onion
-
ఢిల్లీ చేరుకున్న 1,341 టన్నుల ఉల్లి: ఎందుకంటే..
దేశ రాజధానిలో ఉల్లి ధరలకు చెక్ పెట్టే లక్ష్యంతో.. ఉల్లి గడ్డలతో నిండిన ఒక ఎక్స్‌ప్రెస్ ఢిల్లీకి చేరుకుంది. నాసిక్ నుంచి ప్రత్యేక గూడ్స్ రైలులో సుమారు 1,341 టన్నుల ఉల్లి ఢిల్లీకి చేరుకున్నట్లు.. నార్త్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు.పొలాల నుంచే నేరుగా ఉల్లి కొనుగోలు చేస్తే.. రవాణా సమయం, ఖర్చులు వంటివి కూడా తగ్గుతాయి. దీని వల్ల రైతులకు మేలు జరుగుతుంది. ప్రజలకు కూడా కొంత తక్కువ ధరకే ఉల్లిని విక్రయించవచ్చు. పలు నగరాల్లోని మార్కెట్లలో ఉల్లి ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు టన్నుల ఉల్లి.. ఢిల్లీకి చేరుకోవడంతో వారందరూ అధిక ధరల నుంచి ఉపశమనం పొందవచ్చు.గతంలో కూడా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారీ ఎత్తున ఉల్లి సరఫరా చేయడం జరిగింది. అంతే కాకుండా ప్రజల మీద ధరల ప్రభావం పడకూడదనే ఉద్దేశ్యంతోనే సెప్టెంబర్‌లో ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేదించింది. ఏప్రిల్-జూన్‌లో పండించిన ఉల్లి మరి కొన్ని రోజుల వరకు వినియోగదారుల అవసరాలను తీరుస్తుంది. -
ఘాటెక్కిన ఉల్లి.. భారీగా పెరిగిన ధరలు
నిత్యావసర ధరలు సామాన్య ప్రజల మీద అధిక ప్రభావాన్ని చూపిస్తున్న తరుణంలో.. ఉల్లి రేట్లు పెరిగి ఒక్కసారిగా షాకిచ్చాయి. ఢిల్లీ, ముంబైలలో రూ. 40 నుంచి రూ. 60 మధ్య ఉన్న కేజీ ఉల్లి ధర.. రూ. 70 నుంచి రూ. 80కి పెరిగింది. వెల్లుల్లి ధరలు.. ఉల్లి ధరలకు రెట్టింపు ఉన్నాయి.ధరల పెరుగుదల కుటుంబ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనిపైన వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ ప్రకారం ఉల్లి ధరలు తగ్గాల్సి ఉంది, కానీ ధరలు పెరిగాయని కొందరు వాపోతున్నారు.ఇదీ చదవండి: రెండో ఆదాయంపై కన్నేసిన సినీతారలు: అందరి చూపు అటువైపే..దేశంలోనే అధికంగా ఉల్లి పండించే రాష్ట్రమైన మహారాష్ట్రలో అక్టోబర్ నెలలో భారీ వర్షాలు కురవడంతో.. ఉల్లి సాగు ఆలస్యమైంది. దీంతో పంజాబ్, హర్యానా, చండీగఢ్ వంటి ఉత్తర భారత రాష్ట్రాలలో కూడా సరఫరా కొరత ఏర్పడింది. ఉల్లి సరఫరా తగ్గుదల ఇలాగే కొనసాగితే.. కేజీ ధర వంద రూపాయలకు చేరే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. -
కుళ్ళిపోతున్న ఉల్లి.. రైతుల ఆవేదన
-
మార్కెట్ నిండా ఉల్లి.. రైతులకు కష్టాల లొల్లి
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ–నామ్‌కు గ్రహణం పట్టింది. నాలుగు రోజులుగా సర్వర్ పనిచేయక వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు స్తంభించిపోయాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతంలో సాంకేతిక సమస్య ఏర్పడితే ఒకటి లేదా రెండు రోజుల్లో పరిష్కారమయ్యేది. తొలిసారి నాలుగు రోజులుగా సర్వర్ మొండికేయడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఈ–నామ్ సాంకేతిక సమస్య కారణంగా ఉల్లి మినహా ఇతర వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. రేయింబవళ్లు యార్డుల్లోనే నిరీక్షణ ప్రస్తుతం ఉల్లి ధరలు ఆశాజనకంగా ఉండటంతో వారం రోజుల ముందే పంటను కోసి రైతులు మార్కెట్‌కు తెస్తున్నారు. ఫలితంగా మార్కెట్‌కు ఉల్లి వెల్లువెత్తుతోంది. విక్రయాలు ఒకరోజు ఆలస్యమైతే ధర పడిపోతుందేమోనన్న భయం రైతులను వెంటాడుతోంది. ఇదే సందర్భంలో ఈ–నామ్లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా మాన్యువల్‌గా టెండర్లు వేస్తున్నారు. టెండర్లు వేసే ప్రక్రియ పూర్తయి.. ధరలు ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా పంటను అమ్ముకుని ఇంటికి వెళ్లాలంటే రైతులు రేయింబవళ్లు మార్కెట్ యార్డులోనే నిరీక్షించాల్సి వస్తోంది. నిత్యం 20 వేల టన్నులు రాక రాష్ట్రంలో ఉల్లి క్రయవిక్రయాలకు ఏకైక ఆధారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ మాత్రమే. పశి్చమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉల్లి క్రయవిక్రయాలు జరుగుతున్నా.. అది పూర్తిగా ప్రైవేట్ మార్కెట్. కర్నూలు మార్కెట్ ప్రభుత్వం అ«దీనంలో ఉన్నందున రైతులు 60 శాతం పంటను కర్నూలు మార్కెట్‌కే తీసుకొస్తారు. ఉమ్మడి కర్నూలుతో పాటు అనంతపురం, వైఎస్సార్ జిల్లాలు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికే ఉల్లిని తీసుకొచ్చి విక్రయిస్తారు. ఈ ఏడాది మొదటి నుంచి ఉల్లి ధరలు మెరుగ్గా ఉండటం వల్ల సాగు పెరిగింది. 2023 ఖరీప్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాఓ 39,431 ఎకరాల్లో ఉల్లి సాగు చేయగా.. ఈ ఏడాది 43,875 ఎకరాల్లో సాగైంది. ఎకరాకు సగటున 5 టన్నుల చొప్పున ఈ ఏడాది 2,19,375 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఉల్లి పంటను కోసి రబీ పంటగా శనగ విత్తుకోవాలనే ప్రయత్నాల్లో రైతులు ఉన్నారు. మరోవైపు పెరిగిన ధర ఎక్కడ పడిపోతుందోనన్న భయంతో వారం, 10 రోజుల ముందుగానే పంటను కోసి మార్కెట్‌కు తెస్తున్నారు. దీంతో కర్నూలు మార్కెట్‌కు ఉల్లి పోటెత్తుతోంది. రికార్డు స్థాయిలో రోజుకు 20 వేల క్వింటాళ్లు వస్తుండటం విశేషం. గతంలో అత్యధికంగా రోజుకు 8 వేల క్వింటాళ్ల వరకే వచ్చేది. ఎటూ చూసినా ఉల్లి వాహనాలే మార్కెట్ యార్డు విస్తీర్ణం 26 ఎకరాలు. మార్కెట్ మొత్తం ఉల్లి పంటతో నిండిపోయింది. మ్యాన్యువల్ టెండర్ల కారణంగా ధరల నిర్ణయం ఆలస్యమవుతోంది. కాటాల్లోనూ జాప్యం జరుగుతోంది. కొనుగోలు చేసిన ఉల్లిని బయటకు తరలించేందుకు తగినన్ని లారీలు లభ్యం కావడం లేదు. దీంతో యార్డులోని స్థలమంతా ఉల్లి వాహనాలతో నిండిపోయింది.అమ్ముకోవడానికి తెచ్చిన ఉల్లి వాహనాలు రోడ్లపైనే నిలిచిపోతున్నాయి. అన్ని ప్రధాన రహదారుల్లో కిలోమీటర్‌కు పైగా ఉల్లి వాహనాలు బారులు తీరి ఉండిపోతున్నాయి. ఆ వాహనాలు అతి కష్టం మీద మార్కెట్లోకి వెళితే స్థలం దొరకడం లేదు. మరోవైపు అన్లోడ్ చేయడానికి హమాలీలు ఉండటం లేదు. పంటను అమ్ముకోవాలంటే తలప్రాణం తోకకు వస్తోందని రైతులు వాపోతున్నారు. రాష్ట్రమంతటా ఈ–నామ్ సమస్యే గతంలో ఈ–నామ్లో ఎటువంటి సమస్య ఏర్పడినా యుద్ధప్రాతిపదిక పరిష్కరించేవారు. తొలిసారిగా రోజుల తరబడి సాంకేతిక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ సమస్య ఒక్క కర్నూలు మార్కెట్‌కే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లతోపాటు దేశవ్యాప్తంగా ఈ–నామ్ విధానం అమలవుతున్న అన్ని మార్కెట్లలో ఇదే సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వాలు మొద్దు నిద్ర నటిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తొలిసారి ఈ–నామ్ అమల్లోకి వచ్చి ఏళ్లు గడుస్తోంది. ఎప్పుడు సమస్య వచ్చినా ఒకటి, ఒకటిన్నర రోజుల్లోనే పరిష్కారమయ్యేది. మొదటిసారిగా రోజుల తరబడి సమస్య ఉండిపోయింది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే. ఇది రైతులకు శాపంగా మారింది. ఉల్లి మినహా అన్నిరకాల పంట క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఇది రైతులకు ఇబ్బందిగా మారింది. – కట్టా శేఖర్, అధ్యక్షుడు, కమీషన్ ఏజెంట్ల సంఘం, కర్నూలు రైతులకు నరకమే పంటను అమ్ముకోవడానికి వచ్చిన రైతులకు నరకం చూపిస్తున్నారు. పంటను ఆమ్ముకునేందుకు వస్తే.. మార్కెట్లోకి ప్రవేశించేందుకే తల ప్రాణం తోకకు వస్తోంది. ఈ–నామ్ సర్వర్ పనిచేయకపోవడంతో మ్యాన్యువల్‌గా టెండర్ వేయడం వల్ల ఆలస్యమవుతోంది. ధరలను ప్రకటించే సరికి సాయంత్రమైంది. పంటను అమ్ముకుని ఇంటికి వెళ్లేది ఎప్పుడో తెలియడం లేదు. సర్వర్ సమస్య ఏర్పడినపుడు సత్వరం పరిష్కరించేందుకు యంత్రాంగం ఉండాలి. – తిప్పారెడ్డి, బేతపల్లి, దేవనకొండ మండలం -
రైతాలో ఉల్లిపాయలు జోడించి తీసుకుంటున్నారా..!
బిర్యానీ, ఫ్రైడ్ రైస్‌ల పక్కన రైతా ఉండాల్సిందే. అది లేకుండా బిర్యానీ తినడం పూర్తి కాదు అన్నంతగా ఆహారప్రియులు ఇష్టంగా ఆస్వాదిస్తారు. అలా కాకపోయినా పెరుగులో ఉల్లిపాయ నొంచుకుని తింటుంటారు చాలమంది. పెరుగులో లేదా మజ్జిగలో ఉల్లిపాయ పెట్టుకుని తింటే ఉంటది ఆ రుచి..నా సామిరంగా అంటూ ఆనందంగా లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. కడుపు కూడా హాయిగా చల్లగా ఉంటుంది. అలాంటి రైతా గురించి షాకింగ్ విషయాలు చెబుతున్నారు నిపుణులు. రైతాలో ఉల్లిపాయలు ఎట్టి పరిస్థిత్తుల్లోనూ జోడించొద్దని హెచ్చరిస్తున్నారు. ఎందుకని ఇలా చెబుతున్నారంటే..భారతీయలు ఎక్కువగా ఉల్లిపాయను మజ్జిగ/పెరుగులో లేదా రైతా రూపంలో తీసుకుంటుంటారు. అయితే ఇలా పెరుగుకి ఉల్లిపాయను జోడించొద్దని చెబుతున్నారు. ఈ కలయిక నాలుకకు మంచి రుచిని ఇచ్చినప్పటికీ..ఆరోగ్యానికి ఇలాంటి కాంబినేషన్ అస్సలు మంచిది కాదని వారిస్తున్నారు. పెరుగు కేవలం తరిగిన పండ్లు, కూరగాయలు, సుగంధద్రవ్యాలతో మంచి ప్రయోజనాలను ఇస్తుంది. అంతేగాదు జీర్ణక్రియను మెరుగుపరచడం, బరువు నిర్వహణకు, ఎముకలను బలోపేతం చేయడం వంటి ఎన్నో ప్రయోజనాలు అందించినప్పటికీ..ఇలా ఉల్లిపాయతో కలగలిసిన రైతా మాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం..పెరుగు, ఉల్లిపాయలు వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటుంది. పెరుగు శీతలీకరణ స్వభావం, ఉల్లిపాయ ఉత్పత్తిచేసే అధికవేడి శరీరంలో టాక్సిన్ స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. ఫలితంగా శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అందువల్ల ఉల్లిపాయను పెరుగుతో జోడించడాన్ని విరుధమైన అన్నంగా పరగణించటం జరుగుతుంది. ఇది అసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం, వంటి సమస్యలనే పెంచుతుంది. ఒక్కోసారి ఇది తీవ్రమై ఫుడ్ పాయిజన్కి దారితీసే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ ఉల్లిపాయను పచ్చిగా తీసుకోవడం వల్ల వేడి అనుభూతి కలుగుతుంది. దీని వేడి, ఆక్సీకరణకు సున్నితంగా ఉంటుంది. అందువల్ల అధికంగా రియాక్షన్ చెంది పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అన్నారు. అలాగే శరీరంలో వాత పిత్తా కఫాలాల తోసహా అమసతుల్యతను సృష్టిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఉల్లిపాయను పెరుగులో తినడం చాలా ఇష్టమనుకుంటే..పచ్చిగా కాకుండా పెరుగు చట్నీ మాదిరిగా కాస్త ఆయిల్లో ఉల్లిపాయాలు వేయించి తాలింపు మాదిరిగా పెట్టుకుని తింటే దానిలో సల్ఫర్ శక్తి, రియాక్షన్ చెందడం తగ్గుతుంది. పైగా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: కూరగాయల షాపింగ్ గైడ్!) -
ఉల్లి రేటు.. మహా ఘాటు
కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులలో ఉల్లి సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోవడం.. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అధిక వర్షాలకు పంట దెబ్బతినడం.. ఇతర దేశాలకు ఎగుమతులు పెరగడం వంటి పరిస్థితుల్లో ఉల్లి ధరలు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. ఇప్పటికే రిటైల్ మార్కెట్లో రూ. 60కి పైగా ధర పలుకుతుండటంతో ఉల్లి కొనాలంటే వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులు నిషేధించి ధరలు తగ్గేలా కేంద్రం చర్యలు తీసుకోవడంతో పాటు నాఫెడ్ ఆధ్వర్యంలోని నిల్వలను కూడా మార్కెట్లోకి పంపితేనే ధరలు తగ్గు ముఖం పడతాయంటున్నారు.సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అత్యధిక విస్తీర్ణంలో ఉల్లి సాగవుతోంది. ఖరీఫ్, రబీ సీజన్లలో ఏటా 87,500 ఎకరాల్లో ఇక్కడి రైతులు ఉల్లి సాగు చేస్తుండగా.. 5.25 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతోంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఇప్పటివరకు కేవలం 20,382 ఎకరాల్లోనే ఉల్లి సాగు చేస్తుండగా.. ఐదేళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. దీంతో ఉత్పత్తి కూడా తగ్గుతోంది. రైతుల నుంచి మార్కెట్ యార్డుకు ఉల్లి రావడం భారీగా తగ్గింది. నాలుగు రాష్ట్రాల్లో దెబ్బతిన్న పంట ఉల్లి ధరలు పెరగడానికి మహారాష్ట్రలో గత నెలలో కురిసిన భారీ వర్షాలే కారణమని తెలుస్తోంది. జూలై 24, 25 తేదీల్లో కురిసిన వర్షాలకు ఆ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 50 శాతం పంట నష్టం వాటిల్లింది. ఒక్క నాసిక్ జిల్లాలోనే 48 వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేస్తారు. కేవలం ఆ జిల్లానుంచే సుమారు 7 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతోంది. కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఉల్లి ఎక్కువగా సాగవుతుంది. జూలై మూడు, నాలుగో వారంలో కురిసిన వర్షాలకు ఆ రాష్ట్రాల్లోనూ పంట బాగా దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఉల్లిలో తేమ శాతం, ఘాటు ఎక్కువ. వీటిని ఎక్కువ కాలం నిల్వ చేస్తే కుళ్లిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఏపీలో పండే ఉల్లిని ఉత్తర భారతదేశంలో పెద్దగా ఇష్టపడరు. అందుకే ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఈ ఉల్లిని విక్రయిస్తారు. మిగిలిన రాష్ట్రాల్లో పండించే ఉల్లిలో తేమ శాతం, ఘాటు తక్కువ. వాటిని ఏడాది నుంచి రెండేళ్లపాటు నిల్వ చేయొచ్చు. అందుకే ఈ ఉల్లిని దేశీయంగా వినియోగించడంతోపాటు బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఏపీలో వర్షాభావంతో సాగు విస్తీర్ణం తగ్గిపోగా.. ఉత్తర భారతదేశంలో వర్షాలతో పంట దిగుబడులు తగ్గాయి. దీంతో మార్కెట్‌కు ఉల్లి రావడం లేదు. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. రూ.5 వేలకు చేరే అవకాశం ఈ ఏడాది మే నెలలో క్వింటాల్ ఉల్లి ధర కనిష్టంగా రూ.316 ఉంటే.. గరిష్టంగా రూ.1,617 పలికింది. ప్రస్తుతం ఆ ధర రూ.3,700కు పెరిగింది. మార్కెట్లో నిల్వలు తగ్గిపోతుండటంతో సెప్టెంబరులో ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.4,500–రూ.5 వేల వరకూ చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. 50 శాతం కొనుగోళ్లు తాడేపల్లిగూడెం నుంచే.. కర్నూలులో ఉత్పత్తి అయ్యే పంటలో 20 శాతం మాత్రమే కర్నూలు మార్కెట్ యార్డులో అమ్మకాలు జరుగుతాయి. మిగిలిన 80 శాతం పంటను తాడేపల్లిగూడెం, హైదరాబాద్, చెన్నైతో పాటు ఇతర రాష్ట్రాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. ఇక్కడ దళారులను నియమించుకుని, వారి ద్వారా రైతులకు ముందుగానే అప్పులు ఇచ్చి, పంట చేతికి రాగానే మార్కెట్ ధల ప్రకారం తమకే విక్రయించాలని ఒప్పందం చేసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వ్యాపారులు కర్నూలులో ఉత్పత్తి అయ్యే పంటలో 50 శాతం కొనుగోలు చేస్తారు. అక్కడి ప్రైవేట్ మార్కెట్లో విక్రయాలు సాగించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఎగుమతులపై నిషేధం విధిస్తేనే ధరలకు కళ్లెం ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం ముందస్తు చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఏర్పడింది. భారత్ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు ఉల్లిని దిగుమతి చేసుకుంటాయి. ప్రస్తుతం శ్రీలంకలో కిలో ఉల్లి రూ.120 నుంచి రూ.150 వరకూ ధర పలుకుతోంది. ఈ క్రమంలో ఎగుమతులు నిషేధించడంతో పాటు నాఫెడ్‌లోని నిల్వలను కేంద్రం మార్కెట్లోకి విడుదల చేస్తే ధరలు దిగొస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. 2019లోఎన్నడూ లేనివిధంగా ఉల్లి ధర క్వింటాల్ రూ.13,010 పలికింది. అప్పట్లో రిటైల్‌లో కిలో ఉల్లి రూ.150కి చేరింది. వినియోగదారులు ఇబ్బంది పడకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేసి రైతు బజార్లలో కిలో రూ.25కే విక్రయించింది. ఇప్పుడు కూడా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వం రైతు బజార్లలో కిలో రూ.25కే విక్రయించాలని వినియోగదారులు కోరుతున్నారు. -
ఆకాశాన్నంటిన ఆహార ధరలు.. అదే ప్రధాన కారణం!
గతేడాది టమాటా ధరలు, ఉల్లి ధరలు మాత్రమే కాకుండా పప్పు ధాన్యాల ధరలు చుక్కలు తాకాయి. ఇప్పడు కూడా టమాటా ధరలు భారీగానే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కేజీ ధర వంద రూపాయలకంటే ఎక్కువ. ఆహార ధరలు పెరగటానికి గల కారణాలను ఆర్ధిక సర్వేలో వెల్లడించారు.వాతావరణంలో ఏర్పడ్డ మార్పులు, రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గడం, పంట నష్టం వంటివి.. ఆహార ధరలు పెరగటానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక సర్వే వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పంటలపై ప్రభావం చూపుతాయి. ఆ ప్రభావం ధరల మీద పడుతుందని వివరించింది.పంట దిగుబడి తగ్గితే.. డిమాండ్‌కు సరిపడా సరఫరా తగ్గుతుంది. దీంతో ధరలు పెనుగుతాయి. గత కొన్ని రోజులుగా ఆహార ధాన్యాలు, టమాటా, ఉల్లి ధరలు పెరగడానికి ఇదే కారణమని ఆర్ధిక సర్వే వెల్లడించింది. వినియోగదారుల ఆహార ధరల సూచీ (CFPI) ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం FY22లో 3.8 శాతం నుంచి FY23లో 6.6 శాతానికి చేరింది. ఇది FY24 నాటికి 7.5 శాతానికి చేరింది.ఉల్లి ధరలు పెరగడానికి గత కోత సీజన్లో వర్షాలు, విత్తడంలో జాప్యం మాత్రమే కాకుండా ఇతర దేశాలు తీసుకున్న వాణిజ్య సంబంధిత చర్యలు కూడా కారణమని తెలుస్తోంది. తక్కువ ఉత్పత్తి కారణంగా పప్పుధాన్యాల ధరలు పెరిగాయని సర్వే పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ అవాంతరాలతో పాటు రబీ సీజన్లో నెమ్మదిగా విత్తడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వెల్లడించింది. -
పెరిగిన ఉల్లి ధర
దేవరకద్ర: ఉల్లి ధరలు గత వారంతో పోల్చుకుంటే మరింత పెరిగాయి. ప్రస్తుతం ఉల్లి సీజన్ తగ్గిన తర్వాత ధరలు ౖపైపెకి ఎగబాకుతున్నాయి. గత వారం కొంత వరకు తగ్గిన ఉల్లి ధర బుధవారం జరిగిన వేలంలో మరింత పెరిగాయి. వర్షాలు లేకపోవడంతో రైతులు నిల్వ చేసిన ఉల్లిని మార్కెట్‌కు అమ్మకానికి తెచ్చారు. దాదాపు 500 బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. దీంతో వ్యాపారులు వేలం వేసి ఉల్లిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలో మార్కెట్లో వేలం పాటలు పోటీపోటీగా సాగాయి. స్థానిక వ్యాపారులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. వేలంలో క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.3,100, కనిష్టంగా రూ.2,510 చొప్పున పలికాయి. గత వారంతో పోల్చితే గరిష్టంగా రూ.200, కనిష్టంగా రూ.310 వరకు ధరలు పెరిగాయి. అలాగే 45 కిలోల ఉల్లి బస్తా గరిష్టంగా రూ.1,550, కనిష్టంగా రూ.1,250 చొప్పున విక్రయించారు.ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2,459దేవరకద్ర మార్కెట్లో జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,459 ఒకే ధర లభించింది. సీజన్ లేకపోవడంతో కొద్దిపాటిగా వచ్చిన ధాన్యానికి టెండర్లు వేశారు.● గరిష్టంగా రూ.3,100, కనిష్టంగా రూ.2,510 -
ఘాటెక్కిన ఉల్లి
సాక్షి, భీమవరం: ఉల్లి ధర ఘాటెక్కింది. రిటైల్ మార్కెట్లో కేజీ ధర రూ.40 నుంచి రూ.45 వరకు పలుకుతోంది. మహారాష్ట్ర మార్కెట్ నుంచి దిగుమతులు తగ్గడమే ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే పేరొందిన తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్‌కు షోలాపూర్, నాసిక్, పూణే, అహ్మద్‌నగర్ ప్రాంతాల నుంచి నిత్యం కనీసం 450 టన్నుల వరకు ఉల్లి దిగుమతులు జరుగుతుంటాయి.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని మార్కెట్లకు సైతం ఇక్కడి నుంచే ఉల్లి ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రస్తుతం రోజుకు 240 టన్నుల ఉల్లి మాత్రమే వస్తోంది. ఫలితంగా వారం రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. వారం క్రితం రిటైల్ మార్కెట్లో కేజీ రూ.20 నుంచి రూ.30 వరకు పలికిన ధరలు అమాంతం పెరిగాయి. ఆటోలపై ఇళ్లకు వచ్చి నాసిరకం ఉల్లిని మూడు కిలోలు రూ.100కు విక్రయిస్తుండగా.. దుకాణాల వద్ద నాణ్యతను బట్టి కిలో రూ.40 నుంచి రూ.45 వరకు అమ్మకాలు చేస్తున్నారు.రెట్టింపైన కూరగాయల ధరలు కూరగాయల ధరలు సైతం రెట్టింపయ్యాయి. వేసవి ఎండలు గోదావరి లంకలు, మెట్ట ప్రాంతాల్లో సాగుచేసే కూరగాయ పంటలకు తీవ్ర నష్టం కలగజేశాయి. అధిక ఉష్ణోగ్రతలకు పూత మాడిపోయి దిగుబడులు పడిపోయాయి. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చాయి. కిలో రూ.20 ఉండే వంకాయలు రూ.40కి చేరగా, బెండకాయలు రూ.24 నుంచి రూ.40కి, బీరకాయలు రూ.30 నుంచి రూ.50కి పెరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే క్యారెట్, బీట్రూట్, బంగాళా దుంప ధరలు నిలకడగా ఉండగా.. టమాటా రూ.20 నుంచి రూ.50కి పెరిగింది.పాత నిల్వలు వస్తేనే..ప్రస్తుతం ఉల్లి ధర పెరుగుదల తాత్కాలికమేనని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. నాలుగు రోజులుగా తాడేపల్లిగూడెం మార్కెట్‌కు దిగుమతులు తగ్గాయని హోల్‌సేల్ వ్యాపారి సర్వేశ్వరరావు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో మహారాష్ట్ర మార్కెట్లోకి పాత నిల్వలు రానున్నట్టు అక్కడి వ్యాపారులు చెబుతున్నారన్నారు. అవి ఇక్కడి మార్కెట్‌కు చేరితే శుక్రవారం నాటికి ధరలు దిగివచ్చే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత
దేశంలో ఉల్లి ఎగుమతులపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ ఉల్లిపాయల ఎగుమతి విధానాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తక్షణమే అమలులోకి వచ్చేలా కనీస ఎగుమతి ధరను మెట్రిక్ టన్నుకు 550 డాలర్లు (రూ.45,860)గా నిర్ణయించింది.ఈమేరకు విదేశీ వాణిజ్య విధానంలో సవరణలు చేస్తున్నట్లు మే 4 నాటి నోటిఫికేషన్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) పేర్కొంది. మే 3 నుంచి ఉల్లిపై ప్రభుత్వం 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. దీంతో 40 శాతం సుంకంతో ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుంది.ప్రస్తుతం ఉల్లి ఎగుమతిపై నిషేధం ఉంది. అయితే మిత్ర దేశాలైన యూఏఈ, బంగ్లాదేశ్‌లకు మాత్రం నిర్దిష్ట పరిమాణంలో ఉల్లి ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. గత ఏడాది ఆగస్టులో ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. 2023 డిసెంబర్లో ఎగుమతి నిషేధం విధించిన దాదాపు ఐదు నెలల తర్వాత ఏప్రిల్ 26న, మహారాష్ట్ర నుంచి ప్రధానంగా ఆరు పొరుగు దేశాలకు 99,150 మిలియన్ టన్నుల ఉల్లిని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. -
Kitchen Tips: ఈ చిన్న చిన్న పదార్థాలతో ఇబ్బందా? అయితే ఇలా చేయండి!
కిచెన్‌లో.. వంటచేసేటప్పుడు చిన్న చిన్న వస్తువులతో విసిగిపొతూంటాం. కొన్నిరకాల తిను బండారాలను కాపాడలేక, మరికొన్ని వస్తువులను ఎక్కువకాలం నిల్వచేయలేక ఇబ్బంది పడుతూంటాం. అలాగే కొన్ని పదార్థాలనుంచి వెలువడే చెడు వాసనతో కూడా తలనొప్పిగా భావస్తాం. మరి వీటినుంచి బయటపడాలంటే ఈ కిచెన్టిప్స్ ఓసారి ట్రై చేయండి.. కుల్చానుకాల్చేటప్పుడు.. పాన్ మీద కుల్చాను వేసి చుట్టుపక్కల కొద్దిగా నీళ్లు చల్లి మూతపెట్టాలి. ఒక వైపు కాలాక మరో వైపు తిప్పి చుట్టుపక్కల కొద్దిగా నీళ్లు చల్లి మూతపెడితే కుల్చా చక్కగా కాలుతుంది. చివరగా నూనె లేదా నెయ్యి చల్లుకుని సర్వ్ చేసుకుంటే కుల్చా చక్కగా కాలి రుచిగా వస్తుంది. ఉల్లిపాయ తరిగాక.. ఉల్లిపాయను ముక్కలుగా తరిగాక చేతులు ఉల్లివాసన వస్తుంటాయి. ఇలాంటప్పుడు బంగాళ దుంప ముక్కతో చేతులను ఐదు నిమిషాలు రుద్ది, తరువాత నీటితో కడిగితే ఉల్లివాసన వదులుతుంది. ఇవి చదవండి: సమ్మర్ సీజన్ కదా అని.. తొందరపడి పచ్చళ్లు పెట్టేస్తున్నారా! -
ఉల్లితో కలిగే ప్రయోజనాలు..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని చిన్నప్పటి నుంచి విన్నదే. అయితే, దానివల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటే మాత్రం మనమే మరొకరికి చెబుతాం ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని... ఇంతకీ ఉల్లి ఏం మేలు చేస్తుందో, ఎలా చేస్తుందో తెలుసుకుందాం. మజ్జిగ లేదా పెరుగుతో కలిసిన ఉల్లి శరీరానికి మంచిచేసే ఎన్నో పోషకాలనిస్తుందని పరిశోధనలలో వెల్లడైంది. పచ్చిఉల్లిని ప్రతిరోజూ 50 గ్రాముల మోతాదులో తింటే షుగర్ అదుపులో ఉంటుందని పరిశోధనల్లో తెలిసింది. అంతేకాదు, ఉల్లిని తినడం వల్ల ఎలాంటి దుష్పలితాలూ ఉండవు. దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గి, హార్ట్స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయి. ఉల్లిగడ్డను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. ఉల్లిపాయను గుజ్జుగా చేసి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్‌తో కలిపి తింటూ ఉంటే జీర్ణసంబంధిత సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను రోజూ ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది. పచ్చి ఉల్లిగడ్డ తినడం వల్ల బీపీ, హార్ట్ అటాక్, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు రావు. రాత్రి పడుకునే ముందు పచ్చి ఉల్లిపాయ తింటే, వేసవిలో వడదెబ్బ ముప్పు తప్పుతుంది. దీనితోపాటు, పచ్చి ఉల్లిపాయలో వేసవి వేడి నుండి రక్షించే గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో ఉన్న విషాన్ని తొలగిస్తుంది. నిద్రకు ముందు పచ్చి ఉల్లిపాయ తినడం నిద్రలేమిని దూరం చేస్తుంది. జలుబు, కఫంలో ఉల్లిపాయ చాలా మేలు చేస్తుంది. ఉల్లి రసం, తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి త్వరగా తగ్గుతాయి. ఉల్లిపాయల్లో ఉండే విటమిన్ సీ, కాల్షియం నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉల్లి అనేకరకాల క్యాన్సర్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. దీనితోపాటు, ఉల్లిపాయ తినడం వల్ల కడుపు, పెద్దప్రేగు, రొమ్ము, ఊపిరితిత్తులు ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలైనవి తగ్గుతాయి. ఉల్లి కీళ్లకు, గుండెకు మేలు చేస్తుంది. ఉల్లిగడ్డలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, డయేరియాల నుంచి కాపాడే ఆహారంలో ఉల్లిదే అగ్రస్థానం.. ఉల్లిలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. పచ్చిఉల్లిపాయను రోజు తింటే ఎముకల బలహీనతను అధిగమించవచ్చు. ఉల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు సంబంధ సమస్యల్ని దూరం చేస్తాయి. ఉల్లి రసాన్ని మాడుకు పట్టించడం వల్ల జుట్టు రాలడంతోపాటు చుండ్రు సమస్యలు తగ్గుతాయి. జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. జుట్టు పెరుగుతుంది. మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఉల్లి మంచి ఔషదం. ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి రోజూ ఉదయం తీసుకుంటే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. తేనెటీగలు లేదా తేలు కుట్టినప్పుడు ఉల్లి రసాన్ని రాస్తే సత్వర ఉపశమనం ఉంటుంది. ఇవి చదవండి: శ్రామికలోక శక్తిమంతులు. -
Onion skin: ఉల్లిపాయ పొట్టుతో ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
సాధారణంగా వంటల్లో ఉల్లిపాయలను అందరమూ వాడుతుంటాం. కొంతమంది వాసన పడక, మరికొంతమంది ఉపవాసాల సమయంలోనూ ఉల్లిపాయలను పక్కనపెట్టేస్తారు. అయితే ఉల్లిపాయలు మాత్రమేకాదు ఉల్లిపాయ తొక్కలు లేదా పొట్టు వల్ల ఆశ్చర్యకరమైన ప్రయోజనాలున్నాయి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అన్నట్టు ఉల్లిపాయ తొక్కల్లో కూడా మంచి పోషకాలు ఉన్నాయి. ఉల్లిపాయల్లో యాంటీ బయోటిక్, యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండి వీటిని తినడం ద్వారా ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని కాపాడుతాయి. వీటిలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బీ, సీ సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం చాలా తక్కువగా ఉండి మనకు ఆరోగ్యాన్నిస్తాయి. క్వెర్సెటిన్ లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలను ఉల్లిపాయ తొక్కల్లో ఉన్నాయని అధ్యయనాలు వెల్లడించాయి. అలాగే ఉల్లి తొక్కలతో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇవి చర్మం, జుట్టుకు మేలు చేకూరుస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో సాయపడతాయి. అంతేకాదు ఉల్లి పొట్టు మంచి కంపోస్ట్‌గా ఉపయోపడుతుంది. టీ, హెయిర్ డై, టోనర్‌గా, ఫ్లేవర్ ఏజెంట్‌గా, కంపోస్ట్‌గా.. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అదెలాగో చూద్దాం. ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు టీ ఉల్లిపాయ తొక్కతో చేసిన టీ తాగడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుందట వీటిని నీటిలో 10 నుంచి 20 నిమిషాలు ఉడకబెట్టి వడపోసి తరువాత ఈ టీని తాగొచ్చు. ఊబకాయం, అధిక రక్తపోటు, ఇన్ఫెక్షన్లను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మసాలా ఉల్లిపాయ తొక్కలను పారేయకుండా శుభ్రంగా కడిగి రెండు సార్లు కడగాలి. వీటిని ఎండలో ఆరబెట్టి పొడిచేయాలి. ఆరునెలలపాటు నిల్వ ఉండే ఈ పొడి మసాలాలో కలుపుకుని కూరల్లో వేసుకుంటే..కూర మంచి రుచిగా ఉంటుంది. రుచి, సువాసన స్టాక్, సూప్, గ్రేవీ మరుగుతున్న సమయంలో ఉల్లిపాయ తొక్కలను జోడించడం ద్వారా మంచి రుచితోపాటు శక్తివంతమైన రంగును అందిస్తుంది. గ్రేవీని చిక్కగా మారుస్తుంది. ఉడకబెట్టిన తర్వాత పీల్స్ తొలగించడం మర్చిపోవద్దు. చర్మం రోగాలకు ఉల్లిపాయ తొక్కలు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండి చర్మం, దద్దుర్లు, అథ్లెట్స్ ఫుట్‌పై దురదను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మంపై ఉల్లిపాయ తొక్క నీటిని అప్లై చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు. హెయిర్ డై సల్ఫర్ పుష్కలంగా ఉండే ఉల్లిపాయ తొక్కలను ఉపయోగించి నెరిసిన జుట్టు రంగు మార్చుకోవచ్చు. ఇది హెయిర్ ఫోలికల్స్‌కు పోషణ అందించడం ద్వారా బూడిద జుట్టును బంగారు గోధుమ రంగులోకి మారుస్తుంది. అలాగే, జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయ తొక్కలు నల్లగా కాలింత వరకు మీడియం మంట మీద వేడి చేసి తొక్కలను మెత్తగా నూరాలి. దీనికి కొద్దిగా కలబంద జెల్ లేదా నూనె కలపాలి. ఇలా చేసుకున్న జెల్‌ను నేరుగా హెయిర్ డైలా అప్లై చేసి గ్రే హెయిర్‌ను కవర్ చేసుకోవచ్చు. మంచి నిద్రకు ఉల్లిపాయ తొక్కలలో ఉండే ఎల్-ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం సహజమైన మత్తుమందులా పనిచేస్తుంది. ఉల్లిపాయ తొక్క టీ తాగడం వల్ల నరాలు ప్రశాంతతను పొందుతాయి. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. హెయిర్ టోనర్ పొడి జుట్టు, నిస్తేజమైన జుట్టు కోసం ఉల్లిపాయ తొక్కలను హెయిర్ టోనర్‌గా వాడుకోవచ్చు. ఉల్లిపాయ తొక్కలను నీళ్లలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించడం ద్వారా ఈ టోనర్‌ను తయారు చేసుకోవచ్చు. దీన్ని సీసాలో నిల్వ చేసుకుని అప్పుడప్పుడు జుట్టుకు పట్టించాలి. మంచి కంపోస్ట్‌గా మిద్దె తోటల్లో, బాల్కనీ గార్డెన్ ఉల్లి తొక్కల కంపోస్ట్ బాగా ఉపయోపడుతుంది. మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే అవసరమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. గులాబీ, మల్లి లాంటి ఇతర పూల మొక్కలకు ఈ కంపోస్ట్ మంచి టానిక్‌లా ఉపయోపడుతుంది. ఉల్లిపాయ తొక్కల్లో మొక్కలకు బలాన్నిచ్చే ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది. సహజరంగుగా ఉల్లిపాయ తొక్కలను నీటిలో ఉడకబెట్టి ఆ రంగును సహజ రంగులుగా వాడతారు. ఉల్లి రకాన్ని బట్టి బంగారు-పసుపు , డార్క్ ఆరెంజ్ రంగు వస్తుంది. హస్తకళాకారులు, చేతివృత్తులవారు ఈ సహజ రంగును వివిధ ఫాబ్రిక్ ,పేపర్ కోసం ఉపయోగిస్తారు. జాగ్రత్త: ఉల్లిపాయ తొక్కను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఇది కొంతమంది వ్యక్తులలో అలెర్జీ రావచ్చు. అలాగే కొన్ని రకాల ఉల్లిపాయలపై అప్పుడప్పుడు నల్లటి ఫంగస్ లాంటిది ఉంటుంది. సో శుభ్రమైన హెల్దీగా ఉన్నవాటిని తీసుకొని, నీటిలో బాగా కడిగి వాడుకోవడం ఉత్తమం -
అలరిస్తున్న ఉల్లి, ఇసుకల శాంతాక్లాజ్ శిల్పం!
క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన శాంతా క్లాజ్‌ను రూపొందించారు. ఉల్లిపాయలు,ఇసుక సహాయంతో సుదర్శన్ పట్నాయక్ ఈ శాంతా క్లాజ్‌ని తీర్చిదిద్దారు. పట్నాయక్ తనదైన శైలిలో ప్రజలకు సందేశం ఇచ్చారు. శాంతాక్లాజ్ సైకత శిల్పం ముందు క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాయడంతోపాటు ఈ భూమిని సస్యశ్యామలం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ భారీ సైకత శిల్పం తయారీకి రెండు టన్నుల ఉల్లిని వినియోగించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. ప్రతి సంవత్సరం, క్రిస్మస్ సందర్భంగా పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో విభిన్న శిల్పాలను రూపొందించడానికి ప్రయత్నిస్తుంటానని పట్నాయక్ చెప్పారు. ఈసారి ఉల్లిపాయలు, ఇసుకతో ప్రపంచంలోనే అతిపెద్ద శాంతా క్లాజ్‌ని తయారుచేశానని తెలిపారు. ఈ శాంతాక్లాజ్ సైకత శిల్పం 100 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు.ఈ సైకత శిల్పం తయారు చేసేందుకు ఎనిమిది గంటల సమయం పట్టిందని పట్నాయక్ తెలిపారు. కాగా వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియా ఈసైకత శిల్పాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంగా ప్రకటించింది. ఇది కూడా చదవండి: ‘వాజపాయి ప్రధాని కావడం తథ్యం’.. నెహ్రూ ఎందుకలా అన్నారు? Our World's biggest Onion and Sand installation of #SantaClaus. Set a New World record. The Chief Editor Sushma Narvekar and Senior Adjudicator Sanjay Narvekar of World Record Book of India declared it as a new world record and they presented me official certificate and a medal… pic.twitter.com/IzseZTpVsn — Sudarsan Pattnaik (@sudarsansand) December 25, 2023 -
ఉల్లి ఎగుమతులు నిషేధించిన భారత్.. కారణం ఇదే..
దేశీయ మార్కెట్లో ఉల్లి ధరలు మళ్ళీ కొండెక్కుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుదలవైపు దూసుకెళ్తున్న ఉల్లి ధరలు ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో హాఫ్ సెంచరీ (రూ. 50) దాటేశాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే సూచనలున్నట్లు భావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరల పెరుగుదలను నియంత్రణలో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులను నిషేదించింది. దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్లను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) వెల్లడించింది. ప్రజలకు తక్కువ ధరలోనే ఉల్లి అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ ప్రకారం ఈ రోజు నుంచి (డిసెంబర్ 8) నిషేధం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎగుమతికి సిద్దమైన ఉల్లిని ఎగుమతి చేసుకోవచ్చని, కొత్తగా ఎగుమతి చేయడం కుదరదని డీజీఎఫ్టీ ప్రకటించింది. ఇతర దేశాల అభ్యర్థనలను భారత ప్రభుత్వం అనుమతిస్తే.. ఆ దేశాలకు మాత్రమే ఉల్లి ఎగుమతి జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. లోన్ తీసుకున్న వారికి శుభవార్త ఉల్లి ధరలను అదుపు చేయడానికి కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కేంద్రం అనేకసార్లు ఎగుమతులను నిషేదించింది. అయితే 2024 మార్చి 31 తరువాత ఎగుమతులు యధాతధంగా కొనసాగుతాయా? లేదా నిషేధం ఇంకా పొడిగించబడుతుందా అనేది తెలియాల్సి ఉంది. -
తగ్గని ఉల్లి ధర
హైదరాబాద్: ఉల్లి గడ్డ ధర సామాన్యులను కంగుతినిపిస్తోంది. దాదాపు నెల రోజులుగా కిలో రూ.60 నుంచి 70 పైనే ఉంది. దీంతో రేటు తగ్గుతుందని ఎదురు చూస్తున్న మధ్యతరగతి ప్రజలు నిరాశ చెందుతున్నారు. వాస్తవంగా కొత్త పంట వస్తుండడంతో రేటు తగ్గుతుందని భావించినా పరిస్థితి మారలేదు. దీనికి కారణం కమీషన్ ఏజెంట్ల, వ్యాపారుల మాయాజాలం కూడా కారణమని ఆరోపణలు విన్పిస్తున్నాయి. వీరంతా ఒక్కటై ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉల్లి ధరలు పెంచేస్తున్నారని అంటున్నారు. తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ నుంచి కూడా మలక్‌పేట్ మార్కెట్‌కు ఉల్లిగడ్డ దిగుమతి పెరిగింది. రోజుకుదాదాపు 70–80 లారీల ఉల్లి దిగుమతి అవుతోంది. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది లారీ సంఖ్య ఎక్కువగా ఉందని మలక్‌పేట్ మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఇప్పటికే ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కానీ ఈ ఏడాది నగరానికి ఉల్లి రాక పెరిగినా ధరలు మాత్రం తగ్గడం లేదని రిటైల్ వ్యాపారులు అంటున్నారు. గతేడాది నవంబర్‌లో కిలో ఉల్లిగడ్డ ధర రూ.30 ఉండగా ఈ ఏడాది రూ.60 పైనే పలుకుతోంది. వారం రోజులుగా మహారాష్ట్ర నుంచి భారీగా ఉల్లి సరఫరా పెరిగింది. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కలిసి సిండికేట్‌గా మారి ఉల్లి ధరలు తగ్గించడం లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. జంట నగరాల మార్కెట్లలో ఉల్లిగడ్డ నిల్వచేయడానికి తగిన గోదాముల వసతి లేక పోవడంవల్లే ఈ పరిస్థితి వస్తోందని వారంటున్నారు. -
పండగ వేళ కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు
ప్రతి ఏటా ఉల్లి ధరలు భారీగా పెరగడం, తగ్గడం జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా పండుగ సీజన్లో ఉల్లి ధరలు గణనీయంగా పెరిగాయి. కొన్ని నెలల క్రితం కేజీ ఉల్లి ధరలు రూ. 10 నుంచి రూ. 20 వరకు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం అదే ఉల్లి ఢిల్లీలో రూ.70కి చేరింది. రానున్న రోజుల్లో ఇది రూ. 100కి చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉల్లి ధరల పెరుగుదలకు కారణం ఏంటి? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉల్లి ధరల పెరుగుదలకు చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది డిమాండ్. డిమాండ్ పెరిగినప్పుడు అవసరమైనన్ని అందుబాటులో లేనప్పుడు తప్పకుండా ధరలు పెరుగుతాయి. అంతే కాకుండా కొందరు రైతులు తమ పంటను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడం వల్ల, దేశంలో ఉల్లి కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి. ఉల్లి ధరలు పెరగటానికి మరో ప్రధానమైన కారణం పంట ఆలస్యం. ఖరీఫ్ పంట ఆలస్యం వల్ల సాగులో జాప్యం ఏర్పడుతుంది. అప్పుడు చేతికి అందాల్సిన సమయానికి పంట రాకపోతే కొరత ఏర్పడుతుంది. తద్వారా ధరలు పెరుగుదల జరుగుతుంది. ఉల్లి ధరలు తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే? ఉల్లి ధరలు అందుబాటు ధరలు ఉంచాలనే ఉద్దేశ్యంతో గత ఆగస్టు నుంచి పెద్ద మొత్తంలో ఉల్లిపాయలను మార్కెట్లోకి విడుదల చేసినట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి 'రోహిత్ కుమార్ సింగ్' వెల్లడించారు. ధరల పెరుగుదలను నివారించడానికి ప్రభుత్వం రిటైల్ పంపిణీని కూడా పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా? నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్సిసిఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్) ద్వారా కేజీ ఉల్లి ధరలను రూ. 25కే అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ 5 లక్షల టన్నుల ఉల్లి స్టాక్‌ను నిర్వహిస్తోంది, రాబోయే రోజుల్లో అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిపాయలను సేకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. -
ఉల్లి.. ఘాటెక్కింది మళ్లీ..!
సదాశివపేట (సంగారెడ్డి): కోస్తుంటేనే కన్నీళ్లు తెప్పించే ఉల్లి.. ఇప్పుడు కొంటుంటే ఘాటెక్కుతోంది. బహిరంగ మార్కెట్లలో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రిటైల్ మార్కెట్లోనూ ఉల్లి ధరలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సరిగ్గా దసరా పండుగకు ఇరవై రోజుల క్రితం సదాశివపేట పట్టణ వీధుల్లో వాహనాల్లో ఉల్లిగడ్డ తీసుకొచ్చి వందకు ఆరు, పదు కిలోల చొప్పున విక్రయించారు. రిటైల్‌గా రూ 20 కిలో చొప్పున అమ్మారు. దసరా పండుగకు ముందు అమాంతంగా ధర పెరగడంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు, హోటళ్లు, తినుబండారాలు, ఆహారాల దుకాణాల వారు ఉల్లిధర పెరగడంతో వాటి వినియోగాన్ని తగ్గించారు, సదాశివపేటకు వచ్చిన గ్రామీణులు ఉల్లిధర విని అమ్మో అంటున్నారు, మరో నెల రోజుల తర్వాత గాని ఉల్లిధరలు తగ్గుముఖం పట్టదని డీలర్లు పేర్కొంటున్నారు. జూలై నుంచి అక్టోబర్ మధ్య ఉల్లి ధరలను పోల్చి చూస్తే ధరలో దాదాపు 50 శాతం పెరిగింది. జూలైలో రూ.20 ఉండగా అక్టోబర్, నవంబర్‌లో 50 నుంచి 80కి పెరిగింది. ఈ విధంగా చూస్తే ఉల్లి సగటు ధరలు 50 శాతం పెరిగాయి, మహారాష్ట్రంలోని హోల్‌సెల్ ఽమార్కెట్‌లో కూడా ఉల్లిధరలు భారీగా పెరగడంతో దాదాపు 30 శాతం మేర ఉల్లిని విక్రయిస్తున్నారని సమాచారం. సాగు విస్తీర్ణం తగ్గడంతోనే.. మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణకు ఉల్లి దిగుమతి అవుతుంటాయి. గత వానా కాలం సీజన్లో ఆయా రాష్ట్రాల్లో ఉల్లిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఉల్లికి కొరత ఏర్పడి ధరలు పెరిగిపోతున్నాయని వ్యాపారాలు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో 2,596 ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తున్నారు. జిల్లాలోని నారాయణఖేడ్, మనూరు, కంగ్టి, సదాశివపేట, కొండాపూర్, సంగారెడ్డి, కంది, మునిపల్లి, జహిరాబాద్ తదితర మండలాల్లో ఉల్లి పంటను ఎక్కువగా సాగు చేస్తుంటారు. నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో అత్యదికంగా వెయ్యి ఎకరాల వరకు సాగు చేస్తున్నారు, సదాశివపేట మండలం అరూర్, నందికంది, పెద్దాపూర్‌తో పాటు కొండాపూర్ మండలం గొల్లపల్లి, మునిదేవునిపల్లి, మన్సాన్పల్లి, మల్లేపల్లి, అనంతసాగర్, మారేపల్లి, గంగారం, గ్రామాల్లో ఉల్లి సాగుచేస్తారు. సాధారణంగా ఉల్లిని అధిక భాగం దేశంలోని మహారాష్ట్ర, కర్నాటక తర్వాత ఏపీలోని కర్నూలు జిల్లాల్లో సాగవుతుంది, అయితే ఈ ఏడాది కర్నూలు జిల్లాలో రుతుపవనాలు అలస్యంగా రావడం, వచ్చిన అసమానంగా ఉండటం, తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, పంటలు రాక ఆలస్యమవడంతో ఉల్లి లభ్యత తగ్గింది. దీంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని ఉల్లిధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కొరుతున్నారు. -
Onion Prices: మళ్లీ ఉల్లి లొల్లి షురూ..!
కొన్ని వారాల కొందట టొమాటో ధరలు ఏ స్థాయిని చేరుకున్నాయో చూశాం. కేజీ రూ.250 వరకు పలికిన వాటి ధరలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి. ఇప్పుడు ఉల్లి రేట్లు పెరగడం ప్రారంభమైంది. దాంతో వీటి ఎగుమతులను నియంత్రించడం ద్వారా దేశంలో ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. నిత్యం వంటల్లో వాడే ఉల్లి ధరలు ఇప్పుడు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురిశాయి. దాంతో ఉల్లి పంట దెబ్బతింది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో వాటికి కొరత ఏర్పడింది. దాని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల కిలో నాణ్యమైన ఉల్లిపాయలు రూ.40-50 మధ్య విక్రయిస్తున్నారు. (ఇదీ చదవండి: ఆదాయపుపన్ను శాఖ సంచలన నిర్ణయం..అపర కుబేరులకు ఝలక్) దీపావళి పండగ సీజన్ కావడంతో మున్ముందు ఈ ధరలు మరింత పెరగవచ్చనే అంచనాలున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ధరల కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఉల్లి ఎగుమతులపై విధించే పన్నును ఆగస్టులో 40శాతం మేర పెంచింది. ఈ పన్ను ఏడాది చివరివరకు అమలవుతుంది. ఈ చర్యతో ఉల్లి ఎగుమతులు భారీగా తగ్గి, వాటి ధరలు నిలకడగా ఉంటాయన్నది ప్రభుత్వ యోచన. మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్నా దాన్ని గరిష్ఠస్థాయిలో పండించే రాష్ట్రాల్లో గతంలో వర్షాభావం వల్ల దిగుబడి తగ్గింది. వర్షాకాలంలో కర్ణాటకలోని రైతులు ఉల్లిని అధికంగా పండిస్తుంటారు. అయితే ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యం కావడంతో రైతులు ఉల్లి సాగుపై ఆసక్తి చూపించలేదు. కొన్ని చోట్లు ఉల్లిసాగు చేసినా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వేల హెక్టార్లలో నేలకొరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దేశీయంగా ప్రతి నెలా సగటున 13లక్షల టన్నుల ఉల్లి వినియోగమవుతుంది. దేశంలో ఉల్లి ఎక్కువగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పండుతుంది. 65శాతం పంట ఒక్క రబీలోనే వస్తుంది. అది ఏప్రిల్-మే మధ్య మార్కెట్లోకి వచ్చి అక్టోబరు-నవంబరు వరకు ఉంటుంది. అయితే, నిల్వ ప్రక్రియలోనే ఉల్లిపాయలు ఉత్పత్తి బరువులో 30-40శాతం కోల్పోతాయి. కుళ్ళిపోవడంవల్ల కొన్ని వృథా అవుతాయి. అలా పరిమాణంతో పాటు నాణ్యతపరంగానూ నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఉల్లిపాయలను నిల్వ చేసేందుకు నాణ్యమైన ఏర్పాట్లు లేకపోవడంవల్ల ఏటా రూ.11వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని అంచనా. ఇదే సమయంలో దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆహార ధరలు నియంత్రణలో ఉండాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఉల్లి ధర కేజీకి రూ.50కి మించకుండా ఉండాలని చూస్తుంది. ఈ సారి ఖరీఫ్ పంట ఆలస్యంగా చేతికి రావటంతో పాటు పంట దిగుబడి తగ్గడంతో ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయి. పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను అరికట్టడానికి కేంద్రం మరింత జోక్యం చేసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆ ఒక్క రకం ఉల్లిపాయకే మినహాయింపు!
దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం అన్ని రకాల ఉల్లిపాయల ఎగుమతులపై సుంకం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎగుమతుల సుంకం (export duty) నుంచి 'బెంగళూరు రోజ్' (Bangalore Rose) రకం ఉల్లికి కేంద్ర ప్రభుత్వం తాజాగా మినహాయింపునిచ్చింది. కొన్ని షరతులకు లోబడి 'బెంగళూరు రోజ్' ఉల్లికి ఎగుమతి సుంకం నుంచి మినహాయింపును మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎగుమతిదారు ఎగుమతి చేయాల్సిన బెంగళూరు రోజ్ రకం ఉల్లి ఉత్పత్తులు, పరిమాణాన్ని ధ్రువీకరిస్తూ రాష్ట్ర ఉద్యాన కమిషనర్ నుంచి ఒక ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఉల్లి ధరలు భారీగా పెరిగిపోతూ ఉండడంతో వాటిని అదుపు చేయడానికి, దేశీయంగా లభ్యతను పెంచడానికి గత ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఉల్లిపాయలపై 40 శాతం ఎగమతి సుంకాన్ని విధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉల్లి రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'బెంగళూరు రోజ్' రకం ఉల్లికి మాత్రం ఎగుమతి సుంకం మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. -
వెజి‘ట్రబుల్’కు విరుగుడు.. టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్‌తో దీర్ఘకాలం నిల్వ
-పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్ డెస్క్ నిన్నటిదాకా వినియోగదారులను ఏడిపించిన టమాటా నేడు రైతన్నలతో కన్నీళ్లు పెట్టిస్తోంది! టమాటాతో పోటీగా ఎగబాకిన పచ్చి మిర్చి ధరలు సగానికిపైగా పతనమయ్యాయి! ఈదఫా ‘ఉల్లిపాయ’ బాంబు పేలటానికి సిద్ధమైంది!! సామాన్యుడిని ఠారెత్తించిన కూరగాయల ధరలు ఇప్పుడు దిగి వచ్చినా కొద్ది నెలలు దేశ ప్రజలకు చుక్కలు చూపించాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా టమాటాలే. ఐదారు రోజులకు మించి నిల్వ ఉంటే పాడవుతాయి. అకాల వర్షాలకు ఉల్లిపాయలు కుళ్లిపోతాయి. చాలాసార్లు కనీస ఖర్చులు కూడా దక్కకపోవడంతో టమాటాలను రోడ్లపై పారబోసి నిరసన తెలిపిన ఘటనలున్నాయి. అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి..! మరి ఏం చేయాలి? సీజన్లో సద్వినియోగం.. వాతావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడం నిజమే అసలు కారణం సరైన నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు లేకపోవడమే. వరద వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవాలి! టమాటా, ఉల్లి లాంటివి కూడా సీజన్లో విరివిగా, చౌకగా లభ్యమవుతాయి. మరి సమృద్ధిగా దొరికినప్పుడు సేకరించుకుని ప్రాసెస్ చేసి వాడుకుంటే? రాష్ట్రంలో ఇప్పుడు అదే ప్రక్రియ మొదలైంది. సరైన పద్ధతిలో నిల్వ చేయడం, నాణ్యతను సంరక్షించడం కీలకం. అందుకే ప్రాసెసింగ్ యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామ స్థాయిలో పొదుపు మహిళల ద్వారా వీటిని ఏర్పాటు చేయడంతోపాటు భారీ ప్లాంట్లపై కూడా దృష్టి పెట్టింది. ఒకవైపు ధరలు పతనమైనప్పుడు మార్కెట్ జోక్యంతో అన్నదాతలను ఆదుకుంటూనే మరోవైపు వీటిని అందుబాటులోకి తెస్తోంది. దీనివల్ల ధరల మంటకు, దళారుల దందాకు తెర పడుతుంది! ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు షేక్‌జుబేదా బీ. పొదుపు సంఘంలో సభ్యురాలు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లెకు చెందిన ఈమె ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సహకారంతో టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్, డ్రయ్యింగ్ ద్వారా నెలకు రూ.18,000 వరకు ఆదాయాన్ని పొందుతోంది. బ్యాంకు లోన్‌తో యంత్రాలు, షెడ్‌ను సమకూర్చుకోగా సబ్సిడీగా రూ.70,000 అందాయి. తన వాటాగా రూ.20 వేలు జత చేసింది. సోలార్ డ్రయ్యర్లు, డీ హైడ్రేషన్ యూనిట్లతో రోజూ 200 కిలోల కూరగాయలను ఇంట్లోనే ప్రాసెసింగ్ చేస్తోంది. వీటిని సరఫరా చేస్తూన్న ‘ఎస్4 ఎస్’ అనే కంపెనీ ప్రాసెసింగ్ అనంతరం తిరిగి ఆమె వద్ద నుంచి సేకరిస్తోంది. 50 కిలోలు ప్రాసెసింగ్ చేసినందుకు రూ.125 చెల్లిస్తుండగా కరెంట్ చార్జీల కింద మరో రూ.20 చొప్పున కంపెనీ ఇస్తోంది. ప్రతి నెలా రూ.4,000 బ్యాంకు కిస్తీ పోనూ నికరంగా నెలకు రూ.14,000 వరకు ఆదాయం లభిస్తోంది. డ్రయ్యర్లతో డీ హైడ్రేషన్ యూనిట్లు.. ఉద్యాన రైతులకు గిట్టుబాటు ధర, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం లక్ష్యంగా సోలార్ డ్రయ్యర్లతో కూడిన డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లా తడకనపల్లిలో గతేడాది ఆగస్టులో 35 శాతం సబ్సిడీతో పది యూనిట్లు ఏర్పాటు కాగా కొద్ది రోజుల్లోనే మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఇప్పటి వరకు 1,200 టన్నుల టమాటా, ఉల్లిని ప్రాసెస్ చేశారు. ఈ ఏడాది జూలైలో మరో వంద యూనిట్లను ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్లతో 5 వేల యూనిట్ల ఏర్పాటుకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అవగాహన ఒప్పందం చేసుకుంది. వీటిలో 3,500 యూనిట్లను రాయలసీమ జిల్లాల్లోనే నెలకొల్పుతున్నారు. ప్రతి 100 సోలార్ యూనిట్లను ఒక క్లసర్ కిందకు తెచ్చి రైతుల నుంచి రోజూ 20 టన్నులు టమాటా, ఉల్లిని సేకరించి రెండు టన్నుల ఫ్లేక్స్ తయారు చేయనున్నారు. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో ఇప్పటికే 900 మంది లబ్ధిదారులను గుర్తించారు. సెప్టెంబరు నాటికి 500 యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కళ్యాణదుర్గం, సత్యసాయి జిల్లా తనకల్లు ప్రాంతాల్లోనూ లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కర్నూలు జిల్లా పత్తికొండలో రూ.10 కోట్లతో భారీ స్థాయిలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులకు త్వరలో భూమి పూజ జరగనుంది. ఈ యూనిట్లో స్టోరేజీ, సార్టింగ్, గ్రేడింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. పల్పింగ్ లైన్, డీ హైడ్రేషన్ లైన్ ఉంటాయి. కెచప్, జామ్, గ్రేవీ లాంటి అదనపు విలువతో కూడిన ఉత్పత్తులు తయారవుతాయి. రాజంపేటలో రూ.294.92 కోట్లతో, నంద్యాలలో రూ.165.32 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గుజ్జు, ఐక్యూఎఫ్ (టమాటా) పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. రైతన్నకు ‘మద్దతు’.. మహిళలకు ఉపాధి ఉల్లి, టమాటా రైతులకు ఏడాది పొడవునా గిట్టుబాటు ధరలతో పాటు పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద నెలకొల్పిన 100 యూనిట్లు విజయవంతం కావడంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్ల అంచనాతో 5 వేల యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈమేరకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఒక్కో యూనిట్ రూ.1.68 లక్షల అంచనాతో ఏర్పాటు చేస్తున్నాం. లబ్ధిదారుల గుర్తింపు చురుగ్గా సాగుతోంది. – ఎల్.శ్రీధర్‌రెడ్డి, సీఈవో, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ -
వ్యవసాయానికి ఎన్నాళ్లీ సంకెళ్లు?
ఉల్లి ఎగుమతులను సమర్థంగా అడ్డుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం స్థానిక సరఫరాను పెంచింది. ఈ చర్య రైతులకు నష్టం కలిగించేదే. ఇది మార్కెట్ యంత్రాంగంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కాదా? అంతర్జాతీయంగా బియ్యం ధరలు దశాబ్ద కాలపు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. కానీ బాస్మతీయేతర తెల్ల బియ్యం, నూకల బియ్యం ఎగుమతిని కేంద్రం నిషేధించింది. మొత్తం బియ్యం ఎగుమతుల్లో ఈ రెండూ 45 శాతం వరకు ఉంటున్నాయి (తాజాగా బాస్మతి ఎగుమతులనూ నిషేధించింది). బియ్యం ఎగుమతులను నిషేధించడానికి కారణం ఇథనాల్ తయారీదారుల ప్రయోజనాలను కాపాడటం కోసమేనని తెలుస్తోంది. ఇది వరి రైతు లాభాలను పణంగా పెడుతోంది. ఈ సంవత్సరం మరో రెండు లక్షల టన్నుల ఉల్లిని అదనంగా సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఈ ఏడాది ఉల్లి నిల్వల లక్ష్యాన్ని (బఫర్ స్టాక్) మూడు లక్షల టన్నుల నుండి ఐదు లక్షల టన్నులకు తీసుకెళు తుంది. ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకం విధించిన ఒక రోజు తర్వాత కేంద్రం నుంచి ఈ ప్రకటన వచ్చిందని గుర్తించాలి. అంటే, ఎగుమతులను సమర్థంగా అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం స్థానిక సరఫరాను పెంచింది. ఇది ఉల్లి ధరల పతనానికి కారణమవు తుంది. ఇది మార్కెట్ యంత్రాంగంలో జోక్యం చేసుకోవడం కాదా? ఉల్లి రైతులు ప్రభుత్వానికి తక్కువ ధరకు తమ పంటను అమ్మేలా చేసేందుకు ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకున్నట్లు కనిపించడం లేదా? ఇది మార్కెట్‌పై ప్రభుత్వ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేయడం కాదా? ఈ చర్య కచ్చితంగా రైతులకు నష్టం కలిగిస్తున్నందున, కేంద్ర మాజీ వ్యవసాయ మంత్రి కూడా ఉల్లిపై ఎగుమతి పన్ను పెంపును విమర్శించారు. ఆ మాజీ మంత్రి దేశంలోని ఉల్లిపాయల్లో మూడింట ఒక వంతు సరఫరా చేసే రాష్ట్రానికి చెందినవారు. ఎగు మతి పన్నుకు వ్యతిరేకంగా రైతులు ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నప్ప టికీ ఫలితం లేకుండా పోయింది వ్యవసాయోత్పత్తుల కోసం మార్కెట్ యంత్రాంగంలో ఇటువంటి ఏకపక్ష జోక్యాలకు రైతులు అలవాటు పడ్డారు. ఈ వారం ఉల్లి ద్రవ్యోల్బణం 19 శాతానికి చేరుకోవడం కేంద్ర ప్రభుత్వానికి ఆందో ళన కలిగిస్తోంది. ఇంటి బడ్జెట్లో ఉల్లిపాయల వాటా కొంత భాగం మాత్రమే అనుకోవద్దు. ఉల్లి ధరలు రాజకీయ నాయకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి. మితిమీరిన ఉల్లిపాయల ధరల పెరుగుదల కారణంగా ప్రభుత్వాలే పడిపోయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 2020 సెప్టెంబర్‌లో పార్లమెంటులో ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలను గుర్తుంచుకోండి. ఈ మూడు చట్టాలలో ఒకటి వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై నియంత్రణను పూర్తిగా ఎత్తివేయాలనీ, నిల్వ పరిమితులను తొలగించాలనీ ప్రతిపాదించింది. ఎగుమతులు లేదా దిగుమతులపై ఏకపక్ష నిషేధాలను సడలించాలని కూడా అది ప్రతిపాదించింది. కానీ నూతన వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆ వారంలోనే, బంగ్లాదేశ్‌కు వెళ్లే అనేక ట్రక్కులను సరిహద్దు వద్ద నిలిపివేశారు. ఎందుకంటే, అవి ఉల్లిపాయల ఎగుమతి సరుకులను తీసుకుపోతు న్నాయి. ఒకవైపు ఎగుమతులను నిలిపివేయడం, మరోవైపు వ్యవ సాయ మార్కెట్లపై నియంత్రణ ఎత్తివేయడం వంటి ఈ చర్యలు మిశ్రమమైన, నిజాయితీ లేని సంకేతాలను ఇస్తున్నాయి. బహుశా, ఉల్లిపాయలపై ప్రస్తుతం విధించిన ఎగుమతి పన్నును నివారణ చర్యగా చెప్పవచ్చు. టమోటా ధరల అనూహ్య పెరుగుదల కారణంగా ఇప్పటికే దెబ్బతిని ఉన్నాం. భారత జాతీయ సహకార సంస్థల వినియోగదారు సమాఖ్య, భారత జాతీయ సహకార మార్కెటింగ్ సమాఖ్య ఇప్పటికే తమ బఫర్ స్టాక్ కోసం 15 లక్షల టన్నులకంటే ఎక్కువ టమోటాలను సేకరించాయి. కిలో టమోటా ధర రూ.200 వరకు పెరగడంతో సబ్సిడీ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ రాయితీలను ఎక్కడినుంచి చెల్లిస్తున్నారు? ద్రవ్యోల్బణం మంటలను ఆర్పడా నికి నేపాల్, తదితర దేశాల నుండి కూడా బహిరంగంగా ప్రకటించని మొత్తంలో టమోటాలను భారత్ దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం 7.5 శాతం వద్ద నడుస్తోంది. ఇది భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 6 శాతం పరిమితి కంటే ఎక్కువ. కాబట్టి, ద్రవ్యోల్బణానికి కారణమయ్యే ప్రధాన విల¯Œ లలో టమోటాలు కూడా ఉన్నాయి. ఇది ప్రభుత్వాల అపఖ్యాతికి కారణ మవుతోంది. పైగా అది మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది కూడా. మరొక వ్యవసాయ సరుకును తీసుకోండి. జూలై నెలలో భారత దేశం బాస్మతీయేతర తెల్ల బియ్యం, నూకల బియ్యం ఎగుమతిని నిషేధించింది. మొత్తం బియ్యం ఎగుమతుల్లో ఈ రెండూ 45 శాతం వరకు ఉంటున్నాయి. ఈ నిషేధం మన వ్యాపార భాగస్వాములలో చాలామందిని కలవరపెట్టింది. పైగా భారతదేశాన్ని నమ్మదగని సర ఫరాదారుగా కనిపించేలా చేసింది. ఈ నేపథ్యంలో ఆఫ్రికా, ఆసియా లోని కొన్ని దేశాలు భారత్ నుండి బియ్యం దిగుమతిపై ఆధారపడటం వారి ఆహార భద్రతకు హాని కలిగించవచ్చు. దీనివల్ల ఆహార భద్రతపై భారత ప్రభుత్వం నిజంగా శ్రద్ధ చూపడం లేదని అర్థమవుతోంది. అయితే ప్రాథమికంగా బియ్యం ఎగుమతులను నిషేధించడానికి కారణం ఇథనాల్ తయారీదారుల ప్రయోజనాలను కాపాడటం కోస మేనని తెలుస్తోంది. 50 నుండి 60 లక్షల టన్నుల నూకల బియ్యంలో 30 లక్షల టన్నుల దాకా ఇథనాల్ తయారు చేయడానికి వెళ్తాయి. బియ్యం ఎగుమతిపై నిషేధం కార్ ఇంజిన్ల లభ్యతను పెంచుతుంది. కానీ ఇది వరి రైతు లాభాలను పణంగా పెడుతోందని గమనించాలి. అంతర్జాతీయంగా బియ్యం ధరలు దశాబ్ద కాలపు గరిష్ఠ స్థాయికి చేరు కున్నాయి. మంచి లాభాలు ఆర్జించేందుకు ఇదొక అవకాశం. వ్యవసా యోత్పత్తులపై ఎగుమతి నిషేధం వంటి చర్యల ఫలితంగా అంతిమంగా రైతులు నష్టపోతున్నారు. టమోటాలు, ఉల్లిపాయలు లేదా బియ్యంపై విధానపరమైన చర్యలకు సంబంధించిన ఇటీవలి కథనాలు... వ్యవసాయంలో సంస్క రణలు ఎందుకు ఇంత కఠినంగా, అసంపూర్తిగా ఉన్నాయనే విష యాన్ని వివరిస్తున్నాయి. దీని వెనుక స్వాభావికమైన పట్టణ పక్షపాతం ఉంది. ప్రభుత్వ విధానాలు రైతుల ప్రయోజనం కంటే పట్టణ వినియో గదారుల సంక్షేమానికి (తక్కువ ఆహార ద్రవ్యోల్బణం) అధిక ప్రాధా న్యత ఇస్తాయి. కాబట్టి, మార్కెట్లను సంస్కరించే, రైతుకు అనుకూలంగా క్రమబద్ధీకరించే వ్యవసాయ విధానాలను ఎల్లప్పుడూ ఏకపక్షంగా తిప్పికొడుతున్నారు. ధరల నియంత్రణల వల్ల రైతులకు కలుగుతున్న నష్టాన్ని భర్తీ చేయడానికి, ఉచిత నీరు, విద్యుత్, చౌకగా ఎరువులు వంటి ఇన్పుట్ సబ్సిడీలు కొనసాగుతాయి. ఇది ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంటుంది. ప్రభుత్వంపై పడుతున్న భారానికి ప్రత్యా మ్నాయంగా ‘ఫార్వర్డ్ మార్కెట్ల’ అన్వేషణ జరగటం లేదు. అందువల్లే్ల ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుంటోంది. దానికోసం పోటీ లేని గుత్తాధిపత్య ప్రవర్తనకు కూడా వెనుకాడటం లేదు. ఈ ఆధిపత్య దుర్వినియోగానికి గానూ ప్రభుత్వాన్ని ఎవరు కోర్టుకు లాగుతారు? ధరల నియంత్రణ, నిల్వ పరిమితులు, ఏకపక్ష దిగుమతి, ఎగుమతి నిషేధాలతోపాటు తరచూ మారుతున్న ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయం ఇప్పటికీ సంకెళ్లతో బంధించబడి ఉంది. సాంకేతికంగా చూస్తే వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వాల పరిధికి సంబంధించిన అంశం అయినప్పటికీ కేంద్రంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవసా యంపై తీవ్రంగా జోక్యం చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలతో రైతు భారీస్థాయి, విధ్వంసకరమైన రాయితీలతో అల్లాడిపోతాడు. భారీ సబ్సిడీలతో కూడిన రసాయన ఎరువులను అధికంగా వాడటం వల్ల పంజాబ్‌లో సంభవించిన నేల క్షీణత, లవణీయత దీనికి సాక్షీభూ తంగా ఉంది. వీటన్నింటికీ మించి, దేశంలో సగం మంది రైతులకు రాయితీలు లభించవు. ఎందుకంటే వారు భూమి లేనివారు లేదా కౌలుదారులు కాబట్టి తాము సాగుచేసే భూమితో వారికి సంబంధం ఉండదు. వ్యవసాయ విధాన పరంగా మనం నేస్తున్న వలలు మనల్ని చిక్కుల్లో పడేశాయి. అందుకనే వాటి సంకెళ్లు తొలగించడం చాలా కష్టంగా మారింది. మార్కెట్లు మెరుగ్గా పనిచేయాలన్నా, ప్రభుత్వ జోక్యాన్ని పరిమితంగా ఉంచాలన్నా, మార్కెట్ ప్రక్రియలో పాల్గొని, దాని నుండి లాభం పొందేందుకు రైతుకు మరింత స్వేచ్ఛను అందించాల్సి ఉంది. దీనికోసమే మనకు భారీ సంస్కరణలు అవసరం. డాక్టర్ అజీత్ రానాడే, ఆర్థికవేత్త (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
ఉల్లి విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం - రేపటి నుంచే అమలు!
గత కొన్ని రోజులకు ముందు టమాటా ధరలు ఆకాశాన్నంటాయి.. ఇక ఇప్పుడిప్పుడే ధరలు తగ్గుతున్నాయనుకుంటున్న తరుణంలో ఉల్లి ఘాటెక్కిపోతోంది. భారతీయ మార్కెట్లో ధరల నియంత్రణతో పాటు, సరఫరా మెరుగుపరచడానికి కేంద్రం నిన్న 40 శాతం టాక్స్ విధించింది. ఢిల్లీ ప్రజలకు ఉల్లి ధరల నుంచి ఉపశమనం కల్పించడానికి తక్కువ ధరకే విక్రయించాలని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) నిర్ణయించింది. కావున రేపటి నుంచి దేశ రాజధానిలో ఉల్లి కేజీ రూ. 25కి విక్రయించనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 3 లక్షల టన్నుల ఉల్లి బఫర్ స్టాక్‌ను రూపొందించింది. ఈ ఏడాది బఫర్ కోసం అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిని సేకరించాలని నిర్ణయించింది. ఇప్పుడు ప్రారంభంలో ఢిల్లీలో బఫర్ ఉల్లిపాయలను రిటైల్ చేయడం ప్రారంభమవుతుంది. ఇదీ చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే కారు! అంబానీ కారు అదిరిపోలా.. ఢిల్లీలో రేపు సుమారు 10 మొబైల్ వ్యాన్లు దీని కోసం ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఆ తరువాత క్రమంగా వీటిని మరిన్ని ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా తక్కువ ధరకే ఉల్లి విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. -
మండుతున్న ఉల్లి ధరలు
-
ఉల్లిపాయ రసంతో.. మచ్చలకు చెక్! ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది!
ఉల్లిపాయలు ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా! ఇలా చేస్తే ముఖం కాంతులీనుతుంది. ►ఉల్లిపాయలోని యాంటీసెప్టిక్ గుణాలు చర్మ సమస్యలకు చెక్ పెడతాయి. మచ్చలను తొలగిస్తాయి. ►టేబుల్ స్పూన్ ఉల్లి రసంలో టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ఫేస్‌ప్యాక్ లా వేయాలి. ►ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. మీ ముఖంలో నిగారింపు మీకే తెలుస్తుంది. చర్మం మెరిసిపోతుంది! ►టీ స్పూన్ పసుపులో సరిపడా ఉల్లిపాయ రసాన్ని కలిపి పేస్ట్‌లా చేయాలి. ►దీనిని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ►ఇన్‌స్టంట్‌గా చర్మం మెరిసిపోతుంది. ►శనగపిండి, ఉల్లిరసం, పాలు .. మూడూ సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లా ముఖానికి రాసుకుని.. కాసేపటి తర్వాత కడిగితే మొహం చంద్రబింబమే. ►అతినీల లోహిత కిరణాల వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదాన్ని ఉల్లి తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు యూవీ కిరణాల వల్ల కలిగే హానిని అడ్డుకుంటాయి. చివరగా ఒక మాట.., ఉల్లిపాయను తరిగేటప్పుడు కళ్లు మంటపుట్టి, నీళ్లు కారతాయి. అయితే అది కూడా మంచిదే. అలా నీరు కారడం వల్ల కళ్లలోని మలినాలు తొలగిపోతాయి, అంతేకాదు, కంటి సమస్యలను నివారించడంలో ఉల్లికి సాటి మరేదీ లేదు. నేత్ర సమస్యలకు చెక్ పెట్టాలంటే మీ డైట్లో ఉల్లి ఉండేలా చూసుకోవాల్సిందే. చదవండి: పాలు కాచి చల్లార్చి.. పుల్లని మజ్జిగ కలిపి, ఈ పొడి వేసుకుని తాగితే పేగులకు బలం.. ఇంకా! Beauty Tips: కుంకుమ పువ్వు, రోజ్ వాటర్‌తో ఐస్‌క్యూబ్స్.. పిగ్మెంటేషన్‌కు చెక్! ముఖం మెరిసేలా.. -
మార్కెట్ మాయాజాలం.. మహారాష్ట్రలో కిలో ఉల్లి రూ.2, హైదరాబాద్‌లో రూ.25!
సాక్షి, హైదరాబాద్: అక్కడ ఉల్లి రైతులకు ‘మహా కష్టం వచ్చింది. ఇక్కడ వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. పక్కనే ఉన్న మహారాష్ట్రలో ధరల్లేక ఉల్లి పొలాల్లోనే మురిగిపోతోంది. ధర పలుకుతుందని మార్కెట్‌కు తెచ్చినా కొనేవారు లేక రోడ్ల పాలవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అదే మన నగరం విషయానికి వస్తే ధరల మోత మోగుతూనే ఉంది. సాధారణ రోజుల తరహాలోనే ఉల్లిగడ్డ ధర పలుకుతోంది. గ్రేటర్ అవసరాల్లో ఎక్కువ శాతం మహారాష్ట్రలో పండించే ఉల్లే తీరుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ధరలు పెరగగానే ఇక్కడ అమాంతం పెంచడం పరిపాటి. అలాంటిది అక్కడ ధరలు తగ్గితే.. ఇక్కడ కూడా తగ్గాలి. ధరలను నియంత్రించాల్సిన మార్కెటింగ్ శాఖ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. దీంతో మార్కెట్లో ధరలు తగ్గకపోగా.. ఇదే అదనుగా వ్యాపారులు మాత్రం ‘మహా’ నిల్వలు పెంచేసుకుంటున్నారు. తద్వారా ధరలు పెరిగితే భారీగా వెనుకేసుకునే ఎత్తుగడ వేశారు. దిగుమతులు పెరిగినా.. మహారాష్ట్రలో కిలో ఉల్లి రూ. 2 నుంచి 4 పలుకుతుండగా.. నగర మార్కెట్లలో మాత్రం రూ.20 నుంచి 30 వరకు విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ లెక్కల ప్రకారం రోజు నగర మార్కెట్లకు దాదాపు 80 లారీల ఉల్లి దిగుమతి అవుతోంది. ఈ నెల ప్రారంభం నుంచే ఉల్లి దిగుమతులు క్రమంగా పెరుగుతున్నట్లు మలక్‌పేట్ మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో ఉల్లి కిలో రూ. 20 నుంచి 30 వరకు విక్రయించారు. దిగుమతులు పెరిగినా ఇప్పటికీ కూడా అవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కలిసి సిండికేట్‌గా మారి ఉల్లి ధరలు విపరితంగా పెంచారు. గోదాంల్లో నిల్వలు.. ఇక్కడి వ్యాపారులు ముందే మహారాష్ట్ర వ్యాపారుల నుంచి సరుకులు ముందే కొనుగోలు చేసి వాటిని నగరానికి తరలించకుండా వారి గోదాంల్లో నిల్వ చేసుకుంటున్నారు. దీంతో నగరానికి సరఫరా తగ్గింది. పేరుకు మాత్రం నగరానికి సరుకు రాదు. కానీ వ్యాపారులు కొన్న సరుకులు మాత్రం అక్కడి వ్యాపారుల గోదాంల్లో నిల్వ ఉంటాయి. మహారాష్ట్ర వ్యాపారులకు రెండు రకాలుగా వ్యాపారం జరుగుతోంది. ఇక్కడి వ్యాపారులకు సరుకు అమ్మడంతోపాటు వాటిని నిల్వ చేసి ఉంచినందుకు కొంత చార్జీలను వసూలు చేస్తున్నారు. ఇలా కొన్నిరోజుల పాటు నగరానికి సరుకు సరఫరాను నిలిపివేయడంతో ఇక్కడి మార్కెట్లలో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎక్కువ లాభం కోసం ప్రస్తుతం తెలంగాణ జిల్లాల నుంచి నగర మార్కెట్లకు ఉల్లి దిగుమతులు అవుతున్నాయి. దీంతో కమీషన్ ఏజెంట్లు ఇక్కడి సరుకును మాత్రమే విక్రయిస్తున్నారు. మహారాష్ట్రలో కొనుగోలు చేసిన సరుకును నిల్వ చేశారు. లోకల్ సరుకు తగ్గముఖం పడితే ధరలు పెంచి మహారాష్ట్ర సరుకును బయటికి తీస్తారు. ఇలా రూ. 2–4 మహారాష్ట్రలో కొన్న ఉల్లిని రూ. 25–30కి విక్రయించి ఎక్కువగా లాభం పొందుతారు. ఈ విషయంలో మార్కెటింగ్ శాఖ అధికారులు మాత్రం ఏమీ చేయడం లేదని రిటైల్ వ్యాపారులు అంటున్నారు. స్థానిక గోడాన్‌లో నిల్వ చేస్తే దాడులు చేసి సరుకులు పట్టుకునే వారని.. మహారాష్ట్ర వ్యాపారులతో చేతులు కలిపి అక్కడ సరుకులు నిల్వ చేస్తే ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని ఓ అధికారి తెలిపారు. చదవండి: కాలేజీ యాజమాన్యమే మా కొడుకును చంపేసింది: సాత్విక్ పేరెంట్స్ -
వంకాయ బోండా.. భలే రుచి.. ఇలా తయారు చేసుకోండి!
సాయంకాలం వేళ భిన్న రుచులు ఆస్వాదించాలనుకునే వాళ్లు ఇలా వంకాయ బోండా ట్రై చేసి చూడండి! వంకాయ బోండా తయారీకి కావలసినవి: ►వంకాయలు – 10 (కాడలు తీయకుండా గుత్తివంకాయల్లా కట్ చేసుకుని, నూనెలో దోరగా వేయించి తీసుకోవాలి) ►ఉల్లిపాయ – 1(ముక్కలు కట్ చేసుకోవాలి) ►నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు ►జీలకర్ర – అర టీ స్పూన్ ►నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు ►కారం – 1 టీ స్పూన్ ►ఉప్పు – తగినంత ►శనగపిండి – 1 కప్పు ►బియ్యప్పిండి – పావు కప్పు ►వాము – అర టీ స్పూన్ ►పసుపు – చిటికెడు ►తినే సోడా – కొద్దిగా ►నీళ్లు – సరిపడా ►నూనె – డీప్ ఫ్రైకి చాలినంత తయారీ: ►ముందుగా నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర.. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ►నిమ్మరసం, అర టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం ఒక బౌల్ తీసుకుని అందులో.. శనగపిండి, బియ్యప్పిండి, వాము(చేత్తో నలపాలి), పసుపు, అర టీ స్పూన్ కారం, తినే సోడా, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలియతిప్పాలి. ►కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలుచగా కలుపుకోవాలి. ►ఇప్పుడు చల్లారిన వంకాయల్లో ఉల్లిపాయ మిశ్రమం పెట్టుకుని.. వాటిని శనగపిండి మిశ్రమంలో బాగా ముంచి.. నూనెలో దోరగా వేయించుకోవాలి. ►వేడి వేడిగా ఉన్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, టొమాటో కచప్ వంటివి జోడించి తింటే భలే రుచిగా ఉంటాయి ఈ బోండాలు. ఇవి కూడా ట్రై చేయండి: Recipes: పాలిచ్చే తల్లులకు శ్రేష్ఠం.. సొప్పు పాల్య, మోహన్ లడ్డు Potato Popcorn Recipe: పొటాటో పాప్‌కార్న్ ట్రై చేయండిలా! -
Hair Care: ఉల్లిపాయ రసంలో బాదం నూనె కలిపి జుట్టుకు పట్టించారంటే!
Hair Care And Beauty Tips In Telugu: జుట్టు రాలడం తగ్గాలంటే ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి. బాదం నూనెతో వీటిని కలిపి కురులకు పట్టిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయ రసంలో.. మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను తీసుకుని సన్నగా తురిమి రసం తియ్యాలి. ఈ రసాన్ని రెండు టేబుల్ స్పూన్ల బాదం నూనెలో వేసి కలిపి, కుదుళ్ల నుంచి చివర్లవరకు పట్టించి ఇరవై నిమిషాలపాటు మర్దన చేయాలి. నలభై నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది. ఉసిరిపొడితో.. బాదం నూనెలో ఉసిరిపొడి లేదా రెండు టీస్పూన్ల తాజా నిమ్మరసం వేసి కలిపి జుట్టుకు పట్టించాలి. మర్దనచేసి అరగంట తరువాత తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈవిధంగా చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. కురులకు పోషణ అంది నల్లగా నిగనిగలాడుతూ పెరుగుతాయి. ఆవనూనె వల్ల.. ఆవాల నుంచి తీసిన నూనెలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇది జుట్టు బాగా పెరగడానికి దోహదం చేస్తుంది. అంతేకాదు, చుండ్రు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఆవాలను మోతాదుకు మించి ఒకేసారిగా ఎక్కువగా వాడితే టాక్సిక్ కారణంగా ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొటిమలను తగ్గించుకోవాలంటే.. కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఆ నూనెను వడగట్టి రాత్రి నిద్ర పోవడానికి ముందు నీటితో ఈ నూనెను కలిపి ముఖానికి పట్టించాలి. ఉదయాన్నే కడిగేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. చదవండి: Cervical Spondylosis: మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? వేపాకు, వేప పువ్వుల రసం.. ఇంకా.. Hair Care Tips: జుట్టు రాలడం.. చుండ్రు సమస్య వేధిస్తోందా? కొబ్బరి నూనె, ఆముదం కలిపి.. -
Health Benefits of Onions: ఉల్లితో మధుమేహం దూరం!
కాలిఫోర్నియా: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఈ మాటల్లో నిజముందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. మధుమేహ రోగులకు ఉల్లిపాయ సూపర్ ఫుడ్ అని, రోజూ ఉల్లిపాయ తింటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని అమెరికాలోని కాలిఫోర్నియాలో శాన్ డియోగాలోని ఎండోక్రైన్ సొసైటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. టైప్ 2 డయాబెటీస్ రోగులకు ఇచ్చే యాంటీ డయాబెటిక్ డ్రగ్ మెట్‌ఫార్మిన్‌తో పాటు ఉల్లిపాయ కూడా తీసుకుంటే షుగర్ లెవల్స్ 50శాతం వరకు తగ్గే అవకాశం మెరుగ్గా ఉందని ఆ అధ్యయనంలో తేలినట్టు ది ఇండిపెండెంట్ పత్రిక ప్రచురించింది. మధుమేహ రోగుల చికిత్సలో భాగంగా ఉల్లిపాయను కూడా సూచించవచ్చునని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన నైజీరియాలో డెల్టా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆంటోని ఒజిహె అన్నారు. అయితే తమ పరిశోధనలు ప్రస్తుతం ఇంకా ఎలుకలపైనే చేశామని, త్వరలో మానవ ప్రయోగాలు నిర్వహిస్తామని చెప్పారు. ‘‘ఉల్లిపాయ తక్కువ ధరకి లభిస్తుంది. డయాబెటీస్‌కి వాడే మందుతో పాటు ఉల్లిపాయ కూడా క్రమం తప్పకుండా తీసుకుంటే ఆ మందు ఇంకా బాగా పని చేస్తుంది. అయితే ఇంకా ఎలుకల్లోనే ఈ ప్రయోగం జరిగింది’’ అని ఆంటోని వెల్లడించారు. మధుమేహం ఉన్న ఎలుకల్లో రోజుకి 400 ఎంజీ, 600 ఎంజీ ఉల్లిని ఇవ్వడంతో చక్కెర స్థాయి బాగా తగ్గిందని, అంతేకాకుండా కొలస్ట్రాల్ కూడా తగ్గినట్టు తేలినట్టుగా వివరించారు. మరోవైపు సెంటర్ ఫర్ డయోబెటిస్ చైర్మన్ డాక్టర్ అనూప్ శర్మ ఈ అధ్యయనంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారతీయులు ఉల్లిపాయ చాలా ఎక్కువగా తింటారని అలాంటప్పుడు భారత్ మధుమేహగ్రస్తులకు ఎందుకు హాట్‌స్పాట్‌గా మారిందని ప్రశ్నించారు. మానవ ప్రయోగాలు జరిగేంతవరకు ఒక నిర్ధారణకు రాలేమన్నారు. -
Health: ముక్కు నుంచి రక్తం కారుతోందా? ఉల్లిపాయ, కొత్తిమీర, విటమిన్ ఇ క్యాప్సూల్‌తో!
Nose Bleeding Problem: ఎండ వేడిమి ఎక్కువైతే కొంత మందిలో ముక్కులో నుంచి రక్తం విపరీతంగా కారుతుంది. వేడి ఎక్కువగా ఉన్న శరీరంలో అయితే తీవ్రత అధికంగా కనిపిస్తుంది. ఇలా రక్తం కారిన ప్రతిసారి ఆందోళనపడటం, భయపడటం చేస్తుంటారు. తగ్గడం కోసం రక రకాల మందులను ఉపయోగిస్తారు. అయితే కారణం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్సు వస్తాయి. అలా కాకుండా సహజ సిద్ధంగా ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే కింది చిట్కాలను పాటిస్తే సరిపోతుంది... ఇలా చేయండి! ►ముక్కులో నుంచి ఎక్కువగా రక్తం కారుతుంటే.. ఉల్లిపాయను గుండ్రంగా కట్ చేసుకొని, ఆ ఉల్లి ముక్కను ముక్కు దగ్గర పెట్టుకుని గట్టిగా వాసన చూడాలి. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్‌లా పని చేస్తుంది. ఇలా చేయటం తొందరగా ఉపశమనం పొందుతారు. ►రక్తం కారటాన్ని తగ్గించటంలో కొత్తిమీర పాత్ర కీలకం. కొత్తిమీర సహజంగానే చల్లదనాన్నిస్తుంది. ఇది ముక్కుకు సంబంధించిన అన్ని రకాల ఎలర్జీలను నివారించటంలో మంచి ఔషధంలా పని చేస్తుంది. ముక్కు నుంచి రక్తం అధికంగా కారితే కొత్తిమీర తాజా రసాన్ని ముక్కు లోపలి అంచులకు రాసుకుంటే సరిపోతుంది. ►ముక్కు నుంచి రక్తం కారటాన్ని తగ్గించటంలో తులసి మంచి ఔషధం. తులసి రసాన్ని ముక్కులో రెండు చుక్కలు వేసుకోవటం లేదా తాజా తులసి ఆకులను నమలటం వల్ల కూడా ఎలర్జీ సమస్యలు దూరం అవుతాయి. ►చిన్న పిల్లలకు ముక్కులో నుంచి రక్తం ఎక్కువగా కారితే విటమిన్ ఇ క్యాప్సూల్‌ను కత్తిరించి అందులో కొంచెం పెట్రొలియం జెల్లీ కలిపి డ్రాపర్‌తో ముక్కులో రెండు చుక్కలు వేస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. ►ఈ సమస్య అధికంగా వేధిస్తుంటే విటమిన్ ’సి’ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు రోజూ తినటం మంచిది. ►అలాగే గోధుమలు, గోధుమ గడ్డితో తయారు చేసిన పదార్థాలను రోజూ తినటం మంచిది. ఎందుకంటే గోధుమల్లో జింక్, ఐరన్, నూట్రీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి అధిక రక్త ప్రసరణను అదుపులో ఉంచుతాయి. చదవండి👉🏾Hypertension: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్’ వద్దు! ఇవి తినండి! చదవండి👉🏾Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! -
Hyderabad: సగానికి పడిపోయిన ఉల్లి ధరలు.. కిలో రూ. 10
సాక్షి, హైదరాబాద్: ఉల్లిగడ్డ ధరలు దిగొస్తున్నాయి. రోజురోజుకు రేట్లు తగ్గుతున్నాయి. గత పదిహేను రోజులతో పోలిస్తే ధరలు సగానికి పడిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి భారీ మొత్తంలో మలక్‌పేట్ మార్కెట్‌కు దిగుమతి అవుతోంది. అక్కడ అధిక పంట దిగుబడి, నిల్వ చేసిన సరుకును మన రాష్ట్రానికి తరలిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉల్లి క్వింటాల్‌కు రూ.600 నుంచి 700 వరకు మాత్రమే పలుకుతోంది. మార్కెట్లో కిలో ధర రూ.10 నుంచి 15 వరకు పలుకుతోంది. పెరిగిన దిగుమతి.. హైదరాబాద్‌లోని మలక్‌పేట గంజ్ మార్కెట్ ఉల్లిగడ్డకు పేరు గాంచింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచే ఉల్లి సరఫరా అవుతుంది. ప్రధానంగా మహబూబ్ నగర్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలోని కర్నూల్ ప్రాంతాల నుంచి గంజ్ కు ఎక్కువగా సరుకు వస్తుంది. వారం రోజులుగా మార్కెట్‌కు నిత్యం 70 నుంచి 120 ట్రక్కుల్లో 30 వేల బస్తాల వరకు సరుకు దిగుమతి అవుతోంది -
Onion Health Benefits: ఉల్లి చేసే మేలు వెయ్యి విధాలు...
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని ఎవరైనా చెబితే, చికాగ్గా చూస్తాం. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి విన్న సామెతే కదా అని. అయితే, దాని వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటే మాత్రం మనమే మరొకరికి చెబుతాం ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని... ఇంతకీ ఉల్లి ఏం మేలు చేస్తుందో, ఎలా చేస్తుందో తెలుసుకుందాం. ఉల్లి ఒంటికి చలువ చేస్తుందని చెబుతుంటారు. కాని ఉల్లిపాయను మజ్జిగలో భాగంగా తింటే పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తాజాగా పరిశోధనలో తేలింది. మజ్జిగ లేదా పెరుగుతో కలిసిన ఉల్లి శరీరానికి మంచిచేసే ఎన్నో పోషకాలనిస్తుందని వెల్లడైంది. అలాగే ఏ రకమైన డయాబెటిస్ అయినా దాన్ని కేవలం ఒక్క ఉల్లిపాయతో నియంత్రించవచ్చట. ►పచ్చి ఉల్లిగడ్డ ప్రతిరోజూ 50 గ్రాముల మోతాదులో తింటే షుగర్ కంట్రోల్ అవుతుందని సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తెలిసింది. అంతే కాదు, ఉల్లిగడ్డ తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య కూడా తగ్గి, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ►ఉల్లిగడ్డలో క్రోమియం ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవల్స్ ను క్రమబద్ధీకరిస్తుంది. ►ఉల్లిగడ్డను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది. ఉల్లిగడ్డను గుజ్జుగా చేసి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్ కు కలిపి తింటూ ఉంటే జీర్ణసంబంధిత సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. ►పచ్చి ఉల్లిపాయను రోజూ ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది. పచ్చి ఉల్లిగడ్డ తినడం వల్ల బిపి, హార్ట్ అటాక్, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు రావు. ►రాత్రి పడుకునే ముందు పచ్చి ఉల్లిపాయ తింటే, వేసవి కాలంలో మీకు వడదెబ్బ వచ్చే అవకాశం తక్కువ. దీనితో పాటు, పచ్చి ఉల్లిపాయలో వేసవిలో వేడి నుండి మిమ్మల్ని రక్షించే గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయను ఉత్తమ సహజ రక్త శుద్ధిగా పరిగణిస్తారు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో ఉన్న విషాన్ని తొలగిస్తుంది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు పచ్చి ఉల్లిపాయ తినడం నిద్రలేమిని దూరం చే స్తుంది. ►జలుబు, కఫంలో ఉల్లిపాయ చాలా మేలు చేస్తుందని అంటారు. పచ్చి ఉల్లిపాయ రసం తాగాలి. ఉల్లిపాయల్లో ఉండే విటమిన్ సి, కాల్షియం నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అనేక రకాల క్యాన్సర్ల నుండి మిమ్మల్ని రక్షించడంలో ఇది మీకు సహాయపడుతుంది. దీనితో పాటు, ఉల్లిపాయ తినడం వల్ల కడుపు, పెద్దప్రేగు, రొమ్ము, ఊపిరితిత్తులు మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలైనవి తగ్గుతాయి. ►ఉల్లి కీళ్లకు, గుండెకు మేలు చేస్తుంది. ఉల్లి గడ్డలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అందుకే వైద్య, ఆరోగ్య సంస్థలు ఔషధాల తయారీలో వీటిని వాడుతున్నాయి. ►ఉల్లి రసం, తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి త్వరగా తగ్గిపోతాయి. ►బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, డయేరియాల నుంచి ఉల్లి గడ్డలు కాపాడతాయి. ఉల్లిలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. పచ్చి ఉల్లిపాయను రోజూ తిన్నట్లయితే ఎముకల బలహీనతను అధిగమించవచ్చు. ఉల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు సంబంధ సమస్యల్ని దూరం చేస్తాయి. ఉల్లి రసాన్ని మాడుకు పట్టించడం వల్ల జుట్టు రాలడంతోపాటు చుండ్రు సమస్యలు తగ్గుతాయి. జుట్టు పట్టు కుచ్చులా మెరుస్తుంది. మాడుకు రక్త ప్రసరణ పెంచడం వల్ల జుట్టు పెరుగుతుంది. ►మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఉల్లి మంచి ఔషదం. ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి రోజూ ఉదయం వేళలో తీసుకుంటే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. అందుకే మన మన పెద్దలు ఉదయన్నే పెరుగు, ఉల్లిగడ్డను ఆహారంగా తీసుకొనేవారు. తేనెటీగలు లేదా తేలు కుట్టినప్పుడు ఏర్పడే నొప్పిని నివారించేందుకు కాస్త ఉల్లి రసాన్ని రాయం వల్ల సత్వర ఉపశమనం ఉంటుంది. l -
ఉల్లిపాయతో ఈ బ్యూటీ టిప్స్ ఎప్పుడైనా ట్రైశారా?
ఉల్లిపాయతో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు. అద్భుతమైన సౌందర్య పోషకంగా పనిచేస్తుంది. ఉల్లిపాయ ద్వారా కూరకు ఎంత టేస్ట్ వస్తుందో.. మీ జుట్టుకు కూడా అంతే మేలు చేస్తుంది. ఇమ్యూనిటీతోపాటు బ్యూటీకి చక్కగా ఉపయోగపడే ఉల్లిపాయ మంత్రా గురించే తెలిస్తే మీరస్సలు వదిలిపెట్టరు. మొటిమలు, హెయిర్ ఫాల్ బాధను ఇట్టే మాయం చేస్తుంది. ఏజింగ్ ప్రాబ్లమ్స్‌కు చెక్ పెడుతుంది. ఉల్లి చేసే మేలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వంటకాల్లో ముఖ్యమైన ఇంగ్రీడియంట్‌గా పనిచేయడమే కాదు ఉల్లి లాభాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పట్టుకుచ్చు లాంటి జుట్టు కావాలన్నా, ముఖంపై మొటిమలు, మచ్చలు పోవాలన్నా ఉల్లి దివ్యౌధంలా పనిచేస్తుంది. ఉల్లిలోని పీచు పదార్థం, ఫ్లేవ నాయిడ్లు, క్వెర్సెటిన్ కారణంగా జీర్ణ క్రియకు అద్భుతమైన టానిక్‌గా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం చర్మాన్ని మృదువుగా చేస్తుంది. దీని వల్ల మొటిమలు, చర్మసంబంధ ఇన్పెక్షన్లు తగ్గుతాయి. జుట్టు సంబంధిత సమస్యల ఉపశమనానికి ఉల్లిలోని పోషకాలు బాగా ఉపయోగపడతాయి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అలోవోరా కలిపి కొబ్బరి నూనెలో మరిగించాలి. దీన్ని గోరువెచ్చగా మాడుకు మర్దనా చేసుకోవాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే, హెయిర్‌ఫాల్ తగ్గుతుంది. ఉల్లిలో ఉండే కొల్లాజెన్ , సల్ఫర్ మూలకం తలభాగంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా తలలో మూసుకుపోయిన రంధ్రాలు తిరిగి తెరుచుకుని జుట్టు బలంగా ఎదుగుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న ఉల్లిపాయను తరుచుగా తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మసంబంధ ఇన్పెక్షన్లు తగ్గుతాయట. చర్మంపై పగుళ్లను కూడా నివారిస్తుంది. ఉల్లిపాయల్లోని సల్ఫర్-రిచ్ ఫైటోకెమికల్స్ ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి వృద్ధాప్య లక్షణాలను నిరోధిస్తుంది. నిమ్మరసం, పెరుగు కానీ కలిపిన ఉల్లిపాయ రసాన్ని రోజూ చర్మంపై అప్లై చేస్తే యంగ్ అండ్ ఎనర్జటిక్‌గా కనిపించొచ్చన్నమాట. ఇక పచ్చి ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పచ్చి ఉల్లిపాయను భోజనంలో కలిపి తీసుకుంటే చాలా మంచిదని డైటీషియన్లు చెబుతున్నారు. ఉల్లిపాయలో లభించే క్వెర్సెటిన్ అలెర్జీ తగ్గించడంతో పాటు రక్తపోటును నియంత్రిస్తుందట. ఉల్లిపాయల్లో ఉండే సి.బి, పొటాషియం రక్తపోటు సమస్యను పరిష్కరిస్తాయి. ఉల్లిపాయలు యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తాయని, షుగర్ పేషెంట్లలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయని చాలా అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా వేసవి తాపాన్ని ఎదుర్కోవడానికి ఉల్లిపాయ అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వడదెబ్బ తగులకుండా సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. కాలిన గాయాలకు ఉల్లిపాయ రసం మంచి ఉపశమనం. మరీ ముఖ్యంగా ఎర్ర ఉల్లిపాయలు చాలా శ్రేష్టమైనవని ఆహార నిపుణులు చెబుతున్నారు. 25 రకాల ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు అద్భుతమైన మూలమని పరిశోధకులు స్పష్టం చేశారు. ఎర్ర ఉల్లిపాయల రంగుకు కారణమైన ఆంథోసైనిన్లు గుండె జబ్బులు, కొన్ని రకాల కేన్సర్, మధుమేహం నుంచి కాపాడుతుందని డైటీషియన్లు చెబుతున్న మాట. -
అద్భుతమైన సౌందర్య పోషకంగా.. ఉల్లిపాయ
-
చిన్నారి గొంతులో ఇరుక్కున్న ఉల్లి ముక్క.. ఆపస్మారక స్థితిలో..
హిందూపురం(అనంతపురం జిల్లా): 9 నెలలో చిన్నారి గొంతులో ఉల్లి ఇరుక్కుపోయి ఊపిరాడకుండా చేసింది. తల్లిదండ్రులకు కొన్ని గంటలపాటు ప్రాణాలు నిలవకుండా చేసింది. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చాకచక్యంగా ఉల్లి ముక్కను తొలగించడంతో ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు.. రొద్దం మండలం కలిపి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు (9 నెలల చిన్నారి) శనివారం ఆడుకుంటూ ఉల్లిపాయ ముక్కను మింగేశాడు. చదవండి: నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య అది గొంతులో అడ్డుపడి ఊపిరి ఆడకపోవడంతో పిల్లాడు ఆపస్మారకస్థితిలో పడిపోయాడు. తల్లిదండ్రులు హుటాహుటిన పట్టణానికి చేరుకుని పలు ప్రయివేట్ ఆసుపత్రులకు వెళ్లినా చేరి్పంచుకోలేదు. చివరికి ప్రభుత్వ ఆసుపత్రికి రాగా, సూపరింటెండెంట్ డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో డాక్టర్లు అమరేష్, వెంకట రమణనాయక్, వాహిద్ పిల్లాడికి చికిత్స నిర్వహించారు. ఉల్లి ముక్కను బయటకు తీశారు. తమ బిడ్డకు ఏమౌతుందోనని అప్పటివరకూ తల్లడిల్లిన హృదయాలు దీంతో ఉపశమన పొందాయి. తమ ఇంట ఉగాది సంతోషం నింపారంటూ డాక్టర్లు, వైద్యసిబ్బంది రాజు, నిర్మలమ్మ, సత్తి, తదితరులకు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి
-
వెల్లుల్లిని పరగడుపునే తింటున్నారా?
-
సెంచరీ కాదు డబుల్ సెంచరీ కూడా దాటేసిన టమాట, ఉల్లి ధరలు..! కారణం అదేనటా..!
కేంద్ర బడ్జెట్ 2022-23 సమావేశాలు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించడంలో లాంఛనంగా ప్రారంభమైనా విషయం తెలిసిందే. బడ్జెట్‌కు ముందు ఎంతో కీలకంగా పరిగణించే ఆర్థిక సర్వే 2021-22ను ఆర్థిక శాఖ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.ఆర్థిక సర్వే 2021-22కు సంబంధించిన కీలక వివరాలను చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) డాక్టర్ వీ అనంత నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం ఈ సర్వేను రూపొందించింది. అయితే గత ఏడాదిలో ప్రాంతాలను బట్టి దేశవ్యాప్తంగా టమాట, ఉల్లిగడ్డ ధరలు ఎందుకు పెరిగాయనే విషయాలను ఆర్థిక సర్వేలో పొందుపరిచారు. కారణాలు అవే..! గత ఆర్థిక సంవత్సరంలో హోల్‌సేల్ ప్రైజ్ సేల్ ఇండెక్స్ పైపైకి ఎగబాకింది. ప్రతి నెలలో డబ్ల్యూపీఐ ఇండెక్స్ ఎగబాకుతూ వచ్చింది. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. వీటితో పాటుగా టమాట, ఉల్లి ధరలు గత ఏడాది నవంబర్ వరకు సెంచరీ దాటేసి డబుల్ సెంచరీకు చేరువయ్యాయి. 2021లో టమాట, ఉల్లి ధరలు అధిక అస్థిరతకు గురైనాయి. అకాల వర్షాలు..! ఆయా రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా పంట నష్టంతో టమాటా, ఉల్లి ధరలు గణనీయంగా పెరిగాయి. ఆర్థిక సర్వే ప్రకారం పంజాబ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్షాలు ధరల పెంపు అనివార్యమైందని తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా టమాటా సరఫరాకు అంతరాయం కలగడంతో టమాటా ధరలపై ఒత్తిడి మరింత పెరిగింది. నవంబర్ 2021లో టమాట ధరలు కిలో రూ.100కి చేరాయి. మరోవైపు సరఫరా అడ్డంకులు కూడా ధరల పెరుగుదలకు కారణాలయ్యాయి. ఉల్లి ధరలు అస్థిరంగానే..! గత కొన్ని నెలలుగా ఉల్లి ధరలు కూడా అస్థిరంగానే ఉన్నాయి. ఉల్లి ధరలపై ఆర్ధిక సర్వేలో... సీజనల్ కాంపోనెంట్ రబీ పంట కాలంతో సమానంగా ఉల్లి ధరల్లో ఒత్తిడి కన్పించింది. డిసెంబర్లో ఉల్లి ధరలు గరిష్ట స్థాయికు చేరకున్నట్లు పేర్కొంది. ఆర్థికసర్వే సూచనలు ఇవే..! సామాన్యులకు ఉపశమనం కల్పించేలా...టమాట, ఉల్లి ధరలను నియంత్రించేందుకు ఆర్థిక సర్వే 2021-22 పలు సూచనలను చేసింది. సీజనల్, అకాల వర్షాలు రెండూ టమాట, ఉల్లిపాయల ధరల పెరుగుదలకు దోహదం చేస్తాయి. కాలానుగుణ ఉత్పత్తి విధానాల ఫలితంగా ధరలలో కాలానుగుణతకు విధానపరమైన శ్రద్ధ అవసరమని తెలిపింది. టమోటా మిగులు ఉత్పత్తి ప్రాసెసింగ్‌లో పెట్టుబడులు, ఉల్లి ప్రాసెసింగ్, నిల్వ మౌలిక సదుపాయాలను ప్రోత్సహించాలి. ఉత్పత్తి వృధాను తగ్గించడం, మెరుగైన సరఫరా గొలుసు నిర్వహణ కూడా డిమాండ్‌ను తీర్చడంలో సహాయపడుతుందని ఆర్థిక సర్వే సూచించింది. చదవండి: Economic Survey: లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే.. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి ఎంతంటే? -
తెలుసా! ఈ ఉల్లిని కట్ చేస్తే కన్నీళ్లు రావట..!
Cutting this ‘onion’ won't make your eyes watery: ఉల్లిపాయలను కట్ చేయడం కూడా ఓ రకమైన స్టంట్ లెక్కే! ఎంతటి ఘరనా ధైర్యవంతులకైనా కంట్లో నీళ్లు ఇట్టే తెప్పించగలవు. ఆ ఘాటుకు ముక్కు ఛీదేసి.. కళ్లు నులుమేసి.. ఆ కాసేపట్లోనే సతమతంచేసేస్తుంది.. ఉల్లి. కంట్లో నీళ్లు తెప్పించని ఉల్లిగడ్డలుంటే ఎంతబాగుంటుందో.. అని అనుకోని వారు ఉండరేమో! ఐతే ఈ వీడియోలో కనిపించే ఉల్లిని కట్ చేస్తే మాత్రం కళ్లు చెమ్మగిల్లవట!! కంట్లో నీళ్లు తెప్పించని ఉల్లిపాయలా? ఆశ్చర్యంగా ఉందే.. ఎక్కడున్నాయ్! ఇదేనా మీ సందేహం. ఆ విశేషాలు మీకోసం.. గతనెల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఉల్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది ఏ రకమైన ఉల్లి అయ్యుంటుందనేది.. ప్రతి ఒక్కరి అనుమానం. విషయం తెలిశాక ముక్కుమీద వేలేసుకున్నారంత! చదవండి: Side Effects Of Wearing Jeans: ఆ జీన్స్ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో.. నిజానికి.. అచ్చం ఉల్లిలాగే కనిపించే, ఉల్లి రూపంలో తయారు చేసిన రియలిస్టిక్ కేక్ అది. దీనిని చూసిన నెటిజన్లు రియాక్షన్లయితే.. ‘అది నిజమైన ఉల్లికానప్పుడు దానికి ఉల్లి తొడుగు ఎందుకు తొడిగారు' అని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు, ఆనియన్ స్కిన్ కూడా నిజమైనది కాదనీ. వెనీలాతో తయారుచేసినదని.. దాన్ని భేషుగ్గా తినొచ్చని ఈ ఉల్లి కేక్‌ను తయారు చేసిన బేకర్ రిప్లై ఇచ్చాడు. ‘అబద్ధం చెప్పకండి.. పై పొర నిజమైనదే' అని ఒకరు ప్రశ్నిస్తే, ‘అద్భుతమైన స్కిల్.. మనసుకు హత్తుకునేలా ఉంద'ని మరొకరు ప్రశంశించారు. మరి మీరేమంటారు? చదవండి: Punam Rai: ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!! View this post on Instagram A post shared by Sideserf Cake Studio (@sideserfcakes) -
లాంగెస్ట్ కిస్.. గురక వీరుడు ఇంట్రస్టింగ్ వరల్డ్ రికార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: సాధారణంగా ఎవరికైనా అరుదైన స్పెషల్ టాలెంట్ ఉంటే వావ్...విశేషమే అంటూ అబ్బురపడతాం. అలాగే సంబంధిత వ్యక్తులు కూడా చరిత్రలో ఎవ్వరూ ఎన్నడూ సాధించని ఘనతను సాధించిన వ్యక్తిగా తమ పేర్లు నిలవాలని ఆశపడతారు. రికార్డులకెక్కాలని ఉబలాట పడతారు. వాటిల్లో ముఖ్యమైంది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. అలా అరుదైన, కొన్ని విచిత్రమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ను ఒకసారి చూద్దాం. నిలువెల్లా టాటూలే టాటూలు ఈ రోజుల్లో సర్వసాధారణం. దాదాపు ప్రతి వ్యక్తి వారి శరీరంలో ఏదో ఒక భాగంలో పచ్చబొట్టు వేసుకుంటూ ఉండటం చేస్తూనే ఉన్నాం. వీటిల్లో వివిధ డిజైన్లు, పరిమాణాలురంగులు.. బొమ్మలు, అబ్బో వీటి కథ పెద్దదే. పై ఫోటోలని వ్యక్తి న్యూజిలాండ్‌కు చెందిన శ్రీమంతుడు గ్రెగొరీ పాల్ మెక్లారెన్ లేదా లక్కీ డైమండ్ రిచ్. ఇతనికి టాటూలంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే. శరీరం మొత్తం టాటూలే. ఇందుకు 1000 గంటలకు పైగా గడిపాడట. అందుకే ప్రపంచంలో అత్యధికంగా టాటూలు వేయించుకున్న వ్యక్తిగా రికార్డు కొట్టేశాడు. ప్రపంచంలో అతిపెద్ద ఉల్లిపాయ నెవార్క్ పీటర్ గ్లేజ్బ్రూక్ ప్రపంచంలోనే అత్యంత భారీ ఉల్లిని పండించడంలో పాపులర్. 18 పౌండ్ల బరువున్న (8కిలోలకు పైమాటే) ఉల్లిపాయను పండించి భారీ రికార్డును కొట్టేశాడు. ఒకే కోన్ మీద ఇన్ని ఐస్ క్రీమ్ స్కూప్స్? ఐస్‌క్రీం అంటే పిల్లాపెద్దా అందరికీ మోజే. అందులోనూ మండు వేసవిలో చల్లచల్లగా కోన్ ఐస్‌క్రీం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే ఈ ఐస్క్రీ కోన్ తయారీలో ఓ వ్యక్తి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇటలీకి చెందిన దిమిత్రి పాన్సిరా కోన్‌పై ఏకంగా125 స్కూప్స్ అమర్చి ఔరా అనిపించాడు. అంతేకాదు 2018లో తన పేరుతో ఉన్న వరల్డ్ రికార్డునే తనే బ్రేక్ చేశాడు. తాబేలు ఎంత వేగంగా పరిగెత్తగలదు? అతి తక్కువ వేగం గురించి ఆలోచిస్తే గుర్తుకు వచ్చేది తాబేలు. నెమ్మదిగా మారువేరు తాబేలు వేగంలోరికార్డు సాధించడం అంటే అరుదే కదా. కేవలం 19.59 సెకన్లలో 18 అడుగుల దూసుకెళ్లిందో తాబేలు. దీని పేరు బెర్టీని. అంతేకాదు 70ల నుంచి మరే తాబేలు బ్రేక్ చేయలేని రికార్డును బద్దలు కొట్టింది. విచిత్రమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఒకటి. యూకేలోని అడ్వెంచర్ వ్యాలీ అనే ఫ్యామిలీ అడ్వెంచర్ పార్క్‌లో దీని నివాసం. మీరిలా చర్మాన్ని సాగదీయలగలరా పుట్టుకతో వచ్చిన వైకల్యాన్ని లేదా లోపాన్ని రికార్డు మలచడం మరో విశేషం. గ్యారీ టర్నర్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. ఇదే అనతికి ప్రపంచంలోని సాగతీత చర్మంఉన్న వ్యక్తిగా రికార్డును తెచ్చిపెట్టింది. 1999 నుండి ఎవరూ అతని రికార్డును అధిగమించలేదు. ఎవరైనా సాధారణంగా కడుపు చర్మాన్ని 6.25 అంగుళాల వరకు సాగదీయడం మన ఊహించలేం. కానీ గ్యారీ ఆ పనిని సులువుగా చేస్తాడు. శరీరంమీద చర్మాన్ని ఎవరూ చేయలేనంతంగా సాగదీయగలడు ఎలాంటి నొప్పి లేకుండా. ఇతను 2005 నుండి ఒక సర్కస్‌లో సభ్యుడిగా ఉన్నారు. పాస్తా తినే రికార్డు ఇప్పటి తరం యూత్ పాస్తాను ఇష్టపడతారు. కానీ ఈ ఫోటోలోని మహిళకు పాస్తా అంటే మరీ పిచ్చన్నమాట. పాస్తా తినే పోటీలోనే ఈస్టర్ మిచెల్ లెస్కో డబ్బు సంపాదించే మార్గంగా ఎంచుకున్నారు. 100 గ్రాముల పాస్తా కేవలం 26.69 సెకన్లలో పాస్తా మొత్తం గిన్నెను వేగంగా లాగిం చేసిన రికార్డు కొట్టేసింది. పాస్తాలో సాస్ కలుపుకుని మరీ చకా చకా భోంచేసింది. లాంగెస్ట్ కిస్ ప్రేమికులు ముద్దు ముచ్చట్లలోమునిగి తేలడం మామూలే. థాయ్‌లాండ్‌కు చెందిన లక్షన , ఎక్కాచాయ్ తిరనరత్ జంట లాంగెస్ట్ కిస్ పెట్టుకుని రికార్డు లకెక్కారు. 2020లో జరిగిన పోటీల్లో ఏకంగా 58 గంటల 35 నిమిషాల 58 సెకన్ల పాటు కొనసాగిన లిప్ లాక్‌లో ఉండిపోయారు. ఈ సుదీర్ఘ ముద్దుతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. అంతేకాదు డీహైడ్రేషన్‌తో బాధపడకుండా ఇంతసేపు ముద్దు పెట్టుకోవచ్చని మాకు కూడా తెలియదంటూ సెలవిచ్చారు. చేతికి చిక్కారో మటాషే! బలమైన చేతులున్న మహిళ యూకే చెందిన లిసా డెన్నిస్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళలలో ఒకరిగా నిలిచారు. ఎలాగంటే... కేవలం ఒకే ఒక్క నిమిషంలో 923 రూఫ్ బ్రిక్స్ని పిండి చేయడం ఆమె గొప్పతనం. సాధారణంగా మార్షల్ అర్ట్స్లో ప్రావీణ్య ఉన్నవారే ఇలాంటి ఫీట్లు చేయడం మనం చూశాం. గురక వీరుడు గురకలో కూడా ప్రపంచ రికార్డు సొంతంచేసుకున్న ఘనత కోరే వాకర్ట్ సొంతం. 1993 లో స్వీడన్‌లోని ఒరెబ్రో జనరల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అతని గురక 93 డీబేఏ గరిష్ట స్థాయి నమోదు చేయడం ప్రపంచ రికార్డు. గురక నివారణకు ఇపుడు చాలా మార్గాలున్నప్పటికీ, గురక వీరుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. కష్టాలు పక్కన ఉన్నవాళ్లకే తప్ప వాళ్లు మాత్రం హాయిగా నిద్రపోతారు. గురక పెట్టే వాళ్ల పక్కన నిద్రపోవడం అంటే అదొక సవాలే. కాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుక్‌ను 1995లో మొదటిసారిగా ప్రచురించారు. అప్పటినుండి, ఇది ప్రపంచంలోని అత్యంత విశేషమైన విషయాలను నమోదు చేస్తోంది. ఈ ప్రపంచ రికార్డ్స్‌లో మన పేరు నిలవాలంటే..దానికి సంబంధించి చాలా కృషి, పట్టుదల కావాలి. తగిన సమయాన్ని కేటాయించడంతోపాటు అంకితభావం , కఠోర అభ్యాసం కావాలి. -
కేపీ ఉల్లి: అధిక యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్ సమ్మేళనాలు!
వైవీయూ: తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందనే నానుడి తెలుగునాట ఎంతో ప్రాచుర్యం.. అలాంటి ఉల్లిలో ప్రత్యేకమైన కేపీ ఉల్లికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. ఈ ఉల్లిపై వైవీయూ (యోగి వేమన విశ్వవిద్యాలయం) వృక్షశాస్త్ర విభాగం చేపట్టిన పరిశోధనల్లో పలు అంశాలు వెలుగులోకి రావడంతో దీని ప్రాధాన్యత పెరిగింది. దీనికి తోడు కేపీ ఉల్లిని ఈ ప్రాంత పంటగా జియోట్యాగ్ కోసం వైవీయూ వృక్షశాస్త్ర విభాగం ప్రయత్నిస్తుండగా, అంతర్జాతీయ ప్రఖ్యాత జర్నల్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ స్ప్రింగర్లో పరిశోధక పత్రం ప్రచురితమై ఖ్యాతిని మరింత విస్తరించేలా చేసింది. కేపీ ఉల్లిగా కృష్ణాపురం ఉల్లి వైఎస్సార్ జిల్లా మైదుకూరు పరిధిలోని కృష్ణాపురంలో రైతులు ఉల్లి పంటను ఎక్కువగా పండించడంతో కృష్ణాపురం ఉల్లి (కేపీ ఉల్లి)గా ప్రసిద్ధికెక్కింది. కేపీ ఉల్లిని సలాడ్స్, సాస్, సూప్‌లలో విపరీతంగా వినియోగిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో అనేక రకాల పేర్లతో ఉల్లి వంగడాలను పండిస్తున్నప్పటికీ కేపీ ఉల్లి ఎగుమతి కావడానికి ఆరోగ్యపరంగా అత్యధిక ప్రయోజనాలు ఉండటమేనని పరిశోధకులు గుర్తించారు. వ్యాధి నిరోధకత పెంచే యాంటీ ఆక్సిడెంట్లు.. కేపీ ఉల్లిలో ఫినోలిక్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటంతో పాటు అధిక యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం కారణంగా ఇందులో వ్యాధి నిరోధకతను పెంచే సామర్థ్యం ఉన్నట్లు వైవీయూ వృక్షశాస్త్ర పరిశోధకులు వెల్లడించారు. వైవీయూ వృక్షశాస్త్ర ఆచార్యులు డాక్టర్ పీఎస్ షావల్లీఖాన్ మార్గదర్శకంలో డాక్టర్ జి. విజయలక్ష్మి, ఇటలీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్, నేషనల్ కౌన్సెల్ పరిశోధకులు సంయుక్తంగా కేపీ ఉల్లిపై పరిశోధనలు సాగించారు. ఈ పరిశోధనల్లో కేపీ ఉల్లికి ఒక ప్రత్యేకత ఉందని.. దీనికి సంబంధించిన విశిష్టతలను తెలియజేస్తూ ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ స్ప్రింగర్’లో పరిశోధక వ్యాసం ప్రచురితమైంది. అలాగే, వైఎస్సార్ జిల్లాకు చెందిన కేపీ ఉల్లిని ప్రత్యేక వంగడం (లాండ్‌రేస్)గా పరిశోధకులు పేర్కొన్నారు. ప్లేవనాయిడ్ కంటెంట్, యాంటి యాక్సిడెంట్లు ఇందులో ఎక్కువని పరిశోధనల్లో తేల్చారు. కేపీ ఉల్లి ప్రత్యేకించి ముదురు ఎరుపు రంగును కలిగి ఉండటానికి కారణం అందులోని ఆంథోసైనిన్ అని గుర్తించారు. అదే విధంగా యాంటీ ఆక్సిడెంట్స్ అయిన ప్లావినాయిడ్స్ రోగ నిరోధకతను కల్గిస్తాయని శాస్త్రీయంగా నిరూపించారు. ఇందులోని లక్షణాలు మరే ఇతర రకాల్లో లభించవని పరిశోధకులు స్పష్టంచేశారు. జియోట్యాగ్ కోసం ప్రయత్నం.. కేపీ ఉల్లికి జియోట్యాగ్ (భౌగోళికపరమైన గుర్తింపు) పొందేందుకు వైవీయూ వృక్షశాస్త్ర విభాగం ప్రయత్నాలు ప్రారంభించింది. జియోట్యాగ్ వస్తే కేపీ ఉల్లికి న్యాయపరమైన రక్షణ లభిస్తుంది. ఈ వంగడాన్ని ఇతరులు అనధికారికంగా వినియోగించుకునే అవకాశం ఉండదు. ఈ ప్రాంత ఉత్పత్తిదారులకు ఎగుమతుల విషయంలో ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. అందువల్ల ప్రభుత్వ గుర్తింపు సంస్థలు, రిజిస్టర్డ్ రైతు సంస్థలు ముందుకు వచ్చి సహకారం అందించి జియోట్యాగ్ లభించేలా చూడాలని వృక్షశాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ పీఎస్ షావల్లీఖాన్ కోరారు. మరోవైపు.. కేపీ ఉల్లిపై పరిశోధనలు చేసిన డాక్టర్ విజయలక్ష్మి దాని పుష్పాల నుంచి ఉల్లి మొక్కలు సృష్టించడం విశేషం. -
Rajasthani Onion Kachori: రాజస్థానీ ఉల్లి కచోరీ
కావలసినవి: మైదా పిండి – పావు కేజీ; వంట సోడా – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; కలోంజీ (ఉల్లి గింజలు) – ఒక టీ స్పూను; నెయ్యి – 2 టీ స్పూన్లు; నూనె – ఒక టేబుల్ స్పూను; నూనె – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ధనియాలు – ఒక టీ స్పూను (బాగా నలపాలి); పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; ఇంగువ – కొద్దిగా; ఉల్లిపాయలు – అర కిలో (సన్నగా తరగాలి); ఉప్పు – తగినంత; చాట్ మసాలా – ఒక టీ స్పూను; కారం – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను; బంగాళ దుంప – 1 (మీడియం సైజు); కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మ రసం – ఒక టీ స్పూను తయారీ: ముందుగా ఒక పాత్రలో మైదా పిండి, వంట సోడా, ఉప్పు, కలోంజీ, నెయ్యి వేసి బాగా కలపాలి తగినన్ని నీళ్లు జత చేస్తూ, సుమారు పది నిమిషాల పాటు పూరీ పిండిలా గట్టిగా కలపాలి ఒక టీ స్పూను నూనె వేసి మరోమారు బాగా కలిపి, పైన తడి వస్త్రం వేసి సుమారు అరగంట పక్కన ఉంచాలి బంగాళ దుంపను ఉడికించి, తొక్కు తీసి, చేతితో మెత్తగా మెదిపి పక్కన ఉంచుకోవాలి స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి నలిపి ఉంచుకున్న ధనియాలు జత చేయాలి పచ్చి మిర్చి తరుగు, ఇంగువ జత చేసి బాగా కలపాలి ఉల్లి తరుగు వేసి సుమారు పది నిమిషాల పాటు బంగారు రంగులోకి వచ్చేవర కు కలుపుతుండాలి ఉప్పు, చాట్ మసాలా, మిరప కారం, పసుపు, గరం మసాలా జత చేసి మరోమారు కలపాలి ఉడికించి ఉంచుకున్న బంగాళ దుంప ముద్ద జత చేసి మరోమారు కలియబెట్టాలి కొత్తిమీర తరుగు, నిమ్మ రసం జత చేసి కలిపి, దింపి చల్లారనివ్వాలి నానబెట్టి ఉంచుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ఉల్లి తరుగు మిశ్రమాన్ని కూడా ఉండలు చేసి పక్కన ఉంచాలి మైదా పిండి ఉండలను ఒక్కోటి చేతిలోకి తీసుకుని, కొద్దిగా వెడల్పుగా ఒత్తాలి ఉల్లి మిశ్రమం ఉండను మధ్యలో ఉంచి, అంచులు మూసేసి, చేతితో జాగ్రత్తగా కచోరీ మాదిరిగా ఒత్తాలి స్టౌ మీద బాణలిలో నూనె పోసి బాగా మరిగిన తరవాత, తయారుచేసి ఉంచుకున్న కచోరీలు వేసి, స్టౌ ఆర్పేయాలి మూడు నిమిషాల తరవాత కచోరీలు పైకి తేలుతున్న సమయంలో, స్టౌ వెలిగించి, కచోరీలను బాగా వేయించి, కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి. గ్రీన్ ఫిష్ కర్రీ.. ఇలా తయారీ! -
వైరల్ వీడియో: ఉల్లి ఏడిపిస్తోందా.. ఇలా చేయండి!
ఉల్లిపాయలను రకరకాలుగా వాడుతుంటాము. ఉల్లి మేలేమోగానీ దాని ఘాటుకు కళ్ల వెంట నీళ్లు కారడం ఖాయం. ఉల్లిపాయలు కోయాలన్నా, ఆ ఆలోచన మనసులో రాగానే∙వెంటనే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అటువంటి ఉల్లిని ఒక్కచుక్క కన్నీళ్లు రానియకుండా కోయవచ్చు అని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మ్యాక్స్ మెక్కెన్ అనే వ్యక్తి ఇక ఉల్లిపాయలను ఏడవకుండా ఇలా కోయండి అని చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. వీడియోలో.. తడిగా ఉన్న ఒక వస్త్రాన్ని తీసుకుని దానిని కూరగాయలు కట్‌చేసే చాపింగ్ బోర్డు మీద ఉంచాలి. తరువాత మీరు ఎన్ని ఉల్లిపాయలు కోయాలనుకుంటున్నారో వాటన్నింటిని ముక్కలుగా తరగండి. అయితే మనం ఎప్పుడు ఉల్లిపాయలు కోసినా.. వాటి నుంచి కొన్ని రకాల ఆమ్లాలు బయటకు వెదజల్లి మన కళ్లని నేరుగా తాకుతాయి. దీంతో కళ్లు మండి నీరు వస్తుంది. అయితే చాపింగ్ బోర్డు మీద తడిగా ఉన్న వస్త్రం ఉంచడం వల్ల ఉల్లి నుంచి వచ్చే ఆమ్లాలను అది పీల్చుకుంటుంది. ఫలితంగా ఉల్లిలో ఉండే ఘాటైన యాసిడ్స్ కళ్లను చేరవు కాబట్టి కళ్లు మండవు.’’ అని మ్యాక్స్ వీడియోలో చెప్పాడు. ఈ వీడియో వైరల్ అవడమేగాక వేలల్లో లైకులు, కామెంట్స్ వస్తున్నాయి. చదవండి: ఉల్లిగడ్డల చోరీకి వచ్చాడని చంపేశారు.. చాలామంది నెటిజన్లు నిజంగా ఇది పనిచేస్తుందా? అయితే మేము ఒకసారి ట్రె చేస్తాం అని కొందరు అంటే.. మరికొందరు ఇప్పటికే ఈ ట్రిక్కును మేము ట్రై చేశాము బాగా పనిచేస్తుంది అని చెబుతున్నారు. మీరూ ప్రయత్నం చేసి చూడండి ఇది ఎంతవరకు పనిచేస్తుదో తెలుసుకోండి. -
ఉల్లి: ఒక్క ఎకరాలోనూ పంట వేయని రైతులు
సాక్షి, హైదరాబాద్/జోగుళాంబ గద్వాల/ వరంగల్ రూరల్: ఉల్లి విషయంలో తెలంగాణ ఇప్పటికీ ఇతర రాష్ట్రాలపైనే ఆధారపడుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా, ఇక్కడ ఉల్లికి రెక్కలు వస్తాయి. నల్లబజారుకు వెళ్లడమే కాకుండా అధిక ధర పలుకుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉల్లి సాగును ప్రోత్సహించాలని మూడు నాలుగేళ్లుగా అధికారులు కసరత్తు చేస్తూనే ఉన్నారు. కానీ అవి ఫలితాలు ఇవ్వకపోగా, పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రస్తుత యాసంగి సీజన్లో రాష్ట్రంలో రైతులు ఒక్క ఎకరాలో కూడా ఉల్లి సాగు చేయకపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రతి ఏడాది యాసంగిలో రాష్ట్రంలో ఎంతోకొంత సాగవుతున్నా, ఈసారి ఒక్క ఎకరాలోనూ వేయలేదు. యాసంగిలో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 21,869 ఎకరాలు కాగా, గతేడాది 9,536 ఎకరాల్లో సాగైంది. కానీ ఈ ఏడాది ఒక్క ఎకరాలోనూ సాగు లేదని వ్యవసాయ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ సమయానికి సాధారణంగా 9,405 ఎకరాల్లో ఉల్లి సాగవ్వాలి. కానీ రైతులు ఉల్లి సాగుపై ఆసక్తి చూపించడంలేదని ఉద్యాన శాఖ వర్గాలు చెబుతున్నాయి. నెలకు 42,400 మెట్రిక్ టన్నులు అవసరం మార్కెట్ అంచనా ప్రకారం ప్రతి ఏడాది రాష్ట్రంలో 5.08 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డ అవసరం పడుతుంది. అంటే నెలకు 42,400 మెట్రిక్ టన్నులు. అయితే ఉల్లి విత్తనాలకు రాయితీ కల్పించకపోవడం, మద్దతు ధర లేకపోవడం, సరైన మార్కెటింగ్ సౌకర్యాలు సృష్టించకపోవడంతో రైతులు ఉల్లి సాగుపై ఆసక్తి చూపడం లేదు. అంతేగాక ఉత్పాదకత అత్యంత తక్కువగా ఉండటం, నాణ్యమైన విత్తనాలకు ఎక్కువ ధర పలకడం, చీడపీడల బెడద అధికంగా ఉండటం, వాటికి అవసరమైన ఎరువులు, పురుగు మందుల ధరలు ఆకాశాన్ని అంటడం, వాటి ధరల నిర్ధారణ పూర్తిగా మాఫియా చేతుల్లోనే ఉండటం వల్ల ఇటువంటి పరిస్థితి నెలకొంటోందని మార్కెటింగ్ శాఖ ఇటీవల ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపింది. 39.26 లక్షల ఎకరాల్లో వరి సాగు యాసంగి పంటల సాగు విస్తీర్ణం రాష్ట్రంలో భారీగా పెరిగింది. సాగునీటి వనరులు పెరగడంతో సాగు పెరిగినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. ఈ సీజన్లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 36.93 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే ఏకంగా 50.35 లక్షల ఎకరాలకు చేరుకోవడం విశేషం. సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 136.34 శాతం అధికంగా పంటలు సాగయ్యాయి. అన్ని పంటల కంటే వరి విస్తీర్ణం ఎక్కువగా పెరగడం (176.93%) విశేషం. యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం కంటే 176.93% అధికంగా నాట్లు పడడంపై వ్యవసాయ శాఖ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పప్పు ధాన్యాల విస్తీర్ణం కూడా పెరిగింది. సాధారణ సాగు విస్తీర్ణం 3.03 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.73 లక్షల (122.71%) ఎకరాల్లో సాగయ్యాయి. ఇక నూనె గింజల సాధారణ సాగు విస్తీర్ణం 3.73 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.50 లక్షల (66.95%) ఎకరాల్లో సాగైంది. వరంగల్ రూరల్ జిల్లాలో 215% సాగు వరంగల్ రూరల్ జిల్లాలో యాసంగి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. జిల్లాలో యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం 79,867 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.72 లక్షల (215.83%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 76,467 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.51 లక్షల (198.35%) ఎకరాల్లో సాగు జరిగింది. అత్యంత తక్కువగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సాగైంది. ఆ జిల్లా సాధారణ పంటల సాగు విస్తీర్ణం 26,488 ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 21,223 (80.12%) ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. యాసంగిలో పంటల సాగు వివరాలు (లక్షల ఎకరాలు) పంట సాధారణం సాగైంది వరి 22.19 39.26 శనగ 2.48 2.96 వేరుశనగ 3.05 1.90 మొక్కజొన్న 4.04 3.16 జొన్న 0.67 0.92 ధర వస్తుందో, రాదోనని.. ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు సింగిరెడ్డి మొగిలి. వరంగల్ రూరల్ జిల్లా సం గెం మండలం నార్లవాయికి చెందిన ఈయన ఏటా 20 గుంటల భూమిలో ఉల్లి సాగు చేస్తాడు. గతేడాది పంట కుళ్లు తెగులు, మార్కెట్ సౌకర్యం, ధర లేకపోవడం, అధిక వర్షాల తో నష్టపోయిన ఈయన ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళనతో సాగుకు ఆసక్తి కనబర్చలేదు. కేవలం 10 గుంటల భూమిలోనే ఉల్లి సాగుకు పెట్టుబడి పెట్టానని చెప్పాడు. గతేడాది రూ.3 లక్షలు నష్టపోయా గత యాసంగిలో 4 ఎకరాలు, ఖరీఫ్‌లో 2 ఎకరాలు సాగు చేశాను. ఖరీఫ్‌లో సాగుచేసిన పంట క్వింటాల్ రూ.600 కు అమ్మాను. మార్కెటింగ్ లేక, వర్షాల వల్ల రెండు సీజన్లలో ఉల్లి సాగుచేసి రూ.3 లక్షల వరకు నష్టపోయాను. ధర నిలకడగా లేకపోవడంతో ఈ ఏడాది యాసం గిలో నాతో పాటు మా గ్రామంలోని 30 మంది రై తులు ఉల్లి జోలికి వెళ్లలేదు. ఉల్లికి కూడా ప్రభుత్వం మద్దతు ధరనివ్వాలి. – ఖాజామియా, కొంకల, వడ్డేపల్లి మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా వర్షం ఎక్కువై సాగు చేయలేదు పోయినేడాది మూడు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాను. ఈ ఏడాది కూడా సాగు చేసేందుకు రూ.10వేలతో ఉల్లి విత్తనాలు తెచ్చి, 25 నార బేడ్లు పోశాను. దురదృష్టం కొద్దీ వర్షం ఎక్కువగా కురిసింది. పొలంలో గడ్డి విపరీతంగా పెరిగిపోయింది. సరైన సమయానికి కూలీలు దొరకకపోవడంతో పొలం బీడుగా మారింది. – మద్దిలేటి, గోకులపాడు, మానవపాడు మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా చదవండి: పాలకూర మొక్కలతో ఈ–మెయిళ్లు పంపొచ్చు! -
ఆనియన్ టీతో రోగనిరోధక శక్తి
సాధారణంగా సీజనల్ వ్యాధులను నివారించుకోవడానికి మన ఇళ్లలోనే ఎన్నో చిట్కాలు ఉంటాయి. జలుబు, దగ్గు, తుమ్ములు వంటి సాధారణ వ్యాధులకు ఇంట్లోని పెద్దవాళ్లు వంటింటి వస్తువులతోనే చిటికెలో ఉపశమనం కలిగించే ఔషధాన్ని తయారు చేసి ఇస్తుంటారు. వీటి వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని వారు తరచూ చెబుతుంటారు. కానీ వాటిపై ఈ తరం వారు అంతగా నమ్మకం ఉంచరు. అయితే పెద్దలు చెప్పినట్లుగానే వంటింటి పదార్థాలలో తక్షణ ఉపశమనం పొందే ఎన్నో గుణాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అందులో ఒకటి ఉల్లిపాయ టీ కూడా. ఉల్లిపాయలు వంటల్లో రుచిని ఇవ్వడమే కాక, మంచి ఆరోగ్యాన్నిచ్చే ఎన్నో లక్షణాలను ప్రేరేపిస్తుందట. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి కూడా ఉంది. అయితే ప్రస్తుతం చలికాలంలో చాలా మంది జలుబు, తగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారంతా తక్షణ ఉపశమనం కోసం ఈ ఉల్లిపాయ టీ తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆనియన్ టీ రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావంతంగా పనిచేస్తుందని పరీశోధనలో కూడా వెల్లడైందట. అంతేగాక ఉల్లిపాయ విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలకు కూడా అమూల్యమైన వనరుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఓ కప్పు టీని మీ రోజువారి ఆహారపు అలవాట్లలో చేర్చుకుని రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ టీని ఉల్లిపాయతో లేదా వాటి తొక్కలతో కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయ టీ: ఒక గ్లాసు నీరు మరిగించి అందులో తరిగిన ఉల్లిపాయ, 2-3 నల్ల మిరియాలు, 1 యాలుకతో పాటు సగం చెంచా సోపు గింజలను జోడించాలి. దీనిని 15-20 నిమిషాల పాటు మరగించి తర్వాత వడకట్టుకుని తాగాలి. ఉల్లిపాయ పీల్ టీ: టీ పొడి లేదా గ్రీన్ టీ ఆకులు వేసి నీటిని మరగించాలి, ఆ తర్వాత మరిగించిన నీటిని చిన్న ఉల్లిపాయ లేదా సగం ఉల్లిపాయ తొక్కలు తీసి ఉంచుకున్న కప్పులో పోయాలి. వేడి వేడి నీటిలో సుమారు 10 నిమిషాలు పాటు ఈ ఉల్లిపాయ తొక్కలు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి. -
ఉల్లి విషయంలో ఏపీ ప్రభుత్వం తీపి కబురు
సాక్షి, విజయవాడ : సామాన్యుడి రేటుకు అందకుండా పోయి కంటనీరు తెప్పిస్తున్న ఉల్లిగడ్డ విషయంలో ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతు బజార్ల ద్వారా రాయితీపై రూ.40కే కిలో ఉల్లిపాయలు రేపట్నుంచే అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం విజయవాడలో కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ..పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారన్నారు.5 వేల టన్నుల ఉల్లిని నాఫెడ్ ద్వారా దిగుమతి చేసుకుంటున్నామని.. తక్షణమే వెయ్యి టన్నులు మార్కెట్లోకి తీసుకువచ్చి రైతుబజార్లలో విక్రయిస్తామన్నారు. తొలి దశలో అన్ని ప్రధాన పట్టణాల్లోనూ రైతు బజార్ల ద్వారా కేజీ రూ.40లకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన ఉల్లిపాయలను ప్రతి కుటుంబానికి ఒక కేజీ వంతున రొటేషన్ పద్దతిలో ఇవ్వాలని నిర్ణయించామన్నారు. భారీ వర్షాల వల్ల మన రాష్ట్రంలో కర్నూలు సహా ఇతర రాష్ట్రాలైన తమిళనాడు,కర్నాటక, కేరళ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరగడంతో ఉల్లిరేటుకు రెక్కలొచ్చాయన్నారు. కాగా రాష్ట్రంలో 28 వేల హెక్టార్లలో ఉల్లిసాగు జరుగుతోందని.. మరో నెలలో కొత్త పంట కొంత అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రతి ఏటా ఈ సీజన్లో 12 వేల క్వింటాళ్లు కర్నూలు ఉల్లి మార్కెట్లకు వచ్చేదని.. ఇప్పుడు 15 వందల నుంచి 2వేల క్వింటాళ్లు మాత్రమే వస్తోందన్నారు. గతంలో మహారాష్ట్ర నుంచే అత్యధికంగా ఉల్లి దిగుమతులు జరిగేవని.. కానీ అక్కడ భారీ వర్షాలు కురవడంతో పంట దిగుబడి బాగా తగ్గిపోయిందన్నారు. రేపటి నుంచి ఉల్లి విక్రయాలు మొదలుపెట్టి క్రమంగా అన్ని ప్రాంతాల రైతుబజార్లకు విక్రయాలు విస్తరిస్తామన్నారు. గతంలో కూడా ఉల్లి ధరలు పెరిగినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని సబ్సిడీపై అందించినట్లు కన్నబాబు పేర్కొన్నారు. -
ఉల్లి రైతు 'ధర'హాసం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో హోల్‌సేల్ మార్కెట్‌కు వస్తున్న ఉల్లిని వ్యాపారులు ఎగరేసుకుపోతున్నారు. ముఖ్యంగా నాణ్యమైన ఉల్లికి గిరాకీ మరింత పెరిగింది. సోమ, మంగళవారాల్లో కర్నూలు మార్కెట్లో నాణ్యమైన ఉల్లికి క్వింటాలుకు రూ.3,830 ధర పలికింది. తాడేపల్లిగూడెంలోనూ ఇదే పరిస్థితి. రెండు మార్కెట్లలోనూ సగటు ధర రూ.2,000 వరకు ఉంది. ఈ ధర రూ.1,100 స్థాయి నుంచి రూ.2,000కు పెరగడంతో.. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్, రబీల్లో 40 వేల హెక్టార్ల వరకు ఉల్లి సాగవుతోంది. ఒక్క కర్నూలులోనే 32 వేల హెక్టార్లలో ఉల్లి సాగవుతోంది. సాగుకు పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటే ఖరీఫ్‌లో ఎకరాకు 6 నుంచి 8 టన్నులు, రబీలో 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా. అయితే ఆగస్టు నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో.. ఎకరాకు రెండు నుంచి 3 టన్నుల వరకు దిగుబడి తగ్గిందని చెబుతున్నారు. గతేడాది మాదిరే సాగు విస్తీర్ణంలో పెద్దగా వ్యత్యాసం లేకపోయినా దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. రిటైల్ మార్కెట్లో నాణ్యమైన ఉల్లి కిలో రూ.45 నుంచి రూ.50 దాకా పలుకుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలోనూ అధిక వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతినడంతో అక్కడినుంచి దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రంలోని ఉల్లికి «అధిక ధర లభిస్తోంది. కాగా గతేడాది బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు అనూహ్యంగా పెరిగి వినియోగదారులు తీవ్రంగా ఇబ్బంది పడడం తెలిసిందే. అటువంటి పరిస్థితులు ఈ ఏడాది తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశాలకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ కారణంగా ఉల్లి ధర కిలో ఇప్పటికి రిటైల్ మార్కెట్లో రూ.50లోపే ఉంది. ఎగుమతులపై నిషేధం విధించకపోయుంటే ఇప్పటికే కిలో రూ.100 పలికేదని అధికారులు చెబుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పడితే డిసెంబర్లో కొత్త పంట మార్కెట్‌కు వచ్చి ధర తగ్గుతుందని, వర్షాలు ఇలానే కొనసాగితే ధర మరింత పెరిగే అవకాశం లేకపోలేదని వారంటున్నారు. -
‘రైతులపై సర్జికల్ స్ర్టైక్ చేశారు’
ముంబై : నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను నిషేధించి రైతులపై సర్జికల్ స్ర్టైక్ చేసిందని ఎన్సీపీ ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఉల్లికి డిమాండ్ పెరిగిన సమయంలో రైతుల దిగుబడులకు మంచి ధర రాకుండా ఈ నిర్ణయం అడ్డుకుంటోందని ఎన్సీపీ ప్రతినిధి మహేష్ తపసి అన్నారు. ఉల్లి ఎగుమతుల నిషేధం తుగ్లక్ చర్యగా ఆయన అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉల్లి రైతుల ఇబ్బందులను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌కు వివరించారని చెప్పారు. చదవండి : ఉల్లి ఘాటు ఈ అంశంపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని గోయల్ హామీ ఇచ్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఉల్లి రైతులు ఆందోళన బాట పట్టారని తెలిపారు. కరోనా వైరస్‌తో ఉల్లి దిగుమతులు 13 శాతం పడిపోవడంతో 1150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న సంగతి తెలిసిందే. దేశంలోనే మహారాష్ట్రలో అత్యధికంగా ఉల్లి సాగవుతోంది. ఇక దేశంలో ఉల్లి ధరలు పెరగకుండా సరఫరాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను నిషేధించింది. -
ఉల్లి: గజగజ వణికిపోతున్న అమెరికన్లు
వాషింగ్టన్: మన దగ్గర ఉల్లి వాడకం లేని ఇళ్లు చాలా అరుదు. కూర, పులుసు, రసం.. చివరకు మజ్జిగలోకి కూడా ఉల్లిపాయ నంజుకు కావాలి చాలా మందికి. ఇది మనదేశంలో పరిస్థితి. కానీ ఇప్పుడు అమెరికన్లు ఉల్లి పేరు వింటే చాలు.. గజగజ వణికిపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అమెరికాలో ఉల్లిపాయలు ఓ భయంకరమైన వ్యాధిని కలిగిస్తున్నాయట. దీని గురించి స్వయంగా అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ(సీడీసీ) వెల్లడించింది. గత కొద్ది రోజులుగా అమెరికా, కెనడాలో సాల్మొనెల్లా(ఫుడ్ పాయిజన్ కలిగించే బ్యాక్టీరియా) మహమ్మారి కేసులు ఎక్కువగా వెలుగు చేస్తున్నాయంట. ఇప్పటి వరకు మొత్తం 34 రాష్ట్రాల్లో 400 మందికి ఈ బ్యాక్టీరియా సోకినట్లు అధికారులు వెల్లడించారు. సాల్మొనెల్లా ప్రధానంగా పొట్టలోని పేగులపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా డయేరియా (విరేచనాలు), జ్వరం, కడుపు నొప్పి వంటివి వస్తాయి. (రక్తపు వాంతులు, జుట్టంతా రాలిపోయి..) ఇది ఒక్కొక్కరిలో ఆరు గంటలపాటూ ఉంటుంది. బ్యాక్టీరియా సోకిన ఆరు గంటల తర్వాత ఈ అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరిలో ఆరు రోజుల తర్వాత కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు అధికారులు. అమెరికా, కెనడాకు నౌకల్లో వెళ్లిన ఎర్ర ఉల్లిపాయల్లో ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా చేరిందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఉల్లిపాయలు... అమెరికాలోని 50 రాష్ట్రాలతోపాటూ, కెనడాలోని అన్ని సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లకు ఆగస్ట్ 1న సప్లై అయ్యాయి. వీటిలో ఎరుపు, పసుపు, తెలుపు, తీపి పసుపు రంగు ఉల్లిపాయలున్నాయి. వీటన్నింటిలో కన్నా కూడా ఎర్ర ఉల్లిపాయల్లో ఎక్కువగా సాల్మొనెల్లా వైరస్ ఉన్నట్లు గుర్తించింది సీడీసీ. థాంప్సన్ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి వచ్చిన అన్ని రకాల ఉల్లిపాయలనూ వాడవద్దని సీడీసీ జనాలను హెచ్చరించింది. (చైనాను వణికిస్తున్న మరో మాయదారి వైరస్) Salmonella Outbreak Update: Don’t eat, serve or sell recalled onions from Thomson International or food made from these onions. Check the list of brand names to see if you have recalled onions: https://t.co/1uvWO6f6cZ pic.twitter.com/U5ORm1d5V0 — CDC (@CDCgov) August 3, 2020 సాల్మొనెల్లా లక్షణాలు సాల్మొనెల్లా బ్యాక్టీరియా సోకిన వారిలో వెంటనే లక్షణాలు కనిపించవు. 8 గంటల నుంచి 72 గంటల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి 4 రోజుల నుంచి 7 రోజుల పాటూ ఉంటాయి. డయేరియా, జ్వరం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, తలనొప్పి వంటివి వస్తాయి. చాలా మంది డాక్టర్ల దగ్గరకు వెళ్లకుండానే రికవరీ అవుతారు. ముసలి వాళ్లు, పిల్లలకు ఈ సమస్య వస్తే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడమే మేలు. సాల్మొనెల్లో సోకితే... ఎక్కువ నీరు తాగాలి. -
ఉల్లి పొట్టుతో ఉపయోగాలెన్నో!
ప్రతి వంటింట్లో అనుదినం ఉల్లిపాయలను ఉపయోగిస్తూ ఉంటాం. ఉల్లిపాయ పై పొర ఎండిపోయి ఉంటుంది. సాధారణంగా ఈ పొట్టును తీసి చెత్తబుట్టలో వేస్తుంటాం. అయితే, అలా పారెయ్యకుండా మీ ఇంటిపంటల ఉత్పాదకత పెంపుదల కోసం ఉల్లి పొట్టును ఉపయోగించుకోవచ్చు. చక్కని సేంద్రియ ఎరువును, పోషక జలాన్ని కూడా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకొని వాడుకునే పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లి పొట్టుతో సేంద్రియ ఎరువు పండ్ల మొక్కలు, పూల మొక్కలకు పోషక లోపం లేకుండా అన్ని పోషకాలనూ అందించేందుకు ఉల్లి పొట్టుతో తయారు చేసుకునే సేంద్రియ ఎరువు ఉపయోగపడుతుంది. పూత రాలుడు సమస్యను ఆపుతుంది. ఉల్లి పొట్టులో పొటాషియం, ఫాస్ఫరస్, జింక్ పుష్కలంగా, స్వల్పంగా గంధకం ఉన్నాయి. ఇవన్నీ మొక్కలు పోషక లోపం లేకుండా, వేరు వ్యవస్థ బాగా విస్తరించి, ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడతాయి. ఉల్లి పొట్టుతోపాటు.. వాడేసిన టీపొడిని, కాల్షియం కోసం గుడ్ల పెంకులను కూడా కలుపుకుంటే సమగ్రమైన సేంద్రియ ఎరువు తయారవుతుంది. ఉల్లిపొట్టు ఎరువు ఉల్లి పొట్టును బాగా ఎండబెట్టాలి. పూర్తిగా ఎండిన పొట్టునే వాడాలి. వాడేసిన టీ పొడిని కూడా బాగా ఎండబెట్టి వాడాలి. టీ పొడితోపాటే పంచదార వేసుకొని మరగబెట్టే అలవాటు మీకుంటే.. వాడేసిన టీ పొడిని నీటిలో కడిగి మరీ పూర్తిగా ఎండబెట్టి, ఆ తర్వాత ఈ ఎరువు తయారీలో ఉపయోగించాలి. టీ పొడిలో 4.4% నత్రజని, 0.24% ఫాస్ఫరస్, 0.25%పొటాషియం ఉంటాయి. గుడ్ల పెంకులను కూడా బాగా ఎండబెట్టాలి. బాగా ఎండిన ఉల్లి పొట్టు, వాడేసిన టీ పొడి, గుడ్ల పెంకులను సమపాళ్లలో తీసుకొని మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. అంతే.. సమగ్ర పోషకాలతో కూడిన సేంద్రియ ఎరువు సిద్ధమైనట్లే. దీన్ని 3–4 నెలల పాటు నిల్వ చేసుకొని వాడుకోవచ్చు. ఉల్లి ఎరువు వేసుకునే విధానం... ప్రతి మొక్కకు వారానికి 2–3 చెంచాలు వేసి నీరు పోయాలి. టమాటా మొక్కలకు, గులాబీ మొక్కలకు ఇది వేస్తే తేడా ఇట్టే తెలిసిపోతుంది. ఉల్లి పొట్టుతో సేంద్రియ పోషక జలం కేవలం ఉల్లి పొట్టుతో చాలా సులువుగా సేంద్రియ పోషక జలాన్ని ఇంట్లోనే తయారు చేసుకొని ఇంటిపంటలను ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. ఒక పాత్రలోకి నీరు (పట్టుకొని పెట్టుకున్న వాన నీటిని వాడుకుంటే శ్రేష్టం. అవి లేకపోతే ఆర్.ఓ. నీరు పోయాలి) తీసుకొని అందులో ఎండు ఉల్లి పొట్టును వేసి మూత పెట్టాలి. రోజు గడిచే కొద్దీ పొట్టులోని పోషకాలు నీటిలోకి వచ్చి చేరుతూ ఉంటాయి. నీటి రంగు మారుతూ ఉంటుంది. 3–4 రోజుల తర్వాత వడపోసి బాటిల్లో నిల్వ చేసుకోవచ్చు. 1–2 నెలలు నిల్వ ఉంటుంది. పిచికారీ విధానం... పూత దశకు ముందు 15 రోజులకోసారి ఈ పోషక జలాన్ని మొక్కలకు పోయండి. నీరు కలపాల్సిన అవసరం లేదు. ఎండ వేళ్లలో కాకుండా ఉదయం/సాయంత్రపు వేళల్లోనే పోయాలి. ఉల్లి పొట్టులోని యాంధిసైనెన్ పిగ్మెంట్స్ వల్ల పూలకు చక్కని నిగారింపు వస్తుంది. వేసవిలో గులాబీ మొక్కలు చక్కగా పూయడానికి దోహదపడుతుంది. వారానికి 2-3 చెం‘చాలు’ పచ్చబారిన ఆకులకు చెక్ పోషక లోపం వల్ల మొక్కల ఆకులపై పసుపు పచ్చ మచ్చలు వస్తుంటాయి. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఉల్లి పొట్టుతో తయారు చేసుకున్న పోషక జలం సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. 100–200 ఎం.ఎల్. పోషక జలంతోపాటు 800 ఎం.ఎల్. నీటి (వాన నీరు/ఆర్.ఓ. నీరు)ని కలిపి పిచికారీ చేయాలి. మొక్కల ఆకులు పూర్తిగా తడిచేలా వారానికి రెండు సార్లు సూర్యోదయానికి ముందే చల్లాలి. సిట్రస్ జాతి పండ్ల మొక్కలకు నీరు ఎక్కువగా పోయనవసరం లేదు. నీటి తేమ చాలు. నీటి తేమ త్వరగా ఆరిపోకుండా ఉండాలంటే.. ఉల్లి పొట్టును/గడ్డిని మొక్కల చుట్టూ ఆచ్ఛాదన (మల్చింగ్)గా వేయాలి. -
కర్నూలు ఉల్లి.. కొనుగోలు నిల్
తాడేపల్లిగూడెం: మార్కెట్లో కర్నూలు ఉల్లి రకం నేలచూపులు చూస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లిపాయలతో పోటీని తట్టుకోలేక ధర దారుణంగా పడిపోయింది. ఎన్నడూలేని విధంగా తాడేపల్లిగూడెం మార్కెట్లో క్వింటాలు ఉల్లి ధర రూ.130కి చేరింది. దీంతో రిటైల్‌గా కిలో రూ.1.30 పలికింది. ఇంతవరకూ క్వింటాలు గరిష్టంగా రూ. 500 మాత్రమే పలికింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే ఉల్లిపాయలతో పోలిస్తే కర్నూలు ఉల్లి నాణ్యంగా లేక పోవడం, నిల్వకు ఆగకపోవడం కారణంగా వినియోగదారులు వీటిని కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో వీటి ధర అమాంతం పడిపోయింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉల్లిపాయలు క్వింటాలు ధర రూ.600 నుంచి రూ.1350 వరకు అమ్మారు. ప్రస్తుతం రూ.600 నుంచి రూ.1000 మధ్య ఉంది. వాతావరణ మార్పులతో నష్టం ఈ సారి వేసవిలో (రెండో పంట) ఉల్లికి మంచి ధర వస్తుందని కర్నూలు రైతులు పెద్ద ఎత్తున సాగుచేశారు. పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. చేతికొచ్చేనాటికి వాతావరణంలో మార్పులు, అకాల వర్షాలతో పంట దెబ్బతింది. నిల్వకు ఆగని రకంగా పేరున్న ఈ ఉల్లిపాయలు వాతావరణం వల్ల తొక్క ఊడిపోవడం, పెరిగిన ఎండలతో ఉల్లి లోపల ఉడికిపోవడంతో మార్కెట్‌కు వచ్చినా కొనే వారు లేక ధరలు పడిపోయాయి. కర్నూలు ఉల్లి రైతుల పరిస్థితి గమనించిన ప్రభుత్వం గిట్టుబాటు కల్పించేలా క్వింటాలు రూ.770 వంతున కొని జిల్లాలకు పంపించింది. కర్నూలుతో పాటు, ఈ ఉల్లికి రాష్ట్రంలో ప్రధాన మార్కెట్‌గా ఉన్న తాడేపల్లిగూడెం పంపారు. ఇక్కడి మార్కెట్‌కు కర్నూలు ఉల్లి కంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉల్లి రావడంతో కర్నూలు ఉల్లిని వ్యాపారులు పట్టించుకోవడం లేదు. దీంతో క్వింటాలు ధర రూ.130కి పడిపోయింది. మార్క్‌ఫెడ్ ద్వారా 5700 క్వింటాళ్ల కొనుగోలు ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్ ద్వారా 5700 టన్నుల ఉల్లిని క్వింటాలు రూ.770కి కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులను ఆదుకుంది. సరాసరి కిలోకు రూ.2 వరకు కిరాయి ఇచ్చి జిల్లాకు సరుకును పంపించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లిని కిలో రూ.3, గరిష్టంగా రూ. 5కి విక్రయించారు. అయినా సరుకు అమ్ముడిపోని పరిస్థితి. మొత్తం సరుకును ఆదివారం మార్కెఫెడ్, మార్కెటింగ్ శాఖ విక్రయించింది. 5,700 టన్నులు కొన్నాం ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు నుంచి 5,700 టన్నుల ఉల్లిని కొనుగోలు చేశాం. 19 లారీల సరుకు జిల్లాకు రాగా, గూడెం మార్కెట్, మార్కెట్ యార్డు ద్వారా అమ్మాం. అధికంగా క్వింటాలుకు రూ.500 వచ్చింది. నాగమల్లిక, మార్కెఫెడ్ డీఎం రెండో పంటలో నాణ్యత ఉండదు వేసవిలో వచ్చే కర్నూలు ఉల్లి రెండో పంట నాణ్యంగా ఉండదు. గత సీజన్లో ఉల్లికి రికార్డు ధర రావడంతో రైతులు పంటను వేశారు. నాణ్యత లేని కారణంగా రైతు ఆశించిన ధర రాలేదు.ఎన్.కృష్ణమూర్తి, వ్యాపారి -
‘మహా’ ఉల్లిపై నియంత్రణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న మహారాష్ట్ర ఉల్లిపై ప్రభుత్వం నియంత్రణ విధించింది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతి ఉధృతంగా ఉండటంతో మహారాష్ట్ర సరిహద్దులను మూసేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించగా, నిత్యావసరాలైన ఉల్లి దిగుమతులపై తాజాగా ఆంక్షలు పెట్టింది. మన రాష్ట్రంలో ఈ సీజన్లో ఉల్లి సాగు గణనీయంగా పెరిగి లభ్యత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఇక్కడి రైతులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర మార్కెట్లకు ఇక్కడి ఉల్లినే సరఫరా చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉల్లి సరఫరా ముగిశాకే, మహారాష్ట్ర నుంచి దిగుమతులు తిరిగి ఆరంభించాలని, అంతవరకు దాన్ని పూర్తిగా ఆపేయాలని సూచించింది. నియంత్రణకు కారణాలివే.. రాష్ట్రంలోని బోయిన్పల్లి మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి సాధారణ రోజుల్లో 30 నుంచి 40 లారీలు వచ్చేవి. వీటి ద్వారా 5 వేల క్వింటాళ్ల మేర ఉల్లి దిగుమతి అయ్యేది. అయితే ఈ నెల తొలి వారం నుంచి అక్కడి మార్కెట్లను పూర్తిగా మూసేయడంతో అక్కడి వ్యాపారులంతా ఉల్లిని ఇక్కడికే తరలించారు. దీంతో మహారాష్ట్ర నుంచి వచ్చే లారీల సంఖ్య రెట్టింపయింది. ఒక్కో రోజు 100 వరకు లారీలు వచ్చాయి. దీంతో ఉల్లి ధర కిలో రూ.10–12కి పడిపోయింది. అయితే మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం, మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ఆ రాష్ట్రం నుంచి సరుకు రవాణా చేస్తున్న వాహనాలకు వెళ్లాలంటేనే మార్కెట్ సిబ్బంది, హమాలీలు జంకుతున్నారు. ఇక మహారాష్ట్ర వాహనాలను నిలిపే కాలనీల నుంచి సైతం అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని తమ ప్రాంతాల్లో నిలపొద్దని కాలనీవాసులు మొరపెట్టుకుంటున్నారు. దీనికితోడు మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లి ఎక్కువగా పెద్ద పరిమాణంలో ఉంటుంది. దీన్ని ఎక్కువగా హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగిస్తారు. ప్రస్తుతం ఇవేవీ తెరిచి ఉండకపోవడంతో వీటి అవసరం లేదు. ఇక మరోపక్క రాష్ట్రంలోని గద్వాల, వనపర్తి, కొల్లాపూర్, తాండూరు, నారాయణఖేడ్ వంటి ప్రాంతాల్లో ఈ సీజన్లో ఉల్లి సాగు పెరిగింది. అదంతా మార్కెట్‌కు రావడానికి సిద్ధంగా ఉంది. తమ ఉల్లిని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉల్లి రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర‡ రైతులకు ఊరటనిచ్చేలా, రాష్ట్రీయంగా ఉన్న ఉల్లినే సరఫరా చేయాలని, దాన్నే కొనుగోలు చేసి రిటైల్ మార్కెట్‌కు పంపాలని ఉల్లి వ్యాపారులను ప్రభుత్వం కోరింది. దీనికి వ్యాపారులు కూడా అంగీకరించారు. వనపర్తి, గద్వాల జిల్లాలో ఇప్పటికే 7 నుంచి 8 వేల క్వింటాళ్ల ఉల్లి సిద్ధంగా ఉందని, అదంతా సోమవారానికి బోయిన్పల్లి మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఉల్లి దిగుమతి పుష్కలంగా ఉండటంతో ధర సైతం కిలో రూ.10 నుంచి రూ.16 వరకు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. -
ఉల్లి దిగుమతులు బంద్
చాదర్‌ఘాట్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతులు బంద్ చేసినట్లు మార్కెట్ జాయింట్ డైరెక్టర్‌శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి దిగుమతి అవుతున్న ఉల్లిని నిలిపివేశామని ఇది సోమవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు.తెలంగాణకు వచ్చే మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా వైరస్ సమస్య తీవ్రంగా ఉన్నందున అక్కడ నుంచి వచ్చే ఉల్లి దిగుమతిని ఈ నెల 14వ తేదీ వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిపివేస్తున్నామన్నారు. -
మలక్‌పేట్ మార్కెట్లో నిలిచిన ఉల్లి విక్రయాలు
-
' ఉల్లి 'ఉపశమనం
సాక్షి, సిటీబ్యూరో: మొన్నటిదాకా కన్నీరు పెట్టించింది. ధరతో దడ పుట్టించింది. వంటింట్లో వణికించింది. వినియోగదారులను బెంబేలెత్తించింది. మరి ఇప్పుడో.. ఉపశమనం కలిగిస్తోంది. నేలకు దిగిన ధరతో సామాన్యులకు చేరువగా మారింది. అదేమిటని ఆలోచిస్తున్నారా? అదేనండి.. ఉల్లి. మార్కెట్‌కు ఆశించినస్థాయి కంటే ఎక్కువ మొత్తంలో ఉల్లి దిగుమతులు పెరగడంతో ధరలు నేలకు దిగి వస్తున్నాయి. గురువారం మలక్‌పేట్ ఉల్లి హోల్‌సేల్ మార్కెట్లో క్వింటాల్ ధర రూ.2,900 నుంచి రూ.2,500 పలికింది. కొన్నాళ్ల క్రితం క్వింటాలుకు 16వేల నుంచి 18వేల రూపాయల వరకు పలికిన ఉల్లి.. అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపింది. సామాన్య ప్రజలు ఉల్లిని కొనాలంటేనే వణికిపోయారు. ప్రత్యేకించి హోటళ్లు, మెస్‌లలో వినియోగ దారులకు ఉల్లి లేని వంటకాలే వడ్డించాయి. సామాన్య ప్రజలు చాలా మంది ఉల్లికి ప్రత్యామ్నాయంగా క్యాబేజీని వాడారు. ఇలా ఉల్లిపేరు వింటేనే ఉలిక్కిపడిన వారంతా ప్రస్తుతం ధరలు తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. రూ.100కు 4 కిలోలు.. మలక్‌పేట్ ఉల్లి హోల్‌సేల్ మార్కెట్లకు మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు, ఏపీ, తెలంగాణ జిల్లాల నుంచి దిగుమతులు భారీగా వస్తున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లో మొదటి రకం ఉల్లి కిలో రూ.29 ఉండగా, రెండో రకం రూ.25 నుంచి 24 వరకు పలుకుతున్నట్లు ఉల్లి వ్యాపారులు చెబుతున్నారు. కొందరు వ్యాపారులు ఏకంగా వంద రూపాయలకు మూడు కిలోలు అమ్ముతున్నారు. మరికొందరు వ్యాపారులు వందకు నాలుగు కిలోలు కూడా అమ్ముతున్నారు. కొత్త పంట రావడంతో మార్కెట్‌కు ఉల్లి ముంచెత్తుతోంది. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నాఫెడ్ వద్ద మిగిలిన ఈజిప్టు ఉల్లి మార్కెట్‌కు ఉల్లి దిగుమతులు తగ్గడంతో నెల రోజుల క్రితం కిలో ఉల్లి రూ.100 నుంచి రూ.120 వరకు పెరిగాయి. దీంతో మార్కెటింగ్ శాఖ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా వంద మెట్రిక్ టన్నుల ఉల్లిని రూ.65కు కొని సబ్సిడీపై నగరంలోని రైతు బజార్లలో కిలో రూ.40కి విక్రయించారు. దీంతో మార్కెటింగ్ శాఖ తీసుకున్న ఉల్లి మొత్తం విక్రయించారు. నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఈజిప్లు ఉల్లి ముంబై నుంచి నగరానికి వచ్చింది. ఉల్లి ధరలు తగ్గడంతో ఈజిప్టు నుంచి కొన్న ఉల్లి.. ప్రస్తుతం ధరలు తగ్గడంతో సనత్‌నగర్‌లోని గోదాంలో మిగిలిపోయింది. దీంతో నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ అధికారులు ఉల్లి విక్రయించడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసిన ఉల్లి నెలరోజుల కిత్రమే మొత్తం అమ్ముడుపోయిందన్నారు. కొత్త పంటవస్తుండటంతోనే.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లోకల్ కొత్త ఉల్లి పంట మార్కెట్‌కు ఎక్కువగానే దిగుమతయ్యే అవకాశం ఉంది. గత ఏడాది మహారాష్ట్ర ఉల్లిపై ఆధారపడి ఉండాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభ నుంచే మెదక్, మహబూబ్‌నగర్, కర్నూల్ నుంచి ఉల్లి ఎక్కువగా దిగుమతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పెద్ద ఉల్లిగడ్డ కిలో రూ.29 వరకు ధర పలుకుతోంది. చిన్న గడ్డకు రూ.14 వరకు ఉంది. ఈ ఏడాది ఉల్లి ధరలు ఎక్కువగా పెరగవు. కొత్త పంట రావడంతో ధరలు అదుపులోకి వచ్చాయి.– వెంకటేశం, స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ, మలక్‌పేట్ మార్కెట్ -
కేపీ ఉల్లి ఎగుమతిపై నిషేధం ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణాపురం ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధాన్ని ఎత్తివేసింది. కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని తొలగించాలని ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రాన్ని కోరుతూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కూడా ఉల్లి ఎగుమతికి తక్షణమే అనుమతినిచ్చి.. కేపీ ఉల్లి రైతులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో కేపీ ఉల్లిని ఎగుమతి చేసేందుకు అనుమతినిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అదేవిధంగా 10 వేల మెట్రిక్ టన్నుల ఉల్లిని చెన్నై నుంచి వెంటనే ఎగుమతి చేసుకునేందుకు అనుమతిని కూడా ఇచ్చింది. ‘కేపీ ఉల్లి ఎగుమతికి తక్షణమే అనుమతించాలి’ ఇక ఉల్లి పరిమాణంపై కడప హార్టికల్చర్ అధికారి సర్టిఫికెట్ జారీ చేసి మార్చి 31లోగా ఎగుమతులు పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు, ఎంపీ విజయసాయిరెడ్డికి, మిథున్‌రెడ్డికి కేపీ ఉల్లి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా అదేవిధంగా వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి... రైతులను వెంట తీసుకుళ్లి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి కేపీ రైతుల సమస్యను ఆయనకు వివరించగా.. రెండు రోజులల్లో నిర్ణయం ప్రకటిస్తామని.. ఆయన హామీ ఇచ్చినట్లు మిథున్‌రెడ్డి ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇచ్చిన హామీ మేరకు కేపీ ఉల్లి ఎగుమతికి అనుమతిని ఇస్తూ కేంద్రం నిషేధాన్ని తొలగించినట్లు ప్రకటించింది. -
పచ్చి ఉల్లిపాయను తిని చూడండి..
ప్రస్తుత కాలంలో చాలామంది షుగర్ వ్యాధితో అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. మందులు వాడుతున్నా తీసుకునే ఆహారం సరియైనది కాకపోవడంతో షుగర్ లెవెల్స్ పెరిగి పలు ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. మందులతో పాటు కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఉండే వాటితోనే చిన్నపాటి చిట్కాతో చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అదెలాగో చూద్దాం.. రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయను ఖచ్చితంగా తినాలి. యాభై గ్రామాలు ఒకేసారి తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొంచెం తినవచ్చు. షుగర్ ఎక్కువగా ఉన్నవారు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటారు. దానికి బదులుగా యాభై గ్రామల పచ్చి ఉల్లిపాయ తీసుకుంటే 20 యూనిట్ల ఇన్సులిన్‌తో సమానం. ఏడు రోజులు క్రమం తప్పకుండా ఈ పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల బాగా ఎక్కువగా ఉన్న షుగర్ లెవల్ కంట్రోల్ అవుతుంది. -
ఉల్లిపాయ కోసం గొడవ
హైదరాబాద్: ఉల్లిపాయల కోసం ఆటో డ్రైవర్, పానీ పూరి నిర్వాహకుడి మధ్య జరిగిన వాగ్వివాదం కాస్తా గొడవకు దారితీసింది. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చే సుకుంది. రహమత్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ వీరన్న, ఎస్ఆర్నగర్ సమీపం లోని బాపూనగర్‌లో ఉన్న చాట్‌బండార్‌లో పా నీపూరి తిన్నాడు. పానీపూరి తింటూ ఉల్లిపాయ ఎందుకు వేయలేదని వీరన్న ప్రశ్నిం చాడు. ‘ఉల్లిపాయలు వేసేందుకు బిర్యానీకి ఏమైనా ఆర్డర్ ఇచ్చావా’ అంటూ చాట్‌బండార్ నిర్వాహకుడు సర్దార్ పవార్ హేళనగా మాట్లాడాడు. రూ.10 పానీపూరి తిన్న వీరన్న ఉల్లిపాయ వేయనందున డబ్బులు ఇచ్చేది లేదని చెప్పాడు. ఉల్లి ధర పెరిగినందున ఎవరికీ వేయటం లేదని పవార్ బదులిచ్చాడు. పవార్ మాటలు పట్టించుకోకుం డా వీరన్న అక్కడి నుండి వెళ్తుండగా, ఆగ్రహం తో పవార్ వీరన్నపై చేయి చేసుకున్నాడు. దీంతో వీరన్న ఇనుపరాడ్ తీసుకుని పవార్ తల పగుల గొట్టాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వీరన్నను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
విజయవాడలో ఈజిప్టు ఉల్లిపాయలు
సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లిపాయల కొరత తీర్చడానికి ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తొలి విడతలో జిల్లాకు 27 టన్నుల ఈజిప్టు ఉల్లి పాయలను కేటాయించారు. మంగళవారం విజయవాడలోని రైతు బజారుల్లో 15 టన్నుల ఉల్లిపాయలు విక్రయం జరిగింది. గుడివాడ, మచిలీపట్నం రైతు బజారుల్లో ఉల్లిపాయలు అందుబాటులో ఉన్నాయని మార్కెటింగ్ శాఖ అధికారలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలోనూ కిలో రూ.25 చొప్పున ఉల్లిపాయలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. -
ఇవి చాలా ఖరీదైన దండలు సుమా..!
వారణాసి : ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకాయి. ఉల్లి కోస్తేనే కాదు కొనాలంటే కూడా కన్నీళ్లు వస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు ప్రజలను హడలెత్తిస్తుంటే.. సోషల్ మీడియాలో మాత్రం ఉల్లి నవ్వులు పూయిస్తుంది. నెటిజన్లు తమ క్రియేటివిటీ అంతా ఉల్లిపై చూపిస్తున్నారు. కామెడీ పండించే ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ ‘ఉల్లి’ జోకులు వేస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ పెళ్లి జంట ఏకంగా ఉల్లి, వెల్లుల్లి దండలనే మార్చుకొని అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు పెళ్లికి వచ్చిన అతిథులు కూడా వారికి ఉల్లిపాయల్ని గిఫ్టులుగా ఇచ్చారు. ఈ పెళ్లికి హాజరైన సమాజ్ వాదీ పార్టీ నేత కమల్ పటేల్ మాట్లాడుతూ..ఉల్లిధరలు దేశంలో ఎలా ఉన్నాయో జనాలకు సింబాలిక్‌గా తెలియజేసేందుకే వారు అలా ఉల్లిదండలను ధరించారని అందరూ అంటున్నారు. గత కొంతకాలం నుంచి ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. కిలో ఉల్లి రూ.120కి పైగా పలుతోందన్నారు. దీంతో ప్రజలు ఉల్లిపాయల్ని బంగారం కంటే ఎక్కువగా భావిస్తున్నారని అన్నారు. ఈ పెళ్లిలో వధూవరులు ఉల్లిపాయలు, వెల్లుల్లి దండలను మార్చుకుని వాటి రేట్లు ఎలా ఉన్నాయో ప్రదర్శించారని అన్నారు. మరో ఎస్పీ నేత సత్య ప్రకాష్ మాట్లాడుతూ..ఉల్లి రేట్లు అధికంగా ఉన్నందుకు వధూవరులిద్దరు ఈ రకంగా తమ నిరసనను తెలిపారని అన్నారు. ఉల్లికి వ్యతిరేకంగా ఇటువంటి కార్యక్రమాలను తమ పార్టీ నిరసనలు చేపడుతోందని తెలిపారు. కాగా, ఉల్లి ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఇలాంటి వింత ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ నవ జంటకు పెళ్లి గిఫ్ట్‌గా రెండున్నర కిలోల ఉల్లిపాయలను అందించారు స్నేహితులు. కొన్ని కంపెనీలు తమ బిజినెస్‌ను పెంచుకునేందుకు కూడా ఉల్లిని వాడుకుంటున్నారు. తమిళనాడుకు చెందిన ఓ మొబైల్ కంపెనీ.. తమ కస్టమర్లకు కేజీ ఉల్లిని బహుమతిగా అందించాయి. కొన్ని చోట్ల కిలో చికెన్ కొంటే అరకిలో ఉల్లి ఫ్రీ అంటూ ఆఫర్లు ఇస్తున్నారు. -
పర్యాటకులకు ‘అభిబస్’ వినూత్న ఆఫర్!
దేశంలో రోజురోజుకు ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఉల్లిని కొనాలంటే సామాన్య ప్రజలు జంకుతున్నారు. ఉల్లి కొందామని మార్కెట్‌కు వెళ్లినవారికి.. అక్కడి ధరలు చూస్తే చుక్కలు కనబడుతున్నాయి. ఇక కిలో ఉల్లి ధర డబుల్ సెంచరీ దాటడంతో సోషల్ మీడియాలో, టిక్‌టాక్‌లలో ఫన్నీ వీడియోలు, మీమ్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ పర్యాటక సంస్థ అబిబస్.కామ్ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. తమ వెబ్సైట్ ద్వారా గోవా ట్రిప్ బుక్ చేసుకున్న వారికి 3 కిలోల ఉల్లిని బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో పర్యాటక ప్రీయులంతా ఈ ఆఫర్‌కు ఫిదా అవుతూ గోవా పర్యటనకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే గోవా టూర్‌కు అధిక డబ్బులు వెచ్చించిన వారికి ఆపిల్ ఐ ఫోన్ లేదా ఈ-బైక్‌లను గెలుచుకునే మరో ఆఫర్‌ను కూడా అబిబస్ ప్రకటించింది. అయినప్పటకీ అధిక శాతం వినియోగదారులను బుకింగ్‌లో ఉల్లిపాయ బహుమతినే ఎంచుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది. దీనిపై ఆ సంస్థ సీవోవో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. అత్యధిక వినియోగదారులు గోవా పర్యటనకంటే కూడా ఉల్లిపాయాలకే ప్రాధాన్యత ఇవ్వడం చూసి ఆశ్యర్యపోయానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో బంగారు ఆభరణాలు, విలువలైన వస్తువుల కంటే ఉల్లికే అధిక డిమాండ్ ఉందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అన్నారు. ఈ ఆఫర్‌కు వచ్చిన స్పందన చూస్తే.. తాము వినియోగదారులకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఆఫర్లు అందిస్తున్నామన్న సంతృప్తి కలిగిందని చెప్పారు. తమ నిర్ణయం సరైందనే నమ్మకం వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఆఫర్ ద్వారా ప్రతి రోజు 20 మందిని విజేతలుగా ప్రకటించి.. వారికి 3 కిలోల ఉల్లిని ఇంటికి డెలివరీ చేస్తామని రోహిత్ తెలిపారు. డిసెంబర్ 10న ప్రకటించిన ఈ ఆఫర్‌కు మంచి స్పందన లభించిందని చెప్పారు. పర్యాటక ప్రదేశాల ఎంపికలో.. వెనుకంజలో ఉండే గోవా ఈ ఆఫర్‌తో మొదటి సారిగా రెండవ స్థానంలో నిలిచిందని అన్నారు. డిసెంబర్ 15 వరకు ఉండే ఈ ఆఫర్ కోసం అబిబస్ వెబ్సైట్ ద్వారా గోవా టూర్ బుక్ చేసుకోని పోటీలో నిలువవచ్చని చెప్పారు. -
పెళ్లి విందు సరే.. బిర్యానీలో ఉల్లి సంగతేంటి..?
చెన్నై: పెళ్లి అంటేనే సందడి.. చుట్టాలు, స్నేహితులతో నిండిపోయే మండపంలో ఉన్న కోలాహలం చూస్తే అందరు అక్కడ బిజీబిజీగా కనిపిస్తారు. ఆ హడావుడి అంతా ఇంతా కాదు. ఇకపోతే ఏదైన ఫంక్షన్స్‌కు ఖాళీ చేతులతో వెళ్లకూడదని బంధువులు, స్నేహితులు వివిధ కానుకలు తీసుకొచ్చి నూతన వధూవరులకు వాటిని అందజేసి సర్ప్రైజ్ చేస్తుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉల్లి బాగా పాపులర్ అయింది. దాన్ని కొనాలంటే సామాన్యుడు హడలిపోతున్నాడు. ఇంకేముంది కొత్త జంటలకు ఉల్లిని గిఫ్ట్‌గా ఇచ్చి వినూత్నంగా తమ నిరసన తెలపడంతో పాటు.. వాటినే గిఫ్ట్‌గా అందిస్తూ వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. చదవండి: హెరిటేజ్‌లో కిలో ఉల్లి రూ.200 వివరాల్లోకెళ్తే.. తాజాగా బెంగళూరులో ఓ నూతన జంటకు ఉల్లి గిఫ్ట్ ఇచ్చినట్టుగానే తమిళనాడులో జరిగిన పెళ్లిలో స్నేహితులు ఉల్లి గిఫ్ట్‌గా ఇవ్వడం వైరల్‌గా మారింది. కడలూరులోని మంజకుప్పంలో ఆదివారం ఓ పెళ్లిలో ఇది జరిగింది. నూతన జంట షాహుల్, సబ్రినా వివాహాన్ని ఇరు కుటుంబ సభ్యులు వైభవంగా నిర్వహించారు. పెళ్లికి వచ్చిన బంధువుల కోసం మంచి విందు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి బిర్యానీ చేయించి వడ్డించారు. కానీ.. దాంట్లోకి ఉల్లిపాయలకు బదులు రైతా, కీరాతో సరిపెట్టారు. ఉల్లి కొరత కారణంగా ఇలా చేసినట్టు వధువు కుటుంబం చెప్పడంతో దీనిని గమనించిన వరుడి స్నేహితులు ఉల్లిపాయలను గిఫ్ట్‌గా ఇచ్చి నూతన జంటను ఆశ్చర్యపరిచారు. కడలూరులోని ఒక దుకాణం నుండి 2.5 కిలోల ఉల్లిని రూ.500లకు కొని దంపతులకు గిఫ్ట్‌గా ఇవ్వడం గమనార్హం. -
ఈజిప్టు ఉల్లి..రావే తల్లీ..!
సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతులు పెరిగినా ధర మాత్రం ఇంకా ఆకాశంలోనే ఉంది. వస్తున్న ఉల్లిగడ్డ డిమాండ్‌కు తగ్గట్టుగా లేకపోవడంతో ధరలు దిగి రావడం లేదు. నిన్నమొన్నటితో పోలిస్తే మాత్రం కాస్త ఊరటినిచ్చేలా రూ.20 మేర ధరలు తగ్గడం కొంతలో కొంత ఉపశమనం కలిగిస్తోంది. శనివారం సైతం మలక్‌పేట మార్కెట్లో క్వింటాలు ఉల్లి ఏకంగా రూ.16,000 పలకగా, మహారాష్ట్ర ఉల్లి రూ.14,000 పలికింది. అంటే హోల్‌సేల్ మార్కెట్లో ధర రూ.160 వరకు ఉండగా, బహిరంగ మార్కెట్లో అది రూ.170–180 మధ్య ఉంది. ఈ ఇబ్బంది ఈజిప్టు నుంచి వచ్చే ఉల్లి దిగుమతులు తీరుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పుడు ధర బాగా తగ్గే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. 2 వేల క్వింటాళ్లు అధికంగా మార్కెట్లోకి.. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, మధ్యప్రదేశ్ నుంచి ఉల్లి దిగుమతులు తగ్గడంతో గడిచిన కొద్ది రోజుల నుంచి ఉల్లి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. మూడు నాలుగు రోజుల కిందట కిలో ఉల్లి ధర బహిరంగ మార్కెట్లో రూ.170కి చేరగా, రెండు రోజుల క్రితం అది రూ.200 దాటింది. గురువారం సైతం మలక్‌పేట మార్కెట్లో కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చిన ఉల్లి వ్యాపారులు క్వింటాల్ రూ.18 వేలకు అమ్మారు. అంటే మార్కెట్ యార్డుల్లోనే కిలో ఉల్లి రూ.180 ఉండగా, అది బహిరంగ మార్కెట్లకు వచ్చేసరికి రూ.200లు పలికింది. శుక్రవారం 2,500 క్వింటాళ్ల నుంచి 3వేల క్వింటాళ్ల మేర మాత్రమే ఉల్లి రాగా, శనివారం 5,514 క్వింటాళ్ల ఉల్లిగడ్డ వచ్చింది. దీంతో శనివారం మార్కెట్లో కర్ణాటక నుంచి వచ్చిన పెద్దసైజు ఉల్లి క్వింటాల్ రూ.16 వేలు పలకగా, మహారాష్ట్ర ఉల్లి రూ.14 వేలు పలికింది. మీడియం రకం కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చింది రూ.15 వేలు పలకగా, మహారాష్ట్ర ఉల్లిగడ్డ రూ.16 వేలు పలికింది. వీటి ధరలు బహిరంగ మార్కెట్లోకి వచ్చేసరికి మరో రూ.20 అదనంగా పెరిగి రూ.170–180 మధ్య ఉన్నాయి. సోమవారం నుంచి రాష్ట్రానికి మహారాష్ట్ర, రాజస్తాన్ నుంచి ఉల్లి దిగుమతి 7 వేల నుంచి 8 వేల క్వింటాళ్ల మేర ఉండే అవకాశం ఉంటుందని మలక్‌పేట మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అలా అయితే ధర కిలో రూ.100 దిగొచ్చే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి తోడు శనివారం కర్నూల్ మార్కెట్లోనూ ఉల్లి ధరలు దిగొచ్చాయి. మొన్నటి వరకు కర్నూలులో క్వింటాల్ ఉల్లి ధర రూ.14 వేలు పలకగా, అది శనివారం రూ.8 వేలకు తగ్గింది. పొరుగు రాష్ట్రంలో ధరలు దిగిరావడం సైతం రాష్ట్రానికి అనుకూలించనుంది. 15న రానున్న ఈజిప్టు ఉల్లి.. ఇక ఈజిప్టు నుంచి కేంద్రం దిగుమతి చేసుకుంటున్న 6,090 మెట్రిక్ టన్నుల ఉల్లిలో తెలంగాణ 500 మెట్రిక్ టన్నులు ఇదివరకే కోరింది. ఈ ఉల్లి ఈ నెల 15న ముంబై పోర్టు ద్వారా రాష్ట్రానికి చేరే అవకాశం ఉందని మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. వారానికి 100 మెట్రిక్ టన్నుల వంతున ఐదు వారాల పాటు ఈ ఉల్లిని మార్కెట్లోకి వదలనున్నారు. దీన్ని రాష్ట్రంలోని 40 రైతుబజార్ల ద్వారా కిలో రూ.40కే అమ్మనున్నారు. దీనిద్వారా ధరలు దిగొస్తాయని మార్కెటింగ్ శాఖ అంచనా వస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం వ్యాపారులతో మాట్లాడి సరూర్‌నగర్, మెహిదీపట్నం మార్కెట్లలో కిలో ఉల్లి రూ.40కే విక్రయిస్తోంది. దీనిద్వారా సామాన్యుడికి ఉపశమనం కలుగుతోందని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
కొనలేం.. తినలేం
సాక్షి, నర్సాపూర్(మెదక్): ఉల్లి గడ్డ ధర భగ్గుమంటుంది. ధరలు అమాంతం పెరగడంతో ఉల్లిగడ్డ వినియోగం తగ్గి అమ్మకాలు తగ్గాయి. సామాన్య ప్రజలు ఉల్లి గడ్డను వాడేందుకు జంకుతున్నారు. ఉల్లిగడ్డ సైజు బట్టి ధర పలుకుతుంది. చిన్న సైజు ఉల్లి గడ్డని సైతం సాధారణ ప్రజలు వాడే స్థాయిలో దాని ధర లేకపోవడం గమనార్హం. పేడుగా పిలువబడే చిన్న సైజు ఉల్లి ధర కిలోకు 40 రూపాయలకు చేరడంతో ప్రజలు కొనలేకపోతున్నారు. నాలుగు నెలలుగా పెరుగుతున్న ధరలు సుమారు నాలుగు నెలలుగా ఉల్లిగడ్డ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకో ధరకు అమ్మకాలు సాగుతున్నాయి. మామూలుగా చిన్న సైజు ఉల్లి గడ్డ ధర పది రూపాయల లోపు ఉంటుండగా మీడియం సైజు ఉల్లిగడ్డ కిలో ధర పది రూపాయలకు లభించేది. నాలుగు నెలల క్రితం పది రూపాయలు పలికిన ఉల్లి గడ్డ 15 నుంచి 20 రూపాయలకు పెరిగి ఆపై రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. నర్సాపూర్‌కు చెందిన పలువురు వ్యాపారులు హైదరాబాద్, జహీరాబాద్ ప్రాంతాల నుంచి ఉల్లిగడ్డను తెచ్చి విక్రయించేవారు. కాగా హోల్‌సేల్ ధరలు పెరగడంతో స్థానిక వ్యాపారులు సైతం పెంచాల్సి వస్తుందని అంటున్నారు. తగ్గిన వినియోగం ఉల్లిగడ్డ ధరలు అమాంతం పెరుగుతున్నందున దాని వినియోగం బాగా తగ్గి అమ్మకాలు పడిపోయాయి. పది రూపాయలకు కిలో ఉల్లిగడ్డ లభించినపుడు బాగా వినియోగించడంతో మార్కెట్లో అమ్మకాలు సైతం బాగానే ఉండేవి. ప్రస్తుతం చిన్న సైజు ఉల్లి కిలోకు 40 రూపాయలకు చేరడం, మీడియం సైజుది 80 రూపాయల వరకు, పెద్ద సైజుది వంద రూపాయలకు చేరడంతో మామూలు ప్రజలు దానిని వినియోగించేందుకు జంకుతున్నారు. ధరలు పెరగడంతో పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి వస్తుందని అధిక ధరలకు తెచి్చనా అమ్మక పోవడంతో పాడై నష్టాలు వస్తున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనలేక పోతున్నాం మామూలు సైజు ఉల్లి గడ్డ ధరలు 80 నుంచి వంద రూపాయలకు చేరడంతో కొనలేకపోతున్నాం. ధర లు అడ్డగోలుగా పెరుగుతున్నాయి. ఉల్లి ధర వింటుంటే భయమేస్తుంది. ధరలు పెరిగినందున వాడడం తగ్గించాం. ఉల్లి ధరలు అదుపు చేసి సాధారణ ప్రజలకు అందబాటులో ఉండే విధంగా చూడాలి. – బొజ్జ నరహరి, వినియోగదారుడు, నర్సాపూర్ అమ్మకాలు తగ్గాయి ఉల్లిగడ్డ ధరను తాము ఏమాత్రం నిర్ణయించ లేం. హోల్‌సేల్ మార్కెట్లోనే ఉల్లిగడ్డ ధరలు పెరిగాయి. రోజు రోజుకూ ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్, జహీరాబాద్ మార్కెట్ నుంచి తెస్తాం. అక్కడే ధరలు పెరిగాయి. ధరలు బాగా పెరగడంతో ప్రజలు తక్కువ కొనుగోలు చేస్తున్నందున అమ్మకాలు పడిపోయాయి. –సంతోష్ వ్యాపారి, నర్సాపూర్ ప్రభుత్వం ధరలు అదుపు చేయాలి ఉల్లి గడ్డ ధరలను ప్రభుత్వం అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. సాధారణ ప్రజలు వాడే స్థితిలో లేనంత ఎత్తుకు ఉల్లి ధరలు చేరాయి. ఉల్లిగడ్డ హోల్‌సేల్ వ్యాపారులు వారిష్టమున్న రీతిలో ధరను పెంచుతున్నారు. దీంతో సామాన్య ప్రజలకు ఆర్థికంగా భారమై వాడడం ఇబ్బందిగా మారింది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. –సంగసాని సురేష్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు, నర్సాపూర్ -
అందులో ఏపీ ఫస్ట్: మోపిదేవి
సాక్షి, కాకినాడ: ఉల్లి సమస్య త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందని ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనూహ్యంగా పెరిగిన ధరల భారం నుంచి సామాన్యుడిని కాపాడేందుకు తమ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. సబ్సిడీతో తక్కువ ధరకు ఉల్లిపాయలు సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. ‘ఈ నెల 14,15 తేదీల్లో టర్కీ, ఈజిప్టు నుండి కేంద్రం పెద్ద ఎత్తున ఉల్లి దిగుమతి చేసుకుంటుంది. మన రాష్ట్రానికి 22,147 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు అవసరం. మనం అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అధిక ధరలకు ఉల్లిని కొనుగోలు చేసి తక్కువ ధరలకు వినియోగదారునికి ఇస్తున్న రాష్ట్రాలలో మనదే మొదటిది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువ ధరకు ఉల్లిపాయలు అందజేస్తున్నాం. తెలంగాణలో ఉల్లి కిలో రూ.40-45కి మార్కెటింగ్ శాఖ ద్వారా విక్రయిస్తున్నారు. రోజుకు 200 మెట్రిక్ టన్నులు ఉల్లిని కొనుగోలు చేస్తున్నాం. అక్కడక్కడ కొంత మంది వ్యాపారులు ఉల్లిపాయలను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామ’ని మంత్రి వెంకటరమణ వివరించారు. -
నేను ఉల్లిగడ్డలు పెద్దగా తినను!
న్యూఢిల్లీ: సాధారణంగా ఉల్లిగడ్డలు కొస్తే కన్నీళ్లు వస్తాయి. కానీ, ఇప్పుడు ఉల్లిని కొనాలంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కన్నీళ్లు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా ఉల్లిపాయ ధర అమాంతం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఉల్లి సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే అవకాశమే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉల్లి సెగ తాజాగా పార్లమెంటును తాకింది. లోక్‌సభలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలె ఈ అంశాన్ని లేవనెత్తారు. ఉల్లిధరలపై ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ.. ఉల్లి ధరలను తగ్గించడానికి కేంద్రం తీసుకున్న చర్యలను సభకు వివరించారు. అయితే, ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. తమది ఉల్లిపాయలు ఎక్కువగా తినే కుటుంబం కాదని చెప్పుకొచ్చారు. ‘నేను ఉల్లి, వెల్లుల్లి పెద్దగా తినను. ఉల్లిపాయలను పెద్దగా ఉపయోగించని కుటుంబం నుంచి నేను వచ్చాను’ అని ఆమె వివరించారు. ఉల్లి ధరలు అమాంతం ఎందుకు పెరిగిపోయాయని సూప్రియా సూలె కేంద్రాన్ని ప్రశ్నించారు. మరోవైపు చిన్న, సన్నకారు ఉల్లి రైతులను కూడా కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
ఉల్లి లొల్లి ఎందుకంటే..!
సాక్షి సిటీబ్యూరో: ఉల్లిగడ్డ ప్రజల్ని మరోసారి కంగుతినిపిస్తోంది. బహిరంగ మార్కెట్లో రూ.100 దాటడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఉల్లిపైనే చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈసారి ఉల్లిగడ్డ ధరలు ఇంతగా ఎందుకు పెరిగాయనే దానిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేకించి కొందరు వ్యాపారులు ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ జిల్లాల నుంచి ఉల్లి దిగుమతులు ఆగిపోవడం, మహారాష్ట్ర నుంచి అనుకున్న దానికి కంటే సగం దిగుమతి తగ్గడంతో ఇక్కడి వ్యాపారులు ఉల్లి గేమ్ ఆడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత నెల సాఫీగా సాగిన ఉల్లిగడ్డ సరఫరాకు కొందరు వ్యాపారులు అడ్డంకులు సృíష్టించారని తెలుస్తోంది. మహారాష్ట్ర వ్యాపారులతో కుమ్మక్కైన ఇక్కడి వ్యాపారులు సరఫరాను తగ్గించేస్తున్నారు. తద్వారా ఉల్లిగడ్డకు కొరత సృష్టించడంతోనే ధరలు భారీ స్థాయిలో పెరిగాయని తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే నాలుగు రెట్లు గత నెల రోజుల క్రితం మార్కెట్‌కు 70–80 లారీల ఉల్లి దిగుమతి అయింది. ఈ నెల ప్రారంభం నుంచి 40–30 లారీలు మాత్రమే దిగుమతి అవుతోంది. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో 60–70 లారీల ఉల్లి దిగుమతి అయిందని మలక్‌పేట్ మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో ఉల్లి కిలో రూ.20 నుంచి 30 వరకు విక్రయించారు. ఈ ఏడాది గత ఏడాది కంటే 50 శాతం తక్కువగా ఉల్లి దిగుమతి అవుంతుంది. ధరలు ఐదు రెట్లు పెంచి విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కలిసి సిండికేట్‌గా మారి ఉల్లి ధరలు విపరీతంగా పెంచారు. ఇక్కడి వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారుల నుంచి సరుకు ముందే కొనుగోలు చేసి వాటిని నగరానికి తరలించకుండా..వారి గోదాముల్లో నిల్వచేసుకుంటున్నారని తెలిసింది. మార్కెట్‌కు కాకుండా గోదాములకు సరఫరా చేసినందుకు మహారాష్ట్ర వ్యాపారులకు కొంత మొత్తం ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. కృత్రిమ కొరత కారణంగా ధరలు పెరుగుతుండడంతో...ఆ సమయంలోనే గోదాముల్లోని సరుకును బయటకు తీస్తున్నారని తెలిసింది. తద్వారా వ్యాపారులు లక్షలు గడిస్తున్నారు. గత నెలలో నగరానికి రోజుకు 80 లారీల ఉల్లి మహారాష్ట్ర నుంచి దిగుమతి అయుంది. ప్రస్తుతం 30 నుంచి 40 లారీలు కూడా రావడం లేదని కొందరు వ్యాపారులు తెలిపారు. దీంతో వారం పది రోజుల్లోనే క్వింటాల్ రూ.2 వేల వరకు ఉన్న ధరలు రూ.10 వేలకు పెంచారు. జంట నగరాల మార్కెట్లలో ఉల్లిగడ్డ నిల్వచేయడానికి తగిన గోదాముల వసతి లేక పోవడంవల్లే ఇలాంటి అక్రమాలకు తెర తీస్తున్నట్టు తెలిసింది. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొరతను సృష్టించే అక్రమ వ్యాపారులపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. -
ఉల్లి దొంగలున్నారు జాగ్రత్త
సాక్షి ప్రతినిధి, చెన్నై: నగదు, బంగారు, వెండి వస్తువుల స్థానంలో ఉల్లిగడ్డలను బ్యాంకు లాకర్లో పెట్టేరోజులు దాపురించాయి. పెరంబలూరు జిల్లాలో ఓ రైతు 300 కిలోల ఉల్లిగడ్డలను దొంగలెత్తుకుని పోయారు బాబోయ్ అంటూ పోలీసుల వద్ద లబోదిబోమన్నాడు. ఆహారపదార్థాల్లో ఉల్లిలేనిదే అధికశాతం మందికి ముద్దదిగదు. అందునా తమిళనాడులో పెద్ద ఉల్లిగడ్డలతోపాటూ చిన్న ఉల్లిగడ్డల (సాంబార్ వెంగాయం) వినియోగం మరీ ఎక్కువ. చిన్ని ఉల్లిగడ్డలతో వండే సాంబార్...ఆ రుచే వేరు. ఉల్లిగడ్డలు లేనిదే వంటచేయడం కుదరదనే గృహిణులు కూడా ఉన్నారు. ఇక బిరియానీ వండితే పెరుగు, ఉల్లిగడ్డలతో తయారుచేసే రైతా తప్పనిసరి. ఇలా దైనందిన వంటకాల్లో ఉల్లిగడ్డల ప్రాధాన్యత అంతగా పెరిగిపోవడం వల్లనే దేశమంతా వాటి ధరలపై గగ్గోలు పెడుతోంది. రుతుపవనాల తీవ్రత ఉల్లిగడ్డల పంట దిగుబడి దేశవ్యాప్తంగా దారుణంగా పడిపోయింది. దేశంలోని ఉల్లిగడ్డల అమ్మకాలు మహారాష్ట్రలోని పంటపై దాదాపుగా ఆధారపడి ఉన్నాయి. మహారాష్ట్రలో నైరుతిరుతుపవనాలు ఉల్లిగడ్డల పంటపై తీవ్రంగా ప్రభావం చూపడంతో తమిళనాడుతోపాటూ దేశవ్యాప్తంగా గిరాకీ పెరిగిపోయింది. సహజంగా కిలో రూ.30కి అమ్ముతుండిన పెద్ద ఉల్లిగడ్డల ధర చెన్నై కోయంబేడు హోల్‌సేల్ మార్కెట్లోనే రూ.140–రూ.180 వరకు పలుకుతోంది. అలాగే చిన్న ఉల్లిగడ్డలు కిలో రూ.180–రూ.200 వరకు పెరిగింది. ఇక రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరల ఘాటు చెప్పక్కర్లేదు. జనవరి తరువాతనే ఉల్లిగడ్డల ధర ఆకాశం నుంచి భూమిమీదకు దిగుతుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. అదనంగా 25 వేల ఎకరాల్లో ఉల్లి సాగుబడి:ఇదిలా ఉండగా, ఉల్లిగడ్డల ధరను అదుపులోకి తెచ్చేందుకు రాష్ట్రంలో అదనంగా 25 వేల ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో ఉల్లిగడ్డల సాగు జరుగుతుండగా ఆదనంగా వేయాల్సిన 25వేల ఎకరాల పంట కోసం విత్తనాలు సరఫరా చేసి సాగునీటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సూచించింది. జనవరి ఆఖరునాటికి ఉల్లిగడ్డలు విరివిగా అందుబాటులోకి వస్తాయని హార్టికల్చర్‌శాఖ సంచాలకులు సుబ్బయన్ తెలిపారు. ఏడాదికి 7 లక్షల టన్నుల ఉల్లిగడ్డల డిమాండ్ ఉండగా ప్రస్తుతం 3 టన్నులు మాత్రమే సరఫరా అవుతోందని ఆయన చెప్పారు. ఈ వ్యత్యాసాన్ని అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. ఉల్లిగడ్డల బస్తాలను దొంగలెత్తుకెళ్లారు: పెరంబలూరు జిల్లా ఆలందూరుకు చెందిన ముత్తుకృష్ణన్ అనే హోల్‌సేల్ వ్యాపారి తన పొలంలో ఉల్లిగడ్డల పంట పండించేందుకు కిలో రూ.120 లెక్కన 300 చిన్న ఉల్లిగడ్డలు కొనుగోలు చేశాడు. వానలు పడుతున్నందున ఉల్లివిత్తనాలు నాటేందుకు ఇదే అనుకూలమైన సమయం అని భావించి తన పొలం సమీపంలో ఉల్లిగడ్డల బస్తాను భద్రం చేసి ప్లాస్టిక్ టార్పాలిన్ కప్పాడు. మంగళవారం విత్తనాలు నాటేందుకు వెళ్లిచూడగా టార్పాలిన్ కింద ఉన్న 300 కిలోల ఉల్లిగడ్డలు కనపడలేదు. చోరీకి గురైన తన ఉల్లిగడ్డలను వెతికిపట్టుకుని తిరిగి ఇప్పించాల్సిందిగా కోరుతూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఉల్లిగడ్డల చోరీ జరిగిందని ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారని పోలీసులు నవ్వులు చిందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. -
పొలంలోని ఉల్లి పంటనే ఎత్తుకెళ్లారు!
భోపాల్: కొండెక్కెత్తున్న ఉల్లిపాయల ధరలు మనుషులను దొంగతనాలకు పాల్పడేలా చేస్తున్నాయి. బంగారాన్ని, ఉల్లిపాయల్ని పక్క పక్కన పెడితే బంగారాన్ని వదిలేసి ఉల్లియాల్ని చోరీ చేసి ఎత్తుకెళ్లే స్థాయికి ఉల్లి ధరలు చేరుకున్నాయి. సాధారణంగా ఇంట్లో ఉన్న ఉల్లిపాయలను దొంగలించడం గురించి మనం వింటుంటాం.. కానీ ఏకంగా పొలంలో పంటల మీద ఉన్న ఉల్లిపాయల్ని ఎత్తుకెళ్లిన ఘటన మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో చోటు చేసుకుంది. తమ పంట మరికొద్ది రోజుల్లో చేతికి వస్తుందన్న ఆనందంలో ఉన్న రైతుకు.. ఉల్లి పంట ఆయన కళ్లల్లో కన్నీటినే నింపింది. వివరాల్లోకెళ్తే.. రిచా గ్రామంలోని జితేంద్ర కుమార్ అనే రైతు పొలంలో చోరీ జరిగింది. ఈ చోరీలో సుమారు రూ. 30 వేలకు పైగా విలువ చేసే ఆరు క్వింటాళ్ల ఉల్లి పంటను దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఆ రైతు నారాయణగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంట పూర్తిగా చేతికి రాకముందే ఉల్లిని ఎత్తుకెళ్లడం స్థానికంగా సంచలనం రేపింది. దొంగలను వెంటనే పట్టుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. కాగా ఉల్లి దొరకడమే బంగారం అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. దీంతో మార్కెట్లో ఉన్నవాటికే కాదు.. పంట చేలలో ఉన్న వాటిని కూడా వదలడం లేదు. జితేంద్ర కుమార్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. కిలో ఉల్లిపాయలు రూ.100కు చేరుతున్న తరుణంలోనే ఇలా జరిగింటుదన్నారు. అయితే ఉల్లి పంటను దోచుకుపోయారని రైతు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
డబ్బు కట్టలు వదిలి.. ఉల్లి ఎత్తుకెళ్లారు!
కోల్‌కతా: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి వినే ఉంటారు కదా. అంత మేలు చేసే ఉల్లి ధరలు ఇటీవల మార్కెట్లో ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ 100 నుంచి రూ.500 వరకు ఉండటంతో ఉల్లిపాయలను కొందామని మర్కెటికి వెళ్లిన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బయట డబ్బు, నగలకంటే ఉల్లిపాయలకే డిమాండ్ ఎక్కువగా ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఇందుకు ఉదాహరణగా తాజా ఘటన నిలిచింది. ఓ షాపులో దొంగతనానికి వెళ్లిన దుండగులు డబ్బుల కట్టలను అక్కడే ఉంచి, ఉల్లిపాయల సంచులను ఎత్తుకెళ్లిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. బెంగాల్‌కు చెందిన అక్షయ్ దాస్ అనే ఓ కూరగాయల వ్యాపారికి తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో షాపు ఉంది. రోజులాగే యథావిధిగా మంగళవారం షాపు తెరిచిన అక్షయ్ దాస్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. షాపులోని వస్తువులు, కూరగాయలు చెల్లాచెదుదరుగా పడి ఉండటం చూసిన దాస్ కంగారు పడుతూ లోపలికి వెళ్లి చూశాడు. షాపు అంతా చూసిన అతనికి దొంగతనం జరిగిన విషయం అర్థమైంది. ఇక మరు నిమిషం ఆలస్యం చేయకుండా షాపులోని నగదు పెట్టె వద్దకు వెళ్లి చూసుకున్నాడు. అందులోని డబ్బులు చెక్కు చెదరకుండా అలాగే ఉంటడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా షాపుంతా పరిశీలించిన తర్వాత దాస్ మళ్లీ ఉలిక్కిపడ్డాడు. షాపులోని 50వేల రూపాయల విలువ చేసే ఉల్లిపాయల బస్తాలు లేకపోవడంతో లబోదిబోమన్నాడు. పశ్చిమ బెంగాల్ మార్కెట్లో ప్రస్తుతం ఉల్లి ధర కిలో రూ.100పైగా ఉండటంతో దొంగలు డబ్బుల కంటే ఈ ఉల్లిపాయలు తీసుకేళ్లడం మేలు అనుకున్నారేమో అందుకే డబ్బు వదిలేసి ఉల్లిపాయలు ఎత్తుకెళ్లారు. -
కిలో ఉల్లి రూ.35.. హెల్మెట్లు పెట్టుకొని మరీ..
పట్నా: ఉల్లి కోస్తేనే కాదు.. కొనాలన్నా కన్నీళ్లు వస్తున్నాయి. హైదరాబాద్‌లో కిలో ఉల్లి రూ.80 నుంచి రూ.110 వరకూ పలుకుతోంది. ఇక ఉత్తర భారత్‌లో అయితే మరీ దారుణం. కిలో ఉల్లి దాదాపు రూ.100 నుంచి 500 వరకూ ఉంది. దీంతో జనాలు వంట చేసుకోవడానికి బిత్తపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజలకు కాస్త ఉపశమనం కల్పించేందుకు బీహార్ ప్రభుత్వం రూ.35కే కిలో ఉల్లి గడ్డను అందిస్తోంది. ఇందుకు గాను బీహార్ స్టేట్ కార్పొరేటివ్ మార్కెటింగ్ యూనియన్ లిమిటెడ్ ద్వారా ఉల్లిగడ్డల కౌంటర్ పెట్టారు. దీంతో జనాలు శనివారం ఉదయమే బారులు తీరారు. చాలా పొడవైన క్యూ ఏర్పడింది. ఉల్లి అయిపోతుందనే భయంతో జనాలు ఎగబడుతున్నారు. దీంతో చేసేది ఏమీ లేక అధికారులు హెల్మెట్లు పెట్టుకొని మరీ ఉల్లిగడ్డను విక్రయిస్తున్నారు. రాళ్లతో దాడి చేయడం, వాహనం మీదకు దూసుకువస్తారనే భయంతో హెల్మెట్లు పెట్టుకున్నామని అధికారులు చెబుతున్నారు. తమకు ప్రభుత్వం ఎలాంటి భద్రతను ఏర్పాటు చేయలేదని వాపోయారు. -
ఆ ఒక్కటీ అడక్కు!
సాక్షి, హైదరాబాద్: పొగలు కక్కుతున్న చికెన్ బిర్యానీ పక్కన ఉల్లిగడ్డ, నిమ్మకాయ ఉంటేనే నాలుకకు రుచి, మజా వస్తుంది. ఉల్లిగడ్డ లేని బిర్యానీని ఊహించలేం కూడా. ఆహార ప్రియులు చికెన్, మటన్ బిర్యానీ తింటున్నప్పుడే పక్కన ఉల్లిగడ్డ నంజుకోకపోతే తిన్నట్టు ఉండదు. అయితే, నెల రోజులుగా ఉల్లి ధర ఆకాశాన్నంటుతుండడంతో నోటికి ఉల్లి ముక్క దొరకడం లేదు. ప్రస్తుతం ఉల్లిగడ్డ బహిరంగ మార్కెట్లో రూ.80 నుంచి రూ.100 ఉంది. దీంతో బిర్యానీ సరఫరా చేసే హోటళ్లలో ఉల్లిగడ్డకు ‘నో’ చెప్పారు. ఉల్లిపాయ లేకుండానే బిర్యానీ సరఫరా చేస్తున్నారు. కీరాతో పాటు నిమ్మకాయ ప్లేట్లో పెట్టి బిర్యానీ పక్కన పెడుతున్నారు. ఉల్లిగడ్డ ఏదంటే.. ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటున్నారు. బిర్యానీ ధరతో సమానంగా ఉల్లి ధర పోటీ పడుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. పాతబస్తీ, కొత్తబస్తీ అనే తేడా లేకుండా అన్ని హోటళ్లలోనూ బిర్యానీకి ఉల్లిగడ్డ లేకుండానే అందిస్తున్నారు. మరోవైపు ఉల్లి ధర పెరగడంతో కర్రీ పాయింట్లలో ధరలు కూడా పెంచేశారు. మరికొన్ని చోట్ల బిర్యానీ రేట్లు కూడా పెరిగిపోయాయి. -
ఈజిప్టు నుంచి 6వేల టన్నుల ఉల్లి
న్యూఢిల్లీ: దేశీయంగా ఉన్న కొరత, పెరుగుతున్న ధరను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈజిప్టు నుంచి 6వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోనుంది. దీనిని కిలో రూ.52–60 స్థాయిలో రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. సుమారు 1.2 లక్షల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవాలని గత వారం కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ‘ఈజిప్టు నుంచి మొదటి విడతగా 6,090 టన్నుల ఉల్లి కొనుగోలు చేయాలని నిర్ణయించాం. కావాలనుకున్న రాష్ట్రాలు డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ స్టాకును తీసుకెళ్లవచ్చునన్నారు. -
కేజీ ఉల్లి @220
రేటు చూసి మైండ్ బ్లాంక్ అయిందా? అయితే ఈ ధర మన దేశంలో కాదు పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లో. మన దేశం నుంచి దిగుమతి ఆగిపోవడంతో బంగ్లాదేశ్‌లో ఉల్లిపాయల ధరలు మోత మోగిస్తున్నాయి. కేజీ ఉల్లి ఏకంగా 220 రూపాయలకు అమ్ముతున్నారు. ఉల్లిపాయలు కొనాలంటే సామాన్యులు వణికిపోతున్నారు. అనూహ్యంగా ధరలు పెరిగిపోవడంతో పలుచోట్ల వినియోగదారులు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విమానాల ద్వారా టర్కీ, ఈజిప్ట్, చైనా వంటి దేశాల నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటోంది. ప్రభుత్వం పలు చోట్ల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి రూ. 38కే అందించే ప్రయత్నం చేస్తోంది. కాగా, తన నివాసంలో ఉల్లి వాడకంపై ప్రధాని షేక్ హసినా నిషేధం విధించారు. దీంతో శనివారం ప్రధాని నివాసంలో ఉల్లిపాయలు వాడకుండా వంటలు తయారుచేశారని స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు మనదేశంలోనూ ఉల్లిపాయల ధరలు మండిపోతున్నాయి. మేలు రకం ఉల్లి కిలో 70 రూపాయల వరకు బహిరంగ మార్కెట్ అమ్ముతున్నారు. నెల రోజులుగా ధరలు ఎక్కువగా ఉన్నా పాలకులు పట్టించుకున్నట్టు కనబడటం లేదు. వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో ఉల్లిపాయలు ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మరో రెండు నెలల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశముందని వెల్లడించారు. ధరల పెరుగులతో వినియోగదారులు కూడా తక్కువగానే కొంటున్నారని, దీంతో తమ వ్యాపారాలు మందగించాయని చిన్న వ్యాపారులు వాపోతున్నారు. ఇదిలావుంచితే ఉల్లి ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో జోకులు, సెటైర్లు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈరోజు నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉల్లి ధరల గురించి ప్రతిపక్షాలు ప్రస్తావించనున్నాయి. Expensive Weekend Shopping. #onioncrisis #onionprice pic.twitter.com/GUQuo0fNuL — Rituparna Nath (@Rituparna_Nt) November 17, 2019 -
అక్రమ ఉల్లిని సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు
సాక్షి, విజయవాడ : విజయవాడలోని గొల్లపూడి మార్కెట్ యార్డ్‌లో ఉల్లిని అక్రమంగా నిల్వ చేసిన వ్యాపారస్తులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఉల్లి బస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహాత్మగాంధీ హోల్‌సేల్ కయర్షియల్ కాంప్లెక్స్‌లో అక్రమంగా ఉల్లిని నిల్వచేసిన 100వ షాపు నెంబరుకు ఎలాంటి లైసెన్సు లేకపోవడంతో అధికారులు షాపును సీజ్ చేశారు. స్టాక్‌లో ఉన్న ఉల్లిని బయటకు తీసుకొచ్చి మార్కెట్ ధరకు అమ్ముడయ్యేలా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. -
రెండు రోజుల్లో ఉల్లిధరలు అదుపులోకి..
సాక్షి, అమరావతి: విజిలెన్స్ దాడులు చేయించి ఉల్లి బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించామని మార్కెటింగ్‌శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. దీని ద్వారా ఉల్లి ధరలను అదుపులోకి తెచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉల్లి సరఫరా పరిస్థితిపై మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉల్లిపాయల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతు బజార్లలో రూ.25కే కిలో ఉల్లి సరఫరా చేయాలని సూచించారు. ఉల్లి అక్రమ రవాణాను నివారించాలని, ఉల్లిని బ్లాక్ మార్కెట్‌కు తరలించేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉల్లి ఎంత ధరకైనా కొని ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు ఇప్పటివరకు 665 మెట్రిక్ టన్నుల ఉల్లి కొనుగోలు చేశామని వెల్లడించారు. ప్రజల కోసం అధిక ధరకు ఉల్లి కొని ధరల స్థిరీకరణ నిధి ద్వారా ధరలు తగ్గించామని స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో ఉల్లి ధరలు పూర్తిగా అదుపులోకి వస్తాయన్నారు. మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని తెప్పిస్తున్నామని వెల్లడించారు. -
దిగి వచ్చిన ఉల్లి..
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఆకాశాన్నంటిన ఉల్లి ధరను అధికారులు నేల మీదకు తీసుకువచ్చారు. బహిరంగ మార్కెట్లో కిలో సుమారు రూ.70 పలుకుతున్న ఉల్లిపాయలను శనివారం రైతు బజారులో రూ.25లకే సరఫరా చేశారు. వర్షాల కారణంగా ఉత్తరా ది రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గి దిగుమతులు కొరవడడంతోపాటు.. అదను చూసుకొని బ్లాక్ మార్కెటింగ్ చేసిన వ్యాపారుల బెడద నుంచి వినియోగదారులకు ఊరట కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నాసిక్, మధ్యప్రదేశ్ నుంచి సరుకు తీసుకొచ్చి సబ్సిడీ ధరకు అందిస్తోంది. శని వారం రైతు బజారులో ఐదు టన్నుల ఉల్లిని అందుబాటులో ఉంచారు. వినియోగదారులు బారులుదీరి వీటిని కొనుగోలు చేశారు. ఆదివారం వినియోగదారుల రద్దీ దృష్ట్యా మరింత పెంచే ఆలోచనలో ఉన్నారు. ఆమదాలవలస, కోటబొమ్మాళి రైతు బజారుల్లో కూడా ఆదివారం నుంచి కౌంటర్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు అందించనున్నారు. ఒక్కసారిగా పెరిగిన ధరలు నెలన్నర క్రితం వరకు రైతు బజారులో రూ.20గా ఉన్న ఉల్లి ధర ఈమధ్య కాలంలో రూ.35 నుంచి రూ.50వరకు చేరింది. బహిరంగ మార్కెట్లో విపరీతంగా పెరిగింది. పొట్టి శ్రీరాములు మార్కెట్లో అయితే ఏకంగా నాణ్యత పేరుతో రూ.70కి పెంచేశారు. హోటళ్లల్లో ఉల్లిదోశ ధరను రూ.5 పెంచేశారు. ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఉల్లి కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దిగుబడి తగ్గడం తోపాటు కృత్రిమ కొరత సృష్టించడంతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి ప్రత్యామ్నాయ చర్య లకు ఉపక్రమించింది. శనివారం రైతు బజారులో ఉల్లిపాయలకు మూడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒక కౌంటర్ మహిళలకు, రెండు కౌంటర్లు పురుషులకు ఏర్పాటు చేసి ఆధార్ కార్డు ఆధారంగా కిలో రూ.25 వంతున ఒక కిలో అందిస్తున్నారు. అవసరాన్ని బట్టి కౌంటర్లను సైతం పెంచి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు జాయింట్ కలెక్టర్, మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. నాణ్యత బాగుంది రైతు బజారులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నాణ్యమైన ఉల్లిపాయలు తక్కువ ధరకు అందించడం చాలా బాగుంది. డబ్బులిచ్చి కొందామన్నా మంచి ఉల్లి దొరికేది కాదు. అందరికీ ఓ పద్ధతి ప్రకారం అందిస్తున్నారు. –బి.పద్మావతి, డే అండ్ నైట్ కూడలి, శ్రీకాకుళం ఉల్లితోపాటు కూరగాయలు కొంటున్నాం రైతుబజారులో తక్కువ ధరకు ఉల్లిపాయలు అందిస్తున్నారు. దీంతోపాటు కూరగాయలు తక్కువ ధరకే దొరకడంతో సంచి నింపుకుని వెళ్లున్నాం. ధరలు అదుపులోకి వచ్చేంతవరకు ఉల్లి కౌంటర్లు ఉంచితే బాగుంటుంది. –ఎస్.నర్సింగమూర్తి, ఫ్రెండ్స్‌కాలనీ, శ్రీకాకుళం -
రూ. 25కే కిలో ఉల్లిపాయలు
సాక్షి, ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఉల్లిగడ్డల అవసరాలు తీర్చేందుకు జిల్లాకు 5 టన్నులు కేటాయించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న రైతు బజార్ల ద్వారా వాటిని ప్రజలకు విక్రయించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. ప్రభుత్వమే తక్కువ ధరకు ప్రజలకు విక్రయించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. రోజు రోజుకూ పెరుగుతున్న ఉల్లిగడ్డల ధరలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధరకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే మొదటి విడతగా జిల్లాలోని నాలుగు రైతు బజార్ల ద్వారా విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. అందుకోసం జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏడీ కె.వి.ఎన్.ఉపేంద్ర కుమార్ రైతు బజార్ల సిబ్బందిని ఇప్పటికే సన్నద్ధం చేశారు. కర్నూలు జిల్లా నుంచి ఒంగోలు నగరానికి గురువారం అర్ధరాత్రికి లారీల ద్వారా ఉల్లిగడ్డలు చేరుకోనున్నాయి. అందుకోసం ఒంగోలు నగరంలోని మూడు రైతు బజార్లలో శుక్రవారం నుంచి ఉల్లిగడ్డలు విక్రయించే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. కందుకూరు రైతు బజారుకు శుక్రవారం నేరుగా కర్నూలు జిల్లా నుంచి ఉల్లిగడ్డలు లారీల ద్వారా చేరుకోనున్నాయి. ఒంగోలులో నగరంలో లాయరు పేట సాయిబాబా గుడి పక్కన, ఆర్టీసీ బస్టాండ్ ఎదురు దిబ్బల రోడ్డులో, కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని రైతు బజార్ల నుంచి ఉల్లిగడ్డలు విక్రయిస్తారు. ఒక్కో కుటుంబానికి ఒక కిలో చొప్పున మొదట అందజేస్తారు. కిలో ఉల్లిగడ్డలు రూ. 25 చొప్పున విక్రయిస్తామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏడీ కె.వి.ఎన్.ఉపేంద్ర కుమార్ తెలిపారు. ఉల్లిగడ్డల కోసం వచ్చే వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డులు తీసుకొని రైతు బజార్లకు రావాలని ఆయన సూచించారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ఉల్లిగడ్డలు తెప్పించేందుకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అక్కడ భారీ వర్షాలు పడుతుండటంతో రోడ్డు రవాణాకు పూర్తిగా ఆటంకం ఏర్పడటంతో తొలుత కర్నూలు జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. -
వ్యాపారుల ఉల్లికిపాటు
ఏలూరు టౌన్: ఏలూరులోని ఉల్లి హోల్‌సేల్ దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సిబ్బందితో కలిసి సంయుక్తంగా దాడులు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎస్.వరదరాజు ఆదేశాలతో విజిలెన్స్ డీఎస్పీ కేవీ రమణ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. ఏలూరులోని శ్రీ సూర్యట్రేడర్స్, కేఆర్ ఆనియన్స్,శ్రీ భార్గవి ఆనియన్స్ హోల్‌సేల్ దుకాణల్లో అవినీతి జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. భారీ ఎత్తున ఉల్లిని దిగుమతి చేసి విక్రయాలు చేస్తూ లెక్కల్లో తక్కువగా చూపిస్తూ ప్రభుత్వానికి రూ.లక్షల్లో మార్కెట్ సెస్ ఎగ్గొడుతున్నట్టు అధికారులు గుర్తించారు. దుకాణాల గిడ్డంగుల్లో టన్నుల్లో ఉల్లిని నిల్వ చేసిన యజమానులు వాటికి సరైన రికార్డులు చూపించలేకపోయారు. అవకతవకలు ఇలా.. సూర్య ట్రేడర్స్ యజమాని రవికుమార్ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచీ ఇప్పటి వరకూ సుమారు 80 టన్నుల ఉల్లిని కొన్నారు. మొత్తం ఉల్లిని విక్రయించేసి రికార్డుల్లో మాత్రం 48 టన్నులు మాత్రమే నమోదు చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మార్కెట్ సెస్‌ను ఎగ్గొట్టారు. గత మూడేళ్ళుగా ఏలూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చెల్లించాల్సిన అసెస్మెంట్ కూడా సమర్పించలేదని అధికారులు గుర్తించారు. అలాగే కేఆర్ ఆనియన్స్ దుకాణంలో ఏప్రిల్ 11,464 టన్నుల సరకు విక్రయించినట్టు తేలింది. కానీ మార్కెట్ సెస్‌ను చెల్లించలేదు. సుమారు రూ.4లక్షల మేర సెస్ చెల్లించాలని అధికారుల అంచనా. దుకాణంలో మరో 20 టన్నుల ఉల్లి సరుకు నిల్వ ఉంచారు. వీటికి సరైన పత్రాలు లేవు. ఈ షాపులో రెండు ఎలక్ట్రానిక్ కాటాల లైసెన్స్ రెన్యూవల్ చేయకపోవటంతో తూనికలు, కొలతల శాఖ అధికారులు రెండు కేసులు నమోదు చేశారు. శ్రీ భార్గవి ఆనియన్స్ దుకాణాన్ని అసలు రికార్డులు లేకుండానే నిర్వహిస్తున్నారు. 21 టన్నుల ఉల్లిపాయలు ఉండడంతో విక్రయాలు నిలుపుదల చేసేలా ఏఎంసీ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ మూడు దుకాణాల్లో సుమారు రూ.25 లక్షల విలువైన ఉల్లిపాయలు నిల్వ చేయటం, విక్రయించటం జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దాడుల్లో విజిలెన్స్ సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఏవో ఎం.శ్రీనివాసకుమార్, తహసీల్థార్ పీ.రవికుమార్, ఎస్ఐ కే.ఏసుబాబు, ఏఎంసీ సూపర్వైజర్ ఉన్నారు. -
ఆధార్ కార్డు చూపిస్తే .. ఉల్లి గడ్డ
సాక్షి, మచిలీపట్నం : కేవలం నెలరోజుల వ్యవధిలో మూడింతలు పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పెనుభారంగా మారిని ఉల్లిపాయలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నేటి నుంచి రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉల్లి విక్రయాలకు శ్రీకారం చుట్టింది. ఉల్లి ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. కొయ్యకుండానే కన్నీళ్లు తెప్పిస్తు న్నాయి. నెలరోజుల కింద రైతుబజార్లలో కిలోరూ.16 నుంచి రూ.20లు పలికిన ఉల్లి ప్రస్తుతం జిల్లాలో కిలో రూ.55లు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో రూ.60లు కూడా డిమాండ్ చేస్తున్నారు. రైతు బజార్లలో ప్రస్తుతం కిలో ఉల్లి రూ.48లకు చేరింది.జిల్లాలో ప్రతిరోజు సగటున 70 టన్నులకు పైగా వినియోగం ఉంటుందని అంచనా.మన జిల్లా వాసులు ఎక్కువగా మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంత ఉల్లిపాయలనే వినియోగిస్తుంటారు. ఆ తర్వాత ఎక్కువగా షోలాపూర్, కర్నూల్ నుంచి వచ్చే ఉల్లిని వినియోగిస్తుంటారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో అధిక వర్షాలు కురవడంతో అక్కడ పంటలు పూర్తిగా దెబ్బతినడంతో జిల్లాకు సరుకు దిగుమతి గణనీయంగా తగ్గిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో సైతం వర్షాభావ పరిస్థితుల వల్ల ఉల్లి ఉత్పత్తి తగ్గింది. కర్నూల్ మార్కెట్లో క్వింటా గరిష్టంగా రూ.4200లు పలుకుతోంది. హైదరాబాద్, మహారాష్ట్రాలోనూ రూ.4వేలకు పైగా ఉంది. దిగుబడి తగ్గిపోవడంతో ఉన్న కొద్దిపాటి సరుకును డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు పెంచుకుంటూ పోతున్నారు. ఉల్లి ధరలు రోజురోజుకు పెరుగు తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణా చర్యలు చేపట్టింది. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై దాడులు నిర్వహిస్తూనే..మరొక వైపు నుంచి డిమాండ్ తగ్గ ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది.ప్రభుత్వాదేశాల మేరకు రైతు బజార్లలో ఉల్లి కౌంటర్లను ఏర్పాటు చేయాలని జిల్లా యం త్రాంగం నిర్ణయించింది.ప్రస్తుతానికి కర్నూల్ నుంచి ఉల్లిపాయలు దిగుమతి చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కనీసం పదిరోజులకు సరిపడా లోడును రప్పించాలని నిర్ణయించింది.అప్పటికి దిగిరాకపోతే కర్నాటక నుంచి కూడా రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. కనీసం 10–15 టన్నుల ఉల్లి లోడులను కర్నూల్ నుంచి రప్పిస్తున్నారు. వీటిని రైతుబజార్లలో డ్వాక్రా సంఘాల ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. కిలో రూ.25ల కే విక్రయించనున్నారు. అయితే ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డులలో ఏదో ఒకటి చూపిస్తే కుటుంబానికి రోజుకు కిలో చొప్పున విక్రయిస్తారు. రైతు బజార్లలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల వద్ద అవసరమైన మేరకు ప్రత్యేక పోలీస్ బందో బస్తు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు జిల్లా వ్యాప్తంగా కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ఉల్లి వ్యాపారులపై ఎక్కడైనా నిల్వ చేసారేమో గుర్తించేందుకు విస్తృత తనిఖీలు నిర్వహించాలని నిర్ణయిం చారు. ఉల్లిధర అదుపులోకి వచ్చే వరకు రైతు బజార్లలో ఉల్లికౌంటర్లు కొనసాగుతాయని మార్కెటింగ్ శాఖ ఏడీ మురళీకృష్ణ సాక్షికి తెలిపారు. -
రొమ్ము కేన్సర్‌కు ఉల్లి, వెల్లుల్లి మంత్రం
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. మిగిలిన విషయాల మాటెలా ఉన్నా రొమ్ము కేన్సర్ విషయంలో మాత్రం ఇది అక్షరాల వాస్తవమని, ఈ ప్రాణాంతక వ్యాధి రాకుండా ఉండేందుకు ఉల్లితో పాటు వెల్లుల్లి కూడా ఎంతో మేలు చేస్తుందంటున్నారు బఫెలో, ప్యూర్టరికో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ప్యూర్టరికోలోని కొంతమందిని నిశితంగా పరిశీలించిన తర్వాత తాము ఈ అంచనాకొచ్చామని అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త గౌరీ దేశాయి తెలిపారు. ఉల్లి, వెల్లుల్లితో ప్యూర్టరీకన్లు చేసే సోఫ్రిటో అనే వంటకం అసలే తినని వారితో పోలిస్తే ఒకటి కంటే ఎక్కువ సార్లు తినే మహిళలకు రొమ్ము కేన్సర్ వచ్చే ప్రమాదం 67 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. కేన్సర్ నుంచి రక్షణకు ఈ రెండు పదార్థాలు ఉపయోగపడతాయన్న గత అధ్యయనాల ఆధారంగా తాము ఈ పరిశోధన చేశామని చెప్పారు. యూరప్, అమెరికాల కంటే ప్యూర్టరికోలో ఉల్లి, వెల్లుల్లి వాడకం ఎక్కువని, ఈ కారణంగా ఇక్కడ రొమ్ము కేన్సర్ కేసులు కూడా తక్కువగా ఉన్నాయని వివరించారు. ఉల్లి, వెల్లుల్లిలో ఉండే ఫ్లేవనాల్స్, ఆర్గానోసల్ఫర్ పదార్థాలు కేన్సర్ నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు భావిస్తున్నామని చెప్పారు. రోమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న 314 మందితో పాటు లేని 346 మందిపై 2008– 2014 మధ్యకాలంలో ఈ అధ్యయనం జరిపినట్లు తెలిపారు. -
కోయకుండానే.. కన్నీళ్లు
సాక్షి, ఆదిలాబాద్: కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్నాయి ఉల్లిగడ్డలు.. కొద్ది రోజులుగా వాటి ధరలు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తు తం మార్కెట్లో కిలో ఉల్లిగడ్డల ధర రూ.50 నుంచి రూ.60 వర కు పలుకుతోంది. దీంతో సా మాన్య ప్రజలు నిత్య వినియోగంలో ఉల్లిగడ్డలను తగ్గించారు. గతంలో కిలో ధర రూ.15 నుంచి రూ.20 ఉన్న ఉల్లిగడ్డల డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉల్లిగడ్డల సరఫరా తగ్గిపోయి ధరలు మండిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో వీటి ధర మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదని వ్యాపారులు అభిప్రాయ పడుతున్నారు. సామాన్యులకు చుక్కలు ఉల్లికి ప్రధానమైన మార్కెట్లు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు. ఆదిలాబాద్ జిల్లాకు ఆ ప్రాంతాల నుంచే ఉల్లిగడ్డలు దిగుమతి అవుతాయి. కర్నాటకతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పూణె, చంద్రపూర్, బెంగుళూరు, లాసల్గావ్ వంటి తదితర ప్రధాన ప్రాంతాల నుంచి తీసుకువచ్చి వ్యాపారులు ఇక్కడ విక్రయాలు జరుపుతుంటారు. నెలరోజుల క్రితం ఉల్లి కిలో ధర రూ.20 ఉండగా ప్రస్తుతం రెండింతలు దాటిపోయింది. రైతుబజార్లో, కూరగాయల మార్కెట్లో తెల్ల ఉల్లిగడ్డలు రూ.60కిలో విక్రయిస్తుండగా, ఎరుపు రంగు ఉల్లిగడ్డలు రూ.40 నుంచి రూ.50 వరకు అమ్మకాలు జరుపుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాలతో.. మహారాష్ట్రలో రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పంటలు బాగా దెబ్బతిన్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ ఉల్లికి పెట్టిందిపేరు. అక్కడినుంచి దేశంలోని నలుమూలలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఉల్లిగడ్డలు సరఫరా అవుతాయి. మహారాష్ట్రలోని వర్షాలను సాకుగా చూపి కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి రెండు నుంచి మూడింతలు ధరను అధికంగా పలుకుతూ వినియోగదారుల నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఉల్లి ధర పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏమిటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాలేవీ.. ప్రతియేడాది ఉల్లి ధర అమాంతం పెరుగుతూనే ఉంటుంది. ఆ సమయంలో మార్కెట్ అధికారులు, జిల్లా పౌరసరఫరాల అధికారులు రైతుబజార్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తుంటారు. గతంలో రేషన్ షాపుల ద్వారా కూడా తక్కువ ధరకు ఒక్కొక్కరికి 2కిలోల చొప్పున అందించారు. అయితే ఈసారి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖాధికారులు స్పందించి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి సామాన్య, పేద ప్రజలకు తక్కువ ధరకు ఉల్లిగడ్డలు అందించాలని వినియోగదారులు కోరుతున్నారు. ప్రోత్సాహం కరువు ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువశాతం మంది రైతులు పత్తి, సోయా, ఆతర్వాత కందిపంటనే సాగు చేస్తున్నారు. ఉద్యానవన శాఖాధికారులు ఉల్లి సాగు గురించి రైతులకు అవగాహన కల్పించకపోవడం, రాయితీపై విత్తనాలు అందించకపోవడంతోనే రైతులు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. గతంలో జిల్లాలో ఉల్లి సాగు చేసేవారని, ప్రస్తుతం కనీసం వంద ఎకరాల్లో కూడా చేపట్టడం లేదని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. రైతులు వాణిజ్య పంటలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తే వినియోగదారులకు మేలు జరగడంతో పాటు రైతులు ఆర్థికంగా లబ్ధిపొందుతారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
‘అక్షయ పాత్ర’లో అల్లం వెల్లుల్లి గొడవ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్) ఆధ్వర్యంలోని అనుబంధ సంస్థ ‘అక్షయ పాత్ర’ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనంపై మరోసారి వివాదం రాజుకుంది. గతంలో ఒడిశా రాష్ట్రంలో తలెత్తిన వివాదానికి ప్రధాన మీడియా ప్రాధాన్యత ఇవ్వగా, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో రాజుకున్న వివాదానికి ట్విట్టర్ వేదికగా మారింది. మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తోన్న కూరలు మసాలా దినుసుల వాసనలు లేకుండా చప్పగా ఉంటున్నాయని, విద్యార్థులు వాటిని తినలేక బోరుమంటున్నారంటూ ముందుగా స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దానిపై ట్విటర్లో వాదోపవాదాలు రాజుకున్నాయి. అక్షయపాత్ర వంటకాలు అలా ఉండడానికి కారణం వారు వంటల్లో అల్లం–వెల్లుల్లి, ఉల్లిపాయలు ఉపయోగించకపోవడం. వాటిని ఉపయోగించడానికి వారు విరుద్ధం. ఎందుకంటే అది వారి తాత్విక చింతనకు వ్యతిరేకం. వాటిని తినడం వల్ల మనుషుల్లో కామ, క్రోదాలు ప్రకోపిస్తాయనడానికన్నా ఆధ్యాత్మిక చింతన తగ్గుతుందన్నది ఆ సంస్థ వాదన. మరి వారు పూజిస్తోన్న శ్రీకృష్ణుడు ఇవేమీ తినకుండానే వెయ్యి మంది గోపికలతో శృంగార లీలలు ఎలా నెరపారబ్బ!... ట్విటర్లో ఓ గడుగ్గాయి కొంటె ప్రశ్న. దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డును తప్పకుండా సరఫరా చేయాలంటూ భారత జాతీయ పోషకాల ప్రమాణాల సంస్థ ఆదేశాలను కూడా ఇస్కాన్ సంస్థ అమలు చేయడం లేదు. తాము శాకాహారానికి నిబద్ధులమని, కోడిగుడ్డు మాంసాహారం కనుక తాము సరఫరా చేయమన్నది వారి వాదన. అవసరమైతే తాము ఈ పథకం నుంచి తప్పుకుంటాంగానీ సరఫరా చేయమని వారు మొండికేశారు. ఒడిశాలో సామరస్య పరిష్కారం ఒడిశాలో కూడా అక్షయ పాత్ర ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థే అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా చెప్పిన గుడ్డును సరఫరా చేయడానికి సంస్థ నిరాకరించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం వారానికి మూడు సార్లు గుడ్లను ఉడకబెట్టి విద్యార్థులకు వడ్డించే బాధ్యతను పాఠశాలల హెడ్మాస్టర్లకు అప్పగించింది, ఆ మేరకయ్యే ఖర్చును ఇస్కాన్ సంస్థ నుంచే రాబట్టుకోవాలని సూచించింది. అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ విషయంలో మాత్రం ఆ ప్రభుత్వం కూడా ఏం చేయలేక వదిలేసింది. కర్ణాటకలోను ఉత్తర్వులు జాతీయ పోషక ప్రమాణాల సంస్థ సిఫార్సు మేరకు కూరల్లో అల్లం వెల్లులి, ఉల్లిపాయలను తప్పనిసరిగా వినియోగించాలంటూ 2018, నవంబర్ నెలలో కర్ణాటక రాష్ట్ర విద్యా శాఖ అధికారికంగా ఇస్కాన్ సంస్థకు ఉత్తర్వులు జారీ చేసింది. దానికి బదులు తాము ఈ పథకం నుంచి తప్పుకుంటామని బెదిరించడమే కాకుండా తమ వంటకాల్లో విద్యార్థులకు అవసరమైన పోషకాలు ఉంటున్నాయని వాదించింది. ఈ విషయంలో ‘ఆహారం ప్రాథమిక హక్కు’ కార్యకర్తలు జాతీయ పోషక ప్రమాణాల సంస్థకు కేసును నివేదించగా వారు కూడా పోషకాలు ఉన్నాయంటూ సమర్థించారు. విద్యార్థులకు సరఫరా చేస్తోన్న ఆహారం ఎంత?, అందులో వారు వృధా చేస్తున్నది ఎంత? ఎలా మీరు శాంపిల్‌ను తనిఖీ చేశారంటూ ఎన్జీవోలు సంధించిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం రాలేదు. అక్షయ పాత్ర భోజనం ఉచితం కాదు ఇస్కాన్ సంస్థ వెబ్సైట్లో ఉన్న వివరాలు ప్రకారం ఈ సంస్థ దేశంలోని 12 రాష్ట్రాల్లోని 15,024 ప్రభుత్వం, ప్రభుత్వ ఆర్థిక సహాయ పాఠశాలల్లో 17 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తోంది. ‘ఉచితంగా భోజనం సరఫరా చేస్తుంటే ఇది కావాలి, అది కావాలంటూ డిమాండ్ పెడతారా?’ అంటూ కొందరు అమాయకంగా ట్వీట్లు పెట్టారు. ఎంతమాత్రం ఈ సంస్థ ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. ప్రభుత్వం ప్రతి విద్యార్థి భోజనానికి ఐదున్నర రూపాయల చొప్పున చెల్లించడంతోపాటు భారత ఆహార సంస్థ నుంచి ఆహార ధాన్యాలను ఉచితంగా సరఫరా చేస్తోంది. ఈ పథకం కింద ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. అన్ని రాష్ట్రాల్లో కలిపి దేశవ్యాప్తంగా 11.6 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లోని 9.40 కోట్ల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి. అయినా చాలడం లేదంటున్న ఇస్కాన్ అక్షయ పాత్ర కింద తాము ఖర్చు పెడుతున్న మొత్తంలో 60 శాతం మాత్రమే ప్రభుత్వం నుంచి వస్తోందని, 12 రాష్ట్రాల్లో 43 వంటశాలలను సొంత ఖర్చుతో నిర్మించామని, 5,500 మంది ఉద్యోగులకు తామే జీతాలు చెల్లిస్తున్నామని అక్షయ పాత్ర పర్యవేక్షకుల్లో ఒకరైన మోహన్‌దాస్ పాయ్ వివరించారు. ఇతర ఎన్జీవో సంస్థలకన్నా ఉన్నంతలో శుభ్రంగా విద్యార్థులకు భోజనాన్ని అందిస్తోందన్న కారణంగా అక్షయ పాత్ర సేవలను వదులు కోవడానికి పలు రాష్ట్రాలు సిద్ధంగా లేవు. అసలు ఈ పథకం ఎలా పుట్టింది? 1920లో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నప్పుడే మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ నిమ్న వర్గాల విద్యార్థుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశ స్వాతంత్య్రానంతరం తమిళనాడు ముఖ్యమంత్రులుగా ఉన్న కే. కామరాజ్, ఎంజీ రామచంద్రన్ అన్ని వర్గాల విద్యార్థులకు దీన్ని విస్తరించి పథకాన్ని మెరగుపర్చారు. 1995లో ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం చొరవ తీసుకుంది. పిల్లలను బడికి ఆకర్షించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని భావించింది. 2001లో సుప్రీం కోర్టు ‘ఆహారం ప్రాథమిక హక్కు’కు సంబంధించిన ఓ కేసులో అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో ఈ పథకాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
సజ్జలతో వంటలు
సజ్జ ఉల్లిపాయ ముత్తియాస్ కావలసినవి: సజ్జ పిండి – ఒక కప్పు, సన్నటి ఉల్లి తరుగు – అర కప్పు, పసుపు – పావు టీ స్పూను, మిరప కారం – ఒక టీ స్పూను, ధనియాల పొడి – ఒక టీ స్పూను, జీలకర్ర పొడి – ఒక టీ స్పూను, అల్లం + వెల్లుల్లి + పచ్చి మిర్చి ముద్ద – అర టీ స్పూను, పంచదార – పావు టీ స్పూను, బేకింగ్ సోడా – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – తగినంత, ఆవాలు – అర టీ స్పూను, జీలకర్ర – అర టీ స్పూను, కరివేపాకు – నాలుగు రెమ్మలు, ఇంగువ – పావు టీ స్పూను, కొత్తిమీర – అలంకరించడానికి తగినంత, క్యారట్ తురుము – అలంకరించడానికి తగినంత తయారీ: ఒక పాత్రలో సజ్జ పిండి, ఉల్లి తరుగు, పసుపు, మిరప కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి ముద్ద, పంచదార, బేకింగ్ సోడా, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. నీళ్లు పోసి పిండిని ముద్దగా కలపాలి. చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి. ఒక్కో ఉండను పొడవుగా సన్నగా ఒత్తాలి. స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె పోసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. కరివేపాకు జత చేసి మరోమారు కలపాలి. తయారుచేసి ఉంచుకున్న రోల్స్‌ను వేసి జాగ్రత్తగా కలపాలి. అర కప్పు నీళ్లు జత చేసి, కొద్దిగా కలిపి, సన్నటి మంట మీద సుమారు పది నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యలో ఒకసారి నెమ్మదిగా కలపాలి. బాగా ఉడికాయా లేదా అని టూత్ పిక్‌తో గుచ్చి పరిశీలించాలి. ఉడికిన వెంటనే దింపేసి కొత్తిమీర, క్యారట్ తురుములతో అలంకరించి, వేడివేడిగా అందించాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? సజ్జలు (Pearl Millet) నియాసిన్ (Niacin)mg (B3) 2.3 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.25 థయామిన్ (Thiamine) mg (B1) 0.33 కెరోటిన్ Carotene)ug 132 ఐరన్ (Iron)mg 8.0 కాల్షియం (Calcium)g 0.05 ఫాస్పరస్ (Phosphorous)g 0.35 ప్రొటీన్ (Protein)g 11.6 ఖనిజాలు (Minerals) g 2.3 పిండిపదార్థం (Carbo Hydrate) g 67.1 పీచు పదార్థం(Fiber) g 1.2 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 55.91 సజ్జ పకోడీ కావలసినవి: సజ్జ పిండి – అర కప్పు, సెనగ పిండి లేదా గోధుమ పిండి – అర కప్పు, ఉల్లి తరుగు – పావు కప్పు, క్యారట్ తురుము – పావు కప్పు, పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంత, మిరప కారం – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ఒక పాత్రలో సజ్జ పిండి, సెనగ పిండి లేదా గోధుమ పిండి, ఉల్లి తరుగు, క్యారట్ తురుము, పచ్చి మిర్చి తరుగు, మిరప కారం, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి పకోడీల పిండి మాదిరిగా కలిపి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, కలిపి ఉంచుకున్న పిండిని పకోడీలుగా వేయాలి. బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. సజ్జ పకోడీలను టొమాటో సాస్, చిల్లీ సాస్‌లతో తింటే రుచిగా ఉంటుంది. సజ్జ పెసరట్టు కావలసినవి: సజ్జలు – ఒక కప్పు, పెసలు – ఒక కప్పు, బియ్యం – గుప్పెడు, జీలకర్ర – అర టీ స్పూను, ఇంగువ – పావు టీ స్పూను, తరిగిన పచ్చి మిర్చి – 4, అల్లం తురుము – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె లేదా నెయ్యి – అట్లు కాల్చడానికి తగినంత తయారీ: ఒక పాత్రలో సజ్జలు, పెసలు, బియ్యం వేసి శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటలపాటు నానబెట్టి, ఒంపేయాలి. గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉప్పు, జీలకర్ర, ఇంగువ జత చేసి, మూత పెట్టి, గంటసేపు నాననివ్వాలి. స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేయాలి. గరిటెడు పిండి తీసుకుని, పెనం మీద సమానంగా పరచాలి. రెండు వైపులా నెయ్యి వేసి దోరగా కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీలతో తింటే రుచిగా ఉంటాయి. సజ్జ హల్వా కావలసినవి: సజ్జ పిండి – ఒక కప్పు,బెల్లం పొడి లేదా పటిక బెల్లం పొడి – ఒక కప్పునెయ్యి – 2 టేబుల్ స్పూన్లుఏలకుల పొడి – అర టీ స్పూనుజీడి పప్పులు – తగినన్నికిస్మిస్ – తగినన్ని తయారీ: స్టౌ మీద బాణలిలో ఒక టీ స్పూను నెయ్యి వేసి కరిగాక సజ్జ పిండి వేసి దోరగా వేయించాలి. మూడు కప్పుల నీళ్లలో పటిక బెల్లం పొడి వేసి కరిగించి, వేయించుకుంటున్న పిండిలో పోసి కలుపుతుండాలి (బెల్లం పొడి వాడుతుంటే, మందపాటి పాత్రలో కొద్దిగా నీళ్లు, బెల్లం పొడి వేసి లేత పాకం పట్టాలి. ఆ పాకాన్ని వేయించుకుంటున్న పిండిలో వేసి కలియబెట్టాలి). బాగా ఉడుకుతుండగా ఏలకుల పొడి జత చేయాలి. కమ్మని వాసన వచ్చి హల్వాలా తయారయ్యేవరకు కలిపి దింపేయాలి. ఒక పెద్ద ప్లేట్‌కి నెయ్యి పూసి, ఆ ప్లేట్లో హల్వా పోసి సమానంగా సర్దాలి. చిన్న బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీడిపప్పులు, కిస్మిస్ వేసి వేయించి తీసేయాలి. తయారుచేసుకున్న హల్వా మీద అలంకరించి వేడివేడిగా అందించాలి. సజ్జ తెప్లా కావలసినవి: సజ్జ పిండి – ఒకటిన్నర కప్పులు, గోధుమ పిండి – అర కప్పునూనె – 2 టేబుల్ స్పూన్లు, మెంతి పొడి – చిటికెడు,పచ్చి మిర్చి + అల్లం + వెల్లుల్లి + ఉప్పు కలిపిన ముద్ద – 2 టీ స్పూన్లుకొత్తిమీర – 2 టీ స్పూన్లు, పంచదార పొడి – ఒక టీ స్పూనుపెరుగు – పిండి కలపడానికి తగినంత, ఉప్పు – తగినంత తయారీ: ఒక పెద్ద గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. నీళ్లు మరుగుతుండగా ఉప్పు వేసి కలిపి దింపేయాలి. ఒక పాత్రలో గోధుమ పిండి, సజ్జ పిండి, మెంతి పొడి, పంచదార పొడి, పచ్చిమిర్చి మిశ్రమం ముద్ద జత చేసి కలపాలి. వేడి నీళ్లు జత చేస్తూ పిండిని కలపాలి. పెరుగు జత చేస్తూ చపాతీ పిండిలా గట్టిగా కలపాలి. పరాఠాల మాదిరిగా ఒత్తాలి. స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాగాక, ఒత్తుకున్న తెప్లాలను (పరాఠా మాదిరిగా) రెండు వైపులా దోరగా కాల్చి తీసేయాలి. కొత్తిమీరతో అలంకరించి చట్నీతో అందించాలి. -
సామల వంటలు
సామల టొమాటో పులావ్ కావలసినవి: సామలు – ఒక కప్పు, నెయ్యి/నూనె – 2 టీ స్పూన్లు ఉల్లి తరుగు – పావు కప్పుతరిగిన పచ్చి మిర్చి – రెండు క్యారట్ తరుగు – ఒక టేబుల్ స్పూను, కరివేపాకు – 2 రెమ్మలుఅల్లం తురుము – ఒక టీ స్పూనుఆవాలు – ఒక టీ స్పూను, పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూనుమినప్పప్పు – ఒక టీ స్పూనుటొమాటో తరుగు – పావు కప్పు, పసుపు – పావు టీ స్పూనుమిరప కారం – పావు టీ స్పూను, కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను, నీళ్లు, ఉప్పు – తగినంత, ఉడికించిన బఠాణీ – ఒక కప్పు తయారీ: సామలకు తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడిగి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి. స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి/నూనె వేసి కాగాక ఆవాలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఉల్లి తరుగు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉడికించిన బఠాణీలు, క్యారట్ తరుగు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. టొమాటో తరుగు, పసుపు, మిరప కారం వేసి మరోమారు కలపాలి. తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి. సామలలో నీళ్లు ఒంపేయాలి. మరుగుతున్న నీటిలో సామలు వేసి కలియబెట్టి మూత పెట్టేయాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి. కొత్తిమీరతో అలంకరించి, కొబ్బరి చట్నీతో గాని, కొత్తిమీర చట్నీతో గాని వడ్డించాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? సామలు (Littile Millet) నియాసిన్ (Niacin)mg (B3) 1.5 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.07 థయామిన్ (Thiamine) mg (B1) 0.30 కెరోటిన్(Carotene)ug 0 ఐరన్ (Iron)mg 2.8 కాల్షియం (Calcium)g 0.02 ఫాస్పరస్ (Phosphorous)g 0.28 ప్రొటీన్ (Protein)g 7.7 ఖనిజాలు (Minerals) g 1.5 పిండిపదార్థం (Carbo Hydrate) g 65.5 పీచు పదార్థం (Fiber) g 9.8 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 6.68 సామలు పుట్ట గొడుగుల బిర్యానీ కావలసినవి: సామలు – ఒక కప్పు, నెయ్యి – 2 టీ స్పూన్లు తరిగిన పుట్ట గొడుగులు – 100 గ్రా., ఉల్లి తరుగు – పావు కప్పుటొమాటో తరుగు – పావు కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను పసుపు – అర టీ స్పూను, మిరప కారం – ఒక టీ స్పూనుగరం మసాలా – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంతనీళ్లు – 2 కప్పులు (చిరు ధాన్యాలకి) + పావు కప్పు (పుట్టగొడుగుల మసాలాకి)కొత్తిమీర – ఒక కప్పు, పుదీనా – అర కప్పుతరిగిన పచ్చి మిర్చి – 1, ఏలకులు – 1, లవంగాలు – 4, బిర్యానీ ఆకు – 1దాల్చిన చెక్క – చిన్న ముక్క, జాపత్రి – చిన్న ముక్క సోంపు గింజలు – ఒక టీ స్పూనుజీలకర్ర – ఒక టీ స్పూను కరివేపాకు – 2 రెమ్మలు తయారీ: స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక సామలను వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి. బిర్యానీ ఆకు వేసి వేయించాక, లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకులు, జాపత్రి ముక్క, సోంపు గింజలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, టొమాటో తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు వేసి వేగనివ్వాలి. బాగా వేగిన తరవాత తరిగి ఉంచుకున్న పుట్టగొడుగులు, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. సామలు జతచేయాలి. కొద్దిగా నీళ్లు, కొంచెం కరివేపాకు, పుదీనా ఆకులు వేసి మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చాక దింపేసి, మూత తీశాక కొత్తిమీరతో అలంకరించాలి. రైతాతో వడ్డించాలి. సామల దద్ధ్యోదనం కావలసినవి: సామలు – అర కప్పు, నీళ్లు – 2 కప్పులు పెరుగు – ముప్పావు కప్పు, కొబ్బరి పాలు – పావు కప్పు క్యారట్ – 3 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత నెయ్యి/నూనె – ఒక టీ స్పూను, ఆవాలు – అర టీ స్పూను మినప్పప్పు – అర టీ స్పూను, కరివేపాకు – 2 రెమ్మలు తరిగిన పచ్చి మిర్చి – 2, అల్లం తురుము – ఒక టీ స్పూను తయారీ: ముందుగా సామలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి. నీళ్లు ఒంపేసి తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మెత్తగా ఉడికించాలి. ఉడికిన సామల అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, గరిటెతో మెత్తగా అయ్యేలా మెదపాలి. పెరుగు, కొబ్బరి పాలు జత చేసి కలియబెట్టాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె/నెయ్యి వేసి కాగనివ్వాలి. ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి. క్యారట్ తురుము జత చేసి మరోమారు వేయించి, సామల అన్నంలో వేసి కలియబెట్టాలి. ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి. కొత్తిమీరతో అలంకరించి, అల్లం చట్నీతో అందించాలి. సామల ఖీర్ కావలసినవి: సామలు – ఒక కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూను, జీడి పప్పు పలుకులు – 10 కిసిమిస్ – ఒక టేబుల్ స్పూను, బెల్లం పొడి – ఒక కప్పు కొబ్బరి పాలు – ఒక కప్పు, ఏలకుల పొడి – అర టీ స్పూను తయారీ: సామలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలు నానబెట్టాలి. స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక జీడి పప్పు పలుకులు, కిస్మిస్ వేసి వేయించి పక్కన ఉంచాలి. సామలలోని నీళ్లు ఒంపేసి, తగినన్ని మంచినీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. కొబ్బరి పాలు జతచేయాలి. బెల్లం పొడి వేసి బాగా కలియబెట్టి, కొద్దిసేపు ఉడికించాలి. ఏలకుల పొడి, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్మిస్ జత చేసి కలిపి దింపేయాలి. వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది. -
కిలో రూపాయికే ఉల్లి
హోల్ సేల్ మార్కెట్లో ఉల్లి ధర మరోసారి రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లిధర కిలో రూపాయి స్థాయికి పడిపోయింది. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ మహారాష్ట్రలోని లాసల్‌గామ్ వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధర భారీగా పడిపోయింది. గత రెండు నెలల కాలంలో ధర ఏకంగా 91శాతం ధర క్షీణించింది. దీంతో రవాణా ఖర్చులు కూడా తమకు దక్క లేదని రైతులు వాపోతున్నారు. అయితే ఉల్లి ధర తగ్గడంతో గోదాముల్లో నిల్వ చేసుకోవాలని రైతులకు మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు. అకస్మాత్తుగా ఉల్లి సప్లయ్ మార్కెట్‌ను ముంచెత్తడంతో రెండు నెలల క్రితం 21 రూపాయిలు పలికిన ధర అక్టోబర్ రూ.17స్థాయికి దిగి వచ్చింది. డిసెంబర్ 24నాటికి ఏకంగా ఒక రూపాయికి పడిపోయింది. గత ఏడాది జులైలో ఒక రూపాయికి చేరిగా, 2016లో కిలో 5పైసలు స్థాయికి పతనమైన సంగతి తెలిసిందే. -
కన్నీళ్లు పెట్టించడానికి సిద్ధమవుతోన్న ఉల్లి..?
ముంబై : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతోన్న జనాల నడ్డి విరచడానికి ఉల్లిపాయ కూడా సిద్ధమవుతోంది. అతి త్వరలోనే ఉల్లి ధర భారీగా పెరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కిలో 10 రూపాయలకు లభ్యమవుతోన్న ఉల్లిపాయలు, మరో వారం రోజుల్లోనే దాదాపు 50 రూపాయలకు చేరనున్నట్లు తెలిసింది. ఈ విషయం గురించి ఏపీఎమ్‌సీ(అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ) అధ్యక్షుడు వశి మాట్లాడుతూ.. ‘ఇన్ని రోజులు మార్కెట్‌కి ప్రతి రోజు దాదాపు 125 - 150 టన్నుల ఉల్లి వచ్చేది. ఇది కూడా ఎక్కువగా నాసిక్, పూణె ప్రాంతాల నుంచి వస్తుండేది. కానీ కొన్ని రోజులుగా ఉల్లి దిగుమతి భారీగా తగ్గింది. ప్రసుతం రోజుకు కేవలం 50 టన్నుల ఉల్లి మాత్రమే మార్కెట్‌కి వస్తుంది. కొత్త గడ్డ రావడానికి ఇంకా సమయం పడుతుంది. అందవల్ల మరో వారం రోజుల్లోపే ఉల్లి ధర కిలో 50కి చేరవచ్చు’ అని తెలిపారు. ప్రస్తుతం నాసిక్‌లో తీవ్ర కరువు పరిస్థితులు ఇందుకు కారణమని వశి వెల్లడించారు. ప్రస్తుతం నాసిక్‌లో తాగడానికే నీరు దొరకడం లేదు. పంటల సాగు తగ్గిపోయింది. దాంతో ఈ ఏడాది ఉల్లి సాగు కూడా బాగా పడిపోయింది. అందువల్లే ఈ అధిక రేటు అని వశి తెలిపారు. -
పులిపిర్లకు ఉల్లి .. వెల్లుల్లి
మెడ, భుజాలు, చంక, కళ్ల ప్రాంతాలలో పులిపుర్లు మొలుస్తూ ఉంటాయి. వీటికి చర్మసమస్యలు, ఊబకాయం, జన్యుకారకాలు.. ఇలా ఎన్నో కారణాలు అవుతుంటాయి. చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసే ఈ పులిపిర్లను తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలను ఇంటి వద్దే తీసుకోవచ్చు. చర్మ సహజత్వమూ కోల్పోకుండా కాపాడుకోవచ్చు. ఉప్పు, ఉల్లిపాయ: ఉల్లిపాయలో సల్ఫర్ శాతం అధికం. ఇది మొండిగా ఉండే మొటిమలను, పులిపిర్లను నివారించడంలో మహత్తరంగా పనిచేస్తుంది. రాత్రి సమయంలో ఒక గిన్నె తీసుకొని అందులో అర కప్పు నీళ్లు, టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. దీంట్లో 2–3 ఉల్లిపాయ ముక్కలను కోసి వేసి, మూత పెట్టి ఆ రాత్రంతా అలాగే ఉంచాలి. ఈ రసాన్ని రోజుకు మూడు సార్లు పులిపిర్ల మీద, పులిపిర్లు వచ్చేఅవకాశం ఉంది అనుకున్న చోట చర్మం మీద రాయాలి. ఇలా కొన్ని వారాల పాటు చేస్తూ ఉంటే పులిపిర్ల సమస్య తగ్గుముఖం పడుతుంది. వెల్లుల్లి: ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే ఔషధ గుణాలు వెల్లుల్లిలో సమృద్ధిగా ఉన్నాయి. రెండు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరాలి. ఈ పేస్ట్‌ని పులిపిర్లు ఉన్న చోట రాసి, గంట సేపు ఉంచాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తూ ఉండాలి. కొన్ని రోజులకు పులిపిరి చర్మం నుంచి విడివడుతుంది. అల్లం: యాంటీమైక్రోబయల్ లక్షణాలు గల అల్లం చర్మ సమస్యల నివారిస్తుంది. తాజా అల్లంను సన్నని స్లైసులుగా కట్ చేయాలి. ఆ ముక్కలతో పులిపిర్ల మీద మృదువుగా రుద్దాలి. రోజుకు 5 నుంచి 6 సార్లు ఇలా చేస్తూ ఉంటే సహజపద్ధతుల్లోనే పులిపిర్లు రాలిపోతాయి. నిమ్మరసం: దూది ఉండను నిమ్మరసంలో ముంచి దాంతో పులిపిర్లు, యాక్నె ఉన్న చోట అద్దాలి. పది నిమిషాలు ఉంచి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజులో 2 నుంచి 3 సార్లు చేస్తూ ఉంటే పులిపిర్లు సహజ పద్ధతిలో వదిలే అవకాశం ఉంది. కొబ్బరి నూనె: జుట్టుకు వాడేది కాకుండా సహజమైన కొబ్బరి నూనె ఎన్నో చర్మ సమస్యలను నివారిస్తుంది. పులిపిర్లు ఉన్న చోట కొబ్బరి నూనె రాసి ఓ గంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. రోజుకు రెండు సార్లు కొబ్బరి నూనె పులిపిర్లు ఉన్న చోట రాస్తూ ఉంటే కొన్ని వారాలలో వాటి సంఖ్య తగ్గుముఖం పడుతుంది. వేప నూనె: వేప చెట్టు ఆరోగ్యప్రదాయిని అని మనకు తెలిసిందే! వేప నూనెలో ఓషధ గుణాలు అధికం. పులిపిర్లను నివారించడంలో వేపనూనె మహత్తరంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. రోజుకు 3 సార్లు పులిపిర్లకు వేపనూనె రాయాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే కొన్ని వారాలకు మొలిచిన పులిపిర్లు రాలిపోతాయి. -
ఉల్లి కుళ్లకుండా నిల్వ చేసే పద్ధతి..!
రైతు పంట పండించిన సీజన్లో కన్నా కొద్ది నెలలు నిల్వ చేయగలిగితే మార్కెట్లో మంచి ధర పలికే అవకాశం ఉంది. త్వరగా కుళ్లిపోయే స్వభావం ఉన్న ఉల్లిపాయలను నిల్వ చేయడం సమస్యలతో కూడిన విషయం. అయితే, మధ్యప్రదేశ్ డెడ్ల జిల్లా ధర్‌కు చెందిన యువ రైతు రోహిత్ పటేల్(21) గత ఏడాది ఎగ్జాస్ట్ ఫాన్లతో ఉల్లిపాయలను సమర్థవంతంగా నెలల తరబడి నిల్వ చేసే పద్ధతిని కనిపెట్టారు. ఈ కథనాన్ని గతంలోనే ‘సాక్షి సాగుబడి’ పాఠకులకు అందించింది. ఖర్చు పెద్దగా లేకపోవడం, నిల్వ నష్టాన్ని పది శాతం నుంచి 2 శాతానికి తగ్గించడం రోహిత్ పటేల్ సాధించిన విజయం. ఈ కథనం స్ఫూర్తితో.. వికారాబాద్ జిల్లా జిన్గుర్తి గ్రామంలోని ఏకలవ్య ఫౌండేషన్ సేంద్రియ వ్యవసాయ పరిశోధనా స్థానంలో 200 క్వింటాళ్ల ఉల్లిపాయలను అదే పద్ధతిలో నిల్వ చేస్తున్నారు. ఏకలవ్య సేంద్రియ వ్యవసాయ నిపుణుడు రమాకాంత్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పక్కా భవనంలోని 850(17“50) చదరపు అడుగుల గదిలో ఏప్రిల్ 20 నుంచి ఈ పద్ధతిలో ఉల్లిపాయలను నిల్వ చేస్తున్నారు. ప్రతి 100–105 చదరపు అడుగులకు ఒక్కొక్క ఎగ్జాస్ట్ ఫాన్ చొప్పున మొత్తం 8 ఫాన్లను ఏర్పాటు చేశారు. ఇవి నిరంతరాయంగా పనిచే స్తూ ఉల్లిపాయలు కుళ్లిపోకుండా కాపాడుతున్నాయి. తొలుత గదిలో గచ్చుపైన 9 అంగుళాల ఎత్తున సిమెంటు ఇటుకలు పేర్చి.. దానిపైన ఇనుప మెష్ పరిచారు. 100 అడుగులకోచోట ఎగ్జాస్ట్ ఫ్యాన్ల కోసం ఇటుకలు పేర్చారు. వాటిపైన 2.5 అడుగుల ఎత్తున మెష్‌ను పీపాలా గుండ్రంగా చుట్టి.. దానిపైన ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను అమర్చారు. చివరిగా అడుగున్నర మందాన దాదాపు 200 క్వింటాళ్ల ఉల్లిపాయలను నిల్వ చేశారు. మరో 200 క్వింటాళ్ల వరకు ఇదే చోట నిల్వ చేయడానికి అవకాశం ఉందని రమాకాంత్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. పెద్ద పాయలైతే ఎక్కువ పరిమాణంలో నిల్వ చేయవచ్చు. పెద్ద పాయలను 3 అడుగుల మందాన కూడా పోసి నిల్వ చేసుకోవచ్చంటున్నారు. నీడలో బాగా ఆరబెట్టిన ఉల్లిపాయలలో నుంచి కుళ్లిపోయిన వాటిని జాగ్రత్తగా తీసేసి నిల్వచేసుకోవటం చాలా ముఖ్యమని ఆయన అంటున్నారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఆగకుండా తిరగాల్సిందేనని రమాకాంత్(83747 21751) సూచించారు. సిమెంటు ఇటుకలు, ఇనుప మెష్‌పైన ఉల్లిపాయలు పోస్తున్న దృశ్యం -
పూజలు, వ్రతాలలో ఉల్లి, వెల్లుల్లిని ఎందుకు వాడరు?
ఉల్లి చేసిన మేలు తల్లయినా చేయదని సామెత. అయితే, హిందూ సంప్రదాయం ప్రకారం ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు చేసేటప్పుడు ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు లేని సాత్వికమైన ఆహారాన్నే తీసుకోవాలన్న నిబంధన ఉంటుంది. పూజలు, వ్రతాలలోనే కాదు, ఆచారాలను నిష్టగా పాటించే వారు చాలామంది వెల్లుల్లి, ఉల్లి తదితర మసాలా పదార్థాలను తీసుకోరు. అసలు ఈ విధమైన సంప్రదాయం ఎందుకు వచ్చింది? పూర్వులు ప్రత్యేక సందర్భాలు, పర్వదినాలలో వీటిని తమ ఆహారంలో ఎందుకని నిషేధించారో తెలుసుకుందాం! ఆయుర్వేదం ప్రకారం మనం తీసుకునే ఆహారం మొత్తం మూడు భాగాలుగా విభజించారు. అవే సాత్వికం, రాజసికం, తామసికం. వీటిలో ఒక్కో పదార్థం మనిషిలోని ఒక్కో గుణాన్ని పెంచడమో, తగ్గించడమో చేస్తాయి. ఉల్లి, వెల్లుల్లి. మాంసాహారం, మసాలా దినుసులు ఇంకా కొన్ని మొక్కలు రాజసిక తత్వానికి చెందినవి. వీటిని తీసుకోవడం వలన కోపం, ఆలోచనలలో అస్థిరత, ఏకాగ్రతలోపం కలుగుతాయట. ఉల్లి, వెల్లుల్లి కామాన్ని ప్రేరేపిస్తాయట. నిష్టతో ఉండాలనుకునే వారి మనసును మళ్లిస్తాయట. అందుకే ప్రత్యేక సందర్భాలలో ముఖ్యంగా ఎక్కువసేపు ఏకాగ్రతగా కూర్చుని చేయవలసిన పూజలు, వ్రతాలలో ఆహారంలో వాటిని నిషేధించారట. మరో విషయం ఏమిటంటే, ఉల్లి, వెల్లుల్లి వేర్లుగా భూ అంతర్భాగం నుండి లభిస్తాయి. వాటిని శుభ్రం చేసే సమయంలో ఆ సూక్ష్మజీవులు హత్యకు గురవుతాయని వాటిని తినడానికే దూరంగా ఉంటారట. ఉల్లి, వెల్లుల్లి, పుట్టగొడుగులు అవి పెరిగే ప్రదేశం శుచీశుభ్రత లేకుండా ఉంటాయని వాటికి దూరంగా ఉంటారట, భగవంతుణ్ణి భక్తితో కొలిచేటప్పుడు ఇలాంటివి సేకరించడం, వాటిని ఆహారంలో తీసుకోవడం తప్పుగా భావిస్తారు. -
ఉల్లి..కన్నీరే మళ్లీ
అనంతపురం అగ్రికల్చర్: ‘ఉల్లి’ మేలు తల్లి కూడా చేయదంటారు. అదే ఉల్లి ఇపుడు రైతు కంట కన్నీరు తెప్పిస్తోంది. ఎన్నో ఆశలతో సాగు చేసి పండించిన పంటకు గిట్టుబాటు లేకపోవడంతో రైతు కుదేలవుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 6,200 హెక్టార్లకు పైబడి విస్తీర్ణంలో దాదాపు 9 వేల మంది రైతులు ఉల్లి సాగు చేశారు. రాయదుర్గం, గుమ్మఘట్ట, డి.హిరేహాళ్, గుంతకల్లు, గుత్తి, యాడికి, బ్రహ్మసముద్రం కళ్యాణదుర్గం, పెనుకొండ, రొద్దం, పామిడి, అనంతపురం, గార్లదిన్నె, బొమ్మనహాళ్, కణేకల్లు, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో ఉల్లి సాగు ఎక్కువగా ఉంది. వాతావరణం అనుకూలించడంతో పంట దిగుబడులు బాగానే వచ్చాయి. అయితే ధరలు పతనం కావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కిలో రూ.2 కూడా పలకని దుస్థితి ప్రస్తుతం కిలో ఉల్లి రూ.2 కూడా పలకకపోవడంతో పెట్టుబడులు కూడా దక్కించుకోలేని పరిస్థితి నెలకొంది. మార్కెట్లో కొనేవారు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఎంత లేదన్నా క్వింటా రూ.5 వేలు పలికితే పెట్టుబడులైనా వస్తాయని భావించిన రైతులకు రూ.1,500 నుంచి రూ.2 వేలకు పడిపోవడంతో నష్టాలు మూటగట్టుకుంటున్నారు. హెక్టారుకురూ.50 వేల వరకు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేశారు. దిగుబడులు బాగానే వచ్చినా రేట్లు పతనం కావడంతో అయినకాటికి అమ్మేసుకుంటున్నారు. లేదా కలాల్లోనే ఉంచేస్తున్నారు. పెట్టుబడులు రూ.70 కోట్లు రైతులు ఉల్లి సాగుకు రూ.70 నుంచి రూ.72 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ధరలు గిట్టుబాటు కాకపోవడంతో రూ.40 కోట్లకు మించి దక్కించుకోలేని పరిస్థితి. లాభాలు పక్కనపెడితే పెట్టుబడుల్లోనే రూ.30 కోట్లు నష్టాలు మూటగట్టుకున్నారు. రూ.100 నుంచి రూ.120 కోట్లు ఉల్లి వ్యాపారం జరుగుతుందని అధికారులు అంచనా వేయగా... ధరల పతనంలో అంచనాలు తారుమారై రైతులు ఇబ్బందుల్లో పడ్డారు. పెరిగిన సాగు విస్తీర్ణం జిలాల్లో ఉల్లి సాగు విస్తీర్ణం బాగా పెరగడం, పంట దిగుబడులు కూడా బాగా రావడంతో ధరలు పడిపోయినట్లు తెలుస్తోంది. కర్నూలు, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలతో పాటు కర్ణాటకలోని బళ్లారి, చిత్రదుర్గ జిల్లాల పరిధిలో ఉల్లి పంట భారీ విస్తీర్ణంలో సాగులోకి వచ్చినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అలాగే మహారాష్ట్రలో అంచనాలకు మించి పంట వేయడం, దిగుబడులు వచ్చాయని చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లు తాడేపల్లిగూడెం, కర్నూలుకు పెద్ద ఎత్తున ఉల్లి రావడంతో ధరలు పలకడం లేదంటున్నారు. అలాగే చిత్రదుర్గ, బళ్లారి, నాగపూర్, కలకత్తా మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో ఉల్లికి గిట్టుబాటు కష్టంగా ఉందని అంచనా వేస్తున్నారు. పండించిన పంట నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు, ఇతరత్రా ప్రోత్సాహం లేకపోవడంతో తక్కువైనా ఎక్కువైనా పండిన వెంటనే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. -
ఉల్లి గడ్డ పొట్టుతో విద్యుత్
కోల్‌కతా : ‘ఉల్లిగడ్డ పొట్టును ఏం చేస్తారు అందరూ.? ఏముంది చెత్త డబ్బాలో వేస్తారు. కానీ వినూత్నంగా ఆలోచించిన ఐఐటీ ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు అద్భుతం సృష్టించారు. ఉల్లిగడ్డ పొట్టుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఓ పరికరాన్ని రూపొందించారు. దీంతో ఒక ఉల్లిగడ్డ పొట్టుతోనే 12 గ్రీన్ ఎల్ఈడీ బల్బులు వెలుగుతాయంటా. అంతే కాకుండా 6 ఉల్లి గడ్డల పొట్టుతో ఏంచక్కా మోబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌లకు చార్జింగ్ పెట్టుకోవచ్చంటున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్ ఫ్రోఫెసర్ భానుభూషణ్, పీహెచ్డీ స్కాలర్ సుమంతా కుమన్ కరణ్‌లు ఈ పరికారాన్ని రూపోందించారు. ఇటీవలె దక్షిణా కొరియాలోని పోహాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (పోస్ట్చెక్) శాస్త్రవేత్త జిన్ కోన్ కిమ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఈ పరికరాన్ని పరీక్షించినట్లు నానో ఎనర్జీ జర్నల్ ప్రచురించింది. రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున ఉల్లి పొట్టు వృథా అవుతుందని గుర్తించి ఈ ప్రయోగం ప్రారంభించామని ఫ్రోఫెసర్ భానుభూషణ్ తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకునే రెస్టారెంట్లకు ఈ పరికరం ఉపయోగపడుతుందన్నారు. హాఫ్ ఇంచ్ ఉల్లిపొరతో 20 వోల్టుల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చన్నారు. ఆరు ఉల్లిగడ్డల పొట్టుతో 80 ఎల్ఈడీ బల్బులను వెలిగించవచ్చని, లాప్టాప్, మొబైల్ ఫోన్లను కూడా చార్జ్ చేసుకోవచ్చన్నారు. ఇక ఈ ప్రయోగం ప్రాథమిక దశలో ఉందని, దీన్ని అందరూ వినియోగించేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. దీనికి నానోజెనరేటర్గా నామకరణం చేసినట్లు ఫ్రోఫెసర్ పేర్కొన్నారు. ఉల్లిగడ్డ పొట్టులోని పియోజ్ ఎలక్ట్రిక్ గుణాలతో ఇది పని చేస్తోందని, పియోజ్ ఎలక్ట్రిక్ పదార్థాలకు యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తి మార్చే శక్తి ఉందన్నారు. -
అమాంతం పెరిగిన ఉల్లి ధరలు
-
ఉల్లి, టమాటాలతో అలర్జీ తుమ్ములు దూరం!
మీకు దుమ్ము వల్ల అలర్జీయా? దుప్పట్లు దుపలగానే తుమ్ములు మొదలవుతాయా? మీరు ఓ చిన్న చిట్కా పాటించండి. ఇకపై గోధుమలు, అరటిపండ్లు, ఉల్లి, బార్లీ, చికోరీ, టమాటా, చిలగడదుంప వంటివి కాస్త ఎక్కువగా తినండి. అలర్జీలు దూరమవుతాయంటున్నారు జపాన్‌లోని పరిశోధకులు. కొన్ని ఎలుకలపై పరిశోధనల్లో ఈ విషయం తేలింది. వారు తొలుత ఎలుకలకు డస్ట్‌మైట్స్‌తో అలర్జీ కలిగించారు. ఇక వాటికి ‘ఫ్రక్టో ఆలిగో సాకరైడ్స్’ ఎక్కువగా ఉండే ఆహారం ఇస్తూ వచ్చారు. తీరా పరిశీలిస్తే... మామూలు ఆహారంపై ఉన్న ఎలుకలతో పోలిస్తే ఫ్రక్టో ఆలిగో సాకరైడ్స్ ఉండే ఆహారం తిన్నవి చాలా ఆరోగ్యంగా ఉండి, అలర్జీలను సమర్థంగా ఎదుర్కొన్నాయి. అందుకే అలర్జీలను అరికట్టడానికి ఫ్రక్టో ఆలిగో సాకరైడ్స్ ఉండే గోధుమ, అరటి, ఉల్లి, వెల్లుల్లి వంటివి మంచివంటున్నారు పరిశోధకులు. మీరూ కాస్త ట్రై చేస్తారా? -
ఐటీ దెబ్బ-ఉల్లి అబ్బా..!
సాక్షి, నాసిక్ : ఇన్కమ్ టాక్స్ అంటే నల్లకుబేరులు, అక్రమార్కులేకాదు.. ఉల్లి వ్యాపారుల కూడా భయం పట్టుకుంది. ఐటీ దాడులు జరుగుతున్నాయనే సరికి.. ఉల్లి వ్యాపారులు ధరలను అమాంతం నేలకు దించేశారు. ఎవరూ ఊహించనంత తక్కువ ధరకు ఉల్లిని అమ్మడం మొదలు పెట్టారు.. ఇదంతా ఎక్కడనుకుంటున్నారా?? ఆ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకేం చదవండి. మహరాష్ట్రలోని అతి పెద్ద ఉల్లి హోల్‌సేల్ వ్యాపారాన్ని నాసిక్‌లో నిర్వహిస్తారు. ఇక్కడున్న లాసల్గాన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) ఉల్లిని టోకుగా చిరువ్యాపారులుకు అమ్ముతుంది. ఈ మార్కెట్ కమిటీపై ఎవరూ ఊహించని విధంగా ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు గురువారం దాడులు చేశారు. ఏపీఎంసీ కార్యాలయాలు, గోడౌన్లు, నాసిక్‌లోని అతిపెద్ద ఉల్లి వ్యాపారస్తులైన ఏడుమంది ఇళ్లలో ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనతో నాసిక్‌లో ఒక్కసారిగా ఉల్లిధరలు 35 శాతం తగ్గిపోయాయి. ఐటీ దాడులు జరపడానికి మునుపు క్వింటాల్ ఉల్లి రూ.1400 ధర పలికేది. దాడులు తరువాత క్వింటాల్ రూ.900కు దిగింది. ఈ విషయంపై ఏపీఎంసీ ఛైర్మన్ జయదత్తా హోల్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ దాడుల వల్ల టోకు ధరలు పతనమయ్యాయని చెప్పారు. మార్కెట్‌కు వచ్చే ఉల్లిని రోజువారీ ధరల ప్రకారమే అమ్మడం.. కొనడం చేస్తున్నామని చెప్పారు. ఐటీ దాడుల అనంతరం రైతులు తమ ఉత్పత్తిని అమ్ముకోవడానికి ఇష్టపడడం లేదని చెప్పారు. ఐటీ దాడుల వల్ల ఒక్కసారిగా ఉల్లిపాయల ధర నేలకు దిగిరావడం పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండుమూడు నెలలుగా ఉల్లి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని.. వీటిని ఇలా అయినా నిరోధించడం మంచి పరిణామం అని కొనుగోలుదారులు అంటున్నారు. -
ఉల్లి, ఆలూ కూడా అమ్ముతాం
అగ్రి బిజినెస్‌పై ప్రత్యేక దృష్టి ► కొత్త వ్యాపార విభాగాలపైనా కసరత్తు ► ఐటీసీ సీఈవో సంజీవ్ పురి న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ మరిన్ని హెల్త్‌కేర్ తదితర కొత్త వ్యాపార విభాగాల్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రధానంగా అగ్రి బిజినెస్‌పై దృష్టి సారిస్తూ ఉల్లి, బంగాళాదుంప వంటి కూరగాయలు మొదలైన వాటినీ విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ప్రతి కొన్ని నెలలకు మార్కెట్లో కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టే దిశగా.. త్వరలోనే బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కూడా విక్రయించడం ప్రారంభించనున్నట్లు సంస్థ ఈడీ, సీఈవో సంజీవ్ పురి చెప్పారు. ‘రాబోయే రోజుల్లో ఆలూ, గోధుమ మొదలుకుని పళ్లు, ఇతర కూరగాయలు, సముద్ర ఆహారోత్పత్తులు వంటివాటిపై మరింతగా దృష్టి పెట్టనున్నాం’ అని ఆయన వివరించారు. అలాగే ఉల్లి డీహైడ్రేట్స్పైనా కసరత్తు చేస్తున్నామని, ఈ ఏడాది ఆఖరు నాటికి వీటిని అందుబాటులోకి తెచ్చే అవకాశముందని పురి తెలిపారు. ఐటీసీ ఆదాయాల్లో ప్రస్తుతం 58% వాటా పొగాకుయేతర వ్యాపార విభాగాలైన ఎఫ్ఎంసీజీ, హోటల్, అగ్రి బిజినెస్, పేపర్ మొదలైన వాటిదే. హెల్త్‌కేర్ టీమ్ ఏర్పాటు ప్రక్రియ.. ఇక, హెల్త్‌కేర్ వ్యాపార విభాగంపై స్పందిస్తూ ఇందుకు సంబంధించి ప్రస్తుతం టీమ్‌ను తయారుచేసే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వివరించారు. ఎకానమీ వృద్ధికి తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతోనే వివిధ వ్యాపార విభాగాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేవలం షేర్‌హోల్డర్ల ప్రయోజనాల కోణానికే పరిమితం కాకుండా దాని పునాదిపై సామాజిక ప్రయోజనాలకూ పాటుపడాలన్నది ఐటీసీ వ్యూహమని పురి పేర్కొన్నారు. ఇండియా ఫస్ట్ వ్యూహం కింద 2030 నాటికల్లా వ్యాపారాలు, వ్యవస్థలను పటిష్టం చేయడం ద్వారా 1 కోటిపైగా మందికి జీవనోపాధి కల్పించడం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐటీసీ, దాని గ్రూప్ సంస్థల్లో 32,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధినిస్తూ, సుమారు 60 లక్షల మందికి జీవనోపాధి దక్కేలా కృషి చేస్తోంది. అగ్రి బిజినెస్, విలువ జోడింపు వ్యవస్థలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఐటీసీ ప్రస్తుతం సుమారు 20 కన్జూమర్ గూడ్స్, లాజిస్టిక్స్ హబ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. -
ఉల్లి రైతు కంట కన్నీరు
-
ఉల్లి కిలో @ రూ.24
అనంతపురం అగ్రికల్చర్: రైతుబజార్లో ఏర్పాటు చేసిన కౌంటర్లో ఉల్లిగడ్డలు కిలో రూ.24 ప్రకారం విక్రయిస్తున్నారు. ఈనెల 14, 15 తేదీల్లో కిలో రూ.22 ప్రకారం విక్రయించడంతో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఉన్నఫలంగా కిలోపై అదనంగా రూ.2 పెంచడంతో విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. గత వారం కన్నా బహిరంగ మార్కెట్లో ఉల్లిధర కాస్త తగ్గినా ఇక్కడ కొంచెం పెంచడం విశేషం. -
కొన్నా.. కోసినా కన్నీళ్లే!
► రూ.40కి చేరిన ఉల్లి ► పక్షం క్రితం కిలో రూ.14 ► ధరలు రోజురోజూ పైపైకి ► సబ్సిడీ అమ్మకాలు వట్టివే గత నెల 30న కిలో ఉల్లి రూ.14. అయిదు రోజుల క్రితం రూ.28. ఇప్పుడు కిలో ఉల్లి రూ.40కు చేరుకుంది. పక్షం రోజుల్లో ఉల్లి పైపైకి ఎగబాకడంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. ధరలను నియంత్రించలేక చేతులెత్తేసిన ప్రభుత్వం.. సబ్సిడీ ఉల్లిపాయలను రైతు బజార్లలో విక్రయిస్తామని సైలెంట్‌గా ఉండిపోయింది. చిత్తూరు: జిల్లాలో మళ్లీ ఉల్లిపాయల కొరత నెలకొంది. 2015వ సంవత్సరంలో ఇదే తరహాలో ఉల్లిపాయల డిమాండ్ ఏర్పడగా ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దాదాపు 40 రోజులకు పైగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉల్లి మరోమారు కొండెక్కగా ధరలను అదుపులో పెట్టడం, ప్రజలకు కావాల్సిన సరుకును తెప్పించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నష్టం.. లాభం లేకుండా ఉల్లి విక్రయాలు జరగాలనే ప్రతిపాదన నీటి మూటలుగా మారింది. దీనికి తోడు రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు విక్రయించాలనే సీఎం ఆదేశాలు జిల్లాలో ఎక్కడా అమలుకు నోచుకోలేదు. ఇదే కారణం.. జిల్లాలో రోజుకు అయిదు వేల టన్నులకు పైగా ఉల్లిపాయలు ఉత్తర భారత రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతోంది. ఇక్కడి రాష్ట్రాలైన ప్రస్తుతం భారీ వరదలు రావడంతో పంట మొత్తం నీట మునిగిపోయింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ తదితర రాష్ట్రాల వ్యాపారులు ఉల్లిపాయల కోసం మహారాష్ట్రకు వచ్చి ఉల్లిపాయలు కొనుగోలు చేస్తుండటంతో ఒక్కసారిగా ఉల్లికి డిమాండ్ పెరిగి ధరలు ఎగబాకాయి. ఈ ప్రభావం మన రాష్ట్రంపై కూడా పడటంతో జిల్లా వాసులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇక మనకు కర్నూలు నుంచి ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నా.. మహారాష్ట్ర సరుకుతో పోలిస్తే మన ఉల్లిలో నాణ్యత లేకపోవడం, నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉండకపోవడంతో ప్రజలు వీటిని కొనడానికి ఆసక్తి చూపడంలేదు. సీఎం మాటలు వట్టివే.. ఉల్లి డిమాండ్, ధరలు ఒక్కసారిగా పెరగడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత శనివారం వ్యవసాయ, మార్కెటింగ్, రైతు బజార్ల సీఈవోలు, పౌరసరఫరాల శాఖ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. సబ్సిడీపై ఉల్లిపాయలను విక్రయించాలని ఆదేశించారు. మహారాష్ట్ర, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి ఉల్లిపాయల్ని దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిని అందించడంతో పాటు ప్రతీ రెండు గంటలకు ఇక్కడి అమ్మకాలపై సమీక్షలు చేయాలని ఆదేశించారు. ఇక అక్రమ నిల్వలు ఉన్న ప్రాంతాల్లో దాడులు చేసి సరుకును వెలికి తీయాలని కూడా పేర్కొన్నారు. ఇదంతా జరిగి అయిదు రోజులు కావస్తోంది. సీఎం మాటల్లో ఒక్కటి కూడా జిల్లాలో అమలుకు నోచుకోలేదు. పైగా అయిదు రోజుల క్రితం రూ.28 ఉన్న కిలో ఎర్రగడ్డలు ఇప్పుడు ఏకంగా రూ.40కి చేరుకోవడంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది. దడ పుట్టిస్తున్నాయి.. ఇటీవల కాలంలో కూరగాయల ధరలు సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితిగా మారింది. ఇప్పుడు ఉల్లి ధరను చూస్తే ఇదే రీతిలో ఉంది. « సామాన్యులు ఏం తినాలి.. ఎట్టా బతకాలి. రైతు బజారులో కూడా నిర్ణీత ధరకు కూడా విక్రయించడం లేదు. ప్రభుత్వం మాత్రం రాయితీతో అందిస్తామని కూడా చెప్పింది. కానీ ఇంత వరకు అమలులో లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. –రంజని, చిత్తూరు ఉల్లిన్ని రాయితీతో అందించాలి.. కూరగాయల ధరలు మాత్రమే పెరిగాయి.. అనుకుంటే ఉల్లి ధర కూడా పెరిగిపోయింది. ఈ రోజుల్లో పని దొరకడమే కష్టంగా ఉంది. ఇలాంటప్పుడు ధరలు పెరిగితే సామాన్యుడు ఏమై పోవాలి. ప్రధానంగా ఉల్లి. వంటింట్లో ఉల్లి లేనిదే ఏ కూర వండాలన్నా కష్టమే. అధికారులు ధర నియంత్రణనకు చర్యలు తీసుకోవాలి. లేకుంటే రాయితీతో ఉల్లిని అందించాలని కోరుతున్నాం. –భాగ్య, చిత్తూరు -
ఎకరాకు 200 క్వింటాళ్లు
- ఉల్లిసాగులో సీతారామాపురం రైతు ప్రతిభ సీతారామాపురం(బేతంచెర్ల): ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలన్న చందంగా ఏటా పంటలు సాగు చేసి నష్టపోతున్న రైతులు మరుసటి ఏడాది అంతకు రెట్టింపు ఆశలతో పంట సాగు చేస్తారు. ఈ ఏడాదైనా పంట కలసి రాకుండా పోతుందా అన్న ఆశ వారిని నడిపిస్తోంది. ఈ దశలో బేతంచెర్ల మండలం సీతారామాపురం గ్రామానికి చెందిన రైతు మల్లేశ్వరరెడ్డి ఈ ఏడాది ఉల్లి సాగులో సక్సెస్ అయ్యాడు. బోరు నీటి ఆధారంగా రెండెకరాల్లో వెస్టు రకం ఉల్లి సాగు చేసిన ఇతడు 400 క్వింటాళ్ల దిగుబడి సాధించాడు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ పంటకు ముందు సేంద్రియ ఎరువులను దుక్కిలో వేసినట్లు తెలిపారు. నారు నాటింది మొదలు కోత వరకు డ్రిప్ విధానంలో నీటి తడులు, ఎరువులు అందించాడు. వ్యవసాయ అధికారులు, నిపుణుల సలహాలు పాటించాడు. తాను పడిన కష్టానికి ఫలితం దిగుబడి రూపంలో వచ్చింది. ఎకరాకు 100 నుంచి 150 క్వింటాళ్లకు మించని దిగుబడి ఈయన పొలంలో 200 క్వింటాళ్లు వచ్చింది. క్వింటా రూ. 950 ప్రకారం అమ్మగా మొత్తంగా ఖర్చులు పోను రూ. 2లక్షల వరకు మిగిలిందని మల్లేశ్వరెడ్డి తెలిపారు. -
ఇంటిప్స్
కూరగాయలు కిచెన్ ప్లాట్‌ఫామ్ మీద గాని, మార్బుల్ మీద గాని కట్ చేయడం వల్ల చాకులు పదును కోల్పోయి మొండిగా అవుతాయి. చెక్క మీద కట్ చేస్తే ఈ సమస్య రాదు. కొత్తిమీరని పలుచని క్లాత్‌లో చుట్టి రిఫ్రిజిరేటర్లో భద్రపరిస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.ఉల్లిపాయలను నీటిలో 10 నిమిషాలు నానబెట్టిన తరవాత కట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ తరిగేటప్పుడు కంటి నుండి నీరు కారదు. -
ఉల్లి కోసం లొల్లి
► సిరిసిల్ల రెస్టారెంట్లో కస్టమర్లపై దాడి ► బాటిళ్లు..కత్తులతో గాయపర్చిన వైనం ► ఇద్దరికి పాక్షికం..మరొకరికి తీవ్రగాయాలు ► ఏరియాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ► పోలీస్టేషన్ లో పరస్పర ఫిర్యాదులు సిరిసిల్ల క్రైం : బిర్యాని తినే కస్టమర్లు అదనంగా ఉల్లిపాయలు అడిగినందుకు ఓ రెస్టారెంట్ నిర్వాహకులు వారిపై దాడి చేసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని తాజ్ రెస్టారెంట్లో ముస్తాబాద్‌కు చెందిన ఆసరి దీక్షిత్(22) మధ్యాహ్న సమయంలో తన స్నేహితులు విజయ్, నవీ¯ŒSతో కలిసి బిర్యాని తినడానికి వెళ్లారు. స్నేహితులు సరదాగా మాట్లాడుతూ..భోజనం చేస్తుండగా ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వెయిటర్లు ఇంగ్లిష్‌లో దీక్షిత్, అతని స్నేహితులపై కామెంట్ చేశారు. అయినా అవేమీ పట్టించుకోకుండా అదనంగా ఉల్లిపాయలు(గ్రీ¯ŒSసలాడ్) తేవాలని వెయిటర్‌ను కోరారు. దీనికి వెయిటర్ ఒప్పుకోక పోవడంతో అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పారు. అయినా వినకుండా మరిన్ని కామెంట్లు చేశారు. దీంతో దీక్షిత్ అతని స్నేహితులు వెయిటర్‌తో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగింది. రెస్టారెంట్ సిబ్బంది పదిమంది ముగ్గురు కస్టమర్లను రూంలోకి తీసుకెళ్లి విచక్షణా రహితంగా దాడిచేశారు. గాజుసీసాలతో గాయపర్చారు. తీవ్రగాయాలైన దీక్షిత్‌ను స్థానికుల ప్రమేయంతో ఏరియాస్పత్రికి తరలించారు. విజయ్, నవీన్ కు స్వల్పగాయాలయ్యాయి. జరిగిన సంఘటనపై వీరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈవిషయమై తాజ్ రెస్టారెంట్ యజమాని తాజ్‌ను వివరణ కోరగా..తాను స్థానికంగా లేనని హోటల్లో ముగ్గురు వ్యక్తులు అతిగా మద్యం సేవించి వచ్చి అద్దాలు పగులగొట్టి తమ సిబ్బందిపై దాడి చేసారన్నారు. తాము కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెపాపడు. -
మద్దతు కరువు!
ఉల్లి రైతు కంట కన్నీరు - మద్దతు ధరకు దూరమైన 4వేల మంది రైతులు - గత డిసెంబర్ 21 నుంచి పట్టించుకోని కలెక్టర్ - రూ.600లోపు ధరతో విక్రయించిన ఉల్లి 4.50 లక్షల క్వింటాళ్లు - మొత్తం రైతులు 13,566 - మద్దతు 3,797 రైతులకే పరిమితం లారీ బాడుగ కూడా దక్కలేదు గత ఏడాది ఖరీఫ్‌లో 1.88 ఎకరాల్లో ఉల్లి సాగు చేసినా. పెట్టుబడి రూ.75వేలు అయ్యింది. 90 క్వింటాళ్ల పంట వచ్చింది. కర్నూలు మార్కెట్‌కు గత అక్టోబర్ 15న తీసుకొస్తే వ్యాపారులు కొనలేదు. మరుసటి రోజున వేలం పాటకు పెడితే రూ.90 ప్రకారం కొనుగోలు చేసినారు. ఈ ధర లారీ బాడుగలకు కూడా సరిపోలేదు. మద్దతు కోసం మార్కెట్లో 2631 నెంబర్ కార్డుపై తహసీల్దారు, వీఆర్ఓ సంతకాలు పెట్టించుకొని వచ్చి అదే నెలలోనే అందజేసినా. క్వింటాకు రూ.300 మద్దతు కల్పించాలి. నా కుమారుడు శివశంకర్ పేరు మీద కార్డు ఉంది. ఇంతవరకు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. - మూల బీరప్ప, కొత్తపల్లి, పత్తికొండ మండలం మద్దతు కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నాం ఖరీఫ్‌లో ఒక ఎకరాలో ఉల్లి సాగు చేసినా. పెట్టుబడి రూ.35వేల వరకు వచ్చింది. 43 క్వింటాళ్ల దిగుబడి రాగా గత అక్టోబర్‌లో కర్నూలు మార్కెట్లో క్వింటా రూ.430 ప్రకారం అమ్మినా. ఈ లెక్కన క్వింటాకు రూ.170 ప్రకారం మద్దతు ధర రావాల్సి ఉంది. 963 కార్డులో అన్ని వివరాలు సక్రమంగా పూర్తి చేసిచ్చినా. మార్కెట్ కమిటీ అధికారులు కంప్యూటర్లో పేరు తప్పుగా నమోదు చేయడంతో మద్దతు ధరకు దూరమయ్యా. ఆ తర్వాత తప్పు సరిదిద్దినా ఇప్పటికీ నగదు అందలేదు. - ఖాజన్న, సుంకేసుల, కర్నూలు మండలం కర్నూలు(అగ్రికల్చర్): అధికారుల నిర్లక్ష్యం ఉల్లి రైతుకు శాపంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఉల్లి రైతులకు మద్దతు ధర ఇచ్చే అవకాశం ఉన్నా డిసెంబర్ 20 నాటికే ముగించడం వేలాది మంది రైతులకు నిరాశే మిగిలింది. కష్టాల్లోని రైతుల పట్ల అధికారులు కాస్త సానుభూతి చూపినట్లయితే రూ.3.23 కోట్లు మద్దతు రూపంలో లభించేది. జిల్లాలో 4వేల మంది రైతులు మద్దతు ధరకు దూరమవడం చూస్తే అధికారుల పనితీరు ఏవిధంగా ఉందో తెలుస్తోంది. ఉల్లి సాగులో దేశంలోనే మహారాష్ట్రలోని పూనె మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానం కర్నూలుదే. 2016 ఖరీఫ్‌లో సాగు చేసిన ఉల్లి ఆగస్టు నుంచి మార్కెట్లోకి వచ్చింది. రాష్ట్రంలోనే ఉల్లి క్రయ విక్రయాలు కలిగిన ఏకైక మార్కెట్ కర్నూలు. ఎకరాకు రూ.30వేల నుంచి రూ.35వేల వరకు పెట్టుబడి ఖర్చు వస్తోంది. ఎకరాకు సగటున 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గత ఏడాది ఆగస్టు నుంచే మార్కెట్లో ఉల్లి ధర నేలను తాకింది. క్వింటాకు సగటున రూ.250 నుంచి రూ.300 ధర మాత్రమే లభించింది. రూ.50 నుంచి రూ.100 ధరతో అమ్ముకున్న రైతులు 20 శాతం వరకు ఉన్నారు. ధర లభించక అనేక మంది రైతులు దిగుబడులను మార్కెట్లోనే వదిలేశారు. ఆ సందర్భంగా మద్దతు ధర కల్పించాలని రైతులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. దిగొచ్చిన ప్రభుత్వం క్వింటాకు రూ.600 మద్దతు ధర ప్రకటిస్తూ గత అక్టోబర్ 6న జీవో జారీ చేసింది. అయితే జిల్లా యంత్రాంగం గరిష్టంగా క్వింటాకు రూ.300 మద్దతు కల్పించేలా చర్యలు తీసుకుంది. క్వింటా ఉల్లిని రూ.300లోపు అమ్ముకుంటే మద్దతు కింద రూ.300 లభిస్తుంది. రూ.400లకు అమ్ముకుంటే రూ.200 మద్దతు లభిస్తుంది. ఈ మద్దతు మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అధికారుల చుట్టూ తిరగలేక.. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో గత ఏడాది సెప్టంబర్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు రూ.600 లోపు ధరకు అమ్మకున్న రైతులందరకీ మద్దతు వర్తిస్తుంది. ఈ కాలంలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో 13,566 మంది రైతులు 4.50లక్షల క్వింటాళ్ల ఉల్లిని రూ.600 కంటే తక్కువ ధరకు అమ్మకున్నారు. వీరందరికీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బ్యాలెన్స్ మొత్తం మద్దతుగా చెల్లించాలి. అయితే దాదాపు 8వేల మంది రైతులు మాత్రమే మద్దతు ధర కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన వారు అధికారులు చుట్టూ తిరుగలేక.. వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మద్దుతు ధరను స్వచ్ఛందంగా వదులుకున్నారు. 3,797 మంది రైతులకే మద్దతు ఉల్లికి మద్దతు ధర పొందేందుకు మార్కెట్ కమిటీ ప్రత్యేకంగా కార్డులు ముద్రించింది. వీటిలో రైతులు ఉల్లి సాగు చేసినట్లు, ఎన్ని క్వింటాళ్ల దిగుబడి వచ్చింది తదితర వివరాలు ఉంటాయి. ఈ కార్డుపై రైతులు సంబంధిత తహసీల్దారు, వీఆర్ఓ సంతకాలు చేయించుకొని కర్నూలు మార్కెట్ యార్డులో అందజేయాలి. వీటిని మార్కెట్ కమిటీ సెక్రటరీ పరిశీలించి మార్కెటింగ్ శాఖ ఏడీకి.. ఆయన వాటిని జిల్లా కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ ఆమోదించిన తర్వాత ఏడీఏం మద్దతు ధరను రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. మార్కెట్ కమిటీ అధికారులు 7,796 మంది రైతులతో మొత్తం 70 లిస్టులు తయారు చేశారు. ఇందులో 60 లిస్టులను ఏడీఎంకు పంపారు. అయితే జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ డిసెంబర్ 20 వరకు ప్రతి రోజూ ఉల్లి మద్దతు జాబితాలను పరిశీలించారు. ఆ మేరకు 37 జాబితాలను ఆమోదించారు. వీటికి సంబంధించి 3,797 మంది రైతులకు మద్దతు కింద రూ. 3,76,91,218.42 రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. 4వేల మంది రైతులకు మొండిచెయ్యి సెప్టంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28లోపు మార్కెట్లో రూ.50 నుంచి రూ.600 లోపు ధరకు అమ్మకున్న రైతులు 4వేల మంది మద్దతుకు దూరమయ్యారు. వీరంతా మార్కెట్ కమిటీ అధికారులు ఇచ్చిన కార్డులపై అన్ని సంతకాలు చేయించి అందజేశారు. ఇందులో 300 కార్డుల్లో కొన్ని తప్పులు ఉన్నా.. మిగిలినవన్నీ సక్రమంగా ఉన్నాయి. డిసెంబర్ 21న జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తాను మళ్లీ చెప్పే వరకు ఉల్లి రైతుల మద్దతు జాబితాలను తన వద్దకు తీసుకురావొద్దని ఏడీఎంను ఆదేశించారు. అప్పటి నుంచి వీటిని పట్టించుకున్న దాఖలాల్లేవు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాం మొదట్లో అర్హులైన రైతులందరికీ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మద్దతు ధర కల్పించాం. డిసెంబర్ 20 వరకు 3,797 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఆ తర్వాత నుంచి ఉల్లి మద్దతు నిలిచిపోయింది. దాదాపు 4వేల మంది రైతులకు మద్దతు అందించాల్సి ఉంది. ఈ జాబితాలో కొన్ని తప్పులు ఉన్నాయి. విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. - సత్యనారాయణ చౌదరి, ఏడీఎం, కర్నూలు -
5 ఏళ్ల కనిష్టానికి ఉల్లి ధర
ముంబై: నిన్నటి మొన్నటి వరకు వినియోగదారులు కన్నీళ్లు తెప్పించిన ఉల్లి ఇపుడు రైతులను నష్టాల్లోకి నెట్టేస్తోంది. డిమానిటైజేషన్ ప్రభావంతో తగ్గుముఖం పట్టిన ఉల్లిధరలు, దిగుబడి పుంజుకోవడంతో మరింత పతనమయ్యాయి. అయితే మౌలిక సదుపాయాల లేమికారణంగా ఉల్లి రైతులు కనీస ఉత్పత్తిధర కూడా లభించక దిగాలుపడుతున్నారు. దేశంలో అతిపెద్ద ఉల్లి హోల్ సేల్ మార్కెట్ లో సగటు ధర క్వింటాల్ రూ 450గా నమోదైంది. మహారాష్త్ర నాసిక్ లోని లాసర్ గావ్ మార్కెట్లో ఉల్లి ధర ఐదు సంవత్సరాల కనిష్ఠానికి చేరింది. ఉత్పత్తి భారీగా ఉండడంతో ధరలు పడిపోయాయని మార్కెట్‌వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఉత్పత్తి బంపర్ గా ఉందని, అయితే, స్టోరేజ్ కెపాసీటీ , ప్రాసెసింగ్ లాంటి మౌలికవసతుల లేమితో తక్కువ ధరలు నమోద వుతున్నట్టు మార్కెట్ అధికారులు తెలిపారు. సగటున 12వేల క్వింటాళ్లతో పోలిస్తే గా ఫిబ్రవరి నెలలో ప్రతి రోజు 30-35వేల క్వింటాళ్ల ఎరుపు ఉల్లి మార్కెట్‌కు చేరుతోంది. ఉల్లిపాయలు జీవితకాలము ఒక నెలగా ఉంటుందనీ,నిల్వ చేయడం కష్టం మారిందన్నారు. దీంతో గిట్టుబాటు ధర లభించక వద్ద రైతులు ఆందోళనలో పడ్డారన్నారు. కనీస ఉత్పత్తి ధరలు లభించకపోవడంతో కొంతమంది రైతులు తమ ఉల్లికి నిప్పు పెడుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం దిగుబడి పీక్ స్టేజ్ లోఉందని, మార్చి నెలలో ఇదికొంత నెమ్మదించే అవకాశం ఉందని తెలిపారు. తద్వారా ఉల్లి ధరలు నిలదొక్కుకోనున్నాయని అంచనా వేశారు. రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి సప్లయ్ పెరుగుతోందని మార్కెట్ కమిటీ అధికారులుతెలిపారు. మార్కెట్ యార్డ్ వద్ద చాలా స్టాక్ ఉందనీ, ఇది క్లియర్ చేయాలంటే తమకుకనీసం 20రోజులుపడుతుందన్నారు. అలాగే దీని రవాణా కోసం తమకు 40వ్యాగన్లు అవసరం పడతాయని..కానీ ప్రస్తుతం 15-18 మాత్రమేఅందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఉల్లి రవాణాకు మరిన్ని కొత్త బోగీలను కేటాయించేందకు రైల్వేశాఖ సంసిద్ధతను వ్యక్తం చేసింది. అతిపెద్ద మార్కెట్ యార్డ్ లాసర్ గావ్ వద్ద ఫిబ్రవరి 2016లో క్వింటాలు సగటు ధర రూ.740గా ఉండగా, రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన కరువు పరిస్థితులతో క్వింటాలు ఉత్పత్తి వ్యయం రూ 950గా నమోదైంది. కాగా 2013 లో క్వింటా ఉల్లి ధర రూ 1,424 వద్ద అత్యధికంగా పలికిన సంగతి తెలిసిందే. -
ఉల్లి రైతుకు అందని మద్దతు ధర
– పెండింగ్‌లో 3, 000 మంది దరఖాస్తులు కర్నూలు(అగ్రికల్చర్): తక్కువ ధరకు ఉల్లిని అమ్ముకున్న రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతును పొందేందుకు అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. క్వింటాలు ఉల్లిని మార్కెట్లో రూ.60, రూ. 100కి అమ్మకొని రైతులు నష్టపోయారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.600 ప్రకారం మద్దతు ధర ప్రకటించింది. దీని ద్వారా మద్దతు కింద రైతుకు గరిష్టంగా రూ.300 లభిస్తుంది. అయితే మద్దతు ఇచ్చే విషయాన్ని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ డిసెంబరు నెల 21 వరకు పరిగణలోకి తీసుకున్నారు. అన్ని వివరాలు సక్రమంగా ఉంటే బ్యాంకు ఖాతాలకు మిగతా మొత్తం జమ చేశారు. ఈ విధంగా 3,800 మంది రైతులకు రూ.3.50 కోట్లు జమ చేశారు. మార్కెట్లో తక్కువ ధరలకు అమ్మకంటే గరిష్టంగా రూ.300 మద్దతు పొందే అవకాశం ఫిబ్రవరి వరకు ఉంది. జిల్లా కలెక్టర్ మాత్రం డిసెంబరు 21 నుంచి ఉల్లి రైతులకు మద్దతు ధర ఇచ్చే అంశాన్ని పూర్తిగా పక్కకు పెట్టేయడం విమర్శలకు తావిస్తోంది. మార్కెటింగ్ శాఖ అధికారుల దగ్గర దాదాపు 3000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి రూ.3కోట్లు అవసరం అవుతాయి. జిల్లా కలెక్టర్ దయ తలిస్తేనే వీరికి మద్దతు లభిస్తుంది. -
నేటితో ఉల్లి ‘మద్దతు’దరఖాస్తు గడువు ముగింపు
- పిబ్రవరి వరకు అవకాశం ఉన్నా అర్ధాంతరంగా ముగించే యత్నం - ఇప్పటి వరకు మద్దతు పొందినవారు 50శాతం లోపే - డెడ్‌లైన్ విధింపుతో రైతుల గగ్గోలు కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వచ్చే ఏడాది పిబ్రవరి వరకు ఉల్లిని రూ.600 కంటే తక్కువ ధరకు అమ్ముకునే రైతులందరికీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వర్తిస్తుంది. గరిష్టంగా రూ.300 వరకు మద్దతు లభిస్తుంది. పిబ్రవరి చివరి వరకు అవకాశం ఉందికదా అనుకున్న రైతులు మద్దతును కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారికే మద్దతు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ డెడ్‌లైన్ విధించారు. దీని ప్రకారం వేలాది మంది రైతులు సంకటంలో పడ్డారు. దేవుడు వరమిచ్చినా... పూజరి వరమివ్వడు అనే చందంగా ప్రభుత్వం ఉల్లి రైతులు నష్టపోకుండా మద్దతు ప్రకటిస్తే జిల్లా స్థాయిలో మాత్రం మద్దతుకు గండికొట్టే ప్రమాదం ఏర్పడింది. సెప్టంబరు నుంచి వచ్చే ఏడాది పిబ్రవరి చివరి వరకు మార్కెట్లో రూ.600 లోపు ధరకు ఉల్లి అమ్ముకునే రైతులకు మద్దతు వర్తిస్తుంది. రూ.50 నుంచి రూ.300లోపు ధరకు అమ్ముకుంటే రూ.300,... రూ.400కు అమ్మకుంటే రూ.200, రూ.500 అమ్ముకున్న వారికి 100 ప్రకారం మద్దతు లభిస్తుంది. అయితే జిల్లా కలెక్టర్ ఉల్లికి మద్దతు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల21తోనే ముగింపు పలుకుతుండటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు అరకొరే.. ఇప్పటి వరకు మద్దతు పొందిన రైతులు అంతంతమాత్రంగానే ఉన్నారు. దాదాపు 6500 మంది రైతులు ఉల్లి మద్దతు ధర పొందేందుకు తగిన డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కేవలం 3వేల మందికి మాత్రమే మద్దతుకు అర్హత లభించింది. దరఖాస్తులో తప్పులున్నాయనే ఉద్దేశ్యంతో సుమారు 2వేల మందిని తిప్పుకుంటున్నారు. మరో 1500 మంది మార్కెట్ కమిటీ నుంచి దరఖాస్తులు తీసుకెళ్లినా తిరిగి తెచ్చివ్వలేదు. ఈ లెక్కన 3500 మంది ఇంకా మద్దతు పొందాల్సి ఉంది. ఇది కేవలం దరఖాస్తులు తీసుకెళ్లిన వారికి సంబంధించి మాత్రమే. కలెక్టర్ నిర్ణయం మేరకు మద్దతుకు దరఖాస్తులు ఇవ్వడానికి బుధవారమే చివరి రోజని మార్కెట్ కమిటీ సమాచారం ఇవ్వడంతో రైతులు మంగళవారం భారీగా మార్కెట్‌కు తరలివచ్చారు. ఇదెక్కడి అన్యాయం అంటూ మార్కెట్ కమిటీ సెక్రటరీని నిలదీశారు. ఇచ్చిన దరఖాస్తుల్లో తప్పులున్నాయని తిరస్కరించారు... ఇపుడేమో చివరి రోజు బుధవారమేనని అంటున్నారు. రైతులు బాగుపడటం ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు. విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని మార్కెట్ కమిటీ సెక్రటరీ శమంతకమణి తెలిపారు. -
క్విక్‌ఫుడ్
క్యాప్సికమ్ టొమాటో కర్రీ కావలసినవి: క్యాప్సికమ్– 250 గ్రా., టొమాటోలు– 100గ్రా., ఉల్లిగడ్డ – పెద్దది 1, అల్లం, వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, సాజీర, దాల్చిన చెక్క పౌడర్– అర టీ స్పూన్, ధనియాలపొడి– ఒక టీ స్పూన్, ఉప్పు, కారం– రుచికి తగిపంత, కొబ్బరి పౌడర్ – ఒక టీ స్పూన్, నూనె– సరిపడా, పసుపు– చిటికెడు, కొత్తిమీర – గార్నిష్కోసం తయారీ: 1. ముందుగా క్యాప్సికమ్, ఉల్లిపాయ, టొమాటోలను తరగాలి. 2. స్టవ్ మీద బాణలి పెట్టుకుని నూనె వేసుకుని, కాగాక ఉల్లిపాయ ముక్కలు అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించుకోవాలి. 2. ఆ తరువాత క్యాప్సికమ్ ముక్కలు వేసి చిన్న మంట మీద పది నిముషాలు వేయించాలి. 3. టొమాటో ముక్కల్ని వేసి అయిదు నిముషాలు మగ్గించాక, ఉప్పు, కారం వేసి కలియబెట్టి మూత పెట్టాలి. 4. తరవాత పైన చెప్పిన పౌడర్లు, పసుపు వేయాలి. చిన్నమంట మీద అయిదు నిముషాలుంచి దింపేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. 5. ఈ క్యాప్సికమ్ కర్రీ చపాతీలోకి అయినా అన్నంలోకి కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. -
ఉల్లి.. తల్లడిల్లి
= గిట్టుబాటు ధర లేక నష్టాల బాట = రైతన్నను పట్టించుకోని ప్రభుత్వం అనంతపురం అగ్రికల్చర్ : ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 14 వేల మందికి పైగా రైతులు 6,200 హెక్టార్ల విస్తీర్ణంలో ఉల్లి సాగు చేశారు. రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి డివిజన్లలో ఎక్కువగానూ.. మిగిలిన డివిజన్లలో అక్కడక్కడ ఈ పంట సాగు చేశారు. ఎకరా ఉల్లి పంటకు రూ.50 నుంచి రూ.60 వేలు పెట్టుబడి పెట్టారు. పంట బాగుంటే ఎకరాకు 10 టన్నులు (100 క్వింటాళ్లు) పండాలి. టన్ను కనీసం రూ.8 వేలు పలికితే ఎకరాకు రూ.15 నుంచి రూ.20 లాభం వస్తుంది. కానీ ఈ ఏడాది పరిస్థితి దారుణంగా ఉంది. వర్షాభావం..తెగుళ్ల ప్రభావం : వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలుఅడుగంటిపోవడం వల్ల పంట కాలంలో రైతులు నానా అవస్థలు పడ్డారు. ఉన్న నీటి వనరులు సద్వినియోగం చేసుకున్నారు. కానీ. మజ్జిగ తెగులు, వెర్రి తెగులు ఆశించడంతో చాలా ప్రాంతాల్లో పురుగు మందుల పిచికారీకి ఎక్కువ ఖర్చు చేశారు. అలాగే కూలీల ఖర్చు అధికంగానే పెట్టినట్లు తెలిపారు. ఎకరాకు ఆరు టన్నులు (60 క్వింటాళ్లు) కూడా దిగుబడి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరేలే మంచి ధరలైనా పలికితే గట్టెక్కవచ్చని ఆశించిన రైతులకు పుండు మీద కారం చల్లినట్లు ధరలు పతనం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. టన్ను రూ.4 నుంచి రూ.5 వేల మధ్య పలుకుతుండటం, దాన్ని కూడా కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా చేతికి రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. పట్టించుకోని సర్కారు నాలుగైదేళ్లుగా ధర ఆశించిన స్థాయిలో ఉంటూ వచ్చింది. గతేడాది కూడా ధర బాగుంది. అరుుతే రెండు, మూడు నెలల నుంచి తగ్గుతూ వచ్చింది. పంటను రైతన్న విడిగా విక్రయించినా ప్యాకెట్ (40 కిలోలు) ధర ప్రస్తుతం రూ.200 నుంచి 250 వరకు పలుకుతోంది. రెండు నెలల క్రితం అదే ప్యాకెట్ ధర రూ.500 నుంచి రూ.600 వరకు పలికింది. గతేడాది అరుుతే ప్యాకెట్ ధర రూ.1000 వరకు పలికింది. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర అరుుతే రూ.10 వరకు పలుకుతుండడంతో గిట్టుబాటు కాలేదు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లా మంత్రులు, అధికార పార్టీ నేతలు కానీ, మార్కెటింగ్‌శాఖ, ఉద్యానశాఖ తరఫున కూడా ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో ఉల్లి రైతు లబోదిబోమంటున్నాడు. ధరలు లేనప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేస్తే కొంత వెసులుబాటు లభిస్తుందని రైతులు భావిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సారి ఉల్లి దిగుబడి ఆశించిన స్థాయిలో రావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ఉద్యానశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. సాగు విస్తీర్ణం పెరిగింది ఉల్లి సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడి కూడా పెరిగింది. జిల్లాలో మామూలుగా 3 వేల హెక్టార్లలోపు ఉల్లి సాగయ్యేది. నాలుగైదేళ్లుగా ధరలు బాగానే ఉంటుండడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం రెట్టింపరుు్యంది. పొరుగు ఉన్న కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోనూ అదే పరిస్థితి. ఇవి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకలో సాగు విస్తీర్ణం మరింతగా పెరిగింది. దిగుబడి కూడా బాగా రావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. జనవరి 15 తర్వాత కానీ ఫిబ్రవరి నెలలో ధరలు పెరిగే అవకాశం ఉంది. - బీఎస్ సుబ్బరాయుడు, ఉద్యానశాఖ డీడీ ఈ రైతు పేరు వెంకటేశులు, ఉరవకొండ మండలం మైలారంపల్లి. ఒకటిన్నర ఎకరాలో ఉల్లి సాగు చేశాడు. భూమి దుక్కి దున్నడం కాడి నుంచి పంట కోత, రవాణా చేసేంత వరకు రూ.1.10 లక్షలు ఖర్చు చేశాడు. 90 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. క్వింటా రూ.500 కూడా గిట్టుబాటు ధర రాకపోవడంతో తల్లడిల్లిపోతున్నాడు. లాభం పక్కనపెడితే పెట్టిన పెట్టుబడిలోనే రూ.లక్షకు పైగా నష్టం వస్తోంది. గిట్టుబాటు ధర లేదు. కొనేవారు కరువై రోజుల తరబడి ఉల్లి బస్తాలతో రైతుబజార్లో ఎదురుచూస్తున్నాడు. -
ఉల్లి.. తల్లడిల్లి
- గిట్టుబాటు ధర లేక నష్టాల బాట - రైతన్నను పట్టించుకోని ప్రభుత్వం - రోడ్డున పడిన ఉల్లి రైతు ‘ఉల్లి’పంట.. ఈ సారి రైతన్న కంట కన్నీరు తెప్పిస్తోంది. గతేడాదిలాగే ఈసారి రెండు, మూడు నెలల వరకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర ఉన్నా..ఆ తర్వాత పతనమైంది. దీంతో రైతుల ఆశలన్నీ అడియాశలయ్యాయి. దిగుబడి వస్తుంది.. ధర దక్కుతుంది..ఈ సారి అప్పుల ఊభిలోంచి గట్టెక్కొచ్చని ఎన్నో ఆశలతో రైతులు ‘ఉల్లి’ సాగు చేస్తే.. తెగుళ్లు దిగుబడిపై ప్రభావం చూపగా, చేతికందిన పంటకూ గిట్టుబాటు ధర లేక రైతన్న తల్లడిల్లుతున్నాడు. కనీసం పెట్టుబడి కూడా చేతికి దక్కక దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నాడు. రోడ్డున పడిన ఉల్లి రైతులు ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 14 వేల మందికి పైగా రైతులు 6,200 హెక్టార్ల విస్తీర్ణంలో ఉల్లి సాగు చేశారు. రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి డివిజన్లలో ఎక్కువగానూ.. మిగిలిన డివిజన్లలో అక్కడక్కడ ఈ పంట సాగు చేశారు. ఎకరా ఉల్లి పంటకు రూ.50 నుంచి రూ.60 వేలు పెట్టుబడి పెట్టారు. పంట బాగుంటే ఎకరాకు 10 టన్నులు (100 క్వింటాళ్లు) పండాలి. టన్ను కనీసం రూ.8 వేలు పలికితే ఎకరాకు రూ.15 నుంచి రూ.20 లాభం వస్తుంది. కానీ ఈ ఏడాది పరిస్థితి దారుణంగా ఉంది. వర్షాభావం..తెగుళ్ల ప్రభావం : వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలు అడుగంటిపోవడం వల్ల పంట కాలంలో రైతులు నానా అవస్థలు పడ్డారు. ఉన్న నీటి వనరులు సద్వినియోగం చేసుకున్నారు. కానీ. మజ్జిగ తెగులు, వెర్రి తెగులు ఆశించడంతో చాలా ప్రాంతాల్లో పురుగు మందుల పిచికారీకి ఎక్కువ ఖర్చు చేశారు. అలాగే కూలీల ఖర్చు అధికంగానే పెట్టినట్లు తెలిపారు. ఎకరాకు ఆరు టన్నులు (60 క్వింటాళ్లు) కూడా దిగుబడి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరేలే మంచి ధరలైనా పలికితే గట్టెక్కవచ్చని ఆశించిన రైతులకు పుండు మీద కారం చల్లినట్లు ధరలు పతనం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. టన్ను రూ.4 నుంచి రూ.5 వేల మధ్య పలుకుతుండటం, దాన్ని కూడా కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా చేతికి రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. పట్టించుకోని సర్కారు నాలుగైదేళ్లుగా ధర ఆశించిన స్థాయిలో ఉంటూ వచ్చింది. గతేడాది కూడా ధర బాగుంది. అయితే రెండు, మూడు నెలల నుంచి తగ్గుతూ వచ్చింది. పంటను రైతన్న విడిగా విక్రయించినా ప్యాకెట్ (40 కిలోలు) ధర ప్రస్తుతం రూ.200 నుంచి 250 వరకు పలుకుతోంది. రెండు నెలల క్రితం అదే ప్యాకెట్ ధర రూ.500 నుంచి రూ.600 వరకు పలికింది. గతేడాది అయితే ప్యాకెట్ ధర రూ.1000 వరకు పలికింది. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర అయితే రూ.10 వరకు పలుకుతుండడంతో గిట్టుబాటు కాలేదు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లా మంత్రులు, అధికార పార్టీ నేతలు కానీ, మార్కెటింగ్‌శాఖ, ఉద్యానశాఖ తరఫున కూడా ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో ఉల్లి రైతు లబోదిబోమంటున్నాడు. ధరలు లేనప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేస్తే కొంత వెసులుబాటు లభిస్తుందని రైతులు భావిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సారి ఉల్లి దిగుబడి ఆశించిన స్థాయిలో రావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ఉద్యానశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. సాగు విస్తీర్ణం పెరిగింది ఉల్లి సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడి కూడా పెరిగింది. జిల్లాలో మామూలుగా 3 వేల హెక్టార్లలోపు ఉల్లి సాగయ్యేది. నాలుగైదేళ్లుగా ధరలు బాగానే ఉంటుండడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం రెట్టింపయ్యింది. పొరుగు ఉన్న కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోనూ అదే పరిస్థితి. ఇవి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకలో సాగు విస్తీర్ణం మరింతగా పెరిగింది. దిగుబడి కూడా బాగా రావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. జనవరి 15 తర్వాత కానీ ఫిబ్రవరి నెలలో ధరలు పెరిగే అవకాశం ఉంది. – బీఎస్ సుబ్బరాయుడు, ఉద్యానశాఖ డీడీ -
ఉల్లి రైతు కుదేలు
– మళీ్ల నిలిచిపోయిన ఉల్లి కొనుగోళ్లు – కనీసం రూ. 3 లక్షల నగదు లేక క్రయ, విక్రయాలు నిలుపుదల – మార్కెట్ బయటనే తక్కువ ధరలకు అమ్ముకుంటున్న రైతులు పెద్ద నోట్ల మార్పిడితో ఏర్పడిన నగదు సంక్షోభం నుంచి రైతులు బయటపడ లేకపోతున్నారు. ముఖ్యంగా ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. రాష్ట్రంలో ఉల్లి పండే ఏకైక జిల్లా కర్నూలు మాత్రమే. క్రయ, విక్రయాలు కూడా కర్నూలు మార్కెట్లోని జరుగుతాయి. పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన మరుసటి రోజు నుంచి మార్కెట్ బంద్ కావడంతో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిచిపోయాయి. వారం రోజుల తర్వాత ఉల్లి కొనుగోళ్లు చేపట్టారు. అయితే కనీస అవసరాలకు సైతం డబ్బులు లేవని ఈ పరిస్థితుల్లో కొనుగోలు చేయలేమని సోమవారం వ్యాపారులు చేతులెత్తేశారు. దీంతో ఉల్లి రైతులు కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. - కర్నూలు(అగ్రికల్చర్) కర్నూలు మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేసిన ఉల్లిని తరలించడానికి కనీస అవసరాలకు అవసరమైన నగదు ఇచ్చేందుకు బ్యాంకులు సహకరించకపోవడంతో లావాదేవీలు మళ్లీ నిలిచిపోయాయి. కొనుగోలు చేసిన ఉల్లిని తరలించేందుకు కనీసం దారి ఖర్చులకు కూడా డబ్బులు లేవంటూ కొనుగోలుదారులు ముందుకు రాలేదు. మరో వైపు మార్కెట్లోకి ఉల్లిని అనుమతించకపోవడంతో తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక మార్కెట్ బయటనే అతి తక్కువ ధరలకు అమ్ముకొని వెళ్తున్నారు. వేరుశనగ, పత్తి, ప్రొద్దుతిరుగుడు, మొక్కజొన్న, ఆముదం తదితర పంటల కొనుగోళ్లు ఆలస్యం అయినప్పటికి నష్టం లేదనే ఉద్దేశంతో ప్రస్తుతానికి వీటి గురించి పట్టించుకోవడం లేదు. ఉల్లి పచ్చి సరకు కావడం, అదీ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉందేది కాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉల్లి రైతుల ఇబ్బందులు తీర్చాలని మార్కెట్ కమిటీ చైర్మన్ శమంతకమణి ప్రయత్నిస్తున్నప్పటకి బ్యాంకర్లు సహకరించకపోవడంతో ఉల్లి క్రయ, విక్రయాలు అనిశ్చితిలో పడ్డాయి. జిల్లాలో 12 మార్కెట్ కమిటీలు ఉండగా కేవలం కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్ల్లో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. నగదు కొరత కారణంగా పెద్ద నోట్లు రద్దు అయిప్పటి నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో రైతులు ఆర్థి«క సంక్షోభంలో చిక్కుకున్నారు. కనీసం రోజుకు మూడు లక్షలు ఇస్తే. నగదు కొరతతో ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ లావాదేవీలు చేపట్టాలను భావిస్తోంది. ఇందుకు ఉల్లి కొనుగోలు దారులు అనుకూలంగానే ఉన్నారు. రైతులు డబ్బులు ఆలస్యంగా ఇచ్చినా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. అయితే కనీస అవసరాలకు డబ్బులు లేకపోవడం సమస్యను జటిలమవుతోంది. కర్నూలు ఉల్లి 80 శాతం వరకు కోల్‌కతకు ఎగుమతి చేస్తారు. మిగిలినది దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. డీజిల్, బాడుగలు చెక్‌ల ద్వారా ఇస్తున్నా లారీలు కర్నూలు నుంచి గమ్యం చేరుకోవాలంటే ఖర్చులకు ఒక్కో లారీకి రూ.10వేల అవసరం అవుతాయి. కర్నూలు నుంచి రోజుకు 30 లారీలు పోతున్నందున రోజుకు రూ.3 లక్షలు బ్యాంకుల ద్వారా సమకూరిస్తే కొనుగోళ్లు చేపడుదామని కొనుగోలు దారులు పేర్కొంటున్నారు. కాని ఇందుకు బ్యాంకర్లు సహకరించడం లేదు. ఇపుడున్న పరిస్థితుల్లో ఆర్బీఐ నిబంధనల మేరకు మాత్రమే నగదు ఇస్తామని అదనపు మొత్తం ఇవ్వలేమంటూ స్పష్టం చేస్తున్నారు. దీంతో ఉల్లి కొనుగోళ్ల వ్యవహారం ఆగమ్యగోచరంగా మారింది. నగదు సంక్షోభం రైతులకు నష్టాలను మిగిలుస్తోంది. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం: శమంతకమణి, కర్నూలు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉల్లి రైతులు నష్టపోకుండా కొనుగోళ్లు చేపట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. లారీ డ్రైవర్ల దారి ఖర్చులకు రోజు రూ. 3 లక్షలు అవసరమని కోరుతున్నా బ్యాంకర్లు సహకరించడం లేదు. అదీ కూడా 100 నోట్లు అంతకంటే తక్కువ విలువ నోట్లే కావాలని అడుగుతున్నారు. ఉల్లి రైతులు నష్టపోకుండా సహకరించాలని బ్యాంకులను కోరుతున్నా స్పందనలేదు. నిబంధనలకు అనుగుణంగా ఇస్తామని అంతకంటే ఏమీ చేయలేమని చెబుతున్నారు. నగదు కొరతతో ఉల్లి రైతులు సష్టపోతున్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. -
ఉల్లి విక్రయాలు ప్రారంభం
కర్నూలు(అగ్రికల్చర్): దాదాపు వారం రోజుల విరామం తర్వాత శుక్రవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి క్రయ, విక్రయాలు జరిగాయి. దాదాపు 15 లారీల ఉల్లి మార్కెట్‌కు వచ్చింది. క్వింటాల్‌కు కనిష్టంగా రూ.160 గరిష్టంటా రూ.780 ధర లభించింది. రైతులకు కేవలం 10 శాతం మొత్తం మీద చెల్లించారు. మిగిలిన మొత్తం చెక్‌ల రూపంలో చెల్లిస్తారు. ఉల్లి మినహా మిగిలిన వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాలు ఇంకా మొదలు కాలేదు. -
ఉల్లి రైతు ఆత్మహత్య
కర్నూలు: ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేక.. చేసిన అప్పులు తీర్చలేనన్న బెంగతో పడిదెంపాడు గ్రామానికి చెందిన జక్కం మద్దిలేటి (36) పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగేళ్లుగా ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. వర్షాభావ పరిస్థితులతో పంట దిగుబడి సరిగా రాక నష్టపోయాడు. పెట్టుబడి కోసం బయట వ్యక్తుల దగ్గర భారీగా అప్పు చేశాడు. ఈ సంవత్సరం ఉల్లి పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈనెల 14వ తేదీన దిగులుతో పొలంలోనే పురుగుల మందు తాగాడు. భార్య శ్యామల గుర్తించి.. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా 15వ తేదీ రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. -
వ్యవసాయ మార్కెట్ బంద్
కల్లూరు: కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డును ఆదివారం బంద్ చేశారు.ఈ బంద్ నాలుగు రోజులు వరకు కొనసాగుతుందని మార్కెట్ యార్డు కమిటీ ప్రకటించింది. ఈ పక్రటన ఉల్లి రైతులకు శాపంగా మారింది. రెండు రోజులుగా ఆకాశం మేఘావృత మవుతుంటే ఎప్పుడు వర్షం పడుతుందోనని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. టార్ఫాలిన్ల కింద ఉల్లిరి ఆరబోసి కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. -
మిగిలిన ఉల్లి కొనుగోలు
–పెరిగిన ధరలు కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ మార్కెట్ యార్డులో మిగిలిపోయిన ఉల్లిని ఎట్టకేలకు శనివారం కొనుగోలు చేశారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శమంతకమణి, కార్యదర్శి నారాయమూర్తిలు చొరవ తీసుకొని తాత్కాలికంగా నగదు కొరతను పరిష్కరించడంతో వ్యాపారులు ముందుకు వచ్చి కొనుగోలు చేశారు. శనివారం ఉల్లి ధరలు మరింత పెరిగాయి. క్వింటాల్ ధర గరిష్టంగా రూ.1080 పలికింది. మొన్నటి వరకు కనిష్ట ధర రూ.50 వరకే ఉండగా.. ఇపుడు రూ.400 పలికింది. పెద్ద నోట్లు రద్దుతో ఉల్లి ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో మార్కెట్లో కొరత ఏర్పడటం వల్ల ధరలు పెరుగుతున్నాయి. ఇక నగదు కొరత పరిష్కారం అయ్యే వరకు మార్కెట్లో ఉల్లి కొనుగోళ్లు ఉండవని అధికార వర్గాలు తెలిపాయి. -
నిలిచిన ఉల్లి కొనుగోళ్లు
రైతుల ఆందోళన కర్నూలు(అగ్రికల్చర్): పెద్ద నోట్ల రద్దు వ్యవసాయ మార్కెట్ యార్డులపై తీవ్ర ప్రభావం చూపింది. కరెన్సీ కొరత కారణంగా పంట ఉత్పత్తుల క్రయ, విక్రయాలు స్తంభించిపోయారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు చేసే ఉల్లిని 80 శాతం వరకు కోల్‌కతకు తరలిస్తారు. ఇందుకు అడ్వాన్స్‌ల కింద 50 శాతం బాడుగలు చెల్లించాల్సి ఉంది. పెద్దనోట్లు ఉన్నా పనికిరాకపోవడం, బ్యాంకులు పనిచేయకపోవడం, ఏటీఎంలు మూతపడటంతో వ్యాపారులు బాడుగలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వ్యాపారులు ఉల్లి కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేశారు. దీంతో రైతులు బుధవారం సాయంత్రం రోడ్డెక్కారు. తక్షణం ఉల్లి కొనుగోళ్లు చేపట్టాలంటూ ఆందోళన చేపట్టారు. మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్య తీవ్రం కావడంతో పోలీసులు జోక్యం చేసుకొని మార్కెట్ కమిటీ అధికారులు, వ్యాపారులు, లారీ ఓనర్ల అసోషియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. గురువారం ఉల్లి వేలంపాట నిర్వహించాల్సిందేనని రైతులు మార్కెట్ కమిటీపై ఒత్తిడి పెంచారు. ఎన్నిరోజులుండాలి: పాపన్న, ఉల్చాల, కర్నూలు మండలం మూడు రోజుల క్రితం 37 ప్యాకెట్ల ఉల్లిని తీసుకొని మార్కెట్‌కు వచ్చాం. వ్యాపారులు కొనుగోలు చేయలేదు. ఈ రోజు కొనుగోలు చేయాల్సి ఉండగా పెద్ద నోట్లు చెల్లుబాటు కావడం లేదని చెప్పారు. ఈ కారణంతో ఉల్లి కొనుగోళ్లు బంద్ చేస్తే మా పరిస్థితి ఏమిటి, ఎన్నాళ్లు మార్కెట్లో ఉండాలి? -
ఉల్లి రైతు ఉసురు తీసిన ధర
- గోరంట్లలో ఉరేసుకొని రైతు ఆత్మహత్య కోడుమూరు రూరల్: పతనమైన ఉల్లి ధర ఓ రైతు ప్రాణం తీసిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని గోరంట్ల గ్రామంలో చోటు చేసుకుంది. మృతుని భార్య కిష్టమ్మ తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన మద్దిలేటి(45) సర్వీసు ఇనామ్ కింద మాధవస్వామి దేవస్థానం నుంచి సంక్రమించిన నాలుగు ఎకరాల పొలం సాగు చేసుకుంటున్నాడు. ఖరీఫ్‌లో మూడు ఎకరాల్లో ఉల్లి, ఎకరా పొలంలో పత్తి సాగు చేశాడు. పంటల సాగుకు రూ.1.50 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు. ఇదే సమయంలో పొలానికి నీటి సదుపాయం కోసం బోరు, పైపులైన్లు వేసేందుకు సుమారు రూ.2.50 లక్షల వరకు అప్పు చేశాడు. రైతు కష్టం ఫలించి దిగుబడి బాగానే వచ్చినా గిట్టుబాటు ధర లేకపోయింది. కర్నూలు మార్కెట్లో క్వింటా ధర రూ.50 నుంచి రూ.500 ల్లోపే ఉండటం.. ప్రభుత్వం మద్దతు ధర రూ.600 ప్రకటించినా ఎప్పటికి వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ఆ ఊరి నుంచి సరుకు తీసుకెళ్లిన రైతులకు కూడా క్వింటా రూ.300ల్లోపే ఉండటం మరింత కృంగదీసింది. మార్కెట్‌కు తరలించినా రవాణా చార్జీలు కూడా గిట్టుబాటు కావని భావించి.. పంటను పొలంలోనే పశువులకు వదిలేశాడు. అయితే ప్రైవేట్ వ్యక్తుల వద్ద చేసిన అప్పు రూ.4లక్షలు తీర్చే దారి లేక మనోవేదనకు లోనయ్యాడు. సోమవారం రాత్రి ఇదే విషయమై భార్య బాధ పడుతుండటంతో వెళ్లి బయట పడుకోమని చెప్పి పంపాడు. ఆమె వెళ్లి బయట పడుకున్న సమయంలో గుడిసెలోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి పెళ్లయిన కుమారుడు ఉండగా వీరు కూడా బయటే పడుకుని ఉండటంతో.. జరిగిన ఘటనను మంగళవారం తెల్లవారుజామున గుర్తించారు. -
దగాపడుతున్న రైతన్న
–మద్దతు ధర పేరుతో ప్రభుత్వం మోసం –రైతుకు గరిష్టంగా దక్కుతున్నది రూ.300 మాత్రమే –ఆదివారం మార్కెట్‌కు తెచ్చిన ఉల్లిని ఇప్పటి వరకు కొనుగోలు చేయని వ్యాపారులు –దోమలకాటుతో అల్లాడుతున్న రైతులు కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లికి మద్దతు ధర విషయంలో ప్రభుత్వం రైతులను దగా చేస్తోంది. ఉల్లికి మద్దతు ధర రూ.600 అంటూ ప్రకటించిన ప్రభుత్వం ఇస్తుంది మాత్రం రూ.300. మార్కెట్‌కు రైతులు నాణ్యమైన ఉల్లినే తీసుకు వస్తున్నారు. రైతులు తెచ్చిన ఉల్లిలో 60శాతం ఉల్లికి రూ.50 నుంచి రూ.250 వరకు మాత్రమే ధర లభించాల్సి ఉంది. అంటే ప్రభుత్వం చెప్పిన ఉత్తర్వుల ప్రకారం క్వింటం ఉల్లికి వేలంపాటలో ధర రూ.100 లభిస్తే మద్దతు ధర ప్రకారం రూ.500 చెల్లించాలి. జిల్లా యంత్రాంగం రూ.50 నుంచి రూ.300 వరకు ధర లభించినా రైతులకు రూ.300 మాత్రమే చెల్లిస్తోంది. ప్రభుత్వం ప్రకటించింది ఒకటైతే అమలు తీరు మరో విధంగా ఉండటంతో రైతుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉల్లి కొనుగోళ్లలో నెలకొన్న నిర్లక్ష్యంతో రైతులు మార్కెట్లో రోజుల తరబడి ఉండాల్సి వస్తోంది. వేలంపాట(బీట్) ఎప్పుడు వేస్తారో.. ఎన్నడు కొనుగోలు చేస్తారో తెలియక రైతులు మార్కెట్లో నరకం చూస్తున్నారు. ప్రభుత్వం ఉల్లికి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్‌కు ఉల్లి పోటెత్తకుండా రెవెన్యూ డివిజన్ వారీగా ఉల్లి కొనుగోళ్లు చేపట్టారు. సోమ, బుధ, శుక్రవారాల్లో కర్నూలు డివిజన్ రైతులు, మంగళ, గురువారాల్లో ఆదోని డివిజన్ రైతులు, శనివారం నంద్యాల డివిజన్ రైతులు మార్కెట్‌కు ఉల్లి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ విధానం ఈ నెల 24 నుంచి (సోమవారం) అమల్లోకి వచ్చింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వచ్చిన ఉల్లిని ఆదే రోజు వేలంపాటకు పెట్టారు. కాని బుధవారం వరకు కూడా కొనుగోలు చేయలేదు. దీన్ని బట్టి ఉల్లి కొనుగోలులో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. 24న వచ్చిన కర్నూలు రెవెన్యూ డివిజన్ ఉల్లినే ఇంతవరకు కొనలేదంటే మంగళవారం వచ్చిన ఆదోని డివిజన్ ఉల్లిని, బుధవారం వచ్చిన కర్నూలు డివిజన్ ఉల్లిని ఎప్పుడు కొనుగోలు చేస్తారో చెప్పలేని పరిస్థితి. మరోవైపు దోమలబెడదతో రైతులు వ్యాధులకు గురవుతున్నారు. మార్కెట్‌కు వచ్చిన రైతులకు మొదటి రోజు మాత్రమే మధాహ్న భోజనం సబ్సిడీపై పెడుతున్నారు. తర్వాత పెట్టడం లేదు. గ్రేడింగ్ ఇవ్వని ఉల్లిని కొనుగోలు చేయని వ్యాపారులు.. రైతులు తెచ్చిన ఉల్లి నాణ్యతను బట్టి గ్రేడింగ్‌లు ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఉద్యాన అధికారులతో టీములు ఏర్పాటు చేశారు. ఈ టీములు నాణ్యతను ఏ, బీ, సీ గ్రేడ్లు ఇస్తున్నారు. 10శాతం ఉల్లి బాగా లేదని గ్రేడింగ్ ఇవ్వడం లేదు. అటువంటి ఉల్లిని వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి మార్కెట్‌కు ఉల్లిని తీసుకువచ్చిన రైతుల పడుతున్న ఇక్కట్లు అన్నీ, ఇన్నీ కావు. కొందరు రైతులు మార్కెట్లోనే ఉల్లిని వదలి వెళ్లిపోతున్నారు. ఇంతవరకు ఉల్లి కొనుగోలు చేయలేదు: మౌలాలి మాది కోడుమూరు మండలం కొత్తపల్లి గ్రామం. 30 ప్యాకెట్ల ఉల్లిని తీసుకుని ఆదివారం రాత్రి వచ్చాను. సోమవారం ఉల్లిని వేలంపాటకు పెట్టాను. బుధవారం వరకు వేలంపాట రాలేదు. వ్యాపారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎప్పుడు బీట్ వస్తుందో తెలియని పరిస్థితి. రాత్రిళ్లు మార్కెట్లో దోమలతో సావాసం చేస్తున్నాం. ఉల్లిని అమ్ముకునే వరకు రూ.10 కే భోజనం పెట్టాలి: గోవిందప్ప మాది చిప్పగిరి మండలం నేమకల్ గ్రామం. రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాను. 270 ప్యాకెట్ల ఉల్లిని తీసుకుని ఆదివారం మార్కెట్‌కు వచ్చాను. ఇంతవరకు కొనుగోలు చేయలేదు. ఒక్క పూట మాత్రమే రూ.10 భోజనం పెట్టారు. మార్కెట్లో ఉల్లి కొనుగోలు చేయలేదంటే అందుకు బాధ్యత మార్కెట్ కమిటీదే. ఒక్క రోజు రూ.10కి భోజనం పెట్టి చేతులెత్తేస్తే ఎలా... ఉల్లి అమ్మకం అయ్యే వరకు సబ్సిడీపై భోజనం పెట్టాలి. బీట్ వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది: బ్రహ్మయ్య, కోడుమూరు ఆదివారం మార్కెట్‌కు 35 ప్యాకెట్ల ఉల్లిని తీసుకుని వచ్చాను. ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. వేలంపాట ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు.ఇంటి దగ్గర ఎవరూలేరు. త్వరగా కొనుగోలు చేసే విధంగా చూడాలని వ్యాపారులను, అధికారులను కోరుతున్నా పట్టించుకునే వారు లేరు. -
రేపటి నుంచి డివిజన్ల వారీగా ఉల్లి కొనుగోళ్లు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి విక్రయించే రైతులకు గరిష్టంగా క్వింటాకు రూ.300 మద్దతు ఇస్తుండటంతో మార్కెట్‌కు ఉల్లి పోటెత్తకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి రెవెన్యూ డివిజన్ల వారీగా రైతులు మార్కెట్‌కు ఉల్లిని తీసుకొచ్చేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. సోమ, బుధ, శుక్రవారాల్లో కర్నూలు రెవెన్యూ డివిజన్ రైతులు మాత్రమే మార్కెట్‌కు ఉల్లి తీసుకురాల్సి ఉంది. ఆదోని డివిజన్ రైతులు మంగళ, గురువారాల్లో.. నంద్యాల డివిజన్ రైతులు శనివారం మాత్రమే మార్కెట్‌కు దిగుబడులు తీసుకరావాలని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. -
అమ్మబోతే.. కన్నీళ్లు!
‘ఉల్లి’కిపాటు - పెట్టుబడి కూడా దక్కని దయనీయం - సగటున క్వింటాకు లభిస్తున్న ధర రూ.50 నుంచి రూ.80 మాత్రమే - పొలంలోనే పంటను దున్నేస్తున్న రైతులు - వంకలు, రోడ్ల పక్కన గుట్టలుగా దిగుబడులు - మద్దతు ధర కొందరికే.. - కొనుగోళ్లలోనూ వ్యాపారుల చేతివాటం డోన్ మండలం చింతలపేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి ఐదెకరాల్లో ఉల్లి సాగు చేశాడు. దిగుబడి ఎకరాకు 50 క్వింటాళ్ల వరకు వచ్చింది. కర్నూలు మార్కెట్‌కు తరలించాలంటే క్వింటాకు రూ.80 వరకు ఖర్చవుతుంది. పైగా అన్లోడింగ్ చార్టీలు, ఏజెంట్ కమీషన్ ఇతరత్రాలు అదనం. ఈ నేపథ్యంలో పండించిన ఉల్లిని రోడ్డున పడేశాడు. కర్నూలు(అగ్రికల్చర్)/డోన్: రాష్ట్రంలో ఉల్లి సాగు చేసే జిల్లాల్లో కర్నూలు ప్రధానమైంది. మహారాష్ట్ర తర్వాత ఉల్లి అత్యధికంగా పండేది ఇక్కడే. ఈ ఏడాది జిల్లాలో 25వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేయగా.. రైతులు వంద శాతం నష్టాలను మూట కట్టుకున్నారు. ఉల్లి ధరను మహారాష్ట్ర ప్రభావితం చేస్తుంది. మహారాష్ట్రలో పంట బాగా ఉంటే ఇక్కడ పండిన ఉల్లికి డిమాండ్ ఉండదు. అక్కడ ఉల్లి పంట లేకపోతే కర్నూలు ఉల్లికి మంచి రోజులు వస్తాయి. ఈ ఏడాది మహారాష్ట్రలో ఉల్లి మరీ ఎక్కువగా ఉండటం, ఆ ఉల్లి దేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతుండటం వల్ల కర్నూలు ఉల్లికి ఎప్పుడూ లేని విధంగా ధర పడిపోయింది. జిల్లాలో ఉల్లి పంటను దాదాపు 40వేల మంది రైతులు సాగు చేశారు. సగటున ఎకరాకు రూ.30వేల వరకు పెట్టుబడిగా పెట్టారు. ఇందులో దాదాపు 15 శాతం మంది రైతులకు క్వింటాకు లభించిన ధర కేవలం రూ.50 నుంచి రూ.80 మాత్రమే. దాదాపు 15 శాతం మంది రైతులు పంటను పొలంలోనే దున్నేశారు. కొందరు పశువులు, గొర్రెలు, మేకలకు వదిలేశారు. మరికొందరు తీవ్ర వ్యయ ప్రయాసలకోర్చి మార్కెట్‌కు తీసుకొస్తే.. ‘‘అబ్బే, ఉల్లి నాణ్యత బాగోలేదు’’ అంటూ వ్యాపారులు కొనకుండా తరస్కరిస్తున్నారు. ఇలాంటి దిక్కుతోచని స్థితిలో మార్కెట్లోనే దిగుబడిని వదిలేసి వెళ్లిన రైతులు కోకొల్లలు. ఉల్లి సాగు చేసి పూర్తి స్థాయిలో పెట్టుబడి దక్కించుకున్న రైతులు ఒక్కరు కూడా లేకపోవడం గమానార్హం. వేలాది క్వింటాళ్లు వంకల పాలు ఉల్లి ధరలు పడిపోవడంతో మార్కెట్‌కు తరలించి నష్టాలను మూట కట్టుకోలేక వేలాది క్వింటాళ్ల ఉల్లిని వంకలు, రోడ్ల పాలు చేశారు. కోడుమూరు ప్రాంతంలోనే దాదాపు 1000 క్వింటాళ్లను వంకల్లో పారబోశారు. ఉల్లి అత్యధికంగా కోడుమారు, సి.బెళగల్, డోన్ ప్రాంతాల్లో సాగవుతుంది. 80శాతం మంది రైతులు ఉల్లిని పొలంలోనే వదిలేయడం.. వంకలు, రోడ్ల పక్కన పారబోశారు. డోన్‌లో సురేష్ అనే రైతు రీటైల్‌గా వినయోగదారులకు కిలో రూపాయి ప్రకారం పంపిణీ చేశారు. నెల రోజుల వ్యవధిలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో దాదాపు 2వేల క్వింటాళ్లు వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో వదిలి వెళ్లినట్లు స్పష్టం అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఉల్లి రైతును కదిలించినా కన్నీటి గాథలే. వెరసి ఉల్లి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మద్దతు కొందరికే.. రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ప్రభుత్వం క్వింటాకు రూ.600 మద్దతు ధర ప్రకటించింది. ఇందులో రైతుకు ఇచ్చేది గరిష్టంగా క్వింటాకు రూ.300 మాత్రమే. అదీ కర్నూలు మార్కెట్‌కు తీసుకొచ్చి అమ్ముకున్న రైతులకే అమలు చేస్తారు. అంతదూరం తీసుకెళ్లినా ‘‘ఉల్లి నాణ్యత బాగోలేదు.. గ్రేడింగ్ రాదు.. కొనలేం’’ అని వ్యాపారులు చేతులెత్తేస్తే మా పరిస్థితి ఏమిటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆగస్టులో అత్యధికంగా ఉల్లి విక్రయించగా.. ధరలు లేక రైతులు అనేక సార్లు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. అయితే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు సెప్టెంబర్ నెల నుంచి కొనుగోలు చేసిన ఉల్లికే మద్దతును అమలు చేస్తున్నారు. మొత్తంగా ఉల్లికి మద్దతు ధర కేవలం 30శాతం రైతులకు మాత్రమే దక్కుతోంది. -
24 నుంచి డివిజన్ల వారీగా ఉల్లి కొనుగోళ్లు
కర్నూలు(అగ్రికల్చర్): స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 24 నుంచి రెవెన్యూ డివిజన్ వారీగా ఉల్లి కొనుగోళ్లు చేపట్టనున్నట్లుగా మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణచౌదరి తెలిపారు. బుధవారం మార్కెట్ యార్డులోని తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఉల్లి నాణ్యతను పరిశీలించి గ్రేడింగ్‌లు ఇవ్వడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేక బృందాలకు సూచించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి కల్లోలం
– మార్కెట్లో ఎటు చూసినా కంపుకొడుతున్న ఉల్లి నిల్వలు – పట్టించుకోని మార్కెట్ కమిటీ కళ్లలో నుంచి నీళ్లు తెప్పించే ఉల్లి ముక్కు మూసుకునేలా కూడా చేయగలదు మరి. ఉల్లి చేసిన మేలు తల్లి చేయదనే సామెత మనకు తెలుసే. కానీ మార్కెట్ కమిటీ అలసత్వంతో అదే ఉల్లి కడుపులో తిప్పేలా దుర్గంధాన్ని కూడా వెదజల్లుతోంది. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ఉల్లికి ఈ ఏడాది గిట్టుబాటు ధర లేకపోవడం కాదు కదా కనీసం రూ.50రూపాయలకు కూడా అడిగే నాథుడు లేకపోవడంతో రైతులు వందల క్వింటాళ్ల దిగుబడులను మార్కెట్లో ఇలా వదిలేసి వెళ్లారు. పరిసరాల శుభ్రతకు నెలకు రూ.లక్ష వెచ్చిస్తున్నట్లు చెప్పుకునే మార్కెట్ కమిటీ.. ఉల్లిని తొలగించకపోఽవడంతో కుళ్లిపోయి కంపు కొడుతున్నాయి. ఏడాదికి కోట్లలో ఆదాయం చేకూరుతున్నా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోవడమేమిటని మార్కెట్‌కు వచ్చే రైతులు, కార్మికులు, వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. - కర్నూలు(అగ్రికల్చర్): -
ఉల్లి గ్రేడింగ్‌కు 13 టీములు
- డివిజన్ల వారీగా రోజులు కేటాయింపు కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లికి మద్దతు ధర ప్రకటించిన నేపథ్యంలో నాణ్యతా ప్రమాణాలను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ 13 టీములను నియమించారు. ఒక్కో టీములో ఉద్యాన అధికారి, మార్కెటింగ్ శాఖ సూపర్వైజర్ స్థాయి అధికారి సభ్యులుగా ఉంటారు. మార్కెట్లో 13 షెడ్లు ఉన్నాయి. ఒక్కో షెడ్‌కు ఒక టీమును ఏర్పాటు చేశారు. ఈ టీములు రైతులు మార్కెట్‌కు తెచ్చిన ఉల్లి నాణ్యతను పరిశీలించి గ్రేడ్లు ఇస్తుంది. ఇందుకు అనుగుణంగా ధరలు రావాల్సి ఉంది. గ్రేడ్‌కు తగిన ధర లభించకపోతే వ్యాపారులపై చర్యలు తీసుకుంటారు. ఉల్లికి ప్రభుత్వం మద్దతు ప్రకటించడంతో మార్కెట్‌కు ఉల్లి పోటెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నారు. కర్నూలు రెవెన్యూ డివిజన్ రైతులు సోమ, బుధ, శుక్రవారాల్లో మాత్రమే మార్కెట్‌కు ఉల్లి తెచ్చుకొని విక్రయించుకోవాల్సిఉంది. ఆదోని రెవెన్యూ డివిజన్ రైతులు మంగళ, గురువారాల్లో, నంద్యాల రెవెన్యూ డివిజన్ రైతులు శనివారం మాత్రమే ఉల్లిని తెచ్చు కోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ రైతులకు సూచించారు. మార్కెట్లోకి ఉల్లిని ముందు రోజు సాయంత్రం నుంచి ఉదయం 9 గంటల వరకు మాత్రమే అనుమతించబడుతుందని వివరించారు. రైతులు మార్కెట్‌కు వచ్చేటపుడు ఆన్లైన్ అడంగల్, ఆధార్ కార్డు , బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ తీసుకరావాలని సూచించారు. ప్రతి రైతుకు రైతు గుర్తింపు కార్డు ఇస్తారు. ఇందులో రైతుల భూముల వివరాలు నమోదు చేస్తారు. ఇందులో ఎన్ని ఎకరాల్లో ఉల్లి సాగు చేసింది ఉంటుంది. రైతులు ఈ కార్డుపై సంబంధిత వీఆర్ఓ, తహసీల్దారు సంతకాలు చేయించి మార్కెటింగ్ శాఖ అధికారులకు అప్పగించాలి. ఆ తర్వాతనే రైతుల బ్యాంకు ఖాతాకు మద్దతు మొత్తాన్ని జమ చేస్తారు. రూ.50 నుంచి రూ.300 వరకు ఉల్లికి ధర లభిస్తే ఆ రైతులకు ప్రభుత్వం రూ.300 మద్దతు చెల్లిస్తుంది. రూ.400 ధర లభిస్తే రూ.200, రూ.500 ధర లభిస్తే రూ.100 ప్రకారం మద్దతును చెల్లిస్తారు.గరిష్టంగా క్వింటాలుకు రూ.300 మద్దతు కి ంద చెల్లిస్తామని మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణచౌదరీ తెలిపారు. -
ఉల్లి రైతుల గోడు పట్టదా?
-
రేపటి నుంచి ఉల్లి క్రయ,విక్రయాలపై నిఘా
–ఎకరాలకు 80 క్వింటాళ్లకు మద్దతు వర్తింపు కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి క్రయ, విక్రయాలు ఈ నెల18 నుంచి జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో జరుగుతాయి. యథావిధిగా వేలంపాట ద్వారా ఉల్లి క్రయ, విక్రయాలు జరుగుతున్నా మద్దతు ధర ఇస్తున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ఇందుకు రెవెన్యూ అధికారులతో ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు. ఉల్లి నాణ్యతకు అనుగుణంగా వేలంపాటలో ధరలు లభిస్తున్నాయా.. నాణ్యత బాగున్నా....తక్కువ ధర లభించిందా.. ఇందుకు కారణాలు ఏమిటీ అనే దానిని ఈ బృందం పర్యవేక్షిస్తుంది. గ్రేడింగ్‌లు నిర్ణయించేందుకు ఉద్యాన అధికారులు, మార్కెటింగ్ అధికారులతో మరో బృందం ఏర్పాటైంది. ఒక ఎకరాకు గరిష్టంగా 80 క్వింటాళ్ల ఉల్లికి మద్దతు ధర లభిస్తుంది. ఇన్ని ఎకరాల వరకు మద్దతు ఇస్తామనే నిబంధన లేదు. అయితే వెబ్‌ల్యాండ్Š లోని భూముల వివరాలు, ఇ క్రాప్ బుకింగ్ వివరాలు పరిశీలించిన తర్వాత సక్రమంగా ఉంటే మద్దతు వర్తింప చేస్తారు. గ్రేడింగ్‌లోకి రాని ఉల్లికి ఎటువంటి మద్దతు ఇవ్వడం ఉండబోదని మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణచౌదరి తెలిపారు.వేలంపాటలో రూ.50 నుంచి రూ300 వరకు ధర లభించినా ప్రభుత్వం మద్దతు రూ.300 లభిస్తుందని ఆయన తెలిపారు. గరిష్టంగా రూ.300 మాత్రమే మద్దతు ఇస్తామని వివరించారు. రూ.400 లభిస్తే ప్రభుత్వ మద్దతు రూ.200, రూ.500 ధర లభిస్తే మద్దతు రూ.100 లభిస్తుందని వివరించారు. రీ సైక్లింగ్‌కు తావులేకుండా కట్టుడిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఉల్లి ఎక్కువగా పండే రైతులు వారంలో మూడు రోజులు, ఆదోని డివిజన్ రైతులు రెండు రోజులు, నంద్యాల డివిజన్ రైతులకు ఒక్క రోజు ఉల్లి తెచ్చుకొని అమ్మకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
ఉల్లి బంధం తెగుతోంది
– తాడేపల్లిగూడెం మార్కెట్‌కు రాకుండా ప్రతిబంధకాలు – కర్నూలు ప్రజాప్రతినిధుల రాజకీయాలు – అక్కడి మార్కెట్లోనే విక్రయించాలని ఆదేశాలు – సీజన్లో తగ్గిన ఉల్లిపాయల రాక తాడేపల్లిగూడెం : రాష్ట్రంలో ఉల్లిపాయలకు పుట్టిల్లు కర్నూలు అయితే మెట్టిల్లు తాడేపల్లిగూడెం. ఇది ఈనాటిది కాదు 50 ఏళ్లకు పైనుంచి కొనసాగుతున్న వాణిజ్య బంధం. ఉల్లి అక్కడ పండితే పంటంతా తాడేపల్లిగూడెం మార్కెట్‌కు రావాల్సిందే. ఇది వ్యాపార సూత్రంగా కాకుండా రైతు నమ్మకానికి ప్రతీకగా కర్నూలు ఉల్లివ్యాపారం అనాధిగా సాగుతోంది. తాము పడ్డ కష్టానికి తగ్గ ప్రతి «ఫలం గూడెం మార్కెట్లో వస్తుందనేది అక్కడి ఉల్లి వ్యాపారుల విశ్వాసం. తాడేపల్లిగూడెంలోని గుత్త వ్యాపారులు కర్నూలులోని ఉల్లి రైతులకు వడ్డీ లేకుండా పెట్టుబడులు సమకూరుస్తారు. రైతులు పండించిన సరుకును లారీలలో గూడెం మార్కెట్‌కు తీసుకువస్తారు. ఇక్కడ బహిరంగ పాట ద్వారా ఉల్లిపాయలను వ్యాపారులు విక్రయిస్తారు. విక్రయం ద్వారా వచ్చిన సొమ్ములో కమీషన్ తీసుకుని మిగిలిన సొమ్మును రైతులకు ఇస్తారు. కర్నూలులో ఈ తరహా పద్ధతిలేదు. పైగా గూడెం వ్యాపారులకు కర్నూలు రైతులపై నమ్మకం ఎక్కువ. వెయ్యి బస్తాల సరుకు తెస్తే ఒక బస్తా కిందపోసి నాణ్యతను చూసి మిగిలిన 999 బస్తాలలో అదే తరహా నాణ్యతను ఉంటుందని నమ్మి పాట పెడతారు. కర్నూలు యార్డుకు వెయ్యిబస్తాల ఉల్లిని రైతులు తీసుకెళితే ఆ బస్తాలలోని సరుకును కింద పోస్తారు. నాణ్యతను బట్టి ధర ఇస్తారు. గూడెం మార్కెట్‌కు ఉల్లిపాయలను తీసుకురావడం వల్ల మరో వెసులుబాటు కూడా రైతులకు ఉంది. సరుకులు తీసుకొచ్చే సమయంలో మార్కెట్లో అననుకూల పరిస్థితుల కారణంగా ధర రాక, కిరాయిలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి ఉంటే కిరాయి సొమ్మును, అవసరమైతే రైతులకు అవసరమైన డబ్బును ఇక్కడి వ్యాపారులు ఇచ్చి పంపుతారు. అక్కడి రైతులపై నమ్మకంపై ఇక్కడి వ్యాపారులు ప్రతి సీజన్లో రూ.100 కోట్ల వరకు పెట్టుబడులుగా రైతులకు సమకూరుస్తున్నారు. రెండేళ్లుగా సంక్షోభం కర్నూలు ఉల్లిపాయల వ్యాపారంతో గూడెం వ్యాపారులు లాభపడుతున్నారని భావించి పౌరసరఫరాల శాఖ మంత్రి ఆదేశాలతో ఉల్లిపాయలను కర్నూలులోనే విక్రయించాలనే ఆదేశాలు ఇచ్చారు. దీనిని అమలుచేయడానికి అధికారులు పక్కా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ విధానంలో గూడెం వ్యాపార విధానానికి, కర్నూలు యార్డు వ్యాపార విధానానికి వ్యత్యాసాలు ఉన్న నేపథ్యంలో రైతులు నష్టపోతూ వస్తున్నారు. దీంతో రెండు రకాల సెస్‌లు కట్టి ఉల్లి రైతులు సరుకును గూడెం మార్కెట్‌కు తెస్తున్నారు. అయ్యినా ఉల్లి వ్యాపారంలో రెండేళ్లుగా సంక్షోభం నెలకొంది. ఈ ఏడాది ఉల్లి రైతుల శ్రమ అక్కరకు రాకుండా పోయింది. సాగు విస్తీర్ణం పెరగడం, ఇక్కడి ఉల్లిపాయకు నిల్వ ఉండే గుణం లేకపోవడంతో గుత్త మార్కెట్లో క్వింటాలు ఉల్లి రూ.100కి పడిపోయింది. నెలరోజులు ఇదే విధంగా ధర కొనసాగడంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.600 మద్దతు ధర ఇస్తామని ఓ ప్రకటన చేసింది. ఈ కారణంగా కర్నూలు వ్యాపారులు తాడేపల్లిగూడెంకు ఉల్లి తీసుకురాకుండా అక్కడి యార్డుకే సరకు తరలించారు. అయితే అక్కడ డిమాండ్ లేకపోవడంతో సరుకు విక్రయించుకోలేకపోతున్నారు. ఆ సరుకు కుళ్లిపోవడంతో నేలపై పారబోసుకుంటున్నారు. గూడెంకు నిలిచిన ఉల్లి రవాణా కర్నూలు ఉల్లిపాయలను తాడేపల్లిగూడెం మార్కెట్‌కు రైతులు తరలించకుండా అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు అడ్డుకుంటున్నారు. దీని ప్రభావంతో ఆదివారం ఇక్కడి గుత్త మార్కెట్‌కు 20 లారీల సరుకు కూడా రాలేదు. వాస్తవానికి ఈ సీజన్లో కర్నూలు ఉల్లిపాయలు వారానికి 1,500 లారీలు రావాలి. అలాంటిది 40 లారీల సరుకు మాత్రమే వస్తోంది. ఈ ఆదివారం ఆ పరిస్థితి కూడా లేదు. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉల్లి బంధం పూర్తిగా తెగిపోయినట్టే. అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన రాహిత్యంతో తీసుకున్న చర్యలు కారణంగా ఇక్కడి వ్యాపారులు కోట్లలో నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఈ సీజన్ కోసం పెట్టిన పెట్టుబడుల్లో అమ్మకాల ద్వారా కనీసం 25 శాతం సొమ్ములు కూడా రాలేదు. ప్రత్యామ్నాయం వైపు రైతుల చూపు ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్లో కర్నూలు ఉల్లిపాయల ధర పతనమైంది. ఎకరానికి రూ.50 వేల వరకు పెట్టుబడి అవుతుంది. కనీసం పది టన్నుల దిగుబడి వస్తే పెట్టుబడులు పోను కొంచెం లాభం మిగులుతుంది. ఈ సీజన్లో క్వింటాల్ నాణ్యమైన ఉల్లి రూ.800 మించి పలకలేదు. ఇదే సమయంలో మహారాష్ట్ర ఉల్లిపాయలు కూడా అదే ధరకు లభిస్తుండడం, వాటికి నిల్వ ఉండే గుణం ఉండడంతో వాటినే వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తామన్న మద్దతు ధర ఇచ్చినా రైతులకు రెక్కల కష్టం కూడా రాని పరిస్థితి. దీంతో కర్నూలు రైతులు ఉల్లిని వదిలి ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నారు. -
ఉల్లి కొనుగోళ్లపై ప్రత్యేక నిఘా
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి కొనుగోళ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని మార్కెటింగ్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... అర్హులైన ప్రతి రైతుకు మద్దతు ధర (క్వింటాల్‌కు రూ.600) వర్తించే విధంగా చూడాలన్నారు. మార్కెట్‌కు కమీషన్ ఏజెంటు వారీగా.. వచ్చే ఉల్లి నాణ్యతను బట్టి గ్రేడులు ఇవ్వాలని, ఏ గ్రేడ్‌కు దాదాపు రూ.600 ఆపైన ధర లభించాల్సి ఉందని, బీ, సీ గ్రేడ్లకు రూ.400 నుంచి రూ.450 ధర లభించాలని అలా కాకుండా అతి తక్కువ ధరలు రికార్డు అవుతే అక్రమాలు జరిగినట్లేనని వివరించారు. ఎలాంటి అక్రమాలకు తావు ఉండరాదని, ఇందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై తగిన ప్రణాళికలు తయారు చేసుకోని రావాలని వివరించారు. ఉల్లి కొనుగోళ్లు, నాణ్యత, ధరల నిర్ణయం తదితర వాటిని పరిశీలించేందుకు ప్రత్యేక టీములను వేస్తామని వివరించారు. ఉల్లి ధర క్వింటా రూ.50, 100కు పోతే ఏమి చేయాలనే దానిపై కూడ తగిన సూచనలతో రావాలని వివరించారు. అవసరమైతే ఉల్లి కొనుగోళ్ల ప్రక్రియ కలెక్టరేట్ ఆద్వర్యంలో నిర్వహిసామని తెలిపారు. సెప్టెంబర్ నుంచి మార్కెట్లో ఉల్లి అమ్మిన రైతుల జాబితాలను తయారు చేయాలని వివరించారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రంలోగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని..14నుంచి కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని వివరించారు. సమావేశంలో మార్కెటింగ్‌శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి, ఉద్యానశాఖ ఏడీ రఘునాథరెడ్డి, కర్నూలు మార్కెట్ కమిటీ కార్యదర్శి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
తూచ్..!
- ఉల్లి మద్దతు ధర కొందరికే - సెప్టెంబర్ నుంచి అమ్మిన వారికే వర్తింపు - అంతకు ముందు అమ్మకున్న రైతులకు మొండి చేయి - ప్రభుత్వ నిర్ణయంపై రైతుల మండిపాటు - కేవలం 30 శాతం మందికే మద్దతు వర్తింపు కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి రైతులందరికీ మద్దతు ధర ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాటమార్చింది. కర్నూలు మార్కెట్లో పంటను అమ్ముకున్న రైతులకు మాత్రమే సెప్టెంబర్ 1 నుంచి దీనిని అమలు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అంతకు ముందు ఉల్లి అమ్ముకున్న రైతులు నష్టపోనున్నారు. ఖరీప్ ప్రారంభం నుంచి కర్నూలు మార్కెట్లో ఉల్లి కొనుగోళ్లు జరిగాయి. కాని సెప్టెంబర్ నుంచి మద్దతు ధర ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో అన్నదాతలు ఆందోళనకు గురువుతున్నారు. రాష్ట్రంలో ఉల్లి అత్యధికంగా పండించే జిల్లా కర్నూలు. సాధారణ సాగు 20,746 హెక్టార్లు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 25, 500 హెక్టార్లలో సాగైంది. హెక్టారుకు కనీసం పెట్టుబడి వ్యయం రూ.1.20 లక్షల వరకు వస్తుంది. దిగుబడులు 150 క్వింటాళ్ల వరకు వస్తాయి. క్వింటాళుకు కనీసం రూ.1000 ధర ఉంటే రైతులకు పెట్టుబడి వ్యయం తిరిగివస్తుంది. ఖరీప్‌లో సాగు చేసిన ఉల్లి పంట జూలై నుంచి మార్కెట్లోకి వస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది క్వింటా ధర రూ.50 నుంచి 150 వరకు పలికింది. కర్నూలు మార్కెట్‌కు అనంతపురం, వైఎస్ఆర్ జిల్లా, ప్రకాశం జిల్లాల రైతులు కూడా పంటను వచ్చారు. సెప్టెంబర్‌తో పోలిస్తే ఆగస్టులో అధికంగా మార్కెట్‌కు ఉల్లి వచ్చింది. ధరలు పడిపోవడంతో ఆగస్టులో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. ఉల్లి ధరలు పడిపోవడంతో ఆగస్టు నెలలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు మార్కెట్‌కు వచ్చి ధరలపై రైతులతో చర్చించారు. కనీస మద్దతు ధర ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు జూలై, ఆగస్టు నెలలను పక్కన పెట్టి సెప్టెంబర్ నుంచే మద్దతు ధరలను అమలులోకి తెస్తుండటంపై రైతులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వచ్చే ఏడాది పిబ్రవరి 28 వరకు ఇది అమలులో ఉన్నా.. వచ్చే నెల నుంచి మార్కెట్‌కు ఉల్లి రావడం తగ్గతుంది. అంటే కేవలం సెప్టెంబర్, అక్టోబరు నెలలో మార్కెట్లో ఉల్లి అమ్ముకున్న రైతులకు మాత్రమే మద్దతు ధర వర్తిస్తుంది. మార్కెట్‌కు వచ్చే ఉల్లి 60 శాతమే జిల్లాలో ఉల్లి భారీగా సాగైనా..కర్నూలు మార్కెట్‌కు 60శాతం మాత్రమే వస్తోంది. చాలా మంది రైతులు తాడేపల్లిగూడెంకు వెళ్తున్నారు. కొందరు పొలాల్లోనే దళారులకు అమ్ముకుంటున్నారు. ఆగస్టు చివరి నాటికే 30 శాతం మంది రైతులు కర్నూలు మార్కెట్లోనే అమ్ముకున్నారు. దీన్ని బట్టి చేస్తే 30శాతం మంది రైతులకే మద్దతు ధరలు వర్తిస్తున్నాయి. మొన్నటి వరకు రూ.600 ధరతో మార్కెటింగ్ శాఖ అధికారులు రైతుల వద్దకే వెళ్లి ఉల్లి కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఇండెంటు తక్కువగా ఇస్తుండటంతో 500 మంది రైతులకు కూడా న్యాయం జరుగలేదు. ఆర్థిక భారం తగ్గించుకనేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అనామత్ అమ్మకాలకు మద్దతు వర్తించదట... మార్కెట్‌కు ఉల్లి ఎక్కువగా వస్తుండటం, ధరలు పడిపోతుండటంతో వేలంపాట పూర్తి స్థాయిలో జరుగడం లేదు. మార్కెట్ ఉల్లిని తెచ్చిన రైతులు అమ్ముకొని వెళ్లాలంటే రోజులు పడుతుంది. అలాంటి సమయంలో మార్కెట్ కమిటీ అధికారులు అనామత్పై కొనుగోళ్లను ప్రొత్సహిస్తారు. అంటే వేలంపాటతో సంబంధం లేకుండా «కొనుగోలు చేయడం, అనామత్ అమ్మకాలు మార్కెట్ కమిటీ బీట్ పుస్తకంలో రికార్డు కావు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు అనామత్పై అమ్ముకున్న రైతులకు దక్కని పరిస్థితి ఏర్పడింది. బీట్ పుస్తకం ఆధారంగా మార్కెట్లో ఏఏ రైతులు ఏ ధరకు ఎన్ని క్వింటాళ్లు అమ్ముకున్నారనే వివరాలు ఉంటాయి. దీని ద్వారానే రూ.600 కంటే తుక్కవ ధరకు అమ్మకున్న రైతులకు బ్యాలెన్స్ అమౌంటును రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు, కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు... మద్దతు ధర కంటే తక్కువకు అమ్మకున్న రైతులకు మిగతా మొత్తాన్ని చెల్లించేందకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. చైర్మన్‌గా కలెక్టర్, వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్, కన్వీనర్‌గా మార్కెటింగ్ శాఖ ఏడీ, సభ్యులుగా ఉద్యానశాఖ ఏడీ, కర్నూలు మార్కెట్ కమిటీ సెక్రటరీలు ఉంటారు. మార్కెట్లో క్వింటాల్ ఉల్లికి రూ. 250 లభిస్తే మద్దతు ధర ప్రకారం మిగతా రూ.350 ప్రభుత్వం చెల్లిస్తుంది. మద్దతు ధరల నిమిత్తం రూ.20కోట్లు మంజూరు చేసింది. మార్కెట్‌కు వచ్చి ఉల్లి వివరాలు జూన్ 322 టన్నులు జూలై 857 టన్నులు ఆగస్టు 11562 టన్నులు సెప్టంబర్ 11027 టన్నులు -
ఉల్లిధర మరింత కిందకు..
తాడేపల్లిగూడెం : ఉల్లిపాయల ధర మరింత కిందకు వచ్చింది. ఆదివారం తాడేపల్లిగూడెం గుత్తమార్కెట్‌లో ఉల్లిపాయల గత వారం కంటే తక్కువగా అమ్మారు. కిలో రూ.10కే నాణ్యమైన మహారాష్ట్ర ఉల్లిపాయలు లభించాయి. మార్కెట్‌కు 60 లారీల సరుకు వచ్చినప్పటికీ మహారాష్ట్ర నుంచి వచ్చిన పాత రకం ఉల్లిపాయలనే కొనుగోలు చేయడానికి వ్యాపారులు మొగ్గుచూపారు. గుత్త మార్కెట్లో పాత రకం ఉల్లిపాయలు కిలో రూ.5 నుంచి రూ.9 వరకు పలికాయి. విడిగా కిలో రూ.10కి, రూ.12కి విక్రయించారు. కర్నూలు రకం ఉల్లిపాయలు ధర గుత్త మార్కెట్లో కిలో రూ.1 నుంచి రూ.5.50 వరకు విక్రయించారు. విడిగా కిలో రూ.5 నుంచి రూ.8 వరకు అమ్మారు. కూరగాయల ధరలు వారం రోజుల క్రితం ధరలతో పోలిస్తే కొంచెం అటుఇటుగా ఉన్నాయి. తెల్లవంకాయలు కిలో రూ.60, బీర, బెండ, దొండకాయులు కిలో రూ.40కి విక్రయించారు. దోసకాయల ధర కిలో రూ.24 వరకు ఉంది. చిక్కుళ్లు రూ.80, ఆకాకరకాయలు రూ.60, క్యారెట్, బీట్రూట్ కిలో రూ. 40 వంతున అమ్మారు. కంద కూడా ఇదే ధరకు లభించింది. చామదుంపల ధర కిలో రూ.40, టమాటాలు కిలో రూ. 30, బీన్స్ రూ.60, క్యాబేజీ రూ.16, కీరా దోస రూ.30, క్యాప్సికమ్ రూ.60 చేసి అమ్మారు. పునాస మామిడి ధర కిలో రూ.70 ఉండగా విడిగా కాయ రూ.15 చేసి విక్రయించారు. -
కన్నీరు మిగిల్చిన ఉల్లి
- మార్కెట్లో వ్యాపారుల ఇష్టారాజ్యం –లాట్లు సరిగా లేవంటూ వేలంపాట నిలిపేసిన వైనం – ధరలేక పంటను మార్కెట్లోనే వదిలేసిన రైతులు –మంగళవారం ఒక్క రోజే 20 మందిది ఇదే పరిస్థితి కర్నూలు(అగ్రికల్చర్): నందికొట్కూరు మండలం వడ్డెమానుకు చెందిన శేషారెడ్డి కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 250 బస్తాల ఉల్లిని తీసుకొచ్చారు. నాణ్యత బాగానే ఉన్నా వ్యాపారులు క్వింటాకు రూ.100కు మించి ధర పెట్టలేదు. రైతు మాత్రం రెండు ఎకరాల్లో సాగు చేసి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు.మార్కెట్లో కొనుగోలు దారులు కేవలం రూ100 కే అడగడంతో రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. రవాణ చార్జీలు, ఉల్లిని తెంపడానికి అయిన ఖర్చులు కూడ గిట్టుబాటు కాకపోతుండటంతో మానసిక వేదనకు గురైన రైతు తెచ్చిన ఉల్లిని మార్కెట్లోనే వదిలేసి వెల్లాడు. – సి.బెళగల్ మండలం పొన్నకల్‌కు చెందిన నాగన్న తెచ్చిన ఉల్లిని వ్యాపారులు కేవలం క్వింటా రూ.120 ప్రకారమే కొనుగోలు చేశారు. ఎకరాలో సాగు చేయగా దాదాపు 50వేలు పెట్టుబడి పెట్టారు. పంటను అమ్మితే రూ.10వేలు కూడా రాలేదు. దీంతో ఆ రైతు అందోళన అంతా, ఇంతా కాదు. ఇలాంటి రైతులు జిల్లావ్యాప్తంగా వేలాదిగా ఉన్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. ఒకవైపు ధరలు పూర్తిగా పడిపోవడం, మరోవైపు అసలు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఆందోళనకు గురవుతున్న రైతులు తెచ్చిన ఉల్లిని వదిలేసి వెళ్తున్నారు. మంగళవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు ఉల్లి భారీగా వచ్చింది. అయితే కొనుగోలులో నిర్లక్ష్యం నెలకొంది. జంబోషెడ్‌లో ఉల్లి బస్తాలను అస్తవ్యస్తంగా వేశారనే కారణంతో వ్యాపారులు వేలం పాట నిర్వహించలేమని చేతుతెత్తేశారు. ఇలా అడ్డదిడ్డంగా బస్తాలు వేస్తే ఉల్లి కొనేది లేదంటూ వేలంపాట బంద్ చేశారు. ధరలు పూర్తిగా పడిపోవడం, ఏదో ఒక ధరకు అమ్మకొనివెళ్లిపోదామంటే వేలంపాట నిర్వహించకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. పలువురు రైతులు ఉల్లిని మార్కెట్లోనే వదిలేసి వెల్లిపోయారు. మంగళవారం ఒక్క రోజే దాదపు 20 మంది రైతులు ఉల్లిని వదిలేసి వెల్లిపోయారు. మార్కెట్ కమిటీ అధికారులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. అధిక ధరలను చూపుతున్న మార్కెట్ కమిటీ.... కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ.. ధరలను ప్రకటించడంలో రైతులను దగా చేస్తోంది. ధరలు పూర్తిగా పడిపోయి అల్లాడుతున్నా అధిక ధరలున్నట్లు ప్రకటిస్తోంది. వ్యాపారులు రూ.50 నుంచి వేలంపాట ప్రారంభంచి అనేక లాట్లకు రూ.100. 120, 150 మాత్రమే ధర లభిస్తున్నా దీనిని అధికారులు మరుగున పెడుతున్నారు. కనిష్ట ధర రూ.300, 310గా ఉన్నట్లు చూపుతున్నారు. తక్కువ ఎక్కువ ధరలను ప్రకటించడంలో మార్కెట్ కమిటీ రైతులను దగా చేస్తుందనే విమర్శలున్నాయి. అధిక ధర రూ.700, రూ. 800గా ఉంది. అది కూడా కేవలం ఒక లాట్‌కు మాత్రమే అభిస్తున్నా దానిని అధికంగా ప్రచారం చేస్తుండటం గమనార్హం. -
కన్నీటి పంట
– పడిపోయిన ఉల్లి ధర – ఖర్చులూ దక్కకపోవడంతో పొలం గట్లపై పోస్తున్న రైతులు – వెంకటగిరిలో గొర్రెలకు వదలిన వైనం ఎమ్మిగనూరురూరల్: ఉల్లి పంట వినియోగదారులకు బదులు రైతుకే కన్నీరు తెప్పిస్తోంది. ధర పూర్తిగా పడిపోయి ఖర్చులు కూడా దక్కని పరిస్థితి నెలకొనడంతో చాలా మంది రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. కొందరు పొలం గట్లకు పోసి రబీలో ఇతర పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. మండల పరిధిలోని వెంకటగిరి గ్రామంలో గొల్ల రంగన్న అనే రైతు తన రెండెకరాల ఉల్లి పంటను గొర్రెలకు మేపుతున్నాడు. పెట్టుబడి కింద ఖర్చు చేసిన లక్షరూపాయలు మట్టిలో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. మండల పరిధిలో 1155 హెక్టార్లలో ఉల్లి సాగైంది. ప్రధానంగా ఎర్రకోట, గుడేకల్, పార్లపల్లి, కలుగోట్ల, కడిమెట్ల, మల్కాపురం, బనవాసి, దైవందిన్నె, చెన్నాపురం, సిరాలదొడ్డి, గువ్వలదొడ్డి గ్రామాల రైతులు సాగుచేశారు. దిగుబడులు చేతికొచ్చిన తర్వాత క్వింటా కనీస ధర రూ. 150 పలుకుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటను మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు బాడుగలు కూడా రావడం లేదని పేర్కొంటున్నారు. దీంతో పంటను పొలంలోనే వదిలేస్తున్నారు. మరికొందరు కోతలు కూడా లేకుండానే వదిలిపెడుతున్నారు. పెట్టుబడికోసం తెచ్చిన అప్పులు తడిసిమోపెడవడంతో వాటిని ఎలా చెల్లించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. -
మద్దతు కొంతే!
–తూతూ మంత్రంగా ఉల్లి కొనుగోలు –రైతు కష్టాలను పట్టించుకోని ప్రభుత్వం – తెలంగాణలో క్వింటా రూ.800 – ఏపీ రూ.600తో కొనుగోళ్లు కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి రైతుకు మద్దతు ధర అందడం లేదు. తెలంగాణ ప్రభుత్వం క్వింటా రూ.800 ఆపై ధరకే కొనుగోలు చేస్తుంటే ఏపీ ప్రభుత్వం రూ.600తో సరిపెడుతోంది. గత ఏడాది ఉల్లి ధరలు భారీగా పెరిగి వినియోగదారులు ఆందోళన చెందుతున్న సమయంలో క్వింటా ఉల్లిని రూ.4000 ప్రకారం కొనుగోలు చేసిన విషయం విదితమే. రైతులు నష్టపోతున్న పరిస్థితుల్లో మద్దతు ధర ఇవ్వకుండా కొనుగోళ్లు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది జిల్లాలో 24వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేశారు. మహారాష్ట్రలో ఉల్లి పంట ఎక్కువగా ఉండటం, అన్ని ప్రాంతాల్లోను ఉల్లి సాగు చేపట్టడంతో డిమాండ్ తగ్గింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు తగ్గిపోయాయి. గతంలో ధరలు తగ్గినా క్వింటాల్‌కు కనీసం రూ.400 నుంచి రూ.500 వరకు లభించేది. ఈ సారి అది రూ.50 నుంచి 150 వరకు ఉండటంతో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. రవాణా ఖర్చులు కూడ గిట్టడంలేదంటే అన్నదాతలు ఆవేదన వ్యక్త ంచేస్తున్నారు. తూతూ మంత్రంగా కొనుగోళ్లు... గత నెల చివరి వారంలో ధరలు పడిపోవడంతో రైతుల చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. క్వింటాలు రూ.600 ప్రకారం కొనుగోలు చేపట్టింది. అయితే ఇది కూడా నామమాత్రమే. రోజుకు సగటున 50 టన్నులు కూడ కొనడం లేదు. ప్రభుత్వం ఇండెంటు తక్కువగా ఇస్తుండటం, ఒక్కో రోజు అసలు ఇవ్వకపోవడంతో ఉల్లి కొనుగోళ్లు తగ్గాయి. ఇండెంట్ తక్కువ ఇస్తుండటంతో ఒత్తిళ్ల మేరకు వీఐపీల ఉల్లినే కొనుగోలు చేయాల్సి వస్తోంది. సాధారణ రైతులు పండించిన ఉల్లిని పట్టించుకునే దిక్కులేదు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రస్తుతం రోజుకు 6000 క్వింటాళ్ల ఉల్లి వస్తోంది. వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాత్రం క్వింటా రూ.800తో కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఈ ధరతో ప్రభుత్వం ఎపుడు కొనుగోలు చేస్తుందని రైతులు ఎదురు చూస్తున్నారు. పెట్టుబడి రూ.50 వేలు.. ఉల్లి సాగులో ఎకరాకు సగటున రూ. 50 వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. ఎకరాకు మంచి పంట అంటే 50 క్వింటాళ్లు వస్తుంది. కొద్దిరోజులుగా కర్నూలు వ్యవసాయ మార్కెట్లో 50 శాతం మంది రైతులకు లభిస్తున్న ధర కేవలం రూ.200 వరకు మాత్రమే ఉంది. అంటే ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెడితే రూ.10 వేలు వస్తుంది. పండించిన ఉల్లిని మార్కెట్‌కు తీసుకరావాలంటే క్వింటాలుకు రూ.100 వరకు ఖర్చు వస్తుంది. అంటే మార్కెట్‌కు తరలించడానికే రూ.5000 ఖర్చు అవుతోంది. కోత ఖర్చులు, హమాలీ చార్జీలు, కమీషన్ ఏజెంటు కమీషన్ ఇతర ఖర్చులు తీసివేస్తే రైతులకు మిగులు అంటూ ఏమి ఉండటం లేదు. రూ.1000 మద్దతు ధర ఇవ్వాలి: చిన్న రామాంజనేయులు, గుమ్మకొండ, డోన్ మండలం నేను 400 ప్యాకెట్ల ఉల్లిని మార్కెట్‌కు తెచ్చాను. వ్యాపారులు రూ.100 ప్రకారం కొనుగోలు చేస్తామన్నారు. ఈ ధరతో అమ్మకుంటే కేవలం రవాణా చార్జీలు మాత్రమే లభిస్తాయి. పెట్టుబడి మొత్తం బూడిదలో పోసినట్లు అవుతోంది. క్వింటాకు కనీసం రూ.1000 మద్దతు ధర ఇవ్వాలి. అపుడే రైతులకు పెట్టుబడి లభిస్తుంది. -
తల్లడిల్లిన ఉల్లి రైతు
కర్నూలు : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉల్లికి మార్కెట్లో ధర పడిపోయింది. దీంతో ఎక్కడి సరుకు అక్కడే నిలిచిపోయి.. కనుచూపు మేరా ఉల్లి కనిపిస్తుంది. గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ముసురు కారణంగా గురువారం వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో బస్తాల్లోనే మొలకలు వస్తున్నాయి. కుళ్లిపోయిన మూటలు పశువులు తింటున్న దశ్యాలు, కుళ్లిపోయిన ఉల్లిలో నుంచి మంచి గడ్డలు వేరుస్తున్న తల్లీ కొడుకు, వర్షానికి తడిచిపోతున్న మూటలను రిక్షాలో వేరే చోటికి తరలిసున్నారు. -
సిండి‘కేట్లు’
క్వింటా ఉల్లి ధర రూ.100 – సరుకు బాగుంటే సైగలతో సిండికేట్ – ఎకరాకు కనీస పెట్టుబడి రూ.50వేలు – దిగుబడి అమ్మితే వచ్చేది రూ.9వేలు – రవాణా చార్జీలూ దక్కని వైనం – రోడ్డెక్కిన ఉల్లి రైతులు – దిగుబడులు పారబోసి నిరసన కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి రైతు దగా పడుతున్నాడు. ఒక్క ఏడాదిలో పరిస్థితి తలకిందులయింది. గత ఏడాది లాభాలను ఆర్జించిన రైతు ఈ విడత నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. క్వింటా ఉల్లి ధర రూ.100లకు పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో రోడ్డెక్కాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. వ్యాపారులు నాణ్యత కలిగిన ఉల్లి లాట్ కనిపిస్తే చాలు.. సిండికేట్ అయిపోతున్నారు. సైగలతో ధర పెరగకుండా జాగ్రత్త పడుతున్నారు. తక్కువ ధరతో కొనుగోలు చేసిన నాణ్యమైన ఉల్లిని ఆ తర్వాత పంచుకోవడం కర్నూలు మార్కెట్లో పరిపాటిగా మారింది. బుధవారం వేలం రూ.50లతో మొదలుపెట్టి రూ.100లకే ముగించడం రైతుల ఆగ్రహానికి కారణమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు క్వింటా ఉల్లి రూ.700 ప్రకారం కొంటున్నట్లు చెబుతుండగా.. ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉండటం గమనార్హం. రిటైల్ మార్కెట్లో ఒక మాదిరి నాణ్యత కలిగిన ఉల్లి కిలో రూ.10 చొప్పున విక్రయిస్తుంటే.. మార్కెట్లో క్వింటా ధర రూ.100 ప్రకారం కొంటామని వ్యాపారులు చెప్పడం రైతులను కలచివేస్తోంది. సీఎం డౌన్‌డౌన్ మోసపూరిత వేలం పాటను బంద్ చేయించిన రైతులు మూకుమ్మడిగా రోడ్డెక్కారు. సీఎం డౌన్ డౌన్ అంటూ ధర్నా చేపట్టారు. ఉదయం 11 గంటలకు మొదలైన ఆందోళన మధ్యాహ్నం ఒంటి గంటకు పైగా సాగింది. చూడండి.. ఈ ఉల్లి బాగోలేదా అంటూ బస్తాల కొద్దీ ఉల్లిని రోడ్డుపై గుమ్మరించారు. ధర్నాతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తంభించింది. ఆ తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ వద్ద చర్చలు జరుగుతున్నాయంటూ పోలీసులు రైతులచేత బలవంతంగా ధర్నాను విరమింపజేశారు. రైతులకు సీపీఎం నేతలు మద్దతుగా నిలిచారు. గత ఏడాది రూ.4వేలతో కొనలేదా? ‘‘గత ఏడాది ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం క్వింటా రూ.4వేలతో కొనుగోలు చేసి ప్రజలకు కిలో రూ.20 చొప్పున పంపిణీ చేసింది. ఇప్పుడు ధరలు పడిపోయిన నేపథ్యంలో కనీసం రూ.1000లతో కూడా కొనుగోలు చేయకపోవడం ఏమిటి.’’ అని రైతులు ప్రశ్నించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శమంతకమణి, కార్యదర్శి నారాయణమూర్తి, వైస్ చైర్మన్ దేవేంద్రరెడ్డిలు రైతుల వద్దకు చేరుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఉల్లి ధర పూర్తిగా పడిపోయిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ శమంతకమణి తెలిపారు. రైతులు నష్టపోకుండా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మార్కెటింగ్ శాఖ కమిషనర్‌ను కోరినట్లు చెప్పారు. తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారన్నారు. ఈ ఉల్లిలో నాణ్యత లేదా.. ఈ ఉల్లిలో నాణ్యత లేదా.. ఇదే ఉల్లిని రిటైల్‌గా కిలో రూ.10 ప్రకారం అమ్ముతున్నారు. మార్కెట్లో మాత్రం వేలం పాట రూ.50 దగ్గర మొదలు పెట్టి రూ.100 వద్ద ముగిస్తున్నారు. ఎకరాకు రూ.50 వేల పెట్టుబడి పెడితే.. ఇలా యాభై వంద రూపాయలకు అమ్మితే ఎట్లా బతికేది. రవాణా ఖర్చులు కూడా వస్తలేవు. – చిన్న రామాంజనేయులు, గుమ్మకొండ -
ఉల్లి రైతు కంట కన్నీరు
దిగుబడి గణనీయం.. ధర భారీ పతనం నాడు క్వింటా.. 4వేలు.. నేడు రూ.400 రైతులను పట్టించుకోని ప్రభుత్వం గుమ్మఘట్ట : జిల్లా వ్యాప్తంగా ఉల్లి రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గతేడాది సిరులు కురిపించిన ఈ పంట, ప్రస్తుతం కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆశించిన స్థాయిలో దిగుబడులు చేతికందినా, ధరలే కొంప ముంచాయంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా గుమ్మఘట్ట మండలంలో 2,200, రాయదుర్గం రూరల్‌లో 400, కణేకల్లులో 200, బొమ్మనహాళ్‌లో 60, డీ హిరేహాళ్ లో 100 ఎకరాల్లో ఉల్లి పంటలు సాగయ్యాయి. జిల్లాలోనే అత్యధికంగా గుమ్మఘట్ట మండలంలో ఉల్లి సాగు ఏటేటా పెరుగుతూనే ఉంది. ధర తారుమారు గత ఏడాది ఈ సమయానికి క్వింటాలు ఉల్లి రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు ధర పలికింది. అప్పుడు పంట సాగు చేసిన రైతులు మంచి లాభాలు చూశారు. ప్రస్తుతం ఇందులో సగం ధరలు కూడా లేకపోవడంతో కుదేలైపోయారు. క్వింటాలు ఉల్లి రూ. 300 నుంచి రూ. 400లోపే ధర పలుకుతోంది. దళారుల ఇష్టారాజ్యం.. రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో ఉల్లి పంట ఆనవాయితీగా సాగవుతున్నా.. సరైన మార్కెటింగ్ సౌకర్యం లేక రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. ఉల్లిని విక్రయించాలంటే రాజమండ్రి, కర్నూలు, చిత్తూరు, బెంగళూరు లాంటి పట్టణ ప్రాంతాలకు తరలించాల్సి వస్తోంది. దీన్నే అదనుగా తీసుకున్న దళారులు కొందరు ధర నిర్ణేతలుగా మారిపోతున్నారు. ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తూ రైతు నోట్లో మట్టికొడుతున్నారు. కేంద్రం స్పందించాలి గతేడాదితో పోలిస్తే ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. క్వింటాలు ఉల్లి రూ. 300 నుంచి రూ.400 లోపు పలికితే ఎలా గట్టెక్కాలో రైతుకు అర్థం కావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉల్లి ఎగుమతికి అనుమతించి, మద్దతు ధరలు పెంచేలా చూడాలి. లేదంటే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి. – ఉపేంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర నాయకుడు రైతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం ఉల్లి, టమాట, వేరుశనగ లాంటి ప్రధాన పంటలను కోల్పోయి రైతులు కకావికలమయ్యారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలే చేపట్టలేక పోయింది. రూ. లక్షల పెట్టుబడులు మట్టిలో కలిసిపోయాయి. రాయదుర్గంలో మార్కెటింగ్ సౌకర్యంతో పాటు రైతు పండించిన ప్రతి పంటకూ గిట్టుబాటు ధరలు కల్పించాలి. వేరుశనగ, ఉల్లి, టమాట రైతులను తక్షణం ఆర్థికంగా ఆదుకోవాలి. – కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం -
మార్కెట్ యార్డుల ద్వారా ఉల్లి కొనుగోలు
– కిలో రూ. 6 ప్రకారం ధర – రూ. కోటితో గిడ్డంగుల నిర్మాణం – ఆర్డీ వెంకట సుబ్బన్న కోవెలకుంట్ల : కర్నూలు, ఆదోని మార్కెట్‌యార్డుల్లో రైతుల వద్ద నుంచి కిలో రూ. 6 ప్రకారం ఉల్లి కొనుగోళ్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెట్‌యార్డు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటసుబ్బన్న తెలిపారు. కోవెలకుంట్ల మార్కెట్‌యార్డును మంగళవారం ఆయన తనిఖీ చే శారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం మార్కెట్‌యార్డుల ద్వారా ఉల్లి కొనుగోలు ప్రక్రియ చేపడుతున్నామన్నారు. కోవెలకుంట్ల మార్కెట్‌యార్డు ఆవరణలో పాత గోదాముల స్థా«నంలో రూ. కోటితో వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల్గిన గిడ్డంగి ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు చెప్పారు. గత ఏడాది యార్డుకు రూ. 69 లక్షల ఆదాయం సమకూరగా ఈ ఏడాది రూ. 83 లక్షలకు చేరిందన్నారు. కార్యక్రమంలో జేడీ సుధాకర్, మార్కెట్‌యార్డు చైర్మన్ గడ్డం నాగేశ్వరరెడ్డి, సెక్రటరీ శివశంకర్‌రెడ్డి, సూపర్వైజర్ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మళ్లీ రోడ్డెక్కిన ఉల్లి రైతు
– కొనుగోళ్లు ముందుగా నిలిపివేయడంపై ఆగ్రహం –మార్కెట్ కమిటీ అధికారులతో వాగ్వాదం కర్నూలు(అగ్రికల్చర్): స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రైతులు మళ్లీ రోడ్డెక్కారు. కొనుగోళ్లను సోమవారం సాయంత్రం 4 గంటలకే ముగించడంతో.. నాలుగైదు రోజులుగా మార్కెట్లో పడిగాపుల కాస్తున్న రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మార్కెట్లో ఉల్లి నిల్వలు పేరుకొనిపోయినా కొనుగోళ్లలో వ్యాపారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మార్కెట్ కమిటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మార్కెట్‌కు ఎదురుగా వెంకటరమణ కాలనీకి వెళ్లే రోడ్డులో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఉల్లి ఎక్కువగా ఉన్నా.. పూర్తిగా కొనకుండా అర్ధాంతరంగా కొనుగోళ్లు ముగించడం దారణమన్నారు. రైతుల ధర్నాతో రోడ్డుకు ఇరువైపు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నాల్గో పట్టణ పోలీసులు వచ్చి రైతులకు సర్ది చెప్పి ధర్నాను విరమింప చేసి మార్కెట్ కమిటీ కార్యదర్శి దగ్గరకు రైతులను తీసుకెళ్లారు. మార్కెట్‌కు సరుకు ఎక్కువగా వస్తోందని, సోమవారం ఒక్కరోజే 18 వేల ప్యాకెట్లు కొన్నారని కార్యదర్శి నారాయణమూర్తి తెలిపారు. కొన్న సరుకును తరలించుకోవాల్సి ఉన్నందున వేలంపాటను ముగించారన్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు వేలంపాట ప్రారంభించి మిగిలిపోయిన ఉల్లిని పూర్తిగా కొనుగోలు చేస్తామని వివరించారు. -
ఉల్లికిపాట్లు!
– జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణం – ఇప్పుడిప్పుడే వస్తున్న దిగుబడులు – పూర్తిగా పడిపోయిన ధరలు – రిటైల్ మార్కెట్లో కిలో రూ.15 – వ్యవసాయ మార్కెట్లో లభిస్తున్నది రూ.2 మాత్రమే – లబోదిబోమంటున్న రైతులు కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదంటారు. అయితే ఈ పంటను పండిస్తున్న రైతులకు మాత్రం ఎలాంటి మేలు కలగడం లేదు. మార్కెట్లో ధర లేక..కొనేవారు సైతం లేక అన్నదాత అవస్థలు అన్నీఇన్నీ కావు. రాష్ట్రంలో ఉల్లి పండించే జిల్లాలో కర్నూలు అగ్రస్థానంలో ఉంది. జిల్లాలో సాధరణ సాగు 19,147 హెక్టార్లు . అయితే ఈ ఏడాది 20,746 హెక్టార్లలో సాగైంది. అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి పంట సాగు ఎక్కువగా ఉంది. దీంతో డిమాండ్ పూర్తిగా పడిపోయింది. పైగా కర్నూలు వ్యవసాయ మార్కెట్లో బస్తాల్లోనే ఉల్లి కొనుగోలు చేసే పద్ధతి ఉండడంతో తాడేపల్లిగూడెంకు కాకుండా రైతులు ఉత్పత్తులను ఇక్కడికే తీసుకొస్తున్నారు. దీంతో మార్కెట్లో ఉల్లి నిల్వలు పేరుకపోతున్నాయి. కొనుగోలు చేసేవారేరీ? మార్కెట్లో నాలుగైదు రోజులు ఉన్నా.. ఉల్లిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా క్వింటాలుMýు లభిస్తున్నధర రూ.150 నుంచి రూ.300 వరకే ఉంటోంది. తెచ్చిన ఉల్లిని అమ్ముకోవాలంటే ఐదు రోజుల సమయం పడుతోంది. దీంతో రైతులపై ఖర్చుల మోత పెరుగుతోంది. మార్కెట్లో ఉల్లి నిల్వలు పేరుకపోవడంతో ఆదివారం కూడా ఉల్లిని కొనుగోళ్లు చేపట్టాలని తొలుత నిర్ణయించారు. అయితే హమాలీలు సహకరించలేదు. ధర తగ్గడంతో వ్యాపారులు కొనుగోలు చేయడంలో అలసత్వం వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సరకుపేరుకపోయినా అలస్యంగా వేలంపాట ప్రారంభించడం, ముందుగానే ముగిస్తుండటం రైతులకు శాపంగా మారుతోంది. బుధ,గురువారాల్లో వచ్చిన ఉల్లిని కూడా ఇంతవరకు కొనుగోలు చేయలేదంటే వేలంపాట ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించవచ్చు. మార్కెట్ మాయాజాలం.. మార్కెట్లో క్వింటాలు ఉల్లికి సగటున లభిస్తున్న ధర కేవలం రూ.150 నుంచి రూ.300 మాత్రమే. కాని రీటైల్‌గా కిలో ధర రూ.15 ఉంది. కర్నూలు సి. క్యాంపు రైతుబజార్ బయట మామూలు ఉల్లినే కిలో రూ.10, ఒకమోస్తరు నాణ్యత కలిగిన ఉల్లిని రూ16 ప్రకారం విక్రయిస్తున్నారు. అదే నాణ్యత ఉన్న ఉల్లిని మాత్రం వ్యాపారులు కిలో రూ. 1.50 నుంచి రూ.3 లెక్కన కొంటున్నారు. రైతులు ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ కావడం వల్లే ధరలు పడిపోయాయని విమర్శిస్తున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడుల్లో 30 శాతం కూడా రావడం లేదంటున్నారు. -
ఇంటిప్స్
మిరపకాయలు కోసే ముందు చేతులకు కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకుంటే మంట పుట్టదు. శెనగపిండి నిల్వ అయిపోతే పారేయాల్సిన అవసరం లేదు. దానిలో కాసింత నిమ్మరసం కలిపి పాత్రలు తోమితే తళతళలాడతాయి. చీజ్, పన్నీరు లాంటివి నిల్వ చేసే డబ్బాలో చిన్న బెల్లం ముక్క ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. సగం కోసిన ఉల్లిపాయ పాడవకుండా ఉండాలంటే... వెన్న రాసి ఉంచాలి. -
రైతును ముంచిన ఉల్లి కన్నీరు
♦ నాడు కొనలేక జనానికి చుక్కలు ♦ నేడు ధరలేక రైతు గగ్గోలు ♦ కిలో రూ.4కి పడిపోయిన రేటు ♦ దోచుకుంటున్న దళారులు ♦ నిల్వ సౌకర్యం లేక ఇక్కట్లు నాలుగు నెలల క్రితం.. ‘ఉల్లిగడ్డ’ వ్యాపారుల గోదాముల్లో ఉంది. మార్కెట్ లో ఉల్లి ధర బాంబై పేలింది. కిలో రూ.80 పలికింది. జ నం ఉల్లి కొనలేక.. కోయలేక ‘కన్నీళ్లు’ పెట్టారు. సర్కారు సబ్సిడీ ఉల్లి కేంద్రాలను పెట్టి ఉపశమనం కలిగించింది. ప్రస్తుతం.. ‘ఉలి’్ల రైతన్నల కల్లాల్లో ఉంది. దళారులంతా కుమ్మైక్కై రైతుకు చుక్కలు చూపిస్తున్నారు. మార్కెట్‌కు ఉల్లిగడ్డ తీసుకెళ్తే కిలో రూ.4కి మించట్లేదు. రెక్కల కష్టం దళారీ నక్కల పాలైపోతుంటే ఉల్లి రైతు ‘కన్నీళ్లు’ పెడుతున్నాడు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి నిన్నా మొన్నటి వరకు చుక్కలు చూపించిన ఉల్లి ధర ఇప్పుడు చప్పున చల్లారిపోయింది. గత ఏడాది ధర బాగా పలకటంతో ఈ ఏడాది రైతులు భారీగా ఉల్లి సాగు చేశారు. కలిసిరాని కాలంతో పోటీపటి స్వేదంతో సేద్యం చేసి ఉల్లి పండించారు. దిగుబడి కూడా బాగానే వచ్చింది. తీరా మార్కెట్లో రేటు ఒక్కసారిగా పడిపోయింది. పంట తీసుకొని మార్కెట్‌కు వెళ్తే గిట్టుబాటు ధర దేవుడెరుగు.. రవాణా ఖర్చులు కూడా రావటం లేదు. జిల్లాలో భారీగా సాగు.. జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈసారి విస్తారంగా ఉల్లి సాగు చేశారు. మనూరు, నారాయణఖేడ్, కల్హేర్, కంగ్టి, పెద్దశంకరంపేట మండలాల్లో కలిపి దాదాపు 15 వేల మంది రైతులు 10 వేల హెక్టార్లలో ఉల్లిసాగు చేసినట్లు అంచనా. ఈ ఏడాది కనీసం లక్ష క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ అధికారుల అంచనా. ఇక జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, జోగిపేట, జహీరాబాద్ నియోజకవర్గాల్లోనూ ఉల్లి సాగయింది. ఈ ఏడాది ఉల్లి దిగుబడి గణనీయంగా పెరిగింది. కానీ మార్కెట్లో గిట్టుబాటు ధర లేదు. ప్రస్తుతం కిలో ఉల్లి రూ.4-రూ.6 మధ్య పలుకుతోంది. ఈ ధర గడ్డ తోడే కూలీలు, రవాణా ఖర్చులకే సరిపోతోంది. మరోవైపు ఖేడ్‌లో ఇప్పటి వరకు వ్యవసాయ మార్కెట్ లేకపోవటంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. తరుగు, హమాలీ ఖర్చులూ రైతుల నుంచే గుంజుతున్నారు. ఈ లెక్కలన్నీ పోతే ఉల్లి రైతుకు కిలోకు రూ.3కి మించి గిట్టుబాటు అవడం లేదు. దిగుబడి భేష్.. గిట్టుబాటే ష్.. ఎకరా ఉల్లి సాగుకు సగటున రూ 60 వేల ఖర్చు వస్తోంది. నారాయణఖేడ్ పరిసర ప్రాంత పల్లెల్లో సగటున ఎకరాకు 45 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. నిజానికిది చాలా మంచి దిగుబడి. కల్లాల నుంచి ఉల్లిగడ్డ మార్కెట్‌కు తరలించాలంటే లోడ్‌కు కనీసం రూ 10 వేలు కిరాయి తీసుకుంటున్నారు. గడ్డ తోడినందుకు కూలీల ఖర్చు రూ 6 వేలు పోతోంది. మార్కెట్లో అమ్ముకుంటే క్వింటాలుకు రూ.800 నుంచి 1000 మాత్రమే వస్తున్నాయి. ఇక దళారులైతే రూ 400 నుంచి 600 కట్టిస్తున్నారు. -
రైతు బజార్లలో ఉల్లి విక్రయాలు
మార్కెటింగ్‌శాఖకు మంత్రి హరీశ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లి ధరలు గణనీయంగా తగ్గడంతో వినియోగదారులు, రైతులకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని రైతు బజార్లలో రైతులే నేరుగా ఉల్లిని విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర సగటున రూ. 20 ఉండగా హోల్‌సేల్ మార్కెట్లో రైతులకు కిలో రూ. 8కు మించి రేటు దక్కడం లేదు. రైతు బజార్లలో కిలోకు రూ. 11కు తక్కువ కాకుండా రైతులు ఉల్లిని అమ్ముకునేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఉల్లి విక్రయాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు సాగు అధికంగా ఉన్న మండలాల్లో మార్కెటింగ్, ఉద్యానవన శాఖ అధికారులు పర్యటిస్తారు. -
ఉల్లిని రైతులు నేరుగా బజార్లో అమ్మవచ్చు
హైదరాబాద్: ఇక నుంచి రైతు బజార్లలో రైతులు నేరుగా ఉల్లిగడ్డ అమ్మే సౌకర్యాలు కల్పించి వారిని ఆదుకోవాలని మార్కెటింగ్ శాఖమంత్రి హరీష్ రావు ఆ శాఖా అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు 70 శాతం రాయితీపై ఉల్లిగడ్డల విత్తనాలు సరఫరా చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. రైతు బజార్లలో ఒక కిలోకు 11 రూపాయలకు తక్కువ కాకుండా అమ్ముకోవటానికి ప్రత్యేక సదుపాయలు కల్పించాలని చెప్పారు. మంత్రి హరీష్ ఆదేశాలను అనుసరించి పర్యవేక్షణ అధికారి జంట నగరాలలో ఉన్న రైతు బజార్లలో ఎస్టేట్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, ఇందుకు సంబందించిన విధివిధానాలను రూపొందించారు. ఇందులో బాగంగా మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో ఉల్లిగడ్డ అత్యధికంగా పండించే మండలాలైన మొమిన్ పేట్, మర్ పల్లి, సిద్ధిపేట్, చేవెళ్ల, శంకర్ పల్లి, నవాబ్ పేట్, శివంపేట్ ప్రాంతాలలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించి, రైతు బజార్లలో తాము పండించిన ఉల్లి పంటను అమ్ముకునే విధంగా చూడాలని ఆదేశించారు. -
ఇంతింతై.. ఉల్లింతై..
* గ్రీన్హౌస్లో ఉల్లిసాగు... దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో.. * రంగారెడ్డి జిల్లా కీసరలోని రైతు క్షేత్రంలో ఉద్యాన శాఖ శ్రీకారం * నాలుగింతలు పెరగనున్న దిగుబడులు... 70 రోజుల్లోనే పంట * ఎకరాకు రూ.6లక్షల ఆదాయం.. ఒక్కో ఉల్లి గడ్డ బరువు 200 గ్రాములు సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యపరంగా ఉల్లి చేసే మేలు అందరికీ తెలిసిందే. ఆర్థికంగా అది కలిగించే మేలుపై తెలంగాణ ఉద్యాన శాఖ ప్రయోగం చేపట్టింది. అధిక దిగుబడి, అధిక ఆదాయం సాధించే దిశగా ఉల్లిసాగును చేపట్టింది. గ్రీన్హౌస్ (పాలీహౌస్)లో ఉల్లిసాగుకు తెలంగాణ ఉద్యానశాఖ నడుం బిగించింది. దేశంలోనే మొదటిసారిగా రంగారెడ్డి జిల్లా కీసరలో ఒక రైతు పొలంలో ఉల్లి సాగు చేపట్టింది. సాధారణంగా ఒక్కో ఉల్లి గడ్డ బరువు 60 నుంచి 70 గ్రాములుంటుంది. కానీ, గ్రీన్హౌస్లో పండించే ఉల్లి గడ్డ బరువు 180 నుంచి 200 గ్రాముల వరకు ఉంటుంది. ఉల్లి కొరతతో తెలంగాణ సతమతమవుతోన్న నేపథ్యంలో గ్రీన్హౌస్ ద్వారా అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. పబ్లిక్ గార్డెన్లో ప్రయోగం సక్సెస్ వాస్తవంగా గ్రీన్హౌస్లో పూలు, కూరగాయల సాగు చేపడతారు. దేశ, విదేశాల్లోనూ ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఉల్లి కొరత నేపథ్యంలో తెలంగాణ ఉద్యానశా ఖ ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల పబ్లి క్ గార్డెన్లో ఒక గ్రీన్హౌస్ నిర్మించి అందులో 50 ఉల్లి మొక్కలను నాటింది. అందులో ప్రయోగాత్మకంగా చే పట్టిన ఉల్లి సాగు విజయవంతమైంది. ఎకరా గ్రీన్హౌస్ సాగులో ఏకంగా 30 మెట్రిక్ టన్నుల ఉల్లి దిగుబడి వస్తుందని తేలింది. సాధారణంగా బయట క్షేత్రా ల్లో ఉల్లిని పండిస్తే కేవలం ఏడు మెట్రిక్ టన్నుల మేర కే దిగుబడి వస్తుంది. గ్రీన్హౌస్లో ఉల్లి సాగు వల్ల నాలుగింతల దిగుబడి వస్తుందని ప్రయోగం లో తేలడంతో రంగారెడ్డి జిల్లా కీసరకు చెందిన రైతు వెంకటేశ్వరరెడ్డిని ఉద్యానశాఖ సంప్రదిం చింది. అర ఎకరం భూ మిలో ఆ రైతు ఉల్లి సాగు చేపట్టారు. 75 వేల మొక్కలు నాటారు. 70 రోజుల్లో ఎకరానికి రూ. 6 లక్షల ఆదాయం సాధారణంగా ఉల్లి పంట 110 రోజులకు దిగుబడి వస్తుంది. అలాంటిది గ్రీన్హౌస్లో 70 రోజులకే పంట చేతికి వస్తుంది. సాధారణం కంటే నాలుగింతల దిగుబడి రానుండటంతో ఎకరాకు రూ. 6 లక్షల ఆదాయం సమకూరుతుందని ఉద్యానశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కీసర రైతు అర ఎకరానికిగాను రూ. 3 లక్షల ఆదాయం పొందుతారని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వెంటనే కొత్తమీర, దోసకాయ, క్యాప్సికం సాగు చేయాలని అధికారులు అతనికి సూచించారు. ఆ ప్రకారం ఏడాదికి అర ఎకరా భూమిలో కనీసంగా రూ. 10 లక్షల వరకు ఆదాయం పొందుతారని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. గ్రీన్హౌస్ ద్వారా మూడు నాలుగు పంటలు ఏడాదికి వేసే అవకాశం ఉంది. -
దేశంలో పూర్తిగా దిగివచ్చిన ఉల్లి ధర!
► ఇక ఎగుమతుల వృద్ధిపై కేంద్రం దృష్టి కనీస ఎగుమతి ధర రద్దు న్యూఢిల్లీ: దేశంలో ఉల్లి టోకు ధరలు భారీగా పడిపోయిన నేపథ్యంలో... ఇక వీటి ఎగుమతుల పెంపుపై కేంద్రం దృష్టి సారించింది. ఈ మేరకు కేంద్రం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కనీస ఎగుమతి ధరను (ఎంఈపీ) పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. దేశంలో ఉల్లి ధరలు త్రీవంగా ఉన్న సమయంలో కనీస ఎగుమతి ధరను ‘అధిక స్థాయిలో’ కేంద్రం నిర్ణయిస్తుంది. ఆ స్ధాయి ధర రాకుంటే... ఎగుమతులు చేయడం సాధ్యపడదు. దీనివల్ల దేశంలో సరఫరా పెరిగి ఉల్లి ధర దిగిరావాలన్నది లక్ష్యం. దేశంలో ఉల్లి ధర తీవ్రంగా ఉన్న ఆగస్టులో ఎంఈపీని టన్నుకు కేంద్రం 425 డాలర్ల నుంచి 700 డాలర్లకు పెంచింది. దేశంలో సరఫరాలు పెరగడంతో ఈ నెలారంభంలో తిరిగి 400 డాలర్లకు తగ్గించింది. తాజాగా ఎంఈపీని పూర్తిగా ఎత్తివేసింది. కేజీ హోల్‌సేల్ ధర రూ. 10కి పడిపోయిన నేపథ్యంలో ఎంఈపీని పూర్తిగా ఎత్తివేయాలని ఉల్లి ఉత్పత్తి అధికంగా ఉండే మహారాష్ట్ర కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. -
ఈ ఉల్లి బరువు 400 గ్రాములు!
సాధారణంగా ఉల్లిగడ్డ ఐదు నుంచి పది గ్రాములుంటుంది. బందరు ఉల్లి అయితే 100 నుంచి 150 గ్రాములు వరకు తూగుతాయి. కానీ శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రాంతంలో రైతులు సాగు చేస్తున్న ఉల్లిపాయలు ఒక్కో గడ్డ 350 నుంచి 450 గ్రాముల బరువు తూగుతున్నాయి. శుక్రవారం రేగిడి మండలం ఉంగరాడమెట్ట వద్ద విక్రయించేందుకు ఈ రాకాసి ఉల్లిని పాలకొండ వాసులు తీసుకురాగా.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. -రేగిడి -
ఉల్లికో విధానం
- ముసాయిదాను సిద్ధం చేసిన ఆస్కి - విత్తన సబ్సిడీ 75 శాతం పెంచే ప్రతిపాదన - రాయితీ కోసం ఇప్పటికే రూ.కోటి విడుదల సాక్షి, హైదరాబాద్: సాగు విస్తీర్ణం, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడంతో రాష్ట్రంలో ఏటా ఉల్లి కొరత ఏర్పడుతోంది. వినియోగదారులపై భారం తగ్గించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి ఉల్లిని సేకరించి, సబ్సిడీపై పంపిణీ చేయడం ప్రభుత్వానికి భారంగా మారింది. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి ‘ప్రత్యేక ఉల్లి విధానం’ శ్రేయస్కరమని ప్రభుత్వం భావిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఉల్లి సాగులో అనుసరిస్తున్న మెళకువలపై ఇప్పటికే రాష్ట్ర మార్కెటింగ్, ఉద్యానవన శాఖ అధికారులు నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా ఉల్లి పాలసీ విధి విధానాల రూపకల్పనపై ఉద్యానవన శాఖ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) సహకారాన్ని తీసుకుంటోంది. ఆస్కి ముసాయిదాను సిద్ధం చేసి ఉద్యానవన శాఖకు సమర్పించింది. వారం రోజుల్లో దీనికి తుది రూపునిచ్చే అవకాశముందని మార్కెటింగ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. నూతన విధానంలో ఉల్లి సాగును ప్రోత్సహించడం లక్ష్యంగా రైతులకు పలు రాయితీలను ప్రకటించనున్నట్లు సమాచారం. ఉల్లి దిగుబడులను ఎక్కువ కాలం పాటు నిల్వ చేసేలా గోదాముల నిర్మాణం, రైతులకు శిక్షణ, విత్తన సబ్సిడీ తదితరాలపై అందులో స్పష్టత ఇవ్వనున్నారు. విత్తనాలపై భారీ సబ్సిడీ ఇప్పటివరకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) ద్వారా ఉద్యానవన శాఖ 50 శాతం సబ్సిడీపై ఉల్లి విత్తనాలను సరఫరా చేస్తోంది. 2014-15లో 50 శాతం సబ్సిడీపై ఉల్లి విత్తనాలు రైతులకు ఇవ్వగా.. ఇప్పుడు దీన్ని 75 శాతానికి పెంచాలని నిర్ణయించారు. ఇందులో ఆర్కేవీవై 50 శాతాన్ని, 25 శాతాన్ని మార్కెటింగ్ శాఖ భరిస్తుంది. 2015-16లో 14 వేల ఎకరాలకు సరిపడేలా ఉల్లి విత్తనాల సరఫరాకు రూ.4.20 కోట్లు అవసరమవుతాయని అంచ నా వేశారు. 75 శాతం సబ్సిడీ కింద రూ.3.15 కోట్లు భరించాల్సి ఉండగా, మార్కెటింగ్ శాఖ తన వంతు వాటాగా ఇప్పటికే రూ.1.05 కోట్లు విడుదల చేసింది. -
ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు..
-
తగ్గుతున్న ఉల్లి మంట
-దేవరకద్ర మార్కెట్లో క్వింటా గరిష్ట ధర రూ. 2, 400 జనం కళ్ల వెంట నీళ్లు తెప్పించిన ఉల్లి ఘాటు తగ్గుముఖం పడుతోంది. వారం రోజులుగా ధరలు అందుబాటులోకి వస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా దేవకద్ర ఉల్లి మార్కెట్ లో గత వారం వేలంలో పలికిన ధరకన్నా.. ఈ వారం కొద్ది మేర తగ్గింది. బుధవారం మార్కెట్ లో జరిగిన వేలంలో గరిష్టంగా క్వింటాల్ ఉల్లిధర 2,400 పలుకగా.. కనిష్టంగా.. రూ 1,100 గా ఉంది. సీజన్ ప్రారంభంలో 4000 రూపాయలు ఉన్న ఉల్లి.. రెండు వారాలుగా తగ్గుముఖం పట్టింది. వర్షాలు కురవడం వల్ల మార్కెట్ కు వచ్చిన ఉల్లి పచ్చిగా ఉన్నా.. వ్యాపారులు కొనుగోలు చేశారు. కాగా.. హైదరాబాద్ మార్కెట్లో ధరలు తగ్గడం వల్లనే ఉల్లి ధర తగ్గుదల కనిపించిందని వ్యాపారులు అంటున్నారు. బుధవారం మార్కెట్‌కు దాదాపు వేయి బస్తాల ఉల్లి అమ్మాకానికి వచ్చింది. నిల్వ చేసుకోడానికి కావలసిన ఉల్లి రాక పోవడంతో కొనుగోలు దారులు ధరలు పెంచడానికి ఇష్టపడలేదు. బయట వ్యాపారులు స్థానిక వ్యాపారుల మధ్య కొంత వరకు పోటీగా వేలం సాగినా ధర మాత్రం అంతంత మాత్రమే దక్కింది. -
తెలసీ తెలసీ
ఎప్పుడూ ఇంతే! అతిగా మమేకమై అధికంగా బాధపడడం! నూరుశాతం ప్రేముండాలంటూ నూతిలో దూకి నిచ్చెనల సాయంతో పైకి రావడం ఉల్లికి మల్లెపూల గౌరవమిచ్చి మురిసి మెడలో ధరించి అభాసవడం కీకారణ్యపు బుర్రల్లోకి దారి చెయ్యబోయి తోవ తప్పి పులిగుహలో పడి పరితపించడం తేలుకొండిలో తేనె నింపాననుకుని వేలుపెట్టి పరీక్షించి విలవిల్లాడ్డం ఈర్ష్యాళువుకి త్యాగనిరతి గ్రంథం అంకితమిస్తూ అసూయా కంటకాలు గుచ్చుకుని అవాక్కవడం స్నేహమంటూ కనకపు సింహాసనాలిచ్చి బొడ్డు చుట్టూ సూదులు వేయించుకోవడం జిత్తులమారికి కవచకుండలాలిచ్చి దొంగతనం మోపించుకుని మ్రాన్పడిపోవడం ఎప్పుడూ ఇంతే! - అల్లూరి గౌరీలక్ష్మి 9948392357 తిరగబడిన బాపూజీ తెల్లటోపీని నిజాం ప్రభుత్వం వ్యతిరేకిస్తే, తిరుగుబాటుగా తెల్లటోపీ ధరించడం ప్రారంభించారు కొండా లక్ష్మణ్ బాపూజీ. బలవంతుడైన భూస్వామి విస్నూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా బందగి కేసును వాదించారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గం నుంచి కేబినెట్ మంత్రిగా రాజీనామా చేశారు. నిజాం వ్యతిరేక పోరాటం, వెనుకబడిన కులాల ఉద్యమం, చేనేత సహకారోద్యమం, ప్రత్యేక తెలంగాణోద్యమాలతో ముడిపడిన సుదీర్ఘ జీవితం ఆయనది. సెప్టెంబర్ 27 బాపూజీ శతజయంతి. ఈ సందర్భంగా రుద్రమదేవి ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ వారు ఆయన ఉద్యమం, స్మృతులు, ఇంటర్వ్యూలు కలిపి ‘కొండా లక్ష్మణ్ బాపూజీ దార్శనికత’గా పుస్తకం తెచ్చారు. సంపాదకులు ప్రొఫెసర్ కె.శ్రీనివాసులు. వివరాలకు నరేందర్ తన్నీర్ ఫోన్: 9391064357 కవిత్వం ద్వారా సంపాదించిన డబ్బుతో కవి ఎప్పటికైనా కారులో దర్జాగా తిరగాలని కలగనే జనార్దన మహర్షికి తెలుసు, అది పగటి కల అని! అయినా ఒక ఆశ, ‘పెద్ద పెద్ద కంపెనీలు క్రికెట్‌ని, సినిమాని స్పాన్సర్ చేసినట్టుగా’ కవిత్వాన్ని చేసే రోజులొస్తాయని. 2003లో ప్రచురించిన ఆయన ‘వెన్నముద్దలు’ తాజాగా పదో ముద్రణ (క్రియేటివ్ లింక్స్ ప్రచురణ)కు వచ్చిన నేపథ్యంలో ఆయనతో ఆయనే సంభాషించుకుంటే? అదే సెల్ఫీ! జనార్ధనతో మహర్షి ఇది నిజంగానే పదో ముద్రణా? నిజాయితీగానే పదో ముద్రణ. కవిత్వం, అదీ ఈ కాలంలో పదో ముద్రణంటే? సంతోషం, మీరిది కవిత్వం అని ఒప్పుకున్నందుకు. ఛా నా ఉద్దేశం, ఇది ఎలా సాధ్యమైందని? అలా ప్రచారం చేస్తున్నా. పుస్తకాన్ని పుస్తకాల షాపుల్లోనే కాకుండా, సూపర్ మార్కెట్స్‌లో, చిన్న షాపుల్లో, అది టీ స్టాల్ అయినా సరే, పది మంది కలిసే ప్రతిచోటా ఉంచుతున్నా. చక్కెర, ఉప్పు దొరికే ప్రతిచోటా నా ‘వెన్నముద్దలు’ అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తున్నా. గ్రేట్, అందుకే బాగా పోయాయి... పోయాయి. డబ్బులు కూడా! అదేంటి? పుస్తకాలు పోతేనేగా వేశారు! పుస్తకాలు ‘అమ్ముడు’ పోనక్కర్లేదు, ‘అయిపోయినా’ వేస్తారు. ‘పంపకాలు’ ఎక్కువన్నమాట! అయినా ఎందుకు వేస్తున్నట్టు! ఒకే ఒక్క కారణం: కవిత్వం మీది ప్రేమ. వెన్నముద్దలు అని పేరెందుకు పెట్టారు? నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉండాలని. మీరు సినిమా రచయితగా సంతృప్తి చెందారా? సినిమా అంటే నా చేత పదిమంది రాయించేది. పుస్తకం నేనే పదిమందై రాసేది. మీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... నాలోని బొక్కలు/ వెతక్కండి/ అదే వెదురుని/ ‘వేణువు’ని చేసింది. జనార్దన మహర్షి ఫోన్: 9848034309 ‘బంకుపల్లి’ పుస్తకావిష్కరణ శ్రీకాకుళ సాహితి’ ఆధ్వర్యంలో నేడు శ్రీకాకుళం ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 10 గంటలకు కె.ముత్యం రాసిన ‘స్వాతంత్య్రోద్యమ కాలపు సంస్కర్త బంకుపల్లి మల్లయ్య శాస్త్రి జీవిత దృశ్యం’ పుస్తకావిష్కరణ జరగనుంది. ఆవిష్కర్త: కాళీపట్నం రామారావు. రామారావు నాయుడు, అట్టాడ అప్పల్నాయుడు, పి.ఎస్.నాగరాజు వక్తలు. జాషువా జయంతి సదస్సు ‘బహుజన రచయితల వేదిక-ఆంధ్రప్రదేశ్’ ఆధ్వర్యంలో నేడు ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు ప్రకాశం జిల్లా కందుకూరులోని లక్ష్మీశ్రీనివాస ఫంక్షన్ హాలులో జాషువా జయంతి సదస్సు జరగనుంది. పత్రాల సమర్పణతోపాటు, ‘అప్పు వడ్డది సుమీ భరతావని వీని సేవకున్’ అంశంపై కవితాగోష్టి ఉంటుందనీ, అనంతరం ఇటీవల హత్యకు గురైన కన్నడ సాహితీవేత్త కల్బుర్గిని స్మరిస్తూ ర్యాలీ ఉంటుందనీ కన్వీనర్ నూకతోటి రవికుమార్ తెలియజేస్తున్నారు. జాషువా పుస్తకాలు గుంటూరు ఏసీ కాలేజీ ఆడిటోరియంలో నేడు జరగనున్న జాషువా సదస్సులో మహాకవి జాషువా-ప్రగతి శీలత, కళాత్మకత(అద్దేపల్లి రామమోహనరావు), దళిత సాహిత్యవాదం - జాషువా (కత్తి పద్మారావు), జాషువా స్వప్నం-సందేశం(రాచపాళెం చంద్రశేఖరరెడ్డి), జాషువా సాహిత్యం- దృక్పథం- పరిణామం (ఎండ్లూరి సుధాకర్) పుస్తకావిష్కరణలు జరగనున్నాయి. బైరాగి సాహిత్య సదస్సు ఆలూరి బైరాగి 90వ జయంతి సందర్భంగా లోక్‌నాయక్ ఫౌండేషన్ సహకారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయ తెలుగు, హిందీ విభాగాలు ఒక సాహిత్య సదస్సును సెప్టెంబర్ 28న ఉదయం 9 గంటలకు అంబేడ్కర్ అసెంబ్లీ హాలు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్టు ఆ విభాగాల అధిపతులు ఎస్.మెహన్రావు, ఎన్.సత్యన్నారాయణ తెలియజేస్తున్నారు. పొత్తూరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి మారుతిరావు, కె.ఎస్. చలం, చందు సుబ్బారావు, వాడ్రేవు చినవీరభద్రుడు, ఎ.కృష్ణారావు, కాట్రగడ్డ మురారి, తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్, వెలమల సిమ్మన్న, కొర్రపాటి ఆదిత్య పాల్గొంటారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచన ‘బైరాగి- జీవితం సాహిత్యం’ పుస్తకాన్ని కె.వెంకటేశ్వర్లు ఆవిష్కరిస్తారు. పురుగుళ్ళ ఆదేశ్వరరావుకు సత్కారం ఉంటాయి. జాషువా పురస్కారాల ప్రదానం ‘యునెటైడ్ ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్, వరంగల్ యూనిట్’ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28న హన్మకొండలోని జెడ్పీ హాల్లో ఉదయం 11 గంటలకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతుల మీదుగా జాషువా పురస్కారాల ప్రదానం జరగనుంది. గ్రహీతలు: బన్న అయిలయ్య, వి.ఆర్.విద్యార్థి, చల్లపల్లి స్వరూపరాణి, పసునూరి రవీందర్, పొట్లపల్లి శ్రీనివాసరావు, షాజహాన, గోనా నాయక్. -
అక్రమంగా తరలిస్తున్న ఉల్లి స్వాధీనం
సాలూరు: విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని చిన్నబజారు జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 35 బస్తాల ఉల్లి, 5 బస్తాల వెల్లుల్లిని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి బిల్లులు లేకపోవటంతో పట్టుకున్న ఉల్లిపాయలను, వెల్లుల్లి పాయలను స్థానిక తహశీల్దార్‌కు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
'ఇంకా తగ్గని ఉల్లి' కష్టాలు
విజయవాడ: కొద్దిరోజులుగా ఉల్లికష్టాలు రాష్ట్రవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నదీ తెలిసిందే. దాదాపు 30 రోజులు దాటిని ఇంకా ఉల్లిధరలు దిగిరాలేదు. తాజాగా ఉల్లి కృష్ణా జిల్లా విజయవాడలోని రైతు బజారులో బుధవారం పరిస్థితిని చూసినట్లయితే.. భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం సబ్సిడీ ధరతో రూ.20కే కిలో ఉల్లిపాయలు ఇస్తున్నామని ప్రకటించింది. విషయం తెలుసుకున్న స్థానికులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. రేషన్, ఆధార్ కార్డులు చూపిస్తేనే కిలో ఉల్లిగడ్డలు ఇస్తామంటూ అధికారులు చెప్పటంతో పేద, మధ్య తరగతి మహిళలు క్యూలలో నిలబడ్డారు. గంటల తరబడి ఉల్లిగడ్డలు తీసుకుని ఇళ్లకు వెళ్లారు.