Nagam Janardhan Reddy
-
హైదరాబాద్ : కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన నాగం, విష్ణువర్ధన్ రెడ్డి (ఫొటోలు)
-
కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన నాగం జనార్ధన్‌రెడ్డి
-
కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన నాగం, విష్ణువర్ధన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి మంగళవారం బీఆర్ఎస్లో చేశారు. హైదరాబాద్‌లో తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నాగం జనార్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిని హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి తోడుగా రావాలని కోరినట్లు పేర్కొన్నారు. విష్ణురెడ్డి భవిష్యత్తుపై తాను భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. నాగం జనార్ధన్ రెడ్డి నేను అనేక పోరాటాలు చేశామని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో పాత, కొత్త నేతలు అందరూ కలిసి పనిచేశాలని పిలుపునిచ్చారు. ఈసారి పాలమూరులో 14కు 14సీట్లు గెలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని సీఎం తెలిపారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారన్న కేసీఆర్.. మరోసారి బీఆర్ఎస్ను గెలిపించి ఇలాంటి శక్తులకు బుద్ది చెప్పాలని అన్నారు. చదవండి: ‘ఇంకా ఆధారాలు కావాలా?’.. ఎంపీ దాడిపై కేటీఆర్ ట్వీట్ -
కాంగ్రెస్ కు రాజీనామా...బీఆర్ఎస్ లో చేరనున్న నాగం జనార్ధన్ రెడ్డి
-
గులాబీ గూటికి నాగం
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, నాగర్‌కర్నూల్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్నారు. ఆదివారం రాత్రి ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో నాగం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ నెల 31న మంగళవారం ఉదయం 11 గంటలకు కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ వేదికగా తన అనుచరులతో కలసి నాగం గులాబీ కండువా కప్పుకోనున్నారు. కేటీఆర్, హరీశ్ ఆహ్వానించడంతో.. నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ అవకాశం దక్కకపోవడంతో ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఇతర నేతలతో కలిసి హైదరాబాద్‌లోని నాగం నివాసానికి వెళ్లారు. బీఆర్ఎస్లోకి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. తర్వాత నాగం జనార్దన్‌రెడ్డి ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. నాగం సీనియారిటీని గౌరవించి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ భరోసా ఇవ్వడంతో బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లో డబ్బులున్న వారికే టికెట్లు: నాగం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను ఎంతో బాధకు గురిచేశాయని.. అధ్వాన స్థితికి చేరిన కాంగ్రెస్‌కు అధికారం దక్కదని నాగం జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఉదయం పార్టీలో చేరిన వారికి సాయంత్రం టికెట్ ఇచ్చారు. సునీల్ కనుగోలు సర్వే ఆధారంగా టికెట్లు ఇచ్చామని రేవంత్ చెప్తున్నారు. పార్టీ జెండా పట్టుకున్న వారికి కాకుండా అవతలి పార్టీలో డబ్బులున్న వారిని పిలిచి టికెట్ ఇస్తున్నారు. నాగర్ కర్నూల్ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కార్యకర్తల ముందుకు వచ్చా. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలసి బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం..’’ అని పేర్కొన్నారు. సముచిత స్థానం ఇస్తాం: కేటీఆర్ ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘సీఎం కేసీఆర్‌కు నాగం జనార్దన్‌రెడ్డి సన్నిహిత మిత్రుడు. తెలంగాణ కోసం గతంలో జైలుకు వెళ్లిన వ్యక్తి. నాగంతోపాటు ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు బీఆర్ఎస్లో సముచిత స్థానం ఇస్తాం. భవిష్యత్తులో కలసి ముందుకు సాగుతాం..’’ అని చెప్పారు. ఇక సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాగం జనార్దన్‌రెడ్డితో కలసి పనిచేసేందుకు తాను సిద్ధమని, ఆయన అడుగు జాడల్లో నడుస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్లోకి విష్ణు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ఆశించి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి కూడా బీఆర్ఎస్లో చేరికకు రంగం సిద్ధమైంది. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఆదివారం విష్ణుతోనూ మంతనాలు జరిపారు. తర్వాత ప్రగతిభవన్‌కు తోడ్కొని వెళ్లి సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సీఎంతో చర్చించిన తర్వాత తాను బీఆర్ఎస్లో చేరుతున్నట్టు విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. గులాబీ తీర్థం పుచ్చుకున్న పి.చంద్రశేఖర్, ఎర్ర శేఖర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ తెలంగాణభవన్‌లో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. జడ్చర్ల కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరి చేరికతో మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ మరింత బలోపేతమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ కీలక నేతతోనూ బీఆర్ఎస్ మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆ నేత ఒకటి రెండు రోజుల్లో బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. -
‘పారాచూట్‌లా వచ్చి కాంగ్రెస్‌లో చేరాడు, అప్పుడు నాకు అన్యాయం జరగలేదా?’
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్సీ పదవి వదులుకుంటానని కూచకుళ్ళ దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన కూచుకుళ్ల ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. పార్టీ పరంగా సముచిత స్థానం కల్పించినప్పటికీ.. స్థానికంగా ఉండే సమస్యలను పట్టించుకోవడంతోనే బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు కూచుకున్న ప్రకటించారు. మరోవైపు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే కాంగ్రెస్ నాగర్ కర్నూల్ టికెట్ ఖరారు చేయడంతో నాగం జనార్ధన్ రెడ్డి హస్తం పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూచుకుళ్ల ఆదివారం మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్లో గెలుపు సర్వే ఆధారంగానే కాంగ్రెస్ టికెట్ తన కుమారుడు రాజేష్ రెడ్డికి ఇచ్చారని తెలిపారు. 1998-2018 వరకు 20 ఏళ్లపాటు తాను కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీ కోసం కష్టపడ్డానని తెలిపారు. 2018లో అధికారం కోసం ఆశపడి పారాచూట్‌లా వచ్చి కాంగ్రెస్‌లో చేరాడని నాగంను ఉద్ధేశించి విమర్శలు గుప్పించారు. ఆ రోజు తనకు అన్యాయం జరగలేదా అని ప్రశ్నించారు. నాగం నడవలేడు, మెట్ల ఎక్కలేడ కానీటికెట్ కావాలని పట్టుబట్టాడని మండిపడ్డారు. నిన్నటి వరకు నాగం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్, కేటీఆర్, ప్రాజెక్టులపై కేసులు వేశాడని, ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నిత్యం తిట్టిన పార్టీలోనే నేడు చేరుతున్నాడని విమర్శించారు. -
నాగం ఇంటికి మంత్రులు కేటీఆర్, హరీష్.. త్వరలోనే బీఆర్ఎస్లోకి
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కలిశారు. కాంగ్రెస్ పార్టీ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన్ను బీఆర్ఎస్లోకి ఆహ్వానించేందుకు గచ్చిబౌలిలోని నాగం నివాసం వద్దకు వెళ్లారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మంత్రుల వెంట పలువురు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. కాగా నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆదివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సీనియర్ నేతగా పేరున్న ఆయనకు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో పార్టీ పెద్దల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరుల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఆదివారం తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీలో జరిగిన అవమానాలను, కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలను ఈ లేఖ ద్వారా తన అనుచరులకు, ప్రజలకు వివరించారు. త్వరలోనే బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రులు ఆయన్ను కలవడం ఆసక్తికరంగా మారింది. -
కాంగ్రెస్‌కు మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా
హైదరాబాద్: కాంగ్రెస్‌కు మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం బీఆర్ఎస్లో చేరనున్నారని సమాచారం. నాగం జనార్ధన్ రెడ్డిని మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 5:00 గంటలకు నాగం నివాసానికి మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డికి నిరాశ ఎదురవ్వడంతో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో పార్టీ పెద్దల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏళ్లుగా కష్టపడుతున్నవారిని మోసం చేసి, అవసరం కోసం పార్టీలో చేరిన పారాచూట్ నేతలకే టికెట్లు ఇచ్చిందని నాగం జనార్దన్‌రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నాశనం చేశారన్నారు. ఇదీ చదవండి: వివేక్‌తో రేవంత్‌రెడ్డి భేటీ -
కాంగ్రెస్‌ను వీడనున్న నాగం జనార్దన్‌రెడ్డి?
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో పార్టీ పెద్దల తీరుపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఆదివారం సాయంత్రం నాగం ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు సమాచారం. కాగా, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏళ్లుగా కష్టపడుతున్నవారిని మోసం చేసి, అవసరం కోసం పార్టీలో చేరిన పారాచూట్ నేతలకే టికెట్లు ఇచ్చిందని మాజీమంత్రి, పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నాశనం చేశారన్నారు. తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం కూడా చెప్పలేదని విచారం వ్యక్తం చేశారు. 2018 నుంచి నాగర్‌కర్నూల్‌లో పార్టీ బలోపేతం కోసం అన్ని కార్యక్రమాలు చేపట్టానని, కానీ బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దామోదర్‌రెడ్డి కుమారుడికి పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పారు. బోగస్ సర్వేల పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు మోసం చేశారని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలెవరైనా తనను సంప్రదిస్తే, కార్యకర్తల నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని పేర్కొన్నారు. చదవండి: అధిష్ఠానం ఆదేశిస్తే అందుకు రెడీ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
TS Election 2023: కాంగ్రెస్‌లో కొత్తవారికి దక్కిన అవకాశం! తేలేదెవరో.. మునిగేదెవరో..?
సాక్షి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఆపార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్త నేతలు పార్టీని వీడేందుకు మొగ్గు చూపుతుండటం ఆ పార్టీ శ్రేణుల్లో కలవరం రేపుతోంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు గానూ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. అచ్చంపేట నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వంశీకృష్ణ బరిలో నిలువనుండగా, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ఇటీవల పార్టీలో చేరిన కొత్తవారికి అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ విషయంలో పార్టీ నిర్ణయం తీసుకోకపోతే వీడేందుకు సిద్ధమన్న సంకేతాలిచ్చారు. అధిష్టానంపై ధిక్కారస్వరం.. అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 58 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను వెలువరించింది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులకు ఈ జాబితాలో చోటు దక్కింది. పార్టీ అభ్యర్థులను ప్రకటించిన వెంటనే టికెట్ ఆశించిన సీనియర్ నేతలు తమ ధిక్కార స్వరాన్ని వినిపించారు. సోమవారం కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ వేదికగా మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, సీనియర్ నేత చింతలపల్లి జగదీశ్వరరావు పార్టీ అధిష్టానం తీరుపై మండిపడ్డారు. ఏళ్లుగా పార్టీ కోసం శ్రమించిన వారిని కాదని అవకాశవాదులకు టికెట్ ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో స్వతంత్రుడిగానైనా బరిలో ఉంటున్నానని ఆయన తేలి్చచెప్పారు. పార్టీ ప్రకటించినఅభ్యర్థితో కలిసేది లేదని తేల్చి చెప్పారు. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి సైతం పార్టీ వీడేందుకు సిద్ధమన్న సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిపై ఆయన నేరుగా విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో పోటీ విషయమై తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. మలివిడత జాబితాపై సస్పెన్స్.. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, వీటిలో కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి, షాద్‌నగర్‌లో కె.శంకరయ్యను అభ్యర్థులుగా ప్రకటించారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ టికెట్ కోసం పోటీ తీవ్రంగా కన్పిస్తోంది. ప్రధానంగా మక్తల్ నియోజకవర్గంలో వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డి తనయుడు సిద్దార్థరెడ్డి, నాగరాజుగౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడి నుంచి డీసీసీ మాజీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ సైతం టికెట్ కోరుతున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో అనిరుద్‌రెడ్డికి టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. దేవరకద్ర నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు జి.మధుసుదన్‌రెడ్డి, టీపీసీసీ నాయకుడు కాటం ప్రదీప్‌కుమార్ గౌడ్, కొండా ప్రశాంత్‌రెడ్డి మధ్య పోటీ నెలకొంది. నారాయణపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, కుంభం శివకుమార్‌రెడ్డి టికెట్ కోసం పోటీపడుతున్నారు. కాంగ్రెస్ ప్రకటించనున్న మలివిడత జాబితాలో అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాక ఆయా చోట్ల పరిస్థితి ఎలా ఉంటుందోనన్నది ఉత్కంఠగా మారింది. తేలేదెవరో.. మునిగేదెవరో.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి, సమయం మించిపోతున్న నేపథ్యంలో పలుచోట్ల కాంగ్రెస్ అభ్యర్థిత్వాలను ప్రకటించినా, టికెట్ ఆశించిన పెద్దనేతలు పార్టీని వీడుతుండటం హస్తం శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన సీనియర్ నేతలు చివరి నిమిషంలో తమ దారి తాము చూసుకుంటే ఎన్నికల్లో ఎవరికి నష్టం జరుగుతుందో, ఎవరికి మేలు జరుగుతుందోనన్న దిగులు నెలకొంది. ఫలించని పెద్దల బుజ్జగింపులు.. నాగర్‌కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా కూచకుళ్ల రాజేశ్‌రెడ్డిని ప్రకటించిన వెంటనే నాగం జనార్దన్‌రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, మాజీ మంత్రులు జానారెడ్డి, చిన్నారెడ్డితో కలసి సోమవారం హైదరాబాద్‌లోని నాగం ఇంటికి వెళ్లి చర్చించారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాం«దీతో పాటు ఇతర పెద్దల దృష్టికి తీసుకెళ్తామని అంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకొవద్దని చెప్పినట్లు తెలిసింది. అనంతరం సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ అధిష్టానం తీరుపై నాగం ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థిగా కూచుకుళ్ల కుటుంబానికి ఎలాంటి అర్హత లేదని, తనను ఓటు అడిగే హక్కు వారికి లేదని వ్యాఖ్యానించారు. Follow the Sakshi TV channel on WhatsApp: ఇవి చదవండి: 'సార్ వద్దు.. నన్ను అలా పిలువు! నా కోరిక తీర్చవా? అంటూ మహిళా ఉద్యోగితో.. -
నాగం జనార్ధన్ రెడ్డి పై వైఎస్ సీరియస్..!
-
కేసీఆర్‌పై నిఘా పెంచాలి: నాగం
కందనూలు: సీఎం కేసీఆర్‌పై నిఘా పె ట్టాలని, ఆయన విదేశాలకు పారిపోకుండా పాస్‌పోర్టును సీజ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అవినీతిపరులపై చర్యలు తీసుకోకుండా, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వారికే టికెట్లు కేటాయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ప్రభుత్వం రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడుతూ మాఫియాను పెంచి పోషించిందని ఆరోపించారు. పోరాటాలు చేసి సాధించుకున్న రాష్ట్రాన్ని దొంగలపాలు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో మార్కండేయ ప్రాజెక్టు పూర్తి చేస్తానని, లేకపోతే తనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తానన్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తనకు మద్దతుగా ప్రచారం చేస్తే కారులో డీజిల్ పోయించి.. ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తానని మర్రికి సూచించారు. -
TS: ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల సమయంలో మర్రి జనార్ధన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపిస్తూ నాగం జనార్ధన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నిక వివాదంపై సోమవారం తీర్పు వెల్లడించింది. 2018లో నాగం జనార్ధన్‌రెడ్డిపై మర్రి జనార్ధన్‌రెడ్డి విజయం సాధించారు. అయితే మర్రి జనార్ధన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ 2019లో నాగం జనార్ధన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్లో కొన్ని వివరాలు దాచి పెట్టారని ఆరోపిస్తూ.. మర్రి జనార్ధన్‌రెడ్డి ఎన్నిక రద్దు చేయాలని కోరారు. దీనిపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. పిటిషనర్ తన పిటిషన్లో ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు చూపలేదని హైకోర్టు పేర్కొంది. దీంతో మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నిక రద్దు చేయాలన్న నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. చదవండి: హైదరాబాద్‌లో మరో భారీ భూ వేలంపాట -
నాగర్ కర్నూల్: అభివృద్ధి మంత్రం ‘ఉత్త’ ముచ్చటేనా?
నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్దానం వచ్చే ఎన్నికల్లో చాలా కీలకంగా మారుతుంది. ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి ఉండటంతో కొంత రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుంది. గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన నాగం వచ్చే ఎన్నికల్లో గెలువాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. కానీ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో తిరిగి చేరుతుండటంతో కాంగ్రెస్ సీట్ల పంచాయితీ మొదలయ్యింది. దీంతో వచ్చే ఎన్నికలు ఇక్కడ పోటీ రసవత్తరంగా మారనుంది. జిల్లాను అభివృద్ధి చేసినా.. ఎమ్మెల్యేకు వ్యతిరేకత! 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పారిశ్రామికవేత్త మర్రి జనార్దన్‌రెడ్డి విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయన పోటీ ఖరారైంది. రీసెంట్గా విడుదల చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మర్రికి టికెట్ దక్కింది. కాగా మర్రి జనార్దన్‌రెడ్డి నియోజకవర్గంలో మొదటి నుంచి ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవకార్యక్రమాలు చేపట్టారు. వందలాది మంది నిరుపేదలకు సామూహిక వివాహాలు చేయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాగర్ కర్నూల్‌ను జిల్లాగా మార్చారు. జిల్లాకు మెడికల్ కళాశాల అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేయించి ప్రారంభించారు. సొంత నిధులతో మూడు ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేటు స్దాయిలో తీర్చిదిద్దారు. దీంతో అభివృద్ది విషయంలో మిగిలిన నియోజకవర్గాల కంటే ఎక్కువ నిధులు తీసుకురావటంలో సఫలీకృతులవుతున్నారు. నల్లమట్టి అక్రమ వ్యాపారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. నల్లమట్టిలో వందల కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గ్రామాల్లో తన అనుచరులు ముఖ్యులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్‌లో నిర్వాసితులకు సకాలంలో సరైన పరిహారం ఇవ్వలేదనే అసంతృప్తితో నిర్వాసితులు ఉన్నారు. మాదిగ సామాజిక ఓట్లు ఇక్కడ అధికంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వారి ప్రభావం ఉండనుంది. భూ నిర్వాసితుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడ తలనొప్పికానుంది. డబుల్బెడ్రూం ఇళ్లు, రుణమాఫి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. పైకి బాగానే ఉన్నా.. నేతల మధ్య అంతర్గత విభేధాలు ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మధ్య అంతర్గత విభేదాలు ఉండటంతో ఆయన పార్టీని వీడుతుండటం కొంతమైనస్గా మారే ప్రమాదం ఉంది. నియోజకవర్గంలో తన క్యాడర్‌ను ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేయటంతో పాటు పోలీసుల సహయంతో కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఎమ్మెల్సీ మీడియా ముందే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన దామోధర్‌రెడ్డి 2018లో ఎమ్మెల్యేగా సీటు ఆశించి భంగపడ్డారు. ఆయనను సంప్రదించకుండానే నాగం జనార్దర్రెడ్డిని బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని సీటు ఖరారు చేయటంతో ఆగ్రహించిన దామోధర్‌రెడ్డి పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆ ఎన్నికల్లో నాగం ఓడిపోయారు. ఇటీవల రెండవ సారి దామోధర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ ప్రస్తావిస్తే దాన్ని ఎమ్మెల్యే వ్యతిరేకించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బయటికి బాగానే ఉన్నట్టు కనిపించినా లోలోపల వారి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎమ్మెల్యేకు మైనస్‌గా మారే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ రాజేష్‌రెడ్డి హైదరాబాద్‌లో డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తూ తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ నుంచి సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్దికంగా బలంగా ఉన్నానని, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్న తనని ప్రజలు మరోసారి గెలిపిస్తారని ఎమ్మెల్యే ధీమాగా ఉన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత తనకు సన్నిహితంగా ఉండే ముఖ్య నేతలను లోక్‌సభకు పోటీ చేయించాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారట.. ఆ లిస్టులో మర్రి జనార్దన్ రెడ్డి పేరు కూడ ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆయన మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారనే గుసగసలు సైతం వినిపిస్తున్నాయి. ప్రతి పక్షాలు ఇక్కడ బలహీనంగా ఉండటం ఎమ్మెల్యే ఆర్దికంగా బలంగా ఉండటం కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇటీవల వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని మర్రి ప్రకటించటం చూస్తే గెలుపుపై ఆయన ఎంత ధీమాగా ఉన్నారో అర్దం అవుతుంది. కాగా అప్పుడే మర్రి జనార్దన్‌రెడ్డి తన నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ పేరిట పర్యటిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు యత్నిస్తున్నారు. ఇబ్బందికరంగా కాంగ్రెస్ సీట్ల పంచాయతి.. కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. ముఖ్యంగా నాగం జనార్దన్‌రెడ్డి వయస్సు మీదపడటం.. కాంగ్రెస్ క్యాడర్లో చాలా మంది బీఆర్ఎస్ గూటికి చేరటం ఆయనకు సమస్యగా మారింది. ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి ఆయన కుమారుడు డాక్టర్ రాజేష్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే రాజేష్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని నాగం పట్టుబడుతుండటంతో సమస్య జఠిలమవుతుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కొంతసానుకూల వాతావరణం వస్తుందన్న తరుణంలో సీట్ల పంచాయితీ కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. మరి అధిష్టానం నాగం జనార్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి మధ్య సయోధ్య కుదుర్చితే తప్పా కుమ్మలాటలు ఉంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. బీజేపీకి ఇక్కడ పెద్ద క్యాడర్ కూడ లేదు. ఆ పార్టీలో దిలీపాచారి, కొండమణేమ్మలు పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన దిలీపా చారికి డిపాజిట్ కూడ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీగా పనిచేసిన కొండ మణేమ్మకు నాగం జనార్దన్‌రెడ్డితో పొసగక పోవటంతో పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆమె కూడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తుంది. ఆపార్టీ తన ప్రయత్నాలు సైతం మొదలుపెట్టింది. భౌగోళిక పరిస్థితులు: కూలీపనులు,వ్యవసాయంమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు.ఎలాంటి పరిశ్రమలు లేవు. ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఆలయాలు: వట్టెం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం -
వస్తూనే పంచాయితీ పెట్టిన జూపల్లి! టికెట్ ఇవ్వకపోతే అంతే మరి?
ఎన్నికల సీజన్లో నాయకుల గోడ దూకుళ్ళు సహజమే. ఏ పార్టీకి మొగ్గు కనిపిస్తుంటే ఆ పార్టీలో దూకడానికి సిద్ధంగా ఉంటారు. అయితే అప్పటికే అక్కడున్న నేతలు కొత్తవారు వస్తే తమకు ప్రమాదమని ఆందోళన చెందడం కూడా సహజమే. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్‌లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జూపల్లి కృష్ణారావు తదితరులు త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో అప్పుడే అక్కడ సీట్ల లొల్లి మొదలైంది. కర్నాటక ఫలితాలతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతల సంఖ్య పెరుగుతుండటంతో పాలమూరు జిల్లాలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేష్‌రెడ్డి, గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత తదితర అనేక మంది నేతలు కాంగ్రెస్ తీర్థం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ముహూర్తం ఫిక్స్.. ఈ నెల 30న సభ వాయిదాలు పడుతూ వస్తున్నకొల్లాపూర్ కాంగ్రెస్ సభకు ఈనెల 30న ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలిసిందే. ప్రియాంకగాంధీ సమక్షంలో ఈ భారీ బహిరంగసభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు నేతలు. సభ కోసం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాక.. 20వ తేదీనాటి కొల్లాపూర్ సభ వాయిదా పడింది. మరోవైపు కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్న జగదీశ్వర్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి తమ స్వరం పెంచారు. సీనియర్ నాయకుడు మల్లురవి ఆధ్వర్యంలో కొల్లాపూర్‌లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నాగం జనార్దన్‌రెడ్డి, జగదీశ్వర్‌రావులు హాజరైన ఈ సమావేశం వాడీవేడిగా జరిగింది. కొల్లాపూర్ సీటు ఆయనకే.. కాదంటే సమావేశానికి ముందు జగదీశ్వర్‌రావు భారీ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేశారు. గెలిచిన నాయకులు పార్టీని వదిలి పెట్టిన కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన జగదీశ్వర్‌రావుకు కొల్లాపూర్ సీటు తప్పకుండా ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పార్టీకి ఊపు వచ్చిన తర్వాత సీట్లకోసం పార్టీలో చేరితే సహకరించేంది లేదనే సంకేతాలు ఇచ్చారు. ఇదే విషయాన్ని నాగం జనార్దన్‌రెడ్డి కూడ స్పష్టం చేశారు. సీట్లు కేటాయింపు అనేది సర్వేల ఆధారంగానే జరుగుతుందని మల్లు రవి చెప్పినా కార్యకర్తలు వ్యతిరేకించారు. కొల్లాపూర్‌తో పాటు నాలుగు అసెంబ్లీ స్దానాలు తనవారికి కేటాయించాలని కొత్తగా వస్తున్న నేత డిమాండ్ చేసినట్టు తెలుస్తోందంటూ.. జూపల్లిని ఉద్దేశించి నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించటం హాట్‌టాపిక్‌గా మారింది. ఇదేమాత్రం కరెక్ట్ కాదని నాగం స్పష్టం చేశారు. అసలు జూపల్లి ఎందుకు చేరడం.. కొల్లాపూర్‌లో జగదీశ్వర్‌రావు గెలుపుకోసం పనిచేయాలని నాగం జనార్థనరెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. జూపల్లి కృష్ణారావు తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నాగం హెచ్చరించటంతో కలకలం రేగింది. సర్వేల పేరు చెబుతున్నా జూపల్లి కృష్ణారావుకు సీటు గ్యారెంటీ లేకుండా పార్టీలో ఎందుకు చేరతాడనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కొల్లాపూర్ సీటు జూపల్లికి కేటాయిస్తే జగదీశ్వర్‌రావు సహకరించటం కష్టమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది పార్టీలో అంతర్గత పోరుకు తెరలేపుతుందని కార్యకర్తలు, నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రియాంకగాంధీ సభ వాయిదా పడి పరేషాన్లో ఉన్న జూపల్లికి సీట్లలొల్లి తలనొప్పిగా మారిందట. కూచుకుళ్లకు ముందే హామీ.. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేష్‌రెడ్డికి నాగర్‌కర్నూల్ సీటు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు ప్రచారం సాగుతోంది. నాగం జనార్దన్‌రెడ్డి మాత్రం ఈసారి తనకే అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. మరో నాలుగేళ్ళ పదవీకాలం ఉన్నా ఎమ్మెల్సీ సీటు వదులుకుని కూచకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. ఆయన తనయుడికి సీటు భరోసా ఇచ్చాకే పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే చేరికలకు ముందే పార్టీలో కొత్త, పాత నేతల మధ్య జరుగుతున్న పోరు పార్టీకి నష్టం కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ పాలమూరు సీట్ల లొల్లిని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. లేదంటే జూపల్లి చేరికపై ఏమైనా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయా అనేది తేలాల్సి ఉంది. -సాక్షి, పొలిటికల్ డెస్క్ -
TS: స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. థాక్రే, రేవంత్‌తో వారిద్దరూ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే పార్టీలో చేరికలపై కాంగ్రెస్ దృష్టిపెట్టింది. కాగా, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే, రేవంత్ రెడ్డిలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామెదర్‌రెడ్డి భేటీ అయ్యారు. దీంతో, దామోదర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై చర్చ జరగుతోంది. ఇదిలా ఉండగా.. దామోదర్ రెడ్డితో పాటుగా నాగం జనార్ధన్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీన ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. ఈ మేరకు శనివారం ఆయన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్‌లో మాట్లాడినట్లు పార్టీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్‌లోనే పొంగులేటి చేరిక తేదీ ఫిక్స్ అయ్యింది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక అదే తేదీన పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు, సైతం కాంగ్రెస్‌లో చేరనున్నట్టు సమాచారం. మరోవైపు.. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈ నెల 21వ తేదీన ఢిల్లీకి చేరుకుంటారు. అదే తేదీన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక జూపల్లి, పొంగులేటి చేరిక తర్వాత ఖమ్మం, పాలమూరుల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉంది. ఇది కూడా చదవండి: ప్రొ.హరగోపాల్‌పై కేసు ఎత్తేయండి: డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశం -
22న నాగర్‌కర్నూల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవసభ
సాక్షి, హైదరాబాద్: మార్కండేయ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా తమ పార్టీకి చెందిన దళిత, గిరిజన నాయకులపై అధికార బీఆర్ఎస్ నేతల దాడిని నిరసిస్తూ ఈనెల 22న నాగర్‌కర్నూల్ కేంద్రంగా ‘దళిత గిరిజన ఆత్మగౌరవ సభ’ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈనెల 20, 21, 22 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న ఆయన రాష్ట్ర ఇన్చార్జి హోదాలో ఈ సభకు తొలిసారి అతిథిగా రానున్నారు. కాగా, పంజగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలంటూ టీపీసీసీ బృందం బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి విజ్ఞప్తి చేయనుంది. పంజగుట్ట చౌరస్తా నుంచి తొలగించి పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన అంబేడ్కర్ విగ్రహాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు అప్పగించాలంటూ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ విగ్రహాన్ని పంజగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరనుంది. ఇందుకోసం శాంతికుమారి అపాయింట్మెంట్ కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఇప్పటికే పార్టీ తరఫున లేఖ రాశారు. సీఎస్ అపాయింట్మెంట్ లభిస్తే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం సీఎస్‌ను కలిసి అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు, ఎమ్మెల్యేలకు ఎర కేసుతోపాటు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరడాన్ని కూడా విచారించాలని కోరనుంది. గొంతుపై కాలుపెట్టి చంపే యత్నం చేశారు: నాగం మార్కండేయ ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్లిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల గొంతుపై కాలు పెట్టి చంపేందుకు యత్నించారని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ ఎంపీ మల్లురవితో కలిసి ఆయన గాం«ధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దళిత, గిరిజన నేతలపై దాడులు చేయడమేకాక తిరిగి వారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. -
నాగర్‌కర్నూల్‌లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని మార్కండేయ రిజర్వాయర్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే, మార్కండేయ లిఫ్ట్ పనులను పరిశీలించేందుకు మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అనంతరం.. నాగం జనార్థన్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలకు ఇక్కడకి వచ్చేందుకు వీలులేదంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో, ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ నేతల దాడులపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం సక్రమంగా పనులు చేస్తున్నప్పుడు తమను అడ్డుకోవాల్సి అవసరం ఏముందని ప్రశ్నించారు. దాడి ఘటన తర్వాత కాంగ్రెస్ నేతలు, నాగం అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
‘కాంగ్రెస్ సీనియర్లకు ఏమైంది?.. నేనింకా జూనియర్‌నే’
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలంతా సమైక్యంగా ఉండి కొట్లాడితేనే వచ్చే ఎన్నికల్లో అధి కారం దక్కుతుందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అంతర్గత కలహాలతో పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పారు. ‘కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఏమైంది? మనమే తన్నుకుంటే ప్రజలను పట్టించుకునేది ఎవరు’అని ప్రశ్నించారు. కుమ్ములాటలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తాను దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నా కాంగ్రెస్‌లో మాత్రం జూనియర్‌నని వ్యాఖ్యానించారు. నేతలంతా ఒక్కటై పార్టీని బలోపేతం చేయాలని కోరారు. తనకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై మేధావులంతా స్పందించాలని ఎమ్మెల్సీ కవిత అంటున్నారని, మరి కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై కేంద్రం వేధింపులకు దిగినప్పుడు ఆమె ఏమయ్యారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ధర్నాచౌక్‌ను ఎత్తివేసినపుడు, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గొర్రెల్లా కొనుగోలు చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. రేవంత్ ఒంటెద్దు పోకడలతోనే సమస్యలు సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న రేవం™త్Œరెడ్డి పోషించాల్సింది కోడలు పాత్ర కాదని, పెద్ద కొడుకు పాత్ర అని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడి ఒంటెద్దు పోకడల కారణంగానే ఇన్ని సమస్యలు వస్తున్నాయని, అవసరమైతే పార్టీ కోసం ఆయన ఓ మెట్టు దిగిరావాలని అన్నారు. సీనియర్ నేతలతో సమన్వయం చేసుకుంటే పార్టీలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పదవుల్లో ఉన్న నాయకులు అందరినీ సమన్వయం చేసుకుంటే అపార్థాలుండవని, కానీ పార్టీ విభేదాలను కోడళ్ల పంచాయితీతో పోలిస్తే మాత్రం పార్టీ చిన్నాభిన్నం అవుతుందని పేర్కొన్నారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ఏదో ఒక రోజు మాజీ కావాల్సిందేనని, పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు మాత్రం అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు. పార్టీ కోవర్టుల గురించి ప్రతిసారీ చర్చకు రావడం బాధాకరంగా ఉందని, ఈ విషయంలో సీనియర్ నేత దామోదర రాజనర్సింహ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. ప్రతి నాయకుడు కోరుకునేది ఆత్మగౌరవమేనని, ఆత్మాభిమానానికి మించింది ఏమీ ఉండదని చెప్పారు. రానున్నది ఎన్నికల సమయమని, ఈ సమయంలో చేయాల్సింది పార్టీ కమిటీల్లో బలప్రదర్శన కాదని, ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు, ఎన్నికల్లో బలప్రదర్శన చేసేందుకు సిద్ధం కావాలని సూచించారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో తమ ఆవేదన చెప్పుకుంటామని మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. -
ఆ నలుగురు నేతల గుప్పిట్లో బీజేపీ
ఆ పార్టీలో ఆ నలుగురు నేతలు తమ ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారట. దీంతో కొత్త, పాత నేతల మద్య విభేదాలు భగ్గుమంటున్నాయి. బయట అందరితో కలిసికట్టుగా ఉన్నట్టు కనిపించినా లోలోపల గోతులు తీస్తారనే ప్రచారం ఉంది. జిల్లాలో పార్టీ బలపడేందుకు అవకాశాలు ఉన్నా ఆ నలుగురు నేతల తీరు ఇబ్బందిగా మారిందని కార్యకర్తలు అంటున్నారు. మరో వైపు తన కుమారుడిని రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎవరా నేతలు... ఎక్కడ జరుగుతోంది ఈ వ్యవహారం.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీకి మంచి పట్టుంది. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసిన చరిత్ర బీజేపీకి ఉంది. పార్టీ బలపడేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ నేతల మధ్య సమన్వయలోపం.. ఆధిపత్య పోరు.. వర్గ విభేదాలు పార్టీకి నష్టం కల్గిస్తున్నాయి. గతంలో అలంపూర్ నుంచి రవీంద్రనాథ్‌రెడ్డి బీజేపీ తరపున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 జితేందర్‌రెడ్డి బీజేపీ నుంచి ఎంపీగా మహబూబ్‌నగర్ నుంచి గెలిచారు. 2008లో జరిగిన ఉపఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి గెలిచారు. 2014, 2018 సాధారణ ఎన్నికల్లో ఆచారి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కల్వకుర్తి, మహబూబ్‌నగర్ సెగ్మెంట్లతో పాటు పలు పట్టణాల్లో పార్టీకి బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. గత లోక్‌సభ ఎన్నికల ముందు మాజీమంత్రి డీకే అరుణ, మాజీఎంపీ జితేందర్‌రెడ్డితో పాటు వారి అనుచరులు బీజేపీలో చేరిన తర్వాత జిల్లాలో పార్టీ బలం మరింత పెరిగింది. పార్టీ క్యాడర్లో జోష్ పెరిగింది. (అగ్గిరాజేస్తున్న ఆధిపత్య పోరు) 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీకే అరుణ మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసి అధికార టీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. గెలవకపోయినా పార్టీ క్యాడర్‌కు ఓ కొత్త ఊపునిచ్చింది. మహబూబ్‌నగర్, మక్తల్ సెగ్మెంట్లో టీఆర్ఎస్ కంటే అధికంగా ఓట్లు సాధించారు. తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దూకుడు పెంచిన ఆ పార్టీ మక్తల్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోగా నారాయణపేట, భూత్పూరు, అమరచింతలో అధిక స్థానాలు గెలుచుకుంది. డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షపదవి రావటంతో మరింత విశ్వాసం పెరిగింది. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ బీజేపీలో చేరారు. ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. ఇబ్బందిగా ఆ నలుగురు.. ఇక దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ గెలవటంతోపాటు హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలవటంతో జోష్ మీద ఉన్న ఆపార్టీ జిల్లాలో కూడా దూకుడు పెంచింది. పార్టీ కార్యక్రమాలను, ప్రజాసమస్యలపై తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. మరోవైపు ఇతర పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు, ఆయా నియోజకవర్గాల్లోని బలమైన నేతలను పార్టీలోకి ఆకర్షించేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. మొదటి నుంచి పార్టీలో ఉన్న నలుగురు నేతల తీరు ఇబ్బందిగా మారిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అందులో పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, సీనియర్ నాయకులు నాగూరావునామాజీ, ఆచారి, కొండయ్య పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కొత్తగా పార్టీలో చేరిన నేతలకు వీరు సహకరించటం లేదనే ప్రచారం సాగుతుంది. గతంలో పార్టీలో చేరి మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసిన నాగం జనార్దన్‌రెడ్డికి ఈ నేతలతో పాటు రాష్ట్రనేతల్లో కొందరు పొమ్మనలేక పొగపెట్టారట. పలు సందర్భాల్లో అవమానపరిచారనే ఉద్దేశ్యంతో ఆయన పార్టీని వీడారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విషయంలో కూడా ఈ పాతనేతల తీరు అభ్యంతరకరంగా ఉండటంతో ఆయన పార్టీని వీడారు. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ పర్యటనలో అవమానం జరిగిందని పార్టీ అధ్యక్షుడు ఎర్రశేఖర్ రాజనామా చేయటం సంచలనం రేపింది. జిల్లాలో అధ్యక్షుడి పర్యటన వివరాలు కూడా తనకు తెలియకుండా ఈ నేతలు పావులు కదిపారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఓ నాయకుడు మండల పార్టీ అధ్యక్షులకు ఫోన్లు చేసి తాము చెప్పినట్టు ఏర్పాట్లు చేయాలని హుకూం జారీ చేశాడట. లోలోపల గోతులు.. రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన వివరాలు తెలిపేందుకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఎర్రశేఖర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ఆ నేతలు నారాయణపేట జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన ఉంటే నీవు ఎలా మీడియా సమావేశం పెడతావని.. కొత్తగా వచ్చిన నేతల పెత్తనం నడవదనే ధోరణితో మాట్లాడారట. అందుకే మీడియా సమావేశం రద్దు చేశారు. కానీ రాష్ట్ర నాయకుడు మాత్రం నారాయణపేటకు వెళ్లి అక్కడ మీడియా సమావేశం పెట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన వివరాలు కూడా జిల్లా అధ్యక్షుడికి తెలియకుండా కేవలం పాత నేతల కనుసన్నల్లోనే నిర్వహించారు. మొత్తంగా ఈ పాత నేతలు కొత్తవారిని పార్టీలో ఎదకకుండా తొక్కెయటానికి వ్యూహాలు సిద్ధం చేస్తారనే టాక్ఉంది. అందరితో మంచిగా ఉన్నట్టు నటిస్తూ లోలోపల గోతులు తీస్తారనే ప్రచారం ఉంది. మహబూబ్‌నగర్ పట్టణ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా గ్రూపు రాజకీయాలు చోటు చేసుకున్నాయి. బరిలో మాజీ ఎంపీ తనయుడు.. ఓ వర్గం నేతలు పార్టీ కార్యాలయం ముందే ఆందోళనకు దిగారు. జిల్లాలో పార్టీ బలపడెందుకు మంచి అవకాశాలు ఉన్నా నేతల మద్య విభేదాలు, అధిపత్యపోరు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది. కొన్ని సెగ్మెంట్లో కొత్త, పాత నేతలు ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్నారు. మాజీఎంపీ జితేందర్‌రెడ్డి తన తనయున్ని వచ్చే ఎన్నికల్లో ఏదో నియోజకవర్గం నుంచి బరిలో దింపుతారనే ప్రచారం సైతం పార్టీలో కొనసాగుతుంది. అదే జరిగితే ఏ నియోజకవర్గంలో తమపై ప్రభావం పడుతుందోననే ఆందోళన సైతం కొందరు నేతల్లో నెలకొంది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ జిల్లాలో బలపడుతున్న బీజేపీ పార్టీకి కొందరు నేతల తీరు తీవ్రంగా నష్టం కలిగించే ప్రమాదం ఉందని పార్టీలోని సీనియర్లే గుసగుసలాడుతున్నారు. మరి జాతీయ ఉపాధ్యక్షహోదాలో ఉన్న డీకే అరుణ, పార్టీ హై కమాండ్‌తో మంచి సన్నిహితం ఉన్నమాజీఎంపీ జితేందర్‌రెడ్డి కొత్తపాత నేతల మద్య సమన్వయం చేసి పార్టీ బలోపేతం కోసం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. లేకుంటే పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. -
పవర్ఫుల్ ప్రత్యర్థి
రవి వర్మ, వంశీ, రోహిత్, అక్షిత ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘ప్రత్యర్థి’. శంకర్ ముడావత్ దర్శకత్వంలో సంజయ్ షా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్థన్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ ఇచ్చారు. నాగం జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘వాణిజ్య అంశాలతో పాటు సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది’’ అన్నారు శంకర్ ముడావత్. ‘‘హిందీ సినిమాలు నిర్మించాను. తెలుగులో ఇది నా తొలి సినిమా’’ అన్నారు సంజయ్ షా. -
‘కేసీఆర్‌కు దోపిడీ తప్ప ఏమీ తెలియదు’
సాక్షి, నాగర్‌కర్నూల్: కృష్ణా జలాల సాధనలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి విమర్శించారు. నాగం జనార్ధన్ రెడ్డి ఓ సమావేశంలో మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అనుభవం లేని వారికి కాంట్రాక్టులు ఇచ్చి అసలుకే మోసం తెచ్చారని విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపకల్పనలో కేసీఆర్ అంతా తెలుసని అంటారు, కానీ దోపిడి తప్ప ఆయనకు ఏమీ తెలియదని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి, కృష్ణా జలాలను ఆంధ్రకు తాకట్టు పెట్టారని విమర్శించారు. కేసీఆర్‌కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు పోరాడి ప్రాణాలర్పించింది ఇందు కోసమేనా అని ప్రశ్నించారు. కృష్ణా జలాల వాటా దక్కించుకునేందుకు పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు సమాయత్తం కావాలని నాగం జనార్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. చదవండి: ‘అవినీతిని ప్రజలు అర్థం చేసుకోవాలి’ -
నాగం జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జలదీక్షకు వెళ్తున్న నాగంను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆయనను బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని కోరితే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కాగా మంగళవారం జలదీక్ష తలపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. -
నాగం జనార్ధన్‌రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత
-
పాలమూరుపై విచారణ జనవరి 14కు వాయిదా
న్యూఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో నిధులకు సంబంధించి సవరించిన అంచనాలను సవాలు చేస్తూ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సవరించిన అంచనాలతో ప్రాజెక్ట్ వ్యయంలో నిధులకు సంబంధించి అంకెలు అసాధారణ రీతిలో పెరిగాయని ఈ మేరకు పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ప్రాజెక్టులో భారీగా అవకతవకలు జరిగాయని, కాంట్రాక్టు తీసుకున్న సంస్థలపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆదాయపన్ను శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తమ సంస్థ పేర్లు లేవని మేఘా సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు జనవరి 14కు వాయిదా వేసింది. -
‘అవినీతిని ప్రజలు అర్థం చేసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేస్తున్న అవినీతికి ఇన్‌కం డిపార్ట్మెంట్ విడుదల చేసిన ప్రెస్‌నోటే అందుకు సాక్ష్యమని ఆరోపించారు. కాంట్రాక్టులలో విపరీత దోపిడీ జరుగుతోందని, ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులపాలు చేశాడని విమర్శించారు. ఆయన మాటల్లోనే.. చాలా రోజుల నుండి అవినీతిపై పోరాటం చేస్తున్నాను. రూ. 2400 కోట్లతో ఒకే టెండర్ ద్వారా ఒకే సంస్థకు బీటీ రోడ్ల కాంట్రాక్టును కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కమీషన్లు తీసుకునేందుకే ఈ టెండర్లను రూపొందిస్తున్నారు. ఆనాడు ఆంధ్రావాళ్లు దోచుకుంటున్నారని చెప్పిన కేసీఆర్ నేడు ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణ సంపదను పంచిపెడుతున్నాడు. ఒక్క కాంట్రాక్టర్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తే వందల కోట్ల అవినీతి బయటపడుతుంది. తెలంగాణవ్యాప్తంగా ఎంత అవినీతి జరుగుతోందో ప్రజలు అర్థం చేసుకోవాలి. మిషన్ భగీరథ పెద్ద కుంభకోణం. వేల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాళేశ్వరంతో ఒక్కచుక్క నీరు రావట్లేదు. సెక్రటేరియట్, అసెంబ్లీ పేరిట కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రజలను బిచ్చగాళ్లను చేసేలా పాలిస్తున్నారు. అవినీతిపై అప్పటి గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాస్తే పట్టించుకోలేదు. ఖాసీం రజ్వీ ప్రజలను హింసిస్తే, కేసీఆర్ ఆర్ధికంగా రాష్ట్రాన్ని పీల్చేస్తున్నాడు. ఇప్పటివరకు దోచుకున్న డబ్బంతా తిరిగి చెల్లించాలి. లేకుంటే ప్రజలే గద్దె దించుతారు. కేసీఆర్ అనుభవరాహిత్యం, అహంభావ వైఖరి వల్లే నేడు ఆర్టీసీ కార్మికులు సమ్మెచేసే పరిస్థితి వచ్చింది. వారి ఉసురు కేసీఆర్‌కు తగులుతుందని వ్యాఖ్యానించారు. -
నిర్వాసితులకు నాగం మద్ధతు
నాగర్ కర్నూల్ జిల్లా: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు(పీఆర్ఎల్ఐ) భూనిర్వాసితులు చేస్తోన్న ఆందోళనకు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి మద్ధతు తెలిపారు. బిజినాపల్లి మండలం వట్టెం గ్రామం వద్ద నిర్మాణమవుతోన్న పాలమూరు-రంగారెడ్డి రిజర్వాయర్‌లో భూములు, ఇళ్లు కోల్పోతున్న రైతులు ఈ ప్రాజెక్టు పనులను అడ్డుకుని హెచ్‌ఈఎస్ కంపెనీ ముందు ఆందోళన నిర్వహించారు. తమ భూములకు, ఇండ్లకు మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భూనిర్వాసితులకు ఏవిధమైన పరిహారం ఇచ్చారో అదే విధంగా ఇక్కడ కూడా ఇవ్వాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంతో తాను పోరాడతానని నాగం జనార్దన్ రెడ్డి తెలిపి సంఘీభావం ప్రకటించారు. -
జోక్యం అవసరమే లేదు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు (పీఆర్‌ఆర్‌ఎల్‌ఐపీ) ఎలక్ట్రో మెకానికల్ పరికరాల (ఈఅండ్ఎం) ధరల పెంపు వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నాగం జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఈఅండ్ఎం ధరల పెంపు, కాంట్రాక్ట్ ఖరారు విషయంలో అక్రమాలూ చోటు చేసుకోలేదని హైకోర్టు స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ ఖరారులో మోసం జరిగిందనేందుకు నాగం ఎటువంటి ఆధారాలూ చూపలేకపోయారని తేల్చి చెప్పింది. అలాగే ప్యాకేజీ 5 ధరల విషయంలో మేఘా ఇంజనీరింగ్, నవ యుగ కంపెనీలతో అధికారులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలతో సైతం తాము ఏకీభవించడం లేదంది. అలాగే బీహెచ్ఈఎల్–మేఘా ఇంజనీరింగ్ జాయింట్ వెంచర్‌కు కాం ట్రాక్ట్ అప్పగింత ఏకపక్ష నిర్ణయం కాదని, అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తరువాతనే కాంట్రాక్ట్ అప్పగింత నిర్ణయం జరిగిందని తెలిపింది. అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంది. అలాగే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేందుకు పిటిషనర్ ఎటువంటి ఆధారాలను తమ ముందుంచలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. పీఆర్‌ఆర్‌ఎల్‌ఐపీ ఎలక్ట్రో మెకానికల్ పరికరాల ధరల పెంపు విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ప్యాకేజీ 5లో మొత్తం 9 పంప్ అండ్ మోటార్ల ధరను ఏకపక్షంగా రూ.1,729 కోట్ల నుంచి రూ.2,436 కోట్లకు పెంచారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి హైకోర్టులో గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపి గతంలో తీర్పు వాయిదా వేసిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉదయం తీర్పు వెలువరించింది. నిర్ధిష్ట పద్ధతిలోనే ఇస్కీ లెక్కలు.. ‘ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఇస్కీ) పలు ప్రత్యాయ్నాయాలు ఉన్నప్పటికీ, పీఆర్‌ఆర్‌ఎల్‌ఐపీ అంచనా వ్యయాన్ని ఓ నిర్ధిష్ట పద్ధతిలోనే లెక్కించింది. ఇస్కీవి కేవలం అంచనాలే తప్ప, తుది లెక్కలు కావు. ఇస్కీ అంచనా లెక్కలను అంతిమంగా సమీక్షించాల్సింది ప్రభుత్వమే. ఇదే విషయాన్ని ఇస్కీ సైతం అంగీకరిస్తోంది. 1,5,8,16 ప్యాకేజీల్లో ఈఅండ్ఎంతో పంపు హౌస్‌ల నిర్మాణం జరగాల్సి ఉంది. సివిల్ నిర్మాణ పనులు, సొరంగ నిర్మాణ పనులు, హైడ్రో మెకానికల్ పనులు, ఈఅండ్ఎం పనులు ఇందులో భాగం. ప్రాజెక్టు పనులు పూర్తయిన తరువాత ఐదేళ్ల పాటు ప్లాంట్ నిర్వహణ కూడా చేపట్టాల్సి ఉంది. సివిల్ నిర్మాణ పనులు, సొరంగ నిర్మాణ పనులు, నిర్వహణ పనులు చేపట్టే అర్హత, అనుభవం లేదని బీహెచ్ఈఎల్ చెబుతోంది. అందువల్లే బిడ్ నిబంధనల ప్రకారం మేఘా ఇంజనీరింగ్‌తో కలిసి జాయింట్ వెంచర్‌గా ఏర్పడ్డామని చెప్పింది. డిజైన్, తయారీ, రవాణా, ట్రాన్సిట్ రిస్క్ ఇన్సూరెన్స్, పంపులు, మోటార్ల బిగింపు పర్యవేక్షణ తదితరాలన్నీ కూడా మేఘా ఇంజనీరింగ్ బాధ్యత. పంపులు, మోటార్ల సరఫరా, వాటిని విడిభాగాలుగా నిర్దేశిత ప్రాంతానికి తరలించాల్సిన బాధ్యత మాత్రమే బీహెచ్ఈఎల్ది. మిగిలిన బాధ్యతలన్నీ కూడా మేఘా ఇంజనీరింగ్దే. ప్రాజెక్టు అమలులో ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నందున ఈఅండ్ఎం ధరల పెంపును, కాంట్రాక్ట్ ఖరారును ఏకపక్షంగా పరిగణించలేం. మేఘా, నవయుగలతో అధికారులు కుమ్మక్కయ్యారన్న నాగం వాదనను ఆమోదించలేకపోతున్నాం. అలాగే సీబీఐ దర్యాప్తునకూ ఆదేశించాల్సిన అవసరమూ కనిపించడం లేదు.’అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
‘బుద్ధ విగ్రహం ఏర్పాటులో లక్షల రూపాయల అవినీతి’
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా : కేసరి సముద్రం చెరువు కట్ట మరమ్మత్తులో మర్రి జనార్ధన్ రెడ్డి భారీ అవినీతికి పల్పాడ్డారంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసరి సముద్రం చెరువు మరమత్తులో మర్రి జనార్దన్ రెడ్డి వందల కోట్ల ప్రజధనాన్ని లూటీ చేశారంటూ మండిపడ్డారు. చెరువు కట్టపై జరిగిన సీసీ రోడ్ల నిర్మాణంలో టెండర్లు ఆమోదం కాకుండానే.. అగ్రిమెంట్లు లేకుండానే పనులు ఎలా జరిగాయో చెప్పాలంటూ మర్రి జనార్దన్ రెడ్డిని డిమాండ్ చేశారు. చెరువు కట్టపై నాలుగు కోట్ల రూపాయల అభివుద్ధి పనులు కూడా జరగలేదు.. కానీ పదిహేడున్నర కోట్ల రూపాయల పనులు జరిగినట్లు చెప్తున్నారంటూ మండిపడ్డారు. బుద్ధ విగ్రహం, దిమ్మెలైట్లు ఇతర మెటీరియల్ ఏర్పాట్లలో లక్షల రూపాయల అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. కాంట్రక్టర్ నల్లమట్టిని వందల కోట్ల రూపాయలకు అమ్ముకుని.. వేల ఎకరాల పంట భూమిని ఎండ పెట్టారు.. ఇదెక్కడి న్యాయమంటూ నాగం ప్రశ్నించారు. -
నాగం జనార్ధన్‌రెడ్డికి పుత్ర వియోగం
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి కుమారుడు నాగం దినకర్‌రెడ్డి (46) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన వారం రోజుల కిందటే చికిత్స కోసం అపోలో ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేసేందుకు వైద్యులు ఓ వైపు ఏర్పాట్లు చేస్తుండగానే ఆస్పత్రిలో గుండెపోటుతో చనిపోయారు. జనార్దన్‌రెడ్డికి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కొడుకైన దినకర్‌రెడ్డి వైద్యవృత్తిలో కొనసాగుతూనే సివిల్ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కుమారుడి మృతితో నాగం తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు కాంగ్రెస్ నాయకులు అపోలో ఆస్పత్రికి చేరుకుని నాగంను పరామర్శించారు. దినకర్ 46 ఏళ్ల వయస్సులోనే చనిపోవడం నాగం కుటంబానికి తీరని లోటని చిన్నారెడ్డి పేర్కొన్నారు. పార్టీ తరఫున నాగం కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన పలువరు నాయకులు నాగంను పరామర్శించారు. -
కేసీఆర్ అవినీతిని బయటపెడతాం
ఖైరతాబాద్: ప్రగతి నివేదన– ప్రజా ఆవేదన పేరుతో సోమవారం లక్డీకాపూల్‌లోని హోటల్ అబోర్డులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాలుగేళ్ల మూడు నెలల పాలనలో వాగ్దానాలు, వైఫల్యాలపై రాజకీయ నాయకులు, ఇంజినీర్లు, లాయర్లు పాల్గొని చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల్లో అవినీతి విచ్చలవిడిగా జరిగిందన్నారు. అవినీతిపై నిరసన తెలిపేందుకు కూడా వీలు లేకుండా ధర్నా చౌక్‌ను ఎత్తేశారన్నారు. కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేసేందుకే కేసులు వేశానన్నారు. అనంతరం ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం జరిగిందన్నారు. ఇండిపెంటెండ్ ఫోరం కన్వీనర్ శివప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ లింగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస రెడ్డి, రిటైర్డ్ ఇంజినీర్ దొంతు లక్ష్మీనారాయణ, న్యాయవాది రామకృష్ణారెడ్డి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
నాగం జనార్ధన్ రెడ్డికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తనకు భద్రతను ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసందే. పిటిషన్‌పై జనార్థన్ రెడ్డికి గురువారం హైకోర్టులో ఊరట లభించింది. నాగంకు భద్రత పునరుద్ధరించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తనకు గన్మెన్లను తొలగించడంపై నాగం హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే గన్మెన్లను ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాని హైకోర్టు ఆదేశాలు పంపింది. ఆయన అధికార టీఆర్ఎస్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు గతంలో ఉన్న 1+1 భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
టీఆర్ఎస్ నుంచి నాకు ప్రాణహాని ఉంది
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తనకు భద్రతను ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అధికార టీఆర్ఎస్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. తనకు గతంలో ఉన్న 1+1 భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపే అవకాశముంది. నా భర్తకు ప్రాణహాని హైకోర్టును ఆశ్రయించిన న్యూడెమోక్రసీ నేత మధు భార్య పద్మ సాక్షి, హైదరాబాద్: పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్న తన భర్త సీపీఐ–ఎంఎల్ (న్యూడెమోక్రసీ) ప్రాంతీయ కార్యదర్శి ఎ.నారాయణస్వామి అలియాస్ మధుకు ప్రాణహాని ఉందని, వెంటనే కోర్టులో హాజరుపరిచేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన భార్య పద్మ హైకోర్టును ఆశ్రయించారు. పద్మ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను బుధవారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ విషయంపై పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించిన ధర్మాసనం విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. -
అద్భుతమైన పధకాలను అమలు చేసింది వైఎస్ఆరే
-
దంచుకో... దోచుకో... దాచుకో
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలన అవినీతిమయమని, ఆ పార్టీ నేతల అవినీతితోనే తెలంగాణలో అభివృద్ధి ఆగిపోయిందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. దంచుకో, దోచుకో, దాచుకో పద్ధతిలోనే ఈ నాలుగేళ్ల పాలన జరిగిందని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని తాను బయటపెడతానని, అప్పుడు సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్, కేటీఆర్, వారికి సహకరించిన అధికారులంతా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో నాగం విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును తామే అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని టీఆర్ఎస్ ప్రచారార్భాటాలకు పోతోందని, అసలు ఆ ప్రాజెక్టు డీఎన్ఏ కాంగ్రెస్ హయాం లోనిదేనన్నారు. కేసీఆర్ అపర భగీరథుడంటూ మీడియాలో ప్రకటనలిస్తున్నార ని, అయితే అసలు భగీరథుడైన వైఎస్సార్ చనిపోయారని నాగం చెప్పారు. వైఎస్సార్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు బీజం పడిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ అసత్య ప్రచారాలను మానుకోకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ‘ఇది కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టు’అని బోర్డు పెట్టిస్తానని హెచ్చరించారు. టీఆర్ఎస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులను ఉధృతంగా నిర్మిస్తుంటే తామేదో కాళ్లలో కట్టెలు పెడుతున్నామని మంత్రి హరీశ్ వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. ‘హరీశ్ యూజ్లెస్ ఫెలో... నీ కాళ్ల కింద కట్టెలు పెట్టిందెవరు? రూ. 2,098 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇప్పటివరకు మీరు ఖర్చు పెట్టింది రూ. 40–50 కోట్లు మాత్రమే. ఇలాగైతే ఎప్పటికి పూర్తవుతుంది? అసలు ఆ ప్రాజెక్టు విషయంలో ఏం జరిగిందన్నది నేను సమాచార హక్కు చట్టం కింద అడిగితే ఆ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున తాము చెప్పలేమని అధికారులు సమాధానమిచ్చారు. అదీ దుర్మార్గమే. మీరు నిజాయితీగా పనిచేస్తుంటే నేను అడిగిన సమాధానం ఎందుకు ఇవ్వరు? మీ బాంబే తమాషాలు ఆపండి’అని నాగం విమర్శించారు. ఎవరికో పుట్టిన బిడ్డను తమ బిడ్డేనని టీఆర్ఎస్ నేతలు సంకలో పెట్టుకుని తిరుగుతున్నారని, వేరే వాళ్లు చేసిన పనులను కూడా తమ ఖాతాల్లో వేసుకునే టీఆర్ఎస్ ఆటలు ఇక సాగవని ఆయన హెచ్చరించారు. ఓట్లడగడానికి ఊళ్లలోకి వెళ్తే డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయని, రుణమాఫీ, మూడెకరాల భూ పంపిణీ, కేజీ టు పీజీ, ఇంటికో ఉద్యోగం, 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్ల గురించి నిలదీసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీఆర్ఎస్ అవినీతి గురించి మాట్లాడుతున్నందుకే తనకు భద్రత తొలగించారని, అయితే తనకు ప్రజలే సెక్యూరిటీ అని నాగం పేర్కొన్నారు. వై.ఎస్.ను అసెంబ్లీలోనే అభినందించా... ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలోనే ప్రారంభమయ్యాయని, ఈ విషయం చెప్పి అప్పుడే అసెంబ్లీలో ఆయనను అభినందించానని నాగం జనార్దన్‌రెడ్డి చెప్పారు. కుయ్‌కుయ్ అంటూ 108, ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ, ఆకాశమే హద్దుగా పేదలకు ఇళ్లు, ఉచిత విద్యుత్ అన్నీ వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలోనే అమలయ్యాయని చెప్పారు. అప్పుడు ప్రారంభించిన విద్యుత్ ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తయిన కారణంగానే కరెంటు మనకు వస్తోందన్నారు. -
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై నాగం ప్రశంసలు
-
పది తరాలకు సరిపోయేలా దోచుకున్నావ్
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ నేతలను సన్నాసులంటూ సీఎం కేసీఆర్ విమర్శించిన నేపథ్యంలో నాగం ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. సీఎం విచ్చలవిడి అవినీతిని అడ్డుకోవడానికి మాత్రమే కోర్టుకు వెళ్లామన్నారు. రాష్ట్రం కోసమంటూ లక్షల కోట్లు అప్పు చేసి, వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కుటుంబం మొత్తం బంగారు తెలంగాణను పది తరాలకు సరిపోయేలా దోచుకున్నరని విమర్శించారు. కేసీఆర్ అవినీతిని ఆధారాలతో నిరూపిస్తానని, అవినీతికి సహకరించిన మంత్రులు, అధికారులు జైలుకు వెళ్లక తప్పదని నాగం జనార్ధన్ హెచ్చరించారు. మేడిగడ్డ దగ్గర మూడు లిప్టులు ఎందుకని ప్రశ్నించారు. ఒక బడా కాంట్రాక్టు సంస్థకు పనులను కట్టబెట్టడానికే కాళేశ్వరం నిబంధనలు మార్చారంటూ మండిపడ్డారు. ముప్పై నెలల్లో పాలమూరు పూర్తి చేస్తామన్న కేసీఆర్ కనీసం పది శాతం పనులను పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం పేరును అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్లగా మారుస్తామని చెప్పారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను అర్హత లేని కంపెనీకి కట్టబెట్టారని, 14 వేల కోట్ల అవినీతి పాల్పడ్డారని నాగం ఆరోపించారు. రివ్యూలు, రివిజన్ పేరు మీద కేసీఆర్ కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారు నాగం విమర్శించారు. కేసీఆర్ అవినీతిపై యుద్ధం చేస్తామని, ఈడీ, సీబీఐ దగ్గర కూర్చుంటామని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్మిస్తే.. ఆ ఘనతను తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. సీఎం అవినీతిని సాక్ష్యాధారలతో నిరూపిస్తానని, అలా చేయకపోతే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని సవాల్ చేశారు. -
నాగంకు గన్మెన్ల ఉపసంహరణ
సాక్షి, నాగర్‌కర్నూల్: మాజీ మంత్రి, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన నాగం జనార్దన్‌రెడ్డికి ఉన్న ఇద్దరు గన్మెన్లను రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉపసంహరించుకుంది. దీనికి సంబంధించి నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశాలు జారీ చేయడంతో గన్మెన్లు విధులకు హాజరు కాలేదు. విషయం తెలుసుకున్న నాగం జనార్దన్‌రెడ్డి, ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌తో మాట్లాడగా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వంపై గతంలో కోర్టుల్లో పలు కేసులు వేసిన నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలంటూ నాగం పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, నాగంకు ప్రాణహాని ఉన్నట్లు ఎలాంటి సంకేతాలు లేవని, నిఘా సంస్థల నివేదిక ఆధారంగానే గన్మెన్లను ఉపసంహరించామని పోలీస్ శాఖకు చెందిన ఓ అధికారి వివరించారు. అవసరమైతే పెయిడ్ గన్‌మెన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తనకు ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి ఓర్వలేకనే రాష్ట్ర ప్రభుత్వం గన్మెన్లను తొలగించిందని నాగం ఆరోపించారు. -
టీఆర్ఎస్ అంతమే లక్ష్యం
అచ్చంపేట : ‘టీఆర్ఎస్ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకపోయింది.. ఏ ప్రాజెక్టు చేపట్టినా అవినీతి మయమే.. కేసీఆర్ ఒక్కడివల్లే తెలంగాణ రాలె.. 2011లో ఆయన ఉద్యమం ఆపేస్తే నగారా సమితి పెట్టి అదిలాబాద్, పరిగి, నిజామాబాద్‌లో లక్షల మందితో ఐక్యత దీక్ష సభలు పెట్టాను.. ఎవరూ బలిదానాలు చేసుకోవద్దని భరోసా ఇచ్చాను.. కేసీఆర్ ఒక్కరోజైన బలిదానాలు చేసుకోవద్దని చెప్పాడా..? తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అయితే తెచ్చింది నేనేనని ప్రకటించుని పబ్బం గడుపుకుంటున్నడు.. ఆ పార్టీని బొంద పెట్టే వరకు నిద్రపోను’ అని కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం శ్రీశైల ఉత్తర ముఖ ద్వారమైన శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలో నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కొల్లాపూర్ కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వర్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, నాగం అనుచరులు సుమారుగా 150 వాహనాల్లో భారీగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాగం విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటే చలించి పోయిన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ప్రకటించారని, ఉద్యమం వల్ల తెలంగాణ రాలేదని, రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే వచ్చిందన్నారు. ఉమామహేశ్వరుల సన్నిధి నుంచే ఉద్యమం పీకల్లోతు అవినీతిలో కూరకపోయిన టీఆర్ఎస్ను అంతం చేసేందుకు ఉమామహేశ్వరం క్షేత్రం నుంచే ఉద్యమాన్ని మొదలు పెట్టానని నాగం స్పష్టం చేశారు. ఇకనుంచి ప్రతి గ్రామం తిరిగి టీఆర్ఎస్ అవినీతి బాగోతం ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యం చేస్తానన్నారు. కేసీఆర్ కుటుంబానికి అందెలం ఎక్కించి అందిన కాడికి దోచుకుంటున్నాడని, భవిష్యత్‌లో శశికళకు పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పడుతుందన్నారు. నిరుద్యోగ సమ స్య, ఆకలి బాధలు ఉండవని, నీళ్లు, నిధులు తీసుకొస్తానని చెప్పి మోసం చేశాడని మండిపడ్డారు. ప్రాజెక్టుల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎంత అవనితికి పాల్పడుతున్నారో తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని, కేసీఆర్ ప్రభుత్వం పాలమూ రు రంగారెడ్డి ప్రాజెక్టును నిద్రపోయేలా చేసిందని ఆరోపించారు. మొదటి లిప్ట్ రూ. 2,098 కోట్లకు టెండరు ఇచ్చారని దాని విలువ రూ.700 కోట్లు మాత్రమేనని, అయినా ఇంత వరకు కేవలం రూ.50కోట్లు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులను ప్రారంభించారని, ఇన్నిరోజులైనా కెఎల్ఐ కింద కనీసం డిస్టిబ్యూటర్ చానల్స్ కూడా చేయలేదని, అయినా ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని చెబుతున్నారని ఎక్కడ అందించారో చూయించాలని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణాల కోసం నిధులు పెంచుకుంటూ జేబులు నింపుకుంటున్నారే తప్ప మరోటి లేదన్నారు. పాల మూరు ప్రయోజనాలు పక్కన బెట్టి నల్లగొండకు నీళ్లు తీసికెళ్లుతామంటే చూస్తూ ఊరుకోమని, మక్తల్ వద్ద కృష్ణానది ఉంటే శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి నీళ్లు తీసేకెళ్లడం చూస్తే వీరి పరిజ్ఞానం ఏమేరకు ఉందో అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు జగదీశ్వర్‌రావు, జెడ్పీటీసీలు ధర్మానాయక్, కొండ మణెమ్మ, కాంగ్రెస్ నాయకులు పాలమూరు యాదయ్య, కాశన్న యాదవ్, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన దోపిడీ!
సాక్షి, నాగర్ కర్నూలు : భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి తీవ్రస్థాయి ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు కట్టిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిది కాదని, ఈ విషయంలో మంత్రి హరీశ్ రావు అన్ని అబద్ధాలే చెప్తున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవినీతిని తాను బయటకు తీస్తున్నానని, ప్రాజెక్టు కోసం నాసిరకం పంపులు, మోటార్లు వాడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మనీలాండరింగ్ కేసులో మంత్రి హరీశ్ రావు జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. -
టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ ముఖ్యనేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి హస్తాన్ని వీడనున్నారు. రేపు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరడానికి ముహూర్తం ఖరారైంది. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌కు దామోదర్‌రెడ్డి బలమైన నేతగా ఉన్నారు. ఇటీవల నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకనొక సమయంలో బహిరంగంగానే విమర్శలు చేశారు. అంతేకాకుండా పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి నాగం చేరికపై చర్చించినట్టు ప్రచారం జరిగింది. అయినా నాగంను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై దామోదర్‌రెడ్డి తీవ్ర మనస్థాపం చెందారు. తన అభ్యంతరాలను పార్టీ పట్టించుకోలేదని , తన మాటకు విలువలేదనే ఆయన టీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దామోదర్‌రెడ్డి పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని డీకే అరుణ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. -
దామోదర్‌రెడ్డి బాధపడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డిని చేర్చుకున్నందుకు ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి బాధపడుతున్నారని మాజీ మంత్రి డీకే అరుణ వ్యాఖ్యానించారు. నాగంను పార్టీలో చేర్చుకున్నందుకు నిరసనగా దామోదర్‌రెడ్డి పార్టీ మారుతున్నారని, ఆయనను టీపీసీసీ పెద్దలు బుజ్జగిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో గురువారం మీడియాతో అరుణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దామోదర్‌రెడ్డిని కలసి పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని కోరానన్నారు. నాగం చేరిక విషయంలో వాళ్లిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడాలని టీపీసీసీ నేతలకు సూచించానని, అయినా దామోదర్‌రెడ్డితో మాట్లాడకుండానే నాగంను పార్టీలో చేర్చుకున్నారన్న దానిపై ఆయన బాధపడుతున్నారని చెప్పారు. పార్టీ మారడం వల్ల అటు పార్టీతో పాటు వ్యక్తిగతంగా కూడా నష్టం వస్తుందని దామోదర్‌రెడ్డికి వివరించినట్లు వెల్లడించారు. నాగం టీడీపీలోనే బలమైన నాయకుడు.. నాగం జనార్దన్‌రెడ్డి టీడీపీలోనే బలమైన నాయకుడని, కాంగ్రెస్‌లో కాదని అరుణ వ్యాఖ్యానించారు. బలమైన నాయకులైతే అక్కడే గెలవాలి కదా అని ప్రశ్నించారు. నాగం పార్టీలో చేరేటప్పుడే రాహుల్‌కు నివేదిక ఇచ్చారని, ఆయన నాగంకు టికెట్ ఫైనల్ చేయలేదని చెప్పారు. తాను చెబితే దామోదర్‌రెడ్డి వింటారన్న ఆరోపణలను తనపై రాజకీయ కుట్రగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఎవరు తనను టార్గెట్ చేసినా భయపడి ఇంట్లో కూర్చునే వ్యక్తిని కాదన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం, రాహుల్‌ను ప్రధాని చేయడం కోసం నిబద్ధతతో పనిచేస్తానని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్‌లో ఎప్పుడూ గ్రూపులు లేవని, ఇప్పుడే వినిపిస్తున్నాయని అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తాను నిరుత్సాహ పడనని, తనను నిరుత్సాహ పరిస్తే కాంగ్రెస్ పార్టీకే నష్టమని ఆమె వ్యాఖ్యానించారు. -
భయపడి ఇంట్లో కూర్చోను: డీకె అరుణ
సాక్షి, మహబూబ్ నగర్ : ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు ప్రచారంతో నేపథ్యంలో ఆయనతో మాజీమంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ...‘ దామోదర్‌రెడ్డిని కలిసి మాట్లాడాను. పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని చెప్పాను. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్‌కు అండగా ఉన్న వ్యక్తి దామోదర్ రెడ్డి. 2004లో కేవలం 1400 ఓట్లతో ఓడిపోయారు. అప్పుడు పొత్తులో భాగంగా టీఆర్ఎస్లోకి వెళ్లినా టీఆర్ఎస్ నుండి పోటీ చేసి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఎమ్మెల్సీగా గెలిచారు.క్యాడర్ ఆయన వెంట ఉంది. నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక సమయంలో తన బాధ ఎవరూ వినలేదని దామోదర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆవేశం, ఆవేదన, బాధతో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీకి, వ్యక్తిగత నిర్ణయం అని చెప్పాను. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని మరోసారి ఆయనను కోరాను. డీకే అరుణ చెబితే దామోదర్ రెడ్డి వింటారని నన్ను ఇబ్బంది పెట్టే ప్రక్రియ అది. ఇది ఒక రాజకీయ కుట్ర. ఎవరు ఇబ్బంది పెట్టినా, నన్ను టార్గెట్ చేసినా... నేను సిన్సియర్ కార్యకర్తను. కాంగ్రెస్ గెలుపే నా లక్ష్యం. ఎవరు టార్గెట్ చేసినా భయపడి ఇంట్లో కూర్చోను. నా వ్యక్తిగతం కోసం పని చేయడం లేదు. మహబూబ్ నగర్లో ఎప్పుడూ వర్గం లేదు. ఇప్పుడే వినిపిస్తోంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే పని చేస్తున్నా. నన్ను డీ మోరల్ చేస్తే పార్టీకే నష్టం. నాకేం ఉంటుంది. బలం చేకూరే నాయకులు వస్తే తప్పులేదు. కానీ ఉన్న బలం పోతే లాభం ఏంటి?. నాగం టీడీపీలో బలమైన నాయకుడు కావొచ్చు కానీ కాంగ్రెస్‌లో కాదు. వాళ్లు బలమైన నాయకులు అయితే అక్కడే గెలవాలి కదా??’ అని ప్రశ్నించారు. కాగా నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై అధిష్టానాన్ని కలిసినా ఫలితం లేకపోవడంతో.. మనస్తాపానికి గురైన తానే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో డీకే అరుణ, జైపాల్‌రెడ్డి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఒకరు అవునంటే.. మరొకరు కాదంటూ పలు అంశాల్లో విబేధాలు వస్తుండడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కాంగ్రెస్‌లో నాగం జనార్దన్‌రెడ్డి చేరికను వ్యతిరేకించిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డికి డీకే అరుణ మద్దతుగా నిలవగా, ఇక నాగంకు సీనియర్ నేత జైపాల్‌రెడ్డి మద్దతుగా నిలిచి పార్టీలోకి తీసుకున్న విషయం విదితమే. -
‘మిషన్ భగీరథలో రూ.50 కోట్ల అవినీతి’
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథలో రూ.50వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. కమీషన్లకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరాక నాగం జనార్దన్ రెడ్డి తొలిసారి గాంధీభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అవినీతిని, కేసీఆర్ నియంతృత్వాన్ని ప్రశ్నించడానికే తాను కాంగ్రెస్‌లో చేరానన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ సాధ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులను మరింత సంక్షోభంలోకి నెట్టే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నాలుగేళ్ల కాలంలో పంటలకు గిట్టుబాటు ధర, కరువు మండలాలను ప్రభుత్వం ఎందుకు ప్రకటించలేదని నాగం సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ హామీతో కేసీఆర్ చాలా ఆందోళనలో ఉన్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. రైతు బంధు సాయం కౌలు రైతులకు కూడా అందించాలని డిమాండ్ చేశారు. జోనల్ వ్యవస్థను ప్రభుత్వం సరిగా చేయటంలేదని విమర్శించారు. ఉద్యోగ సంఘాలతో పాలు అందర్నీ సంప్రదించి జోన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడనుంచి పోటీ అనేది అధిష్టానం నిర్ణయం రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధిష్టానం నిర్ణయిస్తోందని నాగం పేర్కొన్నారు. తన రాకను వ్యతిరేకించిన దామోదర్ రెడ్డిని కలిసి మాట్లాడానన్నారు. ఇద్దరం కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని దామోదర్‌ను కోరినట్లు నాగం జనార్థన్ రెడ్డి తెలిపారు. -
‘ఆ అంశంలో ఉత్తమ్ తప్పు చేశారు’
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీలో విబేధాలు బయటపడుతున్నాయి. తెలంగాణ పీసీసీపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. రాష్ట్ర పీసీసీ తన సానుకూల వర్గాన్ని ఒకలా.. వ్యతిరేక వర్గాన్ని మరోలా చూస్తోందని ఆయన ఆరోపించారు. నాగం జనార్థన్ రెడ్డి పార్టీలో చేరికపై తమతో సంప్రదిస్తామని చెప్పారు కానీ ఆతర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. నాగం అంశంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి తప్పు చేశారని, వర్గ విబేధాల వల్ల పార్టీకి నష్టమే కానీ లాభం లేదన్నారు. నాగర్ కర్నూల్లో బలమైన నాయకులను దెబ్బతీసేందుకే జైపాల్‌రెడ్డి, చిన్నా రెడ్డిలు ప్రయత్నిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీకి తప్పడు సమాచారం ఇచ్చి నాగం పార్టీలో చేరాలా చేశారని ఆరోపించారు. జైపాల్ రెడ్డి.. రాజీవ్ గాంధీని ఉరితీయాలని చెప్పిన వ్యక్తి అని మండిపడ్డారు. తనపై పార్టీ వ్యవహారాల ఇంచార్జి కుంతియా చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. నాగం పార్టీ కోసం పని చేస్తే సరేకానీ టికెట్ ఇస్తే తాము ఏం చేయాలో అది చేస్తామన్నారు. టికెట్ ఖాయం చేసినట్టు నాగం చెప్పుకుంటున్నారని, కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదని పీసీసీ, కుంతియా అంటున్నారన్నారు. దీనిపై మీడియా ముందు స్పష్టం చేయాలన్నారు. 20 ఏళ్ళుగా పార్టీ కోసం , నాగంకు వ్యతిరేకంగా పోరాటం చేశామని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు నాగం వర్గమే పుకార్లు చేస్తుంది.. ఆయనకు టికెట్ ఇస్తే తాను సహకరించనని దామెదర్‌రెడ్డి తేల్చిచెప్పారు. -
కాంగ్రెస్‌లోకి మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి
సాక్షి, నాగర్‌కర్నూల్ : సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వచ్చినా బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వెంట జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పలుమార్లు అసెంబ్లీ బరిలో దిగిన టీడీపీ మాజీ నేత జగదీశ్వర్‌రావు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామాలతో నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరు నెలల నుంచే... గత ఆరు నెలలుగా నాగం జనార్దన్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. నెల క్రితం ఆయన భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడం ద్వారా కాంగ్రెస్‌లో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో దామోదర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లి ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేద్దామని, అధికార టీఆర్ఎస్ను ఓడించేందుకు కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావడం కోసమే తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు చెప్పుకొచ్చినా దామోదర్‌రెడ్డి స్వాగతించలేదు. ఇకఆ తర్వాత నాగం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. ఇక నాగం జనార్దన్‌రెడ్డి చేరికను ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌కు పెద్ద దిక్కయిన డీకే.అరుణ, నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య తదితరులు వ్యతిరేకించడంతోపాటు రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిపి ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని వాదన వినిపించారు. ఉమ్మడి జిల్లాలోని డీకే.అరుణ వర్గీయులందరూ సమావేశమై నాగం, జగదీశ్వర్‌రావుకు వ్యతిరేకంగా జట్టు కట్టారు. ఈ తరుణంలో నాగం, జగదీశ్వర్రావుల రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడంతో కందనూలు కాంగ్రెస్ పార్టీలోని ఇరు నియోజకవర్గాల్లో వర్గ పోరు మొదలైనట్లయింది. భారీ సభకు ఏర్పాట్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నాగం జనార్దన్‌రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా నాగర్‌కర్నూల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయి నేతలందరినీ ఇక్కడకు రప్పించి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా సమర శంఖారావం పూరించేందుకు ఆయన సిద్ధమవుతున్నారని నాగం అనుచరులు చెబుతున్నారు. మరోపక్క తమ మద్దతుదారులతో నాగర్‌కర్నూల్‌లో భారీ ర్యాలీ నిర్వహించేందుకు నాగం సమాయత్తమవుతున్నారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితోపాటు నియోజకవర్గంలోని మిగతా కీలక నేతలందరినీ కలుపుకుపోయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ తరఫున టికెట్ తెచ్చుకునేందుకు నాగం బల ప్రదర్శన చేయనునున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు మౌనంగా ఉన్న నాగర్‌కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నాగం పార్టీలో చేరడంతో ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. -
2019లో కాంగ్రెస్‌కు అధికారమే లక్ష్యం
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో బుధవారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీని కలసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతోపాటు వేములవాడ బీజేపీ నేత ఆది శ్రీనివాస్, ప్రజాగాయకుడు గద్దర్ కుమారుడు జీవీ సూర్యకిరణ్, ముఖ్యనేతలు అంజిరెడ్డి, జగదీష్రావుతోపాటు మరో 63 మంది నేతలు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ రాహుల్ స్వయంగా పార్టీ కండువాలు కప్పి ‘వెల్కం’అంటూ ఆహ్వానించారు. వేములవాడ దేవస్థానం నుంచి తెచ్చిన శాలువాను ఆదిశ్రీనివాస్ రాహుల్‌కు బహుకరించారు. ఈ సందర్భంగా నేతలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ ఏ లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో అ దిశగా ప్రస్తుతం రాష్ట్రం ముందడుగు వేయడం లేదని అభిప్రాయపడినట్లు తెలిసింది. బంగారు తెలంగాణ సాధన కోసం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. సోనియా రుణం తీర్చుకుంటాం... తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చి సోనియా గాంధీ రుణం తీర్చుకుంటామని నాగం జనార్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ ప్రజల కలల సాకారం కోసం, మంచి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ప్రస్తుతం అది జరగడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం గిట్టుబాటు ధర అడుగుతున్న రైతులను జైళ్లలో పెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో పేదరికం పెరిగిపోతోందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి కూడా టీఆర్ఎస్ న్యాయం చేయడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రాజెక్టుల్లో దోపిడీయే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తన టార్గెట్ అని, ఆయన్ను గద్దె దించడమే తన లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని నాగం ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ పార్టీ అధ్యక్ష పీఠాన్ని చేపట్టాక కాంగ్రెస్‌లోకి వరుస చేరికలను పెద్ద విజయంగా భావిస్తున్నట్లు కుంతియా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ నాయకత్వంలో పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటామన్నారు. నాగం జనార్దన్‌రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు. రాహుల్ పిలుపునిచ్చిన సేవ్ కాన్స్టిట్యూషన్ నినాదం నచ్చి కాంగ్రెస్‌లో చేరినట్లు గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ తెలిపారు. దేశ శ్రేయస్సు కోసం రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయమే తనను కాంగ్రెస్ వైపు నడిపిందన్నారు. కాంగ్రెస్‌లో చేరిన తనకు తండ్రి ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అని, ప్రజాసమస్యలను బీజేపీ గాలికొదిలేసిందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. -
‘నా టార్గెట్ కేసీఆర్..’
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన ‘సాక్షి’ తో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్కు మిత్రపక్షంగా మారిందని.. అందుకే బీజేపీని విడిచి కాంగ్రెస్‌లో చేరినట్టు నాగం తెలిపారు. తన తర్వాతి టార్గెట్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. పార్టీలో తన రాకను ఎవరూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. అధిష్టానం నుంచి సహాయ సహకారాలు కావాలని కోరగా, తన సహకారం ఉంటుందని రాహుల్ గాంధీ తెలిపినట్టు ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, వాటన్నింటిపై పోరాడనున్నట్టు నాగం ఈ సందర్భంగా తెలిపారు. ఎక్కడైనా పోటీకి రెడీ: సూర్యకిరణ్ రాహుల్ గాంధీ సేవ్ కానిస్టిట్యూషన్ నినాదం నచ్చడంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు గద్దర్ తనయుడు సూర్యకిరణ్ తెలిపారు. కాంగ్రెస్‌లో తన చేరికకు తండ్రి ఆశీస్సులున్నాయన్నారు. ఓటు రాజకీయాలపై విశ్వాసం ఉందని, తాను మావోయిస్టు పార్టీ సభ్యుడిని కాదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ బరిలో దిగుతానని సూర్యకిరణ్ వెల్లడించారు. వేములవాడ నుంచి పోటీ: ఆది శ్రీనివాస్ టీఆర్ఎస్కు అసలైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అని ఆది శ్రీనివాస్ తెలిపారు. బీజేపీ ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేయడం లేదని, అందుకే ఆ పార్టీని వీడినట్టు శ్రీనివాస్ అన్నారు. తన సొంతగూడు కాంగ్రెస్‌లో మళ్లీ చేరానని, అధిష్టానం టికెట్ ఇస్తే వేములవాడ నుంచి పోటీ చేస్తానన్నారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వంపై తన పోరాటం కొనసాగుతోందని తెలిపారు. -
కాంగ్రెస్‌లో చేరిన నాగం జనార్దన్‌రెడ్డి
-
కాంగ్రెస్‌లో చేరిన నాగం జనార్థన్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగంతో పాటు వేములవాడ బీజేపీ నేత ఆది శ్రీనివాస్, ప్రజాగాయకుడు గద్దర్ కుమారుడు జి.వి. సూర్యకిరణ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లోకి సూర్యకిరణ్, నాగం జనార్దన్‌రెడ్డి, ఆది శ్రీనివాస్‌ల చేరికల కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియాతో పాటు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లోకి నాగం జనార్దన్, గద్దర్ తనయుడు
-
కాంగ్రెస్‌లోకి గద్దర్ తనయుడు..
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేరికలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో బీజేపీకి రాజీనామా చేసి పార్టీలో చేరేందుకు ఎదురుచూస్తున్న సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డికి గ్రీన్‌సిగ్న్‌ల్ ఇచ్చింది. అదేవిధంగా ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ తనయుడు సూర్య, వ్యాపారవేత్త ఆది శ్రీనివాస్ కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాయలంలో రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో వీరు పార్టీలో చేరనున్నారు. వీరికి పార్టీ కండువాలు కప్పి.. రాహుల్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ఉద్యమాల్లో తన ఆట-పాటలతో, ధూమ్‌ధామ్‌లతో ఎంతో ఉత్తేజాన్ని కలిగించిన ప్రజాగాయకుడు గద్దర్. ఆయన తనయుడు సూర్య కాంగ్రెస్‌లో చేరడం కొత్త ఉత్సాహం నింపుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే, సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడే నాగం జనార్దన్‌రెడ్డితోపాటు బీజేపీకి చెందిన మరో నాయకుడు ఆది శ్రీనివాస్‌కు కూడా కాంగ్రెస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాంగ్రెస్‌లో చేరనున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఆది శ్రీనివాస్ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి, పార్టీలో తన పదవికి ఆయన రాజీనామా చేశారు. -
25న కాంగ్రెస్‌లోకి నాగం
సాక్షి, హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 25న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు అధికారిక సమాచారం అందినట్లు టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. నాగం చేరడాన్ని వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి డీకే అరుణ వర్గం వాదన కన్నా ఆయన పార్టీలో చేరడమే మేలనే భావనకు అధిష్టానం వచ్చిందని, అందుకే నాగం వైపే రాహుల్ మొగ్గు చూపారని పార్టీ వర్గాలంటున్నాయి. ఎప్పుడో ఓకే.. కానీ! నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని నాలుగైదు నెలలుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలోకి వెళ్లిన ఆయన ఆ పార్టీలో తనకు లభిస్తున్న ప్రాధాన్యంపై చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరతారని, రాష్ట్రస్థాయి చరిష్మా ఉన్న నేతగా ఆయనను పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్‌కు లబ్ధి కలుగుతుందనే చర్చ కూడా చాలా రోజులుగా జరుగుతోంది. నాగం చేరికను అదే జిల్లాకు చెందిన కీలక నాయకురాలు డీకే అరుణ వ్యతిరేకిస్తున్నారు. నాగం చేరికపై తన వర్గీయులైన ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిలను వెంటబెట్టుకుని వెళ్లి ఏకంగా రాహుల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నాగం చేరికకు బ్రేక్ పడింది. అప్పటి నుంచీ అదుగో.. ఇదుగో అంటున్నా ఇప్పటివరకు నాగం కాంగ్రెస్‌లో చేరిక కార్యరూపం దాల్చలేదు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సందర్భంగా నాగం చేరికపై రాహుల్‌తో పీసీసీ చీఫ్ ఉత్తమ్ చర్చించి లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. నాగంకు నాగర్‌కర్నూల్ అసెంబ్లీ సీటు ఇచ్చే విషయంలో కూడా రాష్ట్ర నాయకత్వం స్పష్టమైన హామీ ఇచ్చినట్టు సమాచారం. సయోధ్య దిశలో : నాగం, అరుణ వర్గాల మధ్య సయోధ్య కుదిరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తన చేరిక విషయంలో నాగం ఓ మెట్టు దిగి అరుణతో రాజీకి సిద్ధపడ్డట్టు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అరుణ తాను అక్కడి నుంచి వచ్చిన తర్వాత కలుస్తానని చెప్పారని, అరుణ రాగానే ఇద్దరి భేటీ ఉంటుందని సమాచారం. -
ఒక్కటైన నాగం వ్యతిరేకులు
సాక్షి, నాగర్‌కర్నూల్: సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ లోకి తీసుకొచ్చే విషయంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అనుసరిస్తున్న తీరుపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. నాగం రాకను వ్యతిరేకిస్తున్న నేతలంతా ఈ అంశంపై చర్చించేందుకు శుక్రవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, ఎంపీ నంది ఎల్లయ్య నేతృత్వంలో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి తదితరులు రోజంతా ఈ అంశంపై చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. బీజేపీకి రాజీనామా చేసిన నాగం జనార్దన్‌రెడ్డి స్థానిక నేతలైన కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, నంది ఎల్లయ్యకు కనీస సమాచారం ఇవ్వకుండా.. పార్టీలోకి వస్తున్నట్లు తానంతట తాను ప్రకటించుకోవడంపై వీరు మండిపడుతున్నారు. మరోపక్క తాను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి టీఆర్ఎస్ను గల్లంతు చేస్తానంటూ నాగం చెప్పుకోవడంపై డీకే అరుణ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్నారని, ఇతరుల నియోజకవర్గాల్లో ఆయన అనవసర జోక్యాన్ని తీవ్రంగా ఖండించకపోతే మున్ముందు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. నాగం జనార్దన్‌రెడ్డి విషయంలో వాస్తవ పరిస్థితులను రాష్ట్ర, జాతీయ పార్టీల అధ్యక్షుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వారి అపాయింట్మెంట్ తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఇదిలా ఉండగా వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, అలంపూర్ నేత సంపత్‌కుమార్ మాత్రం ఈ వర్గంతో జత కట్టనట్లు తెలుస్తోంది. -
హస్తినలో నాగం మకాం
ఢిల్లీ : హస్తినలో బీజేపీ మాజీ నేత నాగం జనార్దన్ రెడ్డి మకాం వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో శుక్రవారం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవలే బీజేపీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. నాగం కాంగ్రెస్‌లో చేరడానికి ఆసక్తి కనబరుస్తుండటంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. నాగం రాకను కాంగ్రెస్‌లోని పలువర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. నాగంను పార్టీలోకి చేర్చుకోవద్దంటూ రాహుల్ గాంధీకి ఇటీవలే కొందరు నాయకులు ఫిర్యాదులు కూడా చేసిన సంగతి తెల్సిందే. బీజేపీకి రాజీనామా చేసిన నాగం జనార్దనరెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలో కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. నాగంను చేర్చుకోవడం ద్వారా తెలంగాణలో గుర్తింపు పొందిన నేత కాంగ్రెస్‌లో చేరారన్న భావన ప్రజల్లో కల్పించాలని పీసీసీ నాయకత్వం ఆలోచిస్తుండగా, పాలమూరు జిల్లాకు చెందిన నేతలు మాత్రం ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిలు నాగం రాకను వ్యతిరేకిస్తూనే, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తుండడం పార్టీలో చర్చకు దారి తీస్తోంది. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాగం జనార్దనరెడ్డికి తనదైన గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆయన గత ఎన్నికలకు ముందే తెలంగాణ విషయంలో టీడీపీతో విభేదించి రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా దామోదర్ రెడ్డిపై గెలిచిన అనంతరం బీజేపీలో చేరారు. 2014 ఎన్నికలలో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. నాగం జనార్దనరెడ్డి కుమారుడు కూడా నాగర్‌కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత బీజేపీలో చేరిన ఆయనకు పార్టీలో ఎటువంటి కీలకమైన పదవులు దక్కక పోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఆ పార్టీలో తగిన గుర్తింపులేదనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరితే బాగుంటుందనే ఆలోచనతో కొంతకాలం క్రితం పావులు కదిపారు. తనతోపాటు కుమారుని రాజకీయ భవిష్యత్తు కోసం ఆ పార్టీ నాయకత్వాన్ని సంప్రదించారు. -
‘నాగంకు ఏం తక్కువ చేశాం’
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓటమి పాలైన పార్టీలు కూటమిగా ఏర్పడటం వల్ల ఒరిగేదేమి లేదన్నారు. జూన్ నుంచి ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్నిసిద్దం చేస్తున్నామని తెలిపారు. పార్టీ ముఖ్య నాయకులందరూ కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నామని, పార్టీ అనుమతి వచ్చిన తరువాత ప్రారంభిస్తామన్నారు. కోదండరాం కు, తెలంగాణ జనసమితి పార్టీకి ప్రజల్లో గుర్తింపు ఉందని, ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడితే ప్రజలు పట్టం కడతారని భావిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ జన సమితి కాంగ్రెస్‌తో వెళ్తే కోదండరాం పుట్టి మునిగినట్టేన్నారు. టీఆర్ఎస్పై పోరాటం చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. బడ్జెట్ సమావేశాల్లో మొత్తం సభ్యులను సస్పెండ్ చేసి, ఇద్దరి సభ్యుల సభ్యత్వం రద్దు చేసినా కాంగ్రెస్ సరిగా పోరాటం చేయలేదని విమర్శించారు. టీఆర్ఎస్తో కాంగ్రెస్ లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. మరోవైపు మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన అంశంపై లక్ష్మణ్ స్పందించారు. నాగం జనార్థన్‌రెడ్డికి ఏం తక్కువ చేయలేదని, ఆయన కొడుకుకు నాగర్‌కర్నూల్ టికెట్ ఇచ్చినట్టు గుర్తుచేశారు. అక్కడ మర్రి జనార్థన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఉంటే మహబూబ్‌నగర్ పార్లమెంట్‌తో పాటు నాగర్ కర్నూల్‌ను గెలిచేవాళ్లమన్నారు. నాగం.. కొడుకు అసమర్థతను పక్కన పెట్టి, పార్టీపై ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తల పదవులు త్యాగం చేసి.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇచ్చిన ఘనత తమదని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం ఏపీ వ్యవహారాల ఇంచార్జీ రాంమాధవ్ ప్రభావం దక్షణాది అంతటా ఉంటుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పర్యవేక్షణ ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాణిక్యాలరావు పేరు తెరపైకి వచ్చిందని, మరో రెండు రోజుల్లో ఈ అంశం తేలిపోతుందన్నారు. కర్టాటక ఎన్నికల నేపథ్యంలో తెలుగు వాళ్లు ఉండే ప్రాంతాల్లో బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కర్టాటకలో బీజేపీ గెలుపు తధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. -
అటా.. ఇటా..?
సాధారణ ఎన్నికలకు పట్టుమని పది నెలలు కూడా లేవు. ఇప్పటికే సహకార సంఘాల పాలక మండళ్ల పదవీ కాలపరిమితి ముగిసింది. రేపో మాపో పంచాయతీ పాలక మండళ్లు కూడా అధికార పీఠాన్ని కోల్పోనున్నాయి. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు మండల, జిల్లా పరిషత్, పుర పాలక సంఘాల పదవీ కాల పరిమితి కూడా ఏడాది లోపే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇదే పార్టీలో ఉంటే అవకాశం దక్కుతుందా..? కొత్త పార్టీలోకి వెళ్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది..? ఒక వేళ పార్టీ మారితే ఎందులోకి వెళ్లాలి..? అక్కడ ఎవరైనా అవకాశాలు దక్కకుండా అడ్డుపడే అవకాశముందా..? ఇవీ పార్టీలకు అతీతంగా జిల్లాలో సగటు రాజకీయ నాయకుడిని వేధిస్తున్న ప్రశ్నలు. ఎన్నికల వేళ జోరుగా రాజకీయ వలసలు సాగుతాయనే ప్రచారం నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు భవిష్యత్తు దారి వెతుక్కునే ప్రయత్నాల్లో ఉన్నారు. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు గోదావరి అంజిరెడ్డి శనివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ రాజకీయ గురువు నాగం జనార్దన్‌రెడ్డి బాటలో పయనిస్తామని స్పష్టం చేశారు. నాగం జనార్దన్‌రెడ్డి త్వరలో కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం నేపథ్యంలో గోదావరి, అంజిరెడ్డి దంపతులు సైతం అదే పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే తరహాలో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో త్వరలో రాజకీయ వలసలు ఊపందుకునేలా ఉన్నాయి. జిల్లా అంతటా టీఆర్ఎస్ బలమైన నాయకత్వం, పార్టీ యంత్రాంగాన్ని కలిగి ఉంది. కాంగ్రెస్ పార్టీ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల బలహీన లేదా బహుళ నాయకత్వంతో సతమతమవుతోంది. టీడీపీ జిల్లా రాజకీయ చిత్రపటం నుంచి దాదాపు కనుమరుగు కాగా, బీజేపీ ఆశించిన స్థాయిలో పుంజుకోలేక పోతోంది. దీంతో పార్టీ మారాలని అనుకుంటున్న నేతలు ఏ రాజకీయ పక్షం గూటికి చేరాలనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. టీఆర్ఎస్లో జహీరాబాద్ అసెంబ్లీ స్థానం మినహా మిగతా అన్ని చోట్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో తమకు అవకాశం దక్కుతుందనే అంచనాతో కొందరు ప్రయత్నాలు చేస్తున్నా రు. కాగా, నారాయణఖేడ్, జహీరాబా ద్ నియోజకవర్గాల్లో కొందరు ఇతర పార్టీల నేతలు ఎన్నికల నాటికి అధికార పార్టీ గూటికి చేరేందుకు అంతర్గతంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధికార పక్షమా..? విపక్షమా..? టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతలు, కార్యకర్తలతో పాటు, వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలతో అన్ని స్థాయిల్లోనూ తీవ్ర పోటీ నెలకొంది. దీంతో వలస నేతలు అధికార టీఆర్ఎస్తో పాటు, విపక్షంలో ఏ పార్టీ వైపు మొగ్గు చూపాలనే అంశంపై తీవ్ర మీమాంస ఎదుర్కొంటున్నారు. టీడీపీలో శ్రీకాంత్‌గౌడ్(పటాన్చెరు), శ్రీశైలం (అందోలు), నరోత్తం(జహీరాబాద్), విజయపాల్‌రెడ్డి (నారాయణఖేడ్), గంగాధర్‌రావు(మెదక్), ప్రతా ప్రెడ్డి(గజ్వేల్) తదితరులు పార్టీలో కొనసాగుతున్నారు. జాతీయ స్థాయి లో బలంగా ఉన్న బీజేపీలోకి జిల్లా స్థాయిలో ఆశించిన రీతిలో వలసలు జరగడం లేదు. ఏడాదిన్నర క్రితం పటాన్చెరు నుంచి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ మినహా చెప్పుకోదగిన నేతలెవరూ పార్టీ వైపు చూడడం లేదు. దీంతో వివిధ పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలు టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్‌కు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్‌కు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏక నాయకత్వం లేకపోవడంతో వలస నేతలు ఎవరిని సంప్రదించాలో తెలియక సతమతమవుతున్నారు. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల రేవంత్‌రెడ్డి ద్వారా టీడీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు శశికళ యాదవరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. త్వరలో నాగం ద్వారా గోదావరి అంజిరెడ్డి కాంగ్రెస్ బాట పట్టనున్నారు. ఇతర నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు, సమన్వయ లోపం తదితరాలతో ఇతర పార్టీలో పేరున్న నేతలు చేరేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఎన్నికల నాటికి ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలు కాంగ్రెస్ వైపునకు వస్తారని పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం జిల్లాలో ఇతర పార్టీల్లోని అసంతృప్తులు, సొంత పార్టీలోని అసమ్మతివాదులపై ఓ కన్నేసింది. సొంత పార్టీ నేతలను కట్టడి చేస్తూనే ఇతర పార్టీల నుంచి మరింత మందిని చేర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. -
నాగం.. ఆ విషయం గుర్తుంచుకో: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో నాగం జనార్ధన్ రెడ్డికి జాతీయ కార్యవర్గ సభ్యుడు స్థానం ఇచ్చి గౌరవించామని, కానీ ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయన పార్టీకి రాజీనామా చేశారని ఆ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు అన్నారు. గత రెండు రోజులుగా బీజేపీ సీనియర్ నేతలపై నాగం చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ సిద్ధాంతాలు పక్కనపెట్టి నాగం జనార్ధన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడికి గత ఎన్నికల్లో టికెట్లు కేటాయించిన విషయాన్ని మరిచిపోవద్దని గుర్తుచేశారు. బీజేపీపై అవాస్తవ ఆరోపణలు చేయకుంటే బాగుంటుందని కృష్ణసాగర్ రావు సూచించారు. నాగం రాజీనామా ఆయన వ్యక్తిగత నిర్ణయమన్నారు. ప్రభుత్వం అవినీతిపై పోరాడేందుకు అవినీతి పోరాట కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించినా ఆయన స్వప్రయోజనాలు కోరుకుని కాంగ్రెలో చేరుతున్నారని విమర్శించారు. మా పార్టీలో 40 ఏళ్లుగా కొనసాగుతున్న నేతలకు ఇవ్వని హోదా, గౌరవం నాగం జనార్ధన్‌రెడ్డికి ఇచ్చినా అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌లో చేరారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ అంగీకారంతోనే ప్రభుత్వంపై కోర్టులో కేసులు వేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ చేసిన పోరాటాలు ప్రజలకు కనిపిస్తున్నాయి కానీ నాగం జనార్ధన్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క కేసుయినా నమోదు చేయలేదన్నారు. కాంగ్రెస్‌లో నేతలకు స్వేచ్ఛ లేదని, ఆ పార్టీ టీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తుందని బీజేపీ నేత కృష్ణసాగర్ రావు విమర్శించారు. -
నాగం.. రాంరాం
సాక్షి, నాగర్‌కర్నూల్: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. పార్టీ సాధారణ సభ్యత్వంతో పాటు పదవికి రాజీనామా చేస్తున్నట్లు మెయిల్ ద్వారా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్‌కు లేఖ పంపినట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని తన సొంత ఇంట్లో నాగం తన అనుచరులతో సమావేశమై చర్చించారు. ఆ తర్వాత అందరి ఆమోదంతో రాజీనామా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తన గోడు పట్టించుకోనందుకే.. బీజేపీ పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించిన నాగంజనార్దన్‌రెడ్డి అందుకు దారి తీసిన పరిస్థితులను విలేకరులకు వెల్లడించారు.ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తాను కీలకంగా వ్యవహరించటమే కాక ‘నాగం నగారా’ పేరుతో ప్రత్యేక ఉద్యమం నిర్వహించా నని తెలిపారు. అందరిలా కాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ రాజీనామాను ఆమోదం చేసుకుని తిరిగి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందానని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిందని, పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు పలికిందన్న అభిమానంతో ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో భారీ కుంభకోణాలకు పాల్పడుతుండగా ఈ విషయాన్ని ఇటు రాష్ట్ర పార్టీకి, జాతీయ పార్టీ కీలక నేతలకు రికార్డుల రూపంలో ఆధారాలతో సహా అందించినా లాభం లేకపోవడంతో మనస్తాపం చెందినట్లు వివరించారు. తాను ఇచ్చిన ఆధారాలను అసెంబ్లీలో ప్రశ్నిస్తారని భావించినప్పటికీ రాష్ట్ర ఎమ్మెల్యేలు తన గోడు పట్టించుకోకపోవడంతో ఇక పార్టీని వీడాలని నిర్ణయానికి వచ్చానని చెప్పారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని తన అభిమానులు ఆ పార్టీని వీడినందుకు సంతోషంగా ఉన్నానని, గత 30 ఏళ్లుగా తన వెంట ఉన్న ప్రతి కార్యకర్త తిరిగి తన వెంట నడిచేం దుకు సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలివ్వడంతో తిరిగి సొంత నియోజకవర్గంలోనే తన అభిమానుల మధ్య బీజేపీకి రాజీనామా లేఖను పంపినట్లు నాగం వెల్లడించారు. వాళ్లే నిర్ణయిస్తారు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని.. ఏ పార్టీలో చేరాలన్న విషయాన్ని మాత్రం కార్యకర్తలు, అభిమానులే నిర్ణయిస్తారని నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. అధికార టీఆర్ఎస్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే అన్ని శక్తులతో తాను కలిసి పనిచేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కార్యకర్తలు కోరుతున్నారని ఆయన చెప్పారు. దామోదర్‌రెడ్డితో విభేదాలు లేవు కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూచకుళ్ల దామోదర్‌రెడ్డితో తనకెలాంటి విభేదాల్లేవని.. ఆయన, తాను పాత మిత్రులమని నాగం జనార్దన్‌రెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో తాను ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ సిద్ధాంతాలు, కట్టుబాట్లకు లోబడే నడుచుకుంటానని వెల్లడించారు. నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం తనకు కొట్టిన పిండి అని, ఇక్కడి పరిస్థితులన్నీ తెలుసునన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కాలు పెడతానని నాగం దీమా వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మున్ముం దు ముచ్చెమటలు పట్టిస్తానని, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని స్పష్టం చేశారు. నాగం జనార్దన్‌రెడ్డితోపాటు ఆయన కుమారుడు నాగం శశిధర్‌రెడ్డి బీజేపీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు. అంతేకాకుండా పలువురు అనుచరులు కూడా పార్టీకి రాజీనామా చేసి నాగం వెంట నడుస్తామని ప్రకటించారు. -
బీజేపీకి బైబై.. ఏ పార్టీలోకి నాగం!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఎట్టకేలకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మెయిల్ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు నాగం గురువారం రాజీనామా లేఖను పంపారు. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ అవినీతి, అక్రమాలపై తాను పోరాడుతున్నానని, అయినా తనకు బీజేపీ ఏమాత్రం సహకరించడం లేదని నాగం ఈ సందర్భంగా మండిపడ్డారు. అందుకే బీజేపీకి రాజీనామా చేశానని, ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెప్తానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నాగం జనార్దన్‌రెడ్డి భావిస్తున్నట్టు గత కొన్నిరోజులుగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. -
నాగం కాంగ్రెస్‌కి చాలా ద్రోహం చేశాడు..
సాక్షి, నాగర్ కర్నూల్: మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తే తమకు అభ్యంతరం లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. అయితే టిక్కెట్ ఆశిస్తే ఊరుకునేది లేదన్న ఆయన.. నాగంపై మరోసారి తన వ్యతిరేకతను చాటారు. రాజకీయంగా బతుకునిచ్చిన పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి తమ పార్టీలోకి రావడానికి కొందరు పెద్దలు మద్దతునివ్వడంపై దామోదర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా తాను నాగంకు ప్రత్యర్థిగా ఉన్నానని, ఆయన కాంగ్రెస్ కార్యకర్తలెందరికో ద్రోహం చేశారని ఆరోపించారు. నాగం కాంగ్రెస్‌లోకి వస్తే చాలామంది నాయకులు రాజీనామా చేస్తారని దామోదర్ రెడ్డి హెచ్చరించారు. అయినా పార్టీలో 60 ఏళ్లు పైబడిన వారికి టికెట్లు ఇవ్వబోమని రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా బీజేపీ తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి ఎట్టకేలకు ఆ పార్టీకి గురువారం రాజీనామా చేశారు. మెయిల్ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు నాగం రాజీనామా లేఖను పంపారు. -
బీజేపీకి నాగం గుడ్ బై
-
ఢిల్లీ కోర్టులో ‘నాగం’ బంతి
సాక్షి, నాగర్ కర్నూల్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు కీలక నేతగా ఉన్న నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక వ్యవహారం ప్రస్తుతం ఢిల్లీకి చేరింది. నాగర్ కర్నూల్ నియోజకవర్గ రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పాలన్న భావనతో నాగం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఒకపక్క రంగం సిద్ధం చేసుకుంటుండగా.. మరోపక్క స్థానికంగా నాగంపై కేడర్‌లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. నాగం కాంగ్రెస్‌లో చేరేందుకు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ద్వారా ఢిల్లీలో తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఉగాది తర్వాత తాను కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటానని ఆయన ప్రకటించారు. నాగం ప్రధాన ప్రత్యర్థి అయిన ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ఆయన రాకను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఇవేమీ పట్టించుకోని నాగం తన పని తాను చేసుకుంటూ ఢిల్లీలో పావులు కదుపుతున్నారు. పలు మండలాల ముఖ్యులతో ఫోన్లో మాట్లాడుతూ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది తెలుసుకున్న దామోదర్ రెడ్డితోపాటు ఎంపీ నంది ఎల్లయ్య కూడా తమ ప్రమేయం లేకుండా కార్యకర్తలతో సంప్రదింపులేం టని మండిపడుతున్నారు. నాగం రాకను మరికొంతమంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. రాహుల్ వ్యాఖ్యలపై ఆశలు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యమిస్తామని ప్రకటించడం పలువురిలో ఆశలు రేకెత్తిస్తోంది. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి తనకు బదులుగా తన కుమారుడు డాక్టర్ రాజేశ్‌కు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉంచారు. గత 30 ఏళ్లుగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో వరుస పరాజయాలు బాధిస్తున్నా పార్టీని వీడకుండా ప్రతికూల పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ను పటిష్టం చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ వస్తున్నామని దామోదర్‌రెడ్డి చెబుతున్నారు. నాగం కాకుండా యువతకు అవకాశం కల్పిస్తే దగ్గరుండి గెలిపించుకుంటానని కూచకుళ్ల మధ్యేమార్గంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దల ముందు ఉంచడం ద్వారా నాగం జనార్దన్‌రెడ్డికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. మరోపక్క నాగర్ కర్నూల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలైన కొండా మణెమ్మ తనకు అవకాశం వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఢిల్లీ నిర్ణయం ఏమిటి? నాగం జనార్దన్‌రెడ్డి చేరిక వ్యవహారం ఉమ్మడి మహబూబ్‌నగర్ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన నాగం అనూహ్యంగా 2014 ఎన్నికల్లో అసెంబ్లీ బరి నుంచి తప్పుకుని పార్లమెంట్ బరిలో దిగారు. టీడీపీని వీడి బీజేపీ జెండా ఎత్తుకున్నారు. నాగం అనుకున్న స్థాయి లో బీజేపీ ఉమ్మడి జిల్లాలో ఊపందుకోకపోవడంతో రోజురోజుకు ఆ పార్టీపై పెట్టుకున్న ఆశ లు సన్నగిల్లుతూ వచ్చాయి. దీంతో కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నాగంపై కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న అంశం జిల్లా నాయకుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. -
నాగం చేరితే కాంగ్రెస్‌కు లాభమే
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ప్రయోజనమే కలుగుతుందని, ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరంలేదని ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి అన్నారు. శుక్రవారం తనను కలిసిన విలేకరులతో చిన్నారెడ్డి, మరో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాట్లాడారు. నాగం జనార్దన్‌రెడ్డి జిల్లాలోనే కాకుండా, రాష్ట్రంలోనూ ప్రభావం చూపించే నాయకుడని చిన్నారెడ్డి అన్నారు. నాగం లాంటి బలమైన నాయకుడు కాంగ్రెస్‌లోకి వస్తానంటే ఆహ్వానించాల్సిందేనన్నారు. జైపాల్‌రెడ్డి, నాగంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ నాయకుడు పనిచేయాలని కోరారు. వనపర్తికి చెందిన టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. తన కంటే రావుల బలమైన అభ్యర్థి అని భావిస్తే వనపర్తి సీటును త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రావుల కాంగ్రెస్‌లోకి వస్తే దేవరకద్రలో అవకాశం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన నేతలెవరూ నాగం చేరికను వ్యతిరేకించడంలేదని వంశీచంద్‌రెడ్డి అన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరినవారే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. -
ఆయన కాంగ్రెస్‌లోకి వస్తే స్వాగతిస్తా..
మహబూబ్ నగర్ జిల్లా : బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే స్వాగతిస్తానని మాజీ మంత్రి, వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మహబూబ్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ..నాగం జనార్దన్ రెడ్డి లాంటి బలమైన నాయకుల అవసరం కాంగ్రెస్‌కు ఎంతైనా ఉందన్నారు. నాగం జనార్దన్ రెడ్డి, జైపాల్ రెడ్డిలపై ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లోని వచ్చినా తాను ఆహ్వానిస్తానని తెలిపారు. రావుల తనకంటే బలమైన అభ్యర్థి అని భావిస్తే తన సీటును కూడా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చిన్నారెడ్డి స్పష్టం చేశారు. రావుల కాంగ్రెస్‌లోకి వస్తే దేవరకద్రలో అవకాశం ఉంటుందని, పవన్‌కుమార్ రెడ్డి కంటే రావుల బలమైన అభ్యర్థి అవుతాడని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇతర పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్‌లోకి వస్తామంటే స్వాగతిస్తామన్నారు. నాగం చేరికను కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన నేతలెవరూ వ్యతిరేకించడం లేదన్నారు. కేవలం ఇతర పార్టీలు మారి కాంగ్రెస్‌లో చేరినవారే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. -
కాంగ్రెస్‌లో నాగం ‘లొల్లి’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త లొల్లి ప్రారంభమయింది. బీజేపీ అసంతృప్త నేత నాగం జనార్దనరెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలో కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. నాగంను చేర్చుకోవడం ద్వారా తెలంగాణలో గుర్తింపు పొందిన నేత కాంగ్రెస్‌లో చేరారన్న భావన ప్రజల్లో కల్పించాలని పీసీసీ నాయకత్వం ఆలోచిస్తుండగా, పాలమూరు జిల్లాకు చెందిన నేతలు మాత్రం ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిలు నాగం రాకను వ్యతిరేకిస్తూనే, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తుండడం పార్టీలో చర్చకు దారి తీస్తోంది. నాగం రాక.. ఆగమేనా? తెలంగాణ రాజకీయాల్లో నాగం జనార్దనరెడ్డికి తనదైన గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆయన గత ఎన్నికలకు ముందే టీడీపీకి రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం బీజేపీలో చేరారు. 2014 ఎన్నికలలో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. నాగం జనార్దనరెడ్డి కుమారుడు కూడా నాగర్‌కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత బీజేపీలో తన స్థానాన్ని పదిలపర్చుకోలేక నాగం అసంతృప్తితో ఉన్నారు. ఆ పార్టీలో తగిన గుర్తింపులేదనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరితే బాగుంటుందనే ఆలోచనతో కొంతకాలం క్రితం పావులు కదిపారు. తనతోపాటు కుమారుని రాజకీయ భవిష్యత్తు కోసం ఆ పార్టీ నాయకత్వాన్ని సంప్రదించారు. నాగం కాంగ్రెస్‌లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ పార్టీ పెద్దలకు తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నాగం రాకను సహించేది లేదని ఆమె తేల్చి చెప్పారు. నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్యతోపాటు ఎమ్మెల్సీ, నాగర్‌కర్నూలు ఇంచార్జి దామోదర్‌రెడ్డితో కలసి ఆమె ఏకంగా పార్టీ అధినేత రాహుల్‌ను కలిశారు. అయితే, అలాంటిదేమీ ఉండదన్న రాహుల్ హామీతో ఢిల్లీ నుంచి వచ్చిన డీకే అరుణ వర్గం, నాగం చేరికపై తాజా ప్రచారంతో అవాక్కయ్యారు. ఏకంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తీసుకుని నాగం ఢిల్లీలో రాహుల్‌ని కలసి లైన్ క్లియర్ చేసుకున్నారన్న వార్తలు రావడంతో అరుణ శిబిరం మళ్లీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి నాగంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితో అవగాహనతోనే నాగం పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన పార్టీలోకి వస్తే జిల్లాలో గ్రూపు రాజకీయాలు పెరగడం తప్ప ఒరిగేదేమీ లేదని అంటున్నారు. గత ఎన్నికలలో నాగం ఓడిపోయారని, ఆయన కొడుక్కి డిపాజిట్ రాలేదని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్న నాగంను ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అదే జరిగితే నాగర్‌కర్నూలు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల అభీష్టం మేరకు తాను నిర్ణయం తీసుకుంటానని దామోదర్‌రెడ్డి సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో డీకే అరుణ ఇమేజ్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే జైపాల్‌రెడ్డి నాగం చేరికను ప్రోత్సహిస్తున్నారని దామోదర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. పీసీసీ సుముఖం! మరోవైపు పీసీసీ నాయకత్వం మాత్రం నాగంను పార్టీలో చేర్చుకునే విషయంలో సుముఖంగానే ఉందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్‌అలీ ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో డీకే అరుణ వర్గానికి తేల్చిచెప్పారని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పీసీసీ నాయకత్వం ఆలోచనలకు అనుగుణంగా నాగం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా, డీకే అరుణ ఎలాంటి పావులు కదుపుతారు, ఒకవేళ నాగం పార్టీలో చేరితే పాలమూరు జిల్లా కాంగ్రెస్ రాజకీయాలెలా మారుతాయనేది ఆసక్తికరంగా మారింది. -
నాగంకు షాక్.. పార్టీలోకి వస్తే సహకరించం
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని ఆ పార్టీ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి అన్నారు. నాగం కాంగ్రెస్‌లోకి వస్తే పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. నాగం పార్టీలో చేరితే.. పార్టీకి నష్టమేనని అన్నారు. నాగం క్యాడర్ లేని లీడర్ అని ఎద్దేవా చేశారు. నాగంను అభ్యర్థిగా నిలబడితే.. ఆయన ఓడిపోవడం ఖాయమని అన్నారు. నాగంను పార్టీలోకి తీసుకుంటే.. తాము ఎట్టి పరిస్థితుల్లో సహకరించబోమని దామోదర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను, డీకే అరుణ, ఎంపీ నంది ఎల్లయ్య ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి నాగంను తీసుకోవడం వల్ల జరిగే పరిణామాలను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివరించామని తెలిపారు. నాగం, జైపాల్ రెడ్డి మధ్య అండర్ స్టాండింగ్ ఉందని, రేపు జైపాల్ రెడ్డి లోక్‌సభకు పోటీచేయకపోతేనే.. నాగంను కాంగ్రెస్‌లోకి తీసుకోవాలని షరతు పెట్టారు. నాగంను కావాలనే జైపాల్ రెడ్డి పార్టీలోకి తెస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో నాగం ఎంపీ అభ్యర్థిగా, ఆయన కొడుకును ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తే.. వారికి డిపాజిట్ కూడా రాలేదని అన్నారు. -
క్షేత్రస్థాయిలోనే అవినీతి బయటపెడతా
సాక్షి, నాగర్‌కర్నూల్: మూడేళ్లలోనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆ యన అనుచరులు తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, వీటిని ఆలయా ల వద్ద చ ర్చించడం కాదని, క్షేత్రస్థాయిలో నే చిట్టా విప్పుతానని బీజేపీ నేత నా గం జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం లో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే మర్రి తనను బహిరంగచర్చకు ఆహ్వానించి ఉమామహేశ్వరంలో వేదిక ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని, అవినీతి జరిగిన చోటే చర్చిద్దాం రమ్మని సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతిపై ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. తాను బహిరంగ చర్చలో పాల్గొనాల్సి వస్తే సీఎం కేసీఆర్‌తో కూర్చుని పాత్రికేయుల ముందే ఆయన బండారాలు బయట పెడతానని, సీఎంను తనతో బహిరంగ చర్చకు వచ్చేవిధంగా ఎమ్మెల్యే ఒప్పించాలని నాగం సూచించారు. ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా మర్రి జనార్దన్‌రెడ్డి రూ.12కోట్లు వెచ్చించి పేదలకు పెళ్లిళ్లు చేశానని ప్రకటించారని, ఒక్కో జంటకు ఎంత ఖర్చు చేశారో లెక్క చూపించాలన్నారు. రూ.12కోట్లు ఖర్చు చేస్తున్న ఎమ్మెల్యే పెళ్లిళ్లు చేసుకున్న జంటలకు ఏ మేరకు ఉపాధి అవకాశాలు కల్పించారో బయట పెట్టాలన్నారు. రాంచంద్రారెడ్డి, అర్థం రవి, కాశన్న, నసీర్ ఉన్నారు. -
సీఎం కేసీఆర్‌తోనే నా సవాల్: నాగం
సాక్షి, నాగర్‌కర్నూలు: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఏ ప్రాజెక్టును తాను అడ్డుకోవడం లేదని, కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపైనే పోరాడుతున్నానని సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌తోనే నా సవాల్ అని, టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి వదలబోనని నాగం అన్నారు. కేసీఆర్ వస్తానంటే తాను ప్రభుత్వ అవినీతిపై చర్చకు సిద్ధమన్నారు. ‘ఆధారాలతో సహ వస్తా.. నా ప్రశ్నలకు సమాధానం చెప్తారా’ అని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సెటిల్మెంట్లపై పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. మార్కెట్ యార్డు భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, రోడ్డు కోసం దానం చేయడానికి ఎమ్మెల్యే మర్రి ఎవరు అని ఆయన ప్రశ్నించారు. నమస్తే తెలంగాణ పత్రికకు చందదారులను పెంచేందుకు ఎమ్మెల్యే మర్రి మార్కెట్ యార్డు నుంచి లక్ష రూపాయల మేర చందదారులను నమోదు చేయించాడని ఆరోపించారు. -
హస్తినకు చేరిన హస్తం రాజకీయం!
సాక్షి, నాగర్‌కర్నూల్ : కందనూలు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఢిల్లీకి చేరారు. నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై అధిష్టానం దగ్గర తాడోపేడో తేల్చుకునేందుకు నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య నేతృత్వంలో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బీరం హర్షవర్ధన్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లారు. మాజీ మంత్రి డీకే అరుణ సైతం అధిష్టానానికి ఇక్కడి పరిస్థితులను వివరించేందుకు వీరితోపాటు ఉన్నారు. నాగంను పార్టీలోకి తెచ్చేందుకు జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత నేరుగా అధినేత రాహుల్‌గాంధీతో చక్రం తిప్పుతున్నారని, సదరు నేత తన నియోజకవర్గంలో ఎందుకు కల్పించుకుంటున్నారని ఎంపీ నంది ఎల్లయ్య ఆయన విషయాన్ని అధిష్టానం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియాను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అంతటితో ఆగకుండా నేరుగా రాహుల్‌గాంధీని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, రెండు నెలలుగా ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నానని ప్రచా రం చేసుకోవడం వల్ల ఇటు నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో, అటు కొల్లాపూర్ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు అయోమయానికి లోనవుతున్నారని కుంతియా దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు నాగం జనార్దన్‌రెడ్డి తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సన్నిహితులతో చెప్పుకుంటుండడంతో తాను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి అడిగామని, తనకేమీ తెలియదని ఆయన చెప్పడంతో ఢిల్లీకి వచ్చానని ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి ఫోన్ లో ‘సాక్షి’కి వివరించారు. 20ఏళ్లుగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో పరాభవాలను లెక్కచేయకుండా పార్టీ కార్యకర్తల అభిమానంతో రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఇప్పుడు నాగం జనార్దన్‌రెడ్డి వస్తే కాంగ్రెస్ పార్టీని ఆయన చేతుల్లో ఎలా పెడతామని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. ఎవరు అంగీకరించినా కార్యకర్తలు మాత్రం నాగంని అంగీకరించరని, ఆయన కాంగ్రెస్ కార్యకర్తలపై పెట్టిన కేసులు, చేయించిన దాడులను ఇప్పటికీ మర్చిపోలేదని గుర్తు చేశారు. కొల్లాపూర్కూ రానివ్వం.. నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి నాగర్‌కర్నూల్ కాకపోతే కొల్లాపూర్‌లో పోటీ చేస్తారన్న ప్రచారం వెనక కుట్ర దాగి ఉందని కొల్లాపూర్ కాంగ్రె స్ నియోజకవర్గ ఇన్చార్జి హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. నాగం ప్రధాన అనుచరుడైన జగదీశ్వర్‌రావు కాంగ్రెస్ పార్టీలో చేరాక తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటుండడంతో ఇదివరకే ఈ అంశాన్ని డీకే అరుణ దృష్టికి తీసుకొచ్చామని, ఆమె సైతం దీనిని ఖండించారని గుర్తు చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ఈ విషయం అధిష్టా నం ఇప్పుడే తేలిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని ఆయ న వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో తనకే టికెట్ వస్తుందని చెప్పారు. పార్టీ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనడంతో పాటు గత ఎన్నికల్లో మంత్రి కృష్ణారావు చేసిన కుట్రల ద్వారా పరాజయం పాలైనా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలతో మమేకమై పనిచేస్తూ వస్తున్నానని వివరించారు. మరోవైపు నాగం జనార్దన్‌రెడ్డి పార్టీలోకి రాకుండా డీకే అరుణ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి మధ్య గొడవలు తారాస్థాయిలో ఉన్న విషయం అంద రికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడి నేతలిద్దరూ అరుణ మద్దతుతో రాహుల్‌గాంధీని కలుస్తుండడంతో వార్తలు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు, అటు జిల్లా రాజకీయ నాయకుల్లో ఆసక్తికరంగా మారాయి. -
అలాగైతే బీజేపీకి కష్టమే: పార్టీ నేత నాగం
సాక్షి, హైదరాబాద్: తీవ్ర అసంతృప్తితో ఉన్న బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మరోసారి ఆ పార్టీపై వ్యాఖ్యలుచేశారు. తెలంగాణ బీజేపీలో చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం బీజేపీ నేత నాగం మీడియాతో మాట్లాడారు. అనుచరులు, అభిమానుల సూచన మేరకు తాను బీజేపీని వీడుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ మిత్ర పక్షంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. అవినీతిపై తాను పోరాడుతున్నా పార్టీ సహకరించడం లేదని, కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్తో దోస్తీ వల్ల బీజేపీకి నష్టం కలుగుతుందన్నారు. తెలంగాణలో కాస్తో కూస్తో అధికార టీఆర్ఎస్కు ప్రత్యామ్నయం కాంగ్రెస్ పార్టేనని బీజేపీ నేత అభిప్రాయపడ్డారు. ఈ ఉగాది తర్వాత పార్టీ మార్పుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. తనలాంటి అనుభవజ్ఞుడికి బీజేపీలో అనేక సందర్భాల్లో అవమానాలకు గురి కావాల్సి వచ్చిందన్నారు. 2019 ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తానని, ఇవే తనకు చివరి ఎన్నికలని నాగం ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. -
బీజేపీకి నాగం గుడ్‌బై
సాక్షి, నాగర్‌కర్నూల్: తాను బీజేపీని వీడుతున్నట్లు మాజీ మంత్రి, ఆ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి ప్రకటించారు. అనుచరులు, అభిమానుల సూచన మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నాగర్‌కర్నూల్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీలో అనేక సందర్భాల్లో అవమానాలకు గురి కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి అనుభవజ్ఞుడిని ఆ పార్టీ వినియోగించుకోలేక పోయిందన్న బాధ ఉందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంపై తాను రాజీలేని పోరాటం చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు మరోసారి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందుకుగాను కేసీఆర్ వ్యతిరేక శక్తులతో చేతులు కలపాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ పార్టీలో చేరేది అభిమానులు, నియోజకవర్గాల ప్రజలతో చర్చించి త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. 2019 ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తానని, ఇవే తనకు చివరి ఎన్నికలని నాగం పేర్కొన్నారు. -
పార్టీ మారడంపై త్వరలో నిర్ణయం : నాగం
సాక్షి, హైదరాబాద్ : పార్టీ మారడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని, ప్రస్తుతం తాను బీజేపీలోనే ఉన్నానని నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఉగాది అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుకుంటానని నాగం పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం తీరుపై తన అనుచరులు, కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల వాగ్దానాలను కేసీఆర్ అమలు చేయలేదని నాగం మండిపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి కుటుంబం కేసీఆర్‌దేనని ఆయన విమర్శించారు. సకాలంలో పంచాయితీ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. కాగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గాన్ని 30 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన నాగం జనార్దన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం బీజేపీలో కీలకనేతగా ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆయన దిగుతారన్న ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్‌లో తాను చేరుతున్నట్లు వస్తున్న వార్తలను నాగం ఖండిస్తు వస్తున్న విషయం తెలిసిందే. అయితే నాగం తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
ఈఅండ్ఎం ధరల పెంపులో మోసం
సాక్షి, హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(పీఆర్ఎల్ఐఎస్) ఎలక్ట్రో మెకానికల్ (ఈఅండ్ఎం) పరికరాల ధరలను పెంచడాన్ని సవాలు చేస్తూ బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఇస్కీ) ఇచ్చిన ధరలను పక్కన పెట్టి డిపార్ట్మెంటల్ కమిటీ సలహాదారు చెప్పిన ప్రకారం ఈఅండ్ఎం పరికరాల ధరను మోసపూరితంగా పెంచారని, దీనివల్ల ఖజానాకు రూ.2,426 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని, దీనిపై దర్యాప్తు జరిపేలా సీబీఐని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. అలాగే 1,5,8,16 ప్యాకేజీలకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ కూడా రద్దు చేయాలని.. పంపులు, మోటార్లతో పాటు ఈఅండ్ఎం పరికరాలకు ఎటువంటి మొత్తాలను విడుదల చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. జనార్దన్‌రెడ్డి ఈ వ్యాజ్యాన్ని పార్టీ ఇన్ పర్సన్‌గా దాఖలు చేశారు. న్యాయవాదితో నిమిత్తం లేకుండా ఆయనే స్వయంగా వాదనలు వినిపించనున్నారు. -
నాగం వైపే అందరి చూపు..
సాక్షి, నాగర్‌కర్నూల్: స్థానిక సంస్థలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆయా పార్టీలు తమ బలాబలాలను పెంచుకునే ప్రయత్నం మొదలుపెట్టాయి. తమ అనుకూలతలు, ప్రతికూలతలపై అంచనాలు వేసుకుని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలు పు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇటు అధికార టీఆర్ఎస్ తమ పార్టీకి వలస వచ్చిన వారిని తిరిగి వెళ్లకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరికి వారు ఆయా నియోజకవర్గాలలో తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు, ఆ తర్వా త ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి నేతలు, ప్రజాప్రతినిధులు వలస బాటపట్టారు. ముఖ్యంగా టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల నుంచి అధికార టీఆర్ఎస్లో చేరుతూ వస్తున్నారు. ఇన్నాళ్లూ పెద్దగా పట్టించుకోని ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ అంశంపై దృష్టి సారిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి నయానో భయానో ఒప్పించి పాత వారికి మళ్లీ పార్టీ కండువా కప్పాలని ప్రయత్నాలు జోరుగా మొదలుపెట్టాయి. దీంతో అధికార పక్షమూ అప్రమత్తమైంది. ఇతర పార్టీల నుంచి వచ్చి న వారిని బుజ్జగిస్తున్నారు. దీంతో వలసనేతలు ఏది బెటరో తేల్చుకునే పనిలో తలమునకలవుతున్నారు. కల్వకుర్తిలో వలసల పరంపర కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అనూహ్యంగా గెలుపొందిన వంశీచంద్‌రెడ్డికి వలసల తలనొప్పి నేటికీ తప్పడం లేదు. తాజాగా నగర పంచాయతీ చైర్మన్‌తో పాటు ఆ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు కారెక్కారు. నగర పంచాయతీలో ఆరుగురు సభ్యులు ఉన్న కాంగ్రెస్ బలం ఒకటికి పడిపోయింది. ఎమ్మెల్యే వంశీచంద్ గెలుపులో కీలక పాత్ర పోషించిన సుదర్శన్‌రెడ్డి, చింతా రాంమోహన్‌రెడ్డిలు సైతం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. జెడ్పీటీసీ అశోక్‌రెడ్డి, ఎంపీపీ రామేశ్వరమ్మ కాంగ్రెస్ నుంచి గెలుపొందినప్పటికీ ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్లో చేరారు. అలాగే కాంగ్రెస్‌కు చెందిన సర్పంచ్ కరుణశ్రీ, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, కలకొండ మాజీ సర్పంచ్, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సన్నిహితుడైన పవన్‌కుమార్‌రెడ్డి కూడా పార్టీ మారారు. తలకొండపల్లి జెడ్పీటీసీ, ఎంపీపీలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా అధికార పార్టీకి కాంగ్రెస్ నుంచి వలసల పరంపర కొనసాగుతూ వచ్చింది. ఎవరెటు వెళ్లినా తమకేమీ ఇబ్బందులు లేవన్న ధీమా మాత్రం కాంగ్రెస్‌లో ఉంది. ఇదే నియోజకవర్గంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితో పాటు మరో మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, కేవీఎన్ రెడ్డి కీలక నాయకులుగా గుర్తింపు పొందారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంపై తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. అచ్చంపేటలో టీడీపీ నుంచి భారీ వలసలు అచ్చంపేట నియోజకవర్గంలో ఇటీవలి టీడీపీ నుంచి భారీగా టీఆర్ఎస్లోకి వలసలు చోటుచేసుకున్నాయి. అచ్చంపేట ఎంపీపీ పర్వతాలు, జెడ్పీటీసీ సభ్యుడు కె.రామకృష్ణారెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు నర్సింహారెడ్డి, కొండనాగులకు చెందిన చంద్రమోహన్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బల్మూర్ జెడ్పీటీసీ సభ్యుడు ధర్మానాయక్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా ఉప్పునుంతల ఎంపీపీ అరుణమ్మ, అమ్రాబాద్ ఎంపీపీ రామచంద్రమ్మ, వంగూరు ఎంపీపీ భాగ్యమ్మ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నియోజకవర్గంలో ఇటు కాంగ్రెస్, అటు టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వలస వచ్చారు. వీరితోపాటు టీడీపీ ముఖ్య నేతలు పోకల మనోహర్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు తులసీరాం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా వారి అనుచరులైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పెద్దఎత్తున అధికార పార్టీలో చేరారు. వలస వెళ్లిన వారిని తిరిగి రావాలని టీడీపీ ఎలాంటి ప్రయత్నాలు చేయనప్పటికీ.. కాంగ్రెస్ మాత్రం తిరిగి తమ నేతలను పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ అందరితో టచ్‌లో ఉంటున్నారు. కచ్చితంగా ఈసారి స్థానిక సంస్థలలో మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో మంత్రిగా పనిచేస్తూ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. దీంతో కాంగ్రెస్‌లోని ఆయన అనుచరులంతా టీఆర్ఎస్లో చేరారు. అంతకుముందు ఇతర పార్టీలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మంత్రి జూపల్లి తనపై కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన విష్ణువర్ధన్‌రెడ్డిని సైతం ఆ తర్వాత టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యతిరేకులను కూడగట్టి తమ విజయం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తోంది. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి ఈసారి తన కుమారుడు కూచకుళ్ల రాజేష్‌ను ఎమ్మెల్యే బరిలో దించుతున్నట్లు తన సన్నిహితులకు చెబుతూ వస్తున్నారు. దామోదర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం ఇంకా మిగిలి ఉండడంతో అసెంబ్లీ బరిలో తన కుమారుడిని దింపడం ద్వారా కేడర్‌లో ఉత్సాహాన్ని నింపాలని చూస్తున్నారు. ఇందుకు సంబంధించి రాజేష్ కూడా ఆసక్తి చూపుతుండడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార టీఆర్ఎస్లోకి మరిన్ని వలసలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాగం వైపే అందరి చూపు నాగర్‌కర్నూల్ నియోజకవర్గాన్ని 30ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన నాగం జనార్దన్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం బీజేపీలో కీలకనేతగా ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆయన దిగుతారన్న ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్‌లో తాను చేరుతున్నట్లు వస్తున్న వార్తలను నాగం ఖండిస్తున్నారు. బీజేపీకి గ్రామ, మండల స్థాయిలో కేడర్‌ను పెంచుకునేందుకు నాగం తనదైన వ్యూహంతో ముందుకు దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో చివరి నిమిషంలో అద్భుతం జరుగుతుందని నాగం తన సన్నిహితులతో చెబుతూ వస్తున్నారు. -
రైతులకు ఇంత దుస్థితి ఏనాడూలేదు: నాగం
సాక్షి, హైదరాబాద్: రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు గతంలో ఏనాడూ లేవని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. పార్టీ నేతలు ప్రేమేందర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, పుష్పలీలతో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతుల సమస్యలు తెలుసుకోవడానికి పార్టీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించాయని వెల్లడించారు. పుస్తెలు కుదువబెట్టి వ్యవసాయంలో పెట్టుబడికోసం అప్పులు చేశారని, ఇప్పుడేమో పంట అమ్మితే వచ్చిన ఆదాయం కూలీలకు కూడా సరిపోవడంలేదన్నారు. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. కాగా, పదవులకోసం పార్టీ మారే స్థాయి తనది కాదని, పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని నాగం స్పష్టం చేశారు. మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య పరిష్కారంకోసం మంగళవారం తమ పార్టీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టామన్నారు. పుష్పలీల మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధిలేదని విమర్శించారు. -
రేవంత్‌కు మంచి పదవి... కాంగ్రెస్‌లోకి నాగం?
సాక్షి, హైదరాబాద్ : ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి చేరిన రేవంత్‌రెడ్డికి, ఆయనతో కలిసివచ్చిన నేతలకు చల్లటి కబురు చెప్పారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి. 2019 ఎన్నికల దృష్ట్యా పార్టీలో రేవంత్‌కు మంచి పదవి దక్కుతుందని, సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, విజయరమణారావు, అరికెల నర్సారెడ్డిలకు ఎమ్మెల్యే టికెట్లు ఖాయమని ఉత్తమ్ చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా చిట్ చాట్‌తో మాట్లాడిన ఆయన పలు అంశాలతోపాటు నాగం చేరికపైనా స్పందించారు. అన్నిస్థానాల్లో పోటీ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, ఆయన తనయుడు రామారావులు ప్రాతినిథ్యం వహిస్తోన్న గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారని ఉత్తమ్ కుమార్ గుర్తుచేశారు. ఇక హరీశ్‌రావు నియోజకవర్గం సిద్ధిపేటలో బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీలకు చెందిన మరికొంత మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆ మేరకు సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాము అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోకి నాగం? : ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతోన్న పాలమూరు నేత నాగం జనార్థన్‌రెడ్డి త్వరలోనే హస్తం గూటికి చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే అంశాన్ని మీడియా ఉత్తమ్ వద్ద ప్రస్తావించగా.. సమాధానాన్ని దాటవేశారు. ‘‘నాగం చేరికపై నేను మాట్లాడలేను. నో కామెంట్’ అని అన్నారు. ‘కాంగ్రెస్‌లో చేరిక’ వార్తలను నాగం గతంలోనే ఖండించారు. అయినాసరే, పదే పదే ఆయన చేరికపై ప్రశ్నలు వినిపిస్తుండటం గమనార్హం. -
'సీఎం పొలంబాట పట్టాలి'
సాక్షి, హైదరాబాద్: రైతుల కష్టాలు అర్థం కావాలంటే సీఎం పొలంబాట పట్టాలని బీజేపీ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఈ ఏడాది చాలా మంది రైతులు పత్తిసాగు చేశారు. కాయ పగిలే సమయంలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి వారికి తగిన పరిహారం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ భీమా పథకాన్ని రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
లడ్డూ అధరహో...!
♦ నగర వ్యాప్తంగా గణేశ్ లడ్డూ వేలం పాటలు ♦ బాలాపూర్‌లో ఉత్కంఠ.. ♦ రూ.15.6 లక్షలకు దక్కించుకొన ్న నాగం తిరుపతిరెడ్డి ♦ రూ. 5.70 లక్షలు పలికిన బడంగ్పేట్ లడ్డూ సాక్షి, సిటీబ్యూరో: గణపతి నిమజ్జనం సందర్భంగా గ్రేటర్ నలుచెరుగులా మంగళవారం లడ్డూ వేలం పాటలు హోరాహోరీగా జరిగాయి. భక్త సమాజాలకు రూ.లక్షల మేర కాసుల వర్షం కురిపించాయి. కోరిన కోర్కెలు తీర్చే లంబోదరుడి లడ్డూలను రూ. లక్షలు వెచ్చించి సొంతం చేసుకొనేందుకు సిటీజన్లు మక్కువ చూపారు. రూ.50 వేల నుంచి రూ.15.60 లక్షల వరకు లడ్డూ ప్రసాదాలను దక్కించుకునేందుకు రియల్టర్లు, బిల్డర్లు, వ్యాపారులు ఎవరి స్థాయిలో వారు పోటీ పడ్డారు. వేలంపాట ద్వారా వచ్చిన ఆదాయాన్ని ధార్మిక, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను వినియోగించనున్నట్లు ఆయా భక్తమండళ్ల ప్రతినిధులు తెలిపారు. బాలాపూర్ లడ్డూ.. రూ. 15.6 లక్షలు భక్తుల కొంగు బంగారంగా విశేష ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డూ వేలాన్ని ఉదయం 10 గంటలకు ఉత్సవ కమిటీ సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మొత్తం 20 మంది వేలం పాటలో పాల్గొన్నారు. రూ.1116 నుంచి మొదలైన పాట..నిమిషాల వ్యవధిలో వేలు..లక్షలు దాటి.. రూ. పది లక్షలకు చేరింది. బాలాపూర్ గ్రామానికి చెందిన మహేందర్‌రెడ్డి (నాగార్జున స్టీల్), నాగం తిరుపతిరెడ్డిల మధ్య హోరాహోరీగా జరిగిన పోటీలో రూ.15.60 లక్షలకు లడ్డూను నాగం తిరుపతి రెడ్డి దక్కించుకున్నారు. ఆయనను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. శిరస్సున లడ్డూ ప్రసాదం ధరించిన తిరుపతిరెడ్డిని డప్పుదరువు, మేళతాళాలతో స్థానిక వేంకటేశ్వర ఆలయానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. గతేడాది లడ్డూను దక్కించుకున్న స్కైలాబ్‌రెడ్డిని కూడా ఉత్సవ కమిటీ ప్రతినిధులు సన్మానించారు. అరగంట పాటు ఉత్కంఠగా సాగిన ఈ వేలంపాటను తిలకించేందుకు అశేషభక్తవాహిని బాలాపూర్ గ్రామానికి చేరుకోవడంతో గ్రామానికి దారితీసే దారులన్నీ కిక్కిరిశాయి. ఘనంగా గణనాథుని ఊరేగింపు... అంతకు ముందు ఉదయం 5 గంటలకే బాలాపూర్ గణనాథున్ని గ్రామంలో ముఖ్యవీథుల్లో ఊరేగించారు. బ్యాండు మేళాలు, డప్పుకళాకారుల నృత్యాలు, భజనబృందాల ఆటపాటలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణాశాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత్‌రావు, బద్దం బాల్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, దైవజ్ఙశర్మ తదితరులు పాల్గొన్నారు. ఐదేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా.. బాలాపూర్ లడ్డూ ప్రసాదం దక్కించుకునేందుకు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నా. 2013 ఈ లడ్డూను దక్కించుకున్న తీగల కృష్ణారెడ్డి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికవడం నన్ను విశేషంగా ఆకర్షించింది. నేను కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నా. గతంలో ఈ లడ్డూ దక్కించుకున్న వారిని ఎన్నో విజయాలు వరించాయి. అదే స్ఫూర్తితో ఈ సారి ఎలాగైనా ఈ ప్రసాదాన్ని దక్కించుకోవాలని వేలం పాటలో పాల్గొన్నా. ఈ లడ్డూ ద్వారా వచ్చిన ఆదాయా న్ని గ్రామస్తులు సేవా కార్యక్రమాలు, ఆలయం అభివృద్ధికి వినియోగిస్తుండటం గొప్ప విషయం. – నాగం తిరుపతిరెడ్డి, బాలాపూర్ లడ్డూ విజేత కూలీ స్థాయి నుంచి ఎదిగా... దినసరి కూలీ స్థాయినుంచి గణపతి ఆశీస్సులతో అభివృద్ధి చెందా. వీరాంజనేయ భక్తసమాజం లడ్డూను దక్కించుకోవడంతో కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తున్నాయి. ఈ సారితో కలిపి మొత్తం ఐదుసార్లు బడంగ్‌పేట లడ్డూను దక్కించుకున్నా. మళ్లీ లడ్డూను వేలంలో కైవసం చేసుకోవడం ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం సాకారమైనపుడు ఈ లడ్డూను వేలం పాటలో దక్కించుకొని కేటీఆర్‌కు కానుకగా ఇచ్చా. ఈసారి కూడా మంత్రి కేటీఆర్‌కు కానుకగా ఇస్తా. – కర్రె కృష్ణ ,బడంగ్పేట్ లడ్డూ ప్రసాద విజేత బడంగ్పేట్ @ రూ.5.70 లక్షలు బడంగ్‌పేట గణపయ్య లడ్డును ఈ సారి రూ.5.70 లక్షలకు టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కర్రె కృష్ణ దక్కించుకున్నారు. గ్రామానికి చెందిన రాములమ్మ నందు, పెద్దబావి పార్వతమ్మ అండ్ సన్స్, కర్రె కృష్ణల మధ్య వేలం పాట ఉత్కంఠగా సాగింది. చివరకు కర్రె కృష్ణ రూ.5.70 లక్షలకు లడ్డూ ప్రసాదాన్ని దక్షించుకున్నారు. ఆయనను ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. గతంలో కర్రె కృష్ణ ఇదే లడ్డూ ప్రసాదాన్ని తొలిసారి 55 వేలకు, రెండోసారి రూ.70 వేలకు, మూడోసారి రూ.4 లక్షలకు, నాలుగోసారి రూ.5.15 లక్షలకు, ఈసారి రూ.5.70 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది ఈ లడ్డూ రూ.5.40 లక్షలు పలికిది. ఈ సారి రూ.30 వేలు ఎక్కువకు పాడుకున్నారు. అనంతరం డప్పు వాయిద్యాలు, కోలాటాలు, కోయ నృత్యాల మధ్య బడంగ్‌పేట గణనాథుడ్ని గ్రామంలో ఊరేగించి నిమజ్జనానికి తరలించారు. -
బాలాపూర్ లడ్డూ అ’ధర’హో...!