Health Department
-
గాజా మృతులు 50 వేలు
డెయిర్ అల్–బలాహ్: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి బలైన వారి సంఖ్య 50 వేలు దాటింది! ఆదివారం గాజా ఆరోగ్య విభాగం ఈ మేరకు ప్రకటించింది. ‘‘మృతుల్లో సగానికి పైగా మహిళలు, చిన్నారులే. 1.13 లక్షల మందికి పైగా క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజా జనాభాలో 90 శాతం మంది నిలువనీడ కోల్పోయారు’’ అని ఆవేదన వెలిబుచ్చింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఇజ్రాయెల్ చేపట్టిన తాజా వైమానిక దాడుల్లో హమాస్ రాజకీయ విభాగం సీనియర్ నేత సహా 23 మంది చనిపోయారు. ఖాన్‌యూనిస్ సమీపంలో దాడుల్లో పాలస్తీనా పార్లమెంట్ సభ్యుడు, తమ రాజకీయ విభాగం సభ్యుడు సలాహ్ బర్దావిల్, ఆయన భార్య చనిపోయినట్లు హమాస్ వర్గాలు ప్రకటించాయి. టెంట్లో ప్రార్థనలు చేస్తున్న సమయంలో వీరిపై దాడి జరిగిందని పేర్కొన్నాయి. హమాస్ రాజకీయ వ్యవహారాలపై తరచూ మీడియాకు బర్దావిల్ ఇంటర్వ్యూలిస్తుంటారు. ఖాన్ యూనిస్‌పై జరిగిన దాడిలో దంపతులతో పాటు వారి ఐదుగురు సంతానం చనిపోయారు. మరో దాడిలో దంపతులు, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయినట్టు యూరోపియన్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరో దాడిలో చనిపోయిన మహిళ, చిన్నారి మృతదేహాలను ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు కువైటీ ఆస్పత్రి నిర్వాహకులు చెప్పారు.మారణహోమమే హమాస్ సాయుధులు 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసి 1,200 మందిని చంపడం, 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లడం తెలిసిందే. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధానికి దిగింది. ఆ ప్రాంతాన్ని శ్మశానసదృశంగా మార్చేసింది. జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ రెండు నెలల ముచ్చటే అయింది. వారం రోజులుగా మళ్లీ గాజాపై దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. -
అనుమతుల్లేని ప్రైవేట్ ఆసుపత్రులపై దృష్టి
సాక్షి,సిటీబ్యూరో: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లపై వైద్యారోగ్యశాఖ దృష్టి సారిస్తోంది. నగర శివారులో జాతీయ సహా పలు రహదారుల ప్రాంతాల్లో పదుల సంఖ్యలో అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రులు వెలుస్తుండటంతో పాటు ఇష్టానుసారంగా రోగుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారం లేకుండా నిర్వహణ.. ఆసుపత్రుల్లో బోర్డులు ఏర్పాటు చేసి ఫీజుల వివరాల పట్టికతో సహా డాక్టర్లు,సిబ్బంది,పడకల సంఖ్య వంటి సమాచారాన్ని పొందుపరచాల్సి ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. వైద్యశాఖ పర్యవేక్షణ కొరవడటమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఒక అనుమతితో మూడు బ్రాంచ్‌లు.. ఒక ఆసుపత్రికి అనుమతి తీసుకుని రెండు, మూడు బ్రాంచ్‌లను నిర్వహిస్తున్నారు. ఎలాంటి పరిశీలన, విచారణ లేకుండానే వైద్యారోగ్యశాఖ అనుమతులు ఇస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. శివారు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో వందల సంఖ్యలో క్లినిక్‌లు, ఆసుపత్రులు ఇలానే నిర్వహిస్తున్నట్లు సమాచారం. అనవసరంగా వైద్య పరీక్షలు.. అవసరం లేకుండా ఇష్టానుసారంగా వైద్యపరీక్షలు చేస్తూ.. పేదల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలున్నాయి. ప్రైవేటు డయాగ్నస్టిక్, అ్రల్టాసౌండ్ సెంటర్లపై ఇటీవల అధికార యంత్రాంగానికి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటించని సెంటర్లపై చర్యలకు జిల్లా వైద్యారోగ్యశాఖ సిద్ధమవుతోంది. బొల్లారంలో క్లినిక్ సీజ్.. తాజాగా శుక్రవారం క్లినికల్ ఎస్టాబ్లిష్మింట్ చట్టాన్ని ఉల్లంఘించిన భవానీ పోలీ క్లినిక్‌ను డీఎంహెచ్ఓ డాక్టరు ఉమాగౌరీ సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. క్లినిక్ నిర్వాహకులు నకిలీ జనరల్ ఫిజీషియన్‌గా అవతారమెత్తి, హైడోస్ యాంటీబయాటిక్స్ రాయడం, ఐవీ ఇన్ఫ్యూషన్లు ఇవ్వడం వంటి అనుచిత వైద్యచర్యలు చేపడుతున్నట్టు సమాచారం. అర్హతలేని వ్యక్తులతో నడుస్తుందన్న ఫిర్యాదుతో డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఇలా.. అలోపతి ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మింట్ చట్టం ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, కన్సల్టెంట్ క్లినిక్‌లు, ఆయుష్ క్లినిక్‌లు, పిజియోథెరఫీ కేంద్రాలు అన్నింటికీ అనుమతి తప్పనిసరి. డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వాహకులతో పాటు పనిచేసే వైద్యుల రిజి్రస్టేషన్ తప్పనిసరిగా ఉండాలి. అగ్నిమాపక, బయోవేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్, మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్‌తో సహా అన్నిరకాల పత్రాలు సరిగ్గా ఉన్నప్పుడే ఆసుపత్రుల ఏర్పాటుకు అనుమతి ఇస్తారు. ఫీజుల వసూళ్లపై... ప్రైవేట్ ,కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఇష్టానుసారంగా ఫీజుల వసూళ్లు మొదలుకుని వైద్య పరీక్షలు తదితర వాటిల్లో దోపిడీని పసిగట్టిన జిల్లా వైద్యారోగ్యశాఖ బోర్డులు ఏర్పాటు చేయాలని వాటికి సూచినలు చేస్తోంది. అనుమతిలేనివి ఎక్కువే.. మేడ్చల్ జిల్లాలో 2,730 పైగా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఉండగా.. ఇందులో రిజిస్ట్రేషన్‌తో సహా వివిధ అనుమతితో కొనసాగుతున్నట్లు ఆసుపత్రులు 1755 మాత్రమే ఉన్నాయి. అనుమతి లేని ప్రైవేట్ ఆసుపత్రులు 975 ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అంచనా వేస్తోంది. అనుమతులు ఉన్న ఆసుపత్రుల్లో 100 కంటే ఎక్కువ పడకలు(బెడ్స్) ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు 48 ఉండగా.. 20 నుంచి 100 పడకలు(బెడ్స్) ఉన్న ఆస్పత్రులు 317 ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంటోంది. 20 పడకలు (బెడ్స్) ఉన్న ఆస్పత్రులు 294 ఉన్నాయి. 712 పాలీక్లినిక్‌లు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, 180 డెంటల్ ఆసుపత్రులు, 46 ఫిజియోథెరపీ సెంటర్లు, 08రిహాబిలిటేషన్ సెంటర్లు, అనుమతి పొందిన స్కానింగ్ సెంటర్లు 628 ఉన్నాయి. అనుమతి లేకుండా 400 వరకు స్కానింగ్ సెంటర్లు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అంచనా. నిబంధనలు పాటించని వాటిపై చర్యలు ప్రభుత్వ నిబంధనలు, ప్రమాణాలు పాటించని ప్రైవేట్ క్లినిక్‌లు, ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లపై నోటీసులు జారీచేసి,సీజ్ చేస్తాం.అధిక ఫీజుల వసూళ్లతో ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేసే ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – డా.ఉమాగౌరీ, డీఎంహెచ్ఓ -
‘అందుకే జీబీఎస్ ఆందోళన ఎక్కువ అయ్యింది’
అమరావతి: మహారాష్ట్రలో ఎక్కువగా జీబీఎస్ (గులియన్ బారే సిండ్రోమ్) కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న కారణంగా ఇక్కడ కూడా ఆందోళన బాగా ఎక్కువగా ఉందన్నారు ఏపీ హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు. పుణే మున్సిపల్ కార్పొరేషన్లో నీటి సరఫరా సరిగ్గా లేని కారణంగా డయేరియా మొదలై జీబీఎస్ సోకిందన్నారు.దీంతో జీబీఎస్ పై భయం పెరిగిందన్నారు. అన్ని ఏరియాల నుంచి జీబీఎస్ వస్తోందని, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ ఒకే చోట ఎక్కువ కేసులు నమోదు కాలేదని, న్యూరో ఫిజిషయన్లు ఎక్కువగా ఉన్న చోట ట్రీట్ మెంట్ బాగా జరుగుతుందన్నారు.‘వెంటిలేటర్లు ఇతర ఐసీయూ సౌకర్యాలు అందుబాటులో ఉంచుతున్నాం.ఏ ఇన్ఫెక్షన్ వచ్చిన వారికైనా జీబీఎస్ వచ్చే అవకాశం ఉంది.. సాధారణ జాగ్రత్తలు అంటే చేతులు కడుక్కోవడం.. శుభ్రంగా ఉండడం. పాటించాలి. కాళ్ళు తిమ్మిర్లు..చచ్చు బడినట్టు ఉండడం....లక్షణాలు. తినలేకపోవడం..మింగ లేకపోవడం.. శ్వాస అడకపోవడం. కూడా వ్యాధి లక్షణాలు. ప్రజలు ఈ అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి.జీబీఎస్ వచ్చిన 85 శాతం కేసులు ఒక్క రోజులోనే. సెట్ అవుతాయి..వెంటిలేషన్ అవసరం అయితే రికవరీ కష్టం అవుతుంది. మొదట చనిపోయిన చిన్న పిల్లవాడి కేస్ లో ఆసుపత్రి మార్చారు...మొదట శ్రీకాకుళం. తర్వాత విశాఖ కేజీహెచ్. దీంతో ఇబ్బంది వచ్చింది. ఎన్టీఆర్ వైద్య సేవలో చికిత్స అందుబాటులో ఉంది’ అని కృష్ణబాబు తెలిపారు. -
అంతటా కడుపు ‘కోతే’!
సాధారణ ప్రసవాల సంఖ్య తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తగ్గుతోంది. కాసుల కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉండగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్లే ఎక్కువగా నమోదవుతున్నాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్లు (Cesarean) పెరిగాయి. సాధారణ ప్రసవాలపై వైద్యారోగ్య శాఖ అధికారులు అవగాహన కల్పించాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు లేవు. గత ప్రభుత్వ హయాంలో సాధారణ ప్రసవాల పెంపునకు మొదలుపెట్టిన మిడ్‌వైవ్స్ (Midwife) సేవలు ఇప్పుడు నామమాత్రమయ్యాయి.అమ్మో సాధారణ ప్రసవమా?సాధారణ ప్రసవాల విషయంలో నొప్పులు అనుభవించాల్సి వస్తుందనే ఉద్దేశంతో కొందరు గర్భిణులు విముఖత చూపుతున్నారు. కొందరు వైద్యులు సిజేరియన్లతో భవిష్యత్‌లో సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. శిశువు తలకిందులుగా ఉన్నప్పుడు, పెద్దగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స అవసరమవుతుంది. అయితే, సాధారణ ప్రసవంతో త్వరగా దినచర్యలో భాగం కావొచ్చని, సిజేరియన్లతో దీర్ఘకాలంలో ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నా, గర్భిణులు, వారి కుటుంబసభ్యులు ఆపరేషన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. మిడ్‌వైవ్స్ అంతంతేప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచేందుకు గత ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే 2019లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మిడ్‌వైవ్స్ సేవలను ప్రారంభించి 30 మందికి శిక్షణ ఇవ్వగా, వీరు గర్భిణులకు సాధారణ ప్రసవంతో లాభాలను వివరించి వ్యాయామాల ద్వారా ప్రసవాలకు సిద్ధం చేసేవారు. ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతతో ఇప్పుడా సేవలు అందుబాటులో లేవు. అవగాహన కల్పించక..గర్భిణిగా నమోదైనప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు ప్రభుత్వ ఆస్ప త్రిలో వైద్య సేవలు పొందితే వారి ఆరోగ్యంపై డాక్టర్లకు అవగాహన ఉంటుంది. అలా కాకుండా డెలివరీ సమయంలోనే వస్తుండడంతో ఏదో ఒక సమస్య తలెత్తగానే ఆపరేషన్ చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా సాధారణ ప్రసవాలతో కలిగే లాభాలపై అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఉంటుందని తెలిసినా, ఆ దిశగా ప్రయత్నించడం లేదు. » భద్రాచలం ఏరియా ఆస్పత్రిని పరిశీలిస్తే షిఫ్ట్‌కు ఎనిమిది మంది చొప్పున మూడు షిఫ్ట్‌ల్లో 24 మంది సిబ్బంది ఉండాలి. కానీ ఐదుగురే ఉన్నారు.» ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏరియా ఆస్పత్రిలోనూ 8 నెలలుగా మిడ్‌వైవ్స్ సేవలు నామమాత్రమయ్యాయి. ఇక్కడ నలుగురు సిబ్బంది చేయాల్సిన మిడ్‌వైవ్స్ సేవలు ఇద్దరే చేస్తున్నారు. కుటుంబ సభ్యుల సహకారంఉండటం లేదు.. ప్రసవం కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోచేరిన గర్భిణులకు సాధారణ ప్రసవం చేసేందుకే ప్రయత్నిస్తున్నాం, కానీ వారి కుటుంబసభ్యులనుంచి సహకారం ఉండటం లేదు. గర్భిణి కొద్దిసేపు నొప్పులు తట్టుకోలేకపోవడంతో కుటుంబ సభ్యులు మాపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గుతోంది. - డాక్టర్ రామకృష్ణ, సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి, భద్రాచలం.బిడ్డకు హార్ట్‌బీట్ ఎక్కువగా ఉందని.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన సత్యవతికి గతనెల 31న పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకొస్తే పరీక్షలు చేసిన వైద్యులు బిడ్డ హార్ట్‌బీట్ ఎక్కువగా ఉందని చెప్పారు. ఆ వెంటనే ఆపరేషన్‌కు నిర్ణయించి సత్యవతికి సిజేరియన్ చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది.- సత్యవతి,మణుగూరు,భద్రాద్రికొత్తగూడెం జిల్లా -
నకిలీ వైద్యానికి ముకుతాడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ వైద్యులు, ఆసుపత్రులపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) సిద్ధమైంది. ఎలాంటి సదుపాయాలు లేకపోయినా వైద్యం పేరిట పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్న ఆసుపత్రులతో పాటు ఎంబీబీఎస్ డాక్టర్ల పేరిట, స్పెషలిస్ట్ వైద్యులుగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నవారి ఆట కట్టించేందుకు రంగంలోకి దిగింది. ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న విజిలెన్స్ బృందాలకు తోడు ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఒక మెడికల్ టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. వరంగల్, నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ బృందాలు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, విచారణ జరిపి, అవసరమైన చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నాయి. ఒక్కో టీంలో 30 మంది వైద్యులు టీజీఎంసీ మెడికల్ టాస్క్‌ఫోర్స్ ఒక్కో బృందంలో దాదాపు 30 మంది స్పెషలిస్టు డాక్టర్లు ఉంటారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (తానా), హెల్త్‌కేర్ రిఫారŠమ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ), తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ)లకు చెందిన డాక్టర్లు ఇందులో ఉంటారు. మెడికల్ అండ్ హెల్త్, డ్రగ్ కంట్రోల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పోలీస్ ఆధికారులు, న్యాయవాదులు, ఎన్జీవోల ప్రతినిధులు, జర్నలిస్టులను సైతం ఈ బృందాల్లో భాగస్వాములను చేస్తున్నారు. ఎక్కడికక్కడ నిఘా నకిలీ వైద్యులు, ఆసుపత్రులపై ఎక్కడికక్కడ నిఘా పెట్టేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాల్లో కీలక రంగాలవారికి అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విజిలెన్స్ టీంలు క్రియాశీలంగా పనిచేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయికి వెళ్లడం లేదు. టీజీఎంసీ బృందాల ద్వారా క్షేత్రస్థాయి వరకు నిఘా ఉంటుందని భావిస్తున్నారు. గ్రామాల్లోని ఆర్ఎంపీలు, ప్రాథమిక చికిత్స క్లినిక్‌లు, అంబులెన్స్ సర్వీస్‌లు నడిపేవారు పట్టణాల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు దళారులుగా వ్యవహరిస్తున్న అంశాన్ని టీజీఎంసీ సీరియస్‌గా పరిగణిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు విజిలెన్స్ బృందాల తనిఖీల్లో 400 మంది నకిలీ డాక్టర్లు, ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. -
3 వైరస్ల ముప్పు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు వెలుగుచూశాయి. ఈ వైరస్ పాతదే అయినప్పటికీ అది సోకితే వచ్చే వ్యాధుల ప్రభావం పిల్లలు, వృద్ధుల్లో అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది. చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తిపై ఈ ఏడాది మొదటివారంలో ఈ సంస్థ అధ్యయనం చేసింది. చైనాతోపాటు, భారత్‌లో వైరస్ వ్యాప్తి గురించి వివరిస్తూ తాజాగా నివేదిక విడుదల చేసింది. హెచ్ఎంపీవీతోపాటు ఇన్ఫ్లుయెంజా, ఆర్‌ఎస్‌వీల వ్యాప్తి కూడా పెరిగినట్లు వెల్లడించింది.పాతవే.. అయినా జాగ్రత్త ముఖ్యం..మనదేశంలో హెచ్ఎంపీవీ 2015 – 2017 మధ్య కాలంలో వ్యాప్తి చెందినట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 60 ఏళ్లలోపు వయ సున్న ప్రతి లక్ష మందిలో సగటున 220 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. 60–74 ఏళ్ల మధ్య వయస్కుల్లో వైరస్ వ్యాప్తి వేగంగా ఉంది. 80 ఏళ్లకు పైబడిన వారిలో రెట్టింపు స్థాయిలో ఉంది. 2018లో ప్రపంచవ్యాప్తంగా 1.1 కోట్ల హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.వీరిలో ఆస్పత్రిలో చేరిన వారి రేటు 5% ఉండగా, మరణాల రేటు ఒకశాతం ఉంది. హెచ్ఎంపీవీతోపాటు ఇన్ఫ్లుయెంజా, ఆర్‌ఎస్‌వీలు యువకుల్లో పెద్దగా ప్రభావం చూపవని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. నాలుగేళ్లలోపు చిన్నారులు, 60 సంవత్సరాలు పైబడినవారిలో వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని వెల్లడించింది. 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు వారిలో వైరస్‌ను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉందని పేర్కొంది.న్యుమోనియా ప్రమాదం..హెచ్ఎంపీవీ, ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్వీ వైరస్లు సోకినప్పుడు అత్యధికుల్లో రోగ నిరోధక శక్తి క్రియాశీలమై వైరస్‌ను జయిస్తున్నారు. అయితే, ఇన్‌పేషెంట్ కేటగిరీ రోగుల్లో ఇన్ఫ్లుయెంజా బారిన పడిన వారు 30 శాతం ఉండగా, హెచ్ఎంపీవీతో 6.2 శాతం, ఎడినో వైరస్‌తో 3.7 శాతం, రినో వైరస్‌తో 4.9 శాతం ఆసుపత్రుల పాలవుతున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. శ్వాస, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలున్న వారికి ఈ వైరస్లు హాని తలపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా దగ్గు, జలుబు ఉన్న వారిలో ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరుతుందని, అది క్రమంగా న్యుమోనియాకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.జాగ్రత్తలు పాటించాలిచిన్న పిల్లల్లో, వృద్ధుల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉండడంతో బయ టి వ్యక్తులతో ఎక్కువగా కలువొద్దు. కోవిడ్– 19 సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించ డంతో వైరస్ వ్యాప్తి తగ్గింది. దీంతో వాటికి సంబంధించిన యాంటిబాడీస్ క్షీణించాయి. ఇప్పుడు వైరస్ వ్యాప్తితో సమస్యలు వస్తు న్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలిక సమస్యలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలున్నవారు వైద్యడి సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్ తీసు కోవడం మంచిదే. – డాక్టర్ కిరణ్ మాదల,క్రిటికల్ కేర్ హెచ్ఓడీ, గాంధీ మెడికల్ కాలేజీ -
చైనాలో వైరస్ విజృంభణ.. కేంద్ర వైద్యారోగ్యశాఖ కీలక ప్రకటన
ఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన మహా విలయం ఇంకా ఎవరూ మర్చిపోనేలేదు. నాటి మరణాలు, పరిస్థితులు ఇప్పటికీ భయపెడుతూనే ఉన్నాయి. ఇంతోనే చైనాలో మరో వైరస్ వ్యాప్తి ఆందోళన రేపుతోంది. చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయి. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.ఈ క్రమంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అధ్యక్షతన శనివారం జాయింట్ మానిటరింగ్ గ్రూప్ (JMG) సమావేశం నిర్వహించారు. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికి భారత్‌లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సమావేశంలో నిపుణులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా వైరస్ కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపింది.ఇదే సమయంలో చైనా పరిస్థితులను డబ్ల్యూహెచ్‌వో(WHO) కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు స్పష్టం చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్ఎంపీవీ వైరస్ టెస్టింగ్ లేబొరేటరీలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియను ఐసీఎంఆర్ పర్యవేక్షిస్తుందని తెలిపింది. శీతాకాలంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్‌ఫ్లూయెంజా, ఆర్ఎస్వీ, హెచ్ఎంపీవీ తరహా వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని జేఎంజీ తేల్చింది.ఇక, చైనాలో వైరస్ కారణంగా భారత్‌లో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే వివిధ చోట్ల ఆర్ఎస్ఏ, హెచ్ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధుల అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అలాగే, మన దేశంలో ఈ వైరస్ ఆనవాళ్లు ఇప్పటిదాకా బయటపడలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే ఆసుపత్రిలో చేరి పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. మరోవైపు.. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు సమూహాలకు దూరంగా ఉండాలని తెలిపింది. కాగా, చైనాలో వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరిగింది. ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో, ఆసుపత్రులన్నీ పేషంట్స్‌తో నిండిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. Chinese hospitals experiencing a surge in Human Metapneumovirus (HMPV) infections. Reports and online posts indicate widespread transmission, with some claiming hospitals and crematories are overwhelmed pic.twitter.com/1FDyQuGr2X— News Rated (@NewsRated) January 4, 2025 -
డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా వైద్య విధాన పరిషత్
సాక్షి, హైదరాబాద్: డాక్టర్లు, నర్సులు, ఇతర మెడి కల్ స్టాఫ్ ప్రభుత్వం ద్వారా నియమించబడి.. ప్రభుత్వ ఆసుపత్రు ల్లోనే పనిచేస్తారు. వారికి జీత భత్యాల కోసం ప్రభుత్వమే నిధులిస్తుంది. పదవీ విరమణ తరువాత పెన్షన్ కూడా ప్రభుత్వమే ఇస్తుంది. కానీ, వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించే ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ ద్వారా జతభత్యాలు పొందుతూ.. ప్రభుత్వం తర ఫున పనిచేసే తెలంగాణ వైద్య విధాన పరిషత్ (వీవీపీ) ఉద్యోగులు వీరు. తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్నో ఏళ్లుగా వీరు ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు వారి కోరిక నెరవేర బోతున్నది. సుమారు 40 ఏళ్లుగా ప్రభుత్వంలో ప్రత్యేక కేటగిరీగా కొనసాగుతన్న వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వ శాఖగా గుర్తించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోకి వీవీపీని తీసుకొని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చాలని సంకల్పించింది. ఈ మేరకు త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.సీహెచ్‌సీ నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వీవీపీ పరిధిలోనే..రాష్ట్రంలో వీవీపీ పరిధిలో కింగ్‌కోఠి, కరీంనగర్, ఖమ్మం, సంగారెడ్డి, నల్లగొండ జిల్లా ఆసుపత్రులతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, మెటర్నల్ చైల్డ్ హెల్త్ సెంటర్లు సహా175 వరకు ఉన్నా యి. ఈ ఆసు పత్రుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర స్టాఫ్‌కు సాంకేతికంగా ప్రభుత్వం నుంచి నేరుగా జీతభత్యాలు అందవు. వీవీపీ కింద సుమారు 11 వేల మందికిపైగా ఉద్యో గులు పనిచేస్తు ండగా, వీరికి చెల్లించే జీతాలకు పే స్కేల్ కనిపించదు. ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఏటా కేటాయించే మొత్తాన్ని నెలనెలా వేతనాల కోసం సర్దు బాటు చేస్తారు. తమను ప్రభుత్వ ఉద్యోగు లుగా గుర్తించాలని కొంతకాలంగా కోరుతున్నారు. కొద్దిరోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహను కలిసి ఈ మేరకు విన్నవించడంతో ఫైలు కదిలింది. త్వరలో ఉత్తర్వులు.. వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా వైద్యారోగ్య శాఖలోకి తీసుకోవాలనే ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం.. ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అడ్మిని్రస్టేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి)ని కోరారు. ఆస్కి ఇటీవలే ప్రభు త్వానికి నివేదిక సమర్పించింది. మంత్రి రాజనర్సింహ ఉన్నతాధికారులతో సమావేశమై ఈ నివేదికపై ఇటీవల చర్చించారు. ఆ తర్వాత వీవీపీని వైద్యారోగ్య శాఖలో సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలోకి తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రోగుల నుంచి వసూలు చేసే యూజర్ చార్జీల నుంచి జీతాలు చెల్లించే విధానాన్ని రద్దుచేసి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో వీవీపీ ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా జీతభత్యాలు చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఏపీలో ఇప్పటికే వీవీపీని ప్రభుత్వంలో విలీనం చేశారు. మా పోరాటం ఫలించిందివీవీపీని వైద్యారోగ్య శాఖ పరిధిలోకి తీసుకొని సాంకేతికంగా మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గత కొంతకాలంగా పోరాడుతున్నాం. రెండున్నరేళ్ల నుంచి అన్ని ఉద్యోగ సంఘాలతో జేఏసీగా ఏర్పడి పోరాటాన్ని తీవ్రతరం చేశాం.రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిసి 12 వేలకు పైగా ఉన్నాం. ప్రభు త్వం వైద్యారోగ్య శాఖలోకి విధాన పరిషత్‌ను తీసుకోవాలని భావిస్తుండడం శుభ పరిణామం. మా పోరాటానికి ఫలితం దక్కింది. – డాక్టర్ వినయ్ కుమార్, జేఏసీ చైర్మన్ -
Bihar: మరో ప్రశ్నాపత్రం లీక్.. సీహెచ్ఓ పరీక్ష రద్దు
పట్నా: బీహార్ రాష్ట్ర ఆరోగ్య కమిటీ డిసెంబర్ ఒకటిన నిర్వహించిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ) పరీక్ష రద్దయ్యింది. ఈరోజు (డిసెంబర్ 2)న జరగాల్సిన పరీక్ష కూడా రద్దయింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ పరీక్షల తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తారు.సీహెచ్ఓ పరీక్ష పేపర్ లీక్‌కు కొన్ని ముఠాలు పాల్పడినట్లు పట్నా పోలీసులకు ఇన్పుట్ అందింది. వీటి ఆధారంగా పట్నా పోలీసులు ఆదివారం అర్థరాత్రి పలు ఆన్లైన్ పరీక్షా కేంద్రాలపై దాడి చేశారు. ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ తర్వాత ఈ పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. పట్నా పోలీసు బృందం ఆదివారం ఏకకాలంలో 12 ఆన్లైన్ కేంద్రాలపై దాడులు చేసింది. రామకృష్ణనగర్తో పాటు పలు కేంద్రాలకు చెందిన 12 మందిని ఈ బృందం అదుపులోకి తీసుకుంది. రెండు కేంద్రాలను పోలీసులు సీజ్ చేశారు.పోలీసులు ఈ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి నలుగురిని విచారిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ పరీక్షకు సంబంధించిన ఆడియో, వాట్సాప్ చాట్ వైరల్ గా మారింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ఆరోగ్య కమిటీ ఎస్ఎస్పీకి లేఖ రాసి దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో ఆదివారం పరీక్షకు ముందు నుంచే పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. బీహార్‌లో గతంలో పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి.ఇది కూడా చదవండి: Pollution Control Day: భోపాల్ గ్యాస్ లీకేజీ విషాదాన్ని గుర్తు చేస్తూ.. -
క్యాడర్‌ను బట్టి లంచం!
సాక్షి, అమరావతి: ప్రసూతి సెలవుల ఆమోదం కోసం రూ.10 వేలు తీసుకున్నారని ఓ మహిళా వైద్యురాలు... రూ.4 వేలు లంచం ఇస్తే గానీ ఎస్ఆర్ నమోదు చేయలేదని మరొక మెడికల్ ఆఫీసర్... రూ.10 వేలు ముట్టజెప్పాకే ప్రొబేషన్ డిక్లరేషన్(రెగ్యులరైజేషన్) చేశారని ఇంకొకరు... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ డీఎంహెచ్‌వో కార్యాలయం అవినీతిపై మెడికల్ ఆఫీసర్ (ఎంవో)లు అధికారిక వాట్సాప్ గ్రూప్‌లోనే తమ ఆవేదనను వ్యక్తంచేయడం వైద్యశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొందని ఓ వైద్యుడు ఆవేదన వ్యక్తంచేస్తూ మాట్లాడిన ఆడియో మెసేజ్ శుక్రవారం వైద్యశాఖ వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేసింది. డాక్టర్, నర్స్, ల్యాబ్ టెక్నీషియన్... ఇలా క్యాడర్, పనిని బట్టి డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో రేట్లు ఖరారు చేసి లంచాలు వసూలు చేస్తున్నారని ఆ వైద్యుడు చెప్పారు. ఆఖరికి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కింద పని చేసే చిరుద్యోగులను సైతం లంచాల కోసం జలగల్లా పట్టి పీడిస్తున్నారని ధ్వజమెత్తారు. పైగా తాము తీసుకుంటున్న ప్రతి రూపాయిలో కొంత డీహెచ్ కార్యాలయానికి ముట్టజెప్పాలని జిల్లా కార్యాలయాల్లో చెబుతున్నారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మెడికల్ ఆఫీసర్లతో డీఎంహెచ్‌వో మంతనాలు! తన కార్యాలయ అవినీతి తంతు బట్టబయలు కావడంతో ఉలిక్కిపడ్డ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ డీఎంహెచ్‌వో... కొందరు మెడికల్ ఆఫీసర్లను తన కార్యాలయానికి పిలిపించుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారని తెలిసింది. తనకు తెలియకుండానే కింది స్థాయి ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇకపై అలా జరగకుండా చూస్తానని డీఎంహెచ్‌వో బతిమిలాడినట్లు సమాచారం. అదేవిధంగా వసూలు చేసిన ప్రతి రూపాయిని తిరిగి చెల్లించేలా చూస్తానని, ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలని ప్రాథేయపడినట్లు తెలిసింది. మెడికల్ ఆఫీసర్లు సైతం పీహెచ్‌సీల వారీగా అవినీతి వ్యవహారంపై ఫిర్యాదులు స్వీకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. డీఎంహెచ్‌వో కార్యాలయం అవినీతిపై ఎంవోలు జిల్లా స్థాయి అధికారులు ఉండే వాట్సాప్ గ్రూప్‌లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగినా... ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు తేలికగా తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ట్రంప్ టీమ్‌లోకి మరో భారతీయుడు..ఎన్ఐహెచ్ హెడ్‌గా భట్టాచార్య
వాషింగ్టన్:రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తన టీమ్‌లో వరుసగా ఒక్కొక్కరిని నియమిస్తున్నారు. తాజాగా అమెరికా హెల్త్‌సైన్సెస్ పరిశోధనలకు కీలకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) డైరెక్టర్‌గా భారతీయుడైన డాక్టర్ జే భట్టాచార్యను నియమించారు. అమెరికాలో మెడికల్ సైన్సెస్‌లో కీలక పరిశోధనలు చేసే మొత్తం 27 సంస్థలకు ఎన్ఐహెచ్ నుంచే నిధులు కేటాయిస్తారు. ఎన్ఐహెచ్ ఏడాది బడ్జెట్ రూ. 4 లక్షల కోట్ల దాకా ఉంటుందంటే దాని ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. భట్టాచార్య ప్రస్తుతం స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.భట్టాచార్య 1968లో కోల్‌కతాలో జన్మించి అమెరికా వెళ్లారు. కొవిడ్ సమయంలో జో బైడెన్ ప్రభుత్వ పాలసీని తీవ్రంగా విమర్శించిన భట్టాచార్య రిపబ్లికన్లకు దగ్గరయ్యారు. కాగా,ఇటీవలే ట్రంప్ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా ఆర్ఎఫ్కెన్నెడీ జూనియర్ నియమితులైన విషయం తెలిసిందే.ఇప్పటికే భారత సంతతి వ్యాపారవేత్త వివేక్‌రామస్వామి ట్రంప్ టీమ్‌లో ఇలాన్ మస్క్‌తో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డీవోజీఈ) హెడ్ పదవికి ఎంపికైన విషయం తెలిసిందే. -
వ్యాక్సిన్ వ్యతిరేకితో భారత్‌కు నష్టం?
అమెరికా అధ్యక్షపీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధిరోహించనున్నారు. ఇప్పటికే తన వద్ద పనిచేసే మంత్రులను నియమిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఆరోగ్య, ప్రజా సేవల మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమకారుడు రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనియర్‌ను నియమించనున్నట్లు ప్రకటించారు. అయితే ఇందుకు సెనెట్‌లో ఆమోదం లభించాల్సి ఉంటుంది. అమెరికాకు అత్యధికంగా భారత ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఈ తరుణంలో కెనెడీ నియామకం పట్ల భారత కంపెనీలు కొంత ఆందోళన చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.‘ప్రజారోగ్యం విషయంలో మందుల కంపెనీల మోసాలు, తప్పుడు సమాచారం తదితరాలతో అమెరికన్లు చాలాకాలంగా నలిగిపోయారు. కెనెడీ వీటికి అడ్డుకట్ట వేసి అమెరికాను మళ్లీ గొప్పగా, ఆరోగ్యంగా మారుస్తారు. ఔషధాలు, వ్యాక్సిన్లు, ఆహార భద్రత, వైద్య పరిశోధన, సామాజిక భద్రత, మెడికేర్ వంటి కీలక వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు’ అని ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు.2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 7.55 బిలియన్ డాలర్లు (రూ.62,615 కోట్లు) విలువ చేసే ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. యాంటిసెరా, వ్యాక్సిన్లు, టాక్సిన్లు, గ్రంథులు.. వంటి వాటిని ఎగుమతి చేస్తున్నారు. అమెరికాకు ఎగుమతి చేసే దేశీయ కంపెనీల్లో ప్రధానంగా సన్ ఫార్మాస్యూటికల్స్, సిప్లా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, లుపిన్ లిమిటెడ్.. వంటి కంపెనీలున్నాయి. వీటితోపాటు ప్రధానంగా కరోనా సమయం నుంచి ‘వ్యాక్సిన్ మైత్రి’లో భాగంగా దేశీయంగా తయారైన కొవాక్సిన్, కొవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు అమెరికాకు భారీగా ఎగుమతి చేస్తున్నారు. ఆరోగ్య మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేకిగా ఉన్న కెనెడీ నియామకం ఫార్మా కంపెనీల్లో కొంత ఆందోళన కలిగిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రియల్టీ జోరు!‘మేక్ అమెరికా హెల్దీ అగైన్’ నినాదానికి కెనెడీ పూర్తిగా న్యాయం చేస్తారని ట్రంప్ విశ్వాసం వెలిబుచ్చారు. తన రెండో విడత పాలనలో ప్రజారోగ్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కెనెడీకి పూర్తి స్వేచ్ఛనిస్తానని ట్రంప్ పదేపదే చెప్పుకొచ్చారు. టీకాలు తదితరాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తికి ఏకంగా ఆరోగ్య శాఖ అప్పగించడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, నిబంధనల ప్రకారం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యూఎస్ ఎఫ్‌డీఏ) ధ్రువపరిచిన ఫార్మా ఉత్పత్తుల ఎగుమతికి ఎలాంటి ఢోకా లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. -
గుర్లలో కలరా!
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా గుర్లలో 14 మంది మరణించడంతో పాటు, వందల సంఖ్యలో బాధితులు ఆస్పత్రులపాలవ్వడానికి కారణం కలరా అని తెలుస్తోంది. బాధితుల నుంచి సేకరించిన నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా కలరా ఆనవాళ్లను గుర్తించినట్టు సమాచారం. వైద్య శాఖ నియమించిన ర్యాపిడ్ రియాక్షన్ టీమ్ సైతం ఈ అంశాన్ని ధ్రువీకరిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది. గుర్లలో చోటు చేసుకున్న మరణాలను దాచినట్లుగానే, సమస్యకు కారణాలను సైతం బయటకు పొక్కకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆస్పత్రిలో చేరిన కొందరు బాధితుల నుంచి నమూనాలు సేకరించి.. విజయనగరం వైద్యకళాశాల ల్యాబ్‌లో పరీక్షించారు. కల్చర్ టెస్ట్‌లో విబ్రియో కలరా ఆనవాళ్లను గుర్తించినట్టు తెలిసింది. పూర్తి స్థాయిలో నిర్ధారణ కోసం కోల్‌కతాలోని ల్యాబ్‌కు పంపినట్టు సమాచారం. కలరా సోకిన వారిలో తీవ్ర స్థాయిలో విరోచనాలు అవుతాయి. దీంతో తొందరగా శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి బాగా నీరసించిపోతారు. ఆపై కిడ్నీల పనితీరుపై ప్రభావం పడి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో మరణాలు సంభవిస్తాయని వైద్యులు చెబుతున్నారు. -
అందరికీ సంతాన భాగ్యం!
రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ దవాఖాన్లలో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకు ఇది ఓ రకంగా శుభవార్త అని డాక్టర్లు చెబుతున్నారు. సంతానం కోసం అనేకమంది దంపతులు ఐవీఎఫ్ సెంటర్లను ఆశ్రయిస్తూ లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ పేరిట ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి మరీ బాధితుల వద్ద రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. రూ. 50 నుంచి రూ. 80 వేల ఖర్చులో పూర్తయ్యే ఐవీఎఫ్ చికిత్సకు, రూ.3 నుంచి రూ.6 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇంత ఖర్చు చేస్తున్నా, సగం మందికి ఫలితం దక్కడం లేదు. కానీ, ప్రైవేట్ ఆస్పత్రులు మార్కెటింగ్ ట్రిక్స్‌తో బాధిత దంపతులను మభ్యపెట్టి లక్షల్లో దండుకుంటున్నాయి. –సాక్షి, హైదరాబాద్పెరుగుతున్న ఇన్ఫర్టిలిటీ సమస్యలురాష్ట్రంలో యువతకు సంతాన సమస్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రతి వంద జంటల్లో 30 నుంచి 40 జంటలు ఏదో ఒక స్థాయి ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. ప్రభుత్వ దవాఖాన్లలో ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ అందించే సౌకర్యాలు లేకపోవడం, ప్రైవేట్ ఆస్పత్రులు రూ.లక్షల్లో చార్జీలు వసూలు చేస్తుండడంతో ఎంతో మంది మానసికంగా, ఆర్థికంగా కుంగిపోతున్నారు. మారిన జీవనశైలితో ఆడ, మగ ఇద్దరిలోనూ ఇన్ఫర్టిలిటీ సమస్యలు పెరిగాయని వైద్య,ఆరోగ్యశాఖ అంచనా వేస్తుంది. పిల్లలు పుట్టకపోవడంతో కొత్త జంటలు మానసిక వేదనను అనుభవిస్తున్నాయి. ఈ సమస్య తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ దవాఖాన్లలో ఫర్టిలిటీ సెంటర్లు పెడుతామని 2017లో అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 2023 వరకూ ఒక్క గాం«దీలో మాత్రమే ఫర్టిలిటీ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అందులో సౌకర్యాలు కల్పించలేదు. నెల రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి వెళ్లిన మంత్రి దామోదర దృష్టికి ఈ విషయాన్ని అధికారులు తీసుకొచ్చారు. దీంతో ఆయన ఎంబ్రయాలజిస్ట్‌ను నియమించాలని, అవసరమైన పరి కరాలు, మెడిసిన్ కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్య తీవ్రత దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలను అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. -
వైద్య, ఆరోగ్యశాఖలో మరో 371 పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో కొలువుల జా తర కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 7,300 పోస్టులను భర్తీ చేయగా...మరో 6,500 పో స్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో 272 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు, 99 ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సరీ్వసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నెల 18న విడుదల చేసిన 2,050 నర్సింగ్ ఆఫీ సర్ పోస్టులకు, ఈ 272 పోస్టులు అదనం అని నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో మొత్తం నర్సింగ్ ఖాళీల సంఖ్య 2,322కు పెరిగింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలవగా, ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు చివరి గడువుగా పేర్కొంది. నవంబర్ 23న ఆన్లైన్లో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) రాత పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తంగా 732 ఫార్మసిస్ట్ పోస్టులు: గత నెల 24న 633 ఫార్మసిస్ట్(గ్రేడ్ 2) పోస్టులకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖా స్తుల ప్రక్రియ మొదలైంది. ఇదే నోటిఫికేషన్‌కు అదనంగా మరో 99 పోస్టులను జత చేస్తున్నామని, మొత్తం పోస్టు ల సంఖ్య 732కు పెరిగిందని తెలుపుతూ శుక్రవారం బోర్డు ప్రకటించింది. ఈ పోస్టులకు అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచి్చంది. నవంబర్ 30న ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. జోన్లు, కేటగిరీలవారీగా ఖాళీల సం ఖ్యను బోర్డు వెబ్సైట్ https://mhsrb.telangana.gov. in/MHSRB/home.htm లో అందుబాటులో ఉంచారు. -
దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు
తిరువనంతపురం: ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ (ఎంపాక్స్) భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. ఎర్నాకుళం జిల్లాలో ఈ కేసు వెలుగుచూసినట్లు శుక్రవారం ఆ రాష్ట్ర వైద్య శాఖ ధ్రువీకరించింది. కేరళ ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం. .ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల్లోమంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారించారు. వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తేలింది. బాధితుడికి సోకిన ఎంపాక్స్ వైరస్ జాతి ఇంకా వెలుగులోకి రాలేదు. అంతకుముందు సెప్టెంబర్ 18 న, యూఏఈ నుండి ఇటీవల కేరళ మలప్పురం జిల్లాకు వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అతడికి వైద్య పరీక్షలు చేయగా పాజిటీవ్ వచ్చింది. దీంతో కేరళలో తొలి మంకీ పాక్స్ కేను నిర్ధారణైంది. తాజాగా రెండో కేసు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. మంకిపాక్స్ కేసులు నమోదు దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.చదవండి : మంకీపాక్స్ వైరస్ లక్షణాలు -
1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వైద్య,ఆరోగ్యశాఖలో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్విసెస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి ఆ వివరాలు వెల్లడించారు. అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అక్టోబర్ ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడువు విధించారు. దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని ఎడిట్ చేసుకునేందుకు అదే నెల ఐదో తేదీ నుంచి ఏడో తేదీ వరకు అవకాశం కల్పించారు. నవంబర్ 10వ తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఉంటుందని గోపీకాంత్‌రెడ్డి వెల్లడించారు. వయో పరిమితి 46 సంవత్సరాలుగా పేర్కొన్నారు. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే రాత పరీక్షలు రెండు, మూడు సెషన్లో నిర్వహిస్తారు. పరీక్ష పేపరు ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. » మొత్తంగా 1,284 పోస్టులుండగా, అందులో 1,088 ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) విభాగంలో, మరో 183 తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో, మరో 13 హైదరాబాద్ ఎంఎన్‌జే ఆస్పత్రిలో ఉన్నాయి. » ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ), వైద్య విధాన పరిషత్ విభాగంలోని పోస్టులకు పేస్కేల్ రూ.32,810– రూ.96,890. » ఎంఎన్‌జే ఆస్పత్రిలోని పోస్టులకు పేస్కేల్ రూ.31,040–రూ.92,050. ముఖ్యాంశాలు...»అన్ని పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల పరీక్ష కేంద్రాలుంటాయి. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట. » ఆన్లైన్ పరీక్ష ఫీజు రూ.500, ప్రాసెసింగ్ ఫీజు రూ.200 » మెరిట్ జాబితాను బోర్డు వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. » విద్యార్హతలు: అభ్యర్థులు ల్యాబ్ టెక్నిïÙయన్ కోర్సు చేసి ఉండాలి. ఎంఎల్ ఒకేషనల్, ఇంటర్మీడియట్లో ఎంఎల్ ఒకేషనల్ చేసి ఒక ఏడాది క్లినికల్ శిక్షణ పొందిన వారూ అర్హులే. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నిïÙయన్ కోర్సు(డీఎంఎల్డీ), బీఎస్సీ (ఎంఎల్), ఎంఎస్సీ (ఎంఎల్టీ), డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ (క్లినికల్ పాథాలజీ) టెక్నిïÙయన్ కోర్సు, బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యా»ొరేటరీ టెక్నాలజీ(బీఎంఎల్టీ) పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యా»ొరేటరీ టెక్నాలజీ, పీజీ డిప్లొమో ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ, బీఎస్సీ(మైక్రోబయాలజీ), ఎంఎస్సీ (మైక్రోబయాలజీ) ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ చేసినవారు ఈ పోస్టులకు అర్హులు » పోస్టుల నియామక ప్రక్రియ వంద పాయింట్ల ప్రాతిపదికగా భర్తీ చేస్తారు. రాత పరీక్షకు 80 మార్కులు, మిగిలినవి వెయిటేజీ కింద కలుపుతారు. అభ్యర్థులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తే వెయిటేజీ కింద 20 పాయింట్లు కేటాయిస్తారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో కనీసం ఆరు మాసాలకు పైగా వైద్యసేవలందిస్తే 2.5 పాయింట్లు కేటాయిస్తారు. గిరిజనేతర ప్రాంతాల్లో అయితే ప్రతీ ఆరు నెలలకు 2 పాయింట్లు ఇస్తారు. కనీసం ఆరు నెలలు పనిచేస్తేనే వెయిటేజీ మార్కులొస్తాయి. » నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి వెయిటేజీ కటాఫ్ తేదీగా నిర్ణయించారు. » కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ అభ్యర్థులు అనుభవపూర్వక ధ్రువీకరణపత్రాన్ని వారు విధులు నిర్వర్తిస్తున్న ఆస్పత్రుల నుంచే తీసుకోవాలి. » మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఠీఠీఠీ.ఝజిటటb. ్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను సందర్శించాలి. -
నైట్ పెట్రోలింగ్ ఉండాలి
న్యూఢిల్లీ: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై రేప్, హత్య ఘటనసహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందిపై లైంగికదాడుల ఘటనలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. వైద్య సిబ్బంది భద్రతకు ఆస్పత్రుల్లో అమలుచేయాల్సిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం బుధవారం జారీచేసింది. బుధవారం వర్చువల్ విధానంలో జరిగిన నేషనల్ టాస్క్ ఫోర్స్ భేటీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర, ప్రధాన కార్యదర్శలు, డీజీపీలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భేటీలో సూచించిన మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి..→ పెద్ద ఆస్పత్రుల్లో జనం పెద్దగా తిరగని చోట్ల, చీకటి ప్రాంతాలు, మూలగా ఉండే చోట్ల సీసీటీవీలు బిగించాలి→ ఆస్పత్రుల్లో భద్రతపై జిల్లా కలెక్టర్లు, డీఎస్పీలు, జిల్లా ఆస్పత్రి యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి తగు సెక్యూరిటీ ఏర్పాట్లు చూసుకోవాలి→ సెక్యూరిటీ, ఇతర సిబ్బందిని భద్రతా తనిఖీలు చేయాలి→ రాత్రుళ్లు అన్ని ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో సెక్యూరిటీ పెట్రోలింగ్ తరచూ జరుపుతుండాలి→ పెద్ద జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటుచేయాలి. సీసీటీవీలను ఎప్పటికప్పుడు చెక్చేస్తూనే డాటాను కూడా తరచూ బ్యాకప్ తీసుకోవాలి→ అత్యవసర కాల్స్‌కు స్పందించి కంట్రోల్ రూమ్, సెక్యూరిటీ, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలి. కాంట్రాక్ట్ సెక్యూరిటీ సిబ్బంది శారీరకదారుఢ్యం మెరుగు కోసం వారికి శిక్షణ ఇప్పించాలి→ రోగులను స్ట్రెచర్, ట్రాలీ, చక్రాల కుర్చీల్లోకి మారుస్తూ ఎక్కువ మంది బంధువులు ఆస్పత్రుల్లో పోగుబడుతున్నారు. వీరి సంఖ్యను తగ్గించేందుకు ఆస్పత్రులే ఈ పనులకు తగు సిబ్బందిని నియమించాలి→ వైద్యారోగ్య సిబ్బంది రక్షణ కోసం ఉన్న భారతీయ న్యాయ సంహిత చట్టాలు, వారిపై దాడులకు పాల్పడితే బాధ్యులకు విధించే శిక్షలకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి ప్రాంగణంలో స్పష్టంగా ప్రదర్శించాలి→ తమ రాష్ట్రాల్లో హెల్ప్‌లైన్ నంబర్లు 100, 112 ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చాలా రాష్ట్రాలు స్పష్టంచేశాయి.→ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో వైద్య సిబ్బంది రక్షణ కోసం మెరుగైన విధానాలు అమల్లో ఉన్నాయని ఆయా రాష్ట్రాలను కేంద్రం మెచ్చుకోవడం విశేషం. -
మళ్లీ ‘ప్రజాపాలన’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోమారు ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులు జారీ చేయడమే ఎజెండాగా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఇక నుంచి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింకు ఉండదని, వేర్వేరుగా రెండు కార్డులు జారీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 నుంచి నిర్వహించే ప్రజాపాలనలో ఇదే ఎజెండాగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి అవసరమైన వివరాలు సేకరించాలని.. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణాల్లోని ప్రతి వార్డులో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డిజిటల్ హెల్త్ కార్డుల విషయంలో ఫ్రాన్స్‌లో ఉత్తమమైన విధానాన్ని అనుసరిస్తున్నారని ఇటీవల విదేశాల పర్యటనకు వెళ్లినప్పుడు తనను కలిసిన ప్రతినిధులు చెప్పారని.. అక్కడ అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇకపై రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యసేవలతోపాటు సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అందించే సాయానికి ఈ డిజిటల్ హెల్త్ కార్డే ప్రామాణికంగా ఉంటుందని చెప్పారు. సీజనల్ వ్యాధులపై ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రంలో డెంగీ, చికెన్‌గున్యా, ఇతర వైరల్ జ్వరాల కేసులు పెరుగుతున్న అంశంపై సమావేశంలో సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలన కోసం ఫాగింగ్, రసాయనాల స్ప్రే వంటి కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలని, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని సూచించారు. పనిచేయని ఉద్యోగులు, ప్రజల ఆరోగ్యం పట్ల ఉదాసీనంగా వ్యవహరించే సిబ్బందిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలి్పంచాలని సూచించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకోవాలని ఆదేశించారు. డెంగీ, చికెన్‌గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు సూచించారు. -
దయచేసి విధుల్లో చేరండి.. వైద్యులను కోరిన కేంద్ర ఆరోగ్యశాఖ
సాక్షి, ఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రి ఘటన కారకులపై చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో, వైద్యసేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ స్పందిస్తూ.. వైద్యులు తమ ఆందోళనను విరమించాలని కోరింది.వివరాల ప్రకారం.. ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు నిరసనగా దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. వైద్యులు ఆసుపత్రుల్లో వైద్యసేవలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో వైద్యులు తమ ఆందోళన విరమించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. ఈ సందర్భంగా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ భద్రతకు తగిన చర్యలు చేపడతామని కేంద్రం హామీ ఇచ్చింది. అలాగే, వైద్యుల భద్రతకు కమిటీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించింది. #WATCH | Doctors stage a protest at Delhi’s Lady Hardinge Medical College against the rape-murder incident at Kolkata's RG Kar Medical College and Hospital pic.twitter.com/yf06mkCSpj— ANI (@ANI) August 17, 2024 ఇదే సమయంలో వైద్య రంగానికి సంబంధించిన అన్ని వర్గాలతో సంప్రదించి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సిఫారసు చేయనుంది. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసింది. -
ప్రిస్క్రిప్షన్ బాగు.. బాగు..
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖకు 2024–25 బడ్జెట్లో రూ.90,958.63 కోట్లను కేటాయించారు. ఇది 2023–24 సవరించిన అంచనాల కంటే (రూ.80,517.62 కోట్లు) 12.96 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అలాగే ఈ బడ్జెట్లో కేన్సర్ చికిత్సకు ఉపయోగించే మూడు కీలక మందుల (ట్రాస్తుజుమబ్ డెరక్స్‌టెకన్, ఒసిమెర్టినిబ్, డుర్వాలుమాబ్)పై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ‘కేన్సర్ రోగులకు ఉపశమనం ఇచ్చేందుకు మరో మూడు మందులపై కస్టమ్స్ డ్యూటీని మినహాయిస్తున్నాం. అలాగే ఎక్స్‌రే ట్యూబ్స్, మెడికల్ ఎక్స్‌రే మిషన్లలో వాడే ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ)లో మార్పులు చేస్తున్నాం’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖకు గత ఏడాది రూ.3వేల కోట్లు ఇవ్వగా, ఈసారి 3,712.49కోట్లకు పెంచారు. ఆరోగ్య శాఖకు కేటాయించిన మొత్తం రూ.90,958.63 కోట్లలో రూ.87,656.90 కోట్లను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, ఆరోగ్య పరిశోధన విభాగానికి రూ.3,301.73 కోట్లను కేటాయించారు. గత ఏడాది ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.77,624.79 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.100కోట్ల మేర పెరగడం విశేషం. కేంద్ర ప్రాయోజిత పథకాలైన జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేటాయింపులు గత ఏడాది రూ.31,550.87 కోట్లు ఉండగా, ఈసారి అది 36,000 కోట్లకు పెరిగింది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జేఏవై)కి కేటాయింపులు రూ. 6,800 కోట్ల నుంచి రూ.7,300 కోట్లకు పెరగడం గమనార్హం. జాతీయ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌కు కేటాయింపులను రూ.65 కోట్ల నుంచి రూ.90 కోట్లకు పెంచారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌కు గత ఏడాది మాదిరే రూ.200 కోట్లు కేటాయించారు. స్వయంప్రతిపత్తి విభాగాలకు గత ఏడాది (రూ.17,250.90) కేటాయించిన దాని కంటే స్వల్పంగా పెంచుతూ రూ.18,013.62 కోట్లు కేటాయించారు. ఢిల్లీ ఎయిమ్స్‌కు గత ఏడాది రూ.4,278 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో రూ.4,523 కోట్లు ఇచ్చారు. భారత మెడికల్ కౌన్సిల్‌కు గత ఏడాది రూ.2295.12 కోట్ల ఇవ్వగా ఈసారి రూ.2,732.13 కోట్లు కేటాయించారు.మూడు కేన్సర్ మందులు 20% మేర తగ్గుతాయికేన్సర్ చికిత్సలో వాడే మూడు రకాల మందులపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించడంపై ఆరోగ్యరంగ నిపుణులు హర్షం వ్యక్తంచేశారు. ఈ సుంకం తగ్గింపు వల్ల మందుల ధరలు 10–20 శాతం మేర తగ్గుతాయని ఢిల్లీలోని సీకే బిర్లా ఆస్పత్రికి చెందిన సర్జికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ మన్దీప్ సింగ్ మల్హోత్రా చెప్పారు. అయితే, ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలన్న సుదీర్ఘ డిమాండ్‌ను ఈ బడ్జెట్ కూడా నెరవేర్చకపో వడంపై నిపుణులు పెదవి విరుస్తున్నారు. -
రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దు: సీఎం రేవంత్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ మంగళవారం సమావేశమయ్యారు. ప్రజా పాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజారోగ్యం- సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, ఎడ్యుకేషన్, లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ నిర్మూలనపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సదస్సుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు హాజరయ్యారు.అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందాలి: సీఎంకలెక్టర్ల సమీక్షలో ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని స్పష్టం చేశారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్న సీఎం.. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.ఆసుపత్రుల్లో ప్రతీ బెడ్‌కు ఒక సీరియల్ నెంబర్గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్‌కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలని పేర్కొన్నారు.‘డిసెంబర్ 24, 2023న కలెక్టర్లతో మొదటిసారి సమావేశం నిర్వహించాం. ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని ఆ సమావేశంలో ఆదేశించాం.ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించాం. ప్రభుత్వానికి కళ్లు,చెవులు మీరే.. కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలి. ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా పనిచేయాలిఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా మీరు పనిచేయాలి. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా ఎలాంటి సంతృప్తి ఉండదు.మీ ప్రతీ చర్య ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలి. ఈ ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలి. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉంది. కలెక్టర్లు క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే. ప్రతీ పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతీ నెలా రూ.85వేలు ఖర్చు పెడుతోంది.ప్రజా ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కల్పించాలి: సీఎంతెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకం.విద్యావ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే.. విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందించారు. కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా మీ పనితనం ఉండాలి. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించాలి. -
యూపీలో మహిళా చోరులు!
లక్నో: ముసుగులు ధరించిన మహిళలు ఆయుధాలు చేతబూని భారీ దొంగతనానికి పూనుకున్నారు. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి దర్జాగా ప్రవేశించి కేవలం 50 నిమిషాల్లో ఉన్నదంతా ఊడ్చేసి గోతాముల్లో నింపుకుని వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఈ నెల ఏడో తేదీన తెల్లవారుజామున 3 గంటలకు ఆషియానా పోలీస్‌స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ సందీప్ గులాటి ఇంట్లో ఈ మహిళా దొంగలు చొరబడ్డారు. ఒకరిద్దరు ఆయుధాలతో బయట కాపలాగా ఉండిపోగా మిగతా వారు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్లు సహా ప్రతి వస్తువు తీసుకుని ఐదు బస్తాల నిండా దర్జాగా నింపుకుని నెమ్మదిగా వెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
ఏపీ వైద్య రంగం పై రామోజీ తప్పుడు వార్తలు
-
భారీగా ‘బ్యాక్లాగ్’! ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మిగిలిపోతున్న పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న నియామక సంస్థలకు బ్యాక్లాగ్ తిప్పలు పట్టుకున్నాయి. ఒకే సమయంలో భారీగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియలు చేపడుతుండటంతో.. గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. పోటీ పరీక్షల కోసం పకడ్బందీగా సిద్ధమవుతున్న చాలా మంది అభ్యర్థులు.. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు. వాటిలో ఒకదానిని ఎంచుకోవడంతో మిగతా ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఉద్యోగ నియామక సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం, వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల కౌన్సెలింగ్‌ను ఒకే సమయంలో నిర్వహించడం వంటివి దీనికి కారణమవుతున్నాయి. ఉద్యోగాలకు ఎంపికైనవారు వాటిని వదులుకుంటే.. తర్వాతి మెరిట్ అభ్యర్థులకు కేటాయించే పరిస్థితి (రిలిక్విష్ మెంట్) లేకపోవడం కూడా సమస్యకు దారితీస్తోంది. ఇలా మిగిలిపోయిన ఉద్యోగాలకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసి, భర్తీ ప్రక్రియ చేపట్టాల్సి వస్తోంది. ఇటీవల భర్తీ చేసిన గురుకుల కొలువులు, పోలీస్ కానిస్టేబుల్, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్ తదితర కేటగిరీ ఉద్యోగాల్లో సుమారు 10శాతానికిపైగా ఇలా మిగిలిపోవడం గమనార్హం. 33వేల కొలువుల్లో.. 4,590 ఉద్యోగాలు ఖాళీ.. రాష్ట్రంలో గత మూడు నెలల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో 33 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది. ఇందులో 4,590 ఉద్యోగాలు మిగిలిపోయినట్టు నియామక సంస్థల ప్రాథమిక గణాంకాలు చెప్తున్నాయి. ఉద్యోగులంతా పూర్తిస్థాయిలో విధుల్లో చేరితే ఇందుకు సంబంధించి మరింత స్పష్టత రానుంది. గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు పరిధిలో ఇప్పటివరకు 8.820 ఉద్యోగాల భర్తీ చేపట్టగా.. ఏకంగా 1,810 ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలినట్టు సమాచారం. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఇటీవల చేపట్టిన 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో దాదాపు 2వేల ఉద్యోగాలు భర్తీ కాలేదు. ఇక మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7 వేల స్టాఫ్ నర్సు, 1,150 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయగా.. వీటిలోనూ 780 ఉద్యోగాలు మిగిలిపోయాయి. రిలిక్విష్మెంట్ లేకపోవడంతో.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీలో రిలిక్విష్మెంట్ విధానాన్ని అనుసరించారు. అంటే ఏదైనా నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రకటించిన ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ కాకుంటే.. అందులోని తర్వాతి మెరిట్ అభ్యర్థులతో భర్తీచేసేందుకు వీలు ఉండేది. 2018 వరకు ఈ విధానాన్ని అనుసరించారు. కానీ ఈ విధానంలో పారదర్శకత లోపించిందంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, దానికితోడు ఇతర కారణాలతో రిలిక్విష్మెంట్ విధానాన్ని పక్కనబెట్టారు. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చాక జారీ అయిన నోటిఫికేషన్లలో రిలిక్విష్మెంట్ అంశాన్ని జతచేయలేదు. అంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎన్ని పోస్టులు మిగిలినా అదే నోటిఫికేషన్ కింద భర్తీ చేసే అవకాశం లేదు. ఇటీవల రిలిక్విష్మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి, నిబంధనలపై చర్చించినా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా భర్తీ ప్రక్రియలో బ్యాక్లాగ్ ఖాళీలు మిగిలిపోతున్నాయి. వాటిని భర్తీ చేయాలంటే మళ్లీ కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సిందేనని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నియామకాల ప్రక్రియలు ఇంకా కొనసాగుతుండటంతో.. నోటిఫికేషన్ల వారీగా ఏర్పడే ఖాళీలపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. -
త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు కొత్తగా కార్డులివ్వాలని నిర్ణయించింది. ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని యూనిక్ నంబర్‌తో కార్డులు ఇవ్వనుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఒక్కో సబ్ నంబర్ ఇస్తారు. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్‌కు లింక్ చేసి, స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేస్తారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు కసరత్తు చేస్తోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు కొందరు పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అంతేకాకుండా అనేకమంది తెల్ల రేషన్‌కార్డును ఆధారం చేసుకొనే ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీ అంశంపై ఆరోగ్యశ్రీ ట్రస్టు దృష్టిసారించింది. ఈ మేరకు లబ్దిదారుల గుర్తింపుపై మార్గదర్శకాలు రూపొందిస్తోంది. అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.1,100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందరికీ వర్తింప చేయడం వల్ల అదనంగా రూ.400 కోట్ల భారం పడే అవకాశం ఉందని, ఇది పెద్ద భారం కాదన్న భావనలో సర్కారు ఉంది. మధ్యతరగతి ప్రజల్లో చాలామందికి, ఉద్యోగులకు, ఇతరులకు పలు పథకాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఆరోగ్య బీమాతో ఆరోగ్య సేవలు పొందుతున్న వారూ చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కార్డులతో అందరికీ సార్వజనీన ఆరోగ్య సేవలు అందించవచ్చని సర్కారు యోచిస్తోంది. వంద శస్త్రచికిత్సలు చేర్చే అవకాశం రాష్ట్రంలో 293 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, 198 ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే గత ఏడాది 809 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లోనూ ఆరోగ్యశ్రీ కింద సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా రాష్ట్రంలో 1,310 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి అర్హులుగా 77.19 లక్షల మంది పేదలు ఉన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని కూడా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్ఎస్ కిందకు వస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1,376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద 1,949 వ్యాధులకు వైద్యం అందుతోంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌లో ఈ రెండింటిలో ఉన్న వ్యాధులను కలిపి అమలు చేస్తున్నారు. వీటికి సుమారు మరో వంద శస్త్రచికిత్సలను చేర్చే అవకాశం ఉంది. ఒక్కో కుటుంబానికి 10 లక్షల కవరేజీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్రం 2022లో ప్యాకేజీలను సవరించింది. గతంలో ఆరోగ్యశ్రీ కింద కవరేజీ రూ. 2 లక్షలు ఉండగా, ఆయుష్మాన్ భారత్ పథకం రావడంతో దాన్ని రూ. 5 లక్షలు చేశారు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రూ.10 లక్షలు చేసిన సంగతి తెలిసిందే. ఏడాదికి ఈ పథకాల కింద ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది. దీనికి ప్యాకేజీ సొమ్ము కూడా పెంచితే ఏటా రూ.1,500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈహెచ్ఎస్ పథకంపై తేలని నిర్ణయం ఈహెచ్ఎస్ పథకంపై ఉద్యోగులు కంట్రిబ్యూషన్ ఇస్తామని పేర్కొన్న సంగతి విదితమే. గత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) ఏర్పాటు చేసి అమలు చేయాలని నిర్ణయించింది. పథకం అమలుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా జమ చేయాలని పేర్కొన్నది. ఈ మేరకు తమ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశాయి. ఆసుపత్రుల్లో తమకు వైద్యం అందనందున ఈ ప్రక్రియకు ఉద్యోగులు కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల బకాయిల చెల్లింపునకు ఏర్పాట్లు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయడంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. బ కాయిలు పేరుకుపోవడంతో పాటు ఆరో గ్యశ్రీ కింద ఆసుపత్రులకు ఇచ్చే ప్యాకేజీ సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నా యి. దీంతో ఆరోగ్యశ్రీ లబ్దిదారులు, ఈ హెచ్ఎస్ బాధితులు డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా తర్వాత అనారోగ్య సమస్యలు పెరగడంతో చాలామంది ప్రైవేట్ ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. ఉద్యోగులైతే రీయింబర్స్మెంట్ పద్ధతిలో ముందుగా డబ్బులు చెల్లించి వైద్యం పొందుతున్నా రు. అయితే బిల్లుల సొమ్ము మాత్రం పూ ర్తి స్థాయిలో రావడంలేదని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. పెద్దఎత్తున బిల్లులు పే రుకుపోవడం వల్లే తాము వైద్యం అందించలేకపోతున్నామని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు నెట్వర్క్ ఆసుపత్రుల లెక్క ప్రకా రం దాదాపు రూ.500 కోట్లు ఆరోగ్యశ్రీ నుంచి తమకు రావాల్సిన బిల్లుల బకా యిలు పెండింగ్‌లో ఉన్నాయని అంటున్నాయి. మరోవైపు వివిధ వ్యాధులకు 2013లో నిర్ధారించిన ప్యాకేజీ ప్రకారమే ఆసుపత్రులకు సొమ్ము అందుతోంది. అంటే తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటివరకు ఒక్కసారి కూడా వ్యాధులు, చికిత్సలకు ప్యాకేజీ సవరణ జరగలేదు. ఈ రెండు కారణాల వల్ల తాము ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ పథకాల కింద వైద్యం చేయలేకపోతున్నామని ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
చింతలపూడి వంద పడకల ఆసుపత్రి పనులు వేగవంతం
-
‘నాట్కో’ ట్రస్ట్‌తో ప్రభుత్వం ఎంవోయూ
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్: క్యాన్సర్ రోగులకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో సెంటర్‌ను లెవల్–1 క్యాన్సర్ సెంటర్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీన్లో భాగంగా నాట్కో సెంటర్లో ప్రస్తుతం ఉన్న 100 పడకలకు అదనంగా మరో 100 పడకలతో బ్లాక్ నిర్మాణానికి ‘నాట్కో’ ఫార్మా సంస్థ వైద్య, ఆరోగ్య శాఖతో ఎంవోయూ కుదుర్చుకుంది. మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు సమక్షంలో డీఎంఈ డాక్టర్ నరసింహం, నాట్కో ఫార్మా వ్యవస్థాపకుడు, నాట్కో ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ వి.సి.నన్నపనేని మంగళవారం ఎంవోయూ చేసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ.. ఈ సెంటర్లో రేడియేషన్, మెడికల్, సర్జికల్ వంటి అన్ని రకాల విభాగాల్ని ఏర్పాటు చేయడం ద్వారా క్యాన్సర్ రోగులకు సమగ్ర చికిత్స అందుతుందని వివరించారు. క్యాన్సర్ చికిత్స నిర్ధారణ కోసం అవసరమైన పెట్, సిటి మెషిన్ కొనుగోలుకు కూడా టెండర్లు పిలిచామని తెలిపారు. ఈ సెంటర్లో శిక్షణ పొందిన నర్సులు మాత్రమే పని చేసే విధంగా 30 ప్రత్యేక పోస్టులతో కలిపి మొత్తం 120 పోస్టుల్ని మంజూరు చేశామన్నారు. వి.సి. నన్నపనేని మాట్లాడుతూ సుమారు 35 వేల చదరపు అడుగుల్లో అదనంగా 100 పడకల క్యాన్సర్ బ్లాక్ నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలిపారు. నాట్కో క్యాన్సర్ సెంటర్లోని రోగులకు ఉచిత మందుల పంపిణీలో భాగంగా ఈ త్రైమాసికానికి రూ.60 లక్షల విలువైన మందుల్ని కృష్ణబాబుకు ఆయన అందజేశారు. కార్యక్రమంలో నాట్కో ఫార్మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు, క్యాన్సర్ సెంటర్ సమన్వయకర్త యడ్లపాటి అశోక్‌కుమార్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. -
వైద్యశాఖలో ఉద్యోగాల పండుగ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆస్పత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓవైపు ఈ పోస్టుల భర్తీ కొనసాగుతుండగానే మరోవైపు 253 వైద్య పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 234 పోస్టులు నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో ఉన్నాయి. మరో 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో భర్తీ చేయనున్నట్టు రిక్రూట్మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. 11 స్పెషాలిటీల్లో 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విమ్స్‌లో వాక్ ఇన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నారు. అర్హులైన వైద్యులు నేరుగా హాజరు కావాలి. బ్రాడ్ స్పెషాలిటీల్లో నెలకు రూ.92 వేలు, సూపర్ స్పెషాలిటీల్లో నెలకు రూ.1.60 లక్షలు చొప్పున వేతనాలు ఇస్తారు. 7 వరకు దరఖాస్తులకు అవకాశం కాగా ఎన్హెచ్ఎం పరిధిలో 234 స్పెషలిస్ట్ వైద్య పోస్టులకు http://apmsrb.ap.gov.in/msrb/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 7 వరకు గడువు ఉంది. ఓసీలు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్ వర్గాలకు చెందినవారు రూ.500 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఉద్యోగాలకు ఎంపికైనవారికి మైదాన ప్రాంతాల్లో అయితే నెలకు రూ.1.10 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో అయితే రూ.1.40 లక్షలు చొప్పున వేతనాలు ఇస్తారు. దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే అభ్యర్థులు 7416664387/8309725712 నంబర్లను సంప్రదించవచ్చు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా ఎప్పటికప్పుడు ఖాళీలను వైఎస్ జగన్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తోంది. ఈ క్రమంలో 2019 నుంచి ఇప్పటివరకు ఏకంగా 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టింది. అంతేకాకుండా వైద్య శాఖలో నియామకాల కోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డ్‌ను సైతం ఏర్పాటు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా బోర్డుకు అత్యవసర అనుమతులు ఇచ్చింది. దీంతో గతంలో ఎన్నడూలేని విధంగా వైద్య శాఖలో పోస్టుల భర్తీ కొనసాగుతోంది. -
ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
-
ఏపీ సర్కార్‌పై కేంద్రమంత్రి ప్రశంసలు
సాక్షి, విజయవాడ: నగరంలోని పాత ప్రభుత్వాసుపత్రిలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం పర్యటించారు. ఓల్డ్ జీజీహెచ్‌లో రూ.25 కోట్లతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ బ్లాక్, బీఎస్ఎల్-3 ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్తగా 1.25 కోట్లతో నిర్మించిన ఐపీహెచ్ఎల్ ల్యాబ్స్‌ను కేంద్రమంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చాలా బాగుందని ప్రశంసించారు. ఆరోగ్య రంగంలో ఏపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతోనే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఏపీ ప్రభుత్వం హెల్త్ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమన్నారు. సీఎం జగన్‌కి, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనికి కేందమంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘‘ప్రజల ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రధాని మోదీ హెల్త్ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా 1.70 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను నిర్మించాం. గత తొమ్మిదేళ్లలో 350 కి పైగా కొత్త మెడికల్ కళాశాలలనుప్రదాని మోదీ నిర్మించారు. గ్రామీణ స్ధాయిలో హెల్త్ వెల్ నెస్ సెంటర్లని జిల్లా ఆసుపత్రులు, ఎయిమ్స్ లాంటి సంస్ధలతో అనుసంధానం చేశాం. గ్రామీణ ప్రాంతవాసులకు స్పెషలిస్ట్ సేవలు టెలీ కన్సల్టేషన్ ద్వారా ఉచితంగా అందిస్తున్నాం. ప్రతీ రోజూ 4 లక్షల వరకు టెలీ కన్సల్టేషన్ సేవలు అందిస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందిస్తున్నాం’’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: అందుకేనట బాబు రహస్య మంతనాలు! -
శానిటరీ నాప్కిన్ల పంపిణీలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: ఆడబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ వారిపట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మెన్స్ట్రువల్ హైజీన్ (నెలసరి పరిశుభ్రత) కార్యక్రమం అమలులో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉంటోంది. ఈ అంశాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ లోక్‌సభలో వెల్లడించింది. నెలసరి సమయంలో స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థినులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా శానిటరీ నాప్కిన్లను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇలా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య 72.59 లక్షల నాప్కిన్లను పంపిణీ చేసి పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండగా.. 59,63,209 శానిటరీ నాప్కిన్ల పంపిణీతో ఏపీ రెండో స్థానంలో ఉంది. అనంతరం.. 45.86 లక్షలతో తమిళనాడు మూడో స్థానంలో నిలిచింది. ఇక కేరళలో 80,166, కర్ణాటకలో కేవలం 5,613, తెలంగాణలో 3,920 మాత్రమే పంపిణీ చేశారు. కేటాయించిన నిధుల ఖర్చులో నెంబర్ వన్.. ఇక నెలసరి పరిశుభ్రత కార్యక్రమాలు అమలుచేయడం ద్వారా భవిష్యత్తులో బాలికలు అనారోగ్య సమస్యల బారినపడకుండా నియంత్రించేందుకు కేటాయించిన నిధులను ఖర్చుచేయడంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల మేర నిధులు కేటాయించడమే కాకుండా దేశంలోనే అత్యధికంగా వంద శాతం నిధులను ఖర్చుచేసింది. పశ్చిమ బెంగాల్లో రూ.389 కోట్లు కేటాయించగా కేవలం రూ.9.32 కోట్లు, తెలంగాణాలో రూ.303 కోట్లు కేటాయించినప్పటికీ రూ.4 లక్షలు మాత్రమే ఖర్చుచేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రతీనెలా 10 లక్షల మంది బాలికలకు.. నెలసరి ఇబ్బందులతో బాలికలు విద్యకు దూరమవుతున్న పరిస్థితులను సీఎం జగన్ ప్రభుత్వం గుర్తించింది. దేశంలో దాదాపు 23 శాతం బాలికల చదువులు ఆగిపోవడానికి ప్రధాన కారణం నెలసరి సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులేనని యునైటెడ్ నేషన్స్ వాటర్ సఫ్లై అండ్ శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ నివేదికల్లో వెల్లడించారు. ఈ తరహా డ్రాపౌట్స్‌ను తగ్గించడంతో పాటు, బాలికలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని 2021లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఏడు నుంచి ఇంటర్మిడియట్ చదువుతున్న 10 లక్షల మంది బాలికలకు ప్రతినెలా ఒకొక్కరికి 10 చొప్పున నాణ్యమైన, బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం ఏటా ప్రభుత్వం రూ.30 కోట్ల మేర ఖర్చుచేస్తోంది. ప్రత్యేకంగా స్నేహపూర్వక కౌమార దశ క్లినిక్‌లు.. ఇక కౌమార దశలో బాలబాలికలకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నివృత్తికి, వారికి వైద్యసేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రత్యేకంగా స్నేహపూర్వక కౌమార క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. క్లినిక్‌లలో సేవలు అందించే వైద్యులు.. కౌమార దశ పిల్లలపట్ల ఏ విధంగా వ్యవహరించాలి.. తదితర అంశాలపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చారు. అంతేకాక.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామాలకు వెళ్లిన డాక్టర్లు మధ్యాహ్నం నుంచి పాఠశాలలు సందర్శించి అక్కడి బాలికల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఎదుగుతున్న సమయంలో శరీరంలో వచ్చే మార్పుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా ఉపాధ్యాయులు, మహిళా అధ్యాపకులు, గ్రామ సచివాలయాల్లోని ఏఎన్ఎంలు ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అపరిశుభ్ర పద్ధతులతో సమస్యలు.. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థినుల్లో చాలావరకు మధ్యతరగతి, పేద కుటుంబాల వారుంటారు. వీరికి శానిటరీ నాప్కిన్లు కొనే ఆర్థిక స్థోమత ఉండదు. దీంతో.. ► నెలసరి సమయంలో వస్త్రాన్ని వాడే విధానాన్ని అపరిశుభ్ర పద్ధతిగా వైద్యులు చెబుతారు. ఇలా వాడటంతో రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్ఫన్లు (జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్లు–ఆర్టీఐ) వస్తాయి. ► అలాగే.. సాధారణంగా జననాంగంలో రక్షణకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను స్రవించే లాక్టోబాసిల్లై అనే మంచి బ్యాక్టీరియాతో పాటు కొద్ది మోతాదులో వేరే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. వస్త్రం వంటి అపరిశుభ్రమైన పద్ధతులతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు ఏర్పడిన తర్వాత కాలంలో సంతానలేమి, శృంగారంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులొస్తాయి. ► అంతేకాదు.. హానికరమైన బ్యాక్టీరియాతో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది. భవిష్యత్‌లో సంతానలేమి సమస్యలూ తలెత్తుతాయి. -
ఆరోగ్య రంగానికీ నియంత్రణలు!
న్యూఢిల్లీ: ఆరోగ్య పరిరక్షణ రంగానికి ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు.. అందరికీ ఆరోగ్య బీమా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, ఆరోగ్య శాఖల మధ్య ఇందుకు ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు సంబంధిత ప్రభుత్వ అధికారులు ఇద్దరు తెలియజేశారు. అందరికీ ఆరోగ్య బీమా లక్ష్యాన్ని సాధించేందుకు మరింత సమర్ధవంత చర్యలకు తెరతీయవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య బీమాను అందుబాటులో అందరికీ అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇటీవల జాతీయ బీమా ఏజెన్సీ(ఎన్ఐఏ) వెలువరించిన నివేదిక ప్రకారం 40 కోట్లమందికిపైగా వ్యక్తులకు జీవిత బీమా అందుబాటులో లేదు. అంటే మొత్తం జనాభాలో మూడో వంతుకు బీమా అందడం లేదు. బీమా వ్యాప్తిలేకపోవడం, చాలీచాలని కవరేజీ, ఆరోగ్య పరిరక్షణా వ్యయాలు పెరిగిపోవడం ఇందుకు కారణాలుగా అధికారులు పేర్కొన్నారు. అయితే చికిత్సా వ్యయాలలో ప్రామాణికత, ఆరోగ్య క్లెయిములను పరిష్కారించడం తదితర అంశాలలో విభిన్న సవాళ్లు, అవకాశాలు ఉన్నట్లు వివరించారు. ఆరోగ్య రంగంలో తాజాగా ఏర్పాటు చేయతలపెట్టిన నియంత్రణ సంస్థ తప్పనిసరిగా వీటిని పరిష్కరించవలసి ఉంటుందని తెలియజేశారు. వెరసి సవాళ్ల పరిష్కార వ్యూహాలు, నియంత్రణ సంస్థ(హెల్త్ రెగ్యులేటర్) పాత్ర వంటి అంశాలపై చర్చించేందుకు ఆరోగ్య బీమా రంగ కంపెనీలతోపాటు.. సంబంధిత వ్యక్తులు, సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అంతేకాకుండా హెల్త్ రెగ్యులేటర్.. ఆరోగ్య క్లెయిముల జాతీయ ఎక్సే్ఛంజీ(ఎన్‌హెచ్‌సీఎక్స్) పరిధిని విస్తరించడం, పరిశ్రమను మరింత సమర్ధవంతంగా పర్యవేక్షించే అధికారాలను కలిగి ఉండటం ముఖ్యమని మరో అధికారి వ్యాఖ్యానించారు. -
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ : పేదలకు ఆరోగ్యమస్తు
సాక్షి, అమరావతి: వైద్యం కోసం పేదలు ఏ ఒక్కరూ అప్పుల పాలు కాకూడదనే తాపత్రయంతో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేశామని, ఇది ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వమని, గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రభుత్వ వైద్య రంగం స్వరూపాన్ని మార్చామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స వ్యయం పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులంటే సిబ్బంది ఉండరనే దుస్థితిని మన ప్రభుత్వం పూర్తిగా మార్చేసిందన్నారు. ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే 53,126 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ లాంటి వైద్య సిబ్బందిని నియమించి మానవ వనరుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వాసుపత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61 శాతం ఉంటే మన రాష్ట్రంలో కేవలం 3.96 శాతం మాత్రమే ఉందని, ఈ కొరతను కూడా అధిగమించేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇక జాతీయ స్థాయిలో నర్సుల కొరత 27 శాతం అయితే మన రాష్ట్రంలో సున్నా అని తెలిపారు. జాతీయ స్థాయిలో ల్యాబ్ టెక్నీషియన్ల కొరత 33 శాతం అయితే మన రాష్ట్రంలో సున్నా స్థాయికి తెచ్చామని, నూటికి నూరు శాతం పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు పొందడానికి ఏం చేయాలి? ఎవరిని అడగాలి? ఎక్కడికి వెళ్లాలి? చికిత్స వ్యయం ఎంతవరకు వర్తిస్తుంది? తదితర సందేహాలను సంపూర్ణంగా నివృత్తి చేస్తూ సరికొత్త ఫీచర్లతో రూపొందించిన ఆరోగ్యశ్రీ కొత్త కార్డులను లబ్ధిదారులకు అందజేసి విస్తృత అవగాహన కల్పించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు, స్మార్ట్ కార్డుల పంపిణీ, లబ్దిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ కార్యక్రమాలను సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆ వివరాలివీ.. 4.25 కోట్ల మందికి ఆరోగ్య భరోసా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరింత మందికి ఆరోగ్యశ్రీ అందించాలనే ఉద్దేశంతో రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్న ప్రతి కుటుంబాన్ని పథకం పరిధిలోకి తెచ్చాం. దీంతో 1.48 కోట్ల కుటుంబాలు పథకం పరిధిలోకి వచ్చాయి. తద్వారా 4.25 కోట్ల మందికి ఆరోగ్య భరోసా కల్పించాం. 2019 నాటికి ఆరోగ్యశ్రీలో కేవలం 1,059 ప్రొసీజర్లు మాత్రమే ఉండగా మనం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2,300 వరకు కొత్తగా పథకం పరిధిలోకి తెచ్చాం. అనంతరం మరికొన్ని చేర్చి ఇవాళ 3,257 ప్రొసీజర్లతో ఉచిత ఆరోగ్య సేవలను అందిస్తున్నాం. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటిన సందర్భాల్లో ఏ ఒక్కరూ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నాం. గత సర్కారు హయాంలో అరకొర సేవలతో కేవలం 820 ఆస్పత్రులకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిమితమైంది. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతో కలిపి 2,513 ఆస్పత్రులకు సేవలను విస్తరించాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లోనూ 204 కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 716 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని వర్తింపచేస్తున్నాం. ఆరోగ్య సంరక్షణకు రూ.14,439 కోట్లు గత సర్కారు ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ కోసం కేవలం రూ.5,171 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఏడాదికి రూ.1,034 కోట్లు మాత్రమే వెచ్చించిన దుస్థితి. 2014–19 మధ్య 108, 104 సేవల కోసం రూ.729 కోట్లు ఖర్చు చేశారు. మన ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కోసం ఏడాదికి సగటున రూ.4,100 కోట్లు వ్యయం చేస్తున్నాం. దీనికి అదనంగా ఏటా మరో రూ.300 కోట్లు 104, 108 సేవల కోసం ఖర్చు పెడుతున్నాం. ఆరోగ్యశ్రీ, 104, 108 కోసం గత సర్కారు రూ.5,900 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా మనం ఏటా ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తూ ఇప్పటికే రూ.14,439 కోట్లు వెచ్చించాం. గత సర్కారు హయాంలో 22.32 లక్షల చికిత్సలు అందించగా మన ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 2019 నుంచి ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీతో 53 లక్షల చికిత్సలు అందించగలిగాం. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ నాడు – నేడు ద్వారా పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రి వరకూ అన్ని స్థాయిల్లో సదుపాయాలు కల్పించాం. 2019కు ముందు రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా ఇవాళ కొత్తగా మరో 17 వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో నెలకొల్పుతున్నాం. గతంలో 104, 108 వాహనాలు ఎక్కడున్నాయో కూడా తెలియని దుస్థితి. నాడు 108 వాహనాలు కేవలం 336 మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఆదుకునేందుకు మొత్తం 2,204 వాహనాలను అందుబాటులో ఉంచాం. చికిత్సానంతరం ఆసరా.. ఆరోగ్యశ్రీ కింద పేదవాడికి ఉచిత వైద్యం అందించడమే కాకుండా చికిత్స అనంతరం వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు చొప్పున, రెండు నెలలు అయితే రూ.10 వేలు పేదవాడి చేతిలో పెట్టి మరీ ఇంటికి పంపుతున్నాం. ఆరోగ్య ఆసరా కింద 25,27,870 మందికి రూ.1,309 కోట్లు అందించాం. లక్షలు ఖర్చయ్యే ప్రాణాంతక వ్యాధులకూ.. గతంలో ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ లాంటి రోగాలకు చికిత్స ఖర్చు రూ.5 లక్షలు దాటితే ఇచ్చేవారు కాదు. కీమోథెరపీ లాంటిది ప్రారంభిస్తే కేవలం రెండు మూడు డోసులకే రూ.5 లక్షలు ఖర్చు అయిపోతాయి. దీంతో ఇక ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయలేమని వెనక్కు పంపడం లేదంటే నామమాత్రంగా చికిత్స చేసేవారు. 6 నెలలు తర్వాత ఆ పేషెంట్‌కు మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టడంతో వైద్యం అందక చనిపోయిన దుస్థితి ఉండేది. ఇప్పుడు చికిత్స వ్యయంతో పని లేకుండా పూర్తిస్థాయిలో క్యాన్సర్ చికిత్స అందిస్తున్నాం. రూ.12 లక్షల ఖరీదైన కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు రెండు చెవులకూ చేయిస్తున్నాం. ప్రాణాంతక వ్యాధుల్లో రూ.11 లక్షలు ఖర్చయ్యే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, స్టెమ్‌సెల్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేయిస్తున్నాం. రూ.11 లక్షలయ్యే గుండె మార్పిడి చికిత్సలు నిర్వహిస్తున్నాం. ప్రాణాంతక వ్యాధుల బారినపడ్డ 1,82,732 మందికి ఆరోగ్యశ్రీతో ఉచితంగా చికిత్స అందించి తోడుగా నిలబడ్డాం. ఒక్క క్యాన్సర్ చికిత్సకే ఏకంగా రూ.1,900 కోట్లు ఖర్చు చేశాం. 60.27 లక్షల మందికి ఫేజ్ 1లో వైద్య సేవలు ఫేజ్ 1 ఆరోగ్య సురక్షను 50 రోజుల పాటు నిర్వహించాం. 60,27,843 మంది వైద్య సేవలు అందుకున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పంపిణీ చేసే ప్రతి ఔషధం డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలు ప్రకారం ఉండేలా చర్యలు తీసుకున్నాం. 562 రకాల మందులను అందుబాటులోకి తెచ్చాం. ప్రివెంటివ్ కేర్‌తో ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి వైద్యం అందిస్తూ అడుగులు వేసిన ఏకైక రాష్ట్రం మనదే. దేశంలో తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కూడా తెచ్చాం. మండలానికి రెండు పీహెచ్‌సీలు.. ప్రతి పీహెచ్‌సీలోనూ ఇద్దరు డాక్టర్లు చొప్పున నలుగురు వైద్యులను అందుబాటులోకి తెచ్చాం. పాల్గొన్న ఉన్నతాధికారులు.. కార్యక్రమంలో సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఆరోగ్యశ్రీ సీఈవో బాలాజీ, ఎంఏయూడీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి ప్రచార కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కింద ఉచిత సేవలు పొందటాన్ని ప్రతి ఒక్కరికి వివరంగా తెలియచేసే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నాం. మంగళవారం నుంచి ప్రతి నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో ఆరోగ్యశ్రీ ప్రచార కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామాల్లో వీటిని ప్రారంభిస్తారు. ఇలా ప్రతి వారం మండలానికి నాలుగు గ్రామాల చొప్పున కార్యక్రమాలు చేపట్టాలి. ఇందులో ఏఎన్ఎంలు, సీహెచ్‌వోలు ఒక బృందంగా, మరో బృందంలో ఆశా వర్కర్లు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వానికి మద్దతు తెలిపేవారు, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపేవారు పాలు పంచుకుంటారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాలకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డును ఇవ్వడమే కాకుండా ఉచితంగా వైద్య సేవలు ఎలా పొందాలో వివరించాలి. ఇంట్లో కనీసం ఒకరి మొబైల్ ఫోన్లోనైనా ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్లోడ్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించాలి. మహిళా పోలీసులు కూడా ఇందులో పాల్గొని దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయాలి. ఆరోగ్యశ్రీ సేవలపై వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన 6 నిమిషాల వీడియో సందేశాన్ని ఆయా కుటుంబాలకు చూపించాలి. వారి ఫోన్లలో కూడా ఈ వీడియోను ఉంచండి. సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ కార్డులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆరోగ్యశ్రీ కార్డుల్లో సరికొత్త ఫీచర్లున్నాయి. ఇవి స్మార్ట్ కార్డులు. ఇందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. పేషెంట్లకు సంబంధించిన అన్ని వివరాలూ నిక్షిప్తం అవుతాయి. దీంతో వైద్యులు సులభంగా వైద్యం అందించడానికి వీలవుతుంది. ఇది ఈ కార్డులో విశిష్టత. వీటిని ప్రతి ఇంట్లో చక్కగా వివరించాలి. వైద్య రంగంలో అద్భుతాలు ప్రజలంతా మంచి ఆరోగ్యంతో ఉండాలన్న గొప్ప ఆలోచనతో అత్యున్నత స్థాయి వైద్యం ఉచితంగా అందిస్తూ సీఎం జగన్ వినూత్న సంస్కరణలు చేపట్టారు. ఆరోగ్యశ్రీ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. నాడు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి ప్రాణం పోస్తే నేడు సీఎం జగన్ మరింత విస్తరించారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా జగనన్న ప్రభుత్వం వైద్య శాఖలో 53 వేలకుపైగా నియామకాలు చేపట్టిన ఘనత దక్కించుకుంది. జిల్లాకు ఒక వైద్య కళాశాల, ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ భరోసా, గుమ్మం వద్దకే ఫ్యామిలీ డాక్టర్, పల్లెకు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజారోగ్యానికి భరోసాగా నిలుస్తున్నారు. వైద్యులు రోగిని కాపాడి మిరాకిల్స్ చేస్తారు. సీఎం జగన్ వైద్య ఆరోగ్య రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. – విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జనవరి 1 నుంచి ‘సురక్ష’ ఫేజ్–2 జనవరి 1వతేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్–2 ప్రారంభం అవుతుంది. ప్రతి మండలంలోనూ ప్రతి వారం ఒక గ్రామంలో సురక్ష శిబిరం నిర్వహిస్తారు. మండలాన్ని రెండుగా విభజించి ఒక డివిజన్లో మంగళవారం, మరో డివిజన్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి బుధవారం శిబిరాల నిర్వహణ ఉంటుంది. ఉచితంగా మందులు కూడా డోర్ డెలివరీ చేస్తున్నాం. ఇప్పటికే ట్రైల్ రన్ ప్రారంభించాం. జనవరి ఒకటో తేదీ నుంచి మందులు ఉచితంగా డోర్ డెలివరీ ద్వారా అందుతాయి. రిఫరెల్ కేసుల వివరాలు తెలుసుకుని డాక్టర్ వద్దకు పంపించే కార్యక్రమం విలేజ్ క్లినిక్స్ ద్వారా జరుగుతుంది. రోగులకు ప్రయాణ ఖర్చుల కింద రూ.300 ప్రభుత్వమే అందిస్తుంది. వీటిని జగనన్న ఆరోగ్య సురక్ష–2లో భాగంగా చేపడతారు. -
వైద్యరంగంలో ఏపీ నంబర్ వన్
సాక్షి, అమరావతి: ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, శానిటేషన్, ఇతర సదుపాయాల కల్పనపై సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తొలినుంచీ ప్రత్యేక దృష్టి పెడుతూ వస్తోంది. ఇందులో భాగంగా నాడు–నేడు కింద ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖల్లో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వచ్ఛత, పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయి. దేశంలోనే కాయకల్ప గుర్తింపు కలిగిన అత్యధిక ఆస్పత్రులు మన రాష్ట్రంలోనే ఉండటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ పార్లమెంట్లో వెల్లడించింది. 3,161 ఆస్పత్రులకు కాయకల్ప గుర్తింపు పరిశుభ్రతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2014లో స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆస్పత్రుల్లో పరిశుభ్ర వాతావరణాన్ని పెంపొందించి అంటు వ్యాధులు, ఇన్ఫెక్షన్లు నియంత్రించడానికి ‘కాయకల్ప’ కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రుల్లో స్వచ్ఛత, రోగులకు, వారి కుటుంబ సభ్యులకు అందుతున్న సదుపాయాలు, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫెక్షన్ సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, పారిశుధ్యం, రికార్డుల నమోదు, సిబ్బంది పనితీరు వంటి ఏడు ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ఆస్పత్రులకు అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేస్తోంది. ఇందులో భాగంగా 2022–23లో దేశవ్యాప్తంగా 20,336 ప్రభుత్వ ఆస్పత్రులకు ఈ అవార్డులను కేటాయించారు. ఇందులో 3,161 ఆస్పత్రులకు అవార్డులు పొందిన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. 2,619 ఆస్పత్రులతో తమిళనాడు రెండో స్థానంలో, 2,414 ఆస్పత్రులతో ఒడిశా మూడో స్థానంలో నిలిచాయి. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణలో 734, కర్ణాటకలో 371, కేరళలో ఆస్పత్రులకు మాత్రమే అవార్డులు లభించాయి. ఇదిలా ఉండగా ఆస్పత్రుల్లో జాతీయ స్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటించే విభాగంలోనూ ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 2022–23లో దేశవ్యాప్తంగా 2,041 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాష్) లభించగా.. ఇందులో 18 శాతం ఆస్పత్రులు ఏపీ నుంచి ఉన్నాయి. -
నళినిపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీస్, వైద్య..ఆరోగ్య శాఖలపై సమీక్ష సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ పోలీస్ అధికారిణి నళిని అంశాన్ని అధికారుల వద్ద ప్రస్తావించిన ఆయన.. ఆమెకు తిరిగి అదే ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ‘‘ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఓడిపోయాక.. తిరిగి ఉద్యోగాల్లో చేరుతున్నారు. అలాంటిది తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాన్ని వదులుకున్న నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వడం న్యాయమే. ఆమెకు అదే పొజిషన్ అప్పజెప్పండి. ఒకవేళ పోలీస్ శాఖలో తీసుకునేందుకు రూల్స్ అడ్డువస్తే.. మరేయితర డిపార్ట్మెంట్లోకి అయినా తీసుకోండి’’ అని సీఎం రేవంత్, సీఎస్.. డీజీపీలను ఆదేశించారు. పన్నెండేళ్ల కిందట.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఆమె అనుకూలంగా పని చేశారనే అభియోగాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేశారామె. పారదర్శకంగా నియామకాలు చేపట్టండి తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నియామకాలు చేపట్టాలని పోలీస్ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అత్యంత పారద్శకంగా, అవకతవకలకు తావులేకుండా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారాయన. హోంగార్డుల నియామకాలను కూడా చేపట్టాలన్నారు. అలాగే.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన నియామాకాల పై నివేదిక ఇవ్వాలని కోరారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ లాగే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు ఉంటుందని, ఉత్తర, దక్షిణ తెలంగాణ లో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. టైం టు టైం ఆలోచన చేయండి ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సచివాలయ అధికారుల్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అలా వచ్చే ప్రజల కోసం మంత్రుల ఛాంబర్లో నిర్దిష్టమైన టైం ఏర్పాట్లపై అధ్యయనం చేయాలని సూచించారాయన. అలాగే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటివారంలో ఒకట్రెండు రోజులపాటు సభలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తే.. అక్కడి ప్రజలు హైదరాబాద్ దాకా వచ్చే పరిస్థితి ఉండదని అన్నారు. ప్రతీ నెల మొదటి వారంలో రెండు రోజులపాటు సభలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కరానికి చోరవ చూపాలని అధికారులకు సూచించారాయన. అలాగే.. ఫిర్యాదుల్ని డిజిటలైజేషన్ చేయాలని, ప్రజా వాణికి వస్తున్న స్పందన దృష్ట్యా ఇంకా టేబుల్స్ పెంచాలని అధికారులకు చెప్పారు. అవసరం అయితే శిక్షణ లో ఉన్న ఐఎఎస్ ల సేవలను వినియోగించుకోవాలన్నారు. -
AP : డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు
సాక్షి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బృహత్తర కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్షలో గుర్తించిన రోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, సకాలంలో మందులు అందించడంతో పాటు సిబ్బంది.. మందుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత మంత్రిత్వ శాఖకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించే విషయంలో ఎక్కడా తగ్గొద్దని సూచించారు. ‘‘ఆరోగ్య శ్రీ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలి. డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలి. ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్య శ్రీ, దిశ యాప్‌లు ఉండాలి. అలాగే.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సకాలానికి మందులు అందించాలి. ఆస్పత్రుల్లో ఎక్కడా సిబ్బంది లేదనే మాట వినపడకూడదు.. ఖాళీలు ఉండకూడదు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు చేయూత నిచ్చే కార్యక్రమం ఎలా జరుగుతుందన్న దానిపై నిరంతరం సమీక్ష చేయాలి. దిగువస్థాయి వైద్య సిబ్బంది నుంచి సకాలానికే ఇండెంట్ వస్తే వారికి తగిన సమయానికి మందులు ఇచ్చేందుకు వీలు అవుతుంది. ఫ్యామిలీ డాక్టర్ ప్రతి గ్రామానికీ వెళ్తున్నందున అదే సమయంలో వారికి మందులు అందాయా? లేవా? అనే దానిపై పరిశీలన చేయాలి. జనవరి1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం–2 రెండో దశ కార్యక్రమాలు నిర్వహించాలి’’.. అని అధికారులకు ఆదేశించారాయన. అలాగే.. చైనాలో ప్రస్తుతం విస్తరిస్తున్న H9N2 వైరస్ దృష్ట్యా ఇక్కడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. ఆస్పత్రుల వారీగా ఉన్నమౌలిక సదుపాయాలపై సమీక్షచేయాలన్న సీఎం. -
వైద్య,ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష
-
చైనాలో పెరుగుతున్న కేసులు..ఆరు రాష్ట్రాల్లో అలర్ట్!
చైనాలో కొత్తగా నిమోనియా కేసులు పెరుగుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. ముఖ్యంగా చైనాలోని చిన్నారులే ఈ నిమోనియా వ్యాధి బారిన పడటంతో సర్వత్రా తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది. తమ పరిధిలో ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో అనే ఆరోగ్య సంసిద్ధతపై సమగ్రస్థాయిలో సమీక్ష నిర్వహించుకోవాలని ప్రకటన చేసింది. దీంతో దాదాపు ఆరు రాష్ట్రాలు తమ పరిధిలోని ఆరోగ్య మౌలిక సదుపయాలను అప్రమత్తం చేశాయి. ఈ మేరకు రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు తదితర రాష్ట్రాల ఆరోగ్య శాఖ శ్వాసకోసశ సంబంధిత సమస్యలతో వచ్చే రోగులకు సత్వరమే వైద్యం అందించేలా సంసిద్ధంగా ఉండేటమేగాక ఆరోగ్య సంసిద్ధతను సమీక్షించుకోవాలని ఆస్పత్రులను, సిబ్బందిని కోరింది. నిజానికి సీజనల్‌గా వచ్చే ఫ్లూ వంటి వ్యాధుల పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆరోగ్య శాఖ పేర్కొంది. అలాగే కాలానుగుణంగా ఈ వ్యాధుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే గైడ్‌లైన్స్‌లు కూడా వారికి అందించాలని పేర్కొంది. ఇక రాజస్థాన్ ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రకటన ప్రకారం..ప్రస్తుతం పరిస్థితి ఏమీ అంత ఆందోళనకరంగా లేదని తెలిపింది. అయినప్పటికీ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి, అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడం తోపాటు పీడియాట్రిక్ యూనిట్లతో సహా మెడిసిన్ విభాగాలలో తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. అలాగే గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేశ్ మాట్లాడుతూ..ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ఉన్న ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలన్నింటిని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడూ ఆయా ప్రభుత్వ ఆస్పత్రులన్నీ తమ ఆరోగ్య సంసిద్ధతను సమీక్షించాలని ఆరోగ్య అధికారులను కోరారు. అదేవిధంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా శ్వాసకోశ వ్యాధులపై నిఘా పెంచాలని ఆరోగ్య అధికారులను ఆదేశించింది. పైగా ఉత్తరాఖండ్‌లోని దాదాపు మూడు జిల్లాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను మరింత కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. హర్యానా రాష్ట్రం ప్రభుత్వం ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులను శ్వాసకోస సమస్యకు సంబంధించిన కేసు వస్తే వెంటనే నివేదించాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది. తమిళనాడు ఆరోగ్య శాఖ కూడా ఇదే విధమైన ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటి వరకు పిల్లలకు సంబంధించిన న్యూమోనియో కేసులు నమోదు కానప్పటికీ ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ. ఒకవేళ ఏ కేసు అయినా నమోదైతే వెంటనే పరిష్కరించేలా ఆరోగ్య సంసిద్ధతను సమీక్షించుకునేలా అధికారుల అప్రమత్తంగా ఉండేందుకు ఈ ఆదేశాలను జారీ చేసినట్లు పేర్కొంది. ఆ కరోనా మహమ్మారి వచ్చిన నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా చైనాలో పిల్లలో ఈ కొత్త తరహ నిమోనియా కేసులు నమోదవ్వడంతో ప్రపంచదేశాలన్ని ఉలిక్కిపడ్డాయి. అదీగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడూ పరిస్థితి గురించి వెల్లడించాలని చైనాను ఆదేశించడంతో ప్రపంచదేశాలన్నీ కలవరపాటుకు గురయ్యాయి. చైనా మాత్రం శీతకాలం తోపాటు వివిధ వ్యాధి కారకాల వల్లే ఈ వ్యాధి ప్రబలినట్లు వివరణ ఇచ్చుకుంది. పైగా ఇది కోవిడ్-19 మహమ్మారి సమయం నాటి తీవ్రత కాదని కూడా స్పష్టం చేసింది చైనా. (చదవండి: శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమిదే : చైనా) -
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమైనది: సీఎం జగన్
-
బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, అమరావతి/చిలకలూరిపేట: బాలికల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ కింబెర్లీ– క్లార్క్ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు మంగళవారం ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్య, ఆరోగ్య శాఖ విజ్ఞప్తి మేరకు ఈ సంస్థ 2.33 లక్షల శానిటరీ నాప్కిన్లు, 297 కేసుల డైపర్స్‌ను తొలి విడతలో పేద విద్యార్థులు, చిన్నారులకు అందజేసేందుకు ముందుకొచ్చింది. కార్య్రకమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ఏడో తరగతి నుంచి 12వ తరగతి లోపు ఆడపిల్లలకు స్వేచ్ఛ కార్యక్రమం కింద ప్రభుత్వం నెల నెలా 12 లక్షల శానిటరీ నాప్కిన్లను ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు. హెల్త్ రికార్డులన్నీ కంప్యూటర్లో నిక్షిప్తం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నామని మంత్రి రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా వైద్యం పొందుతున్న అందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేస్తున్నట్లు తెలిపారు. 1.6 కోట్ల కుటుంబాలకు ఈ కార్యక్రమం ద్వారా వైద్య సేవలు అందించగలుగుతున్నామన్నారు. క్యాంపులకు హాజరైన వారిలో ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే అలాంటి వారిని పెద్దాస్పత్రులకు సిఫారసు చేస్తున్నామని చెప్పారు. వ్యాధి నయం అయ్యేంతవరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతోందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయని, కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండడాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ప్రతి అంశంలోనూ బురదజల్లడమే పనిగా మారిందని మండిపడ్డారు. -
జగనన్న ఆరోగ్య సురక్షతో ఆరోగ్యాంధ్రప్రదేశ్
మద్దిలపాలెం (విశాఖపట్నం): జగనన్న ఆరోగ్య సురక్షతో ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. విశాఖ నగరం 16వ వార్డులోని ఇసుకతోట అర్బన్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, మేయర్ గొలగాని హరివెంకటకుమారితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాలకు విశేషస్పందన లభిస్తోందన్నారు. రాష్ట్రంలో 10,032 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 542 పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో 45 రోజులపాటు 10,574 జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత నెల 30న వైద్యశిబిరాలు ప్రారంభం కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 611 శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ శిబిరాల్లో 1.57 లక్షలమందికి వైద్యపరీక్షలు చేశామని, వీరిలో 6,089మందికి మెరుగైన వైద్యచికిత్స కోసం రిఫరల్ ఆస్పత్రులకు సిఫార్సు చేశామని వివరించారు. వీరందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ఈ శిబిరాల్లో నాలుగువేల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు చెందిన స్పెషలిస్టు వైద్యులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇదో చరిత్రాత్మక ఘట్టమన్నారు. పల్లెలు, కాలనీల్లోని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాలకు స్పెషలిస్ట్ వైద్యులు వచ్చి వైద్యం చేయడం రాష్ట్రంలో మునుపెన్నడూ చూడలేదని చెప్పారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 3,257 వ్యాధులకు వర్తింపజేశామని, వైద్యంతోపాటు చికిత్స తర్వాత దినసరి భత్యం అందిస్తున్నట్లు తెలిపారు. నాడు–నేడు కింద రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారన్నారు. వీటిలో ఇప్పటికే ఐదు కళాశాలలను ప్రారంభించారని గుర్తుచేశారు. నాలుగేళ్ల పాలనలో కేవలం వైద్యానికి రూ.3,600 కోట్లకుపైగా ఖర్చుచేశామని ఆమె చెప్పారు. -
పారా మెడికల్ సిబ్బంది తొలగింపునకు కుట్ర
ముషీరాబాద్: వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న పారా మెడికల్ సిబ్బందిని తొలగించి ఆ శాఖను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 142ను వెంటనే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 5న హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద వేలాది మందితో భారీ ధర్నా తలపెట్టాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బీసీ ఉద్యోగుల సంఘం నిర్ణయించినట్లు తెలిపారు. ఆయన శనివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. పెరుగుతున్న జనాభా ప్రకారం అర్బన్ హెల్త్ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, వైద్య కళాశాలలు, ఏరియా ఆస్పత్రులు, నూతన భవనాలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. వాటికి సరిపడినంతమంది సిబ్బందిని నియమించకుండా.. ఉన్నవారిని కుదించడానికి కుట్ర పన్నుతూ జీవో 142ను అమలు చేస్తోందని ఆరోపించారు. ఈ జీవో వల్ల దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల మంది ఉద్యోగులకు నష్టం కలుగుతుందని వివరించారు. కానీ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుని కార్యాలయంలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పనిచేసే పారా మెడికల్ సిబ్బందిని తొలగించాలని కొందరు అధికారులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారని కృష్ణయ్య ఆరోపించారు. -
రాష్ట్రంలో 5,263 డెంగీ కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డెంగీ కేసులు తక్కువగా నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతేడాది జనవరి నుంచి సెపె్టంబర్ వరకు 7,988 డెంగీ కేసులు నమోదైతే, ఈ ఏడాది అదే సమయానికి 5,263 కేసులు నమోదైనట్లు చెప్పారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉందని, అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా గడిచిన వారం పది రోజుల సమయంలో ఫీవర్ కేసుల్లో స్వల్పంగా పెరుగుదల ఉన్నట్లు పేర్కొన్నారు. మరింత అప్రమత్తంగా ఉంటే ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవడం సాధ్యమవుతుందన్నారు. మలేరియా, డెంగీ కేసుల విషయంలో భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, జ్వర లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల చికిత్సకు అవసరమైన అన్ని మందులు పల్లె దవాఖానాలు మొదలుకొని అన్ని ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యాధి నిర్ధారించే ఎన్ఎస్1 కిట్స్, ఐజీఎం కిట్లకు కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ డయాగ్నొస్టిక్ ద్వారా 24 గంటల్లో వైద్య పరీక్ష ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. అవసరమైతే జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు డెంగీ చికిత్స పేరుతో ప్రజలను మభ్యపెడుతూ, ప్లేట్లెట్స్ ఎక్కించాలంటూ భయపెడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి ఆసుపత్రుల పట్ల జిల్లా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. వెల్నెస్ సెంటర్ల ద్వారా అందుతున్న సేవల పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెల్నెస్ సెంటర్లను సందర్శించి, అందుతున్న వైద్య సేవలను పరిశీలించాలని ఆరోగ్యశ్రీ సీఈవోను మంత్రి ఆదేశించారు. జూమ్ ద్వారా జరిగిన ఈ సమీక్షలో ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డీసీహెచ్‌లు, టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానాల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. -
18.81 లక్షల గృహాల్లో వ్యక్తుల ఆరోగ్య వివరాల సేకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో), ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తున్నారు. వైద్య రంగంలో ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వంటి విప్లవాత్మక సంస్కరణలతో ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, వాటిని పరిష్కరించడానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 30వ తేదీ నుంచి స్పెషలిస్ట్ వైద్యులతో హెల్త్ క్యాంపులను వైద్యశాఖ ప్రారంభించనుంది. హెల్త్ క్యాంప్‌ల నిర్వహణ షెడ్యూల్‌కు అనుగుణంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేపడుతున్నారు. 18.81 లక్షల గృహాల్లో సర్వే ఈనెల 16 నుంచి ఆరోగ్య సురక్ష సర్వేను మొదలు పెట్టారు. సీహెచ్‌వోలు, ఏఎన్ఎంలు నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఇప్పటి వరకూ 18.81 లక్షల గృహాలను సందర్శించాయి. జ్వరం, బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధి బాధితుల వివరాలు సేకరిస్తున్నారు. జ్వరం, బీపీ, షుగర్ లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఏడు రకాల పరీక్షలను ఇంటి వద్దే చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ జరిగిన సర్వేలో 20 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించారు. 45 రోజుల పాటు హెల్త్ క్యాంపులు ఈనెల 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ క్యాంప్‌లు ప్రారంభించనున్నారు. 45 రోజుల పాటు 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, 500కు పైగా పట్టణ ఆరోగ్య కేంద్రాలను కవర్ చేసేలా క్యాంప్‌లు నిర్వహిస్తారు. ప్రతీ క్యాంప్‌లో నలుగురు వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. టోకెన్ల అందజేత సర్వేలో భాగంగా వివిధ ఆరోగ్యపరమైన సమస్యలపై ఆరా తీసి, అవసరం మేరకు బీపీ, షుగర్, ఇతర పరీక్షలు నిర్వహించిన అనంతరం టోకెన్ స్లిప్‌లు ఇస్తున్నారు. ఆ టోకెన్‌లో గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంప్ నిర్వహించే రోజు, స్థలం వంటి వివరాలు ఉంటాయి. అదే విధంగా సేకరించిన ప్రజల ఆరోగ్య వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్య సురక్ష యాప్‌లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా హెల్త్ క్యాంప్ నిర్వహించే రోజున ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కేస్ షీట్లను తయారు చేస్తారు. ఆ కేస్ షీట్లో సంబంధిత వ్యక్తికి క్యాంప్‌లో అందజేసే వైద్యం, పరీక్షలు, వైద్యుడు సూచించే మందుల ప్రిస్క్రిప్షన్, ఇతర వివరాలన్నింటినీ నమోదు చేస్తారు. -
ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ఆస్పత్రులను ఆధునీకరించి, వైద్య సేవలను మెరుగు పరిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానంతో వైద్య సేవలను ప్రజల ముంగిటకే చేర్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి వాకబు చేసి, ముందస్తుగానే వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్య క్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ప్రభుత్వ సిబ్బంది వాకబు చేస్తారు. ఆ తర్వాత వైద్య శిబిరాల్లో పరీక్షలు చేసి అవసరమైన వారికి మెరుగైన వైద్యాన్ని అందిస్తారు. దీని ద్వారా అరోగ్య సమస్యలు మరింత పెద్దవై, చికిత్సకు లొంగని దశకు చేరకుండా ముందుగానే గుర్తించి, వైద్యం అందించి, ఆరోగ్యవంతులుగా చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ఈ కార్యక్రమం లక్ష్యం. 5 దశల్లో ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఇంటింటి క్యాంపెయిన్ మొదలవుతుంది. ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం తరహాలోనే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో కూడా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తారు. తొలుత వాలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు వారి పరిధిలోని ఇళ్లను సందర్శించి, ప్రజలందరీకి ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పిస్తారు. తొలి దశ వైద్య శిబిరాలు నిర్వహించే పట్టణాలు/గ్రామాల్లో ముందుగా ఈ క్యాంపెయిన్ మొదలవుతుంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం సేవలను కూడా వివరిస్తారు. అవసరమైన వారు ఈ పథకం కింద ఉచిత వైద్య సేవలను ఏ విధంగా పొందాలో తెలియజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.60 కోట్లకు పైగా గృహాల్లో ఆరోగ్యశ్రీ సేవలను వివరిస్తూ ప్రత్యేక బ్రోచర్‌ను వాలంటీర్లు అందజేస్తారు. పథకం కింద ఎన్ని రకాల జబ్బులకు చికిత్స అందిస్తారు, వైద్యం అందించే ఆస్పత్రులు, వాటి చిరునామాలు, ఇతర వివరాలు ఉంటాయి. అదే విధంగా స్మార్ట్ ఫోన్లలో ఆరోగ్యశ్రీ సిటిజెన్ యాప్‌ను డౌన్లోడ్ చేయించి దాని వినియోగంపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఇంటింటికీ వచ్చి ఆరోగ్యపరమైన అంశాలపై వాకబు చేస్తారు. ఆ ప్రాంతంలో హెల్త్ క్యాంప్ నిర్వహించే రోజు, ప్రాంతం తెలిపి, ఆరోజున అందుబాటులో ఉండాలని ప్రజలకు చెబుతారు. ఈ నెల 30 నుంచి మొదటి దశ వైద్య శిబిరాలు (హెల్త్ క్యాంప్‌లు) ప్రతి మండలంలో ఏదో ఒక పట్టణం/గ్రామంలో నిర్వహిస్తారు. ఇందులో వైద్యులు, ఇతర సిబ్బంది ప్రజలకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. మందులు కూడా ఉచితంగా ఇస్తారు. అవసరమైన వారిని సమీపంలోని పెద్ద ఆస్పత్రులకు పంపించి, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తారు. ఆరోగ్య ఏపీ సాధనే లక్ష్యం ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు చెప్పారు. ఈ కార్యక్రమం అమలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఐదు దశల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తొలి దశలో క్యాంపెయిన్, రెండో దశలో ప్రజల ఆరోగ్యంపై వాకబు, ఏడు రకాల వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు. మూడో దశలో మరో మారు హెల్త్ క్యాంప్‌లపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. నాలుగో దశలో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. ఐదో దశలో కాలానుగుణంగా ఫాలోఅప్ సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలో గ్రామ, వార్డు సచివాలయాలు, మహిళా, శిశు సంక్షేమ, విద్య, మున్సిపల్, గిరిజన శాఖల బాధ్యతలను ఉత్తర్వుల్లో తెలియజేశారు. -
మద్యం పోసి... సిగరెట్లు తాగించి
సాక్షి, హైదరాబాద్: గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి 10 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను సస్పెండ్ చేయడంతో వైద్య విద్యార్థి లోకం ఉలిక్కిపడింది. ర్యాగింగ్ పేరిట కొందరు సీనియర్ ఎంబీబీఎస్ విద్యార్థులు ఇటీవల జూనియర్ ఎంబీబీఎస్ విద్యార్థులను అర్ధరాత్రి 2 గంటల సమయంలో తమ హాస్టల్ రూములకు రప్పించి వారికి బలవంతంగా మద్యం పోసి... సిగరెట్లు తాగించినట్లు తేలింది. దీంతో మానసిక వేదనకు గురైన బాధిత విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయ అధికార వర్గాలు చేపట్టిన విచారణలో విస్మయకర నిజాలు వెలుగుచూశాయి. కొందరిని బట్టలు విప్పించి డ్యాన్స్‌లు చేయించారని కూడా అంటున్నారు. బూతులు తిడుతూ, బాధితులతో కూడా బూతులు మాట్లాడించారని తేలింది. కాగా, కొందరు విద్యార్థినులను కూడా ర్యాగింగ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది వాస్తవమేనా కాదా అన్న దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు. కాగా ఈ ర్యాగింగ్ ఉదంతంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అన్ని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ర్యాగింగ్ నిరోధక కమిటీల పటిష్టం... రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల ఒకటో తేదీ నుంచి ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో కొన్నిచోట్ల కొందరు సీని యర్ విద్యార్థులు మొదటి ఏడాది విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడుతున్న ఘటనలు అధికా రుల దృష్టికి వచ్చాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీ ల్లోనూ ఇలాంటివి జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ర్యాగింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్న భావనతో చూసీచూడనట్లుగా వదిలేశారు. కానీ గాంధీ ఘటన నేపథ్యంలో ఇకపై ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంఈ కార్యాలయం ఆదేశించింది. అన్ని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలను పటిష్టం చేయాలని, ఇప్పటికీ లేకుంటే తక్షణమే ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, హాస్టళ్ల వద్ద రాత్రి వేళ నిఘా పెంచాలని సూచించింది. మరోవైపు ర్యాగింగ్‌కు గురైన విద్యార్థుల ఫిర్యాదు నిమిత్తం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు, ఈ మెయిల్ ఐడీని రూపొందించాలని కూడా డీఎంఈ కార్యాలయ అధికారులు యోచిస్తున్నారు. -
సహజ ప్రసవాలకు ‘సీ–సేఫ్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలను తగ్గించి.. సహజ ప్రసవాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే పలు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇదే క్రమంలో ‘సీ–సేఫ్’ అనే మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతానికి మించకూడదు. అయితే, రాష్ట్రంలో మొత్తం ప్రసవాల్లో 45 శాతం సిజేరియన్లు ఉంటున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతానికిపైగా, ప్రభుత్వాస్పత్రుల్లో 32 శాతం మేర ఈ తరహా కాన్పులు ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో కోత కాన్పుల నియంత్రణకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. కాగా, సీ–సేఫ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. నర్సులకు మిడ్వైఫరీ శిక్షణ పూర్తి సహజ ప్రసవాలను పెంపొందించే చర్యల్లో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లోని నర్సులకు ‘నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్వైఫరీ (ఎన్‌పీఎం)’ కోర్సును గత ఏడాది ప్రారంభించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున రెండు బ్యాచ్‌లుగా గుంటూరు, తిరుపతిలలో 18 నెలల శిక్షణ ఇచ్చారు. గర్భధారణ జరిగినప్పటి నుంచి మహిళకు అవసరమైన వైద్య సహాయం, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నవజాత శిశువుకు అందించాల్సిన సేవలు, హైరిస్క్ లో ఉన్న గర్భిణులను ఏ విధంగా గుర్తించాలి వంటి పలు రకాల అంశాలపై నర్సులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం వీరికి నర్సింగ్ బోర్డ్‌లో పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సరి్టఫికెట్లు జారీ చేస్తున్నారు. త్వరలో వీరిని రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా ప్రసవాలు జరిగే 10 ఆస్పత్రుల్లో నియమించనున్నారు. అనవసర కోతల నియంత్రణ యూకేకు చెందిన బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం, యునిసెఫ్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర వైద్య శాఖ సీ–సేఫ్‌ను నిర్వహించనుంది. ప్రభుత్వాస్పత్రుల్లో అనవసర కోత కాన్పులను సాధ్యమైనంత వరకూ నియంత్రించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో సిజేరియన్లను ఎలాంటి పరిస్థితుల్లో నిర్వహించాలి అనే దానిపై ప్రోటోకాల్స్‌ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మన ఆస్పత్రుల్లో అసిస్టెడ్ డెలివరీ ప్రక్రియలను అంతగా వినియోగించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో ఎంపిక చేసిన ఆరు ఆస్పత్రుల్లో గైనిక్ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వ్యాక్యూమ్, ఇతర పరికరాలను ఉపయోగించి సాధారణ ప్రసవాల్ని చేసేలా అసిస్టెడ్ డెలివరీ ప్రక్రియలో నైపుణ్యాలు పెంచనున్నారు. సిజేరియన్ తప్పనిసరి అయిన పరిస్థితుల్లో సురక్షితంగా సర్జరీల నిర్వహణపై మరింత అవగాహన పెంచనున్నారు. రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, తెనాలి, అనకాపల్లి, ఆదోని ఆస్పత్రులను సీ–సేఫ్ కోసం ఎంపిక చేసినట్టు యునిసెఫ్ ప్రతినిధి డాక్టర్ నాగేంద్ర తెలిపారు. ప్రోటోకాల్స్ రూపకల్పన త్వరలో పూర్తి అవుతుందన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మాతృ మరణాల కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఫలితంగా గతంతో పోలిస్తే మరణాలు తగ్గాయి. అదే విధంగా అనవసర సిజేరియన్ కాన్పుల నియంత్రణపై దృష్టి సారించాం. ఈ క్రమంలోనే సీ–సేఫ్‌కు ప్రణాళిక రచించాం. మరొక వైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
రాష్ట్రానికి డెంగీ ముప్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో అంటే జూలై వరకు రాష్ట్రంలో 961 డెంగీ కేసులు నమోదు కాగా, ఆగస్టు నెలలో సరాసరి రోజుకు వంద మందికి పైగా డెంగీ బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఇక ఈనెల సెప్టెంబర్ మూడు నాలుగు వారాల్లో డెంగీ కేసులు ఇంకా ఎక్కువ సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉందనీ, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డెంగీ కారక దోమ వృద్ధి చెందుతోందని చెబుతున్నారు. ప్రజలు పగటి పూట దోమ కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోకుంటే డెంగీ బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 28 ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగీపై సర్వైలెన్స్ డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో 28 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్వైలెన్స్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా ఆసుపత్రుల్లో డెంగీపై ఎప్పటికప్పుడు నిఘా వేస్తారు. ఆసుపత్రుల పరిధిలోని ప్రాంతాల్లో రక్త నమూనాలు సేకరించి వాటిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు పంపిస్తారు. దీనివల్ల దేశంలో ఎక్కడెక్కడ డెంగీ తీవ్రత ఉందో అంచనా వేస్తారు. ఆ మేరకు చర్యలు చేపడతారు. విధిగా ఐజీఎం పరీక్ష చేయించాలి డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్థారించడం శాస్త్రీయం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలని స్పష్టం చేస్తోంది. ప్లేట్లెట్లు 50 వేలలోపు పడిపోతే అది ప్రమాదకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే కొన్నిసార్లు డెంగీ మరణాలు సంభవిస్తాయి. డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి. ఎల్రక్టాల్ పౌడర్, పళ్లరసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపులోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. -
11 నుంచి వైద్యుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో 14 స్పెషాలిటీల్లో వైద్యపోస్టుల భర్తీకి ఈ నెల 5వ తేదీ నుంచి నిర్వహించాలి్సన వాక్–ఇంటర్వూ్యను వారం రోజులు వాయిదా వేశారు. 11వ తేదీ నుంచి ఇంటర్వూ్యలు ఉంటాయని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు సవరించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం జారీచేసింది. తాజా నోటిఫికేషన్లో ఏపీవీవీపీలో 300 పోస్టులకు అదనంగా, నేషనల్ హెల్త్ మిషన్‌లో 37 పోస్టులు వచ్చి చేరాయి. 11వ తేదీన జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, 13వ తేదీన గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పాథాలజీ, 15వ తేదీన పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, చెస్ట్ డిసీజెస్ స్పెషాలిటీల వారీగా ఇంటర్వూ్యలు ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో ఇంటర్వూ్యలు నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు ఇంటర్వూ్యలకు హాజరవ్వాల్సి ఉంటుందని బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రెగ్యులర్ (లిమిటెడ్, జనరల్)/కాంట్రాక్ట్ విధానాల్లో వైద్యుల నియామకం ఉంటుందని తెలి పారు. అదనపు వివరాల కోసం http:// hmfw.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గత నాలుగేళ్లలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. మరోవైపు వైద్యశాఖలో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేసేలా అత్యవసర ఉత్తర్వులను జారీచేశారు. -
మరో 5 వైద్య కళాశాలల ప్రారంభానికి కసరత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్య, వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వచ్చే విద్యా సంవత్సరం (2024–25)లో మరో 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభానికి సిద్ధమవుతోంది. వీటిలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి నిర్ణయించింది. ఈమేరకు కొత్త పోస్టులను కూడా మంజూరు చేసింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా ప్రభుత్వం రూ.8480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కళాశాలల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభిస్తున్నారు. ఆ కళాశాలల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె కళాశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. 3530 పోస్టుల సృష్టి ఈ ఐదు కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా కొత్త పోస్టులను ప్రభుత్వం ఇప్పటికే సృష్టించింది. ఒక్కో వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 3,530 పోస్టులను మంజూరు చేసింది. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్ ఇలా వివిధ విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు, నర్సింగ్, మెడికల్, నాన్‌మెడికల్, అడ్మినిస్ట్రేషన్ పోస్టులను మంజూరు చేసింది. వైద్య పోస్టుల భర్తీకి ఇప్పటికే మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. ఈ ఐదు చోట్ల ఏపీవీవీపీ ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేస్తున్నారు. సమకూరనున్న మరో 750 ఎంబీబీఎస్ సీట్లు 17 కొత్త వైద్య కళాశాలల ద్వారా ఏకంగా 2550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఈ విద్యా సంవత్సరంలో ఐదు కళాశాలలు ప్రారంభించడం ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే 5 కాలేజీల్లో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు వస్తాయి. మిగిలిన ఏడు కళాశాలలను 2025–26లో ప్రారంభించేలా ప్రణాళిక రచించారు. వేగంగా నిర్మాణాలు ఐదు చోట్ల వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల నిర్మాణం వేగంగా సాగుతోంది. 2024–25 సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల అనుమతులకు ఎన్ఎంసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం ఇప్పటికే పోస్టులు మంజూరు చేసింది. ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ల నియామకం జరిగింది. ఇతర వైద్యులు, సిబ్బంది నియామకాలు వేగంగా పూర్తి చేసి ఐదు కళాశాలలు ప్రారంభించడానికి ఎల్వోపీ కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేస్తాం. 2023–24 విద్యా సంవత్సరానికి 5 కళాశాలలకు అనుమతులు తెచ్చిన అనుభవం ఈ సారి సులువుగా పనులు పూర్తి చేయడానికి దోహద పడుతుంది. – ఎం.టి. కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
ప్రైవేటులో ఎంబీబీఎస్ ఫీజుల ఖరారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల ఫీజులను సవరించారు. కొన్ని కాలేజీల్లో పెరగ్గా కొన్ని కాలేజీల్లో తగ్గాయి. మరికొన్ని కాలేజీల్లో యథాతథంగా ఉన్నాయి. ఫీజుల సవరణకు సంబంధించి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఇచ్చిన సిఫార్సులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అనుమతించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. 2023–26 మధ్య చేరిన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యే వరకు ఇదే రుసుము కొనసాగుతుందని ఆయన తెలిపారు. బీ–కేటగిరీ ఎంబీబీఎస్ ఫీజులు కొన్ని కాలేజీల్లో రూ. 50 వేలు పెరగ్గా కొన్ని కాలేజీల్లో తగ్గాయని వివరించారు. ఉదాహరణకు అపోలో మెడికల్ కాలేజీలో బీ–కేటగిరీ ఎంబీబీఎస్‌కు గతంలో రూ. 12.50 లక్షలున్న ఫీజును ఈ ఏడాది నుంచి రూ. 13 లక్షలకు పెంచారు. అయాన్ మెడికల్ కాలేజీలో గతంలో రూ. 14 లక్షలున్న బీ–కేటగిరీ ఫీజును ఇప్పుడు రూ. 12 లక్షలకు తగ్గించారు. సీ–కేటగిరీ ఫీజులను బీ–కేటగిరీ ఫీజుకు రెట్టింపు చేశారు. అంటే బీ–కేటిగిరీ ఫీజు రూ. 12 లక్షలున్న కాలేజీలో సీ–కేటగిరీ ఫీజు రూ. 24 లక్షల వరకు వసూలు చేసుకోవచ్చు. మొత్తంగా సరాసరి 5 శాతం ఫీజులు పెరిగినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. స్వల్పంగానే ఫీజులు పెరిగాయని.. కొన్నిచోట్ల తగ్గాయని అధికారులు చెబుతున్నారు. ఒక్కో మెడికల్ కాలేజీలో ఒక్కో ఫీజు... రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరంలో 56 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,700 సీట్లున్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 35 శాతం సీట్లు బీ–కేటగిరీ, 15 శాతం సీ–కేటగిరీ సీట్లుంటాయి. వాటిని మేనేజ్మెంట్ కేటగిరీ సీట్లుగా పరిగణిస్తారు. మిగిలిన 50 శాతం సీట్లు ఏ–కేటగిరీ (కన్వినర్) కిందకు వస్తాయి. కాలేజీలవారీగా నిర్వహణ ఖర్చు లు మొదలు, బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, నిర్వహణ వ్యయం తదితర వివరాలతో కూడిన ఆడిట్ రిపోర్టులను పరిశీలించిన టీఏఎఫ్ఆర్సీ... వాటి ఆధారంగానే ఫీజుల సవరణకు సిఫార్సు చేసింది. అయితే ప్రైవేటు కాలేజీల్లో ప్రస్తుతం ఎంబీబీఎస్ సీట్ల ఏ–కేటగిరీ ఫీజు రూ. 60 వేలు ఉండగా అందులో ఎలాంటి మార్పు చేయలేదు. అదనపు వసూళ్లు చేయరాదు... కాలేజీలు నిర్వహణ ఖర్చుల నిమిత్తం విద్యార్థుల నుంచి ఎటువంటి క్యాపిటేషన్ రుసుము వసూలు చేయరాదని కాళోజీ వర్గాలు స్పష్టం చేశాయి. కమిటీ నిర్ణయించిన రుసుము మినహా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ఇతర మొత్తాన్ని యాజమాన్యం అనధికారికంగా లేదా చట్టవిరుద్ధంగా వసూలు చేయకూడదని పేర్కొన్నాయి. ఒకవేళ విరా ళం ముసుగులో వసూలు చేసినట్లయితే దాన్ని క్యాపిటేషన్ రుసుముగా పరిగణించనున్నాయి. అయితే తదుపరి సంవత్సరానికి సంబంధించిన ట్యూషన్ ఫీజు కోసం కాలేజీలు బ్యాంక్ గ్యారెంటీని విద్యార్థుల నుంచి తీసుకోవచ్చని స్పష్టం చేశాయి. దీనిపై గతం నుంచే విద్యార్థులు నిరసన తెలుపుతుండగా ఈ నిబంధనను ఇంకా కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల ఫీజులను పెంచలేదని కాళోజీ వర్గాలు తెలిపాయి. -
వైద్య ఆరోగ్యశాఖలో ఆధార్ బయోమెట్రిక్ విధానం.. అదుర్స్..!
వికారాబాద్: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు పొందాలంటే ఇక నుంచి ఆధార్ నంబర్ తప్పనిసరి. ఔట్ పేషెంట్లో వైద్య సేవలు పొందాలనుకునే రోగులు రిజిస్ట్రేషన్ కౌంటర్లో ఆధార్ నంబర్ చెప్పి బయోమెట్రిక్ యంత్రంలో వేలు పెడితే రోగి వివరాలు, చిరునామా ప్రత్యక్షమవుతాయి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ఓపీ రోగుల సంఖ్య ఇక నుంచి పక్కాగా నమోదు కానుంది. గతంలో రోజు వారి ఓపీ వివరాలను ఓ రిజిస్టర్లో రాసి, భాదితుడి ఆరోగ్య సమస్యలను బట్టి ఫలానా డాక్టర్‌ను కలవాలని ప్రిస్క్రిప్షన్ ఇచ్చేవారు. కొన్ని సార్లు అక్కడి సిబ్బంది ఓపీ సంఖ్యను ఎక్కువ చేసి చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మాన్యువల్‌గా తీసుకునే ఓపీ వివరాలను ప్రతీ రోజు ఉన్నతాధికురాలకు పంపించాలంటే సిబ్బందికి సైతం ఇబ్బందులు తలెత్తేవి. ఈ ఇబ్బందులను తొలగించడంతో పాటు, రోజు వారీగా ఓపీ సేవలు ఎంతమంది పొందుతున్నారనే విషయం తెలుసుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీ చీటీ పొందాలంటే పేషెంట్ పేరు, ఊరు, ఆధార్ నెంబర్ తప్పకుండా చెప్పాల్సిందే. వెంటనే బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా పూర్తి వివరాలు నమోదు చేస్తుండటంతో ఓపీ సేవలపై నజర్ వేసేందుకు అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. ఈ బయోమెట్రిక్ విధానం ప్రారంభమై వారం రోజులే కావడంతో ఈ సమాచారం తెలియక చాలా మంది ఆధార్ కార్డు లేకుండానే ఓపీ సేవలకు వస్తున్నారు. ప్రస్తుతం ఆధార్ నెంబర్ చెప్పని వారి వివరాలు నమోదు చేసుకుని ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు. రెండోసారి ఆస్పత్రికి వచ్చేటప్పుడు తప్పకుండా ఆధార్ నెంబర్ తీసుకురావాలని సిబ్బంది రోగులకు సూచిస్తున్నారు. -
కల్తీ కల్లేనా..? కలుషిత నీరేనా..? రంగంలోకి దిగిన 3 శాఖలు..
సంగారెడ్డి: దుబ్బాక ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. వాంతులు, విరేచనాలు ఏ కారణంతో జరిగాయి? వృద్ధుడు ఎలా మృతిచెందాడు? అనే ప్రశ్నల చిక్కుముడి విప్పడానికి 3 శాఖల అధికారులు రంగంలోకి దించింది. కల్తీ కల్లునా? కలుషిత నీరు తాగి మృతిచెందాడా? పలువురు ఎందుకు అస్వస్థతకు గురయ్యారా? అని నిర్థారించే పనిలో నిమగ్నమయ్యారు. దుబ్బాక మండలం దుంపలపల్లి, బల్వంతపూర్, నర్లెంగడ్డ, పద్మశాలి గడ్డ గ్రామాలకు చెందిన వారు కూలీ పనులకు వెళ్లి వస్తున్న క్రమంలో కల్లు తాగారు. గురువారం తెల్లవారుజాము నుంచి వారికి వాంతులు, విరేచనాలై అస్వస్థతకు గురయ్యారు. 33 మందికి పైగా దుబ్బాకలో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 28 మంది ఇంటి వద్దే మందులు వాడుతున్నారు. శుక్రవారం ఉదయం పద్మశాలి గడ్డకు చెందిన కుంటయ్య (65) మృతిచెందాడు. భిన్నాభిప్రాయాలు కల్లు వల్లే వాంతులు, విరేచనాలు అయ్యయని కొందరు పేర్కొంటుండగా, మరికొందరు కలుషిత నీరే కారణమని కొందరు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. వర్షాలతో కల్లు విక్రయ కేంద్రాలలో అమ్మకాలు లేక నిల్వను విక్రయించడంతోనే అస్వస్థతకు కారణమా? అన్నది తేలాల్సి ఉంది. కల్తీ కల్లుతోనే వాంతులు, విరేచనాలు అయ్యాయని వైద్యులు ప్రాథమికంగా నిర్థారించారు. శాంపిల్స్ సేకరణ ఎందువల్ల అస్వస్థతకు గురయ్యారని నిర్థారించేందుకు ఎక్సైజ్ శాఖ, మిషన్ భగీరథ, వైద్యారోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఎక్సైజ్ అధికారులు దుంపలపల్లి, బల్వంతపూర్, నర్లెంగడ్డలలోని కల్లు విక్రయ కేంద్రాల నుంచి కల్లు శాంపిల్స్ సేకరించారు. మిషన్ భగీరథ అధికారులు ఆయా గ్రామాల్లో సరఫరా అయిన నీటిని శాంపిల్స్ సేకరించారు. వైద్య అధికారులు 10 మంది నుంచి బ్లడ్, స్టూల్, మూత్రం శాంపిల్స్ తీసి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంట్ మెడిసిన్ ల్యాబ్ (ఐపీఎం)కు పంపించారు. కల్తీ కల్లు తాగడంతో వృద్ధుడు మృతిచెందాడా? బాధితులు తాగు నీటితో వాంతులు, విరేచనాలయ్యాయా? అన్నది తేలాలంటే రిపోర్టు రావాల్సిందే. -
పేద విద్యార్థులకు చేరువగా వైద్య విద్య
కోనేరుసెంటర్: మచిలీపట్నంలో వైద్య కళాశాల నిర్మాణం చరిత్రాత్మకమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మెడికల్ కళాశాలను శుక్రవారం ఆమె స్థానిక ఎమ్మెల్యే పేర్ని నానితో కలిసి సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నంలో 64 ఎకరాల విస్తీర్ణంలో రూ.560 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం చేయనటువంటి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి నడుం బిగించడం అభినందనీయమన్నారు. ఇందుకోసం దాదాపు రూ.8,500 కోట్లు వెచ్చించి.. త్వరలోనే 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చేందుకు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువచేయాలన్న సంకల్పంతో మెడికల్ కళాశాలల నిర్మాణానికి చర్యలు చేపట్టిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలోని ఐదు మెడికల్ కళాశాలల్లో సెప్టెంబర్ నుంచి తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది మరో ఐదు మెడికల్ కళాశాలల్లోనూ, ఆపై ఏడాది మిగిలిన ఏడు మెడికల్ కళాశాలల్లోనూ అకడమిక్ ఇయర్‌ను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాలను కూడా తీసుకురాలేదని దుయ్యబట్టారు. కనీసం ఆస్పత్రులనైనా అభివృద్ధి చేశారా అంటే అదీ శూన్యమన్నారు. ఆస్పత్రుల్లో మందులనైనా ప్రజలకు అందుబాటులోకి తెద్దామన్న ఆలోచన కూడా చేయని చంద్రబాబు.. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. వైద్య రంగానికి సంబంధించి దాదాపు 50,000 ఉద్యోగాలిచి్చన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. మరో 3,000 పోస్టులకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ జారీ చేసినట్టు చెప్పారు. రైతులపై చంద్రబాబుది మొసలికన్నీరేనని ధ్వజమెత్తారు. రైతును రారాజుగా చూస్తోంది, వారికి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్ ప్రభుత్వమేనన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, వైఎసార్సీపీ యువజన విభాగం జోనల్ ఇన్చార్జ్ పేర్ని కిట్టు పాల్గొన్నారు. -
గుడ్‌న్యూస్! తెలంగాణలో 1,520 ఉద్యోగాలకు నోటిఫికేషన్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కార్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 1,520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 25 ఉదయం 10.30 గంటల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు నియామక బోర్డు నోటిఫికేషన్లో పేర్కొంది. సెప్టెంబర్ 19 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నోటిఫికేషన్‌లోని ముఖ్యమైన వివరాలు.. ► అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర నర్సెస్, మిడ్వైఫ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) ట్రైనింగ్ కోర్సు పాసై ఉండాలి. లేదంటే ఇంటర్ ఒకేషనల్ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సును అభ్యసించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది పాటు క్లినికల్ ట్రైనింగ్ చేసి ఉండాలి. ► అభ్యర్థుల వయసు 2023 జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి మూడేళ్లు చొప్పున వయో పరిమితిలో సడలింపు. ► హెల్త్ అసెస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి వేతన స్కేలు నెలకు రూ.31,040- 92,050 అప్లికేషన్ ఫీజు వివరాలు.. ► ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు రూ.500. దానికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు రూ.200ల చొప్పున చెల్లించాలి. ► ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లతో పాటు 18-44 ఏళ్లు కలిగిన నిరుద్యోగ కేటగిరీ అభ్యర్థులకు ప్రాసిసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ► హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లను ప్రాథమికంగా పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు. -
ఆర్సీహెచ్‌తో గర్భిణుల అభా ఐడీ మ్యాపింగ్
గర్భిణులు, బాలింతలు, పుట్టిన బిడ్డలకు అందించేవైద్య సేవలన్నింటినీ డిజిటలైజేషన్ చేయడానికి వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గర్భిణుల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ (అభా)ను రీప్రొడక్టివ్, చైల్డ్ హెల్త్ (ఆర్సీహెచ్) పోర్టల్‌తో మ్యాపింగ్ చేస్తోంది. రాష్ట్రంలో 2022–23లో 8.71 లక్షలు, 2023–24లో ఇప్పటి వరకు 2.34 లక్షల మంది గర్భిణులు ఆర్సీహెచ్ పోర్టల్‌లో రిజిస్టర్ అయ్యారు. ప్రతి గర్భిణికి ప్రత్యేక రిజి్రస్టేషన్ ఐడీ ఉంటుంది. అభా నంబర్‌ను ఈ ఐడీతో అనుసంధానిస్తున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 5.09 లక్షల మంది గర్భిణుల అభా ఐడీలను ఆర్సీహెచ్‌తో అనుసంధానించారు. మరో 5.95 లక్షల మంది ఐడీల అనుసంధానం కొనసాగుతోంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 70 శాతం గర్భిణుల మ్యాపింగ్ పూర్తయింది. తూర్పు గోదావరిలో 68.71 శాతం, అనకాపల్లిలో 59.25 శాతం మ్యాపింగ్ చేశారు. ఆర్సీహెచ్ పోర్టల్‌తో అభాను మ్యాపింగ్ చేస్తే గర్భం దాల్చిన నాటి నుంచి ఆ మహిళకు అందుతున్న వైద్య సేవలు, పరీక్షలు, టీకాల వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆర్సీహెచ్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. అవన్నీ అభాలో నిక్షిప్తం అవుతాయి. ప్రసవానంతరం బాలింత వైద్య పరీక్షల వివరాలు కూడా ఇందులో నమోదవుతాయి. మరోవైపు చిన్నపిల్లలకు సార్వత్రిక టీకాల నమోదు కోసం కోవిన్ తరహాలో యూవిన్ పోర్టల్‌ను కేంద్ర వైద్య శాఖ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా నడుస్తోంది. ఈ యూవిన్ పోర్టల్‌కు తల్లి అభా ఐడీని మ్యాప్ చేయడం ద్వారా చిన్నారుల టీకా వివరాలను ఆన్లైన్ చేస్తున్నారు. దీనిద్వారా ఎప్పుడైనా సార్వత్రిక వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను పొందవచ్చు. 79.95 శాతం మందికి అభా ఐడీ ప్రజలకు డిజిటల్ వైద్య సేవలపై వైద్య శాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం) అమలులో తొలి నుంచి రాష్ట్ర వైద్య శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే ఉత్తమ పనితీరు కనబరుస్తోంది. రాష్ట్రంలో 4.81 కోట్ల మందికి అభా ఐడీ సృష్టించాల్సి ఉంది. ఇప్పటివరకు 3.84 కోట్ల మందికి అంటే.. 79.95 శాతం మందికి వైద్య శాఖ ఐడీలు సృష్టించింది. ఎన్సీడీ–సీడీ నిర్వహిస్తున్న ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరికీ అభా ఐడీ సృష్టిస్తున్నారు. దీంతో పాటు బీపీ, సుగర్, ఇతర వ్యాధులపై స్క్రీనింగ్ నిర్వహిస్తూ ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. టీబీ, డయాలసిస్, సికిల్ సెల్ అనీమియా రోగులకు కేటాయించిన ప్రత్యేక ఐడీలను అభాతో అనుసంధానిస్తున్నారు. – సాక్షి, అమరావతి -
ప్రజలకు వైద్యం అందించడంలో ఏపీనే నం.1.. కేంద్రం ప్రశంసలు
డెహ్రడూన్: ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందువరుసలో ఉందని కేంద్రప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రడూన్‌లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ కేంద్ర సమాఖ్య 15వ కాన్ఫరెన్స్‌ను స్వాస్థ్య చింతన్ శివిర్ పేరుతో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ, వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర సహాయ మంత్రులు భారతీప్రవీణ్ పవార్, ఎస్పీ సింగ్ భాగేలా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్‌దామీ, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్త, 15 రాష్ట్రాలకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు పాల్గొన్నారు. ఏపీ తరపున మంత్రి విడదల రజిని హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న వైద్య విధానరాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వైద్య విధానాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. ఈ ప్రజంటేషన్లో ఏపీ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు కురిపించింది. పలు అంశాల్లో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చాలా బాగున్నాయని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా అక్కడి ప్రభుత్వ విధానాలు ఉన్నాయని చెప్పింది. చదవండి: వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలి: సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2వేలకు పైగా ఆస్పత్రులు అత్యద్భుతం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకంలో ఏకంగా రెండువేలకుపైగా ఆస్పత్రులు అనుసంధానమై ఉన్నాయని, దేశంలోనే ఈ స్థాయిలో ఆస్పత్రుల్లో ఉచిత వైద్య పథకాలు ఎక్కడా అమలవడం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రజంటేషన్ సందర్భంగా తెలిపారు. ఏపీ ఆరోగ్యశ్రీ అమలు విషయంలో చురుగ్గా ఉండటం వల్ల ఆయుష్మాన్ భారత్ పథకం కూడా చాలా ఎక్కువ ఆస్పత్రుల్లో అమలవుతోందన్నారు. దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతున్నదని చెప్పారు. ఏపీలో ఈ స్థాయిలో ఎలా సాధ్యమైందో మిగిలిన రాష్ట్రాలు పరిశీలస్తే బాగుంటుందని సూచన చేశారు. ఏపీ మొత్తం జనాభా 5 కోట్ల వరకు ఉంటే.. వీరిలో ఏకంగా 80 శాతం మందికి దాదాపు నాలుగున్నర కోట్ల మందికి అబా ఐడీలను ఏపీ ప్రభుత్వం జారీ చేయగలిగిందని పేర్కొన్నారు. ఈ విషయంలో అక్కడి ప్రభుత్వం చూపుతున్న చొరవను మిగిలిన రాష్ట్రాలు కూడా గుర్తించాలని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విధానాలపై కేంద్ర ప్రభుత్వ స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ రాష్ట్ర చొరవకు కేంద్ర సహకారం కూడా మరింతగా తోడైతే పేదలకు మేలు జరుగుతుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ పాల్గొన్నారు. -
ఆయుష్‌లో 156 వైద్యుల పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఆయుష్ విభాగంలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయుర్వేదంలో 54, హోమియోలో 33, యునానిలో 69 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆగస్టు ఏడో తేదీ ఉదయం 10.30 గంటల నుంచి అదే నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకోసం mhsrb.telangana.gov.in వెబ్సైట్ సందర్శించాలని బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి తెలిపారు. ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో మల్టీ జోన్–1లో 37, మల్టీ జోన్–2లో 17 పోస్టులను భర్తీ చేస్తారు. హోమియో మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో మల్టీ జోన్–1లో 23, మల్టీ జోన్–2లో 10 పోస్టులను భర్తీ చేస్తారు. యునానీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో మల్టీ జోన్–1లో 36, మల్టీ జోన్–2లో 33 భర్తీ చేస్తారు. అభ్యర్థులు జూలై 1వ తేదీ నాటికి 18–44 ఏళ్ల వయసుగల వారై ఉండాలి. ఈ పోస్టుల పేస్కేల్ రూ. 54,220 నుంచి రూ. 1,33,630 వరకు ఉంటుంది. ఖాళీలను చేర్చడం లేదా తొలగించడం.. ఏదైనా ఉంటే ఫలితాల ప్రకటన వరకు చేస్తారు. 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక.. అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపికచేస్తారు. అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతానికి గరిష్టంగా 80 పాయింట్లు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ అభ్యర్థులకు గరిష్టంగా 20 పాయింట్లు కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2.5 పాయింట్లు ఇస్తారు. ఇతర ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున ఇస్తారు. సంబంధిత అధికారులు ఈ ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. మెరిట్ జాబితాను బోర్డు వెబ్సైట్లో ఉంచుతారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సందర్భంగా అప్లోడ్ చేయాల్సిన పత్రాలను కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆధార్ కార్డు, పదో తరగతి సర్టిఫికెట్, సంబంధిత డిగ్రీ కన్సాలిడేటెడ్ మార్కుల మెమో, సంబంధిత డిగ్రీ సర్టిఫికెట్, బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్, తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, అనుభవ ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), లోకల్ ఏరియా కోసం స్టడీ సర్టిఫికెట్ (1 నుంచి 7వ తరగతి), కమ్యూనిటీ సర్టిఫికెట్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ), బీసీల విషయంలో తాజా నాన్–క్రీమీ లేయర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్ కోరే దరఖాస్తుదారులకు తాజా ఆదాయ సర్టిఫికెట్ ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు రుసుము కింద ప్రతి దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ. 500 చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు తప్పని సరిగా రూ. 200 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల దరఖాస్తుదారులకు ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఆన్లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత రిఫరెన్స్ ఐడీ నంబర్ జనరేట్ అవుతుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన దరఖాస్తుదారులకు ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు. -
అదనపు డీఎంఈల వయోపరిమితి పెంపు
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ నుంచి అడిషనల్ డీఎంఈ గా పదోన్నతి పొందేందుకు వీలుగా వయోపరిమితిని 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెంచుతూ వైద్య ఆరోగ్యశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అదనపు డీఎంఈ పదోన్నతి ప్రక్రియను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. డీఎంఈ (వైద్య విద్య డైరెక్టర్), అడిషనల్ డీఎంఈ, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ పోస్టుల వయోపరిమితిని 61 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచే బిల్లును గవర్నర్ తిరస్కరించిన నేపథ్యంలో మంత్రి ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. అయితే గవర్నర్ తిరస్కరించినా దీన్ని ఎలా అమలు చేస్తారన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ స్పష్టత ఇవ్వలేదు. బిల్లును తిరిగి గవర్నర్‌కు పంపే ప్రక్రియను ప్రారంభిస్తారా? లేక ఏం చేస్తారన్న దానిపై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ నిర్ణయంతో డీఎంఈ, అడిషనల్ డీఎంఈ, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ పోస్టుల్లో ఉన్న వారి వయో పరిమితి పెరుగుతుంది. డీఎంఈ రమేష్‌రెడ్డి కొనసాగింపునకు ఎలాంటి అవరోధం ఉండదని చెబుతున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పదోన్నతి బుధవారం రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రొఫెసర్ల బదిలీల విషయంలో ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని డీఎంఈ రమేష్ రెడ్డిని ఆదేశించారు. బోధనాసుపత్రుల్లో 190 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తిచేసి వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని చెప్పారు. వైద్య విధాన పరిషత్‌లోని మొత్తం 112 డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ సర్జన్ పదోన్నతుల ప్రక్రియ వెంటనే చేపట్టి 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే అందులోనే 371 నర్సు పదోన్నతుల ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలన్నారు. వచ్చే 10 రోజుల్లో లోకలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి, నెల రోజుల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని వెల్లడించారు. అలాగే ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్స్‌కు సంబంధించిన పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. సమీక్ష సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, డీఎంఈ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ రాజలింగం తదితరులు పాల్గొన్నారు. పీఎంపీ, ఆర్ఎంపీలకు శిక్షణ ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్), పీఎంపీ (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్)లకు శిక్షణ ఇచ్చే విషయంపై వైద్యాధికారులకు హరీశ్‌రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలకు లోబడి వారికి శిక్షణ ఇచ్చే అంశంపై వారం రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక రూపొందించేలా కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. పీఎంపీ, ఆర్ఎంపీలకు శిక్షణ ఇవ్వడం, వారి ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం సరికాదని జూనియర్ డాక్టర్లు మండిపడుతున్నారు. కాగా, డెంగీ వ్యాధి చికిత్సలో ఉపయోగించే 32 సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ మిషన్లను రూ.10 కోట్లతో వెంటనే కొనుగోలు చేసి, అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. వీటివల్ల సకాలంలో రోగ నిర్ధారణ జరిగి సత్వరం చికిత్స అందించడానికి వీలవుతుంది. కాగా, కొత్తగా సమకూర్చుకున్న 228 అమ్మఒడి వాహనాలు, 204 అత్యవసర 108 వాహనాలు, భౌతికకాయాలను తీసుకెళ్లే 34 వాహనాలను ఆగస్టు 1న ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. -
వైద్యశాఖలో 2,118 పోస్టుల మంజూరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో మూడు వైద్య కళాశాలలను కొత్తగా ప్రారంభించేందుకు వీలుగా కీలక ముందడుగు పడింది. ఇందులో భాగంగా ప్రభుత్వం 2,118 పోస్టులను కొత్తగా మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడం కోసం ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడేళ్ల వ్యవధిలో ఈ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టి కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళికలు రచించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే మచిలీపట్నం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక్కోచోట 150 సీట్ల చొప్పున 750 ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఇదిలావుండగా వచ్చే విద్యా సంవత్సరంలో ఏఎస్ఆర్ జిల్లా పాడేరు, వైఎస్సార్ జిల్లా పులివెందుల, కర్నూలు జిల్లా ఆదోని వైద్య కళాశాలల కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఒక్కో చోట వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 2,118 పోస్టులను కొత్తగా సృష్టించారు. ఇప్పటికే ఈ మూడు చోట్ల ఉన్న ప్రభుత్వాస్పత్రులను ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా 330 పడకల స్థాయికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో 16 యూనిట్లతో ఆయా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడానికి వీలుగా అడిషనల్ డీఎంఈ హోదాలో సూపరింటెండెంట్, వివిధ పోస్టులను సృష్టించారు. అదేవిధంగా వైద్య కళాశాలకు సంబంధించి అడిషనల్ డీఎంఈ హోదాలో ప్రిన్సిపాల్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ వంటి వివిధ విభాగాలు ఏర్పాటు, పరిపాలన విభాగాలకు సంబంధించిన పోస్టులను మంజూరు చేశారు. ఇదిలావుండగా అన్నమయ్య జిల్లా మదనపల్లి, ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏర్పాటు చేస్తున్న కొత్త వైద్య కళాశాలల్లో కూడా వచ్చే ఏడాది నుంచి అకడమిక్ కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఎంఈ డాక్టర్ నరసింహం ‘సాక్షి’తో చెప్పారు. కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణ పనులు ఈ రెండుచోట్ల వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో 2025–26కు బదులు 2024–25లో వీటిని అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ రెండు చోట్ల పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నామన్నారు. -
AP: 108 అంబులెన్స్‌ను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
108 అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసేలా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. ఈ అంబులెన్స్‌లను సోమవారం సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్వీర్యం అయిన 108 వ్యవస్థను బలోపేతం చేస్తూ 2020లోనే మండలానికి ఒక 108 అంబులెన్స్‌ను సమకూర్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అప్పట్లో రూ.96.50 కోట్లతో అధునాతన సౌకర్యాలతో 412 కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేసి, అప్పటికే ఉన్నవాటికి మరమ్మతులు చేసి 748 అంబులెన్స్‌లతో సేవలను విస్తరించారు. గత అక్టోబర్‌లో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల కోసం రూ.4.76 కోట్లతో ప్రత్యేకంగా 20 అదనపు అంబులెన్సులు కొనుగోలు చేశారు. దీంతో రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. ఎక్కువకాలం ప్రయాణించి దెబ్బతిన్నస్థితిలో ఉన్నవాటి స్థానంలో కొత్త అంబులెన్సులను ప్రవేశపెట్టడం కోసం తాజాగా రూ.34.79 కోట్లతో 146 అంబులెన్స్‌లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరోవైపు 108 సేవల కోసం ఏటా ప్రభుత్వం రూ.188.56 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం సేవలు ఎంతో మెరుగుపడ్డాయి. అప్పట్లో 1.19 లక్షల మందికి ఒక అంబులెన్స్ ఉండగా ప్రస్తుతం 74,609 మంది జనాభాకు ఒక అంబులెన్స్ ఉంది. సేవలు వినియోగించుకున్న 33,35,670 మంది ప్రస్తుతం రాష్ట్రంలో 108 అంబులెన్స్‌లు రోజుకు 3,089 కేసులకు అటెండ్ అవుతున్నాయి. ఇలా 2020 జూలై నుంచి ఇప్పటి వరకు 33,35,670 ఎమర్జెన్సీ కేసుల్లో అంబులెన్స్‌లు సేవలందించాయి. సేవలు వినియోగించుకున్న వారిలో అత్యధికంగా 23%మంది మహిళలే. అనంతరం 12% మంది కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు, 11% మంది రోడ్డు, ఇతర ప్రమాదాల బాధితులు ఉన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం: నాటా తెలుగు మహా సభలనుద్దేశించి సీఎం జగన్ -
331 వైద్య పోస్టుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలోని ఏపీ వైద్యవిధాన పరిషత్ (ఏపీవీవీపీ) పరిధిలో 14 స్పెషాలిటీల్లో 331 వైద్య పోస్టుల భర్తీకి వచ్చే నెల ఐదోతేదీ నుంచి వాక్–ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్ బుధవారం తెలిపారు. శాశ్వత, కాంట్రాక్ట్ పద్ధతుల్లో పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. ప్రభుత్వ వైద్యులుగా పనిచేసి రిటైరైన వారికి కాంట్రాక్ట్ పద్ధతి నియామకాల్లో అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నాటికి 70 ఏళ్లు పైబడని రిటైర్డ్ వైద్యులు అర్హులని తెలిపారు. 5వ తేదీ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ స్పెషాలిటీల్లో, 7వ తేదీ గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పాథాలజీ, 10వ తేదీ పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రి స్పెషాలిటీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తామని వివరించారు. షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు గొల్లపూడిలోని ఏపీవీవీపీ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు చేరుకుని దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు. నోటిఫికేషన్ వివరాల కోసం అభ్యర్థులు hmfw.ap.gov.in లో చూడాలని సూచించారు. ఇతర వివరాలకు 06301138782 ఫోన్ నంబరులోగానీ,apvvpwalkinrecruitment@gmail.com లోగానీ సంప్రదించాలని కోరారు. కాంట్రాక్ట్ పద్ధతి నియామకాల్లో గిరిజన ఆస్పత్రుల్లో రూ.2.50 లక్షలు, గ్రామీణ ఆస్పత్రుల్లో రూ.2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.30 లక్షలు చొప్పున వేతనాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా చూడాలనే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే 48 వేలకుపైగా పోస్టులను భర్తీచేసిన విషయం తెలిసిందే. ఏపీవీవీపీ పరిధిలోని గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచడానికి ఇప్పటికే పలుమార్లు వాక్–ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించారు. వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మరోసారి ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. -
కుటుంబ నియంత్రణపై అవగాహన పెంచాలి
మంచిర్యాలటౌన్: ఈ నెల 27 నుంచి జూలై 10వరకు కుటుంబ సంక్షేమ, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ సుబ్బరాయుడు అన్నారు. మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో జూలై 11న వరల్డ్ పాపులేషన్ డేను పురస్కరించుకు ని కుటుంబ నియంత్రణ, సంక్షేమ కార్యక్రమాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కుటుంబ నియంత్రణ తాత్కాలిక, శా శ్వత పద్ధతులపై అవగాహన కల్పిస్తూనే, చిన్న కు టుంబం ప్రాధాన్యత, కుటుంబ నియంత్రణ ప్రణాళి క, దంపతులిద్దరి బాధ్యతలు వివరించాలని తెలిపా రు. ఈ కార్యక్రమంలో డీఎస్వో డాక్టర్ ఫయాజ్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ఎస్వో వెంకటేశ్వర్లు, డీపీవో రాఘవ, ఆప్తాలమిక్ ఆఫీసర్ శంకర్, డీడీఎం ప్రవళిక పాల్గొన్నారు. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో వైద్యసేవలు మంచిర్యాలటౌన్: మహిళల్లోని ఆరోగ్య సమస్యలకు ప్రత్యేకంగా ప్రతీ మంగళవారం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా పొందాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుబ్బరాయుడు అన్నారు. జిల్లా కేంద్రంలోని హమాలీవాడ, సాయికుంట బస్తీ దవాఖానాల్లో మంగళవారం నిర్వహించిన ఆరోగ్య మహిళా ప్రత్యేక కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు ఆసుపత్రుల్లో ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రతీ మంగళవారం మహిళల కోసమే నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు జిల్లాలో 4,016 మందికి పరీక్షలతోపాటు వైద్యం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైష్ణవి, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, హెచ్‌ఈవో నాందేవ్ పాల్గొన్నారు. -
వైద్యులు లేరు.. మెరుగు పడని సేవలు
మోర్తాడ్(బాల్కొండ) : వైద్య ఆరోగ్య శాఖ నుంచి సామాజిక ఆస్పత్రులను వైద్య విధాన పరిషత్‌లో విలీనం చేసినప్పటికీ తగినంత మంది వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. మోర్తాడ్, బాల్కొండ, డిచ్పల్లి, ధర్పల్లి, వర్ని, నవీపేట్లలో 30 పడకలు ఉన్న ఆస్పత్రులు ఉన్నాయి. ఆర్మూర్‌లో వంద పడకల ఆస్పత్రి ఉంది. భీమ్‌గల్‌లో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం కొనసాగుతోంది. 30 పడకల ఆస్పత్రిలో వివిధ రకాల వైద్యం అందించే 14 మంది వైద్యులు, 18 మంది వివిధ హోదాలలో పని చేసే సిబ్బందిని నియమించాల్సి ఉంది. వంద పడకల ఆస్పత్రిలో 48 మంది వైద్యులు, 73 మంది సిబ్బంది పోస్టు లను ఖరారు చేశారు. భీమ్‌గల్ ఆస్పత్రి నిర్మాణం ఇంకా పూర్తికానందున మిగిలిన ఆస్పత్రులలో వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. జిల్లాలో మొత్తం 132 మంది వైద్యులు, 181 మంది సిబ్బందిని నియమించాల్సి ఉంది. ఇప్పటి వరకు పోస్టుల భర్తీపై దృష్టి సారించకపోగా నోటిఫికేషన్ జారీతోనే సరిపెట్టారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోకి ఆస్పత్రులు చేరడం వల్ల వైద్య సేవలు ఎంతో మెరుగైతాయని అందరు భావించారు. పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపడంలో జాప్యం కారణంగా పోస్టులు అన్ని ఖాళీగానే ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని, వైద్యులను డిప్యుటేషన్ పద్ధతిపై కమ్యునిటీ ఆస్పత్రులలో కొనసాగిస్తున్నారు. గర్భిణులకు.. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్‌లలోని ఆస్పత్రుల లో మినహా ఇతర సామాజిక వైద్యశాలల్లో గర్భిణు లకు ప్రసవ సేవలు అందడం లేదు. సర్జన్లు, గైనకాలజిస్టులు లేకపోవడంతో శస్త్రచికిత్స ప్రసవ సేవలను పూర్తిగా నిలిపివేశారు. మోర్తాడ్ ప్రాంతం నుంచి ప్రసవాల కోసం మెట్పల్లి ఆస్పత్రికి తరలించా ల్సి వస్తుంది. ఆర్మూర్‌లో నిర్ణీత సంఖ్యలోనే ప్రసవ సేవలు అందిస్తుండటంతో పొరుగు జిల్లా ఆస్పత్రిని ఆశ్రయించక తప్పడం లేదు. ప్రభుత్వం వైద్య సేవలను విస్తృత పరచాలని పలువురు కోరుతున్నారు. త్వరలోనే భర్తీ కావచ్చు.. సామాజిక ఆస్పత్రులలో వైద్యులు, సిబ్బంది నియామకాలు త్వరలోనే పూర్తి కావచ్చు. గతంలో నోటిఫికేషన్ జారీ చేశాం. మరోసారి నోటిఫికేషన్ ఇచ్చి పో స్టుల భర్తీ కోసం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతాం. – డాక్టర్ శివశంకర్ -
తెలంగాణ ఏర్పడ్డాకే వైద్యరంగంలో పురోగతి
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే వైద్యరంగం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర మంత్రి అలోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్స్‌లో వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది పదేళ్లలో జిల్లాలో జరిగిన అభివృద్ధిపై స్టాళ్లు ఏర్పాటు చేసి వివరించారు. గర్భిణుల్లో రక్తహీనతను నివారించడానికి రెండో విడత న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి పలువురికి కిట్లు అందజేశారు. ఏఎన్ఎంలకు బీపీ ఆపరేటర్లు, ఆశ కార్యకర్తలకు చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆస్పత్రి, ప్రసూతి ఆస్పత్రి సిబ్బంది ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో మంత్రి, కలెక్టర్ రూ.23.75 కోట్లతో చేపట్టిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్, రూ.50 లక్షలతో చేపట్టిన 30 పడకల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రూ.166 కోట్లతో వైద్యకళాశాల మంజూరైందని, జూన్ నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 24మంది సీనియర్ రెసిడెన్స్ డాక్టర్లు నియమించగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, 22మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించినట్లు తెలిపారు. వైద్యకళాశాల మొదటి ఏడాది 330 పడకలతో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కలెక్టర్ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. మాతృత్వ మరణాలను అరికట్టేందుకు జిల్లాలో ‘అనీమియా సే నిర్మల్ ముక్త్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ జేవీడీఎస్ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవేందర్‌రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పలువురికి రాష్ట్ర స్థాయి పురస్కారాలు జిల్లాలో వైద్యారోగ్యశాఖలో విశిష్ట సేవలందించిన పలువురికి పురస్కారాలు అందజేశారు. ఉత్తమ మెడికల్ ఆఫీసర్లుగా మమత (జిల్లా ప్రసూతి ఆస్పత్రి), శ్రీనివాస్ (సోన్ పీహెచ్సీ), గంగాదాస్ (జిల్లా ఆయుష్ విభాగం), స్టాఫ్‌నర్స్ విభాగంలో స్వర్ణలత (ముజ్గి పీహెచ్సీ), మాణిక్య వీణ (జిల్లా ఆస్పత్రి), ఫార్మసిస్ట్ విభాగంలో ఎస్.శ్రీనివాసాచారి (జిల్లా ఆస్పత్రి), వేణుగోపాల్ (డీఎంహెచ్‌వో కార్యాలయం), ఉమాదేవి (ఆయుష్ విభాగం), భాగ్యరేఖ (ఏఎన్ఎం), సంతోష్‌కుమార్ (ల్యాబ్ అసిస్టెంట్), శ్రీనివాస్ (ఆరోగ్యమిత్ర), రాజశ్రీ (ఆశ కార్యకర్త), రమేశ్ (ల్యాబ్‌టెక్నీషియన్) మంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్నారు. -
వైద్య ఆరోగ్యశాఖలో ఇది ఒక చరిత్ర: మంత్రి విడదల రజని
-
పెయిన్.. కిల్లింగ్! నెల రోజుల్లోనే 20 మంది, ఆర్ఎంపీల వైద్యమే కారణమా..
‘మా మండలంలోని మామిడిగూడ, ముత్నూర్, హర్కాపూర్ గ్రామాల్లో గత నెల రోజుల వ్యవధిలోనే 20 మంది కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించారు. దీనిపై వైద్యారోగ్యశాఖ అధికారులకు విన్నవించినా స్పందన లేదు. ఆర్ఎంపీల వైద్యంతోనే అమాయక ఆదివాసీలు కిడ్నీలు చెడిపోయి మృత్యువాత పడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలు వెల్లడించాలి.’ ఈ నెల 24న జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఇంద్రవెల్లి జెడ్పీటీసీ అర్క పుష్పలత చేసిన వ్యాఖ్యలివి. బేల మండలంలో బెంగాల్ డాక్టర్ల వైద్యం అమయాక ప్రజల ప్రాణలమీదకు తెస్తుంది. కాళ్లు, కీళ్ల నొప్పులతో స్థానికంగా ఉన్న బెంగాల్ వైద్యుల వద్దకు వెళ్లగా మోకాళ్లలో హైడోస్ ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఇవి తీసుకున్న వారి కిడ్నీలు నెల వ్యవధిలోనే చెడిపోయి డయాలసిస్‌కు వెళ్లాల్సి వస్తోంది. దీనిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.’ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సామ రూపేశ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 27న కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు ఇది. ఆదిలాబాద్: జిల్లాలో కొంతమంది ఆర్ఎంపీల అచ్చీరాని వైద్యం అమయాక ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. పల్లెవాసులు చిన్నపాటి అనారోగ్య సమస్యలు వస్తే ఎక్కువగా వీరినే ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో వారు మోతాదుకు మించి ఇస్తున్న హైడోస్ ఇంజక్షన్లు బాధితుల కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నెల గడువక ముందే బాధితులు డయాలసిస్‌కు వెళ్లాల్సి వస్తుండడం గమనార్హం. ఆర్ఎంపీల వైద్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ఫిర్యాదులు అందుతున్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ఆర్ఎంపీల వైద్యమే కారణమా.. జిల్లాలో ఆయా గూడాలు, తండాల్లో ఉండే ఆదివాసీలు, గిరిజనులు అనారోగ్య సమస్యలు వస్తే ఎక్కువగా ఆర్ఎంపీలను ఆశ్రయిస్తుంటారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే ఆర్థికస్థోమత లేకపోవడం, ప్రభుత్వాసుపత్రుల్లో సకాలంలో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో స్థానికంగా ఉన్న వీరే దిక్కవుతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొంతమంది అచ్చీరాని వైద్యంతో ప్రజల ప్రాణల మీదకు తెస్తున్నారు. రోగుల జబ్బులు త్వరితగతిన నయం కావాలని హైడోస్ ఇంజక్షన్లు వేస్తున్నారు. మోతాదుకు మించి మాత్రలు ఇస్తున్నారు. వాటిని ఉపయోగించిన రోగులకు తాత్కాలికంగా ఉపశమనం కలుగుతున్నప్పటికీ వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆర్ఎంపీల వద్ద ఇంజిక్షన్లు తీసుకున్న రోగులు నెల గడవక ముందే కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. పెరుగుతున్న బాధితులు జిల్లాలో కిడ్నీ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇందుకు బెంగాళి వైద్యుల వైద్యమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వీరితో పాటు జిల్లా వైద్యారోగ్యశాఖ నుంచి ఎలాంటి అనుమతి లేని ఆర్ఎంపీలు సైతం పల్లెల్లో తిరుగుతూ రోగులకు అనధికారికంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కొంతమంది ఏకంగా ఆసుపత్రి తరహాలో పడకలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని బేల, ఉట్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నేరడిగొండ తదితర మండలాల్లో ఇలాంటివి ఎక్కువగా నిర్వహిస్తున్నారు. వీరు మోతాదుకు మించి ఇస్తున్న మాత్రలు, ఇంజక్షన్లతో రోగుల కిడ్నీలపై ప్రభావం చూపుతున్నాయి. ఆర్ఎంపీలను ఆశ్రయించిన మరుసటి నెలకు రిమ్స్‌కు వెళ్లితే అక్కడ పరీక్షించిన వైద్యులు కిడ్నీలు చెడిపోయాయని, డయాలసిస్ చేయాలని చెబుతుండటం కలవరానికి గురి చేస్తోంది. పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీలపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్యారోగ్యశాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతి లేకుండా ఆర్ఎంపీలు ప్రాక్టీస్ చేయడం చట్టరీత్యానేరం. అలాగే పడకలతో కూడిన వైద్యమందించడం కూడా నిబంధనలకు విరుద్దం. ఇలాంటి వారు ఎక్కడైనా వైద్యం చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే బాధ్యులపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. ఇంద్రవెల్లి మండలంలో 20 మంది ఒక నెలలో మరణించారనడం పూర్తిగా అవాస్తవం. గతంలో ధనోరాలో ఇలాంటి పరిస్థితే ఉందని మా దృష్టికి రావడంతో అక్కడ ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశాం. – రాథోడ్ నరేందర్, డీఎంహెచ్‌వో పరిమితికి మించితే ప్రమాదం ఆర్ఎంపీలు యాంటిబయటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్ ఇవ్వడానికి వీలు లేదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా ఉండే వీరి వద్దకు వచ్చే బాధితులకు పరిమితికి మించి పెయిన్‌కిల్లర్స్, యాంటిబెటిక్స్ ఇస్తుంటారు. నెలల తరబడి వీటిని వాడడంతో బీపీ, షుగర్‌తో పాటు ఎముకల్లో కాల్షియం తగ్గిపోయి కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ప్రజలు వారికి వచ్చిన జబ్బును నిపుణులైన వైద్యులతో నిర్ధారించుకొని చికిత్స చేయించుకోవాలి. ఆర్ఎంపీలపై ఆధారపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. – డాక్టర్ సుమలత, ఎండీ ఫిజీషియన్ -
కుష్టు వ్యాధి నియంత్రణ యూనిట్ల ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో హేతుబద్దీకరణ ప్రారంభమైంది. రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు వైద్యాధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో కుష్టు వ్యాధి నియంత్రణ, మెటర్నరీ హెల్త్, టెంపరరీ హాస్పిటలైజేషన్ తదితర సేవలు ఉన్నాయి. అయితే కాలక్రమేణా ఆయా సేవలన్నీ ఆసుపత్రుల్లో సాధారణ సేవలుగా ప్రధాన స్రవంతిలో కలిసిపోయాయి. దాంతో ఈ యూనిట్లు నిరుపయోగంగా మారాయని వైద్య ఆరోగ్యశాఖ భావించింది. అలాగే చిన్న జిల్లాల ఏర్పాటుతో సబ్–డివిజనల్ స్థాయిలో ఉన్న డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయాలు కూడా నిరుపయోగంగా మారాయి. ఈ నేపథ్యంలో వాటిని కూడా ఎత్తివేసి అందులోని సిబ్బందిని ఇతర చోట్ల సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 235 యూపీహెచ్‌సీల్లో వైద్యులు, నర్సులు, ఫార్మసిస్ట్ పోస్టులను కాంట్రాక్ట్ సిబ్బందితో భర్తీ చేసి నడిపిస్తున్నారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, వ్యాక్సినేషన్, అంటువ్యాధుల సమయంలో పర్యవేక్షించడం తదితర సేవల్లో యూపీహెచ్సీల సిబ్బంది కీలకం. దీంతో.. ఎత్తివేసే యూనిట్ల నుంచి సిబ్బందిని వీటిల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. 40 మండలాల్లో పీహెచ్‌సీలు, 6 డీఎంహెచ్వోలు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం (పీహెచ్సీ) లేని మండలాలు రాష్ట్రంలో 40 ఉన్నాయి. సిబ్బందిని హేతుబద్దీకరించడం, పునర్విభజించడం వల్ల ఆ 40 మండలాల్లోనూ పీహెచ్‌సీలను ప్రారంభించడానికి వీలు కలుగుతుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెరిగింది. కొత్తగా రూపొందించిన 23 జిల్లాల్లోని డీఎంహెచ్‌వో కార్యాలయాలు కాంట్రాక్టు సిబ్బందితో నడుస్తున్నాయి. ఈ కార్యాలయాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో సిబ్బందిని డీఎంహెచ్‌వో కార్యాలయాలకు తిరిగి పంపిస్తారు. జీహెచ్ఎంసీ జనాభా పెరుగుదలతో ప్రజారోగ్య పరిపాలనను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆరు డీఎంహెచ్వోలను కొత్తగా నియమిస్తారు. 80 శాతం డాక్టర్లు ఇతర ప్రాంతాల్లోనే నివాసం గ్రామాల్లో వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లు పట్టణాలకే పరిమితమవుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి గతంలో ఓ నివేదిక సమరి్పంచింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)లో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బందిలో 80 శాతం మంది ఇతర ప్రాంతాలు, పట్టణాల్లో నివాసం ఉంటున్నారని ఆ నివేదిక వెల్లడించింది. దీంతో వారు పనిచేసే ఆసుపత్రికి వెళ్లి రావడానికే ఎక్కువ సేపు ప్రయాణం చేయాల్సి వస్తోందని పేర్కొంది. ఎక్కువమంది విధులకు డుమ్మా కొడుతున్నారని, 40% గైర్హాజరు ఉంటోందని నివేదిక స్పష్టం చేసింది. దీంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందించడం ప్రధాన సవాల్‌గా మారిందని ఆ నివేదిక అభిప్రాయపడింది. అధికంగా ఉన్న చోట నుంచి లేని చోటకు సిబ్బంది ఇక రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రుల్లో ఎక్కువ మంది, కొన్నిచోట్ల మరీ తక్కువ సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతం, అక్కడి జనాభా అవసరాలకు అనుగుణంగా వైద్యులు, ఇతర సిబ్బందిని సర్దుబాటు చేయాలని ఆ నివేదిక సర్కారుకు ప్రతిపాదించింది. ఆ ప్రకారమే ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖ రంగం సిద్ధం చేసింది. ఎంతమంది సిబ్బందిని ఒకచోట నుంచి మరో చోటకు మార్చాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కసరత్తు ప్రారంభించాయి. త్వరలోనే సిబ్బందిని గుర్తించి వారిని అవసరమైనచోటకు పంపిస్తారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా పలు జిల్లా కేంద్రాల్లోనే ఏళ్లుగా పాతుకుపోయిన వారికి స్థానచలనం తప్పకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
బై బై టీబీ.. కోవిడ్ తరహాలో క్షయ వ్యాధి నియంత్రణ
సాక్షి, అమరావతి: ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదకర వ్యాధి క్షయ(టీబీ)ను మరింత సమర్థవంతంగా నియంత్రించడానికి వైద్య శాఖ ప్రణాళిక రూపొందించింది. కరోనా వ్యాప్తి సమయంలో అవలంబించిన ట్రేసింగ్–టెస్టింగ్–ట్రీట్మెంట్ విధానాన్ని టీబీ నియంత్రణలోనూ పాటించనుంది. కరోనా పరీక్షల తరహాలో వీలైనంత ఎక్కువ మందికి టీబీ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే ప్రతి లక్ష మంది జనాభాకు 1,522 మందికి పరీక్షలు చేస్తూ దేశంలోనే తొలి మూడు స్థానాల్లో ఏపీ ఒకటిగా ఉంది. ఇకపై మరింత ఎక్కువ మందికి పరీక్షలు చేసి, వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని నిర్ణయించింది. గ్రామ స్థాయిలోనే ఇప్పటివరకు రెండు వారాలైనా తగ్గని దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, కఫంలో రక్తం పడుతున్న వారికి ట్రూ నాట్ ల్యాబ్ సౌకర్యం ఉన్న ఆస్పత్రుల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నూతన విధానంలో గ్రామ స్థాయిలోనే వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో టీబీ లక్షణాలున్న వారి నుంచి నమూనాలు సేకరించనున్నారు. టీబీ రోగుల కుటుంబ సభ్యులు, సుగర్ బాధితులు, ధూమపానం చేసే వారు, ఎయిడ్స్ రోగులు ఇతర హైరిస్క్ వర్గాల వారికి విలేజ్ క్లినిక్‌లోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు స్క్రీనింగ్ చేస్తారు. వీరిలో ఎవరికైనా టీబీ లక్షణాలుంటే అక్కడే కఫం నమూనా సేకరిస్తారు. వాటిని ఓ ఏజెన్సీ ద్వారా ట్రూ నాట్ ల్యాబ్‌కు పంపుతారు. దీనివ్లల వీలైనంత ఎక్కువ మందిని పరీక్షించే అవకాశం ఉంటుంది. ప్రాథమిక స్థాయిలోనే వ్యాధి బయటపడుతుంది. ప్రజలు కూడా వ్యయప్రయాసలకోర్చి లేబొరేటరీ వరకు వెళ్లే అవసరం ఉండదు. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి తగ్గుతుంది. త్వరలో పైలెట్‌గా ప్రకాశం జిల్లాలో నూతన విధానాన్ని త్వరలో ప్రకాశం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. విలేజ్ క్లినిక్‌ల నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించడానికి ఊబర్, ఓలా, ర్యాపిడో తరహా ఏజెన్సీ ఎంపికకు ఏపీఎంఎస్ఐడీసీ టెండర్లను పిలవనుంది. ఈ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టులో గమనించిన లోటుపాట్లను సరిచేసి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు. 93 శాతం సక్సెస్ రేటు దేశంలోనే సమర్థవంతంగా క్షయ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న టాప్–3 రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉంటోంది. 2020 నుంచి రాష్ట్రంలో సక్సెస్ రేటు 90 శాతం నమోదవుతోంది. 2021లో ఉత్తమ పనితీరుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్య శాఖకు అవార్డు అందించింది. గత ఏడాది క్షయ రోగులకు చేసిన వైద్య చికిత్సలో 93 శాతం సక్సెస్ రేటు నమోదైంది. 2022లో రాష్ట్రవ్యాప్తంగా 8,52,414 మందికి టీబీ పరీక్షలు నిర్వహించగా 92,129 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. వీరిలో 90,862 మందికి వైద్య సేవలు అందించారు. 84,501 మంది చికిత్స పూర్తి చేసుకుని వ్యాధి నుంచి బయటపడ్డారు. త్వరలో బీసీజీ వ్యాక్సినేషన్ కూడా పెద్దల్లో క్షయ వ్యాధిని నిరోధించడానికి ఉపయోగపడే బాసిల్లస్ కాల్మెట్ గురిన్ (బీసీజీ) టీకాను రాష్ట్రంలో పంపిణీకి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖకు సమ్మతిని ఇచ్చాం. త్వరలో 50 శాతం జిల్లాల్లో టీకా పంపిణీ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే టీబీతో బాధపడుతున్న వారి కుటుంబ సభ్యులు, ఇతర హైరిస్క్ వర్గాల వారికి టీకా ఇస్తారు. కేంద్ర వైద్య శాఖ 2025 నాటికి దేశంలో టీబీ నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకుంది. అంతకన్నా ముందే మన రాష్ట్రంలో టీబీని నిర్మూలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
కోటిన్నరకు చేరువలో కంటి వెలుగు పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటిన్నర కంటి పరీక్షలకు చేరువైంది. ఈ ఏడాది జనవరి 18న ప్రారంభమైన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కింద 1,42,30,576 మందికి కంటి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 20.69లక్షల మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 10,285 గ్రామ పంచాయతీ వార్డులు, 3,221 మున్సిపల్ వార్డుల్లో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రభుత్వ సెలవు దినాలు, పండుగలు మినహాయించి ప్రభుత్వ పనిదినాలకు అనుగుణంగా కొనసాగిస్తూ వచ్చిన ఈ రెండో విడత కార్యక్రమం జూన్ 15వ తేదీ నాటికి వందరోజులు పూర్తి చేసుకోనున్నట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది. దగ్గరి చూపు సమస్యలున్న వారే ఎక్కువ కంటివెలుగు కార్యక్రమంలో అత్యధికంగా దగ్గరి చూపు సమస్యలున్న వారే గుర్తించబడుతున్నారు. వారికి తక్షణమే రీడింగ్ అద్దాలను పంపిణీ చేస్తున్నట్లు వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. దగ్గరి చూపు సమస్యలున్న వారిలో అత్యధికులు 40 ఏళ్ల వయసు పైబడిన వారున్నారు. ఇవి కాకుండా కంటి సమస్యలతో వస్తున్న చాలా మందికి చుక్కల మందులతో పాటు విటమిన్ ఏ, డీ, బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు. కాగా, 50 ఏళ్లు పైబడిన వారు అత్యధికంగా మోతబిందు(కాటరాక్ట్) సమస్యతో బాధపడుతున్నారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి చికిత్స చేసే సమయాన్ని సెల్‌ఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తున్నామని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదివరకే శస్త్ర చికిత్స పూర్తయి ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి ఎప్పటికప్పుడు వైద్యులు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. -
స్టాఫ్‌నర్స్ పోస్టులకూ ఆన్లైన్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్య శాఖలో వివిధ విభాగాల్లోని స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఆన్లైన్ విధానం(సీబీటీ)లో నిర్వహించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. పరీక్ష కోసం హైదరాబాద్‌తోపాటు, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌ల్లో సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకే రోజు రెండు సెషన్లలో.. ఉదయం సగం మందికి, సాయంత్రం సగం మందికి పరీక్ష నిర్వహిస్తారు. వైద్య, ఆరోగ్యశాఖ పరీక్ష పేపర్‌ను తయారు చేయగా, హైదరాబాద్ జేఎన్టీయూ పరీక్షలు నిర్వహిస్తుంది. ఒకట్రెండు నెలల్లో పరీక్ష జరిగే అవకాశం ఉందని సమాచారం. పేస్కేల్ పెరగడంతో భారీ డిమాండ్.. కాగా, స్టాఫ్‌నర్స్ పోస్టులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. 5,204 పోస్టులకు గాను ఇప్పటివరకు 40,936 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో స్టాఫ్‌నర్స్ పోస్టుకు ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ఈ పోస్టులకు పేస్కేల్ రూ. 36,750 – రూ. 1,06,990 మధ్య ఉండటంతో డిమాండ్ పెరిగింది. ఇప్పటికే వేలాది మంది అభ్యర్థులు కోచింగ్ తీసుకుంటున్నారు. రాత పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. అనాటమీ, ఫిజియాలజీల్లో 14 అంశాలు, మైక్రోబయాలజీలో ఆరు అంశాలు పరీక్ష సిలబస్‌లో ఉంటాయి. ఈ మేరకు అభ్యర్థులు తయారు కావాలని నిపుణులు సూచిస్తున్నారు. స్టాఫ్‌నర్సు రాత పరీక్ష సిలబస్ ఇదీ.. ఫస్ట్ ఎయిడ్, సైకాలజీ, సోషియాలజీ; ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్; కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్;ఎన్విరాన్మెంటల్ హైజీన్; హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్;న్యూట్రిషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్; మెంటల్ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్; మిడ్ వైఫరీ గైనకాలజికల్ నర్సింగ్; గైనకాలజియల్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్; నర్సింగ్ ఎడ్యుకేషన్;ఇంట్రడక్షన్ టు రీసెర్చ్; ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్; నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్ -
వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాలు లేవు: ఎంటీ కృష్ణబాబు
సాక్షి, విజయవాడ: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12591 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 5.32 శాతంగా నమోదైంది. ఈక్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అయితే, ఏపీలో మూడు కోవిడ్ మరణాలు సంభవించాయని వస్తున్న వార్తలపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ, విశాఖపట్నంలో నమోదైన మూడు మరణాలకి కరోనా కారణం కాదని స్పష్టం చేశారు. మరణించిన వారిలో ఇద్దరు వైరల్ న్యూమోనియా, ఒకరు ప్యాంక్రియాలైటిస్ కారణంగా మరణించినట్లు వైద్యులు ధృవీకరించినట్లు తెలిపారు. ఏపీలో కరోనా మరణాలు లేవని, కరోనా పరీక్షల సంఖ్యని 5 వేలకి పెంచామని ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వేలో గుర్తించిన 17 వేల మంది జ్వర బాధితులకి పరీక్షలు నిర్వహించి, కరోనాపై అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఏపీలో గత వారంలో పాజిటివిటీ రేటు కేవలం 2.12 శాతం మాత్రమే ఉందని, కరోనా పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. కరోనా ప్రస్తుత వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, రెండు రోజుల పాటు నిర్వహించిన కోవిడ్ మాక్ డ్రిల్ లో గుర్తించిన విషయాలని సమీక్షించినట్లు ఆయన వెల్లడించారు. కొత్త వేరియంట్‌పై ప్రజలు అనవసర భయాందోళనలకి గురి కావద్దని తెలిపారు. దీర్ఘకాలిక రోగాలున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చదవండి: టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్‌తో సహజీవనం చేసి.. -
దేశంలోనే ఏపీ అగ్రగామి.. చిట్టి తల్లులకు ‘స్వేచ్ఛ’
సాక్షి, అమరావతి: రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రేపటి పౌరులైన కిశోర బాలికల ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. సమర్థవంతంగా మెన్స్ట్రువల్ హైజీన్ (బహిష్టు సమయంలో పరిశుభ్రత) కార్యక్రమాల అమలులో కూడా మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంటోంది. ఈ అంశాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నెలసరి సమయంలో స్కూళ్లు, కళాశాలల్లో చదివే విద్యార్థినులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా శానిటరీ నాప్కిన్లను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇలా 2021–22లో 1.48 కోట్ల శానిటరీ నాప్కిన్ల పంపిణీతో తమిళనాడు దేశంలో మొదటి స్థానంలో ఉండగా, 1.16 కోట్లతో ఏపీ రెండో స్థానంలో ఉంది. ప్రతీనెలా 10 లక్షల మంది బాలికలకు.. రుతుక్రమం ఇబ్బందులతో బాలికలు స్కూలుకు దూరమవుతున్న పరిస్థితులను సీఎం జగన్ ప్రభుత్వం గుర్తించింది. డ్రాపౌట్స్‌ను తగ్గించడంతో పాటు, బాలికలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని 2021లో ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఏడు నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న 10,01,860 మంది బాలికలకు ప్రతినెలా 10 నాణ్యమైన, బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం ఏటా ప్రభుత్వం రూ.30 కోట్ల మేర ఖర్చుచేస్తోంది. అంతేకాక.. ఎదుగుతున్న సమయంలో శరీరంలో వచ్చే మార్పుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఫ్యామిలీ డాక్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా అడోలసెంట్ ఫ్రెండ్లీ క్లినిక్‌లు.. ఇక కౌమార దశలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నివృత్తికి,వైద్యసేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అడోలసెంట్ ఫ్రెండ్లీ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. అపరిశుభ్ర పద్ధతులతో సమస్యలివే.. ♦ నెలసరిలో వస్త్రాన్ని వాడే విధానాన్ని అపరిశుభ్ర పద్ధతిగా వైద్యులు చెబుతారు. ఇలా వాడటంతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తాయి. ♦ జననాంగంలో రక్షణకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను స్రవించే లాక్టోబాసిల్లై అనే మంచి బ్యాక్టీరియాతో పాటు కొద్దిమోతాదులో వేరే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. వస్త్రం వంటి అపరిశుభ్ర పద్ధతులతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు ఏర్పడ్డాక సంతానలేమి, శృంగారంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పెలి్వక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులొస్తాయి. హానికరమైన బ్యాక్టీరియాతో యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి. చాలా మార్పు కనిపిస్తోంది ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థినుల్లో చాలామంది పేద కుటుంబాలకు చెందినవారే. వీరు నెలసరిలో పాఠశాలకు గైర్హాజరయ్యే వారు. ప్రస్తుతం ప్రభుత్వమే ఉచితంగా శానిటరీ నాప్కిన్లు ఇస్తోంది. పాఠశాలల్లో బాత్రూమ్లు, ఇతర వసతులు మెరుగుపడ్డాయి. దీంతో గతంతో పోలిస్తే గైర్హాజరు తక్కువగా ఉంటోంది. – కేవీ పద్మావతి, ఉపాధ్యాయురాలు, అడవివరం, జెడ్పీ ఉన్నత పాఠశాల, విశాఖపట్నం ప్రతి స్కూల్లో అంబాసిడర్లుగా ఇద్దరు టీచర్లు మెన్స్ట్రువల్ హైజీన్ కార్యక్రమాలను విద్యా సంస్థల్లో నిర్వహించడానికి ప్రతి విద్యాసంస్థలో ఇద్దరు టీచర్లను హెల్త్, వెల్నెస్ అంబాసిడర్లుగా గుర్తించారు. వీరితోపాటు మెడికల్ ఆఫీసర్లకు ఎయిమ్స్ వైద్యుల ద్వారా మెన్స్ట్రువల్ హైజీన్‌పై శిక్షణ ఇప్పించాం. వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, అడిషనల్ డైరెక్టర్ వైద్య శాఖ -
కోటి దాటిన కంటి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కంటి పరీక్షలు కోటి దాటాయి. రెండోవిడత కంటి వెలుగు కార్యక్రమం కింద ఇప్పటివరకు 1.01 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 18న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించడం తెలిసిందే. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో 47.70 లక్షల మంది పురుషులు, 53.85 లక్షల మంది మహిళలు, 3,360 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వివిధ రకాల కంటి సమస్యలున్న వారిలో 16.33 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. చత్వారం సమస్యలున్న 12.31 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసులు ఇవ్వాలని నిర్ణయించారు. -
అసలు దొంగలు ఎవరో ?
ఈ చిత్రంలో కనిపించేది కడప పాత రిమ్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం. గతంలో ఇక్కడ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. పలు అంశాలు చర్చకు దారి తీశాయి. అప్పుడు ‘సాక్షి’ పలు సంచలన కథనాలను ప్రచురించింది. తరువాత కాలంలో ఆ కార్యాలయంలో పరిపాలన గాడిలో పడినట్లైంది. తాజాగా స్టాఫ్ నర్సుల నియామకాల ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. కడప రూరల్ : వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం (జోన్–4) పరిధిలో 291 కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆ మేరకు కడపలోని ఆ శాఖ కార్యాలయానికి రాయలసీమలోని జిల్లాల నుంచి 11 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఆ శాఖ అధికారులు జనవరి 17వ తేదీ నుంచి స్టాఫ్ నర్స్‌ల నియామకాలను చేపట్టారు. ఉద్యోగాలు పొందిన వారు రెండు నెలల నుంచి వేతనాలు కూడా పొందుతున్నారు. అనుమానమే నిజమైంది... చిత్తూరు జిల్లాలో పదవీ విరమణ పొందిన ఒక పోలీసు ఉద్యోగి కుమార్తెకి మంచి మార్కులు ఉన్నాయి. అయితే ఆమెకు ఉద్యోగం రాలేదు. ఇతరులకు వచ్చాయి. ఆ రిటైర్డ్ ఉద్యోగికి అనుమానం వచ్చింది. ఉద్యోగాలు పొందిన వారిపై సంబంధిత శాఖకు ఫిర్యాదు చేశారు. మొత్తం 15 మంది మార్కుల సర్టిఫికెట్స్‌ను డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీకి పంపారు. అందులో 8 మంది మార్కుల జాబితా శ్రీట్యాంపర్డ్శ్రీ (సర్టిఫికెట్ మార్ఫింగ్)గా నిర్ధారించారు. ఆ 8 మందిలో వైద్య విధాన పరిషత్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఐదుగురు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఉండగా, ఒక అభ్యర్థి జాబితాలో ఉన్నప్పటికీ మెరిట్ లేనందున ఉద్యోగం రాలేదు. షోకాజ్ నోటీసుకు బదులు లేనందున... డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఆ 8 మంది నివేదిక కడప వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయానికి చేరింది. ఆ ఎనిమిది మందిలో ఐదుగురు వైద్య విధాన పరిషత్‌కు చెందిన వారు ఉన్నారు. ఆ ఉద్యోగులపై చర్యల నిమిత్తం నివేదికను వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు పంపారు. ఇక ఇద్దరు ఉద్యోగులు డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు చెందిన వారు తమ పరిధిలోకి రావడంతో వారికి షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఇంత వరకు వారి నుంచి సమాధానం లేకపోవడంతో వారిపై కేసులు బనాయించడానికి రంగం సిద్ధమైంది. మరో బోగన్ ఉద్యోగ నియామకం.. ఈ బోగస్ మార్కుల సర్టిఫికెట్స్ బాగోతం బయట పడక ముందు. ఒక అభ్యర్థి తాను స్టాఫ్ నర్స్ పోస్టుకు ఎంపికై నట్లు, తనకు పోస్టింగ్ ఇవ్వాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు వెళ్లారు. ఆ నియామక పత్రం ప్రకారం నిర్దేశించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోస్టింగ్ లేదని అక్కడి అధికారులు గమనించి ఇక్కడ ఉన్న ప్రాంతీయ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఆ నియామక పత్రాన్ని గమనించిన అధికారులు అది ఒక బోగస్ నియామక పత్రంగా తేల్చారు. అనంతరం ఆమైపె అధికారులు కడప పోలీస్ స్టేషన్లోి ఫిర్యాదు చేశారు. కాగా ఈ బోగస్ ఉద్యోగ నియామక పత్రంపై సంబంధిత అధికారుల సిగ్నేచర్ (సంతకం) ఎవరిది ఉందనేది ఆసక్తిగా మారింది. అక్రమాల వెనుక హస్తం ఎవరిదో.. మొత్తం ఈ బోగస్ వ్యవహారమంతా చిత్తూరు జిల్లా కేంద్రంగా సాగడం గమనార్హం. బోగస్ సర్టిఫికెట్లను పదుల సంఖ్యలో సృష్టించడం అంటే మాటలు కాదు. ఇదంతా ఎవరో బాగా అనుభవజ్ఞులైన వారి కనుసన్నల్లో జరుగుతున్నట్లుగా ఆ శాఖ ఉద్యోగులు అనుమానిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇంటి దొంగల పనా లేక బయటి దొంగల మాయాజాలమా. లేదంటే ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకమా.? అనేది తేలాలంటే సమగ్ర విచారణ చేపట్టాలని ఆ శాఖ ఉద్యోగులు కోరుతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అనేది ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. కేసులు బనాయించమని ఆదేశించాం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు నియామకాల్లో బోగస్ మార్కుల జాబితాను సమర్పించి, మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు పొందారని ఫిర్యాదులు వచ్చాయి. మొత్తం 15 మందిలో 8 మంది మార్కుల జాబితాను ‘ట్యాంటర్డ్’ చేశారని డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ నుంచి నివేదిక వచ్చింది. ఇందుకు సంబంధించి షోకాజ్ నోటీసులకు బదులు ఇవ్వనందున, వారిపై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. మిగతా ఏడుగురి నివేదిక త్వరలో రానుంది. బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు, అందుకు సహకరించిన వారిపై కఠిన చర్యలు చేపడతాం. – డాక్టర్ కోటేశ్వరి, రీజినల్ డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం -
రాష్ట్రంపై క్షయ పంజా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై క్షయ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా అధిక కేసులు నమోదు అవుతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మందులకు బ్యాక్టీరియా లొంగకపోవడం, పాలకులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి తీవ్రత పూర్తిస్థాయిలో తగ్గడంలేదని క్షయ మరణాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో 2022లో టీబీ కారణంగా ఏకంగా 1,892 మంది మరణించారు. 2021లో 2,055 మంది, 2020లో 2,300 మంది చనిపోయారు. 2022లో 72,911 కేసులు... రాష్ట్రంలో టీబీ పూర్తి నియంత్రణకు రావడం లేదు. 2017లో 44,644 టీబీ కేసులను గుర్తిస్తే, 2018లో 52,269 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. 2019లో 71,665 మందికి వ్యాపించింది. 2020లో 63,243 మందికి, 2021లో 60,796 మందికి వ్యాధి సోకింది. 2022లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గత ఏడాది ఏకంగా 72,911 మంది టీబీ బారినపడ్డారు. రాష్ట్రంలో టీబీ కేసులు ఎక్కువగా హైదరాబాద్‌లోనే నమోదవడం గమనార్హం. 2022లో మొదటి ఏడు నెలల్లో హైదరాబాద్‌లో అత్యధికంగా 6,235 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 2,356 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 2,294 నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 1,409 కేసులు, ఖమ్మం జిల్లాలో 1,299 కేసులు నమోదయ్యాయి. అత్యంత తక్కువగా ములుగు జిల్లాలో 232 టీబీ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 86.5 శాతం మందికి ఆర్థిక సాయం... నేరుగా నగదు బదిలీ (డీబీటీ) పద్దతిలో క్షయవ్యాధిగ్రస్తులకు నెలకు రూ.500 కేంద్రం ఇస్తుంది. అందులో కేంద్రం వాటా 60 శాతం కాగా, రాష్ట్ర వాటా 40 శాతం. అయితే రాష్ట్రంలో కొందరు క్షయ రోగులకు ఆ ఆర్థిక సహకారం పూర్తిస్థాయిలో అందడంలేదు. వారికి బలవర్థకమైన పోషకాహారాన్ని అందించేందుకు ఇస్తున్న ఈ సొమ్ము రాకపోవడంతో అనేకమంది పేద రోగులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నుంచి స్పందన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే గతం కంటే ఇది కాస్త మెరుగుపడిందని రాష్ట్ర క్షయ నియంత్రణ అధికారులు అంటున్నారు. 2020లో క్షయ వ్యాధిగ్రస్తుల్లో 72 శాతం మందికి ఆర్థిక సాయం అందగా, 2021లో 83 శాతం మందికి, 2022లో 86.5 శాతం మందికి డీబీటీ పద్ధతిలో ఆర్థిక సాయం అందింది. 2022లో 68,965 మంది ఆర్థికసాయానికి అర్హులు కాగా, 59,677 మందికి మాత్రమే ఆర్థికసాయం అందింది. మిగిలిన వారికి రాలేదని అధికారులు చెబుతున్నారు -
జేఎన్టీయూ ఆధ్వర్యంలో స్టాఫ్ నర్సుల రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్సుల పోస్టులకు నిర్వహించే రాత పరీక్ష బాధ్యతను జేఎన్టీయూకు అప్పగించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. జేఎన్టీయూ ఆధ్వర్యంలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అయితే పరీక్ష పేపర్‌ను మాత్రం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోనే తయారు చేస్తారు. మే నెలలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇటీవల టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ నేపథ్యంలో స్టాఫ్ నర్స్ పోస్టుల పరీక్షను నిర్వహించడంపై అధికారుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు భారీగా కసరత్తు ప్రారంభించారు. టీఎస్పీఎస్సీ లీకేజీని దృష్టిలో పెట్టుకొని అదనపు చర్యలు తీసుకుంటున్నారు. భారీ డిమాండ్... స్టాఫ్ నర్స్ పోస్టులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. వైద్య ఆరోగ్యశాఖ 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. వాటిని తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ భర్తీ చేయనుంది. మొత్తంగా 40 వేల దరఖాస్తులు వచ్చినట్లు బోర్డు వెల్లడించింది. ఒక్కో స్టాఫ్ నర్స్ పోస్టుకు ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ఈ పోస్టులకు పేస్కేల్ రూ. 36,750 – రూ. 1,06,990 మధ్య ఉంటుంది. దాంతో అభ్యర్థుల నుంచి భారీగా డిమాండ్ ఏర్పడింది. కాగా వేలాది మంది అభ్యర్థులు ఇప్పటికే కోచింగ్ తీసుకుంటున్నారు. కాగా, రాత పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. రాతపరీక్ష సిలబస్ ఇదీ.. అనాటమీ ఫిజియాలజీలలో 14 అంశాలు, మైక్రోబయాలజీలో 6 అంశాలు, సై కాలజీ, సోషియాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, ఫస్ట్ ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఎన్విరాన్మెంటల్ హైజీన్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూట్రిషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్ వైఫరీ గైనకాలాజికల్ నర్సింగ్, గైనకాలజియల్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, నర్సింగ్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ టు రీసెర్చ్, ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్లకు సంబంధించి రాత పరీక్ష సిలబస్ ఉంటుంది. ఈ మేరకు అభ్యర్థులు తయారు కావాలని నిపుణులు సూచిస్తున్నారు. -
24 గంటలూ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు.. మార్గదర్శకాలు జారీ!
సాక్షి, హైదరాబాద్: ఎండల నుంచి ప్రజలను రక్షించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం మార్గదర్శకాలు జారీచేశారు. ఎండ తీవ్రత మార్చి నుంచి జూన్ మధ్య ఉంటుందని, కొన్ని సందర్భాల్లో జూలై వరకు కూడా ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈక్రమంలో జిల్లాల్లో 24 గంటలూ పనిచేసేలా హెల్ప్లైన్లను ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. జిల్లా నిఘా అధికారి నోడల్ ఆఫీసర్‌గా ఉంటారన్నారు. వడదెబ్బ తదితర ఆరోగ్య సమస్యలకు ఎవరైనా గురైతే వారిని కాపాడేందుకు జిల్లా, డివిజనల్ స్థాయిల్లో 24 గంటలూ పనిచేసే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు వడదెబ్బ కేసులు/మరణాలు, తీసుకున్న నివారణ చర్యలపై రోజువారీ నివేదికను తనకు పంపాలని కోరారు. ప్రతీ రోజూ నీటి క్లోరినేషన్‌ను పీహెచ్సీ వైద్యాధికారులు తనిఖీ చేయాలని కోరారు. మార్గదర్శకాలివీ... ♦ అన్ని పీహెచ్‌సీలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ♦ ఎండదెబ్బకు అందించాల్సిన ప్రాథమిక చికిత్సపై వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. ♦ అన్ని ఆసుపత్రుల్లోనూ అత్యవసర ఔషధాలను తగినంత సంఖ్యలో నిల్వ ఉంచాలి. ♦ సీరియస్ కేసులేవైనా వస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించాలి. ♦ శిశువులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆయా వర్గాలకు చెందినవారు ఎండకు దూరంగా ఉండాలి. ♦ ఆరు బయట పనిచేసే కార్మీకులు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండలో పనిచేయకూడదు. పని ప్రదేశంలో వారికి ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించాలి. పని చేసే ప్ర దేశానికి సమీపంలోని కమ్యూనిటీ హాల్స్‌లో అవసరమైన షెల్టర్లను ఏర్పాటు చేయాలి. ♦ పట్టణ ప్రాంతాలు, మునిసిపాలిటీలలో స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతృత్వ సంస్థలు ‘చలివేంద్రం’ ద్వారా సురక్షితమైన మంచినీటి సరఫరా అందజేయాలి. ♦ నీటి పైపులైన్లు లీకేజీ కాకుండా చర్యలు తీసుకోవాలి. ♦ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో ఎండ వేడిమి నుంచి ప్రజలను కాపాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ♦ ఆసుపత్రుల్లో బాధితులకు వడదెబ్బ పాలైన వారికోసం ప్రత్యేకంగా పడకలను సిద్ధం చేయాలి. ♦ ప్రజలు దాహం వేయకపోయినా, వీలైనంత వరకు తగినంత నీరు తాగాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) వాడాలి. నిమ్మరసం, మజ్జిగ లేదా లస్సీ, పండ్ల రసాలు వంటి వాటిని తీసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు నీటిని తీసుకెళ్లాలి. ♦ పుచ్చకాయ, నారింజ, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ వంటి పండ్లు, కూరగాయలను తినాలి. ♦ సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలను ధరించడం మంచిది ♦ ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, టవల్ వంటి వాటిని ఉపయోగించాలి. ♦ పగటిపూట కిటికీలు, కర్టెన్లను మూసి ఉంచాలి. ♦ వేసవి ఎక్కువగా ఉండే సమయంలో వంట చేయడం మానుకోండి. వంట ప్రదేశాన్ని తగినంతగా వెంటిలేట్ చేయడానికి తలుపులు, కిటికీలను తెరవండి. ♦ ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు లేదా పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను తాగకూడదు. -
నిమ్స్ బిల్లింగ్ విభాగానికి మోక్షం
లక్డీకాపూల్ : నిమ్స్ ఆస్పత్రిలో అతి కీలకమైన బిల్లింగ్ విభాగానికి యాజమాన్యం సరికొత్త హంగులను సమకూర్చింది. ఆస్పత్రిలో మూడు దశాబ్దాల తర్వాత ఈ విభాగానికి మోక్షం లభించింది. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే అవుట్ పేషెంట్లు, ఇన్పేషేంట్లకు సంబంధించిన బిల్లులు చెల్లింపులను ఈ విభాగం నిర్వహిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఈ విభాగం పాత బిల్డింగ్‌లో ఓ మూలకు ఉన్నట్టుగా ఉండేది. ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి ఇంటికి వెళ్లే రోగులు డిశ్చార్జి సమయంలో తీవ్ర జాప్యం ఎదురయ్యేది. బిల్లింగ్ విభాగంలో సిబ్బంది కొరత కారణంగా డిశ్చార్జి ప్రక్రియ ఆలస్యమవుతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఈ విభాగం ఆరంభంలో రోజుకి కేవలం 400 మంది రోగులు మాత్రమే ఓపీ సేవలు పొందేవాళ్లు. ప్రస్తుతం దాదాపుగా మూడు వేల మంది వరకు అవుట్ పేషెంట్ విభాగంలో వైద్యసేవలు పొందుతున్నారు. ఆస్పత్రి పడకల సామర్ధ్యం కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 1500 పడకల వరకు రోగులకు చికిత్స అందిస్తున్న పరిస్థితులు. అయినా బిల్లింగ్ విభాగం మాత్రం నానాటికి సిబ్బంది కొరతను ఎదుర్కొంటుంది. గతంలో 18 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఈ విభాగంలో విధులు నిర్వహించే పరిస్థితి. వాళ్లలో 11 మంది పదవీ విరమణ చెందారు. ఆ స్థానంలో ఎలాంటి భర్తీలు చేపట్టకపోవడంతో ఉన్న కొద్ది పాటి సిబ్బందిపై విపరీతమైన పనిభారం పడింది. అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఈ విభాగం ఆధారపడి పని చేస్తుందన్న వ్యాఖ్యలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఓ మూలకు ఉండే బిల్లింగ్ విభాగానికి సర్వ హంగులు కల్పిస్తూ.. సరికొత్త విభాగాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌రావు చొరవతో తెలంగాణ వైద్య సేవలు, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్ధ నిర్మించిన ఈ విభాగాన్ని సోమవారం ఉదయం ఇంచార్జి డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప ప్రారంభించనున్నారు. పేషెంట్ కేర్‌ను దృష్టిలో పెట్టుకుని బిల్లింగ్ విభాగాన్ని ఆధునీకరించిన విధంగా ఆ విభాగం సిబ్బందిని కూడా బలపేతం చేయాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది నియామకం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని. ఆ దిశగా యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. అప్పుడు రోగులకు సకాలంలో మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ విభాగం దోహదపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
కొనసాగుతున్న హెపటైటిస్ – బీ టీకా పంపిణీ
సాక్షి, అమరావతి: హెపటైటిస్ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. హెపటైటిస్–బీ బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలున్న హెచ్ఐవీ బాధితులకు టీకా పంపిణీని గత నెలలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభించింది. రాష్ట్రంలోని 55 యాంటి రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ) కేంద్రాల్లో టీకా అందుబాటులో ఉంచింది. హెచ్ఐవీ బాధితులకు స్క్రీనింగ్ నిర్వహించి హెపటైటిస్–బీ నెగెటివ్‌గా నిర్ధారణ అయిన వారికి టీకా వేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 54,805 మందికి తొలి డోసు వేశారు. రెండో డోసు 3,002 మందికి వేశారు. వచ్చే వారంలో హెచ్ఐవీ హైరిస్క్ వర్గాలకు టీకా పంపిణీ ప్రారంభిస్తున్నారు. ఏపీ శాక్స్ హై రిస్క్ వర్గాలుగా గుర్తించిన 3,923 మంది ట్రాన్స్జెండర్లు, 1,16,616 మంది మహిళా సెక్స్ వర్కర్లు, 23,623 మంది పురుష స్వలింగ సంపర్కులు, 1,741 ఇన్‌జెక్టింగ్ డ్రగ్ యూజర్స్.. మొత్తం 1,45,903 మందికి టీకా పంపిణీ లక్ష్యం. ఈ క్రమంలో దేశంలోనే హెచ్ఐవీ బాధితులు, హైరిస్క్ వర్గాలకు టీకా ఇస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంది. తొలి డోసు వేసుకున్న నెలకు రెండో డోసు, తరువాత రెండు నెలలకు చివరి డోసు టీకా వేస్తారు. హెపటైటిస్ నియంత్రణలో భాగంగా ఇప్పటికే వైద్యులు, వైద్య సిబ్బందికి వందశాతం టీకా పంపిణీ చేశారు. కొత్తగా విధుల్లో చేరుతున్న వారికి కూడా టీకా వేస్తున్నారు. వైద్యశాఖ అంచనాల ప్రకారం రాష్ట్రంలో 2.3 శాతం జనాభా హెపటైటిస్ – బీ, 0.3 శాతం హెపటైటిస్–సీతో బాధపడుతున్నారు. శృంగారం, రక్తమార్పిడి, సిరంజిలు, టూత్‌బ్రెష్, రేజర్లు వంటి వివిధ రూపాల్లో హెపటైటిస్–బీ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. హెచ్ఐవీ బాధితులు, హైరిస్క్ వర్గాల వారు హెపటైటిస్–బీ బారిన పడటానికి ఎక్కువ అవకాశాలుంటాయని, అందువల్ల వీరు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని రాష్ట్ర హెపటైటిస్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం ప్రత్యేకాధికారి డాక్టర్ నీలిమ తెలిపారు. దగ్గరలోని ఏఆర్టీ కేంద్రానికి వెళ్లి స్క్రీనింగ్ చేయించుకుని టీకా వేయించుకోవాలన్నారు. హెపటైటిస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయించి, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. -
జీతాలపై దుష్ప్రచారం చేస్తున్నారు
సాక్షి, అమరావతి: వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఉద్యోగుల జీతాల విషయంలో ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చాక అదనంగా రెండున్నర లక్షలమందికిపైగా ఉద్యోగాలు ఇచ్చిందని, వారంతా ప్రభుత్వంలో కొత్తగా చేరిన విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఆర్టీసీ విలీనం వల్ల వారు ప్రభుత్వ ఉద్యోగులయ్యారని, గ్రామ సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించాయని, వీటివల్ల జీతాల భారం పెరిగిందని వివరించారు. ప్రభుత్వ సొంత ఆదాయం ఏడాదికి రూ.1.25 లక్షల కోట్ల మేర వస్తుంటే, రూ.90 వేల కోట్లు జీతాలకే సరిపోతోందని చెప్పారు. సీపీఎస్ రద్దు అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందన్నారు. ఈ నెలాఖరులోగా ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.3 వేల కోట్లకుపైగా చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. పీఆర్సీ బకాయిల చెల్లింపులపై ఈ నెల 16వ తేదీన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన చర్చల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. కానీ బయటకు వెళ్లాక ఉద్యమాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. -
H3N2 Virus: భారత్‌లో రెండు మరణాలు.. ఎక్కడంటే?
సాక్షి, ఢిల్లీ: హెచ్3ఎన్2 ఇన్ప్లూయెంజా ఫ్లూ.. ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్యలో దేశంలో రోజురోజుకు పెరిగిపోతోంది. మరోవైపు.. ఈ వైరస్ కారణంగా దేశంలో ఇద్దరు మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈ ఫ్లూ వైరస్ పట్ల భయపడాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, హెచ్3ఎన్2 వైరస్ కారణంగా హర్యానాలో తొలి మరణం సంభవించిందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కర్ణాటకలో కూడా మరో వ్యక్తి ఇదే వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. చనిపోయిన వ్యక్తి హసన్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్టు కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు. మరోవైపు.. ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య గతకొన్ని నెలలుగా వేల సంఖ్యలో ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే.. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించాలని ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. ఇక, ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అలాగే ఈ ఫ్లూ లక్షణాలు ఒకటి నుంచి నాలుగు రోజుల్లోనే తెలిసిపోతాయి. హెచ్3ఎన్2 బారినపడివారిలో లక్షణాలు కన్పించకపోతే ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఇన్‌ఫ్లూయెంజా బారినపడితే శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తక్కువగానే ఉంటాయి. ఆక్సిజన్ అందిచాల్సిన అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే, ఓ వ్యక్తికి సోకింది కోవిడ్ లేక ఫ్లూనా అని కచ్చితంగా నిర్ధరించుకోవాలంటే కరోనా టెస్టు తప్పకుండా చేయించుకోవాల్సిందేని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా బారిన వారికి చికిత్సలో యాంటీబయాటిక్స్ ఉపయోగించవద్దని ఐసీఎంఆర్ సూచించింది. BIG BREAKING NEWS | H3N2 Influenza: Two deaths due to virus in Karnataka & Haryana - Sources Total of 90 H3N2 Influenza cases so far reported#BreakingNews #H3N2Influenza #H3N2 pic.twitter.com/ju9IA7JlfQ — Mirror Now (@MirrorNow) March 10, 2023 -
వైద్యరంగానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట
-
వైద్య సేవల్లో తెలంగాణ థర్డ్ ప్లేస్.. యూపీ స్థానం తెలుసా అంటూ హరీష్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైద్యరంగంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతను మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ డయాగ్నాస్టిక్స్పై నేషనల్ హెల్త్ మినిస్ట్రీ నుంచి ప్రశంసలు అందినట్టు మంత్రి తెలిపారు. ఈ సందర్బంగా ఆరోగ్య శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ మీడియాతో మాట్లాడుతూ.. పల్లె దవాఖానాల ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వ పనితీరును కేంద్రం ప్రశంసించింది. ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న 3వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. బీజేపీ అధికారంలో ఉన్న యూపీ చివరి స్థానంలో ఉంది. కేసీఆర్ కిట్ ద్వారా 13.91 లక్షల మందికి ప్రయోజనం కలిగింది. 2014 నాటికి రాష్ట్రంలో శిశు మరణాల రేటు 39 కాగా.. ప్రస్తుతానికి 21కి తగ్గిందని వెల్లడించారు. వైద్య రంగానికి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి టెలి కన్సల్టెన్సీ సేవలు అందించాము. టీబీ నియంత్రణ, నిర్మూలనలో తెలంగాణకు అవార్డు దక్కింది. నిమ్స్‌లో బెడ్ల సంఖ్యను 1489 నుంచి 3489కి పెంచాము. తెలంగాణలో ప్రస్తుతం 22 జిల్లాల్లో డయాగ్నోస్టిక్స్ హబ్స్ ఉన్నాయి. గత ఏడాది రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు విద్యతో పాటు వైద్యం కూడా అందుబాటులోకి వస్తుంది. వరంగల్‌లో రూ.11వందల కోట్లతో 2వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నాము. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. పేద మహిళలకు న్యూట్రీషన్ కిట్స్ కూడా అందజేస్తున్నామని తెలిపారు. వసతులు పెంచడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. ఎన్సీడీసీ స్క్రీనింగ్ ద్వారా ఇంటి వద్దకు వెళ్లి పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. -
మార్చికల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్
సాక్షి, విశాఖపట్నం: వచ్చే మార్చి నాటికి శ్రీకాకుళం జిల్లా పలాసలోని కిడ్నీ రీసెర్చి సెంటర్ అందుబాటులోకి తెస్తున్నామని.. ఇక్కడి ఉద్దానంతో పాటు ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరుల్లోని కిడ్నీ తీవ్రతను తగ్గించే చర్యలు కూడా ఇప్పటికే చేపట్టామని.. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు వెల్లడించారు. అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఆపీ), ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖలు కూడా పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించామన్నారు. విశాఖలో మూడ్రోజులుగా జరుగుతున్న గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఒప్పందం జరిగితే ప్రవాస భారతీయ వైద్య ప్రముఖుల సేవలను రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాలలు, వైద్య విద్యాలయాలు వినియోగించుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ సమ్మిట్ ద్వారా వైద్య రంగ నిపుణుల సూచనలు, సలహాలను ప్రభుత్వం తీసుకుని వాటి ఆచరణకు కృషిచేస్తుందని చెప్పారు. విదేశీ వైద్య ప్రముఖులు రాష్ట్రానికి వచ్చిన సమయంలో ప్రధాన వైద్యశాలల్లో అత్యవసర చికిత్సలతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని కోరినట్లు తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన మన వైద్యులు వారి అనుభవాలను మన రాష్ట్ర వైద్య విధానంలో మార్పుల కోసం సహకరించాలని కోరారు. అంకాలజీ విభాగాల బలోపేతం అలాగే, రాష్ట్రంలోని ఏడు పురాతన వైద్య కళాశాలల్లో అడ్వాన్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సదుపాయాలతో పాటు రేడియోథెరపీ, సర్జికల్, మెడికల్ అంకాలజీ విభాగాలను బలోపేతం చేసే అంశం ప్రభుత్వ ప్రతిపాదనలో ఉందని కృష్ణబాబు వెల్లడించారు. ఈ సదస్సులో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి జీఎస్ నవీన్‌కుమార్, ‘ఆపీ’ ఇండియా ప్రతినిధులు డాక్టర్ టి.రవిరాజు, రవి కొల్లి, ‘ఆపీ’ అమెరికా కోఆర్డినేటర్ ప్రసాద్ చలసాని, భారత సంతతి అమెరికా వైద్యులు, దేశంలోని పలువురు ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. అంతకుముందు.. డాక్టర్ రవిరాజు ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రసాద్ చలసానికి ప్రదానం చేశారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తోందని కృష్ణబాబు చెప్పారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో ఆరోగ్య పథకాలు, సేవలను అమలుచేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమం ద్వారా రూ.16 వేల కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలలు, ప్రతి జిల్లాలో ఒక క్యాథ్‌ల్యాబ్‌ను గిరిజన ప్రాంతాల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటుచేస్తున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ ఫిజిషియన్ విధానాన్నీ ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్ చేసిన 2,225 ఆస్పత్రుల ద్వారా 3,255 రకాల వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క క్యాన్సర్‌కే ఏటా రూ.400 కోట్లు వెచ్చిస్తోందన్నారు. -
కరోనా వచ్చినా కంగారొద్దు..
సాక్షి, అమరావతి: కరోనా మొదటి, రెండో విడత ఉధృతిని సమర్థంగా ఎదుర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం.. మరోసారి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న తాజా వ్యాప్తిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధమైంది. వైరస్ నిర్ధారణ పరీక్షలు మొదలు చికిత్స అందించడానికి, వైరస్ నియంత్రణకు అన్ని వనరులను ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇంకా అవసరమయ్యే పరికరాలు, వస్తువుల కొనుగోలుకు చర్యలు చేపట్టింది. గతంలో వైరస్ వ్యాప్తి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కరోనాకు చికిత్స అందించే ఆస్పత్రులుగా వైద్య శాఖ నోటిఫై చేసింది. వైరస్ వ్యాప్తి, పాజిటివ్ కేసులు తగ్గడంతో ఈ ఆస్పత్రులను డీ నోటిఫై చేశారు. మళ్లీ పాజిటివ్ కేసుల నమోదు పెరిగితే ఆస్పత్రులను తిరిగి నోటిఫై చేయనున్నారు. ఆయా ఆస్పత్రుల్లో 8,594 ఐసీయూ, 34,763 ఆక్సిజన్, 12,292 సాధారణ పడకలు అందుబాటులో ఉన్నాయి. 5813 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. ఐసోలేషన్/క్వారంటైన్ పడకలు 54వేల చొప్పున ఉన్నాయి. 1,092 పీడియాట్రిక్ ఐసీయూ పడకలు, 5,610 పీడియాట్రిక్ వెంటిలేటర్లు, 297 నియోనాటల్ వెంటిలేటర్లు ఉన్నాయి. ప్రాణవాయువు పుష్కలం రెండో విడత కరోనా వ్యాప్తిలో ఆక్సిజన్‌కు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ఆæ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఆక్సిజన్‌కు కొరత రాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 170 పీఎస్ఏ ప్లాంట్లు నెలకొల్పడంతో పాటు 33,902 డీ–టైప్ సిలెండర్లు, 15,565 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సమకూర్చారు. మరోవైపు స్వల్ప లక్షణాలుండి ఇంటిలో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారికి అందజేసేందుకు 4,61,729 హోమ్ ఐసోలేషన్ కిట్లు ఉన్నాయి. వైద్యులు, వైద్య సిబ్బందికి 16,32,714 ఎన్ 95 మాస్క్‌లు, 4,80,441 పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి 14,24,000 ఆర్టీపీసీఆర్, 8,44,763 ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ కిట్లు ఉన్నాయి. జాగ్రత్తలు పాటించాలి కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్–7 కేసులు నమోదవలేదు. డిసెంబర్ నెలలో ఇప్పటివరకు 48 నమూనాలను జీనోమ్ ల్యాబ్‌లో పరీక్షించారు. ఈ కేసులన్నీ ఒమిక్రాన్‌కు సంబంధించినవే. ఎయిర్‌పోర్టుల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు ప్రారంభించాం. అంతర్జాయతీ ప్రయాణికులకు ఎరికైనా పాజిటివ్‌గా తేలితే వారి నమూనాలను జీనోమ్ ల్యాబ్‌కు పంపి సీక్వెన్సింగ్ చేపట్టాలని నిర్ణయించాం. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
తల్లీబిడ్డల ఆరోగ్యానికి అభయం.. ‘కిల్కారీ’కి శ్రీకారం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మాతా శిశు మరణాల నివారణే లక్ష్యంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ఆహార నియమాలు, వైద్య పరీక్షలు తదితర అంశాలపై అప్రమత్తం చేసేందుకు ‘కిల్కారీ’ పేరిట ఆడియో కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. గర్భిణులు, పాలిచ్చే తల్లుల మొబైల్‌కు డాక్టర్ అనిత అనే కల్పిత వైద్యురాలి వాయిస్‌తో ఆరోగ్యపరమైన సూచనలు, తీసుకోవాల్సిన పోషకాహారం, చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు వంటి అంశాలను వివరిస్తారు. ఈ సందేశాలు గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. వారిలో తలెత్తే ఎన్నో సందేహాలను నివృత్తి చేసే విధంగా వాయిస్ సందేశం ఉంటుందని చెబుతున్నారు. గర్భం దాల్చిన నాలుగో నెల నుంచి.. మహిళ గర్భం దాల్చిన నాల్గవ నెల నుంచి పాలిచ్చే తల్లుల వరకు.. బిడ్డకు ఏడాది వయసు వచ్చేవరకూ 72 సార్లు మొబైల్ సందేశాలు వచ్చేలా కిల్కారీ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరికీ 0124488000 నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఒకసారి ఫోన్ ఎత్తకుండా మిస్ అయితే, ఐవీఆర్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఒకేరోజు మూడుసార్లు ఫోన్ వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత మూడు రోజులకు రెండుసార్లు కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. గర్భిణులు, బాలింత కిల్కారీ నుంచి కాల్ పొందలేకపోయినా, ఆ వారాల సందేశాన్ని తిరిగి వినాలనుకున్నా ఆమె దానిని మళ్లీ వినడానికి 14423కు డయల్ చేయవచ్చు. బాలింత ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ఏ విధమైన ఆహారం తీసుకోవాలనే దానితోపాటు వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలను వివరిస్తారు. కిల్‌కారీపై విస్తృత అవగాహన గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం ప్రవేశ పెట్టిన కిల్కారీ విధానంపై విస్తృతంగా అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాం. ఏఎన్ఎంలు ప్రతి గర్భిణి, పాలిచ్చే తల్లులను నమోదు చేస్తుండగా, ఆశా కార్యకర్తలు తమ పరిధిలోని వారు తప్పకుండా ఆ సందేశాలు వినేలా అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు వైద్యపరీక్షలు చేయించుకోవాలి, పాలిచ్చే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శిశువు ఆరోగ్యం విషయంలో చేపట్టాల్సిన చర్యలు ఇలా సమగ్ర సమాచారాన్ని కల్పిత డాక్టర్ వాయిస్‌తో వారికి చేరవేస్తారు. డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్‌వో, ఎన్టీఆర్ జిల్లా -
కరోనా ఫోర్త్ వేవ్‌పై అప్రమత్తంగా ఉన్నాం
యాదగిరిగుట్ట: కరోనా ఫోర్త్ వేవ్‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. శనివారం ఆయన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. గర్భాలయంలో స్వయంభూలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఫోర్త్ వేవ్‌కు సంబంధించి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. ఇప్పటికే పరీక్షలు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో 100శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తయిందని, హైబ్రిడ్ ఇమ్యూనిటీ కూడా వచ్చినట్లు వెల్లడించారు. -
XBB వేరియంట్ వెరీ డేంజర్.. కేంద్రం స్పందన ఇదే..
కరోనా వైరస్ వేరియంట్లు ప్రపంచ దేశాలను మరోసారి భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కొత్త వేరియంట్ల కారణంగా ఇప్పటికే చైనాతో పాటుగా మరికొన్ని దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో, అక్కడ ప్రభుత్వాలు వైరస్ కట్టడికి పూర్తి స్థాయిలో ప్రణాళికలు చేస్తున్నాయి. కాగా, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇటు భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇదిలా ఉండగా.. కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్‌పై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్తు కొడుతోంది. కోవిడ్ ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ వ్యాప్తి ప్రారంభమయిందని.. అలాగే ఈ వేరియంట్ ప్రాణాంతకమైనదంటూ వాట్సాప్ గ్రూప్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. దీంతో, పాటుగా ఎక్స్‌బీబీ వేరియంట్‌ను గుర్తించడం చాలా కష్టమని అందులో ఉంది. దీని వల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని.. ఇది గతంలో వచ్చిన డెల్టా వేరియంట్ కన్నా ఐదు రెట్లు ప్రమాదకరమైనదని.. కాబట్టి మరింత జాగ్రత్త అవసరం అంటూ వార్తలో రాసి ఉంది. కాగా, వార్తపై నెటిజన్లు భయాందోళనలకు గురవుతున్నారు. ఇక, ఈ వార్తపై కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ ఇచ్చింది. ఇది ఫేక్ వార్త అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ కొట్టిపారేసింది. ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందించింది. ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్‌పై సోషల్ మీడియాలో ఫేక్ వార్త ప్రచారంలో ఉంది. ఈ వార్తలను ప్రజలు నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని సీరియస్ కామెంట్స్ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం అప్రమత్తంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. మరోవైపు.. ఎక్స్‌బీబీ వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. ఎక్స్‌బీబీ వేరియంట్ వల్ల సోకే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. #FakeNews This message is circulating in some Whatsapp groups regarding XBB variant of #COVID19. The message is #FAKE and #MISLEADING. pic.twitter.com/LAgnaZjCCi — Ministry of Health (@MoHFW_INDIA) December 22, 2022 -
జాతీయ స్థాయిలో ఏపీ వైద్యశాఖకు రెండు అవార్డులు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మరోసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. రాష్ట్ర వైద్యశాఖకు జాతీయ స్థాయిలో రెండు అవార్డులు లభించాయి. పల్లె ప్రజలకు వైద్యసేవలు చేరువచేయడం కోసం నెలకొలి్పన డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల నిర్వహణ, వీటిలో టెలీ మెడిసిన్ వైద్యసేవలను అమలు చేస్తున్నందుకు గానూ యూనివర్సల్ హెల్త్ కవరేజ్(యూహెచ్‌సీ) డే సందర్భంగా కేంద్ర వైద్యశాఖ ప్రదానం చేస్తున్న అవార్డులకు రాష్ట్రం ఎంపికైంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శని, ఆదివారాల్లో నిర్వహించనున్న యూహెచ్‌సీ డే వేడుకల్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, అధికారులు పాల్గొని అవార్డులు స్వీకరించనున్నారు. విలేజ్ క్లినిక్‌లతో వైద్యసేవలు చేరువ గ్రామీణ ప్రజలకు వైద్యసేవలను చేరువచేయడం కోసం ప్రభుత్వం 10,032 డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను నెలకొల్పుతోంది. నాడు–నేడు కింద క్లినిక్‌లను రూ.1,692 కోట్లతో ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే 8,351 క్లినిక్‌లు ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాయి. వీటిని ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్నెస్ సెంటర్(ఏబీ–హెచ్డబ్ల్యూసీ)లుగా నిర్వహిస్తున్నారు. ఈ సేవలకు గానూ రాష్ట్ర వైద్యశాఖ అవార్డుకు ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఏపీ సహా 20రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అవార్డులు అందిస్తున్నారు. అవార్డుకు ఎంపికైన అన్ని రాష్ట్రాల్లో విలేజ్ క్లినిక్‌ల నిర్వహణలో ఏపీ అగ్రస్థానంలో ఉండటం విశేషం. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలకు 12రకాల వైద్యసేవలు, 14 రకాల వైద్యపరీక్షలు, 67రకాల మందులను అందిస్తున్నారు. 2.84కోట్ల మందికి టెలీ మెడిసిన్ సేవలు అన్ని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో టెలీ మెడిసిన్ సేవలు అమలవుతున్నాయి. క్లినిక్‌కు వచ్చిన ప్రజలకు పీహెచ్సీ వైద్యుడు, స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్ అవసరమైతే టెలీ మెడిసిన్ ద్వారా కూడా అందుతున్నాయి. టెలీ మెడిసిన్ సేవల కోసం రాష్ట్రవ్యాప్తంగా 27 హబ్‌లను వైద్యశాఖ ఏర్పాటు చేసింది. వీటిలో జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్, ఇతర స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉంటారు. రాష్ట్రంలో 2019 నుంచి 2.84 కోట్ల టెలీ కన్సల్టేషన్లు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 8 కోట్ల కన్సల్టేషన్లు నమోదు కాగా, ఏపీ నుంచి 2.84కోట్లు ఉండటం విశేషం. విలేజ్ క్లినిక్‌లలో టెలీ మెడిసిన్ సేవల్లో పెద్ద రాష్ట్రాల విభాగంలో మూడు రాష్ట్రాలకు అవార్డులు దక్కగా, అందులో ఏపీ ఒకటి కాగా, మిగిలినవి తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి. -
1,147 వైద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కొత్తగా 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల నియామక సంస్థ (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌ఏ) సభ్య కార్యదర్శి గోపికాంత్‌రెడ్డి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ) పరిధిలోని వివిధ స్పెషాలిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల కోసం (https://mhsrb. telangana. gov. in) బోర్డు వెబ్సైట్లో అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నెల 20 ఉదయం 10:30 గంటల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. ఆన్లైన్ దరఖాస్తులను వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం 5 గంటలకల్లా సమర్పించాలన్నారు. ఫలితాలు ప్రకటించే వరకు ఖాళీలు ఏవైనా ఉంటే వాటిని చేర్చడం లేదా తొలగించడం చేస్తామని పేర్కొన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో నియమితులయ్యే వారు ప్రైవేటు ప్రాక్టీస్‌కు అర్హులు కాదని ఆయన స్పష్టం చేశారు. ►అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్న స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్/సూపర్ స్పెషాలిటీ అర్హత పొందిన తర్వాతే వారి వెయిటేజీని లెక్కిస్తారు. ►దరఖాస్తుదారుల గరిష్ట వయసు 01–07–2022 నాటికి 44 ఏళ్లు మించకూడదు. ►రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేసే డాక్టర్లకు వారు పనిచేసిన కాలానికి ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుంది. అయితే టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మొదలైన వాటిల్లో పనిచేసినవారికి ఇది వర్తించదు. మాజీ సైనికులకు మూడేళ్ల వరకు, ఎన్సీసీలో డాక్టర్లుగా పనిచేసిన వారికి మూడేళ్ల వరకు వయో పరిమితి సడలిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. పీహెచ్‌లకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది. ►ఇతర రాష్ట్రాలకు చెందిన దరఖాస్తుదారులు రిజర్వేషన్లకు అర్హులు కాదు. ►పోస్ట్‌లను మల్టీ–జోనల్‌గా వర్గీకరించారు. స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుంది. స్థానిక రిజర్వేషన్ 95 శాతం ఇస్తారు. ►వేతన స్కేల్ రూ. 68,900 నుంచి రూ. 2,05,500గా ఖరారైంది. -
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం
-
వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
అందరికీ ఆరోగ్యం ..
-
వైద్యశాఖలో ఇంటర్వ్యూలు.. రెండో రోజు 462 మంది హాజరు
సాక్షి, అమరావతి: వైద్య శాఖలోని డీఎంఈ, ఏపీవీవీపీ విభాగాల్లో స్పెషలిస్ట్, సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకానికి నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు గురువారం రెండో రోజు 462 మంది వైద్యులు హాజరయ్యారు. డీఎంఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏపీవీవీపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల నియామకానికి బుధవారం నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రెండోరోజు డీఎంఈలో 61 పోస్టులు నోటిఫై చేయగా 304 మంది, ఏపీవీవీపీలో 137 పోస్టులు నోటిఫై చేయగా 158 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తులను పరిశీలించి మెరిట్ జాబితాలు ప్రదర్శించి, వీటిపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా పోస్టింగ్‌లు ఇచ్చారు. తొలి రోజు 161 పోస్టులు భర్తీ తొలి రోజైన బుధవారం అర్ధరాత్రి వరకు ఇంటర్వ్యూలు కొనసాగాయి. పలువురు అభ్యర్థులకు గురువారం పోస్టింగ్‌లు ఇచ్చారు. తొలి రోజు 161 పోస్టులు భర్తీ అయినట్టు ఏపీవీవీపీ కమిషనర్, ఇన్చార్జి డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. తొలి రోజు డీఎంఈలో 96 పోస్టులు నోటిఫై చేయగా 45, ఏపీవీవీపీలో 173 పోస్టులు నోటిఫై చేయగా 116 భర్తీ చేశామన్నారు. శుక్రవారం కూడా ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. -
చంద్రబాబు పై మంత్రి విడదల రజని ఫైర్
-
ఆరోగ్య సేవలకు రూ.3,200 కోట్లు: ఏపీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్సల సంఖ్యను త్వరలో 2,446 నుంచి 3,254కు పెంచనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ, అనుబంధ సేవలకు ఏటా రూ.3,200 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. గత సర్కారు హయాంతో పోలిస్తే మూడు రెట్లు అదనంగా ఖర్చు చేస్తున్నామని, ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని చెప్పారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వైద్య శాఖలో నియామకాలు, ఆరోగ్యశ్రీలో చికిత్సల పెంపు, కొత్త వైద్య కళాశాలల నిర్మాణం సహా పలు కార్యక్రమాల్లో పురోగతిని పరిశీలించారు. మెరుగైన వైద్య సేవలే లక్ష్యం ఆరోగ్యశ్రీ పథకం కోసం ఏటా రూ.2,500 కోట్లు, ఆరోగ్య ఆసరా కోసం సుమారు రూ.300 కోట్లు, 108 అంబులెన్స్‌లు, 104 మొబైల్ మెడికల్ యూనిట్ల (ఎంఎంయూ) కోసం మరో రూ.400 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మొత్తంగా ఏటా రూ.3,200 కోట్లు ఆరోగ్యశ్రీ, అనుబంధ సేవలకు వెచ్చిస్తున్నాం. వచ్చే డిసెంబర్ నాటికి 104 ఎంఎంయూ కొత్త వాహనాలు 432 అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 676 వాహనాల ద్వారా గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తున్నాం. కొత్త వాహనాలతో ఎంఎంయూల సంఖ్య 1,108కి పెరుగుతుంది. వీటికి తోడు 108 అంబులెన్స్‌లు 748 ఉన్నాయి. 104, 108 వాహనాల నిర్వహణ, ఆరోగ్యశ్రీ పథకం అమలులో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే మన లక్ష్యం. 12 వైద్య పరీక్షలు.. 67 రకాల మందులు గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో 12 రకాల వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు 67 రకాల మందులు పుష్కలంగా అందుబాటులో ఉండాలి. కరోనా నిర్ధారణ కిట్లు కూడా సమకూర్చాలి. ప్రతి నెలా ఆడిట్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరత సమస్య తలెత్తడానికి వీల్లేదు. వేల సంఖ్యలో వైద్య సిబ్బంది పోస్టుల భర్తీ చేపట్టాం. ప్రతి చోటా సరిపడా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. దీనిపై ప్రతి నెలా ఆస్పత్రుల వారీగా ఆడిట్ నిర్వహించాలి. ఆడిట్ నివేదికలు ప్రతి నెలా ఉన్నతాధికారులకు చేరాలి. నివేదికలు పరిశీలించి ఎక్కడైనా ఖాళీ ఉంటే తక్షణమే వేరొకరిని నియమించాలి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు యోచన చేయాలి. జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంపుపై చర్యలు తీసుకోవాలి. డైట్ చార్జీలు రూ.100 ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు మంచిమెనూతో ఆహా రం అందించాలి. డైట్చార్జీని రోజుకు రూ.100కు పెంచాలి. మంచి మెనూతో డైట్ సమకూర్చాలి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 17 కొత్త వైద్యకళాశాలలను నిర్మిస్తున్నాం. సకాలంలో వీటి నిర్మాణాలు పూర్తయ్యేలా దృష్టి సారించాలి. 15 నుంచి ప్రారంభం! ఆరోగ్యశ్రీలో కొత్తగా చేర్చే చికిత్సలను దాదాపు ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే కొన్ని సంప్రదింపుల దృష్ట్యా కొత్తగా చేర్చిన చికిత్సలను అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాన్ని అక్టోబర్ ఐదో తేదీ నుంచి 15వ తేదీకి వాయిదా వేసినట్లు వెల్లడించారు. అదే రోజు ‘ఫ్యామిలీ డాక్టర్’ పైలట్ ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తామన్నారు. వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం వచ్చే నవంబర్ నెలాఖరుకు పూర్తవుతుందని చెప్పారు. సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ సమీర్‌శర్మ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు కృష్ణబాబు, ముద్దాడ రవిచంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, వైద్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, సీఎఫ్‌డబ్ల్యూ నివాస్, డీఎంఈ, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వినోద్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిరప్రసాద్, డ్రగ్ కంట్రోల్ డీజీ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ఆరు అవార్డులు ప్రజలకు డిజిటల్ వైద్య సేవలు అందించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందచేసిన అవార్డులను సమీక్ష అనంతరం సీఎం జగన్ తిలకించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమంలో ఉత్తమ పనితీరుకు జాతీయ స్థాయిలో 10 అవార్డులు ఇవ్వగా ఆరు రాష్ట్రానికే దక్కాయని మంత్రి రజిని, అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన సీఎం జగన్ వారిని అభినందించారు. -
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష
-
పటిష్ట చర్యలతో విషజ్వరాలను కట్డడి చేశాం: మంత్రి రజనీ
సాక్షి, అమరావతి: విషజ్వరాలతో మరణాలు రాష్ట్రంలో సంభవించలేదని, విషజ్వరాలను సమర్థవంతంగా కట్టడి చేయగలిగామని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం.. వైద్యారోగ్య శాఖల నాడు-నేడు స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆమె ప్రసంగించారు. గత ప్రభుత్వంలో(2015-19 మధ్య) 74 వేలకు పైగా మలేరియా కేసులు నమోదు అయ్యాయి. కానీ, ఈ ప్రభుత్వంలో నాలుగు వేల కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. భారీ వర్షాలు, వరదలు పొటెత్తినా కూడా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుని విషజ్వరాలను రికార్డు స్థాయిలో కట్టడి చేయగలిగామని విడదల రజనీ తెలియజేశారు. ప్రాణాంతకంగా మారుతున్న మలేరియా కట్టడి కోసం కూడా చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్న ఆమె.. ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వం నీరుగార్చిందని, కానీ.. జగనన్న ప్రభుత్వం మాత్రం డెంగ్యూ, మలేరియాలను ఆరోగ్యశ్రీలో చేర్చిందని చెప్పుకొచ్చారు. అదే విధంగా విష జ్వరాల నియంత్రణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించడం, ప్రత్యేక బృందాల క్యాంపులను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆమె లేవనెత్తారు. గత ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో చాలా ఆర్భాటాలు.. ప్రజాధనాన్ని దుబారా చేసిందని మంత్రి రజనీ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆనాడూ ‘దోమలపై దండయాత్ర’ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రకటనను సైతం ఆమె చదివి వినిపించారు. సంధ్య ఘటనపై స్పందిస్తూ.. చింతూరు మండలానికి చెందిన చిన్నారి సంధ్య మృతి ఘటన బాధాకరం. వాస్తవానికి.. వైరల్ డిసీజ్‌తో చిన్నారి మృతి చెందింది. ఈ విషయాన్ని వైద్యులు ఇచ్చిన రిపోర్టులతో పాటు ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికలు కూడా ఇచ్చారని ఆమె ప్రతులు చూపించారు. పొరుగు రాష్ట్రానికి సంధ్య కుటుంబం వెళ్లిందని టీడీపీ విమర్శిస్తోందని.. భద్రాచలం పరిధిలో అందుబాటులో ఉంది కాబట్టే సంధ్య కుటుంబం అక్కడికి వెళ్లిందని మంత్రి రజనీ తెలిపారు. ఈ ఘటనపై కూడా టీడీపీ సభ్యులు రాజకీయం చేయడం సరికాదని, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి విడదల రజనీ మండిపడ్డారు. ఇదీ చదవండి: పారిశ్రామిక పరుగులపై సీఎం జగన్ ఏమన్నారంటే.. -
సమానత్వంలో ఆరోగ్యమూ కీలకమే!
2047 నాటికి అందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దేశంగా భారత్ ఎదగాలంటే ముందుగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంత సమర్థంగా పనిచేయించగలమో చూసుకోవాలి. వ్యక్తులు, వారి అవసరాలే కేంద్రంగా ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం జరగాలి. ఆరోగ్య రంగాన్ని విస్మరిస్తే వ్యాధులు, ఆరోగ్య సమస్యలపై పెట్టాల్సిన ఖర్చులు అలవి కానంతగా పెరుగుతాయి. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మూడోది నేరుగా ఆరోగ్యానికి సంబంధించినదే. అలాగే తొలి రెండు లక్ష్యాలైన అందరికీ ఆహారం, పేదరిక నిర్మూలనకూ ఆరోగ్యంతో సంబంధం ఉన్నది. ఇంకోలా చెప్పాలంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను తీర్చకుండా ఈ రెండు లక్ష్యాలను సాధించడం కష్టం. స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లయ్యే సువర్ణ ఘడియలపైనే ఉంది. భారతదేశం అప్పటికి ఎలా తయారవ్వాలి? నా దృష్టిలో అందరికీ సమాన అవకాశాలున్న దేశంగా; విద్య, ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉన్న దేశంగా ఉండాలి! కులమతాలకు అతీతంగా... వ్యవ సాయం, పాడి పరిశ్రమలు పుష్టిగా సాగుతుండాలి. నాణ్యతే ప్రధానంగా పరిశ్రమలు వస్తువులను అందించాలి. ఇవన్నీ కూడా అందరికీ సమాన అవకాశాలు అన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉపయోగపడేవే. ప్రతి సమాజానికి విద్య, ఆరోగ్యం పునాదుల్లాంటివి. ఈ రెండు విషయాల్లోనూ దేశం సాధించిన ప్రగతికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. భారతీయ విద్యావిధానం అంతర్జాతీయ స్థాయి సీఈవోలను సిద్ధం చేస్తూంటే... భారతీయ ప్రైవేట్ రంగ ఆరోగ్య వ్యవస్థలు ప్రపంచం నలుమూలల్లోని వారికి మెడికల్ టూరిజంతో వైద్యసేవలు అందిస్తున్నాయి. అయితే ఈ రెండు ఉదాహరణలను మినహాయిం పులుగానే చూడాలి. పైగా ఈ రెండింటిలో అవకాశాలు కొందరికే. పిల్లలు తమ మేధోశక్తిని సంపూర్ణంగా ఉపయోగించుకునేందుకు మొట్ట మొదటి పునాది ఇంట్లోనే పడుతుంది. పసివాళ్లతో తగురీతిలో మాటలు కలపడం, ఇంద్రియజ్ఞానానికి సంబంధించిన పనులు చేయించడం వంటి పనుల ప్రాధాన్యతను తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే విద్యభ్యాసానికి గట్టి పునాది పడినట్లే. తల్లిదండ్రులిచ్చిన ఈ ప్రాథమిక విద్యకు సుశిక్షితులైన ఉపాధ్యాయులతో నడిచే పాఠశాల కూడా తోడైతే బాలల వికాసం పెద్ద కష్టమేమీ కాదు. ఉమ్మడి కుటుం బమైనా... చిన్న కుటుంబమైనా సరే... సాంఘిక, ఆర్థిక పరిస్థితులే పిల్లలకు దక్కే విద్య నాణ్యతను నిర్ణయిస్తాయి. పాఠశాల వాతా వరణం సాంఘిక, ఆర్థిక లేమి ప్రభావాన్ని కొంతవరకూ తగ్గించ గలదు కానీ... ఇది జరగాలంటే పాఠశాలలు సక్రమంగా పనిచేస్తూం డాలి. దీనర్థం భవనాలు, పరిపాలన వ్యవస్థలు సరిగా ఉండాలని కాదు. నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయులు కావాలి. అణగారిన వర్గాల పిల్లల జీవితాలను మార్చడం మూకుమ్మడిగా జరగాల్సిన వ్యవహారం. ఈ మార్పు తీసుకు రావడం సాధ్యమనీ, అందుకోసం ఏమైనా చేయగలమనీ ఉపాధ్యాయులు సంకల్పించు కోవడం అవసరం. అయితే ఈ మార్పు రాత్రికి రాత్రి వచ్చేదేమీ కాదు. ప్రభుత్వాల ఆదేశాలతో సాధ్యమయ్యేదీ కాదు. విద్యాబోధనలో గిరిజన సంస్కృతుల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదా తర్క బద్ధమైన అభ్యాసాలను ప్రవేశపెట్టడమైనా సరే... పాఠశాలల్లో విద్యా ర్థుల మదింపు అనేది అందరికీ ఒకేలా ఉండటం సరికాదు. ఈ వాదనలకు ప్రతివాదనలూ లేకపోలేదు. భారత దేశం విశాలమైనదనీ, అన్ని రాష్ట్రాల్లోనూ ఏకరీతి విద్యాబోధన అవసరమనీ అనేవాళ్లూ ఉన్నారు. ప్రభుత్వం వనరుల కొరతను ఎదుర్కొంటోందని ఇంకొందరు అంటారు. విద్యార్థుల జీవితాల్లో మార్పులు తీసుకురావడం దశాబ్దాల దీర్ఘకాలిక ప్రక్రియ అని అంటారు. ఈ ప్రతివాదనలను విస్మరించాల్సిన అవసరమేమీ లేదు. కానీ విద్య ప్రాథమికమైన బాధ్యత సామాజిక వృద్ధి మాత్రమే కాదనీ, సమానతను సృష్టించేం దుకూ ఉపయోగపడాలనీ వీరు గుర్తించాలి. విద్య ద్వారా లింగవివక్షను తగ్గించడం వంటి అనేక లాభాలూ ఉన్నాయని తెలుసుకోవాలి. పాఠశాల విద్యను అభివృద్ధి చేస్తూనే... దీనికి సమాంతరంగా వృత్తి విద్య, పారిశ్రామిక శిక్షణ కేంద్రాలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే... ఈ రెండు రకాల సంస్థలు ఉద్యోగాలు సంపాదించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తాయి. అదే సమయంలో తక్కువ విద్యార్హతలతోనే అర్థవంతమైన ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఆయా రంగాల్లో నిష్ణాతులు ఈ దేశానికి గతంలోనూ ఉన్నారు... భవిష్యత్తులోనూ పుట్టుకొస్తారు. ఇది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియగానే చూడాలి. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలంటే విద్యా వ్యవస్థలో కొత్త కొత్త అవకాశాలను సృష్టించడం... అవి అందరికీ నిత్యం అందుబాటులో ఉండేలా చూడటం అత్యవసరం. ఈ క్రమంలోనే విద్యనభ్య సించేందుకు డబ్బు ఒక ప్రతిబంధకం కాకుండా జాగ్రత్త పడాలి. సుమారు ఇరవై ఏళ్ల క్రితం నాటి మాట. ఆరోగ్యకరమైన సమాజానికి ఆడపిల్లలు విద్యావంతులై ఉండటం ఎంతో అవసరమని ప్రపంచబ్యాంకు నివేదిక ఒకటి విస్పష్టంగా పేర్కొంది. తక్కువమంది పిల్లల్ని కనడం, సురక్షిత కాన్పులు, పిల్లల ఆరోగ్య పరిస్థితుల్లో మెరుగుదల, సమాజంలో స్థాయి పెరగడం వంటి సానుకూల అంశాలకూ ఆడపిల్లలు, మహిళల చదువుకు దగ్గర సంబంధం ఉందని అలవోకగా అనేస్తారు కానీ... ఆరోగ్యం విషయానికి వస్తే అది కాన్పులు, పిల్లల సంరక్షణ పరిధిని దాటి బహుముఖంగా విస్తరించాల్సి ఉంది. రెండు మూడు దశాబ్దాల క్రితంతో పోలిస్తే చాలా వ్యాధులను మనం సమర్థంగా నియంత్రించగలుగుతున్నాం. కాబట్టి ప్రజల ఆరోగ్య సంరక్షణ, ప్రాణాంతక వ్యాధుల నివారణ, రోగులకు మెరుగైన చికిత్స వంటివాటికి ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వాలి. ఐక్యరాజ్య సమితి 2030 నాటికి సాధించాలని ప్రపంచదేశాలకు నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పూర్తిస్థాయిలో నెరవేరడం 2047 నాటికి కానీ సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ఆరోగ్య రంగాన్ని విస్మరిస్తే వ్యాధులు, ఆరోగ్య సమస్యలపై పెట్టాల్సిన ఖర్చులు అలవికానంతగా పెరుగుతాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మూడోది నేరుగా ఆరోగ్యానికి సంబంధించినదే. అలాగే తొలి రెండు లక్ష్యాలైన అందరికీ ఆహారం, పేదరిక నిర్మూలనకూ ఆరోగ్యంతో సంబంధం ఉన్నది. ఇంకోలా చెప్పాలంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను తీర్చకుండా ఈ రెండు లక్ష్యాలను సాధించడం కష్టం. 2047 నాటికి అందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దేశంగా భారత్ ఎదగాలంటే ముందుగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంత సమర్థంగా పనిచేయించగలమో చూసుకోవాలి. ఆరోగ్యంపై పెట్టే ఖర్చులు తగ్గించడం, వ్యాధుల నివారణలపై శ్రద్ధ పెట్టడం జరగాలి. చాలా వ్యాధుల చికిత్సకు ఆసుపత్రుల అవసర ముండదు. ఆరోగ్య కార్యకర్తలను రోగులకు అందుబాటులో ఉంచి, భౌతిక, డిజిటల్ సౌకర్యాలు తగినన్ని ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అలాగే అత్యవసర పరిస్థితులకు వేగంగా స్పందించగల, అందరికీ అందుబాటులో ఉండేలా రెఫరెల్ ఆసుపత్రుల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. చికిత్స ఆలస్యం అవడం వల్ల రోగులకు అనవసరమైన ఇబ్బందులు ఎదురు కారాదు. ఇది సాధ్యం కావాలంటే తగిన వనరులు, సిబ్బంది మాత్రమే కాదు... ఇవన్నీ అవసరమైన చోట ఉండేలా చూడాలి. తగిన పద్ధతులను అమల్లోకి తేవడమూ అవ సరమే. ఇంకోలా చెప్పాలంటే వ్యక్తులు, వారి అవసరాలే కేంద్రంగా ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం జరగాలి. భారీ మొత్తాలు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఈ వ్యవస్థ రోగుల అవసరాలను తీర్చగలగాలి. అయితే ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలంటే.. ప్రైవేట్ రంగాన్ని నియంత్రించక తప్పదు. సుశిక్షితులైన, చిత్తశుద్ధితో పనిచేసే సిబ్బందితో కేవలం చౌక మందులు, టీకాలతోనే మన వ్యవస్థను రోగి ప్రధానంగా పనిచేయించవచ్చు. ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణలో అక్కడక్కడ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న వారు ఉన్నారు. క్లిని కల్ సర్వీసుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. వీటిని సుస్థిర అమలు దిశగా మళ్లించాలి. 2047 అంటే ఇంకో పాతికేళ్లు కావచ్చు కానీ... స్వతంత్ర భారత చరిత్రలో ఇంకో శతాబ్దానికి బలమైన పునాది వేసేందుకు ఈ 25 ఏళ్లలో విద్య, ఆరోగ్యంపై మనం పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడులు కూడా సమాజంలోని ఉన్నత వర్గాల కోసం కాదు. అందరికీ. అయితే ఈ పెట్టుబడుల రాబడులు మాత్రం కొన్ని తరాలవారు అందుకుంటారు. గగన్‌దీప్ కాంగ్, వ్యాసకర్త సీనియర్ వైరాలజిస్ట్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
ఆ కాన్సెప్ట్‌ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తెస్తున్నారు: కృష్ణబాబు
సాక్షి, విజయవాడ: ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తెస్తున్నామని ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రతి మండలానికి అందుబాటులోకి నలుగురు వైద్యులు, విలేజ్ క్లినిక్‌లకు భవనాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనిద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇళ్ల వద్దకు వెళ్లే వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి మండలానికి 4 డాక్టర్లు అందుబాటులోకి వస్తారు. డాక్టర్ మారినా నెంబర్ మాత్రం పర్మనెంట్‌గా ఉండేలా చేస్తాం. ఏ సమస్య ఉన్న ఏ సమయంలో అయినా డాక్టర్‌కి ప్రజలు కాల్ చేసే అవకాశం కల్పిస్తాం. వీటికి తర్వాత ఏరియా ఆస్పత్రి డాక్టర్ సేవలు పొందేలా చర్యలు తీసుకుంటాం. ఏ కుటుంబానికి ఆరోగ్య సమస్య వచ్చినా మా డాక్టర్ ఉన్నారన్న నమ్మకం కల్పిస్తాం. డాక్టర్లకు ఇది మంచి పేరు తెచ్చుకునే అవకాశం. గ్రామ స్థాయిలోనే ఎక్కువ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖలో 42,000 పోస్టులను భర్తీ చేశాము. ఇంకో 4 వేల మందిని నియమిస్తాం. సంక్రాంతి నాటికి పూర్తిగా అందుబాటులోకి తెస్తాం. సెప్టెంబర్ మొదటి వారం నుంచి పైలెట్ లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తామని కృష్ణబాబు తెలిపారు. చదవండి: (CM Jagan: చీమకుర్తిలో పర్యటించనున్న సీఎం జగన్) -
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
ఎంఎల్‌హెచ్‌పీలకు జోన్–2లోనే ఎక్కువ ఖాళీలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో సేవలు అందించడానికిగాను 1,681 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి వైద్య శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 9 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోన్న క్రమంలో 4 జోన్ల వారీగా ఖాళీలను వైద్య శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాలను కవర్ చేసే జోన్–2లో 643 బ్యాక్లాగ్, 15 జనరల్ ఖాళీలు కలిపి 658 పోస్టులు భర్తీ చేయనుంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కవర్ చేసే జోన్–3లో 452 బ్యాక్లాగ్, 42 జనరల్ ఖాళీలు కలిపి 494 ఖాళీలున్నాయి. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూల్ జిల్లాలతో కూడిన జోన్–4లో 245 బ్యాక్లాగ్, 51 జనరల్ ఖాళీలు కలిపి 296 పోస్టులున్నాయి. జోన్–1లోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 222 బ్యాక్లాగ్, 11 జనరల్ ఖాళీలతో కలిపి 233 పోస్టులున్నాయి. hmfw.ap.gov.in వెబ్సైట్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు ఈ నెల 22 వరకు గడువు ఉంది. ఈ నెల 24 నుంచి 30 వరకు హాల్ టికెట్లు జారీ చేసి సెప్టెంబర్ మొదటి వారంలో ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీ హాల్‌టికెట్‌లో తెలియజేస్తారు. పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికలుంటాయి. చదవండి: మునుపెన్నడూ ఇటు చూడని పారిశ్రామిక దిగ్గజాలు.. ఇప్పుడు ఏపీకీ వస్తున్నారు -
మంకీపాక్స్‌పై ఆందోళన వద్దు.. నిర్లక్యం చేయొద్దు!
నల్లకుంట (హైదరాబాద్): మంకీపాక్స్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఇది ప్రాణాంతక వ్యాధి కాదని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్, మంకీపాక్స్ నోడల్ అధికారి డాక్టర్ కె.శంకర్ అన్నారు. ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందదని, రోగితో దీర్ఘకాలం దగ్గరగా ఉండే వాళ్లకు ఇది వ్యాపించే అవకాశముందని చెప్పారు. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. దేశంలో మంకీపాక్స్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కామారెడ్డిలో మంకీపాక్స్ అనుమానిత కేసు బయటపడడంతో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రెఫర్ చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘ఈ నెల మొదటి వారంలో కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చి కామారెడ్డిలో స్వగ్రామానికి వెళ్లిన వ్యక్తి ఈ నెల 20న జ్వరంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆ వ్యక్తికి ట్రావెల్ హిస్టరీ ఉండడంతో అక్కడి వైద్యులు కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. బాధితుడికి మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు ఉండడంతో జిల్లా ఆస్పత్రి వైద్యులు, ఆదివారం హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి పంపారు. బాధితుడి చేతులు, కాళ్లు, మెడ, ఛాతీపై దద్దుర్లు కనిపించడంతో వైద్యులు మంకీపాక్స్ అనుమానిత కేసుగా నమోదు చేసుకుని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అతని నుంచి శాంపిల్స్‌ను సేకరించి పుణేలోని ఎన్ఐవీ ల్యాబ్‌కు పంపాం. రిపోర్టులు మంగళవారం సాయంత్రం వరకు రావొచ్చు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. మంకీపాక్స్ నిర్ధారణ అయితే అతను 25 రోజులపాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందాల్సి ఉంటుంది. అలాగే రోగి ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న కుటుంబసభ్యులను 21 రోజులపాటు క్వారంటైన్లో ఉంచుతాం’అని శంకర్ చెప్పారు. రెండు రోజుల్లో గాంధీకి డీఎన్ఏ ఎక్సాక్షన్ మిషన్ 1980 వరకు స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో 90 శాతం మంకీపాక్స్ వచ్చే అవకాశాల నుంచి రక్షణ ఉంటుందని డా.శంకర్ చెప్పారు. నిర్ధారణ పరీక్షల కోసం మరో రెండు రోజుల్లో గాంధీ మెడికల్ కాలేజీ నోడల్ కేంద్రంలో డీఎన్ఏ ఎక్సాక్షన్ మిషన్ అందుబాటులోకి వస్తుందన్నారు. పరీక్షలకు సంబంధించిన కిట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలిస్తే.. గతంలో స్మాల్‌పాక్స్ కేసులకు వాడిన యాంటీ వైరల్ డ్రగ్స్, ఇమ్యునోగ్లోబులిన్ డ్రగ్స్ మంకీపాక్స్ రోగులకు వాడతామని చెప్పారు. ఈ డ్రగ్స్ గత 40 ఏళ్లుగా వాడటం లేదని, ఐసీఎంఆర్ నుంచి అనుమతి వస్తే ఆ యాంటీ వైరల్ డ్రగ్స్ వాడతామన్నారు. నిర్లక్ష్యం చేస్తే ముప్పు మంకీపాక్స్ వైరస్ సోకితే నిర్లక్ష్యం చేయవద్దని డా.శంకర్ సూచించారు. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స పొందడంలో నిర్లక్ష్యం చేస్తే ఊపిరితిత్తుల ద్వారా న్యుమోనియా వచ్చే అవకాశముందన్నారు. తద్వారా మెదడుపై ప్రభావం చూపి ఫిట్స్ వచ్చే చాన్స్ ఉందన్నారు. రెండో దశలో ప్రాణాలు కూడా పోయే ప్రమాదముందని హెచ్చరించారు. ఎవరికైనా జ్వరం వచ్చి శరీరంపై దద్దుర్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. మంకీపాక్స్ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్సలేమీ లేవని, చికెన్‌పాక్స్ మాదిరిగానే చికిత్సలు అందిస్తామని తెలిపారు. -
డాక్టర్ల నుంచి సిబ్బంది కొరత ఉందనే మాట రాకూడదు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాడు–నేడుతో పాటు వైద్య ఆరోగ్యశాఖలో చేపడుతున్న పనుల ప్రగతిని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. సమీక్ష సందర్భంగా సీఎం ఏమన్నారంటే...: ►ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలి ►ఆరోగ్యశ్రీలో పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా చూడాలి ►ఆరోగ్య శ్రీకి పేషెంట్లను రిఫర్‌చేసే విధానం బలోపేతంగా ఉండాలి ►రిఫరల్ విధానాన్ని పర్యవేక్షణ చేయండి ►విలేజ్ క్లినిక్స్‌లో రిఫరల్ కోసం పర్మినెంట్ ప్లేస్‌ను డిజైన్ చేయాలి ►విలేజ్ క్లినిక్స్ అన్నవి రిఫరల్ కేంద్రాలుగా పనిచేస్తాయి ►ఎక్కడికి రిఫరల్ చేయాలన్నదానిపై హోర్డింగులు ఏర్పాటు చేయడంతో పాటు, అక్కడ పూర్తి సమాచారాన్ని ఉంచాలి ►ఆరోగ్యశ్రీ అందుకున్న తర్వాత లబ్ధిదారులకు లేఖ అందాలి ►పథకం ద్వారా తనకు అందిన లబ్ధిని అందులో పేర్కొనాలి ►ఆరోగ్యశ్రీలో ఆస్పత్రి నుంచి పేషెంట్ బయటకు వెళ్తున్నప్పుడు తనకు అందిన వైద్య సేవలపై కన్ఫర్మేషన్ తీసుకోవాలి ►పేషెంట్ తిరిగి కోలుకున్నంతవరకూ అందిస్తున్న ఆరోగ్య ఆసరా విషయాలు కూడా కన్ఫర్మేషన్ పత్రంలో ఉండాలి ►ఆరోగ్య ఆసరా డబ్బు నేరుగా వారి వ్యక్తిగత ఖాతాకు డీబీటీ విధానంలో చేస్తున్న పద్ధతిని కొనసాగించాలి ►ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ప్రత్యేక ఖాతాలను తెరవాలి ►ఆరోగ్యశ్రీ కింద అందించే డబ్బును నేరుగా ఈ ఖాతాకు పంపాలి ►ఈ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా వైద్యం అందించిన ఆస్పత్రికి వెళ్లాలి ►ఈమేరకు కన్సెంట్ పత్రాన్ని పేషెంట్ నుంచి తీసుకోవాలి ►తన వ్యక్తిగత ఖాతా విషయంలో ఎలాంటి సందేహాలు, భయాందోళనలు లేకుండా ఈ ప్రత్యేక అకౌంట్ వినియోగపడుతుంది ►ఈ విధానాల వల్ల పారదర్శకత వస్తుంది ►తనకు చేసిన వైద్యం, ప్రభుత్వం నుంచి అందిన సహాయం, అక్కడ నుంచి ఆస్పత్రికి చెల్లింపులు అంతా కూడా పారదర్శకంగా ఉంటాయి ►మరింత జవాబుదారీతనం, పారదర్శకత వస్తుంది ►రోగిపై అదనపు భారాన్ని వేయకుండా, వారికి పూర్తిగా ఉచితంగా వైద్య సేవలందే పరిస్థితి వస్తుంది ►ఆరోగ్య మిత్రలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి ►ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వైద్య సేవలకు ప్రభుత్వం మొత్తం చెల్లిస్తుంది ►దీనికి అదనంగా డబ్బు వసూలు చేసే పరిస్థితి ఉండకూడదు ►ఒకవేళ ఎవరైనా అదనంగా డబ్బులు వసూలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామన్న సంకేతం వెళ్లాలి ►అదనంగా తన వద్దనుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదన్న కన్ఫర్మేషన్ పేషెంట్ నుంచి తీసుకోవాలి ►ఏమైనా ఫిర్యాదులు ఉంటే.. ఏ నెంబరుకు కాల్ చేయాలన్న విషయం కూడా పేషెంట్‌కు తెలియాలి ►ఆరోగ్య మిత్రలు క్రియాశీలంగా వ్యవహరించేలా చూడాలి ►పేషెంట్ అస్పత్రిలో చేరిన దగ్గరనుంచీ డిశ్చార్జి అయ్యేంత వరకూ వారికి అండగా, తోడుగా నిలవాలి ►పేషెంట్ ఇంటికి వెళ్లిన తర్వాత ఆరోగ్యకార్యకర్త ఆ ఇంటికి వెళ్లి బాగోగులు చూడాలి ►ఆరోగ్యశ్రీ ద్వారా అందిన సేవలు, ఆరోగ్య మిత్రలనుంచి అందిన సహాయం తదితర సేవలపై వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి ►ఆరోగ్య శ్రీలో అవసరమైన మేరకు చికిత్సా విధానాల సంఖ్యను పెంచాలి ►ఇప్పుడున్న 2436 చికిత్సలను ఇంకా పెంచాలి ►వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే.. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందే దిశగా అడుగులు ముందుకు వేయాలి ►108, 104, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లలో లంచాలకు ఆస్కారం ఉండకూడదు ►లంచం అడిగే పరిస్థితులు లేకుండా ఎస్ఓపీలు ఉండాలి ►లంచం అడిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలన్న నంబర్లను అవే వాహనాలపై ఉంచాలి ►ప్రభుత్వ ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో ఖాళీల భర్తీ, ప్రమాణాలకు అనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖలో సిబ్బంది నియామకంపై సీఎం సమీక్ష ►ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే 40,188 పోస్టులు భర్తీచేశామన్న అధికారులు ►ఇంకా 1,132 మంది భర్తీకి ప్రక్రియ కొనసాగుతోందన్న అధికారులు ►176 కొత్త పీహెచ్‌సీలకు సంబంధించి ఇంకా డాక్టర్లు అవసరమని, ఈ పీహెచ్‌సీల నిర్మాణం పూర్తికాగానే వారిని నియమిస్తామన్న అధికారులు ►176 పీహెచ్‌సీల నిర్మాణం పూర్తి కాగానే... వీటిలో 2072 పోస్టులు కూడా భర్తీ చేస్తామన్న అధికారులు. ►ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా సిబ్బంది కొరత ఉండకూడదు ►బోధనాసుపత్రుల్లో కూడా ఎక్కడా సిబ్బంది కొరత ఉండకూడదు ►ఏ కారణం వల్ల అయినా పోస్టులు ఖాళీ అయితే వెంటనే వాటిని భర్తీచేయాలి ►వివిధ రంగాల్లో మనం సంస్కరణలతో ముందుకు సాగుతున్నాం ►మంచి ఫలితాలు రావాలంటే... సరిపడా సిబ్బందిని నియమించుకోవడం తప్పనిసరి ►పీహెచ్‌సీల నుంచి బోధనాసుత్రుల వరకూ ఎక్కడా కూడా డాక్టర్ల నుంచి సిబ్బంది కొరత ఉందనే మాట రాకూడదు ►పదవీ విరమణ చేసిన వైద్యులు, ఆ రంగంలోని రిటైర్డ్ సీనియర్ల సేవలను వినియోగించుకోండి ►అవసరమైతే వారి పదవీవిరమణ వయస్సును కూడా పెంచే ఆలోచన చేయాలి ►జులై 26 నాటికల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఈ మొత్తం ప్రక్రియ ముగియాలి అని అధికారులకు సీఎం ఆదేశం. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (వ్యాక్సినేషన్ అండ్ కోవిడ్ మేనేజిమెంట్) ఎం రవిచంద్ర,ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: థాంక్యూ సీఎం సార్ -
TS: 1,326 పోస్టులతో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 1,326 డాక్టర్ పోస్టులకు సర్కార్ నోటిఫికేషన్‌ను బుధవారం రిలీజ్ చేసింది. తాజా నోటిఫికేషన్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్-751 పోస్టులు, ట్యూటర్ పోస్టులు-357, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టులు-211, సివిల్ అసిస్టెంట్ సర్జన్ ప్రివెంటివ్ మెడిసిస్ పోస్టులు-7 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇది కూడా చదవండి: అక్టోబర్ 16న గ్రూప్–1 ప్రిలిమ్స్ -
డబుల్ ధమాకా ఆఫర్! 15 వేలు ఇస్తే ప్రమోషన్...కోరిన చోట పోస్టింగ్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘డియర్ బ్రదర్స్... మీ నోట్ ఫైల్ అయిపోయింది. మేడమ్ (రీజనల్ డైరెక్టర్) సంతకం కోసం పెండింగ్‌లో ఉన్న సంగతి మీకందరికీ తెలిసినదే. అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఏఎంఓ (అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్)ల ఫైల్ కూడా రెడీ అయిపోయింది. వారికి ఎస్‌ఆర్‌లు కాల్‌ఫర్ చేస్తున్నారు. వాళ్లది అయిన (ప్రమోషన్లు ఇచ్చిన) తర్వాత పెడితే బాగుంటుందని కొంతమంది బ్రదర్స్ కాల్ చేస్తున్నారు. మీరు ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. ఇప్పుడీ పదహారు (16 మంది ఎంపీహెచ్‌ఎస్‌లకు ప్రమోషన్)కూ కాల్‌ఫర్ చేయించేయాలా? ఏఎంఓలు అయిన తర్వాత ఐదు ఖాళీలైతే అప్పుడు పెట్టించుకుంటారా? పది మంది అలా అడుగుతున్నారు. పది మంది ఇలా చెబుతున్నారు. ఏదో ఒకటి డిసైడైతే బాగుంటుంది. ఏదో ఒకటి చెబితే ఈరోజు పెట్టించేయాలా (సంతకం)? ఆపాలా? అనేది నేను డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు చెప్పేదాని కోసమే వెయింటింగ్ ఇక్కడ...’ ఇదీ విశాఖలోని కేజీహెచ్‌లో పనిచేస్తున్న ఓ హెల్త్ విజిటర్ (హెచ్వీ) వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్లకు పంపిన వాయిస్ మెయిల్. వారికే కాదు విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల్లోని ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు అదే తరహాలో సందేశం వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే రూ.15 వేలు ఫార్మాల్టీ ఇస్తే వారికి ప్రమోషన్‌తో పాటు కోరుకున్న చోట పోస్టింగ్ కూడా ఇప్పిస్తామని! ఈ డబుల్ ధమాకా ఆఫర్‌తో ఆకర్షితులైన చాలామంది ఆ శాఖ ఉద్యోగులు పైకం సమర్పించుకున్నారనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రమోషన్లు, బదిలీలు పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పదేపదే చెబుతున్నా దిగువస్థాయిలో మాత్రం ఆయన ఆశయానికి కొంతమంది గండికొడుతున్నారు. జోన్–1 పరిధిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఇటీవల ఏర్పాటైన పార్వతీపురం–మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు కూడా ఉన్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖలో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తర్వాత ప్రమోషన్ల ఫైళ్లు కూడా కదిలాయి. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఏఎన్ఎం)లుగా పనిచేస్తున్నవారికి మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ (ఎంపీహెచ్ఎస్)/హెల్త్ విజిటర్ (హెచ్వీ)లుగా ప్రమోషన్ ఇవ్వాల్సి ఉంది. అలాగే, ఎంపీహెచ్‌ఎస్‌గా పనిచేస్తున్నవారికి మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఎంపీహెచ్‌ఈవో)లుగా ప్రమోషన్ ఇస్తారు. వారిలో ఎవరైనా బీఎస్సీ (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ–బీజడ్సీ) డిగ్రీ ఉన్నవారైతే అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ (ఏఎంవో)గా నియమించవచ్చు. ఈ ప్రమోషన్ల జాబితాలన్నింటికీ రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఓ ఉద్యోగిని చక్రం... జాబితాలో పేరుంది. రూ.15 వేలే కదా ఫార్మాల్టీ ఇచ్చేస్తే ప్రమోషన్‌కు ప్రమోషన్... తర్వాత కోరుకున్న చోటుకు పోస్టింగ్ వస్తుందని చెబుతూ కొంతమంది ఉద్యోగులే వసూళ్లపర్వానికి తెరలేపారు. గతంలో విజయనగరం జిల్లా బొద్దాం పీహెచ్సీలో పనిచేసి ప్రస్తుతం కేజీహెచ్‌లో హెచ్వీ పోస్టులో ఉన్న ఓ ఉద్యోగిని చక్రం తిప్పుతోందని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని చెబితే ఆర్డీ సంతకం చేయించేస్తానంటూ రికార్డు చేసిన వాయిస్‌ను ఏకంగా వాట్సాప్‌లోనే పోస్టు చేయడం గమనార్హం. అంతేకాదు ఫార్మాల్టీలే ప్రసాదంగా భావించే ఆర్డీ కార్యాలయంలో ఓ ఉద్యోగి పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. జాబితాలు వాట్సాప్‌లో చక్కర్లు... జోన్–1లోని పీహెచ్‌సీల్లో పనిచేస్తున్నవారిలో 87 మంది ఎంపీహెచ్ఏ (ఫిమేల్)లకు ఎంపీహెచ్ఎస్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు జాబితా తయారైంది. వారిలో 45 మంది విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల్లో పనిచేస్తున్నవారు ఉన్నారు. అలాగే, 16 మంది ఎంపీహెచ్‌ఎస్‌లకు ఎంపీహెచ్‌ఈవో/ఏఎంవోలుగా పదోన్నతి ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ జాబితాలు ఇంకా ఆర్డీ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్డీ డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి సంతకం చేయకుండా ఉన్న జాబితాలు మాత్రం కార్యాలయం నుంచి బయటకు వచ్చేశాయి. ప్రమోషన్ కోసం చూస్తున్నవారి వాట్సాప్‌కు అవి చేరాయి. ఫార్మాల్టీలతో పబ్బం... ఫార్మాల్టీ ఇచ్చేస్తే ఎలాంటి పని అయినా అయిపోతుందని ఎర వేస్తూ వైద్యారోగ్య శాఖలో కొంతమంది తోటి ఉద్యోగులే పబ్బం గడుపుకుంటున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కారణంగా కొంతమంది జూనియర్ అసిస్టెంట్లను కొత్త జిల్లాలైన పార్వతీపురం–మన్యం, అల్లూరి సీతారామరాజు (పాడేరు)కు పంపించారు. వారిలో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు పాడేరు నుంచి మళ్లీ వెనక్కి తీసుకురావడానికి రూ.70 వేలు చొప్పున సమర్పించుకున్నారని ఆ శాఖ ఉద్యోగులే చెవులు కొరుక్కుంటున్నారు. అలాగే, విజయనగరం జిల్లాలో ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇస్తూ జాబితా సిద్ధమైంది. రేపో మాపో దానికి ఆమోదముద్ర పడనుంది. అందుకోసం వారు కూడా రూ.15 వేలు చొప్పున ఫార్మాల్టీ చెల్లించుకోవాల్సి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమోషన్లు ఫైనల్ చేయలేదు అందరి దగ్గరా ఎస్ఆర్ (సర్వీసు రిజిస్టర్)లు మాత్రమే కాల్‌ఫర్ చేశాం. వారి దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు నా దృష్టికి రాలేదు. ఏఎన్ఎంలు కూడా ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. వసూళ్లు చేసినవారెవ్వరో నాకు చెబితే వారికి వార్నింగ్ ఇస్తా. – డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి, ఆర్డీ, వైద్యారోగ్య శాఖ, విశాఖపట్నం (చదవండి: సర్వశ్రేయో నిధితో ఆలయాల అభివృద్ధి) -
టీ–డయాగ్నొస్టిక్ మొబైల్ యాప్.. అరచేతిలో ఆరోగ్య రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: టీ–డయాగ్నొస్టిక్ మొబైల్‌యాప్‌లో టీ–డయాగ్నొస్టిక్ సెంటర్లో చేయించుకున్న అన్ని రకాల వైద్యపరీక్షల రిపోర్టులను ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. వ్యక్తిగత ఆరోగ్య వివరాలన్నీ యాప్‌లో తెలుసుకోవచ్చు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం డయాగ్నొస్టిక్ యాప్‌ను తీసుకురావడం విశేషం. యాప్‌లో ఏముంటాయి? ► దగ్గరలోని సర్కారు దవాఖానాలు, ప్రభుత్వ డయాగ్నొస్టిక్ కేంద్రాల చిరునామాను తెలుసుకోవచ్చు. అవసరమైన స్పెషలైజేషన్ వైద్యం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులనూ వెతుక్కోవచ్చు. గూగుల్ మ్యాప్ ద్వారా ఆ కేంద్రానికి వెళ్లొచ్చు. ► వైద్య పరీక్షల కోసం నమూనాలు ఇచ్చినట్లయితే, టెస్టుల స్టేటస్‌తోపాటు రిపోర్టులు కూడా చూసుకోవచ్చు. వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► ఆసుపత్రుల్లోని సేవలపై వైద్యులు, నర్సులు, సిబ్బంది, ఆశ వర్కర్లు తమ అభిప్రాయాలను యాప్ ద్వారా తెలపవచ్చు. ► రోగులు వైద్య సేవలకు సంబంధించిన అసౌకర్యాలపై ఫిర్యాదు చేయొచ్చు. ► పాత వైద్య పరీక్షల రిపోర్టులను చూసుకునే సౌకర్యం ఉండటం వల్ల.. డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు ఆ రిపోర్టులను మొబైల్‌ఫోన్ ద్వారా వెంటనే చూపొచ్చు. ► రోగి లేదా బాధితుడు ఏవైనా సందేహాల నివృత్తి కోసం నేరుగా సమీప ఆసుపత్రికి కాల్ చేయొచ్చు. ► రోగులు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో యాప్‌లోకి వెళ్లి తమ ఫొటో అప్లోడ్ చేసుకోవచ్చు.. అలాగే ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవచ్చు. ► కస్టమర్ సపోర్ట్ కాంటాక్ట్‌లు, ఇతర ప్రభుత్వ హెల్త్ వెబ్సైట్ లింక్‌లు కూడా ఉంటాయి. చదవండి: Lavanya: అందరికీ చెబుతుందనే లావణ్య హత్య -
కరోనా వైరస్.. కొత్త కేసులు ఎన్నంటే?
న్యూడిల్లీ: దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పట్టింది అనుకునేలోపే అనూహ్యంగా కేసులు పెరగడం కొంత ఆందోళనకు గురి చేస్తోంది. అయితే మంగళవారం దేశంలో తాజాగా 2,483 కరోనా కేసులు నమోదవ్వడంతో భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం1 5,636 యాక్టివ్ కేసుల ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 43,06,02,569కి చేరింది. గత 24 గంటల్లో 1,970 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4,25,23,311కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక, రోజువారీ పాజివిటీ రేటు 0.55 శాతానికి చేరిందని పేర్కొంది. ఇక మొత్తం కేసుల్లో 0.04 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో 1,011 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాజధానిలో పాజిటివిటీ రేటు 6.42 శాతానికి పెరిగింది. అంతేకాకుండా, అధికారిక డేటా ప్రకారం.. ఏప్రిల్ 11న 447 మందికి ఉన్న కరోనా రోగుల సంఖ్య ఏప్రిల్ 24 నాటికి 2,812 కి చేరుకుంది. పైగా ఆసుపత్రుల్లో చేరిన రోగుల సంఖ్య కూడా 17 నుంచి 80కి పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో సహా అన్ని రాష్రాలు అప్రమత్తమయ్యాయి. అంతేకాదు మళ్లీ మాస్క్ పాటించేలా నిబంధనలు అమల్లోకి తీసుకు రావడమే కాకుండా బౌతిక దూరం పాటించాలని ఆదేశిస్తున్నాయి. మరోవైపు దేశంలో వేక్సినేషన్ ప్రక్రియ నిరాంతరాయంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 187 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. COVID-19 | India reports 2,483 fresh cases and 1,970 recoveries, in the last 24 hours. Active cases 15,636 Daily positivity rate (0.55%) pic.twitter.com/BQlCsKd3pe — ANI (@ANI) April 26, 2022 (చదవండి: మోదీతో ఈయూ చీఫ్ భేటీ) -
ఆ ఒప్పందం సఫలం కావాలంటే...
ఆరోగ్యరంగంలో నెలకొన్న అసమానతల పునాదిపైనే మహమ్మారి ప్రాణం పోసుకుని ప్రపంచంపై విరుచుకుపడింది. రికార్డు సమయంలో వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగలిగినప్పటికీ వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రజల సంఖ్య అనేక పేద దేశాల్లో ఇప్పటికీ తక్కువే. న్యాయమైన పంపిణీ, చౌకగా లభ్యం కావడం, పరీక్షలకు అందుబాటులో ఉండటం వంటివి ఇప్పటికీ సవాలుగానే ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో సరికొత్త అంతర్జాతీయ ఆరోగ్య ఒడంబడిక ఫలితాలు తీసుకువస్తుందని ఆశించడంలో ఔచిత్యం లేదనిపిస్తుంది. సమన్యాయం, అందరికీ అందుబాటులో ఉంచడం అనేవి ఆరోగ్యానికి సంబంధించిన కీలక సూత్రాలుగా గుర్తించనంతవరకూ మహమ్మారిపై ఒప్పందం కూడా అంతర్జాతీయ వాతావరణ మార్పు ఒడంబడికలాగే నిష్ఫలమవుతుంది. కోవిడ్–19 మహమ్మారి భారత్‌లో తగ్గు ముఖం పడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2022 మార్చి 22 నాటికి ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల 80 లక్షల కేసులు నమోదు కాగా, 60 లక్షల మంది మరణాల బారిన పడ్డారని సమాచారం. అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ స్థిరంగా పెరుగుతూ వచ్చింది. ఆఫ్రికాలోనూ, మరికొన్ని నిరుపేద దేశాల్లోనూ వ్యాక్సిన్లు వేయడం ఇప్పటికీ స్వల్పంగానే ఉంది. గత రెండేళ్లుగా మహమ్మారి ప్రపంచాన్ని కనీవినీ ఎరుగని స్థాయిలో అతలాకుతలం చేయడమే కాకుండా, దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. దీంతో అంతర్జాతీయ సంస్థలు భవిష్యత్ మహమ్మారులతో వ్యవహ రించడం ఎలాగని చర్చించుకుంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఒక అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకోవాలనే ప్రతి పాదన కూడా వీటిలో ఒకటి. రెండేళ్లలో పూర్తవుతుందని భావిస్తున్న ఈ ప్రయత్నపు విజయం పలు కారణాలపై ఆధారపడి ఉంటుంది. మానవ ఆరోగ్యం ప్రధాన సూత్రంగా లేకపోతే ఈ ఒప్పందానికి కూడా వాతావరణ మార్పు ఒప్పందానికి పట్టిన గతే పడుతుంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కోవిడ్–19ని ఎదుర్కోవడా నికి దేశాల మధ్య సహకారం చాలా అవసరమని స్పష్టమైంది. ఒక సాంకేతిక, శాస్త్ర సంబంధిత ఏజెన్సీ అయిన ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ సవాలును ఎదుర్కోవడానికి అవసరమైన వివిధ ప్రజారోగ్య, బయో మెడికల్ కొలమానాలపై మార్గదర్శకత్వాన్ని అందించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారికి చెందిన డేటాను నిర్దిష్టంగా పదిలపర్చే స్థలంలాగా పాత్ర పోషించింది. వైరస్ కట్టడిపై ఈ సంస్థ ఇచ్చే పిలుపును జాతీయ ప్రభుత్వాలే స్వీకరించి ఆచరణలో పెట్టాయి. మాస్కు ధరించడం, లాక్డౌన్లు, ప్రయాణాలపై ఆంక్షలు వంటి వాటిని ఏజెన్సీ అందించిన సాంకేతిక సలహాను బట్టి, స్థానిక పరి స్థితిని బట్టి ఆయా దేశాలు పాటిస్తూ వచ్చాయి. అయితే చైనాలో వైరస్ మూలం గురించిన తనిఖీల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆరోపణలకు గురైంది. ప్రత్యేకించి చైనా పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా మృదు వైఖరి అవలంబించిందని కొన్ని పాలనా యంత్రాంగాలు విమర్శించాయి. మరోవైపున, దేశాలు స్వతంత్రంగా వైరస్ రూపాలపై పరిశోధన చేయడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తన అధికారాలు కుదించుకుపోతున్నట్లు భావించింది. వ్యాధి లేక వైరస్ సంబంధిత సమాచారం, డేటా కోసం సభ్య దేశాలపై ఆధారపడాల్సి ఉండటమే ప్రపంచ ఆరోగ్య సంస్థకు అతిపెద్ద అవరోధంగా ఉంటోంది. 2002–2003 సంవత్సరాల్లో సార్స్ వైరస్ ప్రపంచంపై విరుచుకుపడిన నేపథ్యంలో 2005లో అంతర్జాతీయ ఆరోగ్య క్రమ బద్ధీకరణ (ఐహెచ్ఆర్) చట్టాన్ని తీసుకొచ్చారు. సార్స్ వైరస్ ఉనికికి సంబంధించిన సమాచారాన్ని చైనా నెలల తరబడి వెల్లడించకుండా తొక్కిపెట్టడంతో చాలా దేశాలకు అది విస్తరించింది. ప్రజారోగ్యానికి సంబంధించిన ఘటనలు దేశాల సరిహద్దులు దాటి సంభవించి నప్పుడు ప్రపంచ దేశాలు పాటించాల్సిన విధులు, బాధ్యతలకు సంబంధించి కొన్ని నియమాలను ఐహెచ్ఆర్ నెలకొల్పింది. 2020 జనవరి 30న ఐహెచ్ఆర్ ఎమర్జెన్సీ కమిటీ నిర్వహించిన సమావేశం లోనే, కోవిడ్–19ని అంతర్జాతీయంగా కలవరపెట్టే ప్రజారోగ్య అత్యవ సర పరిస్థితిగా సిఫార్సు చేశారు. అయితే ఐహెచ్ఆర్ బలహీనమైన చట్రంతో కూడుకుని ఉందనీ, పర్యవేక్షణ, నిఘా వంటి అంశాల్లో దాని అమలు లోపభూయిష్ఠంగా ఉందనీ అనుభవాలు తెలియజేస్తున్నాయి. మహమ్మారి వెలుగులో 2020 మే నెలలో ఐహెచ్ఆర్ వ్యవస్థ పనితీరు, దాని అమలు గురించి సమీక్షించాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సభ (వరల్డ్ హెల్త్ అసెంబ్లీ)... ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరింది. 2021 డిసెంబర్లో మహమ్మారి సన్నాహక చర్యలపై సరికొత్త అంతర్జాతీయ ఒడంబడికపై చేసిన కృషిని ఆరోగ్య సభ ఆమోదించింది. ప్రతిపాదిత ఒడంబడికపై చర్చలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. తొలి ప్రశ్న ఏమిటంటే, ఈ ఒడంబడిక తీసుకునే రూపం చట్టానికి కట్టుబడి ఉండే ఉపకరణంగా ఉండాలా లేదా మరొకలా ఉండాలా అనేదే! ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య సమస్యలపై విధివిధానాలను రూపొందించే అధికారాలను ఆరోగ్య అసెంబ్లీకి కట్టబెట్టింది. ఇంత వరకు దీనికి సంబంధించిన ఏకైక ఉదాహరణ ఏమిటంటే, 2005లో అమలులోకి వచ్చిన పొగాకు నియంత్రణపై ముసాయిదా కన్వెన్షన్ మాత్రమే. ఈ కన్వెన్షన్ కింద పొగాకు ఉత్పత్తులలో అక్రమ వాణిజ్యాన్ని తొలగించే ప్రొటోకాల్‌ని అమలులోకి తెచ్చారు. కొన్ని దేశాలు మహమ్మారిపై ఒడంబడిక విషయంలోనూ ఇలాంటి వైఖరినే పాటించాలని సూచించాయి. దీనికింద ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, నిర్దిష్ట విధివిధానాలతో కూడిన చట్రం ఉండాలని ఇవి కోరాయి. ఉదాహరణకు, జంతువుల నుంచి మను షులకు వ్యాపించే వ్యాధుల విస్తరణను నిరోధించేందుకు అడవి జంతువుల వ్యాపారంపై నిషేధం విధించే ప్రొటోకాల్ గురించి యూరోపియన్ యూనియన్ మాట్లాడుతోంది. కొత్త, ఆవిర్భవిస్తున్న వైరస్‌లపై జీనోమ్ సీక్వెన్సింగ్ డేటాను తప్పనిసరిగా అన్ని దేశాలూ పరస్పరం పంచుకోవాలనే డిమాండ్లు కూడా రంగంమీదికి వచ్చాయి. అయితే ఈ కొత్త విధానం లేదా ఒడంబడిక ఐహెచ్ఆర్ని తోసి రాజంటుందా లేదా దానికి అనుబంధ పాత్రను పోషిస్తుందా అనేది స్పష్టం కావడం లేదు. ఈ అన్ని ఘర్షణాత్మకమైన అంశాలపై సంప్ర దింపుల కమిటీ ఒక అవగాహనకు రావాల్సి ఉంది. ప్రపంచ ఆరోగ్యానికి సంబంధించి కొత్త నిబంధనలను అభివృద్ధి చేసే ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, ఇంతవరకు మనకు ఎదురైన అతి పెద్ద గుణపాఠాలను విస్మరించకూడదు. ఆరోగ్యరంగంలో నెలకొన్న అసమానతల పునాదిపైనే మహమ్మారి ప్రాణం పోసుకుని ప్రపం చంపై విరుచుకుపడింది. రికార్డు సమయంలో వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగలిగినప్పటికీ వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రజల సంఖ్య అనేక పేద దేశాల్లో ఇప్పటికీ తక్కువ స్థాయిలోనే ఉండిపోయింది. సంపన్న దేశాల్లోని ప్రజలు ఇప్పటికే బూస్టర్ డోసులు కూడా వేసుకున్నారు. మరోవైపున ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన వ్యాక్సిన్ పూల్ పేదప్రజలకు వ్యాక్సిన్లను అందించడంలో విఫలమైంది. న్యాయమైన పంపిణీ, చౌకగా లభ్యం కావడం, పరీక్షలు అందుబాటులో ఉండటం వంటివి ఇప్పటికీ సవాలుగానే ఉంటున్నాయి. భౌగోళిక–రాజకీయ వ్యూహాల పరంగా కఠినమైన స్థానాల నుంచి ప్రపంచ దేశాలు పక్కకు తొలిగేలా మహమ్మారి మార్పు తీసుకు రాలేక పోయింది. వాణిజ్య ఒప్పందాలలోనూ ఈ పరిస్థితే కొనసాగుతోంది. మేధా సంపత్తికి చెందిన అవరోధాలన్నీ చెక్కుచెదర కుండా అలాగే ఉంటున్నాయి. అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను పక్కనబెట్టి గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఎజెండా వంటి ప్రైవేట్ చర్యలను ప్రోత్సహించడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి. ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి అమెరికా ఇలాంటి వాటిని ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలో అందరికీ వర్తించే బహుపాక్షికత అనే గొప్ప భావనపై దాడి చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో సరికొత్త అంతర్జాతీయ ఆరోగ్య ఒడంబడిక ఫలితాలు తీసుకు వస్తుందని ఆశించడంలో ఔచిత్యం లేదనిపిస్తుంది. దశాబ్దాలుగా వాతావరణ మార్పుపై ఒప్పందం కోసం ప్రపంచం చర్చిస్తూనే ఉంది. కర్బన ఉద్గారాలకు సంబంధించిన సూత్రాలను సంపన్న దేశాలు నిరంతరం వ్యతిరేకిస్తూ, ఉమ్మడి బాధ్యతలు చేపట్ట డానికి నిరాకరిస్తున్నాయి. పేద దేశాలకు టెక్నాలజీ బదలాయింపు, ఆర్థిక వనరుల పంపిణీపై చేసిన వాగ్దానాలు ఇప్పటికే కాగితాల మీదే ఉండిపోయాయి. సమన్యాయం, అందరికీ అందుబాటులో ఉంచడం అనేవి ఆరోగ్యానికి సంబంధించిన కీలక సూత్రాలుగా గుర్తించనంత వరకు మహమ్మారిపై కుదిరే ఒప్పందానికి కూడా వాతావరణ మార్పు ఒప్పందానికి పట్టిన గతే పడుతుందని విస్మరించరాదు. -
మళ్లీ విజృంభిస్తున్న కరోనా!... 79 కొత్త కోవిడ్ కేసులు
పుణె: మహారాష్టలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పుణెలో 79 కొత్త కరోనా కేసుల నమోదయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే ఎటువంటి మరణాలు సంభవించ లేదని తెలిపింది. అసలు ఇప్పటి వరకు పుణెలో సుమారు 1.45 మిలియన్ల మంది కరోనా సోకింది. అందులో దాదాపు 1.43 మిలియన్ల మంది కోలుకోగా..20,509 మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు కొత్త కరోనాకి సంబంధించి పుణె రూరల్‌లో 54, పూణె నగరంలో 23, పింప్రి-చించ్వాడ్లో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కొత్త కరోనాకి సంబంధించిన కేసుల సంఖ్య 425,256కి చేరుకుంది. అయితే పుణె రూరల్‌లో మరణాల సంఖ్య 7,143 , పుణె నగరంలో 9,427 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 17.46 మిలయన్ డోస్‌ల వ్యాకిన్లు వేశారు. అందులో 9.52 మిలియన్లు మొదటి డోస్‌లు, 7.68 మిలియన్లు రెండవ డోస్‌లు, 2,48,055 మందికి ముందు జాగ్రత్త డోస్‌లు వేశారు. (చదవండి: Corona Virus: వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన) -
చనిపోయిన వ్యక్తికి బూస్టర్ డోస్ ఇచ్చారట.. ఇంకేముంది!!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రంలోని న్యూ గొల్లగూడెంకు చెందిన కొత్త మల్లారెడ్డి (రిటైర్డ్ హెడ్మాస్టర్) ఈనెల 11న చనిపోయారు. కానీ వైద్య శాఖ సిబ్బంది మాత్రం ఫిబ్రవరి 16, బుధవారం రోజున బూస్టర్ డోస్ తీసుకున్నట్టుగా రికార్డుల్లో నమోదు చేశారు. ఇదే విషయం సెల్‌ఫోన్‌కు మెసేజ్ రాగా, వాళ్ల కుటుంబ సభ్యులు కోవిన్ యాప్‌లో సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి చూస్తే, అందులో కూడా ఇవాళ వ్యాక్సిన్ వేసినట్టుగా ఎంట్రీ చేశారు. మల్లారెడ్డి భార్య కళావతికి కూడా ఇవాళ బూస్టర్ డోస్ వేయకున్నా, వేసినట్టుగా మెసేజ్ రావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైద్యశాఖ అధికారుల నిర్లక్ష్యంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చదవండి: (మేడారం గద్దెపైకి సారలమ్మ.. చిలకలగుట్ట నుంచి రానున్న సమ్మక్క) -
మెడికల్ సీట్లకు ఒకేసారి ఆప్షన్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి వెబ్ ఆప్షన్లను ఇచ్చే ప్రక్రియలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్పులు చేసింది. వైద్య సీట్లకు దరఖాస్తు చేసుకునేవారు ఒకేసారి అన్ని కాలేజీలకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలన్న నిబంధనను తాజాగా ప్రవేశపెట్టింది. దీంతో రెండో విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండదని స్పష్టం చేసింది. మొదటిసారిగా రాష్ట్రంలో ఈ నిబంధనను తీసుకురావడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. గతేడాది వరకు కన్వీనర్ కోటా మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియలో విద్యార్థులకు ప్రతీ కౌన్సెలింగ్ సందర్భంగా కళాశాలలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండేది. కాలేజీలు, పరిస్థితిని బట్టి ప్రాధాన్యక్రమంలో తమకు నచ్చిన కొన్ని కాలేజీలను ఎంపిక చేసుకునేవారు. అలా ఎంపిక చేసిన వాటిల్లో ఎందులో సీటొచ్చినా చేరాల్సిందే. అయితే తర్వాత జరిగే కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు, మళ్లీ ఆప్షన్లు పెట్టుకునేందుకు అనుమతి ఉండేది. దీంతో తమకు నచ్చిన కాలేజీల్లో సీటు వచ్చే వరకు రెండు, మూడు, మాప్‌అప్ రౌండ్ కౌన్సెలింగ్‌ల వరకు కూడా దరఖాస్తు చేసుకునే, ఆప్షన్లు ఇచ్చుకునే వెసులుబాటు ఉండేది. దీనివల్ల ఇష్టమైన కాలేజీలో సీటు దక్కించుకునేవారు. కానీ ఈ ఏడాది నుంచి తీసుకురానున్న కొత్త నిబంధనతో విద్యార్థులకు చిక్కులు వస్తాయని వైద్య విద్య నిపుణులు అంటున్నారు. అన్ని కళాశాలలకు ఒకేసారి ఆప్షన్లు ఇవ్వాల్సి రావడంతో అవగాహన లేక ప్రాధాన్యాలను సరిగా ఇచ్చుకునే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ఒకవేళ ప్రైవేట్ కాలేజీలో కన్వీనర్ కోటా సీటు వస్తే, చేరాక మరో కౌన్సెలింగ్‌లో ఇతర కాలేజీలో సీటు వస్తే చెల్లించిన ఫీజును తిరిగి వెనక్కిస్తారా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. తదుపరి కౌన్సెలింగ్‌ల్లోనూ ప్రాధాన్యం ప్రకారం సీటు ఉదాహరణకు ఒక విద్యార్థికి తానిచ్చిన ప్రాధాన్యంలోని పదో కాలేజీలో మొదటి కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిందని అనుకుందాం. అతను ఆ కాలేజీలో తప్పక చేరాల్సిందే. తర్వాత కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేయకున్నా, తన ప్రాధాన్యంలోని పై తొమ్మిది కాలేజీల్లో ఎందులోనైనా సీటు వచ్చే అవకాశముంటే కేటాయిస్తారు. అప్పుడు చేరకుంటే, మూడో కౌన్సెలింగ్‌లో మళ్లీ ప్రాధాన్యంలోని పై కాలేజీల్లో కేటాయిస్తారు. కాబట్టి దీనివల్ల విద్యార్థులకు నష్టం ఉండదు. కానీ కొత్త మార్పులపై విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో ప్రాధాన్యాల్లో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
కరోనా హైరానా: తప్పుల తడకగా పరీక్షా ఫలితాలు
రాహుల్.. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగి. ఇటీవల ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయించుకున్నాడు. సాయంత్రానికి నెగెటివ్ అని ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే పాజిటివ్ అని మరో మెసేజ్ వచ్చింది. దీంతో ఏది నిజమో తెలియక ఆయన ఆందోళనలో పడిపోయాడు. తర్వాత ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకున్నాడు. మూడురోజుల తర్వాత పాజిటివ్ అంటూ ఫలితం వచ్చింది. ఆ మూడురోజులూ ఆయన ఎంతో ఆందోళనకు గురయ్యాడు. డాక్టర్ కృష్ణ్ణకాంత్ (పేరు మార్చాం)కు, ఆయన భార్యకు ఇద్దరికీ తీవ్రమైన జలుబు, కాస్తంత జ్వరం ఉండటంతో ర్యాపిడ్ టెస్ట్ చేయించారు. అందులో ఇద్దరికీ నెగెటివ్ వచ్చింది. దీంతో నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్షకు ఇచ్చారు. రెండ్రోజుల తర్వాత వచ్చిన రిపోర్టులో ‘ఇన్డిటర్మినేట్’(అనిశ్చయత) అని వచ్చింది. తర్వాత మూడో రోజు పాజిటివ్ అంటూ మరో రిపోర్టు పంపారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండగా కొందరి పరీక్షా ఫలితాల్లో ఆలస్యం, గందరగోళం చోటు చేసుకుంటుండడంతో అనుమానితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంపై వైద్య ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. ర్యాపిడ్ యాంటిజెన్ఫలితాలు ఎప్పటికప్పుడు వెల్లడవుతుండగా కొన్ని కేసుల్లో పాజిటివ్ అని ఒకసారి రిపోర్టు వచ్చిన కాసేపటికే నెగిటివ్ అంటూ మరో రిపోర్టు వస్తోంది. అలాగే ముందు నెగిటివ్ అని చెప్పి తర్వాత పాజిటివ్ అంటున్నారు. ఆర్టీపీసీఆర్ ఫలితాల్లో సైతం కొన్ని సందర్భాల్లో ఇలాంటి గందరగోళం చోటు చేసుకుంటున్నా.. చాలావరకు కేసుల్లో రెండు మూడు రోజులకు కానీ ఫలితం రావడం లేదు. జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దీంతో బాధితులు చాలాచోట్ల ప్రై వేట్ లేబరేటరీలను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ఆర్టీపీసీఆర్ పరీక్షకు రూ.1,500 వరకు వసూలు చేస్తుండటంతో జేబులు గుల్లవుతున్నాయి. 25 వేల టెస్టుల సామర్థ్యమున్నా... రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 34 ఆర్టీపీసీఆర్ లేబరేటరీలు ఉన్నాయి. వాటిల్లో రోజుకు 25 వేల వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చు. అయినా రోజుకు 10 వేల వరకు ఫలితాలు వెయిటింగ్లో ఉంటున్నాయి. ఆయా లేబరేటరీలపై సరైన పర్యవేక్షణ కొరవడడంతోనే పరీక్షల నిర్వహణలో జాప్యం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది సెకండ్ వేవ్ సమయంలోనే పెద్ద ఎత్తున లేబరేటరీలను పూర్తిస్థాయి సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ప్రస్తుతం థర్డ్‌వేవ్ విజృంభణ సమయంలో కూడా సామర్ధ్యం మేరకు టెస్టులు జరగడం లేదు. జిల్లాల్లోని లేబరేటరీల్లో ఒక్కోచోట రోజుకు 300 వరకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించవచ్చు. ఆ స్థాయిలో చేస్తే రెండు మూడు రోజుల ఆలస్యం ఉండదు. కానీ ఆ విధంగా జరగడం లేదు. చాలా లేబరేటరీలు 2 షిఫ్టులు కూడా పనిచేయడం లేదని సమాచారం. ఇంత కీలక సమయంలో ఇటువంటి అంశాలపై అధికారులు దృష్టి్ట పెట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సరిపడ సిబ్బంది కూడా లేక.. మరోవైపు సెకండ్ వేవ్‌లో నియమించుకున్న ల్యాబ్ టెక్నీషియన్లను, డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఆ తర్వాత కాలంలో తొలగించడం వల్ల కూడా ఇప్పుడు కీలక సమయంలో పనిచేసేవారు లేకుండా పోయారు. దీంతో తప్పుల తడక రిపోర్టులు, రెండు మూడు రోజుల ఆలస్యంతో నివేదికల వంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. ఆలస్యపు రిపోర్టుల వల్ల పాజిటివా నెగెటివా తెలియక అనుమానితులు ఆందోళనకు గురవుతున్నారు. కొందరు బయటకు వచ్చి తిరిగేస్తున్నారు. ఇతరులకు అంటిస్తున్నారు. కొందరికి పాజిటివ్ అయినా తెలియక మందులు వాడకపోవడంతో సీరియస్ అవుతున్న పరిస్థితి కూడా నెలకొంటోంది. -
Andhra Pradesh: వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు..
అరసవల్లి(శ్రీకాకుళం జిల్లా): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్‌మిషన్ కింద పలు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బగాది జగన్నాథరావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటీ టెక్నీషియన్, డెంటల్ హైజనిస్ట్/డెంటల్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అర్హులైనవారు ఈనెల 8వ తేదీ నుంచి 13వ తేదీ లోగా దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి సమర్పించాలని కోరారు. చదవండి: వెలుగు చూసిన టీడీపీ నేతల దురా‘గతం’.. అసలేం జరిగిందంటే? జిల్లా అకౌంట్స్ అధికారి ఉద్యోగానికి ఎంబీఏ(ఫైనాన్స్)/ పీజీ ఇన్ కామర్స్ ఉత్తీర్ణత అర్హతగా కలవారు, కనీసం రెండేళ్లు అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లో అనుభవం కలిగి ఉన్నవారు అర్హులన్నారు. ఇందుకు ఈ నెల 8 నుంచి 13వ తేదీలోగా డీఎంహెచ్ఓ కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలని కోరారు. స్పెషలిస్ట్ ఎండీ (జనరల్ మెడిసిన్), స్పెషలిస్ట్ ఎంఓ(ఓబీజీ), కార్డియాలజిస్ట్, సైకాలజిస్ట్, ఎన్సీడీ వైద్యాధికారి, ఎన్ఆర్సీ వైద్యాధికారి ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసేందుకు అర్హులు ఈ నెల 12న ఉదయం 11గంటలకు డీఎంహెచ్ఓ కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు. వివరాలు శ్రీకాకుళం.ఏపీ.జీవోవి.ఇన్ వె బ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. -
తెలంగాణ: ఒమిక్రాన్ కలవరం.. ఒకేరోజు నాలుగు కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా మరో 4 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7కు చేరింది. ఇవాళ నమోదైన కేసుల్లో ముగ్గురు కెన్యా దేశానికి చెందిన వారు కాగా.. మరొకరు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అని వైద్యాధికారులు చెప్పారు. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరగడంతో తెలంగాణ ఆరోగ్య శాఖ అలెర్ట్ అయింది. ఇప్పటికే రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైన టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. భారత్‌లో మొత్తంగా ఒమిక్రాన్ కేసులు 87కి చేరుకున్నాయి. చదవండి: (ఆ ఇమ్యూనిటీతో ఎదుర్కోవచ్చు) -
Omicron: కేంద్రం కీలక నిర్ణయం.. నైట్ కర్ఫ్యూ విధించాలంటూ లేఖ..
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కట్టడికి కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేసింది. కరోనా నిబంధనలను విధిగా అమలుచేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. 10 రాష్ట్రాల్లోని 27 జిల్లాలో పాజిటివిటి రేటు గత రెండు వారాల్లో పెరుగుతూ వస్తోంది. కేరళ, మిజోరాం, సిక్కింలోని 8 జిల్లాల్లో 10 శాతం పాజిటివిటి రేటు ఉండగా.. మరో 7 రాష్ట్రాల్లో 5 నుంచి 10 పాజిటివిటి రేటు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. అవసరమైతే రాత్రి కర్ఫ్యూ అంశాన్ని కూడా పరిశీలించాలని కేంద్రం లేఖలో పేర్కొంది. దవండి: (ఒమిక్రాన్ అలజడి..! భారత్‌ను కుదిపేయనుందా...?) -
విమానాల్లో ఆహార సేవలు కొనసాగించొచ్చు
న్యూఢిల్లీ: రెండు గంటల కంటే తక్కువ ప్రయాణ సమయమున్న విమానాల్లో ఆహారం అందించడాన్ని పునరుద్ధరించవచ్చని కేంద్రం ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు నిబంధనలు సవరించవచ్చని తెలుపుతూ పౌర విమానయానశాఖకు సమాచారం అందిం చినట్లు వెల్లడించింది. దీంతోపాటు, విమాన సిబ్బంది ఇకపై శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే రక్షణ దుస్తులు ధరించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే, వారు గ్లవ్స్, ఫేస్‌మాస్క్‌లు, ఫేస్ షీల్డ్‌లను మాత్రం ధరించాలని తెలిపింది. కేంద్రం ఏప్రిల్ 15వ తేదీన విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం..ప్రయాణ సమయం రెండు గంటలుండే విమానాల్లో ప్రయాణికులకు ఆహారం అందించడాన్ని నిలిపివేశారు. -
బంపర్ ఆఫర్....వ్యాక్సిన్ తీసుకో..బహుమతి పట్టు
చంద్రపూర్: కరోనా వ్యాక్సిన్లు ప్రజలందరూ తీసుకునేలా ప్రోత్సహించే నిమిత్తం మహారాష్ట్రలోని చంద్రపూర్ మునిసిపల్ కార్పొరేషన్ టీకా బంపర్ లక్కీ డ్రాను ప్రకటించింది. పైగా ఈ లక్కీ డ్రాలో ఎల్ఈడీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు నుండి వాషింగ్ మెషీన్ల వరకు మంచి ఆకర్షణీయమైన బహుమతులను గెలుచుకోవచ్చు అని తెలిపింది. అంతేకాదు నవంబర్ 12 నుంచి 24 వరకు సమీపంలోని వ్యాక్సిన్ సెంటర్ల వద్ద వ్యాక్సిన్లు తీసుకున్నవాళ్లకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని చంద్రపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. (చదవండి: విమానాలకు రన్‌వేగా..) ఈ మేరకు మేయర్ రాఖీ సంజయ్ కంచర్లవార్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పౌరులకు ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించడంతోనే ఈ లక్కీ డ్రా ప్రకటించినట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో పౌర కమీషనర్ రాజేష్ మోహితే కూడా ఇతర అధికారులను, ప్రజలను తమ సమీపంలోని సివిక్-రన్ ఇనాక్యులేషన్ సెంటర్‌కు వెళ్లి వ్యాక్సిన్లు వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఇప్పటివరకు నగరంలో అర్హులైన వ్యక్తుల సంఖ్యతో పోలిస్తే వ్యాక్సిన్లు తీసుకున్నవారి సంఖ్య ఇంకా తక్కువగానే ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పైగా పౌరసరఫరాల శాఖ ఆరోగ్య విభాగం సుమారు 21 కేంద్రాల్లో టీకాలు వేసే సౌకర్యాలను ఏర్పాటు చేసిందన్నారు. క్రయ విక్రయలు చేసేవాళ్లు, ఉద్యోగస్తులు, అధికారులు, ప్రజలతో నిత్యం సంప్రదింపులు చేసే వాళ్లు, తదితరులు కనీసం ఒక్కడోస్ అయిన తీసుకుంటేనే నగరంలోని మార్కెట్లోకి అనుమతిస్తామని లేకుంటే అనుమతించేదే లేదని మోహితే చెప్పారు. అంతేకాక ప్రభుత్వ ఆదేశాల మేరకు నూరుశాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించే దిశగా తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. (చదవండి: సూప్ నచ్చకపోతే మరీ అలా చేస్తావా!) -
ఏపీలో 3393 మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ.. రాష్ట్రంలో ఒప్పంద ప్రాతిపదికన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టులు: మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ► మొత్తం పోస్టుల సంఖ్య: 3393 జిల్లాల వారీగా ఖాళీలు ► శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం–633; ► ఈస్ట్ గోదావరి, వెస్ట్‌గోదావరి, కృష్ణా–1003; ► గుంటూరు, ప్రకాశం, నెల్లూరు–786; ► చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు–971. ► అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి ఉండాలి. దాంతోపాటు ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్‌లో కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఉండాలి. ► వయసు: దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల వయసు 35ఏళ్లు మించకూడదు. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల వయసు 40ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 06.11.2021 ► వెబ్సైట్: https://cfw.ap.nic.in/MLHP2021.html -
మాస్కు ధరించకుంటే మూడో వేవ్ తప్పదు
సాక్షి, హైదరాబాద్: ‘కోవిడ్ మొదటి రెండు దశలతో జనం బాగా భయపడ్డారు. ఇక మూడో దశ వస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందారు. కానీ కొన్ని హెచ్చరికల్లో పేర్కొన్నట్లుగా మూడో దశ వెంటనే రాలేదు. ఇక భయం లేదు, కోవిడ్ అంతమైందన్న భావనలో ఉన్నారు. అందుకే ఇప్పుడు అక్కడక్కడా కొందరు తప్ప ఎవరూ మాస్కులు ధరించటం లేదు. కానీ ఇది చాలా ప్రమాదకర పరిణామం. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు, సూచనలను పెడచెవిన పెట్టిన ఫలితంగా అటు రష్యా, ఇటు యూకేల్లో ఇప్పుడు కోవిడ్ విజృంభిస్తోంది. ఇది మనకు ఓ హెచ్చరికలాంటిది. ప్రస్తుతం ఉన్న నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మూడో దశ రావటానికి పెద్దగా సమయం పట్టదన్న విషయాన్ని గుర్తించాలి’ అని ఇంటిగ్రేటివ్ స్పెషలిస్టు, మైక్రోబయోలజిస్టు డాక్టర్ దుర్గా సునీల్ వాస హెచ్చరించారు. కొన్ని రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోందని, ఇది క్రమంగా మూడో దశగా మారకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ‘సాక్షి’ తో పేర్కొన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వాక్సిన్లతో అతి ధీమా వల్లే.. కోవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో వ్యాక్సిల్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయా అని జనం ఎదురు చూశారు. ప్రపంచంలో ఎక్కడ తయారైనా సరే, అందుబాటులోకి వస్తే మహమ్మారి అంతమవుతుందని భావించారు. ఇప్పుడు సొంత తయారీ వ్యాక్సిన్లు మనకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వాటి కోసం ఎదురుచూసినప్పుడు ఉన్న అభిప్రాయమే జనంలో ఇప్పటికీ ఉందని ప్రస్తుతం వారి తీరును బట్టి అర్ధమవుతోంది. వ్యాక్సిన్ వస్తే కోవిడ్ వైరస్ అంతమైనట్లేనని ఆదిలో భావించారు. ఇప్పుడు వ్యాక్సిన్లు వచ్చాయి. సింహభాగం జనం వ్యాక్సిన్లు వేసుకున్నారు. క్రమంగా రెండో డోస్ వేయించుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. టీకా తీసుకున్నాం కదా ఇక ఢోకా లేదన్న ధీమాలోకి చేరుకున్నారు. వెంటనే మాస్కులు విసిరేశారు. ఇప్పుడు ఈ ధోరణే ప్రమాదకరంగా మారబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా మళ్లీ క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రులకు వస్తున్నవారి సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్లు సురక్షితం మాత్రమే.. రెండు డోసుల వ్యాక్సినేషన్‌తో ఇక కోవిడ్ సోకదనే భ్రమ ప్రజల్లో ఉంది. దాని నుంచి బయటపడాలి. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నతర్వాతకూడా వైరస్ సోకుతుంది. ప్రస్తుతం ఆసుపత్రులకు వస్తున్న వారిని చూస్తే ఇది అవగతమవుతుంది. ఏ వ్యాక్సిన్ తయారీ కంపెనీ కూడా, రెండో డోసు తర్వాత కోవిడ్ సోకదు అని ప్రకటించని విషయాన్ని జనం గుర్తించాలి. వైరస్ సోకినా ప్రాణాంతకం కాకుండా ఉండేందుకు మాత్రమే వ్యాక్సిన్లు ఉపకరిస్తాయిచ, తప్ప వైరస్ సోకకుండా అడ్డుకోలేవు. వైరస్ సోకద్దంటే కచ్చితంగా మాస్కు ధరించటంతోపాటు కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే. మరికొన్ని నెలలు వీటిని పాటిస్తే వైరస్ ప్రభావం బాగా తగ్గిపోయి సురక్షితంగా ఉండొచ్చు. వైరస్ ముప్పు తొలగలేదని, క్రమంగా అది ఎండమిక్ స్థాయికి చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించిన విషయాన్ని గుర్తించాలి. వైరస్ రూపాంతరం చెందినప్పుడలా ప్రభావం చూపుతుంది. సురక్షిత మాస్కులను ధరించటం, భౌతిక దూరం పాటిస్తూ, తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం మినహా ప్రస్తుతానికి తరుణోపాయం లేదు. మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితిని మర ఆర్థిక వ్యవస్థ తట్టుకోలేదన్న విషయాన్ని కూడా ప్రజలు గుర్తించాలి. వచ్చేది చలికాలం. వ్యాధులు ముసిరే కాలం. దగ్గు, జలుబుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కోవిడ్ వైరస్ విజృంభిస్తే వ్యాధి బారిన పడే వారి సంఖ్య అతి వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. ఆ రెండు దేశాల ధోరణి ఇలాగే.. అమెరికాలో చాలా వేగంగా వ్యాక్సినేషన్ జరిగింది. టీకాలు వేసుకున్నాక మాస్కుల అవసరం లేదన్న ప్రకటనలూ జారీ అయ్యాయి. ఆదిలో కోవిడ్‌తో వణికిపోయిన యూకేలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజలు మాస్కులతో పాటు కోవిడ్ నిబంధనలను పాతరేయటంతో ఒక్కసారిగా తదుపరి దశ ప్రారంభమైంది. ఇప్పుడు మళ్లీ యూకే వణికిపోవటం మొదలుపెట్టింది. రష్యాలో భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఆసుపత్రుల్లో బెడ్లు దొరకటమే కాదు, శ్మశానవాటికల్లో స్థలం కూడా లభించటం లేదు. ఆ దేశాలకంటే ఎన్నో రెట్లు జనాభా ఉన్న మన దేశంలో మూడో దశ మొదలైతే పరిస్థితి చేయిదాటిపోతుంది. -
మలేరియాకు వ్యాక్సిన్ రెడీ!
మలేరియా.. అందరికీ తెలిసిన వ్యాధే. అది పెద్ద ప్రమాదకరమేమీ కాదని అనుకుంటాం. కానీ మన దేశంలో, రాష్ట్రంలో ఏటా లక్షలాది మంది మలేరియా బారినపడుతున్నారు. పెద్దవాళ్లు దీన్ని తట్టుకుంటున్నా ఐదేళ్లలోపు చిన్నారుల్లో వందల మంది చనిపోతున్నారు. మలేరియాకు చాలా కాలం నుంచీ చికిత్స, మందులు అందుబాటులో ఉన్నా.. ప్రయోజనం మాత్రం తక్కువే. అలాంటి మలేరియాకు ఎట్టకేలకు ఓ వ్యాక్సిన్ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ఈ మలేరియా మహమ్మారి, దాని వ్యాప్తి, చికిత్స, ప్రస్తుత వ్యాక్సిన్ వివరాలు తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ►ప్రపంచవ్యాప్తంగా ఏటా 2 కోట్ల నుంచి 3 కోట్ల మంది మలేరియా బారినపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ►రోజు విడిచి రోజు బాగా పెరుగుతూ తగ్గుతూ ఉండే జ్వరం, తీవ్ర తలనొప్పి, కండరాల నొప్పులు, చెమటపట్టడం, చేతులు–కాళ్లు వణకడం వంటివి మలేరియా లక్షణాలు. ►దీనితో సుమారు ఏటా నాలుగు లక్షల మంది చనిపోతున్నారు. వీరిలో ఐదేళ్లలోపు పిల్లల సంఖ్యే 2.68 లక్షల మంది వరకు ఉంటోందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ►మలేరియా పరాన్నజీవి ఆడఅనాఫిలిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అప్పటికే ఈ వ్యాధి ఉన్న వ్యక్తులను కుట్టిన దోమలు వేరే వ్యక్తులను కుట్టితే వారికీ వ్యాపిస్తుంది. వైరస్ కాదు.. బ్యాక్టీరియా కాదు.. ప్లాస్మోడియం ఫాల్సిపరం అనే అతిచిన్న పరాన్నజీవి (ఏకకణ జీవి–ప్రొటోజోవా) కారణంగా మలేరియా వ్యాధి వస్తుంది. ఇది వైరస్, బ్యాక్టీరియాల వంటి సూక్ష్మజీవి కాదు. వాటికన్నా పెద్దగా ఉంటుంది. ►ఉదాహరణకు ప్లాస్మోడియం క్రిముల పరిమాణం 8–12 మైక్రోమీటర్లు (మైక్రోమీటర్ అంటే మీటర్లో పదిలక్షల వంతు) ఉంటుంది. అదే వైరస్ల పరిమాణం వంద నానోమీటర్ల వరకు (నానోమీటర్ అంటే మీటర్లో వంద కోట్ల వంతు) ఉంటుంది. అంటే వైరస్ల కంటే.. ప్లాస్మోడియం క్రిములు వంద రెట్లు పెద్దగా ఉంటాయి. 8 లక్షల మందిపై పరిశీలించి.. మస్కిరిక్స్’వ్యాక్సిన్ ప్రాథమిక ప్రయోగాలు 2019లోనే పూర్తయ్యాయి. భద్రతా ప్రమాణాల మేరకు ఉన్నట్టు నిర్ధారించుకున్నాక.. దాని పనితీరు, దీర్ఘకాలిక ప్రభావాలు, ఇతర అంశాలను పరిశీలించేందుకు విస్తృత పరిశోధన చేపట్టారు. గత రెండేళ్లలో ఆఫ్రికా ఖండంలోని ఘనా, కెన్యా, మలావి దేశాల్లో ఎనిమిది లక్షల మంది పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చి పరిశీలించారు. ►ఆరు వారాల వయసు నుంచి ఏడాదిన్నర వయసున్న పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇస్తారు. ►దీనిని నాలుగు డోసులుగా (అర మిల్లీలీటర్ చొప్పున) ఇవ్వాల్సి ఉంటుంది. నెలకో డోసు చొప్పున మూడు డోసులు ఇస్తారు. 18 నెలల (ఏడాదిన్నర) తర్వాత నాలుగో డోసు ఇస్తారు. ►వాస్తవానికి ఈ వ్యాక్సిన్ పిల్లలపై 30శాతం ప్రభావవంతంగానే పనిచేస్తుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కానీ లక్షల కొద్దీ కేసులు, వేలకొద్దీ మరణాలు నమోదయ్యే చోట.. ఈ మాత్రమైనా పనిచేసే వ్యాక్సిన్ ప్రయోజనకరమని పేర్కొంది. ►ఆఫ్రికాలో 2019 ఒక్క ఏడాదిలోనే 3.86 లక్షల మంది మలేరియాతో మరణించారు. అదే గత ఏడాదిన్నరలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య మాత్రం 2.12 లక్షలే. ప్రపంచంలోనే తొలిసారిగా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్లు, బ్యాక్టీరియాలతో వచ్చే వ్యాధులకు సంబంధించి చాలా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగాకుండా ఒక పరాన్నజీవికి సంబంధించిన వ్యాక్సిన్ విడుదల అవుతుండటం ఇదే మొదటిసారి అని నిపుణులు చెప్తున్నారు. మలేరియాకు వ్యాక్సిన్ ప్రయోగాలు చాలా ఏళ్లుగా సాగుతున్నాయి. కొన్ని సంస్థలు వ్యాక్సిన్లను రూపొందించినా.. అవి సమర్థవంతంగా పనిచేయలేకపోవడం, సైడ్ ఎఫెక్టులు ఉండటం వంటి కారణాలతో అనుమతులు పొందలేదు. మస్కిరిక్స్ వ్యాక్సిన్‌ను కూడా ఏళ్లపాటు, లక్షలాది మందిపై పరీక్షించిన తర్వాతే అనుమతి ఇచ్చారు. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? దోమకాటు వేసినప్పుడు మలేరియా పరాన్నజీవులు మన రక్తంలోకి ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి కాలేయానికి చేరుకుని వాటి సంఖ్యను పెంచుకుంటాయి. తర్వాత మళ్లీ రక్తంలోకి చేరి ఎర్రరక్త కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. ‘మస్కిరిక్స్’ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. మలేరియా పరాన్నజీవులు కాలేయంలో చేరి సంఖ్యను పెంచుకోకుండా ఈ యాంటీబాడీలు అడ్డుకుంటాయి. ప్లాస్మోడియం ప్రొటీన్ల నుంచే.. బ్రిటన్‌కు చెందిన గ్లాక్సోస్మిత్‌క్లైన్ (జీఎస్కే) ఫార్మా సంస్థ ఈ ‘మస్కిరిక్స్’ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. మలేరియాను కలిగించే ప్లాస్మోడియం ఫాల్సిపరం పరాన్నజీవి పైపొరలో ఉండే ప్రొటీన్ల ఆధారంగా దీనిని రూపొందించారు. 2028 నాటికల్లా కోటిన్నర డోసులు ఉత్పత్తి చేస్తామని, ఉత్పత్తికి అయ్యే ఖర్చుపై కేవలం ఐదు శాతమే ఎక్కువ ధరతో విక్రయిస్తామని జీఎస్కే ప్రకటించింది. ►ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల్లోని చాలా దేశాల్లో మలేరియా సీజనల్‌గా వ్యాప్తి చెందుతుంటుంది. ఏటా లక్షల మంది దీని బారినపడుతున్నారు. డబ్ల్యూహెచ్‌వో అంచనా ప్రకారం.. 2030 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు కోట్ల మలేరియా వ్యాక్సిన్లు అవసరం కానున్నాయి. మన దేశానికి అత్యవసరం! ప్రపంచంలో ఆఫ్రికా ఖండం తర్వాత ఎక్కువగా మలేరియా కేసులు నమోదయ్యే దేశాల్లో ఇండియా కూడా ఒకటి. దేశంలో ఏటా లక్షలాది కేసులు నమోదవుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే టెస్టులు చేసే సౌకర్యాలు లేకపోవడం, మలేరియా వ్యాప్తి ఎక్కువగా ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటంతో అధికారికంగా కేసుల సంఖ్య తక్కువగా ఉంటోందని పేర్కొంటున్నారు. అయితే కొన్నేళ్లుగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో మలేరియా వ్యాప్తి బాగా తగ్గిపోయిందని వివరిస్తున్నారు. ►2019లో భారత్‌లో సుమారు 56 లక్షల మందికి మలేరియా సోకగా.. 7,700 మంది మరణించినట్టు డబ్ల్యూహెచ్‌వో అంచనా. ►కేంద్ర వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది జూలై చివరినాటికి దేశవ్యాప్తంగా 64,520 మలేరియా కేసులు నమోదుకాగా.. 35 మంది చనిపోయారు. ►హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ మన దేశంలో ‘మస్కిరిక్స్’ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుందని ఫార్మా వర్గాలు తెలిపాయి. ప్రపంచానికి ఓ బహుమతి మలేరియా వ్యాక్సిన్లపై 30 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. జీఎస్కే ఫార్మాతయారు చేసిన ‘మస్కిరిక్స్’ వ్యాక్సిన్‌పై పలు దేశాల్లో విస్తృతంగా ప్రయోగం నిర్వహించారు. ప్రపంచంలోనే తొలి మలేరియా వ్యాక్సిన్‌ను డబ్ల్యూహెచ్‌వో తరఫున సిఫార్సు చేస్తున్నాం. మలేరియా బాధిత దేశాల్లో పిల్లలకు పెద్ద ఎత్తున ఈ వ్యాక్సినేషన్ చేపట్టాలి. – డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ -
TS: ఈహెచ్ఎస్లో ఉద్యోగుల భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)లో సమస్యలను పరిష్కరించడం, పథకాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడంపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ దృష్టిసారించింది. దీనికి సంబం ధించి మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. ఇందులో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో నిమ్స్ డైరెక్టర్ మనోహర్, వైద్య విద్య డైరెక్టర్ రమేశ్ రెడ్డి, సీఎంవో ప్రత్యేకాధికారి తాడూరి గంగాధర్, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డైరెక్టర్ ప్రీతిమీనా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈహెచ్ఎస్ అమలు కోసం ఉద్యోగుల మూల వేతనంలో ఒక శాతాన్ని తీసుకోవాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి, పథకాన్ని సక్రమంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నా.. ఈహెచ్ఎస్ అమలు పరిస్థితిపై ఉద్యోగులు, పింఛన్ దారులు అసంతృప్తితో ఉన్నారని.. చాలా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఈ పథకాన్ని అమలు చేయడం లేదని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. బడ్జెట్లో ఈ పథకానికి రూ.300 కోట్ల మేర కేటాయిస్తున్నా.. నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు. ‘‘సరిగా బిల్లులు అందడం లేదని, వివిధ చికిత్సలకు చెల్లించే ధరలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రైవేటు ఆస్పత్రులు అంటున్నాయి. ఈ కారణాలతోనే ఈహెచ్ఎస్ కింద వైద్యచికిత్సలు అందించేందుకు నిరాకరిస్తున్నాయి. ఆస్పత్రులపై ఒత్తిడి చేయలేని పరిస్థితి ఉంది..’’అని అధికారులు రిజ్వీ దృష్టికి తీసుకొచ్చారు. గత ఐదేళ్లలో పథకం అమలు గణాంకాలను వివరించారు. దీనిపై స్పందించిన రిజ్వీ.. వెంటనే పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక ఉద్యోగులు కోరుతున్నట్టుగా వారి మూల వేతనంలో ఒక శాతం మొత్తాన్ని కంట్రిబ్యూషన్‌గా తీసుకుంటే.. సమస్య పరిష్కారమవుతుందా అన్న చర్చ జరిగింది. ఉద్యోగులు కంట్రిబ్యూషన్ ఇచ్చాక ఇంకా ప్రభుత్వం ఎంత భరించాల్సి ఉంటుందన్న అంచనాలు వేశా రు. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని, తగిన ప్రతిపాదనలతో సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. -
స్టయిఫండ్ ఇవ్వలేమంటే కుదరదు: ఏపీ వైద్య ఆరోగ్యశాఖ
సాక్షి, అమరావతి: ప్రైవేటు వైద్య కాలేజీల్లో పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నెలవారీ స్టయిఫండ్ ఇవ్వలేమంటే కుదరదని వైద్య ఆరోగ్యశాఖ తేల్చి చెప్పింది. కొన్ని నెలల క్రితం ప్రైవేటు వైద్య కళాశాలల అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ ఇచ్చింది. ఈ లేఖలో.. తమకు వైద్యకాలేజీల నిర్వహణ భారం పెరిగిందని, ఈ నేపథ్యంలో పీజీ చదువుకుంటున్న వారికి స్టయిఫండ్ కింద నిధులు చెల్లించలేమని, దీనిపై ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరింది. కొన్ని నెలలుగా ఈ ఫైలు పెండింగ్‌లో ఉందంటూ ప్రైవేటు వైద్యకాలేజీల యాజమాన్యాలు స్టయిఫండ్ చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు యాజమాన్యాల లేఖను వైద్య ఆరోగ్యశాఖ తిరస్కరించింది. ప్రభుత్వ కాలేజీల్లో స్టయిఫండ్ ఎలా ఇస్తున్నామో, ప్రైవేటులోనూ అంతేనని, దీన్ని ఇవ్వలేమని చెప్పడం కుదరదని స్పష్టం చేసింది. వ్యయ నిర్వహణకు సంబంధించిన ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చిన నివేదికను అనుసరించే ఫీ రెగ్యులేటరీ కమిటీ స్టయిఫండ్ ఇవ్వాలని నిర్ణయించిందని, దీన్ని ఇప్పుడు కాదనేందుకు లేదని చెప్పింది. చదవండి: విజయవాడలో అరుదైన పిల్లి హల్చల్.. ఎలా వచ్చింది? -
వైద్య, ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్కు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్
-
ఏపీలో భారీగా తగ్గిన కరోనా మరణాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మృతుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,608 పాజిటివ్ కేసులు నమోదవగా ఆరుగురు మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో 67,911 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసింది. వైరస్ నుంచి 1,107 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,98,561 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. చదవండి: సెక్యూరిటీ గార్డే డాక్టరైండు.. పేషెంట్‌కు ఇంజెక్షన్ -
కారణం లేకుండా ‘కోత’ వద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే సిజేరియన్ ప్రసవాలను అరికట్టేందుకు సర్కారు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇప్పటికే 65 శాతం వరకు సిజేరియన్ ద్వారానే ప్రసవాలు చేస్తున్నారు. దీంతో వీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. కారణాలు లేకుండా ఏ గర్భిణికైనా ‘కోత’ ద్వారా ప్రసవం చేస్తే సదరు వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో ఏటా 8 లక్షలకు పైగా ప్రసవాలు జరుగుతుండగా, అందులో మెజారిటీ ప్రసవాలు కోతల ద్వారానే జరుగుతున్నాయి. అందుకే ఇక ప్రతి వారం కోతల ప్రసవాలపై ఆడిట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఆస్పత్రిలోనూ జరిగిన ప్రసవాల వివరాలు ఆయా జిల్లా వైద్యాధికారులకు పంపించాలి. ఎందుకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది? సాధారణ ప్రసవం కాకపోవడానికి గల కారణాలను ప్రత్యేక ఫార్మాట్లో ఇచ్చిన పేపర్లో నింపి పంపించాలి. ప్రతి 15 రోజులకోసారి జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో సమీక్ష ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కువగా రాత్రి సమయాల్లో వచ్చిన గర్భిణులకు సిజేరియన్ చేస్తున్నారు. సాధారణ ప్రసవానికి ఎక్కువ సేపు వేచిచూడాల్సి రావడం, అంతసేపు సహనంగా ఉండలేక వెంటనే ఆపరేషన్ చేసి ప్రసవం చేస్తున్నారు. దీనివల్ల తల్లికీ, బిడ్డకూ భవిష్యత్‌లో సమస్యలు వస్తాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఆడిట్ నిర్వహిస్తారు. ఎక్కడైనా అసాధారణ కోతలు నిర్వహించే ఆస్పత్రులు లేదా డాక్టర్లు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకునే వీలుంటుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ‘కోతల’ ప్రసవాలపై ఆడిట్ నిర్వహణ మొదలైంది. కోతల ప్రసవాలపైనే కాకుండా మాతృ మరణాలపైనా కారణాలు చెప్పాలని ప్రజారోగ్య సంచాలకులు ఆదేశించారు. -
మ్యాగీ జేసినంత ఈజీగా డాక్టర్ ఆపరేషన్లు
రాయిపూర్: ఓ వైద్యుడు ఉద్యమం మాదిరి శస్త్ర చికిత్సలు చేశాడు. భారీ ఎత్తున ఆపరేషన్లు చేయడం కలకలం రేపింది. నిర్విరామంగా ఏడు గంటలపాటు 101 మందికి కుటుంబ నియంత్రణ (ట్యూబెక్టమీ) శస్త్ర చికిత్సలు చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా ఆ వైద్యుడు ఆపరేషన్లు చేశాడు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. చదవండి: ఆస్పత్రి బాత్రూమ్లో ప్రసవించిన అత్యాచార బాధితురాలు సుర్గుజా జిల్లా నర్మదాపూర్ ఆరోగ్య కేంద్రంలో ఆగస్టు 27వ తేదీన మెగా స్టెరిలైజేషన్ క్యాంప్ నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఒక వైద్యుడు రోజుకు 30 కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయాలి. కానీ ఈ క్యాంప్‌లో ఏకంగా 101 ఆపరేషన్లు చేశారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రభుత్వ సర్జన్ శస్త్ర చికిత్సలు నిర్వహించాడు. ఈ శస్త్ర చికిత్సలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహిళల ఆరోగ్యం చూడకుండా ఇష్టమొచ్చిన తీరునా శస్త్ర చికిత్సలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విమర్శలు రావడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించారు. ఆగస్టు 29న ఆ జిల్లా వైద్యాధికారి పీఎస్ సిసోడియా వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సర్జికల్ స్పెషలిస్ట్ జిబ్నస్ ఎక్కా, మరో వైద్యుడు డాక్టర్ ఆర్ఎస్ సింగ్‌లకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటుచేశారు. దీనిపై వైద్యులు కమిటీకి ఓ నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. ఆ రోజు శిబిరానికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చారని కమిటీకి తెలిపినట్లు సమాచారం. దూర ప్రాంతాల నుంచి మహిళలు వచ్చారని, వారు మళ్లీ అంత దూరం నుంచి రాలేకపోతామని వాపోయారని, అందుకే శస్త్ర చికిత్సలు చేసినట్లు తెలుస్తోంది. మహిళల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యులు వివరణ ఇచ్చారు. అయితే శస్త్ర చికిత్స చేయించుకున్న మహిళలంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం. చదవండి: సీక్రెట్ యాప్‌తో భార్య ఫోన్ ట్యాపింగ్.. ఆమెపై నీడలా భర్త -
జాతీయ మెడికల్ కమిషన్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: చిన్న పిల్లలకు పీడియాట్రిక్స్ స్పెషలైజేషన్‌లాగే... వృద్ధులకు ప్రత్యేకంగా వైద్యం అందించేలా పీజీ మెడికల్‌లో జీరియాట్రిక్స్ స్పెషలైజేషన్ కోర్సును కేంద్ర ప్రభుత్వం పరిచయం చేయనుంది. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా ప్రకటించింది. దేశంలో వృద్ధుల జనాభా పెరుగుతుండటం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వృద్ధులు జీవితాంతం నాణ్యమైన జీవితాన్ని గడిపేలా ఈ కోర్సును తీర్చిదిద్దుతారు. ప్రస్తుతం పీజీ ఎండీ, ఎంఎస్‌లలో 32 కోర్సు లున్నాయి. వీటిల్లో కొత్తగా 4 కోర్సులను ప్రారంభిస్తారు. సూపర్ స్పెషాలిటీలో ప్రస్తుతం 38 కోర్సు లున్నాయి. ఈ కేటగిరీలో కొత్తగా 8 కోర్సులను ప్రారంభించాలని ఎన్ఎంసీ నిర్ణయం తీసుకుంది. చదవండి: ఏపీ: ప్రతి 100 మందిలో 30 మందికి అప్పుడే పెళ్లిళ్లు వైద్య రంగంలో నైతిక విలువలు... వైద్యరంగంలో నైతిక విలువలపై ప్రత్యేకంగా ఎటువంటి కోర్సు లేదు. కానీ రాబోయే రోజుల్లో పీజీ మెడికల్‌లో ఐసీఎంఆర్ నిర్వహించే మెడికల్ ఎథిక్స్ అనే సర్టిఫికెట్ కోర్సును తప్పనిసరిగా చదవాలి. మొదటి ఏడాదిలోనే ఈ కోర్సును పూర్తి చేయాలి. దాన్ని రాయకుంటే ఫైనలియర్ పరీక్ష రాయడానికి వీలుండదు. ఒక డాక్టర్ వేరే డాక్టర్ గురించి చెడుగా చెప్పకూడదు.. కమీషన్ల కోసం ఇతర ఆసుపత్రులకు రోగులను రిఫర్ చేయకూడదు.. డాక్టర్, రోగుల మధ్య సంబంధాలపై మానవీయ కోణాన్ని పెంపొందించడానికి ఈ కోర్సును ఉద్దేశించారు. చదవండి: మహానేత వైఎస్సార్‌కు సీఎం వైఎస్ జగన్ నివాళి మరికొన్ని అంశాలు... పీజీ మెడికల్‌లో మొదటి ఏడాది ఐసీఎంఆర్ నిర్వహించే బేసిక్ బయో మెడికల్ రీసెర్చి కోర్సును ఆన్లైన్లో చదివి రాయాల్సి ఉంటుంది. వైద్య విద్యార్థుల్లో పరిశోధనను పెంపొందించాల్సి ఉంది. ఎలాంటి అంశాలపై చేయవచ్చు అన్న దానిపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. ♦ బేసిక్ లైఫ్ సపోర్టుపై అన్ని స్పెషలైజేషన్ కోర్సు ల వైద్య విద్యార్థులకు తప్పనిసరి చేశారు. అత్యవసర వైద్యాన్ని అందరూ నేర్చుకోవాలి. ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. తర్వాత సరి్టఫికెట్ ఇస్తారు. ♦గతంలో పీజీ మెడికల్‌లో మొదటి ఏడాది, చివరి ఏడాది మాత్రమే పరీక్ష ఉండేది. ఇప్పుడు కోర్సును 50 మాడ్యూల్స్‌గా విభజిస్తారు. దాని ప్రకారం వాళ్లకి శిక్షణ ఇచ్చి, అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. మాడ్యూల్స్ పూర్తి కాగానే పరీక్ష నిర్వహిస్తారు. ఇవన్నీ ప్రాక్టికల్ పరీక్షలే. ♦పీజీ మెడికల్ విద్యార్థులు జిల్లా ఆసుపత్రిలో కోర్సు పీరియడ్‌లో తప్పనిసరిగా 3 నెలలు పనిచేయాలి. దీనివల్ల జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్య సేవలు మెరుగుపడతాయి. జాతీయ ఆరోగ్య పథకాలు, స్థానిక జబ్బులపై అవగాహన కలి్పంచడానికి దీన్ని ఉద్దేశించారు. ♦ అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల అనుభవం, పరిశోధనల ఆధారంగా పీజీ సీట్లను ఆయా కాలేజీలకు అనుమతిస్తారు. ప్రస్తుతం ఒక అసోసియేట్ ప్రొఫెసర్‌కు 2, ప్రొఫెసర్‌కు 3 సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేస్తోంది. ప్రొఫెసర్ల సామర్థ్యం సరిగా లేకుంటే అటువంటి కాలేజీలకు ప్రొఫెసర్‌కు ఒక సీటునే మంజూరు చేస్తారు. ♦ప్రతీ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ కోర్సులను ప్రారంభించాలంటే తప్పనిసరిగా ఎంఆర్ఐ, సీటీ స్కాన్లు ఉండాలన్నది నిబంధన. ఎంవోయూ లేదా ఔట్సోర్సింగ్ పద్ధతిలో బయ ట సమకూర్చుకోవడాన్ని అనుమతించరు. కొత్త కోర్సులు... మెడికల్ పీజీలో (ఎండీ, ఎంఎస్) ♦ ఏరోస్పేస్ మెడిసిన్ ♦ మెరైన్ మెడిసిన్ ♦ ట్రమటాలజీ అండ్ సర్జరీ... ♦ జీరియాట్రిక్ సూపర్ స్పెషాలిటీలు... ♦ మెడికల్ జెనెటిక్స్ ♦వైరాలజీ మెడిసిన్ ♦ చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ ♦ జీరియాట్రిక్ మెంటల్ హెల్త్ ♦ హెపటాలజీ (లివర్) ♦ ఎంసీహెచ్ ఎండోక్రైన్ సర్జరీ ♦ హెపటో పాంకీయాట్రో బిలియరీ సర్జరీ ♦ రీప్రొడెక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ 20 ఏళ్ల తర్వాత మార్పులు 20 ఏళ్ల తర్వాత పీజీ మెడికల్‌లో పలు కీలకమైన మార్పులు చేశారు. ప్రస్తుతం తీసుకొచ్చిన కోర్సులు శాస్త్రీయంగా, సామాజిక అవసరాలకు తగినట్లుగా ఉన్నాయి. మెడికల్ కాలేజీల్లో వైద్య పరిశోధనకు ఊపు తీసుకురావాలని ఎన్ఎంసీ నిర్ణయించడం ముదావహం. నియమాలు ఒకవైపు సరళతరం చేస్తూనే మరోవైపు కొన్ని కొత్త మార్పులు సూచించారు. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
ఆరోగ్యసేవల అనుసంధానం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆరోగ్యశాఖలో సమగ్ర ఆరోగ్య వ్యవస్థ (ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిస్టం) రూపుదిద్దుకుంటోంది. వైద్యసేవల్ని అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల రోగికి సంబంధించిన సమాచారం పక్కాగా ఒకే చోట లభిస్తుంది. తద్వారా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. తొలిదశలో ఈనెలాఖరు నాటికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 104 సర్వీసులను అనుసంధానం చేయనున్నారు. ఈ మూడు సర్వీసుల్లో ఎక్కడకు వెళ్లినా రోగి పూర్తి సమాచారం ఉంటుంది. 104 వాహనాల్లో రక్తనమూనాలు పరిశీలించిన వివరాలు సైతం దీన్లో నమోదు చేస్తారు. ఉదాహరణకు 104 వాహనంలో సేవలు పొందాక ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి ఉంటుంది. అప్పుడు రోగికి ఇచ్చిన ప్రత్యేక కోడ్‌ను క్లిక్ చేయగానే, నెట్వర్క్ ఆస్పత్రిలో సైతం గతంలో బీపీ ఉందా, షుగర్ ఉందా, ఏ తేదీల్లో చూపించుకున్నారు.. ఇలా మొత్తం సమాచారం వెల్లడవుతుంది. ప్రస్తుతం దేశంలో మొట్టమొదటిసారి మన రాష్ట్రంలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. 1,149 పీహెచ్‌సీలు, 104 వాహనాలు 676 ప్రస్తుతం రాష్ట్రంలో 1,149 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. 104 వాహనాలు 676 సేవలందిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పరిధిలో 800కు పైగా నెట్వర్క్ ఆస్పత్రులున్నాయి. ఈ మూడు సర్వీసులను కలిపి రోగుల డేటాను ఒకే వేదికపై ఉంచుతారు. ఇప్పటికే క్యూ ఆర్ కోడ్‌తో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులో గానీ, లేదా ప్రత్యేక కోడ్ నంబరు ఇవ్వడం ద్వారా గానీ సమాచారం తెలుసుకోవచ్చు. వాహనంలో చికిత్సలు పొందినా, పీహెచ్సీలో వైద్యం పొందినా.. ఈరెండూ కాకుండా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లినా రోగి గతంలో తీసుకున్న చికిత్సల వివరాలన్నీ వస్తాయి. దీనివల్ల రోగి పూర్వాపరాలు తెలుసుకోవడంతో పాటు తక్షణమే చికిత్స చేయడానికి వీలుంటుంది. బ్లడ్‌గ్రూపు వివరాలు కూడా ఉంటాయి కాబట్టి అత్యవసర సమయాల్లో ఆలస్యం జరగకుండా ఉంటుంది. ఈ మూడు సర్వీసులను అనుసంధానించే ప్రక్రియను ఈనెలాఖరు నాటికి పూర్తి చేయాలని కుటుంబ సంక్షేమశాఖ భావిస్తోంది. తర్వాత మిగిలినవన్నీ.. ఈ మూడు సర్వీసులు అనుసంధానం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,051 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, 195 సామాజిక ఆరోగ్య కేంద్రాలను వీటికి లింక్ చేస్తారు. తరువాత ఏరియా ఆస్పత్రుల వరకు అనుసంధానం చేస్తారు. దీంతో రాష్ట్రంలో ఒక పేషెంటు ఏ ఆస్పత్రికి వెళ్లినా అతడి సమస్త సమాచారం ఒక కోడ్ నంబరు క్లిక్ చేస్తే వస్తుంది. ఇలా సమాచారం అందుబాటులో ఉండటం వల్ల రోగికి తక్షణమే వైద్యం అందించడంతో పాటు సరైన వైద్యం అందించే వెసులుబాటు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ సేవలు ఈనెలాఖరుకల్లా ఆరోగ్యశ్రీ, పీహెచ్‌సీలు, 104 సర్వీసుల అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది. క్రమంగా మిగతా ఆస్పత్రులనూ ఒకే గొడుగు కిందకు తెస్తాం. దీనివల్ల రోగులకు ఉపయోగమే కాదు, వైద్యులకు కూడా చికిత్సలు సులభతరమవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చికిత్స అనంతరం ఇంటివద్దకే వెళ్లి మందులు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సేవలను ఉన్నతీకరిస్తున్నాం. – కాటమనేని భాస్కర్,కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ -
శ్రీకాకుళం: వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ
శ్రీకాకుళం అర్బన్: కలెక్టర్ ఉత్తర్వుల మేరకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.చంద్రానాయక్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సైకియాట్రిస్ట్, ఫోరెన్సిక్ స్పె షలిస్ట్, జనరల్ ఫిజీషియన్, ఎన్పిసీడీఎస్ కింద కార్డియాలజిస్ట్, ఎన్పీసీడీఎస్ కింద మెడికల్ ఆఫీ సర్, ఎన్‌బీఎస్‌యూసీ కింద మెడికల్ ఆఫీసర్, స్టాఫ్‌నర్సులు, సైకియాట్రిస్ట్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫిజియోథెరఫిస్ట్లు, ఆడియో మెట్రిషియన్, సోషల్ వర్కర్లు, క్వాలిటీ మానిటర్ కన్సల్టెంట్, హాస్పిటల్ అటెండెంట్, శాని టరీ అటెండెంట్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకూ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అర్హులైన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శ్రీకాకుళం.ఏపీ.జీవోవి.ఇన్ నుంచి సమాచారం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇవీ చదవండి: కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. అసలు నిజం ఇదే! ఇంటర్లో సీఈసీ చేశారా.. ఈ కెరీర్ అవకాశాలు మీకోసమే -
ఒక్క రోజే కోటి వ్యాక్సినేషన్లు
న్యూఢిల్లీ: దేశంలో రికార్డు స్థాయిలో ఒకే రోజు కోటి డోసులకు పైగా వ్యాక్సినేషన్లు జరిగినట్లు ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇప్పటి వరకూ ఒకరోజు వ్యవధిలో చేసిన అత్యధిక వ్యాక్సినేషన్ల సంఖ్య ఇదే కావడం గమనార్హం. దీంతో మొత్తం వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 62,17,06,882కు చేరుకుంది. కోవిన్ పోర్టల్ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం ఒక్క రోజులోనే 1,00,64,032 డోసుల వ్యాక్సినేషన్లు జరిగాయి. కోటి డోసులు దాటడం గుర్తుండిపోదగ్గ సందర్భమని ప్రధాని మోదీ అన్నారు. వ్యాక్సినేషన్లు తీసుకొని డ్రైవ్‌ను విజయవంతం చేసిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు వ్యాక్సిన్ వేయించుకున్న పౌరులకు అభినందనలు తెలుపుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ఈ నెల 17న ఒకే రోజు 88 లక్షల డోసుల వ్యాక్సినేషన్లు జరిగాయి. ఇప్పటి వరకూ ఒకరోజులో జరిగిన అత్యధిక వ్యాక్సినేషన్ల రికార్డు అదే కాగా, తాజా రికార్డు దాన్ని బద్దలుకొట్టింది. 18–44 వయసుల వారిలో 30,85,06,160 మంది మొదటి డోసు వ్యాక్సినేషన్ తీసుకోగా, 23,98,99,849 మంది రెండు డోసులను తీసుకున్నారు. -
సీఎం జగన్ సమక్షంలో న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ డ్రైవ్
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) డ్రైవ్‌ను వైద్యారోగ్యశాఖ అధికారులు బుధవారం ప్రారంభించారు. సీఎం జగన్ సమక్షంలో వైద్యాధికారులు నెలల చిన్నారికి పీసీవీ వ్యాక్సిన్‌ను వేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత మంత్రుల సమక్షంలో అన్ని జిల్లాలలో టీకా కార్యక్రమం ప్రారంభమైంది. కాగా న్యూమోనియా వ్యాధితో రెండేళ్ల లోపు చిన్నారుల ఎక్కువగా మృతి చెందుతున్న నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన న్యూమో కాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ తో శిశుమరణాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రతీ చిన్నారికి మూడు డోసుల టీకా ఇవ్వనున్నారు. ఈ ఏడాది 5 లక్షల మందికి పైగా చిన్నారులకి వ్యాక్సిన్ వేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఆరు వారాలు నిండిన 5,45,506 మంది చిన్నారులకి ఈ ఏడాది న్యూమోనియా తొలి డోసు వేయనున్నారు. ఇక 14 వారాలు నిండిన 4,09,130 మంది చిన్నారులకి రెండవ డోసు....తొమ్మిది నెలల నిండిన 68,188 మంది చిన్నారులకి బూస్టర్ డోసు ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. పిల్లలకు సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది రకాల వ్యాక్సిన్లను ప్రభుత్వం అందిస్తోంది. తాజాగా కొత్తగా ఇస్తున్న న్యుమోకాకల్‌తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్లు పిల్లలకు ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ -
మూడో దశ కట్టడికి ఏం చేశారు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మూడో దశ కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇతర రాష్ట్రాలు ఇప్పటికే రోడ్ మ్యాప్‌ను రూపొందించాయని, ఆ తరహాలో ఇక్కడా తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. ఆసుపత్రుల్లో ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయి? ప్రస్తుతం ఎంతమంది రోగులు చికిత్స పొందుతున్నారు? తదితర వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కట్టడికి చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. కరోనా కట్టడి చర్యలపై ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు దాఖలు చేసిన నివేదికపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తెలియజేయలేదని, సెరో సరై్వలెన్స్ నివేదికను సమరి్పంచలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ వివరాలతో పాటు గతంలో తామిచ్చిన ఆదేశాల అమలుపై స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ రెండో వారానికి వాయిదా వేసింది. చదవండి: తస్మాత్ జాగ్రత్త.. చిన్న పిల్లల్లో ఆ వ్యాధులు పెరుగుతున్నాయ్ -
ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించడం మా కల: సీఎం జగన్
సాక్షి, అమరావతి: 45 ఏళ్లకు పైబడ్డవారు, గర్భవతుల తర్వాత టీచర్లకు వ్యాక్సినేషన్లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 16వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని తెలిపారు. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడకుండా చూడాలని సూచించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం కోవిడ్ నియంత్రణ, వైద్యరంగంలో నాడు-నేడుపై సమీక్ష చేపట్టారు. సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పెళ్లిళ్ల సీజన్లో పెద్ద ఎత్తున ప్రజలు ఒక చోటకు వచ్చే అవకాశాలున్నాయి. కోవిడ్ విస్తరణకు దారితీసే అవకాశాలున్నాయి. శుభకార్యాల్లో వీలైనంత తక్కువ మంది ఉండేలా చూడాలి. పెళ్లిల్లో 150 మంది మాత్రమే ఉండాలి. కోవిడ్ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి’’ అని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగేంతవరకూ జాగ్రత్తలు తప్పనిసరని సీఎం జగన్ స్పష్టం చేశారు. రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని, ఆ పరీక్షల్లో కచ్చితమైన నిర్ధారణలు వస్తాయని గుర్తుచేశారు. ఇంటింటీ సర్వే కొనసాగాలని, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని, 104 నంబర్ యంత్రాంగం సమర్థంగా సేవలందించేలా నిరంతరం పర్యవేక్షణ, సమీక్ష చేయాలని సూచించారు. విలేజ్ క్లినిక్స్‌ను పీహెచ్‌సీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ల్యాబులను కూడా అనుసంధానం చేయాలి. గ్రామంలో ప్రజల ఆరోగ్య వివరాలపై మ్యాపింగ్ జరగాలి. ఆరోగ్య శ్రీ కార్డుల ద్వారా సంబంధిత వ్యక్తి వివరాలన్నీ కూడా విలేజ్ క్లినిక్స్‌కు అందుబాటులో ఉండాలి. ఆరోగ్య శ్రీ కార్డు క్యూ ఆర్‌కోడ్ ద్వారా ఈ వివరాలన్నీకూడా వెంటనే తెలిసేలా చూడాలి. ఇదివరకే సేకరించిన డేటా వివరాలన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీ కార్డుతో అనుసంధానం చేయాలి. నిర్దేశిత సమయంలోగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో భాగంగా వైద్యుడు ఆగ్రామానికి వెళ్తున్నప్పుడు చికిత్సకు ఈ వివరాలు ఎంతో సహాయపడతాయి. సత్వరమే నిర్ధారణలతో కూడిన వైద్యం అందించడానికి దోహదపడుతుంది. డిసెంబర్ వరకు విలేజ్‌క్లినిక్స్ అన్నింటినీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు. ఆస్పత్రుల్లో నాడు - నేడుకు సంబంధించి పనులపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తికావాలని ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న 16 వైద్య కళాశాలల్లో పనుల ప్రగతిని ఈ సందర్భంగా సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. వైద్యారోగ్య రంగంలో నాడు - నేడు పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సీఎం సూచించారు. నిధులపరంగా ఒక కార్యాచరణ ప్రకారం ముందుకురావాలని చెప్పారు. ఒక మంచి ఉద్దేశంతో 16 వైద్య కళాశాలల నిర్మాణాలను చేపట్టామని సీఎం జగన్ గుర్తుచేశారు. కళాశాలల్లో సరైన యాజమాన్య విధానాలపై ఎస్ఓపీలను రూపొందించాలని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఈ తరాలకే కాదు, భవిష్యత్ తరాలకు కూడా అత్యుత్తమ వైద్యం ప్రజలకు అందాలన్నదే మా కల. ప్రభుత్వ ఉద్యోగి కూడా వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులను ఎంపికచేసుకునేలా వాటిని తీర్చిదిద్దాలి. ఎల్లప్పుడూ కూడా ఈ మెడికల్ కాలేజ్ ఆస్పత్రులు కొత్తగా కనిపించాలి. అత్యంత నాణ్యమైన, సమర్థవంతమైన సేవలు అందాలి. కార్పొరేట్‌ఆస్పత్రులకు దీటుగా వీటిని నిర్వహించాలి. అందుకు తగ్గ ఎస్ఓపీలను తయారు చేయండి. ఎలా నిర్వహిస్తామో పద్ధతులను తయారు చేసి నాకు సమర్పించండి’’ అని అధికారులకు సీఎం జగన్మోహన్రెడ్డి తెలిపారు. -
వైద్య, ఆరోగ్య శాఖకు 3,977 పోస్టులు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: వైద్య ఆరోగ్య శాఖలో 1,460 కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పోస్టులను ఐదు రోజుల కింద రద్దు చేసిన ప్రభుత్వం.. శుక్రవారం 3,977 పోస్టుల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది. 2022 మార్చి 31 వరకు కొనసాగేలా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిన నియామకాలు చేయాలని సూచించింది. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్ రోస్ మూడు వేర్వేరు ఉత్తర్వులను విడుదల చేశారు. మొత్తం 573 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మంజూరు చేసిన ప్రభుత్వం వరంగల్ కేఎంసీకి 57, ఎంజీఎంకు 27, హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి 3, సీకేఎంకు 4 కేటాయించింది. మిగతావి హైదరాబాద్ ఉస్మా నియా, గాంధీ, నిలో ఫర్, డెంటల్ ఆస్పత్రులతో పాటు నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సిద్ది పేట తదితర జిల్లాలకు కేటాయించారు. అన్ని జిల్లాలకు 1,216 మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్ (ఫిమేల్) / ఏఎన్ఎం పోస్టులు మంజూరు చేశారు. జీఓఆర్టీ నం.1040 ప్రకారం 766 స్పెషల్ అసిస్టెంట్ సివిల్ సర్జన్, 115 సివిల్ సర్జన్ (జనరల్), 139 ల్యాబ్ టెక్నీషియన్, 119 ఫార్మసిస్టు, 252 ఏఎన్ఎం పోస్టు లు, జీఓఆర్టీ 1039 ద్వారా 264 సివిల్ సర్జన్, 86 ల్యాబ్‌టెక్నీషియన్ గ్రేడ్–2, 126 ఫార్మసిస్టు గ్రేడ్–2 పోస్టులు మంజూరు చేశారు. వీటిని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిన నియమిస్తారు. -
85% పీహెచ్‌సీల్లో ఇద్దరు వైద్యులు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యమే పరమావధిగా భావిస్తూ.. గ్రామస్థాయిలో వైద్యసేవల విస్తరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రభుత్వ వైద్యం చేరువ కావడంతో గ్రామీణ ప్రజల్లో సంతోషం కనిపిస్తోంది. ప్రతి మండలంలోను ఐదుగురు డాక్టర్లు అందుబాటులో ఉండటంతో ప్రజలకు మరింతగా వైద్యసేవలు అందనున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ పద్ధతిలో అన్ని కుటుంబాలకు వైద్యసదుపాయం కలగనుంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో (పీహెచ్‌సీల్లో) డాక్టరు ఉంటారో లేదో అన్న పరిస్థితి నుంచి ఎప్పుడు వైద్యానికి వెళ్లినా డాక్టరు అందుబాటులో ఉంటారన్న భరోసా వచ్చింది. ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి ఇద్దరు వైద్యులను నియమించడంతో గ్రామీణ ప్రాంతాల్లో మార్పు కనిపిస్తోంది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలన్న ఆలోచన నుంచి బయటపడుతున్నారు. అందుబాటులో డాక్టరు ఉన్నప్పుడు మళ్లీ ప్రైవేటు ఆస్పత్రికి ఎందుకన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇద్దరు వైద్యుల నియామకం తర్వాత వైద్యుల్లోను కొంత బాధ్యత పెరిగింది. గతంలో ఎంబీబీఎస్ చదివినా ఉద్యోగాలు ఉండేవి కావు. ఈ పరిస్థితుల్లో పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉండాలన్న నిర్ణయంతో వారికి ప్రభుత్వ సర్వీసులో పనిచేసే అవకాశమూ వచ్చింది. ఇలా ప్రాథమిక వైద్యం బలోపేతం అవుతోంది. ప్రతి గ్రామానికి వైద్యుడి రాక ప్రతి మండలంలో 2 పీహెచ్‌సీల్లోను నలుగురు డాక్టర్లు ఉంటారు. ఒక్కో పీహెచ్‌సీలోని ఇద్దరు డాక్టర్లు దాని పరిధిలోని గ్రామాలను విభజించుకుని ప్రతి గ్రామానికి నెలకు రెండుసార్లు వెళతారు. 104 వాహనం నెలకు ఒకసారి ప్రతి గ్రామానికి వెళుతుంది. అందులో వైద్యుడు ఉంటారు. దీంతో గ్రామంలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ వైద్యులు అందుబాటులో ఉన్నట్లవుతుంది. గ్రామంలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ఉంటుంది. అక్కడికి వెళ్లినవారికి అవసరాన్ని బట్టి అక్కడి సిబ్బంది పీహెచ్‌సీలోని వైద్యుడితో మాట్లాడించి చికిత్స అందిస్తారు. ఓపీ సేవల్లో మార్పులు పీహెచ్‌సీల్లో ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు 12 గంటలపాటు వైద్యులు అందుబాటులో ఉండాలి. ఉదయం 8 గంటలకు వచ్చిన వైద్యుడు మధ్యాహ్నం 2 వరకు, మధ్యాహ్నం 2 గంటలకు వచ్చిన డాక్టరు రాత్రి 8 గంటల వరకు పనిచేయాలి. ఆ తర్వాత ఎవరైనా అవసరం ఉండి వైద్యానికి రావాలనుకుంటే ఆన్‌కాల్ అంటే ఫోన్ చేస్తే వైద్యం చేయడానికి డాక్టరు విధిగా రావాల్సిందే. ప్రస్తుతం ప్రతి పీహెచ్సీలోను ఒక వైద్యుడు వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,149 పీహెచ్‌సీలు ఉండగా, కొత్తగా 179 ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రతి మండలంలో 2 వంతున మొత్తం 1,328 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉంటాయి. ఇప్పటికే 85 శాతం పీహెచ్‌సీల్లో ఇద్దరు వైద్యుల నియామకం పూర్తయింది. 2019 తర్వాత భారీసంఖ్యలో వైద్యులను నియమించారు. రోగ నిర్ధారణ పరీక్షల విషయంలోను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గతంలో మెడాల్ వంటి సంస్థలు ల్యాబ్టెస్టులు చేసేవి. ఇప్పుడు పీహెచ్‌సీలోనే 14 రకాల నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రతి పీహెచ్సీలో ల్యాబ్‌టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పక్కాగా ఉంటున్నారు. అప్పట్లో చాలాచోట్ల ఒకరు, కొన్నిచోట్ల ఇద్దరు స్టాఫ్‌నర్సులు ఉండేవారు. ఇప్పుడు ప్రతి పీహెచ్సీలో ముగ్గురు స్టాఫ్‌నర్సులను ఏర్పాటు చేశారు. ఇద్దరు డాక్టర్లు వచ్చాక బాగా మార్పు ఇద్దరు వైద్యులను నియమించాక పేషెంట్లలో ధైర్యం వచ్చింది. ఎప్పుడు ఆస్పత్రికి వెళ్లినా డాక్టరు ఉంటారనేది వాళ్ల నమ్మకం. ప్రస్తుతం ఒక డాక్టరు వ్యాక్సిన్ ప్రక్రియలో ఉన్నారు. వచ్చాక షిఫ్ట్ పద్ధతిలో పనిచేస్తాం. - డాక్టర్ ప్రశాంత్, మెడికల్ ఆఫీసర్, నెల్లిమర్ల పీహెచ్సీ, విజయనగరం జిల్లా ఇప్పుడు ప్రసవాలూ చేస్తున్నాం ఇద్దరు వైద్యులు వచ్చాక ఇప్పుడు ప్రసవాలు కూడా చేస్తున్నాం. ముగ్గురు స్టాఫ్ నర్సులను ఇచ్చారు. ఒక డాక్టరు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకుంటాం. నెలకు కనీసం 5 సాధారణ ప్రసవాలు చేస్తున్నాం. కోవిడ్ దృష్ట్యా కొద్దిగా ఓపీ తగ్గింది కానీ.. సాధారణ పరిస్థితుల్లో బాగా రోగులు వస్తారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో బాగా మార్పు వచ్చింది. మందుల కొరత లేకుండా చేశారు. - డాక్టర్ ప్రతిమ, మెడికల్ ఆఫీసర్, వెనిగండ్ల పీహెచ్సీ, గుంటూరు జిల్లా కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కొన్ని పీహెచ్‌సీల్లో మాత్రమే ఇద్దరు వైద్యులు లేరు. వాటిలో ఉన్న రెండో వైద్యుడి ఖాళీతో పాటు కొత్తగా వచ్చే 179 పీహెచ్‌సీలకు వైద్యుల నియామకానికి ఆర్థికశాఖ ఆమోదానికి పంపించాం. ఆమోదం రాగానే వాటిలో కూడా వైద్యుల భర్తీ జరుగుతుంది. ఇద్దరు వైద్యులు, ముగ్గురు నర్సులు వచ్చాక పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యం అందుతోంది. - డాక్టర్ గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు ప్రతి మండలంలో 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఒక్కోదాన్లో ఇద్దరు వైద్యులు. మండలానికి ఒక 104 వాహనం. అందులో ఒక వైద్యుడు. వెరసి ఐదుగురు వైద్యులు మండల ప్రజలకు వైద్యసేవలు అందించనున్నారు. ఇక ప్రతి గ్రామంలోను వైఎస్సార్ హెల్త్‌క్లినిక్ అందుబాటులో ఉంటుంది. -
Andhra Pradesh: ఆరోగ్య శాఖలో మరో 7,000 పోస్టుల భర్తీ!
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను బలోపేతం చేయడంలో భాగంగా మరో 7,000 పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌లో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవల్ హెల్త్‌ప్రొవైడర్స్) నియామకాలు చేపట్టనున్నారు. ఇప్పటికే 2,920 మంది నియామకాలు పూర్తి కాగా జాతీయ ఆరోగ్యమిషన్ నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్ ఇచ్చి మెరిట్ ప్రాతిపదికన మిగతా నియామకాలు చేపట్టనున్నారు. తద్వారా ఇకపై ప్రతి కేంద్రంలో ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు ఉంటారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలు అందుతాయి. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆరోగ్యశాఖ గత రెండేళ్లుగా 9,500కిపైగా శాశ్వత నియామకాలు చేపట్టింది. ఇప్పటికే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు చొప్పున ఉండేలా నియామకాలు పూర్తి చేశారు. వేలాది మంది స్టాఫ్ నర్సులను నియమించారు. గత ఏడాది ఎంఎల్‌హెచ్‌పీల నియామకం ఇలా జిల్లా సంఖ్య శ్రీకాకుళం 173 విజయనగరం 187 విశాఖపట్నం 247 తూ.గోదావరి 274 ప.గోదావరి 248 కష్ణా 237 గుంటూరు 284 ప్రకాశం 204 నెల్లూరు 166 చిత్తూరు 268 కడప 172 అనంతపురం 241 కర్నూలు 219 ప్రతి క్లినిక్‌లో సిబ్బంది, మందులు ‘ఈ ఏడాది చివరి నాటికి 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌లో ప్రతి కేంద్రంలో ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎఎన్‌ఎం ఉండేలా చర్యలు చేపడతాం. ప్రతి క్లినిక్‌లో మందులు అందుబాబులో ఉంటాయి. ప్రాథమిక వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. త్వరలోనే నియామకాల ప్రక్రియ చేపడతాం’ –కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌లో 12 రకాల సేవలు ఇవీ.. గర్భిణులు, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణ నవజాత, ఏడాది లోపు శిశువుల సంరక్షణ ఐదేళ్ల లోపు చిన్నారులతో పాటు యుక్తవయసు వారికి ఆరోగ్య సేవలు కుటుంబ నియంత్రణ, బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం ఉండేలా ఆయా పద్ధతులపై అవగాహన సాంక్రమిక వ్యాధులపై అవగాహన సాధారణ జ్వరాలు, తదితరాలపై ప్రజలకు వైద్య సేవలు మధుమేహం, బీపీ లాంటివి ప్రాథమిక దశలో గుర్తించేలా స్క్రీనింగ్ కన్ను, చెవి ముక్కు గొంతుæ సమస్యలు గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం దంత సమస్యలకు సేవలు అందించడం 60 ఏళ్లు దాటిన వారికి పాలియేటివ్ కేర్ (నొప్పి నివారణ) మందులు ఇవ్వడం అత్యవసర చికిత్సల్లో భాగంగా మెడికల్ కేర్‌పై జాగ్రత్తలు మానసిక జబ్బు లక్షణాలుంటే గుర్తించి పీహెచ్సీ, సీహెచ్‌సీలకు రిఫర్ చేయడం -
తెలంగాణలో కొత్తగా 3,982 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులో కొద్దిగా తగ్గుముఖం పట్టాయని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మంగళవారం పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,982 కరోనా కేసులు నమోదైనట్టు వెల్లడించారు. వైరస్ బారినపడి 27 మంది మృతి చెందారని తెలిపారు. కరోనా కట్టడికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 40 శాతం ఇతరరాష్ట్రాల వారికి వైద్యం అందుతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ ఉన్నాయని చెప్పారు. బ్లాక్ ఫంగస్ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయని శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. -
కోవాగ్జిన్ రెండో డోసుపై ప్రభుత్వం కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కోవాగ్జిన్ రెండో డోసు వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ నిలిపి వేయగా.. కేంద్రం నుంచి సరఫరా లేకపోవడంతో వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తదుపరి వ్యాక్సినేషన్ తేదీలు త్వరలోనే ప్రకటిస్తామన్న ఆరోగ్యశాఖ వెల్లడించింది. ( చదవండి: కరోనాకు ధైర్యమే మందు అంటూ... ) -
వారి అంత్యక్రియలకు రూ.15 వేలు.. ఏపీ సర్కారు ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా మృతుల అంత్యక్రియలకు సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021-22 ఏడాదికి గాను కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా నియంత్రణ, సహాయ చర్యలకు కేటాయించిన నిధుల నుంచి ఈ ఆర్థికసాయం అందజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్లకు విడుదల చేస్తారని వివరించారు. ( చదవండి: విడిపించేందుకు వెళ్లి.. ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు ) -
ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం.. 150 జిల్లాల్లో లాక్డౌన్?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 150 జిల్లాల్లో కోవిడ్–19 పాజిటివిటీ రేటు 15 శాతం పైగా ఉంది. దీంతో ఆ జిల్లాల్లో వైద్య సౌకర్యాలు సరిపోవడం లేదు. ఆరోగ్య వ్యవస్థ కుప్ప కూలిపోయే ప్రమాదంలో ఉంది. దీంతో ఈ 150 జిలాల్లో కఠినంగా లాక్డౌన్ అమలు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపై మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లాక్‌డౌన్‌ను సిఫారసు చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యాక్టివ్ కేసులను, పాజిటివిటీ రేటును యుద్ధప్రాతిపదికన నియంత్రించడం అవసరమని, లేకపోతే ఆరోగ్య వ్యవస్థపై భారం పెరుగుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే లాక్‌డౌన్‌కు సంబంధించి రాష్ట్రాలను సంప్రదించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 5న తొలిసారిగా భారత్‌లో రోజుకి లక్ష కేసులు దాటాయి. ఆ తర్వాత 10 రోజులకే ఏప్రిల్ 15న 2 లక్షలు కేసులు దాటడం చూశాం. ఇక ఏప్రిల్ 22న మొట్ట మొదటిసారి 3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అప్పట్నుంచి కేసుల సంఖ్య అలా అలా పెరిగిపోతూనే ఉంది. గత వారం రోజులుగా దేశంలో 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఛత్తీస్‌గఢ్, పంజాబ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి అత్యధిక కేసులు వస్తున్నాయి. మంగళవారం నమోదైన మొత్తం కొత్త కేసుల్లో 10 రాష్ట్రాల్లోనే 73.59 శాతం వచ్చాయి. పుణే, ముంబై, థానే, బెంగుళూరు అర్బన్, ఢిల్లీ, రాయ్‌పూర్, నాసిక్, దుర్గ్, ఔరంగాబాద్ జిల్లాల్లో అత్యధికంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. చదవండి: (కరోనా ఇండియన్ స్ట్రెయిన్ చాలా ఫాస్ట్!) ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు కఠినంగానే అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో లాక్డౌన్ మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్టుగా ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. మే 1 వరకు అమల్లో ఉండే లాక్డౌన్ మే 15 వరకు కొనసాగుతుంది. మరోవైపు కొద్దిరోజుల కిందట దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ లాక్డౌన్ అనేది ఆఖరి అస్త్రం కావాలని, అంతదాకా పరిస్థితులు రానివొవ్వద్దని పేర్కొన్నారు. ప్రజలందరూ కోవిడ్ ప్రొటోకాల్‌కు కచ్చితంగా పాటించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మైక్రో కంటైన్మెంట్కే ప్రాధాన్యమిస్తోందనేది ప్రధాని మాటలను బట్టి స్పష్టమైంది. మరి ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ ప్రతిపాదనపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. గోవాలో 4 రోజులు.. గోవాలో ఒకే రోజు కరోనా కేసులు 2 వేలు దాటిపోవడంతో ఆ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బుధవారం ప్రకటించారు. ఏప్రిల్ 29 నుంచి మే 3 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉంటుంది. అత్యవసర సర్వీసులు, పరిశ్రమలకు లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. ప్రజా రవాణాకు మాత్రం అనుమతి లేదు. -
వైద్యారోగ్యశాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్యశాఖకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు (కేసీఆర్) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దేశంలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని అప్డేట్గా ఉండేలా చూసుకోవాలని సీఎం పేర్కొన్నారు. గాంధీ, టిమ్స్ ఆస్పత్రుల్లో ఫైరింజన్లు పెట్టాలని ఆయన సూచించారు. యుద్ధ విమానాలను ఉపయోగించి తీసుకువస్తున్న ఆక్సిజన్‌ను ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు అందేలా సమన్వయం చేసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కరోనా టెస్టు కిట్స్ కొరత లేకుండా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి లేఖ రాయాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు సూచించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న అందరికీ కిట్స్ అందించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. ప్రజలు కూడా కరోనా నియంత్రణలో పూర్తి సహకారం అందించాలని ప్రజలకు మంత్రి ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. చదవండి: కరోనా రోగులు ఏ మందులు వాడాలో తెలుసా? కరోనా: ఎలాంటి మాస్క్ ధరించాలి? ఏది బెస్ట్? -
కరోనా సెకండ్ వేవ్: రానున్న మూడు నెలలూ గడ్డురోజులే!
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభణ నేపథ్యంలో మరో మూడు నెలల పాటు గడ్డు రోజులే ఉంటాయని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. గతేడాది కంటే ఈసారి మూడింతల కేసులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తీవ్రంగా కేసులు పెరుగుతాయని, గతేడాది ఆయా నెలలతో పోలిస్తే అవి మూడింతలు ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమావేశమై పరిస్థితిని అంచనా వేశారు. వైరస్ వ్యాప్తి, విస్తరణ తీవ్రత ఊహకు అందని విధంగా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు మొత్తం యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. కరోనా వ్యాక్సినేషన్‌ను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. టెస్టింగ్, ట్రాకింగ్ చేయడంతోపాటు హోం ట్రీట్మెంట్ కిట్లను పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. టెస్టులు, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రాంతాల వారీగా చేపట్టాలని, కోవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించాలని, అన్ని ఆసుపత్రులను కోవిడ్ చికిత్స కోసం సిద్దం చేయాలని పేర్కొన్నారు. అలాగే ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించేలా, మాస్క్‌లు ధరించేలా చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు. మరోవైపు 15 లక్షల హోం ఐసోలేషన్ కిట్లను సిద్దం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ)ని ప్రభుత్వం ఆదేశించింది. తొలుత సగం, తర్వాత సగం సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఇప్పటివరకు 4 లక్షల కిట్లు సిద్ధమైనట్లు సమాచారం. ప్రైవేట్‌లో 50 శాతం పడకలు కరోనాకే... ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 50 శాతం పడకలను కరోనా చికిత్సల కోసం కేటాయించాలని వైద్య, ఆరోగ్యశాఖ కోరింది. ప్రస్తుతం ఆయా ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలకు 20 శాతం, ఇతర సాధారణ చికిత్సలకు 80 శాతం పడకలు కేటాయించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ కోసం వేచి ఉండాల్సి వస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల సంఘాల ప్రతినిధులతో ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు భేటీ అయ్యారు. కనీసం సగం పడకలను కరోనా రోగులకు, మిగిలిన సగం సాధారణ వైద్య సేవలకు కేటాయించాలని సూచించారు. ఎలెక్టివ్ సర్జరీలను కనీసం మరో 3 నెలల పాటు వాయిదా వేసుకోవాలన్నారు. ఆసుపత్రిలో చేరిక అవసరమని కచ్చితంగా భావిస్తేనే పడక కేటాయించాలని స్పష్టంచేశారు. ఐసోలేషన్‌లో ఉండాల్సిన రోగులకు గతంలో మాదిరిగా కొన్ని ఎంపిక చేసిన హోటళ్లలో గదులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కరోనా బాధితుల చికిత్సలకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులనే వసూలు చేయాలని తేల్చిచెప్పారు. 20 పడకలున్న చిన్నపాటి ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలను ప్రారంభించుకోవచ్చని ఆయన తెలిపారు. చదవండి: కరోనా వ్యాప్తి: స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ బంద్ -
రికార్డులన్నీ బెడ్‌రూంకే.. ఆరోగ్య శాఖలో కామ‘రాజు’
ఆడదంటే అతడి దృష్టిలో ఆటబొమ్మ. చీర చెంగు కనిపిస్తే చాలు కామంతో బుసలు కొట్టేస్తాడు. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉద్యోగినులను వేధింపులకు గురి చేస్తాడు. తాను చెప్పినట్లు వినకపోతే విధుల పరంగా ఇబ్బందులకు గురి చేస్తాడు. అతని వేధింపులు తారస్థాయికి చేరుకోవడంతో భరించలేని మహిళా ఉద్యోగులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం శూన్యం. యూనియన్ను అడ్డుపెట్టుకుని జిల్లా ఉన్నతాధికారులను సైతం బ్లాక్మెయిల్ చేసి తన పబ్బం గడుపుకుంటూ వస్తున్నాడు. దీంతో ఇక తాము విధులు నిర్వర్తించలేమంటూ ఉద్యోగినులు గగ్గోలు పెడుతున్నారు. ఇదీ ఆరోగ్యశాఖలో ఓ కామరాజు లీలలు. గార్లదిన్నె: స్థానిక పీహెచ్సీలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ) నిర్వాకంతో ఉద్యోగినులు అభద్రతా భావంలో కూరుకుపోయారు. తెలుగునాడు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నేతగా ఉంటూ వచ్చిన అతను జిల్లా ఉన్నతాధికారులను సైతం తన చెప్పుచేతుల్లో ఉంచుకుని ఉద్యోగినులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. అతని వేధింపులు తారస్థాయికి చేరుకోవడంతో భరించలేక ఈ నెల 15న మెడికల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల సమాచారం మేరకు... రికార్డులన్నీ బెడ్‌రూంకే.. విధుల నిర్వహణలో భాగంగా సీహెచ్ఓ క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజలకు అందుతున్న వైద్యసేవలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. వైద్య సేవలకు సంబంధించిన రికార్డులను ఏఎన్ఎంలు నిర్వహిస్తూ ఉంటారు. దీనిని అలుసుగా తీసుకున్న గార్లదిన్నె సీహెచ్ఓ.. ఏఎన్ఎంల్లోని అభద్రతా భావాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. వారిని ఏకవచనంతో పిలుస్తూ వెకిలి చేష్టలతో విసిగిస్తున్నాడు. తన మాట వినకపోతే బూతులతో విరుచుకుపడతాడు. రికార్డుల నిర్వహణ సరిగా లేదని, జిల్లా కేంద్రంలోని తన బెడ్ రూంకు వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానంటూ వేధిస్తున్నాడు. తన మాట వినకపోతే ఉద్యోగం లేకుండా చేస్తానని బ్లాక్మెయిల్ చే స్తున్నాడు. దీంతో విసుగు చెందిన పలువురు ఏఎన్ఎంలు ఈ నెల 15న స్థానిక మెడికల్ ఆఫీసర్‌కు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని మెయిల్ ద్వారా డీఎంహెచ్ఓ దృష్టికి మెడికల్ ఆఫీసర్ తీసుకెళ్లారు. ఉన్నతాధికారి అండ? యూనియన్ నాయకుడిగా ఉంటున్న సదరు సీహెచ్ఓ.. చివరకు జిల్లాస్థాయి ఉన్నతాధికారులను సైతం తన చెప్పుచేతల్లో ఉంచుకున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో బుక్కరాయసముద్రం మండలంలో పనిచేసే సమయంలోనూ అక్కడి ఉద్యోగినులను వేధించినట్లు ఆరోపణలున్నాయి. బెళుగుప్ప మండలంలో పనిచేస్తున్న సమయంలో ఏకంగా దళిత ఉద్యోగులను వేధించినట్లు సమాచారం. ఉద్యోగోన్నతిపై నెల్లూరుకు వెళ్లి అక్కడ నుంచి పామిడికి వచ్చారు. అక్కడ కూడా ఆయనపై పలు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం గార్లదిన్నె పీహెచ్సీలో పని చేస్తున్నాడు. తనపై ఎవరు ఫిర్యాదు చేసినా.. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా వారిని సైతం బ్లాక్మెయిల్ చేసి పబ్బం గడుపుకుంటూ వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా గార్లదిన్నె మెడికల్ ఆఫీసర్ సిఫారసు మేరకు జిల్లా కేంద్రంలోని 108 కాల్ సెంటర్‌కు డిప్యూటేషన్‌పై పంపినట్లు సమాచారం. ఉద్యోగినులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న కామాంధుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, అతన్ని కాపాడే యత్నం చేయడం పలు విమర్శలకు దారి తీస్తోంది. హెల్త్ డైరెక్టర్ దృష్టికి సమస్య తమ పట్ల సీహెచ్ఓ చేస్తున్న లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసినా.. డీఎంహెచ్ఓ స్పందించకపోవడంతో ఏఎన్ఎంలు సమస్యను విజయవాడలోని హెల్త్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హెల్త్ డైరెక్టర్.. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాంటూ డీఎంహెచ్ఓను ఆదేశించినట్లు తెలిసింది. అయితే దీనిపై ఎలాంటి విచారణ చేయకుండా సదరు సీహెచ్‌ఓను డిప్యూటేషన్‌పై బదిలీ చేయడంపై బాధిత ఏఎన్ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమే గార్లదిన్నె మండలంలో పనిచేస్తున్న సీహెచ్ఓ తమను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నట్లు ఏఎన్ఎంలు ఫిర్యాదు చేసింది వాస్తవమే. దీనిపై ఈనెల 15న రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మరుసటి రోజు కాపీని డీఎంహెచ్ఓ కార్యాలయానికి మెయిల్ చేశా. తదుపరి ఆదేశాలు వస్తే విచారణ జరిపి వాస్తవాలు నిగ్గుతేల్చాల్సి ఉంటుంది. -డాక్టర్ షమీమ్ తాజ్, గార్లదిన్నె పీహెచ్సీ చదవండి: మహిళలే టార్గెట్: పరిచయాలు పెంచుకుని.. -
మళ్లీ లాక్డౌన్ ఉండదు.. అయితే..
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కరోనా కేసులు అధికం అవుతున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి విజయభాస్కర్ అన్నారు. గత ఏడాది వంటి భీతావహ పరిస్థితులు, సెకెండ్ వేవ్ లేనందున మళ్లీ సంపూర్ణ లాక్డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరగడం, లాక్డౌన్ విధింపు ఖాయమని జరుగుతున్న ప్రచారంపై శుక్రవారం ఆయన మీడియా ముందు స్పందించారు. కరోనా ప్రబలకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా విద్యాసంస్థలను మూసివేసింది. జన సంచారాన్ని కూడా అదుపుచేయడం అవసరం. కరోనాకు సరైన మందులేకపోవడంతో సంపూర్ణ లాక్డౌన్ అనివార్యమైంది. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినందున లాక్డౌన్ అవసరం లేదు. అయితే ప్రజలు మాస్క్ ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించకపోవడం బాధాకరం. ఎన్నికల ప్రచారంలో మాస్క్‌పై కూడా హెచ్చరిస్తున్నాను. కరో నా నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు. 5వేల వ్యాక్సిన్ కేంద్రాలు సిద్ధం.. 45 ఏళ్లకు పైబడిన వారందరికీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 5వేల కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసామని తెలిపారు. మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నా ప్రజల సహ కారం మరింత అవసరం. మహారాష్ట్రలో కరోనా కేసుల పెరుగుదల వేగంగా ఉంది. తమిళనాడులో అంతటి వేగం లేకున్నా అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు వహించడం తప్పనిసరి. మాస్క్ ధరించకుండా ప్రజా బాహుళ్యంలోకి వెళ్లడం వల్లనే వైరస్ ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తోంది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉన్నా అదృష్టవశాత్తు ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. తొలి దశలో 60 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సిన్ పరిమితం చేసినా ఆ ఆంక్షలు సడలించి బీపీ, షుగర్ అనారోగ్య సమస్యలున్న 45 ఏళ్లు దాటినవారికి వేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే ఎలాంటి రుగ్మతలు లేకున్నా 45 ఏళ్లు దాటితే చాలు ఈనెల 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. కరోనా లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించు కోవడంతోపాటు వ్యాక్సిన్ వేసుకుంటేనే వైరస్‌ను అదుపుచేయగలం. ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ప్రయివేటు ఆస్పత్రులు, మండల కార్యాలయాల్లో మొత్తం 5వేల వ్యాక్సిన్ కేంద్రాలను సిద్ధం చేసాం. కరోనా ఆంక్షలు పాటించని 61,246 మంది నుంచి మార్చి 16వ తేదీ మొదలు శుక్రవారం వరకు 1.31 కోట్ల జరిమానా వసూలు చేశాం. కరోనా కేసులు మళ్లీ పెరగడానికి ప్రజలు మాస్కులు ధరించక పోవడమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల అయోమయం.. కరోనా వైరస్ మళ్లీ ప్రబలడం విద్యార్థుల తల్లిదండ్రులను అయోమయంలో పడేసింది. 2021–22 విద్యా సంవత్సరంలో బడులు, కాలేజీలు యథాప్రకారం పనిచేస్తాయా లేదా అనేది స్పష్టం కాలేదు. తెరిచిన విద్యాసంస్థలను ఇటీవల మూసివేసారు. మరి ఈ తరుణంలో ఫీజలు కట్టడమా, మానడమా అనే సందేహంతో సతమతం అవుతున్నారు. గత ఏడాది పరిస్థితి పునరావృతమైతే ఫీజుల రూపంలో వేలాది రూపాయలను నష్టపోవాల్సి వస్తుందని వెనకడుగు వేస్తున్నారు. -
తెలంగాణలో చాప కింద నీరులా కరోనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇటు దేశంలో కరోనా ఉధృతి అధికమైంది. అటు పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో మహమ్మారి విజృంభిస్తోంది. ప్రజల్లో నిర్లక్ష్యం ఫలితంగా తెలంగాణలోనూ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో ఆరు రోజుల వ్యవధితో పోలిస్తే ఇప్పుడు 26 జిల్లాల్లో కేసులు పెరిగాయి. కొన్నిచోట్ల స్వల్పంగా, కొన్నిచోట్ల కాస్తంత ఎక్కువగానే నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో ఈ నెల 8వ తేదీన 31 కరోనా కేసులుండగా, శనివారం 46 నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 8వ తేదీన 10 కేసులుంటే, శనివారం 15 కేసులకు పెరిగాయి. కాగా శనివారం 50,998 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 228 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు ఆదివారం ఉదయం బులెటిన్‌లో వెల్లడించారు. మొత్తం ఇప్పటివరకు 92,00,465 నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 3,01,161 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో శనివారం 152 మంది కోలుకోగా, ఇప్పటివరకు 2,97,515 మంది కోలుకున్నారు. ఈ ఒక్కరోజులో ఒకరు చనిపోగా, మొత్తం కరోనాతో 1,653 మంది మృతి చెందారు. 367 మంది వెంటిలేటర్‌పై.. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 1,993 కరోనా యాక్టివ్ కేసులుండగా, అందులో ఇళ్లు, కోవిడ్ కేర్ కేంద్రాల్లో 795 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.78 శాతం ఉండగా, మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. ఇప్పటివరకు ప్రతీ పది లక్షల జనాభాలో 2,47,191 మందికి పరీక్షలు చేశారు. శనివారం నిర్వహించిన 50,998 కరోనా పరీక్షల్లో 46,067 ప్రభుత్వంలో.. 4,931 ప్రైవేట్‌లో చేశారు. ఆదివారం లెక్కల ప్రకారం రాష్ట్రంలోని కరోనా రోగుల్లో 590 మంది ఆక్సిజన్ పడకలపై, 367 మంది వెంటిలేటర్/ఐసీయూ పడకలపై చికిత్స పొందుతున్నారు. 2.15 లక్షల మందికి వ్యాక్సిన్.. రాష్ట్రంలో శనివారం నాటికి 60 ఏళ్లు పైబడినవారు, 45–59 ఏళ్ల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కలసి మొత్తం 2,15,980 మంది టీకా వేయించుకున్నారని శ్రీనివాసరావు వెల్లడించారు. ఇక జనవరి 16వ తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొదటి డోస్ టీకా తీసుకున్నవారు 5,27,117 మంది కాగా, రెండో డోస్ టీకా తీసుకున్నవారు 2,22,080 మంది ఉన్నారు. అంటే మొత్తం మొదటి, రెండో డోస్ టీకాల సంఖ్య 7,49,197కు చేరింది. ఇక శనివారం 60 ఏళ్లు పైబడిన 10,539 మందికి, 45–59 ఏళ్ల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో 7,793 మందికి మొదటి డోస్ టీకా ఇచ్చారు. ఇటు 753 మంది వైద్య సిబ్బంది, 474 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కూడా శనివారం మొదటి డోస్ టీకా ఇచ్చారు. అలాగే ఈ ఒక్కరోజులో 165 మంది వైద్య సిబ్బందికి, 2,693 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రెండో డోస్ టీకా వేశారు. ఇలా ఒక్కరోజులో మొదటి, రెండో డోస్ టీకా పొందినవారు 22,417 మంది ఉన్నారు.