raghava lawrence
-
కాంచనలో కన్ఫార్మ్?
కోలీవుడ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లున్నారు హీరోయిన్ పూజా హెగ్డే. ఇప్పటికే విజయ్, సూర్య హీరోలుగా నటిస్తున్న తమిళ చిత్రాల్లో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు 2025లో విడుదల కానున్నాయి. కాగా ఈ బ్యూటీ మరో తమిళ సినిమా ‘కాంచన 4’లో నటించనున్నారని కొన్ని రోజులుగా ఓ వార్త ప్రచారంలో ఉంది.ఈ వార్త నిజమేనని, పూజా హెగ్డే దాదాపు ఖారారయ్యారని సమాచారం. రాఘవా లారెన్స్ నటించి, దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే ఓ డెవిల్ రోల్ చేయనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఈ హారర్ మూవీ గురించి ఓ అప్డేట్ రానుంది. -
సాయం చేస్తానంటూ రాఘవ లారెన్స్ పేరుతో మోసం
కోలీవుడ్ నటుడు,కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ పేరు చెప్పుకుని పలు మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుపేదలకు లారెన్స్ సాయం చేస్తూ చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు దానినే ఆసరాగ చేసుకున్న ఈ కేటుగాడు పేదల నుంచి డబ్బు దోచుకునే ప్లాన్ వేశాడు.పోలీసులు తెలుపుతున్న ప్రకారం.. చెన్నైలోని ఎగ్మూర్‌కి చెందిన వీరరాఘవన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లారెన్స్ పేరుతో తనను మోసం చేశారని ఆయన చెప్పడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి తనకు మొదట ఫోన్‌చేసి తాను రాఘవ లారెన్స్ వద్ద సహాయకుడిగా పనిచేస్తానని చెప్పి నమ్మించాడని వాపోయాడు. లారెన్స్ స్వచ్ఛంద సంస్థను ప్రారంభిస్తున్నారని, అందులో మీ బిడ్డ చదువు ఖర్చు మొత్తం వారే భరిస్తారని చెప్పి ఆపై అందుకుగాను రూ.8,457 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని కోరాడు. దీంతో తాను ఆ నగదు ఫోన్ పే ద్వారా చేశానన్నాడు.అయితే, రెండురోజుల తర్వాత మళ్లీ అతను చెప్పిన మాటలు నమ్మి రెండు దపాలుగా రూ.2,875, రూ.50 వేలు పంపినట్లు తెలిపాడు. కానీ, అతనిపై అనుమానం కలగడంతో తన నగదు తిరిగివ్వాలని కోరడంతో అసలు నిజం బయటపడిందని వాపోయాడు. చాలాసార్లు కాల్ చేస్తున్నా కూడా రెస్పాండ్ కాకుండా సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వేలూర్‌లో ఉన్న దినేష్‌కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారించారు. ఎగ్మూర్ కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకి అతన్ని తరలించారు. -
లోకేష్ కనకరాజ్ చిత్రానికి కొత్త సంగీత దర్శకుడు
మాస్టర్, విక్రమ్,లియో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో స్టార్ దర్శకుడిగా మారిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా 'కూలీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ కనకరాజ్ ఇంతకు ముందే నిర్మాతగా మారి ఒక చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసేశారు. కాగా తాజాగా రాఘవ లారెన్స్ కథానాయకుడిగా 'బెంజ్' అనే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ కథను అందించినప్పటికీ ఈ చిత్రానికి రెమో (శివకార్తికేయన్), సుల్తాన్ (కార్తి) చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియోను నటుడు లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రం ద్వారా నూతన సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌ను పరిచయం చేస్తున్నారు. గతంలో ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాష్ కుమార్, సత్య.సీ వద్ద పలు చిత్రాలకు ఆయన పనిచేశారు. అదే విధంగా కట్చిచేర, ఆశ కూడ వంటి ప్రైవేట్ ఆల్బమ్‌లో పాడి సంగీతాన్ని అందించి పాపులర్ అయ్యారనేది గమనార్హం. లోకేష్ కనకరాజ్ నిర్మిస్తున్న బెంజ్ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా సీనీ రంగప్రవేశం చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఇంతకంటే మంచి అవకాశం తనకు రాదన్నారు. దీంతో ఉత్సాహంతో, మరింత బాధ్యతగా పని చేస్తున్నానన్నారు. ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయి సంగీతాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. -
రాఘవ లారెన్స్ బర్త్ డే.. గ్లింప్స్ అదిరిపోయింది!
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ మరో యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇన్నాసి పాండియన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌పై కదిరేశన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో బుల్లెట్ బండి మూవీ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.గ్లింప్స్ చూస్తుంటే ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్‌లో యాక్షన్ సీన్స్, ఫైట్ సీక్వెన్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో ఎల్విన్, వైశాలి, సింగంపులి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. -
భారీ బడ్జెట్‌తో ‘కాల భైరవ’.. ఆసక్తికరంగా రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్!
కోలీవుడ్ హీరో రాఘవా లారెన్స్ కొత్త సినిమాను ప్రకటించాడు. ‘రాక్షసుడు’, ‘ఖిలాడి’లాంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన రమేశ్ వర్మ దర్శకత్వంలో తన 25వ సినిమాను చేయబోతున్నాడు. లారెన్స్ బర్త్‌డే(అక్టోబర్ 29)సందర్భంగా నేడు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘కాల భైరవ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు నిర్మాతలు కోనేరే సత్యనారాయణ, మనీష్ షా తెలిపారు. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కథతో గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఆడియెన్స్ అందించేలా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2025 వేసవిలో సినిమాను విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్నివివరాలను మేకర్స్ తెలియజేస్తారు. -
రియల్ హీరోకు కేరాఫ్ అడ్రస్ మీరే.. బర్త్ డే రోజు ఏం చేశారంటే?
కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ ప్రస్తుతం ఓ యాక్షన్ అడ్వెంచరస్ మూవీలో నటిస్తున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్‌పై కోనేరు సత్యానారాయణ నిర్మించనున్నారు. ఇందులో రాఘవ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతేడాది జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాతో అలరించిన సంగతి తెలిసిందే. అయితే రాఘవ లారెన్స్ సినిమాల్లో మాత్రమే హీరో కాదు.. రియల్ లైఫ్‌లోనే హీరోనే. ఇప్పటికే ఆయన తన మాత్రం ఫౌండేషన్ ద్వారా పేదలు, రైతులకు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు వికలాంగులు, రైతులు అవసరమైన ట్రాక్టర్లు, త్రీవీలర్స్ అందజేశారు. ఇవాళ తన బర్త్ డే కావడంతో పేద వితంతు మహిళలకు అండగా నిలిచారు. వారికి కుట్టు మిషన్స్ అందించి వారి కళ్లలో ఆనందం నింపారు. ఈ విధంగా సాయం అందించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు రాఘవ లారెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. Hi friends and fans, During my Mataram journey many widowed women requested for a stitching machine as it would give them an opportunity to work and fulfill their daily needs. As a new venture for my birthday tomorrow. I provided Tailoring machines to widowed women. I need all… pic.twitter.com/1vHBCcE1GQ— Raghava Lawrence (@offl_Lawrence) October 28, 2024 -
లీక్డ్ వీడియోతో ఒవియా వైరల్.. బిగ్ ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో
ఒవియా హెలెన్.. కొద్దిరోజులుగా ఈ బ్యూటీ పేరు సౌత్ ఇండియాలో భారీగా ట్రెండ్ అవుతుంది. కేరళకు చెందిన ఒవియా తమిళ చిత్ర పరిశ్రమలో రాణిస్తుంది. తమిళ బిగ్‌బాస్ సీజన్ 1లో పాల్గొని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆమెకు సంబంధింఇచన లీక్డ్ వీడియో అంటూ ఒకటి నెట్టింట షేర్ అవుతుంది. ఇలాంటి సమయంలో ఒవియా ఫోటోను లారెన్స్ షేర్ చేస్తూ సినిమా ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కాంచన' ప్రాంచైజీ చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు సుమారు 3 చిత్రాలు విడుదలయ్యాయి. అవన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. అయితే, 'కాంచన 4' ప్రాజెక్ట్‌ను త్వరలో లారెన్స్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో ఒవియాకు కీలక పాత్రను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంచన 3 షూటింగ్ సమయంలో వారిద్దరూ కలిసి తీసుకున్న ఒక ఫోటోను తాజాగా ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం తీవ్రంగా ట్రోల్‌కు గురౌతున్న ఒవియాకు లారెన్స్ మరో సినిమా ఛాన్స్ ఇచ్చారంటూ ఆయన అభిమానులు మెచ్చుకుంటున్నారు. కాంచన బొట్టుతో ఉన్న ఒవియా ఫోటో నెట్టింట భారీగా వైరల్ అవుతుంది. లారెన్స్ దర్శకత్వంలో 2011లో విడుదలైన 'కాంచన' భారీ విజయాన్ని సాధించింది. హారర్ కామెడీ జానర్లో ట్రెండ్‌ని సెట్ చేసిన ఈ సినిమా 2015లో రెండో పార్ట్‌ను రిలీజ్ చేశారు. అది కూడా మంచి సూపర్ హిట్ కావడంతో 2019లో 'కాంచన-3'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మళ్లీ భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ చిత్రం ఈ నవంబర్‌లో నాలుగో భాగం షూటింగ్ ప్రారంభించనున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే, అదికారికంగా మాత్రం ప్రకటన వెలువడలేదు. మూడు భాగాల్లో లారెన్స్ ప్రధానపాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించారు. కోవై సరళ, శరత్‌కుమార్ గత మూడు చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Raghava Lawrence Fans (@raghavalawrenceoffl) -
రాఘవా లారెన్స్‌తో పూజా హెగ్డే జోడీ!
రాఘవా లారెన్స్ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్‌పై కోనేరు సత్యానారాయణ నిర్మించనున్నారు. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు కీర్తీ సురేష్, పూజా హెగ్డే, రకుల్‌ప్రీత్ సింగ్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. (చదవండి: కంగువా రిలీజ్ వాయిదా.. రజనీకాంత్ కోసమే!)అయితే పూజా హెగ్డే కన్ఫార్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. మరి... రాఘవా లారెన్స్‌తో పూజా హెగ్డే జోడీ కడతారా? అంటే కొంత సమయం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నవంబరులో చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాని రిలీజ్ చేయాలను కుంటున్నారు. అలాగే హిందీ హిట్ ఫిల్మ్ ‘కిల్’ సినిమాకు తమిళ రీమేక్‌గా రాఘవా లారెన్స్ 25వ చిత్రం రూపొందుతోందని కోలీవుడ్ టాక్. -
యాక్షన్‌కి సై
రాఘవ లారెన్స్ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఏ స్టూడియోస్ ఎల్ఎల్పీ, నీలాద్రిప్రోడక్షన్స్, హవీష్ప్రోడక్షన్స్పై కోనేరు సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. ‘‘బిగ్ యాక్షన్ అడ్వంచరస్‌గా రూపొందనున్న చిత్రమిది. రాఘవా లారెన్స్ కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కనుంది.‘రాక్షసుడు, ఖిలాడీ’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత రమేశ్ వర్మ, కోనేరు సత్యనారాయణ కాంబినేషన్లో రానున్న మూడో సినిమా ఇది. భారీ వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాలు త్వరలోనే ప్రకటిస్తాం. నవంబర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి 2025 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని మేకర్స్ తెలిపారు. -
నాగార్జున 'మాస్' రీ-రిలీజ్ ట్రైలర్ చూశారా..?
అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా 'మాస్' సినిమా రీ-రిలీజ్ కానుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి 4k వర్షన్లో ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నాగార్జున సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ తెరకెక్కించిన 'మాస్' సినిమా 2004లో విడుదలైంది. సుమారు 20 ఏళ్ల తర్వాత.. ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందు ఆగష్టు 28న రీ-రిలీజ్ కానుంది. ఈ సినిమాలో జ్యోతిక, చార్మికౌర్, రఘువరన్, ప్రకాష్‌రాజ్, రాహుల్ దేవ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆరోజుల్లో నాగార్జునకు అత్యధిక వసూళ్లు అందించి రికార్డు సృష్టించింది. -
లారెన్స్‌పై విజయ కాంత్ ఫ్యాన్స్ ఫైర్
దివంగత ప్రముఖ నటుడు విజయ కాంత్ వారసుడు షణ్ముఖ పాండియన్ తన తండ్రి బాటలోనే నటించడానికి సిద్ధమయ్యారు. అలా ఆయన సహాబ్దం చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యారు. కాగా తాజాగా అన్బు దర్శకత్వంలో పడై తలైవన్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. విజయకాంత్ మరణానంతరం షణ్ముఖ పాండియన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో తాను కూడా ఒక పాత్రలో నటిస్తానని రాఘవ లారెన్స్ మాట ఇచ్చారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆయన ఈ చిత్రంలో నటించడం లేదు. దీంతో రాఘవ లారెన్స్ గురించి సామాజిక మాధ్యమాల్లో పలు రకాలుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. విజయ్ కాంత్ ఫ్యాన్స్ అయితే లారెన్స్‌ను ట్రోల్ చేయడం కూడా ప్రారంభించారు. దీంతో చిత్ర దర్శకుడు అన్బు ఇలా క్లారిటీ ఇచ్చారు. విజయ కాంత్ కుమారుడు షణ్ముగ పాండియన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో లారెన్స్ నటించడం లేదని తెలిపారు. తమ సినిమాలో ఒక పాత్రను పోషిస్తానని రాఘవ లారెన్స్ చెప్పిన విషయం తెలిసిందే.. దీంతో షణ్ముఖ పాండియన్‌తో పాటు తాను కూడా రాఘవ లారెన్స్‌ను వెళ్లి కలిశామని గుర్తుచేశారు. ఆ సమయంలో ఆయనకు ధన్యవాదాలు కూడా తెలిపామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనకు కథను చెప్పగా బాగుందని మెచ్చుకుంటూ తాను నటిస్తానని లారెన్స్ మాట కూడా ఇచ్చారు. ఆ విధంగా చిత్ర షూటింగ్ ప్రారంభం అయిన తరుణంలో తనకు చిన్న సందేహం కలిగిందని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో నటుడు రాఘవ లారెన్స్ పాత్ర బలంగా ఉన్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని లారెన్స్‌కు కూడా తెలిపినట్లు అన్బు అన్నారు. తన నిర్ణయాన్ని రాఘవ లారెన్స్ కూడా స్వాగతించారని చెప్పారు. ఈ సనిమాలో లారెన్స్ నటించిక పోయిన విడుదల సమయంలో ప్రమోషన్ కార్య క్రమాలకు తన చేతనైన సహాయం చేస్తానని మాట ఇచ్చారన్నారు. కాగా రాఘవ లారెన్స్ నటించాల్సిన పాత్రలో దివంగత నటుడు విజయ్‌కాంత్‌ను ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో నటింపజేస్తున్నట్లు సమాచారం. -
నాగార్జున బర్త్‌డే కోసం.. 20 ఏళ్ల నాటి సినిమా రీ-రిలీజ్
టాలీవుడ్లో ఓ వైపు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే వైవిధ్యమైన పాత్రలు, సినిమాల కోసం పరితపించే అగ్రహీరోల లిస్ట్‌లో అక్కినేని నాగార్జున పేరు టాప్‌లో ఉంటుంది. ఆగస్టు 29న ఆయన పుట్టినరోజు రానుంది. దీంతో ఆయన అభిమానుల కోసం 'మాస్' సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. అక్కినేని నాగార్జున హీరోగా, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది.నాగార్జున సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ తెరకెక్కించిన 'మాస్' సినిమా 2004లో విడుదలైంది. సుమారు 20 ఏళ్ల తర్వాత.. ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందు ఆగష్టు 28న రీ-రిలీజ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ఒక పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో జ్యోతిక, చార్మికౌర్, రఘువరన్, ప్రకాష్‌రాజ్, రాహుల్ దేవ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆరోజుల్లో నాగార్జునకు అత్యధిక వసూళ్లు అందించి రికార్డు సృష్టించింది. -
టీచర్ ఇంటికెళ్లిన స్టార్ హీరో.. ఎందుకంటే?
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ గతేడాది జిగర్తాండ డబుల్ ఎక్స్, చంద్రముఖి, రుద్రన్ సినిమాలతో అలరించాడు. ప్రస్తుతం ఆయన దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న గోట్ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే రాఘవ.. సమాజ సేవలోనూ ముందున్నారు. మాత్రం ఫౌండేషన్ ద్వారా పేదలను ఆదుకుంటున్నారు. ఇటీవలే కొన్ని కుటుంబాలకు వ్యవసాయ ట్రాక్టర్స్, టూ వీలర్స్ అందించి తన గొప్పమనసును చాటుకున్నారు.తాజాగా హీరో రాఘవ లారెన్స్ ఓ ఉపాధ్యాయున్ని కలిశారు. ఆయన ప్రతిభను గుర్తించిన హీరో ఇంటికెళ్లి మరి సన్మానించారు. తమిళనాడులోని కళ్లకురిచి జిల్లా మనలూరుపేటకు చెందిన సెల్వం అనే డ్రాయింగ్ టీచర్‌ను రాఘవ అభినందించారు. సోషల్ మీడియాలో అతని అద్భుతమైన డ్రాయింగ్స్ చూసి ముగ్ధుడైనట్లు వెల్లడించారు. అందుకే వ్యక్తిగతంగా కలిసి అభినందించాలని నిర్ణయించుకున్నట్లు లారెన్స్ తెలిపారు. ఈరోజు అతన్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అతని బహుమతి నా మనస్సుకు హత్తుకుందని రాఘవ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.Hi friends and fans, He’s Selvam, a drawing teacher from Manalurpet Kallakurichi district. I saw his wonderful drawing skills shared on social media by all of you. I wanted to meet him in person and appreciate his talent. Today, I’m happy to meet him and so touched by his gift!… pic.twitter.com/Zai28jVALZ— Raghava Lawrence (@offl_Lawrence) July 14, 2024 -
నా కుమారుడిని ఆశీర్వదించండి: లారెన్స్
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌కు కోలీవుడ్‌లో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. కష్టాల్లో ఉన్న వారికి తనకు అందిన వరకు సాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందు ఉంటారు. తమిళనాడులో తన అమ్మగారి పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎందరికో లారెన్స్ సాయం చేశారు. ఈ క్రమంలో గుండెజబ్బుతో బాధపడుతున్న చిన్నారులకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేపించి తన మంచి మనుసు చాటుకున్నారు. చాలామంది పేదలకు ఉపాధి కల్పించారు ట్రాక్టర్స్,బైక్స్,ఆటోలు, తోపుడు బండ్లు, వికలాంగులకు వాహనాలు ఎందరికో లారెన్స్ అందించారు. సినిమా స్టార్స్ అందరూ ఎప్పుడు తమ బిడ్డలను చిత్ర పరిశ్రమలోకి తీసుకుని వద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ లారెన్స్ అందుకు భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇతరులకు సాయం చేసే తన సేవా గుణాన్ని వారసత్వంగా తన కుమారుడికి ఇచ్చారు. చిన్న వయసు నుంచే ఇతరులకు సాయం చేసే అలవాటును పరిచయం చేపించారు. ఈ క్రమంలో లారెన్స్ ఒక వీడియో పంచుకుంటూ ఇలా చెప్పుకొచ్చారు.'అభిమానులకు, స్నేహితులకు విన్నపం.. వీడు మా అబ్బాయి శ్యామ్.. అప్పుడే పెద్దవాడు అయిపోయాడు. ప్రస్తుతం కాలేజీలో 3వ సంవత్సరం చదువుతూ పార్ట్‌టైమ్ జాబ్‌లో కూడా పనిచేస్తున్నాడు. అయితే, గత పదేళ్లుగా నేను హెప్సిబా అనే అమ్మాయి చదువు కోసం నా వంతు డబ్బు సాయం చేస్తున్నాను. తమిళనాడులోని రాయపురంలో ఉన్న హెప్సిబా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే ఉంది. ఇప్పుడు, హెప్సిబా కోసం శ్యామ్ ఈ సంవత్సరం స్కూల్ ఫీజు చెల్లిస్తున్నాడు. ఈ సంతోషకరమైన క్షణాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి శ్యామ్ తన సేవా యాత్రను కొనసాగిస్తాడు. దీనికి మీ అందరి ఆశీస్సులు కావాలి.' అని లారెన్స్ కోరారు. ఇప్పటి వరకు లారెన్స్ ఎందరికో సాయం చేశారు. ఇప్పుడు తన కుమారుడిని కూడా అదే మార్గంలో నడిపించాలని ఆయన పూనుకున్నారు. దీంతో నెటిజన్లు వారిద్దరినీ అభినందిస్తున్నారు.కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాఘవ 'స్పీడ్ డ్యాన్సర్'తో నటుడిగా మారారు. 'కాంచన' సిరీస్‌తో చిత్ర పరిశ్రమలో ట్రెండ్ క్రియేట్ చేశారు. రీసెంట్గా జింగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాతో రూ. 100 కోట్ల క్లబ్లో చేరిపోయారు. ప్రస్తుతం ఆయన 'దుర్గ' చిత్రం కోసం వర్క్ చేస్తున్నారు.Hi Friends and fans, The seed that I planted has now grown into a generous boy. He is Shyam, now currently studying in college 3rd year and also working in a part-time job. Since 10 years I have been supporting Hepsiba for her education. She is from Royapuram and is being taken… pic.twitter.com/2gCBEJwYjJ— Raghava Lawrence (@offl_Lawrence) June 30, 2024 -
రాఘవ లారెన్స్ బాటలో మరో స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ సినిమాలతో పాటు సమాజ సేవలోనూ ముందున్నారు. మాత్రమ్ ఫౌండేషన్ ద్వారా రైతులు, రైతు కూలీలను ఆదుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది దివ్యాంగులకు త్రీవీలర్ వాహనాలు అందజేసిన ఆయన.. ఇటీవల పది మంది పేద రైతు కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారం ట్రాక్టర్స్ అందించారు.రాఘవ లారెన్స్ సేవలు చూసిన మరో హీరో సాయం చేసేందుకు ముందుకొచ్చారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో కలిసి నటించిన ఎస్జే సూర్య తన వంతు సాయం చేశారు. తన సొంత డబ్బులతో ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి కాంచీపురం జిల్లాకు చెందిన బద్రీకి 11వ ట్రాక్టర్‌ను అందజేశారు. ఈ విషయాన్ని రాఘవ లారెన్స్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్జే సూర్యకు ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Hi Friends and fans, You are all aware that I handed over 10 Tractors to Farmers through the Maatram Foundation with my own money. Today @iam_SJSuryah Brother gave me a pleasant surprise by adding another Tractor with his own money. Together, We handed over the 11th Tractor to… pic.twitter.com/Bwe6sjyET5— Raghava Lawrence (@offl_Lawrence) June 18, 2024 -
కాంచన-4లో టాలీవుడ్ హీరోయిన్.. రాఘవ లారెన్స్ క్లారిటీ!
ప్రస్తుతం సీతారామం బ్యూటీ మృణాల్ టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీస్టార్‌లో మెరిసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. మృణాల్ త్వరలోనే కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు లేటేస్ట్ టాక్ నడుస్తోంది. రాఘవ లారెన్స్ తెరకెక్కించనున్న కామెడీ హారర్ కాంచన-4లో మృణాల్ ఠాకుర్ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలవుతోంది.అయితే ఈ వార్తలపై కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ స్పందించారు. ఈ విషయంపై రాఘవ లారెన్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం కాంచన-4 సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపికపై వస్తున్న వార్తలు వాస్తవం కాదని ట్వీట్ చేశారు. అవన్నీ రూమర్స్ మాత్రమేనని.. ఏదైనా ఉంటే రాఘవేంద్ర ప్రొడక్షన్ ద్వారా అధికారికంగానే ప్రకటిస్తామని పోస్ట్ చేశారు. అయితే ఇది చూసిన కొందరు మృణాల్ ఠాకూర్ తీసుకోండంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. గతంలో వచ్చిన ముని, ముని-2 (కాంచన), కాంచన-2, కాంచన-3 చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అదే సిరీస్‌లో ప్రస్తుతం కాంచన-4 తెరకెక్కునుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలోనే ఈ సినిమాలు తెరకెక్కించారు. కాగా.. మృణాల్ ప్రస్తుతం హిందీలో పూజా మేరీ జాన్‌లో కనిపించనుంది. మరోవైపు రాఘవ చివరిసారిగా జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో కనిపించారు. Hi friends and fans, All the information regarding Kanchana 4 and casting that are circulating around social media are just rumors. Official announcement will be made through Ragavendra Production. Coming soon! pic.twitter.com/T46gcYyjAN— Raghava Lawrence (@offl_Lawrence) June 9, 2024 -
లారెన్స్ సినిమాలో అతిథిగా సూర్య?
రాఘవ లారెన్స్.. గ్రూప్ డ్యాన్సర్ స్థాయి నుంచి నృత్య దర్శకుడిగా, ఆ తరువాత కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎదిగారు. ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన జిగర్తండ డబులెక్స్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం.. దర్శకుడు లోకేష్ కనకరాజ్ కథను రాసి, సొంతంగా నిర్మిస్తున్న 'బెంజ్' చిత్రంలో లారెన్స్ కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది. ఇందులో సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నారట!ప్రస్తుతం ఈయన కంగువ చిత్రంతో బిజీగా ఉన్నారు. అలాగే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తన 44వ చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన చేతిలో వాడివాసల్ తదితర చిత్రాలు ఉన్నాయి. కమల్ హాసన్ 'విక్రమ్' సినిమా చివరి ఘట్టంలో సూర్య రోలెక్స్ అనే అతిథి పాత్రలో మెరిసి పెద్ద ఇంపాక్ట్‌నే కలిగించారు. ఇదే పాత్రతో సూర్య హీరోగా పూర్తి చిత్రాన్ని చేయనున్నట్లు లోకేష్ కనకరాజ్ పేర్కొన్నారు కూడా. తాజాగా ఈయన రాఘవ లారెన్స్ బెంజ్ మూవీలో రోలెక్స్ తరహా పాత్రలో అతిథిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.చదవండి: Bangalore Rave Party: ‘మా’ నుంచి హేమ సస్పెండ్ -
తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్.. ధర ఎంతంటే?
సెలబ్రిటీలు కొత్త కార్లు తీసుకోవడం లేదంటే వాటిని మరొకరికి గిఫ్ట్ ఇవ్వడం లాంటివి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ జాబితాలోకి కొరియోగ్రాఫర్ నుంచి హీరోగా మారిన రాఘవ లారెన్స్ చేరారు. దాదాపు రూ.25 లక్షలు విలువ చేసే ఖరీదైన కారుని తన తమ్ముడికి బహుమతిగా ఇచ్చాడు. ఫొటో పోస్ట్ చేసి మరీ ఈ విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' గ్రాండ్ ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?)కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన రాఘవ లారెన్స్.. దక్షిణాది భాషల్లో స్టార్ హీరోలతో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత డైరెక్టర్ అయ్యాడు. తెలుగులోనూ నాగార్జునతో 'డాన్' మూవీ తీశాడు. అనంతరం కొన్నాళ్ల తర్వాత పూర్తిస్థాయి నటుడిగా మారిపోయాడు. 'కాంచన' లాంటి హారర్ సినిమాలతో ఎంతలా భయపెట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గతేడాది 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీతో హిట్ కొట్టిన లారెన్స్.. ప్రస్తుతం తమిళంలో రెండు మూవీస్ చేస్తున్నాడు. అలానే తన తమ్మడు ఎల్విన్‌ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నాడు. 'బుల్లెట్' పేరుతో తీస్తున్న మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా చూసిన లారెన్స్.. తమ్ముడి ఫెర్ఫార్మెన్స్ బాగా నచ్చడంతో ఎమ్జీ హెక్టార్ కారుని బహుమతిగా ఇచ్చాడు. మార్కెట్లో దీని ధర రూ.20-25 లక్షల పైమాటే అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'భజే వాయువేగం' సినిమా రివ్యూ) -
20 ఏళ్ల క్రితం నాటా.. ఇప్పుడు చూస్తే : రాఘవ లారెన్స్
తమిళ స్టార్ హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రలు, సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు సమాజసేవలోనూ దూసుకెళ్తున్నారు. మాత్రం సంస్థ పేరుతో తమిళనాట సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పదిమంది పేద రైతు కుటుంబాలకు ట్రాక్టర్లు అందజేశారు. వారిని ప్రత్యేకంగా కలిసి మరి రాఘవ లారెన్స్ ట్రాక్టర్ తాళాలు అందించారు.తాజాగా తాను సొంత ఖర్చులతో చదివించిన విద్యార్థులను కలిశారు. దాదాపు 20 ఏళ్లుగా వారి అన్నీ తానే నడిపిస్తున్నారు. ఆ విద్యార్థులంతా చదువుల్లో రాణిస్తున్నారు. ఈ సందర్భంగా వారిని కలిసి రాఘవ లారెన్స్ ఎమోషనల్ అయ్యారు. తాను కూడా వారితో పాటు కలిసిపోయి ఆటలు ఆడారు. వారిని చూస్తే తనకు గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. వారిని కలిసి సమయం వెచ్చించడం నా హృదయం సంతోషంతో నిండిపోయిందంటూ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ మీరు గ్రేట్ సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. The seeds I planted 20 years ago have now grown into these beautiful souls and are being a good example in society. I’m extremely proud of my boys and girls for the kind of persons they have grown into. My heart is so full after spending some beautiful and quality time with them.… pic.twitter.com/XjytGqj2OW— Raghava Lawrence (@offl_Lawrence) May 19, 2024 -
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ సేవలో దూసుకుపోతున్నాడు. పేదరికంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. మాత్రం అనే అనే ఫౌండేష్ ద్వారా సేవలు కొనసాగిస్తున్నారు. ఇటీవలే దివ్యాంగులకు టూవీలర్ వాహనాలు అందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇచ్చిన మాట ప్రకారం మరో పది కుటుంబాలకు ట్రాక్టర్లు అందిస్తున్నారు. ప్రస్తుతం విల్లుపురం జిల్లాలోని ఓ పేద కుటుంబానికి ట్రాక్టర్‌ను తానే స్వయంగా అందించారు.దీనికి సంబంధించిన వీడియోను రాఘవ లారెన్స్ ట్విటర్లో పంచుకున్నారు. విల్లుపురం జిల్లాలో ప్రభు కుటుంబానికి మూడో ట్రాక్టర్ తాళాలు అందజేశానని తెలిపారు. మీ ప్రేమను చూస్తుంటే.. ఇది నాకు మరింత శక్తిని ఇస్తోందని.. ముందుకు సాగడానికి ప్రేరణనిస్తోందని రాసుకొచ్చారు. మనమంతా కలిసి అందరికీ ఉజ్వల భవిష్యత్తును సృష్టించగలం అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #serviceisgod DAY TWO JOURNEY! I handed over the 3rd tractor key to the Prabu family in the Villupuram district. Seeing all your love, It's giving us more energy and motivation to go forward. Together, we can make a difference and create a brighter future for all. #Maatram… pic.twitter.com/Hq9lY9vylA— Raghava Lawrence (@offl_Lawrence) May 7, 2024 -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది జిగర్తాండ డబుల్ ఎక్స్, రుద్రన్ చిత్రాలతో అలరించారు. సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉన్నప్పటికీ తనవంతు సాయంగా మాత్రం ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇటీవల దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు కూడా పంపిణీ చేశారు. పేదల కోసం ఇచ్చిన మాట ప్రకారం సాయం చేస్తూ ముందుకెళ్తున్నారు మన కోలీవుడ్ స్టార్.తాజాగా మరో పది పేద రైతు కుటుంబాలకు అండగా నిలిచారు లారెన్స్. వారి కళ్లలో ఆనందం వెల్లివిరిసేలా చేశారు. కష్టాల్లో ఉన్న రైతులకు ఉచితంగా పది ట్రాక్టర్లు అందించారు. దీనికి సంబంధించిన వీడియోను రాఘవ తన ట్విటర్లో పంచుకున్నారు.రాఘవ తన ట్విటర్లో రాస్తూ..' స్నేహితులు అభిమానులు! మాత్రమ్ సేవ ఈరోజు ప్రారంభమైందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నా. గతంలో ప్రెస్మీట్లో చెప్పినట్లుగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు 10 ట్రాక్టర్లను అందజేస్తామని చెప్పాం. మా మొదటి ట్రాక్టర్ విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి అందించాం. అతను తన సోదరి భర్త చనిపోవడంతో ఆమెతో పాటు తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. ఈ రోజు అతను కొత్త ట్రాక్టర్ని నడుపుతున్నప్పుడు అతని ముఖంలో ఆనందం, ఆశను చూడాలనేది నా కోరిక. అందుకే అతన్ని పిలిపించి సర్ప్రైజ్ ఇచ్చాం. కష్టాల్లో ఉన్న రైతులకు ఆనందాన్ని, మద్దతును అందజేద్దాం!' అంటూ పోస్ట్ చేశారు. Hi friends and fans! I am excited to announce that Maatram's service begun today. As I mentioned in our press meet, we will be presenting 10 tractors to financially struggling farmers. Our first tractor was presented to RajaKannan family from Vilupuram District, who is now solely… pic.twitter.com/7XePCpNweb— Raghava Lawrence (@offl_Lawrence) May 1, 2024 -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్టార్ హీరో!
కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవలే పేద మహిళా డ్రైవర్‌కు కొత్త ఆటో బహుమతిగా అందించారు. తనవంతు సాయంగా సమాజ సేవలో భాగంగా తాజాగా వికలాంగులకు బైక్స్ పంపిణీ చేశారు. దివ్యాంగులు, అనాథ బాలల కోసం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు లారెన్స్. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన 13 ద్విచక్ర వాహనాలు అందజేశారు. అంతే కాకుండా వారికి ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు. త్వరలోనే వారికీ ఇళ్లు నిర్మించి ఇస్తానని లారెన్స్ తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం రాఘవ చేస్తున్న సేవలను కొనియాడారు. రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ ఎంట్రీ ఇచ్చిన రాఘవ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది చంద్రముఖి-2, జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాలతో అలరించిన రాఘవ.. ప్రస్తుతం దుర్గ అనే చిత్రంలో నటిస్తున్నారు. Hatsoff @offl_Lawrence Sir தமிழர் பாரம்பரிய மல்லர் கலையில் கலக்கி வரும் #கை_கொடுக்கும்_கை மாற்றுத்திறனாளி குழுவினர் ஒவ்வொருவருக்கும் இரண்டு சக்கர வாகனம் பரிசளித்தார் மாஸ்டர் #ராகவா_லாரன்ஸ் .#RaghavaLawrence pic.twitter.com/879dQ28jLO — Actor Kayal Devaraj (@kayaldevaraj) April 18, 2024 Service is god 🙏🏼 pic.twitter.com/UBZXYFIDMQ — Raghava Lawrence (@offl_Lawrence) April 11, 2024 -
దివ్యాంగుల ఇతివృత్తంతో చిత్రం చేస్తా: రాఘవ లారెన్స్
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవలారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. చాలా కాలం నుంచి అనాథలు, దివ్యాంగులని ఆదుకునేందుకు ట్రస్టు ఏర్పాటు చేసి, దాని ద్వారా వారికి తగిన సాయం చేస్తూ వస్తున్నాడు. ఎందరికో ఎన్నో విధాలుగా సాయం చేస్తూ.. తన చిత్రాల్లో దివ్యాంగులను నటింపజేస్తూ వారిలోని ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా దివ్యాంగులకు కానిదేదీ లేదనేలా వారిని తమిళ పారంపర్య కళ అయిన మల్లర్ కంబం అనే విలువిద్యలో ప్రోత్సహిస్తున్నారు. కై కొడుక్కుమ్ కై అనే ఈయన నాయకత్వంలో దివ్యాంగుల బృందం ఇప్పటికే మల్లర్ కంబం అనే సాధారణ వ్యక్తులు కూడా చేయలేని సాహస కళను పలు వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. కాగా ఈ బృందం సోమవారం రాఘవలారెన్స్ నేతృత్వంలో చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో మల్లర్ కంబం అనే సాహస కళను ప్రదర్శించారు. వీరి కళను ప్రోత్సహించాల్సిందిగా ఈ సందర్భంగా రాఘవలారెన్స్ విజ్ఞప్తి చేశారు. వీరికి తాను తగినంత సాయం చేస్తున్నానని, తన చిత్రాల్లోనూ నటింపజేసే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. అయితే కొందరు అన్ని చిత్రాల్లోనూ వీరిని ఎలా నటింపజేస్తామని అంటుంటారన్నారు. మీ ఇళ్లల్లోనో, ఇతరుల ఇళ్లల్లోనో జరిగే వేడుకల్లో ఇలాంటి టీమ్‌కు అవకాశం కల్పించి ప్రోత్సహించాలని కోరారు. తాను ఈ మల్లర్ కంబం కళ బృందంలోని ప్రతి ఒక్కరికీ ఒక స్యూటీని ఇవ్వనున్నానని చెప్పారు. అలాగే దివ్యాంగుల ఇతి వృత్తంతో ఒక చిత్రం చేయబోతున్నానని, అందులో తానూ దివ్యాంగుడి పాత్రలో నటించనున్నానని చెప్పా రు. ఈ చిత్రం ద్వారా వచ్చిన లాభాలతో వీరికి ఇళ్లు కట్టిస్తానని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. -
లోకేష్ కనగరాజ్, లారెన్స్ కాంబినేషన్లో సినిమా ప్రకటన
కోలీవుడ్‌లో వరుస హిట్లు కొడుతూ దూసుకుపోతున్నాడు లోకేష్ కనగరాజ్.. ఆయన నుంచి సినిమా ప్రకటన వచ్చిందంటే చాలు భారీగా అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలో ఖైదీ, విక్రమ్, మాస్టర్ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ క్రియేట్ చేసి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు. తాజాగా లోకేష్ కనగరాజ్ కొత్త సినిమాను ప్రకటించాడు. దానికి టైటిల్ కూడా 'బెంజ్' అని ఫిక్స్ చేశాడు. అందులో రాఘవ లారెన్స్ హీరోగా నటుస్తున్నాడు. అయితే ఈ క్రేజీ సినిమాను లోకేష్ డైరెక్ట్ చేయడం లేదు. కేవలం కథను మాత్రమే అందిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని బక్యరాజ్ కన్నన్ (రెమో) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదట.. లోకేష్ డైరెక్ట్ చేసిన ఖైదీ సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర ఉండదు అనే విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ నుంచి మరో సినిమా ప్రకటన కూడా తాజాగా వెలువడింది. హంటర్ అనే టైటిల్‌తో ఒక పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కోలీవుడ్‌లో కత్తి సినిమాను డైరెక్ట్ చేసిన వెంకట్ మోహన్ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. కత్తి సినిమా తెలుగులో ఖైదీ 150 పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. హంటర్ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
స్టార్ హీరో కట్టించిన గుడిలో మరో హీరో.. వీడియో వైరల్
దళపతి విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అటు సినిమాలు, ఇటు సోషల్ మీడియాలో ట్రోల్స్ తో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంటాడు. అయితే విజయ్ తన సొంతూరు కొరట్టూర్ లో సాయిబాబా కట్టించున్నాడే విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ ఆలయాన్ని నటుడు-కొరియోగ్రాఫర్ లారెన్స్ దర్శించుకున్నాడు. (ఇదీ చదవండి: లిప్‌లాక్ సీన్స్ వద్దని మా నాన్న చెప్పారు: టాలీవుడ్ యంగ్ హీరోయిన్) సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న విజయ్.. తన తల్లి శోభ కోరిక మేరకు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ మహా కుంభాభిషేకాన్ని ఇటీవల నిర్వహించారు. విజయ్ ఈ మధ్య ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన ఫొటోలు బయటకు రావడంతోనే ఈ విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు ఈ ఆలయాన్ని రాఘవ లారెన్స్.. విజయ్ తల్లితో కలిసి సందర్శించాడు. తాను నిర్మించిన శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని నటుడు విజయ్ తల్లి శోభ సందర్శించి, పాటలు కూడా పాడారన్నారు. ఇప్పుడు ఆయన నిర్మించిన సాయిబాబా ఆలయాన్ని తాను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని లారెన్స్ చెప్పుకొచ్చాడు. విజయ్ ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: ఆ సినిమా వల్ల భారీగానే నష్టపోయాం: మెగాస్టార్ చిరంజీవి) Hi everyone, I visited Nanban Vijay’s Sai Baba Temple today along with his mother. When I built My Raghavendra Swamy temple, She sang a song in our temple and graced us with her presence. Today, I’m happy to visit their temple with her. My heartfelt wishes to Nanban Vijay… pic.twitter.com/sZvzFqC0LL — Raghava Lawrence (@offl_Lawrence) April 13, 2024 -
తల్లి కోసం గుడి కట్టిన స్టార్.. సందర్శించిన లారెన్స్ (ఫోటోలు)
-
నా స్నేహితుడు విజయ్‌కి అభినందనలు: లారెన్స్
కోలివుడ్ టాప్ హీరో విజయ్ సినిమాలతో పాటు రాజకీయ కార్యక్రమాల్లో కూడా బిజీగా ఉన్నారు. కొద్దిరోజు క్రితం తన తల్లి శోభ కోరిక మేరకు సాయిబాబా మందిరాన్ని ఆయన నిర్మించారు. అందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. సాయిబాబా మందిరాన్ని నిర్మించాలని తన కోరిక అని శోభ తెలిపారు. ఇదే విషయాన్ని విజయ్‌తో పలుమార్లు చెప్పగా.. కొంతకాలం క్రితం ఈ ఆలయాన్ని నిర్మించాడని ఆమె పేర్కొంది. చెన్నైలోని కొరటూరులో ఉన్న సాయిబాబా ఆలయాన్ని తాజాగా ప్రముఖ హీరో లారెన్స్ దర్శించుకున్నారు. ఇదే విషయాన్ని తన ఎక్స్ పేజీలో ఇలా పంచుకున్నారు. 'అందరికీ నమస్కారం.. ఈరోజు నా స్నేహితుడు విజయ్ తన తల్లితో కలిసి కొరట్టూరులో కొత్తగా నిర్మించిన సాయిబాబా ఆలయానికి వెళ్లాను. నేను గతంలో రాఘవేంద్రుని ఆలయాన్ని నిర్మించి కుంభాభిషేకం చేసినప్పుడు విజయ్ గుడికి రావడమే కాకుండా నన్ను అభినందించే క్రమంలో నా కోసం ఒక పాట కూడా పాడారు. ప్రస్తుతం విజయ్ నిర్మించిన ఈ ఆలయానికి నేను రావడం చాలా సంతోషంగా ఉంది. నా స్నేహితుడు విజయ్‌కి హృదయపూర్వక అభినందనలు. నేను ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే నాకు స్వచ్ఛమైన దివ్య ప్రకంపనలు కనిపించాయి. ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి వెళ్లి సాయిబాబాను దర్శించుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను.' అని అన్నారు. విజయ్ అమ్మగారితో లారెన్స్ కలిసి సందర్శించిన వీడియోను ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు. అక్కడ ప్రతి గురువారం అన్నదానం ఉంటుందని శోభ తెలిపారు. ఆ సమయంలో తానే అక్కడకు వస్తానని ఆమె చెప్పారు. 'లియో' తర్వాత విజయ్ నటిస్తోన్న చిత్రం 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'. వెంకట్ ప్రభు దర్శకత్వంలో టైమ్ ట్రావెల్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Raghava Lawrence Fans (@raghavalawrenceoffl) -
లోకేష్ కనగరాజ్‌తో లారెన్స్ సినిమా.. నయన్ ఒప్పుకుంటుందా?
తమిళసినిమా: కోలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ దర్శకుడు ఎవరంటే ఠక్కున వచ్చే బదులు లోకేష్ కనకరాజ్ అనే. ఈయన చేసింది ఇప్పటికి అక్షరాలా ఐదు చిత్రాలే. అయితే అన్నీ వసూళ్ల వర్షం కురిపించినవే. మా నగరంతో దర్శకుడిగా పరిచయం అయిన ఒక బ్యాంకు ఉద్యోగి లోకేష్ కనకరాజ్. ఈ చిత్రం విజయం సాధించడంతో ఖైదీ చిత్రాన్ని కార్తీ హీరోగా చేశారు. అదీ సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత విజయ్ కథానాయకుడిగా, విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా చేసిన మాస్టర్ చిత్రం వసూళ్లు కొల్లగొట్టింది. ఆ తరువాత కమలహాసన్ హీరోగా విక్రమ్ 2 చిత్రాన్ని చేశారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నమోదైంది. ఇటీవల మరోసారి విజయ్ హీరోగా చేసిన లియో చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకున్నా, వసూళ్ల విషయంలో ఏ మాత్రం తగ్గలేదు. ఇలా స్టెప్ బై స్టెప్ స్టార్ హీరోలతో పని చేస్తున్న లోకేష్ కనకరాజ్ ఇప్పుడు రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన 171 చిత్రాన్ని చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా చిత్రంలో భారీ అంచనాలను పెంచేస్తోంది. ఇంతకు ముందెప్పుడూ చూడని రజనీకాంత్‌ను ఈ చిత్రంలో చూస్తారని దర్శకుడు చెబుతున్నారు. చిత్ర టైటిల్‌ను ఏప్రిల్ 22వ తేదీన, షూటింగ్‌ను జూన్ నెలలో మొదలెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపోతే లోకేష్ కనకరాజ్ చాలా మంది దర్శకుల తరహాలో జీ స్క్వాడ్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్లో తన శిష్యులు, సన్నిహితులతో చిత్రాలు నిర్మిస్తానని చెప్పారు. ఆ విధంగా ఉరియడి చిత్రం ఫేమ్ విజయకుమార్ హీరోగా అబ్బాస్ ఏ.రఘుమాన్ దర్శకత్వం వహించిన ఫైట్ క్లబ్ చిత్రాన్ని గత ఏడాది చివరిలో విడుదల చేశారు. తాజాగా రత్నకుమార్ దర్శకత్వంలో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రత్నకుమార్ ఇంతకు ముందు మేయాదమాన్, ఆడై, కులు కలు వంటి చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. కాగా తాజా చిత్రంలో నటుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా నటించనున్నారు. ఇది హార్రర్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఈ తరహా చిత్రాలే లారెన్స్‌ను హీరోగా నిలబెట్టాయన్నది తెలిసిందే. ఇకపోతే ఇందులో ప్రధాన పాత్రలో నటి నయనతారను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్ర కథను దర్శకుడు లోకేష్ కనకరాజ్ రాయడం విశేషం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే నయనతార నటుడు లారెన్స్ సరసన నటించడానికి ఒకే అంటారా? అన్న చర్చ జరుగుతోంది. -
నిరుపేద మహిళకు లారెన్స్ సాయం.. వీడియో వైరల్
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, హీరో, సినీ దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి తన దయా హృదయాన్ని చాటుకున్నారు. సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే లారెన్స్.. ఇప్పటికే తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. ఇప్పుడు ఆయన్ను ఆదర్శంగా తీసుకుని కేపీవై బాల అనే కమెడియన్ పలువురికి సాయం చేస్తూ కోలివుడ్లో సెన్సేషనల్‌గా మారాడు. కోలీవుడ్‌లో ఒక కామెడీ షో ద్వారా కేపీవై బాల తెరపైకి వచ్చాడు. అక్కడ మంచి గుర్తింపు దక్కడంతో పలు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. ఆపై స్టాండ్ అప్ కమెడియన్‌గా కూడా ఆయన రాణిస్తున్నాడు. తను సంపాదనలో అధిక మొత్తాన్ని దాతృత్వ కార్యకలాపాలకే ఉపయోగించడం విశేషం. దానికి ప్రధాన కారణం తన అభిమాన హీరో లారెన్స్ అని ఆయన చెబుతుంటారు. లారెన్స్ ఆదర్శంగా ఆయన ఎందరికో సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. పలుమార్లు లారెన్స్, బాల ఇద్దరూ కలిసి సాయం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరూ కలిసి ఒక నిరుపేద మహిళకు సాయం చేశారు. తమిళనాడులో మురుగమ్మాళ్ అనే మహిళకు బాల, లారెన్స్ సాయంగా నిలిచారు. పెళ్లయిన కొన్నేళ్లకే భర్తను కోల్పోయిన ఆమె తన ముగ్గురు కూతుళ్లను పోషించడమే కష్టం మారింది. ముగ్గురు కుమార్తెలను పోషించుకునేందుకు ఆ ప్రాంతంలో తిరిగే ట్రైన్స్‌లలో సమోసాలు విక్రయిస్తూ కాలం వెల్లదీస్తుంది. ఆమెకు ఆటో నడిపడం వచ్చినా.. ఆటో కొనేంత స్థోమత తనకు లేదు. దీంతో కొందరిని సాయం కోసం అడిగింది.. ఈ విషయం కాస్త బాల వద్దకు చేరడం.. ఆ వెంటనే రాఘవ లారెన్స్ వద్దకు ఆమె సమస్యను అతను తీసుకెళ్లడం జరిగిపోయాయి. లారెన్స్ ఇచ్చిన రూ. 3 లక్షల డబ్బుతో కొత్త ఆటోను బాల కొన్నాడు. ఇంకేముంది ఆమె కష్టాలకు ఫుల్స్టాప్ పడే సమయం వచ్చింది. ఆమె ఉన్న చోటుకు స్వయంగా లారెన్స్ వెళ్లారు. ఆపై కొత్తగా కొన్న ఆటోను ఆమెకు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆమె ఎమోషనల్ అయింది. ఇక్కడ కమెడియన్ బాల కూడా పలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల అభిమానాన్ని పొందాడు. గతేడాది మిగ్జామ్ తుపాను వచ్చినప్పుడు 200 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున బాలా అందించాడు. తాజాగా పెట్రోల్ బంకులో పనిచేసే ఓ యువకుడికి ద్విచక్ర వాహనం కొనిచ్చాడు. అంతేకాకుండా తన గ్రామానికి దగ్గర్లో ఉన్న పాఠశాలలో కొన్నేళ్లుగా సరైన టాయిలెట్స్ లేవుని తెలుసుకున్నాడు. ఇంకేముంది వెంటనే లారెన్స్ సాయంతో రూ. 15 లక్షలతో నిర్మించాడు. ఇలాంటివి లెక్కలేనన్ని సంఘటనలు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తాయి. View this post on Instagram A post shared by Balan Akassh Balaiyan Jaganathan (@bjbala_kpy) Service is god 🙏🏼🙏🏼 pic.twitter.com/LIeJA0Aej3 — Raghava Lawrence (@offl_Lawrence) March 29, 2024 -
Raghava Lawrence: అభిమానుల కోసం లారెన్స్ కీలక నిర్ణయం!
అభిమానుల కోసం స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో రాఘవా లారెన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తనను కలిసేందుకు అభిమానులు రావొద్దని..తానే వారి వద్దకు వెళ్తానని ప్రకటించాడు. తనకు కలిసేందుకు వచ్చిన ఓ అభిమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కలత చెందిన లారెన్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సినిమాలతో పాటు సామాజిక సేవ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్.. అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ కోసం సెల్ఫీలు దిగే కార్యక్రమం నిర్వహిస్తుంటాడు. అలా గతేడాదిలో చెన్నై నిర్వహించిన సెల్ఫీ కార్యక్రమానికి హాజరై, తిరిగి వెళ్తున్న ఓ అభిమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి సెల్ఫీ కార్యక్రమానికి దూరంగా ఉన్నాడు లారెన్స్. అభిమానులు ఎవరు తనను కలిసేందుకు రావొద్దని విజ్ఞప్తి చేశాడు. తానే స్వయంగా ప్యాన్స్ వద్దకు వచ్చి సెల్ఫీ ఇస్తానని తాజాగా ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించాడు. హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్.. చివరిసారిగా చెన్నైలో నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ ఫోటోషూట్ సందర్భంగా నా అభిమాని ఒకరు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన నన్ను బాగా కలిచివేసింది. ఆ రోజే నా అభిమానులెవరు నా కోసం ప్రయాణం చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇకపై నేనే వారి కోసం ప్రయాణం చేస్తాను. వారి పట్టణంలో ఫోటోషూట్ నిర్వహిస్తాను. రేపటి(ఫిబ్రవరి 25) నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాను. రేపు మొదట విల్లుపురం లో గలక్ష్మి మహల్ వద్ద కలుద్దాం.’ అని ట్వీట్ చేశాడు. లారెన్స్ నిర్ణయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో తమవద్దకే వచ్చి కలవడం ఆనందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాఘవ లారెన్స్!
రాఘవ లారెన్స్‌కు కెప్టెన్ విజయకాంత్ అంటే ఎంతో ఇష్టం. ఇటీవలే కెప్టెన్ కన్నుమూయగా ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోయాడు లారెన్స్. అంతేకాదు, ఆయన కోసం విజయకాంత్ తనయుడి సినిమాలో నటించేందుకు సిద్ధమని ప్రకటించాడు. విజయకాంత్ చిత్ర పటానికి నివాళులు అర్పించడానికి ఆయన ఇంటికి వెళ్లినప్పుడు తన కొడుకు షణ్ముగ పాండియన్ భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతున్నానని ప్రేమలత చెప్పింది. దీంతో షణ్ముగ నటించే చిత్రంలో తాను అతిథిగా నటించడానికైనా సిద్ధమని, అది తన బాధ్యత అని పేర్కొన్నాడు. తాజాగా షణ్ముగ పాండియన్ పడై తలైవన్ అనే చిత్రంలో కథానాయకుడిగా నటించగా అందులో అతిథి పాత్రలో కనిపించడానికి రాఘవ లారెన్స్ మూడు రోజులు కాల్షీట్స్ కేటాయించినట్లు తెలిసింది. అదే విధంగా ఈ చిత్రం విడుదల సమయంలో ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొంటానని రాఘవ లారెన్స్ పేర్కొన్నట్లు సమాచారం. కాగా చిత్రాన్ని అన్భు అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. దీనికి ఇళయరాజా సంగీతాన్ని, సతీష్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇది కుంకీ చిత్రం తరహాలో ఏనుగుల ప్రధాన ఇతివృత్తంతో సాగే కథా చిత్రం అని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: హీరోయిన్-డైరెక్టర్ మధ్య మాటల యుద్ధం.. అసలేం జరుగుతోంది? -
విజయ్‌కాంత్ కోసం ఆ పని చేయనున్న లారెన్స్!
కెప్టెన్ విజయ్‌కాంత్ ఇక లేరన్న విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 28న కన్నుమూశారు. ఆయన మరణవార్త విని సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. కొందరు సెలబ్రిటీలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కంటతడి పెట్టుకోగా మరికొందరు ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తూ ఎమోషనల్ అయ్యారు. హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ కొద్ది రోజుల క్రితమే తన తల్లితో కలిసి విజయ్‌కాంత్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించాడు. అతడి సినిమాలో చేస్తా ఆ సమయంలో కెప్టెన్ తనయుడు షణ్ముగ పాండియన్ కెరీర్ బాధ్యతలు నువ్వే తీసుకోవాలని ఇంటిసభ్యులు రాఘవను కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం నాడు రాఘవ కీలక ప్రకటన చేశాడు. 'షణ్ముగ పాండియన్ నెక్స్ట్ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తాను. వీలైతే దర్శకులు మల్టీస్టారర్ కాన్సెప్ట్‌తో రండి. అప్పుడు ఇద్దరం ప్రధాన పాత్రల్లో నటించే వీలుంటుంది. అలాగే కెప్టెన్ రెండో కుమారుడు విజయ ప్రభాకరన్ రాజకీయాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని వీడియో రిలీజ్ చేశాడు. విజయ్‌కాంత్ మీద ఉన్న ప్రేమ, గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్(ట్విటర్)లో వెల్లడించాడు. అలా తెలుగువారికీ పరిచయం నల్ల ఎంజీఆర్, పురట్చి కలైజ్ఞర్, కెప్టెన్.. ఎలా పలు పేర్లతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు విజయ్‌కాంత్. తమిళంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న ఆయన ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. కానీ ఛాలెంజ్ రౌడీ, పోలీస్ అధికారం, కెప్టెన్, మా బావ బంగారం, సింధూరపువ్వు, బొబ్బిలి రాయుడు, మరణ మృదంగం.. ఇలా ఆయన నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో అనువాదమవడంతో ఇక్కడివారికీ సుపరిచితులయ్యారు. ఒక్క రూపాయి తీసుకోలేదు నిర్మాత ఇబ్బందుల్లో ఉంటే ఈయన ఒక్క రూపాయి పారితోషికం తీసుకునేవారు కాదు. అలాగే తన కార్యాలయంలో నిత్యాన్నదానం చేసేవారు. అటు సందేశాత్మక చిత్రాలు, ఇటు వాణిజ్య సినిమాలు ఏకకాలంలో చేసేవారు. అలాగే ఎందరో నటీనటులను ప్రోత్సహించి మంచి కెరీర్ అందించారు. ఈయన చివరగా తన కొడుకు షణ్ముగ పాండియన్‌ను హీరోగా పరిచయం చేసిన సహాబ్దం సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. I’m happy to share with you all that I’m ready to do a cameo role in captain sir’s Son Shanmuga Pandian’s movie as my respect and love for Vijayakanth sir 🙏🏼 pic.twitter.com/zIlNBqnVs2 — Raghava Lawrence (@offl_Lawrence) January 10, 2024 చదవండి: 'ఓ విషయం గర్వంగా చెప్పాలని ఉంది'.. నమ్రత పోస్ట్ వైరల్! విరాట్ నాకు బావ అవుతాడు.. నాతో ఎలా ఉంటాడంటే?: సైంధవ్ హీరోయిన్ -
లారెన్స్‌కు జోడీగా మృణాల్.. మూవీ టైటిల్ కూడా డిఫరెంట్!?
హీరో రాఘవా లారెన్స్, హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ జోడీ కట్టనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. రాఘవా లారెన్స్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ఫిల్మ్ తెరకెక్కనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ప్రారంభం కానుందని టాక్. ఈ చిత్రంలో లారెన్స్‌కు జోడీగా మృణాళ్ కనిపిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో లేటెస్ట్గా వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు ‘శ్రీరామరక్ష’ అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నారట మేకర్స్. కాగా ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
వివాహం చేసుకునే అభిమానులకు గిఫ్ట్.. సాయంలో లారెన్స్ ఎవర్గ్రీన్
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్ తండ: డబుల్ ఎక్స్' దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'జిగర్ తండ'కు సీక్వెల్‌గా తెరకెక్కించిన ఈ సినిమా యాక్షన్ కామెడీ చిత్రంగా ప్రేక్షకులను మెప్పించింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 8 నుంచి ప్రసారం కానుంది. తాజాగా ఈ చిత్రం విజయోత్సవ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు కార్తీక సుబ్బరాజ్, ఎస్‌జె సూర్య, రాఘవ లారెన్స్, నవీన్ చంద్ర, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తదితరులు పాల్గొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా నాకు మంచి విజయాన్ని అందించింది. కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాలో అసలైన హీరో అని నా మనసులో ఉంది. ఈ సినిమాకి దేవుడి ఆశీస్సులు చాలా ఉన్నాయి, అదే ఈ సినిమాకు భారీ విజయాన్ని ఇచ్చింది. నా అభిమానుల ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేను. వారందరూ నా కుటుంబ సభ్యులే.' అని ఆయన అన్నారు. ఉచిత కళ్యాణ మండపం అభిమానులకు మరో శుభవార్తను లారెన్స్ ఇలా తెలిపాడు.. 'సినిమా విడుదలైన ప్రతిసారీ నా అభిమానులకు ఏదో ఒకటి చేయాలనుకుంటాను. అందుకే మా అమ్మ పేరు మీద కన్మణి కళ్యాణ మండపాన్ని త్వరలో నిర్మించబోతున్నాను. అందులో నా అభిమానులు ఉచితంగా పెళ్లి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నానంటే.. నా అభిమాని ఒకరు పెళ్లి పత్రిక ఇచ్చి నన్ను పెళ్లికి ఆహ్వానించారు. అప్పుడు పెళ్లి ఎక్కడ అని అడిగాను. అప్పుడు అతను తన ఇంట్లోనే అంటూ.. సరైన వసతిలేదని తెలిపాడు. కళ్యాణమండపంలో పెళ్లి చేసుకుందామనుకుంటే అంత డబ్బు లేదని తెలిపాడు. పెళ్లి సమయంలో సంతోషంగా ఉండాల్సిన వ్యక్తి అలా బాధగా కనిపించేసరికి నాకు నచ్చలేదు. దీంతో వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే మా అమ్మ పేరుతో ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాలనుకున్నాను. అక్కడ వంట పాత్రలతో సహా అన్నీ ఉంటాయి. ఎలాంటి డబ్బు చెల్లించకుండా ఉచితంగానే పెళ్లి చేసుకోవచ్చు. అని లారెన్స్ తెలిపాడు. -
ఓటీటీలో జిగర్తాండ డబుల్ ఎక్స్.. అప్పటినుంచే స్ట్రీమింగ్
రాఘవ లారెన్స్, ఆర్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జిగర్తాండ డబుల్ ఎక్స్. తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన జిగర్తాండ (ఈ మూవీ తెలుగులో గద్దలకొండ గణేశ్‌గా రీమేక్ అయింది)కు సీక్వెల్‌గా తెరకెక్కింది. నవంబర్ 10న తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది చిత్రం. తెలుగువారికి పెద్దగా కనెక్ట్ అవలేదు కానీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది. లారెన్స్, సూర్య నటనకైతే నూటికి నూరు మార్కులు పడ్డాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. డిసెంబర్ 8 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇంగ్లీష్‌లో కూడా త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించింది నెట్‌ఫ్లిక్స్. ఇది చూసిన అభిమానులు వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కథేంటంటే.. కృపాకర్ (ఎస్జే సూర్య) కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదించుకుంటాడు. అంతలోనే చేయని తప్పుకు ఓ హత్య కేసులో జైలుపాలవుతాడు. కర్నూల్లోని జిగర్ తాండ మర్డర్ క్లబ్ గ్యాంగ్‌స్టర్ సీజర్ (రాఘవ లారెన్స్)ను చంపితే కేసు నుంచి బయటపడటమే కాకుండా తిరిగి ఎస్సై ఉద్యోగం పొందగలుగుతాడు. అందుకని సీజర్‌ను చంపే ఆపరేషన్‌ను పూర్తి చేసేందుకు ఒప్పుకుంటాడు. సీజర్కు హీరో అవ్వాలన్న పిచ్చి ఉందని తెలిసి దర్శకుడిగా అతడి దగ్గర చేరతాడు. మరి కృపాకర్ అనుకున్నది జరిగిందా? హీరోగా పేరు తెచ్చుకోవాలన్న సీజర్ కల నెరవేరిందా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! Roll-camera-action!🎥 Indha Pandyaa Blockbuster paaka ellarum vaanga! 💥 Jigarthanda DoubleX is coming to Netflix on 8 December in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi! Coming soon in English.#JigarthandaDoubleXOnNetflix pic.twitter.com/r1OlgnTpLY — Netflix India South (@Netflix_INSouth) December 1, 2023 చదవండి: ఎవరైనా నా చేయి పట్టుకుంటారా?.. హీరోయిన్ పోస్ట్ చూశారా? -
'జిగర్ తండ డబుల్ ఎక్స్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: జిగర్ తండ(డబుల్ ఎక్స్) నటీనటులు: రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య, నిమిషా, నవీన్ చంద్ర తదితరులు నిర్మాణ సంస్థ: స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, కతిరేశన్ దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: తిరు ఎడిటింగ్: షఫీక్ మహమ్మద్ అలీ విడుదల తేది: నవంబర్ 10, 2023 రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో తెరెకెక్కించిన చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం, ఎస్. కథిరేసన్ నిర్మించగా.. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఇది తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన జిగర్ తండ(ఈ మూవీ తెలుగులో గద్దలకొండ గణేశ్‌గా రీమేక్ అయింది) సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. సీజర్(రాఘవ లారెన్స్) రాయలసీమలోని కర్నూలులో గ్యాంగ్‌స్టార్. ఆ ప్రాంతంలోని మరో గ్యాంగ్ స్టార్ లారెన్స్‌తో గొడవ పడుతుంటారు. అప్పుడే తన గురువు లాంటి అతన్ని సీజర్ చంపేస్తాడు. కానీ సీజర్కు స్థానిక రాజకీయ నాయకుడైన కారుమంచి(ఇళవరసు) సపోర్ట్ ఉంటుంది. మరో రాజకీయ నాయకుడైన టామ్ చాకో(జయకృష్ణ) మనిషిని సీజర్ చంపడంతో అతనిపై పగ పెంచుకుంటాడు. దీంతో ఎలాగైనా సరే సీజర్‌ను చంపేయాలని జయకృష్ణ.. ఫారెస్ట్ ఆఫీసర్ అయిన నవీన్ చంద్రకు చెప్తాడు. అయితే సీజర్‌ను చంపే ప్రయత్నంలో ఎస్సై కావాల్సిన ఎస్జే సూర్య(రే దాసన్) మధ్యలో ఎందుకు ఎంటరయ్యాడు? అసలు జయకృష్ణకు సీజర్‌ను చంపాల్సిన అవసరమేంటి? చివరికీ జయకృష్ణ సీజర్‌ను చంపాడా? లేదా? అసలు సీజర్(లారెన్స్)ను, రే దాసన్(ఎస్జే) ఎందుకు చంపాలనుకున్నాడు? వీరిద్దరి మధ్య గల వైరానికి కారణమేంటి? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరోవైపు అడవిలో ఉండే ఆదివాసీలకు, అసలు సీజర్కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఫారెస్ట్ అధికారుల వేధింపుల నుంచి ఆదివాసీలను సీజర్ ఎందుకు రక్షించాలనుకుంటాడు? చివరికీ వారికి అండగా నిలిచాడా? లేదా? ప్రభుత్వం, అటవీ అధికారులకు దొరకకుండా.. అడవిలో ఏనుగులను అంతమొందిస్తున్న స్మగ్లర్లను సీజర్ ఎందుకు పట్టుకున్నాడు? వాళ్లను పట్టుకున్నాక సీజర్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వచ్చింది? చివరికీ తాను అనుకున్న లక్ష్యం నేరవేరిందా? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే. ఎలా సాగిందంటే.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లోనే కథను పరిచయం చేశాడు డైరెక్టర్. దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్ ముందుకొచ్చిన కార్తీక్ సుబ్బరాజు సీక్వెల్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 1970 ప్రాంతంలో రాయలసీమలోని నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే ఏనుగుల దంతాల స్మగ్లింగ్ నేపథ్యంలో కథను తీసుకొచ్చారు. ఫస్టాఫ్‌లో రాయలసీమ జిల్లాల్లోని స్మగ్లర్లు, రాజకీయ నాయకులు, అడవిలో నివసించే ఆదివాసీల చుట్టే తిరుగుతుంది. అయితే ఎస్సైగా జాబ్‌లో చేరాల్సిన ఎస్జే సూర్య(రే దాసన్), మరో వైపు హీరో కావాలనుకున్నా రాఘవ(సీజర్) మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఫస్టాప్‌లో మరీ ముఖ్యంగా సీరియస్‌గా సాగుతున్న స్టోరీలో సత్యన్, ఎస్జే సూర్యతో కామెడీని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సుబ్బరాజు. ఇంటర్వెల్‌కు ముందు చిన్న ట్విస్ట్ ఇచ్చి సింపుల్‌గా ముగించారు. సెకండాఫ్ మొదలవగానే కథలో కాస్తా వేగం పెరిగింది. అడవితల్లితో వారికున్న బంధాన్ని చాలా చక్కగా చూపించారు. అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీల జీవన విధానాన్ని సైతం ప్రేక్షకులకు పరిచయం చేశారు కార్తీక్. ముఖ్యంగా అడవిలో ఏనుగులను అంతమొందిస్తున్నషెటానీ ముఠా.. రాఘవ లారెన్స్ మధ్య జరిగే ఫైట్ సీన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తితో పాటు కాస్తా ఉత్కంఠకు గురి చేస్తాయి. ఒకవైపు రాజకీయ నాయకులు, అధికారుల కుట్రలను ప్రేక్షకులకు చూపిస్తూనే.. మరోవైపు ఆదివాసీ బిడ్డల అమాయకత్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. అడవి బిడ్డలైన ఆదివాసీలకు, జంతువులకు మధ్య ఉండే ప్రేమానురాగాలను కాస్తా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఏనుగులను చంపే షెటానీ ముఠా, సీజర్(రాఘవ లారెన్స్) మధ్య జరిగే ఫైట్ సీన్స్ సెకండాఫ్‌లో హైలెట్. ఒకవైపు రాజకీయ నాయకుల కుట్రలు, మరోవైపు అడవిలో స్మగ్లింగ్, వీరి మధ్యన నలిగిపోతున్న ఆదివాసీ బిడ్డలతో కథను ముందుకు తీసుకెళ్లారు. అక్కడక్కడ వచ్చే ప్రేకకుల ఊహకందే ట్విస్టులతో థియేటర్లో కూర్చోబెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ వచ్చేసరికి ఎమోషనల్ టచ్ ఇచ్చి ఆడియన్స్‌ను కంటతడి పెట్టించారు డైరెక్టర్. సినిమా చివరి 20 నిమిషాలు ఫుల్ ఎమోషనల్‌గా సాగింది. సన్నివేశాలు కాస్త సినిమాటిక్‌గా ఉన్నా ఆడియన్స్‌లో మాత్రం ఉత్కంఠ పెంచుతాయి. దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కించడంలో ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో మాత్రం డైరెక్టర్ సక్సెస్ కాలేకపోయాడనిపిస్తోంది. జగర్ తండకు సీక్వెల్ అయినా రెండు కథలు పూర్తి భిన్నంగా ఉంటాయి. అయితే రెండింటిలోనూ సెటప్ అంతా దాదాపుగా ఒకే తరహాలో సాగుతుంది. అయితే మరో సీక్వెల్‌గా త్రిబుల్ ఎక్స్ తీసుకురానున్నట్లు చివర్లో హింట్ మాత్రం ఇచ్చేశారు. ఎవరెలా చేశారంటే... రాఘవ లారెన్స్ ఎప్పటిలాగే తన నటనతో అదరగొట్టేశారు. తనలోని ఫుల్ మాస్ యాక్షన్‌తో మరోసారి తనదైన నటనతో మెప్పించారు. ఎస్జే సూర్య సైతం తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. నవీన్ చంద్ర అటవీశాఖ అధికారి పాత్రలో ఒదిగిపోయారు. నిమిశా, ఇళవరసు, టామ్ చాకో, సత్యన్, బావ చెల్లాదురై, అరవింద్ ఆకాష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే.. సంతోష్ నారాయణన్ సంగీతం పర్వాలేదు. ఈ చిత్రంలో పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా సందర్భాన్ని తగినట్లుగానే ఉన్నాయి. బీజీఎం ఫరవాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు కాస్తా పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - మధుసూదన్, సాక్షి వెబ్ డెస్క్ -
'జిగర్ తండ డబుల్ ఎక్స్' ట్విటర్ టాక్.. రివ్యూ ఇచ్చిన ధనుష్
రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘జిగర్ తాండ డబుల్ ఎక్స్’. ఇది తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన జిగర్ తండ(ఈ మూవీ తెలుగులో గద్దలకొండ గణేశ్‌గా రీమేక్ అయింది) సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. నిజానికి తొలి భాగంలో హీరోగా నటించే ఛాన్స్ లారెన్స్‌కు వచ్చినప్పటికీ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమా చేయలేదు. ఫస్ట్ పార్ట్ మిస్.. సీక్వెల్లో ఛాన్స్ కానీ ఈ మూవీకి రెండు జాతీయ అవార్డులు రావడంతో సీక్వెల్ ఉంటే నటిస్తానని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకు చెప్పాడు. అందుకు ఆయన ఓకే అన్నాడు. అలా సుమారు ఏడేళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌గా తెరకెక్కింది జిగర్ తండ డబుల్ ఎక్స్. ఇందులో లారెన్స్ గ్యాంగ్‌స్టర్‌గా నటించాడు. ఎస్జే సూర్య దర్శకుడు కావాలనుకునే పాత్రలో కనిపించాడు. కార్తికేయన్ సంతానం నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నేడు(నవంబర్ 10న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చివరి 40 నిమిషాలు.. కొన్ని చోట్ల మాత్రమే ఫస్ట్ డే ఫస్ట్ షో పడ్డాయి. చాలా చోట్ల ఇంకా షో పడకపోవడంతో సినిమా ఎలా ఉందనే టాక్ ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. అటు హీరో ధనుష్ మాత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా చూసి ట్విటర్(ఎక్స్) వేదికగా రివ్యూ ఇచ్చాడు. ఈ మూవీలో సూర్య, లారెన్స్ నటన చాలా బాగుందని, సినిమా చివరి 40 నిమిషాలు అదిరిపోయిందని రివ్యూ ఇచ్చాడు. Watched jigarthandaxx. Fantastic craft from @karthiksubbaraj, being amazing has become an usual deal for @iam_SJSuryah. As a performer @offl_Lawrence is a revelation. @Music_Santhosh u r a beauty. The last 40 mins of d film steals your heart. All the best to the crew and cast. — Dhanush (@dhanushkraja) November 9, 2023 #JigarthandaDoubleX Review Good First Half and Very Good Second Half💥 S.J.Surya and Lawrence Performance Ultimate🔥 Music👏 Screenplay Brilliant 💥 Last 40 Minutes and Climax Verithanam🔥 Worth watch. My Rating 4.2/5⭐#Japan #Leo #Ayalaan #Salaar #CaptainMiller #TheMarvels pic.twitter.com/BrWGIkdTnT — LetsOTT (@letesott) November 10, 2023 #JigarthandaDoubleX Review Good First Half and Very Good Second Half💥 S.J.Surya and Lawrence Performance Ultimate🔥 Music👏 Screenplay Brilliant 💥 Last 40 Minutes and Climax Verithanam🔥 Worth watch. My Rating 4.2/5⭐#Japan #Leo #Ayalaan #Salaar #CaptainMiller #TheMarvels pic.twitter.com/BrWGIkdTnT — LetsOTT (@letesott) November 10, 2023 -
రాఘవకు హీరోగా కెరీర్ ఇచ్చిన డైరెక్టర్ మృతి..
తమిళ చిత్రసీమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు అర్పుదాన్(52) కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా అర్పుదాన్ తమిళంలో ఎన్నో సినిమాలు తీశారు. టాలెంట్ ఉండి అవకాశాల కోసం తిరుగుతున్న రాఘవ లారెన్స్‌ను హీరోగా పెట్టి సినిమా తీశారు. ఆ సినిమాయే అద్భుతం. ఇది 2002లో రిలీజైంది. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. అప్పటికే లారెన్స్ తెలుగులో హీరోగా సినిమా చేశాడు. తమిళంలో సైడ్ క్యారెక్టర్లు చేశాడు. అద్భుతం సినిమాతో కోలీవుడ్‌లోనూ హీరోగా మారాడు. ఈ మూవీ రాఘవ కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడింది. ఇక అర్పుదాన్.. మనతోడు మళైకాలం, షామ్, సెప్పవే సిరుగాలి వంటి పలు చిత్రాలు తెరకెక్కించారు. తెలుగులో ఉదయ్ కిరణ్ హీరోగా లవ్ టుడే చిత్రానికి దర్శకత్వం వహించారు. చదవండి: అర్జున్ చేతుల మీదుగా భార్యకు సీమంతం.. సీక్రెట్స్ చెప్పిన ఆ ముగ్గురు.. గుండె బరువెక్కడం ఖాయం! -
నన్ను కొత్తగా చూస్తారు
రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన ΄ాత్రల్లో నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో చెప్పిన విశేషాలు. లారెన్స్ మాట్లాడుతూ – ‘‘జిగర్ తండ’ సినిమాలోని గ్యాంగ్‌స్టర్ ΄ాత్రలో నటించే తొలి అవకాశం నాకే వచ్చింది. కానీ అప్పుడు ఇతర ్ర΄ాజెక్ట్స్తో బిజీగా ఉండటం వల్ల చేయడం కుదర్లేదు. ఆ తర్వాత ‘జిగర్ తండ’కు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. దీంతో ‘జిగర్ తండ’ కు సీక్వెల్ ఉన్నట్లయితే అందులో నేను నటిస్తానని కార్తీక్ సుబ్బరాజుకి చె΄్పాను. ఈ సీక్వెల్ ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’ కథ సిద్ధమైన ఏడాది తర్వాత కార్తీక్ సుబ్బరాజు ఫోన్ చేసి చె΄్పారు. కథ నచ్చడంతో ఈ సినిమాలో నటించాను. ∙ఈ సినిమా విషయంలో దర్శకుడు కార్తీక్ చెప్పినట్లు చేశాను. ప్రేక్షకులు కొత్త రాఘవా లారెన్స్‌ని చూస్తారు. సినిమా ఫస్టాప్‌లో యాక్షన్, సెకండాఫ్‌లో భావోద్వేగాల సన్నివేశాలు ఉంటాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల హృదయం కూడా బరువెక్కుతుంది. ∙త్వరలో ‘కాంచన 4’ స్టార్ట్ చేస్తాను. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్‌గారి కోసమే కాదు.. సూపర్‌స్టార్, మెగాస్టార్ (చిరంజీవిని ఉద్దేశిస్తూ..) కలిసి యాక్ట్ చేసే ఓ మల్టీస్టారర్ స్క్రిప్ట్ నా దగ్గర ఉంది. కానీ వారు యాక్ట్ చేయాలి కదా’’ అన్నారు. నటుడు– దర్శకుడు ఎస్జే సూర్య మాట్లాడుతూ– ‘‘దర్శకత్వం–నటన..ఈ రెండింటిలో నాకు నటన అంటేనే ఇష్టం. అయితే నా కెరీర్ ్ర΄ారంభంలో యాక్టింగ్ అవకాశాల కోసం డైరెక్షన్‌ని వారధిగా వినియోగించుకున్నాను. ఇక ‘జిగర్ తండ: డబుల్ఎక్స్’లో లారెన్స్గారిది గ్యాంగ్‌స్టర్ రోల్. నాదేమో దర్శకుడు కావాలనుకునే ΄ాత్ర. నా ΄ాత్రలో సత్యజిత్ రేగారి సినిమాల రిఫరెన్స్ ఉండటంతో ఇదొక బహుమతిగా భావించి ఈ మూవీ చేశాను. మంచి మాస్ కమర్షియల్ అంశాలు ఉన్న సందేశాత్మక చిత్రం ఇది. ఈ సినిమా షూటింగ్ కోసం ఓ విలేజ్ సెట్ వేయాల్సి వచ్చింది. ఇందులో భాగంగా ఓ రోడ్, బ్రిడ్జ్ వేశాం. అప్పటికే రోడ్, బ్రిడ్జ్ సౌకర్యాలు లేక ఇబ్బందిపడుతున్న ఆ గ్రామస్తులకు ఇవి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. నేను నటిస్తూ, నా దర్శకత్వంలో ఓ సినిమా రానుంది’’ అని చెప్పుకొచ్చారు. -
ట్రైలర్ అదిరిపోయింది
‘‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ ఎలా ఉంటుందో మరోసారి ఈ ట్రైలర్‌తో చూపించాడు. సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందనే గట్టి నమ్మకం ఉంది’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’. కార్తికేయన్ సంతానం నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదలఅవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్ మాట్లాడుతూ–‘‘లారెన్స్, ఎస్జే సూర్య వంటి ప్రతిభ ఉన్న నటులు ఈ సినిమాలో నటించారు. కార్తీక్ సుబ్బరాజ్ కల్ట్ డైరెక్టర్. నాకోసం తను త్వరలోనే ఓ స్క్రిప్ట్ తయారు చేస్తాడనుకుంటున్నాను’’ అన్నారు. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ–‘‘తమిళనాడులో నేను ట్రస్ట్ పెట్టి సేవలు చేస్తున్నాను. ఇకపై తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ ట్రస్ట్ సేవలు అందించబోతున్నాను’’ అన్నారు. ‘‘అందరూ మా సినిమాను చూసి ఎంజాయ్ చే స్తారు’’ అన్నారు ఎస్జే సూర్య. ‘‘మా చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని కార్తికేయన్ సంతానం అన్నారు. ‘‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ నాకు ఎంతో ప్రత్యేకం. నాలుగున్నరేళ్ల తర్వాత థియేటర్స్‌లోకి విడుదలవుతున్న నా సినిమా ఇది’’ అన్నారు కార్తీక్ సుబ్బరాజ్. ఈ వేడుకలో సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, డైరెక్టర్ శైలేష్ కొలను, నటుడు నవీన్ చంద్ర మాట్లాడారు. -
రజనీ కొత్త మూవీలో లారెన్స్ విలన్ గా..!
-
రజనీకాంత్ కొత్త సినిమా.. విలన్‌గా చంద్రముఖి 2 హీరో
సూపర్‌స్టార్ రజనీకాంత్ అంటే నృత్య దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌కు ఎంతో అభిమానం. రాఘవ లారెన్స్ ఏ కార్యక్రమాన్ని మొదలెట్టినా ముందుగా తన గురువు రజనీకాంత్‌ను కలిసి ఆశీస్సులు అందుకుంటారు. కాగా రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చంద్రముఖి–2 చిత్రంలో రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటించే ముందు రాఘవ లారెన్స్ తన గురువు రజనీకాంత్‌ను కలిసి ఆశీర్వాదం పొందారు. ఇదిలా ఉంటే జైలర్ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న రజనీ తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలాం సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా తెరపైకి రానుంది. ప్రస్తుతం జై భీమ్ చిత్రం ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇది ఆయన నటిస్తున్న 170వ చిత్రం అవుతుంది. కాగా 171 చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం గురించి ఇప్పటికే రకరకాల ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి ఇందులో రజనీకాంత్‌కు ప్రతినాయకుడిగా రాఘవ లారెన్స్ నటించినున్నారట! ఇది ఎంతవరకు నిజమో కానీ ఇదే జరిగితే చిత్రానికి మరింత హైప్ వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. -
ఓటీటీలో చంద్రముఖి 2 సినిమా.. ఒకరోజు ముందుగానే!
హారర్ సినిమాలకు పెట్టింది పేరు రాఘవ లారెన్స్. ముని, కాంచన(ముని సీక్వెల్), కాంచన 2, కాంచన 3 సినిమాలను డైరెక్ట్ చేశాడు. దర్శకత్వం వహించడమే కాదు, ఈ సినిమాలన్నింటిలో లారెన్సే హీరోగా నటించాడు. ఇవి కాకుండా శివలింగ, రుద్ర అని మరికొన్ని హారర్ చిత్రాల్లో నటించాడు. ఇటీవలే బ్లాక్‌బస్టర్ మూవీ చంద్రముఖికి సీక్వెల్లో నటించాడు. చంద్రముఖిని తెరకెక్కించిన డైరెక్టర్ పి.వాసుయే ఈ సీక్వెల్‌కు డైరెక్షన్ చేశాడు. ఈ చిత్రంలో కంగనా రనౌత్ హీరోయిన్గా నటించింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎంఎం. కీరవాణి సంగీతం అందించారు. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చంద్రముఖి 2 చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కరువైంది. బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇక ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొన్నటివరకు ఈ చిత్రం అక్టోబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తోందీ చిత్రం. అక్టోబర్ 26న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. Screaming : Cause Chandramukhi is going to have us on our edge of our seats soon!😱 Chandramukhi 2, streams from 26th Oct on Netflix in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi!#Chandramukhi2OnNetflix pic.twitter.com/AcGDT7zeoo — Netflix India South (@Netflix_INSouth) October 21, 2023 ‘‘క్లిక్ చేసి సాక్షి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ చదవండి: మూడుసార్లు ప్రెగ్నెన్సీ ఫెయిల్, డిప్రెషన్.. అందుకే సీరియల్స్‌కు గుడ్‌బై.. -
ప్రముఖ ఓటీటీలోకి వచ్చేస్తున్న బెస్ట్ హర్రర్ తెలుగు సినిమా
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో పి.వాసు తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘చంద్రముఖి 2’. రజనీకాంత్ హిట్ సినిమా ‘చంద్రముఖి’కి ఇది సీక్వెల్‌గా రూపొందింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు రాఘవ లారెన్స్ భారీగానే ప్రమోషన్స్ నిర్వహించారు. దీంతో భారీ అంచనాల మధ్య విడుదలైన చంద్రముఖి 2 మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. (ఇదీ చదవండి: తెలుగులో ఆ స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ వస్తే చేస్తా: ఆర్కే రోజా) దీంతో సినిమా చూద్దాం అనుకున్న వారందరూ కూడా ఓటీటీలో వచ్చినప్పుడు చూడొచ్చులే అని సరిపెట్టుకున్నారు. ఈ సినిమా వల్ల సుమారు రూ. 20 కోట్ల మేరకు నిర్మాతలు నష్టపోయారని టాక్. తెలుగు వెర్షన్ అయితే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. థియేటర్లో నిరాశపరిచిన ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కానీ చంద్రముఖి 2 సినిమా విడుదలైన కొద్దిరోజులకే ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. తమిళ వెర్షన్‌కు సంబంధించి హెచ్డీ ప్రింట్‌ను పైరసీ సైట్‌తో పాటు కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అయింది. థియేటర్లో చంద్రముఖి 2 చిత్రాన్ని చూడలేకపోయిన వారు అక్టోబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. కానీ ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. చంద్రముఖి 2 సినిమాలో మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సుభీక్ష ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందించారు. -
నాపై నాకు నమ్మకం వచ్చింది
‘‘జిగర్తాండ డబుల్ ఎక్స్’లో నాకు మేకప్ వాడలేదు. మేకప్ లేకుంటే బాగుండనేమో? అనుకున్నాను. కానీ, స్క్రీన్‌పై చూసుకున్నాక నా మీద నాకు నమ్మకం ఏర్పడింది’’ అన్నారు రాఘవా లారెన్స్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’. కార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమాలోని ‘కోరమీసం..’ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ– ‘‘జిగర్తాండ’లో నేను చేయాల్సింది.. కానీ, కుదర్లేదు. ఆ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్‌కు జాతీయ అవార్డు వచ్చింది. ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ కోసం ఓ ఊర్లో రోడ్డు, బ్రిడ్జి నిర్మించారు మా నిర్మాత. ఆయన మంచి మనసు కోసమైనా ఈ చిత్రం బాగా ఆడాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా పండగలా ఉంటుంది’’ అన్నారు కార్తికేయన్. ‘‘జిగర్తాండ’ కంటే డబుల్ ఎక్స్ రేంజ్లో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు కార్తీక్ సుబ్బరాజ్. ‘‘ఈ సినిమా నాకు ప్రత్యేకం’’ అన్నారు ఎస్జే సూర్య. -
నిద్రలోనూ అవే కలలు వస్తున్నాయి.. అయినా తప్పకుండా చేస్తా: రాఘవ లారెన్స్
ఇటీవలే చంద్రముఖి-2 సినిమాతో ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్. ప్రస్తుతం ఎస్జే సూర్యతో కలిసి జగిర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో నటిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్లో రాఘవ లారెన్స్ మాట్లాడారు. చంద్రముఖి- 2 ఫ్లాప్ గురించి ఆయన స్పందించారు. (ఇది చదవండి: మరో సక్సెస్ఫుల్ హీరో వచ్చాడు – హీరో నాని ) రాఘవ మాట్లాడుతూ..'చంద్రముఖి -2 సినిమాకు నా డబ్బులు నాకు వచ్చేశాయి. జీవితంలో అన్నీ మనమే గెలవాలని లేదు కదా. గ్రూప్ డ్యాన్సర్ నుంచి డ్యాన్సర్ మాస్టర్ అయితే చాలని భావించా. అక్కడి నుంచే దర్శకుడిని, హీరోను అయ్యాను. నా గ్లామర్‌కు హీరో అవకాశాలు ఇవ్వడమే దేవుడిచ్చిన పెద్ద వరం. మళ్లీ అందులో ఫ్లాప్, హిట్ గురించి అస్సలు ఆలోచించకూడదు. 'జిగిర్తాండ డబుల్ ఎక్స్' డబ్బింగ్ పూర్తయ్యాక చూశా. ఇందులో మంచి స్టోరీ ఉంది. సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఎంత పెద్ద హీరో సినిమా చేసినా, డ్యాన్స్ చేసినా కథ లేకపోతే సినిమా ఆడదు. కంటెంట్ బలంగా ఉండాలంటే దర్శకుడు కూడా అంతే బలంగా ఉండాలి. కార్తీక్ సుబ్బరాజు విషయంలో నాకు ఎలాంటి డౌట్స్ లేవు.' అని అన్నారు. (ఇది చదవండి: అమర్‌దీప్‌కి ఎలిమినేషన్ భయం.. ఇలా అయిపోయాడేంటి?) అయితే కాంచన-4 ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు సార్.. అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. అన్ని దెయ్యాల సినిమాలు తీసి మనశ్శాంతిగా ఉండటం లేదు. రాత్రి కూడా కలలో అవే గుర్తుకొస్తున్నాయి. దీంతో నా మైండ్ కాస్తా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. కానీ ఏదో ఒక రోజు ఆ సినిమాను తప్పకుండా చేస్తా' అని అన్నారు. Any Muni Fans here ?🙋🏻🔥 #RaghavaLawrence pic.twitter.com/LEqbZCq2r1 — Anchor_Karthik (@Karthikk_7) October 10, 2023 -
ఆ మూవీ రిలీజ్ తర్వాత చాలా బాధపడ్డా: రాఘవ లారెన్స్
నటుడు రాఘవ లారెన్స్ హీరోగా, ఎస్జే సూర్య విలన్‌గా నటించిన తాజా చిత్రం 'జిగర్తండ డబుల్ ఎక్స్'. నటి నిమిషా సజయన్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్ నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, తిరునావుక్కరుసు చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం చైన్నెలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఇందులో రాఘవ లారెనన్స్ మాట్లాడుతూ జగర్తండా చిత్రంలో తానే నటించాల్సి ఉందని.. ఆ సమయంలో తాను తెలుగులో చిత్రం చేయడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నానని తెలిపారు. అయితే చిత్రం విడుదలైన తరువాత చూసి ఇంటికి వచ్చి చాలా బాధపడ్డానని ఒక రోజంతా నిద్ర కూడా పోలేదని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ చిత్రాన్ని చేయకపోవడమే మంచిదిగా భావిస్తున్నానని అన్నారు. కారణం అప్పుడు రూ. 20 కోట్ల బడ్జెట్లో రూపొందిన జిగర్తండా చిత్రాన్ని వదులుకోవడం వల్లే ఇప్పుడు రూ. 100 కోట్ల బడ్జెట్లో రూపొందిస్తున్న ఈ జిగర్తండా డబుల్ ఎక్స్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎస్జే సూర్యతో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. తాను సూర్య నటించే ముందు అలా చేద్దాం.. ఇలా చేద్దాం అని డిస్కస్ చేసుకునే వాళ్లమని, అయితే స్పాట్‌లోకి వచ్చిన తర్వాత దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు చెప్పినట్లే చేయాల్సి వచ్చేదని అన్నారు. ఆయనకు అంత కమాండ్ ఉందని పేర్కొన్నారు. ఇది తనకు చాలా ముఖ్యమైన చిత్రమని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు. జిగర్తండ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయని.. ఈ చిత్రానికి కూడా రెండు, మూడు జాతీయ అవార్డులు వస్తాయనే నమ్మకాన్ని నిర్మాత కార్తికేయన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది తమ సంస్థలో రూ. 100 కోట్ల బడ్జెట్లో నిర్మించిన తొలి చిత్రం అని చెప్పారు. -
లోకేష్ కానగరాజ్, లారెన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన నయనతార
-
భారీ ధరకు చంద్రముఖి 2 ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించిన తాజా చిత్రం చంద్రముఖి 2. 2005లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన హార్రర్ మూవీ ‘చంద్రముఖి’కి సీక్వెల్ ఇది. పీ.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాలతో సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ చంద్రముఖి స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలి రోజు నుంచే మిశ్రమ స్పందన రావడంతో.. కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదు. అయితే సినిమాకు వచ్చిన బజ్ చూసి ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు డిజిటల్ రైట్స్ కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్ట్రీమింగ్ అప్పుడేనా.. చంద్రముఖి 2 స్ట్రీమింగ్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫిక్ల్ దక్కించుకుంది. దాదాపు రూ. 8 కోట్లు పెట్టి ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసిందట. సినిమా విడుదలైన నెలన్నర తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని తొలుత ఒప్పుందం కుదుర్చుకున్నారట. అయితె థియేటర్స్ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో స్పందన లభించకపోవడంతో ముందుగానే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోందట. నవంబర్ మూడో వారంలో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ్వనుందని సమాచారం. అయితే దీనిపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘ఎమెర్జెన్సీ’ బిజీలో కంగనా చంద్రముఖి 2లో టైటిల్ రోల్‌లొ నటించిన కంగనా.. ఇప్పుడా పాత్ర నుంచి బయటకు వచ్చింది. సినిమా ఫలితాన్ని మర్చిపోయి.. రాబోతున్న సినిమాలపై దృష్టి పెట్టింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెనీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందిరా గాంధి బయోపిక్ ఇది. దీంతో పాటు ‘తేజస్’ చిత్రంలో కూడా కంగనా నటించింది. . 2016లో భారత వైమానిక దళంలోకి మొట్టమొదటి సారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. సర్వేష్ మేవారా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల కాబోతుంది. -
‘చంద్రముఖి- 2’ కోసం లారెన్స్ భారీ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే..
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే స్ట్రాటజీని పక్కాగా ఫాలో అవుతున్నాడు రాఘవ లారెన్స్. పలువురు దర్శక నిర్మాతలు అతన్ని హీరోగా పెట్టి సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తుండడంతో తన సొంత సినిమాలను పక్కన పెట్టేశాడు. ముందుగా బయట సినిమాలు తీసి.. అవకాశాలు రానప్పుడు సొంత కథలను తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే ఫలితాలలో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. (చదవండి: ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు.. నయనతార ఆస్తుల విలువెంతో తెలుసా?) తాజాగా ఈ టాలెంటెడ్ హీరో నటించిన చంద్రముఖి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'చంద్రముఖి'కి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సెప్టెంబర్ 28న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీంతో ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టకలేకపోయింది. అయితే విడుదలకు ముందే మంచి బిజినెస్ చేయడంతో నిర్మాతలకు పెద్దగా నష్టమేమి జరగలేదు. ఇవన్నీ పక్కకు పెడితే.. హీరో లారెన్స్‌కు మాత్రం చంద్రముఖి 2 చాలా స్పెషల్ అనే చెప్పాలి. గత సినిమాలతో పోలిస్తే చంద్రముఖి 2కి చాలా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ చిత్రం కోసం లారెన్స్‌కి లైకా నిర్మాణ సంస్థ దాదాపు రూ. 25 కోట్లను పారితోషికంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ సినిమాకు ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం లారెన్స్‌కి ఇదే తొలిశారట. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా హిట్ కాకపోయినా.. లారెన్స్‌కి మాత్రం మంచి లాభమే తెచ్చిపెటిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: పేద వృద్ధురాలు పట్ల సితార తీరు.. నెటిజన్స్ ఫిదా!) -
‘చంద్రముఖి 2’ మూవీ రివ్యూ
టైటిల్: చంద్రముఖి 2 నటీనటులు: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, రాధికా శరత్ కుమార్, మహిమా నంబియార్, లక్ష్మి మీనన్ తదితరులు నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్ నిర్మాత:సుబాస్కరన్ దర్శకుడు: పి.వాసు సంగీతం: కీరవాణి సినిమాటోగ్రఫీ:ఆర్డీ రాజశేఖర్ విడుదల తేది: సెప్టెంబర్ 28, 2023 సూపర్‌స్టార్ రజనీకాంత్ చంద్రముఖి(2005) అప్పట్లో ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. చంద్రముఖిగా జ్యోతిక నటన చూసి చాలామంది భయపడ్డారు కూడా. ఇప్పటికీ చాలా మందికి బెస్ట్ హారర్ ఫిల్మ్ అంటే చంద్రముఖినే. అలాంటి హిట్ సినిమాకు సీక్వెల్ అంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. సినిమా ప్రకటన వచ్చిన దగ్గర నుంచి చంద్రముఖి 2పై హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు రజనీకాంత్ శిష్యుడు రాఘవ లారెన్స్ గురువుగారి పాత్ర పోషించడం.. బాలీవుడ్ క్వీన్ కంగన చంద్రముఖిగా అనేసరికి ‘చంద్రముఖి 2’పై అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల మధ్య గురవారం(సెప్టెంబర్ 28) ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి ఇది ఎలా ఉంది? చంద్రముఖిగా కంగన ఏమేరకు భయపెట్టిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రంగనాయకి(రాధిక శరత్‌కుమార్) ఫ్యామిలీకి అనుకోని ఆపదలు వచ్చిపడతాయి. దీంతో ఆమె స్వామీజీ(రావు రమేశ్)ని కలుస్తుంది. కులదైవం గుడిలో కుటుంబ సభ్యులంతా కలిసి పూజలు చేస్తే దోషాలన్నీ తొలిగిపోతాయని ఆయన చెబుతాడు. దీంతో తన అన్నదమ్ములు, వారి పిల్లలతో కలిసి వేటయపురం వెళ్తుంది. ప్రేమ వివాహం చేసుకున్న కూతురి పిల్లలను కూడా పూజ కోసం తీసుకురావాల్సి వస్తుంది. ఆ పిల్లలకు సంరక్షకుడిగా ఉన్న మదన్(రాఘవ లారెన్స్) ఆ ఊరికి వెళ్తాడు. వారంతా చంద్రముఖి ఫ్యాలెస్‌లో దిగుతారు. ఆ ఇంటి ఓనర్ బసవయ్య(వడివేలు) బిల్డింగ్ అంతా తిరిగి చూపించి, దక్షిణం వైపు మాత్రం వెళ్లొద్దని హెచ్చరిస్తాడు. కానీ రంగనాయకి మేనకోడలు గాయత్రితో పాటు కొందరు దక్షిణం వైపు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు చంద్రముఖి(కంగనా రనౌత్) నేపథ్యం ఏంటి? సెంగోటయ్య(లారెన్స్) వేటయ్యరాజుగా ఎలా మారాడు? వేటయ్యరాజుకి, చంద్రముఖికి మధ్య పగ ఏంటి? రంగనాయకి కుటుంబ సభ్యుల్లో చంద్రముఖి ఎవరిని ఆవహించింది? ఆమె నుంచి చంద్రముఖిని తొలగించడానికి స్వామిజీతో పాటు మదన్ చేసిన త్యాగమేంటి? చివరకు చంద్రముఖి ఆత్మ ఈ లోకాన్ని విడిచి ఎలా వెళ్లిపోయింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కథ వినగానే మీ కళ్ల ముందు చంద్రముఖి సినిమా తిరిగింది కదా! అది నిజమే. సినిమా చూస్తున్నంత సేపు చంద్రముఖి చిత్రమే కనిపిస్తుంది. కేవలం పాత్రలు మారుతాయి అంతే. హీరో ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతిదీ చంద్రముఖి లాగే ఉంటుంది. ఒక ఫైట్ సీన్‌తో హీరో ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత ఫ్యాలెస్‌కు రావడం..అక్కడ అవమానాలు ఎదుర్కోవడం.. ప్యాలెస్ పక్కన ఉండే పేదింటి అమ్మాయిని హీరో ఇష్టపడడం.. సేమ్ టు సేమ్ చంద్రముఖి లాగే ఫస్టాఫ్ సాగుతుంది. అయితే కొత్తదనం ఏదైనా ఉందంటే..అది వేటయ్య ఆత్మను తీసుకురావడమే. రంగనాయకి కుటుంబానికి ఉన్న దోషం గురించి చెబుతూ సినిమాను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత ఓ ఫైట్ సీన్‌తో హీరోని పరిచయం చేశాడు. రంగనాయకి ఫ్యామిలీ అంతా చంద్రముఖి ఫ్యాలెస్ చేరేవరకు కథ ఆసక్తిగా సాగుతుంది. ప్యాలెస్‌లోకి వెళ్లిన తర్వాత ప్రతి సీన్ ‘చంద్రముఖి’లాగే అనిపిస్తుంది. పైగా నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. వడివేలు కామెడీ వర్కౌట్ కాలేదు. చాలాచోట్ల ఆయన సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. మొదటి భాగంలోలాగే ఇందులో కూడా దొంగ బాబాగా మనోబాల ఎంట్రీ ఇస్తాడు. అయితే పార్ట్-1లో ఆ సీన్ బాగా నవ్విస్తుంది. కానీ ఇక్కడ చూస్తే.. నవ్వు రాకపోవడమే కాకుండా బోర్ కొడుతుంది. చంద్రముఖి ఎవరిని ఆవహించిందో చూపించే సీన్ ఒక్కటి కాస్త భయపెడుతుంది. ఇలా ఫస్టాఫ్ రొటీన్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత కథంతా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. వేటయ్య రాజు పాత్ర ఎంట్రీ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. సెంగోటయ్య ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది. చంద్రముఖి ప్రియుడు గుణశేఖర్ ప్యాలెస్‌లోకి రావడం.. అది వేటయ్య రాజు చూడడం.. ఇందతా పార్ట్ 1లో లాగే సాగుతుంది. క్లైమాక్స్‌లో లారెన్స్, కంగనల మధ్య సాగే పోరాట ఘట్టం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ కూడా అచ్చం ‘చంద్రముఖి’లాగే ఉండడం విచిత్రం. ఇక చివర్లో పార్ట్ 3 ఉంటుందన్నట్లు చిన్న లీడ్ ఇచ్చి ముగింపు పలికారు. ఎవరెలా చేశారంటే.. చంద్రముఖి అనగానే మనకు రజనీకాంత్, జ్యోతిక పాత్రలు కళ్లముందు తిరుగుతాయి. అంతలా తమ పాత్రల్లో జీవించారు. లారెన్స్, కంగన ఆ స్థాయిలో మెప్పించకపోయినా.. ఉన్నంతలో న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. మదన్ లాంటి పాత్ర లారెన్స్ కు కొత్తేమి కాదు కానీ వేటయ్యరాజు తరహా పాత్రలో నటించడం మాత్రం తొలిసారి. అయినాసరే తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక చంద్రముఖిగా కంగన ఒదిగిపోయింది. అయితే జ్యోతిక భయపెట్టినట్లుగా కంగన భయపెట్టలేకపోయింది. ఇది దర్శకుడి తప్పిదమనే చెప్పాలి. కైమాక్స్లో వచ్చే యాక్షన్ సీన్లో మాత్రం లారెన్స్‌తో పోటీపడి నటించింది. రంగనాయకిగా రాధికా శరత్‌కుమార్ పర్వాలేదనిపించింది. చంద్రముఖి ప్యాలెస్ ఓనర్ బసవయ్యగా వడివేలు నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. స్వామీజీగా రావు రమేశ్, చంద్రముఖి ఆవహించిన యువతి పాత్రలో నటించిన నటితో పాటు మిగిలిన వారంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారంటే నమ్మశక్యం కాదు. పాటలతో పాటు బీజీఎం కూడా చాలా పూర్. ఒక్క సాంగ్ కూడా గుర్తుండేలా లేదు. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాప్‌లో చాలా చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సిందే. లైకా సంస్థ నిర్మాణ విలువు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Chandramukhi 2 Twitter Review: ‘చంద్రముఖి 2’ మూవీ రివ్యూ
సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార కలిసి నటించిన చిత్రం ‘చంద్రముఖి’. 2005లో విడుదలై న ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.దాదాపు 17 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా చంద్రముఖి 2ని తెరకెక్కించాడు దర్శకుడు పి.వాసు.ఇందులో హీరోగా రాఘవ లారెన్స్, నటించగా జ్యోతిక క్యారెక్టర్లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రానౌత్ నటించింది. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘చంద్రముఖి 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు ఎక్స్(ట్విటర్)వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. చంద్రముఖి 2 మూవీ ఎలా ఉంది? రాఘవ లారెన్స్, కంగన రనౌత్ ఏ మేరకు భయపెట్టారు? తదితర విషయాలు ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. Just hours remain until you can unravel Chandramukhi 2's mysteries and enjoy the hilarious comedy with Murugesan & co! 🚪🐾🤣 Have you got your tickets yet? 🎟️🍿#Chandramukhi2 🗝️ in cinemas near you from tomorrow. 📽️#PVasu @offl_Lawrence @KanganaTeam @mmkeeravaani… pic.twitter.com/TuRmoMxB5J — Lyca Productions (@LycaProductions) September 27, 2023 Today #Chandramukhi2 🎶 🎶 2nd Show Chusi intiki vellalante tadisipovali 👹 https://t.co/pEUKmsaNWN — koti (@koti7711) September 28, 2023 Finally #Chandramukhi first look is here straight from cinemas by fan. "Her screen presence as Chandra Mukhi is just 🔥Biggest Plus to the movie. 2nd half starts with a Bang🔥" ""@mmkeeravaani sir BGM🙏 Next level" #Chandramukhi2 #KanganaRanaut @KanganaTeam pic.twitter.com/R7IU2spYRV — Akansha Gill (@AakanshaGill) September 28, 2023 #chandramukhi2 review !!!! It is a world of p vasu and keeravani. . #Raghav , mahima , kids and Radhika did justice to the plot , Vadivelu brings his magic back !!!! #KanganaRanaut arrives in second half with her magnetic screen presence!!! She is completely ruling !! ⭐️⭐️⭐️⭐️ pic.twitter.com/9rsokRXZSI — vaibhav (@BhaktWine) September 28, 2023 #Chandramukhi2 First Half is Entertaining 🔥 #Vadivelu is back 😄 Queen #KanganaRanaut is yet to arrive! Blockbuster on its cards!!#RaghavaLawrence#PVasu#Chandramukhi2Review pic.twitter.com/tO5qgKztcj — FilmoPhile (@Filmophile_Man) September 28, 2023 It’s an interval and till here #Chandramukhi2 is a perfect family film with the brilliant acting of #RaghavaLawrence The first half has a strong hold The pre 𝗜𝗻𝘁𝗲𝗿𝘃𝗮𝗹 𝗦𝗲𝗾𝘂𝗲𝗻𝗰𝗲𝘀 are🔥🔥 🔥 🔥 Unexpected twist, Great surprise & treat awaiting for Kangana's fans pic.twitter.com/ilfY0vFY0K — Mr.Achiever (@MrAchiever0925) September 28, 2023 #Chandramukhi2 First Half is Entertaining 🔥 #Vadivelu is back Queen #KanganaRanaut is yet to arrive! Blockbuster on its cards!! #RaghavaLawrence #PVasu #Chandramukhi2Review @offl_Lawrence pic.twitter.com/mO4QcHVV0G — GK Videos (@GKVideos09) September 28, 2023 -
ప్రజలు నిజంగానే దేవుళ్ళు..!
-
Raghava Lawrence, Kangana Ranaut Chandramukhi 2 Pre-Release Event: రాఘవ లారెన్స్ 'చంద్రముఖి 2'ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నా జీవితంలో ఆ ముగ్గుర్నీ ఎప్పుడూ మర్చిపోను: రాఘవ లారెన్స్
రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ 'చంద్రముఖి 2'. లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహించారు. రజనీకాంత్ హిట్ చిత్రం 'చంద్రముఖి'కి సీక్వెల్‌గా సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ 'రెబల్' తర్వాత తెలుగులో మరో సినిమాను డైరెక్ట్ చేయడం కుదర్లేదని. 'చంద్రముఖి 2' ద్వారా తెలుగు ప్రేక్షకులు, అభిమానులను కలుసుకుంటుంన్నందుకు సంతోషంగా ఉందని లారెన్స్ చెప్పాడు. (ఇదీ చదవండి: ఆ సంఘటనతో బాడీగార్డ్ కావాలని అనుకున్నా: శృతిహాసన్) ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో టికెట్ కొనుక్కుని సినిమా చూస్తున్నారు. అంతేకాకుండా తమ నుంచి ఏం ఆశించకుండానే అభిమానం చూపిస్తారని ఫ్యాన్స్ గురించి లారెన్స్ తెలిపాడు. అభిమానుల ప్రేమలోనే తాను దేవుణ్ని చూస్తున్నానని ఆయన పేర్కొన్నాడు. తాను చాలామంది హీరోలకు కొరియోగ్రఫీలో డ్యాన్స్ చేశాను.. ఆ హీరోలందరి ఫ్యాన్స్ కూడా తనను కూడా అభిమానించడం చాలా ఆనందాన్ని ఇస్తుందని ఆయన తెలిపాడు. తనకు అలాంటి అవకాశం ఇచ్చిన హీరోలందరికీ ధన్యవాదాలు అని లారెన్స్ చెప్పాడు. 'వాసుగారు 'చంద్రముఖి2' మూవీ చేస్తున్నామని అనౌన్స్ చేయగానే రజినీకాంత్‌గారితో చేస్తున్నారేమోనని అనుకున్నా. తర్వాత డైరెక్టర్ నాకు కథ చెప్పగానే రజనీకాంత్‌కు ఫోన్ చేశాను. 'అన్నయ్యా.. చంద్రముఖి- 2 సినిమా చేస్తున్నా' అని చెప్పగానే ఆయన ఎంతో సంతోషంతో ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతే కాకుండా రాఘవేంద్ర స్వామీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. దీంతో ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నా. ఆయన లేకపోతే నేనీ వేదికపై ఉండేవాడినే కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంతమంది అభిమానులను సొంతం చేసుకున్నానంటే దానికి ప్రధాన కారణం చిరంజీవి అన్నయ్య. ఆయన నుంచే నేను డ్యాన్స్ నేర్చుకున్నా.. నన్ను డైరెక్టర్ని చేసిన నాగార్జునను ఎప్పటికీ మరిచిపోను. ఇక కంగనా రనౌత్ వంటి పెద్ద స్టార్‌తో నటించటం నేను ఎంతో లక్కీ. ఆమె సెట్స్‌లోకి అడుగు పెట్టగానే ఆమెకున్న సెక్యూరిటీని చూసి భయపడ్డాను. ఆ విషయం ఆమెకు చెప్పగానే ఆమె సెక్యూరిటీని బయటకు పంపేశారు. తర్వాత చక్కగా ఇద్దరం కలిసిపోయి నటించాం. చంద్రముఖి పాత్రలో ఆమె ఎంతగానో భయపెట్టారు. వాసుగారితో ఇది వరకు శివలింగ అనే సినిమా చేశాను. ఆ సినిమాకు పూర్తి భిన్నంగా 'చంద్రముఖి2' చేశాం.' అని లారెన్స్ చెప్పారు. కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మాట్లాడుతూ 'నేను గతంలో దక్షిణాదిన సినిమాలు చేశాను. తెలుగులో ఏక్ నిరంజన్, తలైవి వంటి సినిమాల్లో నటించాను. ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను 'చంద్రముఖి2'తో మీ ముందుకు వస్తున్నా. ఈ మూవీలో చంద్రముఖి పాత్ర తెలుగులో మాట్లాడుతుంది. వాసుగారు ఓ వారియర్ సినిమా చేయాలని నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చంద్రముఖి 2లో చంద్రముఖిగా ఎవరు నటిస్తున్నారని అడిగాను. ఇంకా ఎవరినీ తీసుకోలేదని చెప్పడంతో. నేను నటిస్తానని అడగ్గానే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టాను.' అని ఆమె చెప్పింది -
భయపడుతూ చంద్రముఖి-2 చేశాను: లారెన్స్
చంద్రముఖి 2లో కంగనా రనౌత్ హీరోయిన్ అనగానే ఆశ్చర్య పోయాను. సెట్లో అడుగు పెట్టగానే ఆమెకున్న సెక్యూరిటీని చూసి భయపడ్డాను. కొద్ది రోజుల తర్వాత ఆమెకు ఆ విషయం చెప్పగానే.. సెక్యూరిటీని బయటకు పంపించింది. ఆ తర్వాత చక్కగా కలిసిపోయి నటించారు. చంద్రముఖి పాత్రలో ఆమె భయపెట్టారు’అని హీరో రాఘవా లారెన్స్ అన్నారు. రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించిన తాజా చిత్రం చంద్రముఖి-2. 17 ఏళ్ల క్రితం పీ వాసు తెరకెక్కించిన ‘చంద్రముఖి’ చిత్రానికి సీక్వెల్ ఇది. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ.. రజనీకాంత్ చేసిన రోల్లో నేను నటించడం ఆ రాఘవేంద్రస్వామి నాకు ఇచ్చిన వరం. సూపర్‌స్టార్‌గారు చేసిన ఆ పాత్రను నేనెంత గొప్పగా చేయగలనా? అని ఆలోచించలేదు. నా పాత్రకు నేను న్యాయం చేస్తే చాలని అనుకుని చాలా భయపడుతూ నటించాను. కచ్చితంగా సినిమా మీ అందరినీ మెప్పిస్తుందని అనుకుంటున్నాను’ అని అన్నారు. కంగనా మాట్లాడుతూ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మాట్లాడుతూ ‘‘నేను ఇంతకు ముందు దక్షిణాదిలో సినిమాలు చేశాను. తెలుగులో ఏక్ నిరంజన్ సినిమాలో నటించాను. ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను ‘చంద్రముఖి2’తో పలకరిస్తాను. వాసుగారు ఓ సారి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చంద్రముఖి 2లో చంద్రముఖిగా ఎవరు నటిస్తున్నారని అడిగాను. ఎవరినీ తీసుకోలేదని అన్నారు. నేను నటిస్తానని అడగ్గానే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టాను. ‘చంద్రముఖి’లో కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ఎలాగైతే మిక్స్ అయ్యుంటాయో ‘చంద్రముఖి2’లోనూ అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి’ అన్నారు. ‘చంద్రముఖి సినిమాతో ‘చంద్రముఖి2’ను లింక్ చేసి ఈ కథను సిద్ధం చేశాను. కచ్చితంగా ఆడియెన్స్‌కు సినిమాను మెప్పిస్తుంది. తెలుగులో నాగవల్లి సినిమా ఉంది. అందులో డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. కానీ ఇందులో 17 ఏళ్ల ముందు కోట నుంచి వెళ్లి పోయిన చంద్రముఖి మళ్లీ ఎందుకు వచ్చిందనే పాయింట్‌తో చేశాను. తప్పకుండా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని దర్శకుడు పీ.వాసు అన్నారు. -
కంగనా రనౌత్ పై రాఘవ లారెన్స్ ఫన్నీ కామెంట్స్
-
లారెన్స్ తన కూతురిని దాస్తున్నాడా? ఆయనకు అంత పెద్ద కూతురు ఉందా?
కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి, ప్రస్తుతం హీరోగా బిజీ అయిపోయాడు రాఘవ లారెన్స్. ఇతడు చేసిన కొత్త సినిమా 'చంద్రముఖి 2'. గతంలో రజనీకాంత్ చిత్రానికి ఇది సీక్వెల్. సెప్టెంబరు 28న థియేటర్లలోకి రానుంది. 1993లో డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా అరంగేట్రం చేసిన ఆయన 1998లో తెలుగు సినిమాలో నటుడిగా కెరీర్‌ను ప్రారంభించారు. కాంచన సిరీస్‌లో విడుదలైన చిత్రాల ద్వారా సౌత్ ఇండియా ప్రేక్షకుల దృష్టిని లారెన్స్ ఆకర్షించాడు. సామాజిక సేవా విషయాల్లో ఎప్పుడూ ముందుండే వ్యక్తి లారెన్స్. నిరుపేద పిల్లలకు సహాయం చేసేందుకు ఆయన ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పలు సేవలను అందిస్తున్నాడు. (ఇదీ చదవండి: విశాల్ 'మార్క్ ఆంటోనీ' సినిమాపై బ్యాన్ విధించిన కోర్టు) లారెన్స్ లాగే అతని తమ్ముడు ఎల్విన్ కూడా హీరోగా కోలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నాడు. ఆయన సినిమా షూటింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. లారెన్స్ సినిమాలతో పాటు సోషల్ వర్క్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాడు. అనాథ పిల్లలకు, వృద్ధులకు సహాయం చేయడంలో లారెన్స్ ముందుంటాడు. లారెన్స్ గురించి అందరికీ తెలుసుగానీ, అతని కుటుంబం గురించి ఎవరికీ పెద్దగా తెలిసే అవకాశం లేదు. లారెన్స్ భార్య పేరు లత. సామాజిక సేవ చేయడంలో భర్తకు అండగా నిలిచేది లత. లతను పెళ్లి చేసుకున్న తర్వాతే తాను డ్యాన్స్ మాస్టర్‌గా ఎదిగానని, సినిమాల్లో ఇంత ఎత్తుకు ఎదిగానని, ఆమె వల్లే తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని లారెన్స్ ఇంటర్వ్యూలలో చెప్పాడు. లారెన్స్, లత దంపతులకు రాఘవి అనే కుమార్తె ఉంది. లారెన్స్‌కి ఓ కూతురు ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు రాఘవి సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు లారెన్స్ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. లారెన్స్‌కి ఇంత పెద్దకూతురు ఉందంటే నమ్మలేకపోతున్నామని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. (ఇదీ చదవండి: బాక్సాఫీస్ దగ్గర జవాన్ కలెక్షన్ల తుపాన్.. రెండో రోజు ఎన్ని కోట్లంటే?) త్వరలో ఒక మంచి సినిమాతో ఆమె ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతుంది. అందుకు కథను కూడా లారెన్స్ సెలక్ట్ చేశాడని కూతురి తొలి సినిమాకు ఆయన డైరెక్షన్ చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాదితో ఆమె గ్రాడ్యేషన్ పూర్తి అవుతుందని తెలుస్తోంది. రాఘవి మోడ్రన్ డ్రెస్సుల్లో స్టైలిష్‌గా పోజులిచ్చిన ఫోటోలు కూడా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకాలం లారెన్స్ తన కూతురిని ఎక్కడ దాచిపెట్టాడు అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. -
చంద్రముఖి 2 వాయిదా, కారణం ఇదే!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ప్రభు, జ్యోతిక, నయనతార, వడివేలు ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం చంద్రముఖి. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2005లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. తాజాగా దానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం చంద్రముఖి–2. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, మహిమ నంబియార్, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని, ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం అందించారు. ఆ చిత్ర ఆడియో, ట్రైలర్ ఇటీవలే విడుదలయ్యాయి. కాగా చంద్రముఖి 2 చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. చంద్రముఖి చిత్రం సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా రూపొందిన చంద్రముఖి–2 చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ చిత్రం విడుదల వాయిదా పడిందంటూ కొన్ని వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చిత్రానికి వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఆలస్యం కావడం వల్లే సినిమా వాయిదా పడిందని, కావున ఈ చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంటూ టాక్ వైరల్ అవుతోంది. తాజాగా ఇదే నిజమని ధ్రువీకరించింది చిత్రయూనిట్. చంద్రముఖి 2 ఈ నెల 28న రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించింది. Chandramukhi-2 release date has been pushed to September 28 due to technical delays. 🌸 Vettaiyan & Chandramukhi will be back fiercer than ever. 🏇🗡️ See you at the theatres with an extra special treat. 🕴🏻🤗 🎬 #PVasu 🌟 @offl_Lawrence @KanganaTeam 🎶 @mmkeeravaani 🎥… pic.twitter.com/zrJAT7psri — Lyca Productions (@LycaProductions) September 8, 2023 చదవండి: అట్లీ, షారుఖ్‌పై నయనతార అసంతృప్తి.. నిజమెంత? -
'నేను మీకు వీరాభిమానిని'.. జ్యోతిక పోస్ట్ వైరల్!
2005లో ఐకానిక్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ చంద్రముఖి. ఈ చిత్రంలో రజినీకాంత్, నయనతార, ప్రభు, సోనుసూద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం చంద్రముఖి పాత్రలో జ్యోతిక అభిమానులను మెప్పించింది. తన హవాభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రేక్షకుల గుండెల్లో చంద్రముఖిగా తన పేరును ముద్రించుకుంది జ్యోతిక. (ఇది చదవండి: నిన్ను చాలా మిస్ అవుతున్నా.. హీరోయిన్ పోస్ట్ వైరల్!) అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా చంద్రముఖి-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కనిపించనుంది. పార్ట్-2 లో నటీనటులను పూర్తిగా మార్చేశారు. రజినీకాంత్ పోషించిన పాత్రలో రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో నటి జ్యోతిక ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. చంద్రముఖి పాత్రలో కంగనా నటించడం పట్ల ప్రశంసలు కురిపించింది. తాను కూడా కంగనా రనౌత్ అభిమానిని అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జ్యోతిక ఇన్‌స్టాలో రాస్తూ..' అత్యంత ప్రతిభావంతులైన నటీమణుల్లో కంగనా ఒకరు. మీరు చంద్రముఖి పాత్రను పోషించినందుకు చాలా గర్వపడుతున్నా. ఆ పాత్రలో అద్భుతంగా కనిపిస్తున్నారు. మీ నటనకు నేను కూడా పెద్ద అభిమానిని. ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే ప్రత్యేకంగా మీ కోసమే ఈ సినిమా చూడాలని ఉంది. ముఖ్యంగా లారెన్స్, పి వాసుకు మరో హిట్ ఖాతాలో పడినట్టే. సూపర్ హిట్ అవ్వాలని చిత్రబృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు. నా ఆల్ ది బెస్ట్." అంటూ పోస్ట్ చేసింది. కాగా.. చంద్రముఖి 2 సెప్టెంబర్ 15న హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాల్లో విడుదల కానుంది. (ఇది చదవండి: అందుకే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు: తెలుగు నటి) -
జ్యోతిక కాదు నేనే అసలైన చంద్రముఖి: కంగనా
తమిళ సినిమా: వివాదాస్పద నటి అని కంగనా రనౌత్ మరోసారి నిరూపించారు. సినీ రాజకీయ నాయకులపై తనదైన బాణీలో విమర్శిస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది ఈ బాలీవుడ్ జాణ. తాజాగా ఈమె తమిళంలో టైటిల్ పాత్రను పోషించిన చంద్రముఖి –2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈనెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి పి.వాసు దసకత్వం వహించారు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం చైన్నె లోని ఒక స్టార్ హోటల్లో చిత్ర విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటి కంగనా రనౌత్ మాట్లాడుతూ తాను తమిళంలో నటించిన మూడో చిత్రం చంద్రముఖి– 2 అని చెప్పారు. తాను ఇంతకుముందు వచ్చిన చంద్రముఖి చిత్రాన్ని చూశానని అందులో జ్యోతిక నటన చాలా నచ్చిందని చెప్పారు. ఆమె తనకు స్ఫూర్తిగా పేర్కొన్నారు. అయితే ఆమెతో తనను పోల్చుకోరాదని, తాను నటించిన పాత్రే అసలైన చంద్రముఖి అని పేర్కొన్నారు. హారర్ర్, కామెడీ ఫ్యామిలీ అంటూ అన్ని అంశాలు కలిగిన చంద్రముఖి వంటి కలర్ ఫుల్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్ర యూనిట్‌తో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. -
ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో లేడీ సూపర్ స్టార్!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార రేంజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రేమ వ్యవహారం, పెళ్లి, పిల్లలు ఇలా అన్ని విషయాల్లోనూ తాను సంచలనమే. వయసు నాలుగు పదుల దగ్గర్లో ఉన్నా.. హీరోయిన్గా 75 చిత్రాల మైల్ స్టోన్ టచ్ చేసింది. అయినప్పటికీ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆమె షారుక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించింది. తాజాగా సామాజిక మాధ్యమాల్లో నయన్ సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ఆ ఇద్దరు కాదు.. స్టార్ హీరో సినిమాలో బాలీవుడ్ భామ..!) కోలీవుడ్‌లో సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో నయన్ నటించబోతున్నారన్నదే లేటెస్ట్ టాక్. తొలి చిత్రం మా నగరం నుంచి ఈ మధ్య విడుదలైన విక్రమ్ వరకు అపజయం అనేది ఎరుగకుండా సక్సెస్ ఫుల్ ప్రయాణం చేస్తున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్. ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న లియో చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇది రెండు భాగాలుగా రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా తదుపరి లోకేష్ కనకరాజు కోసం చాలా చిత్రాలు ఎదురుచూస్తున్నాయి. అందులో కమలహాసన్ నటించిన విక్రమ్ 2, కార్తీ హీరోగా ఖైదీ 2 వంటి భారీచిత్రాలు ఉన్నాయి. అలాంటిది అనూహ్యంగా నయనతార హీరోయిన్గా మరో చిత్రం గురించి వార్త వెలుగులోకి వచ్చింది. మరో విషయం ఏమిటంటే ఇందులో నటుడు లారెన్స్ కథానాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంతన్నది తెలియాల్సి ఉంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: 'బిగ్‌బాస్ 7' హౌసులోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే) -
Chandramukhi 2: ఆసక్తి పెంచుతోన్న చంద్రముఖి-2 ట్రైలర్
రాఘవ లారెన్స్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రను పోషించింది. రజనీకాంత్ నటించిన సూపర్‌హిట్ సినిమా ‘చంద్రముఖి’కి ఇది సీక్వెల్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది. ‘రాజాధి రాజ.. రాజ గంభీర.. రాజ మార్తాండ.. రాజ కుల తిలక..వేటయ్య వేట్టయ రాజు వరాదూర్’అంటూ రాఘవ లారెన్స్ ఎంట్రీతో ట్రైలర్ ప్రారంభం అవుతంది. ట్రైలర్లో రాఘవ లారెన్స్ రెండు షేడ్స్‌లో మెప్పిస్తున్నారు. ఒకటి స్టైలిష్ లుక్ కాగా.. మరోటి వేట్టయా రాజా లుక్. ఇక చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ ఒదిగిపోయింది. ఇక బసవయ్య పాత్రలో స్టార్ కమెడియన్ వడివేలు తనదైన కామెడీతో మెప్పించబోతున్నారు. సినిమాలోని హారర్, థ్రిల్లింగ్, కామెడీ అంశాలను చూపించారు. ప్రతీ ఫ్రేమ్‌ను ఎంతో రిచ్‌గా తెరకెక్కించారు. నటీనటుల పెర్ఫామెన్స్‌తో పాటు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం, నేపథ్య సంగీతం, ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ హైలైట్‌గా ఆడియెన్స్‌ను అలరించనున్నాయని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుతోంది. ‘చంద్రముఖి 2’తో డైరెక్టర్ పి.వాసు సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
కేవలం రూ.7 కోట్ల సినిమా.. బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది!
తమిళ స్టార్ రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం కాంచన(ముని-2). 2007లో రిలీజైన ముని సిరీస్‌లో వచ్చిన రెండో చిత్రమే కాంచన. 2011లో విడుదలైన బాక్సాఫీస్ బరిలో నిలిచిన ఈ చిత్రం ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. శరత్ కుమార్, కోవై సరళ, లక్ష్మీ రాయ్, దేవదర్శిని, శ్రీమాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. హార్రర్- కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే దాదాపు 12 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రానికి అప్పట్లోనే రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. (ఇది చదవండి: అందుకే నా ట్రస్ట్‌కి విరాళాలు వద్దని చెప్పా: లారెన్స్) కాంచన కథ మొత్తం లారెన్స్ చుట్టే తిరుగుతుంది. అతను ఒక దుష్ట ఆత్మతో బాధపడుతుంటూ ఉంటారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు భయానకంగా అనిపిస్తాయి. కాగా.. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఏ(A) సర్టిఫికేట్ ఇచ్చింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం అప్పట్లోనే రుజువు చేసిన చిత్రంగా కాంచన నిలిచింది. పలు భాషల్లో రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్ల వసూళ్లు రాబట్టింది. చిన్న చిత్రంగా వచ్చిన వంద కోట్ల మార్కును దాటేసిన కాంచనకు మొదట ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కాగా.. 2020లో విడుదలైన అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటించిన లక్ష్మీ బాంబ్ చిత్రం కాంచన చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఆమె ఒక స్టార్ హీరోయిన్.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా! ) మిమి కూడా.. 2021లో ఇటీవల పంకజ్ త్రిపాఠి, కృతి సనన్ల చిత్రం మిమీ సైతం వసూళ్లపరంగా దుమ్ములేపింది. కేవం రూ.20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.298 కోట్ల రూపాయలు రాబట్టింది. తక్కువ బడ్జెట్ చిత్రమైన కలెక్షన్ల పరంగా అద్భుత విజయం సాధించింది. -
అందుకే నా ట్రస్ట్‌కి విరాళాలు వద్దని చెప్పా: లారెన్స్
సామాజిక సేవ కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటాడు రాఘవా లారెన్స్. ‘రాఘవా లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు, దివ్యాంగులకు సేవలు అందిస్తున్నారు. డ్యాన్సర్‌గా ఉన్నప్పుడు దివ్యాంగులకు డ్యాన్స్ నేర్పించాడు. కొంతమంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించడ, కరోనా సమయంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేయటం.. ఇలా క్రమంగా ఆయన తన సేవా కార్యక్రమాలను పెంచుకుంటూ వెళుతున్నారు. అయితే లారెన్స్ చేసే మంచి పనులు చూసి కొంతమంది అతని ట్రస్ట్‌కు డబ్బులు పంపిస్తున్నారు. కానీ ఇది లారెన్స్‌కి నచ్చడం లేదు. తన ట్రస్ట్‌కు ఎవరూ డబ్బులు పంపొద్దని, తానే చూసుకుంటానని ట్వీట్ చేశాడు. లారెన్స్ నిర్ణయాన్ని పలువురు నెటిజన్స్ తప్పుబట్టారు. అతన్ని ట్రోల్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో లారెన్స్ తాజాగా ఓ వీడియోని విడుదల చేశాడు. తాను విరాళాలు స్వీకరించకపోవడానికి గల కారణాలు తెలియజేశాడు. (చదవండి: అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?) "నా ట్రస్ట్ కి ఎవరూ డబ్బులు పంపొద్దు..నా పిల్లల్ని నేనే చూసుకుంటాను.. అని కొన్ని రోజుల ముందు రిక్వెస్ట్ చేస్తూ నేను ఒక ట్వీట్ వేశాను. అందుకు కారణమేంటంటే నేను డాన్స్ మాస్టర్ గా ఉన్నప్పుడు ఓ ట్రస్ట్ ను స్టార్ట్ చేశాను. అందులో 60 మంది పిల్లల్ని పెంచటం, వికలాంగులకు డాన్స్ నేర్పించటం, ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించటం వంటి కార్యక్రమాలను నిర్వహించాను. ఈ పనులన్నింటినీ నేను ఒకడ్నినే చేయలేకపోయాను. అందుకనే ఇతరుల నుంచి సాయం కావాలని కోరాను. అప్పుడు రెండేళ్లకు ఓసినిమానే చేసేవాడిని. కానీ ఇప్పుడు సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్నాను. బాగానే డబ్బులు వస్తున్నాయి కదా, నాకు నేనే చేయొచ్చు కదా, ఇతరులను ఎందుకు అడిగి చేయాలని నాకే అనిపించింది. నేను పొగరుతో ఇతరులు సేవ కోసం ఇచ్చే డబ్బులను వద్దనటం లేదు. నాకు ఇచ్చే డబ్బులను మీకు దగ్గరలో డబ్బుల్లేక కష్టపడే ట్రస్టులు చాలానే ఉన్నాయి. అలాంటి వారికి సాయం చేయండి. వారికెంతో ఉపయోగపడుతుంది. వారికి చాలా మంది సాయం చేయరు. నేను ఎంత చెప్పినా కొందరైతే నాతో కలిసే సాయం చేస్తామని అంటున్నారు. చాలా సంతోషం. ఆర్థిక ఇబ్బందులో బాధపడేవారెవరో నేనే చెబుతాను. మీచేత్తో మీరే సాయం చేయండి. అది మీకు ఎంతో సాయాన్ని కలిగిస్తుంది. థాంక్యూ సో మచ్ ’అన్నారు. This is for my Telugu Fans..! pic.twitter.com/csJPLn5nqH — Raghava Lawrence (@offl_Lawrence) August 30, 2023 -
చంద్రముఖి 2 విజయం ఆయనకే దక్కుతుంది
‘‘డైరెక్టర్ వాసుగారు నాలుగు దశాబ్దాల అనుభవంలో ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ‘చంద్రముఖి 2’ను కూడా గొప్పగా తెరకెక్కించారు.. ఈ సినిమా సాధించే విజయం ఆయనకే దక్కుతుంది’’ అని హీరో రాఘవ లారెన్స్ అన్నారు. పి.వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ హీరోగా, కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘చంద్రముఖి 2’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదలవుతోంది. చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రాఘవ లారెన్స్ మాట్లాడుతూ–‘‘ నేను నిర్వహిస్తున్న చారిటీ సంస్థకు సుభాస్కరన్‌గారు ఎంతో పెద్ద మనసుతో కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఆ డబ్బుతో ఓ స్థలం కొని భవనం కడతాను. ఇకపై నా చారిటీకి డబ్బులు ఇవ్వకండి.. నా చారిటీకి నేను ఉన్నాను. సాయం చేయాలనుకుంటే చాలా చారిటీ సంస్థలుఉన్నాయి.. వాటికి ఇవ్వండి’’ అన్నారు. ‘‘నేను నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఇన్నేళ్లలో ‘చంద్రముఖి 2’ వంటి గొప్ప చిత్రం చేయలేదు’’ అన్నారు కంగన. ‘‘చంద్రముఖి 2’ ని లారెన్స్‌తో చేస్తున్నామని రజనీకాంత్‌గారికి చెప్పగానే.. సినిమా హిట్ అవుతుందని చెప్పారు’’ అని పి.వాసు అన్నారు. -
సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!
కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి, ప్రస్తుతం హీరోగా బిజీ అయిపోయాడు రాఘవ లారెన్స్. ఇతడు చేసిన కొత్త సినిమా 'చంద్రముఖి 2'. గతంలో రజనీకాంత్ చిత్రానికి ఇది సీక్వెల్. సెప్టెంబరు 15న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అక్కడ ఓ గొడవ జరగ్గా, దానిపై ఇప్పుడు లారెన్స్ క్షమాపణలు చెప్పాడు. ఏం జరిగింది? సాధారణంగా ఇలాంటి ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు అభిమానులు కాస్త ఎక్కువగానే వస్తుంటారు. 'చంద్రముఖి 2' ఆడియో విడుదల కార్యక్రమంలోనూ అలాంటి ఓ సంఘటన జరిగింది. ఈవెంట్ చూడటానికి వచ్చిన ఓ స్టూడెంట్‌పై బౌన్సర్ దాడి చేశాడు. ఆ గొడవ ఆడిటోరియం బయట జరగ్గా, తాజాగా లారెన్స్ దృష్టికి రావడంతో సారీ చెప్పాడు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 'ఉల్టా పల్టా' అసలు మీనింగ్ ఇదేనా!?) ట్వీట్లో ఏముంది? 'చంద్రముఖి 2 ఆడియో లాంచ్ ఈవెంట్లో ఓ స్టూడెంట్, బౌన్సర్ మధ్య జరిగిన గొడవ ఇప్పుడు నా దృష్టికి వచ్చింది. వేడుక జరుగుతున్నప్పుడు దాని బయట గొడవ జరగడంతో నాకు ఏం తెలియలేదు. ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. విద్యార్థులంటే నాకు ఎంతిష్టమో, వాళ్ల వృద్ధి చెందాలని ఎంత కోరుకుంటానే మీకు తెలుసు. ఇలాంటి గొడవలు నాకు నచ్చవ్. కారణం ఏదైనా సరే స్టూడెంట్‌ని కొట్టడం తప్పు. ఇది జరగకుండా ఉండాల్సింది. క్షమాపణలు చెబుతున్నా. బౌన్సర్స్ ఇకపై ఇలాంటి దాడి చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా' అని లారెన్స్ ట్వీట్ చేశాడు. సినిమాపై బజ్ లేదు 'చంద్రముఖి' సినిమా అప్పట్లో భాషతో సంబంధం లేకుండా అందరినీ భయపెట్టింది. రజనీకాంత్, జ్యోతిక యాక్టింగ్ ఇప్పటికీ మన కళ్లముందే కదలాడుతూ ఉంది. ఇప్పుడు సీక్వెల్లో వెంకటపతిరాజుగా లారెన్స్, చంద్రముఖిగా బాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్ నటించారు. పోస్టర్, పాటలు రిలీజ్ చేసినప్పటికీ తెలుగులో అయితే పెద్దగా బజ్ లేదు. రిలీజ్‌కి ఇంకో 20 రోజులు ఉంది కాబట్టి అంచనాలు పెరుగుతాయేమో చూడాలి? (ఇదీ చదవండి: పెళ్లికి ముందే పూజలు తెగ చేస్తున్న ఆ హీరోయిన్) Hello everyone, I just came to know about the unfortunate incident which happened during our #Chandramukhi2 movie Audio Launch, where one of the Bouncers involved in a fist fight with a college student. First of all myself or the organisers were not aware of this incident as it… — Raghava Lawrence (@offl_Lawrence) August 27, 2023 -
నా జీవితంలో ఇదే మొదటిసారి: కంగనా
గతంలో రజనీకాంత్ కథానాయకుడు నటించిన 'చంద్రముఖి' చిత్రం ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం 'చంద్రముఖి–2'. ఆ చిత్ర దర్శకుడు పి.వాసు దీనికి దర్శకత్వం వహించారు. లారెన్స్ కథానాయకుడిగా నటించిన ఇందులో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ చంద్రముఖిగా నటించడం విశేషం. నటుడు వడివేలు ముఖ్యపాత్ర పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి ఆర్డి రాజశేఖర్ అందించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ భారీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని వినాయక చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 15న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చైన్నెలోని ఒక విశ్వవిద్యాలయంలో చంద్రముఖి–2 చిత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఎం కీరవాణి మాట్లాడుతూ తనను మళ్లీ తమిళ చిత్ర పరిశ్రమకు తీసుకువచ్చిన లైకా ప్రొడక్షన్న్స్కు, పి.వాసుకు కతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ చిత్రంలో ఐదు పాటలు ఉంటాయని చెప్పారు. నిర్మాత సుభాస్కరన్ తమిళ సినిమాకు దక్కిన భాండాగారం అని దర్శకుడు పి.వాసు పేర్కొన్నారు. కంగనారనౌత్ మాట్లాడుతూ తన జీవితంలో ఇప్పటివరకు ఎవరి వద్ద ఎలాంటి అవకాశాన్ని కోరలేదు అన్నారు అలాంటిది దర్శకుడు పి. వాసు వద్ద చంద్రముఖిగా నటించడానికి తాను నప్పుతానా అని అడిగాను అన్నారు. అందుకు ఆయన కొంచెంసేపు ఆలోచించి ఓకే అని చెప్పారన్నారు. లారెన్స్ మాట్లాడుతూ తాను సహాయ నృత్య కళాకారుడుగా నటిస్తున్నప్పుడే పి వాసు దర్శకత్వం వహించిన చిత్రాలకు పనిచేశానన్నారు. (ఇదీ చదవండి: ప్రియురాలిని పరిచయం చేసిన ' జైలర్' ఫేమ్ జాఫర్ సాదిఖ్.. ఆమె ఎవరంటే) ఆ తర్వాత నృత్య దర్శకుడుగా, నటుడుగా, దర్శకుడుగా చిత్రాలు చేసిన తాను కథానాయకుడిగా నటించిన చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారన్నారు. ఇలా 40 ఏళ్లకుపైగా పి వాసు సక్సెస్ఫుల్ దర్శకుడుగా కొనసాగుతున్నారని అన్నారు. తాను ఈ చిత్రంలో వేట్టైయాన్ పాత్రలో నటించానని, దీనికి లభించే ప్రశంసలన్నీ ఆయనకే చెందుతాయని లారెన్స్ పేర్కొన్నారు. -
కంగనా చాలా బోల్డ్.. గన్‌మెన్స్‌తో కలిసి సెట్లోకి.. భయపడ్డా: లారెన్స్
‘చంద్రముఖి-2’లో కంగనా రనౌత్ హీరోయిన్ అని తెలియగానే ఆశ్చర్యపోయాను. ఆమె చాలా బోల్డ్ పర్సన్. సెట్స్‌లోకి గన్‌మెన్స్‌తో వచ్చేది. అప్పుడు నాలో ఇంకా భయం పెరిగిపోయింది. తర్వాత నా రిక్వెస్ట్ మేరకు ఆమె గన్ మెన్స్‌ను సెట్ బయటే ఉంచారు. అప్పటి నుంచి ఆమెతో ఫ్రెండ్ షిప్ చేయటం ప్రారంభించాను. అద్భుతంగా పాత్రలో ఒదిగిపోయారు’అని స్టార్ కొరియోగ్రాఫర్, డెరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘చంద్రముఖి 2’. సీనియర్ డైరెక్టర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ..‘పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసే సుభాస్కరన్‌గారు నాతో సినిమా చేస్తారా? అని అనుకున్నాను. కానీ చంద్రముఖి 2 వంటి ఓ గొప్ప సినిమాను లార్జర్ దేన్ లైఫ్ మూవీలా నిర్మించారు. ఆయన బ్యానర్లో సినిమా చేయటం ఎంతో గర్వంగా ఉంది. ఇక మా డైరెక్టర్ వాసుగారి గురించి చెప్పాలంటే ఆయనకు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. నేను చిన్న సైడ్ డాన్సర్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన డైరెక్టర్‌గా ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ‘చంద్రముఖి 2’ను కూడా ఎంతో గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమా సాధించే విజయం ఆయనకే దక్కుతుంది’ అన్నారు. హీరోయిన్ కంగనా రనౌత్ మాట్లాడుతూ..‘నేను నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఇన్నేళ్లలో ‘చంద్రముఖి 2’ వంటి గొప్ప సినిమా చేయలేదు. అసలు విషయమేమంటే.. నాకు అవకాశం కావాలని ఎవరినీ అడగలేదు. తొలిసారి డైరెక్టర్ పి.వాసుగారినే అడిగాను. ఈ సినిమాలో వాసుగారు నా పాత్రతో పాటు ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది. లారెన్స్ మాస్టర్ చాలా మందికి పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన చిన్న డాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు హీరో, దర్శకుడు రేంజ్‌కు ఎదిగారు. ఎంతో మంచి మనసున్న వ్యక్తి. ఎలాంటి పరిస్థితులనైనా చిరునవ్వుతో స్వీకరిస్తారు. అలాంటి గుణం చాలాతక్కువ మందికే ఉంటుంది.రు. కీరవాణిగారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచమంతా ఆయన గురించి గొప్పగా మాట్లాడింది. ఆయనకు ఆస్కార్ అవార్డ్ వస్తే నాకే వచ్చినట్లు సంతోషపడ్డాను. ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో సినిమా చేయటం ఓ మంచి ఎక్స్‌పీరియెన్స్’అని అన్నారు. ‘డైరెక్టర్‌గా ఇప్పటి దర్శకులతో పోటీ పడాలనే ఆలోచిస్తుంటాను. ఆ కోణంలో ఆలోచించే చంద్రముఖి 2ను రూపొందించాను. ఈ చిత్రాన్ని లారెన్స్‌తో చేస్తున్నామని రజనీకాంత్‌గారికి చెప్పగానే సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుందన్నారు. లారెన్స్ చాలా అద్భుతంగా నటించాడు’అని దర్శకుడు పి.వాసు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి, కమెడియన్ వడివేలుతో పాటు ఇతర చిత్రబృందం అంతా పాల్గొని, పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకున్నారు. -
నా గురించి రాత్రింబవళ్లు ఆలోచించి డబ్బు వృథా చేసుకోకండి: కంగనా
బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈమెను వివాదాలకు కేంద్ర బిందువు అంటారు. తాను విమర్శించ తలుచుకుంటే వారు ఎంతటి వారనే విషయాన్ని ఆమె పట్టించుకోరని అంటారు. ఈ విషయంలో సినిమా వారినే కాదు, రాజకీయవాదులను కూడా వదిలిపెట్టరు. అయితే నటిగా మాత్రం కంగనా రనౌత్‌ను వంకపెట్టలేం. ఈ బహుభాషా నటి నిర్మాత, దర్శకురాలు కూడా. ముఖ్యంగా తమిళంలో ధామ్ ధూమ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ మధ్య దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవి చిత్రంలో టైటిల్ పాత్రను పోషించి మెప్పించారు. తాజాగా పి.వాసు దర్శకత్వంలో లారెన్‌న్స్ కథానాయకుడిగా నటిస్తున్న చంద్రముఖి– 2 చిత్రంలో టైటిల్ పాత్రను పోషించారు. ఈ చిత్రం వచ్చే నెల తెరపైకి రావడానికి ముస్తాబు అవుతోంది. ఈమె పాత్రను బేస్ చేసుకునే చిత్రవర్గాలు ప్రచారం చేస్తుండటం విశేషం. కాగా నటి కంగనా రనౌథ్ తాజాగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ట్విట్టర్ ద్వారా విరుచుకు పడ్డారు. అందులో తనకు వ్యతిరేకంగా డబ్బిచ్చి మరీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు. తన చిత్రాల వసూళ్ల గురించి ఇలాంటి అవాస్థవాలే ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే అలా చేసేవారి ఆత్మకు సంతృప్తి కలగాలని అన్నారు. రూ.150 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించిన తన చిత్రాలను ప్లాప్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దీని వెనుక ఒక పెద్ద మాఫియా ఉందని అన్నారు. ఇలాంచి సంకుచిత భావాలు వీరికి ఎలా వస్తాయో తెలియడం లేదన్నారు. ఇతరులను చెడ్డవారిగా చిత్రీకరించడానికి రాత్రింబవళ్లు ఆలోచించి డబ్బులు వృథా చేస్తున్నారని నటి కంగనా రనౌత్ పేర్కొన్నారు. (ఇదీ చదవండి: 'భోళా శంకర్'పై చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్) -
చంద్రముఖి నీకిదే స్వాగతాంజలి
‘లాస్య విలసిత.. నవ నాట్యదేవత.. నటనాంకిత అభినయ వ్రత చారుధీర చరిత స్వాగతాంజలి.. స్వాగతాంజలి’ అంటూ సాగే పాట ‘చంద్రముఖి 2’ చిత్రంలోనిది. రాఘవా లారెన్స్, లక్ష్మీ మీనన్, కంగనా రనౌత్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చంద్రముఖి 2’. పి. వాసు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబరు 15న విడుదల కానుంది. ఈ చిత్రంలో చంద్రముఖి పాత్రధారి కంగనా రనౌత్‌పై చిత్రీకరించిన ‘ఓ చంద్రముఖి నీకిదే స్వాగతాంజలి’ పాట తెలుగు, తమిళ లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. యం.యం. కీరవాణి స్వరకల్పనలో చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రీనిధి తిరుమల పాడారు. ఇక రజనీకాంత్ హీరోగా జ్యోతిక, ప్రభు, నయనతార లీడ్ రోల్స్‌లో పి. వాసు దర్శకత్వంలో రూపొందిన ‘చంద్రముఖి’ చిత్రం 2005లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ తెరకెక్కింది. -
చేసింది కొన్ని సినిమాలే.. భారీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!
మలయాళ బ్యూటీ మహిమా నంబియార్ ఇప్పుడు చాలా ఖుషీగా ఉంది. ఈ మలయాళ బ్యూటీ తన 13 ఏళ్ల కెరీర్లో నటించింది తక్కువ చిత్రాలే అయినా మంచి పేరుని తెచ్చుకుంది. దీనికి కారణం మంచి పాత్రలను ఎంపిక చేసుకోవడమే. మలయాళం, తమిళం భాషల్లో నటిస్తున్న మహిమా నంబియార్ఆమె 2010లో మలయాళం సినిమా కార్యస్థాన్ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2012లో సట్టై సినిమాతో కోలీవుడ్‌కు పరిచయమైంది. (ఇది చదవండి: షారుఖ్‌పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ - మిగిలిన వారికంటే..!) ఆమె నటించిన తొలి చిత్రమే మంచి సక్సెస్ కావడంతో ఆ తర్వాత కుట్రం 23, కొడి వీరన్, మహాముని తదితర చిత్రాల్లో నటించే అవకాశం వరించింది. వీటిలో ఎక్కువ శాతం సక్సెస్ కావడం ఈమె కెరీర్‌కు ప్లస్ అయ్యింది. కాగా ప్రస్తుతం చంద్రముఖి– 2 లాంటి వంటి భారీ చిత్రంతో తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్, ప్రభు, నయనతార, జ్యోతిక, వడివేలు ప్రధాన పాత్రలు పోషించిన చంద్రముఖి చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఇందులో రజనీకాంత్ పోషించిన పాత్రలో నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ నటించడం విశేషం. అదే విధంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జ్యోతిక పాత్రలో నటించగా.. లక్ష్మి మీనన్, సృష్టి డాంగే, రాధిక శరత్ కుమార్, వడివేలు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు మహిమ నంబియార్ ఒక నాయకిగా నటిస్తోంది. పి. వాసు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రంలోని ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. దీని గురించి మహిమా నంబియార్ తన ట్విట్టర్లో చంద్రముఖి– 2 చిత్రంలోని పాట చిత్రీకరణ కోసం జార్జియా వెళుతున్నట్లు పేర్కొంది. ఒక నటిగా లారెన్‌న్స్ మాస్టర్‌తో కలిసి డాన్స్ చేయాలన్నది తన చిరకాల కలని అది ఇప్పుడు నెరవేరడం సంతోషంగా ఉందని పేర్కొంది. (ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన హీరోయిన్.. అఫీషియల్‌గా ప్రకటించిన భామ!) View this post on Instagram A post shared by Mahima Nambiar (@mahima_nambiar) -
వినాయక చవితికి ‘చంద్రముఖి-2’
రజనీకాంత్ హీరోగా పి. వాసు దర్శకత్వం వహించిన ‘చంద్రముఖి’ (2005)కి సీక్వెల్‌గా తెరకెక్కించిన సినిమా ‘చంద్రముఖి 2’. రాఘవ లారెన్స్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించారు. పి.వాసు దర్శకుడు. సుభాస్కరన్ నిర్మించారు. ఈ సినిమాని వినాయక చవితికి (సెప్టెంబరు) విడుదల చేయనున్నట్లు ప్రకటించి, రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ ను గమనిస్తే... రాజు వేషంలో రాఘవ లారెన్స్ కనిపిస్తున్నారు. ఆ లుక్ లో పొగరు, రాజసంతో పాటు కూర్రత్వం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. లుక్‌లోనే ఈ రేంజ్ ఉంటే సినిమాలో లారెన్స్ ఎలా తనదైన నటనతో ఆకట్టుకుంటారనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోన్న అంశం. వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్ నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీత సారథ్యం వహిస్తున్నారు. -
చంద్రముఖి–2 అభిమానులకు అప్డేట్ ఇచ్చిన మేకర్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్ చిత్రం చంద్రముఖి. పి.వాసు దర్శకత్వం ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌గా చంద్రముఖి–2 రూపొందిస్తున్న విషయం తెలిసిందే. లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్, వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మీమీనన్, సృష్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పి.వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఇటీవలే నటుడు లారెన్స్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పి పూర్తి చేశారు. కాగా శనివారం నుంచి ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని సమ కూర్చడం ప్రారంభించారని యూనిట్ వర్గాలు తెలిపారు. కాగా త్వరలోనే చంద్రముఖి –2 చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి తెలిపారు. అంతకుముందే వచ్చే నెలలో చిత్రంలోని సింగిల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 19న పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా విడుదల కానుంది. -
విజయ్‌సేతుపతితో మోస్ట్ కాంట్రవర్సీ హీరోయిన్ రొమాన్స్
బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ హిందీ చిత్రాల్లో నటిస్తూనే దక్షిణాది చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారన్నది తెలిసిందే. వివాదాలకు కేరాఫ్‌గా మారిన ఈమె ఇంతకుముందు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో రూపొందిన 'తలైవి' చిత్రంలో టైటిల్ పాత్రను పోషించారు. ప్రస్తుతం పి.వాసు దర్శకత్వంలో వస్తున్న చంద్రముఖి–2 చిత్రం షూటింగ్‌ను కూడా ఆమె పూర్తి చేసుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 15న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో లారెన్స్ కథానాయకుడిగా నటించారు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' టైటిల్, గ్లింప్స్ విడుదల.. హాలీవుడ్ రేంజ్లో సీన్స్) మరో తమిళ చిత్రంలో నటించడానికి కంగనా రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. ట్రైడెంట్ ఆర్ట్స్, అహింసా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రంలో ఒక తమిళ నటుడు, హిందీ నటి కలిసి నటించబోతున్నట్లు ఇంతకముందే వారు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. తాజాగా ఈ క్రేజీ చిత్రంలో విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారు. ఆయనతోపాటు కంగనా నటించనున్నట్లు తెలిసింది. (ఇదీ చదవండి: చిరంజీవి, విజయ్ విషయంలో చాలా బాధపడ్డాను: రష్మిక మందన్న) దీనికి మలయాళం టాప్ దర్శకుడు విపిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. థ్రిల్లర్ కథాంశంతో రూపొందించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దీంతో ఈ రేర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇప్పటినుంచే ఆసక్తి నెలకొంది. కాగా నటి కంగనా స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మిస్తున్న హిందీ చిత్రం ఎమర్జెన్సీ త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోందన్నది గమనార్హం. -
ఎన్నో అవార్డులు తెచ్చిన జిగర్తాండ సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే
తమిళంలో సూపర్ హిట్ సాధించిన జిగర్తాండ సినిమాను ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తమిళ హీరో సిద్ధార్థ్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించగా.. బాక్సాఫీసు వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపించడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఇదే సినిమాను తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేశ్ పేరుతో తెరకెక్కింది. హరీశ్ శంకర్ దీనిని రీమెక్ చేయగా.. టాలీవుడ్లో కూడా మంచి విజయాన్ని సాధించింది. (ఇదీ చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్‌లాక్ చేసేదాన్ని:నటి) తాజాగా దీనికి సిక్వెల్ రెడీ చేశారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. సుమారు 8 ఏళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌గా జిగర్తాండ డబుల్ ఎక్స్ రూపొందుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తూ తన స్టోన్ బెంచ్ ఫిలింస్‌పై అలంకార్ పాండియన్‌కు చెందిన ఇన్వలియో ఆరిజిన్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. దీనికి కార్తికేయన్ సంతానం సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, తిరు చాయాగ్రహణ అందిస్తున్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. (ఇదీ చదవండి:విజయ్ను డైరెక్ట్ చేసే లాస్ట్ ఛాన్స్ ఆ దర్శకుడికే..) ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చిత్రం సంతృప్తికరమైన అనుభవాన్ని కలిగించిందని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెలిపారు. చిత్రాన్ని పలు ప్రాంతాల్లో భారీ వ్యయంతో రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలకు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాన్ని దీపావళికి థియేటర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలుగులో కూడా ఈ సినిమా రానుంది. -
18 ఏళ్లకు సీక్వెల్.. చంద్రముఖి 2 రిలీజ్ డేట్ వచ్చేసింది..
రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో సెన్సేషనల్ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే చాలు చాలామంది టీవీలకు అతుక్కుపోతారు. 2005లో విడుదలైన ఈ సినిమాను పి.వాసు డైరెక్ట్ చేశాడు. దీనికి సీక్వెల్ చేయాలని ఆయన ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో రజనీకాంత్ ఒప్పుకోకపోవడంతో సీక్వెల్ కథతో తెలుగులో నాగవల్లి సినిమా చేశాడు. చివరకు 18 ఏళ్ల తర్వాత తమిళంలోనూ చంద్రముఖి 2 పూర్తి చేశాడు. ఇందులో రజనీకాంత్‌కు బదులుగా నృత్య దర్శకుడు, నటుడు లారెన్స్ నటించాడు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసింది. వడివేలు, రాధిక ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. చంద్రముఖి 2 తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ అధికారికంగా వెల్లడించారు. దీంతో అభిమానులు సినిమా కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. We are thrilled to announce that the doors to the much awaited sequel Chandramukhi 2 🗝️ will be open from Ganesh Chaturthi 🤗✨ Releasing in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada! #Chandramukhi2 🗝️ pic.twitter.com/hoM7BXxWp2 — Raghava Lawrence (@offl_Lawrence) June 29, 2023 చదవండి: పాట పాడటమే కాదు, డ్యాన్స్ కూడా చేసిన ఏఆర్ రెహమాన్ -
చంద్రముఖి 2.. గుమ్మడికాయ కొట్టేశారు!
చంద్రముఖి–2 చిత్ర షూటింగ్ పూర్తి అయింది. రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్ర పోషించిన చంద్రముఖి సినిమా 2005లో విడుదలైంది. అప్పట్లో సంచలన విజయాన్ని సాధించిన చంద్రముఖి చిత్రాన్ని పి.వాసు డైరెక్ట్ చేశాడు. దీనికి సీక్వెల్ చేయాలని వాసు ఎప్పటినుంచో ప్రయత్నిస్తూ ఉన్నారు. రజనీకాంత్ అంగీకరించకపోవడంతో అదే కథతో తెలుగులో వెంకటేష్ కథానాయకుడిగా నాగవల్లి సినిమా తెరకెక్కించారు. అయితే 18 ఏళ్ల తరువాత చంద్రముఖి –2ను తమిళంలో రూపొందిస్తున్నారు. ఇందులో రజనీకాంత్‌కు బదులుగా నృత్య దర్శకుడు, నటుడు లారెన్స్ నటించడం విశేషం. బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రను పోషిస్తున్న ఇందులో వడివేలు, రాధిక ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి.వాసు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ బుధవారం పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న చంద్రముఖి–2 చిత్రంపై సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కారణం రజనీకాంత్ పాత్రను లారెన్స్ పోషించడం జ్యోతిక పాత్రలో కంగనారనౌత్ నటించడంతో పాటు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించడమే! And... Cut! Chandramukhi 2 shooting has officially packed up. 🎬 We can't contain our excitement for fans to experience it on the big screen. 🤩🕴🏻🔥 #Chandramukhi2 🗝️ #CM2 🗝️ 🎬 #PVasu 🌟 @offl_Lawrence @KanganaTeam 🎶 @mmkeeravaani 🎥 @RDRajasekar 🛠️ #ThottaTharani ✂️🎞️… pic.twitter.com/cqxHM8ZJ86 — Lyca Productions (@LycaProductions) June 20, 2023 చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు -
చంద్రముఖి సీక్వెల్ కు పెరిగిన డిమాండ్
-
అప్పుడే ఓటీటీలోకి లారెన్స్ 'రుద్రుడు' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే..
రాఘవ లారెన్స్ తాజాగా నటించిన చిత్రం రుద్రుడు.‘మునీ-4’ తర్వాత దాదాపు ముడేళ్లు గ్యాప్ తీసుకుని లారెన్స్ ఈ సినిమాతో పలకరించారు. కతిరేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లారెన్స్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించింది. తమిళంలో రుద్రన్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రుద్రుడు పేరుతో ఏప్రిల్ 14న విడుదలైంది. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.తాజాగా ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్దమయ్యింది. రుద్రుడు సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ కొనుగోలు చేసింది. మే రెండో వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.