్రాంతంలో ఇప్పటి వరకు పక్షుల గణన ఏ జిల్లాలోనూ జరగలేదు. విజయవాడ నేచర్ క్లబ్ పేరుతో బండి రాజశేఖర్, దాసి రాజేష్‌వర్మ, డాక్టర్ కిశోర్‌నాథ్ మరికొందరు ఔత్సాహికులు ఐఐఎస్ఈఆర్, మథాయ్ నేచర్ కన్జర్వేషన్ ట్రస్ట్ సహకారంతో తొలిసారిగా ఈ గణన చేపట్టారు. అటవీ శాఖ సైతం ఇందులో పాలుపంచుకుంది. 28 మంది వలంటీర్లు వారాంతాలు, సెలవు రోజుల్లో 40 గంటలపాటు ఈ గణనలో పాల్గొన్నారు. రెండో విడత గణన ఈనెల నేటి నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు జరగనుంది. పక్షుల ఆవాసాలను రక్షించాలి విజయవాడ పరిసరాల్లో వలస పక్షులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ఎంతో దూరం నుంచి వస్తున్న వలస పక్షుల ఆవాసాలను రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తొలిసారి చేపట్టిన పక్షుల గణనకు మంచి ఆదరణ వచ్చింది. రెండో విడత గణనలో మరిన్ని కొత్త పక్షులు కనిపిస్తాయని ఆశిస్తున్నాం. – బండి రాజశేఖర్, ఐఐఎస్ఈఆర్, సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్ -
ప్రకాశంలో బర్డ్ ఫ్లూ కలకలం
సాక్షి, చినగంజాం(ప్రకాశం): బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలుతోందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో సోమవారం చెట్ల కింద పక్షులు చనిపోయి ఉండటం తీవ్ర కలకలం రేపింది. ఒకే చెట్టు కింద ఎనిమిది పక్షుల కళేబరాలు ఉండటంతో జనం ఆందోళనకు గురయ్యారు. చినగంజాం మండలంలోని పెదగంజాం పల్లెపాలెం సముద్ర తీరం వెంబడి వేప చెట్టు కింద 5 కాకులు, 3 గోరింకలు చనిపోయి ఉండటాన్ని సోమవారం స్థానికులు గమనించారు. గ్రామంలోకి సమాచారం చేరవేయడంతో బర్డ్ ఫ్లూ వల్లే అలా జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం కావడంతో అధికారులు సత్వరం స్పందించారు. పెదగంజాం గ్రామ కార్యదర్శి భారతి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పక్షుల కళేబరాలను అక్కడి నుంచి తొలగించి వెంటనే పూడ్చి వేయించారు. విషయం తెలుసుకున్న పలు మీడియా చానళ్లు బర్డ్ ఫ్లూ అంటూ.. ప్రచారం చేశాయి. ఈ విషయమై రెవెన్యూ, పోలీసు అధికారులు, పశు వైద్యాధికారులతో ‘సాక్షి’ మాట్లాడి వివరణ తీసుకుంది. తీరం వెంబడి చెట్ల వద్ద పక్షులు నిత్యం నివాసం ఉంటుంటాయని, ఆ సమీప ప్రాంతాలలో వేరుశనగ సాగవుతున్న నేపథ్యంలో రైతులు పంటకు సత్తువ కోసం గుళికల మందు వాడుతుంటారని, అది కలిసిన నీటిని తాగి పక్షులు చెట్టు మీద సేదతీరిన సందర్భల్లోనూ ఇలాంటి సంఘటన చోటు చేసుకొనే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అపోహలు, ఆందోళన వద్దు: డాక్టర్ బసవశంకర్, ప్రాంతీయ పశువైద్య సహాయ సంచాలకులు పల్లెపాలెంలో పక్షులు చనిపోయిన విషయం మా దృష్టికి వచ్చింది. మేం వెళ్లేలోగా అధికారులు వాటిని పూడ్చి పెట్టారు. పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో నుంచి సమాచారం సేకరించాం. గుంటూరు, విజయవాడ, ఒంగోలు ప్రాంతాల్లో పక్షుల కళేబరాలు పరీక్షించే ల్యాబ్ రేటరీలున్నాయి. బర్డ్ ఫ్లూకు సంబంధించి దేశంలో భోపాల్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్‌లో మాత్రమే నిర్దారణ చేస్తారు. పరీక్షిస్తేనే ఏవిషయం తెలుస్తుంది. భవిష్యత్‌లో ఇలా పక్షులు చనిపోతే సత్వరం తమకు సమాచారం ఇవ్వాలని సూచించాం. బర్డ్ ఫ్లూ గురించి ఆందోళన అవసరం లేదు. మన దేశంలో 150 నుంచి 200 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు చికెన్‌ను ఉడికిస్తారు చికెన్ తినడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం లేదు. -
పక్షుల కిలకిల.. మెరుగైన జీవవైవిధ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రకృతిలో ఎన్నో ప్రాణులున్నా పక్షులది ప్రత్యేక గుర్తింపు.. ఎన్నో రకాలు.. ఎన్నో రంగులు.. మరెన్నో రాగాలు.. రాష్ట్రంలో వివిధ రకాల పక్షులు కిలకిలరావాలతో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం మెరుగైన జీవవైవిధ్యం, చెట్లు, పూల మొక్కలు, పక్షులు, జంతుజాలంతో రాష్ట్రం విలసిల్లుతోంది. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే 350కు పైగా పక్షుల రకాలు ఉన్నట్టుగా పర్యావరణ, పక్షుల ప్రేమికులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్.. దాని చుట్టుపక్కలే 270 దాకా వివిధ రకాల పక్షులుంటాయని చెబుతున్నారు. తాజాగా వికారాబాద్ అనంతగిరిలో దేశంలోనే అరుదైన ‘బ్లూ అండ్ వైట్ ఫ్లై క్యాచర్’ పక్షి కనిపించడం విశేషం. గత 30 ఏళ్ల కాలంలో ఇది తెలంగాణలోనే కనిపించలేదని, ఇప్పుడు కనిపించడాన్ని బట్టి మెరుగైన ఎకో సిస్టమ్‌తో పాటు జీవవైవిధ్యం బాగా ఉన్నట్టుగా, పక్షులు స్వేచ్ఛగా తమ జీవక్రియలను కొనసాగించేందుకు అనుకూల వాతావరణం ఉన్నట్టుగా భావించవచ్చని పర్యావరణవేత్తలు పేర్కొన్నారు. జనవరి 5వ తేదీని ‘నేషనల్ బర్డ్ డే’గా అంతర్జాతీయస్థాయిలో నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అమెరికాలో దీనిని ఒక ఉద్యమంగా ఒక కార్యాచరణ మాదిరిగా నిర్వహిస్తున్నారు. బర్డ్‌వాచింగ్, పక్షులపై అధ్యయనం, బర్డ్ యాక్టివిటీస్ పర్యవేక్షణ, పక్షులను దత్తత తీసుకోవడం అనేవి ‘నేషనల్ బర్డ్ డే’ యాక్టివిటీగా దాదాపు 5 లక్షల మంది వరకు నిర్వహిస్తుండటం విశేషం. యూఎస్‌లో ‘యాన్యువల్ క్రిస్మస్ బర్డ్ కౌంట్’లో భాగంగా దీనిని కూడా నిర్వహిస్తా రు. తమ దేశంలోని పక్షుల పురోభివృద్ధి, క్షేమ సమాచారం తెలుసుకునేందుకు సిటిజన్ సైన్స్ సర్వే మాదిరిగా చేపడుతున్నారు. పదేళ్ల కింద నుంచే నేషనల్ బర్డ్ డేను నిర్వహిస్తుండగా, భారత్‌లో ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్‌లోనూ జనవరి 5న నేషనల్ బర్డ్ డే సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్, వానలతో మేలు.. ‘తెలంగాణలో పక్షి జాతులు, రకాల సంతతి బాగానే వృద్ధి చెందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అలాగే హైదరాబాద్, చుట్టుపక్కల వివిధ రకాల పక్షి జాతులు మనుగడ సాగిస్తున్నాయి. సాధారణంగానే పక్షుల మనుగడ, పరిరక్షణ విషయంలో మన రాష్ట్రం మెరుగైన స్థితిలోనే ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘ లాక్డౌన్, ఆ తర్వాత వర్షం సీజన్ బాగా ఉండటం మనకు ఎంతో మేలు చేసింది. ముఖ్యంగా పర్యావరణానికి, అడవులు, జంతువులు, పశుపక్ష్యాదులకు మంచి జరిగింది. ప్రస్తుత సీజన్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వలస పక్షులు, పౌల్ట్రీ ఫామ్‌లలోని కోళ్లతో బర్డ్ ఫ్లూ వ్యాపించే అవకాశాలున్నాయి. అయితే దీని పట్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – హరికృష్ణ ఆడెపు, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సంస్థ అధ్యక్షుడు పాలినేటర్స్ పార్కులు పెట్టాలి.. ‘రాష్ట్రంలో పెద్ద ఎత్తున అర్బన్ పార్కులను పెడుతున్న విధంగానే ‘పాలినేటర్స్ పార్కు’లను కూడా ఏర్పాటు చేయాలి. కనీసం జిల్లాకో పార్క్ పెట్టాలి. తెలంగాణకు ప్రత్యేకమైన, స్థానిక మొక్కలు, పండ్ల మొక్కలను వాటిలో పెంచితే పక్షులు వాటిని తిన్నాక ఇతర ప్రాంతాల్లో వాటి డ్రాపింగ్స్ ద్వారా ఈ మొక్కలు పెరుగుతాయి. అదే ఎగ్జోటిక్, ఇన్వెసివ్ ప్లాంట్లను పెట్టడం వల్ల మనుషులు, పక్షులకు ఎలర్జీలు ఏర్పడుతున్నాయి. నేటివ్ ప్లాంట్స్ ఎకోసిస్టమ్‌ను పెంచడానికి, జీవవైవిధ్యం మరింత మెరుగుపడేందుకు పాలినేటర్స్ పార్కులు దోహదపడతాయి. వీటి వల్ల పక్షుల సంఖ్య కూడా పెరుగుతుంది. బర్డ్ ఫ్లూ కేసులు, కొత్త వైరస్ బయటపడిన నేపథ్యంలో ఎక్కడైనా చనిపోయిన పక్షులు కనిపిస్తే వాటి గురించి అటవీ, వెటర్నరీ అధికారులకు తెలియజేస్తే వాటిని సేఫ్‌గా డిస్పోజ్ చేయవచ్చు. లేకపోతే చనిపోయిన పక్షుల వల్ల కూడా వైరస్ వ్యాపించే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి’ – గైని సాయిలు, బయో డైవర్సిటీ ఎక్స్పర్ట్, ఫారెస్ట్ 2.0 రీజినల్ డైరెక్టర్ జపాన్‌లో కనిపించే పక్షి వికారాబాద్ జిల్లాలోని అడవిలో ఇటీవల మేము పర్యటిస్తున్న సందర్భంగా దేశంలోనే అత్యంత అరుదైన ‘బ్లూ అండ్ వైట్ ఫ్లై క్యాచర్’పక్షి తారసపడటంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బ య్యాము. జపాన్, కొరియాలో ప్రధానంగా కనిపించే ఈ పక్షి, భారత్‌లోని దక్కన్ పీఠభూమిలో కనిపించడాన్ని వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ శ్రీరాంరెడ్డి తన కెమెరాలో బంధించాడు. అడవుల సంరక్షణతో పాటు జీవవైవిధ్యం మెరుగ్గా ఉంటే ప్రతీ ఏడాది ఈ పక్షి తెలంగాణలో కనిపించి కనువిందు చేస్తుంది. – గోపాలకృష్ణ, పక్షి ప్రేమికుడు -
మృత్యు దారం!
ఇదే పొజిషన్లో మనం ఉంటే. తినలేక.. తీయడానికి రాక.. రోజురోజుకీ కృశించిపోయి.. నరకయాతన పడుతూ.. చనిపోవడం ఖాయం. ఎంత దారుణం ఇది.. ఈ పాపం ఎవరిది? అచ్చంగా మనదే.. మన నిర్లక్ష్యానిదే.. సాక్షి, హైదరాబాద్: బీహెచ్ఈఎల్ సమీపంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలోని అమీన్పూర్ చెరువు వద్ద ప్రస్తుత పరిస్థితి ఇదీ.. పట్టణ ప్రాంతంలో ఉన్నప్పటికీ జీవవైవిధ్య వారసత్వ జలాశయంగా గుర్తింపు దక్కించుకున్న తొలి చెరువు ఇది.. ఎందుకంటే అక్కడ 364 రకాల జాతుల ప్రాణులు జీవనం సాగిస్తున్నాయి. అందులో 166 రకాల పక్షులున్నాయి. ఇటు ఏటా 60 జాతుల వరకు విదేశీ పక్షులు వలస వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఇక 16 రకాల పాములు, 10 రకాల చేపలు, 10 రకాల బల్లి, తొండ జాతులు, మూడు రకాల ఊసరవెల్లులు, 41 రకాల సీతాకోకచిలుకలు, 7 రకాల తూనీగలు, 26 రకాల కీటకాలు.. ఒకటేమిటి అదో అద్భుత జీవవైవిధ్యం.. చుట్టూ జనావాసాలే.. అయినా ఆకట్టుకునే జీవవైవిధ్యం దాని సొంతం.. దేశంలోనే అలాంటి ప్రత్యేకత పొందిన ఆ అద్భుతాన్ని మనమెలా చూసుకోవాలి.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ భావితరాలకు దాన్ని అందించాలి.. కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రజలైనా పరిరక్షిస్తున్నారా అంటే అదీ లేదు.. ఏంటా ప్రమాదం.. అమీన్పూర్ చెరువుకు ఏటా ఫ్లెమింగో లు, స్పాట్ బిల్డ్ పెలికాన్స్, గ్రే హెరాన్స్, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్స్, కింగ్ ఫిషర్, ఆ్రస్పే.. ఇలా దాదాపు 60 రకాల జాతుల వరకు విదేశీ వలస పక్షులు వస్తుంటాయి. ప్రాణాధారమై న ఆ చెరువే ఇప్పుడు పక్షుల మరణ శాసనం లిఖిస్తోంది. దారాల రూపంలో ఉరితాళ్లు చెరువులోని పక్షులను కబలిస్తున్నాయి. ఇళ్లల్లో పూజలు చేసిన తర్వాత దేవుడికి సమరి్పంచిన పూలను చాలామంది నీటిలో వేస్తుంటారు. చాలా చెరువుల్లో డ్రైనేజీ నీరు కలుస్తుండటంతో వాటిలో వేయటాన్ని అపవిత్రంగా భావిస్తున్నారు. దీంతో వారి దృష్టి అమీన్పూర్ చెరువుపై పడింది. చాలా ప్రాంతాల నుంచి జనం పూలమాలలను తెచ్చి ఈ చెరువులో వేస్తున్నారు. కొంతకాలానికి పూలు కుళ్లి నీటిలో కలిసి వాటి దారాలు మాత్రం తేలుతున్నాయి. ఆహార వేటలో భాగంగా తలభాగాన్ని నీటిలో ముంచిన సమయంలో ఆ దారాలు పక్షుల ముక్కులకు చుట్టుకుంటున్నాయి. కొన్నింటికి రెక్కలు, కాళ్లకు చిక్కుకుంటున్నాయి. దీంతో వాటిని విడిపించుకోలేక క్రమంగా నీరసించి అవి చనిపోతున్నాయి. గతంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లలో పాత వలల భాగాలు పక్షుల ముక్కులకు చుట్టుకుని మృత్యువాత పడుతుండేవి. తాజాగా యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు అమీన్పూర్ చెరువు వద్ద పరిశుభ్రత చర్యలు చేపట్టారు. అమీన్పూర్ చెరువు వద్ద పరిశుభ్రత చర్యలు చేపడుతున్న యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు కొత్తగా మాస్కులు.. ప్రస్తుతం కరోనా భయంతో వాడిన మాస్కులు కూడా పెద్ద మొత్తంలో చెరువు తీరంలో కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వాడిన మాస్కుల వల్ల ఇక్కడి జీవజాతులకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జీవవైవిధ్య ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ లేదా ఇతర పెద్ద సంస్థలు తమ అ«దీనంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో సరిదిద్దాల్సిన అవసరముందని ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. ఇదీ చరిత్ర ఈ చెరువును ఇబ్రహీం కుతుబ్‌షా హయాంలో 1560 ప్రాంతంలో నిర్మించారు. దివానంలో నవాబు సలహాదారుగా ఉన్న ఖాదిర్ అమీన్ ఖాన్ పటాన్చెరు ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ భూములకు సాగునీటి కోసం దీన్ని నిర్మించారట.. 300 ఎకరాల్లో ఉన్న చెరువు కాస్తా రానురాను 93 ఎకరాలకు కుంచించుకుపోయింది. అద్భుతాన్ని పాడుచేస్తున్నారు.. ‘నగరంలో ఇలా గొప్ప జీవవైవిధ్య జలాశయం ఉండటం అరుదు. ఇప్పుడు వలస పక్షుల రాక మొదలైంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు అవి కనువిందు చేస్తాయి. అలాంటి అద్భుత వనరును ప్రజలే పాడుచేస్తుండటం దారుణం. ప్రజల్లో అవగాహన తేవటంతోపాటు దాని పరిరక్షణకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది’ – సంజీవ్‌వర్మ, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ గతేడాది కొత్త అతిథి ఆస్ప్రే.. అంతెత్తు నుంచి వేగంగా నీటి మీదకు దూసుకొచ్చి రెండు కాళ్లతో చేపను ఒడిసిపట్టుకుని రివ్వున ఎగిరిపోయే తెలుపు–గోధుమ వర్ణం గద్ద గతేడాది ఇక్కడ కనిపించింది. ఆ్రస్పేగా పిలిచే ఈ పక్షి మనదేశంలో కొన్ని ప్రాంతాల్లోనే ఉంది. మనవద్ద కనిపించదు. గతేడాది వలస పక్షిగా అది ఇక్కడ కనిపించినట్టు బర్డ్ వాచర్స్ చెబుతున్నారు. -
అమూర్ డేగ జంట అద్భుత ప్రయాణం..
సాక్షి, అమరావతి: వలస పక్షుల సుదీర్ఘ ప్రయాణాలు సాధారణ విషయమే. కానీ రెండు అమూర్ డేగలు (అమూర్ ఫాల్కన్స్) ఏకంగా రెండు మహా సముద్రాలను దాటి, పదికిపైగా దేశాలను చుట్టి 29 వేల కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించాయి. వాటికి అమర్చిన శాటిలైట్ రేడియో ట్రాన్స్మీటర్ల ద్వారా పరిశోధకులు ఆ పక్షుల రూట్, ప్రయాణించిన దూరాన్ని తెలుసుకున్నారు. ఆర్కిటిక్ టెర్న్ తర్వాత ప్రపంచంలోనే ఎక్కువ దూరం ప్రయాణించిన పక్షులుగా ఇవి ఇప్పుడు గుర్తింపు పొందినట్లు చెబుతున్నారు. అమూర్ డేగల వలస మార్గం, ప్రయాణం గురించి అధ్యయనం చేయడానికి సైబీరియాలోని అమూర్ నుంచి మణిపూర్ వచ్చిన ఐదు పక్షులకు గతేడాది నవంబర్ 2న వైల్డ్ లైఫ్ సొసైటీ ఆఫ్ ఇండియా, మణిపూర్ ఫారెస్ట్ శాఖ సంయుక్తంగా శాటిలైట్ రేడియో ట్రాన్స్మీటర్లు అమర్చింది. వాటికి చ్యులాన్, ఇరాంగ్, బారక్, ఫలాంగ్, పుచింగ్ అని పేర్లు పెట్టారు. బారక్, ఫలాంగ్, ఫుచింగ్‌ల నుంచి సిగ్నల్ రావడం చాలా కాలం క్రితమే ఆగిపోవడంతో అవి చనిపోయినట్లు భావించారు. కానీ చ్యులాన్, ఇరాంగ్ నుంచి నిరంతరం సిగ్నల్స్ వచ్చాయి. ఆడ పక్షి చ్యులాన్ 29 వేల కి.మీ. ప్రయాణించి తన వలస మార్గాన్ని (361 రోజుల్లో) పూర్తిచేసి ఇటీవలే మణిపూర్‌లో తన తాత్కాలిక స్థావరానికి చేరుకుంది. మగ పక్షి ఇరాంగ్ 33 వేల కి.మీ. ప్రయాణించి తర్వాత అక్కడకు చేరింది. (చదవండి: వాలిబాల్ ఆడుతున్న పక్షలు.. గెలుపెవరిది?) డేగల రూట్ ఇదే.. ⇒ చైనా నుంచి బయలుదేరి థాయ్‌లాండ్, మయన్మార్ మీదుగా మన దేశంలోని మణిపూర్‌లోకి వచ్చాక వాటికి జియో ట్యాగ్లు అమర్చారు. వాటి సిగ్నల్ ఆధారంగా బంగాళాఖాతం తీరంలో మన దేశంలోని ఏపీ, కర్ణాటక పలు ప్రాంతాల నుంచి అరేబియా సముద్రం దాటి ఆఫ్రికా ఖండంలోని సోమాలియా, కెన్యా, టాంజానియా, జాంబియా, జింబాబ్వే, బొట్స్వానా మీదుగా దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ శీతాకాల విడిది చేశాయి. మళ్లీ తిరిగి ఇదే రూట్లో మణిపూర్ చేరుకున్నాయి. తర్వాత ఇవి చైనా, రష్యా ప్రాంతానికి వెళ్లిపోయాయి. ⇒ అమూర్ డేగలు నాగాలాండ్ ప్రాంతానికి లక్షల్లో వలస వస్తాయి. శీతాకాలంలో ఆ ప్రాంతంలోని అడవులు, పంటల్లో చెదలు, క్రిమి కీటకాలను ఇవి తినేవి. అయితే స్థానికులు పెద్దఎత్తున వేటాడడంతో వాటి రాక తగ్గిపోయింది. దీనివల్ల పంటలు, అడవులు క్రిమి కీటకాలతో నాశనమవుతున్నట్లు గుర్తించి వేటాడడం నిలిపివేశారు. ⇒ అప్పటి నుంచి మళ్లీ అమూర్ డేగలు వస్తుండటంతో వారికి క్రిమిసం హారక మందులు వాడాల్సిన అవసరం ఉండటంలేదంటున్నారు. నాగాలాండ్‌కు అమూర్ డేగలు వచ్చే సమయంలో పండుగ నిర్వ హిస్తున్నారు.వాటిని చూడ్డానికి పెద్దఎత్తున పర్యాటకులు వస్తున్నారు. ► 6.2 సంవత్సరాల జీవిత కాలం ► 160200 గ్రాముల బరువు ► 2831 సెంటీమీటర్ల పొడవు ► అరుపు.. కివ్.. కివ్.. కివ్.. ► ఆహారం... పంటలను ఆశించే క్రిమి, కీటకాలు, అడవుల్లో చెదలు మగ డేగ ముదురు బూడిద, ఎరుపు రంగులో ఉంటుంది. రెక్కల వెనుక భాగం తెల్లగా ఉంటుంది. తొడల భాగం గోధుమ వర్ణంలో ఉంటుంది. కడుపు భాగంలో నల్లటి మచ్చలు ఉంటాయి. ఆడ డేగ పై భాగం లేత బూడిద రంగులో ఉంటుంది. నుదుటి భాగం క్రీమ్ కలర్లో ఉంటుంది. ఛాతీ భాగంలో తెలుపు, బూడిద రంగులో పెద్ద మచ్చలు ఉంటాయి. తోక, ఈకలు కొంచెం నలుపు రంగులో ఉంటాయి. (చదవండి: రోడ్డుపై సింహాలు, గుజరాతీలో మాట్లాడిన వ్యక్తి) ఇతర విశేషాలు కంటి పాచ్ నల్లగా ఉంటుంది. కంటి చుట్టూ ఆరెంజ్ రంగు వలయం ఆకర్షణీయంగా ఉంటుంది. గుండ్రని వంపు గల రెక్కలు ఉంటాయి. అత్యంత స్నేహశీలి. సంధ్యా సమయంలో చాలా చురుగ్గా ఉంటుంది. కాళ్లు, పాదాలు.. ఎరుపు, ఆరెంజ్ రంగుల మేళవింపుతో ఉంటాయి. చిన్నపాటి తోక కలిగి ఉంటాయి. మధ్య, తూర్పు హిమాలయాల్లో.. దక్షిణ అస్సాం కొండలు, శ్రీలంక, భారతదేశంలోని సముద్రతీరం, మాల్దీవులు, ఈశాన్య ఆసియా, ఆగ్నేయ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. గుంపులుగా కలిసి వలస వెళ్తాయి. ఒక్కో సారి ఇతర జాతుల పక్షులతో కలిసి కూడా ప్రయాణిస్తాయి. చెట్ల పొదలను ఇష్టపడతాయి. గడ్డిభూములు, చిత్తడి నేలలు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా ఆవాసాలు ఏర్పరచుకుంటాయి. చెట్ల రంధ్రాలు, పాత గూళ్లలో విశ్రాంతి తీసుకుంటాయి. ఎరుపు రంగును చూస్తే ఆందోళనకు గురవుతాయి. పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి అమూర్ డేగలు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. క్రిములను తిని బతికే పక్షుల్లో అత్యధిక దూరం ప్రయాణించేవి ఇవే. ఆగకుండా నాలుగైదు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. మన రాష్ట్రం ఈ పక్షుల వలస మార్గం. తిరుపతి, విశాఖలో గతంలో కనిపించాయి. మచిలీపట్నంలోనూ దీన్ని గుర్తించారు. నైరుతి రుతు పవనాలు, సముద్రంలో ఏర్పడే అల్ప పీడనాలను ఉపయోగించుకుని ఇవి ప్రయాణిస్తున్నట్లు ప్రాథమికంగా తేలింది. వీటిపై ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంది. – రాజశేఖర్ బండి, సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్, ఐఐఎస్ఈఆర్ -
వాలిబాల్ ఆడుతున్న పక్షులు.. గెలిచేదెవరు?
న్యూఢిల్లీ: మనుషులను ఆశ్చర్యపరిచే జంతువులు, పక్షుల వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ట్విటర్లో షేర్ చేసిన చిన్న చిన్న పక్షుల వీడియో నెటిజన్లను వీపరీతంగా ఆకట్టుకుంటోంది. పచ్చ, పసుపు రంగుల్లో ఉన్న పక్షులు రెండు టీంలు విడిపోయి పోటీ పోటీగా వాలిబాల్ ఆడుతున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతోంది. దీనికి ‘ప్రపంచవ్యాప్తంగా క్రీడలు రద్దయ్యాయి.. కానీ ఈ బార్డీబాల్ మాత్రం కాదు’ అనే ఫన్ని క్యాప్సన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్ వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఈ గ్రీన్ అండ్ ఎల్లో టీమ్‌లో ఎవరూ గెలుస్తారు అని అడిగిన ప్రశ్నకు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. (చదవండి: యజమానికి పెంపుడు పిల్లి వింత బహుమతి) Sports are mainly cancelled... but some Birdyball will do! 🤣👍 pic.twitter.com/zBgwGM8nlX — Madeyousmile (@Thund3rB0lt) October 18, 2020 ‘రెండు టీమ్‌లు గెలుస్తాయి’, ‘గ్రీన్ టీమ్ చీటింగ్ చేస్తుంది’, ‘ఈ పక్షులు ఎంత ముద్దుగా ఉన్నాయో. వాటిని మా ఇంటికి తీసుకువెళ్లాలని ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 11 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఈ పక్షులు ఎల్లో, గ్రీన్ టీమ్‌లుగా విడిపోయాయి. ఈ రెండు టీమ్‌ల పక్షులు ముక్కుతో బాల్‌ను కరుచుకుని ఆటు ఇటూ నెట్‌పై నుంచి తోస్తున్నాయి. ఎల్లో పక్షి బాల్‌ను గ్రీన్ పక్షుల వైపు వేస్తుంటే ఓ గ్రీన్ పక్షి ఎల్లో పక్షివైపే నెడుతూ చీటింగ్ చేస్తుంది. (చదవండి: 516కు పైగా ఆపరేషన్స్.. అయినా కానీ..) -
కవ్వాల్‌లో కిలకిలలు
వన్యప్రాణులకు నిలయంగా మారిన కవ్వాల్ పులుల రక్షిత ప్రదేశం ఇప్పుడు పక్షులకూ ఆవాసంగా మారుతోంది. వన్యప్రాణుల సంరక్షణతోపాటు పక్షి జాతి సంరక్షణకు అటవీ అధికారులు కంకణం కట్టుకున్నారు. బర్డ్స్ ఫెస్టివల్లో భాగంగా ఇటీవల జన్నారం అడవులకు వచ్చిన పక్షి ప్రేమికులు పలు పక్షులను గుర్తించారు. జన్నారం(ఖానాపూర్): వన్యప్రాణులకు నిలయంగా మారిన కవ్వాల్ పులుల రక్షిత ప్రదేశం ఇప్పుడు పక్షులకూ ఆవాసంగా మారుతోంది. వన్యప్రాణుల సంరక్షణతోపాటు పక్షి జాతి సంరక్షణకు అటవీ అధికారులు కంకణం కట్టుకున్నారు. బర్డ్స్ ఫెస్టివల్లో భాగంగా ఇటీవల జన్నారం అడవులకు వచ్చిన పక్షి ప్రేమికులు పలు పక్షులను గుర్తించారు. ఈ పక్షుల విశేషాలను ఇక్కడికి అధికారులకు తెలియజేశారు. వన్యప్రాణులతోపాటు ఎఫ్‌డీవో మాధవరావు పక్షుల రకాలను గుర్తించారు. కొందరు స్టాఫ్‌కు కూడా పక్షులను గుర్తించడం పట్ల అవగాహన కల్పించారు. ఈ క్రమంలో కవ్వాల్ పులుల రక్షిత ప్రదేశంలో రెండు వందలకు పైగా పక్షి జాతులున్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు 80 వరకు పక్షుల వివరాలను సేకరించారు. వినసొంపుగా అరుపులు ఉదయం పూట అటవీ ప్రాంతంలోకి వెళ్తే పక్షుల కిలకిలలు గుండెను హత్తుకునేలా హాయినిస్తాయి. వినసొంపుగా వివిధ రకాల పక్షుల అరుపులు వినిపిస్తాయి. ఇటీవల టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ వినోద్‌కుమార్ అడవిలో ఉదయం పర్యటించినప్పుడు పక్షులను పరిశీలించారు. హైదరాబాద్‌కు చెందిన బర్డ్స్ వాచ్ ప్రతినిధులు కవ్వాల్‌లో అరుదైన పక్షులను గుర్తించారు. ఇలాంటి పక్షులు అరుదుగా కనిపిస్తాయని, ఇవి ఇతర దేశాలలో ఉంటాయన్నారు. జన్నారం అటవీ డివిజన్లో కొంగలు, ఉలీ నెక్డ్ స్పార్క్, పిచ్చుకలు, చిలుకలు, వడ్రంగి పిట్ట, చికుముకి పిట్ట, పాలపిట్ట, వల్చర్, అడవి పావురాలు, పిచ్చుకలు, గద్దలు, కింగ్‌ఫిషర్, కోకిల, గోరింక, గువ్వలు, బ్లాక్ నెక్డ్, ఇలా అనేక రకాల పక్షులు కవ్వాల్ టైగర్‌జోన్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పక్షిజాతిని రక్షించడం మన బాధ్యత మానవునికి తెలియకుండానే పక్షులు పరోక్షంగా సహకరిస్తాయి. గద్దలు, రాబంధులు మన పరిసరాలలో కళేబరాలను తిని పరోక్షంగా సహకారం అందిస్తాయి. పిచ్చుకలు, కొంగలు, మైనాలు, రైతుల పొలాల్లో కీటకాలు తింటాయి. జీవ వైవిధ్యంలో పక్షులు కూడా కీలకం. ఇలాంటి పక్షులు రోజురోజుకు అంతరించిపోతున్నాయి. వీటిని రక్షించాల్సిన అవసరం అందరిపై ఉంది. అందుకే డివిజన్లో పక్షుల వివరాలు సేకరిస్తున్నాం. ఇప్పటి వరకు 80 వరకు పక్షి జాతులను గుర్తించాం.– మాధవరావు, ఎఫ్‌డీవో ఇండియన్ స్పాట్ బిల్డ్ డక్: భారతీయ ఖండంలోని మంచినీటి వెట్టాండ్ల అంతటా వలస వెళ్లని బ్రీడ్ డక్. ఎర్రటి మచ్చ నుంచి బిల్లు అనే పేరు వచ్చింది. నీటిలో ఉన్నప్పుడు ఈ బాతును గుర్తించవచ్చు. ఒక వైపు తెల్లని చారతో విభిన్నంగా ఉంటుంది. అరుదుగా కనిపించే ఈబాతు కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అడవుల్లోని నీటి కుంటలో కనిపించింది. యురేషియన్ వైజన్: ఈపక్షి సముద్ర తీరాల్లో కనిపిస్తుంది. ఇది 42 నుంచి 52 సెం.మీ పొడవు ఉంటుంది. బాతు జాతికి చెందిన మారెకాలోని మూడు పావురాల జాతులలో ఇది ఒకటి. మగ బాతు బూడిదరంగు పార్శా్వలతో వెనుకభాగం నల్లగా ఉంటుంది. మెడభాగం లేత ఎరుపు రంగులో ఉంటుంది. చలి కాలంలో తన సంతానోత్పత్తిని పెంపొందించడానికి ఈ ప్రాంతానికి వచ్చి వేసవిలో తన ప్రాంతానికి వెళ్తుంది. యురేషియన్ వైజన్: ఈపక్షి సముద్ర తీరాల్లో కనిపిస్తుంది. ఇది 42 నుంచి 52 సెం.మీ పొడవు ఉంటుంది. బాతు జాతికి చెందిన మారెకాలోని మూడు పావురాల జాతులలో ఇది ఒకటి. మగ బాతు బూడిదరంగు పార్శా్వలతో వెనుకభాగం నల్లగా ఉంటుంది. మెడభాగం లేత ఎరుపు రంగులో ఉంటుంది. చలి కాలంలో తన సంతానోత్పత్తిని పెంపొందించడానికి ఈ ప్రాంతానికి వచ్చి వేసవిలో తన ప్రాంతానికి వెళ్తుంది. ఆసియన్ ఓపెన్‌బిల్: ఈ పక్షులు కొంగలను పోలి ఉంటాయి. ఇవి 1.3 నుంచి 8 కేజీల వరకు బరువు, 81 సెం మీ పొడవు ఉంటాయి. ఇవి సౌత్ అసియాలో ఉంటాయి. ఇవి చాలా అరుదైన పక్షులు. ఇవి తెలుపు, నలుపు రంగులో ఉంటాయి. ఈ పక్షులు సైతం జన్నారం అడవుల్లో కనిపించాయి. కామన్ టీల్ డక్: ఇది బాతు జాతికి చెందిన మరో పక్షి. ఇది ఐరోపా, ఆసియా దేశాలలో ఉంటుంది. లేత నీలి, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ రంగులు తన కళ్లచుట్టూ ఉంటాయి. ఈ పక్షి అందంగా కనిపిస్తుంది. శీతాకాలంలో ఈ ప్రాంతానికి వచ్చి సంతానోత్పత్తి పెంచుకుని తిరిగి వెళుతుంది. జన్నారం అటవీ డివిజన్లోని బైసాన్కుంటలో ఈ పక్షి కనిపించగా అటవీ అధికారులు కెమెరాలో బంధించారు. -
జీవవైవిధ్య తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: జీవవైవిధ్యానికి ప్రతీకగా తెలంగాణ నిలుస్తోంది. అరుదైన పక్షి జాతులు, విభిన్నమైన చేపల రకాలు, సీతాకోకచిలుకల, ఇతర జంతు జాతులు.. ఇలా అనేక ప్రత్యేకతలను రాష్ట్రం సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని పోచారం, మంజీరా, అనంతగిరి, జన్నారం, ఏటీఆర్, ఖ మ్మం, వరంగల్, పాకాల తదితర ప్రాంతాల్లో అద్భుతమైన జీవ వైవిధ్యం అలరారుతోంది. అడవులు, జలవనరులు, ప్రకృతి సేద్యం మధ్య ఒక సమన్వయ బంధం ఏర్పడితే అన్ని జీవరాశులు సుహృద్భావ వాతావరణంలో మెలుగుతాయని ప ర్యావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకే ప్రత్యేకమైన కొన్ని రకాల చేపలు, గుడ్లగూబలు, పావురాలు, 400 వరకు రకాల వివిధ పక్షులున్నాయి. జీవవైవిధ్యం పెంపుదలకు పులులు, చిరుత పులుల వంటివి కీలకమైనవే అయినా అవే సర్వస్వం కాదని మొక్కలు, పక్షులు, ఇతర జంతువుల మనుగడ, పురోభివృద్ధి కూడా ముఖ్యమేనని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇటు తెలంగాణలోని 500 నుంచి 600 రకాల ఔషధ మొక్కలూ కీలక భూమికను నిర్వహిస్తున్నాయి. శుక్రవారం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం.. రాష్ట్రంలోని పక్షులు, వృక్షాలు, జంతుజాతులు.. రాష్ట్రంలో 1,900 రకాల వృక్షాలు, మొక్కల జాతులు, 166 రకాల చేపలు, 376 రకాల పక్షులు, 155 సీతాకోకచిలుకలు, 13 రకాల రొయ్యలు, 4 రకాల ఎండ్రకాయలు (పీతలు), 28 రకాల తూనీగలు, 53 రకాల మోథ్స్, 46 రకాల సాలెపురుగులు, 12 రకాల తేళ్లు, 107 రకాల ఇన్వర్టెబ్రేట్స్, 41 రకాల నత్తలు, 17 రకాల కప్ప లు, 60 రకాల పాములున్నాయి. ఇక 376 రకాల పక్షి జాతుల్లో భాగంగా గుడ్లగూబలు, బాతులు, పావురాలు, కొంగలు, రామచిలుకలు, పిట్టలు, రాబందులు.. 70 రకాల జంతువుల్లో భాగంగా పులులు, చిరుతపులులు, వివిధ జాతుల కోతులు, జింకలు, ఎలుకలు, ముంగిసలు, నీల్గాయిలు, నక్కలు వంటివి ఉన్నాయి. రాష్ట్రంలో జీవవైవిధ్యానికి నెలవులు... ►రాష్ట్రంలో 8 వన్యప్రాణి అభయారణ్యాలున్నాయి. ప్రాణహిత, శివరం, ఏటూరునాగారం, నాగార్జున సాగర్–శ్రీశైలం, పాకాల, కిన్నెరసాని, మంజీరా, పోచారం.. వీటిల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, పులులు, నక్కలు, మొసళ్లు, కొండచిలువలు ఇతర జంతువులున్నాయి. ►ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్–2,166 చదరపు కి.మీ., కవ్వాల్ టైగర్ రిజర్వ్–892 చదరపు కి.మీ. మేర పులుల అభయారణ్యాలు విస్తరించి ఉన్నాయి. ► జాతీయపార్కులు.. (కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు, మృగవాణి నేషనల్ పార్కు, మహావీర్ హరిత వనస్థలి జాతీయపార్కు) ►హైదరాబాద్‌లో జవహర్లాల్ నెహ్రూ జూలాజికల్ పార్కు, వరంగల్‌లో వన విజ్ఞానకేంద్రం (మినీ జూ) ఉన్నాయి. ►సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న అమీన్‌పూర్‌చెరువు బయో డైవర్సిటీ హెరిటేజ్‌సైట్‌గా ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి.. ‘తెలంగాణకు ఘనమైన జీవవైవిధ్య వారసత్వ సంపద ఉంది. రకరకాల మొక్కలు, వృక్షాలు, జంతువుల జాతులతో వైవిధ్యమైన ప్రత్యేకతను సొంతం చేసుకుంది. వీటిని పరిరక్షించుకునే విషయంలో సాధారణ ప్రజల్లో అవగాహనను పెంచాలి. పర్యావరణం, ప్రకృతి, జీవవైవిధ్యం నుంచి మనం ఏమి పొందుతున్నాం.. వాటి వల్ల ప్రయోజనాలు కొనసాగాలంటే ఏవిధంగా వాటిని సురక్షితంగా ఉంచుకోవాలన్నది వారు తెలుసుకోగలగాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. స్థానికంగా పండించే వివిధ వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు వంటి వాటిని ప్రోత్సహించాలి. ఔషధ మొక్కల వల్ల ఆరోగ్య పరిరక్షణకు అవకాశం ఏర్పడుతోంది. వాటి ప్రాముఖ్యతను గుర్తించాలి..’ – ఫరీదా తంపల్, వరల్డ్ వైడ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) స్టేట్ డైరెక్టర్ -
మనిషికి లాక్డౌన్.. పక్షులకు ఫ్రీడం..
సనత్‌నగర్: చెట్లు.. పక్షులు.. జంతువులు.. ఇలా ప్రకృతిలో భాగమైన వన్యప్రాణులపై ఎప్పటికీ మనిషి ఆధారపడాల్సిందే. వాటి వనరులను మనిషి దోచుకున్నాడేమో గానీ, అవే వన్యప్రాణులు మనుషుల అవసరం లేకుండా స్వేచ్ఛగా జీవనం సాగించగలవన్నది అక్షర సత్యం. లాక్డౌన్ పుణ్యమా? అని మనిషి ఇంటికే పరిమితం కాగా.. పక్షులు, కొన్ని రకాల వన్యప్రాణులు ఎంచక్కా ఆహ్లాదకర వాతావరణాన్ని ఎం‘జాయ్’ చేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్.. వాటికి వరంగా మారిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే హైదరాబాద్ వంటి నగరాల్లో వేసవి రోజుల్లో మనిషి నీరు పోస్తేనే కదా అవి బతికి బట్టకట్టేది.. అన్న సందేహం రాకమానదు. అయితే నిత్యం బిజీగా ఉండే రోడ్లు, కాలుష్యం, నిరంతర ధ్వనులతో భయపడి ప్రయాణం చేయలేని పక్షులు.. ఇప్పుడు చక్కర్లు కొడుతూ నగరం, నగర శివారులోని చెరువుల చెంతకు నిర్భయంగా చేరుకుని ఆనందంగా గడుపుతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఏటా 70–80 రకాల వలస పక్షులు రాక.. మొత్తం 280 రకాల పక్షి జాతుల్లో దాదాపు 70–80 వలస పక్షులు ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్ మాసాల్లో నగరానికి వలస వస్తుంటాయి. ఇందులో ప్రధానంగా ఫ్లెమింగోలోని పలు రకాల పక్షులు, వెర్డిటెర్ ఫ్లై క్యాచర్, కామన్ స్టోన్‌చాట్, నార్తరన్ షోవలర్, బ్లాక్ టెయిల్డ్ గాడ్విట్, ఎల్లో వాగ్‌టెయిల్, హారియర్స్‌లో పలు రకాల పక్షులు, 12 జాతులకు చెందిన డక్స్, ఈగల్స్, వాడర్స్, లిటిల్ టెర్న్ వంటి ఎన్నో రకాల రంగురంగుల వలస పక్షులు ఉంటాయి. అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు వలస పక్షులకు సురక్షితమైన ప్రాంతంగా హైదరాబాద్ ఉంటుంది. ఆ సమయంలో పక్షులు తట్టుకునే ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు కావడంతో పాటు ఆహారానికి కూడా అనువుగా ఉంటాయి. చెరువుల చెంతనే చెట్లపై గూళ్లు కట్టుకోవడానికి అనువైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. అలాగే చెరువుల మధ్యలో అక్కడక్కడా రాతి శిలలతో పాటు కృత్రిమంగా ఏర్పాటుచేసిన స్టాండ్లు ఉండటం ద్వారా ఫ్లెమింగో వంటి పక్షులు వాటిపై గంటల పాటు గడుపుతూ చేపలను అన్వేషిస్తుంటాయి. ఇలా తమ ఆహారాన్ని సేకరించుకోవడానికి అనువుగా ఉంటుంది. చేపల జోలికి వెళ్లని కొన్ని రకాల పక్షులు చెరువు ఒడ్డు ప్రాంతంలో సంచరిస్తూ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. అలా పక్షులకు కావాల్సిన అనువైన వాతావరణంతో పాటు వనరులు ఇక్కడ పుష్కలంగా అందుబాటులో ఉండటం వల్ల ఏటా వలస పక్షులు ఇక్కడకు వచ్చి విడిది చేస్తుంటాయి. వలస వచ్చే దాదాపు 80 రకాల వలస పక్షుల్లో సుమారు 60 జాతులకు చెందిన పక్షులు ఏప్రిల్ చివరి వరకు విడిది చేస్తుంటాయి. అయితే ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ పరిస్థితులు వాటికి మరింత అనూకూల వాతావరణం కలిగిందని పక్షి ప్రేమికులు చెబుతున్నారు. ఎన్నో అనుకూలాంశాలు.. ♦ వలస వచ్చిన కాలంలో చాలావరకు పక్షులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను జన్మనిస్తుంటాయి. చెరువుల ఒడ్డున తేమ ప్రాంతంలో అవి గుడ్లు పెడుతుంటాయి. రాళ్లతో కలిసిపోయే మాదిరిగానే గుడ్డు ఉండటంతో అక్కడకు వచ్చే సందర్శకులు వాటిని తెలియక తొక్కేస్తుంటారు. కానీ లాక్డౌన్ నేపథ్యంలో బయట రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో పాటు చెరువులు, లేక్‌ల సందర్శనకు వచ్చేవారి సంఖ్య పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సందర్శకుల ఆటంకం లేకుండా గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను కనగలిగే వాతావరణం ప్రస్తుతం వాటికి లభించింది. ♦ చాలా వన్యప్రాణులు మనిషి చూడకుండానే సుదూరం నుంచే వాసనను పసిగట్టి భయపడి దాక్కునే పరిస్థితులు ఉంటాయి. అలాంటిది నిత్యం నగర రహదారుల రణగొణ ధ్వనులతో మార్మోగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో నగరంలోని కేబీఆర్ పార్కు, హరిణి వనస్థలి, హెచ్‌సీయూ వంటి ప్రాంతాల్లోని కొన్ని రకాల వన్యప్రాణులు, పక్షులు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. అలాంటిది రహదారులన్నీ నిర్మానుష్యంగా మారడంతో పాటు ఎలాంటి శబ్దాలు లేకపోవడంతో హాయిగా విహారానికి వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ♦ చెట్లపైనే పండ్లను హాయిగా తింటున్నాయి. గూళ్లు కట్టుకుంటున్నాయి. పువ్వులు ఫలదీకరణ చెందడానికి కొన్ని రకాల పక్షుల అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అంతరాయం లేకుండా పక్షుల ద్వారా పువ్వులు ఫలదీకరణ చెందుతున్నాయి. ♦ పక్షుల ద్వారా ఎన్నో రకాల పండ్ల చెట్లు ఉత్పన్నమవుతాయని తెలుసా.. పండ్లు తినే క్రమంలో వాటి విత్తనాలు(గింజలను) అక్కడక్కడ పడేసుకుంటూ(వెదజల్లుతాయి) వెళ్తాయి. ఈ క్రమంలో ఆ విత్తనాలు మళ్లీ మొలకెత్తి చెట్లుగా మారతాయి. లాక్డౌన్ సమయంలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా పండ్లను సేవించడంతో పాటు విత్తనాలను వెదజల్లే అవకాశం దొరికింది. ♦ కాలుష్యం తగ్గి వాతావరణంలో ఉష్ణోగ్రతలు కూడా అంతగా పెరగకపోవడంతో సాధారణంగా ఉండే దానికంటే మరికొన్ని రోజులు వలస పక్షులు ఇక్కడ సేదతీరే అవకాశం లేకపోలేదు. ♦ చాలాచోట్ల చెరువుల్లో రసాయన వ్యర్థ జాలాలు భారీగా వదులుతారు. కానీ ఇప్పుడు అన్నీ బంద్ కావడంతో చెరువుల్లోకి వచ్చే వ్యర్థ జలాలు తగ్గిపోయి నీటిలో స్వచ్ఛత శాతం పెరిగింది. దీంతో పక్షులు కూడా కాలుష్య జలాల తాకిడి లేకుండా హాయిగా సేదతీరుతున్నాయని చెప్పవచ్చు. పక్షులకు లాక్డౌన్ ఒక వరమే.. వలస పక్షులపై విశ్లేషణ చేయడంతో పాటు ఫొటోలు తీసి బర్డ్స్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ పుస్తకంలో నేను ప్రస్తావించాను. ఇప్పటివరకు 226 రకాల పక్షుల ఫొటోలను తీస్తే, వాటిల్లో దాదాపు 80 రకాల వలస పక్షులు చలికాలం నగరానికి రావడం గమనించాను. ఏప్రిల్ చివరి వరకు ఇక్కడ స్టే చేస్తుంటాయి. లాక్డౌన్ కారణంగా స్వేచ్ఛగా ఎలాంటి భయం లేకుండా విహారం చేసే అవకాశం దొరికింది. చెరువులతో పాటు వాతావరణంలో కాలుష్యం కూడా తగ్గిపోయింది. మనుషుల సందడి లేదు.. ధ్వనులు లేవు. ఇవి పక్షులకు వరంగా మారాయి.– డాక్టర్ వీఏ మంగ, బర్డ్స్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ గ్రంథ రచయిత. మరికొన్ని రోజులు ఎక్కువగా ఉండవచ్చు లాక్డౌన్ పుణ్యమా అని సన్‌బర్డ్, ఫ్లై క్యాచర్, టైలర్‌బర్డ్, వడ్రంగి పిట్టలు, చిలుకలు, కోయిల పక్షులు అన్ని ఇంటి దగ్గరే ఇప్పుడు చూస్తున్నాం. వీటిని తమ గ్రూపు సభ్యులు ఈ–బర్డ్. ఓఆర్జీ లో రికార్డు చేస్తున్నాం. ప్రకృతి శాస్త్రవేత్తలకు పక్షుల గురించి రియల్ టైం డేటాను అందిస్తున్నాం. లాక్డౌన్ వ్యవధిలో ఇప్పుడు తక్కువ కాలుష్యం నమోదవుతోంది. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండటం వల్ల కాలుష్యం తగ్గి వాతావరణంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వలస పక్షులు ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండే అవకాశం ఉంది. – కళ్యాణ్, బర్డ్స్ వాచర్‌క్లబ్ సభ్యుడు పక్షులకు ఇబ్బందికర వాతావరణమే.. నా వద్ద దాదాపు 25 రకాల పక్షులు ఉన్నాయి. లాక్డౌన్ కారణంగా సాధారణ రోజుల్లో కంటే మరింతగా ప్రశాంత వాతావరణం వాటికి అందుతోంది. వేసవికాలం వచ్చిందంటే వాటి విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అరగంటకు ఓసారి ఫాగ్ చేస్తాం. పైప్‌ద్వారా నీటిని పొగమంచు మాదిరిగా పక్షులపై చిమ్ముతుంటాం. దీని వల్ల పక్షుల శరీరం చల్లబడుతుంది. పక్షులు హీట్‌ను తట్టుకోవాలంటే అనేకమార్లు ఇలాంటి ఫాగ్ చేయక తప్పదు. ఇక తాగేందుకు ఎప్పుడూ టబ్‌లో వాటరు పోసి అందుబాటులో ఉంచాలి. – శ్రీనివాస్, పక్షి ప్రేమికుడు -
వలలే ఉరితాళ్లు!
సాక్షి, హైదరాబాద్: వేసవి విడిది కోసం వచ్చిన విదేశీ అతిథులకు వలలకు చిక్కి అల్లాడుతున్నాయి. జాలరులు చేపల కోసం వేసుకున్న వలలు తెలియకుండానే విదేశీ విహంగాలకు ఉరితాళ్లుగా మారుతున్నాయి. గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి కొత్తగా ఏర్పడ్డ కుటుంబంతో తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్లాలని సంబరపడే విదేశీ వలస పక్షులు వేటలో భాగంగా అనుకోకుండా వలలకు చిక్కి మృతి చెందుతున్నాయి. నగరంలోని ప్రధాన జలాశయం గండిపేటలో ఓ స్వచ్ఛంద సంస్థ కొద్ది రోజుల పాటు పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించింది. జాలరుల అవగాహన లేమితోనే ఇది జరుగుతుందని గుర్తించింది. అక్కడి పరిస్థితులు వలస పక్షులకు మృత్యుకౌగిలిగా మారుతోన్న తీరును అటవీశాఖ అధికారుల దృష్టికి తెచ్చింది. వలస పక్షులను రక్షించేందుకు జాలరులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇదీ సంగతి: వేసవి సమీపించిందంటే చాలు సైబీరియా మొదలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పక్షులు మన దగ్గరకు వలస రావడం తెలిసిందే. నీటి వనరులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఆవాసాలుగా చేసుకుని గూళ్లు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెట్టి పొదిగి, ఆ పిల్లలు ఎగిరే నేర్పును పొందే వరకు ఎదురు చూసి ఆ తర్వాత సొంత ప్రాంతాలకు ఎగిరిపోతాయి. ఇలా తెలంగాణలోని వివిధ ప్రాంతాలు విదేశీ పక్షులకు విడిదిగా ఉంటున్నాయి. అందులో నగరంలోని గండిపేట (ఉస్మాన్ సాగర్) కూడా ఒకటి. ప్రస్తుతం గండిపేట జలాశయం విదేశీ విహంగాలతో సందడిగా ఉంది. కానీ కొన్నిరోజులుగా క్రమం తప్పకుండా ఇక్కడ ఆ పక్షులు చనిపోతున్నాయి. విషయం తెలిసి ‘యానిమల్ వారియర్స్’సంస్థ ప్రతినిధులు జలాశయం వద్ద కొద్ది రోజులుగా పరిశీలిస్తుండటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గండిపేట జలాశయం ఆది నుంచి జాలరులకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇందులో చేప విత్తనాలు వేసి అవి పెరిగాక వాటిని పట్టి విక్రయించి ఆదాయం పొందుతున్నారు. చేపలు పట్టేందుకు వీలుగా వలలను జలశయంలోని ముళ్ల పొదలను ఆసరాగా చేసుకుని ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటికి చిక్కే చేపలను తీసి అమ్ముకుంటారు. ఈ క్రమంలో గాలి ఉధృతి పెరిగినప్పుడు కొన్ని వలలు ఆ ముళ్లపొదలకు చిక్కుకుపోతున్నాయి. వాటిని తీయటం సాధ్యం కాక అలాగే వదిలేసి కొత్త వలలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తేలిందని యానిమల్ వారియర్స్ సంస్థ ప్రతినిధులు గుర్తించారు. అలా ఇరుక్కుపోయిన వలలు నీటిలో ఉండిపోతున్నాయి. వాటిని గుర్తించని పక్షులు ముళ్లపొదలపై వాలే సమయంలో వాటిల్లో చిక్కుకుపోతున్నాయి. కొన్ని పక్షులు చేపలను ముక్కుతో వేటాడే సమయంలో వాటి ముక్కు వలలకు ఇరుక్కుపోతోంది. పెనుగులాడితే వలల వైరు భాగం ముక్కుకు గట్టిగా చుట్టుకుపోతోంది. దీంతో ముక్కు తెరుచుకునే పరిస్థితి లేక ఆహారం తీసుకోలేక నీరసించి పక్షులు చనిపోతున్నాయని తేలింది. చేపలు పట్టే ప్రక్రియతో పక్షులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ వదిలేసిన పాత వలలే ప్రమాదంగా మారాయి. ఆదివారం హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ అనే మరో సంస్థ ప్రతినిధులు కొందరు పక్షి ప్రేమికులు కలిసి దాదాపు 60 మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు జలశయంలోని తుప్పలకు ఇరుక్కుని ఉన్న వలల భాగాలను పెద్ద మొత్తంలో వెలికి తీశారు. జలాశయానికి చిలుకూరు వైపు వలస పక్షులు ఎక్కువగా ఉండటంతో అటువైపు ఈ ఆపరేషన్ నిర్వహించారు. కొన్ని టన్నుల బరువున్న వ్యర్థాలను వెలికి తీశారు. ఇంకా అంతకు కొన్ని రెట్ల మేర వ్యర్థాలు నీటిలో ఉన్నాయని, వాటన్నింటినీ తొలగిస్తేనే పక్షులకు సురక్షిత వాతావరణం ఏర్పడుతుందని వారు పేర్కొంటున్నారు. జాలరులకు అవగాహన కల్పిస్తాం ‘‘నీటిలో వదిలేసిన పాత వలలు వలస పక్షులకు ప్రమాదంగా మారాయి. వాటిని తొలగించి భవిష్యత్తులో మళ్లీ అవి రాకుండా ఉండాలి. అందుకోసం ఈ జలాశయంలో చేపలు పట్టే జాలరులకు అవగాహన కల్పించాల్సి ఉంది. వలలు ఏర్పాటు చేయటంలో అంతర్జాతీయ పద్ధతులేంటో గుర్తిస్తున్నాం. వాటిని జాలరుల దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో అలా వలలు తుప్పలకు ఇరుక్కుపోకుండా చేస్తాం. దానివల్ల జాలరులు వలలు కోల్పోయి నష్టపోకుండా ఉండటమే కాకుండా పక్షులకు ప్రమాదం లేకుండా ఉంటుంది. ఇప్పటికే ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారితో కలిసి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ముందు జలాశయంలో పెద్ద మొత్తంలో ఉన్న వలల భాగాలను అధికారులు వెలికి తీయించాల్సి ఉంది. మాతో కలిసి వచ్చిన హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులు, ఇతర పక్షి ప్రేమికులకు ధన్యవాదాలు’’ –ప్రదీప్ నాయర్, సంజీవరావు, ‘యానిమల్ వారియర్స్’సభ్యులు -
పిట్ట కథలు
మనకు తొట్టతొలి పిట్టకథ రామాయణం. క్రౌంచ మిథు నాన్ని ఒక బోయ చంపాడు. తొలి సహగమనం కూడా అక్కడే జరిగింది. శోకం లోంచి శ్లోకం పుట్టింది. మహేతిహాసానికి నాంది వాక్యమైంది. క్రౌంచ పక్షుల్ని వాడుకలో కవుజు పిట్టలంటారు. చుక్కల చుక్కల రెక్కలతో చూడముచ్చటగా ఉంటాయి. పిట్టమాంస ప్రియులు కవుజు రుచి పరమాద్భుతం అంటారు. వేటగాళ్లు దీన్ని చాలా తెలివైన పిట్టగా చెబుతారు. అనవసరంగా ఇది ఎక్కడా కూత వెయ్యదు. కూతతో ఉనికిని చాటుకుని ప్రాణం మీదికి తెచ్చుకోదు. అందుకే వేటగాళ్లు దీన్ని వేటాడాలంటే కవుజు సాయమే తీసుకుంటారు. షికారీల దగ్గర పెంపుడు కవుజులుంటాయ్. నూకలుజల్లి కౌజుల్ని అక్కడ వదులుతారు. పెంపుడు కౌజు చేత ‘ఇక్కడ మేతలు న్నాయ్ రమ్మని’ కూతలు వేయిస్తారు. పాపం నమ్మి బయటి కవుజులు వచ్చి ముగ్గులో వాల్తాయ్. మరు క్షణం వేటగాడి వలలో పడతాయి. మనిషి తిండి కోసం ఎవరినైనా ఎన్ని మోసాలైనా చేస్తాడు. దేశంలో పిట్టలు, అనేకానేక పక్షి జాతులు కను మరుగవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ప్రకృతి ప్రియుల్ని చాలా బాధపెడుతోంది. నగ రీకరణ, అడవుల కొరత, పర్యావరణ కాలుష్యం, మనిషి జిహ్వ చాపల్యం–ఇవన్నీ పిట్టలు కనుమ రుగు అవడానికి కారణం. ఎక్కడ దాక్కున్నా మనిషి పిట్టల్నీ బతకనీయడం లేదు.మనిషి భూమిని, ఆకా శాన్ని, సముద్రాన్నీ ఇప్పటికే వశపరచుకున్నాడు. ఇప్పుడు ఇతర గోళాలమీద దృష్టి సారించాడు. చివ రకు మనిషి త్రివిక్రముడిగా మిగులుతాడో, భస్మాసు రుడుగా కనుమరుగు అవుతాడో కొన్ని తరాలు ఆగి చూడాల్సి ఉంది. అనేకానేక పరిశోధనల తర్వాత పక్షులు కూడా డైనోసార్స్ నుంచే ఆవిర్భవించాయని తేల్చి చెప్పారు. సమస్త చరాలకు డైనోయే మూల మని రుజువైంది. మనదేశంలో చాలామంది పక్షి ప్రియులున్నారు. వాళ్లు టెలిస్కోపులు, కెమెరాలు వేసుకుని కంచెలెంబడి అస్తమానం తిరుగుతుం టారు. వాటి కూతల్ని రికార్డు చేసి ఆనందిస్తుంటారు. ఒకప్పుడు ఎటుచూసినా గుంపులుగా కనిపించే కాకులు ఇప్పుడు అపురూపమైపోయాయి. పిచ్చు కలు ఇళ్లలో కిచకిచలాడుతూ, అద్దాల్ని చూసి ఆడు కుంటూ ఎక్కడంటే అక్కడ గూళ్లుపెట్టి గుడ్లు పెడుతూ నానా యాగీ చేస్తుండేవి. ఇప్పుడు లేవు. సెల్‌ఫోన్ టవర్స్ రేడియేషన్ కారణంగా పిచుకలు పోయాయని చెబుతారు. పల్లెటూళ్లలో అతిపెద్ద పరి మాణంలో రాబందులు, కనిపించేవి. ఇవ్వాళ వాటి సంఖ్య గణనీయంగా పడిపోయింది. వాటిని పెంచ డానికి లక్షలు వెచ్చించడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. చెట్ల తొర్రలో కాపురముండే రామ చిల కలు, గువ్వలు, గోరువంకలు ఒకనాడు మనుషుల బాల్యాన్ని ఆనందంగా నింపేవి. అన్నం తినక మారాం చేసే పిల్లలకు చందమామ, పావురాలు, రామచిలకల్ని చూపి తల్లలు బువ్వలు తినిపించే వారు. తెలంగాణ రాష్ట్రపక్షి పాలపిట్ట. ఎగిరే ఇంద్ర ధనుస్సులా ఉంటుంది. ఇప్పుడు దాన్ని చూద్దా మంటే విజయదశమి పండగరోజు కూడా దర్శనమీ యడం లేదు. తక్కువ ఎగురుతూ, ఎక్కువ పరు గులు పెడుతుండే కంచెకోడి బలే రంగురంగుల పిట్ట. నిజంగా దాన్ని చూసి ఎన్నాళ్లు అయిందో. కోయిల కూతకి బదులు కూత వేస్తూ పిల్లలని కవ్వించేది. అది ఎప్పుడూ కన్పించడం తక్కువే. ఇప్పుడు ఉగాది పండగ చిత్రాల్లో పంచాంగం పక్కన, మామిడి పిందెల సరసన వేపకొమ్మకి వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది నల్లటి కోయిల. తీతువుపిట్ట అరుపులు విన్నాంగానీ ఎప్పుడూ అది కంటపడలేదు. వడ్రంగిపిట్ట బాగా పరిచయం. మునుపు తమిళనాట పక్షి తీర్థం అని క్షేత్రం ప్రసిద్ధి. సరిగ్గా మధ్యాహ్నం వేళకు ఎక్కడినుంచో అయిదు గద్దలు అక్కడకు దిగేవి. అర్చక స్వాములు సమర్పిం చిన ప్రసాదం తిని తిరిగి ఎగిరిపోయేవి. ఏరోజూ వేళ తప్పేవి కావు. వాటిని గరుత్మంత అవతారాలుగా భావించేవారు. పాతికేళ్ల క్రితం వంద ఉన్న చాలా పక్షులు ప్రస్తుతం మూడు, అయిదుకి పడిపోయాయి. ఇప్పటికీ ఎక్కువ రకాల పక్షులు, పాములు తిరుమల ఏడుకొండలమీదే ఉన్నాయని చెబుతారు. పక్షుల్ని సంరక్షించే బాధ్యత ఏడుకొండలవాడికే అప్పగిం చాలి. అనువైన ఒక కొండని పక్షి ఆశ్రయంగా, కణ్వా శ్రమంగా తీర్చిదిద్దాలి. అపురూపమైన అరుదైన పక్షి జాతుల్ని స్వామి సన్నిధిలో కాపాడాలి. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
వలస రెక్కలు ఇరిగిపాయె!
సాక్షి, సిటీబ్యూరో: చూడముచ్చటైన పక్షులు విలవిలలాడుతున్నాయి. ఖండాంతరాలనుంచి వలస వచ్చి ప్రాణాలను పోగొట్టుకుంటున్నాయి. నగరానికి వస్తున్న విదేశీ విహంగాల పాలిట ప్లాస్టిక్ వ్యర్థాలు, శబ్ద, వాయు కాలుష్యం శాపంలాపరిణమిస్తున్నాయి. ఆహారం, వసతి కోసం నగరంలో పలు మంచినీటిచెరువులకు వలస వస్తున్నవాటిలో ఎన్నో పక్షులు ఇక్కడే మృత్యువాతపడుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, చేపల కోసం వేసిన వలల్లో చిక్కుకొని ప్రాణాలు విడుస్తున్నాయి. ప్రతి ఏటా అక్టోబర్– ఫిబ్రవరి మధ్యలో వలస వస్తున్న పక్షుల్లో సుమారు 30 నుంచి 40 శాతం తగ్గుముఖం పడుతున్నట్లు పక్షి శాస్త్రవేత్తల గణాంకాలు వివరిస్తున్నాయి. మరోవైపు చేపలు పట్టేందుకు ఏర్పాటు చేస్తున్న వలలకు ఉన్న ప్లాస్టిక్ దారాలు పక్షుల ముక్కులకు, మెడలకు చుట్టుకొని ఊపిరివదలుతుండటంఆందోళన కలిగిస్తోంది. వీటి శాతం సుమారు 13 శాతం ఉన్నట్లు పక్షి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కనుమరుగవుతున్నపలు జాతుల పక్షులు.. రాజహంసలు.. బాతులు.. కొంగలు.. గోరింకలు.. డేగలు తదితర పక్షుల జాడ క్రమంగా కనుమరుగవుతోంది. శబ్ద, వాయు కాలుష్యం, వాటి సహజ ఆవాసాలైన చెరువులు, కుంటలు, జలాశయాలు కాలుష్యకాసారంగా మారడం, కబ్జాకు గురవడంతో వాటి విస్తీర్ణం తగ్గడం, నగరీకరణ ప్రభావం, పర్యాటక, మానవ తప్పిదాలు, చైనా మాంజా.. ఇలా కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లుగా వలస పక్షుల పాలిట శాపంగా మారుతున్నాయి. సైబీరియా, యూరప్, ఆఫ్రికా, మియన్మార్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ తదితర దేశాల నుంచి గ్రేటర్ నగరంతో పాటు.. సిటీకి ఆనుకొని ఉన్న పలు పర్యాటక ప్రాంతాలకు ఏటా అక్టోబర్– ఫిబ్రవరి మధ్య కాలంలో వేలాదిగా విభిన్న రకాల పక్షి జాతులు తరలివస్తుంటాయి. మాయమవుతున్నవాటిలో ఇవీ.. ఈ సమయానికి హిమాయత్‌సాగర్‌కు సుమారు 200 వరకు గుజరాత్ నుంచి రాజహంసలు వలస వస్తాయి. కానీ ఈసారి వీటి సంఖ్య 50కి మించి లేదని పక్షి ప్రేమికులు చెబుతున్నారు. విభిన్న రకాల గోరింక ప్రజాతులదీ ఇదే పరిస్థితి. సుమారు పదివేల కిలోమీటర్ల దూరం నుంచి వలస వచ్చే బార్‌హెడ్‌గూస్ (బాతు) జాడ కూడా కనిపించకపోవడం గమనార్హం. ఆఫ్రికా ఖండం నుంచి వలస వచ్చే పైడ్ క్రస్టెడ్ కకూ అనే పక్షి జాడ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పక్షి కనిపిస్తే ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుందన్న నానుడి ఉండడం విశేషం. పక్షుల రాక తగ్గిపోవడంతో జీవవైవిధ్యం కనుమరుగవుతోందని పక్షి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వలస పక్షులకు ఈ ప్రాంతాలు ఆలవాలం గ్రేటర్‌తో పాటు సిటీకి ఆనుకొని ఉన్న పలు పర్యాటక ప్రాంతాలు ఏటా వలస పక్షులను అక్కున చేర్చుకొని వాటికి ఆహారం, వసతి సమకూరుస్తున్నాయి. ప్రధానంగా కేబీఆర్ పార్క్, అనంతగిరి హిల్స్, ఫాక్స్‌సాగర్ (జీడిమెట్ల), అమీన్పూర్ చెరువు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మంజీరా జలాశయాలకు ఏటా సుమారు 200 జాతులకు చెందిన వేలాది పక్షులు తరలివస్తాయి. కానీ ఈసారి వీటిలో 30– 40 శాతం తగ్గుముఖం పట్టినట్లు పక్షి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షుల వలసలకు ప్రధాన కారణాలు.. ప్రధానంగా అధిక ఉష్ణోగ్రతలు, శీతల వాతావరణం ,మంచు ప్రభావంతో ఆహారం, వసతి సమకూర్చుకోవడం కష్టతరంగా మారడంతో వేలాది కిలోమీటర్ల నుంచి నగరానికి పక్షులు వలస వస్తుంటాయి. పక్షులు వలసవచ్చే ప్రాంతాల్లో సమశీతోష్ణ వాతావరణం ఉండడం, వలస వచ్చే ప్రాంతంలో ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గి నీటిలో వృక్ష, జంతు ఫ్లవకాలు, చిన్న కీటకాలు ఆహారంగా లభ్యమవుతాయి. ఆయా కారణాల రీత్యా పక్షులు వలస వస్తాయని నిపుణులు చెబుతున్నారు . ఈ ప్రాంతాల్లో వలసలు మాయం... పదేళ్ల క్రితం నగరంలోని హుస్సేన్‌సాగర్‌కు విభిన్న రకాల బాతులు, వాటి ప్రజాతులకు చెందిన పక్షులు వలస వచ్చేవి. ఇప్పుడు ఈ జలాశయం కాలుష్య కాసారం కావడంతో ప్రస్తుతం వలస పక్షుల జాడే కనుమరుగైంది. ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్, కాప్రా, రామకృష్ణాపూర్, బోయిన్పల్లి చెరువుల్లోనూ ఇదే దుస్థితి. ఆయా జలాశయాల్లో గుర్రపుడెక్క ఉద్ధృతి తీవ్రంగా ఉండడంతో నీటిపై తేలియాడుతూ జీవించే పక్షి జాతుల మనుగడ కష్టతరమవుతోంది. ప్రధాన కారణాలివే.. ♦ చేపలను పట్టేందుకు ఏర్పాటు చేస్తున్న వలలకున్న ప్లాస్టిక్ దారాలు పక్షుల ముక్కు, మెడకు చుట్టుకొని మృత్యువాత పడుతున్నాయి ♦ ఆయా ప్రాంతాల్లో శబ్ద, వాయు కాలుష్యం అధికంగా ఉండడం ♦ జలాశయాల విస్తీర్ణం క్రమంగా కబ్జాలు, అన్యాక్రాంతం కావడంతోకుంచించుకుపోయాయి. ♦ పట్టణీకరణ ప్రభావంతో ఆయాజలాశయాల చుట్టూ జనావాసాలు,పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు నెలకొనడం ♦ పర్యాటక కార్యకలాపాలు, టూరిస్టుల రాకపోకలు పెరగడంతో దెబ్బతింటున్న పక్షుల సహజ జీవన శైలి ♦ మానవ సంబంధ కార్యకలాపాలు, ఫొటోలు తీయడం, పక్షుల సహజఆవాసాలను దెబ్బతీయడం ♦ చైనీస్ మాంజా చెట్లు, కొమ్మలకుచిక్కుపడడం.. వీటిలో పక్షులుచిక్కి ప్రాణాలు కోల్పోవడం నగరీకరణ, కాలుష్యం వల్లే.. ప్లాస్టిక్ వ్యర్థాలు, చేపల వలలు, పట్టణీకరణ ప్రభావం, శబ్ద, వాయు కాలుష్యాలే వలస పక్షుల పాలిట శాపంగా మారుతున్నాయి. వీటి మరణాల శాతం క్రమంగా పెరుగుతోంది. వలస పక్షుల సంరక్షణకు అన్ని వర్గాలు పాటుపడాలి.– డాక్టర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ ప్రొఫెసర్, జంతుశాస్త్ర విభాగం, ఓయూ ఈ కేంద్రాలకు వలస వచ్చే ప్రధాన పక్షి జాతులివే: గుజరాత్ రాజహంసలు (గ్రేటర్ ఫ్లెమింగోలు), పిన్‌టెయిల్డ్ డక్ (బాతు), షౌలర్, గార్గినే టేల్, హ్యారియర్స్ డేగలు, ఫ్లైక్యాచెస్, గోరింక ప్రజాతికి చెందిన రోజీపాస్టర్స్, స్టార్ లింక్స్, భార్మెడో గూస్ బాతు, గుజరాత్ రాజహంసలు, పైడ్ క్రస్టడ్ కకూ వీటిలో ప్రధానంగా కొంగలు, బాతులు,డేగలు, గుడ్లగూబలు, నీటికోళ్లు జాతులున్నాయి. వలస పక్షులకు నిలయాలు.. ఈ ప్రాంతాలు ప్రాంతం వలస పక్షుల జాతులు, ప్రజాతులు 1 కేబీఆర్ పార్క్ 24 రకాలు 2 అనంతగిరి హిల్స్ 37 ,, 3 ఫాక్స్‌సాగర్ (జీడిమెట్ల) 38 ,, 4 అమీన్పూర్ చెరువు 42,, 5 హిమాయత్ సాగర్ 52,, 6 ఉస్మాన్ సాగర్ 99,, 7 మంజీరా 153,, -
పిట్ట ‘కొంచెమే’!
సాక్షి, హైదరాబాద్ : ఏడాదికి వివిధ రకాల సాధారణ పక్షుల్లో 80 శాతం వరకు తగ్గిపోతున్నాయి. గత 25 ఏళ్ల కాలంలో దేశంలోని ఐదో వంతుకు పైగా వివిధ పక్షి జాతుల (షార్ట్ టోవ్డ్స్నేక్ ఈగిల్ (గద్ద) మొదలుకుని సర్కిర్ మల్కోటాగా పిలిచే చిన్నపక్షి వరకు) సంఖ్య తగ్గిపోయింది. ఊర పిచ్చుక, పిట్ట వంటి సాధారణంగా కనిపించే పక్షిజాతి క్షీణత నుంచి కొంత మెరుగు పడినా... హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రధాన నగరాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఈ పిచ్చుకలు చాలా అరుదుగా కనిపిస్తున్నట్లు వెల్లడైంది. దేశంలోనే తొలిసారిగా వివిధ రకాల పక్షి జాతులపై స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్–2020 (ఎస్‌వోఐబీ) పేరిట డబ్ల్యూడబ్ల్యూఎఫ్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, వైల్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వెట్‌ల్యాండ్ ఇంటర్నేషనల్, నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్, ఏ ట్రీ, బీఎన్హెచ్ఎస్ ఇండియా, ఎఫ్ఈఎస్, ఎన్సీబీఎస్, సాకాన్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన సమగ్ర నివేదికలో పలు అంశాలు వెల్లడయ్యాయి. ఈ–బర్డ్ ప్లాట్‌ఫామ్‌పై 867 భారత పక్షుల రకాలకుసంబంధించి 15,500 మందికి పైగా పక్షి వీక్షకులు తమ పరిశీలనాంశాల ఆధారంగా ఒక కోటికి పైగా అప్లోడ్ చేసిన వివరాలు, సమాచారం ప్రాతిపదికన ఈ నివేదికను తయారు చేశారు. పక్షుల సంఖ్య తగ్గిపోవడానికి స్పష్టమైన కారణాలు కనుక్కోవాల్సిన అవసరముందని సోమవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ నివేదిక విడుదల సందర్భంగా ఎస్‌వోఐబీ సభ్యుడు సోహెల్ ఖాదర్ పేర్కొన్నారు. రామ చిలుకల నుంచి కాకుల దాకా... రాష్ట్రంలో రామ చిలుకలు, పాలపిట్ట, పిచ్చుకలు, గద్దలు చివరకు కాకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతోంది. అదే సమయంలో మనుషులకు ఆరోగ్యపరంగా నష్టం చేకూర్చే పావురాల సంఖ్య మాత్రం విపరీతంగా పెరుగుతోంది. పావురాల విసర్జనలు ఎండిపోయాక పొడిగా మారి గాలిలో కలిసి మనుషుల ఊపిరితిత్తుల్లోకి చేరుతోంది. దీంతో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. పక్షుల్లో మొండిజీవిగా, ఎక్కడైనా బతకగలిగే ఓర్పు, నేర్పు ఉన్న జీవిగా గుర్తింపు పొందిన కాకులు కూడా క్రమంగా తగ్గిపోతున్నాయి. గతంలో ఎక్కడ చూసినా కాకుల గుంపులు కనిపించేవి.. ఇప్పుడు ఇక్కడొకటి అక్కడొకటి మాత్రమే కనిపిస్తున్నాయని ఆయా రకాల పక్షుల సంఖ్య తగ్గిపోతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. పక్షుల సంఖ్య ప్రమాదకరంగా తగ్గిపోవడానికి... నగరీకరణ పెరిగి చెట్లు, పచ్చదనం తగ్గిపోవడం ఒక కారణం కాగా.. కాలుష్యం, వివిధ రూపాల్లోని రేడియేషన్ మరో కారణం. అదేవిధంగా పంటలు పండించడంలో, పండ్ల చెట్ల పెంపకంలో పురుగు మందులు, రసాయనాల వినియోగం విపరీతంగా పెరిగిపోవడం ముఖ్య కారణం. కాలుష్యం, రేడియేషన్ ప్రభావం ‘పక్షులు స్వేచ్ఛగా పెరిగే వాతావరణం తగ్గిపోవడం, కాలుష్యం పెరగడంతో పాటు వివిధ రూపాల రేడియేషన్‌తో పక్షుల సంఖ్య తగ్గిపోతోంది. గత 15 ఏళ్లుగా ఆయా అంశాలను దగ్గర నుంచి గమనిస్తున్న నాకు పక్షుల సంఖ్యలో తగ్గుదల స్పష్టంగా గోచరిస్తోంది. పక్షులను కాపాడుకోవడంలో ప్రజల జీవన విధానం, అనుసరిస్తున్న పద్ధతుల్లో కచ్చితమైన మార్పు రావాల్సిన అవసరముంది. కాలుష్యం, రేడియేషన్ పెరగడంతో పక్షులు గుడ్లు పెట్టినా వాటిని పొదగడం లేదు. ఆధునిక వసతులతో కూడిన వ్యవస్థ, దానితో పాటు ప్రకృతి, పర్యావరణం రెండూ అవసరం. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటేనే ప్రాణకోటికి మనుగడ. పక్షులను కాపాడుకుని, అవి సహజ సిద్ధంగా ఉండేలా చేసినపుడే మానవాళికి కూడా వివిధ సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది’. –సాక్షితో జి.సాయిలు, ఫారెస్ట్ ప్లస్ 2.0 రీజినల్ డైరెక్టర్, బయో డైవర్సిటీ కన్జర్వేషనలిటిస్ట్ భారీగా పెస్టిసైడ్స్ వినియోగంతో తీవ్ర నష్టం ‘పంటల దిగుబడి పెంచేందుకు విచక్షణారహితంగా పురుగు మందులు, రసాయనాల వినియోగం పక్షులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పాలపిట్ట వంటి పక్షి పంట పొలాలపై క్రిములను తిని జీవనం సాగిస్తుంది. ప్రస్తుతం పెస్టిసైడ్స్‌ను అడ్డూఅదుపు లేకుండా ఉపయోగిస్తుండటంతో క్రిమి, కీటకాలు లేక పాలపిట్టల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రామ చిలుకలు, ఊర పిచ్చుకలదీ ఇదే పరిస్థితి. పండ్ల చెట్లు ఎక్కువ ఫలాలు ఇచ్చేందుకు పురుగు మందులు వినియోగిస్తుండటంతో వాటిని తిని రామచిలుకలు చచ్చిపోవడమో లేక వాటి పునరుత్పత్తి గణనీయంగా తగ్గిపోవడమో జరుగుతోంది’. – ‘సాక్షి’తో శంకరన్, వల్డ్లైఫ్ విభాగం ఓఎస్డీ -
ఎర్రకాళ్ల కొంగ.. వచ్చెనుగా..
ఆస్ట్రేలియాకు చెందిన పెయింటెడ్ స్టార్క్(ఎర్రకాళ్ల కొంగల)ల సందడి ఆ గ్రామంలో మొదలైంది. సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు దాటి వచ్చే విదేశీ అతిథుల కోసం గ్రామమంతా ఎదురు చూస్తుంది. అవి వచ్చాక తమ ఇంటి బిడ్డలే వచ్చారు అన్నంతగా గ్రామంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. సరైన రక్షణ చర్యలు, సౌకర్యాలు లేకపోయినా తామే వాటికి రక్షణ కవచంలా నిలబడతారు. దశాబ్దాలుగా తమ గ్రామానికి వస్తున్న పక్షులను వెంకటాపురం గ్రామస్తులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. చిన్న పక్షి నేలరాలినా విలవిలలాడతారు. వెంకటాపురం(పెనుగంచిప్రోలు): గ్రామంలో ఆస్ట్రేలియాకు చెందిన ఎర్రకాళ్ల కొంగల (పెయింటెడ్ స్టార్క్) సందడి మొదలైంది. ఏటా ఈపక్షులు వేల మైళ్లు ప్రయాణించి నవంబర్, డిసెంబర్ నెలల్లో గ్రామానికి చేరుకుంటాయి. ఈఏడాది కొంచెం ఆలస్యంగా గ్రామానికి చేరుకున్నాయి. నాలుగు రోజుల క్రితం ఇక్కడి నేలపై అడుగుపెట్టాయి. ఆరు నెలల పాటు ఇక్కడి చెట్లపై ఆవాసాలు ఏర్పాటు చేసుకొని గుడ్లుపెట్టి, పిల్లలను వృద్ధి చేసుకొని మే చివరి వారం లేదా జూన్‌లో తిరిగి తమ ప్రాంతానికి వెళ్లిపోతాయి. పక్షుల రాకతో గ్రామానికి మేలు ఏటేట తమ గ్రామానికి వచ్చే విదేశీ పక్షులను స్థానికులు తమ పిల్లల్లా చూసుకుంటారు. నవంబర్ మాసం వచ్చిందంటే పక్షులు ఇంకా రాలేదనే చర్చ నడుస్తుంది. అవి వచ్చేంత వరకు ఎదురు చూస్తారు. అవి వచ్చాక పుట్టింటికి వచ్చిన తమ బిడ్డల్లా చూసుకుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఈపక్షుల వల్లనే తమ గ్రామం పాడిపంటలు, సుఖశాంతులతో వర్ధిల్లుతుందని వారి నమ్మకం. దశాబ్దాల క్రితం ఈపక్షులు గ్రామానికి రావటం నాటి నుంచే గ్రామం సుభిక్షంగా ఉందని, వాటికి ఎవరైనా హాని తలపెడితే ఊరుకోమని గ్రామస్తులు అంటున్నారు. సంరక్షణ చర్యలు కరువు గ్రామానికి తరలి వచ్చే విదేశీ పక్షుల సంరక్షణను పట్టించుకోవటం లేదు. గ్రామం మధ్య నుంచి వెళ్లే 11 కేవీ విద్యుత్ తీగల వలన ప్రతి ఏడాది వందల సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. దీనిపై గ్రీన్ టీం నిర్వాహకుడు జూటూరి అప్పారావు, వైఎస్సార్ సీపీ నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు సహకారంతో గతంలో తీగలకు ప్లాస్టిక్ పైపులు అమర్చారు. అయితే ఇంకా పైపులు తొడగాల్సి ఉంది. గ్రామంలో చెట్లు కొట్టటం, నీటి వసతి లేకపోవటం కూడా పక్షుల ఆవాసానికి అవరోధంగా ఉన్నాయి. అయితే ఈఏడాది చెరువుల్లో, గ్రామంలో ఉన్న నీటి కుంటలో నీరు పుష్కలంగా ఉండటంతో పక్షులకు తాగునీటి కష్టాలు తొలిగినట్టే అని గ్రామస్తులు అంటున్నారు. గ్రామాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తామని గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలు నీటిమూటలుగా మిగిలి పోయాయి. ఇప్పటికైనా విదేశీ పక్షుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు. పక్షుల కోలాహలం రంగు రంగుల రెక్కలు, పొడవాటి ఎర్రని ముక్కులు, పెద్ద శరీరం, పెద్ద కళ్లతో చూపరులకు ఎంతో సంతోషాన్నిచ్చేలా ఉండే ఈపక్షులు సందడి చేస్తాయి. వాటి కోలాహలం మంత్ర ముగ్ధులను చేస్తుంది. రాత్రుళ్లు అవి చేసే పెద్ద అరుపులను సైతం పట్టించుకోకుండా గ్రామస్తులు వాటి సంరక్షణను తమ బాధ్యతగా చూసుకుంటారు. ముందుగా కొన్ని పక్షులు గ్రామానికి వచ్చి పరిసరాలు, ఆహార లభ్యత చూసుకొని అనువుగా ఉంటే వెనక్కి వెళ్లి తోటి పక్షులతో గ్రామానికి చేరుకుంటాయి. సమీపంలో దొరికే పుల్లలు, గడ్డిని తెచ్చి చెట్ల కొమ్మలపైకి చేర్చి గూడులు చేసి గుడ్లు పెడతాయి. చెరువులు, మునేరులో దొరికే చేపలు తిని బతుకుతాయి. అందమైన ఎర్రకాళ్ల కొంగలను చూసేందుకు వచ్చే సందర్శకులకు ఈ ప్రాంతంలో ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం లోటు. -
అతిథి ఆగయా
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్ శీతాకాలం.. చలిపులిని వెంటబెట్టుకుని రావడమే కాదు.. ఖండాంతరాల్లో ఉన్న ప్రకృతి ప్రసాద విహంగాలకూ ఆహ్వానం పలుకుతుంది. వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే ఎన్నో రకాల పక్షులకు నగరం ఆతిథ్యమిస్తుంది. చలి కాలం ప్రారంభమైందంటే చాలు.. ప్రతి ఏటా వర్ణశోభితమైన పక్షులు నగరంలోని పలు తటాకాల్లో సోయగాల సరాగాలు ఆలపిస్తుంటాయి. కిలకిలారావాలతో ప్రకృతి రమణీయతను ఇనుమడింపజేస్తుంటాయి. రంగురంగుల విహంగాలతో సరికొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. ప్రస్తుతం నగర శివారులోని అమీన్పూర్, గండిపేట చెరువులకు విదేశీ వలస పక్షులు వస్తుండటంతో ఈ తటాకాలు నూతన శోభను సంతరించుకుంటున్నాయి. వెర్డిటెర్ ఫ్లై క్యాచర్ ఎక్కడెక్కడి నుంచో.. సైబీరియా నుంచి హైదరాబాద్‌కు సుమారు 20 వేల కి.మీ దూరం ఉంటుందని అంచనా. పక్షులు అంత దూరం నుంచి ప్రయాణించి నగరానికి వలస రావడం గమనార్హం. శీతాకాలంలో అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి వెళ్లడం, తద్వారా వాటికి ఆహార సమస్య ఎదురవడం వంటి కారణాలతో అత్యంత సురక్షిత ప్రాంతంతో పాటు ఆహారం దొరికే ప్రాంతంగా హైదరాబాద్, శివారు ప్రాంతాలను వలస పక్షులు ఎంచుకుంటాయి. ఈ క్రమంలో ఇక్కడి ఆతిథ్యం కోసం నెలల పాటు ప్రయాణం చేసి వస్తుంటాయి. సైబీరియాతో పాటు యూరప్, దక్షిణ యూరేషియా, సెంట్రల్ ఏషియా, రష్యా, టర్కీ, ఆఫ్రికా, ట్రాన్స్– హిమాలయాల నుంచి వివిధ రకాల పక్షులు వలస వస్తుంటాయి. అవి వచ్చే క్రమంలో మధ్యమధ్యలో డే హాల్ట్ (పగలు) చేస్తూ రాత్రి వేళ తమ గమ్యం వైపు సాగిపోతాయి. ఉదాహరణకు సైబీరియా నుంచి వచ్చే పక్షులు చైనా భూభాగంలోని తిపత్, ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లోని చెరువుల వద్ద కొద్ది రోజులు బస చేసి మళ్లీ హైదరాబాద్ వైపు గమ్యం సాగిస్తుంటాయి. అలా దాదాపు నెల, రెండు నెలల పాటు తమ ప్రయాణం కొనసాగిస్తుంటాయి. ప్రతి పక్షి హిమాలయాలను టచ్ చేసి రావాల్సిందే. నగరంలో కొన్ని నెలల పాటు బస చేసి దిగువ ప్రాంతాలకు పయనమై తిరిగి వేసవి కాలం నాటికి స్వస్థలాలకు వెళ్తుంటాయి. ఎల్లో వాగ్‌టేల్ కచ్చిత గమ్యాన్ని ఎలా చేరుకుంటాయి..? పక్షులు కచ్చితమైన గమ్యాన్ని చేరుకునేందుకు ఎలాంటి పంథాను అనుసరిస్తాయనే సందేహం రావడం సహజం. మనుషులు మొదటిసారి కొత్త గమ్యానికి వెళ్లాలంటే తెలిసిన వారిని అంటిపెట్టుకుని వెళ్లడమో లేదా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జీపీఎస్ ఆధారంగానో వెళ్తుంటారు. ఒకసారి గమ్యాన్ని చేరుకున్నారంటే మరోసారి సులువుగా ఎవరి సహాయం అవసరం లేకుండా ఆ గమ్యాన్ని చేరుకోవచ్చు. అలాగే ఒకసారి దారిని కనిపెట్టిన పక్షులు మరోసారి అవలీలగా ఆ మార్గాన్ని అనుసరిస్తూ వస్తుంటాయి. ఈ క్రమంలో రాత్రివేళల్లో ఆకాశంలోని నక్షత్రాలను, చంద్రుడి దిశలను గుర్తుపెట్టుకుంటాయి. కాలానుగుణంగా నక్షత్రాలు, చంద్రుడి దిశలు ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. ఈ నేపథ్యంలో శీతాకాలంలో ఎన్ని డిగ్రీల కోణంలో ప్రయాణం చేస్తే తమ గమ్యం చేరుకుంటామో పక్షుల మైండ్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ఆ మేరకు నక్షత్రాలు, చంద్రుడిని అనుసరిస్తూ రాత్రివేళల్లోనే ఎక్కువగా పక్షులు ప్రయాణం చేస్తుంటాయి. నక్షత్రాలు, చంద్రుడి కిరణాల ప్రసరణతో పైకి ఎగురుకుంటూ వెళ్లే క్రమంలో కింద ఉన్న చెరువులు, కుంటలను కూడా స్పష్టంగా పసిగడతాయి. ఒకవేళ కొత్తగా వలస వచ్చే పక్షులైతే ఇంతకముందు వలస వచ్చిన పక్షులను అనుసరిస్తూ ఉంటాయి. అలా గ్రూపులు గ్రూపులుగా మధ్యమధ్యలో ఆగుతూ చివరకు నగరాన్ని చేరుకుంటాయి. కామన్ స్టోన్‌చాట్ నగరాన్నే ఎందుకు ఎంచుకుంటాయి..? చలికాలంలో పక్షులకు సురక్షితమైన ప్రాంతంగా హైదరాబాద్ ఉంటుంది. చలిని తట్టుకునే ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు కావడంతో పాటు ఆహారానికి కూడా అనువుగా ఉంటాయి. సహజసిద్ధమైన వాతావరణం వలస పక్షులకు ఇక్కడ లభిస్తుంది. చెరువుల చుట్టూ భారీ చెట్లు ఉండటం వలస పక్షులకు అనుకూల అంశం. చెరువుల చెంతనే చెట్లపై గూళ్లు కట్టుకోవడానికి అనువైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. చెరువుల మధ్యలో అక్కడక్కడా రాతి శిలలతో పాటు కృత్రిమంగా ఏర్పాటు చేసిన స్టాండ్లు ఉండటం వల్ల ఫ్లెమింగో వంటి పక్షులు వాటిపై గంటల పాటు స్టే చేస్తూ చేపలను అన్వేషిస్తుంటాయి. ఇలా తమ ఆహారాన్ని సేకరించుకోవడానికి అనువుగా ఉంటుంది. చేపల జోలికి వెళ్లని కొన్ని రకాల పక్షులు చెరువు ఒడ్డు ప్రాంతంలో సంచరిస్తూ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. పక్షులకు అనువైన వాతావరణంతో పాటు వనరులు ఇక్కడ పుష్కలంగా అందుబాటులో ఉండడంతో వలస పక్షులు ఏటా ఇక్కడ వచ్చి విడిది చేస్తుంటాయి. బ్లాక్–టేల్డ్ గాడ్విట్ పక్షి మొత్తం 380 రకాల పక్షి జాతుల్లో దాదాపు 70– 80 వలస పక్షులు ప్రతి ఏటా చలికాలంలో నగరాన్ని ముద్దాడుతుంటాయి. ఇందులో విదేశాలకు చెందిన 40– 45 రకాల పక్షులు విహారం చేస్తుంటాయి. ఇందులో ప్రధానంగా ఫ్లెమింగ్‌లోని పలు రకాల పక్షులు, వెర్డిటెర్ ఫ్లై క్యాచర్, కామన్ స్టోన్‌చాట్, నార్తరన్ షోవలర్, బ్లాక్ టెయిల్డ్ గాడ్విట్, ఎల్లో వాగ్‌టెయిల్, హారియర్స్‌లో పలు రకాల పక్షులు, 12 జాతులకు చెందిన డక్స్, ఈగల్స్, వాడర్స్, లిటిల్ టెర్న్ వంటి ఎన్నో రకాల రంగురంగుల వలస పక్షులను ఈ వింటర్ సీజన్లో చూడవచ్చు. పర్యావరణానికి సంకేతం.. పర్యావరణం ఎలా ఉందో వలస పక్షుల రాకను బట్టి చెప్పవచ్చు. ఇవి ఎక్కువగా వస్తున్నాయంటే ఇక్కడి వాతావరణం ఆమోదయోగ్యంగా ఉందనే భావించాలి. ఒకవేళ వలస పక్షుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయంటే అంతకుముందు కంటే పర్యావరణం దెబ్బతిందన్న సంకేతంగా చెప్పుకోవచ్చని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గత పదేళ్లతో పోలిస్తే వలస పక్షుల రాక కొంచెం తగ్గిందంటున్నారు. పర్యావరణానికి కాస్త విఘాతం కలిగి ఉండవచ్చు లేక వాటి ప్రయాణంలో అవాంతాలు ఎదురై ఉండవచ్చని భావిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లే క్రమంలో ఇటీవల రాజస్థాన్‌లో ఒక రకమైన బ్యాక్టీరియా కారణంగా కొన్ని వేల వలస పక్షులు చనిపోయాయి. అలాంటి సంఘటనలు జరగడం ద్వారా కూడా నగరానికి వలస వచ్చే పక్షుల సంఖ్య తగ్గి ఉండవచ్చని చెబుతున్నారు. ఏదేమైనా శీతాకాలం వలస పక్షులను నగరం మురిసిపోతుందనడంలో సందేహం లేదు. నార్తర్న్ షోవెలర్ చెరువులు కాలుష్యం కాకుండా చూడాలి.. వలస పక్షులపై విశ్లేషణ చేయడంతో పాటు ఫొటోలు తీసి ‘బర్డ్స్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్’ గ్రంథంలో ప్రస్తావించాను. ఇప్పటివరకు నేను 226 రకాల పక్షుల ఫొటోలను తీశాను. వీటిలో దాదాపు 80 రకాల వలస పక్షులు శీతాకాలంలో నగరానికి రావడం గమనించాను. పక్షులు విరివిగా రావాలంటే మన చెరువులను కాలుష్యం బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ మంగ,‘బర్డ్స్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్’ రచయిత వలస పక్షుల రాక తగ్గింది.. గత పదేళ్లుగా నగరానికి దాదాపు 50 శాతం మేర వలస పక్షులు రావడం తగ్గింది. అక్టోబర్ 15 నాటికి వలస పక్షులు రాక మొదలవుతుంది. వేసవికాలం ప్రారంభమయ్యే ముందు తిరిగి వెళతాయి. పక్షులకు అనువైన వాతావరణం కల్పించి తగిన ఆతిథ్యం ఇస్తే బాగుంటుం ది. పర్యావరణాన్ని కాపాడినవారమవుతాం. – చెల్మల శ్రీనివాస్, ఓయూ జంతుశాస్త్ర సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ -
విదేశీ పక్షులొచ్చె.. సందడి తెచ్చె
సాక్షి, గుంటూరు: ఖండాల సరిహద్దులు దాటుకుని.. వేల కిలోమీటర్లు ప్రయాణించి వలస వచ్చిన విదేశీ పక్షుల కిలకిలారావాలు, వాటి సోయగాలు, అవి రెక్కలతో నీటిపైన, ఆకాశంలో చేసే విచిత్ర విన్యాసాలు, సందడి చూడాలంటే గుంటూరుకు 8 కి.మీ. దూరంలో ఉన్న ఉప్పలపాడు పక్షి సంరక్షణ కేంద్రానికి వెళ్లాల్సిందే. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడులో 25 ఏళ్ల క్రితం పక్షి సంరక్షణ కేంద్రం ఏర్పాటైంది. ఇక్కడకు చైనా, నేపాల్, హిమాలయాల నుంచి ఫెలికాన్స్, నైజీరియా నుంచి పెయింటెడ్ స్టార్క్స్, శ్రీలంక, ఆఫ్రికాల నుంచి ఓపెన్ బిల్ స్టార్క్స్, దక్షిణాఫ్రికా నుంచి వైట్ ఐబిస్.. ఇలా వివిధ దేశాల నుంచి 32 రకాల పక్షులు ఆయా కాలాల్లో వలస వస్తున్నాయి. ఈ పక్షులన్నింటికి డాక్టర్ స్నేక్ అనే పక్షి కాపలాగా ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇక్కడకు శీతాకాలం మధ్యలో మిడతల దండును హరించే రోజీ పాస్టర్స్ వేల సంఖ్యలో వస్తాయి. వీటి కోసం ఉప్పలపాడు గ్రామ అవసరాల కోసం 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మంచినీటి చెరువును గ్రామస్తులు వదు లుకున్నారు. చెరువు మధ్యలో ఉన్న మట్టి దిబ్బలు, వాటిపై ఉన్న తుమ్మ చెట్లపై వేలాది పక్షులు నిత్యం సందడి చేస్తుం టాయి. వీటిని చూడటానికి వేలాదిగా సందర్శకులు వస్తున్నారు. పక్కా వ్యూహంతో... వలసలు పక్షులు సాగించే వేల కిలోమీటర్ల వలస ప్రయాణం పక్కా వ్యూహంతో ఉంటుంది. కొన్ని పైలెట్ పక్షులు ముందుగా పక్షి సంరక్షణా కేంద్రాన్ని సందర్శిస్తాయి. ఆహార లభ్యత, వాతావరణం, తదితర విషయాలను పరిశీలించి తమ ప్రాంతాలకు వెళ్లి మిగిలిన పక్షులను తీసుకుని వస్తాయని జీవశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పక్షులు గుడ్లు పెట్టడానికి ఉప్పలపాడులో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో విదేశీ పక్షులు కొన్ని నెలల పాటు ఇక్కడే ఉంటాయి. ఆ సమయంలో గుడ్లు పెట్టి, పిల్లల్ని పొదిగి, వాటికి ఎగరడం నేర్పాక పిల్లలతోపాటు తమ ప్రాంతాలకు సుదీర్ఘ ప్రయాణాన్ని చేపడతాయి. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఎక్కువ రకాలు వస్తాయి. ప్రస్తుతం ఉప్పలపాడులో దాదాపు 15 వేల పక్షులున్నాయి. ఇవి మార్చి వరకూ ఇక్కడే ఉంటాయి. వసతులు అంతంత మాత్రమే.. ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం చెరువును 2002లో అటవీ శాఖ స్వాధీనం చేసుకుంది. అయితే ఇప్పటికీ సరైన వసతులు లేవు. అటవీ శాఖ నిధుల లేమి కారణంగా పక్షుల సంరక్షణ కేంద్రాన్ని గ్రామంలోని పర్యావరణ అభివృద్ధి కమిటీకి అప్పగించింది. నిధుల కేటాయింపు అరకొరగా ఉండడంతో ఈ కమిటీ సందర్శకుల నుంచి రుసుము వసూలు చేసి పక్షుల కేంద్రాన్ని నిర్వహిస్తోంది. పర్యాటక శాఖ ఈ పక్షుల కేంద్రంపై దృష్టి సారించి మరిన్ని వసతులు కల్పిస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని గ్రామస్తులు అంటున్నారు. సైబీరియాకు చెందిన పక్షులే అధికం ఉప్పలపాడులో ఆహారం, వాతావరణం, సంతాన పునరుత్పత్తికి పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్లే భారీగా పక్షులు వలస వస్తున్నాయి. వీటిలో సైబీరియాకు చెందినవే అధికం. పక్షులు గుడ్లుపెట్టి, సంతానాన్ని ఉత్పత్తి చేసి తిరిగి వాటి దేశాలకు వెళతాయి. మళ్లీ సీజన్లో వలస వస్తాయి. గతంలో కొల్లేరుకు ఈ పక్షులు అధికంగా వలస వెళ్లేవి. అక్కడ ప్రకృతి, పర్యావరణం దెబ్బతినడంతో ఇతర ప్రాంతాలను వెతుక్కున్నాయి. ఉప్పలపాడులో ఎక్కువగా చెట్లు పెంచడం, సమీపంలో ఉన్న పొలాల్లో పురుగు మందుల వాడకం తగ్గించడంతోపాటు పక్షులకు అవసరమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచితే మరిన్ని పక్షులు వస్తాయి. – ప్రొఫెసర్ కె.వీరయ్య, జువాలజీ అధ్యాపకుడు, ఏఎన్‌యూ -
ఆ గ్రామాల్లో ‘నిశ్శబ్ధ’ దీపావళి..
దీపావళి అనగానే అందరికీ గుర్తొచ్చేది టపాసులు. ఇటీవలి కాలంలో చాలా మందికి ఎక్కువ టపాసులు కాల్చడమనేది గొప్పదిగా మారింది. వాస్తవానికి దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. మంచిపై చెడు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటామనే సంగతి అందరికి తెలిసిందే. పండగ సందర్భంగా లక్ష్మి పూజ నిర్వహిస్తారు. అయితే దీపావళిని ఉత్తరాదిన ఐదు రోజులు జరుపుకుంటుంగా.. దక్షిణాదిన మాత్రం ఒకటి, రెండు రోజులు మాత్రమే పండగ సందడి ఉంటుంది. కానీ దేశం మొత్తం పండగలో కనిపించేది బాణాసంచా. ఇటీవల దీపావళి రోజున బాణాసంచా కాల్చడంపై సుప్రీం కోర్టు నియంత్రణ విధించింది. కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను చాలా చోట్ల ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అయితే ఇందుకు భిన్నంగా తమిళనాడులో శివగంగ జిల్లాలోని కొల్లుకుడిపట్టి, సింగంపునారి గ్రామాలు మాత్రం టపాకాయలు కాల్చడానికి దూరం. వీరు సుప్రీం ఆదేశాలకు పాతికేళ్ల ముందు నుంచే బాణాసంచా కాల్చకూడదనే తీర్మానం చేసుకున్నారు. ఈ రెండు గ్రామాలు కూడా వెట్టంగుడి బర్డ్ సాంక్చురీలో భాగంగా ఉన్నాయి. అయితే ఇక్కడికి చలికాలం కొన్ని రకాల పక్షులు వలస వస్తుంటాయి. సైబీరియా, న్యూజిలాండ్ నుంచి వచ్చిన పక్షులు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని మళ్లీ ఎండకాలం ప్రారంభం కాగానే వాటి ప్రదేశాలకు వెళ్లిపోతాయి. ఇక్కడే గుడ్లు పెటి పొదిగి పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత తమ ప్రాంతాలకు తీసుకెళ్లిపోతాయి. గతంలో కూడా ఈ ప్రాంతంలో టపాసులు కాల్చేవారు. అయితే బాణాసంచా మోతకు వలస వచ్చిన పక్షలు భీతిల్లిపోయేవి. పక్షులు పొదిగే గుడ్ల నుంచి పిల్లలు కూడా సరిగా బయటికి వచ్చేవి కావు. కొన్ని సార్లు పక్షులు అక్కడి నుంచి ఎగిరి వెళ్లిపోయేవి. ఈ పరిస్థితులను గమనించిన రెండు గ్రామాల ప్రజలు తమ గ్రామాల్లో బాణాసంచా కాల్చకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆ గ్రామాల్లో ఏ దీపావళికి కూడా బాణాసంచా కాల్చడం లేదు. కొల్లుకుడిపట్టి, సింగంపునారి గ్రామాల్లో ఎప్పుడూ బాణాసంచా కాల్చడం చూడలేదని ఆ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న అటవీ అధికారులు తెలిపారు. బాణాసంచా కాల్చకూడదనే నిబంధనపై గ్రామస్తులు కూడా బలమైన సంకల్పంతో ఉన్నారు. ‘మనుషులమైతే బాణాసంచా శబ్దం భరించలేకపోతే ఇంట్లో దూరి తలుపులు వేసుకుంటాం, చెవుల్లో దూది కూరుకుంటాం. మరి ఆ పక్షులు ఈ భయంకరమైన శబ్దాలను ఎలా భరించాలి?’ అని ఆ గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మన ఆనందం కోసం పక్షులను క్షోభ పెట్టడం ఏమిటి అనేది వాళ్ల భావన. దీపావళికే కాక గ్రామాల్లో జరిగే ఏ ఇతర వేడుకల్లో కూడా వారు బాణాసంచా కాల్చరు. పిల్లల సరదా కోసం.. పిల్లలకు టపాసులు కాల్చడమంటే మహా సరదా. అలాంటి వాటిని కాల్చవద్దంటే వాళ్ల మనసులు నోచుకుంటాయి. అందుకే ఆ గ్రామాల్లోని పిల్లలు ఎక్కువ శబ్దం లేని టపాసులను మాత్రమే కాలుస్తారు. అది కూడా... స్కూలు హెడ్మాస్టరు పర్యవేక్షణలో చెట్లు, పక్షులు లేని నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్లి మరీ టపాసుల వేడుక చేసుకుంటారు. -
విదేశీ విహారి..!
పర్యాటక ప్రేమికుల మానస సరోవరం.. అందమైన లోకం..దేశ విదేశాల నుంచి రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోయే విహంగాల విడిది.. శీతాకాలంలో సందడి చేయాల్సిన విదేశీ అతిథులు ముందే నేలపట్టుకు వచ్చేశాయి. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడి కడప చెట్లపై విడిది చేస్తున్నాయి. వందల సంఖ్యలో నత్తగుల్ల కొంగలు జతలు జతలుగా కనువిందు చేస్తున్నాయి. తెల్లకంకణాయిలు సైతం దర్శనమిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పక్షులసంరక్షిత కేంద్రంలోని చెరువుల్లో నీళ్లు వచ్చి చేరాయి. దీంతో విదేశీ పక్షులు ముందుగానే ఇక్కడకు వచ్చి వాలాయి. మామూలుగా అయితే వీటి సీజన్ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకూ ఉంటుంది.విస్తారంగా వర్షాలు కురిసి చెరువుల్లో నీరు వచ్చి చేరితేనేగూడబాతులు వస్తాయి. నెల్లూరు, దొరవారిసత్రం: నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రంలో విదేశీ పక్షుల సందడి మొదలైంది. మామూలుగా వచ్చే నెలలో వీటి సీజన్ ప్రారంభం కావల్సి ఉంది. ఈ ఏడాది ముందుగానే వచ్చి చేరాయి. అక్టోబర్ మాసంలో వీటి సీజన్ ప్రారంభం కానున్న దృష్ట్యా అధికార యంత్రాంగం ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే తాగునీటి వసతి, చెరువు కట్టపై వ్యూ పాయింట్ల వద్ద షెల్టర్లు, సేద తీర్చుకునేందుకు బెంచీలు తదితర ఏర్పాట్లలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది బిజీగా ఉన్నారు. వీటితోపాటు పిల్లల పార్కులో దెబ్బతిన్న వస్తువుల మరమ్మతులు, వాచ్ టవర్ నిర్వహణ వంటి పనులు చకచకా చేయిస్తున్నారు. టిక్కెట్ కౌంటర్ ప్రారంభం నేలపట్టు పక్షుల కేంద్రం ప్రధాన గేట్ల వద్ద గత వారం టిక్కెట్ కౌంటర్‌ను అటవీశాఖ అధికారులు ప్రారంభించారు. ప్రవేశ రుసుము వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దలకు రూ.10, పిల్లలకు రూ.5, బైక్‌కు రూ.20, ఆటోకు రూ.50, జీపు, కారులకు రూ.100, మినీబస్, బస్, టెంపో తదితర వాటికి రూ.250, కెమెరాకు రూ.100, బైనాక్యులర్‌కు రూ.50, విదేశీ పర్యాటకులకు అయితే ఒక్కొక్కరికి ప్రవేశ రుసుము రూ.500, విదేశీయుల కెమెరాకు రూ.100 చెల్లించాల్సి ఉంది. పక్షుల కేంద్రంలో రెస్టారెంట్ విదేశీ విహంగాల సీజన్లో ఇక్కడకు విచ్చే సందర్శకులకు భోజన వసతి, టీ, బిస్కెట్ వంటి సదుపాయాలు లేనందున చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈడీసీ వారే కేంద్రంలో రెస్టారెంట్‌ను నడిపే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దీనికి చెందిన ప్రతిపాదనల నివేదికను ఉన్నతాధికారులకు పంపాం. 2017–18, 2018–19 రెండేళ్లలో ప్రవేశ రుసుము ద్వారా రూ.14 లక్షల వరకు వచ్చింది. ఈ నిధితో కేంద్రంలో సందర్శకులకు అవసరమైన అభివృద్ధి పనులు, నిర్వహణ పనులు చేపడతాం. – కె.రామకొండారెడ్డి, రేంజర్, నేలపట్టు పక్షుల కేంద్రం -
అరగంట టైం వేస్ట్ అవుతోంది.. చెట్లు నరికేయండి
తిరువనంతపురం : ప్రపంచవ్యాప్తంగా అడవుల పరిరక్షణ గురించి చర్చిస్తుంటే కొచ్చి జనాలు మాత్రం చెట్లు నరికేయండి బాబు.. పక్షులతో వేగ లేకపోతున్నాం అని వేడుకుంటున్నారు. ఎందుకో మీరు చదవండి. కొచ్చిలోని అలువా రైల్వే స్టేషన్లో సాధరణంగా వినిపించే ఫిర్యాదు చెట్లను నరికేయండి అని. ఎందుకంటే.. ఉద్యోగమో, మరేదో కారణాల రీత్యా ఇతర ప్రదేశాలకు వెళ్లేవారు రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్లేస్‌లో తమ వాహనాలను పార్క్ చేసి వెళ్తున్నారు. తిరిగి వచ్చి చూసే సరికి వాహనాల నిండా పక్షి రెట్టలుండటంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రదేశంలో చెట్లు ఎక్కువగా ఉన్నాయి. దాంతో అవి కాస్త పక్షులకు నివాసంగా మారాయి. ఫలితంగా అక్కడ వాహనాలు నిలిపి వెళ్తున్న వాహనదారులు ఇలా పక్షి రెట్టలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి రోజు ఉదయం 20-30 నిమిషాల సమయాన్ని వాహనాలను శుభ్రం చేయడానికే కేటాయించాల్సి వస్తోందని వాపోతున్నారు. చెట్లను కొట్టేసి తమను ఈ సమస్య నుంచి బయటపడేయాల్సిందిగా రైల్వే అధికారులను వేడుకుంటున్నప్పటికి.. ఫలితం లేదని వాపోతున్నారు. దీనిపై రైల్వే అధికారులు స్పందిస్తూ.. ‘చెట్లను కొట్టేయడం అంత సులభం కాదు. అందుకు అనుమతులు రావడం కష్టమే కాక చెట్లను నరికితే.. పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బ తింటుంది’ అని తెలిపారు. -
విమానాలకు విహంగాల బెడద
అంతర్జాతీయ విమానాశ్రయ గుర్తింపు పొందినప్పటికీ గన్నవరం విమానాశ్రయం ఇంకా బాలారిష్టాల నుంచి గట్టెక్కలేదు. విమానాశ్రయ పరిసర గ్రామాల వారు ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని డంపింగ్ యార్డులా వాడేసుకుంటున్నారు. వారు పడవేసిన వ్యర్థాల కోసం వస్తున్న పక్షులతో అడపాదడపా విమానాలకు ప్రమాదాలు వాటిల్లుతున్నాయి. అయితే ప్రమాదాల నివారణకు తాత్కాలికంగా బాణసంచా పేల్చి చేతులు దులుపుకొంటున్నారు తప్ప...సమస్య శాశ్వత పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. సాక్షి, గన్నవరం: అంతర్జాతీయ విమానాశ్రయ గుర్తింపు పొందిన గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు పక్షుల బెడద తప్పడం లేదు. విమానాశ్రయ పరిసరాల్లో యథేచ్ఛగా డంప్ చేస్తున్న జంతు కళేబరాలు, మాంసం వ్యర్థాలు, చెత్తాచెదారం కారణంగా పక్షుల సంచారం విపరీతంగా పెరిగింది. ఫలితంగా తరుచూ విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. గతంలో ఇక్కడ పలుమార్లు విమానాలకు పక్షులు ఢీకొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ సమయాల్లో విమానాలకు తృటిలో ప్రమాదాలు తప్పినా అధికారులు మాత్రం అప్రమత్తం కావడం లేదు. ఈ తరహా సంఘటనలు జరిగినప్పుడు అధికారులు అక్రమ చెత్త డంపింగ్ నివారణపై చెత్త సమావేశాలు నిర్వహించి హడావుడి చేయడం తప్ప ఆచరణాత్మక విధానాలేవీ అమల్లో పెట్టడం లేదు. అయితే విమానాశ్రయ పరిసర గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు ఎయిర్పోర్ట్ ఆధారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి సహకారం అందించడం లేదు. యథేచ్ఛగా డంపింగ్ విమానాశ్రయం చుట్టూ ఉన్న గ్రామాలు ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలను డంపింగ్ యార్డులుగా ఉపయోగిస్తున్నాయి. విమానాశ్రయ రన్‌వేకు అతి సమీపంలో ఉన్న కొత్తపేట వద్ద పాటిగోతుల్లో మాంసం దుకాణదారులు వ్యర్థాలను మూటలు కట్టి తీసుకువచ్చి పడవేస్తున్నారు. దీనికితోడు జంతు కళేబరాలను, చెత్తచెదారం యథేచ్ఛగా ఇక్కడ డంప్ చేస్తున్నారు. దీంతో వీటి కోసం వచ్చే గెద్దలు పక్కనే ఉన్న రన్‌వేపైకి చేరుతున్నాయి. రాజీవ్‌నగర్‌తో పాటు ఎయిర్‌పోర్టు తూర్పు వైపు ఉన్న వాగు కూడా పక్షుల సంచారానికి కారణమైంది. ఇంకా రాజీవ్‌నగర్‌కాలనీ, బుద్దవరం వైపు విమానాశ్రయ పరిసరాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. దీనికితోడు విజయవాడలోని హోటళ్లకు చెందిన వ్యర్ధాలను రాత్రి వేళల్లో ఆటోల్లో తీసుకువచ్చి కేసరపల్లి, ఎయిర్‌పోర్టు పరిసరాల్లో డంప్ చేస్తున్నారు. వీటివల్ల పక్షుల సంచారం పెరిగి విమానాల రాకపోకల సమయంలో ఆటంకం ఏర్పడుతోంది. దీంతో విమానాల రాకపోకల సమయంలో పక్షులను బెదరకొట్టేందుకు ఎయిర్‌పోర్టు సిబ్బంది బాణసంచా ఉపయోగించాల్సిన పరిస్ధితి నెలకొంది. గుణపాఠం నేర్వని అధికారులు గత పదేళ్ల వ్యవధిలో ఇక్కడ ఏడుసార్లకు పైగా విమానాలను పక్షులు ఢీకొన్నాయి. తరుచూ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో పక్షుల వల్ల విమాన పైలెట్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పక్షులు ఢీకొనడం వల్ల ఇప్పటివరకు ఎయిరిండియా, స్పైస్‌జెట్, ఎయిర్ కోస్తా, జెట్ ఎయిర్వేస్కు చెందిన విమానాలు సర్వీస్‌లు రద్దు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా పక్షులు ఢీకొన్నప్పుడు విమాన రెక్కలు, ఇంజన్ భాగాలు దెబ్బతిని సదరు విమాన సంస్థలకు ఆర్థికంగా నష్టం కూడా వాటిల్లింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఎయిర్‌పోర్టు అధికారులు సమావేశాలు నిర్వహించి పక్షుల నివారణ, అక్రమ డంపింగ్ అరికట్టేందుకు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పంచాయితీ, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో అనధికార డంపింగ్ యథావిధిగా కొనసాగుతోంది. దీంతో విమానాలకు పక్షుల బెడద తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎయిర్‌పోర్టు పరిసరాల్లో మాంసం వ్యర్థాలు, జంతు కళేబరాలు, చెత్తచెదారం డంప్ చేయకుండా చర్యలు తీసుకోవాలని విమాన ప్రయాణికులు కోరుతున్నారు. కొరవడిన ఎయిర్‌పోర్టు సహకారం విమానాశ్రయ పరిసర గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఎయిర్‌పోర్టు నుంచి సహకారం కొరవడింది. సామాజిక బాధ్యత పథకం కింద ఎయిర్‌పోర్టు అథారిటీ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు అవసరమైన సామగ్రిని అందించే వెసులుబాటు ఉంది. దీనికోసం ప్రతియేటా జరిగే పర్యావరణ సమావేశంలో ఎయిర్‌పోర్టు చుట్టూ ఉన్న బుద్దవరం, కేసరపల్లి, అల్లాపురం, గన్నవరం గ్రామ పంచాయతీల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. అయా గ్రామాల్లో చెత్త నిర్వహణకు ట్రాక్టర్లు, రిక్షాలు, డస్ట్బిన్లు, ఎస్సీ, బీసీ ఏరియాల్లో డ్రైనేజీ నిర్మాణాలకు ఎయిర్‌పోర్టు అధికారులకు ప్రతిపాదనలు ఇస్తున్నప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సహకరం అందించలేదని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పారిశుద్ధ్య నిర్వహణకు ఎయిర్‌పోర్టు సహకారం అందించాలని కోరుతున్నారు. -
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
తెల్లవారు జామున ఒక చెట్టు కొమ్మల మీద పిచ్చుకలు కిచకిచలాడుతున్నాయి. మరో చెట్టు తొర్రలో నుంచి పాలపిల్ల కువకువలాడుతోంది. సూర్యుడు నేలను చూడడానికి చెట్ల ఆకుల మధ్య నుంచి దారులు వెతుక్కుంటున్నాడు! ఇదేమీ చీమలు దూరని చిట్టడవి వర్ణన కాదు, కాకులు దూరని కారడవి వర్ణన కూడా కాదు. ఒక ప్రొఫెసర్ విశ్రాంత జీవనం గడుపుతున్న ప్రదేశం. ఏళ్లుగా కరెంటే లేని నివాసం. మహారాష్ట్రలోని పుణె నగరంలో ఉంది బుధవారపేట. పెద్ద వ్యాపార కేంద్రం అది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ గూడ్స్ మార్కెట్‌కు ప్రసిద్ధి బుధవారపేట. ఆ బుధవారపేటలోనే ఉంది కరెంట్ లేని ఓ ఇల్లు. అది ఇల్లంటే ఇల్లు కాదు తోటంటే తోటా కాదు. చిన్న అడవిని తలపించే ప్రదేశం. అందులో ఎప్పుడైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లున్న ఓ కట్టడం. అందులో ఒంటరిగా నివసించే ప్రొఫెసర్ పేరు డాక్టర్ హేమా సనే. బాటనీ ప్రొఫెసర్‌గా రిటైరయ్యారామె. ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించే హేమ కరెంట్ దీపాలు వెలిగిస్తే పక్షులకు అసౌకర్యం కలుగుతుందని కరెంట్ లేకుండానే జీవిస్తున్నారు. ఇప్పుడామెకి 79 ఏళ్లు. ‘‘కరెంట్ లేని రోజులను చూశాను, అప్పుడు కూడా హాయిగానే జీవించాను. ఇప్పుడూ అంతే. కరెంట్ సౌకర్యం కోసం పక్షులను ఇబ్బంది పెట్టలేను’’ అంటారామె. ఏది నాది? ‘‘తిండి, దుస్తులు, నీడ మాత్రమే మనిషికి కనీసవసరాలు. ఇక ఇతర అవసరాలేవీ తప్పని సరి కానే కాదు. నాకు ఈ మూడు కనీస అవసరాలు తీరుతున్నాయి. కరెంట్ లేని కారణంగా నాకు ఎదురవుతున్న అసౌకర్యం ఏమీ లేదు. నిద్రలేచేటప్పటికి పక్షుల కిలకిలరవాలు వినిపించకపోతే అసౌకర్యానికి లోనవుతాను తప్ప కరెంటు లేనందుకు కాదు. ఈ ప్రదేశాన్ని అమ్మేస్తే చాలా డబ్బు వస్తుందనే సలహాలు నాకు చాలా మందే ఇచ్చారు. ఈ నేల నా ఆస్థి కాదు. ఇక్కడ నాకు తోడుగా ఓ కుక్క, రెండు పిల్లులున్నాయి. వాటికి తోడు ఓ ముంగిస కూడా ఉంది. ఎన్నో రకాల చెట్లున్నాయి. ఆ చెట్ల మీద లెక్కలేనన్ని పక్షులున్నాయి. వాటన్నింటి ఆస్తి ఇది. నేను వాటి బాధ్యత చూసుకునే సంరక్షకురాలిని మాత్రమే. ప్రకృతి భూమిని ఏర్పరచింది పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటూ జీవించడానికే తప్ప మనిషి విపరీతమైన ఆకాంక్షల కోసం ఛిన్నాభిన్నం చేయడానికి కాదు. నన్ను చాలా మంది ఫూల్ అంటుంటారు కూడా. వాళ్లలా అన్నంత మాత్రాన నాకు వచ్చిన నష్టమేమీ లేదు. నేను నా జీవితాన్ని నాకు నచ్చినట్లు జీవిస్తున్నాను. ఎవరికీ హాని కలిగించని రీతిలో జీవిస్తున్నాను కాబట్టి ఎవరికీ సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు’’ అంటారు హేమ నిష్కర్షగా. నిత్యాన్వేషణ నడుము వంగిపోయిన వయసులో ఆమె రోజూ తన అడవిలాంటి తోటంతా తిరుగుతారు. ఆమె సామిత్రీఫూలే పూనె యూనివర్సిటీ నుంచి బాటనీలో పీహెచ్డీ చేశారు. పూనెలోని గర్వారే కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. వృక్షశాస్త్రం– పర్యావరణం అంశం మీద ఆమె రాసిన అనేక పుస్తకాలు ప్రచురితమయ్యాయి. తన ఒంటరి జీవితాన్ని వృక్షశాస్త్ర అధ్యయనానికే అంకితం చేసిన హేమ ఇప్పటికీ కొత్త పరిశీలనలను గ్రంథస్థం చేస్తున్నారు. ఆ తోట మొత్తంలో ఆమెకు పేరు తెలియని పక్షి కానీ, చెట్టు కానీ లేవు. ప్రతి మొక్క, చెట్టు సైంటిఫిక్ నేమ్‌తో దాని లక్షణాలను వివరిస్తారు. ఇలాంటి విలక్షమైన జీవనశైలి ద్వారా సమాజానికి ఎటువంటి సందేశమూ ఇవ్వడం లేదని కూడా అంటారు డాక్టర్ హేమాసనే. అయితే అలా అడిగిన వాళ్లకు... ‘నీ జీవితంలో నీవు నడవాల్సిన దారిని నువ్వే అన్వేషించుకో’ అనే బుద్ధుని సూక్తిని ఉదహరిస్తారామె. – మంజీర -
పాకాలకు ‘విదేశీ చుట్టాలు’
ఖానాపురం: వరంగల్ రూరల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన పాకాలకు వేసవి కాలంలో అనేక రకాల విదేశీ పక్షులు వలస వస్తున్నాయి. గతంలో అంతంత మాత్రంగానే ఉన్న పక్షుల వలసలు ప్రస్తుతం పెరిగాయి. వాటిని గుర్తించడానికి ప్రత్యేకంగా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌ను ఏర్పాటు చేయించడంతోపాటు పక్షులు సేదదీరడానికి అవసరమైన ఏర్పాట్లను ఖాజీపేట డీఎఫ్ఓ పురుషోత్తం ఆధ్వర్యంలో చేపట్టారు. వెరి డైట్ఫ్లై, క్యాచర్, పిగ్నిఉలిడక్, ఎల్లో వాట్ లెడ్, ల్యాప్వింగ్, రెడ్ అవైడవిట్, బార్ హెడ్ గీస్, ఆస్ప్రే, కామన్ ప్రొటైన్ కోల్, రెడ్ క్రాస్టెడ్, పోచార్ట్స్, బ్లూ టేబిల్డ్ బీ ఈటర్, విస్టింగ్ డక్స్, రోసే స్టార్లింగ్, చెస్ట నట్ హెడ్ బీ ఈటర్, రెడ్ నాఫ్ట్ ఇబస్, రివర్ టెర్న్, తిక్ బిల్డ్ గ్రీన్, నార్తర్న్ షోవ్లర్, కామన్ పోచర్డ్స్, కామన్ పిన్ టేల్స్, నార్తర్న్తోపాటు పలు ఇతర రకాల పక్షులు వేసవిలో ఇక్కడ సేదతీరుతున్నాయి. -
మా ఇంటికి రండర్రా
రోజూ రండర్రా, నేను సాయంత్రాలు పార్కుకీ వస్తున్నానని మా ఇంటికి రాకుండా ఉండకండి. మీ ఇంటిల్లిపాదినీ తీసుకురండి, మీ ఫ్రెండ్స్‌కి కూడా ఆంటీ పిలుస్తున్నారని మీ పిచ్చుక్ పిచ్చుక్ భాషలో చెప్పండి, కాసేపు కబుర్లాడుకుందాం. ఱైఱైఱై మంటూ రెండు మినీ ట్రక్కులు నల్లటి పెట్రోలు బుసలొదులుకుంటూ పక్కన్నుంచి శరవేగంతో వెళ్లిపోయాయి. ఏంటో అంత రాచకార్యం వీళ్లకి? పవిటకొంగుని ముక్కుకడ్డెట్టుకుని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నెమ్మదిగా ఫుట్‌పాత్ ఎక్కాను. పక్కనున్న పార్కులో కాసేపు తాజా గాలి పీల్చుకొద్దామని వెళ్లడమంటే రెండు మెయిన్‌రోడ్లు క్రాస్ చెయ్యాల్సిన పని. రెండుసార్లు పద్మవ్యూహంలో ఇరుక్కోవడమే! రోజుకో గంట నడిచి గూడు జాగ్రత్తగా చేరానంటే ఆ రోజు పల్నాటి యుద్ధం గెలిచినంత సంబరం! రానున్న కాలంలో ఈ ఫుట్‌పాత్ కాన్సెప్ట్ కూడా ఉండదేమో అని భయం వేస్తుంది. పక్క సందులోకెళ్లాలన్నా, రోడ్డు దాటాలన్నా ఆటోలో వెళ్లే పరిస్థితి వస్తుందేమో!‘‘నడవండి ఆంటీ, మీరు డెయిలీ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వాకింగు మానకండి. ఏభై ఐదు కిలోలు ఉండాల్సిన వాళ్లు ఎనభై ఐదు కిలోల పైన ఉన్నారు. కనీసం ముప్ఫై కిలోలైనా తగ్గకపోతే కాళ్ల నొప్పులూ, కీళ్ల నొప్పులూ అని మున్ముందు చాలా బాధపడ్తారు. ‘ఒబేసిటీ ఈస్ ఏన్ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ మెనీ డిసీసెస్’ అని ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా!‘ అన్నాడు కిరీట్.‘‘ఓ ఆరు నెలలు డైట్ కంట్రోల్ చేసి, ఓ గంట బ్రిస్క్ వాక్ చేస్తే దీపికా పడుకోన్ లానో, రకుల్ ప్రీత్ లానో అయిపోతారని స్మైల్ చేస్తూ చెప్పాడు. కిరీట్ ఇప్పుడు ‘ఎంబీబిఎస్’ మూడో సం.లో ఉన్నాడు. చిన్నప్పుడు నన్ను ‘లావాంటీ, లావాంటీ‘ అని పిలిచేవాడు. వీడికి వేళాకోళం ఎక్కువైందని బాగా మందలించేదాన్ని. ఫాక్టే కదా అని అప్పుడప్పుడు ఊరుకునేదాన్ని! వాడి ప్రాణానికి నేనేనుగులా కనిపించేదాన్నో ఏమో! వాళ్ల అమ్మ స్మిత సన్నగా చిన్నగా వెల్లుల్లి పాయలా ఉండేదప్పుడు. నన్ను వదినా, వదినా అంటూ ఇప్పటికీ ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తుంది. ఎంతో కాలంనుంచీ ఇరుగుపొరుగిళ్లల్లో ఉంటున్నాం. అవసరానికి చేదోడు వాదోడుగా ఉంటుంది స్మిత.కిరీట్ వాళ్ల నాన్న గారికి ఈ మధ్యనే నీ రీప్లేస్మైంట్ సర్జరీ అయ్యింది. పాపం వాడు నేనిబ్బంది పడకూడదనే సదుద్దేశంతో జాగ్రత్త పడమని చెబుతున్నాడు. ఓవర్ వెయిటు ప్రాణాల మీదకొస్తోంది. ఎక్సర్సైజ్, వాకింగ్, డైటింగ్ తప్ప ఇంకో ఆప్షనేముందీ? ఎక్కడికెళ్లినా లావుగా ఉన్నవాళ్లు సెంటర్ ఆఫ్ అట్రాక్షనో లేక డిస్ట్రాక్షనో అవుతారు. పీత కష్టాలు పీతవన్నట్టు వాళ్ల బాధలు వీళ్లవి. నించుంటే ఆయాసం, కూర్చుంటే ఆయాసం. ఓ మంచి డ్రెస్ వేసుకుందామంటే సైజులు రావు. విసుగొచ్చేస్తుంది. నాలో నేను మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఉన్న పార్కులోని సిమెంటు బెంచీ మీద కాసేపు రెస్టు తీసుకుని, ఆ బూట్లవతల పెట్టి, ఓ పదిహేను నిమిషాలు ప్రాణాయామం చేసి, ఆ ఆకుపచ్చని చల్లటి మఖ్మల్ లాంటి గడ్డి మీద ఓ అరగంట నడిచి ఏదో పరధ్యానంలోకి వెళ్లిపోతున్నప్పుడు ఓ చిట్టి పిట్ట చిట్టి ముక్కుతో నా పాదం పొడిచింది. ఏదో తీక్షణంగా గింజలు కామోసు వెత్తుక్కుంటోంది. ఎంత నాజూకుగా ఉందో! దీనికి డైటింగు, వాకింగు, లివింగు అన్నీ ఇక్కడే! కాలుష్యంతో విషపూరితమైన మన పరిసరాల మధ్య ఈ చిన్నారి పిచ్చుకలు గూళ్లెక్కడ కట్టుకుంటున్నాయో? పసిగుడ్లనెలా వాటి పొదుగుల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నాయో? వాటి కన్న బిడ్డల ఆకలి ఎలా తీరుస్తున్నాయో? పిచ్చితల్లుల ప్రేమ ఏమని వర్ణించగలం? మనలా.. నరాల నొణికించే చలిని కాచుకోవడానికి హీటర్లా? వానల్లో పొడిగా ఉండేందుకు గొడుగులా? సూరీడు సెగలనడ్డుకుందుకు ఏసీలా? ఈ మాత్రం పార్కులింకా ఉన్నాయి కాబట్టి ఈ జీవరాశులకు నిలువనీడ ఉంటోంది. చెట్టుని, పుట్టని నమ్ముకున్న చిట్టి పొట్టి పిట్టలు, పావురాళ్లు, రామచిలుకలు, చిన్ని చీమలు, కాకమ్మలు, మైనాలు ఎన్నెన్నో రకాల పక్షులు. పొట్టకోసం పుట్టెడు గింజల కోసం ఎన్నెన్ని పాట్లో, ఎన్నెన్ని అగచాట్లో! కొద్దిపాటి జీవితంలో ఎంత సుఖదుఖ్కాలెదుర్కుంటాయో? మనలానే అవీ వాటి కష్టసుఖాలను ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటాయా! ఈ మూగజీవులు శాంతంగా ఎంత ప్రసవ వేదన భరిస్తాయో. ఈ చిన్ని ప్రపంచంలో మన నేస్తం కోసం మన ఇళ్ల లోగిళ్లలోకి వచ్చి వాలే ఈ బుజ్జి సందెళ్లకు ఆహ్వానం పలకాలని మా వాళ్లందరికీ చెబుతూనే ఉంటాను.పొట్టి ముక్కుతో, పొడుగు తోకతో, చిన్ని బొజ్జతో, హరివిల్లు రంగులు రంగరించుకొని వినువీధులలోని నీలిమేఘాలలో యవ్వనం, కారుమేఘాలలో ముసలితనం చవి చూచి నేలరాలిపోయే ఈ నేస్తాలు మనముందుకొచ్చిన క్షణం మనకెంత సంతోషాన్ని ఇస్తాయో! ఏదో నాలో నేను ఆ పిట్టలతో సంభాషించడం అలవాటైంది. కాసేపు వాటితో కబుర్లాడుతూ, హాయిగా ఊపిరితిత్తుల నిండా ఫ్రెష్‌గా గాలి పీల్చుకుంటూ, అవీ మనతోపాటు ఈ భూమ్మీద జీవనం సాగిస్తున్నందుకు ఎంతగానో సంతోషపడుతుంటాను. రోజూ మా ఇంటికొచ్చే పక్షులని చూసి ‘‘ఎందుకర్రా, చిన్నారి పిచ్చుకలూ? రోజూ నా బాల్కనీలో వాలతారు? మీకూ నాకూ ఏదో జన్మలో సంబంధమున్నట్టు పిచ్చాపాటీ పెడ్తారు? పర్లేదులే, మీకు నాలుగ్గింజలు నేను ప్రేమతో పెడతాను, రోజూ రండర్రా, నేను సాయంత్రాలు పార్కుకీ వస్తున్నానని మా ఇంటికి రాకుండా ఉండకండి. మీ ఇంటిల్లిపాదినీ తీసుకురండి, మీ ఫ్రెండ్స్‌కి కూడా ఆంటీ పిలుస్తున్నారని మీ పిచ్చుక్ పిచ్చుక్ భాషలో చెప్పండి, కాసేపు కబుర్లాడుకుందాం. అఫ్కోర్స్ నా ఇంటికన్నా మీ ఇల్లే మేలు! కానీ మా ఇంటికి మీరొస్తే నాకెంతో ఉల్లాసంగా ఉంటుంది. మీకు రోడ్లు క్రాస్ చేసే పనీలేదు, ఫుట్‌పాత్‌ల గొడవ అసలే లేదు. చుట్టంచూపుగా అయినా రోజూరండి. మీరాక కోసం ఎదురుచూస్తూ వుంటాను. – సత్యశ్రీ నండూరి ►‘‘ఓ ఆరు నెలలు డైట్ కంట్రోల్ చేసి, ఓ గంట బ్రిస్క్ వాక్ చేస్తే దీపికా పడుకోన్ లానో, రకుల్ ప్రీత్ లానో అయిపోతారని స్మైల్ చేస్తూ చెప్పాడు కిరీట్. ఇప్పుడు ‘ఎంబీబిఎస్’ మూడో సం.లో ఉన్నాడు. చిన్నప్పుడు నన్ను ‘లావాంటీ, లావాంటీ‘ అని పిలిచేవాడు. -
బూడిదలో పోసిన పన్నీరే
ఓ మత బోధకుడి దగ్గర ఓ వేణువు ఉంది. దాన్ని వాయించడానికి అతను కొన్నిసార్లు ఓ పర్వతం మీదకు వెళ్లేవారు. అప్పుడా దార్లో వెళ్ళేవారందరూ ఆ వేణునాదాన్ని విని మైమరచిపోతారు. అంతెందుకు ఆ వేణునాదానికి జింకలు ఆగిపోతాయి. ఎగురుతున్న పక్షులు ఆయన దగ్గరకు వచ్చి వాలుతాయి. కొన్నేళ్ళకు అతను చనిపోయారు. ఆ వేణువును చెట్టుకింద ఉంచి దాన్ని పూజించడం మొదలుపెట్టారు. ఒకటి రెండు తరాల తర్వాత ప్రజలు ఈ వెదురు వేణువులో ఏముంది దీన్ని ఇలాగే ఓ కొయ్యలాగా ఆరాధించడమేంటీ... దీన్ని మరింత గొప్పగా ఆరాధించాలి అనుకుని దాన్ని బంగారంతో అలంకరించారు. కొన్నేళ్ళు గడిచాయి. ఒకసారి కొందరు సంగీత కళాకారులు ఆ దారిలో వచ్చారు. ఆ వేణువు గురించి ఆ నోటా ఈనోటా విన్నారు. దాన్ని చూడడం కోసమే అక్కడికి వచ్చారు. బంగారంతోనూ వజ్రాలతోనూ అలంకరించిన ఆ వేణువును చూశారు. ఆ వేణువును ఆ సంగీత బృంద నాయకుడు తీసి చూశారు. ఆ తర్వాత దానిని వాయించి చూసారు. కానీ రవ్వంత నాదం కూడా రావడం లేదు. వేణువు రంధ్రాలన్నీ కప్పేసి ఉన్నాయి. దాన్నో అలంకారప్రాయమైన వస్తువుగా మార్చడం బాధాకరమని నొచ్చుకున్నారు. అంతెందుకు మహావీరుడి మాటలను, బుద్ధుడి మాటలను, ఏసు ప్రభువు మాటలనూ ఇలాగే కొందరు ఓ అలంకారప్రాయ వస్తువులుగా మార్చేసి ఫ్రేము కట్టి చూస్తున్నారే తప్ప వాటిలోని మంచిని నలుగురికీ చెప్పి ఉపయోగపడేలా చేయడం లేదన్నదే వాస్తవం. మహాత్ముల మాటలను ఆచరించడానికే తప్ప వొట్టినే పూజించడానికి కాదు అని తెలుసుకునే వరకూ ఎవరెన్ని ఆణిముత్యాలు చెప్పినా బూడిదలో పోసిన పన్నీరే... – యామిజాల జగదీశ్ -
హద్దులు దాటితే..!
పూర్వం మగధ రాజధాని రాజగృహ నగర సమీపంలో ఒక పెద్ద పర్వతం ఉండేది. దాని మీద గరుడ జాతి పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ పక్షుల పేరు మీద దానికి గృధ్రకూట పర్వతం అనే పేరు వచ్చింది. ఆ పర్వతం మీద అపనందుడు అనే గరుడుడు ఉండేవాడు. మంచి బలశాలి కావడం వల్ల ఆకాశంలో అవలీలగా ఎగిరి రాగలిగేవాడు. అతని పుత్రుడు మిగాలోపుడు. అతను కూడా తండ్రిని మించిన రెక్కబలం కలవాడు. కుర్రతనపు జోరు మీద కన్నూమిన్నూ కానేవాడు కాదు. ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేస్తూ ఉండేవాడు. కంటికాననంత దూరం ఎగిరి వచ్చేవాడు. ఈ విషయం తండ్రికి తెలిసింది. బిడ్డను పిలిచి– ‘‘కుమారా! మిగాలోపా! నీ విహంగ విన్యాసాల గురించి విన్నాను. మంచిదే! కానీ, నాయనా! ఒక్కో జీవికి ఒక్కో హద్దు ఉంటుంది. అలాగే పక్షులకు కూడా! మన గరుడ పక్షులకూ ఒక హద్దు ఉంది. ఆకాశంలో మనం లేచిపోయి నేలను చూసినప్పుడు ఈ ప్రాంతం నాలుగు మూలలా కనిపించేంత వరకే మనం పోవాలి. ఆ హద్దు దాటి పోతే, మన ప్రాణాల మీదికి మనం తెచుకున్నట్లే. నింగి నుండి నేలరాలడం తప్పదు. ఇకనుండి వేగంలో, ఎత్తులో నీ హద్దుల్లో నీవుండు’’ అని చెప్పాడు. తండ్రి చెప్పాడే కానీ, తనయుడు దాన్ని చెవికెక్కించుకోనేలేదు. ఒక రోజున మిగిలిన పక్షులు వద్దని వారించినా వినకుండా సహజ వాతావరణ పరిధిని దాటి ఇంకా పైపైకి పోయాడు మిగాలోపుడు. అక్కడ మేఘాల్లో సుడిగాలి రేగింది. ఆ సుడిలో చిక్కుకున్న అతని దేహం ఛిద్రమైపోయింది. ప్రాణాలు కోల్పోయిన మిగాలోపుని శరీర భాగాలు గాలిలోనే ఎటో కొట్టుకుపోయాయి. అతని మరణం అతని పరివారాన్ని కుంగదీసింది. తండ్రి తల్లడిల్లాడు. అతని మీద ఆధారపడ్డ భార్యాబిడ్డలు భుక్తి కోల్పోయారు. గృధ్రకూట పర్వతం మీద ఛిద్రమైన పక్షి కుటుంబాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. పెద్దల మాట వినకపోవడం, తమ హద్దులు తాము తెలుసుకోలేకపోవడం, నిర్లక్ష్యం, లెక్కలేనితనం ఎంతటి విపత్తును కలిగిస్తాయో బుద్ధుడు చెప్పిన గొప్ప కథ ఇది. – డా. బొర్రా గోవర్ధన్ -
వీరికి సాటెవ్వరు ?
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: మనసుంటే మార్గం...అంటారు పెద్దలు...వంద మంచి మాటలు చెప్పడం కన్నా ఒక మంచి పని చేసి చూపించడం మేలు అంటారు ఈ యువతీ యువకులు... అవును...మొన్నటికి మొన్న పట్టణంలో వందలాది ఖాళీ వాటర్ బాటిళ్లు సేకరించి నీరు లభించక ఎండిపోతున్న వందలాది మొక్కలకు బిందు సేద్యం తరహాలో నీరు కట్టి శభాష్ అనిపించుకున్న యువతీ యువకుల స్టోరీ మీకు తెలిసిందే. దొడ్డ పట్టణంలో వివిధ రంగాల్లో స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటున్న సుమారు పాతికమంది యువతీ యువకులు ‘యువ సంచలన’ పేరున ఒక సంస్థ ఏర్పాటు చేసుకుని వీకెండ్స్‌లో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అసలే ఇది ఎండాకాలం..పక్షులు ఆహారం, నీరు దొరక్క పిట్టల్లా రాలిపోతూ ప్రాణాలు వదులుతున్నాయి. ఈ విషయంపై తీవ్రంగా చర్చించుకున్న వీరంతా సరికొత్త ఐడియా కనిపెట్టారు. ఐడియా వచ్చిందే తడవు...పట్టణంలో హోటళ్లు, బార్లు, వీధులు తిరిగి వందల సంఖ్యలో ఖాళీ వాటర్ బాటిళ్లు సేకరించారు. అందరూ కొంత డబ్బులు వేసుకుని సిరిధాన్యాలు కొనుగోలు చేశారు. చెట్లు ఎండిపోయి ఆహారం, నీరు దొరకని అటవీ ప్రదేశాలను గుర్తించారు. బాటిళ్లకు ఐడియా ప్రకారం రంధ్రాలు చేసి నీరు, ఆహారం ఏర్పాటు చేశారు. ఎలాగంటే...? వాటర్ బాటిల్లో ధాన్యం గింజలు నింపి కింద భాగంలో పక్షి వాలి కూర్చోడానికి అనుకూలంగా కట్టిపుల్ల కట్టారు. కాస్త పైన స్పూన్ చివరి భాగం మాత్రం వెళ్లేలా రంధ్రం చేసి పక్షి ధాన్యాలు తినడం ప్రారంభించాక ధాన్యం గింజలు స్పూన్లో పడేలా ఏర్పాటు చేశారు. ఆ బాటిల్‌కు దగ్గరలోనే మరో బాటిల్లో నీరు నింపి చెట్టుకు కట్టారు. ఈ విధంగా వందలాది బాటిళ్లు ఏర్పాటు చేసారు వీరంతా. ఇక ఈ చిన్న ప్రయత్నం గురించి చిదానంద్, భరత్, దివాకర్నాగ్, రమ్య,రశ్మి, సతీష్, నంద, సుభాష్, సునీల్ తదితరులు మాట్లాడుతూ... ఈ వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి. మనుషులే తట్టుకోలేకపోతున్నాం. పక్షులు నీటి కోసం, ఆహారం కోసం వెదికివెదికి ప్రాణాలు వదులుతున్నాయి. అన్ని పక్షులకూ నీరు, ఆహారం అందించలేకపోయినా కనీసం తమ శాయశక్తులా వీలయినన్ని పక్షులను బతికించాలన్న చిన్న ప్రయత్నం చేస్తున్నామన్నారు. పక్షులు తిరిగే చోట స్థానికులు కూడా వాటికి తమవంతుగా నీరు, ఆహారం అందేలా చూడాలని కోరుతున్నారు. -
పదార్థాల్లేని వంట
పూర్వం ఒకసారి ఒక ప్రాంతంలో తీవ్ర క్షామం ఏర్పడింది. అంటే వర్షాలు పడక పంటలు ఎండిపోయి, గడ్డి కూడా మొలవని పరిస్థితి అన్నమాట. ఒకాయన అక్కడ వర్షాలు పడేంతవరకు ఎలాగూ పనిదొరకదు కాబట్టి ఎక్కడికైనా వెళ్లి పని చేసుకోవాలనుకున్నాడు. కుటుంబ సభ్యులను తీసుకుని ప్రయాణం ప్రారంభించాడు. మార్గమధ్యంలో అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించారు. పిల్లల్లో చిన్నవాడు ఆకలి అనడంతో ఏదైనా వండుకుని తిని ఆకలి తీరాక ప్రయాణం కొనసాగించాలనుకున్నారు. తల్లి రాళ్లు తెచ్చి పొయ్యి తయారు చేసింది. తండ్రి నీళ్ల కోసం వెళ్లాడు. అబ్బాయి, అమ్మాయి చెట్టు కింద ఉన్న ఎండుపుల్లలు ఏరి నిప్పు రాజేస్తున్నారు. ఈ విధంగా అందరూ తలోపనిలో ఉండటాన్ని చెట్టుపైనుంచి పక్షులు చూస్తున్నాయి. వాటిలో పెద్ద పక్షి మిగిలిన వాటితో ‘‘వీళ్లు చూస్తే ఒట్టి తెలివితక్కువ వాళ్లలా ఉన్నారు. వండుకోవడానికి పదార్థాలేమీ లేకుండానే వంట ప్రయత్నాలు మొదలు పెట్టారు’’ అంటూ నవ్వింది. ఆ మాటలు విన్న పెద్దవాడికి కోపం వచ్చింది. ‘‘ఇప్పటివరకు ఏదైనా దుంపలు తవ్వుకు తీసుకొచ్చి వండుకు తినాలనుకుంటున్నాము. ఇప్పుడు మీరు మమ్మల్ని ఎగతాళి చేశారు కాబట్టి, మిమ్మల్నే పట్టుకుని వండుకుని తింటాం’’ అన్నాడు కోపంగా. ఆ మాటలకు పెద్దపక్షి భయపడింది. ‘‘బాబూ! కుటుంబమంతా కలిసి ఉండటంలోని సంతోషం నీకు తెలుసు కదా. మా పక్షి పరివారాన్ని చంపకండి. అందుకు బదులు మేము మీకు ఒక నిధి చూపిస్తాం వెళ్లి తెచ్చుకోండి. ఈలోగా మీకు ఆకలి తీరేందుకు కొన్ని పళ్లు, దుంపలు చూపిస్తాం. మీరు నిశ్చింతగా ఉండండి’’ అని బతిమాలింది. అందుకు అందరూ సంతోషంగా అంగీకరించారు. ఆ కష్టకాలంలో వారికి లభించిన నిధితో ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ కథను ఒక గురువు తన శిష్యులకు చెప్పి, ‘‘చూశారా పిల్లలూ! పరిస్థితులను తలచుకుని భయపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. మన ప్రయత్నం చేయాలి. అప్పుడే అన్నీ అనుకూలిస్తాయి. ఆ కుటుంబం పదార్థాలేమీ దొరక్కుండానే వంట మొదలు పెట్టి అలా ఆశావహ దృక్పథంతో ప్రవర్తించింది కాబట్టే వారికి నిధి దొరికిందని గ్రహించండి’’ అని బోధించారు. పిల్లలు అర్థమైందన్నట్టు తలలు పంకించారు. – డి.వి.ఆర్. -
ఋషి
అవి వినాయక నవరాత్రులు. నవరాత్రులలో మూడోరోజులాగే సాయంత్రం అవుతుంది. ప్రకృతిలో జరుగుతున్న మార్పులే ఆరోజూ జరుగుతున్నాయి. పక్షులు తమ గూటికి చేరుకుంటున్నాయి. పశువులు కల్లం వైపు కదులుతున్నాయి. తెల్లనైన సూర్యుడు పడమటి కొండకు చేరి ఎరుపెక్కుతున్నాడు. మేత నుండి కల్లంకి పశువులకు పుల్లని కుడితిలో చిట్టేసి కలిపి తొందరగా పెడుతున్నాడు అప్పలరాములు.లేగదూడలను ఒక్కొక్కటిగా విప్పి, ఆవు సేపిన తరువాత దూడను తల్లి కట్టు వద్ద కట్టి పాలు పితికాడు. బయట ఉన్న ఆవులను శాలలో కట్టి రాత్రికి సరిపడినంత వరిగడ్డిని వాటి ముందు వేసాడు.పాలు గుడిసిన లేగదూడలను కూడా కట్టేసి, పాలను పట్టుకొని ఇంటికి వడివడిగా అడుగులు వేశాడు. చెమటతో ఉన్న వంటిని స్నానంతో శుభ్రం చేసి, తెల్లపంచె కట్టుకుని, రాత్రి భోజనం పెట్టేయ్యమని భార్యను తొందర చేశాడు అప్పలరాములు. ‘‘నాయనా మళ్లీ ముఖానికి రంగెయ్యటానికెలిపోతున్నావా ఏటి? ఇంత పెద్ద కుటుంబంలో పుట్టి ఈ నాటకాలెక్కడి నుంచి మరిగినావో!’’ అని తిడుతూనే అప్పుడే అన్నం ఓర్చిన కుండను పైకెత్తి జిబ్బిలో ఉన్న అన్నాన్ని కొంత ఓరిమి తీసి, పళ్లెంలో రెండు ముద్దలు వడ్డించి అప్పలరాముని ముందు పెట్టింది భార్య.చిన్న చిరునవ్వు నవ్వి ‘‘ఇంట్లో ఎవ్వరికి తెలియనియ్యకే’’ అంటూ తొందర తొందరగా కుండ బరువును గుండెకి దించేసి కమీజు తొడుక్కొని, తువ్వాలు భుజంపై వేసుకున్నాడు అప్పలరాములు.ఇంట్లో ఎవరికీ కనబడకుండా వెనుక దొడ్డి నుండి పరుగులాంటి నడకందుకున్నాడు.రాజాం బస్టాండ్ చేరుకునేసరికి తన సమాజం సభ్యులందరూ తన కోసమే ఎదురుచూస్తున్నారు.‘‘ఏటి అప్పలరాములు ఎప్పుడూ లేటే నువ్వు...ఇప్పటికే రెండు బస్సులెళ్లిపోనాయి...పోనీలే ఈ బస్సుకేనందినావు...లేకపోతే ఆ వూరోల్తోటి మాట కాసిద్దుము’’ అని నాటక సమాజపు గురువు శ్రీనుబాబు అప్పలరాముని చనువుగా తిట్టాడు.‘‘మరేటి పర్లేదులే వచ్చేన్ను కదా శీనుబాబు...ఎక్కండి ఎక్కండి’’ అని తనను పలకరిస్తున్న సభ్యులని తొందరపెట్టాడు అప్పలరాములు. బస్సు గమ్యాన్ని చేరుకుంది. ఆ వూళ్లో కమిటీ వారు నాటక సమాజాన్ని ఆహ్వానించి వాళ్లకు భోజన వసతి కల్పించారు.‘‘మరి కొద్దిసేపట్లో...మరికొద్ది క్షణాల్లో...మన గ్రామంలో రాష్ట్రస్థాయి కళాకారులచే హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించబడుతుంది’’ అంటూ కమిటీలోని మైకువీరులు జనాలను ఉదరగొడుతున్నారు.చెక్క బల్లలతో స్టేజిని వేశారు.కమిటీ వాళ్లు పైన ఒక పరజాగుడ్డను కట్టారు.ముందు పొట్టి, పొడుగు వాళ్లకు కూడా అందేటట్టు మైకులు కట్టారు.స్టేజు వెనుక నాలుగు పక్కలా దుప్పట్లు, పరదాల సాయంతో గ్రీన్‌రూమ్ కట్టారు.గ్రీన్‌రూమ్ చుట్టూ రంగు వేయక ముందు పాత్రధారుల రూపాలను చూడాలనే ఆతృత కనబరుస్తున్న ఆ వూరి యువజనులు...స్టేజ్ ముందు మంచు పడకుండా తలపాగాలు చుట్టి, దుప్పట్లు కప్పుకుని, తోడుగా తెచ్చుకున్న దుడ్డుకర్రలను భుజాలకు చేరవేసి, చుట్టలు, బీడీలు కాల్చుకుంటూనాటక ప్రదర్శన కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు...వారి వెనకాల చుట్టలు, బీడీలు, టీలు అమ్ముతూ రెండు కొట్లు.‘‘ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న నాటకం మరి కొద్దిక్షణాల్లోనే’’ కమిటీలోని మైకువీరుడు మరొక్కమారు మైకు ముందు తన కంఠాన్ని ప్రదర్శించాడు.నాటకం సిద్ధమయ్యిందోచ్ అన్నట్లుగా శీనుబాబు హార్మోనియంలో కొత్త సినిమా పాటలను వాయిస్తూ ప్రేక్షకును నాటకవీక్షణానికి సిద్ధం చేశాడు. కర్టెన్ వెనుక నుంచి ప్రార్థన గీతాన్ని ఆలపించి తమ గొంతులను శుద్ధి చేసుకున్నారు నాటక సభ్యులంతా.తెర తొలగించారు.ఆగ్రహోదగ్రుడైన విశ్వామిత్ర మహర్షి వేదిక మీదకు వచ్చి...‘‘సత్యసంధుడట, హరిశ్చంద్రుడట’’ అంటూ పేజీల డైలాగులను గుక్క తిప్పుకోకుండా చెబుతుంటే ముందున్న ప్రేక్షకులు నిజంగా మనల్ని శపించేసినట్లున్నాడీ విశ్వామిత్రుడని భయపడుతూ తమ శ్వాసలను నిలబెట్టేశారు.తరువాత హరిశ్చంద్ర, చంద్రమతుల ప్రవేశం, మాతంగి నృత్యం, అటుపిమ్మట విశ్వామిత్రుడు మరలా వేదిక పైకి రావటం, హరిశ్చంద్రుని కిరీటమెగరేసి తన్నటం, ప్రేక్షకులకు ఒక విధమైన గగుర్పాటు. ఆ తరువాత వారణాసి సీనులో వచ్చిన కాలకౌశికుడు భార్యావిధేయుడిగా ప్రేక్షకులందరినీ హాస్యంలో ముంచెత్తాడు.అటుపిమ్మట హరిశ్చంద్రుని కొనటానికి వచ్చిన వీరబాహుడు నిజంగా కర్కోటకుడేమో అంటూ ప్రేక్షకులు తమ అసహ్యాన్ని ఆ పాత్రపై ప్రదర్శించారు.ఈవిధంగా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని రసస్థాయికి తీసుకువెళ్లి, భయపెట్టి, ఆనంద పెట్టి, అసహ్య పెట్టించిన పాత్రధారుడు ఒక్కడే...అతడే ఇందాకటి అప్పలరాములు.తన వేషాన్ని తీసేసిన తరువాత ఏమీ తెలియని వాడిలాగా గ్రీన్‌రూమ్‌లో ఉన్న మేకప్ సామానుల పక్కన కూర్చున్నాడు. నాటకం పూర్తయ్యేసరికి తెల్లవారుజాము అయింది.‘‘శీను బాబూ...సాయంత్రం రూమ్కొచ్చి కలుస్తాను. పొలములో పనులున్నాయి. ఫస్ట్ బస్సెక్కి పోతాను’’ అంటూ సెలవు తీసుకొని ఆ వూరిలో ఉన్న నైటాల్ట్ బస్సెక్కి పూర్తిగా తెల్లారేసరికి కల్లానికి సేరుకున్నాడు. మరలా పశువుల్ని బయటకట్టి, పేడలు తీసి కసవ తుడిచి పెంటలో వేసేశాడు.పాలు తీసి ఇంటికి చేరుకొని భార్యకు అందించాడు.‘‘నాటకం తగిలితే ఇంటిపట్టునుండవు. ఏమి పుట్టుక పుట్టినావో’’ అంటూ భార్య అప్పలరాముడిని తిడుతూ టీ సుక్కలు కాసి యిచ్చింది.పాపం రాత్రంతా నిద్రలేక నాటకమాడొచ్చిన భర్తను తిట్టడం తనకూ ఇష్టం లేదు. తనుంటున్నది ఉమ్మడి కుటుంబం...తోడికోడళ్లు, బావలు, అత్తమామలు అందరూ రాత్రిపూట కలిసి భోజనాలు చేసినప్పుడు మాట్లాడుకుంటారు.తన భర్త నాటకాలకు వెళ్లిన రోజున...‘‘ఈడికి పనులు సెయ్యడానికి వొళ్లొంగక నాటకాలు మరిగినాడు’’ అంటూ బావలంటుంటే...‘‘మీరు లేరేటి పనులు సెయ్యడానికి’’ అని పుల్లిరుపు మాటలంటున్నారు తోడికోడళ్ళు.అవన్నీ వింటూ ఏమీ అనలేక అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్లు అప్పలరాములుని తిట్టేది భార్య.రైతువారి యిళ్లలో నాటకాలేసే వాళ్లంటే ఉన్న చులకన భావాన్ని అప్పలరాముడు అనుభవించాడు. కానీ నాటకాన్ని విడిచిపెట్టలేదు.‘ఎన్నాళ్లున్నా ఏరు పాట్లు తప్పవు కదా’ అంటూ తండ్రి తనకున్న చెక్క ముక్కలను ముగ్గురు కొడుకులకి సమంగా పంచేశాడు. అప్పలరాములుకు కొత్త సంసారం బరువు, బాధ్యతలు, పిల్లల చదువు బాధ్యతలు పైన బడ్డాయి. అయినా తనకిష్టమైన నాటకాన్ని వదల్లేదు.ఈడొచ్చిన ఆడపిల్లలకు మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. కొడుకును విజయనగరం మహారాజు కాలేజీలో చదివించాడు. కొడుకు కాలేజీలో సాంఘిక నాటకాల్లో హీరో యేషాలేత్తండని తెలసి....‘‘మన రక్తమెటిపోద్దే’’ అని ముసిముసి నవ్వులు నవ్వుతూ భార్యను ఆటపట్టించేవాడు.కొడుకు చదువు పూర్తిచేసుకుని టీచర్ కొలువులో చేరాడు.తండ్రిలానే పౌరాణిక నాటకాలలో ప్రవేశం కూడా చేశాడు.కొడుకు నాటికి నాటకరంగ పరిస్థితి పూర్తిగా దిగజారింది. పౌరాణిక నాటకం ఆడించే నాథుడే కరువయ్యాడు. ఎవరైనా సాహసం చేసి పెట్టించినా నాటకం చూడటానికి జనాలు రావడం లేదు. వినోదసాధనాలు మారినాయి...మార్కెట్లోకి సినిమా వచ్చింది. ఇంట్లోకి టీవీ వచ్చింది. జనాలు ఈదిలోకి రావడం మానేశారు. ఈ స్థితిలో నాటకం అంటే అభిమానమున్న కొడుకు ఈ స్థితిని జీర్ణించుకోలేకపోయాడు.ఒకసారి అప్పలరాములికి మలేరియా జ్వరం వచ్చింది. కొడుకు ఆసుపత్తిరికి తీసుకెళ్లి మందు, యింజప్షన్లు ఇప్పించాడు. భార్య పత్తెము చక్కగా పెట్టింది. వారం రోజ్లో అప్పలరాములు కోలుకున్నాడు. డాక్టరుగారు మరొక పదిరోజులు విశ్రాంతి తీసుకోమ్మన్నారు.అవి దేవి నవరాత్రులు. అప్పుడప్పుడే సత్తువందుకుంటున్న అప్పలరాములుకు శీనుబాబు నాటకముందని కబురెట్టాడు. ఆ మాట సెవిలో పడగానే యిన్ని రోజులు మంచం మీద పడిన బాధలు మరిచిపోయాడు. యింట్లో తెలిస్తే నాటకాలకెల్లనివ్వరని కళ్లంకెళ్లోస్తాని అటునుంచటే నాటకానికి చెక్కేశాడు.ఉదయాన్నే ఇంటికి చేరేసరికి కొడుక్కి తండ్రి మీద ఉన్న ప్రేమ కోపంగా మారింది.నాటకం హీనస్థితిని చూశాడు ఒకపక్క....విశ్రాంతి తీసుకోవాల్సిన తండ్రి రాత్రంతా నిద్ర లేకుండా నాటకం వేసి వచ్చాడు. అది తట్టుకోలేక...‘‘మీరు నాటకాలు వేసి మమ్మల్నేమీ ఉద్దరించియక్కర్లేదు...ఎవరూ మీకు బంగారు కంకణాలు తొడిగీరులే...ఇంకోసారి నాటకాలూసెత్తితే ఊరుకునేది లేదు’’ అంటూ చెడామడా తిట్టేశాడు.తన తోటి కళాకారుల ఇళ్లలో కూడా పిల్లలు నియంత్రిస్తున్నారని విన్నాడు. యిది తనకు కూడా వచ్చేసింది అంటూ ఆదుర్దాపడ్డాడు.‘‘నన్ను కన్న తండ్రినే ఒప్పించాను. నా కడుపున పుట్టిన కొడుకునొప్పించలేనా’’ అని సమాధాన పరుచుకున్నాడు.మరుసటిరోజు కొడుకున్నప్పుడే శీనుబాబు నుంచి నాటకముందని కబురు వచ్చింది.కొడుకున్నాడని కన్నుకొట్టి ‘‘నేనే నాటకానికి రాను’’ అని కుబురు తెచ్చిన మనిషిని పంపేశాడు.ఇదంతా గమనించాడు కొడుకు.‘విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో రాత్రిపూట మంచులో పడి నాటకాలు వేస్తే మళ్లీ జ్వరం తిరగబడుతుంది. ఈ ముసలోడికిలా కాదు’ అంటూ పడుకున్నట్లు నటిస్తున్న తండ్రిని ఇంట్లో పెట్టి బయట గడియ పెట్టేశాడు కొడుకు.అప్పలరాములు కొడుక్కి తన మీద ఉన్న ప్రేమను గమనించాడు.కానీ నాటకం మీద తనకున్న ప్రేమను చంపుకోలేకపోయాడు. చేసేదేమి లేక మంచం మీద చేరబడ్డాడు. ఆరోజు తాను వెళ్లవలసిన నాటకం ఎలా జరుగుతుందో...శీనుబాబేటనుకుంతాడో...నిజంగా కొడుకు చెప్పినట్లుగా నాటకరంగమంత దిగజారిపోయిందా...ఒకప్పుడు తన పరువపు వయసులో...నాటకమంటే పడిచచ్చే జ్ఞాపకాలు...తన కళ్ళ ముందు అలా అలా అలల్లా కదులుతున్నాయి.అప్పలరాములు పార పట్టుకొని దమ్ము మడిలో ఒంగితే గెనకు గెన పూర్తయ్యేవరకు నడుమెత్తేవాడు కాదు. పనులన్నీ పూర్తయ్యాక సాయంత్రం అయ్యేసరికి తోటివాళ్లతో కూడి చెక్క భజనలు, రామభజనలు...అప్పలరాములు గొంతెత్తి ముందు పాట పాడుతుంటే మారాము చేస్తున్న పిల్లలు మగతలోకి జారుకునేవారు. మనువుకు సిద్ధమైన యువతులు గిలిగింతలు పడేవారు. ఆనాడు సినిమా వినోద సాధనంగా మొదలైంది కానీ అది తమలాంటి పల్లెలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. పెద్దపెద్ద పండగలు, ఉత్సవాల సమయాల్లో పెద్ద పెద్ద కూడల్లలో పౌరాణిక నాటకాలు ప్రదర్శించేవారు. ఒకరోజు ఒక రిక్షా బండి ‘ఆలసించిన ఆశాభంగం నేడే...ఈరోజే...మన రాజాంలో ఈలపాట మొదలగు నటులతో పౌరాణిక నాటకం ప్రదర్శించబడును’ అంటూ దండోరా వేసుకుంటూ వెళ్ళిపోయింది.ఎలాగైనా నాటకం చూడాలనుకున్నాడు.నాటకం చూడాలంటే టికెట్ ఉండాలి.టికెట్ ఉండాలంటే డబ్బులు కావాలి.అమ్మ దగ్గరకు చేరాడు...అమ్మ ఇంట్లో బియ్యపుగింజలు ఊర్లో షావుకారుకిచ్చి డబ్బులు తెచ్చింది...అప్పలరాములు పొంగిపోండు. పనులన్నీ వేరము పూర్తి చేసుకుండు. జతగాళ్లతో కలిసి నాటకం చూడటానికి బయలుదేరాడు.నాటకం మొదలైంది...జనాలు ఈలలు, కేకలు...ఈలపాట మొదలగు నటులంతా పద్యాలతో రాగాలు పంపుతుంటే చెవులో అమృతమే పోయించుకున్నాడు. ఇంటికి చేరుకున్నాడు. రెండుమూడు రోజులు పద్యాలు తన చెవుల్నొగ్గలేదు...సివరకు ఒకరోజు సాయంత్రం పనులన్నీపెందరాళే పూర్తి చేసి నాటకాలు నేర్పుతున్న గురువు దగ్గరకు చేరుకున్నాడు.‘‘పొలంలో పండిన కూరో నారో ఇచ్చుకుంటాను. నాటకం నేర్పు గురువా’’ అని ప్రాధేయపడ్డాడు.గురువు కనికరించి పౌరాణిక నాటకాల్లోని మైనర్ పాత్రలను నేర్పించాడు. ఊరి బడిలో తెలుగు సదవడం, రాయడం వచ్చినంత వరకు సదువుకున్నాడు. అది ఇప్పుడుపయోగపడింది.రోజూ రాత్రి రెండు మైళ్ళ దూరం నడిచి గురువు దగ్గర పద్యం చెప్పించుకునేవాడు. ఉదయం అరక తోలునప్పుడో, పశువులు మేపుతూనో, గడ్డి కోస్తూనో సాధన చేసేవాడు. ప్రదర్శనలు కూడా ఇవ్వడంమొదలెట్టాడు. మొదట ప్రదర్శన ఇచ్చిన రోజు తను ఏదో రాజ్యాన్ని జయించినంత సంబరపడ్డాడు....ఇలా గ్యాపకాలు గుర్తొస్తుంటే కళ్ళంబడి నీళ్ళు రాలుతున్నాయి.వ్యవసాయం, సంసారం, సమాజం...ఇవ్వేమి ఇవ్వలేని సంతోషం మనసుకు నాటకం ఇచ్చింది. ఆరోజులు మరలా మోము మీద చిరునవ్వును చిందించాయి. మళ్లీ గతపు ఆలోచనలు...నాటకాలేస్తున్నయిషయం ఆ నోటా ఈ నోట తండ్రికి తెలిసింది. ఆరుగాలం శ్రమించాల్సిన రైతోడు నాటకాల్లో పడితే యివతల యవసాయం ఉట్టెక్కిపోతాది....అవతల మనిషి సెడు యసనాలకుబానిసైపోతాడు. రెంటికి సెడ్డ రేవడైపోతాది గాలా ఈడి బతుకు’’ అని తల్లి సమక్షంలో పరోక్షంగా మందలించాడు తండ్రి.‘‘పనులకు డోకా రాకుండా సూసుకుంతానులే. యసనాల జోలికి పోను’’ అని తల్లికి నచ్చచెప్పి తన మనసుకు ఇష్టమైన నాటకాలను విడవకుండా ముందుకెళ్లాడు.నాటకరంగ గొప్పస్థితిని చూశాడు...ఇప్పుడు అలాగే ఉందనుకుంటున్నాడు...నాటకం మీద తనకున్న ప్రేమ అలాంటిది. అనేకమైన ఆలోచనలు. ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో...మళ్లీ కోడి కూయగానే మెలుకువొచ్చింది. గోళ్లోకెల్లోద్దామని లేవబోయాడు. యెడమసేయికి సెతన తగల్లేదు. యెడమ కాలు కూడా తన సెతనలో లేదు...‘పోనిలే పిల్లల కోరిక తీరిందిలే’ అనుకొని చిన్న చిరునవ్వు నవ్వాడు. నదికి ఆనకట్ట నీరును పొంగించి ఊర్లను ముంచెత్తది. నటనకి ఆనకట్ట తన రక్తాన్ని పొంగించి మనసును ముంచేసింది. అదెల్లి ఎక్కడో నరాలను తెంపేసింది. ‘సత్యసంధుడట, హరిశ్చంద్రుడట...’ అంటూ అందరినీ భయపెట్టే ఆ కంఠం మూగబోయి అప్పుడప్పుడు రుషి వలే నవ్వును మాత్రమే చిందిస్తుంది. అల్తి మోహనరావు -
పాపం పక్షి
సాక్షి,, సిటీబ్యూరో: వినువీధుల్లో స్వేచ్ఛగా విహరించే పక్షులు గాయాలతో రక్తమోడుతున్నాయి. మాంజా యమపాశమై నేలరాలుతున్నాయి. కాలుష్యం, అంతరించిపోతున్న పచ్చదనంతో పాటు మాంజా సైతం జీవవైవిధ్యానికి పెనుముప్పుగా పరిణమించింది. అనూహ్యమైన పర్యావరణ మార్పులతో ఇప్పటికే వందలాది పక్షి జాతులు అంతరించాయి. ఊరపిచ్చుకలు, పాలపిట్టలు, వడ్లపిట్టలు, నెమళ్లు, కాకులు, కొంగలు, డేగలు తదితర అనేక రకాల పక్షులు ప్రమాదపు అంచుల్లో మనుగడ కొనసాగిస్తున్నాయి. పక్షుల ప్రాణాలకు ప్రమాదాన్ని మరింత రెట్టింపు చేస్తున్న పతంగుల మాంజా నగర జీవవైవిధ్యానికి ముప్పుగా మారింది. అటవీశాఖ, పోలీసులు, పర్యావరణ నిపుణులు, ప్రకృతి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా చైనా, నైలాన్ మాంజా వినియోగంలో కొంత మార్పు కనిపించినా ప్రమాదం మాత్రం పొంచే ఉంది. మాం జా తాకిడికి గత వారం రోజులుగా 68 పక్షులు గాయపడగా, మరికొన్ని మృత్యువాత పడ్డాయి. ఇవి స్వచ్ఛంద సంస్థల దృష్టికి వచ్చిన వివరాలు. ఇంకా ఎవరి దృష్టిలో పడకుండా ప్రాణాలు కోల్పోతున్న పక్షులు మరెన్నో ఉండవచ్చునని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా ప్రమాదమే... సంక్రాంతి సంబరాల్లో భాగంగా పతంగులు ఎగరవేసేందుకు వినియోగించే మాంజా పక్షుల పాలిట యమపాశంగా మారింది. సీసం పూతతో తయారు చేసే చైనా, నైలాన్ మాంజాలు పండగ రోజుల్లోనే కాదు.. ఆ తర్వాత కూడా పక్షుల ప్రాణాలకు ముప్పుగానే మారుతున్నాయి. చెట్ల కొమ్మల్లో, భవనాలపై కిలోల కొద్దీ పడి ఉంటుంది. ఈ మాంజాను గుర్తించకుండా కొమ్మలపై, ఇళ్లపై వాలేందుకు వచ్చే పక్షులు గాయపడుతున్నాయి.‘ఇలాంటి మాంజా కేవలం సంక్రాంతి రోజుల్లోనే కాదు. ఏడాది పాటు ప్రమాదమే. ప్రతిరోజు ఎక్కడో ఓచోట గాయపడ్డ పక్షులు మా దృష్టికి వస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు గాయపడిన 58 పక్షులను స్వాధీనం చేసుకొని చికిత్స అందజేస్తున్నాం’ అని చెప్పారు గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు ఎనిమల్స్ సంస్థ (జీహెచ్ఎస్పీసీఏ) కన్వీనర్ సౌధారాం భండారీ. ప్రస్తుతం బేగంబజార్‌లోని ఆ సంస్థకు చెందిన క్లినిక్‌లో వాటికి చికిత్సలు అందజేస్తున్నారు. ‘గాయపడ్డ వాటిలో ఎన్ని బతికి బయటపడతాయో తెలియదు. ఇప్పటికే ఒక పక్షి చనిపోయింది. ఏ చిన్న గాయమైనా అవి కోలుకునేందుకు నెల రోజులకు పైగా సమయం పడుతుంద’ని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎస్పీఏతో పాటు పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ (పీఎఫ్ఏ) సంస్థలు సంయుక్తంగా నగరంలో పక్షుల సంరక్షణ చర్యలను కొనసాగిస్తున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో మరో 10 గాయపడ్డ పక్షులను గుర్తించి జూపార్కులోని పక్షులు, జంతువుల చికిత్స కేంద్రానికి తరలించారు. గాయపడ్డ వాటిలో పావురాలు, చిలుకలు, డేగలు, కొంగలు, కాకులు తదితర ఉన్నాయి. అశోక్‌నగర్, కూకట్పల్లి, మెట్టుగూడ, మాసబ్‌ట్యాంక్, పంజగుట్ట, సంతోష్‌నగర్, ఎయిర్‌పోర్టు కాలనీ, లక్డీకాపూల్, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఈ పక్షులను గుర్తించారు. మరోవైపు అటవీశాఖ ఈసారి నగరంలోని సుమారు 72 షాపులపై దాడులు నిర్వహించి 250 కిలోలకు పైగా చైనా, నైలాన్ మాంజాను స్వాధీనం చేసుకుంది. గతేడాది 150 గాయపడిన పక్షులను గుర్తించి చికిత్స అందజేసినట్లు జీహెచ్ఎస్పీసీఏ తెలిపింది. మార్పు నామమాత్రమే.... చైనా, నైలాన్ మాంజాపై ప్రభుత్వం నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టంలోని సెక్షన్–15 ప్రకారం చైనా మాంజాను విక్రయించినా, కలిగి ఉన్నా ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే రూ.లక్ష జరిమానా కూడా విధించవచ్చు. 2016 జనవరి 13న ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో గత రెండేళ్లుగా కొంత మార్పు కనిపిస్తోంది. 30 శాతం వరకు కాటన్ మాంజా వినియోగంలోకి వచ్చినట్లు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. కానీ ఇంకా 70శాతం చైనా మాంజా ముప్పు పొంచి ఉన్నట్లే కదా. ఈ మాంజా దెబ్బకు గాయపడిన పక్షులను కాపాడేందుకు జీహెచ్ఎస్పీసీఏ 24గంటల పాటు అందుబాటులో ఉంటుందని సౌధారాం భండారీ తెలిపారు. నగరంలో ఎక్కడైనా పక్షులకు, జంతువులకు, వన్యప్రాణులకు అపాయం ఉన్నట్లయితే 88867 43881, 85559 55202 నెంబర్లలో తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే అటవీశాఖ కూడా ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 040–23231440 లేదా 18004255364 నెంబర్లకు సమాచారం అందజేయవచ్చు. -
పక్షులకు ప్రాణదాత!
నాంపల్లి: పతంగులు పక్షుల పాలిట శాపంగా మారాయి. చైనా మాంజాలతో పతంగులు ఎగురవేయడంతో తెగిపడిన మాంజాలకు చిక్కుకుంటూ గద్దలు, కాకులు, పావురాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. కాళ్లను, రెక్కలను పోగొట్టుకుంటున్నాయి. ఆకాశంలో ఎగరలేక కిందపడ్డ ఓ గద్ద ఒకానొక రోజు నాంపల్లి రోడ్లపై కనిపించింది. పైకెగరలేని గద్దను నాంపల్లి వ్యాయామశాల వద్ద నివాసం ఉండే టూ వీలర్ మెకానిక్ సుబ్బారావు కుమారుడు త్రిమూర్తి పిళ్లై దగ్గరకు తీసుకున్నారు. మాంజా (దారం) చుట్టుకుని గాయపడ్డ గద్దకు చికిత్సలు అందించారు. నెల రోజుల పాటు నాంపల్లి మార్కెట్లో చికెన్ కలేజాను కొనుగోలు చేసి ఆహారంగా అందించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత గద్దను పైకి వదిలేశారు. ఈ సంఘటన జరిగి సుమారు 20 ఏళ్లు కావస్తోంది. పక్షులపై నాడు చిగురించిన ప్రేమ నేటికీ అతనిలో తగ్గలేదు. నాటి నుంచి నేటి వరకు ఆయన గద్దలకు మాంసం వేస్తూ తనవంతుగా పక్షులకు ప్రేమను పంచుతున్నారు. వృత్తిరీత్యా మెకానిక్... త్రిమూర్తి పిళ్లై ద్విచక్రవాహనాల మెకానిక్. నాంపల్లి ఏరియా ఆసుపత్రికి వెనుక వైపు ఫుట్‌పాత్‌పై మెకానిక్ షెడ్డు ఏర్పాటు చేసుకున్నారు. వికలాంగుడు కావడం చేత ప్రభుత్వం సైతం సహకరిస్తోంది. త్రిమూర్తి పిళ్లై మెకానిక్‌గా స్థిరపడినప్పటికి ఆయన గొప్ప జంతు ప్రేమికుడు. ఆయన మనసంతా జంతువులు, పక్షుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే ఉడుతలకు, చీమలకు ఆహారాన్ని అందిస్తారు. నాంపల్లిలోని ఆయన నివాసం వద్ద తెలవారగానే ఉడతలు ఆహారం కోసం అరుస్తూ కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. నెలలో రెండు పర్యాయాలు నర్సాపూర్ అడవులకు అద్దె కారులో వెళ్లి అక్కడ ఉండే కోతులకు పల్లీలను ఆహారంగా ఇస్తారు. అంతేకాదు ఆలయాల వద్ద గోవులకు ఆహారాన్ని అందిస్తారు. అనాథలకు అండగా నిలుస్తూ వారికి దుస్తులు అందజేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదన్న కారణంతో అరటి పండ్లను ఇస్తారు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు పిళ్లై దైనందిన దినచర్యలో భాగం అయ్యాయి. గద్దలకే అధిక వ్యయం.... ఆకాశంలో ఎగిరే గద్దలంటే త్రిమూర్తి పిళ్లైకు చాలా ఇష్టం. సాయంత్రం 5 గంటలు అయ్యిందంటే చాలు వాటికి ఆహారం ఇవ్వడం పరిపాటిగా మారింది. త్రిమూర్తి పిళ్లైకు సుస్తీ చేసినా, ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పడు తన దగ్గర మెకానిక్‌గా శిక్షణ పొందే యువకులకు బాధ్యతలు అప్పగిస్తారు. ముర్గీ మార్కెట్లో ప్రతి రోజూ నాలుగు కిలోల చికెన్ కలేజాను కొనుగోలు చేస్తారు. తనతో పాటు శిష్యులతో కలిసి ఆకాశంలో ఎగిరే గద్దలకు మాంసాన్ని విసిరివేస్తారు. సంపాదనలోకొంచెం సామాజిక సేవకు ఆశాంలో ఎగిరే పక్షులు పతంగుల మాంజాలకు బలవుతున్నాయి. పక్షులు అనుభవిస్తున్న క్షోభను చూస్తే ఎవరికైనా బాధేస్తుంది. వాటిని రక్షించాల్సిన అవసరం ఉంది. విదేశాలకు చెందిన మాంజాలను నిషేధించాలి. నేను సంపాదించిన ఆదాయంలో ప్రతి రోజూ రూ.800 వరకు సామాజిక సేవకు ఖర్చు పెడతాను. ఈ సేవ నాకెంతో తృప్తినిస్తోంది. – త్రిమూర్తి పిళ్లై, జంతుప్రేమికుడు -
ఐకమత్యం ∙ ఉండ్రాళ్ళ రాజేశం
కూడ్లేరు ఆటవిక ప్రాంతంలో చెట్లు దట్టంగా వుండేవి. పక్కన త్రివేణి సంగమంలాగా మూడు వాగుల కలయిక వల్ల చుట్టూ పచ్చని ప్రకృతితో పంటలతో అలలారుతుండేది. చెట్ల ఫలాలు, దుంపలు తింటూ కోతులు, కుందేళ్ళు, నెమళ్ళు, పక్షులు మొదలైనవి కలిసిమెలిసి నివసిస్తున్నాయి. ఒక్కరికి ఆపద కలిగినా పసిగట్టి స్నేహితులను రక్షించుకునేవి. రోజులు అన్ని అనుకూలంగా వుండవు అన్నట్లు ఒక రోజు అడవిలోకి సిద్దయ్య అనే వేటగాడు వచ్చాడు. వాడు జంతువులను కనికట్టు మాయతో పట్టుకోవడంలో సిద్ధహస్తుడు. శరీరానికి ఏవేవో రంగులతో అలంకరించుకొని చప్పుడు కాకుండా ఒక చెట్టు ఎక్కి కొమ్మపై పడుకున్నాడు. పూసుకున్న రంగులు కొమ్మలోనే కలిసిపోయాయి. వేటగాడు వచ్చాడన్న అలికిడి జంతువులకు తెలియకుండా వుంది. కుందేళ్ళు గుంపుగా పొదల్లోంచి వచ్చి చెట్ల కింద పడిన పండ్లను తినసాగాయి. మెల్లగా మెల్లగా వేటగాడు వున్న చెట్టు కిందికి వచ్చాయి. సిద్దయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా, దబ్బున చేతిలోంచి వలను విసిరాడు. కుందేళ్ళ గుంపు వలలో చిక్కుకుని, అసలేం జరిగిందో తెలుసుకునే లోపుగా వలలో చిక్కి దుఃఖించసాగాయి. వల నుంచి ఎంత గింజుకున్నా బయటకి వెళ్ళలేక పోతున్నాయి, భయపడసాగాయి. వేటగాడు ఆనందంతో కిందికి దిగసాగాడు. కాలు కింద పెడదామని బుస్సుమన్న శబ్దం విని కిందికి చూశాడు. పెద్ద నాగు బుసలు కొడుతూ వేటగాడి వైపు కోపంతో కోరలు చూపసాగింది. వేటగాడు దబ్బున చెట్టు ఎక్కి కిందికి చూశాడు. ఇంకో నాలుగు పాములు వచ్చి కుందేళ్ళ వలల చుట్టూ చేరాయి. కుందేళ్ళు వలలో చిక్కడం చూసి పక్షులు అరవసాగాయి. పక్షుల అరుపులో తేడాను గమనించిన జంతువులు పరుగున వచ్చాయి. వలలో చిక్కుకున్న జంతువులను చూసి దుఃఖిస్తూ, వేటగాడి వైపు కోపంగా చూడసాగాయి. వేటగాడు గుంపులుగా వున్న జంతువులని చూసి వణకసాగాడు. కోతుల గుంపు వేటగాడి చెట్టు నిండా చేరాయి. వల చుట్టూ చేరిన జంతువులు, పక్షులు కలిసి వలను సగము కొరికి వదిలిన చోట్ల ఎలుకలు పదునైన పళ్ళతో వలను పటపట తెంపసాగాయి. వేటగాడి గుండె గడబిడ కొట్టుకోగా కళ్ళు మూసుకున్నాడు. వలలోంచి బయటకు వచ్చిన కుందేళ్ళతో జంతువులు అడవిలోకి వెళ్ళాయి. వేటగాడు కళ్ళు తెరిచేసరికి అంతా నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా వుంది. నెమళ్లు పాములను తింటాయి. పాములు ఎలుకలను తింటాయి. అలాంటిది అన్నీ కలిసి కుందేళ్లను రక్షించడం తలచుకుని వేటగాడు తలదించుకున్నాడు. ఇంతటి ఐకమత్యంతో జీవిస్తున్న కూడ్లేరు జంతుజాలముకు నమస్కరించి.. సిద్దయ్య జంతువులను వేటాడటం మాని, వ్యవసాయ పనులు చేస్తూ జంతువులతో స్నేహంగా ఉండసాగాడు. -
తమిళ కూలీ
పెద్ద రావి చెట్టు కింద ఆపి వుంచిన జీపుపైన ఎండుటాకులు రాలిపడ్తున్నాయి. మానుపై వాలిన పక్షులు శబ్దం చేస్తున్నాయి.గుంజన యేరుకు అవతల నల్లరాతికొండ వద్ద ఒక తమిళ కూలీ పట్టుబడ్డాడు.ఎర్రచందనం చెట్టు కొట్టడానికి వచ్చిన మిగిలిన కూలీలు పరారయ్యారు.‘చిక్కిన తమిళ కూలీ నుంచి చిన్న సంచిని, ఒక గొడ్డలిని స్వాధీనపర్చుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా గాలింపు చేస్తున్న బీటు ఆఫీసరుకి వీడు దొరికాడు.పట్టుకొచ్చి లోపలేశారు.ఎవరు మాట్లాడుతారు....వాడికి తెలుగు రాదు. వీళ్ళకు తమిళం రాదు. ఏదో విధంగా వాడి నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. మధ్యాహ్నం నుంచి వార్త రాసుకోవడం కోసం విలేకర్లు అక్కడికక్కడే తచ్చాడుతున్నారు. వాళ్ళందరితో పాటు నేను కూడా!ఇంకో జీపు దుమ్ము రేపుకుంటూ ఆవరణలోకి వచ్చింది. మరో ఇద్దరు అధికార్లు దిగారు. చకచకా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్లారు. వీస్తున్న గాలికి కొమ్మలు ఊగుతున్నాయి.కాసేపటి తర్వాత బయటికొచ్చిన బీటు ఆఫీసరు జీపులో వెనుక వైపు వున్న రెండు ఎర్రచందనం దుంగల్ని లోపలికి తీసుకురమ్మని చెప్పి కళ్ళద్దాలు సర్దుకుంటూ వేగంగా వెళ్ళిపోయాడు. సిబ్బంది వాటిని మోసుకెళ్ళారు. వాతావరణం వేడిగా వుంది. మరోవైపు స్తబ్దత. పదేపదే టైం చూసుకుంటున్నారు చెట్టుపక్కన నిల్చున వాళ్ళు.సెల్ పట్టుకొని కాలక్షేపంలో ఇంకొందరు.ఆఫీసు కాంపౌండ్‌కు ఎడమ పక్కన వున్న పాతరేకుల షెడ్డులో టీ కొట్టు దగ్గరికి ఫారెస్ట్ ఆఫీసులో ప్రొటెక్షన్ వాచర్‌గా ఉద్యోగం చేస్తున్న నాగరాజు వచ్చాడు.‘దొరికిన తమిళ కూలీ ఏమైనా చెప్పాడా...’ అడిగాను ఆత్రుతగా.‘ఆ...’ అని అతను ఊకొట్టాడు.‘ఏం పేరంటా?’‘శివలింగం’ ‘ఎక్కడి నుంచి వచ్చాడో తెలిసిందా..’ మళ్ళీ ప్రశ్న.‘వాడి దగ్గర చెన్నై సెంట్రల్ టూ కోడూరు వరకు వున్న జనరల్ రైల్వే టికెట్ దొరికింది’ ‘అయితే ఉదయాన్నే మెయిల్‌కు వచ్చి వుంటాడు’ అన్నాను నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ. ‘అట్నే వుంది!’ పొడిగా జవాబిస్తూ ఐదు టీలు ఆఫీసులోకి పంపించమని టీ కొట్టు వెంకట్రాముడికి చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు...అడిగాను మళ్ళీ...‘తనని ఇక్కడికి ఎవరు పిలిపించారో, అతడి వెనుక వున్న పెద్ద మనిషి పేరు ఏదైనా చెప్పాడా...’అసహనంగా చూశాడు నాగరాజు.‘కాసేపు ఆగితే ఎస్సైసారే...మిమ్మల్నందర్నిలోపలికి పిలిచి విషయాలన్నీ చెప్తాడు’ అంటూ చిరాగ్గా లోపలికి వెళ్లిపోయాడు.త్వరగా వార్త రాసి పంపితే నా పని అయిపోతుంది. డెస్క్‌కు వాట్సాప్ మెసేజ్ పెట్టాను.ఈమధ్య ఎర్రచందనం వార్తలకు బాగానే ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా టాబ్లాయిడ్లో రెండవ పేజీలో ఇలాంటి వార్తలకే చోటు లభిస్తోంది.చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి, రేణిగుంట మీదుగా మామండూరు, బాలపల్లె పరిధిలో వున్న ఎర్రచందనం కోసం రైల్వేకోడూరులోకి దిగుతున్నారు తమిళ కూలీలు.మెయిల్ తెల్లవారుజామున మూడున్నరకు వస్తుంది.రైల్వేస్టేషన్లో దిగడం కొండదారెంబడి సాగిపోవడం ఎంతోకాలంగా సాగుతోంది.ఒక్కోసారి గుంపులు గుంపులుగా కూడా దిగుతుంటారని అక్కడుండేవారు చెప్తుంటారు.వీళ్ళందరూ ఎందుకిలా వస్తున్నారు...?బతకలేనితనం వారిని కూలీలుగా మారుస్తోంది.వీరి వెనుక వుండి నాటకం అంతా నడిపించే స్మగ్లర్లు ఎక్కడో విదేశాల్లో విలాసాలు అనుభవిస్తూ వుంటారు. కడపాత్రంతో గొడ్డలి చేతబట్టి భయంకరమైన అడవుల్లోకి ఎర్రచందనం కొట్టడానికి వస్తున్న కూలీల బతుకు దుర్భరం.క్షణక్షణం భయంభయంగా జీవించాలి. ఇంటికి తిరిగి క్షేమంగా చేరగలమో లేదో కూడా తెలియదు. తెగిస్తున్నారు. ఇట్నుంచి పదకొండు కిలోమీటర్లు ముందుకెళ్తే శేషాచలం అభయారణ్యంలో భాగమైన శ్రీవెంకటేశ్వర అభయారణ్యం మొదలవుతుంది. అటే ముందుకు సాగితే కుక్కలదొడ్డి అనే ప్రాంతం వస్తుంది. అక్కడి నుంచి పదికిలోమీటర్ల దూరంలో వున్న తుంబరతీర్థం చేరుకుంటే అడవిలోకి దారులు ఏర్పాటు చేయబడివున్నాయి.పచ్చటి ప్రకృతిలో ఎల్తైన ఎర్రచందనం చెట్ల దారుల్లో ప్రయాణం సాగిస్తే కోనలెన్నో పలుకరిస్తాయి.వలసకోన, చాకలి రేవు కోన, ముత్తరాచకోన, కాశికోన, తలకోనలు అడవిపాటను నేర్పుతాయి.గుంజనేరు దగ్గర ఏనుగుల మందలు సంచరిస్తుంటాయి. వాన కురిసేటప్పుడు యుద్ధారాల తీర్థం అందాలు చూడ్డానికి రెండు కళ్ళు చాలవు.విష్ణుగుండం పొంగి పొర్లుతోంది.ఇంత ప్రకృతి విధ్వంసానికి గురవుతున్న నేటి దృశ్యం హృదయ విదారకరం.విలేకర్లను లోపలికి పిలిచారు.సెల్ లోపల రెండు చేతులూ, రెండు కాళ్ళూ తాడుతో కట్టివేయబడివున్న తమిళకూలీ శివలింగం కన్పిస్తున్నాడు. ముఖమంతా కమిలిపోయి వుంది.కింద పెదవి పగిలి నెత్తుటి చారలు చూపిస్తోంది.మాసిపోయి చినికిపోయి వున్న చొక్కా, ఎర్రటి దుమ్ము నిండి రంధ్రాలు పడివున్న ప్యాంటు, ఈదురుగాలికి కొట్టుకొచ్చి పడివున్న వాడిలాగా కన్పిస్తున్నాడు. భరించలేనంత వాసన వేస్తోంది.కళ్ళు లోతుకు పోయి వున్నాయి.దువ్వని జుట్టు దుమ్మును మోస్తోంది.ఎక్కడి పక్షి మరెక్కడికో వలస వచ్చి బంధించబడినట్లున్నాడు.పగుళ్ళుబారిన శరీర చర్మం. గారపట్టిన దంతాలు. నల్లటిదేహం.అడవిలో దొరికిన మృగాన్ని కటకటాల్లో బంధించినట్లు వాడున్నాడు.శివలింగంకు కట్టిన తాడు విప్పారు.వాడు లేవలేని స్థితిలో వున్నాడు.వాడి దగ్గరి నుంచి స్వాధీనం చేసుకున్న పాత పసుపురంగు సంచి. దానికి సుబ్రహ్మణ్యస్వామి చిత్రం ముద్రించి వుంది. అందులో ఒక సిల్వర్టిఫిన్ క్యారీ, నాలుగు గుట్కా ప్యాకెట్లు వున్నాయి.దానితో పాటే వాడు ఉపయోగించే గొడ్డలి.ఇవి స్వాధీనం చేసుకున్న వస్తువులు. వాడు కొడుతుండగా పట్టుకున్న రెండు ఎర్రచందనం దుంగలు.సిబ్బంది ప్రెస్‌కు ఇవ్వాల్సిన ఫొటో కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.శివలింగం బాధగా ప్రాధేయపూర్వకంగా దాహమేస్తున్నట్లు సైగ చేశాడు. అక్కడ మూలగా వున్న మట్టికుండలో వున్న నీళ్ళను కూడా లేచివెళ్లి తాగలేని స్థితి. ఎవరో గ్లాసుతో అందించారు.గడగడ తాగి వాడు ఊపిరి పీల్చుకున్నాడు.శివలింగం దగ్గర దొరికిన రైల్వేటికెట్ను చూపించాడు అటవీ అధికారి.చెన్నై సెంట్రల్ టూ కోడూరు అని అందులో రాసి వుంది.జనరల్ టికెట్.విలేకర్లు ఫొటో తీసుకున్నారు.‘వివరాలు చెప్పండి సార్! వార్త రాసుకోవాలి...’ పక్కనున్న మరో విలేకరి కొంత ఆసక్తిగా అడిగాడు.అటవీ అధికారి చిన్నగా నవ్వాడు.‘ముందు టీ తీస్కోండి. చల్లారిపోతుంది’ అంటూ బదులిచ్చాడు.మేమందరం తాగుతుంటే శివలింగం మావైపే చూస్తున్నాడు.‘అతడికి కూడా టీ ఇప్పించండి సార్’ ఎవరో వెనక నుంచి అన్నారు.ఇమ్మన్నట్లు అధికారి సైగ చేశాడు. అతడికీ టీ ఇచ్చారు.అధికారి చెప్పడం ప్రారంభించాడు.‘పట్టుబడిన తమిళకూలీ పేరు శివలింగం.తమిళనాడు తిరువణ్ణామలై జిల్లా మురగంబాడి గ్రామానికి చెందినవాడు. ఇతడి వయసు ముప్ఫై సంవత్సరాలు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి పెంపకంలో పెరిగాడు. పదో తరగతిలోనే చదువు మానేశాడు. ఇతడి భార్య పేరు మునియమ్మాళ్. ఇతడికి నాల్గవ తరగతి చదువుతున్న కూతురు వుంది. పేరు రేవతి’పై ఫ్యాను వేగంగా తిరుగుతోంది.టేబుల్‌పైన వున్న కాగితాలు గాలికి కదులుతున్నాయి.తాగడం పూర్తి కావడంతో కప్పును దూరంగా పెట్టాడు. మీసాలు సవరించుకున్నాడు అధికారి.‘ఎర్రచందనం చెట్టుకొట్టే పని ఎవరు ఇతనికి అప్పగించారు?’ మరొక ప్రశ్న వేశారు.‘అదే చెప్పబోతున్నాను’ అంటూ కళ్ళు ఎగరేశాడు అధికారి.‘శివలింగం వూర్లో వుండేటప్పుడు ఆటో నడుపుకుంటూ జీవించేవాడు. ఇతడికి టింబర్ డిపోలో పనిచేసే మాణిక్యంతో పరిచయమైంది. అతడి పని ఏమిటంటే మన ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను కొట్టడానికి కావలసిన మనుషులను సప్లై చేయడం.ఏజెంట్‌గా వ్యవహరిస్తాడు.ఇలాంటి ఏజెంట్లు అక్కడ చాలామంది వుంటారు. వారే కూలీలను స్మగ్మర్లకు సమకూర్చిపెడతారు. విదేశాల్లో వుండే స్మగ్లర్లకు ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళూ, రాజకీయనాయకులూ సహకరిస్తుంటారు. వ్యవహారమంతా గొలుసు పద్ధతిలో సాగుతూ ఉంటుంది’అధికారి సెల్ ఫోన్ మోగింది.అతడి పై ఆఫీసర్ నుంచి వచ్చినట్లుంది.కోరిన వివరాలు సాయంత్రంలోగా పంపిస్తానని అంటున్నాడు.భాష అర్థం కాకపోయిన అధికారి చెప్పే మాటలన్ని తలొంచుకొని వింటున్నాడు శివలింగం.మాణిక్యం అనే పేరు వచ్చినప్పుడల్లా శివలింగం కళ్ళు ఎరుపెక్కుతున్నాయి. ఆవేశంగా చూస్తున్నాయి.తన జీవితం జైలు పాలు కావడానికి అతడే కారణమని కావచ్చు ఏజెంటు మాటలు నమ్మి అడవిబాట పట్టి కష్టాలు పడుతున్న వైనం శివలింగాన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. మాణిక్యం కనిపిస్తే తనువెంటతెచ్చుకున్న గొడ్డలితోనే సమాధానం ఇచ్చేటట్లున్నాడు.గట్టిగా తాడుతో కట్టివేయడం వల్ల అతడి చేతులు వాతలు పడినట్లు చారలు కమిలిపోయి కన్పిస్తున్నాయి. బయట చెట్టుపైన పక్షుల శబ్దం ఆగిఆగి విన్పిస్తోంది.అధికారి మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు.‘అంతర్జాతీయ మార్కెట్టులో ఎర్రచందనానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అందువల్లనే స్మగ్లర్లు ఎంతకైనా తెగిస్తున్నారు. తమిళనాడులో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి ద్వారా కూలీలను సమకూర్చుకుంటున్నారు. వాటాలు తీసుకుంటున్నారు.’‘చూస్తున్నారు కదా...ఇక్కడ కూలీలను పట్టుకుంటున్నాం. మధ్యలో ఏజెంట్లను పట్టుకున్నాం. అక్కడ స్మగ్లర్లను వలేసి పట్టుకున్నాం. అయినా సమస్య ఇంకా ఉంటుంది’ తాగిన టీకప్పులన్నీ చెత్తబుట్టలోకి చేరాయి.‘ఏదైనా అడగాలనుకుంటే అడగవచ్చు’ అన్నాడు అధికారి కుర్చీలో వెనక్కి వాలుతూ.శివలింగాన్ని ఎక్కడ పట్టుకున్నారు?‘గుంజన యేరుకు అవతల నల్లరాతి కొండ వద్ద’‘ఎప్పుడు?’‘నిన్న సాయంత్రం’‘ఒక్కడే దొరికాడా?’‘అవును. మిగిలిన అయిదుమంది పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నాంరైల్వేటికెట్ పైన తేదీ చూస్తే శివలింగం వచ్చి పదిరోజులు దాటుతోంది కదా!‘అయ్యి ఉండవచ్చు. మాకైతే నిన్న సాయంత్రమే పట్టుబడ్డాడు’నీళ్లుతాగి గ్లాసుకింద పెట్టాడు అధికారి.మీ కస్టడీలో ఎన్నిరోజుల నుంచి ఉన్నాడు?మరో ప్రశ్న వాలింది. జవాబు లేదు.ఫొటో కార్యక్రమం.శివలింగాన్ని మోకాళ్ళ పైన మధ్యలో నిల్చోబెట్టారు. చేతులు కట్టుకొని ఉన్నారు. అతడి వెనుక అటు నలుగురు ఇటు నలుగురు అటవీ సిబ్బంది నిల్చున్నారు.శివలింగం ముందు రెండు ఎర్రచందనం కొయ్యలు, గొడ్డలి అతడి పాతసంచి ఉంచారు.ఫొటోలు చకచకా తీసుకున్నారు.‘కాసేపు అతడితో మాట్లాడించండి సార్!’ అని అన్నాను అధికారితో.‘ఎందుకబ్బా!’ అన్నట్లు చూశాడు.‘అతను తమిళంలో మాట్లాడుతాడు...మీకు అర్థం అవుతుందా?’ అని సన్నగా నవ్వుతూ అన్నాడు అధికారి.శివలింగం విలేకర్ల ముందుకొచ్చాడు.‘ఎనక్కు కవలైయా ఇరుక్కు(నాకు బాధగా ఉంది)ఎన్ నలం సరి ఇల్లై(నా ఆరోగ్యం బాగుండడం లేదు)ఎన్ కై ఎలుంబు మరిన్దదు(నా చేతి ఎముక విరిగింది)వాన్ ది వర మాదిరి ఇరుక్కు(వాంతి వచ్చేలాగా ఉంది)అని అన్నాడు కళ్ళ నిండా కన్నీళ్ళు నింపుకొని.ఇంక చాలు వీడ్ని తీసుకెళ్ళి లోపలెయ్యండి అన్నట్లు అధికారి చూశాడు.శివలింగం ఏదో అడగాలనుకుంటున్నట్లు సంశయంగా చూస్తున్నాడు.‘ఈరోజు తారీఖు ఎంత సామీ?’ అని దుఃఖం నిండిన స్వరంతో అడిగాడు తమిళంలోనే.ఎవరో చెప్పారు జవాబు.‘ఈరోజు నా కూతురు పుట్టినరోజు’ అంటూ ఏడుస్తూ అక్కడికక్కడే కన్నీటి సంద్రమైనాడు. బయట పెద్దరావి చెట్టుపైన అంతవరకు శబ్దం చేస్తూ ఉన్న పక్షులు నిశ్శబ్దమయ్యాయి. చెట్టు కింద ఆపి ఉంచిన జీపుపైన ఎండుటాకులు రాలి పడ్తున్నాయి. -
వాటికి హాని తలపెడితే బడితెపూజే..
‘అబ్బబ్బా.. ఈ రొద ఏంట్రా బాబూ.. ఎదవగోల.. మాయదారి పక్షులు..’ అని ప్రశాంతత కోరుకునే పెద్దవారు తిట్టుకోవడం.. ‘చిచ్చిచ్చీ.. ఎక్కడపడితే అక్కడ ఈ రెట్టలేంట్రా బాబూ.. కడుక్కోలేక చస్తున్నాం.. ఎప్పుడు పోతాయో ఏంటో..’ అని మహిళలు విసుక్కోవడం మామూలే. పెద్ద పెద్ద చెట్లు ఉండి.. పక్షుల గూళ్లు ఉండే చోట్ల సాధారణంగా సంధ్యా సమయాల్లో ఈ కిలకిల రావాలు, రెట్టల వల్ల చికాకులు స్థానికులకు మామూలే. కానీ పుణ్యక్షేత్రం గ్రామస్తులు వారందరికీ విరుద్ధం. ఆ గ్రామంలో పక్షులను తూలనాడితే బడితపూజ చేస్తారు. ఆ విహంగాలు మా ఆడపడుచులు. వాటిని పల్లెత్తుమాట అనడానికి వీలు లేదు. అవి ఏంచేసినా మేం ఇష్టంగా అనుభవిస్తాం. మా ఆడపడుచులని అనడానికి మీరెవరు? అని నిలదీస్తారు. ఆ పక్షులపై వారు చూపే ఆదరాభిమానాలు అనన్యసామాన్యం. తూర్పుగోదావరి, రాజానగరం: రాజమహేంద్రవరానికి అత్యంత చేరువలో ఉన్న పుణ్యక్షేత్రానికి ఏళ్లతరబడి వలస వచ్చే విదేశీ విహంగాలపై ఆ గ్రామస్తులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు హద్దుల్లేవు. నిజానికి వాటిని పురుడు పోసుకునేందుకు వచ్చిన ఆడపడచుల్లా భావిస్తారు. ఓపెన్ బిల్ బర్డ్స్‌గా పిలిచే ఈ పక్షులు ఏటా జూన్, జూలై మాసంలో క్రమం తప్పకుండా సైబీరియా నుంచి ఇక్కడకు వలస వస్తుంటాయి. వీటి ముక్కు మధ్యలో రంధ్రంగా ఉండటంతో స్థానికులు ‘చిల్లు ముక్కు కొంగ’లని కూడా పిలుస్తుంటారు. వందల కొలదీగా ఇక్కడకు వచ్చే ఈ పక్షులు ఇక్కడి ఊర చెరువు చుట్టూ ఉన్న కంచివిత్తనం చెట్ల పై గూళ్లు ఏర్పాటుచేసుకుని గుడ్లు పొదుగుతాయి. వాటి నుంచి పిల్లలు బయలు దేరిన తరువాత డిసెంబర్, జనవరి మాసంలో (మాఘమాసంలో) సంతానంతో కలసి తిరిగి వెళ్లిపోతాయి. కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తారు వీటిని విదేశీ పక్షులంటే పుణ్యక్షేత్రం వాసులు ఒప్పుకోరు. ఎందుకంటే అవి పుట్టింది ఇక్కడే కదా మరి. అందుకే వాటిని పుట్టింటికి పురిటికి వచ్చే ఆడపడచుల్లా భావించి ఆదరిస్తారు. నెత్తిమీద రెట్ట వేసినా, చంకన ఉన్న పసివాడు దుస్తుల్ని ఖరాబు చేసినట్టు భావిస్తారే కానీ చీదరించుకోరు. గూళ్లకు చేరుకునే సమయంలో ఆ పక్షుల కిలకిలరావాలను కోకిల గానం కంటే మిన్నగా ఆస్వాదిస్తారు. పొరపాటున గూళ్ల నుంచి పక్షి పిల్లలు జారి పడితే జాగ్రత్తగా తిరిగి ఆ గూళ్లలోనే చేరవేస్తారు. తరతరాలుగా ఈ గ్రామస్తులకు ఆ పక్షులతో అలాంటి అనుబంధం కొనసాగుతోంది. గ్రామానికి ‘పుణ్యక్షేత్రం’ అనే పేరు కూడా వీటిరాక వల్లే వచ్చిందేమోననే అనుభూతిని వ్యక్తం చేస్తూ, వాటి రాకను శుభకరంగా భావిస్తుంటారు. ఈ పక్షులు వస్తేనే తొలకరి పనులు ప్రారంభమవుతాయని ఇక్కడి వారి విశ్వాసం. అకస్మాత్తుగా మయం కావడం మిస్టరీయే గత ఏడాది ఆగస్టులో ఈ పక్షులు రాత్రికిరాత్రే అదృశ్యమవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పక్షులకు చల్లటి వాతావరణం ఉండాలని, కాని ఇక్కడ ఉష్టోగ్రతలు పెరిగిపోవడంతోనే వెళ్లిపోయాయని కొందరు, వలస వచ్చే వాటికి ఇక్కడ సరైన అనుకూలత లేకపోవడంతోనే మకాం మార్చి ఉంటాయని మరికొందరు.. ఇలా ఎవరికి తోచిన విధంగా చెప్పుకున్నారు, బాధపడ్డారు. ఈ నేపథ్యంలో తొలకరి సమయం ఆసన్నమవుతున్న సమయంలో తిరిగి వస్తాయోరావోనని భావించిన వారికి జూలై మాసంలో ఒక్కొక్కటిగా రావడం ఆనందం కలిగించింది. విద్యుత్ తీగల రూపంలో పొంచివున్న మృత్యువు 15 ఏళ్ల క్రితం వరకూ ఎంతో సంతోషంగా పుట్టింటికి వచ్చివెళ్లే ఈ పక్షులకు తరువాతి కాలంలో విద్యుత్ తీగల రూపంలో ఆపద ముంచుకొచ్చింది. ఈ పక్షులు నివాసం ఉండే చెరువుకు సమీపంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం, అవి జీవించే చెట్ల మీదుగా హై టెన్షన్ విద్యుత్ వైర్లు వేయడంతో వాటి స్వేచ్ఛా జీవనానికి ఆటంకం ఏర్పడింది. దాంతో జెడ్పీ హైస్కూలు వెనుక ఉన్న ఊర చెరువు గట్టున ఉన్న కంచివిత్తనం చెట్లను నివాసాలుగా చేసుకున్నాయి. అయితే ఈ చెట్ల పైనుంచి విద్యుత్ శాఖ హైటెన్షన్ తీగలు వేయడంతో ఈ పక్షులు గాలిలోకి ఎగిరే సమయంలో ఆ తీగలకు తగులుకొని చాలావరకు చనిపోతున్నాయి. ఈ చెరువుపై నుంచి హైటెన్షన్ వైర్లను వేయవద్దని స్థానికులు అడ్డుపెట్టినా విద్యుత్ అధికారులు వినకపోవడంతో పలు సందర్భాల్లో పక్షులు మృతిచెందుతున్నాయి. భవిషత్తులోనైనా ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపి ఈ పక్షుల మనుగడకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు అధికారులనుకోరుతున్నారు. బోర్డుతోనే సరిపెట్టిన అటవీ శాఖ పుణ్యక్షేత్రంలో వలస పక్షుల సంరక్షణకు అటవీ శాఖ వైల్డ్ లైఫ్ విభాగం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో విదేశీ వలస కొంగల సందర్శన ప్రాంతం అని బోర్డును ఏర్పాటుచేసి, అటవీ శాఖ చేతులు దులిపేసుకుందని స్థానికులు విమర్శిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో అకస్మాత్తుగా పక్షులు మాయమైపోతే కారణం ఏమిటనే విషయాన్ని కూడా అటవీ శాఖ పట్టించుకోలేదన్నారు. -
వార్ విత్ వింగ్స్
సాక్షి, సిటీబ్యూరో /శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పక్షుల బెడద పట్టుకుంది. ఇప్పటి వరకు ఎలాంటి ఉపద్రవాలు చోటుచేసుకోలేదు.. కానీ చుట్టుపక్కల ఉన్న జనావాసాలు, చెరువులు, అపరిశుభ్రమైన పరిసరాల కారణంగా విమానాశ్రయానికి పక్షుల తాకిడి పెరిగింది. ఇటీవల రియాద్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఎస్వీ 744 విమానం లాండ్ అవుతున్న సమయంలో పక్షి ఢీకొని ఏకంగా ముందు భాగానికి సొట్ట ఏర్పడడం పక్షుల బెడద తీవ్రతకు నిదర్శనంగా మారింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం జరుగకపోయినా పక్షుల సమస్యను ఎత్తి చూపుతోంది. ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించే జాతీయ, అంతర్జాతీయ విమానాలతో నిత్యం రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టులో పక్షులు సంచరించకుండా, క్రిమికీటకాలు,దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతూనే ఉన్నారు. విమానాశ్రయం చుట్టూ నెలకొన్న వాతావరణం వల్ల పక్షులు యధేచ్చగా సంచరిస్తున్నాయి. మరోవైపు కొద్ది రోజులుగా చుటుపక్కల పల్లెల్లో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా పెరిగిన చెత్త, వ్యర్ధ పదార్ధాల వల్ల పక్షుల సంచారం కూడా పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ఆశ్రయిస్తున్నాయి.... సుమారు 5 వేల ఎకరాలలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరించింది. రెండు రన్‌వేలతో ఉన్న సువిశాలమైన ఎయిర్‌పోర్టులో ప్రతి రోజూ 400 విమానాలు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 75 వేలమంది వివిధ ప్రాంతాలకు బయలుదేరుతారు. ఎయిర్‌పోర్టు చుట్టూ 7, 8 కిలోమీటర్ల దూరంలో నివాసప్రాంతాలు ఉన్నాయి. శంషాబాద్ టౌన్‌తో పాటు, మామిడిపల్లి, రషీద్‌గూడ, గొల్లపల్లి, తొండపల్లి, తదితర గ్రామాల్లోని అడవులు,నివాస సముదాయాలు, చెరువులు, చిన్న చిన్న నీటి కుంటలు కొంగలు, కాకులు, డేగలు, తదితర పక్షులకు ఆలవాలంగా ఉన్నాయి. క్రిమి కీటకాలను ఏరుకొనేందుకు, పల్లెల్లో అన్నం, ఇతర వ్యర్థపదార్ధాలను ఆరగించేందుకు కాకులు వచ్చి వాలుతున్నాయి. మరోవైపు గొల్లపల్లి, మామిడిపల్లి,తొండుపల్లిలోని చెరువులతో పాటు, విమానాశ్రయంలోను జలవనరుల సంరక్షణ కోసం కొత్తగా ఒక చెరువును ఏర్పాటు చేశారు. కొంగలే కాకుండా ఇతర పక్షులు కూడా తరచుగా ఈ చెరువుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో పక్షుల సంచారం సర్వసాధారణమైపోయింది.ఇటీవల కాలంలో పావురాలు కూడా బాగా సంచరిస్తున్నట్లు విమానాశ్రయ సిబ్బంది ఒకరు తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఇలా విమానాశ్రయంలోకి వచ్చిన పావురాళ్లను పట్టుకొని దూరంగా వదిలి వచ్చారు. పేరుకుపోతున్న చెత్త చుట్టుపక్కల పల్లెల్లో చెత్త వేసేందుకు ఎలాంటి డంపింగ్ యార్డులు లేవు. దీంతో ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేస్తున్నారు. దీన్ని తొలగించి కాల్చి వేయాల్సిన పారిశుధ్య సిబ్బంది 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో అన్ని గ్రామాల్లో, చెత్త, వ్యర్థపదార్ధాల నిల్వలు గుట్టలుగా పేరుకుపోయాయి. విమానాశ్రయం రక్షణ కోసం కేవలం విమానాశ్రయంలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల పల్లెల్లోనూ రక్షణ చర్యలు చేపడతారు.అయితే ఈ సమ్మె కారణంగా పరిశుభ్రతకు ఆటంకం ఏర్పడింది. దీంతో పక్షులు, ఇతర క్రిమికీటకాల సంచారం బాగా పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.‘‘ ‘‘ఒక్క పక్షులపైన మాత్రమే కాదు. దోమలు, బొద్దింకలు, ఇతర క్రిమి కీటకాలు ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించకుండా ఉండేందుకు నిరంతరం అమ్రపత్తత పాటిస్తాం. ఎయిర్‌పోర్టుతో పాటు చుట్టుక్కల గ్రామాల్లోను పరిశుభ్రమైన పరిసరాల పరిరక్షణ ఎంతో ముఖ్యం.ఎందుకంటే జాతీయ,అంతర్జాతీయ ప్రయాణికుల భద్రత, ఆరోగ్యం ఈ పరిసరాలపైనే ఆధారపడి ఉంది...’’ అని విమానాశ్రయంలో పెస్ట్ కంట్రోల్ విధులను నిర్వహిస్తున్న ఉద్యోగి ఒకరు చెప్పారు. వైద్య ఆరోగ్య విభాగం అధికారులు వారానికి ఒకసారి దోమల నివారణపైన సర్వేలెన్స్ నిర్వహించి డిఫినోథిన్ స్ప్రే చేస్తారు. పక్షి తాకితే... ఒక్క శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే కాదు. అన్ని చోట్ల ఇలాంటి పక్షుల సంచారం సహజమే. వీటిని అరికట్టడం ఒక్కటే పరిష్కారం. అందుకోసం విమానాశ్రయంలో తరచుగా బాణాసంచా పేల్చడం ద్వారా పెద్ద పెద్ద శబ్దాలు చేయడం ద్వారా పక్షులను పారదోలుతారు. శంషాబాద్‌లోనూ ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా కొనసాగుతూనే ఉంది.పక్షుల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరుగలేదు. కానీ గంటకు 525 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకొచ్చే విమానానికి ఏ చిన్న పక్షి తాకినా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. అదీ ఒకవేళ విమానం రెక్కల కింద ఉన్న ఇంజిన్లోకి పక్షి వెళ్లినపుడు ఒక్కోసారి ఇంజన్ ఆగిపోతుంది. అటువంటి సమయంలో విమానాన్ని వెంటనే దగ్గరలోఉన్న విమానాశ్రయంలో దింపి మరమ్మతు చేస్తారు. ఒక్కోసారి దానికి రెండు వైపులా ఉండే ఇంజన్లలో మంటలు తలెత్తవచ్చు.అప్పుడు ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. -
సంధ్యా వేళ.. విహంగాల హేల
ఆత్మకూరురూరల్ : సాయం సంధ్యా వేళ పచ్చటి పొలాలపై విహంగాల విహారం ప్రకృతి ప్రేమికులను పరవశింపజేసింది. వేసవి తాపంతో పలు రకాల పక్షిజాతులు మధ్యాహ్నం వేళ నీడపట్టున తలదాచుకుంటున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఆహార అన్వేషణ చేస్తూ విహరిస్తున్నాయి. మండలంలోని కరటంపాడులో పచ్చని పంట పొలాలపై ఆదివారం సూర్యాస్తమయ వేళలో పలు రకాల విహంగాలు, గుంపులు, గుంపులుగా విహారం చేస్తూ ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేశాయి. -
పట్నంలో..పక్షి ప్రపంచం
పక్షులు మచ్చుకైనా కనిపించని మన నగరంలో ఇవన్నీ ఎక్కడివని ఆశ్చర్యంగా ఉంది కదూ! అవును.. మన పట్నంలో మరో పక్షి ప్రపంచం దాగుంది. విదేశీ పక్షుల రాక మొదలవడంతో హెచ్ఐసీసీ, అమీన్పూర్ సరస్సులు కళకళలాడుతున్నాయి. ఎన్నో రకాల పక్షులు ఇక్కడ సందడి చేస్తున్నాయి. ఫొటోలు: మహ్మద్ రఫీ -
పక్షులకు పండగొచ్చే..
పక్షులకు పండగొచ్చింది. రైతులు ఎక్కడ పొలం దున్నితే అక్కడ వాలి కడుపునింపుకుంటున్నాయి. ప్రస్తుతం పంట సాగు కోసం రైతులు పొలాలను దున్నుతున్నారు. అయితే, దున్నే సమయంలో మట్టిలో ఉండే పేడపురుగులు, ఇతర వ్యర్థాలు భూమిలో నుంచి బయట పడుతుంటాయి. ఆ సమయంలో ఎక్కడెక్కడి నుంచో పక్షులు (కొంగలు) గుంపులు గుంపులుగా పొలాల వద్దకు చేరుకొని వాటిని ఆరగిస్తున్నాయి. ఒక వైపు రైతులు వారి పొలం దున్నే.. వరి నాట్లు వేసే పనుల్లో నిమగ్నమవ్వగా.. పక్షులు తాపీగా పురుగు, పుట్ర తిని ఇతోధికంగా రైతుకు మేలు చేస్తున్నాయి. జిల్లాలోని తెలకపల్లిలో శుక్రవారం కనిపించిన ఈ సుందర దృశ్యాలను ‘సాక్షి’ క్లిక్ మనిపించింది. – ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, నాగర్‌కర్నూల్