KKR
-
కేకేఆర్‌కు గుడ్ న్యూస్.. అరివీర భయంకరమైన ఫామ్‌లో రహానే
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు కేకేఆర్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా బరోడాతో జరిగిన సెమీఫైనల్లో రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ టోర్నీలో రహానే గత ఆరు మ్యాచ్‌ల్లో ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు.మహారాష్ట్రతో జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో రహానే పరుగుల ప్రవాహం మొదలైంది. ఆ మ్యాచ్‌లో అతను 34 బంతుల్లో 52 పరుగుల చేశాడు. ఆతర్వాత కేరళతో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అనంతరం సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 22 పరుగులు చేశాడు.రహానే విశ్వరూపం ఆంధ్రతో జరిగిన చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్‌తో మొదలైంది. ఈ మ్యాచ్‌లో రహానే 53 బంతుల్లో 95 పరుగులు చేశాడు. అనంతరం విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 45 బంతుల్లో 84 పరుగులు చేశాడు. తాజాగా బరోడాతో జరిగిన సెమీస్‌లో 57 బంతుల్లో 98 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.ప్రస్తుత సీజన్లో (సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ) రహానే లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో రహానే 8 మ్యాచ్‌లు ఆడి 172 స్ట్రయిక్ రేట్‌తో 366 పరుగులు చేశాడు. బరోడాతో జరిగిన సెమీస్‌లో రహానే రఫ్ఫాడించడంతో ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్‌కు చేరింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శాశ్వత్ రావత్ (33), కృనాల్ పాండ్యా (30), శివాలిక్ శర్మ (26 నాటౌట్), అథీత్ సేథ్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హార్దిక్ పాండ్యా 5 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.159 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రహానే మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. రహానేకు జతగా శ్రేయస్ అయ్యర్ (46) కూడా కాసేపు మెరుపు మెరిపించాడు. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ, మధ్యప్రదేశ్ మధ్య రెండో సెమీఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు డిసెంబర్ 15న జరిగే అంతిమ పోరులో ముంబైతో తలపడనుంది. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో అజింక్య రహానేను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ.1.5 కోట్ల బేస్ ధరకు సొంతం చేసుకుంది. -
డాక్టర్ కానున్న కేకేఆర్ స్టార్ ప్లేయర్
కేకేఆర్ ప్రామిసింగ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ త్వరలోనే డాక్టర్ కానున్నాడు. 2018లో ఎంబీఏ పూర్తి చేసిన అయ్యర్.. త్వరలోనే ఫైనాన్స్‌లో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టర్ వెంకటేశ్ అయ్యర్‌గా పిలిపించుకుంటానంటున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో అయ్యర్ ఈ విషయాన్ని వెల్లడించాడు.ఇంటర్వ్యూ సందర్భంగా అయ్యర్ మాట్లాడుతూ.. ఓ క్రికెటర్ 60 సంవత్సరాల వరకు క్రికెట్ ఆడలేడు. అయితే విద్య మాత్రం చనిపోయేంతవరకూ మనతోనే ఉంటుంది. బాగా చదువుకుంటే మైదానంలోనూ, నిజ జీవితంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. యువ క్రికెటర్లు చదువుకు కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తానని అన్నాడు.కాగా, వెంకటేశ్ అయ్యర్‌కు ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత బెంగళూరులోని ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయితే అయ్యర్ క్రికెట్ కోసం ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో వెంకటేశ్ అయ్యర్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.23.75 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.కెప్టెన్సీ రేసులో అయ్యర్ఐపీఎల్ 2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో వెంకటేశ్ అయ్యర్ కీలకపాత్ర పోషించాడు. అయినా మెగా వేలానికి ముందు కేకేఆర్ అతన్ని రిలీజ్ చేసింది. అయితే మెగా వేలంలో కేకేఆర్ ఊహించని విధంగా అయ్యర్‌పై భారీ మొత్తం వెచ్చింది తిరిగి సొంతం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌ను వీడటంతో ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ కెప్టెన్ పోస్ట్ ఖాళీగా ఉంది. వచ్చే సీజన్ కోసం కేకేఆర్ కెప్టెన్సీ రేసులో వెంకటేశ్ అయ్యర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయ్యర్ నాలుగు సీజన్ల పాటు కేకేఆర్‌తో ఉన్నాడు.మరోవైపు కేకేఆర్ కెప్టెన్సీ కోసం అయ్యర్‌తో పాటు అజింక్య రహానే కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. మెగా వేలంలో కేకేఆర్ రహానేను 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. కెప్టెన్సీ కట్టబెట్టేందుకే కేకేఆర్ యాజమాన్యం రహానే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రహానేకు కెప్టెన్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రహానే టీమిండియాను విజయవంతంగా ముందుండి నడిపించాడు. దేశవాలీ క్రికెట్లోనూ రహానే ముంబై జట్టును విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు. -
కేకేఆర్ ఆటగాడి విధ్వంసం.. ధనాధన్ వీరుల జట్టు ఓటమి
అబుదాబీ టీ10 లీగ్‌లో కేకేఆర్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో యూపీ నవాబ్స్కు నాయకత్వం వహిస్తున్న గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్).. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఫలితంగా యూపీ నవాబ్స్.. విధ్వంసకర వీరులతో నిండిన గ్లాడియేటర్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ధనాధన్ వీరులు టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (22), రిలీ రొస్సో (10), నికోలస్ పూరన్ (8), జోస్ బట్లర్ (30), మార్కస్ స్టోయినిస్ (0), డేవిడ్ వీస్ (29), ఆజమ్ ఖాన్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. నవాబ్స్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 2 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. బినుర ఫెర్నాండో 2 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తైమాల్ మిల్స్ 2, అఖిలేశ్ ఓ వికెట్ దక్కించుకున్నారు.113 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నవాబ్స్ 8.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (52), ఆవిష్క ఫెర్నాండో (34) నవాబ్స్ విజయానికి గట్టి పునాది వేశారు. ఆండ్రీ ఫ్లెచర్ 7, డేవిడ్ మలాన్ 6, ఓడియన్ స్మిత్ 8 పరుగులు చేశారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్, స్టోయినిస్, ఇబ్రార్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. ప్రస్తుత ఎడిషన్‌లో నవాబ్స్కు ఇది రెండో విజయం. గ్లాడియేటర్స్‌కు తొలి ఓటమి. కాగా, రెండు రోజుల కిందట జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేకేఆర్ ఫ్రాంచైజీ గుర్బాజ్‌ను 2 కోట్ల బేస్ ధరకు తిరిగి సొంతం చేసుకుంది. -
కేకేఆర్ ఖరీదైన ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ అందమైన భార్య (ఫోటోలు)
-
IPL 2025: కేకేఆర్ విడిచిపెట్టింది.. సెంచరీలతో విరుచుకుపడ్డారు..!
ఐపీఎల్ ఫ్రాంచైజీలు అక్టోబర్ 31న తాము రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. ఈ జాబితాలో చాలామంది స్టార్ ఆటగాళ్ల పేర్లు మిస్ అయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ రింకూ సింగ్ (రూ. 13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 12 కోట్లు), సునీల్ నరైన్ (రూ. 12 కోట్లు), ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు), హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు), రమన్‌దీప్ సింగ్‌ను (రూ. 4 కోట్లు) అట్టిపెట్టుకుని.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా మిగతా ఆటగాళ్లనంతా వేలానికి వదిలేసింది.కేకేఆర్ రిటైన్ చేసుకున్న జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మిచెల్ స్టార్క్, వెంకటేశ్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు మనసు నొచ్చుకున్నారు. వెంకటేశ్ అయ్యర్ తన మనసులోని మాటను సోషల్‌మీడియాలో షేర్ చేసుకున్నాడు. కేకేఆర్ వదిలిపెట్టిన తర్వాత జరుగుతున్న తొలి రంజీ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ తన ప్రతాపాన్ని చూపాడు. రంజీల్లో మధ్యప్రదేశ్‌కు ఆడే వెంకటేశ్ అయ్యర్.. బీహార్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 113 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.కేకేఆర్ తనను వదిలేసిందన్న కోపమో ఏమో కానీ ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ చాలా పట్టుదలగా ఆడి సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా సవాలు విసిరాడు. తానెంత విలువైన ఆటగాడినో అన్న విషయాన్ని వెంకటేశ్ అయ్యర్ ఫ్రాంచైజీలకు తెలియజేశాడు.మరోవైపు కేకేఆర్ వదిలేసిన మరో అయ్యర్ కూడా ఇవాళ శతకొట్టాడు. కేకేఆర్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో 164 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్రస్తుత రంజీ సీజన్లో శ్రేయస్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. తాజా ప్రదర్శనల నేపథ్యంలో ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్‌కు మాంచి గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది. -
IPL 2025: శ్రేయస్‌తో కేకేఆర్ కటీఫ్..?
ఐపీఎల్-2025 సీజన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాల సమర్పణకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. అక్టోబర్ 31లోగా ఫ్రాంచైజీలన్నీ తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలను సమర్పించాలి. అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై ఓ క్లారిటీ కలిగి ఉన్నాయి.ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది. రిటైన్ చేసుకునే క్యాప్డ్ ప్లేయర్లకు ఛాయిస్ ప్రకారం వరుసగా 18, 14, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రిటైన్ చేసుకునే అన్క్యాప్డ్ ప్లేయర్‌కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్-2025 వేలం నవంబర్ 25 లేదా 26 తేదీల్లో రియాద్‌లో జరగవచ్చు.శ్రేయస్‌తో కేకేఆర్ కటీఫ్..?కేకేఆర్ విషయానికొస్తే.. ఈ ఫ్రాంచైజీ కూడా తమ రిటెన్షన్ జాబితాను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కేకేఆర్ ఈసారి కెప్టెన్ పేరు లేకుండానే ముందుకు సాగనున్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ గత సీజన్ టైటిల్ గెలిచినప్పటికీ.. ఈసారి అతన్ని రిటైన్ చేసుకునేందుకు ఫ్రాంచైజీ యాజమాన్యం ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తుంది. రిటెన్షన్ జాబితా సమర్పణకు మరికొద్ది గంటలు సమయమే ఉన్నా ఇప్పటికీ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ శ్రేయస్‌ను సంప్రదించలేదట. దీన్ని బట్టి చూస్తే కేకేఆర్ శ్రేయస్‌కు కటీఫ్ చెప్పడం ఖాయమని తెలుస్తుంది.ఇదిలా ఉంటే, శ్రేయస్ కోసం సొంత ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చనప్పటికీ.. మిగతా ఫ్రాంచైజీలు ఎగబడుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ శ్రేయస్ వేలానికి వస్తే ఇతన్ని దక్కించుకోవడం కోసం మూడు, నాలుగు ఫ్రాంచైజీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయట. కెప్టెన్‌గా శ్రేయస్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉండటంతో ఇతన్ని కెప్టెన్‌గా చేసేందుకు పలు ఫ్రాంచైజీలు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాయని సమాచారం.కేకేఆర్ రిటైన్ చేసుకునే అవకాశం ఉన్న ఆటగాళ్లు..సునీల్ నరైన్ఆండ్రీ రసెల్ఫిలిప్ సాల్ట్రింకూ సింగ్ -
కన్నీటిపర్యంతమైన బ్రావో
విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరీబియన్ ప్రీమియర్ లీగ్-2024లో సెప్టెంబర్ 24న సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ బ్రావో కెరీర్లో చివరి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బ్రావో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్ అనంతరం బ్రావో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఉబికి వస్తున్న బాధను ఆపుకోలేక కన్నీటిపర్యంతమయ్యాడు. బ్రావో కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. Champion Dwayne Bravo announces his retirement from all formats of cricket.Know more: https://t.co/ljuWjTsGQS— CricTracker (@Cricketracker) September 27, 20242021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బ్రావో.. వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ గెలిచిన రెండు సందర్భాల్లో (2012, 2016) ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. బ్రావో పొట్టి క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. బ్రావో తన టీ20 కెరీర్లో 582 మ్యాచ్‌లు ఆడి 631 వికెట్లు పడగొట్టాడు. బ్రావో తాజాగా ఐపీఎల్లో కేకేఆర్ ఫ్రాంచైజీ మెంటార్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2025 నుంచి బ్రావో కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరిస్తాడు. కాగా, 40 ఏళ్ల బ్రావో 2004లో తన అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టాడు. నాటి నుంచి 2021 వరకు అతను విండీస్ జాతీయ జట్టుకు సేవలందించాడు. ఈ మధ్యలో 40 టెస్ట్‌లు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన బ్రావో తన అంతర్జాతీయ కెరీర్లో 6300 పైచిలుకు పరుగులు సాధించి, 363 వికెట్లు పడగొట్టాడు. బ్రావో 2008 నుంచి 2022 వరకు వివిధ ఫ్రాంచైజీల తరఫున ఐపీఎల్లో ఆడాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో బ్రావో 161 మ్యాచ్‌లు ఆడి 1560 పరుగులు చేసి 183 వికెట్లు తీశాడు. చదవండి: భారత్‌తో టెస్ట్ మ్యాచ్.. బంగ్లాదేశ్ వీరాభిమానిపై దాడి.. ఆసుపత్రికి తరలింపు -
IPL: కేకేఆర్ మెంటార్‌గా రాహుల్ ద్రవిడ్..?
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త మెంటార్ అన్వేషణలో పడింది. తమ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించాలని కేకేఆర్ టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కోరినట్లు తెలుస్తుంది. ఇందుకు ద్రవిడ్ సైతం సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. ఒకవేళ ఈ డీల్ కుదిరితే ద్రవిడ్ వచ్చే సీజన్ (2025) నుంచి కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరిస్తాడు.మరోవైపు టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు అధికారికంగా ప్రకటించడమే తరువాయి. హెడ్ కోచ్ పదవి విషయంలో గంభీర్-బీసీసీఐ మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం. గంభీర్ తన సహాయ సిబ్బందిని ఎంచుకునే విషయంలోనూ బీసీసీఐ పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తుంది. గంభీర్ సక్సెస్ఫుల్ బ్యాటర్ కావడంతో తనే బ్యాటింగ్ కోచ్‌గా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. గంభీర్ తనకు ఇష్టం వచ్చిన వారికి బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లుగా ఎంచుకోవచ్చు.టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రేసులో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బౌలింగ్ కోచ్‌గా ఎవరుంటారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడితే కేకేఆర్ మెంటార్షిప్ను వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ద్రవిడ్ కేకేఆర్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కాగా, టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 వరల్డ్‌కప్ 2024తో ముగిసిన విషయం తెలిసిందే. -
IPL 2024: కేకేఆర్ స్టార్ పేసర్‌కు గ్రాండ్ వెల్కమ్
ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ గెలిచాక సొంత పట్టణం అంబాలకు (హర్యానా) విచ్చేసిన కేకేఆర్ స్టార్ పేసర్ వైభవ్ అరోరాకు ఘన స్వాగతం లభించింది. వైభవ్‌ను అతని సన్నిహితులు, అభిమానులు, అంబాల వాసులు డప్పు వాయిద్యాల మధ్య పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వైభవ్‌తో ఫోటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. అనంతరం వైభవ్ ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఐపీఎల్ 2024 సీజన్ ముగిసి వారం రోజులు పూర్తయినా జనాలు ఇంకా అదే మూడ్‌లో ఉన్నారు. 27 ఏళ్ల వైభవ్ ఈ ఐపీఎల్ సీజన్లో అద్భుతమైన ప్రదర్శనలతో చెలరేగాడు. వైభవ్ ఈ సీజన్లో 10 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి కేకేఆర్ విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. Vaibhav Arora gets a hero's welcome to his hometown after IPL win. 🏆pic.twitter.com/PhWOMk76Y6— Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2024రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన వైభవ్.. సహచరుడు హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్‌లతో కలిసి కేకేఆర్ పేస్ అటాక్‌ను లీడ్ చేశాడు. లోయర్ ఆర్డర్లో ఉపయోగకర బ్యాటర్ కూడా అయిన వైభవ్‌ను కేకేఆర్ ఈ సీజన్ వేలంలో 60 లక్షలకు సొంతం చేసుకుంది. వైభవ్ ఇప్పటివరకు 21 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. వైభవ్ దేశవాలీ క్రికెట్లో హిమాచల్ ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. 2021లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ ఆ సీజన్లో కేకేఆర్‌కు ఆడి ఆతర్వాతి సీజన్లో (2022) పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్లో వైభవ్ తిరిగి కేకేఆర్ పంచన చేరాడు. ఈ సీజన్లో వైభవ్‌కు చాలా పాపులారిటీ వచ్చింది. సన్‌రైజర్స్‌తో జరిగిన ఫైనల్లో వైభవ్ 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి అత్యంత కీలకమైన ట్రవిస్ హెడ్ వికెట్ తీశాడు. ఈ సీజన్ ప్రదర్శనల కారణంగా కేకేఆర్ తదుపరి సీజన్లోనూ ఇతన్ని రీటెయిన్ చేసుకునే అవకాశం ఉంది. -
IPL 2024: ఫైనల్లో ఎస్ఆర్హెచ్ చిత్తు.. చాంపియన్‌గా కేకేఆర్
-
సన్‌రైజర్స్ యజమానిని, కంటతడిపెట్టించిన కేకేఆర్..
-
IPL 2024: ఓ పక్క స్టార్క్.. మరోపక్క అయ్యర్..!
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా అవతరించింది. నిన్న జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడో ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ (3-0-14-2), వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరెంజ్ ఆర్మీని చెడుగుడు ఆడుకున్నారు. వీరికి రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1), రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా తోడవ్వడంతో కేకేఆర్ సునాయాస విజయం సాధించింది.క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ వీరిద్దరే.. నిన్నటి ఫైనల్లో సన్‌రైజర్స్‌ను డామేజ్ చేసిన స్టార్క్, వెంకటేశ్ అయ్యర్లు ఇదే సన్‌రైజర్స్‌ను క్వాలిఫయర్-1లోనూ ముప్పుతిప్పలు పెట్టారు. నాటి మ్యాచ్‌లోనూ స్టార్క్ అద్భుతమైన గణాంకాలు (4-0-34-3) నమోదు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపిక కాగా.. వెంకటేశ్ అయ్యర్ సైతం ఫైనల్లోలానే మెరుపు ఇన్నింగ్స్‌తో (28 బంతుల్లో 51 నాటౌట్) విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరు పోటీపడి మరీ సన్‌రైజర్స్‌పై దండయాత్ర చేసి వారికి టైటిల్ దక్కకుండా చేశారు.సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన స్టార్క్ కీలకమైన ప్లే ఆఫ్స్‌లో ఫామ్‌లోని వచ్చి కేకేఆర్ పాలిట గెలుపు గుర్రంగా మారగా.. వెంకటేశ్ అయ్యర్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఓ మోస్తరు ప్రదర్శనలతో అలరించాడు. ప్లే ఆఫ్స్‌లో తిరుగులేని అయ్యర్.. నిన్నటి ఫైనల్‌తో వెంకటేశ్ అయ్యర్ ప్లే ఆఫ్స్ హీరో అని మరోసారి నిరూపించుకున్నాడు. అయ్యర్‌కు ప్లే ఆఫ్స్‌లో ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ (55, 50, 51*, 52*). ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాకు దక్కుతుంది. రైనా ప్లే ఆఫ్స్‌లో ఏడు 50కి పైగా స్కోర్లు సాధించాడు.ఫైనల్స్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మెరుపు వీరులు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. -
ఐపీఎల్ 2024 ప్రైజ్ మనీ ఎవరికి ఎన్ని కోట్లు ?
-
KKR Wins IPL ‘హ్యాపీ నా పప్పా’: అటు పెద్దోడు, ఇటు చిన్నోడు : తండ్రీ కూతుళ్ల ఎమోషనల్ వీడియో
ఐపీఎల్-2024 టైటిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చేజిక్కించుకుంది. 10 ఏళ్ల తర్వాత ట్రోఫీని గెల్చుకోడంతో కేకేఆర్ కో-ఫౌండర్ షారుఖ్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా మైదానంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన విజువల్స్నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.An emotional moment between #ShahRukhKhan and #SuhanaKhan after marvelous victory of #KKRpic.twitter.com/yO6nBBgvo1— Suhana Khan (@SuhanaKhanClub) May 26, 2024ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన షారుఖ్ ప్యామిలీ, పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్‌ను అందుకున్న ఆనంద క్షణాల్లో మునిగి తేలాయి. ఈ సందర్భంగా షారుఖ్ ముద్దుల తనయ సుహానా ఖాన్ పరుగున వచ్చి ‘‘మీరు సంతోషంగా ఉన్నారా’’అడిగింది. దీంతో సూపర్ స్టార్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ తండ్రీ- కూతుళ్ల ఆనంద క్షణాలు అటు ఫ్యాన్స్‌ను, ఇటు నెటిజనులు సంతోషంలో ముంచేశాయి.Suhana asking Shah “Are you happy” and the way AbRam and Aryan came to hug their papa @iamsrk … I can’t help my tears 😭💜pic.twitter.com/VjCxU5Nwsz— Samina ✨ (@SRKsSamina_) May 26, 2024ఆ తరువాత కాసేపటికే షారుఖ్ చిన్న కుమారుడు అబ్రామ్, తండ్రీ-కూతురు ద్వయం పరస్వరం గట్టిగా కౌగిలించుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతలోనే పెద్ద కుమారుడు ఆర్యన్, హగ్గింగ్ ఫెస్ట్‌లో చేరి పోవడం విశేషం. అంతేకాదు చివరి పరుగుతో వెంకేటేష్ అయ్యర్ విజయాన్ని అందించడంతో బాలీవుడ్ రొమాన్స్ కింగ్ తన భార్య గౌరీ నుదిటిపై ముద్దు పెట్టుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ,ఇద్దరూ ఆనంద క్షణాల్లో మునిగి తేలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేకేఆర్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కోల్‌కతా ఈ టార్గెట్‌ను కేవలం 10.3 ఓవర్లలోనే ముగించి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. వెంకటేష్ అయ్యర్ విన్నింగ్ షాట్‌తో 2012, 2014 తర్వాత ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలిచిన జట్టుగా కోల్‌కతా నిలిచింది. దీంతో షారుఖ్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు. -
IPL 2024: 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు
కేకేఆర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ఎవరికీ సాధ్యంకాని అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు అత్యంత విలువైన ఆటగాడి అవార్డు (MVP) అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2012.. తన డెబ్యూ సీజన్లో తొలిసారి ఈ అవార్డు అందుకున్న నరైన్.. 2018 సీజన్లో.. తాజాగా 2024 సీజన్లో అత్యంత విలువైన ఆటగాడి అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టిన నరైన్.. 2018 సీజన్లో 357 పరుగులు, 17 వికెట్లు.. 2012 సీజన్లో 24 వికెట్లు పడగొట్టాడు.ఈ సీజన్లో మెంటార్ గంభీర్ చొరవతో ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన నరైన్.. సుడిగాలి ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ సీజన్లో నరైన్ బ్యాట్ నుంచి సెంచరీ, 3 అర్దసెంచరీలు జాలువారాయి. సీజన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నరైన్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో నరైన్ బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 11వ స్థానంలో నిలిచాడు.ఇదిలా ఉంటే, కేకేఆర్ ఐపీఎల్లో తమ మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. నిన్న (మే 26) జరిగిన 2024 సీజన్ ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్‌గా అవతరించింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ (3-0-14-2, 2 క్యాచ్‌లు) ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మెరుపు వీరులు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా విఫలమయ్యారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. -
IPL 2024: కేకేఆర్ వెనుక 'గంభీరం'
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈ సీజన్లో ఆధ్యాంతం అద్భుత విజయాలు సాధించిన కేకేఆర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ అన్ని రంగాల్లో సత్తా చాటి పదేళ్ల తర్వాత మరోసారి ఐపీఎల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.Shreyas Iyer handed the Trophy to Rinku Singh for celebration.- The Leader. 👌 pic.twitter.com/V8Pb55ZPQX— Johns. (@CricCrazyJohns) May 26, 2024ఆటగాళ్లతో సమానమైపాత్ర..ఈ సీజన్లో కేకేఆర్ విజయాల్లో ఆటగాళ్ల పాత్ర ఎంత ఉందో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ పాత్ర కూడా అంతే ఉంది. ఈ సీజన్‌తోనే కేకేఆర్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్.. ఆ జట్టు సాధించిన ప్రతి విజయంలోనూ తనదైన ముద్ర వేశాడు.Third most successful IPL franchise in league history - KKR. pic.twitter.com/bYnKkbujXi— Johns. (@CricCrazyJohns) May 26, 2024పేరుకు తగ్గట్టుగానే గంభీరంగా..ఆన్ ఫీల్డ్ అయినా.. ఆఫ్ ద ఫీల్డ్ అయినా గంభీరంగా కనిపించే గంభీర్ పేరుకు తగ్గట్టుగానే కేకేఆర్ విజయాల్లో గంభీరమైన పాత్ర పోషించాడు. గంభీర్ తనకు మాత్రమే సాధ్యమైన సాహసోపేతమైన నిర్ణయాలతో కేకేఆర్‌ను గెలుపుబాట పట్టించాడు. గంభీర్ ఆధ్వర్యంలో కేకేఆర్ ఈ సీజన్లో కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. Gautam Gambhir with IPL Trophy. ❤️ pic.twitter.com/LI2HLwEpiH— Johns. (@CricCrazyJohns) May 26, 2024నరైన్ సక్సెస్ వెనుక కూడా గంభీరుడే..సునీల్ నరైన్‌కు ఓపెనర్‌గా ప్రమోషన్ ఇచ్చి సత్ఫలితాలు రాబట్టిన ఘనత గంభీర్‌దే. అలాగే ఫైనల్స్ హీరో మిచెల్ స్టార్క్‌ను దక్కించుకోవడంలోనూ గంభీరే ప్రధానపాత్ర పోషించాడని అంతా అంటారు. యువ పేసర్లు హర్షిత్ రాణా, వైభవ్ అరోరాలను ప్రోత్సాహించడంలోనూ.. వెటరన్ ఆండ్రీ రసెల్‌ను వెనకేసుకురావడంలోనూ గంభీర్‌దే ప్రధానమైన పాత్ర. SUNIL NARINE - The MVP of IPL 2024. Greatest of KKR...!!!!! pic.twitter.com/1IBdxl1qRk— Johns. (@CricCrazyJohns) May 26, 2024శ్రేయస్‌ను వెన్నుతట్టి.. వెంకటేశ్‌పై విశ్వాసముంచి..శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్‌లపై విశ్వాసముంచి వారి నుంచి సత్ఫలితాలు రాబట్టిన ఘనత కూడా గంభీర్‌కే దక్కుతుంది. రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి లాంటి లోకల్ టాలెంట్లకు కూడా గంభీర్ అండగా నిలిచాడు. ఇలా ఏరకంగా చూసుకున్నా కేకేఆర్‌కు పూర్వవైభవం దక్కడంలో గంభీర్ పాత్ర ప్రధానమైందనడంలో ఎలాంటి సందేహాం లేదు.KKR players taking Gautam Gambhir in their shoulders. 👌 pic.twitter.com/XspysKKbiM— Johns. (@CricCrazyJohns) May 26, 2024సొంత అభిమానులచే ఛీత్కారాలు ఎదుర్కొన్న స్థాయి నుంచి..గడిచిన ఆరు సీజన్లలో పేలవ ప్రదర్శనతో సొంత అభిమానల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్న కేకేఆర్.. గంభీర్ రాకతో ఒక్కసారిగా నూతనోత్సాహాన్ని అందుకుని టైటిల్ ఎగరేసుకుపోయింది.షారుఖ్ పట్టుబట్టి మరీ..కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ ఈ సీజన్ కోసం గంభీర్‌ను పట్టుబట్టి మరీ ఒప్పించి లక్నో సూపర్ జెయింట్స్ నుంచి పిలిపించుకున్నాడు. మెంటార్‌గా గంభీర్‌కు కేకేఆర్ కొత్తేమో కానీ ఆటగాడిగా, కెప్టెన్‌గా గంభీర్ కేకేఆర్ అభిమానులకు సుపరిచితుడు. ఈ సీజన్లో మెంటార్‌గా కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన గంభీర్.. 2012, 2014 సీజన్లలో కెప్టెన్‌గా కేకేఆర్‌కు టైటిల్స్ అందించాడు. Gautam Gambhir & King of Indian Cinema Shah Rukh Khan with IPL Trophy 💜- The Frame for KKR legacy. pic.twitter.com/pfrFw9prKe— Johns. (@CricCrazyJohns) May 27, 2024కేకేఆర్ కెప్టెన్‌గా గంభీర్ ప్రస్తానం దీనితోనే ఆగిపోలేదు. గంభీర్ నేతృత్వంలో కేకేఆర్ 2016, 2017 సీజన్లలోనే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. దీనికి ముందు 2011 సీజన్లోనూ గంభీర్ సారథ్యంలో కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. కేకేఆర్ కెప్టెన్‌గా ఏడు సీజన్ల పాటు కొనసాగిన గంభీర్ ఈ జట్టును రెండుసార్లు ఛాంపియన్‌గా.. మూడు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు.. రెండు సీజన్లలో (2013, 2015) లీగ్ దశ వరకు విజయవంతంగా నడిపించాడు. తాజాగా మెంటార్‌గా బాధ్యతలు చేపట్టి తన ఆధ్వర్యంలో మూడోసారి కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. Shah Rukh Khan kissing Gautam Gambhir 💜- SRK brings back Gambhir again and he has written a great comeback story. pic.twitter.com/gcAjm1S2Bh— Johns. (@CricCrazyJohns) May 26, 2024షారుఖ్ విశ్వాసాన్ని నిలుపుకున్నాడు..కేకేఆర్ బాస్ షారుఖ్‌కు తనపై అపార విశ్వాసమున్నట్లు గంభీరే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు. ఈ నమ్మకాన్ని నిలుపుకుంటూ గంభీర్ పదేళ్ల తర్వాత తిరిగొచ్చి కేకేఆర్‌కు టైటిల్‌ను అందించాడు. తాజాగా కేకేఆర్ టైటిల్ గెలిచిన అనంతరం షారుఖ్ ఖాన్ గంభీర్ నుదిటిపై ముద్దు పెట్టుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన చిత్రాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. -
కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
కోల్కత్తా: ఐపీఎల్-17(2024)లో విజేతగా నిలిచిన కోల్కత్తా నైట్‌రైడర్ జట్టును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు. ఈ ఐపీఎల్ సీజన్లో రికార్డులు బద్దలు కొట్టినందుకు ప్లేయర్స్‌కు వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు.కాగా, మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా..‘కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంతో బెంగాల్ అంతటా సంబరాలు మిన్నంటాయి. ఈ ఐపీఎల్ సీజన్లో రికార్డు బద్దలు కొట్టినందుకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీని వ్యక్తిగతంగా అభినందించాలనుకుంటున్నాను. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. Kolkata Knight Riders' win has brought about an air of celebration all across Bengal.I would like to personally congratulate the players, the support staff and the franchise for their record breaking performance in this season of the IPL.Wishing for more such enchanting…— Mamata Banerjee (@MamataOfficial) May 26, 2024 ఇక, ఐపీఎల్-17 సీజన్లో కేకేఆర్ అద్భుత ఆటతీరును కనబరిచింది. సీజన్ ప్రారంభం నాటి నుంచి దూకుడుగా ఆడుతూ టేబుట్ టాపర్‌గా నిలిచింది. చివరగా ఫైనల్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి 114 లక్ష్యాన్ని కేవలం పదో ఓవర్లోనే పూర్తి చేసింది. కాగా, ఈ సీజన్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా కేకేఆర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ నిలిచాడు. ICYMI! That special run to glory 💫💜Recap the #Final on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/qUDfUFHpka— IndianPremierLeague (@IPL) May 26, 2024 📽️ 𝗥𝗔𝗪 𝗥𝗘𝗔𝗖𝗧𝗜𝗢𝗡𝗦Moments of pure joy, happiness, jubilation, and happy tears 🥹 What it feels to win the #TATAIPL Final 💜Scorecard ▶️ https://t.co/lCK6AJCdH9#KKRvSRH | #Final | #TheFinalCall | @KKRiders pic.twitter.com/987TCaksZz— IndianPremierLeague (@IPL) May 26, 2024 -
IPL 2024 Final: కేకేఆర్‌కు అచ్చొచ్చిన 'M'
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా రాణించి కేకేఆర్‌ను పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఫైనల్లో స్టార్క్ 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్‌లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ సన్‌రైజర్స్‌తోనే జరిగిన తొలి క్వాలిఫయర్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా (4-0-34-3) నిలిచాడు.సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్‌ను అందించాడు. ఓవరాల్‌గా చూస్తే ఈ సీజన్లో స్టార్క్ సన్‌రైజర్స్ పాలిట విలన్‌గా దాపురించాడు.మరోసారి కలిసొచ్చిన 'M'ఇదిలా ఉంటే, ఐపీఎల్ ఫైనల్స్‌లో కేకేఆర్‌కు 'M' అక్షరం మరోసారి కలిసొచ్చింది. కేకేఆర్ ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన మూడు సందర్భాల్లో ఈ అక్షరంతో పేరు మొదలయ్యే ఆటగాళ్లే ఆ జట్టు పాలిట గెలుపు గుర్రాలయ్యారు. MMM2012లో మన్విందర్ బిస్లా, 2014లో మనీశ్ పాండే, తాజాగా మిచెల్ స్టార్క్ ఫైనల్స్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌లుగా నిలిచి కేకేఆర్‌కు టైటిల్స్ అందించారు. దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్ ఫైనల్స్‌లో కేకేఆర్‌కు M అక్షరం సెంటిమెంట్ బాగా అచ్చొచ్చిందని స్పష్టమవుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరో టైటిల్‌ను అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. సిరీస్ ఆధ్యాంతం బ్యాట్‌తో (14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు), బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్ నరైన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
IPL 2024 Final: సన్‌రైజర్స్‌కు గుండెకోత.. చరిత్ర సృష్టించిన స్టార్క్
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నిన్న (మే 26) జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. తుది సమరంలో కేకేఆర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో సన్‌రైజర్స్ తమ ప్రధాన బలమైన బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. నమ్మకాన్ని వమ్ము చేయని స్టార్క్కేకేఆర్ పేసర్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ తనపై యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనకు లభించిన ధరకు న్యాయం చేశాడు. అంతిమ సమరంలో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి సన్‌రైజర్స్‌కు గుండెకోత మిగిల్చాడు. అతను 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్‌లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆటగాడుఐపీఎల్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ సన్‌రైజర్స్‌తోనే జరిగిన తొలి క్వాలిఫయర్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా (4-0-34-3) నిలిచాడు. సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్‌ను అందించాడు. ఓవరాల్‌గా చూస్తే ఈ సీజన్లో స్టార్క్ సన్‌రైజర్స్ పాలిట విలన్లా దాపురించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి అత్యుత్సాహంగా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లైనా కూడా ఆడకుండానే (18.3 ఓవర్లు) 113 పరుగులకు చాపచుట్టేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా నిరాశపరిచారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.The winning by Celebration by Kolkata Knight Riders after winning the third IPL title. 🏆 pic.twitter.com/OgQBi87Kzt— Johns. (@CricCrazyJohns) May 26, 2024ఆడుతూ పాడుతూ..అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరో టైటిల్‌ను అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. గత సీజన్లో టేబుల్ చివర్లో ఉండిన సన్‌రైజర్స్ ఈ సీజన్లో రన్నరప్‌గా నిలవడం ఆ జట్టు అభిమానులకు ఊరట కలిగించే అంశం. సిరీస్ ఆధ్యాంతం బ్యాట్‌తో (14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు) ఇరగదీసి, బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్ నరైన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
IPL 2024 Final: వార్న్, రోహిత్, హార్దిక్ సరసన కమిన్స్ చేరేనా..?
ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ ఇవాళ (మే 26) రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్.. సన్‌రైజర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో పలు ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయి. అందులో తొలి సీజన్లోనే టైటిల్ కైవసం చేసుకున్న కెప్టెన్ల విషయం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కేవలం ముగ్గురు మాత్రమే..16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకే కేవలం ముగ్గురు కెప్టెన్లు మాత్రమే తొలి సీజన్లోనే టైటిల్ గెలిచారు. తొట్ట తొలి సీజన్లో (2008) షేన్ వార్న్ (రాజస్థాన్ రాయల్స్), 2013 సీజన్లో రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్), 2022 సీజన్లో హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్) ఐపీఎల్ టైటిల్ గెలిచారు. ప్రస్తుత సీజన్ ఫైనల్లో తలపడుతున్న పాట్ కమిన్స్ కూడా కెప్టెన్ ఇదే తొలి సీజన్ కావడంతో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కెప్టెన్‌గా పాట్ ట్రాక్ రికార్డు చూస్తే వార్న్, రోహిత్, హార్దిక్ సరసన చేరడం ఖాయంగా కనిపిస్తుంది. మరి నేటి ఫైనల్లో కమిన్స్ ఏం చేస్తాడో వేచి చూడాలి. కేవలం బ్యాటింగ్‌ను నమ్ముకున్న సన్‌రైజర్స్.. అన్ని విభాగాల్లో సత్తా చాటుతున్న కేకేఆర్‌ను ఏమేరకు నిలువరిస్తుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అలా చూస్తే కేకేఆర్‌దే టైటిల్..గత ఆరు సీజన్లలో క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టే టైటిల్ గెలుస్తుంది. ఈ సెంటిమెంట్‌నే కేకేఆర్ కొనసాగిస్తుందో లేక సన్‌రైజర్స్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందో చూడాలి. ఈ ఏడాది సన్‌రైజర్స్ మరో టైటిల్ గెలుస్తుందా..?మరోవైపు సన్‌రైజర్స్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ ఫ్రాంచైజీ ఈ ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్ గెలిచి అదే జోరును ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తుంది. ఫైనల్లో హాట్ ఫేవరెట్ కేకేఆరే అయినప్పటికీ.. కమిన్స్ కెప్టెన్సీ సామర్థ్యం, బ్యాటర్ల విధ్వంసంపై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎస్ఆర్హెచ్ అభిమానులు అంచనాలు నిజమైతే ఐపీఎల్ టైటిల్ గెలిచిన నాలుగో ఆసీస్ ఆటగాడిగా కమిన్స్ రికార్డు బుక్కుల్లోకెక్కుతాడు. కేకేఆర్‌కు చెపాక్ స్పెషల్..మరోవైపు చెపాక్ మైదానంతో కేకేఆర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. 12 ఏళ్ల క్రితం కేకేఆర్ ఇక్కడే తమ తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. కేకేఆర్ చెపాక్ సెంటిమెంట్ కూడా తమకు వర్కౌట్ అవుతుందని అశిస్తుంది. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం తమనే వరించడంపై కూడా కేకేఆర్ ధీమాగా ఉంది. ఫైనల్లో మరోసారి ఎస్ఆర్హెచ్ను మట్టికరిపించి ఈ సీజన్లో హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేస్తామని కేకేఆర్ ధీమాగా ఉంది. -
IPL 2024 KKR vs SRH: ఐపీఎల్ విన్నర్లు, రన్నరప్స్ వీరే..!
ఐపీఎల్ 2024 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. కేకేఆర్, సన్‌రైజర్స్ మధ్య నేడు (మే 26) జరుగబోయే ఫైనల్‌తో ఐపీఎల్ 17వ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ సీజన్ గత సీజన్లకు భిన్నంగా సాగింది. బ్యాటింగ్‌కు సంబంధించి ఆల్‌టైమ్ రికార్డులు బద్దలుకావడంతో పాటు పలు సంచలన బౌలింగ్ ప్రదర్శనలు నమోదయ్యాయి. చెరి ఐదసార్లు ఛాంపియన్లైన ముంబై, సీఎస్కే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించాయి. దిగ్గజ కెప్టెన్లు రోహిత్, ధోని లేకుండా జరుగుతున్న ఐదో ఐపీఎల్ ఫైనల్ ఇది.ఐపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన 16 సీజన్లలో విజేతలు, రన్నరప్లపై ఓ లుక్కేద్దాం. ఇప్పటివరకు జరిగిన 16 ఫైనల్స్‌లో సీఎస్కే (2010, 2011, 2018, 2021, 2023), ముంబై (2013, 2015, 2017, 2019, 2020) చెరి ఐదుసార్లు టైటిల్ కైవసం చేసుకోగా.. కేకేఆర్ రెండు (2012, 2014), సన్‌రైజర్స్ (2016), రాజస్థాన్ రాయల్స్ (2008), గుజరాత్ టైటాన్స్ (2022), డెక్కన్ ఛార్జర్స్ (2009) తలో సారి టైటిల్ నెగ్గాయి. అత్యధికసార్లు రన్నరప్‌గా నిలిచిన ఘనత సీఎస్కేకు దక్కింది. సీఎస్కే ఐదుసార్లు (2008, 2012, 2013, 2015, 2019) ఫైనల్లో ఓటమిపాలైంది.ఆతర్వాత ఆర్సీబీ మూడు సార్లు (2009, 2011, 2016).. ముంబై ఇండియన్స్ (2010), కేకేఆర్ (2021), సన్‌రైజర్స్ (2018), రాజస్థాన్ రాయల్స్ (2022), గుజరాత్ టైటాన్స్ (2023), పంజాబ్ కింగ్స్ (2014), ఢిల్లీ క్యాపిటల్స్ (2020), రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ (2017) తలో సారి రన్నరప్‌గా నిలిచాయి.సీజన్ల వారీగా విజేతలు, రన్నరప్స్..2008- రాజస్థాన్ రాయల్స్ (విజేత), సీఎస్కే (రన్నరప్)2009- డెక్కన్ ఛార్జర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2010- సీఎస్కే (విజేత), ముంబై ఇండియన్స్ (రన్నరప్)2011- సీఎస్కే (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2012- కేకేఆర్ (విజేత), సీఎస్కే (రన్నరప్)2013- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2014- కేకేఆర్ (విజేత), పంజాబ్ (రన్నరప్)2015- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2016- సన్‌రైజర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2017- ముంబై (విజేత), పూణే (రన్నరప్)2018- సీఎస్కే (విజేత), సన్‌రైజర్స్ (రన్నరప్)2019- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2020- ముంబై (విజేత), ఢిల్లీ (రన్నరప్)2021- సీఎస్కే (విజేత), కేకేఆర్ (రన్నరప్)2022- గుజరాత్ (విజేత), రాజస్థాన్ (రన్నరప్)2023- సీఎస్కే (విజేత), గుజరాత్ (రన్నరప్) -
IPL 2024 ఫైనల్ జోరుగా బెట్టింగ్..
-
ఫైనల్లో తలపడనున్న SRH, KKR జట్లు
-
SRH Vs KKR IPL 2024 Final: జై జై రైజర్స్
ఐపీఎల్– 2024లో తుది సమరానికి రంగం సిద్ధమైంది. 65 రోజులు, 73 మ్యాచ్‌ల తర్వాత ఐపీఎల్–17 విజేతను తేల్చే మ్యాచ్‌కు ఆదివారం చెన్నై వేదికవుతోంది. హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆనందాన్ని పంచుతూ ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ టీమ్ ఆఖరి పంచ్ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. తొలి క్వాలిఫయర్‌లో తమను దెబ్బ తీసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పుడు మళ్లీ ప్రత్యర్థి రూపంలో ఎదురుగా ఉంది. గత మ్యాచ్‌కు ప్రతీకారం తీర్చుకుంటూ రైజర్స్ చెలరేగితే రెండోసారి లీగ్ చాంపియన్‌గా సగర్వంగా నిలవవచ్చు. 2016లో ఆఖరిసారిగా టైటిల్ సాధించిన హైదరాబాద్ 2018లో ఫైనల్ చేరి తుది మెట్టుపై తడబడింది. 2012, 2014లలో ఐపీఎల్ గెలుచుకున్న కోల్‌కతా ఇప్పుడు మూడోసారి ట్రోఫీపై గురి పెట్టింది. మ్యాచ్ చెన్నైలో జరుగుతుండడంతో మన నగర అభిమానుల మనసంతా అక్కడే ఉందనేది వాస్తవం. హైదరాబాద్ గెలిస్తే సారథిగా మన నగరానికి టైటిల్ అందించిన మూడో ఆస్ట్రేలియన్‌గా కమిన్స్ నిలుస్తాడు. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ ఫైనల్ ఆదివారం చెన్నైలో జరుగుతున్నప్పటికీ మన నగరంలోనే జరుగుతున్నంత కోలాహలం నెలకొంది. దీని కోసం నగరంలోని రెస్టారెంట్లు లైవ్ స్క్రీనింగ్ ప్రత్యేక వంటకాల ద్వారా ఈ మెగా ఈవెంట్‌కు సిద్ధమవుతున్నాయి. పలు పబ్స్, లాంజ్‌లు.. క్రికెట్ థీమ్ అలంకరణతో ఆకట్టుకుంటున్నాయి. మన సొంత జట్టు ఫైనల్‌కు చేరడంతో మరింత ఆసక్తికరంగా మారిన ఈ మ్యాచ్ నగరవాసులను ఉర్రూతలూగించనుంది. దీంతో ఎంట్రీ ఫీజు కనీసం రూ.500 నుంచి ప్రారంభించి ఆపై ధరలో విభిన్న రకాల ఆకర్షణలతో క్రికెట్ అభిమానుల్ని లైవ్ ఏర్పాట్లతో ఆహా్వనిస్తున్నారు. గచ్చిబౌలిలోని ముస్టాంగ్ టెర్రస్ లాంజ్‌లో ఏకంగా 3 స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఎయిర్‌లైవ్‌లో 2 స్క్రీన్స్, మాదాపూర్‌లోని రష్ స్పోర్ట్స్ బార్ అండ్ బౌలింగ్ సెంటర్లో పెద్ద స్క్రీన్, కార్ఖానాలోని ద బార్ నెక్ట్స్ డోర్లో 2 బిగ్ స్క్రీన్స్‌తోపాటు చిన్నపాటి టీవీలు కూడా పూర్తిగా ఐపీఎల్ సందడికి సిద్ధమయ్యాయి. నగరంలోని పబ్స్, బార్స్, రెస్టారెంట్స్‌తో పాటు సికింద్రాబాద్ క్లబ్, జింఖానా క్లబ్, ఫిలింనగర్ క్లబ్.. వంటి సంపన్నులకు చెందిన క్లబ్స్ కూడా ప్రత్యేక ఏర్పాట్లతో సభ్యులను ఆహా్వనిస్తున్నాయి. మాల్స్, మలీ్టఫ్లెక్స్లూ, కెఫెలు సైతం స్క్రీన్స్ ఏర్పాటులో పోటీ పడుతున్నాయి. పలు గేటెడ్ కమ్యూనిటీల్లోనూ ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. -
Qualifier 1: సన్‌రైజర్స్ విఫలం.. ఫైనల్ చేరిన కేకేఆర్