niti aayog
-
భారత్ సార్వభౌమత్వం నిలుపుకోవాలి
న్యూఢిల్లీ: భారత్ తన సార్వభౌమత్వాన్ని నిలుపుకోవాలని నితి ఆయోగ్ సీఈవో, జీ20 షెర్పా అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. పశ్చిమ దేశాల సాంకేతికతల కాలనీగా మారొద్దంటూ స్టార్టప్ మహాకుంభ్ ప్రసంగంలో సూచించారు. తెలివైన.. చౌక ఆవిష్కరణల ఆవశ్యకత ఉన్నట్లు నొక్కి చెప్పారు. పశ్చిమ దేశాల మోడళ్లను అవలంబించడంవల్ల దేశీ సంప్రదాయాలు, సంస్కృతి, గుర్తింపులను కోల్పోతామని అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతికతలలో దేశ సార్వభౌమత్వాన్ని కొనసాగించవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ముందుండి నడిపించడంలో పశ్చిమ దేశాల లేదా ప్రపంచంలోని ఏ ఇతర ప్రాంతాల కాలనీగా మారకూడదని వ్యాఖ్యానించారు. అతితక్కువ ఇంధన వినియోగం, తక్కువ వ్యయాలతోకూడిన చురుకైన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నట్లు తెలియజేశారు. పశ్చిమ ప్రభావానికి లోనుకాకుండా సొంత డేటా ఆధారంగా దేశ సార్వభౌమత్వానికి అనుగుణమైన మోడళ్లను ఆవిష్కరించవలసి ఉన్నట్లు వివరించారు. 22 ప్రాంతీయ భాషలుగల దేశ భిన్నత్వానికి అనుగుణంగా వివిధ భాషల ఏఐ మోడళ్లకు తెరతీయవలసి ఉన్నట్లు తెలియజేశారు. తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం సేవలు అందించగలుగుతామని సూచించారు. స్వీయనియంత్రణ స్టార్టప్‌లు భారీ కార్పొరేట్లుగా ఎదగాలంటే స్వీయనియంత్రణకుతోడు.. సుపరిపాలనకు చోటు ఇవ్వాలని అమితాబ్ కాంత్ తెలియజేశారు. ఒకప్పుడు స్టార్టప్‌గా ప్రారంభమై భారీ మల్టీనేషనల్ ఐటీ దిగ్గజంగా అవతరించిన ఇన్ఫోసిస్‌ను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. నైతిక పాలన, ఆడిట్లు, పటిష్ట ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌సహా స్వీయనియంత్రణ స్టార్టప్‌లకు కీలకమని వివరించారు. కాంత్ శుక్రవారం ఫిన్‌టెక్ పరిశ్రమకు స్వీయనియంత్రణ సంస్థ(ఎస్ఆర్వో) అయిన ఇండియా ఫిన్‌టెక్ ఫౌండేషన్(ఐఎఫ్ఎఫ్)ను ప్రారంభించారు. ఎస్ఆర్వో– ఫిన్‌టెక్ డెవలప్మెంట్ ఫౌండేషన్(ఎస్‌ఆర్‌వోఎఫ్‌టీ–డీఎఫ్)గా పేర్కొనే సంస్థ ఆవిర్భావం సందర్భంగా ప్రతిపాదిత ఎస్ఆర్వో బోర్డులో ఇప్పటికే 100మంది సభ్యులున్నట్లు వెల్లడించారు. డిజిటల్ లెండింగ్ పేమెంట్స్, వెల్త్‌టెక్, ఇన్సూర్టెక్, అకౌంట్ అగ్రిగేషన్‌సహా డెఫీ, వెబ్3 తదితర వర్ధమాన టెక్నాలజీల నుంచి సభ్యులు చేరినట్లు పేర్కొన్నారు. పరిశ్రమకు ప్రమాణాలు నెలకొల్పడంలో ఎస్ఆర్వో కీలకపాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు. నియంత్రణ సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీల మద్య వారధిగా వ్యవహరించనున్నట్లు వివరించారు.విమర్శించడం సులభం దేశీ స్టార్టప్ కమ్యూనిటీ గ్రోసరీ డెలివరీలు, ఐస్‌క్రీమ్, చిప్స్ తయారీ నుంచి దృష్టి మరల్చాలని వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పలువురు ఎంట్రప్రెన్యూర్స్ స్పందించారు. సెమీకండక్టర్, మెషీన్ లెరి్నంగ్, రోబోటిక్స్, ఏఐ తదితర హైటెక్ రంగాలపై దృష్టి పెట్టాలని స్టార్టప్ మహాకుంభ్ సందర్భంగా గోయల్ సూచించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా లోతైన సాంకేతిక నైపుణ్యాలు ప్రదర్శిస్తున్న యూఎస్, చైనాతో పోల్చి దేశీ కన్జూమర్ ఇంటర్నెట్ స్టార్టప్‌లను విమర్శించడం సులభమేనని పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై జెప్టో సీఈవో ఆదిత్ పలీచా లింక్డ్ఇన్ పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. నిండా మూడున్నరేళ్ల వయసుకూడా లేని జెప్టో ప్రస్తుతం సుమారు 1.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. క్విక్‌కామర్స్ సంస్థలు ఉద్యోగాలు సృష్టిస్తున్నాయని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయని తెలియజేశారు. ఇంటర్నెట్ కన్జూమర్ కంపెనీలు టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణకు తెరతీస్తున్నట్లు తెలియజేశారు. మంత్రి వ్యాఖ్యలు వేలెత్తి చూపడం అనికాకుండా.. ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులకు సవాళ్లు విసురుతున్నట్లు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. మంత్రులు విశ్వాసాన్ని ఉంచాలని, డీప్‌టెక్ స్టార్టప్‌లకు సహాయసహకారాలు అందించాలని, సమస్యలను తొలగించాలని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ సూచించారు. చైనాతో పోలిక సరికాదని, పరిశ్రమ దేశీయంగా సైతం చిన్నస్థాయిలో స్టార్టప్ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. గత కొద్ది నెలల్లో పలు డీప్‌టెక్ కంపెలతో సమావేశమైనట్లు షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ తెలిపారు. -
‘ఉన్నత’ సంస్కరణలు తప్పనిసరి..
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో (స్టేట్ యూనివర్సిటీలు) సంస్కరణలు అమలు చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా కరిక్యులమ్, పరీక్షల విధానంతో పాటు వర్సిటీల అక్రిడిటేషన్ ప్రక్రియ వరకు అన్నింటిలోనూ మార్పులు తేవాలని పేర్కొంది. జాతీయ పరిశోధన విధానాన్ని ప్రవేశపెట్టి మానవీయ శాస్త్రాలలో పరిశోధనలను ప్రోత్సహించాలని సిఫారసు చేసింది.సెమిస్టర్ ప్రాతిపదికన బోధన నాణ్యతను లెక్కించడం నుంచి ఉన్నత విద్య రోడ్ మ్యాప్ రూపకల్పన వరకు నీతి ఆయోగ్ పలు సూచనలు చేసింది. ఈ మేరకు 20 రాష్ట్రాలకు చెందిన వర్సిటీల వైస్ చాన్సలర్ల ఆమోదంతో రూపొందించిన నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఆయా రాష్ట్రాలు తమ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో మెరుగైన సంస్కరణలకు లిఖిత పూర్వకంగా అంగీకారం తెలిపాయి. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడం, 2047 నాటికి కేంద్రం నిర్దేశించిన వికసిత్ భారత్ దార్శనికతలో భాగంగా నివేదికను తయారు చేసినట్లు నీతి ఆయోగ్ తెలిపింది43 స్టేట్ వర్సిటీలతో కర్ణాటక టాప్.. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఉన్నత విద్యలో 81% విద్యార్థుల నమోదు రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోనే ఉంది. 2025 జనవరి నాటికి దేశంలో 495 స్టేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో 43 వర్సిటీలతో కర్ణాటక అగ్రస్థానంలో ఉండగా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ 38 వర్సిటీలతో రెండో స్థానాల్లో నిలిచాయి. గత 14 ఏళ్లలో స్టేట్ వర్సిటీల వృద్ధి 50 శాతానికి పైగా ఉంది. వీటిలో విద్యార్థుల నమోదు 2011–12నుంచి 2021–22 మధ్య 38% పెరిగి దాదాపు 3.24 కోట్లకు చేరుకుంది.పరిశోధనలు.. స్టార్టప్స్విద్యలో నాణ్యతా ప్రమాణాలు, పాలన, నిధులు, ఉపాధి సామర్థ్యం అనే నాలుగు విభాగాలలో 80 సిఫార్సులతోపాటు పరిశోధన, బోధన, డిజిటలైజేషన్, అంతర్జాతీకరణ అనే కీలకమైన నాలుగు అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ నివేదికలో సూచనలు చేసింది. మానవీయ శాస్త్రాలు, ప్రాథమిక పరిశోధనలను ప్రోత్సహించడంతో పాటు పరిశోధనలను వాణిజ్యీకరణ చేయాలని, వర్సిటీల్లో స్టార్టప్‌లకు అవకాశం కల్పించాలని, ప్రముఖ పరిశోధన సంస్థలను ఇందులో భాగస్వాములుగా చేయాలని నివేదిక సూచించింది.ఐఐటీలకు దీటుగా ఎదగాలి..నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దశాబ్ద కాలంలో (2011–12 నుంచి 2021–22 వరకు) విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) వృద్ధి పరంగా కేరళ, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్ టాప్ 10 రాష్ట్రాలుగా నిలిచాయి. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు విద్యార్థి–టీచర్ నిష్పత్తి (పీటీఆర్)లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. లింగ సమానత్వ సూచిక (జీపీఐ)లో నాగాలాండ్, హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, సిక్కిం, హరియాణా, రాజస్థాన్, త్రిపుర, తమిళనాడు టాప్ 10 రాష్ట్రాలుగా ఉన్నాయి. అమెరికా, బ్రెజిల్ దేశాల్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ ప్రమాణాలను అనుసరిస్తున్నాయని, ఆ స్థాయిలో మన స్టేట్ వర్సిటీలు కూడా ఉండాలని సూచించింది. దేశంలో ఐఐటీలు వంటి విద్యాసంస్థలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నత ప్రమాణాల కోసం కృషి చేయాలని పేర్కొంది. గత సర్కారు హయాంలో పలు సంస్కరణలు అమలు..నీతి ఆయోగ్ తాజాగా సిఫారసు చేసిన పలు సంస్కరణలను వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఏపీలోని వర్సిటీలు, కళాశాల విద్యలో గతంలోనే అమలు చేయడం గమనార్హం. కళాశాలలను కంపెనీల స్టార్టప్స్‌తో అనుసంధానించి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లను అకడమిక్‌లో భాగం చేసింది. మానవీయ శాస్త్రాలు అభ్యసిస్తున్న విద్యార్థులకు సైతం ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేసింది. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ లాంటి అంతర్జాతీయ సంస్థ ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్‌పై శిక్షణను ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ యూనివర్సిటీలు అందిస్తున్న నైపుణ్య కోర్సులను మన విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ ఎడ్టెక్ సంస్థ ఎడెక్స్‌తో కలిసి 2 వేల అంతర్జాతీయ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్ కోర్సులను ఉచితంగా అందించింది.ఏఐసీటీఈ ద్వారా ఏఐ, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి అంశాల్లో శిక్షణను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఒక్క 2023–24 విద్యా సంవత్సరంలోనే డిగ్రీ పూర్తయిన వెంటనే దాదాపు 2 లక్షల మందికిపైగా క్యాంపస్ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించారు. ఇతర సిఫారసులివీ..» విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు సెమిస్టర్ ప్రాతిపదికన బోధన నాణ్యతను లెక్కించాలి.» డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లను బోధనతో అనుసంధానించాలి. » ప్రొఫెసర్లు, విద్యార్థులకు ప్రపంచ దృక్పథాన్ని అలవరచేందుకు విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలి. » ఉన్నత విద్య ఆర్థిక సంస్థ (హెచ్ఈఎఫ్ఏ) తరహాలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల కోసం మౌలిక సదుపాయాల ఆర్థిక సంస్థను నెలకొల్పాలి. » ఆర్థిక సహాయం కోసం బలమైన పూర్వ విద్యార్థుల సంఘాలు, కార్పొరేట్ కార్యక్రమాలపై రాష్ట్ర విశ్వవిద్యాలయాలు దృష్టి పెట్టాలి. » 2047 రాష్ట్ర స్థాయి ఉన్నత విద్యా రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకోవాలి. ఉన్నత విద్యా మండళ్లకు అధికారాలు కల్పించి ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను సంస్కరించాలి. » పాలక మండళ్లల్లో బోధనా బృందాలకు చోటు కల్పించాలి. » రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యా విభాగాల మధ్య సహకారాన్ని పెంచుతూ అక్రిడిటేషన్ ప్రక్రియను మార్చాలి. » విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంచేందుకు ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లపై దృష్టి పెట్టాలి. వారు ఉద్యోగాల సృష్టికర్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలి. -
మహిళా పారిశ్రామిక వేత్తలకు సాధికారత
న్యూఢిల్లీ: మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత కోసం ఎస్ఎంఈ ఫోరమ్, నీతి ఆయోగ్ సంయుక్తంగా ‘ఏ మిలియన్ ఉమెన్ అరైజ్’ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టాయి. దేశవ్యాప్తంగా 6 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలు ఉంటే, అందులో 35 శాతం మహిళల నిర్వహణలోనివేనని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ డైరెక్టర్ అంకితా పాండే ఈ సందర్భంగా తెలిపారు. అయినప్పటికీ లింగపరమైన పక్షపాతం, మార్కెట్లో పరిమిత అవకాశాల వంటి వినూత్న సవాళ్లను వారు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. సంఘటితం చేయడం, మార్గదర్శకం, సామర్థ్య నిర్మాణం, ఈ–కామర్స్‌తో అనుసంధానం ద్వారా ఈ అంతరాలను పరిష్కరించేందుకు ఎంఎస్ఎంఈ శాఖ కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మహిళా వ్యాపారవేత్తలకు మద్దతుగా మహిళా ఎంటర్ప్రెన్యుర్షిప్ ప్లాట్‌ఫామ్ (డబ్ల్యూఈపీ)ను ఏర్పాటు చేసినట్టు నీతి ఆయోగ్ డైరెక్టర్ అన్నారాయ్ తెలిపారు.మహిళ వ్యాపారవేత్తలకు రుణ సదుపాయం, నిబంధనలపరమైన మద్దతు, నైపుణ్య కల్పన, మార్గదర్శకం, నెట్వర్కింగ్ పరంగా సాయమందించనున్నట్టు చెప్పారు. నీతి ఆయోగ్ సహకారంతో డబ్ల్యూఈపీ కార్యక్రమాన్ని లక్షలాది మంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు చేరువ చేయగలమని ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ చెప్పారు. ఎంఎస్ఎంఈలకు మెరుగైన రవాణా పరిష్కారాలను అందించే లక్ష్యంతో ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగోతో ఎస్ఎంఈ ఫోరమ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ సందర్భంగా కుదుర్చుకుంది. రెట్టింపు సంఖ్యలో మహిళలకు రుణాలు: సరళ్ ఎస్సీఎఫ్ బ్లాక్‌సాయిల్ క్యాపిటల్‌కు చెందిన ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ‘సరళ్ ఎస్సీఎఫ్’ 2025లో రెట్టింపు మహిళా వ్యాపారవేత్తలకు సాయమందించాలనుకుంటోంది. ఇప్పటికే 150 మంది మహిళా వ్యాపారవేత్తలకు రూ.64 కోట్ల రుణాలను సమకూర్చినట్టు ప్రకటించింది. వృద్ధికి పెట్టుబడి, దీర్ఘకాల స్థిరత్వం దిశగా వారికి మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. 2024లో ఈ సంస్థ అంతక్రితం సంవత్సరంతో పోల్చితే 34 శాతం అధికంగా రూ.1,237 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు ప్రకటించింది. -
ఉద్యోగాలు పెరుగుతున్నాయి, ప్చ్.. జీతాలే..
న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగాలు పెరుగుతున్నప్పటికీ, ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా జీతాలు మాత్రం పెరగడం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మానీ వ్యాఖ్యానించారు. గత ఏడేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. ఇందుకు నైపుణ్యాల కొరతే ప్రధాన కారణమని తెలిపారు. అత్యధిక జనాభాను భారత్ ప్రయోజనకరమైన అంశంగా మల్చుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం బోధన, శిక్షణను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా ప్రకారం వర్కర్లు–జనాభా నిష్పత్తి గత ఏడేళ్లుగా పెరుగుతోంది. అంటే జనాభా వృద్ధికి మించి ఉద్యోగాల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ఉద్యోగాలు పెరగడం లేదనడం తప్పు. క్యాజువల్ వర్కర్ల వాస్తవ వేతనాలూ పెరిగాయని, వారి పరిస్థితులూ మెరుగుపడ్డాయని గణాంకాలు చెబుతున్నాయి. కానీ రెగ్యులర్ జీతాల ఉద్యోగాలే పెద్ద సమస్యగా ఉంటోంది. ఈ కేటగిరీలో ఏడేళ్లుగా ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా వాస్తవ వేతనాలు పెరగలేదు‘ అని విర్మానీ చెప్పారు. మిగతా దేశాల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తోందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఫోకస్ చేయాలి.. కేంద్ర ప్రభుత్వం దీనిపై తగు చర్యలు తీసుకుంటోందని, రాష్ట్రాలు కూడా ఈ దిశగా కసరత్తు చేయాలని చెప్పారు. ఉద్యోగాల కల్పన జిల్లా స్థాయిలో జరుగుతుంది కాబట్టి అక్కడ దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే పని చేస్తున్న వారికే కాకుండా కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారికి కూడా నైపుణ్యాలు అవసరమేనని విర్మానీ చెప్పారు. ‘ఉద్యోగం, నైపుణ్యాలనేవి ఒకే నాణేనికి రెండు పార్శా్వలు. నైపుణ్యాలుంటే ఉద్యోగం దక్కించుకోవడం సులభమవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మనం అన్ని అంశాల్లోనూ మెరుగుపడాలి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి‘ అని వివరించారు. -
ఇంకా కష్టపడితేనే లక్ష్యాలు సాధించగలం
న్యూఢిల్లీ: 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారతీయులు మరింత ఎక్కువగా కష్టపడితేనే సాధ్యమని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందుకోసం అవసరమైతే వారానికి 80 గంటలైనా, 90 గంటలైనా పనిచేయాల్సిందేనన్నారు. ‘‘నేను కష్టించి పని చేయాలని విశ్వసిస్తాను. భారతీయులు ఇంకా కష్టపడి పనిచేయాలి. అది వారానికి 80 గంటలు కావచ్చు లేదా 90 గంటలు కావచ్చు. ఇప్పుడు 4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న మన ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్ల భారీ లక్ష్యానికి చేరుకోవాలనుకున్నప్పుడు, వినోదాలతో గడిపేస్తూనో, లేకపోతే ఏదో కొందరు సినిమా స్టార్ల అభిప్రాయాలను అనుసరిస్తూనో కూర్చుంటే సాధించలేము’’ అని వ్యాఖ్యానించారు. పటిష్టమైన పని విధానాలతోనే జపాన్, దక్షిణ కొరియా, చైనా ఆర్థిక విజయం సాధించాయని, ప్రపంచ స్థాయి ఎకానమీగా ఎదగాలంటే భారత్ కూడా అలాంటి ఆలోచనా ధోరణిని అలవర్చుకోవాలని చెప్పారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. ఎన్ని గంటల పని వేళలు ఉండాలనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొందరు కార్పొరేట్ దిగ్గజాలు వారానికి 70–90 గంటలు పని చేయాలంటే, ఎన్ని గంటలు పని చేశామనేది కాదు ఎంత నాణ్యంగా పని చేశామనేది ముఖ్యమని మరికొందరు దిగ్గజాలు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాషనైపోయింది.. ‘‘ఎక్కువగా కష్టపడకూడదంటూ మాట్లాడటం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. పనుల్లో జాప్యం జరగకుండా, ఖర్చులు పెరిగిపోకుండా, ప్రపంచ స్థాయి నాణ్యతతో, గడువు కన్నా ముందుగా ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే భారత్ కష్టపడి పని చేయాల్సిందే. ఇక పని–కుటుంబ జీవితం మధ్య సమతౌల్యం పాటించాలనే విషయానికొస్తే.. నేను ప్రతి రోజూ వ్యాయామం చేస్తాను. గోల్ఫ్ ఆడతాను. ఇవన్నీ చేస్తూనే నేను ప్రతి రోజూ కష్టపడి పని కూడా చేస్తాను. మీకు వ్యక్తిగతంగా ఒకటిన్నర గంటలు మీకోసమే పక్కన పెట్టుకున్నా మీకు రోజులో ఇంకా 22.5 గంటలు ఉంటాయి. పని–కుటుంబ బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించడానికి బోలెడంత సమయం ఉంటుంది. కష్టపడకపోవడమనేదాన్ని ఏదో ఫ్యాషన్‌గా మార్చొద్దు. పెద్దగా శ్రమించకుండానే భారత్ గొప్ప దేశంగా ఎదగగలదంటూ యువతకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. కష్టపడకుండా ఏ దేశమూ ఎదగలేదు’’ అని అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. -
ఆంగ్ల భాషా నైపుణ్యం తప్పనిసరి!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన యువతకు ఆంగ్లంలో సరైన నైపుణ్యం లేకపోవడం వారి పోటీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని నీతి ఆయోగ్ వెల్లడించింది. యువతలో భాషా నైపుణ్యాలు పెంపొందించేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసింది. విద్యార్థులు ఆంగ్లం, ఇతర విదేశీ భాషలపై పట్టుసాధించేలా అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఈ మేరకు ఇటీవల ‘రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్య విస్తరణ’పేరిట విడుదల చేసిన నివేదికలో ఆంగ్ల భాష అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘అనేక రాష్ట్రాల్లో, స్థానిక పరిశ్రమలలో పనిచేసే నైపుణ్యం గల వ్యక్తులు, ఇతర మానవ వనరులు ప్రధానంగా రాష్ట్రం బయటి నుంచే వస్తున్నారు. ఈ ధోరణికి ముఖ్య కారణం స్థానిక యువతకు ఆంగ్ల భాషలో నైపుణ్యం తగినంతగా లేకపోవడమే. సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సి ఉంది. విద్యార్థుల ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, తద్వారా వారు రాష్ట్రంలోనే ఉంటూ జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయికి తీసుకెళ్లడం అత్యవసరం’అని తన నివేదికలో పేర్కొంది. ముందున్న రెండు రాష్ట్రాలు ఆంగ్ల భాష అవసరాన్ని గుర్తించడంలో పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు ముందున్నాయని నివేదికలో పేర్కొంది. పంజాబ్ ప్రభుత్వం 2023లో బ్రిటిష్ కౌన్సిల్ సహకారంతో ఈ దిశగా ప్రయత్నాలను ప్రారంభించిందని తెలిపింది. ఆరు నెలల పాటు ఇంటెన్సివ్ 18–సెషన్ల కోర్సును నిర్వహించడం ద్వారా ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టిందని వివరించింది. దాదాపు 5వేల మంది ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఈ పైలట్ ప్రాజెక్ట్‌తో లాభం కలిగిందని వెల్లడించింది. విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ స్థాయిలో అభివృధ్ధి చెందేందుకు విద్యార్థులకు అవసరమైన భాషా సామర్థ్యాలను పెంపొందించడంలో పంజాబ్ చొరను నీతిఆయోగ్ ప్రశంసించింది. అదేవిధంగా, కర్ణాటక ప్రభుత్వం 2024లో ప్రారంభించిన కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం, భాషా నైపుణ్యాలను పెంచడం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేసింది. మైక్రోసాఫ్ట్ ఇండియాతో భాగస్వామ్యంతో ‘ఇంగ్లిష్ స్కిల్స్ ఫర్ యూత్’కార్యక్రమం ద్వారా 16 ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో 5,795 మంది విద్యార్థుల ఆంగ్ల నైపుణ్యాభివృధ్ధికి తోడ్పాటునందిస్తోంది. ‘స్కాలర్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ టాలెంట్’కార్యక్రమం ద్వారా ఆరు విశ్వవిద్యాలయాల నుంచి అర్హులైన విద్యార్థులకు లండన్‌లోని విశ్వవిద్యాలయాలకు రెండు వారాల పాటు పంపి, వారితో అభ్యసించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆంగ్ల విద్యను ప్రోత్సహించిందని నీతిఆయోగ్ ప్రశంసించింది. -
స్వర్ణాంధ్ర–2047 ప్రణాళికకు చేయూతనివ్వండి
సాక్షి, అమరావతి: స్వర్ణాంధ్ర– 2047 ప్రణాళికకు చేయూతనివ్వాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీని సీఎం చంద్రబాబు కోరారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయానికి వచ్చిన సుమన్ బేరీతో సీఎం సమావేశమయ్యారు. నూతన సాంకేతికత, ఆవిష్కరణలకు సహకారం అందించాలని, నూతన విధానాల అమలుకు తోడ్పాటునివ్వాలని ఆయన్ని సీఎం కోరారు. ఏపీ ఏటా 15 శాతం వృద్ధి రేటు సాధించి 2047కల్లా 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నెలకొల్పేలా, తద్వారా అందరూ 42 వేల డాలర్ల తలసరి ఆదాయానికి చేరుకునేలా ప్రయత్నిస్తున్నట్టు సీఎం చెప్పారు. నీతి ఆయోగ్ మద్దతు ఉంటే రాష్ట్రం మరింత ముందుకెళ్తుందని, వికసిత్ భారత్ 2047 సాధనలో ఏపీ మోడల్ స్టేట్‌గా ఉంటుందని చెప్పారు. కేంద్రానికి, రాష్ట్రానికి ఇది అనుకూల సమయమని, అభివృద్ధికి ఎంతో ఆస్కారముందని, ఇందులో నీతి ఆయోగ్ భాగస్వామ్యం కూడా కచ్చితంగా ఉంటుందని సుమన్ బేరీ తెలిపారు.మానవాభివృద్ధి, ఉత్తమ పాలనలో గ్లోబల్ లీడర్‌గా ఏపీని తీర్చిదిద్దాలని భావిస్తున్నామని సీఎం చెప్పారు. అయితే రాష్ట్ర విభజన వల్ల రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాలు ఇప్పటికీ పరిష్కారమవకపోవడం, రాష్ట్ర ఆదాయానికి గ్రోత్ ఇంజిన్ వంటి హైదరాబాద్‌ను కోల్పోవడం, ఏపీ పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడం వంటి కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఏపీ దేశంలో 3వ అతిపెద్ద తీర ప్రాంతం కలిగి ఉండటం, పోర్టులు, రైల్వే, హైవేలతో అతిపెద్ద కనెక్టవిటీ, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, తూర్పు ఆగ్నేయాసియాకు గేట్ వే కావడం, పునరుత్పాదకత విద్యుత్, డేటా టెక్నాలజీలో పెట్టుబడులను ఆకర్షించడం ఏపీకి ప్రధాన సానుకూలాంశాలుగా తెలిపారు. విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్)తో పాటు తిరుపతి, అమరావతిని రీజినల్ గ్రోత్ హబ్‌లుగా మలిచేందుకు సహకారం అందించాలని సీఎం కోరారు. డేటా సేకరణ, బెస్ట్ ప్రాక్టీసెస్, స్ట్రాటజిక్ పార్టనర్షిప్స్, ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణ, ఎఫ్‌డీఐ, రిసోర్స్ మొబిలైజేషన్ తదితర విషయాల్లోనూ నీతి ఆయోగ్ కీలకపాత్ర పోషించాలని కోరారు. ఇందులో భాగంగా ప్రతి మూడు నెలలకు ఓసారి సమీక్ష చేయాలన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్లు, స్కిల్లింగ్ హబ్స్, స్మార్ట్ సిటీలు, మౌలిక వసతుల బలోపేతంలో ఏపీ ప్రభుత్వం, నీతి ఆయోగ్ కలిసి పనిచేయాలని ప్రతిపాదించారు. నదుల అనుసంధానం, పీ–4 విధానం ద్వారా పేదరిక నిర్మాలన, 2047 విజన్‌లోని పది ప్రధాన సూత్రాల అమలుకు నీతి ఆయోగ్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో 2029 కల్లా 11 వేలకు పైగా విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టడం, అన్ని బస్ స్టేషన్లపైనా రూఫ్ టాప్ సోలార్ యూనిట్ల ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని సీఎం చెప్పారు. -
380 జిల్లాల్లో వర్సిటీలు లేవు
సాక్షి, అమరావతి : దేశంలో రాష్ట్రాల మధ్య విశ్వవిద్యాలయాలు, కాలేజీల నిష్పత్తిలో అసమానతలున్నాయని నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ విశ్వవిద్యాలయాలుంటే ఇంకొన్ని రాష్ట్రాల్లో అతి తక్కువ ఉన్నాయని తెలిపింది. ఉదా.. రాజస్థాన్‌లో 93, గుజరాత్లో 91, ఉత్తరప్రదేశ్‌లో 87 ఉండగా.. అండమాన్–నికోబార్ దీవులు, లక్షద్విప్, దాద్రా–నగర్ హవేలీ, డామన్–డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేదని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తక్కువ విశ్వవిద్యాలయాలున్నాయని నివేదిక తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాల నిష్పత్తిలోను, ఉన్నత విద్య అందుబాటులోనూ అసమానతలున్నాయని వివరించింది. నీతి ఆయోగ్ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు ఏమిటంటే.. పట్టణ ప్రాంతాల్లో 59 శాతం వర్సిటీలు.. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా 1,160 విశ్వవిద్యాలయాలుంటే ఇందులో 680 వర్సిటీలు పట్టణ ప్రాంతాల్లోనూ.. 480 వరిటీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే.. 66 శాతం జనాభా గల గ్రామీణ ప్రాంతాల్లో 41 శాతం యూనివర్శిటీలుండగా 34 శాతం జనాభాగల పట్టణ ప్రాంతాల్లో 59 శాతం యూనివర్సిటీలున్నాయి. జాతీయ విద్యా విధానంలో భాగంగా 2035 నాటికి ఉన్నత విద్యలో జీఈఆర్‌ను 50 శాతానికి పెంచాలన్న లక్ష్యాలు నెరవేరాలంటే ప్రస్తుతమున్న 4.33 కోట్ల విద్యార్థుల నమోదును 9 కోట్లకు చేర్చాల్సి ఉంది. దాదాపు 4.5 కోట్ల మంది అదనపు విద్యార్థులను ఉన్నత విద్యలోకి తీసుకురావాలి. ఈ నేపథ్యంలో.. ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాల మధ్య ఉన్నత విద్యా సంస్థల్లో అసమానతలను తొలగించేందుకు చర్య లు తీసుకుంటూ క్లస్టర్ వర్శిటీలతో సహా అనేక కొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించాలని నీతి ఆయోగ్ నివేదిక సూచించింది. ప్రాంతీయ డిమాండ్, యాక్సెసిబిలిటీ, సామీప్యత పరిగణనలోకి తీసుకుని కొత్త వర్సిటీలు స్థాపించాలని సూచించింది. ఉన్నత విద్యలోనూ అవకాశాలు పరిమితం.. » తక్కువ జనాభా కలిగిన ఈశాన్య రాష్ట్రాల్లో లక్ష జనాభాకు చూస్తే ఎక్కువ విశ్వవిద్యాలయాలు, కాలేజీలున్నాయి. కానీ, అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో లక్ష జనాభాకు కొన్ని వర్సిటీలే ఉన్నాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లోనూ ఒక లక్ష జనాభాకు తక్కువ విశ్వవిద్యాలయాలున్నాయి. » దేశంలో ఉన్నత విద్య అందుబాటులోనూ అసమానతలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పరిమితంగా అవకాశాలు అందుబాటులో ఉండగా కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఉన్నాయి. » రాజస్థాన్‌లోని జైపూర్‌లో అత్యధికంగా 35, బెంగళూరులో 25, గుజరాత్లో 21 విశ్వవిద్యాలయాలున్నాయి. » 160 జిల్లాల్లో ఒక్కో విశ్వవిద్యాలయం చొప్పున.. 102 జిల్లాల్లో మూడు కంటే తక్కువగా వర్సిటీలున్నాయి. » ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని 380 జిల్లాల్లో అసలు విశ్వవిద్యాలయాలే లేవు. » ఇక కాలేజీలు కూడా దేశంలోని కొన్ని జిల్లాల్లో అత్యధికంగా కొన్ని జిల్లాల్లో తక్కువగాను ఉన్నాయి. » బెంగళూరులో 1,118 ఉండగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో 740, మహారాష్ట్రలోని పూణేలో 628 కాలేజీలు ఉన్నాయి. » దేశంలోని 153 జిల్లాల్లో 100 లేదా అంతకంటే ఎక్కువ కాలేజీలుండగా 29 జిల్లాల్లో ఒక్క కాలేజీ కూడా లేదు. 85 జిల్లాల్లో ఐదు కన్నా తక్కువ కాలేజీలున్నాయి. -
నో డౌట్ ఇలా చేస్తే..చచ్చినట్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు..!
ఇటీవల కాలంలో ఎంతలా ట్రాఫిక్ నిబంధలు పెట్టినా..ఘెరమైన యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రమాదాల్లో అభం శుభం తెలియని చిన్నారులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అంతేగాదు ఎందరో తల్లులకు కడుపుకోత, తీరని వ్యథ మిగులుతుంది. ప్రధానంగా మొబైల్ ఫోన్లు, నిర్లక్ష్య ధోరణి, తొందరపాటులే ఈ రోడ్డు ప్రమాదానికి కారణాలు. అక్కడికి దీనిపై ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. పెద్దగా ప్రయోజనం లేదు. ఏం చేస్తే ఈ సమస్యని నివారించగలమని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రేంజ్‌లోనే హైవేలపై స్పీడ్ ఉండాలని నియంత్రించినా..ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. అయితే ఇదే సమస్యను ఫేస్ చేస్తున్న వియత్నాం దేశం అమలు చేస్తున్న ట్రాఫిక్ చట్టాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇలా అయినా ప్రమాదాలు తగ్గుతాయేమో అనే ఆశను రేకెత్తించింది. ఇంతకీ ఆ దేశం ఎలాంటి ట్రాఫిక్ చట్టాలను తీసుకొచ్చింది..? మన దేశంలో సాధ్యమేనా..?వియత్నాం(Vietnam) రోడ్డు ప్రమాదాలను నివారించేలా ట్రాఫిక్ ఉల్లంఘనలు నియంత్రించేందుకు ప్రోత్సాహకాలను అందజేస్తామని ప్రకటించింది. ఎవ్వరైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారి గురించి సమాచారం అందిచినట్లయితే వారికి ప్రభుత్వం దాదాపు రూ. 17 వేలు వరకు ప్రోత్సహకాన్ని అందుకోవచ్చు. ప్రజా భద్రతను పెంచేలా ట్రాఫిక్ క్రమశిక్షణ(Traffic Rules) అమలయ్యేందుకు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది వియత్నాం. నిజానికి గతేడాది ప్రారంభ నుంచే వియత్నాం ట్రాపిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి భరించలేని స్థాయిలో జరిమానాలు పెంచేసింది. రెడ్ సిగ్నల్ ఉండగానే పట్టించుకోకుండా వెళ్లిపోవడం, మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం తదితరాలకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అయితే ఇలాంటి వ్యక్తుల గురించి ఏ పౌరుడైనా సమాచారం(reporting) అందిస్తే..వారి గోప్యతను భద్రంగా ఉంచడమే గాక వాళ్లకి పడిన జరిమానా నుంచి మినహాయింపు లేదా తగిన విధంగా ప్రోత్సాహకం ఇవ్వడం వంటివి చేస్తోంది. అంతేగాదు వారు నడిపే వాహనం అనుసరించి జరిమానాలను భారీగా పెంచింది. అలాగే పారితోషకం కూడా ఆ విధమైన డిఫరెన్స్తోనే భారీగా ముట్టచెబుతోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.దీంతో నెటిజన్లు ఆ దేశానికి దాదాపు ఐదు వేల కిలోమీటర్లు ఉన్న మనదేశంలో కూడా వాటిని అమలు చేస్తే చాలామంది మిలియనీర్లుగా మారతారని కామెంట్లు చేస్తున్నారు. అలాగే ప్రముఖ ఆర్థికవేత్త, నీతి ఆయోగ్ సభ్యుడు(NITI Aayog member) అరవింద్ విర్మాణితో సహా చాలామంది మాత్రం తప్పనిసరిగా భారత్‌లో కూడా ఇలాంటి రూల్స్‌ని అమలు చేయాలని వాదిస్తూ పోస్టులు పెట్టారు. ఇలా చేస్తే సంపాదన సామర్థ్యం కష్టమైపోతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా. ఒకకంగా ఇది ఇరు దేశాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎంతలా ఉన్నాయనేది హైలెట్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఇది ఒకరకంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి సమస్యలకు చక్కటి పరిష్కారన్ని అందించిందని చెప్పొచ్చు.We should definitely introduce this for major traffic offenses like going the wrong way on a divided highway/street, and jumping red lights https://t.co/tTkpwoIXck— Dr Arvind Virmani (Phd) (@dravirmani) January 5, 2025 (చదవండి: గోల్డెన్ గ్లోబ్స్ 2025 అవార్డుల వేడుకలో మెనూ ఇలా ఉంటుందా..! 24 క్యారెట్ల బంగారం..) -
ఇక పప్పులుడకవ్!
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో పప్పు ధాన్యాలకు కొరత ఏర్పడుతుందని నీతి ఆయోగ్ వెల్లడించింది. దేశంలో ఆహార ధాన్యాలకు కొరత లేనప్పటికీ.. పప్పులు, తృణధాన్యాలు, కూరగాయలు, చక్కెర ఉత్పత్తులు డిమాండ్‌కు తగినట్టు సరఫరా ఉండదని నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక తేల్చింది. వచ్చే ఆర్థిక ఏడాది (2025–26)తో పాటు, 2030–31 ఆర్థిక ఏడాది నాటికి ఆహార ధాన్యాలు డిమాండ్–సరఫరాతోపాటు పప్పులు, తృణధాన్యాలు, కూరగాయల డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసం ఉంటుందని స్పష్టం చేసింది. నాలుగేళ్లుగా ఆహార ధాన్యాలతోపాటు వివిధ ఆహారోత్పత్తులు రోజువారీ తలసరి లభ్యతపై నీతి ఆయోగ్ అధ్యయన నివేదికలో ఆసక్తికర విషయాలనువెల్లడించింది. నీతి ఆయోగ్ నివేదిక ఏం తేల్చిందంటే..నాలుగేళ్లుగా బియ్యం, గోధుమలు, తృణధాన్యాల రోజువారీ తలసరి లభ్యత పెరుగుతోంది. అయితే, పప్పుల రోజువారీ తలసరి లభ్యతలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి.రానున్న రోజుల్లోనూ పప్పులు, కూరగాయలు, చక్కెర ఉత్పత్తుల డిమాండ్–సరఫరాకు మధ్య వ్యత్యాసం ఎక్కువగానే ఉంటుంది. దేశంలో వివిధ పంటల సాగు విస్తీర్ణంలో హెచ్చుతగ్గులుంటున్నాయి. దీనికి వాతావరణ పరిస్థితులు, నీటి పారుదల సౌకర్యాల లేమి, నేల పరిస్థితులు, తెగుళ్లు, వ్యాధులు వంటివి ప్రధాన కారణాలు. -
ద్రవ్యోల్బణం ‘లెక్క’ మారుతోంది
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం బేస్ ఇయర్ మార్పు కసరత్తు ప్రారంభమైంది. 18 మంది సభ్యులతో కూడిన ఈ వర్కింగ్ గ్రూప్‌నకు నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ అధ్యక్షత వహిస్తారు. ప్రస్తుతం ఉన్న బేస్ ఇయర్ 2011–12ను 2022–23కు మార్పు సిఫారసులు చేయడం ఈ గ్రూప్ ఏర్పాటు ప్రధాన లక్ష్యం. దేశ ఆర్థిక వ్యవస్థలో ధరల స్థితిగతుల్లో మరింత పారదర్శకతల తీసుకురావడం లక్ష్యంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గ్రూప్ టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) ప్రకారం.. ఎకానమీలో వచి్చన మార్పులకు అనుగుణంగా డబ్ల్యూపీఐతోపాటు ఉత్పత్తిదారుల ధర సూచీ (పీపీఐ) ఏర్పాటుకు వర్కింగ్ గ్రూప్ సూచనలు చేస్తుంది. ఉత్పత్తిదారుల ధర సూచీ వైపు మార్పు! పీపీఐలో ఉత్పత్తులపై సిఫారసులతోపాటు, ధరల సేకరణ వ్యవస్థ సమీక్ష, మెరుగునకు సూచనలు, డబ్ల్యూపీఐ నుంచి పూర్తిగా పీపీఐకి మారడానికి రోడ్ మ్యాప్ రూపకల్పన కూడా వర్కింగ్ గ్రూప్ బాధ్యతల్లో కొన్ని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఆర్థిక వ్యవహారాల విభాగం, గణాంకాల మంత్రిత్వ శాఖ, వ్యవసాయ విభాగం, విని యోగదారుల వ్యవహారాల విభాగం, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ నుండి ఈ గ్రూప్‌లో ప్రతినిధులు ఉన్నారు. ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యు రా లు షామికా రవి, క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ ధర్మకిర్తి జోషి, కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ అసెట్ నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నిలేష్ షా, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ చీఫ్ ఎకనామి స్ట్ కో హెడ్ ఇంద్రనిల్ సేన్‌గుప్తా ప్రత్యేక ఆహా్వనిత సభ్యులుగా గ్రూప్‌లో బాధ్యతలు నిర్వహిస్తారు.ప్రస్తుత డబ్ల్యూపీఐలో 697 ఉత్పత్తులుప్రస్తుతం డబ్ల్యూపీఐలో 697 ఉత్పత్తులు ఉన్నాయి. ఇందులో ప్రైమరీ ఆరి్టకల్స్ సంఖ్య 117. ఫూయల్ అండ్ పవర్ విభాగంలో 16, తయారీ రంగంలో 564 ఉత్పత్తులు ఉన్నాయి. ధరల పెరుగుదల ధోరణులను గుర్తించడానికి ప్రస్తుతం ప్రధానంగా రెండు సూచీలు ఉన్నాయి. ఇందులో ఒకటి డబ్ల్యూపీఐకాగా, మరొకటి వినియోగ ధరల సూచీ (పీపీఐ). రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్షకు వినియోగ ధరల సూచీ ప్రధాన ప్రాతిపదికగా ఉంది. 2 శాతం అటుఇటుగా 4 శాతం వద్ద సీపీఐ ఉండేలా చూడాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. 1942లో డబ్ల్యూపీఐ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో 1939 బేస్ ఇయర్‌గా ఉంది. అటు తర్వాత ఏడు సార్లు (1952–53, 1961–62, 1970–71, 1981–82, 1993–94, 2004–05, 2011–12) బేస్ ఇయర్లు మారాయి. ప్రస్తుత 2011–12 బేస్ ఇయర్ 2017 మేలో ప్రారంభమైంది. తాజా గణాంకాల ప్రకారం, నవంబర్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 1.89 శాతంగా నమోదైంది. ఇక వృద్ధి లక్ష్యంగా రేటు తగ్గింపును (సరళతర వడ్డీరేట్ల విధానం) కోరుతున్న ప్రభుత్వం– రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కేంద్రం సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్ల జారీ ప్రతిపాదనను సైతం ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. ఈ విధానాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంతదాస్ వ్యతిరేకించడం గమనార్హం. -
దోపిడీకి అడ్డొస్తుందనే.. జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2014–19 మధ్య దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పద్ధతిలో ఖజానాను అప్పటి ప్రభుత్వ పెద్దలు దోచేశారు. ప్రజా ధనాన్ని ఇలా దోపిడీ చేయకుండా అడ్డుకట్ట వేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్టక్చర్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) చట్టం–2019ను తెచ్చింది. ఈ చట్టం ద్వారా టెండర్లలో పారదర్శకత, సూచనలు చేయడం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రవేశ పెట్టింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేసింది. కానీ, ఇటీవలి ఎన్నికల్లో 2014–19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు కూటమే మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీంతో మళ్లీ దోపిడీ పర్వానికి తెర తీస్తూ చంద్రబాబు కూటమి జ్యుడిషియల్ ప్రివ్యూను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్టక్చర్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) చట్టం–2019ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన ప్రతిపాదనను బుధవారం మంత్రివర్గం ఆమోదించింది. ఇప్పటికే రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు జ్యుడిషియల్ ప్రివ్యూ అడ్డునూ తొలగించుకుంది. మళ్లీ 2014–19 తరహాలోనే అడ్డగోలుగా అంచనాలు పెంచేసి.. కమీషన్లు ఎక్కువ ఇచ్చే కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్లు పిలిచి, కోరుకున్న కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి, మొబిలైజేషన్ అడ్వాన్సులిచ్చి, కమీషన్లు వసూలు చేసుకునేందుకు మళ్లీ సిద్ధమయ్యారని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.జ్యుడిషియల్ ప్రివ్యూకు నీతి అయోగ్ ప్రశంసలురాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చిన టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చుతూ 2019 ఆగస్టు 20న ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్ట్రాస్టక్చర్ యాక్ట్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) – 2019 చట్టాన్ని నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తిని జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జిగా నియమించింది. ఈ చట్టం ప్రకారం.. రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనుల టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను ముందుగా జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి పరిశీలనకు పంపుతారు. ఆ ముసాయిదాపై జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆన్లైన్లో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. వాటిని పరిగణనలోకి తీసుకుని జడ్జి మార్పులు సూచిస్తారు. ఎలాంటి మార్పులు అవసరం లేదని భావిస్తే.. దానిని యధాతథంగా ఆమోదిస్తారు. ఇలా జ్యూడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన టెండర్ ముసాయిదా షెడ్యూల్‌తోనే రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. వంద కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులన్నింటినీ ఇదే విధానంలో నిర్వహించారు. ఈ విధానంలో టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించడం వల్లే కాంట్రాక్టర్లు భారీ సంఖ్యలో పోటీ పడి.. కాంట్రాక్టు విలువకంటే తక్కువకే పనులు చేయడానికి ముందుకొచ్చారు. దీని వల్ల రూ.7,500 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదా అయ్యింది. జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. ఈ విధానాన్ని అమలు చేయడాన్ని పరిశీలించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.అంచనాల్లో వంచనకు, దోపిడీకి అవకాశం ఉండదనే..విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఇప్పటిలానే బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. కోట్లాది రూపాయలు వెదజల్లి కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చేందుకు పెట్టిన పెట్టుబడికి వంద రెట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కొల్లగొట్టేందుకు టెండర్ విధానాన్ని ఓ అస్త్రంగా మల్చుకున్నారు. 2014 – 19 మధ్య బాబు సర్కారు దోపిడీకి సాక్ష్యాలు ఇవిగో..» గాలేరు–నగరి పథకం తొలి దశలో 27వ ప్యాకేజీలో 2014 నాటికి రూ.11 కోట్ల విలువైన పని మాత్రమే మిగిలింది. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. అంచనా వ్యయాన్ని రూ.112.83 కోట్లకు పెంచేసి, దొడ్డిదారిన తన సన్నిహితుడైన సి.ఎం. రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు అప్పగించారు.»హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశలో 2–బీ ప్యాకేజీలో 2014 నాటికి కేవలం రూ.99 లక్షల విలువైన పనులు, 3–బి ప్యాకేజిల్లో రూ.రూ.8.69 కోట్ల విలువైన పను మిగిలాయి. ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. 2–బి ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.115.08 కోట్లకు పెంచేశారు. 3–బి ప్యాకేజీ వ్యయాన్ని రూ.149.14 కోట్లకు పెంచేశారు. ఈ రెండింటినీ సి.ఎం. రమేష్‌కే అప్పగించారు. ఇలా 2–బి ప్యాకేజీలో రూ.114.09 కోట్లు, 3–బి ప్యాకేజీలో 140.45 కోట్లు పెంచేసి, సి.ఎం.రమేష్‌కు బిల్లులు చెల్లించినట్లు స్పష్టమవుతోంది. »హంద్రీ–నీవా రెండో దశ 4–బి ప్యాకేజీలో 2014 నాటికి రూ.1.34 కోట్లు, 5–బీ ప్యాకేజీలో రూ.11.87 కోట్ల విలువైన పనులే మిగిలాయి. వాటి కాంట్రాక్టర్లను కూడా 60–సీ నిబంధన కింద చంద్రబాబు తొలగించారు. 4–బి ప్యాకేజీ పనుల వ్యయాన్ని రూ.73.26 కోట్లకు, 5–బి ప్యాకేజీ వ్యయాన్ని రూ.97.40 కోట్లకు పెంచేసి, తన సన్నిహితుడైన ఆర్.మహేశ్వరనాయుడు, ఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు.»వెలిగొండ రెండో టన్నెల్లో 2014 నాటికి రూ.299.48 కోట్ల విలువైన పనులే మిగిలాయి. వాటిని చేస్తున్న కాంట్రాక్టర్‌పై 60–సీ నిబంధన కింద వేటు వేసిన చంద్రబాబు.. జీవో 22, జీవో 63ను వర్తింపజేసి.. అంచనా వ్యయాన్ని రూ.597.11 కోట్లకు పెంచేశారు. వాటిని సి.ఎం. రమేష్‌కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ పనులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించి, సి.ఎం. రమేష్ సంస్థకంటే రూ.61.76 కోట్లకు తక్కువ ధరకు మరో కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఆ టన్నెల్ పనిని పూర్తి చేయించారు. ఈ ప్రాజెక్టు పనులను తనిఖీ చేసిన కాVŠ జీవో 22, జీవో 63ను వర్తింపజేయడం ద్వారా కాంట్రాక్టర్లకు రూ.630.57 కోట్లను దోచిపెట్టినట్లు తేల్చడం బాబు అవినీతికి తార్కాణం.» 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రకాశం బ్యారేజ్‌కు 21 కిలోమీటర్ల ఎగువన కృష్ణా నదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజి నిర్మాణానికి 2018లో తొలుత రూ.801.88 కోట్లతో చంద్రబాబు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత దాన్ని రద్దు చేసి అంచనా వ్యయాన్ని రూ.1,376 కోట్లకు పెంచేసి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే.. అంచనాల్లోనే రూ.574.12 కోట్లు పెంచేశారు. ఈ పనులను రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగకు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ పనులను నిబంధనలకు విరుద్ధంగా 13.19 శాతం అధిక ధరకు రూ.1,554.88 కోట్లకు నవయుగకు అప్పగించారు. అంటే.. అంచనాలు పెంచడం ద్వారా, అధిక ధరకు పనులు అప్పగించడం ద్వారా నవయుగకు ప్రభుత్వ ఖజానా నుంచి ఉత్తినే రూ.753 కోట్లు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను 2019లో ప్రభుత్వం రద్దు చేసింది. » ఇప్పుడూ అదే రీతిలో ఖజానాను కొల్లగొట్టేందుకు జ్యుడిషియల్ ప్రివ్యూను ప్రభుత్వం రద్దు చేసిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. -
పెట్రోలియం దిగుమతులకు చెక్!
న్యూఢిల్లీ: భారీ పరిమాణంలో మెథనాల్ ప్లాంట్ల ఏర్పాటుతో శిలాజ ఇంధనాలైన పెట్రోలియం తదితర ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవచ్చని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ సూచించారు. థర్మల్ ప్లాంట్లపై ఆధారపడడం భవిష్యత్తులో తగ్గుతుందంటూ.. మెథనాల్ తయారీకి పరిశ్రమ ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. మెథనాల్‌ను శుద్ధ ఇంధనంగా పేర్కొంటూ, భారీ వాణిజ్య వాహనాల్లోనూ దీన్ని వినియోగించొచ్చన్నారు. మెథనాల్‌తో నడిచే ఓడను నిర్మించాలంటూ ఓ విదేశీ కంపెనీ కోచి్చన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు ఆర్డర్ ఇచి్చనట్టు చెప్పారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఢిల్లీలోని మనేక్షా కేంద్రంలో రెండు రోజుల పాటు అంతర్జాతీయ మెథనాల్ సెమినార్, ఎక్స్పోను నీతి ఆయోగ్ నిర్వహిస్తున్నట్టు సారస్వత్ ప్రకటించారు. 2016లో అమెరికాకు చెందిన మెథనాల్ ఇనిస్టిట్యూట్‌తో నీతిఆయోగ్ భాగస్వామ్యం కుదుర్చుకోగా.. ఈ ఎనిమిదేళ్లలో ప్రాజెక్టులు, ఉత్పత్తులు, పరిశోధన, అభివృద్ధికి సంబంధించి సాధించిన పురోగతిని సెమినార్లో తెలియజేస్తామని చెప్పారు. ఉత్పత్తులు, టెక్నాలజీలను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెథనాల్ తయారీ, వినియోగానికి వీలుగా ప్రభుత్వం ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోందని, ఆ తర్వాత పెద్ద స్థాయి మెథనాల్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలతో సమగ్ర విధానాన్ని ప్రకటిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 0.7 మిలియన్ మెట్రిక్ టన్నుల మెథనాల్ తయారీ సామర్థ్యం ఉండగా.. డిమాండ్ 4 మిలియన్ టన్నులు మేర ఉండడం గమనార్హం. -
2030 నాటికి భారత ఎకానమీ రెట్టింపు
భారత ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి రెట్టింపవుతుందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 2026–27 సమయానికి మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించాలన్న లక్ష్యం సాకారం అయ్యేందుకు పటిష్ట వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంటుందన్నారు.వాతావరణ మార్పులకు సంబంధించి క్లైమేట్ టెక్నాలజీలో భారత్ అగ్రగామిగా ఎదిగేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం చెప్పారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత్ ప్రస్తుతం 3.7 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో అయిదో అతి పెద్ద ఎకానమీగా ఉంది. ప్రకృతి విపత్తులు, పేదరికం వంటి సవాళ్లను అధిగమించడంలో దేశం గత దశాబ్దకాలంగా గణనీయ పురోగతి సాధించిందని, 2047 నాటికి తలసరి ఆదాయం 18,000–20,000 డాలర్ల స్థాయికి పెరుగుతుందని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆర్థిక వ్యవస్థను పర్యావరణ అనుకూలమైనదిగా తీర్చిదిద్దే దిశగా తీసుకోతగిన చర్యలపై టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో పురోగమించాలంటే సరఫరా వ్యవస్థను సంస్కరించుకోవాలని సుబ్రహ్మణ్యం చెప్పారు.ఇదీ చదవండి: యూఎస్ వెళ్లేవారికి శుభవార్త! 2.5 లక్షల వీసా స్లాట్లు -
ఆయిల్ పామ్ కింగ్ ఏపీ
సాక్షి, అమరావతి: ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఉంది. దేశంలో ఆయిల్ పామ్ సాగు వృద్ధికి ఏపీ దిక్సూచిగా నిలిచిందని నూనె గింజల ఉత్పత్తి రాష్ట్రాలపై నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, హరియాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర.. ఈతొమ్మిది రాష్ట్రాలే దేశం మొత్తం నూనె గింజల విస్తీర్ణం, ఉత్పత్తిలో 90 శాతం పైగా దోహదం చేస్తున్నాయని నివేదిక తెలిపింది. ఈ రాష్ట్రాల్లో నూనె గింజల సాగు, ఉత్పత్తిపై మరింత దృష్టి సారించడం ద్వారా స్వయం సమృద్ధి సాధించాల్సిందిగా నీతి ఆయోగ్ నివేదిక సూచించింది. ఆయిల్ పామ్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆధిపత్యం చెలాయిస్తున్నాయని తెలిపింది. దేశంలో మొత్తం ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం 3,70,028 హెక్టార్లలో ఉండగా ఇందులో ఏపీలోనే అత్యధికంగా 1,84,640 హెక్టార్లలో ఉందని వివరించింది. ముడి పామాయిల్ ఉత్పత్తిలో కూడా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని నివేదిక తెలిపింది. దేశంలో ముడి పామాయిల్ ఉత్పత్తి 3,60,729 టన్నులుండగా అందులో ఏపీలోనే అత్యధికంగా ముడి పామాయిల్ ఉత్పత్తి 2,95,075 టన్నులు ఉందని, ఆ తరువాత స్థానాల్లో తెలంగాణ, కర్ణాటక, మిజోరంలు ఉన్నాయని చెప్పింది.ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలిమిగతా రాష్ట్రాల్లో కూడా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నీతి ఆయోగ్ నివేదిక సూచించింది. దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా దిగుమతులను తగ్గించేందుకు ఎడిబుల్ ఆయిల్ మిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసిందని తెలిపింది. నూనె గింజలు సాగు, ఉత్పత్తి మరింత విస్తరింప చేసేలా వ్యూహాలను, రోడ్ మ్యాప్‌లను అమలు చేయాలని నివేదిక సూచించింది. ఈ రంగంలో ఆత్మనిర్భర భారత్ లక్ష్యంగా ముందుకు సాగాలని పేర్కొంది. -
అపనమ్మకంతో అభివృద్ధి ఎలా?
వికసిత భారత్ లక్ష్యమనీ, అందుకు వికసిత రాష్ట్రాలు కీలకమనీ కేంద్రం మాట. అందుకు అవరోధంగా రాజకీయంగా వివక్ష కొనసాగుతోందని రాష్ట్రాల ఆరోపణ. అందుకే, రాష్ట్రాల అభివృద్ధి, నిధుల కేటాయింపునకు కీలకమైన నీతి ఆయోగ్ సమావేశంలో బహిష్కరణల పర్వం కొనసాగడం ఆశ్చర్యం అనిపించదు. ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం సాగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 9వ భేటీకి ఒకటీ రెండు కాదు... ఏకంగా పది ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ప్రతినిధులు గైర్హాజరయ్యారు. గత వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2024–25 కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రాల్లో ప్రాజెక్ట్‌లకు తగినన్ని నిధులు కేటాయించలేదంటూ తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల సీఎంలు భేటీని బహిష్కరిస్తే, పశ్చిమ బెంగాల్ పక్షాన హాజరైన ఏకైక ప్రతిపక్ష పాలిత సీఎం మమతా బెనర్జీ సైతం మాట్లాడనివ్వకుండా మైకు ఆపేశారంటూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అనుకున్నట్టే ఆ భేటీ కేంద్రం, రాష్ట్రాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. నీతి ఆయోగ్ ప్రాథమిక లక్ష్యాలు, పనితీరు పైన చర్చకు పురిగొల్పింది. కేంద్ర, రాష్ట్రాలు పరస్పర నిందారోపణలు మాని, నిజమైన సమాఖ్య స్ఫూర్తిని పాటించాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. ఈ నీతి ఆయోగ్ వ్యవస్థ ఎన్డీఏ తెచ్చిపెట్టినదే. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో కేంద్ర ప్రణాళికా సంఘం స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు. అలా 2015 జనవరి నుంచి ఇది అమలులోకి వచ్చింది. ప్రణాళికా సంఘమైతే పైన కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఏకపక్షంగా విధాన నిర్ణయాలు బట్వాడా చేస్తుందనీ, దానికి బదులు కింది అందరినీ కలుపుకొనిపోతూ, రాష్ట్రాల ఆలోచనలకు పెద్దపీట వేసేందుకు ఉపకరిస్తుందనే ఉద్దేశంతో నీతి ఆయోగ్‌ను పెట్టారంటారు. కానీ, ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నది ప్రధాన విమర్శ. వరుసగా మూడోసారి ఎన్డీఏ సర్కారు ఏర్పడిన తర్వాత ఈ జూలై 16న నీతి ఆయోగ్ మేధావి బృందాన్ని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ప్రధానమంత్రి మోదీ ఛైర్‌పర్సన్‌గా ఉండే ఈ బృందంలో నలుగురు పూర్తికాలిక సభ్యులతో పాటు, ఎన్డీఏలో భాగస్వాములైన బీజేపీ, దాని మిత్రపక్షాలకు చెందిన 15 మంది కేంద్ర మంత్రుల్ని ఎక్స్–అఫిషియో సభ్యులుగా చేర్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోమ్ మంత్రి అమిత్‌షా తదితరులు అందులో సభ్యులే. ఒకప్పటి ప్రణాళికా సంఘంలోనూ లోపాలున్నా... గ్రాంట్ల విషయంలో గతంలో రాష్ట్రాలతోసంప్రతింపులకు వీలుండేది. కానీ, ఇప్పుడు గ్రాంట్లపై ఆర్థికశాఖదే సర్వంసహాధికారం. ప్రణాళికా సంఘం ఉసురు తీసి వచ్చిన నీతి ఆయోగ్ కేవలం సలహా సంఘమైపోయింది. ఎంతసేపటికీ రాష్ట్రాల స్థానాన్ని మదింపు చేయడానికి కీలకమైన సూచికల సృష్టి మీదే దృష్టి పెడుతోంది. రాష్ట్రాలకూ, ఇతర సంస్థలకూ వనరుల పంపిణీ, కేటాయింపులు జరిపే అధికారం లేని వట్టి ఉత్సవ విగ్రహమైంది. వెరసి, కేంద్ర సర్కార్ జేబుసంస్థగా, పాలకుల అభీష్టానికి తలాడించే సవాలక్ష ఏజెన్సీల్లో ఒకటిగా దాన్ని మార్చేశారు. చివరకు ‘సహకార సమాఖ్య’ విధానానికి బాటలు వేస్తుందంటూ తెచ్చిన వ్యవస్థ అనూహ్యంగా ‘పోటాపోటీ సమాఖ్య’ పద్ధతికి దారి తీసింది. చివరకు మేధావి బృందపు పాత్ర ఏమిటన్న దానిపైనా ప్రశ్నలు తలెత్తాయి. వాటికీ సరైన జవాబు లేదు. అపనమ్మకం పెరిగితే వ్యవస్థలో చిక్కులు తప్పవని నీతి ఆయోగ్ భేటీ మరోసారి తేటతెల్లం చేసింది.అభివృద్ధికి సంబంధించిన వైఖరుల్లో పరస్పరం తేడాలున్నా, ప్రధానంగా భౌతిక ప్రాథమిక వసతుల నిర్మాణంపైనే అధికంగా ఖర్చు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ భావనకు సరిపోలేలా రాష్ట్రాలు కృషి చేయాలంటూ నీతి ఆయోగ్ తాజా భేటీలో 20 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతి నిధుల్ని ఉద్దేశించి ప్రధాని నొక్కిచెప్పారు. ఆర్థిక కార్యకలాపాలు చురుకుగా సాగాలంటే ప్రాథమిక వసతుల నిర్మాణం ప్రాధమ్యాంశమని కేంద్రం ఆలోచన. అందుకే, జాతీయ అభివృద్ధి లక్ష్యాల సాధనకు కేంద్రంతో రాష్ట్రాలు చేతులు కలిపి అటు వసతులకూ, ఇటు సంక్షేమానికీ వనరులు అందు కోవాలని ప్రధాని అంటున్నారు. అయితే, రాష్ట్రాల స్థానిక అవసరాలు, ప్రాధాన్యాలు ఎక్కడికక్కడ వేర్వేరు కాబట్టి, చెప్పినంత సులభం కాదది! పైగా, రాష్ట్రాలన్నిటికీ పెద్దపీటనే మాటకు భిన్నంగా ఆచరణలో పాలకపక్షం తమ ప్రభుత్వాలు ఉన్నచోటనే ప్రేమ చూపిస్తోందనే విమర్శ ఉండనే ఉంది.కేంద్ర బడ్జెట్‌ను సైతం అదే సరళిలో రాజకీయమయం చేశారని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆరోపి స్తున్నాయి. తమిళనాట చెన్నై మెట్రో రైల్, కేరళలో విళింజమ్ పోర్ట్ సహా పలు కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లకు నిధులివ్వలేదని ఎత్తిచూపుతున్నాయి. ఈ అనుమానాలు, ఆరోపణలకు సంతృప్తికరమైన సమాధానాలు కేంద్రం వద్ద లేవు. అదే సమయంలో తాగునీరు, విద్యుచ్ఛక్తి, ఆరోగ్యం, పాఠశాల విద్య తదితర అంశాలే అజెండాగా సాగిన ఓ భేటీని బహిష్కరించడం వల్ల రాష్ట్రాలకూ, ప్రజానీకానికే నష్టం. ఆ సంగతి రాష్ట్రాలు గుర్తించాలి. బహిష్కరణను తప్పుబడుతున్న కేంద్ర పెద్దలు కూడా పరి స్థితి ఇంత దాకా ఎందుకు వచ్చిందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. నీతి ఆయోగ్‌ను రద్దు చేసి, మునుపటి ప్రణాళికా సంఘమే మళ్ళీ తేవాలనే వాదన వినిపిస్తున్న వేళ వ్యవస్థాగతంగానూ, పని తీరులోనూ పాతుకున్న లోపాలను తక్షణం సవరించాలి. నిధులను సక్రమంగా, సమానంగా పంచ డంలో కేంద్ర ఆర్థిక మంత్రి, బడ్జెట్లు విఫలమవుతున్న తీరును మాటలతో కొట్టిపారేస్తే సరిపోదు. పెద్దన్నగా అన్ని రాష్ట్రాలనూ కలుపుకొనిపోతేనే వికసిత భారత లక్ష్యం సిద్ధిస్తుంది. పన్నుల రూపంలో భారీగా కేంద్రానికి చేయందిస్తున్న ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలూ ఇదే భారతావనిలో భాగమని గుర్తిస్తేనే అది కుదురుతుంది. అందుకు రాజకీయాలను మించిన విశాల దృష్టి అవసరం. -
కూటమిలో కీలకమైనా.. దీదీపై కాంగ్రెస్ నేత విమర్శలు
కోల్‌కతా: నీతి ఆయోగ్ సమావేశంలో తన మైక్‌ను ఆఫ్ చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు అబద్దమని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరీ ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.‘‘నీతి ఆయోగ్ సమావేశం గురించి సీఎం మమత చెసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం. ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులను మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటారని మమత చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సీఎంలను మాట్లాన్వికుండా చేస్తారని నేను నమ్మటం లేదు. మమత బెనర్జీకి అక్కడ ఏం జరుగుతుందో ముందే తెలుసు. ఆమె పక్కా స్క్రిప్ట్ ప్రకారమే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లారు’’ అని అన్నారు. మరోవైపు.. సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించి.. నీతి ఆయోగ్ సమావేశంలో ఆమె పట్ల ప్రవర్తించిన తీరును తీవ్రంగా తప్పుపట్టింది. అయితే కాంగ్రెస్ స్పందనకు భిన్నంగా అధీర్ రంజన్ చౌదరీ విమర్శలు చేయటం గమనార్హం.దీనికంటే ముందు పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రలు క్షీణిస్తూ.. అరాచక పరిస్థితులు కొనసాగుతున్నాయని అధీర్ రంజన్ చౌదరీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ శాంతి భద్రతల పునరుద్ధరించడానికి జోక్యం చేసుకోసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కాగా, శనివారం ప్రధానిమోదీ అధ్యక్షత జరిగిన నీతి ఆయోగ్ సమాశానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. అనంతరం తానను మాట్లాడనివ్వకుండా మైక్ ఆఫ్ చేశారని ఆమె ఆరోపలు చేశారు. తర్వాత ఆమె నీతి ఆయోగ్ భేటీ నుంచి వాకౌట్ చేశారు. మరోపైపు.. లోక్‌సభ ఎన్నికల్లో అధీర్ రంజన్ చౌదరీ టీఎంసీ అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. సీఎం మమత ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ అధీర్ రంజన్ ఆమెపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. -
నీతి ఆయోగ్ సమావేశంలో తనను ఘోరంగా అవమానించారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపాటు... భేటీ నుంచి వాకౌట్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పాతబకాయిలే అడుగుతున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు మాత్రమే వచ్చాయని.. తాము అడిగింది కూడా పాత బకాయిలేనని, కొత్తగా కేంద్రం ఇచ్చింది ఏమీలేదని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. విభజన సమయం కంటే గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలవల్ల రాష్ట్రానికి మరింత నష్టం జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో శనివారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు.ఆ తర్వాత సాయంత్రం కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరా యులతో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పోలవరం డయాఫ్రమ్ వాల్‌కు సంబంధించిన డిజైన్ల విషయంలో జాప్యం జరగకుండా చూడాలని కేంద్రమంత్రిని కోరారు. సమావేశానంతరం చంద్రబాబు అక్కడున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విభజన చట్టంవల్ల నష్టం..: విభజన చట్టాన్ని రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీయేనని.. వాళ్లు చేసిన ఆ చట్టం ద్వారా పోలవరానికి ఎంతో నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పారు. విభజన చట్టంలో ఏర్పడిన నష్టం నుంచి తేరుకుంటున్న సమయంలో తమ ప్రభుత్వం ఓటమి పాలైందని.. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోలవరాన్ని నాశనం చేసిందని ఆరోపించారు.అదేవిధంగా అప్పులు పెరగడం, రాష్ట్రానికి ఆదాయం తగ్గడం, అమరావతిని నాశనం చేయడం, పరిశ్రమలు పారిపోయేలా చేశారని విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎవరూ పూడ్చలేరని, అందుకే పోలవరం పునర్నిర్మాణానికి పాత బకాయిలను అడుగుతున్నామని, కొత్తగా ఇచ్చిందేమీ లేదనే విషయాన్ని విమర్శించే వాళ్లు గుర్తించాలని చంద్రబాబు కోరారు. విభజన సందర్భంగా అన్యాయం జరిగిన దానిని ఇస్తే తాము నిలదొక్కుకునే అవకాశముందన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసికెళ్లినట్లు చంద్రబాబు చెప్పారు. నవంబర్‌లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం..: ఇక నవంబరు నెలలో వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని, అప్పుడు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపడతామని.. ఆ తర్వాత ఎర్త్‌కం రాక్ ఫీల్డ్ డ్యామ్ నిర్మాణం చేపడతామని చంద్రబాబు తెలిపారు. -
NITI Aayog: నితీశ్ అసంతృప్తి?
నీతిఆయోగ్ భేటీకి విపక్ష ఇండియా కూటమి సీఎంలతో పాటు పాలక ఎన్డీఏ సంకీర్ణంలో కీలక భాగస్వామి అయిన బిహార్ సీఎం నితీశ్‌కుమార్ కూడా డుమ్మా కొట్టడం విశేషం. ఆయన బదులు ఉప ముఖ్యమంత్రులు సమర్థ్ చౌదరి, విజయ్‌కుమార్ సిన్హా పాల్గొన్నారు. ఆయన కోరుతున్నట్టుగా బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం ఇటీవలే స్పష్టం చేయడం తెలిసిందే. దీనిపై అసంతృప్తితోనే భేటీకి నితీశ్ దూరంగా ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే ఆయన గైర్హాజరుకు పెద్ద ప్రాధాన్యమేమీ లేదని జేడీ(యూ) పేర్కొంది. గతంలో కూడా నితీశ్ పలుమార్లు నీతిఆయోగ్ భేటీకి గైర్హాజరయ్యారని గుర్తు చేసింది. కేంద్ర బడ్జెట్లో విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపారని ఆరోపిస్తూ తెలంగాణ, కర్నాటక తమిళనాడు, కేరళ, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, పాండిచ్చేరి సీఎంలు కూడా భేటీకి దూరంగా ఉన్నారు. ‘‘10 రాష్ట్రాల సీఎంలు భేటీకి రాలేదు. అది ఆయా రాష్ట్రాలకే నష్టం’’ అని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం అన్నారు. ‘‘మమత సమయం పూర్తవగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మైక్‌పై తట్టారు. వెంటనే ఆమె మాట్లాడటం ఆపేసి వాకౌట్ చేశారు’’ అని ఆయన వివరించారు. బిహార్ అసెంబ్లీ సమావేశాల కారణంగా నితీశ్ రాలేకపోయారన్నారు. -
Mamata Banerjee: ఘోరంగా అవమానించారు
న్యూఢిల్లీ/కోల్‌కతా/పటా్న: నీతి ఆయోగ్ సమావేశం రాజకీయ దుమారానికి కారణంగా మారింది. శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన ఈ భేటీలో తనకు ఘోర అవమానం జరిగిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మండిపడ్డారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ భేటీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఢిల్లీలో, ఆ తర్వాత కోల్‌కతా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఇతర సీఎంలకు 10 నుంచి 20 నిమిషాలు సమయమిచ్చి తనకు మాత్రం 5 నిమిషాలకే మైక్ కట్ చేశారని ఆరోపించారు. ‘‘కేంద్రంపై పెద్దగా ఆశలు లేకపోయినా సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయాలనే సదుద్దేశంతో భేటీకి వచ్చా. విపక్ష పాలిత రాష్ట్రాల నుంచి హాజరైన ఏకైక సీఎంను నేనే. ఆంధ్రప్రదేశ్ సీఎంకు 20 నిమిషాలిచ్చారు. గోవా, అసోం, ఛత్తీస్‌గఢ్ తదితర సీఎంలకు కూడా 10 నుంచి 12 నిమిషాల దాకా ఇచ్చారు. నన్ను మాత్రం ఐదు నిమిషాల కంటే మాట్లాడనివ్వలేదు. పైగా ఆ ఐదు నిమిషాల్లోనూ పదేపదే బెల్లు కొడుతూ దారుణంగా అవమానించారు. భేటీని పర్యవేక్షించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పదేపదే బెల్లు కొట్టారు. పక్కనే కూర్చున్న మోదీ, కేంద్ర హోం మంత్రి సూచన మేరకే ఆయనలా చేశారు. దీనికి నిరసనగా వాకౌట్ చేశా’’ అని వివరించారు. ఇకపై నీతి ఆయోగ్ భేటీలకు ఎప్పటికీ హాజరు కాబోనని ప్రకటించారు. మైక్ కట్ చేయలేదు: నిర్మల మమత ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఆమెకు కేటాయించిన సమయం మేరకు పూర్తిగా మాట్లాడారని పేర్కొంది. ‘‘నిజానికి అక్షరక్రమంలో మమత లంచ్ అనంతరం మాట్లాడాల్సింది. కానీ ఆమె అర్జెంటుగా కోల్‌కతా తిరిగి వెళ్లాల్సి ఉందన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అంతకుముందే ఏడో వక్తగా అవకాశమిచ్చాం. మమతకు కేటాయించిన సమయం పూర్తయిందని కేవలం అందరి ముందూ ఉన్న స్క్రీన్లపై కని్పంచింది. అంతే తప్ప టైం అయిపోయిందంటూ ఎవరూ బెల్ కూడా మోగించలేదు’’ అని వివరణ ఇచి్చంది. మమత పూర్తి సమయం మేరకు మాట్లాడారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘మధ్యలో మైక్ కట్ చేయడం నిజం కాదు. ఎవరెంతసేపు మాట్లాడుతున్నదీ మా ముందున్న స్క్రీన్లపై కనిపిస్తూనే ఉంది. కొందరు సీఎంలు కేటాయించిన సమయం కన్నా ఎక్కువగా మాట్లాడారు. వారి విజ్ఞప్తి మేరకు అదనపు సమయం కేటాయించాం. అంతే తప్ప ఎవరికీ, ముఖ్యంగా బెంగాల్ సీఎంకు మైకు కట్ చేయలేదు’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేంద్రానిది రాజకీయ వివక్ష విపక్ష పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం దారుణమైన రాజకీయ వివక్ష కనబరుస్తోందని మమత ఆరోపించారు. ‘‘ఈ వివక్ష కేంద్ర బడ్జెట్లో కూడా కొట్టొచి్చనట్టు కని్పంచింది. ఈ వైనాన్ని భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే లేవనెత్తా. వారికి కొన్ని రాష్ట్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంటే ఉండొచ్చు. వాటికి ఎక్కువ నిధులు కేటాయించడంపైనా నాకు అభ్యంతరం లేదు. కానీ బెంగాల్ తదితర రాష్ట్రాలపై మాత్రం ఎందుకిలా వివక్ష చూపు తున్నారని ప్రశ్నించా. దీనిపై సమీక్ష జరగాలని డిమాండ్ చేశా. అన్ని రాష్ట్రాల తరఫునా భేటీలో మాట్లాడా’’ అని తెలిపారు. ‘‘నీతి ఆయోగ్‌కు ఎలాంటి ఆర్థిక అధికారాలూ లేవు. దానికి అధికారాలన్నా ఇవ్వాలి. లేదంటే ప్రణాళిక సంఘాన్నే పునరుద్ధరించాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘ఉపాధి హామీ వంటి పలు కీలక కేంద్ర పథకాల అమలును బెంగాల్లో మూడేళ్లుగా నిలిపేయడాన్ని భేటీలో ప్రస్తావించా. స్వపక్షం, విపక్షాల మధ్య కేంద్రం ఇలా వివక్ష చూపుతుంటే దేశం ఎలా నడుస్తుంది? అధికారంలో ఉన్నప్పుడు అందరి మేలూ పట్టించుకోవాలి’’ అన్నారు. అధికార, విపక్షాల పరస్పర విమర్శలు కాంగ్రెస్‌తో పాటు పలు విపక్షాలు మమతకు సంఘీభావం ప్రకటించాయి. విపక్ష నేత అ న్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా ముఖ్యమంత్రినే ఇంతగా అవమానించడం దారుణమని మండిపడ్డాయి. దీన్ని ఎంతమాత్రమూ అంగీకరించలేమని కాంగ్రెస్ పేర్కొంది. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు స్టాలిన్ (తమిళనాడు) సహా విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు అన్నారు. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచి్చంది. కేవలం మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచేందుకే ముందుగా నిర్ణయించుకుని మరీ మమత ఇలా వాకౌట్ చేశారని కేంద్ర మంత్రులు అర్జున్‌రాం మేఘ్వాల్, ప్రహ్లాద్ జోషీ తదితరులు విమర్శించారు. బెంగాల్ పీసీసీ చీఫ్ అ«దీర్ రంజన్ చౌధరి మాత్రం మమత కావాలనే డ్రామా చేశారంటూ కొట్టిపారేయడం విశేషం.‘‘సహకారాత్మక సమాఖ్య వ్యవస్థ అంటే ఇదేనా? సీఎంతో ప్రవర్తించే తీరిదేనా? మన ప్రజాస్వామ్యంలో విపక్షాలు కూడా అంతర్గత భాగమని కేంద్రంలోని బీజేపీ సర్కారు అర్థం చేసుకోవాలి. శత్రువుల్లా చూడటం ఇకనైనా మానుకుంటే మంచిది’’ – తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‘‘మన దేశంలో పతాక శీర్షికలకు ఎక్కడం చాలా తేలిక. ఏకైక నీతి ఆయోగ్ భేటీలో పాల్గొన్న ఏకైక విపక్ష సీఎం నేనే అని ముందుగా చెప్పాలి. బయటికొచ్చి, ‘నా మైక్ కట్ చేశారు. అందుకే బాయ్‌కాట్ చేశా’ అని చెప్పాలి. ఇక రోజంతా టీవీలు దీన్నే చూపిస్తాయి. పని చేయాల్సిన, చర్చించాల్సిన అవసరం లేదు. ఇదీ దీదీ తీరు!’’ – బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ -
‘వికసిత భారత్’ సాకారంలో... రాష్ట్రాలదే కీలక పాత్ర: మోదీ
న్యూఢిల్లీ: 2047 కల్లా వికసిత భారత్ కలను సాకారం చేసుకోవడంలో రాష్ట్రాలది ప్రధాన పాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ‘‘పేదరిక నిర్మూలనే మన లక్ష్యం కావాలి. గ్రామం మొదలుకుని రాష్ట్రస్థాయి దాకా ఆ దిశగా కార్యాచరణ ఉండాలి. ఇందుకు ప్రతి జిల్లా, రాష్ట్రం 2047కు విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలి. జిల్లా, బ్లాక్, గ్రామ స్థాయి దాకా వికసిత్ భారత్ ఆకాంక్ష చేరాలి’’ అని సూచించారు. నీతి ఆయోగ్ పాలక మండలి 9వ భేటీ శనివారం జరిగింది. కేంద్ర మంత్రులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు తదితరులు పాల్గొన్నారు. భేటీకి సారథ్యం వహించిన మోదీ మాట్లాడుతూ దేశాభివృద్ధే లక్ష్యంగా పాలనలో కేంద్ర, రాష్ట్రాలు కలిసి సాగాలని అభిలషించారు. ‘‘ఇది సాంకేతిక మార్పుల దశాబ్ది. ఎదిగేందుకు అపారమైన అవకాశాలున్నాయి. వాటిని రాష్ట్రాలు అందిపుచ్చుకోవాలి. పెట్టుబడులను ఆకర్షించాలంటే శాంతిభద్రతలు, సుపరిపాలన, మౌలిక సదుపాయాలు చాలా కీలకం. జల వనరుల సమర్థ వినియోగానికి రివర్ గ్రిడ్లు ఏర్పాటు చేసుకోవాలి’’ అని సూచించారు. ముఖ్యమంత్రులు తమ అవసరాలు, ప్రాథమ్యాలను వివరించారు. పేదరిక నిర్మూలన (జీరో పావరీ్ట) లక్ష్యాలను సాధించిన గ్రామాలను పేదరికరహిత గ్రామాలుగా ప్రకటిస్తామని నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణ్యం మీడియాకు వెల్లడించారు. భేటీలో చర్చించిన విషయాలపై 45 రోజుల్లో ‘విజన్ ఇండియా 2047’ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తామని తెలిపారు. -
ముగిసిన నీతిఆయోగ్ భేటీ.. ప్రధాని స్పీచ్ హైలైట్స్..
ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం(జులై 27) జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేపట్టాల్సిన ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రాల అభివృద్ధి, దేశాభివృద్ధిపై ఈ సమావేశంలో పలువురు సీఎంలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు సరైన దిశలో పయనిస్తున్నామన్నారు. వందేళ్లలో ఒకసారి వచ్చే మహమ్మారిని(కరోనా) ఓడించామని చెప్పారు. అన్ని రాష్ట్రాల సమిష్టి కృషితో 2047 నాటికి వికసిత్ భారత్ కల నెరవేర్చుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.కాగా, తాను మాట్లాడుతుండగా మధ్యలో మైక్ కట్ చేశారని నీతిఆయోగ్ సమావేశం నుంచి వెస్ట్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అలిగి వెళ్లిపోయారు. ఎన్డీఏ కీలక భాగస్వామ్యపక్షమైన జేడీయూ నుంచి బిహార్ సీఎం నితీశ్‌కుమార్ నీతిఆయోగ్‌కు రాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే అనారోగ్యకారణాల వల్లనే నితీశ్ రాలేదని జేడీయూ ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది. -
మైక్ కట్‌చేయడం.. కోఆపరేటివ్ ఫెడరలిజమా: స్టాలిన్
చెన్నై: పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీకి తమిళనాడు సీఎం స్టాలిన్ మద్దతు పలికారు. నీతిఆయోగ్ భేటీలో మమత మైక్ కట్ చేయడం కో ఆపరేటివ్ ఫెడరలిజమా అని ప్రశ్నించారు.ఈ మేరకు ఆయన శనివారం(జులై 27) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ఒక ముఖ్యమంత్రిని ఇలాగేనా గౌరవించేంది. ప్రతిపక్షాలు కూడా ప్రజాస్వామ్యంలో భాగమేనని బీజేపీ గుర్తించాలి. వారిని శత్రువులుగా చూడకూడదు. కోఆపరేటివ్ ఫెడరలిజం మనుగడ సాగించాలంటగే చర్చలకు అవకాశం ఉండాలి. భిన్నాభిప్రాయాలను గౌరవించాలని స్టాలిన్ తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, నీతిఆయోగ్ మీటింగ్‌లో కేవలం 5 నిమిషాలే తనను మాట్లాడించారని, తర్వాత మైక్ కట్ చేశారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు మాత్రం మాట్లాడటానికి 20 నిమిషాల సమయం ఇచ్చారని మండిపడ్డారు. -
మమత వాకౌట్
-
నీతి ఆయోగ్ సమావేశానికి నితీష్ కుమార్ డుమ్మా.. కారణం అదేనా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం నీతి ఆయోగ్ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగుతోంది. వికసిత్ భారత్-2047 అజెండాగా సాగుతున్న ఈ భేటీకి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, సభ్యులు ఇతరులు పాల్గొన్నారు.అయితే ఈ సమావేశానికి విపక్ష ఇండియా కూటమి పార్టీలకు చెందిన రాష్ట్రాల సీఎంలు గైర్హాజరయ్యారు. కేవలం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరవ్వగా.. ఆమెకు మాట్లాడేందుకు సరైన సమయం ఇవ్వలేదని, మైక్ కట్ చేశారంటూ ఆరోపిస్తూ మమతా సైతం ఈ భేటీ నుంచి వాకౌట్ చేశారు.ఇదిలా ఉండగా ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామి జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్‌కుమార్ కూడా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాలేదు. బిహార్ తరపున డిప్యూటీ సీఎంలు సామ్రాట్‌చౌదరి, విజయ్‌కుమార్ సిన్హా పాల్గొన్నారు. అయితే నీతి ఆయోగ్ కీలక సమావేశానికి సీఎం నితీష్‌కుమార్ గైర్హాజరుపై దేశ రాజకీయాల్లో అప్పుడే చర్చ మొదలైపోయింది. కేంద్రం బీహార్‌కు ప్రత్యేక మోదాఇవ్వకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ వ్యవహారంపై బీహార్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలో మూడోసారి మోదీ ప్రధానిగా అవతరించడంతో నితీష్ పార్టీ జేడీయూ కీలకంగా వ్యవహరించింది. అయినప్పటికీ తమ డిమాండ్‌ను కేంద్రం తిరస్కరించడంతో నిరసనగా.. బిహార్ సీఎం ఈ సమావేశానికి డుమ్మా కొట్టిన్నట్లు సమాచారం.ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వివక్ష చూపారంటూ నిరసిస్తూ ప్రతిపక్ష ముఖ్యమంత్రులైన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగసామి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. కాగా కేంద్ర ప్రభుత్వ విభాగమైన నీతి ఆయోగ్‌కు ప్రధానమంత్రిని చైర్మన్‌గా ఉంటారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అనేక కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులను సభ్యులుగా ఉంటారు. -
నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన ఇండియా కూటమి
-
చంద్రబాబుకి అంత టైమిస్తారా?.. నీతి ఆయోగ్ మీటింగ్ నుంచి మమతా బెనర్జీ వాకౌట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఉన్నపళంగా బయటకు వచ్చి.. వాకౌట్ చేస్తున్నట్లు మీడియాకు చెబుతూ వెళ్లిపోయారామె.‘‘విపక్షాల నుంచి హాజరైంది నేను మాత్రమే. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడనిచ్చారు. మాట్లాడే టైంలో నా మైక్‌ను కట్ చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు 20 నిమిషాల పాటు మాట్లాడారు. బీజేపీ రాష్ట్రాలకు చాలా టైం ఇచ్చారు. ఇది ప్రాంతీయ పార్టీలను అవమానించడమే. ఇదేం నీతి?. అందుకే నిరసనగా బయటకు వచ్చేశా’’ అని అన్నారామె. అలాగే.. బడ్జెట్లో కేంద్రం వివక్ష చూపిందని, బడ్జెట్ రాజకీయంగా ఉందని అభిప్రాయపడ్డారామె. ‘‘బడ్జెట్ విషయంలో బెంగాల్‌నూ అవమానించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదు. ఈసారి బడ్జెట్ పూర్తి రాజకీయంగా ఉంది’’ అంటూ ఆమె కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక.. నీతి ఆయోగ్‌ను రద్దు చేసి స్థానంలో ప్రణాళిక సంఘాన్ని పునరుద్ధరించాలని పేర్కొంటూ ఆమె డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మీటింగ్ హాజరై ఆమె కేంద్రాన్ని నిలదీస్తానని ఆమె ప్రకటించారు కూడా.ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ప్రధాని నేతృత్వంలో నీతి ఆయోగ్ భేటీ జరుగుతోంది. ‘వికసిత్ భారత్ - 2047’ ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరుగుతోంది. దీనికి కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అయితే.. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం వివక్ష ప్రదర్శించిందని ఆరోపిస్తూ ఇండియా కూటమి తరఫున ముఖ్యమంత్రులు(ఆరుగురు) మాత్రం ఈ భేటీని బహిష్కరించారు. NDA 3.0: Mic Bandh Sarkar!Despite being the sole Opposition voice, Smt. @MamataOfficial was not allowed to raise her concerns at today's Niti Aayog meeting in Delhi. This is yet another example of how the Jomidars of Delhi want to silence Bengal — at every step. As if… pic.twitter.com/bN9PwItEre— All India Trinamool Congress (@AITCofficial) July 27, 2024 -
నీతిఆయోగ్ భేటీకి ఆరుగురు సీఎంలు దూరం
న్యూఢిల్లీ: హస్తినలో శనివారం జరగబోయే నీతి ఆయోగ్ పాలకమండలి భేటీని విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీలకు చెందిన ఆరుగురు సీఎంలు బహిష్కరించారు. కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపారంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరిలో కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి (తెలంగాణ), సిద్ధరామయ్య (కర్ణాటక), సుఖీ్వందర్ సింగ్ సుఖూ (హిమాచల్ ప్రదేశ్)తో పాటు ఎంకే స్టాలిన్ (తమిళనాడు), విజయన్ (కేరళ), భగవంత్ మాన్ (పంజాబ్) ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వమూ భేటీని బాయ్‌కాట్ చేసింది.ప్రణాళికా సంఘమే కావాలి: మమతపశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ మాత్రం భేటీలో పాల్గొంటానని స్పష్టంచేశారు. ‘‘బడ్జెట్ కేటాయింపుల్లో విపక్షాలపాలిత రాష్ట్రాలపై మోదీ సర్కార్ వివక్షను భేటీలో ప్రస్తావిస్తా. బెంగాల్లో విభజన రాజకీయాలు తెస్తూ పొరుగురాష్ట్రాలతో వైరానికి వంతపాడుతున్న కేంద్రాన్ని కడిగేస్తా. నీతి ఆయోగ్ ప్రణాళికలు ఒక్కటీ అమలుకావడం చూడలేదు. ప్రణాళికా సంఘంలో ఒక విధానమంటూ ఉండేది. రాష్ట్రాల సూచనలకు విలువ ఇచ్చేవారు. నీతిఆయోగ్‌లో మా మాట వినే అవకాశం లేదు. పట్టించుకుంటారన్న ఆశ అస్సలు లేదు. అందుకే ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించాలి’’ అని మమత అన్నారు. నేడు మోదీ నేతృత్వంలో భేటీ 2047 ఏడాదికల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై చర్చించేందుకు నేడు ప్రధాని మెదీ అధ్యక్షతన 9వ నీతిఆయోగ్ పాలకమండలి సమావేశం జరగనుంది. ఈ భేటీకి కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరుకానున్నారు. అయితే పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి ఈ భేటీకి రావట్లేదని తెలుస్తోంది. పుదుచ్చేరిలో రంగస్వామికి చెందిన ఏఐఎన్ఆర్సీ పార్టీ బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజాజీవనాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్రాలు ఎలా మరింత సమన్వయంతో పనిచేయాలనే అంశాలనూ ఈ భేటీలో చర్చించనున్నారు. వికసిత భారత్‌కు దార్శనిక పత్రం రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ క్రతువులో రాష్ట్రాల పాత్రపై విస్తృతస్థాయిలో చర్చ జరగనుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మూడో జాతీయ సదస్సులో చేసిన సిఫార్సులనూ సమావేశంలో పరిశీలించనున్నారు. -
నీతిఆయోగ్‌లో కేంద్రాన్ని నిలదీస్తా: మమతా బెనర్జీ
కలకత్తా: ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలపై కేంద్ర బడ్జెట్లో సవతితల్లి ప్రేమ చూపించారని తృణమూల్కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ అన్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలో శనివారం(జులై 26) జరిగే నీతిఆయోగ్ సమావేశానికి హాజరై చెబుతానన్నారు. నీతిఆయోగ్ సమావేశానికి హాజరవడం కోసం శుక్రవారం(జులై26) ఆమె కలకత్తా నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘నీతిఆయోగ్ మీటింగ్‌కు వెళ్తానని బడ్జెట్‌కు ముందే చెప్పా. మీటింగ్‌లో నా స్పీచ్ కాపీని కూడా ఇప్పటికే పంపించాను. ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం వ్యవహరించిన తీరు చూశాక ఈ విషయమే నీతిఆయోగ్‌లో మాట్లాడాలనుకుంటున్నా. ఒకవేళ వాళ్లు నాకు మాట్లాడటగానికి నాకు అనుమతివ్వకపోతే నిరసన తెలిపి సమావేశం నుంచి బయటికి వస్తా అని మమత తెలిపారు. మమతాబెనర్జీ నీతిఆయోగ్ సమావేశానికి హాజరవడం ఇదే తొలిసారి. 2014లో ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి నీతిఆయోగ్‌ను ఏర్పాటు చేయడంపై మమత తొలి నుంచి నిరసన తెలుపుతూనే ఉన్నారు. -
నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్ష చూపడానికి, నిధుల కేటాయింపులో అన్యాయానికి నిరసనగా ఈ నెల 27న జరిగే నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిరసన వ్యక్తం చేస్తోందని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై బుధవారం అసెంబ్లీలో ప్రత్యేక చర్చ నిర్వహించారు. అనంతరం దీనిపై సీఎం రేవంత్ తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘‘2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి రాష్ట్రానికి నిధుల కేటాయింపులో, విభ జన హామీల అమల్లో కక్షపూరిత వైఖరినే అవలంబిస్తున్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు విభజన చట్టంలోని అంశాలేవీ అమలు కాలేదు. మేం అధికారం చేపట్టాక రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తున్నాం. కేంద్ర పెద్దలను కలసి సాయం కోసం విజ్ఞప్తులు చేశాం. స్వయంగా నేను మూడు సార్లు ప్రధానిని.. 18 సార్లు కేంద్ర మంత్రులను కలిశా. తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశా. మేం ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే కలిశాం తప్ప.. ఎవరి దగ్గరో వంగిపోవడానికో.. లొంగిపోవడానికో కాదు. రాష్ట్రానికి వచ్చిన ప్రధానిని కలసి ఓ మెట్టు దిగి.. పెద్దన్నగా సంబోధించి రాష్ట్రానికి మేలు చేయాలని కోరాను. ప్రధానిని పెద్దన్న అన్నందుకు కొందరు నన్ను విమర్శించారు. నాకు సీఎం పదవి ఎవరి దయా దాక్షిణ్యాలతోనో రాలేదు. ప్రజల వల్ల, మా పార్టీ వల్ల, 64 మంది ఎమ్మెల్యేలు నన్ను నాయకుడిగా ఎన్నుకోవడం వల్ల వచ్చింది. ఎవరినో పెద్దన్న అన్నందుకు రాలేదు. బడ్జెట్లో అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్రాన్ని కోరేందుకే శాసనసభలో చర్చ లేవనెత్తాం. కానీ కొందరు సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్నే దోషిగా నిలబెట్టాలని, ప్రధాని మోదీని కాపాడాలని ప్రయత్నించడం రాష్ట్రమంతా చూసింది.అది కక్షపూరిత వైఖరిదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. తొలి ప్రధాని నెహ్రూ అభివృద్ధికి బాటలు వేస్తే.. ఆయన స్ఫూర్తితో ఇందిరాగాంధీ ఎన్నో సరళీకృత విధానాలను తీసుకొచ్చారు. తర్వాత సోనియాగాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేశారు. తెలంగాణ అభివృద్ధికి కావాల్సినవన్నీ విభజన చట్టంలో పొందుపరిచి సోనియా తెలంగాణ ఇచ్చారు. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. ఆ హామీల అమల్లో నిర్లక్ష్యం వహించింది. తెలంగాణపై కేంద్రానిది వివక్ష మాత్రమే కాదు.. కక్షపూరిత వైఖరి.రూపాయి చెల్లిస్తే.. వస్తున్నది 43 పైసలేరాష్ట్రం నుంచి ఒక రూపాయిని పన్నులుగా చెల్లిస్తే కేంద్రం తెలంగాణకు తిరిగిస్తున్నది 43 పైసలే. బిహార్‌కు రూపాయికి రూ.7.26 అందుతున్నాయి. యూపీకి కూడా అంతే. ఐదేళ్లలో తెలంగాణ నుంచి రూ.3.68లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి వెళితే.. రాష్ట్రానికి ఇచ్చేది రూ.1.68లక్షల కోట్లు మాత్రమే. మోదీ ఏమైనా గుజరాత్‌లోని ఎస్టేట్లు అమ్మి తెలంగాణకు ఇచ్చారా? ఆయన జాగీర్దారు అమ్మి ఇచ్చారా? మన హక్కులు మనకు ఇవ్వకపోవడం వల్లే ఈ అంశంపై సభలో చర్చించాల్సిన పరిస్థితి. ఐదు దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్నది రూ.22.26 లక్షల కోట్లు అయితే.. కేంద్రం వీటికి తిరిగి ఇచ్చింది రూ.6.42 లక్షల కోట్లు మాత్రమే. అదే యూపీ పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చినది రూ.3.41 లక్షల కోట్లు అయితే.. కేంద్రం యూపీకి తిరిగిచ్చింది రూ.6.91 లక్షల కోట్లు. ఐదు దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే ఒక్క యూపీకి ఇచ్చినది ఎక్కువ. ఇదీ కేంద్రం వివక్ష కాదా.. దేశం 5 ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రధానికి స్పష్టంగా చెప్పాం. అందరం ఏకతాటిపై ఉంటే కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవటం పెద్ద కష్టం కాదు..’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
జగన్ పాలనలో ఏపీ ముందడుగు
-
Arvind Virmani: 2024–25లో 7 శాతం వృద్ధి సాధిస్తాం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి అంచనా వ్యక్తం చేశారు. ఈ రేటు 0.5 శాతం అటూ, ఇటూగా ఉండొచ్చన్నారు. అంతేకాదు, రానున్న కొన్నేళ్లపాటు ఇదే తరహా వృద్ధి రేటు నమోదవుతుందన్నారు. దేశం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందంటూ.. వాటిని పరిష్కరించాల్సి ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–25) జీడీపీ 7.2 శాతం వరకు వృద్ధిని నమోదు చేయవచ్చని ఆర్బీఐ సైతం ఇటీవలే అంచనా వేయడం గమనార్హం. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు వినియోగం వ్యయాలు క్షీణించడంపై ఎదురైన ప్రశ్నకు విర్మాణి స్పందిస్తూ.. కరోనా విపత్తు ప్రభావంతో గృహ పొదుపు తగ్గిపోయిందని.. అంతకుముందు ఆర్థిక సంక్షోభాలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉందన్నారు. రెట్టింపు కరువు పరిస్థితిగా దీన్ని అభివర్ణించారు. గతేడాది ఎల్‌నినో పరిస్థితిని చూసినట్టు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పొదుపులను మళ్లీ పోగు చేసుకోవాల్సి ఉన్నందున, అది వినియోగంపై ప్రభావం చూపించినట్టు వివరించారు. ‘‘బ్రాండెడ్ ఉత్పత్తులు కొనుగోలు చేసే వారు, చిన్న బ్రాండ్లు లేదా సాధారణ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. తద్వారా కొంత మొత్తాన్ని ఆదా చేసుకుంటున్నారు’’అని వివరించారు. చారిత్రకంగా చూస్తే ప్రాంతీయ భాగస్వామి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రైవేటీకరణ నిదానించినట్టుగా తెలుస్తోందని.. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటీకరణ చేపట్టకపోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదన్నారు. వడ్డీ రేట్ల కోతతో పెట్టుబడుల ప్రవాహం..వర్ధమాన దేశాలతో పోలిస్తే రిస్క్ లేని రాడులు యూఎస్‌లో, అభివృద్ధి చెందిన మార్కెట్లో వస్తుండడమే, మన దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తక్కువగా ఉండడానికి కారణంగా విర్మాణి చెప్పారు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం మొదలైన తర్వాత మన దగ్గరకు పెట్టుబడుల ప్రవాహం మొదలవుతుందని అంచనా వేశారు. -
సచివాలయాలతో సమున్నత సేవలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం పౌర సేవలు, ప్రభుత్వ పథకాల అమలు స్వరూపాన్నే మార్చేసింది. గ్రామ గ్రామాన సరికొత్త చిత్రం ఆవిష్కృతమైంది. పల్లె రూపురేఖలే మారిపోయాయి. విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు సాకారమయ్యాయి. ఎక్కడా లంచాలు, వివక్ష, పడిగాపులకు తావులేకుండా పారదర్శకంగా ప్రతి ఇంటికీ ప్రయోజనాలను అందచేసింది. గ్రామం నుంచి కదలాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్నే పల్లె చెంతకు తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో సాకారమైన విప్లవాత్మక మార్పులివి. నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు నిర్వహించిన సంయుక్త సదస్సు ఈ అంశాలను ప్రముఖంగా ప్రస్తావించడం గమనార్హం. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అద్భుతమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసించారు. ఇంటింటికీ పౌర సేవలు, అర్హులకు సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోందని, ప్రధానంగా నీతి ఆయోగ్ నిర్దేశించిన ఎస్డీజీ (సుస్థిరాభివృద్ధి) లక్ష్యాల సాధనకు సచివాలయాలతో క్షేత్రస్థాయి నుంచి కృషి చేశారని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావనా వశిష్ఠ పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల ఆవిష్కరణ డేటా అధారిత పాలన, ప్రణాళికల కోసం డేటా సేకరణపై ఇటీవల లక్నోలో నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు సంయుక్త సదస్సు నిర్వహించాయి. డేటాను నాలెడ్జ్‌గా మార్చడం, 2047 భారత్ విజన్ లక్ష్యాలను సాధించడం, డేటాను పరిపాలనలో వినియోగించడం తదితర అంశాలపై వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలపై చర్చాగోష్టి నిర్వహించారు. సదస్సులో నీతి ఆయోగ్, ప్రపంచబ్యాంకుతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొని ఆయా రాష్ట్రాల్లోని ఆవిష్కరణలపై ప్రముఖంగా చర్చించారు.ప్రతి పౌరుడికీ అందుబాటులో సేవలు..సమగ్ర డేటా సేకరణ ద్వారా పాలనను మెరుగుపరిచే లక్ష్యంతో 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిందని, పాలన వికేంద్రీకరణలో భాగంగా తెచ్చిన ఈ వ్యవస్థ అద్భుతమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనను వికేంద్రీకరించడంతోపాటు విధాన రూపకర్తలకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు గ్రామాలు, వార్డులలో ఆధునిక పరిజ్ఞానంతో సౌకర్యాలు కల్పించారన్నారు. ఏపీలోని ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడికీ ఈ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్లు, నెలవారీ కేటాయింపులు లాంటి సంక్షేమ ప్రయోజనాలను అందజేయడంతోపాటు పౌరుల అవసరాలను గుర్తించి తీర్చుతున్నట్లు తెలిపారు. పరిపాలనాపరమైన ఫిర్యాదులను సింగిల్ విండో వ్యవస్థ ద్వారా పరిష్కరిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వివిధ టెక్ పోర్టల్‌లను ఏర్పాటు చేయడం వల్ల పైస్థాయి నుంచి కింద స్థాయి వరకు పనులను సమన్వయంతో వేగంగా పూర్తి చేసే వెసులుబాటు కలిగిందన్నారు. విప్లవాత్మక పాలనలో భాగంగా డేటా సేకరణ, క్రోడీకరణ, మార్పిడి ద్వారా సచివాలయాల వ్యవస్థతో ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలను అమలు చేశారన్నారు. నీతి ఆయోగ్ రూపొందించిన 116 సూచికల ఆధారంగా 16 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సచివాలయాల వ్యవస్థ దోహదం చేసిందని అభినందించారు. అన్ని పోర్టల్లలో డేటాను సేకరించడంతో పాటు విశ్లేషించి మెరుగైన ఫలితాలు సాధించారన్నారు. పాఠశాలలకు వెళ్లే బాలికల్లో రక్తహీనత నిర్మూలన లాంటి సామాజిక లక్ష్యాలతో పాటు బడికి దూరమైన పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్చడం లాంటి వాటిని సచివాలయాల వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా అమలు చేసిందని ప్రస్తావించారు.ఎస్డీజీ లక్ష్యాల సాధన..నీతి ఆయోగ్ నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయిలో పటిష్ట వ్యవస్థను తెచ్చిందని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావనా వశిష్ఠ పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు అవసరమైన డేటా సేకరణ, విశ్లేషణ గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచే జరుగుతోందన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలుకు యాప్‌లు తీసుకొచ్చి అన్ని స్థాయిల్లో పకడ్బందీగా పర్యవేక్షించారన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి పౌరుల అవసరాలను తీర్చడం, గ్రామంలోనే సేవలు అందించడం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిందన్నారు. అవి సింగిల్ విండో విధానం ద్వారా పంచాయతీలు, స్థానిక సంస్థలకు సహాయ విభాగంగా పనిచేయడంతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విధానాలను అమలు చేస్తున్నాయన్నారు. సచివాలయాల స్థాయిలోనే పౌరుల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనకు సచివాలయాల వ్యవస్థ టెక్ పోర్టల్‌తో బలమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉందన్నారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనలో భాగంగా ఆరోగ్యం, విద్య సంబంధిత కార్యక్రమాలను గ్రామ, వార్డు సచివాలయాలతో అనుసంధానించినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో కార్యక్రమాల పర్యవేక్షణకు ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డ్ ఏర్పాటైందని, వీటన్నింటినీ ప్రతిబింబించేలా రాష్ట్ర స్థాయి డేటా రూపొందించడం కార్యక్రమాలు విజయవంతంగా అమలుకు దోహదం చేసిందన్నారు. అన్ని స్థాయిల్లో అధికారులు పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. బాలికలలో రక్తహీనత నిర్మూలనకు విద్యాసంస్ధల్లో డేటాను సేకరించి సంబంధిత విభాగాల ద్వారా క్రోడీకరించారని తెలిపారు. వలంటీర్ల ద్వారా భారీ సర్వేతో బడికి దూరమైన పిల్లల డేటాను సేకరించడంతోపాటు తిరిగి స్కూళ్లకు వెళ్లేలా ప్రోత్సహిస్తూ విద్యార్ధి సమాచార పోర్టల్‌ను నిర్వహిస్తున్నారన్నారు. నవశకం ద్వారా ప్రభుత్వ పథకాలకు అర్హులను పారదర్శకంగా గుర్తించి క్రోడీకరించిన లబ్ధిదారుల డేటాతో పోర్టల్‌ను నిర్వహిస్తున్నారని తెలిపారు. -
నాట్స్ నాయకుడి సేవలకు నీతి ఆయోగ్ గుర్తింపు!
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ గత రెండేళ్లలో చేసిన సేవలను భారత నీతి ఆయోగ్ గుర్తించింది. ఈ రెండేళ్లలో నాట్స్ అధ్యక్షుడిగా బాపయ్య చౌదరి(బాపు) నూతి చేసిన సేవా కార్యక్రమాలు సమాజంలో స్ఫూర్తిని నింపేలా ఉన్నాయని నీతి అయోగ్ కొనియాడింది. బాపు నూతి సేవలను అభినందిస్తూ నీతి ఆయోగ్ సభ్యులు పద్మభూషణ్ డాక్టర్ విజయ్ కుమార్ సరస్వత్ గుర్తింపు పత్రాన్ని బాపు నూతికి అందించారు. గత రెండు సంవత్సరాలుగా వేలాది మందికి సహాయక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు బాపు నూతికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని నీతి ఆయోగ్ భవన్ లో బాపు నూతికి గుర్తింపు పత్రాన్ని ఇచ్చి విజయ్ కుమార్ అభినందించారు. ముఖ్యంగా నాట్స్ మన గ్రామం-మన బాధ్యత కార్యక్రమం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు, దివ్యాంగుల కోసం ఆటిజం కేర్ అండ్ వీల్ పేరుతో మొబైల్ ఏర్పాటు చేయడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆటిజం కేర్ ఆన్ వీల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ, అటవీ ప్రాంతాలలో దివ్యాంగులకు సహాయపడే విధంగా డాక్టర్స్, ఫిజియోథెరపిస్ట్, ఎడ్యుకేషన్ కిట్స్ ను పంపించి వారి ఎదుగుదలకు తోడ్పాటు అందించడం చాలా గొప్ప విషయం అని విజయ్ కుమార్ అన్నారు. నాట్స్, స్పర్ష్ ఫౌండేషన్ సంస్థలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని దివ్యాంగులకు, పిల్లలకు సేవా కార్యక్రమాలతో పాటు మొబైల్ వ్యాన్ ని ఏర్పాటు చేసి డాక్టర్స్ ద్వారా సేవలను అందించడం అభినందనీయమన్నారు. దివ్యాంగులకు పునరావాస కార్యక్రమాలు చేపట్టడం, గ్రామీణ గిరిజన తండాల్లోని వైద్య సేవలు, అవసరమైన వారిని గుర్తించి సహాయం అందించడం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బాపు నూతి తో పాటు నాట్స్ డల్లాస్ నాయకులు రవి తాండ్ర, స్పర్ష్ ఫౌండేషన్ అధినేత పంచముఖి, డా. జ్యోతిర్మయి పాల్గొన్నారు.(చదవండి: నాట్స్ నూతన అధ్యక్షుడిగా మదన్ పాములపాటి) -
కోవిడ్ సమయంలో ‘ఊపిరి’పోశారు
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్సిజన్ పడకలను భారీగా పెంచినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2020 ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో కేవలం 2,643 ఆక్సిజన్ పడకలు మాత్రమే ఉండగా అనంతరం నాలుగేళ్లలో అదనంగా 15,376 ఆక్సిజన్ పడకలను పెంచినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో ఆక్సిజన్ పడకల సంఖ్య 18,019కి చేరినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి చాలా వేగంగా ఆక్సిజన్ పడకలను పెంచడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందించడానికి పలు చర్యలను చేపట్టింది. ఆక్సిజన్ పడకల సంఖ్య దేశంలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్నారు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. వికసిత్ భారత్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు అనుసరించిన ఉత్తమ ఆచరణలను నీతి ఆయోగ్ వెల్లడించింది. మార్చి 2020లో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి అంటువ్యాధుల చట్టాన్ని అమలులోకి తెచ్చిన మొదటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. రాజకీయ నిబద్ధత, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం, టెలిమెడిసిన్ వంటి డిజిటల్ సాంకేతిక సాధనాల వినియోగం, ఫ్రంట్‌లైన్ కార్మికులకు ముందస్తు శిక్షణ, అవగాహన కోసం కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రచారాలు, నిఘాపై దృష్టి కేంద్రీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో మరణాల రేటు తక్కువగా ఉందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. రాజకీయ నిబద్ధతతో పాటు అధికారులు, భాగస్వాముల మధ్య సమన్వయం, ముందస్తు స్క్రీనింగ్‌లు, నిఘా, ట్రేసింగ్, టెస్టింగ్, ఐసోలేటింగ్, డిజిటల్ పద్ధతులు ఏపీ ప్రభుత్వం అమలు చేసిందని పేర్కొంది. క్షేత్ర స్థాయి పరిస్థితిని పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయడం, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలను అవసరమైన సాధనాలతో సన్నద్ధం చేయడం, కమ్యూనిటీలతో నిమగ్నమవ్వడం, ప్రజల మానసిక, సామాజిక అవసరాలను పరిష్కరించడం, అవసరమైన ఆరోగ్య సేవల పంపిణీకి హామీ ఇవ్వడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అదుపులో ఉంచిందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశంలో అత్యధికంగా కోవిడ్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించినట్లు తెలిపింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ ఫుల్ క్లారిటీ
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారానికి నీతి ఆయోగ్ చెక్
సాక్షి, న్యూఢిల్లీ: పచ్చమీడియా విషప్రచారాన్ని అండగా చేసుకుని చెలరేగిపోయి, రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించాలని చూసిన చంద్రబాబు నాయుడికి దిమ్మదిరిగే షాక్ నీతి ఆయోగ్ రూపంలో తగిలింది. ఎన్నికల ప్రచారంలో దూషణలు, పనికిమాలిన అబద్ధాలు చెప్పి ప్రజలను వంచించాలని చూసిన ఈ పచ్చపార్టీ అధినేతకు ఇది శరాఘాతమే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు గణం చేసిన దుష్ప్రచారానికి నీతి ఆయోగ్ ఫుల్స్టాప్ పెట్టింది. ఈ చట్టానికి సంబంధించి కీలక సమాచారాన్ని వెల్లడించింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఈ చట్టం వల్ల భూములన్నీ మరింత భద్రంగా ఉంటాయని... భూ పరిపాలన మరింత సులువవుతుందని పేర్కొంది. భూములపై రైతులకు సర్వహక్కులూ లభిస్తాయని... ఈ చట్టంతో పటిష్ఠమైన భూ యాజమాన్య నిర్వహణ సాధ్యమవుతుందని వెల్లడించింది.సమాచార హక్కు చట్టం కింద సాక్షి టీవీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ నాగిళ్ల వెంకటేష్ అడిగిన ప్రశ్నలకు నీతి ఆయోగ్‌లోని జల, భూవనరుల శాఖ ఈ విషయమై స్పష్టతను ఇచ్చింది. ఆ శాఖ అండర్ సెక్రటరీ రవీందర్ కౌర్ గురువారం ఒక లేఖ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు సంబంధించిన ముసాయిదాను కేంద్ర భూవనరుల శాఖతో పాటు అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే పంపించామని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..
-
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
సాక్షి, ఢిల్లీ: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భేష్ అన్న నీతి ఆయోగ్.. ఈ చట్టం తో రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదని స్పష్టం చేసింది. ఈ చట్టం వల్ల భూములన్నీ మరింత భద్రం అని.. భూములపై రైతులకు సర్వహక్కులు లభిస్తాయని పేర్కొంది.పటిష్టమైన భూ యాజమాన్య నిర్వహణకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని.. ఈ చట్టంతో భూ పరిపాలన మరింత సులువవుతుందన్న నీతి ఆయోగ్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారానికి చెక్ పెట్టింది. సాక్షి డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్ వెంకటేష్ అడిగిన ఆర్టీఐ ప్రశ్నకు నీతి ఆయోగ్ సమాధానం పంపింది.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్” కు వ్యతిరేకంగా జరిగిన విస్తృత ప్రచారానికి నీతి అయోగ్ వివరణతో రైతుల్లో భరోసా, నమ్మకం పెరగనుంది. ఇక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై రైతుల అనుమానాలు తొలగనున్నాయి. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై రైతులను తప్పుదోవ పట్టించిన ప్రచారానికి చెల్లు చీటీ పడింది.అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే నీతి ఆయోగ్ సమాధానం పంపింది. నీతి ఆయోగ చైర్మనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాగా, టీడీపీ-జనసేన కూటమి దుష్ప్రచారానికి ఇక చెక్ పడినట్లే.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో రైతులకు టైటిల్ పై పరిపూర్ణ హక్కుల లభిస్తాయని ఇప్పటికే సీఎం జగన్ స్పష్టం చేశారు. సీఎం జగన్ మాటనే బలపరుస్తూ నీతి ఆయోగ్ సమాధానం ఇచ్చింది. ఈ అంశంతో మరోసారి విశ్వసనీయతకు సీఎం జగన్ మారుపేరుగా నిలిచారు.కాగా, ఓటమి భయంతో చంద్రబాబు గ్యాంగ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేసింది. చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేక వైఎస్ జగన్‌పైన, ఆయన ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసి, ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే ప్రజల భూములపై వారికే హక్కులు కల్పించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై నీచమైన ప్రచారానికి ఒడిగట్టింది. భూముల వ్యవస్థను సమూలంగా మార్చడం ద్వారా ప్రజలకు.. తద్వారా సమాజానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ఈ చట్టాన్ని స్వలాభం కోసం వివాదాస్పదంగా మార్చింది.భూముల సమగ్ర సర్వే ద్వారా భూమి రికార్డులను ఆధునీకరించి వాటిపై ప్రజలకు శాశ్వత భూ హక్కులు కల్పించేదే ల్యాండ్ టైట్లింగ్ చట్టం. దీనివల్ల రికార్డుల భద్రత, రిజిస్ట్రేషన్లలో పారదర్శకత, ఆస్తుల రక్షణకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తాయి.ప్రస్తుతం భూమి హక్కులు అంటే కనీసం 30 రికార్డులు చూసుకోవాలి. అన్ని వివరాలూ స్పష్టంగా ఉన్నా, 30 పత్రాలు బాగున్నా ఏదో ఒక విధంగా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దీంతో ఏ భూమినైనా వివాదాస్పదంగా మార్చొచ్చు. వివాదంలో ఉన్న భూమిని తిరిగి భూ యజమాని తన పేరు మీదకు తెచ్చుకోవాలంటే కోర్టుకే వెళ్లాలి. ఏళ్లకు ఏళ్లు వేచి చూడాలి. కింది కోర్టు, పైకోర్టు అంటూ తిరగాలి. ఈ అవస్థలన్నింటినీ తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకువచ్చింది. -
సేద్యంలో సేవలకు సలాం
సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్త పథకాలు, ఉత్తమ విధానాలు అమలు చేస్తోందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలు అనుసరించి ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలు చేయడంతో అప్పుల వలయం నుంచి రైతాంగం విముక్తి పొందుతున్నారనీ, ఆర్బీకేలు పారదర్శకంగా ఉంటూ రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని కితాబిచ్చింది. వికసిత్ భారత్ దిశగా ప్రోత్సాహానికి వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు, ఆచరణలతో నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల కోసం కొత్తగా అమలు చేస్తున్న పథకాలు.. ఉత్తమ విధానాలు, ఆచరణలను ప్రముఖంగా ప్రస్తావించింది. వీటిని ఇతర రాష్ట్రాలు నేర్చుకోవడానికి, భాగస్వామ్యం చేయడానికి నివేదికను విడుదల చేసినట్లు పేర్కొంది. ఈ నివేదికలో నీతి ఆయోగ్ పేర్కొన్న అంశాలివే.. వడ్డీ భారం మొత్తం ప్రభుత్వమే చెల్లింపు వైఎస్సార్ సున్నా వడ్డీతో రుణ భారం నుంచి రైతులు విముక్తి పొందారు. వారి సంక్షేమం, ప్రయోజనాలే లక్ష్యంగా ఈ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. సకాలంలో పంట రుణాలు చెల్లించే రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని ప్రభుత్వం వర్తింప చేస్తోంది. వడ్డీ రాయితీ మొత్తాన్ని రైతుల బ్యాంకుల ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తోంది. వడ్డీ భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ..లబ్ధిదారులు సకాలంలో రుణాన్ని చెల్లిస్తే ప్రభుత్వం వడ్డీని తిరిగి చెల్లిస్తోంది. పంటలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా రైతుల ప్రయోజనాల కోసం సీఎం వైఎస్ జగన్ ఉచిత పంటల బీమా కొత్త పథకాన్ని అమలు చేస్తున్నారు.ఈ పథకం కింద రైతుల నమోదును సులభతరం చేయడంతో పాటు కేవలం టోకెన్‌గా ఒక రూపాయి మాత్రమే వసూలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఉచిత పంటల బీమాను వర్తింప చేయడంతో రైతులకు వరంగా మారింది. వాతావరణ మార్పులు, ప్రకతి వైపరీత్యాలు లాంటి సమయాల్లో పంటలు దెబ్బతిన్న రైతులకు ఆయా సీజన్లోనే క్లెయిమ్‌లను నేరుగా రైతుల ఖాతాలకే జమ చేస్తున్నారు. దీంతోపాటు పంటల భౌతిక ధ్రువీకరణ కూడా రైతులకు అందిస్తోంది. రైతాంగానికి బీమా నమోదు రసీదులను కూడా పంపిణీ చేస్తున్నారు. ఉచిత పంటల బీమా నమోదు ప్రక్రియ వీలైనంత సరళంగా, అవాంతరాలు లేకుండా చేస్తున్నారు. ఈ పథకం విజయవంతంగా అమలయ్యే తీరు వ్యవసాయ అభివద్ధిని సూచిస్తోంది. రైతు భరోసా అందించే ఏకైక రాష్ట్రం వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలను ఏపీ ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తోందని నీతి ఆయోగ్ పేర్కొంది. రైతులకు ఆర్థిక సాయం గ్రాంట్‌గా అందిస్తున్నారని తెలిపింది. ఏడాదిలో మూడు విడతల్లో రైతులకు రూ.13,500 చొప్పున అందిస్తున్నారని, సీజన్ ప్రారంభంలో భూమిని సిద్ధం చేసి, విత్తనాలు కొనుగోలు చేయడం, ఎరువులు, కూలీల చార్జీల నిమిత్తం రైతులకు ఉపయోగపడేలా ఈ పథకాలను అమలు చేస్తున్నారని నివేదిక వివరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు ఈ పథకంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొంది. ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ.8,748 కోట్లు వ్యవసాయంలో ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.8,748 కోట్లు చెల్లిస్తోందని నీతి ఆయోగ్ నివేదికలో తెలిపింది. దీన్ని మరింత పటిష్టపరిచేందుకు వచ్చే 30 ఏళ్ల పాటు నిరంతరాయంగా కొనసాగించేందుకు ముందస్తు చర్యలను ప్రభుత్వం చేపట్టిందని నివేదిక స్పష్టం చేసింది. దీంతో పాటు వ్యవసాయ విద్యుత్‌కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోందని, ఇందుకోసం అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల బిల్లులకు ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తుందని పేర్కొంది. ఉచిత విద్యుత్ బిల్లు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపింది. కేంద్రం సూచించిన సంస్కరణల్లో భాగంగా నగదు బదిలీ పథకాన్ని అమలు చేయనుందని, ఈ పథకంలో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడంతో రైతులపై ఆరి్థక భారాన్ని తగ్గిస్తుందని తెలిపింది. వచ్చే 30 ఏళ్లపాటు ఉచిత విద్యుత్ అందించడానికి 10,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను అభివద్ధి చేయనుందని తెలిపింది. రైతుల వ్యవసాయానికి ఉచితంగా పగటి పూట 9 గంటలపాటు విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్మిషన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.1,700 కోట్లను ప్రభుత్వం వ్యయం చేసిందని నివేదిక తెలిపింది.అందివచ్చిన ఆర్బీకేలు: వ్యవసాయంలో సవాళ్లను పరిష్కరించేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇది ఉత్తమ ఆచరణగా నీతి ఆయోగ్ కితాబు ఇచ్చింది. రైతులకు నాణ్యమైన ఇన్పుట్లు, సేవలు అందించడంతోపాటు సామర్థ్యం పెంపుదల, విజ్ఞాన వ్యాప్తిని ఆర్బీకేలు అందిస్తున్నాయని తెలిపింది. ఇవి పంటల సేకరణ కేంద్రాలుగా పని చేస్తూ రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా పారదర్శకంగా రైతాంగానికి భరోసా ఇస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ కేంద్రాలు అధిక దిగుబడి సాధించడంలోను, పంటల నాణ్యతను మెరుగుపరిచేందుకు సహాయపడటంలో విజయవంతమయ్యాయని నివేదిక తెలిపింది. ఆర్బీకేలను పంటల కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించిన తరువాత రైతులు తమ ఉత్పత్తులను గ్రామంలోనే విక్రయించుకునే వీలు కలిగింది. వీటి ద్వారా రైతాంగం ప్రభుత్వ పథకాలు నేరుగా పొందుతున్నారు. ముందుగా పరీక్షించడం ద్వారా నకిలీ విత్తనాలను నిరోధించడంతో పాటు ప్రైవేట్ అవుట్లెట్లలో అధిక ధరలను నిరోధిస్తున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ, ఉచిత పంటల బీమా నమోదు కార్యక్రమాలు ఆర్బీకేలు నిర్వహిస్తున్నాయి. రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు శాస్త్రవేత్తలు అందిస్తున్నారు. -
ఏపీ ఆక్వా చట్టాలు దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో ఆక్వారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, చట్టాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని కేంద్రం కితాబునిచ్చింది. రాష్ట్రంలో ఆక్వారంగం బలోపేతం కోసం అవసరమైన తోడ్పాటు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, నీతి ఆయోగ్ సీఈవో పీవీఆర్ సుబ్రహ్మణ్యం, నీతి ఆయోగ్ జాతీయ సలహాదారు నీలం పటేల్ స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ ఆహ్వానం మేరకు న్యూఢిల్లీ వెళ్లిన ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురాం శుక్రవారం వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆక్వారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎంతో ముందుచూపుతో అడుగులు వేస్తున్నారని, ఈ రంగంలో తెచ్చిన సంస్కరణలు నిజంగా ప్రశంసనీయమని అన్నారు. భవిష్యత్‌లో ఆక్వారంగం మరింత పుంజుకునేందుకు ఇవి ఎంతో దోహద పడతాయన్నారు. కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు, ఈ–ఫిష్ సర్వే ద్వారా ఆక్వా సాగు గుర్తింపు, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్, ఆన్లైన్ ద్వారా లైసెన్సుల జారీ వంటి కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. జాతీయ స్థాయిలో ఆచరించతగ్గ కార్యక్రమాలని చెప్పారు. ఏపీ ఆక్వా కార్యక్రమాలను ఇటీవల ఆ రాష్ట్రంలో పర్యటించినపుడు స్వయంగా చూశామన్నారు. 15 రోజులకోసారి సమీక్ష రాష్ట్రంలో ఆక్వా అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం కేంద్రమంత్రికి, నీతి ఆయోగ్ సీఈవోకు వివరించారు. ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నం.1 స్థానంలో ఉందన్నారు. ఈ రంగం బలోపేతం కోసం సీఎం వైఎస్ జగన్ గడిచిన ఐదేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి రైతులకు అన్ని విధాలుగా తోడుగా నిలుస్తున్నారని అన్నారు. ఆక్వా కార్యకలాపాలన్నీ కొత్తగా ఏర్పాటు చేసిన అప్సడా చట్ట పరిధిలోకి తీసుకొచ్చారని, నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరా కోసం ఏపీ సీడ్, ఫీడ్ యాక్టులను తీసుకొచ్చారని చెప్పారు. ప్రతీ 15 రోజులకోసారి అప్సడా ఆధ్వర్యంలో రైతులు, ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్టర్స్‌తో సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు రైతులకు యూనిట్ రూ. 1.50కే విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. ఇప్పటి వరకు రూ. 3,420 కోట్లు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరించిందన్నారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో మాట్లాడుతూ.. ఏపీలో జాతీయ పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, తాము అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచి అవసరమైన ప్రతిపాదనలు పంపితే ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలకు పెద్దపీట
న్యూఢిల్లీ: భారతదేశంలో పన్ను సంస్కరణలతో పాటు, సీనియర్ సిటిజన్లకు తప్పనిసరి పొదుపు, గృహనిర్మాణ ప్రణాళిక అవసరమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. దేశ జనభాలో 2050 నాటికి సీనియర్ సిటిజన్ల వాటా 19.5 శాతానికి చేరుకుంటుందని, ఈ నేపథ్యంలో వారి ప్రయోజనాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది. భారతదేశంలో సీనియర్ సిటిజన్ల భద్రత– సంస్కరణలు అనే అంశంపై ఒక నివేదికను ఆవిష్కరించిన నీతి ఆయోగ్, సీనియర్ సిటిజన్లకు అన్ని సేవలను సులువుగా అందుబాటులోకి తీసుకురావడానికి ఒక జాతీయ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది. ‘‘భారత్‌లో సామాజిక భద్రతా విధాన చర్యలు పరిమితంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా మంది వృద్ధులు వారి పొదుపు నుండి వచ్చే ఆదాయంపై ఆధారపడతారు. కొన్ని సందర్భాల్లో నెలకొనే తక్కువ వడ్డీ రేట్ల వ్యవస్థ వారి ఆదాయ కోతకు దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ వడ్డీరేట్లు జీవనోపాధి స్థాయిల కంటే కూడా తక్కువగా ఉంటాయి’’ అని నివేదిక వివరించింది. అందువల్ల ఆయా అంశాల పరిశీలనకు, సీనియర్ సిటిజన్ల ప్రయోజనాల పరిరక్షణకు ఒక నియంత్రణా యంత్రాంగం అవసరమని ఉద్ఘాటించింది. వృద్ధ మహిళలకు మరింత రాయితీ ఇవ్వడం అవసరమని, అది వారి ఆరి్థక శ్రేయస్సుకు దోహదం చేస్తుందని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం భారతదేశంలో వృద్ధులు ప్రస్తుతం జనాభాలో 10 శాతానికి పైగా (10 కోట్లకు పైగా) ఉన్నారు. 2050 నాటికి మొత్తం జనాభాలో ఇది 19.5 శాతానికి చేరుతుందని అంచనా. సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలకుగాను పన్ను సంస్కరణలు, దత్తత వ్యవస్థ నిబంధనావళి సరళీకరణ అవసరమని కూడా నీతి ఆయోగ్ నివేదిక ఉద్ఘాటించింది. భారతదేశంలో 75 శాతం కంటే ఎక్కువ మంది వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని వివరించింది. -
వికసిత్ భారత్‌కు ప్రధాన ఆర్థిక దిక్సూచి విశాఖ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కీలకమైన విశాఖ నగరం దేశ ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించడంలో తనవంతు పాత్ర పోషించనుంది. రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు దిక్సూచిగా విశాఖను మరింత ఉన్నతస్థితికి తీసుకెళ్లేందుకు దీనిని పరిపాలన రాజధానిగా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ నగరాన్ని మరింత పరిపుష్టం చేసేందుకు నిరంతరం కృషిచేస్తున్నారు. ఇక్కడి పలు ప్రాజెక్టులను పూర్తిచేయాలని ఇటీవల ప్రధాని మోదీని కోరిన విషయం తెలిసిందే. దేశ ఆర్థికవ్యవస్థలో విశాఖ నగర ప్రాధాన్యాన్ని తాజాగా నీతి ఆయోగ్ కూడా గుర్తించింది. భారత ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించే కీలక నగరాల్లో విశాఖపట్నం కీలకపాత్ర పోషించనుందని ప్రకటించింది. వికసిత్ భారత్–2047 కింద దేశీయ ఆర్థికవ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.2,500 లక్షల కోట్లు)కి చేర్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విజన్‌తో ముందుకెళుతోంది. 2047 నాటికి భారత ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించే నగరాలను గుర్తిస్తూ నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తొలిసారిగా 2047 వరకు దేశ ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించే నగరాల్లో ముంబై, సూరత్, వారణాసి, విశాఖపట్నం ఉన్నాయని నీతి ఆయోగ్ సీఈవో బి.వి.ఆర్.సుబ్రమణ్యం ప్రకటించారు. వీటితోపాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎకనామిక్ హబ్స్‌గా కీలకపాత్ర పోషించే మరో 20 నుంచి 25 పట్టణాలను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు పట్టణాల ఆర్థిక ప్రణాళికలు కాకుండా కేవలం పట్టణ అభివృద్ధి ప్రణాళికలకు పరిమితమయ్యామని, కానీ ఇప్పుడు ముంబై, సూరత్, వారణాసి, విశాఖపట్నంలను ఆర్థిక చోదకశక్తులుగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలను రూపొందించనున్నట్లు వివరించారు. వికసిత్ భారత్–2047 లక్ష్యాలను చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 11న సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా దేశ యువతను కోరింది. ఇప్పటివరకు 10 లక్షలకుపైగా వివరణాత్మకమైన సూచనలు, సలహాలు వచ్చాయని, వీటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రోడీకరించి విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ విజన్ డాక్యుమెంట్ వికసిత్ భారత్–2047ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఐటీకి అనుకూలమని గతంలోనేగుర్తించిన నాస్కామ్–డెలాయిట్ ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు విశాఖ అనువైన ప్రాంతమని గతంలో నాస్కామ్–డెలాయిట్ గుర్తించిన సంగతి తెలిసిందే. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మౌలికవసతులు, రిస్క్–వ్యవస్థల నియంత్రణ, స్టార్టప్ ఎకోసిస్టమ్, సోషల్–లివింగ్ ఎన్విరాన్మెంట్ అనే అయిదు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని వీటిని ఎంపిక చేసినట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఐటీ పేరుతో ఇప్పటికే విశాఖను ప్రోత్సహిస్తుండటమే కాకుండా నూతన తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు, స్టార్టప్ ఇంక్యుబేటర్స్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. దీంతో ఇన్ఫోసిస్, రాండ్‌శాండ్, బీఈఎల్, అమెజాన్ వంటి ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖకు విస్తరించగా, మరికొన్ని కంపెనీలు త్వరలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ బ్రాండింగ్ శక్తిమంతమైన ఈ నగరానికి మరిన్ని వసతులు, వనరులు కల్పించేందుకు, అంతర్జాతీయంగా విశాఖ బ్రాండింగ్‌ను పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. జీ20 సమావేశాలు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్, అంతర్జాతీయ వైద్యసదస్సు, మారిటైమ్ సదస్సు.. ఇలా అనేక అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించడం ద్వారా విశాఖకు గ్లోబల్ బ్రాండింగ్‌ను తీసుకొచ్చింది. తద్వారా మరిన్ని పెట్టుబడుల ఆకర్షణకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు మార్గం ఏర్పడింది. ఇటీవల ప్రధానితో సమావేశమైన సీఎం వైఎస్ జగన్ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు త్వరగా ఆమోదం తెలపాలని కోరారు. విభజన చట్టంలో పొందుపరచిన విశాఖ–కర్నూలు హైస్పీడ్ కారిడార్‌ను కడప మీదుగా బెంగళూరు వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో అనుసంధానిస్తూ భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖ పోర్టును కలిపే 55 కిలోమీటర్ల పొడవైన ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. -
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నీతి ఆయోగ్ బృందం
-
ఆర్థిక సంఘం నూతన చైర్మన్‌గా అరవింద్ పనగరియా
న్యూఢిల్లీ: నీతీ ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాను 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికశాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రితి్వక్ రంజనం పాండేను ఆర్థికసంఘం కార్యదర్శిగా నియమించారు. పనగరియా గతంలో కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా సేవలందించారు. నూతన ఆర్థిక సంఘం 2026–27 నుంచి 2030–31 కాలానికి సంబంధించిన ఐదేళ్ల నివేదికను 2025 అక్టోబర్ 31వ తేదీకల్లా రాష్ట్రపతికి నివేదించనుంది. 16వ ఆర్థిక సంఘం ఏర్పాటు, విధి విధానాలు, కార్యచరణను నవంబర్ నెలలో ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రిమండలి ఆమోదించింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపకం, రెవిన్యూ వాటా తదితరాలపై ఆర్థిక సంఘం సూచనలు, సలహాలు ఇవ్వనుంది. విపత్తు నిర్వహణ చట్టం,2005 కింద మంజూరైన నిధులు కేంద్ర, రాష్ట్రాల్లో ఏ మేరకు సది్వనియోగం అవుతున్నాయనే అంశాలపై సంఘం సమీక్ష చేపట్టనుంది. 14వ ఆర్థిక సంఘం సలహా మాదిరే 2021–22 నుంచి 2025–26 ఐదేళ్లకాలానికి కేంద్రం పన్ను రాబడుల్లో 41 శాతం వాటా రాష్ట్రాలకు దక్కాలని ఎన్కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం సిఫార్సుచేయడం తెల్సిందే. ఫైనాన్స్ కమిషన్ కేంద్ర,రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సూచనలు ఇచ్చే రాజ్యాంగబద్ధ సంస్థ. -
ఆంధ్రా తీరం.. ఆర్థికంగా ఊతం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి 50 కి.మీకు ఒక్క పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు (మినీ పోర్టు)లను నిర్మిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు పోర్టులతో పాటు పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టి రికార్డు సృష్టించింది. ఇందుకోసం సుమారు రూ.20,000 కోట్లు వ్యయం చేస్తుండటం గమనార్హం. తొలి దశలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల పనులు దాదాపు పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధం కానున్నాయి. ఎగుమతులను ప్రోత్స హించే విధంగా తీర ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. 2022 సంవత్సరానికి నీతి ఆయోగ్ ప్రకటించిన ఎగుమతి సన్నద్ధత రాష్ట్రాల్లో రాష్ట్రం 59.27 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు మత్స్యకారులు చేపల వేటకు గుజరాత్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. మరో వైపు పోర్టులను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కలా పారిశ్రామిక ప్రగతిని వెదజల్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. సుమారు 8,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కుతో పాటు తెట్టు వద్ద కార్గొ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ల సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎగుమతుల్లో 10 శాతం వాటా లక్ష్యం దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేజిక్కించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. 2030 నాటికి 10 శాతం మార్కెట్ వాటాతో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆరు నెలల కాలంలో రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల విలువ రూ. 82,732.65 కోట్ల నుంచి రూ.85,021.74 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఎగుమతుల విలువ రూ. 18,17,640.99 కోట్ల నుంచి రూ. 17,42,429.99 కోట్లకు పడిపోవడం గమనార్హం. 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రాష్ట్రం రూ.1,59,368.02 కోట్ల ఎగుమతులు చేయడం ద్వారా 4.40 శాతం వాటాతో ఆరో స్థానంలో నిలవగా, ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో రూ. 85,021.74 కోట్ల ఎగుమతులతో దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటాను 4.88 శాతంకు పెంచుకొని ఐదో స్థానానికి ఎగబాకింది. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ♦ విశాఖపట్నం జిల్లా భీమిలి ♦ అనకాపల్లి జిల్లా రాజయ్యపేట, దొండవాక ♦ విజయనగరం జిల్లా చింతపల్లి ♦ తిరుపతి జిల్లా రాయదరువు ♦ కాకినాడ జిల్లా ఉప్పలంక -
Covid-19: కరోనా కేసుల ఉధృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 614 కొత్త కేసులు నమోదయ్యాయి. మే 21వ తేదీ తర్వాత ఒక్క రోజులో ఇంతగా కొత్త కేసులు నమోదవడం ఇదే తొలిసారికావడం గమనార్హం. గత 24 గంటల్లో కేరళలో ముగ్గురు కోవిడ్‌తో కన్నుమూశారు. భారత్‌లో కొత్తగా వెలుగుచూసిన జేఎన్1 ఉపరకం వైరస్ కేసులు ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో 21 నమోదయ్యాయని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ చెప్పారు. ఈ వైరస్ సోకినవారు 92 శాతం వరకు ఇంటివద్దే చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,311కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్, కర్ణాటకల్లో రోజువారీ కేసుల సంఖ్యలో మరింత పెరుగుదల కనిపించింది. ఆరోగ్య మంత్రి ఉన్నతస్థాయి సమావేశం కేసుల ఉదృతి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘‘ పెరుగుతున్న కేసులతో ఆందోళన అక్కర్లేదు. కానీ అప్రమత్తంగా ఉండండి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం, కరోనా కేసుల నిర్ధారణ పరీక్షల పెంపు, ఆస్పత్రుల్లో చికిత్స సన్నద్ధత అంశాలపై సూచనలు చేశారు. కొత్తరకం వేరియంట్‌గా భావించే అనుమానిత కేసుల శాంపిళ్లను వెంటనే ఇన్సాకాగ్ జన్యక్రమ విశ్లేషణ ల్యాబ్‌లకు పంపండి. కేసుల నిర్ధారణ, నిఘా, చికిత్స విధానాలను పటిష్టంచేయండి. ఆస్పత్రుల్లో మెడికల్ ఆక్సిజన్, పడకలు, వెంటిలేటర్లు, వైద్య ఉపకరణాలు, ఆక్సిజన్ ప్లాంట్లు తదితరాల లభ్యతను ఎప్పటికప్పుడు సరిచూసుకోండి. ఈ సన్నద్దతపై ప్రతి మూడు నెలలకు ఒకసారి మాక్ డ్రిల్ నిర్వహించండి. వైరస్ విస్తృతిపై ప్రజల్లో అవగాహన పెంచండి’’ అని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు. దేశంలో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి వివరాలతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాన్‡్ష పంత్ మంత్రికి ఒక ప్రజెంటేషన్ చూపించారు. కొత్త జేఎన్1 సబ్‌వేరియంట్‌ను ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రస్ట్’ పరిగణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వ్యాప్తి వేగం ఎక్కువగా ఉన్నా రిస్క్ తక్కువేనంది. అమెరికా, చైనా, సింగపూర్, భారత్‌లలో ఈ వైరస్ వెలుగు చూసింది. -
ఇటు అభివృద్ధి .. అటు పేదరికం!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఒక రాష్ట్రం అభివృద్ధికి.. ఒక నగరం. కొన్ని పట్టణాలు, పలు గ్రామాలే కొలబద్ద కాదు. ఏ మూలకు వెళ్లినా కాస్త అటుఇటుగానైనా అభివృద్ధి, ఒకే జీవన విధానం, సమాన అవకాశాలు ఉండాలి. అలా ఉండేలా చూడటం ప్రభుత్వాల విధి. కానీ గణనీయమైన అభివృద్ధి, అపార అవకాశాలు ఉన్న నగరాలు, గ్రామాలు ఒక వైపు.. అసలు తినేందుకు పౌష్టికాహారం, నడిచేందుకు రోడ్డు, ఉండేందుకు ఇళ్లులేని పేద ప్రాంతాలు మరోవైపు ఉంటే ప్రగతి గతి సరిగా లేదనే చెప్పాలి. తెలంగాణలో ఇదే విధమైన పరిస్థితి ఉంది. ఇటీవల నీతిఆయోగ్ విడుదల చేసిన బహుముఖ పేదరిక సూచి–2023.. గడిచిన ఏడేళ్లతో పోలిస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పేదరికం 7.3 శాతం తగ్గిందని వెల్లడించింది. 2015–16లో రాష్ట్రంలో 13.18 శాతం పేదలుండగా 2019 –21కి వచ్చే సరికి 5.88 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. అయితే కొమురంభీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం జాతీయ సగటు (14.96 శాతం)కు మించి పేదరికం నమోదు అవటం గమనించాల్సిన అంశం. గడిచిన పదేళ్ల క్రితమే విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో పైమూడు జిల్లాల్లో అసమగ్ర అభివృద్ధి, సంక్షేమం ఉందని తేలినా.. అక్కడ ప్రత్యేక ప్రణాళిక, కార్యాచరణ అమలు చేయని కారణంగా ఇంకా ఆయా జిల్లాలు అత్యధిక పేద జిల్లాలుగానే కొనసాగుతున్నాయి. ఇక్కడ అన్నీ సమస్యలే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికల ఆధారంగా నీతిఆయోగ్ బాలికా శిశు, బాలింతల ఆరోగ్యం, విద్య, పారిశుధ్యం, విద్యుత్, మంచినీరు, సొంత ఆస్తులు, బ్యాంక్ అకౌంట్ తదితర పన్నెండు అంశాలను తీసుకుని తెలంగాణలోని పేదల లెక్కలు తీసింది. అందులో అత్యధికం తినేందుకు పౌష్టికాహారం, ఉండేందుకు సరైన ఇంటి వసతి లేని వారి సంఖ్యే ఎక్కువగా ఉందని తేలింది. అలాగే అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లు, వసతులు, ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఎక్కువగా ఉండటం శోచనీయం. ఆరు కిలోమీటర్లు నడిస్తేనే.. కొమురంభీం జిల్లా తిర్యాణి మండలం భీమ్రెల్ల గ్రామానికి వెళ్లే దారి ఇది. మండల కేంద్రం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే భీమ్రెల్లకు వెళ్లాలంటే ముల్కలమంద పంచాయతీ పరిధిలోని తోయరేటి వరకు వాహనంలో వెళ్లాలి. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్లు నడిస్తేనే గానీ గ్రామానికి చేరుకోలేం. ఈ గూడెంలో 50 మంది ఆదివాసీలు నివాసం ఉంటున్నారు. బండరాళ్ల దారిలో కాలినడక! ఇది కొమురంభీం జిల్లా కెరమెరి మండలం లైన్‌పటార్ గ్రామానికి వెళ్లే రోడ్డు. ఈ గ్రామంలో 113 మంది జనాభా ఉన్నారు. దారి మొత్తం బండరాళ్లతో అధ్వానంగా ఉంది. దారి మధ్యలో రెండు ఒర్రెలు కూడా ఉండటంతో వర్షాకాలంలో ఆదివాసీల అవస్థలు వర్ణనాతీతం. పిల్లలు, పెద్దలు ఎవరైనా.. ఇలా ఇబ్బందులు పడాల్సిందే. అక్షరాస్యతలో అధ్వానం.. గట్టు జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అక్షరాస్యతలో దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంది. మండలంలో 36 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. మండలంలో 60 పాఠశాలలు ఉన్నాయి. కానీ సరైన వసతులు లేవు. టీచర్ల కొరత వేధిస్తోంది. ఎక్కువమంది తల్లిదండ్రులు పిల్లలను పనులకు పంపించేస్తున్నారు. ఆడపిల్లలను చదివించేందుకు పెద్దగా శ్రద్ధ చూపరు. సీడ్ పత్తి సీజన్ (పత్తి మొగ్గ గిల్లేందుకు చిన్నపిల్లలు అవసరం. దీంతో సీజన్లో ఎక్కువగా చిన్నపిల్లలను రైతులు పనుల్లో పెట్టుకుంటారు. పిల్లలు బడికి వెళ్లకపోవడానికి ఇదో ప్రధాన కారణం. అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా స్పందన అంతంత మాత్రమే. ఈ కారణంగా గట్టు మండలం పూర్తిగా వెనుకబడి ఉంది. ప్రత్యేక కార్యాచరణ అవసరం పేదరికం, వెనుకబాటుపై ప్రత్యేక కార్యాచరణ ఉండాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పదేళ్లవుతున్నా.. వెనుకబడిన ప్రాంతాలు అలాగే ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. – ప్రొఫెసర్ కె.ముత్యంరెడ్డి, తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు లేవు వెనుకబాటు, అసమానతల వల్లే తెలంగాణ నినాదం పుట్టింది. ఈ రెండింటినీ లేకుండా చేయటం కోసమే తెలంగాణ ఏర్పడింది. కానీ గడిచిన పదేళ్లలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై ప్రణాళికలు, రాజకీయ నిర్దేశనం లేకపోవటం వల్లే అభివృద్ధిలో అసమానతలు నెలకొన్నాయి. – గాదె ఇన్నయ్య, సామాజిక విశ్లేషకుడు -
రాష్ట్రాల అసమానతలు తొలగాలంటే...
16వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్స్) నియామకం త్వరలో జరగనుందని భావిస్తున్నారు. 15వ కమిషన్స్ ఏర్పాటైన 2017తో పోలిస్తే ఇప్పుడు ప్రపంచ, దేశీయ సవాళ్లు భిన్నంగా ఉన్నాయి. కోవిడ్–19 ప్రేరేపించిన ఆర్థిక షాక్‌లు, భౌగోళిక రాజకీయ సవాళ్లతో సహా ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితిని 16వ కమిషన్స్ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఫైనాన్స్ ్స కమిషన్స్ మినహా మరే ఇతర ప్రభుత్వ సంస్థ కూడా రాష్ట్రాల మధ్య అసమానతలపై దృష్టి సారించలేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి అన్నారు. కొన్ని రాష్ట్రాలు అఖిల భారత పేదరిక నిష్పత్తిలో చాలా వెనుకబడి ఉన్నాయి. 16వ ఆర్థిక సంఘం ఈ అసమానతలను పరిశీలించి, ఆర్థిక పరిష్కారాలను అందించాలి. 2022–23లో కేంద్రం, రాష్ట్రాల సంయుక్త లోటు, అప్పులు వరుసగా 10 శాతం, 89 శాతంగా ఉన్నాయి. కేంద్ర పన్ను రాబడిలో రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలి అనే క్షితిజ లంబ(వెర్టికల్) వాటాలనూ, దాన్ని రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ చేయాలి అనే క్షితిజ సమాంతర(హారిజాంటల్) వాటాలనూ ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. కేంద్ర పన్నుల భాగస్వామ్య పూల్‌లో రాష్ట్రాల వాటాలను 14వ ఆర్థిక కమిషన్స్ 32 నుండి 42 శాతానికి పెంచింది. అయితే రాష్ట్రాల సంఖ్యను 28కి తగ్గించినప్పుడు, రాష్ట్రాల వాటాను 41 శాతంగా 15వ కమిషన్స్ సిఫార్సు చేసింది. 2022–23లో 6.5 శాతం ఆర్థిక లోటు, 58 శాతం అప్పుతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అసమతుల్యతతో ఉన్నందున ఈ వాటాను పెంచే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. అయితే, 16వ ఆర్థిక కమిషన్స్ సెస్సులు, సర్‌ఛార్జీల అంశాన్ని పరిశీలించాలి. 2011–12లో ఉన్న 10 శాతం నికర పన్ను రాబడి (జీటీఅర్) నుండి 2019–20కి 20 శాతానికి పెరిగింది. వాస్తవానికి, కేంద్ర జీటీఅర్‌లో రాష్ట్రాల నిష్పత్తి 2018–19లో ఉన్న 36.6 శాతం నుండి 2022–23లో 30.2 శాతానికి తగ్గింది. సెస్సులు, సర్‌చార్జ్‌ల కోసం 10 శాతం జీటీఅర్ గరిష్ఠ పరిమితిగా ఉండాలని రంగరాజన్, శ్రీవాస్తవ సూచించారు. కమిషన్స్ దీనిని సిఫారసు చేయవచ్చు. అది 10 శాతాన్ని దాటితే, కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాను పెంచవచ్చు. మరో మాటలో చెప్పాలంటే– సెస్సులు, సర్ఛార్జ్ల వాటాపై ఆధార పడి క్షితిజ లంబ వాటాను మార్పు చేయవచ్చు. పెరుగుతున్న అంతరాలు ఫైనాన్స్ ్స కమిషన్స్ అమలు చేస్తున్న క్షితిజ సమాంతర పంపిణీ ఫార్ములా అనేది, రాష్ట్రాల అసమానతలను పరిష్కరించడానికి ఒక ముఖ్యమైన పరికరం. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి అసమాన తలపై రాసిన ఒక కథనంలో, ఫైనాన్స్ ్స కమిషన్స్ మినహా మరే ఇతర ప్రభుత్వ సంస్థ కూడా రాష్ట్రాల మధ్య అసమానతలపై దృష్టి సారించలేదని సూచించారు. అంతకుముందు ప్రణాళికా సంఘం తలసరి ఖర్చులు కూడా ధనిక రాష్ట్రాలకే ఎక్కువగా ఉండేవి. కేంద్ర ప్రాయో జిత పథకాలకు తగిన వాటా రాష్ట్రాలు చెల్లించగలగాలి. కానీ దేశీయ మార్కెట్ రుణాలు, బాహ్య రుణాల నిబంధనలు, షరతులు ధనిక రాష్ట్రాలకు అనుకూలంగా ఉంటాయి. అభివృద్ధి చెందిన రాష్ట్రాలలోనే పరిశ్రమ, వ్యాపారం కేంద్రీకృతమై ఉన్నందున బ్యాంక్ రుణ పరపతి తిరోగమనంగా ఉంటుంది. కేంద్ర పన్ను రాయితీలు కూడా తిరోగ మనంగానే ఉంటాయి. 12వ ఆర్థిక సంఘం నుండి 15వ ఆర్థిక సంఘం వరకు తలసరి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)పై పోల్చదగిన డేటాను పరిగణనలోకి తీసుకున్నప్పుడు రాష్ట్రాల్లో అసమా నతలు విస్తృతమవుతున్నాయి. రాష్ట్రాల వ్యాప్తంగా ‘కోఎఫిషియెంట్ ఆఫ్ వేరియేషన్స్’ 0.46 నుండి 0.67కి పెరిగింది. తలసరి జీఎస్డీపీలో అసమానతలు 15వ కమిషన్స్ నివేదికలో ఇచ్చిన డేటాలో అత్యధికంగా ఉన్నాయి. కాబట్టి, రాష్ట్ర స్థాయిలో ఆదాయంలో విస్తరిస్తున్న అసమాన తలను 16వ కమిషన్స్ పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్రాలన్నింటిలోనూ, క్షితిజ సమాంతర పంపిణీ అనేది జనాభా, ప్రాంతం, తలసరి ఆదాయం వంటి సూచికలపైనా, జనాభా మార్పు, అటవీ విస్తీర్ణం వంటి ప్రోత్సాహక సంబంధిత సూచికలపైనా ఆధారపడి ఉంటుంది. రాష్ట్రాలన్నింటిలోనూ ఆదాయ అసమానత లను పరిష్కరించడానికి తలసరి ఆదాయంలో అంతరం అత్యంత ముఖ్యమైన సూచిక. 15వ కమిషన్స్లో ఆదాయ అంతరం 45 శాతం. ఆదాయ అంతరం వెనుక ఉన్న ముఖ్యమైన ఆలోచన ఏమిటంటే, రాష్ట్రాల మధ్య ఆర్థిక సామర్థ్య వ్యత్యాసాలు అనేవి పౌరులకు ఆరోగ్యం, విద్య, నీరు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సేవలను పొందడానికి ఆటంకం కాకూడదు. ఇప్పటికీ దిగువే... ఫైనాన్స్ కమిషన్స్ నివేదికల్లోని పోల్చదగిన గణాంకాలను బట్టి, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాలు తక్కువ ర్యాంకులో ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా వీటిలో పెద్ద మార్పు లేదు. కనిష్ఠ తలసరి జీఎస్డీపీ (బిహార్‌కి చెందినది) మరియు గరిష్ఠ తలసరి జీఎస్డీపీ నిష్పత్తి (ఇది గోవాను మినహాయించిన తర్వాత, పంజాబ్ లేదా హరియాణాను సూచిస్తుంది) 1999–2002 లోని త్రైవార్షిక సగటు 23.3 శాతం నుండి 2016–2019లో 17.7 శాతానికి తగ్గింది. బహుమితీయ పేదరికంపై నీతి అయోగ్ ఇటీవలి నివేదిక ప్రకారం చూసినప్పుడు, అఖిల భారత పేదరికం నిష్పత్తి అయిన 15 శాతంతో పోలిస్తే బిహార్‌లో అత్యధిక పేదరికం (33.76 శాతం) ఉంది. తర్వాతి స్థానాల్లో జార్ఖండ్ (28.81), యూపీ (22.93), మధ్యప్రదేశ్ (20.63), అస్సాం (19.35) ఉన్నాయి. ఈ నేపథ్యంలో, 16వ కమిషన్స్ సిఫార్సులు అసమానతలను తగ్గించడంలో, ప్రత్యేకించి ఆదాయం విషయంలో ముఖ్యమైనవి. క్షితిజ సమాంతర పంపిణీ అనేది రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశం. అధిక పనితీరు కనబరుస్తున్న దక్షిణాది రాష్ట్రాలు, కాలక్రమేణా తమ వాటా తగ్గుముఖం పట్టిందనీ, ఆదాయం, జనాభా స్థిరీకరణ, మానవాభివృద్ధిలో మెరుగైన పనితీరు కారణంగా తమను దండి స్తున్నారనీ ఫిర్యాదు చేస్తున్నాయి. పన్నుల పంపిణీకి సమాంతర పంపిణీ సూత్రంతో ముడిపెట్టకూడదని ఒక సూచన. తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు గ్రాంట్లు అందించవచ్చు. కానీ పన్నుల పంపిణీ అనేది మొత్తం బదిలీలలో 80 శాతంగా ఉన్నట్లయితే ప్రగతిశీలంగా ఉంటుందనీ, గ్రాంట్లు (మొత్తం బదిలీలలో 20 శాతం)గా ఉన్నట్ల యితే తిరోగమన శీలంగా ఉంటుందనీ అనుభవం సూచిస్తోంది. అందువల్ల, తక్కువ తలసరి ఆదాయ రాష్ట్రాలకు సహాయం చేయడా నికి గ్రాంట్లు మరింత ప్రగతిశీలంగా ఉండాలి. సాధారణంగా, అంత ర్రాష్ట్ర అసమానతలను పరిష్కరించే ఏకైక సంస్థ అయినందున, ఫైనాన్స్ ్స కమిషన్స్ పన్నుల పంపిణీ, గ్రాంట్లు రెండింటిలోనూ సమధర్మ సూత్రానికి మరింత సున్నితంగా ఉండాలి. రాష్ట్రాలే ప్రగతికి కీలకం 16వ ఆర్థిక సంఘం పరిశీలించాల్సిన ఇతర అంశాలు: సంక్షో భాన్ని ఎదుర్కోవడానికి మరిన్ని ప్రోత్సాహకాలు, మానవాభివృద్ధిని మెరుగుపరచడం, రెవెన్యూ లోటు గ్రాంట్ల పరిశీలన, స్థానిక సంస్థలకు నిధుల బదిలీ, కేంద్రం, రాష్ట్రాలు రెండూ అందిస్తున్న ఉచితాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) పునరుద్ధరణ. సీఎస్ఎస్ విషయానికొస్తే, రాష్ట్రాలు మరింత సరళతతో పథకాల రూపకల్పనలో పాల్గొనవచ్చు. ఆదాయ వ్యయాల శాతంగా ఉచితాలపై కొంత పరి మితి ఉండాలి. ఉచితాలపై సిఫార్సులు కేంద్రం, రాష్ట్రాలు రెండింటికీ వర్తిస్తాయి. ఆర్థిక నియమాల ఆధారంగా రుణాన్ని, ఆర్థిక స్థిరత్వ విశ్లేష ణను అందించడానికి స్వతంత్ర ఆర్థిక మండలిని ఏర్పాటు చేయాలనే సూచనలు కూడా ఉన్నాయి. చివరగా, సమ్మిళిత అభివృద్ధితో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశ హోదాను సాధించాలని భారతదేశం ఆకాంక్షిస్తోంది. ఈ లక్ష్యా లను సాధించడంలో రాష్ట్రాల పాత్ర సమానంగా లేదా అంతకంటే ముఖ్యమైనది. రాష్ట్రాలు మొత్తం ప్రభుత్వ వ్యయంలో 60 శాతం ఖర్చు చేస్తాయి. విద్య, ఆరోగ్య వ్యయంలో 70 శాతం, మూలధన వ్యయంలో మూడింట రెండు వంతులు ఖర్చు చేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులలో 79 శాతం మందిని రాష్ట్రాలు నియమిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, అంతర్రాష్ట్ర అసమానతలను తగ్గించడంలో 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు ముఖ్యమైనవి. ఎస్. మహేంద్ర దేవ్ వ్యాసకర్త హైదరాబాద్ ‘ఇక్ఫాయ్’లో విశిష్ట ప్రొఫెసర్ (‘ది హిందుస్థాన్స్ టైమ్స్’ సౌజన్యంతో) -
పేదరికం తగ్గిన ఆహార వినియోగం పెరగలేదు!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: తలసరి ఆదాయం పెరిగి పేదరికం తగ్గిన దశలో శక్తినిచ్చే ఆహార వినియోగం పెరగటం ప్రపంచదేశాల్లో సర్వసాధారణం కాగా, భారత్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రముఖ వ్యవసాయ ఆర్థిక వేత్త డాక్టర్ రమేశ్ చంద్ అన్నారు. 2012కు ముందు 30 ఏళ్లలో తలసరి ఆదాయం పెరిగి, పేదరికం తగ్గినప్పటికీ శక్తినిచ్చే ఆహార వినియోగం మాత్రం తగ్గిందన్నారు. పేదరికాన్ని తగ్గించినంత సులువుగా శక్తినిచ్చే ఆహార వినియోగాన్ని పెంపొందించలేకపోవటం అనే విచిత్ర పరిస్థితి మన దేశంలో నెలకొన్నదన్నారు. ప్రపంచ దేశాల పోకడకు భిన్నమైన ఈ ఆహార వినియోగ ధోరణికి మూలకారణాన్ని శోధించాలన్నారు. శనివారం సాయంత్రం ఇక్కడి జాతీయ పోషకాహార సంస్థలో ఆయన డా. గోపాలన్ స్మారకోపన్యాసం చేశారు. ఆహార లభ్యత గత 50 ఏళ్లలో గణనీయంగా పెరిగినప్పటికీ శక్తినిచ్చే ఆహార వినియోగం తగ్గటం వెనుక మర్మాన్ని మన పౌష్టికాహార నిపుణులు శోధించాల్సిన అవసరం ఉందని డా. రమేశ్ చంద్ తెలిపారు. 1980 నుంచి 2012 నాటికి భారత్‌లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి శాతం 38 నుంచి 16కి తగ్గిందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార-వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.)చెబుతున్నదన్నారు. అయితే, హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్.ఐ.ఎన్.) గణాంకాల ప్రకారం మాత్రం వీరి శాతం 2012 నాటికి 77%గా ఉందన్నారు. ఎన్.ఐ.ఎన్. విశ్లేషణ నమూనాను ఎఫ్.ఎ.ఓ. నమూనాతో అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంతో పోల్చితే ప్రజలకు యాంత్రీకరణ పెరిగి, శారీరక శ్రమ చేయాల్సిన అవసరం తగ్గింది. కాబట్టి, ప్రొటీన్లు, ఐరన్ వంటి పోషకాలు తీసుకోవటం పెరిగినా శక్తినిచ్చే ఆహార ధాన్యాల వినియోగం తగ్గి ఉంటుందన్నారు. భారతీయ సంస్కృతిలోని ఆహారం తక్కువగా తినటం ఆరోగ్యదాయకం అన్న భావన కారణంగానే కేలరీల వినియోగం తగ్గిందని ఫ్రెంచ్ ఆంత్రపాలజిస్ట్ ఫ్రెడరిక్ లెండి విశ్లేషించారని, ఈ కోణంలో పరిశోధనలు చేయాలని డా. రమేశ్ చంద్ అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే ఆహార ధాన్యాలు మనుషులతో పాటు పశువులకు మేపుతున్నామా? లేకపోతే ఆహారధాన్యాలు ఏమవుతున్నాయన్నది అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. తక్కువ పరిమాణంలో ఆహార వినియోగం జరుగుతున్నందున పోషకాల సాంద్రత ఎక్కువగా ఉన్న ఆహారోత్పత్తి చేపట్టాలి. స్థానిక / సంప్రదాయ ఆహారాన్ని వినియోగించే దిశగా ప్రోత్సహించాలన్నారు. చిరుధాన్యాలను మధ్య, ఉన్నతి తరగతి ప్రజలు మరింతగా తింటున్నారని, అంటూ చిరుధాన్యాలకు మరింత ధర చెల్లిస్తే సాగుతో పాటు లభ్యత పెరుగుతుందని డా. రమేశ్ చంద్ అన్నారు. ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు. దేశీయంగా గత పదేళ్ల నేషనల్ శాంపుల్ సర్వే గణాంకాల సేకరణ ఫలితాలు వెలువడాల్సి ఉందన్నారు. 2012 తర్వాత ప్రజల ఆదాయం బాగా పెరిగిందని అంటూ.. ఈ గణాంకాల్లో ఎంత మార్పు కనిపిస్తుందో వేచిచూడాలన్నారు. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (చదవండి: సహకార ‘భారత్ ఆర్గానిక్స్’! -
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ పంపిణీపై నీతి ఆయోగ్ కితాబు
-
ఏపీలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాల అమలు భేష్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే టేక్ హోమ్ రేషన్ పంపిణీ ఆంధ్రప్రదేశ్‌లో బాగా అమలవుతోందని నీతి ఆయోగ్ నివేదిక కితాబు ఇచ్చిది. వివిధ రాష్ట్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీల్లో మంచి పద్ధతులపై నీతి ఆయోగ్ నివేదిక రూపొందించింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్టికాహార లేమిని పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిగిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా పక్కాగా అమలు చేస్తోందని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కోసం ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ స్మార్ట్ ఫోన్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తోందని, తద్వారా టేక్ హోమ్ రేషన్ పంపిణీకి సంబంధించి బహుళ అంశాలను ట్రాక్ చేస్తున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. తద్వారా రేషన్ పంపిణీ సమయంలో లీకేజీలను నిరోధించడంతో పాటు పక్కాగా ధ్రువీకరణ జరుగుతోందని నీతి ఆయోగ్ తెలిపింది. అంగన్వాడీ కేంద్రాల వారీగా అంగన్వాడీ వర్కర్లు ప్రతినెలా వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారుల వివరాలను యాప్‌లో నమోదు చేయడంతోపాటు ప్రతినెలా ఆ డేటాను నవీకరిస్తున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. నీతి ఆయోగ్ ఇంకా ఏం చెప్పిందంటే.. ► ఈ–సాధన సాఫ్ట్వేర్ నుంచి లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ప్రతినెలా టేక్ హోమ్ రేషన్ సరుకులు ఎంత పరిమాణం అవసరమో అంచనా వేస్తారు. గత నెలకు సంబంధించి నిల్వలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలను పరిగణనలోకి తీసుకుని, ప్రతినెలా బడ్జెట్ అంచనాలను అభివృద్ధి చేస్తారు. ► సాఫ్ట్వేర్ డేటాతో మరోసారి రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ప్రభుత్వంలో నమోదైన సరఫరాదారులకు పాలు, గుడ్లు తదితర డ్రై రేషన్ సరుకులు అంగన్వాడీ కేంద్రాల వారీగా ఎంత పరిమాణం కావాలో తెలియజేస్తారు. ► జిల్లాల వారీగా ఏయే అంగన్ వాడీ కేంద్రాలకు ఎంత పరిమాణంలో డ్రై రేషన్ అవసరమో అంచనా మేరకు సరఫరాదారు డెలివరీ చేస్తారు. ►అవసరమైన మెటీరియల్ సరఫరా చేసారా లేదా అనే విషయాన్ని అంగన్వాడీ వర్కర్ యాప్‌లోని డేటా ఎంట్రీ ద్వారా బయోమెట్రిక్ ప్రమాణీకరణతో ధ్రువీకరిస్తారు. ►ఆ వెంటనే అంగన్వాడీ కేంద్రానికి సరఫరా అయిన టేక్ హోమ్ రేషన్ పరిమాణాన్ని మహిళా సూపర్వైజర్ తనిఖీ నిర్వహిస్తారు. ఆ తరువాత శిశు అభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్ మరోసారి తనిఖీ నిర్వహిస్తారు. నాణ్యతను కూడా నిర్థారిస్తారు. -
విశాఖకు ఉజ్వల భవిష్యత్
దొండపర్తి (విశాఖ దక్షిణ): దేశంలోనే అత్యుత్తమ నగరాల్లో విశాఖ ఒకటని, అన్నిరకాల వనరులూ కేంద్రీకృతమైన ఈ నగరానికి ఉజ్వల భవిష్యత్ ఉందని నీతి ఆయోగ్ ప్రత్యేక కార్యదర్శి అనారాయ్ పేర్కొన్నారు. నీతి ఆయోగ్ గ్రోత్ హబ్ ప్రాంతీయ సమావేశాన్ని సోమవారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రణాళికా విభాగం కార్యదర్శి గిరిజా శంకర్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖలో ఉన్న అభివృద్ధి అవకాశాలు, సువిశాలమైన సముద్ర తీరం, పర్యాటక ప్రాజెక్టులపై కలెక్టర్ మల్లికార్జున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనారాయ్ మాట్లాడుతూ.. సమ్మిళిత ఆర్థిక విధానాలు, మిషన్ మోడ్ ప్రాజెక్టుల అమలు ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందేందుకు పుష్కలమైన అవకాశాలు విశాఖకు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజంపై మరింత దృష్టి సారించాలని సూచించారు. విదేశీ పర్యాటకులను మరింత ఆకర్షించేలా, వారు ఇక్కడ ఎక్కువ రోజులు బస చేసేలా వినూత్న రీతిలో పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని చెప్పారు. 2047 నాటికి గ్రోత్ హబ్‌లుగా 20 నగరాలు 2030, 2047 ఆర్థిక సంవత్సరాల నాటికి దేశంలో 20 నగరాలను గ్రోత్ హబ్‌లుగా గుర్తించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అనారాయ్ తెలిపారు. ముందుగా దేశంలో నాలుగు గ్రోత్ హబ్‌లు గుర్తించామని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ముంబై, సూరత్, వారణాసితోపాటు విశాఖ నగరాన్ని కూడా గ్రోత్ హబ్‌గా ఎంపిక చేశామని చెప్పారు. విశాఖ వంటి మహానగరాలు దేశ అభివృద్ధికి చోదక శక్తిగా నిలుస్తాయన్నారు. విశాఖ జిల్లాకు అనుబంధంగా ఉన్న కోస్తా ప్రాంతంలోని మిగిలిన జిల్లాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రణాళికా విభాగం సెక్రటరీ గిరిజా శంకర్ కోస్తా జిల్లాల్లో అవలంబిస్తున్న ఆర్థిక విధానాలు, చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను వివరించారు. కలెక్టర్ ఎ.మల్లికార్జున, నీతి ఆయోగ్ నేషనల్ అడ్వైజర్ పార్థసారథిరెడ్డి, మికెన్సీ సంస్థ ప్రతినిధి అఖిలేశ్ బాబెల్, విజయనగరం, అనకాపల్లి కలెక్టర్లు ఎస్.నాగలక్ష్మి, రవి పట్టన్‌శెట్టి, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, సీతంపేట ఐటీడీఏ పీవో కల్పనా కుమారి తదితరులు పాల్గొన్నారు. -
దేశం అనుకరించేలా ఏపీ విజన్ ప్రణాళిక–2047
సాక్షి, అమరావతి: దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజన్ ప్రణాళిక–2047ను అనుకరించేలా అద్భుతమైన విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాలని నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధా.. రాష్ట్ర ఉన్నతాధికారులకు సూచించారు. ప్రాథమిక, ఉత్పాదక, సామాజిక రంగాలకు సంబంధించి పలు అంశాలపై వర్క్ షాపులో ఫలవంతంగా చర్చలు జరిగాయన్నారు. రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న నీతి ఆయోగ్ వర్క్ షాపులో భాగంగా శుక్రవారం రాష్ట్ర విద్యా రంగంపై సుదీర్ఘ చర్చ జరిగింది. వి.రాధా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన సంస్కరణలపై విద్యా వేత్తలు, మేథావులు పలు సూచనలు చేశారని, వాటిని అమలు చేయాలంటే కేంద్ర స్థాయిలోని పలు విద్యా సంస్థల్లో వ్యవస్థాగతంగా కీలక మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర పాఠశాల విద్యా విభాగంలో అమలు పరుస్తున్న పలు విద్యా సంస్కరణలను వివరించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు, అక్షరాశ్యత శాతం పెంపుతో పాటు రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీ పరీక్షల్లో దీటుగా నిలబడేందుకు అవసరమైన అన్ని రకాల శిక్షణలను ప్రాథమిక స్థాయి నుంచే అందజేస్తున్న విషయాన్ని తెలిపారు. రాష్ట్ర విజన్ ప్రణాళిక–2047లో భాగంగా పాఠశాల విద్యా విభాగం లక్ష్యాలు, అమలు చేయనున్న వ్యూహాత్మక ప్రణాళి కలను వివరించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్, స్కిల్ డెవలప్మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్, పలువురు ఉన్నతాధికారులు, విద్యా వేత్తలు ప్రసంగించారు. నీతి ఆయోగ్ డీఎంఈవో డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, ఏపీఎస్ఎస్డీసీ సీఈవో ఎండీ డా.వినోద్ కుమార్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ సి.నాగరాణితో పాటు నీతి ఆయోగ్ సలహాదారులు సీహెచ్ పార్థసారథిరెడ్డి, పబ్లిక్ పాలసీ నిపుణుడు అమ్రిత్ పాల్ కౌర్, సీనియర్ కన్సెల్టెంట్ శైలీ మణికర్, పర్యవేక్షణ, మూల్యాంకన నిపుణుడు బిప్లప్ నంది, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు ప్రతినిధి అభిషేక్ పాల్గొన్నారు. కేంద్ర నిధులకు సిఫార్సు చేయండి: సీఎస్ విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డిని కలిసింది. నిధులు సమకూర్చేందుకు నీతి ఆయోగ్ కేంద్రానికి తగిన సిఫార్సులు చేయాలని సీఎస్ విజ్ఞప్తి చేశారు. -
చైనాతో వాణిజ్యలోటును ఎలా తగ్గిద్దాం?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కీలక వాణిజ్య అంశాలు, సవాళ్లపై నీతి ఆయోగ్ దృష్టి సారించింది. కాలక్రమేణా చైనాతో భారత్ వాణిజ్య లోటును తగ్గించడం, తాజా భౌగోళిక రాజకీయ పరిస్థితులలో వాణిజ్య వ్యూహాల రూపకల్పన, సరఫరాల వ్యవస్థ (సప్లై చైన్)ను రక్షించడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం, దేశీయ తయారీ పరిశ్రమ పురోగతి వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా చైనాతో వాణిజ్యలోటు తగ్గింపు, దేశీయంగా తయారీ రంగం పురోగతిపై రెండు అధ్యయనాలకు నాయకత్వం వహించడానికి కన్సల్టెంట్ల నుండి నీతి ఆయోగ్ బిడ్లను ఆహ్వానించింది. భారతదేశం– చైనా మధ్య 2020 జూన్ నుంచి కొనసాగుతున్న గాల్వాన్ ఘర్షణ, ఉద్రిక్తతల నేపథ్యంలో తాజా అంశం తెరమీదకు రావడం గమనార్హం. చైనాకు భారత్ ఎగుమతులకు సంబంధించి టారిఫ్, నాన్–టారిఫ్ అడ్డంకులు, నియంత్రణ వ్యవస్థ, మార్కెట్ లభ్యతా ఆందోళనలను కూడా ప్రతిపాదిత అధ్యయనం పరిశీలించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చడానికి, ఈ దిశలో సవాళ్లను అధిగమించడానికి... గుర్తించిన రంగాలలో వృద్ధిని ప్రోత్సహించడానికి వ్యూహాలు– అనుసరించాల్సిన విధానాలను కూడా అధ్యయనం సిఫార్సు చేయాల్సి ఉంటుంది. రెండు అధ్యయనాలకు సంబంధించి కన్సల్టెంట్ల బిడ్ల సమర్పణకు తుది గడువు నవంబర్ 7. గణాంకాలు, నిర్దిష్ట ప్రాముఖ్యత కలిగిన అంశాల సేకరణ, విశ్లేషణ, సిఫార్సుల రూపకల్పన కోసం మాత్రం ఆరు నెలల గడువు ఉంటుంది. తగ్గిన లోటు భారం! భారత్ వస్తు వాణిజ్య పరిమాణం 2021–22 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరింది. సమీక్షా కాలంలో వస్తు ఎగుమతుల విలువ 422 బిలియన్ డాలర్లయితే, దిగుమతుల విలువ 613 బిలియన్ డాలర్లు. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 191 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే సంవత్సరంలో చైనాతో భారత్ వాణిజ్య లోటు ఏకంగా 73.3 బిలియన్ డాలర్లు. అంటే మొత్తం వాణిజ్యలోటులో ఈ పరిమాణం దాదాపు 38 శాతం. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరం వచ్చే సరికి భారత్ వస్తు ఎగుమతులు 450 బిలియన్ డాలర్లు. దిగుమతులు 714 బిలియన్ డాలర్లు. వెరసి వాణిజ్యలోటు 264 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఇందులో చైనాతో వాణిజ్యలోటు 32 శాతంగానే ఉంది. విలువలో మాత్రం 83.1 బిలియన్ డాలర్లు. అయితే గడచిన ఆర్థిక సంవత్సరంలో భారత్ తన వాణిజ్య భాగస్వామ్య దేశాలతో పోల్చితే... చైనాతోనే అత్యధిక వాణిజ్యలోటును కలిగి ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ మాట్లాడుతూ, భారతదేశం దృష్టి కేవలం చైనాతో మొత్తం వాణిజ్య లోటుపై ఉండకూడదని, కొన్ని క్లిష్టమైన ఉత్పత్తుల కోసం బీజింగ్‌పై దేశం ఆధారపడటాన్ని తగ్గించడంపై ప్రధాన లక్ష్యం ఉండాలని అన్నారు. చైనాతో భారత్ వాణిజ్య తీరిది... 2021 భారత్–చైనా మధ్య వస్తు ఎగుమతి–దిగుమతి గణాంకాల ప్రకారం.. భారీ యంత్ర పరికరాలకు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ భారత్ దిగుమతుల విలువ 47 బిలియన్ డాలర్లుగా ఉంది. తర్వాతి స్థానంలో ఇంటర్మీడియట్ వస్తువులు (30 బిలియన్ డాలర్లు), వినియోగ వస్తువులు (9.4 బిలియన్ డాలర్లు), ముడి పదార్థాలు ( బిలియన్ డాల ర్లు) ఉన్నాయి. ఇక భారత్ 11 బిలియన్ డాలర్ల ఇంటర్మీడియట్ వస్తువులను చైనాకు ఎగు మతి చేసింది. తరువాతి స్థానంలో ముడి పదార్థాలు (6 బిలియన్ డాలర్లు), వినియోగ వస్తువులు (3.4 బిలియన్ డాలర్లు), క్యాపిటల్ గూ డ్స్ (2.4 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. వెరసి చైనాతో వాణిజ్యలోటు క్యాపిటల్ గూడ్స్‌కు సంబంధించి 45 బిలియన్ డాలర్లు, ఇంటర్మీడియట్ గూడ్స్‌కు సంబంధించి 19 బిలియన్ డాలర్లు, వినియోగ వస్తువుల విషయంలో 6 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు ఉంది. -
AP: డిసెంబర్ నాటికి రాష్ట్ర విజన్ ప్రణాళిక–2047
సాక్షి, అమరావతి: వికసిత్ భారత్–2047లో భాగంగా నీతి ఆయోగ్ సహకారంతో రాష్ట్ర ను డిసెంబర్ నెలాఖరుకల్లా సిద్ధం చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రాథమిక, ద్వితీయ, సామాజిక రంగాల వృద్ధికి ఆయా శాఖలవారీగా దృక్కోణ ప్రణాళికలను రూపొందించేందుకు మార్గదర్శకాలు, సూచనలు, సలహాలను నీతి ఆయోగ్ అధికారులు రాష్ట్ర అధికారులకు అందించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం వర్క్‌షాప్ ప్రారంభమైంది. మూడు రోజులపాటు దీన్ని నిర్వహిస్తారు. తొలి రోజు వర్క్‌షాప్ నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడానికి కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్–2047 కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. దీని ద్వారా ప్రజలకు సాధికారత కల్పించడంతో పాటు ఆధునిక భారతదేశ నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతులను కేంద్రం కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ పురోగతిపైనే కాకుండా ప్రాంతీయ ఆకాంక్షలపైన కూడా దృష్టి సారించిందన్నారు. అందుకనుగుణంగా రాష్ట్ర విజన్ ప్రణాళిక – 2047ను రూపొందించేందుకు రాష్ట్ర అధికారులకు అవసరమైన శిక్షణను నీతి ఆయోగ్ అందిస్తోందని చెప్పారు. దీన్ని రాష్ట్ర అధికారులు సద్వినియోగం చేసుకుని రాష్ట్ర విజన్ ప్రణాళికను సమగ్రంగా సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని కోరారు. వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు కాగా తొలి రోజు వర్క్‌షాప్‌లో ఉదయం సామాజిక రంగం, మధ్యాహ్నం ప్రాథమిక రంగానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. రాష్ట్రంలో ఆయా రంగాల వారీగా బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్లను ఆయా శాఖల అధికారులు నీతి ఆయోగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వర్క్‌షాప్‌లో రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ జె.నివాస్, రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో హరీందిర ప్రసాద్, రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా.నరసింహం తదితరులతోపాటు నీతి ఆయోగ్ సలహాదారు సీహెచ్ పార్థసారధి రెడ్డి, పబ్లిక్ పాలసీ నిపుణులు అమ్రిత్ పాల్ కౌర్, సీనియర్ కన్సల్టెంట్ శైలీ మణికర్, పర్యవేక్షణ – మూల్యాంకన నిపుణులు బిప్లప్ నంది, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ డైరెక్టర్ అంకష్ వథేరా తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికలను రూపొందిస్తున్నాం.. రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి ఎం.గిరిజాశంకర్ మాట్లాడుతూ.. వికసిత్ భారత్–2047 కార్యక్రమం అమల్లో భాగంగా రాష్ట్రంలో ప్రాథమిక, ద్వితీయ, సామాజిక రంగాల్లో వ్యూహాత్మక వృద్ధిని సాధించేందుకు అవసరమైన దృక్కోణ ప్రణాళికలను రూపొందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ముఖ్యంగా ప్రాథమిక రంగంలో.. వ్యవసాయం, పశుసంవర్థకం, డెయిరీ, ఫిషరీస్, ఉద్యానవనం, సెరికల్చర్, మార్కెటింగ్, సహకారం, అటవీ, జలవనరులు, భూగర్భ జలాలు, చిన్ననీటి పారుదల, కమాండ్ ఏరియా అభివృద్ధి వంటి అంశాల్లో దృక్కోణ ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ద్వితీయ రంగంలో.. ఇంధనం, రవాణా, ఐటీ, పర్యాటకం, పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడులు, ఆహార శుద్ధి, గనుల తవ్వకం, చేనేత–జౌళి, గృహ నిర్మాణం, టిడ్కో తదితర అంశాలపైన సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు. సామాజిక రంగం అభివృద్ధిలో భాగంగా విద్య, వైద్య, ఆరోగ్యం, మహిళ, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం, పౌర సరఫరాలకు సంబంధించిన అంశాలపై ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. -
నేటి నుంచి విశాఖలో త్రిసభ్య కమిటీ పర్యటన
విశాఖపట్నం: నీతి అయోగ్ గ్రోత్ హబ్ సిటీ, రాజధాని వసతులు, సౌకర్యాల పరిశీలనకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ బృందం సోమవారం నుంచి విశాఖలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. విశాఖలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో రుషికొండలోని ఐటీ హిల్స్‌లో ఏర్పాట్లను ఆయన ఆదివారం తనిఖీ చేశారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్‌లతో ఓ బృందాన్ని నియమించిందని ఈ కమిటీ ఇప్పటికే పని ప్రారంభించిందనీ.. క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించనుందని తెలిపారు. -
ఉత్తరాంధ్రలో అధికారుల వసతి ఏర్పాట్లకు కమిటీ
సాక్షి, అమరావతి: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినందువల్ల అధికార యంత్రాంగం కూడా ఇందుకు సన్నద్ధమవుతోంది. త్వరలో ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాల అమలు తీరును నిరంతరం సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. రాత్రి పూటఆయన అక్కడే బస చేయనున్నారు. వివిధ శాఖలపై విశాఖలోనే సమీక్షలు చేసే అవకాశం ఉంది. అందువల్ల సీనియర్ అధికారులు, జిల్లా పరిపాలన అధికారులు సీఎంకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించాల్సి వస్తుంది. కొంతమంది సీనియర్ అధికారులను రాత్రి పూట కూడా విశాఖలో బస చేయమని కోరవచ్చు. ఈ కారణంగా వీలైనంత త్వరగా తగిన వసతిని గుర్తించి నివేదిక ఇచ్చేందుకు ముగ్గురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్–హెఆర్‌ఎం) కార్యదర్శితో కమిటీని ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా తగిన వసతి గుర్తించి సాధారణ పరిపాలన శాఖకు నివేదికను సమర్పించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాత్రి పూట తగిన రవాణా, వసతి ఉండేలా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో బస చేయడానికి తగ్గ ప్రాంతాలను గుర్తించాలని పేర్కొన్నారు. అభివృద్ధికి అవసరం.. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలను ఉత్తరాంధ్రగా పిలుస్తారు. ఈ ప్రాంతం ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, నీటిపారుదల, కనెక్టివిటి మొదలైన సూచికల్లో వెనుకబడి ఉంది. గిరిజన జనాభా అత్యధికంగా ఉంది. ఉత్తరాంధ్రలో నాలుగు జిల్లాలను వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గుర్తించింది. ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు కింద కూడా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో రెండు జిల్లాలను ఆకాంక్ష జిల్లాలుగా నీతి ఆయోగ్ గుర్తించింది. ఉత్తరాంధ్ర చారిత్రకంగా వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రత్యేక అభివృద్ధి ప్రోత్సహకాలను పొందుపరిచారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించడం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించడం, సమీక్షించడంతో పాటు స్థానిక అవసరాలను తెలుసుకోవడం వంటివి అధికారయంత్రాంగం చేయాల్సి ఉంటుంది. రాత్రి పూట బస చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో రవాణా, వసతి చూసుకోవాల్సిందిగా ఆయా శాఖలు, శాఖాధిపతులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. -
విశాఖ అభివృద్ధి మరింత వేగవంతం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలోనే అత్యంత శరవేగంగా వృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన విశాఖపట్నంలో అభివృద్ధి మరింత వేగం పుంజుకోనుంది. కొద్దిరోజుల క్రితం దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్ ఎంపిక చేసిన గ్రోత్ హబ్‌లో విశాఖ స్థానం దక్కించుకుంది. దేశం మొత్తం మీద నాలుగు నగరాలను నీతి ఆయోగ్ ఎంపిక చేయగా అందులో విశాఖ ఒకటి కావడం విశేషం. అందులోనూ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక నగరంగా విశాఖ మరో ప్రత్యేకతను నమోదు చేసింది. విశాఖ కాకుండా ముంబై, సూరత్, వారణాసి కూడా ఎంపికయ్యాయి. ఈ నేపథ్యంలో విశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. విశాఖ నగరాభివృద్ధికి ఉన్న అవకాశాలపై నీతి ఆయోగ్ ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. ఈ క్రమంలో ఆయా రంగాల అభివృద్ధికి ప్రత్యేక రాయితీలు ఇచ్చే విధంగా అభివృద్ధి ప్రణాళిక సిద్ధం కానున్నట్టు తెలుస్తోంది. విశాఖ అభివృద్ధికి విస్తృత అవకాశాలు.. విశాఖ అభివృద్ధికి అపార అవకాశాలున్నాయి. నౌకాశ్రయం, విమానాశ్రయం, రహదారుల అనుసంధానం ఇలా మూడు ఉండటంతో పాటు తూర్పు నావికాదళానికి ప్రధాన కేంద్రంగా ఇప్పటికే నగరం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అంతేకాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు కేంద్రంగా భాసిల్లుతోంది. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ మొదటగా ఈ ప్రాంతానికి సంబంధించి వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలు, అభివృద్ధికి అవకాశం ఉన్న అంశాలను అధ్యయనం చేయనుందని తెలుస్తోంది. నాలుగు కీలక అంశాలపై.. విశాఖ నగరాభివృద్ధిపై ఎస్వీవోటీ అనాలసిస్ అంటే... స్ట్రెంత్ (బలం), వీక్నెస్ (బలహీనతలు), ఆపర్చునిటీస్ (అవకాశాలు), త్రెట్స్ (ఇబ్బందులు).. ఈ నాలుగు అంశాలపై నీతి ఆయోగ్ బృందం అధ్యయనం చేయనుంది. ఇందుకనుగుణంగా ఆ ర్థిక వృద్ధికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని.. వీటిని సాధించేందుకు ఒక పాలసీని రూపొందించనుందని సమాచారం. విశాఖ నగరంలో ప్రధానంగా ఎగుమతి ఆధారిత పరిశ్రమలతోపాటు ఫార్మా, ఆటో, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. ఈ రంగాలతో పాటు ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలకు కూడా నగరం మంచి ఎంపిక అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ బృందం నిర్ణయాలను అమలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి కమిటీలో జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి కమిటీలో జీవీఎంసీ కమిషనర్లు కీలకంగా వ్యవహరించనున్నారు. ప్రత్యేక రాయితీలకు అవకాశం.. వాస్తవానికి నీతి ఆయోగ్ బృందం ఇప్పటికే తన పనిని ప్రారంభించింది. ఇప్పటికే ఒక దఫా విశాఖలో పర్యటించింది. ప్రధానంగా విశాఖ నగర అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్‌తో పాటు చేపడుతున్న పలు పనులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న పలు పరిశ్రమలతో పాటు నగర భౌగోళిక విస్తీర్ణం, అభివృద్ధికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసినట్టు సమాచారం. గ్రోత్ హబ్‌లో ప్రధానంగా నగరంలో ఏయే ప్రాంతాల్లో ఏయే రంగాల అభివృద్ధికి అవకాశం ఉందో.. అందుకనుగుణంగా ఆయా రంగాలకు ప్రత్యేక రాయితీలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే విశాఖ అభివృద్ధికి ప్రత్యేక రోడ్ మ్యాప్ సిద్ధమయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక రాయితీలు మంజూరు చేస్తే నగరంలో అన్ని రంగాలు ఇతోధికంగా అభివృద్ధి చెందుతాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఆలస్యమే అయినా... మేల్కొన్నట్లేనా?
సుమారుగా నాలుగు దశాబ్దాల నుంచి ప్రపంచ దేశాలను శాసిస్తోన్న ‘నయా ఉదార వాద’ ఆర్థిక విధానాలు నేడు ప్రశ్నించబడుతు న్నాయి. నిన్నటి వరకూ ఈ విధానాలకు ప్రతి నిధులుగా ఉన్న ఆర్థికరంగ మేధావులు కూడా నేడు భిన్నమైన గొంతుకలను వినిపిస్తున్నారు. ఈ క్రమంలో, ఈ మధ్యకాలంలో మన దేశంలోని ఇరువురు ప్రముఖుల ప్రకటనలు లేదా ఇంటర్వ్యూలు మనదేశంలో కూడా నయా ఉదారవాద విధానాలను అనివార్యంగా విడనాడవలసిన అవసరాన్ని చెబుతున్నాయి. వీరిలో ఒకరు రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రంగ రాజన్. రెండవవారు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ కె. బెరి. రంగ రాజన్ మాటలు నేడు వ్యవస్థలో మౌలికంగానే తలెత్తుతోన్న ప్రశ్నలకు అద్దం పడుతున్నాయి. ఆయన లేవనెత్తిన ప్రశ్న ఉపాధి అవకాశాలను సరిపడా సృష్టించలేని అభివృద్ధి దేనికి అనేది. అలాగే ఆయన తలసరి ఆదాయం పెరిగితేనే అది అసలైన దేశాభివృద్ధి అన్నారు. దానితో పాటుగా నిరుపేదలకు రాయితీలు అవసరమేనని స్పష్టీకరించారు. గతంలో దేశంలో పెట్రోలియం ధరలకు సంబంధించి సబ్సిడీల రద్దులను ప్రతిపాదించిన కమిటీలలో ఒకదానికి నాయకత్వం వహించిన రంగరాజన్ నోట వెలువడిన ఈ మాటలు చాలా కీలకమైనవి. వ్యవస్థలో నేడు మారుతోన్న ఆలోచనలకూ... నయా ఉదారవాద సంస్కరణల వైఫల్యానికీ ఈ మాటలు అద్దంపడుతున్నాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్పీజీ) విధానాలనే సూక్ష్మంగా ‘నయా ఉదారవాదం’ అంటున్నాం. ప్రపంచంలో 1980ల నుంచీ... మనదేశంలో 1991 అనంతరం మొదలైన ఈ విధానాలు కార్పొరేట్లకు మరింతగా రాయితీలు ఇవ్వడాన్ని ప్రతిపాదించాయి. అలాగే, జన సామాన్యానికి ఇచ్చే సబ్సిడీలు, సంక్షేమ పథకాలపై కోతలను ప్రతిపాదించాయి. ఈ విధానాల అమలు క్రమంలోనే నేడు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల మధ్య, అలాగే విడివిడిగా వివిధ దేశాలలో అంతర్గతంగా కూడా ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగిపోయాయి. ధనికులు మరింత ధనికులూ, పేదలు మరింత పేదలూ అవుతున్నారు. నేడు పరాకాష్ఠకు చేరుకుంటున్న ఈ పరిస్థితి ఈ విధానాలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ క్రమంలోనే రంగరాజన్ వంటివారు కూడా తమ పాత ఆలోచనలను పరిత్యజించవలసి వస్తోంది. మరో పక్కన నీతి ఆయోగ్ సుమన్ బెరి 1950ల నుంచి బలమైన నమూనాగా ఉన్న మొత్తం ఆర్థిక నమూనానే ప్రశ్నిస్తున్నారు. ఈ నమూనా ప్రకారంగా ఒక దేశ ఆర్థిక అభివృద్ధి క్రమం: తొలుత వ్యవసాయక ప్రాధాన్యత గలదిగా ఉండి, తరువాత సరుకు ఉత్పత్తి పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఉన్నదిగానూ... అనంతరం (చివరగా) సేవా రంగం ప్రాధాన్యత దిశగా సాగాలి. అయితే, ప్రస్తుతం ప్రపంచంలో నెలకొని ఉన్న ఆర్థిక పరిస్థితులూ, అలాగే భారీగా ఆటోమేషన్ దిశగా అభివృద్ధి చెందిన సాంకేతిక రంగం వంటి వాటి దృష్ట్యా నేడు మనదేశానికి ఈ పాత దశల అభివృద్ధి నమూనా పనికి రాదనేది సుమన్ బెరి ప్రతిపాదన. ఈ సందర్భంగా ఆయన ‘భూగోళం మరో చైనాను భరించలేదు’ అని పేర్కొన్నారు. అంటే, నేడు భూగోళంపై జరుగుతోన్న పర్యావరణ మార్పులూ... వినాశనం దృష్ట్యా చైనా స్థాయిలో పారిశ్రామిక సరుకు ఉత్పత్తి చేయగల మరో దేశం అవసరం లేదన్నమాట. అటువంటిదే జరిగితే ప్రపంచంలో కాలుష్యం మరింత వేగంగానూ, తీవ్రంగానూ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఆయన భారతదేశం సరుకు ఉత్పత్తి రంగంలో చైనాతో పాటుగా ఎదిగే ప్రయత్నాన్ని ప్రశ్నించారు. దీనిలో భాగంగానే ఆయన ఏది ఏమైనా సరే భారీ వృద్ధిరేట్లను సాధించాలనే దృక్పథాన్ని విమర్శిస్తూ... దాని స్థానే నేడు భారత్‌కు కావాలిసింది హేతుబద్ధమైన, పర్యావరణం పట్ల చైతన్యం గల వినియోగం, ఉత్పత్తి అని పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే, 2014లో ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాన్ని మోదీ ఆరంభించిన నేపథ్యంలో మాజీ రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ అయిన రఘురామ్ రాజన్ మాటలను కూడా గుర్తుచేసుకోవచ్చు. ఆయన ప్రకారంగా ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం పేరిట ప్రపంచానికి మరో చైనా అవసరం లేదు. నిజానికి మనం కొద్ది దశాబ్దాల క్రితమే పారిశ్రామిక సరుకు ఉత్పత్తి దిగ్గజంగా ఎదిగే అవకాశాన్ని కోల్పోయాం... బస్సు మిస్సయ్యాం! సరుకు ఉత్పత్తి రంగంలో ముందుగానే 1980లలో ప్రయాణం ప్రారంభించిన చైనా నేడు శాచ్యురేషన్ స్థాయిని సాధించి ఉంది. అదీ విషయం. అంటే, రఘురామ్ రాజన్ ఈ మాటలను అంతర్జాతీయ మార్కెట్ తాలూకు అవసరాలు, డిమాండ్ స్థాయుల గురించి వివరిస్తూ చెప్పారు. అయితే, గత పది సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం తన దృష్టినంతా సరుకు ఉత్పత్తిరంగం పైననే పెట్టింది. దీనిలో భాగంగానే 2014లో ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం ముందుకు వచ్చింది. అనంతరం 2019లో భారీస్థాయిలో కార్పొరేట్ ట్యాక్స్‌ను ప్రభుత్వం తగ్గించింది. ఇక తరువాత ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పేరిట లక్షల కోట్ల రూపాయల రాయితీలతో దేశంలో భారీ పారిశ్రామికీకరణను తలపెట్టింది. కానీ, ఈ ప్రయత్నాలు ఏవీ ఇప్పటివరకూ ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. ఈ కారణం చేతనే కోవిడ్ అనంతర కాలంలో అంతర్జాతీయంగా ముందుకు వచ్చిన ‘చైనా+1’ ఆలోచన కూడా మనదేశానికి సంబంధించినంత వరకూ పెద్దగా ఫలితాలను సాధించలేదు. మరో పక్కన దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోతోంది. అనేక ఇతరేతర ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. కాబట్టి నేడు మనం పాత దశలవారి సిద్ధాంతం అయిన వ్యవసాయరంగం నుంచి సరుకు ఉత్పత్తి రంగం, అనంతరం సేవారంగంలోకి ప్రయాణం అనే దానికి ఇక ఎంత మాత్రమూ అంటిపెట్టుకోలేము. సరికొత్త మార్గాన్ని అన్వేషించుకోవాలి. ప్రధాని మోదీ కూడా ‘ఏదేమైనా వృద్ధిని సాధించడమే ఏకైక లక్ష్యమ’ని ఇక ఎంతమాత్రమూ అనలేము అంటూ ఈమధ్య పేర్కొనటాన్ని గమనించవచ్చు. ఈ నేప«థ్యంలో ముందుకు వచ్చినవే సుమన్ బెరి ఆలోచనలు. వాస్తవానికి నేడు ప్రపంచమంతటా పెరిగిపోతున్న సాంకేతికత దృష్ట్యా సరుకు ఉత్పత్తిరంగంలో ఉపాధి అవకాశాలు వేగంగా క్షీణిస్తున్నాయి. ఇదీ సమస్య తాలూకు మరో కోణం. అంటే, మనం సరుకు ఉత్పత్తిరంగంపై దృష్టిపెట్టి, దానిలో ఒకవేళ బాగా ముందుకు వెళ్ళగలిగినా అది మన ప్రధాన సమస్య అయిన నిరుద్యోగాన్ని పరిష్కరించలేదు. ఈ నేపథ్యంలో మనకు ఉన్న మెరుగైన మార్గాంతరంగా వ్యవసాయరంగంపై దృష్టిపెట్టడం అనేది ఉంది. దీనినే సుమన్ బెరి ప్రతిపాదిస్తున్నారు. ఆయన ప్రకారం మనం పర్యావరణ కాలుష్యం, నిరుద్యోగం వంటి సమస్యలు పరిష్కరించలేకపోవడం దృష్ట్యా, సరుకు ఉత్పత్తిరంగాన్ని మన ప్రాధా న్యతగా చేసుకోరాదు. మనం చేయవలసింది, వ్యవసాయ రంగంలో సూపర్ పవర్‌గా ఎదగగలగడం. నేడు మన దేశ జనాభాలో 55–60 శాతం మేరకు వ్యవసాయరంగంలోనే ఉన్న నేపథ్యంలో, వారి ఉత్పాదకతతోపాటు, వారి ఆదాయాలను కూడా పెంచేదిశగా చర్యలు తీసుకుంటే అవి దేశీయంగానే డిమాండ్ కల్పనకూ... వ్యవసాయరంగాన్ని ఒక మెరుగైన ఉపాధి రంగంగా యువకుల ముందు ఉంచగలిగేటందుకూ ఉపయోగపడతాయి. అటు వంటి విధానాలు, దేశంలోని నగర ప్రాంతాలలో కూడా ఆర్థిక కార్య కలాపాల వృద్ధికి ఉపయోగపడతాయి. ఒక రచయితగా నేను 2014లో ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం ఆరంభం అయిన నాటి నుంచి పదే పదే వ్యాసాలలో, ఉపన్యాసాలలో వివరించినది ఇదే! స్థూలంగా నేడు మనదేశంలో కూడా సరికొత్త ఆలోచనల పవనాలు వీస్తున్నాయి. కానీ, పుణ్యకాలం కాస్త అయిపోయిన తరువాత అన్నట్టుగా పది సంవత్సరాల విలువైన కాలాన్ని వృ«థా చేసుకుని నేడు మనం మరలా బండి చక్రాన్ని కనుగొంటున్నట్లుగా ఇది ఉంది. ఏదేమైనా, నేటికైనా మన దేశ ఆర్థిక నమూనా పాత సైద్ధాంతిక చట్రాలను బద్దలు కొట్టుకొని సరైన దారిలోకి ప్రయాణిస్తుందని ఆశిద్దాం. డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
వృద్ధి 6.5 శాతం: అరవింద్ విర్మాణి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందన్న విశ్వాసాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి వ్యక్తం చేశారు. క్రూడ్ ధరల పెరుగుదల, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ ప్రపంచంలోనే భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటకు ఢోకా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఆర్థిక వృద్ధిని అతిగా అంచనా వేస్తోందని అమెరికాకు చెందిన కొంతమంది ఆర్థికవేత్తల వాదనపై ఆయన మాట్లాడుతూ, కొంతమంది మాజీ అధికారులకు భారత్ జీడీపీ మదింపుపై ఎటువంటి అవగాహనా లేదని పేర్కొన్నారు. ఎల్ నినో పరిస్థితుల సమస్య మళ్లీ తెరపైకి వచి్చందని, వాతావరణ మార్పుల కారణంగా అనిశ్చితి పెరిగిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వినియోగదారు రుణం వేగంగా పెరుగుతున్నందున నికర హౌస్‌హోల్డ్ పొదుపు నిష్పత్తి (జీడీపీలో) తగ్గుతోందని, అయితే స్థూలంగా చూస్తే, నిలకడగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఇక హౌస్‌హౌల్డ్ సెక్టార్ రుణం కూడా జీడీపీ నిష్పత్తిలో చూస్తే, తీవ్ర స్థాయిలో లేని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ధరలే దేశంలో ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణమని వివరించారు. -
నీతి ఆయోగ్ భవిష్యత్ ప్రణాళికలో వైజాగ్‌కు చోటు
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీతి ఆయోగ్ గ్రోత్ హబ్ నగరాల్లో విశాఖకు చోటు కల్పించింది. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నాలుగు నగరాలను నీతి ఆయోగ్ ఎంపిక చేయగా అందులో వైజాగ్‌కు చోటు దక్కింది.. దక్షిణాది రాష్ట్రాల నుంచి విశాఖను ఎంపిక చేయగా, మిగతా వాటిలో ముంబై, సూరత్, వారణాసి ఉన్నాయి. వీటిని పైలట్ నగరాలుగా కేంద్రం ఎంచుకుంది. 2047 అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మార్చేందుకు పైలట్ ప్రాజెక్టు ప్రవేశపెట్టగా, తాజాగా ఎంపికైన నాలుగు నగరాలలో పైలట్ ప్రాజెక్టు అమల్లోకి రానుంది. నీతి ఆయోగ్ ఎంపిక చేసిన నగరాల్లో భారీ ఎత్తున ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయనుంది. చదవండి: ఏపీలో గొప్ప చర్యలు: కొలంబియా వర్సిటీ ప్రొఫెసర్ -
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ
దొండపర్తి(విశాఖ దక్షిణ): దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం అన్నారు. అందుకే నీతి ఆయోగ్ పైలట్ నగరాల జాబితాలో ముంబై, సూరత్, వారణాసితో పాటు విశాఖకు స్థానం కల్పించినట్లు చెప్పారు. మంగళవారం విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పరిశ్రమల శాఖ అధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడి సహజవనరులతో పాటు రైల్వే, పోర్టు కనెక్టవిటీలు, విమానాశ్రయం విశాఖపట్నం అభివృద్ధికి మరింత దోహదపడుతాయన్నారు. విజన్ ఫర్ ఆంధ్రప్రదేశ్, నగర అభివృద్ధి కోసం ఆర్థిక ప్రణాళికలు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ విశాఖ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. నగర ప్రణాళిక, పర్యాటకం, విద్య, ప్రజారోగ్యం, ఈ–గవర్నెన్స్ తదితర అంశాలపై సాధించిన ప్రగతిని తెలియజేశారు.బీఆర్టీఎస్ నెట్వర్క్, నగరవ్యాప్తంగా మంచినీటి సరఫరా వ్యవస్థ వివరాలను వివరించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా బీచ్ రోడ్డులో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే పరిశ్రమలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల పరిస్థితులను తెలియజేశారు. విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ ఎం.అంగముత్తు మాట్లాడుతూ.. ఒడిశా, తెలంగాణ, కర్ణాటకకు సంబంధించిన పలు ఎగుమతులు, దిగుమతులు కూడా విశాఖ కేంద్రంగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులు పార్థసారధి, పరిశ్రమల శాఖ జీఎం సి.హెచ్.గణపతి, టూరిజం ఆర్డీ శ్రీనివాసరావు, సీపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
2014కు ముందు సర్వం అవినీత, కుంభకోణాలమయం
భోపాల్: దేశంలో 2014కు ముందు మొత్తం అవినీతి, కుంభకోణాలే రాజ్యమేలాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పేద ప్రజల హక్కులను, సంపదను విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన సొమ్ము వారికి చేరకుండా మధ్యలోనే లూటీ చేశారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ అరాచకానికి తెరపడిందని, ఇప్పుడు ప్రతి పైసా నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లోకే పంపిస్తున్నామని ఉద్ఘాటించారు. నీతి ఆయోగ్ నివేదికను ఆయన ప్రస్తావించారు. గత ఐదేళ్లలో ఏకంగా 13.50 కోట్ల మంది భారతీయులు దారిద్య్ర రేఖ దిగువ(పీబీఎల్) కేటగిరీ నుంచి బయటపడ్డారంటూ నీతి ఆయోగ్ ప్రకటించిందని గుర్తుచేశారు. దేశంలో పన్నులు చెల్లించేవారి సంఖ్య భారీగా పెరిగిందని అన్నారు. పన్నుల సొమ్మును మంచి పనుల కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్న నమ్మకం వారిలో కనిపిస్తోందని చెప్పారు. సోమవారం మధ్యప్రదేశ్‌లో కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో ప్రధాని వర్చువల్‌గా ప్రసంగించారు. భోపాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ‘అమృతకాలంలో’ తొలి సంవత్సరం నుంచే సానుకూల వార్తలు రావడం ఆరంభమైందని, దేశంలో సంపద వృద్ధి చెందుతోందని, పేదరికం తగ్గిపోతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్)లు దాఖలు చేసే వారి సగటు వార్షికాదాయం ఆదాయం 2014లో రూ.4 లక్షలు ఉండేదని, ఇప్పుడు అది రూ.13 లక్షలకు చేరిందని వెల్లడించారు. ప్రజలు దిగువ ఆదాయ వర్గం నుంచి ఎగువ ఆదాయ వర్గంలోకి చేరుకుంటున్నారని మోదీ తెలిపారు. దేశమంతటా సానుకూల వాతావరణం దేశంలో దాదాపు అన్ని రంగాలు బలోపేతం అవుతున్నాయని, అదే స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతోందని ప్రధాని చెప్పారు. 2014లో మన దేశం ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, ఇప్పుడు ఐదో ఆర్థిక వ్యవస్థగా మారిందని చెప్పారు. కొత్తగా నియమితులైన 5,580 మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచి్చంది. -
Telangana: నిలబెట్టిన సం‘క్షేమం’!
ఉచిత విద్యుత్, పంటల సాగుకు పెట్టుబడి సాయం, ఇంకా గొర్రెలు, చేపపిల్లల పంపిణీ, రేషన్ పెంపు, ఆసరా పింఛన్లు, మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు వంటివి తెలంగాణ ఆర్థిక, సామాజిక చిత్రాన్ని మార్చుతున్నాయి. పౌష్టికాహారం, అక్షరాస్యత, లింగ సమానత్వం, ఉపాధి హామీ తదితర అంశాల్లో పురోగతితోపాటు పేదరికం తగ్గిపోతోంది. ఈ మేరకు తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘బహుముఖ పేదరిక సూచిక 2019–21’లో తెలంగాణ జాతీయ సగటును మించి సత్ఫలితాలు సాధించినట్టు తెలిపింది. పేదలకు పౌష్టికాహారం మొదలుకుని బ్యాంకు ఖాతాల వరకు మొత్తం పన్నెండు అంశాలను పరిశీలించిన నీతి ఆయోగ్.. తెలంగాణలో నిరుపేదల సంఖ్య 5.88శాతానికి తగ్గినట్టు తేల్చింది. -సాక్షి ప్రత్యేక ప్రతినిధి సంక్షేమ పథకాలే ఔషధంగా.. ఉచితాలు అనుచితం అభివృద్ధి నిరోధమంటూ సంక్షేమ పథకాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. సంక్షేమ పథకాలే ప్రజలు పేదరికం నుంచి బయటపడటానికి తోడ్పడుతున్నాయని జాతీయ కుటుంబ సర్వే ఆధారంగా నీతి ఆయోగ్ వెలువరించిన పేదరిక సూచిక తేల్చింది. సంక్షేమ పథకాలు అమలవుతున్న రాష్ట్రాల్లో దారిద్య్ర రేఖను అధిగమిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 2015–2016లో 13.18శాతంగా ఉన్న నిరుపేదల సంఖ్య.. మూడేళ్లలోనే 5.88 శాతానికి తగ్గింది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ 2015–16లో 11.77శాతంగా ఉన్న పేదరికం 6.06 శాతానికి తగ్గింది. పట్టణాల కంటే గ్రామాల్లో పేదల సంఖ్య వేగంగా తగ్గుతోందని నివేదిక తేల్చింది. తెలంగాణలో ప్రçÜ్తుతం గ్రామాల్లో 7.51 శాతం, పట్టణాలు–నగరాల్లో 2.73శాతం పేదలు ఉన్నట్టు పేర్కొంది. పోషకాహారమే సమస్య దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పోషకాహారమే పెద్ద సమస్యగా ఉందని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. దీనివల్ల రక్తహీనత, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం వంటివి కొనసాగుతున్నాయని వెల్లడించింది. తెలంగాణలో 2015–16లో 9.78 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడగా.. 2019–21 నాటికి ఇది 4.91 శాతానికి తగ్గింది. ఇళ్లులేని వారిశాతం 2015–16లో 8.07 శాతంగా ఉండగా.. 2019–21 నాటికి 3.17 శాతానికి తగ్గింది. కుమురంభీం, గద్వాలలో ఎక్కువ పేదరికం రాష్ట్రంలో జాతీయ సగటును మించి కుమురం భీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పేదరిక శాతం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాలు ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితిలో ఉన్నాయని.. అత్యంత వెనుకబడిన ఈ జిల్లాల్లో పేదరిక నిర్మూలన సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాల్సి ఉందని సామాజిక పరిశీలకులు అంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాల ని.. పలు ప్రత్యేక పథకాల అమలు తక్షణ అవసరమని సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ వి.సత్తిరెడ్డి అభిప్రాయపడ్డారు. సంక్షేమం.. ఉత్పాదక శక్తికి ఊతం తెలంగాణలో సంక్షేమ పథకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మంచినీరు, విద్యుత్, పక్కా గృహాల విషయంలో చాలా మార్పు వచ్చింది. సంక్షేమ పథకాలు ఉత్పాదక శక్తికి ఊతం ఇస్తున్నాయి. నిరుపేదలు తమ కాళ్లపై తాము నిలబడే వరకు సంక్షేమ పథకాలు అమలు చేయటం, వాటిని అదే స్థాయిలో సద్వినియోగం చేసుకుంటే సామాజిక మార్పు సాధ్యం. – డాక్టర్ రేవతి, సెస్ సంస్థ డైరెక్టర్ సామాజిక మార్పునకు కారణమవే.. అనేక వైరుధ్యాలున్న తెలంగాణ సమాజంలో ఇప్పుడు అమలవు తున్న సంక్షేమ పథకాలతో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సంపద వివిధ రూపంలో ప్రజలకు చేరుతోంది. దాంతో నిరుపేదలు సైతం సంపద సృష్టించే స్థాయికి చేరుతుండటం శుభ పరిణామం. – డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, మాజీ ప్రధాన సమాచార కమిషనర్ -
నీతిఆయోగ్ టాప్ పెర్ఫార్మెన్స్లో ‘విశాఖ ఏఎంటీజెడ్ ఇంక్యుబేషన్’కు చోటు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్లు అద్భుతమైన పనితీరుతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. విశాఖ మెడ్‌టెక్ జోన్లో, అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్లు నీతిఆయోగ్ ప్రకటించిన సర్వేలో అగ్రస్థానాలను దక్కించుకున్నాయి. 2021కి సంబంధించి నీతిఆయోగ్ 68 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ పనితీరును అధ్యయనం చేసి.. వచ్చిన మార్కుల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించి నివేదిక విడుదల చేసింది. పదికి 7.5 కంటే ఎక్కువ మార్కులు సాధించిన వాటిని టాప్ పెర్ఫార్మ్స్గా నీతి ఆయోగ్ ప్రకటించింది. ఈ విభాగంలో దేశవ్యాప్తంగా 12 ఇంక్యుబేటర్స్‌కు స్థానం లభించగా.. విశాఖకు చెందిన ఏఎంటీజెడ్(మెడ్‌టెక్ జోన్) మెడ్‌వ్యాలీ ఇంక్యుబేషన్ సెంటర్‌కు స్థానం లభించింది. ఒకే రంగంపై అత్యధికంగా దృష్టిసారించడం, అనేక రకాల గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ పొందడం, సీడ్ ఫండ్ గ్రాండ్స్ ఫండ్స్‌లో మంచి పనితీరు కనపర్చిన వాటిని ఈ విభాగం కింద ఎంపిక చేసింది. అదే విధంగా 6.5–7.5 మధ్య మార్కులు పొందిన వాటిని ఫ్రంట్ రన్నర్స్‌గా కేటాయించింది. ఈ విభాగంలో దేశవ్యాప్తంగా 22 ఇంక్యుబేటర్స్ ఎంపికకాగా, రాష్ట్రానికి చెందిన ఎస్కేయూ కాన్ఫడరేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ చోటు దక్కించుకుంది. ఈ విభాగంలో ఎంపికైన ఇంక్యుబేటర్స్‌కు ఇన్పుట్స్, ప్రాసెస్‌లన్నీ ఉన్నాయని, కానీ భాగస్వాములను పెంచుకోవాల్సిన అవ సరం ఉందని నీతి ఆయోగ్ తన నివేదికలో సూచించింది. అటల్ ఇంక్యుబేటర్స్‌తో 35,000 మందికి ఉపాధి దేశవ్యాప్తంగా పరిశోధనలను నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి 2016లో 68 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్‌ను ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటి ద్వారా 3,200కు పైగా యాక్టివ్ స్టార్టప్స్ అభివృద్ధి చెందినట్టు నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. ఇందులో 30 శాతం స్టార్టప్స్ మహిళల నాయకత్వంలో ఉండటం గమనార్హం. ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ద్వారా 30,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు నీతి ఆయోగ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా 700 ఇంక్యుబేటర్స్ ఉండగా.. వాటిలో 450 ఇంక్యుబేటర్స్‌కు వివిధ మంత్రిత్వ శాఖల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.2,100 కోట్ల వరకు ఆరి్థక మద్దతు లభించినట్టు వెల్లడించింది. ఇందులో 70 శాతం అంటే 1,500 కోట్లు ప్రభుత్వం నుంచే వస్తే, ప్రైవేటు రంగం నుంచి కేవలం 18 శాతం అంటే సుమారు రూ.400 కోట్లు మాత్రమే వచ్చింది. సీఎస్ఆర్ నిధుల కింద మరో 12 శాతం లభించింది. ఈ గణాంకాలు ప్రైవేటు రంగ పెట్టుబడులు మరింత పెరగాల్సిన ఆవశ్యకతను సూచిస్తోందని నీతి ఆయోగ్ తెలిపింది. -
సీఎం క్యాంప్ ఆఫీస్ లో వైఎస్ జగన్ ను కలిసిన నీతి అయోగ్ టీమ్
-
ప్రపంచ పటంలో విశాఖ..
సాక్షి, అమరావతి : విశాఖపట్నాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అంతర్జాతీయంగా ప్రపంచ పటంలో పెట్టే ప్రయత్నాన్ని తమ ప్రభుత్వం చేస్తుందని ముఖ్యమం‘త్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి. రాధతో పాటు పార్థసారథిరెడ్డి, నేహా శ్రీవాత్సవ, అభిషేక్ తదితరుల ప్రతినిధుల బృందం మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి జగన్ ఈ సందర్భంగా వారికి వివరించారు. నగరీకరణ, పారిశ్రామికీకరణ అంశాల్లో దేశంలో ఎంపిక చేసిన నాలుగు నగరాల్లో విశాఖకు చోటుకల్పించడం శుభపరిణామమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఎయిర్‌పోర్టు–సీపోర్ట్ కనెక్టివిటీ రోడ్డు, డేటా సెంటర్, మూలపేట పోర్టు, ఇనార్బిట్ మాల్.. ఇలా అనేక విధాలుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసి అంతర్జాతీయంగా, ప్రపంచ పటంలో పెట్టే ప్రయత్నాన్ని తమ ప్రభుత్వం చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అంతేకాక.. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సీపోర్టులు, వ్యవసాయం, వైద్య, ఆరోగ్య, విద్యారంగం, నాడు–నేడు, నవరత్నాలు, ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాలు ఇలా.. ప్రతి విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వాటి ఫలితాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, ప్రభుత్వ పనితీరును నీతి ఆయోగ్ బృందం అభినందించింది. ఈ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ సమగ్ర నివేదిక రూపంలో తమకు అందజేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని బృందం కోరింది. ఏపీకి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. ఈ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ పాల్గొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నీతి ఆయోగ్ ప్రత్యేక దృష్టి మరోవైపు.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ ప్రత్యేక దృష్టిసారించింది. అందుకు రాష్ట్రంలో స్టేట్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మేషన్ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా రాధ మాట్లాడుతూ.. రాష్ట్రం అధిక వృద్ధి రేటు సాధించే విషయంలో అభివృద్ధి వ్యూహాల రూపకల్పనకుగాను రానున్న రెండేళ్లలో నీతి ఆయోగ్ రూ.5.28 కోట్లు అందించడంతోపాటు అవసరమైన ఇతర సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. దేశాభివృద్ధిలో నగరీకరణ అత్యంత కీలకపాత్ర పోషిస్తోందని ఆమె అన్నారు. రానున్న సంవత్సరాల్లో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ వైపు భారత్ పరుగులు తీస్తోందని.. అందుకు రాష్ట్రాల సహకారం ఎంతో ముఖ్యమని రాధ అన్నారు. నవరత్నాలతో అధిక వృద్ధి రేటు: సీఎస్ ఇక రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను సీఎస్ జవహర్‌రెడ్డి వివరించారు. నవరత్నాలు పేరిట పెద్దఎత్తున సంక్షేమాభివృద్ధి పధకాలను అమలుచేయడంవల్ల రానున్న రోజుల్లో అధికవృద్ధి రేటు సాధనకు అన్నివిధాలా అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. నీతి ఆయోగ్ సలహాదారు పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. ఆయా రంగాల వారీగా ఆర్థికాభివృద్ధికి గల అంశాలను వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికాశాఖ కార్యదర్శి గిరిజాశంకర్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
PM Narendra Modi: మూడోసారీ మేమే...
న్యూఢిల్లీ: వరుసగా మూడో పర్యాయం ప్రధాని పదవిని చేపడతానని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. తమ మూడో పర్యాయంలో మెరుగైన వృద్ధిరేటుతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అన్నారు. 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారనే నీతి ఆయోగ్ నివేదికను ప్రస్తావిస్తూ భారత్ తప్పకుండా పేదరిక నిర్మూలన సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2014లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టినపుడు భారత్ ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండగా... ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారు. -
ఏపీలో తగ్గుతున్న పేదరికం
-
పేదరికం.. తగ్గుముఖం
సాక్షి, అమరావతి: ‘పేదరికంపైనే నా యుద్ధం.. పేదల సంక్షేమమే నా లక్ష్యం’ అని విస్పష్టంగా పేర్కొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయ సాధనలో కీలక మైలురాయిని అధిగమించారు. మొత్తం జనాభాలో పేదలు 10 శాతం కంటే తక్కువగా ఉండాలన్న నీతి ఆయోగ్ ప్రాథమిక లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా 2021లో సాధించింది. విపక్షాలు రాజకీయ దురుద్దేశాలతో ఎంత బురద జల్లుతున్నా సంక్షేమ ఫలాలు పేదల అభ్యున్నతికి దోహదపడుతున్నట్లు మరోసారి రుజువైంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘జాతీయ బహుముఖ పేదరిక సూచీ’ నివేదిక ఈ వాస్తవాన్ని గణాంకాలతో సహా వెల్లడించింది. 2016 కంటే 2021 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేదలు దాదాపుగా సగం వరకు తగ్గారని నివేదిక తెలిపింది. మరోవైపు ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని పేర్కొంది. పౌష్టికాహారం, శిశు మరణాల రేటు, తల్లుల ఆరోగ్యం, పాఠశాల విద్య, హాజరు శాతం, వంటనూనెల వినియోగం, పరిశుభ్రత, తాగునీరు, గృహ వసతి, విద్యుత్ వినియోగం, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు కలిగి ఉండటం లాంటి 12 అంశాలు ప్రామాణికంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే నివేదికను నీతి ఆయోగ్ తాజాగా వెల్లడించింది. అందులో ప్రధానాంశాలు ఇవీ.. గ్రామాల్లో గణనీయంగా తగ్గుదల.. ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం తగ్గుతోందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. 2016 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 11.77 శాతం మంది ప్రజలు నిరుపేదలుండగా 2021 డిసెంబర్ నాటికి 6.06 శాతానికి తగ్గారు. నిరుపేదలు 5.71 శాతం తగ్గారని నీతి ఆయోగ్ వెల్లడించింది. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తగ్గడం గమనార్హం. 2016 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 14.72 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 4.63 శాతం మంది నిరుపేదలున్నారు. 2021 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు 7.71 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 2.20 శాతానికి తగ్గారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 7.01 శాతం, పట్టణ ప్రాంతాల్లో 2.43 శాతం పేదరికం తగ్గింది. 12 అంశాల్లోనూ మెరుగైన పనితీరు బహుముఖ పేదరిక నిర్మూలనకు సంబంధించి నీతి ఆయోగ్ పరిగణలోకి తీసుకున్న 12 అంశాల్లోనూ ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరిచింది. పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు (వంటనూనెల వినియోగం, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ వినియోగం, గృహనిర్మాణం, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు) ఇలా అన్నింటిలో రాష్ట్రం ప్రగతి సాధించింది. చంద్రబాబు సాధించలేనిది... జగన్ చేసి చూపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాల ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు సత్ఫలితాలను అందిస్తున్నట్లు నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేస్తోంది. పేదరిక నిర్మూలనకు నీతి ఆయోగ్ నిర్దేశించిన లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిగమించడమే అందుకు నిదర్శనం. బహుముఖ పేదరిక సూచీల ప్రమాణాల ప్రకారం జనాభాలో పేదలు 10 శాతం కంటే తక్కువ ఉండాలని నీతి ఆయోగ్ పేర్కొంది. 2016 డిసెంబర్లో నీతి ఆయోగ్ వెల్లడించిన నివేదిక ప్రకారం మొత్తం జనాభాలో 10 శాతం కంటే తక్కువ పేదలున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, కేరళ, గోవా, మిజోరాం రాష్ట్రాలే ఆ జాబితాలో ఉన్నాయి. 2016 డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేదలు 11.77 శాతం మంది ఉన్నారు. అంటే జనాభాలో 10 శాతం లోపే పేదలు ఉండాలన్న లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ సాధించలేకపోయింది. అయితే 2021నాటికి ఆంధ్రప్రదేశ్ పేదల సంక్షేమంలో గణనీయమైన ప్రగతి సాధించింది. నీతి ఆయోగ్ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించింది. పేదరికాన్ని సమర్థంగా కట్టడి చేసిన రాష్ట్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. రాష్ట్ర జనాభాలో నిరుపేదలను 6.06 శాతానికి తగ్గించింది. -
నీతి ఆయోగ్ టాప్ లిస్ట్‌లో వైఎస్సార్ జిల్లా
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్ జిల్లాకు నీతి ఆయోగ్ ప్రశంసలు దక్కాయి. ప్రతీ ఏటా విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో.. ఆకాంక్షాత్మక జిల్లాల AspirationalDistricts మెరుగైన ఫలితాలు సాధించిన జాబితా టాప్-5లో మూడో స్థానంలో నిలిచింది వైఎస్సార్. తద్వారా అభినందనలు అందుకుంటోంది. అభివృద్ధి చెందుతున్న జిల్లాలు, అభివృద్ధి చెందుతున్న దేశానికి పట్టుకొమ్మలంటూ నీతి ఆయోగ్ మొదటి నుంచి ప్రకటించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఈ జాబితాలో వైఎస్సార్ జిల్లా మూడో స్థానం నిలవడం విశేషం. Prospering Districts, Prospering Country! 🇮🇳 Here are the top 5⃣ most improved #AspirationalDistricts as per #NITIAayog's Delta Ranking for May 2023. Congratulations to our #ChampionsOfChange!👏 pic.twitter.com/QZJLzR44P6 — NITI Aayog (@NITIAayog) July 17, 2023 ఇక.. నీతి ఆయోగ్ ఏటా ప్రకటించే ఎగుమతుల సన్నద్ధత సూచీ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ సోమవారం విడుదల చేసిన 2022కు సంబంధించిన ర్యాంకుల్లో 59.27 పాయింట్లతో ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. గతేడాది తొమ్మిదో స్థానంలో ఉన్న మన రాష్ట్రం మరోస్థానం ఎగబాకింది. ఇదీ చదవండి: ఎగుమతుల్లో ఎగసిన ఏపీ -
సీఎం జగన్ సర్కార్‌ను ప్రశంసించిన నీతి అయోగ్
-
ఎగుమతుల్లో ‘ఎగిసిన’ ఏపీ
సాక్షి, అమరావతి: నీతి ఆయోగ్ ఏటా ప్రకటించే ఎగుమతుల సన్నద్ధత సూచీ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ సోమవారం విడుదల చేసిన 2022కు సంబంధించిన ర్యాంకుల్లో 59.27 పాయింట్లతో ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. గతేడాది తొమ్మిదో స్థానంలో ఉన్న మన రాష్ట్రం మరోస్థానం ఎగబాకింది. ఈ ర్యాంకుల్లో 80.89 పాయింట్లతో తమిళనాడు మొదటిస్థానంలో నిలిస్తే, ఆ తరువాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర (78.20), కర్ణాటక (76.36), గుజరాత్ (73.22), హరియాణ (63.65), తెలంగాణ (61.36), ఉత్తరప్రదేశ్ (61.23) ఉన్నాయి. 2020లో 20వ స్థానంలో ఉన్న ఏపీ .. కేవలం రెండేళ్లలో 12 స్థానాలను మెరుగుపర్చుకుని సత్తా చాటింది. ఇక కోస్తాతీరం కలిగిన రాష్ట్రాలు 8 ఉంటే ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచింది. ఎగుమతుల పాలసీలో 99.52 పాయింట్లతో 4వ స్థానం, ఎగుమతుల ఎకోసిస్టమ్‌లో 6వ స్థానం దక్కించుకుంది. టాప్ 100లో రాష్ట్రం నుంచి 8 జిల్లాలు.. దేశం నుంచి 2021–22లో 422 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు జరగ్గా ఏపీ వాటా 4.58 శాతం (19 బిలియన్ డాలర్లు) ఉందని నివేదిక పేర్కొంది. 127 బిలియన్ డాలర్ల ఎగుమతులతో గుజరాత్ మొదటిస్థానంలో ఉంది. దేశం నుంచి అత్యధికంగా ఎగుమతులు జరుగుతున్న టాప్ 100 జిల్లాల్లో రాష్ట్రం నుంచి 8 ఉమ్మడి జిల్లాలకు చోటు దక్కింది. అందులో విశాఖకు టాప్ 10లో తొమ్మిదో స్థానం దక్కగా ఉమ్మడి తూర్పుగోదావరికి 24వ స్థానం దక్కింది. ఎగుమతులు ఇన్ఫ్రాలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పనితీరు బాగుందని, అలాగే గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఎగుమతిదారులకు రుణ లభ్యతకూడా భారీగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా నిర్దిష్టమైన పాలసీలను రూపొందించి అమలు చేయడం ద్వారా ఏపీ ర్యాంకులు మెరుగుపడ్డాయని నీతిఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో అత్యధికంగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ జోన్స్, అగ్రిఎక్స్‌పోర్ట్ జోన్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఎగుమతిదారుల సామర్థ్యాన్ని పెంచే విధంగా ప్రభుత్వం వర్క్‌షాప్స్, ట్రేడ్ ఫెయిర్స్‌ను నిర్వహించిందంటూ కితాబునిచ్చింది. టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవడంతో అంతర్జాతీయంగా రాష్ట్రం పోటీపడటానికి దోహదం చేసిందని, అది రాష్ట్ర ఎగుమతుల్లో భారీ వృద్ధిని నమోదు చేసిందని పేర్కొంది. రాష్ట్రంలోకి విదేశీపెట్టుబడుల రాక పెరుగుతున్నప్పటికీ.. ఎగుమతుల ఎకోసిస్టమ్‌కు అనుగుణంగా వ్యాపార వాతావరణం మెరుగుపర్చుకుంటే ఎగుమతుల్లో మరింత వృద్ధి నమోదు చేయవచ్చని సూచించింది. కాగా, ఎగుమతులు పెంచుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, సాధిస్తున్న ఫలితాల ఆధారంగా ఈ సూచీలో ర్యాంకులు నిర్ధారిస్తారు. 2020లో 20వ స్థానంలో ఉన్న ఏపీ.. 2021లో 9వ ర్యాంకుకు, ఈ ఏడాది మరో ర్యాంకుకు ఎగబాకి అంతర్జాతీయంగా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోందని, దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ కృషి ఎంతో ఉందని నిపుణులు చెబుతున్నారు. -
తెలంగాణ జనాభా 4.10 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనాభా ప్రస్తుతం 4.10 కోట్లు అని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. నీతి ఆయోగ్ అంచనా ప్రకారం తెలంగాణ సంతానోత్పత్తి రేటు 1.6గా అంచనా వేసినట్టు తెలిపింది. జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుటుంబ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో సత్కరిస్తామని తెలిపింది. స్వాతంత్ర అమృత మహోత్సవాల సందర్భంగా కుటుంబ నియంత్రణపై ప్రతిజ్ఞ చేయాలని ఆ శాఖ కోరింది. రెండు విడతలుగా పక్షోత్సవాలు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతలుగా పక్షోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి పక్షోత్సవం ఈ నెల 27 నుండి జూలై 10వ తేదీ వరకు, రెండో పక్షోత్సవం జూలై 11 నుండి జూలై 24వ తేదీ వరకు నిర్వహిస్తారు. మొదటి పక్షం రోజుల్లో జనాభా పెరుగుదల, దానివల్ల కలిగే అనర్ధాల గురించి విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండో పక్షోత్సవంలో కోవిడ్ నిబంధనలను అమలు చేస్తూ తాత్కాలిక పద్ధతులు, కుటుంబ నియంత్రణకు శాశ్వత పద్ధతులతో క్యాంప్‌లు నిర్వహిస్తారు. కాపర్–టిపై అవగాహన ఈ క్యాంపుల్లో అర్హులైన పురుషులకు వేసెక్టమీ, స్త్రీలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేస్తారు. ప్రసవం అయిన 48 గంటల్లో వేసే కాపర్–టి గురించి అవగాహన కల్పిస్తారు. ఈ కాపర్–టి 10 సంవత్సరాల వరకు కూడా పని చేస్తుంది. దీనివల్ల బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం ఉండటమే కాక అధిక ప్రమాదం గల గర్భములను, మాతృ మరణాలను నివారించవచ్చు. ఈ సేవలన్నీ ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా లభిస్తాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వేసెక్టమీ, ట్యూబెక్టమీ చేయించుకున్న వారికి నగదు ప్రోత్సాహకాలు శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అయిన వేసెక్టమీ, ట్యూబెక్టమీ చేయించుకున్న వారికి, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులైన అంతర ఇంజెక్షన్ వేయించుకున్న వారికి నగదు ప్రోత్సాహకాలు ఇస్తారు. గతేడాది ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్న స్త్రీల సంఖ్య 1,14,141, వేసెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్న పురుషుల సంఖ్య 3,229 అని ఆరోగ్య కుటుంబ సంక్షేమ అదనపు సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు. -
మంత్రిత్వ శాఖ చర్యలు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి - అజయ్ శర్మ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఉద్ధేశించిన ఫేమ్–2 పథకంపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని సొసైట ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఎస్ఎంఈవీ) తాజాగా నీతి ఆయోగ్‌ను కోరింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ చర్యలు ఫేమ్–2 విధానాన్ని విధ్వంసం చేస్తున్నాయని నీతి ఆయోగ్ చైర్పర్సన్ సుమన్ కె బెర్రీకి రాసిన లేఖలో సొసైటీ సెక్రటరీ జనరల్ అజయ్ శర్మ పేర్కొన్నారు. ‘18 నెలలుగా మంత్రిత్వ శాఖ చర్యలు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ, విస్తరణ ప్రక్రియను గణనీయంగా ఆలస్యం చేసే అవకాశం ఉంది. రాయితీల నిలిపివేత, 2019లో ఇచ్చిన రాయితీల పునరాలోచనను డిమాండ్ చేయడం, నేషనల్ ఆటోమోటివ్ బోర్డ్ పోర్టల్ నుండి కంపెనీల తొలగింపు, ఫేమ్–2 సబ్సిడీల తగ్గింపు వినాశకర చర్యల శ్రేణిగా భావిస్తున్నాం. సబ్సిడీ దిగ్బంధనం, పెనాల్టీ నోటీసులు, భవిష్యత్ విక్రయాలపై ఆంక్షలు ఫేమ్–2 విధానాన్ని నాశనం చేస్తున్నాయి. (ఇదీ చదవండి: అప్పుచేసి ట్రక్కు కొని వేలకోట్లు సంపాదిస్తున్నాడిలా!) తయారీ కంపెనీలు సమస్యల నుంచి గట్టెక్కడానికి కష్టపడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బ్యాంకులు మొహం చాటేస్తున్నాయి. ఉద్యోగులు పారిపోతున్నారు. కంపెనీలకు అప్పులు పెరుగుతున్నాయి. మూసివేతలే ఇక తదుపరి దశ’ అని లేఖలో వివరించారు. -
మౌలిక సదుపాయాలే కీలకం: నీతి ఆయోగ్ భేటీలో సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తేనే ఆర్థిక వ్యవస్థ శీఘ్రగతిన పురోగమిస్తుందని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశ జీడీపీలో తయారీ, సేవల రంగం వాటా 85 శాతం దాటినప్పుడే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేశారు. రెండు రంగాల ప్రపంచ సగటు వాటా 91.5 శాతంగా ఉందని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయం, పెట్టుబడులు.. రెండింటికీ సంబంధించిన అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆహార రంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతోపాటు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రాష్ట్రాలూ ఒక జట్టుగా పని చేయాలని, ప్రతి రాష్ట్రం శ్రేయస్సు మొత్తం దేశంతో ముడి పడి ఉంటుందని చెప్పారు. శనివారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ ఎనిమిదవ పాలక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. నీతి ఆయోగ్ చర్చించే వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరిస్తూ ఒక నోట్ సమర్పించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పోర్డు ఆధారిత అభివృద్ధికి ఏపీ ప్రాధాన్యం ► దేశంలో లాజిస్టిక్స్ కోసం పెడుతున్న ఖర్చు జీడీపీలో 14 శాతంగా ఉంది. భారతీయ ఉత్పత్తులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు ఇది ప్రతిబంధకంగా మారింది. అమెరికాలో లాజిస్టిక్స్ ఖర్చు కేవలం 7.5 శాతానికే పరిమితమైంది. గత తొమ్మిదేళ్లలో సరకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారులపై ప్రభుత్వం ప్రశంసనీయ రీతిలో వ్యయం చేస్తోంది. ఆశించిన ఫలితాలను సాధించడానికి దీన్ని కొనసాగించడం చాలా అవసరం. ► ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం పోర్టు ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పీపీపీ పద్ధతిలో నిరి్మస్తోంది. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు.. 6 లక్షల మందికి ఉపాధి ► తయారీ, సేవల రంగాల వాటా పెరుగుదలను సాధించడానికి పెట్టుబడులు చాలా అవసరం. దీనికి అనుకూలమైన వ్యాపార వాతావరణం తప్పనిసరి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ గత మూడేళ్లుగా వరుసగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ► ప్రభుత్వం వ్యాపారస్తులకు అత్యంత అనుకూలంగా అనుమతులు సహా తదితర విధానాలను సరళీకృతం చేసింది. వాడుకలో లేని చట్టపరమైన నిబంధనలను సవరించడంతో పాటు కొన్నింటిని రద్దు చేసింది. ► విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023కు అద్భుత స్పందన లభించించింది. రూ. రూ.13 లక్షల కోట్ల భారీ పెట్టుబడులతో వివిధ సంస్థలు, కంపెనీలు ముందుకు వచ్చాయి. దీనివల్ల దాదాపు 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రజారోగ్యం బలోపేతం ► ప్రజారోగ్యం, పౌష్టికాహారం కూడా చాలా ముఖ్యమైన అంశాలు. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, పెరుగుతున్న సంక్రమించని దీర్ఘకాలిక వ్యాధులైన హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటి అనారోగ్యాలకు సమయానికి చికిత్స అందించకపోతే తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. టెరిటరీ హెల్త్‌కేర్ పేరిట అతిపెద్ద భారానికి దారితీస్తుంది. అందుకనే దీనిపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. హెల్త్‌కేర్ మేనేజ్మెంట్, పౌష్టికాహారంపై అత్యంత దృష్టి పెట్టాలి. ► ఏపీ ప్రభుత్వం 10,592 గ్రామ, వార్డు క్లినిక్‌లను ఏర్పాటు చేసి, ఇందులో ఒక మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్, ఒక ఏఎన్ఎం, ఆశావర్కర్లను అందుబాటులో ఉంచింది. ప్రతి విలేజ్, వార్డు క్లినిక్‌లో 105 రకాల అవసరమైన మందులు, 14 రకాల డయాగ్నస్టిక్స్ అందుబాటులో ఉన్నాయి. ► రెండున్నరేళ్లలో రాష్ట్రంలో 48,639 మంది వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని నియమించింది. విలేజ్ క్లినిక్‌ల నుండి బోధనాస్పత్రుల వరకు అవసరమైన సంఖ్యలో వైద్యులు, నర్సులు, పారామెడిక్స్ ఉన్నారు. ► విలేజ్ క్లినిక్ కాన్సెప్‌్టను పూర్తి సామర్థ్యంతో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇందులో పీహెచ్‌సీల నుండి వైద్యులు కనీసం నెలకు రెండుసార్లు వారికి నిర్దేశించిన గ్రామాన్ని సందర్శిస్తారు. విలేజ్, వార్డు క్లినిక్‌ల సౌకర్యాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ముందుగా పేర్కొన్న తేదీల్లో వైద్యులు ఆయా గ్రామాలను సందర్శిస్తారు. ► జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా వచ్చే వ్యాధుల సమస్యలను సమర్థవంతంగా స్క్రీనింగ్ చేయడం, గుర్తించడం, నిర్ధారించడం, ట్రాక్ చేయడం, చికిత్స చేయడం ద్వారా విజయవంతంగా వాటిని నివారించవచ్చని ప్రగాఢంగా నమ్ముతున్నాం. డైనమిక్‌గా పాఠ్య ప్రణాళిక ► నైపుణ్యాభివృద్ధి అన్నది మరో కీలక అంశం. జర్మనీ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈ అంశంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తగ్గుతున్న జననాల రేటు కారణంగా, ఆ దేశాలు చివరకు శ్రామికశక్తి కొరతను ఎదుర్కొంటాయి. పని చేసే వయసున్న జనాభా విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నాయి. ► అదృష్టవశాత్తు మన దేశ జనాభాలో అధిక భాగం పనిచేసే వయసున్న వారే ఉన్నారు. ఇది దేశానికి అత్యంత ప్రయోజనకరం. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, లార్జ్ లాంగ్వేజ్ల ప్రవాహం ప్రపంచాన్ని శరవేగంగా మారుస్తోంది. ఈ సృజనాత్మక యుగంలో పాతవాటి విధ్వంసం, కొత్త ఆవిష్కరణలు.. ఇప్పటికే ఉన్న వ్యాపార పద్ధతులు, ప్రక్రియలు, సాంకేతికతలను సమూలంగా మార్చేస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవడానికి వీలుగా మనం పాఠ్యాంశాల్లోనే అర్థవంతమైన, డైనమిక్ నైపుణ్యాలను నేర్చుకునేలా కొత్తవాటిని ప్రవేశపెట్టాలి. పాఠ్య ప్రణాళికను డైనమిక్‌గా తీర్చిదిద్దాలి. మహిళలకు చేయూత ► సమ్మిళిత వృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి మహిళా సాధికారత చాలా కీలకం. మహిళలకు ఆర్థిక వనరులు, అవకాశాలను పెంపొందించడానికి, ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేయూత, ఆసరా వంటి అనేక పథకాలను అమలు చేస్తోంది. దీని కింద వెనుకబడిన, ఆరి్థకంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నాలుగేళ్లుగా స్థిరంగా ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ► మహిళా స్వయం సహాయక సంఘాలపై అధిక అప్పుల భారం.. ఆదాయాన్ని సమకూర్చే కార్యక్రమాల్లో వారి పెట్టుబడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని ప్రభుత్వం గుర్తించింది. ఈ పోటీ ప్రపంచంలో వారు నిలదొక్కుకోవడం చాలా కష్టమవుతున్నందున, సున్నా వడ్డీ కార్యక్రమం ద్వారా, సకాలంలో తిరిగి చెల్లించే షరతుపై ఎస్‌హెచ్‌జీలు పొందే రుణాలపై వడ్డీ రాయితీని ప్రభుత్వం గణనీయంగా అందిస్తోంది. ► కేవలం నిధులను మహిళల చేతుల్లో పెట్టడంతోనే ప్రభుత్వాల పాత్ర ముగిసిపోకూడదు. పెట్టుబడి పెట్టడానికి, తీవ్రమైన పోటీని తట్టుకునేలా ఆయా కార్యక్రమాల్లో కొనసాగడానికి మహిళలకు పరిమిత సామర్థ్యం ఉందని ప్రభుత్వాలు గుర్తించాలి. వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ అనుసంధానాలను పొందడంలో మహిళలకు చేయూతనిచ్చి నడిపించే ప్రగతిశీల విధానాన్ని ప్రభుత్వాలు అవలంబించాలి. -
రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి
న్యూఢిల్లీ: భారత్‌ను 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలని, ఈ లక్ష్య సాధన కోసం ఒక ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒక బృందంగా కలిసి పనిచేయాలన్నారు. రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో ‘నీతి ఆయోగ్’ ఎనిమిదో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఇక ఉమ్మడి దార్శనికత(విజన్) అవసరమని అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రాంతాల అభివృద్ధికి, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రాలు ‘గతిశక్తి పోర్టల్’ను ఉపయోగించాలని చెప్పారు. ‘వికసిత్ భారత్’ సాధనకు సుపరిపాలన కీలకమని వివరించారు. కీలక అంశాలపై చర్చ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా తదితరులు హాజరయ్యారు. నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు, బిహార్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకాలేదు. ఈ భేటీకి 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. కొందరు సీఎంల తీరు ప్రజా వ్యతిరేకం: బీజేపీ నీతి ఆయోగ్ సమావేశానికి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాకపోవడాన్ని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తప్పుపట్టారు. వారి నిర్ణయం ప్రజా వ్యతిరేకం, బాధ్యతారహితం అని విమర్శించారు. దేశ అభివృద్ధికి రోడ్డు మ్యాప్ రూపొందించడంలో నీతి ఆయోగ్ పాత్ర కీలకమని గుర్తుచేశారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారని ఆక్షేపించారు. 100 కీలక అంశాలపై చర్చించే గవర్నింగ్ కౌన్సిల్ భేటీకి ముఖ్యమంత్రులు రాకపోవడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దీనివల్ల వారు తమ రాష్ట్రాల వాణిని వినిపించే అవకాశం కోల్పోయారని తెలిపారు. ప్రధాని మోదీని ఇంకెంత కాలం ద్వేషిస్తారని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. మోదీని ద్వేషించడానికి ఇంకా చాలా అవకాశాలు వస్తాయని, మరి ప్రజలకెందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. -
నీతి ఆయోగ్ భేటికి సీఎం జగన్.. ఢిల్లీ పర్యటన దృశ్యాలు
-
ఢిల్లీలో నీతిఆయోగ్ పాలకమండలి సమావేశం
-
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన సీఎం వైఎస్ జగన్
-
నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్
-
నీతి ఆయోగ్ సమావేశం.. సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. సమావేశానుద్దేశించి ప్రసంగించిన సీఎం.. దీంతో పాటు నీతిఆయోగ్ చర్చించే వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించేలా నోట్‌ను సమావేశానికి సమర్పించారు. సమావేశంలో సీఎం జగన్ ఏమన్నారంటే.. ►ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతంచేయాలి. తద్వారా ఆర్థికవ్యవస్థ శ్రీఘ్రగతిన పురోగమిస్తుంది. ►భారతదేశంలో లాజిస్ట్రిక్స్ ఖర్చు చాలా ఎక్కువుగా ఉంది. లాజిస్టిక్స్ కోసం పెడుతున్న ఖర్చు జీడీపీలో 14శాతంగా ఉంది. భారతీయ ఉత్పత్తులు ప్రపంచస్థాయిలో పోటీపడేందుకు ఇది ప్రతిబంధకంగా మారింది. అమెరికాలో చూసుకుంటే లాజిస్టిక్స్ ఖర్చు కేవలం 7.5శాతానికే పరిమితం అయ్యింది. గడచిన తొమ్మిదేళ్లలో సరకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారులపై ప్రభుత్వం ప్రశంసనీయరీతిలో వ్యవయం చేస్తోంది. మనం ఆశించిన ఫలితాలను సాధించడానికి దీన్ని కొనసాగించడం చాలా అవసరం. ►ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోర్టు ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా PPP పద్ధతిలో నిర్మిస్తోంది. దేశ GDPలో తయారీ మరియు సేవల రంగం వాటా 85 శాతం దాటినప్పుడే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరుతుంది. ►రెండు రంగాల ప్రపంచ సగటు వాటా 91.5%. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయం, పెట్టుబడులు రెండింటికి సంబంధించిన అంశాలపై అత్యంత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఆహారరంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతోపాటు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం చాలా అవసరం. ►తయారీ మరియు సేవల రంగాల వాటా పెరుగుదలను సాధించడానికి పెట్టుబడులు చాలా అవసరం, దీనికి అనుకూలమైన వ్యాపార వాతావరణం తప్పనిసరి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత మూడేళ్లుగా వరుసగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇంకా, మేము వ్యాపారస్తులకు అత్యంత అనుకూలంగా అనుమతులు సహా తదితర విధానాలను సరళీకృతం చేశాం. వాడుకలో లేని చట్టపరమైన నిబంధనలను సవరించాము, రద్దు చేసాం. ►విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కి అద్భుతమైన స్పందన లభించించింది. రూ. 13 లక్షల కోట్లు భారీ పెట్టుబడులకు వివిధ సంస్థలు, కంపెనీలు ముందుకు వచ్చాయి. దీనివల్ల దాదాపు 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పాటవుతున్నాయి. ►ప్రజారోగ్యం, పౌష్టికాహారం కూడా చాలా ముఖ్యమని నేను గట్టిగా చెప్పదలచుకున్నాను. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, పెరుగుతున్న NCD (సంక్రమించని దీర్ఘకాలిక వ్యాధుల)ల భారం గురించి మనం తెలుసుకోవాలి. హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటి అనారోగ్యాలకు సమయానికి చికిత్స అందించకపోతే తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. టెరిషరీ హెల్త్‌కేర్ పేరిట అతిపెద్ద భారానికి దారితీస్తుంది. అందుకనే దీనిపై ఎక్కువగా శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఉంది. హెల్త్‌కేర్ మేనేజ్మెంట్, పౌష్టికాహారంపై అత్యంత శ్రద్ధపెట్టాలి. ►ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,592 గ్రామ, వార్డు క్లినిక్‌లను ఏర్పాటు చేసింది, ఇందులో ఒక మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్ మరియు ఒక ANMను, ఆశావర్కర్లను అందుబాటులో ఉంచాం. ప్రతి విలేజ్, వార్డు క్లినిక్‌లో 105 రకాల అవసరమైన మందులు, 14 రకాల డయాగ్నస్టిక్స్ అందుబాటులో ఉన్నాయి. ►గత రెండున్నర సంవత్సరాల కాలంలో, రాష్ట్రంలో 48,639 మంది వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని నియమించింది, విలేజ్ క్లినిక్‌ల నుండి బోధనాసుపత్రుల వరకు అవసరమైన సంఖ్యలో వైద్యులు, నర్సులు మరియు పారామెడిక్స్ ఉండేలా చూసుకున్నాం ►విలేజ్ క్లినిక్ కాన్సెప్ట్‌ను పూర్తి సామర్థ్యంతో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది, ఇందులో PHCల నుండి వైద్యులు కనీసం నెలకు రెండుసార్లు వారికి నిర్దేశించిన గ్రామాన్ని సందర్శిస్తారు. విలేజ్, వార్డు క్లినిక్స్‌ల సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ముందుగా పేర్కొన్న తేదీల్లో వైద్యులు ఆయా గ్రామాలను సందర్శిస్తారు. చదవండి: టీడీపీ మహానాడులో లోకేష్‌కు షాకిచ్చిన కార్యకర్త ►జీవనశైలిలో వచ్చిన మార్పులు కారణంగా వచ్చే వ్యాధుల సమస్యలను సమర్థవంతంగా స్క్రీనింగ్ చేయడం, గుర్తించడం, నిర్ధారించడం, ట్రాక్ చేయడం, చికిత్స చేయడం ద్వారా విజయవంతంగా వాటిని నివారించవచ్చని మేం ప్రగాఢంగా నమ్ముతున్నాం. ►నైపుణ్యాభివృద్ధికి అన్నది మరొక కీలక అంశం. జర్మనీ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈ అంశంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయయి. తగ్గుతున్న జననాల రేటు కారణంగా, ఆ దేశాలు చివరికి శ్రామికశక్తి కొరతను ఎదుర్కొంటాయి. పని చేసే వయస్సున్న జనాభా విషయంలో తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. అదృష్టవశాత్తూ, దేశ జనాభాలో అధిక భాగం పనిచేసే వయస్సున్న వారే ఉన్నారు. ఇది దేశానికి అత్యంత ప్రయోజనకరం. ►కాని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, లార్జ్ లాంగ్వేజ్ల ప్రవాహం ప్రపంచాన్ని శరవేగంగా మారుస్తోంది. ఈ సృజనాత్మక యుగంలో పాతవాటి విధ్వంసం, కొత్త ఆవిష్కరణలు ఇప్పటికే ఉన్న వ్యాపార పద్ధతులను, ప్రక్రియలను, సాంకేతికతలను సమూలంగా మార్చేస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవడానికి వీలుగా మనం పాఠ్యాంశాల్లోనే అర్థవంతమైన, డైనమిక్ నైపుణ్యాలను నేర్చుకునేలా కొత్తవాటిని ప్రవేశపెట్టాలి. పాఠ్యప్రణాళికను డైనమిక్‌గా తీర్చిదిద్దాలి. ►సమ్మిళిత వృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి మహిళా సాధికారత చాలా కీలకం. మహిళలకు ఆర్థిక వనరులు మరియు అవకాశాలను పెంపొందించడానికి, ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. నేను వాటిలో కొన్నింటిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాను ►రాష్ట్ర ప్రభుత్వం చేయూత, ఆసరా వంటి అనేక పథకాలను అమలు చేస్తోంది. దీని కింద వెనుకబడిన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అదే మహిళకు 4 సంవత్సరాలలో స్థిరంగా ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ►అంతేకాకుండా, మహిళా స్వయం సహాయక సంఘాలపై అధిక అప్పుల భారం ఆదాయాన్ని సమకూర్చే కార్యక్రమాల్లో వారి పెట్టుబడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ పోటీ ప్రపంచంలో వారు నిలదొక్కుకోవడం చాలా కష్టమవుతుంది. అందువల్ల, సున్నా వడ్డి కార్యక్రమం ద్వారా, సకాలంలో తిరిగి చెల్లించే షరతుపై SHGలు పొందే రుణాలపై వడ్డీ రాయితీని ప్రభుత్వం గణనీయంగా అందిస్తోంది. కేవలం నిధులను మహిళల చేతుల్లో పెట్టడంతోనే ప్రభుత్వాల పాత్ర ముగిసిపోదు. ►పెట్టుబడి పెట్టడానికి మరియు తీవ్రమైన పోటీని తట్టుకునేలా ఆయా కార్యక్రమాల్లో కొనసాగడానికి మహిళలకు పరిమిత సామర్థ్యం ఉందని ప్రభుత్వాలు గుర్తించాలి. అందువల్ల, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ అనుసంధానాలను పొందడంలో మహిళలను చేయూతనిచ్చి నడిపించే ప్రగతిశీల విధానాన్ని ప్రభుత్వాలు అవలంబించాలి. చివరగా, అన్ని రాష్ట్రాలూ కూడా ఒక జట్టుగా పనిచేయాలి. ప్రతి రాష్ట్రం శ్రేయస్సు మొత్తం దేశంతో ముడి పడి ఉంటుంది. #WATCH | Prime Minister Narendra Modi chairs the 8th Governing Council meeting of Niti Aayog on the theme of 'Viksit Bharat @ 2047: Role of Team India' at the new Convention Centre in Pragati Maidan, Delhi. pic.twitter.com/6W0igz0WD8 — ANI (@ANI) May 27, 2023 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ భేటీ
Updates.. ► కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ► ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇటీవల కేంద్రం రూ.10వేల కోట్ల రెవెన్యూ లోటు నిధుల విడుదల, పెండింగ్ నిధుల విడుదలపై సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. ► సీఎం జగన్ రేపు(శనివారం) నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు. ► సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. ► ఢిల్లీలో సీఎం జగన్‌కు వైఎస్సార్సీపీ ఎంపీలు స్వాగతం పలికారు. సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. రేపు(శనివారం) ఢిల్లీ వేదికగా జరుగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు సీఎం జగన్.. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఢిల్లీకి పయనమయ్యారు. రేపు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. -
నీతి ఆయోగ్ వేదికపై రాష్ట్ర ప్రగతి చిత్రం
సాక్షి, అమరావతి: గత నాలుగేళ్లలో వివిధ అంశాలు, పలు రంగాల్లో సాధించిన ప్రగతిని నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో వివరించడంతోపాటు కేంద్రం నుంచి సహాయాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కీలక రంగాలకు సంబంధించి కొన్ని సూచనలు కూడా చేయనుంది. ఈనెల 27న న్యూఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆ సమావేశంలో చర్చించనున్న అంశాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యం, పౌష్టికాహారం రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చరిత్రాత్మక మార్పులు.. ఫ్యామిలీ డాక్టర్, ఎన్‌సీడీఎస్‌ల నియంత్రణ, ఆరోగ్యశ్రీ, ఆస్పత్రుల్లో నాడు–నేడు, తల్లులు, పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామకం.. తదితర అంశాలను స్పష్టంగా వివరించేలా సన్నద్ధం కావాలన్నారు. 104 వాహనాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను వివరించడంతో పాటు పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్‌ల మధ్య అనుసంధానం ద్వారా కార్యక్రమం ఎలా విజయవంతంగా సాగుతుందో తెలియజేయాలని నిర్ణయించారు. సమీక్షలో చర్చించిన అంశాలు ఇలా ఉన్నాయి. మహిళా సాధికారిత దిశగా అడుగులు ► మహిళా సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. దీంతోపాటు బహుళజాతి కంపెనీలతో కలిసి చేయూత పథకాన్ని అమలు చేస్తోంది. తద్వారా ఆయా కుటుంబాల్లో జీవన ప్రమాణాలు పెరిగేందుకు, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు తోడ్పాటు అందించింది. ► మహిళా సాధికారిత దిశగా చేయూతతో పాటు, ఆసరా, సున్నా వడ్డీ రుణాలు కీలక పాత్ర పోషించాయి. ‘దిశ’ కింద చేపట్టిన కార్యక్రమాలు.. సత్వరమే స్పందించిన తీరు వల్ల వేలాది మంది బాలికలు, మహిళలకు రక్షణ లభించింది. ► మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ, విద్యా శాఖ.. ఈ మూడు విభాగాలు కలిసి డేటాను సమ్మిళితం చేయాలి. తల్లి గర్భం దాల్చి, కాన్పు పూర్తి కాగానే శిశువుకు ఆధార్ నంబరు కేటాయింపు జరిగేలా చూడాలి. ► ఆ తర్వాత పిల్లలకు పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి, అంగన్వాడీల్లో చేరిక, తర్వాత స్కూల్లో చేరిక వరకూ వారిని ట్రాక్ చేయడానికి సులభతరం అవుతుంది. పిల్లల ఆరోగ్యం, వ్యాక్సినేషన్, చదువులు తదితర అంశాలన్నింటినీ ట్రాక్ చేయొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్లో కీలక ప్రగతి ► రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్ రంగంలో త్వరితగతిన ఘనణీయమైన ప్రగతి సాధ్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం వల్ల ఎంఎస్ఎంఈలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మద్దతు కావాలి. ► రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లతో తీర ప్రాంతంలో మౌలిక సదుపాయాలు బాగా పెరగనున్నాయి. ► కడప, కర్నూలు ఎయిర్‌పోర్టులకు నిధులు పూర్తి స్థాయిలో వెచ్చించి వాటిని సంపూర్ణ వినియోగంలోకి తీసుకొచ్చాం. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. నెల్లూరు సమీపంలోని తెట్టువద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణం ముందుకు సాగేలా అడుగులు వేస్తున్నాం. పరిశ్రమల నుంచి నిరంతరం ఫీడ్ బ్యాక్ ► పరిశ్రమల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలి. ► ఫ్యామిలీ డాక్టర్ విధానంలో హైపర్ టెన్షన్, డయాబెటిస్.. రెండూ ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వీరికి వైద్యం అందించడం, ఫాలోఅప్ చేయడం చాలా ముఖ్యం. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న బోధనాస్పత్రులు, కొత్తగా నిర్మించనున్న బోధనాస్పత్రుల్లో తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించిన ల్యాబ్‌లు, కాథ్ ల్యాబ్స్ తప్పనిసరిగా పెట్టాలి. ఈ మేరకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలి. స్కిల్ కార్యక్రమాల్లో వేగం పెరగాలి ► స్కిల్ డెవలప్మెంట్ రంగంలో కార్యక్రమాల వేగం పెంచాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గానికి ఒక హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఇదివరకే డిగ్రీలు సాధించిన వారు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు ఈ స్కిల్ సెంటర్లు ఉపయోగపడతాయి. ► నియోజకవర్గాలలో హబ్స్, జిల్లాల వారీగా సెంటర్లలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల రూపకల్పనకు ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. కాలానుగుణంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు ఈ కోర్సులను సంబంధిత యూనివర్సిటీ ద్వారా రూపొందించాలి. ► స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు గతంలో అవినీతమయం అయ్యాయి. రూ.371 కోట్లు దోచుకున్నారు. అలాంటి పరిస్థితులకు ఆస్కారం ఉండకూడదు. నిధుల వినియోగంలో జవాబుదారీతనం ఉండాలి. ప్రభుత్వ రంగంలో స్కిల్ కాలేజీలు, వీటికి సంబంధించి ప్రభుత్వం అమలు చేయనున్న ప్రణాళికతో.. మంచి వ్యవస్థలు ఏర్పడతాయి. తద్వారా నిరంతరాయంగా పిల్లలకు నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. -
రెవెన్యూ లోటు భర్తీని సాధించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలోని ముఖ్యమైన హామీ అయిన 2014–15 ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు భర్తీని గత చంద్రబాబు ప్రభుత్వం సాధించలేక పోయింది. అప్పటి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ రెవెన్యూ లోటును పూర్తి స్థాయిలో సాధించలేక చేతులెత్తేసింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి నుంచీ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ వస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి, నీతి ఆయోగ్ అధికారులను కలిసినప్పుడల్లా రెవెన్యూ లోటు భర్తీ గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. దాని ఫలితమే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ లోటు భర్తీ కింద ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయంగా రూ.10,461 కోట్లు మంజూరు చేసింది. దీన్ని ఈనాడు పచ్చ మీడియా జీర్ణించుకోలేక చంద్రబాబు ఎన్నిసార్లు గింజుకున్నా విదల్చని కేంద్రం ఇప్పుడు రెవెన్యూ లోటు భర్తీ కింద డబ్బులు మంజూరు చేయడం తప్పనేలా రోత రాతలు రాసింది. రాష్ట్రానికి ఆర్థికంగా ప్రయోజనం జరగడం కూడా పచ్చ మీడియా జీర్ణించుకోలేకపోవడం శోచనీయం. రాష్ట్ర విభజన జరిగిన 2014–15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.16,078 కోట్లుగా కాగ్ తేల్చింది. ఆ మేరకు భర్తీ చేయాల్సిందిగా గత చంద్రబాబు కోరిననప్పటికీ కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా రూ.4,000 కోట్లు మాత్రమే ఇచ్చింది. అయితే ముఖ్యమంత్రి జగన్ సర్కారు చట్ట ప్రకారం రావాల్సిన రెవెన్యూ లోటు భర్తీ గ్రాంటు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉంది. అందుకు సహేతుక కారణాలను నీతి ఆయోగ్‌తోపాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులకు వివరించడంతో పాటు స్వయంగా ప్రధాన మంత్రి దృష్టికి కూడా ముఖ్యమంత్రి పలుసార్లు తీసుకెళ్లారు. దాని ఫలితంగానే ప్రస్తుతం నిధులు విడుదలయ్యాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలపై ఆరోపణలు చేస్తున్న పచ్చ మీడియా, టీడీపీ నేతలకు ఇది చెంపపెట్టే. సీఎం ఢిల్లీ పర్యటనలన్నీ రాష్ట్ర ప్రయోజనాలకోసమేనని రెవెన్యూ లోటు భర్తీ సాధనతో స్పష్టమైంది. సీఎం జగన్ విజయమిది.. విభజన నాటి నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పరిష్కరించుకుంటోంది. సంక్షేమాభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీ సర్కారుకు ప్రస్తుత రెవెన్యూ లోటు భర్తీ నిధుల విడుదల భారీ ఊరట కలిగించనుంది. తాజాగా విడుదల చేసిన రూ.10,460.87 కోట్ల నిధులను 2014–15 ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు కింద చూపిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ఆదేశాలిచ్చారు. సీఎం గత నెల ఢిల్లీ పర్యటనలో భాగంగా జరిగిన చర్చలు కొలిక్కి వచ్చి నిధుల విడుదలకు ఈ నెల 19వ తేదీన ఆదేశాలు వెలవడగా తాజాగా నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభించాలని ఆర్థిక శాఖను కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి కేంద్రం నుంచి ఏకమొత్తంలో విడుదలైన భారీ నిధులు ఇవే కావడం గమనార్హం. చంద్రబాబుతో కానిది సీఎం జగన్ వల్ల సాధ్యమైందని, ఇది ముఖ్యమంత్రి విజయమని అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి. -
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 27న న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సమావేశానికి హాజరుకానున్నారు. వికాస్ భారత్ @ 2047, ఎంఎస్ఎంఈలు, మౌలిక సదుపాయాలు–పెట్టబడులు, వ్యాపార వర్గాలకు సులభతరమైన విధానాలు, మహిళాసాధికారత, ఆరోగ్యం మరియు పౌష్టికాహారం, నైపుణ్యాభివృద్ధి, గతి శక్తి ఏరియా డెవలప్మెంట్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై నీతిఆయోగ్ పాలక మండలి చర్చించనుంది. ఈ సందర్భంగా గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్న అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. నీతి ఆయోగ్ సమావేశంలో వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించడంతోపాటు, కేంద్రం నుంచి సహాయాన్ని రాష్ట్రం కోరనుంది. కీలక రంగాలకు సంబంధించి కొన్ని సూచనలను కూడా చేయనుంది. ఇక సమీక్ష సందర్భంగా నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలిచ్చారు. ఆరోగ్యం, పౌష్టికాహారం రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చరిత్రాత్మక మార్పులను నీతి ఆయోగ్ వేదికపై రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. ఫ్యామిలీ డాక్టర్, ఎన్‌సీడీఎస్‌ల నియంత్రణ, ఆరోగ్యశ్రీ, ఆస్పత్రుల్లో నాడు-నేడు, తల్లులు, పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామకం.. తదితర అంశాలను వివరించనుంది. 104 వాహనాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్ల్ మధ్య అనుసంధానం ద్వారా కార్యక్రమం ఎలా విజయవంతంగా సాగుతుందో రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. ఇదే సమయంలో అధికారులకు సీఎం.. కీలక అదేశాలు ఇచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో హైపర్ టెన్షన్, డయాబెటిస్, రెండూ ఉన్న వారిపైన ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.. వీరికి వైద్యం అందించడం, ఫాలో అప్ చేయడం అన్నది చాలా ముఖ్యమని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న బోధనాసుపత్రులు, కొత్తగా నిర్మించనున్న బోధనాసుపత్రుల్లోనూ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించిన ల్యాబ్‌లు, కాథ్ ల్యాబ్స్ తప్పనిసరిగా పెట్టాలన్న సీఎం.. ఈ మేరకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య డేటా సమ్మిళితం చేసే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. మహిళా శిశుసంక్షేమశాఖ, వైద్య–ఆరోగ్యశాఖ, విద్యాశాఖ ఈ మూడు విభాగాలు కలిసి డేటాను సమ్మిళితం చేయాలన్న సీఎం.. తల్లి గర్బం దాల్చి, కాన్పు పూర్తి అయిన తర్వాత శిశువుకు ఆధార్ నెంబరు కేటాయింపు జరిగేలా చూడాలన్నారు. ఆ తర్వాత పిల్లలకు పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి, అంగన్వాడీల్లో చేరిక, తర్వాత స్కూల్లో చేరిక వరకూ వారిని ట్రాక్ చేయడానికి సులభతరం అవుతుందని, పిల్లల ఆరోగ్యం, వ్యాక్సినేషన్, చదువులు తదితర అంశాలన్నింటినీ కూడా ట్రాక్ చేయడం కూడా సులభతరం అవుతుందని సీఎం పేర్కొన్నారు. మహిళా సాధికారిత కోసం చేపట్టిన కార్యక్రమాలను, బహుళజాతి కంపెనీలతో కలిసి చేసిన చేయూత పథకాన్ని ఏపీ ప్రభుత్వం వివరించనుంది. ఆయా కుటుంబాల్లో జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఏ రకంగా పథకం ఉపయోగపడిందో, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు ఎలా తోడ్పాటు నందించిందో, మహిళా సాధికారిత దిశలో చేయతతో పాటు, ఆసరా, సున్నా వడ్డీ రుణాల పాత్రను రాష్ట ప్రభుత్వం వివరించనుంది. దిశ కింద చేపట్టిన కార్యక్రమాలనూ వివరించడంతో పాటు, దాదాపు 30వేలకుపైగా ఇంటర్వెన్షన్స్ జరిగిన విషయాన్ని హైలెట్ చేయనుంది. స్కిల్ డెవలప్మెంట్ రంగంలో కార్యక్రమాల వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్న సీఎం.. నియోజకవర్గానికి ఒక హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక స్కిల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. అదివరకే డిగ్రీలు సాధించిన వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ స్కిల్ సెంటర్లు ఉపయోగపడతాయన్న సీఎం.. నియోజకవర్గాలలో హబ్స్, జిల్లాల వారీగా సెంటర్లలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల రూపకల్పనకు ఒక యూనివర్శిటీని ఏర్పాటు చేయాలన్నారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు ఈ కోర్సులను సంబంధిత యూనివర్శిటీ ద్వారా తయారు చేయించాలని సీఎం సూచించారు. ‘‘స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు గతంలో అవినీతమయం అయ్యాయి.. ప్రభుత్వం సొమ్మ రూ.371 కోట్లను దోచుకున్నారు. అలాంటి పరిస్థితులకు ఆస్కారం ఉండకూడదు. నిధుల వినియోగంలో జవాబుదారీతనం ఉండాలి. ప్రభుత్వ రంగంలో స్కిల్ కాలేజీలు, వీటికి సంబంధించి ప్రభుత్వం అమలు చేయనున్న ప్రణాళికతో.. మంచి వ్యవస్థలు ఏర్పడతాయి. నిరంతరాయంగా పిల్లలకు నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి.’’ అని సీఎం అన్నారు. చదవండి: సీఎం జగన్ గొప్ప మనసు.. గంటల వ్యవధిలోనే.. ఎంఎస్ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయాన్ని, మద్దతును నీతి ఆయోగ్ సమావేశంలో ప్రభుత్వం వివరించనుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్టిమెంట్ రంగంలో సాధించిన ప్రగతిని ప్రభుత్వం వివరించనుంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో కొనసాగుతున్న పనులను వివరించనుంది. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లతోనూ తీర ప్రాంతంలో గణనీయంగా పెరగనున్న మౌలిక సదుపాయాలు అంశాన్ని రాష్ట్రం వివరించనుంది. కడప, కర్నూలు ఎయిర్‌పోర్టులకు నిధులు పూర్తిస్థాయిలో వెచ్చించి వాటిని సంపూర్ణ వినియోగంలోకి తీసుకొచ్చిన అంశాన్ని ప్రభుత్వం వివరించనుంది. కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్టు అంశాన్నీ కేంద్రం ప్రస్తావించనుంది. నెల్లూరు సమీపంలోని తెట్టువద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణం ముందుకుసాగాలన్న సీఎం.. పరిశ్రమల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు.. వారితో నిరంతరం మాట్లాడుతూ ఫీడ్ బ్యాక్ తీసుకోవడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్న సీఎం.. బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్‌ను రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: ‘సివిల్స్’లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. టాప్‌లో ఉమా హారతి -
‘వెలుగు’తోంది ఇండియా!
సాక్షి, అమరావతి: మన దేశంలో 1996 నాటికి కేవలం 7 కోట్ల విద్యుత్ సర్వీసులుండేవి. ఇప్పుడు దాదాపు 26 కోట్ల సర్వీసులతో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద విద్యుత్ వినియోగదారులున్న దేశంగా అవతరించింది. వీటిలో 41 శాతం పరిశ్రమలు, 26 శాతం గృహావసరాలకు వినియోగిన్నారు. కేవలం ఈ లెక్కలే కాదు.. విద్యుత్ రంగంపై జరుగుతున్న అధ్యయనాలు సైతం భారత్ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతోందని స్పష్టం చేస్తున్నాయి. అయితే, దేశంలో 13 శాతం గృహాలకు మాత్రం ఇప్పటికీ విద్యుత్ అందుబాటులో లేదు. విద్యుత్ వినియోగదారులు, డిస్కంపై రాక్ఫెల్లర్ ఫౌండేషన్, నీతి ఆయోగ్‌తో కలిసి స్మార్ట్ పవర్ ఇండియా జరిపిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశ జనాభాలో దాదాపు 87 శాతం మందికి గ్రిడ్ ఆధారిత విద్యుత్ అందుబాటులో ఉందని సర్వే వెల్లడించింది. సగటున 17 గంటల సరఫరా దేశంలో విద్యుత్ అందుబాటులో లేని 13 శాతం మంది ఇతర మార్గాల్లో విద్యుత్‌ను పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 13 శాతంలో ఎక్కువగా 62 శాతం మంది వ్యవసాయదారులు ఉండటం గమనార్హం. కేవలం 4 శాతం గృహాలకు మాత్రమే గ్రిడ్ ఆధారిత విద్యుత్ లేదు. 92 శాతం మంది కస్టమర్లకు కేవలం 50 మీటర్ల లోపుగానే విద్యుత్ మౌలిక సదుపాయాలు లభిస్తున్నాయి. వ్యవసాయ కేటగిరీ సర్వీసులకు ఇది 75 శాతంగా ఉంది. మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న వినియోగదారులకు కనెక్షన్ రేటు 86 శాతం, వ్యవసాయ వినియోగదారులకు కనెక్షన్ రేటు 70 శాతం, సంస్థాగత వినియోగదారులకు కనెక్షన్ రేటు 81 శాతంగా ఉంది. విద్యుత్ అందుబాటులో లేకపోవడానికి కారణాలివీ కొందరికి విద్యుత్ అందుబాటులో లేకపోవడానికి కారణాలను కూడా అధ్యయనం వెల్లడించింది. కస్టమర్‌కు దూరంగా విద్యుత్ స్తంభం ఉండటం 47 శాతం, విద్యుత్ ఖర్చులు, వినియోగదారు చార్జీలు 35 శాతం, పేలవమైన సేవల నాణ్యత 20 శాతం కారణంగా ఉన్నాయి. వాణిజ్య కస్టమర్లలో దాదాపు సగం మంది సర్వీసు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం ఖర్చులు భరించలేకపోవడం అని అధ్యయనంలో వెల్లడించారు. గ్రిడ్ ఆధారిత విద్యుత్ కనెక్షన్ ఉన్న గృహ వినియోగదారులలో 92 శాతం మంది తక్కువ మంజూరైన లోడ్ 0–1 కిలోవాట్ పరిధిలోనే ఉన్నారు. విద్యుత్ సరఫరా సగటున రోజుకు సుమారు 17 గంటలు ఉంటోంది. 70 శాతం మంది గృహ వినియోగదారులు వారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నారు. దాదాపు 75 శాతం మంది గృహ వినియోగదారులకు విద్యుత్ కోతల గురించి ముందస్తు నోటిఫికేషన్ అందటం లేదు. 63 శాతం మంది వినియోగదారులు వారంలో ఒకటి కంటే ఎక్కువ వోల్టేజి సమస్యలకు గురయ్యారు. 16 శాతం మంది వినియోగదారులు విద్యుత్ ప్రమాదాలను చవిచూశారు. -
గేమ్ ఛేంజర్.. ఆర్బీకే
ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మకం. రైతు కష్టాలన్నింటికీ వన్ స్టాప్ సొల్యూషన్‌గా నిలుస్తున్నాయి. విత్తనం మొదలు పంట కొనుగోలు వరకు అన్నదాతల చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. నాణ్యమైన పురుగు మందులు, ఎరువుల సరఫరా.. పంటల సాగుపై అధునాతన శిక్షణ, సాంకేతికత వినియోగం, యాంత్రీకరణ.. తదితర విధానాలతో సాగు రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు ఆర్బీకేల పనితీరును స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించాయి. లక్షలాది మంది రైతులకు సాగును లాభసాటిగా మార్చడంలో ఆర్బీకేల పాత్ర కీలకం. ► సంయుక్త నివేదికలో నీతి ఆయోగ్, యూఎన్డీపీ సాక్షి,అమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో ప్రారంభించిన డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకువస్తున్నాయని నీతి ఆయోగ్, యూఎన్డీపీ (యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) ప్రశంసించాయి. అధిక దిగుబడులు సాధించేలా, రైతుల సాగు సమస్యలన్నింటికీ ఒకే చోట పరిష్కారం చూపిస్తూ ‘వ్యవసాయం’లో గేమ్ ఛేంజర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడాయి. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో సామాజిక రంగాల్లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి.. నీతి ఆయోగ్, యూఎన్డీపీ తాజాగా ఓ సంయుక్త నివేదికను విడుదల చేశాయి. ప్రధానంగా రైతుల ఇబ్బందులు తీర్చడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన ఆర్బీకేల ద్వారా అన్నదాతలకు సరైన సమయంలో సరైన సలహాలు అందుతున్నాయని.. ఇది ఆహ్వానించదగిన పరిణామమని ఈ నివేదిక కొనియాడింది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం అత్యంత ముఖ్యమైన రంగాల్లో ఒకటని, కొన్నేళ్ల క్రితం వరకు వ్యవసాయ రంగంలో సాంకేతిక పురోగతి ఉన్నప్పటికీ రైతుల వ్యవసాయ పద్ధతులు, వివిధ పంటల క్లిష్టమైన దశల గురించి పూర్తి స్థాయి అవగాహనలేని రైతులు డీలర్లపై ఆధారపడ్డారని తెలిపింది. విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా ఇన్పుట్లకు అధికంగా చెల్లించాల్సి రావడంతో పంట చేతికొచ్చే సమయానికి రైతులకు కన్నీళ్లే మిగిలేవని వివరించింది. మరోవైపు.. నాసిరకం దిగుబడులు, దళారుల ఆగడాల కారణంగా గిట్టుబాటు ధరలేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని, ఆర్బీకేల ఏర్పాటుతో రైతులకు ఈ ఇబ్బందులన్నీ తప్పాయని తెలిపింది. ఈ నివేదికలో ఇంకా ఏముందంటే.. దేశంలోనే ఉత్తమ పద్ధతి ► రైతుల ఆదాయం, విజ్ఞానం పెంపొందించడానికి, సరికొత్త సాంకేతిక విజ్ఞానాన్ని బదిలీ చేయడంతోపాటు.. ముందుగా పరీక్షించి ధ్రువీకరించిన, నాణ్యమైన ఇన్పుట్లను గ్రామ స్థాయిలో అందుబాటు ధరలకు అందించడమే లక్ష్యంగా ఆర్బీకేలు పని చేస్తున్నాయి. విత్తనం నుంచి విక్రయం వరకు సేవలందిస్తున్న ఆర్బీకే వ్యవస్థ దేశంలోనే మొదటి ఉత్తమ పద్ధతి. ► ఆర్బీకేలు నాలుగు అంశాల్లో ప్రధానంగా పని చేస్తున్నాయి. ముందుగా.. పరీక్షించిన నాణ్యమైన ఇన్పుట్ల సరఫరా, నకిలీ విత్తన వ్యాప్తిని అరికట్టడం, ప్రైవేటు ఔట్లెట్లలో అధిక ధరలకు ఇన్పుట్ల అమ్మకాలు నిరోధించడం, విత్తన సీజన్‌కు ముందే ఇన్పుట్లు అందుబాటులో ఉంచడం లక్ష్యంగా పని చేస్తున్నాయి. పనితీరు నిజంగా అద్భుతం ► సేవల బట్వాడా, సామర్థ్యం పెంపుదల, విజ్ఞాన వ్యాప్తిలో ఆర్బీకేల పనితీరు నిజంగా అద్భుతం. రైతులకు అవసరమైన సేవలను అందించడమే కాకుండా సామర్థ్యం పెంపుదలకు అవసరమైన విజ్ఞానాన్నీ ఆర్బీకేలు రైతులకు పంచుతున్నాయి. ► వ్యవసాయ యాంత్రీకరణ, ఈక్రాప్.. ఉచిత పంటల బీమా నమోదు, సీడ్–టు–సీడ్ శిక్షణ కార్యక్రమం, శాస్త్రవేత్తల శిక్షణలు, ఫీల్డ్ డయాగ్నస్టిక్ సందర్శనలు, సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి పోస్టర్లు, కరపత్రాలను ఉపయోగించడం, పంటలపై సమాచార వ్యాప్తి కోసం పుస్తకాలు, వీడియో మెటీరియల్‌తో కూడిన లైబ్రరీలను నిర్వహిస్తుండటం విశేషం. కాల్ సెంటర్ ద్వారా సలహాలు ► వ్యవసాయ పద్ధతుల్లో కాల్‌సెంటర్ ద్వారా ఆర్బీకేలు రైతులకు సలహాలూ అందిస్తున్నాయి. ఇందుకోసం కాల్ సెంటర్ నిర్వహణతో ఉత్తమ పద్ధతులను అవలంబించడంలో సహాయం చేయడానికి, మద్దతు ప్యాకేజీ, దేశీయ డిమాండ్–సరఫరా అంతరాన్ని పరిష్కరించడం కోసం అగ్రి అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేశారు. ► తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం. రైతులకు మద్దతు ధర, ప్రోత్సాహం అందించడానికి అన్ని ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా ప్రభుత్వం ప్రకటించడం వల్ల రైతులకు ఎంతో లాభం. రవాణా ఖర్చులు తగ్గించడంలోనూ ఆర్బీకేల పాత్ర ప్రశంసనీయం. ► పంటల కొనుగోలు కేంద్రాలుగా ఆర్బీకేలను ప్రకటించిన తర్వాత రైతులు తమ పంటను గ్రామంలోనే విక్రయించుకోగలుతున్నారు. ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందుతున్నాయి. -
హరిత విప్లవాన్ని మించి క్షీర విప్లవం
సాక్షి, అమరావతి: గత పాతికేళ్లలో దేశంలో హరిత విప్లవాన్ని మించి క్షీర విప్లవం వృద్ధి చెందిందని నీతిఆయోగ్ పేర్కొంది. దీంతో ప్రపంచ పాల ఉత్పత్తిలో మనదేశం వాటా రెట్టింపు అయ్యిందని తెలిపింది. ఈ మేరకు దేశంలో క్షీర విప్లవంపై నీతిఆయోగ్ వర్కింగ్ పత్రం విడుదల చేసింది. 1990 మధ్య కాలం వరకు పాల ఉత్పత్తిలో అమెరికా అగ్రస్థానంలో ఉందని వెల్లడించింది. అయితే రాబోయే 25 ఏళ్లలో అమెరికాలో ఉత్పత్తి అయ్యే పాల కంటే దేశంలో రెండు రెట్లు ఎక్కువ ఉత్పత్తి అవుతాయని వివరించింది. అంతేకాకుండా దేశంలో డెయిరీ రంగం వృద్ధి వ్యవసాయ రంగం వృద్ధికి దోహదపడుతోందని పేర్కొంది. పేదలకు, మహిళలకు పాల ఉత్పత్తి రంగం అనుకూలంగా ఉందని తెలిపింది. ఇన్పుట్ సబ్సిడీలు లేకుండానే డెయిరీ రంగం అద్భుతమైన వృద్ధిని సాధించిందని వెల్లడించింది. దేశంలో పాడి పరిశ్రమ విజయం నుంచి పాఠాలు నేర్చుకోవచ్చని కొనియాడింది. వ్యవసాయ రంగం మొత్తం ఆదాయంలో నాలుగో వంతు పాలు ద్వారా వచ్చిందేనని వివరించింది. నాలుగు అంశాలు కారణం.. దేశంలో క్షీర విప్లవం విజయవంతం కావడానికి ప్రధానంగా నాలుగు అంశాలు దోహదపడినట్లు నీతిఆయోగ్ అభిప్రాయపడింది. పాల మార్కెటింగ్ కోసం సహకార సంస్థల ఏర్పాటు, పాల ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు, ఆవులతో కృత్రిమ గర్భధారణ, పాల మార్కెటింగ్–వాణిజ్యంపై పరిమితులు, నిబంధనలు లేకపోవడం ఇందుకు కారణమని పేర్కొంది. 1950–51లో దేశంలో పాల ఉత్పత్తి సంవత్సరానికి 1.36 శాతం పెరిగింది. 1973–74 వరకు ఇది జనాభా పెరుగుదల రేటు కంటే తక్కువగా ఉంది. దీంతో ఈ కాలంలో తలసరి పాల లభ్యత 15 శాతం పడిపోయింది. దీంతో దేశంలో పాల కొరత పెరగడంతో కొంత వరకు దిగుమతుల ద్వారా పాల పొడి రూపంలో భర్తీ చేసుకున్నారు. 1970లో దేశంలో ఆపరేషన్ ఫ్లడ్‌ను ప్రారంభించడంతో పాల ఉత్పత్తి పురోగతి సాధించింది. జనాభా పెరుగుదల రేటును అధిగమించి పాల ఉత్పత్తి పెరిగింది. 1973–74లో దేశంలో తలసరి రోజు పాల ఉత్పత్తి 100 గ్రాములుండగా 2020–21 నాటికి ఇది 450 గ్రాములకు పెరిగింది. ఇటీవల కాలంలో దేశంలో పాల ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 5.3 శాతంగా ఉంది. 2005 తరువాత పాల ఉత్పత్తి వృద్ధి రేటు వేగవంతమైంది. ఇందులో సహకార సంఘాలు ప్రధాన పాత్ర పోషించాయి. 246.7 మిలియన్ల పాడి జంతువులు.. గత 50 ఏళ్లలో పాడి జంతువుల జనాభా కూడా బాగా పెరిగింది. దేశంలో 1972లో 122.7 మిలియన్ల పాడి జంతువులుండగా ఇప్పుడు 246.7 మిలియన్లకు పెరిగాయి. 2017–18 తర్వాత నాలుగేళ్లలో పాల ఉత్పత్తులు నాలుగు రెట్లు పెరిగాయి. అయితే వీటిని విదేశాలకు ఎగుమతులుగా పంపడంలో వెనుకబడి ఉన్నట్లు నీతిఆయోగ్ వర్కింగ్ పత్రం పేర్కొంది. పాల ఎగుమతి 2021–22లో రెండింతలు మాత్రమే పెరిగిందని.. రూ 4,742 కోట్లకే ఎగుమతులు పరిమితమయ్యాయని వివరించింది. ఇప్పటికీ ఎగుమతులు మొత్తం దేశీయ పాల ఉత్పత్తిలో 0.5 శాతం కంటే తక్కువగానే ఉన్నాయని బాంబుపేల్చింది. మార్కెటింగ్‌పై దృష్టి సారించాలి.. దేశంలో పాల ఉత్పత్తి ఏడాదికి 6 శాతం పెరుగుతుందని నీతిఆయోగ్ అంచనా వేసింది. భవిష్యత్తులో మిగులు పాలను ఎగుమతి చేసేందుకు అవసరమైన మార్కెటింగ్‌పై దృష్టి సారించాలని సూచించింది. భవిష్యత్‌లో దేశాన్ని అతిపెద్ద డెయిరీ ఎగుమతిదారుగా మార్చేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని కోరింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే దేశంలో రోజు వారీ ఆవు, గేదె పాల దిగుబడి చాలా తక్కువగా ఉందని పేర్కొంది. పాల దిగుబడిని పెంచేందుకు, ఉత్పాదకత పెరుగుదలకు పశు జాతుల అభివృద్ధి, మెరుగైన పెంపకం పద్ధతులు చేపట్టాలని సూచించింది. పంజాబ్, కేరళ, హరియాణా, ఆంధ్రప్రదేశ్‌ల్లో పాల దిగుబడి ఎక్కువగా ఉండగా మిగతా రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉందని పేర్కొంది. ఇక దేశంలో రోజువారీ పాల దిగుబడి ఆవులకు 5.15 కిలోలు, గేదెలకు 5.9 కిలోలుగా ఉందని వెల్లడించింది. -
కారు చీకటి బతుకులు.. అంతరం అలాగే!
చెలిమ నీళ్లే ఇంకా.. కుమురంభీం జిల్లా తిర్యాణి మండలం గోవెన పరిధిలో ఐదు గూడేలకు విద్యుత్ వెలుగే లేదు. ఇందులో నాయకపుగూడ, కుర్సీ గూడాల పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ మిషన్ భగీరథ కోసం నిర్మించిన వాటర్ ట్యాంకులు అలంకారప్రాయమే. దీంతో నాయకపుగూడ గిరిజనులకు వాగులోని చెలిమ నీళ్లే గొంతు తడుపుతున్నాయి. గోవెన పరిధిలోని ఐదు గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఐటీడీఏ ఎప్పుడో ఏర్పాటు చేసిన సోలారు లైట్లు ఆరేళ్ల క్రితమే పనిచేయకుండా పోయాయి. పోలీసులు ఏర్పాటు చేసిన నాలుగు సోలారు వీధి లైట్లు మాత్రం వెలుగుతున్నాయి. కారు చీకటి బతుకులు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని చాకిరేవు గ్రామానికి చేరాలంటే ఆరు కిలోమీటర్లు నడిచివెళ్లాలి. సరైన దారే లేని అలాంటి ఊరికి కరెంటు కూడా లేదు. పెంబిమండల కేంద్రం నుంచి 25 కి.మీ. దూరంలో ఉండే ఈ పల్లెలో 35 ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి. ఇంకా పెద్దరాగిదుబ్బ, సోముగూడ, కడెం మండలంలోని మిద్దెచింత, రాంపూర్ గ్రామాలవీ చీకటి బతుకులే. శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి : వెనుకబాటుపైనే తిరుగుబాటు చేసి పుట్టిన రాష్ట్రం తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రం వస్తే అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి జరుగుతుందని, అందరికీ సమాన అవకాశాలు వస్తాయన్న నినాదమూ తెలంగాణదే. అయితే ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించి ఇన్నేళ్లవుతున్నా.. రాష్ట్రంలో ఇంకా 13.74% పేదలు ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జాతీయ సగటు (25.01%)ను మించి పేదరికం ఉందని నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన బహుముఖ పేదరిక సూచిక (మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్–2021) వెల్లడించడం గమనార్హం. విద్య, వైద్యం, విద్యుత్ ప్రాతిపదికగా.. విద్య, వైద్యం, పారిశుధ్యం, మంచినీరు, విద్యుత్, పక్కా ఇళ్లు, సొంత ఆస్తులు, బ్యాంక్ ఖాతా తదితర పన్నెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని నీతి ఆయోగ్ నివేదిక రూపొందించింది. దేశ జనాభాలో 25.01% పేదలుండగా, తెలంగాణలో ఇది 13.74%గా ఉంది. అయితే ఆదిలాబాద్ (27.43%), మహబూబ్‌నగర్ (26.11%) జిల్లాల్లో మాత్రం పరిస్థితి మరీ నిరాశాజనకంగా ఉంది. ఆయా జిల్లాల్లో 25% మందికి ఇప్పటికీ విద్య, వైద్యం, పౌష్టికాహారం పూర్తిస్థాయిలో అందటం లేదని నివేదిక తేల్చింది. కొత్తగా ఏర్పడిన కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ లేకపోవడం, రాజకీయ అవసరం, ప్రాబల్యం ఉంటేనే నిధుల వరద పారుతున్న వైనం.. వెనుకబడిన ప్రాంతాల్లో మరోసారి అసహనానికి కారణం కాబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా అన్ని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించటం, రాజకీయ సిఫారసులు, అవసరాలు లేని ప్రత్యేక కార్యాచరణ అమలుతోనే సమ అభివృద్ధి సాధ్యమని ప్రొఫెసర్ సి.నాగేశ్వర్ పేర్కొన్నారు. ప్రత్యేక ప్రాధాన్యం ఏదీ? తెలంగాణ వచ్చినా కూడా పాలమూరు వెతలు తీరటం లేదు. మా జిల్లాలో సహజ వనరుల దోపిడీ పెరిగింది. వలసలు ఇంకా ఆగనే లేదు. గుంపు వలసల స్థానే వ్యక్తిగత వలసలు కొనసాగుతున్నాయి. జీవన ప్రమాణాలు పెంచే ఉపాధి, విద్య, వైద్య రంగాల్లో పాలమూరుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇదే కొనసాగితే పాలమూరు పేదల జిల్లాగానే మిగిలిపోతుంది. –ఎం.రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక ప్రణాళికా బద్ధమైన కేటాయింపులు ఉండాలి సంక్షేమ రాజ్యం ప్రధాన సూత్రం..అందరికీ సమన్యాయం. అంటే వెనుకబడిన ప్రాంతాల్లో సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేకంగా ఒక ప్రణాళిక రూపొందించి దాని ని నిరీ్ణత కాలంలో అమలు చేయాలి. కానీ ఇప్పుడు తెలంగాణలో ప్రణాళిక – కేటాయింపులు–సమీక్షలు అంత అర్థ్ధవంతంగా లేవు.అందుకే ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో దేశ సగటును మించి పేదరికం నమోదైంది. – ప్రొఫెసర్ కె.ముత్యంరెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ పేదలే లేని కొట్టాయం కేరళలోని కొట్టాయం జిల్లాలో పేదలే లేరు. ఎర్నాకులం జిల్లాలో 0.1%, కోజికోడ్‌లో 0.26% ఉన్నారు. దేశంలోనే పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రంగా కేరళ (0.71) నిలిచింది. ఇక అత్యధిక పేదరికం బిహార్‌లో (51.91%) ఉంది. దేశంలో అత్యధిక పేదరికం యూపీలోని శ్రావస్తి జిల్లాలో (74.38%) నమోదైంది. బహరైచ్‌లో 71.81%, మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పూర్‌లో 71.31% పేదరికం ఉంది. మా జీవితాలకు వెలుగెప్పుడో..! అడవిలో మూడు కిలోమీటర్లు నడిస్తేనే.. బయటి ప్రపంచానికి మేమంటూ ఉన్నామని తెలుస్తుంది. నేను పుట్టినప్పటి నుంచి చెప్తున్నరు కరెంటు వస్తదని. కానీ రాలే.. సోలారు లైట్లు పెడుతున్నా.. అవి కొన్నిరోజులే వెలుగుతున్నయి. మా పిల్లల జీవితాల్లోనైనా వెలుగు వస్తుందో లేదో..! – ఆత్రం శ్రీరాములు, ఠిమిద్దెచింత, నిర్మల్ బడి లేక..కూలీకి.. అమ్మా నాయిన ముంబైకి వలస వెళ్లిండ్రు. నేను మా తండా బడిలోనే 5వ తరగతి వరకుచదివిన. 6వ తరగతి చదవాలంటే రోజూ 14 కి.మీ వెళ్లిరావాలి. రోడ్డు బాగా లేదు, ప్రయాణ సౌకర్యం కూడా లేదు. దీంతో రోజూ నడుచుకుంటూ వెళ్లలేక గత ఏడాది బడి మానేసిన. ఇప్పుడు మా అవ్వ ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు కూలీ పనులకెళ్తున్న. మా అమ్మా నాయిన లాగే తండాలో 95 కుటుంబాలు ముంబైకి వలస వెళ్లాయి. నాలా చానామంది నడుచుకుంటూ బడికి వెళ్లలేక కూలీ పని చేస్తుండ్రు. – సోనమ్మ, పాతతండా, నారాయణపేట జిల్లా -
జీ20తో డిజిటల్ కృషిని ప్రపంచానికి చాటి చెప్తాం
న్యూఢిల్లీ: డిజిటల్ పరివర్తనలో భారత్ చేస్తున్న కృషిని జీ20 కార్యక్రమాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పనున్నట్లు నీతి ఆయోగ్ మాజీ సీఈవో, జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. తద్వారా గ్లోబల్ సౌత్ (లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఓషియానియా దేశాలు) ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తోడ్పాటు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 8వ జాతీయ నాయకత్వ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా 400 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపు లేదని, 250 కోట్ల మంది కనీసం బ్యాంకు ఖాతా కూడా లేదని కాంత్ చెప్పారు. 133 దేశాల్లో వేగవంతమైన డిజిటల్ చెల్లింపుల విధానాలు లేవని పేర్కొన్నారు. అలాంటిది, డిజిటైజేషన్ ద్వారా భారత్ ప్రజల జీవితాల్లో మార్పులు తేగలిగిందని, ఉత్పాదకత పెంచుకుని సమర్థమంతమైన ఆర్థిక వ్యవస్థగా ముందుకెడుతోందని కాంత్ చెప్పారు. డిజిటైజేషన్ డిజిటల్ చెల్లింపులు తదితర విభాగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరించారు. ‘భారత్ పాటిస్తున్న ఈ మోడల్‌ను మిగతా ప్రపంచం ముందుకు ఎలా తీసుకెళ్లాలన్నది ఒక సవాలు. భారత డిజిటల్ పరివర్తన గాధను ప్రపంచానికి పరిచయం చేసేందుకు జీ20 వేదికను ఉపయోగించు కుందాం. ఆ విధంగా గ్లోబల్ సౌత్ దేశాల పౌరుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం‘ అని కాంత్ పేర్కొన్నారు. -
మేడిన్ తెలంగాణ అద్దాలు
మణికొండ: రాష్ట్రంలో రెండు విడతలుగా కంటి వెలుగు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. రెండవ విడత కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కోటి మందికి పరీక్షలు చేశామని చెప్పారు. కంటి అద్దాలు అవసరమైన వారికి మేడిన్ తెలంగాణ అద్దాలను పంపిణీ చేస్తున్నామని వివరించారు. శుక్రవారం మణికొండలో శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శంకర సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, జిల్లాకో మెడికల్ కళాశాల, పల్లె దవాఖాన, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరం మెడికల్ హబ్‌గా మారిందన్నారు. ఎక్కడా లేని విధంగా ఇటీవల నీతి అయోగ్ ప్రకటించిన వివరాల ప్రకారం దేశంలోనే వైద్య ప్రమాణాలలో రాష్ట్రం మూడవ స్థానంలో నిలిచిందని చెప్పారు. ప్రపంచ స్థాయి ఆసుపత్రి రావటం శుభపరిణామం హైదరాబాద్‌కు మరో ప్రపంచ స్థాయి కంటి వైద్య సేవలను అందించే శంకర ఆసుపత్రి రావటం శుభ పరిణామని, తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. సమాజానికి శంకర కంటి ఆసుపత్రి అందిస్తున్న సేవలు అమోఘమని, ఆర్థికంగా లేని వారికి ఉచితంగా, సంపన్నులకు నామమాత్రపు రుసుములతో సేవలు అందించటం అభినందనీయమన్నారు. కంటివెలుగులో భాగంగా శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఈ ఆసుపత్రి తోడ్పాటునివ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కోరిక మేరకు ముందుగా రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచే సేవలను ప్రారంభించాలన్నారు. శంకర ఆసుపత్రి వాహనాలను ఎలాంటి ట్యాక్స్‌లు లేకుండా మినహాయింపులు ఇస్తామని హామీనిచ్చారు. అంధత్వాన్ని తొలగించటమే లక్ష్యంగా.. దేశంలో అంధత్వాన్ని తొలగించటమే లక్ష్యంగా శంకర ఐ ఫౌండేషన్ ప్రారంభించామని, అదే మార్గంలో నిరంతరాయంగా కృషి చేస్తామని ఎస్ఈఎఫ్ యూఎస్ఏ వ్యవస్థాపకుడు మురళీ కృష్ణమూర్తి చెప్పారు. 2030నాటికి 5లక్షల మందికి ఉచిత శస్త్ర చికిత్సలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. హైదరాబాద్ కేంద్రంగా 225 పడకల ఆసుపత్రి నిర్మించేందుకు సహకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడి ఆసుపత్రి నిర్మాణానికి శంకర ఐ ఫౌండేషన్, ఫీనిక్స్ ఫౌండేషన్ ఐకేర్‌లు దాతలుగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, సంస్థ ప్రతినిధులు ఎస్వీ బాల సుబ్రమణ్యం, డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్ రోబో: విశాఖ గురుకుల విద్యార్థినుల వినూత్న ఆవిష్కరణ
సాక్షి, అమరావతి: అనారోగ్యం వస్తే డాక్టర్ వద్దకు వెళ్లడం.. జబ్బు లక్షణాన్ని బట్టి వైద్యులు పరీక్షించి మందులు రాయడం అందరికీ తెలిసిందే. అదే పని ఒక రోబో చేస్తే?.. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఎస్సీ గురుకుల విద్యార్థినులు డాక్టర్ రోబోను ఆవిష్కరించారు. విశాఖపట్నంలోని మధురవాడ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం–సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు చెందిన విద్యార్థినులు జెస్సికా (10వ తరగతి), కె. వర్షిణి ప్రియాంక, కె. రేష్మా బిందు (9వ తరగతి)లు ఫిజికల్ సైన్స్ టీచర్ డాక్టర్ టి. రాంబాబు పర్యవేక్షణలో ‘డాక్టర్ రోబో’ కాన్సెప్‌్టను రూపొందించారు. ఈ ప్రాజెక్టు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్) ఆధ్వర్యంలో నిర్వహించిన మారథాన్ 2021–22 టాప్‌టెన్ ప్రాజెక్టుల్లో ఒకటిగా ఎంపిక కావడం విశేషం. దీంతో జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి చెందిన ఎస్సీ గురుకుల విద్యార్థులు హ్యాట్రిక్ సాధించినట్లైంది. ఏటీఎల్ మారథాన్‌లో ఏడు వేల ప్రాజెక్టులు.. నీతి ఆయోగ్ పరిధిలో అటల్ ఇన్నోవేషన్ మిషన్‌లో భాగంగా నిర్వహించే ఏటీఎల్‌లో విద్యార్థుల మేధస్సుకు పోటీపెట్టి శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలను రూపొందించేలా చేస్తున్నారు. ఏటీఎల్–మారథాన్ 2021–22ను ఎంటర్ప్రెన్యూర్ ఇంటర్న్‌షిప్ పేరుతో ఈ ఏడాది జనవరి 9 నుంచి 13 వరకు నిర్వహించారు. బెంగళూరులో నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 16 వేల మంది 7వేల ప్రాజెక్టులను ప్రదర్శించారు. వీటి నుంచి తొలిదశలో 350 ప్రాజెక్టులు, మలిదశలో వాటి నుంచి వంద ప్రాజెక్టులు, ఆ తర్వాత అందులోని 30 ప్రాజెక్టులు, చివరకు టాప్టెన్ను ఎంపిక చేశారు. ఇందులో ఏపీకి చెందిన ఎస్సీ గురుకుల విద్యార్థుల డాక్టర్ రోబో ప్రాజెక్టు ఎంపిక కావడం రాష్ట్రానికి గర్వకారణం. డాక్టర్ రోబో పనితీరు ఇలా.. డాక్టర్ రోబో కృత్రిమ మేధస్సుతో పనిచేస్తుంది. రోగి తన పరిస్థితిని రోబోకు వివరిస్తే అతను వాడాల్సిన మందులను స్క్రీన్‌పై డిస్ప్లే చేయడంతోపాటు ఔషధాలను ఇస్తుంది. రోగికి ఇంకా ఏదైన సమస్య ఉంటే రోబో ప్రత్యేక వైద్యులకు వీడియోకాల్ చేసి కనెక్ట్ చేస్తుంది. రోగి వారితో మాట్లాడి వైద్య సహాయం పొందవచ్చు. అలాగే, ఏఏ ప్రాంతాల్లో వైద్యనిపుణులున్నారు? ఏ రోగానికి ఏ వైద్యుడ్ని సంప్రదించాలి? అవసరమైన వైద్యులు బిజీగా ఉంటే ఏ సమయంలో అందుబాటులోకి వస్తారు? వంటి సమాచారాన్ని డాక్టర్ రోబో అందిస్తుంది. ఇక ఈ రోబో రోగి దగ్గరకే వెళ్లి వైద్యసేవలు అందించేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. డాక్టర్ రోబో వినియోగంలోకి వస్తే మేలు.. పెరుగుతున్న వైద్య అవసరాలకు తగ్గట్లు డాక్టర్ రోబో కాన్సెప్ట్ చాలా ఉపయోగపడుతుంది. ప్రధానంగా గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇది చాలా మేలు చేస్తుంది. కోవిడ్ సమయంలో డాక్టర్‌ను సంప్రదించడం, వైద్యసేవలు అందించడం వంటి అనేక సమస్యలకు మార్గం చూపేలా డాక్టర్ రోబోను ఆవిష్కరించాం. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ డెవలప్చేశాం. ఇది డాక్టర్లా సేవలు అందించడమే కాదు.. డాక్టర్లకు కూడా సహాయకుడిగా ఉపయోగపడుతుంది. ఈ నెల 9 నుంచి 13 వరకు బెంగళూరులో జరిగే గ్లోబల్ బృందం పరిశీలనలో మా ప్రాజెక్టు ఎంపికైతే వైద్య రంగంలో మరింత మేలుచేసే రోబో అందుబాటులోకి వస్తుంది. – జెస్సికా, కె. వర్షిణి ప్రియాంక, కె. రేష్మా బిందు, విద్యార్థినులు ఎస్సీ గురుకులాల హ్యాట్రిక్ విద్యార్థుల్లో మేధస్సును మెరుగు పెట్టేలా అటల్ ఇన్నోవేషన్ మిషన్ కృషిచేస్తోంది. ఏటీఎల్ ప్రాజెక్టుల ప్రదర్శనలో మూడేళ్లుగా ఎస్సీ గురుకుల విద్యార్థులు జాతీయ స్థాయిలో టాప్‌టెన్‌లో నిలవడం ఆనందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న ప్రోత్సాహంతో మన విద్యార్థులు జాతీయస్థాయిలో రాణిస్తుండటం రాష్ట్రానికి గర్వకారణం. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
AP: నీతి ఆయోగ్ మెచ్చిన ఆక్వా టెకీ
సాక్షి, విశాఖపట్నం: ఆక్వా ఎక్స్చేంజ్ పేరుతో సాంకేతికతని పరిచయం చేసి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించేలా ఏకంగా 2,500 మంది రైతుల్ని నడిపిస్తున్నారు విశాఖకు చెందిన పవన్‌కృష్ణ కొసరాజు. అతడి కృషిని నీతి ఆయోగ్ గుర్తించింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం పురోభివృద్ధికి దోహదపడుతున్న 75 స్టార్టప్‌లలో ఆక్వా ఎక్స్చేంజ్కు చోటు కల్పించింది. విశాఖలో చదువుకుని ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పట్టా, బెర్లిన్‌లో ఎంబీఏ, యూఎస్ఏలో ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ పట్టా పుచ్చుకున్న పవన్‌కృష్ణ జర్మనీ, భారతదేశాల్లోని వివిధ సంస్థల్లో పనిచేశారు. ఆ తరువాత ఓ స్టార్టప్ కంపెనీ ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ప్రత్యక్షంగా చూసిన పవన్ వారికి సాంకేతికతను పరిచయం చేయాలన్న సంకల్పంతో ఆక్వా ఎక్స్చేంజ్ పేరుతో 2020లో స్టార్టప్‌ను ప్రారంభించారు. విశాఖలో రిజిస్టర్ చేసి విజయవాడలో కార్యాలయం ప్రారంభించారు. కోవిడ్ సమయం కావడంతో కాస్తా ఆలస్యంగానే అడుగులు పడ్డాయి. తన బంధువులైన ఒకరిద్దరు రైతులతో మొదలుపెట్టగా.. వారు సత్ఫలితాలు సాధించడంతో క్రమంగా రైతులు ఆక్వా ఎక్స్చేంజ్ వైపు ఆకర్షితులయ్యారు. టెక్ పరికరాలు.. లాభాల సిరులు ఆక్వా రైతులకు ప్రధానంగా ఎదురవుతున్న సమస్యలపైనే పవన్ దృష్టి సారించారు. చెరువుల్లో పెంచే రొయ్యలు, చేపలకు ఆక్సిజన్ పూర్తిస్థాయిలో సరఫరా చేయడం.. మేతను సమపాళ్లలో అందించడం.. విద్యుత్ ఖర్చులు తగ్గించడం.. దిగుబడుల్ని మంచి లాభాలకు కొనుగోలు చేయించడం వంటి నాలుగు అంశాలపై ఆక్వా ఎక్స్చేంజ్ పనిచేస్తూ.. రైతుల మన్ననల్ని చూరగొంటోంది. నెక్ట్స్ ఆక్వా పేరుతో భిన్నమైన పరికరాలను ఆవిష్కరించారు. వాటికి పేటెంట్లు కూడా దక్కించుకున్నారు. ఆక్వా ఎక్స్చేంజ్ పేరుతో తయారు చేసిన యాప్ ద్వారా ఈ పరికరాల్ని ఆయా రైతులే స్వయంగా మోనిటరింగ్ చేసుకునేలా వ్యవస్థను రూపొందించారు. అద్భుతమైన ఈ టెక్ పరికరాల్ని నెల్లూరు జిల్లా గూడూరు నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ 2500 మంది రైతులు 30 వేల ఎకరాల్లో వినియోగిస్తున్నారు. మేతకు ఢోకా లేదు... రొయ్యలకు మేత వేసేందుకు చెరువులోకి పడవలో వెళ్లి.. ఒక వైరుని చేత్తో పట్టుకొని మరో చేత్తో మేతని విసురుతారు. అన్నిచోట్లా మేత ఒకేలా అందకపోవడంతో రొయ్యలు, చేపలు సమస్థాయిలో ఎదగవు. ఫలితంగా దిగుబడిలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. దీనిని అధిగమించేందుకు పవన్ సంస్థ ఆక్వాబాట్ అనే పరికరాన్ని తయారు చేసింది. దీనిని రైతు ఏ ప్రాంతం నుంచైనా స్టార్ట్‌చేసి మేతని అందించవచ్చు. ఈ మెషిన్ చెరువులోని ప్రతి ప్రాంతానికి ఆటోమేటిక్‌గా తిరుగుతూ సమపాళ్లలో మేతని అందిస్తుంటుంది. దీన్ని 6 నెలలకు రైతులకు రూ.20 వేల అద్దెకు అందిస్తున్నారు. సాధారణంగా ఒక చెరువుకు ఒకర్ని నియమించుకుంటే.. ఒక పంటకాలానికి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చు అవుతుంది. పవన్ సంస్థ తయారు చేసిన పరికరాల్ని వినియోగించి దాదాపు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకూ రైతులు ఖర్చుల్ని ఆదా చేసుకుంటున్నారు. ఆక్వాఎక్స్చేంజ్లో రిజిస్టర్ అవ్వాలంటే నెలకు రూ.150 ఖర్చవుతుంది. వీటిని వినియోగిస్తుండటం వల్ల ప్రతి రైతు విద్యుత్ వినియోగంలో రూ.500 నుంచి రూ.600 వరకూ ఆదా చేస్తున్నారు. విజయవాడ శివారు గన్నవరంలో ఏర్పాటు చేసిన సంస్థ కార్యాలయంలో ప్రస్తుతం 160 మందికి ఉపాధి కల్పించారు. ఇందులో 50 మంది మహిళలుండటం విశేషం. కరెంట్ పోయినా.. చింత లేదు ఈ సంస్థ రూపొందించిన పవర్ మోన్ అనే పరికరాన్ని చెరువు వద్ద ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ సరఫరాను ఆ పరికరమే మోనిటరింగ్ చేసుకుంటుంది. కరెంటు పోయినప్పుడు ఏరియేటర్లు ఆగిపోకుండా ఆ పరికరమే జనరేటర్‌ను ఆన్ చేస్తుంది. ఆక్వాఎక్స్చేంజ్ తయారు చేసిన ఏపీఎఫ్సీని పెట్టుకుంటే.. ఆక్వా చెరువుకు ఎంత లోడ్ అవసరమో అంతే విద్యుత్వినియోగించేలా చేస్తుంది. తది్వరా విద్యుత్ బిల్లు చాలా వరకూ ఆదా అవుతుంది. 25 వేల మంది రైతులకు చేరువ చేసే దిశగా.. ఆక్వా రైతులకు ఖర్చులు తగ్గించి వారికి భరోసా అందించే దిశగా ప్రారంభించిన స్టార్టప్ విజయవంతంగా నడుస్తోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాంకేతిక డేటా ఆధారంగా రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాం. కేవలం టెక్ పరికరాలు అందించడమే కాదు.. నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు మంచి ధర వచ్చేలా ఎగుమతిదారులకు అనుసంధానం చేసే బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నాం. మొత్తంగా 25 వేల మంది రైతులకు లక్ష ఎకరాలకు చేరువ చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం. తాజాగా ఒడిశాకు కూడా ఆక్వా ఎక్స్చేంజ్ సేవలను విస్తరించాం. – పవన్‌కృష్ణ కొసరాజు, సీఈవో, ఆక్వా ఎక్స్చేంజ్ -
నీతి ఆయోగ్ సీఈవోగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం
న్యూఢిల్లీ: థింక్-ట్యాంక్ నీతి ఆయోగ్ సీఈవోగా మాజీ వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. ప్రభుత్వ నిర్ణయానికి క్యాబినెట్ నియామకాల కమిటీ (ఫిబ్రవరి 20న) ఆమోదం తెలిపింది. సుబ్రమణ్యం బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు నీతి ఆయోగ్ సీఈవోగా ఉంటారని సిబ్బంది వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది ప్రస్తుత సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులైన కారణంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా సుబ్రహ్మణ్యం చత్తీస్‌గఢ్ 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, అతను సెప్టెంబర్ 30, 2022న వాణిజ్య కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. మరోవైపు పరమేశ్వరన్ అయ్యర్ జూలై 1, 2022న నీతి ఆయోగ్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. 2009 లో ప్రభుత్వాధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి , 2014లో ప్రభుత్వ స్వచ్ఛ్ భారత్ మిషన్‌కు నాయకత్వం వహించిన అయ్యర్ ఆ తరువాత ప్రపంచ బ్యాంకులో చేరారు. ఇపుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగ నున్నారు. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తస్మాత్ జాగ్రత్త..నీతి ఆయోగ్ హెచ్చరికలు!
న్యూఢిల్లీ: కొత్త తరం టెక్నాలజీ కృత్రిమ మేథ (ఏఐ)తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, అయితే వాటితో పాటు రిస్కులూ పొంచి ఉన్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ తెలిపారు. ఏఐని అభివృద్ధి చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కృత్రిమ మేథపై అంతర్జాతీయ సదస్సు 2023లో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. పూర్తి స్థాయి కృత్రిమ మేథ వల్ల మానవాళి అంతమయ్యే పరిస్థితి తలెత్తుతుందంటూ ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చేసిన హెచ్చరికను ఈ సందర్భంగా సారస్వత్ ప్రస్తావించారు. ఏఐని ఒక్కసారి రూపొందించాక .. అది తనంతట తానే వేగంగా వృద్ధి చెంది, మనుషులను అధిగమించేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. జీవసంబంధ పరిమితుల వల్ల మనుషులు దానితో పోటీపడలేరన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని సారస్వత్ చెప్పారు. 2035 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు ఏఐ 1 లక్ష కోట్ల డాలర్లను జోడించగలదని .. అదే సమయంలో సమాజంపైనా చాలా ప్రభావం చూపగలదని ఆయన పేర్కొన్నారు. -
మహిళా కార్మికుల ముందంజ
సాక్షి, అమరావతి: దేశంలో మహిళా శ్రామిక శక్తి నాలుగేళ్లలో 6.4 శాతం మేర పెరిగింది. పురుషుల కన్నా మహిళా కార్మికుల సంఖ్య పెరుగుదల ఎక్కువగా ఉంది. పట్టణాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ఇది ఎక్కువగా ఉందని నీతి ఆయోగ్ వెల్లడించింది. 2017–18లో మహిళా కార్మిక శక్తి 23.1 శాతం ఉంటే 2020–21 నాటికి అది 29.5 శాతానికి చేరిందని పేర్కొంది. ఈ కాలంలో దేశంలో ఉపాధి, శ్రామిక శక్తిలో చోటుచేసుకున్న మార్పులపై నీతి ఆయోగ్ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. 2017–18లో దేశంలో 485.3 మిలియన్ల కార్మిక శక్తి ఉండగా 2020–21 నాటికి అది 563.7 మిలియన్లకు పెరిగింది. అంటే.. మూడేళ్లలో 16.15 శాతం మేర పెరిగింది. కార్మిక శక్తి పెరుగుదల పురుషులతో పాటు మహిళా జనాభాలో కూడా నమోదైంది. అలాగే, ఈ పెరుగుదల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉందని నివేదిక తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఈ పెరుగుదల తక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. దేశంలో 2019–20లో గ్రామీణ కార్మిక శక్తి 70.7 శాతం ఉండగా 2020–21లో 73 శాతానికి పెరిగింది. పట్టణాల నుంచి పల్లెలకు వలసలు ఇక కోవిడ్ సమయంలో ఆసక్తికరంగా పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలసలు జరిగాయని నివేదిక తెలిపింది. దీంతో ఆ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కార్మిక శక్తి 8 శాతం మేర పెరుగుదల ఉంటే పట్టణ ప్రాంతాల్లో మూడు శాతం తగ్గింది. మూడేళ్లుగా మహిళా కార్మిక శక్తి పురుషుల కన్నా ఎక్కువ శాతం పెరిగింది. ఈ పెరుగుదల గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. నిరుద్యోగ రేటూ తగ్గుముఖం మరోవైపు.. దేశంలో 2017–18 నుంచి నిరుద్యోగ రేటు తగ్గుతూ వస్తోందని నివేదిక పేర్కొంది. 2017–18లో నిరుద్యోగ రేటు 6.07 శాతం ఉండగా 2018–19లో 5.84 శాతానికి.. 2019–20లో 4.84 శాతానికి, 2020–21లో 4.33 శాతానికి తగ్గినట్లు తెలిపింది. అదే సమయంలో.. రాష్ట్రంలో 2018–19లో నిరుద్యోగత రేటు 5.3 శాతం ఉండగా 2020–21 నాటికి 4.1 శాతనికి తగ్గింది. దేశంలో పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగత రేటు తక్కువగా ఉంది. కోవిడ్–19తో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడినప్పటికీ కూడా పరిశ్రమ, సేవల రంగాల్లో 2019–20 నుంచి 2020–21 మధ్య ఉద్యోగాల సంఖ్య పెరిగింది. పరిశ్రమల రంగంలో 2018–19లో 4.8 మిలియన్ల ఉద్యోగాలు జోడించగా 2019–20లో 3.4 మిలియన్ల ఉద్యోగాలు, 2020–21లో 7.6 మిలియన్ల ఉద్యోగాలు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. అలాగే, సర్వీసు రంగంలో కూడా 2018–19లో 10.1 మిలియన్ల ఉద్యోగాలు 2019–20లో 6 మిలియన్ ఉద్యోగాలు, 2020–21లో 2.3 మిలియన్ ఉద్యోగాలు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
మున్సిపాల్టీల్లో తల‘సిరి’ తక్కువే
సాక్షి, అమరావతి: దేశంలో 15 రాష్ట్రాల్లోని మున్సిపాలిటీల మొత్తం ఆదాయంలో తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందని నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం మున్సిపాలిటీల జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.4,624 కాగా.. 15 రాష్ట్రాల్లో ఈ సగటు ఇంకా తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. పట్టణ జనాభా పెరుగుతున్నప్పటికీ జీడీపీలో మున్సిపాలిటీల వ్యయం 0.44 శాతం నుంచి 0.37 శాతానికి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితులు, అకౌంటింగ్ విధానంపైనా నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా మున్సిపాలిటీల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంతో పాటు పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక, పరిపాలన సంస్కరణలు చేపట్టాలని పేర్కొంది. ఏపీలో స్థానిక సంస్థలకు 16 అంశాలు బదిలీ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు 18 అంశాలను బదిలీ చేయాల్సి ఉన్నప్పటికీ కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే 18 అంశాలను బదిలీ చేశాయని, ఆంధ్రప్రదేశ్ 16 అంశాలను బదిలీ చేసిందని నివేదిక వెల్లడించింది. అలాగే, పట్టణ స్థానిక సంస్థల్లో ఏటా తప్పనిసరిగా అకౌంటింగ్ విధానం ఉండాలని నివేదిక సూచించింది. అలాగే, నీతి ఆయోగ్ ఇంకా ఏం సూచించిందంటే.. ► రాష్ట్రాల తరహాలోనే పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం అమలుచేయాలి. ► పట్టణ స్థానిక సంస్థలు సొంత ఆదాయ వనరులను పెంచుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. ► దేశంలో 223 క్రెడిట్ రేటింగ్‌లు ఇస్తే కేవలం 95 పట్టణ స్థానిక సంస్థలకే పెట్టుబడి రేటింగ్ ఉంది. ఇందులో కేవలం 41 మున్సిపాలిటీలే బాండ్ల ద్వారా రూ.5,459 కోట్ల నిధులు సమీకరించాయి. ► 2036 నాటికి పెరిగే జనాభాలో 73 శాతం పట్టణాల్లోనే ఉంటుందని, అందుకనుగుణంగా మౌలిక వసతుల కోసం అవసరమైన నిధుల సమీకరణకు మున్సిపల్ బాండ్ల జారీతో పాటు ఇతర మార్గాలను అనుసరించాలి. ఇందుకోసం మున్సిపాలిటీల సొంత ఆదాయాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు క్రెడిట్ రేటింగ్ సాధ్యమవుతుంది. ► స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరులైన ఆస్తి పన్ను, వినియోగ రుసుం చాలా తక్కువగా వస్తున్నాయి. అయితే, దేశ జీడీపీలో మున్సిపాలిటీల ఆస్తి పన్ను కేవలం 0.2 శాతమే ఉంది. ► మున్సిపాలిటీలు ఎక్కువగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బదిలీచేసే నిధులపైనే ఆధారపడుతున్నాయి. ► మెరుగైన మున్సిపల్ పాలన కోసం ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి. ► మున్సిపల్ అకౌంటింగ్ రికార్డులు, వార్షిక ఖాతాలు కచ్చితత్వంతో ఉండాలి. ► వాస్తవ ఆదాయం, వ్యయంతోనే అకౌంటింగ్ ఉండాలి తప్ప ఇంకా రాని ఆదాయం, చేయని వ్యయాలను అకౌంటింగ్లో ఉండకూడదు. ► ఏటా ఆదాయంలో 5 శాతం నగదు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ► రుణ స్థాయిలో చట్టబద్ధమైన సీలింగ్‌ను విధించుకోవాలి. ► జీతం, పెన్షన్ వ్యయాలను 49 శాతానికి పరిమితం చేయాలి. ► 51 శాతం ఆస్తుల సృష్టి, రుణ సేవలు, పెట్టుబడికి వ్యయం చేయాలి. ► క్రెడిట్ రేటింగ్‌తో బాండ్ల జారీని ప్రోత్సహించాలి. ► ఫలితాల ఆధారిత బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. ► ఆదాయ అంచనాలు సగటు వార్షిక వృద్ధి కంటే ఎక్కువగా ఉండకూడదు. ► స్థానిక సంస్థలు ఆర్థిక డేటాబేస్‌ను ఏర్పాటుచేయాలి. ► సొంత పన్నులు, కేంద్ర.. రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం, వ్యయంతో పాటు అన్ని వివరాలు పౌరులకు ప్రదర్శించాలి. -
దేశంలో ఐటీఐలు చాలా పూర్
సాక్షి, అమరావతి: దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ (పారిశ్రామిక శిక్షణ సంస్ధలు)ల పనితీరు చాలా పేలవంగా ఉందని, వాటిని తక్షణం సంస్కరించి, అధునాతనంగా తీర్చిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నీతి ఆయోగ్ సూచించింది. నీతి ఆయోగ్ అధ్యయన బృందం వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటుఐటీఐలను స్వయంగా సందర్శించింది. అక్కడి విద్యార్థులు, బోధకులతో మాట్లాడటంతో పాటు మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, పరిశ్రమల అనుసంధానం తదితర అంశాలను పరిశీలించి, సమగ్ర అధ్యయన నివేదికను విడుదల చేసింది. దేశం మొత్తం మీద ఐటీఐల్లో శిక్షణ పొందిన వారిలో ప్లేస్మెంట్ కేవలం 0.90 శాతమే ఉందని ఆ నివేదిక పేర్కొంది. దేశం మొత్తం మీద 2021 సంవత్సరంలో 4,14,247 మంది ఐటీఐల్లో శిక్షణ పొందితే 405 మంది మాత్రమే ప్లేస్‌మెంట్స్ పొందినట్లు వెల్లడించింది. అత్యధికంగా తమిళనాడులో 7,676 మంది విద్యార్థుల్లో 248 మందికి అంటే 3.2 శాతం ప్లేస్‌మెంట్స్ పొందారని, ఆ తరువాత గుజరాత్లో 0.25 శాతం ప్లేస్‌మెంట్స్ ఉండగా మిగతా రాష్ట్రాల్లో చాలా అధ్వాన్నంగా ఉందని నివేదిక వివరించింది. దేశంలో ప్రత్యేకంగా మహిళా ఐటీఐలు 2021 నాటికి 16.83 శాతం ఉంటే అందులో చేరికలు కేవలం 6.6 శాతమే. బోధకుల్లోనూ మహిళలు 15.83 శాతమే ఉన్నారు. ఇక్కడ లింగ వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని నివేదిక తెలిపింది. ఆ నివేదిక ప్రధానాంశాలివీ.. ప్రభుత్వ ఐటీఐలకే విద్యార్థుల ప్రాధాన్యత దేశవ్యాప్తంగా 14,789 ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో మొత్తం 25,38,487 సీట్లు ఉండగా, వీటిలో 48.20 శాతం సీట్లే భర్తీ అవుతున్నాయి. మొత్తం ఐటీఐల్లో 78.40 శాతం ప్రైవేటు రంగంలో, మిగతావి ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. అయితే, సీట్ల భర్తీలో ప్రైవేట్‌కన్నా ప్రభుత్వ ఐటీఐలే మెరుగ్గా ఉన్నాయి. ప్రైవేటు రంగంలో 43.07 శాతం సీట్లు భర్తీ అవుతుండగా ప్రభుత్వ ఐటీఐల్లో సీట్ల భర్తీ 56.74 శాతం ఉందని నివేదిక పేర్కొంది. అత్యంత ఆదరణ పొందిన ట్రేడ్లలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మోటారు వెహికల్ మెకానిక్, డ్రాప్ట్స్‌మెన్ మొదలైనవి ఉన్నాయి. అయినప్పటికీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఉన్న సీట్లలో 64.81 శాతం, ఫిట్టర్ ట్రేడ్‌లో 71.57 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో 35.19 శాతం, ఫిట్టర్లో 28.43 శాతం సీట్లే భర్తీ అవుతున్నాయి. అప్రెంటిస్‌లుగానే ఉపాధి ఐటీఐల్లో విద్యార్ధుల అనుభవాలు మిశ్రమంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. అత్యున్నత ప్రమాణాలతో ఉన్న ఐటీఐల్లో ప్లేస్‌మెంట్స్ 80 శాతం ఉంటున్నాయి. వీటిలో చదివిన విద్యార్థులు కెరీర్ పట్ల భరోసాతో ఉంటున్నారు. వీరిలో ఎక్కువ మంది సొంతంగా వెంచర్ ప్రారంభించాలన్న ఆసక్తిని కనబరుస్తున్నారు. మరికొందరు బోధకులుగా మారాలనుకుంటున్నారు. మధ్యస్థాయి, తక్కువ స్థాయి ఐటీఐల్లో అతి కొద్ది సంస్థల్లో మాత్రమే 20 శాతానికి పైగా ప్లేస్‌మెంట్స్ పొందుతున్నారు. ఐటీఐ విద్యార్థులను సంస్థలు ఉద్యోగులుగా కాకుండా అప్రెంటిస్‌లుగానే పరిగణిస్తున్నాయి. సాధారణంగా ఐటీఐ అభ్యర్థుల కనీస వేతనం నెలకు రూ.20 వేలుగా ఉంది. చాలా కంపెనీలు ఐటీఐ అభ్యర్ధులను ఉద్యోగులుగా కాకుండా రిపేర్ల కోసం అప్రెంటిస్‌లగానే తీసుకుంటున్నాయి. వీరికి నెలకు రూ. 9,000 నుంచి రూ.12,000 వరకు ఇస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం 18 సంవత్సరాల వయస్సుగల వారు కావడం, సౌకర్యాల కోసం డిమాండ్ చేయడం. ఇవీ అసౌకర్యాలు ఐటీఐల్లో సరైన బోధకులు లేరు. మంజూరైన బోధకుల పోస్టుల్లో 36 శాతమే ఉన్నారు. ఔట్ సోర్సింగ్ బోధకుల్లో సమర్ధత లేదు. ఐటీఐల్లో శిక్షణకు అవసరమైన లేబోరేటరీలు, సాధనాల కొరత తీవ్రంగా ఉంది. ఐటీఐలకు కనెక్టివిటీ కూడా తక్కువగా ఉంది. దీంతో కొంతమంది మధ్యలోనే చదువు మానేస్తున్నారు -
కారుణ్య బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్ సకల జనుల బడ్జెట్‌గా ప్రశంసలందుకుంది. ఆర్థిక ఉత్పాతాలకు లోనయ్యే ఆదివాసీ బృందాలు, మహిళలు, యువత కోసం అనేక చర్య లను ప్రతిపాదించింది. కళాకారులకూ, హస్తకళాకారులకూ నిపుణతలు నేర్పించే పీఎం – వికాస్ వంటి పలు పథకాలను పేర్కొని తీరాలి. ఇవి 2047 నాటికి వికాస్ భారత్ లక్ష్యసాధనకు పునాది వేస్తాయి. 2023–24 కేంద్ర బడ్జెట్ దాని ఆదర్శాలకు సంబంధించి సాహసో పేతమైనదే, కానీ దాని గణన విధానంలో సాంప్రదాయికమైనది. దాని వ్యూహాల్లో ఆశావహమైనది, అయినప్పటికీ అది వాస్తవంలో బలమైన పునాదిని కలిగిఉంది. ఇది ప్రపంచ సూక్ష్మ ఆర్థిక ముఖ చిత్రం చుట్టూ ఉన్న అనిశ్చితత్వాలను విజయవంతంగా సంగ్రహించింది. భారత ఆర్థిక వ్యవస్థ అమృత్ కాల్ వైపు గమనం సాగిస్తున్నందున దానికి అవసరమైన దృఢత్వాన్ని పెంపొందించి, వృద్ధిని వేగవంతం చేయడానికి రోడ్ మ్యాప్‌ని అందించింది. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ (ప్రతి ఒక్కరితో, అందరి అభి వృద్ధి కోసం) అనే పంక్తులను అనుసరించిన ఈ బడ్జెట్ సకల జనుల బడ్జెట్‌గా ప్రశంసలందుకుంది. సమాజంలోని అన్ని వర్గా లకూ ఇది ఏదో ఒక అవకాశాన్ని ప్రతిపాదించింది. బడ్జెట్ అనే ఈ డాక్యుమెంట్ 2047లో భారత్ ఆకాంక్షిస్తున్న తరహా సమాజం గురించి ప్రధాని మోదీ ఇచ్చిన స్పష్టమైన దార్శనికతను వ్యక్తపరు స్తోంది. ఇండియా ఎట్ 100 (వందేళ్ల భారత్) సమగ్రత, సంపద్వంతం అనే స్తంభాలపై నిలబడుతుంది. అప్పుడు అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు ప్రత్యేకించి మన యువత, మహిళలు, రైతులు, ఓబీసీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలతో పాటు దేశంలోని పౌరులందరికీ చెందుతాయి. సమీకృత అభివృద్ధి, చివరి మైలురాయిని కూడా చేరుకోవడం అనే రెండు తొలి ప్రాధాన్యాల ద్వారా ఈ దార్శనికత ప్రతిఫలిస్తుంది. ఆర్థిక ఉత్పాతాలకు సులభంగా లోనయ్యే దుర్బలమైన ఆదివాసీ బృందాలు, మహిళలు, యువత కోసం; సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా వ్యాపారసంస్థల సాధికారత కోసం తాజా బడ్జెట్ చర్య లను ప్రతిపాదించింది. సాంకేతికతను, ఆర్థికాన్ని సమ్మిళితం చేయడం ద్వారా వ్యక్తులకు, స్థానిక పరిశ్రమలకు సాధికారత కల్పించడంపై తాజా బడ్జెట్ గట్టిగా దృష్టి పెట్టింది. మన యువతకు సాధికారత కల్పిస్తూ, అమృత్ పీఢీ (బంగారు తరం) తన శక్తిసామర్థ్యాలను వెలికితీయడంలో సహాయం చేసేందుకు తగిన విధానాలను అది రూపొందించింది. యువతకు, మహిళలకు, హస్తకళాకారులకు, స్వయం సహాయక బృందాలకు విస్తృతంగా ఉద్యోగాల కల్పన కోసం తగిన నైపుణ్యాల ప్రాధాన్యతపై అది దృష్టి పెట్టింది. సాంప్రదాయిక కళాకారులకు, హస్తకళా కారులకు నిపుణతలు నేర్పించడం కోసం ప్రధాన మంత్రి విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ (పీఎమ్–వికాస్) వంటి పథకాలను ప్రత్యేకంగా పేర్కొ నాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువ పారిశ్రామికవేత్తల ద్వారా వ్యవసాయాధారిత అగ్రిస్టార్టప్లను ప్రోత్స హించడానికి అగ్రికల్చర్ ఆక్సిలేటర్ ఫండ్ కల్పన, ‘దేఖో అప్నా దేశ్ ఇనిషి యేటివ్’ కింద పర్యాటక రంగం కోసం ప్రత్యేక నైపుణ్యాలు, పారిశ్రామిక తత్వాన్ని పెంపొందించడానికీ బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చింది. 2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ద్వారా, అమృత్ పీఢీ కార్యక్రమం ద్వారా యువశక్తికి, ఆధునిక నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ పథకం కోడింగ్, కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి అంశాల్లో యువతకు నైపుణ్యాలను కల్పిస్తుంది. అంతేకాకుండా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా ఉపకార వేతనాలు కూడా అందిస్తోంది. ఇలా రూపొందిన నిపుణ కార్మిక శక్తి నుండి పర్యాటక రంగం ప్రయోజనం పొందుతుంది. ఇక యువ పారిశ్రామికవేత్తలయితే ఒక జిల్లా, ఒక ఉత్పత్తి కార్యక్రమం ద్వారా ప్రతిపాదిత ‘యూనిటీ మాల్స్’ గుండా మార్కెటింగ్ మద్దతు కూడా పొందుతారు. బాహ్య ఎదురుగాలులను తట్టుకునేందుకుగాను బడ్జెట్ ఆశిస్తున్న శక్తి గుణకాల్లో ఇవి ఓ భాగం. అనిశ్చితమైన బాహ్య వాతావరణం ద్వారా ఎదురయ్యే సవాళ్లను బడ్జెట్ గుర్తించడమే కాదు, వృద్ధి పెంపుదలలో దేశీయ చోదకశక్తులు ఎంత కీలకమో ఎత్తి చూపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ భారత్ ఆర్థిక ప్రమా దాల నుంచి బయటపడటమే కాకుండా, 2023లో 7 శాతం, 2024 ఆర్థిక సంవత్సరంలో 6.6 లేదా 6.8 శాతం వృద్ధి రేటు అంచనాను నిలబెట్టుకునేలా ఆర్థిక వ్యవస్థను నడిపించింది. అంతర్జాతీయ ఉపద్రవాల నేపథ్యంలో కూడా, ఇప్పటికీ దృఢంగా ఉంటూ, దూసుకెళుతున్న దేశీయ చోదక శక్తుల ద్వారా ఆర్థిక వృద్ధి సాగుతోంది. కోవిడ్ అనంతర కాలంలో ప్రైవేట్ విని యోగం పెరగడం కూడా దీనికి తోడయింది. బహుముఖంగా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల కాంట్రాక్ట్ ఇన్సెంటివ్ సర్వీసు లపై వ్యక్తులు ఖర్చుపెట్టడం సాధ్యమైంది. ఇళ్లకు వెళ్లిపోయిన వలస కార్మికులు నగరాలకు తిరిగి రావడం, అధిక స్థాయిలో మూలధన వ్యయం (33 శాతం పెరుగుదలతో 10 లక్షల కోట్లకు పెరిగింది) పెరగడం, కార్పొరేట్ల ఆదాయ, వ్యయ సమాచార నివేదికలు బలపడటం వంటివి వీటిలో కొన్ని. దీనికి అనుగుణంగా వ్యవసాయం, టూరిజం, మౌలిక వ్యవస్థాపన వంటి వాణిజ్యేతర రంగాలపై బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. పైగా పర్యా వరణం, గ్రీన్ ఎకానమీ వంటి క్రాస్ కటింగ్ థీమ్‌లు (ప్రధాన లక్ష్యంపై గురి తప్పకుండానే అనుబంధ అంశా లపై దృష్టి పెట్టడం) కూడా బడ్జెట్ లోకి వచ్చాయి. ప్రభుత్వ విధాన రోడ్ మ్యాప్‌లో సుస్థిరాభివృద్ధికి కేంద్ర స్థానం. అదేవిధంగా ‘పంచామృత్’ (అయిదు ప్రతి జ్ఞలు), ‘మిషన్ లైఫ్’ (పర్యావరణ అనుకూల జీవన శైలి), నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, (రూ.19,700 కోట్ల బడ్జెట్ కేటాయింపులు), కాలం చెల్లిన వాహనాల తొలగింపు విధానం, చెత్త నుంచి సంపదను సృష్టించే 500 వందలకు పైగా నూతన ప్లాంట్లను నెలకొల్పే గోవర్ధన్ స్కీమ్ (10,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు), తీరప్రాంత నివాసాల రక్షణ కోసం మడ అడవుల పెంపకం, ప్రత్యక్ష ఆదాయ పథకం వంటి వాటి గురించి 2023–24 బడ్జెట్లో నొక్కి చెప్పడమైనది. సొంత చొరవ, కార్యకలాపాల ద్వారా నీతి ఆయోగ్ లక్ష్యాల సాధన కోసం ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ గణనీయ స్థాయిలో మార్గదర్శకత్వాన్ని అందజేస్తుంది. స్టేట్ సపోర్ట్ మిషన్ ద్వారా నీతి ఆయోగ్ మరింత నిర్మాణాత్మక, సంస్థాగత పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలతో తాను వ్యవహరించే తీరును మరింత మెరుగుపర్చుకోవడాన్ని కొనసాగిస్తుంది. మరోవైపున నీతి ఆయోగ్ నేతృత్వంలోని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ (ఆకాంక్ష జిల్లాలు) ప్రోగ్రామ్ విజయం గురించి, ఇటీవలే ప్రారంభించిన ఆస్పి రేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్లలోని సామర్థ్యం గురించి కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. ఈ పరివర్తనా కార్య క్రమం ద్వారా నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా 500 బ్లాక్‌ల లోని(సమితులలోని) పౌరుల జీవన నాణ్యతను పెంపొందించడానికి పాలనను మెరుగుపర్చ డంపై కూడా దృష్టి పెడుతుంది. ఇవి, మరికొన్ని కార్యకలాపాలు... 2047 నాటికి వికాస్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యసాధన వైపుగా... మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలతో సహకా రాత్మక చర్యకు పునాది వేస్తాయి. సుమన్ బెరీ వ్యాసకర్త నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ -
ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలసి పనిచేయాలి
న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలసికట్టుగా పనిచేయాలని, అంతర్జాతీయంగా ఉన్న పరిణామాల నేపథ్యంలో తమ పరిధి దాటి విశాల దృక్పథంతో ఆలోచించి అవకాశాలను సొంతం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రముఖ ఆర్థికవేత్తలతో శుక్రవారం ప్రధాని సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలు, సూచనలను తెలుసుకున్నారు. డిజిటల్ కార్యకలాపాల విషయంలో, ఫిన్‌టెక్ విస్తరణలో దేశం సాధించిన విజయాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించినట్టు అధికారికంగా ఓ ప్రకటన విడుదలైంది. సమ్మిళిత వృద్ధికి ఇది కీలకమని ప్రధాని అభిప్రాయపడ్డారు. భారత్ వృద్ధిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొంటూ, ఉత్పాదకతలో మహిళలను మరింతగా భాగస్వాములను చేయాలని కోరారు. రిస్క్‌లు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా డిజిటైజేషన్, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం రంగాల్లో విస్తతమైన అవకాశాలున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. ఈ అవకాశాలను సొంతం చేసుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్ తన వృద్ధిని స్థిరంగా కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆర్థికవేత్తలు ఈ సమావేశంలో ప్రధానికి సూచించినట్టు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న సమస్యలు కొనసాగుతాయంటూ, భారత్ మరింత బలమైన వృద్ధిని నమోదు చేసేందుకు చర్యలను ప్రతిపాదించినట్టు పేర్కొంది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ, ఉన్నతాధికారులతోపాటు.. ఆర్థికవేత్తలు శంకర్ ఆచార్య, అశోక్ గులాటీ, షమిక రవి తదితరులు పాల్గొన్నారు. -
Pre-Budget 2023: శుక్రవారం ప్రధాని ప్రీ బడ్జెట్ భేటీ!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఆర్థివేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. నీతి ఆయోగ్‌లో జరగనున్న ఈ భేటీలో దేశ ఆర్థిక వ్యవస్థ, వృద్ధి పురోగతికి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై ప్రధాని చర్చించనున్నారని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2023–24 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతారని భావిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్ ఎకానమీ వృద్ధి రేటు 6.5–7.0 శ్రేణిలో నమోదవుతుందని అంచనా. -
చైనాతో వాణిజ్య బంధం తెంచుకోవాలనడం సరికాదు
న్యూఢిల్లీ: సరిహద్దులో అతిక్రమనలకు ప్రతీకారంగా చైనాతో భారత్ వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవలన్న డిమాండ్ సరికాదని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ పనగారియా స్పష్టం చేశారు. అలాచేయడం వల్ల భారత్ ఆర్థిక వృద్ధి వేగమూ మందగిస్తుందని హెచ్చరించారు. అందుకు బదులుగా ముందు భారతదేశం తన వాణిజ్యాన్ని విస్తరించడానికి బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ)కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన సూచించారు. ‘‘ రెండు దేశాలు వాణిజ్య ఆంక్షలు విధించుకోవచ్చు. అయితే 17 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ (చైనా)కు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ (భారతదేశం)ని దెబ్బతీసే సామర్థ్యమే అధికంగా ఉంటుంది’’ అని ఆయన విశ్లేషించారు. ‘‘మనం చైనాను శిక్షించాలని ప్రయత్నిస్తే, అది వెనక్కి తగ్గదు. అమెరికా ఆంక్షల విషయంలో చైనా ఎలా ప్రతిస్పందించిందన్న విషయాన్ని, ఇందుకు సంబంధించి అమెరికాలో పరిణామాలను మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి’’ అని ఆయన అన్నారు. ఆంక్షల విధింపు వల్ల లాభంకన్నా నష్టాలే ఎక్కువనే అన్నారు. రష్యాపై ఆంక్షల విధింపు ద్వారా అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఎలాంటి ప్రతికూల పర్యవసానాలను ఎదుర్కొంటున్నాయో కూడా మనం గమనించాలని అన్నారు. చౌక కాబట్టే కొంటున్నాం... భారతదేశం దిగుమతి చేసుకునే అనేక ఉత్పత్తులకు చైనా చౌకైన సరఫరాదారు కాబట్టే భారత్ బీజింగ్ నుండి కొనుగోలు చేస్తోందని పనగారియా చెప్పారు. భారతదేశం ఎగుమతి చేయాలనుకుంటున్న వస్తువులకు చైనా మంచి ధరను అందించబోదని అన్నారు. ఇక్కడే మనం అమెరికా వంటి వాణిజ్య భాగస్వాములకు మన వస్తువులను భారీగా అమ్మడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. దీని ఫలితంగా చైనాతో వాణిజ్య లోటు– అమెరికాతో వాణిజ్య మిగులుతో భర్తీ అవుతుందని అన్నారు. వెరసి చైనాతో వాణిజ్యలోటు తీవ్రత వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదన్నారు. ఏటేటా భారీ వాణిజ్యలోటు భారత్– చైనాల మధ్య వాణిజ్య లోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో 51.5 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. 2021–22లో ఈ లోటు 73.31 బిలియన్ డాలర్లు. 2020–21లో 44.03 బిలియన్లతో పోల్చితే వాణిజ్యలోటు భారీగా పెరగడం గమనార్హం. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–అక్టోబర్ మధ్య చైనా దిగుమతులు 60.27 బిలియన్ డాలర్లు. ఎగుమతులు 8.77 బిలియన్ డాలర్లు. క్యాడ్‌పై ఇప్పటికి ఓకే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) 2 నుండి 3 శాతం (జీడీపీ విలువతో పోల్చి) మధ్య ఉండవచ్చని అన్నారు. ఇది భారత్ తట్టుకునే పరిమితిలో ఉందని పేర్కొన్నారు. ఈ స్థాయి క్యాడ్‌తో స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఎటువంటి ముప్పు ఉండబోదని స్పష్టం చేశారు. 2020–21లో భారతదేశం జీడీపీలో 0.9 శాతం కరెంట్–ఖాతా మిగులు నమోదయ్యింది. 2021–22లో 1.2 శాతం కరెంట్–ఖాతా లోటు ఏర్పడింది. ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించండి: కేంద్రం సూచన
సాక్షి, ఢిల్లీ: పలు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. మన పొరుగు దేశంలో చైనాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో, ఆరోగ్యశాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయా వైద్య నిపుణులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కేంద్రం కీలక సూచనలు చేసింది. కోవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని కోరింది. ఈ క్రమంలోనే విదేశాల నుంచి రాకపోకలపై ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు అదుపులోకి ఉన్నాయని తెలిపింది. మన దేశంలో భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. చైనా, జపాన్, దక్షిణ కొరియాలో కేసులు పెరుగుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. అలాగే, దేశంలో కోవిడ్ పరిస్థితిని పర్యవేక్షించడానికి వారానికొకసారి సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. Use a mask if you are in a crowded space, indoors or outdoors. This is all the more important for people with comorbidities or are of higher age: Dr VK Paul, Member-Health, NITI Aayog after Union Health Minister's meeting on COVID pic.twitter.com/14Mx9ixIod — ANI (@ANI) December 21, 2022 -
సంక్షేమం కూడా అభివృద్ధిలో భాగమే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పేదలకు మేలు చేస్తున్నాయని, సంక్షేమం కూడా అభివృద్ధిలో భాగమేనని పలువురు వక్తలు స్పష్టంచేశారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ఆంధ్రాలో అభివృద్ధి–సంక్షేమం–వాస్తవాలు–వక్రీకరణ’ అనే అంశంపై విజయవాడలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ 11.43 శాతం ఆర్థికాభివృద్ధితో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. అవినీతికి తావులేకుండా సంక్షేమ ఫలాలు నేరుగా నిరుపేదలకు అందుతున్నాయని, అయినా ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నాయని, ఇది సరైన విధానం కాదన్నారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బీజేపీ నేత చందు సాంబశివరావు మాట్లాడుతూ ఏపీలో ఆర్థిక సంక్షేమమేగాని సంక్షోభం లేదని, శ్రీలంకతో మన రాష్ట్రాన్ని పోల్చడం భావ్యం కాదన్నారు. బెటర్ ఆంధ్రప్రదేశ్ కో–కన్వీనర్ లఖంరాజు సునీత మాట్లాడుతూ నీతి ఆయోగ్ సూచీల్లో పలు విభాగాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని, రాష్ట్ర నుంచి ఎగుమతులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయని గణాంకాలతో వివరించారు. జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి జంపా కృష్ణకిషోర్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిపై కేంద్ర నివేదికలకు భిన్నంగా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు మాట్లాడుతూ నేరుగా నగదు ప్రజలకు అందడం వల్ల వారు దానిని వస్తుసేవల విక్రయానికి ఉపయోగిస్తారన్నారు. దీంతో వాటికి డిమాండ్, సరఫరా, ఉత్పత్తి పెరిగి ఉపాధి అవకాశాలు, ప్రభుత్వానికి పన్నుల రాబడి పెరుగుతుందని వివరించారు. వైఎస్సార్సీపీ ఉపాధ్యాయ విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 2020–21లో దేశంలో రూ.6.3 లక్షల కోట్ల నగదును నేరుగా ప్రజలకు బదిలీ చేయగా.. దానిలో పది శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరిగిందని చెప్పారు. బెజవాడ మీడియా సెంటర్ అధ్యక్షుడు చందన మధు, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి మేళం భాగ్యారావు, సీనియర్ పాత్రికేయుడు బ్రహ్మయ్య తదితరులు ప్రసంగించారు. -
రూ.23 లక్షల కోట్లు అవసరం..ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మర్చేందుకు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్‌కు మారేందుకు సుమారు రూ.23 లక్షల కోట్లు అవసరమని ఒక నివేదిక వెల్లడించింది. నీతి అయోగ్ భాగస్వామ్యంతో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రూపొందించిన ఈ శ్వేత పత్రం ప్రకారం..చివరి గమ్యస్థానం కోసం, అలాగే పట్టణాల్లో డెలివరీకి ఉపయోగించే వాహనాలే దేశంలో ఎలక్ట్రిక్ టూ, త్రీవీలర్ల స్వీకరణను ముందుండి నడిపిస్తున్నాయి. పూర్తిగా ఎలక్ట్రిక్‌కి మారబోయే మొదటి విభాగాలుగా వీటిని చెప్పవచ్చు. ముందస్తు కొనుగోలు ఖర్చు ఎక్కువగా ఉండడం, కొత్త సాంకేతికతపై విశ్వాసం లేకపోవడం, హామీ లేని విశ్వసనీయత, పునఃవిక్రయం విలువ స్థిరీకరించకపోవడం కారణంగా ఎలక్ట్రిక్‌కు మారడానికి డ్రైవర్–కమ్–ఓనర్లు వెనుకాడుతున్నారు. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం వెహికిల్స్‌లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల వాటా ఏకంగా 80 శాతం ఉంది. కొన్నేళ్లుగా ఈవీల వాడకం పెరుగుతోంది. నిర్వహణ ఖర్చు తక్కువ.. భారత్‌లో ధ్రువీకరణ పొందిన 45 కంపెనీలు ఎలక్ట్రిక్ టూ, త్రీవీలర్ల తయారీలో ఉన్నాయి. ఇవి ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్లను విక్రయించాయి. 25 కోట్ల మొత్తం ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో ఎలక్ట్రిక్ టూ, త్రీవీలర్ల వాటా అతిస్వల్పమే. భారత్‌లో పెరుగుతున్న ఆదాయాలు, వాహన యాజమాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ద్విచక్ర, త్రిచక్ర వాహనాల సంఖ్య మొత్తం 27 కోట్లకు పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. వీటిలో 26.4 కోట్ల యూనిట్ల ఎలక్ట్రిక్ టూవీలర్లు ఒక్కొక్కటి సగటున రూ.80,000 చొప్పున, అలాగే 60 లక్షల యూనిట్ల ఈ–త్రీవీలర్లు ఒక్కొక్కటి సగటున రూ.2.8 లక్షలుగా లెక్కించారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నప్పటికీ.. వాటి నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. యాజమాన్య ఖర్చుతో అంచనా వేసినప్పుడు రోజువారీ అధికంగా వినియోగించే రైడ్–హెయిలింగ్, లాస్ట్–మైల్ డెలివరీ ఫ్లీట్స్‌కు ఈవీలు ఇప్పటికే అనువైనవని పరిశ్రమ గుర్తించిందని నివేదిక వివరించింది. -
వృద్ధి కోసం ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు మారాలి
ముంబై: దేశంలో ఆర్థిక రంగానికి సంబంధించి పనిచేస్తున్న నియంత్రణ సంస్థలు (రెగ్యులేటర్లు) సోషలిస్ట్ యుగంలో రూపొందించినవని, వృద్ధి కోసం అవి మారాల్సిన అవసరం ఉందని జీ–20లో భారత్ షెర్పా (ప్రతినిధి), నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ఎస్బీఐ కాంక్లేవ్‌లో భాగంగా కాంత్ మాట్లాడారు. ఆర్బీఐ, సెబీ, కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. మార్పు, అభివృద్ధి ఏజెంట్లుగా పనిచేయాలని సూచించారు. ఎప్పుడో సామ్యవాదం రోజుల్లో నియంత్రణ సంస్థలు ఏర్పాడ్డాయని, నేటి కాలానికి అనుగుణంగా వాటి ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నది తన అభిప్రాయంగా పేర్కొన్నారు. దేశ అభివృద్ధి ఆవశ్యకత గురించి కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ) ఉపోద్ఘాతంలో ప్రస్తావించారని చెబుతూ, ఇతర నియంత్రణ సంస్థలకు సైతం ఇదే విధమైన లక్ష్యం ఉండాలన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ, రెన్యువబుల్ ఎనర్జీలో రానున్న అవకాశాలను భారత్ సొంతం చేసుకోలేకపోతే 7 శాతం వృద్ధి రేటును కూడా ఆశించలేమన్నారు. ఉచిత విద్యుత్ తదితర ఉచిత తాయిలాలతో కొంత మంది రాజకీయ నాయకులు దేశాన్ని నాశనం చేస్తున్నారని, ప్రత్యేకంగా ఎవరి పేరును ప్రస్తావించకుండా విమర్శించారు. ఈ ఏడాది జీ–20కి భారత్ నాయకత్వం వహిస్తుండడం తెలిసిందే. సర్క్యులర్ ఎకానమీపై దృష్టి అవశ్యం క్లైమేట్ చేంజ్ సమస్య పరిష్కారం కోసం (వాతావరణ సమతౌల్య పరిరక్షణ) సర్క్యులర్ ఎకానమీపై దృష్టి సారించాల్సిన తక్షణ అవసరం ఉందని ఒక వెర్చువల్ కార్యక్రమంలో భారత్ తరఫున జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ అనేది ఉత్పత్తి– వినియోగానికి సంబంధించిన ఒక నమూనా. వినియోగ ఉత్పత్తుల రీసైక్లింగ్ ఇందులో ప్రధాన భాగం. డిసెంబర్ 1 నుంచి జీ–20 ప్రెసిడెన్సీ బాధ్యతలు స్వీకరిస్తున్న భారత్, సర్క్యులర్ ఎకానమీ పురోగతికి తన వంతు ప్రయత్నం చేస్తుందన్నారు. -
Recession In India 2022: భారత్‌లో మాంద్యానికి ఆస్కారమే లేదు
న్యూఢిల్లీ: ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారుకోనుందన్న భయాలు నెలకొన్న నేపథ్యంలో భారత్‌లో అటువంటి పరిస్థితేమీ రాబోదని నీతి ఆయోగ్ మాజీ వైస్–చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల ప్రభావం భారత్‌పై పడినా .. దేశీయంగా మాంద్యం తలెత్తబోదని స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24)లో వృద్ధి రేటు 6–7 శాతం స్థాయిలో ఉంటుందని కుమార్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికా, యూరప్, జపాన్‌తో పాటు చైనా తదితర దేశాల్లో ఏకకాలంలో మందగమనం కనిపిస్తోందని, దీనితో రాబోయే నెలల్లో ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారుకునే అవకాశం ఉందని ఒక ఇంటర్వ్యూలో కుమార్ చెప్పారు. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం మరికొంత కాలం పాటు 6–7 శాతం స్థాయిలోనే ఉండవచ్చని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణం ఎక్కువగా అంతర్జాతీయ చమురు ధరలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతల కారణంగా క్రూడాయిల్ రేట్ల పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని, అలా కాకపోతే దేశీయ సానుకూల అంశాల కారణంగా ద్రవ్యోల్బణం దిగి రాగలదని కుమార్ చెప్పారు. ఎగుమతులపై దృష్టి పెట్టాలి.. వాణిజ్య లోటు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తులు, సర్వీసుల ఎగుమతులను పెంచుకోవడానికి తగిన విధానాలపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కుమార్ చెప్పారు. ఒక్కో రాష్ట్రంలో పరిస్థితి ఒక్కో రకంగా ఉన్నప్పుడు దేశం మొత్తానికి ఒకే ఎగుమతుల విధానం అమలుపర్చడం సరికాదన్నారు. సముద్ర తీరమే లేని పంజాబ్‌కు, శతాబ్దాలుగా సముద్ర వాణిజ్యం చేస్తున్న తీర ప్రాంత రాష్ట్రం తమిళనాడుకు ఒకే తరహా ఎగుమతుల విధానాలు పని చేయవని కుమార్ చెప్పారు. -
పర్యావరణ పరిరక్షణ.. భావితరాలకు భరోసా
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ కోసం, భావితరాలకు సురక్షితమైన జీవితాన్ని అందించడం కోసం మన దైనందిన జీవితంలో అలవరుచుకోవలసిన, మార్చుకోవాల్సిన కొన్ని పద్ధతులను పై నాలుగు అంశాలూ సుస్పష్టం చేస్తున్నాయి. మన దైనందిన జీవితంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే ఎంత మేలు జరుగుతుందో వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నీతి ఆయోగ్ మూడు దశల కార్యాచరణను సిఫారసు చేసింది. 2022–23 నుంచి 2027–28 మధ్య కాలంలో దేశంలోని 80 శాతం మంది ప్రజలను పర్యావరణ హితులుగా మార్చడమే లక్ష్యంగా ‘మిషన్ లైఫ్’ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ (పర్యావరణ హిత జీవన విధానం (లైఫ్) పేరుతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం.. గత వారంలోనే వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించింది. మొదటిదశలో భాగంగా 2022–23లో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ హిత వ్యక్తిగత జీవనాన్ని అలవర్చుకునేలా పలు సూచనలు చేసింది. ఇంధనం, నీరు పొదుపు చేయడం, ప్లాసిక్ నియంత్రణ, మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవడం, వ్యర్ధాలను తగ్గించడం, ఆరోగ్యకర జీవనాన్ని అలవరుచుకోవడం, ఈ–వ్యర్థాలను తగ్గించడం అనే ఏడు కేటగిరీల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో 75 జీవన సూత్రాలను పేర్కొంది. తద్వారా పర్యావరణానికి హాని కలిగించే వస్తువుల డిమాండ్‌లో మార్పు వస్తుందని వెల్లడించింది. దైనందిన జీవితంలో అలవరుచుకోవాల్సిన కొన్ని ప్రధాన సూచనలు, చేసుకోవాల్సిన కీలక మార్పులు ఇవే.. ►ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు వాడాలి ►వీలున్న ప్రతి చోటా ప్రజారవాణాను మాత్రమే ఉపయోగించాలి ►స్నేహితులు, సహచరులతో కార్ పూలింగ్ (ఒక కారులో కలిసి వెళ్లడం) అలవరుచుకోవాలి ►ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, రైల్వే గేట్ల వద్ద ఆగినప్పుడు వాహనాల ఇంజన్ ఆపేయాలి ►స్థానికంగా తిరిగేటప్పుడు, సమీప ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సైకిల్ మీద వెళ్లాలి ►అవసరం లేనప్పుడు సాగునీటి పంపులను నిలిపివేయాలి ►పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి ►వంటలో ప్రెషర్ కుక్కర్లకు ప్రాధాన్యమివ్వాలి ►పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలి. తక్కువ నీటిని తీసుకునే చిరుధాన్యాల పంటలను సాగుచేయాలి ►ఇళ్లు, పాఠశాలలు, కార్యాలయాల్లో వర్షపు నీటిని పొదుపు చేసే ఏర్పాట్లు చేసుకోవాలి ►కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు పోయాలి లేదంటే ఇతర అవసరాలకు వాడుకోవాలి ►చెట్లకు నీరు పోసేటప్పు డు, వాహనాలు, ఇళ్లు కడిగేటప్పుడు పైపులకు బదులుగా బకెట్లలో నీటిని ఉపయోగించాలి ►రోజువారీ నీటి వినియోగాన్ని నియంత్రించడంలో భాగంగా ప్రతి ఇంటికీ నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోవాలి ►ప్లాస్టిక్ సంచులకు బదులు నేత సంచులు వాడాలి ►వెదురు దువ్వెనలు, వేప బ్రష్‌లు ఉపయోగించాలి ►ఆహారం తీసుకునే సమయంలో చిన్న ప్లేట్లను ఉపయోగించాలి ►పాత దుస్తులు, పుస్తకాలను దానం చేయాలి ►రెండువైపులా ప్రింట్ వచ్చేలా ప్రింటర్‌ను సెట్ చేసుకోవాలి ►ఎలక్ట్రానిక్ పరికరాలను మరమ్మతు చేసి ఉపయోగించుకోవాలే తప్ప పడేయకూడదు. -
ఇథనాల్ ఉత్పత్తికి ప్రభుత్వ మద్దతు కావాలి
న్యూఢిల్లీ: ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలంటే చక్కెర పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు అవసరమని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) ప్రెసిడెంట్ ఆదిత్య ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. అప్పుడే 2025 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ పరిమాణాన్ని 20 శాతానికి (ఈ20) పెంచాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యపడగలదని పేర్కొన్నారు. ఈ20 లక్ష్య సాధన కోసం 1,000 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసిందని భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయంగా చెరకు, చక్కెర ఉత్పత్తిని పెంచేందుకు మరింత అధిక తయారీ సామర్థ్యాలు, మరిన్ని డిస్టిలరీలు అవసరమవుతాయని ఆదిత్య చెప్పారు. ఇందుకు ప్రభుత్వ విధానాలపరమైన తోడ్పాటు కావాల్సి ఉంటుందన్నారు. పరిశ్రమ ఇప్పటికే పూర్తి ఉత్పత్తి సామర్థ్యాలతో పనిచేస్తోందని, కొత్తగా మరిన్ని ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంటుందని ఆదిత్య వివరించారు. చక్కెర పరిశ్రమ ఇథనాల్ ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని పెట్టుబడులు పెడుతోందని, దీనికి ప్రభుత్వం నుంచి కూడా కొంత మద్దతు అవసరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, చెరకు పంటకు నీరు ఎక్కువగా అవసరం అవుతుంది కాబట్టి వ్యవసాయ వ్యర్ధాల్లాంటి వనరుల నుండి ఇథనాల్ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పురి చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలకు స్పష్టమైన విధానాలు కీలకం హెచ్ఎంఎస్ఐ సీఈవో ఒగాటా దేశీయంగా ప్రత్యామ్నాయ ఇంధన మార్గదర్శ ప్రణాళికను అమలు చేయాలంటే స్పష్టమైన, స్థిరమైన విధానాల ప్రణాళిక కీలకమని ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ప్రెసిడెంట్ అత్సుషి ఒకాటా చెప్పారు. ప్రభుత్వ విజన్‌ను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే ఇంధన సరఫరా, ధర వంటి సవాళ్లను పరిష్కారం కావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రణాళిక విజయవంతంగా అమలయ్యేందుకు తగిన విధానం అవసరమన్నారు. -
హైదరాబాద్‌లో నిత్యం ఎంత మురుగు వస్తుందంటే...
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో మురుగు శుద్ధి ప్రహసనంగా మారింది. దేశంలో పట్టణ ప్రాంతాల్లో రోజువారీగా వెలువడుతోన్న వ్యర్థజలాల్లో కేవలం 28 శాతమే శుద్ధి జరుగుతోందని ఇటీవల నీతిఆయోగ్ ఆందోళన వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశమౌతోంది. ఈ నేపథ్యంలో మన నగరంలో రోజువారీగా సుమారు 2000 మిలియన్ లీటర్ల మురుగు జలాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో కేవలం వెయ్యి మిలియన్ లీటర్ల వ్యర్థజలాల శుద్ధి జరుగుతోంది. మిగతా సగం ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులతోపాటు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్, జంటజలాశయాలు, చారిత్రక మూసీ నదిని ముంచెత్తుతుండడంతో ఆయా జలవనరులు కాలుష్యకాటుకు గురవుతున్నాయి. దేశవ్యాప్తంగా దుస్థితి ఇదీ... నీతిఆయోగ్ ఇటీవల ‘అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఇన్ ఇండియా’ పేరుతో విడుదల చేసిన తాజా నివేదికలో పలు ఆందోళనకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా 323 నదుల్లో 351 చోట్ల నీటి నమూనాలు సేకరించి పరీక్షించగా..ఇందులో 13 శాతం తీవ్రంగా..మరో 17 శాతం మధ్యస్థ కాలుష్యం ఉన్నట్లు తేలింది. ఆయా జలాశయాల నీటిలో భారలోహాలు, ఆర్సినిక్, ఫ్లోరైడ్స్ విషపూరిత రసాయనాలు, ఫార్మా అవశేషాలున్నట్లు గుర్తించారు. సమీప ప్రాంతాల్లో భూగర్భజలాలు సైతం కలుషితమైనట్లు గుర్తించారు. గ్రేటర్ సిటీలో పరిస్థితి ఇలా... ► గ్రేటర్ పరిధిలో నిత్యం గృహ,వాణిజ్య,పారిశ్రామిక వాడల నుంచి 2 వేల మిలియన్ లీటర్ల మురుగు జలాలు ఉత్పన్నమౌతున్నాయి. ► ఇందులో సుమారు వెయ్యి మిలియన్ లీటర్ల వ్యర్థజలాలను సుమారు 25 మురుగు శుద్ధి కేంద్రాల్లో జలమండలి శుద్ధి చేస్తోంది. ► మిగతా మురుగు నగరవ్యాప్తంగా ఉన్న జలవనరుల్లో కలుస్తోంది. కాగా భవిష్యత్‌లో మురుగు నగరాన్ని ముంచెత్తుతోందన్న అంచనాతో మిగతా వెయ్యి మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసేందుకు దశలవారీగా మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించాలని సంకల్పించింది. రాబోయే ఐదేళ్లలో నగరంలో మూడు ప్యాకేజీలుగా 31 మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నట్లు జలమండలి ప్రకటించింది . ► తొలివిడతగా రూ.1280 కోట్లతో నగరంలో పలు చోట్ల 17 ఎస్టీపీల నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులు ఈ ఏడాది చివరి వరకు పూర్తయ్యే అవ కాశాలున్నాయి. ఇక మరో 14 ఎస్టీపీలను దశలవారీగా నగరంలో నిర్మించనున్నట్లు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. మొత్తంగా 31 ఎస్టీపీలను రూ.3866.41 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నామని.. వీటిలో రోజువారీగా 1000– 1282 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధిచేయవచ్చని పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: కృష్ణా నదిపై రెండంతస్తుల కేబుల్ బ్రిడ్జి) -
గూగుల్‌కు భారీ షాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. గూగుల్ ఇండియా పాలసీ హెడ్ అర్చన గులాటీ తన పదవికి రాజీనామా చేశారు. విధుల్లో చేరిన 5 నెలల తర్వాత ఆమె తన పదవికి రాజీనామా చేయడం చర్చాంశనీయంగా మారింది. అయితే రాజీనామాపై అర్చన , గూగుల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎకనమిక్స్ గ్రాడ్యుయేట్‌గా, ఐఐటీ-ఢిల్లీలో పీహెచ్డీ పూర్తి చేసిన అర్చన గులాటీ నీతి ఆయోగ్ డిజిటల్ కమ్యూనికేషన్ విభాగంలో జాయింట్ సెక్రటరీగా, అడ్వైజరీగా బాధ్యతలు నిర్వహిస్తుండగా తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రిటైర్మెంట్ ప్రకటించారు. అనంతరం ఈ ఏడాది మేలో గూగుల్ ఇండియా పాలసీ హెడ్‌గా చేరారు. ఈ క్రమంలో అర్చన గులాటీ తన పదవి నుంచి వైదొలిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కాగా, గూగుల్ దేశంలో రెండు యాంటీ ట్రస్ట్ కేసులతో పాటు కఠినమైన నిబంధనల్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో గులాటీ గుడ్ బై చెప్పడం గూగుల్‌కు గట్టి ఎదురు దెబ్బేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ టూ గూగుల్ గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో పనిచేసే సమయంలో అర్చన గులాటీ గూగుల్తన స్మార్ట్ టీవీ మార్కెట్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు యాప్ పేమెంట్ సిస్టం వ్యాపార వ్యవహారాల్ని ఎలా నిర్వర్తిస్తుందో పరిశీలించేవారు. కేంద్రంలో కీలక పదవులు అంతకముందే గులాటీ పలు కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన కీలక విభాగాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. మే 2007 నుండి ఫిబ్రవరి 2012 వరకు టెలికాం మంత్రిత్వ శాఖ విభాగానికి చెందిన యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ ఆఫ్ ఇండియాలో(యూఎస్ఓఎఫ్) జాయింట్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. ఆ పదవిలో కొనసాగుతుండగా యూఎస్ఓఎఫ్ పథకాల రూపకల్పన, వాటి అమలుతో పాటు సబ్సిడీకి పంపిణీకి సంబంధించిన అంశాల రూప కల్పనలో పాలు పంచుకున్నారు. ఆ తర్వాత అర్చన గులాటీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆమె మే 2017 నుండి ఆగస్టు 2019 వరకు టెలికాం సెక్రటరీ కార్యాలయంలో స్పెషల్ డ్యూటీలో అధికారిగా,ఆగస్టు 2019 నుండి మార్చి 2021 వరకు నీతి ఆయోగ్‌లో డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ వ్యవహారాలు చూసుకున్నారు. ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి..ఏడాది పాటు ఫ్రీలాన్సర్‌గా పని చేశారు. అనంతరం ఈ ఏడాది మేలో గూగుల్‌లో చేరారు. ఐదు నెలలు తిరక్క ముందే గూగుల్‌కు అర్చన గులాటీ గుడ్‌బై చెప్పడం చర్చాంశనీయమైంది. -
Poshan Abhiyaan: ‘పోషణ్ అభియాన్’ అమల్లో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపం నివారణకు ఉద్దేశించిన పోషణ్ అభియాన్ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పథకం మొత్తం అమలులో అత్యధిక విజయాలు సాధించిన రాష్ట్రాల్లో తొలుత మహారాష్ట్ర నిలవగా రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్, మూడో స్థానంలో గుజరాత్ నిలిచాయి. ఈ రాష్ట్రాలు మొత్తం మీద 70 శాతానికి పైగా స్కోర్ సాధించాయి. ఆ తరువాత స్థానాల్లో తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ ఉన్నట్లు నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. కోవిడ్ సమయంలో కీలకమైన ఆరోగ్య, పోషకాహార సేవల విషయంలో ఆయా రాష్ట్రాలు చేపట్టిన వినూత్న చర్యలపై నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది. 2019 అక్టోబర్ నుంచి డిసెంబర్ 2020 వరకు పోషణ్ అభియాన్ అమలులో మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, శిక్షణపై పురోగతి, అమలు సామర్థ్యాలు, కెపాసిటీ బిల్డింగ్, కన్వర్జెన్స్, ప్రోగ్రామ్, ఔట్పుట్ యాక్టివిటీస్, సర్వీస్ డెలివరీలపై నీతి ఆయోగ్ అధ్యయనంచేసి ఆయా రాష్ట్రాలకు స్కోర్లు ఇచ్చింది. ఆ వివరాలు.. మానవ వనరుల నియామకాల్లో ఏపీ టాప్ ► కోవిడ్ సమయంలో పోషణ్ అభియాన్ అమలుకు అవసరమైన మానవ వనరుల నియామకాలను నూరు శాతం చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. జాయింట్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ స్థానాలనూ నూరు శాతం భర్తీచేసిన రాష్ట్రాల్లో ఏపీ ఈ ఘనత సాధించింది. అంగన్వాడీ వర్కర్లకు మొబైల్ ఫోన్లను నూరు శా>తం పంపిణీలోనూ ఏపీ టాప్‌లో నిలిచింది. పిల్లల వృద్ధి పర్యవేక్షణ పరికరాలనూ నూటికి నూరు శాతం ఏపీ పంపిణీ చేసింది. అంతేకాక.. రాష్ట్రస్థాయిలో సిబ్బంది శిక్షణ, సామర్థ్యం పెంపునూ నూరు శాతం అమలుచేసింది. ► ఆరోగ్య సంబంధిత సేవలు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులను అంచనా వేయగా.. కమ్యూనిటీ హెల్త్ కేంద్రాలు, పిల్లలు, బాలింతలకు సేవలు, ఏఎన్ఎంల భర్తీలో ఆంధ్రప్రదేశ్ అత్యధిక స్కోర్ సాధించింది. ఆ తరువాత స్థానాల్లో గుజరాత్, కర్ణాటక, కేరళ నిలిచాయి. ► రాష్ట్రస్థాయిలో మౌలిక సదుపాయాలకు సంబంధించి సబ్ సెంటర్లు, కకమ్యూనిటీ హెల్త్ కేంద్రాలు, హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌లో నూటికి నూరు శాతం పనిచేస్తున్నాయి. ఈ విషయంలో దేశంలోని 13 పెద్ద రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ► ఏపీ సర్కారు ప్రత్యేకంగా సప్లిమెంటరీ పోషకాహారం కూడా పంపిణీ చేసింది. గృహ సందర్శనలు, వర్చువల్‌గా కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు పిల్లలకు వర్చువల్ తరగతులు నిర్వహించింది. కమ్యూనిటీ పద్ధతిలో వర్చువల్ ఈవెంట్లనూ నిర్వహించింది. కోవిడ్ సమయంలో జనసమూహాన్ని నివారించేందుకు టోకెన్ ఆధారిత వ్యవస్థ ద్వారా జింక్, ఓఆర్ఎస్లను పంపిణీ చేసింది. ► కోవిడ్ సంక్షోభ సమయంలో అక్టోబర్ 2019 నుంచి 2020 రెండో త్రైమాసికం వరకు ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయస్సు గల పిల్లలకు సప్లిమెంటరీ పౌష్టికాహారం ఏపీలో 113 శాతం మేర పంపిణీ చేయగా 2020 మూడో త్రైమాసికం నాటికి అది 115 శాతం మేర.. నాలుగో త్రైమాసికం నాటికి అది 119 శాతానికి పెరిగింది. ► ఇక అక్టోబర్ 2019 నుంచి 2020 రెండో త్రైమాసికం వరకు గర్భిణులతో పాటు పాలు ఇచ్చే తల్లులకు సప్లిమెంటరీ పౌష్టికాహారం పంపిణీ 108 శాతం ఉండగా 2020 మూడో త్రైమాసికానికి 111 శాతం, 2020 నాలుగో త్రైమాసికంలోనూ అదే స్థాయిలో పంపిణీ జరిగింది. ► ఇక అక్టోబర్ 2019 నుంచి 2020 రెండో త్రైమాసికం వరకు ఇనిస్టిట్యూషనల్ కాన్పులు ఏపీలో 90 శాతం ఉండగా 2020 మూడో త్రైమాసికంలో 94 శాతానికి.. 2020 నాలుగో త్రైమాసికానికి 100 శాతానికి పెరిగాయి. -
ఆర్బీకేలతో రైతుకు ఎంతో మేలు: నీతి ఆయోగ్
సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో రైతులకు సేవలందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఆదర్శనీయమని, వాటిని అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్ రమేష్ చంద్ చెప్పారు. ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో శుక్రవారం జాతీయ స్థాయిలో వ్యవసాయ శాఖల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. నీతి ఆయోగ్ ఆహ్వానం మేరకు ఈ సమావేశానికి హాజరైన ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు, దాని ఆవశ్యకత, అందిస్తున్న సేవలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పౌర సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రతి రెండువేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారని, వాటికి అనుబంధంగా గ్రామస్థాయిలో రైతుల కోసం ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చామని పూనం మాలకొండయ్య వివరించారు. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి ఇన్‌పుట్స్‌ను రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. వీటిని నాలెడ్జ్ హబ్‌లుగా, వన్‌స్టాప్ సెంటర్లుగా కూడా తీర్చిదిద్దామని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులతోపాటు ఆక్వా, పాడి రైతులకు కూడా ఆర్బీకేలు సేవలందిస్తున్నాయని తెలిపారు. పొలం బడులు, తోట, పట్టు, పశువిజ్ఞాన, మత్స్య సాగుబడుల ద్వారా రైతులకు శిక్షణ ఇస్తూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నట్లు చెప్పారు. ఈ–క్రాప్, ఈ–కేవైసీ ద్వారా వాస్తవ సాగుదారులకే ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ ఫలాలు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా అందిస్తున్నామన్నారు. స్పెషల్ సీఎస్ చెప్పిన ప్రతి విషయాన్ని ఆసక్తిగా విన్న వివిధ రాష్ట్రాల అధికారులు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఆర్బీకే విధానం తమ రాష్ట్రాల్లో అమలుకు కృషి చేస్తామని ప్రకటించారు. త్వరలోనే ఏపీలో పర్యటించి క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తామన్నారు. అనంతరం రమేష్ చంద్ మాట్లాడుతూ.. తాను స్వయంగా ఆర్బీకేలను పరిశీలించానని, వాటి సేవలు బాగున్నాయని తెలిపారు. వీటిని తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేయాలన్నారు. ఈ–క్రాప్, ఈ–కేవైసీ సేవలు అద్భుతమని కొనియాడారు. కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రమోద్, ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు పాల్గొన్నారు. ఇదీ చదవండి: బాబు ‘అప్పు’డే లెక్క తప్పారు -
జనగామలో హై టెన్షన్.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
సాక్షి, జనగామ: తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. కాగా, స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా జనగామలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్, బీజేపీ నేతలు రాళ్లు విసురుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వేడి ఇంకా తగ్గలేదు. తాజాగా బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా ప్రచార హోర్డింగ్స్ పెట్టాయి. బండి సంజయ్‌కు సవాల్ విసరురూ టీఆర్ఎస్ నేతలు హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జనగామలో అడుగుపెట్టాలంటే నీతి ఆయోగ్ సిఫారసు నిధులు తేవాలని డిమాండ్ చేశారు. కాగా, రెండు పార్టీల ఫ్లెక్సీలతో అక్కడ టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి: పాతికేళ్ల లక్ష్యాలు ఘనం మరి.. గత హామీల సంగతి?: కేటీఆర్ -
నేతిబీరకాయలో నేతి లాంటిదే.. నీతి ఆయోగ్‌లోని నీతి: మంత్రి కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై.. ప్రధానిని ప్రశ్నించి ఉండాల్సిందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘అయిననూ పోయి రావలె హస్తినకు’అనేది పాత మాట అని ట్వీట్ చేశారు. ‘ఈ కేంద్ర ప్రభుత్వం పక్షపాత, వివక్షాపూరితమైన మనస్తత్వంతో గతంలో నీతి ఆయోగ్ సిఫార్సులను బుట్టదాఖలు చేసింది’అని పేర్కొన్నారు. ‘నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. నీతి ఆయోగ్‌లో నీతి కూడా అంతే’అని వ్యాఖ్యానించారు. అందుకే సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ భేటీని బహిష్కరించారన్నారు. (చదవండి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి ఆత్మహత్య ) “అయినను పోయి రావలె హస్తినకు”అనేది పాత సామెత నాగేశ్వర్ గారు ఈ కేంద్ర ప్రభుత్వం ఒక పక్షపాత, వివక్ష పూరితమైన మనస్తత్వంతో గతంలో నీతి ఆయోగ్ సిఫార్సు బుట్టదాఖలు చేసింది నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందొ నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే That’s why he chose to express dissent by Boycotting https://t.co/9cjppJnT3E — KTR (@KTRTRS) August 8, 2022 -
India@75: ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’
భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1న సరికొత్త వ్యవస్థ ‘నీతి ఆయోగ్’ ఏర్పాటైంది. అంతకు ముందు ఉన్న భారత ప్రణాళికా సంఘం.. కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా 1950 మార్చి 15 న ఏర్పాటైంది. 2014 లో మోడీ తన మొదటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో, ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయాలనే ఉద్దేశ్యాన్ని ప్రకటించారు. తదనుగుణంగా నీతి ఆయోగ్ కు రూపకల్పన జరిగింది. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు ఎం.ఎస్.నారాయణ, ఆర్.కె.లక్ష్మణ్, కేశవరెడ్డి, డి. రామానాయుడు, రాళ్లబండి కవితా ప్రసాద్, నర్రా రాఘవరెడ్డి, షీలా కౌల్ (100), ఎం.ఎస్. విశ్వనాథన్, వి. రామకృష్ణ, ఏడిద నాగేశ్వరరావు, కళ్లు చిదంబరం, కొండవలస లక్ష్మణరావు, రంగనాథ్.. కన్నుమూత. జాతీయోద్యమ కార్యకర్త మదన్ మోహన్ మలావ్యాకు మరణానంతర ‘భారత రత్న’. తొలి ‘ఇంటర్నేషనల్ యోగా డే’ వేడుకలు. గోదావరి పుష్కరాల్లో భక్తుల తొక్కిసలాట (రాజమండ్రి). 29 మంది మృతి. (చదవండి: శతమానం భారతి: లక్ష్యం 2047.. అమృతయాత్ర) -
ప్రధాని మోదీతో లంచ్ లో పాల్గొన్న సీఎం జగన్
-
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించిన సీఎం జగన్
-
NITI Aayog governing council: జీఎస్టీ వసూళ్లు పెరగాలి
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో భారత్ స్వయంసమృద్ధంగా మారడంతో పాటు ప్రపంచ సారథిగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు సాగు, పశుపోషణ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ఆధునీకరించాల్సిన అవసరముందన్నారు. దిగుమతులను బాగా తగ్గించుకుని ఎగుమతులను ఇతోధికంగా పెంచుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ట్రేడ్ (వాణిజ్యం), టూరిజం (పర్యాటకం), టెక్నాలజీ అనే మూడు ‘టి’లపై మరింతగా దృష్టి సారించాల్సిందిగా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. నీతి ఆయోగ్ పాలక మండలి ఏడో సమావేశం ఆదివారం ఢిల్లీలో మోదీ సారథ్యంలో జరిగింది. 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తదితరులు భేటీలో పాల్గొన్నారు. గత రెండేళ్లలో ఇది నీతి ఆయోగ్ తొలి భౌతిక సమావేశం. కరోనా కారణంగా 2021లో భేటీ వర్చువల్‌గా జరిగింది. 4 కీలకాంశాలను పాలక మండలి లోతుగా చర్చించింది. పంట వైవిధ్యం, తృణధాన్యాలు, నూనె గింజలు తదితర వ్యవసాయ దిగుబడుల్లో స్వయంసమృద్ధి, పాఠశాల, ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, పట్టణ పాలన విషయంలో చేపట్టాల్సిన చర్యలపై సభ్యులంతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నీతి ఆయోగ్ భేటీని బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కరోనా నుంచి కోలుకుంటున్న బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సమావేశానికి రాలేదు. రాష్ట్రానికో జీ20 టీమ్ నీతీ ఆయోగ్ పాలక మండలి ఏడో భేటీని జాతీయ ప్రాథమ్యాలను గుర్తించేందుకు కేంద్ర రాష్టాల మధ్య నెలల తరబడి జరిగిన లోతైన మేధోమథనం, సంప్రదింపులకు ఫలితంగా మోదీ అభివర్ణించారు. పలు అంశాల్లో కేంద్ర రాష్ట్రాల నడుమ సహాయ సహకారాలు మరింతగా పెరగాల్సిన అవసరముందన్నారు. భేటీలో చర్చించిన అంశాలు వచ్చే పాతికేళ్లలో జాతి ప్రాథమ్యాలను నిర్ణయించడంలో కీలకంగా మారతాయని వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉన్నా అవి భారీగా పెరగాల్సి ఉందదన్నారు. అందుకు అపారమైన అవకాశాలు కూడా ఉన్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని రాష్ట్రాలకు సూచించారు. అప్పుడే ఆర్థికంగా దేశం మరింత బలపడి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదాలుస్తుందన్నారు. వీలైన ప్రతిచోటా స్థానిక వస్తువులనే వాడేలా ప్రజలను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించారు. వోకల్ ఫర్ లోకల్ అన్నది ఏ ఒక్క పార్టీ అజెండానో కాదని, అందరి ఉమ్మడి లక్ష్యమని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘శరవేగంగా సాగుతున్న పట్టణీకరణను సమస్యగా కాకుండా దేశానికి గొప్ప బలంగా మలచుకోవాల్సి ఉంది. సేవల్లో పారదర్శకత, పౌరులందరి జీవన ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి’’అన్నారు. కరోనాపై పోరాటంలో ప్రతి రాష్ట్రమూ చురుకైన పాత్ర పోషించిందని కొనియాడారు. తద్వారా ఇవాళ వర్ధమాన దేశాలు స్ఫూర్తి కోసం భారత్‌వైపు చూసే పరిస్థితి ఉందని హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తొలిసారిగా ఒక్కచోటికి వచ్చి జాతీయ ప్రాధాన్యమున్న అంశాలపై మూడు రోజుల పాటు చర్చించడం గొప్ప విషయమన్నారు. సంపన్న, వర్ధమాన దేశాలతో కూడిన జీ20కి 2023లో భారత్ సారథ్యం వహించనుండటాన్ని మోదీ ప్రస్తావించారు. దీన్నుంచి గరిష్టంగా లబ్ధి పొందే మార్గాలను సూచించేందుకు ప్రతి రాష్ట్రమూ ఓ జీ20 టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రాలేమన్నాయంటే... వ్యవసాయ రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రాలపై విధానాలను కేంద్రం బలవంతంగా రుద్దొద్దని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం అమలుకు ఒత్తిడి తేవొద్దన్నారు. రాష్ట్రాల డిమాండ్లకు కేంద్రం మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్, కేరళ, రాజస్తాన్ సీఎంలు కోరారు. జార్ఖండ్‌లో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం హేమంత్ సోరెన్ కోరారు. వ్యవసాయ, విద్యా రంగాల్లో మహారాష్ట్రకు కేంద్రం మరింత దన్నుగా నిలవాలని సీఎం ఏక్నాథ్ షిండే విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయడాన్ని మానుకోవాలని కేరళ సీఎం పినరాయి విజయన్ డిమాండ్ చేశారు. రాజ్యాంగం తాలూకు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పోవొద్దన్నారు. విపత్తుల నిర్వహణకు ఒడిశాకు మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు, వాటి ఆందోళనలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలను నీతీ ఆయోగ్ లోతుగా అధ్యయనం చేస్తుందని మోదీ ప్రకటించారు. చిన్న అణు విద్యుత్కేంద్రాలు మేలు ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు పాతబడుతున్న థర్మల్ విద్యుత్కేంద్రాల స్థానంలో చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (ఎస్ఎంఆర్)ను ఏర్పాటు చేసుకోవడంపై కేంద్రం దృష్టి సారించాలని నీతీ ఆయోగ్ సభ్యుడు, శాస్త్రవేత్త వీకే సారస్వత్ సూచించారు. అణు విద్యుత్కేంద్రాల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎస్ఎంఆర్లు 300 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన అధునాతన అణు రియాక్టర్లు. ప్రస్తుతం దేశంలో 6,780 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 22 అణు రియాక్టర్లు పని చేస్తున్నాయి. జాతీయ విద్యా విధానం కింద టీచర్ల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను, అభ్యసన ఫలితాలను మెరుగు పరిచేందుకు చేపట్టిన చర్యలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రగతికి కేంద్రం, రాష్ట్రాలు కలసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం మరింతగా ఉందని నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్సుమన్ బెరీ అన్నారు. కేంద్ర విధానాలను రుద్దొద్దు: రాష్ట్రాలు వ్యవసాయ రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రాలపై విధానాలను కేంద్రం బలవంతంగా రుద్దొద్దని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం అమలుకు ఒత్తిడి తేవొద్దన్నారు. రాష్ట్రాల డిమాండ్లకు కేంద్రం మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్, కేరళ, రాజస్తాన్ సీఎంలు కోరారు. జార్ఖండ్‌లో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం హేమంత్ సోరెన్ కోరారు. వ్యవసాయ, విద్యా రంగాల్లో మహారాష్ట్రకు కేంద్రం మరింత దన్నుగా నిలవాలని సీఎం ఏక్నాథ్ షిండే విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయడాన్ని మానుకోవాలని కేరళ సీఎం పినరాయి విజయన్ డిమాండ్ చేశారు. విపత్తుల నిర్వహణకు ఒడిశాకు మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు, వాటి ఆందోళనలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలను నీతీ ఆయోగ్ లోతుగా అధ్యయనం చేస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. -
ఏపీలో నవశకం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, విద్య, పాలన రంగాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్, ఉచిత పంటల బీమా పథకం, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు, 9 గంటల పాటు ఉచిత విద్యుత్ తదితర పథకాలు తీసుకొచ్చామన్నారు. బడికెళ్లడం, చదువు కోవడం అనేది చిన్నారుల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. తల్లిదండ్రుల పేదరికం పిల్లల చదువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో అమ్మ ఒడి సహా పలు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వివక్ష, అవినీతికి తావు లేకుండా అర్హులైన వారందరికీ పథకాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్ పాలక మండలి ఏడో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పంటల మార్పిడి, నూనె దినుసులు, పప్పు దినుసుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, జాతీయ విద్యా విధానం, పాఠశాల విద్య, ఉన్నత విద్య, పురపాలక పాలనపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, విద్య, పాలనా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించారు. ఇందుకు సంబంధించి ఒక నోట్‌ను కూడా సమర్పించారు. సీఎం ప్రసంగంలోని వివరాలు ఇలా ఉన్నాయి. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన వివిధ రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవసాయానికి అగ్ర స్థానం ► రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రంగా మారింది. 62 శాతం మంది ప్రజలు ఈ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35 శాతం పైనే ఉంది. ఈ రంగం ప్రాముఖ్యత దృష్ట్యా అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ► రైతులకు మరింత అండగా నిలుస్తూ.. వారికి భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యవసాయ అవసరాలకు ఒన్ స్టాప్ సొల్యూషన్ కింద వీటిని ఏర్పాటు చేశాం. నాణ్యమైన, ధ్రువీకరించిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలుస్తున్నాం. ► డిజిటిల్ టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ సీఎం యాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చాం. మొత్తం పంటల కొనుగోలు ప్రక్రియను రోజు వారీగా ఆర్బీకేల స్థాయిలో ఈ యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అవసరమైన పక్షంలో ప్రభుత్వం తరఫున పంటల కొనుగోళ్లు చేస్తూ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ అండగా నిలుస్తున్నాం. ► ఆర్బీకే స్థాయిలోనే ఈ– క్రాప్ బుకింగ్ చేస్తున్నాం. ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వడ్డీ లేని పంట రుణాలు, పంటల కొనుగోలు తదితర వాటిని సమర్థవంతగా అమలు చేయడానికి ఈ–క్రాప్ బుకింగ్ ఎంతగానో దోహద పడుతోంది. ► ఆర్బీకేల్లో కియోస్క్‌లను కూడా అందుబాటులో పెట్టాం. రైతులు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితర వాటిని కియోస్క్‌ల ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు. వారి చెంతకే అవన్నీ చేర వేస్తున్నాం. పంటలకు సంబంధించి రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి, సూచనలు చేయడానికి శాస్త్రవేత్తలతో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం. ► ఆర్బీకే, మండల, జిల్లా స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను ప్రారంభిస్తున్నాం. పంటల మార్పిడి, చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించడం, క్రమంగా సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతుల వైపుగా రైతులను ప్రోత్సహిస్తున్నాం. జీఈఆర్ పెంపే లక్ష్యం ► విద్యా రంగానికి సంబంధించి బడికి వెళ్లడం, చదువు కోవడం అన్నది చిన్నారుల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీన్ని సుస్థిర ప్రగతి లక్ష్యాలతో అనుసంధానం చేశాం. పాఠశాల మానేసే విద్యార్థుల శాతాన్ని పూర్తిగా నివారించడంతోపాటు గ్రాస్ ఎన్ రోల్మెంట్ రేషియో (జీఈఆర్) పెంచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ► ప్రాథమిక విద్యలో దేశ జీఈఆర్ నిష్పత్తి 99.21 శాతం కాగా, ఏపీలో ఇది 84.48 కావడం విచారకరం. 2018లో కేంద్ర విద్యా శాఖ విడుదల చేసిన గణాంకాల్లో విద్యా రంగంలో రాష్ట్రం పనితీరు అత్యంత దారుణంగా ఉందని వెల్లడైంది. అందుకే ఈ రంగంలో కీలక అంశాలపై దృష్టి పెడుతూ సమర్థవంతమైన విధానాలను తీసుకొచ్చాం. ► తల్లిదండ్రుల పేదరికం అన్నది పిల్లల చదువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మ ఒడి అనే పథకాన్ని అమలు చేస్తోంది. పిల్లలను బడికి పంపిస్తే చాలు, ఏటా రూ.15 వేలు చొప్పున పిల్లల తల్లులకు అందిస్తున్నాం. 75 శాతం హాజరు ఉండాలనే నిబంధనను పరిగణనలోకి తీసుకున్నాం. ► పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు తీసుకు వచ్చాం. విద్యా కానుక ద్వారా స్కూలు బ్యాగులు, బై లింగువల్ టెక్టŠస్ బుక్స్, నోట్ పుస్తకాలు, షూ, 3 జతల యూనిఫారం, ఇంగ్లిష్ టు తెలుగు డిక్షనరీలు ఇస్తున్నాం. పిల్లలకు మరింత నాణ్యతతో బోధన అందించడానికి నాణ్యమైన పాఠ్యాంశాలతో ఉన్న బైజూస్ యాప్ కూడా అందిస్తున్నాం. 8వ తరగతి విదార్థులకు ట్యాబ్ కూడా ఇవ్వబోతున్నాం. 55,555 స్కూళ్లలో నాడు–నేడు ► పిల్లలు మంచి వాతావరణంలో విజ్ఞానాన్ని సముపార్జించడానికి మన బడి నాడు – నేడు కింద 55,555 స్కూళ్లలో రూ.17,900 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. నీటి సదుపాయం ఉన్న టాయిలెట్లు, పరిశుభ్రమైన తాగు నీరు, పెయింటింగ్, విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, పిల్లలకు.. టీచర్లకు ఫర్నిచర్, గ్రీ¯Œన్ చాక్ బోర్డులు, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇతరత్రా కావాల్సిన మరమ్మతులు అన్నీ చేపడుతున్నాం. మొత్తం మూడు విడతల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. మొదటి విడత కింద ఇప్పటికే 15,715 స్కూళ్లను తీర్చిదిద్దాం. ఇందులో డిజిటల్ తరగతుల ఏర్పాటు కూడా పూర్తి చేస్తాం. ► ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లిష్ భాషకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పిల్లలకు చక్కటి పునాది వేసే కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా పిల్లలను తీర్చిదిద్దడానికి అన్ని స్కూళ్లను మ్యాపింగ్ చేసి, 3వ తరగతి నుంచే సబ్జెక్టు వారీగా టీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. ► ఉన్నత విద్య స్థాయిలో కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. కేవలం విద్య ద్వారానే పేదిరికం నుంచి బయట పడతారని గట్టిగా విశ్వసిస్తూ విద్యా దీవెన పథకం ద్వారా 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. గత మూడేళ్లలో 21.56 లక్షల మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధిపొందారు. విద్యార్థులు భోజనం, హాస్టల్ ఖర్చు కోసం వసతి దీవెన అమలు చేస్తున్నాం. ► అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో సంప్రదాయ కోర్సులను ఉద్యోగాలు కల్పించేలా తీర్చిదిద్దాం. నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నాం. 1.6 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ముందుకు వచ్చింది. కోవిడ్ కారణంగా తలెత్తిన ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలిస్తున్నాయి. 2018–19లో క్యాంపస్‌ల ద్వారా 37 వేల మందికి ఉద్యోగాలు వస్తే, 2020–21లో 69 వేలు వచ్చాయి. పారదర్శక పాలనతో ప్రజలకు చేరువ ► ప్రజల గడప వద్దకే సేవలందించే విధానాన్ని అమలు చేస్తూ.. చివరి వరకూ అత్యంత పారదర్శకంగా సేవలను అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఇప్పుడు రాష్ట్రంలో పని చేస్తున్నాయి. ► ప్రతి 50–100 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించాం. తద్వారా వారికి ఉపాధితో పాటు.. అవినీతి లేకుండా, పారదర్శకంగా ప్రజలకు సేవలు అందిస్తున్నాం. మరింత సమర్థవంతంగా లక్ష్యాలు సాధించడానికి అధికార వికేంద్రీకరణ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టాం. వివక్ష, అవినీతికి తావులేకుండా అర్హులైన వారందరికీ ఆయా పథకాల ఫలాలు అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కేసీఆర్‌కు నీతి ఆయోగ్ ప్రాధాన్యత తెలియదు
సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ ప్రాధాన్యత తెలియకనే ప్రధాని అధ్యక్షతన జరిగిన భేటీకి సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి, దేశ అభ్యున్నతికి దోహదపడుతున్న నీతి ఆయోగ్‌ను విమర్శించి, కేసీఆర్ తన నైజాన్ని మరో సారి చాటుకున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై రాష్ట్రానికి ఏం కావాలో చెప్పుకునే విజ్ఞత కూడా ముఖ్యమంత్రికి లోపించడం విచారకరమన్నారు. ప్రధాని మోదీని విభేదించే ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌తో పాటు నవీన్ పట్నాయక్ వంటి వారు కూడా సమావేశానికి వచ్చి ఆయా రాష్ట్రాల హక్కులను సాధించుకుంటున్నారని తెలిపా రు. రాష్ట్రాల అభివృద్ధికి సూచనలు, సలహాలు అందించే నీతి ఆయోగ్ సమావేశానికి గైర్హాజరుతో ఆయనకు రాష్ట్ర ప్రజల పట్ల గల చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మతితప్పి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాను తప్ప మంత్రులు, కలెక్టర్లకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వని కేసీఆర్ నీతి ఆయోగ్‌పై విమర్శలు చేయడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. -
‘కేసీఆర్‌ను గద్దె దించే వరకూ వదిలే ప్రసక్తే లేదు’
ఢిల్లీ: నీతి ఆయోగ్‌పై తీవ్ర విమర్శలు చేసి ఆ సమావేశానికి గైర్హాజరీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ రాకపోవడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఏవో సాకులు చెప్పి నీతి ఆయోగ్‌పై బురద జల్లడం సమంజసం కాదని కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘నీతి ఆయోగ్ మీటింగ్‌కు కేసీఆర్ రాకపోవడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. వ్యవస్థల్ని బద్నాం చేయొద్దు. నీతి ఆయోగ్ అవార్డులు వస్తే జబ్బలు చరుచుకున్నరు. తన కొడుకు సీఎం కాలేడనే భయంతో కేంద్రంపై కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ వరుస ఓటములతో ప్రధాని నరేంద్ర మోదీపై విషం కక్కుతున్నరు. దళిత సీఎం ఎక్కడ ? నిరుద్యోగుల భృతి ఎక్కడ ?, ఇళ్ల మంజూరు లో కేంద్రం వెనక్కిపోదు. కేంద్రం తన వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 2015 లో మంజూరు చేసిన ఇల్లు ఇప్పటికీ కట్టలేదు. కేసీఆర్‌ను గద్దె దించే వరకూ వదిలే ప్రసక్తే లేదు. 15 మంత్రిత్వ శాఖలు కేసీఆర్ కుటుంబం చేతుల్లో ఉన్నాయి. కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదు’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
నీతి ఆయోగ్ రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటు: హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధుల ఇచ్చామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపణలు అర్థరహితమంటూ నీతి ఆయోగ్ చేసిన ప్రకటనపై తీవ్రంగా స్పందించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరినా ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. స్మిత సబర్వాల్, ఎర్రబెల్లి దయాకరరావు, కృపాకర్ రెడ్డి.. జల్ జీవన్ మిషన్ కింద నిధులు ఇవ్వాలని అనేక లేఖలు రాశారని గుర్తు చేశారు. బీజేపీకి వంతపాడుతూ నీతి ఆయోగ్ నోట్ రిలీజ్ చేయడం సిగ్గు చేటుగాన్నారు. నీతి ఆయోగ్ రాజకీయ రంగు పులుముకుందని విమర్శించారు. నీతి ఆయోగ్ సీఎం కేసీఆర్ కామెంట్స్‌పై కొద్దీ గంటల్లోనే స్పందించిందని.. అయితే, కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోగా తన విలువను తగ్గించుకుందన్నారు హరీష్ రావు. ‘19వేల కోట్లు ఇవ్వాలని అడిగాం, కానీ స్పందన లేదు. నీతి ఆయోగ్ సిఫార్సులను సైతం కేంద్రం చెత్త బుట్టలో వేసింది. దానికి సమాధానం చెప్పకుండా ఊరికే రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. 3వేల కోట్లు ఇచ్చామని నీతి ఆయోగ్ చెప్తోంది. అందులో తెలంగాణ రెండు వందల కోట్లు మాత్రమే వాడుకుందని తప్పుడు ప్రకటన చేస్తోంది. ఇది ప్రజల్ని పక్కదోవ పట్టించటమే. కాగితాల మీద లెక్కలు చూపుతోంది కేంద్రం కానీ ఆచరణలో నిధులు ఇవ్వట్లేదు.’ అని పేర్కొన్నారు హరీష్ రావు. రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు హరీశ్ రావు. మిషన్ భగీరథకు 24వేల కోట్లు ఇవ్వమని అడిగితె 24 పైసలు ఇవ్వలేదు అని సీఎం చెప్పారని, సీఎం అడిగిన బేఖాతారు చేసిందని విమర్శించారు. శనివారం అర్ధ సత్యాలు, అవాస్తవాలు, రాజకీయ రంగులో ప్రకటన ఇచ్చిందని పేర్కొన్నారు. సహకార సమైక్య స్ఫూర్తి ఎక్కడుంది? అని ప్రశ్నించారు హరీశ్ రావు. ఇదీ చదవండి: నీతి ఆయోగ్ పనికిమాలిందన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. వేగంగా కౌంటర్ ఇచ్చిన నీతి ఆయోగ్ -
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం
-
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్
-
విభజన తర్వాత ఏపీ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రమైంది: సీఎం జగన్
సాక్షి, ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. ప్రత్యామ్నాయ పంటల సాగు, నూనె, పప్పు పంటల సాగులో స్వయం సమృద్ధి, జాతీయ విద్యా విధానం అమలు, పట్టణాభివృద్ధి, వివిధ రంగాల్లో ఆత్మ నిర్భర్ సాధించేందుకు కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం అయ్యిందన్నారు. 62శాతం మంది జనాభా కేవలం వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారని, జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35శాతం పైమాటేనని, వ్యవసాయరంగం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని తాము ఆ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వ్యవసాయరంగంలో ఉన్న రిస్క్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, ఉచిత పంటలబీమా పథకం, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు, 9 గంటలపాటు ఉచితంగా కరెంటు తదితర పథకాలు, కార్యక్రమాలను రైతులను ఆదుకునేందుకు అమలు చేస్తున్నాం. రైతులకు మరింత అండగా నిలవడానికి వారికి భరోసానిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యవసాయ అవసరాలకు ఒన్ స్టాప్ సొల్యూషన్ కింద ఈ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. నాణ్యమైన, ధృవీకరించిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాలద్వారా అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకూ ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలుస్తున్నాం. డిజిటిల్ టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ సీఎంయాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చాం. మొత్తం పంటల కొనుగోలు ప్రక్రియను రోజువారీగా ఆర్బీకేల స్థాయిలో ఈ యాప్‌ద్వారా నిరంతరం పరిశీలన, పర్యవేక్షణ చేస్తున్నాం. అవసరమైన పక్షంలో ప్రభుత్వం తరఫున పంటల కొనుగోళ్లు చేస్తూ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ వారికి అండగా నిలుస్తున్నాం. దీంతోపాటు ఆర్బీకే స్థాయిలోనే ఇ– క్రాప్ బుకింగ్ కూడా చేస్తున్నాం. ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వడ్డీలేని పంట రుణాలు, పంటల కొనుగోలు తదితర వాటిని సమర్థవంతగా అమలు చేయడానికి ఇ–క్రాప్ బుకింగ్ దోహదపడుతోంది. ఆర్బీకేల్లో కియోస్క్‌లను కూడా అందుబాటులో పెట్టాం. రైతులకు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర వాటిని కియోస్క్‌ల ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చు. వారి చెంతకే అవన్నీ కూడా చేరవేస్తున్నాం. పంటలకు సంబంధించి రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి, సూచనలు చేయడానికి శాస్త్రవేత్తలతో ఇంటిగ్రేటెడ్ కాల్‌సెంటర్‌నుకూడా ఏర్పాటు చేశాం. అంతేకాకుండా ఆర్బీకేల స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లాల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లనుకూడా ప్రారంభిస్తున్నాం. పంటల మార్పిడి, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం, క్రమంగా సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులవైపుగా రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఇక విద్యా రంగం విషయానికొస్తే బడికెళ్లడం, చదువుకోవడం అన్నది చిన్నారుల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీన్ని సుస్థిర ప్రగతి లక్ష్యాలతో అనుసంధానం చేశాం. స్కూళ్లుమానేసే విద్యార్థుల శాతాన్ని పూర్తిగా నివారించడంతోపాటు జీఈఆర్ నిష్పత్తిని పెంచేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రాథమిక విద్యలో దేశ జీఈఆర్ నిష్పత్తి 99.21 శాతంకాగా, ఏపీలో ఇది 84.48 కావడం విచారకరం. 2018లో కేంద్ర విద్యాశాఖ విడుదలచేసిన గణాంకాల్లో విద్యారంగంలో రాష్ట్రం పనితీరు అత్యంత దారుణంగా ఉందని వెల్లడైంది. అందుకే విద్యారంగంలో కీలక అంశాలపై దృష్టిపెడుతూ సమర్థవంతమైన విధానాలను తీసుకు వచ్చాం. తల్లిదండ్రుల పేదరికం అన్నది పిల్లల చదువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మ ఒడి అనే పథకాన్ని అమలు చేస్తోంది. పిల్లలను బడికి పంపిస్తే చాలు, ఏటా రూ.15వేల రూపాయల చొప్పున పిల్లల తల్లులకు అందిస్తోంది. 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను కూడా పరిగణలోకి తీసుకున్నాం. అంతేకాదు పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు తీసుకు వచ్చాం. విద్యాకానుక ద్వారా స్కూలు బ్యాగులు, బై లింగువల్ టెక్ట్స్‌బుక్స్, నోట్ పుస్తకాలు, షూ, 3 జతల యూనిఫారం, ఇంగ్లిషు టు తెలుగు డిక్షనరీలు ఇస్తున్నాం. పిల్లలకు మరింత నాణ్యతతో బోధన అందించడానికి నాణ్యమైన పాఠ్యాంశాలతో ఉన్న బైజూస్ యాప్‌కూడా అందిస్తున్నాం. 8 వ తరగతి విదార్థులకు ట్యాబ్ కూడా ఇవ్వబోతున్నాం. పిల్లలు మంచి వాతావరణంలో విజ్ఞానాన్ని సముపార్జించడానికి మన బడి నాడు – నేడు కింద 55,555 స్కూళ్లలో రూ.17,900 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. నీటి సదుపాయం ఉన్న టాయిలెట్లు, పరిశుభ్రమైన తాగునీరు, పెయింటింగ్, విద్యుద్దీకరణ, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, పిల్లలకు, టీచర్లకు ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, ఇంగ్లిషు ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదులు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, కావాల్సిన మరమ్మతులు అన్నీ చేపడుతున్నాం. మొత్తం మూడు విడతల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తాం. మొదటి విడత కింద ఇప్పటికే 15,715 స్కూళ్లను తీర్చిదిద్దాం. ఇందులో డిజిటల్ తరగతుల ఏర్పాటు కూడా పూర్తిచేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిషు భాషకున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పిల్లలకు చక్కటి పునాది వేసే కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కొనేలా పిల్లలను తీర్చిదిద్దడానికి అన్ని స్కూళ్లను మ్యాపింగ్ చేసి సబ్జెక్టు వారీగా టీచర్లను 3వ తరగతి నుంచే అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఉన్నత విద్యా స్థాయిలో కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. కేవలం విద్య ద్వారానే పేదిరికం నుంచి బయటపడతారని గట్టిగా విశ్వసిస్తూ విద్యాదీవెన పథకం ద్వారా 100శాతం ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నాం. గత మూడేళ్లలో 21.56 లక్షల మంది విద్యార్థులు దీనిద్వారా లబ్ధిపొందారు. విద్యార్థులు భోజనం, హాస్టల్ ఖర్చుకోసం వసతి దీవెన అమలు చేస్తున్నాం. ఇక అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో సంప్రదాయ కోర్సులను ఉద్యోగాలు కల్పించేలా తీర్చిదద్దాం. నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నాం. 1.6 లక్షలమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ముందుకు వచ్చింది. కోవిడ్ కారణంగా తలెత్తిన ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. 2018–19లో క్యాంపస్‌ల ద్వారా 37వేలమందికి ఉద్యోగాలు వస్తే, 2020–21లో 69వేలు వచ్చాయి. పౌరుల గడపవద్దకే సేవలందించే విధానాన్ని అమలు చేస్తూ.. చివరి వరకూ అత్యంత పారదర్శకంగా సేవలను అందిస్తున్నాం. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఇప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ప్రతి 50–100 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను కూడా నియమించాం. దీనివల్ల ఉపాధి కల్పించడమేకాదు, అవినీతి లేకుండా, పారదర్శకంగా సేవలను ప్రజలకు అందిస్తున్నాం. మరింత సమర్థవంతంగా లక్ష్యాలు సాధించడానికి అధికార వికేంద్రీకరణ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాం. వివక్షకు, అవినీతికి తావులేకుండా అర్హులైన వారి అందరికీ అన్ని అందాలన్నదే లక్ష్యం. దీనికి సంబంధించి ఒక నోట్‌ను కూడా సమర్పించిన సీఎం జగన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఏపీ వైపు ఐటీ దిగ్గజాల చూపు.. -
నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: కేసీఆర్
-
ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా హాజరుకానున్న అన్ని రాష్ట్రల సీఎంలు
-
మోదీని ఎదుర్కోలేకే ‘నీతి ఆయోగ్’కు ఎగనామం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే ముఖం లేకే సీఎం కేసీఆర్ ఆదివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. సమావేశానికి వెళ్లకుండా ఏవో కారణాలు చెపుతున్నారని విమ ర్శించారు. ఎనిమిదేళ్ల పాలనలో ఏనాడు కేంద్రంలో అధికారిక మీటింగ్‌లకు వెళ్లేందుకు ఆసక్తి చూపని కేసీఆర్, తన రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ పార్టీలతో సమావేశాల కోసమో.. లేదంటే డాక్టర్ల వద్ద చికిత్స కోసమో మాత్రమే ఢిల్లీ వెళ్లారని శనివారం సంజయ్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం చర్చించేందుకు ఏనాడైనా ఢిల్లీ వెళ్లారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కోరినంత డబ్బులు ఇస్తే నీతి ఆయోగ్ మంచిది.. లేదంటే మంచిది కాదా అని నిలదీశారు. కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే.. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై అందులోనే మాట్లాడవచ్చు కదా? అని ప్రశ్నించారు. గత ఏడాది కేంద్రం రూ.5 వేల కోట్లు కూడా ఇవ్వలేదని చెబుతున్న కేసీఆర్, 5 రోజులు ఢిల్లీలో ఉండి కేంద్రాన్ని బెదిరించి రూ.10 వేలు కోట్లు అప్పు సాధించానని చెబుతున్నారని, మరి కేంద్రం నిజంగా డబ్బులివ్వకపోతే ఏడాది నుంచి ఏం చేసినట్లని ప్రశ్నించారు. గత ఏడాది కేంద్రం రూ.5 వేల కోట్ల కంటే ఎక్కువ ఇచ్చినట్లు రుజువు చేస్తే అసెంబ్లీ ముందు కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా? అని నిలదీశారు. నీతి ఆయోగ్ అద్భుతమని నిన్నటిదాకా పొగిడిన కేసీఆర్‌కు నేడు ఆ సంస్థ చేదైందని అన్నారు. సుప్రీం వ్యాఖ్యలతో కేంద్రానికేం సంబంధం ఓట్ల కోసం ఉచితాలను ఇస్తూ ఆర్థిక వ్యవస్థ ను ఛిన్నాభిన్నం చేయడం వల్ల శ్రీలంక వంటి పరిస్థితి వస్తుందని, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని సుప్రీంకోర్టు చేసిన వ్యా ఖ్యలతో కేంద్రానికి ఏం సంబంధం అని సంజయ్ ప్రశ్నించారు. సుప్రీం సూచనను కేంద్రానికి అంట గట్టడం కేసీఆర్ అవివేకానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. దేశంలో కంపెనీల ఎన్పీఏల గురించి మాట్లాడే ముందు హైదరాబాద్‌లో వేల పరిశ్రమలు ఎందుకు మూతపడ్డాయో కేసీఆర్ సమాధానం చెప్పా లని నిలదీశారు. బతుకమ్మ చీరలు కూడా హైదరాబాద్‌లో తయారు చేయించడం చేతగాక సూరత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు రైతు చట్టాలను విమర్శిస్తున్న కేసీఆర్.. ఆనాడు ఎందుకు సమర్థించారో సమాధానం చెప్పా లని సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్మలకు కారకుడైన కేసీఆర్ కేంద్రాన్ని విమర్శించడం సిగ్గుచేట న్నారు. కేసీఆర్ తనకు ఇష్టమొచ్చినట్టు అన్నింటినీ బహిష్కరిస్తున్నారని, తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్‌ను బహిష్కరించే రో జులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. చదవండి: 34 ఏళ్లు పనిచేసినా హోంగార్డు.. ఎస్పీ అవుతాడా? -
ఢిల్లీ చేరుకున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం ఉదయం 09.30 గంటలకు ఆయన రాష్ట్రపతి భవన్ చేరుకొని సాయంత్రం 4.30 గంటల వరకు జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి 7వ సమావేశంలో పాల్గొననున్నారు. ఢిల్లీ చేరుకున్న సీఎంకు ఎయిర్‌పోర్టులో వైఎస్సార్సీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన అధికార నివాసం 1, జనపథ్‌కు చేరుకుని, అక్కడే బస చేశారు. ఇది కూడా చదవండి: 11న బాపట్లకు సీఎం వైఎస్ జగన్ -
మోదీ నాకు మిత్రుడే.. బిగ్ బాంబ్ పేల్చిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ నేతృత్వంలో ఆదివారం ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నీతి ఆయోగ్ నిరర్థక సంస్థగా మారిపోయిందని.. దాని సిఫార్సులకు విలువ, గౌరవం లేకుండా పోయిందని మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో దేశం పరిస్థితి దారుణంగా తయారైందని ఆరోపించారు. నీతి ఆయోగ్‌తో సహకార సమాఖ్య స్ఫూర్తిని తెస్తామన్నారని, కానీ అదొక జోక్‌గా మిగిలిపోయిందని విమర్శించారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం బాధాకరమే అయినా.. ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలపడానికి ఇది ఉత్తమ మార్గమని భావిస్తున్నట్టు చెప్పారు. తన నిరసనను ప్రధాని మోదీకి స్వయంగా బహిరంగ లేఖ ద్వారా తెలియజేస్తున్నట్టు ప్రకటించారు. సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, నీతి ఆయోగ్ వైఫల్యాలపై మండిపడ్డారు. కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ఎన్నడూ లేనంత అధ్వానంగా మారింది ‘‘కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామంటే.. పెరిగిన డీజిల్, విత్తనాలు, ఎరువుల ధరలతో వారి పెట్టుబడి ఖర్చు రెట్టింపైంది. దేశంలో మంచి నీళ్లూ సరిగా దొరకని పరిస్థితి. పని చేసుకుందామంటే ఉద్యోగం దొరకదు. ప్రభుత్వ రంగ సంస్థలను మూసేస్తూ.. ఉద్యోగులను రోడ్డు మీద పడేస్తున్నారు. చివరికి ఉపాధి హామీ కూలీలు కూడా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. 28శాతం జీఎస్టీతో బీడీ కారి్మకుల నోట్లో మట్టికొట్టే పరిస్థితి. నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణం అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. జీడీపీ పతనమైంది. చరిత్రలో ఎన్నడూ లేనంత అధ్వానంగా రూపాయి పాతాళానికి పడిపోతూ ఉంది. ఇక నీతి ఆయోగ్ ఏం సాధించినట్టు? అంతా జోక్‌గా మారింది 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దేశాన్ని సమూలంగా మార్చేస్తామంటూ.. ప్రణాళికా సంఘానికి ప్రత్యామ్నాయంగా నీతి ఆయోగ్‌ను సృష్టించారు. సహకార సమాఖ్య స్ఫూర్తి తెస్తామన్నారు. సీఎంలకు సభ్యత్వంఇస్తున్నాం. దీన్ని టీమ్ ఇండియా అంటాం అని ప్రధాన మంత్రి చెప్పారు. దేశానికి మంచి రోజులు వచ్చాయని అనుకున్నాను. చాలా ఆశించా. దురదృష్టవశాత్తు ఏమీ జరగలేదు. ఎనిమిదేళ్ల తర్వాత చూసుకుంటే.. ప్రధాని మోదీ, బీజేపీ వాగ్దానాలు, నీతి ఆయోగ్ సృష్టి, వీటన్నింటి ఆచరణ పెద్ద జోక్‌లా మిగిలిపోయింది. దేశం అన్ని రంగాల్లో దెబ్బతింటోందని, అంతర్జాతీయ విపణిలో దేశం పరువు పోతోందని ఆర్థికవేత్తలు మొత్తుకుంటున్నారు. ఆదర్శమన్నా.. చేసింది సున్నా.. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని.. మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.19వేల కోట్లు కలిపి రూ.24 వేల కోట్లను తెలంగాణకు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఐదున్నరేళ్లు గడిచినా 24 పైసలు కూడా ఇవ్వలేదు. నీతి ఆయోగ్ సిఫార్సులు బుట్టదాఖలైతే దానికి విలువ ఏమిటి? లోతుగా అధ్యయనం చేయడానికి నీతి ఆయోగ్‌ను ఉప సంఘాలు వేయాలని కోరితే ఆ ప్రయత్నం జరగలేదు. ఓ బృందం వేస్తే సమావేశానికి వెళ్లి విలువైన సలహాలు ఇచ్చా. విశాలమైన దేశంలో భిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు ప్రత్యేక పథకాలు చేపట్టేందుకు కేంద్ర నిధులను నేరుగా రాష్ట్రాలకే ఇవ్వాలని కోరాను. ప్రతిపాదన బాగుంది, ఆచరిస్తామని ప్రధాని అన్నారు. కానీ చేసింది సున్నా. నడి వీధుల్లో కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు.. వాళ్లు చెప్పిందే చేయాలి. లేకుంటే మీ కథేంటో చూస్తామనే పరిస్థితి వచి్చంది. సహకార సమాఖ్య స్ఫూర్తి పోయింది. నియంతృత్వం వచ్చింది. చివరికి పరిస్థితి ఎక్కడిదాకా వచి్చందంటే.. సీఎంలే బుల్డోజర్లు పెట్టి ఇళ్లనుకూలగొడతాం అంటున్నారు. కొందరు కూలగొడుతున్నారు కూడా. రాష్ట్రాల్లో మంత్రులుగా ఉండే వాళ్లు ఎన్కౌంటర్లు చేయడానికి వెనుకాడం అని మాట్లాడే పరిస్థితి. గత హనుమాన్ జయంతినాడు భగవంతుడి పేరుతో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఉత్సవాల్లో కత్తులు, కటార్లు, గదలు పట్టుకుని తిరిగేటటువంటి పరిస్థితి. ఢిల్లీ నగర వీధుల్లో పట్టపగలు కత్తులు పట్టుకుని స్వైర విహారం చేస్తున్నారు. అంతులేకుండా విద్వేషం, ద్వేషం, అసహనం పెంచుతున్నారు. ఇదేనా కేంద్ర ప్రభుత్వం ఈ దేశానికి ఇచ్చే సందేశం? ఇది దోపిడీ స్ఫూర్తి.. నీతి ఆయోగ్ ఎజెండా రూపకల్పనలో సమాఖ్య స్ఫూర్తి ఏమైంది? కాకి ఎత్తుకుపోయిందా? ఎజెండా రూపకల్పన ఎక్కడ, ఎవరు చేస్తారో తెలియదు. ఈసారి ప్రధాన సమస్యలైన ధరలు, ద్రవ్యోల్బణంపై ఏం చేద్దామనే ముచ్చటే లేదు. కొన్నిరకాల పన్నుల్లో రాష్ట్రాలకు వాటా అనేది రాజ్యాంగ బద్ధమైన హక్కు. నీతి ఆయోగ్ సృజన, ప్రధాని మోదీ మేధో సంపత్తితో రాష్ట్రాల వాటాను ఎగ్గొట్టడానికి పన్నులకు సెస్సులుగా పేరుపెట్టి.. ఇప్పటివరకు రూ.13– 14 లక్షల కోట్ల మేర రాష్ట్రాల వాటాలను ఎగ్గొట్టారు. ఇదే నా సహకార సమాఖ్య స్ఫూర్తి? ఇది దోపిడీ స్పూర్తి. టీమ్ ఇండియా చేసే పని ఇదేనా? నీతి ఆయోగ్ మీటింగ్‌లో దీనిపై చర్చకు ఆస్కారం ఉంటుందా? సీఎం స్థాయి వ్యక్తి కూడా ఇన్ని నిమిషాలే మాట్లాడాలని టైమ్ పెట్టి.. ఎవరైనా రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడితే బెల్లు కొడుతుంటారు. నవ్వుతుంటారు. నీతి ఆయోగ్‌లో నాలుగు నిమిషాలు మాట్లాడి నాలుగు గంటలు పల్లీలు తింటూ ఉండాలా?. మోదీ నాకు మిత్రుడే అయినా.. ప్రధాని మోదీ నాకు మిత్రుడే అయినా దేశ ప్రయోజనాల కోసం ప్రజల తరఫున గొంతెత్తుతా. మోదీ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రాణం ఉన్నంత వరకు బాధ్యత కలిగిన పౌరుడిగా పోరాడుతాం. కలిసొచ్చే వారితో భవిష్యత్తులో బలీయమైన ఉద్యమాలు చేస్తాం. రాష్ట్రానికి శూన్య హస్తమే.. కేంద్ర నిర్ణయాలు రాష్ట్రాల ప్రగతిని దెబ్బతీస్తున్నాయి. మీ భగీరథ బాగుంది, అది బాగుంది ఇది బాగుంది అనడమే తప్ప ఇచ్చిందేమీ లేదు. అంతా శుష్క ప్రియాలు శూన్య హస్తాలు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం రూ.1.90 లక్షల కోట్లు ఖర్చు చేస్తే అందులో కేంద్రం నుంచి వచ్చినవి కేవలం రూ.5 వేల కోట్లు. అయినా ఇక్కడి ఆ పార్టీ (బీజేపీ) నేతలు దుర్మార్గ ప్రచారం చేస్తారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల విషయంలోనూ కేంద్ర వైఖరి బయట పడుతోంది. తెలంగాణకు రావాల్సిన రూ.6 వేలకోట్లలో నయాపైసా ఇవ్వలేదు. పైగా రూ.3,200 కోట్ల జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఇవన్నీ నీతి ఆయోగ్ భేటీలో ప్రస్తావిస్తే కంఠ శోష మిగులుతోంది. ఇది హిరణ్య కశ్యపుడి లాగానే.. దేశంలో ఏకస్వామ్య పార్టీ పాలన ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా బహిరంగంగా చెప్తున్నారు. అది దేశ భవిష్యత్తుకు మంచిదికాదు. హిరణ్య కశ్యపుడు కూడా తనకు దేవుడు మొక్కాలంటే ఫలితం ఏమైందో తెలుసు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, రాజ్యాంగ సంస్థలను నాశనం చేసి జేబు సంస్థల్లా వాడుకుంటే.. రేపు అవే మిమ్మల్ని కబళిస్తాయి. క్రియకు ప్రతిక్రియ తప్పనిసరిగా ఉంటుంది. బెంగాల్, తమిళనాడు, తెలంగాణ.. ఇలా ఎక్కడికక్కడ ఏక్నాథ్ షిండేలను సృష్టిస్తామని స్థానిక బీజేపీ నేతలు అహంకార పూరిత ప్రకటనలు చేస్తున్నారు. నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తే ప్రధాని తన బుద్ధి మార్చుకుని దేశానికి మంచి చేస్తారని, కేంద్రం పనితీరులో పరివర్తన వస్తుందని భావిస్తున్నా. ఎన్పీఏల వెనుక లక్షల కోట్ల కుంభకోణం వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటివి ఉచిత పథకాలా? అవి మంచివి కాదంటారా? మరి నిరర్థక ఆస్తులకు (ఎన్పీఏ) ఎందుకు ఉద్దీపన ప్యాకేజీలు ఇస్తున్నారు? 2004–05లో రూ.58వేల కోట్లుగా ఉన్న ఎన్పీఏల విలువ.. 2014 నాటికి రూ.2.63 లక్షల కోట్లకు చేరితే, ఎన్డీయే పాలనలో ఇప్పుడు పదింతలు పెరిగి రూ.20.07 లక్షల కోట్లకు చేరాయి. ఎన్పీఏలు పెరగడం వెనుక ఉన్న లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలపై కేంద్రం సమాధానం ఇవ్వాలి. చైనా నుంచి దిగుమతులే మేకిన్ ఇండియానా? మాంజా, దీపావళి దీపాంతలు, టపాసులు, నెయిల్ కట్టర్లు, మొబైల్ ఫోన్లు, పీపీఈ కిట్లు, జాతీయ పతాకాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవడమే మేకిన్ ఇండియానా? పెట్టుబడిదారులు లక్షల కోట్లు ఉపసంహరించుకుని దేశం దాటి వెళ్తున్నారు. గతంలో బ్రెయిన్ డ్రెయిన్.. ఇప్పుడు క్యాపిటల్ డ్రెయిన్.. విదేశీ మారక నిల్వలు హరించుకుపోతున్నాయి. అప్పుడు 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణమంటూ గగ్గోలు పెట్టి.. ఇప్పుడు 5జీ స్పెక్ర్టమ్లో రూ.5 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేసుకుంటే.. రూ.1.50 లక్షల కోట్లు రావడాన్ని ఎలా సమరి్థంచుకుంటారు? ఎయిర్‌పోర్టులు, రైల్వేలు, వ్యవసాయ మార్కెట్లను ప్రైవేటు పరం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాలు ఇస్తున్నాయంటూ.. కార్పోరేట్లకు మాత్రం లక్షల కోట్ల రూపాయలు పంచుతున్నారు. అప్పుల్లో కోతలు దుర్మార్గం మోదీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల అప్పులను సాకుగా చూపుతూ రూ.53 వేల కోట్లుగా ఉన్న తెలంగాణ అప్పుల పరిమితిలో రూ.25వేల కోట్ల మేర కోత విధించింది. బలమైన రాష్ట్రాలతోనే బలమైన కేంద్రం సాధ్యమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని.. అల్పాదాయ వర్గాలపై విధించిన జీఎస్టీని తగ్గించాలి. ఎఫఆర్బీఎం ఆంక్షలను తొలగించాలి. 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు.. – స్వాతంత్య్ర వజ్రోత్సవాల కానుకలు ప్రకటించిన కేసీఆర్ రాజ్యాంగం భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగా పేర్కొందని.. నిరుపేదలు, విధి వంచితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల కానుకగా 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వనున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి కొత్తగా 10లక్షల మందికి ప్రతినెలా రూ.2,016 చొప్పున పెన్షన్ ఇస్తామని తెలిపారు. దీనిపై గతంలోనే హామీ ఇచ్చినా ఆర్థిక మాంద్యం, కరోనా, కేంద్రసాయం లేకపోవడంతో జాప్యం జరిగిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని కేటగిరీలు కలిపి 36 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని, కొత్తగా ఇచ్చేవి కలిపి లబ్ధిదారుల సంఖ్య 46 లక్షలకు చేరుతుందని చెప్పారు. పాత, కొత్త అనే తేడా లేకుండా అందరికీ బార్ కోడ్‌తో కూడిన కొత్త కార్డులు జారీ చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో 15 రోజుల పాటు పంపిణీ చేస్తారని తెలిపారు. – రాష్ట్రంలో 10వేల మందికిపైగా డయాలసిస్ రోగులకు కూడా ఆసరా పెన్షన్లు ఇవ్వనున్నట్టు కేసీఆర్ తెలిపారు. – స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తవడానికి సూచికగా సత్ప్రవర్తన గల 75 మంది జీవిత ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించామన్నారు. – అనాథ పిల్లలను స్టేట్ చిల్డ్రన్‌గా గుర్తించడంతోపాటు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా కల్పిస్తామన్నారు. అనాథ శరణాలయాలకు నిధులు పెంచుతామన్నారు. ఇది కూడా చదవండి: మానవతామూర్తి సీఎం కేసీఆర్: హరీశ్‌రావు -
నీతి ఆయోగ్ సమావేశాల బహిష్కరణ హాస్యాస్పదం
సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లే ముఖంలేక, సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. నీతి ఆయోగ్ సమావేశంలో 4 గంటలు కూర్చోబెట్టి, 4 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తారనడం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? అని అరుణ ప్రశ్నించారు. రాష్ట్రంలో 57 ఏళ్లు వయసు నిండిన 10 లక్షల మందికి కొత్తగా నెలకు రూ.2,016 పెన్షన్ ఇవ్వనున్నట్లు సీఎం గప్పాలు కొడుతున్నారని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నాలుగేళ్లుగా అమలు చేయకుండా, ఇప్పుడు ఉపఎన్నికలు వస్తాయన్న భయంతో ప్రకటించారన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ రావడం లేదని, ప్రభుత్వ సిబ్బందికి ప్రతి నెలా 15 తర్వాత జీతం ఇస్తున్నారని అరుణ ధ్వజమెత్తార -
కేసీఆర్ చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశాన్ని బహిష్కరించడం ద్వారా తెలంగాణ ప్రజలకు నష్టమే తప్ప ఒనగూరేదేమీ ఉండదన్నారు. ఈమేరకు శనివారం లక్ష్మణ్ మీడియా ప్రకటన విడుదల చేశారు. నీతిఆయోగ్ ద్వారా ముఖ్యమంత్రుల గౌరవాన్ని పెంచి టీం ఇండియా స్ఫూర్తిని చాటిన ప్రధాని నరేంద్రమోదీపై రాజకీయ లబ్ధి కోసం అవాకులు చెవాకులు పేలడం కేసీఆర్ కుసంస్కారానికి నిదర్శనమని మండిపడ్డారు. కేసీఆర్ మాట్లాడినవన్నీ అబద్ధాలు, అర్ధ సత్యాలేనని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్రంపై బురద చల్లి రాజకీయ లబ్ధి పొందేందుకు చేసిన కుట్రగానే భావిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు. ప్రజాక్షేత్రంలోనే కేసీఆర్ బండారాన్ని బయటపెడతామని లక్ష్మణ్ హెచ్చరించారు. -
తెలంగాణ సీఎం ఆరోపణలు అర్థరహితం: నీతి ఆయోగ్
సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తూ.. సంచలన ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. నీతి ఆయోగ్ ఒక పనికి మాలిందని, నీతి ఆయోగ్ సమావేశాలు భజన బృందంగా మారిందంటూ తీవ్ర ఆరోపణలే చేశారాయన. ఈ క్రమంలో కేసీఆర్ ఆరోపణలు చేసిన కాసేపటికే నీతి ఆయోగ్ తీవ్రంగా స్పందించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఆరోపణలు అర్థరహితం. సమాఖ్య స్ఫూర్తి బలోపేతం కోసమే ఈ సంస్థ ఏర్పాటు. గడిచిన ఏడాదిలోనే సీఎంలతో ముప్ఫై సమావేశాలు నిర్వహించాం. నీతిఆయోగ్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో గతేడాది జనవరి 21న రాష్ట్రాభివృద్ధి అంశాలపై తెలంగాణ సీఎంతో భేటీ అయ్యాం. పలుమార్లు సమావేశం కోసం ప్రతిపాదించినా.. తెలంగాణ సీఎం స్పందించలేదు. రేపటి సమావేశానికి ఆయన హాజరుకావొద్దన్న నిర్ణయం దురదృష్టకరం. రాష్ట్రాలకు ఎజెండా తయారీలో నీతి ఆయోగ్ సహకరించడం లేదన్న ఆరోపణలు సరికాదు. కేంద్రం రాష్ట్రాలకు ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరిస్తుంది. 2015-16లో రూ. 2 లక్షల 3 వేల 740 కోట్లు.. 2022-23 ఏడాదికి రూ.4 లక్షల 42 వేల 781 కోట్లకు చేరింది. జల్‌జీవన్ మిషన్ కింద తెలంగాణకు రూ.3,982 కోట్లు కేటాయింపు జరిగింది. కానీ, తెలంగాణ కేవలం రూ.200 కోట్లు మాత్రమే వినియోగించుకుంది. పీఎంకేఎస్‌వై-ఏబీపీ స్కీం కింద రూ.1,195 కోట్లు విడుదల అయ్యాయి అని గణాంకాలతో సహా సీఎం కేసీఆర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ అనేది దేశంలోని అత్యున్నత రాజకీయ నాయకత్వం ఉండే వేదిక. రాష్ట్ర స్థాయిలలో కీలకమైన అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై చర్చించి, జాతీయ అభివృద్ధికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే వేదిక. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని తయారు చేయాలనే ఉద్దేశ్యంతో స్పూర్తితో నీతి ఆయోగ్ ఒక సంస్థగా ఏర్పాటు చేయబడింది. రాష్ట్రాలతో సన్నిహితంగా పని చేసేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టాం అని ప్రకటించుకుంది.. ఇదీ చదవండి: నీతి ఆయోగ్ తెలంగాణను మెచ్చుకుంది కూడా-సీఎం కేసీఆర్ -
మోదీకి సీఎం కేసీఆర్ ఏకలవ్య శిష్యుడు: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ మీటింగ్‌ను కేసీఆర్ బహిష్కరించడం ఎందుకని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ వెళ్తే ప్రధానిని ముఖాముఖిగా ప్రశ్నించే అవకాశం ఉండేది కదా అని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడుతారని భావించినట్లు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో శనివారం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి, కేసీఆర్‌కు చీకటి ఒప్పందం ఉందని విమర్శించారు. జీఎస్టీ బిల్లు తెచ్చినప్పుడు మోదీని కేసీఆర్ పొగిడారని రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. ఏడున్నరేళ్లుగా కేసీఆర్.. మోదీతో కలిసి నడిచారని గుర్తు చేశారు. కేసీఆర్ మాటలు వ్యతిరేకంగా కనిపిస్తున్నా.. చర్యలు మోదీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. మోదీకి కేసీఆర్ ఏకలవ్య శిష్యుడని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ‘కేంద్రంలో ఈడీలాగే, ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ను తన వ్యతిరేకులపై కేసీఆర్ ప్రయోగిస్తున్నారు. తెలంగాణలో దర్యాప్తు నిఘా వ్యవస్థలను ప్రతిపక్షాల్ని టార్గెట్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. నీతి ఆయోగ్ మీటింగ్‌కు స్వయంగా కేసీఆర్ హాజరు కావాలి. ప్రధానిని నిలదీయడానికి వచ్చిన ఛాన్స్‌ను ఉపయోగించుకోవాలి. చదవండి: ప్రధానికి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా: సీఎం కేసీఆర్ పార్టీ మారుతున్న వాళ్లపై కొన్నిప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. బీజేపీ ఇంకొంత మంది కోవర్టులను తయారు చేయవచ్చు. కండువా కప్పుకున్నాక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. స్థాయి లేకపోయినా వేదికపై కాలుమీద కాలువేసుకొని కూర్చుంటారు. పీసీసీ చీఫ్‌గా నాకే చాలాసార్లుకుర్చీ ఇవ్వరు.. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉంటుంది. రాజకీయాల్లో సందర్భాలు, పదవులు మారుతాయి.’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
నా నిరసనపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి: సీఎం కేసీఆర్
-
నీతి ఆయోగ్ భజన బృందంగా మారిపోయింది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్‌లో మేథోమథనం జరగడం లేదని, భజన బృందంగా మారిందని సీఎం కేసీఆర్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ప్లానింగ్ కమిషన్‌ను తీసేసి నీతి ఆయోగ్ తీసుకొచ్చి ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఏ హామీ నెరవేరడం లేదని అన్నారు. 8 ఏళ్ల నీతి ఆయోగ్ సాధించింది ఏం లేదని విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేవంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రాల అభివృద్ధిని కేంద్రమే అడ్డుకుంటోందని మండిపడ్డారు. కేంద్రం డిక్టేటరిజం పెరిగిపోయిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. నీతి ఆయోగ్‌లో కో-ఆపరేటివ్ ఫెడరలిజం లేదని అన్నారు. అన్ని రంగాల్లో దేశం వెనకబడిపోయిందని అన్నారు. దేశ భవిష్యత్తు రోజురోజుకు ప్రమాదంలో పడుతోందన్నారు. కూర్చున్న కొమ్మను తామే నరుకున్నట్లు కేంద్రం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను పట్టించుకోలేదని,. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సమస్య పరిష్కారానికి కృషి చేశామని గుర్తు చేశారు. కేంద్రం అవార్డులు, నీతి ఆయోగ్ ప్రశంసలన్నీ అందుకున్నా.. నిధుల విషయంలో రాష్ట్రంపై చిన్నచూపు చూపిస్తున్నారని ప్రస్తావించారు. చదవండి: నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: సీఎం కేసీఆర్ ‘ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ఫెడరల్ స్ఫూర్తి పోయి మేము ఏం చెబితే అది చేయాలనే వరకు పరిస్థితి వచ్చింది. మేము చెప్పింది చేయకపోతే.. మీ కథ చూస్తామని హెచ్చరిస్తున్నారు. ట్యాక్సులకు సెస్‌లనే పేరు మార్చి రాష్ట్రాల నిధులను కేంద్ర కొల్లగొడుతుంది. సీఎం స్థాయి వ్యక్తికి కూడా టైమ్ పెట్టి అయిపోగానే బెల్ కొడుతుంటారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాలకు కాళ్లు అడ్డం పెట్టకుండా ప్రోత్సహించాలని కోరాను. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు 24 ఏల కోట్లు ఇవ్వమంటే 24 పైసలు కూడా ఇవ్వలేదు. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు నిధులు ఇవ్వనప్పుడు ఇంక ఆ సంస్థ ఎందుకు’ అంటూ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌పై సీఎం కేసీఆర్ ద్వజమెత్తారు. -
నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ ద్వారా తన నిరసన తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథకు రూ.19,500 కోట్లు గ్రాంట్, మిషన్ కాకతీయకు రూ. 5 వేల కోట్లు గ్రాండ్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందన్నారు. CM Telangana KCR, penning letter to PM Modi for not joining 7th governing council meeting of NITI Aayog, has expressed anguish against center, for states not being given "flexibility to design & modify schemes based on their needs & conditions to ensure maximum benefit to people" pic.twitter.com/jz3XQI8Wdb — ANI (@ANI) August 6, 2022 అయితే నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్ర పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పూర్తయినా నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిధుల కేటాయింపు విషయంలో గందరగోళం ఉందని, ఉద్ధేశ్యపూర్వకంగా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. చదవండి: Telangana: అదే సీఎం కేసీఆర్ వ్యూహం! మోదీకి రాసిన లేఖలో కేంద్ర విధానాలపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇటీవల రాష్ట్రాలు చేసే అప్పులపై కేంద్ర కొత్త నిబంధన తీసుకొచ్చిందన్న కేసీఆర్.. ఈ కొత్త నిబంధనలతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి బ్రేక్ పడుతుందని అన్నారు.. నీతి ఆయోగ్ అనేది నిరర్ధక సంస్థగా మారిపోయిందని విమర్శించారు. ‘రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. కేంద్రానివి అన్నీ ఏకపక్ష నిర్ణయాలు. దేశం సంక్లిష్ట పరిస్థితిలో ఉంది. రూపాయి విలువ పడిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇలాంటి ముఖ్య అంశాలపై నీతి ఆయోగ్‌లో చర్చించడం లేదు. ఢిల్లీలో కూడా నీళ్లు దొరకడం లేదు. నీతి ఆయోగ్ ఏం చేసింది. కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపే అంశాలపై చర్చ జరగడం లేదు. కేంద్రం నిస్తేజంగా చూస్తూ ఉండిపోతుంది. దేశంలో మత సామరస్యం దెబ్బతినేలా కొందరు నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా కేంద్రం ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సమాఖ్య స్ఫూర్తిగా విరుద్దంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుంది. దేశంలో రోజురోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి. కేంద్ర విధానాలతో దేశంలో రైతాంగం బాగా దెబ్బతింది. రైతుల పెట్టుబడి డబుల్ అయ్యింది. సంపాదన డబుల్ అవ్వలేదు. దేశంలో ద్వేషం, అసహనం పెరిగిపోతున్నాయి.’ అని సీఎం కేసీఆర్ కేంద్రం, నీతి ఆయోగ్‌పై నిప్పులు చెరిగారు. -
7న ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం నీతి ఆయోగ్ ఏడో గవర్నింగ్ కౌన్సిల్ భేటీ ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సహకారానికి ఈ సమావేశం మరింతగా తోడ్పడుతుందన్నారు. 2019 జూలై తర్వాత నీతి ఆయోగ్ సభ్యులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యక్షంగా పాల్గొంటున్న ఈ సమావేశం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ వేదికగా జరుగుతుందన్నారు. పంటల వైవిధ్యం, పప్పులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, అగ్రి కమ్యూనిటీస్, ఎన్ఈపీ అమలు, పట్టణ పాలన వంటి అంశాలపై ఈ భేటీలో చర్చలు ఉంటాయన్నారు. -
CM Jagan: ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనకు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. 6వ తేదీ సాయంత్రం విశాఖపట్నం నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. రాత్రికి వన్ జన్‌పథ్‌లో బస చేసి, 7వ తేదీ (ఆదివారం) ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. ఆ తర్వాత నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అక్కడ జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఏడవ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. కాగా.. సీఎం వైఎస్ జగన్ శనివారం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస జూనియర్ కాలేజీ మైదానంలో జరగనున్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇదీ చదవండి: ఏపీ మెగా ప్రాజెక్టు ఒక గేమ్ చేంజర్ -
వినూత్నం, ఆదర్శం.. ఏపీకి నీతిఆయోగ్ సలహాదారు ప్రశంస
సాక్షి, అమరావతి: ఏపీలో కాలుష్యానికి తావులేని పర్యావరణహిత పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 2070 నాటికి కర్బన ఉద్గారాలు లేకుండా చేయాలన్న లక్ష్యంలో భాగంగా గ్రీన్ ఎనర్జీతో పాటు ఎలక్ట్రికల్ వాహన రంగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ‘షేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది మొబిలిటీ’ పేరుతో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. చదవండి: అరచేతిలో 87 రకాల సేవలు.. ఈ యాప్ ఉంటే మీ వెంట పోలీస్ ఉన్నట్టే! ఇందులో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి. సృజన, ఏపీ ఈడీబీ సీఈఓ జవ్వాది సుబ్రమణ్యంలతో పాటు 60కిపైగా ఎలక్ట్రిక్ వాహన రంగానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అత్యధిక పెట్టుబడులు ఆకర్షించేలా చర్యలు ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ.. 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహన రంగంలో భారత్‌లోకి రూ.50,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారని, ఇందులో అత్యధిక భాగం రాష్ట్రానికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం మూడంచెల విధానంలో ముందుకెళ్తున్నామని, 2029 నాటికి దేశంలో అత్యధిక పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రంగా.. 2050 నాటికి అంతర్జాతీయంగా పెట్టుబడులకు అత్యంత అనువైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమర్నాథ్ తెలిపారు. ఇందుకు అనుగుణంగా పారిశ్రామిక కారిడార్లలో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామన్నారు. జీడీపీ 5 శాతం పెరుగుతుంది జవ్వాది సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఒకపక్క ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు దేశంలో గణనీయంగా పెరుగుతున్నప్పటికీ అదే సమయంలో ఏటా 20 లక్షల మంది వాయు కాలుష్యంవల్ల మరణించడం ఆందోళన కలిగించే అంశమన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా వీటిని అరికట్టవచ్చని, తద్వారా దేశ జీడీపీ మరో 5 శాతం పెరుగుతుందన్నారు. పెట్టుబడులకు రాష్ట్రం చాలా అనువైనదని, సింగిల్ విండో విధానంలో కేవలం 21 రోజుల్లోనే అనుమతులను మంజూరు చేస్తున్నట్లు జవ్వాది తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంలో భాగంగా చార్జింగ్ స్టేషన్లు వంటి కీలక మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారిస్తోందన్నారు. 2030 నాటికి గ్రీన్ ఎనర్జీ వాటా 45శాతం ప్రస్తుతం రాష్ట్ర ఇంధన వినియోగంలో 30 శాతం వరకు సౌర, పవన విద్యుత్ నుంచి సమకూర్చుకుంటున్నామని, 2030 నాటికి గ్రీన్ ఎనర్జీ వాటాను 45 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విజయానంద్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వినియోగించుకోవాల్సిందిగా పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి. సృజన కోరారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహన రంగానికి చెందిన పలువురు ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తంచేశారు. ఏపీకి నీతిఆయోగ్ సలహాదారు ప్రశంస ఇక ఏదైనా అనుకుంటే దానిని వెంటనే చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందుంటుందని సమావేశంలో నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు సిన్హా ప్రశంసించారు. ఒక ఆలోచన వస్తే వెంటనే ఆచరణలో పెట్టడంలోగానీ, ఒక బృందాన్ని ఏర్పాటుచేసుకుని ప్రణాళికతో లక్ష్యాన్ని చేరడంలోగానీ ఏపీ తీరు ఆదర్శమని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఏపీ మార్గదర్శిగా నిలుస్తుందని సిన్హా అభిప్రాయపడ్డారు. -
ఉచితాలకు అడ్డుకట్ట వేద్దాం.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు చేసే ఉచిత వాగ్దానాలు తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘‘వీటిని వ్యతిరేకించడానికి, పార్లమెంటులో చర్చించడానికి ఏ పార్టీ కూడా ఇష్టపడదు. ఇవి కొనసాగాలనే కోరుకుంటుంది. కాబట్టి ఈ పోకడకు అడ్డుకట్ట వేయడానికి ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వంతో పాటు నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, ఆర్బీఐ వంటి సంస్థలు మేధోమథనం చేసి నిర్మాణాత్మక సూచనలివ్వాలి. విపక్షాలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి’’ అని సూచించింది. ఉచిత పథకాలను ప్రకటించే పార్టీల గుర్తింపును, వాటి ఎన్నికల గుర్తును రద్దు చేసేందుకు ఎన్నికల సంఘానికి అధికారాలు కల్పించాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మానసం బుధవారం విచారణ జరిపింది. ఈ విషయంలో ఏమీ చేయలేమని మాత్రం కేంద్రం, ఎన్నికల సంఘం చెప్పొద్దని, కూలంకషంగా పరిశీలించి సలహాలివ్వాలని స్పష్టం చేసింది. పిల్లో లేవనెత్తిన అంశాలకు కేంద్రం కూడా మద్దతిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ‘‘ప్రజాకర్షక పథకాలతో ఇష్టారీతిన ఉచితాల పంపకం మున్ముందు ఆర్థిక వినాశనానికి దారి తీస్తుంది. ఉచితాల ద్వారా తన కుడి జేబులోకి కొంత వస్తున్నా తర్వాత్తర్వాత ఎడమ జేబుకు ఎంత కోత పడుతుందో సగటు పౌరుడు ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. కనుక ఓటర్లు తమ ఓటు హక్కును తెలివిడితో ఉపయోగించుకునే వీల్లేకుండా పోతుంది’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. ఈ అంశం ఈసీ పరిధిలోనిదని ఇప్పటిదాకా కేంద్రం చెబుతూ వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ అంశమై కేంద్రానికి సలహాలిచ్చేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలిస్తామని ధర్మాసనం సంకేతాలిచ్చింది. దీనిపై గురువారం కూడా విచారణ కొనసాగనుంది. -
భారత్‌ను శ్రీలంకతో పోల్చడం హాస్యాస్పదం!!
న్యూఢిల్లీ: తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకతో భారత ఆర్థిక పరిస్థితులను పోల్చి చూడటం హాస్యాస్పదమేనని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా వ్యాఖ్యానించారు. అయితే, శ్రీలంక సంక్షోభం నుంచి నేర్చుతగిన పాఠాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 1991లో దేశీయంగా చెల్లింపుల సంక్షోభం తలెత్తినప్పట్నుంచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలన్నీ స్థూల ఆర్థిక పరిస్థితులు కట్టుతప్పకుండా, దేశాన్ని సంరక్షిస్తున్నాయని పనగారియా చెప్పారు. మరోవైపు, భారత్ ప్రధాన సమస్య నిరుద్యోగం కాదని .. ఉత్పాదకత, జీతాల స్థాయి తక్కువగా ఉండటమేనని ఆయన పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలకు మెరుగైన జీతాలు లభించే ఉద్యోగాలను సృష్టించే దిశగా కృషి చేయల్సిన అవసరం ఉందన్నారు. 2017–18లో 6.1 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు .. కోవిడ్‌పరంగా కష్టకాలం అయినప్పటికీ 2020–21లో 4.2 శాతానికి దిగి వచ్చిందని పనగారియా చెప్పారు. 2017–18లో నిరుద్యోగిత రేటుపై ఆందోళనలు చేసిన వారంతా తాజా గణాంకాల తర్వాత మౌనం వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వివిధ విషయాలపై భారత అధికారిక డేటాపై కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తుండటంపై స్పందిస్తూ .. దేశ జీడీపీ, కీలక గణాంకాల సేకరణ అంతా కూడా అంతర్జాతీయ ప్రమాణాలతోనే జరుగుతోందని పనగరియా స్పష్టం చేశారు. సహేతుకమైన కొన్ని విమర్శలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఉద్దేశ్యపూర్వకంగా చేసే విమర్శలను తప్పక ఖండించాలని ఆయన స్పష్టం చేశారు. -
అనవసర అప్పులన్నీ టీడీపీ హయాంలోనే..
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ హయాంలోనే రాష్ట్రానికి అనవసర అప్పులు చేశారని ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. తమ వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిమితికి మించి ఏనాడూ అప్పులు చేయలేదని స్పష్టం చేశారు. ఏపీ వెనకబాటుతనానికి చంద్రబాబే కారణమన్నారు. రాష్ట్రంలో ద్రవ్యలోటు, రుణాలు అంటూ టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తున్న ఆరోపణలు, విమర్శలను ఆయన ఖండించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎక్కువ అప్పులు చేస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, మనకంటే ఇతర రాష్ట్రాలు ఇంకా ఎక్కువ రుణం తీసుకుంటున్నాయని గణాంకాలతో సహా వివరించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో ద్రవ్యలోటు కూడా తక్కువేనన్నారు. ఆయన మంగళవారం న్యూఢిల్లీలోని ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అప్పులపై ప్రజల్లో భయం కలిగించాలని ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందని విమర్శించారు. వాస్తవానికి పార్లమెంటులో అడిగిన ప్రశ్న ఆంధ్రప్రదేశ్ అప్పులపై కాదని, అయినా టీవీ చానళ్లు స్క్రోలింగ్స్, ఇంటర్వ్యూలు, చర్చల ద్వారా ప్రజల్లో భయం సృష్టించాలని చూశాయని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. బాబు పాలనలో అప్పు 140% పెరిగింది ‘2014–19 మధ్యలో అప్పటి టీడీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసింది. మా ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి ఆర్థిక సమస్యలు, తర్వాత కోవిడ్‌తో మరిన్ని ఇబ్బందులు వచ్చినా సామాన్య మానవుడిని కాపాడుకునేందుకు కృషిచే స్తున్నాం. ఈ విషయంలో సీఎం జగన్మోహన్రెడ్డి ఎంతో నిబద్ధతతో ఉన్నారు. విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు 2014లో ఉన్న అప్పు రూ.1.35 లక్షల కోట్ల నుంచి 2019 మే నాటికి రూ.3.27 లక్షల కోట్లకు చేరింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అప్పు 140% పెరిగింది. మా ప్రభుత్వం వచ్చేనాటికి.. అంటే 2019 మే నెలలో రాష్ట్ర అప్పు రూ.3.27 లక్షల కోట్లు. అది మూడేళ్ల తర్వాత రూ.4.98 లక్షల కోట్లకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ అప్పులు 2020లో రూ.3,07,671 కోట్లు, 2021లో రూ.3,60,333 కోట్లు, 2022లో రూ.3,98,903 కోట్లు. ఏటా సగటున కర్ణాటక అప్పులు రూ.60 వేల కోట్లు, కేరళ అప్పులు రూ.45 వేల కోట్లు, తమిళనాడు అప్పులు రూ.లక్ష కోట్లు, తెలంగాణ అప్పులు రూ.45 వేల కోట్ల వంతున పెరిగాయి. జనాభా ప్రకారం చూసినా, స్థూల ఉత్పత్తి ప్రకారం చూసినా ఏపీ అప్పు తక్కువే. స్థూల ఉత్పత్తి మీద రాష్ట్రాల అప్పు నిష్పత్తిగా చూసినా ఏపీ భేష్. అప్పులు కూడా టీడీపీ తెచ్చిన వడ్డీకంటే తక్కువకే తీసుకున్నాం. 2014–19 మధ్య కాలంలో కోవిడ్ వంటి సంక్షోభం లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల 4% ద్రవ్యలోటు నమోదైంది. కోవిడ్ సంక్షోభంలో కూడా మా ప్రభుత్వం ద్రవ్యలోటును 3% కి పరిమితం చేసింది. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు విషయాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ బెటర్. దేశంలో బాగా పనిచేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటని గర్వంగా చెప్పవచ్చు. చంద్రబాబు ‘మనసులో మాట’ చదవాలి ఉద్యోగులు చంద్రబాబు ‘మనసులో మాట’ పుస్తకాన్ని చదవాలి. శాశ్వత ఉద్యోగాలు వద్దు అని, 60% ఉద్యోగులు అవినీతి పరులని చంద్రబాబు ఆ పుసక్తంలో రాశారు. ప్రాజెక్టులు కడితే లాభం లేదని, సబ్సిడీలు పులి మీద సవారీ అని, ఉచిత సేవలు వద్దేవద్దని రాశారు..’ అని బుగ్గన చెప్పారు. అంతకుముందు ఆయన నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ సుమన్ బెరిని కలిశారు. -
సీఎం జగన్‌తో భేటీలో నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ ప్రశంసలు
-
Ramesh Chand: దేశ సగటు కంటే ఏపీ వృద్ధి భేష్
సాక్షి, అమరావతి: తలసరి ఆదాయం, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పశు సంపద తదితర విషయాల్లో దేశ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధి చాలా బాగుందని నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించారు. దేశంలో అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా మెరుగ్గా ఉందని, ప్రతి రంగంలో లక్ష్యాలను పెట్టుకుని దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బృందం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చేపట్టిన.. ప్రధానంగా జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ వ్యవసాయం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. పండ్లు, మత్స్య ఉత్పత్తుల్లో ఏపీ నంబర్ వన్‌గా నిలిచిందని రమేష్ చంద్ తెలిపారు. ఆయిల్‌పామ్ సాగు ద్వారా వంట నూనెల ఉత్పత్తిలో రాష్ట్రం స్వయంసమృద్ధి సాధించిందని చెప్పారు. ఆర్బీకేల ద్వారా రైతులకు సమగ్ర వ్యవస్థ అందుబాటులో ఉందని, క్షేత్ర స్థాయిలో ఆర్బీకేలు అత్యుత్తమ వ్యవస్థ అని కితాబు ఇచ్చారు. ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ దేశం సగటు కన్నా ఆంధ్రప్రదేశ్ సగటు అధికంగా ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ, విద్య, వైద్య, గృహ నిర్మాణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ బృందానికి వివరించారు. వ్యవసాయం, వైద్య, విద్య, గృహ నిర్మాణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామని తెలిపారు. ఈ రంగాల్లో చాలా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. గర్భవతులు, బాలింతలు, చిన్నారులు, బడి పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా సంపూర్ణ పోషణ, గోరుముద్ద లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. మహిళా సాధికారత కోసం బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను పెట్టామని, గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి.. వివక్ష, అవినీతికి ఆస్కారం లేకుండా డెలివరీ మెకానిజాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నామని తెలిపారు. డీబీటీ విధానంలో ఏపీది అగ్రస్థానమని స్పష్టం చేశారు. పిల్లలను బడికి పంపించేలా తల్లులను చైతన్య పరచడానికి అమ్మ ఒడిని అమలు చేస్తున్నామని, దీనివల్ల జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) పెరుగుతోందని చెప్పారు. విద్యా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నామని, ప్రపంచ స్థాయిలో పోటీని తట్టుకునేలా పిల్లలను తయారు చేస్తున్నామని వివరించారు. ఇంగ్లిష్ మీడియం, నాణ్యమైన విద్య దిశగా అడుగులు వేస్తున్నామని, నాడు –నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చామని, తరగతి గదులను డిజిటల్ ఉపకరణాలతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. సబ్జెక్టుల వారీగా బోధనకు టీచర్లను నియమిస్తున్నామని, ఆరు రకాల స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పూర్తి స్థాయి రీయింబర్స్మెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని, వసతి దీవెన కింద కూడా ఏడాదికి రూ.20 వేలు ఇస్తున్నామని, దీనివల్ల జీఈఆర్ గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేశారు. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులు ప్రభుత్వాస్పత్రుల్లో, బోధనాస్పత్రుల్లో నాడు –నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేపడుతున్నామని సీఎం తెలిపారు. ప్రతి గ్రామంలో, వార్డుల్లో విలేజ్, వార్డు క్లినిక్స్ పెడుతున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీకి రిఫరల్ పాయింట్‌గా, వ్యాధుల నివారణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని, పీహెచ్‌సీలతో.. అక్కడున్న డాక్టర్లతో అనుసంధానమవుతాయని వివరించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను కూడా అమల్లోకి తీసుకువస్తున్నామని తెలిపారు. 3 వేలకు పైగా చికిత్సలకు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత చికిత్స అందిస్తున్నామని, ప్రతిపార్లమెంటు నియోజకవర్గంలో తప్పనిసరిగా మెడికల్ కాలేజీ ఉండేలా కొత్తగా 16 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్బీకేల వ్యవస్థ, సీఎం యాప్ పనితీరు.. తదితర అంశాలు, ఫుడ్ ప్రాసెసింగ్ కోసం కొత్తగా చేపడుతున్న 26 యూనిట్ల గురించి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇతర కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి వారికి వివరించారు. ఆర్బీకే చానల్, ఆర్బీకే, అగ్రి ల్యాబ్ సందర్శన సాక్షి, అమరావతి/ఉయ్యూరు/కంకిపాడు: నీతి ఆయోగ్ సభ్యుడు (వ్యవసాయం) ప్రొఫెసర్ రమేష్‌చంద్.. నీతి ఆయోగ్ సలహాదారు సి.పార్థసారథిరెడ్డితో కలిసి శుక్రవారం గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్‌ను సందర్శించారు. కాల్ సెంటర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకే చానల్ ద్వారా ప్రసారమవుతున్న వ్యవసాయ ప్రాయోజిత కార్యక్రమాల వీడియోలను తిలకించారు. అనంతరం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట–2 ఆర్బీకేను సందర్శించి, అక్కడ కియోస్క్‌లో ఎరువులు బుక్ చేసుకుంటున్న విధానాన్ని, డిజిటల్ లైబ్రరీలోని మ్యాగజైన్స్, పంటల వారీగా ఉన్న బుక్‌లెట్స్‌ను, మినీ టెస్టింగ్ కిట్లు, సాయిల్, మాయిశ్చూర్ మిషన్ల ద్వారా చేస్తోన్న పరీక్షలను పరిశీలించారు. పొలంబడి ప్లాట్‌ను పరిశీలించిన సందర్భంలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తున్న రైతులకు జీఏపీ సర్టిఫికేషన్ ఇవ్వబోతున్నామని, భవిష్యత్‌లో సేంద్రియ ధ్రువీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య వివరించారు. ఆర్బీకే ఆవరణలో ఉన్న వైఎస్సార్ పశు సంచార వైద్య సేవా రథం, రైతు చైతన్య రథాలను పరిశీలించి వాటి ద్వారా అందిస్తోన్న సేవలను అడిగి తెలుసుకున్నారు. గండిగుంటలో రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ‘తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. ఇన్నాళ్లుకు రైతు ముంగిటకు సేవలు వచ్చాయి. మా ఊళ్లో ఏర్పాటు చేసిన ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సర్టిఫైడ్ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందిస్తున్నారు. పంటలనూ కొనుగోలు చేస్తున్నారు. నిజంగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత మాటల్లో చెప్పలేం’ అంటూ నందం జోగేశ్వరరావు, గెత్తం విజయ్‌కుమార్ అనే రైతులు వివరించారు. ఆ తర్వాత కంకిపాడు అగ్రి ల్యాబ్‌ను సందర్శించి, అక్కడ ఇన్‌పుట్స్‌ను పరీక్షిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ‘రైతుల ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, గ్రామ స్థాయిలో అమలు చేస్తున్న కార్యక్రమాలు చాలా వినూత్నంగా ఉన్నాయి’ అని విజిటర్స్ బుక్‌లో పేర్కొన్నారు. -
ఏపీ గ్రోత్ స్టోరీ దేశానికే స్ఫూర్తి.. నేరుగా చూడటానికి రాష్ట్రానికి వచ్చా
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాలు అనుసరించాలని తాను సూచిస్తానని నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రముఖ వ్యవసాయ ఆర్థిక వేత్త, ప్రొఫెసర్ రమేష్ చంద్ చెప్పారు. రైతు గుమ్మం ముందు సేవలు అందిస్తున్న ఆర్బీకేలు, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు వ్యవసాయ ముఖ చిత్రాన్ని మారుస్తాయని విశ్వసిస్తున్నానని అన్నారు. సాగులో అనుసరిస్తున్న ఈ విధానాలు ప్రపంచంలో ఎక్కడా లేవని, ఈ విధానాలు ‘యూనిక్’గా ఉన్నాయని అభివర్ణించారు. రెండున్నర దశాబ్దాలుగా వ్యవసాయ విధానాల రూపకల్పనలో విశేష అనుభవం ఉన్న ఆయన 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా పనిచేశారు. నీతి ఆయోగ్‌లో చేరక ముందు ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనమిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్’ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆస్ట్రేలియా, జపాన్‌లో ప్రముఖ యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. నీతి ఆయోగ్‌లో సభ్యుడిగా వ్యవసాయ రంగాన్ని పర్యవేక్షిస్తున్న ఆయన.. ఏపీలో అమలువుతున్న వ్యవసాయ విధానాలు, ఆర్బీకేల ద్వారా రైతులకు అందుతున్న సేవలను స్వయంగా చూడటానికి రాష్ట్రానికి వచ్చారు. కంకిపాడు మార్కెట్ యార్డ్‌లోని అగ్రి ల్యాబ్‌లో ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ వినియోగం ►ఏపీలో ఆర్బీకేలు అందిస్తున్న సేవల గురించి విన్నాను. క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరును స్వయంగా పరిశీలించడానికి వచ్చాను. సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని(ఐటీ) వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల్లో వినియోగిస్తున్న విధానాన్ని చూశాను. డిజిటల్ టెక్నాలజీ వినియోగానికి ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ మంచి ఉదాహరణ. రైతులు సలహాలు, సూచనలు అడుగుతున్న తీరు, అనుమానాలను నివృత్తి చేసుకుంటున్న విధానాన్ని కాల్ సెంటర్లో పరిశీలించాను. ►రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే)ను సందర్శించాను. సాగుకు సంబంధించిన ‘ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ ఎట్ వన్ ప్లేస్’గా ఇది రైతులకు తోడ్పాటు అందిస్తోంది. రైతులకు సలహాలు, సూచనలే కాదు.. వారికి కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను అందించే కేంద్రంగా ఉపయోగపడుతోంది. వ్యవసాయ కేంద్రాలంటే కేవలం పంటలకే పరిమితం కావడం నేను చాలా చోట్ల చూశాను. కానీ ఆర్బీకే అలా లేదు. పశువులు, జీవాలు, ఫిషరీస్‌కు సంబంధించిన కార్యకలాపాలు కలగలిసే ఉన్నాయి. నా అభిప్రాయం మార్చుకుంటున్నా.. ►వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం (అడ్వాన్స్ టెక్నాలజీ) వినియోగించుకోవడంలో పంజాబ్ రాష్ట్రమే దేశంలో ముందుందని అనుకున్నా. ఇక్కడ గ్రామ స్థాయిలో కల్పించిన సౌకర్యాలు, అమలు చేస్తోన్న కార్యక్రమాలు చూసిన తర్వాతæ నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నా. ఇక్కడి వ్యవసాయ వి«ధానాలు, కార్యక్రమాలు చాలా వినూత్నంగా ఉన్నాయి. ►ఆర్బీకేలు, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, అగ్రి ల్యాబ్స్ అద్భుతం. మిగతా రాష్ట్రాలకు అనుసరణీయం. వ్యవసాయ రంగం దేశంలో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలంటే దేశ వ్యాప్తంగా ఇలాంటి సౌకర్యాలు అందుబాటులోకి రావాలి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా. జాతీయ స్థాయిలో అమలు చేయాలని సిఫారసు చేస్తా. సాగు చేసి నష్టపోవడమనే సమస్యే తలెత్తదు.. ►దేశంలో చాలా కాల్ సెంటర్స్‌ను చూసాను. కానీ ఇంత పక్కాగా, ప్రణాళికాబద్దంగా నిర్వహిస్తున్న కాల్ సెంటర్ ఇదే. శాస్త్రవేత్తలు, అధికారులను రైతులతో అనుసంధానించడం గొప్ప ఆలోచన. శాస్త్రీయ అంశాలను నేరుగా రైతులకు చేర్చడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుంది. దేశమంతా ఈ విధానం అనుసరించాలి. ►కియోస్క్‌లో రైతులు ఎరువులు బుక్ చేసుకుంటున్న విధానాన్ని స్వయంగా చూశా. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యద్భుతంగా వినియోగించుకుంటున్నారు. ►108, 104 అంబులెన్స్ తరహాలో మారుమూల పల్లెల్లో పశువులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న అంబులేటరీ సేవలు రైతులకు చాలా ఉపయోగం. ►వ్యవసాయ రంగంలో నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు పెద్ద సమస్య. ఈ సమస్యను అధిగమించడానికి ఆర్బీకేలు ఉపయోపగపడుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కంపెనీల నుంచి రైతులకు అందించడం వల్ల నాణ్యమైన ఇన్పుట్స్ చౌకగా రైతులకు లభిస్తున్నాయి. ►వాటి నాణ్యతను పరీక్షించడానికి ల్యాబ్‌లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం, నాణ్యత లేని వాటిని తిరస్కరించడం ద్వారా.. నాణ్యత లేని మెటీరియల్ ఏదీ రైతులకు చేరదు. ఫలితంగా సాగు చేసి నష్టపోవడమనే సమస్యే తలెత్తదు. ►ఇక్కడ అనుసరిస్తున్న విధానాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖతో కలిసి సంయుక్తంగా అధ్యయన పత్రం రూపొందించి, నీతి ఆయోగ్ ద్వారా ప్రచురిస్తాం. తద్వారా ఆంధ్రప్రదేశ్ విధానాల సమాచారం ఇతర రాష్ట్రాలకు అందుబాటులో ఉంటుంది. చాలా సమస్యలకు పరిష్కారం ►రైతు వ్యాపారస్తుడిగా(ట్రేడర్‌గా) మారి తన పంట తాను అమ్ముకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడం మంచి పరిణామం. తద్వారా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. రైతులకు గిట్టుబాట ధర లభించడానికి, మార్కెటింగ్‌లో ఉన్న సమస్యలు అధిగమించడానికి ఈ విధానం దోహదం చేస్తుంది. ►కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను తీసుకురావడంలో నా పాత్ర ఉంది. రైతు ట్రేడర్‌గా మారాలనేది నా కల. కనీసం చట్టంలో అయినా రైతులు ట్రేడర్లుగా మారాలని నా కోరిక. దురదృష్టవశాత్తు ఆ చట్టాలు వెలుగు చూడలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవడం సంతోషం. ►ఏపీ వ్యవసాయ రంగం ‘గ్రోత్ స్టోరీ’ దేశానికి స్ఫూర్తినిస్తుంది. కేవలం పంటలే కాకుండా పశుపోషణ, ఆక్వా, ఇతర అనుబంధ రంగాల్లోనూ వృద్ధి రేటు బాగుంది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 1 శాతం వృద్ధి నమోదైతే, దారిద్య్రం కనీసం 4 శాతం తగ్గుతుంది. వ్యవసాయ ఆధారిత సమాజం మనది. ఈ రంగంలో వృద్ధి అత్యవసరం.