Narendra Modi
-
భారత్, గయానా మధ్య బలమైన బంధం
జార్జిటౌన్: భారత్, గయానా మధ్య చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయని, రెండు దేశాలను సంస్కృతి, వంటలు, క్రికెట్ అనుసంధానిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రెండు దేశాల నడుమ ఉన్న సారూప్యతలు బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని పేర్కొ న్నారు. గయానా రాజధాని జార్జిటౌన్లో స్థానిక కాలమానం ప్రకారం గురువారం భారత సంతతి ప్రజలు, ప్రవాస భారతీ యుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కరీబియన్ దేశమైన గయానా అభివృద్ధిలో ఇండో–గయానీస్ సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. భారత్, గయానా పరస్పరం పంచుకుంటున్న విలువలే ఇరు దేశాల మధ్య బంధానికి బలమైన పునాదిగా మారాయని వివరించారు. సుసంపన్నమైన, విశిష్టమైన సంస్కృతి ఇరు దేశాలకు గర్వకారణంగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. మన సాంస్కృతిక వైవిధ్యమే మన బలం అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. క్రికెట్ క్రీడ పట్ల ఉన్న ప్రేమ భారత్–గయానాను ఒక్కటిగా కలిపి ఉంచుతోందని తెలిపారు. క్రికెట్ అంటే ఒక జీవన విధానమని వెల్లడించారు. టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో భారత జట్టుకు గయానా ప్రజలు మద్దతు తెలిపారని గుర్తుచేసుకున్నారు. ప్రవాస భారతీయులను ‘రాష్ట్రదూతలు’గా ప్రధాని మోదీ అభివర్ణించారు. భారత సంస్కృతి, విలువలకు వారు రాయబారులని కొనియాడారు. ఇండో–గయానీస్ ప్రజలు రెండు రకాలుగా ఆశీస్సులు పొందారని, వారికి గయానా మాతృభూమి అయితే భారతమాత ప్రాచీన భూమి అని వివరించారు. రెండు దశాబ్దాల క్రితం ఒక యాత్రికుడిగా గయానాలో పర్యటించానని, అప్పటితో పోలిస్తే దేశం ఇప్పుడు దేశం చాలా మారిపోయిందని చెప్పారు. గయానా ప్రజల ప్రేమ, ఆప్యాయ తల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని ఉద్ఘాటించారు. స్వదేశానికి మోదీ: నైజీరియా, బ్రెజిల్, గయానాల్లో ఐదు రోజుల పర్యటన ముగించుకొని మోదీ శుక్రవారం భారత్ చేరుకున్నారు. -
ఈనెల 29న విశాఖ రానున్న ప్రధాని మోదీ
-
ప్రజాస్వామ్యం మానవత్వం
జార్జిటౌన్: ప్రపంచ శాంతి, సౌభాగ్యాలే లక్ష్యంగా ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే సరికొత్త పిలుపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చారు. అంతరిక్షం, సముద్రం అనేవి అంతర్జాతీయంగా పరస్పర సహకారానికి, అభివృద్ధికి వేదికలు కావాలి తప్ప సంఘర్షణలు, యుద్ధాలకు కాదని తేల్చిచెప్పారు. గురువారం గయానా దేశ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. స్వార్థం, విస్తరణవాదం అనే సంకుచిత ధోరణిని భారత్ ఏనాడూ నమ్ముకోలేదని అన్నారు. విస్తరణవాదంతో ముందుకెళ్లాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. వనరుల దోపిడీ అనే ఆలోచనకు భారత్ దూరంగా ఉంటుందని వివరించారు. మూడు దేశాల పర్యటన భాగంగా ప్రధాని మోదీ గయానాలో పర్యటించారు. గయానా పార్లమెంట్లో ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘ప్రపంచం ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే సూత్రాన్ని అనుసరించాలి. అదే మనకు తారకమంత్రం. మనతోపాటు అందరినీ కలుపుకొని వెళ్లాలని, అందరి అభివృద్ధిలో మనం సైతం భాగస్వాములం కావాలని ప్రజాస్వామ్యం ప్రథమం స్ఫూర్తి బోధిస్తోంది. మనం నిర్ణయాలు తీసుకోవడంలో మానవత్వం ప్రథమం అనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మానవత్వానికి తొలి ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటే వచ్చే ఫలితాలతో మొత్తం మానవాళికి మేలు జరుగుతుంది. గ్లోబల్ సౌత్ దేశాలు మేల్కోవాల్సిన సమయం వచి్చంది. మనమంతా క్రియాశీలకంగా పనిచేయాలి. మనం ఒక్కతాటిపైకి రావాలి. మనం కలిసికట్టుగా పని చేస్తూ నూతన ప్రపంచ క్రమాన్ని(గ్లోబల్ ఆర్డర్) సృష్టించాలి. ప్రపంచం విషయానికొస్తే యుద్ధాలు, ఘర్షణలకు ఇది సమయం కాదు. యుద్ధాలకు దారితీస్తున్న పరిస్థితులను గుర్తించి, వాటిని రూపుమాపాల్సిన సమయం ఇది. భారత్–గయానా మధ్య గత 150 ఏళ్లుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. భారత్ దృష్టిలో ప్రతి దేశమూ కీలకమైనదే. ఏ ఒక్కటీ తక్కువ కాదు. ద్వీప దేశాలను చిన్న దేశాలుగా పరిగణించడం లేదు. వాటిని అతిపెద్ద సముద్ర దేశాలుగా భావిస్తున్నాం. ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే స్ఫూర్తితో భారత్ ‘విశ్వబంధు’గా తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభాలు తలెత్తితే అందరికంటే మొదట భారత్ స్పందిస్తోంది’ అని ప్రధాని మోదీ వివరించారు. -
అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?.. మోదీకి కవిత సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: జైలు నుంచి విడుదలయిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. తొలిసారి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత ట్వీట్ చేసిన కవిత.. అదానీ వ్యవహారంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ప్రధాని మోదీపై ఆరోపణలు చేశారు.‘‘అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా?. ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా??’’ అంటూ కవిత సూటిగా ప్రశ్నించారు.అఖండ భారతంలో అదానికో న్యాయం...ఆడబిడ్డకో న్యాయమా ?ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ? ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా ??— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 21, 2024 కాగా, లిక్కర్ కేసులో.. మార్చి 15వ తేదీన తన నివాసంలో కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్ 11న ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. మొత్తం ఈ కేసులో ఐదు నెలలపైనే ఆమె తీహార్ జైల్లో గడిపారు. ఆగస్టు 27న సుప్రీం కోర్టులో ఆమెకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను.. ద్విసభ్య ధర్మాసనం ఒకేసారి విచారణ జరిపింది.ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత ట్విట్టర్ వేదికగా సత్యమేవ జయతే అని కామెంట్స్ చేస్తూ ఓ పోస్టు చేశారు. తన భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. తాజాగా, కొన్ని రోజుల విరామం అనంతరం తొలిసారిగా బీజేపీ, ప్రధాని మోదీపై ఆరోపణలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. -
అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?.. మోదీకి కవిత సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: జైలు నుంచి విడుదలయిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. తొలిసారి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత ట్వీట్ చేసిన కవిత.. అదానీ వ్యవహారంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ప్రధాని మోదీపై ఆరోపణలు చేశారు.‘‘అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా?. ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా??’’ అంటూ కవిత సూటిగా ప్రశ్నించారు.అఖండ భారతంలో అదానికో న్యాయం...ఆడబిడ్డకో న్యాయమా ?ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ? ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా ??— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 21, 2024 కాగా, లిక్కర్ కేసులో.. మార్చి 15వ తేదీన తన నివాసంలో కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్ 11న ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. మొత్తం ఈ కేసులో ఐదు నెలలపైనే ఆమె తీహార్ జైల్లో గడిపారు. ఆగస్టు 27న సుప్రీం కోర్టులో ఆమెకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను.. ద్విసభ్య ధర్మాసనం ఒకేసారి విచారణ జరిపింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్జీ సుమారు గంటన్నరపాటు ఇవాళ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది.ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతంరం జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత తాజాగా.. ట్విట్టర్ వేదికగా సత్యమేవ జయతే అని కామెంట్స్ చేస్తూ ఓ పోస్టు చేశారు. తన భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. -
అదానీని ఇవాళే అరెస్ట్ చేయాలి: రాహుల్ గాంధీ
ఢిల్లీ: దేశంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఏకంగా ముఖ్యమంత్రులను అరెస్ట్‌లను చేస్తున్నారు.. కానీ, గౌతమ్ అదానీని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అదానీ.. భారత చట్టాలను, అమెరికా చట్టాలను ఉల్లఘించారనని నిరూపించబడిందని చెప్పుకొచ్చారు. అదానీని వంద శాతం ప్రధాని మోదీనే కాపాడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ లంచం ఆరోపణ కేసులో గౌతమ్ అదానీ, ఇతరులపై అభియోగాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సందర్బంగా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు గౌతమ్ అదానీ, మరో ఏడుగురుతో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా ఎఫ్‌బీఐ చెబుతోంది. అదే సమయంలో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. అమెరికాలో ఇది స్పష్టంగా నిరూపించబడింది. అయినప్పటికీ అదానీ బాహ్య ప్రపంచంలో స్వేచ్చగా తిరుగుతున్నారు. చట్టాలు ఆయనకు వర్తించవా?. అదానీని అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాం. #WATCH | Delhi: When asked if he would raise the issue of US prosecutors charging Gautam Adani and others in alleged Solar Energy contract bribery case, in Parliament, Lok Sabha LoP Rahul Gandhi says, "We are raising this issue. It is my responsibility as LoP, to raise this… pic.twitter.com/UenrnN2dej— ANI (@ANI) November 21, 2024ఇదే సమయంలో అదానీ కుంభకోణాలకు పాల్పడుతున్నారని మేము పార్లమెంట్ సాక్షిగా ఎన్నో సార్లు చెప్పాము. కానీ, అదానీపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం మాత్రం ముందుకు రాదు. ఎందుకంటే ప్రధాని మోదీనే అదానీని వంద శాతం కాపాడుతున్నారు. మోదీ, అదానీ కలిసి ఉంటే.. ఆ ఇద్దరూ ఇండియాలో క్షేమంగా ఉంటారు. అదానీ అక్రమాలపై విచారణ జరిపేందుకు జేపీసీ ఏర్పాటు చేయాలన్నది ముందు నుంచి మా డిమాండ్. ఇప్పుడు కూడా ఇదే కోరుతున్నాం. అదానీ రూ.2000 కోట్ల స్కాం చేసినా స్వేచ్చగా బయటే తిరుగుతున్నారు. ఇక, రాహుల్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ కార్యాలయంలో పవర్ కట్ కావడంతో అదానీ పవర్, మోదీ పవర్ ఏది పనిచేస్తుందో అర్థం కాలేదు అంటూ సెటైర్లు వేశారు. కచ్చితంగా పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తుతాం. ప్రజలకు అన్ని వివరాలను వెల్లడిస్తాం. ఏ రాష్ట్రంలో అదానీ అవినీతికి పాల్పడినా కచ్చితంగా విచారణ జరపాలి. ఈ వ్యవహారంలో అదానీకి తోడుగా ఉన్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. కానీ, అదానీని అరెస్ట్ చేయరు.. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ప్రభుత్వంలో ఉన్న పెద్దల పేర్లు కూడా బయటకు వస్తాయి.. కాబట్టి ఆయనపై విచారణ కూడా ఉండదు. అదానీ దేశాన్ని హైజాక్ చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే, ఈ కేసుకు సంబంధించి సెబీ చీఫ్ మదహబి పురి బుచ్‌ను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. #WATCH | Delhi: On US prosecutors charging Gautam Adani and others in alleged Solar Energy contract bribery case, Lok Sabha LoP Rahul Gandhi says, "JPC is important, it should be done but now the question is why is Adani not in jail?...American agency has said that he has… pic.twitter.com/rAzVUoquqN— ANI (@ANI) November 21, 2024 -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉక్కు కార్మికుల డెడ్‌లైన్
సాక్షి, విశాఖ: విశాఖ ఉక్కు కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డెడ్ లైన్ విధించారు. తమకు చెల్లించాల్సిన జీతాలను వారం రోజుల్లోగా చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. జీతాలు ఇవ్వని పక్షంలో ప్రధాని మోదీ విశాఖలో అడుగుపెట్టేందుకు అర్హత లేదంటూ సీపీఎం నేత కామెంట్స్ చేశారు.విశాఖ ఉక్కు కార్మికుల జీతాల విషయంపై సీపీఎం నేత గంగారావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.. విశాఖ వచ్చే లోపు కార్మికులకు జీతాలు చెల్లించాలి. లేదంటే విశాఖలో కాలుపెట్టే అర్హత లేదు.. అడుగడుగునా ముట్టడిస్తాం. ఉద్యోగుల జీతాల విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకోవాలి.ఉక్కు కార్మికులకు ఇంత అన్యాయం జరుగుతుంటే విశాఖ ఎంపీ ఏం చేస్తున్నారు?. యూనివర్సిటీని నడుపుకోడానికి నిన్ను ఎంపీని చేయలేదు. జీతాలకోసం యాజమాన్యంతో మాట్లాడాలి. ఎంపీ మాట కూడా యాజమాన్యం వినకపోతే ఉద్యమంలోకి రావాలి. ఆయనతో కలిసి మేమంతా ఉద్యమిస్తాం అని చెప్పుకొచ్చారు. -
మోదీ టార్గెట్‌గా కెనడా కొత్త ప్లాన్!.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీ: ఢిల్లీ: కెనడాపై భారత ప్రభుత్వం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ప్లాన్ చేసిన విషయం ప్రధాని మోదీకి ముందే తెలుసు అంటూ కెనడాకు చెందిన ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ వార్తా పత్రిక ఓ కథనం రాసుకొచ్చింది. ఈ కథనాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అలాంటి అర్థం లేని కథనాలను కొట్టిపారేస్తున్నామని ఖండించింది.కెనడా కథనంపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. మేము సాధారణంగా మీడియాలో వచ్చే కథనాలపై స్పందించం. కానీ, కెనడా ప్రభుత్వ వర్గాలను ఉద్దేశిస్తూ వెలువడిన ఈ హాస్యాస్పద వార్తలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరాధారమైన ఇలాంటి వార్తలు హాస్యాస్పదం. ఇలాంటి వార్తలపై అధికారులు కచ్చితంగా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు, ప్రచారాలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతిస్తాయి. ఇప్పటికైనా తప్పుడు నివేదికలు ప్రచురించకపోవడం మంచిది అంటూ కామెంట్స్ చేశారు.సదరు వార్తా పత్రిక.. ఈ హత్యకు కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ కూడా భాగమైనట్లు తమకు తెలిసిందని కెనడా సీనియర్ జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కథనం పేర్కొనడం గమనార్హం.ఇదిలా ఉండగా.. గత సంవత్సరం, నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. కెనడా వాదనలు నిరాధారమైనవి అని తెలిపింది. నిజ్జర్ హత్య జరిగినప్పటి నుంచి కెనడా.. భారత ప్రభుత్వం, మోదీపై తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. అంతకుముందు.. కెనడాకు చెందిన పలు నేతలు అమిత్ షాను కూడా టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. Our response to queries regarding a report in Canadian media: https://t.co/1IAURpKlfT pic.twitter.com/jIPlg05JM6— Randhir Jaiswal (@MEAIndia) November 20, 2024 -
మోదీకి డొమినికా అత్యున్నత పురస్కారం
సాంటో డొమింగో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. కరేబియన్ దేశం కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డును ఆయనకు అందించింది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ గుయానా చేరుకున్నారు. అక్కడ డొమెనికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ఆయనన్ని కలిశారు. ఈ సందర్భంగా.. ‘డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్’తో మోదీని డొమెనికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ సత్కరించారు. కరోనా టైంలో తమ దేశానికి మోదీ నేతృత్వంలో భారత్ అందించిన సహకారం.. అందులో ఆయన పాత్రను బర్టన్ ఈ సందర్భంగా కొనియాడారు. అలాగే.. Gratitude to President Sylvanie Burton of Dominica for conferring the 'Dominica Award of Honour' upon me. This honour is dedicated to my sisters and brothers of India. It is also indicative of the unbreakable bond between our nations. pic.twitter.com/Ro27fpSyr3— Narendra Modi (@narendramodi) November 20, 2024ఈ అవార్డును భారతీయ సోదర సోదరీమణులకు అంకితం ఇస్తున్నానని ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. మరోవైపు జార్జ్‌టౌన్‌లో డొమెనికా ప్రధాని రూజ్వె స్కెర్రిట్తో మోదీ ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు. 1981 నుంచి ఈ రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు.. 2019లో ఇండి-క్యారీకామ్లో భాగంగా మోదీ-స్కెర్రిట్ న్యూయార్క్‌లోనూ భేటీయ్యారు. కరోనా టైంలో ఈ దేశానికి భారత్ వ్యాక్సిన్ సహకారం అందించింది కూడా. -
గయానాతో 10 ఒప్పందాలు
జార్జిటౌన్: పలు రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకో వాలని భారత్, గయానా నిర్ణయించాయి. వ్యవసాయం, హైడ్రోకార్బన్లు మొదలుకుని ఫార్మా, డిజిటల్ పేమెంట్ల దాకా 10 రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సైనికంగా గయానాకు కీలక మద్దతు అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా బుధవారం గయానా చేరుకున్న ఆయనకు అపూర్వ స్వాగతం పలికింది. జార్జిటౌన్ విమానాశ్రయంలో అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ, పలువురు మంత్రులు మోదీని స్వయంగా స్వాగతించారు. గత 56 ఏళ్లలో అక్కడ పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. తన పర్యటనతో ఇరు దేశాల మైత్రీ బంధం సుదృఢమవుతుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. గయానాలో జన్ ఔషధీ కేంద్రం ఏర్పాటుకు కూడా నిర్ణయం జరిగింది. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నేతలిద్దరూ లోతుగా చర్చించారు. ఇరు దేశాల సంబంధాల్లో మోదీ పర్యటన ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఇర్ఫాన్ అలీ అన్నారు. ఆయన్ను నేతల్లో చాంపియన్‌గా అభివర్ణించారు. మోదీ పాలన తీరు అద్భుతమన్నారు. భేటీ అనంతరం నేతలిద్దరూ మొక్కలు నాటారు. గయానా, గ్రెనెడా, బార్బడోస్ ప్రధాను లు కూడా మోదీతో భేటీ అయ్యారు. తర్వాత గయానాలోని భారతీయులతో ప్రధాని భేటీ అయ్యారు. 185 ఏళ్ల కింద అక్కడికి వలస వెళ్లిన భారతీయులు ఇప్పటికీ దేశ పతాకను సగర్వంగా రెపరెపలాడిస్తున్నారంటూ ప్రశంసించారు. గయానాలో 3.2 లక్షల మందికి పైగా ఎన్నారైలున్నారు. -
ముందుకు కదలని ముచ్చట
మరో ఏడాది గడిచింది. మరో జీ20 సదస్సు జరిగింది. భారత ప్రధాని మోదీ సహా ప్రపంచ దేశాల పెద్దలు కలిశారన్న మాటే కానీ, ఏం ఒరిగింది? బ్రెజిల్లో రెండు రోజులు జరిగిన సదస్సు తర్వాత వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈ 20 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల కూటమి ఓ సమష్టి తీర్మానం చేసింది కానీ, తీర్మానంలోని భాషపై అర్జెంటీనా అభ్యంతరాలతో ఏకాభిప్రాయ సాధన కుదరలేదు. ఆకలిపై పోరాటానికి ఒప్పందం, ప్రపంచంలో అత్యంత సంపన్నులపై పన్ను లాంటి అంశాలపై సదస్సులో మాటలు సాగాయి. కానీ, ఉక్రెయిన్‌లో, మధ్యప్రాచ్యంలో... జరుగుతున్న ప్రధాన యుద్ధాల క్రీనీడలు సదస్సుపై పరుచుకున్నాయి. చివరకు సదస్సు చివర జరపాల్సిన విలేఖరుల సమావేశాన్ని సైతం బ్రెజిల్ దేశాధ్యక్షుడు ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. రష్యాపై ఉక్రెయిన్ క్షిపణి దాడులు, పరిమిత అణ్వస్త్ర వినియోగానికి మాస్కో సన్నద్ధతతో ఉద్రిక్తతలు పెరిగినా అమెరికా అధ్యక్షుడు ఏమీ మాట్లాడకుండానే పయనమయ్యారు. వెరసి, అధికారులు అంటున్నట్టు ఈ ‘జీ20 సదస్సు చరిత్రలో నిలిచిపోతుంది’ కానీ, గొప్పగా చెప్పుకోవడానికేమీ లేనిదిగానే నిలిచిపోతుంది. మాటలు కోటలు దాటినా, చేతలు గడప దాటడం లేదనడానికి తాజా జీ20 సదస్సు మరో ఉదాహరణ. నిజానికి, పర్యావరణ పరిరక్షణకు కార్యాచరణ, నిధులు అనేవి ఈ సదస్సుకు కేంద్ర బిందువులు. పర్యావరణ మార్పులను ఎదుర్కోవాల్సిన ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, పరస్పర సహకార ప్రయత్నాలకు కట్టుబడినట్టు సదస్సు పేర్కొంది. కానీ, శిలాజ ఇంధనాల వినియోగం నుంచి క్రమంగా పక్కకు మరలేందుకు స్పష్టమైన ప్రణాళికలేమీ చేయలేకపోయింది. పర్యావరణ పరిరక్షణ నిధులకు సంబంధించీ పురోగతి లేకుండానే ఈ జీ20 ముగిసింది. ప్రపంచ దేశాల నేతలు కృత నిశ్చయాన్ని ప్రకటిస్తూ, బలమైన సూచన ఏదో చేస్తారని ‘కాప్–29’ ఆశించినా, అలాంటిదేమీ జరగనేలేదు. కాకపోతే, ‘జీ20’ సదస్సు తుది తీర్మానంలో నిర్దిష్టమైన ఆర్థిక వాగ్దానాలేమీ లేనప్పటికీ, మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంకుల సంస్కరణలపై దృష్టి పెట్టినందున అది పరోక్షంగా పర్యావరణ నిధులకు ఉపకరిస్తుందని కొందరు నిపుణుల మాట. కాగా, ప్రపంచం నుంచి దారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించాలంటూ జీ20 దేశాలు వచ్చే అయిదేళ్ళను కాలవ్యవధిగా పెట్టుకోవడం సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకపోయినా, సత్సంకల్పమని సంతోషించాలి. 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం వాషింగ్టన్లో జరిగిన జీ20 నేతల తొలి సమావేశానికి హాజరయ్యానని గుర్తు చేసుకుంటూ, పదహారేళ్ళ తర్వాత ఇప్పటికీ ప్రపంచం ఘోరమైన పరిస్థితిలో ఉందని బ్రెజిల్ అధ్యక్షుడన్న మాట నిష్ఠురసత్యం. ఆకలి, దారిద్య్రం ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నాయి. దీనికి తప్పుడు రాజకీయ నిర్ణయాలే కారణమన్న ఆయన మాట సరైనదే. ఆకలి, దారిద్య్రంపై పోరాటానికి ప్రపంచ కూటమి స్థాపన మంచి ఆలోచనే. కానీ, ఇన్నేళ్ళుగా ఇలాంటివెన్నో సంకల్పాలు చేసుకున్నా, ఎందుకు నిర్వీర్యమయ్యాయన్నది ఆలోచించాల్సిన అంశం. పేరుకు కూటమి అయినా జీ20లోని సభ్య దేశాల మధ్య యుద్ధాలు సహా అనేక అంశాలపై భిన్నాభిప్రాయాలున్నా యన్నది సదస్సు ఆరంభం కాక ముందు నుంచీ తెలిసినదే. అందుకే, ఈ సదస్సును అతిగా అంచనా వేస్తే ఆశాభంగమే. కొన్ని విజయాలున్నా అధిక శాతం అంతర్జాతీయ శక్తుల మధ్య విభేదాలే సదస్సులో బయటపడ్డాయి. ఏ దేశాల పేర్లూ ఎత్తకుండా శాంతి సూక్తులకే జీ20 పరిమితమైంది. సమష్టి లక్ష్యం కోసం పలుదేశాలు కలసి కూటములుగా ఏర్పడుతున్నా, అవి చక్రబంధంలో చిక్కుకొని అడుగు ముందుకేయలేని పరిస్థితి ఉందని అర్థమవుతోంది. ఇటీవలి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సదస్సు ‘కాప్29’, ఇరవై ఒక్క ఆసియా – పసిఫిక్ దేశ ఆర్థిక వ్యవస్థల వేదిక ‘ఆసియా – పసిఫిక్ ఆర్థిక సహకార మండలి’, జీ20ల్లో ఎదురైన ప్రతిష్టంభనలే అందుకు తార్కాణం. అవి ఇప్పుడు సమష్టి సవాళ్ళను పరిష్కరించే వేదికలుగా లేవు. వ్యాపార సంరక్షణవాద విధానాలు, భౌగోళిక – రాజకీయ శత్రుత్వాల యుద్ధభూములుగా మారిపోయాయి. ఈ వైఫల్యం వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు అశనిపాతం. అమెరికా, యూరోపియన్ యూనియన్ లాంటివి స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతం నుంచి పక్కకు జరిగాయి. ఫలితంగా తక్కువ కూలీ ఖర్చు, సరళమైన పర్యావరణ ప్రమా ణాలున్న వర్ధమాన దేశాలకు మునుపటి సానుకూలత ఇప్పుడు లేదు. పారిశ్రామికీకరణ వేళ సరళ తర నిబంధనలతో లబ్ధి పొందిన పెద్ద దేశాలు, తీరా ఇప్పుడలాంటి ఆర్థిక అవకాశాలేమీ లేకుండానే వర్ధమాన దేశాలను సుస్థిరాభివృద్ధి వైపు నడవాలని కోరడం అన్యాయమే. ప్రపంచాన్ని పీడిస్తున్న అంశాలపై దృష్టి సారించడంలో జీ20 విఫలమవడం విషాదం. పర్యావరణ సంక్షోభం, దారిద్య్రం, ఉత్పాతాల లాంటి అనేక సవాళ్ళు కళ్ళెదుటే ఉన్నా, వాటి పరిష్కారం బదులు రష్యా, చైనాలను ఏకాకుల్ని చేయాలన్నదే జీ7 దేశాల తాపత్రయం కావడమూ తంటా. భౌగోళిక – రాజకీయ వివాదాలు అజెండాను నిర్దేశించడంతో జీ20 ప్రాసంగికతను కోల్పోతోంది. సమాన అవకాశాలు కల్పించేలా కనిపిస్తున్న బ్రిక్స్ లాంటి ప్రత్యామ్నాయ వేదికల వైపు పలు దేశాలు మొగ్గుతున్నది అందుకే. జీ20 లాంటి బహుళ దేశాల వ్యవస్థల కార్యాచరణను ఇతరేతర అంశాలు కమ్మివేస్తే అసలు లక్ష్యానికే చేటు. పరస్పర భిన్నాభిప్రాయాల్ని గౌరవిస్తూనే దేశాలు సద్భావంతో నిర్మాణాత్మక చర్చలు జరిపితే మేలు. ఏ కూటమైనా శక్తిమంతులైన కొందరి వేదికగా కాక, అంద రిదిగా నిలవాలి. పశ్చిమదేశాలు ఆ సంగతి గ్రహిస్తేనే, జీ20 లాంటి వాటికి విలువ. విశ్వ మాన వాళికి ప్రయోజనం. వచ్చే ఏడాది సౌతాఫ్రికాలో జరిగేనాటికైనా జీ20 వైఖరి మారుతుందా? -
నాకు తెలుసు.. మీరు చాలా ఫేమస్: జైశంకర్‌తో ఇండోనేషియా అధ్యక్షుడు
బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో G20 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకరర్‌పై ప్రశంసలు కురిపించారు. భారత్, ఇండోనేషియా మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ దృశ్యం చోటుచేసుకుంది.ఇండోనేషియా క్షుడు జైశంకర్ తనను తాను పరిచేయం చేసుకున్నారు. ఈ క్రమంలో సుబియాంటో కరచాలనం చేస్తూ ‘నువ్వు నాకు తెలుసు, నువ్వు చాలా ఫేమస్’ అంటూ పేర్కొన్నారు. దీంతో అక్కడున్న మోదీ వారి వైపు చూస్తూ చిరునవ్వులు చిందించారు. మరోవైపు ఇండోనేషియా అధ్యక్షుడితో జరిగిన భేటీలో ప్రధాని మోదీ వాణిజ్యం, వాణిజ్యం, ఆరోగ్యం, భద్రత వంటి రంగాల్లో సహకారంపై చర్చించారు. ఇండోనేషియా అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో ఎన్నికైన తర్వాత ఇరువురు నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి."I know you, you are very famous", Indonesia Prez Prabowo tells EAM Dr S Jaishankar after the latter introduces himself. Location : Ahead of PM Modi, Indonesia Prez Prabowo bilateral at Brazil G20 summit Vdo Source: Indonesia Govt pic.twitter.com/fqXb3ZeA86— Sidhant Sibal (@sidhant) November 19, 2024కాగా మంగళవారం జరిగిన జీ 20 సదస్సులో భాగంగా చైనా విదేశాంగమంత్రి మంత్రి వాంగ్ యితో జైశంకర్ చర్చలు జరిపారు. భారత్, చైనా మధ్య నేరుగా విమానాలు నడపాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. కైలాష్ మానస్ సరోవర్ యాత్రను కూడా..తిరిగి ప్రారంభించాలని ఇరుదేశాల ప్రతిపాదించాయి. తూర్పు లద్దాఖ్‌లోని డెమ్చోక్ సెక్టార్లో భారత బలగాల పెట్రోలింగ్ ప్రారంభం తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన మొదటి ఉన్నత స్థాయి సమావేశం. -
మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రధాని మోదీ అభ్యర్థన
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నేడు (బుధవారం) జరుగుతున్నాయి. జార్ఖండ్‌లో నేడు రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నవారిని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ ‘నేటి పోటింగ్లో సరి కొత్త రికార్డును సృష్టించాలని’ విజ్ఞప్తి చేశారు. తొలిసారిగా ఓటు వేయబోతున్న యువ ఓటర్లకు అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర ఓటర్లకు కూడా ప్రధాని మోదీ ఒక సందేశం ఇచ్చారు. ‘ఈ రోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్ర ఓటర్లు పూర్తి ఉత్సాహంతో ఇందులో భాగస్వాములు కావాలి. ప్రజాస్వామ్య పండుగను సంపూర్ణం చేయాలని కోరుతున్నాను. యువతీ, యువకులంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. झारखंड में आज लोकतंत्र के महापर्व का दूसरा और आखिरी चरण है। सभी मतदाताओं से मेरा आग्रह है कि वे इसमें बढ़-चढ़कर भागीदारी करें और वोटिंग का नया रिकॉर्ड बनाएं। इस अवसर पर पहली बार वोट डालने जा रहे अपने सभी युवा साथियों का मैं विशेष अभिनंदन करता हूं। आपका एक-एक मत राज्य की ताकत है।— Narendra Modi (@narendramodi) November 20, 2024మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలో భాగమైన బీజేపీ అత్యధికంగా 149 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తోంది.ఇది కూడా చదవండి: UP By Election 2024: సెమీ ఫైనల్లో యూపీ ఓటర్లు ఎటువైపు? -
G20 Summit: మళ్లీ ఎఫ్‌టీఏ చర్చలు
రియో డి జనిరో: బ్రిటన్, భారత్ మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై నెలకొన్న అనుమానాలకు తెర పడింది. దీనిపై చర్చలను పునఃప్రారంభిస్తామని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ స్పష్టం చేశారు. బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం ఆయన ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నేతలిద్దరూ సమావేశమయ్యారు. బ్రిటన్‌లో లేబర్ పార్టీ గెలుపుతో ఎఫ్‌టీఏ భవితవ్యం అయోమయంలో పడటం తెలిసిందే. దానికి నేతలిద్దరూ తాజాగా తెర దించారు. పరస్పరం లాభసాటిగా ఉండేలా ఎఫ్‌టీఏ విధివిధానాలు రూపొందుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. బెల్ఫాస్ట్, మాంచెస్టర్ నగరాల్లో నూతన కాన్సులేట్లు తెరవాలని నిర్ణయించారు. పరారీలో ఉన్న వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని స్టార్మర్‌కు మోదీ విజ్ఞప్తి చేశారు.మెరుగైన భవితకు కృషి మెరుగైన భవిష్యత్తు కోసం చర్యలు చేపట్టాల్సిందిగా జీ20 సభ్య దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. సదస్సులో రెండో రోజు సుస్థిరాభివృద్ధి, ఇంధన రంగంలో మార్పులపై ఆయన ప్రసంగించారు. అభవృద్ధి చెందుతున్న దేశాలకు ఇచి్చన హామీలను అమలు చేయడం సంపన్న దేశాల బాధ్యత అని గుర్తు చేశారు. పర్యావరణ సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కోవడం మానవాళి మనుగడకు చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. గాజాకు మరింత మాన వతా సాయం అందించాలని, ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడాలంటూ సదస్సు డిక్లరేషన్ విడుదల చేసింది. వీటితో పాటు పలు అంశాలపై బుధవారం సదస్సు చివరి రోజు ఉమ్మడి తీర్మానం చేసే అవకాశముంది. దేశాధినేతలతో మోదీ భేటీలుఆతిథ్య దేశం బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వాతో పాటు పలువురు దేశాధినేతలతో మోదీ వరుస భేటీలు జరిపారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (ఫ్రాన్స్), గాబ్రియెల్ బోరిక్ ఫోంట్ (చిలీ), జేవియర్ మెయిలీ (అర్జెంటీనా), జార్జియా మెలోనీ (ఇటలీ), ప్రబోవో సుబియాంటో (ఇండొనేసియా), పెడ్రో శాంచెజ్ (స్పెయిన్), అబ్దెల్ ఫతా ఎల్ సిసీ (ఈజిప్ట్), యూన్ సుక్ యోల్ (దక్షిణ కొరియా), జోనాస్ గర్ స్టోర్ (నార్వే), లూయీస్ మాంటెనెగ్రో (పోర్చుగీస్), లారెన్స్ వాంగ్ (సింగపూర్), యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లియన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్ తదితరులు వీరిలో ఉన్నారు. -
వచ్చే ఏడాది భారత్‌లో పుతిన్ పర్యటన!
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే వీలుంది. దశాబ్దాల స్నేహం, బలమైన రక్షణ, వాణిజ్య బంధాలు, పరస్పరసహకారాలతో ఇరుదేశాల ద్వైపాక్షిక బంధం పటిష్టంగా ఉన్న నేపథ్యంలో వార్షిక పర్యటనల్లో భాగంగా వచ్చే ఏడాది పుతిన్ భారత్‌కు రావొచ్చని దౌత్యవర్గాలు మంగళవారం వెల్లడించాయి. పుతిన్ పర్యటన వేళ రష్యా ఏఏ అంశాలపై భారత్‌తో ఒప్పందాలు చేసుకోవచ్చు అనేది ఇంకా ఖరారుకాలేదని తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా రాజధాని మాస్కోలో పర్యటించి పుతిన్‌తో విస్తృతస్థాయి చర్చలు జరిపిన విషయం విదితమే. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతంకానుందని మంగళవారం రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన ఖాయమని దాదాపు స్పష్టమైంది. మంగళవారం ఆయన భారత సీనియర్ సంపాదకులతో వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ పుతిన్ త్వరలోనే భారత్‌లో పర్యటిస్తారు. అయితే పర్యటన తేదీలపై ఇరుదేశాలు సంప్రదింపులు జరపాల్సి ఉంది’ అని పెస్కోవ్ అన్నారు. అయితే ఏ తేదీల్లో ఎన్ని రోజులు భారత్‌లో పుతిన్ పర్యటిస్తారన్న వివరాలను దిమిత్రీ వెల్లడించలేదు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ గత నెలలో కజక్‌స్తాన్‌లో పర్యటించిన విషయం తెల్సిందే. దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించాలని బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెస్కోవ్ మాట్లాడారు. ‘‘అమెరికా నిర్ణయం ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మరింత ఆజ్యంపోస్తోంది. యుద్ధం మరింతగా విస్తరించడం ఖాయం. బైడెన్ ప్రభుత్వం యుద్ధానికే మద్దతు పలుకుతోంది. శాంతిస్థాపనకు కాదు. రష్యాపై అధునాతన ఆయుధాల వినియోగానికి అమెరికా పచ్చజెండా ఊపిన నేపథ్యంలో మేం కూడా మా అణ్వస్త్ర విధానాన్ని సవరించాల్సిన సమయమొచ్చింది’’ అని పెస్కోవ్ అన్నారు. అణ్వాయుధ వినియోగానికి సంబంధించిన కీలక దస్త్రంపై పుతిన్ సంతకం చేసిన వేళ పెస్కోవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
ఘర్షణలకు ముగింపెప్పుడు?
నవంబరు 11 నుంచి కనిపించకుండా పోయిన మహిళలు, పిల్లలవిగా భావిస్తున్న ఆరు మృతదేహాలు మణిపుర్ సరిహద్దులోని నది నుండి స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన నివేదికల తర్వాత రాజధాని ఇంఫాల్ లోయలో భయంకర వాతావరణం నెలకొంది. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి, వాహనాలను తగుల బెట్టి, పలువురు ఎమ్మెల్యేల నివాసాలపైనా, సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం పైనా దాడి చేశారు. దీంతో గిరిజనేతర మెయితీల ఆధిపత్యంలో ఉన్న లోయలోని ఏడు జిల్లాల్లో ప్రభుత్వం ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. గిరిజన కుకీ– జోలు ఎక్కువగా ఉండే చుట్టుపక్కల కొండలు, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్ జిల్లాలలో కూడా కర్ఫ్యూ విధించారు. ప్రపంచమంతా తిరిగొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ... ఈ క్లిష్ట పరిస్థితు ల్లోనూ మణిపుర్ రాష్ట్రాన్ని సందర్శించి అక్కడ శాంతిని పునరుద్ధరించే పని చేపట్టక పోవడం దిగ్భ్రాంతిని కలిగించే అంశం. ఇరవై నెలలుగా ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్లో హింస రాజుకుంటోంది. 2023 మే 3న రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు దగ్గరగా ఉన్న చురాచాంద్‌పూర్ పట్టణంలో మెయితీ కమ్యూనిటీ– కుకీ తెగ మధ్య హింస చెలరేగింది. తమకు షెడ్యూల్డ్ తెగ హోదా ఇవ్వాలని గిరిజనేతర మెయితీ ప్రజలు డిమాండ్ చేయడం ఘర్షణలకు తక్షణ అని అంటున్నారు. కుకీలను మెయితీలు బయటి వ్యక్తులుగా, మాదకద్రవ్యాల వ్యాపారులుగా చూస్తారు. తమకు ఎస్టీ హోదా లేనందువల్ల తాము కుకీ ప్రాంతాల్లో భూములు కొనలేక పోతున్నట్లు వారు భావిస్తారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పరిపాలనా స్థానాలను కలిగి ఉన్న మెయితీలే తమ అవకాశాలన్నింటినీ కొట్టేస్తున్నట్లు కుకీలు భావి స్తారు. కొన్నేళ్లుగా రెండు వర్గాల మధ్య అనేక గొడవలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ప్రస్తుత అల్లర్లు ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి, విద్యలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.మణిపుర్ జనాభాలో 53 శాతం ఉన్న మెయితీ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ ఒక్కటే ప్రస్తుత హింసకు కారణం అని చెప్పలేం. అంతర్లీనంగా ఒకరి పట్ల ఒకరికి ఉన్న కోపం, చాలా కాలంగా వారి మధ్య కొనసాగుతున్న వైరుధ్యం లాంటివి అన్నీ కలిసి నేటి దుఃస్థితికి దారితీశాయి. రాష్ట్రంలోని కొండ ప్రాంతాలలోని రక్షిత అడవులపై ప్రభుత్వ నిర్బంధం, తాము హింసకు గురవుతున్నామన్న భావన కుకీలలో అసంతృప్తిని కలిగిస్తోంది. మయన్మార్ నుంచి అక్రమంగా భారత్‌లో ప్రవేశించిన కుకీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. సరిహద్దు ఆవల, మణిపూర్‌లో తాము నివసించే ప్రాంతాలను కలిపి ప్రత్యేక కుకీ ల్యాండ్ కావాలనే వేర్పాటువాదులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం కూడా మరో కారణం. అలాగే కుకీలు మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారని పేర్కొంటూ కుకీ ప్రజలందరినీ ‘డ్రగ్ లార్డ్స్’ అని ప్రస్తావించడాన్ని వారు నిరసిస్తున్నారు. గిరిజన గ్రామాలలో జనాభా పెరగడంతో, వారు తమ పూర్వీకుల హక్కుగా భావించే చుట్టుపక్కల అటవీ ప్రాంతాలకు వ్యాపిస్తున్నారు. దీన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇదీ కుకీల్లో ఆగ్రహానికి హేతువే.కొత్త గ్రామాలను ఎలా గుర్తించాలనే అంశంపై ప్రభుత్వానికి అసలు ఒక విధానం లేదు. అలాగే మణి పుర్లో పారదర్శకమైన అటవీ విధానం లేదు. దీంతో పాలక బీజేపీ కూటమిలోనూ దుమారం రేగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మరింత విషమించకుండా కేంద్రం మరింత వివేకంతో వ్యవహరించాలి.– డా‘‘ ముచ్చుకోట సురేష్ బాబుప్రజా సైన్స్ వేదిక అధ్యక్షుడు ‘ 99899 88912 -
త్వరలో భారత్-చైనాల మధ్య విమానాల రాకపోకలు పునఃప్రారంభం?
బ్రెసిలియా : భారత్-చైనాల మధ్య శాంతియుత వాతావరణం నెలకునే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జీ20 సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.భారత్-చైనాల మధ్య శాంతి కుదిరేలా భారత విదేశాంగ మంత్రి జై శంకర్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యిల భేటీ జరిగింది. ఈ భేటీలో రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలను పునరుద్ధరించడంతోపాటు కైలాష్ మానసరోవర్ యాత్ర పునఃప్రారంభంపై ఇరు దేశాలు చర్చించినట్లు సమాచారం.తూర్పు లద్దాఖ్‌లోని డెమ్చోక్ సెక్టార్లో భారత బలగాల పెట్రోలింగ్ ప్రారంభం తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన మొదటి ఉన్నత స్థాయి సమావేశం. ఈ సమావేశం శాంతి, ప్రశాంతత పరిరక్షణకు దోహదపడిందని మంత్రులు పేర్కొన్నారు.కాగా,2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. కానీ ఆ సంఖ్యను వెల్లడించలేదు. ఈ పరిస్థితుల వల్ల ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. వాటిని నివారించేందుకు భారత్-చైనా మధ్య అనేక చర్యలు జరిగాయి. నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇటీవల ఇరు దేశాలు కీలక గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
G20 సదస్సులో బిజీ బిజీగా PM మోడీ
-
జీ20 సదస్సులో ఫొటో.. బైడెన్, ట్రూడో మిస్సింగ్!
ప్రపంచ దేశాధినేతలు కలిసి దిగిన ఓ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో జరిగిన జీ 20 శిఖరాగ్ర సదస్సులో ఈ పరిమాణం వెలుగుచూసింది. ఈ సమ్మిట్‌లో భాగంగా సోమవారం దేశాధినేతలంతా కలిసి ఓ ఫోటో దిగారు. ఇందులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తదితర నేతలంతా ఉన్నారు. వారందరూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు.అయితే ఈ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు లేరు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌కు చివరి జీ20 సదస్సు అయినందున ఆయన లేకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. మరోవైపు ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరు కావడం గమనార్హం. తాజాగా ఈ ఫోటోపై అమెరికా అధికారులు స్పందిస్తూ.. తీవ్రంగా త ప్పుబట్టారు. ఫోటో దిగే సమయంలో బైడెన్.. కెనడా ప్రధాని జస్టిన్ట్రూడోతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. చర్చలు ముగించుకొని వస్తుండగా బైడెన్ రాకముందే తొందరగా ఫోటో తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల నాయకులంతా రాకముందే పలువురు దేశాధినేతలు ఫొటో దిగేశారని, అందుకే అందరూ నేతలు అక్కడ లేరని చెప్పారు. కాగాఫోటోలో మిస్ అయిన బైడెన్, ట్రూడో, మెలోనీలు తరువాత ప్రత్యేకంగా ఫొటో దిగారు.ఇదిలా ఉండగా మరో రెండు నెలల మాత్రం అమెరికా అధ్యక్ష హోదాలో కొనసాగనున్నారు బైడెన్.. యూఎస్ ప్రెసిడెంట్‌గా ఆయనకు ఇదే చివరి జీ 20 సదస్సు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. -
జీ-20: మోదీ మెలోని భేటీ...
రియో డీ జెనీరో: బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో జరుగుతున్న జీ-20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంతోపాటు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చించారు.సమావేశం అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో ఆయన పలు ఫోటోలను పంచుకుంటూ ఇలా రాశారు.. రియో డీ జెనీరో జీ- 20 సమ్మిట్ సందర్భంగా ప్రధాని జార్జియా మెలోనిని కలవడం చాలా ఆనందంగా ఉంది. మా చర్చలో ఇరు దేశాల రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతికత తదితర అంశాలలో సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. దీనితో పాటు భారత్, ఇటలీ మధ్య స్నేహం గురించి కూడా చర్చించా మన్నారు. #WATCH | Prime Minister Narendra Modi and Italian Prime Minister Giorgia Meloni hold bilateral meeting on the sidelines of the 19th G-20 summit, Rio de Janeiro, Brazil(Source - DD News) pic.twitter.com/mVjOKkuJ4O— ANI (@ANI) November 18, 2024జీ-20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్‌తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు ఇండోనేషియా, పోర్చుగల్ నేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, రక్షణ వంటి రంగాల్లో ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ప్రధాని మోదీ చర్చించారు.Glad to have met Prime Minister Giorgia Meloni on the sidelines of the Rio de Janeiro G20 Summit. Our talks centred around deepening ties in defence, security, trade and technology. We also talked about how to boost cooperation in culture, education and other such areas.… pic.twitter.com/BOUbBMeEov— Narendra Modi (@narendramodi) November 18, 2024భారత్-ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరింపజేస్తామని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ట్విట్టర్లో ఆయన ఇలా పేర్కొన్నారు. ‘ఇండియా-ఇండోనేషియా: 75 సంవత్సరాల స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నాయి. జీ 20 బ్రెజిల్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటోతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు’ అని తెలిపారు.ఇది కూడా చదవండి: భారత్ దౌత్య విజయం.. ఏకాభిప్రాయం అమలుకు చైనా సిద్ధం -
భారత్ దౌత్య విజయం.. ఏకాభిప్రాయం అమలుకు చైనా సిద్ధం
బీజింగ్: రష్యాలో ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన భేటీలో ముఖ్యమైన అంశాలపై కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా ప్రకటించింది. బ్రెజిల్లో జరగబోయే జీ20 సదస్సులో మోదీ, జిన్‌పింగ్ భేటీ కానున్న నేపధ్యంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ షియాన్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారన్నారు.ఈ సందర్భంగా చర్చించిన ముఖ్యమైన అంశాలపై ఇరుదేశాల నాయకుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేయడానికి చైనా సిద్ధంగా ఉన్నదన్నారు. అలాగే ఇరు దేశాల మధ్య చర్చలు, సహకారాన్ని మెరుగుపరచడానికి, పరస్పర నమ్మకాన్ని పెంపొందించడానికి భారతదేశంతో కలిసి పని చేయడానికి చైనా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అయితే ఇరు దేశాల నేతలు, అధికారుల మధ్య త్వరలో జరగబోయే సమావేశపు షెడ్యూల్‌పై తన దగ్గర ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదని షియాన్ చెప్పారు.గత నెలలో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో సందర్భంగా జరిగిన సమావేశంలో తూర్పు లఢాక్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి మిగిలిన స్టాండ్ ఆఫ్ పాయింట్ల నుండి దళాలను ఉపసంహరించుకోవడంపై మోదీ, జిన్‌పింగ్ మధ్య చర్చ జరిగింది. విభేదాలు, వివాదాలను సక్రమంగా పరిష్కరించుకోవడంతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతకు విఘాతం కలగకుండా చూడాల్సిన అవసరాన్ని మోదీ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం ఇరు దేశాల సంబంధాలకు ప్రాతిపదికగా ఉండాలని ఆయన అన్నారు. అదే సమయంలో చైనా, భారత్‌లు వ్యూహాత్మక అవగాహనను కొనసాగించాలని, ఇరు దేశాలు సామరస్యంగా జీవించడానికి, కలిసి అభివృద్ధి చెందడానికి కలిసి పనిచేయాలని జిన్‌పింగ్ అన్నారు.ఇది కూడా చదవండి: Maharashtra: అనిల్ దేశ్‌ముఖ్ కారుపై రాళ్ల దాడి.. మాజీ మంత్రి తలకు గాయాలు -
మోదీజీ.. సవాల్ చేస్తున్నా కమిటీని పంపండి!: సీఎం రేవంత్
సాక్షి,ముంబై: పదకొండేళ్ల పాలన తర్వాత కూడా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఒక్క విజయగాథ లేదని సీఎం రేవంత్ విమర్శించారు. వారికి చెప్పుకోవడానికి ఏమీ లేకనే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన రేవంత్ సోమవారం పుణెలో మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రధాని అయ్యాక కార్పొరేట్ కంపెనీలకు రూ.16 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారని.. అదే తాము రైతులకు రుణమాఫీ చేస్తే బీజేపీ నేతలు ప్రశ్నించడం ఏమిటని నిలదీశారు.హామీలు అమలు చేశాం.. వచ్చి చూడండితెలంగాణలో కాంగ్రెస్ హామీల అమలు విషయంలో ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘‘ఇచ్చిన హామీలన్నింటిలో విఫలమైన ప్రధాని నరేంద్ర మోదీ.. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లలోని కాంగ్రెస్ ప్రభుత్వాల హామీలపై ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసింది. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో నేను మోదీకి సవాల్ విసురుతున్నాను. కేంద్ర మంత్రి లేదా కేంద్ర ఉన్నతాధికారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి తెలంగాణకు పంపండి. మేం ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తున్న వివరాలన్నీ వారికి ఇస్తాం. అవసరమైతే వారు హైదరాబాద్‌కు వచ్చేందుకు విమాన ఖర్చులు కూడా మేమే భరిస్తాం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది. మంగళవారం బీజేపీ నాయకులు హైదరాబాద్‌కు వస్తే సచివాలయంలో కూర్చోబెట్టి నేను చెప్పిన ప్రతి అంశంపై వివరాలు అందజేస్తా. అందులో ఏవైనా తప్పులు ఉంటే క్షమాపణలు చెబుతా..’’ అని చెప్పారు. తమ గ్యారంటీలన్ని ఖచ్చితమైనవని, మోదీలా విఫల హామీలు కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని.. భారతీయ జూటా (అబద్ధాల) పార్టీ అని అభివర్ణించారు. -
గ్లోబల్ సౌత్‌ను పట్టించుకోవాలి
రియో డిజనిరో: ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల కమ్ముకున్న యుద్ధ మేఘాలు దక్షిణార్ధ గోళ (గ్లోబల్ సౌత్) దేశాలను అతలాకుతలం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫలితంగా ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభాలతో అవి సతమతమవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. వాటిని తక్షణం పరిష్కరించడంపై జీ20 కూటమి ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. ‘‘గ్లోబల్ సౌత్ సవాళ్లు, అవసరాలకు ముందుగా పెద్దపీట వేయాలి. అప్పుడు మాత్రమే జీ20 జరిపే ఏ చర్చలైనా, తీసుకునే ఏ నిర్ణయాలైనా ఫలవంతం అవుతాయి’’ అని స్పష్టం చేశారు.రెండు రోజుల జీ20 శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో సోమవారం మొదలైంది. తొలి రోజు సదస్సును ఉద్దేశించి ‘ఆకలి, పేదరికంపై పోరు–సోషల్ ఇంక్లూజన్’ అంశంపై మోదీ ప్రసంగించారు. గ్లోబల్ సౌత్ సమస్యలు, సవాళ్లను ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ గతేడాది ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో పలు నిర్ణయాలు తీసుకున్న వైనాన్ని గుర్తు చేశారు. ‘‘గ్లోబల్ సౌత్‌కు ప్రాధాన్యం పెంచే చర్యల్లో భాగంగా ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కలి్పస్తూ ఢిల్లీ శిఖరాగ్రం నిర్ణయం తీసుకుంది.అన్ని దేశాలనూ కలుపుకునిపోయేలా సుస్ధిరాభివృద్ధి లక్ష్యాలకు ప్రాథమ్యమివ్వాలని నిర్ణయించింది. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత’ అన్నదే మూలమంత్రంగా సదస్సు జరిగింది. ఆ ఒరవడిని మరింతగా కొనసాగించాలి’’ అని సదస్సులో పాల్గొన్న పలువురు దేశాధినేతలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి మొదలుకుని పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమన్న భారత వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత్ తీరు ఆచరణీయం పేదరికం, ఆకలి సమస్యలపై పోరులో భారత్ ముందుందని మోదీ వివరించారు. ‘‘ప్రజలందరినీ కలుపుకుని పోవడమే ప్రధాన లక్ష్యంగా మా ప్రభుత్వ పదేళ్ల పాలన సాగింది. 80 కోట్లకు పై చిలుకు ప్రజలకు ఆహార ధాన్యాలను ఉచితంగా అందజేస్తున్నాం. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆరోగ్య బీమా, పెద్ద పంటల బీమా, పంట రుణాల పథకాలు అమలు చేస్తున్నాం. తద్వారా 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయట పడ్డారు’’ అని వివరించారు. గ్లోబల్ సౌత్‌తో పాటు ఇతర దేశాలు కూడా వీటిని అనుసరిస్తే అద్భుత ఫలితాలుంటాయన్నారు. పేదరికం, ఆకలిపై పోరాటానికి అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలని జీ20 శిఖరాగ్రంలో తొలి రోజు నిర్ణయం జరిగింది.బైడెన్‌తో మోదీ భేటీజీ20 శిఖరాగ్రం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ సోమవారం సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం వారి మధ్య ఇది తొలి భేటీ. వారిద్దరూ పలు ద్వైపాక్షిక అంశాలు మాట్లాడుకున్నట్టు సమాచారం.ఘనస్వాగతం జీ20 భేటీ కోసం బ్రెజిల్ వెళ్లిన మోదీకి ఘనస్వాగతం లభించింది. ప్రవాస భారతీయుల సంస్కృత శ్లోకాలాపన, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోని యో గుటెరస్, స్పెయిన్ అధినేత పెడ్రో శాంచెజ్, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తదితరులతో ప్రధాని భేటీ అయ్యారు. -
ఏక్ హై తో మోదీ, అదానీ సేఫ్ హై: రాహుల్ గాంధీ
ముంబై/రాంచీ: ‘ఏక్ హై తో సేఫ్ హై’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సేఫ్ అంటే సురక్షితంతోపాటు బీరువా అనే అర్థం కూడా ఉంది. మోదీ పిలుపునకు, ముంబైలో అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టిన ధారావి అభివృద్ధి పథకాన్ని ముడిపెడుతూ విమర్శలు గుప్పించారు. రాహుల్ సోమవారం ముంబైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వెంట ఒక సేఫ్(చిన్నపాటి బీరువా) కూడా తీసుకొచ్చారు. అందులోంచి రెండు పోస్టర్లు బయటకు లాగారు.ఒక పోస్టర్‌పై నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీ ఫోటో, మరో పోస్టర్‌పై ధారావి మ్యాప్ ఉంది. మోదీ, అదానీ ఫోటోపై ‘ఏక్ హై తో సేఫ్ హై’ అనే పిలుపును ముద్రించారు. కలిసి ఉంటే సురక్షితంగా ఉంటామని మోదీ చెబుతున్నారని, వాస్తవానికి సురక్షితంగా ఉన్నది ఎవరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మోదీ, అదానీ కలిసికట్టుగా ముందుకుసాగుతూ, ఒకరికొకరు చక్కగా సహకరించుకుంటూ సురక్షితంగా ఉంటున్నారని మండిపడ్డారు. ధారావి అభివృద్ధి ప్రాజెక్టు పేరిట రూ.లక్ష కోట్ల విలువైన భూమిని అదానీకి అప్పగించారని మండిపడ్డారు. కేవలం అదానీ ప్రయోజనాల కాపాడేలా ధారావి ప్రాజెక్టు టెండర్లు రూపొందించారని విమర్శించారు.ధారావి ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి బడా పారిశ్రామికవేత్తల కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తోందని ధ్వజమెత్తారు. బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. ఇతర పారిశ్రామికవేత్తలకు దక్కిన ప్రాజెక్టులను నరేంద్ర మోదీకి సన్నిహితులైన బిలియనీర్లకు అప్పగించేలా కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. దేశంలో ఓడరేవులు, విమానాశ్రయాలతోపాటు దేశ సంపదను కేవలం ఒకే ఒక్క వ్యక్తికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. మోదీ, అమిత్ షా, అదానీ కలిసుంటారు ‘‘ప్రధాని మోదీ ప్రవచిస్తున్న ‘ఏక్ హై తో సేఫ్ హై’కి అసలు అర్థం నేను చెబుతా. నరేంద్ర మోదీ, అమిత్ షా, గౌతమ్ అదానీ కలిసి ఉంటే సురక్షితంగా ఉంటారు. ఆ ముగ్గురూ కలిసే ఉంటున్నారు. దేశ సంపద మొత్తం అదానీ, అంబానీ లాంటి బడా బాబుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. టెండర్లలో పారదర్శకతకు పాతరవేసి, ప్రాజెక్టులను వారికి కట్టబెడుతున్నారు’’ అని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఆయన సోమవారం జార్ఖండ్ రాజధాని రాంచీలో మీడియాతో మాట్లాడారు. మణిపూర్ గత ఏడాదిన్నర కాలంగా మండిపోతున్నా ప్రధాని మోదీ మొద్దునిద్ర వీడడం లేదని అన్నారు. హింసాకాండలో అమాయక ప్రజలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకంగా కాదని రాహుల్ తేల్చిచెప్పారు. రిజర్వేషన్లను మరింత పెంచాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. -
బిలియనీర్లు, పేదలకు మధ్య పోరే ఈ ఎన్నికలు: రాహుల్
ముంబై: మహారాష్ట్ర ఎన్నికలు ఇద్దరు బిలియనీర్లు, పేదల మధ్య పోరుగా పేర్కొన్నారు కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ముంబైలోని భూమి అంతా తమ చేతుల్లోకి వెళ్లాలని ఆ బిలియనీర్లు కోరుకుంటున్నారని అంబానీ, అదానీలను పరోక్షంగా ఉద్ధేశిస్తూ విమర్శించారు. ఈ మేరకు ముంబైలో సోమవారం రాహుల్ మాట్లాడుతూ.. ఫాక్స్‌కాన్, ఎయిర్‌బస్ సహా రూ.7 లక్షల కోట్ల ప్రాజెక్టులను మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలించారని మండిపడ్డారు. దీని వల్ల మహారాష్ట్రలో యువత ఉద్యోగాలు కోల్పోయారని ఆయన అన్నారు.‘మహారాష్ట్ర రైతులు, పేదలు, నిరుద్యోగులు, యువతకు సహాయం అవసరం. మహా వికాస్ అఘాడి ప్రభుత్వం మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలో ఉచితంగా రూ.3000 జమ చేస్తాం, మహిళలకు, రైతులకు బస్సు ప్రయాణం, రూ.3 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. సోయాబీన్‌కు క్వింటాల్‌కు రూ.7వేలు మద్దతు ధర ఇస్తాం. తెలంగాణ, కర్ణాటకలో మాదిరి మహారాష్ట్రలో కూడా కులగణన పూర్తి చేస్తాం. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించి, దేశంలో కుల గణన నిర్వహిస్తాం’ అని తెలిపారు.ఇక ఇటీవల ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ‘ఏక్ హై తో సేఫ్ హై’ (ఐక్యంగా ఉంటేనే మనమంతా సురక్షితంగా ఉంటాం) అని ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘‘పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే మోదీ సర్కార్ పని చేస్తోంది. పేదల గురించి వారికి ఎలాంటి ఆలోచన లేదు. ధారావిలోని నివాసితుల ప్రయోజనాలను విస్మరించారు. మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి అధికారంలోకి వచ్చాక అక్కడి ప్రజలకు భూములను తిరిగి అప్పగిస్తుంది’’ అని రాహుల్ భరోసానిచ్చారు.