Crime News
-
గూడు లేక.. అద్దె ఇంటికి వెళ్లలేక
ముస్తాబాద్(సిరిసిల్ల): గూడు లేక.. అద్దె ఇంటికి వెళ్లలేక.. మృతదేహంతో ఓ కుటుంబం రాత్రంతా అంబులెన్స్‌లో ఉన్న హృదయ విదారకర సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఖరీదైన వైద్యం పొందలేని నేత కార్మికుడు మృతిచెందగా.. భార్య ముగ్గురు పిల్లలతో కలిసి భర్త మృతదేహంతో రాత్రంతా చలిలోనే ఉండటం చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ముస్తాబాద్‌కు చెందిన బిట్ల సంతోష్(48) వార్పిన్ నేత కార్మికుడిగా పని చేసేవాడు. కేన్సర్‌తో బాధపడుతూ శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో సిరిసిల్లకు తరలిస్తుండగా మార్గమ«ధ్యలో మృతిచెందాడు. అద్దె ఇంట్లో ఉంటూ భార్య శారద, ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని పోషిస్తున్న సంతోష్ మృతితో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. అతని మృతదేహాన్ని అద్దె ఇంటికి తీసుకెళ్లలేక పూర్తిగా శిథిలమైన తమ పూర్వీకుల ఇంటికి తీసుకెళ్లి, రాత్రంతా చలిలో ఉన్నారు. ఈ ఘటన సోషల్‌మీడియాలో వైరల్ అవడంతో తహసీల్దార్ సురేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు స్పందించారు. చందాలు పోగు చేశారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. బాధిత కుటుంబానికి ఇల్లు..నేత కార్మికుడు సంతోష్ కుటుంబ దీనగాథ తెలుసుకున్న కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి విషయాన్ని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన.. బాధితులకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని తహసీల్దా ర్ సురేశ్, ఎంపీడీవో బీరయ్యలను ఆదేశించారు. వారు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి చేతులమీదుగా బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇంటి తాళాలు అందజేశారు. సంతోష్ కుటుంబానికి అండగా ఉంటామని, చిన్నారుల చదువులకు సహకరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. -
అమ్మానాన్నా.. నన్ను క్షమించండి..!
పెద్దపల్లి జిల్లా: ‘చదువుల్లో రాణించలేకపోతున్నా.. ఎంత చదివినా ఎక్కువ మార్కులు రావడం లేదు. టెన్త్‌లో 10 జీపీఏ సాధించాలనుకున్నా అది సాధ్యం అయ్యేలా లేదు. నా వల్ల కాదు.. నేను చనిపోతున్నా. అమ్మానాన్నా.. నన్ను క్షమించండి..’అంటూ చదువు ఒత్తిడిని తట్టుకోలేక పదో తరగతి విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణం రాంనగర్లో శనివారం చోటుచేసుకుంది. సీసీసీ నస్పూర్ ఎస్సై సుగుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిలువేరి దేవేందర్, జ్యోతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురంలో నివాసం ఉంటున్నారు. వీరి కూతురు యోగిత (15) చిన్నప్పటి నుంచి రాంనగర్లో ఉన్న అమ్మమ్మ వద్ద ఉంటోంది. స్థానిక ఆదిత్య స్కూల్లో టెన్త్ చదువుతోంది. పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తుండటంతో ఆవేదన చెంది.. శనివారం తెల్లవారుజామున ఐదు గంటలకు వంట గదిలో ఉరేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కూతురు మరణ వార్త తెలుసుకుని అమలాపురం నుంచి వచి్చ న తల్లిదండ్రులు మృతదేహంపై పడి బోరున విలపించడం అందరినీ కలచివేసింది. -
యువతి స్నానం చేస్తుండగా వీడియో తీశాడని..
అక్కిరెడ్డిపాలెం(విశాఖపట్నం): యువతి స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియో తీశాడు. ఇది గమనించిన యువతి బంధువులు ఆ యువకుడిపై దాడి చేసి గదిలో బంధించారు. భయాందోళన చెందిన ఆ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా.. తమ కుమారుడిని ఆ యువతి బంధువులు కొట్టి హత్య చేశారని బాధిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన శనివారం గాజువాకలో చోటుచేసుకుంది. గాజువాక సీఐ ఎ.పార్థసారథి తెలిపిన వివరాలివీ. విజయనగరం జిల్లాకు చెందిన జి.భాస్కరరావు(30) ఫార్మాసిటీలోని ఓ ఫార్మా కంపెనీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇంకా వివాహం కాలేదు. గాజువాక శ్రీనగర్‌లోని శ్రీరాంనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇంటి యజమానురాలి మనవరాలు ఊరు నుంచి వచ్చింది. పై ఇంట్లో యజమానురాలి బాత్రూమ్ కొంత ఓపెన్‌గా ఉంటుంది. శనివారం మనవరాలు స్నానం చేస్తుండగా భాస్కరరావు వీడియో తీస్తున్నాడని బిగ్గరగా అరిచింది. దీంతో భాస్కరరావు అక్కడ నుంచి తన రూమ్‌లోకి వచ్చేశాడు. అక్కడకి వచ్చిన యువతి బంధువులు భాస్కరరావుపై దాడి చేసి అతడి రూమ్‌లోనే బంధించి తాళం వేశారు. వీడియో విషయాన్ని అతడి తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో ఆందోళన చెందిన భాస్కరరావు తన రూమ్‌లోనే కేబుల్ వైర్లతో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. విజయనగరంలో ఆటోడ్రైవర్‌గా జీవిస్తున్న భాస్కరరావు తండ్రి తాతారావు.. తన కుమారుడిని యువతి బంధువులు కొట్టి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో యువతికి సంబంధించిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
యువ వైద్యుడి ప్రాణం తీసిన అతివేగం
మణికొండ: అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలోని హోర్డింగ్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఓ యువ వైద్యుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళా డాక్టర్ గాయాల పాలయ్యారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో వి.జస్వంత్ (25), భూమిక హౌస్ సర్జన్లుగా పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి వీరు కారులో రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లికి ఓ వివాహానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తెల్లవారు జామున ఖానాపూర్ వద్ద రోడ్డు మలుపును గమనించకుండా వేగంగా రావడంతో కారు అదుపు తప్పింది. రోడ్డు మధ్యలో డివైడర్‌పై ఉన్న హోర్డింగ్ స్తంభాన్ని ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న జస్వంత్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పక్క సీటులో కూర్చున్న భూమికకు తీవ్ర గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని..
జీడిమెట్ల: డబ్బులు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకపోవడం , ఈ విషయమై ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి లోనైన ఓ మహిళ ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జీడిమెట్ల టీఎస్ఎస్ఐసీ కాలనీలో నివాసం ఉంటున్న చందు భార్య లావణ్య(35) స్థానికంగా టైలరింగ్ షాప్ నిర్వహిస్తోంది. కొద్ది నెలల క్రితం ఆమెకు శివరాం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. లావణ్యతో స్నేహంగా ఉండే శివరాం తన వ్యాపార నిమిత్తం రూ.5లక్షలు అప్పుగా ఇవ్వాలని కోరాడు. దీంతో ఆమె తన నగలు తాకట్టు పెట్టి రూ.5 లక్షలు ఇచ్చింది. నెలలు గడుస్తున్నా శివరాం డబ్బులు చెల్లించకపోవడంతో ఆమె ఈ విషయాన్ని తన భర్త దృష్టికి తీసుకెళ్లింది. దీంతో చందు శుక్రవారం శివరాంను ఇంటికి పిలిచి డబ్బుల విషయమై నిలదీయగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో లావణ్య శివరాంకు ఫోన్‌చేసి నువ్వు డబ్బులు ఇవ్వనందునే తమ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని నీ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన శివరాం, చందు ఇంటికి వెళ్లి చూడగా లావణ్య చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఇద్దరూ కలిసి ఆమెను కిందికి దింపి సమీపంలోని అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై టీడీపీ నేత లైంగిక వేధింపులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీపోతున్నాయి. తామేమి చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. తాజాగా.. ‘పచ్చ’నేత ఒకరు ఓ బాలికను మానసికంగా, లైంగికంగా వేధించాడు. తీవ్ర మనోవేదనకు గురైన ఆమె హెచ్చెల్సీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుంది. ఇంతలో తల్లిదండ్రులు అప్రమత్తమై తమ కుమార్తెను కాపాడుకున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కణేకల్లు మండలం యర్రగుంట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. యర్రగుంటలో నిరుపేద కుటుంబానికి చెందిన బాలిక స్థానిక జెడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ముక్కన్న సదరు బాలికపై కన్నేశాడు. వివాహితుడైనప్పటికీ ఉచ్ఛనీచాలు మరిచి నాలుగు నెలలుగా ఆమెను వేధించసాగాడు.ఇంటి నుంచి కిలోమీటరు దూరంలోని స్కూల్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా తరచూ బాలిక వెంటబడేవాడు. ‘ఇలాంటివన్నీ నాకు నచ్చవు. నా వెంట పడొద్దు’ అని ఆ బాలిక చాలాసార్లు చెప్పినా వినలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం బాలిక స్కూల్‌కు వెళ్తుండగా.. ‘నా వెంట రావడానికి నీకెంత కావాలి? చెప్పు.. డబ్బులు పడేస్తా’ అంటూ నీచంగా మాట్లాడాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. స్కూల్‌కెళ్లకుండా హెచ్చెల్సీ కాలువ వైపు వెళ్లింది. ఇది గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. స్కూల్‌కెళ్లకుండా ఇక్కడికెందుకు వచ్చావని ఆరా తీయగా.. జరిగిందంతా చెప్పి బోరున విలపించింది. నాలుగు నెలల నుంచి అతను వేధిస్తున్నాడని, స్కూల్ ఎక్కడ మాన్పిస్తారోనన్న భయంతో చెప్పలేకపోయానని, ఇప్పుడతని మాటలతో చచ్చిపోదామనుకున్నానని కన్నీరు పెట్టుకుంది. దీంతో తల్లిదండ్రులు జెడ్పీ హైస్కూల్ సమీపంలో ఉన్న ముక్కన్నను పట్టుకుని చితకబాదారు. అనంతరం గ్రామస్తులు అతన్ని ఊళ్లోకి తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి కొట్టి పోలీసులకు అప్పగించారు.కామాంధుడికి పోలీసుల వత్తాసు?మరోవైపు.. కామాంధుడు టీడీపీ నాయకుడు కావడంతో అతన్ని ఎలాగైనా కాపాడాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీడీపీ ముఖ్య నాయకుల ఒత్తిళ్లతో నిందితుని నుంచి కూడా కౌంటర్ ఫిర్యాదు తీసుకుని అతనిని రక్షించాలని చూస్తున్నట్లు తెలిసింది. -
13 ఏళ్లకు పట్టుబడ్డాడు!
సాక్షి, హైదరాబాద్: ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆచూకీ 13 ఏళ్లుగా చిక్కలేదు... కోర్టు నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా జాడ దొరకలేదు... దీంతో పోలీసులు ఆ కేసు మూసేయాలని భావించారు... ఈ సమయంలో రంగంలోకి దిగిన నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ టీమ్ నిందితుడిని పట్టుకుంది. అతగాడిని తదుపరి చర్యల నిమిత్తం మహంకాళి పోలీసులకు అప్పగించినట్లు టాస్‌్కఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుదీంద్ర శుక్రవారం వెల్లడించారు. చైతన్యపురి ప్రాంతానికి చెందిన కె.భరద్వాజ్ రావు అలియాస్ గోపాల్‌రెడ్డి మరో ఇద్దరితో కలిసి 2011లో భారీ కుట్ర పన్నాడు. వీరిలో ఒకరి ద్వారా పుణే కేంద్రంగా కార్యకలాపాలు సాగించే రమెలెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చెక్కు చోరీ చేయించాడు. అదే ఏడాది ఆగస్టు 22న సికింద్రాబాద్, ఎస్డీ రోడ్‌లోని ఎస్బీఐ బ్రాంచ్‌లో తన వివరాలు, ఫొటో ఆధారంగా గోపాల్‌రెడ్డి పేరుతో ఓ సేవింగ్స్ ఖాతా తెరిచాడు. ఆపై పుణే సంస్థ చెక్కుపై గోపాల్‌రెడ్డి పేరు రాసి రూ.90 లక్షలకు సిద్ధం చేశాడు. దీన్ని బ్యాంక్‌కు తీసుకువెళ్లిన భరద్వాజ్ అధికారులకు అందించి తాను గోపాల్‌రెడ్డి పేరుతో తెరిచిన ఖాతాలోకి నగదు మళ్లించాడు. ఆపై ఆ ఖాతాకు సంబంధించిన సెల్ఫ్ చెక్ ఇచ్చి ఆ మొత్తం డ్రా చేసుకోవాలని ప్రయతి్నంచాడు. అయితే ఆ ఖాతా కొత్తగా తెరిచింది కావడంతో పాటు ఒకేసారి భారీ మొత్తం డ్రా చేసే ప్రయత్నం చేయడంతో బ్యాంకు సిబ్బందికి అనుమానం వచి్చంది. నగదు ఇవ్వడానికి కొంత సమయం కోరిన వారు అప్పటికి భరద్వాజ్‌ను పంపేశారు. ఈ విషయాన్ని ఫ్యాక్స్ ద్వారా పుణే సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సదరు సంస్థ తమ చెక్కు చోరీ అయిందని, ఆ మొత్తం డ్రా చేసుకోనీయ వద్దని సమాధానం ఇచ్చారు. దీంతో బ్యాంకు అధికారులు గోపాల్‌రెడ్డిగా చెప్పుకున్న భరద్వాజ్‌పై మహంకాళి ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు భరద్వాజ్‌తో సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భరద్వాజ్ కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. అప్పటి నుంచి కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో కోర్టు 2018లో ఆ కేసు నుంచి భరద్వాజ్‌ను వేరు చేసి, మిగిలిన ఇద్దరినీ విచారించింది. న్యాయస్థానం భరద్వాజ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయినా ఆచూకీ లభించకపోవడంతో ఇతడిపై ఉన్న కేసును లాంగ్ పెండింగ్ కేటగిరీలో మూసేయాలని అధికారులు భావించారు. ఆ సమయంలో నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ దృష్టికి ఈ విష యం వచ్చింది. ఇన్స్పెక్టర్ కె.సైదులు నేతృత్వంలో ఎస్సైలు పి.గగన్‌దీప్, సి.రాఘవేంద్రరెడ్డి, శ్రీనివాసులు దాసు రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాలను బట్టి భరద్వాజ్ కొత్తపేటలో ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే అనేక చోట్ల ఇళ్లు, ఫోన్ నెంబర్లు మార్చిన అతగాడిని చాకచక్యంగా పట్టుకున్నారు. -
33 ఏళ్ల తర్వాత మళ్లీ ‘వ్యభిచారం’!
నిజామాబాద్ జిల్లా: మూడు దశాబ్దాల క్రితం... దేశం మొత్తం ఆ ఊరి గురించే మాట్లాడుకుంది. అండర్ గ్రౌండ్లలో బంధించి మరీ అమ్మాయిలతో వ్యభిచారం చేయించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రజలు తిరగబడడంతో ఆ ముఠా ఊరు విడిచి పరారైంది. అయితే ఇప్పుడు మళ్లీ అదే ముఠా సంచారం ఆ ఊరిని ఆందోళనకు గురి చేస్తోంది. నందిపేటలో.. గ్రామస్తుల కృషితో అంతమైన వ్యభిచార వృత్తి మళ్లీ మొదలైంది. ఊరి జనం దాడి చేయడంతో పారిపోయిన వ్యభిచార గృహాల నిర్వాహకులు మళ్లీ అక్కడ అడుగుపెట్టారు. అయితే కూలీ పనులు చేసుకుని బతుకుతామని బతిమాలి.. తిరిగి పాత వ్యవహారాలనే వెలగబెడున్నారు. నందిపేట సమీపంలోని లక్కంపల్లి ప్రాంతంలో వీళ్లు స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నివాసాలు మళ్లీ వ్యభిచార కేంద్రాలుగా మారాయి. అమ్మాయిలను ఎక్కడి నుంచో తీసుకువచ్చి బలవంతంగా ఈ రొంపిలోకి దింపుతున్నారు. ఐదు రోజుల క్రితం పోలీసులు దాడులు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలతో పాటు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.33 ఏళ్ల కిందట ఏం జరిగిందంటే.. 1992లో 13 ఏళ్ల బాలికను చిత్రహింసలు పెడుతూ వ్యభిచార రొంపిలోకి దింపడానికి ప్రయత్నించాగా ఆమె తప్పించుకుని ప్రజలను రక్షించాలని వేడుకుంది. దీంతో.. వ్యభిచార కూపాలపై గ్రామస్తులంతా దాడులు చేసి నిర్వాహకులను పరిగెత్తించారు. వారి ఇళ్లను తగులబెట్టి, నిర్వాహకులను తరిమి కొట్టారు. ఈ కూపంలో ఇరుక్కున్న అమ్మాయిలకు విముక్తి కల్పించారు. ఈ దాడుల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అండర్ గ్రౌండ్ గదుల్లో అమ్మాయిలను బంధించి వ్యభిచార కూపంలోకి దించేందుకు చిత్రహింసలు పెట్టేవారని, వినకపోతే చంపడానికి కూడా వెనుకాడబోయే వారు కాదని తేలింది. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించగా.. ఆంగ్ల, హిందీ ప్రముఖ పత్రికలు కూడా కథనాలు ప్రచురించాయి. -
యువజంట పరువు హత్య.. హంతకులకు మరణశిక్ష
హుబ్లీ/ యశవంతపుర: ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి యువజంట దారుణ హత్యకు గురైంది. ఈ మర్యాద హత్య కేసులో గదగ్ జిల్లా కోర్టు నలుగురు దోషులకు మరణశిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. వివరాలు.. గదగ్ జిల్లాలోని గజేంద్రగడ తాలూకా లక్కలకట్టి గ్రామానికి చెందిన రమేష్ మాదర (29), గంగమ్మ (23) అనే దంపతులను 2019లో కత్తులతో పొడిచి హత్య చేశారు. గంగమ్మ బంధువులే ఈ రక్తపాతానికి పాల్పడ్డారు. కులాంతర పెళ్లి చేసుకోవడం వారికి ఎంతమాత్రం ఇష్టం లేదు. గజేంద్రగడ పోలీసులు గంగమ్మ బంధువులైన శివప్ప రాథోడ్, రవికుమార్ రాథోడ్, రమేష్ రాథోడ్, పరశురామ రాథోడ్‌తో పాటు మరికొందరిని అరెస్టు చేసి, జిల్లా కోర్టులో చార్జిషీట్ ను సమర్పించారు. విచారణలో ఈ నలుగురి నేరం రుజువు కావడంతో వారికి మరణశిక్ష విధిస్తున్నట్లు జడ్జి తీర్పు వెలువరించారు. అనంతరం దోషులను జైలుకు తరలించారు. మరికొందరిపై ఆరోపణలు రుజువు కాకపోవడంతో విముక్తుల్ని చేశారు. -
షేర్ మార్కెట్లో కోటి రూపాయలు లాస్.. కానిస్టేబుల్ బలవన్మరణం
అంబర్‌పేట: ఆర్థిక ఇబ్బందు ల కారణంగా ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ అశోక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సూర్యాపేట జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు (42) మదన్నపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తూ అంబర్‌పేట, దుర్గానగర్‌లో నివాసం ఉంటున్నాడు. గత కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అత ను గురువారం ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. వెంకటే శ్వర్లుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిస్సి సూసైడ్ నోట్ లభ్యం.. లెటర్లో ఏముందంటే?
సాక్షి, తిరుపతి జిల్లా: గూడూరులోని పంబలేరు వాగులో నిస్సి మృతదేహం వద్ద పోలీసులు సూసైడ్ లెటర్‌ను గుర్తించారు. తనను పెళ్లి చేసుకోబోయే చైతన్య అనే అబ్బాయికి లెటర్ రాసిన మృతురాలు.. చైతన్యను జీవితంలో ఎప్పటికీ మరిచిపోనని.. అతనంటే తనకెంతో ఇష్టమంటూ లేఖలో పేర్కొంది.అయితే ఆత్మహత్యకు గల కారణాలను నోట్లో ఎక్కడా ప్రస్తావించలేదు. మరో వైపు, అందరినీ వదిలి వెళిపోతున్నా.. మిస్ యూ అంటూ నోట్ రాసి ఇంట్లోనే పెట్టింది. యువతి అదృశ్యం అనంతరం.. ఇంట్లో ఉన్న నోట్‌ను కుటుంబ సభ్యులు గుర్తించారు.కాగా, గూడూరులో యువతి అనుమానాస్పదంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నెల 31న యువతి వివాహం జరగాల్సి ఉండగా, రెండు రోజుల క్రితం అదృశ్యమైంది.. ఇవాళ వాగులో మృతదేహం లభ్యమైంది. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వలపు వలలో త్రిబుల్ స్టార్ అధికారి!
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా : ‘కంచె చేను మేసింద’న్న చందంగా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పులివెందుల సబ్ డివిజన్లో యథేచ్ఛగా ఇలాంటి ఘటనలు తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉంటే చాలు ఎలాంటి అడ్డదారులు ఎంచుకున్నా పర్వాలేదన్న ధోరణి అధికంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అసలైన హత్యాయత్నం కేసులు నీరు గార్చడం, వాదులాటలపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం సర్వసాధారణమవుతోంది. అందులో భాగంగా మోట్నూతలపల్లెకు చెందిన గంగాధర్ ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది.తెరవెనుక చక్రం తిప్పిన మహిళ..పులివెందుల మండలం మోట్నూతలపల్లి గ్రామానికి చెందిన గంగాధర అనే వ్యక్తి మంగళవారం పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తే విస్తు పోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మృతి చెందిన గంగాధర్‌కు ఓ మహిళకు మధ్య విభేదాలున్నాయి. సదరు మహిళకు త్రిబుల్ స్టార్ అధికారితో కొద్దికాలంగా సాన్నిహిత్యం ఉన్నట్లు సమాచారం. ఆమె విభేదాలతో నిమిత్తం లేకుండా మరో చిన్న కొట్లాటలో గంగాధర్ చిక్కుకున్నాడు. అంతే తెరవెనుక సదరు మహిళ చక్రం తిప్పింది. అంతే వేగంగా గంగాధర్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. అంతటితో పోలీసు అధికారుల చర్యలు ఆగిపోలేదు. త్రిబుల్ స్టార్ అధికారితో సాన్నిహిత్యం ఉన్న మహిళను సంతృప్తి పర్చేందుకు గంగాధర్‌కు పోలీసుల వేధింపులు అధికమయ్యాయి. వెరసి పోలీసుస్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి చనిపోవడం గమనార్హం.గతంలోనూ లైంగిక ఆరోపణలు..ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు త్రిబుల్ స్టార్ అధికారి గతంలో రాయచోటి ప్రాంతంలో పనిచేస్తుండగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. తన కింది స్థాయి సిబ్బంది కుటుంబ సభ్యురాలితో సాన్నిహిత్యం కొనసాగించారు. ఈ విషయం తెలుసుకున్న సదరు సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. తర్వాత కాలంలో సైతం ఆమెతో సాన్నిహిత్యం కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటికీ సంబంధబాంధవ్యాలు కొనసాగుతున్నట్లు సమాచారం. సదరు మహిళకు రాయచోటిలో ఏకంగా ఇల్లు నిర్మిస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ ఇంటి నిర్మాణానికి పులివెందుల టీడీపీ నాయకులు చేస్తున్న అనైతిక కార్యకలాపాల ద్వారా లభించే సొమ్ము వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. గంగాధర్ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునే దిశగా.. పులివెందులలో పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్న మోట్నూతలపల్లె గంగాధర్ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో త్రిబుల్ స్టార్ అధికారి నిమగ్నమైనట్లు సమాచారం. గంగాధర్ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. దాంతో బిత్తర పోయిన సదరు అధికారి మొత్తం వ్యవహారం బహిర్గతమవుతుందని నోట్ల కట్టలతో నోరు మూయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర హోంమంత్రి అనిత మాత్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు, చట్టాన్ని అతిక్రమించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించమని నిత్యం ప్రకటిస్తుంటారు. అయితే పోలీసుశాఖకు ఎలాంటి మచ్చ తెచ్చినా టీడీపీ నేతల సిఫార్సులుంటే ఎలాంటి చర్యలు ఉండవని పులివెందుల సబ్ డివిజన్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పలు ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. ఎస్పీ గాడిలో పెడతారా?!జిల్లాలో కొంతమంది పోలీసు అధికారులు ఖాకీ వనంలో కలుపు మొక్కలుగా తయారయ్యారు. చట్టాన్ని పరిరక్షించాల్సింది పోయి వారే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అక్రమ ఆదాయం కోసం అర్రులు చాస్తూ, ఈజీ మనీ కోసం అడ్డదారులు ఎంచుకున్నారు. అధికార పార్టీ నేతల అండదండలు ఉంటే చాలు ఉద్యోగ నిర్వహణ ఎలా ఉన్నా ఇబ్బంది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా నూతన ఎస్పీగా ఈజీ అశోక్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. మొత్తం వ్యవస్థకే మచ్చ తెస్తున్న కలుపు మొక్కలను.. కళంకితులను గాడిలో పెట్టా ల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. మరి జిల్లా పోలీసు బాసు ఏమేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
ప్రాణం తీసిన గర్భస్రావ మాత్ర
ఖలీల్‌వాడి (నిజామాబాద్ జిల్లా): గర్భస్రావం మాత్రలు రిఫర్ చేసి ఓ యువతి మరణానికి కారణమైన పీఎంపీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏసీపీ బుధవారం వెల్లడించారు. మాక్లూర్ మండలానికి చెందిన యువతి, మెండోరా మండలం సావెల్‌కు చెందిన యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కారణంగా యువతి గర్భం (2 నుంచి 3 నెలలు) దాల్చడంతో యువకుడు తన గ్రామంలో క్లినిక్ నిర్వహిస్తున్న ముప్కాల్ మండలం రెంజర్లకు చెందిన పీఎంపీ హరికృష్ణచారిని ఈనెల 4న సంప్రదించాడు. పీఎంపీ సూచించిన మాత్రలను యువకుడు అదే రోజు యువతికి ఇవ్వగా మూడు రోజుల తరువాత ఆమెకు కడుపు నొప్పితోపాటు బ్లీడింగ్ అయ్యింది. దీంతో యువతిని ఆమె తల్లి నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. యువతికి గర్భస్రావమైందని, కిడ్నీ, లివర్‌కు ఇన్ఫెక్షన్ వచ్చిందని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈనెల 10న హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో యువతి మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పీఎంపీని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. -
జనం పేరుతో రూ.50 లక్షల అప్పులు
తుమకూరు(కర్ణాటక): సుమారు 10కి పైగా మైక్రో ఫైనాన్స్(Microfinance) కంపెనీల నుంచి గ్రామస్తుల పేరుతో అప్పులు తీసుకుని ఘరానా దంపతులు పారిపోయారు. తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలూకాలో ఈ సంఘటన జరిగింది. తాలూకా సమీపంలోని దొడ్డహోసహళ్ళి ఉండే ప్రతాప్, రత్నమ్మ దంపతులు సమారు 35 మంది గ్రామస్తుల పేరుతో ఆధార్ కార్డు, ఇతర దాఖలాలు తీసుకున్నారు. పలు మైక్రో ఫైనాన్స్ కంపెనీలలో వాటిని చూపించి రూ. 50 లక్షల వరకు రుణాలు పొందారు. రెండు నెలల పాటు కంతులు కడుతున్నట్లు నమ్మించారు. ఆ డబ్బుతో గ్రామం నుంచి జారుకున్నారు. మరోవైపు ఫైనాన్స్ సంస్థల సిబ్బంది వచ్చి మీరు అప్పు తీసుకున్నారు, చెల్లించండి అని గ్రామస్తులను ఒత్తిడి చేస్తున్నారు. సుమారు 35 మంది గ్రామస్తులు రూపాయి కూడా తీసుకోకుండా లక్షలాది రూపాయల అప్పుల బారిన పడ్డారు. 2 నెలల నుంచి మోసకారి దంపతుల జాడ లేదని తెలిపారు. చేయని అప్పులను తామెందుకు చెల్లించాలని పలువురు బాధితులు ప్రశ్నించారు. దీంతో గ్రామంలో అలజడి నెలకొంది. -
వీడని యువతి హత్య మిస్టరీ
గంగాధర(చొప్పదండి): మంచిర్యాల జిల్లాలో అదృశ్యమై, కరీంనగర్ జిల్లాలో శవమై కనిపించిన యువతి హత్య మిస్టరీ వీడటం లేదు. గంగాధర పోలీస్‌స్టేషన్‌లో సోమవారం గుర్తు తెలియని యువతి హత్య కేసు నమోదవగా మృతురాలి కుటుంబ వివరాలు మంగళవారం సాయంత్రం తెలిశాయి. అయితే, ఆమెను ఎవరు తీసుకెళ్లారు.. ఎక్కడ హత్య చేశారు, ఆమె వెంట ఉన్న నాలుగేళ్ల కుమారుడి జాడ తెలియలేదు. కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉండే మమత కాసిపేటకు చెందిన భరత్‌ను ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు ఉన్నాడు. కాగా, మమత నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి మంచిర్యాల వచ్చి, తెలిసినవారి ఇంట్లో ఉంటోంది. ఈ నెల 25న సాయంత్రం నూనె ప్యాకెట్ తీసుకువస్తానని కుమారుడితో కలిసి బయటకు వచ్చింది. ఆమె కారు ఎక్కిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తర్వాత కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిలో గంగాధర మండలం కొండన్నపల్లి బస్టాండ్ సమీపంలోని మామిడితోట వద్ద రోడ్డు పక్కన మమత శవమై కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి ఫొటోతో అన్ని పోలీస్స్టేషన్లకు పంపించారు. మంచిర్యాలలో ఉండే ఆమె కుటుంబసభ్యులు గుర్తించి, మంగళవారం సాయంత్రం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు వారికి అప్పగించారు. మమత హత్యపై, ఆమె కుమారుడి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. మృతురాలు ఎక్కిన కారు ఎవరిది, అందులో ఉన్నది ఎవరు, ఎటు తీసుకెళ్లారు అనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేస్తున్నారు. త్వరలోనే హత్య మిస్టరీ వీడుతుందని ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు. -
సూర్యాపేట పరువు హత్య.. అసలు ఏం జరిగింది.. ఎలా చేశారు?
సాక్షి, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట పరువు హత్య కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. వడ్లకొండ కృష్ణ హత్య కేసుపై ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. జనవరి 26న కృష్ణ హత్య జరిగింది. కృష్ణ, భార్గవి కులాంతర వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం నేపథ్యంలోనే హత్య జరిగింది. ఏ1 కోట్ల నవీన్, ఏ2 బైరు మహేష్, ఏ3 కోట్ల సైదులు, ఏ4 కోట్ల వంశీ, ఏ5 కోట్ల భిక్షమమ్మ/ బుచ్చమ్మ ఏ6 నువ్వుల సాయి చరణ్‌లను చేరుస్తూ కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.26న బైరు మహేష్ మూడు నెలలుగా కృష్ణతో స్నేహం చేశాడు. కృష్టను ఫోన్ చేసి బయటకు పిలిపించారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో దాడి చేశారు. కృష్ణను హత్య చేశామని నవీన్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. మృతదేహాన్ని తీసుకెళ్లి పాత సూర్యాపేటకు వెళ్లారు. అక్కడ నాయనమ్మ బుచ్చమ్మకు చూపించారు. ఆ తర్వాత నల్లగొండకు వెళ్లి సాయిచరణ్‌కు చూపించారు. అందరూ కలిసి నల్లగొండ, కనగల్‌తో పాటు పలు చోట్ల మృతదేహాన్ని పడేయాలని చూశారుచివరగా పిల్లలమర్రి చెరువు కట్టపై కృష్ణ మృతదేహాన్ని పడేశారు. గతంలో మూడుసార్లు హత్య చేసేందుకు ప్లాన్ చేసి విఫలం అయ్యారు. ఓ కత్తి కూడా కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచారు. నిందితులు నవీన్ పై నాలుగు కేసులు ఉన్నాయి. మహేష్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయి. వంశీపై మూడు, సైదులు, బుచ్చమ్మపై రెండు కేసులు, సాయి చరణ్ పై ఒక కేసు ఉంది. ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయంలో విచారణ చేస్తున్నాం’’ అని ఎస్పీ పేర్కొన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
హత్నూర(సంగారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తనే హత్య చేసింది భార్య. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్‌లో చోటు చేసుకుంది. సోమవారం ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మల్లె నారాయణ(42) మూడేళ్ల కిందట ఉపాధి నిమిత్తం హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ గ్రామానికొచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గ్రామంలోనే ఎఫ్‌పీఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) కార్యాలయంలో సీఈవోగా పని చేస్తున్నాడు. భార్య లక్ష్మీ సొంత మల్లుపల్లి గ్రామంలోనే ఉండేది. నాలుగు రోజుల కిందట భర్త వద్దకు రెడ్డి ఖానాపూర్ గ్రామానికి వచ్చింది . లక్ష్మీకి బిక్నూర్ మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కడారి రాకేశ్‌తో వివాహేత సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం తెలిసి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఎలాగైన భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. పథకం ప్రకారం శుక్రవారం రాత్రి ప్రియుడు రాకేశ్, బిక్నూర్ గ్రామానికి చెందిన సాగర్ రమేశ్, డప్పు శ్రీకాంత్, కడారి శ్రీకాంత్‌తో కలిసి భర్త నారాయణను రెడ్డి ఖానాపూర్ గ్రామ శివారులోని సొసైటీ కార్యాలయం వద్ద హత్య చేసి మృతదేహాన్ని పల్పనూరు గ్రామ శివారులో పడి వేశారు. మరుసటి రోజు (శనివారం) ఏమీ తెలియనట్లు భర్త కనిపించడం లేదని హత్నూర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం గ్రామ ఉదయం శివారులో మృతదేహం ఉందనే సమాచారం మేరకు ఘటన స్థలాన్ని పటాన్ చెరువు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ నదిముద్దీన్ పరిశీలించారు. అనుమానితురాలుగా ఉన్న భార్యను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకుంది. లక్ష్మీ, రాకేశ్‌తోపాటు వీరికి సహకరించిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సుభాష్ తెలిపారు. లక్ష్మీ సైతం బీజేపీ బీసీ మహిళా మండలాధ్యక్షురాలు పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.హత్య కేసులో నిందితుల రిమాండ్హత్నూర(సంగారెడ్డి): భర్తను హత్య చేయించిన భార్యతోపాటు ఇందుకు సహకరించిన నలుగురిని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు జిన్నారం సీఐ ఎండీ నయీముద్దీన్ తెలిపారు. హత్నూర పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుభాష్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మల్లె నారాయణ (42) వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య లక్ష్మీనర్సవ్వ, ప్రియుడు కడారి రాకేష్, చెట్లపల్లి సాగర్, కడారి శ్రీకాంత్, డప్పు శ్రీకాంత్ కలిసి హత్య చేయించిన విషయం తెలిసిందే. పథకం ప్రకారం తన ప్రియుడైన రాకేశ్‌కు రూ.40 వేలు సుపారీ ఇచ్చింది. లక్ష్మీ నర్సవ్వ ఖానాపూర్‌లో ఉండే భర్త దగ్గరకు మూడు రోజుల కిందట వచ్చింది. అతడు ఆఫీసులో ఉండగానే తాగడానికి కల్లు తెమ్మని చెప్పింది. అతడు వచ్చే లోపు పథకం ప్రకారం నలుగురు నిందితులు వచ్చి ఆఫీసులోని ఓ గదిలో దాక్కున్నారు. నారాయణ కల్లు తీసుకొని రాగానే వారి వెంట తెచ్చుకున్న కత్తి, కట్టే ఇనుప రాడుతో ఒక్కసారిగా దాడి చేసి నరికి చంపేశారు. ఈ హత్యపై ఎస్సై సుభాష్ తనదైన శైలిలో విచారణ చేయగా భార్య లక్ష్మీతోపాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కారు, కత్తి కట్టే ఇనుప రాడును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. -
సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..
మహబూబ్‌నగర్: తమ సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుడిపై నలుగురు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన నవాబుపేట మండలం మరికల్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మరికల్‌కు చెందిన బైండ్ల నర్సింహులు (32) అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న నెపంతో పలుమార్లు గొడవ చోటు చేసుకుంది. ఏడాది క్రితం నర్సింహులుపై వివాహిత సోదరులు దాడికి పాల్పడ్డారు. ఆరునెలల క్రితం అతడి ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టారు. మంగళవారం వ్యవసాయ పొలంలో ఒంటరిగా ఉన్న నర్సింహులుపై నలుగురు మూకుమ్మడిగా దాడిచేసి, తీవ్రంగా గాయపరిచారు. అనంతరం అతడిని ద్విచక్ర వాహనంపై గ్రామానికి తీసుకువచ్చి మరోసారి దాడిచేశారు. ఈ క్రమంలో నర్సింహులు భార్యతో పాటు చుట్టుపక్కల వారు వారించి, అతడిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు నర్సింహులు మృతికి కారణమైన జోగు యాదయ్య, అతడి సోదరులు శ్రీను, నర్సింహులు, బాల్రాజ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. కాగా, ఈ ఘటనకు ప్రధాన కారకురాలైన వివాహితపై సైతం పలువురు దాడికి పాల్పడటంతో తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
వెండి వ్యాపారి కుటుంబం ఆత్మహత్య
సేలం (తమిళనాడు): రుణ వేధింపులతో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడన ఘటన సేలంలో మంగళవారం కలకలం రేపింది. వివరాలు.. సేలం జిల్లా అరిసిపాళయం ముత్యాల్ స్ట్రీట్ ప్రాంతానికి చెందిన బాల్‌రాజ్ (46) వెండి పని చేస్తున్నాడు. అతని భార్య రేఖ (40). వీరి కూతురు జనని(17). ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పన్నెండో తరగతి చదువుతుంది. బాల్‌రాజ్ కొద్ది నెలల క్రితం కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశాడు. ఈ స్థితిలో ఆయన చేస్తున్న వెండి వ్యాపారంలో నష్టం ఏర్పడడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. అప్పు ఇచ్చిన వారు సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి మంగళవారం ఉదయం అప్పు చెల్లించాలని, లేకుంటే పరువు తీస్తామని బెదిరించినట్లు సమాచారం. దీంతో బాల్‌రాజ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఇరుగుపొరుగు వారు తెలిపారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం బంధువు పరామర్శకు వెళ్లగా.. ఇంటి మేడ గదిలో బాల్‌రాజ్, రేఖ, జనని ముగ్గురు ఉరి వేసుకుని మృతదేహాలుగా వేలాడుతూ కనిపించారు. దిగ్భ్రాంతికి గురైన బంధువును, ఇరుగుపొరుగు వారు అక్కడికి వెళ్లారు. ఈ ఆత్మహత్య ఘటనపై పల్లపట్టి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సేలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతో కుటుంబ సమేతంగా వెండి వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపడమే కాకుండా విషాదాన్ని నింపింది. కాగా ఘటనా స్థలంలో.. పోలీసులు బాల్‌రాజ్ రాసిన లేఖను స్వాదీనం చేసుకున్నారు. -
కన్నతల్లి కన్నీటి వ్యథ
హైదరాబాద్: పీపుల్స్ ప్లాజా వేదికగా గత ఆదివారం భారతమాత ఫౌండేషన్ (Bharat Mata Foundation) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారత మాత మహా హారతి’ కార్యక్రమంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం (Fire Accident) ఘటన తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో హుస్సేన్‌సాగర్‌లో గల్లంతైన అజయ్ మృతదేహం మంగళవారం లభించగా.. ఇదే ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న గణపతి అనే యువకుడు కూడా మంగళవారం మృతిచెందాడు. రెండు రోజులుగా గాలింపు..నాగారంకు చెందిన అజయ్ మిస్సింగ్ అయ్యాడని కుటుంబ సభ్యులు సోమవారం (Monday) తెల్లవారుజామున లేక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం నుంచి బోటు ప్రమాదం జరిగిన ప్రదేశం, ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు, లేక్ పోలీసులు, లుంబీపార్క్ బోటింగ్ సిబ్బంది మరోసారి గాలింపు చేపట్టగా మంగళవారం సాయంత్రం సంజీవయ్య పార్కు వద్ద ఉన్న భారీ జాతీయ జెండా సమీపంలో మృతదేహం లభ్యమైంది. అజయ్ కుటుంబంలో విషాదంకన్నబిడ్డ క్షేమంగా ఉంటాడని గంపెడాశతో ఎదురు చూసిన అజయ్ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. రెండు రోజులుగా హుస్సేన్ సాగర్ వద్దే పడిగాపులు కాస్తున్న ఆ కుటుంబ సభ్యులకు మంగళవారం సాయంత్రం మృతదేహం దొరికిందని తెలియగానే.. తల్లిదండ్రులు జానకిరాం, నాగలక్ష్మి దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. తూ.గో జిల్లా నుంచి వచ్చిన..టాటా ఏస్ డ్రైవర్ గణపతి (22) తూర్పు గోదావరి జిల్లా నుంచి బాణసంచా కాల్చే టీంతో కలిసి వచ్చాడు. ఆ సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్ర గాయాలపాలై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. అనుమతి తీసుకున్నారా?కాగా సాధారణంగా బాణసంచా కాల్చేందుకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. కానీ ఆదివారం రాత్రి హుస్సేన్‌సాగర్‌లో మహా హారతి కార్యక్రమంలో బాణసంచా కాల్చేందుకు పోలీసుల అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. లుంబినీ పార్కు మేనేజర్, బోటింగ్ ఇన్చార్జి, ఇతర అధికారుల అనుమతితో బోటులో బాణసంచా కాల్చేందుకు వెళ్లినట్లు తెలిసింది.బాణసంచా కాలుస్తుండగా..మహా హారతి ఇచ్చే క్రమంలో హుస్సేన్ సాగర్‌లో బోటులోంచి బాణసంచా కాలుస్తుండగా మంటలు అంటుకున్నాయి. దీంతో బోట్లో ఉన్న వారంతా నీటిలోకి దూకేశారు. ఈ క్రమంలో నీటిలోకి దూకిన వారిలో నాగారంకు చెందిన సిల్వేరు అజయ్(21) గల్లంతయ్యాడు. అదే బోటులో మంటల తాకిడికి తీవ్ర గాయాలై హాస్పిటల్లో చికిత్స పొందుతూ గణపతి (22) మంగళవారం ఉదయం మృతిచెందాడు. దీంతో ఈ సంఘటనలో ఇద్దరు మృత్యువాత పడటం విషాదాంతంగా మారింది. చదవండి: ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్యరెండు రోజులుగా బోటింగ్ నిలిపివేతసాగర్లో బోటింగ్‌లో మంటలు చెలరేగి యువకుడు గల్లంతైన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో సాగర్‌లో బోటింగ్ నిలిపివేశారు. బోటింగ్ సిబ్బంది మొత్తం అజయ్ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. -
‘మమ్మీ బాయ్..’
ఫిలింనగర్: ‘మమ్మీ బాయ్..’ అంటూ తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై స్కూలుకు బయలుదేరిన చిన్నారిని అక్రమంగా నగరంలోకి ప్రవేశించిన లారీ బలితీసుకుంది. తన కళ్లెదుటే కుమార్తె లారీ చక్రాల కిందపడి ఛిద్రం కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. ఈ హృదయవిదారకమైన ఘటన ఫిల్మ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని షేక్‌పేట ప్రధాన రహదారిలో మంగళవారం చోటు చేసుకుంది. షేక్‌పేట మై హోం రెయిన్ బో రెసిడెన్స్‌లో నివసించే గడ్డం హేమ సుందర్‌రెడ్డి కుమార్తె అథర్వి (10) మణికొండలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఐదో తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం 8.00 గంటల సమయంలో హేమ సుందర్‌రెడ్డి తన కుమార్తెను స్కూల్లో దింపడానికి యాక్టీవా వాహనంపై బయలుదేరారు. వీరి వాహనం 8.10 గంటలకు షేక్‌పేటలోని ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకుంది. అదే సమయంలో వెనుక వైపు నుంచి చక్కెర లోడ్‌తో వచి్చన లారీ హేమ సుందర్‌రెడ్డి నడుపుతున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ధాటికి తండ్రీకుమార్తె వాహనం పైనుంచి ఇద్దరు కిందపడ్డారు. అథర్వి లారీ వెళ్తున్న వైపు పడటంతో దాని వెనుక చక్రాలు ఆమె పైనుంచి వెళ్లాయి. దీంతో శరీరం ఛిద్రమై అక్కడికక్కడే చనిపోయింది. హేమ సుందర్‌రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆ ప్రాంతంలోని రోడ్డంతా రక్తసిక్తమైంది. మరికొద్దిసేపట్లో కూతుర్ని స్కూల్ దగ్గర దింపాల్సి ఉండగా కళ్లెదుటే ఆమె రక్తపు మడుగులో పడి ఉండటాన్ని ఆయన జీరి్ణంచుకోలేకపోయారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న అథర్వి కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమతి లేని వేళల్లో అక్రమంగా సిటీలోకి లారీతో ప్రవేశించి, చిన్నారి మృతికి కారణమైన లారీ డ్రైవర్ యాసిన్ ఖురేషిని అరెస్ట్ చేశారు. -
మీర్‌పేట మాధవి కేసులో గురుమూర్తి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన మీర్‌పేట వెంకట మాధవి హత్య కేసులో ఎట్టకేలకు భర్త గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం ఇంటి వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేసిన పోలీసులు.. మధ్యాహ్నాం అరెస్టును ధృవీకరించారు. అంతకు ముందు.. మాధవి కనిపించకుండా పోయిందన్న కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ కేసును ఇప్పుడు మర్డర్ కేసుగా మార్చారు. సాయంత్రం నిందితుడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వెంకట మాధవిని గురుమూర్తి కిరాతకంగా హతమార్చిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూశాయి. ఆమెను హతమార్చాక.. మలయాళ సినిమా సూక్ష్మదర్శిని ప్రేరణతో మృతదేహాన్ని మాయం చేశాడు గురుమూర్తి. ఆ తర్వాత కూడా సినిమా టికెట్లు బుక్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో రకరకాల ప్రచారాలు మీడియాలో జరగ్గా.. సాయంత్రం ప్రెస్మీట్లో పోలీసులు ఆ విషయాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.భార్య మాధవితో గొడవ పడి ఆమెను హతమార్చి.. ఆపై మృతదేహాన్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టాడు గురుమూర్తి. ఆపై ఆ మాంసాన్ని కమర్షియల్ గ్యాస్ స్టౌవ్‌పై కాల్చాడు. చివరకు ఎముకల్ని పొడి చేసి చెరువులో కలిపాడు. సాంకేతిక ఆధారాలతో గురుమూర్తిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు
గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలో గుట్టుగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇంటిపై పట్టణ పోలీసులు దాడులు చేపట్టి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని బీరోలు చౌరస్తాలోని ఓ ఇంటిలో కడప జిల్లా ఇందిరానగర్‌కు చెందిన రమణయ్యగౌడ్ కొన్ని నెలలుగా వ్యభిచార దందాను గుట్టుగా నిర్వహిస్తున్నాడు. అయితే సోమవారం సాయంత్రం నమ్మదగిన సమాచారం మేరకు వ్యభిచార గృహాంపై దాడులు చేపట్టిన పోలీసులు ఇద్దరు మహిళలు, ముగ్గురు విటులతో పాటు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 సెల్ఫోన్లు, నగదును స్వాదీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. అయితే 20 రోజుల క్రితం ఇదే తరహాలో జిల్లాకేంద్రంలోని పాత హౌసింగ్‌బోర్డు కాలనీలో పట్టుబడిన ఘటన మరవక ముందే మరోసారి పట్టణంలో వ్యభిచార దందా వెలుగులోకి రావడంతో జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో దాగి ఉన్న ప్రధానసూత్రదారులెవరో గుర్తిస్తే తప్ప ఈ దందాను కట్టడి చేయొచ్చని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. -
ఓఆర్ఆర్.. నేరాలకు అడ్డా
మేడ్చల్‌రూరల్: హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు( Outer Ring Road) నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఓఆర్ఆర్ ఇరువైపులా దాని పరిధిలోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటగా ప్రస్తుతం అవి ఏపుగా పెరిగాయి. దీనికితోడూ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లులో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడం, రాత్రుల్లో చీకటిగా ఉండడంతో ఇదే అదునుగా కొందరు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారు. కానరానీ సీసీ కెమెరాలు, హైమాస్ట్ లైట్లు.. ⇒ ఓఆర్ఆర్ ప్రధాన రహదారిలో ప్రభుత్వం విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసింది. కానీ సర్వీస్‌రోడ్డులో మాత్రం చిన్నపాటి లైట్లు కూడా లేవు. దీంతో పాదచారులు, సమీప గ్రామాల వారు రాత్రి వేళల్లో సర్వీస్‌రోడ్డు వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ అండర్ పాస్ బ్రిడ్జిల కింద ప్రేమికులు, వివాహేతర సంబంధాలు గల వారు రాత్రి వేళల్లో ఇక్కడే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పలు పోలీస్స్టేషన్ల పరిధిలో సర్వీస్‌రోడ్డు ఉండడంతో పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు సైతం నిఘా పెట్టకపోవడంతో వారిని అడ్డుకునే వారే లేకుండా పోయారు. ⇒ గతంలో మేడ్చల్ పరిధిలోని కండ్లకోయ చౌరస్తా సమీపంలోని సర్వీస్‌రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చెట్లు పెరిగి నిర్మానుష్య ప్రదేశంగా మారడంతో కొందరు వ్యభిచారులు పట్టపగలే చెట్లపొదల చాటున తమ దందా సాగించారు. ఇదే విషయమై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించగా పోలీసులు వాటికి అడ్డుకట్ట వేశారు. కొన్ని నెలల పాటు పెట్రోలింగ్ చేయడంతో ఆగినా.. ప్రస్తుతం సర్వీస్ రోడ్డులో పోలీసుల లేకపోవడంతో పోకిరీలు మళ్లీ రెచ్చిపోతున్నారు.సీసీ కెమెరాలు లేక నానాతంటాలు..మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఒక్క చోట కూడా సీసీ కెమెరాలు లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. సరీ్వస్ రోడ్డులో ఏ ప్రమాదం, నేరాలు జరిగినా పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కేసు దర్యాప్తులో కీలంగా వ్యవహరించే సీసీ కెమెరాలు లేక నిందితులను పట్టుకునేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈనెల 24న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు పక్కన కల్వర్టు కింద జరిగిన దారుణ హత్య ఘటనను ఛేదించడంలో పోలీసులు మూడు రోజుల పాటు శ్రమించాల్సి వచి్చంది. చివరకు హత్యకు గురైన మహిళ చేతిపై పచ్చబొట్టుతో వేయించుకున్న పేర్లు, ఇతర ఫొటోలతో పాటు జిల్లాల్లో లుక్అవుట్ నోటీసులు అంటించగా వాటిని చూసిన మృతురాలి బంధువులు పోలీసులను ఆశ్రయిస్తేనే హత్య కేసు నిందితుడిని పట్టుకోగలిగారు. -
విద్యార్థినిపై క్షుద్ర పూజ ప్రయోగం
కర్నూలు(సెంట్రల్): కర్నూలు నగర శివారులోని బి.తాండ్రపాడు ఎస్ఆర్ కాలేజీలో క్షుద్ర పూజ ప్రయోగం కలకలం సంచలనం సృష్టించింది. ఈ నెల 26వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో హాస్టల్లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని చంపే ప్రయత్నం చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆమె గాఢనిద్రలో ఉండగా జుట్టుకు కత్తిరించాడు. తరువాత చంపబోయే సమయంలో ఆ విద్యార్థిని నిద్రలేచి కేకలు వేయడంతో దుండగుడు పారిపోయినట్లు తెలుస్తోంది.అయితే ఆ అమ్మాయి బెడ్‌పై కిల్యూ అనే లెటర్, పదునైన కత్తి, రెండు భాగాలు చేసిన నిమ్మకాయ ఉండడంతో క్షుద్ర పూజ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆ గదిలో మొత్తం ఏడుగురు విద్యార్థినులు నిద్రిస్తుండగా ఉండగా..అందులో బాగా చదివే విద్యార్థినినే టార్గెట్ చేయడం గమనార్హం. కాగా, గతంలో కూడా ఒక అమ్మాయిపై క్షుద్ర పూజలు జరిగాయని, అప్పట్లో ఆమె కళ్లు తిరిగి కింద పడిపోయిందని యాజమాన్యం వారి తల్లిదండ్రులకు చెప్పి సముదాయించినట్లు సమాచారం. ఇప్పుడు మళ్లీ కాలేజీలో క్షుద్ర పూజల ప్రయోగం జరగడంతో మిగతా విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వని కళాశాల యాజమాన్యం... కాగా.. క్షుద్ర పూజల సంఘటనపై బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు. అయితే తోటి విద్యార్థులు కొందరు విషయాన్నివారి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు సోమవారం కాలేజీకి చేరుకొని ఆందోళన చెందారు. యాజమాన్యాన్ని సమాచారం అడిగిన సరైన సమాధానం ఇవ్వలేదు. ఈవిషయాన్నివిద్యార్థి, మహిళా సంఘాలు తెలుసుకొని కాలేజీ ఎదుట ఆందోనకు దిగాయి. అస్తవ్యస్తంగా హాస్టల్ నిర్వహణ... ఎస్ఆర్ కాలేజీకి అనుబంధంగా ఉండే హాస్టల్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాలేజీలో మహిళా సెక్యూరిటీ గార్డులు ఉండాల్సి ఉన్నా ఉండడంలేదు. కాలేజీలో ఎక్కడా సీసీ కెమెరాలు లేవు. అంతేకాక మహిళా వార్డెన్లు కూడా లేరని చెబుతున్నారు. అయినా యాజమాన్యం మాత్రం విద్యారి్థనుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్ఐఓ విచారణ.. ఎస్ఆర్ కాలేజీలో అమ్మాయిపై క్షుద్రపూజల కలకలం నేపథ్యంలో ఆర్ఐఓ గురవయ్యశెట్టి విచారణచేపట్టారు. ఆయన కాలేజీకి చేరుకొని బాధిత విద్యారి్థని, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. మరోవైపు కాలేజీ యాజమాన్యం కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు తాలూకా పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇంతవరకు కేసు నమోదుకాలేదు.