Boyapati Srinu
-
ఈ సినిమా ఇద్దరికీ అగ్నిపరీక్షే
‘‘చిన్న సినిమా.. పెద్ద సినిమా అని ఉండదు. మంచి సినిమానా? కాదా? అనేది ఉంటుంది. ‘దేవకి నందన వాసుదేవ’ వంద శాతం మంచి సినిమా అనిపించింది. ఈ చిత్రం అశోక్‌కి, అర్జున్‌కి అగ్ని పరీక్షే. ఈ పరీక్షని ఎదుర్కొని వారు నిలబడతారని కోరుకుంటున్నాను’’ అని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. అశోక్ గల్లా, వారణాసి మానస జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకుడు. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బోయపాటి శ్రీను, హీరో సుధీర్ బాబు అతిథులుగా పాల్గొన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్, విజువల్స్, సాంగ్స్ చూసినప్పుడు అశోక్‌కి సరైన సినిమా అనిపించింది. తను కమర్షియల్ హీరోగా సక్సెస్ అవుతాడు’’ అన్నారు. ‘‘నేను రాసిన కథల్లో ఇది మాస్ ఎంటర్టైనర్. ఈ పాత్రకి అశోక్ కరెక్టుగా సరిపోయాడు. మహేశ్‌బాబుగారి ఫ్యాన్స్, ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూసి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’’ అని చిత్ర కథారచయిత ప్రశాంత్ వర్మ అన్నారు. ‘‘ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. నాలాంటి కొత్త నిర్మాతని బతికించాలి’’ అని బాలకృష్ణ కోరారు. -
థియేటర్లో అట్టర్‌ఫ్లాప్.. ఓటీటీలో బ్లాక్‌బస్టర్ హిట్
మాస్ సినిమాలకు పెట్టింది పేరు బోయపాటి శ్రీను. మాస్ డైలాగులైనా, యాక్షన్ సీన్లయినా తన ఎనర్జీతో ఇరగదీసే హీరో రామ్ పోతినేని. వీరి కాంబోలో బొమ్మ పడితే బాక్సాఫీస్ దద్దరిల్లుతుందనుకున్నారంతా! కానీ అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. రామ్ పోతినేని- బోయపాటి కాంబోలో తెరకెక్కిన చిత్రం స్కంద. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో నెలలోపే ఓటీటీలోకి తీసుకురావాలని భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది. ఆ తర్వాత నవంబర్ 2న హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్కంద స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీలో స్కంద సినిమాను ఎగబడి మరీ చూస్తున్నారట! ఈ ఏడాది హాట్‌స్టార్‌లో రిలీజైన మొదటి 24 గంటల్లో ఎక్కువమంది వీక్షించిన సినిమాగా స్కంద నిలిచిందని తెలుస్తోంది. అప్పట్లో బోయపాటి.. బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా పెట్టి తీసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆడకపోయినా యూట్యూబ్‌లో మాత్రం రికార్డులు తిరగరాసింది. జయజానకి నాయక చిత్రం హిందీ డబ్బింగ్‌కు యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ వచ్చాయి. ఇప్పుడదే ట్రెండ్ హాట్‌స్టార్‌లోనూ కనిపిస్తోంది. మరోపక్క స్కంద సినిమా ఎడిటింగ్‌లో కొన్ని లోపాలున్నాయని విమర్శలూ వస్తున్నాయి. ఓ పక్క ట్రోలింగ్ జరుగుతున్నా మరోపక్క ట్రెండింగ్‌లో ఉండటం బోయపాటి సినిమాకే సాధ్యమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: భారతీయుడు 2 ఇంట్రో చూశారా? అదిరిపోయిందంతే! -
గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?
తమన్ పేరు చెప్పగానే దద్దరిల్లిపోయే పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గుర్తొస్తాయి. పలు సినిమాల్ని తన సంగీతంతో ఓ రేంజులో ఎలివేట్ చేశాడు. వాటిలో 'అఖండ' ఒకటి. బాలకృష్ణ హీరో, బోయపాటి డైరెక్టర్ అయినా సరే ఈ మూవీ విషయంలో ఎక్కువ క్రెడిట్ తమన్దేనని ప్రేక్షకుల అభిప్రాయం. కానీ మొన్నీమధ్య ఓ ఇంటర్వ్యూలో తమన్ కష్టం ఏం లేదన్నట్లు మాట్లాడాడు. ఇప్పుడు ఆ కామెంట్స్‌పై స్వయంగా తమన్ పరోక్షంగా కౌంటర్ కామెంట్స్ చేశాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా 'స్కంద' మూవీ తీశారు. గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. ఫైట్స్ తప్ప మరే విషయంలోనూ మెప్పించలేకపోయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'అఖండ'కి తమన్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది కదా అని జర్నలిస్ట్ అడగ్గా.. 'ఆ సినిమాను ఆర్ఆర్ (రీరికార్టింగ్) లేకుండా చూసినా మీరు గర్వంగా ఫీలవుతారు. దానికి అంత దమ్ము ఉంటుంది. అదే టైంలో ఆ పర్టిక్యులర్ కల్ట్ మీద తమన్ అద్భుతంగా చేయగలిగాడు' అని బోయపాటి చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఓటీటీలో 'ప్రేమ విమానం' సినిమాకు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్) ఇలా బోయపాటి కామెంట్స్ చేసిన ఒకటి రెండు రోజుల్లోనే తమన్.. 'ఐ డోంట్ కేర్' అని ట్వీట్ వేశాడు. ఇది బోయపాటిని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ అని అందరూ అనుకున్నారు. తాజాగా 'భగవంత్ కేసరి' సక్సెస్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన తమన్.. బాలకృష్ణ ముందే బోయపాటి పరువు తీసేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 'మంచి సీన్‌ని మనం చెడగొట్టం. మనం ఇంకా దాన్ని ఎలివేట్ చేయాలనే చూస్తాం. అక్కడ సీన్లో ఎమోషన్ లేకపోతే నేను ఏం చేసినా వర్కౌట్ కాదు. ఎవడి వల్ల అవ్వదు. చచ్చిన శవం తీసుకొచ్చి బతికించమంటే ఎలా? అంతే లాజిక్ ఇక్కడ. బ్యాక్ గ్రౌండ్ స్కోరు అంటారు గానీ అక్కడ మేటర్ లేకపోతే నేనేం చేయను. అక్కడ వాళ్లు(దర్శకులు) ఇవ్వాలి' అని తమన్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అంతా చూస్తుంటే ఈ గొడవ ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) #Thaman Comments 🤷pic.twitter.com/XDDsBF6Zk3 — CineCorn.Com By YoungMantra (@cinecorndotcom) October 25, 2023 -
ఓటీటీలో 'స్కంద' స్ట్రీమింగ్
బోయపాటి శ్రీను- రామ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం స్కంద. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించింది. గత నెల 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేయడానికి ఈ మాస్ సినిమా సిద్దమైంది. సినిమా విషయంలో మిశ్రమ స్పందన వచ్చినా బోయపాటి మార్క్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. సుమారు రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన స్కంద అక్టోబరు 27వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘స్కంద’ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలని మొదట స్కందతో ఒప్పందం కుదిరిందట. అయితే ఇప్పుడు ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు సమాచారం. స్కంద సినిమాకు థమన్ స్వరాలు సమకూర్చారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై శ్రీనివాస్ చిట్టూరి, పవన్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక స్కంద తర్వాత రామ్ పోతినేని- పూరి కాంబినేషన్లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నారు. -
యంగ్ హీరోల కొంపముంచిన బోయపాటి!
ఊరమాస్ సినిమాలకు పెట్టింది పేరు బోయపాటి శ్రీను. ఆయన మేకింగ్‌లో ఓ పవర్ ఉంటుంది. అది మాస్ ఆడియన్స్‌కు ఎక్కడలేని కిక్ అందిస్తుంది. అయితే ఇది కేవలం సీనియర్ హీరోల విషయంలోనే జరుగుతుంది. యంగ్ హీరోలకు మాత్ర బోయపాటి భారీ ఫ్లాపులను అందిస్తున్నాడు. ఒక్క అల్లు అర్జున్ తప్ప మిగతా ఏ యంగ్ హీరోలకి బోయపాటి హిట్ అందించలేదు. 2012లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ‘దమ్ము’ తీశాడు. అది బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో జయ జానకి నాయక(2017) తీస్తే..అది హిట్ కాలేదు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రం చేయగా.. అది కూడా ఫ్లాప్ అయింది. ఇక తాజాగా రామ్ పోతినేనితో ‘స్కంద’ చేయగా..అది కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. బోయపాటిపై ‘స్కంద’ ఎఫెక్ట్! బోయపాటిపై ‘స్కంద’ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. స్కంద రిలీజ్‌కు ముందు ఆయన తర్వాత సినిమా బన్నీతో ఉంటుందనే వార్తలు వినిపించాయి. మరోవైపు సూర్య కూడా బోయపాటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వచ్చింది. చిరంజీవీ కూడా బోయపాటితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే స్కంద రిలీజ్ తర్వాత మాత్రం ఈ పుకార్లు వినిపించడం లేదు. పైగా బోయపాటితో సినిమా చేయడానికి యంగ్ హీరోలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య కూడా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవి కూడా ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో బోయపాటి మళ్లీ బాలయ్యతోనే సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీ టాక్. -
'స్కంద' కలెక్షన్స్.. సగానికి సగం పడిపోయాయి!
యంగ్ హీరో రామ్-బోయపాటి కాంబోలో వచ్చిన సినిమా 'స్కంద'. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని.. బోయపాటి తనదైన శైలిలోనే తీశారు. రామ్ గెటప్స్‌తో పాటు తమనే నేపథ్య సంగీతం థియేటర్లని దడదడలాడిస్తోంది. మరోవైపు తొలిరోజు కళ్లుచెదిరే వసూళ్లు రాగా, రెండో రోజు సగానికి సగం పడిపోయాయి. తాజాగా పోస్టర్ రిలీజ్ చేయడంతో ఈ విషయం క్లారిటీ వచ్చేసింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్!) స్కంద సంగతేంటి? బోయపాటి సినిమాలంటే లాజిక్స్ వెతక్కూడదు. హీరోలు లార్జర్ దేన్ లైఫ్ పాత్రల్లో కనిపిస్తుంటారు. ఇందులో హీరో పాత్ర అంతకు మించే ఉంటుంది. మిగతా వాళ్లకు పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు గానీ మాస్ ఆడియెన్స్‌కి మాత్రం ఈ సినిమా నచ్చేస్తుంది. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.18.2 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. రెండోరోజు వచ్చేసరికి సగానికి పైగా వసూళ్లు పడిపోయాయి. సగానికి సగం అంటే తొలిరోజు రూ.18.2 కోట్లు వసూలు కాగా, రెండో రోజు రూ.9.4 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.27.6 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని అధికారికంగా రిలీజ్ చేశారు. అయితే వీకెండ్ అయ్యేసరికి 'స్కంద' ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి? మరోవైపు 'స్కంద' మేకింగ్ వీడియోని కూడా తాజాగా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ.. పెళ్లికి అంతా సెట్!) -
ఈ వారం నాలుగు సినిమాలు.. రివ్యూలివే
టాలీవుడ్లో ఈ వారం పెద్ద సినిమాల హవా కొనసాగింది. రామ్ పోతినినే స్కందతో పాటు లారెన్స్ ‘చంద్రముఖి -2’, శ్రీకాంత్ అడ్డాల ‘పెదకాపు’చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. వీటితో పాటు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘ది వాక్సిన్ వార్’ కూడా ఈ నెల 28నే విడుదలయ్యాయి. మరి ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ‘సాక్షి’ రివ్యూల్లో చదవండి. స్కంద: నో లాజిక్.. ఓన్లీ యాక్షన్ రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం ‘స్కంద’. బోయపాటి సినిమాలు అంటేనే హై వోల్టేజ్ యాక్షన్ కథ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్కంద కూడా అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథేంటి? ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్? ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చంద్రముఖి-2: భయపెట్టని హార్రర్ రజనీకాంత్, పీ.వాసు కాంబోలో వచ్చిన చంద్రముఖి(2005) అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తమిళ్లోనే కాదు తెలుగులో ఆ చిత్రం భారీ వసూళ్లని రాబట్టింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. పైగా చంద్రముఖిగా బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ నటించడంతో ‘చంద్రముఖి-2’పై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఏర్పడాయి. మరి ఆ అంచనాలు ఈ చిత్రం ఏ మేరకు అందుకుంది? చంద్రముఖిగా కంగనా భయపెట్టిందా లేదా? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) పెదకాపు-1..తడబడిన సామ్యానుడి సంతకం ఫ్యామిలీ సినిమాకు కేరాఫ్ శ్రీకాంత్ అడ్డాల. ఒక నారప్ప మినహా ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ కుటుంబ, ప్రేమ కథలే. అలాంటి దర్శకుడు రాజకీయ నేపథ్యంతో ‘పెదకాపు’ అనే సినిమాను తెరకెకించాడు. అది కూడా కొత్త హీరోహీరోయిన్లతో. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ‘పెద కాపు -1’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సామాన్యుడి సంతకం అంటూ వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘ది వ్యాక్సిన్ వార్’ ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో వివేక్ అగ్నిహోత్రి నేషనల్ వైడ్‌గా కాంట్రవర్సీ అయ్యాడు. అంతకు ముందు పలు చిత్రాలను తెరక్కించినా.. ది కాశ్మీర్ ఫైల్స్’తోనే అతనికి గుర్తింపు వచ్చింది. తాజాగా వివేక్ అగ్నిహోత్రి తెరక్కించిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజల దుస్థితి ఎలా ఉంది? వ్యాక్సిన్ కనుగోనేందుకు భారత శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ క్రమంలో మన శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సమస్యలేంటి? అనే నేపథ్యంలో ది వ్యాక్సిన్ వార్ సాగుతుంది ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'స్కంద' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
సెప్టెంబరు 28 పేరు చెప్పగానే మొన్నటివరకు 'సలార్' గుర్తొచ్చేది. కానీ అది వాయిదా పడేసరికి ఈ తేదీ కోసం మిగతా సినిమాలన్నీ పోటీపడ్డాయి. ఈ క్రమంలోనే రామ్ 'స్కంద' ఇదేరోజున అంటే తాజాగా థియేటర్లలోకి వచ్చింది. బోయపాటి మార్క్ సినిమాల తరహాలోనే ఇది ఉంది. యాక్షన్ ప్రియుల్ని అలరిస్తున్న ఈ చిత్రం అలానే ఓటీటీ పార్ట్నర్తో పాటు స్ట్రీమింగ్ టైమ్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 'స్కంద' కథేంటి? ఏపీ ముఖ్యమంత్రి (అజయ్ పుర్కన్) కూతురి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ వేడుకకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి (శరత్ లోహితస్వ) కొడుకుతో లేచిపోతుంది. దీంతో సీఎంలు ఇద్దరూ ఒకరిపై ఒకరు పగ పెంచుకుంటారు. తన కూతురిని తిరిగి రప్పించడం కోసం ఏపీ సీఎం ఓ కుర్రాడిని(రామ్ పోతినేని) తెలంగాణకు పంపిస్తాడు. తెలంగాణ సీఎంకి ఓ కూతురు (శ్రీలీల) ఉంటుంది. ఓ సందర్భంలో ఈ కుర్రాడు.. ఇద్దరు ముఖ్యమంత్రుల కుమార్తెలని తీసుకెళ్లిపోతాడు. అసలు ఈ కుర్రాడెవరు? ఎందుకు తీసుకెళ్లాడనేది 'స్కంద' స్టోరీ. (ఇదీ చదవండి: Skanda Movie Review: ‘స్కంద’ మూవీ రివ్యూ) ఎలా ఉంది? బోయపాటి గత సినిమాల్లో ఓ మాదిరిగా అయినా కథ ఉండేది. ఇందులో పెద్దగా అలాంటిదేం లేదు. కమర్షియల్ చిత్రాల్లో నలిగిపోయిన రొటీన్ రివేంజ్ డ్రామానే తీసుకున్నాడు. కానీ సినిమా మొదలైన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు తనదైన మార్క్ సన్నివేశాలతో నడిపించేశాడు. యాక్షన్ లవర్స్, మాస్ ఆడియెన్స్‌కి ఇది నచ్చేయొచ్చు కానీ మిగతా వాళ్లకు కాస్త కష్టమే. ఓటీటీ డీటైల్స్ ఇకపోతే రిలీజ్‌కి ముందే 'స్కంద' మూవీ డిజిటల్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుంది. చేసుకున్న ఒప్పందం ప్రకారం నెల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుందట. అంటే సెప్టెంబరు 28న థియేటర్లలోకి సినిమా వచ్చింది కాబట్టి అక్టోబరు చివరి వారంలో ఇందులో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రావొచ్చని సమాచారం. కొన్నిరోజులు ఆగితే దీనిపై క్లారిటీ వచ్చేస్తుందిలే! (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు) -
Skanda Movie Review: ‘స్కంద’ మూవీ రివ్యూ
టైటిల్: స్కంద నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, పృథ్వీ రాజ్, ప్రిన్స్ సిసల్, ఇంద్రజ, మురళీ శర్మ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మాత: శ్రీనివాస చిట్టూరి దర్శకుడు: బోయపాటి శ్రీను సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ: సంతోష్ డేటాకే ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: సెప్టెంబర్ 28, 2023 ‘స్కంద’ కథేంటంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయుడు(అజయ్ పుర్కర్) తన కూతరు పెళ్లి జరిపించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటాడు. గవర్నర్‌తో సహా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం పెళ్లికి హాజరవుతారు. అయితే ముహుర్తానికి కొన్ని క్షణాల ముందు ఏపీ సీఎం కూతురిని తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి(శరత్ లోహితస్వ) కొడుకు లేపుకెళ్తాడు. దీంతో ఏపీ సీఎం.. తెలంగాణ సీఎంపై పగ పెంచుకుంటాడు. తన పరువు దక్కాలంటే తన కూతురు తిరిగి రావాలని భావిస్తాడు. దాని కోసం ఓ కుర్రాడిని (రామ్ పోతినేని) తెలంగాణకు పంపిస్తాడు. ఏపీ సీఎం కుమార్తెతో తెలంగాణ సీఎం కొడుకు నిశ్చితార్థం జరిగే కొద్ది క్షణాల ముందు.. రామ్ వచ్చి ఏపీ సీఎం కూతురితో పాటు తెలంగాణ సీఎం కూతురి(శ్రీలీల)ని కూడా తీసుకెళ్తాడు. ఎందుకలా చేశాడు? అతను ఎవరు? ప్రముఖ వ్యాపారవేత్త రుద్రగంటి రామకృష్ణరాజు(శ్రీకాంత్)కు, ఇద్దరు సీఎంలతో ఉన్న వైర్యం ఏంటి? రామకృష్ణ రాజుకు, రామ్‌కు(ఈ సినిమాలు హీరో పాత్రకు పేరు లేదు) ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో 'స్కంద' చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ అనే పదానికి కేరాఫ్ అంటే బోయపాటి శ్రీను అనే చెప్పాలి. ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన 9 సినిమాలు మాస్ ఆడియన్స్‌ని మెప్పించేలా ఉంటాయి. స్కంద కూడా అదే స్థాయిలో తెరకెక్కించాడు. అయితే బోయపాటి సినిమాల్లో లాజిక్కులు ఉండవు. హీరో ఏ స్థాయి వ్యక్తినైన ఈజీగా కొట్టగలడు. కాలితో తన్నితే కార్లు సైతం బద్దలవ్వాల్సిందే. ఇదంతా గత సినిమాల్లో చూశాం. ఇక స్కందలో అయితే రెండు అడుగులు ముందుకేశాడు. లాజిక్కు అనే పదమే వాడొద్దనేలా చేశాడు. ఎంతలా అంటే.. ఒక సీఎం ఇంటికి ఓ సామాన్యుడు ట్రాక్టర్ వేసుకొని వెళ్లేంతలా. ఇద్దరు ముఖ్యమంత్రులు అతని చేతిలో తన్నులు తినేంతలా. ఒక ముఖ్యమంత్రి వీధి రౌడీ కంటే నీచంగా బూతులు మాట్లాడేంతలా. పోలీసు బెటాలియన్ మొత్తం దిగి గన్ పైరింగ్ చేస్తుంటే మన హీరోకి ఒక్కటంటే.. ఒక్క బుల్లెట్ కూడా తగలదు అంటే అది బోయపాటితోనే సాధ్యమని స్కందలో చూపించాడు. ఇవన్నీ మాస్ ఆడియన్స్‌ని ఈలలు వేయిస్తే.. సామాన్య ప్రేక్షకులను మాత్రం సిల్లీగా కనిపిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్త రుద్రగంటి రామకృష్ణరాజు(శ్రీకాంత్) జైలు సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు సంబంధించిన ఆసక్తికర సన్నివేశాలతో అసలు కథలోకి తీసుకెళ్తాడు. హీరో ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఆ తర్వాత కథ కాస్త చప్పగా సాగుతుంది. కాలేజీ సీన్స్ అంతగా ఆకట్టుకోలేవు. హీరో ఎంట్రీ, అతనికిచ్చిన ఎలివేషన్స్ బట్టి ఏదో జరుగబోతుందనే ఆసక్తి ఆడియన్స్‌లో కలుగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ట్విస్ట్ కూడా సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక బోయపాటి సినిమా గత సినిమాల మాదిరి స్కంద సెకండాఫ్ కూడా ఫ్లాష్‌బ్యాక్‌తో ప్రారంభమవుతుంది. రుద్రగంటి రామకృష్ణరాజు ఎందుకు జైలు పాలయ్యాడు? హీరో నేపథ్యం ఏంటి? తదితర సన్నివేశాలతో సెకండాఫ్ సాగుతుంది. క్లైమాక్స్ 15 నిమిషాల ముందు వచ్చే యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. అదే సమయంలో విపరీతమైన హింస, అనవసరపు సంభాషణలు ఓ వర్గం ప్రేక్షకులను ఇబ్బందిని కలిగిస్తాయి. యాక్షన్ సీన్స్ పండినంతగా ఎమోషనల్ సన్నీవేశాలు పండలేదు. క్లైమాక్స్ ట్వీస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. ఓవరాల్‌గా మాస్ ఆడియన్స్‌కి అయితే బోయపాటి ఫుల్ మీల్స్ పెట్టాడనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. మాస్ పాత్రలు రామ్‌కి కొత్తేమి కాదు. ఇంతకు ముందు జగడం, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో ఆ తరహా పాత్రలు చేశాడు. అయితే స్కందలో మాత్రం ఊరమాస్ యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. యాక్షన్స్ సీన్స్. హీరోయిన్లు శ్రీలీల, సయీ మంజ్రేకర్ పాత్రల పరిధి చాలా తక్కువ. అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నటించారు. శ్రీలీల తనదైన డ్యాన్స్‌తో మరోసారి ఆకట్టుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా అజయ్ పుర్కర్, శరత్ లోహితస్వ తమ పాత్రల పరిధిమేర నటించారు. వ్యాపారవేత్తగా శ్రీకాంత్ చక్కగా నటించాడు.దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సంతోష్ డేటాకే సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఎక్కడ రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Skanda Review: ‘స్కంద’ మూవీ ట్వీటర్ రివ్యూ
అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘‘స్కంద’-ది ఎటాకర్’. రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు,టీజర్ సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. స్కంద మూవీ ఎలా ఉంది?స్టోరీ ఏంటి? తదితర విషయాలు ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. Good First Half Sound effects could have been less in fights Boya Senseless Mass Logics pekkana petti chudandi #Skanda https://t.co/6XUAzzuu2i — ʜᴜɴɢʀʏ ᴄʜᴇᴇᴛᴀʜ (@SiddarthRoi) September 28, 2023 సాధారణంగా ఓవర్సీస్ ఏరియాల్లో సినిమా ముందుగా రిలీజ్ అవుతుంది. అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఒక్క రోజు ముందే ప్రీమియర్ షోలు పడతాయి. కానీ స్కంద టీమ్ మాత్రం ఓవర్సీస్లో ప్రీమియర్లు వేయలేదు. ఇండియాలో ఎప్పుడైతే విడుదల అవుతుందో.. అప్పుడే విదేశాల్లోనూ బొమ్మ పడుతుంది. ఈ రోజు మార్నింగ్ కొన్ని చోట్ల షో పడిపోయింది. ట్విటర్లో పలువురు షేర్ చేస్తున్న ప్రకారం సినిమాలో కథా బలం తక్కువగా ఉన్నా రామ్ పోతినేని మాస్ ఎనర్జీతో మెప్పించాడని చెబుతున్నారు. ఎక్కువగా మాస్ ఆడియన్స్‌కు బాగా నచ్చుతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇందులో రామ్ ఫైట్స్ ఎలివేషన్‌తో పాటు తమన్ మ్యూజిక్ బాగా ప్లస్ అయిందని సమాచారం. ఫస్టాఫ్ కొంతమేరకు యావరేజ్‌గా ఉన్నా ఫైనల్లీ సినిమా బాగుందనే అభిప్రాయం ఎక్కువ మంది తెలుపుతున్నారు. రామ్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడా నిరుత్సాహం చెందరని.. రామ్ ఎనర్జీతో సినిమాను మరో రేంజ్‌కు తీసుకుపోయాడని ఎక్కువ మంది కామెంట్స్ చేస్తున్నారు. స్కంద ముగింపును ఆధారంగా చూస్తే పార్ట్ -2 కూడా ఉంటుందనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. #Skanda 🎬 First Half Report 📝 :#RAmPOthineni introduction & Mass Swag🔥💥#Sreeleela Scenes 💥 Action Scenes ⚡️⚡️#Thaman Songs & Bgm Music 💥🥁💥 Interval 💥 Overall a Good First Half...!!👍 Stay tuned to @Mee_Cinema for Second Half Report & Full Review ✍️ pic.twitter.com/y1sOAXYh0j — Mee Cinema (@Mee_Cinema) September 28, 2023 Just finished watching #Skanda movie #BoyapatiSreenu Thandavaam started the main asset to movie is direction The main piller to entire movie @ramsayz acting and swag never before seen This time @MusicThaman ur music and bgm will speaks in peeks 🔥@sreeleela14 dance ultimate pic.twitter.com/sa8nDUIJRO — Jaikarthiksv (@jaikarthiksv1) September 28, 2023 First half #Blockbuster #Skanda #RAPO #RAPOMass https://t.co/o3fjjWCV8u — BABA #DEVARA 🥵 (@lovelybaba9999) September 28, 2023 Pakka Mass Hittt Bomma 🤙🤙💥 Mass Euphoria In Theatres 🔥🔥🔥 Ustaad Ram in never before looks Boyapati mark massss💥💥💥💥 Thaman On Steroids 🤙🤙🤙🤙🤙#skanda #Skanda #RAmPOthineni #BoyapatiSreenu — S.Harsha (@SHarsha19085417) September 28, 2023 #Skanda Average 1st Half! Starts off interesting and has a rocking introduction for Ram but dips after that and loses track apart from a few good action sequences. — Venky Reviews (@venkyreviews) September 28, 2023 Take care sir! Don't sit near the speakers and wear helmet, if possible! Feeling sorry for you that you are going through this torture.....@ramsayz #skandareview — SATYA (@ssatyatweets) September 28, 2023 #Skanda 1st half: Best Introduction ever for @ramsayz 🔥, Narration👍, some mass scenes Worked well, Interval Massive🔥🔥 Very Good 1st half works In most parts 2nd half: Dialogues and some scenes Are Excellent, Climax is Different and Okay Good 2nd half Overall: HIT💥 — tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) September 28, 2023 All set for Boya-Thaman Sambavam 👂👂 #Skanda pic.twitter.com/jRm5uvyQpJ — Ragadi (@RagadiYT) September 28, 2023 It's official It's two parts Skanda 2 was confirmed in post credits scene#Skanda #SkandaOnSep28 — 𝙍𝙤𝙨𝙝𝙖𝙣™ (@NTR_Roshan_) September 28, 2023 Just mental mass no logic ..just mass First half #Skanda @Prabhas83932022 pic.twitter.com/Z0xPYZvm6X — Raghu (@436game) September 28, 2023 -
యాక్షన్ సినిమాలపై మరింత గౌరవం పెరిగింది
‘‘యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా ‘స్కంద’. ఇందులో నా పాత్రలో సరదా, భావోద్వేగ సన్నివేశాలు ఉంటాయి. కాలేజ్ డ్రామా కూడా ఉంది. మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్‌ని అద్భుతంగా చూపించడంలో బోయపాటిగారి మార్క్ కనిపిస్తుంది. ‘స్కంద’ చేస్తున్నప్పుడు యాక్షన్ సినిమాలపై మరింత గౌరవం పెరిగింది’’ అని శ్రీ లీల అన్నారు. రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం ‘స్కంద’. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక శ్రీ లీల చెప్పిన విశేషాలు. ► ‘స్కంద’లో నా పాత్రలో మాస్, క్లాస్ రెండూ మిక్స్ అయ్యుంటాయి. ఇందులో కొన్ని సీన్స్ నా రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా మాస్ సీన్స్. ► ధమాకా’లో నా డ్యాన్స్‌లకు అంత పేరు వస్తుందనుకోలేదు. ‘స్కంద’ పాటల్లో మాస్, వెస్ట్రన్ డ్యాన్సులు అలరిస్తాయి. రామ్‌గారి డ్యాన్స్‌ని మ్యాచ్ చేయడం కష్టం. శ్రీనివాసా చిట్టూరిగారు ఈ సినిమాని గ్రాండ్‌గా నిర్మించారు. ‘స్కంద’ బోయపాటిగారి మార్క్‌లో గ్రాండ్‌గా ఉంటుంది. ఇంత మాస్ యాక్షన్ సినిమా చేయడం నాకిదే తొలిసారి. అలాగే పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పడం కూడా మొదటిసారే. ► ‘పెళ్లి సందడి’ తర్వాత ‘స్కంద’తో పాటు మరో రెండు మూడు సినిమాలు ఒప్పుకున్నాను. ఇప్పుడు దాదాపు ఎనిమిది సినిమాలు ఉన్నాయి. ఇన్ని అవకాశాలు రావడానికి కారణం ఇండస్ట్రీ, ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానమే. ఆ ప్రేమను మంచి సినిమాలు చేయడం ద్వారా తిరిగి ఇవ్వాలన్నదే నా తపన. -
బోయపాటిని వెంటాడుతున్న సెంటిమెంట్.. ‘స్కంద’తో నిరూపిస్తాడా?
టాలీవుడ్లో ఊరమాస్ డైరెక్టర్ అనగానే అందరికి గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను. నేల టికెట్ ఆడియన్స్‌కి నచ్చేలా.. వాళ్లను మెప్పించేలా భారీ మాస్ మూవీస్‌ని తెరకెక్కిస్తున్న ఏకైక తెలుగు దర్శకుడు. బోయపాటి కెరీర్లో ఇప్పటికి వరకు 9 సినిమాలు తెరకెక్కిస్తే.. అందులో 6 బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఇది ఆషామాషీ విషయం కాదు. కెరీర్ ప్రారంభంలోనే హ్యాట్రిక్ విక్టరీ సాధించిన అతికొద్ది మంది దర్శకుల్లో బోయపాటి ఒకరు. అయితే బోయపాటిని మాత్రం ఒక సెంటిమెంట్ బాగా పట్టి పీడిస్తోంది. ఆరు విక్టరీలు కానీ.. బోయపాటి కెరీర్లో ఇప్పటి వరకు తొమ్మిది సినిమాలు తెరకెక్కిస్తే.. వాటిలో ఆరు సీనియర్ హీరోలు నటించినవే. అవి మాత్రమే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. బోయపాటి తొలి చిత్రం భద్ర. రవితేజ హీరోగా నటించాడు. 2005 రిలీజైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత వెంకటేశ్‌తో తులసి(2007) చిత్రం తెరకెక్కించాడు. అది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 2010లో బాలయ్యతో సింహా తెరకెక్కించగా.. అది రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇలా వరుస హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బోయపాటి.. తన నాలుగో చిత్రం ‘దమ్ము’ని ఎన్టీఆర్‌తో చేశాడు. 2012లో వచ్చిన ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ బాలయ్యతో ‘లెజెండ్’ తీస్తే.. అది సూపర్ హిట్‌గా నిలిచింది. అదే జోష్‌లో అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ తెరకెక్కించాడు. 2016లో రిలీజ్ అయిన ఈ చిత్రం అల్లు అర్జున్‌ని రూ. 100 కోట్ల క్లబ్లో చేర్చింది. ఇక 2017లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో జయ జానకి నాయక చిత్రాన్ని తెరకెక్కించగా.. అది బాక్సాపీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రం చేయగా.. అది కూడా ఫ్లాప్ అయింది. దీంతో మళ్లీ బాలయ్యతో మూవీ చేశాడు. 2021లో రిలీజైన అఖండ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. స్కంద పరీక్షలో పాస్ అవుతాడా ? బోయపాటి కెరీర్లో హిట్ అయిన చిత్రాలన్నీ సీనియర్ హీరోలవే. బాలయ్యకు మూడు(సింహా, లెజెండ్, అఖండ), రవితేజ, వెంకటేశ్‌లకు ఒక్కొక్క(భద్ర, తులసి) హిట్ అందించాడు. అలాగే సరైనోడుతో అల్లు అర్జున్‌కి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. బన్నీ మినహా యంగ్ హీరోలతో చేసిన సినిమాలేవి విజయం సాధించలేదు. రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ తెరకెక్కిస్తే..అది డిజాస్టర్ అయింది. అలాగే మరో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘జయ జానకి నాయక’ తీస్తే..అది కూడా దారుణంగా బోల్తా పడింది. చాలా కాలం తర్వాత మరో యంగ్ హీరో రామ్ పోతినేనితో బోయపాటి సినిమా తీశాడు. మరి ఈ సారి అయినా బోయపాటి ఆ సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తాడా? స్కంద పరీక్షలో పాస్ అయి..తనపై పడిన ముద్రను తొలగింటాడో..లేదో ఈ నెల 28న తెలుస్తుంది. -
‘స్కంద’ మాస్ మూవీనే కాదు..ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి: రామ్
‘బోయపాటి గారి సినిమా అంటే ఫైట్స్ అని అంటారు. ఐతే కేవలం ఫైట్స్ మాత్రమే కాదు.. ఆ ఫైట్స్ వెనుక ఎమోషన్. ఆ ఎమోషన్ ని ఎలా బిల్డ్ చేస్తారనేది స్కంద కీ ఎలిమెంట్. స్కంద కేవలం మాస్ సినిమానే కాదు. చాలా అందమైన ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాకి సోల్ ఫ్యామిలీ ఎమోషన్స్ అని హీరో రామ్ పోతినేని అన్నారు. బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్కంద’-ది ఎటాకర్. శ్రీలీల హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ కరీంనగర్లో స్కంద కల్ట్ జాతర పేరుతో ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. బోయపాటి గారు ప్రతి సినిమాలో ఒక సోషల్ మెసేజ్ పెడతారు. ఇందులో మెసేజ్ ని కుటుంబ సభ్యులంతా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. ‘నేను సినిమా తీసేటప్పుడే టెన్షన్ పడతాను. ఒక్కసారి ఔట్పుట్ వచ్చిన తర్వాత ఇంక టెన్షన్ ఉండదు. ఎందుకంటే చాలా బాగా తీశాననే నమ్మకం. స్కంద చాలా మంచి సినిమా. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం కచ్చితంగా అందరూ మనస్పూర్తిగా ఆదరించాలని కోరుకుంటున్నాను’అని దర్శకుడు బోయపాటి అన్నారు. రామ్- బోయపాటి సినిమా అభిమానులందరికీ ఒక పండగలా ఉంటుందని హీరో శ్రీకాంత్ అన్నారు. ఈ ఈవెంట్లో హీరోయిన్ సాయి మంజ్రేకర్, ఇంద్రజ, ప్రిన్స్, శ్రవణ్, రచ్చరవితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. రింగ్ లో దిగితే రీసౌండ్ రావాలె.. కరీంనగర్లో నిర్వహించిన కల్ట్ జాతర ఈవెంట్లో స్కంద మూవీ రెండో ట్రైలర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేశారు. పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది.'నేను సంపేటపుడు వాడి తలకాయ యాడుందో చూస్తాను..ఆడి యెనకాల ఎవరున్నారో చూడను’,'రింగ్ లో దిగితే రీసౌండ్ రావాలె...చూసుకుందాం..బరాబర్ చూసుకుందాం.'' అంటూ ట్రైలర్ లో రామ్ చెప్పిన డైలాగులు పవర్ ఫుల్ గా ఉన్నాయి. మాస్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది. తమన్ నేపధ్య సంగీతం యాక్షన్ ని మరింతగా ఎలివేట్ చేసింది -
తెలుగు టాప్ డైరెక్టర్‌తో సూర్య సినిమా.. తొందరపడ్డాడా..?
భారతీయ సినిమా ఇప్పుడు ఎల్లలు దాటి చాలా కాలమైంది. ఇంతకుముందు ఒక భాషలో నిర్మించిన పెద్ద హీరో చిత్రాలు మాత్రమే ఇతర భాషల్లో అనువాదం అయ్యేవి. ఆ తర్వాత ద్విభాషా చిత్రాల ఒరవడి మొదలైంది. అలాంటిది ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాల రూపకల్పన అధికం అవుతోంది. మరో విషయం ఏమిటంటే ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రాన్ని ఒక భాషలో రూపొందిస్తే వర్కౌట్కాని పరిస్థితి. సమీప కాలంలో ద్విభాషా చిత్రాలతో నటుడు కార్తీ, విజయ్, ధనుష్ వంటి వారు సక్సెస్ అయ్యారు. తాజాగా నటుడు సూర్య కూడా ఈ బాటలో పయనించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇంతకుముందు తెలుగులో రక్తచరిత్ర అనే చిత్రంలో సూర్య నటించారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. కాగా సూర్య తమిళంలో నటించిన పలు చిత్రాలు తెలుగులో అనువాదమై మంచి వసూళ్లను సాధించాయి. ప్రస్తుతం సూర్య నటిస్తున్న కంగువ చిత్రం ఏకంగా 10 భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో ఆయన ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. తాజా సమాచారం ఏంటంటే సూర్య టాలీవుడ్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు ఇదేవిధంగా తెలుగులో ధనుష్, విజయ్, కార్తీ వంటి వారు సక్సెస్ అయ్యారు. ఒక్క శివకార్తికేయన్ నటించిన ప్రిన్స్ చిత్రం మాత్రం నిరాశపరిచింది. కాగా సూర్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో చిత్రం రూపొందడం నిజమే అయితే అది పక్కా మాస్ మసాలా చిత్రంగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. సూర్య 'స్కంద' వరకు ఆగాల్సింది బోయపాటి ప్రాజెక్ట్‌ను సూర్య ఓకే చేసే విషయంలో తొందర పడ్డాడా అనే చర్చ కూడా ఇండస్ట్రీలో జరుగుతుంది. ఎందుకంటే బోయపాటి ఎక్కువగా బాలకృష్ణతో మాత్రమే బ్లాక్బస్టర్లు ఇచ్చారు కానీ వేరే హీరోలతో అతడికి సరైన విజయాలు లేవని చెప్పవచ్చు. అఖండ సినిమాకు ముందు 'వినయ విధేయ రామ' ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు రామ్‌తో అతను చేసిన 'స్కంద' కూడా పెద్దగా బజ్ లేదు. బోయపాటి నుంచి వచ్చే ఏ సినిమా అయినా ట్రైలర్ పెద్ద సంచలనమే క్రియేట్ చేస్తుంది. కానీ స్కంద ట్రైలర్ చూసిన మెజారిటీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. సినిమా విడుదల తర్వాత అభిప్రాయం మారవచ్చేమో చూడాలి. స్కంద హిట్ అయితే సూర్య సినిమాకు మరింత క్రేజ్ పెరగడం ఖాయం అనే వార్తలు కూడా వస్తున్నాయి. -
రామ్ 'స్కంద' మూవీ స్టిల్స్
-
'గందార బాయి' అంటూ.. రెచ్చిపోయిన రామ్
రామ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘స్కంద’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. ఎస్ఎస్ తమన్ స్వర పరచిన ‘స్కంద’లోని ‘గందార బాయి..’ అంటూ సాగే రెండో పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, నకాష్ అజీజ్, సౌజన్య భాగ వతుల పాడారు. ‘‘ఈ పాటలో రామ్ డ్యాన్స్‌లో డైనమిజమ్ చూపించగా, శ్రీలీల ఎనర్జీతో మ్యాచ్ చేసింది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, కెమెరా: సంతోష్ డిటాకే. -
‘స్కంద’ క్రేజీ అప్డేట్ ఇచ్చిన బోయపాటి
రామ్, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్కంద’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతదర్శకుడు. ఈ చిత్రంలోని ‘నీ చుట్టు చుట్టు...’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను ఈ నెల 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, పోస్టర్ని విడుదల చేశారు. ‘‘ఈ చిత్రంలో రామ్ ఇంతకుముందు కనిపించనంత మాస్‌గా కనిపించనున్నారు. ‘నీ చుట్టు..’ సాంగ్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ డిటాకే, సమర్పణ: పవన్ కుమార్, జీ స్టూడియోస్. డబుల్.. తొలి షెడ్యూల్ పూర్తి: రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ‘‘మా యాక్షన్ ప్యాక్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. మరో షెడ్యూల్ కోసం విదేశాలు వెళ్లనున్నాం. 2024 మార్చి 8న థియేటర్లలో ‘డబుల్ ఇస్మార్ట్’’ అని ఛార్మి పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సీఈవో: విషు రెడ్డి. -
నేను దిగితే మిగిలేదుండదు!
రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘స్కంద’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘ది ఎటాకర్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. సోమవారం ‘స్కంద’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ‘మీరు (సినిమాలో రౌడీలను ఉద్దేశిస్తూ..) దిగితే ఊడేదుండదు... నేను దిగితే మిగిలేదుండదు..’ అంటూ రామ్ చెప్పే డైలాగ్‌తో ఈ గ్లింప్స్ విడుదలైంది. జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్ , కెమెరా: సంతోష్ డిటాకే. -
జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న రామ్, బోయపాటి
-
కాస్త ముందుగానే..
రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీ లీల నాయిక. జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరు 20న రిలీజ్ చేయాలనుకున్నారు. తాజాగా సెప్టెంబరు 15న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలా అనుకున్న టైమ్కంటే ముందుగానే ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. -
ఊర మాస్ సాంగ్ లో రామ్, శ్రీలీల
-
మైసూర్ లో డ్యూయెట్ పాడుకుంటున్న రామ్ - శ్రీలీల, సెల్ఫీ పిక్ వైరల్
ఒక పాట, ఒక పవర్ఫుల్ ఫైట్ కోసం రామ్, శ్రీలీల, బోయపాటి అండ్ టీమ్ మైసూర్ వెళ్లారు. ఈ సందర్భంగా మైసూర్లో రామ్, శ్రీలీల సెల్ఫీలు దిగి, సందడి చేశారు. రామ్, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఒక యాక్షన్ సీక్వెన్స్, ఒక పాటను మైసూర్లో చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. మంగళవారం ఆరంభమైన ఈ షెడ్యూల్ ఈ నెల 15 వరకు సాగుతుంది. ఈ షెడ్యూల్‌తో ఒక్క పాట మినహా సినిమా పూర్తవుతుంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 20న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
బర్త్‌డే స్పెషల్: టీజర్ విడుదల.. మాస్ లుక్‌లో రామ్ పోతినేని.. ఇక రచ్చ రచ్చే (ఫొటోలు)
-
బర్త్‌డేకి థండర్
‘‘ఫస్ట్ థండర్ రానుంది.. రెడీగా ఉండండి’ అంటూ రామ్ నటిస్తున్న తాజా చిత్రం గురించి యూనిట్ పేర్కొంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా రామ్ పుట్టినరోజు (మే 15) సందర్భంగా ఈ సినిమా నుంచి ‘ఫస్ట్ థండర్’ పేరుతో ప్రత్యేకంగా ఓ అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించి, శనివారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘యాక్షన్, మాస్ ఎంటర్టైనర్గా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 20న అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. రామ్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సంతోష్ డిటాకే, సమర్పణ: జీ స్టూడియోస్, పవన్‌కుమార్. -
1500 మందితో మాస్ ఫైట్..పూనకాలు తెపిస్తున్న చరణ్,రామ్ లు
-
ఏయే హీరో ఏయే దర్శకుడు చెప్పిన కథ విన్నారో చూద్దాం!
షూటింగ్ చేయడం.. కొత్త సినిమా కోసం కథలు వినడం... ప్రస్తుతం సీనియర్ స్టార్స్ ఇలా కథలు వినే పని మీద ఉన్నారు. ఫలానా దర్శకుడు చెప్పిన కథను ఫలానా హీరో విన్నారట అనే టాక్ రావడంతో విన్నారా? నిజమేనా? అనే చర్చ మొదలైంది. ఇక వార్తల్లో ఉన్న ప్రకారం ఏయే హీరో ఏయే దర్శకుడు చెప్పిన కథ విన్నారో చూద్దాం. చిరంజీవి ఖాతాలో ప్రస్తుతం ఉన్న రెండు చిత్రాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘బోళా శంకర్’. వీటిలో ‘వాల్తేరు వీరయ్య’ ఈ 13న విడుదల కానుండగా, ‘బోళా శంకర్’ ఏప్రిల్ 14న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ రెండు చిత్రాల తర్వాత యువ దర్శకుడు వెంకీ కుడుములతో చిరంజీవి హీరోగా నటించే సినిమా తెర కెక్కాల్సింది. కానీ ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం హోల్డ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి తర్వాతి సినిమా ఏ దర్శకుడితో అనే చర్చ మొదలైంది. అయితే గత ఏడాది వేసవిలో చిరంజీవి హీరోగా తాను నిర్మాతగా ఓ సినిమా చేయనున్నట్లు నటి రాధిక ట్వీట్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. చిరంజీవి నెక్ట్స్ చేయబోయేది ఈ సినిమాయే అని, ఇటీవలే కథా చర్చలు కూడా ఊపందుకున్నాయన్నది ఫిల్మ్‌నగర్ లేటెస్ట్ టాక్. ఆల్రెడీ కొంతమంది దర్శకులు చెప్పిన కథలు విన్నారట చిరంజీవి. ఇటు రాధిక కూడా కొంతమంది రచయితలను సంప్రదించగా, వారు చిరంజీవికి స్టోరీ లైన్ చెప్పారట. మరోవైపు దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా చిరంజీవి కోసం ఓ కథను రెడీ చేస్తున్నారని తెలిసింది. అలాగే ప్రభుదేవా కూడా ఓ కథ సిద్ధం చేశారట. మరి.. చిరంజీవి ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? అనే విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇటు ‘వీరసింహారెడ్డి’ సినిమాను ఈ సంక్రాంతి బరిలో ఉంచిన బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కాగా బాలకృష్ణకు ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి సూపర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను ఇటీవల ఆయనకు ఓ కథ వినిపించారట. అలాగే దర్శకుడు పరశురామ్ కూడా బాలకృష్ణకు కథ చెప్పారట. మరోవైపు ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా ‘ఆదిత్య మ్యాక్స్ 999’ సినిమా చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారు. మరి.. బాలకృష్ణ 109వ దర్శకుడు ఎవరు? అనే విషయంపై క్లారిటీ రావాలంటే కొంత సమయం పడుతుంది. ఇక మరో ఇద్దరు సీనియర్ హీరోలు వెంకటేశ్, నాగార్జున కూడా ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నారు. నాగార్జునకు గతంలో కథలు వినిపించిన వారిలో తమిళ దర్శకుడు మోహన్‌రాజా, రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుతానికి ప్రసన్న కుమార్ కథ పట్ల నాగార్జున మొగ్గు చూపారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన సంక్రాంతి సమయంలో రానున్నట్లు తెలిసింది. కాగా, గత ఏడాది రిలీజైన ‘ఎఫ్ 3’ తర్వాత మరో కొత్త సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లలేదు వెంకటేశ్. ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు కేవీ అనుదీప్, దర్శక–రచయిత తరుణ్ భాస్కర్ కథలు వినిపించినప్పటికీ... ఇంకా ఏ ప్రాజెక్ట్‌కీ పచ్చజెండా ఊపలేదు వెంకీ. కాగా వెంకటేశ్‌కి కథ వినిపించిన దర్శకుల జాబితాలో తాజాగా ‘హిట్’ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను పేరు కూడా చేరిందని, శైలేష్ చెప్పిన కథకు వెంకీ ఇంప్రెస్ అయ్యారని టాక్. వెంకటేశ్ నెక్ట్స్ మూవీ శైలేష్ దర్శకత్వంలోనే అనే ప్రచారం ఊపందుకుంది. ఇక ఈ నలుగురి హీరోల నెక్ట్స్ డైరెక్టర్ ఎవరో అధికారిక ప్రకటన వస్తేనే తెలుస్తుంది. -
మెగా ఫోన్ పట్టిన బోయపాటి శిష్యుడు..స్టైలిష్ ఎంటర్టైన్మెంట్ షురూ!
కొత్త దర్శకులను ప్రొత్సహించడంలో టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. మంచి కంటెంట్‌తో వస్తే చాలు.. ఒక్క సినిమాతోనే అతన్ని స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరుస్తారు. అందుకే యువ దర్శకులు ఎప్పుడూ తెలుగులో సినిమాలు చేయడానికి ఇష్టపడతారు. తాజాగా టాలీవుడ్‌కి మరో డైరెక్టర్ పరిచయం కానున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దగ్గర అసోసియేట్ గా దర్శకత్వ శాఖ లో పనిచేసిన సుబ్బు మెగా ఫోన్ పట్టనున్నారు. త్రిశూల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఏ ఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. స్టైలిష్ లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ కవుటూరి హీరోగా నటిస్తున్నారు. ఇతర నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడికానున్నట్టు సమాచారం. -
హై వోల్టేజ్ యాక్షన్ సీన్‌తో రామ్ పోతినేని కొత్త మూవీ ఆరంభం
రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీ లీల కథానాయిక. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్‌తో షూటింగ్‌ను మొదలుపెట్టింది యూనిట్. స్టంట్ శివ నేతృత్వంలో ఈ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సంతోష్ డి. -
రామ్ సినిమాలో ఊర్వశీ రౌతేలా.. ఫోటోతో క్లారిటీ
యంగ్ హీరో రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా సాగనుంది. పెళ్లిసందడి బ్యూటీ శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్గా నటించనుంది.. శ్రీనివాస సిల్వర్ స్కీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రూమర్స్‌ని నిజం చేస్తూ హీరో రామ్‌తో సెట్స్‌లో దిగిన ఓ ఫోటోను ఊర్వశీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ సినిమాలో ఆమె ఐటెం సాంగ్‌లో నటించనుందనే న్యూస్ కన్ఫర్మ్ చేసినట్లయ్యింది. ఇక అఖండ తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. @ramsayz 🌹♥️ #RP pic.twitter.com/t9eCNweftY — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 27, 2022 -
బోయపాటి స్కెచ్.. హీరో రామ్‌కు తండ్రిగా ఆ బాలీవుడ్ హీరో?
యంగ్ హీరో రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోను సంప్రదించారట. పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌కి తండ్రిగా ప్రముఖ బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఇక హీరో రామ్ కూడా ఈ చిత్రంలో చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఇందుకోసం సుమారు 11కిలోల బరువు పెరగనున్నట్లు టాక్ వినిపిస్తుంది.రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రెండు పాత్రల్లో వేరియేషన్స్ కోసం రామ్ కొత్తగా మేకోవర్ అవనున్నారట.కాగా అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, అందులోనూ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. -
అమ్మడి అదృష్టం.. బోయపాటి డైరక్షన్లో శ్రీలీల..
రామ్ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు శ్రీలీలను ఎంపిక చేశారు. దసరా సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభమైంది. తొలి షెడ్యూల్లోనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. -
రామ్ - బోయపాటి కాంబినేషన్.. క్రేజీ అప్ డేట్ ఆరోజే..!
రామ్ పోతినేని తాజా చిత్రంపై క్రేజీ అప్డేట్ వచ్చింది. మాస్ డైరెక్టర్ బోయపాటి- రామ్ కాంబినేషన్లో రానున్న చిత్రానికి సంబంధించి దసరా కానుకగా అక్టోబర్ 5న అప్డేట్ ఇస్తున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. 'ఇక ఎదురుచూపులు ముగిశాయి. మాసివ్ ఎనర్జిటిక్ కాంబోతో దసరా వేడుకలు ప్రారంభిద్దాం. అక్టోబర్ 5న అప్ డేట్స్ రాబోతున్నాయి. వేచి ఉండండి’ అంటూ పోస్ట్ చేశారు. (చదవండి: అర్జున్ను ఎవరూ ఆపలేరు.. అంచనాలు పెంచుతున్న 'హంట్' టీజర్) అయితే వీరిద్దరి సినిమాపై చిత్రబృందం నుంచి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని సమాచారం. ముఖ్యంగా రామ్ బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ అఖండ సినిమాతో బోయపాటి ఖాతాలో భారీ హిట్ వచ్చి చేరింది. ఆ తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
బోయపాటి సినిమా కోసం రామ్ పోతినేని షాకింగ్ నిర్ణయం
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం హీరో రామ్ తన లుక్‌ని పూర్తిగా మార్చబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం సుమారు 11కిలోల బరువు పెరగనున్నట్లు టాక్ వినిపిస్తుంది. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు రామ్ కూడా ఈ కండిషన్‌కి వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రెండు పాత్రల్లో వేరియేషన్స్ కోసం రామ్ కొత్తగా మేకోవర్ అవనున్నారట.కాగా అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, అందులోనూ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సెట్స్‌పైకి రానున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘వారియర్’ షాక్‌తో ప్లాన్ మార్చుకున్న రామ్!
‘ది వారియర్’ మూవీతోనే తమిళ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు రామ్ పోతినేని. ఈ సినిమాతోనే కోలీవుడ్ కు తన మార్కెట్ ను విస్తరించాలనుకున్నాడు. తర్వాత చేయబోయే బోయపాటి మూవీ, ఆ తర్వాత చేయబోయే గౌతమ్ మీనన్ మూవీతో తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలనుకున్నాడు. ది వారియర్ వేసిన విజిల్‌ను తమిళ ఆడియెన్స్ పట్టించుకోలేదు. (చదవండి: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న వారియర్ మూవీ) బోయపాటి తో రామ్ నటించే మూవీ పై పడిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ముందు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ప్లాన్ చేశారట. కాని ఇప్పుడు మారిన బిజినెస్ స్ట్రాటజీస్ లెక్కలు చూసుకుని బడ్జెట్ తగ్గించుకునే ఆలోచనలో ఉన్నారట. పాన్ ఇండియా ప్లానింగ్ కూడా విరమించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. బోయపాటి మూవీ తర్వాత లవ్ స్టోరీస్ కు స్పెషలిస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ మేకింగ్ లో మూవీ చేయాలనుకున్నాడు రామ్. ఈ ప్రాజెక్ట్ ను కేవలం కోలీవుడ్ ఆడియెన్స్ ను టార్గెట్ పెట్టుకుని ఫిక్స్ చేయాలనుకున్నాడు. కాని ది వారియర్ రిజల్ట్ చూసిన తర్వాత కోలీవుడ్ మార్కెట్ కాస్త బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాడట. గౌతమ్ మీనన్ కంటే కూడా అనిల్ రావివూడితో మూవీ చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నాడట. బాలయ్యతో మూవీ తర్వాత ఎఫ్ 3 డైరెక్టర్ అనిల్ రావిపూడి రామ్ తో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
రామ్‌పై బాలయ్య సెంటిమెంట్ ను అప్లై చేస్తున్న బోయపాటి!
కొందరు దర్శకులకు, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అయితే వాటిని బయటికి చెప్పరు. సింపుల్ గా సైలెంట్ గా ఫాలో అయిపోతుంటారు. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇప్పుడు కొత్త సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. ఆ సెంటిమెంట్ ను రామ్ నటించే పాన్ ఇండియా మూవీకి అప్లై చేస్తున్నాడు. బోయపాటి మిగతా హీరోలతో తెరకెక్కించే సినిమాలు వేరు. బాలయ్యతో చేసే మూవీస్ వేరు. అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చిన ప్రతీసారి ఇండస్ట్రీ షేక్ అయింది. అయితే బాలయ్యతో ఎప్పుడు బోయపాటి సినిమా చేసినా నట సింహాన్ని డ్యూయర్ రోల్ చూసి బాక్సాఫీస్ ను బద్దలు కొడతూ వచ్చాడు. (చదవండి: కొత్త సినిమాలతో కళకళలాడుతున్న ఓటీటీ వరల్డ్) ముందు వచ్చిన సింహా ఆ తర్వాత వచ్చిన లెజెండ్, ఈ మధ్యే వచ్చిన అఖండలో బాలయ్యకు డ్యూయల్ రోల్స్ ఇచ్చాడు బోయపాటి. అయితే ఇతర హీరోలతో బోయ వర్క్ చేసినప్పుడు మాత్రం ఈ ఫార్ములా అప్లై చేయడు. దాంతో ఈ మధ్య కాలంలో ఒక్క సరైనోడు విషయంలో తప్పితే ప్రతీసారి ఫెయిల్యూర్ అవుతూనే వచ్చాడు. ఆఖరికి అఖండ ముందు రిలీజైన వినయ విధేయ రామాలో కూడా చరణ్ ను సింగిల్ రోల్ లో చూపించి పరాజయాన్ని అందుకున్నాడు బోయ. అఖండ తర్వాత రామ్ మూవీతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు బోయపాటి. ఈసారి అస్సలు రిస్క్ తీసుకోదలచుకోవడం లేదు ఈ మాస్ డైరెక్టర్. అందుకే రామ్ మూవీ కోసం బాలయ్య సెంటిమెంట్ ను అప్లై చేస్తున్నాడట బోయపాటి. కొత్త చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ ను డ్యూయల్ రోల్ లో నటింపజేస్తున్నాడట. ఇదే రూమర్ నిజం కావాలని రామ్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. -
ది వారియర్ సగం హిట్ అయినట్లే : హీరో రామ్
రామ్, కృతీ శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ది వారియర్’. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ – ‘‘అనంతపురంలో ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ అనగానే హ్యాపీ ఫీలయ్యాను. ఇక్కడ ఫంక్షన్ జరుపుకుని ‘ది వారియర్’ సగం సక్సెస్ సాధించింది’ అన్నారు. ‘‘బోయపాటి శ్రీను గారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజైంది కాబట్టి సినిమా సగం హిట్ అయినట్లుగా భావిస్తున్నాం. సినిమాలోని ప్రతి ఎమోషన్‌ను లింగుసామి జెన్యూన్‌గా ఫీలై చేశారు’’ అన్నారు రామ్. ‘‘మీ అందరిలో (ఫ్యాన్స్‌ని ఉద్దేశించి) ఉన్న ఎనర్జీ అంతా రామ్ ఒక్కడిలోనే ఉంది’’ అన్నారు లింగుసామి. శ్రీనివాసా చిట్టూరి, ఆది పినిశెట్టి పాల్గొన్నారు. -
నాగ చైతన్య ద్విభాషా చిత్ర షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
-
మరో మాస్ చిత్రం.. బోయపాటి, రామ్ మూవీ షురూ
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన దివారియర్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి, రామ్ పోతినేని కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ రోజు(జూన్ 1) పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం అయ్యింది. హీరో రామ్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ క్లాప్ ఇచ్చారు. చిత్ర దర్శకులు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో దర్శకులు లింగుస్వామి, వెంకట్ ప్రభు స్క్రిప్ట్ అందజేశారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్9గా శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. దర్శకుడిగా ఆయన ఇది 10వ సినిమా. హీరో రామ్ 20వ సినిమా ఇది. ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ..బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది. 'ది వారియర్' తర్వాత మా హీరో రామ్‌తో వెంటనే మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. మా సంస్థలో ప్రతిష్ఠాత్మక చిత్రమిది. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా చేయబోతున్నాం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తాం. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడిస్తాం’ అని అన్నారు. -
బోయపాటితో మరో మూవీ.. కానీ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బాలయ్య!
టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ ఉండవచ్చు. కాని బోయపాటి, బాలయ్య కాంబోకు తిరుగులేదు. సింహా, లెజెండ్,అఖండ తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని బ్లాక్ బస్టర్స్. బీసీ ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ అందించిన మూవీస్. అందుకే ఈ కాంబో మళ్లీ రిపీట్ బాగుంటుందని టాలీవుడ్ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం బోయపాటి కూడా అదే పనిలో ఉన్నాడని సమాచారం. (చదవండి: 40 గంటలు నిద్ర లేకుండా షూటింగ్ చేశాను: చిరంజీవి) బాలయ్య, బోయపాటి సినిమా అనగానే అందరూ అఖండ -2 ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఎందుకంటే సీక్వెల్ స్టోరీ రెడీగా ఉందని ఓ రియాలిటీ షోలో ఆల్రెడీ బోయపాటి స్టేట్ మెంట్ కూడా ఇచ్చేశాడు. కాని బాలయ్య అక్కడే బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. బోయపాటితో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాకపోతే లెజెండ్ రేంజ్ లో పొలిటికల్ స్టోరీ ఉండాలి అంటున్నాడట. అందుకు బోయపాటి కూడా సరే అన్నాడని సమాచారం. ప్రస్తుతం బోయపాటి ఎనర్జిటిక్ హీరో రామ్ తో మూవీ కమిట్ అయ్యాడు. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.మరో వైపు బాలయ్య కూడా గోపీచంద్ మలినేని మేకింగ్ లో నటిస్తున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత బోయపాటి సినిమా సెట్లో అడుగుపెట్టాలనుకుంటున్నాడట బాలయ్య. ఆ లోపు బోయపాటి ఓ పవర్ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీ రెడీ చేయాల్సి ఉంటుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మరో సర్‌ప్రైజ్‌కి మహేశ్ రెడీ.. మాస్ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడా? అంటే అవుననే అంటూన్నారు టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ మాసీవ్ మూవీస్లని యాక్షన్ ప్యాక్డ్ చిత్రాలని చేస్తున్నారు. త్వరలో మహేశ్ కూడా అదే తరహా మూవీ చేయలాని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం మహేశ్ ‘సర్కారువారి పాట’మూవీతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ సాంగ్స్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా మరింత స్టైలిష్‌గా మహేశ్ కనిపిస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే వున్నాయి. `పోకిరి` వైబ్స్ కనిపిస్తున్నాయని మహేశ్ స్వయంగా చెప్పడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీని మే 12న విడుదల చేస్తున్నట్టుగా చిత్ర బృందం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత మహేశ్ వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ తరువాత రాజమౌళితో ఓ భారీ మూవీకి మహేశ్ శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే. ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్ నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోందని స్క్రీప్ట్ వర్క్ పూర్తయిందని ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. రాజమౌళి మూవీ తరువాత మహేశ్ ఓ మాసీవ్ ఎంటర్ టైనర్ చేయాలనుకుంటున్నాడట. ఊర మాస్ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా అయిన బోయపాటి ఈ మూవీని డైరెక్ట్ చేసే అవకాశం వుందని ఫీల్మ్నగర్ టాక్ వినిపిస్తుంది. నిజంగా ఈ కాంబినేషన్ సెట్టయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి మహేశ్ సర్ప్రైజ్ ఇచ్చినట్లే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. -
Rashmika Mandanna: యంగ్ హీరోతో రష్మిక రొమాన్స్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మీద శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్‌కి జోడిగా ఏ హీరోయిన్ నటిస్తోంది, ఇతర కీలక పాత్రలు ఎవరెవరు పోషిస్తున్నారు అనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. ప్రస్తుతం బోయపాటి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల మీద దృష్టి పెట్టారట. అందులో భాగంగా సినిమాలో నటించే ఇతర నటులను ఎంపిక చేసే పనిలో పడ్డారట. ఇప్పటికే హీరోయిన్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బోయపాటి రష్మికకు కథ వినిపించాడని, ఆమెకు నచ్చడంతో నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. రామ్‌కి బాలీవుడ్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఆయన నటించిన సినిమాలు హిందీలో డబ్ అయి, యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ని అందుకున్నాయి. అలాగే పుష్పతో రష్మిక బాలీవుడ్ క్రష్‌గా మారింది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని రష్మికను హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రష్మిక విషయానికొస్తే.. శర్వానంద్‌తో కలిసి నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం పుష్ప 3తో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది. -
Akhanda 100 Days Function: కర్నూలులో అఖండ 100 రోజులు వేడుక (ఫొటోలు)
-
హీరో రామ్ ప్యాన్ ఇండియా చిత్రం
-
బన్నిని ఫాలో అవుతున్న బాలయ్య.. బోయపాటిపై ఒత్తిడి!
కొద్ది రోజులుగా బాలయ్య జోరు పెంచాడు.అభిమానులు కోరుకున్న విధంగా ట్రెండింగ్ లో ఉన్న దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ఓటీటీ వరకు వచ్చి టాక్ షో చేశాడు.ఇప్పుడు ఇదే స్పీడ్ లో తాను నటించిన బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ తెరకెక్కాలని పట్టుబడుతున్నాడట.గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం.. చాలా కాలం తర్వాత బాలయ్యకు భారీ బ్లాక్ బస్టర్‌ను అందించింది.సింహా, లెజెండ్ చిత్రాలను మించి వసూళ్లను కొల్లగొట్టింది.ఇటు థియేటర్స్ లోనూ, అటు ఓటీటీలో దుమ్మురేపింది.అందుకే ఇప్పుడు ఇమిడియెట్ గా సీక్వెల్ తెరకెక్కాలి అంటున్నాడట. అందుకోసం దర్శకుడు బోయపాటి పై ఒత్తిడి తీసుకొస్తున్నాడట. అఖండ తర్వాత బన్నితో బోయపాటి మూవీ చేయాల్సి ఉండగా అల్లు అర్జున్ పుష్ప 2 ప్రాజెక్ట్ లో బిజీ అయ్యాడు.దాంతో బోయపాటి ఇమిడియెట్ గా రామ్ తో మూవీ లాక్ చేసుకున్నాడు.ఎనర్జిటిక్ స్టార్ తో కలసి ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు.ఇటీవలే ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చింది.అయితే రామ్ తో మూవీ తర్వాత బోయపాటి అఖండ2 పై ఫోకస్ పెట్టనున్నాడట.అఖండ 2 స్టోరీ లైన్ కు సంబంధించినలీడ్ ను మొదటి భాగం క్లైమాక్స్ లో చెప్పకనే చెప్పాడు బోయపాటి.పైగా అందుకు తగ్గ స్టోరీ కూడా రెడీగా ఉందని అన్ స్టాపబుల్ షోలో చెప్పాడు. అందుకే రామ్ తో మూవీ కంప్లీట్ కాగానే అఖండ 2 పట్టాలెక్కించాలనుకుంటున్నాడట.పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ గా నిలిచింది.వేడి తగ్గకముందే పార్ట్ 2 రిలీజ్ చేసి మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలనుకుంటున్నాడు బన్ని. ఇప్పుడు ఇదే ట్రెండ్ ను బాలయ్య అండ్ బోయపాటి ఫాలో కావాలనుకుంటున్నారు. అన్ని కుదిరితే 2023 అఖండ పార్ట్ 2 పట్టాలెక్కనుంది. -
పాన్ ఇండియాగా రామ్ మూవీ.. హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ !
Ram Pothineni In Boyapati Srinu Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ' చిత్రంతో మాసివ్ హిట్ కొట్టాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ జోష్‌తో మరో మాస్ యాక్షన్ సినిమాను తెరకెక్కించనున్నాడు బోయపాటి. ఉస్తాద్ హీరో రామ్‌తో కలిసి తన 10వ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. అలాగే రామ్ కెరీర్లో 20వ సినిమాగా ఈ చిత్రం రూపొందడం విశేషం. ఈ సినిమాను శ్రీనివాస్ చుట్టూరి నిర్మించగా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. రామ్ సినీ కెరీర్లో పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ మూవీ కోసం బోయపాటి భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ కోసం బాలీవుడ్ భామను తీసుకోనున్నారట. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హిందీ హీరోయిన్ అయితే మార్కెట్ కూడా కలిసివస్తుందని మేకర్స్ అంచనా. అందుకే ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రాను తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే బోయపాటి పరిణితీ చోప్రాను సంప్రదించాడని, ఆమె పాజిటివ్‌గా స్పందించినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే సౌత్ నుంచి కూడా మరో ఇద్దరు నటులను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. -
అఫిషియల్: బోయపాటి-రామ్ కాంబోలో పాన్ ఇండియా చిత్రం
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను-యంగ్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. కానీ ఈ సినిమాలో నటీనటులు వీరే అంటూ కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే సినిమా ప్రకటన ఇంకా రాలేదు.. కానీ అప్పుడే నటీనటుల పాత్రలు,పేర్లు వినిపించడమేంటని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఇచ్చాడు బోయపాటి. చదవండి: తప్పతాగి అర్థరాత్రి రోడ్డుపై హల్చల్.. హీరోయిన్ అరెస్ట్ దర్శకుడిగా బోయపాటికి ఇది 10వ సినిమా కాగా.. రామ్‌కు ఇది 20వ సినిమా. ప్రస్తుతం రామ్.. తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో 'ది వారియర్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే బోయపాటి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు పెట్టనున్నాడట. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనుంది. కాగా ఈ సినిమాలో రామ్‌కు అక్కగా సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: భీమ్లా నాయక్ నిర్మాత నోటి దురద.. ఆపై సారీ! Super kicked to announce my 20th film! #RAPO20 is #BoyapatiRapo !! Excited to see myself through the eyes of the Daddy of Mass emotions Boyapati garu.🤘 Love..#RAPO pic.twitter.com/J5cFVxU7nv — RAm POthineni (@ramsayz) February 18, 2022 -
బోయపాటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతోన్న హీరోయిన్!
Meera Jasmine Reentry: ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు తెరపై మెరిసింది నటి మీరా జాస్మిన్. ఆ తర్వాత వరస చిత్రాల్లో ఆపర్ అందుకున్న ఆమెకు పెద్దగా సక్సెస్ రాలేదు. చివరిగా గొరింటాకు సినిమాలోరాజశేఖర్ చెల్లెలి పాత్రలో మెప్పించింది, మంచి హిట్‌ను అందుకుంది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. చదవండి: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటాను: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు ఆ తర్వాత నటకు బ్రేక్ ఇచ్చిన మీరా జాస్మిన్ ఇటీవల ఓ తమిళ చిత్రంలో రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ క్రమంలో ఆమెకు తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మాస్ డైరెక్టర్ బోయపాటి తన సినిమాలో మీరాకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో రామ్ పోతినేని బోయపాటి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చర్చలు, స్క్రిప్ట్‌ను పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్.. ప్రస్తుతం నటీనటులు ఎంపిక దశలో ఉంది. చదవండి: ఆయనకు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా: డైరెక్టర్ ఈ క్రమంలో హీరో అక్క పాత్రకు మీరా జాస్మిన్ను సంప్రదించినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే ఆమెకి బోయపాటి కధ,పాత్రను వివరించగా చేసేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందులో అమెది కీలకమైన పాత్ర అని సమాచారం. కాగా బోయపాటి తెరకెక్కించిన మొదటి సినిమా భద్రలో మీరా జాస్మిన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. -
హాట్ టాపిక్ గా మారిన బోయపాటి రెమ్యూనరేషన్
-
హీరో కన్నా 'అఖండ' డైరెక్టర్‌కే ఎక్కువ రెమ్యునరేషన్!
తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లు అందించాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఇటీవలే నటసింహం నందమూరి బాలకృష్ణతో కలిసి 'అఖండ' ద్వారా మరో సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడీ డైరెక్టర్. 50 రోజుల్లో రూ.200 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డులను తిరగరాసిందీ మూవీ. ఓటీటీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన 'అఖండ' సినిమాతో బోయపాటి రేంజ్ పెరిగింది. దీంతో హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట! అఖండ సీక్వెల్ తీసేందుకు బోయపాటి సిద్ధంగా ఉన్నాడు. కానీ బాలయ్య బిజీ షెడ్యూల్లో ఉండటంతో ప్రస్తుతం వేరే సినిమాను పట్టాలెక్కించే యోచనలో ఉన్నాడు. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో మాస్ మూవీ చేసేందుకు మంచి కథ సిద్ధం చేసుకున్నాడట ఈ డైరెక్టర్. ఇక్కడ ట్విస్టేంటంటే.. హీరో రామ్ కన్నా దర్శకుడు బోయపాటి శ్రీను ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ హీరో రామ్ 9 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుంటే అఖండ డైరెక్టర్ బోయపాటి దానికి మరో మూడు కోట్లు జత చేసి మొత్తంగా రూ. 12 కోట్లు అందుకోనున్నాడట. ఈ మేరకు ఓ వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. -
ఓటీటీలోనూ దూసుకెళ్తున్న ‘అఖండ’.. తొలిరోజే రికార్డు నమోదు
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన హైట్రిక్ మూవీ `అఖండ`. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 152 కోట్ల గ్రాస్, రూ.93 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. నాన్ థియేట్రికల్‌తో కలిపి ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక తాజాగా ఓటీటీలో విడుదలైన ‘అఖండ’.. అక్కడ కూడా రికార్డు క్రియేట్ చేసింది. జనవరి 21 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హార్ట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ.. తొలి 24 గంటల్లోనే 10 లక్షల మంది వీక్షించినట్లు సమాచారం. ఇది ఓటీటీ చరిత్రలో ఓ రికార్డు అని చెప్పొచ్చు. ఓటీటీలో భారీ ఓపెనింగ్స్ రావడంతో పట్ల నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ‘థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన ‘అఖండ’.. ఓటీటీలోనూ రికార్డు సృష్టించడం గర్వంగా ఉంది. ఈ వేదిక ద్వారా మరింత మంది సినీ అభిమానులకు మా చిత్రం వీక్షించడం పట్ల సంతోషంగా ఉంది ’ అన్నారు బాలకృష్ణ. కోవిడ్ కారణంగా థియేటర్స్‌లో చూడలేకపోయిన వారంతా.. ఓటీటీలో ‘అఖండ’ చిత్రం వీక్షించి ఆస్వాదించండి’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. -
'అఖండ' 50 రోజుల మాస్ జాతర ఫోటోలు
-
ఇప్పుడు అఖండ పండగ.. ఎంజాయ్ చేయండి: బాలకృష్ణ
‘మానవ పుట్టుకలో ఒకరో ఇద్దిరినో స్నేహితులుగా ఇస్తారు. కానీ మాకు కోట్లాది మంది అభిమానులను సంపాదించేలా భగవంతుడు చేశాడు. నేను ఏది చేసినా అభిమానులు ప్రోత్సహిస్తూనే వున్నారు. కోవిడ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారోరారో అనుకున్న సమయంలో తీర్థయాత్రలకు వచ్చినట్లు థియేటర్లకు జనాలు వచ్చి ‘అఖండ’ సినిమా వీక్షిస్తున్నారు. ఈ అఖండ విజయం తెలుగు చలన చిత్ర పరిశ్రమ విజయం’అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ‘అఖండ’. గత ఏడాది డిసెంబరు 2న విడుదైన ఈ చిత్రం.. జనవరి 20 (గురువారం)తో యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గురువారంనాడు సాయంత్రం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో గల సుదర్శన్ 35.ఎం.ఎం. థియేటర్లో అర్థ శతదినోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... ‘ఇది ప్రేక్షకులు ఇచ్చిన విజయం. మా టీమ్ సమష్టి కృషి. శివుడు భక్తుడిగా నేను చేసిన అఖండలోని పాత్ర నాన్నగారు చేసిన పాత్రలు గుర్తుచేసుంటూ వాటిని పోషించాను. మొన్ననే సంక్రాంతి పండుగ జరుపుకున్నాం. ఇప్పుడు అఖండ పండుగ ఇది. ఈ చిత్రం శుక్రవారం(జనవరి 21) నుంచి డిస్నీప్లస్ హార్ట్స్టార్లో విడుదల కానుంది. చూసి ఎంజాయ్ చేయండి’అన్నారు. ఈ విజయాన్ని ఎన్టీఆర్ గారికి అంకితమిస్తూన్నామని అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ‘నిజాయితీగా చెబుతున్నా... ఇలా అఖండ సినిమా విడుదల అవుతుందనీ, యాభై రోజులు అడుతుందనీ, ఇంకా థియేటర్లలో కొనసాగుతుందనీ కానీ నేను కానీ, ఎవరూ కానీ కల కనలేదు. ఆ కలను నిజంచేసిన ప్రతి ఒక్కరినీ ధన్యవాదాలు’అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నైజాం పంపిణీదారుడు శిరీష్ రెడ్డి, సుదర్శన్ థియేటర్ అధినేత బాల గోవిందరాజు, మేనేజర్ బాలు తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘అఖండ’ విజయం.. 50 రోజులు.. 200 కోట్ల కలెక్షన్స్
ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో 50 రోజులు.. 100 రోజులు ఆడేవి. కానీ ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా రెండు వారాల కంటే ఎక్కువ ఆడడం కష్టమే. సూపర్ హిట్ అయితే.. ఓ నాలుగు వారాలు నడవడమే కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సినిమా 50 రోజులు థియేటర్స్‌లో ఆడిదంటే మాములు విషయం కాదు. చాలా రోజుల తర్వాత ఆ ఘనతను నందమూరి బాలకృష్ణ సాధించారు. ఆయన హీరోగా నటించిన ‘అఖండ’మూవీ 50 రోజులు పూర్తి చేసుకొని హిస్టరీ రిపీట్ చేసింది. గతేడాది డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 152 కోట్ల గ్రాస్, రూ.93 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. నాన్ థియేట్రికల్‌తో కలిపి ఈ సినిమా రూ. 200 క్లబ్బులో ప్రవేశించినట్టు ‘అఖండ’ చిత్ర నిర్మాతలు రూ. 200 క్లబ్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. అంతేకాదు ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించ బడటం ఒక రికార్డు అని చెప్పాలి.. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. -
స్టార్స్‌తో ప్రయోగాలు చేయకూడదు: బాలకృష్ణ
Balakrishna About Akhanda Movie Success In Sankranthi Sambaralu Event: ‘‘రకరకాల సినిమాలు ఉండొచ్చు. కానీ ప్రేక్షకులు తమ అభిమాన హీరోలను ఒక రకంగానే ఊహించుకుంటారు. స్టార్స్‌తో (స్టార్ యాక్టర్లు) ప్రయోగాలు చేయకూడదు. గతంలో స్టార్స్ చేసిన ప్రయోగాత్మక చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయి కానీ కొన్ని కమర్షియల్‌గా రాణించలేదు. ‘అఖండ’లో నా అఘోరా పాత్ర గెటప్ గురించి బోయపాటిగారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు’’ అని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అఖండ’. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబరు 2న విడుదలైంది. ఈ చిత్రం యాభై రోజుల దిశగా వెళుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ‘అఖండ’ థ్యాంక్స్ మీట్లో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘అఖండ’ సందేశాత్మక, వినోదాత్మక చిత్రం. అందుకే ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. కొందరి నిర్మాతల్లా కాకుండా కరోనా పరిస్థితులు భయపెడుతున్నా ధైర్యంగా రిలీజ్‌కు ముందడుగు వేసిన మిర్యాల రవీందర్వంటి నిర్మాతలు కూడా ఇండస్ట్రీలో ఉండాలి. ప్రపంచం గర్వించదగ్గ దర్శకుల్లో బోయపాటి శ్రీనుగారు ఉన్నారు. సినిమా అనేది ప్రజలకు నిత్యావసర వస్తువు అయిపోయింది. ఎంతోమంది ఉపాధి ఆధారపడి ఉన్న ఇండస్ట్రీకి ప్రభుత్వాలు సహకరించాలని కోరుకుంటున్నాను. ఇక ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల విషయంపై ప్రత్యేకంగా నా అభిప్రాయం అంటూ ఏదీ లేదు. ఇండస్ట్రీలోని అన్ని సెక్టార్ల వారూ ఈ విషయంపై చర్చించుకుని సమష్టిగా ప్రభుత్వాలను సంప్రదించాలి’’ అన్నారు. అలాగే బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా ఒక హీరో సినిమాను ఆ హీరో అభిమానులే ఎక్కువగా చూస్తారు. కానీ ‘అఖండ’ను అందరు హీరోల ఫ్యాన్స్, ప్రేక్షకులు చూసి విజయం అందించారు. ‘అఖండ’కు సీక్వెల్ చేసే అవకాశం ఉంది. ఇక అన్ని సినిమా యూనిట్స్ వారు సినిమాలు గెలవాలని మాట్లాడుతున్న ఈ టైమ్‌లో నంబర్స్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు’’ అన్నారు. ‘‘సినిమా విఫలమైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది డిస్ట్రిబ్యూటర్సే. నా తొలి రెండు సినిమాలకు ఇబ్బంది పడిన డిస్ట్రిబ్యూటర్స్ ‘అఖండ’తో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ రోజుల్లో సినిమాలు ఎక్కువగా ఆడటం లేదు. అలాంటిది ‘అఖండ’ యాభై రోజుల దిశగా వెళుతోంది’’ అన్నారు రవీందర్ రెడ్డి. కాగా ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, అయ్యప్ప శర్మ, రాం ప్రసాద్, విజయ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘అఖండ’జోరు.. సెంచరీ కొట్టిన బాలయ్య
నటసింహం నందమూరీ బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’మూవీ జోరు ఇంకా కొనసాగుతోంది. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. రొటీన్ కథే అయినా.. బోయపాటి ఇచ్చిన మాస్ స్ట్రోక్‌కు బాలయ్య రెచ్చిపోయి నటించడం.. దానికి తమన్ మ్యూజిక్ తోడవడంతో థియేటర్స్‌లో బొమ్మ అదిరిపోయింది. బాలయ్య కెరీర్లోనే తొలిసారి 100 కోట్ల మార్క్‌ను అందుకున్నాడు. కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ని అందుకోవడం గమనార్హం. ఈ పది రోజుల్లో.. . నైజాంలో రూ. 16.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.10 కోట్లు, గుంటూరులో రూ. 3.96 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.39 కోట్లు, కృష్ణాలో రూ. 2.99 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.80 కోట్లు, నెల్లూరులో రూ. 2.15 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ట్రేడ్ నిపుణుల నుంచి అందిన సమాచారం మేరకు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోరూ. 49.34 కోట్లు షేర్ వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కలిపితే మొత్తంగా రూ. 9.35 కోట్లు రాబట్టింది. వీటన్నింటిని కలుపుకుంటే రూ. 58.74 కోట్లు షేర్ రాగా…. రూ. 100 కోట్లు గ్రాస్‌ను దాటినట్లు చెబుతున్నారు. రూ.53 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ వారం రోజుల్లోనే టార్గెట్‌ని పూర్తి చేసుకొని బ్రేక్ ఈవెన్‌లోకి దూసుకెళ్లింది. మొత్తం మీద బాక్సాఫీస్ వద్ద బాలయ్య సునామీ సృష్టించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. . ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. -
అఖండ సినిమాతో పరిశ్రమకు ధైర్యం వచ్చింది: బాలకృష్ణ
సాక్షి, విశాఖపట్నం: అఖండ సినిమా ఘన విజయంతో ఫుల్లు ఖుషీలో ఉన్నారు హీరో బాలకృష్ణ. అఖండ భారీ విజయం నేపథ్యంలో గురువారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నాడు బాలకృష్ణ. ఆయనతో పాటు దర్శకుడు బోయపాటి కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘అఖండ సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశాం. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలియ చేసుకునేందుకు వచ్చాము. సంవత్సరం తొమ్మిది నెలల తర్వాత విడుదలైన సినిమాకు మంచి ఆదరణ చూపించారు.ఘన విజయం అందించారు. ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. ఇది మా విజయం కాదు....చిత్ర పరిశ్రమ విజయం’’ అన్నారు. (చదవండి: ‘అఖండ’ ఫైట్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు) అంతేకాక ‘‘ఈ సినిమాతో చలనచిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చింది. మంచి సినిమాలను ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు సినిమాను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు’’ అన్నారు బాలకృష్ణ. చదవండి: అన్‌స్టాపబుల్ షోలో సూపర్ స్టార్ సందడి.. ఫొటోలు వైరల్ -
Akhanda Movie: జై బాలయ్య నినాదాలతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ..
Balakrishna Akhanda, Fans Celebrations At Bramaramba Theatre: నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత వచ్చిన హ్యాట్రిక్ మూవీ కావడంతో అఖండ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు(డిసెంబర్2)న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో అర్థరాత్రి నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్టు పడిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కూకట్పల్లి భ్రమరాంబ థియేటర్లో తెల్లవారుజామున బెనిఫిట్ షో వేయగా.. అర్థరాత్రి నుంచే అభిమానులు అక్కడికి చేరుకున్నారు. థియేటర్ ప్రాంగణమంతా జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు. బాలయ్య విశ్వరూపం చూపించారని, మాస్ జాతర అంటూ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. సెలబ్రేషన్స్‌తో హంగామా సృష్టిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. -
అఖండ మూవీ ట్విటర్ రివ్యూ
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` నేడు(డిసెంబర్ 2)ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. సింహా’, ‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడం, తానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ‘అఖండ’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ చూడాలని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. బాలయ్య మాస్ డైలాగ్స్ ఏమేరకు ఆకట్టుకున్నాయి? మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. (చదవండి: ‘అఖండ’మూవీ రివ్యూ) Meeru tappu chesthey cell lo vestharu ! Memu hell lo vestham!! Both are not same!! Mass dialogue sequence followed by #Akhanda title song !! #AkhandaRoar !! So far second half 80% filled with action sequences !! — Sasi (@sasidharanne) December 2, 2021 ఫస్టాఫ్ చాలా బాగుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సెకండాఫ్ మాస్ ఎలిమెంట్స్ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయని చెబుతున్నారు. తమన్ నేపథ్య సంగీతం అదిరిపోయిందట. బాలయ్య చెప్పే మాస్ డైలాగ్స్‌కి థియేటర్లలో ఫ్యాన్స్ ఈళలు వేయడం పక్కా అని ఓ నెటిజన్ కామెంట్చేశాడు. ఇక ఎప్పటి లాగే బాలయ్య తనదైన నటనతో రెచ్చిపోయాడట. అఘోరాగా బాలయ్య నటన సినిమాకే హైలెట్ అట. ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారని అంటున్నారు. Highlights are Balayya intro , interval bang, police station fight , and climax . No one can pull of aghora role better than Balayya . 🔥🔥 bgm leaves you in that trance .. boya mass will leave fans and mass audience fully satisfied movie concept is also very good #akhanda — Super Sampangi (@supersampangi) December 2, 2021 #Akhanda Live Updates FIRST HALF REPORT: Though ridiculously bad at times, the first half is fairly entertaining and engaging! Interval is 🔥🔥🔥 with Aghora Entry!!@MusicThaman Em BGM Raa, ADARAKOTTESAV 🔥🔥🔥. Peaks asalu!#AkhandaOnDec2nd#AkhandaRoaringFrom2ndDec — FDFSLiveAus (@FDFSLiveAus) December 2, 2021 @MusicThaman Dudeeee This is officially your ERA.. Mindblowing work #Akhanda — PST (@PSTtwtz) December 2, 2021 INTERVAL: #AkhandaMassJathara 🙏🏽🔥 Mass combo ki perfect example Balayya - Boya 💥💥#Akhanda — Anna Yaaru 🐯🌊 (@EV9999_Tarakian) December 2, 2021 Comedy lepesinattu next movie lo ee love scenes kuuda lepeyandi Boya gaaru #Akhanda — Sathwik Sriram (@sksathwik) December 2, 2021 Don't expect like legend& simha #Akhanda different masss bomma balaya acting 🔥🔥🔥 Boyapati approached differently & delivered BLOCKBUSTER @MusicThaman Biggest plus point rampage BGM congratulations @dwarakacreation thank you for bringing to ONLY THEATERS — fan of NTR (@Ntrfan999922) December 2, 2021 #Akhanda Review నటసింహం అన్న పదానికి అర్థం చూయించేసాడు ,, 💯🙏🏻 కుమ్మిమోపారదెంగాడయ్యా🤙🌪🌋#AkhandaMassJathara #Balayya 🦁 — Mahesh🖤Kajal (@MaheshKajal3) December 2, 2021 #Akhanda followed by Gopichand ,anil movies manchi linup set chesukunnadu balayya — vikky (@mnopq999) December 2, 2021 Mental ekkesindi ra ayya asalu. Interval fight nunchi start aithadi #Akhanda rampage, climax varaku kummutune untaadu. Bala-Boya-Thaman andaru kalipi duty chestharu, just mind blowing anthe. Every action sequence is still flashing in front of my eyes. — Hulkeshwara Shastry (@casual_babu) December 2, 2021 Kurnool mass jathara shuru 🔥🔥🤙💥💥 jai balaya jai balaya 🔥🙌💥#Akhanda #AkhandaMassJathara pic.twitter.com/jzsCsTlEie — tarak yusuf (@NtrYusuf) December 2, 2021 #Akhanda UK 1st half : ABOVE AVERAGE ( Dragged some love scenes) Boya perfectly targeted akhanda entry in interval and AKHANDA ARRIVES. 2nd half : ONLY ONE WORD BHAM AKHANDA FINALLY YOU WONT GET DISAPPOINTED WITH #BB3 #AkhandaOnDec2nd — tolly_wood_UK_Europe (@PsPk__Europe_UK) December 2, 2021 Balayya and srikanth confrontation💥💥💥💥💥...emi dialogues raa mawa #akhanda — Gangstar GASTINO🔔 (@shannu309) December 2, 2021 Hearing super positive response for #Akhanda from USA premiers. Mass Jathara Shuru 🤙🏻🤙🏻🤙🏻#AkhandaMassJathara #AkhandaFromToday #AkhandaRoar — Telugumovie USA (@TelugumovieUsa) December 2, 2021 #Akhanda 2haff kukka Rod antunaru .... — 𝐍𝐈𝐘𝐀𝐙 ᴋɪɴɢ👑 (@itsniyazKING) December 2, 2021 #Akhanda Roaring in theatres Positive talk #BheemlaNayak #RRR #RadheyShyam https://t.co/DElN4u3bXB — MANA MEMES KA ADDA (arun💥) (@arunakula4) December 2, 2021 This Decade is completely Belongs to @MusicThaman 💥💥💥 His Music & BGMs makes an Average Film as BLOCKBUSTERS A BGM Ka Baap Ban Gaya Rayyyy Kudos to His Hard Work This is Just Begining #Akhanda#BheemlaNayak #SarkaruVaariPataa — Guntur Box Office (@MacherlaMbfc) December 2, 2021 #Akhanda - No one can match #NBK’s Roudhram, aggression and diction. He lived in the role of #Aghora completely Complete Mass action loaded with “balayya elements” Single screens will be on 🔥 and it’s not a film of reviews. One in a while we get to watch this mass films pic.twitter.com/6KgFDBEETD — 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 2, 2021 -
బాలయ్య, నేను తొమ్మిది రోజులు మైనింగ్ ఏరియాలో కష్టపడ్డాం : శ్రీకాంత్
కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేశాను. సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత హీరోగా చేశాను. మధ్యలో మళ్లీ విలన్‌గా చేశా.. కానీ అంతగా గుర్తింపు రాలేదు. ఇకపై హీరోగానే చేస్తాను అని పట్టుపట్టను కానీ మంచి పాత్ర వస్తే చేయాలని నిర్ణయించుకున్నాను’అన్నారు హీరో శ్రీకాంత్. నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ`లో ఆయన విలన్‌గా నటించాడు. ఈ మూవీ సెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం శ్రీకాంత్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేశాను. సక్సెస్ అయ్యాను. హీరోగా చేశాను. మధ్యలో మళ్లీ విలన్‌గా చేశాను. అలా ఏది పడితే అది చేయకండని బోయపాటి ముందే హెచ్చారించారు. సరైనోడు సినిమాలో మంచి సాఫ్ట్ క్యారెక్టర్ ఇచ్చారు. మంచి విలన్ పాత్రను రాస్తాను వేస్తారా? అని అడిగారు. నేను అక్కడి నుంచే వచ్చాను.. ఎందుకు చేయను భయ్యా అని అన్నాను. అలా కొన్ని రోజులు ఎదురుచూశాను. అలా ఓ సారి బాలయ్య బాబు అఖండ కోసం విలన్ క్యారెక్టర్ చెప్పారు. విన్న వెంటనే భయపడ్డాను. వరదరాజులు క్యారెక్టర్‌కు న్యాయం చేయగలనా? అని అనుకున్నాను. ఎందుకంటే బాలయ్య, బోయపాటి సినిమాలో విలన్ అంటే మామూలుగా ఉండదు. ముందు గెటప్ సెట్ అయితే బాగుంటుందని అనుకున్నాం. ఎన్నో రకరకాలుగా ట్రై చేశాం. కానీ సహజంగా, సింపుల్‌గా పెట్టేద్దామని అన్నారు. అలా గడ్డంతో చూసే సరికి నేనేనా? అనుకున్నాను. ► నా గెటప్ చూసి అందరూ ఫోన్లు చేశారు. ప్రశసించారు. కానీ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాను. కొత్త శ్రీకాంత్ కనిపిస్తాడు. నాక్కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. వరదరాజులు పాత్ర చాలా బాగా వచ్చింది. ► బాలయ్యతో శ్రీరామారాజ్యం సినిమాలో నటించాను. అందులో లక్ష్మణుడి పాత్రలో తమ్ముడిగా కనిపిస్తే ఇందులో రావణాసురుడి పాత్రలో కనిపిస్తాను. ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. శ్రీకాంత్ పాత్ర అదిరిపోవాలి. అప్పుడు మన పాత్ర కూడా బాగా వస్తుందంటూ బోయపాటి చెబుతూ ఉండేవారు. క్రికెట్ ఆడే సమయం నుంచి ఆయనతో మంచి ర్యాపో ఉంది. ► ఈ సినిమా తరువాత బోలెడన్ని అవకాశాలు వస్తాయి. ఏది పడితే అది ఒప్పుకోకు. సబ్జెక్ట్‌లు నేను చెబుతాను అని బాలకృష్ణ అనేవారు. ► లెజెండ్ సినిమా జగపతి బాబుకు ఎంత ప్లస్ అయిందో నాకు తెలుసు. ఇప్పటికీ మంచి స్థానంలో ఉన్నారు. నాకూ అలా ఉంటుందని నేను అనుకోను. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. దర్శక నిర్మాతలు ఎలాంటి పాత్రలు ఇస్తారో చూడాలి. ఓ పక్కన హీరోగా, విలన్‌గా నటిస్తున్నాను ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమాలోనూ పాత్రను పోషిస్తున్నాను. మంచి పాత్ర వస్తే చేయాలని నిర్ణయించుకున్నాను. ► ఈ చిత్రంలో నాది సెటిల్డ్ పర్ఫామెన్స్‌లా ఉంటుంది. డబ్బింగ్లోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. సెటిల్డ్‌గా డైలాగ్స్ చెప్పించారు. ► బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియెన్స్‌లో అంచనాలుంటాయి. ముఖ్యంగా ఇందులో డైలాగ్స్ అద్బుతంగా ఉంటాయి. బాలయ్య దగ్గరి నుంచి ప్రేక్షకులు కోరుకునేదే అది. ఇందులో సెంటిమెంట్ కూడా ప్రధాన పాత్రను పోషిస్తుంది. ► ఇది హెవీ హై ఓల్టేజ్ సినిమా. నేచర్‌తో ఎలా ఉండాలి.. ఎలా పోరాడాలనే విషయాలుంటాయి. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా పాత్రను చూసి జనాలు ఏమంటారు? తిడతారా? అని చూస్తున్నాను. ► నాకు హీరోగా చేయడమే ఇష్టం. కానీ పాత్రలు నచ్చితే క్యారెక్టర్లు కూడా చేశాను. అది నాకొక సరదా. హీరోగానే చేస్తాను అని పట్టుపట్టను. లైఫ్‌ను అన్ని రకాలుగా ఎంజాయ్ చేయాలి. ► ఇలాంటి సినిమాను చేయాలంటే అది బోయపాటి వల్లే అవుతుంది. కథ వినేటప్పుడు.. తెర మీదకు వెళ్లేటప్పటికి చాలా హైలో ఉంటుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. బాలకృష్ణ నేను కలిసి ఓ ఫైట్ కోసం తొమ్మిది రోజులు మైనింగ్ ఏరియాలో కష్టపడ్డాం. ► థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ వేరు. ఓటీటీలో అయితే ఇంట్లో ఒకరిద్దరం కూర్చుని చూస్తాం. కానీ ఇలాంటి సినిమాను అందరి మధ్య కూర్చుని చూస్తూ విజిల్స్ వేస్తూ చూడాలి. అప్పుడే మజా ఉంటుంది. ► పునీత్ రాజ్ కుమార్‌తో ఓ సినిమాలో విలన్‌గా నటించాను. శంకర్ రామ్ చరణ్ సినిమాలో ఓ పాత్రను చేస్తున్నాను. వివరాలు త్వరలోనే వెల్లడిస్తా. -
అఘోర పాత్రల మీద రీసెర్చ్ చేశా, ఆ పాటకు నెల రోజులు పట్టింది: తమన్
సినిమాకు ఏం కావాలో అది చేస్తాను. ఎక్కువ ఖర్చు అనేది నేను అంగీకరించను. ఒక్కో పాటకు ఒక్కోలా చేయాల్సి ఉంటుంది. శంకర్ మహదేవన్ పాడితే బాగుంటుందని అనుకుంటే.. ఆయనతోనే పాడిస్తాం. అంతే కానీ ఖర్చు తక్కువ అవుతుందని వేరే వాళ్లతో పాడించను’అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ( Akhanda)`కు సంగీతం అందించాడు తమన్. ఈ మూవీ డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా మ్యూజిక్ డైరక్టర్ తమన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►కరోనా వల్ల సినిమాలో మార్పులు వచ్చాయి. కాలానికి తగ్గట్టుగా మార్చుకుంటూ వచ్చాను. విడుదలయ్యే టైంకు తగ్గట్టు మ్యూజిక్ ఉండాలి. అందుకే మళ్లీ రీరికార్డింగ్ చేశాను. అఖండ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. మంచి రేసుగుర్రంలా బోయపాటి గారు పరిగెత్తారు. మా అందరినీ పరిగెత్తించారు. ►ఈ సినిమాలో ఫైర్ ఉంది. ఇందులో ఎమోషన్ బాగుంటుంది. ఎమోషన్ బాగుంటే సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతాయి. బాలయ్య గారు అదరగొట్టేశారు. ఇది పర్ఫెక్ట్ మీల్లాంటి సినిమా. ►అఘోర పాత్రల మీద రీసెర్చ్ చేశాను. ఆ పాత్రలకు తగ్గట్టుగానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టాం. చాలా బాగా వచ్చింది. ఈ కథ నెవ్వర్ బిఫోర్ అని.. నెవ్వర్ అగైన్ అని కూడా చెప్పొచ్చు. టైటిల్ సాంగ్ విని బాలయ్య గారు మెచ్చుకున్నారు. కమర్షియల్ సినిమాలకు త్వరగా ఏజ్ అవుతుంది. కానీ బోయపాటి గారు ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. ►మా మ్యూజిక్‌ను జనాల్లోకి తీసుకెళ్లేదే హీరోలు. వారి వల్లే అందరికీ రీచ్ అవుతుంది. ఈ చిత్రంలో బోర్ కొట్టే సీన్స్ ఉండవు. థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పటి వరకు నేను చేసిన పనిలో ఇదే బెస్ట్ అని అనిపిస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో చేయడం చాలా కొత్త. సపరేట్గా ఇద్దరికి పని చేయడం వేరే.. ఇలా ఈ ఇద్దరికి కలిపి చేయడం వేరు. ఇది వేరే ఫైర్. ►ఈ సినిమాకు దాదాపు ఐదారు వందల మంది పని చేశారు. చాలా ప్రయోగాలు చేశాం. కేవలం సింగర్లే 120 మంది వరకు ఉంటారు. అఘోరాల గురించి చాలా రీసెర్చ్ చేశాం. సినిమాలో అఘోర పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో రేంజ్ మారిపోతోంది. వేరే జోన్లో ఉంటుంది. ► అఘోర అంటేనే సైన్స్. వాళ్లు అలా ఎందుకు మారుతారు? అనే విషయాలపై సినిమా ద్వారా క్లారిటీ వస్తుంది. దేవుడిని ఎందుకు నమ్మాలి అనే దాన్ని క్లారిటీగా చూపిస్తారు. సినిమా చూసి మా టీం అంతా కూడా చాలా హైలో ఉన్నాం. ►నిర్మాత చాలా మంచివారు. ఆయన సినిమాలకు చెందిన వ్యక్తి కాదు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో తెలిసిన వారు. ద్వారక క్రియేషన్స్‌లో పని చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. ►ఇలాంటి జానర్లో ఇదే నా బెస్ట్ వర్క్ అవుతుంది. కమర్షియల్ సినిమా అంటే అన్నీ స్పైసీగా ఉండాలి. కానీ ఇలాంటి చిత్రాలకు అది కుదరదు. టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేసేందుకు దాదాపు ఓ నెల రోజులు పట్టింది. గొప్ప సన్నివేశం తరువాత ఆ పాట వస్తుంది. ►డైరెక్టర్ కథ చెప్పేటప్పుడే మాకు ఇన్ స్పైరింగ్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లుంటే మాకు కూడా ఊపు వస్తుంది. ఇందులో శ్రీకాంత్ , జగపతి బాబు అద్భుతంగా కనిపిస్తారు. ►మ్యూజిక్ అనేది చాలా ముందుకు వచ్చింది. పెళ్లికి ముందు గ్రీటింగ్ కార్డ్‌లా మ్యూజిక్ మారింది. ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తోంది. ఇంకో పది, ఇరవై ఏళ్లు ఉంటుంది. ఈ ట్రెండ్ మంచిది. పాట హిట్ అయితే సింగర్ల గురించి వెతుకుతారు. కానీ ఇప్పుడు సింగర్లు ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుస్తోంది. వారి ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ చూసి సంతోషిస్తారు. ఆ విషయంలో హీరోలకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. డైరెక్టర్, హీరోలు అందరూ ఒప్పుకుని ప్రోత్సహిస్తున్నారు. ఇలా పాటలను విడుదల చేయడం వల్ల ఆడియో కంపెనీలకు రెవెన్యూ కూడా వస్తోంది. -
టాలీవుడ్‌కి మరో స్టార్ విలన్ దొరికినట్లేనా?
టాలీవుడ్ విలన్స్ లో బోయపాటి మూవీ విలన్స్ మరీ క్రూయెల్ గా ఉంటారు. లెజెండ్ లో జగపతి, సరైనోడు లో ఆదిపినిశెట్టి, వినయ విధేయ రామలో వివేక్ ఓబెరాయ్ పవర్ ఫుల్ విలన్స్ గా కనిపించారు. ఇప్పుడు ఇదే రేంజ్ విలనీతో ఆడియెన్స్ ను భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు హీరో శ్రీకాంత్. బాలయ్య-బోయపాటి కాంబో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అందులో హీరో శ్రీకాంత్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో క్రూరమైన లుక్స్ తో బాలయ్యనే భయపెడుతున్నాడు. శ్రీకాంత్ కు కంప్లీట్ గా న్యూ ఇమేజ్ ఇచ్చేందుకు బోయపాటి పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ ను డిజైన్ చేసాడట. గతంలో లెజెండ్ తో జగపతిబాబును విలన్ గా మార్చి అతనికి స్టార్ డమ్ తీసుకొచ్చాడు బోయపాటి. ఇప్పుడు సేమ్ సీన్ శ్రీకాంత్ విషయంలోనూ రిపీట్ అవుతుందని అందరూ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు. అఖండలో శ్రీకాంత్ విలనీ వర్క్ అవుట్ అయితే మాత్రం టాలీవుడ్ లో మరో స్టార్ విలన్ అందుబాటులోకి వచ్చినట్లే లెక్క. -
Akhanda Movie Images: బాలకృష్ణ 'అఖండ' మూవీ స్టిల్స్
-
అఖండ ట్రైలర్: బాలయ్య నట గర్జన చూశారా?
Nandamuri Balakrishna Akhanda Trailer Released: సింహా’, ‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. ఆదివారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. 'విధికి, విధాతకు, విశ్వానికి సవాళ్లు విసరకూడదు' అన్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. 'అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా? పట్టిసీమ తూమా? పిల్లకాలువ' అని డైలాగ్‌తో గర్జించాడు బాలయ్య. ఆశ చచ్చిపోయినప్పుడు, నమ్మకానికి చోటు లేనప్పుడు, విధ్వంస శక్తులు విరుచుకుపడినప్పుడు అఖండ వస్తాడు, కాపాడతాడు అంటూ బాలయ్య అఘోరాగా నటించిన మరో పాత్ర అఖండ పవర్ గురించి చెప్పారు. 'ఒక మాట నువ్వంటే అది శబ్ధం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం'', మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం, బోత్ ఆర్ నాట్ సేమ్' అని అఘోరాగా బాలయ్య గర్జించిన డైలాగులు మాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. -
గూస్బంప్స్ తెప్పిస్తున్న 'అఖండ' టైటిల్ సాంగ్
Akhanda Title Song Released: బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి అఖండ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. శంకర్ మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్, శివమ్ మహదేవన్ ఆలపించిన ఈ సాంగ్ భారీ విజువల్స్‌తో గూస్బంప్స్ తెప్పిస్తుంది. పాట విడుదలైన కాసేపటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. సింహా’,‘లెజెండ్’వంటి బెగ్గెస్ట్ హిట్స్ తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. -
బోయపాటి స్టోరీపై అల్లు అర్జున్ ఇంట్రెస్ట్ ?
-
ఒకే ఫ్రేములో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్
Vamshi Paidipally Birthday: టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంతా ఒకచోట చేరితే ఎలా ఉంటుంది? అబ్బో, ఆ సందడే వేరంటారా? ప్రముఖ దర్శకులంతా కలిసి ఇప్పుడు అదే పని చేశారు! టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి జూలై 25న పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన స్నేహితులతో పాటు ఇండస్ట్రీ సహచరులకు పార్టీ ఇచ్చాడు. ఈ క్రమంలో బర్త్‌డే వేడుకలకు సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో టాలీవుడ్ దర్శకులంతా కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ, పరశురామ్, సుకుమార్, బోయపాటి శ్రీను, మెహర్ రమేశ్, కీర్తి సురేశ్, దిల్ రాజు- ఆయన భార్య, కార్తీ, అల్లు అరవింద్, సోనూసూద్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ బర్త్‌డే వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి, పరశురామ్ సుకుమార్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, మెహర్ రమేశ్‌లు ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఇది కాస్త ఆలస్యంగా బయటకు రాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
తమిళనాడులో ‘అఖండ’ హల్చల్.. దేవాలయంలో క్లైమాక్స్ ఫైట్ సీన్
‘సింహా’,‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ఉగాది కానుకగా టైటిల్ రోర్ పేరుతో వదిలిన టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ తమిళనాడులో ప్రారంభమైంది. తమిళనాడులోని ఓ దేవాలయంలో ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షూట్లో బాలకృష్ణ సహా ఈ సినిమాలోని ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టంట్ శివ ఈ ఫైట్ సీన్‌ను డిజైన్ చేశారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో మరో హైలైట్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ పేర్కొంది. -
కథ క్లైమాక్స్‌కు, లొకేషన్ వెతుకుతున్న బోయపాటి
సాక్షి, తిరుమల: దర్శకుడు బోయపాటి శ్రీను తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు బుధవారం ఉదయం వీఐపీ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వీరికి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా బోయపాటి మీడియాతో మాట్లాడుతూ.. 'అఖండ' సినిమా క్లైమాక్స్ షూటింగ్ లొకేషన్ కోసం వెతుకుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో వర్షాలు ఉండటంతో కడపలో లొకేషన్ చూస్తున్నామన్నారు. కరోనా మూడో దశ వ్యాప్తిని బట్టి అఖండ సినిమాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. కాగా బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా అఖండ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇది వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో చిత్రం కావడంతో అఖండపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇది పూర్తవగానే బన్నీతో ఓ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మురగదాస్‌తో గజినీ సీక్వెల్ చేసే అవకాశం ఉంది. చదవండి: అలా లీనమైపోయిన నివేథా.. వీడియో వైరల్ -
వాళ్లను కాదనుకొని బోయపాటితో సినిమా చేయనున్న బన్నీ!
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బన్నీకి కరోనా రావడంతో ఈ షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్‌తో మూవీ చేయనున్నాడనే సస్పెన్స్‌కు తెరపడటం లేదు. ఇప్పటికే అల్లు అర్జున్ కొరటాల శివ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొరటాల మాత్రం ఎన్టీఆర్‌తో సినిమా పూర్తయిన తర్వాతే బన్నీ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడట. సో ఈ గ్యాప్‌లో ఓ మూవీ చేయాలని బన్నీ భావిస్తున్నాడట. ఇందులో భాగంగా పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ముందుగా మురగదాస్‌తో సినిమా చేయాలని భావించినా ప్రస్తుతం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టాలనుకుంటున్నాడట. మూవీ మేకింగ్‌లో మురగదాస్ ఎక్కువ టైం తీసుకుంటారన్న కారణంతో ఆ గ్యాప్‌లో ఓ సినిమా చేయాలని ఫిక్సయ్యాడట బన్నీ. తాజాగా సరైనోడు సినిమాతో తనకు హిట్ ఇచ్చిన బోయపాటితో అల్లుఅర్జున్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆయన అఖండ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్ చేయగానే బన్నీతో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తర్వాత మురగదాస్‌తో గజినీ సీక్వెల్ చేసే అవకాశం ఉంది. చదవండి : నాన్న కోసం దోశ వేసిన అల్లు అర్హ.. వీడియో వైరల్ TNR : ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన టీఎన్ఆర్ -
టీజర్ హిట్.. రెమ్యునరేషన్ పెంచిన బాలయ్య
ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల రేంజ్ పెరిగింది. ఒక్కో సినిమా వందల కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. దీంతో మన హీరోలు రెమ్యునరేషన్ కూడా పెంచేశారు. టాలీవుడ్ టాప్ హీరోలు ఒక్కో సినిమాకు రూ.50 నుంచి 70 కోట్ల వరకూ తీసుకుంటున్నారు. యంగ్ హీరోలు సైతం ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు పుచ్చకుంటున్నారు. కానీ సీనియర్లు హీరోలలో ఒక్క చిరంజీవి తప్ప మిగతావారంతా చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నాగార్జున, వెంకటేశ్‌లు సినిమాను బట్టి రూ.5 నుంచి 6 కోట్ల వరకు తీసుకుంటున్నటు సమాచారం. ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం ఒక్కో సినిమాకు రూ.7 కోట్లు పుచ్చుకుంటున్నారట. బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’కు కూడా బాలయ్య రూ.7 కోట్లు తీసుకుంటానని మొదట ఒప్పుకున్నాడట. కానీ ఇటీవల విడుదలైన టీజర్‌కు భారీ స్పందన రావడంలో తన రెమ్యునరేషన్‌ని పెంచాడట ఈ నందమూరి నటసింహం. యూట్యూబ్‌లో అఖండ టీజర్ దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు 50 మిలియన్ల వ్యూస్‌ని రాబట్టి రికార్డుని క్రియేట్ చేసింది. ఇక ఈ టీజర్ సూపర్ హిట్ కావడంతో బాలయ్య తన పారితోషికాన్ని మరో మూడు కోట్లు పెంచినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే అఖండ కోసం బాలయ్య మొత్తంగా రూ.10 కోట్లు తీసుకోబోతున్నారన్నమాట. ఇదిలా ఉంటే ఈ సినిమాకు కోసం దర్శకుడు బోయపాటి శ్రీను ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. రూ.70 కోట్లతో ఈ సినిమా రూపొందుతుంది. బడ్జెట్ ఎక్కువవవ్వడం వలన నిర్మాతలు ముందే అనుకున్నంత బడ్జెట్ ఇవ్వలేమని డైరెక్ట్ గా చెప్పినట్లు రూమర్స్ కూడా వస్తున్నాయి. అందుకే బోయపాటి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. సినిమా విడుదల తర్వాత నాన్ థియేట్రికల్ బిజినెస్ అలాగే బాక్సాఫీస్ ప్రాఫిట్ బట్టి దర్శకుడికి షేర్స్ ఇస్తారని సమాచారం. -
బీబీ3 టైటిల్ వచ్చేసింది..మరోసారి అదరగొట్టిన బాలయ్య
సింహా,లెజెండ్ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడో చిత్రం(బీబీ3) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. పూర్ణ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా టైటిల్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బీబీ3 సినిమా టైటిల్‌ని అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఈ చిత్రానికి ‘అఖండ’అనే టైటిల్ ఖరారు చేసినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. దీంతో పాటు టీజర్‌ని కూడా విడుదల చేశారు. గత సినిమాల మాదిరే సినిమా టైటిల్‌తో పాటు టీజర్ కూడా పవర్‌పుల్‌గా ఉంది. 'కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది... కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది...' అంటూ బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక ఈ వీడియోలో బాలయ్య స్వామిజీ లుక్ లో దర్శనమిచ్చి షాకిచ్చారు. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించనున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వైరల్ అవుతున్న బాలకృష్ణ న్యూ లుక్
ప్రతి సినిమాకు కొత్త లుక్ ట్రై చేయడంలో ముందుంటారు హీరో నందమూరి బాలకృష్ణ. దాదాపు అన్ని సినిమాల్లోనూ కొత్తగా కనిపించాలని ఆరాటపడుతుంటారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్వకత్వంలో బాలకృష్ణ BB3 అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే సింహా, లెజెండ్ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో BB3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం బాలయ్య న్యూలుక్లోకి మారిపోయాడు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ బాలయ్య సరసన నటిస్తోంది. తాజాగా హోలీ సంబరాల్లో పాల్గొన్న బాలకృష్ణ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా కనిపించనున్నాడు. వరుస డిజాస్టర్స్‌లో ఉన్న బాలయ్యకు ఈ సినిమా కీలకంగా మారింది. బాలయ్య 106వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఫిక్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశముంది. మే28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. చదవండి : చిరు, బాలయ్యలతో బాలీవుడ్ భామ రొమాన్స్! రెండోపెళ్లి నాకు ఓకే : నాగబాబు.. పోస్ట్ వైరల్ -
బాలకృష్ణ ఎనర్జీ ఓ పవర్ హౌజ్: హీరోయిన్
‘కంచె’ మూవీతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది ప్రగ్యా జైశ్వాల్. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్గా నటించినప్పటికి అనుకున్న స్థాయిలో ఆమెకు గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో ఆమెకు హీరో బాలకృష్ణ తాజా చిత్రం ‘బీబీ3’లో నటించే అవకాశం వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రగ్యా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ‘కరోనా తర్వాత నేను నటిస్తున్న మొదటి చిత్రం ఇది. ఈ మూవీ నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే బాలకృష్ణ సర్‌తో స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం అనేది అద్భుతమైన విషయం. ఆయన ఎప్పుడు ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. స్టార్ హీరో అయినప్పటికి షూటింగ్ సెట్లో ఎప్పుడు సందడి చేస్తూ తొటి నటీనటులతో సరదాగా ఉంటారు. చాలా ఎనర్జీటిక్గా ఉంటారు. చెప్పాలంటే ఆయన ఎనర్జీ ఓ పవర్ హౌజ్ లాంటింది. ఎప్పుడూ పాజిటివిటీతో ఉంటారు. అందుకే ఆయన నాకు స్ఫూర్తి. ఇక సినిమా పట్ల ఆయనకున్న అభిరుచికి ఎవరూ సాటిరారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్లో ఇప్పటికే ‘జయ జానకి నాయక’ మూవీ చేశానని, ఇప్పుడు మళ్లీ ఆయన డైరెక్షన్లో నటించడం సులభంగా ఉందన్నారు. దర్శకుడిగా మూవీ పట్ల ఆయనకున్న స్పష్టత, విజన్ ఎంతో స్ఫూర్తిదాయకమైనదని పేర్కొన్నారు. చదవండి: బాలయ్య సినిమా నుంచి ఆ ఇద్దరూ ఔట్! సితూ పాప నువ్వు అప్పుడే ఎదగకు ప్లీజ్.. -
బాలయ్య సినిమా నుంచి ఆ ఇద్దరూ ఔట్!
బాలయ్య-బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ పుకారు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్‌గా వ్యవహరిస్తోన్న రామ్-లక్ష్మణ్‌లు సినిమా నుంచి తప్పుకున్నారనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బోయపాటి సినిమా అంటే యాక్షన్ సన్నివేశాలకు ఎంత ప్రాధన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో రామ్-లక్ష్మణ్‌లు ఇద్దరు చిత్రానికి మూల స్తంభాలని చెప్పవచ్చు. అలాంటిది ప్రస్తుతం వీరిద్దరూ బాలయ్య-బోయపాటి సినిమా నుంచి తప్పుకున్నారనే వార్తలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. బోయపాటితో విబేధాల కారణంగానే వీరిద్దరూ ఈ సినిమా నుంచి తప్పకున్నారని సమాచారం. వీరి స్థానంలో స్టంట్ శివ ఎంటరైనట్లు తెలిసింది. అయితే దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఫైట్ మాస్టర్స్‌గా రామ్-లక్ష్మణ్‌లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు సరికొత్తగా ఫైట్లను కంపోజ్ చేస్తుంటారు. వీరి ఫైట్లకు ప్రత్యేకంగా అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. చదవండి: సాహసం: అఘోరాగా మారిన బాలకృష్ణ! -
బోయపాటి సినిమాకు బ్రేక్.. కారణం ఇదే!
అనంతగిరి: తమ గ్రామ పరిధిలో సినిమా చిత్రీకరణ చేయరాదని, తమ భూములు పాడవుతున్నాయని కొటాలగూడ గ్రామస్తులు అడ్డుకున్నారు. శనివారం వికారాబాద్ మండలం కొటాలగుడెం గ్రామంలో ద్వారక క్రియేషన్స్ ప్రొడక్షన్స్‌లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాను చిత్రీకరించేందుకు వచ్చారు. చిత్రీకరిస్తున్న క్రమంలో పలువురు గ్రామస్తులు వెళ్లి సినిమా షూటింగ్‌ను అడ్డగించడంతోపాటు తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని వాపోయారు. చదవండి: హైదరాబాద్ తర్వాత వరంగల్‌లోనే: నాగబాబు చదవండి: ఆచార్య@ మారేడుపల్లి.. చిరు గ్రాండ్ ఎంట్రీ -
సాహసం: అఘోరాగా మారిన బాలకృష్ణ!
కంటి చూపుతో చంపేస్తానని వార్నింగ్ ఇచ్చే బాలయ్య ఈసారి నిజంగానే భయపెట్టేందుకు వచ్చేస్తున్నాడు. తాజాగా ఆయన ఎవరూ ఊహించలేని అవతారంలోకి మారిపోయాడట. ఆ మధ్య గుండు గెటప్ వేసుకున్న ఆయన ఈసారి ఏకంగా అఘోరా గెటప్ వేసుకున్నాడట. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న BB3(వర్కింగ్ టైటిల్) సినిమా చిత్రీకరణలో భాగంగా ఈ గెటప్ వేసినట్లు సమాచారం. పైగా ఈ వేషంలో బాలయ్య యాక్షన్ ఫీట్లు సైతం చేస్తున్నాడట. ఎలాగో మిగతా హీరోలకు భిన్నంగా ఫ్లైట్లు చేస్తూ శత్రువులను అల్లల్లాడించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే కాబట్టి ఈ ఫైటింగ్ సీన్లను కూడా అలవోకగా చేస్తున్నట్లు వినికిడి. ఏదేమైనా బాలయ్యను అలాంటి పాత్రలో చూసి అభిమానులు థ్రిల్ ఫీలవ్వడం ఖాయం. కాగా 'రూలర్'తో డిజాస్టర్ అందుకున్న బాలకృష్ణ, 'వినయ విధేయ రామ'తో దారుణ ఫ్లాఫ్‌ను మూటగట్టుకున్న బోయపాటి శ్రీను ఈసారి సూపర్ హిట్ అందుకోవాలన్న కసితో ఈ సినిమా డీల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 28న రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ఇటీవలే ప్రకటించింది. కానీ ఇప్పటివరకు టైటిల్ మాత్రం వెల్లడించలేదు. ఫస్ట్‌లుక్ మాత్రం రిలీజ్ చేసింది. ఇందులో మాత్రం బాలకృష్ణ యంగ్ అండ్ స్టైలిష్‌గా కనిపించాడు. ఇక ఈ సినిమాలో హీరో రెండు వైవిధ్యమైన పాత్రలను పోషించనున్నట్లు తెలుస్తోంది. ప్రగ్యా జైశ్వాల్ ఓ కథానాయికగా నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై 'జయ జానకి నాయక' నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. గతంలో తమిళ హీరో ఆర్య 'నేను దేవుణ్ణి' సినిమాలో అఘోరాగా కనిపించాడు. ఈ సినిమా వచ్చి పదేళ్లు దాటిపోగా, ఈసారి నందమూరి నటసింహం బాలకృష్ణ అఘోరా పాత్రలో పరకాయ ప్రవేశం చేయనున్నాడు. ఈ గెటప్‌లో బాలయ్య చెప్పే డైలాగ్స్, దానితో ముడిపడ్డ సన్నివేశాలు సినిమాకే హైలైట్ అవుతాయని అంటున్నారు. ఇక అఘోరాగా బాలయ్య లుక్‌ను చూడటం కోసం తహతహలాడుతున్నారు అభిమానులు. చదవండి: ‘బలరామయ్య బరిలో దిగితే’ ఎలా ఉంటుంది? బాక్సాఫీస్ వార్: చిరు Vs బాలయ్య.. సై అంటున్న వెంకీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1521341774.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మూడు భాషల్లో ఇద్దరు
అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇద్దరు’. ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా నిర్మిస్తున్నారు. తెలుగు–తమిళ–కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో రాధికా కుమారస్వామి, సోనీ చరిష్టా, జె.డి. చక్రవర్తి, కళాతపస్వి కె.విశ్వనాధ్, హీరో ఆమిర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శనివారం అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘ఇద్దరు’ చిత్రంలోని ప్రత్యేక గీతాన్ని దర్శకుడు బోయపాటి శ్రీనుతో చిత్రబృందం విడుదల చేయించింది. ‘‘అర్జున్‌గారితో కలిసి నేను చేసిన స్పెషల్ సాంగ్ బోయపాటి సార్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సోనీ చరిష్టా. ఈ పాట విడుదల కార్యక్రమంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, చిత్ర సహనిర్మాత శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. -
భావితరాలకు ఆకుపచ్చ భారతాన్ని అందించాలి
‘‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ అంటూ మొక్కలు నాటే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి దూసుకెళుతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్‌గారికి అభినందనలు. ఈ కరోనా సమయంలో అందరికీ ప్రాణవాయువు విలువ తెలిసింది. ఈ భూమి తల్లికి కూడా వృక్షాలు, అడవులు ప్రాణవాయువు అందిస్తాయి’’ అని నటుడు చిరంజీవి అన్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మరియు జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి సొసైటీ ప్రాంగణంలో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘మొక్కలు నాటి ఆకుపచ్చ భారతాన్ని అందించడమే మన భావితరాలకు మనం అందించే గొప్ప సంపద. మనం ఇచ్చే కాలుష్యాన్ని మొక్కలు పీల్చుకుని మనకు ప్రాణవాయువు అందిస్తున్నాయని సంతోష్‌గారు గుర్తించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మెగా అభిమానులందరూ మొక్కలు నాటాలి’’ అన్నారు. -
ఆల్ ఇండియా రికార్డ్ సెట్ చేసిన బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతో పాటు కేరళలో కూడా బన్నీకి అభిమానం గణం ఉంది. అల్లు అర్జున్ సినిమాలకి మలయాళంతో పాటు హిందీ భాషలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో బన్ని సినిమాలు అన్ని కూడా ఈ రెండు భాషలలో డబ్బింగ్ అవుతూ ఉంటాయి. తెలుగులో ఏవరేజ్ అయినా సినిమాలు కూడా డబ్బింగ్ వెర్షన్లో మంచి హిట్ టాక్ తెచ్చుకుంటాయి. ఇక కొన్ని ప్రొడక్షన్ సంస్థలు బన్నీ ప్రతి సినిమాని హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ ‘సరైనోడు’ హిందీ డబ్బింగ్ వెర్షన్ యుట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఏకంగా మూడు వందల మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి దేశంలో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బన్నీ సినిమాకి దరిదాపులలో ఒక్క హిందీ సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని అనలిస్ట్ కమల్‌నాథ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.(ఆటపాటల పుష్ప) Stylish Star @alluarjun film #Sarrainodu (Hindi dubbed version) becomes the FIRST INDIAN FILM to reach 300 Million+ views on @youtubeindia#AlluArjun#300MViewsForSarrainoduHindi pic.twitter.com/v6TaqWns5m — Komal Nahta (@KomalNahta) July 15, 2020 2016లో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బన్నీ ఊర మాస్ యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. మరో హీరో ఆదిపిని శెట్టి ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.(బన్నీని ఒక్క ఛాన్స్ అడిగిన బాలీవుడ్ డైరెక్టర్) -
బాలయ్యకు విలన్‌గా బాలీవుడ్ హీరో!
టాలీవుడ్లో హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎంత సూపర్ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో బాలయ్యకు మంచి సక్సెస్ అందించిన బోయపాటి శ్రీను, ఆ తర్వాత కూడా ‘లెజెండ్’ మూవీతో మరో బ్లాక్ బాస్టర్‌ను అందించాడు. ఈ సినిమా సింహాకు మించిన సక్సెస్‌ను సాధించింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతోంది. బీబీ3 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌కు ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య వైట్ అండ్ వైట్ వేసుకొని చెప్పే ఒక పవర్ఫుల్ డైలాగ్ దుమ్ము లేసేసింది. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఒకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర అయితే.. మరోకొటి అఘోరా పాత్ర. మరి ఇంతటి పవర్ ఫుల్‌గా బాలయ్య కనిసిస్తుంటే ఆయనకు ఎదురొడ్డి నిలిచే విలన్ కూడా అలానే ఉండాలి కదా... దాని కోసం ఒక బాలీవుడ్ హీరోను విలన్‌గా బోయపాటి ఎంపిక చేసినట్లు తెలిసింది. బాలయ్య సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌ను అనుకుంటున్నారు. గతంలో ఈ సినిమా చేయడానికి నో చెప్పినా సంజూ బాబా.. తాజాగా ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు బోయపాటి కొంత మందితో పంచుకున్నట్లు సమాచారం. చదవండి: బాలకృష్ణ బీబీ3లో అమలా పాల్! ప్రస్తుతం సంజయ్ దత్.. యశ్ హీరోగా నటిస్తోన్న కేజీఎఫ్ 2లో విలన్‌గా నటిస్తున్నాడు. మున్నాభాయ్ ఇప్పటి వరకు హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ‘అగ్నిపథ్’ సినిమాతో పాటు ‘పానిపట్’ సినిమాలో విలన్‌గా విశ్వరూపం చూపించాడు. మొదటి సారి తెలుగులో బాలయ్య సినిమాతో విలన్‌గా కనిపించబోతున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడిన బీబీ3 షూటింగ్ వాయిదా పడింది. సెప్టెంబర్ నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే వేసవికాలంలో విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: బాలయ్యా మజాకా? అందులోనూ రికార్డులే! -
బాలయ్య అభిమానులకు మరో కానుక
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘సింహా’ (2010), ‘లెజెండ్’ (2014) వంటి సూపర్‌హిట్స్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూడో చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి. ఇక బాలయ్య బర్త్‌డే సందర్భంగా బీబీ3 (బాలకృష్ణ–బోయపాటి) ఫస్ట్ రోర్ పేరుతో ఓ లుక్‌ను, 64 సెకండ్స్‌తో ఉన్న ఓ వీడియోను విడుదల చేశారు.ప్రస్తుతం బీబీ3 ఫస్ట్ రోర్ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్న విషయం తెలుస్తోంది. అయితే బాలయ్య అభిమానులకు మరో కానుకను చిత్రబృందం అందించింది. (బాలయ్యా మజాకా? అందులోనూ రికార్డులే!) బీబీ 3 ఫస్ట్ రోర్‌కు సంబంధించి యానిమేటెడ్ టీజర్ విడుదల చేసింది. ఎస్ఆర్ఏ1 ఎంటర్టైన్మెంట్ రూపొందించిన ఈ వీడియో కూడా బాలయ్య అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్‌ను చిత్ర బృందం ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే త్వరలోనే చిత్ర టైటిల్ గురించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంపై బాలయ్యతో పాటు ఆయన అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. (బాలయ్య చిత్రంలో ‘బాల్‌రెడ్డి’?) -
బాలయ్య-బోయపాటి చిత్రంలో ‘బాల్‌రెడ్డి’?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. బాలయ్య బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ రోర్ (చిన్నపాటి టీజర్) సోషల్ మీడియాలో ఎంతో రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫస్ట్ రోర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో సింహా, లెజెండ్ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ మూడో చిత్రంపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. (ట్రెండింగ్‌లో టీజర్.. సంతోషంలో బాలయ్య) ఇక బోయపాటి-బాలయ్య సినిమా ఆనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి ఈ చిత్రానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ చిత్రంలో ‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర ఓ కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. అటు హీరోగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే నటుడిగా తననితాను ఫ్రూవ్ చేసుకోవడానికి విలక్షణ పాత్రలను సైతం అంగీకరిస్తున్నాడు. ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో బాల్‌రెడ్డి పాత్రలో కనిపించిన నవీన్ చంద్ర తన నటనతో మెప్పించాడు. అయితే బాలయ్య చిత్రంలో నవీన్‌చంద్ర నటించే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ఈ చిత్రంలో మరో కీలకపాత్ర కోసం శ్రీకాంత్‌ను బోయపాటి ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. (‘సమరసింహారెడ్డి’ మళ్లీ రిపీట్ అవుతుందా?) -
ట్రెండింగ్‌లో టీజర్.. సంతోషంలో బాలయ్య
‘సింహా’ (2010), ‘లెజెండ్’ (2014) వంటి సూపర్‌హిట్స్ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బుధవారం బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులకు బోయపాటి అదిరిపోయే సర్ప్రైజ్ గిప్ట్ ఇచ్చాడు. బీబీ3 (బాలకృష్ణ–బోయపాటి) ఫస్ట్ రోర్ పేరుతో పవర్ఫుల్ లుక్‌లో బాలయ్యకు సంబంధించిన చిన్న టీజర్‌ను విడుదలచేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. (బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్ చూశారా!) 64 సెకన్ల నిడివి గల ఈ టీజర్ ఇప్పటికే దాదాపు ఏడు మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకొని ప్రస్తుతతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. బీబీ3 ఫస్ట్ రోర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందనపై చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. బాలయ్య కూడా టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్‌ను చూసి సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మా కాంబినేషన్(బాలయ్య-బోయపాటి) గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరంలేదు. మా కాంబినేషనల్ ఇది మూడో చిత్రం. అయితే ఇది మూడో చిత్రం అని ఎక్కడా టెన్షన్ తీసుకోవడం లేదు. హిట్ కాకుండా ఎక్కడికి పోతుంది ఈ సినిమా. (బాలయ్య బర్త్‌డే గిఫ్ట్: సాంగ్ విన్నారా?) మా కాంబినేషన్లో వచ్చే సినిమాలో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంటుంది. టీజర్ అద్భుతంగా వచ్చిందని అందరూ అంటున్నారు. అందుకే ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ఉంది. ఇక సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. షూటింగ్‌లు ప్రారంభమయ్యాకు గతంలో కంటే రెట్టింపు వేగంతో ఈ చిత్రాన్ని పూర్తిచేస్తాం. ఈ టీజర్ తర్వాత ఈ సినిమా అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. అంతకంటే రెట్టింపు అంచనాలతో సినిమాను వేగంగా మీ ముందుకు తీసుకొస్తాం’ అని బాలయ్య పేర్కొన్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. -
‘సినిమా హిట్ కాకుండా ఎక్కడికి పోతుంది’
-
బీబీ3 లుక్
‘సింహా’ (2010), ‘లెజెండ్’ (2014) వంటి సూపర్‌హిట్స్ తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నేడు (బుధవారం) బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బీబీ3 (బాలకృష్ణ–బోయపాటి) ఫస్ట్ రోర్ పేరుతో ఓ లుక్‌ను, 64 సెకండ్స్‌తో ఉన్న ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. -
బాలయ్య టీజర్ వచ్చేసింది.. రచ్చరచ్చే
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర షూటింగ్ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. బుధవారం బాలయ్య బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ చిన్న టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. అయితే అందరూ ఊహించినట్లు మూవీ టైటిల్‌ను చిత్రబృందం రివీల్ చేయలేదు. (‘సమరసింహారెడ్డి’ మళ్లీ రిపీట్ అవుతుందా?) 64 సెకన్ల నిడివి గల ఈ టీజర్లో నందమూరి అభిమానులకు కావాల్సిన పూర్తి విందు లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెల్లటి దుస్తులు, గుబురు మీసాలతో మాస్ లుక్‌లో బాలయ్య కనిపించారు. ఆయన చెప్పిన ఫవర్ ఫుల్ డైలాగ్‌లు, శత్రుగణాన్ని గాల్లోకి ఎగిరేసి కొట్టడం వంటి సీన్లు టీజర్లో చూపించి సినిమాపై ఆసక్తి పెంచేశారు. ఈ సినిమా కోసం బాలయ్య భారీగానే బరువు తగ్గినట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. (బాలయ్య కోసం భారీగా శత్రు గణం) -
‘సమరసింహారెడ్డి’ మళ్లీ రిపీట్ అవుతుందా?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారణాసిలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇక ఈ చిత్రంలో బాలయ్య రెండు డిఫరెంట్ పాత్రలు కనిపిస్తాడని టాక్. ఇక లాక్డౌన్ సమయంలో బోయపాటి తర్వాత చేయబోయే చిత్రంపై ఈ నందమూరి హీరో ఫోకస్ చేశారు. అయిత టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం బాలయ్య తన 107వ చిత్రాన్ని బి.గోపాల దర్శకత్వంలో చేయనున్నాడట. ఇప్పటికే పలు కథలు విన్న బాలయ్య దర్శకుడు బి.గోపాల్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చిందని, పూర్తి స్క్రిప్ట్‌ను కూడా గోపాల్ సిద్దం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా రచయిత సాయిమాధవ్ బుర్రా స్క్రిప్ట్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త పాత్రలో కనిపించనున్నారని, ఓ యువతికి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారట. ఇక బోయపాటి చిత్రం పూర్తయిన వెంటనే బి.గోపాల్ సినిమా మొదలుపెట్టనున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక బాలయ్య-గోపాల్ కాంబినేషన్లో వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా అన్నీ కుదిరి వీరి కలయికలో మరో చిత్రం వస్తే బాగుంటుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చదవండి: అదిరేటి లుక్‌లో మహేశ్.. సినిమా కోసమేనా? పదే పదే నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి బాలయ్య కోసం భారీగా శత్రు గణం -
బాలయ్య కోసం భారీగా శత్రు గణం
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఏ రేంజ్లో హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమా అనౌన్స్మెంట్ నుంచి సోషల్ మీడియాలో ఈ చిత్రంపై అనేక వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కథ ఇదేనంటూ, బాలయ్య అఘోరగా నటిస్తున్నాడంటూ, విలన్ పాత్ర శ్రీకాంత్ పోషిస్తున్నాడని మొదట్నుంచి లీకువీరులు చెబుతూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మరో అప్డేట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కాగా ఈ చిత్రంలో బాలయ్యకి సవాల్ విసరడానికి భారీగా విలన్లను దించాలని బోయపాటి భావిస్తున్నాడట. ఇప్పటికే హీరో శ్రీకాంత్‌ను మెయిన్ విలన్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు మర విలన్‌గా బాలీవుడ్‌కు చెందిన ఓ నటుడితో చిత్రబృందం సంప్రదింపులు జరిపనట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌కు బోయపాటి ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం భారీ శత్రుగణాన్ని దర్శకుడు సిద్దం చేస్తున్నారని టాలీవుడ్ టాక్. ఇక అరవీర భయంకరమైన విలన్స్ మధ్య బాలయ్య యాక్షన్ ఘట్టాలు మామూలుగా ఉండవని సమాచారం. ఇక ఈ చిత్రానికి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చదవండి: పెళ్లిపై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్ ఓ ఇంటివాడైన ‘రంగస్థలం’ మహేశ్ -
‘వారికి శిరసువంచి పాదాభివందనం చేస్తున్నా’
హైదరాబాద్: కరోనా వ్యాప్తిపై పోరాటంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు రేయింబవళ్లు కష్టపడుతున్న తీరుకు శిరసువంచి పాదాభివందనం చేస్తున్నట్లు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెలిపారు. మన దేశం ఇంత ప్రభావవంతంగా కరోనాపై పోరాడుతున్నదంటే అందుకు వాళ్లు చేస్తున్న సేవలే ప్రధాన కారణమని, ఆలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా తమ వంతు పాత్రను గొప్పగా పోషిస్తున్నారని ప్రశంసించారు. లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాన నరేంద్రమోదీ ప్రకటించిన అనంతరం మీడియాకు బోయపాటి ఓ లేఖను విడుదల చేశారు. ‘లాక్డౌన్ కాలాన్ని మే3 వరకు పొడిగిస్తూ మన ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయం ఎంతైనా సముచితం. కోవిడ్-19పై రాజీలేని పోరాటాన్ని కొనసాగించడానికి లాక్డౌన్ మించిన ఆయుధం లేదనేది నిపుణులంగా చెప్తున్న విషయం. ఇప్పటివరకు 21 రోజుల లాక్‌డౌన్‌ను దేశంలోని అందరం ఏకతాటిపై నిల్చొని విజయవంతం చేశాం. అందువల్లే కరోనా వైరస్ సమాజంలో విరివిగా వ్యాప్తి చెందకుండా అడ్డుకోగలిగాం. మరో 19 రోజుల పాట అదే స్పూర్థితో, స్వీయ నియంత్రణతో లాక్‌డౌన్‌ను విజయవంతం చేసి, తద్వార కరోనా మహహ్మారిపై పోరాటంలోనూ విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టడానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా పనిచేస్తున్నాయి. అహర్శిశం అప్రమత్తంగా ఉంటూ, ఎప్పటికప్పుడు ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తూ చైతన్య పరుస్తున్న ప్రభుత్వ యంత్రాంగాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కరోనా వ్యాప్తిపై పోరాటంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు రేయింబవళ్లు కష్టపడుతున్న తీరుకు శిరసువంచి పాదాభివందనం చేస్తున్నా. మన దేశం ఇంత ప్రభావవంతంగా కరోనాపై పోరాడుతున్నదంటే అందుకు వాళ్లు అద్భుతంగా చేస్తున్న సేవలే ప్రధాన కారణం. అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా తమ వంతు పాత్రను గొప్పగా పోషిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా దేశానికి ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లినా, దాని కంటే ప్రజల ప్రాణాలే గొప్పవని ప్రధాని చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. సినిమా ఇండస్ట్రీపై కూడా లాక్డౌన్ తీవ్ర ప్రభావం కలిగిస్తోంది. ప్రధానంగా ఉపాధి కోల్పోయిన పేద కళాకారులు, దినసరి వేతనంతో జీవించే కార్మికులను ఆదుకోవడానికి సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్టిగా ముందుకు రావడం ముదావహం. కరోనా వైరస్ ఎంత భయానకమైనదైనా, దాని వల్ల దేశమంతా ఒక్కటేననే భావన ఏర్పడటం, కుల మత భేదం లేకుండా, పేద ధనిక తారతమ్యం లేకుండా అందరం ఐకమత్యం ప్రదర్శించడం గొప్ప విషయం. ఇదే స్పూర్థితో మే3 వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌ను విజయవంతం చేద్దాం. అందరం ఇళ్లల్లో ఉండి ప్రభుత్వాలకు, పోలీసులకు పూర్తిగా సహకరిద్దాం. ఇంట్లోనే ఉందాం. క్షేమంగా ఉందాం. మీ బోయపాటి శ్రీను’ అంటూ లేఖలో బోయపాటి పేర్కొన్నారు. చదవండి: గబ్బిలాన్ని కరోనా ఏం చేయలేదా? ఒకే ఇంట్లో వేరు వేరుగా ఉన్నాం -
బోయపాటి చిత్రంలో బాలయ్య లుక్.. అదుర్స్!
‘రూలర్’చిత్రంలో ఐరన్ మ్యాన్ లుక్‌లో కనిపించి అదరగొట్టారు నందమూరి బాలకృష్ణ. తన చిత్రాల్లోన్ని పాత్రలకు పూర్తి న్యాయం చేయడానికి భాష, వేషం, ఆహార్యం పూర్తిగా మార్చేసుకోవడంలో ఆయన ఏ మాత్రం వెనకాడరు. తాజాగా మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బాలయ్య డిఫరెంట్ షేడ్స్‌లలో కనిపించనున్నట్లు సమాచారం. నందమూరి ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని బాలయ్య పాత్రను డిఫరెంట్‌గా డిజైన్ చేశారట బోయపాటి. దీనిలో భాగంగా ఈ చిత్రంలో ‘ఆఘోర’ క్యారెక్టర్లో బాలయ్య కనిపించనున్నాడని టాలీవుడ్ టాక్. ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ వారణాసిలో ప్రారంభమైంది. కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వారణాసి నుంచి తిరిగొచ్చారు. అయితే ఈ మధ్య ఓ కార్యక్రమంలో బాలయ్య డిఫరెంట్ లుక్‌లో దర్శనమిచ్చారు. చిన్నపాటి జుట్టు, గుబురు మీసంతో కనిపించిన బాలయ్య లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బోయపాటి సినిమాల్లో ఆయన లుక్ ఇదేనంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అప్పట్లో గుండుతో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు ఈ నందమూరి నటసింహం. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం ఇప్పటివరకు లేదు. అంజలి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. చదవండి: 2008లో ఓ వ్యక్తిని ప్రేమించా: అనుష్క అమలా పరిణయం -
ఫైట్‌తో షురూ
‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా సోమవారం మొదలైంది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫైట్‌మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్‌తో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటినుండి ఏకధాటిగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ‘సామజవరగమన....’ అంటూ ఫుల్ జోష్‌లో ఉన్న ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. -
బాలయ్య కొత్త చిత్రం షూటింగ్ స్టార్ట్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా కొత్త సినిమా పట్టాలెక్కింది. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం ఆర్ఎఫ్సీలో ప్రారంభమైంది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలతో సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. బాలకృష్ణ షూటింగ్లో పాల్గొంటున్న ఈ షెడ్యుల్ ఏకధాటిగా సాగనుంది. ఈ చిత్రం కోసం బాలకృష్ణ బరువు కూడా తగ్గారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సింహా, లెజెండ్స్ వంటి హిట్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ తెరకెక్కుతున్న మూడో చిత్రమిదే. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నటీనటులకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: థమన్ ఎస్.ఎస్, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్.ప్రకాష్. -
బాలయ్య సరసన అంజలి.. మరొకరు ఎవరో?
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఊర మాస్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన ఎవరు నటిస్తున్నారు, కథేంటి, టైటిల్ ఇదేనా అంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ను ఎంపిక చేయడానికి బోయపాటి బృందం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు ఆవకాశం ఉండగా.. ఒక కథానాయికగా తెలుగమ్మాయి అంజలిని ఎంపిక చేసినట్టు చిత్రబృందం తెలిపింది. దీంతో బాలయ్య సరసన అంజలి నటించే రెండో చిత్రం ఇది కానుంది. గతంలో డిక్టేటర్ అనే చిత్రంలో ఈ తెలుగమ్మాయి నటించిన విషయం తెలిసిందే. కాగా, మరో హీరోయిన్ ఎవరనేదానిపై సస్సెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే శ్రియనే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కానీ చిత్ర వర్గాల నుంచి ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ఈ చిత్రంలో బాలయ్య రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఒక పాత్రలో అఘోరాగా కనిపించున్నాడని టాలీవుడ్ వర్గాల టాక్. సింహా, లెజెండ్ హిట్ చిత్రాల కాంబినేషన్ తర్వాత వస్తున్న ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్లో భాగంగా తొలి షెడ్యూల్ వారణాసిలో ప్లాన్ చేసినట్టు సమాచారం. చదవండి: బాలయ్యకు ‘సినిమా’ కష్టాలు! బాలయ్య న్యూలుక్ అదిరింది!! -
ఇద్దరు హీరోయిన్లతో బాలయ్య.. ఒకరు ఫిక్స్?
నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కాగా.. ఈ నెల చివరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. తొలి షెడ్యూల్ వారణాసిలో ప్లాన్ చేశారట చిత్ర బృందం. బాలయ్య-బోయపాటిల సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పట్నుంచి ఈ చిత్రం గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడని, అందులో ఒక పాత్ర అఘోరా అని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు ఆడిపాడనున్నారని సమాచారం. ఆ ఇద్దరు కథానాయికలు ఎవరనేదానిపై చిత్రబృందం అనేక చర్చలు జరిపి చివరికి ఒకరిని ఫిక్స్ చేశారట. ఇప్పటికే బాలయ్యతో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రల్లో కథానాయికగా నటించిన శ్రియను ఈ సినిమాలో ఒక హీరోయిన్గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. మరో హీరోయిన్ ఎవరనేదానిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. మరో హీరోయిన్ కోసం క్యాథరీన్, తమన్నాలను సంప్రదించగా వారు సున్నితంగా తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే సినిమా సెట్స్‌పైకి వెళ్లేలోపు ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక బాలయ్య-బోయపాటి కాంబినేషన్ వంటే మాస్ ఆడియన్స్‌కు పండగే. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రస్తుతం బాలయ్య, బోయపాటిలు ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ సినిమాతో ఒకేసారి ఇద్దరూ హిట్ ట్రాక్‌లోకి రావాలని భావిస్తున్నారు. చదవండి: బాలయ్య న్యూలుక్ అదిరింది!! ‘రూలర్’ మూవీ రివ్యూ -
అఘోరాగా బాలకృష్ణ
ఆడియన్స్ మాస్ పల్స్ పట్టిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. ప్రేక్షకులకు మాస్ కిక్ ఎక్కించే హీరో బాలకృష్ణ. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అది డబుల్మాసే. బాలకృష్ణ–బోయపాటి కాంబినేషన్లో ఆల్రెడీ వచ్చిన ‘సింహా’ (2010), ‘లెజెండ్’ (2014) చిత్రాల మాస్ సక్సెస్‌లే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో మరో మూవీ రూపు దిద్దుకుంటుంది. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 26 నుంచి వారణాశిలో జరగనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రెండు కోణాల్లో కనిపించే బాలయ్య, ఓ పాత్రలో అఘోరాగా కనిపిస్తారని టాలీవుడ్ టాక్. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి వుండగా, బాలయ్య లుక్ ను మార్చాలని నిర్ణయించుకున్న బోయపాటి, అందుకోసం మరింత సమయాన్ని ఇస్తూ, కాస్తంత ఆలస్యమైనా ఫిల్మ్ పర్ ఫెక్ట్ గా రావాలని భావిస్తున్నారట. ఇక చిత్రంలో బాలకృష్ణ అఘోరాగా కనిపించే సన్నివేశాలు అత్యంత కీలకమని సినీ వర్గాల సమాచారం.ఇందులో ఇద్దరు కథానాయికలని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి శ్రియ, నయనతార కథానాయికలని ప్రచారం జరుగుతుండగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. -
బోయపాటిని పరామర్శించిన బన్నీ..
ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనును నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బోయపాటి తల్లి సీతారావమ్మ(80) ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. దీంతో గుంటూరు జిల్లా పెద్దకాకాని వెళ్లిన బన్నీ.. బోయపాటిని కలిసి ధైర్యం చెప్పారు. బోయపాటితోపాటు ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. కాగా, బోయపాటి, బన్నీ కాంబినేషన్లో వచ్చిన సరైనోడ్ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. మరోవైపు బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ మరణించడంతో అల్లు కుటుంబం విజయవాడ వెళ్లిన సంగతి తెలిసిందే. -
బాలయ్యకు ‘సినిమా’ కష్టాలు!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న సినిమాలో నటించడానికి హీరోయిన్ కేథరిన్ థెరిసా నో చెప్పిందట. రూలర్ సినిమా తర్వాత బాలయ్య నటించే భారీ బడ్జెట్ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమాలో కేథరిన్‌ను హీరోయిన్గా ఫైనల్ చేసినా.. రెమ్యునరేషన్ విషయంలో రాజీ కుదరలేదట. బాలయ్యతో జోడీ కట్టేందుకు దాదాపు కోటి రూపాయలు డిమాండ్ చేసిందట ఈ భామ. ఇంత భారీ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు నిరాకరించడంతో కేథరిన్.. ఈ అవకాశాన్ని వదులుకున్నట్టు టాలీవుడ్ టాక్. 2013లో చమ్మక్ చల్లో అనే సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కేథరిన్.. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణకు 'సింహా' వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన 'లెజెండ్' మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో నటించే అవకావాన్ని రెమ్యునరేషన్ కోసం మిస్ చేసుకుంది కేథరిన్. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో బాలయ్య సరసన నటించే హీరోయిన్ కోసం బోయపాటికి తంటాలు తప్పడం లేదు. తరచుగా ఏదో ఒక హీరోయిన్ పేరు వినిపించడం.. తీరా సదరు బ్యూటీ ఆ వార్తలని ఖండించడం మామూలైపోయింది. కేథరిన్‌కి ముందు చిత్ర యూనిట్.. మిల్క్ బ్యూటీ తమన్నాను సంప్రదించగా ఆమె సున్నితంగా తిరస్కరించింది. ఆ మధ్యన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా బాలయ్యతో జోడీ కట్టనుందని వార్తలు వినిపించినా సోనాక్షి వాటిని ఖండించింది. మొత్తానికి బాలయ్యకు హీరోయిన్ని వెతకడం బోయపాటికి పెద్ద సవాల్‌గా మారినట్లు ఉంది. చదవండి: ‘రూలర్’ మూవీ రివ్యూ -
బోయపాటి శ్రీను ఇంట్లో విషాదం
గుంటూరు: టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి సీతారావమ్మ(80) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె... గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో మరణించారు. కాగా శనివారం సీతారావమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక మాస్ మహారాజ్ రవితేజ.. ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన బోయపాటి శ్రీను అనతికాలంలోనే మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తులసి, సింహ, దమ్ము, లెజెండ్ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన.. గతేడాది వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కాగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌తో బోయపాటి బిజీగా ఉన్నాడు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
నువ్వంటే శబ్దం.. నేనంటే శాసనం
‘నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే అది శాసనం’ అంటూ తన తాజా చిత్రం కోసం పవర్ఫుల్ డైలాగ్‌ను చెప్పారు బాలకృష్ణ. ‘సింహా, లెజెండ్’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేష¯Œ లో వస్తోన్న మూడో చిత్రానికి శుక్రవారం కొబ్బరికాయ కొట్టారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అంబికా కృష్ణ కెమెరా స్విచ్చా¯Œ చేయగా, దర్శకుడు బి. గోపాల్ క్లాప్ ఇచ్చారు. బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘బోయపాటి, నా కాంబినేషన్లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎక్కువ అంచనాలుంటాయి. గతం గతః అన్నది మా సిద్ధాంతం. మా గత సినిమాల గురించి మాట్లాడుకోకుండా పూర్తిగా ఈ సినిమాపైనే మా దృష్టి ఉంచుతాం. ఈ చిత్రంలో ఆధ్యాత్మికం కూడా ఉంటుంది’’ అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘భద్ర’ వంటి మంచి సినిమాతో ఇండస్ట్రీలో నా లైఫ్ స్టార్ట్ అయింది. ‘సింహా’ వంటి భారీ విజయంతో నా జీవితానికి మంచి మలుపు వచ్చింది. ‘సింహా, లెజెండ్’ చిత్రాలను మించిన మంచి సినిమాను మీ ముందుకు తీసుకొచ్చి నా బాధ్యతను నెరవేర్చుకుంటాను’’ అన్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘భవిష్యత్తులో నేను చాలా సినిమాలు తీయొచ్చు. కానీ, బాలకృష్ణగారితో సినిమా అంటే గౌరవంగా భావిస్తా. ఆయన అభిమానులు, సినిమా ఇష్టపడే ప్రతి ఒక్కరి నుంచి అటువంటి గౌరవాన్ని పొందే విధంగా ఈ సినిమా నిర్మిస్తానని మాట ఇస్తున్నా’’ అన్నారు. ప్రారంభోత్సవ వేడుకలో నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్, సి.కల్యాణ్, కెమెరామేన్ రాంప్రసాద్, రచయిత ఎం.రత్నం పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్ ఎస్.ఎస్. -
అదే మాట నేనంటే శాసనం: బాలయ్య
బాలయ్య బాబు జోష్ పెంచాడు. వరుస చిత్రాలు చేసుకుంటూ పోతున్న నందమూరి బాలకృష్ణ తన 106వ సినిమాను పట్టాలెక్కించి అభిమానులకు తీపివార్త అంజేశాడు. ఈ సినిమా శుక్రవారం పూజాకార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అవగా పలువురు సినీపెద్దలు హాజరయ్యారు. ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బాలయ్య బాబుపై దర్శకుడు గోపాల్ తొలి క్లాప్ కొట్టగా, నిర్మాత అంబిక కృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశాడు. ‘నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే అది శాసనం’ అంటూ బాలయ్య పవర్ఫుల్ డైలాగ్‌తో షూటింగ్ మొదలు పెట్టారు. ఇక మాస్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మిర్యా రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్‌పై సినిమా నిర్మిస్తున్నారు. బోయపాటి శ్రీను, బాలయ్య బాబు కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్బస్టర్లుగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో వీరు ముచ్చటగా మూడోసారి జత కడుతుండటంతో బాలయ్య ఖాతాలో మరో హిట్ పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బాలయ్య సరసన నటించే హీరోయిన్ను ఇంకా ఫైనల్ చేసినట్లు కనిపించడం లేదు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణులను వెల్లడిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపింది. ఇదిలా ఉండగా బాలయ్య తాజాగా నటించిన రూలర్ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానున్న విషయం తెలిసిందే. -
గోపీచంద్ అభిమానులు గర్వపడతారు
‘‘శ్రీనివాస్, పవన్‌గార్లు నాకు చాలాకాలంగా తెలిసినా, వారితో తొలిసారి పని చేస్తున్నాను. మంచి సినిమా చేయాలనే తపన ఉన్న నిర్మాతలతో మంచి కథతో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అని గోపీచంద్ అన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా తెరకెక్కనున్న సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘యు టర్న్’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్ ఇచ్చారు. గోపీ చంద్ మాట్లాడుతూ– ‘‘గౌతమ్ నంద’ తర్వాత సంపత్ మంచి స్క్రిప్ట్‌తో వచ్చారు. తమన్నాతో ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. తనది కూడా మంచి పాత్ర’’ అన్నారు. సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ టైమ్ క్రీడా నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాను. ఆంధ్రా ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీగారు, తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా చేస్తున్నారు. చిట్టూరి శ్రీనివాస్, పవన్, శ్రీనివాస్‌గార్ల బేనర్లో పది కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. గోపీచంద్‌గారి ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘సంపత్‌గారితో నా మూడో సినిమా ఇది. గోపీచంద్‌గారితో సినిమా చేయాలని చాలారోజులుగా ఎదురు చూస్తున్నాను. నాది నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర’’ అన్నారు తమన్నా. ‘‘అన్ని రకాల వాణిజ్య అంశాలున్న సినిమా ఇది. నవంబర్‌లో షూటింగ్ ఆరంభించి, ఏప్రిల్‌లో సినిమా విడుదలకి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు శ్రీనివాసా చిట్టూరి. ఈ కార్యక్రమంలో చిత్రసమర్పకులు పవన్ కుమార్, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, అనిల్ సుంకర, కె.కె. రాధామోహన్, దర్శకుడు ప్రశాంత్ వర్మ, కెమెరామేన్ సౌందర్ రాజన్, ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ తదితరులు పాల్గొన్నారు. -
మంచి సినిమాని ప్రోత్సహించాలి
‘‘నిన్నుతలచి’ టైటిల్లోనే పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఈ టైటిల్‌ను ఖరారు చేసినప్పుడే దర్శక–నిర్మాతలు సగం సక్సెస్ అయ్యారు. పరిశ్రమలో మంచి సినిమానా? కాదా? అని రెండే ఉంటాయి. మంచి చిత్రాన్ని మనం ప్రోత్సహించాల్సిందే. మంచి పాయింట్‌తో వస్తున్న ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. వంశీ ఎక్కసిరి, స్టెఫీ పాటిల్ జంటగా అనిల్ తోట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిన్ను తలచి’. ఎస్.ఎల్.ఎన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని బోయపాటి శ్రీను విడుదల చేశారు. అనిల్ తోట మాట్లాడుతూ– ‘‘ఎమోషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. శ్రీమణి, పూర్ణాచారి గార్లు అద్భుతమైన సాహిత్యం ఇచ్చారు.. మంచి స్పందన వస్తోంది. శ్యామ్ ప్రసాద్ చక్కటి విజువల్స్ అందించారు’’ అన్నారు. ‘‘ఓ ఫీల్ గుడ్ మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అవడం చాలా ఆనందంగా ఉంది’’ అని వంశీ ఎక్కసిరి, స్టెఫీ పాటిల్ అన్నారు. ‘‘నిర్మాత అజిత్గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించారు’’ అన్నారు సంగీత దర్శకుడు ఎలెందర్ మహావీర్. -
ముచ్చటగా మూడోసారి
‘సింహా’(2010), ‘లెజెండ్’(2014) చిత్రాల్లో బాలకృష్ణ మాస్ పెర్ఫార్మెన్స్ ఆడియన్స్‌కు సూపర్ కిక్ ఇచ్చింది. బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ రెండు చిత్రాలు బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే తెరకెక్కాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కనుంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ ఏడాది డిసెంబరులో రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. వచ్చే ఏడాది వేసవి చివర్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘బోయపాటి శ్రీను ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. ఇందులో బాలకృష్ణ మాస్ లుక్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ప్రస్తుతం సమాజంలో ఉన్న ఓ ప్రధాన సమస్యకు కొన్ని కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. -
‘పహిల్వాన్’ ప్రీ–రిలీజ్ వేడుక
-
పాటలు నచ్చడంతో సినిమా చేశా
‘‘ఒకరోజు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కాల్ చేసి ఆఫీసుకు రమ్మన్నారు. ఆదాయపు పన్ను విషయం ఏమో అనుకున్నా. ‘నా ఫ్రెండ్ సినిమా చేస్తున్నారు.. మీరు అందులో నటించాలి’ అన్నారు. ఆ ఆఫీసర్ ఫ్రెండే మా దిలీప్ రాజా అని తెలిసింది. కట్ చేస్తే... మొదట నాకు కొన్ని పాటలు పంపి వినమన్నారు. ఆ పాటలు నచ్చడంతో సినిమా చేస్తానని చెప్పా’’ అని అలీ అన్నారు. దిలీప్ రాజా దర్శకత్వంలో అలీ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. ‘వీడు ఫోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది’ అనేది ట్యాగ్‌లైన్. పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించారు. ఈ సినిమా పాటలను దర్శకులు పూరి జగన్నాథ్, బోయపాటి శీను విడుదల చేశారు. సినిమా ట్రైలర్‌ను దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి రిలీజ్ చేశారు. అలీ మాట్లాడుతూ– ‘‘మా సినిమా కథ కూడా చాలా బాగుంది. వెంకటేశ్వర విద్యాలయ సంస్థ అధినేతగా ఉన్న సాంబిరెడ్డిగారు సినిమాలపై ఇష్టంతో నాతో ఈ సినిమా నిర్మించారు. మా చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘పండుగాడు ఫోటో తీస్తే ఎవరికైనా పెళ్లి అయిపోతుంది అనేది ఈ చిత్ర కథ. రెండేళ్లు ఈ కథ కోసం కష్టపడ్డా. జంధ్యాలగారి మార్క్ కామెడీతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు దిలీప్ రాజా. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బాపట్ల ఎంపీ నందిగాం సురేష్, నటీనటులు బాబూమోహన్, శ్రీకాంత్, నరేష్, ‘అల్లరి’ నరేష్, చార్మి, ఖయ్యుమ్, ప్రవీణ, అనిల్ కడియాల తదితరులు పాల్గొన్నారు. -
బోయపాటికి హీరో దొరికాడా?
మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను, వినయ విధేయ రామ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావటంతో ఈ యాక్షన్ దర్శకుడు ఆలోచనలో పడ్డాడు. చాలా కాలంగా బోయపాటి నెక్ట్స్ సినిమాకు సంబంధించిన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. బోయపాటి తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఓ కన్నడ యంగ్ హీరోతో ప్లాన్ చేస్తున్నారట. జాగ్వర్ సినిమాతో టాలీవుడ్, సాండల్వుడ్లకు ఓకేసారి పరిచయం అయిన నిఖిల్ గౌడ హీరోగా బోయపాటి తదుపరి చిత్రాన్న ప్లాన్ చేస్తున్నారట. కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్, బోయపాటి సినిమాతో మరోసారి టాలీవుడ్ మీద దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
బోయపాటికి షూటింగ్ చేయమని చెప్పింది ఎవరు?
సాక్షి, అమరావతి : పుష్కరాల పేరిట గత ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాలయను మంచి నీళ్లలా ఖర్చు పెట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు జోగి రమేశ్ విమర్శించారు. గోదావరి పుష్కరల్లో 29 మంది అమాయకపు భక్తులు చనిపోవడానికి కారణం టీడీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. గోదావరి, కృష్ణా పుష్కరాల్లో వేలాది కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తరువాత స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయంలో పుష్కరాల నిర్వహణపై జోగి రమేశ్ మాట్లాడుతూ.. పుష్కరాలకు వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించిన టీడీపీ ప్రభుత్వం.. అందుకు సరిపడ ఏర్పాట్లు చేయలేకపోయింది. పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు చనిపోవడానికి కారణమేవరు?. దర్శకుడు బోయపాటి శ్రీనును అక్కడ షూటింగ్ చేయమని ఎవరు చెప్పారు?. బోయపాటిని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు షూటింగ్ చేయమన్నారా లేక బోయపాటినే సినిమా షూటింగ్ చేశారా అనేది టీడీపీ సమాధానం చెప్పాలి. చంద్రబాబు ఎందుకు సామాన్య ఘాట్‌లో పుష్కర స్నానం చేయాల్సి వచ్చింది?. అంత పెద్ద ఘటన జరిగిన కూడా కనీసం ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. 29 మంది మరణానికి కారణమైన వారికి శిక్ష తప్పదు. గోదావరి పుష్కరాల ఘటనపై సభాసంఘం వేయాలి. అసలైన దోషులను గుర్తించాల్సిన అవసరం ఉంది. కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఇబ్రహీం గాంధీ సెంటర్లో ఉన్న మహత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించి మురికి కాలువలో వేశారు. కృష్ణా పుష్కరాల కోసం వేలాది మంది పేదల ఇళ్లను అక్రమంగా తొలగించార’ని తెలిపారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే 29 మంది చనిపోయారు.. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తులు చనిపోయారని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. పర్యాటక శాఖ ద్వారా నేషనల్ జియో గ్రాఫిక్ ఛానల్‌కు రూ. 64 లక్షలతో డాక్యుమెంటరీ చిత్రీకరించే యత్నం చేశారు. బోయపాటి శీనుతో ఆ షూట్ చేశారు. లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు కనీసం జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు. 29 మంది చనిపోవడానికి చంద్రబాబు కారణమని విమర్శించారు. పైగా భక్తుల తొక్కిసలాట వల్లే ప్రమాదం జరిగిందని గత ప్రభుత్వం సమర్ధించుకుందని గుర్తుచేశారు. ఈ ఘటనకు సోమయాజులు కమిషన్ నివేదనకు పట్టించుకోలేదన్నారు. బాధితులకు ఇప్పటికీ పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు గోదావరి పుష్కరాల కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. ఆ నిధులను పూర్తిగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గోదావరి పుష్కరాల ఘటనపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. కేబినెట్ సబ్‌కమిటీతో విచారణ చేయిస్తాం సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వెళ్లిన పుష్కర ఘాట్ వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోలేదని సోమయాజులు కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఆ నివేదికను కూడా చంద్రబాబు ప్రభుత్వం తొక్కిపెట్టిందని మండిపడ్డారు. మృతుల కుటుంబసభ్యులు కూడా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. సామాన్య ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఘాట్‌కు చంద్రబాబు రావడం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొన్నట్టు వెల్లడించారు. కేబినెట్ సబ్‌కమిటీ ద్వారా ఈ ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. -
నాలుగో సినిమా లైన్లో పెట్టిన బన్నీ
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ వరుసపెట్టి సినిమాలు ఓకె చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్లతో పాటు కొత్త దర్శకులకు కూడా చాన్స్ ఇస్తున్న సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు బన్నీ. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఇప్పటికే మూడు సినిమాలు చేతిలో ఉన్న బన్నీ తాజాగా మరో సినిమాను లైన్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఓ సినీ వేడుకలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌లో త్వరలో సినిమా ఉంటుందని చెప్పారు నిర్మాత అల్లు అరవింద్. ఈ సినిమా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో బన్నీ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన సరైనోడు ఘన విజయం సాధించింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
బోయపాటికి ఎదురుచూపులు తప్పవా
‘వినయ విదేయ రామ’ లాంటి డిజాస్టర్ చిత్రంలో బోయపటి శ్రీను గ్రాఫ్ బాగా పడిపోయింది. ఈ మూవీపై వచ్చినన్ని విమర్శలు ఈమధ్యకాలంలో మరే చిత్రానికి రాలేదు. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన బోయపాటిని ప్రేక్షకులు ఏకిపారేశారు. అంతటి పరాభవాన్ని ఎదరుర్కొన్న బోయపాటి శ్రీను.. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాలయ్య హీరోగా బోయపాటి చిత్రం ఈపాటికే మొదలుకావాల్సి ఉండగా.. ఆ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వస్తోంది. మధ్యలో కేఎస్ రవికుమార్ రాగా.. ఆయనతో మూవీ చేసేందుకు బాలకృష్ణ రెడీ అయ్యారు. బోయపాటి చెప్పిన కథలో కొన్ని మార్పులు, చేర్పులు సూచించిన బాలయ్య.. బడ్జెట్‌ను కూడా వీలైనంతగా తగ్గించమని కోరాడట. అయితే బాలయ్య చెప్పిన వాటికి సరే అని.. బడ్జెట్‌ను తగ్గించి కథలో మార్పులు చేసినా కూడా బోయపాటికి ఎదురుచూపులు తప్పడం లేదట. మరి బోయపాటి బాలయ్యకోసం ఎదురుచూస్తు ఉంటాడా? లేక వేరే హీరోతో మరో కథను సిద్దం చేసి ప్రేక్షకుల ముందుకు వస్తాడా అన్నది చూడాలి. -
బాలయ్య సినిమాకు భారీగా కోత
ఎన్టీఆర్ బయోపిక్‌తో నిరాశపరిచిన నందమూరి బాలకృష్ణ, త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కారణంగా కాస్త గ్యాప్ ఇచ్చిన బాలయ్య త్వరలోనే ఈసినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. గతంలో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ కావటంతో హ్యాట్రిక్ కాంబినేషన్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని భావించారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు రిలీజ్ అయిన తరువాత సీన్ పూర్తిగా మారిపోయింది. రెండు భాగాలు డిజాస్టర్ కావటం, అదే సమయంలో బోయపాటి తెరకెక్కించిన వినయ విధేయ రామకు కూడా బ్యాడ్ టాక్ రావటంతో బాలయ్య సినిమా విషయంలో ఆలోచనలో పడ్డారు. ముందుగా 60 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించాలని భావించినా.. ఇప్పుడు అంత బడ్జెట్ వర్క్అవుట్ కాదేమో అన్న భావనలో ఉన్నారట. అందుకే బడ్జెట్లో భారీగా కోత పెట్టినట్టుగా తెలుస్తోంది. 40 కోట్ల లోపే సినిమాను పూర్తి చేసేందుకు స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ మార్పులు ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి. -
బాబు 40ఏళ్ల అనుభవం అక్కరకొచ్చిందా..?
సాక్షి, అమరావతి : నలభై ఏళ్ల అనుభవం.. రాజధానికి ఒక్క శాశ్వత ఇటుక కూడా వేయలేకపోయింది.. సమర్థుడిని, పాలనాదక్షుడినని చెప్పుకునే నాయకుడి ఐదేళ్ల పాలనలో స్వయంగా సీఎం నివాసానికి కూతవేటు దూరంలోని 2.6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ పూర్తికాలేదు. దార్శనికుడి ఐదేళ్ల ఏలుబడిలో... రాజధానిలో భాగమైన విజయవాడ, గుంటూరు నగరాలు మురికి కూపాలుగా మారింది వాస్తవం కాదా? నిప్పునని నిత్యం చెప్పుకునే నిజాయితీపరుడి రాజ్యంలో.. లక్షల కోట్లు అవినీతి ఎలా జరిగింది? రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నానని ఊదరగొట్టే.. కూలీనెం.1 ఐదేళ్ల పరిపాలనలో చిన్నచిన్న పెండింగ్ పనులు సైతం పూర్తికాలేదు. అన్నీ తాత్కాలిక నిర్మాణాలు, ప్రజాధనం దుబారా, విలువలకు తిలోదకాలు.. ప్రచార కండూతి.. ఇవి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అడుగడుగునా కనిపించే సచిత్ర దృశ్యాలు. అనుభవజ్ఞుడి ఐదేళ్ల అసమర్థ,అవినీతి పాలననే.. స్వర్ణాంధ్ర అనుకుందామా..? నలభై ఏళ్ల అనుభవంతో ఆంధ్రావనికి అంతర్జాతీయ స్థాయి రాజధానిని నిర్మిస్తానన్నారు..కాని ఐదేళ్లుగా రాజధాని కోసం కనీసం ఒక్క శాశ్వత ఇటుకైనా వేశారా.. రైతుల నుంచి 35 వేల ఎకరాల పంట భూములు లాక్కోవడం, తన వాళ్లకు కట్టబెట్టడం తప్ప.. రాజధాని నిర్మాణానికి ఒక్క రాయి అయినా ఎత్తారా? లేదే!!మరి అనుభవం అక్కరకొచ్చినట్టా... మాటలతో మభ్యపెట్టినట్టా..?! రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనాలకోసమే పని చేస్తున్నానంటూ..ఉపన్యాసాలు ఇస్తూ... గత ఐదేళ్లలో రాజధానిలో తాత్కాలిక సచివాలయం..తాత్కాలిక శాసనసభ.. శాసన మండలి.. అన్నీ తాత్కాలిక కట్టడాలే! ఈ తాత్కాలిక నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ.11వేలను ఖర్చు చేసి తన కోటరీకి లబ్ధి చేకూర్చడం చంద్రబాబుకే చెల్లింది. అవినీతిలో ఎత్తిపోతలు నిజాయితీ... తాను నిప్పునని పదే పదే చెప్పుకునే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో.. ఇసుక, మట్టి, గనుల దగ్గర నుంచి రాజధాని భూముల వరకూ.. జన్మభూమి కమిటీల నుంచి టీడీపీ నాయకులు, ప్రభుత్వ పెద్దల దాకా.. వాటాలు వేసుకొని మరీ సాగించిన దోపడీ పర్వం లక్షల కోట్లు దాటిందన్నది జగమెరిగిన సత్యం కాదా? అంతెందుకు ఒక్క పట్టిసీమ ఎత్తిపోతల్లోనే.. రూ.374 కోట్ల దోచేశారని కాగ్ ఇచ్చిన నివేదికే చంద్రబాబు అవినీతికి అధికారిక నిదర్శనం. ఇప్పుడు చెప్పండి.. చంద్రబాబు నిప్పా.. అవినీతి కుప్పా? విలువలకు వలువలేవీ? నైతిక విలువలతో రాజకీయాలు చేస్తున్నా అంటూ పదే పదే చంద్రబాబు చెబుతున్నారు. కానీ.. దేశంలో రాజకీయాల్లో నైతిక విలువలకు వలువలు వదిలింది చంద్రబాబేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నాక.. 1996 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దేశంలో ఆ ఎన్నికల్లోనే ఓటర్లకు డబ్బులను ఎరగా వేసి..ప్రలోభ పెట్టే కార్యక్రమానికి మొట్టమొదట సారిగా చంద్రబాబే ప్రారంభించారు. 1998 లోక్‌సభ మధ్యంతరఎన్నికల్లో.. 1999 సాధారణ ఎన్నికలు, 2004, 2014 ఎన్నికల్లోనూ ధనప్రవాహాన్ని ఏరులై పారించారు. నంద్యాల ఉప ఎన్నికలో ధనప్రవాహాన్ని పరాకాష్టకు చేర్చారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఒక్కో నియోజకవర్గానికి సగటున రూ.30 కోట్లు వెదజల్లి.. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పావులు కదుపుతున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కి.. వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని రూ.25 కోట్లకుపైగా వెదజల్లి.. కొనుగోలు చేశారు. ఇవీ రాజకీయాల్లో చంద్రబాబు పాటిస్తున్న నైతిక విలువలు..! దుబారా బాబు రెవెన్యూ లోటు, ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా.. అందుబాటులో ఉన్న వనరులకు సమర్థవంగా వినియోగించుకుని.. ఒక్క రూపాయి కూడా వృథా చేయకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టానని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. గత ఐదేళ్లలో హంగులు ఆర్భాటాలు.. విందులు వినోదాలు.. స్వదేశీ, విదేశీ యాత్రలు.. విహారయాత్రలు.. రియాలిటీ షోల పేరుతో భారీఎత్తున ప్రజాధనాన్ని దుబారా చేశారు. రాజధానికి భూమి పూజ పేరుతో ఒకసారి.. శంకుస్థాపన పేరుతో మరోసారి.. ప్రభుత్వ భవనాల శంకుస్థాపన పేరుతో ఇంకోసారి.. రహదారులకు శంకుస్థాపన పేరుతో మరొకసారి.. ఇలా అనేకసార్లు రాజధానికి శంకుస్థాపనలు చేసి భారీగా రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేశారు. చివరకు పోలవరం విహారయాత్ర పేరుతో రూ.121.81 కోట్లను దుర్వినియోగం చేశారు. ఇప్పుడు చెప్పండి ప్రజాధనాన్నిసద్వినియోగం చేసుకునే తీరు ఇదేనా? ప్రచార యావకి29 మంది బలి 2015లో గోదావరి పుష్కరాల ప్రారంభ ముహూర్తంలోనే గోదావరిలో స్నానం చేస్తే.. పుణ్యం వస్తుందంటూ భారీ ఎత్తున ప్రచారం చేశారు. దాంతో రాజమహేంద్రవరానికి ప్రజలు పోటెత్తారు. సీఎం చంద్రబాబు నిబంధనల ప్రకారం– వీఐపీ ఘాట్ వద్ద స్నానం చేయకుండా.. భక్తులకు కేటాయించిన పుష్కర ఘాట్‌లో స్నానం చేసేందుకు వచ్చారు. భారీఎత్తున పోటెత్తిన భక్తుల నడుమ.. పుష్కరాల్లో తన వైభవాన్ని చాటిచెప్పేలా నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుతో చిత్రీకరణకుప్రయత్నించారు. చిత్రీకరణ పూర్తయి.. చంద్రబాబువెళ్లిపోయాక పుష్కర ఘాట్‌లోకి భక్తులను ఒకేసారి వదలడంతో తొక్కిసలాట జరిగి 29 మంది కన్నుమూశారు. చంద్రబాబు వీఐపీ ఘాట్‌లో స్నానం చేసి ఉంటే ఈ ఘోరం జరిగేదా? ఇప్పుడు చెప్పండి చంద్రబాబు ప్రచార కండూతి వల్లే 29 మంది బలయ్యారన్నది వాస్తవం కాదా?! నీ అసమర్థ పాలనకు ‘దుర్గమ్మే’ సాక్షి తన సమర్థతతో, పాలనాదక్షతతో నవ్యాంధ్రను నిర్మిస్తానన్ననాయకుడు.. ఐదేళ్ల పాలన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి నివాసానికి కూత వేటు దూరంలోని 2.6 కిలోమీటర్ల పొడవైన కనకదుర్గ ప్లైఓవర్‌ను కూడా నిర్మించలేకపోయారు.. కృష్ణా పుష్కరాలు ప్రారంభమయ్యేలోగా అంటే.. ఆగస్టు 12, 2016 నాటికే ప్లైఓవర్‌ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా పుష్కరాలు పూర్తయి 32 నెలలు గడిచిపోయాయి. కానీ.. ప్లైఓవర్ పూర్తి కాలేదు. విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరనేలేదు. ఇప్పుడు చెప్పండి.. బాబు సమర్థుడా.. పాలనా దక్షుడా?! లేక అది ఆయన అసమర్థతకు నిలువుటద్దమా?! సమీక్షలు సరే.. పనులెక్కడ? హార్డ్‌వర్క్.. ప్రజల కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నట్లు ఊదరగొట్టే చంద్రబాబు పాలన అంటే.. ఉత్తి సమీక్షలే సమీక్షలు.. పనులు నత్తనడక.. ఫలితాలు శూన్యం..! అనే విషయం ఏ చిన్న అధికారిని అడిగినా చెబుతారు. ఉదాహరణకు వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలో కేవలం 3.2 కిమీల పనులు పూర్తి చేస్తే నీటిని విడుదల చేయవచ్చు. కానీ.. ఐదేళ్ల తర్వాత కూడా పనులు ముందుకు సాగక.. ఇప్పటికీ 2.8 కి.మీ. సొరంగం పనులు మిగిలిపోవడాన్ని బట్టి చూస్తేబాబు హార్డ్ వర్క్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. -
బాలకృష్ణ మానేద్దాం అనుకుంటున్నాడట!
సుధీర్ఘ సినీ కెరీర్లో నందమూరి బాలకృష్ణ నిర్మాణ రంగం మీద దృష్టి పెట్టలేదు. కానీ తన తండ్రి బయోపిక్ నిర్మించాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో తాను నిర్మాతగా మారితే బాగుంటుందని భావించారు. అందుకే ఎన్బీకే ఫిలింస్ బ్యానర్‌ను స్థాపించి యన్.టి.ఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా నిర్మించారు. అయితే ఈ రెండు సినిమాలకు దారుణమైన ఫలితాలు రావటంతో నిర్మాణ రంగంలో కొనసాగటంపై బాలయ్య ఆలోచనలో పడ్డారట. ఇప్పటికే బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాను తానే స్వయంగా నిర్మిస్తున్నట్టుగా బాలకృష్ణ ప్రకటించాడు. తాజా సమాచారం ప్రకారం ఆ సినిమాను కూడా బయటి బ్యానర్లోనే చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తొలి ప్రయత్నమే తేడా కొట్టడంతో ఇక నిర్మాతగా కొనసాగకపోవటమే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి నిజంగానే బాలయ్య నిర్మాణ రంగం నుంచి తప్పుకుంటాడా..? లేదా అన్న విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఒప్పేసుకున్న రామ్ చరణ్..!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వినయ విధేయ రామ. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత చెర్రీ రొటీన్ మాస్ ఫార్ములా సినిమా చేయటం అభిమానులకు రుచించలేదు. అయితే మాస్ ఫార్ములా సినిమా కావటంతో కలెక్షన్లు మాత్రం భారీగానే వచ్చాయి. తాజాగా వినయ విధేయ రామ రిజల్ట్‌పై చరణ్ ఓ ప్రతికా ప్రకటన విడుదల చేశారు. సినిమా కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పంపిణీదారులు, ప్రదర్శనదారులకు కృతఙన్యుడనై ఉంటానని తెలిపారు. అభిమానులను అలరించే సినిమా ఇచ్చేందుకు శ్రమించామన్న చెర్రీ, అంచనాలని అందుకోలేకపోయామని అంగీకరించారు. భవిష్యత్తులో మీరు మెచ్చే చిత్రాన్ని అందిస్తానన్నారు. -
బాలయ్యతో బోయపాటి సినిమాకు ముహూర్తం ఫిక్స్
సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతోంది. ‘యన్.టి.ఆర్’ తరువాత బోయపాటి దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నట్టుగా బాలయ్య ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభకానుందని తెలుస్తోంది. ఇటీవల వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బోయపాటి టాక్ పరంగా నిరాశపరిచినా.. భారీ వసూళ్లు సాధించి మాస్ ఆడియన్స్‌లో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అదే జోరులో బాలయ్యతో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు బోయపాటి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మాస్ మార్కే కాపాడిందా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజు నుంచే ఈ సినిమాకు డివైడ్ టాక్ రావటంతో సినిమాకు భారీ నష్టాలు తప్పవని భావించారు. కానీ వసూళ్ల పరంగా చూస్తే సీన్స్ రివర్స్ అయ్యింది. సంక్రాంతి సెలవులను క్యాష్ చేసుకున్న వినయ విధేయ రామ మంచి వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా ఆరు రోజుల్లో ఈ సినిమా 60 కోట్లకుపైగా వసూళ్లు సాధించటంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టాల నుంచి చాలా వరకు బయటపడ్డట్టుగా తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కూడా సాధించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు సన్నివేశాలు కాస్త అతిగా అనిపించినా.. బోయపాటి మార్క్ మాస్ యాక్షనే సినిమాను కాపాడిందన్న టాక్ వినిపిస్తోంది. బీ, సీ సెంటర్స్ రెస్పాన్స్ బాగుండటం కలెక్షన్ల విషయంలో ప్రభావం చూపించింది. జనవరి 25 వరకు రిలీజ్లు లేకపోవటం కూడా వినయ విధేయ రామకు కలిసొస్తుందని భావిస్తున్నారు. -
‘వీవీఆర్’... అసలేం జరుగుతోంది..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వినయ విధేయ రామ. మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరున్న బోయపాటి, రంగస్థలం సక్సెస్‌తో సూపర్ ఫాంలో ఉన్న చెర్రీ కాంబినేషన్లో సినిమా తెరకెక్కటంతో రిలీజ్ కు ముందు నుంచే ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే సినిమా రిలీజ్ తరువాత సీన్ మారిపోయింది. ఫస్ట్ షో నుంచి సినిమా మీద ట్రోలింగ్ మొదలైంది. ముఖ్యంగా దర్శకుడు బోయపాటిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. కావాలనే కొంతమంది ఇలా సినిమాను ట్రోల్చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు, నందమూరి బాలకృష్ణను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్, రిలీజ్ చేసిన వీడియోస్ కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు ఫ్యాన్స్. ఒక వర్గం కావాలనే సినిమాను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. సినిమా అనేది టీం వర్క్.. అయినా కేవలం దర్శకుడినే బాధ్యుడిని చేసి విమర్శించటం కరెక్ట్ కాదంటున్నారు అభిమానులు. గతంలో ఇంత బ్యాడ్ టాక్ వచ్చిన సినిమాలేవి రెండో రోజుకు నిలబడలేకపోయాయి. కానీ చరణ్ ఇమేజ్, బోయపాటి స్టామినా కారణంగా వినయ విధేయ రామ మంచి వసూళ్లు సాధించిందంటున్నారు ఫ్యాన్స్. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బీ, సీ సెంటర్స్‌లో మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు. తొలి రోజే దాదాపు 30 కోట్లకు పైగా షేర్ సాధించిన ఈ సినిమా చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్స్‌లో ఒకటిగా నిలిచింది. అయితే టాక్ ప్రభావం రెండో రోజు కలెక్షన్ల మీద కనిపించింది. మరో రెండు రోజులు సంక్రాంతి సెలవులు కావటంతో వసూళ్ల పరంగా సినిమాకు ప్లస్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
అలాంటి సినిమాలు చేయలేను
‘‘సినిమాలో ఫోర్స్‌గా ఫైట్ పెట్టను. యాక్షనే కావాలంటే ఇంగ్లీష్ సినిమా చూడొచ్చు. కానీ ప్రేక్షకులు మన సినిమాలనే ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు? అంటే మన సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది. ఓ రిలేషన్ ఉంటుంది. ‘భద్ర’ నుంచి నా సినిమాలను గమనిస్తే ఫ్యామిలీ, సొసైటీ అంశాలు తప్పనిసరిగా ఉన్న విషయం తెలుస్తుంది’’ అన్నారు బోయపాటి శ్రీను. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ఇవాళ విడుదలవుతోంది. ఈ సందర్భంగా బోయపాటి చెప్పిన సంగతులు. ► పోయిన ఏడాది పడిన కష్టాలన్నింటినీ మరచిపోయి కొత్త ఏడాదిలో అందరూ జరుపుకునే మొదటి పండగ సంక్రాంతి. ఈ పండగలాంటి సినిమా ‘వినయ విధేయ రామ’. ఫ్యామిలీ కోసం తలవంచే వినయుడిలా, అయినవారి కోసం ఏమైనా చేసే ఒక విధేయుడిగా, తనది అనుకున్న దాన్ని సాధించే రాముడిలోని పరాక్రమవంతుడిగా రామ్‌చరణ్ క్యారెక్టర్ ఉంటుందీ సినిమాలో. ఈ సినిమాకు ఎంత కావాలో అంతా చేశారు రామ్ చరణ్. అజర్ బైజాన్ షెడ్యూల్ కోసం ఆయన బాగా బాడీని బిల్డప్ చేశారు. ఈ కథను రామ్‌చరణ్ కోసమే రాశాను. ఒకరినొకరు బాగా నమ్మి ఈ సినిమా చేశాం. సోషల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన ఓ పాయింట్‌ను కూడా ఈ సినిమాలో టచ్ చేశాం. ► సినిమా ప్రేక్షకులు కొత్త పోస్టర్‌నే కోరుకుంటారు. కొత్త లుక్స్‌నే చూడాలనుకుంటారు. కుటుంబ కథా చిత్రం అన్నప్పుడు ఆర్టిస్టుల కటౌట్స్, వారి లుక్స్ కూడా ముఖ్యం. ప్రశాంత్‌గారు, ఆర్యన్ రాజేశ్, రవివర్మ, మధు నందన్, స్నేహ, మధుమిత, హిమజ, ప్రవీణ.. ఇలా అందరూ బాగా చేశారు. విలన్ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్‌ను సంప్రదించినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముందు ఆసక్తిగా లేదన్నారు. కానీ నేను కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నారు. నా సినిమాలోని ప్రతి పాత్రకు జస్టిఫికేషన్ ఉండేలానే ప్లాన్ చేస్తాను. జ్యూస్ నాదైనా గ్లాస్ దానయ్యగారిదే. నిర్మాత సహకారం బాగా ఉంటే సినిమా బాగుంటుంది. స్ట్రాంగ్ విజువల్‌ని దేవిశ్రీ ప్రసాద్ ముందు పెడితే ఎలాంటి ఆర్ఆర్ ఇస్తారో సినిమాలో చూస్తారు. నా ఆర్టిస్టు నుంచి సినిమాకు కావాల్సింది రాబట్టుకోవడం కోసమే సెట్లో యాక్టివ్‌గా ఉంటాను. నేను రాయడం, తీయడం మీదనే ఎక్కువగా దృష్టి పెడతాను. బిజినెస్‌లో అంతగా కల్పించుకోను. ► చిరంజీవిగారు 150 సినిమాలు చేశారు. వెయ్యి కథలు విని ఉంటారు. ఆయన ఇచ్చే సలహాలు సినిమా బాగా రావడం కోసమే. ఈ కథ విన్న తర్వాత నాన్నగారికి ఓసారి చెబుదాం అన్నారు చరణ్. ఇప్పుడే వద్దు.. పది రోజులు తర్వాత చెబుదాం అన్నాను. ఆయనకు ఫుల్‌గా చెప్పాను. నచ్చింది. బాగుంది. నువ్వు బాగా చేస్తావనే నమ్మకం ఉంది అన్నారు. ► తండ్రి ఎవరైనా తన కొడుక్కి స్పోర్ట్స్ బైకో, స్పోర్ట్స్ కారో గిఫ్ట్‌గా ఇస్తారు. కానీ చిరంజీవిగారు రామ్‌చరణ్‌కు ఓ యుద్ధ ట్యాంకర్ (వారసత్వం)ని ఇచ్చారు. అది తోలుతూనే ఉండాలి. గెలుస్తూనే ఉండాలి. నిలబెడుతూనే ఉండాలి. ఒకటే మాట ఏంటంటే.. చరణ్ దానికి సమర్థుడు. ► చిన్న సినిమాలు, స్మూత్ సినిమాలు చేయలేను. ఆడియన్స్ నా దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాన్నుంచి నేను బయటికి రాలేను. కథలుగా మారుతూనే వస్తున్నాను. యాక్షన్ పార్ట్ ఒక భాగం మాత్రమే. అంటే.. పదిమంది చూసే సినిమాలు చేస్తాను కానీ ఒకరు చూసే సినిమాలు చేయను. మంచి సినిమాలు చేస్తాను. బయోపిక్ పట్ల ఆసక్తి ఉంది. చేసినా దానికి ఓ దమ్ము ఉంటుంది. నా బ్రాండ్‌ను నూటికి నూరు శాతం బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఆ బాధ్యతను పెంచుకుంటూనే వెళ్తాను. ► ఇండస్ట్రీలో బోయపాటి చేసే ప్రతి సినిమా ఫస్ట్ సినిమానే. నా గత సినిమాల రేంజ్‌ని మించి నా సినిమాలు ఉండాలని ఎప్పటికప్పుడు తాపత్రయపడుతుంటాను. ఏ హీరోతో నేను సినిమా చేస్తున్నానో ఆ హీరో ఫ్రంట్ సీట్ అభిమానిగానే నేను ఫీల్ అవుతాను. చరణ్‌ని అలా ఫీలయ్యే ‘వినయ విధేయ రామ’ సినిమా చేశాను. ► ప్రేక్షకులు తమ జీవితాల్లో నుంచి కొంత సమాయాన్ని మన కోసం వెచ్చిస్తున్నారు. వాళ్లు కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఫ్యామిలీ కోసం కాకుండా సినిమా చూడటానికి ఖర్చు పెడుతున్నారు. లక్షల్లో ఆడియన్స్ సినిమాను చూస్తారు. వారందరి అంచనాలను అందుకోవాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. అంటే చావుతో చెలగాటం ఆడతాం. నిద్ర ఉండదు. నేను నిద్రపోయి ఆరు రోజులైంది. డీటీఎస్ నుంచి ప్రింట్ వెళ్లేవరకు ఆరు రోజులు. ఆ తర్వాత పబ్లిసిటీ, సినిమాను ప్రజల ముందుకు ఎలా తీసుకెళ్లాలి. ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడతాం. ఎందుకంటే మనకంటే ఎంతోమంది మేధావులు ఉన్నా దేవుడు సినిమా చేసే అవకాశం నాకు ఇచ్చాడు. ► బాలకృష్ణగారితో నేను చేయబోయే సినిమా గురించి తర్వాత మాట్లాడతాను. రామ్‌చరణ్‌కు ఓ లైన్ చెప్పాను. ఈ సినిమాకు బాగా టైమ్ పట్టొచ్చు. చిరంజీవిగారితో కూడా ఓ సినిమా ఉంటుంది. నా టీమ్ 180 మెంబర్స్ ఉంటారు. నా సినిమాలో స్పాన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతమంది ఉంటారు. అందరినీ కో ఆర్డినేట్ చేయాలంటే సెట్లో కాస్త గట్టిగానే ఉండాలి. అప్పుడే టైమ్ సేవ్ అయ్యి నిర్మాతకు నష్టం వాటిల్లదు. నా సెట్‌కి ఒకసారి వస్తే ఈ విషయం అర్థం అవుతుంది. -
మోక్షజ్ఞ ఎంట్రీపై బోయపాటి క్లారిటీ
నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతున్న యువ కథానాయకుడు మోక్షజ్ఞ. చాలా రోజులుగా మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్‌ఎంట్రీపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతోనే మోక్షజ్ఞ పరిచయమవుతాడన్న ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో ఆ ఆలోచనను వాయిదా వేశారు. తరువాత ఎన్టీఆర్ బయోపిక్‌లో మోక్షజ్ఞ తళుక్కుమంటాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై కూడా నందమూరి ఫ్యామిలీ స్పందించలేదు. అయితే గతంలో మోక్షజ్ఞ తొలి చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉంటుందన్న వార్తల వినిపించాయి. తాజాగా వినయ విధేయ రామ ప్రమోషన్ సందర్భంగా ఈ వార్తలపై స్పందించిన బోయపాటి.. మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని తాను డైరెక్ట్ చేయబోవటం లేదన్నారు. తాను ఆ సినిమాను డైరెక్ట్ చేస్తే అభిమానులు అంచనాలు తారా స్థాయికి చేరతాయని, తొలి సినిమాకు ఆ స్థాయి అంచనాలు కరెక్ట్ కాదన్నారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుండగా తన తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ హీరోగా ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. -
ఇదో మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్
రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వినయ విధేయ రామ’. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ నెల 11న విడుదల కానున్న ఈ చిత్రం 2గంటల 26 నిమిషాల నిడివి ఉందని సమాచారం. అలాగే ఈ సినిమాలోని ‘రామా లవ్స్ సీత..’ పాటను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా గురించి రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘ఇందులో బ్యూటిఫుల్ అండ్ బ్యాలెన్డ్స్ క్యారెక్టర్ చేశాను. పూర్తి స్థాయి మాస్ ఫిల్మ్‌లా ఉంటుంది. మంచి కుటుంబ కథా చిత్రం కూడా. సినిమాలో అజర్ బైజాన్ లొకేషన్స్‌ను నేపాల్–బీహార్ సరిహద్దు ప్రాంతంలా చూపించాం. కియారా ఫైన్ ఆర్టిస్టు. ఆ అమ్మాయి కళ్లతో మంచి హావభావాలు పలికించగలదు. మంచి డ్యాన్స్ పార్టనర్. ‘రామా లవ్స్ సీత’ సాంగ్ విజువల్‌గా హైలైట్‌గా ఉంటుంది. ప్రశాంత్, స్నేహ, వివేక్ ఒబెరాయ్గార్లతో పనిచేయడం నాకు లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌లా అనిపించింది. లొకేషన్లో బాగా ఎంజాయ్ చేశాం కూడా. పెద్ద సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు దానయ్యగారు. ఆయనతో చేస్తే మా హోమ్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్‌లో చేసినట్లే ఉంటుంది. బోయపాటిగారు మంచి కన్విక్షన్‌తో సినిమా చేస్తారు’’ అన్నారు. ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి చెబుతూ– ‘‘ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అనగానే సర్ప్రైజ్ కాలేదు. సెట్లో ఎలా ఉంటామని కూడా ఆలోచించలేదు. బయట మేం మంచి స్నేహితులం. అదే షూటింగ్లో కూడా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యింది. చాలా ఆనందంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది’’ అని పేర్కొన్నారు. -
‘వినయ విధేయ రామ’ మూవీ స్టిల్స్
-
‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
కేటీఆర్.. నేను బెంచ్‌మేట్స్
‘‘వినయ విధేయ రామ’ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి వచ్చి ఆశీస్సులు అందించిన కళాభిమానులకు, మా మెగా అభిమానులకు కృతజ్ఞతలు. నేను అనుకున్న దానికంటే ఈ వేదిక చాలా వైబ్రంట్‌గా ఉందంటే దానికి ప్రధాన కారణం మీ రాక, మీ కేకలు, కేరింతలు. ఈ ఉత్సాహమే ఎప్పుడూ మేము కోరుకుంటాం’’ అని చిరంజీవి అన్నారు. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినయ విధేయ రామ’. డి.పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై దానయ్య డీవీవీ నిర్మించిన ఈ సినిమా జనవరి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో.... చిరంజీవి మాట్లాడుతూ– ‘‘మమ్మల్ని ముందుకు నడిపించే ఇంధనం మీ ఉత్సాహం, ప్రోత్సాహమే. ఎవరైనా నన్ను ఏం సాధించావు? ఏం ఆర్జించావు? అని అడిగితే.. ఒకటి రామ్‌చరణ్, రెండోది కోట్లాదిమంది అభిమానులు అని చెప్పగలను. మనం నిజంగా కోట్లు గడించొచ్చు. కానీ, ఎంతకాలం మనవద్ద ఉంటాయో తెలియదు. కానీ, ఎప్పటికీ తరగనిది మీ అభిమానం అని గుండె లోతుల్లోంచి చెబుతున్నా. రాజకీయంగా కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ తిరిగొచ్చిన తర్వాత మీ అభిమానం ఎలా ఉంటుందా? అనే మీమాంస ఉండేది. ‘ఖైదీ నంబర్ 150’ని సూపర్ డూపర్ హిట్ చేసి, మీ అభిమానం ఏమాత్రం చెక్కు చెదరలేదని నిరూపించారు. కేటీఆర్‌గారి రాకతో ఈ ఫంక్షన్‌కి నిండుదనం వచ్చింది. మేమిద్దరం ఒకే బెంచ్‌మేట్స్.. ఇద్దరి మధ్య వయస్సు తేడా ఉంది ఏ స్కూల్లో, ఏ కాలేజ్‌లో అని అడగొద్దు.. అసెంబ్లీలో మేమిద్దరం ఒకే టైమ్‌లో ఎమ్మెల్యేలుగా ఉన్నాం. ‘రంగస్థలం’ షూటింగ్ అప్పుడు నెక్ట్స్ సినిమా ఏం చేస్తే బాగుంటుందని నాకు, రామ్‌చరణ్‌కి మధ్య చర్చ జరిగింది. ‘గోవిందుడు అందరివాడేలే’లో ఫ్యామిలీ డ్రామా చేశావ్, ‘ధృవ’ చిత్రంలో మోడ్రన్ కాప్‌గా చేశావ్. ఇప్పుడేమో గ్రామీణ నేపథ్యంలో ‘రంగస్థలం’ చేస్తున్నావ్. ఇక మిస్ అవుతున్నది ఏదైనా ఉందంటే అది మాస్. ప్రేక్షకుల్ని అలరించేలా, మన ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చేలా మాస్ సినిమా చేస్తే బాగుంటుంది అని చెప్పా. ఎక్కడో ఓ లైన్ విన్నా.. బోయపాటి కాంబినేషన్ అని. ఆయనతో సినిమా చేస్తే మాస్‌కి దగ్గరవడానికి స్కోప్ ఉంటుంది చేయమని చరణ్‌ని ఉసిగొల్పా. తర్వాత బోయపాటిగారు వచ్చి ‘వినయ విధేయ రామ’ కథ చెప్పారు. హీరో పాత్ర వినగానే నాకు ‘గ్యాంగ్‌లీడర్’లో నా పాత్ర గుర్తుకొచ్చింది. సినిమా రషెష్ చూశా. చెప్పింది చెప్పినట్టు తీశారు బోయపాటి. ఈ చిత్రం ట్రైలర్ చూసి కొన్నిసార్లు శభాష్ అన్న సందర్భాలున్నాయి. చరణ్ చేశాడు అనడం కంటే బోయపాటి చేయించాడు.. అది చరణ్ తెరపై చక్కగా చూపించాడు. ‘రంగస్థలం’ సినిమాకి చక్కటి పాటలిచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా మంచి పాటలిచ్చారు. బోయపాటికి అవసరం మేరకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వెన్నుదన్నుగా నిలిచారు దానయ్య. ఆయనకి విజయలక్ష్మి, ధనలక్ష్మి వరిస్తారు. ‘వినయ విధేయ రామ’ విజయం తథ్యం. దానయ్యగారు చాలా అదృష్టవంతులు. ఈ సంవత్సరం ‘భరత్ అనే నేను’, 2019 సంక్రాంతికి ‘వినయ విధేయ రామ’, ఆ తర్వాతి ఏడాదికి అపజయం ఎరుగని రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ చేయడం ఆషా మాషీ కాదు. ఏ నిర్మాతకీ రాని గొప్ప అవకాశం ఆయనకి వచ్చింది. చాలా మంది నిర్మాతలు ‘ఏంటీ దానయ్య’ అని ఈర్ష్య పడేలా ఆయనకి అవకాశాలొస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో నేను హీరోగా దానయ్యగారు ఓ సినిమా చేయనున్నారు. ఈ కాంబినేషన్‌ని సెట్ చేసింది రామ్‌చరణ్. దానయ్యగారితో చరణ్ వరుసగా రెండు సినిమాలు చేయడంతో పాటు నన్ను కూడా ఇరికించారు (నవ్వుతూ). త్రివిక్రమ్‌తో సినిమా చేయాలన్నది నా ఆకాంక్ష. మా కాంబినేషన్లో ఓ చక్కటి సినిమా వస్తుంది.. అది ఎప్పుడొస్తుందా అని నేను కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ– ‘‘మొత్తం తెలుగు చలన చిత్రపరిశ్రమకు... ఇంకా చెప్పాలంటే భారత చలన చిత్రపరిశ్రమలో ఒక దిగ్గజం, ఒక మహానటుడు... స్వయంకృషితో ఈ రోజు పరిశ్రమలో....ఇప్పుడే చరణ్ చెప్పినట్లు...సముద్రమంత అభిమానాన్ని.. అద్భుతమైన వారసులను కూడా అందించిన పెద్దలు, గౌరవనీయులు మెగాస్టార్ చిరంజీవిగారికి నమస్కారం. చరణ్ స్పీచ్ వింటుంటే మేము ఎలక్షన్స్‌లో స్పీచ్‌లు ఇచ్చిన దానికంటే బాగానే మాట్లాడాడని చెప్పవచ్చు. మా సోదరుడు చరణ్ ఈ మధ్య చాకచక్యంగా హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు. ‘ధృవ’కి కూడా నేను వచ్చాను. పెద్ద హిట్ సాధించింది. ‘రంగస్థలం’ సినిమా చేస్తున్నప్పుడు బయట కలిశాం. ఆ గడ్డం చూసి ఏ సినిమా చేస్తున్నావ్? అని అడిగా. ఇదంతా రూరల్ సెట్టింగు. గ్రామీణ నేపథ్యంలో సినిమా అన్నాడు. నేను చచ్చినా చూడను ఆ సినిమా అన్నా. రిలీజ్ అయిన తర్వాత నా స్నేహితులు చాలా మంది చెప్పారు.. ఆ సినిమా అద్భుతంగా ఉందని. చూసిన తర్వాత చెబుతున్నాను.. అది నీ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఈ సినిమాను ఎలక్షన్స్‌లో కూడా బాగా వాడుకున్నాను నేను. ఆ గట్టున ఉంటావా? ఈ గట్టున ఉంటవా? అని నా స్పీచ్‌లో ప్రతిచోటా వాడాను. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా మంచి సంగీతం ఇచ్చాడు. ఈ జోనర్ సినిమాలు నేను చూడను. కానీ బోయపాటిగారి కోసం చూస్తాను. చిరంజీవిగారి నుంచి వినయాన్ని, విధేయతను, సంస్కారాన్ని.. ఇలా అన్నింటినీ అలవరుచుకుని ఇండస్ట్రీలో అద్భుతమైన శక్తిగా ఎదుగుతున్న చరణ్‌కి హృదయపూర్వక శుభాకాంక్షలు. కల్యాణ్‌గారు ఇక్కడ లేరు. ఈ మధ్య రెండు మూడు సార్లు మాట్లాడాను. వారి రాజకీయ, సినీ ప్రస్థానం కూడా విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి విజన్‌ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్న కేటీఆర్‌గారి తపన చాలా స్ఫూర్తి. ఇప్పుడు బాస్ అనాలా? బిగ్‌బాస్ అనాలా? మెగాస్టార్ అనాలా? లేకుంటే ముద్దుగా మీరందరూ పిలిచే అన్నయ్యా అనాలా? అది తెలీదు కానీ నాకు మాత్రం నాన్నగారే. ‘సైరా’ షెడ్యూల్లో బిజీగా ఉండి కూడా వచ్చినందుకు థ్యాంక్స్ డాడ్. ‘వినయ విధేయ రామ’ అనగానే బోయపాటిగారు గుర్తొస్తారు. నాలుగేళ్ల కిందట ఈ సినిమా లైన్ చెప్పారాయన. అందరికీ నచ్చేలా మంచి సినిమా చరణ్‌కి ఇవ్వాలనే ఇన్నేళ్లు వెయిట్ చేసి రాసిన కథ ‘వినయ విధేయ రామ’. ప్రతి హీరో ఆయనతో ఒక్కసారైనా పనిచేయాలన్నది నా కోరిక. ఆయనతో పనిచేస్తే వచ్చే కిక్కే వేరప్పా. నా మాట నమ్మండి. అంతగొప్ప డైరెక్టర్, గొప్ప వ్యక్తి ఆయన. ఈ సినిమా నాకు మంచి మెమొరీగా ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్.. ఈ సినిమాకి నువ్వు ఎంత చాలెంజ్‌గా మ్యూజిక్ కొట్టావో తెలీదు కానీ మా కొరియోగ్రాఫర్లు మాత్రం మా మోకాళ్లు విరగ్గొట్టారు(నవ్వుతూ). భారీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ దానయ్యగారు అయిపోయారు. మా నాన్నగారి ‘ఖైదీ, గ్యాంగ్‌లీడర్’ వంటి కమర్శియల్ సినిమాలు చూస్తూ పెరిగాం. అలాంటి ఒక లవ్లీ సినిమా ఇది. నాన్నగారు 1980లో ‘అభిలాష, ఖైదీ, మన్మథరాజు, మంత్రిగారి వియ్యంకుడు’ వంటి అన్ని జోనర్స్ చేశారు. అలా చేయాలని మాకూ కోరిక ఉండి ఈ సినిమా ఒప్పుకున్నా’’ అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘వారసత్యం అనేది అసమర్థుడికి బరువు.. సమర్థుడికి ఓ బాధ్యత. రాజకీయరంగంలో కేసీఆర్‌గారి వారసుడిగా కేటీఆర్‌గారు, సినిమా రంగంలో చిరంజీవి వారసుడిగా చరణ్‌బాబు ఇద్దరూ ఆ బాధ్యతను అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు. చరణ్‌బాబు ఆర్టిస్టుగా ఏంటో ఈ సినిమా విడుదల తర్వాత చూస్తారు. ప్రేక్షకులందరూ గుండెమీద చేయి వేసుకుని ఈ సినిమా చూడొచ్చు’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ కొత్త సినిమా ఓపెనింగ్
‘ఆర్ఎక్స్–100 ’ ఫేమ్ కార్తికేయ హీరోగా జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ప్రారంభమైంది. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకుడు. ఈ చిత్రం ద్వారా అర్జున్ మొదటిసారిగా మెగా ఫోన్ పట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినిమా స్క్రిప్ట్‌ను హీరో, దర్శకుడు, నిర్మాతలకు అందచేశారు. అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వంతో పాటు హీరోపై క్లాప్ నిచ్చారు. నటులు అలీ, ప్రవీణా కడియాల కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ‘నేను ఏ సినిమా ఓపెనింగ్లకు వెళ్లను. అటువంటిది ఈ చిత్ర నిర్మాతలు ఎంతో కష్టపడి ఇంతదూరం ప్రయాణం చేశారు. వారి ప్రయాణంలోని మొదటి సినిమా ఓపెనింగ్‌కు వచ్చి వాళ్లను మనసారా ఆశీర్వదించటం నా బాధ్యత అనిపించింది. వారితో పాటు మరో నిర్మాత తిరుమల్ రెడ్డి, దర్శకుడు అర్జున్ జంధ్యాల లకు అల్ ది బెస్ట్’ అన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘నా దగ్గర పన్నెండు సంవత్సరాలుగా నాతో పాటు అసోసియేట్‌గా ప్రయాణం చేసిన అర్జున్ నాకు తమ్ముడు లాంటివాడు. టాలెంట్, టైమింగ్ ఉన్నవాడతను. అలాగే ఈ నిర్మాతలు నాకు మొదటినుండి మంచి మిత్రులు. హీరోకి ఈ చిత్రం ద్వారా మంచి పేరు వస్తుందని కచ్చితంగా చెప్పగలను’ అన్నారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ ‘‘ఆర్ ఎక్స్100’ చిత్రం విడుదల తర్వాత నేను చాలా కథలు విన్నాను. నేను విన్న అన్ని కథల్లోకి బెస్ట్ కథ ఇది. అందుకే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడేప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత డివివి. దానయ్య, మిరియాల రవీంధర్ రెడ్డి, ప్రవీణ్, నటులు హేమా తదితరులు పాల్గొన్నారు. -
మగధీరను గుర్తు చేస్తున్న చెర్రీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. గురువారం థియట్రికల్ ట్రైలర్, ఆడియో రిలీజ్ వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. గుర్రం మీద ఉన్న రామ్ చరణ్ స్టిల్ మరోసారి మగధీరను గుర్తు చేస్తోంది. టాలీవుడ్ హీరోలు సైతం ఈ పోస్టర్‌ను రీ ట్వీట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. రంగస్థలం లాంటి ప్రయోగం తరువాత చరణ్ చేస్తున్న మాస్‌యాక్షన్ సినిమా కావటంతో వినయ విధేయ రామపై భారీ అంచనాలే ఉన్నాయి. చెర్రీ సరసన భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. సీనియర్ హీరోలు ప్రశాంత్, ఆర్యన్ రాజేష్‌లు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. -
చరణ్ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ సినిమా వినయ విధేయ రామ. మాస్ మసాల ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీకి మరింత గ్లామర్ యాడ్ చేసేందుకు ఓ స్పెషల్ సాంగ్‌ను తెరకెక్కించనున్నారు. బోయపాటి సినిమాలతో పాటు చరణ్ సినిమాల్లోనూ స్పెషల్ సాంగ్స్‌లో స్టార్ హీరోయిన్స్ కనిపిస్తుంటారు. తమన్నా, పూజా హెగ్డే, కేథరిన్ లాంటి వారు వీరి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారు. ఈ సినిమాలో కూడా ఓ క్రేజీ స్టార్‌తో స్పెషల్ సాంగ్ చేయించాలని భావిస్తున్నారట చిత్రయూనిట్. అయితే సౌత్ భామలు రొటీన్ కావటంతో ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీని సెలెక్ట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల సినిమాలతో కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో హల్చల్ చేస్తున్న ఈషా గుప్తా, వినయ విధేయ రామలో చరణ్ సరసన ఆడిపాడనుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
శుభలేఖ+లు మన ఇంట్లో సినిమా
సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘శుభలేఖ+లు’. ప్రియా వడ్లమాని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో వంశీ నెక్కంటి, మోనా బేద్రే ముఖ్య పాత్రలు చేశారు. ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి శిష్యుడు శరత్ నర్వాడే ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. హనుమా తెలుగు మూవీస్ పతాకంపై సి. విద్యాసాగర్, జనార్థన్ ఆర్.ఆర్ నిర్మించిన ఈ సినిమాను నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి ఫ్యాన్సీ రేటుతో సొంతం చేసుకున్నారు. ‘ఆనంద్, గోదావరి, చందమామ’ వంటి హిట్ సినిమాలకు సంగీతం అందించిన కేఎమ్ రాధాకృష్ణన్ ఈ సినిమాకు సంగీత దర్శకునిగా వ్యవహరించారు. వివాహం పట్ల నేటి యువతరం ఆలోచనా ధోరణి ఎలా ఉంది? అనే కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ చెప్పిన విశేషాలు.... సందర్భానుసారంగానే పాటలు నేను సంగీతం అందించిన మంచి సినిమాల్లో ‘శుభలేఖ+లు’ ఒకటి. ఈ సినిమాలో ఆరు పాటలు ఉన్నాయి. అన్నీ సందర్భానుసారంగానే వస్తాయి. ఇందులో ఉన్న ‘పద్మనాభ పాహి’ అనే పాట పాడింది నేనే. పెద్దాడ మూర్తిగారు రాశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు ‘వేదవాసిని’ అనే పాట పాడారు. ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇందులోని ‘శృంగారలహరి’ సాంగ్ నా ఫేవరెట్. ‘చెప్పక తప్పదు’ అనే సంగీత్ సాంగ్ ఓ ఆకర్షణ. దాదాపు 23 రోజులు ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్‌కి పట్టింది. అంత డీటైల్డ్‌గా చేశాను. నాకా సంతోషం ఉంది ఈ సినిమాలోని సాంగ్స్ కోసం మా టీమ్ జరిపిన సంభాషణలు నాకు మరింత మంచి పాటలు ఇచ్చే చాన్స్ కలిపించాయి. దర్శకుడు శరత్ కూల్‌గా ఉంటారు. నిర్మాత జనార్థన్ ఈ సినిమాకు కథ కూడా అందించారు. ఆయనతో నాకు ఉన్న స్నేహం నా బాధ్యతను మరింత పెంచింది. నా సినిమాలో ఆరు పాటలు హిట్ కావాలని నేను కోరుకుంటాను. అందుకే లిమిటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటాను. ఎక్కువ సినిమాలు చేస్తే మజ్జిగ పలచన అవుతుందనిపిస్తోంది. తక్కువ సినిమాలు చేయడం నాకు వ్యక్తిగతంగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ సక్సెస్ రేట్ పెరిగిన సంతోషం ఉంది నాకు. యువత ఆలోచనలకు దృశ్యరూపం వివాహం పట్ల యువతరం ఆలోచనా ధోరణి మారింది. అరేంజ్డ్ మ్యారేజేస్ విషయంలో వధూవరుల సొంత అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పెద్దలు చూసిన సంబంధాలకు అడ్జెస్ట్ అయ్యే ఒక ధోరణి ఉండేది. ఇప్పుడు అలా లేదు. పెళ్లి తర్వాత తమ జీవితం ఎలా ఉండబోతుందనే ఇన్సెక్యూరిటీ అమ్మాయిలు, అబ్బాయిలు.. ఇద్దర్లోనూ ఉంది. కొత్త ఇంట్లో ఎలా సర్దుకుపోవాలనే ఆలోచనలతో అమ్మాయిలు సతమతం అవుతుంటారు. నేటి పరిస్థితులను ప్రతిబింబించేలా శుభలేఖ+లు చిత్రం ఉంటుంది. సినిమాలోని ప్రతి పాత్రలోనూ బాధ్యతాయుతమైన ప్రవర్తన కనిపిస్తుంది. సిస్టర్ పెళ్లి కోసం హీరో పడే తపన, హీరోయిన్ పెళ్లి గురించి ఆలోచించే విధానం ఇలా ప్రతిదీ ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంటుంది. యూత్ అభిప్రాయాలకు, మనస్తత్వాలకు, ఆలోచనలకు దృశ్యరూపం ఇచ్చారు దర్శకుడు శరత్. రిలీజ్ ముందే సక్సెస్ అయ్యాం రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభిస్తోంది. మార్కెట్లో మంచి మౌత్ టాక్ వస్తోంది. సోషల్ మీడియాలో మంచి బజ్ ఉంది. ఆల్రెడీ మా సినిమాను నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డిగారు తీసుకున్నారు. దీంతో రిలీజ్ ముందే సక్సెస్ అయ్యాం అనుకుంటున్నాం. ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందనే నమ్మకం ఉంది. అందుకే మాతో పాటు ఇతర సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయన్న టెన్షన్ లేదు. ఇది మన ఇంట్లో సినిమానే. మన ఇంట్లో జరుగుతున్న విధివిధానాలే ఈ సినిమా కథనం. వాటిని సిల్వర్‌స్క్రీన్‌పై చూపించాం. ఎస్పీబీతో హరికథ ప్రస్తుతం ‘ఊరంతా అనుకుంటున్నారు’ సినిమా చేస్తున్నాను. ఎస్పీ బాలూగారితో ‘భీష్మ’ అనే హరికథ ప్లాన్ చేస్తున్నాను. ఇంకో రెండు సినిమాలు కమిట్ అవ్వబోతున్నాను. -
మెగా బ్యానర్లో అక్కినేని హీరో
హీరో ఫుల్ బిజీగా కొనసాగుతూనే నిర్మాతగానూ వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. ఇప్పటికే ఖైదీ నంబర్ 150తో సూపర్ హిట్ అందుకున్న చెర్రీ ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరోసారి చిరు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. కేవలం మెగా హీరోలతో మాత్రమే కాదు.. బయటి హీరోలతోనూ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు చరణ్. అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమా తెరకెక్కిచేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ సినిమాను డైరెక్ట్ చేస్తున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే అఖిల్ సినిమా ఉండనుందన్న టాక్ వినిపిస్తోంది. తొలి రెండు సినిమాలతో నిరాశపరిచిన అఖిల్ ప్రస్తుతం తొలి ప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలె మిస్టర్ మజ్ను సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత బోయపాటి అఖిల్ కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇంకా కాంబినేషన్ పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
చెర్రీ ఆల్‌టైం రికార్డ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా వినయ విధేయ రామ. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ శుక్రవారం రిలీజ్ అయ్యింది. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ సీన్స్‌తో రూపొందించిన ఈ టీజర్ మెగా పవర్ స్టార్ అభిమానులను అలరిస్తోంది. అంతేకాదు ఈ టీజర్ కేవలం 24 గంటల్లో 15.1 మిలియన్ల( కోటీ 50 లక్షలకు పైగా) డిజిటిల్ వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. కేవల ధృవ, రంగస్థలం సినిమాలతో ప్రయోగాలు చేసిన చరణ్ ఈ సారి పక్కా కమర్షియల్ సినిమాతో అలరించనున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. -
‘ఇక్కడ రామ్.. రామ్ కొణిదెల’
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ ఈ సినిమాలో చరణ్‌కు జోడిగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్. దీపావళి కానుకగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. బోయపాటి మార్క్ మాస్ క్యారెక్టర్లో చరణ్ ఇరగదీశాడు. 49 సెకన్ల ఈ టీజర్‌ను మాస్ యాక్షన్ సీన్స్‌తో పవర్ ప్యాక్డ్గా రెడీ చేశారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. -
మెగా అభిమానులకు దీపావళి కానుక
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. రంగస్థలం లాంటి భారీ హిట్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ఫస్ట్‌లుక్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా దీపావళి కానుకగా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీకి జోడిగా భరత్ అనేనేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ నటుడు ప్రశాంత్, తెలుగు హీరో ఆర్యన్ రాజేష్‌లు కీలకపాత్రల్లో నటిస్తుండగా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. బోయపాటి మార్క్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చదవండి : చరణ్, బోయపాటి సినిమాకు క్లాస్ టైటిల్..! -
చెర్రీ ఫస్ట్ లుక్, టీజర్ ఎప్పుడంటే..?
రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్హిట్ తరువాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రషూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ వచ్చేసింది. షూటింగ్ మొదలైనప్పటి నుంచి రామ్‌చరణ్‌కు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను గానీ, టైటిల్‌ను గానీ విడుదల చేయని చిత్రయూనిట్ ఈ దీపావళికి అభిమానులను ఖుషీ చేయబోతోంది. నవంబర్ 6 మధ్యాహ్నం ఒంటి గంటకు చెర్రీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను, టీజర్‌ను నవంబర్ 9 ఉదయం 10:25 గంటలకు విడుదలచేయనున్నట్లు ప్రకటించారు. కియారా అద్వాణీ, స్నేహ, జీన్స్ ఫేమ్ ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
ఆన్ స్క్రీన్ వారియర్స్... ఆఫ్ స్క్రీన్ బ్రదర్స్
‘‘కెమెరా ఆన్ చేస్తే రామ్‌చరణ్, నేను వారియర్స్‌లా ఫైట్ చేసుకున్నాం. కెమెరా ఆఫ్ చేస్తే అన్నదమ్ములుగా కబుర్లు చెప్పుకున్నాం’’ అని అంటున్నారు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదారాబాద్‌లో జరుగుతోందని సమాచారం. ‘‘ఈ సినిమాకు సంబంధించి నా లాస్ట్ డే (శనివారం) షూటింగ్లో పాల్గొన్నాను. నా తమ్ముడు రామ్ చరణ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నువ్వు(రామ్ చరణ్) చూపించిన ప్రేమాభిమానలకు థ్యాంక్స్. గొప్ప నటులు చిరంజీవిగారిలో ఉన్న క్వాలిటీస్ అన్నీ ఆయన కొడుకు రామ్‌చరణ్‌లోనూ ఉన్నాయి’’ అని పేర్కొన్నారు వివేక్. స్నేహ,ఆర్యన్ రాజేశ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. -
రామ్ చరణ్, బోయపాటి సినిమా తాజా అప్డేట్
రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రశాంత్ (జీన్స్ ఫేం), ఆర్యన్ రాజేష్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తిగా కావచ్చింది. నవంబర్ 10 నాటికి రెండు పాటలు మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తవుతుందని వెల్లడించారు చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య. నవంబర్ 9 నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, త్వరలనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. 2019 సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఆలోచన ముఖ్యం
శివ, సోనా పటేల్ జంటగా పైడి రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూల్’ (ది పవర్ ఆఫ్ పీపుల్). శ్రీ సుదర్శన చక్ర క్రియేషన్స్ పతాకంపై పైడి సూర్యనారాయణ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 9న విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో బిగ్ సీడీని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల విడుదల చేశారు. దర్శకులు కె.రాఘవేంద్రరావు మోషన్ పోస్టర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫస్ట్ లుక్, నిర్మాత అశ్వినీదత్ టీజర్, డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసారు. సినిమా విజయం సాధించాలని వీరందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పైడి రమేశ్ మాట్లాడుతూ– ‘‘హీరో ఒక యువజన నాయకుడు. తన కుటుంబంతో పాటు ఎన్నో నిరుపేద కుటుంబాలకు అన్యాయం జరగకుండా ఎలా ఆదర్శవంతుడిగా నిలిచాడన్నది ఈ చిత్రం కథాంశం. ఈ చిత్రంతో రమణ సాయి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్, వైజాగ్, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం’’ అన్నారు. ‘‘ఆవేశం కంటే ఆలోచనలు ముఖ్యం. మనీ కంటే మనుషుల విలువలు ముఖ్యం అని తెలియజేసే మంచి సందేశం ఉన్న చిత్రం ఇది. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు పైడి సూర్యనారాయణ . ఈ చిత్రానికి కెమెరా: బాల, సహ నిర్మాత: పాంగ కోదండరావు. -
ఫుల్ క్లారిటీ
టైటిల్ ఖరారైందా? ఫస్ట్ లుక్ ఎప్పుడు? సినిమా షూటింగ్ ఎంతవరకూ వచ్చింది? రామ్‌చరణ్ కొత్త చిత్రానికి సంబంధించి ఆయన అభిమానుల్లో ఉన్న ప్రశ్నలు ఇవి. ఆ సందేహాలకు ఇప్పుడు ఫుల్ క్లారిటీతో సమాధానం ఇవ్వబోతున్నాం. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమాకు ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అదే టైటిల్ ఫిక్స్ అని యూనిట్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. దీపావళి స్పెషల్‌గా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయబోతున్నారట.ప్రస్తుతానికి 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మరోవైపు కెమెరామేన్ రిషీ పంజాబీ ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో చిత్రబృందంలో మనస్పర్థలు వచ్చాయి అని పలు పుకార్లు బయటకు వస్తున్నాయి. ఈ విషయం గురించి చిత్రబృందం మాట్లాడుతూ– ‘‘ఆల్రెడీ ముందుగా అంగీకరించిన సినిమా ఉండటంతో రిషీ ఈ చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంతే కానీ ఎటువంటి మనస్పర్థలు లేవు. మిగిలిన భాగాన్ని కెమెరామేన్ ఆర్థర్ విల్సన్ పూర్తి చేస్తారు’’ అని క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. జనవరి 11న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
చెర్రీకి నో చెప్పిన రకుల్!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘రంగస్థలం’ లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత చెర్రీ నుంచి రాబోతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికి వరకు ఫస్ట్‌లుక్, టైటిల్‌ను కూడా ప్రకటించకపోవడంతో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీని బోయపాటి స్టైల్లో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. అయితే దేవి స్టైల్లో ఓ ఐటెంసాంగ్‌ను కూడా కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేకగీతంలో రకుల్‌ను తీసుకోవాలని చిత్రయూనిట్ భావించిందట. కానీ రకుల్ మాత్రం కూల్‌గా నో చెప్పేసిందని టాక్. అయితే ఇప్పటికే వీరిద్దరు బ్రూస్లీ, ధృవ సినిమాల్లో కలిసి నటించారు. తెలుగులో అవకాశాలు లేక కోలీవుడ్, బాలీవుడ్ అంటూ తిరుగుతున్న రకుల్.. ఈ ఐటమ్‌సాంగ్‌ను వద్దనడంతో ఈ పాటకు ఓ బాలీవుడ్ భామను తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. స్నేహ, జీన్స్ ఫేం ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. -
చరణ్ సినిమా నుంచి తప్పుకున్న సినిమాటోగ్రాఫర్
రంగస్థలం సక్సెస్ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సాంకేతిక విభాగంలో మార్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన రిషీ పంజాబీ తప్పుకోవటంతో కొత్త కెమెరామేన్ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కారణాలు వెల్లడించకపోయినా రిషీ పంజాబీ తప్పుకోవటంతో ఆ స్థానంలో ఆర్థర్ విల్సన్‌ను సినిమాటోగ్రాఫర్‌గా తీసుకున్నారట. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. మిగిలి ఉన్న టాకీ పార్ట్‌తో పాటు పాటలకు విల్సన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. ఈ సినిమాలో చరణ్‌కు జోడిగా కియారా అద్వానీ నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. -
దీపావళికైనా వస్తుందా..?
రంగస్థలం లాంటి బిగ్ హిట్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా రోజు సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ రిలీజ్ అవుతుందని ఆశపడ్డ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ తాజాగా దీపావళి కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చిత్రయూనిట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఈ సినిమాకు వినయ విధేయ రామ అనే పేరును పరిశీలిస్తున్నారట. ఇప్పటికైనా చిత్రయూనిట్ అధికారికంగా డేట్ ఎనౌన్స్ చేస్తుందేమో చూడాలి. రామ్ చరణ్ సరసన భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. జీన్స్ ఫేం ప్రశాంత్, ఆర్యన్ రాజేష్‌లు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. -
లీకైన రామ్ చరణ్ కొత్త సినిమా స్టిల్స్
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2019 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంతవరకు చిత్రయూనిట్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవటంతో అభిమానులు ఫస్ట్‌లుక్, టైటిల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఓ యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించిన స్టిల్స్ లీకయ్యాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద మాత్రం తప్పటం లేదు. ఈ సినిమాలో సీనియర్ హీరో ప్రశాంత్ చెర్రీ అన్నగా కనిపిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. -
అప్పన్న సన్నిధిలో రామ
అజర్బైజాన్, హైదరాబాద్ చుట్టొచ్చాక వైజాగ్ వెళ్లారు రామ్‌చరణ్. సినిమా ఫ్యామిలీతో కలసి సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను ఓ చిత్రం తెరక్కెకిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ కథానాయిక. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లోని సింహాచలం గుడిలో జరుగుతోంది. రామ్‌చరణ్, ఆర్యన్ రాజేశ్‌పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఈ షెడ్యూల్లో ఎక్కువ కుటుంబానికి సంబంధించిన సీన్స్ ఉంటాయని సమాచారం. రామ్ చరణ్‌కు అన్నయ్యలుగా ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్ కనిపించనున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. వివేక్ ఒబెరాయ్ విలన్‌గా కనిపించనున్నారు. దసరాకు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నారని టాక్. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
చరణ్, బోయపాటి సినిమాకు క్లాస్ టైటిల్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు స్టేట్‌రౌడీ, తమ్ముడు లాంటి టైటిల్స్ పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తెర మీదకు వచ్చింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యం తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. అంతేకాదు నిర్మాత డీవీవీ దానయ్య ఈ టైటిల్‌ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించినట్టుగా తెలుస్తుంది. బోయపాటి గత చిత్రం జయ జానకి నాయక టైటిల్ తరహాలోనే ఈ సినిమాకు కూడా క్లాస్ టైటిల్‌ను నిర్ణయించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. దసరా సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. అదే రోజు టైటిల్ విషయంలో కూడా క్లారిటీ వస్తుందని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. -
బోయపాటికి బాలయ్య డెడ్‌లైన్..!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సింహా, లెజెండ్ లాంటి భారీ హిట్లు వచ్చాయి. అప్పటి నుంచి ఈ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ వందో సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తారన్న ప్రచారం జరిగినా కుదరలేదు. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్‌పై వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తున్నారు. అంతేకాదు ఆ సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో స్వయంగా నిర్మించాలని భావిస్తున్నారట. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బోయపాటి సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు బాలకృష్ణ. అందుకే బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను కేవలం 70 రోజుల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నాడట. బోయపాటి శ్రీను లాంటి మాస్ దర్శకుడి సినిమా అంటే భారీ స్టార్ కాస్ట్‌తో పాటు అదేస్థాయిలో యాక్షన్ సీన్సూ ఉంటాయి. మరి 70 రోజుల్లో అంతా భారీ చిత్రం పూర్తి చేయటం సాధ్యమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
మెగాస్టార్ టైటిల్‌తో చరణ్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం అజర్బైజాన్ లో జరుగుతోంది. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవల మెయిన్ విలన్‌గా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ తన షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగి ఇండియా వచ్చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్టేట్ రౌడీ అనే టైటిల్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. చిరంజీవి హీరోగా 1989లో రిలీజ్ సినిమా స్టేట్ రౌడీ. ఇప్పుడు అదే టైటిల్‌ను చరణ్ సినిమాకు ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా సోషల్ మీడియాలో చరణ్ స్టేట్ రౌడీ సినిమా పోస్టర్ అంటూ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ హల్చల్ చేస్తున్నాయి. -
అంచనాలను మించేలా...
‘రంగస్థలం’ వంటి భారీ హిట్ తర్వాత రామ్‌చరణ్ నటిస్తోన్న తాజా చిత్రం షెడ్యూల్ అజర్ బైజాన్‌లో మంగళవారం నుంచి ప్రారంభమైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య డీవీవీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. దానయ్య మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందిస్తున్నాం. రామ్‌చరణ్– బోయపాటి కాంబినేషన్ అనగానే మెగా అభిమానులు, ప్రేక్షకులు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో తెలిసిందే. వారి అంచనాలను మించేలా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇటీవల హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేశాం. మంగళవారం నుంచి అజర్బైజాన్లో భారీ ఖర్చుతో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. 25 రోజల పాటు జరగబోయే ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్ సహా ఎంటైర్ యూనిట్ పాల్గొంటుంది. ఈ చిత్రాన్ని జనవరి 11న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. రీసెంట్గా తెరకెక్కించిన పండగ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఫైట్ ఈ చిత్రంలో హైలైట్‌గా ఉంటుందని సమాచారం. ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్‌కుమార్, సహ నిర్మాత: కల్యాణ్. -
ఛలో అజర్ బైజాన్
మరో ఇరవై రోజుల పాటు రామ్‌చరణ్ అండ్ టీమ్ ఇండియాలో కనిపించరట. వర్కింగ్ హాలీడేగా దుబాయ్‌కి పయనం కానున్నారు. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఇందులో కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రబృందం మరో నాలుగు రోజుల్లో దుబాయ్ ప్రయాణం అవ్వనున్నారని సమాచారం. దుబాయ్ పక్కనున్న అజర్ బైజాన్‌లో 23రోజుల పాటు షూటింగ్ చేయనున్నారట. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ ఫ్యామిలీ సాంగ్ కూడా షూట్ చేయనున్నారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో దుబాయ్ ప్రయాణం అవుతారు చిత్రబృందం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జనవరి 11న రిలీజ్ కానుంది. -
బాబాయ్ పుట్టిన రోజుకి అబ్బాయ్ గిఫ్ట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభమై చాలా కాలం అవుతున్న ఇంత వరకు టైటిల్గాని లుక్ గాని రివీల్ చేయలేదు. అందుకే మెగా అభిమానుల కోసం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా పవన్ పుట్టిన రోజున చరణ్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ పై అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
చరణ్ కొత్త సినిమాపై ఇంట్రస్టింగ్ న్యూస్
రంగస్థలం లాంటి సూపర్ హిట్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో చరణ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడట. ప్రస్తుతం చిత్రకీరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. -
సెట్లో వందనం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సెట్స్‌లోనే జరుపుకుంటారట రామ్‌చరణ్. జెండా వందనం యూనిట్ సభ్యులతోనే. ఎందుకంటే ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కొత్త షెడ్యూల్ ఈ రోజు నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ‘‘మా చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ ఈ రోజు నుంచి హైదారాబాద్‌లో స్టార్ట్ కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ షెడ్యూల్లో ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలతో పాటుగా కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను అనౌన్స్ చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. -
హైదరాబాద్‌లో చెర్రీ-బోయపాటి షూటింగ్!
‘రంగస్థలం’లో చిట్టిబాబుగా మంచి నటన కనబర్చి కెరీర్లో భారీ హిట్ కొట్టాడు రామ్‌చరణ్. మాస్ ప్రేక్షకులను అలరించేలా సినిమాలను తీసే దర్శకుడు బోయపాటి శ్రీను. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించింది చిత్రయూనిట్. తాజాగా మరో షెడ్యుల్‌ను హైదరాబాద్‌లో షూట్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆగస్టు 15నుంచి హైదరాబాద్‌లో ఓ షెడ్యుల్‌ను చిత్రీకరిస్తున్నట్లు నిర్మాత ప్రకటించాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. వివేక్ ఒబేరాయ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. Megapower Star Ram Charan and Director Boyapati Srinu's #RC12 next schedule starts tomorrow.🎬 pic.twitter.com/y0dvr4ooyx — DVV Entertainment (@DVVMovies) August 14, 2018 -
అన్న కాదు విలన్..!
రంగస్థలం సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వివేక్‌తో పాటు మరో విలన్ కూడా కనిపించనున్నాడట. హాయ్ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయిన ఆర్యన్ రాజేష్, చెర్రీ సినిమాలో స్టైలిష్ విలన్‌గా కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జగపతి బాబు, ఆది పినిశెట్టి లాంటి వాళ్లను విలన్లుగా చూపించి మెప్పించిన బోయపాటి, రామ్‌చరణ్ సినిమాతో ఆర్యన్ రాజేష్‌ను ప్రతినాయక పాత్రలో పరిచయం చేయనున్నాడు. ముందుగా ఈ సినిమాలో ఆర్యన్, చెర్రీకి అన్నగా కనిపించనున్నారన్న ప్రచారం జరిగింది. కానీ తాజా సమచారం ప్రకారం ఈ సీనియర్ హీరో నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్న ఆర్యన్ రాజేష్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ రాజేష్ కూడా జగపతి బాబు, ఆదిల్లా స్టార్ ఇమేజ్ అందుకుంటాడేమో చూడాలి.