Nick Jonas
-
'ప్రియాంక.. నీ భర్తను అదుపులో పెట్టుకో!' నిక్‌పై...
సెలబ్రిటీలు చేసే కామెంట్లు, వేసే ట్వీట్లు ఏమాత్రం నచ్చకపోయినా నెటిజన్లు సోషల్ మీడియాలో రుసరుసలాడుతారు. అలా సింగర్ నిక్ జోనస్ వేసిన ట్వీట్ చూసి నెట్టింట విరుచుకుపడుతున్నారు. నీ భర్తను అదుపులో పెట్టుకో అంటూ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు వార్నింగ్ ఇస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే?ఎలన్ మస్క్ రాజకీయాల్లో అడుగుపెట్టి తన కంపెనీ టెస్లా పేరును తనే చేతులారా నాశనం చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ జరిగిందేంటో తెలుసా? అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత టెస్లా లాభాలు పుంజుకున్నాయి అని టెస్లా ఓనర్స్ సిలికాన్ వాలీ అకౌంట్ నుంచి డిసెంబర్ 17న ఓ ట్వీట్ వేశారు. దీనికి మస్క్.. అవును, నిజమేనంటూ స్పందించాడు.నీ భర్తను అదుపులో పెట్టుకోఇది చూసిన నిక్ జోనస్.. 3000వ సంవత్సరం వరకు మమ్మల్ని మీరే నడిపించాలి అని రాసుకొచ్చాడు. ఇది కొందరికి మింగుడుపడలేదు. ట్రంప్‌కు సపోర్ట్ చేస్తున్నారా? ప్రియాంక.. దయచేసి నీ భర్తను కాస్త అదుపులో పెట్టుకో, ఏంటి? ప్రపంచ కుబేరుడు మస్క్‌కు మద్దతిస్తున్నావా? ప్రియాంక.. మరింత ఆలస్యం కాకముందే నీ భర్త చేతిలోని ఫోన్ తీసేసుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Take us to the Year 3000. https://t.co/vk0sdBhrXS pic.twitter.com/CSG7ItCmES— Nick Jonas (@nickjonas) December 17, 2024చదవండి: Pallavi Prashanth: మాట మారింది.. స్టైల్ మారింది! -
కూతురితో ప్రియాంక విహారం.. లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో అలా!
-
బరాత్‌లో దుమ్ము లేపిన బ్యూటీలు.. అతడిని నెట్టేసి మరీ..!
అంబానీ ఇంట పెళ్లి ధూంధాంగా జరిగింది. ఇండియన్ సెలబ్రిటీలతో పాటు హాలీవుడ్ స్టార్స్ సైతం విచ్చేసి అనంత్ అంబానీ- రాధిక మర్చంట్లను దీవించారు. నిండు నూరేళ్లు కలిసుండమని ఆశీర్వదించారు. సినిమా తారలే కాకుండా వ్యాపార, రాజకీయ ప్రముఖులు సైతం పెళ్లికి విచ్చేశారు. ఇకపోతే శుక్రవారం జరిగిన బరాత్‌లో సినిమా స్టార్స్ డ్యాన్స్‌తో హోరెత్తించారు.గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా స్టెప్పులేస్తుంటే ఆమె భర్త నిక్ జోనస్ తనతో పాటు కాలు కదిపాడు. కానీ అంతలోనే నిక్‌ను వెనక్కు నెట్టిందో హీరోయిన్. లైగర్ బ్యూటీ అనన్య పాండే నిక్‌ను వెనక్కి నెట్టి ముందుకు వచ్చి ప్రియాంకతో డ్యాన్స్ చేసింది. దీంతో నిక్ బిత్తరపోయాడు. విషయం అర్థం చేసుకున్న హీరో రణ్వీర్ సింగ్.. అతడిని దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అయ్యో.. నిక్ ఎక్స్ప్రెషన్స్ చూశారా?, బరాత్ అంటే అంతే మరి.. నలుగురిని తోసి అయినా సరే.. ముందుకొచ్చి మరీ డ్యాన్స్ చేయాల్సిందే అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా మాధురి దీక్షిత్, రాశీ ఖన్నా, రణ్వీర్ సింగ్, అనిల్ కపూర్.. ఇలా తారలంందరూ బరాత్‌లో సరదాగా చిందేశారు. Ananya is literally representing Nick jiju hatiye 😭#PriyankaChopra #AnanyaPandey pic.twitter.com/ADWSMkEIr7— 𝒫𝓇𝒾𝓎𝒶🌸🤍 (@DewaniMastanii) July 13, 2024 View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ప్రియాంక భర్త డైరెక్ట్‌గా నన్నే అడిగాడు: హీరోయిన్ తల్లి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. బీటౌన్‌లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అగ్రహీరోలందరి సరసన నటించింది. అయితే ప్రస్తుతం హాలీవుడ్లో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన ప్రముఖ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఓ కూతురు కూడా జన్మించారు.అయితే తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్‌పై ప్రియాంక చోప్రా తల్లి మధుచోప్రా స్పందించారు. ఈ జంట మధ్య పదేళ్ల వయసు తేడా ఉండడంతో ఎలాంటి ప్రభావం ఉందన్న విషయంపై ఆమె మాట్లాడారు. ఇద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు వయసు అనేది పెద్ద మ్యాటర్ కాదని ఆమె అన్నారు.మధు చోప్రా మాట్లాడుతూ.."ప్రియాంక, నిక్ మధ్య వయసు తేడా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదు. అబ్బాయి మంచివాడు. ఒకరినొకరు బాగా చూసుకుంటారు. నేను వారి గురించి చాలా సంతోషంగా ఉన్నా. ప్రజలు వారి వయసు పట్ల ఏమైనా మాట్లాడతారు. కానీ అవేమీ నేను పట్టించుకోను. నిక్ ఇండియాకు వచ్చి ప్రియాంక లేనప్పుడు నన్ను లంచ్‌కి తీసుకెళ్లాడు. ప్రియాంక కోసం ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారని నిక్ నన్ను అడిగాడు. అన్ని లక్షణాలను అతనికి వివరించా. నా మాటలు విని నేను ఆ వ్యక్తిని కాగలనా? అని డైరెక్ట్‌గా అడిగాడు. ప్రియాంకను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తానని మాటిస్తున్నా అని చెప్పాడు. అతని మాటలకు నేను ఆశ్చర్యపోయా. కానీ వెంటనే ఓకే చెప్పాను' అని వివరించారు.కాగా.. ప్రియాంక, నిక్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. అదే ఏడాది డిసెంబర్లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వారు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2022లో కుమార్తె జన్మించింది. వీరి మధ్య పదేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. -
అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న ప్రియాంక చోప్రా (ఫొటోలు)
-
కూతురు బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో నిక్-ప్రియాంక (ఫొటోలు)
-
Priyanka Chopra-Nick Jonas: చూడముచ్చటగా ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ (ఫొటోలు)
-
'నువ్వే నా జీవితంలో గొప్ప ఆనందం'.. ప్రియాంక ఎమోషనల్ పోస్ట్!
ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్లో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిక్.. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను ప్రేమపెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది తన భార్య, బేబీతో కలిసి ఇండియాకు కూడా వచ్చాడు. గతంలో ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌కు తమ కూతురితో తొలిసారి ఇండియా వచ్చారు నిక్, ప్రియాంక చోప్రా. తాజాగా నిక్ బర్త్ డే సందర్భంగా ప్రియాంక విష్ చేసింది. భర్తకు ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. జోనాస్ తన జీవితంలో దొరికిన గొప్ప ఆనందం అని తెలిపింది. నిక్‌తో పాటు తన కుమార్తె మాల్టీ మేరీ ఫోటోను కూడా జతచేసింది. (ఇది చదవండి: ఏడుసార్లు అబార్షన్ అంటూ నటి ఫిర్యాదు.. అంతలోనే బిగ్ ట్విస్ట్! ) ఇన్‌స్టాలో ప్రియాంక రాస్తూ.. 'నీ పుట్టిన రోజు జరుపుకోవడం నా జీవితంలో చాలా సంతోషమైంది. నాకు సాధ్యం కానీ మార్గంలో నడిపించారు. నీ ప్రపంచంలో నన్ను నీలా ప్రేమించేవారు లేరు. ఐ లవ్ యూ బర్త్ డే గాయ్. నీ కలలన్నీ భవిష్యత్తులో నిజమవ్వాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్ డే బేబీ.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ప్రియాంక అభిమానులు సైతం నిక్ జోనాస్‌కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంక షేర్ చేసిన ఫోటోల్లో నిక్ గోల్ఫ్ ఆడుతున్న ఫోటో, తన కూతురు మాల్టీ పాలు తాగిస్తున్న అందమైన ఫోటోలు ఉన్నాయి. కాగా.. ప్రియాంక, నిక్ 2018లో జోధ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో క్రిస్టియన్, హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఢిల్లీ, ముంబ రెండు రిసెప్షన్స్ కూడా నిర్వహించారు. జనవరి 2022లో సరోగసీ ద్వారా మాల్టీ మేరీని స్వాగతించారు. (ఇది చదవండి: సర్జరీ కోసం ఇంటిని అమ్మేసింది.. అప్పుడే సొంతింటికి!) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
'అబ్బో ఎంత ప్రేమో'.. వేదికపైనే ముద్దులు పెట్టిన ప్రియాంక!
ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ఫ్యాన్స్ అత్యంత ఇష్టపడే సెలబ్రిటీ జంటలలో ఒకరు. ఆమె భర్త నిక్ జోనాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్లో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిక్.. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. తన భార్యతో కలిసి ఇండియాకు చాలాసార్లు వచ్చాడు. ఇప్పటికే ఈ జంటకు మాల్టీ మేరీ అనే కూతురు కూడా ఉంది. అయితే ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతున్న మ్యూజిక్ కన్సర్ట్‌లో నిక్ జోనాస్ ప్రదర్శన ఇస్తున్నారు. తన సోదరులు కెవిన్ జోనాస్, జో జోనాస్‌లతో కలిసి ఈవెంట్లో పాల్గొన్నారు. (ఇది చదవండి: 'ఆలియా భట్ తండ్రి అసభ్య ప్రవర్తన'.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏమందంటే?) తాజాగా ఈ ఈవెంట్‌కు ప్రియాంక చోప్రా కూడా హాజరైంది. వేదికపై భర్తను ఉత్సాహంగా ప్రోత్సహిస్తూ సందడి చేసింది. యాంకీ స్టేడియంలో ఒక సంగీత కచేరీలో ప్రియాంక ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ కనిపించింది. అయితే అదే సమయంలో వేదిక పక్కనే ఉన్న ప్రియాంక తన భర్త నిక్ జోనాస్ ముద్దు పెట్టుకోవడం కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇటీవలే సంగీత కచేరీకి హాజరైన ప్రియాంక తన భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. కాగా.. 2018 డిసెంబర్లో జోధ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో క్రిస్టియన్, హిందూ సంప్రదాయంలో ఈ జంట వివాహం చేసుకున్నారు. జనవరి 2022లో సరోగసీ ద్వారా కుమార్తె మాల్తీ మేరీకి స్వాగతం పలికారు. ప్రియాంక.. జీ లే జరాలో అలియా భట్, కత్రినా కైఫ్‌లతో స్క్రీన్ పంచుకోనుంది. ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు ప్రకటించలేదు. (ఇది చదవండి: ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే! ) View this post on Instagram A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi) -
ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే!
ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్లో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిక్.. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను ప్రేమపెళ్లి చేసుకున్నాడు. తన భార్యతో కలిసి ఇండియాకు చాలాసార్లు వచ్చాడు. ఇప్పటికే ఈ జంటకు ఓ కూతురు కూడా ఉంది. గతంలో ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌కు తమ కూతురితో తొలిసారి ఇండియా వచ్చారు నిక్, ప్రియాంక చోప్రా. (ఇది చదవండి: చిరంజీవి ఏ ఉద్దేశంతో కామెంట్స్ చేశారో తెలీదు: ఆర్జీవీ) అయితే తాజాగా ప్రియాంక భర్త నిక్ జోనాస్ ఓ సంగీత కచేరిలో పాల్గొన్నారు. అతని సోదరులు కెవిన్ జోనాస్, జో జోనాస్‌లతో కలిసి శనివారం జరిగిన ఓ ఈవెంట్లో ప్రదర్శన ఇచ్చారు. అయితే ఆ వేదికపై నిక్ జోనాస్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. నిక్ జోనాస్ ఎంతో ఉత్సాహంగా పాట పాడుతున్న సమయంలో వేదికపైకి మహిళల లో దుస్తులను విసిరేశారు. ఇది చూసిన నిక్ జోనాస్ అవేమీ పట్టించుకోకుండా పాట పాడుకుంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. ఓ ఆర్టిస్ట్‌ను ఇలా అవమానించడం ఏంటని నిలదీస్తున్నారు. విశేషమేమిటంటే ఈ సంఘటన జరిగినప్పటికీ కచేరీ సజావుగా కొనసాగింది. కాగా.. న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో ఇటీవల జరిగిన జోనాస్ బ్రదర్స్ కచేరీలో ఈ సంఘటన జరిగింది. ఊహించని సంఘటనతో ఈ కచేరీని కొద్దిసేపు నిలిపేసి మళ్లీ కొనసాగించారు. అయితే ప్రదర్శనను కొనసాగించడాన్ని చూసి నిక్ అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. ఇలాంటి చర్యలు కళాకారుల గౌరవాన్ని దెబ్బతీస్తాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాకారుల పట్ల గౌరవప్రదంగా ప్రవర్తించాలని అంటున్నారు. అయితే గతంలోనూ ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటివీ సింగర్స్ సవాలుగా మారాయని.. అభిమానుల తీరు తీవ్ర అంతరాయం కలిగించేలా ఉందని అంటున్నారు. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. తెలుగు సినిమాతోనే ఎంట్రీ!) View this post on Instagram A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi) -
ఇండియన్ సినిమాలపై చీప్ కామెంట్ చేసిన ప్రియాంక
దక్షిణాది చిత్రంతో కెరీర్ ప్రారంభించి.. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగి ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతూ గ్లోబల్ నటిగా ప్రియాంక చోప్రా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్కావడంతో పాటు పలు విమర్శలు వస్తున్నాయి. (ఇదీ చదవండి: విడాకుల తరువాత నిహారిక మొదటి పోస్ట్.. ఎవరి కోసమంటే..) అమెరికాలోని లాస్ ఏంజల్స్‌లో 2016లో జరిగిన ఎమ్మీ అవార్డ్స్ కార్యక్రమానికి ప్రియాంక హాజరయింది. అక్కడ ఒక అంతర్జాతీయ మీడియాకు చెందిన యాంకర్ భారతీయ సినిమాలపై తన అభిప్రాయం చెప్పాలంటూ కోరింది. దీంతో తముడుకోకుండా వెంటనే భారతీయ సినిమాలన్ని ‘హిప్స్ అండ్ బి**బిస్’ గురించే ఉంటాయి. ఒక రకంగా వాటిని మాత్రమే ఎక్స్పోజ్ చేస్తే చాలు అనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది. అయితే, అది పాత వీడియో అయినప్పటికీ ఇటీవల ఆమె నటించిన హాలీవుడ్ సిరీస్ 'సిటడెల్' విడుదల కావడంతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ప్రియాంక పేరు ట్రెండింగ్ అయింది. ప్రియాంక తీరుపై సోషల్ మీడియాలో ఒకరు ఇలా రియాక్ట్ అయ్యారు 'భారత చలనచిత్ర పరిశ్రమ గురించి అంతర్జాతీయ వేదికపై ఇలా చీప్‌గా మాట్లాడటం చాలా బాధించిందని తెలుపుతూ అమెను ఇండియన్ సినిమాల్లో బ్యాన్ చేయాలి.' అని కోరాడు. మరోక వ్యక్తి ఇలా అన్నాడు, 'నేను అమెరికన్‌ని.. ఆమెకు అమెరికన్ల నుంచి ప్రజాదరణ లేదు.. నిక్ జోనస్ భార్య అని చెప్పడం తప్ప ప్రియాంక గురించి ఎవరూ ఇక్కడ మాట్లాడటం నేను వినలేదు.' అని తెలిపాడు. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) (ఇదీ చదవండి: Niharika-Chaitanya Divorce: నిహారిక కోసం పిటిషన్ వేసిన అడ్వకేట్ ఎవరంటూ..) -
ఆ డైరెక్టర్ లోదుస్తులు చూపించమన్నాడు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ పలువురు స్టార్ హీరోలతో సినిమాల్లో మెప్పించింది. బీటౌన్‌లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మారిపోయిన ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను 2018లో పెళ్లాడింది. ఆ తర్వాత ఈ జంటకు ఓ కూతురు కూడా పుట్టిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నా ఇద్దరు కూతుర్లు ఇప్పటికీ నిత్యానంద దగ్గరే ఉన్నారు: నటుడు) అయితే ఇటీవలే ముంబయిలో నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి తొలిసారి బిడ్డతో కలిసి ఇండియాకు వచ్చారు. తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూలో ఇచ్చిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. బాలీవుడ్ దర్శకుడు తన లో దుస్తులను చూడాలనుకున్నారని వెల్లడించింది. 2002-03లో మధ్య కాలంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది. ప్రియాంక మాట్లాడుతూ.. 'అప్పుడప్పుడే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. నేను ఒక సినిమాను అంగీకరించా. అందులో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు దర్శకుడు నా దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేసేటప్పుడు లో దుస్తులన్నీ తీసేయాలన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. అందుకు నేను ఒప్పుకోలేదు. ఆ మరుసటి రోజే నేను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా. ఇందులో నాకు నటించడం ఇష్టం లేదు.' అంటూ ప్రియాంక చోప్రా గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది. అయితే దీనిపై దర్శకుడికి వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపింది. (ఇది చదవండి: ఆ నిర్మాతకు అమ్మాయిల పిచ్చి.. ఒంటరిగా ఇంటికి రమ్మన్నాడు: నటి) -
నేను డేటింగ్ చేసింది వీళ్లతోనే... ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్
-
పెళ్లికి ముందు నాకు, నా భర్తకు వేరేవాళ్లతో ఎఫైర్లు ఉన్నాయి: హీరోయిన్
ప్రేమ, పెళ్లి రెండూ ఒకటి కావు. అందరూ ప్రేమిస్తారు, కానీ కొందరే దాన్ని పెళ్లి దాకా తీసుకెళ్లి సక్సెస్ అవుతారు. మరికొందరు తొలిచూపులోనే ప్రేమించినవాడిని కాకుండా మలి చూపులో లవ్వాడిన వ్యక్తితోనే ఏడడుగులు వేస్తారు. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా అదే కోవలోకి చెందుతుంది. బాలీవుడ్లో ఆమె ఎంతోమందితో ప్రేమాయణం సాగించింది. ఆమె భర్త నిక్ జోనస్ కూడా ఏం తక్కువ తినలేదు. ఆమె తన జీవితంలోకి వచ్చేముందు ఎందరితోనో డేటింగ్ చేశాడు. తాజాగా ఈ విషయాల గురించి ప్రియాంక చోప్రా.. అలెక్స్ కూపర్ 'కాల్ హర్ డాడీ' పాడ్‌క్యాస్ట్‌లో మాట్లాడింది. 'నేను నిక్ జోనస్‌ను కలవడానికి ముందు కొందరిని ప్రేమించాను. ఒకరితో బ్రేకప్ అవగానే మరొకరిని ప్రేమించేదాన్ని. ఒక బంధానికి, మరొక బంధానికి మధ్య పెద్ద గ్యాప్ కూడా ఇవ్వలేదు. నటిగా ఎంతో బిజీగా ఉండేదాన్ని. ఈ క్రమంలో నాతో పని చేసినవారితో డేటింగ్ చేసేదాన్ని. కొందరితో బంధాలు విషాదంగా ముగిసిపోయాయి. కానీ నేను డేటింగ్ చేసినవారందరూ అద్భుతమైనవారు. చివరి బ్రేకప్ తర్వాత మరో బంధంలో అడుగుపెట్టడానికి చాలా టైం తీసుకున్నా. ఎందుకు? నా ప్రేమలన్నీ విఫలమయ్యాయని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఆ తర్వాత నిక్ జోనస్‌ను కలిశాను. అతడు నా ప్రియుడిగానే కాక భర్తగానూ ప్రమోషన్ తీసుకున్నాడు. అతడు కూడా నా కంటే ముందు చాలామందిని ప్రేమించాడు. కానీ అతడి గతం కన్నా తనతో భవిష్యత్తు పంచుకోవడం ముఖ్యమనుకున్నాను. అయిపోయినదాన్ని తవ్వడం అనవసరం అనిపించింది. తనతో జీవితాన్ని కొనసాగించాలనుకున్నాను' అని చెప్పుకొచ్చింది ప్రియాంక. కాగా నిక్ జోనస్ గతంలో మిలీ సైరస్, సెలీనా గోమెజ్, ఒలీవియా కుల్పో, లిలీ కొల్లిన్స్, కెండల్ జెన్నర్, కేట్ హడ్సన్.. ఇలా పలువురితో ప్రేమాయణం నడిపాడు. ఇకపోతే నిక్, ప్రియాంకలు కొంతకాలం పాటు డేటింగ్ చేశాక 2018లో రాజస్థాన్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరికి మాల్తీ అనే గారాలపట్టి ఉంది. చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం -
మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!
న్యూఢిల్లీ: న్యూయార్క్‌లో అంతర్జాతీయ అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్‌గాలా 2023లో తారలు సందడి గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, తొలిసారి భర్త నిక్ జోనాస్ స్టైలిష్‌గా కనిపించారు. ఈ సందర్భంగా ఆమె ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. మెట్‌గాలా 2023లో ప్రియాంక చోప్రా ప్రముఖ డిజైనర్ వాలెంటినో రూపొందించిన సెక్సీ బ్లాక్ గౌనులో చూపరులను కట్టి పడేసింది. ముఖ్యంగా బల్గారీకి చెందిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్‌ను ధరించింది. ఈ డైమండ్ నెక్లెస్ విలువ రూ. 204 కోట్లు అని వార్త హల్చల్ చేస్తోంది. మరోవైపు ఈ ఈవెంట్ తర్వాత 25 మిలియన్ల బల్గేరియో ఫీషియల్ నెక్లెస్ వేలం వేయనున్నారు. (Realme 5th Anniversary Sale:స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్) ప్రియాంక మూడోసారి ఈ ఈవెంట్లో తళుక్కు మనగా, తొలిసారిగా భర్తతలో కలిసి సందడి చేసింది. ఇద్దరూ బ్లాక్ అండ్‌వైట్ వాలెంటినో దుస్తుల్లో అలరించారు. ప్రియాంక ఇటీవల విడుదలైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన అమెరికన్ వెబ్ సిరీస్‌కు సిరీస్ సిటాడెల్కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై అలియా భట్ అరంగేట్రంతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. అంతేకాదు రిలయన్స్అధినేత కుమార్తె ఇషా అంబానీ ప్రబల్ గురుంగ్ డిజైన్ చేసిన డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయారు. ఇంకా ఫ్లోరెన్స్ పగ్, అన్నే హాత్వే, జారెడ్ లెటోరా కిమ్ కర్దాషియాన్, జెన్నిఫర్ లోపెజ్, నవోమి కాంప్‌బెల్ తదితరులు హాజరయ్యారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్యాషన్ షోలలో ఒకటి 'మెట్ గాలా'. ఈ ఈవెంట్లో ఫ్యాషన్ దుస్తులపై ఫోకస్ చేస్తారు. ఈ సంవత్సరం థీమ్ ఫ్యాషన్ డిజైనర్ 2019లో మరణించిన ప్రసిద్ధ జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ లాగర్ఫెల్డ్. ఆయనకు ఈ ఈవెంట్ ఘన నివాళులర్పించింది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) Her $25 million @Bulgariofficial necklace is going to be auctioned off after #MetGala @priyankachopra pic.twitter.com/LK0otVUHea — SAMBIT ⚡ (@GirlDontYell) May 2, 2023 -
రోమ్ వీధుల్లో రొమాన్స్.. పబ్లిక్‌లో స్టార్ కపుల్ లిప్ లాక్!
ప్రియాంక చోప్రా బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె హాలీవుడ్లో బిజీగా ఉన్నారు. రూసో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. తాజాగా లండన్‌లో నిర్వహించిన సిటాడెల్ ప్రీమియర్‌లో ప్రియాంక చోప్రా కూడా పాల్గొన్నారు. ఇంగ్లీష్‌లో రూసో బ్రదర్స్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటించారు. ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్లో సమంత, వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్నారు. సిటాడెల్ సిరీస్ సిటాడెల్ ఏప్రిల్ 28న అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం తన భర్త, హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌తో కలిసి రోమ్ వేకేషన్ వెళ్లింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను నిక్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అందులో రోమ్ వీధుల్లో నడుస్తూ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది ఈ జంట. ఆ వీడియోలో ప్రియాంక, నిక్ జోనాస్ లిప్ కిస్ చేస్తూ కనిపించారు. అక్కడే ఇద్దరూ కలిసి ఐస్‌క్రీం తింటూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ 2018 డిసెంబర్లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. జనవరి 2022లో సరోగసీ ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చారు. వీరి కూతురికి మాల్టీ మేరీ అని పేటు పెట్టారు. ఇటీవల ముంబయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి తొలిసారి బిడ్డతో కలిసి ఇండియాకు వచ్చారు. View this post on Instagram A post shared by Nick Jonas (@nickjonas) -
ఇండియాకు ప్రియాంక చోప్రా.. అలా రావడం తొలిసారి!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో స్టార్ హీరోలతో సినిమాల్లో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మారిపోయిన ప్రియాంక చోప్రా అప్పుడప్పుడు ఇండియాకు వస్తూ ఉంటుంది. తాజాగా ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇటీవలే బాలీవుడ్ ఇండస్ట్రీపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేసింది. అక్కడ రాజకీయాలు భరించలేకే హాలీవుడ్‌కు మారిపోయానని తెలిపింది. అయితే హాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్, ప్రియాంక చోప్రాలు 2018న ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి సరోగసి ద్వారా ఓపాప కూడా జన్మించింది. ప్రియాంక తన గారాలపట్టికి మాల్తీ మేరీ అని పేరు పెట్టింది. తాజాగా కూతురు, భర్తతో కలిసి తొలిసారిగా ఇండియాకు ప్రియాంక చోప్రా వచ్చారు. నిక్ జోనాస్, ప్రియాంక కుమార్తె మాల్తీ మేరీ శుక్రవారం ముంబై విమానాశ్రయంలో కనిపించారు. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ గ్రాండ్ ఓపెనింగ్ కోసం వారు ముంబయికి వచ్చినట్లు సమాచారం. కాగా.. తన కూతురు మాల్తీని భారత్‌కు తీసుకురావడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గతంలో కొన్ని ఫోటోలు షేర్ చేసినా పాప మాల్తీ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతుండేది. ఇటీవలే జొనాస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్లో ప్రియాంక తన గారాలపట్టి మాల్తీ ముఖాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. MY NEICE , MY CUTEST HOOMAN YALL 🥹❤️❤️❤️ LOVE OF MY LIFE 🥹🥹❤️❤️ MM is truly her mothers daughter 🫶🫶 my god🥹🥹 #PriyankaChopra pic.twitter.com/oCz874XKbe — k. (@karishmaokay) March 31, 2023 -
సిటాడెల్ కోసం ఫ్యామిలీతో ముంబై వచ్చిన ప్రియాంక చోప్రా
-
పిల్లలంటే ఇష్టం.. అందుకే పెళ్లికి ముందే అలా చేశా!: ప్రియాంక చోప్రా
గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా ప్రస్తుతం వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. తాజాగా ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్‌లో రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించి షాకిచ్చింది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బాలీవుడ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హిందీ చిత్ర పరిశ్రమలోని రాజకీయాలు తట్టుకోలేకే తాను హాలీవుడ్‌కు వచ్చానని చెప్పింది. దీంతో ప్రియాంక ప్రస్తుతం ఇండిస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. చదవండి: 1997లో ప్రారంభమైన కమల్ చిత్రం షూటింగ్.. 26 ఏళ్ల తర్వాత సెట్‌పైకి! అలాగే అదే ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయం గురించి షాకింగ్ విషయం చెప్పింది. తనకు పిల్లలంటే ఇష్టమని, పెళ్లికి ముందే పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నానంది. కాగా ప్రియాంక సరోగసికి వెళ్లడంపై ఆమెకు ప్రశ్న ఎదురవగా అసలు విషయం వెల్లడించింది. ‘నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఎక్కువ సమయంతో వారితో గడపడానికే ఇష్టపడతాను. అందుకే పెళ్లికి ముందే నా అండాలను దాచిపెట్టాను. అప్పట్లో నేను ఎవరితో పిల్లలను కనాలనుకున్నానో ఆ వ్యక్తిని కలవలేకపోయాను. అందుకే అండాలను దాచుకోమ్మని మా అమ్మ మధు చోప్రా (గైనకాలజిస్ట్) సలహా ఇచ్చారు. చదవండి: రానా నాయుడు వెబ్ సిరీస్‌పై నెట్‌ఫ్లిక్స్ షాకింగ్ నిర్ణయం! అమ్మ సలహా మేరకు 30 ఏళ్ల వయసులోనే నా అండాలను దాచిపెట్టుకున్నాను. అలా చేయడం వల్ల నాకు చాలా స్వేచ్చగా అనిపించింది. ఆ స్వేచ్చతోనే నా కెరీర్లో ముందుకు వెళ్లాను. అనుకున్నది సాధించగలిగాను. నా లక్ష్యాలను చేరుకోగలిగాను’ అంటూ చెప్పుకొచ్చింది. అదే విధంగా తనకు పిల్లలను కనాలనే ఆశ ఉండేదని, కానీ తన భర్త నిక్ జోనస్ వయసు తక్కువ ఉండుటంతో తనకి అప్పుడే పిల్లలను కనే ఇష్టం ఉందో? లేదో? అనే అనుమానం ఉండేదని పేర్కొంది. ఆ కారణం చేతనే పెళ్లికి ముందు నిక్‌తో డేటింగ్‌కి కూడా ఒప్పుకోలేదంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. -
నన్ను ఓ మూలన పడేశారు.. అందుకే తప్పుకున్నా: ప్రియాంక చోప్రా
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. తాజాగా బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను హాలీవుడ్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ప్రియాంక చోప్రా వెల్లడించింది. బాలీవుడ్లో తనకు వచ్చిన అవకాశాల పట్ల సంతోషంగా లేనని తెలిపింది. దీనికి కారణం తాను అభద్రతాభావానికి గురి కావడమేనని పేర్కొంది. కాగా.. ప్రియాంక చోప్రా 2015 టెలివిజన్ సిరీస్ క్వాంటికోలో నటించిన తర్వాత హాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ప్రియాంక మాట్లాడుతూ.. 'తనను బాలీవుడ్లో ఓ మూలన పడేశారు. అంతేకాకుండా కొందరితో విభేదాలు ఏర్పడ్డాయి. ఆ రాజకీయాలు చేసే ఉద్దేశం నాకు లేదు. బాలీవుడ్ రాజకీయాలతో నేను విసిగిపోయా. అందుకే బాలీవుడ్ నుంచి పూర్తిగా బ్రేక్ తీసుకోవాలనిపించింది. అందుకే అమెరికా వచ్చేశా.' అని ప్రియాంక వివరించింది. ఆ సమయంలోనే తన మేనేజర్ అంజులా ఆచార్య తన మ్యూజిక్ వీడియోను చూసి యూఎస్‌లో పనిచేసే అవకాశం ఇచ్చారని ఆమె చెప్పింది. మ్యూజిక్ కెరీర్ సక్సెస్ కాకపోతే సినిమాల్లో ప్రయత్నించి చూడాలని ఒకరు సూచించారని ప్రియాంక తెలిపింది. అందుకే క్వాంటికోలో నటించానని చెప్పింది. ఆ తర్వాత బేబీవాచ్, మ్యాట్రిక్స్, రెవల్యూషన్స్, ద వైట్ టైగర్‌లో అవకాశాలను సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. త్వరలో సిటాడెల్ సెకండ్ షోతోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియాంక నటించిన లవ్ ఎగైన్ అనే సినిమా మేలో విడుదల కానుంది. గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ప్రియాంక.. నిక్ జోనస్‌ను 2018 డిసెంబర్లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రియాంక చోప్రా నటించిన 'సిటాడెల్' సిరీస్ త్వరలోనే విడుదల కానుంది. ఇందులో ఆమె రిచర్డ్ మాడెన్‌తో పాటు గూఢచారి పాత్రలో నటించారు. ఈ సిరీస్ ఏప్రిల్ 28 నుండి ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. -
తొలిసారిగా కూతురి ఫోటోలు రివీల్ చేసిన ప్రియాంక చోప్రా
బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా తొలిసారిగా తన కూతుర్ని పరిచయం చేసింది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను తరచూ అభిమానులతో షేర్ చేస్తుంటుంది. అయితే కూతురు మాల్తీ మేరీని మాత్రం ఇంతవరకు ఎక్కడా రివీల్ చేయలేదు. గతంలో కొన్ని ఫోటోలు షేర్ చేసినా పాప మాల్తీ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతుండేది. అయితే రీసెంట్గా జొనాస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్లో ప్రియాంక తన గారాలపట్టి మాల్తీతో కలిసి వేడుకలకు హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రియాంక ఒళ్లో కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్న మాల్తీ వైట్ డ్రెస్‌లో క్యూట్‌గా ఉంది. కాగా అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్, ప్రియాంక చోప్రాలు 2018న ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సరోగసి ద్వారా ప్రియాంక బిడ్డను కన్నారు. అయితే అప్పటినుంచి ఇంతవరకు పాప ముఖాన్ని చూపించలేదు. కానీ తొలిసారిగా మాల్తీ ఫేస్‌ను రివీల్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
నా బిడ్డ బతుకుతుందనుకోలేదు.. సరోగసి సీక్రెట్స్ వివరించిన ప్రియాంక చోప్రా
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తొలిసారిగా తన కూతురు మాల్తీ జననం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సరోగసి విధానం ద్వారా బిడ్డను ఎందుకు కనాల్సి వచ్చిందో వివరిస్తూ ఎమోషనల్ అయ్యింది. ''మాల్తీ పుట్టినప్పుడు నేను ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాను. ఆమె నా చేయికంటే చాలా చిన్నగా ఉంది. దీంతో కొన్నిరోజుల పాటు ఆమెను ఇంటెన్సివ్ కేర్ విభాగంలో డాక్టర్ల పర్యవేక్షనలో ఉంచాం. ఇంక్యుబేటర్‌లో కూతురిని చూస్తూ నేను, నిక్ చాలా మదనపడ్డాం. ఆ సమయంలోఘెంతో మంది డాక్టర్లు, నర్సులను కలిశాను. నిజానికి వాళ్లు దేవుని ప్రతిరూపాలు.. సాక్షాత్తు దేవుడిలానే పిల్లలకు ప్రాణాలు పోస్తున్నారు. నా కూతురు బతికి బయటపడుతుందని కూడా అనుకోలేదు. నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే సరోగసిని ఎంచుకున్నాం. కానీ నేనేదో అందం తగ్గుతుందని సరోగసిని ఎంచుకున్నానని మాట్లాడినప్పుడు చాలా బాధనపించింది. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ తాలూకు ప్రభావం నా బిడ్డపై పడకూడదని నిర్ణయించుకున్నా. అందుకే తన ఫోటోలు కూడా రివీల్ చేయడం లేదు. ఇక సరోగసీ అంద ఈజీ కాదు. దీనికోసం సుమారు ఆరునెలల పాటు నేను, నా భర్త చాలా వెతికాం. చివరకి ఓ దయగల మహిళ సరోగసికి ఒప్పుకుంది. అందుకే నా కూతురికి నాతో పాటు ఆమె పేరు కూడా కలిసి వచ్చేలా పేరు పెట్టుకున్నాం'' అంటూ చెప్పుకొచ్చింది. కాగా గతేడాది జనవరిలో నిక్-ప్రియాంక దంపతులు పేరెంట్స్‌గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. -
మూడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన ప్రియాంక చోప్రా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మూడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్‌లో సెటిలైన ఆమె దాదాపు మూడేళ్ల ఇండియాకు వచ్చారు. సోమవారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన ప్రియాంకకు అభిమానులు ఫ్లకార్డులు, బొకేలతో స్వాగతం పలికారు. ఆమె వెంట భర్త నిక్ జోనస్, కూతురు కూడా ఉన్నారు. కాగా సరోగసి పద్ధతిలో ప్రియాంక, నిక్ దంపతులు ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తల్లైన తర్వాత ప్రియాంక భారత్‌కు రావడం ఇదే మొదటి సారి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్’తో 2017లో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జొనాస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం 2018లో ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. #PriyankaChopra spotted at Mumbai airport 🔥💃📷 @viralbhayani77 pic.twitter.com/FPLmDzwoLq — Viral Bhayani (@viralbhayani77) November 1, 2022 -
ప్రత్యేక జెట్‌లో నిక్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ప్రియాంక చోప్రా గ్రాండ్ విషెష్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ బర్త్‌డేకు సర్ప్రైజ్ ఇచ్చింది. అతని పుట్టినరోజు వేడుకలను ఏకంగా ప్రత్యేక జెట్‌లో ప్లాన్ చేసింది. ఇవాళ నిక్ 30వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బర్త్‌డే వేడుకల కోసం ప్రైవేట్ జెట్‌ను వేదికగా మార్చింది. ఈ సందర్భంగా సింగర్ నిక్ జోనాస్ తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ప్రియాంక చోప్రా స్పెషల్ జెట్‌లో కూర్చొని భర్తకు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది. అయితే ఈ వేడుక ఎక్కడ నిర్వహించారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. వేడుకలకు ముందు ప్రియాంక తన హ్యాండిల్‌పై ఫోటోను కూడా పంచుకుంది. (చదవండి: Priyanka Chopra: క్లిష్ట పరిస్థితులు చూశాం, మా కూతురు తిరిగొచ్చింది) కాగా నిక్, ప్రియాంక 2018 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. రాజస్తాన్‌లోని ఓ రాజభవనంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. క్రిస్టియన్ పద్ధతిలో ఓసారి, హిందూ సంప్రదాయంలో మరోసారి వీరి పెళ్లి జరిపించారు. ఆ తర్వాత సరోగసి ద్వారా ప్రియాంక- నిక్ జోనస్ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తమ గారాల పట్టికి ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’అని నామకరణం కూడా చేశారు. View this post on Instagram A post shared by Nick Jonas (@nickjonas) -
మదర్స్ డే: తొలిసారి కూతురు ఫొటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా
Priyanka Chopra Shares Her Daughter Malti First Pic: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తల్లైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ప్రియాంక, నిక్ జోనస్‌లు తల్లిదండ్రులు అయినట్టు ప్రకటించి అందరికి షాకిచ్చారు. ఎప్పుడు బేబీ బంప్‌తో కనిపించని ప్రియాంక ఆకస్మాత్తుగా తల్లైనట్లు ప్రకటించడం అందరు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే సరోగసి ద్వారా వారు తల్లిదండ్రులు అయినట్లు ప్రియాంక సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. చదవండి: మదర్స్‌డే: అమ్మతో మెగా బ్రదర్స్.. వీడియో వైరల్ అంతేగాక ఇటీవల తమ గారాల పట్టి పేరు ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’ ప్రకటించిన ప్రియాంక తాజాగా కూతురి గురించి ఓ షాకింగ్ న్యూస్ పంచుకుంది. ఆదివారం మదర్స్ డే సందర్భంగా తొలిసారి తన కూతురు ఫొటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యింది ప్రియాంక. దాదాపు 100 రోజుల తర్వాత తన కూతురు ఇంటికి వచ్చిందని, మదర్స్ డే సందర్భంగా తమ ఇంట్లోకి నవ్వులు తిరిగొచ్చాయని ఆమె పేర్కొంది. వారి కూతురు మాల్తీ 100 రోజులకు పైగా హాస్పిటల్లో చికిత్స పొందినట్లు ప్రియాంక తెలిపింది. చదవండి: 'ప్రాజెక్ట్ కె'లో బాలీవుడ్ హీరోయిన్, వైరల్ అవుతున్న పోస్ట్! లాస్ ఎంజల్స్లోని పిల్లల హాస్పిటల్లో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందినట్లు ప్రియాంక తెలిపింది. ఈ మేరకు తమ కూతురు పూర్తి ఆరోగ్యం ఇంటికి తిరిగి రావడంలో డాక్టర్లు, నర్సులు ముఖ్య పాత్ర పోషించారని, ఈ సందర్భంగా వారందరికి ప్రియాంక కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం తమ జీవితాల్లో మరో అధ్యాయం మొదలైందని, మమ్మీ-డాడీ లవ్స్ యూ.. అంటూ ప్రియాంక తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇక ఆమె పొస్ట్‌పై పులువురు బాలీవుడ్ స్టార్స్ స్పందిస్తూ వారు సైతం ఎమోషనల్ అయ్యారు. ప్రితీ జింటా, పరిణితి చోప్రా, దియా మిర్జా, మలైక ఆరోరాలు కామెంట్స్ చేస్తూ లవ్ ఎమోజీతో ప్రియాంక, నిక్ దంపతుల కూతురు మల్తీకి స్వాగతం పలికారు. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });