February
-
ఫండ్ రివర్స్..!
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా ఫిబ్రవరి నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు గణనీయంగా పడిపోయాయి. రూ.29,303 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో వచ్చిన రూ.39,688 కోట్లతో పోల్చి చూస్తే 26 శాతం తగ్గిపోయాయి. 2024 డిసెంబర్లో ఈక్విటీ పథకాల్లోకి రూ.41,156 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. ఇలా చూస్తే వరుసగా రెండో నెలలోనూ ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక తగ్గినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ముఖ్యంగా స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడుల విలువ క్షీణించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపించింది. అటు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చిన పెట్టుబడులు సైతం మూడు నెలల కనిష్టానికి చేరాయి. గత డిసెంబర్లో సిప్ ద్వారా ఈక్విటీల్లోకి రూ.26,459 కోట్లు రాగా, జనవరిలో రూ.26,400 కోట్లకు, ఫిబ్రవరిలో రూ.25,999 కోట్లకు క్షీణించాయి. మార్కెట్లలో కరెక్షన్ నేపథ్యంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి లమ్సమ్ రూపంలో పెట్టుబడులు గణనీయంగా తగ్గినప్పటికీ, సిప్ పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు స్థిరత్వాన్ని చూపిస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ‘‘సిప్ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. కానీ, పెద్ద మొత్తమేమీ కాదు. పైగా జనవరితో పోల్చితే ఫిబ్రవరి నెలలో తక్కువ రోజులు ఉంటాయి’’ అని మిరే అస్సెట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ హెడ్ సురంజన తెలిపారు. మార్కెట్లలో కరెక్షన్ కొనసాగడం ఫిబ్రవరిలో అమ్మకాలపై ప్రభావం చూపించినట్టు మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ ఈడీ అఖిల్ చతుర్వేది పేర్కొన్నారు. దీర్ఘకాలానికి సెంటిమెంట్ సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. స్మాల్, మిడ్‌క్యాప్‌పై ప్రభావం ఎక్కువ → స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి ఫిబ్రవరిలో రూ.3,722 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జనవరిలో వచ్చిన రూ.5,721 కోట్లతో పోల్చితే గణనీయంగా తగ్గాయి. → మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులు రూ.5,148 కోట్ల నుంచి రూ.3,407 కోట్లకు క్షీణించాయి. → గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)లోకి సైతం పెట్టుబడులు ఫిబ్రవరిలో రూ.1,980 కోట్లకు పరిమితమయ్యాయి. జనవరిలో రూ.3,751 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → అన్ని రకాల పథకాల్లోకి ఫిబ్రవరిలో రూ.40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → సిప్ ఖాతాలు 10.16 కోట్లుగా ఉన్నాయి. ఫిబ్రవరిలో కొత్తగా 44.56 లక్షల సిప్ ఖాతాలు ప్రారంభం కాగా, 54.70 లక్షల ఖాతాలను ఇన్వెస్టర్లు నిలిపివేశారు. ఫండ్స్ ఏయూఎంలో కుదుపు మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ ఫిబ్రవరి నెలలో 4% పతనమైంది. జనవరి చివరికి ఉన్న రూ.67.25 లక్షల కోట్ల నుంచి ఫిబ్రవరి చివరికి రూ.64.53 లక్షల కోట్లకు తగ్గింది. తాజా నిధుల సమీకరణ తక్కువగా ఉండడం, అదే సమయంలో స్టాక్స్ విలువలు పతనం కావడం ఫండ్స్ ఏయూఎం నికరంగా రూ.2.72 లక్షల కోట్ల మేర ఆవిరైంది. 2022 జూన్ తర్వాత నెలవారీ ఏయూఎం(శాతంలో) ఇంత అధికంగా క్షీణించడం ఇదే తొలి సారి. విలువ క్షీణత పరంగా చూస్తే 2020 మార్చి నెల తర్వాత గరిష్టం కావడం గమనార్హం. మార్కెట్లో దిద్దుబాటు ప్రభావం పరిశ్రమపై ఏ మేరకు ఉందో ఈ గణాంకాలు చెబుతున్నాయి.ఇన్వెస్టర్ల విశ్వాసం బలంగానే..స్వల్పకాల ప్రతికూలతలు పెట్టుబడులపై ప్రభావం చూపించి ఉండొచ్చు. అయినప్పటికీ ఇన్వెస్టర్ల విశ్వాసం బలంగానే ఉంది. ఇప్పటికీ పెట్టుబడులు సానుకూలంగా ఉండడం దీన్నే సూచిస్తోంది. ఇన్వెస్టర్లు కాస్త అప్రమత్త ధోరణిని అనుసరిస్తూ, తమ దీర్ఘకాల పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోని తిరిగి పరిశీలించుకుంటున్నట్టు కనిపిస్తోంది.– నేహల్ మెష్రామ్ సీనియర్ అనలిస్ట్, మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ -
ఆధార్ ధ్రువీకరణ లావాదేవీలు 225 కోట్లు
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలకు ఆధార్ కీలకంగా మారుతోంది. ఫిబ్రవరి నెలలో ఆధార్ ఆధారిత ధ్రువీకరణ లావాదేవీలు 225 కోట్లుగా ఉన్నాయి. ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ లావాదేవీలు మరో 43 కోట్లు జరిగాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇతర రంగాల్లో ఆధార్ ఆధారిత ధ్రువీకరణకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆధార్ ధ్రువీకరణలు మెరుగైన కస్టమర్ అనుభవానికి తోడ్పడుతున్నట్టు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ లావాదేవీలు గతేడాది ఫిబ్రవరి గణాంకాలతో చూస్తే 14 శాతం పెరిగాయి. ఇక 2025 ఫిబ్రవరి నాటికి మొత్తం మీద ఆధార్ ధ్రువీకరణ లావాదేవీలు 14,555 కోట్లను అధిగమించాయి. అలాగే ఇప్పటి వరకు నమోదైన ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ లావాదేవీలు 2,311 కోట్లకు చేరాయి. ఆధార్ ముఖ గుర్తింపు ధ్రువీకరణలకూ ఆదరణ పెరుగుతోంది. ఫిబ్రవరిలో ఇలాంటివి 12.54 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2021 ఫిబ్రవరిలో ఆధార్ ముఖ గుర్తింపు ధ్రువీకరణను ప్రవేశపెట్టగా.. అప్పటి నుంచి చూస్తే నెలవారీ గరిష్ట లావాదేవీలు ఫిబ్రవరిలోనే నమోదు కావడం గమనార్హం. ఇప్పటి వరకు మొత్తం ముఖ గుర్తింపు ధ్రువీకరణ లావాదేవీలు 115 కోట్లకు చేరాయి. ఇందులో 87 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నమోదు కావడం గమనార్హం. కోటక్ మహీంద్రా ప్రైమ్, ఫోన్‌పే, కరూర్ వైశ్యా బ్యాంక్, జేఅండ్‌కే బ్యాంక్ ముఖ గుర్తింపు ధ్రువీకరణ కోసం కొత్తగా అనుమతి పొందాయి. ఇప్పటి వరకు మొత్తం 97 సంస్థలకు ఇందుకు అనుమతి లభించింది. -
ఎక్కువమంది ఆ బ్రాండ్ కార్లనే కొనేస్తున్నారు
ముంబై: వాహన కంపెనీల విక్రయాలు ఎగుమతులతో కలుపుకుని ఫిబ్రవరిలో ఆశాజనకంగా నమోదయ్యాయి. ప్యాసింజర్స్ వెహికిల్స్ తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ స్వల్ప వృద్ధితో సరిపెట్టుకుంది. డిమాండ్ స్తబ్ధుగా ఉండడంతో హ్యుందాయ్, టాటా మోటార్స్ వాహన అమ్మకాలు నెమ్మదించాయి. ఎస్‌యూవీలు, ఎంపీవీ మోడళ్లకు గిరాకీ లభించడంతో మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్ వాహన విక్రయాలు గత నెలలో రెండంకెల వృద్ధి సాధించాయి.మారుతీ సుజుకీ దేశీయంగా గత నెలలో 1,60,791 యూనిట్ల వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సంఖ్య 1,60,271 యూనిట్లు. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్-ప్రెస్సో విక్రయాలు 14,782 నుంచి 10,226 యూనిట్లకు తగ్గాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వేగన్–ఆర్ అమ్మకాలు 71,627 నుంచి 72,942 యూనిట్లకు పెరిగాయి. యుటిలిటీ వాహన విభాగంలోని బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్ఎల్6 విక్రయాలు 61,234 నుంచి 65,033 యూనిట్లకు చేరాయి. ఎగుమతులు కలుపుకొని ఈ ఫిబ్రవరిలో కంపెనీ 1,99,400 యూనిట్ల వాహనాలు విక్రయించింది.➤హ్యుండై మోటార్ ఇండియా మొత్తం వాహన విక్రయాలు 3% క్షీణించి 58,727 యూనిట్లకు వచ్చి చేరాయి. దేశీయంగా భౌగోళిక రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ.. కేంద్ర బడ్జెట్ 2025లో ప్రతిపాదిత పన్ను సంస్కరణలు, మెరుగైన ద్రవ్య లభ్యత మార్కెట్‌కు అవసరమైన డిమాండ్‌ను అందిస్తాయని ఆశావాదంగా ఉన్నాం’ అని కంపెనీ సీఈవో తరుణ్ గర్గ్ అన్నారు.➤టాటా మోటార్స్ మొత్తం వాహన విక్రయాలు 8% తగ్గి 77,232 యూనిట్లకు పరిమితమయ్యాయి.➤ఎస్‌యూవీలకు డిమాండ్ లభించడంతో ఎంఅండ్ఎం మొత్తం అమ్మకాల్లో 15% వృద్ధి నమోదై 83,072 యూనిట్లకు చేరుకున్నాయి. -
124 ఏళ్లలో కెల్లా అత్యంత వేడి ఫిబ్రవరి
ఈసారి ఎండలు అప్పుడే దంచికొడుతున్నాయి. ఎండాకాలం ఇంకా మొదలైనా కాకుండానే ఠారెత్తిస్తున్నాయి. ఆ క్రమంలో గత 124 ఏళ్లలో అత్యంత వేడిమి ఫిబ్రవరిగా గత మాసం కొత్త రికార్డు సృష్టించింది. గత నెలలో సగటున 22 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 1901 తర్వాత ఫిబ్రవరిలో ఈ స్థాయి సగటు నమోదవడం ఇదే తొలిసారి. అంతేకాదు, చరిత్రలోనే తొలిసారిగా ఈ ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 15 డిగ్రీల పై చిలుకు నమోదై సరికొత్త రికార్డు నెలకొల్పాయి. అంతేగాక సగటు గరిష్ట ఉష్ణోగ్రత విషయంలో 2023 ఫిబ్రవరి నెలకొల్పిన రికార్డును కూడా గత నెల దాదాపుగా అధిగమించినంత పని చేసింది! దీనిపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ మార్పుల తాలూకు విపరిణామాలకు ఈ ఉష్ణ ధోరణులు తాజా నిదర్శనమని వారు చెబుతున్నారు. 20 ఏళ్లు వరుసగా చరిత్రలోనే అత్యంత వేడిమి దశాబ్దాలుగా రికా ర్డులు సృష్టించిన వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అకస్మాత్తుగా వరుణుడు కరుణిస్తే తప్ప వచ్చే మూడు నెలలు ప్రచండమైన ఎండలు తప్పవని సైంటిస్టులు జోస్యం చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై డిస్కౌంట్
హైదరాబాద్: ప్రముఖ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెల్లరీ సంస్థ భీమా జ్యువెల్స్ ‘అద్భుతమైన ఫిబ్రవరి’ ఆఫర్ ప్రకటించింది. బంగారు, వెండి ఆభరణాల తయారీ చార్జీలపై 70% డిస్కౌంట్ అందిస్తుంది. వజ్రాభరణాలపై క్యారెట్‌కు రూ.7,000 తగ్గింపుతో పాటు ప్రతి క్యారెట్‌తో ఒక గ్రాము బంగారు నాణెం ఉచితంగా పొందవచ్చు. ప్రతి వారం నిర్వహించే ‘గ్రాండ్ వీక్లీ లక్కీ డ్రా’ ద్వారా 20 మంది కస్టమర్లు అప్రిలియా స్కూటర్ గెలుచుకోవచ్చు. స్క్రాచ్ అండ్ విన్ క్యాష్ ఆఫర్లో భాగంగా ప్రతి గ్రాముకు రూ.150 వరకు క్యాష్ బ్యాక్ గెలుచుకోవచ్చు. ఇప్పటికే మొదలైన ‘అద్భుతమైన ఆఫర్’ ఫిబ్రవరి 28 వరకు అందుబాటులో ఉంటుందని, కస్టమర్లు సది్వనియోగం చేసుకోవాలని కంపెనీ తెలిపింది. -
ఎఫ్‌పీఐల షాక్
దేశీ స్టాక్ మార్కెట్లో కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాలకే ఆసక్తి చూపుతున్నారు. ఈ నెలలోనూ ఇదే బాటలో కొనసాగుతున్నారు. దీంతో ఫిబ్రవరి 3–21 మధ్య నికరంగా రూ. 23,710 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య ఆందోళనల మధ్య దేశీ స్టాక్స్‌లో విక్రయాలకు తెరతీస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం జనవరిలో ఎఫ్‌పీఐలు దేశీ మార్కెట్ల నుంచి రూ. 78,027 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వెరసి కొత్త కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1,01,737 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మివేశారు. ఫలితంగా ఈ కాలంలో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 4 శాతం నష్టపోయింది. పటిష్ట ఆరి్థక పురోగతి, కార్పొరేట్ ఫలితాలలో వృద్ధి వంటి సానుకూల అంశాలు మాత్రమే తిరిగి ఎఫ్‌పీఐలను ఆకట్టుకోగలవని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్.. పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు. -
Todays History: ఫిబ్రవరి 10న ఏం జరిగింది? 2013 కుంభమేళాతో లింకేంటి?
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్న భారతదేశంలో ఫిబ్రవరి 10కి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజును ప్రజాస్వామ్యంలో పండుగ రోజుగా అభివర్ణిస్తారు. దేశంలోని పౌరులు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేయడం ద్వారా తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అయితే 1952లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికలు పెద్ద సవాలుగా నిలిచాయి.1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూవచ్చారు. 1952 ఫిబ్రవరి 10.. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ముఖ్యమైన రోజుగా మారింది. ఆరోజు నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ లోక్‌సభలోని 489 సీట్లలో 249 సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించింది. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడంలో ఈ ఎన్నికలు విజయబావుటా ఎగురవేశాయి.ఫిబ్రవరి 10న భారత్‌తో పాటు ప్రపంచ చరిత్రలో ప్రముఖంగా నిలిచిన ఘట్టాలను ఒకసారి నెమరువేసుకుందాం.1818: ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో బ్రిటిష్ సైన్యం, మరాఠా సైన్యం మధ్య మూడవ, చివరి యుద్ధం జరిగింది.1921: మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠాన్ని ప్రారంభించారు.1921: బ్రిటిష్ పాలకుడు కన్నాట్ డ్యూక్ ఇండియా గేట్ నిర్మాణానికి పునాది రాయి వేశారు.1952: స్వాతంత్ర్యం తర్వాత జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్కును దాటి, దేశంలో ప్రజాస్వామ్య స్థాపనను ప్రకటించింది.1990: గెలీలియో అంతరిక్ష నౌక బృహస్పతి వైపు వెళుతూ, శుక్ర గ్రహం ముందునుంచి వెళ్లింది.1996: చదరంగం ఒక మైండ్ గేమ్‌గా పేరొందింది. ప్రపంచ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్- డీప్ బ్లూ మధ్య ఫిబ్రవరి 10న ఒక మ్యాచ్ జరిగింది. దీనిలో కాస్పరోవ్ 4-2 తేడాతో గెలిచారు. మరుసటి సంవత్సరం ఈ పోటీలో డీప్ బ్లూ విజయం సాధించించారు.2005: బ్రిటన్ యువరాజు చార్లెస్ తన చిరకాల స్నేహితురాలు కెమిల్లా పార్కర్‌తో వివాహాన్ని ప్రకటించారు.2009: ప్రముఖ శాస్త్రీయ గాయకుడు పండిట్ భీమ్సేన్ జోషికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. 2008 నవంబర్‌లో ఆయనకు భారతరత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు.2010: పాకిస్తాన్‌లోని పెషావర్ సమీపంలోని ఖైబర్ పాస్ ప్రాంతంలో పోలీసు అధికారుల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. దీనిలో 13 మంది పోలీసు అధికారులతో పాటు మొత్తం 17 మంది మృతిచెందారు.2013: అలహాబాద్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 36 మంది మృతిచెందారు. 39 మంది గాయపడ్డారు.ఇది కూడా చదవండి: 11 ఏళ్లలో 86 విదేశీ పర్యటనలు.. ప్రధాని మోదీ ఎప్పుడు ఎక్కడికి వెళ్లారు? -
సామాన్యుడి జేబుకి చిల్లు!: రేపటి నుంచి కొత్త రూల్స్..
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2025-26 బడ్జెట్‌తో అనేక మార్పులు జరగనున్నాయి. అవి మాత్రమే కాకుండా ప్రతి నెలా పలు విభాగాల్లో రూల్స్ మారుతూ ఉంటాయి. గ్యాస్ సిలిండర్ ధరలు, యూపీఐ లావాదేవీలు వంటివాటితో పాటు మారుతి సుజుకి కంపెనీ తన వాహనాల ధరలను కూడా పెంచనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.ఎల్పీజీ సిలిండర్ ధరలుఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీన మారుతూ ఉంటాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ల ధరలను అప్డేట్ చేస్తూ ఉంటాయి. సిలిండర్ ధరలలో జరిగే మార్పులు నేరుగా ప్రజలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి రేపు (శనివారం) సిలిండర్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనే విషయం తెలియాల్సి ఉంది.యూపీఐ లావాదేవీలుఫిబ్రవరి 1వ తేదీన యూపీఐ నిబంధలనలకు సమందించిన కీలక మార్పులు రానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్దిష్ట UPI లావాదేవీలను బ్లాక్ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్క్యులర్ కూడా విడుదలైంది. కాబట్టి కొత్త రూల్స్ రేపటి నుంచే అమలులోకి రానున్నాయి.తాజా ఆదేశాల ప్రకారం ప్రత్యేక అక్షరాలను(స్పెషల్ క్యారెక్టర్లు) కలిగిన యూపీఐ ఐడీ (@, #, $, %, &, మొదలైనవి)ల ద్వారా చేసే లావాదేవీలను కేంద్ర వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికీ యూపీఐ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.కార్ల ధరలుదిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL), తన వాహన ధరలను గణనీయంగా పెంచనుంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ధరలను పెంచనున్నట్లు.. పెరిగిన ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కంపెనీ ఆల్టో కే10, ఎస్ ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా, ఈకో, ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఎక్స్ఎల్6, ఫ్రాంక్స్, ఇన్విక్టో, జిమ్నీ, గ్రాండ్ విటారా మొదలైన కార్ల ధరలను పెంచనుంది.బ్యాంకింగ్ రూల్స్కోటక్ మహీంద్రా బ్యాంక్ తన సాధారణ సర్వీస్.. చార్జీలలో మార్పులు తీసుకురానుంది. ఈ మార్పుల గురించి తన వినియోగదారులకు తెలియజేసింది. కాబట్టి కొత్త నియమాలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇందులో ఉచిత ఏటీఎమ్ లావాదేవీల పరిమితికి తగ్గించడం.. బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన చార్జీలను పెంచడం వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: అయ్య బాబోయ్.. ఇక బంగారం కొనలేం!ఏటీఎఫ్ ధరలుఫిబ్రవరి 1 నుంచి విమాన ఇంధనం, ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరల్లో మార్పు జరిగే అవకాశం ఉంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన విమాన ఇంధన ధరలను సవరిస్తాయి. కాబట్టి, ఫిబ్రవరి 1వ తేదీన ధరలలో మార్పు జరిగితే, అది నేరుగా విమాన ప్రయాణికులపై ప్రభావం చూపుతుంది. -
ఫిబ్రవరిలో అమెరికాకు ప్రధాని మోదీ..!
వాషింగ్టన్:కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోదీ తొలిసారి అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఫిబ్రవరిలో మోదీ అమెరికా వెళ్లే అవకాశాలున్నాయి.ఈ పర్యటనపై ట్రంప్,మోదీ మధ్య ఫోన్లో చర్చ జరిగినట్లు వైట్‌హౌజ్ సోమవారం(జనవరి27) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ, ట్రంప్‌కు ఫోన్ చేసి అభినందించారు.ఈ సందర్భంగా వారిరువురి మధ్య ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే క్వాడ్ సదస్సు కూడా చర్చలో ప్రస్తావనకు వచ్చింది. మిడిల్ ఈస్ట్, యూరప్‌లో ప్రస్తుత పరిస్థితులపైనా ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.కాగా, భారత్ సభ్య దేశంగా ఉన్న బ్రిక్స్ కూటమిలోని దేశాలపై 100 శాతం దిగుమతి సుంకం విధిస్తానని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. దీనికి తోడు ట్రంప్ అనుసరిస్తున్న వలస విధానంపైన భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
వచ్చే నెలలో బ్యాంక్ పని ఉందా? ఫిబ్రవరి సెలవులు ఇవే..
సంవత్సరంలో రెండవ నెల ఫిబ్రవరి (February) అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెలలో 28 రోజులే ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే ఈ 28 రోజుల్లో కూడా బ్యాంకులు పని చేసేది కొన్ని రోజులే. దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరిలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో జాబితాను (Bank Holidays) విడుదల చేసింది.ఫిబ్రవరి నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సినవారు ఈ సెలవుల జాబితాను తప్పక తెలుసుకోవాలి. తద్వారా మీ ప్రాంతంలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో.. ఏయే రోజుల్లో పనిచేస్తాయో తెలుస్తుంది. తదనుగుణంగా బ్యాంకింగ్ పనిని ప్లాన్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.మొత్తం 14 రోజులుఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకులు మొత్తం 14 రోజులు మూసిఉంటాయి. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతోపాటు పండుగలు, పర్వదినాలు, స్థానిక సెలవులు ఇందులో ఉంటాయి. స్థానిక సెలవులు ఆయా రాష్ట్రాల బట్టి ఉంటాయి. ఫిబ్రవరిలో ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయన్నది పూర్తి జాబితా ఇక్కడ ఇస్తున్నాం..ఫిబ్రవరిలో బ్యాంకు సెలవుల జాబితాఫిబ్రవరి 2: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 3: సోమవారం సరస్వతి పూజ సందర్భంగా అగర్తలాలో సెలవుఫిబ్రవరి 8: రెండవ శనివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 9: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 11: మంగళవారం థాయ్ పూసం సందర్భంగా చెన్నైలో హాలిడే.ఫిబ్రవరి 12: బుధవారం శ్రీ రవిదాస్ జయంతి సందర్భంగా సిమ్లాలో సెలవు.ఫిబ్రవరి 16: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 15: శనివారం లుయి-నగై-ని సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు.ఫిబ్రవరి 19: బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బేలాపూర్, ముంబై , నాగ్‌పూర్‌లోని బ్యాంకుల మూతఫిబ్రవరి 20: గురువారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్, ఇటానగర్‌లో హాలిడేఫిబ్రవరి 22: నాల్గవ శనివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 23: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 26: బుధవారం మహా శివరాత్రి కారణంగా అనేక చోట్ల సెలవు.ఫిబ్రవరి 28: శుక్రవారం లోసార్ కారణంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకుల మూత. -
మోదీ, ట్రంప్ భేటీ ఫిబ్రవరిలో?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ఫిబ్రవరిలోనే జరగనుందా? ఈ దిశగా ఇరు దేశాల దౌత్యవేత్తల స్థాయిలో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయా? అవుననే అంటోంది రాయిటర్స్ వార్తా సంస్థ. వారు వాషింగ్టన్లో భేటీ కానున్నారని భారత దౌత్యవర్గాలను ఉటంకిస్తూ కథనం వెలువరించింది. ‘‘ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో మోదీ, ట్రంప్ మధ్య ఉన్న స్నేహబంధం కీలకపాత్ర పోషించనుంది. చైనా దూకుడును అడ్డుకోవడంపై ఈ భేటీలో నేతలిద్దరూ దృష్టి సారించే అవకాశముంది. ఇక భారతీయులను ఆందోళన పరుస్తున్న వలసలపై కఠిన వైఖరి, జన్మతః పౌరసత్వం రద్దు తదితర అంశాలను మోదీ ప్రముఖంగా లేవనెత్తవచ్చు. హెచ్–1బీ వీసాల్లో సింహభాగం భారతీయులే దక్కించుకుంటారన్నది తెలిసిందే. అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలు మరీ ఎక్కువని పదేపదే ఆక్షేపిస్తున్న ట్రంప్ ఈ అంశాన్ని మోదీతో లేవనెత్తవచ్చు. సుంకాలను తగ్గించడంతో పాటు అమెరికా పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా పలు నిర్ణయాలను ఈ భేటీలో ట్రంప్ ముందుంచాలని మోదీ భావిస్తున్నారు’’ అని రాయిటర్స్ పేర్కొంది. భారత్‌కు అతి పెద్ద వర్తక భాగస్వామిగా అమెరికా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2023–24లో 118 బిలియన్ డాలర్ల మేరకు ద్వైపాక్షిక వర్తకం జరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ రోజే ఏకంగా ఐదు సినిమాలు!
'ఫిబ్రవరి అంటే వెంటనే... సినిమా లవర్స్‌కు ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ అయ్యే సినిమాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా ప్రేమ నేపథ్యంలో వచ్చే చిత్రాలను విడుదల చేయడానికి దర్శక–నిర్మాతలు ప్రయత్నిస్తే, ప్రేక్షకులు కూడా లవ్ మూవీస్‌ని ఆశిస్తారు. దానికి తగ్గట్టే ఫిబ్రవరిలో అరడజను ప్రేమకథా చిత్రాలు థియేటర్స్‌లోకి రానున్నాయి. వీటితో పాటు యాక్షన్, ఎమోషనల్ మూవీ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇలా వచ్చే ఫిబ్రవరి నెలలో సినిమాల సందడి మరింత పెరగనుంది. 'రాజుగాడి లవ్‌స్టోరీ..‘లవ్‌స్టోరీ’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి జోడీగా నటించిన సినిమా ‘తండేల్’. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ ఇంటెన్స్ లవ్‌స్టోరీ ఫిల్మ్‌ను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాజు అనే జాలరి పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రకథ విషయానికొస్తే... ఉత్తరాంధ్ర మత్స్యకారులు జీవనో΄ాధి కోసం గుజరాత్‌కు వెళ్తారు. అక్కడి సముద్ర తీరంలో తెలియక ఇండియన్ బోర్డర్ దాటి, పాకిస్తాన్ కోస్టు గార్డులకు బంధీలుగా చిక్కుతారు. వీరందరి జీవితాలు ఏమయ్యాయి? అన్నదే ‘తండేల్’ సినిమా కథ అని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలోని రాజు పాత్ర కోసం నాగచైతన్య, ఉత్తరాంధ్రకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఉత్తరాంధ్ర యాస నేర్చుకున్నారు.సాయిరామ్ శంకర్ 'ఒక పథకం ప్రకారం'..ఇక ‘ఒక పథకం ప్రకారం’ అంటూ ఇదే రోజు థియేటర్స్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు హీరో సాయిరామ్ శంకర్. ‘143, బంపర్ ఆఫర్’ వంటి సినిమాల్లో నటించిన సాయిరామ్ శంకర్ నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఒక పథకం ప్రకారం’. క్రైమ్ మిస్టరీగా రానున్న ఈ మూవీలో సాయిరామ్ శంకర్ అడ్వొకేట్ పాత్రలో, సముద్ర ఖని పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. గార్లపాటి రమేష్‌తో కలిసి ఈ చిత్రదర్శక–నిర్మాత వినోద్ కుమార్ విజయన్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. శ్రుతీ సోధి, ఆషిమా నర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. రాహుల్ రాజ్ సంగీతం అందించిన ఈ సినిమాకు మరో మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ ఆర్ఆర్ అందించారు. ఇక ఈ సినిమాల కంటే ముందు అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘రాచరికం’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. దర్శక–ద్వయం సురేష్ లంకపల్లి, ఈశ్వర్ వాసె దర్శకత్వంలో ఈ మూవీని ఈశ్వర్ నిర్మించగా, ఈ చిత్రం ఫిబ్రవరి 1న రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఇటు ప్రేమ... అటు సంఘర్షణవిశ్వక్ సేన్ హీరోగా నటించిన యూత్ ఫుల్ లవ్‌స్టోరీ మూవీ ‘లైలా’ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోనూగా, అమ్మాయి లైలాగా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న రోల్స్‌లో నటిస్తున్నారు విశ్వక్ సేన్. రామ్ నారాయణ్ డైరెక్షన్లో సాహు గారపాటి ఈ మూవీని నిర్మించారు. ఆకాంక్షా శర్మ హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.కిరణ్ అబ్బవరం దిల్ రూబా..మరోవైపు ఇటీవలే ‘క’తో ఓ మంచి హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం లవర్స్ డే రోజున ‘దిల్ రూబా’ అనే లవ్ అండ్ యాక్షన్ మూవీతో థియేటర్స్‌లోకి వస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా, నాజియా డేవిసన్ మరో కీలక ΄ాత్రలో నటించిన ఈ మూవీకి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అయిన ఓ అబ్బాయి, మరోసారి మరో అమ్మాయితో ప్రేమలో పడితే ఏమైంది? అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కినట్లుగా తెలిసింది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఈ రెండు సిటీ లవ్‌స్టోరీ మూవీస్‌తో పాటు ఓ గ్రామీణ లవ్‌స్టోరీ కూడా ఇదే రోజున థియేటర్స్‌లోకి రానుంది. ‘నీది నాది ఒకే కథ’, ‘విరాట పర్వం’ సినిమాలు తీసిన దర్శకుడు వేణు ఊడుగుల నిర్మాతగా మారి, మరో నిర్మాత రాహుల్ మోపిదేవితో కలిసి ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే తెలంగాణ గ్రామీణ ప్రేమకథ తీశారు. ఖమ్మం– వరంగల్ల సరిహద్దు నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీతో సాయిలు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గత ఏడాది నవంబరులో జరిగిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ గ్లింప్స్ వీడియోలో ఈ మూవీని ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా నటీనటులు సాంకేతిక నిపుణులపై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది. తాతా మనవడు... తండ్రీకొడుకుఈ ప్రేమికుల దినోత్సవం రోజున లవ్‌స్టోరీ మూవీస్ మాత్రమే కాదు.. ఎమోషనల్ చిత్రాలు కూడా థియేటర్స్‌లోకి వస్తున్నాయి. ప్రముఖ సీనియర్ నటుడు బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్, ‘వెన్నెల’ కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన వినోదాత్మక చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నిజ జీవితంలో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ‘బ్రహ్మా ఆనందం’ మూవీలో మాత్రం తాతా మనవళ్లుగా నటించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్, సంపత్, రాజీవ్ కనకాల ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, శాండిల్య పీసపాటి సంగీతం అందిస్తున్నారు. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. కానీ గురువారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి, ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నట్లుగా వెల్లడించారు.ధన్‌రాజ్ 'రామం రాఘవం'నటుడు ధన్‌రాజ్ నటించి, దర్శకత్వం వహించిన ‘రామం రాఘవం’ మూవీ కూడా ఫిబ్రవరి 14నే రిలీజ్ కానుంది. తండ్రి పాత్రలో సముద్రఖని, తనయుడి పాత్రలో ధన్‌రాజ్ కనిపిస్తారు. తండ్రీకొడుకుల ఎమోషన్స్ నేపథ్యంలో సాగే ఈ మూవీని గత ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు. కుదరకపోవడంతో ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. కొడుకు ప్రయోజకుడైతే చూడాలనుకునే తండ్రి, తనను తన తండ్రి సరిగా అర్థం చేసుకోవడం లేదనుకునే ఓ కొడుకు మధ్య సాగే భావోద్వేగ సంఘర్షణల నేపథ్యంలో ఈ ‘రామం రాఘవం’ మూవీ రానుంది.సందీప్ కిషన్ మజాకా..గత ఏడాది ఫిబ్రవరిలో ‘ఊరి పేరు భైరవకోన’ అనే ఓ హారర్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు సందీప్ కిషన్. ఈ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయాలనుకుంటున్నారేమో. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మజాకా’ మూవీతో సందీప్ కిషన్ వస్తున్నారు. సందీప్ కిషన్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా, రావు రమేశ్, ‘మన్మధుడు’ ఫేమ్ నటి అన్షు ప్రధాన ΄ాత్రల్లో నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘మజాకా’. ‘నేను లోకల్, ధమాకా’ చిత్రాల ఫేమ్ నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సందీప్ కిషన్, రావు రమేశ్ తండ్రీ కొడుకులుగా నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేశ్ దండా నిర్మించిన ఈ ‘మజాకా’ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది.శివరాత్రికి నితిన్..శివరాత్రికి ‘తమ్ముడు’గా థియేటర్స్‌లోకి రానున్నారు నితిన్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘తమ్ముడు’ అనే మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు.ఇక సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న మూవీ ‘జటాధర’. శాస్త్రీయ, పౌరాణిక అంశాలతో ఈ మూవీకి వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రేరణా అరోరా, సివిన్ నారం, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ నిర్మిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో ఈ సినిమా ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేశారు. ఆ సమయంలో ‘జటాధర’ మూవీని మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ‘తమ్ముడు, జటాధర’ రిలీజ్ డేట్స్‌పై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది.అలాగే ఫిబ్రవరి 28న థియేటర్స్‌లో ఆది పినిశెట్టి ‘శబ్దం’ చేయనున్నారు. ‘ఈరమ్’ (తెలుగులో ‘వైశాలి’) తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా మూవీ ‘శబ్దం’. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్ల్స్, ఎం.ఎస్. భాస్కర్ ఇతర కీలక ΄ాత్రల్లో ఈ మూవీని 7జీ శివ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఫిబ్రవరి 28న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఫిబ్రవరి నెల ఆరంభానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయ్యేందుకు మరికొన్ని సినిమాలు బరిలోకి రావొచ్చు లేదా ఆల్రెడీ ఫిబ్రవరి రిలీజ్‌కు రెడీ అయిన సినిమాల్లో విడుదల వాయిదా పడే అవకావం లేకపోలేదు. మరి... ఫిబ్రవరిలో ఫైనల్ రిలీజ్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న సినిమాలేవో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. అనువాదాలు రెడీ..అజిత్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘విదాముయర్చి’. తెలుగులో ‘పట్టుదల’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, మరో కీలక పాత్రలో అర్జున్ నటించారు. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ్ర΄÷డక్షన్స్ నిర్మించిన ఈ యాక్షన్ చిత్రం ఫిబ్రవరి 6న రిలీజ్ కానుంది.ఇక అనిఖా సురేంద్రన్, పవిష్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ రొమాంటిక్ అండ్ లవ్ ఎంటర్టైనర్ మూవీ ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని, ఫిబ్రవరిలోనే రిలీజ్ ఉండొచ్చనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.2022లో విడుదలైన ‘లవ్ టుడే’ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ హీరో ప్రదీప్ రంగనాథన్ తెలుగు ప్రేక్షకులకు నటుడిగా దగ్గరయ్యారు. ఈ కుర్ర హీరోగా నటించిన తమిళ చిత్రం ‘డ్రాగన్’ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. తమిళంలో లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా, కేఎస్ రవికుమార్, మిస్కిన్, వి.జె. సిద్ధు, హర్షద్ ఖాన్లు ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. తెలుగులోనూ ఈ మూవీని ఫిబ్రవరిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు.– ముసిమి శివాంజనేయులు -
ప్రత్యేక ఫిబ్రవరి.. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా!
ఈ ఏడాది ఫిబ్రవరికో ప్రత్యేకత ఉంది. 2025 ఫిబ్రవరి (February) నెలలో వారంలో ఏడు రోజులూ ఒక్కోటి నాలుగేసిసార్లు రానున్నాయి. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా వస్తుందని గణిత శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రతి 176 సంవత్సరాలకోసారి ఫిబ్రవరిలో సోమ, శుక్ర, శనివారాలు మూడేసి రోజులు మాత్రమే వస్తాయని తెనాలి (Teanali) డిగ్రీ కాలేజి అధ్యాపకుడు ఎస్వీ శర్మ చెప్పారు. – తెనాలిమేక బండి.. ట్రెండ్ సెట్ చేసిందండీ! ఇప్పటి వరకూ మనం ఎండ్ల బండి, గుర్రం బండి చూశాం. కానీ, కోనసీమ జిల్లా మలికిపురం (Malikipuram) మండలం కేశనపల్లిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఆవుల పాల ఉత్పత్తి, ఎండ్ల అందాల పోటీల్లో శనివారం మేక బండి అందరినీ ఆకర్షించింది. అంబాజీపేటకు చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్ ట్రెండ్ సెట్ చేద్దామని ఎంతో శ్రమించి, రూ.7 వేలు వెచ్చించి ఈ బండిని రూపొందించారు. – మలికిపురంశునక వానర స్నేహం అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో శునక వానర స్నేహం ఐదేళ్లుగా జాతి వైరాన్ని మరచి వర్ధిల్లుతోంది. ఐదేళ్ల క్రితం ఒక కొండముచ్చుల గుంపు ఈ ప్రాంతానికి వచ్చింది. ఇక్కడ శునకాలతో అలవాటు పడిన ఓ కొండముచ్చు తన గుంపును వదిలేసింది. గ్రామంలోని శునకాల గుంపుతోనే ఉంటోంది. – మలికిపురం'చుక్కలు' కాదు.. సమర సన్నాహాలుసముద్రం ఒడ్డున అంత జనం నిలబడి ఆకాశంలోని తారలను ఆసక్తిగా తిలకిస్తున్నట్టుగా ఉంది కదా ఈ చిత్రం. నిజానికి అవి నక్షత్రాలు కావు. యుద్ధ విమానాలు. విశాఖపట్నం (Visakhapatnam) ఆర్కే బీచ్‌లో శనివారం నావికాదళం అద్భుత విన్యాసాలు ప్రదర్శించింది. వీటిని ప్రత్యక్షంగా చూసేందుకు విశాఖ నగర వాసులు భారీగా బీచ్‌కు తరలివచ్చారు. దీంతో సముద్రతీరం జనసంద్రాన్ని తలపించింది. సాగర తీరంలో నేవీ విన్యాసాలను చూసి వైజాగ్ వాసులు అచ్చెరువొందారు. చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు -
కియా కొత్త ఎస్యూవీ సిరోస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా సరికొత్త సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సిరోస్‌ను భారత్ వేదికగా అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. 2025 జనవరి 3 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి డెలివరీలు మొదలవుతాయి. ధర ఎక్స్‌షోరూంలో రూ.10–15 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. 118 బీహెచ్పీ, 172 ఎన్ఎం టార్క్‌తో పెట్రోల్ వేరియంట్ 1.0 లీటర్ త్రీ–సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో తయారైంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు. లెవెల్–2 అడాస్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు జోడించారు. 30 అంగుళాల పనోరమిక్ డ్యూయల్ స్క్రీన్ సెటప్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి హంగులు జోడించారు. -
బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఫిబ్రవరిలో
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఫిబ్రవరిలో జరుగుతుందని పార్టీలోని విశ్వసనీవర్గాలు వెల్లడించాయి. జేపీ నడ్డా నుంచి కొత్త అధ్యక్షుడు ఫిబ్రవరిలో పగ్గాలు చేపడతారని వెల్లడించాయి. సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు జనవరి మధ్యకల్లా పూర్తవుతాయని, తదుపరి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉటుందని వివరించాయి. 60 శాతం రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల పదవీకాలం ముగిసిందని, వీరి స్థానాల్లో .జనవరి మధ్యకల్లా కొత్త అధ్యక్షులు ఎన్నికవుతారని తెలిపాయి. కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే.. సగం రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తికావాలని బీజేపీ నిబంధనావళి చెబుతోంది. మంత్రివర్గంలో నుంచి ఒకరిని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా అని ప్రశ్నించగా.. మంత్రి కావొచ్చు లేదా పార్టీలో ఒకరు కావొచ్చు.. అని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. కొత్త అధ్యక్షుడెవరనే విషయంలో ఇంకా ఏదీ ఖరారు కాలేదని వివరించాయి. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా 2020 ఫిబ్రవరిలో పార్టీ పగ్గాలు చేపట్టారు. సాధారణంగా అధ్యక్షుడికి మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. అయితే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా నడ్డాకు పొడిగింపునిచ్చిన విషయం తెలిసిందే. -
సునీత రాక ఫిబ్రవరిలోనే!
కేప్‌కనావెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి రావడానికి బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్యూల్ సురక్షితం కాదని నాసా తేల్చిచెప్పింది. వారిని అందులో వెనక్కు తీసుకురావడం అత్యంత ప్రమాదకరమని శనివారం పేర్కొంది. ఆ రిస్క్ తీసుకోరాదని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్ మస్‌్కకు చెందిన స్పేస్ ఎక్స్ షటిల్ డ్రాగన్ క్యాప్సూల్‌లో వారిని తీసుకురావాలని నిర్ణయించింది.పలు వైఫల్యాల తర్వాత బోయింగ్ స్టార్‌లైనర్ గత జూన్‌లో సునీత, విల్మోర్లను అంతరిక్ష కేంద్రానికి చేర్చడం తెలిసిందే. థ్రస్టర్లు మొరాయించడం, హీలియం లీకేజీ తదితర సమస్యల నడుమ అతికష్టమ్మీద∙స్టార్‌లైనర్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. వారం కోసమని వెళ్లిన సునీత, విల్మోర్ అక్కడే చిక్కుకుపోయారు. ఫిబ్రవరిలో తిరుగు ప్రమాణమంటే ఎనిమిది నెలలకు పైగా ఐఎస్ఎస్లోనే గడపనున్నారు. స్టార్‌లైనర్‌కు మరమ్మతులు చేయడానికి బోయింగ్ ఇంజనీర్లతో కలిసి నాసా తీవ్రంగా శ్రమించింది. మూడునెలల ప్రయత్నాల అనంతరం.. మానవసహిత తిరుగు ప్రమాణానికి స్టార్‌లైనర్ సురక్షితం కాదని తేల్చేసింది. అది ఒకటి, రెండు వారాల్లో ఐఎస్ఎస్ నుంచి విడివడి ఆటోపైలెట్ మోడ్‌లో ఖాళీగా భూమికి తిరిగి రానుంది. తమ విమానాల భద్రతపై ఇప్పటికే ఇబ్బందులను ఎదుర్కొంటున్న బోయింగ్‌కు స్టార్‌లైనర్ వైఫల్యం గట్టి ఎదురుదెబ్బే.స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలోనే ఉంది. మార్చి నుంచి ఐఎస్ఎస్లో ఉన్న నలుగురు వ్యోమగాములను తీసుకుని సెపె్టంబరు నెలాఖరులో భూమికి తిరిగివస్తుంది. అత్యవసరమైతే తప్ప అందులో మరో ఇద్దరిని ఇరికించడం సురక్షితం కాదని నాసా తెలిపింది. రష్యాకు చెందిన సోయుజ్ క్యాప్సూల్ కూడా ఐఎస్ఎస్లోనే ఉన్నా అందులోనూ ముగ్గురికే చోటుంది. ఏడాదిగా ఐఎస్ఎస్లో ఉన్న ఇద్దరు రష్యా వ్యోమగాములు అందులో తిరిగొస్తారు. డ్రాగన్ సెపె్టంబరులో ఇద్దరు వ్యోమగాములతో ఐఎస్ఎఐస్కు వెళ్తుంది. తిరుగు ప్రమాణంలో సునీత, విల్మోర్లను కూడా తీసుకొస్తుంది. -
ఎగుమతులు రికార్డ్
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులు ఫిబ్రవరిలో రికార్డు సృష్టించాయి. 11 నెలల గరిష్ట స్థాయిలో 41.40 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2023 ఏప్రిల్‌తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో ఎగుమతుల వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. ఇంజనీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్, ఫార్మా ఎగుమతులు పెరగడం మొత్తం సానుకూల గణాంకాలకు దారితీసింది. ఇక ఇదే కాలంలో దిగుమతులు 12.16 శాతం పెరిగి 60.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 18.70 బిలియన్ డాలర్లు. ► పసిడి దిగుమతులు ఫిబ్రవరిలో గణనీయంగా 133.82% పెరిగి, 6.15 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో 39% పెరిగి 44 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు ఫిబ్రవరిలో 15.9 శాతం పెరిగి 9.94 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు 55 శాతం ఎగసి 3 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకూ ఎగుమతుల (వస్తువులు, సేవలు) విలువ 0.83 శాతం వృద్ధితో 709.81 బిలియన్ డాలర్లు. ఇదే కాలంలో దిగుమతుల విలువ 782.05 బిలియన్ డాలర్లు. ► 2021–22లో ఎగుమతుల విలువ 422 బిలియన్ డాలర్లయితే, దిగుమతుల విలువ 613 బిలియన్ డాలర్లు. 2022–23లో వస్తు ఎగుమతులు 450 బిలియన్ డాలర్లు. దిగుమతులు 714 బిలియన్ డాలర్లు. -
ఈక్విటీ ఎంఎఫ్లకు ఫిబ్రవరిలో రూ.26,866 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్)లోకి ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.26,866 కోట్ల పెట్టుబడులు వచ్చాయని భారత మ్యూచువల్ ఫండ్ల సంఘం (యాంఫీ) గణాంకాలు వెల్లడించాయి. ఒక నెలలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం గడిచిన 23 ఏళ్లలో గరిష్టం. ఈ జనవరిలో వెల్లువెత్తిన రూ.21,721 కోట్లతో పోలిస్తే కూడా 23% అధికం. కొత్త ఫండ్ల ఆవిష్కరణ, థీమాటిక్/సెక్టోరియల్ ఫండ్లపై ఆసక్తి ఇందుకు ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) పథకాల్లోకి కూడా ఫిబ్రవరి జీవితకాల గరిష్టం రూ.19,186 కోట్లకు చేరాయి. జనవరి ఇవి రూ.18,838 కోట్లుగా ఉన్నాయి. -
టాప్‌గేర్‌లో వాహనాల స్పీడు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి ఈ ఏడాది ఫిబ్రవరిలో 20,29,541 యూనిట్ల వాహనాలు రోడ్డెక్కాయి. 2023 ఫిబ్రవరిలో ఈ సంఖ్య 17,94,866 యూనిట్లు నమోదైంది. రిటైల్ విక్రయాలు గత నెలలో 13 శాతం పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) గురువారం తెలిపింది. ‘భారత్‌లో ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు రిటైల్‌లో 12 శాతం దూసుకెళ్లి 3,30,107 యూనిట్లు నమోదైంది. ద్విచక్ర వాహనాలు 13 శాతం ఎగసి 14,39,523 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 5 శాతం అధికమై 88,367 యూనిట్లు, త్రీవీలర్లు ఏకంగా 24 శాతం పెరిగి 94,918 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్ల విక్రయాలు 11 శాతం ఎగసి 76,626 యూనిట్లుగా ఉంది. ప్యాసింజర్ వాహనాలు 2024 ఫిబ్రవరి నెలలో గరిష్ట విక్రయాలను నమోదు చేశాయి’ అని ఎఫ్ఏడీఏ వివరించింది. ‘కొత్త ఉత్పత్తుల వ్యూహాత్మక పరిచయం, మెరుగైన వాహన లభ్యత ప్యాసింజర్ వాహనాల అమ్మకాల జోరుకు కారణమైంది. టూవీలర్ల విషయంలో గ్రామీణ మార్కెట్లు, ప్రీమియం మోడళ్లకు డిమాండ్, విస్తృత ఉత్పత్తి లభ్యత, వెల్లువెత్తిన ఆఫర్లు వృద్ధిని నడిపించాయి. -
తయారీ చక్రం స్పీడ్
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం ఫిబ్రవరిలో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 56.9కి ఎగసింది. ఇది ఐదు నెలలు గరిష్ట స్థాయి. జనవరిలో సూచీ 56.5గా నమోదయ్యింది. సమీక్షా నెల్లో సూచీకి దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ సహకారం లభించినట్లు ఈ మేరకు వెలువడిన ఒక నెలవారీ సర్వే పేర్కొంది. కాగా, ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ద్రవ్యోల్బణం 2023 జూలై కనిష్ట స్థాయికి తగ్గడంతో తయారీ సంస్థల మార్జిన్లు మెరుగుపడినట్లు సర్వే పేర్కొనడం గమనార్హం. దాదాపు 400 మంది తయారీదారుల ప్యానెల్లో కొనుగోలు చేసే మేనేజర్లకు పంపిన ప్రశ్నలు, ప్రతిస్పందనలను ఎస్అండ్పీ గ్లోబల్ మదింపుచేసే హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పీఎంఐని ఆవిష్కరిస్తుంది. -
ఫిబ్రవరిలోనూ ‘రయ్ రయ్’
ముంబై: స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)కు ఆదరణ పెరగడంతో ఫిబ్రవరిలోనూ రికార్డు స్థాయిలో వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రాఅండ్‌మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్ కంపెనీల అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. మొత్తం 3.73 లక్షల ప్యాసింజర్ వాహన(పీవీ) విక్రయాలు జరిగాయి. తద్వారా పరిశ్రమ చరిత్రలో అత్యధిక పీవీలు అమ్ముడైన మూడో నెలగా ఫిబ్రవరి ఆవిర్భవించింది. ద్విచక్ర వాహనాలకూ డిమాండ్ కొనసాగింది. కాగా ట్రాక్టర్స్ అమ్మకాల వృద్ధిలో క్షీణత జరిగింది. -
ఫిబ్రవరి 29.. ప్రాధాన్యతలివే!
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 29 సంవత్సరంలో 60వ రోజు. సంవత్సరాంతానికి ఇంకా 305 రోజులు మిగిలి ఉన్నాయి. ఫిబ్రవరి 29వ తేదీన దేశ, ప్రపంచ చరిత్రలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు నమోదయ్యాయి. ఫిబ్రవరి 29న పుట్టిన వారు ప్రతి సంవత్సరం తమ పుట్టినరోజును జరుపుకోలేరు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే తమ పుట్టినరోజును జరుపుకోగలుగుతారు. ఫిబ్రవరిలో 29 రోజులు ఉండే సంవత్సరాన్ని లీపు సంవత్సరం అని అంటారు. ఈ రోజు (ఫిబ్రవరి 29) భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ జన్మించారు. ఇలా ఫిబ్రవరి 29న చోటు చేసుకున్న ప్రముఖ ఘట్టాలను ఒకసారి చూద్దాం. ఫిబ్రవరి 29.. కొన్ని ముఖ్యమైన ఘటనలు 1504: క్రిస్టోఫర్ కొలంబస్ తన పశ్చిమ యాత్రలో జమైకాలో చిక్కుకుపోయాడు. స్థానికులను చంద్రగ్రహణం పేరుతో భయపెట్టి, తన బృందానికి ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. 1796: బ్రిటన్‌తో పాత వివాదాలకు స్వస్తి పలికిన జే ఒప్పందాన్ని నాటి అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. 1856: రష్యా- టర్కియే మధ్య యుద్ధ విరమణ ప్రకటన 2000 - రష్యన్ దళాలు చెచ్న్యాలో 99 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి. రువాండా ప్రధాని పియర్ సెలెస్టిన్ రివిగేమా తన పదవికి రాజీనామా చేశారు. 2004 - ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యాత్రికుడు మిచెల్ అలెగ్జాండర్ కల్లెరి అంతరిక్షంలో కాలు మోపారు. అయితే అతని స్పేస్ సూట్లోని లోపం కారణంగా స్టేషన్‌కి తిరిగి వచ్చాడు. 2004: ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్’ చలనచిత్రం అకాడమీ అవార్డ్స్‌లో 11 అవార్డులను గెలుచుకుంది. ఇది మునుపటి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. 2008 - ప్రసిద్ధ సాహిత్యవేత్త డాక్టర్ బచ్చన్ సింగ్‌కు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2008 - భారత సంతతికి చెందిన రిచా గంగోపాధ్యాయ 26వ అందాల పోటీలో మిస్ ఇండియా యూఎస్ఏ-2007 టైటిల్‌ను గెలుచుకుంది. ఫిబ్రవరి 29న పుట్టిన ప్రముఖులు 1932 – సిఎస్ శేషాద్రి (భారతదేశ ప్రముఖ గణిత శాస్త్రవేత్త) 1904 - రుక్మిణీ దేవి అరుండేల్ (ప్రముఖ భరతనాట్య నర్తకి) 1812 - టాస్మానియా నాయకుడు విల్సన్ కన్నుమూత. 1896 - మొరార్జీ దేశాయ్ (భారతదేశ మొదటి కాంగ్రెసేతర ప్రధాని) ఫిబ్రవరి 29న కన్నుమూసినవారు 1880 - సర్ జేమ్స్ విల్సన్ (టాస్మానియన్ రాజకీయ నేత) 1952 – కుష్వాహా కాంత్ (భారతదేశ ప్రసిద్ధ నవలా రచయిత) ఫిబ్రవరి 29 ముఖ్యమైన సందర్భాలు జాతీయ డీ అడిక్షన్ డే (మొరార్జీ దేశాయ్ పుట్టినరోజు) -
లీప్ ఇయర్ అంటే? ఫిబ్రవరిలో 29 రోజులు లేకపోతే? ఇంట్రస్టింగ్ సంగతులు
Leap year 2024: భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుందని అందరికీ తెలుసు. నిజానికి భూమి సూర్యుని చుట్టూ తన కక్ష్యను పూర్తి చేయడానికి 365 రోజులు, ఐదు గంటలు, నలభై ఎనిమిది నిమిషాలు,నలభై ఆరు సెకన్లు పడుతుంది. కాబట్టి, దాదాపు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అదనంగా ఒక రోజు వస్తుంది. అలా 366 రోజులు ఉండే సంవత్సరాన్నే లీప్ ఇయర్ అంటాం. అలా 2024 ఏడాదికి 366 రోజులుంటాయి. లీప్ ఇయర్ ఎందుకు వస్తుంది? ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం వస్తుంది అనుకున్నాం కదా! లీప్ సంవత్సరాన్ని నాలుగుతో భాగిస్తే శేషం ఖచ్చితంగా సున్నా వస్తుంది. కానీ 100తో కూడా భాగింపబడితే మాత్రం అది లీప్ సంవత్సరం కాదు. ప్రతీ ఏడాదిలా కాకుండా లీప్ ఫిబ్రవరి నెలలో 29 రోజులుంటాయి నాలుగేళ్లకొకసారి లీప్ డే ఉంటుందా? ఇంట్రస్టింగ్ లెక్కలు అయితే, ప్రతి నాలుగు సంవత్సరాలకు లీప్ డే జోడించడదనీ, క్యాలెండర్‌ను 44 నిమిషాలు పొడిగింపు మాత్రమే ఉంటుందని వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం నిపుణులు అంటున్నారు. కాలక్రమేణా, అంటే వేసవి నవంబర్‌లో వస్తుందని బర్మింగ్‌హామ్‌లోని అలబామా విశ్వవిద్యాలయ ఫిజిక్స్ బోధకుడు యూనాస్ ఖాన్ అన్నారు. ఈ క్రమంలోనే దాదాపు నాలుగేళ్లకొకసారి లీప్ ఇయర్ వస్తుందనీ, 1700, 1800, 1900 సంవత్సరాల్లో లీప్ డే లేదని తెలిపారు. 2000 సంవత్సరంలో ఒక లీప్ డే ఉంది, ఎందుకంటే ఇది 100, 400 రెండింటితో భాగించబడే సంవత్సరం. అలాగే తరువాతి 500 సంవత్సరాలలో 2100, 2200, 2300 , 2500లో కూడా లీప్ డే ఉండదు. మళ్లీ 2028, 2032, 2036లో లీప్ డేస్ ఉంటాయి. లీప్ డే ఆలోచన కాలక్రమేణా క్యాలెండర్ మార్పు అభివృద్ధి చెందిందని నిపుణులు అంటున్నారు. లీప్ డే కలపపోతే ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు ఒక రోజు, అంటే 24 గంటల సమయం పడుతుంది. అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాలు పడుతుంది. అంటే పావు రోజు సమయం కిందకి వస్తుంది. పావు రోజుని కలపడం కుదరదు కనుక నాలుగేళ్ల పాటు నాలుగు పావు రోజులు కలిపితే ఒక రోజు అవుతుంది. ఫిబ్రవరిలో తక్కువ రోజులు ఉండటంతో అదనంగా వచ్చిన ఒక రోజుని ఫిబ్రవరిలో నెలలో పెట్టారు. ఈ లీప్ డే లేకపోతే, రైతులు సరైన సీజన్లో నాటడానికి ఇబ్బంది పడవచ్చంటారు ఖాన్. అంతేకాదు క్రిస్మస్ వేసవిలో వస్తుంది. అప్పుడు స్నో ఉండదూ.. క్రిస్మస్ ఫీలింగూ ఉండదు అంటారాయన. నాసా ప్రకారం ప్రతి క్యాలెండర్ సంవత్సరం 365 రోజుల కంటే దాదాపు ఆరు గంటలు ఎక్కువ. ఈ నేపథ్యంలో నాలుగేళ్లకొకసారి ఈ అదనపు రోజు కలపకపోతే రుతువుల్లో మార్పులొస్తాయని నాసా చెబుతోంది. వేసవి కాలం మధ్యలో శీతాకాలం వచ్చే అవకాశం ఉంటుంది. నాలుగేళ్లకి ఒకసారి ఫిబ్రవరిలో 29 రోజులు వచ్చే విధంగా గ్రెగెరియన్ క్యాలెండర్‌ను రూపొందించారు. ఇది కూడా లెక్కల ఆధారంగా ఉంటుంది. ఈక్వినాక్స్ అయనాంతం వంటి వార్షిక సంఘటనలకు నెలలు కనెక్ట్ అయ్యేలా చూసుకోవడానికి ఈ అదనపు రోజు ఉపయోగిస్తారని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ తెలిపింది. -
Valentine's Day: ప్రేమిస్తే టీసీ ఇచ్చి పంపించారు..
ప్రేమ..అదో మధురానుభూతి. ఈ భావాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ప్రతి ఒక్కరికీ ఎప్పుడో.. అప్పుడు ఎవరిపైనో మనసులాగేసే ఉంటుంది. ఆ సందర్భంలో మనసులోని వింత అనుభావాలను ఆస్వాధించే ఉంటారు.. ‘ప్రేమించడం కన్నా.. ప్రేమించబడడం అదృష్టం’ అన్నాడో సినీ కవి. అలా దాన్ని చివరి వరకు నిలుపుకుని భాగస్వామి సంతోషమే తమ సంతోషంగా భావిస్తూ కొన్ని జంటలు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్నాయి. ప్రేమ..పెళ్లి పీటల వరకు చేరే క్రమంలో ఎన్నో అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా ఒక్కటయ్యారు. ప్రేమలో గెలిచి దంపతులుగా అన్యోన్య జీవనం గడుపుతున్న కొన్ని జంటల జీవితాలను ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ పాఠకుల ముందు ఆవిష్కరిస్తోంది. ప్రియురాలిని ప్రయోజకురాలిగా చేసి.. ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలం కప్రాయపల్లికి చెందిన దేవరపల్లి ప్రవీణ్‌రెడ్డి మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడేనికి చెందిన బంధువుల అమ్మాయి భవానిరెడ్డితో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్తా ఇద్దరిలో ప్రేమను చిగురింపజేసింది. అయితే, నిరుపేద కుటుంబానికి చెందిన భవానీరెడ్డి డిగ్రీ మధ్యలో చదువు మానేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న ప్రవీణ్‌రెడ్డి ప్రియురాలిని పీజీ వరకు చదివించాడు. ఆ వెంటనే ఆమెకు వీఆర్వో ఉద్యోగం వచ్చింది. అయినా.. ఆమెను ప్రోత్సహించడంతో 2019లో ఎస్ఐ ఉద్యోగం సాధించింది. ఆ తర్వాత 2021లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో భవానీరెడ్డి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రవీణ్‌రెడ్డి కూడా హైదరాబాద్‌లో ఎల్ఎల్బీ ప్రాక్టీస్ చేస్తున్నారు. తొమ్మిది నెలల బాబుతో సంతోషంగా జీవిస్తున్నారు. అడ్డంకులను అధిగమించి.. మోత్కూరు : వారిద్దరి మనసులు కలిశాయి. కులా లు అడ్డుగోడలుగా నిలిచినా ప్రేమ వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు.. మోత్కూరుకు చెందిన ఎడ్ల శ్రీకాంత్, సముద్రాల సింధూజ దంపతులు. మోత్కూరులో ఫొటోగ్రాఫర్ వృత్తి నేర్చుకుంటున్న శ్రీకాంత్‌కు పట్టణంలోని సముద్రాల వెంకన్న కూతురు సంధ్యతో పదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా కాలక్రమంలో ప్రేమగా మారింది. విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలియడంతో అడ్డంకులు సృష్టించారు. సంధ్యను హైదరాబాద్‌లో బీటెక్ చదివిస్తూ అక్కడే సోదరుడి వద్ద ఉంచారు. శ్రీకాంత్ రెండేళ్ల ఎడబాటు తర్వాత సంధ్యను కలుసుకోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2018వ సంవత్సరం ఫిబ్రవరి 15న యాదగిరిగుట్టలో సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వ్యతిరేకించి సంధ్య తల్లిదండ్రులు శ్రీకాంత్‌పై కేసు పెట్టినా కోర్టు ప్రేమజంటకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఈ దంపతులు మోత్కూరులో ఫొటో స్టూడియో, ఇంటర్నెట్ సెంటర్ నడుపుకుంటూ తమ ఆరేళ్ల కుమారుడు రెహాన్‡్ష, నాలుగేళ్ల కూతురు శ్రీహన్షతో ఆనందంగా జీవిస్తున్నారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు రామగిరి (నల్లగొండ): మిర్యాలగూడకు చెందిన తుమ్ములూరి మురళీధర్ రెడ్డి హాలియాకు చెందిన పుష్పలత ఇద్దరు బంధువులు. అయినా మొదట్లో వీరికి పరిచయం లేదు. బంధువుల వివాహంలో పుష్పలత తొలిసారిగా మురళీధర్ రెడ్డిని చూసింది. ఆ తర్వాత మురళీధర్ రెడ్డి అడ్రస్ తెలుసుకొని ఉత్తరాలే రాసేది. అవి చూసి తను తెలిసీతెలియక రాస్తుందేమో అనుకునేవాడు. అలా చాలా సార్లు లెటర్లు రాసూ్తనే ఉండేది. అప్పుడు మురళీధర్‌రెడ్డికి అనిపించింది..ఆమె నన్ను నిజంగా ప్రేమిస్తుందని. అప్పటికీ వారి చదువు పూర్తి కాలేదు. ఇంట్లో వాళ్లకు విషయం తెలిసింది. కానీ వారు ఒప్పుకోలేదు. ఆ తర్వాత వారిని ఒప్పించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మురళీధర్ రెడ్డి నల్లగొండలో కంప్యూటర్ హార్డ్‌వేర్‌గా స్థిరపడగా, పుష్పలత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమారులు. అశుతోష్ రెడ్డి ఎంఎస్ పూర్తి చేసి అమెరికాలో స్థిరపడగా, అమిత్ రెడ్డి డిఫెన్స్ అకాడమీలో పైలెట్‌గా పనిచేస్తున్నాడు. ప్రేమిస్తే టీసీ ఇచ్చి పంపించారు.. భూదాన్‌పోచంపల్లి : తెలిసీ తెలియని వయస్సులో మైనర్‌ను ప్రేమించాడు. బాలికకు సైతం అతనంటే ఇష్టమే. కానీ తల్లిదండ్రులకు విషయం తెలిస్తే ఏమి అవుతుందోనని భయం. చివరకు ఈ విషయం తెలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్బాయికి టీసీ ఇచ్చి పంపించారు. అయినా పట్టువిడవకుండా అమ్మా యి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లిచేసుకోవడానికి నాలుగేళ్లు పట్టింది. చివరకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని 38 ఏళ్లుగా అన్యోన్య జీవనం సాగిస్తున్న భూదాన్ పోచంపల్లి జెడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి ప్రేమపెళ్లి గా«థ ఇది. భూదాన్‌పోచంపల్లి మండలం కనుముకుల గ్రామానికి చెందిన కోట మల్లారెడ్డి పోచంపల్లి జెడ్పీ హైసూ్కల్లో 9వ తరగతి చదువుతుండగా ఇదే స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సామల పుష్పలతను ప్రేమించాడు. ఈ విషయం పుష్పలత తల్లిదండ్రులు, ఇటు స్కూల్లో ఉపాధ్యాయులకు తెలిసి రచ్చ అయ్యింది. దాంతో మల్లారెడ్డికి ప్రధానోపాధ్యాయుడు టీసీ ఇచ్చి పంపించారు. పెళ్లి చేసుకోవడానికి ఆస్తులు, అంతస్తులు అడ్డు వచ్చి పుష్పలత తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. ఇంటర్ పూర్తి చేసిన నాలుగేళ్ల తర్వాత అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించి 1989 మే 10న పెళ్లి చేసుకొన్నాడు. ప్రస్తుతం వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పుష్పలత ప్రస్తుతం పోచంపల్లి మండల జెడ్పీటీసీగా ఉన్నారు. కాగా కోట మల్లారెడ్డి ప్రతి ఏటా ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున తన సతీమణికి గిఫ్ట్ ఇస్తూ ప్రేమను చాటుతున్నారు. ఒకే ఇంట్లో మూడు ప్రేమ వివాహాలు కోదాడ: తల్లిదండ్రులు కులాలకు అతీతంగా ప్రేమ వివాహం చేసుకోగా.. వారి బాటలోనే వారి ఇద్దరు కుమారులు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోదాడ మండల పరిధిలోని కొమరబండకు చెందిన దివ్యాంగుడు కందుల పాపయ్య అదే గ్రామానికి చెందిన వెంకట్రావమ్మను 1980వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి పెద్ద కుమారుడు కందుల మధు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతూ తన క్లాస్మేట్ విజయలక్షి్మని 2010లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. పాపయ్య చిన్న కుమారుడు కందుల విక్రమ్ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ 2014లో తన తోటి ఉద్యోగి ఉషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇలా ఒకే ఇంట్లో ముగ్గురు ప్రేమ వివాహాలు చేసుకొని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఖండాలు దాటి.. ఇంగ్లండ్‌లో చిగురించిన ప్రేమ కోదాడ: ఇండియాలో పుట్టిన వారు ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లారు. అక్కడి యూనివర్సిటీలో కలిసిన మనస్సులు కులమతాలకు అతీతంగా వారిని ఒకటి చేశాయి. ఒకరి అభిప్రాయాలు మరొకరి నచ్చడంతో వారిమధ్య చిగురించిన ప్రేమ పెళ్లిపీటల వరకు తీసుకెళ్లింది. ప్రస్తుతం వారు ఇద్దరు పిల్లలతో అక్కడే నివాసముంటున్నారు. ప్రేమించడం కన్నా ఆ ప్రేమను నిలుపుకోవడం ముఖ్యమంటున్నారు లంకెల బాలకృష్ణారెడ్డి– నీనశ్రీ దంపతులు. కోదాడకు చెందిన లంకెల బాలకృష్ణారెడ్డి 2007లో ఎంఎస్ చదవడానికి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్‌కు వెళ్లాడు. ఎంఎస్ కోసం అదే యూనివర్సిటీలో హైదరాబాద్‌కు చెందిన నీనశ్రీ కూడా చేరారు. ఇద్దరు కులాలు వేరైనా అభిప్రాయాలు కలవడంతో వారి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. ఇండియాలో ఉన్న పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. ఇద్దరు ఇంగ్లండ్ వారసత్వాన్ని పొందారు. ప్రేమికుల రోజు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమించడం.. ప్రేమించబడడం అదృష్టమని దాన్ని చివరి వరకు నిలుపుకొని భాగస్వామి సంతోషాన్నే తమ సంతోషంగా ఇరువురు భావించినపుడే అ బంధం పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని చెప్పారు. తొలి పరిచయంలోనే ఇష్టపడి.. హుజూర్నగర్ : రెండు భిన్న కులాలకు చెందిన యువతీ, యువకుడి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు వివాహానికి అంగీకరించక పోడంతో రాజకీయ నాయకుల సహాయంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం వర్ధాపురం గ్రామానికి చెందిన బచ్చలకూరి బాబు, శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ప్రవీణ 26 ఏళ్ల క్రితం హుజూర్‌నగర్‌లో తొలి పరిచయంలోనే ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు వివాహానికి అంగీకరించలేదు. దీంతో స్థానిక సీపీఐ నాయకుడు కేవీరాజు సహాయ సహకరాంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. పెద్దమ్మాయి అఖిల అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసింది. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికై ఇటీవల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంది. కాగా చిన్న కూతురు అచ్యుత బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. ప్రస్తుతం వారి కుటుంబం హుజూర్‌నగర్‌లో నివాసం ఉంటోంది. -
వాలెంటైన్స్ డే వేళ... కొన్ని సరదా సంగతులు!
ఫిబ్రవరి 14... వాలెంటైన్స్ డే.. అంటే ప్రేమికుల రోజు. ఆ రోజున ప్రేమికులంతా ఆనంద డోలికల్లో మునిగితేలుతుంటారు. ప్రేమ ఊసులు చెప్పుకుంటారు. అయితే వాలెంటైన్స్ డేకు సంబంధించిన కొన్ని ఆసక్తికర సంగతులు చాలామందికి తెలియవు. వాటిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం. మొదటి వాలెంటైన్ డే వేడుక 15వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో జరిగింది. మొదటి అధికారిక వాలెంటైన్స్ డే పారిస్‌లో జరిగిందని చెబుతారు. ఫిబ్రవరినాటి మధ్యస్థ రోజుల్లో పక్షుల సంభోగంలో పాల్గొంటాయట. అందుకే ఇది శృంగారాన్ని జరుపుకోవడానికి తగిన సమయమని అంటుంటారు. వాలెంటైన్స్ డే నాడు ప్రతి సంవత్సరం 145 మిలియన్ గ్రీటింగ్ కార్డ్‌లను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. యునైటెడ్ స్టేట్స్లో అత్యధిక వాలెంటైన్స్ గ్రీటింగ్ కార్డులు పంచుకుంటారట. పెంపుడు జంతువుల యజమానులలో 25 శాతం మంది వాలెంటైన్స్ డే సందర్భంగా తమ పెంపుడు జంతువులకు వాలెంటైన్స్ డే బహుమతులు ఇస్తారు. అంటే వాలెంటైన్స్ డే.. కేవలం మనుషులకే కాదు కుక్కలు, పిల్లులు,పక్షులు, ఇతర పెంపుడు జంతువులకు సంబంధించినది కూడా. హృదయాకార మిఠాయిలను 1800లో తయారుచేశారట. బోస్టన్ ఫార్మసిస్ట్ ఆలివర్ చేజ్ వీటిని తయారుచేసే ప్రక్రియను సులభతరం చేయడానికి ఒక యంత్రాన్ని కనుగొన్నాడు. ప్రతి సంవత్సరం ఎనిమిది బిలియన్ల హృదయ సంభాషణలు రూపొందిస్తారట. వివిధ రకాల క్యాండీలపై క్లాసిక్ రొమాంటిక్ పదబంధాలలో ‘బి మైన్’, ‘క్యూటీ పై’ ‘ఐ యామ్ యువర్స్’ అనే అక్షరాలను ముద్రిస్తారు. వాలెంటైన్స్ డే నాడుప్రేమికులు 58 మిలియన్ పౌండ్ల విలువైన చాక్లెట్లు, మిఠాయిలను కొనుగోలు చేస్తారట. వాలెంటైన్స్ డే మిఠాయి అమ్మకాలలో గుండె ఆకారంలో ఉండే చాక్లెట్ బాక్స్‌లు దాదాపు 10శాతం ఉంటాయి. 1850లో క్యాడ్బరీ కంపెనీ చాక్లెట్లతో కూడిన బాక్స్ రూపొందించింది. దశాబ్ధకాలం తరువాత మొదటి గుండె ఆకారపు చాక్లెట్ బాక్స్‌ను తయారయ్యింది. మొదటి వాలెంటైన్స్ డే గ్రీటింగ్ కార్డు జైలు నుండి పంపించారు. డ్యూక్ ఆఫ్ ఓర్లీన్స్ 15వ శతాబ్దం ప్రారంభంలో ఖైదీగా మారినప్పుడు మొదటి వాలెంటైన్ లేఖ రాశాడు. దానిలో ఒక కవిత రాసి, తన రెండవ భార్యకు పంపాడు. అయితే అతను జైలులో ఉన్నందున ఆ కవితకు ఆమె నుంచి వచ్చిన స్పందనను అతను చూడలేదు. అత్యధికంగా టీచర్లు వాలెంటైన్డే గ్రీటింగులను అందుకుంటారు. వాలెంటైన్స్ డే కోసం 250 మిలియన్ల గులాబీలను పండిస్తారు! రోమన్ ప్రేమ దేవత వీనస్‌కు ఇష్టమైనవి ఎరుపు రంగు గులాబీలు. ఇవి శృంగారాన్ని, ప్రేమను సూచిస్తాయి. -
‘ప్రామిస్ డే’ అంటే ఏమిటి? వాలంటైన్ వీక్‌లో దీని ప్రాధాన్యత ఏమిటి?
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న ‘ప్రామిస్ డే’గా జరుపుకుంటారు. ఇది ప్రేమికుల వారంలో ఒక ప్రత్యేకమైన రోజు. ప్రతి సంబంధానికి ఈ రోజు ప్రత్యేకమైనదే అయినప్పటికీ, ప్రేమికులకు ‘ప్రామిస్ డే’ ఎంతో ప్రాధాన్యత కలిగినది. ‘ప్రామిస్ డే’నాడు ప్రేమికులు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు. బలహీనపడ్డ బంధాలకు తిరిగి ప్రాణం పోయవచ్చు. అయితే మీరు మీ భాగస్వామికి ఎలాంటి ప్రామిస్ చేయలి? ఈ విషయంలో ఎంత నిజాయితీగా వ్యవహరించాలి? అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన అనుబంధాల విషయంలో మీ ఇష్టాలు, అయిష్టాలను అవతలి వ్యక్తిపై ఎట్టిపరిస్థితుల్లోనూ రుద్దకూడదు. అలా కాదని మీకు నచ్చినట్లు వ్యవహరిస్తే క్రమంగా సంబంధం బలహీనపడుతుందని గుర్తించండి. మీరు నిజాయితీగా భాగస్వామిని ప్రేమిస్తే వారు ఎలా ఉన్నారో అలానే అంగీకరించండి. ఈ ప్రామిస్ డే నాడు హృదయ పూర్వకంగా భాగస్వామికి ఇటువంటి వాగ్దానం చేయండి. నాకోసం నువ్వు మారాలని ఏనాడూ కోరనని వాగ్దానం చేయండి. గతంలో ఏమి జరిగినా, వాటిని హృదయపూర్వకంగా అంగీకరించండి. మధురంగా మాట్లాడటం, బహుమతులు ఇవ్వడం ద్వారా ప్రేమికులు పరస్పరం ప్రపోజ్ చేసుకుంటారు. ప్రతి కష్టమైన మలుపులో తోడుగా ఉంటానని చెప్పుకుంటారు. ఈ హామీని ప్రతీ ఒక్కరూ నిలబెట్టుకోలేరు. అయితే దీనిని నిలబెట్టుకోవడంలోనే అసలైన ప్రామిస్‌కు అర్థం ఉంటుంది. అబద్ధం చెప్పే అలవాటు ఉంటే ఎలాంటి సంబంధమైనా కొద్దికాలానికే తెగిపోతుంది. అబద్ధాలు వినడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే వాటిని చాలామంది అలవోకగా మాట్లాడేస్తుంటారు. ప్రామిస్ డే నాడు మీ భాగస్వామితో జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని వాగ్దానం చేయండి. -
ఫిబ్రవరి సినిమాల జోరు
-
వచ్చే నెలలో బ్యాంకుల బంద్! ఎన్ని రోజులంటే..
వచ్చే నెలలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు 18 రోజులు మాత్రమే పని చేస్తాయి. ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు, సాధారణ సెలవులతోపాటు పండుగలు, ఇతర ప్రత్యేక దినోత్సవాల నేపథ్యంలో 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఫిబ్రవరిలో బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. వచ్చే నెలలో దాదాపు 11 బ్యాంకులకు సెలవులు ఉంటాయి కాబట్టి, ఆ నెలలో బ్యాంక్ బ్రాంచ్ని సందరర్శించే పని ఉన్నవారు సెలవుల జాబితాను ఓ సారి చూసుకోవడం మంచిది. బ్యాంకులు మూతపడినప్పటికీ ఆన్లైన్ మోడ్ ద్వారా ఆర్థిక లావాదేవీలను నిర్వహించవచ్చు. ఫిబ్రవరిలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఫిబ్రవరి 4 - ఆదివారం ఫిబ్రవరి 10- రెండవ శనివారం ఫిబ్రవరి 11- ఆదివారం ఫిబ్రవరి 14- బసంత్ పంచమి (త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో సెలవు) ఫిబ్రవరి 15- లూ-నాగి-ని (మణిపూర్‌లో సెలవు) ఫిబ్రవరి 18- ఆదివారం ఫిబ్రవరి 19- ఛత్రపతి శివాజీ జయంతి (మహారాష్ట్రలో సెలవు) ఫిబ్రవరి 20- రాష్ట్ర దినోత్సవం (మిజోరం, అరుణాచల్ ప్రదేశ్లలో సెలవు) ఫిబ్రవరి 24- రెండవ శనివారం ఫిబ్రవరి 25- ఆదివారం ఫిబ్రవరి 26- న్యోకుమ్ (అరుణాచల్ ప్రదేశ్‌లో సెలవు) -
ఇటు హీరోగా... అటు నిర్మాతగా...
నటుడిగా ఆమిర్ ఖాన్ మేకప్ వేసుకుని దాదాపు రెండేళ్లవుతోంది. ‘లాల్‌సింగ్ చద్దా’ (2022)లో చేసిన టైటిల్ రోల్, ‘సలామ్ వెంకీ’ (2022)లో చేసిన అతిథి పాత్ర తర్వాత ఆమిర్ ఖాన్ నటుడిగా మేకప్ వేసుకోలేదు. ఫైనల్‌గా ఫిబ్రవరిలో కెమెరా ముందుకు రానున్నారు. హీరోగా ‘సితారే జమీన్ పర్’ అంగీకరించారు ఆమిర్. ఫిబ్రవరి 2న ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారు. కొన్ని నెలలుగా ఈ చిత్రంలోని పాత్ర కోసం ప్రిపేర్ అవుతున్నారు ఆమిర్ ఖాన్. పలు లుక్స్ ట్రై చేసి, చివరికి ఒకటి ఖరారు చేశారు. అలాగే పలుమార్లు స్క్రిప్ట్‌ని చదివారు. అన్నీ సంతృప్తికరంగా అనిపించడంతో ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్లాన్ చేశారు. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి 70 నుంచి 80 రోజులు డేట్స్ ఇచ్చారు ఆమిర్. ఈ చిత్రాన్ని క్రిస్మస్కి విడుదల చేయాలనుకుంటున్నారు. సన్నీ డియోల్ హీరోగా.. నిర్మాతగా ‘లాహోర్: 1947’ చిత్రాన్ని నిర్మించనున్నారు ఆమిర్ ఖాన్. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా మాత్రమే కాదు.. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో (ఏకేపీ) మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి ఆమిర్ భార్య కిరణ్ రావ్ దర్శకత్వంలో రూపొందిన ‘లాపతా లేడీస్’. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం విడుదల కానుంది. మరోటి ‘ప్రీతమ్ ప్యారే’. సంజయ్ శ్రీవాస్తవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమిర్ బుక్ న్యారేటర్గా అతిథి పాత్ర చేశారు. ఈ చిత్రం కూడా ప్రథమార్ధంలోనే విడుదల కానుంది. ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలను ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్ చేపట్టడం విశేషం. ఇలా హీరోగా, ఏకేపీ నిర్మించే చిత్రాలతో ఆమిర్ బిజీ. -
Asmita Sood: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్ (ఫోటోలు)
-
రానున్నది పూర్తిస్థాయి బడ్జెటేనా? ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్పారు?
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో సమర్పించే బడ్జెట్ .. ఓట్ ఆన్ అకౌంట్ మాత్రమేనని, అందులో ఎటువంటి అద్భుతమైన ప్రకటనలు ఉండబోవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అలాంటి వాటి కోసం, ఎన్నికలయ్యాక ఏర్పడే కొత్త ప్రభుత్వం జూలైలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే దాకా ఎదురు చూడాల్సిందేనని ఆమె తెలిపారు. సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఎన్నికల ముంగిట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ .. కొత్త సర్కార్ కొలువు తీరే వరకు అయ్యే ప్రభుత్వ వ్యయాలకు ఆమోదం పొందేందుకు ఉద్దేశించి ఉంటుంది. దీన్ని ఓట్ ఆన్ అకౌంట్‌గా వ్యవహరిస్తారు. సాధారణంగా ఇలాంటి వాటిలో ప్రభుత్వం భారీ ప్రతిపాదనలేమీ చేయదు. మరోవైపు, అన్ని రంగాల్లో కార్యకలాపాలు పుంజుకోవడంతో రెండో క్వార్టర్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అత్యధికంగా నమోదైనట్లు రాజ్యసభలో చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా భారత్ కొనసాగుతోందని ఆమె చెప్పారు. గత ఎనిమిదేళ్ల వ్యవధిలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎకానమీల జాబితాలో భారత్ 10వ స్థానం నుంచి అయిదో స్థానానికి చేరిందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మేకిన్ ఇండియా, పీఎల్ఐ (ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల స్కీము) వంటి తోడ్పాటు చర్యలతో తయారీ రంగం కూడా ఎకానమీ వృద్ధిలో గణనీయంగా పాలుపంచుకుంటోందని మంత్రి చెప్పారు. నిరుద్యోగిత రేటు 2017–18లో దాదాపు 18 శాతంగా ఉండగా ప్రస్తుతం 10 శాతానికి దిగి వచ్చిందన్నారు. -
ఫిబ్రవరి 8న పాకిస్తాన్ ఎన్నికలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన సాధారణ ఎన్నికలు జరుపుతామని అధ్యక్షుడు అరిఫ్ అల్వీ గురువారం ప్రకటించారు. దేశంలో ఆర్థిక అస్థిరత తీవ్రరూపం దాలి్చన ఈ సమయంలో అధ్యక్షుడితో చర్చించి, ఎన్నికల తేదీని ఖరారు చేయాలంటూ అంతకుముందు ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్(ఈసీపీ) చీఫ్ కమిషనర్ సికందర్ సుల్తాన్ రజా, కమిషన్‌లోని నలుగురు సభ్యులు, అటార్నీ జనరల్ ఉస్మాన్ అవాన్ కలిసి అధ్యక్షుడు అరిఫ్ అల్వీని కలిశారు. ఎన్నికల నిర్వహణపై చర్చలు జరిపారు. అనంతరం ఎన్నికల తేదీని 2024 ఫిబ్రవరి 8గా నిర్ణయించినట్లు అధ్యక్షుడు ప్రకటించారు. -
బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది?
గత ఫిబ్రవరిలో ఆదాయపు పన్ను శాఖ బృందం ‘సర్వే’ కోసం బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) కార్యాలయాలను పరిశీలించింది. ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాల్లో పరిశీలనలు మాత్రమే జరుగుతున్నాయని, సోదాలు చేయడం లేదని (సీబీడీటీ )సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సీనియర్ అధికారి ఒకరు నాడు స్పష్టం చేశారు. అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అవకతవకలను తనిఖీ చేసేందుకు పన్ను అధికారులు పలు పత్రాలను పరిశీలిస్తున్నట్లు అప్పట్లో మరో అధికారి తెలిపారు. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్' అనే డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన కొన్ని వారాల తర్వాత ఐటీ అధికారులు ఈ చర్యలు చేపట్టడం విశేషం. అలాగే భారత ప్రభుత్వం బీబీసీ వలసవాద మనస్తత్వం కలిగి ఉందని ఆరోపించింది. యజమాని ఎవరు? బీబీసీ 1922, అక్టోబరు 18 న ఒక ప్రైవేట్ కంపెనీగా ఆవిర్భవించింది. అప్పట్లో దీనిని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీగా పిలిచేవారు. ప్రారంభంలో ఈ వ్యాపారంలో తనను తాను నిరూపించుకోవడానికి బీబీసీ ఎన్నో కష్టాలు పడింది. 1926 సార్వత్రిక సమ్మె సమయంలో విస్తృతమైన కవరేజ్ అందించి, బీబీసీ బ్రిటిష్ ప్రజల ఆదరణను చూరగొంది. అదే సంవత్సరంలో, పార్లమెంటరీ కమిటీ సిఫార్సు ద్వారా బీబీసీ ప్రైవేట్ కంపెనీ నుండి పబ్లిక్ కార్పొరేషన్‌గా మార్పుచెందింది. దీనితో కంపెనీ.. పార్లమెంటుకు జవాబుదారీతనం కలిగివుండాలని నిర్ణయించారు. కానీ బీబీసీ దాని పని తీరు విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. బీబీసీని జాన్ రీత్ (1889–1971) స్థాపించారు. 1922లో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీగా సంస్థను స్థాపించినప్పుడు దాని మొదటి జనరల్ మేనేజర్‌గా, 1927లో పబ్లిక్ కార్పొరేషన్‌గా మారినప్పుడు దాని మొదటి డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ ప్రచార సాధనాలను ఎదుర్కొనేందుకు బ్రిటిష్ ప్రభుత్వం మరో సమాచార మంత్రిత్వ శాఖను సృష్టించింది. దీనికి జాన్ రీత్ను సమాచార మంత్రిగా నియమించింది. ఐరోపాలో హిట్లర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, బ్రిటిష్ ప్రజలను మానసికంగా యుద్ధానికి సిద్ధం చేయడం అతని పనిగా ఉండేది. డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? బీబీసికి వచ్చే నిధులలో ఎక్కువ భాగం వార్షిక టెలివిజన్ ఫీజు ద్వారా వస్తుంది. ఇదే కాకుండా, బ్రిటన్ పార్లమెంట్ కూడా బీబీసీకి గ్రాంట్ల ద్వారా నిధులు సమకూరుస్తుంది. బీబీసీకి ఇతర ఆదాయ వనరులు బీబీసీ స్టూడియోస్, బీబీసీ స్టూడియోవర్క్స్. భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది? బీబీసీ భారతదేశంలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1940 మే 11న ప్రారంభమైంది. విశేషమేమిటంటే, ఈ తేదీన విన్స్టన్ చర్చిల్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. భారతదేశంలో బీబీసీని ప్రారంభించడం వెనక ఉద్దేశ్యం భారత ఉపఖండంలోని సైనికులకు వార్తలను అందించడమే. బీబీసీ హిందీ డాట్ కామ్ 2001లో ప్రారంభమమైంది. ఇది కూడా చదవండి: అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి? -
ఎనిమిది పరిశ్రమల గ్రూప్.. అక్కడక్కడే!
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు ఫిబ్రవరిలో దాదాపు నిశ్చలంగా 6 శాతంగా నమోదయ్యింది. 2022 ఇదే నెల్లో ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.9 శాతం. 2023 జనవరిలో వృద్ధి రేటు భారీగా 8.9 శాతంగా ఉంది. తాజా సమీక్షా నెల్లో క్రూడ్ ఆయిల్ మినహా మిగిలిన అన్ని విభాగాల్లో (బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్) ఉత్పత్తి పెరిగింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి మాత్రం 4.9 క్షీణించింది (2022 ఫిబ్రవరితో పోల్చి). కాగా, మార్చితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య గ్రూప్ వృద్ధి రేటు 7.8 శాతంకాగా, 2021–22 ఇదే కాలంలో ఈ రేటు 11.1 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 40.27 శాతం. ఏప్రిల్ రెండవ వారం ప్రారంభంలో ఫిబ్రవరి ఐఐపీ గణాంకాలు వెలువడతాయి. ఎకానమీ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో మౌలిక రంగం పురోగతి రానున్న కాలంలో కొంత ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రంగంపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. కీలక రంగాలకు ప్యాకేజీ అవసరమని కూడా సూచిస్తున్నారు. మున్ముందు ఈ రంగాల గణాంకాలపై ‘బేస్ ఎఫెక్ట్’ ప్రభావం ప్రధానంగా ఉంటుందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. -
డెట్ ఫండ్స్‌లో కొనసాగుతున్న అమ్మకాలు
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్ వరుసగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరిలో డెట్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.13,815 కోట్ల మేర నికరంగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డెట్ ఫండ్స్ నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు తరలిపోవడం వరుసగా మూడో నెలలోనూ చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో రూ.10,316 కోట్లు, గత డిసెంబర్లో రూ.21,947 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేష్ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022 నవంబర్‌లో డెట్ ఫండ్స్‌లోకి రూ.3,668 కోట్ల మేర వచ్చాయి. డెట్‌లో మొత్తం 16 విభాగాలు ఉంటే, తొమ్మిది విభాగాల్లోని పథకాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మిగిలిన విభాగాల్లోకి పెట్టుబడులు వచ్చాయి. విభాగాల వారీగా.. ► లిక్విడ్ ఫండ్స్ నుంచి అత్యధికంగా రూ.11,304 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ► అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.2,430 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.1,904 కోట్లు, ఫ్లోటర్ ఫండ్స్ నుంచి రూ.1,665 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ► ఓవర్‌నైట్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.2,946 కోట్ల అమ్మకాలు చేశారు. ఆ తర్వాత కార్పొరేట్ కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌లో రూ.662 కోట్లు, డైనమిక్ బాండ్ ఫండ్స్‌లోకి రూ.502 కోట్లు, గిల్ట్ ఫండ్స్‌లోకి రూ.451 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ► డెట్ విభాగంలో లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్, మనీ మార్కెట్, ఓవర్‌నైట్ ఫండ్ విభాగాలు 50 శాతానికి పైగా ఆస్తులు కలిగి ఉన్నాయి. -
ఆభరణాల ఎగుమతుల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2023 ఫిబ్రవరిలో రూ.28,833 కోట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 24 శాతం వృద్ధి అని జెమ్, జువెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) తెలిపింది. చైనా, మధ్యప్రాచ్య మార్కెట్ల రికవరీ ఇందుకు కారణమని వెల్లడించింది. ‘ఈ ఏడాది ఫిబ్రవరిలో కట్, పాలిష్డ్ డైమండ్ ఎగుమతులు 32 శాతం ఎగసి రూ.19,582 కోట్లుగా ఉంది. బంగారు ఆభరణాలు 30 శాతం అధికమై రూ.5,829 కోట్లకు చేరుకున్నాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం తరువాత యూఏఈకి బంగారు ఆభరణాల ఎగుమతులు 45 శాతం దూసుకెళ్లాయి. స్వల్ప క్షీణత తరువాత తిరిగి మధ్యప్య్రాచ్య మార్కెట్ పుంజుకుంటోందని అనడానికి ఇదే నిదర్శనం’ అని వివరించింది. కలిసి వస్తున్న చైనా మార్కెట్.. : ‘ప్రధానంగా యూఎస్‌కు ఎగుమతయ్యే రాళ్లు పొదిగిన బంగారు ఆభరణాల విక్రయాలు 2023 ఫిబ్రవరిలో 20 శాతం అధికం అయ్యాయి. కొన్ని నెలలుగా తిరోగమన వృద్ధి నమోదు చేసిన హాంగ్‌కాంగ్ ఇప్పుడు తిరిగి గాడిలో పడింది. చైనా మారెŠక్ట్ పుంజుకోవడం గొప్ప మెరుగుదలకు దారితీయవచ్చు. చైనాలో సగటు పొదుపు రేటు దాదాపు 40 శాతంగా ఉంది. పొదుపు విలువ లక్షల కోట్ల రూపాయలకు సమానం. సుదీర్ఘ లాక్డౌన్ వ్యవధి తర్వాత ఇతర ప్రపంచ మార్కెట్లలో చూసిన విధంగా ’ప్రతీకార కొనుగోలు’కు అవకాశం ఉంది. ఫలితంగా వజ్రాలు, వజ్రాభరణాల పరిశ్రమలో వచ్చే ఆరు నెలల్లో పెద్ద ఎత్తున వృద్ధి నమోదయ్యే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నాం’ అని కౌన్సిల్ అభిప్రాయపడింది. -
భారత్ ‘సేవలు’ భేష్...
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం ఫిబ్రవరిలో చక్కటి పనితీరు ప్రదర్శించింది. దేశ ఎకానమీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న ఈ రంగానికి సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 59.4 వద్ద ముగిసింది. గత 12 ఏళ్లలో ఈ స్థాయి పురోగతి ఇదే తొలిసారి. దేశంలో డిమాండ్ పరిస్థితులు, కొత్త వ్యాపారాలు ఊపందుకోవడం వంటి అంశాలు దీనికి కారణమని గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. సూచీ జనవరిలో 57.2 వద్ద ఉంది. అయితే ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన చూస్తే, సేవల రంగం వరుసగా 19 నెలల నుంచి వృద్ధిలోనే కొనసాగుతోంది. కాగా, ఉపాధి అవకాశాల పరిస్థితులు మాత్రం ఇంకా మందగమనంలోనే ఉన్నట్లు డీ లిమా తెలిపారు. సేవలు–తయారీ కలిపినా... పురోగతి! తయారీ, సేవల రంగం కలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ కూడా ఫిబ్రవరిలో పటిష్ట స్థాయిలో 59 వద్దకు చేరింది. జనవరిలో సూచీ 57.5 వద్ద ఉంది. ఇది 11 ఏళ్ల గరిష్టం. ఒక్క తయారీ రంగాన్ని చూస్తే మాత్రం సూచీ ఫిబ్రవరిలో 55.3 వద్ద ఉంది. జనవరికన్నా (55.4) సూచీ స్వల్పంగా వెనుకబడింది. -
పెట్రోల్, డీజిల్ విక్రయాలు మళ్లీ పైకి
న్యూఢిల్లీ: శీతాకాలం ప్రభావం తొలగిపోవడంతో ఫిబ్రవరిలో మళ్లీ పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పుంజుకున్నాయి. రెండంకెల వృద్ధిని చూశాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీల గణాంకాలను పరిశీలిస్తే.. ఫిబ్రవరిలో పెట్రోల్ అమ్మకాలు 12 శాతం పెరిగి 2.57 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. 2022 ఫిబ్రవరిలో పెట్రోల్ అమ్మకాలు 2.29 మిలియన్ టన్నులుగా ఉండడం గమనార్హం. 2021 ఫిబ్రవరి విక్రయాలు 1.57 మిలియన్ టన్నులతో పోల్చినా వృద్ధి నమోదైంది. నెలవారీగా చూస్తే.. జనవరి నుంచి ఫిబ్రవరికి పెట్రోల్ అమ్మకాలు 13.5 శాతం పెరిగాయి. ఇక డీజిల్ విక్రయాలు గత నెలలో 6.52 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో విక్రయాలతో పోలిస్తే 13 శాతం పెరిగాయి. ఈ ఏడాది జనవరి నెల విక్రయాలతో పోల్చి చూసినప్పుడు 9.2 శాతం వృద్ధి నమోదైంది. పర్వత ప్రాంతాల్లో మంచు వల్ల జనవరిలో డీజిల్ అమ్మకాలు 8.6 శాతం తగ్గడం గమనార్హం. ట్రక్కులు తిరిగి పూర్తి స్థాయిలో రోడ్లపైకి రావడం, రబీ సాగు సీజన్ రద్దీగా మారడంతో ఇక ముందూ డీజిల్ అమ్మకాలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. విమానయాన సేవలు పెరగడం ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) అమ్మకాలను పెంచింది. గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 2023 ఫిబ్రవరిలో ఏటీఎఫ్ విక్రయాలు 41 శాతం పెరిగి 5,74,200 టన్నులుగా ఉన్నాయి. ఎల్పీజీ అమ్మకాలు 2.43 శాతం పెరిగి 2.53 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. -
ఫిబ్రవరిసేల్స్: మారుతి బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీదారు మారుతి సుజుకి ఇండియా తన కస్టమర్లకు భారీ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్లో అమ్మకాలను పెంచుకునే క్రమంలో పలు మోడళ్ల కార్లపై తగ్గింపును ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో బాలెనో, సియాజ్ , ఇగ్నిస్ వంటి మోడల్ కార్లపై నేరుగా నగదు తగ్గింపులతో పాటు, కార్పొరేట్ డిస్కౌంట్లు , ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందించింది. (ఇదీ చదవండి: టాటా మోటార్స్ గుడ్ న్యూస్, టాప్ మోడల్స్‌పై అదిరిపోయే ఆఫర్లు) మారుతీ సుజుకి సియాజ్ హై-ఎండ్ సెడాన్. మారుతి సుజుకి సియాజ్ రూ.40,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఇందులో రూ. 25,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్చేంజ్ , రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు. 105 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రధాన ఫీచర్లు (Valentine’s Day sale: ఐఫోన్14 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు ) మారుతీ సుజుకి బాలెనో హై-ఎండ్ హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి బాలెనో సీఎన్జీ మోడల్ కొనుగోలుపై రూ. 15,000 వరకు ఆదా చేయవచ్చు. బాలెనోలోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 90 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది మారుతీ సుజుకి ఇగ్నిస్ పలు చిన్న కార్లలో ఒకటైన మారుతి సుజుకి ఇగ్నిస్ పై గరిష్టంగా రూ.50,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో రూ.25వేల వరకు క్యాష్ డిస్కౌంట్. మారుతి సుజుకి ఇగ్నిస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 83 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. -
ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు పది రోజులు సెలవు..లిస్ట్ ఇదిగో
సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2023 ఫిబ్రవరి బ్యాంకు సెలవుల జాబితా ప్రకటించింది. దీని ప్రకారం వచ్చే నెలలో బ్యాంకులకు పది రోజులు సెలవులున్నాయి. వీటిల్లో శని, ఆదివారాలు కలిపి ఉన్నాయి. అయితే బ్యాంకులకు పది రోజులపాటు సెలవులునప్పటికీ ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు పనిచేస్తాయి. ఆన్లైన్ సేవలను కస్టమర్లకు వినియోగించుకోవచ్చు.ఆర్బీఐ జారీ చేసిన ఫిబ్రవరి సెలవుల జాబితా దేశవ్యాప్తంగా ఒకేలా ఉండదు. రాష్ట్రాల్ని బట్టి మారుతూ ఉంటుందనేది గమనించాలి. ఇందులో పబ్లిక్ హాలిడేస్‌తో పాటు ప్రాంతీయ హాలిడేస్ కూడా ఉన్నాయి. 2023, ఫిబ్రవరి లో బ్యాంకుల సెలవుల జాబితా ఫిబ్రవరి 5 - ఆదివారం ఫిబ్రవరి 11- రెండో శనివారం ఫిబ్రవరి 12 - ఆదివారం ఫిబ్రవరి 15 - ఇంఫాల్‌లో సెలవు ఫిబ్రవరి 18 -ముంబాయి, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, బేలాపుర్, భోపాల్, భువనేశ్వర్, రాయ్‌పూర్, రాంచీ, డెహ్రాడూన్, జమ్ము, కాన్పూర్, తిరువనంతపురం, కొచ్చి, లక్నో, నాగ్‌పూర్, షిమ్లా, శ్రీనగర్‌లో మహా శివరాత్రి సెలవు ఫిబ్రవరి 19 - ఆదివారం ఫిబ్రవరి 20 - మిజోరాంలో సెలవు ఫిబ్రవరి21-సిక్కింలో లోసార్ సెలవు ఫిబ్రవరి 25 -నాలుగో శనివారం -
ఎన్నాళ్లకెన్నాళ్లకు...!
ఎప్పుడో 50 వేల ఏళ్ల క్రితం కన్పించిన ఓ తోకచుక్క త్వరలో మళ్లీ మనల్ని పలకరించనుంది. ఫిబ్రవరి 1న భూమికి అత్యంత సమీపంగా, అంటే 2.6 కోట్ల మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది. జనవరి 26 నుంచి వారం పాటు మామూలు కంటికి కూడా కన్పిస్తుందని నాసా చెబుతోంది. అది ప్రస్తుతం మనకు 11.7 కోట్ల మైళ్ల దూరంలో ఉంది. సి2022 ఈ3గా పిలుస్తున్న ఈ తోకచుక్కను నాసా సైంటిస్టులు కెమెరాలో బంధించారు. అన్నట్టూ, భూమి మాదిరిగానే ఇది కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుందట. 50 వేల ఏళ్లకు ఒక పరిభ్రమణం పూర్తి చేస్తుందట! 2020 జూలైలోనూ ఇలాగే ఒక తోకచుక్క మనకు కన్పించేంత సమీపంగా వచ్చింది. -
హైదరాబాద్‌కు రానున్న బిల్ గేట్స్, సత్య నాదెళ్ల
సాక్షి, హైదరాబాద్ః వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు బయో ఏషియా 20వ వార్షిక సదస్సు హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ సదస్సులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ప్రోత్సహించేందు కు కేంద్ర ఎంఎస్ఎంఈ విభాగంతో బయో ఏషి యా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏషియాలో అతిపెద్దదైన లైఫ్ సైన్సెస్, హెల్త్ టెక్ వేదికగా బయో ఏషియా సదస్సును తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తోంది. ఆ సదస్సులో ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పెవిలియన్ కేటాయిస్తారు. ఇందులో వైద్య ఉపకరణాలు, ఫార్మా స్యూటికల్స్‌తో పాటు అనుబంధ పరిశ్రమలకు చెందిన 60 ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సదస్సులో హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలతో పాటు స్థానిక సంస్థలు భాగస్వాములుగా ఉంటున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. సదస్సుకు అనేక మంది నోబుల్ బహుమతి విజేతలతో పాటు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, నోవార్టిస్ సీఈఓ వాస్ నర్సింహన్, మెడ్‌ట్రానిక్స్ సీఈవో జెఫ్ మార్తా వంటి ప్రముఖులు హాజరవుతున్నట్లు బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్ వెల్లడించారు. (క్లిక్ చేయండి: రాయదుర్గం టు శంషాబాద్.. ఏనోట విన్నా అదే చర్చ) -
గోల్డ్ ఫండ్స్‌కు అమ్మకాల ఒత్తిడి
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు ఈక్విటీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)కు ఫిబ్రవరిలో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. రూ.248 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. బంగారం ఈటీఎఫ్‌ల నుంచి నికరంగా పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం అంతకుముందు నెలలోనూ నమోదైంది. జనవరిలో గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి మరింత మొత్తంలో రూ.452 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. అంతకుముందు కాలం లో ప్రతి నెలా నికరంగా పెట్టుబడులు రావడం గమనార్హం. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలను పరిశీలిస్తే ఈ విష యం తెలుస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ చోటుచేసుకున్నా కానీ.. ఈ పథకాల నిర్వహణలోని పెట్టుబడుల విలువ (ఏయూఎం) జనవరి చివరికి రూ.17,839 కోట్లుగా ఉంటే.. ఫిబ్రవరి ఆఖరికి రూ.18,727 కోట్లకు పెరిగింది. ఫోలియోల సంఖ్య కూడా ఫిబ్రవరిలో 3.09 లక్షలు పెరిగి 37.74 లక్షలకు చేరింది. 2021 మొత్తం మీద గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.4,814 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. అంతకుముందు 2020లో వచ్చినమొత్తం రూ.6,657 కోట్లుగా ఉంది. ఇతర అవకాశాల కోసం.. బంగారాన్ని పెట్టుబడుల వైవిధ్య సాధనంగా చూసే ధోరణి పెరిగినట్టు, మార్కెట్ అస్థిరతలకు హెడ్జ్ సాధనంగా పరిగణిస్తున్నట్టు ఎల్‌ఎక్స్‌ఎంఈ వ్యవస్థాపకురాలు ప్రీతి రాతి గుప్తా తెలిపారు. ప్రస్తుత పెట్టుబడుల ఉపసంహరణను పరిశీలిస్తే.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఈక్విటీకి (పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్సింగ్) మళ్లించడం, ఈక్విటీ మార్కెట్లలో కరెక్షన్ను అవకాశంగా మలుచుకోవడం కారణమై ఉంటుందని గుప్తా పేర్కొన్నారు. అలాగే, బంగారం ధరలు పెరగడంతో ట్రేడర్లు తమ లాభాలను బుక్ చేసుకుని ఉంటారని ఆమె చెప్పారు. -
డబ్బే డబ్బు!! స్టార్టప్లోకి పెట్టుబడుల వరద!
ముంబై: ఇటీవల దేశీ స్టార్టప్ వ్యవస్థలోకి భారీగా తరలి వస్తున్న ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) పెట్టుబడులు ఫిబ్రవరిలో మరింత జోరందుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన ఫిబ్రవరిలో రెట్టింపై 5.8 బిలియన్ డాలర్లను తాకాయి. గతేడాది(2021) ఫిబ్రవరిలో ఇవి 2.5 బిలియన్ డాలర్లు మాత్రమే. ఐవీసీఏ–ఈవై రూపొందించిన నెలవారీ గణాంకాలివి. వీటి ప్రకారం ఫిబ్రవరిలో డీల్ పరిమాణం 33 శాతం ఎగసి 117కు చేరాయి. అయితే 2022 జనవరిలో నమోదైన 122 డీల్స్‌తో పోలిస్తే స్వల్పంగా క్షీణించాయి. కాగా.. పీఈ, వీసీ పెట్టుబడుల్లో 88 శాతం రియల్టీ, ఇన్ఫ్రా రంగాలను మినహాయించి ప్యూర్‌ప్లే ఇన్వెస్ట్మెంట్స్ కావడం గమనార్హం! గతేడాది ఫిబ్రవరిలో ఈ వాటా 79 శాతమే. 17 భారీ డీల్స్ గత నెలలో మొత్తం 4.4 బిలియన్ డాలర్ల విలువైన 17 భారీ డీల్స్ జరిగాయి. నెలవారీగా చూస్తే ఇవి 24 శాతం అధికం. మొత్తం పెట్టుబడుల్లో దాదాపు సగం అంటే 2.5 బిలియన్ డాలర్లు స్టార్టప్లలోకే ప్రవహించడం విశేషం! కాగా.. 85 డీల్స్ ద్వారా అత్యధిక పెట్టుబడులను స్టార్టప్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఏడు డీల్స్ ద్వారా 1.5 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లు నమోదయ్యాయి. మరోపక్క 1.4 బిలియన్ డాలర్ల విలువైన 10 విక్రయ డీల్స్ సైతం జరిగాయి. వీటిలో మూడు డీల్స్ 1.2 బిలియన్ డాలర్ల విలువైన సెకండరీ విక్రయాలు కావడం గమనార్హం! చదవండి: భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం, క్యూ కడుతున్న సరిహద్దు దేశాలు! -
దేశ వాణిజ్యలోటు రూ.20.88 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశ ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసాన్ని సూచించే వాణిజ్య లోటు భారీగా పెరిగింది. 2022 ఫిబ్రవరిలో 20.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెల్లో వాణిజ్యలోటు 13.12 బిలియన్ డాలర్లు. క్రూడ్ దిగుమతుల బిల్లు భారం వల్ల వాణిజ్యలోటు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ముఖ్య గణాంకాలు పరిశీలిస్తే, ఫిబ్రవరిలో దేశ ఎగుమతులు 25.1 శాతం పెరిగి 34.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఇదే నెల్లో దిగుమతులు 36 శాతం పెరిగి 55.45 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 20.88 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ తాజా గణాంకాల ప్రకారం, మొత్తం దిగుమతుల్లో పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ ఏకంగా 69 శాతం పెరిగి (2021 ఇదే నెలతో పోల్చి) 15.28 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. విభాగాల వారీగా... - ఫిబ్రవరిలో పసిడి దిగుమతులు 9.65 శాతం తగ్గి 4.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. - ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతులు 29.53 శాతం పెరిగి 6.27 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. - ఇక ఇంజనీరింగ్ గూడ్స్ (32 శాతం), పెట్రోలియం (88.14 శాతం), రసాయనాల (25.38 శాతం) విభాగాలు మంచి పురోగతితో విలువల్లో వరుసగా 9.32 బిలియన్ డాలర్లు, 4.64 బిలియన్ డాలర్లు, 2.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. - ఫార్మా ఎగుమతుల విలువ 1.78 శాతం పడిపోయి 1.96 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం నెరవేరినా... ఇక ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్–ఫిబ్రవరి మధ్య ఎగుమతుల విలువ 46.09 శాతం పెరిగి 374.81 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు ఇదే కాలంలో 59.33 శాతం పెరిగి 550.56 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దీనితో వాణిజ్యలోటు 2020–21 ఇదే కాలంతో పోలి్చచూస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో 88.99 బిలియన్ డాలర్ల నుంచి 175.75 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 400 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని దేశం సాధించే అవకాశాలు ఉండడం కొంతసానుకూల అంశమైనా, క్రూడ్ ధరల వల్ల వాణిజ్యలోటు తీవ్రం కావడం ఆందోళన కలిగిస్తోంది. -
వంట నూనెల దిగుమతులు పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల దిగుమతులు ఫిబ్రవరిలో 9,83,608 టన్నులకు చేరింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 23 శాతం అధికం. 2021 ఫిబ్రవరిలో 7,96,568 టన్నుల వంట నూనె భారత్‌కు సరఫరా అయింది. ప్రధానంగా శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతులలో గణనీయమైన పెరుగుదల కారణంగా ఈ స్థాయిలో వృద్ధి నమోదైందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ వెల్లడించింది. అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. గతేడాదితో పోలిస్తే 2022 ఫిబ్రవరిలో శుద్ది చేసిన పామాయిల్ 6,000 నుంచి ఏకంగా 3,02,928 టన్నులకు చేరింది. వంటలకు కాకుండా ఇతర ఉత్పత్తుల తయారీలో వాడే నూనెలు 42,039 నుంచి 36,389 టన్నులకు వచ్చి చేరింది. ఇతర ఉత్పత్తులకు వినియోగించే నూనెలతో కలిపి మొత్తం నూనెల దిగుమతులు 8,38,607 నుంచి 10,19,997 టన్నులకు ఎగశాయి. 2021 నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి మధ్య అన్ని రకాల నూనెలు 7 శాతం అధికమై 46,94,760 టన్నులుగా ఉంది. శుద్ధి చేసిన పామోలిన్ 21,601 నుంచి 5,19,450 టన్నులకు చేరాయి. ముడి పామాయిల్ 24,89,105 నుంచి 15,62,639 టన్నులకు దిగొచ్చింది. ప్రతి నెల సగటున 1.75–2 లక్షల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ విదేశాల నుంచి భారత్‌కు వస్తోంది. యుద్ధం కొనసాగితే.. ‘రష్యా–ఉక్రెయిన్ వివాదం సన్‌ఫ్లవర్ (పొద్దు తిరుగుడు) నూనె సరఫరాకు అంతరాయం కలిగించింది. ఫిబ్రవరి 2022లో దాదాపు 1,52,000 టన్నులు భారతదేశానికి దిగుమతైంది. అదే పరిమాణం ఈ నెలలోనూ వచ్చే అవకాశం ఉంది. యుద్ధానికి ముందు బయలుదేరిన ఓడలు ప్రస్తుత నెలలో భారతీయ ఓడరేవులకు చేరుకుంటాయి. యుద్ధం కొనసాగితే తరువాతి నెలల్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ రవాణా తగ్గుతుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ లభ్యత స్వల్పంగా తగ్గినప్పటికీ దేశీయంగా సోయాబీన్, ఆవనూనెల అధిక లభ్యత ఉపశమనం కలిగిస్తుంది. దేశీయ విక్రయాల పరిమితిని 20 నుంచి 30 శాతానికి పెంచుతూ మార్చి 9న ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇండోనేషియా ఎగుమతి పరిమాణాన్ని మరింత తగ్గిస్తుంది. అలాగే ప్రపంచ ఎగుమతి సరఫరాలను కఠినతరం చేస్తుంది. ఈ అంశాలు అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరల్లో గత కొన్ని రోజులుగా అధిక అస్థిరతకు దారితీస్తున్నాయి. పామాయిల్ ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి భారత్‌కు వస్తోంది. ముడి సోయాబీన్ నూనె అర్జెంటీనా, బ్రెజిల్ నుండి దిగుమతి అవుతోంది. ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్, రష్యా నుండి భారత్‌కు సరఫరా అవుతోంది’ అని అసోసియేషన్ తెలిపింది. -
ఫిబ్రవరిలో తగ్గిన యూపీఐ లావాదేవీలు
న్యూఢిల్లీ: యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై రిటైల్ చెల్లింపుల లావాదేవీలు ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గి రూ.8.27 లక్షల కోట్ల మేర నమోదయ్యాయి. సంఖ్యా పరంగా 452 కోట్ల లావాదేవీలు జరిగాయి. అంతక్రితం నెల 2022 జనవరిలో 461 కోట్ల లావాదేవీలు నమోదు కాగా, వీటి విలువ రూ.8.32 లక్షల కోట్ల మేర ఉంది. టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ఆధారిత లావాదేవీలు 24.36 కోట్లు నమోదయ్యాయి. వీటి విలువ రూ.3,613 కోట్లుగా నమోదైంది. ఈ వివరాలను ఎన్పీసీఐ విడుదల చేసింది. జనవరిలో ఫాస్టాగ్ టోల్ వసూళ్ల లావాదేవీలు 23.10 కోట్లుగాను, వీటి విలువ రూ.3,604 కోట్లుగా ఉంది. ఐఎంపీఎస్ లావాదేవీల విలువ జనవరిలో రూ.3.87 లక్షల కోట్లు. ఫిబ్రవరిలో రూ.3.84 లక్షల కోట్లకు తగ్గింది. జనవరిలో 31 రోజులు కాగా, ఫిబ్రవరిలో 28 రోజులే కావడం గమనార్హం. (చదవండి: వాహనదారులకు అలర్ట్.. ఇక ఆ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి!) -
పెట్రోలియం, క్రూడాయిల్ దిగుమతుల భారం
న్యూఢిల్లీ: భారత పెట్రోలియం, క్రూడాయిల్ దిగుమతుల విలువ ఫిబ్రవరిలో భారీగా 67 శాతం పెరిగింది. విలువలో 15 బిలియన్ డాలర్లకు చేరింది. సమీప భవిష్యత్‌లో భారత్‌లో ధరల పెరుగుదలకు సంకేతంగా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన ఫిబ్రవరి ఎగుమతులు–దిగుమతుల గణాంకాల్లో ఈ అంశం కీలకాంశంగా ఉంది. గణాంకాల్లో కీలకాంశాలు... ► ఫిబ్రవరిలో మొత్తం ఎగుమతుల విలువ 22.36 శాతం పెరిగి 33.81 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక దిగుమతుల విలువ 35 శాతం పెరిగి 55 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు భారీగా 21.19 డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ విలువ కేవలం 13.12 బిలియన్ డాలర్లు. ► ఎగుమతుల్లో ఇంజనీరింగ్ (31.34 శాతం పెరిగి 9.27 బిలియన్ డాలర్లు), పెట్రోలియం (66.29 శాతం పెరిగి 4.1 బిలియన్ డాలర్లు), రసాయన రంగాలు (25 శాతం పెరిగి 2.4 బిలియన్ డాలర్లు) మంచి పనితీరును ప్రదర్శించాయి. కాగా, ఫార్మా ఎగుమతులు 3.13 శాతం క్షీణించి 1.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ► ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతులు 29 శాతం పెరిగి 6.24 బిలియన్ డాలర్లకు చేరింది. 400 బిలియన్ డాలర్ల లక్ష్యం సాకారం! ఇక భారత్ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల కాలంలో (2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకూ) 374.05 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 45.80 శాతం అధికం. ఇక దిగుమతుల విలువ ఇదే కాలంలో 59.21 శాతం పెరిగి 550.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరిసి వాణిజ్యలోటు 176.07 బిలియన్ డాలర్లుగా ఉంది. తాజా గణాంకాల ప్రకారం, భారత్ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
జీఎస్టీ వసూళ్లు 18 శాతం అప్
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను వసూళ్లు 2022 ఫిబ్రవరిలో 18 శాతం పెరిగి (2021 ఇదే నెలతో పోల్చి) రూ.1.33 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అయితే నెలవారీగా 2022 జనవరి నెలతో పోల్చిచూస్తే, వసూళ్లపై మూడవ వేల్లో సవాలుగా ఏర్పడిన ఒమిక్రాన్ ప్రభావం కనబడింది. జనవరిలో రికార్డు స్థాయిలో రూ. 1,40,986 కోట్ల వసూళ్లు నమోదయిన సంగతి తెలిసిందే. ఇక జనవరితో పోల్చితే ఫిబ్రవరిలో మూడు రోజులు తక్కువగా ఉండడం ఇక్కడ గమనించాల్సిన మరో అంశం. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.లక్ష కోట్లపైన జీఎస్టీ వసూళ్లు ఇది వరుసగా ఎనిమిదవ నెల. రూ.1.30 లక్షల కోట్లు దాటడం ఐదవసారి. ►ఒక్క సెస్ వసూళ్లు రూ.10,000 కోట్ల కీలక స్థాయిని దాటడం ఇదే మొదటిసారి. ఆటోమొబైల్ వంటి కీలక రంగాల్లో పటిష్ట రికవరీ దీనికి కారణమని ఆర్థికశాఖ ప్రకటన ఒకటి పేర్కొంది. ►2021 ఫిబ్రవరితో పోల్చితే జీఎస్టీ వసూళ్ల వృద్ధి 18 శాతం అయితే, దేశంలో కరోనా సవాళ్లు ప్రారంభానికి ముందు ఫిబ్రవరి 2020తో పోల్చితే ఏకంగా ఈ వృద్ధి రేటు 26 శాతంగా ఉండడం గమనార్హం. ►వసూలయిన మొత్తం రూ.1,33,026 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.24,435 కోట్లు. స్టేట్ జీఎస్టీ రూ.30,779 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.67,471 కోట్లు (వస్తువుల దిగుమతులపై రూ.33,837 కోట్ల వసూళ్లుసహా), సెస్ రూ.10,341 కోట్లు ((వస్తువుల దిగుమతులపై రూ.638 కోట్ల వసూళ్లుసహా). -
రెడీ టు హిట్ సినిమా సునామీ
-
పురోగతి బాటలో ఎకానమీ
ముంబై: ఆర్థికమంత్రి ఈ నెల ఒకటవ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2022–23 వార్షిక బడ్జెట్, సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానాలు భారత్ ఎకానమీ విస్తృత స్థాయి పురోగతికి బాటలు వేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి బులిటన్లో ప్రచురితమైన ఆర్టికల్ విశ్లేషించింది. మూడవ వేవ్‌ను సవాళ్లను అధిగమించిన భారత్‌లో ఆర్థిక రికవరీ ఇప్పటికే పటిష్టం అవుతోందని వివరించింది. అంతర్జాతీయంగా ఆర్థిక అంశాలుసహా వివిధ ప్రతికూలతలు కొనసాగుతున్నప్పటికీ దేశీయ ఎకానమీ పురోగమిస్తోందని ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’ థామ్‌తో ప్రచురితమైన ఆర్టికల్ పేర్కొంది. ఆర్టికల్‌లో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి బడ్జెట్లో ప్రభుత్వ పెట్టుబడుల పునరుద్ధరణ వల్ల 2022–23లో ప్రైవేట్ పెట్టుబడులు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఇది ఉపాధి కల్పన, డిమాండ్‌ను బలోపేతం వంటి అంశాలకూ దోహదపడుతుంది. ► మల్టీ–మోడల్ కనెక్టివిటీ, రవాణా రంగం పురోగతి ద్వారా విస్తృత స్థాయి వృద్ధిని భారత్ సాధించగలుతుంది. ఈ లక్ష్య సాధనలో గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్రణాళిక కీలకమైనది. మౌలిక సదుపాయాల పురోగతిలో ఇది కీలకమైనది. ► ప్రపంచ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయి. మూడవ వేవ్ నుంచి భారత్ బయట పడిన నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలలో పునరుద్ధరణ వేగంగా ఉంది. ► డిమాండ్, ఆశావాదం ప్రాతిపదికన తయారీ, సేవల రంగాల రెండూ విస్తరిస్తున్నాయి. వినియోగదారు, వ్యాపార విశ్వాసాన్ని మెరుగుపడ్డం కూడా కలిసివస్తోంది. వ్యాపారాలు తిరిగి సాధారణ స్థితికి వస్తుండడంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని విశ్వసిస్తున్నాం. ► ఈ రోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం సమస్యతో సతమతమవుతోంది. క్రూడ్‌సహా కమోడిటీల ధరలు పెరగడం, సరఫరాల్లో సమస్యలు దీనికి ప్రధాన కారణం. ► ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు ఇంకా తీవ్ర అనిశ్చితిలోనే కొనసాగుతున్నాయి. పలు అంశాలు ఇంకా సవాళ్లవైపే పయనిస్తున్నాయి. ► భారత్‌కు సంబంధించినంతవరకూ ప్రభుత్వం నుంచి అధిక వ్యయాల ప్రణాళికలు, వ్యాపారాలను సులభతరం చేయడానికి చర్యలు సానుకూల అంశాలు. ఆయా అంశాలే ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల వరుసలో భారత్‌ను మొదట నిలబెడుతున్నాయి. ► ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆర్బీఐ పాలసీ సమావేశాల్లో ద్రవ్యోల్బణం–వృద్ధి లక్ష్యంగా ఆర్బీఐ వరుసగా పదవ త్రైమాసిక బేటీలోనూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్బీఐ యథాతథంగా 4 శాతం వద్దే కొనసాగించింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని పేర్కొంది. వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని అభిప్రాయపడింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని ఆర్బీఐ ఇటీవలి పాలసీ సమావేశం అంచనావేసింది. ► పెట్టుబడులకు సంబంధించి కేంద్రం మూలధన వ్యయాలు (క్యాపిటల్ అకౌంట్‌కు సంబంధించి) 35.4 శాతం పెరిగినట్లు బడ్జెట్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇందుకు సంబంధించి కేటాయింపులు రూ.5.54 లక్షల కోట్లయితే (సవరిత గణాంకాల ప్రకారం రూ.6.03 లక్షల కోట్లు), 2022–23లో రూ.7.50 లక్షల కోట్లకు (జీడీపీలో 2.9 శాతం) పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ కేటాయింపులకు భారీగా పెంచుతున్నట్లు తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే తాజా కేటాయింపులు (రూ.7.50 లక్షల కోట్లు) రెండు రెట్లు అధికమని మంత్రి తెలిపారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి ఆర్థికశాఖ నెలవారీ నివేదిక స్పష్టీకరణ న్యూఢిల్లీ: కొత్త బడ్జెట్ (2022–23 ఆర్థిక సంవత్సరం)లో ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థ అగ్ర దేశాలతో పోల్చితే వేగంగా పురోగమించనుందని ఆర్థికశాఖ నెలవారీ సమీక్షా నివేదిక పేర్కొంది. కోవిడ్–19 అనంతర ప్రపంచం ఆర్థిక పరిస్థితి ఎలా ఉండాలన్న ప్రణాళికతోనే ప్రస్తుత సంవత్సరం కూడా ముగియవచ్చని నివేదిక విశ్లేషించింది. భారత్‌కు సంబంధించినంతవరకూ తయారీ, నిర్మాణ రంగాలు వృద్ధి చోదకాలుగా ఉంటాయని పేర్కొంది. పీఎల్ఐ, మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాల పెంపు దేశీయ ఆర్థిక వ్యవస్థ పురోగతికి బాటలు వేస్తాయని నివేదిక విశ్లేషించింది. నివేదికలోని కొన్ని కీలకాంశాలను పరిశీలిస్తే... ► నికర విత్తన విస్తీర్ణం, పంటల వైవిధ్యీకరణలో స్థిరమైన పురోగతిని వ్యవసాయ రంగం సాధిస్తోంది. ఇది దేశ ఆహార నిల్వల పరిస్థితిని బలోపేతం చేస్తుంది. అదే సమయంలో రైతులకు కనీస మద్దతు ధరలు, ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా ఆదాయ బదిలీల వంటి అంశాలు ఈ రంగానికి లాభిస్తాయి. ► వేగవంతమైన వృద్ధి విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా భారత్‌ను తొలి స్థానంలో నిలిపిన విషయం గమనార్హం. జనవరి మొదట్లో భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారీగా 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. గత ఏడాది అక్టోబర్‌లో 9.5 శాతం అంచనాలను తాజాగా 9 శాతానికి కుదించింది. అయినా ఈ స్థాయి వృద్ధి కూడా ప్రపంచ దేశాల్లో అత్యధికమని పేర్కొంది. ► దేశంలో మూడవ వేవ్ సవాళ్లు తలెత్తినప్పటికీ, మొత్తం ఆర్థిక కార్యకలాపాలు వీటిని తట్టుకుని నిలబడ్డాయి. విద్యుత్ వినియోగం, తయారీకి సంబంధించి పర్చేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్, ఎగుమతులు, ఈ–వే బిల్లులు వంటి వంటి అనేక హై ఫ్రీక్వెన్సీ సూచికలు బలమైన పనితీరును ప్రదర్శిస్తున్నాయి. వృద్ధి రికవరీ పటిష్టతను ఇది ప్రతిబింబిస్తోంది. ► కోవిడ్ 19 వైరస్ వల్ల కలిగిన అనిశ్చితి, ఆందోళన ప్రజల మనస్సుల నుండి తొలగిపోయిన తర్వాత, వినియోగం పుంజుకుంటుంది. డిమాండ్ పునరుద్ధరణ జరుగుతుంది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి సంబంధించి ఉత్పత్తిని పెంచడానికి ప్రైవేటు పెట్టుబడులకు విస్తృత స్థాయి అవకాశం ఏర్పడుతుంది. ► అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అంశాలను మినహాయిస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థకు 2022–23లో పలు సానుకూల అంశాలు ఉన్నాయి. -
అలెర్ట్: బ్యాంకుల్లో మోగనున్న సమ్మె సైరన్?..లావాదేవీలు ఉంటే ఇప్పుడే చూసుకోండి!
బ్యాంక్ ఖాతాదారులకు గమనిక. బ్యాంకులకు 11రోజుల పాటు సెలవులు ఉన్నాయి. మొబైల్,ఇంటర్నెట్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు అంతరాయం లేకుండా కొనసాగుతున్నప్పటికీ, బ్యాంక్ సెలవులతో పాటు బ్యాంకింగ్ అసోసియేషన్ల సమ్మె కారణంగా అనేక బ్యాంకుల కార్యకలాపాలు మొత్తం 11రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. బ్యాంక్ యూనియన్లు ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 24న రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో బ్యాంక్ స్ట్రైక్లతోపాటు పబ్లిక్ హాలిడేస్ల కారణంగా మొత్తం 11రోజులు బ్యాంకులు పనిచేయవనే విషయాన్ని ఖాతాదారులు గుర్తించాలని బ్యాంక్ సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఏఏ రోజుల్లో బ్యాంకులు పనిచేయవంటే? ఫిబ్రవరి 12- నెలలో రెండవ శనివారం 13 ఫిబ్రవరి-ఆదివారం 15 ఫిబ్రవరి-హజ్రత్ అలీ జయంతి/లూయిస్-నగై-ని (ఉత్తరప్రదేశ్, మణిపూర్లలో బ్యాంకులు పనిచేయవు) 16 ఫిబ్రవరి-గురు రవిదాస్ జయంతి (చండీగఢ్, హిమాచల్, హర్యానా,పంజాబ్‌లలో బ్యాంకులు పనిచేయవు) ఫిబ్రవరి 18-దోల్ యాత్ర (పశ్చిమ బెంగాల్లో బ్యాంకులు పనిచేయవు) ఫిబ్రవరి 19-ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి (మహారాష్ట్రలో బ్యాంకులు పనిచేయవు) ఫిబ్రవరి 20-ఆదివారం ఫిబ్రవరి 23 - బ్యాంకు సమ్మె ఫిబ్రవరి 24 - బ్యాంకు సమ్మె 26 ఫిబ్రవరి-నెలలో నాలుగవ శనివారం ఫిబ్రవరి 27-ఆదివారం -
ఫిబ్రవరిలో బ్యాంకుల హాలిడేస్ జాబితా ఇదే..!
మీకు ఈ ఫిబ్రవరి నెలలో ఏమైనా ముఖ్యమైన బ్యాంకు పనులు ఉన్నాయా? అయితే గమనిక. బ్యాంకుకు వెళ్లే ముందు ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకుంటే మంచిది. బ్యాంకుల్లో ఏదైనా పని ఉంటే సెలవు రోజులకు అనుగుణంగా ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ నెలలో బ్యాంకులకు ఈ క్రింది రోజుల్లో సెలవులు రానున్నయి. ఫిబ్రవరి బ్యాంక్ హాలిడేస్ జాబితా: ఫిబ్రవరి 2: సోనమ్ లోచర్ (గ్యాంగ్టాక్లో బ్యాకులకు సెలవు) ఫిబ్రవరి 5: సరస్వతి పూజా, శ్రీ పంచమి, వసంత పంచమి(కోల్‌కతా, భువనేశ్వర్, అగర్తలలో బ్యాకులకు సెలవు) ఫిబ్రవరి 6: ఆదివారం సాధారణ సెలవు ఫిబ్రవరి 12: రెండో శనివారం సాధారణ సెలవు ఫిబ్రవరి 13: ఆదివారం సాధారణ సెలవు ఫిబ్రవరి 15: మహమ్మద్ హజ్రత్ అలీ జయంతి, లుయిస్-నాగాయ్-ని (ఇంఫల్, కాన్పూర్, లక్నోల్లో బ్యాంకులకు సెలవు) ఫిబ్రవరి 16: గురు రవిదాస్ జయంతి(చంఢీగడ్‌లో బ్యాకులకు సెలవు) ఫిబ్రవరి 18: దోల్జాత్రా (కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు) ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి (మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు) ఫిబ్రవరి 20: ఆదివారం సాధారణ సెలవు ఫిబ్రవరి 26: నాలుగో శనివారం సాధారణ సెలవు ఫిబ్రవరి 27: ఆదివారం సాధారణ సెలవు (చదవండి: కేంద్ర బడ్జెట్‌పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు..!) -
ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!
అమ్మో ఒకటో తారీఖు..! ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంతో పాటు దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల కొన్ని సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. వచ్చేనెల ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనుండగా పలు రంగాల్లో రానున్న మార్పులను మనం స్వాగతించాల్సి ఉంటుంది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్న బ్యాంకులకు సంబంధించిన కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ► దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్) ఛార్జీలను పెంచనుంది. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో ఐఎంపీఎస్ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ విధించనుంది. ఐఎమ్పిఎస్ లావాదేవీలు చేసేటప్పుడు జీఎస్టీతో పాటు గరిష్టంగా రూ.20 వసూలు చార్జీల రూపంలో చేయనుంది. అక్టోబర్ 2021లో ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని ఆర్బిఐ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన విషయం మనకు తెలిసిందే. ► ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన చెక్ క్లియరెన్స్‌కు సంబంధించిన నియమ & నిబంధనలు మారనున్నాయి. చెక్ చెల్లింపు కోసం వినియోగదారులు సానుకూల చెల్లింపు విధానాన్ని అనుసరించాలి. ప్రస్తుతం ఖాతాదారులు చెక్ జారీ చేసిన తర్వాత ఆ చెక్కుకు సంబంధించిన వివరాలు బ్యాంక్‌కు పంపాల్సి ఉంటుంది. లేకపోతే ఆ చెక్ క్లియర్ అవ్వదు. ఖాతాదారుల భద్రత దృష్ట్యా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు కేవలం రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న చెక్కుల కోసం ఇలాంటి నిబంధనలు మార్చింది. తక్కువ మొత్తంలో చెక్కులు జారీ చేస్తే మాత్రం ఈ మార్పులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చే నెల నుంచి చార్జీల బాదుడు షురూ చేయబోతోంది. ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోవడం వల్ల మీ ఇన్స్టాల్మెంట్లు లేదంటే ఈఎంఐ చెల్లింపులు ఫెయిల్ అయితే అప్పుడు బ్యాంక్ రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ.100 చార్జీ వసూలు చేస్తున్నారు. డిమాండ్ డ్రాఫ్ట్‌ను క్యాన్సిల్ చేయాలన్నా రూ.150 చెల్లించుకోవాలి. ► ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మాదిరిగానే వచ్చేనెల ఫిబ్రవరి 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. ఫిబ్రవరి & మార్చిలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఫిబ్రవరి 1న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం తగ్గిస్తుందా? లేదా అనేది చూడాలి. (చదవండి: బీఎండబ్ల్యూ అనూహ్య నిర్ణయం...! తొమ్మిదేళ్ల ప్రస్థానానికి ఎండ్ కార్డ్..!) -
ఫిబ్రవరి కోటా టికెట్లు విడుదల చేసిన టీటీడీ
Srivari Special Darshan Quota Tickets: శ్రీవారి ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్లను ఫిబ్రవరి నెలకు సంబంధించి టీటీడీ శుక్రవారం ఉదయం ఆన్లైన్లో విడుదల చేసింది. రోజుకి 12 వేల చొప్పున టోకెన్లను విడుదల చేసింది. ఫిబ్రవరి నెలకు స్లాటర్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పీఆర్వో విభాగం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులంతా టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్లలో మాత్రమే బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. చదవండి: (కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి వేతనాలు.. ఏపీ ఆర్థికశాఖ ఉత్తర్వులు) -
అలా పైపైకి...
న్యూఢిల్లీ: భయపడినట్లే జరుగుతోంది. దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. డిసెంబరు 28తో పోలిస్తే జనవరి 3 తేదీకల్లా (వారం రోజుల్లో) కేసుల్లో 500 శాతానికి పైగా పెరుగుదల నమోదు కావడంతో ఆందోళనను రేకెత్తిస్తోంది. ఫిబ్రవరి నెల మధ్యకు వచ్చేనాటికి ఒమిక్రాన్ కారణంగా భారత్‌లో థర్డ్‌వేవ్ పీక్కు చేరొచ్చనే అంచనాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డిసెంబరు 28న 6,358 కేసులు నమోదుకాగా... సోమవారం (జనవరి 3న) ఏకంగా 33,750 కొత్త కేసులొచ్చాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,700లకు చేరింది. వీరిలో 639 మంది కోలుకోవడమో, ఇతర ప్రదేశాలకు వెళ్లిపోవడమో జరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. మహారాష్ట్ర (510), ఢిల్లీ (351)లు అత్యధిక ఒమిక్రాన్ కేసులున్న రాష్ట్రాలు. దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివిటీ రేటు 3.84 శాతంగా నమోదైంది. ► దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఒక్కరోజే 4,099 కేసులు వచ్చాయి. మే నెల తర్వాత ఇదే అత్యధికం. 6.46 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. జీనోమ్ స్వీక్సెనింగ్‌కు పంపిన శాంపిళ్లలో 81 శాతం ఒమిక్రాన్ కేసులొచ్చాయి. ► ముంబైలో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 7,298 కేసులొచ్చాయి. దాంతో ముంబైలో 1–9 తరగతులకు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు బడులు/కాలేజీలను జనవరి 31 దాకా మూసివేయాలని నిర్ణయించారు. -
పెన్షన్ తీసుకునే వారికి కేంద్రం శుభవార్త..!
కేంద్ర ప్రభుత్వ పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పెన్షన్ దారులు తమ లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించేందుకు గడువును ఫిబ్రవరి 28, 2022 వరకూ పెంచుతూ నేడు ప్రకటన చేసింది కేంద్రం. "వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కేసుల సంఖ్య పేరుగతున్న దృష్ట్యా వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెన్షనర్ లైఫ్ సర్టిఫికెట్ పత్రాన్ని సమర్పించడానికి ప్రస్తుతం ఉన్న 31.12.2021 కాలవ్యవధిని ఫిబ్రవరి 28, 2022 వరకూ పొడిగించాలని నిర్ణయించినట్లు" పెన్షన్ల విభాగం పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక మెమోరాండంలో తెలిపింది. అప్పటి వరకూ వారి పెన్షన్ పంపిణీకి ఎలాంటి ఢోకా ఉండబోదని పేర్కొంది. వృద్ధులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న కారణంగా లైఫ్ సర్టిఫికెట్ గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునే వారు నవంబర్ నెలలో కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్‌ను అందించాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే ప్రభుత్వం నుంచి పెన్షన్ లభిస్తుంది. అయితే ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం వీరికి ఊరట కలిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును పొడిగించింది. (చదవండి: ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ తెలిస్తే కుర్రకారు ఫిదా కావాల్సిందే..!) -
భారత్‌లో కోవిడ్ థర్డ్‌వేవ్.. ఫిబ్రవరిలో విజృంభణ!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ థర్డ్‌వేవ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పతాక స్థాయికి చేరవచ్చని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) కాన్పూర్ పరిశోధకులు చేపట్టిన ఓ ముందస్తు అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల తీరు ప్రాతిపదికగా ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపింది. గౌసియన్ మిక్సర్ మోడల్ అనే టూల్‌ను ఉపయోగించి చేపట్టిన ఈ అధ్యయనాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే థర్డ్‌వేవ్‌తో సతమతమవుతున్న అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యాల్లో నమోదైన రోజువారీ కేసుల డేటాను ఉపయోగించుకుంటూ దేశంలో థర్డ్‌వేవ్ ప్రభావంపై ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పింది. దేశంలో థర్డ్‌వేవ్‌లో డిసెంబర్ 15వ తేదీకి అటూఇటుగా కరోనా కేసుల్లో పెరుగుదల నమోదు చోటుచేసుకోగా 2022 ఫిబ్రవరి 3వ తేదీకల్లా ఇది తీవ్ర స్థాయికి చేరుకోనుంది’ అని ఆ అధ్యయనం పేర్కొంది. అయితే, వ్యాక్సినేషన్ డేటాను పరిగణనలోకి తీసుకోనందున అప్పటికి కేసుల్లో పెరుగుదల ఏ మేరకు ఉంటుందో కచ్చితంగా చెప్పలేమని కూడా స్పష్టం చేసింది. -
ఉన్నది రెండు అంగుళాలే.. దీని వెనుక పెద్ద కథే ఉంది
ఈ చిత్రంలో ఏదో ఓ బొగ్గు ముక్కలా కనిపిస్తున్నది చిన్నపాటి ఉల్క. ఉన్నది కేవలం రెండు అంగుళాలే.. కానీ శాస్త్రవేత్తలను పరుగులు పెట్టిస్తోంది. ఎందుకో తెలుసా..? భూమ్మీద జీవం పుట్టుకను తేల్చేందుకు ఈ ఉల్క తోడ్పడనుంది మరి. సైన్స్ పరంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ ఉల్కను గుర్తించడం వెనుక పెద్ద కథే ఉంది. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? –సాక్షి సెంట్రల్ డెస్క్ వెంటాడి.. వేటాడి.. బ్రిటన్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాత్రి ఆకాశాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలకు ధగధగా మెరుస్తూ భూమివైపు దూసుకొస్తున్న ఓ ఉల్క కనబడింది. సాధారణంగా చిన్న చిన్న ఉల్కలు వాతావరణంలోనే మండిపోతాయి. కాస్త పెద్దవి అయితేనే దాటుకుని వచ్చి నేలపై పడతాయి. ఈ ఉల్క కూడా వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ రావడంతో శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అలా ఈ ఉల్క వించ్‌కోంబ్ ప్రాంతం దాకా వచ్చినట్టు గుర్తించారు. ఆ ప్రాంతంలోని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఇళ్లలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి.. ఉల్క ఎక్కడ పడిందీ సుమారుగా గుర్తించారు. తర్వాత ఏడెనిమిది మంది శాస్త్రవేత్తలు, మరికొందరి సహాయంతో గాలించి.. ఓ ఇంటి ఆవరణలో ఒక ముక్కను, రెండు కిలోమీటర్ల దూరంలోని గొర్రెల ఫారంలో మరో ముక్కను గుర్తించారు. వీటి విలువ సుమారు కోటి రూపాయలకుపైగా ఉంటుందని అంచనా వేశారు. జీవానికి ఆధారమైన అమైనో ఆమ్లాలతో.. బొగ్గు తరహాలో నల్లగా ఉన్న ఆ ఉల్కలను తీసుకెళ్లి పరిశోధన చేపట్టారు. అది చాలా ప్రత్యేకమైనదని గుర్తించి.. తాజాగా వివరాలను వెల్లడించారు. ఇది అత్యంత అరుదైన ‘కార్బొనసియస్ కాండ్రైట్’రకానికి చెందిన ఉల్క అని, సుమారు 460 కోట్ల సంవత్సరాల కిందటిదని శాస్త్రవేత్తలు తెలిపారు. 300 గ్రాముల బరువున్న ఈ ఉల్కలో.. జీవం పుట్టుకకు ఆధారమైన అమైనో ఆమ్లాలు, నీటి ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడించారు. ‘‘సూర్యుడు, భూమి, ఇతర గ్రహాలు ఏర్పడిన తొలినాళ్ల నాటి గ్రహ శకలం ఇది. దీనిని ఆనాటి పరిస్థితులను యథాతథంగా కాపాడుతున్న ‘టైం క్యాప్సూల్’అనుకోవచ్చు.భూమి, ఇతర గ్రహాల పుట్టుకకు సంబంధించిన విశేషాలను దీనిద్వారా తెలుసుకొనే అవకాశం ఉంటుంది. ధ్వని వేగానికి 40 రెట్ల వేగం.. అంటే గంటకు 50 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశించి.. మండిపోయింది..’’అని ఇంగ్లండ్ నేషనల్ హిస్టరీ మ్యూజియం పరిశోధకుడు డాక్టర్ ఆష్లే కింగ్ వెల్లడించారు. ఇప్పుడున్న జీవజాలం భూమ్మీద పుట్టిందేనా? అంతరిక్షంలో మరోచోటి నుంచి ఇక్కడికి వచ్చిందా? విశ్వంలో మరెక్కడైనా జీవం ఉందా అన్నదానికీ ఈ ఉల్క సమాధానం చెప్పగలదని తెలిపారు. -
'ప్లేయర్ ఆఫ్ ద మంత్' రవిచంద్రన్ అశ్విన్
దుబాయ్: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిబ్రవరి నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన అశ్విన్‌ను ఈ అవార్డ్ వరించింది. ఈ అవార్డ్ రేసులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, విండీస్ ఆటగాడు కైల్ మేయర్స్ ఉన్నప్పటికీ ఆల్‌రౌండ్ ప్రతిభ కనబర్చిన అశ్విన్‌వైపే ఐసీసీ మొగ్గుచూపింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఏకంగా 32 వికెట్లు తీసిన అశ్విన్.. చెన్నైలో జరిగిన రెండో టెస్ట్‌లో సెంచరీ కూడా సాధించాడు. ఒక సిరీస్‌లో 30కిపైగా వికెట్లు సాధించడం అశ్విన్‌కు ఇది రెండోసారి. అంతేకాదు ఈ ఫీట్‌ను సాధించిన ఏకైక ఇండియన్ బౌలర్ కూడా అశ్వినే కావడం విశేషం. కాగా, టీమిండియా ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించినట్లు ఐసీసీ తన ట్వీటర్ ఖాతాలో పేర్కొంది. ఐసీసీ ఈ ఏడాది ప్రవేశపెట్టిన ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్‌ను జనవరి నెలకుగాను టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎగురేసుకుపోగా, ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్‌ను అశ్విన్ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో అద్భుతంగా రాణించిన పంత్.. ఈ అవార్డును గెలుచుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. -
ఐదవ నెలా లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూ ఢిల్లీ: కరోనా కారణంగా భారీగా పడిపోయిన జీఎస్టి వసూళ్లు తిరిగి గాడిన పడ్డాయి. వరుసగా ఐదవ నెలలో కూడా జీఎస్టి వసూళ్లు లక్ష కోట్ల మార్కును దాటాయి. ఫిబ్రవరి నెలలో జీఎస్టి వసూళ్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1.13 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది వసూళ్లు 7 శాతం పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో వసూలు చేసిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,13,143 కోట్లు కాగా గత నెలలో వసూలు చేసిన రూ.1,19,875 కోట్ల రూపాయల కన్నా తక్కువ. ఫిబ్రవరి నెలకు గాను వసూలైన జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.21,092 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.27,273 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.55,253 కోట్లు, సెస్సులు కింద రూ.9,525 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. వరుసగా ఐదో నెలా లక్ష కోట్లు దాటాయని, జీఎస్టీ వసూళ్లు తిరిగి పుంజుకున్నాయనడానికి ఇదే నిదర్శమని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ నెలలో వస్తువుల దిగుమతి ద్వారా వచ్చిన ఆదాయం గత ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయం కంటే 15 శాతం ఎక్కువ అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: కోవిన్ 2.0 రెడీ.. రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా! వాట్సాప్ లో అందుబాటులోకి సరికొత్త ఫీచర్ -
సామాన్యుడి నడ్డి విరిచేలా.. ఒక నెలలోనే ‘వంద’
సాక్షి, అమరావతి: సామాన్యుడి నడ్డి విరిచేలా రాయితీ గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు అమాంతం పెంచాయి. దీంతో వంటింట్లో గ్యాస్ బండ సామాన్యులకు మోయలేని భారంగా మారుతోంది. ఒక్కో సిలిండర్‌పై ఈ నెల 4వ తేదీన రూ.25, 15న రూ.50 పెంచగా ప్రస్తుతం మరో రూ.25 ధర పెంచాయి. ఒకే నెలలో సుమారు రూ.100 వరకు ధర పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గృహ వినియోగ సిలిండర్ (14.2 కేజీల) ధర ప్రస్తుతం విజయవాడలో రూ.816.50, ఒంగోలులో రూ.839.50, కందుకూరులో రూ.841.50కు (రవాణా చార్జీల వల్ల వ్యత్యాసం) పెరిగింది. భవిష్యత్తులో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సబ్సిడీలోనూ భారీ కోత వినియోగదారులకు కేంద్రం ఇచ్చే సబ్సిడీలోనూ భారీగా కోత విధించారు. ఒక్కో సిలిండర్‌పై గత ఏడాది రూ.220 చొప్పున సబ్సిడీ మొత్తం వినియోగదారుల బ్యాంకు అకౌంట్‌కు జమ అయ్యేది. ప్రస్తుతం సబ్సిడీ మొత్తం కేవలం రూ.15.38 మాత్రమే జమ చేస్తున్నారు. రాష్ట్రంలో వినియోగదారులకు ప్రతి రోజూ సగటున రెండు లక్షలకు పైగా సిలిండర్లు డెలివరీ చేస్తున్నారు. గతంలో రోజూ సబ్సిడీ మొత్తం రూ.4.50 కోట్లు వినియోగదారులకు అందుతుండేది. ప్రస్తుతం ఆ మొత్తం కేవలం రూ.30.76 లక్షలకు మాత్రమే పరిమితమైంది. మున్ముందు సబ్సిడీ పూర్తిగా ఎత్తేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా, గ్యాస్ ధర పెంపుపై సామాన్యులు పెదవి విరుస్తున్నారు. చదవండి: బాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి! తాడిపత్రిలో బయటపడ్డ ‘జేసీ’ ప్రలోభాలు -
ఈ నెలాఖరున ఎంసెట్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ నోటిఫికేషన్ ఈ నెలాఖరున జారీ చేసేందుకు ఎంసెట్ కమిటీ కసరత్తు చేస్తోంది. జూలై 5 నుంచి 9 వరకు నిర్వహించే ఈ పరీక్షల్లో సాధారణంగా ముందు మూడ్రోజుల పాటు (5, 6, 7 తేదీల్లో) ఆన్లైన్లో ఇంజనీరింగ్ ఎంసెట్‌ను 6 సెషన్లలో (రోజుకు 2 సెషన్లు) నిర్వహిస్తారు. అవసరమైతే 8వ తేదీన కూడా ఒక సెషన్ నిర్వహించే అవకాశముంటుంది. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్‌ను 8, 9 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు. అయితే ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు(జూలై 3న), ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షల ప్రారంభ తేదీకి మధ్య ఒకరోజు గడువే ఉంటోంది. మరోవైపు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష తేదీలు ఇంకా ఖరారు కాలేదు. కాబట్టి నీట్ తేదీలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్ ఎంసెట్‌ను ముందుగా నిర్వహించాలా? ఇంజనీరింగ్ ఎంసెట్‌ను ముందుగా నిర్వహించాలా? అన్న విషయంలో మరోసారి ఉన్నత విద్యామండలితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఎంసెట్ కమిటీ భావిస్తోంది. ఇక, ఈసారి 160 ప్రశ్నలకు బదులు 180 ప్రశ్నలిస్తే విద్యార్థులకు 20 ప్రశ్నలు ఆప్షన్‌గా ఉండేలా కసరత్తు చేస్తోంది. వీటన్నింటిపై చేపట్టిన ప్రక్రియ ఈ నెలాఖరుకల్లా పూర్తయితే నెలాఖరున ఎంసెట్ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. లేదంటే వచ్చే నెల మొదటి వారంలో జారీ చేయనుంది. -
బంగారం కొనే వారికి గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: బంగారం కొనాలనుకునే వారికీ గుడ్‌న్యూస్. గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు పెరిగిన కూడా దేశీయ మార్కెట్ లో పసిడి ధరలు పడిపోవడం విశేషం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను తగ్గిస్తామని ప్రకటించడంతో ఆ ప్రభావం పసిడిపై పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దింతో ఏడు నెలల కనిష్టానికి బంగారం ధరలు చేరుకున్నాయి.(చదవండి: రిలయన్స్ జోరుకు ఢిల్లీ హైకోర్టు బ్రేక్) దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారు రేట్లు తగ్గుతూ వచ్చాయి. ఎంసిఎక్స్‌లో 24క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు రూ.440 క్షిణించి రూ.48,380 చేరుకుంది. బెంగుళూరు నగరంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు రూ.44,350గా ఉంది. కాస్మోపాలిటన్ నగరమైన హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు రూ.440 క్షిణించి రూ.48,380 చేరుకోగా పది గ్రాముల 22క్యారెట్ల బంగారం 400 పతనంతో 44,350 రూపాయలకు చేరుకుంది. దింతో పాటు కేజీ వెండిపై వెయ్యి రూపాయలు దిగొచ్చి రూ.72 వేల 200కు చేరుకుంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. -
మూవీ క్విజ్: రవితేజ ‘భద్ర’లో హీరోయిన్ ఎవరు?
సినీ సెలబ్రిటీలు తమ బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడంలో చాలా ఆసక్తి చూపుతారు. తమ సినిమాలను వారు పుట్టిన లక్కీ నెలలో ప్రకటించడం, విడుదల చేయటం వంటివి చేస్తారు. తాజాగా ఫిబ్రవరి నెలలో పుట్టి, ప్రేక్షకుల మనసు దోచుకున్న పులువురు మూవీ స్టార్స్ గురించి క్విజ్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1521341774.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1531341776.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కొత్త ఏడాదిలో వాట్సాప్ నుంచి బిగ్ అప్డేట్
ప్రపంచ వ్యాప్తంగా బాగా గుర్తింపు పొందిన మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇంతలా ఆదరిస్తున్న తన వినియోగదారుల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూనే ఉంటుంది. తాజాగా కొత్త ఏడాదిలో కూడా కొత్త అప్డేట్ తో ముందుకు వచ్చింది. ఈ అప్డేట్ లో భాగంగా టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ అప్డేట్ ను తీసుకొచ్చింది. 2021లో కొత్త నియమ నిబంధనలు తీసుకొస్తున్నట్లు గతంలో వాట్సాప్ ప్రకటించింది. అందులో భాగంగానే ఈ టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ అప్డేట్ ను తీసుకొచ్చినట్లు వాట్సాప్ తన బ్లాగ్ వాబీటా ఇన్ఫోలో ప్రకటించింది.(చదవండి: మార్కెట్లోకి వన్‌ప్లస్ కొత్త ప్రోడక్ట్) కొత్తగా తీసుకొచ్చిన టర్మ్స్ అండ్ ప్రైవసీ రూల్స్‌ని ప్రతి ఒక్కరు అంగీకరించాల్సి ఉంటుంది. ఒకవేల వాట్సాప్ కొత్త రూల్స్‌ని అంగీకరించక పొతే వారి మొబైల్లో తమ సేవలను 2021 ఫిబ్రవరి 8 నుంచి నిలిపివేయనునట్లు ప్రకటించింది. ప్రతి ఒక్కరికి ఈ కొత్త టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ రూల్స్‌ని దశల వారీగా పంపుతున్నట్లు పేర్కొంది. చాలా మంది తమకు ఈ కొత్త అప్డేట్ వచ్చినట్లు షేర్ చేసుకుంటున్నారు. గతంలో 19 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంలో భాగంగా ఫేస్బుక్ 2014లో కొనుగోలు చేసినప్పటి నుండి ఇది ఎలా పనిచేస్తుందనే దానిపై వాట్సాప్ విమర్శలను ఎదుర్కొంది. యూజర్ల గోప్యత మరియు డేటా భద్రత గురించి చాలా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ కొత్త రూల్స్‌ని తీసుకొస్తుంది. -
వాహనదారులకు కేంద్రం శుభవార్త
న్యూఢిల్లీ: వాహనదారులకు శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం. గతంలో జనవరి 1 నుండి ఫాస్ట్‌టాగ్ ను తప్పని సరిచేస్తూ తీసుకున్న నిబంధనలను మరోసారి సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం ఫాస్ట్‌టాగ్ ఉపయోగించి జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలు చేయడానికి గడువును రోడ్డు రవాణా మరియు రహదారి మంత్రిత్వ శాఖ పొడిగించింది. ఈ గడువు మొదట జనవరి 1, 2021 వరకు ఉండేది. తాజాగా ఫిబ్రవరి 15, 2021 వరకు పొడిగించబడింది. అసలు గడువు ప్రకారం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జనవరి 1 నుండి టోల్ ప్లాజాలలో ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపుకు పూర్తిగా మారాలని నిర్ణయించారు.(చదవండి: అమెజాన్‌లో 'మెగా శాలరీ డేస్' సేల్) ప్రస్తుతం, ఫాస్ట్ ట్యాగ్ ద్వారా చేసిన లావాదేవీల వాటా 75-80 శాతం ఉంటుందని చెబుతున్నారు. డిజిటల్, ఐటీ ఆధారిత టోల్ ఫీజుల చెల్లింపు విధానాలను ప్రోత్సహించే దిశగా 2017 డిసెంబర్ 1కి ముందు విక్రయించిన వాహనాలన్నింటికీ ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఫీబ్రవరి 15 నుండి 100 శాతం నగదు రహిత రుసుము వసూలు చేయాలనీ కేంద్రం భావిస్తుంది. ప్రభుత్వం ఇంకో వైపు సింగల్ లేన్ మినహా అన్ని దారులను ఫాస్ట్ ట్యాగ్ లేన్లుగా మార్చాలని చూస్తుంది. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా చూడటం వల్ల ఇటు ఇంధనంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది అని కేంద్రం పేర్కొంది. -
పెన్షనర్లకు ఊరట : కీలక ఉత్తర్వులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌దారులకు ఊరట. కేంద్ర పెన్షన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును మరో రెండు నెలలు పెంచుతూ కేంద్రప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఈ గడువును పెంచాలన్న పెన్షన్‌దారుల సంఘాల విజ్ఞప్తి మేరకు 2021 ఫిబ్రవరి 28 వరకు పెంచుతూ కేంద్ర పెన్షన్ వెల్ఫేర్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని లైఫ్ సర్టిఫికేట్ గడువును మరికొంత కాలం పెంచాలంటూ వివిధ పెన్షన్‌దారుల సంఘాల నుంచి పిటిషన్లు సంబంధిత మంత్రిత్వ శాఖకు వెల్లువెత్తడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని భారత ప్రభుత్వ అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. కోవిడ్-19 కేసులు వరకు పెరుగుతున్న నేపథ్యంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయంతో సంప్రదించిన పిదప ఈ గడువును 2021 ఫిబ్రవరి 28 వరకు పెంచినట్టు తెలిపారు. అలాగే పొడిగించిన కాలంలో, (ఫిబ్రవరి వరకు) ప్రతీ నెలా పెన్షన్ యథావిధిగా చెల్లిస్తామని పేర్కొన్నారు. వాయిదా ప్రధాన లక్ష్యం వివిధ శాఖల వద్ద విపరీతమైన రద్దీని నివారించడమనీ, సంబంధిత శాఖలలో సరైన పారిశుద్ధ్యం, సామాజిక దూరాన్ని పాటించాలని నోటీసులో పేర్కొంది. కాగా ప్రతీ ఏడాది పింఛనుదారులు నవంబర్‌లోగా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంది. కరోనా ప్రభావం వృద్ధులపై తీవ్రంగా ఉంటుందనే ఆందోళన మేరకు కేంద్ర పెన్షన్ వెల్ఫేర్ శాఖ లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసే చివరి తేదీని 2020 డిసెంబర్ 31వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. -
ఫిబ్రవరికల్లా కోవాగ్జిన్
న్యూఢిల్లీ: కోవిడ్‌పై పోరుకు భారత్ బయోటెక్ కంపెనీ సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కోవాగ్జిన్ పేరుతో కంపెనీ తయారు చేస్తున్న టీకా మూడో దశ మానవ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. భారత్ బయోటెక్ భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) లు కలిసి ఈ టీకాను తయారు చేస్తున్నాయి. వ్యాక్సిన్ సామర్థ్యం బాగానే ఉందని ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త, టీకా టాస్క్‌ఫోర్స్ సభ్యుడు రజనీకాంత్ గురువారం న్యూఢిల్లీలో తెలిపారు. ‘‘వచ్చే ఏడాది మొదట్లో.. ఫిబ్రవరి లేదా మార్చిలలో అందుబాటులోకి (టీకా) వస్తుంది’’అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే నిజమైతే భారత్ సిద్ధం చేసిన తొలి కోవిడ్ నిరోధక టీకాగా కోవాగ్జిన్ రికార్డు సృష్టిస్తుంది. భారతీయులను నిలిపేసిన చైనా భారత్ నుంచి చైనాకు వెళ్లేందుకు కేటాయించిన విమానాలను చైనా నిలిపివేసింది. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో భారతీయులు తమ దేశంలోకి ప్రవేశించడాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు చైనా ఎంబసీ ప్రకటించింది. దాదాపు 2 వేల మంది ఈ చర్య వల్ల భారత్‌లోనే ఆగిపోయే అవకాశం ఉంది. సరైన పర్మి ట్లు ఉన్నప్పటికీ నిలిపివేస్తున్నట్లు చెప్పింది. మళ్లీ 50 వేలు దేశంలో ఇటీవల కరోనా కొత్త కేసులు రోజుకు 50 వేల లోపు నమోదు కాగా, గురువారం ఆ సంఖ్య 50 వేలు దాటింది. గత 24 గంటల్లో 50,210 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 83,64,086కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 704 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,23,611కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కోలుకున్న వారి సంఖ్య 77,11,809కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 92.20 శాతానికి చేరింది. -
వచ్చే ఫిబ్రవరిలో అండర్–17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్
న్యూఢిల్లీ: భారత్ వేదికగా ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సిన అండర్–17 మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడింది. మంగళవారం ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు ప్రపంచకప్ జరుగుతుందని ‘ఫిఫా’ ప్రకటించింది. మొత్తం ఐదు వేదికల్లో (కోల్‌కతా, గువాహటి, భువనేశ్వర్, నవీ ముంబై, అహ్మదాబాద్) ఈ టోర్నీని నిర్వహించనుండగా... మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య హోదాలో భారత మహిళల జట్టు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. -
చల్లబడిన రీటైల్ ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారుల ధరల సూచిక ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2020 ఫిబ్రవరిలో 6.58 శాతానికి దిగి వచ్చింది. కూరగాయలు, ఇతర వంట వస్తువుల ధరలు చల్లబడటంతో ఫిబ్రవరిలో ఆరు నెలల తర్వాత తొలిసారి రిటైల్ ద్రవ్యోల్బణం 6.58 శాతానికి తగ్గిందని ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది.రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జనవరిలో 7.59 శాతం, గత ఏడాది ఫిబ్రవరిలో 2.57 శాతంగా ఉంది. ఫిబ్రవరిలో మాంసం, చేపల విభాగ ద్రవ్యోల్బణం 10.2 శాతంగా ఉంది. అంతకుముందు నెలలో ఇది 10.5 శాతంగా ఉంది. 2019 ఆగస్టు నుండి పెరుగుతూ వస్తున్న సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం తొలిసారని తనదిశను మార్చుకుంది. కూరగాయల ధరల ద్రవ్యోల్బణం జనవరిలో 50.19 శాతం గరిష్ట స్థాయి నుండి 31.61 శాతానికి చల్లబడింది. ప్రోటీన్ అధికంగా ఉండే పప్పుధాన్యాలు గుడ్ల విషయంలో ధరల పెరుగుదల రేటు కూడా నెమ్మదిగా ఉంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన సీపీఐ గణాంకాల ప్రకారం 2020 ఫిబ్రవరిలో ఆహారద్రవ్యోల్బణం 10.81 శాతంగా ఉంది. అంతకుముందు నెలలో ఇది 13.63 శాతం. అయితే, 'ఇంధన కాంతి' విభాగంలో ద్రవ్యోల్బణం అంతకుముందు నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో దాదాపు 6.36 శాతానికి పెరిగింది. మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనాకి కరోనా వైరస్ ఆందోళనలు తోడు కావడంతో ఆర్బీఐ ఈసారి భారీగా వడ్డీ రేట్ల కోత పెట్టనుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 2020 ఏప్రిల్ 3 నుంచిప్రారంభంకానున్న ఏంపీసీ సమావేశాల్లో ఈసారి 50 బీపీఎస్‌పాయింట్ల మేర వడ్డీరేట్లను తగ్గించవచ్చని భావిస్తున్నారు. గత సమీక్షలో రెపో రేటును 5.15 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. ఇప్పటికే పలుదేశాల కేంద్రబ్యాంకులు వడ్డీరేటు కోతను ప్రకటించాయి. -
మారుతి కార్ల విక్రయాలు డౌన్..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమన భయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కార్ల విక్రయాలు ఫిబ్రవరి నెలలో 1.1 శాతం పడిపోయాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ 1,48,682 కార్లను విక్రయించగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 1,48,682 యూనిట్ల అమ్మకాలు జరిగాయని మారుతి సుజుకి ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశీ కార్ల విక్రయాలు గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 1.6 శాతం తగ్గాయని..అల్టో, వాగనార్, వంటి మినీ కార్ల విక్రయాలు మాత్రం 11.1 శాతం పెరగడం గమనార్హం. ఇక స్విఫ్ట్, బలేనో, ఇగ్నిస్, డిజైర్ వంటి కాంపాక్ట్ సెగ్మెంట్లో అమ్మకాలు 3.9 శాతం తగ్గుదల నమోదైంది. ఇక విటారా బ్రెజా, ఎస్ క్రాస్, ఎర్టిగా సేల్స్ గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో 3.5 శాతం మేర పెరిగాయని కంపెనీ తెలిపింది. మరోవైపు ఫిబ్రవరిలో ఎగుమతులు 7.1 శాతం వృద్ధి నమోదు చేశాయని మారుతి సుజుకి వెల్లడించింది. చదవండి : కొత్త ఇంజీన్‌తో ఆకర్షణీయంగా మారుతి ఇగ్నిస్ -
కేజ్రీవాల్.. ఫిబ్రవరి 14!
సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ జీవితానికి ఫిబ్రవరి 14కి ఆసక్తికర బంధముంది. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 49 రోజుల తర్వాత ఫిబ్రవరి 14ననే ఆయన రాజీనామా చేశారు. 2015లో గెలిచాక ఫిబ్రవరి 14వ తేదీనే ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోయేదీ ఫిబ్రవరి 14వ తేదీననే అని సమాచారం. కేజ్రీవాల్‌ది ప్రేమ వివాహం. ఎగ్జిట్ పోల్స్ నిజం! ఆప్ గెలుస్తుందన్న ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఢిల్లీలో ఆప్ విజయం సాధించింది. ఇండియాటుడే–యాక్సిస్, ఏబీపీ–సీ ఓటర్, టీవీ9 భరత్వర్ష్లు అంచనా వేసినట్లే సీట్లు వచ్చాయి. ఇండియా టుడే–యాక్సిస్ సర్వే ఆప్‌కి 59–68 సీట్లు వస్తాయని వెల్లడించింది. బీజేపీకి 2 నుంచి 11 సీట్లొస్తాయని చెప్పింది. ఏబీపీ–సీ ఓటర్ ఆప్‌కి 49 నుంచి 63 స్థానాలూ, బీజేపీకి 5 నుంచి 19 స్థానాలూ వస్తాయని చెప్పింది. ఇక టీవీ 9 భరత్‌వర్ష్ అంచనాల ప్రకారం ఆప్‌కి 52 నుంచి 64, బీజేపీకి 6 నుంచి 16 స్థానాలు వస్తాయని వెల్లడించింది. (చదవండి: ఆప్.. మళ్లీ స్వీప్) మీరు అద్భుతం చేశారు.. ఐ లవ్ యూ ఎన్నికల్లో ఘనవిజయం అందించిన ఢిల్లీ ప్రజలకు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఆప్ విజయాన్ని భరత మాత విజయంగా అభివర్ణించారు. ఢిల్లీ ప్రజలు తనను పెద్ద కొడుకుగా ఆదరించి ఈ విజయాన్ని అందించారన్నారు. ‘ఢిల్లీ ప్రజలారా.. మీరు అద్భుతం చేశారు.. ఐ లవ్ యూ’ అని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘ఈ రోజు ఢిల్లీ ప్రజలు ‘పని రాజకీయం(పాలిటిక్స్ ఆఫ్ వర్క్స్)’ అనే కొత్త తరహా రాజకీయ సంస్కృతికి తెర తీశారు’ అని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఉన్న వేదికపై నుంచి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. (చదవండి: ఏ.కే.–62) -
ఫిబ్రవరి 11 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే మార్చి 19వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆర్జేడీఈలను, డీఈవోలను ఆదేశించింది. నిర్ణీత తేదీల్లో అన్ని ఉన్నత పాఠశాలల్లో పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాలని పేర్కొంటూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఫిబ్రవరి 11, 12, 13, 14, 15, 17, 18, 19, 20, 24, 25 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించాలని స్పష్టంచేసింది. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు వచ్చే ఏప్రిల్ 7 నుంచి 16వ తేదీ వరకు వార్షిక పరీక్షలను (ఎస్ఏ–2) నిర్వహించాలని తెలిపింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పరీక్షలను ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 6, 7 తరగతుల వారికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు, 8వ తరగతి వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు, 9వ తరగతికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పేపర్–1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు పేపర్–2 పరీక్షలు నిర్వహించాలని వెల్లడించింది. ఏప్రిల్ 18వ తేదీన ఫలితాలను ప్రకటించి, విద్యార్థులకు జవాబు పత్రాలను అందజేయాలని, 20వ తేదీన పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహించాలని సూచించింది. -
ఫిబ్రవరి 5 నుంచి మేడారం జాతర
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు మేడారం జాతర జరుగుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశముందని, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సంక్షేమ భవన్లో మేడారం జాతర ఏర్పా ట్లపై ఆమె సమావేశం నిర్వహించారు. జాతరకు డిసెంబర్ చివరి వారం నుం చే భక్తుల తాకిడి ఉంటుందని, కాబట్టి డిసెంబర్ నెలాఖరుకల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. పార్కిం గ్, వసతుల కల్పనలో లోపాలు ఉండద్దన్నారు. జాతరకు వచ్చే భక్తులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ సందర్శించేందుకు వీలుగా పర్యా టక ప్రాంతాలపై ప్రచారం చేయాలన్నారు. జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించడానికి కృషి చేస్తున్నామన్నారు. పాలు, పాల ఉత్పత్తుల సరఫ రా కోసం విజయ డైరీని భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. జాతర కోసం ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసిందని, వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణకు వీటిని వెచ్చిస్తామని మంత్రి చెప్పారు. -
ఫిబ్రవరిలో తగ్గిన వాణిజ్యలోటు
న్యూఢిల్లీ: ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు ఫిబ్రవరిలో ఉపశమించింది. దిగుమతులు తగ్గడం దీనికి ప్రధాన కారణం. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే... ► దిగుమతుల విషయంలో ఈ మొత్తం 36.26 బిలియన్ డాలర్లు. గత ఏడాది (2018 ఫిబ్రవరి) ఇదే నెలతో పోల్చిచూస్తే, ఈ విలువ 5.4 శాతం తగ్గింది. ► వెరసి వాణిజ్యలోటు ఫిబ్రవరిలో 9.6 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు 2018 ఫిబ్రవరిలో 12.3 బిలియన్ డాలర్లు అయితే, 2019 జనవరిలో ఈ విలువ 14.73 బిలియన్ డాలర్లు. ►పసిడి, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు తగ్గాయి. దీనితో దిగుమతులు మొత్తంగా తగ్గాయి. పసిడి దిగుమతులు 11 శాతం తగ్గి 2.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 2.89 బిలియన్ డాలర్లు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 8 శాతం తగ్గి 9.37 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్– ఫిబ్రవరి మధ్య... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– ఫిబ్రవరి మధ్య ఎగుమతుల విలువ 8.85 శాతం పెరిగి 298.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల విలువ 9.75 శాతం పెరిగి 464 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు దాదాపు 166 బిలియన్ డాలర్లు. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ విలువ 149 బిలియన్ డాలర్లు. అవరోధాలను అధిగమిస్తున్నాం: ఎఫ్ఐఈఓ అంతర్జాతీయంగా వాణిజ్య రక్షణాత్మక విధానాలు ఉన్నాయి. కఠిన అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు ఉన్నాయి. దేశీయంగానూ ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ఎగుమతులు కొంత సానుకూలంగానే నమోదయ్యాయి. మొత్తం 30 ప్రధాన గ్రూపుల్లో 18 సానుకూల ఫలితాలను అందించాయి. – గణేశ్ కుమార్ గుప్తా, ఎఫ్ఐఈఓ సేవలు తగ్గాయి... సేవల ఎగుమతులు 2018 డిసెంబర్‌తో పోల్చితే, 2019 జనవరిలో 1.02 శాతం తగ్గాయి. 17.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక సేవల దిగుమతులు కూడా ఇదే కాలంలో 3.07 శాతం తగ్గి 11.03 బిలియన్ డాలర్లకు చేరాయి. -
టోకు ద్రవ్యోల్బణానికి కూర‘గాయాల్’ సెగ
సాక్షి, న్యూఢిల్లీ : టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పైకి ఎగబాకిగింది. కూరగాయలు, ఇంధన ధరలు బాగా పెరగడంతో ఫిబ్రవరి నెలలోని డబ్ల్యూపీఐ ఇన్ప్లేషన 2.93 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. గత జనవరిలో 2.76 శాతంతో 10 ఏళ్ల కనిష్టానికి చేరినా ఫిబ్రవరిలో అంతే వేగంగా ఎగిసింది. జనవరిలో 1.84 శాతంగా ఉన్న కూరగాయల ద్రవ్యోల్బణంతో పోలిస్తే ప్రస్తుతం 3.29( వార్షిక ప్రాతిపదికన)శాతానికి చేరింది. -
నాలుగు నెలల గరిష్టానికి రీటైల్ ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ : రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ నాలుగు నెలల గరిష్టాన్ని నమోదు చేసింది. జనవరి మాసంలో 2.05 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో 2.57 శాతానికి చేరింది. అటు ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి 1. 7 శాతానికి పడిపోయింది. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 2.05 శాతం నుంచి 2.57 శాతానికి పెరిగింది. ఫ్యాక్టరీ ఉత్పత్తి జనవరి నెలలో 2.4 శాతం నుంచి 1.7 శాతానికి క్షీణించింది. -
లక్ష కోట్ల మార్క్ దిగువకు జీఎస్టీ వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: రికార్డు కలెక్షన్ల పరంపర నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు ఫిబ్రవరి మాసంలో తగ్గుదలను నమోదు చేశాయి. ఫిబ్రవరి మాసపు జీఎస్టీ వసూళ్ల గణాంకాలను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. జనవరి నెలలో రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు ఫిబ్రవరి నెలలో రూ.97,247కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం రూ.97,247కోట్లు వసూలు కాగా అందులో కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ) రూ.17,626కోట్లు, రాష్ట్ర జీఎస్టీ(ఎస్జీఎస్టీ) రూ.24,192కోట్లు, ఐజీఎస్టీ రూ.46,953కోట్లుగా ఉన్నాయి. అలాగే దిగుమతుల మీద వసూలైన సెస్ కింద రూ.21,384కోట్లు, సెస్ కింద రూ.8,476కోట్లు వసూలయ్యాయి. విక్రయాలకు సంబంధించి దాఖలయ్యే రిటర్నరులు(జీఎస్టీఆర్-3బీ) 73.48లక్షలకు చేరాయి. కాగా గత నెల జీఎస్టీ వసూళ్లు రూ.1.02లక్షల కోట్లు వచ్చాయి. ఒక నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను దాటడం ఇది మూడోసారి. గతేడాది ఏప్రిల్, అక్టోబరులో ఈ స్థాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. -
రెడ్మి నోట్ 7 లాంచింగ్ ఈ నెలలోనే
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 7 భారత్ లో విడుదలపై క్లారిటీ ఇచ్చింది. ఎప్పటినుంచో స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవవరి 28న ఆవిష్కరించన్నుట్టు అధికారిక ట్విటర్లో షావోమి ప్రకటించింది. ఇప్పటికే చైనా మార్కెట్లో మిలియన్ అమ్మకాలతో దూసుకుపోతోంది. రెడ్ మి నోట్ 7 లో 48 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న భారీ కెమెరాను అమర్చగా మూడు వేరియంట్లలో బ్లాక్, బ్లూ, పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. 3 జీబీ/32జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.10,390 ధరకు లభ్యం కానుంని తెలుస్తోంది. 4జీబీ/64జీబీ స్టోరేజ్ ధర రూ. 12,460, 6జీబీ/64జీబీ స్టోరేజ్ ధర రూ.14,540లుగా ఉండనుందని అంచనా. రెడ్మీ నోట్ 7 ఫీచర్లు 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 660 సాక్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 48+5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0. Your answer to when is #RedmiNote7 launching is finally here! Unleashing the #ǝɟᴉ7ƃnɥʇ on 28th Feb 2019. Register to buy the ticket for the launch event: https://t.co/ulSUeJlVgI. Limited seats! pic.twitter.com/GwfWwVMBvh — Mi India (@XiaomiIndia) February 14, 2019 -
సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ ఫిబ్రవరిలోనే!
-
ఫిబ్రవరిలో ట్రంప్, కిమ్ భేటీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో ఫిబ్రవరిలో మరోసారి సమావేశమవుతారని వైట్‌హౌస్ తెలిపింది. ఉత్తరకొరియా అణు నిరాయుధీకరణ, క్షిపణి అభివృద్ధి కార్యక్రమంపై ట్రంప్, కిమ్‌లు చర్చిస్తారని వెల్లడించింది. ఈ సమావేశం జరిగే వేదికను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. గతేడాది జూన్ 12న సింగపూర్‌లోని ఓ హోటల్లో ట్రంప్, కిమ్ తొలిసారి భేటీ అయ్యారు. కాగా, ఉత్తరకొరియా అణ్వస్త్రాలను త్యజించేవరకూ ఆంక్షలను కొనసాగిస్తామని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ తెలిపారు. మరోవైపు, అమెరికా దక్షిణ సరిహద్దులో నెలకొన్న మానవతా సంక్షోభంతో పాటు షట్డౌన్పై శనివారం మధ్యాహ్నం 3 గంటలకు (స్థానికకాలమానం) కీలక ప్రకటన చేస్తానని ట్రంప్ ట్విట్టర్లో తెలిపారు. -
ముహూర్తం ఫిబ్రవరి 10
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గాన్ని ఫిబ్రవరి రెండో వారంలో విస్తరించనున్నారు. అత్యున్నత అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీ వసంత పంచమి పర్వదినాన మంత్రివర్గ విస్తరణ జరగనుంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండటం, మంచి ముహూర్తాలు లేకపోవడంతో మంత్రివర్గ విస్తరణను ఫిబ్రవరిలో పెట్టుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే తొలి విడతలో ఎనిమిది మందికే చోటు ఉంటుందని, లోక్‌సభ ఎన్నికల తరువాత జరిగే విస్తరణలో మరో ఎనిమిది మందికి అవకాశం కల్పించి పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. మంత్రివర్గాన్ని ఎప్పుడు విస్తరిస్తారు, ఎవరెవరికి స్థానం లభిస్తుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. విస్తరణలో మంత్రి పదవులు పొందే ఆ ఎనిమిది మంది ఎవరన్నదానిపై అధికార పార్టీలో ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ఈసారి విస్తరణలో కొత్త వారికి అవకాశం ఇవ్వకపోవచ్చని, అందరూ పాతవారే ఉంటారని కొందరంటుంటే కనీసం ఇద్దరు కొత్త వారు ఉండే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం రాని వారికి ఇతరత్రా కీలక పదవులు కూడా అప్పుడే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఎవరెవరు మంత్రివర్గంలో ఉండాలి, అవకాశం లేని వారిని ఏ పదవుల్లో నియమించాలన్న విషయంలో సీఎం ఇప్పటికే పలుమార్లు కరసత్తు చేసినట్లు సమాచారం. కేబినెట్ హోదా ఉండే పదవుల్లో డిప్యూటీ స్పీకర్‌తోపాటు శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్, మండలిలో చీఫ్ విప్, శాసనసభలో, మండలిలో ఇద్దరు లేదా ముగ్గురేసి చొప్పున విప్ల పదవులు ఉండనున్నాయి. ఇవి కాకుండా పార్లమెంటరీ కార్యదర్శుల పేరుతో మరికొందరికి కూడా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఆ ఎనిమిది మంది ఎవరు? తొలి దశ మంత్రివర్గ విస్తరణలో పాత మంత్రులకే అవకాశం లభించవచ్చు. టీఆర్ఎస్లో, ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నేతలకు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి అభీష్టం మేరకు మంత్రి మండలి ఉంటుందని, ఈ విషయంలో ఆయన తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని ఓ సీనియర్ నేత అన్నారు. ‘ముఖ్యమంత్రి ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలన్నీ పరిశీలిస్తే పాత వారికి దాదాపుగా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందనే అనుకుంటున్నా. శాసనసభ ఎన్నికల్లో అనేక మంది సిట్టింగ్‌లు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని తెలిసినా ఆయన నలుగురు మినహా పాత వారందరికీ టికెట్లు ఇచ్చారు. మహమూద్ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలకు కీలక పదవులిచ్చారు. ఇవన్నీ గమనిస్తే ముఖ్యమంత్రి అందరికీ ఏదో విధంగా న్యాయం చేస్తారనిపిస్తోంది’అని ఆ సీనియర్ నేత విశ్లేషించారు. మంత్రివర్గంలో ఎవరు ఉంటారన్న విషయంలో ముఖ్యమంత్రి తన మనోగతాన్ని ఇప్పటిదాకా ఎవరితోనూ పంచుకోలేదని పార్టీ ముఖ్య నాయకులు అంటున్నారు. అయితే సమయం చిక్కినప్పుడల్లా ఆయన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల జాబితా ముందు పెట్టుకొని ఎవరికి ఏ అవకాశం ఇవ్వాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నారని ఓ మాజీ మంత్రి అన్నారు. తొలి దశ విస్తరణ రేసులో ఉన్నది వీరే... తొలి మంత్రివర్గ విస్తరణలో స్థానం పొందే వారిలో ఈటల రాజేందర్ (కరీంనగర్), కడియం శ్రీహరి (జనగామ), జి. జగదీశ్‌రెడ్డి (సూర్యాపేట), సి. లక్ష్మారెడ్డి (మహబూబ్‌నగర్), కేటీ రామారావు (సిరిసిల్ల), టి. హరీశ్‌రావు (సిద్దిపేట), తలసాని శ్రీనివాస్ యాదవ్ (గ్రేటర్ హైదరాబాద్), జోగు రామన్న (ఆదిలాబాద్) ఉండొచ్చని ఒక అంచనా. తొలి దశలోనే ఎస్టీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం భావిస్తే డీఎస్ రెడ్యానాయక్ (మహబూబాబాద్ జిల్లా)కు అవకాశం రావచ్చని అంటున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్‌గా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ పేరు వినిపిస్తోంది. స్పీకర్ పదవిని ఇప్పటికే రెడ్డి సామాజికవర్గానికి కేటాయించడంతో ఈసారి పద్మాదేవేందర్‌రెడ్డికి ఆ అవకాశం లేకపోవచ్చు. ఆమెకు మలి దశ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి లేదా మరో కేబినెట్ హోదా పదవి లభించొచ్చు. అయితే మలి విడత మంత్రివర్గ విస్తరణలో పదవులు ఆశించే వారి సంఖ్య రెండు డజన్ల దాకా ఉంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువ మంది శాసనసభకు ఎన్నిక కావడంతో పోటీ కూడా తీవ్రంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల తరువాత విస్తరించనున్న మంత్రివర్గంలో ముగ్గురు రెడ్లకు అవకాశం లభించవచ్చు. ఈ కోటాలో మంత్రి పదవి కోసం నాయిని నర్సింహారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. వారిలో ఒకరిద్దరికి చీఫ్ విప్, విప్ పదవులు కట్టబెట్టే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్... కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాతే రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల మంత్రివర్గ విస్తరణ తరువాత మార్చి రెండో వారంలో తాత్కాలిక బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తికాగానే మలి విడత మంత్రివర్గ విస్తరణ చేపట్టి జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్‌కు సిద్ధం కావాలని ఆయన యోచిస్తున్నారు. -
ఫిబ్రవరి నెలాకరులో పీఆర్సీ నివేదిక!
-
భారీగా పెరిగిన ఎయిర్‌లైన్ ట్రాఫిక్: పుంజుకున్న షేర్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు ఇండిగో, గో ఎయిర్ లాంటి విమాన యాన సంస్థలకు చెందిన విమానాలపై నిషేధం కొనసాగుతుండగా దేశీయ పాసింజర్ ఎయిర్ ట్రాఫిక్ పెరుగుదలను నమోదు చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తన నెలవారీ దేశీయ ట్రాఫిక్ నివేదికలో పేర్కొన్న ప్రకారం ఫిబ్రవరిలో విమాన ప్రయాణికుల సంఖ్య(ఏవియేషన్ ట్రాఫిక్) 24 శాతం జంప్‌చేసింది. 24 శాతం వృద్ధితో 2018 ఫిబ్రవరి నాటికి దేశీయ దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య 1.07 కోట్లకు పెరిగింది. మొత్తం దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ జనవరి నెలలో 1.14 కోట్లకు పెరిగింది. డిజిసిఎ ఇచ్చిన సమాచారం ప్రకారం జనవరి-ఫిబ్రవరి 2018 నాటికి ప్రయాణీకుల రద్దీ 21.80 శాతం పెరిగింది. 2017 నాటికి 86.55 లక్షల నుంచి పెరిగినట్లు సోమవారం వెల్లడించిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. దీంతో విమానయాన కంపెనీల కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. జెట్ ఎయిర్వేస్ 2 శాతం, స్పైస్‌జెట్ 1.2 శాతం, ఇంటర్‌గ్లోబ్(ఇండిగో) 0.75 శాతం లాభపడింది. -
పుంజుకున్న ఎగుమతులు
సాక్షి, న్యూఢిల్లీ: గత జనవరిలో భయపెట్టిన భారత వాణిజ్యలోటు కొద్దిగా చల్లబడింది. ఫిబ్రవరి మాసానికి సంబంధించి వాణిజ్య లోటు 12బిలియన్ డాలర్లుగా ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గురువారం వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం ఎగుమతులు 4.5 శాతం దిగుమతులు 10.4 శాతం పెరిగాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడంతో దిగుమతులు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 4.5 శాతం పెరుగుదలతో 25.8 బిలియన్ల డాలర్ల ఎగుమతులను సాధించామని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా వెల్లడించారు. ఫిబ్రవరి వాణిజ్య లోటు గత మాసంలోని 16.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే 12 బిలియన్ డాలర్లుగా ఉంది. అలాగే జనవరి 24.3 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పోలిస్తే ఫిబ్రవరి ఎగుమతులు 25.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో దిగుమతులు 37.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, రసాయనాలు, వెండి, ముత్యాల దిగుమతి పెరగడంతో వాణిజ్య లోటు జనవరిలో 56 నెలల గరిష్ఠానికి (16.3 బిలియన్ డాలర్లు) ఎగబాకింది. -
యూ ట్యూబ్ ఎపుడు మొదలైందో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం యూ ట్యూబ్ ఎపుడు ప్రారంభమైందో తెలుసా. పే పాల్ మాజీ ఉద్యోగి సృప్టించిన యూ ట్యూబ్ వాలెంటైన్స్ డే రోజున ప్రపంచానికి పరిచయమైంది. ఫిబ్రవరి 14 సోమవారం, 2005లో యూ ట్యూబ్‌ను యాక్టివేట్ చేశారు. ప్రస్తుతం గూగుల్ సొంతమైన యూ ట్యూబ్ 13 ఏళ్ల క్రితం తన సేవలను ప్రారంభించింది. ఆన్లైన్ చెల్లింపు సంస్థ పేపాల్ లో పనిచేస్తున్న సమయంలో ఛాడ్ హుర్లీ, స్టీవ్ చెన్, జావేద్ కరీమ్ యూ ట్యూబ్‌ను స్థాపించారు. కాలిఫోర్నియా కేంద్రంగా ఫిబ్రవరి 14న యాక్టివేట్ అయిన యూ ట్యూబ్ అదే ఏడాది ఏప్రిల్ 23న ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అంతే...యూజర్లను ఆకట్టుకోవడంలో శరవేగంగా దూసుకుపోయిన ఈ డొమైన్ ఒక సంవత్సరంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న సైట్లలో ఒకటిగా నిలిచింది. 2005 నవంబరులో వెంచర్ క్యాపిటల్ సంస్థ సీక్వోయా కాపిటల్ 3.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీ పార్టనర్, పేపాల్ మాజీ సీఎఫ్‌వో రూల్ఫ్ బోథా, యూ ట్యూబ్ డైరెక్టర్స్ బోర్డులో చేరారు. ఎన్బీసీ భాగస్వామ్యంతో మార్కెటింగ్ అండ్ ఎడ్వర్టైజింగ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో టైమ్స్ మ్యాగజైన్ అందించే ప్రతిష్టాత్మక పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా తన ఖాతాలో చేసుకుంది. 2006 నవంబర్ లో గూగుల్ 1.65 డాలర్లతో యూ ట్యూబ్‌ను సొంతం చేసుకుంది. తాజా నివేదికల ప్రకారం ప్రస్తుతం సుమారు 1 బిలియన్ వినియోగదారులుండగా ఒక రోజులో 30 మిలియన్లకు పైగా ప్రజలు దీన్ని సందర్శిస్తున్నారు. -
ఫిబ్రవరి13నే మహాశివరాత్రి
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 13నే మహాశివరాత్రిని నిర్వహిం చేందుకు ఇదివరకే వైదిక కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీశైల దేవస్థానం స్థానాచార్యులు çపూర్ణానందస్వామి చెప్పారు. సోమవారం ఆయన శ్రీశైలంలో విలేకరులతో మాట్లాడారు. శివరాత్రి ఎప్పుడన్న విషయంపై ఎవరికీ సందేహాలు అవసరం లేదన్నారు. శ్రీశైల దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ పంచాంగంలోనూ 13నే మహాశివరాత్రిగా పేర్కొన్నారని గుర్తుచేశారు. మిగిలిన అనేక పంచాంగాల్లో కూడా ఇదే ఉందని చెప్పారు. మహాశివరాత్రి ఫిబ్రవరి 14న అని కొందరు అంటున్నప్పటికీ 13నే జరుపుకోవాలని సూచించారు. -
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
-
ఫిబ్రవరిలో తేజ్‌పాల్ రేప్ కేసు విచారణ
పనాజి: తెహెల్కా మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ రేప్ కేసు సంవత్సరాల ఆలస్యం తర్వాత వచ్చే నెల నుంచి విచారణకు రానుంది. ఫిబ్రవరిలో విచారణ ప్రారంభమవుతుందని గోవా కోర్టు తెలిపింది. తన సహచర ఉద్యోగినిపై ఆయన అత్యాచారం జరిపారనేది అభియోగం. ఫిబ్రవరి 26నుంచి విచారణ ప్రారంభమై నాలుగు రోజులపాటు జరుగుతుందని, ఇన్‌కెమెరా విచారణ చేస్తామని అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి విజయపాల్ రూలింగ్ ఇచ్చారు. 2013లో తేజ్‌పాల్ తెహెల్కా మ్యాగజిన్కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా ఉన్నపుడు గోవాలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో తెహెల్కా నిర్వహించిన అంతర్జాతీయ సమావేశం సందర్భంగా తనపై అత్యాచారం జరిపారని సంస్థలోని మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరిపి ఆయన్ను అరెస్టు చేయగా ఏడాదిపాటు ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉండి ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యారు. దాంతో ఆయన మ్యాగజిన్లో తన పదవికి రాజీనామా చేశారు. -
ఫిబ్రవరి 1 నుంచి జీఎస్టీ ఈ–వే బిల్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను అనుసరించి ఏవేనీ రెండు రాష్ట్రాల మధ్య రూ.50 వేలకు మించి విలువ కలిగిన సరకులను రవాణా చేయాలంటే ఫిబ్రవరి 1 నుంచి ఎలక్ట్రానిక్ వే (ఈ–వే) బిల్లు తప్పనిసరని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఒకే రాష్ట్రంలో రవాణాకు ఈ–వే బిల్లులను ఎప్పుడు అమలుచేయాలనే విషయం రాష్ట్రాలకే వదిలేస్తున్నామనీ, ఫిబ్రవరి 1 నుంచి జూన్ 1 మధ్య వారు ఎప్పుడైనా ఈ–వే బిల్లులను తప్పనిసరి చేయొచ్చని ఆయన వెల్లడించారు. ఈ–వే బిల్లులు జారీ చేసేందుకు తగిన సాంకేతిక వ్యవస్థ సిద్ధం కాకపోవడంతో దీన్ని ఇన్నాళ్లూ వాయిదా వేశారు. -
ఫిబ్రవరి 1నుంచే ఇ-వే బిల్లు
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ పన్ను పరిధిలో ఇ-వే బిల్లు విధానాన్ని కచ్చితంగా అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం జరిగిన ఈ సమావేశంలో ఇ-వే బిల్లు విధానాన్ని తప్పని సరిచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంట్రా-స్టేట్ ఇ-వే బిల్లు జూన్ 1 నుంచి తప్పనిసరి చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వస్తువుల అంతర్ రాష్ట్ర ఇ-వే బిల్లు మాండేటరీ అని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. దీన్ని ట్రయల్ రన్ కోసం జనవరి 16నాటికి సిద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఇ-వే బిల్లు విధానం, ఇన్వాయిస్ మ్యాచింగ్ తదితర అంశాలపై చర్చించిన 24వ జీఎస్టీ మండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రూ. 50వేల విలువకంటే ఎక్కువ వస్తువులను రవాణా చేస్తే తప్పనిసరిగా ఇ-వే బిల్లు, రాష్ట్రంలో 10 కి.మీ లోపు వస్తువులను రవాణా చేస్తే ఇంట్రా స్టేట్ ఇ-వే బిల్లు ఉండాలి. కొన్ని రాష్ట్రాలు ఫిబ్రవరి 1 నుంచి స్వచ్ఛంద ప్రాతిపదికన ఇంటర్-స్టేట్ , ఇంట్రాస్టేట్ ఇ-వే బిల్లును అమలు చేస్తాయని కౌన్సిల్ తెలిపింది. అయితే ఇంట్రా స్టేట్ ఇ-వే బిల్లు విధానం మాత్రం ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా అంతర్ రాష్ట్ర వస్తువుల రవాణా, పన్నుల ఎగవేత నిరోధాన్ని ఇ-వే బిల్లు విధానాన్ని జనవరి 1 నుంచి దశలవారీగా..ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని గతంలో నిర్ణయించింది. దీనిపై రివ్యూ నిర్వహించిన మండలి ఈ నిర్ణయం అమలు ఫిబ్రవరికి ప్రీ పోన్ చేసింది. అలాగే నవంబరులో గువాహటిలో జరిగిన గత మండలి సమావేశంలో 178 వస్తువులపై పన్ను రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. -
137 ఏళ్ల రికార్డు బద్దలు...
వాషింగ్టన్: చల్లనైన నెలగా 2017 ఫిబ్రవరి రికార్డు సృష్టించింది. దాదాపు 137 ఏళ్ల తర్వాత అత్యంత తక్కువ ఉష్టోగ్రతలు గత ఫిబ్రవరిలో నమోదయ్యాయని న్యూయార్క్‌లోని నాసాకు చెందిన గొడార్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ స్టడీస్ తెలిపింది. 1951-1980 మధ్య కాలంలోని ఫిబ్రవరి నెలల కంటే 1.1 డిగ్రీల తక్కువ టెంపరేచర్స్ 2017 ఫిబ్రవరిలో నమోదయ్యాయని పేర్కొంది. అయితే, ఇప్పటి వరకు నమోదైన ఉష్ణోగ్రతల కంటే గత ఏడాది ఫిబ్రవరిలో అత్యధికంగా ఉష్టోగ్రతలు నమోదు కావటం కూడా ఒక రికార్డేనని తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరిలో సరాసరిన 1.3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రతతో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి సరాసరి ఉష్ణోగ్రతలు 0.20 తక్కువ రికార్డయ్యాయని వివరించింది. ఈ వివరాలను ప్రపంచవ్యాప్తంగా భూమితోపాటు సముద్ర జలాలపై ఉన్న దాదాపు 6,300 వాతావరణ స్టేషన్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా లెక్క కట్టినట్లు తెలిపింది. కాగా, 1880వ సంవత్సరం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతల నమోదు ప్రారంభమయిందని, అంతకుమునుపు రికార్డుల్లో ఉన్న వాతావరణ వివరాలు కేవలం ఏదో ఒక ప్రాంతానికే పరిమితమైనవని తన నివేదికలో తెలిపింది. -
ఎగుమతుల జోరు
⇒ ఫిబ్రవరిలో 17 శాతం వృద్ధి ⇒ 24.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు న్యూఢిల్లీ: ఎగుమతులు ఫిబ్రవరిలో పరుగులు తీశాయి. గత ఆరు నెలల కాలంలో అత్యధిక స్థాయిలో 17.48 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 24.5 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. పెట్రోలియం, ఇంజనీరింగ్, రసాయనాల ఎగుమతులు ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. అదే సమయంలో దిగుమతులు సైతం పెరగడంతో దేశ వాణిజ్య లోటు 8.89 బిలియన్ డాలర్లకు విస్తరించింది. గతేడాది ఫిబ్రవరిలో వాణిజ్య లోటు 6.57 బిలియన్ డాలర్లుగానే ఉంది. గతేడాది సెప్టెంబర్ తర్వాత మొదటి సారి ఎగుమతుల్లో రెండంకెల సానుకూల వృద్ధి నమోదైందని వాణిజ్య శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఇక దిగుమతులు ఫిబ్రవరిలో 21.76% అధికంగా 33.38 డాలర్ల మేర జరిగాయి. 2016 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఎగుమతుల్లో వృద్ధి 2.52%గా ఉందని, 245బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయని వాణిజ్య శాఖ వెల్లడించింది. దిగుమతులు 3.67% తగ్గి 340.7 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి. 11 నెలల కాలంలో వాణిజ్య లోటు 95.28 డాలర్లుగా ఉంది. -
నాలుగు నెలల గరిష్టానికి వినియోగ ధరల సూచీ
న్యూఢిల్లీ: ఫిబ్రవరి నెలకు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు భారీగా పెరిగింది. దేశం వార్షిక వినియోగదారుల ధర ద్రవ్యోల్బణం 3.65 శాతంగా నమోదైంది. 2016 అక్టోబర్ సెప్టెంబర్ స్థాయిని నమోదు చేసి , నాలుగునెలల గరిష్టానికి చేరింది. గత నెలలో ఇది 3.17శాతంగా ఉంది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరి మాసానికిగాను 2.01 శాతంగా నిలిచి ఐదు సంవత్సరాల కనిష్ఠ స్థాయికి చేరింది. ఈ గణాంకాలను ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. గత జనవరిలో ఇది 0.53శాతంగా ఉంది. రాయిటర్స్ఆర్థికవేత్తలు గత నెల వార్షిక చిల్లర ద్రవ్యోల్బణం జనవరిలో 3.17 శాతం పోలిస్తే, 3.58 శాతంగా ఉండనుందని భావించారు. -
డౌన్ లోడ్ స్పీడ్‌లో టాప్ అదే!
డౌన్ లోడ్ స్పీడులో రిలయన్స్ జియో మళ్లీ తన జోరు పెంచింది. జనవరి నెలలో నాలుగో స్థానానికి పడిపోయిన జియో, ఫిబ్రవరి నెలలో పైకి ఎగిసి, మరోసారి డౌన్ లోడ్ స్పీడులో మార్కెట్ లీడర్ గా నిలిచింది. ట్రాయ్స్ 'మై స్పీడ్ యాప్' ద్వారా సేకరించిన డేటా ప్రకారం 4జీ డౌన్ లోడ్ స్పీడులో జియో మార్కెట్ ను ఏలుతున్నట్టు వెల్లడైంది. కానీ అప్ లోడ్ స్పీడులో మాత్రం ఇతర కంపెనీల కంటే కొంత వెనుకంజలోనే ఉందట. 2017 ఫిబ్రవరిలో జియో నెట్ వర్క్ సగటు వేగం 17.427 ఎంబీపీఎస్ ఉన్నట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది. జియో తర్వాతి స్థానంలో ఐడియా(12.216ఎంబీపీఎస్), ఎయిర్ టెల్(11.245ఎంబీపీఎస్), వొడాఫోన్(8.337ఎంబీపీఎస్) ఉన్నాయి. అయితే 2016 డిసెంబర్ లో నమోదుచేసిన 18.146ఎంబీపీఎస్ స్పీడ్ కంటే ప్రస్తుతమున్న జియో స్పీడు తక్కువేనని ట్రాయ్ తెలిపింది. ఐడియా సెల్యులార్ స్పీడ్ వరుసగా పైకి ఎగుస్తున్నట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది. డిసెంబర్ నెలలో 5.943ఎంబీపీఎస్ గా ఉన్న ఐడియా సెల్యులార్ స్పీడ్, తర్వాతి నెలలో 10.301ఎంబీపీఎస్ గా, గత నెలలో 12.216ఎంబీపీఎస్ గా ఉన్నట్టు పేర్కొంది. టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్, వొడాఫోన్ డౌన్ లోడ్ స్పీడ్లు మాత్రం జనవరి నుంచి తక్కువవుతున్నాయని డేటా వెల్లడించింది. చాలా వేగవంతంగా 4జీ అప్ లోడ్‌లో ఐడియా ముందంజలో ఉన్నట్టు ట్రాయ్ రిపోర్టు తెలిపింది. -
రేపే బ్యాంకు యూనియన్ల సమ్మె
న్యూఢిల్లీ: తొమ్మిది బ్యాంకుల సంఘాల ఆధ్వర్యంలో రేపే భారీ ఎత్తున సమ్మె నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా, ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్సీబీసీ, ఏబబీఓఏ,బీఈఎఫ్ఐ, ఐఎన్‌బీఈ ఎఫ్, ఐఎన్ బీఓసీ, ఎన్ఓబీడబ్ల్యు, ఎన్ఓబీఓ యూనిమయన్ల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28 న ఒక రోజు సమ్మె చేపట్టనున్నారు. బ్యాంకుయూనియన్లతో కేంద్ర ప్రభుత్వ చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వరంలో జరిగిన సమావేశంలో విఫలం కావడంతో ఈ సమ్మె అనివార్యమైంది. యూనియన్ల డిమాండ్లను బ్యాంకుల మేనేజ్ మెంట్ బాడీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తిరస్కరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, బ్యాంకు ఉద్యోగులు, అధికారులు, పాత తరం ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులుఈ సమ్మెలో పాల్గొననున్నాయి. మొండి బకాయిలను రాబట్టడంలో బ్యాంకు ఉన్నతాధికారులు జవాబుదారీగా ఉండాలి, అన్ని స్థాయిల్లో ఖాళీల భర్తీ, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు కఠిన శిక్షలు వంటి పలు డిమాండ్లతో సమ్మెకు దిగనున్నట్లు బ్యాంకు సంఘాల ఐక్య వేదిక(యుఎఫ్‌బియు) నేతృత్వంలోని బ్యాంకు సంఘాలు తెలిపాయి. అయితే జాతీయ బ్యాంకు ఉద్యోగుల సంఘం, జాతీయ బ్యాంకు అధికారుల సంఘాలు మాత్రం సమ్మెలో పాల్గొనట్లేదు. ఫిబ్రవరి 21న భారత బ్యాంకుల సమాఖ్య(ఐబిఎ)తో జరిపిన చర్చలు విఫలమైనట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య(ఎఐబిఇఎ) ప్రకటించింది. సమ్మె యథావిధిగా కొనసాగుతందని ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం ఆదివారం మీడియాకు చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన కార్మిక సంస్కరణలపై కూడా బ్యాంకు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. బ్యాంకింగ్ రంగంలో శాశ్వత ఉద్యోగాలను తగ్గించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ సంఘాలు ప్రభుత్వం ప్రజావ్యతిరేక బ్యాంకింగ్ సంస్కరణలకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టనున్నాయి. ముఖ్యంగ గత ఏడాది నవంబర్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డీమానిటైజేషన్ కాలంలో అదనంగా పనిచేసిన ఉద్యోగులకు పరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు మంగళవారం వివిధ యూనియన్ల ఆద్వర్యంలో సమ్మెను చేపట్టనున్న నేపథ్యంలో ప్రముఖ బ్యాంకులు కొన్ని ఇప్పటికే వినియోగదారులకు సమాచారాన్ని అందించాయి. ముఖ్యంగా సమ్మె కారణంగా తమ బ్యాంక్ కార్యకలాపాలకు, సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందన్న ముందస్తు సూచనలను అందించాయి. -
బీ అలర్ట్: ఈ నెలాఖరున బ్యాంకు ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఫిబ్రవరి 28వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆంధ్రప్రదేశ్-తెలంగాణా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి వీవీఎస్ఆర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 28న జాతీయ స్థాయిలో సమ్మె జరుపనున్నామని, ఇందులో నాలుగు ఆఫీసర్ల అసోషియేషన్లతోపాటు మరో అయిదు ఉద్యోగుల సంఘాల ఏకగ్రీవ ఆమోదంతో ఈ సమ్మె చేపట్టనున్నట్టు తెలిపారు. గత రెండు దశాబ్దాలుగాపైగా సామాన్య ప్రజానీకానికి వ్యతిరేకంగా చేపడుతున్న సంస్కరణలపై తాము పోరాడుతున్నామన్నారు. వివిధ పబ్లిక్ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, విదేశీ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు పది లక్షల మందికి పైగా పాల్గొననున్నట్లు తెలిపారు . కొత్త ఆర్థిక విధానాల పేరిట బ్యాంకులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ బడ్జెట్లోనూ బ్యాంకులకు అవసరమైన మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేయలేదని, దీంతో బ్యాంకులు ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. సుమారు రూ.110 లక్షల కోట్ల చలామణి కలిగిన బ్యాంకింగ్ రంగాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ఈ ఆందోళన జరుపనున్నట్లు తెలిపారు. 500, వెయ్యి రూపాయల నోట్ల రద్దు తర్వాత ప్రజల్లో భారీ స్థాయిలో నగదు కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. తమ ఒకరోజు సందర్భంగా గౌరవనీయులైన ఖాతాదారులు, సామాన్య ప్రజానీకానికి జరుగనున్న అసౌకర్యంపై చింతిస్తున్నామనీ, తమ పోరాటానికి నైతిక మద్దతును అందించాల్సిందిగా శర్మ విజ్ఞప్తి చేశారు. -
లవ్ బిజినెస్
రెడ్ రోస్.. ప్రేమకు చిహ్నం! దాని ఖరీదు ఎంతో తెలుసా? ఒకే ఒక్క రోజా పువ్వు ధర..ఒక్క రోజు వంద రూపాయలు! టెడ్డీబేర్.. ప్రియురాలికి ఇష్టమైన సాఫ్ట్ టాయ్.. జానెడు బొమ్మ వెల ఆరడుగుల ప్రియుడిని బేర్మనేలా చేస్తోంది! లవర్స్‌ను ఊరించే కానుక ఉంగరం! కాని దాని కాస్ట్ ఇమిటేషన్స్లోనే వేలు పలుకుతుంటే ఖంగుమంటున్నారు! పెర్ఫ్యూమ్.. ప్రేమికులను దరిచేర్చే పరిమళం! ఒక్క స్ప్రేతో లవ్‌ను లాక్కుందామనుకుంటే ప్రైస్ ట్యాగ్ ముందుకు ప్రొసీడ్ కాకుండా లాక్ చేస్తోంది! ఏ శుభకార్యాన్నయినా తీపితో మొదలుపెట్టడం మన ఆనవాయితీ! అందుకే ఐ లవ్యూ అనే మంచి మాటను తియ్యగా చెబుదామంటే చాక్లేట్ ధర చేదు రుచిని తలపిస్తోంది! ఇక్కడ ఉదాహరణలే కాదు కానుకలనే ఊహల వెల కూడా ఆకాశానికి ఉయ్యాలేసి లవ్‌బర్డ్స్‌ను ఊరిస్తోంది అందుకోమని! తమ ప్రెషస్ ప్రేమ పారమీటర్ వందలు దాటి వెలకు చేరుతోంటే పట్టుకోవడానికి ప్లాన్ వేసుకుంటున్నారు ప్రేమికులు! అదే అదను అని సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు! ఇది ప్రేమికుల రోజు కథ.. వాలంటైన్స్ డే స్పెషల్! ప్రేమించడానికి మనసుంటే సరిపోతుంది.. కానుకలెందుకు? బ్లాక్ అండ్ వైట్ కాలంనాటి మాట ఇప్పుడు చెల్లదండీ! ఏ కానుకల్లేకుండా ప్రేమను పేలవంగా చెప్తే ఏం బాగుంటుంది? గిఫ్ట్స్‌తో గుబాళించాలి! అప్పుడే అవతలి వాళ్లు అట్రాక్ట్ అవుతారు అనేది కొత్త కాన్సెప్ట్! ప్రేమించడానికి ఇటు అబ్బాయిల జేబు, అటు అమ్మాయిల పర్స్ రెండూ నిండుగానే ఉండాలి. నిండుకుంటే లవ్ వే గేట్స్ మూసేసుకుంటుంది. వాలెంటైన్ జానపద గాథను ప్రేమకు చిరునామాగా మలచి వ్యాపారులు ఆ దారిని పరిస్తే మీడియా ట్రెండ్‌గా పాపులర్ చేసింది! ప్రేమికులు బ్లైండ్‌గా ఫాలో అవుతున్నారు! అందుకే ఇంతకుముందు గుట్టుచప్పుడు కాకుండా సాగిన ప్రేమాయణం ఇప్పుడు కాస్టీ›్ల వ్యవహారంగా సందడిచేస్తోంది.. కాసులను ఖర్చుపెట్టిస్తోంది. వ్యాపారుల పంట పండిస్తోంది. ఎర్ర గులాబీ గుసగుసలు అన్ని డేస్లాగే పాశ్చాత్య ప్రపంచం వాలెంటైన్ డేనూ మూడో ప్రపంచం మీదకు వదిలింది. తన లవ్బిజినెస్ ఫార్ములాను ఆ దేశాల మార్కెట్‌కూ అందించింది. ఉత్పత్తులను దించింది. వీటికి ఎంత గిరాకీ అంటే ఇండిపెండెన్స్ డే ఇంపార్టెన్స్‌ను మరిచిపోయినా వాలంటైన్స్‌డే సెలబ్రేషన్స్‌ను మాత్రం గుర్తుపెట్టుకుంటోంది యూత్. వ్యాపారులకు కావాల్సిందీ అదే! వాలంటైన్స్డేను ఫేమస్ చేయడానికి పెట్టిన ఖర్చును అణాపైసలతో సహా రాబట్టుకుంటున్నాయి ఆ సంస్థలు. ఇదంతా ఓ పథకం.. ప్రణాళిక. వాటి జోలికి పోకుండా వాలంటైన్స్ డే రోజు డిమాండ్‌లో ఉన్న ఉత్పత్తులేంటి? వాటిని మార్కెట్లోకి వదిలిన శక్తులేంటో తెలుసుకుందాం! ఆ తొమ్మిది కంపెనీలు.. వాలంటైన్స్ డే లవ్బిజినెస్ ఐడియాను క్రియేట్ చేసింది, ఇంప్లిమెంట్ చేసిందీ అమెరికానే! స్వీట్నథింగ్స్ను కరెన్సీ రేపర్లో చుట్టి ప్రేమికుల కళ్లబడేలా పేర్చింది. ఈ కష్టానికి క్రెడిట్ అమెరికాలోని 9 కంపెనీల ఖాతాలోనే జమవుతుంది. ది నేషనల్ రిటైల్ ఫెడరేషన్ (అమెరికా) లెక్క ప్రకారం వాలంటైన్స్ డే ఒక్కరోజే ఈ కంపెనీల లాభం లక్షా పదమూడు వేల తొమ్మిది వందల కోట్ల పై మాటే. 1-800 ఫ్లవర్స్, ది హర్షే కంపెనీ, హాల్మార్క్కార్డ్స్, నెకో, వెర్మోంట్ టెడ్డీ బేర్, విక్టోరియాస్ సీక్రెట్, టిఫనీ అండ్ కో, అర్మెల్లిని ఎక్స్ప్రెస్లైన్స్, ది యూఎస్ పోస్టల్ సర్వీస్ మొదలైన 9 కంపెనీలు ఆ జాబితాలో ఉన్నాయి. 1-800 ఫ్లవర్స్... మోస్ట్ వాంటెడ్ ఫర్ లవర్స్ ఇది ప్రేమ గులాబీలు అంటే రెడ్రోజెస్ను, ఇతర కానుకలను అమ్మే సంస్థ. ఒక్క ప్రేమికులరోజు నాడే తన యేడాది ఆదాయం కన్నా పది శాతం అధిక సేల్స్ ఉంటాయి ఈ కంపెనీకి. గిఫ్ట్స్ ఆర్డర్ చేసిన లవర్స్‌కి క్షణం ఆలస్యం చేయకుండా అందించేందుకు వాలంటైన్స్‌డే ఒక్కరోజే అదనంగా ఆరువేల మంది వర్కర్స్‌ను అపాయింట్ చేసుకుంటుందంటే ఎంత డిమాండో అర్థం చేసుకోవచ్చు. ఆ ఖర్చుకి ఆరింతల లాభం వస్తుందని చెప్తాడు 1-800 కంపెనీ సీఈవో జిమ్ మెకాన్. యేటా 40 శాతం మంది కొత్త కస్టమర్స్ కూడా పెరుగుతారట. హర్షే ... కాక పుట్టించే చాక్లేట్ ఇది అమెరికన్ పాపులర్ చాక్లేట్స్ కంపెనీ. యేడాది మొత్తంలో కన్నా యాభై యాతం అధికంగా వాలెంటైన్స్‌డే రోజు హర్షేకి బిజినెస్ ఉంటుందట. హాల్‌మార్క్ కార్డ్స్.. గ్రీటింగ్స్కే హాల్‌మార్క్ వాలెంటైన్స్ డే గ్రీటింగ్స్ కార్డ్స్‌కి ఈ కంపెనీ ప్రసిద్ధమైంది. దాదాపు పధ్నాలుగువందల వాలంటైన్స్‌డే కార్డ్స్ డిజైన్స్‌ను క్రియేట్ చేసింది. స్టాటిస్టిక్ బ్రెయిన్ సర్వే ప్రకారం కిందటేడాది వాలంటైన్స్ డే రోజు 150 మిలియన్ల మంది హాల్‌మార్క్ కార్డ్స్‌ను తమ ప్రేమికులకు పంపారు. క్రిస్మస్ తర్వాత అంత పెద్దమొత్తంలో ఆదాయం తెచ్చిపెట్టేది వాలెంటైన్స్ డేనే అని ఒప్పుకుంటుంది హాల్‌మార్క్ కార్డ్స్ యాజమాన్యం. నెకో.. లవ్స్ స్వీట్హార్ట్ క్యాండీస్ కంపెనీ. ఇది చతురస్రాకారం, బేస్బాల్స్, వాచెస్ ఆకారంలో క్యాండీస్‌ను తయారు చేసినన్నాళ్లు దీనికి పెద్ద గిరాకీ లేదు. ఎప్పుడైతే పిప్పర్మెంట్ సైజులో హార్ట్‌షేప్ ఆకారంలో క్యాండీస్‌ను తయారు చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి సప్లయ్ చేయలేనంతటి డిమాండ్ పెరిగిందట. దీన్ని వాలెంటైన్స్ డేకి యూఎస్పిగా ఎలా మలచుకోవాలో ఆలోచించమని మార్కెటింగ్ స్టాఫ్‌కి ఆర్డర్ వేసింది యాజమాన్యం. ఈ హార్ట్షేప్లోని క్యాండీస్ మీద ప్రేమికులకు సంబంధించిన సేయింగ్స్, కొటేషన్స్‌ను ముద్రించి మార్కెట్లోకి రాసులు పోశారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 14 వరకు ప్రతిరోజూ ప్రపంచ వ్యాప్తంగా లక్షపౌండ్ల క్యాండీహార్ట్స్ను అమ్మి ఆదాయం గడిస్తోంది నెకో! వెర్మోంట్ టెడ్డీ బేర్.. వాలెంటైన్స్ డిమాండ్ ఈ కంపెనీ టెడ్డి బేర్ వరల్డ్ ఫేమస్. మల్టీ మిలియన్ డాలర్ బిజినెస్ కంపెనీ. వాలంటైన్స్ డే గిఫ్ట్‌గా ఇది తయారు చేసే టెడ్డీకి ఎంత బెట్టంటే ఆర్నెల్ల ముందుగానే ఆర్డర్ ఇచ్చేంత. ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి వెర్మెంట్కి వాలెంటైన్స్ డే బిజినెస్ ఎంతో! విక్టోరియాస్ సీక్రెట్.. హాటెస్ట్ గిఫ్ట్ మాయిశ్చరైజర్స్, పెర్ఫ్యూమ్స్, లోదుస్తులు తయారు చేసే కంపెనీ ఇది. కాని లోదుస్తులకే బ్రాండ్ నేమ్ సంపాదించుకుంది. వాలెంటైన్స్ డే రోజు పాశ్చాత్య దేశాల్లోని ప్రతి ప్రేమికుడు తన ప్రియురాలికి విక్టోరియాస్ సీక్రెట్ కంపెనీ లో దుస్తులు గిఫ్ట్‌గా ఇచ్చి తన ప్రేయసి మనసెరిగిన ప్రియుడిగా ముద్ర వేయించుకోవాలని తపనపడుతుంటాడట. రిచ్ బాయ్‌ఫ్రెండ్‌గా బిల్డప్ ఇవ్వాలనుకుంటాడట. ఈ లెక్కన ఆ ఒక్కరోజు ఈ కంపెనీ లాభాలెంతో అంచనాకు అందే ఉంటాయి కదా! టిఫనీ అండ్ కో.. జ్యుయెలరీ అందుకో మొదట ఇది స్టేషనరీ షాప్. తర్వాత వరల్డ్ ఫేమస్ జ్యుయలరీ కంపెనీ. వాలెంటైన్స్ డే రోజు ప్రతి ముగ్గురిలో ఒక పురుషుడు తన ప్రియురాలికో, భార్యకో టిఫనీ అండ్ కో జ్యుయలరీని ప్రెజెంట్ చేయాలనుకుంటాడు. ఆ రోజుకి తన సేల్స్ ఎంతో చెప్పకుండా సీక్రెట్‌గా ఉంచుతుంది ఈ కంపెనీ. బిలియన్లలోనే ఆదాయం ఉంటుందంటారు మార్కెట్ విశ్లేషకులు. అర్మెల్లిని ఎక్స్‌ప్రెస్ లైన్స్ .. ప్రేమ డెలివరీ లైన్స్ పువ్వుల రవాణాలో పేరుమోసిన సంస్థ. వాలంటైన్స్ డే రోజు ఎర్రగులాబీలను పంపిణీ చేయడానికి రెండు నెలల ముందునుంచే సమాయత్తమవుతుంది. అదనంగా ట్రక్ డ్రైవర్స్‌ను నియమించుకుంటుంది. మామూలు రోజుల్లో కన్నా ప్రేమికుల రోజు నాడు నాలుగున్నరరెట్లు ఎక్కువుంటుంది దీని వ్యాపారం! యూఎస్ పోస్టల్ సర్వీస్.. సందేశాలను మోసుకొచ్చే సర్వీస్ మెయిల్స్, మొబైల్స్, వాట్సప్ మెస్సేజెస్ ఎన్ని ఉన్నా.. పోస్టల్ సర్వీస్‌లో వచ్చిన చిన్న కార్డుముక్క అందించే ఆనందం వేరు..ఆస్వాదించే దగ్గరి తనం వేరు. ఆ సంప్రదాయాన్నే నిలుపుతోంది ది యూఎస్ పోస్టల్ సర్వీస్. ప్రేమికుల అనురాగ సందేశాలను, ప్రేమ పలుకులను పొదువుకున్న గ్రీటింగ్ కార్డ్స్‌ను పదిలంగా పట్టుకొచ్చి అప్పజెప్పడంలో ది యూఎస్ పోస్టల్ సర్వీస్‌ను మించిన సర్వీసే లేదట. అందుకే వాలెంటైన్స్ డేకి వారం ముందునుంచే బిజీ అయిపోతుంది.. అయిదు నుంచి ఏడు శాతం అధికంగా వచ్చిపడే కార్డ్స్, ప్యాకేజెస్ అండ్ పార్సిల్స్‌తో. క్రిస్మస్ తర్వాత అంత పని, అంతేపెద్ద మొత్తంలో ఆదాయమూ వచ్చే పండగ ప్రేమికుల పండగే అని సంబరపడ్తోంది ఈ పోస్టల్ సర్వీస్ సంస్థ. నాట్ ఓన్లీ ఫర్ కపుల్స్.. పాశ్చాత్య సమాజంలో వాలెంటైన్స్ డేను కేవలం జంటలే కాదు ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్లాస్మేట్స్, టీచర్లు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ ధోరణి ఈసారి ఆసియా దేశాల్లోనూ కనిపించే అవకాశం ఉంది. వాలెంటైన్స్‌డే డెస్టినేషన్స్ గిఫ్ట్స్ తయారు చేసే కార్పోరేట్ సంస్థలు, ట్రావెల్ హౌజెస్ ప్రేమికుల రోజు కోసం కేరళ, గోవా, నైనిటాల్, మౌంట్ అబు, డెహ్రాడూన్, ముస్సోరి, కసౌలి, షిమ్లా, పంచవటి మొదలైన ప్రదేశాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజ్‌లను అందిస్తున్నాయి. వీటి ధర ఆరు వేల నుంచి అరవై వేల రూపాయల వరకు ఉంటోంది. వాలెంటైన్స్ డే పిచ్చిని ఎయిర్‌లైన్స్ సంస్థలూ సొమ్ము చేసుకుంటు న్నాయి. విమాన చార్జీల్లో రాయితీలుస్తూ స్పెషల్హాళఇడే ప్యాకేజేస్తో గాల్లో విహరింపచేస్తున్నాయి. వాలెంటైన్స్ డే కథ నిజానికి ఇది ప్రేమపక్షుల కథ కాదు. స్నేహం కథ! తల్లిదండ్రులు-బిడ్డలు, అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు, స్నేహితులు, రాజు - పేద, యజమాని- ఉద్యోగి మధ్య స్నేహాన్ని, ప్రేమను పెంచే కథ.. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని ప్రేమమయం చేయమని చాటే ఓ సెయింట్ కథ. మూడో శతాబ్దంనాటి గ్రీకు కథ. రోమ్ చక్రవర్తి అయిన క్లాడియస్ 2 .. తాను నమ్మే పన్నెండు దేవతలను మాత్రమే పూజించాలని రోమన్లందరినీ ఆజ్ఞాపిస్తాడు. క్రిస్టియన్లతో ఎవరైనా సన్నిహితంగా మెదిలారని తెలిస్తే మరణశిక్ష ఖాయమనీ హెచ్చరిస్తాడు. కాని వాలెంటినస్ అనే సాధువు చక్రవర్తి మాటను చెవికెక్కించుకోడు. తన జీవితాన్ని క్రీస్తుకే అంకితం చేస్తాడు. దాంతో కన్నెర్ర చేసిన క్లాడియస్.. వాలెంటినస్‌ను జైల్లో పెట్టి మరణ శిక్ష విధిస్తాడు. ఆయనకు జూలియా అనే కూతురు ఉంటుంది. ఆమె పుట్టుకతో అంధురాలు. వాలెంటినస్ తన కూతురుకి అన్నీ నేర్పిస్తాడు. తనకళ్లతో ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. వారం రోజుల్లో ఆ సాధువుకు మరణశిక్ష అమలవుతుందనగా జైలర్ ఆయన్ని అడుగుతాడు.. ‘నీ కూతుర్ని చూడాలనుకుంటున్నావా?’ అని. పిలిపిస్తాడు. జైల్లోంచే తన కూతురుకి జీవన సత్యాలు బోధిస్తుం టాడు. ఆ జ్ఞానంతో జూలియాకు చూపు వస్తుంది. చివరకు తాను చనిపోయే ముందు రోజు జూలియాకు ఓ ఉత్తరం రాస్తాడు.. ‘దైవాన్ని నమ్ము.. ప్రపంచాన్ని ప్రేమించు.. ఫ్రమ్ యువర్ వాలెంటైన్’ అని! ఆ తర్వాత రోజు అంటే క్రీ.శ. 270, ఫ్రిబవరి 14న వాలెంటినస్కు మరణశిక్ష అమలవుతుంది. తన తండ్రిని సమాధి చేసిన చోట గులాబిరంగులో పూత పూసే బాదం మొక్క నాటుతుంది ఆమె. ఆ మొక్క తర్వాత కాలంలో వృక్షమై ప్రేమ, స్నేహానికి చిహ్నంగా నిలిచింది అంటారు. ఆ ప్రేమను, స్నేహాన్ని ప్రపంచానికి చాటడానికే ప్రతి ఫిబ్రవరి 14న వాలెంటినస్ పేరుమీద వాలెంటైన్స్ డేని జరుపుకోవడం మొదలుపెట్టింది ప్రపంచం. -
చినవెంకన్న సన్నిధిలో వివాహాల సందడి
దేవరపల్లి (ద్వారకాతిరుమల) : వివాహాలు, కొత్త జంటలతో చినవెంకన్న క్షేత్రంలో శనివారం సందడి నెలకొంది. మాఘమాసం కావడంతో శుక్రవారం రాత్రి వివిధ ప్రాంతాల్లో వివాహాలు జరుపుకున్న నూతన వధూవరులు శనివారం తెల్లవారుజాము నుంచి ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శనార్థం వచ్చారు. వీరి రాకతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. కొత్త జంటలు, వారి బంధువులతో క్షేత్రం సందడిగా మారింది. పెళ్లి వస్రా్తలతో వీరంతా స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులు తీరారు. స్వామివారి సన్నిధిలో వివాహాలు కూడా పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి -
26న ఓపెన్ డిగ్రీ ప్రవేశ అర్హత పరీక్ష
అనంతపురం ఎడ్యుకేషన్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ)కోర్సులో ప్రవేశానికి ఈనెల 26న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ వై.శివచంద్ర తెలిపారు. ఆదివారం ఆర్ట్స్ కళాశాలలోని అధ్యయన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్, సమానమైన విద్యార్హత లేని వారు డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశానికి అర్హత పరీక్ష తప్పనిసరిగా రాయాల్సి ఉంటుందన్నారు. అందుబాటులో ఉన్న నెట్కేంద్రానికి వెళ్లి ఠీఠీఠీ.bట్చౌఠౌn జీn్ఛ.జీn పోర్టల్‌ను ఓపెన్ చేస్తే అర్హత పరీక్ష దరఖాస్తు లింక్ ఉంటుందని వివరించారు. ఆ లింక్‌పై క్లిక్ చేయగానే దరఖాస్తు ఓపెన్ అవుతుందని, విద్యార్థి తన పూర్తి వివరాలు నమోదు చేసి ఫొటో స్కాన్ చేయాలని సూచించారు. అప్లోడ్ చేసిన దరఖాస్తును ప్రింట్ తీసుకుంటే దానిపై తొమ్మిది అంకెల సంఖ్య వస్తుందన్నారు. ఆసంఖ్య ఆధారంగా ఏపీ ఆన్లైన్ లేదా తెలంగాణ ఆన్లైన్ కేంద్రాల్లో కమీషన్‌తో కలిపి రూ. 310 ఫీజు చెల్లించి రశీదు పొందాలన్నారు. బ్యాంకు డెబిట్ కార్డు, క్రెడిట్‌కార్డు ద్వారా కూడా ఫీజు చెల్లించే వీలుందన్నారు. ఈ ఏడాది జూలై 1 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే వారు దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు 08554–222448, సెల్ 73829 29602 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
15న నింగిలోకి 104 ఉపగ్రహాలు
పీఎస్ఎల్వీ సీ37 ప్రయోగానికి సన్నద్ధమవుతున్న ఇస్రో శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ప్రయోగాన్ని ఈనెల 15న ఉదయం 9.32 నిమిషాలకు నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. ఈ రాకెట్ ద్వారా దేశ విదేశాలకు చెందిన 104 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్ట నున్నారు. స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలన్నీ శనివారం నాటికి షార్కు చేరుకున్నాయి. ప్రస్తుతం షార్‌లోని క్లీన్‌రూంలో ఉపగ్రహాలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలను పూర్తి చేసి ఈనెల 9న ఉపగ్రహాలను రాకెట్ శిఖరభాగాన అమర్చే ప్రక్రియ చేపడతారు. 10, 11 తేదీలలో రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించిన అనంతరం 12న మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్) నిర్వహించి ప్రయోగతేదీని, సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఎంఆర్ఆర్ కమిటీ రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేసి లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగిస్తుంది. ఈ బోర్డు ఛైర్మన్ పి. కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో ప్రయోగానికి 36 గంటల ముందు కౌంట్‌డౌన్ నిర్వహిస్తారు. -
బీచ్ ఫెస్టివల్‌కు ముస్తాబు అవుతున్న విశాఖ
-
సమ్మెకు దిగనున్న బ్యాంకు సిబ్బంది
-
సమ్మెకు దిగనున్న బ్యాంకు సిబ్బంది
చెన్నై: ఎగవేత దారుల నుంచి రుణాల వసూలు, ఐచ్చిక బకాయిదారులపై చర్యలు.. తదితర డిమాండ్లతో బ్యాంకు సిబ్బంది ఫిబ్రవరి 28వ తేదీన సమ్మెకు దిగనున్నారు. ముందుగా మూడు సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయని, అయితే మొత్తం 9 యూనియన్లు కూడా ఆందోళనలో పాలుపంచుకోనున్నాయని ఆలిండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం తెలిపారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7వ తేదీన తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 28వ తేదీన తలపెట్టిన సమ్మెలో దేశవ్యాప్తంగా పది లక్షల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటారని వివరించారు. -
సమస్యలు తీర్చే బడ్జెట్ కావాలి
సంప్రదాయానికి విరుద్ధంగా తొలిసారి బడ్జెట్ ను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్నారు. ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి వచ్చే ఈ ఏడాది బడ్జెట్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలను గత ఏడాది సెప్టెంబర్‌లోనే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం వేగంగా దాన్ని అమల్లోకి తెచ్చేందుకు వీలుగానే సంప్రదాయానికి భిన్నంగా ఫిబ్రవరి ప్రారంభంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పలు విమర్శలు వచ్చాయి. ఐదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనుండటం, బడ్జెట్ ప్రవేశపెట్టిన కొద్ది రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు ఉండటంతో వాటిని ప్రభావితం చేసేందుకే ఎన్డీయే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఒకనొక సందర్భంలో 2012 సంవత్సరంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మాదిరిగా మార్చి11(ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తవుతాయి) తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలనే డిమాండ్ వినిపించింది. అంతలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలను ప్రభావితం చేసే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉండకూడదని చెబుతూ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం సమంజసమేనా?. ఒక దేశానికి బడ్జెట్‌ను ప్రవేశపెడుతన్నప్పుడూ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు దేశంలో భాగం కావా?. బడ్జెట్ కేటాయింపులు ఆ ఐదు రాష్ట్రాలకూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఓటర్లు ప్రభావితం కాకుండా ఎలా ఉంటారు?. దేశంలో ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో స్ధానిక ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అలాగని దేశ భవిష్యత్తును నిర్దేశించే బడ్జెట్ లాంటి కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం కూడా మంచిది కాదు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఎన్నికల కమిషన్(ఈసీ) కట్టుదిట్టమైన నిబంధనలను తయారు చేయాల్సివుంది. 2017- 2018 ఆర్థిక సంవత్సరానికి బుధవారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఏయే అంశాలకు ప్రాధాన్యత కల్పిస్తే లాభం కలుగుతుందో చూద్దాం. నోట్ల రద్దు పెద్ద నోట్ల రద్దు అనంతరం పూట గడవడం కోసం రోజూ కూలీకి వెళ్లే వారు కూడా పనులు మానుకుని బ్యాంకుల ముందు క్యూలలో నిల్చున్నారు. వీరిలో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులు, మధ్య తరగతి వారు, చిన్న వ్యాపారులు ఉన్నారు. ఈ బడ్జెట్ ద్వారా వీరందరికి ఆర్ధిక సాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే బావుంటుంది. వ్యవసాయ రంగం బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత రెండేళ్లుగా వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండేళ్లలో వ్యవసాయ రంగ అభివృద్ధి రెండు శాతాని కంటే దిగువకు పడిపోయింది. 2022కల్లా వ్యవసాయ రంగంలో అభివృద్ధిని నాలుగు శాతానికి చేరుస్తామని బీజేపీ ప్రభుత్వం 2016-2017 ఆర్ధిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ చెప్పింది. నేషనల్ సర్వీసు స్కీంలో ఉన్న వివరాల ప్రకారం.. ఓ రైతు పంటను పండించడానికి సగటున రూ.20వేలు పెట్టుబడి పెడుతున్నాడు. సదరు పంట మీద అతనికి రూ.40 వేలు వస్తే.. ఏడాది పాటు పడిన రెక్కల కష్టానికి నెలకు రూ.3,500 కంటే తక్కువ వస్తుంది. అది కూడా తాను పండించిన పంటకు మార్కెట్లో ధర బావుంటేనే. ప్రస్తుతం దేశంలో ఉన్న 50శాతం మంది రైతులకు కనీసం రూ.47వేల అప్పులు ఉన్నాయి. ప్రభుత్వం వూరికే రైతులకు బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించడం కాకుండా ఆ స్దానంలో మరేదైనా ప్రత్యామ్నాయాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రస్తావించుకోదగిన మరో అంశం రైతుల ఆత్మహత్యలు గత రెండేళ్లుగా దేశంలో రైతుల ఆత్మహత్యలు బాగా పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం గత ఏడాది జరిగిన ఆత్మహత్యల్లో అత్యధికంగా 11 శాతం మంది రైతులు బలవతంగా ప్రాణాలు తీసుకున్నారు. రైతు ఆత్మహత్య గురించి సుప్రీం కోర్టులో ఓ ఎన్జీఓ పిటిషన్‌ను దాఖలు చేయగా దాన్ని అత్యున్నత న్యాయస్ధానం పిల్‌గా మలిచి విచారణకు స్వీకరించింది. రైతులకు లోన్లు ఇస్తున్నామని చేతులు దులుపుకోకుండా ప్రభుత్వాలు వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని అందుకోసం ఓ జాతీయ పాలసీని తీసుకురావాలని పేర్కొంది. ఎన్పీఏలు బ్యాంకులను ఓ వైపు వేధిస్తున్నా గత ఏడాది వ్యవసాయ బడ్జెట్ రైతులకు లోన్లు ఇప్పించే దిశగానే సాగింది. కేవలం లోన్లకే పరిమితంగా కాకుండా నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులు, రైతులకు పంటలపై అవగాహన కల్పించడం, ఇరిగేషన్ తదితరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దురదృష్టవశాత్తు గతేడాది వ్యవసాయబడ్జెట్ 2005లో ఇచ్చిన బడ్జెట్ కన్నా తక్కువ కేటాయింపులకే పరిమితమైంది. వ్యవసాయ రంగంలో ఒక శాతం అభివృద్ధి జరిగితే జీడీపీ అందుకు రెండింతలు పెరుగుతుందని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో నాలుగు శాతం వృద్ధి రేటు అనే ప్రభుత్వ కల సాకారం కావాలంటే అన్ని రంగాల కంటే ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరగాలి. కొలువులు సృష్టించగలగాలి 2017-2018 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్ దేశ యువతకు తమ కాళ్ల మీద తాము నిలబడగలిగే అవకాశాన్ని ఇవ్వగలగాలి. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం ఎగుమతులు, తయారీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గినట్లు చెబుతున్నాయి. భారతదేశానికి ఉన్న సమున్నత శక్తి యువత. వారికి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేయాలి. అందుకు తగిన విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటే బావుంటుంది. వ్యాపారం దేశంలో సులువుగా వ్యాపారం చేయడానికి అనుగుణంగా పన్నులకు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే వ్యాపార రంగం భారత్‌లో విస్తృతం అవుతుంది. పారదర్శకత పెంచడం, వ్యాపార ప్రతిపాదనలకు సులువైన రీతిలో ఆమోదం తెలపడం వంటి వాటిపై ఈ బడ్జెట్లో ప్రకటన చేయడం వల్ల లాభం ఉంటుంది. రాష్ట్రాల అభివృద్ధి దేశంలో ఐదారు రాష్ట్రాలే ఆర్ధికంగా పరిపుష్టంగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లోకే 90శాతానికి పైగా పెట్టుబడులు వెళుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అభివృద్ధిలో వెనుక ఉన్న రాష్ట్రాలు అక్కడే ఆగిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రాలకు అందించే నిధుల్లో కొన్నింటికి కేంద్రం కోత విధించింది. కేవలం కొన్ని రాష్ట్రాల అభివృద్ధి ద్వారా మాత్రమే దేశాభివృద్ధి సాధ్యం కాదు. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ద్వారా నిధులు అందుతున్నాయి. కానీ, మరికొన్ని రాష్ట్రాలు పుంజుకోవడానికి కేంద్రం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు అవసరం. ఇప్పటివరకూ ప్రస్తావించుకుంది కొన్ని ప్రాంతాలే అయినా బడ్జెట్ కేటాయింపుల్లో వీటికి ప్రాధాన్యం కల్పిస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరగా పరిష్కారాలు చూపే ఆస్కారం ఉంటుంది. -
చేస్తారా ‘చేయి’స్తారా ?
కేంద్ర బడ్జెట్‌పై జిల్లావాసుల ఎదురుచూపు రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులపై ఆశ వ్యవసాయానికి పెద్ద పీట వేయాలని రైతుల విజ్ఞప్తులు పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించాలని డిమాండ్ మరో ఏడాదిపాటు దేశ భవితను శాసించే బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి కేంద్ర బడ్జెట్‌పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రాధాన్యరంగమైన వ్యవసాయానికి పెద్దపీట వేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేసి తమను ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క పెద్ద నోట్ల రద్దుతో కుదేలైన పౌల్ట్రీ రంగాన్ని ఆదుకునేందుకు తగినన్ని నిధులు కేటాయించాలని ఆ పరిశ్రమ ప్రతినిధులు కోరుతున్నారు. అలాగే, జిల్లాలోని కోనసీమ, కాకినాడ మెయిన్ రైల్వే లైన్ ప్రాజెక్టులు త్వరగా పట్టాలెక్కేందుకు అవసరమైన స్థాయిలో నిధులు కేటాయించాలని జిల్లావాసులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు కోరుతున్నట్టుగా కేంద్ర పాలకులు బడ్జెట్లో నిధుల కేటాయింపులు ‘చేస్తారా..?’ లేక ‘చేయి’స్తారా! అన్న ఉత్కంఠ నెలకొంది. – సాక్షి, రాజమహేంద్రవరం / అమలాపురం / అమలాపురం టౌన్ / మండపేట లైన్లో పడేనా.. పట్టాలెక్కేనా? ప్రస్తుతం కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ రైల్వే లైను ఉంది. దీనిని నుంచి కోనసీమ మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వరకూ మరో 57 కిలోమీటర్ల మేర పొడిగించడం ద్వారా ఆ ప్రాంతానికి రైల్వే సౌకర్యం ఏర్పడుతుంది. ఈ లైను నిర్మాణానికి రూ.15 వందల కోట్లు అవుతుందన్నది అంచనా. ఈ మార్గం పూర్తయితే ప్రయాణికులకే కాకుండా చమురు, గ్యాస్, ఇసుక, ధాన్యం తదితర సరుకుల రవాణా ద్వారా కూడా ఈ ప్రాంతం నుంచి రైల్వేకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశముంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాజెక్టుకు గత బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. వాస్తవానికి ఒకటిన్నర దశాబ్దాల కాలంలో ఈ పెండింగ్ ప్రాజెక్టుకు అంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం ఇదే ప్రథమం. దీంతో కోనసీమ రైలు పట్టాలెక్కుతుందన్న నమ్మకం కుదిరింది. అదే సమయంలో గత ఏడాది కాలంలో కోటిపల్లి – ముక్తేశ్వరం మధ్య గౌతమీ గోదావరి నదిపై రైల్వే వంతెన నిర్మాణానికి నిధుల కేటాయింపు, టెండర్ల ప్రక్రియ మొదలు కావడంతో ఆ ఆశలు రెట్టింపయ్యాయి. కొంతవరకూ భూసేకరణ కూడా జరిగింది. రైల్వే వంతెనకు ఫిబ్రవరిలో టెండర్లు ఖరారు కానున్నాయి. ఈ క్రమంలో ఈసారి బడ్జెట్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన స్థాయిలో నిధులు కేటాయించాలని కోనసీమ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. l జిల్లా కేంద్రమైన కాకినాడను మెయిన్ రైల్వే లైనులో కలపాలన్నది నాలుగు దశాబ్దాలుగా ఉన్న డిమాండ్. ప్రస్తుతం ఉన్న మెయిన్ లైన్ సామర్లకోట నుంచి నేరుగా పిఠాపురం మీదుగా వెళ్తుంది. దీనివల్ల కాకినాడ ఓ పక్కకు ఉండిపోతుంది. వాస్తవానికి ఇప్పటికే సామర్లకోట నుంచి కాకినాడ వరకూ రైల్వే లైను ఉంది. అక్కడనుంచి దీనిని పిఠాపురం వరకూ పొడిగిస్తే కాకినాడ మెయిన్ లైన్లోకి వచ్చేస్తుంది. 21 కిలోమీటర్ల ఈ లై¯ŒS నిర్మాణానికి 2000 సంవత్సరంనాటి అంచనా రూ.126 కోట్లు. ప్రస్తుతం అది రూ.250 కోట్లకు చేరుకుంది. ఈ ప్రాజెక్టుకు గత బడ్జెట్లో మొక్కుబడిగా రూ.50 కోట్లు మాత్రమే కేటాయించారు. గడచిన ఏడాది కాలంగా ఇందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఈసారి బడ్జెట్లో మరో రూ.50 కోట్లు కేటాయించే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు అంచనాతో పోలిస్తే ఈ మొత్తం దేనికీ సరిపోని పరిస్థితి. l కాకినాడ నుంచి వారణాసికి రైలు వేయాలని కొన్నేళ్లుగా జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్లోనైనా ఈ రైలు పట్టాలెక్కుతుందో లేదో చూడాలి. స్వామినాథ¯ŒS సిఫారసులన్నీ అమలు చేసేలా.. వ్యవసాయ ఆదాయం రెట్టింపు కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజంగా కోరుకుంటే.. స్వామినాథ¯ŒS కమిటీ సిఫారసులన్నీ అమలు చేసేలా కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి నిధులు కేటాయించాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. ఈ బడ్జెట్‌పై రైతు ప్రతినిధుల ఆకాంక్షలేమిటంటే.. ∙పెట్టుబడులకు 50 శాతం కలిపి కనీస మద్దతు ధర ఇస్తానన్న కేంద్రం అరకొరగా పెంచుతోంది. మద్దతు ధర పడిపోయిన సమయంలో కేంద్రం నేరుగా కొనుగోలు చేసేందుకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులను తక్షణం ఆదుకునేందుకు బడ్జెట్లో కనీసం రూ.50 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి. ∙జిల్లాలో వరి సాగు ద్వారా ఏడాదికి 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుండగా, మనవద్ద దీనిలో మూడోవంతు మాత్రమే నిల్వ చేసే సామర్థ్యముంది. ఎఫ్‌సీఐ ద్వారా రైతులు వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసేందుకు చిన్నచిన్న గోదాములు నిర్మించేందుకు నిధులు కేటాయించాలి. ∙జిల్లాలో అతి పెద్ద వాణిజ్య పంట కొబ్బరి సాగు గత ఏడాది తీవ్ర నష్టాల పాలైంది. ఈ రైతులకు చేయూతనిచ్చేలా కొబ్బరి ఆధారిత భారీ పరిశ్రమలు పెట్టేందుకు కేంద్రం నిధులు కేటాయించాలి. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు (సీడీబీ) ద్వారా రైతులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీలిచ్చేందుకు బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. కొబ్బరి, అరటి, ఆయిల్‌పామ్, కూరగాయ పంటల దిగుబడులను నిలువ చేసేందుకు వీలుగా కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణానికి భారీ రాయితీలు ఇవ్వాలి. ∙ఆక్వా పరిశ్రమకు దన్నుగా ఎగుమతుల్లో రాయితీలివ్వాలి. కోల్డ్ స్టోరేజ్‌లకు నిధులివ్వాలి. పోల‘వరం’ ఇస్తారా? జిల్లాలో మెట్ట, డెల్టా రైతులకు మేలు చేసే పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. తాజా అంచనాల ప్రకారం రూ.40 వేల కోట్ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు కేంద్రం నాబార్డు ద్వారా కేవలం రూ.2 వేల కోట్లు అప్పుగా ఇచ్చిన విషయం తెలిసిందే. దీనివల్ల పెద్ద ప్రయోజనం లేదని, వచ్చే బడ్జెట్లో కనీసం రూ.15 వేల కోట్లయినా కేటాయించాలి. నష్టాల భర్తీ కోసం ఎదురుచూపులు పెద్ద నోట్ల రద్దుతో కుదేలైన కోళ్ల పరిశ్రమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు కోళ్ల రైతులు. కేంద్ర బడ్జెట్‌పై వారు గంపెడాశలు పెట్టుకున్నారు. తమ వినతులపై ఈసారి బడ్జెట్లోనైనా కేంద్రం వరాలు కురిపించాలని, పౌల్ట్రీ పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించాలని ఎదురు చూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1.3 కోట్ల కోళ్లుండగా రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నాయి. వీటిలో 40 శాతం జిల్లాలో వినియోగమవుతుండగా మిగిలినవి పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి. పెద్దనోట్ల రద్దుతో ప్రస్తుత సీజ¯ŒS కోళ్ల రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. గుడ్డు ధర పతనం కావడం, మాంసం ధర తగ్గిపోవడం తదితర రూపాల్లో మునుపెన్నడూ లేనివిధంగా గడచిన రెండున్నర నెలల వ్యవధిలో పరిశ్రమకు రూ.60 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. పరిశ్రమకు వాటిల్లిన నష్టం గురించి కోళ్ల రైతులు నెక్ ద్వారా ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. జరిగిన నష్టంపై విజిలె¯Œ్స శాఖ కూడా ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. సబ్సిడీపై ఇవ్వాలి ఎఫ్‌సీఐ సేకరించిన బియ్యం, జొన్న, మొక్కజొన్న, గోధుమలు తదితర ఆహార ధాన్యాల్లో పాడైనవాటిని బహిరంగ వేలం నిర్వహిస్తుంది. వీటిని బడా వ్యాపారులు వేలంలో దక్కించుకుని పౌల్ట్రీలకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కోళ్ల మేతకు వినియోగించే ఆహార ధాన్యాలను బహిరంగ వేలంలో కాకుండా, పౌల్ట్రీ అసోసియేష¯ŒSకు సబ్సిడీపై అందించాలని ఎన్నో ఏళ్లుగా కోళ్ల రైతులు కోరుతున్నారు. ఈ మేరకు గతంలోనే కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు అందజేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్న మేతలకు స్థానికంగా పన్నులు వేయడాన్ని నిలిపివేయాలన్న డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. వీటికి ఈ బడ్జెట్లో పరిష్కారం లభిస్తుందని పౌల్ట్రీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నాం పెద్దనోట్ల రద్దుతో పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కో గుడ్డుకు రూపాయి వరకూ, కేజీ కోడికి రూ.25 వరకూ నష్టపోతున్నాం. పాత నష్టాలు భర్తీ కాకపోగా కొత్తగా ఏర్పడిన నష్టాలతో ప్రస్తుతం పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పాడైన ఆహార ధాన్యాలకు వేలం నిర్వహించకుండా సబ్సిడీపై పౌల్ట్రీ అసోసియేష¯ŒSకు అందజేయాలని ఇప్పటికే రాష్ట్ర అసోసియేష¯ŒS ద్వారా కేంద్రాన్ని కోరడం జరిగింది. ప్రస్తుత బడ్జెట్లో పరిశ్రమను ఆదుకునే దిశగా కేంద్రం కేటాయిస్తుందని ఆశిస్తున్నాం. – పడాల సుబ్బారెడ్డి, నెక్ జిల్లా చైర్మన్, ఏపీ పౌల్ట్రీ ఫెడరేష¯ŒS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు మార్కెటింగ్ సౌకర్యాలు పెంచాలి స్వామినాథ¯ŒS కమిటీ సిఫారసులన్నింటినీ అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో నిధులు పెద్ద ఎత్తున పెంచాలి. ఆర్కేవీవై స్కీమ్‌లో రాయితీని మోదీ ప్రభుత్వం 60 శాతానికి తగ్గించింది. దీనిని 100 శాతం పెంచాలి. ఎఫ్‌సీఐ ద్వారా గ్రామీణ ప్రాంతంలో గోడౌన్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలి. – జున్నూరి బాబీ, డీసీసీబీ మాజీ డైరెక్టర్, డి.రావులపాలెం, అమలాపురం కొబ్బరి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాల్లో కొబ్బరిసాగు జరుగుతోంది. ఈ చెట్ల ద్వారా ఏడాదికి 1,500 కోట్ల కాయ దిగుబడి వస్తోంది. సరైన పరిశ్రమలు లేక రైతులు రెండు మూడు ఉత్పత్తులుగా కొబ్బరి అమ్ముకోవాల్సి వస్తోంది. పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కొబ్బరిని పలురకాల ఉత్పత్తులుగా చేసుకుని రైతులు విక్రయించుకోవచ్చు. రూ.50 కోట్ల నుంచి రూ.200 కోట్లు ఖర్చయ్యే పరిశ్రమలు ఏర్పాటు చేయడమంటే కేంద్ర ప్రభుత్వంవల్లే సాధ్యమవుతోంది. – ముత్యాల జమ్మీ, బీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కొబ్బరి రైతు, అంబాజీపేట ఎఫ్‌సీఐ గోడౌన్ల తరహాలో కోల్డ్ స్టోరేజ్‌లు బియ్యం నిల్వ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ గోడౌన్లను ఎలా నిర్మిస్తోందో.. ఆక్వా ఉత్పత్తుల నిల్వలకు కూడా జిల్లాలోని తీర ప్రాంతంలో భారీగా కోల్డ్‌స్టోరేజ్‌లను నిర్మించాలి. దేశీయ ఎగుమతుల్లో వచ్చే ఆదాయంలో ఆక్వా రంగం నుంచే ఎక్కువగా వస్తోంది. కోల్డ్‌స్టోరేజ్Sతోపాటు జిల్లాలోని కాకినాడ పోర్టు నుంచి ఎగుమతులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయడం, ఆక్వా పరిశ్రమకు ఊతం ఇచ్చేలా కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ, ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలి. – అల్లూరి రమేష్‌రాజు, అధ్యక్షుడు, కోనసీమ ఆక్వా డీలర్స్ అండ్ ష్రింప్ డీలర్స్ అసోసియేష¯ŒS చిన్న వర్తకులపై కరుణ చూపాలి రెండున్నర సంవత్సరాల మోదీ పరిపాలన కారణంగా వర్తక, వాణిజ్య వర్గాలు దెబ్బతిన్నాయి. రిటైల్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు, పెద్ద నోట్ల రద్దు వల్ల చిన్న వ్యాపారులు చితికిపోయారు. ఈసారైనా బడ్జెట్లో చిరు వ్యాపారులను ఆదుకునేవిధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. – అశోక్‌కుమార్‌జైన్, కన్వీనర్, ఏపీ ఫెడరేష¯ŒS చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, రాజమహేంద్రవరం పన్నులు తగ్గించాలి బంగారం వ్యాపారులకు సాధ్యమైనంత వరకూ పన్ను తగ్గించాలి. లేదంటే ఆ భారం ప్రత్యక్షంగా ప్రజలపై పడుతుంది. జీఎస్టీ ఎక్కువగా ఉంటే బంగారం కొనే మహిళలు ఇబ్బంది పడతారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బంగారం కొనే సాధారణ, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచించాలి. – కడియాల శ్రీనివాస్, అధ్యక్షుడు, రాజమహేద్రవరం గోల్డ్ మర్చంట్స్ అసోసియేష¯ŒS వస్రా్తలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలి వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లో వస్రా్తనికి పూర్తి మినహాయింపు ఇవ్వాలి. వీటితోపాటు ఆదాయపన్ను పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి. నగదు విలువ మారుతున్నప్పుడు అన్నీ మారాల్సిన అవసరం ఉంది. పెద్దనోట్ల రద్దు వల్ల అత్యధికంగా నష్టపోయింది వస్త్ర వ్యాపారులే. వారిని ఆదుకోవాలి. – పోకల సీతయ్య, ఉపాధ్యక్షుడు, ఏపీ టెక్స్టైల్ ఫెడరేష¯ŒS, రాజమహేంద్రవరం -
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సర్వం సిద్ధం!
– జిల్లాలో 66 కేంద్రాలు...16,297 మంది విద్యార్థులు – నాలుగు విడతలుగా నిర్వహణ...ఒక్కో విడత ఐదు రోజులు – ఇప్పటికే మెటీరియల్ పంపిణీ, ఎగ్జామినర్లకు నేరుగా బోర్డు నుంచి ఉత్తర్వులు – 1న ఎగ్జామినర్లకు సమావేశం అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ›ప్రాక్టికల్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు నిర్వహించే ఈ పరీక్షలకు జిల్లాలో 16,297 మంది ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, బాటనీ విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం 66 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 43 ప్రభుత్వ కళాశాలలు, 23 ప్రైవేట్ కళాశాలల కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే హాల్‌టికెట్లు, ప్రశ్నపత్రాలు, టైంటేబుల్, ఎన్ఆర్లు, బ్యాచ్‌ల వివరాలు ఆయా కేంద్రాలకు పంపిణీ చేశారు. నాలుగు విడతలుగా ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.తొలివిడత ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు, రెండో విడత 8 నుంచి 12 వరకు, మూడో విడత 13 నుంచి 17 వరకు, నాల్గో విడత 18 నుంచి 22 వరకు జరుగుతాయి. ఎగ్జామినర్లకు పోస్టల్ ద్వారా ఉత్తర్వులు ఆయా కేంద్రాల్లో ఎగ్జామినర్లుగా నేరుగా బోర్డు అధికారులే నియమించారు. కనీసం మూడేళ్లు అనుభవం అర్హతగా పరిగణలోకి తీసుకున్నారు. అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న కళాశాలల నుంచి అధ్యాపకులను ఎంపికచేశారు. ఎవరిని ఏ సెంటర్‌కు నియమించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఉత్తర్వులు రెండు రోజుల కిందటే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పోస్టల్ ద్వారా పంపారు. ఈ నెల 31 నాటికి దాదాపు అందరికీ ఉత్తర్వులు అందే అవకాశం ఉంది. మూడురోజులకో ఎగ్జామినర్ ఎగ్జామినర్లను మూడు రోజులకోసారి మారుస్తారు. ఒకసారి నియమించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి నియమించరు. ఈ లెక్కన జిల్లాలో సుమారు 270 మంది దాకా ఎగ్జామినర్లను నియమించనున్నారు. ప్రైవేట్ కళాశాలలు కేంద్రాలుగా ఉన్నవాటికి డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించనున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు డీఓలుగా ఉంటారు. డీఓలను కూడా ప్రతి ఐదు రోజులకు ఒకర్ని మారుస్తారు. పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు పరీక్షల నిర్వహణకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఆర్ఐఓ వెంకటేశులుతో పాటు జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) మెంబర్లు టి. రాజారాం, ఎం. వెంకటరమణనాయక్, ఎం. కృష్ణమూర్తి పర్యవేక్షిస్తారు. హైఫవర్ కమిటీ మెంబరుగా కె. శ్రీనివాసులును నియమించారు. ఇద్దరు సభ్యులను ఫ్లయింగ్ స్క్వాడ్‌గా నియమించారు. వీరిలో ఒకరు విద్య, మరొకరు రెవెన్యూ శాఖ నుంచి ఉంటారు. అలాగే ఆర్జేడీ వెంకటరమణ, జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్‌రావు అబ్జర్వర్లుగా ఉంటారు. వీరే కాకుండా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, డీఆర్వో, ఆర్డీఓలతో పాటు కేంద్రాలున్న ప్రాంతాల తహసీల్దార్లు కూడా పర్యవేక్షిస్తారు. 1న ఎగ్జామినర్లతో సమావేశం పరీక్ష ఎగ్జామినర్లతో ఫిబ్రవరి 1న స్థానిక కొత్తూరు ప్రభుత్వ ఒకేషన్ జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించనున్నారు. నియామక ఉత్తర్వులు అందిన ప్రతి అధ్యాపకుడూ విధిగా హాజరుకావాలని అధికారులు తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఆర్ఐఓ వెంకటేశులు తెలిపారు. పరికరాలు, ఇతర మెటీరియల్ అందుబాటులోని కేంద్రాలకు బడ్జెట్ కూడా కేటాయిస్తున్నామన్నారు. -
ఫిబ్రవరి చివరికి నగదు విత్‌డ్రా కష్టాలకు చెక్
పరిమితి ఎత్తివేయొచ్చని బ్యాంకర్ల అంచనా న్యూఢిల్లీ: బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా పరిమితిని ఫిబ్రవరి చివరికల్లా రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తొలగించనున్నట్లు బ్యాంకర్లు వెల్లడించారు. నగదు విత్‌డ్రా పరిమితిని ఫిబ్రవరి చివరికి లేక మార్చి మొదటి అర్ధ భాగంలో పూర్తిగా తొలగించనున్నట్లు గురువారం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే గుప్తా మీడియాకు తెలిపారు. అన్ని కోణాల్లో ఆలోచించి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం ఫిబ్రవరి చివరికల్లా 78–88% కొత్త కరెన్సీ వ్యవస్థలోకి వచ్చేస్తుంది. మరో 2 నెలల్లో నగదు విషయంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. అయితే ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మాత్రం బ్యాంకింగ్ వ్యవస్థ నిర్ధేశిత సమయంలో సాధారణ పరిస్థితులకు రావడంపై స్థాయీ సంఘానికి స్పష్టంగా చెప్పలేదు. అయితే రద్దయిన పెద్ద నోట్ల స్థానంలో రూ. 9.2 లక్షల కోట్లు లేక 60% కొత్త నోట్లను ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఆర్బీఐ ఇటీవలే ఏటీఎంల్లో విత్‌డ్రా పరిమితిని రోజుకు రూ. 10,000 పెంచి, వారంలో పరిమితిని మాత్రం సేవింగ్స్ అకౌంట్లకు రూ. 24,000, కరెంట్ అకౌంట్లకు రూ. లక్ష కొనసాగించడం తెలిసిందే. ఆ కొత్త నోట్ల వివరాలు చెప్పలేం... పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన నవంబర్ 8కి ముందే ముద్రించి సిద్ధంచేసిన కొత్త నోట్ల వివరాలు చెప్పడం కుదరదని ఆర్బీఐ స్పష్టంచేసింది. ముందే ఎన్ని కొత్త రూ.2,000, రూ.500 నోట్లు ముద్రించారని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు.. బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ వివరణ ఇచ్చింది. -
ఖాతాదారులకు మరో శుభవార్త..!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన నగదు ఇబ్బందులకు త్వరలోనే పూర్తిగా చెక్ పడనుందట. ఏటీఎంల విత్ డ్రాలపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే నెల చివరి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఏటీఎం ఉపసంహరణ పరిమితులను పూర్తిగా తొలగించనుందని బ్యాంకర్లు తెలిపారు. ఫిబ్రవరి మాసాంతానికి లేదా మార్చి మొదటి వారానికి నగదు విత్ డ్రా నిబంధనలను పూర్తిగా సడలించనుందని మహారాష్ట్ర బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ కే గుప్తా మీడియాకు తెలిపారు. ఇది పూర్తిగా ఆర్ బీఐ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందన్నారు. పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన తరువాత కేంద్ర బ్యాంకు నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఫిబ్రవరి నాటికి 78-88 శాతం నగదు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి చేరుతుందని ఎస్బీఐ పరిశోధన నివేదించింది. దీంతో రాబోయే రెండు నెలల్లో పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి చేరనుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు ముందే పరిస్థితి పూర్తిగా చక్కబడుతుందని మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ చాలా వేగంగా పరిస్థితిని సమీక్షిస్తోందని.. నగదుకష్టాలు రెండు మూడు వారాల్లో తీరిపోతాయన్నారు. మరోవైపు ఆర్థికశాఖ స్టాండింగ్ కమిటీ ముందు హాజరైన ఆర్ బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మాత్రం దీనిపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. రద్దయిన నోట్లలో 60 శాతం వెనక్కి వచ్చిందనీ, రూ.9.2 లక్షల కోట్ల నగదు బ్యాంకులకు తిరిగి చేరిందని ప్రకటించినప్పటికీ, నగదు కష్టాల ఉపశమన పరిస్థితులపై ఎలాంటి సమయాన్ని సూచించకపోవడం గమనార్హం. కాగా నవంబరు 8న దేశవ్యాప్తంగా రూ.500,1000 పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటన సంచలనం రేపింది. దీంతో నగదు కొరతతో ప్రజలు అష్ట కష్టాలుపడ్డారు. అనేక రోజుల పాటు బ్యాంకుల వద్ద, ఏటీఎం సెంటర్ల వద్ద జనం క్యూకట్టారు. ఈ నగదు కష్టాలను అధిగమించేందుకు ఆర్బీఐ విడతల వారీగా అనేక ఉపశమన చర్యలు చేపట్టింది. ఏటీఎం క్యాష్ విత్ డ్రా లిమిట్ పెంపును ప్రకటించింది. తాజాగా పొదుపు ఖాతాదారులకు రోజుకు రూ 10,000 లు, కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు ను లక్ష. రూపాయలకు ఉపసంహరణ పరిమితిని పెంచింది. మరోవైపు పాత నోట్ల డిపాజిట్లకు గడువు 2016 డిసెంబర్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే. -
ఫిబ్రవరి 19న ఎన్జీఓ రాష్ట్ర సంఘానికి ఎన్నికలు
తాడితోట (రాజమహేంద్రవరం) : ఏపీ ఎన్జీఓ రాష్ట్ర సంఘానికి ఫిబ్రవరి 19న ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు బూరిగ అశీర్వాదం తెలిపారు. స్థానిక ఎన్జీఓ హోమ్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల అధికారి కె.దాలినాయుడు ఎన్నికల షెడ్యూల్డ్‌ను విడుదల చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వందల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుని ఇరవై మంది రాష్ట్ర ఆఫీసు బేరర్లను ఎన్నుకుంటారని చెప్పారు. జిల్లా నుంచి 68 మంది స్టేట్ కౌన్సిలర్లు, జిల్లా కార్యనిర్వాహక సభ్యులు, 20 యూనిట్లు అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కౌన్సిలర్లు ఓటు వేస్తారన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని ఎన్జీఓ అసోసియేష¯ŒS భవ¯ŒSలో ఈ ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. ప్రస్తుత సంఘ అధ్యక్షుడు పర్చూరి అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి ఎ¯ŒS.చంద్రశేఖర్‌రెడ్డి పానెల్‌కు మద్దతు ఇవ్వాలని జిల్లా కార్యవర్గ సమావేశంలో తీర్మానించినట్టు చెప్పారు. జిల్లా నుంచి పసుపులేటి శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నామినేష¯ŒS వేస్తారన్నారు. జిల్లా మాజీ అధ్యక్షుడు ఆచంట రామరాయుడు, ఉపాధ్యక్షులు పి. రాజబాబు, నేతలు పసుపులేటి శ్రీనివాస్, రాజమహేంద్రవరం యూనిట్ అధ్యక్షుడు జి.హరిబాబు, ధవళేశ్వరం యూనిట్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్, పి.నాగేశ్వరరావు, వైవీ నారాయణ, జి.వంశీ కళ్యాణ్, క్రిష్టాఫర్, ప్రవీణ్ కుమార్, పీవై శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిబ్రవరి మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తరహాలో రాష్ట్ర బడ్జెట్‌ను ఫిబ్రవరిలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు బడ్జెట్ తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. గతేడాది మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఏటా ఫిబ్రవరి నెలాఖరున ప్రవేశపెట్టే బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీనే ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పంథాను అనుసరించి బడ్జెట్ రూపకల్పన చేయాలని ఆర్థిక శాఖకు సీఎం దిశా నిర్దేశం చేశారు. కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాల కేటాయింపులపై స్పష్టత వస్తుంది. అందుకే ఫిబ్రవరి మూడో వారంలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆర్థిక శాఖను అప్రమత్తం చేసినట్లు సమాచారం. అన్ని శాఖల ప్రతిపాదనలు సిద్ధంగా ఉంటే బడ్జెట్ తయారీ ప్రక్రియకు కనీసం 15 రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. 2017–18 బడ్జెట్‌కు సంబంధించి అన్ని శాఖల ప్రతిపాదనలు రెండు రోజుల కిందటే ఆర్థిక శాఖకు చేరాయి. ఈసారి ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు విలీనమవటంతో నిర్వహణ పద్దులు, ప్రగతి పద్దులుగా అన్ని శాఖలు ప్రతిపాదనలు తయారు చేశాయి. ఆదాయ వ్యయాల అంచనాలు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపులు, వచ్చే ఆర్థిక సంవత్సరపు ప్రాధాన్యాలకు అనుగుణంగా బడ్జెట్ కసరత్తు మొదలైంది. రూ.15 వేల కోట్ల మేరకు సవరణ.. 2016–17 బడ్జెట్ అంచనాలు, వాస్తవంగా వచ్చిన ఆదాయ వ్యయాల ఆధారంగా సవరణ బడ్జెట్‌ను సైతం ఆర్థిక శాఖ తయారు చేయనుంది. కొత్త బడ్జెట్‌తో పాటు సవరణ బడ్జెట్ గణాంకాలను పొందుపరచనుంది. గతేడాది రూ.1.30 లక్షల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. నోట్ల రద్దు పరిణామాలు, భూముల అమ్మకంతో ఆశించిన ఆదాయం రాకపోవటంతో దాదాపు రూ.15 వేల కోట్ల మేర అంచనాలు తలకిందులైనట్లు ప్రభుత్వం విశ్లేషించింది. ఈ నేపథ్యంలో రూ.1.15 లక్షల కోట్లతో సవరణ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. -
ఫిబ్రవరి నుంచే బుల్లితెరపై మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇప్పటికే ఖైదీ నంబర్ 150 సినిమాతో రికార్డ్ వేట కొనసాగిస్తున్న చిరు ఇప్పుడు బుల్లితెర మీద దృష్టి పెట్టాడు. తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాధరణ కలిగిన షోగా పేరు తెచ్చుకున్న మీలో ఎవరు కోటీశ్వరుడుకు మెగాస్టార్ వ్యాఖ్యతగా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. గతంలో నాగర్జున ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించగా రికార్డ్ టీఆర్పీలను సాధించింది. ఇప్పుడు చిరంజీవి ప్రశ్నలు సందించడానికి రెడీ అవుతుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షోను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించనున్నారు. అయితే సీరీస్ ఎన్ని రోజులు కొనసాగుతుందన్న విషయాన్ని ఇంతవరకు ప్రకటించలేదు. -
ఫిబ్రవరి 1నే బడ్జెట్
‘ఎన్నికల’ రాష్ట్రాలకు వరాలుండవు: కేంద్రం న్యూఢిల్లీ: ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటినే 2017–18 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనుంది. అయితే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సంబంధించిన ప్రకటనలు లేకుండా జాగ్రత్త వహించనుంది. ‘బడ్జెట్ సమర్పణ ఫిబ్రవరి ఒకటినే ఉంటుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సంబంధించిన ప్రకటనలేవీ ఉండవు’ అని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఐదు రాష్ట్రాల తొలి దశ ఎన్నికలు జరగనున్న ఫిబ్రవరి 4వ తేదీకి ముందు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం సరికాదంటూ కాంగ్రెస్, టీఎంసీసహా ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అయితే ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది. ముందస్తు బడ్జెట్ సమర్పించడానికి గల కారణాన్ని ఎన్నికల సంఘానికి విన్నవించింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజు అయిన ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెట్టుబడులతో కూడిన పథకాలు పక్కాగా ప్రారంభించడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. పార్లమెంటు సమావేశాలు జనవరి 31న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి ఒకటిన అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను సమర్పిస్తారు. రైల్వే బడ్జెట్‌ను రద్దు చేసి, దాన్ని సాధారణ బడ్జెట్లో కలిపేయాలని కేబినెట్ గతంలో నిర్ణయించింది. -
11నుంచి ఎన్టీఆర్ 27?
‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ చిత్రం తర్వాత తమ అభిమాన హీరో కొత్త చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న చిన్న ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించనున్న కొత్త చిత్రానికి ఫిబ్రవరి 11న కొబ్బరికాయ కొట్టనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్ కొంచెం విరామం తీసుకున్నారు. తర్వాతి చిత్రం ఎవరి దర్శకత్వంలో చేస్తారనే దానిపై పలువురి పేర్లు వినిపించినా, ఫైనల్‌గా బాబీ దర్శకత్వంలో నటించేందుకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఫిబ్రవరి 11న గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరపాలనుకుంటున్నారట. ఆగస్టులో సినిమా విడుదల చే సేలా యూనిట్ భావిస్తోందని సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నారని టాక్. ఈ చిత్రానికి ‘జై లవకుశ’ అనే టైటిల్‌ని పెట్టనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఫిల్మ్‌ఛాంబర్‌లో ‘జై లవకుశ’ నమోదు చేయించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. కాగా, ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్లు భోగట్టా. అన్నట్లు.. ఇది ఎన్టీఆర్‌కి 27వ సినిమా. -
ఫిబ్రవరి 10 నుంచి రెవెన్యూ క్రీడలు
అనంతపురం అగ్రికల్చర్ : వచ్చే నెల 10 నుంచి 12 వరకు అనంతపురం రెవెన్యూ క్రీడలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం నాయకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం, కళ్యాణదుర్గం, కదిరి, ధర్మవరం, పెనుకొండ, కలెక్టరేట్ జట్ల మధ్య ఈ నెల 29న స్థానిక ఆర్డీటీ స్టేడియంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తుండగా, ఫిబ్రవరి 5న ఫైనల్ పోటీ ఉంటుందన్నారు. అదే నెల 10, 11, 12 తేదీల్లో పురుషుల విభాగంలో వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, టెన్నీకాయిట్, క్యారమ్స్, క్రికెట్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, చెస్‌తో పాటు 100 మీటర్లు పరుగు, లాంగ్‌జంప్, డిస్క్‌త్రో, షాట్‌పుట్, జావెలిన్‌త్రో, నడక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. మహిళల విభాగంలో షటిల్ బ్యాడ్మింటన్, టెన్నీకాయిట్, త్రోబాల్, చెస్, క్యారమ్స్, మ్యాజికల్ ఛైర్స్, 100 మీటర్లు పరుగు, షాట్‌పుట్, జావెలిన్‌త్రో, నడక పోటీలు ఉంటాయని తెలతిపారు. సాంస్కృతిక పోటీలు ఉంటాయన్నారు. -
గెలాక్సీ ఎస్ 8 కమింగ్ సూన్..!
న్యూఢిల్లీ: కొరియా ఎలక్ట్రానికి దిగ్గజం శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 8 త్వరలోనే మార్కెట్లను పలకరించనుంది. మీడియా నివేదికలు ప్రకారం, అనుకున్న దానికంటే ముందుగానే ప్రపంచవ్యాప్తంగా ఈ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులో ఉంచడానికి శాంసంగ్ సిద్ధపడుతోంది. వినియోగదారుల విశ్వాసం పొందేందుకు గాను ఫిబ్రవరి 2017 లోను దీన్ని లాంచ్ చేయనుంది. ముందు ఇది ఏప్రిల్ 2017 లో రానుందని అంచనావేశారు. ఫీచర్లు, ధర తదితర వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడి చేయనప్పటికీ...వివిధ అంచనాల ప్రకారం ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇలా ఉండనున్నాయి. గెలాక్సీ ఎస్ 8 ఫీచర్లు 1440 x 2560 ఎంపీ రిజల్యూషన్ 4కె స్క్రీన్, 6 జీబీ ర్యామ్ 256 జీబీ ఎక్స్ పాండబుల్ మొమొరీ 30 మెగాపిక్సెల్ కెమెరా 4,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ అయితే 3.5ఎంఎం ఆడియో జాక్ ను ఎస్ 8 లో తొలగించినట్టు తెలుస్తోంది. ఇక ధర విషయానికి వస్తే ఎస్ 7 ఎస్ 7ఎడ్జ్ రేంజ్ లోనే ఉండొచ్చని భావిస్తున్నారు. రెండు వేరియంట్లలో వస్తున్న గెలాక్సీ ఎస్ 8 64 జీబీ రూ.55,000, 128 జీబీ రూ. 60,000 ఉండొచ్చని అంచనా. కాగా గెలాక్సీ నోట్ 7 ఫెయిల్యూర్ కారణంగా వినియోగదారుల విశ్వసనీయతను కోల్పొవటంతో పాటు వేల కోట్ల నష్టపోయింది. దీంతో బ్యాటరీ లో మరిన్ని జాగ్రత్తలతో పాటు, ఎక్సినాస్ 8895 ప్రాసెసర్ విత్ మాలి-జీ71 జీపీయుతో గెలాక్స్ ఎస్ 7కంటే 1.8 రెట్ల అధిక సామర్ధ్యంతో రానుందని తెలుస్తోంది. అలాగే వైర్ లెస్ ఎయిర్ బడ్స్ ను కూడా లాంచ్ చేయనుంది. సామ్సంగ్ తన అప్ కమింగ్ గెలాక్సీ ఎస్8 ద్వారా తిరిగి తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. -
కార్లు, బస్సులపై అక్కడ బ్యాన్
న్యూఢిల్లీ: ప్రపంచంలో అతి ఖరీదైన ప్రదేశాల్లో ఒకటిగా నిలుస్తున్న ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతానికి కార్లు, బస్సులు నిలిపివేయనున్నారు. ఫిబ్రవరి నుంచి మూడు నెలల పాటు ఆ ప్రాంతానికి బస్సు, కార్లు వెళ్లడాన్ని అనుమతించమని ప్రభుత్వం చెప్పింది. వచ్చే నెలలో ఆవిష్కరించబోతున్న పైలెట్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా వీటిని నిలిపివేయనున్నట్టు తెలిసింది. 1993లో ఎడ్విన్ లుట్యెన్స్ ఈ వాణిజ్య ప్రాంతాన్ని నిర్మించారు. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. కన్నాట్ ఏరియా పరిసర పార్కింగ్ ప్రాంతాలు శివాజీ స్టేడియం, బాబా ఖారక్ సింగ్ మార్గ్, పలికా పార్కింగ్‌ల నుంచి సైకిళ్లు, బ్యాటరీ ఆధారిత వెహికిల్స్‌ను 'పార్క్ అండ్ రైడ్' సర్వీసుల కోసం ఆఫర్ చేయనున్నారు. కన్నాట్ ప్రాంతంలో మూడు నెలల వరకు నడకబాటలో ప్రయాణించే వారికే అనుమతిస్తామని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా చర్చలు జరిపారు. ఈ వాణిజ్య ప్రాంత రూపురేఖలను మార్చడానికి, నీళ్లు సదుపాయాలను అభివృద్ధి చేయడంపై మంత్రి చర్చించారు. అంతేకాక పబ్లిక్ ప్లాజాలు, సైడ్ వాక్ కేఫ్‌లు, లైట్స్, స్ట్రీట్ ఫెస్టివల్ వంటి పలు అంశాలపై కేంద్రమంత్రి అధికారులతో చర్చించారు. -
pslv - c 37 ప్రయోగానికి ఏర్పాట్లు
-
ఫిబ్రవరి 8న ‘వేటూరి’ సాహిత్యంపై జాతీయ సదస్సు
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ’వేటూరి ప్రభాకరశాస్త్రి సాహిత్యం – సమాలోచనం’ అనే అంశంపై తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8న జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని వైస్ చాన్సలర్ ఎం.ముత్యాలునాయుడు గురువారం ఆవిష్కరించారు. ప్రభాకరశాస్త్రి వాజ్ఞ్మయ పీఠం, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంఞ్మీ సదస్సును నిర్వహించనున్నాయి. తెలుగు సాహిత్యానికి వేటూరి అందించిన సేవలు చిరస్మరణీయమైనవని, అన్నమయ సంకీర్తనలను స్వరపరచి, తెలుగుదనాన్ని తీసుకువచ్చారని వీసీ పేర్కొన్నారు. వేటూరి 129వ జయంతి సందర్భంగా జరుగుతున్న సదస్సుకు సంచాలకులుగా తెలుగు శాఖ సహాయ ఆచార్యులు దొంతరాజు లక్షీ్మనరసమ్మ, సమన్వయకర్తలుగా సహాయ ఆచార్యులు టి.వాసు, కేవీఎ¯ŒSడీ వరప్రసాద్, టి. సత్యనారాయణ వ్యవహరిస్తారు. ‘ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ – 2’ ఆవిష్కరణ వాణిజ్య శాస్త్రం, వ్యాపార నిర్వహణ çసబ్జెక్టులతో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ‘ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ – 2’ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. వర్సిటీ అకడమిక్ అఫైర్స్ డీ¯ŒS ఆచా ర్య ఎస్.టేకి రచించిన పుస్తకాన్ని గురువారం వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వీసీ మాట్లాడుతూ నన్నయ వర్సిటీ అనుబంధ కళాశాలలకే కాక ఇతర రాష్ట్రాలలోని వాణిజ, వ్యాపార నిర్వహణ సబ్జెక్టులతో డిగ్రీ చదివే విద్యార్థులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. పుస్తక రచయిత ఎస్. టేకి, రిజిస్టార్ ఆచార్య ఎ.నరసింహరావు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు!
-
ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు!
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యధిక సంఖ్యలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ డిసెంబర్ చివరి వారంలో ఎన్నికల తేదీలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్ సమర్పణ జరిగిన అనంతరం ఫిబ్రవరి రెండోవారంలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని ఎలక్షన్ కమిషన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల్లో బోర్డు, ఇంటర్ పరీక్షలకు ముందే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల తేదీలపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని సూచనలు చేసినట్లు సమాచారం. పంజాబ్, గోవా,మణిపూర్, ఉత్తరాఖండ్‌ల అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు విడతల్లో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడవు 2017 మే 27తో ముగియనుండగా, ఈ నేపథ్యంలో యూపీ అసెంబ్లీ పదవీకాలం ముగియకముందే.. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఉత్తరప్రదేశ్‌లో తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని అధికార పార్టీ సమాజ్ వాదీ, మరోవైపు అధికారం కోసం బీఎస్పీ పోటీ పడుతున్నాయి. ఇక పంజాబ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పోటీపడుతుండగా, కొత్తగా ఆమ్ ఆద్మీపార్టీ పోటీకి దిగటంతో అక్కడ త్రిముఖ పోటీ ఏర్పడింది. గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ఆప్ వెల్లడించింది. -
బడ్జెట్ ముహుర్తం ఆ రోజే!
కేంద్ర బడ్జెట్ ముహుర్తం దాదాపు ఖరారైనట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం సాధారణ బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. పాత సంప్రదాయానికి భిన్నంగా ఈసారి నెల రోజుల ముందే కేందం బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది. వచ్చే ఏడాది(2017-18) నిర్వహించబోయే ఈ బడ్జెట్ సమావేశాలూ జనవరిలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీల అనంతరం వచ్చే ఏడాది నిర్వహించబోయే ఈ సమావేశ తేదీలను ప్రభుత్వం ఖరారుచేసినట్టు సమాచారం. ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16వరకు జరుగనున్నాయి. ఈ సారి బడ్జెట్లో మరో విశేషమేమిటంటే ప్రత్యేక రైల్వే బడ్జెట్ కూడా సాధారణ బడ్జెట్లో కలిపి తీసుకురావడమే. 92ఏళ్ల నాటి నుంచి వస్తున్న ప్రత్యేక రైల్వే బడ్జెట్ సాంస్కృతికి చరమగీతం పాడిన కేంద్రప్రభుత్వం, ఈ బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో కలపడానికి ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. రెండు బడ్జెట్లను ప్రభుత్వం కలిపి ప్రవేశపెడుతున్నందున్న, డివిడెంట్ రూపంలో చెల్లించే రూ.9,700 కోట్ల రూపాయలను భారత రైల్వే ఖజానా పొదుపు చేసుకోనుంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ మొత్తం విలువ ఈసారి రూ. 20,32,650 కోట్లగా ఉండనుందని తెలుస్తోంది. ప్రతిసారి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థిక సర్వేను, సాధారణ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతూ వస్తోంది. బడ్జెట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక అంశమైనందున దానిని ఎప్పుడైనా పార్లమెంట్లో ప్రవేశపెట్టుకోవచ్చని ఓ వైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టతనిచ్చింది. దీంతో ఫిబ్రవరి1నే దేశ ప్రజల ముందుకు బడ్జెట్ లెక్కలు రాబోతున్నాయి. -
నీచ ఫెస్టివల్!
-
4 ప్రాజెక్ట్‌లు.. 40 ఫ్లాట్లు!
• ఫిబ్రవరిలో పలు ప్రాజెక్ట్‌లు ప్రారంభం • రామ్ డెవలపర్స్ ఎండీ రాము సాక్షి, హైదరాబాద్: చిన్న చిన్న ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో శరవేగంగా కదులుతున్న రామ్ డెవలపర్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనూ నగరంలో పలు ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టనుంది. పద్మారావ్ నగర్, బేగంపేట, ఎల్బీనగర్, నాగోల్‌లో ఈ ప్రాజెక్ట్‌లు రానున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లు, కొత్త ప్రాజెక్ట్‌ల వివరాలను రామ్ డెవలపర్స్ ఎండీ రాము ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు. ⇔ పంజగుట్టలో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్తో కలసి వెయ్యి గజాల్లో హిదర్ క్రెస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఐదంతస్తుల్లో 15 ఫ్లాట్లొస్తాయి. 1,200-1,975 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ధర చ.అ.కు రూ.7,500. వచ్చే డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. ⇔ చిక్కడపల్లిలో 500 గజాల్లో మై ఫెయిర్ అవెన్యూస్‌ను నిర్మిస్తున్నాం. ఐదంతస్తుల్లో మొత్తం 10 ఫ్లాట్లొస్తున్నాయి. 1,195- 1,470 చ.అ.ల్లో ఫ్లాట్లుంటాయి.ధర చ.అ.కు రూ.5,000. మూడు నెలల్లో పూర్తి చేస్తాం. ⇔ బేగంపేటలో 725 గజాల్లో రివర్స్టోన్ హ్యాబిటేట్‌ను నిర్మిస్తున్నాం. నాలుగంతస్తుల్లో 12 ఫ్లాట్లుంటాయి. 1,940-1,980 చ.అ. ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.5,500. డిసెంబర్ 2017కు ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. ⇔ వచ్చే ఏడాది జనవరిలో ఎల్బీనగర్లో 850 గజాల్లో రామ్ అవెన్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. ఐదంతస్తుల్లో 15 ఫ్లాట్లుంటాయి. 1,180-1,800 చ.అ.ల్లో ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ధర చ.అ.కు రూ.3,500. ⇔ నాగోల్‌లో 500 గజాల్లో మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. ఇందులో నాలుగంతస్తుల్లో 8 ఫ్లాట్లుంటాయి. 1,175-1,500 చ.అ. మధ్య ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.3,200 ⇔ పద్మారావ్‌నగర్‌లో 475 గజాల్లో రామ్ రెసిడెన్సీ రానుంది. నాలుగంతస్తుల్లో 8 ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.6,000. ⇔ బేగంపేటలో 700 గజాల్లో రామ్ ఎన్క్లేవ్ ప్రాజెక్ట్‌ను చేయనున్నాం. ఇందులో నాలుగంతస్తుల్లో 8 ఫ్లాట్లుంటాయి. ఏడాదిన్నరలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. -
ఫిబ్రవరిలో బయో ఆసియా సదస్సు
వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు హైదరాబాద్‌లో 14వ బయో ఆసియా సదస్సును నిర్వహించనున్నట్లు రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. ‘బయో ఆసియా 2017’ వెబ్‌సైట్‌ను శుక్రవారం సచివాలయంలో ఆయన ప్రారంభించారు. ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి, ఆసియన్ బయోటెక్ అసోసియేషన్స్ సమాఖ్యతో కలసి సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. 50 దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, విధాన నిర్ణేతలు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు ఒకే వేదికపై తమ అనుభవాలు, వ్యాపార నిర్వహణ మెలకువలను పంచుకుంటారని కేటీఆర్ తెలిపారు. ‘శక్తిమంతమైన గతం.. బలమైన భవిష్యత్తు’ నినాదంతో నిర్వహించే ఈ సదస్సు భారతీయ లైఫ్ సెన్సైస్ రంగం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. లైఫ్ సెన్సైస్ రంగంలో రాష్ట్రం ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించినా ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరముందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో దేశంతోపాటు తెలంగాణలో నూతన శకం దిశగా కీలక సంబంధాలు, భాగస్వామ్యాలను ఏర్పాటు చేసేందుకు సదస్సు దోహదపడుతుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి వస్తున్న పెట్టుబడులతో ఔషధ, ఆరోగ్య ఉత్పత్తులు, సేవలు తదితరాలతో కూడిన లైఫ్ సెన్సైస్ రంగంలో దేశం గణనీయ పురోగతి సాధిస్తోందన్నారు. ప్రపంచ దేశాల్లోని ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య, ఔషధ ఉత్పత్తులు భారత్ నుంచి అందేలా మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
ఈరోజు పుడితే తర్వాతి బర్త్‌డేకి మీ వయసెంత?
సంధ్యను అమితంగా ప్రేమించే గణేశ్ బర్త్ డేని వాళ్ల నాన్న ఘనంగా నిర్వహిస్తాడు. 'హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మళ్లీ మళ్లీ..' అంటూ హిట్ పాట పాడిమరీ విషెస్ చెబుతాడు. గణేశ్ బర్త్ డే ప్రత్యేకతేంటంటే.. అతను లీపర్. అవును నాలుగేళ్ల కొకసారి మాత్రమే వచ్చే ఫిబ్రవరి 29న పుట్టినరోజు జరుపుకునేవాళ్లను లీపర్స్ అంటారు. అసలింతకీ లీప్ సంవత్సరాలు ఎందుకొస్తాయి? వాటి విశిష్టత ఏంటి? తెలిసిన విషమేఅయినా లీపర్స్ కోసం మరోసారి ఆ అంశాలపై చిన్న లుక్కేద్దాం.. తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ దీర్ఘావృత్తాకార కక్ష్యలో తిరిగే భూమి.. ఒక పరిభ్రమణం పూర్తిచేయడానికి సరిగ్గా 365 రోజుల 5 గంటల 48 నిముషాల 46 సెకన్లు పడుతుంది. కచ్చితంగా చెప్పాలంటే 365.242199 రోజులన్నమాట. కానీ మనకు సంవత్సరంలో ఉన్నవి 365రోజులే. లెక్కింపునకు నోచుకోకుండా మిగిలిపోతోన్న ఆ నాలుగు పావురోజులను(కలిపితే ఒక ఒక రోజు) కలిపి లెక్కించేదే లీప్ ఇయర్! ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా చెప్పుకుందాం.. దీర్ఘ వృత్తకార కక్ష్యలో తిరిగే భూమి.. సూర్యుడికి దగ్గరిగా ఉన్నప్పుడు ఎండాకాలమని, దూరంగా ఉన్నప్పుడు శీతాకాలామని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజంకాదు. ఈ ఏడాదిలో భూమి సూర్యుడికి అతి సమీపంగా ఉన్నది శీతాకాలంలోనే. జనవరి 2న సూర్యుడికి కేవలం 147,100,176 కిలోమీటర్ల దూరంలో భూమి ఉంది. దీన్నిబట్టి.. సూర్యుడికి దగ్గరగానో దూరంగానో ఉండటంవల్ల కాక 23.5 డిగ్రీల వంపు తిరిగి భూమి భ్రమణం చెందడం వల్లే రుతువులు ఏర్పడతాయని అర్థం చేసుకోవాలి. -
వారఫలాలు : 21 ఫిబ్రవరి నుంచి 27 ఫిబ్రవరి, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) సమస్యలు క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలు సఫలం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. పసుపు, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయకుని పూజించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) గతాన్ని తలచుకుంటూ గడుపుతారు. పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వివాదాలు సర్దుబాటు కాగలవు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. వాహనయోగం. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులు ఒక సమాచారంతో ఊరట చెందుతారు. లేత ఆకుపచ్చ, ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) పనుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. కొత్త కాంట్రాక్టులు. ఆలోచనలు కలసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆదాయం పెరిగి రుణాలు తీరుస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగల అవకాశం. కళాకారులకు అవార్డులు. బంగారు, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. మీ శ్రమ ఫలిస్తుంది. ఒక వివాదాన్ని చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. రాజకీయ వర్గాలకు ఊహించని విధంగా పదవులు. గులాబీ, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) అదనపు ఆదాయం సమకూరుతుంది. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సత్తా చాటుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు. శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4,స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. పోటీపరీక్షల్లో విజయం. వాహనాలు, గృహం కొనుగోలు. వివాదాలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. రాజకీయ వర్గాలకు పదవీయోగం. నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆదాయం పెరిగే అవకాశం ఉంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గవచ్చు. కళాకారులు ఒత్తిళ్ల నుంచి బయట పడతారు. గులాబి, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్తుతి మంచిది. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) చికాకులు, ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. విలువైన వస్తువుల కొనుగోలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఊపిరి పీల్చుకునే సమయం. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. పనులు వేగం పుంజుకుంటాయి. ఆప్తులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ సత్తా చాటుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. రాజకీయ వర్గాలకు పదవులు లభిస్తాయి. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్తపనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. పెద్దలు, ప్రముఖుల సలహాలతో ముందడుగు. ఆస్తి లాభ సూచనలు. కొన్ని వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. బంధువుల కలయిక. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు. నలుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కార్యక్రమాలు సకాలంలోనే పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. అదనపు ఆదాయం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. భూ వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు గౌరవ పురస్కారాలు. గోధుమ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
వారఫలాలు : 14 ఫిబ్రవరి నుంచి 20 ఫిబ్రవరి, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. పాత బాకీలు వసూలవు తాయి. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలలో లాభాలు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. పసుపు, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) సంఘంలో గౌరవం. మీ ప్రతిభను పదిమందీ గుర్తిస్తారు. ఇంటి నిర్మాణాల్లో అవరోధాలు తొలగుతాయి. ఆదాయం కొంత పెరిగే అవకాశం. ఒక సమస్య పరిష్కారమవుతుంది. స్థిరాస్తి లాభం. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి సహకారం. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. నీలం, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. కొన్ని వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. భూములు, వాహనాల కొనుగోలు. ఇంటిలో శుభకార్యాలు. కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆరోగ్యంమందగిస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. కళా కారులకు ప్రయత్నాలలో పురోగతి. ఆకుపచ్చ, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) వీరికి పట్టింది బంగారమే అన్నట్లుంటుంది. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. తెలుపు,లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆదాయం కొంతపెరిగే సూచనలు. పనులు అనుకున్న రీతిలో పూర్తి కాగలవు. కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఇంతకాలం పడిన కష్టాలు కొంతవరకూ తొలగుతాయి. వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. భూ, వాహనయోగాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు సత్కారాలు. గులాబీ, లేత ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట. గృహ నిర్మాణయత్నాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. ఆరోగ్యంపై అశ్రద్ధ తగదు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులు సమర్థత చాటుకునే సమయం. కళాకారులకు పురస్కారాలు. చాక్లెట్, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. పలుకుబడి కలిగిన వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు. నిరుద్యోగుల ప్రయత్నాలలో కొంత పురోగతి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు. తెలుపు, లేతనీలం రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనాలు, భూముల కొనుగోలు. సంఘంలో గౌరవ మర్యాదలు. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు. ఎరుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. కాంట్రాకు ్టపనులు దక్కుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు, సమస్యలు తప్పకపోవచ్చు. అయితే క్రమేపీ అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆదాయం సమకూరుతుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనసౌఖ్యం. స్వల్ప అనారోగ్య సూచనలు. దూరప్రాంతాల నుంచి శుభ వార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు అందుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. నీలం, లేత ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. కళాకారులకు విశేష ఆదరణ లభిస్తుంది. నలుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పనుల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. బంధువులు, మిత్రులతో అకారణ వివాదాలు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. కష్టపడ్డా ఫలితం కనిపించని పరిస్థితి. ఇంటా బయటా ఒత్తిడులు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలలో మార్పులు. గులాబీ, లేత ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
రేపు జ్యువెలరీ షాపులు బంద్!
పాన్‌కార్డు నమోదు తప్పనిసరికి నిరసనగా జీజేఎఫ్ దేశవ్యాప్త సమ్మె కోల్‌కతా: దాదాపు 300 అసోసియేషన్స్‌కు చెందిన లక్షకు పైగా జ్యువెలరీ షాపు యజమానులు ఫిబ్రవరి 10న దేశవ్యాప్త సమ్మె చేయనున్నారు. రూ.2 లక్షలు, అంతకు మించి విలువైన బంగారు ఆభరణాల కొనుగోలుకు పాన్ కార్డు తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా సమ్మె చేపడుతున్నట్లు ‘ఆల్ ఇండియా జెమ్స్, జ్యువెలరీ ట్రేడ్ ఫెడరేషన్’ (జీజేఎఫ్) తెలిపింది. ప్రభుత్వపు చర్య.. దేశవ్యాప్తంగా ఉన్న అధిక సంఖ్యాక జ్యువెలర్స్, నగల తయారీదారులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని పేర్కొంది. అన్ని అసోసియేషన్స్ సహకారంతోనే సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఆదాయపు పన్ను చెల్లించలేని, గ్రామాల్లో నివసించే, వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్నవారు అధికంగా ఉండే ప్రాంతాల్లోని బంగారు షాపుల వారి వ్యాపారానికి పాన్ కార్డు తప్పనిసరి చర్య అడ్డుగా పరిణమిస్తోందని జీజేఎఫ్ డెరైక్టర్ బచ్‌రాజ్ బమల్వా వివరించారు. భారత్‌లో కేవలం 22 కోట్ల పాన్ కార్డుల జారీ జరిగిందని, ప్రభుత్వపు చర్య వల్ల జ్యువెలరీ పరిశ్రమ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. పాన్ కార్డు తప్పనిసరి చర్య అమల్లోకి వచ్చిన దగ్గరి నుంచి పరిశ్రమ మొత్తం టర్నోవర్ 30 శాతం తగ్గిందన్నారు. చిన్న వ్యాపారులు, పనివారు, నగల తయారీదారుల ఉపాధి కల్పన ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని బంగారు షాపు యజమానులు నష్టపోయే పరిస్థితి నెలకొందని జీజేఎఫ్ తూర్పు జోనల్ చైర్మన్ శంకర్ సేన్ పేర్కొన్నారు. దాదాపు 50 శాతంపైగా బంగారం వ్యాపారం చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతుంద న్నారు. కేంద్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి రూ.2 లక్షలు, అంతకు మించి విలువైన బంగారు ఆభరణాల కొనుగోలుపై పాన్ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. -
వాలెంటైన్ వైరస్
చలికాలం వెళుతూ వెళుతూ ఉండగానే మొదలయ్యే చెలికాలం ఇది. నులివెచ్చని గిలికాలం ఇది. ఎల్లలకు అతీతంగా విస్తరించే ప్రేమికుల కాలం ఇది. యవ్వనానికి వసంతం వచ్చి లవ్వనంగా విరబూసే కాలం ఇది. పాతికేళ్ల కిందటి వరకు ఇలాంటి కాలం కాని కాలం ఒకటి వచ్చిపడుతుందని మన దేశంలో కాలజ్ఞానులెవరూ ఊహించనైనా ఊహించలేదు. చివరకు బ్రిటిష్‌వాడు పరిపాలించిన కాలంలో సైతం ఇలాంటి కాలం ఒకటి ఉంటుందనే విషయమైనా మనవాళ్లకు తెలియదు. కానికాలమని ఆడిపోసుకులేం. అలాగే, అయిన కాలమని మురిసిపోనూలేం. ప్రపంచీకరణ దెబ్బకు భూగోళం స్పీడు పెరిగిందో ఏమో మరి! పడమటి గాలులు బలంగా వీచడం మొదలుపెట్టాయి. వాటి తాకిడికి కాలగతుల్లో నానా మార్పులు వచ్చిపడ్డాయి. అలాంటి మార్పుల్లో మరీ ప్రస్ఫుటంగా కనిపించే మార్పు ఇది. కాలం కాని కాలం వచ్చిపడే సరికి... ఈ పెద్దోళ్లున్నారే... ‘ఇదేం పోయేకాలం’ అని నొసలు చిట్లించి, నోళ్లు నొక్కుకోవడం షరామామూలే. కొత్త కొత్తగా అనిపించే కాలం అడుగుపెట్టే సరికి... ‘కొత్త కొత్తగా ఉన్నదే..’ అంటూ యువతరం హుషారు గీతాలను జోరుగా ఆలపించడమూ అంతే మామూలు. జంటరితనమే రుతుధర్మం ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న ఒక్కరోజుకు మాత్రమే పరిమితం కాదిది. ఈ రోజుకు కొన్నాళ్ల ముందు నుంచి, కొన్నాళ్ల తర్వాతి వరకు ప్రభావం ఉండనే ఉంటుంది. అందుకే దీనిని ప్రేమికుల కాలంగా ఎంచవచ్చు. ప్రకృతి సిద్ధంగా వచ్చే కాలాలకు రుతుధర్మాలు ఉన్నట్లే, ఈ కాలానికీ కొన్ని రుతుధర్మాలు ఉన్నాయి. వాటిలో కొట్టొచ్చినట్లు కనిపించే లక్షణం జంటరితనం. ఔను! జంటరితనమే ఈ కాలం రుతుధర్మం. ఈ కాలంలో మూగప్రేమలకు మాటలొస్తాయి. సెల్లుప్రేమలకు బిల్లులొస్తాయి. పార్కు ప్రేమలకు ‘నో పార్కింగ్’ నోటీసులొస్తాయి. ‘చాట్’మాటు ప్రేమలకు మీటింగులొస్తాయి... ఆపై డేటింగులొస్తాయి. కుర్రకారు జోరుకు మాజీ యువకులు బేజారెత్తిపోయే కాలం ఇది. అనుభవ‘జ్ఞాన వృద్ధుల’కు ఫ్లాష్‌బ్యాక్ రీళ్లు కళ్లకు కట్టి, పెదవులపై ముసిముసి నవ్వులు విరిసే కాలం ఇది. ఖానా ఖజానా, గానా బజానా, నయా నజరానా వ్యాపారాలకు కాసుల వర్షం కురిసే కాలం ఇది. కాలానికి తగ్గ అకాల ఉపద్రవాలు ఎండాకాలంలో ఒక్కోసారి భగభగల జోరు పెరిగి వడదెబ్బల తాకిడి పెరుగుతుంది. ఇంకొక్కోసారి ఉన్నట్టుండి వడగళ్ల వానలు పడతాయి. వర్షాకాలంలో ఒక్కోసారి తుపానులు, వరదలు ఊరూవాడా ముంచెత్తుతాయి. ఇంకొక్కోసారి మబ్బులు ఉరిమినా, చినుకులు నేలరాలడానికి మొహమాటపడతాయి. చలికాలంలో ఒక్కోసారి వెన్నులోంచి వణుకు తన్నుకొచ్చేలా మంచు కురుస్తుంది. ఇంకొక్కోసారి పొద్దున్నే పొగమంచు లీలగా కనిపించినా, మధ్యాహ్నానికి చిరుచెమటలు పడుతూ ఉంటాయి. ఏ కాలానికి తగ్గ అకాల ఉపద్రవాలు ఆ కాలానికి ఉండనే ఉంటాయి. ప్రేమికుల కాలానికి కూడా ఇలాంటివి ఉంటాయి. చెట్టపట్టాలేసుకు సాగిపోయే జంటరులపై జీవితంలో రసికత ఎరుగని ఒంటరుల దాడులు పెరుగుతాయి. అప్రాచ్య పవనాలను ఖండించడానికి ఛాందస ఖడ్గాలు పైకిలేస్తాయి. ప్రేమపక్షుల కిలకిలారావాలను సహించలేని స్వయంప్రకటిత సాంస్కృతిక పరిరక్షకదళాలు ‘శివా’లెత్తిపోతాయి. ప్రేమ రాలు కాలం వసంతానికి ముందు ఆకు రాలు కాలం వచ్చినట్లే... ప్రేమికుల కాలానికి ముందు ప్రేమరాలు కాలం కూడా వస్తుంది. లవ్వనంలో చాలా ప్రేమలు ఈ కాలానికి కొద్దిరోజుల ముందే పుటుక్కున రాలిపోతూ ఉంటాయి. జంటరులు తిరిగి ఒంటరులవుతారు. ఈ కాలంలోనే ఒంటరులుగా మారిన సెలిబ్రిటీ జంటరుల సంగతులు తరచుగా వార్తలకెక్కుతూ ఉంటాయి. తాజాగా ఈ ఏడాది విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తిరిగి ఒంటరులయ్యారు. ఎవరు ఎవరిని విడిచిపెట్టేశారనేది పక్కనపెడితే, ఇద్దరి నడుమ అల్లుకున్న అనుబంధపు లత నుంచి ప్రేమ రాలిపోయిందనేది వాస్తవం. అయితే, ప్రేమ రాలిపోయినంత మాత్రాన జీవితాలు మోడుబారిపోవు. జీవితంలో ప్రేమ మళ్లీ మళ్లీ చిగురిస్తూనే ఉంటుంది. లవ్వనం మళ్లీ మళ్లీ విరబూస్తూనే ఉంటుంది. -
ఫిబ్రవరి 4న ప్రేమ పోటీల ప్రసారం
తనంటే అమ్మాయికి ప్రేమ ఉంన్నదీ లేనిదీ 'లవ్ మీటర్' ద్వారా తెలుసుకుంటాడు 'అపరిచితుడు'లో రెమో. నిజజీవితంలో ప్రేమను కొలిచే అలాంటి మ్యాజిక్ సాధనాలేవీ లేవుగానీ శాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్రేమ గాఢతను నిరూపించవచ్చు. ప్రియమైన వ్యక్తిని చూడటంతోనే విడుదలయ్యే ఆక్సిటోసిన్(ప్రేమను కలిగించే హార్మోన్లు) ప్రభావానికి 'ఇంకా దగ్గరికి వెళ్లు' అని మెదడు ప్రతిస్పందనలు పంపుతుంది. ఈ రసాయనిక చర్య కేవలం స్వజాతి జీవుల్లోనే కాక విభిన్న జీవుల మధ్య కూడా ఒకేరకంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ క్రమంలో మనిషిని అమితంగా ప్రేమించే జంతువు ఏది? అనే దిశగా జరిగిన ప్రయోగాల్లో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. మనిషిని ప్రేమించడంలో విశ్వాసానికి ప్రతీకగా నిలిచే శునకరాజాలు మార్జాలాలను తోసిరాజన్నాయి. అమెరికాకు చెందిన న్యూరోసర్జన్ పాల్ జాక్ పరిశోధన ఇలా చేశారు.. 10 పిల్లులు, 10 కుక్కలను ఎంచుకుని, అవి వాటివాటి యజమానులతో విడివిడిగా గడిపినప్పటి దృశ్యాలు రికార్డ్ చేయడమేకాక వాటి మెదళ్లలో చోటుచేసుకున్న రసాయన ప్రక్రియలను కూడా పరిశీలించారు. యజమానికి దగ్గరగా ఉన్నప్పుడు కుక్కలో 57.2 శాతం ఆక్సిటోసిన్ విడుదలకాగా, పిల్లిలో మాత్రం కేవలం 12 శాతమే విడుదలైంది. దీన్నిబట్టి యజమానిని ప్రేమించే పోటీల్లో కుక్కలే విజేతలుగా నిలిచాయి. ఈ ప్రయోగానికి సంబంధించిన కార్యక్రమం ప్రఖ్యాత న్యూస్ ఛానెల్ బీబీసీలో ఫిబ్రవరి 4న ప్రసారంకానుంది. -
వేలంలో 8 మంది స్టార్ ఆటగాళ్లు
♦ జాబితాలో యువీ, ఇషాంత్ ♦ 6న ఐపీఎల్ ఆటగాళ్ల వేలం న్యూఢిల్లీ: ఐపీఎల్ తొమ్మిదో సీజన్ కోసం ఫిబ్రవరి 6న జరిగే వేలానికి 351 మంది ఆట గాళ్లు అందుబాటులో ఉండనున్నారు. స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, పేసర్ ఇషాంత్ శర్మతో పాటు ఎనిమిది మంది ప్రముఖ ఆటగాళ్లు కూడా ఇందులో ఉన్నారు. బెంగళూరులో ఈ వేలం జరుగుతుంది. ఓవరాల్‌గా ఈ వేలంలో 230 మంది భారత ఆటగాళ్లు కాగా 131 మంది విదేశీ క్రికెటర్లున్నారు. ఇతర ఆరుగురు స్టార్ ఆటగాళ్లలో షేన్ వాట్సన్, ఆరోన్ ఫించ్, స్టెయిన్, స్మిత్, గప్టిల్, పీటర్సన్ ఉన్నారు. మరోవైపు 130 మంది క్యాప్డ్ క్రికెటర్లలో 29 మంది ఆసీస్‌కు చెందినవారే ఉన్నారు. భారత్ నుంచి 127 మంది ఉన్నారు. 204 మంది అన్క్యాప్డ్ ఆటగాళ్లున్నారు. =ఇక యువీ, ఇషాంత్ భారత్ నుంచి ప్రముఖ ఆటగాళ్లు కావడంతో పాటు వేలంలో వీరు ఫ్రాంచైజీలను ఏమేరకు ఆకట్టుకోనేది ఆసక్తికరంగా మారింది. గతంలో అత్యధిక ధర పలికి రికార్డు సృష్టించిన యువరాజ్ గత రెండు సీజన్ల నుంచి బెంగళూరు, ఢిల్లీ జట్ల నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ఇషాంత్ హైదరాబాద్ జట్టు నుంచి విడుదలయ్యాడు. -
ఇక నెలలో ఆరుసార్లేనట
న్యూఢిల్లీ: ఆన్లైన్ రైల్వే రిజర్వేషన్ విధానంలో భారత రైల్వే శాఖ మరోసారి కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇంటర్నెట్ ద్వారా టికెట్ల కొనుగోలుపై ఆంక్షలు విధించింది. ఇక మీదట నెలలో ఆరుసార్లు మాత్రమే రైల్వే టికెట్లను ఆన్లైన్లో బుకింగ్ చేసుకొనే విధంగా నిబంధనలను సవరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధన ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి రానున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు ఒక నెలలో ఈ-టికెటింగ్ ద్వారా పదిసార్లు టికెట్లను బుక్ చేసుకొనే వెసులుబాటు ఉండేది. తాజా పరిణామంతో తరచూ రైళ్లలో ప్రయాణం చేసేవారికి ఇక కొత్త తలనొప్పులు మొదలైనట్టే. రైల్వేశాఖ కొత్త నిబంధనలపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ-టికెటింగ్ విధానాన్ని ప్రమోట్ చేయాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహిరిస్తోందని ఆరోపిస్తున్నారు. చాలామంది సాధారణ ప్రయాణికులకు ఈ విధానం వల్ల అసౌకర్యం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఆన్లైన్ రైల్వే రిజర్వేషన్ విధానంలో చోటుచేసుకొంటున్న అక్రమాలకు తెరదించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. దళారీలను నిరోధించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. -
ఫిబ్రవరి 3న ఐసెట్ నోటిఫికేషన్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఐసెట్)కు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 6 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణకు దాదాపు నెలరోజులపాటు గడువు ఇవ్వనున్నారు. గురువారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏపీఐసెట్ కమిటీ సమావేశం జరిగింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి, వైస్ఛైర్మన్లు ప్రొఫెసర్ విజయప్రకాశ్, ప్రొఫెసర్ నరసింహారావు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి, ఐసెట్ కమిటీ ఛైర్మన్, ఏయూ వీసీ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు, కన్వీనర్ ప్రొఫెసర్ కె.రామ్మోహనరావు, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ వరదరాజన్, క్యాంపుఆఫీస్ ఇన్‌ఛార్జి కె.రఘునాధ్ తదితరులు పాల్గొన్నారు. ఐసెట్ షెడ్యూల్‌ను సమావేశంలో కమిటీ ఖరారు చేసింది. ఐసెట్ షెడ్యూల్ : నోటిఫికేషన్ - ఫిబ్రవరి 3 ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - ఫిబ్రవరి 6 అపరాధ రుసుము లేకుండా గడువు - మార్చి 5 రూ.500 రుసుముతో - మార్చి 15 ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పులుంటే సవరణ - మార్చి 19 రూ.2వేల రుసుముతో - మార్చి 24 రూ.5వేల రుసుముతో - మార్చి 31 హాల్టిక్కెట్ల డౌన్లోడ్ ప్రారంభం - ఏప్రిల్ 20 రూ.10వేల రుసుముతో దరఖాస్తు స్వీకరణ - మే 9 ఐసెట్ పరీక్ష - మే 16 ప్రాధమిక కీ విడుదల - మే 19 అభ్యంతరాలకు గడువు - మే 23 ర్యాంకుల ప్రకటన - మే 27 -
ఫిబ్రవరి 13న రాష్ట్రానికి ప్రధాని మోదీ!
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ ఫిబ్రవరి 13న రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. వరంగల్‌లోని గిరిజన విశ్వవిద్యాలయం, కాళోజీ హెల్త్ వర్సిటీ, టెక్స్టైల్ పార్క్‌ల శంకుస్థాపన కార్యక్రమాల్లో మోదీ పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమం ఇంకా ఖరారు కాలేదన్నారు. బుధవారం సచివాలయంలో మాట్లాడుతూ.. గతంలో జరిగిన డీఎస్సీల్లో నష్టపోయిన అభ్యర్థులను ఆదుకుంటామని, ఈ విషయంలో న్యాయసలహా తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌లో పేదలకు మూడు లక్షల మేర డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామన్నారు. గ్రేటర్ మేయర్ స్థానాన్ని టీఆర్ఎస్ ఒంటరిగానే కైవసం చేసుకుంటుందన్నారు. రాజకీయ అనుభవం లేని లోకేశ్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. -
ఫిబ్రవరి 4-5 తేదీల్లో భారత పెట్టుబడుల సదస్సు
న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఫిబ్రవరి 4, 5 తేదీల్లో దేశంలో పెట్టుబడుల సదస్సును నిర్వహించనుంది. న్యూ ఢిల్లీలో జరిగే ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు పాల్గొంటారని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ బుధవారం ట్వీట్ చేశారు. భారత్ ఆర్థికవృద్ధి లక్ష్యంగా మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలను చేపడుతున్న ప్రభుత్వం... భారత్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలుసహా పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సదస్సును ఆర్థికమంత్రిత్వ శాఖ నిర్వహించనుంది. రోడ్లు, రహదారులు, చమురు, గ్యాస్, రైల్వే మంత్రిత్వశాఖల అధికారులు ఈ సదస్సులో పాల్గొని ఆయా రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలను వివరించే అవకాశం ఉంది. పలు గ్లోబల్ ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఆ ముగ్గురు హీరోలు సర్దుకుపోతున్నారు!
సంక్రాంతి సీజన్‌కు భారీ పోటి నెలకొనటంతో మంచి విజయం సాధించిన సినిమాలు కూడా కలెక్షన్ల రికార్డ్‌లు సృష్టించటంలో వెనకపడుతున్నాయి. దీంతో త్వరలో భారీ పోటికి సిద్దమవుతున్న హీరోలు సర్థుకుపోయే ఉద్దేశంలో ఉన్నారట. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 5న మంచి అంచనాలున్న మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అయితే సంక్రాంతి రిలీజ్‌తో ఆలోచనలో పడ్డ ఆ ముగ్గురు ఇప్పుడు డేట్లు సర్ధుబాటు చేసుకుంటున్నారు. నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ, సునీల్ హీరోగా తెరకెక్కిన కృష్ణాష్టమి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రెండో సినిమా స్పీడున్నోడు సినిమాలు ఫిబ్రవరి 5న రిలీజ్ చేయాలని భావించారు. అయితే భారీ పోటీ దృష్ట్యా థియేటర్లు సర్థుబాటు కాకపోవటంతో ఇప్పుడు వారానికి ఒక సినిమా చొప్పున రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రెండో సినిమా స్పీడున్నోడు ఫిబ్రవరి 5న రిలీజ్ అవుతుంది. ఆ తరువాత ఫిబ్రవరి 12న నాని, కృష్ణగాడి వీరప్రేమగాధ రిలీజ్ కానుంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిన సునీల్ కృష్ణాష్టమిని మరింత ఆలస్యంగా ఫిబ్రవరి 19న రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. -
ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి5కు వాయిదా
-
ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక
సాక్షి,సిటీబ్యూరో: ఫిబ్రవరి 11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నట్టు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి తెలిపారు. 5న కౌంటింగ్ పూర్తవనుండగా, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి విజయం సాధించిన కార్పొరేటర్లకు 6న ప్రత్యేక నోటీస్ జారీ చేయనున్నట్లు చెప్పారు. గురువారం రాత్రి ఆయన మీడియా సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. మేయర్ ఎన్నికల్లో 150 డివిజన్ల కార్పొరేటర్లతో పాటు జీహెచ్ఎంసీలో ఎక్స్అఫిషియో సభ్యులుగా ఉన్న వారు ఓటర్లుగా ఉంటారు. ఈ ఎన్నికకు రంగారెడ్డి లేదా హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను రిటర్నింగ్ అధికారిగా నియమించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ సెంటర్లో ఎన్నికల సమాచారాన్ని చార్టుల రూపంలో ప్రదర్శించడంతోపాటు ఫిర్యాదుల్ని స్వీకరించేందుకు మూడు టెలిఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఫోన్ నెంబర్లు: 040- 2326 1330, 2322 2018, 2322 1978. అదనంగా 35 పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే ఉన్న 7757 పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరో 35 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. కొత్తగా నమోదైన ఓటర్లు పెరిగినందునఅదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. దీంతో మొత్తం పోలింగ్ కేంద్రాలు 7792 కానున్నాయి. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఈనెల 27లోగా పోస్టల్ బ్యాలెట్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. వీటిని ఫిబ్రవరి 4లోగా సంబంధిత రిటర్నింగ్ అధికారులకు పంపించాల్సి ఉంటుందన్నారు. ఓటర్లందరూ తప్పనిసరిగా పోలింగ్‌లో పాల్గొనేలా విద్యార్థుల ద్వారా సంకల్ప పత్రాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 8.92 లక్షల ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేశామన్నారు. వీటితోపాటు ఎన్నికల సంఘం వెబ్సైట్, ప్రత్యేక యాప్‌ల ద్వారా 3.83 లక్షల మంది ఓటర్ స్లిప్‌లు డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు. -
ఫిబ్రవరి 2న వేతనంతో కూడిన సెలవు
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 2 వ తేదీని వేతనంతో కూడిన సెలవు రోజుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కార్మిక చట్టంలోని సెక్షన్ 135-బి(4)ను అనుసరించి ప్రైవేట్ విభాగాలలో, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ సెలవు వర్తిస్తుందని పేర్కొంది. గ్రేటర్ పరిధిలోని వారందరికీ వర్తిస్తుందని కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
లైఫ్‌లో గొప్ప నిర్ణయం అదే: రితేశ్
ముంబై: తన భార్య చేయందుకోవడమే జీవితంలో తను చేసిన గొప్ప పని అని బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ పొంగిపోతున్నాడు. వివాహ వార్షికత్సవం సందర్భంగా భార్య జెనీలియా పట్ల తన ప్రేమను అద్భుతంగా వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో అభిమానులతో సంతోషాన్ని అతడు పంచుకున్నాడు. నాలుగేళ్ల క్రితం తాను తీసుకున్న ఉత్తమ నిర్ణయం జెనీలియాను ఎంచుకోవడమంటూ మంగళవారం రితేశ్ ట్విట్ చేశాడు. జీవితభాగస్వామి పట్ల తనకున్న అవ్యాజమైన అనురాగాన్ని ప్రకటించి మరోసారి ఆమె మనసు కొల్లగొట్టేసాడు. అటు అభిమానుల గుండెల్లో హీరోగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. కాగా తుఝె మెరీ కసమ్ సినిమాతో రీల్ లైఫ్ దంపతులుగా వెలిగిన జెనీలియా, రితేశ్ ముఖ్ రియల్ లైఫ్ లోనూ బాలీవుడ్ క్యూట్ కపుల్ గా అవతరించారు. సంతోషకరమైన వీరి వైవాహిక జీవితంలో 2004 లో కొడుకు రియాన్ ఎంటరై మరిన్ని వెలుగులు పూయించాడు. తొందర్లోనే జెనీలియా మరోబిడ్డకు జన్మనివ్వనుంది. పన్నెండేళ్లుగా బాలీవుడ్ లో తమదైన శైలిలో రాణిస్తూ సముచిత స్థానాన్ని సంపాదించుకున్నాడు రితేశ్. -
భాగ్యనగరిలో సంగీత ఝరి!
► హైదరాబాద్ వేదికగా ‘సెన్సేషన్’ డ్యాన్స్ షో సాక్షి, హైదరాబాద్: ఆకాశం నుంచి అగ్నిపూలు జాలువారుతున్నాయా అన్నట్లు బాణసంచా కాల్పులు.. కళ్లు మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు.. లయబద్ధంగా వినిపిస్తూ ఉర్రూతలూగించే సంగీత ఝరి.. అందులో తడిసి ముద్దవుతూ కుర్రకారు డ్యాన్స్‌లు.. కళ్లకు కనువిందు చేసే లేజర్ షోలు.. ఇవన్నీ నెదర్లాండ్స్ కేంద్రంగా పుట్టి ప్రపంచాన్నే ఉర్రూతలూగిస్తున్న అతిపెద్ద డ్యాన్స్ షో ‘సెన్సేషన్’ విశేషాలు. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యాంలో పుట్టి ప్రపంచ యువతను ఓలలాడిస్తున్న సెన్సేషన్ డ్యాన్స్ షోకు ఇప్పుడు హైదరాబాద్ నగరం వేదిక కానుంది. ఓ తరంగంలా సాగనున్న ఈ కార్యక్రమాన్ని సెన్సేషన్ నిర్వాహకులు ఏటా ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల్లోని ప్రముఖ స్టేడియాల్లో నిర్వహిస్తూ.. తొలిసారిగా భారత్‌లో.. అది కూడా హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. దాదాపు 50 వేలకు పైగా ప్రేక్షకులు ఈ డ్యాన్స్ షోలో పాల్గొంటారు. ఫిబ్రవరి 6న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ‘సెన్సేషన్’ భారీ ప్రదర్శన ఇవ్వనుంది. ఇక్కడి యువతను కొంగొత్త లోకాల్లో విహరింపజేసేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఈవెంట్లో పాల్గొనదలచుకునేవారు తప్పని సరిగా తెలుపు రంగు దుస్తులు ధరించాలని నిబంధన ఉంది. అందుకే ఈ షో సెన్సేషన్ వైట్‌గా పేరొందింది. ఈ డ్రెస్ కోడ్‌ను అందరూ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ షోలో ప్రేక్షకులను ఓలలాడించేందుకు నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యాం నుంచి దాదాపు వెయ్యి మంది కళాకారుల బృందం ఇక్కడికి రానుంది. వీరితో పాటు భారత్‌కు చెందిన ప్రముఖ డీజేలు కూడా ఈ ఈవెంట్లో పాల్గొంటారు. ప్రభుత్వానికి అందివచ్చిన అవకాశం! ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సెన్సేషన్ మంచి అవకాశం కానుంది. భిన్న సంస్కృతులతో అలరారుతున్న హైదరాబాద్‌ను ఈ డ్యాన్స్ షోకు వేదికగా మార్చుకునేందుకు అనుమతివ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని నిర్వాహకులు కోరారు. దీన్ని మంచి అవకాశంగా భావించిన ప్రభుత్వం దీనికి అనుమతులు జారీ చేసింది. వెంటనే గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లు చేసేందుకు పర్యాటక శాఖ సంసిద్ధత ప్రకటించింది. -
వచ్చేనెల 4నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ర్యాలీ
నిజామాబాద్‌నాగారం : నిరుద్యోగ యువత కోసం ఆసక్తి ఉన్న వారికి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు స్టెప్ ఇన్చార్జి సీఈవో ముత్తెన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ర్యాలీ ఫిబ్రవరి4నుంచి 13వరకు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఉంటుందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 19లోగా www.joinindianarmy.nic.in నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వారికి అదే వెబ్సైట్లో అడ్మిట్‌కార్డు వస్తుందన్నారు. -
బల్దియా ఎన్నికలు ఫిబ్రవరిలో?
► జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టు ఉత్తర్వుల ఎఫెక్ట్ ► మరో వారానికి పైగా ఎన్నికల ప్రక్రియ వాయిదా ► శనివారంలోగా డివిజన్ల రిజర్వేషన్ల వెల్లడి ► వెంటనే షెడ్యూల్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈసీ ► హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తాం: సీఎం కేసీఆర్ ► ప్రజలకు ఇబ్బందులను తప్పించేందుకే ► ఎన్నికల ప్రక్రియను కుదించాలనుకున్నామని వివరణ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల అంశం మరో మలుపు తిరిగింది. జనవరి నెలాఖరులోపే ముగియాల్సిన ఎన్నికల ప్రక్రియ మరో వారం రోజులకు పైగా వాయిదా పడడం ఖాయమైంది. జనవరి 23న ఎన్నికలు నిర్వహించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపిన రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం హైకోర్టు తీర్పుతో చుక్కెదురైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ గడువును 21 రోజుల నుంచి 14 రోజులకు కుదిస్తూ సర్కారు జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. శనివారం (ఈనెల 9) లోగా జీహెచ్ఎంసీ డివిజన్ల రిజర్వేషన్లను వెల్లడించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రిగానీ, శనివారం ఉదయంగానీ రిజర్వేషన్లకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసేందుకు అధికార వర్గాలు హడావుడి పడుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే ఎన్నికల షెడ్యూల్ జారీకి సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. అంటే 9వ తేదీన రాత్రి లేదా 10న ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయి. 10వ తేదీ ఆదివారమైనప్పటికీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఇబ్బందేమీ లేదని అధికారులు చెబుతున్నారు. 11న లేదా 12న నోటిఫికేషన్ ఇచ్చి అదేరోజు నుంచి నామినేషన్లను స్వీకరించడం ప్రారంభించే అవకాశం ఉంది. అదే జరిగితే 19వ తేదీలోపు నామినేషన్ల ఘట్టం ముగుస్తుంది. సాధారణంగా నామినేషన్ల ప్రక్రియ ముగిశాక.. పన్నెండు రోజుల వ్యవధితో పోలింగ్ నిర్వహించే వీలుంది. అంటే జనవరి 31న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల గడువు మధ్యలో భోగి, సంక్రాంతి, రిపబ్లిక్‌డే సెలవు దినాలు ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే... ఫిబ్రవరి 1 లేదా 2వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఆస్కారముందని తెలుస్తోంది. ఎన్నికల అనంతరం అవసరమైతే రీపోలింగ్, ఓట్ల లెక్కింపు, మేయర్ ఎన్నిక తదితర అంశాలకూ నిర్ణీత గడువు ఉంటుంది. మొత్తంగా ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని హైకోర్టు ఉత్తర్వులను బట్టి అధికారులు విశ్లేషిస్తున్నారు. ఫిబ్రవరి నెలారంభంలో పోలింగ్ నిర్వహిస్తే వెసులుబాటుగా ఉంటుందనే కోణంలో ఈసీ వర్గాలు పోలింగ్ తేదీలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తాం: సీఎం కేసీఆర్ హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తామని, కోర్టు చెప్పిన ప్రకారమే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులు తొలగించేందుకే తక్కువ వ్యవధిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలనుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు లక్ష మంది ఉద్యోగులు అవసరం. రాష్ట్రంలో ఉన్న మొత్తం మూడు లక్షల మంది ఉద్యోగుల్లో మూడో వంతు ఉద్యోగులు నెల రోజుల పాటు ఎన్నికల ప్రక్రియలో విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. దానివల్ల పరిపాలనలో అసౌకర్యం కలుగుతుంది. అభివృద్ధి పనులు కుంటుపడతాయి. హైదరాబాద్‌లో అతి ఎక్కువ జనసాంద్రత ఉంది. ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయం తీసుకుంటే ప్రజలు అసౌకర్యానికి గురయ్యే అవకాశముంది. ఈ కారణాల దృష్ట్యా జీహెచ్ఎంసీ ఎన్నికలను తక్కువ సమయంలో పూర్తిచేయాలని నిర్ణయించాం. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. కానీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 21 రోజుల్లో పోలింగ్ జరపాలన్న హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం..’’ అని కేసీఆర్ చెప్పారు. ఈ తేదీల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు (అంచనా) 9న లేదా 10వ తేదీన: ఎన్నికల షెడ్యూల్ విడుదల 11 లేదా 12న: నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం 19వ తేదీ నాటికి: నామినేషన్లు, ఉపసంహరణ, పరిశీలన పూర్తి జనవరి 31 లేదా ఫిబ్రవరి 1, 2 తేదీల్లో: పోలింగ్ నిర్వహణ ఫిబ్రవరి 10వ తేదీనాటికి: అవసరమైతే రీపోలింగ్, ఓట్ల లెక్కింపు, మేయర్ ఎన్నిక -
'ఫిబ్రవరి తొలివారంలో బడ్జెట్ సమావేశాలు'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించనున్నట్లు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ నూతన ఎమ్మెల్సీల చేత గురువారం ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాసన మండలిలో ఎమ్మెల్సీల సంఖ్య పరిపూర్ణం అయిందని తెలిపారు. ఇప్పుడు మండలిలో 40 మంది ఎమ్మెల్సిలు ఉన్నారని తెలిపారు. -
కొత్త క్యాంపస్‌లోకి ఇన్ఫోసిస్
సాక్షి, హైదరాబాద్: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తున్న సువిశాల నూతన ప్రాంగణంలోకి కార్యాలయాన్ని మార్చనుంది. 25,000 మంది పనిచేయగల సామర్థ్యంతో పోచారం వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాంగణంలో ఇప్పటికే 12,000 సీటింగ్ సామర్థ్యం వరకు పనులు పూర్తయ్యాయి. మంత్రి కె.తారక రామారావుకు ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా ఈ విషయాలను వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో కలసి సోమవారం టీ-హబ్‌ను సందర్శించిన అనంతరం మంత్రి కేటీఆర్‌తో విశాల్ సిక్కా భేటీ అయ్యారు. సంస్థ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవానికి రావాలని మంత్రిని ఆహ్వానించారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్‌లో ఇన్ఫోసిస్‌కు 10,000 మంది సీటింగ్ సామర్థ్యం గల ప్రాంగణం ఉంది. ఇక 2008లో రెండో ప్రాంగణం నిర్మాణ పనులను ఇన్ఫోసిస్ ప్రారంభించింది. రూ. 1,250 కోట్లతో 447 ఎకరాల స్థలంలో దీన్ని నిర్మిస్తున్నారు. పదేళ్లలో మూడు దశలుగా దీని నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి దశలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు అంచనా. ఈ భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఇన్ఫోసిస్ నూతన ప్రాంగణాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించే అవకాశముందని చెప్పారు. టీ-హబ్‌లో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఇన్ఫోసిస్ సంస్థ ఇన్నోవేషన్ ఫండ్ నుంచి సహకారం అందించేందుకు విశాల్ సిక్కా ఆసక్తి చూపించారని తెలిపారు. -
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఆటో ఎక్స్పో-2016 ప్రారంభం
ముంబై: ఆటో ఎక్స్పో-2016 ప్రదర్శన ఫిబ్రవరి 5న ప్రారంభం కానుంది. గతంతో పోలిస్తే ఈసారి దీనికి భారీ సంఖ్యలో సందర్శకులు రావచ్చని నిర్వహకులు అంచనా వేస్తున్నారు. ఐదు రోజులపాటు ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడా లోని ఇండియా ఎక్స్పో మార్ట్, ప్రగతి మైదాన్‌లో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్పో కార్యక్రమాన్ని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్(సియామ్), ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2014లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్పో కార్యక్రమానికి సగటున 1.25 లక్షల మంది వచ్చారు. దీంతో ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఆటో ఎక్స్పో కార్యక్రమంగా అవతరించింది. 1.13 లక్షల సందర్శకులతో షాంఘై ఆటో ఎక్స్పో దీని తర్వాతి స్థానంలో నిలిచింది. త్వ రలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్పోను 6 లక్షల మంది సందర్శించవచ్చని సియామ్ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ అంచనా వేశారు. గత కార్యక్రమంలో ఉత్పన్నమైన అవాంతరాలు అధిగమిస్తూ, మెరుగైన సేవలను అందించడానికి అన్ని వసతులను ఏర్పాటు చేశామని తెలిపారు. -
ఫిబ్రవరిలో ఘంటసాల సంగీత ఆరాధనోత్సవం
రాజమండ్రి కల్చరల్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 13, 14 తేదీల్లో రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో 24 గంటల నిర్విరామ ఘంటసాల సంగీత ఆరాధనోత్సవం నిర్వహించనున్నట్టు హైదరాబాద్‌కు చెందిన కిన్నెర ఆర్ట్ థియేటర్ కార్యదర్శి మద్దాలి రఘురామ్ వెల్లడించారు. స్థానిక ఆనం రోటరీ హాలులో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి గాయనీ గాయకులు బృందాలుగా కానీ, విడిగా కానీ ఘంటసాల పాటలు ఆలపిస్తారన్నారు. ఇందుకోసం ఘంటసాల పాటలు పాడిన 200 సినిమాలను ఎంపిక చేశామని తెలిపారు. ఒకరు పాడిన పాటను మరొకరు పాడరాదన్నారు. మూడు ఆర్కెస్ట్రా బృందాలు పాల్గొంటాయన్నారు. 14న జరిగే ముగింపు ఉత్సవంలో ఘంటసాల అర్ధాంగి సావిత్రమ్మ, తనయుడు రత్నకుమార్, ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, సినీ సంగీత దర్శకుడు ఆనంద్ తదితరులు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో పాల్గొనగోరే గాయనీ గాయకులు 98660 57777 సెల్ నంబర్లో సంప్రదించాలని రఘురామ్ కోరారు. విలేకరుల సమావేశంలో సినీ విజ్ఞాన విశారద ఎస్వీ రామారావు, నటుడు, గాయకుడు జిత్‌మోహన్ మిత్రా, ‘కిన్నెర’ కోశాధికారి కేవీ సుబ్బారావు కె.వెంకటేశ్వరరావు, సాహితీవేత్త ఫణి నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
హాజల్ కీచ్‌తో యువీ పెళ్లి?
ఫిబ్రవరిలో జరిగే అవకాశం ముంబై: బాలీవుడ్ నటి, బ్రిటిష్ మోడల్ హాజల్ కీచ్‌తో వచ్చే ఫిబ్రవరిలో యువరాజ్ సింగ్ వివాహం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీపావళి తర్వాత తన పెళ్లి వార్త గురించి యువరాజ్ చెబుతాడంటూ ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. అయితే ఈ స్టార్ క్రికెటర్ సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం ఫిబ్రవరిలో పెళ్లి జరిగే అవకాశం ఉంది. బాడీగార్డ్, బిల్లా సినిమాల్లో కీచ్ నటించింది. ఈ బ్రిటిష్ యువతితో యువీ డేటింగ్ చేస్తున్నాడంటూ నాలుగు నెలల క్రితం వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరూ గతంలో లండన్‌లో కలిసి తిరుగుతూ మీడియా కంట పడ్డారు.