Ship
-
ఇంగ్లండ్ తీరంలో రెండు నౌకలు ఢీ
లండన్: ఇంగ్లండ్ తూర్పు తీరంలో ఆయిల్ ట్యాంకర్, సరుకు నౌక ఢీకొన్న ఘటనలో రెండు ఓడలకు మంటలు అంటుకున్నాయి. హల్ తీరానికి సమీపంలో సోమవారం ఉదయం 9.48 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు నౌకల్లోని మొత్తం 37 మందిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చినట్లు రవాణా శాఖ మంత్రి తెలిపారని స్థానిక ప్రజా ప్రతినిధి గ్రాహం స్టువార్ట్ చెప్పారు. వీరిలో తీవ్రగాయాలతో ఉన్న ఒకరిని ఆస్పత్రిలో చేర్పించారన్నారు. గ్రీస్ నుంచి వచ్చిన అమెరికాకు చెందిన ఎంవీ స్టెనా ఇమాక్యులేట్ పేరున్న ఆయిల్ ట్యాంకర్ గ్రీమ్స్‌బీ పోర్టులో లంగరేసి ఉంది. అదే సమయంలో, స్కాట్లాండ్ నుంచి నెదర్లాండ్స్‌లోని పోటర్‌డ్యామ్ వైపు వెళ్తున్న పోర్చుగల్ సరుకు నౌక సొలొంగ్ దానిని ఢీకొట్టింది. దీంతో, రెండు ఓడల్లో మంటలు చెలరేగాయి. సరుకు ఓడలో సోడియం సైనైడ్ అనే విషపూరిత రసాయన కంటెయినర్లు ఉన్నట్టు సమాచారం. బ్రిటన్ మారిటైం కోస్ట్‌గార్డ్ ఏజెన్సీ ఆ ప్రాంతానికి లైఫ్బోట్లను, రెస్క్యూ హెలి కాప్టర్‌ను పంపించింది. నౌకల్లో నుంచి బయటకు దూకిన వారిని లైఫ్బోట్లలో రక్షించి ఒడ్డుకు చేర్చారు. కాగా, స్టెనా ఇమాక్యులేట్ ఓడలో జెట్–ఏ1 ఇంధనం రవాణా అవుతోందని అమెరికాకు చెందిన మారిటైం మేనేజ్మెంట్ సంస్థ క్రౌలీ తెలిపింది. సరుకు నౌక ఢీకొట్టడంతో ట్యాంకర్ దెబ్బతిని ఇంధనం లీకైంది. దీంతో మంటలు వ్యాపించడంతోపాటు పలుమార్లు పేలుళ్లు సంభవించినట్లు వెల్లడించింది. ట్యాంకర్ నౌకలో ఉన్న మొత్తం 23 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు క్రౌలీ వివరించింది. అమెరికా సైన్యానికి అవసరమైన ఇంధనాన్ని ఈ సంస్థ సరఫరా చేస్తుంది. -
నగరాన్ని తలపించే హైటెక్ నౌక..!
సర్వాంగ సుందరంగా సకల సౌకర్యాలతో ఉండే రాజప్రాసాదం నీటిలో తేలియాడితే ఎలా ఉంటుందంటే, అది అచ్చం ‘సోమ్నియా’లాగే ఉంటుంది. సోమ్నియా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద నౌక మాత్రమే కాదు, అద్దాల గోడలతో నిండిన అద్భుత నిర్మాణం. లాటిన్లో సోమ్నియా అంటే ‘కల’ అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే ఈ నౌక ఒక కలల ప్రపంచంలా కనిపిస్తుంది. ఇందులో మొత్తం విలాసవంతమైన 39 అపార్ట్మెంట్లను ఆరు డెక్‌లలో నిర్మించారు. సుమారు పదివేలమంది వరకు ఇందులో ఉండొచ్చు. పెద్ద రెస్టరెంట్లు, లాబీ, స్పా, బార్లు, సూపర్ మార్కెట్లు, బొటిక్, ఫిట్నెస్ సెంటర్లు, టెన్నిస్ కోర్టు, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్‌పూల్, కాక్టెయిల్ లాంజ్ సహా సమస్త సౌకర్యాలను ఈ నౌకలో ఏర్పాటు చేశారు. ఈ నౌక యజమాని మలేషియాలో అత్యంత ధనవంతుడైన రాబర్ట్ కుయోక్ అని సమాచారం. రాబర్ట్ తన విహార యాత్రల కోసం కస్టమైజ్డ్ యాట్‌లను తయారు చేసే డచ్ కంపెనీతో దీనిని తయారు చేయించుకుంటున్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి.. కాని, అధికారికంగా ఇంకా ఈ నౌక యజమాని ఎవరనేది వెల్లడి కాలేదు.(చదవండి: భారీ కీటకం.. దాంతోనే వంటకం..! ఎక్కడంటే..?) -
ఆ‘పాత’ నావ
ఇదేమిటో తెలుసా? అలనాటి భారతీయ నౌకా పాటవానికి నిదర్శనం. వేల ఏళ్ల క్రితమే సముద్రాలపై రాజ్యం చేసిన వైనానికి తిరుగులేని గుర్తు. ఐదో శతాబ్దం దాకా సముద్రాలపై భారతీయులకు ఆధిపత్యం కట్టబెట్టిన విశాలమైన నావలివి. ఇనుము వాడకుండా కేవలం కలప దుంగలు, చెక్క, తాళ్లు తదితరాలతో వీటిని తయారు చేసేవారు. అయినా ఇవి అత్యంత ప్రతికూల వాతావరణాలను కూడా తట్టుకుంటూ సదూర సముద్రయానాలకు ఎంతో అనువుగా ఉండేవి. ఈ భారతీయ నావలకు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా యమ గిరాకీ ఉండేదట. ఇంతటి చరిత్ర ఉన్న పురాతన భారతీయ నావకు వాయుసేన, కేంద్ర సాంస్కృతిక శాఖ ఇప్పుడిలా ప్రాణం పోశాయి. వారి ఆలోచనలకు రూపమిస్తూ గోవాకు చెందిన నౌకా నిర్మాణ సంస్థ హోడీ ఇన్నొవేషన్స్ అచ్చం అలనాటి విధానంలోనే దీన్ని రూపొందించింది. బాబు శంకరన్ సారథ్యంలో కేరళకు చెందిన నిపుణులైన పనివాళ్లు అహోరాత్రాలు శ్రమించి దీన్ని పూర్తి చేశారు. అప్పట్లో మాదిరిగానే ఈ నావను ముందుగా రెండు అర్ధ భాగాలుగా నిర్మించారు. తర్వాత కొబ్బరి నార నుంచి అల్లిన తాళ్ల సాయంతో ఒడుపుగా ఒక్కటిగా బిగించారు. సముద్ర జలాల్లో తడిసి పాడవకుండా నావ అడుగు, పక్క భాగాలకు అప్పటి పద్ధతుల్లోనే సార్డిన్ ఆయిల్ తదితరాలతో పూత పూశారు. మన్నిక కోసం టేకు, పనస వంటి చెక్కలు మాత్రమే వాడారు. ఈ తరహా భారతీయ నావల హవా క్రీస్తుశకం ఐదో శతాబ్ది దాకా ప్రపంచమంతటా నిరి్నరోధంగా సాగింది. ఆ ఘన వారసత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో ఇదో ముందడుగని నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆ‘పాత’నావకు ఇంకా పేరు పెట్టాల్సి ఉంది. ఇది బుధవారం ఘనంగా జలప్రవేశం చేసింది. ఈ ఏడాది చివర్లో 15 మంది నేవీ అధికారులతో ప్రాచీన సముద్ర మార్గాల్లో ఈ నావ మస్కట్, ఇండొనేసియాలకు తొలి ప్రయాణం ప్రారంభించనుంది. దీన్ని నడిపే విధానం తదితరాలపై వారు ముందస్తు శిక్షణ కూడా పొందనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టెక్నాలజీ అద్భుతం.. ఎగిరే ఓడ: చూశారా?
ఇప్పటికే ఎగిరే కార్లు వచ్చేశాయి. వాటి వరుసలోనే తాజాగా ఎగిరే ఓడలు కూడా వచ్చేశాయి. సముద్రం మీదుగా రవాణా చేయటానికి ఉపయోగించే ఓడలు, ఇప్పుడు గాలిలో ఎగురుతూ ప్రయాణం చేస్తాయి. ది ఫ్లయింగ్ షిప్ కంపెనీ వింగ్టిప్స్ రూపొందించిన ఈ ఎగిరే ఓడ సాధారణమైన ఓడల కంటే పదిరెట్లు వేగంగా ప్రయాణిస్తుంది.హోవర్ ఇంజిన్లతో తయారుచేసిన ఈ ఓడ బ్యాటరీలతో పనిచేస్తుంది. ఒకేసారి మొత్తం 22 కిలోల బరువు వరకు సరుకు రవాణా చేయగలదు. ఇక దీనికున్న పది అడుగుల పొడవైన రెక్కల సాయంతో, ఈ నౌక దాదాపు సముద్రంపై నుంచి 80 కిలోమీటర్ల పరిధి మేరకు ఎగురుతుంది.ఇది గంటకు గరిష్ఠంగా 19 నుంచి 27 మైళ్ల (సుమారు 30 కిలోమీటర్ల నుంచి 43 కిలోమీటర్ల) వేగంతో ప్రయాణిస్తుంది. దీనిని ప్రధానంగా సరుకుల రవాణా కోసం రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. త్వరలోనే ఈ ఎగిరే ఓడల్లో మరో రెండు మోడల్స్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: వాట్సాప్‌లోనే కరెంట్ బిల్, మొబైల్ రీఛార్జ్: కొత్త ఫీచర్ వచ్చేస్తోంది -
ఐఎఫ్ఎస్సీలో కార్యకలాపాలకు ఊతం..
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్లో (ఐఎఫ్ఎస్సీ) కార్యకలాపాలకు ఊతమిచ్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. షిప్ లీజింగ్ యూనిట్లు, అంతర్జాతీయ కంపెనీలు ఏర్పాటు చేసే బీమా ఆఫీసులు, ట్రెజరీ కార్యాలయాలకు ప్రయోజనాలను కల్పించే ప్రణాళికలు వీటిలో ఉన్నాయి. పలు పన్ను మినహాయింపుల గడువును 2030 మార్చి వరకు వరకు పొడిగించారు. వాస్తవానికి కొన్ని మినహాయింపులు ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ముగిసిపోనున్నాయి. మరోవైపు, ఐఎఫ్ఎస్సీలోని ట్రెజరీ సెంటర్లకు సంబంధించి డివిడెండ్ నిర్వచనం క్రమబద్ధీకరణ, ఫండ్ మేనేజర్లకు సరళతరమైన విధానాలను కూడా బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించింది. అంతర్జాతీయంగా ఆర్థిక సేవల రంగంలో భారత్ పురోగమించేందుకు ఇవి దోహదపడగలవని గిఫ్ట్ సిటీ ఎండీ తపన్ రే తెలిపారు. పన్ను ప్రయోజనాల గడువు పొడిగించడం వల్ల ఇన్వెస్టర్లకు దీర్ఘకాలికంగా ఒక స్పష్టత లభిస్తుందని ధృవ అడ్వైజర్స్ పార్ట్నర్ ఆదిత్య హన్స్ చెప్పారు. -
సీజ్ ద షిప్.. సర్వం లాస్!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పావలా కోడికి ముప్పావలా మసాలా అన్నట్లుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘సీజ్ ద షిప్’ వ్యవహారం. కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం వివాదంలో పట్టుబడ్డ బియ్యం ఖరీదుకంటే నౌక నిలిచిపోవడం వల్ల పడ్డ డెమరేజ్ చార్జీలు ఎక్కువయ్యాయి. మరోపక్క కార్మికులకూ నష్టం వాటిల్లింది. మొత్తంగా పోర్టు పరువే తీసేసింది కూటమి ప్రభుత్వం. అనేక వివాదాలు, భారీ నష్టం అనంతరం పీడీఎస్ బియ్యం ఉన్న స్టెల్లా నౌక ఆదివారం అర్ధరాత్రి దాటాక 52 వేల మెట్రిక్‌టన్నుల బియ్యంతో పశ్చిమ ఆఫ్రికాకు బయలుదేరింది.స్టెల్లా నౌకలో పీడీఎస్ బియ్యం ఉన్నాయనే అనుమానంతో నవంబర్ 27న కాకినాడ పోర్టులో నిలిపివేశారు. నవంబర్ 29న పవన్ కాకినాడ పోర్టుకు వచ్చి ‘సీజ్ ద షిప్’ అంటూ సినిమా స్టైల్లో ఆదేశించేశారు. కానీ, దాని పర్యవసానాలు ప్రభుత్వం పట్టించుకోలేదు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఇతర సరకులను ఎగుమతి చేసే వారు ఇతర పోర్టులకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. పోర్టుపై ఆధారపడ్డ 10 వేలకు పైగా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది.పట్టుకున్న బియ్యం విలువ కన్నా డెమరేజ్ చార్జి రూ.1.5 కోట్లు ఎక్కువస్టెల్లా నౌకలోని ఐదు హేచెస్లో 52వేల మెట్రిక్ టన్నులు బియ్యం ఉంటే కేవలం 4 వేల టన్నుల బియ్యాన్ని 12 గంటల పాటు తనిఖీ చేశారు. చివరకు 3వ నంబరు హేచెస్లో ఉన్న సత్యం బాలాజీ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్‌కు చెందిన 1,320 మెట్రిక్ టన్నులు పీడీఎస్‌గా లెక్క తేల్చారు. ఈ బియ్యాన్ని వెంటనే అన్లోడ్ చేసి, నౌకను పంపకుండా పవన్ అన్న ‘సీజ్ ద షిప్’ మాటతో పోర్టులోనే నిలిపివేశారు. ఇలా నౌకను పోర్టులో నిలిపివేసినందుకు దాని యాజమాన్యానికి ఎగుమతిదారులు డెమరేజ్ చార్జీలు చెల్లించాలి. నవంబర్ 29 నుంచి డెమరేజ్ చెల్లించాలని నౌక యాజమాన్యం అంటుండగా.. తుపాను కారణంగా డిసెంబర్ 4 వరకు డెమరేజ్ వేయడం కుదరదని ఎగుమతిదారులు పట్టుబడుతున్నారు. ఈ వివాదం ఇంతవరకు తేలలేదు.నౌక పశ్చిమ ఆఫ్రికాకు చేరుకున్నాక షిప్ నిర్వాహకుడు బియ్యానికి చెల్లించాల్సిన సొమ్ము నుంచి డెమరేజ్ను మినహాయించుకుని మిగిలిన సొమ్ము జమ చేస్తాడని పోర్టు వర్గాలు చెబుతున్నాయి. నౌకకు క్రూతో సహా అన్ని ఖర్చులు చూసుకుంటే రోజుకు 22 వేల యూఎస్ డాలర్లు (రూ.18.73 లక్షలు) వంతున డెమరేజ్ చెల్లించాలి. అంటే నౌక నిలిచిపోయిన 38 రోజులకు సుమారు రూ.7 కోట్లకు పైగా డెమరేజ్ పడుతుందని లెక్కలేçÜ్తున్నారు. విదేశాలకు ఎగుమతిచేసే బియ్యం ప్రస్తుత ధరల ప్రకారం కిలో రూ.36 పలుకుతోంది. ఈ లెక్కన 1,320 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం ఖరీదు రూ.5.50 కోట్లు. అంటే పట్టుకున్న బియ్యం కంటే స్టెల్లా నౌకకు చెల్లించే నష్టమే రూ.1.5 కోట్లకు పైగా అదనం. ఇన్ని రోజులు పోర్టులో నిలిపివేసిన నౌక డెమరేజ్ చార్జీలు పవన్ చెల్లిస్తారా అని ట్రేడ్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మరోపక్క ఈ నష్టాన్ని సత్యంబాలాజీ కంపెనీ చెల్లించాలా లేక, ఆ నౌకలో బియ్యం ఎగుమతికి రిజిస్టర్ అయిన 28 ఎక్స్‌పోర్టు కంపెనీలు చెల్లించాలా అనే దానిపైనా వివాదం నడుస్తోంది.మంటగలిసిన పోర్టు ప్రతిష్టఈ వ్యవహారంతో పోర్టు ప్రతిష్ట కూడా మంటగలిసిపోయింది. కాండ్లా, విశాఖపట్టణం, కృష్ణపట్నం పోర్టులు ఉన్నప్పటికీ బియ్యం ఎగుమతిలో కాకినాడ పోర్టుకే ఎగుమతిదారులు ఎక్కువ మొగ్గు చూపుతారు. దేశంలో ఏక కాలంలో బియ్యాన్ని ఏడు నౌకల ద్వారా ఎగుమతి చేయగలిగే బెర్త్‌ల సామర్థ్యం ఉన్న ఏకైక పోర్టు కాకినాడ యాంకరేజ్ పోర్టు. మిగిలిన పోర్టుల్లో రెండుకు మించి బియ్యం ఎగుమతికి అవకాశం లేదు. ఈ వెసులుబాటు కారణంగానే బియ్యం ఎగుమతుల్లో దేశంలోనే నంబర్ వన్‌గా కాకినాడ పోర్టు నిలుస్తోంది. అటువంటి పోర్టుపై పీడీఎస్ బియ్యం పేరుతో కూటమి నేతలు విషం చిమ్మడంతో పోర్టు ప్రతిష్ట మంటగలిసిపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు బియ్యం ఎగుమతిదారులు కాండ్లా రేవుకు మళ్లే ఏర్పాట్లలో ఉన్నారు.ఆందోళనలో కార్మికులుపోర్టుపై ఆధారపడ్డ వేలాది మంది కార్మికులు మట్టికొట్టుకుపోయే పరిస్థితులు దాపురించాయని వారి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ పోర్టుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేలకు పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. పోర్టులో ఉన్న 100 బార్జీలపై 2,000 మంది కార్మికులు, టవ్వింగ్లో 1,000 మంది, షోర్ లేబర్ (గోడౌన్ ఎగుమతి, దిగుమతి)లో 8,000 మంది, మరో 2,000 మంది స్టీవ్ డోర్ వర్కర్స్‌గా పనిచేస్తున్నారు. ప్రతి కార్మికుడికి రోజూ రూ.800 నుంచి రూ.1,000 వరకు ఆదాయం లభిస్తుంది. -
తనిఖీలు చేయకుండానే వెళ్లిపోయిన 'పున్నీ' షిప్
-
సీజ్ ద షిప్ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్
-
నౌకాయానంలో వర్చువల్ వ్యవసాయ శాస్త్రవేత్త
నౌకాయాన పరిశ్రమ సొంత ఆహార అవసరాల కోసం అధునాతన సేద్య సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నది. కృత్రిమ మేధతో నడిచే కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను నౌకల్లోనే సాగు చేయటం ప్రారంభమైంది. సిబ్బందికి మెరుగైన ఆహారాన్ని అందించటంతోపాటు వారి మనోబలాన్ని పెంపొందించేందుకు కొన్ని షిప్పింగ్ కంపెనీలు డిజిటల్ సేద్య పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఈ సంస్థల జాబితాలో సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న సినర్జీ మెరైన్ గ్రూప్ ముందంజలో ఉంది. ‘అగ్వా’ సంస్థ రూపొందించిన అటానమస్ వెజిటబుల్ గ్రోయింగ్ టెక్నాలజీ నావికులకు అనుదినం పోషకాలతో నిండిన తాజా శాకాహారం అందించడానికి ఉపయోగపడుతోంది. గతంలో తీర్రప్రాంతాలకు చేరినప్పుడు మాత్రమే తాజా కూరగాయలు, ఆకుకూరలు వీరికి అందుబాటులో ఉండేవి. ఇప్పుడు రోజూ అందుబాటులోకి రావటం వల్ల నౌకా సంస్థల సిబ్బంది సంతృప్తిగా, ఆరోగ్యంగా ఉంటూ మెరుగైన సేవలందించగలుగుతున్నారట. సినర్జీ మెరైన్ గ్రూప్ బాటలో ఈస్ట్రన్ పసిఫిక్ షిప్పింగ్, సీస్పాన్ కార్ప్, కాపిటల్ షిప్పింగ్, కూల్కొ నడుస్తూ సముద్ర యానంలో తాజా ఆహారాన్ని పండిస్తూ, వండి వార్చుతున్నాయి. సినర్జీ మెరైన్ గ్రూప్‌నకు చెందిన సూయెజ్‌మాక్స్ ఎఫ్ఫీ మెర్స్క్ ఓడలో సిబ్బంది సెప్టెంబర్ నుండి మూడు ప్రత్యేక అగ్వా యూనిట్లను ఉపయోగించి ఆకుకూరలు, ఔషధ మొక్కలు, దుంప కూరలు, టొమాటోలు, స్ట్రాబెర్రీలను నడి సముద్రంలో ప్రయాణం చేస్తూనే సాగు చేసుకుంటూ ఆనందంగా ఆరగిస్తున్నారు.స్వయంచాలిత సేద్యంఆకర్షణీయమైన వేతనాలకు మించి సముద్రయాన సంస్థ సిబ్బంది సమగ్ర సంక్షేమం, జీవనశైలి ప్రయోజనాలను అందించడంలో అగ్వా సంస్థ రూపొందించిన అత్యాధునిక ఇన్డోర్ సాగు పరికరాలు ఉపయోగపడుతున్నాయి. సిబ్బంది శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. తాజా కూరగాయలను స్థిరంగా సరఫరా చేయడం ఒక కీలకమైన ఆవిష్కరణ. పూర్తి స్వయంప్రతిపత్తి కలిగిన అగ్వా ఆన్ బోర్డ్ కూరగాయల పెంపక యూనిట్లు అత్యాధునిక సాంకేతికతతో వినియోగదారుల అవసరాలకు, ఆసక్తులకు తగిన రీతిలో తాజా ఉత్పత్తులను అందిస్తున్నాయి. అధునాతన కృత్రిమ మేధ, ఇమేజ్ ఎనలైజర్, సెన్సరీ డేటా ద్వారా వినియోగదారు ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా అగ్వా యూనిట్లు పనిచేస్తాయి. ఇవి చూడటానికి ఒక ఫ్రిజ్ మాదిరిగా ఉంటాయి. ఇవి పూర్తిస్థాయిలో ‘వర్చువల్ అగ్రానామిస్ట్’ (వర్చువల్ వ్యవసాయ శాస్త్రవేత్త) పాత్రను పోషిస్తాయి. వెల్తురు, తేమ, మొక్కలకు పోషకాల సరఫరా.. వంటి పనులన్నిటినీ వాతావరణాన్ని బట్టి ఇవే మార్పులు చేసేసుకుంటాయి. అగ్వా యాప్ సాగులో ఉన్న కూరగాయల స్థితిగతులు, పెరుగుదల తీరుతెన్నులపై ఎప్పటికప్పుడు మెసేజ్‌లు పంపుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా నౌకా సిబ్బంది శ్రేయస్సు కోసం మెరుగైన ప్రయోజనాలు కల్పించటం, ప్రతికూల పరిస్థితుల్లోనూ నావికా సిబ్బందికి మెరుగైన ఆహారాన్ని అందించడానికి ఈ అధునాతన హైడ్రో΄ోనిక్ సాంకేతికత ఉపయోగపడుతోంది. వాతావరణంలో మార్పులకు తగిన రీతిలో పంట మొక్కల అవసరాలను అగ్వా 2.0 యూనిట్లు స్వయంచాలకంగా, రిమోట్‌గా సర్దుబాటు చేసుకుంటాయి. ఇది ఏకకాలంలో వివిధ కూరగాయలను పండించగలదు. ‘వర్చువల్ వ్యవసాయ శాస్త్రవేత్త’ అగ్వా యూనిట్లో పెరిగే ప్రతి మొక్కను నిరంతరం పర్యవేక్షిస్తుంది. సరైన నాణ్యత, మెరుగైన దిగుబడి సాధనకు అనుగుణంగా సర్దుబాటు చేస్తుంది. (చదవండి: ఒరిజినల్ దస్తావేజులు పోతే ప్రాపర్టీని అమ్మడం కష్టమా..?) -
ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ కథ క్లోజ్.. విశాఖపట్నానికి వచ్చిన నౌకలో డ్రగ్స్ లేవని నిర్ధారించిన సీబీఐ... అప్పట్లో ఓటర్లను మోసగించడానికి టీడీపీ అండ్ కో దుష్ప్రచారం
-
పీడీఎస్ బియ్యం ఉన్నా షిప్‌ను సీజ్ చెయ్యలేం
సాక్షి, విశాఖపట్నం: సరకు రవాణా చేసే కార్గో షిప్లో అక్రమంగా తరలించిన పీడీఎస్ బియ్యం ఉంటే.. షిప్ మొత్తం సీజ్ చెయ్యలేమనీ, బియ్యం ఉన్న కంటైనర్‌ని మాత్రమే సీజ్ చెయ్యగలమని విశాఖపట్నం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. అదేవిధంగా.. పీడీఎస్ బియ్యం రవాణా చేసిన వారిపైనే చర్యలు తీసుకోగలం తప్ప.. షిప్‌పై చర్యలు తీసుకోలేమని చెప్పారు. విశాఖలోని కస్టమ్స్ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ పోర్టులో ఇటీవల పీడీఎస్ బియ్యం ఎగుమతి అవుతోందని, కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోందంటూ కథనాలు వచ్చిన నేపథ్యంలో స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సివిల్ సప్లైస్ ఎన్వోసీ తప్పనిసరిపోర్టులోకి వచ్చిన ఏ సరుకైనా నేరుగా షిప్‌లోకి లోడ్ చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రతి సరుకుకు సంబంధించిన పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే షిప్‌లోకి ఎక్కించేందుకు కస్టమ్స్ అనుమతిస్తుందని స్పష్టం చేశారు. బియ్యం విషయంలోనూ పక్కాగా పరిశీలన ఉంటుందన్నారు. కస్టమ్స్ విభాగం ఎలాంటి అనధికార బియ్యం ఎగుమతి, దిగుమతుల్ని ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఎన్ని చెక్‌పోస్టులు దాటి వచ్చినా, అన్ని డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాతే కస్టమ్స్ నుంచి లోడింగ్‌కు అనుమతి ఉంటుందని తెలిపారు. ఏ బియ్యమైనా సరే.. పీడీఎస్ బియ్యం కాదు అని పౌర సరఫరాల శాఖ ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) చెకింగ్ డాక్యుమెంట్స్‌లో తప్పనిసరిగా ఉండాలని, అప్పుడే లోడింగ్‌కు అనుమతిస్తామని తెలిపారు. బియ్యం డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే వాటిని నిలిపేస్తామని చెప్పారు. ఒకవేళ అనుమానం వచ్చి అవి పీడీఎస్ బియ్యమా కాదా అనేది తెలుసుకోవాలంటే పరీక్షకు పంపాలని, దాని ఫలితాలు 15 రోజులకు వస్తాయని తెలిపారు. అప్పుడే దానిపై చర్యలు తీసుకోగలమని అన్నారు. స్టేక్ హోల్డర్లతో అవగాహన సదస్సుఇటీవల కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం ఎగుమతి జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో విశాఖపట్నం జోన్ కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ సంజయ్ రెడ్డి, ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ ఆధ్వర్యంలో కస్టమ్స్ కార్యాలయంలో శుక్రవారం ఏపీలోని వివిధ పోర్టుల స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, కస్టమ్స్ బ్రోకర్స్ అసోసియేషన్, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఎంకరేజ్ పోర్ట్, స్టివడోర్స్ అసోసియేషన్, పౌర సరఫరాల శాఖ అధికారులు హాజరయ్యారు. పోర్టుల ద్వారా ఎలాంటి అక్రమ ఎగుమతి, దిగుమతులకు తావివ్వకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని, ఇకపై మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని సంజయ్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో స్టేక్‌హోల్డర్స్ సహకారాన్ని అందించాలని కోరారు. అక్రమ ఎగుమతులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కస్టమ్స్ శాఖ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. బియ్యం ఎగుమతి విధి విధానాలు, నిబంధనలను ఎన్.శ్రీధర్ వివరించారు. బియ్యం ఎగుమతుల పత్రాలను పరిశీలనలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నౌక మొత్తం సీజ్ చెయ్యడం కుదరదుషిప్లో పొరపాటున పీడీఎస్ బియ్యం ఉన్నా.. నౌకని మొత్తం సీజ్ చెయ్యలేమని తెలిపారు. ఒక రవాణా నౌకలో ఎన్నో కంటైనర్లు ఉంటాయని, వాటిలో ఇతర కంపెనీలు, వ్యాపారులకు సంబంధించిన విభిన్న రకాల ఉత్పత్తులు కూడా ఉంటాయని తెలిపారు.అందువల్ల ఏవైనా అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే.. సంబంధిత కంటైనర్‌ని మాత్రమే సీజ్ చెయ్యగలమని, షిప్ మొత్తాన్ని కాదని స్పష్టంచేశారు. చర్యలు కూడా అక్రమ రవాణాదారులపైనే ఉంటాయని, షిప్‌పై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. -
మళ్లీ మొదటికొచ్చిన ‘సీజ్ ది షిప్’
సాక్షి, కాకినాడ జిల్లా: ‘సీజ్ ది షిప్’ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మల్టీ డిస్ ప్లయినరీ కమిటీతో స్టెల్లా ఎల్ వన్ నౌకలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో తమ అనుకూల మీడియాకు మాత్రమే కూటమి సర్కార్ అనుమతిస్తోంది.పోర్ట్ అథారిటీ అధికారంతో స్టెల్లా నౌకను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అయితే అంతర్జాతీయ షిప్‌ను సీజ్ చేసే విషయంలో అధికారులు తర్జనభజర్జన పడుతున్నారు. ఐదు రోజుల క్రిందట "సీజ్ ద షిప్" అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైడ్రామాకు తెరతీసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సముద్రంలో ఉన్న కెన్ స్టార్ నౌకను పరిశీలించకుండా పవన్ వచ్చేశారు.ఇదీ చదవండి: డైవర్షన్ క్లాప్.. ఫ్లాప్ బాబు స్క్రిప్ట్ బోల్తాతమ వియ్యంకుడు బాయిల్డ్ రైస్ మాత్రమే ఎగుమతి చేస్తారంటూ పట్టాభి అగ్రో ఫుడ్ అధినేత కే.వి.కృష్ణారావు గురించి ఆర్థిక మంత్రి పయ్యావుల చెప్పుకొచ్చారు. తాజాగా కాకినాడ పోర్టు నుండి పట్టాభి అగ్రో ఫుడ్ చెందిన రా రైస్ (పచ్చి బియ్యం) విదేశాలకు ఎగుమతి అవుతోంది. "బిరస్ బుల్లోగ్" ప్యాకింగ్‌తో పచ్చి బియ్యాన్ని ఎంవీడీడీఎస్ మరీనా నౌకలోకి ఎగుమతి చేస్తున్నారు. ఇండోనేషియాకు 12 వేల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యాన్ని పట్టాభి అగ్రో ఫుడ్ సంస్థ ఎగుమతి చేస్తోంది.ఇదీ చదవండి: పవన్ ‘న్యూట్రల్’ గేర్! -
‘బ్రహ్మపుత్ర’లో భారీ అగ్ని ప్రమాదం
ముంబై/న్యూఢిల్లీ: ముంబై డాక్ యార్డులో మరమ్మతుల కోసం ఉన్న ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనతో యుద్ధ నౌక పూర్తిగా ఒక పక్కకు ఒరిగిపోగా ఒక నావికుడు గల్లంతయ్యారని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. ముంబై డాక్‌యార్డులో రీఫిట్ పనులు జరుగుతున్న మలీ్టరోల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని నేవీ తెలిపింది. సోమవారం ఉదయం కల్లా మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చామని వివరించింది. అయితే, మధ్యాహ్నం నుంచి యుద్ధ నౌక పక్కకు ఒరిగిపోవడం మొదలైందని, నిటారుగా సరైన స్థితిలో ఉంచేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వివరించింది. ప్రస్తుతం బ్రహ్మపుత్ర పూర్తిగా పక్కకు ఒరిగి ఉందని తెలిపింది. ప్రమాదంపై విచారణ జరుగుతోందని, గల్లంతైన ఒక జూనియర్ నావికుడి కోసం గాలింపు చేపట్టామని తెలిపింది. దేశీయంగా మొదటిసారిగా రూపొందిన బ్రహ్మపుత్ర క్లాస్‌కు చెందిన గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ ఇది. 2000 ఏప్రిల్ నుంచి విధుల్లో ఉన్న ఈ షిప్‌పై 40 మంది అధికారులు, 330 మంది నావికులు విధుల్లో ఉంటారు. -
బోటులో అగ్నిప్రమాదం.. 40 మంది హైతీ పౌరులు మృతి
పోర్ట్ ఓ ప్రిన్స్ : హైతీ నుంచి 80 మంది శరణార్థులతో వెళుతున్న బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సమారు 40 మంది మృతి చెందారు. మరో 40 మందిని హైతీ రక్షక దళం కాపాడింది.హైతీలోని సెయింట్ మైఖేల్ నార్త్ నుంచి బయలుదేరిన ఈ పడవ కాయ్‌కోస్, టర్క్స్ ఐలాండ్‌కు వెళుతోంది. పడవలో ఉన్నవారు క్యాండిల్స్ వెలిగించారు.దీంతో ఈ మంటలు బోటులో ఉన్న పెట్రోల్ డ్రమ్ములకు అంటుకోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. హైతీ గత కొంత కాలంగా సామాజిక, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో పౌరులు దేశం విడిచి వలస వెళుతున్నారు. -
ప్రపంచంలో అతిపెద్ద షిప్.. రిపేర్ ఖర్చే రూ.2212 కోట్లు!
టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయిన తరువాత.. ప్రపంచంలో అతిపెద్ద ఓడల నిర్మాణం పూర్తిగా ఆగిపోయిందని అనుకున్నారు. కానీ 1979లో జపాన్ ఓ నౌకను తయారు చేసింది. దీనిపేరు 'సీవైజ్ జెయింట్'. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..సీవైజ్ జెయింట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద షిప్. దీనిని 1974-79 మధ్య జపాన్ కంపెనీ సుమిటోమో హెవీ ఇండస్ట్రీస్ తయారు చేసింది. ఈ నౌక పొడవు టైటానిక్ షిప్ కంటే రెండు రెట్లు ఎక్కువ. ఇది కార్గో షిప్‌గా పరిచయమైంది. దీనికి భారతదేశంతో కూడా ఓ ప్రత్యేకమైన అనుభందం ఉన్నట్లు సమాచారం.సీవైజ్ జెయింట్ నౌకను గ్రీకు వ్యాపారవేత్త కోసం.. జపాన్ దేశంలోని ఒప్పామా షిప్‌యార్డ్‌లో నిర్మించడం ప్రారభించారు. కానీ ఓడ నిర్మాణం చాలా ఆలస్యం కావడంతో ఆర్డర్ చేసిన ఓనర్ ఈ నౌకను నిరాకరించారు. అప్పటికి నౌకకు పేరు పెట్టలేదు. ఆ తరువాత తయారీ సంస్థ, ఆర్డర్ చేసిన యజమానికి మధ్య సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది.ఒప్పామా షిప్‌యార్డ్‌లో ఈ అతిపెద్ద నౌకను నిర్మించడం వల్ల దీనికి మొదట్లో ఒప్పమా అని పేరుపెట్టారు. కంపెనీ దీనిని ఆ తరువాత చైనాకు అప్పగించడం జరిగింది. చైనా చేతుల్లోకి చేరిన తరువాత దీనికి సీవైజ్ జెయింట్ అని పేరుపెట్టారు. ఈ నౌక అప్పట్లో ముడి చమురు రవాణా చేయడానికి ప్రధానంగా ఉపయోగించేవారు.1988లో సీవైజ్ జెయింట్ నౌక ఇరాన్ నుంచి చమురు తీసుకుని బయలుదేరి.. లారాక్ ద్విపంలో ఆగింది. అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ వైమానిక దళం ఈ నౌకపై దాడి చేసింది. ఆ సమయంలో ఇది చాలా వరకు దెబ్బతింది. ఈ ఓడను మరమ్మత్తులు చేయడానికే.. ఏకంగా 100 మిలియన్ డాలర్లు ఖర్చు (1988లో) అయినట్లు సమాచారం. 100 మిలియన్ డాలర్ల నేటి విలువ సుమారు 265 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.2212 కోట్లు.సీవైజ్ జెయింట్ నౌక దాదాపు 1500 అడుగుల పొడవు ఉంది. 1988 తరువాత దీనిని పూర్తిగా మరమ్మత్తు చేసి 1991లో నార్వేజియన్ కంపెనీకి విక్రయించారు. 1991 తరువాత 2009లో గుజరాత్‌లోని అలంగ్ షిప్బ్రేకింగ్ యార్డ్‌కు చేరుకుంది. ఆ తరువాత దీనిని కూల్చి వేశాలు. ప్రస్తుతం ఇది హాంకాంగ్ మారిటైమ్ మ్యూజియంలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఇజ్రాయెల్ నౌకపై ఇరాన్ దాడి.. నౌకలో 17 మంది భారతీయులు
దుబాయ్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించిడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ బిలియనీర్‌కు చెందిన ఎమ్ఎస్సి ఎరిస్ కంటెయినర్ షిప్‌ను గల్ఫ్ ఆఫ్ హార్ముజ్ వద్ద ఇరాన్ నేవీ ఆధీనంలోకి తీసుకుంది. పోర్చుగల్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 25 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 17 మంది భారతీయులుండటం కలవర పరుస్తోంది. వీరి విడుదల కోసం భారత ప్రభుత్వం ఇరాన్‌తో ఇప్పటికే సందప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం. నౌకను ఇరాన్ తీసుకెళుతున్నట్లు ఇరాన్ నేవీ ప్రకటించింది. నౌక డెక్‌పై ఇరాన్ కమాండోలు కూర్చున్న వీడియో బయటికి వచ్చింది. ఇజ్రాయెల్ బిలియనీర్ వ్యాపారవేత్తకు చెందిన జోడియాక్ మారిటైమ్ గ్రూపు ఈ నౌకను నిర్వహిస్తోంది. హెలికాప్టర్ ద్వారా ఇరాన్నేవీ సిబ్బంది నౌకపై దాడి చేసి లోపలికి ప్రవేశించారు. హర్మూజ్ జలసంధివైపు వెళుతుండగా చివరిసారిగా ఎంఎస్సి ఎయిరిస్‌ను గుర్తించారు. ఘటన తర్వాత ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి స్పందించారు. ఇరాన్ గార్డ్స్‌ను ఉగ్రవాదులుగా గుర్తించాలని ప్రపంచ దేశాలను కోరారు. ఇరాన్లో ప్రస్తుతం క్రిమినల్స్ పాలన కొనసాగుతోందని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి పైరేట్ ఆపరేషన్లను ఆ దేశం నిర్వహిస్తోందని ఫైర్ అయ్యారు. హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు కూడా ఇరాన్ మద్దతిస్తోందని మండిపడ్డారు. కాగా, ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ దాడిలో ఏడుగురు ఇరాన్ ఆర్మీ ఉన్నతాధికారులు మరణించారు. ఘటనతో ఆగ్రహించిన ఇరాన్, ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తామని ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇదీ చదవండి.. అలర్ట్.. 48 గంటల్లో యుద్ధం -
విశాఖ పర్యటనను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం
విశాఖపట్నం: టైగర్ ట్రయంఫ్లో భాగంగా తమ విశాఖపట్నం పర్యటనను, భారత నౌకాదళంతో సంయుక్తంగా జరిపిన విన్యాసాల గొప్ప అనుభవాన్ని తాము ప్పటికీ గుర్తుంచుకుంటామని యూఎస్ఎస్ సోమర్సెట్ నౌక సిబ్బంది పేర్కొన్నారు. విశాఖపట్నం పోర్టులో శనివారం మీడియాతో మాట్లాడారు. యూఎస్ఎస్ సోమర్సెట్ నౌక గురించి వివరించారు. డజన్ల కొద్దీ సైనిక వాహనాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ ఓడలో 1,000 మందికి పైగా నావికులు, మెరైన్లు ప్రయాణిస్తారని, పడవలను రిపేర్ చేసే వర్క్‌షాప్‌తో పాటు ఫ్లైట్ డెక్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు ల్యాండ్ అవుతాయని షిప్ పైలట్ ఆష్లే అంబుహెల్ తెలిపారు. “విశాఖపట్నంలో భారత నౌకాదళ సిబ్బందితో గడపడం ఆనందంగా ఉంది. మేము వారి నుండి చాలా నేర్చుకున్నాం. మంచి జ్ఞాపకాలు పొందాం” అని సోమర్సెట్లోని సర్ఫేస్ వార్ఫేర్ ఆఫీసర్ బ్రన్జిక్ చెప్పారు. -
భిన్న ఉపాధి...తొలి మహిళా షిప్ సర్వేయర్
స్త్రీలు సముద్రయానంలో పని చేయడానికి వెనుకాడతారు.సముద్రం మీదకు వెళ్లడానికి ధైర్యమున్నా కుటుంబాలు అంగీకరించవు. కాని పూజా ఛతోత్ దేశంలో మొదటి మహిళా షిప్ సర్వేయర్ కాగలిగింది.ఒక షిప్ తయారీ మొదలైనప్పటి నుంచీ అది సముద్రం మీద చేసే ప్రయాణం వరకూ అన్ని ప్రమాణాలు పాటించేలా చూసే ఉద్యోగమే షిప్ సర్వేయర్. పూజా ఛతోత్ పరిచయం. భారీ నౌక ప్రయాణిస్తూ ఉంటుంది. కనుచూపు మేరా నీలి రంగు సముద్రం తప్ప వేరే ఏమీ ఉండదు. ఉప్పునీటి గాలులు ముఖాన తాకుతుంటాయి. ఆ నౌక సముద్రయానానికి సురక్షితం అనే ఆమోదం తెలిపిన షిప్ సర్వేయర్ డెక్ మీద నిలబడి డ్యూటీ సమర్థంగా చేస్తున్నాననే తృప్తితో చిరునవ్వు చిందిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? పూజా ఛతోత్ను అడగాలి. ఆమె ఇప్పుడు బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత సముద్రయాన సంస్థ ‘లాయెడ్స్ రిజిస్టర్’లో షిప్ సర్వేయర్‌గా పని చేస్తోంది. ఇతర దేశాలలో షిప్ సర్వేయర్లుగా మహిళలు ఇదివరకే పని చేస్తున్నా మన దేశంలో పూజా ఛతోత్ మాత్రమే తొలి మహిళా సర్వేయర్ కాగలిగింది. చిన్నప్పటి ప్రభావం పూజా ఛతోత్ది కేరళలోని కన్నూర్ జిల్లా. అక్కడి ‘ఎజిమల’ అనే చోట ఆసియాలోనే అతి పెద్దదైన భారత నావెల్ అకాడెమీ ఉంది. నావెల్ కేడెట్ల శిక్షణ అక్కడే జరుగుతుంది. బాల్యంలో తల్లిదండ్రులతో కలిసి అకాడెమీని సందర్శించిన పూజా శిక్షణలో ఉన్న నావెల్ కేడెట్లను చూసి స్ఫూర్తి పొందింది. ముఖ్యంగా చాలామంది పురుష కేడెట్ల మధ్య ఒకే ఒక మహిళా ఆఫీసర్‌ను చూసింది పూజ. అప్పుడే ఆ ఆఫీసర్లాగానే తానూ సముద్రం మీద పని చేసే ఉద్యోగం చేయాలని అనుకుంది. ‘నేను హైస్కూల్ చదువుతున్నప్పుడే అనుకున్నాను ఆఫీసులో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు పని చేసే ఉద్యోగం చేయకూడదని’ అంది పూజ. నావెల్ ఆర్కిటెక్చర్ చదివి... సముద్రయాన రంగంలో పని చేయాలనుకున్నది పూజ. కొచ్చిలో నావెల్ ఆర్కిటెక్చర్‌ను 2020లో పూర్తి చేసింది. ఆ తర్వాత ఒక మెరైన్ కంపెనీలో ట్రయినీ నావెల్ ఆర్కిటెక్ట్‌గా చేరింది కాని ఆ పని రుచించలేదు. సముద్రపుగాలి తగలాలి అనుకుంది. ఆ సమయంలోనే తండ్రి స్నేహితుడొకడు షిప్ సర్వేయర్ ఉద్యోగం గురించి తెలిపాడు. అయితే ఆ రంగంలో స్త్రీలు ఇప్పటి దాకా లేరు. ‘నువ్వు మొదటిదానివి ఎందుకు కాకూడదు’ అన్నాడు తండ్రి. ఆ ్రపోత్సాహంతో లాయెడ్స్ రిజిస్టర్లో షిప్ సర్వేయర్‌గా ఉద్యోగం సంపాదించింది పూజ. రెండేళ్ల శిక్షణ షిప్ సర్వేయర్ మానసిక బలం, శారీరక సామర్థ్యం అవసరమయ్యే ఉద్యోగం. నౌక తయారవుతున్నప్పటి నుంచి సముద్రం మీదకు చేరే వరకూ చేరాక కూడా అన్ని నిర్మాణ, సాంకేతిక విభాగాలూ నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా చూడటమే ఈ ఉద్యోగం. నేల మీదా, సముద్రం మీదా పని ఉంటుంది. ఇందుకు కఠినమైన శిక్షణ అవసరం. లాయెడ్స్ రిజిస్టర్ సంస్థ ఆమెకు రెండేళ్లు శిక్షణ ఇచ్చింది. నౌకను తయారు చేసే మెటీరియల్ సర్వే శిక్షణ ముంబైలో తీసుకుంటే తయారీ విధానం సర్వే శిక్షణ కొచ్చిలో, గోవాలో తీసుకుంది. టెక్నికల్ శిక్షణ అంతా వైజాగ్, సింగపూర్లలో జరిగింది. రెండేళ్ల మొత్తం శిక్షణను సమర్థతతో పూర్తి చేయడం వల్ల ఇటీవల ఆమె షిప్ సర్వేయర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకుంది. పూజను చూసి మరెందరో యువతులు ఈ రంగంలోకి వస్తారు. ఏ రంగమూ మగవారి స్వీయసామ్రాజ్యం కాదని నిరూపిస్తారు. -
ఎర్రసముద్రంలో హౌతీ దాడులు.. ఇద్దరి మృతి
దుబాయ్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ మారణకాండకు తీవ్రంగా తప్పుబడుతూ అందుకు ప్రతిగా ఎర్రసముద్రంలో వాణిజ్యనౌకలను లక్ష్యంగా చేసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను ఉధృతం చేశారు. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హౌతీ దాడుల్లో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎర్ర సముద్ర పరిధిలోని గల్ఫ్ ఆఫ్ ఆడెన్ వద్ద ఈ ఘటన జరిగింది. బుధవారం గ్రీస్ దేశానికి చెందిన బార్బడోస్ జెండాతో వెళ్తున్న వాణిజ్యనౌక ‘ట్రూ కాని్ఫడెన్స్’పై హౌతీలు మిస్సైల్ దాడి జరపగా నౌకలోని ఇద్దరు సిబ్బంది చనిపోయారు. ఇతర సిబ్బంది పారిపోయారు. నౌకను వదిలేశామని, అది తమ అదీనంలో లేదని చెప్పారు. తమ యుద్ధనౌకలపైకి హౌతీ రెబెల్స్ నౌక మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించడంతో అమెరికా విధ్వంసక నౌకలు రెచి్చపోయాయి. హౌతీలు ఉంటున్న యెమెన్ భూభాగంపై దాడి చేసి హౌతీ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసంచేసింది. హౌతీల దాడుల్లో మరణాలు నమోదవడంతో ఆసియా, మధ్యప్రాచ్యం, ఐరోపాల మధ్య సముద్ర రవాణా రంగంలో సంక్షోభం మరింత ముదిరింది. హౌతీలపై అమెరికా దాడులపై ఇరాన్ మండిపడింది. అమెరికా ఇంధన సంస్థ షెవ్రాన్ కార్ప్‌కు చేరాల్సిన కువైట్ చమురును తోడేస్తామని హెచ్చరించింది. రూ.414 కోట్ల విలువైన ఆ చమురును తీసుకెళ్తున్న నౌకను ఇరాన్ గతేడాది హైజాక్ చేసి తమ వద్దే ఉంచుకుంది. -
హౌతీల క్షిపణి దాడి.. నౌక మునక
దుబాయ్: హౌతీ మిలిటెంట్ల క్షిపణి దాడిలో దెబ్బతిన్న మొట్టమొదటి వాణిజ్య నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. గాజాలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం సాగిస్తున్న దాడులకు నిరసనగా యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18వ తేదీన బాబ్ ఎల్ మండెల్ సింధుశాఖ వద్ద రుబీమర్ అనే నౌకపైకి హౌతీలు క్షిపణులను ప్రయోగించారు. దీంతో, ఆ నౌక దెబ్బతినడంతో అందులోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ నౌక నుంచి ఇంధన లీకవుతూ క్రమేపీ మునిగిపోతూ వచి్చంది. శనివారం మధ్యాహా్ననికి రుబీమర్ పూర్తిగా నీట మునిగినట్లు యెమెన్ అధికారులు ధ్రువీకరించారు. -
నౌకకు హైకోర్టు అరెస్టు ఉత్తర్వులు!
కటక్: పారాదీప్ ఓడ రేవులో మూడు నెలలుగా బెర్త్ అద్దెను చెల్లించని ఓ విదేశీ నౌకను అరెస్ట్ చేయాలని ఒరిస్సా హైకోర్టు ఆదేశించింది! ఎంవీ డెబి అనే ఈ నౌకలో రూ.220 కోట్ల విలువైన కొకైన పట్టుబడటంతో గత డిసెంబర్ నుంచి పోర్టులో లంగరేసి ఉంది. తమకు ఫీజు చెల్లించనందుకు షిప్పును అరెస్ట్ చేయాలంటూ పారాదీప్ పోర్టు కార్గో టెర్మినల్ విభాగం కోర్టుకెక్కింది. దాంతో నౌక అరెస్టుకు న్యాయమూర్తి జస్టిస్ వి.నరసింహ ఆదేశించారు. అడ్మిరాలిటీ చట్టం–2017 ప్రకారం ఇలాంటి ఆదేశాలు జారీ చేసే అధికారం ఒరిస్సాతో పాటు మరో ఏడు హైకోర్టులకుంది. -
Houthi Rebels: అమెరికా నౌకపై మిసైళ్లతో దాడి
సనా: యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న హౌతీ మిలిటెంట్లు మళ్లీ రెచ్చిపోయారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ నౌక ఎంవీ టార్మ్ థార్‌పై మిసైళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయిల్ ట్యాంకర్ నౌకకు ఎలాంటి నష్టం జరగలేదు. నౌకలోని సిబ్బంది ఎవరికీ గాయాలవలేదు. నౌకపై దాడి విషయాన్ని హౌతీ మిలిటెంట్ల ప్రతినిధి సరియా వెల్లడించారు. మరోవైపు ఈ విషయమై అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) కూడా ఒక ప్రకటన చేసింది. తమ దేశానికి చెందిన ఆయిల్ ట్యాంకర్ నౌక లక్ష్యంగా హౌతీలు పేల్చిన యాంటీ షిప్ బాలిస్టిక్ మిసైళ్లను తమ మిసైల్ డెస్ట్రాయర్ యూఎస్ఎస్ మాసన్ కూల్చివేసిందని సెంట్కామ్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్ ఎంవీ టార్మ్ థార్, యూఎస్ఎస్ మాసన్కు ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించింది. కాగా, గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్నయుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా ఎర్ర సముద్రం నుంచి వెళుతున్న వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్లు మిసైళ్లు, డ్రోన్లతో గత నవంబర్ నుంచి దాడులు మొదలు పెట్టారు. తొలుత ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చేస్తామని ప్రకటించిన హౌతీ గ్రూపు తర్వాత అమెరికా, బ్రిటన్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన నౌకలపైనా దాడులు చేస్తోంది. ఇదీ చదవండి.. రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు వెలికితీత -
ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్‌షిప్.. ప్రత్యేకతలివే..
సముద్ర అలలతో పోటీపడేలా ఆశలు ఉప్పొంగేవారికి ఇదో అద్భుతమైన అవకాశం. సముద్ర జలాల్లో ప్రయాణానికి ప్రపంచంలోనే అతి పెద్ద నౌక సిద్ధమైంది. టైటానిక్ కంటే ఇది ఐదు రెట్లు పెద్దది. ఈ నౌకలోనే సకల సదుపాయాలు ఉన్నాయి. ప్రపంచంలోని నౌకల్లో స్వర్గధామంగా మారిన ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మయామీ పోర్టు నుంచి బయలుదేరి వారం రోజులపాటు సముద్ర జలాలాపై విహరిస్తూ తూర్పు కరేబియన్ దీవులగుండా ప్రయాణించి ఫిబ్రవరి 3న తిరిగి మయామీకి చేరుకోనుంది. రకరకాల ధరల శ్రేణుల్లో ఈ విలాసనౌకలో అద్భుత ప్రయాణానికి ఏర్పాట్లున్నాయి. ప్రత్యేకతలివీ.. ఫిన్లాండ్లో మెయర్ తుర్కు షిప్‌యార్డ్ ఈ నౌకని నిర్మించింది. రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన ఈ నౌక పేరు ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’. నౌక పొడవు 1200 అడుగులు, బరువు 2,50,800 టన్నులు. ఈ నౌకలో 2,350 మంది సిబ్బంది ఉంటారు. 7,600 మంది ప్రయాణించగలరు. ప్రపంచ వ్యాప్తంగా 40 ప్రాంతాలకు చెందిన విభిన్న ఆహార పదార్థాలు ఈ షిప్లో లభిస్తాయి. నౌకలో వాటర్‌పార్క్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లు, ఫ్యామిలీలు ఎంజాయ్ చేసే సకల సదుపాయాలున్నాయి. ఈ నౌకలో ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్ పార్క్ ఉంది. దీన్ని ‘కేటగిరీ 6’ అని పిలుస్తారు. ఈ వాటర్ పార్కులో ఆరు స్లైడ్లు ఉన్నాయి. ఒక వాటర్ స్లయిడ్ నుంచి నేరుగా సముద్రంలోకి డైవ్ చేసేలా పెట్టారు. కానీ ప్రయాణికుల భద్రత రీత్యా దీనిని వారికి అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాల్లేవు. 2023 జూన్ 22న ఈ నౌక విజయవంతంగా మొదటి ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. నౌకలో ఉద్యానవనాలు ఉన్నాయి. పార్కుల్లోనూ ప్రయాణికులు సేద తీరవచ్చు. కాలుష్య నివారణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)ను ఇంధనంగా వాడుకుంటూ ఈ నౌక ప్రయాణం కొనసాగిస్తుంది. ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియెనల్ మెస్సీ ఈ నౌకకు పేరుపెట్టడం విశేషం. వివిధ రకాల ప్యాకేజీల కింద ధరలున్నాయి. అన్నింటికంటే తక్కువగా ఏడు రాత్రులు ఓడలో గడపాలంటే 3 వేల పౌండ్ల (కనిష్టంగా దాదాపు రూ.3.2 లక్షలకు పైన) వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇదీ చదవండి: ఈ దేశాల్లో డబ్బులన్నీ వ్యాపార కుటుంబాలవే.. కరేబియన్‌లో అత్యంత అందమైన దీవులైన బహమాస్, కొజుమెల్, ఫిలిప్స్బర్గ్, సెయింట్ మార్టెన్, రోటన్, హోండురస్ వంటి వాటి మీదుగా ఈ నౌక ప్రయాణిస్తుంది. -
కడలిలో కరెంట్ బోట్.. ఆసక్తికర విషయాలు..
విద్యుత్ వాహనాల(ఈవీల) వినియోగం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రజల్లో ఇప్పుడిప్పుడే వీటిపై అవగాహన పెరుగుతోంది. రానున్న రోజుల్లో వీటి వినియోగం మరింత హెచ్చవుతుందని భావిస్తున్నారు. అయితే ఈవీలు కేవలం రోడ్లకే పరిమితం కాకుండా నీటిలో సముద్రంపై వాటి మార్కును నిలుపుకోనున్నాయి. చాలా కంపెనీలు నీటిలో వినియోగించే చిన్నబోట్లను నడిపేందుకు సైతం విద్యుత్తును వినియోగించేలా పరిశోధనలు సాగిస్తున్నాయి. ఆ పరిశోధనల్లో భాగంగా అమెరికాకు చెందిన ‘క్రౌలి’ సంస్థ ‘ఈ-వోల్ఫ్’ అనే షిప్పింగ్ వెజెల్‌ను తయారుచేసింది. 70 టన్నులు మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఈ వెజెల్ 82 అడుగుల పొడవు ఉంటుంది. దీన్ని క్రౌలికు చెందిన ఇంజినీర్లు మాస్టర్బోట్ బిల్డర్స్ షిప్‌యార్డ్‌లో రూపొందించినట్లు తెలిసింది. ఇందులో ప్రయాణించే వారికి చుట్టూ(360 డిగ్రీ వ్యూ) ప్రదేశాలు కనిపించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ వెజెల్‌ను ఈ ఏడాది చివర్లో శాన్ డియాగో పోర్ట్‌లో విధుల్లో ప్రవేశపెట్టనున్నారు. దీన్ని తీరప్రాంతంలో పెట్రోలింగ్ కోసం వినియోగంచనున్నట్లు సమాచారం. ఈ వెజెల్లో 6.2 మెగావాట్ హవర్ మాడ్యులర్ బ్యాటరీ సిస్టమ్‌ను అమర్చారు. ఇది దాదాపు గంటకు 30 కిలోమీటర్లు గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. 2,100 కిలోవాట్ శక్తినిచ్చే రెండు థ్రస్టర్ మోటార్లతో కూడిన ప్రొపల్షన్ సిస్టమ్‌కు అమర్చారు. అయితే ఇందులో అత్యవసర సమయాల్లో బ్యాటరీ అయిపోయినా మరింత దూరం ప్రయాణించడానికి వీలుగా రెండు చిన్న డీజిల్ జనరేటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దీన్ని భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: చిన్న పరికరం.. పెద్ద ప్రయోజనం - వీడియో సాన్‌డియాగో పోర్ట్ తీరప్రాంతంలో మైక్రోగ్రిడ్ ఛార్జింగ్, స్టోరేజ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఏడాది చివర్లో ఈ-వోల్ఫ్ సేవలు వినియోగించుకోనున్నారు. సాంప్రదాయ వెజెల్‌తో పోలిస్తే ఇది మొదటి 10 సంవత్సరాల కాలంలో 2.5 టన్నుల డీజిల్ పార్టికల్స్, 3,100 మెట్రిక్ టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను ఆదా చేస్తుందని క్రౌలీ తెలిపింది. సముద్రగర్భంలో ఏర్పడుతున్న శబ్దకాలుష్యం వల్ల జీవులకు ఎంతో హానికలుగుతుందని అయితే అది ఈవీ బోట్లతో నివారించవచ్చని చెప్పింది. -
ది బోమ్ జీసస్: ఎడారిలో ఓడ... బోలెడంత బంగారం!
సుమారు 500 సంవత్సరాల క్రితం బంగారం , ఇతర సంపదతో భారతదేశానికి వెళుతుండగా అదృశ్యమైన పోర్చుగీస్ ఓడ అవశేషాలు నమీబియా ఎడారి తీరప్రాంతంలో గుర్తించారు. నైరుతి ఆఫ్రికాలోని ఎడారిలో బంగారు నాణేలతో ఉన్న ఓడను గుర్తించడం పురావస్తు పరిశోధనల్లో వెలుగు చూసిన అద్భుతంగా భావించారు. రెండు వేల స్వచ్ఛమైన బంగారు నాణేలు 44 వేల పౌండ్ల రాగి కడ్డీలు దాదాపుగా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. బోమ్ జీసస్ అనేది సబ్-సహారా ఆఫ్రికాలోని పశ్చిమ తీరంలో గుర్తించిన అత్యంత పురాతనమైన , అత్యంత విలువైన ఓడ. బోమ్ జీసస్ (ది గుడ్ జీసస్) ఓడ పోర్చుగల్‌లోని లిస్బన్ నుండి 1533న మార్చి 7 శుక్రవారం బయలుదేరిన పోర్చుగీస్ నౌక. కానీ 2008లో నమీబియా ఎడారిలో దీని అవశేషాలను గుర్తించినపుడు మాత్రమే ఈ ఓడలోని అద్భుత నిధి గురించి తెలిసింది. నైరుతి ఆఫ్రికాలోని డైమండ్ మైనింగ్ పనుల్లో నామ్దేబ్ డైమండ్ కార్పొరేషన్‌లోని కార్మికులు దీన్ని గుర్తించారు. బంగారం, రాగితో వంటి విలువైన సంపదతో ఇండియాకు వెళుతుండగా భయంకరమైన తుఫానులో చిక్కుకుని ఉంటుందని భావించారు.నమీబియా తీరంలో తుఫాను కారణంగా ఒడ్డుకు చాలా దగ్గరగా వచ్చినపుడు బోమ్ జీసస్ మునిగిపోయిందని అంచనా. దీని వలన ఓడ ముందు భాగం రాయితో ఢీకొని బోల్తా కొట్టింది. అయితే తీరప్రాంత జలాలు తగ్గుముఖం పట్టడంతో, బోమ్ జీసస్ అవశేషాలు బయల్పడ్డాయి. అయితే చెల్లాచెదురుగా కనిపించిన కొన్ని మానవ ఎముకలు తప్ప మరేమీ వీటిల్లో గుర్తించకపోవడంతో ఓడలోని సిబ్బంది శిధిలాల నుండి బయటపడటమో లేక మరణించడమో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ ఆర్కియాలజికల్ రీసెర్చ్‌కి చెందిన చీఫ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ నోలీ దీనిపై మరింత పరిశోధన చేశారు. బంగారు, వెండి, రాగి కడ్డీల నిధిని గుర్తించారు. దీనిపై బ్రూనో వెర్జ్ అనే సముద్రపు పురావస్తు శాస్త్రవేత్తను సంప్రదించారు డా. నోలీ. ప్రపంచ వారసత్వ సంపదకు సంబంధించి మూడు ఖండాలకు చెందిన వస్తువులతో ఉన్న ఓడ ప్రమాదాన్ని కనుగొనడం చాలా ముఖ్యమైనదని కూడా ఆయన అన్నారు. -
ఎర్ర సముద్రంలో ఆగని హౌతీల దాడులు!
న్యూయార్క్: అమెరికా నేతృత్వంలో ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ చేపట్టిన తర్వాత కూడా ఎర్రసముద్రంలో తొలిసారి ఓ నౌకపై దాడి జరిగింది. అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మెర్స్క్ హాంగ్జౌ అనే వాణిజ్య నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. హాంగ్జౌ నౌక డెనార్క్‌కు చెందిన నౌక. అయితే.. దాడి జరిగినప్పటికీ ప్రయాణానికి ఇబ్బంది కలగలేదని అమెరికా తెలిపింది ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ పేరిట అమెరికా, ఫ్రాన్స్, యూకేల నౌకలు ఎర్ర సముద్రంలో గస్తీ కాస్తున్నాయి. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై తరచూ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆపరేషన్‌ను అమెరికా నేతృత్వంలో చేపట్టాయి. డెన్మార్క్ కూడా ఈ కూటమిలో చేరింది. ఈ గస్తీ తర్వాత కూడా ఓ నౌకపై దాడి జరగడం గమనార్హం. అయితే.. ఆపరేషన్ మొదలైనప్పటి నుంచి శత్రువులకు చెందిన 17 డ్రోన్లను, నాలుగు యాంటీ బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేశాయి. ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి 1200 వాణిజ్య నౌకలను క్షేమంగా ఎర్ర సముద్రం దాటించామని అమెరికా నేవీకి చెందిన వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే హాంగ్జౌపై దాడి జరిగింది. ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం ఎర్ర సముద్రం నుంచే జరుగుతుంది. ఇంత కీలక రూట్లో వాణిజ్య నౌకలపై హౌతీ రెబెల్స్ దాడులకు దిగుతున్నారు. పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఈ దాడులు చేస్తున్నట్లు మిలిటెంట్లు చెబుతున్నారు. వీరికి ఇరాన్ మద్దతుందని అమెరికా బలంగా నమ్ముతోంది. ఇదీ చదవండి: హౌతీ రెబెల్స్‌ను మళ్లీ దెబ్బ కొట్టిన అమెరికా -
అన్నీ అమ్ముకుని నౌకపై దేశాలు తిరుగుతూ...
భూమిమీద బతికే మనిషికి అన్నీ సమస్యలే... ఇంటి రెంట్ మొదలుకొని ఇన్స్యూరెన్స్ వరకూ అన్నీ మోయలేనంత భారమే. అందుకే దీనికి పరిష్కారం క్రూయిజ్ షిప్లో బతకడం అంటూ తేల్చిపారేస్తున్నారు జాన్, హెన్సెస్సీ దంపతులు. క్రూయిజ్ షిప్లో నివసించడం అంటూ మొదలుపెడితే మీరు యుటిలిటీ బిల్లులు, ఆటో బీమా, ఆస్తి బీమా మొదలైనవి అస్సలు చెల్లించాల్సిన అవసరం లేదని జాన్, హెన్సెస్సీలు ముక్తకంఠంతో చెబుతున్నారు. క్రూయిజ్ షిప్లో నివసించేందుకు సిద్ధమైన జాన్, హెన్సెస్సీ దంపతులు 2020లో ఫ్లోరిడా(అమెరికా)లోని తమ ఇల్లు, వ్యాపారం, విలువైన వస్తువులను విక్రయించేశారు. రాయల్ కరీబియన్ క్రూయిజ్ లైన్స్‌లో 274 రోజుల ప్రయాణం కోసం టిక్కెట్లను కొనుగోలు చేశారు..‘ఇప్పుడు మేము టెలిఫోన్ బిల్లు, షిప్పింగ్ బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. కొన్ని క్రెడిట్ కార్టు మా దగ్గర ఉన్నాయి. ఇకపై మేము ఇంటి అద్దె, వాహన బీమా, ఆస్తి బీమా, యుటిలిటీ బిల్లులు... ఇలా పెద్ద జాబితాను చెల్లించాల్సిన అవసరం లేదు’ అని ఆ దంపతులు పేర్కొన్నారు. ఈ దంపతులు త్వరలో రెసిడెన్షియల్ క్రూయిజ్ షిప్ ఎక్కనున్నారు. దానిలో వారు క్యాబిన్‌ను కొనుగోలు చేశారు. ఇందుకోసం వారు ‘విల్లా వీ’ని ఎంచుకున్నారు. ఇది శాశ్వత నివాసాన్ని అందించే తొలి క్రూయిజ్ షిప్‌లలో ఒకటి. దీనిలోని ప్రయాణికులలో 30శాతం మంది పూర్తి సమయం దీనిలోనే ఉంటారు. మిగిలిన 85శాతం ప్రయాణికులు యూఎస్ పౌరులు. ఈ క్రూయిజ్ షిప్‌లోని క్యాబిన్ ధర 99 వేల డాలర్లు(ఒక డాలర్ రూ. 83). సీ వ్యూ కలిగిన బాల్కనీ విల్లాల ధర 249 వేల డాలర్లు. క్యాబిన్లలో కిచెన్, అతిథుల కోసం లివింగ్ రూమ్‌లో పుల్ డౌన్ బెడ్ ఉంటాయి. ఇందులో నివాసం కల్పించుకున్నవారు పోర్ట్ ఛార్జీలు చెల్లించాక తమ కుటుంబాలను ఉచితంగా ఆన్‌బోర్డ్‌లోకి తీసుకువచ్చేందుకు అనుమతివుంటుంది. ‘విల్లా వీ’ సీఈఓ మైకేల్ పెటర్సన్ మీడియాతో మాట్లాడుతూ తమ షిప్‌లోని దాదాపు సగం క్యాబిన్లలో వ్యాపార యజమానులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారన్నారు. కాగా జాన్, హెన్సెస్సీ దంపతులు క్రూయిజ్‌లో ఉంటూనే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలైనంత వరకు నడుస్తుంటారు. ఈ భారీ షిప్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి భూగోళాన్ని చుట్టుముడుతుంది. వెచ్చని వాతావరణంలో ఉండేందుకు సూర్యుడిని అనుసరిస్తుంది. జాన్, హెన్సెస్సీ దంపతులు తమకు కనిపించినవారందరికీ ఈ భూమిమీద నివసించడం కన్నా ఇలా క్రూయిజ్ షిప్లో బతకడమే చౌకైనదని, అదే ఉత్తమమని సలహా ఇస్తుంటారు. ఇది కూడా చదవండి: పాక్ రాజకీయాల్లో పెను సంచలనాలు! -
Drone Attack: నౌకపై దాడి అక్కడి నుంచే !
పుణె : ఇటీవల గుజరాత్‌లోని పోర్బందర్ తీరానికి సమీపంలో క్రూడాయిల్ నౌకపై జరిగిన డ్రోన్ దాడి ఇరాన్ నుంచే జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. డ్రోన్‌లో నుంచి వచ్చిన పేలుడు పదార్థం ఇరానియన్ 136 లాయిటరింగ్ అమ్యూనిషన్ అని పుణెలోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చినట్లు సమాచారం. రష్యన్ జిరాన్ -2 ఎక్స్‌ప్యాండబుల్ రకానికి చెందిన ఈ డ్రోన్ 2500 కిలోమీటర్ల రేంజ్ ప్రయాణించగలదు. దీనిలో 50 కిలోల వార్‌హెడ్ ఉంది. వార్‌హెడ్‌లో షాహెద్ 136 అనే పేలుడు పదార్థం వాడారని తెలుస్తోంది. అయితే పుణె ల్యాబ్ పూర్తిస్థాయి నివేదిక రావడానికి వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. సమీపంలోని రెండు ఇరానియన్ షిప్పుల నుంచే క్రూడాయిల్ నౌకపై డ్రోన్ దాడి జరిగిందని తొలుత భావించారు. అయితే ఆ రెండు నౌకలను తనిఖీ చేసిన తర్వాత వాటికి ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని నేవీ అధికారులు తేల్చారు. ఇదీచదవండి..హౌతీ రెబెల్స్‌పై అమెరికా కీలక ప్రకటన -
Drone Attack: అమెరికా సంచలన ప్రకటన
వాషింగ్టన్: గుజరాత్‌లోని పోర్బందర్ సమీపంలో అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి కారణమైన డ్రోన్ ఇరాన్ నుంచి ప్రయోగించారని అమెరికా రక్షణశాఖ ముఖ్య కార్యాలయం పెంటగాన్ తెలిపింది. ఈ మేరకు పెంటగాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘జపాన్‌కు చెందిన కెమికల్ ట్యాంకర్ నౌక కెమ్ ప్లూటో మంగళూరు వెళుతోంది. ఈ నౌకపై భారత తీరానికి 200 నాటికల్ మైళ్ల దూరంలో డ్రోన్ దాడి జరిగింది. డ్రోన్ దాడితో చెలరేగిన మంటలను నౌకలోని సిబ్బంది ఆర్పివేశారు. నౌకపై దాడి చేసిన డ్రోన్‌ను ఇరాన్ నుంచి ప్రయోగించారు. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేయడం 2021 నుంచి ఇది ఏడోసారి’అని పెంటగాన్ అధికార ప్రతినిధి ఓ వార్తా సంస్థకు తెలిపారు. దీనిపై ఇరాన్ ఇంత వరకు స్పందించలేదు. ఓ పక్క ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హతీ రెబెల్స్ దాడి చేస్తుండగా భారత సమీపంలో నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే డ్రోన్ దాడి తామే చేశామని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. డ్రోన్ దాడికి గురైన కెమ్ప్లూటోకు భారత కోస్ట్‌గార్డ్ అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తోంది. ఇదీచదవండి..హిందూ ఆలయంపై విద్వేష రాతలు -
ఆర్థిక, దౌత్యంలో నూతనాధ్యాయం
నాగపట్నం/న్యూఢిల్లీ: దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత భారత్, శ్రీలంక మధ్య మొదలైన పడవ ప్రయాణ సేవలు ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాన్ని సుధృడం చేస్తాయని ప్రధాని మోదీ అభిలíÙంచారు. శనివారం తమిళనాడులోని నాగపట్నం, జాఫా్నలోని కంకెసంథురై మధ్య ఫెర్రీ సేవలు మొదలవడం అనేది ఇరుదేశాల మైత్రీ బంధంలో కీలకమైన మైలురాయి అని మోదీ శ్లాఘించారు. షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ హైస్పీడ్ ఫెర్రీ సేవలు మొదలయ్యాయి. సముద్రమార్గంలో 110 కిలోమీటర్ల దూరాన్ని 3.5 గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. ఫెర్రీ సేవలను లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా చెరియాపని అనే పడవ 50 మంది ప్రయాణికులతో శ్రీలంకకు బయల్దేరింది. సాయంత్రం కల్లా భారత్‌కు తిరిగొచి్చంది. ‘ఇరుదేశాల మధ్య కనెక్టివిటీతోపాటు వాణిజ్యం, బంధాల బలోపేతానికి ఫెర్రీ సేవలు ఎంతో కీలకం’ అని ప్రధాని మోదీ తన వీడియో సందేశంలో వ్యాఖ్యానించారు. ‘ ఈ బంధం ఈనాటిదికాదు. ప్రాచీన తమిళ సాహిత్యంలోనూ దీని ప్రస్తావన ఉంది. సంగం కాలం నాటి పట్టినాప్పలై, మణిమేఖలై సాహిత్యంలోనూ భారత్, శ్రీలంక నౌకల రాకపోకల వివరణ ఉంది. ప్రఖ్యాత కవి సుబ్రమణ్యభారతి రాసిన పాట ‘సింధు నదియన్ మిసై’లోనూ రెండుదేశాల బంధాన్ని వివరించారు. చారిత్రక, సాంస్కృతిక బంధాల్లో ఈ పడవ ప్రయాణాల మధుర జ్ఞాపకాలు సజీవంగా ఉన్నాయి. ఇటీవల భారత్‌లో పర్యటించిన సందర్భంగా విక్రమసింఘే అనుసంధాన సంబంధిత విజన్ డాక్యుమెంట్‌ను భారత్‌తో పంచుకున్నారు. 2015లో శ్రీలంకలో నేను పర్యటించాకే ఢిల్లీ, కొలంబో మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి ’ అని మోదీ గుర్తుచేసుకున్నారు. మనసులనూ దగ్గర చేస్తోంది ‘ఈ అనుసంధానం రెండు పట్టణాలను మాత్రమే కాదు. రెండు దేశాలను, దేశాల ప్రజలను, వారి మనసులనూ దగ్గర చేస్తోంది. ‘పొరుగుదేశాలకు ప్రాధాన్యం’ అనే మోదీ సర్కార్ విధానాన్ని మరింత తీసుకెళ్తున్నాం’ అని ఈ సేవలను లాంఛనంగా పచ్చజెండా ఊపి ప్రారంభించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నౌకలు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య అనుసంధానం, వాణిజ్యం, పర్యాటకం, సాంస్కృతిక అనుబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఈ సేవలు దోహదపడతాయని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే వ్యాఖ్యానించారు. గతంలో చెన్నై, కొలంబోల మధ్య తూత్తుకుడి మీదుగా ఇండో–సియోల్ ఎక్స్‌ప్రెస్ ఆధ్వర్యంలో పడవ ప్రయాణలు కొనసాగేవి. అయితేశ్రీలంకలో పౌర సంక్షోభం తలెత్తాక 1982లో ఆ సేవలు నిలిచిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఇలా పడవ సేవలు పునఃప్రారంభమయ్యాయి. -
నెదర్లాండ్స్ నౌకలో భారీ అగ్నిప్రమాదం
ది హేగ్: నెదర్లాండ్స్‌లోని ఉత్తర సముద్రంలో సరుకు రవాణా చేసే ఒక నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మంటల్లో నౌకలో ఉన్న 3 వేల కార్లు దగ్ధమైనట్టు అంచనా. నౌక సిబ్బందిలో ఒకరు మంటల్లో చిక్కుకొని మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొందరు ప్రాణరక్షణ కోసం సముద్రంలో దూకారు. ఆ నౌకలో దట్టంగా పొగ అలుముకోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి 22 మంది నౌకా సిబ్బందిని ఆస్పత్రికి తరలించినట్టుగా డచ్ కోస్ట్‌గార్డ్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నౌకలో ఉన్న 25 ఎలక్ట్రిక్ కారుల్లో ఒక దానిలో మంటలు చెలరేగడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. జర్మనీలోని బ్రెమర్‌హెవన్ పోర్టు నుంచి ఈజిప్టులో మరో పోర్టుకి ఈ నౌక వెళుతుండగా మంగళవారం రాత్రి అమెలాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ నౌకలో మంటలు కొద్ది రోజుల పాటు కొనసాగుతాయని డచ్ కోస్ట్ గార్డ్ అంచనా వేస్తోంది. నౌకకి ఇరువైపులా నీళ్లు పోస్తూ మంటల్ని అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపల నీళ్లు వేస్తే నౌక మునిగిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు తరలించడం కూడా ఒక ముప్పుగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
సముద్రపు దొంగల ఒంటికన్ను సీక్రెట్ ఇదే..!
సముద్రపు దొంగలకు సంబంధించిన కథలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. చాలామంది ఈ కథలంటే చెవికోసుకుంటారు. ఈ కథలకు దశాబ్ధాల చరిత్ర ఉంది. సముద్రపు దొంగల చిత్రాలు కూడా ఎంతో విచిత్రంగా ఉంటాయి. వీరు టోపీ ధరించడంతోపాటు నల్లని ప్యాంటు వేసుకోవడాన్ని మనం గమనించే ఉంటాం. ముఖ్యంగా ముఖానికి ఒక పట్టీ ఉంటుంది. అది ఒక కంటిని కప్పివేస్తూ ఉంటుంది. దీని వెనుక అనేక కథనాలు ఉన్నాయి. ఆ కామెడీ టీవీ సిరీస్‌లో.. దీనిని ఫ్యాషన్ అని కొందరు చెబుతుంటారు. కొన్ని కథలలో ఆ సముద్రపు దొంగకు ఒక కంటికి గాయమయ్యిందని, లేదా ఆ కన్ను లేదని అందుకే అలా పట్టీ కట్టుకున్నట్లు చెబుతారు. స్పాంజ్‌బాబ్ స్క్వేర్ప్యాంట్లు అనే అమెరికన్ కామెడీ టీవీ సిరీస్‌లోని సముద్రపు దొంగ పాత్రకు చిన్నప్పటి నుంచి ఒక కన్నువుండదు. దీంతో అతను తన కంటికి పట్టీ కట్టుకుంటాడు. అయితే సముద్రపు దొంగల పాత్రలన్నింటికీ కంటికి పట్టీ ఉండదు. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ మూవీ సిరీస్‌లోని సముద్రపు దొంగల కంటికీ పట్టీ ఉండదు. స్ఫూర్తిగా నిలిచిన క్యారెక్టర్ అరేబియా గల్ఫ్‌లో రహ్మాహ్ ఇబ్న్ జాబిర్ అల్-జల్హామీ అనే సముద్రపు దొంగ తన దృష్టిని ఒకే చోట నిలిపి ఉండాలనే ఉద్దేశంలో ఒక కంటికి గంతలు కట్టుకునేవాడని చెబుతారు. ఈ తరహా పాత్రలు, చిత్రాలను సృష్టించడానికి చిత్రకారులు.. రహ్మాహ్ ఇబ్న్ జాబిర్ అల్-జల్హామీను ప్రేరణగా తీసుకుని ఉండవచ్చని చెబుతారు. శాస్త్రీయ కోణంలో.. శాస్త్రీయంగా చూస్తే మన కళ్ళు అకస్మాత్తుగా చీకటి లేదా కాంతిని చూడాల్సి వచ్చినప్పుడు అవి సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తాయి. అకస్మాత్తుగా చీకటి పడినప్పుడు, మన కంటిలోని కనుబొమ్మ విస్తరిస్తుంది. తద్వారా ఎక్కువ కాంతి లోపలికి ప్రవేశిస్తుంది. కానీ ఆ కాంతి చీకటిలో చూడటానికి సరిపోదు. అప్పుడు రోడాప్సిన్ అనే రసాయనం విచ్ఛిన్నమై మన మెదడుకు నరాల ద్వారా సందేశాలను పంపుతుంది. అప్పుడు మసక చీకటిలో కూడా కళ్లు కొంతమేరకు చూడగలుగుతాం. సముద్రపు దొంగలు చీకటిలో చూసేందుకు ఒక కంటిని, వెలుతురులో చూసేందుకు మరో కంటిని సిద్ధంగా ఉంచుతారట. సముద్రపు దొంగలు ఒక కంటికి పట్టీ కట్టడంవలన మసక చీకటిలో వారు సరిగ్గా చూడటానికి ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదట. మసక చీకటిలో చూసేందుకు వారు ఒక కంటికి ఉన్న పట్టీని తొలగించి, దానిని మరొక కంటికి దానిని అమరుస్తారుట. ఇది కూడా చదవండి: ‘అయ్యా.. నేను బతికే ఉన్నాను.. డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి’ -
Anchor Sreemukhi : శ్రీముఖి స్టన్నింగ్ లుక్స్.. బోటులో ఏకంగా! (ఫొటోలు)
-
Icon Of The Seas: టైటానిక్ కంటే ఐదు రెట్లు పెద్దది
సముద్ర అలలతో పోటీపడేలా ఆశలు ఉప్పొంగేవారికి ఇదో అద్భుతమైన అవకాశం. సముద్ర జలాల్లో ప్రయాణానికి ప్రపంచంలోనే అతి పెద్ద నౌక సిద్ధమైంది. టైటానిక్ కంటే ఇది ఐదు రెట్లు పెద్దది. ఈ నౌకలోనే సకల సదుపాయాలు ఉన్నాయి. ప్రపంచంలోని నౌకల్లో స్వర్గధామంగా మారిన ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. రకరకాల ధరల శ్రేణుల్లో ఈ విలాసనౌకలో అద్భుత ప్రయాణానికి ఏర్పాట్లున్నాయి. ప్రత్యేకతలివీ.. ► ఫిన్లాండ్లో మెయర్ తుర్కు షిప్‌యార్డ్ ఈ నౌకని నిర్మించింది ► రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన ఈ నౌక పేరు ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’. ► నౌక పొడవు 1200 అడుగులు, బరువు 2,50,800 టన్నులు, ► ఈ నౌకలో 2,350 మంది సిబ్బంది ఉంటారు. 5,610 మంది ప్రయాణించగలరు ► ప్రపంచ వ్యాప్తంగా 40 ప్రాంతాలకు చెందిన విభిన్న ఆహార పదార్థాలు ఈ షిప్లో లభిస్తాయి. ► నౌకలో వాటర్‌పార్క్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లు, ఫ్యామిలీలు ఎంజాయ్ చేసే సకల సదుపాయాలున్నాయి. ► వచ్చే ఏడాది జనవరిలో మియామి నుంచి బయల్దేరే ఈ నౌక కరేబియన్ సముద్ర జలాల్లో ప్రయాణిస్తుంది. ► ఈ నౌకలో ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్ పార్క్ ఉంది. దీనికి కేటగిరీ 6 అని పిలుస్తారు. ఈ వాటర్ పార్కులో ఆరు స్లైడ్లు ఉన్నాయి. ► ఒక వాటర్ స్లయిడ్ నుంచి నేరుగా సముద్రంలోకి డైవ్ చేసేలా పెట్టారు. కానీ ప్రయాణికుల భద్రత రీత్యా దీనిని వారికి అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాల్లేవు. ► జూన్ 22న ఈ నౌక విజయవంతంగా మొదటి ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. ► నౌకలో ఉద్యానవనాలు ఉన్నాయి. పార్కుల్లోనూ ప్రయాణికులు సేద తీరవచ్చు. ► కాలుష్య నివారణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)ను ఇంథనంగా వాడుకుంటూ ఈ నౌక ప్రయాణం కొనసాగిస్తుంది. ► వచ్చే ఏడాది జనవరిలో మియామి నుంచి ప్రారంభమయ్యే ఈ నౌకలో ప్రయాణం కోసం ఇప్పటికే రికార్డు స్థాయిలో టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ► వివిధ రకాల ప్యాకేజీల కింద ధరలున్నాయి. అన్నింటికంటే తక్కువగా ఏడు రాత్రులు ఓడలో గడపాలంటే 3 వేల పౌండ్ల (రూ. 3 లక్షలకు పైన ) వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ► కరేబియన్‌లో అత్యంత అందమైన దీవులైన బహమాస్, కొజుమెల్, ఫిలిప్స్బర్గ్, సెయింట్ మార్టెన్, రోటన్, హోండురస్ వంటి వాటి మీదుగా ఈ నౌక ప్రయాణిస్తుంది. ► వినోదమే ప్రధానంగా రూపొందించిన ఈ షిప్లో జరీ్నకి సర్వత్రా ఆసక్తి నెలకొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్టార్‌షిప్ మరో ప్రయోగంపై ఎలన్ మస్క్ అప్డేట్
ఎలన్‌మస్క్ సారధ్యంలోని స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ స్టార్‌షిప్ ప్రయోగంలో మరో కీలక మైలు రాయి దాటింది. ఈ ప్రయోగం గతంలో విఫలమైన తరువాత ఎలన్ మస్క్ మరికొద్ది నెలల్లో మరో ప్రయోగం చేపడతామని వెల్లడించారు. తాజాగా జరిగిన ఫ్లైట్-2 ప్రయోగంలో మరో మైలురాయిని అధిగమించినట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎలన్ మస్క్ వెల్లడించారు.దీనికి సంబంధించి తాజాగా టెక్సాస్‌లోని స్టార్‌బేస్‌లో షిప్ 25 సిక్స్ ఇంజిన్ స్టాటిక్ ఫైర్ టెస్ట్ పూర్తి చేసుకున్నదని ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా మస్క్ షేర్ చేశారు. గత ఏప్రిల్‌లో ఎలన్ మస్క్ సారధ్యంలో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలమైన విషయం విదితమే. అమెరికాలోని టెక్సాస్ సమీపంలోగల బోకా చీకా తీరం నుంచి నింగిలోకి ఎగిసిన కొద్దిసేపటికే రాకెట్ స్టార్‌షిప్ పేలిపోయింది.ఈ రాకెట్ ప్రయోగం విఫలమమైన నేపధ్యంలో బూస్టర్, స్పేస్ క్రాఫ్ట్ పేలిపోయినట్లు స్పేస్ ఎక్స్ సంస్థ వివరించింది. గత ప్రయోగ ఫలితాలను విశ్లేషించి.. అయితే నాడు ఎలన్ మస్క్ ఒక ట్వీట్లో ఈ ప్రయోగ ఫలితాలను తమ సైంటిస్టులు క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు. ఈ వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకున్నామని, మరికొద్ది నెలల్లో మరో ప్రయోగం చేపడతామని తెలిపారు. అంతరిక్షంలో వ్యోమగాములు, సరుకు రవాణాకు ఉద్దేశించిన స్టార్‌షిప్ ప్రయోగాన్ని గత ఏప్రిల్ 17న చేపట్టారు. ఈ ప్రయోగం ప్రారంభమైన మూడు నిమిషాలకు బూస్టర్ విడిపోయి, మెక్సికోలో పడేలా దానిని రూపొందించారు. అయితే స్పేస్ క్రాఫ్ట్ భూమి చుట్టూ దాదాపు ఒక పరిభ్రమణం సాగించినా, సాంకేతిక కారణాలతో చివరి క్షణంలో ప్రయోగం వాయిదా పడింది. తరువాతి ప్రయోగంలో ఊహించని విధంగా స్టార్‌షిప్ ప్రయోగం విఫలమైంది. అయితే తాజాగా చేసిన ప్రయోగంలో మరోమైలు రాయి దాటినట్లు ఎలన్ మస్క్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. Key milestone completed for flight 2 https://t.co/bGmWKOnKEH — Elon Musk (@elonmusk) June 27, 2023 ఇది కూడా చదవండి: ఇకపై డాక్టర్ చీటీ లేకుండానే గర్భనిరోధక మాత్రలు.. -
భార్య కోసం నౌక తరహాలో భారీ ఇల్లు
సాక్షి, చైన్నె: తన భార్య కోరికగా ఓ భర్త ఏకంగా నౌక తరహాలో ఇంటిని నిర్మించాడు. సముద్రాన్ని తలపించే నిర్మాణాలతో అచ్చం నౌకలో ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగించే విధంగా నిర్మించిన ఈ నివాసం ప్రస్తుతం కడలూరులో హాట్ టాపిక్‌గా మారింది. వివరాలు.. ఇటీవల కాలంలో భార్యలను స్మరిస్తూ ఆలయాలు, భర్తల కోసం భార్యల స్మారక మందిరాల నిర్మాణాలు, విగ్రహాల ఏర్పాటు వంటి ఘటనలు తమిళనాట అధికమయ్యాయి. అలాగే తమ తల్లిదండ్రుల కోసం స్మారక మందిరాలను నిర్మించే తనయులూ ఉన్నారు. రెండు రోజుల క్రితం తిరువారూర్ జిల్లా అమ్మయప్పన్ గ్రామంలో చైన్నెనకు చెందిన పారిశ్రామిక వేత్త అమరుద్దీన్ మరణించిన తన తల్లి జైలానీ బీవీ స్మారకంగా ఓ తాజ్ మహల్ తరహాలో మందిరాన్ని నిర్మించి అందరినీ విస్మయంలో పడేశాడు. ఈ తాజ్‌మహల్ గురించి గత రెండు రోజులుగా పెద్ద చర్చే జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కడలూరులో జీవించి ఉన్న తన భార్య కోరికను తీర్చే విధంగా షిప్లో పనిచేసే ఉద్యోగి ఒకరు నౌక తరహా నిర్మాణాలతో ఇంటిని నిర్మించడం విశేషం. నౌక తరహాలో.. కడలూరు జిల్లా వన్నార పాళయానికి చెందిన శుభాష్ ఓ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అధిక సమయం ఆయన నౌకలోనే పయనం చేస్తూ వస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వివాహమైన తొలి నాళ్లలో తన భార్య శుభశ్రీని వెంట బెట్టుకుని నౌకలో కొన్ని దేశాలకు వెళ్లాడు. ఈ సమయంలో నౌక తరహాలో ఇంటిని మనం కూడా నిర్మించుకోవాలని భర్తను శుభశ్రీ కోరింది. దీంతో భార్య కోరిక తీర్చేందుకు ఇటీవల వన్నార పాళయంలో 11 వేల చదరపు అడుగు స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఇందులో 4 వేల చదరపు అడుగులలో బ్రహ్మాండ నివాసం నిర్మించాడు. ఇది పూర్తిగా నౌకను తలపించే విధంగా ఉండడం విశేషం. మిగిలిన స్థలంలో ప్రత్యేక నిర్మాణాలతో సముద్రాన్ని తలపించే విధంగా ఏర్పాట్లు చేశాడు. నౌకలో ఉండే విధంగానే మెట్లు, గదులు, స్విమ్మింగ్ ఫుల్, జిమ్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయించాడు. నౌకలో కెప్టెన్ కూర్చునే ప్రాంతాన్ని ప్రత్యేక గదిగా తీర్చిదిద్ది, అక్కడి నుంచి కడలూరు పరిసరాలను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేక బైనాకులర్ వంటి ఏర్పాట్లు చేయించుకున్నాడు. రాత్రుల్లో అయితే, సముద్రంలో నౌక పయనిస్తున్న తరహాలో లైటింగ్ సెట్టింగ్‌లు వేయించాడు. 90 శాతానికి పైగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఇంట్లోకి శుభాష్, శుభశ్రీ దంపతులు శుక్రవారం గృహ ప్రవేశం చేశారు. ఇంటికి ఎస్– 4 నిలయం అని వినూత్నంగా పేరు పెట్టారు. తన ఇంట్లో ఉన్న నలుగురి పేర్లకు ముందుగా ఎస్ అక్షరం రావడంతోనే ఈ పేరు పెట్టినట్టు శుభాష్ పేర్కొన్నారు. మిగిలిన ఖాళీ స్థలంలో నిర్మాణాలన్నీ పూర్తి కాగానే, ఓ దీవిలో తన ఇల్లు నౌక తరహాలో కనిపిస్తుందని, ఆ దిశగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించాడు. పెళ్లైన కొత్తలో కోరిన కోరికను ఇప్పుడు తన భర్త సాకారం చేయడం ఆనందంగా ఉందని శుభశ్రీ తెలిపారు. -
‘ఏడాది పాటు షిప్పు ప్రయాణం’.. డబ్బు కట్టి గొల్లుమంటున్న జనం
తాను ఒక క్రూజ్‌షిప్ కెప్టెన్ అని చెప్పుకుంటూ జనాల నుంచి ఏకంగా రూ.2.78 కోట్ల సొమ్ము కాజేసిన వ్యక్తికి కేవలం రూ. 36 వేలు తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశాలిచ్చిన వింత ఉదంతం సంచలనంగా మారింది. ఆ మోసగాని పేరు జాడీ ఆలివర్. అతను చాలామందిని కలిసి, ఎవరికైనా సరే షిప్పులో సెలవులు ఆనందంగా గడిపేందుకు అవకాశం కల్పిస్తానంటూ వారి నుంచి డబ్బులు గుంజేవాడు. సదరు మోసగాడు షిప్పు కెప్టెన్ తరహా దుస్తులు ధరించి తిరుగుతుండేవాడు. అందరికీ నకిలీ ఐడీ కార్డు చూపించి ప్రలోభపెట్టేవాడు. మిర్రర్ యూకే తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదంతం బ్రిటన్‌లో చోటుచేసుకుంది. ఆ మోసగాడు నకిలీ అకౌంట్ ద్వారా జనాలకు ఈ మెయిల్స్ పంపించి, తాను కార్నివాల్ పీఎల్సీ ఉద్యోగిని అని చెప్పుకునేవాడు. కోర్టు విచారణ నేపధ్యంలో..మోసగాడు జనానికి ఒక షీటు పంపేవాడని, దానిలో ట్రిప్స్‌కు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన వివరాలు ఉంటాయని వెల్లడయ్యింది. ఈవిధంగా అతను సేకరించిన మొత్తాన్ని ఆన్లైన్ జూదానికి వినియోగించేవాడు. ఆన్లైన్ జూదం కోసం రుణాలు కూడా తీసుకునేవాడు. అయితే ఇప్పుడు అతని దగ్గర బాధితులకు ఇచ్చేందుకు కేవలం రూ.36 వేలు మాత్రమే ఉన్నాయి. బాధితులలో చాలామంది తాము దాచుకున్న మొత్తాన్ని ఆలివర్ చేతిలో పెట్టారు. జీవితంలో మరచిపోలేని విధంగా సెలవులను ఆనందంగా గడపుతామనే ఉద్దేశంలో అతనికి డబ్బులు చెల్లించారు. అతని బారిన పడినవారిలో ముఖ్యంగా వృద్ధులు అధికంగా ఉన్నారు. ఇవాన్స్ అనే ఒక బాధితుడు మాట్లాడుతూ ‘ఆలీవర్ దగ్గర నేను ఎంత సొమ్ము పోగొట్టుకున్నానో చెప్పుకోలేను. ఎందుకంటే ఈ విషయం ఇప్పటికీ నా కుమారునికి చెప్పలేదు. ఇలా డబ్బులు పోగొట్టుకోవడంలో నాదే పూర్తి బాధ్యత’అని అన్నారు. మరో బాధితుడు మార్షల్ గోడాయీ మాట్లాడుతూ‘దీని ప్రభావం నా భార్య ఆరోగ్యం మీద పడింది. గతంలో మేము డబ్బుకు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. పోగొట్టుకున్న మొత్తం మాకెంతో విలువైనది’ అని అన్నారు. 2018లో బాధితులు ట్రిప్పు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ విషయమై పోలీసులకు తెలిసింది. బాధితులు తమ బ్యాగులతో ఎదురుచూసినప్పటికీ ఎటువంటి షిప్పు రాలేదు. ఆలీవర్ వారికి 2018 జనవరి 1నుంచి 2019 జనవరి 2 వరకూ ట్రిప్పు చేయిస్తానని నమ్మబలికాడు. కాగా అలీవర్ ఒక ప్రాంతంలో భార్యతో ఉంటూ, మరోప్రాంతంలో ప్రియురాలితో కాలం గడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆలివర్ చేసిన మోసాలు కోర్టులో నిర్థారణ కావడంతో కోర్టు అతనిని దోషిగా ఖరారు చేసింది. జడ్జి రిచర్డ్ విలియమ్స్ నేరస్తునికి ఆరు ఏళ్ల ఒకనెల పాటు జైలుశిక్ష విధించారు. -
నడి సముద్రంలో క్రికెట్.. 'ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో'
క్రికెట్‌ను ఎక్కడైనా ఆడుకోవచ్చు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి గల్లీ క్రికెట్ దాకా చాలా చూశాం. అయితే కదులుతున్న షిప్లో క్రికెట్ ఆడడమే వింత అనుకుంటే.. బంతికి తాడు కట్టి ఆడడం మరో విశేషం. ఎందుకంటే నడి సముద్రంలో కదులుతున్న షిప్లో క్రికెట్ ఆడినా.. భారీ షాట్లు కొడితే బంతి వెళ్లి సముద్రంలో పడడం ఖాయం. దీంతో ప్రతీసారి కొత్త బంతితో ఆడాల్సి వస్తోంది. అయితే ఇక్కడ మాత్రం షిప్లో క్రికెట్ ఆడిన కొందరు వ్యక్తులు తమ మెదుడుకు పదును పెట్టారు. బంతికి తాడు కట్టి క్రికెట్ ఆడారు. అప్పుడు భారీ షాట్లు కొట్టినా.. బంతి సముద్రంలో పడినా.. తాడు సాయంతో మళ్లీ వెనక్కి తెచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. వీడియో చూసిన క్రికెట్ అభిమానులు ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో.. అంటూ కామెంట్ చేశారు. pic.twitter.com/WbyhQPh87c — Out Of Context Cricket (@GemsOfCricket) May 15, 2023 చదవండి: 'ఆడడమే వ్యర్థమనుకుంటే బ్యాటింగ్‌లో ప్రమోషన్' -
ఈ ఓడ ఏ ఇంధనంతో నడుస్తుందో తెలుసా? పర్యావరణానికి ఎంతో మేలు!
ఎరువుగా ఉపయోగించే అమోనియాను వాహనాలకు ఇంధనంగా ఉపయోగించే పద్ధతి మొదలైంది. అమెరికాలోని బ్రూక్లిన్కు చెందిన ‘అమోగీ’ సంస్థ ఇదివరకే అమోనియాతో నడిచే ట్రక్కు, ట్రాక్టర్లను విజయవంతంగా రూపొందించింది. ఇటీవల అమోనియా ఇంధనంగా నడిచే ఓడను కూడా ఈ సంస్థ రూపొందించింది. ఇదీ చదవండి: ఈ స్మార్ట్ వాచ్ సూపర్! 12 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఇంకా మరెన్నో కళ్లుచెదిరే ఫీచర్లు! నార్వేకు చెందిన ‘యారా క్లీన్ అమోనియా’ సంస్థ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న ‘గ్రీన్ అమోనియా’ను వాడుకుని నడిచే వాహనాలను ‘అమోగీ’ సంస్థ తయారు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల పూర్తిగా అమోనియానే ఇంధనంగా ఉపయోగించుకుని ప్రయాణించే ఓడను రూపొందించింది. అమోనియాను ఇంధనంగా ఉపయోగించుకోవడం వల్ల పర్యావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదల పూర్తిగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విద్యుత్ వాహనాల వినియోగానికి తగిన వెసులుబాటు లేని ప్రాంతాల్లో అమోనియాతో నడిచే వాహనాలు అద్భుతంగా ఉపయోగపడతాయని వారు చెబుతున్నారు. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
ఓడ ప్రయాణం.. అంతా చూస్తుండగా భార్యని సముద్రంలోకి విసిరేసిన భర్త!
సముద్రంలో ప్రయాణిస్తుండగా ఓ వ్యక్తి తన భార్యని ఫెర్రీలో నుంచి తోసేసిన ఘటన ఇండోనేషియాలో జరిగింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఇండోనేషియా పోలీసులు విడుదల చేశారు. సుండా స్ట్రెయిట్ గుండా ప్రయాణించే ఫెర్రీ ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీసులు షేర్ చేసిన వీడియోలో... ఫెర్రిలో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆమె భర్త తన వెనుక వచ్చి నిల్చుంటాడు. అతనికి ఏమైందోగానీ హఠాత్తుగా ఆమెను ఎత్తుకొని అందరి కళ్లు ముందు ఓవర్‌బోర్డ్‌లో నుంచి సముద్రంలోకి విసిరేస్తాడు. అయితే అదృష్టవశాత్తు, ఆ మహిళ సముద్రంలో పడకుండా తప్పించుకుంటుంది. కింద పడ్డ ఆమె ఫెర్రిలోని రెయిలింగ్‌పై ఉన్న కడ్డీలకు అతుక్కుపోవడంతో ప్రాణాలతో బయటపడింది. తోటి ప్రయాణికుల సహాయంతో ఆమె భర్తని పోలీసులకు అప్పగిస్తారు. మరో వైపు.. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో అతనిపై కేసు నమోదు చేయనట్లు సమాచారం. ఎందుకంటే.. ఆ వ్యక్తి మానసిక స్థితి కొంతకాలంగా సరిగా లేదని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు మహిళ కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: సంక్షోభంతో అల్లాడుతున్న పాక్‌కు షాక్: మరో ప్లాంట్ షట్‌డౌన్ -
ఆంగ్లో ఈస్టర్న్ భారీ నియామకాలు
ముంబై: నౌకల నిర్వహణలో ఉన్న హాంగ్‌కాంగ్ కంపెనీ ఆంగ్లో ఈస్టర్న్ గ్రూప్ భారత్‌లో కొత్తగా 2023 డిసెంబర్ నాటికి 1,000 మంది నావికులను నియమించుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ పరిశ్రమకు శిక్షణ పొందిన మానవ వనరులను అందించే ప్రధాన సరఫరాదార్లలో భారత్ ఒకటి. ఆంగ్లో ఈస్టర్న్ గ్రూప్ అనుబంధ కంపెనీ ఆంగ్లో ఈస్టర్న్ షిప్ మేనేజ్మెంట్ ఇండియాకు ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కత, కొచ్చి, లక్నో, చండీగఢ్‌లో కార్యాలయాలు ఉన్నాయి. నావికా శిక్షణ కేంద్రం సైతం భారత్‌లో కంపెనీ నిర్వహిస్తోంది. ప్రస్తుతం దేశంలో కంపెనీకి 21,000 మంది సిబ్బంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 27,000. థర్డ్ పార్టీ షిప్ మేనేజ్మెంట్ కింద సంస్థ ఖాతాలో 600 నౌకలు కొలువుదీరాయి. 300 బల్క్ ట్యాంకర్స్, 200 ట్యాంకర్స్, 100 కంటైనర్ షిప్స్ ఉన్నాయి. ప్రపంచంలో నౌకల పరంగా తొలి స్థానంలో, సిబ్బంది పరంగా రెండవ స్థానంలో గ్రూప్ నిలిచిందని ఆంగ్లో ఈస్టర్న్ షిప్ మేనేజ్మెంట్ ఇండియా ఎండీ మనీశ్ ప్రధాన్ తెలిపారు. -
కడలిలో కచ్ఛప నగరం
సౌదీ అరేబియా కడలిలో నగర నిర్మాణాన్ని తలపెట్టింది. తాబేలు ఆకారంలోని భారీ ఓడను నిర్మించి, దానిని తేలియాడే నగరంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ తేలియాడే నగరానికి ‘పాంజీయోస్’ అని పేరు పెట్టింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తలపెట్టిన ఈ నౌకానగర నిర్మాణానికి సౌదీ ప్రభుత్వం 8 బిలియన్ డాలర్లు (రూ.65,388 కోట్లు) ఖర్చు చేస్తోంది. దీని నిర్మాణం పూర్తయితే, ఇందులో అరవైవేల మంది నివాసం ఉండటానికి వీలు ఉంటుంది. ఇందులోని శరీర భాగంలో అరవై నాలుగు అపార్ట్మెంట్లు ఉంటాయి. రెక్కల భాగంలో లగ్జరీ విల్లాలు, పర్యాటకుల కోసం హోటళ్లు ఉంటాయి. దీని వెడల్పు 610 మీటర్లు, పొడవు 550 మీటర్లు. ఇటాలియన్ స్టూడియో ‘లజారినీ’కి చెందిన ఆర్కిటెక్ట్‌లు, డిజైన్ ఇంజనీర్లు ఈ భారీ నిర్మాణానికి రూపకల్పన చేశారు. దీనిపైన హెలికాప్టర్లు ల్యాండ్ కావడానికి కూడా ప్రత్యేకమైన చోటు ఉండటం విశేషం. ఇది సముద్రంలో గంటకు ఐదు నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. పర్యాటకుల సౌకర్యం కోసం ఇతర ఓడలు, పడవలు దీని ఒడ్డున నిలపడానికి కూడా వెసులుబాటు ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.ఈ ఏడాది ప్రారంభిస్తున్న దీని నిర్మాణం పూర్తి కావడానికి ఎనిమిదేళ్లు పడుతుందని ‘లజారినీ’ ప్రతినిధులు చెబుతున్నారు. -
దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు
మనీలా: దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం తమదేనంటున్న డ్రాగన్ దేశం దుందుడుకు చర్యకు పాల్పడింది. వివాదాస్పద జలాల్లోని ఫిలిప్పీన్స్ కోస్ట్‌గార్డ్ ఓడపైకి చైనా కోస్ట్‌గార్డ్ షిప్ మిలటరీ గ్రేడ్ లేజర్ కిరణాలను ప్రయోగించింది. దీంతో అందులోని తమ సిబ్బందిలో కొందరికి కొద్దిసేపు కళ్లు కనిపించకుండా పోయాయి. ఈ చర్యతో చైనా తమ సార్వభౌమ హక్కులకు తీవ్ర భంగం కలిగించిందని ఫిలిప్పీన్స్ ఆరోపించింది. తమ ఓడ బీఆర్పీ మలపస్కువాను దగ్గరల్లోని రాతి దిబ్బ వైపు వెళ్లకుండా చైనా ఓడ అడ్డుకుందని తెలిపింది. ఈ క్రమంలో ప్రమాదకరంగా 137 మీటర్ల అతి సమీపానికి చేరుకుందని వివరించింది. -
సద్దాం హుస్సేన్ వాడని ఓడ
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఓడ ఇరాక్ మాజీ అధినేత సద్దాం హుస్సేన్ ముచ్చటపడి ప్రత్యేకంగా తయారు చేయించుకున్నది. అయితే, ఆయన తన జీవితకాలంలో ఎన్నడూ దీనిని వాడలేదు. నాలుగు అంతస్తులు, పద్దెనిమిది విశాలమైన గదులు, లోపల అధునాతన సౌకర్యాలతో రూపొందించిన ఈ 270 అడుగుల పొడవైన ఓడ పేరు ‘బస్రా బ్రీజ్’. ఇందులో ఫైవ్‌స్టార్ హోటల్‌ను తలదన్నే ఏర్పాట్లన్నీ ఉన్నాయి. ఒక సెలూన్, డ్రైక్లీనింగ్ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. సద్దాం హుస్సేన్ ఈ ఓడను ఒక డెన్మార్క్ కంపెనీ ద్వారా తయారు చేయించుకున్నాడు. దీని తయారీ 1980లో ప్రారంభమైంది. తయారీ పూర్తయ్యాక మరుసటి ఏడాది ఇది ఇరాక్ తీరానికి చేరుకుంది. ఇంత ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఈ ఓడలో సద్దాం హుస్సేన్ ఎన్నడూ అడుగుపెట్టలేదు. ఇరాక్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ ఓడను బస్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో శాస్త్ర పరిశోధన కేంద్రంగా మార్చింది. నిజానికి ఇరాక్ ప్రభుత్వం 2018లో ఈ ఓడను 30 మిలియన్ డాలర్లకు (రూ.245 కోట్లు) అమ్మకానికి పెట్టినా, దీని కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఇప్పుడిది శాస్త్ర పరిశోధన కేంద్రంగా మారడంతో వార్తలకెక్కింది. -
ఒడిశాలో మరో రష్యా పౌరుడు మృతి.. రెండు వారాల్లో మూడో ఘటన
భువనేశ్వర్: ఒడిశాలో రష్యా పౌరుల మిస్టరీ మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకే హోటల్లో ఇద్దరు రష్యన్లు మృతి చెందిన మిస్టరీ వీడకముందే రష్యాకు చెందిన మరో పౌరుడు మృతి చెందాడు. రెండు వారాల వ్యవధిలో ముగ్గురు రష్యన్లు మరణించటంతో ఇంతకి ఒడిశాలో ఏం జరుగుతోందనే ఆందోళన నెలకొంది. జగత్సింఘ్పూర్ జిల్లాలోని పారాదిప్ పోర్టులో ఓ షిప్లో మంగళవారం రష్యా పౌరుడి మృతదేహం లభ్యమైంది. ‘ఎంబీ అల్ద్నాహ్’ షిప్లో చీఫ్ ఇంజినీర్‌గా పని చేస్తున్న 51 ఏళ్ల మిలియాకోవ్ సెర్గేగా పోలీసులు గుర్తించారు. ఆ నౌక బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ పోర్టు నుంచి పారాదీప్ పోర్టు మీదుగా ముంబైకి వస్తోంది. నౌకలోని తన ఛాంబర్లో మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో మరణించినట్లు సమాచారం. అయితే, అతడి మృతికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఒకే హోటల్లో ఇద్దరు.. గతంలో దక్షిణ ఒడిశాలోని రాయగడ నగరంలో ఓ హోటల్లో ఇద్దరు టూరిస్టులు రెండు రోజుల వ్యవధిలో మరణించారు. అందులో ఒకరు రష్యా చట్ట సభ్యుడు కూడా ఉండటం గమనార్హం. వారు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యతిరేకంగా గతంలో మాట్లాడటం చర్చకు దారి తీస్తోంది. రష్యా చట్ట సభ్యుడు పావెల్ ఆంటోవ్(65) డిసెంబర్ 24న హోటల్ మూడో అంతస్తు నుంచి పడి చనిపోయాడు. అంతకు ముందు డిసెంబర్ 22న ఆయన స్నేహితుడు వ్లాదిమిర్ బిదెనోవ్(61)హోటల్ గదిలో మృతి చెందాడు. ఈ రెండు కేసులపై ఒడిశా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: ‘పుతిన్’ను వ్యతిరేకిస్తే అంతేనా? ఒడిశాలో మరో రష్యన్ మిస్సింగ్! -
ఓడంటే ఓడా కాదు.. లక్ష మంది ఒకేసారి ప్రయాణించేలా..
ఓడంటే అలాంటిలాంటి ఓడ కాదు. ఇది తేలియాడే నగరం. అతి భారీ నౌకల కంటే పరిమాణంలో ఐదురెట్లు పెద్దదైన ఈ ఓడ పేరు ‘ఫ్రీడమ్ షిప్’. దీని పొడవే ఒక మైలు ఉంటుంది. ప్రస్తుతం ఇది తయారీ దశలో ఉంది. దీని తయారీ పూర్తయితే, ప్రపంచంలోని అతిపెద్ద ఓడలు కూడా దీనిముందు మరుగుజ్జుల్లాగానే కనిపిస్తాయి. ఈ ఓడను తయారు చేయాలని ముప్పయ్యేళ్ల కిందటే ఫ్లోరిడాకు చెందిన ఇంజినీరు నార్మన్ నిక్సన్ సంకల్పించాడు. అతడు 2012లో మరణించాడు. దీని తయారీ మొదలయ్యాక చాలా కంపెనీల చేతులు మారాక, 2020లో ప్రస్తుత యాజమాన్య సంస్థ ఫ్రీడమ్ క్రూయిజ్ లైన్ ఇంటర్నేషనల్ చేతికి చేరింది. సింగపూర్, ఇండోనేసియాలలో దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఫ్రీడమ్ క్రూయిజ్ లైన్ ఇంటర్నేషనల్ సీఈవో రోజర్ గూష్ చెబుతున్నారు. అయితే, దీని డిజైన్‌కు రూపకల్పన చేసింది తామేనని భారత్‌కు చెందిన కనేతారా మెరైన్ సంస్థ చెబుతోంది. ఈ ఓడ తయారీ పూర్తయితే, ఇందులో ఏకంగా లక్షమంది ఒకేసారి ప్రయాణించే వీలు ఉంటుంది. ఇందులో నలభైవేల మంది శాశ్వత నివాసులు, ముప్పయివేల మంది వచ్చిపోయే జనాలు, పదివేల మంది హోటల్ అతిథులు, ఇరవైవేల మంది సిబ్బంది ఉంటారని చెబుతున్నారు. నిర్మాణం పూర్తయ్యాక ఈ ఓడ నిరంతరాయంగా సముద్రంలో ప్రపంచయాత్ర సాగిస్తూనే ఉంటుందని, సరుకులు నింపుకోవడానికి మాత్రమే అనుకూలమైన రేవుల్లో నిలుస్తుందని కూడా చెబుతున్నారు. చదవండి: Christmas 2022: క్రీస్తు జననం.. విశ్వానికి పర్వదినం -
Visakhapatnam: నగర అందాలను చూస్తూ షిప్లో విహారం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : సముద్రాన్ని చూస్తే.. ఎవరైనా చిన్న పిల్లాడిలా మారిపోవాల్సిందే. ఎగసిపడే కెరటాల్లా మనసు కేరింతలు కొట్టించే.. సాగరతీరంలో పడవ ప్రయాణమంటే..? గుండె ఆనందంతో గంతులేస్తుంది. పిల్లగాలి అల్లరి చేస్తుంటే.. నీలి కెరటాలతో పోటీ పడుతూ అలలపై ఆహ్లాదకరమైన విహారయాత్ర.. విశాఖ వాసుల్ని రా.. రమ్మని ఆహ్వానిస్తోంది. నగర అందాల్ని చూస్తూ.. ఆనంద ‘సాగరం’లో మునిగిపోతూ.. ఫిషింగ్ హార్బర్ నుంచి రుషికొండ వరకూ షిప్లో సుమారు 2 గంటల పాటు విహరించే అవకాశం అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. పర్యాటకులకు మర్చిపోలేని మధుర స్మృతులు మిగిల్చేలా సాగరంలో విహారానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎంతో కాలంగా లాంచీల ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న ప్రకృతి ప్రేమికులు.. పర్యాటకులకు ఆనందంతో పాటు మానసిక ఉల్లాసం అందించేందుకు ఎంఎస్ఎస్ క్లాస్–6 షిప్ అందుబాటులోకి రానుంది. ఒకేసారి 54 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ షిప్‌ని గుజరాత నుంచి తీసుకురానున్నారు. నగర అందాల్ని చూస్తూ.. ఫిషింగ్ హార్బర్ నుంచి రుషికొండ వరకూ జల విహారం చేసేలా చర్యలు చేపడుతున్నారు. 2 గంటల పాటు సముద్రంలో.. ఇటీవల క్రూయిజ్ షిప్ కనువిందు చేసింది. కానీ.. ఇందులో సామాన్యులు మాత్రం ప్రయాణం చేయలేని పరిస్థితి. ఒక్కసారైనా సాగరతీరంలో షిప్లో విహరించాలన్న కోరిక.. ఈ ప్రయాణంతో తీరిపోనుంది. సుమారు 2 గంటల పాటు సముద్రంలో ప్రయాణించవచ్చు. షిప్లో డెక్ మీదకు వచ్చి నగరాన్ని చూసేందుకు కూడా వీలు కలి్పంచనున్నారు. సముద్ర తీరం నుంచి అరకిలోమీటరు నుంచి కిలోమీటరు దూరం వరకూ లోపల నౌకాయానానికి అవకాశం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే డ్రై డాక్ అనుమతి షిప్ ప్రయాణానికి సంబంధించి.. పోర్టు చైర్మన్ కె.రామ్మోహన్‌రావుతో జిల్లా కలెక్టర్ డా.మల్లికార్జున, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇటీవలే సంప్రదింపులు చేశారు. బోటు విహారానికి పోర్టులో అవకాశం కలి్పంచేందుకు అనుమతులివ్వాలన్న ప్రతిపాదనలు పంపించారు. దీనికి విశాఖపట్నం పోర్టు అథారిటీ అంగీకరిస్తూ.. డ్రైడాక్‌లో రాకపోకలకు అనుమతులు మంజూరు చేసింది. త్వరలోనే.. అతి త్వరలోనే అలలపై షికారు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ మల్లికార్జున చెప్పారు. విశాఖ పర్యాటకానికి ఎంఎస్ఎస్ క్లాస్–6 షిప్ మరో ఆభరణంగా మారనుందన్నారు. లగ్జరీ ప్రయాణంలా.. బోటు ఎక్కామా... రుషికొండ వరకూ ప్రయాణించామా అన్నట్లుగా కాకుండా.. పర్యాటకులకు మధురానుభూతుల్ని అందించేందుకు కూడా ప్రణాళికలు చేస్తున్నారు. షిప్లో ప్రయాణిస్తున్న సమయంలో స్నాక్స్, టీ అందించనున్నారు. కొన్ని గదులు కూడా షిప్లో ఉండటంతో అందులో ఏసీ, టీవీ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఓపెన్ ఎయిర్ ప్రయాణంతో పాటు.. ఏసీ గదిలో ప్రయాణం.. అనేరీతిలో రెండు భాగాలుగా టికెట్ ధరని నిర్ణయించనున్నారు. బోట్ ఆపరేటింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో 8 శాతం ఇవ్వాలని కోరనున్నారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వశాఖల నుంచి నిరంభ్యంతర పత్రాలన్నీ (ఎన్వోసీ) ప్రభుత్వమే జారీ చేసి ఇస్తుంది. అన్నీ సక్రమంగా పూర్తయితే.. ఈ ఏడాది చివర్లోనే విశాఖ వాసులతో పాటు.. వైజాగ్‌ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు బోటులో షికారు చేసే అవకాశం కలుగుతుంది. -
లాహిరి లాహిరి ‘క్రూయిజ్’లో..!
సముద్రం.. ఎవరినైనా చిన్న పిల్లాడిలా మార్చేస్తుంది! ఎగసిపడే కెరటాల్లా మనసును కేరింతలు కొట్టిస్తుంది!! మరి అలాంటి సముద్రంపై ప్రయాణమంటే... అది కూడా 11 అంతస్తుల కదిలే లగ్జరీ హోటల్లాంటి క్రూయిజ్‌లో విహరిస్తే? తేలియాడే నగరంలో చక్కర్లు కొడితే? పోలా... అదిరిపోలా... తలుచుకుంటేనే ఎప్పుడెప్పుడా అనిపిస్తోంది కదా! నాదీ సేమ్ ఫీలింగ్. ఎక్కడో విదేశాల్లో ఉండే క్రూయిజ్ విహారం మనక్కూడా అందుబాటులోకి వచ్చిందన్న విషయం తెలియగానే నాలోని ‘ప్రయాణాల పక్షి’ నిద్రలేచాడు. అందులోనూ నేను పుట్టిపెరిగిన వైజాగ్ నుంచి క్రూయిజ్‌లో బయలుదేరడం అనగానే, ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి... అంటూ ఆనంద‘సాగరం’లో మునిగిపోయాను. మన దేశంలో ఏకైక, తొలి లగ్జరీ క్రూయిజ్లైనర్ కార్డీలియా క్రూయిజెస్ ‘ఎంప్రెస్’లో సముద్ర ప్రయాణం ఎలా ఉంటుంది? అందులో ఉన్న విందు వినోదాలు.. వింతలు విశేషాలేంటి? అసలు అంతపెద్ద షిప్లో చూడ్డానికి ఏమేమి ఉన్నాయి? ఇందులో వెళ్లాలంటే ఎంత ఖర్చవుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే లాహిరి లాహిరి ‘క్రూయిజ్’లో అంటూ విశాఖ నుంచి చెన్నైకి నాతో పాటు జర్నీ చేసేయండి మరి! కమాన్.. లెట్స్ క్రూయిజ్!! దేశంలో తొలిసారిగా అమెరికా, యూరప్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి చోట్ల నడిపే అతిపెద్ద లగ్జరీ క్రూయిజ్ ఏడాది క్రితం పశ్చిమ తీరంలోని ముంబైలో జర్నీ స్టార్ట్ చేసింది. దీన్ని వాటర్‌వేస్ లీజర్ టూరిజమ్‌కు చెందిన కార్డీలియా క్రూయిజెస్.. ‘ఎంప్రెస్’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం, చొరవతో ఈ ఏడాది జూన్‌లో తూర్పు తీరంలో వైజాగ్–చెన్నై మధ్య వర్షాకాల సీజన్ ట్రిప్పులు మొదలయ్యాయి. దీంతో నేను, మరో ఇద్దరం కలిసి నాలుగు రోజులు (సెప్టెంబర్ 14–17) టూర్ ప్లాన్ చేశాం. ఎదురుచూపులకు తెరపడే రోజు రానే వచ్చింది. సన్నగా చిరుజల్లులు కురుస్తున్నాయి. క్రూయిజ్ కంపెనీ ప్రతినిధులు విశాఖలోని ఒక హోటల్లో బోర్డింగ్ పాస్‌లు, ఆధార్ కార్డు వెరిఫికేషన్ పూర్తి చేసి గెస్ట్ పేరు, రూమ్ నంబర్ తదితర వివరాలతో ఉన్న యాక్సెస్ కార్డులను అందించారు. కోవిడ్ నేపథ్యంతో రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి. లేదంటే జర్నీకి 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో నెగటివ్ వచ్చిన రిపోర్ట్‌ను చూపాల్సి ఉంటుంది. విశాఖ కంటైనర్ టెర్మినల్‌లోని బెర్త్ వద్దకు చేరుకోగానే... రాజహంసలా సేదతీరుతున్న క్రూయిజ్ ‘ఎంప్రెస్’ను చూడగానే ‘వాట్ ఎ బ్యూటీ’ అనుకుంటూ చూస్తుండిపోయాం!! క్లిక్‌మనిపించి సెక్యూరిటీ చెక్‌లో లగేజీ స్కానింగ్ పూర్తి చేసుకున్నాం. క్రూయిజ్ చెక్–ఇన్ ఎయిర్పోర్టులానే ఉంటుంది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది లగేజీని అణువణువునా స్కాన్ చేశాకే పంపిస్తారు. తీసుకెళ్లకూడని జాబితాలో ఉన్న వస్తువులను సెక్యూరిటీకి అప్పగించాల్సిందే. వాటిని భద్రంగా ఒక కవర్లో పెట్టి, షిప్ దిగాక తిరిగిస్తారు. ఎలాంటి డ్రింక్స్, ఆహార పదార్థాలనూ లోనికి అనుమతించరు. ఈ తతంగం పూర్తయ్యాక యాక్సెస్ కార్డును చెక్ చేసి, షిప్‌లోకి చేరుస్తారు. ఇది చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఏటవాలుగా ఉన్న పొడవాటి నిచ్చెనపై జాగ్రత్తగా నడుస్తూ అయిదో అంతస్తులోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది. కళ్లు జిగేల్మనే ఏట్రియం... లోపలికి ప్రవేశించగానే ప్రతిఒక్కరూ కళ్లప్పగించి చూసే సెంట్రల్ కోర్ట్ (ఏట్రియం) నిజంగా హైలైట్. గాజు పైకప్పుతో, అద్దాల లిఫ్ట్‌లు, మిరుమిట్లుగొలిపే లైట్లతో అదొక మయసభను తలపిస్తుంది. దాన్ని తనివితీరా ఓ లుక్కేసి, లగేజీతో రూమ్‌కు వెళ్లాం. విండో, బాల్కనీ నుంచి సీన్ చూస్తే.. మైమరచిపోవాల్సిందే. మధ్యాహ్నం ఒంటిగంట నుంచే షిప్‌లోకి ఎంట్రీ మొదలవడంతో... పదో డెక్‌లోని ఫుడ్ కోర్టులో అతిథుల కోసం లంచ్ సిద్ధంగా ఉంది. క్రూయిజ్ మైకంలో ఆకలి లేకపోయినా.. ఫుడ్డు అదిరిపోవడంతో దండిగానే లాగించేశాం. లక్కీగా చిరుజల్లులు ఆగిపోయి సూర్యుడు దర్శనమివ్వడంతో సన్‌సెట్‌ను చూసే అవకాశం చిక్కింది. సముద్రం మీద నుంచి ఆ సీన్ నిజంగా ప్రకృతి ప్రేమికులకు కనులవిందే! షిప్ బయలుదేరడానికి ముందే ఎమర్జెన్సీ డ్రిల్ ఉంటుంది. బ్లాస్టింగ్ శబ్దం వినబడగానే ప్రయాణికులందరూ ఎక్కడున్నాసరే యాక్సెస్ కార్డుపై ఉన్న ‘మస్టర్ స్టేషన్’ నంబర్ ఆధారంగా ఆయా ప్రదేశాలకు చేసుకోవాలి. అక్కడ లైఫ్ జాకెట్ ఎలా ధరించాలి... అత్యవసర పరిస్థితుల్లో లైఫ్ బోట్లలోకి ఎలా తీసుకెళ్తారు వంటి సూచనలన్నీ సిబ్బంది వివరిస్తారు. షిప్లో 14 లైఫ్ బోట్లు ఉంటాయి. ఎట్టకేలకు సాయంత్రం ఆరు గంటలకు వైజాగ్‌కు గుడ్‌బై చెబుతూ కార్డీలియా ‘ఎంప్రెస్’ నిండుకుండలా నెమ్మదిగా కదిలింది. సంధ్యవేళ లైట్ల వెలుగులో మిలమిల మెరిసిపోతున్న సిటీ అందాలను చూస్తే.. ఎవరైనా సరే వావ్ వైజాగ్ అనాల్సిందే! సెయిల్ ఎవే పార్టీ సూపర్బ్... క్రూయిజ్ జర్నీ స్టార్ట్ అవ్వగానే తొలిరోజు సాయంత్రం 6 నుంచి 8 వరకూ పదో డెక్‌లో సెయిల్ ఎవే పార్టీ ఉందనడంతో అక్కడికి చేరుకున్నాం. అప్పటికే అక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కన ‘డీజే టిల్లు కొట్టు.. కొట్టు’ అంటూ చిన్నాపెద్దా తేడాలేకుండా చేస్తున్న డ్యాన్సులతో ఫ్లోర్ మొత్తం పూనకం వచ్చినట్లు ఊగిపోతోంది. సరదాగా మేం కూడా రెండు స్టెప్పులేసి పూల్ బార్లో చిల్ అవుతూ డీజే పార్టీని ఎంజాయ్ చేశాం. ఎంటర్టైన్మెంట్ క్రూ ఆడించే ఆటపాటల్లో అంతా తలమునకలైపోయారు. ఇక అక్కడి నుంచి చిమ్మచీకట్లో వెలుగులీనుతూ సముద్రాన్ని చీల్చుకుంటూ గుంభనంగా సాగుతున్న క్రూయిజ్‌ను చూస్తూ టెర్రస్ అంతా ఒకసారి కలియదిరిగాం. 4వ డెక్‌లో ఉన్న స్టార్‌లైట్ రెస్టారెంట్లో డిన్నర్ ముగించుకుని చైర్మన్స్ క్లబ్ బార్ లాంజ్‌లో నడుస్తున్న లైవ్బ్యాండ్లో మాంచి హిందీ, ఇంగ్లీష్ సాంగ్స్‌ను ఆస్వాదించాం. అక్కడి నుంచి రాత్రి 12 తర్వాత డోమ్ బార్లో మిడ్నైట్ డీజే మొదలైంది. దాదాపు ఒంటి గంట వరకూ అక్కడ ఫుల్ జోష్‌లో డ్యాన్స్ ఫ్లోర్ దద్దరిల్లింది. ఇక రూమ్‌కు చేరుకుని బాల్కనీలోకి వెళ్లేసరికి ఒక్క క్షణం ఇది కలా నిజమా అనిపించింది. చిమ్మచీకట్లో నిండు చందమామ కనువిందు చేస్తూ.. సముద్రంతో దోబూచులాడుతున్న వేళ... వెన్నెల్లో షిప్ కదులుతూ ఉంటే... దాన్ని చూసేందుకు రెండుకళ్లూ చాలవు!! కాసేపు మూన్స్కేప్ను ఎంజాయ్ చేస్తూ.. 2 గంటలకు బెడ్డెక్కాం. మార్క్యూ థియేటర్... మరో లోకం! మతిపోగొట్టే క్రూయిజ్ ప్రత్యేకతల్లో మార్క్యూ థియేటర్ నిజంగా అద్భుతం. దీనిలోకి వెళ్తుంటే ఆ గ్రాండ్ లుక్ అబ్బురపరుస్తుంది. రెండు అంతస్తుల్లో (5, 6 డెక్‌లు), 900 మందికిపైగా కూర్చునే వీలుంది. తొలిరోజు రాత్రి 10.30కి దక్షిణాదికి చెందిన పాత, కొత్త తరం సినిమా స్టార్స్ బ్లాక్‌బస్టర్ సాంగ్స్‌తో గుదిగుచ్చిన ‘సౌత్ ఎక్స్ట్రావెగాంజా‘ డ్యాన్స్ షో దీనిలో ప్రదర్శించారు. అరగంటపాటు చూపుతిప్పుకోనివ్వని నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్తో గెస్ట్‌లను ఉర్రూతలూగించింది. రెండో రోజు సాయంత్రం 6 గంటలకు పంజాబీ భారీ పెళ్లి సందడి థీమ్‌తో డ్యాన్స్ అండ్ డ్రామా షో ‘బల్లేబల్లే’ మరో హైలైట్. మూడో రోజు రాత్రి 7 గంటలకు ’కార్డీలియాస్ మ్యూజిక్ ఫియస్టా‘లో హాలీవుడ్, బాలీవుడ్‌తో సహా సౌత్ హిట్స్‌ను లైవ్ ఆర్కెస్ట్రాతో సింగర్స్ పాడుతుంటే.. ఈలలు, చప్పట్లు, డ్యాన్సులతో హాలంతా దద్దరిల్లింది!! ఇక విదేశాల్లోని ఫేమస్ డ్యాన్స్ అండ్ మ్యూజికల్ షో ‘బర్లెస్క్’ మూడో రోజు రాత్రి 10.30కి ప్రదర్శించారు. బాలీవుడ్ థీమ్‌తో హాట్ హాట్ దేశ విదేశీ భామలు చేసే హంగామా కనువిందు చేస్తుంది!! ఇది పెయిడ్ షో, 18+ వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. సన్‌రైజ్, సన్‌సెట్.. మాటల్లేవ్!! క్రూయిజ్ జర్నీలో ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడనివి సన్‌రైజ్, సన్‌సెట్. వేకువజామున లేలేత సూర్యకిరణాలు సాగరంపై పడుతూ.. పసిడి వర్ణంలో ధగధగమంటూ కనువిందు చేసే ఆ దృశ్యాన్ని చూస్తే మనసు ఆకాశంలో అలా తేలిపోతుంది! బాల్కనీలో చీర్స్ కొట్టి కడలిపై అరుణోదయ అందాలను కెమెరాల్లో బంధించాం. ఇక సాయంత్రం అయ్యేసరికి 11వ అంతస్తుపై సూర్యాస్తమయం కోసం గెస్ట్‌ల ఎదురుచూపులు మొదలయ్యాయి. ఎరుపు వర్ణంలో కాంతులీనుతూ సాయం సంధ్య వేళ భానుడు అస్తమించే సన్‌సెట్ దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు!! చుట్టూ సముద్రం మధ్యలో మనం జర్నీ చేస్తున్న క్రూయిజ్ తప్ప ఇంకేమీ కనబడని చోట సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూస్తే.. నేచర్ లవర్స్ గుండెజారి బంగాళాఖాతంలో గల్లంతవ్వాల్సిందే!! నిజంగానే ‘ఎంప్రస్‘... పేరుకు తగ్గట్టే ‘ఎంప్రస్’ది నిజంగా మహారాణి దర్పమే. దీని పొడవు 210 మీటర్లు (దాదాపు 692 అడుగులు) కాగా, వెడల్పు 36 మీటర్లు, ఎత్తు 47 మీటర్లు. మొత్తం బరువు 48,500 టన్నుల పైనే. 11 డెక్‌లు (అంతస్తులు) ఉన్న ఈ క్రూయిజ్‌లో మొత్తం 796 గెస్ట్ క్యాబిన్లు (రూమ్స్) ఉంటాయి. సుమారు 2,000 మంది ప్రయాణికులకు అతిథ్యం ఇస్తుంది. ఇక ఇందులో 600–700 మంది సిబ్బంది ఉంటారు. నాలుగు ఇంజిన్లుండే దీని గరిష్ట వేగం 19 నాటికల్ మైళ్లు (గంటకు 35 కిలోమీటర్లు). మేము ‘బ్రిడ్జ్ టూర్’కు కూడా వెళ్లాం. దీనికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని కచ్చితంగా అందరూ చూసితీరాలి. 6వ డెక్‌లో షిప్ ముందు భాగంలో కెప్టెన్ ఇతరత్రా సిబ్బంది ఉండే ఆపరేషనల్ ప్రదేశం ఇది. ఇక్కడ మాకు ఫ్రాన్స్‌కు చెందిన థర్డ్ ఆఫీసర్ ‘లూసియన్’ షిప్ గురించి బోలెడన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. నిజానికి చాలా కొత్తగా కనిపిస్తున్న ఈ షిప్‌ను రాయల్ కరీబియన్ క్రూయిజెస్ కోసం ఫ్రాన్స్ కంపెనీ దాదాపు 32 ఏళ్ల క్రితం 1990లో తయారు చేసిందట. అక్కడి నుంచి చేతులు మారుతూ చివరికి కార్డీలియా చెంతకు చేరింది. అయితే, ప్రతి రెండేళ్లకోసారి పూర్తిగా దీని రూపురేఖలను మార్చేస్తుంటారు, అందుకే ఎప్పుడూ కొత్తగా అలరిస్తుంది. ఇక బ్రిడ్జ్ టూర్లో అన్నింటికంటే అబ్బురపరిచే అంశం షిప్ స్టీరింగ్. కేవలం ఒక అంగుళం పొడవున్న వీడియోగేమ్ తరహా జాయ్ స్టిక్‌తో అంత పెద్ద ఐరావతంలాంటి క్రూయిజ్‌ను అలవోకగా ఎటుకావాలంటే అటు తిప్పొచ్చని లూసియన్ చెబుతుంటే.. అంతా అవాక్కయ్యారు!! ఈ ట్రిప్‌లో ఎంప్రెస్ గంటకు 12–14 కిలోమీటర్ల వేగంతో.. తీరం వెంబడి 80–120 కిలోమీటర్ల దూరంలో జర్నీ చేసింది. అక్కడ సముద్రం లోతు 2 కిలోమీటర్ల పైమాటే!! అన్నీ పూసగుచ్చినట్లుగా... నగరాన్ని తలపించే క్రూయిజ్‌లో ఏది ఎక్కడ ఉంది.. ప్రోగ్రామ్‌లు, ఈవెంట్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవడం కాస్త కష్టమే. అయితే, గెస్ట్‌లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ వివరాలన్నింటితో చిన్న బ్రోచర్‌ను ఏరోజుకారోజు ప్రతి రూమ్‌లో ఉంచుతారు. దీన్ని కచ్చితంగా మన వెంట ఉంచుకోవడం లేదంటే ఫోన్లో పిక్ తీసుకోవడం బెటర్. ఇక అయిదో డెక్‌లో రిసెప్షన్ పక్కన ఉన్న బాక్సాఫీస్‌లో పెయిడ్ ఈవెంట్లు, షోలకు సంబంధించిన టిక్కెట్లు లభిస్తాయి. రూమ్స్ ఎన్ని రకాలంటే..? ఇంటీరియర్ స్టేట్‌రూమ్, ఓషన్ వ్యూ, మినీ సూట్, సూట్, చైర్మన్స్ సూట్ అనే 5 రకాల రూమ్స్ ఉంటాయి. 63 మినీ సూట్లు, 5 సూట్లు ఉండగా, చైర్మన్ సూట్ మాత్రం ఒకేఒక్కటి ఉంది. ఇక మిగతావన్నీ ఇంటీరియర్ (విండో ఉండదు), ఓషన్ వ్యూ (విండో ఉంటుంది) స్టేట్ రూమ్‌లే. వీటిలో కూడా మళ్లీ స్టాండర్డ్, ప్రీమియం అని రెండు రకాలున్నాయి. స్టాండర్డ్ రూమ్‌లన్నీ 3, 4 డెక్స్‌లో, ప్రీమియం రూమ్స్ 8, 9 డెక్స్‌లో ఉంటాయి. అంతేకాదు, ఈ గెస్ట్‌లకు అన్నిరకాల షోలు, ఏరియాలు, ఈవెంట్లకూ యాక్సెస్ ఉండటంతో పాటు ‘హ్యాపీ అవర్’ మరో బోనస్. మినీ సూట్‌కు బాల్కనీ ఉంటుంది. సూట్ రూమ్‌లో పేద్ద బాల్కనీ, లివింగ్ రూమ్, బెడ్రూమ్ వంటి లగ్జరీ సౌకర్యాలు ఉంటాయి. ఇక అల్టిమేట్ లగ్జరీతో, సకల సదుపాయాలన్నీ చైర్మన్స్ సూట్ సొంతం. భారీ బాల్కనీ, ప్రత్యేక డైనింగ్, లివింగ్ రూమ్, బెడ్రూమ్, ఇలా అల్ట్రా లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను తలపిస్తుంది. రేట్లు ఎంతెంత? క్రూయిజ్ అనగానే వామ్మో టూర్ ప్యాకేజీ లక్షల్లో ఉంటుందనే అపోహ మీకే కాదు నాక్కూడా ఉండేది. అయితే, సాధారణ మధ్యతరగతి కుటుంబం సైతం లగ్జరీ క్రూయిజ్ జర్నీ చేసేలా రూమ్‌లు, డిస్కౌంట్లు, గ్రూప్ ప్యాకేజీలను కార్డీలియా అందిస్తోంది. ఇద్దరు పెద్దవాళ్లకు 2 నైట్స్, 3 డేస్ ప్యాకేజీ ప్రారంభ ధరలు చూస్తే (పన్నులతో)... ఇంటీరియర్ స్టేట్‌రూమ్ స్టాండర్డ్: రూ. 44,174 ఓషన్ వ్యూ స్టాండర్డ్: రూ.54,120 మినీ సూట్: రూ.85,413 సూట్: రూ.1,42,846 చైర్మన్ సూట్: రూ.2,37,831 అంటే ఇంటీరియర్ స్టాండర్డ్ స్టేట్రూమ్కు ఒక్కో వ్యక్తికి రూ.22,000 చార్జీ(ఫుడ్, ఎంటర్టైన్మెంట్ అన్నీంటితో) పడుతుంది. మూడు రోజుల పాటు ఫైఫ్స్టార్ లగ్జరీతో పాటు సముద్ర ప్రయాణ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ రేట్లు విమాన టిక్కెట్ల మాదిరిగా డైనమిక్‌గా మారుతుంటాయి. ముందుగా బుక్ చేసుకుంటే చాలా తక్కువకు లభించవచ్చు. 3, 5 నైట్స్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి. నలుగురు కలిసి ఒక రూమ్ బుక్ చేసుకుంటే మిగతా ఇద్దరికీ క్యాబిన్ ధరలో సగం డిస్కౌంట్(స్పెషల్ ఆఫర్స్), 12 ఏళ్ల లోపు చిన్నారులకు షరతులకు లోబడి ఉచిత జర్నీ (పన్నులు కాకుండా), గ్రూప్ బుకింగ్స్‌లో ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తుంది. https://www.cordeliacruises.com/cruise-routes వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు లేదా వెబ్‌లోని కాంటాక్ట్ నంబర్లకు కాల్ చేస్తే మొత్తం వివరాలన్నీ చెప్పడంతో పాటు బుకింగ్ కూడా చేసేస్తారు. గమ్య స్థానాల్లో ఆన్‌షోర్ సిటీ టూర్ ఆప్షన్ కూడా ఉంది. తూర్పు తీరంలో ‘ఎంప్రెస్’ మాన్సూన్ టూర్ సీజన్ సెప్టెంబర్‌తో పూర్తయింది. ఇక పశ్చిమ తీరంలోని ముంబై, కొచ్చి, లక్షద్వీప్, గోవాలో వచ్చే ఏడాది మే వరకూ ఆతిథ్యం ఇస్తుంది. మళ్లీ జూన్ తర్వాత చెన్నైకి చేరుకుని తూర్పు యాత్రకు సిద్ధమవుతుంది. అంతేకాదు, 2023 జూన్ కల్లా ఎంప్రెస్–2 (దాదాపు 3,500 ప్రయాణికుల సామర్థ్యం) కూడా కార్డీలియా చెంతకు చేరే అవకాశం ఉంది. ఫుడీస్‌కు పండగే... కార్డీలియా ‘ఎంప్రెస్’లో ఫుడ్... భోజనప్రియులకు పండగే! రూమ్ స్టేతో పాటు ఉదయం బ్రేక్ పాస్ట్ నుంచి లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్, అర్థరాత్రి శాండ్విచ్ల వరకూ అన్నీ ఉచితమే. తిన్నోళ్లకు తిన్నంత అనేలా రకరకాల వెరైటీలతో చూస్తేనే కడుపునిండిపోయే రేంజ్లో మెనూ ఉంటుంది. వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటు నోరూరించే రకరకాల స్వీట్స్, డెసర్ట్స్, ఫ్రూట్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా దక్షిణాది వంటకాలనూ వడ్డిస్తున్నారు. రెండంతస్తుల స్టార్‌లైట్ రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్‌లో ఫుడ్ అందరికీ కామన్ ఇంకా ఫ్రీ కూడా. చాప్‌స్టిక్స్ పెయిడ్ రెస్టారెంట్ మాత్రం హైలైట్. దీనిలో ఆసియాలోని అన్ని దేశాలకు చెందిన క్యుజీన్స్ (వంటకాలు)తో పాటు.. షెఫ్స్ టేబుల్ అనే ప్రత్యేకత కూడా ఉంది. కనీసం ఆరుగురు బుక్ చేసుకుంటే.. స్వయంగా చీఫ్ షెఫ్ పర్యవేక్షణలో మన టేస్ట్‌కు అనుగుణంగా వంటకాలను వండి వడ్డిస్తారు. కాక్టెయిల్స్ (హాట్ డ్రింక్స్), మాక్టెయిల్స్ వంటి పానీయాల కోసం క్రూయిజ్‌లో అనేక బార్ లాంజ్‌లు ఉన్నాయి. ఇది పూర్తిగా పేమెంట్ సర్వీస్. ఫుడ్ తినే చోటే కాకుండా, ఎంటర్టైన్మెంట్ షోలు, స్విమ్మింగ్ పూల్ ఇలా మనం ఎక్కడున్నా వీటిని సర్వ్ చేస్తారు. ప్రీమియర్ క్యాబిన్ గెస్ట్‌లకు ‘హ్యాపీ అవర్’ ప్రత్యేకం. గంటపాటు ఏది తాగినా 1+1 ఆఫర్‌తో కుమ్మేయొచ్చన్నమాట!! సిబ్బందితో కలిపి దాదాపు 2,600 మందికి ఘుమఘుమలాడే వంటకాలను సిద్ధం చేసేందుకు ఇందులో ఏకంగా ఫుడ్ ఫ్యాక్టరీ ఉంది. తెలంగాణకు చెందిన షెఫ్ శ్రీనివాస్, చీఫ్ షెఫ్ అశ్విన్ కుమార్ ఫుడ్ తయారీ నుంచి వేస్ట్ మేనేజ్మెంట్ వరకూ అన్నీ చూపించి, వివరించారు. ఫ్రీగా ఇచ్చేవి కాకుండా, మనం ఏది కొనుక్కున్నా రేటు ఘాటుగానే ఉంటుంది. పూల్.. సముద్రంలో ఈదినట్లే! క్రూయిజ్ స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేయడం అనేది మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. ఈత రాకపోయినా పర్లేదు. లైఫ్ జాకెట్లు వేసుకొని జలకాలాటల్లో.. అంటూ తేలిపోవచ్చు. పిల్లల కోసం ప్రత్యేకంగా పూల్ ఉంది, మూడేళ్లలోపు బుడుగులకు సైతం పాండ్స్ ఉండటం విశేషం. దీనిలో సముద్రపు నీటిని నింపుతారు. షిప్ కదులుతుండటం వల్ల పూల్‌లో నీరు అలల మాదిరిగా పైకి, కిందికి కదులుతుంది. దీనివల్ల మనం సముద్రం నీటిలో ఉన్నట్లే ఫీల్ అవుతాం. అన్ని రూమ్స్ వాళ్లకూ పూల్ యాక్సెస్ ఉంటుంది. ఫన్.. అన్లిమిటెడ్! అరే, రోజు అప్పుడే అయిపోయిందా అనిపించేలా క్రూయిజ్‌లో అన్లిమిటెడ్ వినోదం మనల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. ప్రత్యేక డ్యాన్స్, మ్యూజిక్ షోలతో పాటు లైవ్ బ్యాండ్స్ సైతం సంగీత ప్రియులను మైమరపిస్తాయి. ‘డోమ్’ నైట్ క్లబ్ డీజేలో డ్యాన్స్ ఫ్లోర్ దద్దరిల్లిపోతూ.. పార్టీ ఫ్రీక్స్లో ఫుల్ జోష్ నింపుతుంది. షిప్ మొత్తం ఎక్కడికెళ్లినా మాంచి మ్యూజిక్‌తో ఏదో తెలియని వైబ్ మనల్ని ఉరకలేయిస్తుంది. 24 గంటలూ జనాల కోలాహలంతో క్రూయిజ్‌లో ఉన్నంతసేపూ ఏదో జాతరలో ఉన్నామన్న ఫీలింగ్ కలిగింది. ఇక మెగా హౌసీ, ట్రెజర్ హంట్... మినీ ఒలింపిక్స్... మ్యాజిక్ షో.. వీడియో గేమ్స్.. ఇంటర్నెట్ కేఫ్.. కార్డ్స్ ప్లే ఏరియా... లైబ్రరీ.. కిడ్స్ అకాడమీ... ఫోటో గ్యాలరీ అండ్ స్టూడియో.. టేబుల్ టెన్నిస్.. జిమ్.. స్పా.. పూల్ బార్.. ఇలా ఒకటేంటి చిన్నాపెద్దా అందరికీ అంతులేని ఆటవిడుపే!! ఇంటర్నెట్ కోసం శాటిలైట్ వైఫై (పే చేయాలి) కూడా ఉంది. అడ్వెంచర్ లవర్స్ కోసం రాక్ క్లయింబింగ్ ప్రత్యేకం. దేశంలో సముద్రంపై అత్యంత ఎత్తయిన రాక్ క్లయింబింగ్ కూడా ఇదే. క్రూయిజ్ కదులుతుంటే.. దీన్ని ఎక్కడం అనేది అదిరిపోయే థ్రిల్!! ఇక జూద ప్రియులను ‘కేసినో రాయల్’ రారమ్మంటుంది. సరదాగా మేము కూడా దీన్ని కాసేపు ఎంజాయ్ చేశాం. అయితే, తీరం నుంచి అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి అంటే, 12 నాటికల్ మైళ్ల (22 కి.మీ) దూరం క్రూయిజ్ వెళ్లాకే కేసినో తెరుస్తారు. ఇందులో ఆడకపోయినా .. కనీసం ఆ యాంబియెన్స్ కోసమైనా దీన్ని చూసితీరాల్సిందే. జాక్‌పాట్ కొట్టినవాళ్లు చేసే హంగామా మామూలుగా ఉండదు మరి!! అంతా డాలర్లలోనే... ఒక్కసారి క్రూయిజ్‌లోకి ఎక్కామంటే మనం విదేశంలో ఉన్నట్లే లెక్క. చెల్లింపులన్నీ డాలర్లలో ఉంటాయి. రిసెప్షన్ దగ్గర మన రూపాయలను క్యాష్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లిస్తే డాలర్లు ఇస్తారు. అదీకూడా క్యాష్ కాదు.. మనకిచ్చిన యాక్సెస్ కార్డులో వేస్తారు. ఇక ఎక్కడ ఏది చెల్లించాలన్నా ఈ కార్డు ఇస్తే చాలు. రేట్లన్నీ డాలర్లలోనే ఉంటాయి. డబ్బులు అయిపోతే, మళ్లీ లోడ్ చేసుకోవచ్చు. 24 గంటలూ ఈ సర్వీస్ ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్ మిగిలితే క్రూయిజ్ దిగే ముందు క్యాష్ రూపంలో తిరిగి ఇచ్చేస్తారు. ఇలా... టన్నులకొద్దీ మధుర స్మృతులను నింపుకుని చెన్నైలో క్రూయిజ్ దిగుతుంటే.. నాలుగు రోజుల టూరు నాలుగు నిమిషాల్లో అయిపోయినట్టు అనిపించింది. విందు వినోదం.. సాహసం.. ప్రకృతిలో పరవశించిపోవడం.. వీటి కోసం హాలిడే ట్రిప్ వేయాలంటే జర్నీ చేయాల్సిందే. మరి ఆ ప్రయాణమే ఒక గమ్య స్థానం అయితే, ఇవన్నీ కూడా జర్నీ చేస్తూనే ఎంజాయ్ చేస్తే.. క్రూయిజ్ ప్రయాణంతో ఈ అనుభూతులన్నీ సొంతం చేసుకోవచ్చు. నడిసంద్రంలో సకల సౌకర్యాలున్న కదిలే దీవిలో అలా చక్కర్లు కొడుతూ నేచర్‌ను ఆస్వాదించడం అనేది జీవితాంతం గుర్తుండే జ్ఞాపకంగా నిలిచిపోతుంది! మరింకేం లగేజీ సర్దేయండి.. గెట్ సెట్ క్రూయిజ్!! -శివరామకృష్ణ మిర్తిపాటి ఫోటోల సహకారం: సూర్య చైతన్య వానపల్లి -
సరుకు కలెక్ట్ చేస్తుండగా.. హఠాత్తుగా మునిగిపోయిన ఓడ: వీడియో వైరల్
టర్కీలో ఓ భారీ ఓడ సరుకు అన్లోడ్ చేస్తుండగా..మునిగిపోయింది. ఈ హఠాత్పరిణామానికి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకెళ్తే.. ఈజిప్ట్‌కి చెందిన సీ ఈగిల్ అనే కార్గో ఓడ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటన టర్కీలోని ఇస్కెండరమ్ పోర్ట్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం సంభవించినప్పుడూ సిబ్బంది కంటైనర్ల లోడ్‌ని దింపుతోంది. ఇంతలో ఓడ ముందుకు కదిలి ఆ తర్వాత ఒక్కసారిగా బోల్తాపడింది. దీంతో లోడ్‌ను కలెక్ట్ చేస్తున్న సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఈ మేరకు టర్కీ రవాణా, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో... ఈ ఓడ ప్రమాదం కారణగా సుమారు 24 కంటైనర్లు మునిగిపోయాయని తెలిపింది. అలాగే కొద్ది మోతాదులో చమురు కూడా లీక్ అయినట్లు వెల్లడించింది. అదృష్టవశాత్తు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది. ఈ ఓడ గత కొంతకాలంగా స్థిరత్వానికి(బ్యాలెన్సింగ్) సంబంధించిన విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. ఈ ఓడ సెప్టెంబర్ 17న టర్కీలోని ఇస్కెండరమ్ పోర్ట్‌కి చేరుకుందని, అప్పుడే ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొంది. ఈ ఓడను 1984 నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలను టర్కీలోని పోర్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఓడను వెలికితీసే ఆపరేషన్ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. అంతేగాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. SEA EAGLE isimli konteyner gemisinden denize düşen 24 konteynerin tamamı denizden çıkarılmış olup, dalgıç marifetiyle batık bölgesinde gerekli kontroller yapılarak deniz yüzeyinin temizlenmesine müteakip batıkla ilgili çalışmalara devam edilecektir. pic.twitter.com/RV19PsH7PZ — DENİZCİLİK GENEL MÜDÜRLÜĞÜ (@denizcilikgm) September 18, 2022 Sinking moment of the Sea Eagle in İskenderun... pic.twitter.com/mgg3VtKIMl — focuSEA (@focuseatv) September 19, 2022 (చదవండి: భూమిని ఢీ కొట్టిన జెట్ విమానం...మంటల్లో సైతం ఎగిరి...: వీడియో వైరల్) -
భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల నౌక ఇది. ఇరవై అంతస్తులతో, ఒకేసారి తొమ్మిదివేల మంది ప్రయాణించేందుకు వీలుగా ఆరుబయటి స్విమ్మింగ్ పూల్. విశాలమైన సినిమా థియేటర్ వంటి భారీ హంగులతో అట్టహాసంగా ‘గ్లోబల్ డ్రీమ్–2’ పేరిట దీని నిర్మాణం చేపట్టారు. అయితే, తొలి ప్రయాణానికి ముందే ఇది తునాతునకలుగా తుక్కు కానుంది. Photo Courtesy: Mv Werften జర్మన్–హాంకాంగ్ నౌకా నిర్మాణ సంస్థ ‘ఎంవీ వెర్ఫ్‌టెన్’ ఈ భారీ నౌక నిర్మాణం చేపట్టింది. దీని నిర్మాణానికి 120 కోట్ల పౌండ్ల (రూ.11,090 కోట్లు) అంచనా వేయగా, నిర్మాణ సంస్థ దీనికోసం ఇప్పటికే 90 కోట్ల పౌండ్లు (రూ.8,318 కోట్లు) ఖర్చు చేసింది. నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయింది. సంస్థ వద్ద నిధులన్నీ పూర్తిగా ఖర్చయిపోయాయి. Photo Courtesy: Mv Werften తుదిమెరుగులు పూర్తి చేసి, నౌకను ప్రయాణం కోసం సముద్రంలోకి దించాలంటే, మరో 30 కోట్ల పౌండ్లు (రూ.2,772 కోట్లు) కావాల్సి ఉంటుంది. ఎంవీ వెర్ఫ్‌టెన్ సంస్థ ఇంతవరకు ఆ నిధులను సమకూర్చుకోలేకపోయింది. దీనిని యథాతథంగా అమ్మాలని నిర్ణయించుకున్నా, దీనిని కొనుగోలు చేయడానికి కూడా ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. Photo Courtesy: Mv Werften దీంతో, ఈ నౌకను, దీంతో పాటు దీనికి ముందు నిర్మించిన ‘గ్లోబల్ డ్రీమ్’ నౌకను కూడా తునాతునకలు చేసి, విడిభాగాలను విడగొట్టి తుక్కుగా అమ్ముకుని కొంతైనా నష్టాల నుంచి బయటపడాలని ఎంవీ వెర్ఫ్‌టెన్ సంస్థ నిర్ణయించుకుంది. చదవండి: రివ్యూయర్లూ.. బహుపరాక్, తప్పుడు రివ్యూ రాస్తే మరణమే..! -
శ్రీలంకను వీడిన చైనా నిఘా నౌక
కొలంబో: శ్రీలంకలోని వ్యూహాత్మకంగా కీలకమైన హంబన్‌టోట పోర్టులో మకాం వేసిన చైనా నిఘా నౌక ఆరు రోజుల అనంతరం సోమవారం అక్కడి నుంచి వెళ్లిపోయింది. బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలు, శాటిలైట్ ట్రాకింగ్ సామర్థ్యం కలిగిన యువాన్ వాంగ్ 5 రాకపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ నౌక హంబన్‌టోటకు ఈనెల 11వ తేదీనే రావాల్సి ఉంది. భారత్ భద్రతాపరమైన ఆందోళనల నడుమ శ్రీలంక అధికారులు అనుమతులను వెంటనే ఇవ్వలేదు. చైనా నిర్వహణలో ఉన్న హంబన్‌టోటకు ఈ నెల 16వ తేదీన చేరుకుని ఇంధనం నింపుకునే కారణంతో సోమవారం వరకు అక్కడే లంగరేసింది. యువాన్ వాంగ్ 5 సోమవారం సాయంత్రం 4 గంటలకు చైనాలోని జియాంగ్ యిన్ పోర్టు దిశగా తిరిగి బయలుదేరి వెళ్లిపోయిందని హార్బర్ అధికారులు వెల్లడించారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం పోర్టులో ఉన్న సమయంలో నౌకలోని సిబ్బందిని మార్చలేదని వివరించారు. తమ ప్రాదేశిక జలాల్లో ఉన్న సమయంలో ఈ నౌకలోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ వ్యవస్థ స్విఛాన్ చేసి ఉంటుందని, ఎటువంటి పరిశోధనలు జరపరాదనే షరతులతోనే అనుమతులు ఇచ్చినట్లు శ్రీలంక ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. -
భారత ఆందోళనను లెక్కచేయని శ్రీలంక.. చైనా నిఘా నౌకకు అనుమతి
కొలంబో: భారత్ ఆందోళనలను బేఖాతర్ చేస్తూ చైనా హైటెక్ నిఘా నౌక యువాన్ వాంగ్ 5 లంగరు వేయడానికి శ్రీలంక అనుమతులు మంజూరు చేసింది. దక్షిణ రేవు పట్టణమైన హంబన్‌టొటలో ఆగస్టు 16 నుంచి 22 వరకు ఉండడానికి అనుమతినిచ్చినట్టు శనివారం అధికారులు వెల్లడించారు. యువాన్ వాంగ్ 5 నౌక ఖండాంతర క్షిపణి, అంతరిక్షం, ఉపగ్రహాలను ట్రాక్ చేయగలదు. ప్రస్తుతం ఈ నౌక ప్రయాణిస్తున్న పరిధిలోకి మన దేశ అణు పరిశోధనా కేంద్రాలన్నీ వస్తాయి. అందుకే భారత్ ఈ నౌక రాకపట్ల అభ్యంతరం చెబుతూ దానిని అడ్డుకోవాలంటూ శ్రీలంకపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. భారత్ ఆందోళనల్ని శ్రీలంక విదేశాంగ శాఖ చైనా దృష్టికి తీసుకువెళుతూ నౌక తమ జలాల్లోకి రావడానికి తొలుత అనుమతినివ్వలేదు. దీంతో 11వ తేదీ గురువారమే హంబన్‌టొట రేవుకి చేరుకోవాల్సిన యువాన్ నౌక ప్రయాణాన్ని గతంలో ఆపడం తెల్సిందే. చదవండి: (సామూహిక మతమార్పిడులకు పదేళ్ల జైలు) -
భారత్ వ్యూహంతో చైనా ఉక్కిరిబిక్కిరి
కొలంబో: శ్రీలంకలోని హంబన్‌టోటా నౌకాశ్రయానికి నిఘా నౌక రాకుండా చేసిన భారత్ వ్యూహంతో చైనా ఉక్కిరిబిక్కిరవుతోంది. తాము అనుకున్న పనికి ఆటంకం ఏర్పడటంతో ఆందోళన చెందుతోంది. భారత్ ఒత్తిడి మేరకు నిఘా నౌక పర్యటనను నిరవధికంగా వాయిదా వేసుకోమని చైనాకు శ్రీలంక అభ్యర్థించింది. ఎలాగూ శ్రీలంక మన మాట కాదనదులే అనుకుని ప్రయాణం ప్రారంభించిన నౌక ప్రస్తుతం శ్రీలంకకు సమీపంలోని మార్గం మధ్యలో ఉంది. దీంతో శ్రీలంకతో అత్యవసర సమావేశానికి సిద్ధమైంది చైనా. కొలంబోలోని చైనా రాయబార కార్యాలయం.. శ్రీలంక ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. మరోవైపు.. ఈ విషయంపై శ్రీలంక అధ్యక్షుడు రణీల్ విక్రమసింఘే చైనా రాయబారి కిజెన్‌హోంగ్‌తో ప్రత్యేకంగా సమావేశమైనట్లు కొలంబో మీడియా పోర్టల్స్ పేర్కొన్నాయి. తదుపరి కార్యాచరణపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. అయితే.. ఈ సమావేశంపై మీడియాలో వచ్చిన వార్తలను అధ్యక్ష కార్యాలయం ఖండించింది. యువాన్వాంగ్ 5 రెండు రకాలగా ఉపయోగపడే గూఢచారి నౌక, పైగా దీన్ని అంతరిక్ష ఉపగ్రహ ట్రాకింగ్‌తోపాటు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలలోనూ వినియోగిస్తారు. అయితే ఈ నౌక తమ కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు చైనా ఉపయోగిస్తుందేమోనని భారత్ తీవ్ర ఆందోళన చెందుతుంది. ఈ విషయమై కొలంబోలో ఫిర్యాదు చేసింది కూడా. అదీగాక భారత్‌కి పొరుగున ఉన్న శ్రీలంక నుంచి చైనా బలపడుతుందేమోనని అనుమానిస్తోంది. ఇదీ చదవండి: భారత్‌కు హామీ ఇచ్చిన శ్రీలంక...చైనా నౌకకు చెక్! -
భారత్‌కు హామీ ఇచ్చిన శ్రీలంక...చైనా నౌకకు చెక్!
కొలంబో: భారత్ ఒత్తిడి మేరకు నిఘా నౌక పర్యటనను నిరవధికంగా వాయిదా వేసుకోమని చైనాను శ్రీలంక అభ్యర్థించింది. ఈ మేరకు యువాన్వాంగ్ 5 చైనీస్ పోర్ట్ ఆఫ్ జియాంగిన్ నుంచి ఆ నిఘా నౌక శ్రీలంకకు సమీపంలోని మార్గ మధ్యలో ఉంది. ఆ నౌక గురువారం చైనీస్ ఆధ్వర్యంలో శ్రీలంక నౌకాశ్రయమైన హంబన్‌టోటాకు చేరుకుంటుందని మెరైన్ ట్రాఫిక్ పేర్కొంది. ఇది పరిశోధనలకు సంబంధించిన నిఘా నౌకగా అనుమానిస్తోంది భారత్. ఇది రెండు రకాలగా ఉపయోగపడే గూఢచారి నౌక, పైగా దీన్ని అంతరిక్ష ఉపగ్రహ ట్రాకింగ్‌తోపాటు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలలోనూ వినియోగిస్తారు. అయితే ఈ నౌక తమ కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు చైనా ఉపయోగిస్తుందేమోనని భారత్ తీవ్ర ఆందోళన చెందుతుంది. ఈ విషయమై కొలంబోలో ఫిర్యాదు చేసింది కూడా. అదీగాక భారత్‌కి పొరుగున ఉన్న శ్రీలంక నుంచి చైనా బలపడుతుందేమోనని అనుమానిస్తోంది. ఐతే శ్రీలంక విదేశాంగ మంత్రిత్వశాఖ భారత భద్రత, ఆర్థిక ప్రయోజనాలకు ఎలాంటి అవాంతరం తలెత్తకుండా చూడటమే కాకుండా తగిన చర్యలను కూడా తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ చైనా రాయబార కార్యాలయానికి ఈ నౌక పర్యటన వాయిదా వేసుకోవాలంటూ వ్రాత పూర్వకంగా అభ్యర్థించిందని అధికారిక వర్గాలు తెలిపాయి. శ్రీలంక సముద్ర జలాల్లో భారత్‌కి కుట్ర తలపెట్టేలా ఎలాంటి వివాదాస్పద పర్యటన కొనసాగదని ఆ దేశ అధ్యక్షుడు విక్రమశింఘే రణిల్ భారత్‌కి హామీ ఇచ్చారు. అంతేకాదు ఆ చైనా నౌక ఇంధనం నింపడానికి, సరఫరా చేయడానికి వస్తుందని చెబుతోంది శ్రీలంక. (చదవండి: Gotabaya Rajapaksa: ప్లీజ్ ఆయన్ని అక్కడే ఉండనివ్వండి... అభ్యర్థించిన శ్రీలంక) -
Bermuda Triangle: మాయమైతే.. పైసలు వాపస్
న్యూయార్క్: బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని వ్యాపారంగా మార్చుకునేందుకు యూకేకు చెందిన ‘యాన్సియంట్ మిస్టరీస్’అనే సంస్థ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. ‘బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోకి వెళ్లాక మాయమవుతామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కనిపించకుండా పోతే మీ డబ్బు 100% వాపస్ ఇస్తాం’అనిప్రకటించింది. వచ్చే ఏడాది మార్చిలో నార్వేజియన్ ప్రిమా షిప్ న్యూయార్క్ నుంచి బెర్ముడాకు ప్రయాణం ప్రారంభించనుంది. ఆ ఓడ అడుగు భాగమంతా గ్లాస్‌తోనే తయారైందని చెప్పింది. క్యాబిన్ టికెట్ ఖర్చు ఒక్కరికి 1830 డాలర్లపైనే అని తెలిపింది. అట్లాంటిక్ సముద్రంలోని 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోకి వెళ్లిన 75 విమానాలు వందల సంఖ్యలో ఓడలు కనిపించకుండా పోయాయి. -
‘మీ చెత్త మాకెందుకు?’.. దిమ్మతిరిగే షాక్
Sri Lanka Returns Tonnes Of Garbage: అక్రమంగా దిగుమతి అవుతున్న వేలాది టన్నుల వ్యర్థాలతో నిండిన అనేక వందల కంటైనర్లను శ్రీలంక సోమవారం బ్రిటన్‌కు పంపించిందని అధికారులు తెలిపారు. అవన్నీ బ్రిటన్ నుంచి వచ్చిన వ్యర్థాలు. 2017, 2019 మధ్య కాలంలో శ్రీలంకకు పెద్ద ఎత్తున చేరాయి. వాటిలో ఉపయోగించిన పరుపులు, తివాచీలు, రగ్గులు, మార్చురీల నుండి శరీర భాగాలతో సహా ఆసుపత్రుల నుండి బయోవేస్ట్ కూడా ఉందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అంతేకాదు ఆ కంటైనర్ల నుంచి ఘోరమైన దుర్వాసన వస్తుందని చెప్పారు. ఈ మేరకు సోమవారం కొలంబో ఓడరేవులోని ఓడల్లో లోడ్ చేయబడిన కంటైనర్లలోదాదాపు 3 వేల టన్నుల వ్యర్థాలు ఉన్నాయి. దీంతో కస్టమ్స్ చీఫ్ విజిత రవిప్రియ ఈ విషయమై స్పందించి.. "ఇలాంటి ప్రమాదకర వాటిని దిగుమతి చేసుకోం అప్రమత్తంగా ఉండటమే కాక మళ్లీ జరగకుండా చూసుకుంటాం." అని వివరణ ఇచ్చారు. అయితే కస్టమ్స్ ఒక స్థానిక సంస్థ బ్రిటన్ నుంచి వ్యర్థాలను దిగుమతి చేసుకుంటోందని చెబుతోంది కానీ కచ్చితమైన ఆధారాలను చూపించడంలో విఫలమైంది. ఈ క్రమంలో స్థానిక పర్యావరణ కార్యకర్త బృందం వ్యర్థాలను పంపినవారికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శ్రీలంక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే శ్రీలంక అప్పీల్ కోర్టు 2020లో ఆ పిటిషన్‌ను సమర్థించింది కూడా. ఈ నేపథ్యంలోనే శ్రీలంక ఆ వ్యర్థాలను యూకేకి తిరిగి పంపించేసింది. ధనిక దేశాలు చాలావరకు ఇలా చెత్తను దిగుమతి చేసి.. సముద్ర మార్గాల గుండా పంపించి చేతులు దులుపుకుంటాయి. ఈ క్రమంలో ఆసియా దేశాల్లో చాలావరకు ఇలాంటి చెత్త కంటెయినర్లు చేరి.. ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతాయి. శ్రీలంకలాగే.. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా కూడా దిగుమతవుతున్న వందలాది చెత్త కంటైనర్లను గతంలో ఆయా దేశాలకు తిరిగి పంపించాయి. (చదవండి: చంద్రుడిని ఢీ కొట్టనున్న రాకెట్!.మాది కాదంటున్న చైనా) -
నడి సంద్రం.. నౌకలో మంటలు.. వేలాది కార్లు బూడిద
Ship Carrying Thousands of vehicles: ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని పోర్చుగీస్ ద్వీపం తీరంలో వాహనాలతో కూడిన ఓడ బుధవారం నుంచి మంటల్లో దగ్ధమవుతోంది. నౌకలోని 22 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఇది ఇప్పుడు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో పోర్చుగల్‌లోని అజోర్స్ తీరం వెంబడి కొట్టుకుపోతోంది. ‘ఫెలిసిటీ ఏస్’ అనే ఓడ ఫిబ్రవరి 10న జర్మనీలోని ఎమ్డెన్ నుంచి బయలుదేరి బుధవారం అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లోని డేవిస్‌విల్లేకు చేరుకోవాల్సి ఉంది. పోర్చుగీస్ ద్వీప ప్రాంతమైన అజోర్స్‌లోని టెర్సీరా ద్వీపానికి 200 మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఓడ కార్గో హోల్డ్‌లో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో పోర్చుగీస్ బలగాలు సిబ్బందిని ఖాళీ చేయించారు. హెలికాప్టర్‌తో కూడిన రెస్క్యూ ఆపరేషన్ సాయంతో సిబ్బందిని రక్షించారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎంతమేర ఆస్తి నష్టం జరిగిందనేది స్పష్టం కాలేదు. ఆ ఓడలో 189 బెంట్లీ కార్లతో సహా వోక్స్వ్యాగన్ గ్రూప్‌కి చెందిన 4 వేల కార్లు ఉన్నట్లు అంచనా. అంతేకాదు ఆ ఓడలో పోర్ష్ కంపెనీకి సంబంధించిన కార్లు సుమారు వెయ్యి కార్లు ఉన్నట్లు ఆ కంపెనీ ధృవీకరించింది. తమ కార్ల గురించి ఆందోళన చెందుతున్న కస్టమర్లను సంబంధిత డీలర్లను సంప్రదించమని సంబంధిత కంపెనీల ప్రతినిధులు తెలిపారు. (చదవండి: ఉక్రెయిన్ సరిహద్దుల్లో కాల్పుల మోత.. సైనికుల ఎదురుకాల్పులు!) -
మతి పోయేలా.. ‘మలేనా’.. ఖర్చు రూ.2500 కోట్లు, మరెన్నో విశేషాలు
పేద్ద.. క్రూయిజ్ ఓడ నీళ్లలో వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఓ బిల్డింగే అలా కదిలిపోతున్నట్టు అనిపిస్తుంటుంది. ఆ ఓడలను అంతలా అద్భుతంగా నిర్మిస్తుంటారు. రోడ్రిగ్యుయెజ్ డిజైన్ అనే కంపెనీ కూడా తామేం తీసిపోలేదంటూ కళ్లు చెదిరే ఓ ఓడ డిజైన్‌ను రూపొందించింది. 110 మీటర్ల పొడవు.. 26 మీటర్ల ఎత్తున్న అతిపెద్ద ఈ ఓడను పక్కనుంచి చూస్తే ఓ లగ్జరీ హోటలేనా అనిపించేట్టు ఉంటుంది. ఈ డిజైన్‌తో ఓడను నిర్మించాలంటే ఓడలో వాడే వస్తువులు, నిర్మించే కంపెనీని బట్టి దాదాపు రూ.2,500 కోట్ల వరకు ఖర్చవుతుందని కంపెనీ చెబుతోంది. ఓడకు ‘మలేనా’ అని పేరు పెట్టింది. ఓడలో మొత్తం 11 క్యాబిన్లు ఉంటాయి. వీటన్నింటిలో కలిపి 24 మంది ప్రయాణించొచ్చు. ఓడ ప్రధాన డెక్‌లో 6 వీఐపీ క్యాబిన్లు ఉంటాయి. లోయర్ డెక్‌లో 4 డబుల్ క్యాబిన్ డెక్‌లు, ఒక యజమాని అపార్ట్మెంట్ ఉంటాయి. ఇందులో హాట్ టబ్, డైనింగ్ ప్రాంతం ఉంటుంది. లోయర్ డెక్లోనే 9 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పుతో రెండు ఇన్ఫినిటీ పూల్స్, వీటితో పాటు సన్ బెడ్స్ ఉంటాయి. అలాగే ఏడుగురు కూర్చునేలా బార్ ఉంటుంది. లోయర్ డెక్ నుంచి మెట్లెక్కి పైకి వెళ్తే అప్పర్ డెక్ వస్తుంది. ఇక్కడ ఓ పెద్ద డైనింగ్ ఏరియా ఉంటుంది. 24 మంది కలిసి కూర్చొని తినవచ్చు. అప్పర్ డెక్‌లో ఒక హెలిప్యాడ్ కూడా ఉంటుంది. ఏసీహెచ్ 160 లేదా అలాంటి పరిమాణంలోని హెలికాప్టర్లు దీనిపై ల్యాండ్ చేయవచ్చు. (చదవండి: వామ్మో ! కుక్కపిల్ల మాదిరి సింహాన్ని చేతులతో మోసుకుంటూ తీసుకువచ్చేసింది!!) నిర్మాణానికే నాలుగైదేళ్లు ఓడలో అన్నింటికన్నా పైన సన్ డెక్ ఉంటుంది. దీన్నే పార్టీ డెక్ అని కూడా అంటారు. ఇక్కడ మరో హాట్ టబ్, కూర్చునేందుకు ఓ ప్రాంతం, ఓ బార్ కూడా ఉంటాయి. బోటు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతుంది. డీజిల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఇంధనాలతో కలిసి నడుస్తుంది. బోటును నిర్మించడానికి దాదాపు 4 నుంచి 5 ఏళ్లు పడుతుందని కంపెనీ యజమాని చెప్పారు. ప్రస్తుతానికి ఇది డిజైన్ మాత్రమే అయినా ఓడ నిర్మాణానికి ఓ షిప్ యార్డ్‌తో, నిర్మించాలనుకుంటున్న వ్యక్తితో సంప్రదింపులు జరుపుతున్నామని డిజైన్ కంపెనీ చెప్పింది. (చదవండి: లాక్‌డౌన్‌తో ఆగమాగం .. చైనీయుల ఆకలి కేకలు, అయినా తగ్గేదే లే!) – సాక్షి సెంట్రల్ డెస్క్ -
హౌతీ రెబల్స్ చెరలో ఎమిరేట్స్ నౌక
దుబాయ్: తమకు మద్దతిచ్చిన ఇరాన్ సైనిక జనరల్ ఖాసిమ్ సులేమానీని అమెరికా హతమార్చినందుకు ఆగ్రహంగా ఉన్న యెమెన్ హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో కలకలం రేపారు. ఎర్ర సముద్రం మీదుగా వెళ్తున్న యూఏఈకి చెందిన వాణిజ్య నౌకను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అంతర్జాతీయ వాణిజ్య, ఇంధన సరకు నౌకల రాకపోకలకు కీలకమైన మార్గంలో ‘వాబీ’ షిప్‌ను సోమవారం సీజ్ చేసి హౌతీ రెబల్స్ ఉద్రిక్తత పెంచారు. మరోవైపు, ఇజ్రాయెల్‌కు చెందిన వార్తా పత్రిక ‘జెరూసలేం పోస్ట్’కు చెందిన వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురైంది. -
Sailcargo: ఈ నౌకకు ఇంధనం అక్కరలేదట! కేవలం గాలితోనే...
చిన్న చిన్న పడవలైతే గాలివాలుకు అలా ముందుకు సాగిపోతాయి గాని, భారీ నౌకలు సముద్రంలో ముందుకు సాగాలంటే ఇంధనం కావాలి కదా! కేవలం గాలితో ఇంత పెద్ద నౌక సముద్రంలో ఎలా ప్రయాణం సాగించగలుగుతుందనేగా మీ అనుమానం? ఇందులో అణుమాత్రమైనా అనుమానానికి ఆస్కారం లేదు. ఫొటోలో కనిపిస్తున్న ఈ నౌక పూర్తిగా గాలి ఆధారంగానే నడుస్తుంది. కెనడాకు చెందిన ‘కేఫ్ విలియమ్’ తన అంతర్జాతీయ కాఫీ రవాణా కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఈ నౌక పూర్తిగా పవనశక్తినే ఇంధనంగా మార్చుకుని, సముద్రంలో ప్రయాణిస్తుంది. ‘కేఫ్ విలియమ్’ కోసం ‘సెయిల్ కార్గో’ సంస్థ ఈ నౌకను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ నౌక 2023లో తొలి సముద్రయానం చేయనుంది. చదవండి: Job Alert: 14 రోజులు వర్క్ చేస్తే ఏకంగా 9 లక్షల రూపాయల జీతం..! చివరితేదీ ఇదే.. -
ఏపీలో షిప్ రిపేరింగ్ యూనిట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ఆసరాగా చేసుకుని ఆదాయ, ఉపాధి మార్గాలకు ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేసింది. తూర్పు తీర ప్రాంతంలో షిప్ రిపేరింగ్ యూనిట్ ఒక్కటీ లేకపోవడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవడంపై దృష్టి సారించింది. మారిటైమ్ ఇండియా విజన్–2030లో భాగంగా షిప్ రిపేరింగ్, రీసైక్లింగ్ క్లస్టర్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిందిగా ఏపీ మారిటైమ్ బోర్డు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ క్లస్టర్‌కు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు అనుకూలంగా ఉన్నాయని, దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి శర్బానంద్ సోనోవల్‌ను కోరింది. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఏపీ మారిటైమ్ అధికారులు వెల్లడించారు. షిప్ రిపేరింగ్–రీ సైక్లింగ్ యూనిట్ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 15,000 మందికి ఉపాధి లభించనుంది. ఒక షిప్‌ను రీసైక్లింగ్ చేయడానికి సగటున 300 మంది నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం ఉంటుంది. దీనిపై ఆధారపడి 50 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు అవుతాయని అంచనా. దీంతో పాటు 10 లక్షల టన్నుల ఉక్కును తుక్కుగా మార్చి అమ్మితే జీఎస్టీ రూపంలో అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి రూ. 270 కోట్ల చొప్పున ఆదాయం సమకూరనుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1,000కుపైగా ఓడలు, దేశంలో 300 వరకు ఓడలు రీసైక్లింగ్‌కు వెళుతున్నట్లు అంచనా. ప్రస్తుతం మన దేశంలో రీసైక్లింగ్ వ్యాపారంలో గుజరాత్ రాష్ట్రం ముందంజలో ఉంది. ఇప్పుడు ఈ అవకాశాన్ని తూర్పు తీరప్రాంతంలో మన రాష్ట్రం అందిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. -
మలేషియాలో సూర్యాపేట యువకుడు మృతి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేటకు చెందిన యువకుడు మలేషియాలో మృతిచెందాడు. పట్టణానికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి, మాధవిల కుమారుడు రిశి వర్ధన్ రెడ్డి(20) మలేషియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఓ ప్రైవేటు షిప్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అతను సోమవారం మృత్యువాత పడ్డాడు. ఉదయం షిప్‌పై నుంచి సముద్రంలో పడిపోవడంతో అతను మృతి చెందినట్లు మలేషియా అధికారులు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారం క్రితమే తమ బిడ్డ ఫోన్ చేశాడని, ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడి ఉందని అన్నాడు. త్వరలోనే మరో కంపెనీకి మారాలనుకుంటున్నట్లు చెప్పాడని, ఇంతలోనే ఇలా జరిగిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. కాగా, కుమారుడి మృతిపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (అమెరికాలో నిజామాబాద్ యువకుడి మృతి) -
ఎవర్‌గివెన్ కన్నా పెద్ద నౌక!.. సూయజ్ దారి ఇస్తుందా?
ప్రపంచ వాణిజ్య సముద్ర మార్గం సూయజ్ కెనాల్లోకి ప్రపంచంలోనే అతి పెద్దదైన భారీ ఓడ ప్రవేశించబోతోంది. ఈ ఏడాది మార్చిలో సూయజ్ కెనాల్లో నిలిచిపోయిన ఎవర్ గివెన్ నౌకను మించిన ఓడ ఇది. ఎవర్ గివెన్ నౌక ఆరు రోజుల పాటు సూయజ్ కెనాల్లో ఇసుకలో కూరుకుపోయి, నిలిచిపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వందలాది నౌకలు సముద్రంలో నిలిచిపోయాయి. ఆ తర్వాత నౌక కింద ఇసుకను తవ్వి, అతి కష్టంమీద దానిని మళ్లీ సముద్ర మార్గంలోకి మళ్లించగలిగారు. ఈ నౌక నిలిచిపోయిన కారణంగా సముద్ర వాణిజ్యానికి తీవ్ర నష్టం కలిగింది. ఇప్పుడు వస్తున్న ఎవర్ ఏస్ నౌక అంతకంటే పెద్దది. ఎక్కువ కంటెయినర్లను మోసుకొని వస్తోంది. చదవండి: సూయజ్ కాలువ.. ఎవర్ గీవెన్ నౌక.. ఇప్పుడెక్కడుందో తెలుసా? ప్రస్తుతం ఇది బ్రిటన్‌లోని సఫోల్క్‌లో ఉన్న ఫ్లెగ్జిస్టోవ్ నౌకాశ్రయంలో ఉంది. బుధవారం దాని ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. భారీ కంటెయినర్ల లోడ్‌తో రాటర్‌డామ్‌కు చేరుకొనేందుకు ఎవర్ గివెన్ వెళ్లిన మార్గంలోనే సూయజ్ కెనాల్ గుండా వెళ్లనుంది. దీంతో అందరిలోనూ ఉత్సుకత నెలకొంది. ఎవర్ గివెన్కంటే పెద్దదైన ఈ నౌక సూయజ్ కెనాల్‌ను దాటేంతవరకు ఉత్కంఠ తప్పదని వాణిజ్యవర్గాలు అంటున్నాయి. తైవాన్‌కు చెందిన షిప్పింగ్ కంపెనీ ఎవర్ గ్రీన్ మెరైన్‌కు చెందిన ఈ నౌక ఎవర్గ్రీన్ ఎ క్లాస్‌లో కొత్త తరానికి చెందినది. ఎవర్ గివెన్‌కు 20,124 కార్గో యూనిట్లను మోసుకెళ్లే సామర్ధ్యం ఉండగా.. ఎవర్ ఏస్ ఏకంగా 23,992 కంటెయినర్లను మోసుకెళ్లగలదు. ఇవే కాదు ఈ రెండింటి మధ్య ఇంకా చాలా తేడాలున్నాయి. రెండింటి పొడవు ఒకటే. వెడల్పు, లోతులో, సామర్ధ్యంలో ఎవర్ ఏస్ ఎక్కువ. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ -
విశాఖ చేరిన 'విగ్రహ'
సాక్షి, విశాఖపట్నం: భారతతీర గస్తీ దళం అమ్ముల పొదిలో చేరిన అధునాతన నౌక విశాఖ కేంద్రంగా సేవలందించేందుకు సిద్ధమైంది. అడ్వాన్స్డ్ ఫైర్ పవర్‌తో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐసీజీఎస్ విగ్రహ నౌకని గత నెల 28న చెన్నైలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జాతికి అంకితం చేశారు. అనంతరం కోస్ట్‌గార్డు ఈస్ట్రన్ సీబోర్డు ప్రధాన స్థావరమైన విశాఖ నుంచి కార్యకలాపాలు నిర్వర్తించేందుకు శుక్రవారం ఇక్కడికి చేరుకుంది. విగ్రహ నౌకకు విశాఖలోని కోస్ట్‌గార్డ్ సిబ్బంది.. అధికారులు స్వాగతం పలికారు. కోస్ట్‌గార్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్, జిల్లా కమాండర్(ఏపీ) యోగిందర్ ఢాకా నేతృత్వంలోని బృందం విగ్రహ షిప్‌ని ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లోకి స్వాగతించారు. ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసల్ సిరీస్‌లో ఏడో నౌక అయిన దీనిని చెన్నైలోని ఎల్ అండ్ టీ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ సంస్థ తయారుచేసింది. 98 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 3.6 మీటర్ల డ్రాట్, 2,200 టన్నుల బరువుతో తయారైన విగ్రహ.. 9,100 కిలోవాట్స్ డీజిల్ సామర్థ్యం ఉన్న రెండు ఇంజిన్లతో 26 నాటికల్ మైళ్ల వేగంతో 5 వేల కి.మీ ప్రయాణించగల సామర్థ్యం సొంతం చేసుకుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాడార్లు, నేవిగేషన్, కమ్యూనికేషన్ పరికరాలు, సెన్సార్లు, సముద్ర స్థితిగతులకు అనుగుణంగా దిశ మార్చుకునే యంత్ర సామర్థ్యంతో దీనిని రూపొందించారు. రెస్క్యూ ఆపరేషన్లకు ఉపయోగపడేలా ఒక ట్విన్ ఇంజిన్ హెలికాఫ్టర్, నాలుగు హైస్పీడ్ బోట్లను తీసుకెళ్లగలదు. షిప్లో 12 మంది అధికారులు, 90 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. తొలి కమాండెంట్‌గా పీఎన్ అనూప్‌కు బాధ్యతలు అప్పగించారు. ఐసీజీఎస్ విగ్రహ చేరికతో కోస్ట్‌గార్డ్ జాబితాలో 157 నౌకలు, 66 విమానాలున్నాయి. -
‘టైటానిక్’ మరో 12 ఏళ్లే.. ఆ తర్వాత..
‘టైటానిక్’ ఉదంతం చరిత్ర పుటల్లో ఓ దుర్ఘటన. 1912 నవంబర్ 14న అట్లాంటిక్ మహాసముద్రంలో మంచుకొండను ఢీ కొట్టి, మునిగి.. వందల మందిని జలసమాధి చేసిన ఓ విషాదం. 73 ఏళ్ల తర్వాత కెనడాలోని న్యూఫౌండ్ ల్యాండ్‌కు 740 కి.మీ. దూరంలో సముద్ర మట్టానికి 4 వేల మీటర్ల లోతున 2 ముక్కలైన టైటానిక్ అవశేషాలను గుర్తించిన విషయం తెలిసిందే. 109 ఏళ్లు దాటినా ఆ ఓడ అవశేషాలు నేటికీ నీళ్లల్లో పదిలంగానే ఉన్నాయి. అయితే మరికొన్ని ఏళ్లల్లో ఆ ఛాన్స్ కూడా ఉండదట. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఒకరకమైన బ్యాక్టీరియా టైటానిక్ అవశేషాలను వేగంగా తినేస్తోందట.. ‘మరో 12 ఏళ్ల తర్వాత టైటానిక్ అని చెప్పుకోవడానికి నీళ్లల్లో ఒక్క ముక్క కూడా మిగలద’ని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకూ ‘ఆర్ఎంఎస్ టైటానిక్ సంస్థ’ పలు పరిశోధక యాత్రలు చేపట్టి.. దాదాపు 5 వేలకు పైగా.. వెండి పాత్రలు, బంగారు నాణాలు వంటివెన్నో టైటానిక్ శిథిలాల నుంచి బయటకు తీసింది. ఆనాడు ఈ ప్రమాదం నుంచి ఏడు వందల మంది ప్రాణాలతో బయటపడ్డారు. చదవండి: ఇలా చేస్తే.. ఎంత వయసొచ్చినా యంగ్‌గా కనిస్తారు.. -
వియత్నాంకు చేరుకున్న ఐఎన్ఎస్ ఐరావత్
దొండపర్తి (విశాఖ దక్షిణ): మిషన్ సాగర్ కార్యక్రమంలో భాగంగా కోవిడ్ వైద్య సామగ్రితో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఐరావత్ నౌక వియత్నాంలో ఉన్న హో ఛీ మిన్ సిటీ పోర్ట్‌కు సోమవారం చేరుకుంది. వియత్నాం ప్రభుత్వ కోరిక మేరకు భారత్ నుంచి 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో పాటు 300 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఇతర కోవిడ్ సామగ్రిని నౌక ద్వారా తరలించారు. మిత్ర దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇప్పటికే భారత్ ఈ ఏడాదిలో రెండు సార్లు ఐఎన్ఎస్ ఐరావత్ నౌక ద్వారా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను, వైద్య సామగ్రిని ఇండోనేషియాకు పంపించింది. -
సూయజ్ కాలువ.. ఎవర్ గీవెన్ నౌక.. ఇప్పుడెక్కడుందో తెలుసా?
Ever Given In Suez Canal Again ప్రపంచ వాణిజ్యంలో 15 శాతానికి పైగా నిర్వహించే సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కిపోయి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఎవర్ గీవెన్ నౌక ఇప్పుడెక్కడుంది. సూయజ్ నుంచి ఎవర్ గీవెన్‌ని తొలగించిన తర్వాత ఏం జరిగింది. సూయజ్‌లో ప్రమాదం ప్రపంచంలోనే అత్యంత పెద్ద వాణిజ్య నౌకల్లో ఎవర్ గీవెన్ ఒకటి. దాదాపు 400 మీటర్ల పొడవైన ఈ నౌకలో ఒకేసారి 2.20 లక్షల టన్నుల సరుకును తరలించే వీలుంది. ఇంత భారీ నౌక మధ్యధర సముద్రం నుంచి ఎర్ర సముద్రం వైపు ప్రయాణిస్తూ 2021 మార్చి 23న కాలువలో కూరుకుపోయింది. పెనుగాలుల తీవ్రంగా కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయింది. కూరుకుపోయిన నౌకను బయటకు తీసేందుకు ఆరు రోజుల సమయం పట్టింది. దీంతో ఆరు రోజుల పాటు ఈ కాలువ గుండా వాణిజ్య నౌకల రాకపోకలు నిలిచిపోయి బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. మూడు నెలల తర్వాత సూయజ్ కాలువ నుంచి బయటకు తీసిన తర్వాత ఎవర్‌గీవెన్ నౌకను సూయజ్ కెనాల్ అథారిటీ సీజ్ చేసింది. ఆరు రోజుల పాటు కెనాల్ బ్లాక్ అయినందుకు గాను 916 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. దీంతో ఇటు సూయజ్ కెనాల్ అథారిటీ, ఎవర్‌గీవెన్ నౌక యాజమాన్యమైన షోయ్ కిసెన్ ఖైషా, ఇన్సురెన్స్ సంస్థల మధ్య చర్చలు జరిగాయి. మూడు నెలల చర్చల అనంతరం వీరి మధ్య 600 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఎవర్‌గీవెన్ నౌకను జులై 7న రిలీజ్ చేశారు. సూయజ్ టూ ఇంగ్లండ్ సూయజ్ కెనాల్ నుంచి రిలీజైన తర్వాత మరమ్మత్తులు నిర్వహించి జులై 29న హలండ్‌లోని రోటర్‌డ్యామ్‌కు చేరుకుంది,.అనంతరం ఇంగ్లండ్‌లోని ఫెలిక్స్‌టోవ్ పోర్టుకు చేరుకుంది, అక్కడ మరోసారి సరుకులు నింపుకుని వాణిజ్య ప్రయాణానికి రెడీ అయ్యింది. ఆగస్టు 20న ఇంగ్లండ్ నుంచి చైనాకు ప్రయాణమైన ఎవర్ గీవెన్ ఆగస్టు 20న మరోసారి సూయజ్ కాలువని దాటింది. మరోసారి ప్రమాదం జరగకుండా సూయజ్ కెనాల్ అథారిటీ జాగ్రత్తలు తీసుకుని. ఎవర్‌గీవెన్‌కు తోడుగా రెండు టగ్ బోట్లను కూడా పంపింది. ఎవర్‌గీవెన్‌తో పాటు ఒకేసారి 26 చిన్న నౌకలు సైతం సూయజ్‌ను దాటినట్టు ఈజిప్టు మీడియా పేర్కొంది. 22వ సారి ఎవర్‌గీవెన్ నౌకను తైవాన్‌కు చెందిన తైవాన్‌కు చెందిన ఎవర్గ్రీన్ షిప్టింగ్ సంస్థ 2018లో తయారు చేసింది. ఈ భారీ నౌక అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ప్రపంచ యాత్రలు చేసింది. సూయజ్ కాలువను 21వ సారి దాటే క్రమంలో మట్టి దిబ్బల్లో ఇరుక్కుపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి ఎవర్‌గీవెన్‌పై పడింది. ఆ వివాదం నుంచి బయటపడి విజయవంతంగా 22వ సారి సూయజ్ కాలువను దాటింది. -
యుద్ధ నౌక సాక్షిగా
-
ఇండోనేషియాకు కోవిడ్‌పై పోరాటంలో భారత్ భారీ సాయం
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్‌పై పోరాటం చేయడానికి ఇండోనేషియాకు భారత్ భారీ సాయం అందించింది. ఈ నేపథ్యంలో ఇండోనేషియా రాజధాని జకార్తాకు భారత నౌక ఐఎన్ఎస్ ఐరావత్ చేరుకుంది. ఆ నౌకలో100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సామర్థ్యంతో 5 క్రయోజనిక్ ట్యాంకర్లు,300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపింది. భారత్, ఇండొనేషియా దేశాల మధ్య సాంస్కృతిక, వ్యాపార ద్వైపాక్షిక సంబంధాలు కలిగి వున్నాయి. -
100 రోజుల పైగా డ్రామా.. ఎట్టకేలకు కదిలిన ఎవర్ గివెన్ నౌక
suez canal vs ever given ship settled: ఎవర్ గివెన్ షిప్ గుర్తుందా? అదేనండి మార్చి నెలలో సరకు సూయాజ్ కాలువలో వెళ్తూ టైం బాలేక అక్కడే అడ్డంగా ఇరుక్కుపోయింది కదా. ఇక అప్పటి నుంచి ఆ షిప్, దాని యాజమాన్యానికి నష్టాలు, కష్టాలు కంటిన్యు అవుతూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం షిప్ యాజమాన్యానికి వీటి నుంచి ఊరట లభించింది. సూయాజ్‌లో ఇరుక్కుపోయిన ఆ భారీ నౌక కదిలించడం కోసం కెనాల్ యంత్రాంగం వారం రోజులు అష్టకష్టాలు పడి చివరకు దాన్ని మళ్లీ కదిలేలా చేశారు. హమ్మయ్యా కదిలింది కదా! అనుకుంటే ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. అది వారం రోజులు బ్లాక్ కావడంతో ఇతర షిప్‌లు రాకకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో కెనాల్ అథారిటీ రవాణా ఫీజును కోల్పోవడం వల్ల తీవ్ర నష్టాన్ని చూశారు. అలానే షిప్ కదిలికకు చేసిన ఖర్చును కలిపి మొదట 916 మిలియన్ డాలర్లను పరిహారాన్ని డిమాండ్ చేసినప్పటికీ తర్వాత 550 మిలియన్ డాలర్లను చెల్లించాలన్నారు. ఈ నేపథ్యంలో నష్టం పరిహారం ఇచ్చిన తర్వాతే నౌకను వదులుతామని ఈజిప్ట్ దానిని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక తాజాగా ఎవర్ గివెన్ నౌక యజమాని జపాన్‌కు చెందిన షూయీ కిసెన్ కైషా లిమిటెడ్ సంస్థ బుధవారం సూయాజ్ కాలువ యాజమాన్యంతో ఓ ఒప్పందానికి వచ్చింది. దీంతో వంద రోజులకుపైగా నడిచిన డ్రామాకు తెరపడింది. దీనిపై కోర్టులో కేసు కూడా దాఖలైంది. అయితే ఈ ఒప్పందం తర్వాత కోర్టు ఆ కేసు కొట్టేసింది. ఈ సెటిల్మెంట్తో ఎవర్ గివెన్ నౌక మధ్యధరా సముద్రం వైపు కదిలింది. -
106 ఏళ్ల క్రితం మంచులో మునిగిన నౌక కోసం అన్వేషణ
లండన్ : 106 ఏళ్ల క్రితం అంటార్కటిక్ మంచులో కూరుకుపోయిన భారీ నౌక ‘సర్ ఎర్నెస్ట్ శాక్లెటన్స్ ఎండూరన్స్’ను కనుక్కునేందుకు మెరైన్ పురావస్తు శాస్త్రవేత్తల బృందం సిద్ధమైంది. 1914-1917 మధ్య కాలంలో అంటార్కటిక్ అన్వేషణ కోసం ఉపయోగించిన రెండు నౌకల్లో ఎండూరన్స్ ఒకటి. ధ్రువ ప్రాంతంలోని నీళ్లలో అన్వేషణ సాగించటం కోసం ఈ నౌకను ప్రత్యేకంగా రూపొందించారు. 144 అడుగుల పొడవున్న ఈ నౌక 28 మంది పురుషులతో వాసెల్ బేకు బయలుదేరింది. అయితే గమ్యాన్ని చేరుకోకుండానే 1915 జనవరి 18న వెడ్డల్ సముద్రంలో కూరుకుపోయింది. అక్టోబర్ నెలలో ఉష్ణోగ్రతలు మరింత దిగజారటంతో ఎండూరన్స్ ముక్కలు అవసాగింది. ఈ నేపథ్యంలో 1915 డిసెంబర్లో నౌక మొత్తంగా మునిగిపోయింది. ఫాక్లాండ్ మారిటైమ్ హెరిటేజ్ ట్రస్ట్ ప్రస్తుతం ఈ నౌకను కనుక్కునేందుకు ప్రయత్నిస్తోంది. అండర్ వాటర్ రోబోట్స్ ద్వారా నౌకను అన్వేషించనుంది. 2022 ఫిబ్రవరిలో కేప్టౌన్నుంచి ఈ అన్వేషణ ప్రారంభం అవుతుంది. -
మునిగిపోతున్న నౌక నుంచి సిబ్బందిని కాపాడిన కోస్ట్ గార్డ్
-
Photo Feature: కోవిడ్ పిడుగు.. ఆగని ఆంక్షలు
కరోనా విలయానికి చేతివృతుల సడుగులు విరిగిపోయాయి. చేతివృతులపై ఆధారపడి జీవిస్తున్న వారందరిపై కోవిడ్ పిడుగులా పడింది. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు దేశమంతా కఠినంగా ఆంక్షలు అమలుచేస్తున్నారు. సముద్ర మార్గాల్లో ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గుజరాత్ నుంచి కొలంబో పోర్ట్‌కు వెళ్తున్న సరకు రవాణా నౌక ప్రమాదానికి గురైంది. -
సూయజ్ లో చిక్కుకున్న రాకాసి నౌకకు తప్పని కష్టాలు
సూయజ్ కాల్వలో ఒక వారం పాటు చిక్కుకున్నరాకాసి నౌక ‘ఎవర్ గివెన్’పై ఈజిప్ట్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. గత నెలలో సూయజ్ కాల్వలో నౌక చిక్కుకోవడంతో వాణిజ్య పరంగా భారీ నష్టం వచ్చిందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. దీంతో బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ పరిహారంపై ఈజిప్ట్ ప్రభుత్వ అధికారులతో ఎవర్ గివెన్ యాజమాన్యం చర్చిస్తోంది. ఈజిప్టు అధికారులు ఎవర్ గివెన్ నౌక సూయజ్ కాలువకు అడ్డంగా వారం పాటు నిలిచిపోవడంతో తమకు నష్టాలు వచ్చాయని, ఒక బిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించేవరకూ దానిని వదిలేది లేదని చెబుతున్నారు. భారీ కార్గో షిప్ ప్రస్తుతం సూయజ్ కెనాల్ హోల్డింగ్ సరస్సులో ఉంది. ఇక్కడ అధికారులు, ఓడ నిర్వాహకులు దర్యాప్తు కొనసాగుతున్నారని చెప్పారు. భారీ నౌక యజమానులతో ఆర్థిక పరిష్కారం కోసం అధికారులు చర్చలు జరుపుతున్నారని సూయజ్ కెనాల్ చీఫ్ గతంలో చెప్పారు. లెఫ్టినెంట్ జనరల్ ఒసామా రాబీ అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ.. రాకాసి నౌక ఎవర్ గివెన్ జపనీస్ యజమాని షోయి కిసెన్ కైషా లిమిటెడ్‌తో చర్చలు త్వరగా ముగుస్తాయని తాను ఆశిస్తున్నానని చెప్పారు. కాలువ నిర్వహణతో పరిష్కరించుకోవడం కంటే కేసును కోర్టు ముందు తీసుకురావడం సంస్థకు ఎక్కువ హానికరం అని ఆయన అభిప్రాయపడ్డారు. గత వారం సూయజ్ కెనాల్ అథారిటీ 1 బిలియన్ డాలర్లకు పైగా నష్టపరిహారాన్ని ఆశిస్తున్నట్లు కాలువ చీఫ్ చెప్పారు, నష్టాల సమస్య చట్టపరమైన వివాదంగా మారితే ఓడను కాలువ నుండి బయటకు వెళ్ళడానికి అనుమతించదని హెచ్చరించారు. పరిహారం చెల్లించడానికి ఎవరు బాధ్యత వహిస్తారో అతను అప్పుడు పేర్కొనలేదు. చదవండి: డేంజర్ జోన్లో వాట్సప్ యూజర్లు! -
ఓడా.. ఓడా.. ఎందుకాగావు?
సూయెజ్: ఈజిప్టులోని ప్రఖ్యాత సూయెజ్ కాలువలో ఎవర్‌గివెన్ నౌక అడ్డం తిరగడం, దీంతో ప్రపంచ వాణిజ్యానికి దాదాపు వారం పాటు విఘాతం కలగడంపై విచారణ షురూ అయింది. వారం ప్రయత్నాల అనంతరం నౌకా ప్రతిష్ఠంభన ముగిసి తిరిగి నౌకల పయనం ఆరంభమవడంతో ఇప్పుడందరి దృష్టి అసలేం జరిగిందనే అంశంపైకి మరలింది. ఈజిప్టు ప్రభుత్వం, బీమా సంస్థలు, నౌకా సంస్థలతో పాటు పలువురు ఈ అంశంపై వివరాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలవ గట్ల ఆధునీకరణ, నౌకల రిపేరు వ్యయాలు, నౌకల కార్గో షిప్మెంట్ ఇన్సూ్యరెన్సుల్లాంటి పలు అంశాలు చర్చకురానున్నాయి. ఎవెర్గివెన్ నౌక ఓనర్ జపనీస్ కంపెనీ కాగా, దాన్ని నిర్వహిస్తున్నది తైవాన్ కంపెనీ, బయలుదేరింది పనామా నుంచి కాగా ప్రస్తుతం ఈజిప్టులో ఉంది, నౌకా సిబ్బంది భారతీయులు. దీంతో ఈ నౌక విషయం పలు దేశాలతో ముడిపడిఉందని షిప్పింగ్ నిపుణుడు జాన్కోనార్డ్ అభిప్రాయపడ్డారు. రోజుల తరబడి చిక్కుకుపోవడంతో నౌకకు భారీగానే డ్యామేజి జరిగి ఉంటుందంటున్నారు. సమగ్ర విచారణ కావాలి ప్రతిష్ఠంభనపై జరిగే విచారణలో పాల్గొంటామని నౌక సొంతదారైన జపాన్ కంపెనీ షోయి కిసెన్ కైషా తెలిపింది. అయితే విచారణ సమయంలో ఏ విషయాలు బహిర్గతం చేయరాదంటూ ఈ విషయంపై బహిరంగ ప్రకటనకు నిరాకరించింది. నౌక ఎందుకు నిలిచిపోయింది, నౌకకు ఏమి అడ్డం తగిలింది, నౌకకు రిపేర్లు ఎక్కడ చేయిస్తారు, ప్రమాద సమయంలో నౌకా వేగం ఎంత తదితర అంశాలనేవీ చెప్పలేమని పేర్కొంది. మరోవైపు నౌక కారణంగా జరిగిన రోజూవారీ నావిక నష్టాలు(పర్డే మారిటైమ్ లాస్) బిలియన్ డాలర్లలో ఉంటాయని, ఇవన్నీ క్రమంగా దావాల రూపంలో బయటకు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. నౌకకు 300 కోట్ల డాలర్ల మేర బీమా ఉంది, కానీ ఈ బీమా సంస్థలేవీ బడా బీమా సంస్థలు కావు. ప్రస్తుతానికి నౌకా చిక్కుదలను విడిపించేందుకు అయిన ఖర్చులను కెనాల్ అథార్టీకి ఎవెర్ గివెన్ ఓనర్ చెల్లిస్తుందని అంతర్జాతీయ లీగల్ సంస్థ క్లైడ్ అండ్ కో తెలిపింది. నౌకపై కెనాల్ అథార్టీ పెనాల్టీ విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరపాలని కంపెనీ కోరుతోంది. కెనాల్‌లోని నౌకా ట్రాఫిక్ క్లియరయ్యేందుకు మరో పదిరోజులు పట్టవచ్చని అంచనా. నౌక అడ్డం తిరగడంతో పలు నౌకలు సూయజ్ కెనాల్ మార్గం బదులు కేప్ ఆఫ్ గుడ్‌హోప్ మీదుగా ప్రయాణం చేయాల్సి వచ్చింది. చదవండి: ‘ఎవర్ గివెన్’ ఎట్టకేలకు కదిలింది -
‘ఎవర్ గివెన్’ ఎట్టకేలకు కదిలింది
సూయెజ్(ఈజిప్ట్): సూయెజ్ కాలువలో కూరుకుపోయిన అత్యంత భారీ కంటెయినర్ ఓడ ‘ఎవర్ గివెన్’ ఎట్టకేలకు కదిలింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు వారం క్రితం ఈ ఓడ.. అంతర్జాతీయ సరుకు రవాణాలో కీలకమైన సూయెజ్ కాలువలో అడ్డం తిరిగి చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దాంతో సూయెజ్ కాలువలో సరుకు రవాణా ఒక్కసారిగా ఆగిపోయింది. వారం రోజులుగా అంతర్జాతీయ సరుకు రవాణా నిలిచిపోయి, వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఆ భారీ రవాణా నౌకను కదిలించేందుకు అంతర్జాతీయ నిపుణులు గత వారం రోజులుగా చేస్తున్న కృషి సోమవారానికి ఫలించింది. వాతావరణ పరిస్థితులు, పోటెత్తిన అలలు కొంతవరకు వారికి సహకరించాయి. కూరుకుపోయిన నౌక భాగాన్ని కదిలించేందుకు ఒకవైపు డ్రెడ్జింగ్ చేస్తూ, మరోవైపు 10 టగ్ బోట్లతో వెనక్కు లాగుతూ నిపుణులు ప్రయత్నించారు. అలాగే, నౌక చుట్టూ 18 మీటర్ల లోతు వరకు 27 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించారు. అనంతరం, కెనాల్ ఉత్తర, దక్షిణ తీరాలకు మధ్యనున్న వెడల్పైన ‘గ్రేట్ బిట్టర్ లేక్’ వద్దకు 2.2 లక్షల టన్నుల బరువైన ఆ నౌకను తీసుకు రాగలిగారు. అక్కడ ఆ నౌకను క్షుణ్నంగా పరిశీలిస్తారు. నౌక సాంకేతిక సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. నౌక కదులుతున్న దృశ్యాలను ఉపగ్రహ ఛాయాచిత్రాలతో ‘మెరైన్‌ట్రాఫిక్.కామ్’ వెబ్సైట్లో పొందుపర్చారు. ఈ విధానం సఫలం కానట్లైతే, నౌకలోని దాదాపు 20 వేల కంటెయినర్లను వేరే షిప్‌లోకి మార్చి, అనంతరం, బరువు తగ్గిన ఈ నౌకను కదిలించాల్సి వచ్చేది. ఇసుక, బురదలో కూరుకుపోయిన ‘ఎవర్ గివెన్’ నౌకను తిరిగి కదిలించి, ప్రధాన మార్గంలోకి తీసుకువచ్చే బాధ్యతను ‘బొస్కాలిస్’ అనే నౌకా నిర్వహణ, మరమ్మత్తుల సంస్థకు అప్పగించారు. ఆ పని పూర్తికాగానే ‘మా పని పూర్తి చేశాం. సూయెజ్ కెనాల్ అథారిటీస్‌తో కలిసి మా నిపుణులు ఎవర్‌గివెన్‌ను జలాల్లోకి తీసుకురాగలిగారు. ఈ కాలువ ద్వారా రవాణా మళ్లీ ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమమయింది’ అని ఆ సంస్థ సీఈఓ పీటర్ ప్రకటించారు. కాలువ మార్గానికి అడ్డంగా గత మంగళవారం జపాన్‌కు చెందిన సరకు రవాణా నౌక ‘ఎవర్ గివెన్’ చిక్కుకుపోవడంతో వారం రోజులుగా అంతర్జాతీయ రవాణా నిలిచింది. దాంతో రోజుకు దాదాపు 900 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. సూయెజ్ కాలువ మార్గంలో వారం రోజుల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడిన నేపథ్యంలో.. ఎవర్ గివెన్ నౌకను కదిల్చినప్పటికీ.. ఈ కాలువ గుండా సాధారణ స్థాయిలో నౌకల రవాణా జరిగేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఇప్పటికే దాదాపు 367 నౌకలు ఇరువైపులా నిలిచిపోయాయి. ఇవన్నీ క్లియర్ అయ్యేందుకు 10 రోజులు పడుతుందని రిఫినిటివ్ అనే సంస్థ అంచనా వేసింది. పలు నౌకలు ప్రత్యామ్నాయ, సుదూర మార్గమైన ‘కేప్ ఆఫ్ గుడ్‌హోప్’ ద్వారా వెళ్తున్నాయి. అంతర్జాతీయ సరకురవాణా వాణిజ్యంలో 10% సూయెజ్ కాలువ ద్వారా జరుగుతుంది. క్రూడాయిల్ రవాణాలో ఈ మార్గం వాటా దాదాపు 7%. గత సంవత్సరం ఈ మార్గం గుండా 19 వేలకు పైగా నౌకలు వెళ్లాయి. -
కదిలిన ఓడ.. దృశ్యాలు వైరల్
సూయజ్ కాలువలో ఇరుక్కుపోయిన ఎవర్ గ్రీన్ భారీ ఓడ ఎట్టకేలకు కదిలింది. ఆ ఓడ కదలడంతో ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇక వాణిజ్య ఓడలు రాకపోకలు సాగించేందుకు మార్గం సుగమమైంది. దాదాపు వారం పాటు సముద్రంలో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ క్లియర్ కానుంది. ఓడ కదులుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మధ్యదరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం మధ్య ఉన్న ఈ కాలువలో పెద్ద ఎత్తున ఓడలు ప్రయాణిస్తుంటాయి. వాణిజ్య ఓడల ప్రయాణం కోసం ఈ కాలువ నిర్మించారు. కాలువలో చిక్కుకున్న భారీ నౌకతో రోజుకు రూ.72 వేల కోట్ల చొప్పున వారం రోజులుగా నష్టం ఏర్పడింది. దీంతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ అతలాకుతలమైంది. ప్రపంచంలో పదోవంతు వ్యాపారం జరిగే సూయజ్ కాలువలో ఇరుక్కున్న ఈ భారీ నౌక ఎట్టకేలకు కదిలింది. ఈ ఓడను కదిలించడంలో భారతదేశానికి చెందిన నౌక నిపుణులు కూడా వెళ్లారని తెలుస్తోంది. ఈ నౌకను కదిలించేందుకు పలు దేశాలు కూడా ముందుకు వచ్చి చర్యలు తీసుకున్నాయి. సమష్టి కృషితో ఎట్టకేలకు ఎవర్ గ్రీన్ ఓడను కదిలించారు. ఆ ఓడ నీటిలోకి చేరడంతో అక్కడి శ్రామికులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సూయజ్ కెనాల్ అథారిటీ చైర్మన్ ఒసామా రాబీ తెలిపారు. మధ్యదరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం మధ్య ఈ సూయజ్ కాలువ ఉంది. ఈ పరిణామంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. 🎥: The #EVERGIVEN vessel is sailing North in the #SuezCanel. #Suez #SuezUnblocked #SuezBLOCKED #Evergreen pic.twitter.com/jm3AgOgAJZ — Mohammed Soliman (@ThisIsSoliman) March 29, 2021 🌇 #مشاريع_مصر🇪🇬| The Suez Canal Authority (SCA) announced that Ever Given container ship is currently sailing north on its way to the Bitter Lakes in the canal.#Egypt #Suez #SuezCanal #EVERGIVEN #Evergreen #قناة_السويس #السفينة_الجائحة pic.twitter.com/1flUiNliFv — مشاريع مصر Egypt (@EgyProjects) March 29, 2021 -
రోజుకు 72వేల కోట్లు నష్టం : తాజా శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ : సూయజ్ కెనాల్లో చిక్కుకున్న భారీ నౌక ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రోజుకు 72వేల కోట్ల రూపాయల చొప్పున గత వారం రోజులుగా సంభవించిన నష్టం ప్రపంచ ఆర్థికవ్యవస్థను అతలాకుతలం చేసింది. ప్రపంచంలో పదోవంతు వ్యాపారం జరిగే సూయజ్ కెనాల్లో ఇరుక్కున్న ఈ భారీనౌకను దారిలోకి తీసుకొచ్చేందుకు మల్లగుల్లాలు పడుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఒక గుడ్‌న్యూస్ ఊరటనిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పెను సవాల్‌గా భారీ కంటైనర్ షిప్ ఇపుడు పాక్షికంగా ముందుకు కదిలింది. తాజా పరిణామంతో ఈ ప్రతిష్టంభనకు త్వరలోనే తెరపడనుందనే ఆశలు భారీగా వ్యాపించాయి. షిప్పింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ మారిటైమ్ సర్వీసెస్ సంస్థ ఇంచ్‌కేప్ ఈ వార్తను ధృవీకరించింది. ఈ మేరకు ‘ఎవర్ గివెన్’ నౌక కదిలిందంటూ సోమవారం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. అటు "ఇది శుభవార్త" అని సూయజ్ కెనాల్ అథారిటీ చైర్మన్ ఒసామా రాబీ మీడియాకు చెప్పారు. ఇంకా పూర్తి కాలేదు, కానీ కొంచెం కదిలిందని వెల్లడించారు. కానీ 400కి పైగా నౌకల ప్రతిష్టంభనకు ముగింపు ఎపుడనేదిమాత్రం స్పష్టం చేయలేదు. షిప్-ట్రాకింగ్ సిస్టం వెసెల్ ఫైండర్ వెబ్సైట్లో ఎవర్ గివెన్ స్టేటస్‌ను అండర్వేగా మార్చుకుందని, తద్వారా జలమార్గం త్వరలో తిరిగి తెరుచుకోనుందనే ఆశలు పెంచుతోందంటూ ఈజిప్ట్ టుడే మ్యాగజీన్ ట్వీట్ చేసింది. కాగా ఈ షిప్‌ను ముందుకు కదిలించే ప్రయత్నాలు నిలిపివేశామని సూయజ్ కెనాల్ అథారిటీ (ఎస్‌సిఎ) ఈ ప్రయత్నాన్ని వాయిదా వేశామని ఆదివారం ప్రకటించారు. తగినంత టగ్ శక్తి అమలయ్యే వరకు తదుపరి రిఫ్లోటింగ్ ప్రయత్నాన్ని సోమవారం సాయంత్రానికి వాయిదా వేయాలని నిర్ణయించింది. రాబోయే 24-48 గంటల్లో ఓడను తరలించే అవకాశం ముందని కూడా షిప్పింగ్ డేటా, న్యూస్ కంపెనీ లాయిడ్స్ లిస్ట్ ఎడిటర్ రిచర్డ్ మీడే వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో తాజా వార్తలు భారీ ఊరటనిస్తున్నాయి. అటు వేల కిలోమీటర్ల ఇసుకలో ఆఫ్రికా నుంచి సినాయ్ పెనిన్సులా మధ్యలో ఉన్న ఈ కెనాల్లో చిక్కుకుపోయిన ఈషిప్ను ఎవర్ గ్రీన్ అనే పనామా షిప్పింగ్‌కి చెందిన నౌకని కదల్చలేని పరిస్థితిలో ఇక చేసేదిలేక డ్రెడ్జింగ్‌కూడా సిద్ధమవుతున్నట్లు ఒసామా రాబేయ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ షిప్‌ను విడిపించేందుకు మరిన్ని టగ్బోట్లు అవసరమని ఈజిప్టు అధికారులు ఆదివారం నిర్ణయించారు. సుమారు 20వేల కంటైనర్లను తొలగించడానికి సన్నాహాలు ప్రారంభించారు. మరోవైపు రష్యా ఇప్పటికే సహాయాన్నిఅందించగా, అమెరికాతో సహా ఇతర దేశాలు కూడా ముందు కొస్తున్నాయి. ఈజిప్ట్ ప్రభుత్వం కోరితే సాయం చేయడానికి తాము సిద్దమంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. (సూయజ్ కెనాల్లో అడ్డం తిరిగిన భారీ నౌక.. గంటకు 3వేల కోట్ల నష్టం) #BREAKING: watch video of the Ever Given, which was previously clogging the Suez Canal and has now been refloated. Good news in #Egypt. pic.twitter.com/6HbkeBpA40 — Steve Hanke (@steve_hanke) March 29, 2021 #BREAKING | Ship-tracking service VesselFinder has changed Ever Given’s status to under way on its website. raising hopes the busy waterway will soon be reopened.#Egypt #Suez #SuezCanal #EVERGIVEN #Evergreen #BreakingNews|#قناة_السويس #السفينة_الجائحة #عاجل pic.twitter.com/lz5EuNM5Ty — Egypt Today Magazine (@EgyptTodayMag) March 29, 2021 -
రోజుకి వెయ్యి కోట్ల డాలర్ల నష్టం
ఇస్మాలియా(ఈజిప్ట్): అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కీలక పాత్ర పోషించే ఈజిప్టులోని సూయజ్ కాలువలో అత్యంత భారీ సరకురవాణా నౌక చిక్కుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 180కిపైగా చమురు, సరకు రవాణా నౌకలు ఎటూ వెళ్లలేక ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో రోజుకి దాదాపుగా వెయ్యి కోట్ల డాలర్లు నష్టం వస్తున్నట్టుగా అంచనా. ఆసియా, యూరప్ దేశాల మధ్య సరుకు రవాణా చేసే పనామాకు చెందిన ఎవర్ గివెన్ అనే భారీ నౌక సూయజ్ కాలువ మార్గంలో అడ్డంగా ఇరుక్కుంది. 2 లక్షల మెట్రిక్ టన్నుల బరువు ఉండే ఈ నౌకని ముందుకి కదల్చడం సాంకేతిక నిపుణులకు సవాల్‌గా మారింది. కాగా, ఈ నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారని, వీరంతా భారతీయులేనని నౌక యజమాని చెప్పారు. నౌక ఎలా చిక్కుకుంది ? సూయజ్ కాలువ మానవ నిర్మితం కావడంతో అక్కడక్కడా మార్గాలు చాలా ఇరుగ్గా ఉంటాయి. చైనా నుంచి నెదర్లాండ్స్‌కు వెళుతున్న ఈ భారీ నౌక మంగళవారం ఇరుకు మార్గం దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రాంతంలో తుపాను వాతావరణం నెలకొని ఉంది. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఆ రాకాసి గాలుల ధాటికి తీర ప్రాంతంలో ఇసుక కాల్వలో చేరి మేటలు వేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ముందున్న మార్గం కనిపించకపోవడంతో సిబ్బంది నౌకపై నియంత్రణ కోల్పోయారు. దీంతో ఆ నౌక ఇసుక మేటల్లో అడ్డంగా కూరుకుపోయింది. ఎంత భారీ నౌక ?..: ఈ నౌక ఈఫిల్ టవర్ కంటే పొడవైనది. మూడు ఫుట్‌బాల్ గ్రౌండ్ల కంటే పెద్దది. ఈ నౌకలో మొత్తం పన్నెండు అంతస్తులు ఉన్నాయి. ఈ నౌక ఇంచుమించుగా 1300 అడుగుల పొడవు, 193 అడుగుల వెడల్పు ఉంటుంది. నౌకని బయటపడేయడం ఎలా ? నౌకను మళ్లీ కదల్చడం అంత సులభంగా జరిగేది కాదని నావికారంగ నిపుణులు చెబుతున్నారు. నౌక చుట్టూ పేరుకుపోయిన ఇసుక బురదను తొలగించడానికి డ్రెడ్జింగ్ పరికరాలతో గత రెండు రోజులుగా యత్నిస్తున్నారు. నౌక అడుగున ఉన్న బురద వదులైతే నౌకని నిలువుగా తిప్పడానికి కుదురుతుందని ఆ నౌక మేనేజర్ బెర్న్‌హర్డ్ చెబుతున్నారు. అయితే దీనికి ఎంత సమయం పడుతుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే నౌకని ముందుకు కదలేలా చేయవచ్చునని, లేదంటే వారాలైన పట్టవచ్చునని ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొంటున్న డచ్ కంపెనీ బోస్కలిస్ సీఈవో పీటర్ బెర్డోవ్స్కి తెలిపారు. కాలువలో భారీగా కెరటాలు వస్తే నౌక ముందుకు కదిలే అవకాశం ఉందని, ఆ స్థాయిలో కెరటాలు రావాలంటే ఆది, సోమవారాల వరకు వేచి చూడాలని సాల్వేజ్ మాస్టర్ నిక్ సోలెన్ చెప్పారు. ఎందుకింత ఆందోళన ? 120 మైళ్లున్న సూయజ్ కాలువను 1869లో నిర్మించారు. ఉత్తరాన మధ్యధరా సముద్రాన్ని, దక్షిణాన ఉన్న ఎర్ర సముద్రాన్ని ఇది కలుపుతుంది. ఆసియా, యూరప్ దేశాల మధ్య సరకు రవాణా జరగాలన్నా, అరబ్ దేశాల నుంచి చమురు యూరప్ దేశాలకు , అక్కడ్నుంచి అమెరికాకు వెళ్లాలంటే ఈ కాలువే ఆధారం. అంతర్జాతీయ వాణిజ్యంలో 12% ఈ కాలువ ద్వారా జరుగుతుంది. ప్రపంచంలోని వాణిజ్య నౌకల్లో 30% ఈ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి. కరోనా సంక్షోభం ప్రపంచ దేశాలను కుదిపేసినప్పటికీ 2020లో 19వేల నౌకలు ఈ మార్గం వెంబడి ప్రయాణించాయి. అంటే సగటున రోజుకి 52 నౌకలు రాకపోకలు సాగించాయి. 1.17 బిలియన్ టన్నుల సరకు రవాణా జరిగింది. ఇప్పుడు భారీ నౌక కాలువలో అడ్డంగా ఇరుక్కుపోవడంతో కాల్వకి రెండు వైపుల నుంచి రాకపోకలు నిలిచిపోయినట్టుగా ఈజిప్టు అధికారులు వెల్లడించారు. రవాణా స్తంభించడంతో యూరప్ దేశాల్లో వాణిజ్యంపై ప్రభావం పడింది. చమురు ధరలు భగ్గుమన్నాయి. బారెల్‌కు 5శాతం పెరిగిపోయాయి. కాలువ మార్గంలో అడ్డంగానిలిచిన ఎవర్ గివెన్ -
‘ఎవర్ గివెన్’ చెప్పే గుణపాఠం
చరిత్రలో ఎన్నో ఉత్కంఠభరిత ఘట్టాలకు మౌన సాక్షిగా వున్న సూయిజ్ కెనాల్ మరోసారి వార్తల్లో కెక్కింది. మంగళవారం వేకువజామున హఠాత్తుగా విరుచుకుపడిన ఇసుక తుపానులో సరుకులతో వెళ్తున్న భారీ నౌక ‘ఎవర్ గివెన్’ చిక్కుకుంది. గత రెండురోజులుగా ఆ నౌక అంగుళం కూడా అటూ ఇటూ కదులుతున్న జాడ లేదు. పర్యవసానంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరువంటి మహా నగరాల్లో మనం తరచుగా చూసే నరకప్రాయమైన ట్రాఫిక్ జామ్‌లను తలదన్నే రీతిలో ఇప్పుడు సూయిజ్ కెనాల్ వుంది. ‘ఎవర్ గివెన్’ మొరాయించిన సమయానికి కెనాల్లో ప్రవేశించివున్న దాదాపు 200 నౌకలు చిక్కుకుపోయాయి. ఎర్ర సముద్రాన్నీ, మధ్యధరా సముద్రాన్ని అనుసంధానించి తూర్పు, పడమరలను ఏకం చేసి, ఖండాంతర వాణిజ్యంతో ఎవరూ అందుకోలేనంత ఎత్తులో వుండాలని కలగని 1859లో ఈ కాలువ నిర్మాణానికి శ్రీకారంచుట్టారు. వాస్తవానికి ఇది అప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచన కాదు. ప్రాచీన ఈజిప్టు రాచరిక వ్యవస్థలు క్రీస్తుపూర్వమే దీన్ని కలగన్నాయి. నెపోలియన్ సైతం ఈ కెనాల్ నిర్మిస్తే బ్రిటన్‌ని దారికి తేవొచ్చని, దానిపై పైచేయి సాధించవచ్చని ఆలోచించాడు. కానీ చివరకు ఫ్రాన్స్ ఏలుబడిలోని ఈజిప్టుకే కాలం కలిసొచ్చింది. ఒక ఫ్రాన్స్ దౌత్యవేత్త చొరవతో ఏర్పాటైన కంపెనీ 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన దాదాపు 194 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువను నిర్మించింది. దీనివల్ల కలిగే లాభాన్ని గుర్తించి బ్రిటన్ ఇందులో 40 శాతం వాటాను పోరుపెట్టి సాధించుకుంది. ప్రపంచంలో ఇంకా పనామా కెనాల్, వోల్గా డాన్ కెనాల్, గ్రాండ్ కెనాల్ వంటివి వున్నాయి. కానీ సూయిజ్ ప్రధాన సముద్ర మార్గాలను అనుసంధానించే మెరుగైన కెనాల్. పర్యావరణవేత్తలు కావొచ్చు, నౌకాయాన రంగ నిపుణులు కావొచ్చు... రాకాసి నౌకా నిర్మాణం జోలికిపోవద్దని చాన్నాళ్లుగా వేడుకుంటున్నారు. అనుకోని ప్రమాదాలు ఎదురైతే భారీ నౌకలతో చేటు తప్పదని ప్రాణ నష్టంతోపాటు సముద్ర జలాలు కాలుష్యమయమై పర్యావరణానికి హాని కలుగుతుందని చెబుతున్నారు. కానీ పెద్ద మొత్తంలో సరుకు పంపిణీ చేయటానికి, భారీగా ఆదాయం రాబట్టడానికి భారీ నౌకలే మేలని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే వారి హెచ్చ రికలను ఎవరూ పట్టించుకుంటున్న దాఖలా లేదు. ఇప్పుడు ‘ఎవర్ గివెన్’ అడ్డం తిరిగిన వైనం వారి హితవచనాలను మరోసారి గుర్తుకుతెస్తోంది. 2,20,000 టన్నుల సరుకును మోసుకుపోగల సామర్థ్యం దానికుంది. అయితే ఆ నౌక పూర్తిగా కుంగిపోయే స్థితి ఏర్పడకపోవటం ఒక రకంగా అదృష్టమే. ప్రపంచ వాణిజ్యం గత రెండున్నర దశాబ్దాల్లో వందల రెట్లు విస్తరించింది. ఒకప్పుడు ఆహారం, సరుకులు, చమురు, ఖనిజాలు వంటివే ప్రధానంగా రవాణా కాగా, ఇంటర్నెట్ అందు బాటులోకి రావటంతో విశ్వవ్యాప్త వస్తు సేవలు విపరీతంగా పెరిగాయి. విమానయానం ఎంత వేగంతో కూడినదైనా, విమానాల ద్వారా సరుకు రవాణా ఎంతగా విస్తరించినా వాణిజ్యంలో ఈనాటికీ 90 శాతం వాటా సముద్ర మార్గాలదే. ఇందులో సూయిజ్ కెనాల్ ద్వారా సాగే వాణిజ్యం దాదాపు 15 శాతం. పశ్చిమాసియా నుంచి యూరప్, అమెరికాలకు... రష్యా నుంచి ఆసియా దేశాలకు ముడి చమురు రవాణా సాగుతున్నదీ ఇటునుంచే. అందుకే ఈ దిగ్బంధం సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కాకపోతే ప్రపంచవ్యాప్తంగా సరుకు పంపిణీలో అస్తవ్యస్థ పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళన వుంది. ఆసియా, ఆఫ్రికా ఖండాలను విడదీసే ఈ కెనాల్... యూరప్‌కు రాకపోకలు సాగించే నౌకలు దక్షిణ అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తోంది. అందువల్ల దాదాపు ఏడువేల కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. వారం రోజుల సమయాన్ని ఆదా చేస్తోంది. రోజూ సగటున 50 నౌకలకు వరకూ ప్రయాణించే సూయిజ్ కాల్వ ఈజిప్టు ఖజానాకు డాలర్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఆ దేశం ఏటా దాదాపు 1,500 కోట్ల డాలర్ల ఆదాయాన్ని పొందుతోంది. సూయిజ్ కెనాల్‌ను మరింత విస్తరించటానికి ఆ దేశం ఇప్పటికే పనులు ప్రారంభించింది. అదంతా మరో రెండేళ్లలో పూర్తయితే ఈజిప్టు ఆదాయం మూడింతలు పెరుగుతుంది. అంతర్జాతీయ నావికా సంస్థ(ఐఎంఓ) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం నౌకాయానం వల్ల ఏటా వాతావరణంలోకి వేయి మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతోంది. ఇది ప్రపంచ వార్షిక ఉద్గారాల్లో 3.1 శాతం. 2050నాటికి ఉద్గారాలను కనీసం 50 శాతం తగ్గించుకోవాలని ఐఎంఓ కోరుతోంది. భారీ నౌకల వల్ల పొంచివుండే ఇతరత్రా ప్రమాదాల సంగతలావుంచి వాటి ఇంధన సామర్థ్యం తక్కువని ఐఎంఓ చెబుతోంది. కనీసం కొత్త సాంకేతికతలను పెంచుకుని, మెరుగైన డిజైన్లతో నౌకల్ని నిర్మిస్తే, వాటి వేగాన్ని నియంత్రణలోవుంచితే కర్బన ఉద్గారాల బెడదను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నది దాని సూచన. నౌకల వేగాన్ని సగటున పదిశాతం తగ్గిస్తే కర్బన ఉద్గారాలను నియంత్రించటం వీలవుతుందని సూచిస్తోంది. నౌకల వేగంపై నిరంతరం నిఘా వుంచుతూ అవి ఎక్కడ సంచరిస్తున్నాయో, వాటి వేగం, దిశ ఎలావున్నాయో తెలుసుకునే సాంకే తికతలు అందుబాటులోకొచ్చాయి. వాటిని అమర్చుకోవటాన్ని తప్పనిసరి కూడా చేశారు. 150 ఏళ్లక్రితం అందుబాటులోకొచ్చి, ప్రపంచ వాణిజ్యంలో కీలకపాత్ర పోషించే సూయిజ్ కెనాల్లో చోటుచేసుకున్న తాజా ఉదంతం నౌకా యానంలో ఇమిడివుండే సమస్యలను మరోసారి అందరి దృష్టికీ తెచ్చింది. -
గాల్లో తేలుతున్న భారీ నౌకలు
ఇక్కడ నౌకలు గాల్లో ఎగురుతాయి. చిన్న చిన్నవే కాదు.. అత్యంత భారీ నౌకలు కూడా గాల్లో తేలుతూ ఉంటాయి. అలా తేలుతున్న నౌకలను కళ్లతో చూడటమే కాదు, ఫొటోలూ తీసుకోవచ్చు. ఇదేంటి అంటారా? అంతా మన వాతావరణంలో ఉండే కొన్ని ప్రత్యేకతలతో ఏర్పడే దృష్టి భ్రమ (ఇల్యూషన్). సింపుల్‌గా చెప్పాలంటే.. వేసవిలో కనిపించే ఎండమావుల లాంటి పరిస్థితి అనొచ్చు. సముద్రంలో దూరంగా ఉన్న నౌకలు గాల్లో తేలుతున్నట్టుగా కనిపించే ఈ దృష్టి భ్రమను ‘ఫటా మోర్గానా’ అంటారు. నౌకలేకాదు.. దూరంగా సముద్రం కూడా కొంత పైకి లేచినట్టుగా అనిపిస్తుంటుంది. పలుచోట్ల సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను బట్టి కాస్త అరుదుగా ఈ తరహా దృష్టి భ్రమ కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌లోని కార్న్‌వాల్, డెవన్, అబెర్డీన్‌షైర్ తీర ప్రాంతాల్లో ఇటీవల కొందరు ఇలా నౌకలు గాల్లో తేలుతున్నట్టు గా కనిపించడంతో ఆశ్చర్యపోయారు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారాయి. ఏమిటీ ఫటా మోర్గానా? సముద్ర తీర ప్రాంతాల్లో ఎండగా ఉన్నప్పుడు.. ఓ వైపు భూమి, మరోవైపు సముద్ర ఉపరితలం వేడెక్కుతాయి. వీటికి ఆనుకుని ఉన్న గాలి కూడా వేడెక్కుతుంది. ఇలా వేడెక్కిన గాలి తేలికగా మారి పైకి వెళుతూ.. చల్లటి గాలి కిందికి దిగుతుంది. దీనివల్ల కింద ఉన్న గాలి చల్లగా, ఆపై కొంత వేడిగా, ఇంకాపైన మరింత వేడిగా.. గాలి పొరలు పొరలుగా ఏర్పడుతుంది. ఈ పొరలు నీటిపై వేరుగా, భూమిపై వేరుగా ఉంటాయి. సముద్రంలో దూరంగా ఉన్న నౌకల నుంచి వచ్చే కాంతి.. ఇలా వేర్వేరుగా ఉన్న గాలి పొరల్లోంచి వెళుతున్నప్పుడు వంగి ప్రయాణిస్తుంది. చివరిగా మన కంటికి చేరే సమయానికి బాగా వంగి ఉంటుంది. కానీ మన కన్ను, మెదడు సాధారణంగా.. కాంతి సరళ రేఖా మార్గాన్ని(స్ట్రెయిట్ లైన్‌ను) పరిగణనలోకి తీసుకుంటాయి. ఆ స్ట్రెయిట్ లైన్లో నౌక ఉన్నట్టు గుర్తిస్తాయి. దీంతో నౌకలు సముద్రంపై గాల్లో ఎగురుతున్నట్టుగా కనిపిస్తాయి. దీనినే ‘ఫటా మోర్గానా’అంటారు. కొన్నిసార్లు భూమిపైన కూడా ఇలాంటివి కనిపిస్తుంటాయి. సాధారణంగా ఏదైనా వస్తువుపై పడిన కాంతి ప్రతిఫలించి.. నేరుగా సరళ రేఖా మార్గంలో ప్రయాణించి మన కంటిని చేరుతుంది. మన కళ్లు, మెదడు అదే స్ట్రెయిట్ లైన్‌ను పరిగణనలోకి తీసుకుని.. ఆ స్థానంలో సదరు వస్తువు ఉన్నట్టు గుర్తిస్తాయి. అయితే గాజు, నీళ్లు, గాలి వంటి వేర్వేరు వాటిల్లో కాంతి ప్రయాణిస్తున్నప్పుడు.. వాటి సాంద్రత, ఉష్ణోగ్రత వేరుగా ఉండటంతో వంగుతుంది. ఆ వస్తువులు భిన్నంగా కనిపిస్తాయి. ఉదాహరణకు గాజు గ్లాసులో నీళ్లు పోసి, ఏదైనా కర్ర, పెన్ను వంటివి పెడితే.. నీళ్లలోపల ఉన్న భాగం వంగి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇలాంటివి చాలా వరకు మన చుట్టూ కనిపిస్తూనే ఉంటాయి. బ్రిటన్‌లోని బోర్న్మౌత్ తీర ప్రాంతంలో గాల్లో తేలుతున్నట్టుగా కనిపించిన ‘ది ఆంథెం’నౌక ఇది. 347 మీటర్ల పొడవు, లక్షన్నర టన్నుల బరువున్న ఈ భారీ నౌకలో ఐదు వేల మందివరకు ప్రయాణించొచ్చు. బ్రిటన్‌లోని గిల్లాన్ ప్రాంతంలో గాల్లో తేలుతున్నట్టుగా కనిపించిన భారీ షిప్ ఇది. డేవిడ్ మోరిస్ అనే వ్యక్తి ఈ ఫొటో తీశారు. చదవండి: జూన్ 1 తర్వాత ఆ బంగారం అమ్మలేరు -
వైరల్: ఆకాశంలో ప్రయాణిస్తున్న ఓడ!
ఒట్టావా: కంటికి కనిపించేదంతా నిజం కాదు అంటే ఏంటో అనుకున్నాం కానీ, ఇలాంటి వార్తలను చూసినప్పుడు అది కొంత నిజమేననిపిస్తుంది. పై ఫొటోలో ఓడ సముద్రాన్ని వదిలి ఆకాశంలో ఎగురుతున్నట్లుగా కనిపిస్తుంది కదూ.. ఆ సముద్ర తీరానికి సమీపంలో ప్రయాణించిన కొలిన్ మెకల్లమ్ అనే వ్యక్తికి కూడా అలాగే అనిపించింది. కళ్లు రుద్దుకుని మరీ చూసినా ఓడ ఆకాశం దిగి నీళ్ల మీదకు రాలేదు. వార్నీ, ఇదేదో విచిత్రంగా ఉందేనని ఫొటో తీసి ఫేస్బుక్లో పెట్టాడు. ఇంకేముందీ, జనాలు దీన్ని ఒకటికి రెండుసార్లు చూస్తూ ఓడ గాల్లోకి ఎలా వెళ్లిందా? అని ఆలోచించి బుర్రలు బద్ధలు చేసుకుంటున్నారు. "నిజానికి సముద్రానికి ఐదు ఇంచుల పైన గాల్లో ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఓడ నీళ్ల మీదే ఉంది. కానీ అక్కడికి మబ్బులు అతి దగ్గరగా రావడం, దాని ప్రతిబింబం నీళ్ల మీద పడటంతో ఆ ప్రదేశం ఆకాశంలో కలిసిపోయినట్లు అనిపిస్తోంది. అది కదిలేకొద్దీ గాల్లో తేలినట్లు భ్రమ కలిగించింది" అని ఈ ఫొటోను పోస్ట్ చేసిన కొలిన్ మెకల్లమ్ అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఈ ఫొటో మాత్రం ప్రస్తుతం నెట్టింట సెన్సేషన్‌గా మారింది. చదవండి: ఇంటర్వ్యూలలో ఫెయిల్.. బాధతో 9 ప్లాస్టిక్ సర్జరీలు వైరల్: విమానంలో పిల్లి రచ్చ.. పైలట్‌పై దాడి -
14 గంటలు యముడితో పోరాడాడు!
అది పసిఫిక్ మహాసముద్రం. ఆ మహాసముద్రంలో మధ్యలో ఒంటిరిగా ఓ వ్యక్తి. తన ప్రాణాలు రక్షించుకోవడానికి సర్వ శక్తులూ ఒడ్డాడు. నీటిలో ఈదుతూ 14 గంటలు యముడితో పోరాడాడు. తుదకు తానే గెలిచాడు. తన కుటుంబంలో ఆనందం నింపాడు. ఈ సంఘటన ఎలా జరిగిందంటే.. సిల్వర్ సపోర్టర్ అనే ఓడలో విడామ్ పెరివెటిలోవ్ చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 16న ఆ ఓడ న్యూజిలాండ్‌లోని టౌరంగా పోర్టు నుంచి పిట్‌కెయిర్న్ దీవులకు సరుకులతో బయలుదేరింది. ఇంజిన్ రూంలో నైట్ డ్యూటీ విధులు ముగించుకున్న 52 ఏళ్ల విడామ్.. తెల్లవారుజామున తన కొడుకుతో ఫోన్లో మాట్లాడుతూ ఓడ డెక్ పైకి వచ్చాడు. నిద్రవస్తోందని కూడా కుమారుడికి చెప్పాడు. నిద్ర మత్తులో ఉన్న విడామ్ ఆ తర్వాత కొద్ది సేపటికే ఓడపై నుంచి సముద్రంలో పడిపోయాడు. ఇది గమనించని ఓడ సిబ్బంది ముందుకు వెళ్లిపోయారు. నీటిలో పడ్డ విడామ్ పైకి వచ్చి చూసే సరికి ఓడ దూరంగా వెళ్లిపోయింది. ఫిషింగ్ బెలూన్ ఆసరా.. లైఫ్ జాకెట్ లేదు. ఎటు చూసినా నీళ్లు. ఎటు ఈదాలో తెలియదు. నడి సంద్రంలో విడామ్ పరిస్థితి కడు దీనంగా తయారైంది. దూరంగా ఏదో నల్లగా కనబడితే ఆదేదో దీవి అనుకుని అటు ఈదడం మొదలు పెట్టాడు. చాలా సేపు ఈదిన తర్వాత దానికి దగ్గరా వచ్చాడు. అప్పడు తెలిసింది అది దీవి కాదు. చేపల వేటకు ఉపయోగించే రబ్బరు బెలూన్ అని. దాన్నే ఆసరా చేసుకున్నాడు. దాన్ని అంటిపెట్టుకుని తాను మునిగిపోకుండా చూసుకున్నాడు. తాను ఎలాగైనా బతకాలని అనుకుని ఆ బెలూన్తోనే పాటే కొంత సేపు తేలుతూ.. కొంత సేపు ఈదుతూ ఉండిపోయాడు. ఆరు గంటల తర్వాత.. విడామ్ ఓడలో లేని విషయాన్ని ఉదయం పది గంటల తర్వాత సిబ్బంది గుర్తించారు. తెల్లవారుజాము నాలుగు గంటల వరకూ విడామ్ షిప్‌లోనే ఉన్నట్లు నిర్దారించుకున్న సిబ్బంది.. ఎక్కడ పడిపోయి ఉంటాడో అనే అంచనా వేశారు. 400 నాటికల్ మైళ్ల దూరంలో అతను ఉండి ఉండవచ్చని నిర్దారణకు వచ్చారు. వెంటనే ఓడను వెనక్కు తిప్పారు. ఇంతలో సమీపంలోని ఆస్ట్రల్ దీవుల్లో ఉన్న ఫ్రెంచ్ వారికి సమాచారం ఇవ్వడంతో వారు కూడా విమానంలో వెతుకులాటకు బయలుదేరారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో తాము అనుకున్న ప్రాంతానికి షిప్ చేరింది. అప్పటికే సముద్రంలో విడామ్ అలసిపోయాడు. దూరం నుంచి ఓడ కనబడటంతో నీరసించి ఉన్నా.. చేతిని పైకి ఎత్తి పిలిచాడు. దానిని గుర్తించిన ఓడ సిబ్బంది.. విడామ్ వద్దకు చేరుకుని ఓడ పైకి అతన్ని తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేశారు. సుమారు 14 గంటల పోరాటం తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. అతని విల్ పవర్ చూసి ఓడ సిబ్బంది ఆశ్చర్యపోయారు. విడామ్కు జేజేలు పలికారు. నౌక సిబ్బందిని విడామ్ ఓ కోరిక కోరాడు. అదేంటంటే, ఆ బెలూన్ను సముద్రంలోనే వదిలేయమని.. ఎందుకంటే అది మరొకరి జీవితాన్ని రక్షిస్తుందనే ఉద్దేశంతో. ► సముద్రంలో ప్రమాదానికి గురైన తర్వాత ఎక్కువ రోజుల బ్రతికున్న వ్యక్తిగా జపాన్‌కు చెందిన కెప్టెన్ ఓగురి జుకుచి రికార్డు సాధించారు. 1813లో జపాన్ నుంచి కాలిఫోర్నియాకు బయలుదేరిన ఆయన ఓడ మధ్యలో మునిగిపోయింది. వాటి శకలాలపైనే ఆయన, మరో నావికుడు ఓటోకిచి 484 రోజులు బతికి ఉన్నారు. ► ఎల్సాల్విడార్కు చెందిన అల్వెరెంగా 2012 నవంబర్‌లో సముద్రంలో వేటకు వెళ్లిన బోటు ప్రమాదం బారిన పడింది. 2014 జనవరి వరకు అతను బతికుండి మార్షల్ ఐలాండ్ తీరానికి చేరుకున్నాడు. ► ఆరోగ్యవంతమైన మనిషి మంచి నీళ్లు తాగకుండా 3 నుంచి 4 రోజులు బతికుండే అవకాశం ఉంది. 5 డిగ్రీలు కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే నీటిలో మనిషి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం బతకడం కష్టం. -
బంగ్లాదేశ్ నౌక తిరిగి సముద్రంలోకి..
సాక్షి, విశాఖపట్నం: అలల ఉధృతికి పోర్టు నుంచి తెన్నేటి పార్కు ఒడ్డుకు కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్‌కి చెందిన ‘ఎంవీ–మా’ జనరల్ కార్గో నౌకను తిరిగి సముద్రంలోకి పంపించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన అధికారులు, సిబ్బంది ప్రస్తుతం నౌక ఉన్న స్థితిగతులను బుధవారం పరిశీలించారు. నౌక ఎంత మేరకు ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కింద భాగంలో రాళ్లు ఏ మేర ఉన్నాయి.. నౌకను సముద్రంలోకి పంపించే సమయంలో నౌకలోని భాగాలు దెబ్బతినే అవకాశం ఉందా వంటి అంశాల్ని పరిశీలించారు. ఎంవీ మా కార్గో షిప్ యాజమాన్యంతో పాటు షిప్ స్థానిక ఏజెంట్, హల్ అండ్ మెషినరీ క్లబ్, విశాఖపోర్టు ట్రస్టు, డీజీ షిప్పింగ్, ఇండియన్ కోస్ట్‌గార్డు, జిల్లా కలెక్టరేట్, స్థానిక, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ విభాగాలు ఈ ఆపరేషన్‌లో భాగస్వాములవుతున్నాయి. అంతర్జాతీయ నిబంధనల మేరకు నౌకను సముద్రంలోకి పంపించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఏర్పడే సమస్యలను పరిష్కరించేందుకు హల్ అండ్ మెషినరీ విభాగం సిద్ధంగా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఒడ్డు నుంచి తీస్తున్న సమయంలో నౌక నుంచి చమురు సముద్రంపై పడి తెట్టులా కాలుష్యం ఏర్పడే అవకాశం ఉంది. దీనికి తోడు ఈ సమయంలో వినియోగించే పరికరాలు, ఇతర సామాగ్రితో ఆ ప్రాంతమంతా వ్యర్థాలతో నిండిపోతుంది. కోస్ట్‌గార్డు భాగస్వామ్యంతో వీటన్నింటిని తొలిగించేందుకు విశాఖ పోర్టు ట్రస్టు అంగీకారం తెలిపింది. గురువారం లేదా శుక్రవారం ఆపరేషన్ ఎంవీ–మా కు ఉపక్రమించే అవకాశం ఉందని పోర్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కార్గోను చూసేందుకు క్యూ ఆరిలోవ(విశాఖ తూర్పు): తెన్నేటి పార్కు వద్ద తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన కార్గో నౌకను తిలకించడానికి నగర ప్రజలు తరలివస్తున్నారు. బుధవారం నౌక వద్దకు ఎవ్వరినీ పోలీసులు వెళ్లనీయకపోవడంతో.. దూరం నుంచి చూస్తూ సంతోషించారు. దీంతో జోడుగుళ్లపాలెం బీచ్ నుంచి తెన్నేటి పార్కు వరకు సందడి నెలకొంది. కరోనా కారణంగా బోసిపోయిన ఇక్కడ బీచ్ నౌక వల్ల మళ్లీ నిండుదనం సంతరించుకుంది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. సందర్శకులు ఎక్కువ సేపు గుమిగూడకుండా నియంత్రించారు. ఇదిలా ఉండగా ఉదయం నుంచి పలుమార్లు నేవీ అధికారులు ఇక్కడకు వచ్చి నౌక లోపల ఆయిల్ బయటకు తీసే మార్గం, సామగ్రిని ఏ విధంగా తీసుకురావాలనే అంశాలను పరిశీలించారు. -
వర్ష బీభత్సం: కొట్టుకొచ్చిన భారీ నౌక
సాక్షి, విశాఖటపట్నం : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ నగరం అతలాకుతలం అవుతోంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ తెన్నేటి పార్క్ తీరానికి ఓ భారీ నౌక కొట్టుకుని వచ్చింది. బంగ్లాదేశ్‌కు చెందిన మర్చంట్ వెసల్ నౌక భారీ ఈదురు గాలులకు కొట్టుకువచ్చింది. గాలితీవ్రత ఎక్కవగా వుండటంతో ప్రతికూల పరిస్ధితుల్లో ఒడ్డుకు చేరుకున్న 80 మీటర్ల పొడవాటి నౌక పార్క్ సమీపంలోని రాళ్లలో చిక్కుకుంది. అర్ధరాత్రి సమయంలో ఇసుక తిన్నుల మధ్య చిక్కుకోగా.. నౌకలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. యాంకర్లు రెండూ కోల్పోవడంతో ఏర్పడిన సమస్య తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న నేవీ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నౌకను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నౌకను చూసేందుకు స్ధానికులు పెద్ద ఎత్తున తీరానికి చేరుకుంటున్నారు. (భారీ వర్షాలు: తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం) (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
కోవిడ్ మృతులు 1,665
బీజింగ్/న్యూఢిల్లీ: ప్రాణాంతక ‘కోవిడ్–19’ విజృంభణ కొనసాగుతోంది. చైనాలో ఈ వైరస్ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 1,665కి చేరింది. ఈ మరణాల్లో అత్యధికం తొలుత ఈ వైరస్‌ను గుర్తించిన వుహాన్ నగరం ఉన్న హుబే ప్రావిన్స్‌లోనే చోటు చేసుకున్నాయి. శనివారం చనిపోయిన 142 మందిలో 139 మంది ఆ రాష్ట్రంలోనే మరణించారు. అలాగే, మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 68,500కు పెరగగా, వాటిలో 56,249 కేసులు హుబే ప్రావిన్స్‌లోనివే. వీటిలో శనివారం ఒక్కరోజే నిర్ధారించిన కేసుల సంఖ్య 1,843. అయితే, కొత్తగా వైరస్ సోకుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు దాదాపు 1700 మంది వైద్య సిబ్బందికి ఈ వైరస్ సోకగా ఆరుగురు చనిపోయారు. కరెన్సీ ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశమున్న నేపథ్యంలో.. నోట్లు, నాణేలను కొన్ని రోజుల పాటు వాడకుండా పక్కనబెట్టి, వాటిపై అతినీలలోహిత కిరణాలను ప్రసరింపచేసి, ఆ తరువాత మళ్లీ సర్క్యులేషన్లోకి పంపిస్తున్నారు. పాన్ తీరంలో నిలిపేసిన ‘డైమండ్ ప్రిన్సెస్’ నౌకలో కోవిడ్–19 సోకిన వారి సంఖ్య ఆదివారానికి 355కి పెరిగింది. అందులోభారత్ సహా 50 దేశాలకు చెందిన 3700 మంది ఉన్నారు. ఆ నౌకలో నుంచి తమ వారిని తీసుకువెళ్లేందుకు అమెరికా, కెనడా సహా పలు దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కోవిడ్–19పై పోరులో చైనాకు అన్ని రకాలుగా సహకరిస్తామని భారత్ మరోసారి చెప్పింది. భారత్ త్వరలో ఔషధాలను పంపించనుందని చైనాలో భారతీయ రాయబారి విక్రమ్ మిస్రీ తెలిపారు. -
కోవిడ్ మృతులు 1,500
బీజింగ్/టోక్యో/న్యూఢిల్లీ: చైనాలో ప్రమాదకర కోవిడ్–19 బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉన్న హుబే ప్రావిన్స్, తదితర ప్రాంతాల్లో ఒక్క రోజులోనే 121 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,500కు చేరుకుంది. అదేవిధంగా, చైనాలోని 31 ప్రావిన్స్‌ల్లో మరో 5,090 కేసులు కొత్తగా బయటపడగా వీటిలో 4,823 కేసులు వ్యాధి మూలాలు మొదట గుర్తించిన హుబే ప్రావిన్స్‌లోనివే కావడం గమనార్హం. దీంతో దేశం మొత్తమ్మీద బాధితుల సంఖ్య గురువారానికి 64,894కు చేరుకుంది. అలాగే, కోవిడ్ బాధితులకు వైద్య చికిత్సలు అందిస్తూ వైరస్ సోకిన 1,700 మంది ఆరోగ్య సిబ్బందిలో ఆరుగురు చనిపోయారని చైనా ప్రకటించింది. జపాన్ ఓడలో ముగ్గురు భారతీయులకు.. కోవిడ్–19 వైరస్ అనుమానంతో జపాన్ తీరంలో నిలిపేసిన ఓడలోని 3,711 మందిలో 218 కేసులను పాజిటివ్‌గా గుర్తించగా వీరిలో ముగ్గురు భారతీయులున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. డైమండ్ ప్రిన్సెస్ అనే ఈ ఓడలోని 138 భారతీయుల్లో 132 మంది సిబ్బంది కాగా, ఆరుగురు ప్రయాణికులున్నారు. దీంతోపాటు ఓడలోని కోవిడ్ నెగటివ్‌గా నిర్ధారించిన 11 మంది 80 ఏళ్లు పైబడిన వృద్ధులను జపాన్ అధికారులు శుక్రవారం బయటకు పంపించారు. టోక్యోకు చెందిన ఓ వృద్ధురాలు కోవిడ్‌తో మృతి చెందినట్లు జపాన్ తెలిపింది. భారత్‌లో పరిస్థితి అదుపులోనే.. దేశంలో కోవిడ్ (కరోనా) వ్యాప్తి నియంత్రణలోనే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ తెలిపారు. చైనాలోని వుహాన్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ముగ్గురు కేరళ విద్యార్థులకు వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని, వీరిలో ఒకరు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు. చైనా, హాంకాంగ్, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాల నుంచి వచ్చే వారికి దేశంలోని 21 ఎయిర్‌పోర్టుల వద్ద స్క్రీనింగ్ కొనసాగుతుండగా, ఈ జాబితాలో జపాన్, దక్షిణకొరియాలను కూడా చేర్చినట్లు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. -
కరోనా : నిర్బంధంలో 200 మంది భారతీయులు
టోక్యో/బీజింగ్/జెనీవా: కరోనా భయంతో జపాన్ ప్రభుత్వం యెకోహోమా తీరంలో నిలిపివేసిన నౌకలోని భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ‘డైమండ్ ప్రిన్సెస్’ అనే ఆ నౌకలో నిర్బంధంలో ఉన్న బినయ్ కుమార్ సర్కార్ అనే భారతీయుడు తమను కాపాడాలంటూ సోషల్ మీడియా ద్వారా వేడుకున్నారు. 200 మంది భారతీయులతో పాటు నౌకలో అంతా కలిపి 3,700 మంది ఉన్నారనీ, వీరిలో 62 మందికి కరోనా సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ కాగా తమ నౌకను అధికారులు దిగ్బంధించినట్లు బినయ్ పేర్కొన్నాడు. మరింత మందికి వైరస్ సోకే ప్రమాదం ఉండడంతో తమను కాపాడాలంటూ బినయ్ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఓ వీడియోను ఫేస్బుక్లో పెట్టారు. ‘మేం కోరుకుంటోంది ఒక్కటే, దయచేసి మమ్మల్ని ఈ నౌక నుంచీ, ఈ నిర్బంధం నుంచీ వేరు చేసి, ప్రత్యేకంగా ఉంచండి. మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. మాకు భయంగా ఉంది. దయచేసి సాయం చేయండి’అని అందులో ఉంది. వైరస్ ఇంకా మరింత మందికి వ్యాపించకుండా ఉంటే, ఫిబ్రవరి 19 వరకు వీరందరినీ వేరుగా ఉంచాల్సి ఉంటుందని నౌకలోని జపాన్ అధికారులు శుక్రవారం చెప్పారు. ‘జపాన్ కాలమానం ప్రకారం ఫిబ్రవరి 6వ తేదీ రాత్రి 7 గంటల వరకు భారతీయులెవ్వరికీ కరోనా సోకలేదు. ప్రస్తుతం నౌకలోని చివరి బృందానికి పరీక్షలు నిర్వహిస్తున్నాం’అని జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. 723కు చేరిన కరోనా మృతులు చైనాలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 723కు చేరింది. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన కేసులు 34,598కు చేరాయి. తాజాగా, 1,280 మంది వ్యాధిగ్రస్తుల పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు చైనా నేషనల్ హెల్త్క మిషన్ ప్రకటించింది. చైనాలో కరోనా వైరస్ బారిన పడి అమెరికాకు చెందిన ఓ మహిళ, జపనీయుడొకరు మృతి చెందారు. కరోనాతో చైనాలో విదేశీయులు మరణించిన తొలి ఘటన ఇదే. కరోనాకు శాశ్వత పేరుపై తర్జనభర్జన ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త రకం వైరస్ కరోనాకు శాశ్వతంగా ఏం పేరు పెట్టాలనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తర్జనభర్జన పడుతోంది. కరోనా వైరస్ ప్రారంభమైన వుహాన్ నగరం పేరు గానీ, అటు చైనా ప్రజల మనోభావాలు గానీ దెబ్బతినకుండా ఉండేలా పేరు పెట్టాలని జాగ్రత్త వహిస్తోంది. ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పేర్కొన్న ఈ వ్యాధికి ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ అధికారికంగా తాత్కాలిక పేరు ‘2019–ఎన్కోవ్ అక్యూట్ రెస్పిరేటరీ డిసీజ్’అని పెట్టింది. ‘ఎన్కోవ్’అంటే ‘నావల్ కరోనావైరస్’అని అర్థం అని తెలిపింది. ‘పేరుతో ప్రదేశానికి ఎలాంటి సంబంధం లేకుండా ఉండేలా ఓ పేరును పెట్టడం చాలా ముఖ్యమని మేం భావించాం’అని డబ్ల్యూహెచ్‌వో అత్యవసర వ్యాధుల విభాగం అధిపతి మరియా తెలిపారు. శాశ్వత పేరు పెట్టడంపై నిర్ణయం కొద్దిరోజుల్లోనే తీసుకుంటామని, డబ్ల్యూహెచ్‌వోతో పాటు ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరస్ (ఐసీటీవీ) కరోనా నిపుణుల నిర్ణయం మేరకు ఉంటుందని ఆమె వెల్లడించారు. ఎయిర్ హగ్ ! కరోనా బాధితులకు సేవలు అందించేందుకు ఆస్పత్రిలో చేరిన నర్స్ లియు హైయాన్ తన కూతురు చెంగ్‌ను 10 రోజుల నుంచి కలవలేదు. శనివారం చెంగ్ ఆస్పత్రి వద్దకు వచ్చింది. అయితే కరోనా కారణంగా ఇద్దరు కలవడం కుదరకపోవడంతో దూరం నుంచే కౌగిలింత ఇచ్చినట్లుగా ఏడుస్తూ చేతులు చాచి భావోద్వేగానికి గురయ్యారు. ‘మమ్మీ వైరస్‌తో పోరాడుతోంది.. తగ్గగానే ఇంటికి వస్తుంది’ అని చెబుతూ.. చక్కగా, మంచిగా ఉండాలని కుమార్తెకు సూచించారు. కరోనా కారణంగా తల్లీకూతుళ్లు కన్నీళ్ల నడుమ జరిగిన ఈ ఎయిర్ హగ్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. తల్లి, కూతుళ్ల ఎయిర్ హగ్ -
జపాన్ నౌకలో కరోనా కలకలం
-
ప్రపంచంలోనే మొదటి స్టీల్ బోటు
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మొత్తం స్టీల్‌తో ఓ బోటును (యాట్)ను తయారు చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో కొనసాగుతున్న 60వ ఫోర్ట్ లాడర్ డేల్ అంతర్జాతీయ బోట్ల ప్రదర్శనలో ఇది విశేషంగా ఆకర్షిస్తోంది. తొమ్మిది వేల చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఈ బోటును ‘మాన్షన్ యాట్’గా నామకరణం చేశారు. ఇందులో ఐదు బెడ్ రూమ్‌లు, ఐదు బాత్ రూమ్‌లు ఉండగా, పలు ఇండోర్, అవుట్ డోర్ సిట్టింగ్‌లు ఉన్నాయి. పూర్తి స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేసిన ఈ బోటు నిర్వహణ ఖర్చు ఫైబర్ గ్లాస్తోని తయారు చేసిన బోట నిర్వహణ ఖర్చుకన్నా 25 శాతం తక్కువని బోటు యజమాని బ్రూనో ఎడ్వర్డ్స్ తెలిపారు. దీన్ని కొనుగోలు చేసేందుకు పలువురు వ్యాపారులు పోటీ పడుతున్నారని చెప్పారు. అయితే దాని వెలెంతో చెప్పలేదు. 40 అడుగుల వెడల్పూ, 85 అడుగుల పొడువు కలిగిన ఈ బోటులో 145 మంది హాయిగా ప్రయాణం చేయవచ్చని బ్రూనో ఎడ్వర్డ్స్ తెలిపారు. దీన్ని ప్రస్తుతం నీటికి 18 అడుగులపైన, నాలుగు హైడ్రాలిక్ పిల్లర్లపై అమర్చి ప్రదర్శనకు పెట్టారు. -
సాగర జలాల్లో సమర విన్యాసాలు
సాక్షి విశాఖపట్నం : ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ యుద్ధ నౌకలు విశాఖ చేరుకున్నాయి. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరుకున్న బంగ్లా నౌకలు బీఎన్ఎస్ అలీ హైదర్, బీఎన్ఎస్ షాడినోటాలకు భారత నౌకాదళ బృందం ఘన స్వాగతం పలికింది. అనంతరం విశాఖ సాగర జలాల్లో ఇరుదేశాల నౌకలు ప్రదర్శించిన విన్యాసాలు అలరించాయి. ఇండియా– బంగ్లాదేశ్ సమన్వయ గస్తీ (కార్పాట్) విన్యాసాల్లో భాగంగా తొలుత బంగ్లాదేశ్ సాగర జలాల్లో భారత నౌకలు విన్యాసాలు చేశాయి. ఈ నెల 16 వరకు విశాఖలో రెండో విడత విన్యాసాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఐఎన్ఎస్ రణ్విజయ్, ఐఎన్ఎస్ ఖతర్‌తో కలిసి సాగర జలాల్లో విన్యాసాలు నిర్వహించారు. రెండు దేశాల మధ్య వృత్తిపరమైన సహకారం, గస్తీ కార్యకలాపాల్లో సమన్వయం, నౌకాదళ శిక్షణ, నిర్వహణ వ్యవహారాల్లో భాగస్వామ్యం మెరుగు పడేందుకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు చేపట్టినట్లు ఇరు దేశాల నౌకాదళాధికారులు తెలిపారు. -
టగ్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ముంబైకి తరలింపు
సాక్షి, ద్వారకనగర్(విశాఖ దక్షిణం): ఈనెల 13వ తేదీన విశాఖ సాగర తీరానికి మూడు నాటికల్ మైళ్ల దూరంలో జరిగిన టగ్ ప్రమాద ఘటనలో తీవ్ర గాయాలపాలైన జువిన్ జోషి(24)ని మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ ఆదేశాల మేరకు బాధితుడిని ఆదివారం ముంబైలోని ఆస్పత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించినట్టు జాయింట్ కలెక్టర్–2 ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తరలింపు బాధ్యతలను జేసీ–2, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పర్యవేక్షించారు. చదవండి: టగ్ ఆన్ ఫైర్ -
ఆరని సందేహాల మంటలు
ఔటర్ హార్బర్ జలాల్లో హెచ్‌పీసీఎల్ అద్దెకు తీసుకున్న టగ్‌ను అంటుకున్న మంటలను గంటల తరబడి శ్రమించి సోమవారం అర్ధరాత్రికి అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంపై సందేహాల మంటలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. ప్రమాదానికి దారితీసిన కారణాలేమిటి?.. ప్రమాద సమయంలో టగ్‌లో ఎంతమంది ఉన్నారు??.. అందులో ఉండాల్సిన సిబ్బంది సంఖ్య ఎంత???.. నిర్దేశించిన దానికంటే ఎక్కువమంది ఉంటే, వారెలా నౌకలోకి వచ్చారు????.. ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు. టగ్‌ను అద్దెకు తీసుకొని పనులు నిర్వహిస్తున్న హెచ్‌పీసీఎల్ సంస్థ మాత్రమే వీటికి సమాధానం చెప్పగలదు. కానీ ఆ సంస్థ అధికారులు మంగళవారం రాత్రి వరకు నోరు విప్పలేదు.. ఎటువంటి ప్రకటనలూ జారీ చేయలేదు. ఘటనపై అంతర్గత విచారణకు మాత్రమే ఆ సంస్థ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రమాదంలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ప్రమాదం నుంచి మొత్తం 24 మందిని పోర్టు, కోస్ట్‌గార్డు సిబ్బంది రక్షించి ఆస్పత్రులకు తరలించారు. వారిలో తొమ్మిది మందిని ప్రాథమిక చికిత్స అనంతరం సోమవారం రాత్రే పంపించేశారు. ఆరుగురిని మంగళవారం డిశ్చార్జి చేశారు. మిగిలిన 9 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ముంబైలోని హెచ్‌పీసీఎల్ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినా ఇక్కడి డాక్టర్లు నివారించారు. కాగా సంఘటనపై విచారణ జరుగుతోందని.. రెండు రోజుల తర్వాత గానీ పూర్తి వివరాలు చెప్పలేమని పోలీసులు అంటున్నారు. సాక్షి, విశాఖపట్నం/పాతపోస్టాఫీస్/ మల్కాపురం: ఔటర్ హార్బర్ సముద్ర జాలాల్లో క్రూడ్ ఆయిల్ నౌకలను నిలిపి ఉంచే సింగిల్ పాయింట్ మూరింగ్ (ఎస్పీఎం) టెర్మినల్ వద్ద హెచ్‌పీసీఎల్‌కు చెందిన అద్దె నౌక కోస్టల్ జాగ్వార్లో సోమవారం ఉదయం 11.25 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సమాచారం పోర్ట్ మెరైన్ సమాచారంతో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మంటలను అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగింది. మంటలను అదుపు చేసేందుకు సీ లైన్ అజిల్, సీ లైన్ సెంటినల్, సర్దార్ పటేల్, ఫైర్ ఫ్లోట్ అనే క్రాఫ్ట్‌లను పంపింది. వీటితో పాటు కోస్ట్‌గార్డ్‌కు చెందిన రాణి రష్మోణీ, సీజీ 81 నౌకలు సమన్వయంతో అత్యంత చాకచక్యంగా మంటలను అతి కష్టమ్మీద అదుపులోకి తీసుకువచ్చాయి. విశాఖపట్నం పోర్ట్‌ట్రస్ట్, కోస్ట్‌గార్డ్ సిబ్బంది నిరంతరం శ్రమించి సోమవారం రాత్రికి మంటలు, దట్టమైన పొగ పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అనంతరం పోర్ట్ సిబ్బంది ప్రమాదానికి గురైన కోస్టల్ జాగ్వార్‌ను ఇన్నర్ హార్బర్లోకి తరలించినట్లు పోర్టు వర్గాలు తెలిపాయి. ఎంతమంది ఉన్నారు? ఈ ప్రమాదం ఎలా జరిగింది.? కారణాలేంటన్న విషయాలపై ఇంకా స్పష్టత లేదు. అసలు ప్రమాదం సంభవించినప్పుడు నౌకలో ఎంతమంది ఉన్నారన్న విషయంపై తలో మాట చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు సమయంలో కోస్టల్ జాగ్వార్లో 26 మంది ఉన్నట్టు సమాచారం ఉందని పోర్టు వర్గాలు చెబుతుండగా.. 23 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. పనికి పంపిన హెచ్‌పీసీఎల్ మాత్రం నౌకలో ఎంతమంది ఉన్నారన్న విషయంపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి టగ్‌లో 20 మంది మాత్రమే ఉండాలి. కానీ.. పోలీసుల సమాచారం ప్రకారం 23 మంది ఉన్నారు. అదనంగా ముగ్గురు నౌకలోకి ఎలా వచ్చారు.? అధికారికంగా వచ్చారా.? అనధికారికంగా నౌకలో ఉన్నారా అనే విషయంపై కూడా ఇంతవరకూ స్పష్టత రాలేదు. మెరుగైన వైద్యం కోసం ముంబైకి.. కానీ..? ప్రమాదం జరిగినప్పుడు ఒకరు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. 24 మందిని పోర్ట్, కోస్ట్‌గార్డ్ సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు. వీరిలో 9 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు సోమవారం ఇంటికి పంపారు. మిగిలిన 15 మందికి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగుర్ని చికిత్స అనంతరం మంగళవారం ఇంటికి పంపారు. మరో తొమ్మిది మంది ప్రస్తుతం మైక్యూర్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరు 90 శాతం కాలిన గాయాలతో ఉన్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మిగిలిన వారు 40 శాతం పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులకు ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్స్‌పాల్ డాక్టర్ పీవీ సుధాకర్‌రావు పర్యవేక్షణలో వైద్య సేవలందిస్తున్నారు. అయితే విశాఖకు చెందిన కాశారపు భరధ్వాజ్ (23) పరిస్థితి మరింత విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌మీద చికిత్స పొందుతున్నారు. కోల్‌కతాకు చెందిన అన్సార్ (39)కు కాలేయానికి తీవ్ర గాయాలవ్వడంతో పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కేరళకు చెందిన జోబిన్‌కు కూడా 65 శాతం శరీరం కాలిపోవడంతో విషమంగా ఉందన్నారు. హెచ్‌పీసీఎల్ యాజమాన్యం ఒత్తిడితో విషమంగా ఉన్న ముగ్గురు క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ముంబైలోని ప్రధాన ఆస్పత్రికి తరలించడానికి సన్నాహాలు చేశారు. అయితే.. ఈ సమయంలో వీరిని తరలిస్తే పరిస్థితి మరింత విషమంగా అవుతుందని డాక్టర్ పీవీ సుధాకర్ రావు చెప్పడంతో.. ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మిగిలిన ఆరుగురి పరిస్థితి కొంతమేర మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. స్పందించని హెచ్‌పీసీఎల్.. ఈ ఘటనపై ఇంతవరకూ హెచ్‌పీసీఎల్ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు. నౌకలో ఎంతమంది ఉన్నారు.. ఎవరెవరు వెళ్లారు అనే వివరాలను జిల్లా యంత్రాంగానికి కూడా ఇవ్వలేదు. సంస్థ యాజమాన్యం మాత్రం ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. విచారణ కమిటీ మ«ధ్యాహ్నం 2 గంటల సమయంలో రిఫైనరీని సందర్శించి ఆపరేషనల్ జీఎం, ఇండస్ట్రీ జీఎంలతో పాటు ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించినట్లు సమాచారం. బుధవారం నాటికి నివేదిక సిద్ధం అవుతుందని హెచ్‌పీసీఎల్ వర్గాలు చెబుతున్నాయి. క్షతగాత్రులకు మంత్రి అవంతి పరామర్శ.. విశాఖ హార్బర్ సముద్ర తీరంలో సోమవారం ఉదయం జరిగిన జాగ్వర్ టగ్(నౌక)ప్రమాదంలో గాయపడి మైక్యూర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, పోర్ట్ డిప్యూటీ చైర్మన్ పీఎల్ హరనాథ్, జేసీ–2 వెంకటేశ్వరావు, డీఎంహెచ్‌వో తిరుపతిరావులు పరామర్శించారు. క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మొరుగైన సేవలు అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై ఆరా తీసిన అధికారులు.. హార్బర్ తీరంలో జరిగిన జాగ్వర్ టగ్(నౌక)ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వేసిన కమిటీ ఆరా తీసింది. టగ్‌లో రిపేర్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారుల విచారణలో తేలింది.హెచ్‌పీసీఎల్(విశాఖ రిఫైనరీ)కి అవసరమైన క్రూడ్ ఆయిల్ అన్లోడ్ చేసేందుకు సోమవారం నౌక వచ్చింది. ఈ నౌక పోర్టు పరిధిలోని హెచ్‌పీసీఎల్‌కు పైపులైన్ ద్వారా పంపే పాయింట్ వద్ద ఉంది. అయితే ఈ నౌక నుంచి పైపులైన్ ద్వారా క్రూడ్ అన్లోడ్ చేయాలంటే దానికి అటాచ్డ్ (అంటే నౌక వద్ద గల అన్లోడ్ పాయింట్‌కు పైపులైన్ పాయింట్‌కు కలిపేది)ఎడ్జిస్బుల్ పైపులు అవసరం. ఈ పనులు సామారో అనే సంస్థ నిర్వహిస్తోంది. హెచ్‌పీసీఎల్ ఆ సంస్థకు కాంట్రాక్టు అప్పగించింది. ఈ నౌకలో పనులకు కొమాకో అనే సంస్థ నుంచి సిబ్బందిని విధులకు తీసుకొచ్చారు. అయితే సదరు కాంట్రాక్టర్ క్రూడ్ అన్లోడ్ చేసేం దుకు టగ్(ప్రమాదానికి గురైన నౌక)లో 23 మంది సిబ్బందితో సోమవారం ఉదయం వస్తున్నాడు.అయితే ప్రమాదానికి పది నిమిషాల ముందు నౌకలో సింగల్ పాయింట్ మోడ్æ వద్ద సిబ్బంది రిపేర్ పనులు చేస్తున్నారు.ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు రావాలంటే మరో రెండు రోజులు పడుతోందని సీఐ ఉదయ్‌కుమార్ తెలిపారు.అయితే ప్రమాదంపై హెచ్‌పీసీఎల్ అధికారులు మంగళవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీ వేసినట్లు తెలిపారు. -
కడలిలో కల్లోలం
విశాఖ తీరానికి సుమారు మూడు నాటికల్ మైళ్ల దూరం.. సమయం ఉదయం సుమారు 11.30 గంటలు.. హఠాత్తుగా కడలిలో కల్లోలం.. నీళ్లలో నిప్పు.. హెచ్‌పీసీఎల్‌కు చెందిన భారీ క్రూడ్ నౌక వద్దకు వెళ్లిన టగ్‌లో ఒక్కసారిగా పేలుడు.. ఆ వెంటనే మంటలు క్షణాల్లో నౌకను అంటుకున్నాయి. ఊహించని ఈ పరిణామంతో టగ్‌లోని సిబ్బంది హాహాకారాలు చేశారు. రక్షించమని ఆర్తనాదాలు చేశారు. ఆ సమయంలో అందులో 23 మంది సిబ్బంది ఉండగా.. ఎనిమిది మంది భయంతోనో.. ప్రమాదం నుంచి తమను తాము రక్షించుకునేందుకో నౌక నుంచి సముద్రంలోకి దూకేశారు. ఆ ప్రయత్నంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరొకరి జాడ తెలియరాలేదు. నౌకలో ఉన్న మిగిలిన 15 మందికి కాలిన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన కోస్ట్‌గార్డు, పోర్టులకు చెందిన సుమారు ఆరు నౌకలు మంటలను ఆర్పేసి.. క్షతగాత్రులను వేరే బోట్లలో జెట్టీకి చేర్చాయి. వారందరినీ నేవీకి చెందిన ఐఎన్ఎస్ కల్యాణితోపాటు మైక్యూర్ ఆస్పత్రిలో చేర్చారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గాయపడిన వారిలో నలుగురు మన రాష్ట్రానికి చెందినవారు కాగా.. మిగిలిన వారందరూ ఇతర రాష్ట్రాలకు చెందినవారు. ఔటర్ హార్బర్లో లంగరు వేసిన నౌకలను ఇన్నర్ హార్బర్లోకి తీసుకురావడం.. ఔటర్లో ఉన్న భారీ నౌకల్లో నిర్వహణ పనుల కోసం సిబ్బందిని తీసుకెళ్లడానికి వినియోగించే చిన్న నౌకలను టగ్‌లుగా వ్యవహరిస్తుంటారు. సరిగా ఆ పనుల కోపమే హెచ్‌పీసీఎల్ అద్దెకు తీసుకున్న జాగ్వర్ టగ్లోనే దుర్ఘటన జరిగింది. సాక్షి, విశాఖపట్నం/పాత పోస్టాఫీస్(విశాఖ దక్షిణ): సోమవారం ఉదయం 11 గంటలు... అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న విశాఖ హార్బర్లో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. అక్కడికి మూడు నాటికల్ మైళ్ల దూరంలో సంభవించిన అగ్ని ప్రమాదంతో రోదనలు మిన్నం టాయి. వివరాల్లోకి వెళ్తే... హెచ్‌పీసీఎల్‌కు క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చే భారీ నౌకలను నిలిపి ఉంచే ప్రాంతానికి కోమాకో సంస్థ సిబ్బంది కోస్టల్ జాగ్వార్ టగ్‌తో చేరుకుని నిర్వహణ పనులు చేస్తున్నారు. ఈ టగ్‌ను హెచ్‌పీసీఎల్ సంస్థ అద్దెకు తీసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చిన భారీ నౌక వద్దకు జాగ్వార్‌తో 23 మంది సిబ్బంది చేరుకుని నిర్వహణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో నౌకకు టగ్‌ను అనుసంధానించే క్రమంలో మంటలు చెలరేగి ఒక్కసారిగా వ్యాపించాయి. అనూహ్య పరిణామంతో సిబ్బందిలో 8 మంది సముద్రంలో దూకేశారు. మిగిలిన 15 మంది మంటల్లో చిక్కుకున్నారు. నౌకలో మంటలు చెలరేగి దట్టంగా పొగలు కమ్ముకుంటున్న సమయంలో పోర్టు ఛానల్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది గమనించి పోర్టు కంట్రోల్ – 1కు సమాచారం అందించారు. అదే సమయంలో సమీపంలో ఉన్న కోస్ట్‌గార్డు సిబ్బందికి జాగ్వార్ ట్రగ్లో ఉన్న సిబ్బంది వాకీటాకీ ద్వారా సమాచారం అందించారు. కోస్ట్‌గార్డు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆరుగురిని రక్షించారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు మరణించగా మరొకరు గల్లంతయ్యారు. టగ్‌లో గాయపడిన 15 మందిని పోర్ట్ ప్రథమ చికిత్సా లాంచీల ద్వారా జీసీబీ జెట్టీ వద్దకు తరలించారు. అక్కడి నుంచి నగరంలోని జిల్లా పరిషత్ వెనుక గల మై క్యూర్ ఆస్పత్రికి, ఐఎన్ఎస్ కల్యాణికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. 15 మంది క్షతగాత్రులో అత్యధికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కాగా ఇద్దరు తూర్పు గోదావరి జిల్లా వాళ్లు, విశాఖ, శ్రీకాకుళంకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్, పోర్టు అధికారులు వెంటనే స్పందించి తగిన సహాయ చర్యలు చేపట్టినట్టు పోర్టు వర్గాలు తెలిపాయి. పోర్టు తరపున సీ లయన్ ఏజిల్, సీ లయన్ సెంటినల్, సర్దార్ పటేల్, ఫైర్ ఫ్లోట్, కోస్ట్‌గార్డ్ తరపున రాణి రోష్మణి, చార్లి సీ 432 నౌకలు, వెసల్ సీజీ – 81లు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించడంతోపాటు నౌకలోని మంటలను ఆదుపుచేశాయి. తల్లడిల్లిన భరద్వాజ్ తల్లి.. విశాఖపట్నం పాతపోస్టాఫీస్ కోటవీధిలో నివసిస్తున్న కాశారపు భరద్వాజ్(23)కి 90 శాతం శరీరం కాలిపోయి ప్రమాద పరిస్థితిలో ఉన్నాడు. ఆస్పత్రికి చేరుకున్న అతని తల్లి తీవ్ర మనస్తాపానికి గురై సొమ్మసిల్లి పోయింది. కుమారుడి పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయింది. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద విషాద వాతావరణం నెలకొంది. మెరుగైన చికిత్సకు చర్యలు అగ్ని ప్రమాద బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రి వర్గాలకు తెలియజేశాం. ప్రభుత్వం తరపున చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నాం. – వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ – 2 మైక్యూర్లో చికిత్స పొందుతున్న వారు 1. కన్నయ్య (44)..గుజరాత్ 2. వై.సత్తిబాబు (39)..తూర్పు గోదావరి 3. రామ్ నివాస్ యాదవ్ (64)..హర్యానా 4. రోహిత్ చౌహాన్ (31)..ఉత్తర ప్రదేశ్ 5. శ్యాం కె.అర్జున్ (25)..కేరళ 6. మంజిత్ కుమార్ (27)..ఉత్తర ప్రదేశ్ 7. రాకేష్ కుమార్ (27)..జార్ఖండ్ 8. ముఖేష్ కుమార్ (35)..హర్యానా 9. కమల్‌కాంత్ (24)...బీహార్ -
9మందిని విడుదల చేసిన ఇరాన్
టెహ్రాన్: కొన్ని రోజుల క్రితం ఇరాన్, ఎంటీ రియా అనే నావను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అందులో మొత్తం 12 మంది భారత సిబ్బంది ఉన్నారు. అయితే తాజాగా వారిలో తొమ్మిది మందిని ఇరాన్ విడుదల చేసింది. కాగా మరో ముగ్గురు ఇంకా వారి చెరలోనే ఉన్నారు. ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఇరాన్ పలు నావలను నిబంధనల ఉల్లంఘనల పేరిట అదపులోకి తీసుకుంది. దాంతో ఆ నావల్లో ఉన్న భారతీయులు ఇరాన్ అదుపులోకి వెళ్లారు. ఇటీవల అదుపులోకి తీసుకున్న బ్రిటన్ నౌక స్టెనా ఇంపెరోలో ఉన్న 18 మంది, ఎంటీ రియాలో ఉన్న ముగ్గురితో కలిపి ప్రస్తుతం 21మంది భారతీయులు ఇరాన్ చెరలో ఉన్నారు. అలాగే గ్రేస్1 నావలో ప్రయాణిస్తున్న 24 మంది భారత నావికులను జీబ్రాల్టర్ పోలీసు అథారిటీస్ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. లండన్‌లోని భారత రాయబారులు వారిని బుధవారం కలిశారని విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. వారిని విడుదల చేయించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చింది. -
కోస్ట్‌గార్డ్ అమ్ములపొదిలో ఐసీజీఎస్ వీరా
విశాఖసిటీ: భారత తీర భద్రతా దళం అమ్ములపొదిలో మరో ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసల్ చేరింది. ఓపీవీ–3 క్లాస్ నౌకగా రూపొందిన ఇండియన్ కోస్ట్‌గార్డ్ నౌక వీరా(ఐసీజీఎస్ వీరా) సేవలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మూడో సిరీస్ ఓపీవీ నౌకగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీరా రూపొందించారు. పూర్తిస్థాయి మెరుగులు దిద్దుకున్న వీరా.. మార్చి రెండో వారంలో విశాఖ కోస్ట్‌గార్డు ప్రధాన కేంద్రానికి చేరుకుంది. భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ లాంఛనంగా ఐసీజీఎస్ వీరా సేవల్ని ప్రారంభించారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్ డైరెక్టర్ జనరల్ రాజేంద్రసింగ్ మాట్లాడుతూ మేకిన్ ఇండియాలో భాగంగా గతేడాది ఏప్రిల్‌లో, ఆగస్ట్‌లో రెండు నౌకలు కోస్ట్‌గార్డ్ సేవల్లో చేరగా.. తాజాగా ఐసీజీఎస్ వీర సేవలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇదీ ‘వీరా’ పరాక్రమ సామర్థ్యం ♦ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మూడో కోస్ట్‌గార్డ్ నౌక వీర ♦ ఇంటిగ్రేటెడ్ బ్రిడ్జ్ సిస్టమ్(ఐబీఎస్), ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఐపీఎంఎస్), ఆటోమేటెడ్ పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఏపీఎంఎస్) ఉన్న ఏకైక కోస్ట్‌గార్డ్ నౌక ♦ హై పవర్ ఎక్స్టర్నల్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ కూడా వీర సొంతం ♦ 97 మీటర్ల పొడవు, 15 మీటర్ల విశాలమైన వెడల్పుతో 3.6మీటర్ల డ్రాఫ్ట్‌గా వీరాను తయారు చేశారు. ♦ 2,200 టన్నుల బరువుతో 9,100 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రెండు డీజిల్ ఇంజిన్ల సహాయంతో నడుస్తుంది. ♦ 26 నాటికల్ మైళ్ల వేగంతో వెళ్లే సామర్థ్యంతో 5 వేల నాటికల్ మైళ్ల వరకూ ఏకకాలంలో దూసుకెళ్లగలదు. ♦ 30 ఎంఎం నేవల్ గన్లు, 12.7 ఎంఎం గన్ ఫిట్ చేశారు. ♦ ట్విన్ ఇంజిన్ హెలికాఫ్టర్, నాలుగు హైస్పీడ్ బోట్లు, బోర్డింగ్ ఆపరేషన్లకు వినియోగించే రెండు ఇన్ఫ్లేటబుల్ బోట్స్ వీరా లో ఉంటాయి. ♦ సముద్రంలో ఎక్కడైనా చమురు తెట్టు ఏర్పడితే.. దాన్ని తొలగించే సామర్థ్యం ఉన్న పరికరాల్ని తీసుకెళ్లే సామర్థ్యమూ వీర సొంతం. ♦ 12 మంది అధికారులు, 94 మంది కోస్ట్‌గార్డ్ సిబ్బంది వీరాలో విధులు నిర్వర్తించనున్నారు. ♦ ఆల్ట్రా మోడ్రన్ నేవిగేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్‌తో వీరా అత్యాధునిక కోస్ట్‌గార్డ్ నౌకల్లో ఒకటిగా వీరా రూపుదిద్దుకుంది. -
కొస్ట్‌గార్డ్ అమ్ములపొదిలో అత్యాధునిక నౌక వీర
-
ఓడలో పేలుడు..14 మంది ఆహుతి
మాస్కో/ముంబై: రష్యా సముద్ర జలాల్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. గ్యాస్ ట్యాంకర్ ఓడల్లో పేలుడు, మంటల కారణంగా 14 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ ఓడల్లో భారత్, టర్కీ దేశాల సిబ్బంది ఉన్నారు. అయితే, భారతీయ సిబ్బందిలో చాలా మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్(డీజీఎస్) స్పష్టం చేసింది. అజోవ్, నల్ల సముద్రాలను కలిపే కెర్చ్ జలసంధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. టాంజానియాకు చెందిన క్యాండీ అనే ఓడలో ఉన్న ధ్రువీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ)ను మేస్త్రో అనే ట్యాంకర్ ఓడలోకి సిబ్బంది నింపుతున్నారు. ఈ క్రమంలో భారీ పేలుడు సంభవించడంతో చెలరేగిన మంటలు రెండు ఓడల్లోనూ శరవేగంగా వ్యాపించాయి. దీంతో సిబ్బంది భయంతో సముద్రంలోకి దూకేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారన్న రష్యా ప్రభుత్వం వారి వివరాలను వెల్లడించలేదు. తమ నేవీ సిబ్బంది 12 మందిని రక్షించారని, మరో ఆరుగురి జాడ తెలియడం లేదని తెలిపింది. ప్రమాదం జరిగిన క్యాండీ ఓడలోని 17 మంది సిబ్బందిలో భారతీయులు 8 మంది కాగా టర్కీ జాతీయులు 9 మంది ఉన్నారు. మేస్త్రోలోని 15 మందిలో ఏడుగురు చొప్పున భారత్, టర్కీ దేశస్తులు, ఒకరు లిబియా దేశస్తుడని సమాచారం. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. -
స్త్రీలోక సంచారం
జపాన్‌లోని ‘స్పా’ అనే పత్రిక యావత్ మహిళావనికి క్షమాపణలు చెప్పుకుంది! ఏ యూనివర్సిటీ అమ్మాయిలు ఎంత త్వరగా ‘పడిపోతారో’ యూనివర్సిటీలకు ర్యాంకులు ఇస్తూ మరీ ఈ పత్రిక ఒక కథనాన్ని ఇవ్వడం జపాన్ మహిళల ఆగ్రహానికి కారణం అయింది. డిసెంబర్ 25 సంచికలో వచ్చిన ఆ కథనంలో, మందు పార్టీలలో ఏ యూనివర్సిటీ అమ్మాయిల్ని ఎంత టైమ్‌లో దారిలోకి తెచ్చుకోవచ్చో చెబుతూ ఆ యూనివర్సిటీలకు ర్యాంకులు ఇవ్వడం సోషల్ మీడియాలో కలకలం రేపింది. ‘ఈ బుద్ధి లేని పత్రికను వెలివేయండి’ అని ఒక మహిళ ఆన్లైన్ క్యాంపెయిన్ ప్రారంభించి, పత్రిక యాజమాన్యం తక్షణం మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చెయ్యడంతో, తర్వాత సంచికలో ‘స్పా’ తన మహిళా పాఠకులను ‘అపాలజీ’ కోరింది.భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ తన ‘గగన్‌యాన్’ ప్రాజెక్టులో భాగంగా 2021 లో ప్రయోగించబోయే తొలి మానవ సహిత వ్యోమనౌకలో ఒక మహిళ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గతంలో మోదీ అన్న మాటలను గుర్తు చేశారు. ‘‘భారతదేశం అంతరిక్షంలోకి పంపే మానవ నౌకలో భారతమాత పుత్రుడు కానీ, పుత్రిక కానీ ఉండొచ్చు’ అని మోదీ అన్న విషయాన్ని గుర్తు చేయడం ద్వారా, శివన్.. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అంతర్లీనంగా వెల్లడించారు. అయితే తుది నిర్ణయం, తదనంతర కార్యక్రమాలకు మరికొంత సమయం పడుతుందని శివన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు 550 మందికి పైగా మహిళా వ్యోమగాములు అంతరిక్ష యానం చేయగా వారిలో భారతీయ సంతతికి చెందిన మహిళ కల్పనా చావ్లా కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తూ చావ్లా 2003లో జరిగిన కొలంబియా వ్యోమనౌక నేలపైకి దిగుతుండగా పేలిపోయి మరణించారు. ఇలా ఉండగా, భారతదేశంలో అంతరిక్షంలోకి పంపే వ్యోమగాములకు తగిన శిక్షణ ఇచ్చేందుకు రష్యా ముందుకు వచ్చింది. -
విమానాల్లో మొబైల్ సేవలపై కమిటీ..
న్యూఢిల్లీ: విమానాల్లోనూ, నౌకల్లోనూ మొబైల్ సేవలను (ఐఎఫ్‌ఎంసీ) మూడు నెలల వ్యవధిలోగా అందుబాటులోకి తెచ్చే అంశంపై అంతర్–మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. వీటి అమల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై ఈ కమిటీ ప్రతి 15 రోజులకొకసారి సమావేశం అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘ఎయిర్‌లైన్స్, షిప్పింగ్ కంపెనీలు, టెలికం ఆపరేటర్లు, ప్రభుత్వంలోని వివిధ శాఖల వర్గాలతో శుక్రవారం సమావేశం జరిగింది. ఐఎఫ్‌ఎంసీ సర్వీసులను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చే దిశగా అంతర్–మంత్రిత్వ శాఖల గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సర్వీసులు సజావుగా అమలయ్యే క్రమంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఈ కమిటీ ప్రతి 15 రోజులకోసారి సమావేశం అవుతుంది‘ అని వివరించాయి. మూడు నెలల్లోగా సర్వీసులు అందుబాటులోకి తేవొచ్చని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్లు పేర్కొన్నాయి. పది ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఈ సేవలు ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని స్పైస్‌జెట్ తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో శాటిలైట్ బ్యాండ్‌విడ్త్ చార్జీలు 7–8 రెట్లు అధికంగా ఉంటున్నాయని, దీంతో రెండు గంటల విమాన ప్రయాణంలో కాల్ చార్జీలు 30–50 రెట్లు అధికంగా ఉండే (సుమారు రూ. 700–1000 దాకా) అవకాశముందని బ్రాడ్‌బ్యాండ్ టెక్నాలజీ సంస్థ హ్యూస్ ఇండియా పేర్కొంది. -
విశాఖ చేరుకున్న అమెరికా యుద్ధ నౌక
విశాఖసిటీ: అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన యూఎస్ఎస్ యాంకరేజ్ ల్యాండిగ్ ప్లాట్‌ఫాం డాక్ నౌక విశాఖకు ఆదివారం చేరుకుంది. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరుకున్న యాంకరేజ్ నౌకకు ఈఎన్సీ బ్యాండ్ బృందం సంప్రదాయ స్వాగతం పలికింది. కెప్టెన్ డెన్నిస్ జాకో నేతృత్వంలో అమెరికా నౌకాదళ బృందం నాలుగు రోజుల పాటు ఈఎన్సీలో పర్యటించనుంది. పర్యటనలో భాగంగా వృత్తిపరమైన పరస్పర అవగాహన చర్చలు, నౌకాదళ పరమైన ఒప్పందాలు, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు అంశాలపై ఇరుదేశాల నౌకాదళాధికారులు చర్చించనున్నారు. భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ రాజ్‌పుత్ తో కలిసి విన్యాసాల్లో పాల్గొన్న అనంతరం ఈ నెల 26న యూఎస్ఎస్ యాంకరేజ్ నౌక తిరుగుప్రయాణం కానుంది. -
9 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన ‘దెయ్యం ఓడ’
థోంగ్వా(మయన్మార్): కొన్ని సంఘటనల వెనుక మర్మమేమిటో ఎంత ఆలోచించినా అంతుపట్టదు. వాటికి సమాధానం తెలుసుకోవాలన్నా దొరకదు. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల క్రితం పసిఫిక్ మహాసముద్రంలో అదృశ్యమైన ఓ భారీ నౌక.. గతవారం హిందూ మహాసముద్రంలో కన్పించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘దెయ్యం ఓడ’గా పిలుచుకుంటున్న సామ్ రత్లుంగి పీబీ 1600 అనే నౌక వేల టన్నుల సరుకులతో ఇండోనేషియా జెండాతో బయలుదేరింది. ఈ నౌక చివరిసారిగా 2009లో తైవాన్ సముద్ర జలాల్లో కనిపించింది. తర్వాత అది కనిపించకుండా పోయింది. పలు దేశాలకు చెందిన అధికారులు ఎంత గాలింపు చేపట్టిన షిప్ జాడ కనిపెట్టలేకపోయారు. ఎంత వెతికినా నౌక ఆచూకీ లభ్యం కాకపోవడంతో అది పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కడో మునిగిపోయి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ తీరా ఇటీవల ఆగస్టు 30వ తేదీన ఆ నౌకను మయన్మార్ తీరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఆ దేశ మత్స్యకారులు గుర్తించారు. అందులోకి వెళ్లి చూడగా అందులో ఎవరూ కనబడలేదు. అందులో ఎటువంటి సరకులు కూడా లేవు. దీంతో వారు తీరప్రాంత పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కూడా దానిని పరిశీలించారు. అయిన కూడా ఆ నౌక ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోలేకపోయారు. 9 ఏళ్ల తరువాత నౌక వెలుగులోకి రావడంపై రకరకాలు కథనాలు వినిపిస్తున్నప్పటికీ.. ఆ నౌక ఇంతకాలం ఎక్కడ ఉంది, అందులోని సరుకులు, సిబ్బంది ఎమయ్యారు అనే ప్రశ్నలు సమాధానాలు లేనివిగానే మిగిలాయి. కాగా, 177.35 మీటర్ల పొడవు, 27.91 మీటర్ల వెడల్పుతో 2001లో ఈ ఓడను నిర్మించారు. -
భారత తీరప్రాంత రక్షణ దళంలోకి మరో నౌక
సాక్షి, వైజాగ్: భారత తీర ప్రాంత రక్షణ దళంలోకి మరో గస్తీ నౌక చేరింది. రాణి రోష్మణి నౌకను కోస్ట్‌గార్డు అదనపు డీజీ వీఎస్ఆర్ మూర్తి జాతికి అంకితం చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 51 మీటర్ల పొడవైన ఈ నౌకను విశాఖ హిందూస్థాన్ షిప్‌యార్డు తయారు చేసింది. రాణి రోహ్మణి ధైర్యసాహసాలు గుర్తు చేసుకుంటూ నౌకకు నామకరణం చేశారు. ఈ నౌకను నిర్మించడం షిప్‌యార్డు ఘనతల్లో ఒకటని హిందూస్థాన్ షిప్‌యార్డు సీఎండీ తెలిపారు. 34 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించడానికి చాలా ప్రయోగాలు చేశామని పేర్కొన్నారు. సాంకేతికంగా చాలా ఆధునికంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు తీర ప్రాంత రక్షణ దళం అవసరాలకు అనుగుణంగా నౌకల తయారీకి షిప్‌యార్డు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. -
ఒక టైటానిక్.. ఒక కర్పాథియా..
మనకు టైటానిక్ గురించి తెలుసు.. జాక్, రోజ్ల అజరామరమైన ప్రేమ కథ గురించి తెలుసు.. మరి మనకు కర్పాథియా గురించి తెలుసా? ఆ నౌకా సిబ్బంది హీరోచిత గాథ గురించి తెలుసా? తెలీదా.. అయితే.. తెలుసుకుందాం రండి.. టైటానిక్.. దాదాపుగా అందరం చూసిన సినిమానే.. ఇందులో ఆ నౌక భారీ మంచు ఖండాన్ని ఢీకొని మునిగిపోతుంది.. 2,224 మందికిపైగా సిబ్బంది, ప్రయాణికులతో బయల్దేరిన టైటానిక్‌లో 1,500 మందికిపైగా సముద్రంలో మునిగి చనిపోయారు.. మరి మిగిలినవాళ్లు ఎలా బతికారు? ఆర్ఎంఎస్ కర్పాథియా వల్ల.. ఆ నౌకలోని సిబ్బంది వల్ల.. 1912, ఏప్రిల్ 15 తెల్లవారుజామున టైటానిక్ సముద్రంలో మునిగిపోయింది.. ఆ సమయంలో కర్పాథియా న్యూయార్క్ నుంచి ఆస్ట్రియాకు వెళ్తోంది.. ప్రమాద స్థలానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 15వ తేదీ తెల్లవారుజామున టైటానిక్ నుంచి ప్రమాదానికి సంబంధించిన సిగ్నల్ వచ్చింది.. దీన్ని ట్రాక్ చేసిన కర్పాథియా సిబ్బంది.. హుటాహుటిన రంగంలోకి దిగారు. మంచు ఖండాలతో ప్రమాదకరంగా ఉన్న ఆ మార్గంలో ప్రయాణించి.. అక్కడికి చేరుకున్నారు. వెళ్లే సమయానికే టైటానిక్ మునిగిపోయింది. అయినప్పటికీ.. బతికున్న ప్రతి ఒక్కరినీ కాపాడాలన్న లక్ష్యంతో సుమారు 4 గంటలపాటు సహాయక చర్యలు చేపట్టారు. 705 మంది ప్రయాణికులను కాపాడారు. టైటానిక్ తన తొలి, చివరి ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఏప్రిల్ 10తో 106 ఏళ్లు అయిన సందర్భంగా.. కర్పాథియా సహాయక చర్యలకు సంబంధించిన కొన్ని అరుదైన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. అవే ఇవీ.. తానూ టైటానిక్‌లాగే.. టైటానిక్‌కు సంబంధించిన వందల మంది ప్రయాణికులను కాపాడిన కర్పాథియా నౌక కూడా తర్వాతి కాలంలో టైటానిక్‌లాగే మునిగిపోయింది. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో.. అంటే 1918, జూలై 17న ఐర్లాండ్ సముద్ర జలాల్లో ఉండగా.. జర్మన్ సబ్‌మెరైన్ దీనిపైకి టార్పెడోలు ప్రయోగించడంతో పేలుడు ధాటికి సముద్రంలో మునిగిపోయింది. -సాక్షి, తెలంగాణ డెస్క్ -
సీ పైలట్
ఆకాశంలో విమానాల్ని చక్కర్లు కొట్టించడం..పట్టాల మీద రైళ్లను రయ్యిన పరుగులెత్తించడం..రోడ్ల మీద బస్సుల్ని లాఘవంగా తిప్పడం..ఈ మూడు దారులలో మహిళలు ఇప్పటికే నైపుణ్యాన్ని ప్రదర్శించారు.ఇప్పుడు కొత్తగా సముద్రం నుంచి పోర్ట్‌కి ఓడల్ని నడుపుతోంది!ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగాచెన్నైకి చెందిన రేష్మా నీలోఫర్ సాగర్..ఐలాండ్ నుంచి కోల్‌కతా పోర్టుకి నౌకల్ని నడుపుతూ రికార్డు సృష్టించింది. రోడ్డు మీద ఉన్నట్లే సముద్రంలోనూ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఇసుక తిప్పలు, చిన్న చిన్న రాతి గుట్టలు.. వాటిని జాగ్రత్తగా దాటుకుంటూ ఓడను ఒడ్డుకు చేర్చాలి. అందువల్లే సముద్రం నుంచి పోర్ట్‌కి ఓడను నడపడం చాలా కష్టమైన పని. ఈ ఓడలు నడిపే పైలట్‌కి ‘యాక్సిడెంట్ జరగకుండా చూడగలను’ అనే నమ్మకం లేకపోతే ఈ పని చేయలేరు. చిన్న చిన్న మలుపులు తిప్పడానికే ఎంతో నైపుణ్యం ఉండాలి. ఓడలను నియంత్రించడం అంత సులువైన విషయం కాదు. మగవారికే అసాధ్యమైన ఈ ప్రొఫెషన్లోకి తొలిసారిగా రేష్మా నీలోఫర్ వచ్చారు. ప్రపంచంలోనే తొలి సీ పైలట్‌గా గుర్తింపు పొందారు. చెన్నైలో జన్మించిన రేష్మా నాటికల్ సైన్సెస్‌లో బి.ఎస్.సి. డిగ్రీ చేసి, కోల్‌కతా పోర్ట్ ట్రస్టులో శిక్షణ తీసుకున్నారు. ఏడాది పాటు క్యాడెట్‌గా పనిచేశారు. ‘డైరెక్టొరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్‌లో ఫస్ట్ అండ్ సెకండ్ కాంపిటెన్సీ’ సర్టిఫికెట్ అందుకున్నారు. గ్రేడ్ త్రీ, పార్ట్ వన్ పూర్తి చేసి, గ్రేడ్ త్రీ పైలట్‌గా మరో ఆరు నెలల్లో పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వహించబోతున్నారని మెరైన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జెజె బిశ్వాస్ అంటున్నారు. ఫస్ట్ అండ్ సెకండ్ కాంపిటెన్సీ అయ్యాక.. చిన్న చిన్న వస్తువులు ఉన్న ఓడలు నడిపి, అనుభవం çసంపాదించారు రేష్మ. ఆ తర్వాత ‘పనామాక్స్ వెజల్స్’ ఉండే పెద్ద పెద్ద ఓడలను నడిపారు. 300 మీటర్ల పొడవు ఉండే ఈ ఓడలలో, 70,000 టన్నుల సరుకు ఉంటుంది. సముద్ర గర్భం నుంచి కోల్‌కతా పోర్ట్‌కి ప్రతిరోజూ సామాన్లు చేరవేస్తారు రేష్మ. ఆవిడ ప్రయాణించే దూరం 223 కిలో మీటర్లు. హుగ్లీ మీదుగా ప్రయాణించే 148 కిలోమీటర్ల ప్రాంతమంతా అనేక మలుపులు, అడ్డంకులతో నిండి ఉంటుంది. కోల్‌కతా లేదా హల్దియా నుంచి వచ్చే ఓడలు.. సాగర్ ఐలాండ్‌లో ఉండే పైలట్‌తో దారిలో ఉండే అడ్డంకుల గురించి కమ్యూనికేట్ అవ్వాలి. సముద్రంలో అనేక ఇసుక దిబ్బలు, కొండరాళ్ల మలుపులు ఉంటాయి. అవి బాగా ఇబ్బంది కలిగిస్తాయి. ఓడ వాటిని తప్పించుకుంటూ వెళ్లాలి. అక్కడ యుక్తితో తప్పించుకునే అవకాశం చాలా తక్కువ. ఎంత నేర్పు ప్రదర్శించినా తప్పించుకోలేకపోతారు. ఇందుకు కావలసినదల్లా అనుభవమే. రేష్మను చూసి చాలామంది ఒక ప్రశ్న వేస్తుంటారు. సముద్రంలో పనిచేయడం ఆడవారికి ఎంతవరకు క్షేమమా? అని. అందుకు రేష్మ ‘ఈత వస్తే సముద్రం గురించి భయపడవలసిన అవసరం లేదు’ అంటారు. అంత తేలికేం కాదు సీ పైలట్‌ని మారిటైమ్ పైలట్ అని కూడా అంటారు. వీళ్లు ఇరుకుగా ఉండే నీటి ప్రాంతం.. అంటే హార్బర్స్, నదీ ముఖ ప్రాంతం వంటి ప్రదేశాల నుంచి సరుకులను చేరవేస్తారు. సాధారణంగా వీరికి షిప్ కెప్టెన్‌గా, కష్టమైన ప్రదేశాలలో షిప్‌ను హ్యాండిల్ చేసిన అనుభవం ఉండాలి. అంటే అక్కడి లోతు ఎంత, గాలి ఎంత శక్తితో ఏ దిశగా ప్రయాణం చేస్తోంది, అలలు ఆటు మీద ఉన్నాయా, పోటు మీద ఉన్నాయా... వంటి విషయాలలో అనుభవం ఉండాలి. వీటన్నిటినీ అలవోకగా దాటేస్తున్నారు రేష్మ. – రోహిణి -
నావ.. మునగదిక..!
ఇలాంటి షిప్ ముందే తయారై ఉంటే ‘టైటానిక్’ మునగకపోయి ఉండేదేమో..! ‘టైటానిక్’ అనే ఓ అద్భుతమైన సినిమా వచ్చి ఉండకపోవచ్చేమో..! ఇలా ఎందుకు అంటున్నామంటే.. ఈ ఫొటోలో ఉన్న షిప్ పేరు ‘థండర్ చైల్డ్’. సముద్రాల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు మనుషులను వెతికి ప్రాణాలు కాపాడేందుకు దీన్ని వినియోగిస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది నీటిలో అస్సలంటే అస్సలు మునగదు. ఆఖరికి బోల్తా కొట్టినా కూడా నీటిలో మునిగిపోదు! అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు వీలుగా ఐర్లండ్ నేవీ ఈ షిప్‌ను తయారు చేసింది. సేఫ్ హెవెన్ మెరైన్ అనే ఐరిష్ కంపెనీ దీన్ని అభివృద్ధి పరిచింది. ఇది సముద్రంలో గంటకు 62 మైళ్ల వేగంతో దూసుకుపోగలదు. 10 మంది ప్రయాణించేందుకు వీలున్న ఈ షిప్‌ను సముద్రంలోని బలమైన ఆటుపోటులను తట్టుకునేలా తయారు చేశారు. ఇందులోని కేబిన్ లోపల ఎప్పుడూ గాలి నింపి మునిగిపోకుండా చేశారు. అంటే ఒక రకంగా మన టైర్లలో ఎప్పుడూ గాలి ఉండాలి కదా అలా అన్నమాట. -
నడి సముద్రంలో.. మంటల్లో చిక్కుకున్న నౌక
సాక్షి, లక్షద్వీప్: అరేబియా సముద్రంలోని లక్షద్వీప్‌లో అగట్టికి 340 నాటికల్ మైళ్ల దూరంలో ఓ భారీ వాణిజ్య నౌక మంటల్లో చిక్కుంది. డెన్మార్క్‌లోని మెర్స్క్ కంపెనీకి చెందిన ఈ నౌకలో మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది తమ పైఅధికారులకు సమాచారమందించారు. గత రెండు రోజులుగా మంటలు అదుపులోకి రావడం లేదు. దీనిలో మొత్తం 27 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 13 మంది భారతీయులు ఉన్నారు. ప్రమాదంలో ఒకరు మరణించారు. ఆయన థాయ్‌ల్యాండ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరో నలుగురు ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. మిగిలిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఘటనకి సంబంధించిన నష్టంపై పూర్తి సమాచారం లేదని తెలిపింది. -
హైజాకైన భారతీయులకు విముక్తి
న్యూఢిల్లీ : హైజాక్‌కు గురైన వాణిజ్య నౌకలోని 22 మంది భారతీయులకు విముక్తి కలిగిందని విదేశాంగ మంత్రి సుస్మా స్వరాజ్ మంగళవారం తెలిపారు. ఆంగ్లో ఈస్ట్రన్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఓడ ఆయిల్ రవాణా చేస్తుండగా పశ్చిమాఫ్రికా దేశం బెనిన్ సముద్ర తీరం వద్ద హైజాక్‌కు గురైంది. సముద్రపు దొంగలు ఓడలోని నౌకా సిబ్బందిని తమ బందీలుగా చేసుకున్నారు. శుక్రవారం నుంచి ఓడ జాడ తెలియకుండాపోయింది. ఈ విషయం భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు తెలియడంతో ఆమె నైజీరియా, బెనిన్ దేశాల అధికారులకు చెప్పారు. ఈ విషయంలో సహాయం చేయాలని అర్దించారు. అప్రమత్తమైన అక్కడి అధికారులు నౌకా సిబ్బందిని విడిపించడంతో ప్రత్యేక పాత్ర పోషించారు. ఓడలో ఉన్న 13,500 టన్నుల ఆయిల్ కూడా సురక్షితంగా ఉంది. అక్కడి అధికారులు సముద్రపు దొంగలకు డబ్బులేమైనా చెల్లించారా అనేది తెలియాల్సి ఉంది. భారతీయులు విడుదల కావడం పట్ల ఆనందంగా ఉందని ట్విటర్ ద్వారా విదేశాంగ శాఖ మంత్రి సుస్మాస్వరాజ్ తెలిపారు. -
కొత్తరకం విధ్వంసక నౌకను నిర్మిస్తున్న చైనా
బీజింగ్: శత్రువుల యుద్ధ విమానాలు, క్షిపణులు, నౌకలు, జలాంతర్గాములను నాశనం చేయగలిగిన కొత్తరకం విధ్వంసక నౌకను చైనా నిర్మిస్తోందని ఆ దేశ మీడియా శుక్రవారం వెల్లడించింది. పది వేల టన్నుల బరువుండే ఈ విధ్వంసక నౌక నిర్మాణం ప్రస్తుతం తుది దశలో ఉందనీ, షాంఘైలోని జియాంగ్నన్ రేవులో పనులు జరుగుతున్నాయని జిన్హువా న్యూస్ తెలిపింది. ఆర్మీ అధికారులు, సైనికుల నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం విధ్వంసక నౌకలో ప్రస్తుతం స్వల్ప మార్పులు చేస్తున్నారనీ, తర్వాత సముద్రంలో పరీక్షించాల్సి ఉందని వార్తా సంస్థ పేర్కొంది. -
లగ్జరీ షిప్లో మూడు ముళ్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : పెళ్లంటే... ఇంటి ముందు మండపంలోనో లేక ఫంక్షన్ హాల్లోనో కానిచ్చేయడం మనకు తెలుసు. కానీ, ఈ మధ్య కాలంలో క్రూయిజ్ (భారీ సముద్ర నౌక)లో, అది కూడా హంగూ ఆర్భాటాలతో... సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకునే సంప్రదాయం పెరుగుతోందండోయ్!!. మరి, క్రూయిజ్‌లో పెళ్లంటే మాటలు కాదు. నౌకను బుక్ చేసుకోవడం నుంచి మొదలుపెడితే ప్రయాణ గమ్యస్థానం, పెళ్లి ఏర్పాట్లు, భోజన వసతులు.. ఇలా ప్రతిదీ పనే. దీన్నే వ్యాపారంగా మలుచుకుంది ట్రావ్‌కార్ట్.కామ్. దీనికోసం క్రూయిజ్ వెడ్డింగ్‌లో పేరు గాంచిన డ్రీమ్ క్రూయిజ్‌తో ఒప్పందం కూడా చేసుకుంది. మరిన్ని వివరాలు ట్రావ్‌కార్ట్ కో–ఫౌండర్ మన్హీర్ సింగ్ సేథి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘రెండు దశాబ్దాల కిందటే మా కుటుంబానికి సాహిబ్జీ ట్రావెల్స్ అండ్ టూర్స్ ఏజెన్సీ ఉంది. అందుకేనేమో!! చిన్నతనం నుంచే నాతో పాటు మా తమ్ముడు గుర్సాహిబ్ సింగ్ సేథికీ ట్రావెలింగ్ అంటే ఇష్టముండేది. చదువు పూర్తయ్యాక ఇద్దరం కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టాం. తక్కువ కాలంలోనే వ్యాపారాన్ని మంచి స్థాయికి తెచ్చాం. అదే సమయంలో ఆన్లైన్ బూమ్ వచ్చింది. టూర్ మొత్తం ఆన్లైన్లో బుక్ చేసుకునేలా వీలు కల్పిస్తే వేగంగా, సులువుగా కస్టమర్లను చేరుకోవచ్చనే ఆలోచనతో రూ.5 లక్షల పెట్టుబడితో 2016 డిసెంబర్లో ఢిల్లీ కేంద్రంగా ట్రావ్‌కార్ట్.కామ్‌ను ఆరంభించాం. బీ2బీ, బీ2సీ కస్టమర్లకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండింట్లోనూ ప్రయాణ సేవలందించడం మా ప్రత్యేకత. 58 దేశాలు, 3,500 ప్యాకేజీలు.. థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్, దుబాయ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజ్లాండ్, అమెరికా, యూరప్ వంటి 58 దేశాల్లో ఫ్యామిలీ హాలీడే, హనీమూన్, క్రూయిజ్, థీమ్ హాలిడేస్, డే ట్రిప్స్, వీకెండ్ గేట్‌వే ఇలా సుమారు 3,500 రకాల ప్యాకేజీలున్నాయి. రూ.1,500 నుంచి రూ.10 లక్షల వరకు ధరలున్నాయి. క్రూయిజ్ వెడ్డింగ్ కోసం ఒక రాత్రికి ఒక్కరికి రూ.9 వేలు ఖర్చవుతుంది. గోవా, హువాహిన్, పుకెట్, కౌలాలంపూర్ గమ్యస్థానాల్లో క్రూయిజ్ వెడ్డింగ్ చేసుకునే వీలుంది. కస్టమర్లు అక్కడ సొంతంగా కారులో విహరించేందుకు కారు కూడా అద్దెకు తీసుకోవచ్చు. ఇందుకోసం సెల్ఫ్ డ్రైవ్ కార్ రెంటల్ కంపెనీ ఎవీస్తో ఒప్పందం చేసుకున్నాం. ట్రావెల్ ఏజంట్లకూ ఫ్రాంచైజీ.. బీ2బీలో 8 వేలకు పైగా ట్రావెల్ ఏజెంట్లు, బీ2సీలో 3 వేలకు పైగా కస్టమర్లున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 800 మంది ట్రావెల్ ఏజెంట్లున్నారు. సుమారు 3 వేల హోటళ్లు, 20కి పైగా విమానయాన సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని ట్రావెల్ ఏంజెట్లకు బ్రాండింగ్, ప్రమోషన్, ప్రచారంతో పాటూ కస్టమర్లనూ అందించడం కోసం ఫ్రాంచైజీ ఇస్తున్నాం. ఈ డిసెంబర్ నాటికి 20 ఫ్రాంచైజీలు, 2020 నాటికి 100 ఫ్రాంచైజీలు లకి‡్ష్యంచాం. నెలకు కోటి వ్యాపారం.. ప్రస్తుతం నెలకు 70 వరకు ఆర్డర్లు, కోటి రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నాం. ఎక్కువగా ఫ్యామిలీ, హనీమూన్ ప్యాకేజ్‌లు బుక్ అవుతున్నాయి. మా మొత్తం వ్యాపారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 8 శాతం. ప్రస్తుతం 68 మంది ఉద్యోగులున్నారు. మార్చి నాటికి మరో 100 మందిని తీసుకుంటాం. ‘‘వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో దుబాయ్, సింగపూర్‌లో ట్రావ్‌కార్ట్ సేవలను విస్తరిస్తాం. దానికి నిధులు సమీకరిస్తున్నాం’’ అని ’ మన్హీర్ వివరించారు. -
ఓడ మునక..భారతీయులు గల్లంతు
టోక్యో(జపాన్): జపాన్ తీరంలో సరుకు రవాణా నౌక మునిగిన ఘటనలో పది మంది భారతీయులు కనిపించకుండాపోయారు. హాంగ్‌కాంగ్‌లో రిజిస్టరయిన 33వేల టన్నుల ఎమరాల్డ్‌స్టార్ అనే సరుకు రవాణా నౌక శుక్రవారం తెల్లవారుజామున ఒకినావ సమీపంలో మునిగిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న జపాన్ కోస్టుగార్డులు వెంటనే సంఘటన స్థలికి చేరుకున్నారు. ఓడలోని 26 మంది భారతీయ సిబ్బందిలో 16మందిని మాత్రం రక్షించగలిగారు. అయితే, బలమైన టైఫూన్ తుఫాను కారణంగా వెంటనే రక్షణ చర్యలకు అంతరాయం ఏర్పడింది. మిగతా 10 మంది జాడ కోసం గాలింపు కొనసాగుతోంది. మృతులు, బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. -
దూసుకొచ్చిన యుద్ధనౌక.. కాల్పులు
పర్షియన్ సముద్ర జలాల్లోకి దూసుకొచ్చిన ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా కాల్పులు జరిపింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పర్షియన్ గల్ఫ్ వైపు మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ యుద్ధనౌకను పలుమార్లు ఆగాలని అమెరికాకు చెందిన థండర్‌బోల్ట్ బోటు పలుమార్లు హెచ్చరించింది. ఇరాన్ నౌక హెచ్చరికలను ఖతరు చేయకపోవడంతో దాన్ని వెంబడించింది. దాదాపు 150 యార్డుల చేరువలో ఇరు ఓడలు సముద్రంలో వెళ్లినట్లు అమెరికా నేవీ వర్గాలు తెలిపాయి. అంత దగ్గరలో ప్రయాణించడం కారణంగా ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టే అవకాశం కూడా ఉంటుందని వెల్లడించాయి. అప్పటికీ ఇరాన్ నౌక వెనక్క తగ్గకపోవడంతో వరుసగా కాల్పులు జరిపినట్లు వివరించాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేరు తెలపడానికి ఇష్టపడని పెంటగాన్ అధికారి ఒకరు తెలిపారు. అమెరికాకు చెందిన నౌకలు డే టైమ్‌లో విన్యాసాలు నిర్వహిస్తుండగా.. ఇరాన్ నౌక ఈ చర్యకు దిగినట్లు వెల్లడించారు. -
వేల కోట్ల నాజీ సొత్తును వెలికితీస్తారా?
ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన నాజీల ఓడను వెలికితీయాలని ట్రెజర్ హంటర్లు భావిస్తున్నారు. ఇందుకోసం ఐలాండ్ ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దక్షిణ అమెరికా నుంచి జర్మనీకి తరలిస్తున్న టన్నుల కొద్దీ బంగారం మునిగిపోయిన ఓడలో ఉందని ట్రెజర్ హంటర్ల నమ్మకం. 1939 రెండో ప్రపంచ యుద్ధం జరగుతున్న నేపథ్యంలో దక్షిణ అమెరికా నుంచి జర్మనీకి బయల్దేరిన ఈ ఓడను ఇంగ్లండ్ తన సముద్రజలాల్లో అడ్డుకుని దాడి చేసింది. దాంతో ఓడతో పాటు దక్షిణ అమెరికా నుంచి వస్తున్న విలువైన వస్తువులు సముద్ర అంతర్భాగంలో కలసిపోయాయి. దాదాపు నాలుగు టన్నుల బంగారం మునిగిపోయిన ఓడలో దాడి ఉందని పలువురి అభిప్రాయం. బంగారం విలువ దాదాపు 100 మిలియన్ పౌండ్లు ఉంటుందని భావిస్తున్నారు. ఓడలో ఉన్న బాక్సును వెలికితీసేందుకు బ్రిటన్‌కు చెందిన ఓ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఐలాండ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి పరిశోధనలు చేయాలని భావించినా ఆ దేశ ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో నేవీ ఒప్పుకోలేదు. దీంతో ఐలాండ్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం బ్రిటన్ కంపెనీ వేచి చూస్తోంది. -
పడవను ఢీకొన్న నౌక, 15మంది గల్లంతు
జకర్తా: ఇండోనేసియాలోని తూర్పు జావా ప్రావిన్స్‌లో పడవను నౌక ఢీకొట్టిన ఘటనలో కనీసం 15 మంది గల్లంతయ్యారు. శనివారం తుర్బాన్ జిల్లా జలాల్లో వియత్నాం నౌక, ఇండోనేసియా పడవ ఢీకొన్నాయి. ఇండోనేసియా పడవలో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో గల్లంతయిన వారందరూ పడవలో ప్రయాణిస్తున్న వారేనని అధికారులు చెప్పారు. పడవలో ఉన్నవారిలో 12 మందిని సురక్షితంగా కాపాడమని తెలిపారు. మిగిలివారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. తూర్పు జావా ప్రావిన్స్ రాజధాని సురబయలోని ఓడరేవుకు వియత్నాం నౌక వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు. -
పడవ బోల్తా
నరసాపురం రూరల్ : సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మర పడవ ప్రమాదవశాత్తు అలల ఉధృతికి బోల్తా కొట్టింది. నరసాపురం మండలం వేములదీవి శివారు చినమైనవానిలంక గ్రామానికి చెందిన మైల లవరాజు, మరో ముగ్గురితో కలిసి మంగళవారం తెల్లవారు జామున సముద్రంలో వేటకు వెళ్లాడు. అలల తాకిడికి పడవ బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పడవ తిరగబడడంతో వేట సామగ్రితోపాటు ఇంజిన్ పాడైంది. పడవ దెబ్బతింది. వలల చిరిగిపోయాయి. ఆస్తి నష్టం రూ.లక్ష ఉంటుంది. దీంతో మత్స్యకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు మత్స్యశాఖ అధికారి రమణకుమార్ తెలిపారు. -
కృష్ణపట్నం టూ చైనా:14 రోజులే
తొలి నౌకాయానం ప్రారంభం ముత్తుకూరు : కృష్ణపట్నంపోర్టు నుంచి చైనాకు కేవలం 14 రోజుల్లో కంటైనర్ల నౌక ద్వారా సరుకుల రవాణా జరుగుతుందని పోర్టు సీఈఓ అనీల్ ఎండ్లూరి వెల్లడించారు. ప్రతి వారం చైనాకు సరుకుల కంటైనర్ల రవాణా చేసే తొలి నౌక ‘ఎంవీ మాస్క్ కైరెనియా’ను సోమవారం పోర్టులో మెర్స్క్‌లైన్ ఇండియా ఎండీ ఫ్రాంక్ డెడెనిస్, పోర్టు సీఈఓ అనీల్ ఎండ్లూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తూర్పు, ఈశాన్య దేశాలైన కొరియా, సింగపూర్, మలేసియా, చైనాకు ఇక నుంచి ప్రతి వారం కంటైనర్ల నౌక ప్రయాణిస్తుందని వెల్లడించారు. ఈ నౌకా యానం వల్ల ఖర్చు తగ్గుతుందని, వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నారు. కాంకర్ రైలు సర్వీసు ప్రారంభం బెంగళూరు, హైదరాబాద్ నుంచి వారానికి రెండు సార్లు కంటైనర్లు రవాణా చేసే రైలును కూడా మాస్క్ ౖలైన్ ఇండియా ఎండీ ఫ్రాంక్ డెడెనిస్, పోర్టు సీఈఓ అనీల్ ఎండ్లూరి ప్రారంభించారు. కాంకర్ సంస్థ ఆధ్వర్యంలో అత్యంత వేగవంతంగా ఈ రవాణా జరుగుతుందని సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ధనుంజయులు వెల్లడించారు. -
నేటి నుంచి లాంచీ సేవలు
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయంలో గురువారం నుంచి లాంచీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ జీఎం మనోహర్ బుధవారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. తెలంగాణ(హిల్‌కాలనీ) వైపు నుంచి లాంచీలు నిత్యం జాలీ ట్రిప్పులు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాంచీలను తిప్పనున్నట్లు వెల్లడించారు. లాంచీ నాగార్జునకొండకు వెళ్లేందుకు ఆర్కియాలజీ డిపార్ట్మెంటుతో అనుమతి పొందాల్సి ఉందనిన్నారు. అనుమతి కోసం ధరఖాస్తు చేసినట్లు వివరించారు. పర్యాటకులను బట్టీ లాంచీ ట్రిప్పులు వేస్తామని చెప్పారు. అలాగే కంపెనీలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు గంటల చొప్పున అద్దెకు ఇచ్చేందుకు మరో లాంచీని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. -
స్నేహం ఓ సుమం.. ఇగరదులే సుగంధం..
‘చెలిమి..జీవితాన్ని సుసంపన్నం చేసే కలిమి’ అన్నాడో కవి. ‘స్నేహం..రుతువేదైనా వాడని సుమం’ అన్నాడింకో కవి. స్నేహితుల దినోత్సవాన్ని (ఆదివారం) పురస్కరించుకుని స్థానిక నర్సరీ రైతులు ఫ్రెండ్‌షిప్‌డే శుభాకాంక్షలు అందంగా తెలియజేశారు. స్థానిక పల్లవెంకన్న నర్సరీలో మొక్కలు, పువ్వులతో ఏర్పాటు చేసిన కూర్పు ఇది. ప్రతివారూ స్నేహభావంతో మెలగాలని కాంక్షిస్తూ దీన్ని ఏర్పాటు చేసినట్లు నర్సరీ డైరెక్టర్ పల్ల వెంకటేష్, రైతులు సత్తిబాబు, సుబ్రహ్మణ్యం, గణపతి తెలిపారు. – కడియం -
మేకిన్ ఇండియా నౌకలకు సాయం
భారత్‌లో నిర్మించే నౌకలకు 20% ఆర్థిక సహకారం కేంద్రం కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం కింద దేశీయంగా నౌకానిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత్‌లో నిర్మించిన నౌకలపై 20 శాతం మేర ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. పదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పథకానికి రూ. 4,000 కోట్ల మేర బడ్జెట్‌పరమైన మద్దతు అవసరమవుతుందని కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. పెట్టుబడులు, టర్నోవరుపరంగానే కాకుండా ఉపాధి అవకాశాలపరంగా కూడా మౌలిక రంగం స్థాయిలో ప్రభావం చూపే నౌకానిర్మాణం, నౌకల మరమ్మతు పరిశ్రమకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. నౌకానిర్మాణ రంగానికి పన్నులపరమైన ప్రయోజనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగ హోదా తదితర అంశాలు కూడా తాజా ప్రతిపాదనలో ఉన్నాయి. -
పేరులో నేముంది
అర్జెంటీనా (వింత కథల పుట్ట) పోర్చుగల్‌కు చెందిన ఫ్రాన్సిస్కో డి టోరెస్ అనే ఒక సముద్రవర్తకుడు ప్రయాణిస్తున్న ఓడ ప్రమాదానికి గురైంది. సముద్రంలో కొట్టుకుపోతున్న టోరెస్‌ను కొందరు రక్షించి, తమ దేశానికి తీసుకెళ్లి, సపర్యలు చేశారు. కొంతకాలం తర్వాత టోరెస్‌ను స్వదేశానికి పంపుతూ, వీడ్కోలు ఇచ్చే సందర్భంలో తమ ఆతిథ్యానికి గుర్తుగా కొన్ని ఆభరణాలను బహూకరించారు. చనిపోయాడనుకున్న టోరెస్ క్షేమంగా తిరిగి వచ్చేసరికి అందరూ సంతోషించారు. టోరెస్ తాను ప్రమాదం నుంచి బయటపడిన విధానాన్ని, అక్కడివారు తనను ఆదరించిన తీరును గురించి చెప్పి, వారు తనకు బహూకరించిన ఆభరణాలను చూపించాడు. తెల్లగా మెరుస్తున్న ఆ ఆభరణాలను చూసి అందరూ ముచ్చటపడి, తమకు కూడా కావాలన్నారు. దాంతో టోరెస్ కొందరిని వెంటబెట్టుకుని ఆ దీవికి వెళ్లి, అక్కడివారిని ఆభరణాల గురించి అడిగాడు. వారు అతనికి ఓ తెల్లటి కొండను చూపించి, ఆ కొండ రాళ్లతోనే తాము ఆభరణాలను తయారు చేశామని చెప్పారు. టోరెస్ వారి అనుమతితో ఆ కొండరాళ్లను కొన్నింటిని తనతోబాటు తీసికెళ్లి, ఆ రాళ్లను శుద్ధి చేసి, వాటితో ఆభరణాలు తయారు చేసి అమ్మకం సాగించాడు. అలా తనకు ముడిసరుకు కావలసి వచ్చినప్పుడల్లా ఆ దీవికెళ్లి రాళ్లు తెచ్చుకునేవాడు. ఆ కొండకు అర్జెంటీనా అని పేరు పెట్టాడు. లాటిన్లో ఆర్జంటమ్ అంటే వెండి అని అర్థం. అలా ఆ దేశానికి అర్జెంటీనా అనే పేరు స్థిరపడిపోయింది. -
సముద్రంలో చిక్కుకున్న నావ..
ముంబై: భారత నౌకాదళానికి చెందిన జిందాల్ కామాక్షి నౌక సముద్రంలో చిక్కుకుపోయింది. అయితే తక్షణమే రంగంలోకి దిగిన రక్షకదళాలు సహాయక చర్యలు చేపట్టి సిబ్బందిని కాపాడాయి ఇరవైమంది సిబ్బందితో ఉన్న నౌక ముంబై నౌకాశ్రయానికి నలభై నాటికల్ మైళ్లదూరంలో ప్రమాదంలో పడింది. బలమైన గాలుల కారణంగా పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో సిబ్బంది కలవరపడ్డారు. దాదాపు ఒక పక్కకు ఒరిగిపోతూ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, తక్షణమే తమని రక్షించాలని కోరుతూ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే నావీకి చెందిన కింగ్ సీ 42 సీ హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. ఆదివారం రాత్రికి 19 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. వాతావరణం అనుకూలించకపోవడంతో తరలింపు చర్యలను నిలిపివేశారు. అయితే ఓడలోనే ఉండిపోయిన మాస్టర్‌ను సోమవారం ఉదయం తరలించడంతో మొత్తం సిబ్బంది ప్రమాదం నుంచి బైటపడ్డారు. కాగా ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రవాణా వ్యవస్థలు స్థంభించి, జనజీవనం అప్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. -
మొరాయించిన ఓడ : 2000 మంది పడిగాపులు
విశాఖపట్నం : షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖ నుంచి అండమాన్ వెళ్లే నౌక సాంకేతిక సమస్యలతో శుక్రవారం మొండికేసింది. ఇంజన్లో సమస్య తలెత్తడంతో ఉదయం 11.30 గంటలకు వెళ్లాల్సిన నౌక సాయంత్రం 6గంటలకు బయలుదేరింది. దీంతో 2వేల మంది ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. విశాఖ పోర్టు నుంచి అండమాన్‌లోని పోర్టు బ్లెయిర్ వరకూ ప్రతి నెలా నౌకను షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి అనుమతి పొందిన ప్రైవేట్ కాంట్రాక్టర్ నడుపుతున్నారు. 1100 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణానికి రూ.2,500 నుంచి రూ.9వేల వరకూ కేటగిరీల వారీగా టిక్కెట్టు డబ్బులు వసూలు చేస్తున్నారు. యాభై ఆరు గంటల పాటు ప్రయాణించాల్సి ఉండటంతో ప్రయాణీకులు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటారు. చెన్నై, కోల్కత్తా పోర్టుల తర్వాత అండమాన్‌కు విశాఖ నుంచే నౌకాయానం అందుబాటులో ఉంది. చెన్నై, కోల్కత్తా నుంచి వెళ్లడం కంటే విశాఖ నుంచి వెళితే నాలుగు గంటలు ముందుగానే పోర్ట్ బ్లెయిర్ చేరుకోవచ్చు. కాగా అండమాన్ నౌక ఆలస్యమవ్వడం కొత్తకాదు. గతంలోనూ అనేక సార్లు ఇదే విధంగా ఇబ్బందులు పెట్టింది. ఒక్కోసారి రెండు మూడు రోజుల పాటు నిలిచిపోయిన సందర్భాలున్నాయి. -
నౌక కలకలం
సాక్షి, చెన్నై : కడలూరు-నాగపట్నం సముద్ర తీరంలో శ్రీకృష్ణ అనే నౌక కలకలం రేపింది. కడలూరు హార్బర్‌కు సమీపంలో లంగర్ వేసిన ఈ నౌక ఒడ్డుకు కొట్టుకురావడం, మట్టిలో కూరుకు పోవడంతో పోలీసుల్లో అనుమానాలు నెలకొన్నాయి. తీవ్రవాదులు ఎవరైనా చొరబడ్డారా? అన్న ఆందోళనతో విచారణను వేగవంతం చేశారు. ఇటీవల సముద్ర మార్గంలో ఓ పడవ ద్వారా పాకిస్తానీ ముష్కరులు భారత్‌లోకి చొరబడే యత్నం చేయడం, అది మంటల్లో చిక్కుకోవడం తెలిసిందే. దీంతో సముద్ర తీరాల్లో భద్రతను పెంచారు. రాష్ట్రంలో అయితే, తిరువళ్లూరు, చెన్నై మొదలు కన్యాకుమారి వరకు సముద్ర తీరాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిఘాతో వ్యవహరిస్తున్నా, శ్రీ కృష్ణ అనే ఓ నైక ఒడ్డుకు కొట్టుకు రావడం కలకలాన్ని రేపింది. నాగపట్నం, కడలూరు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఉరకలు తీయించింది. కడలూరు - నాగపట్నం సముద్ర తీరంలోని పోయనల్లూరు వద్ద శుక్రవారం రాత్రి ఓ చిన్న సైజు నౌక ఒడ్డుకు దూసుకు వచ్చింది. ఒడ్డుకు అతి వేగంగా వచ్చిన ఈ నౌక మట్టిలో కూరుకు పోయింది. దీన్ని గుర్తించిన జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు.ఆందోళనలో పడ్డ కడలూరు, నాగపట్నం జిల్లా పోలీసు అధికారులు, మెరైన్, కోస్టు గార్డు వర్గాలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆ నౌకలో కెప్టెన్ అమరనాథ్‌తో పాటుగా పది మంది మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఈ నౌక ఒడ్డు వైపుగా దూసుకు రావడంతో తీవ్ర వాదులెవరైనా చొరబడ్డారా? అన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో ఆపరిసరాల్లో కలకలం బయలు దేరింది. అదే సమయంలో ఆ నౌకను చుడటానికి జనం పరుగులు తీశారు. అనుమానాలు నెలకొనడంతో ఆ నౌక సిబ్బంది వద్ద పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. విచారణ: గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన శ్రీ కృష్ణగా ఆ నౌకను గుర్తించారు. కడలూరు తదితర చిన్న చిన్న హార్బర్లకు ఈ నౌక ద్వారా సరకులు సరఫరా అవుతున్నట్టు విచారణలో తేలింది. కడలూరు హార్బర్లో ఈ నౌక సరకుల్ని దించినట్టు గుర్తించారు. ఎక్కువ రోజులు ఈ నౌక కడలూరు హార్బర్‌లోనే ఉంది. ఖాళీగా ఉన్న ఈ నౌకకు మరమ్మతులు చేపట్టాల్సిన దృష్ట్యా, సూరత్‌కు తరలించే ప్రయత్నంచేశారు. దీనిని కడలూరు హార్బర్‌కు కాస్త దూరంలో లంగర్ వేసి నిలిపి ఉన్నట్టు తేలింది. కడలూరు హార్బర్లో తాగు నీటిని నింపుకున్న అనంతరం సూరత్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు జరిగినా, శుక్రవారం లంగర్ తెగడంతో ఈ నౌక అదుపు తప్పింది. గాలి ప్రభావం కారణంగా నౌకను కట్టడి చేయలేక కెప్టెన్ చేతులెత్తేశారు, ఖాళీగా ఉండబట్టే ఆ నౌక ఒడ్డుకు దూసుకు వచ్చి మట్టి లో కూరుకు పోయిందని విచారణలో తేలింది. అయితే, పోలీసులు తమ అనుమానాల్ని నివృత్తి చేసుకునేందుకు మరింతగా విచారణ జరుపుతున్నారు. ఆ సముద్ర తీరాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని జాలర్ల గ్రామాల్లోని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ నౌకను మళ్లీ సముద్రంలోకి చేర్చేందుకు కుస్తీలు పడుతున్నారు. -
ఇస్రోకు కేర్ మాడ్యూల్
మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ మార్క్ -3లోని కేర్ మాడ్యూల్‌ను ఆదివారం చెన్నైకు చేర్చారు. ఎన్నూరు హార్బర్‌కు చేరుకున్న ఈ మాడ్యూల్‌ను ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ పరిశీలించారు. - అండమాన్ నుంచి చెన్నైకు - నౌకలో తీసుకొచ్చిన వైనం - పరిశీలించిన రాధాకృష్ణన్ సాక్షి, చెన్నై : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గురువారం చరిత్ర సృష్టించే అద్భుతాన్ని పరిశోధించిన విషయం తెలిసిందే. మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ముందడుగు వేస్తూ జీఎస్ఎల్వీ మార్క్-3ని ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతం అయింది. ఈ ప్రయోగంలో భాగంగా నింగిలోకి వెళ్లి కేర్ మాడ్యూల్(వ్యోమగాముల గది) మళ్లీ కిందకు దిగింది. ఇందులో అమరికల మేరకు పారాచూట్ల సాయంతో ఆ మాడ్యూల్ అండమాన్ సముద్ర తీరంలో సురక్షితంగా దిగింది. దీనిని అత్యంత జాగ్రత్తగా భారత నావికాదళం, కోస్ట్ గార్డ్లు చెన్నైకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక నౌకలో ఎన్నూర్ హార్బర్‌కు తీసుకొచ్చారు. నౌక నుంచి భారీ క్రేన్ సాయంతో దీనిని నిపుణులు కామరాజర్ టెర్మినల్‌కు తీసుకొచ్చారు. దీనిని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ పరిశీలించారు. అనంతరం గట్టి భద్రత నడుమ ఈ మాడ్యూల్‌ను శ్రీహరి కోటకు తరలించారు. -
ప్రైవేటు నౌకలతో ప్రమాదం
‘ముంబై’ తరహా దాడులకు అవకాశం నౌకాదళ ప్రధానాధికారి ఆందోళన న్యూఢిల్లీ: సముద్ర జలాల్లో రవాణా నౌకలకు రక్షణ కల్పించే కొన్ని దేశాలకు చెందిన ప్రైవేటు సాయుధ బలగాల వల్ల దేశ భద్రతకు ముప్పు కలిగే ప్రమాదం ఉందని నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ డీకే జోషి హెచ్చరించారు. నౌకాదళ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ బలగాలున్న నౌకల నియంత్రణకు సరైన విధానమంటూ లేదని, వాటి వల్ల ఉగ్రవాదులు దేశంలోకి చొరబడటం, ముంబై తరహా దాడులకు పాల్పడటం వంటివి జరగొచ్చని జోషి ఆందోళన వ్యక్తంచేశారు. అలాంటి నౌకలు 140కి పైగా ఉన్నాయన్నారు. ‘ఆ నౌకల్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉంటాయి. వాటిని ఎక్కడికి, ఎవరి కోసం తీసుకెళ్తున్నారో తెలియదు. ఇది చాలా ఆందోళనకర విషయం’ అన్నారు. తమిళనాడులోని ట్యూటికొరన్ తీరంలో అమెరికన్ నౌక ‘సీమెన్‌గార్డ్ ఓహియో’ను అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కొన్ని దేశాలు ప్రైవేటు సాయుధ గార్డులుగా కొందరిని తాత్కాలికంగా నియమించుకుంటున్న విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్య చేశారా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. రవాణా నౌకల నియంత్రణకు అంతర్జాతీయ మారిటైమ్ సంస్థ ఉన్నట్లుగానే ఆ సాయుధ బలగాలున్న నౌకలకు కూడా నియంత్రణ వ్యవస్థ ఉండాలని, అందుకు సముద్ర తీర దేశాలన్నీ కృషి చేయాలని జోషి సూచించారు. ఆ నౌకల వివరాలు, అందులోని గార్డులు, ఆయుధాల సంఖ్య మొదలైనవన్నీ సంబంధిత దేశాలకు తెలియజేయాలన్నారు. సముద్రదొంగల ప్రమాదం అధికంగా ఉన్నప్రాంతాల్లో రవాణా నౌకల ప్రయాణాన్ని కూడా నిరోధించాలన్నారు. దక్షిణ శ్రీలంకకు దగ్గరగా ప్రయాణించాల్సిన నౌకలు భారతదేశ తీరానికి దగ్గరగా వెళ్తున్నాయని, ఇది తమకు ఆందోళన కలిగిస్తోందని అన్నారు. -
ఆయుధాలతో పట్టుబడ్డ అమెరికా నౌక
ఆయుధాలతో పట్టుబడిన అమెరికా నౌక కదలికలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. నౌకలోని సిబ్బంది భిన్న కథనాలు వినిపిస్తున్నారు. దీంతో నిజాన్ని నిగ్గు తేల్చే దిశగా అధికారులు విచారణ ముమ్మరం చేశారు. నౌకలోని 25 మందిపై కేసులు నమోదు చేశారు. అదే సమయంలో భారత్-అమెరికా మధ్య చర్చలు మొదలయ్యాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి: అనుమతి లేకుండా తూత్తుకూడి హార్బర్ వైపు ప్రయాణిస్తున్న ‘సీమెన్ గార్డ్’ అనే నౌకను ఈ నెల 12న అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఇది చైనా నౌకగా భావించారు. తర్వాత అమెరికాలోని అడ్వన్ పోర్ట్ అనే ప్రయివేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన నౌకగా గుర్తించారు. తీరానికి 30 నాటికల్ మైళ్ల దూరంలో నిలిపేసిన ఈ నౌకను మంగళవారం తూత్తుకూడి హార్బర్లోని 2వ బెర్త్‌లో పెట్టి తనిఖీలు చేశారు. ఈ నౌకలో 10 గదులు, 25 మంది సైనికు లు, 35 అత్యాధునిక తుపాకులు, 5 వేల తూటాలు ఉన్నట్లు సమాచారం. తూత్తుకూడి హార్బర్ అధికారులు మాత్రం 13 అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని చెబుతున్నారు. భిన్న కథనాలు: అమెరికా నౌక తూత్తుకూడి హార్బర్ సమీపంలో ప్రయాణించడం వెనుక భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పై-లీన్ తుపాను నుంచి రక్షణ పొందేందుకే హార్బర్‌కు చేరుకున్నామని అమెరికా వర్గాలు ప్రకటించాయి. తూత్తుకూడికి చెందిన ఒక పారిశ్రామికవేత్త 10 బారెళ్ల ద్వారా నౌకలోకి 2 వేల లీటర్ల డీజిల్‌ను చేరవేశాడు. ఇందుకు కోసం కొన్నిమరబోట్లను రూ.15 వేల చొప్పున బాడుగ కు మాట్లాడుకున్నాడు. డీజిల్ కొనుగోలుకు నౌక కెప్టెన్ రూ.లక్షను సదరు పారిశ్రామికవేత్త బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. హార్బర్ అధికారులు నౌకను చుట్టుముట్టుతున్న సమయంలో చాటుమాటుగా ఆ పది డీజిల్ బ్యారెళ్లను సముద్రంలోకి జార విడిచేందుకు సిబ్బంది ప్రయత్నించినట్లుగా సమాచారం. అయితే అధికారులు అప్రమత్తమై డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. డీజిల్ కోసమే తూత్తుకూడి హార్బర్ వద్దకు వచ్చామని ఒకరు, పై-లీన్ తుపాను కారణంగా వచ్చామని మరొకరు భిన్నమైన సమాచారం ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు విచారణను ముమ్మరం చేశారు. తూత్తుకూడి జిల్లా కలెక్టర్ రవికుమార్ నౌకను మంగళవారం తనిఖీ చేశారు. ఇదిలా ఉండగా తూత్తుకూడిలోని మరో వ్యక్తి ద్వారా రహస్యంగా కూరగాయలు, పండ్లు చేరవేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆ నౌకను రక్షణ సిబ్బంది చుట్టుముట్టడంతో సదరు వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సముద్రపు దొంగల నుంచి తమ నౌకలను కాపాడుకునేందుకే మారణాయుధాలను సిద్ధం చేసుకున్నామని నౌకలోని సిబ్బంది అంటున్నారు. అనేక అంశాల్లో నిబంధనలను అతిక్రమించినట్లు భావించిన తూత్తుకూడి హార్బర్ అధికారులు నాలుగు సెక్షన్ల కింద నౌకలోని 25 మందిపై కేసులు పెట్టారు. వీరిలో ఆరుగురు బ్రిటిష్‌వారు, 14 మంది ఈస్టోనియా దేశస్తులు, ఒక ఉక్రెయిన్ వ్యక్తి, నలుగురు భారతీయులు ఉన్నట్లు కోస్ట్ గార్డు రీజియన్ (తూర్పు) చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నౌక అంశంపై భారత్- అమెరికాల మధ్య చర్చలు సాగుతున్నాయి. -
నౌకల యాజమాన్యాల్లో స్పందన కరువు
సేతు సముద్రం ప్రాజెక్ట్‌కు మంగళం పాడే యోచనలో కేంద్రం ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే ఇప్పటివరకు ఖర్చు పెట్టిన రూ.831 కోట్లు వృథా కానున్నాయి. ఒక వేళ ఈ ప్రాజెక్ట్ అమలైనా లాభాన్ని తొమ్మిదేళ్ల తర్వాత చూడాల్సిందే. ఈ వివరాలన్నీ సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చాయి. సాక్షి, చెన్నై: భారత్ నుంచి ఇతర దేశాలకు నౌకాయానం కష్టతరంగా ఉంటోంది. నౌకలు శ్రీలంకను చుట్టి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో 424 నాటికల్ మైళ్లు వృథాగా పయనించాల్సి వస్తోంది. ఇందుకు 30 గంటలు పడుతోంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం సేతు సముద్రం ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.2,447.40 కోట్లు. ఈ పనులను ప్రధాని మన్మోహన్సింగ్ 2005లో ప్రారంభించారు. మూడేళ్లలో పనుల్ని ముగించి 2009 నాటికి నౌకాయానాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా చర్యలు తీసుకున్నారు. మొత్తం 300 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల లోతుతో, 167 కి.మీ దూరం కాలువ తవ్వే పనుల్ని వేగవంతం చేశారు. అయితే రామసేతు వంతెన అడ్డుపడడంతో వ్యవహారం కోర్టుకు చేరింది. పనుల్ని నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆది నుంచి ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్న జయలలిత తాజాగా తన దృష్టిని రామసేతు మీద పెట్టారు. రాముడు నిర్మించిన వంతెనను జాతీయ పురాతన చిహ్నంగా ప్రకటించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. అసెంబ్లీ తీర్మానంతో కోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు. మరోవైపు సేతు ప్రాజెక్టు సాధనే లక్ష్యంగా డీఎంకే ఉద్యమిస్తోంది. ఆది నుంచి అడ్డంకులు ఎదురవుతున్న ఈ ప్రాజెక్ట్‌కు మంగళం పాడేయూలన్న యోచనలో కేంద్రం ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇలా వెలుగులోకి కాంచీపురానికి చెందిన తమిళ ప్రజల సంస్కృతి కళగం నిర్వాహకుడు కె.ఆర్.రవి సేతు సముద్రం ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. ప్రాజెక్ట్ నిర్మాణం, దీని ద్వారా చేకూరే లాభాలు, వాటాలు తదితర వివరాల కోసం సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రరుుంచారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు, వివరణలు ఇస్తూ సేతు సముద్రం ప్రాజెక్ట్ కార్పొరేషన్ ఉన్నతాధికారి నిధి మురళీధరన్ లేఖ పంపించారు. సేతు పనుల కోసం ఇప్పటివరకు రూ. 831.80 కోట్లు ఖర్చయ్యూయని పేర్కొన్నారు. మూడేళ్లలో పనులు ముగించాల్సి ఉందన్నారు. అయితే వ్యవహారం కోర్టులో ఉన్న దృష్ట్యా పనులు ఆగాయని వివరించారు. ఈ ప్రాజెక్ట్ అమలైన పక్షంలో నౌకా యాజమాన్యాలకు ఇంధనం ఖర్చు, ప్రయూణ సమయం తగ్గుతుందని వివరించారు. అయితే ఈ మార్గంలో పయనించేందుకు నౌకాయూన సంస్థలు ఏ ఒక్కటీ ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ అమలైనా లాభాన్ని ఆర్జించేందుకు తొమ్మిదేళ్లు పడుతుంద న్నారు. అలాగే పబ్లిక్ రంగం సంస్థలకు వాటాల్ని పంచేందుకు 22 ఏళ్లు పట్టడం ఖాయమని వివరించారు. ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తే నష్టాలు తప్పవంటూ పరోక్షంగా పేర్కొనడం గమనార్హం. ఈ దృష్ట్యా ప్రాజెక్ట్‌కు స్వస్తి చెప్పేందుకు కేంద్రం మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామసభల్లో తీర్మానాలు సేతు సముద్రం ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలోని సముద్రతీర జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల్లో నిరసన వ్యక్తమవుతోంది. గాంధీ జయంతి రోజున సేతుకు వ్యతిరేకంగా గ్రామసభల్లో తీర్మానం చేయడానికి సముద్రతీర పంచాయతీల పాలక మండళ్లు సన్నద్ధమవుతున్నాయి. అలాగే రాముడి వంతెన, జలజీవరాశులకు నిలయంగా ఉన్న మన్నార్ వలై గుడాను పురాతన చిహ్నాలుగా ప్రకటించాలన్న నినాదాన్ని తెర మీదకు తేనున్నాయి.