Quinton de Kock
-
Quinton de Kock: వచ్చాడు.. రెండో మ్యాచ్‌లోనే భారీ రికార్డు పట్టాడు..!
కేకేఆర్ తరఫున తన రెండో మ్యాచ్‌లోనే క్వింటన్ డికాక్ ఓ భారీ రికార్డు సాధించాడు. నిన్న (మార్చి 26) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లో 97 పరుగులు చేసిన అతడు.. కేకేఆర్ తరఫున విజయవంతమైన ఛేదనల్లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు మనీశ్ పాండే పేరిట ఉండేది. మనీశ్ 2014 సీజన్ ఫైనల్లో పంజాబ్‌పై 94 పరుగులు చేశాడు.విజయవంతమైన లక్ష్య ఛేదనల్లో కేకేఆర్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు97* - క్వింటన్ డికాక్ vs RR, గౌహతి, 202594 - మనీశ్ పాండే vs PBKS, బెంగళూరు, 2014 ఫైనల్93* - క్రిస్ లిన్ vs GL, రాజ్‌కోట్, 201792 - మన్వీందర్ బిస్లా vs CSK, చెన్నై, 201390* - గౌతమ్ గంభీర్ vs SRH, హైదరాబాద్, 2016కాగా, రాయల్స్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో డికాక్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి కేకేఆర్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. కేకేఆర్ బౌలర్లు మొయిన్ అలీ (4-0-23-2), వరుణ్ చక్రవర్తి (4-0-17-2), హర్షిత్ రాణా (4-0-36-2), వైభవ్ అరోరా (4-0-33-2) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాయల్స్ బ్యాటర్లలో ధృవ్ జురెల్ (33) టాప్ స్కోరర్‌గా కాగా.. జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 25, సంజూ శాంసన్ 13, జోఫ్రా ఆర్చర్ 16 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో డికాక్ బాధ్యతాయుతంగా ఆడి కేకేఆర్‌ను గెలిపించాడు. 61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ రహానే (18), రఘువంశీ (22 నాటౌట్) సహకారంతో కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. కేకేఆర్ మరో 15 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తద్వారా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో డికాక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. గత సీజన్లో లక్నోకు ఆడిన డికాక్.. కేకేఆర్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో ప్రభావం చూపనప్పటికీ.. రెండో మ్యాచ్‌లో సత్తా చాటాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు నాలుగు ఫ్రాంచైజీలకు (ఢిల్లీ, ముంబై, లక్నో, ఢిల్లీ) ఆడిన డికాక్.. నాలుగింటి తరఫున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో నాలుగు ఫ్రాంచైజీల తరఫున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఏకైక ప్లేయర్ డికాకే. -
ఐపీఎల్-2025లో ఆసక్తికర విషయం.. వాళ్లే హీరోలయ్యారు..!
ఐపీఎల్ 2025 సీజన్లో ఇప్పటివరకు (మార్చి 26) ఆరు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇందులో తొలి ఐదు మ్యాచ్‌లు ధనాధన్ బ్యాటింగ్ విన్యాసాలతో సాగగా.. నిన్న జరిగిన ఆరో మ్యాచ్ ఎలాంటి మెరుపులు లేకుండా చప్పగా ముగిసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఓ ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో ఫ్రాంచైజీలు మారి వచ్చిన ఆటగాళ్లే తమ కొత్త జట్లను గెలిపించారు.సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌పై ఆర్సీబీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుపులో లక్నో నుంచి వలస వచ్చిన కృనాల్ పాండ్యా కీలకపాత్ర పోషించాడు. కృనాల్ ఆర్సీబీ తరఫున తన తొలి మ్యాచ్‌లోనే మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.సీజన్ రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీ చేసి సన్‌రైజర్స్ విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్‌కు ఆడిన ఇషాన్.. సన్‌రైజర్స్ తరఫున తన తొలి మ్యాచ్‌లోనే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.మూడో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్ లైనప్‌కు కుప్పకూల్చిన నూర్ అహ్మద్ సీఎస్కే గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. గత సీజన్ వరకు గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన నూర్.. సీఎస్కే తరఫున తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.సీజన్ నాలుగో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆశుతోష్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలు ప్రదర్శించి ఢిల్లీకి ఊహించని విజయాన్నందించాడు. గత సీజన్లో పంజాబ్‌కు ఆడిన అశుతోష్.. ఢిల్లీ తరఫున తొలి మ్యాచ్‌లోనే అదగొట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.ఐదో మ్యాచ్‌లో గుజరాత్‌పై పంజాబ్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సెంచరీ త్యాగం చేసి మరీ తన కొత్త ఫ్రాంచైజీ పంజాబ్‌ను గెలిపించాడు. గత సీజన్లో కేకేఆర్‌కు టైటిల్ అందించిన శ్రేయస్.. పంజాబ్ తరఫున తన తొలి మ్యాచ్‌లో వీరంగం సృష్టించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. నిన్న జరిగిన ఆరో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై కేకేఆర్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ను డికాక్ ఒంటిచేత్తో గెలిపించాడు. గత సీజన్లో లక్నోకు ఆడిన డికాక్.. కేకేఆర్ తరఫున తన రెండో మ్యాచ్‌లోనే అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.ఈ ట్రెండ్ ప్రకారం చూస్తే.. నేడు జరుగబోయే సన్‌రైజర్స్, లక్నో మ్యాచ్‌లో కూడా ఫ్రాంచైజీ మారి వచ్చిన ఆటగాడే తన కొత్త జట్టును గెలిపించే అవకాశం ఉంది. ఆ ఆటగాడు ఎవరవుతారని అనుకుంటున్నారు. మరోసారి ఇషాన్ అయితే A.. పంత్ అయితే B.. మిచెల్ మార్ష్ అయితే C.. మార్క్రమ్ అయితే D అని కామెంట్ చేయండి. -
KKR Vs RR: డికాక్ ధమాకా
ఐపీఎల్లో పరుగుల వరద పారిన రెండు వరుస మ్యాచ్‌ల తర్వాత ఆ జోరుకు కాస్త విరామం. పొడిగా, బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని పిచ్‌పై సాగిన మ్యాచ్‌లో సీజన్లో తక్కువ స్కోరు నమోదు కాగా, డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) పైచేయి సాధించి తొలి విజయాన్ని నమోదు చేసింది. వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ కట్టుదిట్టమైన స్పిన్‌తో ముందుగా రాజస్తాన్‌ను నైట్‌రైడర్స్ తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. ఆ తర్వాత డికాక్ దూకుడైన బ్యాటింగ్‌తో లక్ష్యఛేదనను సునాయాసం చేసేశాడు. 15 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ విజయాన్నందుకుంది. అన్ని రంగాల్లో విఫలమైన రాజస్తాన్ రాయల్స్ తమ ‘హోం గ్రౌండ్’లో పేలవ ప్రదర్శనతో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. గువహాటి: డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ ఐపీఎల్ సీజన్లో గెలుపు బోణీ చేసింది. గత మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన నైట్‌రైడర్స్ బుధవారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ధ్రువ్ జురేల్ (28 బంతుల్లో 33; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, యశస్వి జైస్వాల్ (24 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ (15 బంతుల్లో 25; 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై వరుణ్, మొయిన్ అలీ 8 ఓవర్లలో 40 పరుగులకే 4 వికెట్లు తీసి రాయల్స్‌ను దెబ్బ కొట్టారు. వైభవ్ అరోరా, హర్షిత్ కూడా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం కోల్‌కతా 17.3 ఓవర్లలో 2 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్వింటన్ డికాక్ (61 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. సునీల్ నరైన్ అనారోగ్యం కారణంగా మ్యాచ్‌కు దూరం కావడంతో మొయిన్ అలీకి కోల్‌కతా చోటు కల్పించగా, ఫారుఖీ స్థానంలో రాజస్తాన్ జట్టులోకి హసరంగ వచ్చాడు.సమష్టి వైఫల్యం... రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆసాంతం ఒకే తరహాలో సాదాసీదాగా సాగింది. ఆశించిన స్థాయిలో దూకుడైన బ్యాటింగ్ లేకపోగా, ఒక్కటీ సరైన భాగస్వామ్యం రాలేదు. జైస్వాల్ ధాటిగానే మొదలు పెట్టినా... మరోవైపు సంజు సామ్సన్ (11 బంతుల్లో 13; 2 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేదు. ‘లోకల్ బాయ్’ పరాగ్ తన తొలి 7 బంతుల్లో 2 సిక్సర్లు బాది అభిమానులను ఆకట్టుకున్నాడు. వరుణ్ ఓవర్లోనూ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్స్ బాదిన అతను...అదే ఓవర్లో మరో షాట్‌కు ప్రయత్నించి వెనుదిరగడంతో మైదానంలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత హసరంగ (4)ను ముందుగా పంపిన ప్రయోగం ఫలితం ఇవ్వకపోగా, నితీశ్ రాణా (9 బంతుల్లో 8), శుభమ్ దూబే (12 బంతుల్లో 9; 1 ఫోర్) కూడా విఫలమయ్యారు. 67/1తో మెరుగైన స్థితిలో కనిపించిన రాజస్తాన్ 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి 82/5కి చేరింది. దాంతో ‘ఇంపాక్ట్ సబ్’గా అదనపు బ్యాటర్‌ను శుభమ్ దూబే రూపంలో ఏడో స్థానంలో బరిలోకి దింపింది. అయితే ఒత్తిడిలో అతనూ ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో జురేల్ కొన్ని చక్కటి షాట్లతో జట్టును ఆదుకున్నాడు. హర్షిత్ రాణా వరుస ఓవర్లలో అతను రెండేసి ఫోర్లు కొట్టాడు. అయితే హర్షిత్ తన తర్వాతి ఓవర్లో జురేల్, ప్రమాదకర బ్యాటర్ హెట్‌మైర్ (8 బంతుల్లో 7; 1 ఫోర్)లను వెనక్కి పంపించాడు. చివర్లో ఆర్చర్ (7 బంతుల్లో 16; 2 సిక్స్‌లు) కొట్టిన రెండు సిక్సర్లతో రాజస్తాన్ స్కోరు 150 పరుగులు దాటింది. డికాక్ మెరుపులు... ఛేదనలో డికాక్ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. పవర్‌ప్లేలో జట్టు స్కోరు 40 పరుగులు కాగా, డికాక్ ఒక్కడే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 పరుగులు సాధించాడు. మరోవైపు కేకేఆర్ తరఫున ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన మొయిన్ అలీ (5) రనౌట్ కావడంతో జట్టు మొదటి వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ అజింక్య రహానే (15 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయినా, డికాక్ జోరుతో స్కోరు వేగంగా సాగిపోయింది. 35 బంతుల్లోనే డికాక్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అతనికి గెలుపు దిశగా అంగ్కృష్ రఘువంశీ (17 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) సహకరించాడు. దూకుడు తగ్గించని డికాక్ శతకం దిశగా దూసుకుపోయాడు. చివరి 3 ఓవర్లలో నైట్‌రైడర్స్ విజయానికి 17 పరుగులు, డికాక్ సెంచరీకి 19 పరుగులు అవసరం కాగా, ఆర్చర్ ఓవర్లో డికాక్ ఒక ఫోర్, 2 సిక్స్‌లు బాదినా... చివరకు 97 వద్దే అతను ఆగిపోవాల్సి వచ్చింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) హర్షిత్ రాణా (బి) అలీ 29; సామ్సన్ (బి) అరోరా 13; పరాగ్ (సి) డికాక్ (బి) వరుణ్ 25; నితీశ్ రాణా (బి) అలీ 8; హసరంగ (సి) రహానే (బి) వరుణ్ 4; జురేల్ (బి) హర్షిత్ రాణా 33; శుభమ్ (సి) రసెల్ (బి) అరోరా 9; హెట్‌మైర్ (సి) రఘువంశీ (బి) హర్షిత్ రాణా 7; ఆర్చర్ (బి) జాన్సన్ 16; తీక్షణ (నాటౌట్) 1; తుషార్ దేశ్‌పాండే (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–33, 2–67, 3–69, 4–76, 5–82, 6–110, 7–131, 8–138, 9–149. బౌలింగ్: స్పెన్సర్ జాన్సన్ 4–0–42–1, వైభవ్ అరోరా 4–0–33–2, హర్షిత్ రాణా 4–0–36–2, మొయిన్ అలీ 4–0–23–2, వరుణ్ 4–0–17–2. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: మొయిన్ అలీ (రనౌట్) 5; డికాక్ (నాటౌట్) 97; రహానే (సి) దేశ్‌పాండే (బి) హసరంగ 18; రఘువంశీ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17.3 ఓవర్లలో 2 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–41, 2–70. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 2.3–0–33–0, మహీశ్ తీక్షణ 4–0–32–0, రియాన్ పరాగ్ 4–0–25–0, సందీప్ శర్మ 2–0–11–0, హసరంగ 3–0–34–1, నితీశ్ రాణా 1–0–9–0, తుషార్ 1–0–7–0.ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X లక్నోవేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
KKR Vs RR: డికాక్ వన్ మ్యాన్ షో.. రాజస్తాన్‌ను చిత్తు చేసిన కేకేఆర్
ఐపీఎల్-2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి విజయం సాధించింది. గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపొందింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కోల్‌కతా విజయంలో క్వింటన్ డికాక్ కీలక పాత్ర పోషించాడు.ఓపెనర్‌గా బరిలోకి దిగిన డికాక్ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. 60 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 8ఫోర్లు, 5 సిక్స్‌లతో 97 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రఘువంశీ(22), రహానే(18) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో హసరంగా ఒక్కడే ఓ వికెట్ సాధించగా.. మరో వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది.చెతులేత్తేసిన బ్యాటర్లు..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కేకేఆర్ స్పిన్నర్ల దాటికి రాజస్తాన్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వి జైశ్వాల్(29), రియాన్ పరాగ్(25) పరుగులతో రాణించారు. కాగా రాజస్తాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.చదవండి: IPL 2025: డికాక్ మాస్టర్ మైండ్.. హెల్మెట్‌ను తీసి మరి! వీడియో వైరల్ -
డికాక్ మాస్టర్ మైండ్.. హెల్మెట్‌ను తీసి మరి! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో భాగంగా గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో రాజస్తాన్ స్టాండ్ ఇన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌ను డికాక్ పెవిలియన్‌కు పంపాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో మూడో బంతిని పరాగ్ భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత బంతిని పరాగ్ డిఫెన్స్ ఆడాడు. ఈ క్రమంలో ఐదో బంతిని వరుణ్ చక్రవర్తి.. పరాగ్‌కు ఔట్‌సైడ్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని పరాగ్ మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని చాలా ఎత్తుగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో వికెట్ల వెనక ఉన్న డికాక్ తన కీపింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. బంతి గాల్లోకి లేచిన వెంటనే డికాక్ క్యాచ్ కాల్ ఇచ్చాడు. క్లియర్ వ్యూ కోసం హెల్మెట్‌ను తీసి మరి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. వెంటనే సహచర ఆటగాళ్లు అతడి వద్దకు వచ్చి అభినంధించారు. దీంతో 25 పరుగులు చేసిన పరాగ్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వి జైశ్వాల్(29), రియాన్ పరాగ్(25) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. Spinners casting their magic 🪄First Varun Chakravarthy and then Moeen Ali 💜Updates ▶ https://t.co/lGpYvw7zTj#TATAIPL | #RRvKKR | @KKRiders pic.twitter.com/EfWc2iLVIx— IndianPremierLeague (@IPL) March 26, 2025 -
రాణించిన రకీమ్, డికాక్.. ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన రాయల్స్
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యింది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన తొలి జట్టు రాయల్సే. ఇవాళ (సెప్టెంబర్ 18) జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్.. రకీమ్ కార్న్‌వాల్ (4-0-16-5), నవీన్ ఉల్ హక్ (4-0-21-3), ఓబెద్ మెక్కాయ్ (2.1-0-11-2) ధాటికి 110 పరుగులకే (19.1 ఓవర్లలో) కుప్పకూలింది. పేట్రియాట్స్ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ ఫ్లెచర్ (32), జాషువ డసిల్వ (25), అన్రిచ్ నోర్జే (22), హసరంగ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 11.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. క్వింటన్ డికాక్ (59 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు. ఈ సీజన్లో డికాక్‌కు ఇది మూడో ఫిఫ్టి ప్లస్ స్కోర్. డికాక్ గత మ్యాచ్‌లో సెంచరీ చేశాడు.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఈ సీజన్లో రాయల్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. మరోవైపు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఈ సీజన్లో పేలవ ప్రదర్శనలు కనబరుస్తూ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సెయింట్ లూసియా కింగ్స్ రెండో స్థానంలో, గయానా అమెజాన్ వారియర్స్ మూడు, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ నాలుగో స్థానంలో, ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ ఐదో స్థానంలో ఉన్నాయి.చదవండి: ఐదు వికెట్లతో చెలరేగిన భారీకాయుడు -
CPL 2025: డికాక్ విధ్వంసకర సెంచరీ.. 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో బార్బడోస్ రాయల్స్ మరో అద్భుత విజయం సాధించింది. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో బార్బడోస్ రాయల్స్ గెలుపొందింది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గయానా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. గయానా బ్యాటర్లలో షాయ్ హోప్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు మొయిన్ అలీ(33), కీమో పాల్(30) తమవంతు ప్రయత్నం చేసినప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. బార్బడోస్ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 3 వికెట్లు పడగొట్టగా.. హోల్డర్ రెండు వికెట్లు సాధించారు.డికాక్ విధ్వంసకర సెంచరీ..అంతకముందు బ్యాటింగ్ చేసిన బార్బోడస్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బార్బోడస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు.ఈ మ్యాచ్‌లో 68 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో 115 పరుగులు చేశాడు. డికాక్‌కు ఇదే తొలి సీపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. అతడితో పాటు హోల్డర్(10 బంతుల్లో 28,3 సిక్స్‌లు, ఒక ఫోర్) మెరుపులు మెరిపించాడు.టాప్‌లో గయానా..ఇక ఈ విజయంతో బార్బోడస్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన బార్బోడస్ నాలుగింట విజయం సాధించి టాప్‌లో కొనసాగుతోంది. బార్బోడస్ తర్వాత గయానా, ట్రినాబాగో నైట్‌రైడర్స్, సెయింట్ లూసియా వరుసగా ఉన్నాయి.చదవండి: ఇద్దరం ఒకే జట్టుకు ఆడాము.. అయినా నన్ను స్లెడ్జ్ చేశాడు: ధ్రువ్ -
రాణించిన డికాక్.. రాయల్స్ హ్యాట్రిక్ విజయం
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 12) బార్బడోస్ రాయల్స్, ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఫాల్కన్స్‌పై రాయల్స్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 10 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. జస్టిన్ గ్రీవ్స్ (61 నాటౌట్), సామ్ బిల్లింగ్స్ (56) అర్ద సెంచరీలతో రాణించారు. రాయల్స్ బౌలర్లలో జేసన్ హోల్డర్, నవీన్ ఉల్ హక్ తలో 2, కేశవ్ మహారాజ్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు ఛేదనకు దిగిన రాయల్స్‌కు వరుణుడు వరుస క్రమాల్లో అడ్డుతగిలాడు. 14.3 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన రాయల్స్‌ను విజేతగా ప్రకటించారు. ఆ సమయానికి రాయల్స్ 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి డీఎల్ఎస్ స్కోర్‌కు 10 పరుగులు అధికంగా ఉండింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో క్వింటన్ డికాక్ (48), అలిక్ అథనాజ్ (34) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. రోవ్‌మన్ పావెల్ 15, డేవిడ్ మిల్లర్ 19 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫాల్కన్స్ బౌలర్లలో క్రిస్ గ్రీన్, రోషన్ ప్రైమస్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో రాయల్స్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. బ్యాటింగ్‌లో 48 పరుగులు చేసి, వికెట్‌కీపింగ్‌తో ముగ్గురిని ఔట్ చేసిన డికాక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్: ఒక్క ఫోర్ లేదు! అన్నీ సిక్సర్లే! -
డికాక్ సునామీ ఇన్నింగ్స్.. 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో! రాయల్స్ ఘన విజయం
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024ను బార్బడోస్ రాయల్స్ విజయంతో ఆరంభించింది. ఆదివారం సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో బార్బడోస్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బార్బుడా ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. బార్బుడా బ్యాటర్లలో జ్యువెల్ ఆండ్రూ(48) మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రాయల్స్ బౌలర్లలో మెకాయ్ మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ, హోల్డర్ తలా రెండు వికెట్లు సాధించారు.డికాక్ ఊచకోత..అనంతరం 146 పరుగుల లక్ష్యాన్ని బార్బడోస్ రాయల్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. లక్ష్య చేధనలో రాయల్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో ఓపెనర్ కార్న్‌వాల్(34) సైతం దూకుడుగా ఆడాడు. ఆంటిగ్వా బౌలర్లలో వసీం ఒక్కడే వికెట్ సాధించాడు.చదవండి: #Babar Azam: 'బాబర్ నీ పని అయిపోయింది.. వెళ్లి జింబాబ్వేలో ఆడుకో' Quinton de kock vs Antigua & Barbuda Falcons 87*(45) incl. 9 Fours | 5 Sixes | SR 193+ pic.twitter.com/4JXTBixj6Q— SuperGiantsArmy™ — LSG FC (@LucknowIPLCover) September 2, 2024 -
నరైన్, రసెల్ విఫలం.. నైట్‌రైడర్స్ ఓటమి
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో సియాటిల్ ఓర్కాస్ తొలి విజయాన్ని నమోదు చేసింది. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌తో నిన్న (జులై 9) జరిగిన మ్యాచ్‌లో ఓర్కాస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్.. జేసన్ రాయ్ (52 బంతుల్లో 69; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (22 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (5), ఉన్ముక్త్ చంద్ (18), షకీబ్ అల్ హసన్ (7), ఆండ్రీ రసెల్ (14) నిరాశపరిచారు. ఓర్కాస్ బౌలర్లలో జమాన్ ఖాన్, హర్మీత్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. గానన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఓర్కాస్.. ర్యాన్ రికెల్టన్ (66 బంతుల్లో 103; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకంతో విజృంభించడంతో 19.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. రికెల్టన్కు జతగా క్వింటన్ డికాక్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (51 నాటౌట్) ఆడాడు. ఓర్కాస్ కోల్పోయిన ఏకైక వికెట్ (నౌమన్ అన్వర్ (9)) స్పెన్సర్ జాన్సన్‌కు దక్కింది. ఎంఎల్సీ ప్రస్తుత ఎడిషన్‌లో ఆరు మ్యాచ్‌లు అయిన అనంతరం పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ ఫ్రీడం టాప్‌లో ఉంది. శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, ఎంఐ న్యూయార్క్, లాస ఏంజెలెస్ నైట్‌రైడర్స్, సీయాటిల్ ఓర్కాస్, టెక్సస్ సూపర్ కింగ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
T20 WC 2024: చెలరేగిన డికాక్, మిల్లర్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
టీ20 వరల్డ్‌కప్-2024 సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా దక్షిణాఫ్రికా- ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. డికాక్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవరాల్‌గా 38 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. అతడితో పాటు డేవిడ్ మిల్లర్ మెరుపులు మెరిపించాడు. 28 బంతులు ఎదుర్కొన్న మిల్లర్ 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 పరుగులు చేశాడు. ప్రోటీస్ బ్యాటర్లలో వీరిద్దరి మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ మార్క్రమ్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా మార్క్రమ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ మూడు వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ, రషీద్ తలా వికెట్ సాధించారు. -
T20 World Cup 2024: గిల్‌క్రిస్ట్‌ను అధిగమించిన డికాక్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా యూఎస్ఏతో నిన్న (జూన్ 19) జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ మెరుపు అర్దశతకంతో (40 బంతుల్లో 74; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ హాఫ్ సెంచరీతో డికాక్ ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో అతను దిగ్గజ వికెట్‌కీపర్, బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను అధిగమించాడు. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ల జాబితాలో శ్రీలంక ఆల్‌టైమ్ గ్రేట్ కుమార సంగక్కర అగ్రస్థానంలో ఉన్నాడు.ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్లు వీరే..కుమార సంగక్కర (84 ఇన్నింగ్స్‌ల్లో 2855 పరుగులు)క్వింటన్ డికాక్ (53 ఇన్నింగ్స్‌ల్లో 1685 పరుగులు)ఆడమ్ గిల్‌క్రిస్ట్ (50 ఇన్నింగ్స్‌ల్లో 1636 పరుగులు)జోస్ బట్లర్ (56 ఇన్నింగ్స్‌ల్లో 1550 పరుగులు)ముష్ఫికర్ రహీం (61 ఇన్నింగ్స్‌ల్లో 1500 పరుగులు)కాగా, యూఎస్ఏతో నిన్న జరిగిన తొలి సూపర్-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (74), మార్క్రమ్ (46), క్లాసెన్ (36 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (20 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.అనంతరం 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఎస్ఏ.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఆండ్రియస్ గౌస్ (80 నాటౌట్), హర్మీత్ సింగ్ (38) యూఎస్ఏను గెలిపించేందుకు విపలయత్నం చేశారు. సౌతాప్రికా బౌలర్లలో కగిసో రబాడ (4-0-18-3) అద్భుతంగా బౌలింగ్ చేసి యూఎస్ఏను కట్టడి చేశాడు. -
T20 World Cup 2024: రెచ్చిపోయిన డికాక్.. యూఎస్ఏ ముందు భారీ లక్ష్యం
టీ20 వరల్డ్‌కప్ 2024లో యూఎస్ఏతో ఇవాళ (జూన్ 19) జరుగుతున్న తొలి సూపర్-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి యూఎస్ఏ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్వింటన్ డికాక్ (40 బంతుల్లో 74; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (32 బంతుల్లో 46; 4 ఫోర్లు, సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (22 బంతుల్లో 36 నాటౌట్; 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (16 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు) సత్తా చాటగా.. అమెరికా బౌలర్లలో సౌరబ్ నేత్రావల్కర్ (4-0-21-2), హర్మీత్ సింగ్ (4-0-24-2) వికెట్లు తీశారు. తుది జట్లు..దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీయునైటెడ్ స్టేట్స్: షాయన్ జహంగీర్, స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్(వికెట్‌కీపర్), ఆరోన్ జోన్స్(కెప్టెన్), నితీష్ కుమార్, కోరె అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, నోష్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్ -
మయాంక్ మెరుపు బౌలింగ్
బెంగళూరు: అందివచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా నిప్పులు చెరిగే బంతులతో మరోసారి లక్నో పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ హడలెత్తించాడు. వేగానికితోడు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ఐపీఎల్ టోర్నీ లో లక్నో జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించాడు. మయాంక్ (3/14) దెబ్బకు సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు మళ్లీ నిరాశే ఎదురైంది. మయాంక్‌తోపాటు డికాక్, నికోలస్ పూరన్ రాణించడంతో... మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (56 బంతుల్లో 81; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), పూరన్ (21 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్స్‌లు) చెలరేగారు. అనంతరం బెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. మహిపాల్ లామ్రోర్ (13 బంతుల్లో 33; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ ఆట ఆడగా... పటిదార్, గ్రీన్, మ్యాక్స్‌వెల్ వికెట్లను తీసి లక్నో విజయంలో కీలకపాత్ర పోషించిన మయాంక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ మయాంక్ మూడు వికెట్టు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం అందుకున్నాడు. డికాక్, పూరన్ మెరుపులతో... లక్నో జట్టు ఓపెనర్ డికాక్ ఆరంభం నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టాప్లీ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో అతను 3 బౌండరీలు, సిరాజ్ మూడో ఓవర్లో 2 సిక్స్‌లు బాదాడు. దీంతో కెపె్టన్ కేఎల్ రాహుల్ (20; 2 సిక్స్‌లు) తక్కువే చేసినా... దేవదత్ పడిక్కల్ (6) విఫలమైనా... లక్నో ఇన్నింగ్స్‌పై ఏమాత్రం ప్రభావం పడలేదు. 36 బంతుల్లో డికాక్ ఫిఫ్టీ పూర్తవగా జట్టు స్కోరు 12వ ఓవర్లోనే వందకు చేరింది. స్టొయినిస్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిని ప్రదర్శించగా, ఆఖర్లో పూరన్ మెరుపులతో లక్నో భారీస్కోరు చేయగలిగింది. 19, 20వ ఓవర్లను పూర్తిగా ఆడిన పూరన్ 5 సిక్స్‌లతో 33 పరుగులు పిండుకున్నాడు. కోహ్లి అవుటవడంతోనే... బెంగళూరు ఇన్నింగ్స్ ఆరంభంలో కొద్ది సేపే బాగుంది. కెపె్టన్ డు ప్లెసిస్ బౌండరీలతో వేగం పెంచగా, నవీనుల్ నాలుగో ఓవర్లో కోహ్లి సిక్స్‌తో టచ్‌లోకి వచ్చాడు. మరుసటి ఓవర్ తొలి బంతికి కోహ్లి ఫోర్ కొట్టడంతో స్కోరు 40/0 వద్ద బాగానే ఉంది. అక్కడే కోహ్లి నిష్క్రష్కమించగా, మరుసటి ఓవర్లో డుప్లెసిస్ (19; 3 ఫోర్లు) రనౌటయ్యాడు. చెత్త షాట్ ఆడిన మ్యాక్స్‌వెల్ (0) పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతే 43 పరుగులకే ముగ్గురు హిట్టర్లను కోల్పోయిన బెంగళూరు కష్టాల్లో పడింది. మయాంక్ అద్భుత బంతికి గ్రీన్ (9) బౌల్డ్ కాగా.. అనూజ్ (11) కూడా జట్టును ఆదుకోలేకపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన లామ్రోర్ సిక్స్‌లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. 20 బంతుల్లో 46 పరుగుల సమీకరణం ఆర్సీబీలో కొత్త ఆశలు రేపగా... మరుసటి బంతికి కార్తీక్ (4) అవుట్ కావడంతోనే బెంగళూరు ఖేల్ ఖతమైంది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) డాగర్ (బి) టాప్లీ 81; కేఎల్ రాహుల్ (సి) డాగర్ (బి) మ్యాక్స్‌వెల్ 20; పడిక్కల్ (సి) అనూజ్ (బి) సిరాజ్ 6; స్టొయినిస్ (సి) డాగర్ (బి) మ్యాక్స్‌వెల్ 24; పూరన్ (నాటౌట్) 40; బదోని (సి) డుప్లెసిస్ (బి) యశ్ దయాళ్ 0; కృనాల్ పాండ్యా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–53, 2–73, 3–129, 4–143, 5–148. బౌలింగ్: రీస్ టాప్లీ 4–0–39–1, యశ్ దయాళ్ 4–0–24–1, సిరాజ్ 4–0–47–1, మ్యాక్స్‌వెల్ 4–0–23–2, మయాంక్ డాగర్ 2–0–23–0, గ్రీన్ 2–0–25–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) పడిక్కల్ (బి) సిద్ధార్థ్ 22; డుప్లెసిస్ (రనౌట్) 19; పటిదార్ (సి) పడిక్కల్ (బి) మయాంక్ యాదవ్ 29; మ్యాక్స్‌వెల్ (సి) పూరన్ (బి) మయాంక్ యాదవ్ 0; గ్రీన్ (బి) మయాంక్ యాదవ్ 9; అనూజ్ (సి) పడిక్కల్ (బి) స్టొయినిస్ 11; మహిపాల్ (సి) పూరన్ (బి) యశ్ ఠాకూర్ 33; దినేశ్ కార్తీక్ (సి) రాహుల్ (బి) నవీనుల్ 4; మయాంక్ డాగర్ (రనౌట్) 0; టాప్లీ (నాటౌట్) 3; సిరాజ్ (సి) పూరన్ (బి) నవీనుల్ 12; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 153. వికెట్ల పతనం: 1–40, 2–42, 3–43, 4–58, 5–94, 6–103, 7–136, 8–137, 9–138, 10–153. బౌలింగ్: సిద్ధార్థ్ 3–0–21–1, కృనాల్ పాండ్యా 1–0–10–0, నవీనుల్ 3.4–0–25–2, మయాంక్ యాదవ్ 4–0–14–3, రవి బిష్ణోయ్ 3–0–33–0, యశ్ ఠాకూర్ 4–0–38–1, స్టొయినిస్ 1–0–9–1. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X కోల్‌కతా వేదిక: విశాఖపట్నం రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్!?
ఐపీఎల్-2024 సీజన్ వేలానికి ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను రూ.15 కోట్లకు ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా మరో ఇప్పుడు మరో స్టార్ ఆటగాడు ఫ్రాంచైజీ మారనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడు ఎవరో కాదు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్. డికాక్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రేడ్ చేసుకోనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. డికాక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్-2023లో దుమ్మురేపాడు. అయితే గత కొన్ని సీజన్ల నుంచి ఎస్ఆర్హెచ్కు సరైన ఓపెనింగ్ జోడి లేకపోవడంతో స్టార్ ఓపెనర్ అయినా డికాక్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోందట. ఇప్పటికే లక్నోతో పాటు డికాక్‌తో కూడా ఎస్ఆర్హెచ్ యాజమాన్యం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాగా ఐపీఎల్-2023 మినీవేలంలో డికాక్‌ను రూ. 6.75 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. ఐపీఎల్-2024 సీజన్‌కు కూడా అతడినికి లక్నో రిటైన్ చేసుకుంది. ఇక ఇప్పటివరకు 96 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన డికాక్.. 2907 పరుగులు చేశాడు. టెస్టు,వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన డికాక్.. కేవలం టీ20ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. కాగా ఐపీఎల్-2024కు సంబంధిచిన వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. చదవండి: IND vs AFG: పాకిస్తాన్ పొమ్మంది.. సల్మాన్ బట్కు అఫ్గానిస్తాన్ బంపరాఫర్!? -
రఫ్ఫాడించిన రాయ్.. దంచికొట్టిన డికాక్
అబుదాబీ టీ10 లీగ్ 2023లో భాగంగా నిన్న (నవంబర్ 29) జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు చెలరేగిపోయారు. టీమ్ అబుదాబీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్రేవ్స్ ఆటగాడు జేసన్ రాయ్ (39 బంతుల్లో 84 నాటౌట్; 6 ఫోర్లు, 7 సిక్సర్లు).. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బుల్స్ ఆటగాడు క్వింటన్ డికాక్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు).. బంగ్లా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూయార్క్ స్ట్రయికర్స్ ఆటగాడు కుశాల్ పెరీరా (20 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. వీరితో పాటు ఆండ్రీ రసెల్ (5 బంతుల్లో 19 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్ (20 బంతుల్లో 34; ఫోర్, 3 సిక్సర్లు), జాన్సన్ చార్లెస్ (13 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోవ్‌మన్ పావెల్ (12 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) లాంటి విండీస్ స్టార్లు ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మ్యాచ్ ఫలితాల విషయానికొస్తే.. డెక్కన్ గ్లాడియేటర్స్‌పై ఢిల్లీ బుల్స్ (డికాక్ జట్టు) 9 వికెట్ల తేడాతో.. టీమ్ అబుదాబీపై చెన్నై బ్రేవ్స్ (జేసన్ రాయ్ జట్టు) 4 పరుగుల తేడాతో.. బంగ్లా టైగర్స్‌పై న్యూయార్క్ స్ట్రయికర్స్ (కుశాల్ పెరీరా జట్టు) 8 వికెట్ల తేడాతో విజయాలు సాధించాయి. -
CWC 2023: వరల్డ్‌కప్ చరిత్రలో ఒకే ఒక్కడు.. క్వింటన్ డికాక్
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలై ఐదోసారి సెమీస్ గండాన్ని దాటలేక ఇంటిబాట పట్టింది. ఈ ఎడిషన్ ప్రారంభం నుంచి అద్బుతమైన ఆటతీరు కనబర్చి వరుస విజయాలు సాధించిన సఫారీలు.. సెమీస్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డారు. లీగ్ దశ మొత్తంలో ఇరదీసిన సౌతాఫ్రికా బ్యాటర్లు నిన్నటి నాకౌట్ మ్యాచ్‌లో చేతులెత్తేశారు. టోర్నీ టాప్ 10 రన్ స్కోరర్ల జాబితాలో ఉన్న డికాక్, డస్సెన్, మార్క్రమ్ ఆసీస్‌తో మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యారు. డికాక్ 3, డస్సెన్ 6, మార్క్రమ్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. ఆసీస్ చేతిలో సౌతాఫ్రికా ఓడినప్పటికీ.. క్వింటన్ డికాక్ మాత్రం ఓ అరుదైన ఘనత సాధించాడు. నిన్నటి మ్యాచ్‌తో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డికాక్ తన కెరీర్ ఆఖరి మ్యాచ్‌తో వరల్డ్‌కప్ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌ల్లో 4 సెంచరీల సాయంతో 594 పరుగులు చేసి విరాట్ కోహ్లి (10 మ్యాచ్‌ల్లో 711 పరుగులు) తర్వాత సెకెండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచిన డికాక్.. ఈ ఎడిషన్‌లో 20 క్యాచ్‌లు కూడా పట్టి ప్రపంచకప్ చరిత్రలో 500 ప్లస్ పరుగులు, 20 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎవరికీ సాధ్యంకాని రికార్డును సాధించాడు. అలాగే ఓ సింగిల్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో గిల్‌క్రిస్ట్ (2003లో 21 క్యాచ్‌లు), టామ్ లాథమ్ (2019లో 21 క్యాచ్‌లు), అలెక్స్ క్యారీ (2019లో 20 క్యాచ్‌లు) తర్వాత అత్యధిక క్యాచ్‌లు (2023లో 20 క్యాచ్‌లు) అందుకున్న వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇదిలా ఉంటే, రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాపై గెలవడంతో ఆస్ట్రేలియా ఎనిమిదో సారి ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరింది. అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్.. న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆసీస్‌ల మధ్య నవంబర్ 19న వరల్డ్‌కప్ ఫైనల్ జరుగనుంది. -
క్వింటన్ డికాక్ అరుదైన ఘనత.. గిల్‌క్రిస్ట్ రికార్డు సమం!
దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఒక మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్, సర్ఫరాజ్ అహ్మద్‌లతో కలిసి సంయుక్తంగా నిలిచాడు. వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో 6 క్యాచ్‌లు పట్టిన డికాక్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇబ్రహీం జద్రాన్, హష్మతుల్లా షాహిదీ, ఇక్రమ్ అలీఖిల్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ మరియు నూర్ అహ్మద్‌ల క్యాచ్‌లను అందుకున్న డికాక్.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు 2003 ప్రపంచ కప్ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా నమీబియాపై ఆరు క్యాచ్‌లను పట్టాడు. అదే విధంగా 2015 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా ఇదే ఫీట్ సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్(91 నాటౌట్) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రోటీస్ బౌలర్లలో పేసర్ గెరాల్డ్ కోయెట్జీ 4 వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహారాజ్, ఎంగిడి తలా వికెట్ సాధించారు. చదవండి: IPL 2024: ఆర్సీబీలోకి రచిన్ రవీంద్ర.. హింట్ ఇచ్చిన యువ సంచలనం! View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: డికాక్, బుమ్రాలను కాదని రచిన్‌కే దక్కింది..!
2023 అక్టోబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును న్యూజిలాండ్ రైజింగ్ స్టార్ రచిన్ రవీంద్ర దక్కించుకున్నాడు. ఈ అవార్డు కోసం క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా), జస్ప్రీత్ బుమ్రా (భారత్) పోటీపడినప్పటికీ చివరికి రచిన్‌నే వరించింది. అక్టోబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను రచిన్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రచిన్ బ్యాట్‌తో పాటు బంతిలోనూ చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీల సాయంతో 565 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అలాగే 7 వికెట్లు కూడా పడగొట్టాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసిన రచిన్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ వరల్డ్‌కప్ రికార్డును బద్దలు కొట్టాడు. వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో 25 ఏళ్ల వయసులోపు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రచిన్ (565).. సచిన్ రికార్డును (523) తుడిచిపెట్టాడు. లంకతో జరిగిన మ్యాచ్‌లో రచిన్ రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. మొత్తానికి ఈ వరల్డ్‌కప్ రచిన్‌కు కలగా మిగిలిపోనుంది. కాగా, శ్రీలంకపై విజయంతో న్యూజిలాండ్ సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఏదో ఊహించని అద్భుతం జరిగితే తప్ప కివీస్ సెమీస్ చేరుకుండా ఉండదు. ఈ నెల 15న ముంబైలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరిగే అవకాశం ఉంది. 16న కోల్‌కతాలో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ ఖరారైపోయింది. -
ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో వరల్డ్‌కప్ హీరోలు
ఐసీసీ ప్రతి నెలా ప్రకటించే ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో వన్డే వరల్డ్‌కప్ 2023 హీరోలు పోటీపడుతున్నారు. అక్టోబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌గా క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా), రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), జస్ప్రీత్ బుమ్రా (భారత్) ప్రకటించబడ్డారు. ఈ ముగ్గురి ఆటగాళ్ల హవా అక్టోబర్ నెలతో పాటు ప్రస్తుత మాసంలోనూ (నవంబర్) కొనసాగుతుంది. ప్రపంచకప్‌లో ఈ ఆటగాళ్లు ఆయా విభాగాల్లో అత్యుత్తమ స్థాయిల్లో ఉన్నారు. అక్టోబర్ 5న మొదలైన వరల్డ్‌కప్ 2023లో డికాక్ ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచ్‌ల్లో 4 సెంచరీల సాయంతో 550 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. రచిన్ రవీంద్ర సైతం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీల సాయంతో 523 పరుగులు చేసి అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. బౌలింగ్‌లో టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. Here are the Men's and Women's 'ICC Player of the Month nominees for October 2023. pic.twitter.com/0tK6mbq1s0 — CricTracker (@Cricketracker) November 7, 2023 బుమ్రా ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి, వరల్డ్‌కప్ అత్యధిక వికెట్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ అక్టోబర్ నెల పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలతో పాటు మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ పేర్లను కూడా ప్రకటించింది. మహిళల విభాగంలో వెస్టిండీస్ హేలీ మాథ్యూస్, బంగ్లాదేశ్ నహీద అక్తర్, న్యూజిలాండ్ అమేలయా కెర్ ఈ అవార్డు కోసం పోటీపడుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న పురుషుల వన్డే ప్రపంచకప్‌లో భారత్, సౌతాఫ్రికా జట్లు ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. మిగిలిన రెండు బెర్త్‌ల కోసం ఆసీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఘోర పరాజయాలను మూటగట్టుకున్న బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు ఎలిమినేషన్‌కు గురయ్యాయి. నెదర్లాండ్స్ అధికారికంగా ఎలిమినేట్ కానప్పటికీ, సెమీస్ అవకాశాలు దాదాపుగా లేనట్లే. -
చరిత్ర సృష్టించిన డికాక్.. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలోనే!
వన్డే ప్రపంచకప్-2023లో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా పుణే వేదికగా న్యూజిలాండ్‌పై డికాక్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 116 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులు సాధించాడు. మొదటిలో కివీస్ బౌలర్లను ఆచితూచి ఆడిన డికాక్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ టోర్నీలో డికాక్ ఇది నాలుగో సెంచరీ కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్‌లలో 545 పరుగులు చేసిన డికాక్.. లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన డికాక్ పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. డికాక్ సాధించిన రికార్డులు ఇవే.. ►ఒక వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా డికాక్(545) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార్ సంగక్కర పేరిట ఉండేది. 2015 వన్డే ప్రపంచకప్‌లో సంగక్కర 541 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌తో సంగక్కర రికార్డును క్వింటన్ బ్రేక్ చేశాడు. ►అదే విధంగా వన్డేప్రపంచకప్లలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన వికెట్ కీపర్‌గా డికాక్ నిలిచాడు. ఇప్పటివరకు వన్డే వరల్డ్‌కప్‌లలో డికాక్ 22 సిక్సర్లు సాధించారు. ఈ ఏడాది ఎడిషన్‌లోనే డికాక్ 18 సిక్సర్లు కొట్టడం గమనార్హం. కాగా అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్(19) పేరిట ఉండేది. చదవండి: CWC 2023: వరల్డ్‌కప్‌లో ఘోర ప్రదర్శన. ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం! క్రికెట్‌కు గుడ్‌బై View this post on Instagram A post shared by ICC (@icc) -
అగ్రపీఠానికి మరింత చేరువైన గిల్.. దుమ్ములేపిన డికాక్, క్లాసెన్! బాబర్ ఇక..
ICC ODI Batting Rankings: టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠానికి మరింత చేరువయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 823 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌గా ఉన్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కంటే కేవలం ఆరు పాయింట్లు వెనుకబడి ఉన్నాడు. డెంగ్యూ జ్వరం కారణంగా కాగా డెంగ్యూ జ్వరం కారణంగా భారత ఓపెనింగ్ బ్యాటర్ వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెరుగైన చికిత్స అనంతరం పూర్తి ఫిట్నెస్ సాధించిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ అహ్మదాబాద్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో తిరిగి జట్టుతో చేరాడు. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో మ్యాచ్‌లో కేవలం 16 పరుగులకే పరిమితమైన శుబ్‌మన్ గిల్.. బంగ్లాదేశ్‌పై అర్ధ శతకం(53) సాధించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పటి వరకు మొత్తంగా మూడు ఇన్నింగ్స్‌లో కలిపి 95 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో వన్డేల్లో బాబర్ ఆజం నంబర్ వన్ ర్యాంకును ఆక్రమించే క్రమంలో మరో ముందడుగు వేశాడు. దుమ్ములేపిన డికాక్, క్లాసెన్ ఇక ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్లు క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్ దుమ్ములేపారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా వన్డే ప్రపంచకప్-2023లో మూడో సెంచరీ నమోదు చేసిన డికాక్ ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకు సాధించాడు. అదే విధంగా.. ఆరంభం నుంచి అద్భుత ఇన్నింగ్స్ ఆడుతున్న క్లాసెన్ బంగ్లాదేశ్‌పై 90 పరుగులు చేసి తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు మెరుగుపరచుకుని నాలుగో ర్యాంకు సొంతం చేసుకున్నాడు. కోహ్లి, రోహిత్ ఇలా ఇక బాబర్ ఆజం(పాకిస్తాన్- 829 పాయింట్లు), శుబ్‌మన్ గిల్(ఇండియా- 823), క్వింటన్ డికాక్(సౌతాఫ్రికా- 769), హెన్రిచ్ క్లాసెన్(సౌతాఫ్రికా- 756)లతో పాటు ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్(747 పాయింట్లు) టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి రెండు స్థానాలు కోల్పోయి వార్నర్ తర్వాతి ర్యాంకులో నిలిచాడు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపరచుకుని ఎనిమిదో ర్యాంకు సాధించాడు. చదవండి: రుత్‌రాజ్ విధ్వంసకర శతకం.. కేవలం 51 బంతుల్లోనే View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: అతడిని రిటైర్ కాకుండా చూడాలని పిటిషన్ వేస్తా: భారత మాజీ బ్యాటర్
సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ మూడు సెంచరీలు బాదాడు. ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకపై శతక్కొట్టిన డికాక్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ 109 పరుగులు సాధించాడు. ఇలా మెగా టోర్నీ మొదట్లో వరుస సెంచరీలతో ఆకట్టుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. అయితే, బంగ్లాదేశ్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో మాత్రం మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు డికాక్. ముంబైలోని వాంఖడే మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అద్భుతమైన షాట్లతో అలరిస్తూ ప్రేక్షకులకు టీ20 మాదిరి వినోదం అందించాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. ఈ క్రమంలో పలు రికార్డులు నమోదు చేసిన డికాక్.. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా శరీరం సహకరించకపోవడం.. ఇకపై లీగ్ మ్యాచ్‌లపై ఎక్కువగా దృష్టి సారించే క్రమంలో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు క్వింటన్ డికాక్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత రిటైర్ అవ్వబోతున్నట్లు.. టోర్నీ ఆరంభానికి ముందే డికాక్ తెలియజేశాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా క్వింటన్ డికాక్ అద్భుత ఇన్నింగ్స్ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడి బ్యాటింగ్ సూపర్. తన అద్భుతమైన నైపుణ్యాలతో అదరగొట్టాడు. నేనైతే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఓ పిటిషన్ సమర్పించాలనుకుంటున్నా. వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత డికాక్ రిటైర్ అవకుండా చూడాలని హామీ ఇమ్మని కోరతా. ఎందుకంటే.. అతడు రిటైర్ అయిపోతే.. 50 ఓవర్ల క్రికెట్లో ఇలాంటి మజాను మనకు ఎవరు అందిస్తారు?’’ అంటూ కామెంటేటర్ మంజ్రేకర్ సౌతాఫ్రికా బ్యాటర్‌ను ఆకాశానికెత్తాడు. ఇందుకు స్పందించిన మరో కామెంటేటర్, సౌతాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ సైతం.. ‘‘అవును.. తను వయసులో ఇంకా చిన్నవాడే. అంతేకాదు.. కెరీర్లో ఇప్పుడు అత్యుత్తమ దశలో ఉన్నాడు. కానీ ప్రపంచ క్రికెట్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో డికాక్‌తో పాటు చాలా మంది ఆటగాళ్లు వన్డే ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా నువ్వు పిటిషన్ వేస్తానంటే నేను కూడా దానిపై తప్పకుండా సంతకం చేస్తా’’ అని సంజయ్ మంజ్రేకర్‌తో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే.. ముంబై మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు బంగ్లాదేశ్‌ను 149 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
డికాక్, క్లాసెన్ విధ్వంసం.. బంగ్లాదేశ్ టార్గెట్ 383 పరుగులు
వన్డే ప్రపంచకప్-2023లో ముంబై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. సాతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుతమైన శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 140 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 174 పరుగులు చేశాడు. అతడితో పాటు హెన్రిస్ క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. క్లాసెన్ కేవలం 49 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. మెహది హసన్, షోర్ఫుల్ ఇస్లాం, షకీబ్ తలా వికెట్ సాధించారు. చదవండి: చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే -
చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే
వన్డే ప్రపంచకప్-2023లో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తన కెరీర్లో చివరి వరల్డ్‌కప్ ఆడుతున్న డికాక్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ముంబై వేదికగా బంగ్లాదేశ్‌పై డికాక్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. బంగ్లాదేశ్ బౌలర్లను డికాక్ ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త ఆచతూచి ఆడిన క్వింటన్.. మిడిల్ ఓవర్లలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 140 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 174 పరుగులు చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో డికాక్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. అదేవిధంగా ఇది వన్డేల్లో అతడికి రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమానార్హం. డికాక్ అరుదైన రికార్డు.. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన డికాక్ ఓ అరుదైన ఘనతను తన పేరిటి లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉండేది. 2007 వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో గిల్‌క్రిస్ట్ 149 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో గిల్‌క్రిస్ట్ రికార్డును డికాక్(174) బ్రేక్ చేశాడు. చదవండి: నిజంగా సిగ్గు చేటు.. రోజూ 8 కేజీల మటన్ తింటున్నట్టు ఉన్నారు: పాకిస్తాన్ లెజెండ్ ఫైర్ -
WC 2023: చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు.. ఆసీస్‌కు ఘోర పరాభవం! వరుసగా రెండో‘సారీ’
ICC Cricket World Cup 2023- Australia vs South Africa, 10th Match: వన్డే వరల్డ్‌కప్-2023లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభం నుంచే షాకుల మీద షాకులిచ్చింది సౌతాఫ్రికా. ప్రొటిస్ బౌలర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. ముఖ్యంగా పేసర్ కగిసో రబడ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 71 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన కంగారూ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ఆరో ఓవర్ ఐదో బంతికి మిచెల్ మార్ష్(7)ను మార్కో జాన్సెన్ అవుట్ చేయడంతో మొదలైంది ఆసీస్ వికెట్ల పతనం. ఆ తర్వాత ఎంగిడి బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్(13), రబడ బౌలింగ్‌లో స్మిత్(19) ఎల్బీడబ్ల్యూ, జోష్ ఇంగ్లిస్‌ను బౌల్డ్ కాగా.. మహరాజ్ బౌలింగ్‌లో మాక్స్వెల్(3) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మళ్లీ రంగంలోకి దిగిన రబడ స్టొయినిస్(5)ను అవుట్ చేయడంతో ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి దశలో మార్నస్ లబుషేన్‌కు తోడుగా టెయిలెండర్ మిచెల్ స్టార్క్(51 బంతుల్లో 27 పరుగులు) పట్టుదలగా క్రీజులో నిలబడిన వేళ మార్కో జాన్సెన్ దెబ్బకొట్టాడు. ఆ వెంటనే 46 పరుగులతో నిలకడగా ఆడుతున్న లబుషేన్‌ను కేశవ్ మహరాజ్ పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. నాలుగు బౌండరీల సాయంతో 22 పరుగులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే, 41వ ఓవర్ మూడో బంతికి తబ్రేజ్ షంసీ బౌలింగ్‌లో కమిన్స్ ఇచ్చిన క్యాచ్‌ను మిల్లర్ ఎలాంటి పొరపాటు చేయకుండా ఒడిసిపట్టాడు. దీంతో షంసీ ఖాతాలో వరల్డ్‌కప్ క్రికెట్లో తొలి వికెట్ చేరింది. అదే ఓవర్లో హాజిల్‌వుడ్‌ను కూడా షంసీ అవుట్ చేయడంతో ఆసీస్ కథ ముగిసిపోయింది. 177 పరుగులకే ఆలౌట్ కావడంతో సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 134 పరుగులు భారీ తేడాతో ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ప్రొటిస్ పేసర్లలో రబడకు మూడు, జాన్సెన్కు రెండు, లుంగి ఎంగిడికి ఒక వికెట్ దక్కగా.. స్పిన్నర్లు కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంసీ చెరో రెండు వికెట్లు తీశారు. డికాక్ సెంచరీతో.. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా గురువార నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. కంగారూ జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఓపెనర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్వింటన్ డికాక్ వన్డే వరల్డ్‌కప్-2023లో వరుసగా రెండో శతకం(109) నమోదు చేయగా.. నాలుగో నంబర్ బ్యాటర్ ఎయిడెన్ మార్కరమ్ 56 పరుగులతో రాణించాడు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారీ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. కాగా ఈ మెగా టోర్నీ తాజా ఎడిషన్‌లో ఆసీస్‌కు ఇది వరుసగా రెండో పరాజయం.తొలుత చెన్నైలో టీమిండియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. -
SA Vs Aus: వరుసగా రెండో సెంచరీ! ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన డికాక్
ICC WC 2023- Australia vs South Africa- Quinton De Kock: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా పలు అరుదైన ఘనతలు సాధించాడు. లక్నో వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్ జట్టుకు క్వింటన్ డికాక్ సెంచరీతో శుభారంభం అందించాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 29.5వ ఓవర్లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో సిక్సర్ బాది వంద పరుగులు చేసుకున్నాడు. వరుసగా రెండో సెంచరీ ప్రపంచకప్-2023లో వరుసగా రెండోసారి సెంచరీ సాధించి.. అంతర్జాతీయ వన్డేల్లో 19వ శతకం నమోదు చేశాడు. ఈ సందర్భంగా.. వరల్డ్‌కప్ హిస్టరీలో అత్యధిక సెంచరీలు సాధించిన దక్షిణాఫ్రికా క్రికెటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్(4) తర్వాత ఈ ఘనత సాధించిన హషీం ఆమ్లా(2), ఫాఫ్ డుప్లెసిస్(2), హర్షల్ గిబ్స్(2)లతో సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. రెండో ప్రొటిస్ బ్యాటర్‌గా అదే విధంగా సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఓపెనర్‌గా చరిత్రకెక్కాడు. ఈ ఎలైట్ లిస్టులో హషీం ఆమ్లా 27 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. 19 సెంచరీలతో డికాక్ అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలో హర్షల్ గిబ్స్(18)ను అధిగమించాడు. గిబ్స్ అరుదైన రికార్డు బ్రేక్ అంతేగాక వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా మీద అత్యధిక వ్యక్తిగత స్కోరు(109) సాధించిన తొలి సౌతాఫ్రికా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో హర్షల్ గిబ్స్(1999లో- 101 పరుగులు) రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో 100 పరుగులతో ఫాఫ్ డుప్లెసిస్(2019) మూడో స్థానంలో ఉన్నాడు. కాగా ఆసీస్ మీద ఓవరాల్‌గా డికాక్‌కు ఇది మూడో శతకం. ఇక సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో 35వ ఓవర్ ఐదో బంతికి ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ డికాక్‌ను బౌల్డ్ చేయడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ఈ మ్యాచ్‌లో ఎయిడెన్ మార్కరమ్ అర్ధ శతకంతో రాణించగా నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు సాధించింది. చదవండి: WC 2011లో నేనే కెప్టెన్ అయి ఉంటే అతడిని తప్పక తీసుకునేవాడిని.. కానీ! View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023 SA VS SL: శ్రీలంకను చిత్తు చేసిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా సెంచరీల మోత మోగించింది. ఈ రోజు (శనివారం) జరిగిన పోరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు శతక్కొట్టారు. క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. A stellar batting performance helps South Africa to a massive win in their #CWC23 clash against Sri Lanka 💪#SAvSL 📝: https://t.co/6P9uKyV5lF pic.twitter.com/LxZPnRHPKN — ICC Cricket World Cup (@cricketworldcup) October 7, 2023 అయితే 428 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రీలంక జట్టు విఫలమైంది. లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. నిస్సంక (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే కుశాల్ పెరీరా (7) కూడా ఔటయ్యాడు. ఇక ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్ మాత్రం తన ఆటతో శ్రీలంక జట్టు పై ఆశలు రేకెత్తించాడు. మొత్తం 8 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అనంతరం కగిసో రబడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ దశలో చరిత్ అసలంక, దాసున్ షనకలు కాసేపు జట్టు విజయం కోసం పోరాటం చేశారు. వీరిద్దరు తమ జోరు చూపించారు. ఆ సమయంలో శ్రీలంక లక్ష్యానికి చేరువయ్యే అవకాశం కనిపించింది. అయితే అసలంక, ఆ తర్వాత షనక ఔటవ్వడంతో 326 పరుగుల వద్దే శ్రీలంక కథ ముగిసింది. మొత్తానికి 102 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. స్కోర్లు: సౌతాఫ్రికా- 428, శ్రీలంక- 326 -
CWC 2023 SA VS SL: సెంచరీలతో డబుల్ సెంచరీ కొట్టిన డికాక్, డస్సెన్
సౌతాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 7) జరుగుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లో సెంచరీల మోత మోగింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు శతక్కొట్టారు. క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. కాగా, ఈ మ్యాచ్‌లు అత్యధిక టీమ్ స్కోర్ నమోదు కావడంతో పాటు పలు ఇతర రికార్డులు కూడా నమోదయ్యాయి. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ (మార్క్రమ్- 49 బంతుల్లో), వరల్డ్‌కప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు శతక్కొట్టడం.. ఇలా సౌతాఫ్రికా, ఆ జట్టు ఆటగాళ్లు పలు రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. ఈ రికార్డులతో పాటు డికాక్, డస్సెన్‌లు మూడు వేర్వేరు ఘనతలను సాధించి, రికార్డుపుటల్లోకెక్కారు. అవేంటంటే.. ఈ మ్యాచ్‌లో డికాక్ చేసిన సెంచరీ వన్డేల్లో వికెట్కీపర్లు చేసిన 200వ సెంచరీగా రికార్డైంది. ఈ సెంచరీ వన్డేల్లో సౌతాఫ్రికా తరఫున కూడా 200వ సెంచరీ కావడం విశేషం. ఇదే మ్యాచ్‌లో డస్సెన్ చేసిన సెంచరీ వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో 200వ శతకంగా నమోదైంది. ఇలా డికాక్, డస్సెన్ చేసిన సెంచరీలతో డబుల్ సెంచరీని మార్కును తాకారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా నిర్ధేశించిన కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. 21 ఓవర్లలో 154 పరుగులు చేసి సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. షకన (3), అసలంక (28) క్రీజ్‌లో ఉన్నారు. లంక ఇన్నింగ్స్‌లో నిస్సంక (0), కుశాల్ పెరీరా (7), ధనంజయ డిసిల్వ (11), సమరవిక్రమ (23) విఫలం కాగా.. కుశాల్ మెండిస్ క్రీజ్‌లో ఉన్నంతసేపు విధ్వంసం (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) సృష్టించాడు. -
లంక బౌలర్ల తుక్కు రేగ్గొట్టిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. 3 శతకాలు.. వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోర్
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 7) జరుగుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడినప్పటికీ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు రికార్డు స్థాయిలో 400కి పైగా పరుగులు స్కోర్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు సఫారీ బ్యాటర్లు సెంచరీలతో కదంతొక్కారు. తొలుత క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆతర్వాత రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో ఎయిడెన్ మార్క్రమ్ (106) సెంచరీలతో విరుచుకుపడ్డారు. ఈ ముగ్గురు శతక వీరుల్లో మార్క్రమ్ సృష్టించిన విధ్వంసం ఓ రేంజ్లో ఉండింది. మార్క్రమ్ కేవలం 49 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. అతను తన సెంచరీ మార్కును సిక్సర్‌తో అందుకున్నాడు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (21 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (20 బంతుల్లో 32; ఫోర్, 3 సిక్సర్లు), మార్కో జన్సెన్ (7 బంతుల్లో 12 నాటౌట్; సిక్స్) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. గత రికార్డు ఆసీస్ పేరిట ఉండింది. 2015 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా.. బంగ్లాదేశ్‌పై 417/6 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు వరల్డ్‌కప్‌లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్. మొత్తంగా వరల్డ్‌కప్‌లో 400కు పైగా స్కోర్ ఐదుసార్లు నమోదు కాగా.. అందులో మూడుసార్లు సౌతాఫ్రికానే ఈ మార్కును దాటింది. వరల్డ్‌కప్‌లో భారత్ ఓసారి 400 ప్లస్ స్కోర్ నమోదు చేసింది. 2007 వరల్డ్‌కప్‌లో బెర్ముడాపై భారత్ 413/5 స్కోర్ చేసింది. కాగా, సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బవుమా (8) ఒక్కడే విఫలమయ్యాడు. సఫారీ బ్యాటర్ల విధ్వంసం ధాటికి లంక బౌలర్లు విలవిలలాడిపోయారు. దాదాపుగా అందరూ దాదాపు 9 రన్‌రేట్‌తో పరుగులు సమర్పించకున్నారు. రజిత 10 ఓవర్లలో వికెట్ తీసి 90 పరుగులు, దిల్షన్ మధుషంక 10 ఓవర్లలో 2 వికెట్లు తీసి 89 పరుగులు, దసున్ షనక 6 ఓవర్లలో 36 పరుగులు, ధనంజయ డిసిల్వ 4 ఓవర్లలో 39, మతీష పతిరణ 10 ఓవర్లలో ఒక్క వికెట్ తీసి అత్యధికంగా 95 పరుగులు, దునిత్ వెల్లలగే 10 ఓవర్లలో వికెట్ పడగొట్టి 81 పరుగులు సమర్పించుకున్నారు. -
CWC 2023 SA VS SL: సెంచరీలతో విరుచుకుపడిన సౌతాఫ్రికా ప్లేయర్లు
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 2023లో సెంచరీల మోత మోగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటికే నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డెవాన్ కాన్వే (152 నాటౌట్), రచిన్ రవీంద్ర (123 నాటౌట్) శతక్కొట్టగా.. ఢిల్లీ వేదికగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 7) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్ డికాక్ (100), రస్సీ వాన్ డర్ డస్సెన్ సెంచరీలతో కదంతొక్కారు. 84 బంతులు ఎదుర్కొన్న డికాక్ 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ చేసి, ఆ వెంటనే పతిరణ బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 103బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన డస్సెన్ క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. 34.4 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 244/2గా ఉంది. డస్సెస్, మార్క్రమ్ (24 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి శ్రీలంక సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రెండో ఓవర్లోనే సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను (8) దిల్షన్ మధషంక ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు ఆడుతున్న తీరు చూస్తుంటే 400 స్కోర్ నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా, ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా ఆటగాడు మెహిది హసన్ మీరజ్ ఆల్‌రౌండ్ షోతో (9-3-25-3, 57) ఆదరగొట్టి బంగ్లాదేశ్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. ఆఫ్ఘనిస్తాన్‌ను 156 పరుగులకే (37.2 ఓవర్లలో) మట్టికరిపించగా.. స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. కలిస్‌ను అధిగమించిన డికాక్.. ఈ వరల్డ్‌కప్ తర్వాత వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతానని ఇదివరకే ప్రకటించిన డికాక్.. తన ఆఖరి ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో కదంతొక్కాడు. ఈ సెంచరీతో డికాక్ సౌతాఫ్రికా దిగ్గజం జాక్ కలిస్‌ను (17 వన్డే సెంచరీలు) అధిగమించాడు. సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డికాక్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో హషీమ్ ఆమ్లా (27) టాప్‌లో ఉండగా.. ఏబీ డివిలియర్స్ (25), హెర్షల్ గిబ్స్ (21) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. -
కోహ్లికి నో ఛాన్స్! మరో టీమిండియా స్టార్‌కు చోటు.. ఆ ఐదుగురు అదుర్స్: బట్లర్
ICC ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో 2019లో మొట్టమొదటిసారిగా జగజ్జేతగా నిలిచిన ఇంగ్లిష్ జట్టు పగ్గాలు ఇప్పుడు స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ చేతిలో ఉన్న విషయం తెలిసిందే. అన్ని విభాగాల్లో పటిష్టంగా బట్లర్ బృందం పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆటగాడిగా రాణిస్తూ.. కెప్టెన్‌గానూ అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాడు ఈ వికెట్ కీపర్. గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలిచిన రికార్డు బట్లర్ సొంతం. కోహ్లికి నో ఛాన్స్ ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లో వన్డే ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్ పటిష్టంగా ఉండటంతో మోర్గాన్ వారసత్వాన్ని బట్లర్ నిలబెట్టే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మెగా టోర్నీ ఆరంభానికి ముందు ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ తన డ్రీమ్ ఎలెవన్ వన్డే టీమ్‌లో మొదటి ఛాయిస్‌గా ఐదుగురు ప్లేయర్లను ఎంపిక చేసుకున్నాడు. అనూహ్యంగా ఇందులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మాత్రం బట్లర్ చోటివ్వలేదు. అయితే, మరో భారత స్టార్‌ను మాత్రం తన జట్టుకు ఎంపిక చేశాడు. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరంటే? 1.ఆదిల్ రషీద్ ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఇప్పటి వరకు అంతర్జాతీయ వన్డేల్లో 5.67 ఎకానమీతో 184 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్‌కప్ టోర్నీలో 11 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. గత 10 వన్డేల్లో రషీద్ ఏకంగా 22 వికెట్లు తీయడం విశేషం. ఈ నేపథ్యంలో బట్లర్ తన మొదటి ఎంపికగా ఆదిల్ పేరు చెప్పాడు. 2.క్వింటన్ డికాక్ సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ వన్డేల్లో 95.75 స్ట్రైక్‌రేటుతో 6176 పరుగులు సాధించాడు. ప్రపంచకప్ ఈవెంట్లో 450 రన్స్ తీశాడు. అదే విధంగా అతడి ఖాతాలో 190 క్యాచ్‌లు, 16 స్టంపింగ్‌లు ఉన్నాయి. కాగా తాజా వరల్డ్‌కప్ తర్వాత తాను వన్డేలకు గుడ్‌బై చెప్పనున్నట్లు డికాక్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. 3.రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో ఇప్పటి వరకు 10112 పరుగులు సాధించాడు. వరల్డ్‌కప్ టోర్నీలో 978 పరుగులు తీశాడు. 2011లో ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్.. ఈసారి సొంతగడ్డపై ఏకంగా కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనుండటం విశేషం. 4.గ్లెన్ మాక్స్వెల్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఖాతాలో 3495 వన్డే పరుగులు, 64 వికెట్లు ఉన్నాయి. బ్యాట్, బాల్ రెండింటితోనూ రాణించగల సత్తా ఉన్న ఈ స్పిన్ ఆల్‌రౌండర్ ఆసీస్‌కు ప్రధాన బలం కానున్నాడు. భారత్‌లోని స్లో పిచ్‌లపై ఈసారి ఆఫ్ స్పిన్నర్ మాక్సీ ప్రభావం చూపే అవకాశం ఉంది. 5. అన్రిచ్ నోర్జే సౌతాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జే వన్డేల్లో ఇప్పటి వరకు 36 వికెట్లు తీశాడు. 29 ఏళ్ల ఈ ఫాస్ట్‌బౌలర్ గాయం కారణంగా వన్డే వరల్డ్‌కప్-2023టోర్నీకి దూరమయ్యాడు. 2019లోనూ చేతినొప్పి కారణంగా ఐసీసీ ఈవెంట్ ఆడే అవకాశం కోల్పోయాడు. చదవండి: WC 2023: మునుపటిలా లేదు.. కానీ ఆ జట్టు సెమీస్ చేరితే ఆపడం కష్టం! -
నా శరీరం 40 ఏళ్లు అంటోంది.. ఐడీ 31 చూపిస్తోంది.. కానీ: డికాక్ భావోద్వేగం
SA Vs Aus 5th ODI- Quinton de Kock gets emotional: సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. సొంతగడ్డపై ఆఖరి వన్డే ఆడుతున్న ఈ లెఫ్టాండర్ శరీరం సహకరించని కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత తాను అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలుకనున్నట్లు డికాక్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. డికాక్ కంట నీటిచెమ్మ ఆస్ట్రేలియాతో సిరీస్ స్వదేశంలో ఆఖరిదని పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఆసీస్‌తో ఐదో వన్డే ఆరంభానికి ముందు డికాక్ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో అతడి కళ్లు చెమర్చిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 30 ఏళ్లకే ఎందుకిలా? కాగా స్టార్ బ్యాటర్‌గా పేరొందిన డికాక్ ఇప్పటికే టెస్టులకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకొంటున్నాడు. 30 ఏళ్ల వయసులోనే డికాక్ ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులను నిరాశ పరిచింది. సిగ్గుపడాల్సిందేమీ లేదు ఈ నేపథ్యంలో క్వింటన్ డికాక్ ఈసీఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘నా టెస్టు కెరీర్ ముగిసిన సమయంలో ఇలాంటి భావన కలిగింది. మళ్లీ ఇప్పుడు కూడా! టెస్టుల్లో ఆడాలని శక్తిమేర ప్రయత్నించాను. కానీ నా వల్ల కాలేదు. 50 టెస్టులు ఆడిన తర్వాత రిటైర్మెంట్ అవడం సరైందేనా అని నా సన్నిహితులను అడిగాను. ఇతర ఫార్మాట్లపై దృష్టి పెట్టడం కోసం ఇలా చేయడానికి ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదని చెప్పారు. శరీరం 40 ఏళ్లు అంటోది.. 20 ఏళ్ల వాడిలా నటిస్తున్నా గత 10-11 ఏళ్లలో ఎన్నో మధుర జ్ఞాపకాలు మూటగట్టుకున్నాను. నా శరీరమేమో నాకు 40 ఏళ్లని చెబుతోంది.. కానీ ఐడీ మాత్రం నాకింకా 31 ఏళ్లే అని చూపిస్తోంది.. మానసికంగా నేను 20 ఏళ్లవాడిలా నటించేందుకు ఇప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. అబుదాబి టూర్ మొదలు ఇండియాలో టెస్టులు.. ముఖ్యంగా శ్రీలంక పర్యటనలో అనుభవాల గురించి డికాక్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. కాగా టీ20 లీగ్‌లలో ఆడటం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని.. అందుకే తాను కూడా పొట్టి ఫార్మాట్‌పైనే దృష్టి సారించాలనుకున్నానని డికాక్ పేర్కొన్నాడు. అవును.. ఎక్కవ డబ్బులు వస్తాయి.. కానీ జాతీయ జట్టును విజయపథంలో నిలిపే క్రమంలో మాత్రం ఎప్పుడూ తాను వెనకడుగు వేయలేదని ఈ లెఫ్టాండర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఒకవేళ కేవలం డబ్బు గురించే ఆలోచించి ఉంటే ఐదేళ్ల క్రితమే రిటైర్ అయ్యేవాడినని పేర్కొన్నాడు. కాగా ఆసీస్‌తో ఐదో వన్డేలో క్వింటన్ డికాక్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. సొంతగడ్డపై ఆఖరి వన్డేలో 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా అరంగేట్రం 2012లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా డికాక్ సౌతాఫ్రికా తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. 2014లో టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. తన అంతర్జాతీయ కెరీర్లో క్వింటన్ డికాక్.. టెస్టుల్లో 3300, వన్డేల్లో 6176, టీ20లలో 2907 పరుగులు సాధించాడు. చదవండి: WC 2023: ఫిట్‌గా ఉన్నా శ్రేయస్ అయ్యర్‌కు నో ఛాన్స్! ఇక మర్చిపోవాల్సిందేనా? -
మార్క్రమ్ విధ్వంసకర శతకం.. సౌతాఫ్రికా భారీ స్కోర్
5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (సెప్టెంబర్12) జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ ఆకాశమే హద్దుగా విజృంభించాడు. కేవలం 74 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకంతో (102 నాటౌట్) విరుచుకుపడ్డాడు. మార్క్రమ్కు జతగా క్వింటన్ డికాక్ (77 బంతుల్లో 82; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ టెంబా బవుమా (62 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించగా.. రీజా హెండ్రిక్స్ (39), మార్కో జన్సెన్ (32) పర్వాలేదనిపించారు. ఈ నలుగురు సత్తా చాటడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. సఫారీ ఇన్నింగ్స్‌లో హెన్రిచ్ క్లాసెన్ (0), డేవిడ్ మిల్లర్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ 2 వికెట్లు పడగొట్టగా.. మార్కస్ స్టోయినిస్, నాథన్ ఇల్లిస్, తన్వీర్ సంగా తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, 5 మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఆసీస్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. దీనికి ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సైతం ఆసీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ప్రస్తుతానికి సౌతాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా అజేయ జట్టుగా కొనసాగుతుంది. -
వరల్డ్‌కప్‌కు జట్టు ప్రకటన.. ఇంతలోనే షాకింగ్ న్యూస్
వన్డే వరల్డ్‌కప్ కోసం జట్టును ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే క్రికెట్ సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్ వరల్డ్ కప్ తర్వాత వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా (CSA).. జట్టు ప్రకటన సందర్భంగా ధృవీకరించింది. 2013 వన్డే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన డికాక్.. సౌతాఫ్రికా తరఫున 140 మ్యాచ్‌లు ఆడి 44.85 సగటున 96.08 స్ట్రయిక్‌రేట్‌తో 5966 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2016లో సెంచూరియన్ వేదికగా ఆస్ట్రేలియాపై చేసిన 178 పరుగులు అతని అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. వికెట్‌కీపర్‌గా డికాక్ 183 క్యాచ్‌లు, 14 స్టంపింగ్‌లు చేశాడు. 30 ఏళ్ల డికాక్ 8 వన్డేల్లో సౌతాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇందులో 3 పరాజయాలు, 4 విజయాలు సాధించాడు. డికాక్.. సౌతాఫ్రికా తరఫున గత రెండు వన్డే వరల్డ్‌కప్‌ల్లో పాల్గొన్నాడు. 17 మ్యాచ్‌ల్లో 30 సగటున 450 పరుగులు సాధించాడు. డికాక్ వన్డే రిటైర్మెంట్ అంశంపై సౌతాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ ఈనాక్ ఎన్క్వే స్పందిస్తూ.. సౌతాఫ్రికా టీమ్‌ను డికాక్ ఎనలేని సేవలు చేశాడని కొనియాడాడు. డికాక్ తన అటాకింగ్ బ్యాటింగ్ స్టయిల్‌తో సౌతాఫ్రికన్ క్రికెట్లో బెంచ్ మార్క్ సెట్ చేశాడని ప్రశంసించాడు. కాగా, డికాక్ ఇదివరకే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే క్రికెట్ నుంచి వైదొలిగాక అతను టీ20ల్లో కొనసాగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా తమ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 5) ప్రకటించింది. ఈ జట్టులో డికాక్ సహా మొత్తం 15 మంది సభ్యులకు చోటు దక్కింది. టెంబా బవుమా ఈ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్ లాంటి యువ సంచలనాలకు ఈ జట్టులో చోటు దక్కలేదు. అనుభవజ్ఞులైన వారికే సౌతాఫ్రికన్ సెలెక్టర్లు పెద్ద పీట వేశారు. వన్డే వరల్డ్‌కప్‌కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, రీజా హెండ్రిక్స్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి, సిసండ మగాలా, గెరాల్డ్ కొయెట్జీ, మార్కో జన్సెన్, తబ్రేజ్ షంషి, కేశవ్ మహారాజ్ -
డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఫైనల్లో సీటెల్ ఓర్కాస్
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023) తొలి ఎడిషన్‌లో భాగంగా సీటెల్ ఓర్కాస్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్‌లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) టెక్సస్ సూపర్‌కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో సీటెల్ ఓర్కాస్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సీటెల్ ఆర్కాస్ ఓపెనర్ క్వింటన్ డికాక్(50 బంతుల్లో 88 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడంతో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 127 పరుగుల లక్ష్యాన్ని సులువుగా చేధించింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సస్ సూపర్ కింగ్స్ సీటెల్ ఆర్కాస్ బౌలర్ల దాటికి పెద్దగా పరుగులు చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. సూపర్‌కింగ్స్ బ్యాటింగ్‌లో డేనియల్ సామ్స్ 26 నాటౌట్ టాప్ స్కోరర్ కాగా.. కోడి చెట్టి, డెవాన్ కాన్వేలు తలా 24 పరుగులు చేశారు. సీటెల్ బౌలర్లలో ఆండ్రూ టై మూడు వికెట్లు తీయగా.. ఇమాద్ వసీమ్ రెండు, గానన్, హర్మీత్ సింగ్ చెరొక వికెట్ తీశారు. అనంతరం 127 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీటెల్ ఓర్కాస్ 15 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. నుమాన్ అన్వర్ రెండు పరుగులకే వెనుదిరిగినప్పటికి స్నేహన్ జయసూరియా(34 బంతుల్లో 31 నాటౌట్)తో కలిసి డికాక్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఎలిమినేటర్‌లో వాషింగ్టన్‌ను చిత్తు చేసిన ముంబై న్యూయార్క్ కాగా ముంబై న్యూయార్క్, వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై న్యూయార్క్ 16 పరుగులతో విజయం సాధించి చాలెంజర్‌లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసిది. అనంతరం బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. శనివారం తెల్లవారుజామున చాలెంజర్ మ్యాచ్‌లో ముంబై న్యూయార్క్.. టెక్సస్ సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. చాలెంజర్‌లో నెగ్గిన జట్టు ఆదివారం జరగబోయే ఫైనల్లో సీటెల్ ఓర్కాస్ జట్టుతో టైటిల్ పోరులో తలపడనుంది. A TRUE QDK masterclass! @MLCSeattleOrcas clinch their spot in the inaugural #MajorLeagueCricket Championship Final! 💚 🐳 🏏 pic.twitter.com/3v71g4bn52 — Major League Cricket (@MLCricket) July 28, 2023 QDK GOES BIG WITH TWO SIXES! Quinton De Kock sends TWO SIXES over the LEG 🦵side boundaries to RAISE🖐️ his FIFTY and MORE! 7⃣9⃣/1⃣ (10.3) pic.twitter.com/hEjU1GIweU — Major League Cricket (@MLCricket) July 28, 2023 చదవండి: బ్యాటింగ్‌కు రాకపోయినా అరుదైన రికార్డుతో మెరిసిన కోహ్లి AB De Villiers: 'రొనాల్డో, ఫెదరర్‌లానే కోహ్లి కూడా చాలా గొప్పోడు' -
నిప్పులు చెరిగిన పార్నెల్.. కుప్పకూలిన సూపర్ కింగ్స్
అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ ఆరంభ ఎడిషన్‌లో సీయాటిల్ ఆర్కాస్ ఫ్రాంచైజీ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆ జట్టు సీజన్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో ఇవాళ (జులై 22) జరిగిన మ్యాచ్‌లో ఆర్కాస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టు కెప్టెన్ వేన్ పార్నెల్ నిప్పులు చెరగడంతో (5/20) తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 127 పరుగులకే కుప్పకూలింది. పార్నెల్.. సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించగా, ఆండ్రూ టై (2/15), ఇమాద్ వసీం (1/25), గానన్ (1/30) మిగతా పనిని పూర్తి చేశారు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో డ్వేన్ బ్రేవో (39) టాప్ స్కోరర్‌గా నిలువగా..డేనియల్ సామ్స్ (26), కోడీ చెట్టి (22), డుప్లెసిస్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటై డెవాన్ కాన్వే (0) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (8), మిచెల్ సాంట్నర్ (2) దారుణంగా విఫలమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్కాస్.. 16 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (53) అర్ధసెంచరీతో రాణించగా.. హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆర్కాస్ కోల్పోయిన రెండు వికెట్లలో ఒకటి సాంట్నర్, మరొకటి మొహమ్మద్ మొహిసిన్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో ఆర్కాస్ టేబుల్ టాపర్‌గా (3 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) నిలువగా.. 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించిన సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వాషింగ్టన్ ఫ్రీడం (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), ముంబై ఇండియన్స్ న్యూయార్క్ (3 మ్యాచ్‌ల్లో ఓ విజయం), లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్ (4 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలు) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో ఉన్నాయి. -
అదరగొట్టినా.. పాపం ఎండ వేడిమికి తట్టుకోలేకపోయాడు
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ ఐపీఎల్ 16వ సీజన్లో తొలి మ్యాచ్ ఆడాడు. ఆదివారం గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 31 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న డికాక్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కాగా ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న డికాక్ ఆ తర్వాత జట్టుతో కలిసినప్పటికి విదేశీ కోటాలో కైల్ మేయర్స్, స్టోయినిస్, నికోలస్ పూరన్, మార్క్‌వుడ్‌లు ఉండడంతో డికాక్ దాదాపు 10 మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అందరూ మంచి ప్రదర్శన కనబరుస్తుండడంతో ఎవరిని తీయాలో కేఎల్ రాహుల్‌కు అర్థం కాలేదు. అయితే ఆర్సీబీతో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కెప్టెన్ కేఎల్ రాహుల్ తాజాగా టోర్నీ మొత్తానికి దూరం కావడంతో డికాక్ తుది జట్టులోకి వచ్చాడు. గతేడాది ఫామ్‌ను కంటిన్యూ చేసిన డికాక్.. వచ్చీ రావడంతోనే అర్థసెంచరీతో మెరిశాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు ఎండవేడిమి ఎక్కువగా ఉంది. దీనికి తోడు మ్యాచ్ మధ్యాహ్నం జరగడంతో స్టేడియంలో వడగాలులు వీచాయి. ఎండ వేడిమికి భరించలేని డికాక్ డీ హైడ్రేట్ అయినట్లు కనిపించాడు. అందుకే ఫిఫ్టీ మార్క్ అందుకున్నప్పటికి.. సీజన్లో తొలి అర్థసెంచరీ అయినప్పటికి ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోలేకపోయాడు. సింపుల్‌గా బ్యాట్ పైకెత్తిన డికాక్ నీరసంగా స్ట్రైక్ ఎండ్‌వైపు నడవడం కనిపించింది. అంతకముందు బ్రేక్ సమయంలోనూ డికాక్ ప్లూయిడ్స్ తీసుకోవడం కనిపించింది. దీన్నిబట్టి డికాక్ చాలా అలిసిపోయినట్లు అనిపించింది. ఓవరాల్‌గా 41 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 71 పరుగులు చేసి ఔటయ్యాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 𝗕𝗮𝗰𝗸 𝘄𝗶𝘁𝗵 𝗮 𝗯𝗮𝗻𝗴 👊💥 Quinton de Kock marks his return to #TATAIPL action with a blistering 50 #GTvLSG #IPLonJioCinema #IPL2023 | @QuinnyDeKock69 pic.twitter.com/V1YuVeBOoX — JioCinema (@JioCinema) May 7, 2023 చదవండి: తీసేస్తారన్న సమయంలో ఆడతాడు.. అదే ప్రత్యేకత! -
ఏమా విధ్వంసం.. ఇలా ఆడితే డికాక్‌కు కష్టమే!
ఐపీఎల్ 16వ సీజన్లో కైల్ మేయర్స్ తన సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌తోనే ఐపీఎల్లో డెబ్యూ ఇచ్చిన మేయర్స్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్నాడు. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కైల్ మేయర్స్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. పంజాబ్ బౌలర్లను ఉతికారేసిన మేయర్స్ ఏడు ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. 44 పరుగుల వద్ద సిక్సర్ బాదిన మేయర్స్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే 24 బంతుల్లోఈ సీజన్లో మేయర్స్‌కు ఇది నాలుగో అర్థసెంచరీ కాగా.. మొత్తంగా 8 మ్యాచ్‌లాడిన మేయర్స్ 297 పరుగులు చేశాడు. అయితే కైల్ మేయర్స్ తన సూపర్ ఫామ్ కనబరుస్తుండడంతో క్వింటన్ డికాక్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. మేయర్స్ తప్పించే సాహసం కేఎల్ రాహుల్ చేయడం లేదు. ఒకవేళ కైల్ మేయర్స్ విధ్వంసం ఇలాగే కొనసాగితే మాత్రం డికాక్ ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవచ్చు. It's Diwali in Mohali, courtesy Kyle Mayers 🔥🎇🎆#IPLonJioCinema #TATAIPL #PBKSvLSG pic.twitter.com/1MLi05NlBj — JioCinema (@JioCinema) April 28, 2023 చదవండి: పంజాబ్, లక్నో మ్యాచ్‌కు పొంచిఉన్న ముప్పు.. ఏ క్షణమైనా! -
'డికాక్‌ను మిస్ అవుతున్నా.. ఏం చేయలేని పరిస్థితి!'
లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు క్వింటన్ డికాక్‌ను తాను చాలా మిస్సవుతున్నట్లు జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో లక్నో తలపడుతుంది. టాస్ సమయంలో కేఎల్ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని సంతరించుకుంది. గతేడాది ఐపీఎల్లో క్వింటన్ డికాక్ లక్నో సూపర్‌జెయింట్స్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగి మంచి ప్రదర్శన కనబరిచాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు నిర్మించిన డికాక్ 148.97 స్ట్రైక్‌రేట్‌తో 508 పరుగులు చేశాడు. గతేడాది లక్నో ప్లేఆఫ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో డికాక్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. దానికి ఒక కారణం ఉంది. జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లు ఉండాలనే నిబంధన ఒకటి అయితే.. మరొకటి డికాక్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కైల్ మేయర్స్ అంచనాలకు మించి రాణిస్తుండడమే. వన్డే మ్యాచ్‌ల కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు డికాక్ అందుబాటులో లేడు. దీంతో అతని స్థానంలో మేయర్స్ ఓపెనర్‌గా వచ్చి ఆకట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున కైల్ మేయర్స్ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌లు కలిపి 168 స్ట్రైక్‌రేట్‌తో 219 పరుగులు చేశాడు. అతని ఖాతాలో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓపెనింగ్ స్లాట్‌లో కాదని మిగతా స్థానాల్లో ఆడిద్దామంటే నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్‌లు ఉండనే ఉన్నారు. ఇక బౌలర్ల కోటాలో మార్క్‌వుడ్ లేదా రొమారియో షెపర్డ్‌లకు చోటు దక్కుతుంది. దీంతో 6.75 కోట్లకు రిటైన్ చేసుకున్న డికాక్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోంది. ఓపెనర్‌గా రావాల్సినోడు డ్రింక్స్ మోస్తూ కనిపించడం ఆసక్తి కలిగించింది. ఇదే విషయమై కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. ''డికాక్‌ను చాలా మిస్సవుతున్నా. కానీ ఏం చేయలేని పరిస్థితి. గతేడాది ఐపీఎల్ సీజన్లో నాతో కలిసి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు అందించి జట్టును ప్లేఆఫ్ వరకు తీసుకెళ్లాడు. కానీ ఈసారి అతను వచ్చేసరికే జట్టులో ఉన్న నలుగురు విదేశీ ప్లేయర్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఓపెనర్‌గా కైల్ మేయర్స్ అద్బుత ప్రదర్శన చేస్తుండడంతో అతన్ని పక్కనబెట్టలేని పరిస్థితి. డికాక్ అవకాశం కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిందే తప్పదు.'' అంటూ చెప్పుకొచ్చాడు. -
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్.. సన్‌రైజర్స్‌లో కీలక మార్పులు
SRH VS LSG: ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 7) లక్నో సూపర్ జెయింట్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అటల్ బిహారి స్టేడియంలో రాత్రి 7: 30 గంటలకు ప్రారంభంకాబోయే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు భారీ మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత ఎల్ఎస్జే విషయానికొస్తే.. ఈ జట్టులో రెండు మార్పులకు ఆస్కారం ఉంది. మార్కస్ స్టొయినిస్ స్థానంలో సఫారీ వికెట్‌కీపర్ క్వింటన్ డికాక్‌కు తుది జట్టులో చోటు దొరకవచ్చు. జయదేవ్ ఉనద్కత్‌ను ఫైనల్ ఎలెవెన్‌లో ఆడించవచ్చు. పేసర్ యశ్ ఠాకూర్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ విషయానికొస్తే.. రెగ్యులర్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఈ మ్యాచ్‌లో తప్పక బరిలో ఉంటాడు. తొలి మ్యాచ్‌లో కెప్టెన్సీ చేసిన భువీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. వికెట్‌కీపర్ కోటాలో గ్లెన్ ఫిలిప్స్‌కు బదులు హెన్రిచ్ క్లాసెన్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండవచ్చు. తుది జట్లు (అంచనా).. సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఫజల్హక్ ఫారూఖీ, మయాంక్ మార్కండే (ఇంపాక్ట్ ప్లేయర్) లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, కృష్ణప్ప గౌతమ్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, జయదేవ్ ఉనద్కత్, ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్ (ఇంపాక్ట్ ప్లేయర్) -
ఆల్‌టైమ్ పర్ఫెక్ట్ టీ20 మ్యాచ్.. డజన్‌కు పైగా రికార్డులు బద్దలు
సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న (మార్చి 26) జరిగిన రసవత్తర మ్యాచ్ పొట్టి ఫార్మాట్లో పర్ఫెక్ట్ మ్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. హోరీహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు పోటాపోటీగా పరుగులు సాధించడంతో పాటు అదే స్థాయిలో రికార్డులు కూడా కొల్లగొట్టారు. ఇరు జట్ల ధాటికి నిన్నటి మ్యాచ్‌లో డజన్‌కు పైగా రికార్డులు బద్దలయ్యాయి. ఆ రికార్డులేవంటే.. అంతర్జాతీయ టీ20ల్లో హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ ఛేజ్ (సౌతాఫ్రికా- 259 టార్గెట్) అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ అత్యధిక టీమ్ స్కోర్- 258/5 అంతర్జాతీయ టీ20ల్లో సౌతాఫ్రికా అత్యధిక టీమ్ స్కోర్- 259/4 అంతర్జాతీయ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు- 517 అంతర్జాతీయ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు- 81 అంతర్జాతీయ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు- 35 అంతర్జాతీయ టీ20ల్లో బౌండరీల ద్వారా ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు- 394 వెస్టిండీస్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 హండ్రెడ్- జాన్సన్ చార్లెస్ (39 బంతుల్లో) సౌతాఫ్రికా తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టి- క్వింటన్ డికాక్ (15 బంతుల్లో) పవర్ ప్లే (6 ఓవర్లు)లో అత్యధిక టీమ్ టోటల్- 102/0 (సౌతాఫ్రికా) అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా 200 పరుగులు పూర్తి చేసిన జట్టు (సౌతాఫ్రికా-13.5 ఓవర్లలో) మొదటి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టు (సౌతాఫ్రికా-149) -
చరిత్ర సృష్టించిన డికాక్.. టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ!
అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా డికాక్ రికార్డు సృష్టించాడు. ఆదివారం సెంచూరియన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో.. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న డికాక్ ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఓవరాల్‌గా ప్రపంచక్రికెట్లో ఈ ఘనత సాధించిన జాబితాలో డికాక్ ఐదో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. 2007 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ కేవలల 12 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. ఇక రెండో టీ20లో డికాక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 44 బంతులు ఎదుర్కొన్న డికాక్ 9 పోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో విండీస్‌పై దక్షిణాఫ్రికా రికార్డు విజయం సాధించింది. 259 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి దక్షిణాఫ్రికా ప్రపంచరికార్డు సృష్టించింది. చదవండి: SA vs WI: టీ20 మ్యాచ్‌లో 517 పరుగులు.. దెబ్బకు ప్రపంచ రికార్డు బద్దలు! ఇదే తొలిసారి That was special 🔥#SAvWI #BePartOfIt pic.twitter.com/rruu4aYa0h — Proteas Men (@ProteasMenCSA) March 26, 2023 -
టీ20 మ్యాచ్‌లో 517 పరుగులు.. దెబ్బకు ప్రపంచ రికార్డు బద్దలు
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో పరుగుల వరద పారింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సూపర్‌స్పోర్ట్ పార్క్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా 517 పరుగులు సాధించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 259 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి దక్షిణాఫ్రికా ప్రపంచరికార్డు సృష్టించింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక టార్గెట్‌ను ఛేజ్ జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా (245/5) జట్టు పేరిట ఉంది. 2018లో న్యూజిలాండ్ జట్టుతో (20 ఓవర్లలో 243/6)తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఈ రికార్డు నమోదు చేసింది. కాగా ప్రోటీస్ ఇన్నింగ్స్‌లో క్వింటన్ డి కాక్ (44 బంతుల్లో 100; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) దూకుడుగా ఆడి 43 బంతుల్లో శతకం బాదగా, హెన్డ్రిక్స్ (28 బంతుల్లో 68; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండగా నిలిచాడు. ప్రపంచ రికార్డు సృష్టించిన విండీస్-దక్షిణాఫ్రికా మ్యాచ్ ఇక పరుగుల సునామీ సృష్టించిన విండీస్-దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్ మరో ప్రపంచ రికార్డును కూడా నమోదు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా ఈ రెండో టీ20 నిలిచింది. ఈ మ్యాచ్‌లో విండీస్-ప్రోటీస్ జట్లు కలిపి 517 పరుగులు సాధించాయి. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్ , ముల్తాన్ సుల్తాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి 515 పరుగులు చేశాయి. తాజా మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన విండీస్,దక్షిణాఫ్రికా జట్లు ఈ ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాయి. చదవండి: SA vs WI: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా 🚨 RESULT | SOUTH AFRICA WIN BY 6 WICKETS Records were broken as Quinton de Kock's maiden T20I century set the #Proteas on their way to chasing down a mammoth 259-run target - with 7 balls remaining - to level the KFC T20I series#SAvWI #BePartOfIt pic.twitter.com/XMJnBL6p5r — Proteas Men (@ProteasMenCSA) March 26, 2023 That was special 🔥#SAvWI #BePartOfIt pic.twitter.com/rruu4aYa0h — Proteas Men (@ProteasMenCSA) March 26, 2023 -
చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా సరి కొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక టార్గెట్ ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో 259 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేసిన ప్రోటీస్.. ఈ ప్రపంచ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2018లో ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో 245 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా ఛేజ్ చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక ఛేజింగ్ కాగా.. తాజా మ్యాచ్‌తో ప్రోటీస్ ఆసీస్ రికార్డును బ్రేక్ చేసింది. 259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రోటీస్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 44 బంతులు ఎదుర్కొన్న డికాక్ 9 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 100 పరుగులు చేశాడు. డికాక్‌తో పాటు మరో ఓపెనర్ రెజా హెండ్రిక్స్ (28 బంతుల్లో 68 పరుగులు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరిలో కెప్టెన్ మార్క్రమ్ 38 పరుగులతో ఆజేయంగా నిలిచి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. జాన్సన్(118) అద్బుతమైన సెంచరీ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు సాధించింది. చార్లెస్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చదవండి: WI vs SA: వెస్టిండీస్ క్రికెటర్ విధ్వంసకర శతకం.. కేవలం 39 బంతుల్లోనే! -
చెత్త రికార్డు సమం చేసిన డికాక్
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా సాతాఫ్రికాతో నిన్న (మార్చి 25) జరిగిన తొలి మ్యాచ్‌లో పర్యాటక వెస్డిండీస్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. వర్షం అంతరాయం కలిగించడంతో 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగా.. విండీస్ మరో 3 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్నోయి లక్ష్యాన్ని ఛేదించింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డేవిడ్ మిల్లర్ (22 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. విండీస్‌ను కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (18 బంతుల్లో 43; ఫోర్, 5 సిక్సర్లు) అజేయమై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విజయతీరాలకు చేర్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా వికెట్‌కీపర్,బ్యాటర్ క్వింటన్ డికాక్ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతికే ఔటైన (గోల్డన్ డక్) డికాక్.. సౌతాఫ్రికా తరఫున టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా జేపీ డుమినీ, ఆండైల్ ఫెలుక్వాయో సరసన చేరాడు. వీరు ముగ్గురు టీ20ల్లో 6 సార్లు డకౌటయ్యారు. ఇదిలా ఉంటే, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లు ఆడేందుకు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టు టెస్ట్ సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోగా.. వన్డే సిరీస్‌ను 1-1తో (వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దైంది) సమం చేసుకుంది. తొలి టీ20లో విండీస్ గెలవడంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
SA20 2023: డికాక్ పోరాటం వృధా.. చెన్నై చేతిలో లక్నో ఓటమి
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంలో నడిచే జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టు శుభారంభం చేసింది. బుధవారం (జనవరి 11) డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో సూపర్ జెయింట్స్)తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ సూపర్ కింగ్స్.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు డొనావాన్ ఫెరియెరా (40 బంతుల్లో 82 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (20 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సూపర్ కింగ్స్‌ను వీరి జోడీ (85 పరుగులు జోడించి) ఆదుకుంది. సూపర్ జెయింట్స్ బౌలర్లలో సుబ్రయెన్ 2 వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహారాజ్, ప్రిటోరియస్, అఖిల ధనంజయ, జేసన్ హోల్డర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులకు మాత్రమే పరిమితై ఓటమిపాలైంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (52 బంతుల్లో 78; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్ జెయింట్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. మరో ఓపెనర్ కైల్ మేయర్స్ (29 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసిన్ (20), ప్రిటోరియస్ (6 బంతుల్లో 14; 2 సిక్సర్లు) తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. జోబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 2, మలుసి సిబోటో, డొనావాన్ ఫెరియెరా, ఆరోన్ ఫాంగిసో తలో వికెట్ పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (82 నాటౌట్, ఒక వికెట్) అదరగొట్టిన డొనావాన్ ఫెరియెరాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ సన్‌రైజర్స్ ఈస్ట్ర్న్ కేప్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), ప్రిటోరియా క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) జట్లు తలపడనున్నాయి. భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ను మినీ ఐపీఎల్‌గా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో పాల్గొనే మొత్తం ఆరు జట్లను ఐపీఎల్ జట్ల యాజమాన్యాలే కొనుగోలు చేశాయి. -
డర్బన్ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా క్వింటన్ డికాక్
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ తొలి ఎడిషన్ వచ్చే ఏడాది జనవరి 10న ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ లీగ్‌కు సంబంధించిన వేలంను కూడా క్రికెట్ సౌతాఫ్రికా పూర్తి చేసింది. అదే విధంగా ఈ టోర్నీలో పాల్గోనే మొత్తం ఆరు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. డర్బన్ సూపర్ జెయింట్స్ తమ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డి కాక్‌ను ఎంపిక చేసింది. ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్ ప్రకటించింది. కాగా డర్బన్ ఫ్రాంచైజీనీ ఐపీఎల్‌కు చెందిన లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు డికాక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో డర్బన్ సూపర్ జెయింట్స్ సారథిగా డికాక్ ఎంపికయ్యాడు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన వేలంలో జాసన్ హోల్డర్, డ్వైన్ ప్రిటోరియస్ వంటి స్టార్ ఆటగాళ్లను డర్బన్ సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Durban's Super Giants (@durbanssupergiants) డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు: క్వింటన్ డి కాక్, ప్రేనెలన్ సుబ్రాయెన్, జాసన్ హోల్డర్, కైల్ మేయర్స్, రీస్ టోప్లీ, డ్వైన్ ప్రిటోరియస్, హెన్రిచ్ క్లాసెన్, కీమో పాల్, కేశవ్ మహరాజ్, కైల్ అబాట్, జూనియర్ డాలా, దిల్షన్ మధుశంక, జాన్సన్ చార్లెస్, మాథ్యూ బ్రీట్జ్కేర్, క్రిస్టియన్ జోంకర్ వియాన్ ముల్డర్, సైమన్ హార్మర్ చదవండి: FIFA World Cup 2022: సెర్బియాకు చుక్కలు చూపించిన ఆఫ్రికా జట్టు.. మ్యాచ్ 'డ్రా' -
దురదృష్టం అంటే దక్షిణాఫ్రికాదే.. గ్లౌవ్‌ను తాకినందుకు ఐదు పరుగులు
టీ20 ప్రపంచకప్ 2022 సూపర్-12లో భాగంగా జరిగిన దక్షిణాఫ్రికా- జింబాబ్వే మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అయితే పలు మార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చేసుకుంది. ప్రోటీస్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ చేసిన చిన్న తప్పిదం వల్ల ప్రత్యర్ధి జట్టుకు 5 పెనాల్టీ పరుగులతో పాటు అదనంగా బంతి కూడా లభించింది. ఏం జరిగిందంటే..? వర్షం కారణంగా మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వేతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. అయితే అఖరి నోకియా వేసిన అఖరి ఓవర్ రెండో బంతిని బ్యాటర్ మిల్టన్ శుంబా థర్డ్ మ్యాన్ దిశగా ఆడాడు. అయితే థర్డ్ మ్యాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లుంగీ ఎంగిడీ.. వికెట్ కీపర్ వైపు త్రో విసిరాడు. ఈ క్రమంలో మైదానంలో ఉంచిన క్వింటన్ డి కాక్ గ్లోవ్‌లను బంతి తాకింది. దీంతో అంపైర్లు ఐదు పెనాల్టీ పరుగులతో పాటు బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటించారు. కాగా త్వరగా బంతిని త్రో చేయాలనే ఉద్దేశ్యంతో డికాక్ తన గ్లోవ్‌ను మైదానంలో ఉంచాడు. అయితే అదనంగా వచ్చిన బంతికి శుంబా పెవిలియన్‌కు చేరాడు. ఎంసీసీ నిబంధనల ప్రకారం.. మైదానంలో బంతి వికెట్ కీపర్ హెల్మెట్‌కు గానీ, గ్లౌవ్‌లకు గానీ తాకితే అంపైర్ బ్యాటింగ్ జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులను ఇస్తారు. అదే విధంగా ఆ బంతిని డెడ్‌బాల్‌గా అంపైర్లు ప్రకటిస్తారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: T20 World Cup 2022: ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శన.. వెస్టిండీస్ హెడ్ కోచ్ రాజీనామా -
శ్రేయస్ అయ్యర్ బుల్లెట్ త్రో.. డికాక్ అస్సలు ఊహించలేదుగా!
ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సంచలన త్రోతో మెరిశాడు. దూకుడుగా ఆడుతోన్న దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్‌ను అయ్యర్ అద్భుతమైన త్రోతో రనౌట్‌గా పెవిలియన్ పంపాడు. ప్రోటీస్ ఇన్నింగ్స్ 13 ఓవర్లో డికాక్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్ పరిగెత్తుకుంటూ బంతిని అందుకుని వికెట్ కీపర్‌కు త్రో చేశాడు. వెంటనే వికెట్ కీపర్ పంత్ వికెట్లను గిరాటేశాడు. దీంతో డికాక్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో 43 బంతులు ఎదర్కొన్న డికాక్ 68 పరుగులు చేశాడు. అదే విధంగా మరో దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రుసౌవ్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022కు ముందు భారత్, దక్షిణాఫ్రికాకు ఇదే అఖరి టీ20 మ్యాచ్. టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఆక్టోబర్6న ఆస్ట్రేలియాకు వెళ్లనుండగా.. దక్షిణాఫ్రికా మాత్రం వన్డే సిరీస్ అనంతం పయనం కానుంది. చదవండి: IND vs SA: శబాష్ దీపక్ చాహర్.. రనౌట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ..! -
రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం (ఫొటోలు)
-
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్.. కొత్త రూల్స్ మరిచితిరి!
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టి20లో చివర్లో విజయం అందుకున్న టీమిండియా ఎలాగోలా తొలిసారి సిరీస్‌ను దక్కించుకుంది. టీమిండియా భారీ స్కోరు చేసింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే మిల్లర్ విధ్వంసానికి మ్యాచ్ ఓడిపోయేదే. మ్యాచ్ ఓడినా మిల్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి సెంచరీతో అభిమానుల మనుసు గెలుచుకున్నాడు. ఈ సంగతి పక్కనబెడితే.. అక్టోబర్ 1 నుంచి ఐసీసీ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి మ్యాచ్ టీమిండియా, సౌతాఫ్రికాదే కావడం గమనార్హం. అయితే కొత్త నిబంధనలను అంపైర్లు మరిచిపోయారు. తాజా రూల్స్ ప్రకారం స్ట్రయికర్ షాట్ కొట్టి అవుటైతే పరుగు తీసే ప్రయత్నం చేస్తూ నాన్‌స్ట్రయికర్ అతడిని దాటినా సరే, కొత్తగా వచ్చే బ్యాటర్ మాత్రమే స్ట్రయికింగ్ తీసుకోవాలి. కానీ రెండో ఓవర్ నాలుగో బంతికి రోసో అవుటయ్యాక, ఐదో బంతికి డి కాక్ స్ట్రయిక్ తీసుకున్నాడు. వాస్తవానికి మార్క్రమ్ స్ట్రైయిక్ తీసుకోవాల్సింది.. అంపైర్లు దీనిని గుర్తించలేకపోయారు. తొలి మ్యాచ్ కదా.. అందుకే మరిచిపోయింటారు.. ఫాలో కావడానికి అంపైర్లకు టైం పడుతుందేమో అంటూ అభిమానులు కామెంట్ చేశారు. -
Ind Vs Sa: ప్రొటిస్‌తో రెండో టీ20.. సూర్య మరో 24 పరుగులు సాధించాడంటే!
India vs South Africa, 2nd T20I Records Preview: అసోంలోని గువాహటి వేదికగా జరుగనున్న రెండో టీ20కి టీమిండియా, సౌతాఫ్రికా సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రాక్టీసు పూర్తి చేసుకున్న ఇరు జట్లు బర్సాపారా స్టేడియంలో ముఖాముఖి తలపడేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు.. మొదటి టీ20లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని ప్రొటిస్ జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో వర్షం ఆటంకం కలిగించకపోతే ఈ మ్యాచ్ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. కాగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో.. రెండో టీ20 సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లను ఊరిస్తున్న కొన్ని రికార్డులపై ఓ లుక్కేద్దాం. మైలురాయికి చేరువలో డికాక్ దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో 10969 పరుగులు సాధించాడు. టీమిండియాతో రెండో టీ20లో మరో 31 పరుగులు చేస్తే తన కెరీర్లో 11 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. అదే విధంగా మూడు బౌండరీలు బాదాడంటే అంతర్జాతీయ టీ20లలో 200 ఫోర్లు పూర్తి చేసుకుంటాడు. 56 పరుగుల దూరంలో అంతర్జాతీయ టీ20లలో 2 వేల పరుగుల మార్కుకు ప్రొటిస్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ 56 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు పొట్టిఫార్మాట్లో అతడు చేసిన రన్స్ 1944. సూర్య మరో 24 పరుగులు తీస్తే ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన కెరీర్లో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో సూర్య 24 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ టీ20లలో 1000 పరుగుల మార్కును అందుకుంటాడు. కోహ్లి మూడు క్యాచ్‌లు పడితే! పంత్ ఏమో.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్ సందర్భంగా మూడు క్యాచ్‌లు పడితే అంతర్జాతీయ టీ20లలో 50 క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్లలో ఒకడిగా నిలుస్తాడు. ఇక రిషభ్ పంత్ తుది జట్టులో చోటు దక్కించుకుని 66 పరుగులు చేయగలిగితే పొట్టి ఫార్మాట్ ఇంటర్నేషనల్ కెరీర్లో 1000 రన్స్ పూర్తి చేసుకుంటాడు. 200 వికెట్ల క్లబ్లో ప్రొటిస్ ఆటగాడు కేశవ్ మహరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడంటే అన్ని ఫార్మాట్లలో కలిపి 200 వికెట్లు తన ఖాతాలో పడతాయి. ఇక లుంగి ఎంగిడి ఒక వికెట్ తీస్తే అంతర్జాతీయ టీ20లలో 50 వికెట్ల మార్కు అందుకుంటాడు. చదవండి: T20 WC: అతడి స్థానాన్ని ప్రపంచంలో ఎవరూ భర్తీ చేయలేరు.. భారత్ గెలవడం కష్టమే: ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ Asia Cup 2022: తల్లి అంపైర్.. కూతురు ఆల్‌రౌండర్.. ఇద్దరూ ఒకేసారి! వీరికి వెనుక ఉన్నది ఎవరంటే! -
డికాక్ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు..
ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 27.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. డికాక్ (76 బంతుల్లో 92 పరుగులు నాటౌట్, 13 ఫోర్లు) దూకుడుగా ఆడగా.. మార్క్రమ్ 24 పరుగులతో ఆడుతున్నారు. ఈ సమయంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే ఆ తర్వాత పలుమార్లు అంపైర్లు పరిశీలించారు. మ్యాచ్ 20 ఓవర్లకు కుదించి ఆడిద్దామనుకున్నా వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అయితే మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన దక్షిణాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ సెంచరీ దిశగా పయనించాడు. కేవలం 8 పరుగుల దూరంలో ఉండగా డికాక్ సెంచరీ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు చెరొక మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా వాండర్ డుసెన్ ఎంపికయ్యాడు. చదవండి: Nathan Lyon Wedding: లేటు వయసులో ఘాటైన ప్రేమ.. గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన ఆసీస్ స్టార్ -
Ind Vs SA: డి కాక్ స్థానంలో వచ్చి అతడి రికార్డునే బద్దలు కొట్టిన క్లాసెన్!
India Vs South Africa 2nd T20- Heinrich Klaasen: టీమిండియాతో రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు ప్రొటిస్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్. కెప్టెన్ తెంబా బవుమా(35 పరుగులు) మినహా టాపార్డర్ చేతులెత్తేసిన వేళ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. కటక్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్ 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసి 81 పరుగులు చేశాడు. కెరీర బెస్ట్ స్కోరు సాధించాడు. తద్వారా టీమిండియాపై ప్రొటిస్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందడంలో తన వంతు సహాయం చేశాడు. ఈ క్రమంలో క్లాసెన్ క్వింటన్ డి కాక్ రికార్డు బద్దలు కొట్టాడు. టీ20 ఫార్మాట్లో భారత్‌పై అత్యధిక స్కోరు చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డు క్వింటన్ పేరిట ఉండేది. 2019లో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో డి కాక్ 79 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ప్రొటిస్ రెగ్యులర్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ గాయపడటంతో క్లాసెన్ తుది జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించడంతో పాటు ఇలా డి కాక్ రికార్డును అధిగమించాడు క్లాసెన్. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన క్లాసెన్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘బస్సులో ఉన్న సమయంలో క్విన్నీ(డి కాక్) తన మణికట్టుకు గాయమైందని నాతో చెప్పాడు. గాయం తీవ్రతరం కావడంతో అతడి స్థానంలో నేను ఆడబోతున్నానని నిన్ననే నాకు తెలిసింది. కొత్త బంతితో కాస్త కష్టమే. అయితే, నేను స్పిన్నర్లకు టార్గెట్ చేయాలనుకున్నాను. అందులో సఫలమయ్యాను. భారత్‌లో ఇలాంటి స్కోరు సాధించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. సహాయక సిబ్బంది మొదలు ప్రతి ఒక్కరు నాకు మద్దతుగా నిలిచారు’’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక రెండో టీ20లో విజయంతో దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య భారత్‌పై 2-0 తేడాతో పైచేయి సాధించింది. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా రెండో టీ20: టాస్: దక్షిణాఫ్రికా- తొలుత బౌలింగ్ భారత్ స్కోరు: 148/6 (20) దక్షిణాఫ్రికా స్కోరు: 149/6 (18.2) విజేత: 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హెన్రిచ్ క్లాసెన్(46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 81 పరుగులు) చదవండి: Rishabh Pant: అదే మా పొరపాటు.. అందుకే ఓడిపోయాం.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే! ICC World Cup Super League: రోజుల వ్యవధిలోనే అంతా తలకిందులు.. అక్కడ క్లీన్‌స్వీప్ చేసి.. ఇక్కడ వైట్‌వాష్‌కు గురై! -
డికాక్, రాహుల్ విధ్వంసం ధాటికి బద్దలైన రికార్డులు ఇవే..!
ఐపీఎల్ 2022 సీజన్ చివరి దశలో క్రికెట్ ప్రేమికులకు కావాల్సిన అసలుసిసలైన మజా లభించింది. నిన్న (మే 18) లక్నో సూపర్ జెయింట్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు రెచ్చిపోయి ప్రేక్షకులకు కనువిందు కలిగించారు. ముఖ్యంగా లక్నో ఓపెనర్లు డికాక్ (70 బంతుల్లో 140 నాటౌట్; 10 ఫోర్లు, 10 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 68 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు)లు ఆకాశమే హద్దుగా చెలరేగి చాలాకాలం తర్వాత అసలైన ఐపీఎల్ మజాను ప్రేక్షకులకు అందించారు. అనంతరం కేకేఆర్ బ్యాటర్లు సైతం అద్భుతమైన పోరాట పటిమ కనబర్చడంతో మ్యాచ్ చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది. అయితే కేకేఆర్ ఆఖరి రెండు బంతులకు రెండు వికెట్లు కోల్పోవడంతో 2 పరుగుల స్వల్ప తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఫలితంగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కోల్‌కథ ముగిసినట్లైంది. లక్నో దర్జాగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో డికాక్-రాహుల్ విధ్వంసం ధాటికి చాలాకాలంగా పదిలంగా ఉన్న పలు రికార్డులు బద్దలయ్యాయి. ఈ ఇద్దరూ వ్యక్తిగతంగానూ, అలాగే ఓపెనింగ్ జోడీగా పలు కొత్త రికార్డులు నమోదు చేశారు. డికాక్-రాహుల్ సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం. అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం.. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి వికెట్‌కు అజేయమైన 210 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించిన డికాక్-రాహుల్ జోడీ ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామాయన్ని నెలకొల్పారు. ఈ రికార్డు గతంలో సన్‌రైజర్స్ ఓపెనర్లు జానీ బెయిర్ స్టో-డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. 2019లో ఈ జోడీ తొలి వికెట్‌కు 185 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అంతకుముందు 2017 సీజన్లో కేకేఆర్ ఓపెనర్లు గౌతం గంభీర్-క్రిస్ లిన్లు తొలి వికెట్‌కు 184 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఐపీఎల్ చరిత్రలో తొలి జోడీగా.. ఐపీఎల్ చరిత్రలోనే 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉన్న ఏకైక జోడీగా డికాక్-రాహుల్ జోడీ రికార్డుల్లోకెక్కింది. లీగ్ చరిత్రలో ఏ జోడీ కూడా మొత్తం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయలేదు. కేకేఆర్‌పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.. డికాక్-రాహుల్ జోడీ కేకేఆర్‌పై అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని (అజేయమైన 210 పరుగుల) నెలకొల్పింది. 2017లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్-శిఖర్ ధవన్లు తొలి వికెట్‌కు 139 పరుగులు జతచేశారు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు కేకేఆర్‌పై ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం. ఐపీఎల్ చరిత్రలో ఏ వికెట్‌కైనా మూడో అత్యుత్తమ భాగస్వామ్యం.. - కోహ్లి-డివిలియర్స్ (229) ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ లయన్స్ (2016) - కోహ్లి-డివిలియర్స్ (215) ఆర్సీబీ వర్సెస్ ముంబై (2015) - డికాక్-రాహుల్ (210) లక్నో వర్సెస్ కేకేఆర్ (2022) ఐపీఎల్లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు.. - క్రిస్ గేల్ (175 నాటౌట్) ఆర్సీబీ వర్సెస్ పూణే (2013) - బ్రెండన్ మెక్ కల్లమ్ (158 నాటౌట్) కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ (2008) - క్వింటన్ డికాక్ (140 నాటౌట్) లక్నో వర్సెస్ కేకేఆర్ (2022) - ఏబీ డివిలియర్స్ (133 నాటౌట్) ఆర్సీబీ వర్సెస్ ముంబై (2015) - కేఎల్ రాహుల్ (132 నాటౌట్) పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ (2020) పొట్టి క్రికెట్ చరిత్రలో అజేయమైన ఓపెనింగ్ జోడీగా.. డికాక్-రాహుల్ జోడీ పొట్టి క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సాధించింది. ఈ జోడీ టీ20 ఫార్మాట్లో అజేయమైన నాలుగో ఓపెనింగ్ జోడీగా రికార్డుల్లోకెక్కింది. 2013 బీపీఎల్‌లో నఫీస్-రాజ్‌షాహీ జోడీ తొలిసారి టీ20ల్లో అజేయమైన ఓపెనింగ్ జోడీ (20 ఓవర్లు ఆడి)గా నిలువగా... 2017లో పాక్ వేదికగా జరిగే నాట్ టీ20 కప్‌లో కమ్రాన్ అక్మల్- సల్మాన్ బట్ జోడీ.. ఇదే ఏడాది (2022) జిబ్రాల్టర్-బల్గేరియా మధ్య జరిగిన అంతర్జాతీయ టీ20లో బ్రూస్-పాయ్ జోడీ పొట్టి ఫార్మాట్లో అజేయమైన ఓపెనింగ్ జోడీలుగా నిలిచారు. రాహుల్ వరుసగా ఐదోసారి.. ఐపీఎల్లో కేఎల్ రాహుల్ వరుసగా ఐదో ఏడాది 500 పరుగులను దాటాడు. ఇలా సాధించిన వారిలో రాహుల్ రెండో స్థానంలో నిలిచాడు. డేవిడ్ వార్నర్ (6) తొలి స్థానంలో ఉండగా.. రాహుల్ (5), విరాట్ (5), శిఖర్ (5)లు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మరిన్ని.. - ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వికెట్ కీపర్ డికాక్ రికార్డుల్లోకెక్కాడు. - డికాక్: ఈ సీజన్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (10)లు కొట్టిన బ్యాటర్ రికార్డు. 2019 సీజన్ తర్వాత (పోలార్డ్) ఓ ఇన్నింగ్స్‌లో 10 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా మరో రికార్డు. - ఐపీఎల్ చరిత్రలో ఓపెనర్లిద్దరు 500 పరుగులు దాటడం ఇది రెండోసారి. 2021లో రుతురాజ్ గైక్వాడ్-ఫాఫ్ డుప్లెసిస్ (సీఎస్కే) ఈ అరుదైన ఘనతను సాధించగా, తాజాగా డికాక్ (502), రాహుల్ (537) వారి సరసన చేరారు. చదవండి: డికాక్ విధ్వంసం.. ఉత్కంఠ పోరులో లక్నోదే విజయం -
10 ఫోర్లు, 10 సిక్స్‌లతో డికాక్ విధ్వంసం.. ఐపీఎల్లో మూడో ఆటగాడిగా..!
ఐపీఎల్-2022లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 70 బంతుల్లోనే 140 పరుగులు డికాక్ విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి. ఇక డికాక్‌కు ఐపీఎల్ కెరీర్లో రెండో సెంచరీ. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తన తొలి సెంచరీను డికాక్ నమోదు చేశాడు. అదే విధంగా ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసిన మూడో ఆటగాడిగా డికాక్ నిలిచాడు. అంతకు ముందు క్రిస్ గేల్(175), బ్రెండన్ మెకల్లమ్(158) పరుగులు సాధించారు. ఇక సునామీ ఇన్నింగ్స్ ఆడిన డికాక్‌పై ట్విటర్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. చదవండి: IPL 2022: చరిత్ర సృష్టించిన లక్నో ఓపెనర్లు..ఐపీఎల్లో తొలిసారి..! -
చరిత్ర సృష్టించిన లక్నో ఓపెనర్లు..ఐపీఎల్లో తొలిసారి..!
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడిగా రికార్డులకెక్కారు. ఐపీఎల్-2022లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో వీరిద్దరూ 210 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. డికాక్ కేవలం 70 బంతుల్లోనే 140 పరుగులు సాధించగా.. రాహుల్ 51 బంతుల్లో 68 పరుగులు చేశాడు. కాగా అంతకుముందు విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్ నమోదు చేసిన 181 పరుగలు ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డును వీరిద్దరూ బ్రేక్ చేశారు. ఇక ఓవరాల్‌గా ఐపీఎల్లో ఏ వికెట్‌కైనా ఇది మూడో అత్యధిక భాగస్వామ్యం గమనార్హం. చదవండి: Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కి చేరిన నిఖత్ జరీన్ -
IPL 2022: లక్నో సూపర్ ‘సిక్సర్’
పుణే: ఐపీఎల్లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ దూసుకుపోతోంది. బ్యాటింగ్‌లో అద్భుతాలు చేయకపోయినా... ఈసారి బౌలర్ల చక్కటి ప్రదర్శనతో ఆ జట్టు ఖాతాలో ఆరో విజయం చేరింది. స్వల్ప లక్ష్యాన్ని కూడా టీమ్ కాపాడుకోగలిగింది. శుక్రవారం జరిగిన పోరులో లక్నో 20 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (37 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్ హుడా (28 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. కగిసో రబడకు 4 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. జానీ బెయిర్‌స్టో (28 బంతుల్లో 32; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన కృనాల్ పాండ్యా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. కీలక భాగస్వామ్యం... సీజన్లో అద్భుత ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ (6) అరుదైన వైఫల్యంతో లక్నో ఆట మొదలైంది. అయితే డికాక్, హుడా రెండో వికెట్‌కు 85 పరుగులు (59 బంతుల్లో) జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. రబడ ఓవర్లో డికాక్ వరుస బంతుల్లో రెండు సిక్సర్లు బాదగా, పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 39 పరుగులకు చేరింది. ఈ భాగస్వామ్యం భారీ స్కోరుకు బాటలు వేస్తున్న తరుణంలో సందీప్ శర్మ దెబ్బ తీశాడు. అతని బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి డికాక్ అవుటయ్యాడు. బౌలర్ అప్పీల్‌పై అంపైర్ స్పందించకపోయినా డికాక్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ మైదానం వీడాడు. ఇక్కడే లక్నో బ్యాటింగ్ తడబడింది. 13 పరుగుల వ్యవధిలో జట్టు మరో 4 ప్రధాన వికెట్లు కోల్పోయింది. హుడా, కృనాల్ (7), బదోని (4), స్టొయినిస్ (1) పెవిలియన్ చేరారు. చివర్లో ఆరు బంతుల వ్యవధిలో 4 సిక్సర్లు కొట్టిన సూపర్ జెయింట్స్ 150 పరుగుల స్కోరు దాటగలిగింది. వీటిలో రబడ ఓవర్లో వరుస బంతుల్లో చమీరా బాదిన రెండు సిక్స్‌లు ఉన్నాయి. సమష్టి వైఫల్యం... మొహసిన్ ఓవర్లో 6, 4 తో ఛేదనను కెప్టెన్ మయాంక్ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా మొదలు పెట్టాడు. అయితే చమీరా ఓవర్లోనూ సిక్స్ బాదిన అతను అదే ఓవర్లో వెనుదిరిగాడు. అనంతరం తక్కువ వ్యవధిలో శిఖర్ ధావన్ (5), రాజపక్స (9) వికెట్లను పంజాబ్ కోల్పోయింది. బెయిర్‌స్టోతో పాటు భారీ హిట్టర్ లివింగ్‌స్టోన్ (18) క్రీజ్‌లో ఉన్నంత వరకు కింగ్స్ గెలుపు విషయంలో ఎలాంటి ఢోకా కనిపించలేదు. రవి బిష్ణోయ్ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లు కొట్టిన లివింగ్‌స్టోన్ జోరు ప్రదర్శించాడు కూడా. అయితే మొహసిన్ బౌలింగ్‌లో కీపర్ మీదుగా భిన్నమైన షాట్ ఆడేందుకు ప్రయత్నించి అతను అవుటయ్యాడు. ఆ వెంటనే జితేశ్ శర్మ (2), గెలిపించే అవకాశం ఉన్న బెయిర్‌స్టో కూడా వెనుదిరగడంతో పంజాబ్ గెలుపు ఆశలకు కళ్లెం పడింది. చివర్లో రిషి ధావన్ (22 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ప్రయత్నం సరిపోలేదు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) జితేశ్ (బి) సందీప్ శర్మ 46; రాహుల్ (సి) జితేశ్ (బి) రబడ 6; హుడా (రనౌట్) 34; కృనాల్ (సి) శిఖర్ (బి) రబడ 7; స్టొయినిస్ (సి అండ్ బి) చహర్ 1; బదోని (సి) లివింగ్‌స్టోన్ (బి) రబడ 4; హోల్డర్ (సి) సందీప్ (బి) చహర్ 11; చమీరా (సి) చహర్ (బి) రబడ 17; మొహసిన్ (నాటౌట్) 13; అవేశ్ ఖాన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–13, 2–98, 3–104, 4–105, 5–109, 6–111, 7–126, 8–144. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–23–0, సందీప్ శర్మ 4–0–18–1, రబడ 4–0–38–4, రిషి ధావన్ 2–0–13–0, లివింగ్‌స్టోన్ 2–0–23–0, రాహుల్ చహర్ 4–0–30–2. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: మయాంక్ (సి) రాహుల్ (బి) చమీరా 25; శిఖర్ ధావన్ (బి) బిష్ణోయ్ 5; బెయిర్‌స్టో (సి) కృనాల్ (బి) చమీరా 32; రాజపక్స (సి) రాహుల్ (బి) కృనాల్ 9; లివింగ్‌స్టోన్ (సి) డికాక్ (బి) మొహసిన్ 18; జితేశ్ (ఎల్బీ) (బి) కృనాల్ 2; రిషి ధావన్ (నాటౌట్) 21; రబడ (సి) బదోని (బి) మొహసిన్ 2; చహర్ (సి) బదోని (బి) మొహసిన్ 4; అర్‡్షదీప్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–35, 2–46, 3–58, 4–88, 5–92, 6–103, 7–112, 8–117. బౌలింగ్: మొహసిన్ 4–1–24–3, చమీరా 4–0–17–2, హోల్డర్ 1–0–8–0, అవేశ్ ఖాన్ 3–0–26–0, రవి బిష్ణోయ్ 4–0–41–1, కృనాల్ పాండ్యా 4–1–11–2. ఐపీఎల్లో నేడు గుజరాత్ టైటాన్స్ X బెంగళూరు వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి రాజస్తాన్ రాయల్స్ X ముంబై ఇండియన్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. That's that from Match 42.@LucknowIPL win by 20 runs and add two more points to their tally. Scorecard - https://t.co/H9HyjJPgvV #PBKSvLSG #TATAIPL pic.twitter.com/dfSJXzHcfG — IndianPremierLeague (@IPL) April 29, 2022 -
డికాక్ నిజాయితీని మెచ్చుకొని తీరాల్సిందే!
డీఆర్ఎస్ రూల్ వచ్చాకా ఔట్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. బ్యాటింగ్ జట్టుకు.. బౌలింగ్ జట్టుకు ఔట్‌పై ఏ మాత్రం సందేహం ఉన్నా వెంటనే రివ్యూకు వెళ్లిపోతున్నారు. కానీ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వకున్నా బ్యాట్స్‌మన్ తనంతట తానే క్రీజు విడిచి వెళ్లడం అరుదుగా చూస్తున్నాం. తాజాగా ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో అలాంటిదే చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 13వ ఓవర్ సందీప్ శర్మ వేశాడు. ఆ ఓవర్లో సందీప్ వేసిన ఒక బంతి డికాక్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ కీపర్ జితేశ్ చేతిలో పడింది. పంజాబ్ ఆటగాళ్లు ఔట్‌కు అప్పీల్ చేసినప్పటికి ఫీల్డ్ అంపైర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే డికాక్ మాత్రం తాను ఔట్ అంటూ క్రీజు వీడాడు. ఈ నేపథ్యంలో పెవిలియన్ వెళ్తున్న డికాక్ నిజాయితీని సందీప్ శర్మ మెచ్చుకుంటూ అతని భుజాన్ని తట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Venkatesh Iyer: అప్పుడు హీరోలా కనిపించాడు; ఇప్పుడు విలన్.. ఎందుకిలా! pic.twitter.com/tzk1o22hAf — Vaishnavi Sawant (@VaishnaviS45) April 29, 2022 -
నా డార్లింగ్‌కే అంకితమన్న గౌతమ్.. తొడగొట్టిన గబ్బర్.. బెయిర్‌స్టో రెడీ!
IPL Today Trending Videos: ఐపీఎల్-2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ అదరగొట్టింది. సమిష్టి కృషితో పంత్ సేనపై రాహుల్ బృందం 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక చాలా రోజుల తర్వాత లక్నో తుది జట్టులోకి వచ్చిన కర్ణాటక బౌలింగ్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ కీలక సమయంలో వికెట్ తీసి సత్తా చాటాడు. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షాను అవుట్ చేసి లక్నో గెలుపులో తానూ భాగమయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా ఆఫ్ స్పిన్నర్ గౌతమ్ ఒకటి, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయి రెండు వికెట్లు కూల్చాడు. తద్వారా ఢిల్లీని తక్కువ స్కోరుకే వీరు కట్టడి చేయగా.. క్వింటన్ డికాక్ మెరుపులతో లక్నో విజయం సాధ్యమైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం గౌతమ్ మాట్లాడుతూ.. గురువారం నాటి మ్యాచ్‌లో తన ప్రదర్శనను తన కుటుంబానికి.. ముఖ్యంగా తన చిన్నారి పాపాయి, ముద్దుల కూతురు నితారాకు అంకితమిస్తున్నట్లు తెలిపాడు. Crucial breakthroughs 💪 Energetic celebrations 🔥 K Gowtham's special dedication 😊@gowthamyadav88 & @bishnoi0056 chat after @LucknowIPL complete a hat-trick of wins in the #TATAIPL 2022. 👍 👍 - By @ameyatilak Full interview 📹 🔽 #LSGvDC https://t.co/zaEryYY18b pic.twitter.com/o3PgPgMpDk — IndianPremierLeague (@IPL) April 8, 2022 ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. దీనితో పాటు ఐపీఎల్ ప్రేమికుల మది దోచుకుంటున్న మరికొన్ని వీడియోలు మీకోసం.. ఢిల్లీపై విజయంతో లక్నో ఖాతాలో హ్యాట్రిక్ Young Badoni finishes things off in style.@LucknowIPL win by 6 wickets and register their third win on the trot in #TATAIPL. Scorecard - https://t.co/RH4VDWYbeX #LSGvDC #TATAIPL pic.twitter.com/ZzgYMSxlsw — IndianPremierLeague (@IPL) April 7, 2022 లక్నో తరఫున డికాక్ సూపర్ ఇన్నింగ్స్(52 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు) Our best performer from the second innings is Quinton de Kock for his match-winning knock of 80. A look at his batting summary here 👇 #TATAIPL pic.twitter.com/YPUfgRLwxH — IndianPremierLeague (@IPL) April 7, 2022 పంజాబ్ కింగ్స్‌తో ఏప్రిల్ 8న తలపడనున్న గుజరాత్ టైటాన్స్. తమ యువ ఆటగాడు యశ్ దయాల్ ప్రయాణానికి సంబంధించిన వీడియో పంచుకున్న గుజరాత్. Ep 2: The journey from a promising youngster to a #TitanYoungStar… 🎬 We wish you all the ‘Yash’ in life! 🙌#SeasonOfFirsts #AavaDe pic.twitter.com/X3yFF89C5y — Gujarat Titans (@gujarat_titans) April 8, 2022 టైటాన్స్‌తో పోరుకు సై అంటున్న పంజాబ్ ప్లేయర్ గబ్బర్. తొడగొట్టి మరీ సవాల్ విసురుతున్న శిఖర్ ధావన్ 𝘼 𝙂𝙖𝙗𝙗𝙖𝙧 𝙨𝙩𝙧𝙞𝙙𝙚 𝙞𝙣𝙩𝙤 #𝙋𝘽𝙆𝙎𝙫𝙂𝙏! 😎#SaddaPunjab #IPL2022 #PunjabKings #ਸਾਡਾਪੰਜਾਬ @SDhawan25 pic.twitter.com/w8pvbFWz1F — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2022 విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతున్న పంజాబ్ ఆటగాడు బెయిర్‌స్టో 𝐑𝐞𝐚𝐝𝐲 • 𝐒𝐞𝐭 • 𝐑𝐨𝐚𝐫 • 🦁 Bair𝙨𝙩𝙤𝙧𝙢 loading… 🌪#PunjabKings #SaddaPunjab #IPL2022 #ਸਾਡਾਪੰਜਾਬ #PBKSvGT @jbairstow21 pic.twitter.com/VoW5CT9Muw — Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2022 దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్, పంజాబ్ బౌలర్ కగిసో రబడ.. రైజ్ ఆఫ్ రబడ.. యువ ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చే వీడియో The Rise of Rabada! 🔥 Watch Kagiso Rabada talk about soaring through the ranks of South African youth cricket, rising to the🔝 in international cricket and what he aims to achieve at #SaddaPunjab! 💪🏻#IPL2022 #PunjabKings #ਸਾਡਾਪੰਜਾਬ @KagisoRabada25 pic.twitter.com/ujZEaMVMda — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2022 -
10 కోట్లకు అమ్ముడుపోతాడనుకున్నా! లక్నోది సరైన నిర్ణయం
ఐపీఎల్-2022లో అదరగొడుతోన్న లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో అతడిని దక్కించుకోవడానికి లక్నోతో ఏ జట్టు పోటీపడకపోవడం, అతడికి భారీ ధర దక్కకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని ఆకాశ్ చోప్రా తెలిపాడు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డికాక్ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. 52 బంతుల్లో 80 పరుగులు సాధించి లక్నో విజయంలో డికాక్ కీలక పాత్ర పోషించాడు. "ఐపీఎల్ మెగా వేలంలో క్వింటన్ డి కాక్‌ను కొనుగోలు చేసి లక్నో సూపర్ జెయింట్స్ సరైన నిర్ణయం తీసుకుంది. వేలంలో డికాక్ మార్క్యూ(ప్రధాన) జాబితాలో ఉన్నాడు. అయినప్పటికీ అతడి కోసం జట్లు ఎందుకు పోటీ పడలేదో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అతడు వేలంలో 10 కోట్లకు అమ్ముడుపోతాడని నేను భావించాను. కానీ అతడిని కేవలం 6.75 కోట్లకే లక్నో కొనుగోలు చేసింది. అతడిని అంత తక్కువ ధరకు కొనుగోలు చేస్తారని అని నేను అనుకోలేదు. కానీ లక్నో మాత్రం అతడిని దక్కించుకుని సరైన నిర్ణయం తీసుకుంది. అతడు బ్యాట్‌తో పాటు కీపర్‌గా అద్భుతంగా రాణిస్తాడు. అదే విధంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా డికాక్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. నోర్జే లాంటి స్టార్ పేసర్‌కు చుక్కలు చూపించాడు. తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు" అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: IPL 2022 LSG Vs DC: రిషభ్ పంత్‌కు భారీ షాక్! అసలే వరుస ఓటములు.. ఇప్పుడిలా! -
IPL 2022: డికాక్ మెరుపు బ్యాటింగ్.. లక్నో హ్యాట్రిక్!
IPL 2022 LSG Vs DC- ముంబై: ఐపీఎల్ కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్ విజయాల హ్యాట్రిక్ కొట్టింది. తొలి పోరులో మరో కొత్త టీమ్ గుజరాత్ చేతిలో ఓడాక... వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 6 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పృథ్వీ షా (34 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. క్వింటన్ డికాక్ (52 బంతుల్లో 80; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. పృథ్వీ అర్ధ శతకం పవర్ ప్లేలో ఢిల్లీ స్కోరు 52/0. డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రీజులో ఉండగా... పృథ్వీ షా కొట్టిన పరుగులే 47! ఆస్ట్రేలియన్ మూడే పరుగులు చేశాడు. మరో రెండు ఓవర్లకు వార్నర్ ఇంకో పరుగు చేస్తే ఢిల్లీ బ్యాటర్ ఫిఫ్టీ పూర్తయ్యింది. 67 జట్టు స్కోరులో పృథ్వీ షా 61 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ స్కోర్ల తీరును పరిశీలిస్తే అతను ఏ రేంజ్లో దంచేశాడో అర్థం చేసుకోవచ్చు. గౌతమ్ వేసిన రెండో ఓవర్ నుంచి పృథ్వీ తన బ్యాట్‌కు షాట్లను, స్కోరుకు వేగాన్ని జతచేశాడు. మూడో ఓవర్ హోల్డర్ వేస్తే చూడచక్కని రీతిలో 4, 6 బాదేశాడు. అవేశ్ ఖాన్ నాలుగో ఓవర్లో వరుసగా మూడు బౌండరీలు, రవి బిష్ణోయ్, అండ్రూ టై ఇలా 6 ఓవర్ల పవర్ ప్లేలోనే ఏకంగా 5 మంది బౌలర్లను మార్చినా... అతని ధాటిని ఏమార్చలేకపోయారు. 30 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో షా ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ‘షో’కు స్పిన్ తూట్లు అప్పటిదాకా ఫోర్లు, సిక్సర్లతో మార్మోగిన స్టేడియం తర్వాత కాసేపటికే మూగబోయినంత పనైంది. పృథ్వీ షా అవుటయ్యాక ఢిల్లీ ఆట గతి తప్పింది. పృథ్వీని కృష్ణప్ప గౌతమ్ పెవిలియన్ చేర్చగా, వార్నర్ (4)ను రవి బిష్ణోయ్ అవుట్ చేశాడు. వన్‌డౌన్‌లో రోమన్ పావెల్ (3)ను కూడా బిష్ణోయ్ బౌల్డ్ చేయడంతో 74 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. తర్వాత పంత్ (36 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సర్ఫరాజ్ (28 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు) ఆఖరి దాకా క్రీజులో ఉన్నా కూడా లక్నో బౌలింగ్‌పై ఎదురు దాడి చేయడంలో విఫలమయ్యారు. వీరిద్దరు ధాటిగా ఆడలేకపోయారు. దీంతో 5.4 ఓవర్లో 50 పరుగులు చేసిన జట్టే తర్వాత మిగిలిన 14.2 ఓవర్లలో 100 పరుగులైనా చేయలేకపోయింది. డికాక్ జోరు పెద్ద లక్ష్యం కాకపోవడంతో లక్నో ఓపెనర్లు కేఎల్ రాహుల్ (25 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్), డికాక్ నింపాదిగా ఆట ప్రారంభించారు. ఐదో ఓవర్లో డికాక్ ఆట మారింది. నోర్జే వేసిన ఆ ఓవర్‌ను పూర్తిగా డికాకే ఆడి 4, 4, 4, 0, 6, 1తో 19 పరుగులు పిండుకున్నాడు. 6.4 ఓవర్లో జట్టు స్కోరు 50 దాటింది. కుల్దీప్ తొలి ఓవర్లో లాంగాన్ దిశగా భారీ సిక్సర్ కొట్టిన రాహుల్ మళ్లీ అతని మరుసటి ఓవర్లో (ఇన్నింగ్స్ 10వ) మరో షాట్‌కు ప్రయత్నించి లాంగాఫ్‌లో పృథ్వీషా చేతికి చిక్కాడు. మరోవైపు డికాక్ 36 బంతుల్లో (6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఎవిన్ లూయిస్ (5) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. డికాక్ మాత్రం తన దాటిని కొనసాగిస్తూ అడపాదడపా బౌండరీలతో లక్ష్యానికి చేరేందుకు అవసరమైన పరుగులు క్రమం తప్పకుండా సాధించిపెట్టాడు. Quinton de Kock is adjudged Player of the Match for his match-winning knock of 80 off 52 deliveries as #LSG win by 6 wickets. Scorecard - https://t.co/RH4VDWYbeX #LSGvDC #TATAIPL pic.twitter.com/MhfV3TLwTt — IndianPremierLeague (@IPL) April 7, 2022 కుల్దీప్ 16వ ఓవర్లో రెండు వరుస బౌండరీలు కొట్టిన డికాక్ ఆఖరి బంతికి అవుటయ్యాడు. తర్వాత దీపక్ హుడా (11), కృనాల్ పాండ్యా (14 బంతుల్లో 19 నాటౌట్; 1 సిక్స్) ఒకటి, రెండు పరుగులతో మ్యాచ్‌ను ఆఖరిదాకా సాగదీశారు. ఆఖరి ఓవర్లో హుడా అవుటవగా... బదోని (10 నాటౌట్) 4, 6తో మరో రెండు బంతులుండానే జట్టును గెలిపించాడు. చదవండి: IPL 2022: నోర్ట్జేకు చేదు అనుభవం.. బౌలింగ్ వేయకుండా అడ్డుకున్న అంపైర్లు Young Badoni finishes things off in style.@LucknowIPL win by 6 wickets and register their third win on the trot in #TATAIPL. Scorecard - https://t.co/RH4VDWYbeX #LSGvDC #TATAIPL pic.twitter.com/ZzgYMSxlsw — IndianPremierLeague (@IPL) April 7, 2022 -
150 కిమీ వేగంతో బంతి.. కళ్లు చెదిరే సిక్స్; డికాక్ ఊహించి ఉండడు
భారత గడ్డపై తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న అన్రిచ్ నోర్ట్జేకు డికాక్ చుక్కలు చూపించాడు. 150 కిమీ వేగంతో విసిరిన బంతిని డికాక్ కళ్లు చెదిరే సిక్స్ కొట్టడంతో ఆశ్చర్యపోవడం నోర్ట్జే వంతైంది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. 14వ ఓవర్ తొలి బంతిని నోర్ట్జే 150 కిమీ వేగంతో బీమర్ (హై ఫుల్‌టాస్ బంతి) వేశాడు. అసలు ఆడేందుకు కష్టంగా ఉండే బంతిని డికాక్ సూపర్‌గా హిట్ చేశాడు. తన మొహానికి డికాక్ బ్యాట్ అడ్డుపెట్టగానే బంతి బ్యాట్ ఎడ్జ్ తగిలి నేరుగా బౌండరీ అవతల పడింది. తాను కొట్టింది సిక్సర్ అని బహుశా డికాక్ కూడా ఊహించి ఉండడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత అంపైర్ దానిని బీమర్‌గా ప్రకటించి నోబాల్ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనూ నోర్ట్జే దీపక్ హుడాకు ఇదే తరహాలో బీమర్ వేయడంతో అంపైర్లు నోర్ట్జేను బౌలింగ్ చేయకుండా అడ్డుకున్నారు. డికాక్ కళ్లు చెదిరే సిక్స్ కోసం క్లిక్ చేయండి చదవండి: IPL 2022: నోర్ట్జేకు చేదు అనుభవం.. బౌలింగ్ వేయకుండా అడ్డుకున్న అంపైర్లు -
ఫామ్‌లో లేడనుకున్నాం.. దుమ్మురేపుతున్నాడు; టార్గెట్ అదేనా?
టీమిండియాతో మూడో వన్డేలో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ సూపర్ సెంచరీతో మెరిశాడు. వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు డికాక్ పెద్దగా ఫామ్‌లో కూడా లేడు. అంతకముందు జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడిన డికాక్ పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. దీంతో వన్డే, టి20 క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. అయితే టీమిండియాతో వన్డే సిరీస్ మొదలవగానే డికాక్ జూలు విదిల్చాడు. తొలి మ్యాచ్‌లో 27 పరుగులు చేసిన డికాక్.. రెండో వన్డేలో 66 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు.. 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక మూడో వన్డేలో టీమిండియాకు తన విశ్వరూపమే చూపెట్టాడు. 130 బంతుల్లో 124 పరుగులు చేసిన డికాక్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు.. 2 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో డికాక్ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.. ►డికాక్‌కు వన్డేల్లో ఇది 17వ సెంచరీ. హషీమ్ ఆమ్లా(23 సెంచరీలు), హర్షలే గిబ్స్(18 సెంచరీలు) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. తాజా సెంచరీతో డికాక్ మూడో స్థానంలో నిలిచాడు. ►టీమిండియాపై డికాక్‌కు ఇది ఆరో సెంచరీ కావడం విశేషం. వన్డేల్లో టీమిండియాపై అత్యధిక సెంచరీలు బాదిన విదేశీ ఆటగాడిగా డికాక్ రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య( ఏడు సెంచరీలు) ఉన్నాడు. ►డికాక్ తాను సాధించిన 17వ సెంచరీతో.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. కుమార సంగక్కర 23 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. ►టీమిండియాపై అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఆరు సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా డికాక్ నిలిచాడు. ఇంతకముందు సెహ్వాగ్ న్యూజిలాండ్‌పై 23 ఇన్నింగ్స్‌లో ఆరు సెంచరీలు సాధించాడు. ► టీమిండియాపై వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా డికాక్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్ మెగావేలంపై కన్నేసిన డికాక్.. అసలు ఫామ్‌లో లేని డికాక్ ఇప్పుడు మాత్రం దుమ్మురేపుతున్నాడు. తన ఇన్నింగ్స్‌లతో ఐపీఎల్ మెగా వేలంపై కన్నువేశాడు. ఇంతకముందు సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన డికాక్... ఇటీవలే తన పేరును రూ.2 కోట్లకు రిజిస్టర్ చేసుకున్నాడు. అతను ఉన్న ఫామ్ దృశ్యా వేలంలో మంచి ధరకే పలికే అవకాశం ఉంది. ఇక బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగావేలం జరగనుంది. ఇక ఐపీఎల్ 2022 కోసం భారత ఆటగాళ్ల మొదలు అసోసియేట్ టీమ్‌ల క్రికెటర్ల వరకు అందరూ వేలంలో తామూ భాగం అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వేలంలో అవకాశం దక్కించుకునే క్రమంలో తొలి అడుగుగా ఏకంగా 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవడం విశేషం. ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు కాగా, 318 మంది విదేశీయులు. ఇందులో గరిష్టంగా ఆస్ట్రేలియానుంచి 59 మంది క్రికెటర్లు ఉన్నారు. -
డికాక్ మెరుపువేగంతో.. పంత్ తేరుకునేలోపే
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను దురదృష్టం వెంటాడింది. ఆండిలే ఫెహ్లుక్వాయో బౌలింగ్‌లో పంత్ ఔటైనప్పటికి ఆ క్రెడిట్ మొత్తం కీపర్ క్వింటన్ డికాక్‌కే దక్కుతుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స 35వ ఓవర్ తొలి బంతిని ఫెహ్లుక్వాయో లెగ్‌సైడ్ వేయగా.. పంత్ దానిని ఫ్లిక్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే బంతి మిస్ అవడం.. పంత్ క్రీజులో నుంచి బయటికి రావడం ఒకేసారి జరిగిపోయింది. ఇక్కడే కీపర్ డికాక్ మెరుపు వేగంతో స్పందించాడు. పంత్ తేరుకునేలోపే సెకన్ల వ్యవధిలో డికాక్ బెయిల్స్ ఎగురగొట్టడం జరిగిపోయింది. దీనిపై లెగ్ అంపైర్ థర్డ్అంపైర్ను కోరగా.. బిగ్‌స్క్రీన్‌లో పంత్ కాలు గాల్లోనే ఉండడం స్పష్టంగా కనిపించడంతో ఔట్ అని తేలింది. దీంతో 16 పరుగులు చేసిన పంత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో పంత్ 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేయగలిగింది. శిఖర్ ధావన్(75), విరాట్ కోహ్లి(51), శార్ధూల్ ఠాకూర్(50 నాటౌట్) రాణించినప్పటికి వారి మెరుపులు సరిపోలేదు. దీనికి తోడూ మిగతా బ్యాట్స్‌మన్ విఫలం కావడంతో టీమిండియా పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, తబ్రైజ్ షంసీ, ఆండీ ఫెలుక్యావో తలా రెండు వికెట్లు తీశారు. Did you see that?👀 #SAvIND #BetwayODISeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/bWLdyNIySx — Cricket South Africa (@OfficialCSA) January 19, 2022 -
నాలుగేళ్ల తర్వాత అశ్విన్‌కు వికెట్; బుమ్రా 925 రోజుల నిరీక్షణకు తెర
టీమిండియా ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగేళ్ల తర్వాత వన్డేల్లో వికెట్ సాధించాడు. 2017లో వెస్టిండీస్‌తో చివరిసారి వన్డే ఆడిన అశ్విన్.. తాజాగా నాలుగేళ్ల తర్వాత సాతాఫ్రికాతో మ్యాచ్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడం ద్వారా వికెట్ సాధించాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ తొలి బంతిని అశ్విన్ రౌండ్ ది వికెట్ వేయగా.. డికాక్ కట్‌షాట్ ఆడాలని భావించాడు. అయితే గుడ్‌లెంగ్త్‌తో వచ్చిన బంతి డికాక్ బ్యాట్‌ను మిస్ అయి మిడిల్ స్టంప్‌ను ఎగురగొట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో డికాక్ 27 పరుగులు చేసి ఔటయ్యాడు. చదవండి: 'బులెట్ వేగం'తో మార్క్రమ్ను దెబ్బకొట్టిన వెంకటేశ్ అయ్యర్ 925 రోజుల నిరీక్షణకు తెర.. బుమ్రా పవర్ ప్లేలో ఎట్టకేలకు వికెట్ సాధించాడు. దాదాపు 925 రోజుల పాటు పవర్ ప్లేలో బుమ్రాకు వికెట్ దక్కలేదు. బుమ్రా చివరిసారి 2019 వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌ను పవర్‌ప్లేలో ఔట్ చేశాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో ఇన్నింగ్స్ 5వ ఓవర్లో జానేమన్ మలాన్‌ను ఔట్ చేయడం ద్వారా ఆ నిరీక్షణకు తెరపడింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా 41 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కెప్టెన్ బవుమా 93, డుసెన్ 71 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: షేన్ వార్న్ ఫిక్సింగ్ ఆరోపణలకు పాక్ మాజీ కెప్టెన్ కౌంటర్ 19 days into 2022, and it's already gotten me like#SAvIND #INDvSA #Ashwin pic.twitter.com/3YncjDmYfs — Oninthough (@theoninthough) January 19, 2022 -
Ind Vs Sa 1st ODI: భారీ స్కోరుకు అవకాశం.. టాస్ గెలిస్తే...
Ind Vs Sa Odi Series- 1st ODI: టెస్టు సిరీస్‌లో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో టీమిండియాతో వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా సన్నద్ధమవుతోంది. జనవరి 19న జరుగనున్న మొదటి మ్యాచ్‌కు ప్రధాన ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది. కాగా ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన సిరీస్‌లో పలువురు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారంతా పునరాగమనం చేస్తున్నారు. ఇక టీమిండియాతో సిరీస్ జరుగుతున్న సమయంలోనే టెస్టుల నుంచి అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించిన కీపర్ డి కాక్ వన్డేల కోసం పూర్తి సన్నద్ధతతో వచ్చాడు. సీనియర్లు ఒక్కసారిగా తప్పుకోవడంతో గతంతో పోలిస్తే దక్షిణాఫ్రికా కొంత బలహీనంగా కనిపిస్తున్నా... స్వదేశంలో ఆ జట్టు రికార్డు బాగుంది. పైగా టెస్టు సిరీస్‌లో టీమ్ కనబర్చిన పట్టుదల, పోరాటతత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పని భారం తగ్గించేందుకు రబడకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినివ్వగా, మార్కో జాన్సెన్ అరంగేట్రం చేయవచ్చు. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు బాగా అనుకూల మైదానం. బౌండరీలు చిన్నవి కాబట్టి భారీ స్కోరుకు అవకాశముంది. వర్షం సమస్య లేదు. టాస్ గెలిచిన జట్టు సహజంగానే బ్యాటింగ్ ఎంచుకుంటుంది. టీమిండియా వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా ప్రకటించిన జట్టు: తెంబా బవుమా (కెప్టెన్), కేశవ్ మహరాజ్ (వైస్ కెప్టెన్), క్వింటన్ డికాక్, జన్నెమాన్ మలన్, జుబేర్ హంజా, మార్కో జెన్సన్, సిసండా మగాలా, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, వేన్ పార్నెల్, ఆండైల్ ఫెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి, రాసి వాన్ డెర్ డస్సెన్, కైల్ వెర్రెన్ తుది జట్టు అంచనా దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డి కాక్, మలాన్, మార్క్రమ్, డర్ డసెన్, మిల్లర్, ఫెలుక్వాయో, ప్రిటోరియస్/లిండే, మార్కో జాన్సెన్, ఎన్గిడి, షంషి. చదవండి: IPL 2022 Auction: రాహుల్‌తో పాటు ఆసీస్ ఆటగాడు, రవి బిష్ణోయిని ఎంచుకున్న లక్నో.. అతడికి 15 కోట్లు! -
డికాక్ ఫ్యామిలిలోకి కియారా.. తండ్రి అయిన సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ తండ్రి అయ్యాడు. అతని భార్య సాశా గురువారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కూతురికి కియారా అని నామకరణం చేసారు డికాక్ దంపతులు. డికాక్.. తన కూతురుని గుండెలకు హత్తుకుని దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా, భార్య గర్భవతి కావడంతో, ఆమెతో గడిపేందుకు డికాక్ ఇటీవలే టెస్ట్ క్రికెటకు వీడ్కోలు పలికి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Quinton De Kock (@qdk_12) టీమిండియాతో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో పాల్గొన్న డికాక్.. ఆ మ్యాచ్ అనంతరం టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరిని షాక్‌కి గురి చేశాడు. మరోవైపు, భారత జట్టుతో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన దక్షిణాఫ్రికా జట్టులో డికాక్‌కి చోటు దక్కింది. చదవండి: జకోవిచ్‌పై మండిపడ్డ నదాల్.. టెన్నిస్ దిగ్గజాల మధ్య కోవిడ్ టీకా రచ్చ -
ఆ విషయం విని షాక్‌కు గురయ్యాను: దక్షిణాఫ్రికా హెడ్ కోచ్
టెస్ట్ సిరీస్‌లో భాగంగా జొహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. అయితే తొలి టెస్ట్‌లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికాకు క్వింటన్ డి కాక్ రూపంలో బిగ్ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. డికాక్ తన టెస్ట్ రిటైర్మెంట్ను ఆకస్మికంగా ప్రకటించి అందరనీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ విషయంపై దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ మార్క్ బౌచర్ తాజాగా స్పందించాడు. డికాక్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నట్లు తెలిపాడు. అయితే అతడు ఇంత త్వరగా రిటైర్ అవుతుడాని ఎవరూ ఊహించలేదని బౌచర్ పేర్కొన్నాడు. టెస్ట్ ఫార్మాట్లో డికాక్ అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడని అతడు ప్రశంసించాడు. "ఆ వయస్సులో డికాక్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎవరూ ఊహించ లేదు. ఇప్పటికీ మేము అదే షాక్‌లో ఉన్నాము. అతడి వ్యక్తిగత కారణాలను మేము గౌరవిస్తాము. మేము ఇప్పుడు సిరీస్ మధ్యలో ఉన్నాము. సిరీస్‌పై దృష్టిసారించాలి. డికాక్ స్ధానంలో వచ్చిన యువ ఆటగాళ్లపై దృష్టి పెట్టాలి. అద్భతమైన టెస్ట్ కెరీర్‌ను కలిగి ఉన్నాడు. డికాక్ స్ధానంలో కైల్ వెర్రెయిన్ జట్టులోకి రానున్నాడు. అతడు తన ఆటను మెరుగుపరుచుకున్నాడు. అతడికి తుది జట్టులో చోటు దక్కపోయిన చాలా కాలం నుంచి జట్టుతోనే ఉన్నాడు. కాబట్టి ఆ అనుభవంతో ముందుకు సాగుతాడని భావిస్తున్నాను" అని బౌచర్ పేర్కొన్నాడు. కాగా మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0తో భారత్ ముందుంజలో ఉంది. ఇక రెండో టెస్ట్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది. చదవండి: SA vs IND: ఇది గెలిస్తే... ప్రపంచాన్నే గెలిచినట్లు -
విదేశీ లీగ్‌ల కోసం రెండేసి నెలలు దూరంగా ఉంటారు.. కానీ.. టెస్టులు ఆడరా?
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తీరుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ విమర్శల వర్షం కురిపించాడు. లీగ్ మ్యాచ్‌ల కోసం నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండొచ్చు కానీ... దేశం కోసం ఆడలేవా అంటూ మండిపడ్డాడు. కాగా సెంచూరియన్‌లో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ప్రొటిస్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 113 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో తాను టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు డికాక్. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేందుకే రిటైర్మెంట్ తీసుకున్నట్లు 29 ఏళ్ల డికాక్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో డికాక్ ఆకస్మిక నిర్ణయం పట్ల సల్మాన్ భట్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు. ఇలాంటి నిర్ణయాలు సెలక్షన్ పాలసీ, కెప్టెన్ మైండ్‌సెట్‌ను ప్రభావితం చేస్తాయని విమర్శించాడు. ఈ మేరకు.. ‘‘ గత ఏడాదిన్నర కాలంగా క్వింటన్ డికాక్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. కెప్టెన్‌గా పాకిస్తాన్‌కు వచ్చాడు. ఆ తర్వాత ఆ బాధ్యతల్లో కొనసాగలేకపోయాడు. ఇప్పుడేమో ఒక టెస్టు ఆడిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇలాంటి ఆలోచనా విధానం, ప్రకటనలు జట్టులోని వాతావరణాన్ని నాశనం చేస్తాయి. సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయి’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక ఇటీవల కాలంలో రిటైర్మెంట్ డ్రామా ఎక్కువైందన్న సల్మాన్ భట్... ‘‘అకస్మాత్తుగా ఆటకు వీడ్కోలు పలకడం ఇటీవల ఫ్యాషన్ అయిపోయింది. విదేశీ లీగ్‌లలో ఆడేందుకు రెండేసి నెలల పాటు కుటుంబాలకు దూరంగా ఉన్నపుడు ఎలాంటి సమస్యలు ఎదురుకావడం లేదా? టెస్టు క్రికెట్ విషయంలో మాత్రమే ఇలా ఎందుకు? దేశం కోసం ఆడుతున్నపుడే అన్నీ గుర్తుకువస్తాయి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘కొంతమంది లీగ్ క్రికెట్ ఆడితే సరిపోతుంది అనుకుంటున్నారు. టెస్టులతో పనిలేదు అని భావిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెటర్లకు ఉండాల్సిన లక్షణం కాదిది. డికాక్ రిటైర్మెంట్ గురించి ఇంతకంటే మంచిగా మాట్లాడటం నా వల్ల కాదు’’ అంటూ సల్మాన్ క్రికెటర్ల తీరును విమర్శించాడు. చదవండి: అన్ని ఫార్మాట్లలోనూ రోహిత్ ‘హిట్’... అశూ, అక్షర్ కూడా అద్భుతం! -
భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం!
Quinton De Kock Retirement: దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌కు డికాక్ వీడ్కోలు పలికాడు. సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరగిన తొలి టెస్ట్ అనంతరం డికాక్ ఈ విషయాన్ని ప్రకటించాడు. డికాక్ రిటైర్మెంట్ విషయాన్ని క్రికెట్ సౌత్ ఆఫ్రికా అధికారంగా ధ్రువీకరించింది. సెంచూరియన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డి కాక్ 34 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేశాడు. కాగా మొదటి టెస్టులో ప్రోటీస్ 113 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు తెలిపాడు. "ఇది నేను అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు. సాషా, నేను మా మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించబోతున్నాము. నా జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని గురించి చాలా ఆలోచించాను. నా కుటుంబమే నాకు సర్వస్వం. మా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను" అని డికాక్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా తరపున 54 టెస్ట్‌లు ఆడిన క్వింటన్ డి కాక్ ఆరు సెంచరీలు, 22 అర్ధ సెంచరీలతో 3,300 పరుగులు చేశాడు. చదవండి: IND Vs SA: స్టన్నింగ్ విక్టరీ.. డ్యాన్స్‌లతో దుమ్మురేపిన టీమిండియా ఆటగాళ్లు -
Ind Vs Sa Test Series: ప్రొటిస్ జట్టుకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం
Ind Vs Sa Test Series: భారత్‌తో జరుగుతున్న దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ టెస్టు సిరీస్‌కు దూరం కానున్నాడు. అతడి భార్య త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో పితృత్వ సెలవు తీసుకోనున్నాడు. ఈ క్రమంలో టీమిండియాతో జరుగనున్న రెండో, మూడో టెస్టుకు డికాక్ అందుబాటులో ఉండటం లేదు. తొలుత రెండో టెస్టు ఆడాలని భావించిన డికాక్... తర్వాత తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. గర్భవతి అయిన భార్యకు ఎక్కువ సమయం కేటాయించాలని అతడు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో తొలి టెస్టు పూర్తైన వెంటనే జట్టును వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా డికాక్ వంటి స్టార్ బ్యాటర్ దూరం కావడం ప్రొటిస్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. ఇక అతడి స్థానంలో వికెట్ కీపర్లు కైల్ వెరెన్నె లేదంటే... రియాన్ రికెల్టన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక కోహ్లి సేనతో సెంచూరియన్ వేదికగా తొలి టెస్టులో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో డికాక్ 33 పరుగులు చేశాడు. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్, రహానే, శార్దూల్, షమీ వికెట్లు కూల్చడంలో భాగమయ్యాడు ఈ వికెట్ కీపర్. నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. చదవండి: ODI Series Cancelled: కరోనా కలకలం.. వన్డే సిరీస్ రద్దు Quinton De Kock: ఎంత ఔటైతే మాత్రం ఇంత కోపం అవసరమా డికాక్.. pic.twitter.com/DsqwN8BHZ5 — Addicric (@addicric) December 28, 2021 -
ఎంత ఔటైతే మాత్రం ఇంత కోపమా డికాక్..
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తుంది. టీమిండియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ప్రొటీస్‌ను దెబ్బ తీస్తున్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 132 పరుగులతో ఆడుతోంది. ఇప్పటికే ఐదు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా మరో 198 పరుగులు వెనుకబడి ఉంది. ఆటకు రెండు రోజులు సమయం ఉండడంతో వర్షం అంతరాయం కలిగించకపోతే మాత్రం టీమిండియాకు మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక మ్యాచ్‌లో తొలి నాలుగు వికెట్లు త్వరగా కోల్పోయిన తర్వాత డికాక్, బవుమాతో కలిసి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను కాసేపు నడిపించాడు. అయితే 34 పరుగులతో నిలదొక్కుకున్నట్లు కనిపించిన డికాక్‌ను శార్దూల్ ఠాకూర్ సూపర్ డెలివరీతో క్లీన్‌బౌల్డ్ చేశాడు. శార్దూల్ వేసిన గుడ్‌లెంగ్త్ డెలివరీ ఆఫ్‌స్టంప్ అవతల పడగా.. డికాక్ థర్డ్‌మన్ దిశగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి మిస్ అయి ఇన్సైడ్ ఎడ్జ్ అయి స్టంప్స్‌ను ఎగురగొట్టింది. దీంతో ఔటయ్యానన్న కోపంతో డికాక్ తన బ్యాట్‌తో వికెట్లను కొట్టాలనుకొని చివరి నిమిషంలో ఆగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. pic.twitter.com/DsqwN8BHZ5 — Addicric (@addicric) December 28, 2021 -
'లడ్డూలాంటి క్యాచ్ వదిలేశారు.. ఫలితం అనుభవించండి'
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టును టీమిండియా నిలకడగా ఆరంభించింది. భారత ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌లు ఆచితూచి బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. తొలి సెషన్లో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఒక వికెట్ కూడా కోల్పోకుండా లంచ్ విరామానికి వెళ్లిన టీమిండియా రెండో సెషన్లోనూ అదే జోరు కనబరుస్తుంది. ప్రస్తుతం 39 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 109 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ అర్థశతకం(56 పరుగులు బ్యాటింగ్), కేఎల్ రాహుల్ 43 బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. చదవండి: Cheteswar Pujara: అప్పుడు 'గోల్డెన్' రనౌట్.. ఇప్పుడు 'గోల్డెన్' డక్ అయితే 36 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మార్కో జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ నాలుగో బంతి మయాంక్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ కీపర్ డికాక్ వైపు పడింది. అయితే డికాక్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నప్పటికి చేతిలో నుంచి జారిపోయింది. ఆ పక్కనే ఉన్న డీన్ ఎల్గర్‌కు అవకాశమున్నప్పటికి వదిలేయడంతో మయాంక్ తప్పించుకున్నాడు. ఆ తర్వాత మయాంక్ అర్థ శతకం సాధించి ప్రస్తుతం నిలకడగా ఆడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ''లడ్డూలాంటి క్యాచ్‌ను వదిలేశారు.. ఫలితం అనుభవించండి'' అంటూ ఫన్నీ ట్వీట్ చేశాడు. #SAvsIND Quinton de Kock drops a regulation catch… #SouthAfrica #India pic.twitter.com/WszyWmDfz1 — 𝐅𝐚𝐢𝐳𝐞𝐥 𝐏𝐚𝐭𝐞𝐥 (@FaizelPatel143) December 26, 2021 -
IND Vs SA: దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ.. టెస్ట్‌లకు స్టార్ ప్లేయర్ దూరం
Quinton De Kock: టీమిండియాతో కీలక సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, వికెట్‌కీపర్ క్వింటన్ డికాక్ వ్యక్తిగత కారణాల చేత రెండు, మూడు టెస్ట్‌లకు దూరంగా ఉండనున్నాడని ఆ జట్టు సెలెక్షన్ కన్వీనర్ విక్టర్ పిట్సాంగ్ వెల్లడించాడు. జనవరిలో అతని భార్య సశా బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండడంతో డికాక్ పితృత్వపు సెలవులు తీసుకుంటున్నట్లు విక్టర్ ప్రకటించాడు. డికాక్ గైర్హాజరీలో కైల్ వెర్రిన్, ర్యాన్ రికెల్టన్లను వికెట్‌కీపింగ్ బాధ్యతల కోసం సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం టీమిండియా డిసెంబర్ 16న దక్షిణాఫ్రికాకు బయల్దేరనుంది. పర్యటనలో భాగంగా సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26-30 వరకు తొలి టెస్ట్, జొహన్నెస్‌బర్గ్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 3-7 వరకు రెండో టెస్ట్, కేప్‌టౌన్ వేదికగా జనవరి 11-15 వరకు మూడో టెస్ట్ జరగాల్సి ఉంది. చదవండి: ఆండ్రీ రసెల్ సునామీ ఇన్నింగ్స్.. సిక్సర్లతో విధ్వంసం -
IND Vs SA: వాళ్లిద్దరినీ త్వరగా ఔట్ చేస్తే.. భారత్‌దే విజయం!
South Africas batting is pretty vulnerable Karthik backs India to win: దక్షిణాఫ్రికా పర్యటనకు త్వరలో భారత్ వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో భారత వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ టెస్ట్ సిరీస్‌పై అసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ పర్యటనలో తొలి సారి దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని కార్తీక్ జోస్యం చెప్పాడు. టీమిండియా.. ఫాస్ట్ బౌలింగ్ లైనప్, పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కారణంగా టీమిండియా కచ్ఛింతంగా విజయం సాధిస్తుందని థీమా వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాపై విజయం సాధించడానికి భారత్‌కు ఇదే అత్యుత్తమ అవకాశం. ఎందకుంటే టీమిండియాకు ఫాస్ట్ బౌలింగ్ లైనప్, పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది. ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే.. బ్యాటింగ్ లైనప్ చాలా బలహీనంగా ఉంది. కానీ రబడ, నార్ట్జేలతో కూడిన అద్బుతమైన బౌలింగ్ విభాగం ఉంది. దక్షిణాఫ్రికా బౌలర్లను భారత్ ఎదుర్కుంటే చాలు. కాగా చివరిసారిగా 2018లో దక్షిణాఫ్రికాకు పర్యటనకు వెళ్లిన భారత్ ఒకే ఒకే టెస్ట్‌లో విజయం సాధించింది. ఇక దక్షిణాఫ్రికా బ్యాటింగ్ గురించి మాట్లాడూతూ.. "బ్యాటింగ్ లైనప్ చాలా బలహీనంగా ఉంది. ముఖ్యంగా క్వింటన్ డికాక్, టెంబా బవుమాపైనే జట్టు బ్యాటింగ్ ఆదారపడి ఉంది. వీరిద్దరనీ త్వరగా ఔట్ చేస్తే భారత్‌కు విజయం తిరిగి ఉండదు. అంతేకాకుండా కొంతమంది ఆటగాళ్లకి అంతర్జాతీయ స్ధాయిలో అంతగా ఆడిన అనుభవం లేదు. కాబట్టి భారత్ వంటి మేటి జట్టుపై రాణించడం అంత సులభంకాదు. కనుక దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ తొలి సారి సిరీస్ కైవసం చేసుకుంటుందని భావిస్తున్నాను "అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. కాగా డిసెంబర్26న సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. చదవండి: Pakistan Players Clash Video: డ్రెస్సింగ్‌రూంలో పాక్ ఆటగాళ్ల ‘గొడవ’.. బాబర్ ఆజం ప్రతీకారం! -
SA Vs SL: డికాక్ మోకాళ్లపై నిల్చున్నాడు.. ఇప్పుడైనా వదిలేయండి
Quinton De Kock Bend Knee Black Live Matters Moment.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా వికెట్ కీపర్క్వింటన్ డికాక్ శ్రీలంకతో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అతను బరిలో ఉన్నాడనే దానికంటే బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ ఉద్యమానికి మద్దతిస్తాడా లేదా అన్నదానిపై చాలా మందిలో ఆసక్తి నెలకొని ఉంది. కాగా డికాక్ ఈసారి మాత్రం బ్లాక్‌లైవ్స్ మ్యాటర్స్‌కు ఉద్యమానికి మద్దతిస్తూ మోకాళ్లపై నిల్చొని సంఘీభావం తెలిపాడు. దీంతో అతని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుంటే.. గిట్టనివాళ్లు మాత్రం డికాక్‌పై ట్రోల్స్ ఆపలేదు. అయితే తన తప్పు తెలుసుకొని డికాక్ సంఘీబావం తెలిపాడు.. ఇకనైనా అతన్ని వదిలేయండి అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: మోకాలిపై నిలబడకపోవడంపై క్షమాపణలు కోరిన డికాక్ ఇక వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ మూమెంట్‌కు మద్దతు ఇవ్వలేనంటూ ఆఖరి క్షణంలో జట్టు నుంచి తప్పుకొని అందర్ని ఆశ్చర్యపరిచాడు. అయితే డికాక్ తీరుపై సీఎస్ఏతో(క్రికెట్ సౌతాఫ్రికా అసోసియేషన్) పాటు అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒక దశలో డికాక్ దక్షిణాఫ్రికాకు ఆఖరి మ్యాచ్ ఆడేశాడంటూ ఊహగానాలు కూడా వచ్చాయి. కానీ సీఎస్ఏ అవన్నీ కొట్టి పారేసింది.. మద్దతివ్వాలా వద్దా అనేది అతనిష్టం. కానీ మా ఆదేశాలు దిక్కరించినందుకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై క్లారిటి ఉంది. సీఎస్ఏ చర్యలు తీసుకునేలోపే డికాక్ తన తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరుతూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. చదవండి: Quinton De Kock: మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు డికాక్ ఔట్.. కారణం United against racism: Quinton de Kock joins his South ... via @t20worldcup https://t.co/b5CS6RFIUL — varun seggari (@SeggariVarun) October 30, 2021 Quinton de Kock returns as he took the knee before Sri Lanka game #SlvsSA #BLM #quintondekock pic.twitter.com/9pcWtxGxZb — Anjana Kaluarachchi (@Anjana_CT) October 30, 2021 -
De Kock: తగ్గేదేలే అన్నాడు.. ఇప్పుడేమో దిగొచ్చాడు..!
Quinton De Kock Apologises For Refusing To Take Knee: ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా వేదికలపై ఆటగాళ్లు సంఘీభావం తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) సైతం మోకాలిపై కూర్చుని ఉద్యమానికి మద్దతు తెలపాల్సిందిగా ఆ దేశ ఆటగాళ్లను ఆదేశించింది. అయితే ఆ జట్టు వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మాత్రం ఇందుకు ససేమిరా అన్నాడు. ఏకంగా జట్టు నుంచే తప్పుకున్నాడు. అయితే, సదరు అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఎస్ఏ చివరి అవకాశం ఇవ్వడంతో తాజాగా అతను దిగొచ్చాడు. Quinton de Kock statement 📝 pic.twitter.com/Vtje9yUCO6— Cricket South Africa (@OfficialCSA) October 28, 2021 జట్టు సభ్యులకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా నిలబడడం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నానని, తదుపరి మ్యాచ్‌లో మోకాలిపై నిల్చొని ఉద్యమానికి మద్దతు తెలుపుతానని అన్నాడు. ఈ సున్నితమైన అంశాన్ని రాద్దాంతం చేయడం, ఎవరినీ అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చాడు. తన చర్యలు ఎవరినైనా బాధించి ఉంటే పెద్ద మనసుతో తనను క్షమించాలని కోరాడు. జట్టుతో చేరేందుకు తాను సుముఖంగా ఉన్నానని తెలిపాడు. కాగా, మొదట్లో ఈ అంశంపై స్పందించేందుకు కూడా ఇష్టపడని డికాక్.. ఓ దశలో కెరీర్‌ను అర్ధంతరంగా ముగించేందుకు సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. చదవండి: David Warner: మోకాలిపై కూర్చుంటాం... ఆ విషయం గురించి స్పందించలేను! -
David Warner: మోకాలిపై కూర్చుంటాం... ఆ విషయం గురించి స్పందించలేను!
David Warner Response On Quinton De Kock Sitting Out: ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సంఘీభావం ప్రకటిస్తుందని ఓపెనర్ డేవిడ్ వార్నర్ వెల్లడించాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆసీస్ ఆటగాళ్లందరూ మైదానంలో మోకాలిపై కూర్చొని మద్దతునిస్తారని అతను స్పష్టతనిచ్చాడు. ‘దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఇచ్చిన ఆదేశాలపై నేను స్పందించలేను. మేం మాత్రం మోకాలిపై కూర్చొని సంఘీభావం ప్రకటిస్తాం. దానికి మేం సిద్ధం’ అని వార్నర్ అన్నాడు. కాగా జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా వేదికలపై ఆటగాళ్లు సంఘీభావం తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు.. దక్షిణాఫ్రికా బోర్డు సైతం మోకాలిపై కూర్చుని ఉద్యమానికి మద్దతు పలకాల్సిందిగా ఆటగాళ్లకు ఆదేశాలు ఇచ్చింది. అయితే, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మాత్రం.. ఇందుకు అభ్యంతరం తెలిపాడు. అలా చేయనని చెబుతూ జట్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ నేపథ్యంలో డికాక్ నిర్ణయం గురించి వార్నర్‌ను ప్రశ్నించగా... ఈ మేరకు స్పందించాడు. చదవండి: NAM VS SCO: టి20 ప్రపంచకప్ చరిత్రలో క్రేజీ ఓవర్ అంటున్న ఫ్యాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Quinton De Kock: నేను అలా చేయలేను; అతడేం చిన్నపిల్లాడు కాదు: కెప్టెన్
Temba Bavuma On Quinton De Kock Refusal To Take Knee: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు జట్టు నుంచి తప్పుకొన్న క్వింటన్ డికాక్ నిర్ణయంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా స్పందించాడు. ‘‘మ్యాచ్‌కు కొన్ని గంటలముందు సీఎస్ఏ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. డికాక్ నిర్ణయం మాకూ ఆశ్చర్యం కలిగించింది. అతను చిన్నపిల్లాడు కాదు. తన నిర్ణయం తాను తీసుకోగలడు. దానికే కట్టుబడే ఉంటాడు. అతని నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. అతనిపై ఎలాంటి చర్య తీసుకుంటారనేది ఒక కెప్టెన్‌గా నేను ఇప్పుడే చెప్పలేను. దానిని నేను నిర్ణయించలేను. ప్రపంచకప్‌లో రాబోయే మ్యాచ్‌లపై కూడా మేం దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే ఒకటి మాత్రం నిజం. డికాక్ మాలో ఒకడు. అతనికి మా వైపు నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అండగా ఉంటాం. ఏదైనా అతను మాతో చర్చించవచ్చు. నాకు తెలిసి మేం సహచరులం దీనిపై మాట్లాడుకోగలం’’ అని బవుమా స్పష్టం చేశాడు. అసలేం జరిగిందంటే... జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ (బీఎల్ఎమ్) కోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా వేదికల్లో సంఘీభావం తెలుపుతున్న విషయం తెలిసిందే. ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) సైతం తమ ఆటగాళ్లకు ఇదే తరహా ఆదేశాలు ఇచ్చింది. అయితే, తాను ఈ ఆదేశాలను పాటించలేనంటూ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్.. మ్యాచ్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. శ్వేత జాతీయుడైన డికాక్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అవసరమైతే మ్యాచ్ ఆడను కానీ అలా మాత్రం చేయనంటూ అతను తన మాటపైనే నిలబడ్డాడు. టాస్ సమయంలో కెప్టెన్ బవుమా ‘వ్యక్తిగత కారణాలతో డికాక్ దూరమయ్యాడు’ అని ప్రకటించడంతో ఈ విషయం గురించి అందరికీ తెలిసింది. డికాక్ తన శ్వేత జాతి అహంకారాన్ని ప్రదర్శించాడని ఒకవైపు నుంచి విమర్శలు వస్తుండగా... అతడి ఇష్టానికి వదిలేయడమే సరైందని మరికొందరు డికాక్‌కు మద్దతుగా నిలిచారు. ఇక క్రికెట్ ప్రపంచంలో ఊహించని ఈ పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆటతో సంబంధం లేని అంశంలో తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రకటిస్తూ ప్రపంచకప్‌లాంటి మెగా ఈవెంట్లో ఒక ఆటగాడు మ్యాచ్‌కు దూరమయ్యేందుకు సిద్ధం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: T20 World Cup 2021 Pak Vs NZ: రెండు మేటి జట్లపై విజయాలు.. సెమీస్ దారిలో పాక్ .. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు డికాక్ ఔట్.. కారణం
Quinton De Kock Pulled Out Vs WI Match.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా వెస్డీండీస్తో మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా సిద్ధమైన వేళ మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు క్వింటన్ డికాక్ రూపంలో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌కు అతను దూరంగా ఉండనున్నాడని.. అతని స్థానంలో రీజా హెండ్రిక్స్ ఆడుతాడంటూ జట్టుకు కెప్టెన్ టెంబా బవుమా వెల్లడించాడు. అయితే డికాక్ వ్యక్తిగత కారణాల రిత్యా విండీస్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని బవుమా పేర్కొన్నప్పటికి అసలు కారణం వేరే ఉందని సమాచారం. చదవండి: T20 WC: చెత్త ప్రదర్శన.. ప్రపంచకప్ ఆడటానికి వచ్చారా.. టూరిస్ట్ వీసా మీద ఉన్నారా? బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ ఉద్యమానికి మద్దతుగా టి20 ప్రపంచకప్‌లో వివిధ జట్లు వివిధ పద్దతుల్లో మద్దతు తెలుపుతున్నాయి. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ఇకపై తాము ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో మొకాళ్లపై నిలబడి బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ మూమెంట్‌కు మద్దతు తెలపాలంటూ క్రికెట్ దక్షిణాఫ్రికా బోర్డు(సీఎస్ఏ) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విషయంలో విండీస్‌తో మ్యాచ్‌కు కొన్ని నిమిషాల ముందు సీఎస్ఏతో డికాక్ గొడవకు దిగినట్లు సమాచారం. బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ ఉద్యమానికి తాను వ్యతిరేకి కాదని.. కానీ మొకాళ్లపై కూర్చొని మద్దతు పలకలేనని తెలిపినట్లు సమాచారం. కేవలం ఈ కారణంతోనే డికాక్ కీలకమ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. అయితే డికాక్ మాత్రం అలాంటిదేం లేదని.. కొన్ని వ్యక్తిగత కారణాల రిత్యా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నానని.. అనవసరంగా దీన్ని పెద్ద విషయం చేయొద్దంటూ మీడియాను విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. చదవండి: T20 WC 2021 SA Vs WI: విండీస్ మూడో వికెట్ డౌన్.. సిమన్స్(16) ఔట్ 🚨 TEAM ANNOUNCEMENT 🇿🇦 There's one change as Reeza Hendricks comes in for Quinton de Kock 📝 Ball by Ball https://t.co/c1ztvrT95P#SAvWI #T20WorldCup #BePartOfIt pic.twitter.com/0blL4GviNO — Cricket South Africa (@OfficialCSA) October 26, 2021 -
AUS Vs SA: దురదృష్టం అంటే డికాక్‌దే..
Quinton De Kock Awkward Dismissal.. టి20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను దురదృష్టం వెంటాడింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 4వ ఓవర్ తొలి బంతిని డికాక్ డిఫెన్స్ చేయబోయి మిస్ అయ్యాడు. అయితే బంతి అతని ప్యాడ్స్‌కు తాకి క్రీజు మీద పడింది. దీంతో డికాక్ పరుగుకు యత్నించాడు. అయితే బంతి అనూహ్యంగా వెనక్కి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో డికాక్ అవుట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇక్కడ దురదృష్టమేమిటంటే డికాక్ అక్కడే ఉండి కూడా బంతిని అడ్డుకోలేకపోయాడు. తాను ఔటయ్యాననే బాధతో నిరాశగా క్రీజులోనే కాసేపు నిల్చొని పెవిలియన్ చేరాడు. ఇక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తడబడుతుంది. 6 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 29 పరుగులు మాత్రమే చేసింది. Calamity for South Africa as de Kock plays it onto his stumps via @t20worldcup https://t.co/v75y5QkujC — varun seggari (@SeggariVarun) October 23, 2021 -
AUS Vs SA: దక్షిణాఫ్రికాపై 5 వికెట్ల తేడాతో విజయం.. బోణీ కొట్టిన ఆస్ట్రేలియా
దక్షిణాఫ్రికాపై 5 వికెట్ల తేడాతో విజయం..భోణి కొట్టిన ఆస్ట్రేలియా టి20 ప్రపంచకప్ 2021లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం అందుకొని భోణి కొట్టింది. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరమైన దశలో మార్కస్ స్టోయినిస్(24 నాటౌట్), మాథ్యూ వేడ్(15 నాటౌట్) ఆసీస్‌ను గెలిపించారు. అంతకముందు స్టీవ్ స్మిత్ 35 పరుగులు పరుగులతో రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్ట్జే 2, షంసీ, కగిసో రబడ, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు. మ్యాక్స్‌వెల్ ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా ఆసీస్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ షమ్సీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి ఇంకా 38 పరుగులు కావాలి. అంతకముందు ఎయిడెన్ మక్రమ్ సూపర్ క్యాచ్‌కు స్టీవ్ స్మిత్(35)వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా 80 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. మిచెల్ మార్ష్(11) ఔట్ 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. 11 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో వాండర్ డుసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. స్మిత్ 30, మ్యాక్స్‌వెల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు డేవిడ్ వార్నర్ రబడ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆరోన్ ఫించ్ డకౌట్ 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 118/9.. ఆసీస్ టార్గెట్ 119 ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ బౌలర్ల దాటికి మక్రమ్(40) మినహా ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో ఐదుగురు బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ తలా రెండు వికెట్లు తీయగా.. మ్యాక్స్‌వెల్, కమిన్స్ చెరో వికెట్ తీశారు. ఎనిమిదో వికెట్ డౌన్.. దక్షిణాఫ్రికా 98/8 మక్రమ్(40) భారీ షాట్‌కు యత్నించి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 98 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది. దక్షిణాఫ్రికా దారుణ ఆటతీరు కనబరుస్తుంది. ఆసీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు పరుగులు చేయడంలో నానా కష్టాలు పడుతున్న దక్షిణాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోతూ వస్తుంది. తాజాగా కేశవ్ మహరాజ్(0) కమిన్స్ బౌలింగ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో దక్షిణాఫ్రికా 83 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆసీస్ బౌలర్ల ప్రతాపం.. ఆరో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా ఆసీస్ బౌలర్లు తమ ప్రతాపం చూపిస్తుండడంతో దక్షిణాఫ్రికా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. తాజాగా 1 పరుగు చేసిన ప్రిటోరియస్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అంతకముందు 16 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 14 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. 13 ఓవర్లలో దక్షిణాఫ్రికా 78/4 13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. మక్రమ్ 28, డేవిడ్ మిల్లర్ 14 పరుగులతో ఆడుతున్నారు. 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా 59/4 10 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 5, ఎయిడెన్ మక్రమ్ 19 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 13 పరుగులు చేసిన క్లాసెన్ కమిన్స్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డికాక్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. తాజాగా డికాక్(7) దురదృష్టవశాత్తూ బౌల్డ్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రస్తుతం 5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 23 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వాండర్ డుసెన్(2) వేడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు పార్ట్‌టైమ్ బౌలర్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో కెప్టెన్ బవుమా(12) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. డికాక్ 2, మక్రమ్ 1 పరుగుతో ఆడుతున్నారు. అబుదాబి: టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా నేటి నుంచి సూపర్ 12 దశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. సుదీర్ఘ కాలంపాటు క్రికెట్‌ను శాసించినా టి20 ప్రపంచకప్ మాత్రం ఆస్ట్రేలియా జట్టుకు అందని ద్రాక్షే అయింది. ఆరు టోర్నీలను చూస్తే 2010లో ఫైనల్ చేరడం మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ లేదు. ప్రస్తుత టీమ్‌లో ఓపెనర్లు వార్నర్, ఫించ్ పేలవ ఫామ్‌లో ఉండటం కలవరపెడుతుండగా... మిడిలార్డర్లో మ్యాక్స్‌వెల్, స్మిత్, స్టొయినిస్‌లను జట్టు నమ్ముకుంది. మరోవైపు స్టార్లతో నిండి ఉన్నప్పుడు కూడా దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ప్రపంచకప్‌లో ఫైనల్ చేరలేదు. ఇప్పుడు పెద్దగా అనుభవంలేని ఆటగాళ్లు ఎక్కువ మందితో కూడిన టీమ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడే అవకాశం ఉండటం సానుకూలాంశం. ఇక ముఖాముఖి పోరులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య 21 టి20 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో 13 ఆస్ట్రేలియా.. 8 దక్షిణాఫ్రికా గెలిచింది. ఇక టి20 ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా 29 మ్యాచ్‌ల్లో 16 విజయాలు.. 13 ఓటములు చవిచూసింది. ఇక దక్షిణాఫ్రికా టి20 ప్రపంచకప్‌లలో 30 మ్యాచ్‌ల్లో 18 గెలిచి.. 12 ఓడింది. దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, రాసీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహారాజ్, కాగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే, తబ్రేజ్ షమ్సీ ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ -
డికాక్ మెరుపులు.. 10 వికెట్లతో విజయం; దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్
కొలంబో: శ్రీలంకతో జరిగిన చివరిదైన మూడో టి20లో దక్షిణాఫ్రికా 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది. దాంతో సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 120 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు), చమిక కరుణరత్నే (19 బంతుల్లో 24 నాటౌట్; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. జార్న్ ఫోర్చూన్, రబడ చెరో రెండు వికెట్లు తీశారు. చదవండి: అక్టోబర్ 17న రెండు ఐపీఎల్ కొత్త జట్లకు వేలం? ఛేదనలో సఫారీ జట్టు 14.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు డికాక్ (46 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు), రీజా హెండ్రిక్స్ (42 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అజేయమైన తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును డికాక్ అందుకున్నాడు. చదవండి: నాడు కవ్వించిన కోహ్లి, బ్యాట్‌తో జవాబిచ్చి.. టాప్-5 ఇన్నింగ్స్! -
డికాక్ మెరుపులు.. ఐదు బంతులు ఉండగానే విజయం
సౌతాంప్టన్: హండ్రెడ్ మెన్స్ బాల్ కాంపిటీషన్లో భాగంగా శనివారం సౌతాంప్టన్ వేదికగా నార్తన్ సూపర్‌చార్జర్స్, సదరన్ బ్రేవ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ ఆటగాడు క్వింటన్ డికాక్ బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు నిలిచి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. (45 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 72 నాటౌట్) పరుగులు చేసిన డికాక్ ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే విజాయాన్ని అందించాడు. తన సహచరులంతా తక్కువ స్కోరుకే వెనుదిరుగుతున్నా డికాక్ మాత్రం ఎక్కడా రన్‌రేట్ తగ్గకుండా బౌండరీల వర్షం కురిపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన నార్తన్ సూపర్‌చార్జర్స్ 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. డేన్ విలాస్ 35 పరుగులతో టాప్ స్కోరరగా నిలవగా.. క్రిస్ లిన్ 26, విల్లీ 24 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ 95 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో సదరన్ బ్రేవ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. అయితే వారి రన్‌రేట్ మైనస్‌లో ఉన్నప్పటికీ 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు.. రెండు ఓటములతో నిలిచి టాప్ 2కు చేరింది. -
'ఫుల్ ఎంజాయ్ చేశా.. మిస్ యూ ముంబై ఇండియన్స్'
ముంబై: దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా కరోనా మహమ్మారి కారణంగా బీసీసీఐ ఐపీఎల్ సీజన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో డికాక్ తన స్వంత దేశానికి వెళ్లిపోయాడు. కాగా ఐపీఎల్ ఆడేందుకు వచ్చిన డికాక్‌తో పాటు అతని భార్య షాషా హర్లీ కూడా వచ్చింది. ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లు జరిగిన ప్రతీసారి హాజరై వారిని ఉత్సాహపరుస్తూ.. ఇతర క్రికెటర్ల భార్యలు, ప్రియురాళ్లతో కలిసి తన ఆనందాన్ని షేర్ చేసుకుంది. అయితే కరోనా కారణంగా లీగ్ మధ్యలోనే రద్దు కావడంతో తన భర్తతో కలిసి స్వదేశానికి వెళ్లిపోయిన షాషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'మిస్ యూ ముంబై ఇండియన్స్' అంటూ రాసుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. ''ఐపీఎల్‌ను ఇంత త్వరగా వీడాల్సి వస్తుందని ఊహించలేదు. కానీ ఐపీఎల్ జరిగినన్ని రోజులు ముంబై ఇండియన్స్ ఫ్యామిలీతో బాగా కలిసిపోయా.. ముఖ్యంగా స్పెషల్ లేడీస్.. ప్రెండ్స్‌ను చాలా మిస్సవుతున్నా. కానీ కరోనా కారణంగా అర్థంతరంగా వారిని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మీరంతా ఇంట్లోనే ఉంటూ మాస్క్‌లు ధరించి సురక్షింతగా ఉండండి. మనం మళ్లీ కచ్చితంగా మీటవుదాం.'' అని రాసుకొచ్చింది. ఇక డికాక్ ఈ సీజన్లో మొదట విఫలమైన ఆ తర్వాత ఫామ్ అందుకొని మంచి ప్రదర్శన కనబరిచాడు. డికాక్ ఆరు మ్యాచ్‌లాడి 155 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు ఐపీఎల్లో 72 మ్యాచ్‌లాడిన డికాక్ 2114 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 15 అర్థ సెంచరీలు ఉన్నాయి. చదవండి: పృథ్వీ షా ముందు బరువు తగ్గు.. ఆ తర్వాత చూద్దాం! View this post on Instagram A post shared by Sasha De Kock (@sashadekock) -
'అలా చూసుకుంటే డికాక్‌ను తీసేయాల్సిందే'
ఢిల్లీ: రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కు ముంబై తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే ఇషాన్ కిషన్‌ను పక్కకు తప్పించడంపై విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా తప్పబట్టాడు. బ్యటింగ్ సరిగా లేదని ఇషాన్‌ను తీసేస్తే.. డికాక్‌ను కూడా తీసేయాల్సిందే అని పేర్కొన్నాడు. స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో లారా మాట్లాడుతూ.. '' ఇషాన్ కిషన్‌ను రాజస్తాన్‌తో మ్యాచ్‌కు పక్కకు తప్పించడం ఆశ్చర్యపరిచింది. అతనిలో మంచి హిట్టర్ దాగున్నాడు. రానున్న మ్యాచ్‌ల్లో అతను మ్యాచ్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెపాక్ పిచ్‌లపై ఇషాన్ దారుణ ప్రదర్శన కనబరిచాడని జట్టులో నుంచి తొలిగించారంటే సమంజసం కాదు. అలా చూసుకుంటే క్వింటన్ డికాక్‌ను కూడా తొలగించాల్సిందే. Courtesy: IPL Twitter అతను నాలుగు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 2,40,2,3 పరుగులతో మొత్తం 47 పరుగులు మాత్రమే చేశాడు. డికాక్ స్థానంలో క్రిస్ లిన్‌కు అవకాశం ఇస్తే బాగుండేది. డికాక్ గైర్హాజరీలో తొలి మ్యా,చ్ ఆడిన లిన్ 49 పరుగులతో ఆకట్టుకున్నాడు. కానీ తర్వాతి మ్యాచ్‌ల్లో అతనికి అవకాశాలు ఇవ్వలేదు. వరుసగా విఫలమవుతూ వస్తున్న డికాక్‌ను ఆడిస్తూనే ఉన్నారు. ఇషాన్ కిషన్ విషయంలో ముంబై ఇండియన్స్ వ్యవహరించిన తీరు తప్పు '' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇషాన్ కిషన్ ఈ సీజన్లో ముంబై తరపున ఐదు మ్యాచ్‌లాడి 14.60 సగటుతో 73 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఇషాన్ కిషన్ మాత్రమే కాదు ముంబై మిడిలార్డర్ అనుకున్నంత గొప్పగా ఏం లేదు. మిడిలార్డర్ బలం లేకనే ముంబై ఓటములను కొని తెచ్చకుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 2 గెలిచి.. మూడింట ఓడింది. ఇక రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 8 ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. డికాక్ 35, సూర్యకుమార్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్ 42 పరుగలతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బట్లర్ 41, దూబే 35, జైస్వాల్ 32 పరుగులు చేశారు. చదవండి: 'చహర్ ఇదేం బాలేదు.. పాపం జైస్వాల్‌ను చూడు' 'కెప్టెన్సీ అతనికి కొత్త.. నా సలహాలు ఎప్పుడు ఉంటాయి' -
డీకాక్‌ను వేసుకుంటారా.. లిన్‌కే చాన్స్ ఇస్తారా?
చెన్నై: ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు ఓపెనర్ క్వింటాన్ డీకాక్ ఆడలేదు. అతను క్వారంటైన్లో ఉండటంతో ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కలేదు. కాగా, మంగళవారం(ఏప్రిల్ 13వ తేదీ) కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఆడే మ్యాచ్‌లో డీకాక్ అవకాశం కల్పించే ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని పరోక్షంగా ధృవీకరించాడు ముంబై ఇండియన్స్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్‌ఖాన్. వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జహీర్ మాట్లాడుతూ.. ‘డీకాక్ క్వారంటైన్ పూర్తయ్యింది. నిన్న నెట్ సెషన్లో కూడా పాల్గొన్నాడు. రేపటి మ్యాచ్ సెలక్షన్‌కు డీకాక్ అందుబాటులోకి వచ్చాడు’ అని తెలిపాడు. ఆర్సీబీతో జరిగిన ఈ సీజన్ ఆరంభపు మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో రోహిత్‌కు జతగా క్రిస్ లిన్ ఓపెనర్‌గా వచ్చాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు సాధించి తన అవకాశాన్ని వినియోగించుకున్నాడు లిన్. టీ20 ఫార్మాట్ అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్‌గా పేరొందని లిన్.. రేపటి మ్యాచ్ తుది జట్టులో ఉంటాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ డీకాక్ అందుబాటులోకి రావడంతో లిన్‌కు విశ్రాంతి ఇవ్వొచ్చు. ముంబై జట్టు బ్యాటింగ్ బలమంతా హార్డ్ హిట్టర్లే కాబట్టే లిన్ కంటే డీకాక్ వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపే అవకాశం ఉంది. -
ఒక ఓపెనర్‌కు రెస్ట్.. మరొక ఓపెనర్ క్వారంటైన్లో
చెన్నై: ఈ ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్-ఆర్సీబీలు తలపడుతుండగా ఇరుజట్లలో ఇద్దరు కీలక ఆటగాళ్లు మిస్సయ్యారు. వారిద్దరూ ఆయా జట్లలో ఓపెనర్లగా కీలక పాత్ర పోషించినవారే. ఒకరు ముంబై ఇండియన్స్ ఆటగాడు క్వింటాన్ డీకాక్ అయితే మరొకరు ఆర్సీబీ ప్లేయర్ దేవదత్ పడిక్కల్. ఇటీవల కరోనా బారిన పడ్డ దేవదత్ పడిక్కల్‌కు విశ్రాంతి ఇస్తూ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకోగా, డీకాక్ ఇంకా క్వారంటైన్లో ఉన్నాడు. దేవదత్ పడిక్కల్‌కు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో తొలి మ్యాచ్ తుది జట్టులో అవకాశం దక్కలేదని ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్కు వచ్చిన క్రమంలో స్పష్టం చేశాడు. తాము ఆడే రెండో గేమ్ నాటికి పడిక్కల్ అందుబాటులోకి వస్తాడని కోహ్లి తెలిపాడు. దాంతో రజత్ పాటిదార్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. ఇతను కోహ్లితో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇక డీకాక్ ఇంకా క్వారంటైన్లో ఉన్నాడు. దాంతో ముంబై తరఫున అరంగేట్రం చేసిన క్రిస్ లిన్ ఓపెనర్‌గా దిగాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో జాన్సెన్ కూడా ముంబై తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి ముందుగా ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. -
వివాదాస్పద రనౌట్ దుమారం: ‘డీకాక్ తప్పేమీ లేదు’
జొహన్నెస్‌బర్గ్: ఆటల్లో క్రీడాస్ఫూర్తి అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా క్రికెట్లో దీని పాలు ఎక్కువే! అందుకే దీనిని జెంటిల్మెన్ గేమ్ అంటారు. ఆటలో ఏ జట్టుకైనా గెలుపోటములు సహజం. కానీ మైదానంలో ఆటగాళ్లు ఎలా ప్రవర్తించారనేది చాలా ముఖ్యం. అందుకు సంబంధించి ‘ఫెయిర్ ప్లే’ నియమ నిబంధనలూ ఉన్నాయి. అయితే, తాజాగా పాకిస్థాన్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓపెనర్ ఫకర్ జమాన్ (193; 155 బంతుల్లో 18x4, 10x6) ను రనౌట్ చేసిన విధానం వివాదాస్పదంగా మారింది. ఈ రనౌట్ కు సంబంధించి డీకాక్ చేసింది గేమ్ స్పిరిట్‌కు విరుద్ధమని పాక్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇదే విషయంపై తాజాగా ఫకర్ జమాన్ స్పందించాడు. నేనే మరింత చురుగ్గా వ్యవహరించుండాలి దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో తన రనౌట్ బాధ్యతను ఫఖర్ జమానే తీసుకున్నాడు. ‘ఆ సమయంలో తానే మరింత చురుగ్గా వ్యవహరించి ఉండాల్సింది. ఇందులో వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ తప్పు లేదు. హరిస్ రౌఫ్ క్రీజ్ నుంచి కొంచెం ఆలస్యంగా పరుగు ప్రారంభించాడు, అందువల్ల అతను ఇబ్బందుల్లో పడతాడని నేను భావించాను. ఈ క్రమంలో నా దృష్టి కొంచెం మళ్లింది. కాబట్టి ఇందులో డికాక్ తప్పుందని నేను అనుకోవడంలేదు’అని జమాన్ పేర్కొన్నాడు. ఇక రనౌట్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో మార్క్రమ్ త్రో చేస్తున్న సమయంలో డీకాక్ చేసిన సైగలతో బంతి తను పరుగెడుతున్న వైపు రావడం లేదని భావించిన జమాన్ వేగాన్ని తగ్గించాడు. కాని బంతి అనూహ్యంగా అతని ఎండ్ వికెట్లకే తగిలి ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా రెండో వన్డేలో 342 పరుగులు చేసిన పాకిస్థాన్‌కు చివరి ఓవర్లో 31 పరుగులు అవసరం. జమాన్ రనౌట్ అయిన తరువాత, పాక్ 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అసలు చట్టం ఏం చెప్తోంది రూల్ 41.5.1 ప్రకారం స్ట్రైకర్ బంతిని అందుకున్న తర్వాత బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకోవడం, ఏ ఫీల్డర్ అయినా మాటలు లేదా తమ చర్యల ద్వారా ఉద్దేశపూర్వకంగా బ్యాట్స్‌మన్‌ను దృష్టి మరల్చకూడదని పేర్కొటోంది. ( చదవండి: పవర్ఫుల్ షాట్.. కెమెరానే పగిలిపోయింది! ) #fakharzaman For the ones justifying. he clearly deceived fakhar zaman by his gesture and he unintentionally looked behind and hence slowed himself down. this is clear cheating. fake fielding. against the rules. 👎#fakharzaman #PakvRSA pic.twitter.com/qqNm5oKo8p — Pak Warrior 🇵🇰🇹🇷🇵🇰🇹🇷 (@MUxama3) April 4, 2021 -
14 ఏళ్ల తర్వాత...
ఇస్లామాబాద్: దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై దక్షిణాఫ్రికా జట్టు మళ్లీ కాలు మోపింది. పాకిస్తాన్‌తో రెండు టెస్టులు, మూడు టి20లు ఆడేందుకు క్వింటన్ డికాక్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు శనివారం కరాచీలో అడుగు పెట్టింది. చివరిసారిగా పాకిస్తాన్ వేదికగా ఈ రెండు జట్లు 2007లో టెస్టు సిరీస్ ఆడగా... దక్షిణాఫ్రికా 1–0తో సిరీస్ నెగ్గింది. అనంతరం 2009లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో పాక్‌లో క్రికెట్ ఆడేందుకు ఇతర జట్లు విముఖత చూపాయి. దాంతో కొన్ని సంవత్సరాలపాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా సిరీస్‌లను నిర్వహించింది. అక్కడ పాకిస్తాన్... దక్షిణాఫ్రికాతో రెండు పర్యాయాలు (2010, 2013) టెస్టు సిరీస్ ఆడటం విశేషం. ప్రస్తుత పర్యటనలో భాగంగా తొలి టెస్టు కరాచీ వేదికగా ఈ నెల 26–30 మధ్య... రెండో టెస్టు రావల్పిండిలో ఫిబ్రవరి 4–8 మధ్య జరగనున్నాయి. టి20 సిరీస్‌కు లాహోర్ ఆతిథ్యమివ్వనుంది. ఫిబ్రవరి 11, 13, 14 తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి. -
మీ ఆప్షన్ ఏది.. ఆరు సిక్స్‌లా.. సెంచరీనా?
దుబాయ్: ప్రస్తుత ఐపీఎల్లో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, క్వింటాన్ డీకాక్‌లు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్‌లు చెలరేగుతుంటే, బ్యాటింగ్‌లో డీకాక్ సత్తాచాటుతున్నాడు. ఈ సీజన్లో డీకాక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. చివరి ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇందులో మూడు వరుస హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో డీకాక్(53; 43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించి ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. 2010లో ఈ ఫీట్‌ను సచిన్ టెండూల్కర్ నమోదు చేయగా, ఆ తర్వాత మరో పదేళ్లకు ముంబై తరఫున ఆ ఘనతను డీకాక్ నమోదు చేశాడు. (గంభీర్.. ఇప్పుడేమంటావ్?) కాగా, నెటిజన్లతో ఫ్రాంచైజీలు, క్రికెటర్లు ఇంటరాక్ట్ అవుతూ మరింత మజాను అందించడానికి సోషల్ మీడియా గేమ్‌ను నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా క్వింటాన్ డీకాక్ చెప్పిన పలు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్‌ను ముంబై ఇండియన్స్ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఇందులో మీకు బుమ్రాను ఎదుర్కోవడం కష్టమా.. బౌల్ట్‌ను ఎదుర్కోవడం కష్టమా? అనే ప్రశ్న దగ్గర్నుంచీ ఒక ఓవర్లలో ఆరు సిక్స్‌లు కొట్టడం ఈజీనా.. సెంచరీ చేయడం ఈజీనా అనే ప్రశ్నలు ఉన్నాయి. పేసర్లలో మీకు బుమ్రా బౌలింగ్ కష్టమా.. బౌల్ట్ బౌలింగ్ కష్టమా అంటే బుమ్రాను ఎంచుకున్న డీకాక్.. ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టడం కంటే సెంచరీ చేయడం వైపే వెళతానని సమాధానం చెప్పాడు. ఇక గ్లౌజ్‌లు లేకుండా బ్యాటింగ్ చేస్తారా లేక ప్యాడ్లు లేకుండా బ్యాటింగ్ చేస్తారా అనే దానికి రెండో ఆప్షన్ ఎంచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకూ 20 సెంచరీలు సాధించిన డీకాక్.. కొన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చాడు. ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో ఎదురైన ప్రశ్నలకు ఏదో సమాధానం చెప్పామన్నట్లు కాకుండా కాస్త ఆలోచించి మరీ ఆప్షన్లు ఎంచుకున్నాడు డీకాక్. ⚡️ Boult or Bumrah 💥 - Who is tougher to face? Quinny reveals!#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @QuinnyDeKock69 pic.twitter.com/upjb42Hk75 — Mumbai Indians (@mipaltan) October 21, 2020 -
అప్పుడు సచిన్.. ఇప్పుడు డీకాక్
దుబాయ్: కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 177 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ఆదిలోనే రోహిత్ శర్మ(9), సూర్యకుమార్ యాదవ్(0) వికెట్లను కోల్పోయింది. అర్షదీప్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతికి రోహిత్ ఔట్ కాగా, షమీ వేసిన నాల్గో ఓవర్ మూడో బంతికి సూర్యకుమార్ డకౌట్ అయ్యాడు. ఇక ఇషాన్ కిషన్(7) కూడా నిరాశపరిచాడు. డీకాక్(53; 43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)లకు జతగా కృనాల్ పాండ్యా(34; 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. హార్దిక్ పాండ్యా(8) విఫలం కాగా, చివర్లో పొలార్డ్(34 నాటౌట్; 12 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు), కౌల్టర్ నైల్(24 నాటౌట్; 12 బంతుల్లో 4 ఫోర్లు)లు బ్యాట్ ఝుళిపించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 176 పరుగులు చేసింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, అర్షదీప్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, క్రిస్ జోర్డాన్, రవి బిష్నోయ్‌లు చెరో వికెట్ తీశారు. సచిన్ తర్వాత డీకాక్ ఈ సీజన్లో డీకాక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. చివరి ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇందులో మూడు వరుస హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు కేకేఆర్‌పై 78 పరుగులు సాధించిన డీకాక్.. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 53 పరుగులు చేశాడు. ఫలితంగా ముంబై ఇండియన్స్ తరఫున వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. 2010లో ఈ ఫీట్‌ను సచిన్ టెండూల్కర్ నమోదు చేయగా, ఆ తర్వాత మరో పదేళ్లకు ముంబై తరఫున ఆ ఘనతను డీకాక్ నమోదు చేశాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో డీకాక్ 67 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. -
డీకాక్ డగౌట్ వైపు పరుగు.. రోహిత్ నవ్వులు!
అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 149 పరుగుల టార్గెట్‌ను ముంబై 16.5 ఓవర్లలోనే కొట్టేసింది. డీకాక్(78 నాటౌట్; 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో ముంబై సునాయాసంగా గెలుపొందింది. వన్‌సైడ్ వార్ అన్నట్లు ముంబై రెచ్చిపోయి ఆడింది. ఇది ముంబైకు ఆరో విజయం. ఫలితంగా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు వచ్చేసింది. ఇక కేకేఆర్‌కు నాల్గో ఓటమి. ఈ సీజన్లో కేకేఆర్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబైనే విజయం సాధించింది. మరొకవైపు ఇరుజట్లు తలపడిన చివరి 12 మ్యాచ్‌ల్లో 11 సార్లు ముంబైనే విజయం వరించడం విశేషం. ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. క్వింటాన్ డీకాక్ ట్రెయినింగ్ ప్యాంట్‌తోనే సహచర ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించడానికి సిద్ధమయ్యాడు. దాన్ని సహచర ముంబై ఆటగాళ్లు గుర్తించి వెనకాల వచ్చి చెప్పడంతో డీకాక్ మళ్లీ డగౌట్ వైపు పరుగు తీశాడు. అప్పటికి డీకాక్ బ్యాట్ పట్టుకుని సగానికి పైగా దూరం వచ్చేశాడు. అసలు విషయం తెలుసుకుని అయోమయానికి గురైన డీకాక్ ప్యాంట్ మార్చుకోవడానికి మళ్లీ వెనక్కి వెళ్లబోతుండగా రోహిత్ ఆపేశాడు. ప్యాంట్‌పై వెనకాల ఉన్న ఆరెంజ్ కలర్‌ను కవర్ చేస్తే సరిపోతుందని చెబితే డీకాక్ ఆగిపోయాడు.(‘వైడ్ బాల్’ వివాదంపై భజ్జీ ఘాటు రియాక్షన్) దాంతో జెర్సీని కిందకి లాగేసుకుని ఆ ఆరెంజ్ కలర్ కనబడకుండా చేశాడు. అయితే ఇది రోహిత్‌కు విపరీతమైన నవ్వు తెప్పించింది. క్రీజ్‌లోకి వచ్చేవరకూ రోహిత్ అలా నవ్వుతూనే ఉన్నాడు. ఈ విషయాన్ని అంపైర్ సైతం అడగడంతో రోహిత్ ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పాడు. దానికి అంపైర్ కూడా నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. నిన్న మ్యాచ్ చూసే క్రమంలో చాలామంది అభిమానులకు రోహిత్ నవ్వు ఒక్కటే అర్థమైంది. రోహిత్ ఎందుకు అంతలా నవ్వుతున్నాడు అని తలలు పట్టుకున్నారు. కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో అసలు విషయం తెలిసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 149 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(39 నాటౌట్; 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్యాట్ కమిన్స్(53 నాటౌట్; 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు ఆకట్టుకోవడంతో కేకేఆర్ ఈ మాత్రం స్కోరును బోర్డుపై ఉంచకల్గింది. ప్రధానంగా కమిన్స్ మెరుపులతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరును చేయకల్గింది. pic.twitter.com/jRM2SJZGNU — Simran (@CowCorner9) October 17, 2020 -
దక్షిణాఫ్రికా ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా డికాక్
జొహాన్నెస్‌బర్గ్: క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) వార్షిక అవార్డుల్లో సఫారీ జట్టు వన్డే, టి20 జట్టు కెప్టెన్ క్వింటన్ డికాక్ రెండు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నాడు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో పురుషుల విభాగంలో డికాక్, మహిళల కేటగిరీలో లారా వోల్వార్ట్ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకున్నారు. తన ఎనిమిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో డికాక్ ఇప్పటివరకు 47 టెస్టుల్లో, 121 వన్డేల్లో, 44 టి20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు డికాక్ కెప్టెన్సీలో ఎనిమిది వన్డేలు ఆడిన దక్షిణాఫ్రికా నాలుగింటిలో గెలిచి, మూడింటిలో ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. టి20ల్లో డికాక్ నేతృత్వంలో దక్షిణాఫ్రికా ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. మూడింటిలో గెలిచి, ఐదింటిలో ఓటమి చవిచూసింది. ఈ అవార్డును రెండోసారి గెలుచుకున్న డికాక్ (2017)... జాక్వెస్ కలిస్ (2004, 2011), మఖాయ ఎన్తిని (2005, 2006), హషీమ్ ఆమ్లా (2010, 2013), ఏబీ డివిలియర్స్ (2014, 2015), కగిసో రబడ (2016, 2018)ల సరసన చేరాడు. దీంతోపాటు 27 ఏళ్ల వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ డికాక్ ‘టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాన్నీ సొంతం చేసుకున్నాడు. పేసర్ లుంగీ ఇన్‌గిడి ‘వన్డే, టి20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను గెలుచుకోగా... డేవిడ్ మిల్లర్ ‘ఫేవరెట్ ప్లేయర్’గా నిలిచాడు. -
ఈ ప్రయాణం బహు భారం!
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా జట్టు రెండో వన్డే ఆడేందుకు శుక్రవారమే లక్నో చేరుకుంది. ఆ తర్వాతే సిరీస్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. నిజానికి స్వదేశం వెళ్లాలంటే అత్యంత సమీప అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీకి వెళ్లి అటు నుంచి సఫారీ ఆటగాళ్లు దక్షిణాఫ్రికా బయల్దేరాలి. లేదంటే ఎక్కువ విమానాలు అందుబాటులో ఉన్న ముంబై నుంచి కానీ వెళ్లాలి. అయితే అలా జరగలేదు. ఢిల్లీ, ముంబైలలో కరోనా వైరస్ విస్తరిస్తోందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో డి కాక్ బృందం దేశ రాజధాని వెళ్లడానికి నిరాకరించింది. ప్రస్తుతం దేశంలో ఒక్క కోవిడ్–19 కేసు కూడా నమోదు కాని సురక్షిత నగరానికి ముందు తమను తీసుకెళ్లమని కోరింది! అప్పటి వరకు జట్టు సభ్యులంతా హోటల్ గదుల నుంచి బయటకు రాకుండా లక్నోలోనే ఉండిపోయారు. దాంతో అధికారులు అన్నీ చూసి కోల్‌కతాను అందు కోసం ఎంపిక చేశారు. ఇప్పుడు వారు సోమవారం కోల్‌కతాకు వెళ్లి మరుసటి రోజు దుబాయ్ మీదుగా స్వదేశానికి బయల్దేరతారు. దక్షిణాఫ్రికా క్రికెటర్లను పంపించేందుకు ప్రభుత్వ సహాయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా వెల్లడించారు. ‘విమానాశ్రయానికి దగ్గరలోనే వారి బస ఏర్పాటు చేశాం. రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా ఈ విషయంపై చర్చించాం. వారు మా అతిథులు. అన్ని రకాలుగా సహకరించి దక్షిణాఫ్రికా జట్టును వారి దేశానికి పంపిస్తాం’ అని ఆయన చెప్పారు. -
ఇది కదా అసలైన ప్రతీకారం
డర్బన్: ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో పరుగు తేడాతో దక్షిణాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 178 పరుగుల టార్గెట్ ఛేదనలో ఇంగ్లండ్ 176 పరుగులకే పరిమితమై పరుగు తేడాతో ఓటమి చూసింది. చివరి బంతికి ఆదిల్ రషీద్ రనౌట్ కావడంతో ఇంగ్లండ్ కడవరకూ వచ్చి పరాజయాన్ని చూసింది. అయితే అందుకు ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది ఇంగ్లండ్. దక్షిణాఫ్రికా జట్టు చేతిలో పరుగు తేడాతో ఎదురైన పరాభవానికి ఇంగ్లండ్ దెబ్బకు దెబ్బకు రూచిచూపించింది. రెండో టీ20లో రెండు పరుగుల తేడాతో గెలిచి ఇది కదా అసలైన ప్రతీకారం అనే రీతిలో బదులిచ్చింది. రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. (ఇక్కడ చదవండి: పరుగు తేడాతో గెలుపు.. స్టెయిన్ రికార్డు) జోసన్ రాయ్(40), బెయిర్ స్టో(35), మోర్గాన్(27), బెన్ స్టోక్స్(47 నాటౌట్), మొయిన్ అలీ(39)లు వచ్చిన వారు వచ్చినట్లే బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ రెండొందల మార్కును సునాయాసంగా చేరింది. అనంతరం 205 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన సఫారీల చివరి వరకూ పోరాడారు. ఓపెనర్లలో బావుమా(35) ఫర్వాలేదనిపించగా, కెప్టెన్ డీకాక్( 65:22 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) చెలరేగిపోయాడు. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా తరఫున వేగవంతంగా టీ20 హాఫ్ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అనంతరం మిల్లర్(21), వాన్‌డెర్ డస్సెన్(43 నాటౌట్)లు బ్యాట్ ఝుళిపించారు. ఆపై ప్రిటిరియోస్(25) ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ప్రధానంగా చివరి ఓవర్లో సఫారీల విజయానికి 15 పరుగులు కావాల్సిన తరుణంలో ప్రిటిరియోస్ తొలి మూడు బంతులకు 10 పరుగులు చేశాడు. టామ్ కరాన్ వేసిన ఆ ఓవర్ రెండు బంతికి సిక్స్ కొట్టిన ప్రిటిరియోస్.. మూడో బంతిని ఫోర్ కొట్టాడు. నాల్గో బంతికి రెండు పరుగులు తీయగా, ఐదో బంతికి ప్రిటిరియోస్ ఔటయ్యాడు. ఆఖరి బంతికి మూడు పరుగులు చేయాల్సిన సమయంలో ఫార్చున్ గోల్డెన్ డక్ అయ్యాడు. దాంతో ఇంగ్లండ్ రెండు పరుగుల తేడాతో చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసిన సిరీస్‌ను సమం చేసింది. ఇక సిరీస్ నిర్ణయాత్మక మూడో టీ20 ఆదివారం జరుగనుంది. అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా ఇలా విజయానికి దగ్గరగా వచ్చి పరుగు, రెండు పరుగులు తేడాతో ఓడిపోవడం మూడోసారి. అంతకుముందు 2009లో జోహెనెస్‌బర్గ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు పరుగు తేడాతో ఓటమి చెందగా, 2012లో కొలంబోలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పరుగు తేడాతోనే ఓటమి పాలయ్యాడు. ఆపై ఇంతకాలానికి మరో అతి స్వల్ప ఓటమిని దక్షిణాఫ్రికా రుచిచూసింది. -
నోరు పారేసుకున్న రబడ.. సర్దిచెప్పిన కెప్టెన్..!
పుణె : మహారాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాళ్లు పరుగుల వరద పారించారు. 273/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లి సేన సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించింది. రెండోరోజు (అజింక్య రహానే 59, రవీంద్ర జడేజా 91) వికెట్లను మాత్రమే కోల్పోయిన టీమిండియా 328 పరుగులు జతచేసి 601 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ కోహ్లి 254 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక తొలిరోజు మూడు వికెట్లు ఖాతాలో వేసుకుని సత్తా చాటిన రబడ రెండో రోజు వికెట్లేమీ తీయలేకపోయాడు. ఫ్లాట్ పిచ్‌పై భారత ఆటగాళ్లు చెలరేగుతుంటే చేష్టలుడిగిపోయాడు. తన బౌలింగ్‌లో అలవోకగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులెత్తిస్తన్న కోహ్లి, రహానేలను చూసి అతనిలో అసహనం పెరిగింది. ఇదే క్రమంలో బౌలర్‌ను మార్చితే బాగుంటుందని కీపర్ క్వింటన్ డీకాక్ కెప్టెన్ డుప్లెసిస్‌కు సూచించడంతో.. రబడలో అసహనం తీవ్రస్థాయికి చేరింది. దీంతో డీకాక్‌తో అతను వాగ్వివాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో అక్కడే ఉన్న డుప్లెసిస్ కలగజేసుకున్నాడు. రబడను అతను అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘టీమిండియా ఆటగాళ్ల దెబ్బకు రబడకు దిమ్మతిరిగింది. అతనేం చేస్తున్నాడో తెలియడం లేదు’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రహానేను మహరాజ్, రవీంద్ర జడేజాను ముత్తుసామి ఔట్ చేశారు. -
డీకాక్ కెప్టెన్సీ రికార్డు
బెంగళూరు: టీమిండియాతో జరిగిన మూడో టీ20లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా సిరీస్‌ను సమం చేసింది. టీమిండియా నిర్దేశించిన 135 పరుగుల టార్గెట్‌ను సఫారీలు వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించారు. కేవలం ఓపెనర్ రీజా హెండ్రిక్స్(28) వికెట్‌ను మాత్రమే కోల్పోయిన దక్షిణాఫ్రికా.. 16.5 ఓవర్లలో విజయ భేరీ మోగించింది. కెప్టెన్ క్వింటాన్ డీకాక్(79 నాటౌట్; 52 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) దూకుడుగా ఆడి సఫారీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి జతగా బావుమా(27 నాటౌట్) ఆకట్టుకున్నాడు. కాగా, డీకాక్ ఒక అరుదైన జాబితాలో చేరిపోయాడు. అంతర్జాతీయ టీ20 కెప్టెన్సీ అరంగేట్రంలోనే వరుసగా యాభైకి పైగా పరుగులు సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. భారత్‌తో జరిగిన రెండో టీ20లో డీకాక్ 52 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. టీ20 కెప్టెన్లగా నియమితులై వరుసగా యాభైకి పరుగులు నమోదు చేసిన క్రికెటర్ల జాబితాలో పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్), నవనీత్ సింగ్(కెనడా)ల తర్వాత స్థానాన్ని డీకాక్ ఆక్రమించాడు. ఇదిలా ఉంచితే. అంతర్జాతీయ టీ20ల్లో డీకాక్ వెయ్యి పరుగుల్ని సాధించడం మరో విశేషం. ప్రస్తుతం డీకాక్ 1018 పరుగులతో ఉన్నాడు. అయితే అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు సాధించిన వికెట్ కీపర్ల జాబితాలో కుమార సంగక్కరా(శ్రీలంక)తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. డీకాక్ తన 38 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరాడు. ఈ జాబితాలో బ్రెండన్ మెకల్లమ్(31), మహ్మద్ షెహ్జాద్(37)లు వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రెండో ఓపెనింగ్ జంటగా.. టీ20ల్లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రెండో జంటగా హెండ్రిక్స్-డీకాక్‌ల జోడి నిలిచింది. నిన్నటి మ్యాచ్‌లో తొలి వికెట్‌కు 76 పరుగుల్ని డీకాక్-హెండ్రిక్స్‌లు నమోదు చేశారు. అంతకుముందు ఏబీ డివిలియర్స్-హషీమ్ ఆమ్లాలు జోడి 77 పరుగులు చేసింది. 2015లో ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్-ఆమ్లాలు ఈ ఫీట్‌ను సాధించారు. ఇక దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రెండో కెప్టెన్‌గా డీకాక్ గుర్తింపు సాధించాడు. గతంలో డుప్లెసిస్ 85 పరుగులు సాధించాడు. ఇదే దక్షిణాఫ్రికా టీ20 కెప్టెన్‌గా అత్యధిక పరుగుల రికార్డు. -
అచ్చొచ్చిన మైదానంలో.. ఇరగదీశారు
మొహాలి: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సారథి విరాట్ కోహ్లి (72 నాటౌట్; 52 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి తన ఫామ్ చాటడంతో భారత్ సునాయస విజయాన్ని అందుకుంది. సఫారీ జట్టు నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 19 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లితో పాటు ధావన్(40; 31 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. ఛేదనలో టీమిండియాకు మంచి శుభారంభం లభించింది. తొలి వికెట్‌కు 33 పరుగులు జోడించిన అనంతరం రోహిత్(12)ను ఫెలుక్వాయో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి మరోఓపెనర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. వీరిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు పరిగెత్తించారు. కోహ్లి-ధావన్‌లు రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. అనంతరం షమ్సీ బౌలింగ్‌లో మిల్లర్ బౌండరీ వద్ద కళ్లుచెదిరే రీతిలో క్యాచ్ అందుకోవడంతో ధావన్ భారంగా క్రీజు వదిలాడు. అయితే ధావన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఫార్చూన్ బౌలింగ్‌లో పంత్(4) పేలవమైన షాట్ ఆడి వెనుదిరుగుతాడు. ఈ క్రమంలో శ్రేయాస్ అయ్యర్(16 నాటౌట్)తో కలిసి కోహ్లి టీమిండియాకు విజయాన్ని అందించాడు. సఫారీ బౌలర్లలో ఫెలుక్వాయో, ఫార్చూన్, షమ్సీలు తలో వికెట్ దక్కించుకున్నారు. అర్దసెంచరీతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన కోహ్లికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. సారథి డికాక్ (52; 37 బంతుల్లో 8ఫోర్లు) అర్దసెంచరీతో మెరవగా బవుమా(49; 43 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సర్)తన వంతు పాత్ర పోషించాడు. అయితే రీజా హెండ్రిక్స్(6), మిల్లర్(18), డసెన్(1) పూర్తిగా విఫలమవ్వడంతో టీమిండియా ముందు సఫారీ జట్టు భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది. టీమిండియా బౌలర్లలో దీపక్ చహర్ రెండు వికెట్లతో రాణించగా.. సైనీ, జడేజా, హార్దిక్ పాండ్యాలు తలో వికెట్ పడగొట్టారు. -
వారెవ్వా.. కోహ్లి వాటే క్యాచ్!
మొహాలి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా సారథి విరాట్ కోహ్లి కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకొని ఔరా అనిపించాడు. కీలక సమయంలో ప్రమాదకరంగా మారుతున్న బ్యాట్స్‌మన్‌ను తన సూపర్బ్ క్యాచ్ ఔట్ చేశాడు. ఇది టీమిండియాకు టర్నింగ్ పాయింట్ అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. హాఫ్ సెంచరీతో అదరగొడుతున్న డికాక్ నవదీప్ సైనీ వేసిన 12 ఓవర్ రెండో బంతిన స్ట్రేట్ డ్రైవ్ ఆడాడు. అది కాస్తా గాల్లోకి లేవడంతో మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి చిరుతలా పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో డికాక్ షాక్ గురై భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. టీమిండియా ఆటగాళ్లతో సహా అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. అప్పటివరకు సాఫీగా సాగుతున్న సఫారీ ఇన్నింగ్స్ కోహ్లి క్యాచ్‌తో కకలావికలం అయింది. డికాక్‌తో పాటు బవుమా రాణిస్తుండటంతో సఫారీ జట్టు భారీ స్కోర్ సాధిస్తుందనుకున్నారు. అయితే డికాక్ ఔటైన తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్ తడబడటంతో టీమిండియా ముందు ఓ మోస్తారు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక ప్రస్తుతం కోహ్లి అందుకున్న క్యాచ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నెటిజన్లు కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. -
టీమిండియా లక్ష్యం 150
మొహాలి : సారథి డికాక్ (52; 37 బంతుల్లో 8ఫోర్లు), బవుమా(49; 43 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సర్)రాణించడంతో టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో దక్షిణాఫ్రికా 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొహాలి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంలో టాస్ గెలిచిన టీమిండియా సారథి విరాట్ కోహ్లి చేజింగ్ వైపు మొగ్గు చూపాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టుకు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్(6) పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బవుమాతో కలిసి సారథి డికాక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే టీమిండియా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌కు సఫారీ బ్యాట్స్‌మెన్ ఇబ్బందులకు గురయ్యారు. లైన్‌అండ్‌లెంగ్స్‌తో సఫారీ బ్యాట్స్‌మెన్ పరుగులు తీయకుండా అడ్డుకున్నారు. అయితే బవుమా స్లో బ్యాటింగ్‌తో నిరత్సాహపరిచినా.. డికాక్ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ పెంచే ప్రయత్నం చేశాడు. అయితే అర్దసెంచరీ తర్వాత డికాక్‌ను నవదీప్ సైనీ ఔట్ చేయడంతో దక్షిణాఫ్రికాకు కష్టాలు మొదలయ్యాయి. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకోడానికి నానాతంటాలు పడ్డారు. అయితే బవుమా కూడ హాఫ్ సెంచరీ సాధించకుండానే దీపక్ చహర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. డసెన్(1), మిల్లర్(18) విఫలమవ్వడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో దీపక్ చహర్ రెండు వికెట్లతో రాణించగా.. సైనీ, జడేజా, హార్దిక్ పాండ్యాలు తలో వికెట్ దక్కించుకున్నారు. -
దక్షిణాఫ్రికా కీలక నిర్ణయం.. సారథిగా డికాక్
కేప్‌టౌన్: టీమిండియాతో జరగబోయే టెస్టు, టీ20 సిరీస్‌ల కోసం దక్షిణాఫ్రికా తన బలగాన్ని ప్రకటించింది. భారత పర్యటనలో సఫారీ జట్టు మూడు టీ20లు, మూడు టెస్టులు ఆడనుంది. ప్రపంచకప్‌లో ఘోర ఓటమి అనంతరం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు జట్టులో పెను మార్పులు తీసుకొస్తోంది. ప్రధాన కోచ్ గిబ్సన్ కాంట్రాక్ట్‌ను పొడగించడం లేదని స్పష్టం చేసింది. ఇక ఇప్పటివరకు దక్షిణాఫ్రికాకు సారథిగా వ్యవహరిస్తున్న డుప్లెసిస్‌ను కేవలం టెస్టులకే పరిమితం చేసింది. వైట్‌బాల్ క్రికెట్‌కు వికెట్ కీపర్ డికాక్‌ను సారథిగా ఎంపిక చేసింది. సీనియర్ ఆటగాళ్లు డేల్ స్టెయిన్, హషీమ్ ఆమ్లాలు రిటైర్మెంట్ ప్రకటించడంతో ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్స్‌ను టెస్టు జట్టులోకి తీసుకుంది. డుప్లెసిస్పై ఒత్తిడి తగ్గించే ఉద్దేశంతోనే పరిమిత క్రికెట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పించామని.. అదేవిధంగా వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ వరకు సారథిగా డికాక్‌కు తగిన అనుభవం లభించాలనే ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డస్సన్ వైస్ కెప్టెన్‌గా పదోన్నతి పొందాడు. ఇమ్రాన్ తాహీర్ రిటైర్మెంట్ ప్రకటించడంతో స్పిన్ బౌలింగ్‌ను మరింత పటిష్టం చేసేందుకు కేశవ్ మహారాజ్‌తో పాటు యువ స్పిన్నర్లు ముత్తుసామి, డేన్ పీడ్ట్లను ఎంపిక చేసింది. ఇక భారత్ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా తొలుత టీ20 సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 15న ధర్మశాలలో తొలి టీ20 జరగనుంది. అనంతరం అక్టోబర్ 2 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. భారత్-దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్‌లకు విశాఖపట్నం, రాంఛీ, పుణె నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. -
సంధి దశలో సఫారీలు
ఒక్కొక్కరుగా దిగ్గజాల రిటైర్మెంట్, ఫిట్నెస్ సమస్యలు, బోర్డు పాలన వైఫల్యాలతో దక్షిణాఫ్రికా క్రికెట్ ప్రమాణాలు క్రమంగా పడిపోతున్నాయి. గతేడాది సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్ వరకు ఫర్వాలేదనిపించిన ఆ జట్టు అనంతరం డీలా పడిపోయింది. ఆఖరికి శ్రీలంకకు టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఇక వన్డే ప్రపంచ కప్‌లో వారి వైఫల్యం దీనికి పరాకాష్ట. ప్రతిభావంతులను గౌరవించకపోవడం, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోలేకపోవడం... ఇలా అనేక తప్పిదాలతో ప్రొటీస్ పరిస్థితి దిగజారింది. తక్షణమే దిద్దుబాటు చర్యలు లేకుంటే మరింతగా పతనమయ్యే ప్రమాదమూ ఉంది. సాక్షి క్రీడా విభాగం పేరుకు 12 జట్లున్నా... ప్రస్తుతం టెస్టు హోదా ఉన్న దేశాల్లో బలమైనవని చెప్పుకోదగ్గవి ఆరే! అవి... భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్. వీటిలోనూ విండీస్ ఆట మూడు దశాబ్దాలుగా అనిశ్చితం. ఇప్పుడు దక్షిణాఫ్రికా రూపంలో మరో జట్టు తీవ్ర కష్టాల్లో ఉంది. మేటి అనదగ్గ ఆటగాళ్లు ఒకరివెంట ఒకరు నిష్క్రమిస్తుండటంతో సఫారీలు నడి సంద్రంలో చుక్కాని లేని నావలా మిగిలారు. విధ్వంసక ఏబీ డివిలియర్స్‌తో మొదలైన రిటైర్మెంట్ల పరంపర... నిలకడకు మారుపేరైన హషీమ్ ఆమ్లా వరకు వచ్చింది. వీరిద్దరి మధ్యలో ప్రధాన పేసర్లు మోర్నీ మోర్కెల్, డేల్ స్టెయిన్ వీడ్కోలు పలకడం ప్రొటీస్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇప్పుడా జట్టులో మిగిలిన నాణ్యమైన ఆటగాళ్లు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ మాత్రమే. మిగతా వారిలో కొందరు అంతర్జాతీయ క్రికెట్లో తమ ముద్ర వేసే దిశలో ఉండగా... ఇంకొందరు ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పూర్తిగా సంధి కాలం అనదగ్గ ఇలాంటి దశను అధిగమించేందుకు దక్షిణాఫ్రికా బోర్డు గట్టి చర్యలు చేపట్టకుంటే... ఆ జట్టు ఓ సాధారణమైనదిగా మిగిలిపోవడం ఖాయం. రెండు, మూడేళ్లయినా ఆడగలిగినవారే! తమ దిగ్గజ ఆటగాళ్లు అర్ధంతర రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారంటే ఏ దేశ క్రికెట్ బోర్డయినా ఏం చేస్తుంది? తక్షణమే సంప్రదింపులు జరిపి, వారి సేవలు ఎంత కీలకమో వివరించి నిర్ణయాన్ని కొన్నాళ్లు వాయిదా వేసుకునేలా చేయడమో, మూడు ఫార్మాట్లలో వారి సేవలు ఎక్కడ ఎక్కువ అవసరమో అక్కడ తగిన విధంగా వాడుకునేలా చేయడమో చేస్తుంది. కానీ, దక్షిణాఫ్రికా బోర్డు ఇలాంటి చొరవేదీ చూపుతున్నట్లు లేదు. డివిలియర్స్ ఉదంతమే దీనికి పక్కా నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మైదానంలోనైనా రాణించగలిగే అతడు గతేడాది ఏప్రిల్‌లో అనూహ్యంగా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యపర్చాడు. అప్పటికి ఏబీ వయసు 34 ఏళ్లే. తన ఫామ్‌ను అంతకుమించిన ఫిట్నెస్ను చూస్తే కనీసం రెండేళ్లయినా మైదానంలో మెరుపులు మెరిపించగల స్థితిలో ఉన్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో 2018 మార్చి 30న జొహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభమైన టెస్టు తర్వాత ఇక ఆడనంటూ తప్పుకొన్నాడు. ఇదే టెస్టుతో, అంతకుమందే ప్రకటించిన మేరకు పేసర్ మోర్నీ మోర్కెల్ బై బై చెప్పాడు. ఆ సమయంలో అతడికి 33 ఏళ్లే. గాయాలు వేధిస్తున్నాయని అనుకున్నా... మోర్కెల్ మరీ ఫామ్ కోల్పోయి ఏమీ లేడు. పెద్ద జట్లతో సిరీస్‌లైనా ఆడేలా అతడిని ఒప్పించలేకపోయారు. మోర్కెల్ లేని లోటు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో తెలిసొచ్చింది. చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికా... లంకకు టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఇక 36 ఏళ్ల స్టెయిన్‌ది మరో కథ. ప్రపంచ స్థాయి బౌలర్ అయిన అతడు వరుసగా గాయాలతో సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలో టెస్టులకు రాం రాం చెప్పాడు. దీంతో ఇద్దరు ఫ్రంట్‌లైన్ పేసర్ల సేవలను కోల్పోయినట్లైంది. మరో ప్రధాన పేసర్ వెర్నాన్ ఫిలాండర్ అద్భుత బౌలరే. అయితే, 34 ఏళ్లు దాటిన అతడు గాయాలతో కొంతకాలంగా ప్రధాన స్రవంతి క్రికెట్లో లేడు. తాజాగా హషీమ్ ఆమ్లా రిటైర్మెంట్తో దక్షిణాఫ్రికా మరో స్టార్ ఆటగాడిని కోల్పోయినట్లైంది. వాస్తవానికి 36 ఏళ్ల ఆమ్లా విరమణపై ఊహాగానాలు ఉన్నా... కనీసం ఇంకో ఏడాదైనా టెస్టుల వరకు ఆడతాడని భావించారు. అతడు మాత్రం మూడు ఫార్మాట్లకు అస్త్రసన్యాసం చేశాడు. టెస్టు చాంపియన్‌షిప్‌లో ఎలాగో... బ్యాటింగ్, బౌలింగ్‌లో మూలస్తంభాలైన నలుగురి రిటైర్మెంట్తో ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఎదుర్కోనున్న అసలు సవాలు టెస్టు చాంపియన్‌షిప్. ఆ జట్టు చాంపియన్‌షిప్‌లో 16 టెస్టులు ఆడనుంది. వీటిలో వచ్చే జనవరి లోపు భారత్ (3), ఇంగ్లండ్ (4 సొంతగడ్డపై)లతోనే ఏడు టెస్టులున్నాయి. విండీస్, పాక్, లంకలతోనూ రెండేసి ఆడాల్సి ఉంది. చివరగా ఆస్ట్రేలియాతో 3 టెస్టుల్లో తలపడుతుంది. బౌలింగ్‌లో రబడ మినహా ఇంకెవరిపైనా ఆశలు లేని నేపథ్యంలో డు ప్లెసిస్, డికాక్‌లకు తోడు ఓపెనర్ మార్క్రమ్, ఎల్గర్ సత్తా చాటితేనే సఫారీలు కనీసం పోటీ ఇవ్వగలరు. పెద్దరికం లేని బోర్డు... దూరదృష్టి లేని క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ) తీరే ప్రస్తుత పరిస్థితికి కారణం. ఆటగాళ్లు, బోర్డు అధికారుల మధ్య సత్సంబంధాలు లేవు. వన్డే ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీ ముందుండగా రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్‌కు నచ్చజెప్పి ఆపే పెద్దరికం, కప్‌నకు తుది జట్టును ప్రకటించే సమయంలో తిరిగొస్తానన్న అతడిని తీసుకునే విశేష చొరవ ఎవరికీ లేకపోయింది. గాయాలతో ఉన్న స్టెయిన్‌ను జాగ్రత్తగా కాపాడుకునే వ్యూహం, ఆమ్లాను కొన్నాళ్లు ఆగేలా చేసే ప్రయత్నమూ వారిలో కొరవడింది. వన్డేలు, టి20ల కంటే స్టెయిన్ టెస్టుల్లోనే దక్షిణాఫ్రికాకు ఎక్కువ అవసరం. కానీ, అతడు టెస్టులకే రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇక్కడా బోర్డు నిష్క్రియాపరత్వం కనిపిస్తోంది. ఇప్పుడు సీఎస్ఏ... ఫుట్‌బాల్ తరహాలో జట్టుకు మేనేజర్‌ను నియమించి అతడే కోచింగ్ సిబ్బందిని, కెప్టెన్‌ను ఎంపిక చేసేలా కొత్త విధానం తీసుకురావాలని చూస్తోంది. ప్రధాన కోచ్ గిబ్సన్, సహాయ సిబ్బంది కాంట్రాక్టు కూడా ముగియనుంది. వచ్చేవారైనా దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలిసితీసి బాధ్యతలను సమర్థంగా నెరవేరిస్తేనే ప్రొటీస్ జట్టు పటిష్టంగా ఉంటుంది. -
డి కాక్ సెంచరీ: దక్షిణాఫ్రికాదే సిరీస్
డర్బన్: ఓపెనర్ క్వింటన్ డి కాక్ (108 బంతుల్లో 121; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించడంతో... శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 71 పరుగుల తేడాతో గెలిచింది. వరుసగా మూడో విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3–0తో సొంతం చేసుకుంది. తొలుత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 331 పరుగులు చేసింది. డసెన్ (50), మిల్లర్ (41 నాటౌట్) రాణించారు. అనంతరం వర్షం రావడంతో శ్రీలంక లక్ష్యాన్ని 24 ఓవర్లలో 193 పరుగులుగా నిర్దేశించారు. అయితే శ్రీలంక 24 ఓవర్లలో ఐదు వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. -
అయ్యో డికాక్.! ఈగ ఎంత పనిచేసింది
జోహన్నెస్‌బర్గ్ : వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వీడియోపై సోషల్‌మీడియాలో జోకులు పేలుతున్నాయి. దక్షిణాఫ్రికా-ఆసీస్ చివరి టెస్టు రెండో రోజు ఆటలో ఓ ఈగ సఫారీ వికెట్ కీపర్ డికాక్ ఏకాగ్రతను దెబ్బతీసింది. దీంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్‌ను స్టంప్ అవుట్ మిస్ చేసే అవకాశం కోల్పోయాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో కేశవ్ మహరాజ్ వేసిన 30 ఓవర్లో క్రీజు దాటి వచ్చిన షాన్ మార్ష్ ఆఫ్ వికెట్ మీదుగా వచ్చిన బంతిని మిస్సయ్యాడు. అయితే ఇక్కడ కీపర్ డికాక్ బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు అంతకు ముందే అద్భుత క్యాచ్‌తో ఉస్మాన్ ఖాజాను పెవిలియన్ చేర్చిన డికాక్ సులువై స్టంప్ ఔట్ మిస్ చేయడం ఏమిటని అందర అశ్చర్యానికి లోనయ్యారు. అయితే ఓ ఈగ డికాక్ భుజాలపై వాలడం.. అతను ఏకాగ్రత కోల్పోయి స్టంప్ ఔట్ మిస్ చేయడం టీవీ రీప్లేలో స్పష్టమైంది. ప్రస్తుతం ఈ వీడియోపై అభిమానులు జోకులు పేల్చుతున్నారు. ఐసీసీ వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని, డికాక్ కుట్రను బయటపెట్టాలని సెటైర్స్ వేస్తున్నారు. మరి కొంత మంది ఆ ఈగ డికాక్‌ను ఏప్రిల్ ఫూల్ చేసిందని కామెంట్ చేస్తున్నారు. మార్కరమ్ అద్భుత సెంచరీకి తోడు బవుమా (95 నాటౌట్) రాణించడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 488 పరుగుల వద్ద ముగిసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్‌ను ఫిలాండర్ దెబ్బతీశాడు. దీంతో ఆసీస్ 96 పరుగులకే కీలకమైన 6 వికెట్లను కోల్పోయింది. ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో సస్పెన్షన్‌కు గురైన స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ స్థానంలో ఈ టెస్టులో బరిలోకి దిగిన హ్యాండ్స్కోంబ్ (0), రెన్షా (8), బర్న్స్ (4) విఫలమయ్యారు. ఈ ముగ్గురు కలిసి కేవలం 12 పరుగులే చేశారు. Marsh to face harsh disciplinary action after Quinton De Kock is mysteriously stung by a Bee. ICC investigates #SAvsAUS pic.twitter.com/7u09n2x22D — Juno (@JunoSnez) 31 March 2018 -
ఈగ ఎంత పనిచేసింది!
-
వార్నర్, డికాక్ : బీరు తాగుతూ కలిసిపోండి!
సాక్షి, స్పోర్ట్స్: ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్, ఎగతాళిలు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భాగమేనని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో స్లెడ్జింగ్ తారస్థాయికి చేరి ఆటగాళ్లు ఒకరినొకరు దూషించుకునే వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షేన్ వార్న్ ఇవన్నీ ఆటలో భాగమేనని బీరు తాగి కలిసిపోవాలని ఇద్దరి ఆటగాళ్లకు సూచించాడు. నాలుగో రోజు టీ విరామానికి ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్న సమయంలో వార్నర్-డికాక్ పరస్పరం దూషించుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే దారిలో ఉన్న మెట్ల వద్దే వార్నర్ ఆవేశంగా డి కాక్ వైపు దూసుకుపోయే ప్రయత్నం చేయడం కెమెరాల్లో రికార్డయింది. సహచరుడు ఖాజా పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా వార్నర్ మాత్రం తగ్గలేదు. కొద్ది దూరంలోనే ఉన్న డి కాక్ కూడా ఆ సమయంలో ఏదో అంటూ తమ జట్టు గది వైపు వెళ్లిపోయాడు. ఈ వ్యవహరమంతా బయటకు రావడంతో చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై షేన్ వార్న్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘‘ఆటగాళ్ల మధ్య ఎగతాళిలు, చీదరింపులు, స్లెడ్జింగ్‌లు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భాగమే. ఇరు జట్లు ఆటగాళ్లు ఇంతటితో వదిలేయండి. ఒకరికొకరు మర్యాదగా నడుచుకోవడం మంచిది. ఎవరైనా వ్యక్తిగత విషయాలు ప్రస్తావించొద్దు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయడం మానేసి బీరు తాగుతూ కలిసిపోండి’’ అని వార్న్ ట్వీట్ చేశాడు. ఇక దక్షిణాఫ్రికా ఆటగాళ్ల పట్ల వార్నర్ ఎన్నోసార్లు తన హద్దులు దాటి ప్రవర్తించాడని, అందుకే అతని రియాక్షన్ పట్ల మేం ఆశ్చర్య పడలేదని, ఒకరిపై కామెంట్ చేసేముందు తీసుకోవడానికి కూడా సిద్దంగా ఉండాలని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ట్వీట్ చేశాడు. డర్బన్‌లో నీచమైన దృశ్యాలు చోటు చేసుకున్నాయని, ఆటగాళ్లు వ్యక్తిగతంగా దూషించుకోవడం అంత మంచిది కాదని గిల్‌క్రిస్ట్ ట్వీట్ చేశాడు. Chat, banter, sledging has always been apart of any series between SA & Oz. Both sides always give it out. Respect is the key & I hope nothing personal was said to any player towards anyone from either side. Have a beer together afterwards & get on with it - stop the whinging ! — Shane Warne (@ShaneWarne) 5 March 2018 -
క్రికెటర్ల వాడివేడి వాగ్వాదం
-
వీడియో వైరల్.. క్రికెటర్ల వాడివేడి వాగ్వాదం
డర్బన్: సాధారణంగా ఏ గేమ్లోనైనా ఆటగాళ్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం అనేది మైదానంలో మాత్రమే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత క్రికెటర్లు గొడవ పడిన ఘటన ఆసీస్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో చోటు చేసుకుంది. నాలుగు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాడివేడి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆటగాళ్లు మైదానం విడిచి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే క్రమంలో తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది. ప్రధానంగా ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్-దక్షిణాఫ్రికా క్రికెటర్ డీకాక్‌ల మధ్య వాడివాడిగా వాగ్వాదం జరిగింది. ఆదివారం నాల్గో రోజు ఆటలో టీ విరామంలో వార్నర్-డీకాక్‌లు ఒకర్ని ఒకరు తిట్టుకుంటూ ముందుకు సాగారు. ఒకానొక సమయంలో సహనం కోల్పోయిన డేవిడ్ వార్నర్.. డీకాక్‌పై దూసుకెళ్లే యత్నం చేశాడు. అయితే సహచర ఆటగాళ్లు వార్నర్‌ను ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకెళ్లి గొడవను సద్దుమణిచే యత్నం చేశారు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ ఖాజాలు వార్నర్‌ను నిలువరించి డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకెళ్లిపోయారు. ఇది మెట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పాటు వైరల్‌గా మారింది. ఏబీ రనౌటే కారణమా..? అయితే ఏబీ డివిలియర్స్ రనౌట్ కావడమే ఈ గొడవకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. నాథన్ లయన్ వేసిన బంతిని క్రీజ్‌లో ఉన్న మర్క్రామ్ స్వ్కేర్ లెగ్ వైపు ఆడాడు. దాంతో రన్ కోసం మర్క్రామ్-ఏబీలు ప్రయత్నించారు. అయితే చివరినిమిషంలో పరుగు విరమించుకోవడంతో మర్క్రామ్ క్రీజ్‌లోకి వెళ్లిపోగా, అప్పటికే ముందుకొచ్చిన ఏబీ వెనక్కివెళ్లే యత్నం చేశాడు. అదే సమయంలో బంతిని వేగంగా అందుకున్న వార్నర్.. నాన్ స్టైకర్ ఎండ్ వైపు విసిరాడు. ఆ బంతిని లయన్ అందుకోవడం వికెట్లను నేలకూల్చడం వేగంగా జరిగిపోయాయి. దాంతో ఏబీ భారంగా పెవిలియన్ చేరగా, ఆసీస్ మాత్రం సంబరాలు చేసుకుంది. ఇదే వార్నర్-డీకాక్‌ల మధ్య గొడవకు ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది. -
డికాక్‌ను బెంబేలెత్తించిన బుమ్రా
-
బెంబేలెత్తించిన బుమ్రా
సెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రొటీస్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. చురకత్తిలాంటి బౌన్సర్లతో సఫారీ ఓపెనర్ డికాక్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఓవర్ తొలి బంతికే వెనుదిరిగాల్సిన డికాక్‌కు అదృష్టం కలిసొచ్చింది. బంతి వికెట్లను తాకినా బెల్స్ పడకపోవడంతో డికాక్ బతికిపోయాడు. అనంతరం ఐదు బంతులను ఎదుర్కొన్న డికాక్ బంతిని బ్యాట్‌కు తగిలించాడానికే ముప్పు తిప్పలు పడ్డాడు. దీంతో ఈ ఓవర్లో ఆతిథ్యజట్టుకు ఒక్క పరుగు కూడా రాలేదు. పిచ్ పేస్ అనూకూలిస్తుండంతో భారత పేసర్లు సమర్ధవంతంగా ఉపయోగించుకుంటున్నారు. 5 ఓవర్లు పూర్తయ్యేసరికి దక్షిణాఫ్రికా 10 పరుగులు చేసింది. క్రీజులో ఆమ్లా(5), డికాక్(5)లున్నారు. -
ఫీల్డ్ లో ఇద్దరు ఆమ్లాలు!
బ్లోమ్ ఫోంటీన్:దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ ల జట్ల మధ్య జరిగిన ఇక్కడ గురువారం జరిగిన తొలి టీ 20లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను ఓపెనర్లు హషీమ్ ఆమ్లా-డీకాక్ లు ఆరంభించిందుకు అడుగుపెట్టారు. అయితే ఆ సమయంలో ఇద్దరు ఆమ్లాలు ఒకేసారి కనిపించడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన చర్చమొదలైంది. వారిద్దరూ ధరించిన జెర్సీలపై ఆమ్లా అని పేరు ఉండటంతో దీన్ని చూసిన ప్రేక్షకులు కొద్దిపాటిఇబ్బందికి గురయ్యారు. అయితే కాసేపటికి జరిగిన విషయాన్ని తెలుసుకుని నవ్వుకోవడం వారి వంతైంది. అసలేం జరిగిందంటే.. మ్యాచ్ ఆరంభానికి ముందు డీకాక్ జెర్సీ కనిపించలేదు. ఎంత వెదికినా తన జెర్సీ దొరక్కపోవడంతో ఆమ్లా తన జెర్సీని అందించాడు. ఆ క్రమంలోనే ఆమ్లా జెర్సీ వేసుకుని డీకాక్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాడు. అయితే మ్యాచ్ కాసేపు జరిగే వరకూ ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద ఆమ్లా(3)అవుటైన తరువాత డివిలియర్స్ తో కలిసి డీకాక్ ఆడుతున్న సమయంలో ప్రేక్షకుల్లో గందరగోళం మొదలైంది. ఆమ్లా అవుటై పెవిలియన్ కు చేరితే మళ్లీ ఎలా వచ్చాడనే సందిగ్థత ఏర్పడింది. కాకపోతే చివరకు అసలు విషయం తెలుసుకుని నవ్వుకున్నారు.మొదటి టీ 20లో సఫారీలు 20 పరుగుల తేడాతో విజయం సాధించారు. -
డి కాక్ మెరుపులు
►దక్షిణాఫ్రికా 314 ► న్యూజిలాండ్‌తో మూడో టెస్టు హామిల్టన్: చేతి వేలి గాయంతో బాధపడుతున్నప్పటికీ క్వింటాన్ డి కాక్ (118 బంతుల్లో 90; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 89.2 ఓవర్లలో 314 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 148 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో ఏడో నంబర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన డి కాక్ కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో భారీగా పరుగులు వచ్చాయి. కెప్టెన్ డు ప్లెసిస్ (108 బంతుల్లో 53; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... చివర్లో రబడా (31 బంతుల్లో 34; 6 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడాడు. హెన్రీకి నాలుగు, వాగ్నర్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 25.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. వెలుతురు సరిగా లేకపోవడంతో కాస్త ముందుగానే ఆటను నిలిపివేశారు. క్రీజులో ఓపెనర్లు లాథమ్ (82 బంతుల్లో 42 బ్యాటింగ్; 8 ఫోర్లు), రావల్ (71 బంతుల్లో 25 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఉన్నారు. -
ఆదుకున్న డికాక్, బవుమా
దక్షిణాఫ్రికా 349/9 ∙ కివీస్‌తో రెండో టెస్టు వెల్లింగ్టన్: న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి తడబడిన దక్షిణాఫ్రికాను క్వింటన్ డికాక్ (118 బంతుల్లో 91; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), బవుమా (160 బంతుల్లో 89; 9 ఫోర్లు) ఆదుకున్నారు. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 81 పరుగుల ఆధిక్యం సంపాదించింది. శుక్రవారం 24/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట నిలిచే సమయానికి 9 వికెట్లకు 349 పరుగులు చేసింది. గ్రాండ్‌హోమ్ (3/52), వాగ్నర్ (3/96)లు విజృంభించడంతో దక్షిణాఫ్రికా ఒక దశలో 94 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రబడ (9), ఆమ్లా (21), డుమినీ (16), డుప్లెసిస్ (22) విఫలమయ్యారు. ఈ దశలో డికాక్, బవుమా ఏడో వికెట్‌కు 160 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ప్రస్తుతం ఫిలాండర్ (36 బ్యాటింగ్), మోర్కెల్ (31 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
డీకాక్ మరో ఘనత
కేప్‌టౌన్:గతేడాది ఫిబ్రవరిలో వేగవంతంగా పది వన్డే సెంచరీలు సాధించిన రికార్డును నెలకొల్పిన దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డీ కాక్..ఏడాది వ్యవధిలోనే మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో రెండో టెస్టు తొలి రోజు ఆటలో హాఫ్ సెంచరీ చేసిన డీ కాక్.. తన కెరీర్లో వెయ్యి టెస్టు పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. తద్వారా దక్షిణాఫ్రికా తరపున వేగవంతంగా వెయ్యి పరుగుల్ని పూర్తి చేసుకుని సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. డీ కాక్ 23 ఇన్నింగ్స్ ల్లో వెయ్యి టెస్టు పరుగుల్ని సాధించగా, అంతకుముందు డు ప్లెసిస్ కూడా 23 ఇన్నింగ్స్ ల్లోనే ఈ మార్కును చేరాడు. డీకాక్ సాధించిన వెయ్యి టెస్టు పరుగుల్లో ఎనిమిది హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరపున వేగవంతంగా వెయ్యి టెస్టు పరుగుల్ని పూర్తి చేసుకున్న ఆటగాళ్లలో గ్రేమ్ స్మిత్(17 ఇన్నింగ్స్‌లు), ఏబీ డివిలియర్స్(20), బార్లో(21), గ్రేమ్ పొలాక్(22) వరుసగా నాలుగు స్థానాల్లో ఉన్నారు. గత ఫిబ్రవరిలో ఐదు వన్డేల సిరీస్ లో ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో శతకం సాధించిన డీకాక్ ఈ ఫార్మాట్ లో అత్యంత వేగంగా పది సెంచరీలు కొట్టిన ఆటగాడిగా గుర్తింపు సాధించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే వేగవంతమైన పది వన్డే సెంచరీల్లో విరాట్ కోహ్లిని డీ కాక్ అధిగమించాడు. డీకాక్ 23 సంవత్సరాల 54 రోజుల వయసులో 10 సెంచరీలు చేస్తే, అదే విరాట్ 10 సెంచరీలు చేయడానికి 23 సంవత్సరాల 159 రోజులు పట్టింది. -
'రాంగ్ టైమ్ లో అవుటయ్యా'
రాయ్ పూర్: మంచి గేమ్ ప్లాన్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయం సాధించిందని ఢిల్లీ డేర్ డెవిల్స్ వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ అన్నాడు. ఒత్తిడిలో మ్యాచ్ ఓడిపోయామని చెప్పాడు. ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీని బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్-9 ప్లేఆఫ్ కు అర్హత సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత డీకాక్ మాట్లాడుతూ.. బెంగళూరు స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒత్తిడికి గురయ్యామని, మంచి భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోయామని చెప్పాడు. బౌలింగ్ విభాగంలో ఆర్సీబీ చేసిన మార్పులు ఆ జట్టుకు లాభించాయని పేర్కొన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయామని, తాను కూడా రాంగ్ టైమ్ లో అవుటయ్యానని తెలిపాడు. మరో 20 పరుగులు చేసివుంటే ఆర్సీబీకి గట్టిపోటీ ఇచ్చేవాళ్లమని అభిప్రాయపడ్డాడు. తన ఆటతీరును మెరుగు పరుచుకోవడానికి ఐపీఎల్ దోహద పడిందని, స్పిన్ బౌలింగ్ ఆడడం నేర్చుకున్నానని తెలిపాడు. అద్భుత బ్యాటింగ్ తో జట్టుకు విజయాన్ని అందించిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై డీకాక్ ప్రశంసలు కురిపించాడు. -
క్రికెటర్ మ్యాచ్ ఫీజులో భారీ కోత
చిట్టగాంగ్ : దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మ్యాచ్ ఫీజులో భారీ కోత పడింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ను తన భుజంతో గుద్దినందుకు డికాక్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విదించినట్లు ఐసీసీ ప్రకటించింది. చిట్టగాంగ్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో తమీమ్ ను ఢీకొట్టిన కారణంగా అతనికి జరిమానా విధించినట్లు మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ తెలిపారు. క్రికెట్ మైదానంలో ఇటువంటి వాటిని తావుండకూడదని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో తమీమ్ 57 పరుగులు చేసి బంగ్లా వికెట్లకు అడ్డుకట్ట వేయడంతో అతనితో డికాక్ గొడవకు దిగాడు. అయితే, ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌లో 2-1 తో బంగ్లా చేతిలో సఫారీలు ఓటమి పాలైన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ లో ఇదే ఆటగాడిని రోసౌ భుజంతో గుద్దడంతో 50 ఫైన్ జరిమానా విధించారు. తాజాగా అదే బంగ్లా ఆటగాడితో గొడవ పడినందుకు సఫారీల వికెట్ కీపర్‌కు మ్యాచ్ ఫీజులో భారీగా కోత పడటం గమనార్హం. -
ఐదో వన్డేలో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలుపు
సిడ్నీ: దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా 4-1తో గెల్చుకుంది. ఆదివారం జరిగిన ఐదో వన్డేలో 2 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఆసీస్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. డీకాక్(107) సెంచరీ సాధించాడు. రాసౌన్(51), బెహర్దీన్(63) అర్థ సెంచరీలు చేశారు. ఆసీస్ కు డీఎల్ఎఫ్ ద్వారా 48 ఓవర్లలో 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆస్ట్రేలియా 47.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. డీకాక్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. ఆస్ట్రేలియా యువ ఆటగాడు స్టీవెట్ స్మిత్ కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' దక్కింది. -
మళ్ళీ దెబ్బ పడింది
డర్బన్: దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. అన్ని రంగాల్లో విఫలమైన జట్టు వన్డే సిరీస్ కోల్పోయింది. ఆదివారం ఇక్కడి కింగ్స్‌మీడ్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 134 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. అనంతరం భారత్ 35.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. సఫారీ ఆటగాళ్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ క్వాంటన్ డి కాక్ (118 బంతుల్లో 106; 9 ఫోర్లు) సిరీస్‌లో వరుసగా రెండో సెంచరీ చేయగా... హాషిం ఆమ్లా (117 బంతుల్లో 100; 8 ఫోర్లు) కూడా శతకంతో చెలరేగాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు ఏకంగా 194 పరుగులు జత చేసి తమ జట్టుకు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరఫున రైనా (50 బంతుల్లో 36; 3 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. సోట్సోబ్ (4/25) జట్టును దెబ్బ తీశాడు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను డివిలియర్స్ బృందం 2-0తో గెలుచుకుంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం సెంచూరియన్‌లో జరుగుతుంది. మళ్లీ ఆ ఇద్దరే... అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో ఆట గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో మ్యాచ్‌ను 49 ఓవర్లుగా కుదించారు. టాస్ గెలిచిన ధోని మరోసారి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. భువనేశ్వర్, మోహిత్‌ల స్థానంలో ఇషాంత్, ఉమేశ్‌లకు అవకాశం ఇవ్వగా... అనారోగ్యంతో ఉన్న యువరాజ్ స్థానంలో రహానేకు చోటు దక్కింది. దక్షిణాఫ్రికా జట్టులో పార్నెల్ స్థానంలో ఫిలాండర్‌ను ఎంపిక చేశారు. ప్రొటీస్ ఓపెనర్లు డి కాక్, ఆమ్లా భారత్‌కు గత మ్యాచ్ ‘రీప్లే’ చూపించారు. అదే తరహాలో ఆరంభం నుంచి చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా సాధికారికంగా ఆడారు. చిన్న స్పెల్స్‌తో పదే పదే బౌలర్లను మార్చిన ధోని వ్యూహం పని చేయకపోగా... ఏ బౌలర్ కూడా ప్రభావం చూపించలేకపోయాడు. దాంతో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో పాటు 18.3 ఓవర్లలో భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. ఆ తర్వాత కూడా ఈ జోడి జోరు తగ్గలేదు. ఇషాంత్ బౌలింగ్‌లో సింగిల్ తీసి డి కాక్ 112 బంతుల్లో వరుసగా రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భాగస్వామ్యం 200 పరుగులకు చేరువైన తరుణంలో ఎట్టకేలకు భారత్‌కు తొలి వికెట్ దక్కింది. అశ్విన్ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి డి కాక్ వెనుదిరిగాడు. గత మ్యాచ్ తరహాలోనే భారీ హిట్టింగ్ చేసే ప్రయత్నంలో మూడో స్థానంలో దిగిన డివిలియర్స్ (3) ఎత్తుగడ పని చేయలేదు. జడేజా చక్కటి బంతిని షాట్ ఆడలేక వెనుదిరిగాడు. కట్టడి చేసిన బౌలర్లు.... 194/1తో పటిష్టంగా కనిపించిన దక్షిణాఫ్రికా గత మ్యాచ్ తరహాలోనే 300కు పైగా పరుగుల భారీ స్కోరు చేసేట్లు కనిపించింది. అయితే భారత బౌలర్లు చక్కటి బౌలింగ్‌తో పరుగులు రాకుండా నిరోధించారు. ముఖ్యంగా జడేజా, షమీ కట్టడి చేశారు. 35 నుంచి 48 ఓవర్ల మధ్య ఆ జట్టు 66 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఓపిగ్గా ఆడిన ఆమ్లా కూడా కెరీర్లో 12వ సెంచరీని అందుకున్నాడు. ఆ వెంటనే ఒకే ఓవర్లో ఆమ్లా, మిల్లర్ (0)లను షమీ పెవిలియన్ పంపించాడు. డుమిని (29 బంతుల్లో 26; 2 ఫోర్లు) రనౌట్ కాగా, కలిస్ (10) మళ్లీ విఫలమయ్యాడు. ఉమేశ్ వేసిన చివరి ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 20 పరుగులు వచ్చాయి. టప టపా... రోహిత్ శర్మ (26 బంతుల్లో 19; 2 ఫోర్లు) గత మ్యాచ్ తరహాలో కాకుండా ఈ సారి స్టెయిన్‌ను మెరుగ్గా ఎదుర్కొన్నాడు. అయితే మరోవైపు స్టెయిన్ బౌలింగ్‌లో తాను ఆడిన రెండో బంతికే షాట్ ఆడబోయి ధావన్ (0) వెనుదిరిగాడు. ఈ సారి సోట్సోబ్ వంతు. చక్కటి బంతితో కోహ్లి (0)ని వెనక్కి పంపిన అతను... మరో రెండు ఓవర్ల తర్వాత రోహిత్ శర్మను అవుట్ చేశాడు. షార్ట్ మిడ్ వికెట్లో ఆమ్లా అద్భుత క్యాచ్ పట్టడంతో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత ఓవర్లో దురదృష్టవశాత్తూ రహానే (8) అవుటయ్యాడు. మోర్కెల్ బౌలింగ్‌లో దూరంగా వెళుతున్న బంతిని వేటాడగా, అది కీపర్ చేతిలో పడింది. రీప్లేలో బంతి, బ్యాట్‌కు తాకలేదని కనిపించింది. ఈ దశలో ధోని (31 బంతుల్లో 19), రైనా కలిసి కొద్ది సేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్‌కు 40 పరుగులు జత చేసిన అనంతరం డి కాక్ అద్భుత క్యాచ్‌కు కెప్టెన్ నిష్ర్కమించాడు. ఆ వెంటనే రైనా కూడా పెవిలియన్ చేరాడు. జడేజా (34 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కొద్ది సేపు నిలబడ్డా లాభం లేకపోయింది. మరో 13.5 ఓవర్లు ఉండగానే ఇండియా ఇన్నింగ్స్ ముగియడం పరిస్థితిని సూచిస్తోంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డి కాక్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 106; ఆమ్లా (సి) ధోని (బి) షమీ 100; డివిలియర్స్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 3; డుమిని (రనౌట్) 26; మిల్లర్ (ఎల్బీ) (బి) షమీ 0; కలిస్ (బి) షమీ 10; మెక్లారెన్ (నాటౌట్) 12; ఫిలాండర్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు (బై 1, లెగ్‌బై 2, వైడ్ 6) 9; మొత్తం (49 ఓవర్లలో 6 వికెట్లకు) 280. వికెట్ల పతనం: 1-194; 2-199; 3-233; 4-234; 5-249; 6-255. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 6-0-45-0; షమీ 8-0-48-3; ఇషాంత్ 7-0-38-0; అశ్విన్ 9-0-48-1; రైనా 6-0-32-0; కోహ్లి 3-0-17-0; జడేజా 10-0-49-1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) ఆమ్లా (బి) సోట్సోబ్ 19; ధావన్ (సి) డుమిని (బి) స్టెయిన్ 0; కోహ్లి (సి) డి కాక్ (బి) సోట్సోబ్ 0; రహానే (సి) డి కాక్ (బి) మోర్కెల్ 8; రైనా (సి) మిల్లర్ (బి) మోర్కెల్ 36; ధోని (సి) డి కాక్ (బి) ఫిలాండర్ 9; జడేజా (సి) డివిలియర్స్ (బి) సోట్సోబ్ 26 ; అశ్విన్ (సి) డి కాక్ (బి) స్టెయిన్ 15 ; షమీ (బి) సోట్సోబ్ 8 ; ఉమేశ్ యాదవ్ (బి) స్టెయిన్ 1 ; ఇషాంత్ (నాటౌట్) 0 ; ఎక్స్‌ట్రాలు (బై 4, లెగ్‌బై 1, వైడ్ 8, నోబాల్ 1) 14 ; మొత్తం (35.1 ఓవర్లలో ఆలౌట్) 146. వికెట్ల పతనం: 1-10; 2-16; 3-29; 4-34 ; 5-74 ; 6-95 ; 7-133 ; 8-145 ; 9-146 ; 10-146. బౌలింగ్: స్టెయిన్ 7-1-17-3; సోట్సోబ్ 7.1-0-25-4; మోర్కెల్ 6-0-34-2; ఫిలాండర్ 6-1-20-1 ; డుమిని 5-0-20-0 ; మెక్లారెన్ 4-0-25-0.