somu veerraju
-
ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా రెడీ.. వీరి పేర్లు ఖరారు?
సాక్షి, ఢిల్లీ/ విజయవాడ: పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ, జనసేనలతో పొత్తు ఒప్పందంలో బీజేపీకి కేటాయించిన ఆరు లోక్‌సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకు సిద్ధంచేసిన జాబితాకు ఆమోదముద్ర పడింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో గత కొన్నిరోజులుగా రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేసి సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితాపై కూలంకషంగా చర్చించారు. ఇక, నేడు మరోసారి పార్లమెంటరీ బోర్డు సమావేశమయ్యే అవకాశముంది. ఈరోజు సాయంత్రానికి ఫైనల్ జాబితాపై క్లారిటీ రానున్నట్టు సమాచారం. కాగా, మరో రెండు రోజుల్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నరసాపురం, రాజంపేట, తిరుపతి పార్లమెంట్ స్ధానాలకు అభ్యర్ధులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కాగా, బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఆశించిన జీవీఎల్, పీవీఎన్ మాధవ్‌లకు నిరాశే ఎదురైనట్టు సమాచారం. మరోవైపు.. సోము వీర్రాజు విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తే సోము వీర్రాజుని అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల అంచనా.. అనకాపల్లి- సీఎం రమేష్, అరకు- కొత్తపల్లి గీత, రాజమండ్రి- పురంధేశ్వరి, నరసాపురం- మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు లేదా శ్రీనివాస వర్మ, రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి- మాజీ ఐఎఎస్ వరప్రసాద్ లేదా రత్నప్రభ పేర్లు ప్రచారం. -
బీజేపీకి ‘మూడొ’చ్చింది
పి.గన్నవరం నుంచి అయ్యాజీ వేమా సాక్షి ప్రతినిధి, కాకినాడ: బీజేపీకి ‘మూడొ’చ్చింది. విపక్ష కూటమిలోకి వచ్చీ రాగానే ఉమ్మడి తూర్పు గోదావరిలోని మూడు జిల్లాల్లో మూడు ఎమ్మెల్యే సీట్ల కోసం ఆ పార్టీ పట్టుపడుతోంది. లోక్‌సభ స్థానాలకు వచ్చేసరికి గతంలో తాము గెలుపొందిన రాజమహేంద్రవరం తమకు ఇవ్వాల్సిందేనని కమలనాథులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పార్టీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు, తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముళ్లపూడి రేణుక పేర్లు పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు. దీంతోపాటు మూడు అసెంబ్లీ స్థానాలు కూడా కావాలనేది బీజేపీ ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఆ మూడు ఏవంటే కమలనాథుల దృష్టి కాకినాడ సిటీ, అమలాపురం, పి.గన్నవరం, అనపర్తి అసెంబ్లీ స్థానాలపై పడింది. ఈ నాలుగింటిలో మూడింటిని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. పట్టణ ఓటర్లు అధికంగా ఉన్న కాకినాడ సిటీ, గతంలో గెలుపొందిన పి.గన్నవరం (ఎస్సీ) స్థానంపై వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. పి.గన్నవరం నుంచి టీడీపీ తన అభ్యర్థిగా తొలుత సరిపల్లి రాజేష్ ను ప్రకటించింది. దీనిపై సొంత పార్టీతోపాటు వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో రాజేష్ తనంత తానుగానే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్ అయింది. ఇక్కడ వివాదాల కారణంగా ఈ సీటును బీజేపీకి విడిచిపెట్టేస్తే ఎలా ఉంటుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహచర నేతలతో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. పి.గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమాకు మద్దతుగా బీజేపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలు ఇప్పటికే పార్టీ పెద్దలకు ప్రతిపాదించారు. అమలాపురం సీటు కోసం టీడీపీ, జనసేనల్లో ఆశావహులు బస్తీ మే సవాల్ అంటూ కాలు దువ్వుతున్నారు. రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తున్నా ఇరు పార్టీల అగ్ర నాయకత్వాలు మాత్రం నోరు మెదపడం లేదు. దీనిపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో కూటమి నేతలున్నారు. ఇంకా తర్జనభర్జనలే జనసేన తొలుత ఆశించిన కాకినాడ సిటీ విషయంలో కూటమి నుంచి ఇంతవరకూ స్పష్టత రాలేదు. కాకినాడ రూరల్ ఎలాగూ ఆ పార్టీకి ఖరారు చేయడం, పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో సిటీపై జనసేన ఆశలు వదిలేసుకుంది. పట్టణ ఓటర్లపై దృష్టి పెట్టిన బీజేపీ ఇప్పుడా సీటును ఆశిస్తోంది. సిటీ సీటు కోసం కైట్ విద్యా సంస్థల చైర్మన్ పోతుల విశ్వం, బీజేపీ నాయకుడు డాక్టర్ ముత్తా వంశీ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ రెండింటితోపాటు రాజమహేంద్రవరం సిటీ స్థానాన్ని కూడా బీజేపీ మొదటి నుంచీ కోరుతోంది. ఈ స్థానానికి టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసును టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ కాదన్న చంద్రబాబు..ఇదే జిల్లాలో వైఎస్సార్సీపీ బలంగా ఉన్న అనపర్తిని బీజేపీకి వదిలేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. దీనిపై టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలు రావడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి బీజేపీకి అనపర్తి సీటుని కేటాయిస్తారంటూ బలమైన ప్రచారమే జరుగుతోంది. బీజేపీ నుంచి సోము వీర్రాజు పేరు ప్రతిపాదిస్తున్నారని కమలనాథులు చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఉండబట్టే టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి కనుసన్నల్లోనే ఆయన అనుచరులు అనపర్తి ఎస్ఎన్ఆర్ కల్యాణ మండపంలో శనివారం హడావిడిగా మూడు మండలాల పార్టీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. నల్లమిల్లికి సీటు ఇవ్వాల్సిందేనని తీర్మానించడమే కాకుండా రామవరంలోని ఆయన ఇంటికి ర్యాలీగా వెళ్లి సీటు విషయంలో సంఘీభావం ప్రకటించారు. -
ఒక కార్యకర్తగానైనా పని చేస్తా: సోము వీర్రాజు
సాక్షి, హైదరాబాద్: ఏపీ బీజేపీ చీఫ్‌గా పురంధేశ్వరి నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు. మార్పులు చేర్పులపై తనకు బాధ లేదని.. ఒక కార్యకర్తగా కూడా పార్టీ కోసం పని చేస్తానని అన్నారాయన. అలాగే.. పురంధేశ్వరి నాయకత్వంలో అందరం కలిసి పని చేస్తాం అని ఆయన ప్రకటించారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా పదవీ కాలం ముగియడంతో ఆయనకు మరో ఛాన్స్ ఇవ్వకుండా బాధ్యతల నుంచి తప్పించి.. దగ్గుబాటి పురంధేశ్వరిని నూతన అధ్యక్షురాలిగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం. ఇదీ చదవండి: సారీ.. మరో ఛాన్స్ ఇవ్వలేం! -
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజు అవుట్?
సాక్షి, విశాఖపట్నం: బీజేపీ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి మార్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు జేపీ నడ్డా ఫోన్ చేసినట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీకాలం ముగిసింది. అయితే మరోసారి బీజేపీ అధ్యక్షుడిగా అవకాశం లేదంటూ జాతీయ అధిష్టానం స్పష్టం చేయడంతో ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని ఎంపిక చేయనున్నారు. కాగా సోము వీర్రాజు 2020 జులై 27 నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే.. కీలక బాధ్యతల అప్పగింత హామీని ఆయనకు అధిష్టానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక కాషాయ పార్టీకి కొత్త బాస్ రేసులో సత్యకుమార్, సుజనా చౌదరి, జీవీఎల్, పురందేశ్వరి పేర్లు ఉన్నట్లు సమాచారం. అయితే జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న సత్యకుమార్ వైపే అధిష్టానం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సాయంత్రం లోపు క్లారిటీ రానుంది. -
‘చంద్రబాబు ఎంతో ఇబ్బందిపెట్టారు.. మరిచిపోలేదు’
సాక్షి, తిరుపతి: రానున్న ఎన్నికల్లో అందరూ అనుకున్నట్లు టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని పారిచెర్లవారిపాళెం గ్రామంలో సోమవారం కేంద్ర ఐటీ సహాయ మంత్రి దేవూసిన్హ్ చౌహాన్‌తో కలసి ఉపాధి హామీ పథకం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో సోము వీర్రాజు మాట్లాడారు. బీజేపీ .. పొత్తులతో అధికారంలోకి రాదని, అందుకే రాష్ట్రంలో టీడీపీతో ఎలాంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోకూడదని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే జనసేనతో మాత్రం కలసి నడుస్తామన్నారు. గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఇబ్బంది పెట్టిన విషయం మరచిపోలేదని.. దీంతోనే కేంద్రంలోని పెద్దలు కూడా చంద్రబాబుతో పొత్తు అంటే అంగీకరించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో చంద్రబాబు పాలన సమయంలో రాష్ట్రానికి రూ.35వేల కోట్ల నిధులు ఇచ్చారని.. అయితే ఆయన వాటిని చంద్రన్న బాట పేరుతో ఖర్చుచేసి బీజేపీ ఏమి ఇవ్వలేదని చెప్పారని దుయ్యబట్టారు. ఇవాళ.. జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పలు పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేస్తున్నారని దీంతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. తిరుపతి జిల్లాలో 85 చెరువులను అమృత్ సరోవర్ పేరుతో ఆధునికీకరణ చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో తాము అందిస్తున్న సంక్షేమ పథకాలతోనే తమ పార్టీ అధికారంలోకి వస్తుందని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. ప్యాకేజీ చాలన్నది బాబే.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వద్దు ప్యాకేజీ చాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు. బీజేపీ పాలన చేపట్టి 9 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా చిత్తూరులోని గంగినేనిచెరువు పార్కు వద్ద నిర్వహించిన జిల్లా మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు. మోదీ పాలన దేశానికి ఆదర్శమన్నారు. చంద్రబాబు అమరావతిలో తాత్కాలిక రాజధాని నిర్మించారని ఆరోపించారు. బాబు పాలనలో సోమవారం పోలవరం అని కాలక్షేపం చేశారన్నారు. జనసేన, టీడీపీ పొత్తు విషయమై బాబునే ప్రశ్నించాలని చెప్పారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
చంద్రబాబుపై సోము వీర్రాజు ఫైర్
-
చంద్రబాబుపై సోమువీర్రాజు ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, ప్రకాశం: బీజేపీని అవమానించేలా మాట్లాడే వ్యక్తితో పొత్తు ఆలోచన ఎలా? చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. ఈ క్రమంలో.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. ప్రత్యేక హోదా వద్దన్నది చంద్రబాబే. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలన్నది చంద్రబాబే. ప్రధానులను మార్చే శక్తి ఉన్నవాడిని.. కేంద్రంలో చక్రం తిప్పానంటాడుగా. మరి అప్పుడు రైల్వేజోన్ ఎందుకు తేలేకపోయాడు. నోటాతో పోటీపడే పార్టీ బీజేపీ అన్నారుగా.. ఇప్పుడు మాతో ఎలా పొత్తు పెట్టుకుంటారని బీజేపీ ఏపీ చీఫ్ సోమువీర్రాజు నిలదీశారు. ఆ అర్హత లేదు సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా నిషేధించిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు శాంతిభద్రతల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు. చంద్రబాబు అధికారంలో ఉంటే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయా?. తిరుపతిలో హోంమంత్రి అమిత్ షాపై దాడి చేస్తే.. వాళ్ల మీద చర్యలు తీసుకున్నావా?. చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి.. లేకుంటే పద్ధతిగా ఉండదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారాయన. ఇదీ చదవండి: బాబూ.. శవాల మీద పేలాలు ఏరుకోకు! -
సోము వీర్రాజుకు నిరసన సెగ..!
-
మే 15 నుంచి బీజేపీ ప్రచార భేరి
రాజమహేంద్రవరం సిటీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిపాలన, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న తోడ్పాటును వివరిస్తూ మే నెల 15వ తేదీ నుంచి జూన్ 15 వరకు ప్రచార భేరి కార్యక్రమం చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్ తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మే 5 నుంచి 15 వరకు పది రోజులపాటు పోరాటం చేయడంతో పాటు చార్జిషీట్ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర మంత్రి, పార్టీ ఏపీ ఇన్చార్జి మురళీధరన్ నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపారు. అనంతరం కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ వివరాలను మాధవ్ మీడియాకు వివరించారు. వైఎస్సార్సీపీతో బీజేపీ కలిసి వెళ్తుందనే అసత్య ప్రచారం జరుగుతుందని.. దానిని తిప్పికొడతామని చెప్పారు. గతంలో తెలుగుదేశం కూడా రాష్ట్రంలో అరాచకాలు చేసిందన్నారు. అచ్చెన్నాయుడు, పితాని ఏదో ఊహించి మాట్లాడుతున్నారని చెప్పారు. పవన్ తమతోనే ఉన్నారని, వచ్చే ఎన్నికలకు జనసేనతోనే కలిసి వెళ్తామని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వంపై పోరాటం విషయంలో జనసేనతో కలిసి కార్యక్రమాల రూపకల్పనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. కోర్ కమిటీ సమావేశంలో పురందేశ్వరి, టీజీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీలో చేరిన వ్యాపారవేత్త రామచంద్రప్రభు గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, తులసి సీడ్స్ అధినేత రామచంద్ర ప్రభు శుక్రవారం రాజమహేంద్రవరంలో కేంద్ర మంత్రి మురళీధరన్ సమక్షంలో బీజేపీలో చేరారు. పధాని మోదీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి తన కుమారుడు తులసీ సీడ్స్ ఎండీ యోగేష్ చంద్రతో కలిసి బీజేపీలో చేరానని రామచంద్ర ప్రభు తెలిపారు. ఏపీలో బీజేపీ పటిష్టత కోసం కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. -
మా పొత్తు జనసేనతో మాత్రమే
సాక్షి, అమరావతి: బీజేపీ, జనసేన పార్టీలు మాత్రమే కలిసి ముందుకెళ్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఢిల్లీ పర్యటన, టీడీపీతో పొత్తు గురించి మీడియా ప్రశ్నించగా.. సోము వీర్రాజు జవాబిచ్చారు. బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయని.. కలిసే ముందుకెళ్తాయని చెప్పారు. అందువల్లే పవన్‌కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిని, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిని కలిశారని పేర్కొన్నారు. పవన్‌ను చంద్రబాబు, చంద్రబాబును పవన్ కలిసినంత మాత్రాన.. వాళ్లు రాజకీయంగా ఒక్కటైనట్టు కాదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో చంద్రబాబు వద్ద తాను కూడా కూర్చున్నానని గుర్తు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, జనసేన కలిసి పోరాడతాయని తెలిపారు. రాజకీయాల్లో ఏదీ వ్యూహం ప్రకారం జరగవన్నారు. -
AP: జనసేనకు షాకిస్తూ బీజేపీకిలోకి..
సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో విపక్షాల పొత్తులపర్వంపై గందరగోళం నడుస్తోంది. బీజేపీ-జనసేనల చెట్టాపట్టాల్పై ఆ పార్టీల నేతలకే స్పష్టత లేకుండా పోయింది. ఈ క్రమంలో దోస్తీ ఉన్నా.. లేనట్లేనంటూ కొందరు వ్యాఖ్యానిస్తుండడమూ చూస్తున్నాం. ఈ తరుణంలో జనసేనకు పండగనాడు ఊహించని షాక్ తగిలింది. జనసేన అధికార ప్రతినిధి ఆకుల కిరణ్ కాషాయం కండువా కప్పుకున్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరుకాగా, ఆయన సమక్షంలోనే బీజేపీలో చేరాడు ఆకుల కిరణ్. -
పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం: సోము వీర్రాజు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వాగతించారు. పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం అంటూ వ్యాఖ్యలు చేశారు. సదస్సుపై శుక్రవారం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం. ఇది విజయవంతమవుతుంది. రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వానికి కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం. ప్రధాని నరేంద్రమోదీ నిబద్దతతో కూడిన ప్రయత్నాల కారణంగా నేడు దేశం అనుకూలమైన పారిశ్రామికవాతావరణాన్ని కలిగి ఉంది. విశాఖ వేదికగా చేసిన వాగ్దానాలు రాష్ట్ర అభివృద్ధికి దారితీస్తాయని ఆశిస్తున్నాం. నితిన్ గడ్కరీ హాజరు కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎలా మద్దతు ఇస్తుందో చూపిస్తోంది’ అంటూ పేర్కొన్నారు. విశాఖలో పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం మరియు ఇది విజయవంతమవుతుంది. రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వానికి కేంద్రం నుండి అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం. @narendramodi గారి నిబద్దతతో కూడిన ప్రయత్నాల కారణంగా నేడు దేశం అనుకూలమైన పారిశ్రామిక (1/2)@blsanthosh pic.twitter.com/TzmR5Cqrdz — Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) March 3, 2023 -
జనసేన పొత్తుతోనే ఎన్నికలకు వెళ్తాం: సోము
గంగవరం(చిత్తూరు జిల్లా): జనసేనతో పొత్తుతోనే ఎన్నికలకు వెళతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు. గంగవరం మండల కేంద్రంలో శనివారం బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి తరఫున సోము వీర్రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు గెలుస్తారని తెలిపారు. జనసేన పొత్తుతోనే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు 2024 ఎన్నికలకు కూడా వెళ్తామని తెలిపారు. -
పదివేల కోట్లు ఇచ్చినా బాబు రాజధాని కట్టలేదు
మదనపల్లె/ బి.కొత్తకోట: కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు ఇచ్చినా చంద్రబాబు రాజ«దాని నిర్మించకపోగా, రైతులను నడిరోడ్డు మీద పడేశాడని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలోనూ, బి.కొత్తకోట మండలం అమరనారాయణపురంలో తంబళ్లపల్లె నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లతో జరిగిన సమావేశంలోనూ శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆనాడు చంద్రబాబు అమరావతిలో సగం నిర్మాణాలు చేసి ఉన్నా ఈరోజు రాజధాని ప్రసక్తే ఉండేది కాదన్నారు. రాష్ట్ర బీజేపీలో అసమ్మతి పెరిగిందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రత్యేక అజెండాతోనే పార్టీ మారుతున్నారన్నారు. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని, ఈ విషయాన్ని పవన్‌కళ్యాణ్ స్వయంగా ధృవీకరించారని తెలిపారు. కమ్యూనిస్టులు అంగన్వాడీ కేంద్రాల నుంచి వసూలు చేసే సొమ్ముతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, టీడీపీలను ఓడించాలన్నారు. -
ఢిల్లీ చేరిన ఏపీ బీజేపీ పంచాయితీ.. సోము వీర్రాజుపై ఎఫెక్ట్ ఎంత?
సాక్షి, ఢిల్లీ: ఏపీ బీజేపీలో ముసలం చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తర్వాత పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలపై అసంతృప్తి నేతలు ఒక్కసారిగా తమ గళం వినిపించారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై ఫిర్యాదు చేసేందుకు కాషాయ నేతలు ఏకంగా ఢిల్లీకి వెళ్లారు. వివరాల ప్రకారం.. ఏపీ బీజేపీ నేతల పంచాయితీ ఢిల్లీకి చేరింది. దాదాపు 30 మంది ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ఇంఛార్జ్ మురళీధరన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. అధ్యక్షుడిగా సోము వీర్రాజు తమకు వద్దంటూ ఇంఛార్జ్ వద్ద మొరపెట్టుకున్నారు. నూతన అధ్యక్షుడు కావాలని పట్టుబట్టారు. రాష్ట్రంలో సోము వీర్రాజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశారు. ఆరు జిల్లాల అధ్యక్షులను తొలగించారని ఈ సందర్భంగా వారు చెప్పుకొచ్చారు. అయితే, ఢిల్లీకి వచ్చిన ఏపీ బీజేపీ నేతలకు మురళీధరన్ క్లాస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ అంతర్గత విషయాలపై రచ్చకెక్కొద్దని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇంత మంది ఒకేసారి ఢిల్లీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించడంతో వారు ఖంగుతిన్నారు. ఇక, ఢిల్లీలో దిగిన 30 మంది ఏపీ బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులతో 20 నిమిషాల పాటు మాట్లాడి పంపించేశారు. తాను రాష్ట్రానికి వచ్చినప్పుడు కలవాలని వారికి సూచించారు. ఇకపై రాష్ట్ర పరిస్థితులను పరిష్కరించేందుకు ప్రతి నెల సమయం ఇస్తానని మురళీధరన్ తమకు హామీ ఇచ్చారని స్థానిక నేతలు చెబుతున్నారు. -
ఏపీలో బీజేపీ ఆ నానుడి మార్చివేసిందా?
ఆంద్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి ఏమీ తోచడం లేదు.పెద్దగా పని ఉండడం లేదు. అప్పుడప్పుడూ గుడులనో, గోపురాలనో హడావుడి చేస్తేనన్నా పార్టీ ఉనికి నిలబడుతుందని అనుకున్నారేమో తెలియదు కానీ, తాజాగా ఒక కారికేచర్ ఆధారంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపైన విమర్శలు కురిపించి నిరసనలకు దిగారు. ఒకప్పుడు మానవ సేవే మాధవ సేవ అనేవారు. కాని ఏపీలో బీజేపీ ఆ నానుడిని మార్చివేసినట్లుగా ఉంది. పసిపిల్లవాడికి శివరాత్రి నాడు ముఖ్యమంత్రి జగన్ పాలుపడుతున్నట్లుగా ఒక కారికేచర్ వచ్చింది. దానిని వైసీపీ అధికారిక ట్విటర్ లో పోస్టు చేశారట. అందులో ఏదో పెద్ద తప్పు ఉన్నట్లు బీజేపీ నేతలు కనిపెట్టేశారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా వారు నిరసనలు, ధర్నాలు అంటూ రంగంలోకి దిగారు. ఇక ప్రకటనల ఊదర ఎటూ ఉంటుంది. దానిపై వైసీపీ ఎమ్మెల్యేలు , మంత్రులు సీరియస్ గా స్పందించారు. నిజానికి బీజేపీ వారి చేష్టలపై అసలు స్పందించకపోయినా పెద్దగా పోయేదేమీ లేదు. కాని మతపరమైన అంశంగా బీజేపీ చిత్రీకరిస్తున్న నేపధ్యంలో ఈ వ్యవహారం సున్నితంగా ఉంటుంది కనుక వైసీపీ నేతలు దానిపై మాట్లాడినట్లు ఉన్నారు. ఆ కారికేచర్ గమనించినవారికి ఎవరికైనా ముందుగా వచ్చే ప్రశ్న అందులో ఏమి తప్పు ఉందని! ఇందులో హిందువుల మనోభావాలు ఎలా దెబ్బతింటాయని! బీజేపీ అద్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ ఇన్ చార్జీ సునీల్ ధియోదర్, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు తదితర ముఖ్యనేతలతో పాటు చిన్నా,చితక నేతలు కూడా దీనిపై ప్రచారం చేపట్టారు. ఈ ప్రభుత్వం ఏకంగా హిందూ వ్యతిరేక ప్రభుత్వమని వారు తేల్చేశారు. అదెలాగంటే పసిపిల్లవాడికి పాలు పట్టడమట. ఇంతకన్నా విడ్డూరం ఏమైనా ఉంటుందా? చిన్నారి బాలుడికి పాలు పడితే శివుడికి క్షీరాభిషేకం చేయడాన్ని అపహాస్యం చేసినట్లయిందని వారు ఆరోపిస్తున్నారు. హిందువులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. ఏదో ఈనాడు, తదితర టీడీపీ మీడియా ప్రచార సంస్థల ద్వారా ప్రచారం పొందడానికి తప్ప బీజేపీ నేతల చర్య ఎందుకన్నా ఉపయోగం ఉంటుందా?ఈనాడు కూడా అసలు ఆ ఫోటోలో ఏముందో రాయకుండా శివలింగానికి క్షీరాభిషేకాన్ని అవహేళన చేసేలా ఫోటో ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని మాత్రమే పేర్కొనడం గమనించదగిన అంశం. ఆ ఫోటోను సవివరంగా ప్రచురిస్తే అసలు విషయం బయటపడిపోయి,ప్రజలకు వాస్తవం తెలిసిపోతుందన్నది ఈనాడు భయం కావచ్చు. సరే!వారి బాద వారిది! ఎక్కడ ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా మహా ప్రసాదంగా ఈనాడు భావిస్తోంది . అది వేరే సంగతి.సోము వీర్రాజు ఆద్వర్యంలో ఏకంగా మార్కాపురం, గిద్దలూరులలో ధర్నాలు కూడా చేసేశారు. ఆయనేదో అక్కడకు టూర్ కు వెళ్లినట్లున్నారు. ఏదో ఒకటి చేస్తే పోలా అని చేసినట్లుంది తప్ప ఏ మాత్రం ఇందులో అర్దం లేదు.ఏపీలో మతపరమైన వైరుధ్యాలు క్రియేట్ చేయడానికి గతంలోను బీజేపీతో పాటు జనసేన, టీడీపీలు ప్రయత్నాలు చేయకపోలేదు. గుడులలో చోరీలు జరిగాయనో, విగ్రహాలను పాడు చేశారనో , ఏవో సాకులతో అలజడి సృష్టించడానికి కృషి చేశారు. కాని అవేవి ఫలించలేదు. ప్రభుత్వం అలాంటి చిన్న ఘటన జరిగినా వెంటనే సీరియస్‌గా రియాక్ట్ అవడమే కారణమని వేరే చెప్పనవసరం లేదు. ఉదాహరణకు అంతర్వేదిలో రధం దగ్దం అయిన ఘటనపై విపక్షం నానా రాద్దాంతం చేసింది. వెంటనే సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాని కేంద్రం దానిపై స్పందించలేదు.శ్రీకాకుళం జిల్లాలో ఒక విగ్రహాన్ని తరలించిన ఘటనను వివాదాస్పదం చేశారు. తీరా చూస్తే టీడీపీవారే కావాలని అలా చేసి యాగీ చేశారని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వెల్లడైంది. రామతీర్దంలో రాముడి విగ్రహాన్ని ద్వంసం చేశారంటూ మరో గొడవను సృష్టించారు. ప్రభుత్వం వెంటనే మరో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఈ రకంగా హిందువుల మనోభావాలకు ఎక్కడా దెబ్బ తగలకుండా చర్యలు చేపడుతుంటే విపక్షానికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. అంతేకాదు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత నిష్టతో ప్రతి హిందూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంక్రాంతి ,ఉగాది .. ఇలా ఒకటేమిటి? ఆలయాలలో ఉత్సవాలు పలు సందర్భాలలో ఆయనే పూజా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయినా బీజేపీ నేతలకు ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా కనిపిస్తోంది. కొంతకాలం క్రితం వరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి పిచ్చి ప్రచారం ద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని యత్నించి భంగపడ్డారు. ఆయా కేసులలో టీడీపీవారే నిందితులుగా పట్టుబడుతుండడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత అలాంటి ఘటనలే దాదాపు జరగకుండా ఆగిపోయాయి. ఏమి దొరకక బీజేపీవారికి ఈ చిన్న పిల్లాడి బొమ్మను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూడడం దారుణం. అదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ , మాజీ మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు ప్రస్తావించారు. హిందూ మతం బీజేపీ సొంతం కాదని వారు స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో 40 గుళ్లను కూల్చివేస్తే బీజేపీ నేతలు అప్పట్లో నోరు మెదపని విషయాన్ని వారు గుర్తు చేసి ప్రశ్నించారు. వీటికి వారి వద్ద సమాధానం ఉండదు. బీజేపీవారు ఇంతటి శ్రద్దను పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో, ప్రత్యేక హోదా అంశంలో ,రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం విషయంలో చూపించి ఉంటే మంచి పేరు వచ్చేది. బీజేపీకి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పడం, జనసేన తమతో పొత్తులో ఉంటుందో, ఉండదో తెలియని వైనం తదితర కారణాలతో రాజకీయాలను డైవర్ట్ చేయడానికి బీజేపీ పూనుకున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఏదో ఒక సాకుతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుని బీజేపీ ఈ విమర్శలు చేసినట్లుగా ఉంది. కానీ అవి హేతుబద్దంగా లేకపోవడం, అర్ధవంతంగా లేకపోవడం వల్ల బీజేపీనే నవ్వులపాలవుతోంది. అందువల్ల ఇలా చిన్నపిల్లాడికి పాలు పడితే కూడా తప్పుపట్టే విధంగా బీజేపీ నేతలు మాట్లాడకుండా ఉంటేనే వారికి పరువు దక్కుతుంది. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
సోము వీర్రాజుకు ఇలాంటి రాజకీయాలు పద్దతి కాదు: కన్నబాబు ఫైర్
సాక్షి, కాకినాడ: బీజేపీ రాజకీయాలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయంలో ఆలయాలను కూలిస్తే బీజేపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. కాగా, కన్నబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని మతాలను గౌరవిస్తారు. తిరుమలలో తొలి దర్శనం యాదవులకు కలిగేలా పునరుద్ధరణ చేశారు. మానవసేవే.. మాధవసేవ అని చెప్పే పార్టీ మాది. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజీయం చేస్తోంది. సునీల్ ధియోధర్ ట్వీట్ చాలా అవమానకరంగా ఉంది. చంద్రబాబు హయంలో 40 ఆలయాలను కూల్చివేశారు. అప్పుడు బీజేపీ నేతలు ఏం చేశారు?. ప్యాబ్రికేటెడ్ ఉద్యమాలు చేద్దామనుకుంటే బీజేపీకి వర్క్ అవుట్ కాదు. సీఎం జగన్.. అర్చకులకు ఆర్ధిక సహయం అందించడం నుండి దూపదీప నైవేద్యాలు సమర్పించి ఆలయాల్లో వైభవం తీసుకువచ్చారు. మీ ఒక్కరికే హిందుత్వం మీద ప్రేమ ఉందా?. సోము వీర్రాజుకు రాజకీయాలు చేయాలను కుంటే ఇది పద్దతి కాదు. సునీల్ ధియోధర్ వంటి నాయకులను పెట్టుకుని ఏపీ రాజకీయాలు చేస్తే ఇంకా దిగిజారిపోతారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘చంద్రబాబు కూల్చిన ఆలయాలను పునర్మిర్తిస్తున్నాం’
సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీ నేతలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవసేవే మాధవసేవ అనేది బీజేపీ నేతలకు తెలియదా?. పేదలకు సాయం చేస్తే దేవుడికి సాయం చేసినట్టే అవుతుందని బీజేపీ నేతలు తెలుసుకోవాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, వెల్లంపల్లి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కులాలు, మతాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం బీజేపీ మానుకోవాలి. చంద్రబాబు హయంలో 40 ఆలయాలను కూలిస్తే బీజేపీ ఏం చేశారు?. చంద్రబాబు కూల్చిన ఆలయాలను పునర్మిర్తిస్తున్నాం. బీజేపీ మత రాజకీయాలు ఏపీలో చెల్లవు. శివాలయాల వద్ద బీజేపీ డ్రామాలను ప్రజలు నమ్మరు అంటూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో పరిపాలన అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. -
సోము వీర్రాజుపై కన్నా వ్యాఖ్యలు సముచితం కాదు: జీవీఎల్
-
‘ప్రజల్ని రోడ్లపై వదిలేసే పార్టీలతో పొత్తు లేదు’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఒంటరి పోరుకు బీజేపీ మానసికంగా సిద్ధమవుతోందా?. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఆ విషయం స్పష్టమవుతోంది. ఈ క్రమంలో జనసేన పొత్తుకు సైతం దూరంగా జరిగేలా ఆయన ప్రకటనలు ఇస్తుండడం గమనార్హం. ఇటీవల జగిత్యాల కొండగట్టు పర్యటనలో ‘బీజేపీతోనే ఉన్నా’ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. బీజేపీ మాత్రం ఏపీలో పవన్‌తో పొత్తు విషయంలో డైలమా ప్రదర్శిస్తోంది. ఒకప్పుడు జనసేనతోనే పొత్తు అంటూ స్టేట్మెంట్లు ఇచ్చిన సోము వీర్రాజు వాయిస్‌లో ఒక్కసారిగా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా.. గత మూడు రోజులుగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న బీజేపీ ఏపీ చీఫ్.. ‘‘కలిసి వస్తేనే జనసేనతో పొత్తు.. లేదంటే జనంతోనే మా పొత్తు’’ అంటూ ప్రకటించడం గమనార్హం. పైగా ప్రజలను రోడ్లపై వదిలేసే పార్టీలతో పొత్తు ఉండదంటూ వ్యాఖ్యల ద్వారా పొత్తు విషయంలో ఊగిసలాట ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందుకు టీడీపీనే ప్రధాన కారణమని చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ ప్రసంగాలు చేస్తున్న పవన్ కల్యాణ్, కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబుతోనే చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నాడు. మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ-బీజేపీలను ఒకచోట చేర్చేందుకు సిద్ధమన్న రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ తీరుపైనే బీజేపీలో అనుమానాలు మొదలైనట్లు స్పష్టమవుతోంది. పైగా టీడీపీతో కలిసి ఏమాత్రం ముందుకు వెళ్లడం ఇష్టంలేని బీజేపీ అవసరమైతే జనసేనాని కూడా దూరం పెట్టేందుకు సిద్ధమైంది!. ఈ క్రమంలో జనసేన కలిసి రాకపోయినా.. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామనే రీతిలో సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టమవుతోంది. -
బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు.. స్పందించిన సోము వీర్రాజు
ఒంగోలు: పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌నే ప్రశ్నించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గురువారం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీతోనే ఉన్నానని పవన్ చెప్పారు. మేమూ అదే చెబుతున్నాం. టీడీపీతో జనసేన పొత్తు గురించి నన్ను అడగడం సరికాదు. అదేదో పవన్నే అడగండి’ అని సోము వీర్రాజు అన్నారు. తమ పొత్తు జనసేనతోనే కొనసాగుతోందన్నారు. చంద్రబాబు అటూ ఇటూ తిరగడం వల్ల ఆరేడు ప్రాణాలు పోవడం తప్ప ఏమీ ఉపయోగముండదన్నారు. బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్థన్‌రెడ్డి వంటి వారు మాట్లాడే అంశాలపై తాను స్పందించనని చెప్పారు. సమావేశంలో బీజేపీ నాయకులు సూర్యనారాయణరాజు, పీవీ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కన్నా ధిక్కార స్వరం దేనికి సంకేతం..?
-
సోముపై కన్నా మరోసారి ఫైర్.. ఏపీ బీజేపీ రియాక్షన్ ఇదే
సాక్షి, అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ మరోసారి మండిపడ్డారు. ఏపీ బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పుపై కన్నా లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను నియమించిన వారినే తొలిగించారంటూ సోము వీర్రాజు వ్యవహార శైలిపై కన్నా నిప్పులు చెరిగారు. కాగా, కన్నా లక్ష్మీనారాయణ వ్యవహార శైలీపై ఏపీ బీజేపీ సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. కన్నా హయాంలో ఏనాడూ కేంద్ర కమిటీ నిర్ణయాలను పాటించలేదన్నారు. సోము వీర్రాజు కేంద్ర కమిటీ నిర్ణయాలనే అమలు చేస్తున్నారని ఏపీ బీజేపీ చెబుతోంది. చదవండి: కేసీఆర్‌వి పగటి కలలు: సోము వీర్రాజు -
కేసీఆర్‌వి పగటి కలలు: సోము వీర్రాజు
కర్నూలు కల్చరల్: సీఎం కేసీఆర్ టీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చి బీఆర్ఎస్ అంటూ పగటి కలలు కంటున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఎద్దేవా చేశారు. కర్నూలులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భద్రాచలం రాములవారిని ఆంధ్రప్రదేశ్‌కు అప్పజెప్పి అప్పుడు కేసీఆర్ రాజకీయాలు మాట్లాడాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అడ్డుపడిన కేసీఆర్... ఇప్పుడు ఆంధ్రా అంటూ కూని రాగాలు తీయడం ఏమిటని ప్రశ్నించారు. సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ప్రభుత్వం నియంత్రణ చేయడం ఎంత వరకు సమంజసమని అన్నారు. -
ఏపీ బీజేపీలో రాజీనామాల కలకలం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు సీనియర్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. అమిత్ షా పర్యటన వేళ బీజేపీలో నెలకొన్న విభేదాలు బట్టబయలయ్యాయి. ఆరు జిల్లాల అధ్యక్షుల మార్పుపై నేతలు అంసతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటెద్దు పోకడలపై పార్టీ నేతలు అంసతృప్తితో ఉన్నట్లు చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆరు జిల్లాల అధ్యక్షుల మార్పు జరగటం విభేదాలను బట్టబయలు చేసింది. సీనియర్లను సంప్రదించకుండా జిల్లా అధ్యక్షులను మార్చడంపై నిరసన వ్యక్తం చేస్తూ తమ పదవులకు తుమ్మల ఆంజనేయులు, కుమారస్వామిలు రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై నిరసన గళం వినిపించారు. ఇదీ చదవండి: టీడీపీ స్థానిక నాయకులు, ఎన్ఆర్ఐల మధ్య సీట్ల పేచీ