Baahubali
-
బాహుబలి బాలుడు..!
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యులు క్లిష్టమైన కాన్పును సుసాధ్యం చేశారు. ఈ కాన్పులో మహిళ 5.25 కిలోల బాలుడికి జన్మనివ్వడం విశేషం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన మడకం సన్న భార్య నందినికి నెలలు నిండటంతో.. గురువారం ఉదయం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి వైద్యులు సాత్విక్, మల్లేశ్ సాధారణ ప్రసవం కోసంప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో రాత్రి శస్త్రచికిత్స చేయగా నందిని 5.25 కిలోల బరువైన మగశిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండగా.. ఆ రెండూ సాధారణ ప్రసవాలే జరిగాయి. ఈసారి కేసులో క్లిష్టత దృష్ట్యా తప్పనిసరిగా సిజేరియన్ చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. కాగా, తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. -
బాహుబలి 3 కి రంగం సిద్ధం..!
-
రాజా సాబ్ స్పెషల్ సాంగ్ అప్డేట్..
-
బాహుబలి 1000 కోట్లు.. దిమ్మతిరిగే ఫ్యాక్ట్స్
-
బాహుబలి బఫెట్
గచ్చిబౌలి: భారతదేశంలోనే అతిపెద్ద ఫ్యామిలీ ‘బఫెట్’ రెస్టారెంట్ గచ్చిబౌలిలో అందుబాటులోకి వచి్చంది. మాస్టర్ పీస్ ఇండియా ఆధ్వర్యంలో దీన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే...300 రకాల విభిన్న వంటకాలు అందుబాటులో ఉండడం. 500 మంది కూర్చునే సామర్థ్యంతో సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ఈ రెస్టారెంట్లో భారతీయ వంటకాలతోపాటు పాశ్చాత్య దేశాల రుచులను భోజన ప్రియులకు అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ దమ్ బిర్యానీతోపాటు కరేబియన్ ఫుడ్డింగ్, రాజస్థానీ కోఫ్తా కర్రీ, థాయ్ రెడ్కర్రీ, జపనీస్ సకానా కుట్సు, డచ్ చికెన్‌తో పాటు అనేక రకాల వెజ్, నాన్‌వెజ్ వంటకాలు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వెరైటీ స్టార్టర్స్, డెజర్ట్స్, ఇతర అన్ని రుచులు కలిపి 300 రకాల వంటకాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. టేస్ట్‌కు టేస్ట్.. ఎన్నో వెరైటీలు అందుబాటులోకి రావడంతో ఫుడ్‌లవర్స్ ఖుషీ అవుతున్నారు. మరెందుకు ఆలస్యం.. మాస్టర్ పీస్ వైపు ఓ లుక్కేయండి మరి. -
బాహుబలి వర్సెస్ బుజ్జి
-
బాహుబలిలా వెపన్
‘‘ప్రస్తుతం భాష అనేది హద్దుగా లేదు. ‘బాహుబలి’ సినిమా ఎన్నో భాషల్లో విడుదలైంది. మా ‘వెపన్’ మూవీ కూడా అలాంటి చిత్రమే. సూపర్ హ్యూమన్ సాగా కాన్సెప్ట్‌తో రానున్న ఈ మూవీ కొత్త ట్రెండ్ కావడంతో పాటు పెద్ద హిట్టవుతుంది’’ అని నటుడు సత్యరాజ్ అన్నారు. గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘వెపన్’.ఎంఎస్ మన్జూర్ సమర్పణలో మిలియన్ స్టూడియో బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గుహన్ సెన్నియప్పన్ మాట్లాడుతూ– ‘‘ఇదొక స్కైఫై థ్రిల్లర్, యాక్షన్ మూవీ’’ అన్నారు. ‘‘వెపన్’ లాంటి మంచి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు వసంత్ రవి, తాన్యా హోప్, రాజీవ్ పిళ్లై. -
సుర సుర సుర అసుర!
‘బాహుబలి’ ఫేమ్ ప్రభాకర్ ప్రధాన పాత్రలో పాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. రావుల రమేష్ నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ని,చిత్రంలోని మొదటి లిరికల్ (సుర సుర సుర అసురసురసుర...) వీడియోను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా సినిమాని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు రావుల రమేష్. ‘‘మా చిత్రానికి జాన్ భూషణ్ సంగీతం, సురేష్ గంగుల సాహిత్యం బాగా కుదిరాయి’’ అని పాలిక్ అన్నారు. -
బాహుబలి కంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ చేశాను – సత్యరాజ్
‘‘వెపన్’లాంటి సినిమా తీయాలంటే డైరెక్టర్,ప్రొడ్యూసర్స్, సినిమాటోగ్రాఫర్, వీఎఫ్ఎక్స్.. ఇలా సాంకేతిక నిపుణులే కీలకం. వాళ్ల తర్వాత యాక్టర్స్‌కు ప్రాధాన్యత అని నా అబిప్రాయయం. ‘బాహుబలి’ కంటే ‘వెపన్’లో ఎక్కువ యాక్షన్ సీన్స్ చేశా. గుహన్ సరికొత్త విజన్‌తో తీశారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది’’ అన్నారు సత్యరాజ్. గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వెపన్’. మన్సూర్ నిర్మించిన ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ‘‘సరికొత్త సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది’’ అన్నారు వసంత్ రవి. ‘‘మా బ్యానర్లో వస్తోన్న తొలి చిత్రమిది’’ అన్నారు మన్సూర్. ‘‘ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులున్నాయి’’ అన్నారు గుహన్ సెన్నియప్పన్. -
కట్టప్పా కమాన్... ఇదిగో బాహుబలి థాలీ
చెన్నైలోని పొన్నుస్వామి హోటల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ‘బాహుబలి థాలీ’ సోషల్ మీడియా స్టార్మ్‌గా మారింది. ‘మీలో బాహుబలి థాలీని టచ్ చేసే వీరుడు ఎవరు?’ అని ఒక నెటిజనుడు కామెంట్ పెట్టాడు. ట్విట్టర్ యూజర్ అనంత్ రూపన్గూడి ‘బాహుబలి థాలి’ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు థాలీ భారీ ప్లేట్‌ను కస్టమర్ల దగ్గరకు తీసుకు వస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ వీడియోను చూసి.... ‘నోరూరుతోంది సుమీ!’ అని లొట్టలు వేస్తున్న వారితో పాటు– ‘ఇది గుడ్ ఐడియా కాదు. రెండు ముక్కల్లో చెప్పాలంటే ఫుడ్ వేస్టేజీ’ అని విమర్శించిన వారు ఉన్నారు. ఇంతకీ బాహుబలి థాలి ధర ఎంతనుకుంటున్నారు? కేవలం రూ.1399 ప్లస్ జీఎస్టీ మాత్రమే! -
గాయంతో బాహుబలి.. బరువు తగ్గిన అరిసి కొంబన్
సాక్షి, చైన్నె: నోటి వద్ద తీవ్రగాయంతో బాహుబలి ఏనుగు, బరువు తగ్గి కనిపిస్తున్న అరిసి కొంబన్ ఏనుగు ఆరోగ్యంపై అటవీశాఖ అధికారులు దృష్టి పెట్టారు. వైద్య పరిశోధనలు, చికిత్సలకు సిద్ధమయ్యారు. ముందుగా బాహుబలిని పట్టుకుని వైద్య చికిత్సలు అందించేందుకు రెండు కుంకీ ఏనుగులను శనివారం రంగంలోకి దించారు. బాహుబలి ఏనుగు కోయంబత్తూరు జిల్లాలోని అటవీ గ్రామాల ప్రజలను వణికిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని పలుమార్లు దట్టమైన అడవుల్లోకి పంపించినా మళ్లీ గ్రామాల్లోకి వస్తోంది. ప్రస్తుతం మళ్లీ అటవీ గ్రామాల్లోకి వచ్చిన బాహుబలి ఏనుగుకు నోటి వద్ద తీవ్ర గాయం అయినట్టు అధికారులు గుర్తించారు. దానికి చికిత్స అందించేందుకు అటవీ అధికారులు, వైద్యులు సిద్ధమయ్యారు. శుక్రవారం రాత్రి నుంచి ఈ ఏనుగు కదలికలపై నిఘా పెట్టారు. మేట్టుపాళయం పరిసరాల్లో బాహుబలి ఉన్నట్టు గుర్తించారు. దీనిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ముదుమలై శరణాలయం నుంచి వశీం, విజయ్ అనే రెండు ఏనుగులను రంగంలోకి దించారు. ఈ ఏనుగుల ద్వారా బాహుబలిని మచ్చిక చేసుకుని మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నోటి వద్ద గాయానికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. బరువు తగ్గిన అరిసి కొంబన్ తేని జిల్లాలోని అటవీ గ్రామాల ప్రజలను బెంబేలెత్తించిన అరిసి కొంబన్ ఏనుగును ఇటీవల పట్టుకున్న విషయం తెలిసిందే. దీన్ని కన్యాకుమారి జిల్లా కొచ్చియారు పరిధిలోకి తీసుకెళ్లి వదలి పెట్టారు. ఈ పరిసరాలలోనే అరిసి కొంబన్ తిరుగుతోంది. రేడియో కాలర్ అమర్చి దీని కదలికలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కొచ్చియారు తీరంలో తిరుగుతున్న ఈ ఏనుగు మరీ బరువు తగ్గి కనిపించడంతో ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. దీంతో దీని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు వైద్య బృందాలు రంగంలోకి దిగాయి. హఠాత్తుగా ఏనుగు బరువు తగ్గడం అనుమానాలకు దారి తీస్తోంది. గత ఏడాది కాలంగా ఈ ఏనుగు గ్రామాల్లోకి చొరబడి ఇష్టానుసారంగా తనకు చిక్కిన ఆహారాన్ని తింటోంది. ప్రస్తుతం అడవుల్లో లభించే ఆహారం మాత్రమే తీసుకుంటున్న దృష్ట్యా బరువు తగ్గి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
ONEWEB: ఇస్రో కీర్తి కిరీటంలో... మరో వాణిజ్య విజయం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ఇస్రో మరో అద్భుత వాణిజ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 36 వన్‌వెబ్ ఇండియా–2 ఇంటర్నెట్ సమాచార ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్‌ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి అత్యంత బరువైన ఎల్వీఎం3–ఎం3 బాహుబలి రాకెట్ వాటిని తీసుకుని ఆదివారం ఉదయం 9.00 గంటలకు నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. బ్రిటన్‌కు చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్, ఇండియన్ భారతి ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా రూపొందించిన 5,805 కిలోలు బరువున్న ఈ ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్లు ఎత్తులో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ 36 ఉపగ్రహాలను 97 నిమిషాల వ్యవధిలో ఒక్కోసారి నాలుగేసి ఉపగ్రహాల చొప్పున 9 విడుతలుగా భూమికి అతి తక్కువ దూరంలో లోయర్ ఎర్త్ లియో అర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. అవన్నీ కక్ష్యలోకి చేరాయని, అంటార్కిటికా గ్రౌండ్‌స్టేషన్ నుంచి సిగ్నల్స్ అందాయని ఇస్రో ప్రకటించింది. వన్‌వెబ్ ఇండియా–1 పేరిట 2022 అక్టోబర్ 23న తొలి బ్యాచ్‌లో 36 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించడం తెలిసిందే. తాజా ప్రయోగంతో మొత్తం 72 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. ఇస్రో స్థాయి పెరిగింది: చైర్మన్ సోమనాథ్ ప్రయోగం విజయవంతం కాగానే మిషన్ కంట్రోల్ సెంటర్లో శాస్త్రవేత్తలు పరస్పరం అలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. రాకెట్‌లోని అన్ని దశలు అద్భుతంగా పనిచేసినట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు. ‘‘ఇది టీం వర్క్. ప్రపంచంలోనే అద్భుతమైన విజయంతో ఇస్రో కీర్తి ప్రతిష్టలను పెంచినందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రయోగం చరిత్రాత్మకమైనది. దీనివల్ల ఇస్రో వాణిజ్యపరమైన ప్రయోగాల ప్రయోజనాలకు మరింత బలం చేకూరింది. ఇదే ఊపులో పీఎస్ఎల్వీ సీ55 రాకెట్ ద్వారా ఏప్రిల్‌లో సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నాం. ఈ ఏడాది చంద్రయాన్–3, ఆదిత్య–ఎల్1తో పాటు మరో నాలుగు ప్రయోగాలు చేసే అవకాశముంది’’ అని చెప్పారు. వాణిజ్య ప్రయోగాలకు ఎల్వీఎం3 రాకెట్ ఎంతో ఉపయోగకారి అని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సీఎండీ డి.రాధాకృష్ణన్, మిషన్ డైరెక్టర్ ఎస్.మోహన్‌కుమార్ చెప్పారు. ఆత్మనిర్భరతకు తార్కాణం ప్రధాని మోదీ అభినందనలు వన్‌వెబ్ ఇండియా–2 ప్రయోగం దిగ్విజయం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. ఇస్రోకు అభినందనలు తెలిపారు. ‘‘వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో అంతర్జాతీయంగా భారత్ పై చేయిని ఈ ప్రయోగం మరింత దృఢపరిచింది. ఆత్మనిర్భరత స్ఫూర్తిని ఎలుగెత్తి చాటింది’’ అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. -
‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇందులో బాహుబలి, దేవసేన, కట్టప్ప, భళ్లాలదేవుడు, కాలకేయ, శివగామి పాత్రలు ఎంతో ప్రేక్షకాదరణ పొందాయి. అందులో ముఖ్యంగా రాజమాత శివగామి రోల్‌ను ఇప్పటికీ మర్చిపోలేదు. ఈ పవర్ఫుల్ రోల్ చేసిన రమ్యకృష్ణకు విశేషమైన గుర్తింపు దక్కింది. చదవండి: చిరు ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ‘మెగా154’ నుంచి క్రేజీ అప్డేట్ ఈ పాత్ర ఆమె కోసమే క్రియేట్ చేశారా? అనేంతగ రాజమాతగా రమ్యకృష్ణ ఒదిగిపోయారు. ఇందులో శివగామిగా రమ్యకృష్ణ తప్ప మరే నటి చేసిన అంతగా గుర్తింపు వచ్చి ఉండేది కాదని రాజమౌళితో సహా అందరు అభిప్రాయపడ్డారు. అయితే మొదట ఈ రోల్ కోసం రాజమౌళి మంచు లక్ష్మిని సంప్రదించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్‌కు అమ్మగా తాను చేయలేనని మంచు లక్ష్మి ఈ ఆఫర్‌ను వదులుకుంది. ఇదే విషయాన్ని ఎన్నో సందర్భాల్లో స్వయంగా మంచు లక్ష్మియే చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి ఇదే విషయంపై ఆమె స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె బాహుబలిలో తాను శివగామి పాత్ర చేయనందుకు గర్వపడుతున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చదవండి: 31 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్ కాబోతోన్న ‘దళపతి’ కాంబినేషన్ ‘బాహుబలిలో శివగామి పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అయితే ప్రభాస్‌కు తల్లిగా చేయాలనుకోలేదు. ఇండియాలో మనం ఒక పాత్ర పోషించిన తర్వాత దానిలోనే ఉండిపోతాం. కానీ నేను మాత్రం ఒకే తరహా పాత్రలకు పరిమితం కావాలనుకోలేదు. బాహుబలి సినిమా అంత పెద్ద హిట్ అయ్యాక .. నిజానికి నేను చాలా గర్వపడ్డాను. హమ్మయ్యా.. నేను ఆ సినిమా చేయలేదు అనుకున్నాడు. అది ఓ ప్రత్యేకమైన సినిమా కావచ్చు. కానీ ఆ పాత్రకు నేను కరెక్ట్ అనిపించలేదు. నా జీవితం.. నా కెరీర్ దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకున్నాను. అలాగే నేను నా కెరీర్లో నేను చేసిన ఐరేంద్రి(అనగనగా ఓ ధీరుడు చిత్రంలోని పాత్ర) లాంటి పాత్ర ఇంకోటి రాలేదు. ఇక మీదట రాదు కూడా’ అని ఆమె పేర్కొంది. -
బాహుబలిని మించిన సినిమా తీస్తా: కమల్ ఆర్ ఖాన్
Kamla R Khan Comments On Baahubali: బాలీవుడ్ సినీ విమర్శకుడిగా గుర్తింపు పొందిన కమల్ ఆర్ ఖాన్ తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. తన యూట్యూబ్ చానల్లో ద్వారా నటీనటులు, సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు షేర్ చేస్తుంటాడు. ఇటీవల పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్, ఈ మూవీ డైరెక్టర్ జక్కన్నపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత చెత్త సినిమా తీసినందుకు డైరెక్టర్ రాజమౌళిని జైలులో పెట్టాలని కేఆర్కే తీవ్ర విమర్శలు గుప్పించాడు. చదవండి: ‘శాకుంతలం’ డబ్బింగ్ కోసం 3 నెలలు శిక్షణ తీసుకున్న సామ్ తాజాగా అతడు రాజమౌళి మరో పాన్ ఇండియా చిత్రం బాహుబలిపై స్పందించాడు. బాహుబలి మూవీ కేవలం తెలుగులోనే కాదు ప్రపంచ సినిమాలోనే ఎలాంటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో రాజమౌళి, ప్రభాస్‌తో పాటు ఎంతోమంది నటీనటులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అయితే ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందిన బాహుబలి చిత్రాన్ని మించిన సినిమా తీస్తానంటూ కేఆర్కే సవాలు చేశాడు. దేశ్‌ద్రోహీ మూవీ సీక్వెల్‌ను ప్రకటిస్తూ దీన్ని బాహుబలిని మిచంఇన బడ్జెట్‌తో తెరకెక్కిస్తానని పేర్కొన్నాడు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలేంటో లుక్కేయండి! దీంతో అతడి కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అతడి తీరుపై ప్రభాస్, జక్కన్న ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తాము మరో మహమ్మారిని ఎదుర్కొలేమని, నాలుగో వేవ్‌ను చూడలేమంటూ అతడి ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2008లో కేఆర్కే హీరోగా నటించిన చిత్రమే ‘దేశద్రోహి’. ఈ సినిమాపై, ఇందులో కేఆర్కే నటనపై ఇప్పటికీ ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఇన్నాళ్ల తర్వాత దేశద్రోహి పార్ట్ 2 తెరకెక్కించేందుకు కేఆర్కే సిద్ధమయ్యాడు. అది కూడా బాహుబలిని మించేలా తెరకెక్కిస్తానని, ఇది చూసి బాలీవుడ్ వారు సినిమా ఎలా తీయాలో నేర్చుకోవాలి అంటూ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు కేఆర్కే. Shooting is going to start soon! pic.twitter.com/WEXxe5MkRB — KRK (@kamaalrkhan) April 18, 2022 -
బాహుబలి 2: అచ్చం ప్రభాస్‌ను దించేశాడు.. వైరల్ వీడియో
టాలీవుడ్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. రెండు పార్టులుగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టింది. ప్రభాస్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ప్రభాస్ నటన, పాటలు, యాక్షన్ సన్నివేశాలు ఒక్కటేంటి సినిమాలోని అన్నీ అంశాలు అభిమానులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే సినిమా వచ్చి ఆరేళ్లు పూర్తైనా ఇప్పటికీ బాహుబలికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కాగా బాహుబాలి సెకండ్ పార్ట్‌లో ప్రభాస్ తొండం మీద కాలు పెట్టి ఏనుగు మీదకు ఎక్కి కూర్చూనే సీన్ ఒకటి ఉంటుంది. దాదాపు ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది. సినిమాకు ఈ సన్నివేశం హైలెట్‌గా నిలిచింది. తాజాగా అచ్చం బాహుబలి స్టైల్లో ఓ వ్యక్తి ఏనుగు మీదకు ఎక్కాడు. ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విటర్లో పోస్టు చేశారు. 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఏనుగులపై స్వారీ చేసే వ్యక్తి దాని ముందు నిల్చొని ఉంటాడు. వెంటనే ఎలాంటి సాయం లేకుండా తొండంపై కాలు పెట్టి ఏనుగు ఎక్కి కూర్చుంటాడు. చదవండి: Viral Video: దున్నపోతుతో యవ్వారం.. దెబ్బకు గాల్లో ఎగిరి పడ్డారు.. He did it like @PrabhasRaju in #Baahubali2. @BaahubaliMovie @ssrajamouli pic.twitter.com/nCpTLYXp7g — Dipanshu Kabra (@ipskabra) March 30, 2022 ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్చేస్తోంది. ఈ దృశ్యం చూసిన నెటిజన్లు బాహుబలి సినిమాలోని సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చిదంటూ కామెంట్ చేస్తున్నారు. బాహుబలి 2లో ప్రభాస్ ఇలాగే చేశాడని, ప్రభాస్ ఒకవేళ వృద్ధుడు అయిన తర్వాత ఇలాగే చేసేవాడని, బాహుబలి పార్ట్ 3లా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: మిస్ యూనివర్స్‌కు బాడీ షేమింగ్.. అసలు విషయం చెప్పిన హర్నాజ్ -
‘రాజ్ కపూర్ తర్వాత ప్రభాస్‌కే’
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిచెప్పిన చిత్రం ‘బాహుబలి’. ఎన్నో రికార్డులు, అవార్డులు ఘనతలు అందుకున్న ‘బాహుబలి’ కీర్తి కిరీటంలో మరో కలికుతురాయి వచ్చిచేరింది. బాహుబలిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటనకు గాను ‘రష్యా ఆడియన్స్ హార్ట్’ అవార్డుకు ఎంపికయ్యాడు. 2015కు గాను ప్రకంటించిన అవార్డుల జాబితాలో ప్రభాస్‌కు అభిమానులను మెప్పించిన విభాగంలో అవార్డు లభించింది. రష్యాలోని సినీ ప్రేక్షకుల అభిమానాన్ని విపరీతంగా పొందడంతోనే ప్రభాస్‌కు ఈ అవార్డు లభించిందని అక్కడి ప్రతినిధులు పేర్కొంటున్నారు. (రిజర్వ్ ఫారెస్ట్ దత్తత తీసుకుంటా..) ఇక ఈ అవార్డు అందుకుంటున్న రెండో భారతీయ నటుడిగా ప్రభాస్ నిలవనున్నాడు. గతంలో దిగ్గజ నటుడు రాజ్‌కపూర్ ఈ అవార్డును అందుకున్నారు. శ్రీ 420, అవారా, ఆరాధన వంటి చిత్రాలతో రష్యన్ ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుని రష్యన్ అభిమానులను మెప్పించిన రాజ్ కపూర్ 30ఏళ్ల క్రితం ఈ అవార్డును అందుకున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి, బాహుబలి2 చిత్రాలు ఎంతటి చరిత్ర సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్‌తో పాటు రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ తదితరులు ఈ చిత్రంలో నటించి మెప్పించారు. (ప్రభాస్ కళ్లు నాకు చాలా ఇష్టం..) -
నా లైఫ్‌లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ – ప్రభాస్
భారతీయ సినిమా చరిత్రలో ‘బాహుబలి’ది ఓ ప్రత్యేకమైన స్థానం. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, తమన్నా ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్’ పేరుతో రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. 2017 ఏప్రిల్ 28న విడుదలైన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ వసూళ్ల రికార్డులను తిరగ రాసింది. ‘బాహుబలి 2’ విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభాస్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ దేశవ్యాప్తంగా ప్రజలు మెచ్చిన చిత్రమే కాదు.. నా లైఫ్‌లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్. ఈ సినిమా మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని నాకు అత్యంత చిరస్మరణీయంగా మలచిన దర్శకుడు రాజమౌళితో పాటు చిత్రబృందానికి, ఈ చిత్రాన్ని ఆదరించిన అభిమానులు, ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అని పేర్కొని ఓ వర్కింగ్ స్టిల్‌ను షేర్ చేశారు ప్రభాస్. ‘‘నటుడిగా ఎంతో నేర్చుకుంటూ, ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది’’ అని రానా పేర్కొన్నారు. -
బాహుబలికి ముందు ఆ సినిమానే!
సాక్షి, హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘బాహుబలి’... ఈ సినిమా విడుదలై చాలాకాలమైన ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడో చోట ఈ సినిమా ప్రదర్శితమవుతూనే ఉంది. తాజాగా ‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రాన్ని లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించారు. ఇప్పటివరకు రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించిన తొలి ఇంగ్లిషేతర సినిమా ‘బాహుబలి’ కావడం విశేషం. ఈ సినిమా ప్రదర్శనకు దర్శకుడు రాజమౌళితోపాటు రానా, ప్రభాస్, అనుష్క, కీరవాణి, శోభూ యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు. చిత్ర ప్రదర్శన సందర్భంగా ప్రభాస్, రానా బీబీసీ విలేకరి హరూన్ రషీద్‌తో ముచ్చటించారు. బాహుబలి సక్సెస్ గురించి తమ ఆనందానుభూతులను పంచుకున్నారు. ‘బాహుబలి’ కి ముందు తెలుగు సినిమాలు ఏమైనా ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రభావం చూపించాయా? అని రషీద్ ప్రశ్నించగా.. దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ చిత్రాన్ని ప్రభాస్ ప్రస్తావించారు. ‘30, సంవత్సరాల కిందట రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా దేశవ్యాప్తంగా సత్తాను చాటింది’ అని తెలిపారు. అయితే,బాహుబలి సినిమా అంతకుమించి దేశవ్యాప్తంగా అన్నిచోట్ల విజయం సాధించిందని, విదేశాల్లోనూ గొప్పగా ప్రేక్షకుల ఆదరణ పొందిందని ప్రభాస్ తెలిపారు. నాగార్జున హీరోగా వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. -
‘బాహుబలి’కి భల్లాలదేవ విషెస్
హైదరాబాద్: పుట్టినరోజు సందర్భంగా యంగ్ రెబల్ స్టార్, టాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్‌కు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాహుబలి ప్రభాస్ మరిన్ని గొప్ప సినిమాలు తీయాలని, ఆయన కెరీర్ గొప్పగా సాగాలని, మున్ముందు భారీ విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బాహుబలి సినిమాలో భల్లాలదేవుడిగా ప్రభాస్‌కు పోటీగా నటించిన రానా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో విషెస్ తెలిపారు. "జన్మదిన శుభాకాంక్షలు సోదరా... నీ అందమైన మనస్సు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ" అంటూ రానా ప్రభాస్‌కు విషెస్ చెప్పారు. ప్రభాస్ తో కలిసి నవ్వులు చిందిస్తున్న ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. 'బాహుబలి' సినిమాలో ప్రభాస్-రానా పోటాపోటీగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మూడేళ్లకుపైగా కలిసి పనిచేసిన ఈ ఇద్దరు స్టార్స్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. బాహుబలిగా ప్రభాస్‌కు ఎంత పేరు వచ్చిందో.. భల్లాలదేవగా రానాకు కూడా ప్రేక్షకులు అంతగానే ఫిదా అయ్యారు. -
‘వార్-2’: హృతిక్‌ను ప్రభాస్ ఢీకొడతాడా?
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్న నటుడు ప్రభాస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలతో ప్రభాస్ కెరీర్ ఎవరెస్ట్ శిఖరాలను అందుకుంది. ‘బాహుబలి’ సినిమాల అనంతరం ఇటీవల ప్రభాస్.. ‘సాహో’ తో ప్రేక్షకులను పలుకరించాడు. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ డివైడ్ టాక్ వచ్చింది. విమర్శకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయినా దేశవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల పరంగా పర్వాలేదనిపించింది. హిందీలో సుమారు రూ. 150 కోట్లు వసూలుచేసి.. ‘సాహో’ హిట్ అనిపించికుంది. మొత్తానికి ‘సాహో’ ప్రభాస్‌ను, ఆయన ఫ్యాన్స్ నిరాశపరిచినా.. ప్యాన్ ఇండియా స్టార్‌గా డార్లింగ్ స్టామినా ఏంటో చాటింది. ఈ క్రమంలో తన స్టార్‌డమ్‌ను కాపాడుకుంటూ.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేలా భారీ సినిమాలు తీసేందుకు ప్రభాస్ ఈ సమయాతమవుతున్నాడు. డార్లింగ్‌గా ఫ్యాన్స్ హృదయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ప్రభాస్ బుధవారం 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రభాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం. ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. చెన్నైలో సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించారు. టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్‌కు పెద్దనాన్న. ప్రభాస్ దేశవ్యాప్తంగా టాప్ స్టార్‌గా వెలుగొందుతున్నాడంటే అందుకు కారణం రాజమౌళి తీసిన బాహుబలి, బాహుబలి-2 సినిమాలు. బాహుబలి-2 సినిమా వసూళ్లపరంగా దేశంలోని అన్ని రికార్డులను చెరిపేసింది. మొదటి పదిరోజుల్లోనే ఈ సినిమా దేశంలో వెయ్యికోట్లు వసూలు చేసింది. అంతేకాదు ఇండియాలో రూ. 1500 కోట్ల మైలురాయి చేరిన తొలి సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. మరో సరదా అంశం ఏమిటింటే.. ప్రభాస్ గత మూడు చిత్రాల (బాహుబలి, బాహుబలి-2, సాహో)కు అయిన బడ్జెట్ దాదాపు రూ. 800 కోట్లు. ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్డే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్‌కు రీచ్ అయ్యేలా ప్రభాస్ భారీ సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు. 2017లో జీక్యూ మ్యాగజీన్ ప్రచురించిన అత్యంత ప్రభావవంతమైన యువత జాబితాలో ప్రభాస్ ఆరోస్థానంలో నిలిచాడు. బాహుబలి-2 సక్సెస్ దేశవ్యాప్తంగా యువతలో ప్రభాస్‌కు మంచి క్రేజ్‌ను తీసుకొచ్చింది. ప్రభాస్‌కు 40 ఏళ్లు వచ్చాయి. ఇప్పటికీ ఓ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. అదే ఆయన పెళ్లి. ప్రభాస్ ఎప్పుడు మ్యారెజ్ చేసుకుంటారు. ఈ ప్రశ్న ఆయనకు నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. గతంలో తన కో-స్టార్ అనుష్కను ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని వదంతులు వచ్చాయి. ఈ ఇద్దరు ‘మిర్చి’ సినిమా చేసినప్పటి నుంచి ఈ వదంతులు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తన పెళ్లి వదంతుల గురించి స్పందించిన ప్రభాస్.. తాను, అనుష్క మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. కనీసం నువ్వు అయినా పెళ్లి చేసుకో.. ఈ వదంతులు అగుతాయని అనుష్కను అడిగినట్టు ప్రభాస్ సరదాగా వ్యాఖ్యానించారు. దక్షిణాది సినీ స్టార్స్‌లో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం ప్రభాస్‌కి దక్కింది. బ్యాంకాక్‌లోని ప్రపంచ ప్రఖ్యాత మేడం టుస్సాడ్ మ్యూజియంలో ఆయన మైనపు బొమ్మ కొలువదీరింది. బాహుబలి చిత్రంలోని అమరేంద్ర బాహుబలి పాత్ర రూపంలో ఆయన మ్యూజియంలో దర్శనమిస్తున్నారు. ప్రభాస్ బాగా నచ్చిన సినిమా తన పెద్దనాన్న కృష్ణంరాజు నటించిన 'భక్తకన్నప్ప'. బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సినిమాలు అన్నా పడిచస్తాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రి ఇడియట్స్ సినిమాలను 20సార్లకుపైగా చూశాడట. ఇక హాలీవుడ్ విషయానికొస్తే రాబర్ట్ డీనీరో నటన అంటే ఇష్టం. ప్రభాస్‌కు వాలీబాల్ అంటే ఇష్టం. బాహుబలి సినిమా కోసం మిస్టర్ వరల్డ్ 2010 లక్ష్మణ్ రెడ్డి ప్రత్యేకంగా దేహాదారుఢ్యంపై ప్రభాస్‌కు శిక్షణ ఇచ్చారు. కండలు తిరిగిన దేహసౌష్ఠవం కోసం చిత్ర నిర్మాతలు ప్రత్యేకంగా రూ. 1.5 కోట్లు విలువచేసే జిమ్ ఎక్విప్మెంట్స్ ఇచ్చారు. చాలామంది నటులు వరుసగా సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపుతుండగా ప్రభాస్ మాత్రం ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాపై దృష్టి పెడుతున్నాడు. 'బాహుబలి' సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సాహో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ప్రస్తుతం 'జిల్' దర్శకుడు కె.కె. రాధాకృష్ణ డైరెక్షన్లో మరో భారీ సినిమాలో నటించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. గోపికృష్ణా మూవీస్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణంరాజు సమర్పణలో తెరకెక్కనున్న త్రిభాషా చిత్రానికి ‘జాను’ టైటిల్ ప్రచారంలో ఉంది. హృతిక్‌ను ఢీకొంటాడా? హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ ‘వార్’ ఈ ఏడాది సంచలన విజయాన్ని అందుకుంది. రూ. 300 కోట్లు వసూలు చేసి.. ఈ ఏడాదికి బిగ్గెస్ట్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో చిత్ర నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిలిమ్స్ ఉంది. ఈ సినిమా సీక్వెల్లో హృతిక్ పాత్ర యథాతథంగా కొనసాగనుండగా.. టైగర్ ష్రాఫ్ పాత్రను మాత్రం మరొకరు చేయాల్సి ఉంది. ఈ పాత్ర కోసం పలువురు హీరోల పేర్లు తెరపైకి వస్తుండగా.. ప్రభాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం గమనార్హం. బాలీవుడ్ మీడియా వర్గాలు కూడా ప్రభాస్ పేరును ‘వార్-2’కు ప్రముఖంగా సూచిస్తున్నాయి. ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్డమ్ ఉండటం.. దక్షిణాదిలో తిరుగులేని క్రేజ్ ఉండటంతో ‘వార్-2’లో హృతిక్, ప్రభాస్ కలిసి నటిస్తే.. దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ తథ్యమని సినీ విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు. -
పంచెకట్టులో రాజమౌళి.. ఎందుకోసమంటే..
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచదేశాలకు తెలిసేలా చేసిన చిత్రం బాహుబలి. తాజాగా బాహుబలి టీమ్ సభ్యులు మళ్లీ కలిశారు. లండన్‌లో రాయల్ రీ యూనియన్ జరుపుకున్నారు. వీరు ఎందుకోసం కలిశారంటే.. లండన్‌లోని అల్బర్ట్ హాల్లో శనివారం ‘బాహుబలి1’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బాహుబలి టీమ్ అక్కడికి వెళ్లింది. లండన్ వెళ్లిన వారిలో రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, కీరవాణి, శోభు యార్లగడ్డ ఉన్నారు. అక్కడ జరిగిన బాహుబలి ప్రదర్శనకు రాజమౌళి పంచెకట్టులో హాజరుకావడం విశేషం. ఈ సందర్భంగా హౌస్‌లోని ప్రేక్షకులు బాహుబలి యూనిట్‌ను చప్పట్లు, కేరింతలతో అభినందించారు. రాయల్ అల్బర్ట్ హాల్లో బాహుబలి ప్రదర్శనను చూడటానికి వచ్చిన పలువురు జపాన్ అభిమానులు వచ్చారు. బాహుబలి యూనిట్ స్టే చేసిన హోటల్ వెలుపల వారిని కలుసుకున్నారు. అలాగే వారితో ఫొటోలు కూడా దిగారు. అయితే రాయల్ అల్బర్ట్ హాల్లో తొలి నాన్-ఇంగ్లిష్ చిత్రం బాహుబలి అని ఆ చిత్ర బృందం తెలిపింది. ఇది మనందరికి గర్వకారణమని పేర్కొంది. -
ఇక ‘నాన్ బాహుబలి రికార్డ్’ అన్న పదం వినిపించదా!
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా భారతీయ సినిమా ముఖచిత్రాన్నే మార్చేసింది. వందకోట్ల వసూళ్లు సాధించటమే టార్గెట్ అనుకున్న ఇండియన్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో వసూళ్లకు గేట్లు తెరిచింది. బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా బాహుబలి విజయం ముందు దాసోహం అన్నాయి. బాహుబలి రిలీజ్ తరువాత ఆ రికార్డ్లను చెరిపేసేందుకు బాలీవుడ్ చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. కానీ ఇప్పుడు సాహో సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతుండటంతో మరోసారి బాహుబలి రికార్డ్‌లపై చర్చ మొదలైంది. ఇన్నాళ్లు భారీ విజయం సాధించిన సినిమాలను నాన్ బాహుబలి రికార్డ్ సాధించిందంటూ చెపుతూ వస్తున్నారు. కానీ సాహో రిలీజ్ తరువాత రికార్డ్‌లకు సరికొత్త స్టాండర్ట్స్ సెట్ అవుతాయంటున్నారు ఫ్యాన్స్. సాహో.. బాహుబలి రికార్డులన్నింటినీ చెరిపేయటం ఖాయం అని భావిస్తున్నారు. అయితే విశ్లేషకుల మాట మాత్రం మరోలా ఉంది. సాహో మీద భారీ అంచనాలు ఉన్నా బాహుబలి మార్క్‌ను అందుకోవటం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాహో బ్రేక్ఈవెన్ సాధించాలంటే దాదాపు 400 వందల కోట్ల వసూళ్లు సాధించాలి. కేవలం బాలీవుడ్లోనే 125 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ఆ స్థాయి వసూళ్లు సాహోకు సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బాహుబలి కాస్ట్యూమ్ డ్రామా కావటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సాహో రెగ్యులర్ సోషల్ యాక్షన్ కథ కావటంతో ఆ స్థాయిలో అంచనాలు కష్టమే అంటున్నారు. హిందీలో ఇప్పటికే ధూమ్ లాంటి యాక్షన్ సినిమాల చాలా వచ్చాయి. మరి సాహో వాటిని మించి బాలీవుడ్ జనాలు సాహో అలరిస్తుందా లేదా చూడాలి. -
ఇక అలాంటి సినిమాలు చేయను : ప్రభాస్
సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ప్రభాస్ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అనుష్కతో తన అనుబంధం గురించి క్లారిటీ ఇచ్చిన ప్రభాస్.. ఇక మీదట ఎట్టిపరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాల్లో నటించబోనని తేల్చి చెప్పేశాడు. భారీ బడ్జెట్ చిత్రాల వల్ల చాలా రోజులు పాటు షూటింగ్ చేయాల్సి రావటంతో పాటు రిలీజ్ సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురికావాల్సి వస్తుందన్నాడు ప్రభాస్. అభిమానుల కోరిక మేరకు ఇక మీదట ఏడాదికి రెండు సినిమాలు చేసేలా ప్రయత్నిస్తానని చెప్పాడు. అంతేకాదు ‘సాహో భారీ వసూళ్లు సాధించి చరిత్ర సృష్టిస్తుందో లేదో చెప్పలేను కానీ బాహుబలి అభిమానులను మాత్రం తప్పకుండా అలరిస్తుంద’న్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ సాహో. శ్రద్ధకపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. -
‘సాహో’ బడ్జెట్‌ను స్వయంగా వెల్లడించిన ప్రభాస్
బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక సినిమా ‘సాహో. దేశ చరిత్రలోనే అతిపెద్ద యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ‘సాహో’ ఈ నెల 30న ప్రేక్షకులను పలుకరించబోతోంది. ప్రభాస్‌తోపాటు శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేశ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా కోసం చిత్రయూనిట్ ముమ్మరంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇటీవల విడుదలైన ‘సాహో’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ‘సాహో’ చిత్ర బడ్జెట్‌పై అనేక రుమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఫిల్మ్ కంపానియన్ అనుపమ చోప్రాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్ చిత్ర బడ్జెట్‌పై స్పందించారు. రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్టు ఇంతకముందు కథనాలు వచ్చాయి. చిత్ర బడ్జెట్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ కళ్లు చెదిరే విషయాలు వెల్లడించారు. ఈ సినిమా బడ్జెట్ అక్షరాల రూ. 350 కోట్లు అని తెలిపారు. ఇక, ఇది ఫ్యూచరిస్టిక్ సినిమా కాదని స్పష్టం చేసిన ప్రభాస్.. ‘ఇది ప్రస్తుతం నడిచే కథ. సినిమాలో కొన్ని పార్ట్స్ ఫ్యూచరిస్టిక్‌గా ఉంటాయి. అవి యదార్థంగానే సాగుతాయి. ట్రైలర్లో నేను ఎగరడం మీరు చూస్తారు. ఈ సీన్లను మేం పెద్దస్థాయిలో తీశాం. ట్రైలర్లో పింక్ సరస్సు కనిపిస్తోంది. ఇది ఆస్ట్రేలియాలో ఉంది. అది కూడా నిజమైనదే. ప్రపంచం నలుమూలాల్లోని ఉత్తమమైన వాటిని ఒకచోట చేర్చి ఈ సినిమాలో చూపిస్తున్నాం’ అని ప్రభాస్ వెల్లడించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషాల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలవుతోంది. ఇక, అబుదాబిలో చిత్రీకరించిన ఓ ఛేజింగ్ సీన్ కోసం అక్షరాల రూ. 80 కోట్లు ఖర్చు పెట్టినట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. -
‘సాహో’ మన సినిమా : నాని
బాహుబలి తరువాత టాలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ చిత్రం సాహో. బాహుబలి తరహాలోనే సాహోపై కూడా జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. అయితే సాహో రిలీజ్ డేట్ వాయిదా పడటం కారణంగా తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల రిలీజ్లు డైలామాలో పడ్డాయి. వాటిలో నాని హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్ ఒకటి. తాజాగా తన సినిమా రిలీజ్ డేట్‌పై నాని స్పందించాడు. ‘దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సాహో మన సినిమా. ఆ సినిమా విజయాన్ని కూడా మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రభాస్ అన్న, సాహో టీంకు నా శుభాకాంక్షలు. గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్‌ను రేపు ప్రకటిస్తా’ అంటూ ట్వీట్ చేశాడు. #Saaho is our film which is making noise nation wide and when it succeeds its our celebration. wishing Prabhas Anna and team nothing less than a huge blockbuster on August 30th 🤗#GANGLEADER release date will be announced tomorrow 🔥 pic.twitter.com/D6oJXOmFDA — Nani (@NameisNani) August 8, 2019 -
అమెరికా అమ్మాయితో ప్రభాస్ పెళ్లి?
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే టక్కున గుర్కొచ్చే పేరు ప్రభాస్. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ త్వరలో సాహో సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ప్రభాస్ సినిమాలు ఏ స్థాయిలో వార్తల్లో ఉంటాయో, ప్రభాస్ పెళ్లి వార్తలు కూడా అదే స్థాయిలో వార్తల్లో వినిపిస్తుంటాయి. తాజాగా సాహో సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సాహో సినిమా రిలీజ్ తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అమెరికాలో సెటిల్ అయిన ఓ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లాడనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ప్రభాస్ గాని ఆయన పీఆర్ టీం గాని ఇంతవరకు స్పందించలేదు. -
టెన్షన్ పడుతున్న ‘సాహో’ టీం
బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం సాహో. భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే చిత్రయూనిట్ ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో టెన్షన్ పడుతున్నట్టుగా తెలుస్తోంది. షూటింగ్ పూర్తి అయినా భారీగా గ్రాఫిక్స్ చేయాల్సి ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయా లేదా అన్న భయం నిర్మాతలను వేదిస్తోదంట. ముందుగా ప్రకటించినట్టుగా ఆగస్టు 15కు ప్రాజెక్ట్ రెడీ కాకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ అవుతుండటంతో ఆగస్టు 15కు మించి మంచి డేట్ దొరకదని అందుకే ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయాలని రాత్రి పగలు వర్క్ చేస్తున్నారట. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సాహో సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. -
బాహుబలి రీమేకా.. అయ్యే పనేనా?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ విజువల్ వండర్ బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుతం తెలుగుతో పాటు ఉత్తరాదిలోనూ ఘనవిజయం సాధించింది. బాలీవుడ్ సినిమాలకు కూడా సాధ్యం కాని రికార్డ్లను కొల్లగొట్టి బిగెస్ట్ ఇండియన్ మూవీగా చరిత్ర సృస్టించింది. అసలు బాహుబలి సినిమా చూడని మూవీ లవర్ఉండడంటే అతిషయోక్తి కాదు. అలాంటి భారీ చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. వందకోట్ల బడ్జెట్‌తో ఆర్కా మీడియా సంస్థ తెరకెక్కించిన బాహుబలి చిత్రాన్ని గుజరాతీ భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే నిర్మాతలు నితిన్ జానీ, తరుణ్ జానీ రీమేక్ హక్కులను కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే హిందీలోనూ చాలా సార్లు టీవీలో వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు రీమేక్ చేస్తే బిజినెస్ పరంగా వర్క్ అవుట్ అవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒక వేళ రీమేక్ చేసిన ఒరిజినల్ వర్షన్‌తో పోటి పడగలరా..? అంత సమయం కేటాయించి, అంత ఖర్చు పెట్టి, ఆ స్థాయిలో గ్రాఫిక్స్ అవుట్‌పుట్ సాధ్యమేనా అంటున్నారు విశ్లేషకులు. కొందరైతే మరొ అడుగు ముందుకేసి బాహుబలిని రీమేక్ చేయటం తుగ్లక్ చర్య అని కామెంట్ చేస్తున్నారు. నితిన్, తరుణ్ లు మాత్రం గుజరాతీ స్టైల్, కాస్త తక్కువ బడ్జెట్లో బాహుబలిని రీమేక్ చేస్తే వర్క్ అవుట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారట. -
షాకింగ్ లుక్‌లో రానా
సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటిన స్టార్ వారసుడు రానా. కెరీర్ స్టార్టింగ్ నుంచి హీరో అన్న ఇమేజ్‌లో ఫిక్స్ అవ్వకుండా విలన్, క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. ప్రస్తుతం రానా బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న హాథీమేరి సాథీ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పిక్‌లో రానా బాగా పెరిగిన గెడ్డంతో వయసైన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్‌లో నీట్ షేవ్‌తో కనిపించిన రానా ఇప్పుడు పూర్తిగా మారిపోయిన ఓ అడవి మనిషిలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా తరువాత పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న విరాటపర్వం సినిమాలో నటించనున్నాడు రానా. అంతేకాదు గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో హిరణ్యకశ్యప అనే పౌరాణిక చిత్రాన్ని స్వయంగా నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. -
‘బాహుబలి 3’లో స్టార్ క్రికెటర్!
నిషేదం తరువాత ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చిన స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సూపర్ ఫాంలో దూసుకుపోతున్నాడు. హైదరాబాద్ సన్‌రైజర్స్ తరుపున ఆడుతున్న వార్నర్ తాజాగా టీం మెంబర్స్‌తో కలిసి ఓ ప్రమోషనల్ ఈవెంట్లో సందడి చేశాడు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఈ స్టార్ క్రికెటర్. యాక్టింగ్ కెరీర్‌గా ఎంచుకునే ఆలోచన ఉందా అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానంగా బాహుబలి అంటూ సమాధానం ఇచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అఫీషియల్ ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ వీడియోపై బాహుబలి చిత్రయూనిట్ స్పందంచింది. ‘హేయ్ డేవిడ్ వార్నర్.. మేం విన్నాం. మీరు ఎవరి వైపు ఉండాలనుకుంటున్నారు..? బాహు వైపా.. భల్లా వైపా? బాహుబలి 3 షూటింగ్‌కు సిద్ధంకండి’ అంటూ బాహుబలి మూవీ అఫీషియల్ ట్విటర్ పేజ్ నుంచి రిప్లై ఇచ్చారు. Hey, @davidwarner31. We have listened 😁 Whose side do you want to take?? Baahu or Bhalla?? Be prepared for the #Baahubali3 Shoot! 😉 Best wishes for the rest of #IPL. Keep hitting hard 🏏 https://t.co/ZWCUbDQVYk — Baahubali (@BaahubaliMovie) 2 April 2019 -
2020 సంక్రాంతి బరిలో ప్రభాస్
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి సినిమా రెండు భాగాలు పూర్తి చేయడానికి ప్రభాస్ నాలుగేళ్లకు పైగా సమయం తీసుకున్నాడు. అయితే బాహుబలి తరువాత అయినా డార్లింగ్ వరుస సినిమాలతో అలరిస్తాడనుకుంటే సాహో లాంటి భారీ సినిమాతో మరోసారి ఆలస్యం చేశాడు. కానీ తదుపరి చిత్రం విషయంలో మాత్రం ప్రభాస్ వేగంగా పావులు కదుపుతున్నాడు. ఇప్పటికే చివరి దశకు చేరుకున్న సాహో సినిమా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత మరో ఐదు నెలల గ్యాప్‌తో జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో మూవీ జాన్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఐదేళ్లలో రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ చేసిన డార్లింగ్ ఐదు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడన్న వార్తతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. -
చైర్‌బలి
అంతర్జాతీయ స్థాయిలో ‘బాహుబలి’గా ప్రభాస్ ఫేమస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. అయితే.. ఇప్పుడీ ‘బాహుబలి’ ప్రస్తావన ఎందుకంటే... కొత్తగా చైర్‌బలి పేరుతో వియాన్ రాజ్‌కుంద్రా నెట్టింట్లో షికారు చేస్తున్నారు. ప్రముఖ హిందీ నటి శిల్పాశెట్టి కుమారుడే ఈ రాజ్ కుంద్రా. టీవీలో ‘బాహుబలి’ సినిమాను చూస్తూ ఫస్ట్ సాంగ్‌లో వచ్చే ఓ సీన్‌ను సరదాగా ఇమిటేట్ చేశారు రాజ్‌కుంద్రా. ఈ వీడియాను షేర్ చేశారు శిల్పాశెట్టి. ‘‘బాహుబలి’ సినిమా ముందు చైర్‌బలి ఉన్నాడు. ఈ యాక్టింగ్ స్కిల్స్ వాళ్ల అమ్మ (శిల్పాశెట్టి) దగ్గర్నుంచి వచ్చి ఉంటాయి’’ అని పేర్కొన్నారు రాజ్ కుంద్రా. 2009లో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను శిల్పాశెట్టి వివాహం చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. 2012లో వీరిద్దరికీ కలిగిన సంతానమే వియాన్ రాజ్‌కుంద్రా. -
బాహుబలి 3లో నటిస్తా : హాలీవుడ్ స్టార్
అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకువచ్చిన విజువల్ వండర్ బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ భారీ వసూళ్లు సాధించింది. పలు హాలీవుడ్ చిత్రాల కన్నా ఎక్కువ కలెక్షన్లు సాదించిన బాహుబలి హాలీవుడ్ స్టార్లను సైతం ఆకట్టుకుంది. తాజాగా హాలీవుడ్ యాక్టర్ సామ్యూల్ ఎల్ జాక్సన్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ అవకాశం ఇస్తే బాహుబలి 3లో నటిస్తానన్నారు. ఎవెంజర్స్ సీరిస్‌లోని నిక్ ఫ్యూరీ పాత్రలో ఫేమస్ అయిన సామ్యూల్ ఇండియన్ సినిమాలో నటిస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా బాహుబలి సీరిస్‌లో నటించాలనుందంటూ తన మనసులోని మాట బయటపెట్టారు. మరి ఈ హాలీవుడ్ స్టార్ కోరికను రాజమౌళి తీరుస్తాడో లేదో చూడాలి. -
సాహో : రికార్డుల వేట మొదలైంది!
బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సాహో. బాహుబలితో ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ రావటంతో సాహోను కూడా అదే స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ 150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సాహో ఓవర్ సీస్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులు దాదాపు 42 కోట్లకు అమ్ముడైనట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
ప్రభాస్‌తో యువతి సెల్ఫీ.. వీడియో వైరల్
-
ప్రభాస్‌తో యువతి సెల్ఫీ.. వీడియో వైరల్
బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజే మారిపోయింది. ఈసినిమా సక్సెస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్‌స్టార్. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు దేశంలోని అన్ని భాషల ప్రేక్షకులు ప్రభాస్‌కు అభిమానులుగా మారిపోయారు. అందుకే ఇండియాలోనే కాదు.., ప్రభాస్ విదేశాలకు వెళ్లినా అభిమానులు ఆయన్ను వదిలిపెట్టడం లేదు. ఇటీవల ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ లో భాగంగా లాస్ ఏంజిల్స్ వెళ్లాడు. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో ప్రభాస్‌తో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా ప్రభాస్‌తో సెల్ఫీ దిగిన ఓ యువతి.. గంతులు వేస్తూ ప్రభాస్ చెంపను తడిమింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాహో షూటింగ్ చివరి దశకు చేరుకోవటంతో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు 15న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
గాసిప్స్ మంచిదే!
గాసిప్స్ మంచిదే అనగానే మరక మంచిదే అనే వాణిజ్య ప్రకటన గుర్తుకొస్తోంది కదూ! అవును ఇదో రకం ప్రచార టెక్నిక్. ఇవాళ నెగిటివ్ ప్రచారమే వినియోగదారుల్లోకి చొచ్చుకుపోతోంది. నటి తమన్నా అలాంటి టెక్నిక్‌నే అమలు పరుస్తోంది. ఈ మిల్కీబ్యూటీకి నటిగా సీనియారిటీ పెరిగిపోతోంది కదా ఆ మాత్రం వాడకపోతే ఎలా? అదీ గాక ఇప్పుడు ఈ అమ్మడికి ప్రచారం చాలా అవసరం. నటిగా దశాబ్దాన్ని దాటేసిన తమన్నా మొదట్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుని ఉంటుందంటారు? అవన్నీ అనుభవాలేకదా! అయితే తమన్నా గురించి ఎప్పుడూ ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా నెగిటివ్ ప్రచారం. తమన్నాకు అవకాశాలు లేవని, ఫ్లాప్‌ల నటి అని, ఇక మూటా ముల్లు సర్దుకోవలసిందేనంటూ రకరకాల ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఇలాంటి ప్రచారానికి మరొకరైతే బాధ పడడమో, ఫైర్ అవడమో జరుగుతుంది. కానీ ఈ పంజాబీ బ్యూటీ కాస్త భిన్నం కదా! గాసిప్స్ మంచిదే అంటోంది. అందుకు కారణం కూడా చెబుతోంది. నా నట కెరీర్ అంతం కాబోతోంది లాంటి ట్విట్స్, గాసిప్స్ వంటివి చదవడం తనకు చాలా ఇష్టం అని పేర్కొంది. నాపనైపోయింది అని అన్నప్పుడు తనకింకా ఉత్సాహం కలుగుతోందని అంది. ఎందుకంటే అప్పుడు తానింకా కొత్త నటిగా ఫీల్ అవుతానని చెప్పింది. అది తనకు ఇంకా శ్రమించేలా చేస్తుందని పేర్కొంది. అయినా అలాంటి ఫ్లాప్ ముద్రలో తాను ఉన్నప్పుడే బాహుబలి చిత్ర అవకాశం వచ్చిందని పేర్కొంది. ఒక నటిగా నట జీవితం ఇక చాలు అని భావించినప్పుడే తన వృత్తి పరమైన జీవితం ముగుస్తుందని అంది. అయితే తనలోని నటికి మాత్రం ఎప్పటికీ విశ్రాంతి ఉండదని నటి తమన్నా పేర్కొంది. తమన్నా ఉదయనిధితో నటించిన కన్నే కలైమానే చిత్రంలో నటనకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ప్రభుదేవాతో దేవి–2 చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. ఇక త్వరలో నటుడు విశాల్‌తో జత కట్టడానికి రెడీ అవుతోంది. అదేవిధంగా తెలుగులోనూ అవకాశాలు ఆశాజనకంగానే ఉన్నాయి. సో ఈ అమ్మడు వదంతులను ఎంజాయ్ చేస్తూ మరింత ఉత్సాహంతో నటించేస్తోందన్నమాట. -
బిజీ అవుతున్న యువ నటుడు
‘బాహుబలి’లో కాలకేయ తమ్ముడిగానూ, ‘పీఎస్వీ గరుడవేగ’లో పోలీస్ పాత్రలోనూ ప్రేక్షకులను మెప్పించిన చరణ్‌దీప్ సూరినేని సరికొత్త మేకోవర్‌లో రెడీ అయ్యాడు. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’లో మెయిన్ విలన్ గా నటించిన చరణ్‌దీప్‌కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు ఈ యువ నటుడు. తాజాగా ఈ చరణ్ న్యూలుక్లో ఆకట్టుకుంటున్నాడు. జుట్టు బాగా పెంచి, గడ్డంతో మెడ్రన్ లుక్ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘సైరా నరసింహారెడ్డి’, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కల్కి’ చిత్రాల్లో నటిస్తున్నాడు చరణ్ దీప్. ఈ శుక్రవారం విడుదలవుతున్న ‘సీమరాజా’లో చరణ్ సూరినేని కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు, మేకోవర్ గురించి చరణ్ సూరినేని మాట్లాడుతూ ‘రాజశేఖర్ గారి ‘పీఎస్వీ గరుడవేగ’లో పాజిటివ్ ఎన్ఐఎ ఆఫీసర్ పాత్రలో నటించాను. అది నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత మళ్లీ రాజశేఖర్ గారితో నటించే అవకాశాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ కల్పించారు. రాజశేఖర్ గారు, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కిలో నేను పోలీస్ పాత్రలో నటిస్తున్నా. గరుడవేగలో నాది పాజిటివ్ క్యారెక్టర్ అయితే... కల్కిలో నెగిటివ్ క్యారెక్టర్. ఈ సినిమాతో పాటు చిరంజీవిగారితో 'సైరా నరసింహారెడ్డి'లో నటిస్తున్నా. ఆ పాత్ర గురించి ఇప్పుడేమీ చెప్పలేను. అయితే మంచి పాత్రలో నటిస్తున్నానని చెప్పగలను. అలాగే, తమిళంలోనూ నాకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికి ఓ పది సినిమాల్లో నటించాను. ప్రస్తుతం తమిళంలో ఓ భారీ సినిమాలో నటిస్తున్నా. మరో మూడు నాలుగు భారీ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ డిజిటల్ ఫ్లాట్ఫార్మ్ కోసం రూపొందుతున్న ఒక వెబ్ సిరీస్‌లో నటించమని సంప్రదించారు. త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తా’ అన్నారు. -
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
గత ఐదేళ్లలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కేవలం రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ చేశాడు. భారీగా తెరకెక్కిన బాహుబలి సినిమా రెండు భాగాలు పూర్తి చేయడానికి ప్రభాస్ నాలుగేళ్లకు పైగా సమయం తీసుకున్నాడు. అయితే బాహుబలి తరువాత అయినా డార్లింగ్ వరుస సినిమాలతో అలరిస్తాడనుకుంటే సాహో లాంటి భారీ సినిమాతో మరోసారి ఆలస్యం చేశాడు. ఈ ఆలస్యాన్ని మరిపించేలా ఈ ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే చివరి దశకు చేరుకున్న సాహో సినిమా ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కేవలం నాలుగు నెలల గ్యాప్‌తో జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో మూవీ జాన్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ముందుగా 2020 జనవరిలో రిలీజ్ చేయాలనకున్నా.. షూటింగ్ అనుకున్న సమయం కన్నా ముందే పూర్తయ్యే అవకాశం ఉండటంతో డిసెంబర్లోనే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఐదేళ్లలో రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ చేసిన డార్లింగ్ ఒకే ఏడాదిలో రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడన్న వార్తతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. -
‘బాహుబలి’ రికార్డుకు చేరువలో ‘కేజీఎఫ్’
తెలుగు, తమిళ ఇండస్ట్రీలతో పోలిస్తే సౌత్‌లో కన్నడ సినీ పరిశ్రమ చాలా చిన్నది. మార్కెట్ పరంగానూ కన్నడ సినిమా భారీ వసూళ్లు సాధించిన రికార్డ్ లేదు. ఇన్నాళ్లు తమ సినిమాలను ఇతర భాషల్లోకి అనువదించకపోవటం, ఇతర భాషా చిత్రాల అనువాదానికి అంగీకరించకపోవటం కారణంగా సాండల్‌వుడ్ మార్కెట్ పరంగా పెద్దగా ఎదగలేకపోయింది. అయితే ఈ హద్దులను చెరిపేసిన సినిమా కేజీఎఫ్. యువ కథానాయకుడు యష్ హీరోగా తెరకెక్కిన ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామా కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ భారీగా రిలీజ్ అయ్యింది. అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావటంతో కన్నడ నాట సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకుపైగా గ్రాస్ సాధించినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు కన్నడలో రూ. 121 కోట్లకు పైగా వసూళ్లు సాదించి వందకోట్ల మార్క్ దాటినతొలి కన్నడ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. కర్ణాటకలో అత్యథిక వసూళ్లు సాధించిన రికార్డ్ బాహుబలి 2 పేరిట ఉంది. బాహుబలి సాండల్‌వుడ్‌లో 129 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ రికార్డ్‌ను అతి త్వరలో కేజీఎఫ్ బద్ధలు కొట్టనుంది. ఇప్పటికీ కేజీఎఫ్ మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ముందు ముందు మరిన్ని రికార్డ్‌లు సాధించే దిశగా దూసుకుపోతోంది ఈ సినిమా. -
రానా బర్త్‌డేకి జపాన్ నుంచి కానుకలు
బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచటం మాత్రమే కాదు.. ఆ సినిమాలో నటించిన నటీనటుల స్థాయిని కూడా ఎన్నో రెట్లు పెంచింది. ముఖ్యంగా ఈ సినిమాతో ప్రభాస్, రానాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇటీవల బాహుబలి జపార్ లో రిలీజ్ అయిన సందర్భంగా అక్కడి అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. వారిని మరింత ఉత్సాహపరిచేందుకు చిత్రయూనిట్ జపాన్‌లో పర్యటించి వారితో సరదాగా గడిపారు. మన రానాను తమ వాడిగా ఓన్ చేసుకున్న జపాన్ అభిమానులు రానా పుట్టిన రోజు సందర్భంగా భారీగా గిఫ్ట్‌లను పంపించారు. బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ఆఫీస్‌కు 19 గిప్ట్ పార్సిల్ వచ్చినట్టుగా నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. జపాన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మూవీ ట్విన్ ద్వారా ఈ పార్సిల్స్ వచ్చినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం హాథీ మేరి సాథీ సినిమాలో నటిస్తున్న రానా చేతిలో మరిన్ని బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. 19 boxes of fan mail & gifts to @RanaDaggubati from our Japan distributor @movietwin2 arrived today at Arka! Thanks once again for all the love from Japan! #Ballaladeva @BaahubaliMovie #JapanFans #Fanlove @V8Japan pic.twitter.com/KOHuqcLjZD — Shobu Yarlagadda (@Shobu_) 14 December 2018 -
‘బాలీవుడ్లో అలాంటి దర్శకులు లేరు’
తెలుగు సినిమా తన పరిధిని విస్తరించుకుంటూ పోతోంది. బాహుబలి సినిమా తరువాత టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. మన దర్శక నిర్మాతలు బాలీవుడ్‌లోనూ తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కొన్ని సినిమాల డిజిటల్, డబ్బింగ్ రైట్స్ బాలీవుడ్లో రికార్డ్‌లు క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ కమర్షియల్ ఎంటర్ టైనర్లకు బాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంది. ఈ విషయంపై స్పందించిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సౌత్ దర్శకుల విజన్ గొప్పగా ఉంటుంది. వాళ్ల టేకింగ్, సాంకేతికను వినియోగించుకునే విదానం అద్భుతం. సౌత్ సినిమాల కారణంగానే భారతీయ సినిమా ప్రరిశ్రమకు మంచి గుర్తింపు వస్తోంది. బాలీవుడ్ దర్శకులు ప్రయోగాలు, సాహసాలు చేసేందుకు ముందుకు రావటం లేదు. మనం మన ఆలోచనా సరళిని మార్చుకోవటం లేదు. వాళ్లు భారీ చిత్రాలతో మనల్ని మనం తక్కువగా భావించేలా చేస్తున్నారు. సంజయ్ లీలా బన్సాలీ లాంటి వారు భారీ చిత్రాలు చేస్తున్నా.. బాలీవుడ్ అలాంటి చిత్రాలు మరిన్ని రావాలి’ అన్నారు. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న 2.ఓ ప్రమోషన్ కార్యక్రమాల్లో కరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2.ఓ సినిమాను బాలీవుడ్లో కరణ్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్లో రిలీజ్ చేస్తున్నారు. -
‘సాహో’ రిలీజ్ డేట్ ఫిక్స్..!
బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. బాహుబలి సక్సెస్‌తో ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ క్రియేట్ అవ్వటంతో సాహోను కూడా అదే స్థాయిలో 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలై ఈ సినిమా మేకింగ్ వీడియోకు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2019 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దేశ విదేశాల్లో భారీ ఎత్తున చిత్రీకరించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
బాహుబలి వెబ్ సిరీస్‌లో స్టార్ హీరోయిన్
బాహుబలి దేశ విదేశాల్లో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే బాహుబలి ప్రపంచాన్ని ఇక ముందు కూడా కొనసాగించే ప్రయత్నాల్లో ఉన్నారు మేకర్స్. అందులో భాగంగా బాహుబలికి ప్రీక్వెల్‌గా ఓ వెబ్ సీరీస్‌ను నిర్మిస్తున్నారు నిర్మాతలు. బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం, ఆమె ఎదుగుదల ప్రధానాంశంగా ఈ వెబ్ సీరీస్ తెరకెక్కనుంది. ఈ వెబ్‌సీరీస్‌లో ప్రధాన పాత్ర శివగామిగా ఉత్తరాది నటి మృణాల్ థాకూర్ నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి శ్రియ మరో కీలక పాత్రలో నటించనున్నారు. నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్‌కు దేవా కట్టా, ప్రవీణ్ సత్తారులతో పాటు మరో బాలీవుడ్ దర్శకుడు పని చేయనున్నట్టుగా తెలుస్తోంది. -
‘థగ్స్’కు అంత సీన్ లేదు.. బాహుబలి రికార్డ్స్ సేఫ్
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ భారీ చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. బాహుబలి సినిమా విడుదలైన దగ్గర నుంచి ఇండియాలో ఆ సినిమా రికార్డ్ లను దాటే హిట్ ఇవ్వాలని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కలలు కంటున్నాడు. దంగల్ సినిమాతో వసూళ్ల విషయంలో బాహుబలిని దాటినా భారత మార్కెట్లో మాత్రం బాహుబలిని రికార్డ్లను దాటలేకపోయాడు. దీంతో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌తో బాహుబలి రికార్డ్లను బద్ధలు కొట్టొచ్చన్న ఆశతో ఉన్నాడు ఆమిర్. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమాకు దారుణమైన టాక్ వచ్చింది. దీంతో బాహుబలి రికార్డ్‌లకు ఇప్పట్లో ఎలాంటి ప్రమాదం లేదని కన్ఫామ్ అయిపోయింది. అయితే తొలి రోజు రికార్డ్ విషయంలో మాత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ బాహుబలిని దాటేసింది. ఈ సినిమా తొలి రోజు దాదాపు 52 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. బాహుబలి 2 తొలి రోజు 40.73 కోట్ల వసూళ్లు సాధించింది. సినిమా టాక్‌తో డీలా పడిపోయినా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ టీంకు ఇది కాస్త ఊరట నిచ్చే వార్తే అని భావిస్తున్నారు విశ్లేషకులు. -
బహా కిలికి రహా కిలికి... స్పోకెన్ కిలికి!
హైదరాబాద్ అమీర్‌పేటలో ఎటు చూసినా ‘స్పోకెన్ కిలికి’ బ్యానర్లు కనిపిస్తున్నాయి. అసలు హైదరాబాద్ అని ఏమిటి... తెలుగు రాష్ట్రాల్లో ఏ మూల చూసినా ఇలాంటి బ్యానర్లే కనిపిస్తున్నాయి. కిలికి కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.ఒకప్పుడు ఇంగ్లిష్ మాట్లాడటం హోదాకు సింబల్‌గా ఉండేది.ఇప్పుడు మాత్రం కిలికి భాషలో ఎంతసేపు మాట్లాడితే అంత గొప్ప!కూకట్‌పల్లిలో ఒక మధ్యతరగతి కుటుంబం.ఆ ఇంట్లో జరిగే సంభాషణ వినండి....తండ్రి:‘నిమ్దాదోసురాసురా నుమ్మీమోహినో జూ?’తెలుగు అనువాదం:‘ఏరా హోంవర్క్ ఎందుకు చేయలేదు. ఒళ్లు బలిసిందా?’కొడుకు:‘మిన పీజ్రాషూకు నే...మిన్ బహిత్త..అనువాదం:‘హోంవర్క్ చేయాల్సింది డాడీలే కదా...నన్ను దబాయిస్తావేం. వీడియోగేమ్స్ ఆడుతున్నాను. కనబడటం లేదా!’సికింద్రాబాద్‌లో ‘అఖిల భారత బద్ధకస్తుల మహాసభ’ జరుగుతుంది. ఆ సభలో అధ్యక్షుడి ఉపన్యాసం వినండి...‘క్రా చు రావీక్ నేమీన్ మహత్తి బస్ మర్ర బంత బంత నత్తురే’ అనువాదం:‘కుందేలు రోజు రన్నింగ్, జంపింగ్ చేస్తుంది.కానీ ఏంలాభం? పది సంవత్సరాలకు మించి బతకదు.తాబేలు విషయానికి వస్తే...రన్నింగ్ చేయదు. జంపింగ్ చేయదు.అయినా భేషుగ్గా వందసంవత్సరాలు బతుకుతుంది’పెళ్లి ఊరేగింపులో కిలికి భాషలో డీజే సాంగ్...‘నిమ్దా సిగ్క నిమ్ సింబ రిపోస్బహా కిలికి రహా కిలికిపిప్పీ ఫిలిఫ్ జివ్ల క్రోయిక్కిఉన్నో డున్నో మువ్వో జావోదంబా దంబా బూగూ కిలికినిమ్దేరే ఉఫ్ఫ్బహ సులుకుకి మారో... మారో మారో మారో మారో కిలికి’ ‘‘మై డియర్ రాజా... బాహుబలి సినిమా వచ్చి చాలా కాలమే అయింది కదా. మరి ఇప్పుడు కిలికి గోల ఏంటి? ఉన్నట్టుండి ఇంగ్లిష్ భాష కనుమరుగు కావడం ఏమిటి? ఎటు చూసినా కిలికి మాట్లాడటం ఏమిటి? ఈ భాష నేర్చుకోవడానికి కోచింగ్సెంటర్లకు పరుగులు తీయడం ఏమిటి? ఈ ప్రశ్నలకు తెలిసి కూడా జవాబు చెప్పలేకపోయావో..’’ అన్నాడు విక్రమార్కుడి భుజం మీది భేతాళుడు.‘‘ఈజీ కొచ్చన్ అడిగావు తమ్ముడూ’’ అని భేతాళుడికి థ్యాంక్స్ చెప్పి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు విక్రమార్కుడు...‘‘ఒకరోజు ట్రంపుకు బాగా బోరు కొట్టింది. వైట్‌హౌజ్‌కు వెళ్లకుండా ఓన్హౌజ్కు వెళ్లాడు.‘ఏదైనా మంచి సినిమా ఉంటే చెప్పండయ్యా...బోరు కొట్టి చస్తున్నాను’ అన్నాడు అసిస్టెంట్‌తో.‘ఆమధ్య బాహుబలి అనే ఒక సినిమా వచ్చింది సార్. మీకు బాగా నచ్చుద్దీ’’ సమాధానం ఇచ్చాడు అసిస్టెంట్.వెంటనే ఆ సినిమా డీవీడీ తెప్పించాడు ట్రంపు.ఆయనకు కాలకేయులు మాట్లాడే కిలికి భాష తెగ నచ్చేసింది.ట్రంపు తిక్కలోడు కదా...వెంటనే ఒక రూల్ పాస్ చేశాడు.అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులు, ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్లు, ఇంకా రకరకాల వాళ్లకు తప్పనిసరిగా కిలికి భాష వచ్చి ఉండాలి. ఈ భాష రాకుంటే ఎంత పెద్ద మొనగాడినైనా దేశంలోకి అడుగుపెట్టనివ్వను, నా దేశం నా ఇష్టం అని ప్రకటించాడు ట్రంపు.మనవాళ్లకేమో అమెరికా భూతలస్వర్గమాయే! దీంతో ఎక్కడ తమకు అమెరికాలో ఉండే అవకాశం మిస్సవుతుందేమోనని భయపడి విద్యార్థులు, ఉద్యోగులు, తల్లిదండ్రులు...ఒక్కరనేమిటీ...సమస్త వర్గాలు కిలికి మీద పడ్డాయి. దీన్ని సొమ్ము చేసుకోవడానికి ఏ వీధిలో చూసినా పుట్టగొడుగుల్లా కోచింగ్ సెంటర్లు వెలిశాయి. ట్రంపు మూడ్ మారే వరకు ఈ ట్రెండ్ ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది’’ – యాకుబ్ పాషా -
సాహో : రొమానియాలో మరో భారీ యాక్షన్ ఎపిసోడ్
బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2019 సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే దుబాయ్‌లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించిన చిత్రయూనిట్ త్వరలో మరో యాక్షన్ సీన్‌కు రెడీ అవుతున్నారు. ఈ సారి రొమానియాలో ఓ భారీ చేజ్‌ను చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్ లో ప్రభాస్‌తో పాటు ప్రతినాయక పాత్రలో నటిస్తున్న నీల్ నితిన్ ముఖేష్ కూడా పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది. సాహోతో పాటు రాధకృష్ణ దర్శకత్వంలో పిరియాడిక్లవ్ స్టోరిలోనూ నటిస్తున్నాడు ప్రభాస్. ఈ రెండు సినిమాలు 2019లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. -
ప్రభాస్ కొత్త సినిమాకు దేశీ టైటిలే..!
బాహుబలి తరువాత సాహో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ సినిమా రిలీజ్ కాకముందే మరో ప్రాజెక్ట్‌ను టైల్లో పెట్టాడు. జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఇటలీలో ప్రారంభమైంది. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ఎక్కువ భాగం విదేశాల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ముందుగా అమోల్ (ప్రేమ) అనే ఫ్రెంచ్ పదాన్ని టైటిల్‌గా ఫిక్స్ చేశారన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో టైటిల్ తెరమీదకు వచ్చింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ కావటంతో ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. డార్లింగ్ ఇమేజ్ ఉన్న ప్రభాస్‌కు ఈ టైటిల్ అయితే కరెక్ట్ అని భావిస్తున్నారట చిత్రయూనిట్. అయితే ఇంత వరకు చిత్రయూనిట్ నుంచి టైటిల్ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. -
ఇటలీలో ప్రభాస్ ప్రేమకథ
బాహుబలి సినిమాతో అంతర్జాతీజయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ప్రభాస్ మరో సినిమాను ప్రారంభించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే తన తదుపరి చిత్రం జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఉంటుందని ప్రకటించాడు ప్రభాస్. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. పీరియాడిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ఇటలీలో షూట్ చేయనున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్‌తో పాటు ప్రభాస్ కూడా ఇటలీ చేరుకున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు రాధకృష్ణ ట్విటర్ ద్వారా వెల్లడించారు. “il cast e la crew sono arrivati in italia, tutto pronto per cominciare a girare” Evviva #prabhas20 — Radha Krishna Kumar (@director_radhaa) 29 September 2018 -
శివగామి పాత్రలో బాలీవుడ్ మోడల్
బాహుబలి దేశ విదేశాల్లో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే బాహుబలి ప్రపంచాన్ని ఇక ముందు కూడా కొనసాగించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగా బాహుబలికి ప్రీక్వెల్‌గా ఓ వెబ్ సీరీస్‌ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు నిర్మాతలు. బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం, ఆమె ఎదుగుదల ప్రధానాంశంగా ఈ వెబ్ సీరీస్ తెరకెక్కనుంది. ఈ వెబ్‌సీరీస్‌లో ప్రధాన పాత్ర శివగామిగా ఉత్తరాది నటి మృణాల్ థాకూర్ కనిపించనున్నారట. సిల్వర్ స్క్రీన్‌పై రమ్యకృష్ణ నట విశ్వరూపం చూపించిన పాత్రలో ఉత్తరాది అందాల నటి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాకపోయినా.. శివగామి పాత్రలో మృణాల్ కనిపించటం ఖరారయ్యిందన్న ప్రచారం జరుగుతుంది. కుంకుమ్ భాగ్య సీరియల్లో బుల్ బుల్ పాత్రలో ఆకట్టుకున్న మృణాల్.. ప్రస్తుతం హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న సూపర్ 30లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ వెబ్ సీరీస్‌ను ముగ్గురు దర్శకులు డైరెక్ట్ చేయనున్నారు. -
‘బాహుబలి 3’.. హీరో ఎవరంటే
భోపాల్ : ‘జక్కన్న’ చెక్కిన ‘బాహుబలి’, ‘బాహుబలి - ది కంక్లూజన్’ రెండూ భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యయనాలను లిఖించాయి. దాదాపు ఆరేళ్ల పాటు శ్రమించి రెండు పార్టులుగా తీసిన ఈ చిత్రం కలెక్షన్ల వసూళ్లలో కొత్త రికార్డులను నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డులను బ్రేక్ చేయడానికి ‘బాహుబలి - 3’ తెర మీదకొస్తుంది. అదేంటి ‘బాహుబలి - ది కంక్లూజన్’తోనే ఆ కథ అయిపోయింది కదా.. ఇప్పుడు మూడో పార్ట్‌లో ఏం చెప్తారు.. ఈ మూడో పార్ట్‌ని తీసేది కూడా రాజమౌళియేనా.. ఇందులో కూడా ప్రభాస్, రానాలే ఉంటారా.. అయినా అసలు దీని గురించి ఇంత వరకూ ఎక్కడ, ఎవరు, ఏమి చెప్పలేదు కదా అని ఆలోచిస్తున్నారా..? అయితే ఒక్క నిమిషం. ఇప్పుడు మేం చెప్తున్నది రాజమౌళి ‘బాహుబలి’ గురించి కాదు. ఈ ‘బాహుబలి 3’కి, రాజమౌళి ‘బాహుబలి’కి సంబంధమే లేదు. ఈ ‘బాహుబలి’ని తీసింది వివారాలు తెలియని ఒక నెటిజన్. మరికొద్ది నెలల్లో మధ్యప్రదేశ్‌లోనే కాక దేశవ్యాప్తంగా లోక్ సభ, శాసన సభ ఎన్నికల నగారా మోగనున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓ నెటిజన్ ‘బాహుబలి’ సినిమాకు స్పూఫ్గా ‘బాహుబలి 3’ అనే వీడియోను రూపొందించి ఇంటర్నెట్లో షేర్ చేశాడు. ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ, సోనియా గాంధీ, రాహూల్ గాంధీ, జ్యోతిరాదిత్య సింధియాలు ప్రధాన పాత్రదారులు. వీరిలో శివరాజ్ సింగ్ చౌహాన్ ‘బాహుబలి’గా, జ్యోతిరాధిత్య సింధియా ‘బల్లాల దేవుని’గా, సోనియా గాంధీని ప్రభాస్ పెంచిన తల్లి పాత్రలో నటించిన రోహిణిగా డిజైన్ చేశారు. బాహుబలికి, బల్లాల దేవునికి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్‌తో పాటు.. బాహుబలి ఫస్ట్ పార్ట్‌కే హైలెట్‌గా నిలిచిన ప్రభాస్ శివలింగాన్ని మోసే సీన్‌ని కూడా మార్ఫ్ చేశారు. ఈ సీన్లో ప్రభాస్ పాత్రలో శివరాజ్ సింగ్‌ని మార్ఫ్ చేశారు. 2 నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఈ వీడియో నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది. -
ఫస్ట్‌లుక్ 7th August 2018
-
బాలీవుడ్ మల్టీ స్టారర్లో ప్రభాస్..?
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను కూడా ప్రభాస్ మార్కెట్ రేంజ్‌కు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. అదే సమయంలో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి సినిమాను బాలీవుడ్లో రిలీజ్ చేసిన కరణ్ జోహర్, ప్రభాస్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు. అయితే ప్రభాస్ బాలీవుడ్ కు మల్టీ స్టారర్ సినిమాతో పరిచయం అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్, రణవీర్‌లో ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో మల్టీస్టారర్ 2019లో సెట్స్‌మీదకు వెళ్లనుందట. అయితే ఈ విషయంపై ప్రభాస్ నుంచి గాని కరణ్ జోహర్ నుంచిగాని ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. -
ప్రభాస్ ప్రేమకథ మొదలవుతోంది
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్ట్స్ సినిమాను రెడీ చేస్తున్నాడు ప్రభాస్. జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటించేందుకు ఓకె చెప్పాడు. ఈ సినిమాను కూడా యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ఇప్పటికే సాహో పనులు పూర్తి కావస్తుండటంతో త్వరలో కొత్త సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు తొలి వారంలో ప్రారంభించనున్నారట. అధికారికంగా ప్రకటించకపోయినా ఆగస్టులోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా కోసం హైదరబాద్‌లో యూరప్ లోకేషన్లను సెట్ వేస్తున్నారట. అక్కడి ట్రైన్, షిప్, హెలికాప్టర్ లాంటి వాటిని కూడా హైదరాబాద్‌లో సెట్ వేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. -
ఆ తప్పిదం వల్లే ఎలిమినేట్ అయ్యాను: భానుశ్రీ
శ్రీనగర్‌కాలనీ: నా అసలు పేరు స్వప్న. డ్యాన్సర్‌గా ఎదిగాక భానుశ్రీగా మార్చుకున్నాను. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే కొరియోగ్రాఫర్ అవుతానని ఇంట్లో చెప్పాను. అయితే ఒప్పుకోలేదు. దాంతో నేను దాచుకున్న కొంత డబ్బుతో ఒంటరిగా హైదరాబాద్ వచ్చేశాను. నేను ముక్కుసూటి మనిషిని.. దేనికీ భయపడను. నా వ్యక్తిత్వాన్ని నమ్ముతూ నిజాయతీగా ముందుకెళ్తాను. నాకు తెలిసిన వాళ్ల ద్వారా డ్యాన్సర్ కార్డ్ తీసుకున్నాను. తెలిసిన అమ్మాయితో కలిసి రూమ్ తీసుకొని ఉన్నాను. కొన్ని రోజులకు నా గొలుసు ఎవరో దొంగతనం చేశారు. బాధతో రూమ్ నుంచి వచ్చేశాను. ఆ తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. డ్యాన్సర్‌గా శక్తి, డార్లింగ్ తదితర సినిమాలకు పనిచేశాను. సీరియల్.. సినిమా డ్యాన్సర్‌గా ఎదిగాక కొన్ని షోలలో పాల్గొన్నాను. తర్వాత జాబిలమ్మ సీరియల్లో లీడ్ రోల్ చేశాను. బాహుబలి సినిమా నా కెరీర్‌ను మలుపు తిప్పింది. అందులో తమన్నా స్నేహితురాలిగా నటించాను. బాహుబలి తర్వాత కుమారి 21ఎఫ్ సినిమాలో మంచి పాత్ర వచ్చింది. కాటమరాయుడు, సుబ్రమణ్యం ఫర్ సేల్, మహానుభావుడు తదితర చిత్రాల్లో నటించాను. పెద్ద సినిమాల్లో నటించడంతో చిన్న సినిమాల్లో హీరోయిన్గా అవకాశం లభించింది. ఇద్దరి మధ్య 18, మౌనం, ఆవుపులి మధ్యలో ప్రభాస్ పెళ్లి తదితర చిత్రాల్లో హీరోయిన్గా చేశాను. బాహుబలి సినిమాలో నటించాక వరంగల్‌లో నాకు సన్మానం చేశారు. ‘సినిమాల్లో వద్దు. నీకు చాన్స్‌లు రావు’ అన్నవాళ్లే నన్ను అభినందిస్తూ సన్మానం చేయడం సంతోషంగా అనిపించింది. ప్రస్తుతం తెలుగు, కన్నడ మూవీలో హీరోయిన్గా చేస్తున్నాను. నేనే ప్రపోజ్ చేశా... డ్యాన్సర్‌గా ఉన్నప్పుడు శివశంకర్‌రెడ్డితో పరిచయమైంది. తనది కడప. నిజాయతీగా ఉండేవాడు. కష్టాల్లో తోడుగా ఉండి భరోసా ఇచ్చాడు. స్టైలింగ్‌లో సూచనలిస్తూ స్నేహితుడిగా మారాడు. శివ వ్యక్తిత్వం, ఆప్యాయత నచ్చాయి. కొన్ని రోజులకు నేనే ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామని చెప్పాను. శివతోనే నా ప్రయాణం. శివ తోడు నా జీవితాన్ని మరో మలుపు తిప్పింది. నా స్వీయ తప్పిదం... బిగ్‌బాస్‌లో అవకాశం రావడం నా అదృష్టం. అందులో పాల్గొనడం ఆనందాన్నిచ్చింది. చాలామంది ఇది గేమ్ డైరెక్షన్ అనుకుంటారు. కానీ నిజాయతీగా ఉండే రియాల్టీ షో. ప్రతిరోజూ నూతనంగా ఉండేది. కొత్త టాస్క్‌లతో ఉత్సాహంగా గడిపేవాళ్లం. నా ముక్కుసూటి తనంతో షోలో నన్ను అభిమానిస్తూ సన్నిహితంగా ఉండేవారు. బిగ్‌బాస్‌లో నెలరోజులకు పైగా ఉండడం సంతోషంగా అనిపించింది. ఓ టాస్క్‌లో కౌషల్‌తో చిన్న వాగ్వాదం జరిగింది. నా స్వీయ తప్పిదంతోనే వాగ్వాదం పెద్దదైంది. దీంతో నాకు మైనస్ మార్క్స్ పడ్డాయి. -
నాని సినిమాలో అనుష్క.!
టాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన స్టార్ హీరోయిన్ అనుష్క. అరుందతి, బాహుబలి, భాగమతి లాంటి చాలెంజింగ్ రోల్స్‌లో ఆకట్టుకున్న స్వీటీ మరో డిఫరెంట్ క్యారెక్టర్ కు ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ ఏలేటి త్వరలో నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాలో అనుష్క కీలక పాత్రలో నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క తరువాత లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. బాహుబలి 2 తరువాత సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న స్వీటీ, చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో నటించేందుకు అంగీకరిస్తారో లేదో చూడాలి. -
బాహుబలి నిర్మాతల భారీ ప్రాజెక్ట్
బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన ఆర్కా మీడియా సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు రెడీ అవుతోంది. బాహుబలి తరువాత రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. అదే సమయంలో బుల్లితెర మీద బాహుబలి స్థాయిలో ఓ భారీ టీవీ సీరియల్‌ను నిర్మిస్తున్నారు. తాజాగా బాహుబలికి ప్రీక్వెల్‌గా ఓ వెబ్ సీరీస్‌ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం, ఆమె ఎదుగుదల ప్రధానాంశంగా ఈ వెబ్ సీరీస్ రూపొందనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ వెబ్ సీరీస్‌ను ముగ్గురు దర్శకులు డైరెక్ట్ చేయనున్నారట. ఇప్పటికే ప్రస్థానం ఫేం దేవ కట్టా ఫైనల్ కాగా ఓ హిందీ డైరెక్టర్, తెలుగు డైరెక్టర్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ భారీ వెబ్ సీరీస్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
‘సంఘమిత్ర’ మొదలవుతోంది..!
బాహుబలి సక్సెస్ తరువాత తమిళ చిత్ర వర్గాలు అదే స్థాయిలో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. దర్శకుడు సుందర్.సి సంఘమిత్ర పేరుతో భారీ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేశారు. ముందుగా టాప్ స్టార్స్‌తో సినిమా రూపొందించాలని ప్రయత్నించిన డేట్స్ అడ్జెస్ట్ కాకపోవటంతో జయం రవి, ఆర్య కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుందని ప్రకటించారు. టైటిల్ రోల్‌కు శృతి హాసన్‌ను ఎపింక చేసి కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో గ్రాండ్‌గా పోస్టర్స్ రిలీజ్ చేశారు. కానీ కొద్ది రోజులకే శృతిహాసన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. దీంతో సంఘమిత్ర ఆగిపోయినట్టే భావించారు. కానీ తాజాగా సంఘమిత్ర చిత్రయూనిట్ షూటింగ్ ప్రారభించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. లోఫర్ ఫేం దిశా పటాని టైటిల్ రోల్లో సినిమాను తెరకెక్కించేందుకు సుందర్.సి రెడీ అవుతున్నారట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది. -
‘మగధీర’ పనుల్లో రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా మగధీర. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసింది. పునర్జన్మల నేపథ్యంలో ఫాంటసీ కథాశంతో తెరకెక్కిన మగధీర సినిమా రాజమౌళిని టాప్ డైరెక్టర్‌గా నిలిపింది. 2009లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. బాహుబలి సినిమాతో రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జపాన్‌లో బాహుబలి చిత్రానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఇప్పుడు మగధీర సినిమాను కూడా జపనీన్ భాషలతో డబ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. అయితే గతంలోనే మగధీర జపనీస్ సబ్‌టైటిల్స్‌తో అక్కడ రిలీజ్ అయ్యింది. కానీ ఆ సమయంలో రాజమౌళికి జపాన్‌లో ఎలాంటి ఇమేజ్ లేదు. బాహుబలి సినిమాతో రాజమౌళి పేరు జపాన్‌లోనూ మారుమోగిపోయింది. అందుకే మగధీరను డబ్ చేసి రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారట. అయితే విషయంపై చిత్రయూనిట్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
ప్రభాస్ కోసం హైదరాబాద్‌లో యూరప్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. బాహుబలి లాంటి ఘన విజయం తరువాత తెరకెక్కుతున్న సినిమా కావటంతో సాహోను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల దుబాయ్‌లో 40 రోజుల పాటు యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించారు. త్వరలో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్ట్స్ సినిమాను రెడీ చేస్తున్నాడు ప్రభాస్. జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను కూడా యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా కోసం హైదరబాద్‌లో యూరప్ లోకేషన్లను సెట్ వేస్తున్నారట. అక్కడి ట్రైన్, షిప్, హెలికాప్టర్ లాంటి వాటిని కూడా హైదరాబాద్‌లో సెట్ వేస్తున్నారు. -
ఆయనతో వివాదం లేదు : ప్రభాస్
బాహుబలి ప్రభాస్‌కు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌కు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టుగా కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌ను కరణ్ బాలీవుడ్‌కు పరిచయం చేసేందుకు ప్రయత్నించటం. అందుకు ప్రభాస్ నో చెప్పటంతో వారిద్దరి మధ్య దూరం పెరిగిందన్న టాక్ టాలీవుడ్, బాలీవుడ్‌లలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేశారు. మీడియాలో తమ మధ్య వివాదం నడుస్తున్నట్టుగా వార్తలు వచ్చిన విషయం కరణ్ తనకు ఫోన్‌చేసి చెప్పారన్నారు. మా మధ్య ఎలాంటి వివాదం లేదని క్లారిటీ ఇచ్చారు. దుబాయ్‌లో షూటింగ్ పూర్తియిన సందర్భంగా అక్కడి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన సాహో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. -
త్వరలో సెట్స్ మీదకు బాహుబలి ప్రీక్వెల్
తెలుగు సినిమా మార్కెట్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన భారీ చిత్రం బాహుబలి. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డలు సంయుక్తంగా నిర్మించారు. భారీ బడ్జెట్ తో నిర్మించటమే కాదు అదే స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించి సినిమా ఘనవిజయం సాధించేందుకు తమవంతుగా కష్టపడ్డారు. తాజాగా బాహుబలి 2 చైనాలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఈ సందర్బంగా తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్న నిర్మాతలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. త్వరలో బాహుబలికి ప్రీక్వెల్‌ను నిర్మించనున్నట్టుగా తెలిపారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆన్లైన్ సీరీస్‌గా ఈ ప్రీక్వెల్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులోనే చిత్రీకరణ ప్రారంభించేందుకు రెడీ సిద్ధమవుతున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం ఉన్న మాహిష్మతి సెట్‌తో పాటు మరికొన్ని సెట్స్‌ను రూపొందించి శివగామి చిన్నతనం నుంచి జరిగే కథతో ఈ ప్రీక్వెల్ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రీక్వెల్‌లో అంతా కొత్త నటీనటులు కనిపించనున్నారు. ఎవరు దర్శకత్వం వహిస్తారు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది లాంటి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఇప్పటికే ఆనంద్ నీలకంఠన్ ద రైజ్ ఆఫ్ శివగామి పేరుతో బాహుబలికి ముందు జరిగే కథను నవలగా విడుదల చేశారు. ఇప్పటికే బాహుబలి థీమ్‌తో వచ్చిన కామిక్ బుక్స్, ఏనిమేషన్ సిరీస్, మర్చెంట్ డైస్‌లకు మంచి ఆదరణ లభించటంతో ఆన్లైన్ సిరీస్ కూడా సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. -
పాఠశాల చదువు పూర్తి కాకుండానే..!
తమిళసినిమా: దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో నటి తమన్నా ఒకరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా మంది హీరోయిన్లు ముందు గ్లామర్ పాత్రల్లో నటించి ఆ తరువాత నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించి పేరు తెచ్చుకుంటారు. అయితే తమన్నాకు లక్కీగా ఆదిలోనూ కోలీవుడ్‌లో కల్లూరి, టాలీవుడ్లో శ్రీ, హ్యాపిడేస్ చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలే లభించాయి. ఆ తరువాత ఈ మిల్కీబ్యూటీ చాలా చిత్రాల్లో అందాలాబోరతలో రెచ్చిపోయి నటించారనుకోండి. అలాంటి సమయంలోనే బాహుబలి చిత్రం తమన్నా సినీ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోయింది. అందులో అవంతిక పాత్రకు ప్రాణం పోశారనే చెప్పాలి. బాలీవుడ్‌లోనూ తన సత్తాచాటాలని ప్రయత్నించినా అక్కడ పెద్దగా లక్కు కలిసి రాలేదు. నటిగా దశాబ్దపు మైలురాయిని అధిగమించిన తమన్నా తన సినీ జీవితంలో అనుభవాలను పంచుకున్నారు. అవేంటో చూద్దాం. సినిమా పాఠశాల లాంటిది. నిత్యం పలు విషయాలను నేర్పుతుంది. నేను పాఠశాల చదువు పూర్తి కాకుండానే సినీరంగప్రవేశం చేశాను. అందువల్ల కళాశాల్లో చదువుకోలేదన్నది లోటే. అయితే సినిమాలో ఆ అనుభవాలను నేను చవిచూశాను. పాఠాలు చదవడం, పరీక్షలకు సిద్ధం కావడం, రిజల్ట్ కోసం ఆతృతగా ఎదురుచూడడం వంటి అనుభవాలను సినిమా ద్వారా పొందాను. సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరంజీవి సరసన నటిస్తున్నాను. అది చారిత్రక కథా చిత్రం. అందుకోసం పలు చరిత్ర కథలను చదివి నాటి సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకుంటున్నాను. బాహుబలి చిత్రం కోసం కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. మరో చిత్రం కోసం నాట్యంలో శిక్షణ పొందాను అని తమన్నా పేర్కొన్నారు. తమిళంలో ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా కన్నే కలైమానే చిత్రంలో నటిస్తున్నారు. ఇవి కాక మరో మూడు కొత్త చిత్రాలను సంతకం చేశారట. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. -
వైరల్ : సాహోలో ప్రభాస్
బాహుబలి లాంటి ఘన విజయం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సాహో. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు చిత్రయూనిట్. తాజా ఈ షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రభాస్ స్టైలిష్ లుక్‌లో బైక్ మీద కూర్చున్న స్టిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు చిత్రయూనిట్ సాహోలో ప్రభాస్ లుక్ కు సంబంధించి ఎలాంటి స్టిల్ రిలీజ్ చేయకపోవటంతో రెబల్ స్టార్ అభిమానులు లీకైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, చుంకీ పాండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
బాహుబలిలో శ్రీదేవి అందుకే చేయలేదు: ఆర్జీవీ
-
శ్రీదేవి.. బాహుబలి చేయకుండా ఆపింది అతనే..!
తెలుగు సినిమా ఖ్యాతీని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన భారీ చిత్రం బాహుబలి. ఈ సినిమా దర్శక నిర్మాతలతో పాటు నటీనటులకు కూడా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ముఖ్యంగా శివగామి పాత్రలో నటించిన రమ్యకృష్ణకు ఈ సినిమా వరుస అవకాశాలను తెచ్చిపెట్టింది. అయితే ఈ పాత్రకు ముందుగా అతిలోకసుందరి శ్రీదేవిని తీసుకోవాలని భావించారు. కానీ శ్రీదేవి అంగీకరించకపోవటంతో రమ్యకృష్ణను తీసుకున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి కూడా పలు వేదికల మీద ప్రస్తావించారు. అయితే తాజాగా ఈ విషయంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో శ్రీదేవికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. శ్రీదేవి.. బాహుబలి సినిమా చేయకపోవటానికి కారణం బోని కపూరే అన్నారు వర్మ. ఈ విషయంపై తాను అప్పట్లో శ్రీదేవితో మూడు నాలుగుసార్లు చర్చించానని.. శ్రీదేవి కూడా బాహుబలి సినిమాలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపించారని.. కానీ బోనీనే భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి బాహుబలి చేయకుండా చేశారన్నారు. బోని నిర్ణయాల కారణంగానే శ్రీదేవి కెరీర్ పరంగా ఎంతో నష్టపోయారని.. పెళ్లి తరువాత ఆమె ఒక్క రోజు కూడా ఆనందంగా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
మార్కెట్ రేస్
-
నిన్ననే చూడండి
సరిగ్గా నిన్నటి తేదీ (అంటే ఏప్రిల్ 28). నలభై రెండేళ్ల క్రితం, పన్నెండేళ్ల క్రితం, ఏడాది క్రితం.. సినిమా ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. అలాంటి ఇలాంటి పండుగ కాదది. థియేటర్ల ముందు జనాలను బారులు తీరేలా చేసి, టిక్కెట్టు చింపి లోపలికెళ్లి కూర్చుంటే ఎంత ప్రయత్నించినా ఈలలు వేయకుండా ఉండలేని, అరిచి గోల చేయకుండా కూర్చోలేని పరిస్థితిని తెచ్చిపెట్టిన పండుగ. ‘ఇండస్ట్రీ హిట్ సినిమా’ ఆ పండుగ పేరు. ఇండస్ట్రీ హిట్ అంటే అప్పటివరకూ ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేయడం. బాక్సాఫీస్ దుమ్ము దులపడం, రోజులకు రోజులు థియేటర్లలోనే సినిమా మకాం వేసేయడం.. అవన్నీ చేస్తేనే అది ఇండస్ట్రీ హిట్. ఏప్రిల్ 28వ తేదీకి, తెలుగు సినిమాకు ఓ మంచి కనెక్షన్ ఉంది. ఈరోజునే అడవి రాముడు (1977), పోకిరి (2006), బాహుబలి 2 (2017) రిలీజ్ అయ్యాయి. ఈ మూడూ తెలుగు సినిమా బాక్సాఫీస్‌ను తిరగరాసిన ఇండస్ట్రీ హిట్స్. ‘నేడే చూడండి’ అంటూ అదరగొట్టిన ఆ నిన్నటి సినిమాలను ఇవ్వాళ తలుచుకుంటూ నిన్ననే చూసొద్దాం... ఫార్ములా కథకు పుట్టుక ఒక పక్కా మాస్ సినిమా ఎలా ఉండాలి? ఏమేం ఉంటే అది మాస్ సినిమా అవుతుంది? సరిగ్గా కొలతలు వేస్కొని, హీరో ఇమేజ్‌కు తగ్గట్టు సన్నివేశాలు రాస్కొని ఒక కథ అల్లుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడైతే ఇలా ఉన్న సినిమాను ఫార్ములా కమర్షియల్ ఎంటర్టైనర్ అంటున్నాం. అలాంటి ఫార్ములాను పుట్టించిన సినిమా ‘అడవి రాముడు’. 1977 ఏప్రిల్ 28న విడుదలైందీ సినిమా. ‘అడవి రాముడు’కి ముందు కె. రాఘవేంద్రరావుకు దర్శకుడిగా పెద్ద పేరు కూడా లేదు. నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణలు ఒక కంప్లీట్ మాస్ సినిమా తీయాలనుకున్నారు. అదీ ఎన్టీఆర్‌తో. జయప్రద హీరోయిన్. ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టు, ఆయన్ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తూ ఒక కథ వండుకున్నారు. అందుకే కథ క్రెడిట్ కూడా ‘సత్య చిత్రా యూనిట్’ అని బ్యానర్ పేరు ఉంటుంది. హీరో అడవిలో జరిగే అన్యాయాలు, అక్రమాలను గుర్తిస్తాడు. స్మగ్లింగ్ ముఠాను అడ్డుకొని వారి ఆగడాలను అరికడుతుంటాడు. అడవిలో జనాలందరిలోనూ ధైర్యాన్ని నింపి స్మగ్లింగ్‌పై వాళ్లే పోరాడేలా చేస్తాడు. ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా సాగిపోయే ఈ కథలో సెకండాఫ్‌కి వచ్చాక ఒక ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటంటే హీరోనే ఫారెస్ట్ ఆఫీసర్. నాలుగు భారీ ఫైట్లు, అదిరిపోయే డైలాగులు, చిన్న రొమాన్స్ ట్రాక్, అక్కడక్కడా కామెడీ బిట్లు, ఒక ఆరు పాటలు.. ఇలా లెక్కలేస్కొని మరీ ఈ ఈ అంశాలను జతచేరుస్తూ కథ పూర్తిచేశారు. ‘అడవి రాముడు’ కథ రెడీ అయిపోయింది. ఎన్టీఆర్, జయప్రద హీరో, హీరోయిన్లు. రాము అనే ఆ హీరో పాత్రతో ఆద్యంతం సినిమాను తన భుజాల మీద మోసేశాడు ఎన్టీఆర్. ఏప్రిల్ 28న సమ్మర్ హాలీడేస్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అప్పటికి తెలుగు సినిమా ఊహకు కూడా అందని రీతిలో 4 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. 32 సెంటర్లలో వంద రోజులు ఆడింది. ఎన్టీఆర్ చరిష్మా, రాఘవేంద్రరావు మేకింగ్, మాస్ అంశాలు మెండుగా ఉండటంతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అనే స్టేటస్‌ను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ ఏనుగుపైకెక్కి కూర్చోవడం ఒక ట్రెండ్‌సెట్టింగ్ సీన్. డైలాగులు చాలాకాలం పాటు జనాల నోళ్లలో నానాయి. కె.వి.మహదేవన్ అందించిన పాటలైతే ఇక చెప్పక్కర్లేదు. ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను..’ అనే పాట ఈరోజుకీ పాపులరే! ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు..’ అనే పాటలో ఎన్టీఆర్‌ను అభిమానులు చూడాలనుకున్న అన్ని చారిత్రక పాత్రల్లో చూపించాడు రాఘవేంద్రరావు. ఈ సినిమా తర్వాతే ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్లో ‘సర్దార్ పాపారాయుడు’, ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్ చౌదరి’ లాంటి సూపర్‌హిట్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమా తర్వాతే తెలుగులో కమర్షియల్ సినిమా ఫార్ములా అనేది ఒకటి తయారైంది. ఆ ఫార్ములా ఈరోజుకీ బ్లాక్‌బస్టర్ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ ఉండటాన్ని విశేషంగా చెప్పుకోవాలి. టూ హండ్రెడ్ సెంటర్స్.. హండ్రెడ్ డేస్ 2006 ఏప్రిల్ 28న విడుదలైన ‘పోకిరి’, 75 సంవత్సరాల (అప్పటికి) తెలుగు సినీ పరిశ్రమ రికార్డులను తిరగరాసిన ఇండస్ట్రీ హిట్. ఈ సినిమాలో ఒక పోలీసాఫీసర్ కామెడీగా చెప్పిన డైలాగ్ ఒకటి ఉంది. ‘ఇండియాలో గాంధీ సినిమా వంద రోజులు ఆడదు. కడప కింగ్ అని తీయ్! టూ హండ్రెడ్ సెంటర్స్.. హండ్రెడ్ డేస్’ అని. రెండు వందల కేంద్రాల్లో ఒక సినిమా వంద రోజులు ఆడడం అనేది ఎవ్వరూ అందుకోలేని ఒక గొప్ప అచీవ్మెంట్ అన్న ఉద్దేశంలో ఆ డైలాగ్ పెట్టి ఉండొచ్చు. అయితే ‘పోకిరి’ కూడా ఎవ్వరి ఊహకీ అందని హిట్. ఆ డైలాగ్‌లో చెప్పినట్టే సరిగ్గా టూ హండ్రెడ్ సెంటర్స్‌లో పోకిరి హండ్రెడ్ డేస్ ఆడింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ మహేశ్ బాబుతో చేసిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్, ఈ జానర్లో ఎవర్గ్రీన్ బ్లాక్‌బస్టర్. ఆలీభాయ్ అనే ఓ మాఫియా లీడర్ దుబాయ్‌లో ఉంటూనే ఓ పెద్ద మాఫియాను నడిపిస్తుంటాడు. ల్యాండ్ మాఫియా అది. సిటీలో కొత్తగా ఎవరు ఏ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినా మాఫియాకు డబ్బులు అందాలి. హీరో పండు ఆ మాఫియా గ్యాంగ్‌లో చేరతాడు. డబ్బులిస్తే ఎవర్ని కొట్టమన్నా కొడుతూంటాడు పండు. పక్కా పోకిరీ. మాఫియా వరుసగా వేసే ఒక్కో ప్లాన్‌లో భాగమై వాళ్లతోనే ఉంటాడు. ప్రీ క్లైమాక్స్ దగ్గర పడేవరకూ అతన్నొక పోకిరీగానే చూపిస్తూ కథ నడుస్తుంది. అప్పుడొచ్చే ఒక ట్విస్టే సినిమాకు హైలైట్. ఆ ట్విస్టే తెలుగు సినిమా చరిత్రను తిరగరాసే కమర్షియల్ సినిమా పుట్టుకకు మూలం. ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణ మనోహర్ ఓ క్రిమినల్లా నటిస్తూ పండు అనే పోకిరీగా మాఫియాలో చేరడమే ఆ ట్విస్ట్. మాఫియాను మట్టుపెట్టేందుకు కృష్ణ మనోహర్ పండుగా నటించాడన్న ట్విస్ట్ బయటపడగానే పోకిరీ కథంతా ఓ కొత్త మలుపు తీసుకుంటుంది. దాని ఫలితమే ఈరోజు మనల్ని ఈ సినిమాను గుర్తు చేసుకునేలా చేసింది. పది పన్నెండు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నలభై కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి తెలుగు సినిమా బాక్సాఫీస్ పొటెన్షియల్‌ను ఇండియన్ సినిమాకు పరిచయం చేసింది. పూరీ జగన్నాథ్‌ను టాప్ డైరెక్టర్‌ను చేసింది. ప్రిన్స్ మహేశ్ బాబును సూపర్‌స్టార్ స్థాయికి తీసుకెళ్లింది. ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు’, ‘నేనెంత ఎదవనో నాకే తెలీదు,’ లాంటి పంచ్ డైలాగులు ఆ తర్వాత ఒక దశాబ్దం పాటు తెలుగు సినిమాల్లో ఏదో ఒకరకంగా వినిపించాయి. మణిశర్మ అందించిన పాటలన్నీ సూపర్‌హిట్. పోకిరీ తయారు చేసిన.. హీరో ఒక క్రిమినల్‌గా నటించడం అనే కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో కామన్‌గా మారిపోయింది. పోకిరీ తమిళంలోకి వెళ్లింది. హిందీలోకీ వెళ్లింది. హిందీలో ‘వాంటెడ్’ పేరుతో వచ్చిన ‘పోకిరీ’, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సెకండ్ ఇన్నింగ్స్‌కు ప్రాణం పోసి నిలబెట్టింది. ఈతరం కమర్షియల్ సినిమాలకు పోకిరీ ఒక బ్రాండ్ నేమ్. తెలుగు సినిమా చరిత్రలో ఒక బ్లాక్‌బస్టర్ పేజీ. ఇండియన్ సినిమా ఐడెంటిటీ ఇండియాలో ఎన్ని సినీ పరిశ్రమలున్నా, ప్రపంచ దేశాలకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్. బాలీవుడ్ తప్ప ఇక్కడ ఇంకే సినిమా లేదన్నట్టుగా ప్రపంచదేశాలు భావిస్తాయి. ఈ ఆలోచనను పక్కకు తోసి ‘తెలుగు సినిమా’ అన్నది ఒకటి ఉందని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా ‘బాహుబలి’. బాహుబలి రెండు భాగాలుగా వచ్చింది. రెండో భాగం ‘బాహుబలి – ది కంక్లూజన్’ 2017 ఏప్రిల్ 28న విడుదలైంది. ‘అడవి రాముడు’, ‘పోకిరి’ ఎలాగైతే ఏప్రిల్ 28న వచ్చి ఇండస్ట్రీ హిట్ అనిపించుకున్నాయో, ‘బాహుబలి 2’ కూడా అదే తేదీన వచ్చి ఇండస్ట్రీ హిట్‌కి మించిన పేరేదైనా ఉంటే ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది. తెలుగు సినిమాకే కాదు, ‘బాహుబలి’ ఇండియన్ సినిమాకే ఒక ఐడెంటిటీ. 2015లో విడుదలైన బాహుబలి మొదటి భాగం.. కట్టప్ప బాహుబలిని చంపాడన్న ట్విస్ట్‌తో ముగుస్తుంది. రాజవంశానికి అత్యంత నమ్మకస్తుడైన, ఆ కుటుంబాన్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కట్టప్ప తనకెంతో ఇష్టమైన బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్న ఇండియన్ సినిమా అభిమానులందర్నీ 2017లో బాహుబలి రెండో భాగం వచ్చేవరకూ వెంటాడింది. దర్శకుడు రాజమౌళి ఈ సినిమాతో ఇండియన్ సినిమాకు ఒక ఐకాన్‌లా మారిపోయాడు. విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉన్నాయన్న పేరు ఒక ప్రత్యేక గుర్తింపు. బాహుబలి పాత్రలో అద్భుతంగా నటించిన ప్రభాస్, నేషనల్ లెవెల్ స్టార్‌గా మారిపోయాడు. బాక్సాఫీస్ వసూళ్లు చూసుకుంటే ఇండియన్ సినిమా స్టామినా ఇంత ఉందా అనేలా కలెక్షన్స్ వచ్చాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీల్లోనూ విడుదలైన ‘బాహుబలి2’ 1700 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో బాహుబలి చర్చకు వచ్చింది. నేషనల్ అవార్డ్స్‌లో బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డు సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ డొమెస్టిక్ మార్కెట్లో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసింది. అవి ఎలాంటి రికార్డులంటే కొత్తగా ఏ సినిమా విడుదలైనా ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను ‘నాన్ బాహుబలి రికార్డు’ అని సరిపెట్టుకునేంత. చరిత్రలో పేజీలంత కథగా మాత్రమే మిగిలిపోలేదు బాహుబలి. దాని గురించి రాయడమే ఒక చరిత్ర. యాదృచ్చికమో, విచిత్రమో, మరింకోటో కానీ నలభై రెండేళ్ల కిందట, పన్నెండేళ్ల కిందట, ఏడాది కిందట.. ఒకేరోజున (ఏప్రిల్ 28న) తెలుగు సినిమా రూపు రేఖల్ని మార్చిన సినిమాలు రావడం విశేషమే! ఆ డేట్లో ఏదో మ్యాజిక్ ఉండే ఉండాలి మరి!! అడవి రాముడు స్టార్స్ ఎన్టీఆర్ అప్పట్లో ఎక్కడికెళ్లినా హారతులిచ్చి ఆరాధించేవారట. ఆయన స్టార్‌డమ్‌ను దగ్గరుండి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పట్నుంచే గమనించిన రాఘవేంద్ర అందుకు తగ్గట్టు అడవి రాముడులో ఎన్టీఆర్ పాత్రను రాసుకున్నాడట. ఎన్టీఆర్ ఏనుగుపైకెక్కి తిరగడమన్నది అలాగే పుట్టిందని చెబుతాడాయన. అడవి రాముడు రిలీజై హిట్టయ్యాక రాఘవేంద్రరావు తన మొదటి కారు (అంబాసిడర్) కొన్నాడు. అడవి రాముడు రిలీజైన ఐదేళ్లకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యాడు. సీఎం అయ్యాక కూడా ఆయన అడవి రాముడు సిల్వర్ జూబ్లీ షీల్డ్‌ను తన ఆఫీసులో పెట్టుకున్నాడట. అందులో ఆ ఒక్క సినిమా షీల్డే ఉండటాన్ని రాఘవేంద్రరావు ఎప్పటికీ మరచిపోలేదు. రాఘవేంద్రరావుతో పాటు రైటర్ జంధ్యాల, హీరోయిన్ జయప్రద, సింగర్ బాలసుబ్రమణ్యం తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నారు. పోకిరి విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2006 దర్శకుడు : పూరీ జగన్నాథ్ నటీనటులు : మహేశ్ బాబు, ఇలియానా నిర్మాతలు : పూరీ జగన్నాథ్, మంజుల ఘట్టమనేని సంగీతం : మణిశర్మ ‘బాహుబలి’ బడ్జెట్.. ప్రభాస్, రానా ఇద్దరినీ నేషనల్ లెవెల్ స్టార్లను చేసింది బాహుబలి. వీళ్లిద్దరూ మూడు నాలుగేళ్లు కేవలం బాహుబలి కోసమే తమ సమయాన్ని కేటాయిం చారు. ఈ మూడేళ్లూ కఠోరమైన డైట్, వర్కవుట్లను ఫాలో అయ్యారు. ‘జురాసిక్ వరల్డ్’ లాంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన 30 దేశాలకు చెందిన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలు ‘బాహుబలి 2’ కోసం పనిచేశాయి. ఇండియన్ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాగా ‘బాహుబలి 2’ (దాదాపు 250 కోట్ల రూపాయలు) నిలిచింది.బాహుబలి పేరుమీద త్వరలోనే కామిక్స్, టీవీ సిరీస్ రానున్నాయి. బాహుబలి 2 విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2018 దర్శకుడు : ఎస్.ఎస్. రాజమౌళి నటీనటులు : ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్ నిర్మాతలు : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి – వి. మల్లికార్జున్ -
సాహో నేపథ్యం అదే..!
బాహుబలి లాంటి భారీ విజయం తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. యువ దర్శకుడు సుజిత్ (రన్ రాజా రన్ ఫేం) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న సాహో లైన్ ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రీవేంజ్ డ్రామా అని తెలుస్తోంది. అంతేకాదు సినిమాలో బలమైన సోషల్ మేసేజ్ కూడా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ధృవీకరించలేదు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్‌నితిన్ ముఖేష్, మందిరా బేడీ, చుంకీ పాండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
300 కోట్లతో రాజమౌళి మల్టీ స్టారర్
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ అంటూ సినిమా వర్కింగ్ టైటిల్‌ను ప్రకటించేశారు చిత్రయూనిట్. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాత దానయ్య ఈ భారీ మల్టీ స్టారర్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇన్నాళ్లు సినిమా బడ్జెట్ 100, 150 కోట్ల వరకు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే అందరికీ షాక్ ఇస్తూ ఆర్ ఆర్ ఆర్ సినిమాను 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు దానయ్య. మహేష్ బాబు హీరోగా దానయ్య నిర్మించిన భరత్ అనే నేను సినిమా ప్రమోషన్ సందర్భంగా ఈ విషయాలను వెల్లడించారు. ‘మల్టీ స్టారర్ సినిమాను కథను రాజమౌళి నాతో పాటు మరికొందరు సాంకేతిక నిపుణులకు చెప్పారు. ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాము. సెట్స్ కోసం ఆర్ట్ డైరెక్టర్ పని మొదలు పెట్టారు. సినిమా విజువల్ ట్రీట్ గా ఉంటుంది’ అన్నారు నిర్మాత డీవీవీ దానయ్య. -
తమన్నాకు దాదాసాహెబ్ అవార్డు
సాక్షి, ముంబై : మిల్కీ బ్యూటీ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు చేరింది. ఇటీవలే జీ సంస్థలు నిర్వహించిన అప్సర అవార్డుల్లో శ్రీదేవి అవార్డు అందుకున్న తమన్నా తాజాగా మరో అవార్డుకు ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డు ఆమెను వరించింది. తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన బాహుబలి సిరీస్‌లో తమన్నా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటి భాగంలో తమన్నా అద్భుత నటనకు గాను ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకోన్నారు. తమన్నాతో పాటు రణ్వీర్ సింగ్, అనుష్క శర్మలకు కూడా ఈనెల 21న అవార్డులు ప్రదానం చేయనున్నట్టు ముంబైకి చెందిన దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ తెలిపింది. తనకు ఈ అవార్డు ప్రకటించడం పట్ల హీరోయిన్ తమన్నా సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ సినిమా రంగానికి దాదాసాహెబ్ ఫాల్కే ఎంతో సేవ చేశారని, ఆయన పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ నుంచి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం తమన్నా తెలుగులో నా నువ్వే.. క్వీన్ రీమేక్‌లో నటిస్తున్నారు. -
అక్కడ ‘బాహుబలి 1’ని దాటిన ‘రంగస్థలం’
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్ సీస్లో 28 లక్షల డాలర్లకు పైగా వసూళు చేసిన ఈ సినిమా 30 లక్షల డాలర్ల మార్క్‌ను కూడా ఈజీగా సాధిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే పలు కలెక్షన్ రికార్డ్ లను సొంతం చేసుకున్న రంగస్థలం ఖాతాలో మరో భారీ రికార్డ్ చేరింది. తొలి వారాంతంలో 80 కోట్లకు పైగా షేర్ వసూళు చేసి బాహుబలి 1 తరువాతి స్థానంలో నిలిచిన ఈ సినిమా తమిళనాట మాత్రం బాహుబలి 1 రికార్డ్ లను దాటేసింది. సమ్మె కారణంగా కోలీవుడ్ లో తమిళ చిత్రాలేవి విడుదల కాకపోవటం రంగస్థలంకు కలిసొచ్చింది. తొలి ఎనిమిది రోజులకు చెన్నై నగరంలోనే కోటి రూపాయల షేర్ వసూళు చేసి సత్తా చాటింది రంగస్థలం. -
ప్రభాస్ అభిమానులకు శుభవార్త
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ అడ్వంచరస్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ ప్రారంభానికి ముందే ఓ టీజర్ తో సందడి చేసిన సాహో యూనిట్, తరువాత ఒక్క పోస్టర్‌ను మాత్రమే రిలీజ్ చేసింది. ప్రస్తుతం సాహో సినిమాకు సంబంధించిన వార్తలు పెద్దగా వినిపించటం లేదు. సినిమా మీద బజ్ క్రియేట్ చేసేందుకు చిత్రయూనిట్ ఓ టీజర్ ను రెడీ చేస్తోందట. దుబాయ్ షెడ్యూల్ పూర్తయిన తరువాత ఈ టీజర్ ను రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు శంకర్ ఇషాన్ లాయ్‌లు సంగీతమందిస్తున్నారు. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, చుంకీ పాండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
పాకిస్తాన్‌కు రాజమౌళి
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి. భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించిన బాహుబలి 2 ఇతర దేశాల్లోనూ రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇటీవల జపాన్ రిలీజ్ లోనూ సత్తా చాటిన ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు రాజమౌళి. త్వరలో పాకిస్తాన్‌లోని కరాచీ జరగనున్న ‘పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’లో రాజమౌళి పాల్గొనున్నారు. ‘బాహుబలి సినిమా నాకు ఎన్నో దేశాలను సందర్శించే అవకాశం కలిగించింది. వాటన్నింటికి మించి ఇప్పుడు పాకిస్తాన్ వెళ్లబోతున్నాం. కరాచీలో జరిగే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి. Baahubali has given me opportunities to travel to a number of countries... The most exciting of them all is now, Pakistan. Thank you Pakistan international film festival, Karachi for the invite. — rajamouli ss (@ssrajamouli) 28 March 2018 -
బ్యాంకాక్‌లో బాహుబలి.. లండన్‌లో కట్టప్ప
ముందు బాహుబలి (ప్రభాస్) బొమ్మ.. ఇప్పుడు కట్టప్ప (సత్యరాజ్) బొమ్మ కూడా కనువిందు చేయనుంది. ఎక్కడ అంటే? మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో. తుస్సాడ్స్ బ్యాంకాక్ శాఖలో ఇప్పటికే బాహుబలి కొలువు దీరాడు. ఇప్పుడు లండన్ శాఖలో కట్టప్ప కనిపించబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకునే ప్రముఖుల మైనపు విగ్రహాలను తుస్సాడ్స్ వారు మ్యూజియంలో ప్రతిష్టించే విషయం తెలిసిందే. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ మైనపు విగ్రహాన్ని బాహుబలి గెటప్‌లోనే ప్రతిష్టించారు. ఇదే సినిమా ద్వారా బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్న సత్యరాజ్ విగ్రహాన్ని కట్టప్ప గెటప్‌లో పెట్టాలని తుస్సాడ్స్ నిర్ణయించుకుంది. త్వరలో సత్యరాజ్‌ని కలిసి విగ్రహ కొలతలు తీసుకోనున్నారు. లండన్ తుస్సాడ్స్‌లో చోటు సంపాదించుకోబోతున్న తొలి తమిళ నటుడు సత్యరాజే కావడం విశేషం. తమిళంలో ఆయన దాదాపు 200 పై చిలుకు సినిమాలు చేసినా ఒక్క ‘బాహుబలి’ ఆయన్ను వరల్డ్ వైడ్‌గా పాపులర్ చేసేసింది. -
కట్టప్పకు అరుదైన గౌరవం
సాక్షి, సినిమా : బాహుబలి సిరీస్‌లో కట్టప్ప పాత్రకు దక్కిన గుర్తింపు అంతా ఇంతా కాదు. మాషిష్మతి రాజ్యానికి, సింహాసనానికి.. నమ్మిన బంటుగా ఉండే పాత్రలో నటుడు సత్యరాజ్ మెప్పించగా.. దర్శకధీరుడు రాజమౌళి ఆ పాత్రను అద్భుతంగా తీర్చి దిద్దడంతో జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఆ కట్టప్ప అలియాస్ సత్యరాజ్‌కు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో కట్టప్ప మైనం విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలో కట్టప్ప రూపంలో ఉన్న సత్యరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మ్యూజియం నిర్వాహకులు ప్రకటించారు. ఈ విషయాన్ని కోలీవుడ్ మీడియా, సత్యరాజ్ తనయుడు శిబి సత్యారాజ్ కూడా ధృవీకరించారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే... మేడమ్ టుస్సాడ్‌లో విగ్రహ ఏర్పాటు గౌరవం అందుకున్న తొలి తమిళ నటుడు సత్యరాజ్ కావటం. అంతకు ముందు బాహుబలి రూపంలో ఉన్న ప్రభాస్ విగ్రహాన్ని కూడా బ్యాంకాక్ మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో నెలకొల్పిన విషయం తెలిసిందే. Really proud to read this!😊🙏🏻 #Kattappa #Baahubali https://t.co/M61ZcN8OLU — Sibi (Sathya)raj (@Sibi_Sathyaraj) 11 March 2018 -
చ.ము చ.త ఇదీ కథ!
‘‘ఈమధ్య చంద్రబాబు సినిమాలు తెగ చూస్తున్నాడు. తెగ ఇన్స్పైర్ అవుతున్నాడు. బాహుబలి చూసి ఆ మైకంలో ఆ సినిమాలోని సెట్టింగ్లా రాజధాని నిర్మించాలని డిసైడ్ అయిపోయాడు. ఆయన ఇంగ్లిష్ సినిమాలు చూడకపోవడం మన అదృష్టం’’ అని బాబు గురించి పబ్లిక్టాక్. ఇంగ్లిష్ సినిమాలేం ఖర్మ...తమిళ డబ్బింగ్ సినిమాలు చూసినా చంద్రబాబు ఏ విధంగా ఇన్స్పైర్ అవుతారనేదానికి ఇదో చిలిపి ఊహ. చలో అమరావతి... ఆరోజు ఆదివారం. ఉండవల్లిలోని గెస్ట్‌హౌస్‌లో టీవీ ముందు కూర్చున్న బాబుకు రకరకాల న్యూస్‌చానల్స్ చూసి బోర్ కొట్టింది. ఏదైనా సినిమా చూడాలనిపించింది. రిమోట్ నొక్కుతుండగా ఒక చానల్లో ‘కాసేపట్లో రోబో సినిమా’ అనే ప్రకటన వచ్చింది. బాబుకు హుషారొచ్చింది. వెంటనే తన మంత్రివర్గ సభ్యులకు ఫోన్ చేసి అర్జెంట్‌గా గెస్ట్‌హౌస్‌కు రమ్మని ఆదేశించాడు. విషయం తెలియని మంత్రులు ఆందోళనతో బాబు ఇంటికి పరుగు తీశారు. ‘‘రజనీకాంత్ రోబో సినిమా టీవీలో రాబోతుంది. అందరం కలిసి సినిమా చూద్దాం... ఆ విధంగా ముందుకు పోదాం’’ అని గడ్డం సవరించాడు బాబు. ‘‘అలాగే సార్!’’ అని అందరూ టీవీ ముందు బుద్ధిగా కూర్చున్నారు. సినిమా మొదలైంది. ‘ది ఎండ్’ కార్డ్ పడిందో లేదో గెస్ట్‌హౌస్ నుంచి బయటికి వచ్చి ఒక చెట్టు కింద నిల్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు బాబు.‘‘సార్... మీకు ఈ సినిమా తెగ నచ్చేసి ఉంటుంది. నా వయసు 72 ఏళ్లు సార్. అయినా సరే... కిలిమంజారో పాట వస్తుంటే డ్యాన్స్ చేయాలనిపించింది అంటే నమ్మండి! ఇక ఐషు అందం గురించి ఎంత చెప్పినా తక్కువే!’’ అని నాన్‌స్టాప్‌గా చెప్పుకుంటూ పోతున్నాడు టీడీపీ సీనియర్ నేత ఒకరు.‘‘ఆపవయ్యా నీ సోది’’ అని కళ్లు పెద్దవి చేసి గద్దించి ఉన్నపళంగా కారు ఎక్కాడు చంద్రబాబు.చుట్టూ ఉన్నవాళ్లు ఈ దృశ్యం చూసి షాక్ తిన్నారు. చంద్రబాబు తన గెస్ట్‌హౌస్ నుంచి నేరుగా సెక్రటేరియట్‌కు చేరుకున్నాడు. ‘‘ఈరోజు నన్ను ఎవరూ కలవడానికి వీల్లేదు. చివరికి లోకేశ్ కూడా’’ అని సిబ్బందికి ఆర్డర్ వేసి తన ఛాంబర్లోకి వెళ్లి తలుపులు బిగించుకున్నాడు బాబు. మరోవైపు బాబు గురించిమంత్రులు హాటుహాటుగా చర్చించుకుంటున్నారు.‘‘ఎంత చెత్త సినిమా చూసినా ఆ సినిమా గొప్పతనం గురించి మురిసి పోతుంటాడు బాబు. అలాంటిది సూపర్ డూపర్ హిట్ సినిమా ‘రోబో’ బాబుకు నచ్చలేదా?’’ అని ఒక మంత్రి ఇంకో మంత్రిని అడిగాడు. ‘‘సీనియర్ నాయకుడిని అకారణంగా విసుక్కోవడం చూస్తుంటే ఆయనకు సినిమా నచ్చలేదనే అనిపిస్తుంది’’ అన్నాడా మంత్రి. ఇక అక్కడ బాబు ఏంచేస్తున్నాడో చూద్దాం... అన్ని శాఖల ఫైళ్లను దగ్గర పెట్టుకొని కాగితాల మీద ఏవేవో లెక్కలు వేస్తున్నాడు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు... ఒక్కటనేమిటి? అన్నీ చేస్తున్నాడు బాబు. కాసేపు కంప్యూటర్లోకి దూరి ఏదో సమాచారం లాగాడు. మళ్లీ లెక్కలు వేశాడు. ఈ లెక్కల పనిలో పడి భోజనం చేయకపోవడమే కాదు... పచ్చికాఫీ కూడా ముట్టలేదు బాబు. బాబు తన పని ముగించుకునేసరికి రాత్రి పదకొండు దాటింది. బయటికి వచ్చిన బాబు ‘కనిపెట్టేశా. ఇక నాకు తిరుగే లేదు. నేను గ్రేట్’ అని గట్టిగా నవ్వుతున్నాడు.‘‘సార్... ఏమైంది?’’ భద్రతా సిబ్బంది ఆందోళనగా అడిగారు.‘‘ఏమీ లేదు. రేపు అర్జంటుగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నా’’ అని ప్రకటించాడు. మరుసటి రోజు మంత్రివర్గ సమావేశంలో బాబు మాట్లాడటం మొదలు పెట్టాడు...‘‘సినిమాల నుంచి కూడా చాలా ఇన్స్పైర్ కావచ్చు అనే విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నాను. బాహుబలి చూశానా...అందులో సెట్టింగ్స్లా మన రాజధాని ఉండాలని రాజమౌళికి కబురు చేశాను. ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నాడు. నిన్నటికి నిన్న రోబో సినిమా చూశాను.అందులో ఒక సీన్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ఈ ఆలోచన విజయవంతమైతే ‘చ.ము’ ‘చ.త’ అని చరిత్ర రెండుగా విడిపోతుంది’’ అని చెప్పుకుంటూ పోతున్నాడు బాబు. ‘‘చ. ము... చ.త అంటే ఏమిటి సార్?’’ అని అడిగాడు నిమ్మకాయల చినరాజప్ప.‘‘చ.ము అంటే చంద్రబాబుకు ముందు... చ.త అంటే చంద్రబాబు తరువాత’’ అని వివరించిన బాబు మళ్లీ మాట్లాడటం మొదలు పెట్టాడు...‘‘రోబో సినిమాలో ఒక సీన్లో.... మిలటరీ ఆఫీసర్లకు ‘చిట్టి’ రోబోను పరిచయం చేస్తూ సైంటిస్ట్ రజనీకాంత్ ఏమంటాడో తెలుసా? ‘ఈ రోబో ఒక్కటి వంద మందితో సమానం’ అని. ఈ సీన్ నుంచి నేను ఇన్స్పైర్ అయిందేమిటంటే, ‘‘సైన్యంలో ఏంఖర్మ...మన ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ రోబోలనే ఉద్యోగులుగా నియమించాలనుకుంటున్నాను. రోబోలకు జీతాలు ఇవ్వాల్సిన పనిలేదు. పెంచాల్సిన అవసరం లేదు. పెన్షన్ ఇవ్వాల్సిన పని అంతకంటే లేదు. ఈ రోబో ఉద్యోగుల వల్ల గవర్నమెంట్‌కు ఎంత ఆదాయం మిగులుతుందంటే...’’ అని జేబులో నుంచి కాగితం తీసి ఆనందంగా చదువుతూ పోతున్నాడు బాబు. చప్పట్లు కొట్టకపోతే ‘రోబో మంత్రులు’ అనే ఐడియా బాబుకు ఎక్కడ వస్తుందోనని భయపడి హాల్ అదిరేలా చప్పట్లు కొట్టారు మంత్రులు. మరుసటి రోజే ‘రోబో’ డైరెక్టర్ శంకర్‌తో కలిసి జపాన్‌కు వెళ్లిన బాబు.... లక్షలాది రోబోలను కొనుగోలు చేశాడు. ఒక నెల తరువాత...ఏపీలో ఎక్కడ చూసినా రోబో డాక్టర్లు, రోబో ఇంజనీర్లు, రోబో టీచర్లు... ఇలా ఏ ప్రభుత్వ విభాగంలో చూసినా ఉద్యోగుల స్థానంలో రోబోలే కనిపిస్తున్నాయి. ఉద్యోగుల జీతాలు మిగిలాయి కాబట్టి ప్రభుత్వం దగ్గర ఇప్పుడు వందల కోట్లు ఉన్నాయి. అలా మిగిలిన డబ్బుతో రెండు వేల ఎకరాల ‘రామోజీ ఫిలిం సిటీ’కీ దీటుగా భీమిలి దగ్గర మూడువేల ఎకరాల్లో ‘భీమోజీ ఫిలిం సిటీ’ నిర్మించాడు బాబు. కొద్ది కాలం తరువాత ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. ‘‘మీ పార్టీ చిత్తుగా ఓడిపోబోతుంది’’ అని చెప్పాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. ఆరోజు చాలా బాధగా ఇంట్లో కూర్చున్నాడు బాబు. ‘‘ఏమైంది డాడీ!’’ ఆరాతీశాడు లోకేశ్. జరగబోయేది చెప్పాడు బాబు.‘‘ఓస్... ఈ మాత్రం దానికే ఇంత అదవ్వాలా? నా దగ్గర గొప్ప ఐడియా ఉంది’’ అన్నాడు కాలరెగరేస్తూ లోకేశ్. ‘‘ఏమిటి నాన్నా అది?’’ అని ఆసక్తిగా లోకేశ్ దగ్గరకు వచ్చాడు బాబు.‘‘అర్జంటుగా జపాన్‌కి వెళ్లి రోబో ఓటర్లకు ఆర్డర్ ఇద్దాం. ఇక ఏపీలో టోటల్ సీట్లన్నీ మనవే’’ అని చంద్రబాబు చెవిలో రహస్యంగా చెప్పాడు చినబాబు లోకేశ్. – యాకుబ్ పాషా -
ఒక్క షెడ్యూల్‌కే రూ. 40 కోట్లు..!
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్, ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై బహుభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రయూనిట్ ప్రస్తుతం దుబాయ్‌లో మరో షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో పాటు కొన్ని చేజ్ సీన్లు, యాక్షన్ సీన్లు చిత్రీకరించనున్నారట. అందుకు తగ్గట్టుగా ఈ ఒక్క షెడ్యూల్‌కు భారీ బడ్జెట్‌ను కేటాయించారు చిత్రయూనిట్. కేవలం దుబాయ్‌లో జరిగే షూటింగ్ కోసమే 40 కోట్ల రూపాయలు కేటాయించారట. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, చుంకీ పాండేలు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. -
షాక్ : బాహుబలి కోసం 400 మెట్లెక్కి...
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక సీనియర్ నేత, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ పెద్ద షాకే ఇచ్చారు. దాదాపు 400లకి పైగా మెట్లు ఎక్కి ఆశ్చర్యానికి గురి చేశారు. శనివారం శ్రావణ బెళగొళ లోని బాహుబలి మహామస్తకాభిషేక కార్యక్రమానికి వెళ్లిన ఆయన ఈ పని చేశారు. 86 ఏళ్ల దేవెగౌడ తన భార్య, కుటుంబ సభ్యులతో కలిసి బాహుబలి(గోమఠేశ్వర విగ్రహ) 88వ మహామస్తకాభిషేకం నిర్వహించేందుకు వింధ్యగిరి పర్వతాలకు వెళ్లారు. ఆయన భార్య చిన్నమ్మ పల్లకిలో వెళ్లగా.. ఈయన మాత్రం కాలినడకన బయలుదేరారు. ఆరోగ్య సమస్యల రిత్యా డోలిలో(పల్లకి తరహా) వెళ్లాలంటూ బంధువులు ఆయనకు సూచించారు. అయితే ఆయన మాత్రం ససేమిరా అంటూ మెట్లు ఎక్కేశారు. ఇద్దరు భద్రతా సిబ్బంది సాయంతో 50 నిమిషాల్లో మెట్లు ఎక్కేశారు. కొందరు అనుచరులు ఆయన్ని వెంబడిస్తూ బాహుబలి నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగించారు. అయితే అన్ని మెట్లు ఒకేసారి ఎక్కేసరికి ఆయన కాస్త అలసటకు లోనయ్యారు. దీంతో కొండ పైన ఉన్న ఆరోగ్య కేంద్రంలో కాసేపు విశ్రాంతి తీసుకుని, ఆపై మహామస్తకాభిషేకంలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో కూడా ఆయన కాలి నడకనే దిగటం విశేషం. గత వారం సిద్ధరామయ్య కూడా డోలిని తిరస్కరించి మెట్లెక్కి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
స్టార్ కొరియోగ్రాఫర్‌తో ప్రభాస్
బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. సాహో తరువాత అదే బ్యానర్ లో జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు డార్లింగ్. ఈ రెండు సినిమాల తరువాత ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని భావించారు. అయితే తాజాగా ప్రభాస్ మరో దక్షిణాది దర్శకుడికి ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందర్ దర్శకత్వంలో నటించేందుకు ప్రభాస్ అంగీకరించాడట. ఇప్పటికే రాజు సుందరం కథ విన్న ప్రభాస్ పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడట. ఈ ప్రాజెక్ట్ పై ప్రభాస్ నుంచిగాని, రాజు సుందరం నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. టాలీవుడ్ లో ఈ వార్త తెగ హల్ చల్ చేస్తోంది.