Jacqueline Fernandez
-
ఇండియా నన్ను స్వీకరిస్తే చాలు..!: జాక్వెలిన్ ఫెర్నాండేజ్
కష్టాలను తట్టుకొని, త్వరగా కోలుకొని, తిరిగి మామూలు స్థితిలోకి వచ్చే మానసిక దృఢత్వాన్ని ఇంగ్లిష్‌లో ‘రిజిలియన్స్’ అని, తెలుగులో ‘స్థితిస్థాపకత్వం’ అని మనం అంటే అంటూండవచ్చు కానీ.. ఇక్కడ మాత్రం.. ‘జాక్వెలిన్ ఫెర్నాండేజ్’ అని మాత్రమే ఆ.. దృఢత్వానికి అర్థం చెప్పుకోవాలి! జాక్వెలిన్ బాలీవుడ్‌లోకి వచ్చి 15 ఏళ్లు అయింది. ఈ ఒకటిన్నర దశాబ్దాలలో ఆమె అనేక విజయాలను చవి చూశారు. కొన్ని కష్టకాలాలు కూడా ఆమెకు తమ తడాఖా చూపించాయి. అయితే – ‘‘కష్టం లేనిదే జీవితం లేదు. ఆ కష్టం నుంచి జీవితం ఏం నేర్పిందన్నదే మనకు ముఖ్యం’’ అని అంటారు జాక్వెలిన్.‘‘నేనైతే గాలి దుమారంలా వచ్చిపోయే ఒడిదుడుకులకు గట్టిగా నిలబడటం నేర్చుకున్నాను. నాపై నేను నమ్మకాన్ని ఏర్పరచుకోవడాన్ని సాధన చేశాను. చేస్తున్న పని నుండి పారిపోవలసి వస్తే అసలా పనిలోకి ఎన్ని ఆశలతో వచ్చామన్నది మొదట గుర్తు చేసుకోవాలి. అక్కడి వరకు సాగిన మన ప్రయాణాన్ని వృథా కానివ్వకూడదని సంకల్పించుకోవాలి. ఇక నాకైతే నన్ను ప్రేమించే కుటుంబ సభ్యులు అండగా ఉన్నారు. నన్ను సంతోషంగా ఉంచే వ్యాపకాలూ నాకు తోడుగా ఉన్నాయి’’ అంటారు జాక్వెలిన్ . శ్రీలంక నుంచి వచ్చి, ‘అలాద్దీన్’ (2009) చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమై, ‘మర్డర్–2’ తో ఇండస్త్రీలో నిలదొక్కుకున్న జాక్వెలిన్ .. ‘‘ఇండియా నన్ను స్వీకరిస్తే చాలునన్నదే అప్పటి నా కల’’ అంటారు. ‘‘అయితే ఈ దేశం నన్ను అక్కున చేర్చుకుని, ఆ కలను మించిన గుర్తింపునే ఇచ్చింది. మొదట్లో భాష కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ, బాలీవుడ్ ప్రేక్షకులు నాకిది పరాయి దేశం అన్న భావన కలగనంతగా నన్ను ఆదరించారు’’ అని ఆమె తెలిపారు.ఈ పదిహేనేళ్లలోనూ 30కి పైగా చిత్రాలలో నటించిన జాక్వెలిన్ రెండు నెలల క్రితమే ‘స్టార్మ్ రైడర్’ మ్యూజిక్ వీడియోతో సంగీత ప్రపంచంలోకి కూడా ప్రవేశించారు. ప్రస్తుతం షూటింగ్లో ఉన్న ‘హౌస్‌ఫుల్ 5’ చిత్రంలో నటిస్తున్నారు. అందులో హీరో అక్షయ్ కుమార్. ‘‘ఏ రంగంలోనైనా ఎదుగుతున్న క్రమంలో సవాళ్లు ఎదురవటం మామూలే. అయితే ఊహించని వైపుల నుంచి సవాళ్లు చుట్టుముట్టినప్పుడు (బహుశా ఈడీ దాడులు, మీడియా రాతలు అని ఆమె ఉద్దేశం కావచ్చు) జీవితం తలకిందులు అయినట్లుగా అనిపిస్తుంది. అప్పుడే మనం దృఢంగా ఉండాలి.. ’’ అని హార్పర్స్ బజార్’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు జాక్వెలిన్ (చదవండి: జస్ట్ ఏడు రోజుల్లో 8 కిలోలు బరువు తగ్గిన నటి నిమ్రా ఖాన్: ఇది ఆరోగ్యకరమేనా..?) -
అత్యంత అందమైన శాకాహార సెలబ్రిటీలు వీరే!
బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితీష్ దేశ్‌ముఖ్‌లను పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా 2024కి గాను భారతదేశపు ’అత్యంత అందమైన శాకాహార సెలబ్రిటీలు’ గా ఎంపిక చేసింది. జంతు సంక్షేమం పట్ల గల అంకితభావానికి, కారుణ్య జీవనశైలి నిబద్ధతకు గుర్తింపుగా వారికి ఈ గౌరవం లభించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ‘పనితో సంబంధం లేకుండా కూడా వెలుగులోకి రావడం ఆనందంగా ఉంది’ని ఈ సందర్భంగా తెలియజేసింది. గతంలో హాటెస్ట్ వెజిటేరియన్ సెలబ్రిటీ అవార్డు టైటిల్ విజేతలలో జీనత్ అమన్, జాకీ ష్రాఫ్, ఫాతిమా సనా షేక్, రాజ్‌కుమార్ రావు, అలియా భట్, అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్, శ్రద్ధా కపూర్, సోనూసూద్, మానుషి చిల్లర్ .. వంటి సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. మానుషి చిల్లర్, సునీల్ ఛెత్రి, అనుష్క శర్మ, కార్తీక్ ఆర్యన్, విద్యుత్ జమ్వాల్, షాహిద్ కపూర్, రేఖ, అమితాబ్ బచ్చన్ లు కూడా అత్యంత అందమైన శాకా హారులుగా గుర్తింపు పొందారు. ఈ యేడాది జాక్వెలిన్ తన స్టార్ పవర్‌ను అన్ని జంతువుల రక్షణ కోసం ఉపయోగించడంలో పేరొందింది. 50 ఏళ్లకు పైగా సంకెళ్లలో ఉంచిన ఏనుగును రక్షించిన #Freegajraj ప్రచారంతో సహా అనేక మార్గాల్లో పెటా ఇండియా పనికి మద్దతుగా తన అభిమానులను సమీకరించింది.రితేష్ శాకాహారి. శాకాహారాన్ని ప్రోత్సహిస్తున్నాడు. భార్య జెనీలియాతో కలిసి శాకాహార మాంసం కంపెనీని కూడా స్థాపించాడు. ‘నటన నుంచి జంతు సంరక్షణ వరకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితీష్ దేశ్‌ముఖ్ నిజమైన సూపర్ స్టార్లుగా నిరూపితమయ్యారు’ అని పెటా ఇండియా సెలబ్రిటీ, పబ్లిక్ రిలేషన్స్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ బంగేరా తెలిపారు. ‘ఈ విధంగా దయను ప్రపంచానికి చూపినందుకు పెటా ఇండియా వారిని గౌరవించడం ఆనందంగా ఉంది. అన్నింటికన్నా వీరిది నాణ్యమైన అందం’ అని ప్రశంసించారు. -
జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మరోసారి ఈడీ సమన్లు
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. రూ. 200కోట్ల మనీలాండరింగ్ కేసులో సుమారు రెండేళ్ల క్రితం ఆమెకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ నిందితుడిగా ఉన్న రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఆమె విచారణకు కూడా హాజరైంది. అయితే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు జైల్లో ఉన్న సుకేశ్ పలుమార్లు ప్రేమ సందేశాలు పంపాడు. దీంతో ఆమె పలుమార్లు కోర్టును కూడా ఆశ్రయించింది.అయితే, తాజాగా ఈ కేసులో జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు పంపింది. విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ కేసులో ఈడీ పలుమార్లు ఆమెను ఇప్పటికే విచారించింది. ఆమెకు సంబంధించిన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.సుకేశ్ నుంచి జాక్వెలిన్ చాలా ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ ఈ కేసులో ఆమెను నిందితురాలిగా గుర్తించింది. అయితే, సుకేశ్ తన జీవితాన్ని నాశనం చేశాడని జాక్వెలిన్ కోర్టు ముందు గతంలో వాపోయింది. అతని వల్ల సినిమా ఛాన్స్‌లు కూడా పోయాయని ఆమె తెలిపింది. తన కెరీర్‌తో సుకేశ్ ఆడుకున్నాడని కోర్టు ఎదుట జాక్వెలిన్ వాపోయింది. కొన్నేళ్లుగా సుకేశ్ చంద్రశేఖర్ తీహార్ జైల్లో ఉన్నాడు. -
మళ్లీ హానీమూన్‌కి వెళ్లిన రకుల్.. అనసూయ స్మైలీ పోజులు
బికినీలో కూల్‌గా కనిపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్గోల్డెన్ డ్రస్సులో మెరిసిపోతున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్క్యూట్ స్మైల్‌తో మాయలో పడేస్తున్న దీపికా పిల్లివెనక అందాలు చూపిస్తూ కిక్ ఇచ్చేస్తున్న అమైరా దస్తూర్నడుము వయ్యారాలు.. జబర్దస్త్ వర్ష కిర్రాక్ పోజులుచిన్న పిల్లలా ఆడుకుంటున్న యాంకర్ అనసూయ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by Kanch (@akansharanjankapoor) View this post on Instagram A post shared by Niharika Nm (@niharika_nm) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) View this post on Instagram A post shared by Priyaa Lal (@impriyaalal) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Likhita Yalamanchili (@likhita_yalamanchili) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Shobhitta (@shobhitaranaofficial) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
సున్నితమైన ఎమోషన్స్‌ను ఎంతో అద్భుతంగా పేపర్ బాయ్ సినిమాలో చూపించి మెప్పించాడు దర్శకుడు జయ శంకర్. ఇక రెండో ప్రయత్నంగా 'అరి' అంటూ అరిషడ్వర్గాల మీద చిత్రాన్ని తీశాడు. ఇప్పటికే ఈ మూవీ అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేసింది. పలువురు సెలెబ్రిటీలు సినిమాను చూసి మెచ్చుకున్నారు కూడా. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ క్రమంలో దర్శకుడు జయ శంకర్ కొత్త సినిమా మీద రూమర్లు వస్తున్నాయి. ఆల్రెడీ ఈయన ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టినట్టుగా, ఆ కథకు నయనతార ఓకే చెప్పినట్టుగా ఆ మధ్య రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద కొత్త రూమర్ వినిపిస్తోంది. జయశంకర్ అనుకుంటున్న ఈ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌కు సౌత్, నార్త్‌లో మంచి క్రేజ్ ఉన్న నటిని తీసుకున్నారని సమాచారం. శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో జయ శంకర్ తన లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ను చేస్తున్నాడని తెలుస్తోంది. పాన్ ఇండియాగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ మీద అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక జయశంకర్ తీసిన అరి చిత్రం ఈ ఎన్నికల హడావిడి అయిపోయిన తరువాత థియేటర్లోకి రానుంది. జూన్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. పలు అనుమానాలు
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ముంబై బాంద్రావెస్ట్లో ఉండే నౌరోజ్ హిల్ సొసైటీలో ఒక అపార్ట్మెంట్లో ఆమె ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. అందులో 14వ ఫ్లోర్లో ఉండే ఒక ఫ్లాట్‌లో బుధవారం అర్ధరాత్రి మంటలు వ్యాపించాయి. కానీ 15వ ఫ్లోర్లో జాక్వెలిన్ ఉంటుంది. ఈ మంటలు ఆమె ఉండే నివాసం వరకు కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది. బయట నుంచి చూసిన కొంతమంది ఫైర్ ఇంజిన్‌కు కాల్ చేయడంతో వెంటనే వారు తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాలేదని సమాచారం. దాదాపు రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఈడీ. ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ ఛార్జ్‌షీట్ దాఖలు కూడా చేసింది. కానీ ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సుఖేశ్ చంద్రశేఖర్ తన జీవితాన్ని నరకప్రాయం చేయడమే కాకుండా తన భావోద్వేగాలతో ఆడుకుని, తన కెరీర్, జీవనోపాధిని నాశనం చేశాడని చెప్పిన జాక్వెలిన్.. సుఖేశ్ వల్ల తనకు ప్రాణాపాయం ఉన్నట్లు కూడా తెలిపింది. ఇప్పుడు ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు కిందనే ఈ అగ్ని ప్రమాదం జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. -
క్రిస్మస్ ఎనర్జీ
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు సంబంధించి బాలీవుడ్ సెలబ్స్ సందడి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. పాత, కొత్త అనే తేడా లేకుండా తారల క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. తారలలో కొందరు తమ క్రిస్మస్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. క్రిస్మస్ తన ఫేవరెట్ ఫెస్టివల్ అని చెబుతోంది బాలీవుడ్ కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ‘క్రిస్మస్కు సంబంధించి బాల్యజ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. పిల్లలకు బాగా నచ్చే పండగ ఇది. నా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎక్కువగా బహ్రెయిన్‌లో జరిగాయి. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కడే. చిన్నప్పుడు క్రిస్మస్కు ముందురోజు రాత్రి బొమ్మల దుకాణంలో అందమైన బార్బీ బొమ్మను చూశాను. అది నాకు బాగా నచ్చింది. అదేరోజు అర్ధరాత్రి ప్రార్థనల తర్వాత శాంటా క్లాజ్ నుంచి అచ్చం అలాంటి బొమ్మే అందింది. ఓ మై గాడ్, శాంటా ఈజ్ సో కూల్ అనుకున్నాను’ అంటూ గత జ్ఞాపకాల్లోకి వెళ్లింది ఫెర్నాండేజ్. ‘క్రిస్మస్ ఎనర్జీ’ పేరుతో క్రిస్మస్ జ్ఞాపకాల ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయడంలో ముందుంటుంది శ్రద్ధా కపూర్. -
నువ్వు మరింత అందంగా తయారవుతున్నావ్.. హీరోయిన్‌కు ప్రేమలేఖ!
బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పరిచయం అక్కర్లేని పేరు. 2009లో అల్లాదీన్ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించింది. ఇవాళ ఆమె 38వ ఏడాదిలో అడుగు పెడుతున్నారు. మోడలింగ్‌పై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించింది. అయితే తాజాగా ఆమె బర్త్ డే సందర్భంగా జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపాడు. (ఇది చదవండి: చిరంజీవిపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్!) రూ. 200 కోట్ల మానీలాండరింగ్ కేసులో ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో సుకేశ్ చంద్రశేఖర్ తన ఫ్రెండ్‌కు విషెస్ చెప్పాడు. నటి పుట్టినరోజు సందర్భంగా సుకేశ్ ఆమెకు ఓ ప్రేమ లేఖ రాశారు. ఈ ప్రేమలేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నిన్ను చాలా మిస్సవుతున్నా సుకేశ్ లేఖలో రాస్తూ..'నా బేబీ జాక్వెలిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీర్వదాలు నీకు ఎప్పుడు ఉంటాయి. నా జీవితంలో ప్రతి ఏడాది నీ పుట్టినరోజు అత్యంత ఇష్టమైన రోజు. నా బర్త్ డే కంటే కూడా ఎక్కువ. బేబీ నువ్వు రోజు రోజుకి మరింత అందంగా..యవ్వనంగా తయారవుతున్నావ్. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా. వచ్చే ఏడాది నీ పుట్టినరోజును కలిసి జరుపుకుంటానని ఆశిస్తున్నా. ఈ గ్రహంలోని ఏ శక్తి నిన్ను ప్రేమించకుండా ఆపలేదు.' అంటూ తీవ్రమైన భావోద్వేగంతో రాసుకొచ్చాడు. గతంలో చంద్రశేఖర్ ఆమెను కౌగిలించుకోవడం, కేక్ తినిపించిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనలయ్యాడు. అయితే గతంలో సుఖేష్ చంద్రశేఖర్‌తో డేటింగ్లో ఉన్నారంటూ వచ్చిన వార్తలను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఖండించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? జూ.ఎన్టీఆర్‌తో ఆ సినిమాలో ) -
రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్.. ఆయన బహుమతే కదా అంటూ..
గత ఏడాదిలో సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసు వెలుగుచూసినప్పటి నుంచి.. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు మీడియాలో మార్మోగుతూనే ఉంది. తాజాగా ఆమె కొత్త ఇల్లు కొనడంతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలోని కాస్ట్లీ ఏరియాలో జాక్వెలీన్ కొత్త ఇంటిని కొనింది. బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్-ఆలియా భట్, కరీనా కపూర్,సైఫ్ అలీ ఖాన్ వంటి బడా హీరోలు నివసించే ప్రాంతంలో 'మర్డర్-2' బ్యూటీ కొత్త ఇంటిని తీసుకుంది. (ఇదీ చదవండి: వాళ్లు బాలకృష్ణ మనుషులని నాకు తెలియదు: కిర్రాక్ ఆర్పీ) ఇదే ప్రాంతంలో దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కూడా ఇల్లు కొనే ప్లాన్‌లో ఉన్నారని తెలిసిందే. తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొత్త ఇంటి వీడియోలతో పాటు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉండే పాలి హిల్‌లో ఇంటిని కొనుగోలు చేసింది ఈ బ్యూటీ. వ్యాపారా నివేదికల ప్రకారం, ఈ ప్రాంతంలో 3 BHK, 4 BHK ఇళ్లు కొనాలన్నా రూ. 12 కోట్ల నుంచి మొదలవుతుంది. కానీ ఈ బ్యూటీ ఎన్ని బెడ్ రూమ్స్ ఉన్న ఇంటిని కొనుగోలు చేశారు, ఎంత డబ్బు పెట్టి కొన్నారని ఇంకా తెలియరాలేదు. కానీ సుమారు రూ. 20 కోట్లతో కొన్నట్లు ప్రచారం జరుగుతుంది. జాక్వెలిన్ కొత్త ఇంటికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో.. నెటిజన్ల నుంచి పలు కామెంట్లు వచ్చాయి. సుకేష్ బహుమతిగా పంపించాడా అని ఒకరు ప్రశ్నిస్తే.. ఇదంతా సుకేష్ నుంచి వచ్చిన ప్రాప్తం అంటూ మరోకరు కామెంట్ చేశారు. మరోకరు అయితే ఏకంగా 'సుకేష్ డబ్బుతోనా లేక సల్మాన్ భాయ్తోనా?' ఇని పలు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులో ఆమెకు బెమధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. సుకేశ్ మాత్రం జైళ్లోనే ఉన్నాడు. (ఇదీ చదవండి: జాక్వెలిన్‌కు కాకుండా నాటునాటుకు ఆస్కార్.. అసూయ వెల్లగక్కిన హీరోయిన్ మేకప్ ఆర్టిస్ట్) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) (ఇదీ చదవండి: (Kajal Aggarwal: నెటిజన్ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చిన కాజల్) -
పింక్ లో ప్రియమణి.. బ్లూ డ్రెస్‌లో వర్ష..తారల అందాలు
పింక్ డ్రెస్ లో మతి పోగోడుతున్న ప్రియమణి నీలి రంగు డ్రెస్‌లో వర్ష పరువాల విందు వొకేషన్ మూడ్ అంటూ సముద్రం ఒడ్డున బోటుపై ఫోటోకి పోజులు ఇచ్చాడు బుల్లితెర నటుడు రవికృష్ణ View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Ravi krishna (@ravikrishna_official) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
'అవార్డులే అనుకున్నా ఆస్కార్ కూడా కొనేశారు కదరా'
ఆస్కార్ రావడం భారతీయులందరికీ ఎంతో గర్వకారణమైన విషయం. కానీ సౌత్ సినిమాలకు ఈ అవార్డులు రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు(ఆర్ఆర్ఆర్) పాటకు, బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరీలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే! ఇది జీర్ణించుకోలేకపోయిన కొందరు ఈ రెండు చిత్రాలపై అక్కసు వెల్లగక్కుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మేకప్ ఆర్టిస్ట్, క్లోజ్ ఫ్రెండ్ షాన్ ముట్టతిన్ ఆస్కార్ విజయంపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'హహ్హ, ఇది భలే ఉంది. ఇండియాలో ఈజీగా అవార్డులు కొనేస్తారనుకున్నాను కానీ ఏకంగా ఆస్కార్‌ను కూడా కొనేస్తారని ఊహించలేదు. అంతా డబ్బు మహిమ, డబ్బుంటే ఏదైనా సాధ్యమవుతుంది. అది ఆస్కార్ అయినా!' అని ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కింద కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవగా నెటిజన్లు మండిపడుతున్నారు. అతడు ఇలా ఆర్ఆర్ఆర్ను ఆడిపోసుకోవడానికి కారణం లేకపోలేదు. తన స్నేహితురాలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించిన 'టెల్ ఇట్ లైక్ ఎ వుమెన్' సినిమాలోని అప్లాజ్ కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌కు పోటీపడింది. అయితే ఆ పాటను వెనక్కు నెట్టి నాటునాటుకు అకాడమీ అవార్డు రావడంతో అతడు అసూయ పడుతున్నాడు. అయినా మరీ అంత జెలసీ పనికిరాదని బుద్ధి చెప్తున్నారు నెటిజన్లు. -
ఆర్ఆర్ఆర్కు పోటీగా జాక్వెలిన్ మూవీ.. ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు
ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత దక్కడంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఐదు చిత్రాలు ఎంపికయ్యాయి. 95వ ఆస్కార్ -2023 నామినేషన్లను జనవరి 24న తేదీన ప్రకటించారు. మార్చి 13న ఈ అవార్డులను ఎంపికైన వారికి ప్రదానం చేయనున్నారు. అయితే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సాంగ్ 'నాటు నాటు'తో పాటు మరో ఐదు చిత్రాలు పోటీలో నిలిచాయి. అందులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన 'టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్' చిత్రంలోని అప్లాజ్ అనే సాంగ్ ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. దీంతో ఈ విభాగంలో ఆర్ఆర్ఆర్కు పోటీగా నిలిచింది. జాక్వెలిన్ మాట్లాడుతూ, "టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ టీమ్‌ని చూసి నేను చాలా గర్వపడుతున్నా. ముఖ్యంగా చప్పట్లతో అద్భుతమైన సంగీతాన్ని సృష్టించిన డయాన్, సోఫియా గురించి నేను చాలా గర్వపడుతున్నా. ఈ సినిమా చేసిన అనుభవం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ ఆస్కార్ నామినేషన్స్‌తో అనుబంధం కలిగి ఉండటం చాలా ప్రత్యేకమైనది.' అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆర్ఆర్ఆర్ సాంగ్ ఆస్కార్ నామినేట్ కావడం పట్ల జాక్వెలిన్ ఆర్ఆర్ఆర్ బృందానికి సోషల్ మీడియాలో అభినందనలు తెలిపింది. ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ జాబితా ఇదే నాటు నాటు (ఆర్ఆర్ఆర్) అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్) హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్) లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్) ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) -
డేటింగ్ చేయమని రోజు పది సార్లు కాల్ చేసేది.. నటిపై సంచలన ఆరోపణలు
సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరును కూడా ఈడీ చేర్చింది. అయి తే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వివరించాడు. మరో నటి నోరా ఫతేహిపై సంచలన ఆరోపణలు చేశాడు. నోరా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై ఎప్పుడూ అసూయపడేదని సుకేశ్ విచారణలో తెలిపాడు. తాను జాక్వెలిన్‌తో రిలేషన్లో ఉండగా.. తనను బ్రెయిన్‌వాష్ చేయడానికి ప్రయత్నించేదని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. నేను జాక్వెలిన్‌ను విడిచిపెట్టి ఆమెతో డేటింగ్ చేయాలని కోరిందని సుకేశ్ వివరించారు. నోరా నాకు రోజుకు కనీసం 10 సార్లు కాల్ చేసేదని ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. నోరా ఫతేహి ఈడీ ముందు తప్పుడు వాంగ్మూలాన్ని ఇచ్చిందని ఆరోపించారు. ఆమె దుర్మార్గపు ఆలోచనలతో తమను మోసం చేసిందని పేర్కొన్నాడు. అయితే జాక్వెలిన్ ఇచ్చిన వాంగ్మూలంపై తాను మాట్లాడదలచుకోలేదని అన్నారు. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించిన వివరాలతో దిల్లీ పోలీసులు అనుబంధ ఛార్జిషీట్లో దాఖలు చేసినట్లు తెలుస్తోంది. జాక్వెలిన్ గురించి సుకేశ్ ప్రస్తావిస్తూ.. 'ఆమె నేను గౌరవించే వ్యక్తి. ఆమె ఎల్లప్పుడూ నా జీవితంలో భాగం. ఆమెతో నాతో ఉంటే సంతోషం. ఈ కేసు ఆమెను ఎలా ప్రభావితం చేసిందో నాకు తెలుసు. జాక్వెలిన్‌ను చూసుకోవడం నా బాధ్యత. ఆమెకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు.' అని అన్నారు. కాగా.. బాలీవుడ్ నటి జాక్వెలిన్ మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. -
అతని వల్ల నా కెరీర్ మొత్తం నాశనం: ప్రముఖ నటి
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో కీలక విషయాలు వెల్లడించింది. కోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో సుకేశ్ చంద్రశేఖర్‌పై సంచలన కామెంట్స్ చేసింది. కాగా ఈ కేసులో కీలక నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌పై బాలీవుడ్ నటి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. అతని వల్లే తన కెరీర్ పూర్తిగా నాశమైందని వాపోయింది. సుకేశ్ తన భావోద్వేగాలతో ఆడుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. జాక్వెలిన్ మాట్లాడుతూ..'సుకేష్ చంద్రశేఖర్ నా కెరీర్ నాశనం చేశాడు. అతను ఒక మోసగాడు. నేను అతని తప్పులను గుర్తించలేకపోయా. నన్ను నయవంచనకు గురిచేశాడు. తనను తప్పుదారి పట్టించాడు. నా భావోద్వేగాలతో ఆడుకున్నాడు.' అంటూ తన వాంగ్మూలంలో వివరించింది. ఈ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. కాగా.. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఇటీవలే ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. -
ఆమె వల్లే అన్ని కోల్పోయా.. బాలీవుడ్ నటి సంచలన ఆరోపణలు
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై మరో నటి నోరా ఫతేహి పరువునష్టం దావా వేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నా కెరీర్ నాశనం చేసేందుకు యత్నించారని నోరా ఆరోపించింది. ఆమె వ్యాఖ్యలతో షోలు, ప్రముఖ బ్రాండ్ ఒప్పందాలు కోల్పోయానని వెల్లడించింది. ఆ వార్తలు మీడియాలో రావడంతో తన పరువు పోయిందని ఆమె అన్నారు. జాక్వెలిన్ తన పట్ల ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిందని నోరా ఆరోపించింది. ఈ మేరకు దిల్లీ కోర్టులో జాక్వెలిన్‌పై పరువునష్టం దావా వేసింది బాలీవుడ్ భామ. (ఇది చదవండి: హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు బెయిల్) గతంలో జాక్వెలిన్ కోర్టు ముందు రాతపూర్వక వివరణ ఇచ్చింది. ఈ కేసులో ఈడీ నన్ను తప్పుగా చూపిస్తోందని.. నోరా ఫతేహి లాంటి ప్రముఖులు సుకేష్ చంద్రశేఖర్ నుంచి బహుమతులు కూడా పొందారని తెలిపింది. అయితే సుఖేష్ నుంచి తనకు ఎలాంటి బహుమతులు అందలేదని.. నేరుగా అతనితో ఎలాంటి సంబంధం లేదని నోరా పేర్కొంది. ఈ పిటిషన్లో అనేక మీడియా సంస్థల పేర్లను కూడా ఆమె పేర్కొంది. మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేయడం సామూహిక దాడి చేయడంతో సమానమని నోరా ఫతేహీ ఆరోపించింది. తనపేరును అన్యాయంగా లాగారని.. ఇదంతా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆదేశాల ప్రకారమే జరిగిందని తెలిపింది. మరోవైపు జాక్వెలిన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. నోరాపై చాలా గౌరవం ఉందని .. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇద్దరు నటీమణులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిందని తెలిపారు. -
మీ సర్జరీల మాటేమిటి..? నటిపై దారుణంగా ట్రోల్స్
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్లో బాగా గుర్తింపు తెచ్చుకున్న నటి. గతంలో ఆమె ప్లాస్టిక్ సర్జరీలపై మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీంతో ఆమెను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మీ అందం కోసం చేయించుకున్న సర్జరీల మాటేమిటి అని ప్రశ్నిస్తున్నారు. 2006లో శ్రీలంక మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్లాస్టిక్ సర్జరీలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. 'ప్లాస్టిక్ సర్జరీ మహిళల సహజ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. అలా చేయించుకోవడం వల్ల వచ్చే అందం నిజమైంది కాదు. అలాంటి వాటికి నేను పూర్తిగా వ్యతిరేకిని' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్‌మీడియా వేదికగా ఈ వీడియోపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇప్పటిదాకా మీరు ఎన్నిసార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. అందంగా కనిపించడం కోసం మీరు చేయించుకున్న శస్త్రచికిత్సల మాటేమిటి' అని ప్రశ్నించారు. తాజాగా జాక్వెలిన్ సర్కస్ ట్రైలర్ ప్రీమియర్‌లో కనిపించింది. అక్షయ్‌కుమార్ ప్రధానపాత్రలో నటించిన రామ్ సేతు చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. View this post on Instagram A post shared by Pageant 💫 Influence (@pageantandinfluence) -
Ram Setu Review: ‘రామ్ సేతు’ మూవీ రివ్యూ
టైటిల్: రామ్ సేతు నటీనటులు: అక్షయ్ కుమార్, నాజర్, సత్యదేవ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరూచా తదితరులు నిర్మాతలు: అరుణా భాటియా, విక్రమ్ మల్హోత్రా, సుభాస్కరన్, మహావీర్ జైన్, ఆశిష్ సింగ్, ప్రైమ్ వీడియో దర్శకత్వం : అభిషేక్ శర్మ సంగీతం: డేనియల్ బి జార్జ్ సినిమాటోగ్రఫీ: అసీమ్ మిశ్రా ఎడిటర్: రామేశ్వర్ ఎస్ భగత్ విడుదల తేది: అక్టోబర్ 25, 2022 అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రామ్ సేతు’. రామ్ సేతు విశిష్టత, దాన్ని రక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో యంగ్ అండ్ టాలెంట్ హీరో సత్యదేవ్ మరో కీలక పాత్ర పోషించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరూచా హీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా నేడు( అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘రామ్ సేతు’ కథేంటంటే.. ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రకాంత్ (నాజర్) రామసేతును నాశనం చేస్తూ.. సేతుసముద్రం పేరుతో ఒక ప్రాజెక్ట్‌ను నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. ఇది జరగాలంటే భారతీయులు విశ్వసిస్తున్నట్లు రామసేతును శ్రీరాముడు నిర్మించలేదని, అది సహజసిద్దంగా ఏర్పడిందని నిరూపించాలి. దీని కోసం భారత్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్, పురావస్తు శాఖ జాయింట్ డైరెక్టర్ ఆర్యన్(అక్షయ్ కుమార్)తో ఓ రిపోర్ట్‌ని ఇప్పిస్తాడు. దీంతో అర్యన్‌కు లేనిపోని చిక్కులు వచ్చిపడతాయి. ఆయన ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ కారణంగా ఉద్యోగం కూడా కోల్పోతాడు. అయితే రామసేతు మీద మరింత పరిశోధన చేయమని, అన్ని విధాలుగా తోడుగా ఉంటానని ఇంద్రకాంత్ హామీ ఇవ్వడంతో ఆర్యన్ వారి టీమ్‌లో చేరిపోతాడు. రామసేతు మీద పూర్తిగా పరిశోధించేందుకు వెళ్లిన ఆర్యన్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? ఆర్యన్ టీమ్ ఎందుకు శ్రీలంకకు వెళ్లాల్సి వచ్చింది? ఇంద్రకాంత్ వేసిన ప్లాన్ ఏంటి? శ్రీలంక ప్రయాణంలో ఆర్యన్ టీమ్‌కు ఏపీ(సత్యదేవ్)ఎలాంటి సహాయం చేశాడు. గైడ్‌గా చెప్పుకున్న ఏపీ ఎవరు? చివరకు ఆర్యన్ ‘రామసేతు’పై ఆధారలతో సహా ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. రామ్ సేతు ఒక అడ్వెంచర్ థ్రిల్లర్. రామసేతుని స్వయంగా శ్రీరాముడే నిర్మించాడని భారతీయులు విశ్వసిస్తారు. రామసేతు వేనుక ఉన్న రహస్యం ఏంటి? అనేది అందరికి ఆసక్తికరమైన అంశమే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్‌ని తీసుకొని ‘రామ్ సేతు’ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అభిషేక్ శర్మ. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. దానికి తగ్గట్టుగా కథనాన్ని నడిపించడంలో విఫలమయ్యాడు. వాస్తవ గాధకు కల్పనను జోడించి కథనాన్ని నడిపించాడు. ఇలాంటి చిత్రాలకు ప్రేక్షకులను కట్టిపడేసేలా స్క్రీన్‌ప్లే ఉండాలి. ఈ చిత్రంలో అది మిస్ అయింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అంతగా ఆకట్టుకోవు. కానీ ప్లస్ ఏంటంటే.. రామసేతు నిర్మాణానికి సంబంధించిన అనేక వాస్తవాలను ఈ చిత్రంలో చూపించారు. శ్రీలకంలో రావణాసురుడి ఆనవాళ్లు ఉన్నాయని, రామాయణం ప్రకారం రావణుడు ఉన్నాడంటే.. రాముడు కూడా ఉన్నట్లే కదా అని ఈ చిత్రం సారాంశం. శ్రీలంకలో ఉన్న త్రికూటరపర్వతం, అశోకవనం, స్వర్ణలంక ఇలా అన్నింటిని ఈ చిత్రంలో చూపించారు. అయితే హీరో టీమ్ చేసే పరిశోధన మాత్రం ఆసక్తికరంగా సాగదు. పేలవమైన స్క్రీన్‌ప్లే, పసలేని డైలాగ్స్, చప్పగా సాగే కీలక సన్నివేశాలు సినిమా స్థాయిని తగ్గించాయి. నిర్మాణ విలువలు కూడా అంత ఉన్నతంగా ఉన్నట్లు కనిపించవు. ఎవరెలా చేశారంటే.. ఆర్కియాలజిస్ట్ ఆర్యన్గా అక్షయ్ చక్కగా నటించాడు. తన పాత్రకు తగినట్టుగా ప్రొఫెషనల్‌గా తెరపై కనిపించాడు. గైడ్ ఏపీగా సత్యదేవ్ తనదైన నటనతో మెప్పించాడు. ఆయన ఎవరో అని రివీల్ చేసే సీన్ ఆకట్టుకుంటుంది. ఆర్యన్ టీమ్మెంబర్గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన పాత్రకు న్యాయం చేసింది. నాజర్, నుస్రత్ బరూచాతో పాటు ఇతన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. డేనియల్ బి జార్జ్ సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫర్ అసీమ్ మిశ్రా. ఎడిటర్ రామేశ్వర్ ఎస్ భగత్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు పేలవంగా ఉన్నాయి. - అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు బెయిల్
Jacqueline Fernandez Bail: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. 200కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరయ్యింది. తదుపరి విచారణను అక్టోబర్ 22కి వాయిదా వేసింది. కాగా సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌ను నిందితురాలిగాపేర్కొంటూ రెండో అనుబంధ ఛార్జిషీట్‌ను ఆగస్టు 17న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సెప్టెంబర్ 26 కోర్టుల ఎదుట హాజరు కావాలంటూ ఆమెకు సమన్లు జారీ అవగా, సోమవారం జాక్వెలిన్ న్యాయవాదితో కలిసి కోర్టుకు హాజరయ్యింది. ఈ క్రమంలో విచారణ సందర్భంగా ఆమెకు బెయిల్ ఇవ్వాలంటూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తరపు న్యాయవాది కోర్టుకు దరఖాస్తు సమర్పించారు. దీనిపై అదనపు సెషన్స్ జడ్జి శైలేందర్ మాలిక్ ఈడీ స్పందన కోరింది. అయితే అప్పటికే రెగ్యులర్ బెయిల్ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున అప్పటివరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని జాక్వెలిన్ న్యాయవాది కోరారు. దీన్ని అంగీకరిస్తూ రూ.50 వేల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్‌ను ఢిల్లీ పాటియాల కోర్టు మంజూరు చేసింది. -
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు.. మరోసారి జాక్వెలిన్‌కు సమన్లు
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల వసూళ్ల కేసుతోపాటు మనీ లాండరింగ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ పోలీసు శాఖ ఆర్థికనేరాల విభాగం అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ప్రముఖ వ్యక్తులను మోసగించి, రూ.200 కోట్లు దండుకుంటున్నట్లు ఆరోపణలున్న సుఖేశ్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒకదశలో సుఖేశ్‌ను పెళ్లి చేసుకోవాలని జాక్వెలిన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు: జాక్వెలిన్‌కు బిగుస్తున్న ఉచ్చు..
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా ఆమెకు డిల్లీ పాటియాల హౌజ్ కోర్టు షాకిచ్చింది. సెప్టెంబర్ 26వ తేదీన కోర్టులో హాజరు కావాలని జాక్వెలిన్‌ను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కోర్టు ఆమెకు సమాన్లు ఇచ్చింది. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పరిగణించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల జాక్వెలిన్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్‌పై నమోదు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌లో జాక్వెలిన్ పేరును చేర్చింది ఈడీ. ఈ ఛార్జ్‌షీట్‌ను ఈడీ కోర్టులో సమర్పించగా దాని ఆధారంగా తాజాగా కోర్టు జాక్వెలిన్‌కు సమాన్లు జారీ చేసింది. చదవండి: సుమన్ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్ చానళ్లకు నటుడు వార్నింగ్ కాగా రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లను రూ.200 కోట్లకు మోసం చేసిన కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనితో జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. అతని నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్లు గుర్తించారు. ఇప్పటికే జాక్వెలిన్‌కు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే.. ఈడీ అటాచ్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు తన కష్టార్జితమని జాక్వెలిన్ ఇప్పటికే స్పష్టం చేసింది. తన సంపాదనకు సంబంధించి ఆదాయపు పన్ను కూడా చెల్లించానని, క్రైమ్ ప్రొసీడింగ్స్‌ను నిలిపి వేయాలని జాక్వెలిన్ ఈడీని కోరిన సంగతి తెలిసిందే. చదవండి: యాంకర్ సుమ పెళ్లి చీర ధరెంతో తెలుసా? అదే ఆమె రేంజ్ అట నటుడు బ్రహ్మాజీ సటైరికల్ ట్వీట్.. అనసూయను ఉద్ధేశించేనా? -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ 'విక్రాంత్ రోణ'
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన చిత్రం విక్రాంత్ రోణ. గ్లామరస్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్గా నటించింది. అనూప్ భండారి డైరెక్ట్ చేయగా మంజునాథ్ గౌడ్ నిర్మించారు. జూలై 28న రిలీజైన ఈ పాన్ ఇండియా మూవీ అంచనాలకు తగ్గట్టుగానే భారీగానే వసూళ్లు రాబట్టింది. కేవలం రిలీజైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజైన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. జీ5 విక్రాంత్ రోణ డిజిటల్ రైట్స్‌ను భారీ మొత్తానికి దక్కించుకుంది. తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ 2 నుంచి జీ 5లో ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక కొద్దిరోజులు ఆగారంటే విక్రాంత్ రోణను ఎంచక్కా కూర్చున్న చోటే వీక్షించేయవచ్చు. The devil will take over @ZEE5Kannada @KicchaSudeep @anupsbhandari @JackManjunath @shaliniartss @ZeeStudios_ #VikrantRonaOnZee5 https://t.co/vjt1XW0ziw — VikrantRona (@VikrantRona) August 25, 2022 ಇದೇ September 2nd ಬರ್ತಿದ್ದಾನೆ ವಿಕ್ರಾಂತ್ ರೋಣ ನಿಮ್ಮ Zee5 ಅಲ್ಲಿ! Stay tuned@KicchaSudeep @anupsbhandari @nirupbhandari @Asli_Jacqueline @neethaofficial @AJANEESHB @williamdaviddop @shaliniartss @shivakumarart @AlwaysJani @ZeeStudios_ @ZeeKannada @RavishankarGow5 @vasukivaibhav#VR pic.twitter.com/MEpDbecYCt — ZEE5 Kannada (@ZEE5Kannada) August 25, 2022 చదవండి: పూరీ దగ్గర సుక్కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడా! పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్లో కీర్తి సురేష్.. ఏ సినిమాలో అంటే -
జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు షాక్ ఇచ్చిన ఈడీ
-
ఈడీ షాక్.. రూ.200 కోట్ల దోపిడీ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాక్ ఇచ్చింది. సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్‌ని నిందితురాలిగా ఈడీ పరిగణించింది. ఈ మేరకు జాక్వెలిన్ పేరును ఢీల్లీ కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌లో చేరుస్తూ..ఆమెను నిందితురాలిగా పేర్కొంది. రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లను రూ.200 కోట్లకు మోసం చేసిన కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనితో జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. అతని నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్లు గుర్తించారు. ఇప్పటికే జాక్వెలిన్‌కు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. (చదవండి: త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న బుల్లితెర నటి) రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తామని నమ్మించి వారి భార్యల నుంచి రూ. 200 కోట్లు వసూల్ చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. ఆ తర్వాత బెయిల్ విషయాన్ని దాటవేశాడు. దీంతో శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాదిలో ఢిల్లీ పోలీసులు సుకేశ్ అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన ఈడీ.. ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసింది. -
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కట్టుకున్న ఈ చీర ధర ఎంతంటే?
‘చిటియా కలైయా వే.. ఓ బేబీ మెరీ చిటియా కలైయా వే’ అనే ఈ హిందీ (‘రాయ్’ సినిమా) పాట భాషాకతీతంగా ఎంత హిట్టో తెలియని సినీ ప్రేక్షకుల్లేరు. అలాగే ఆ పాట మీద డాన్స్ చేసిన ఆ మూవీ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రతిభ గురించి కూడా పరిచయం లేని అభిమానుల్లేరు. ఇక జాక్వెలిన్ స్టైల్ గురించి, ఫ్యాషన్‌లో ఆమెకున్న అభిరుచి, ఆమె ఫ్యాషన్ సెన్స్‌ను తెలిపే బ్రాండ్స్ ఏంటో చూద్దామా ! 'నా దృష్టిలో ఫ్యాషన్ అంటే సౌకర్యమే. 1990ల చివర్లో వచ్చిన ట్రెండ్స్ అంటే నాకు భలే ఇష్టం' అని ఫ్యాషన్‌పై తనకున్న మమకారాన్ని తెలిపింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఆమె ఎక్కువగా వాడే బ్రాండ్స్‌లలో 'రోజ్ రూమ్' ఒకటి. ఈ 'రోజ్ రూమ్' బ్రాండ్ చీర ధర రూ. 15, 500. ఇక జ్యూయెలరీ విషయానికొస్తే 'అమ్రిస్'ను ఎక్కుగా ప్రిఫర్ చేస్తుంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ బ్రాండ్‌లోని నెక్లెస్, కమ్మలు, ఉంగరం ధరలు నాణ్యత, డిజైన్ బట్టి ఉంటాయి. రోజ్ రూమ్: ‘ఓ స్త్రీగా నాలో నేను దేన్ని నమ్ముతాను.. ఎలా ఉండాలనుకుంటాను.. ఏం కోరుకుంటానో అవే నా డిజైన్స్ ద్వారా చెప్పాలనుకుంటాను. నా దృష్టిలో దేవుడి అద్భుతమైన సృష్టి స్త్రీ. నా బ్రాండ్ ఆమెను మరింత అద్భుతంగా మలస్తుంది’ అంటోంది ‘రోజ్ రూమ్’ లేబుల్ వ్యవస్థాపకురాలు ఇషా. ఇంతకు మించి ఈ బ్రాండ్‌కు వివరణ, వర్ణన ఏం ఉంటుంది! ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ధరలూ అందుబాటులోనే. అమ్రిస్: పన్నెండేళ్ల కిందట మొదలైందీ బ్రాండ్. వ్యవస్థాపకురాలు.. ప్రేరణ రాజ్‌పాల్. నగల పట్ల, నగల డిజైన్స్ పట్ల తన అత్తగారికున్న ఆసక్తి, అభిరుచితో స్ఫూర్తి పొంది ఈ జ్యూయెలరీ బ్రాండ్‌ను స్థాపించారు ఆమె. అనతికాలంలోనే ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్‌తోపాటు దుబాయ్, సింగపూర్, న్యూయార్క్ వంటి ప్రపంచ నగరాలకూ అమ్రిస్ను విస్తరించారు. నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధరలు. -
Vikrant Rona Review: విక్రాంత్ రోణ మూవీ రివ్యూ
టైటిల్ : విక్రాంత్ రోణ నటీనటులు :కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మధుసూదన్ రావు తదితరులు నిర్మాత: జాక్ మంజునాథ్, అలంకార్ పాండియన్ దర్శకత్వం: అనూప్ భండారి సంగీతం : అజనీష్ లోకనాథ్ సినిమాటోగ్రఫీ: విలియం డేవిడ్ విడుదల తేది: జులై 28, 2022 కథేంటంటే.. కొమరట్టు గ్రామంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ ఊర్లో ఓ పాడుబడ్డ ఇంట్లోని బావిలో శవాలు కనిపిస్తుంటాయి. బ్రహ్మరాక్షసుడే వీరందరినీ చంపుతున్నాడని గ్రామస్తుల నమ్మకం. ఊరిపెద్ద జనార్థన్ గంభీర్(మధుసూదన్‌రావు), అతని తమ్ముడు ఏక్నాథ్ గంభీర్(రమేశ్ రాయ్)కూడా గ్రామ ప్రజలకు ఇదే విషయాన్ని చెప్పి ఆ ఇంటివైపు ఎవరినీ వెళ్లకుండా చేస్తారు. అయితే ఓ సారి ఆ ఊరి ఎస్సై ఆ పాడుబడ్డ ఇంటికి వెళ్లగా.. తెల్లారి బావిలో శవమై కనిపిస్తాడు. అతని మొండెం మాత్రమే లభిస్తుంది కానీ తల కనిపించదు. ఈ హత్య కేసును చేధించడానికి ఆ ఊరికి కొత్త ఎస్సై వస్తాడు. అతనే విక్రాంత్ రోణ(కిచ్చా సుధీప్). ఈ కేసు విచారణలో అతనికి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఆ గ్రామానికి చెందిన స్కూల్ పిల్లలు పదుల సంఖ్యలో హత్యకు గురయ్యారని తెలుస్తుంది. మరి పిల్లల హత్యకు కారకులు ఎవరు? ఎందుకు హత్య చేశారు? ఆ ఊరికి కొత్తగా వచ్చిన సంజు(నిరూప్ భండారి)ఎవరు? గ్రామస్తులను భయపెడుతున్న బ్రహ్మరాక్షసుడు ఎవరు? ఎస్సై హత్య కేసుతో విక్రాంత్ వ్యక్తిగత జీవితానికి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే విక్రాంత్ రోణ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. విక్రాంత్ రోణ..ఇదొక యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రమని తొలి నుంచి చిత్రబృందం చెప్పుకుంటూ వచ్చింది. ట్రైలర్, టీజర్లో కూడా ఆ విధంగానే చూపించింది. పైగా పాన్ ఇండియా మూవీ అనగానే.. కేజీయఫ్ తర్వాత కన్నడ నుంచి మరో భారీ మూవీ రాబోతుందని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇది కూడా కేజీయఫ్ రేంజ్లో ఉంటుందని ఊహించారు. కానీ దర్శకుడు అనూప్ భండారి నిరాశపరిచాడు. తెరపై విజువల్స్, వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ.. కథలో పసలేదు. అసలు దర్శకుడు ఏ జానర్లో ఈ కథను తెరకెక్కించాలనుకున్నాడో సరైన క్లారిటీ లేదనిపిస్తుంది. ఓ తల్లీకూతుళ్లు అర్ధరాత్రి కొమరట్టుకు బయలుదేరగా.. ముసుగులో ఉన్న కొంతమంది వారిని హత్య చేయడంతో కథ ప్రారంభమవుతుంది. ఆ ఊరిలో ఏదో జరుగుతుంది. ఆ పాడుబడ్డ ఇంట్లో ఎవరు ఉన్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది. ఎస్సై విక్రాంత్ రోణ ఎంట్రీతో కథలో స్పీడ్ పెరుగుతుంది. యాక్షన్ ఎపిసోడ్ బాగున్నప్పటికీ.. వరుస హత్యల రహస్యాన్ని చేధించే సీన్స్ ఆసక్తికరంగా సాగవు. దానికి తోడు సంజు లవ్‌ట్రాక్, మదర్ సెంటిమెంట్ అంతగా ఆకట్టుకోకపోవడం సినిమాకు పెద్ద మైనస్. మధ్య మధ్య వచ్చే కొన్ని భయంకర సన్నివేశాలు మినహా.. కథ ఎక్కడా ఆకట్టుకునే విధంగా ఉండదు. ఎవరెలా చేశారంటే.. విక్రాంత్ రోణ పాత్రలో సుదీప్ ఒదిగిపోయాడు. తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. సంజుగా నిరూప్ బండారి పర్వాలేదు. క్లైమాక్స్‌లో అతని పాత్ర సర్ప్రైజ్ చేస్తుంది. అపర్ణగా నీతా అశోక్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఫక్రూగా కార్తీక్ రావు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక రక్కమ్మగా జాక్వెలిన్ తనదైన అందచందాలతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటుల పాత్రలకు అంతగా ప్రాధాన్యత లేకున్నా.. తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అజనీష్ నేపథ్య సంగీతం చాలా బాగుంది. రారా రక్కమ్మ పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. శివ కుమార్ ఆర్ట్‌వర్క్ అద్భుతంగా ఉంది. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. విలినియం సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.