Chiefminister Chandrababu Naidu
-
‘అసమర్థ పాలన కప్పిపుచ్చుకునేందుకే గిమ్మిక్కులు
శ్రీకాకుళం సిటీ: ఆడబిడ్డలకు రక్షణగా కదులుదాం.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాలీలు నిర్వహించడం తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికేనని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి శాంతి పేర్కొన్నారు. మంగళవా రం ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశా రు. నాలుగేళ్ల పాలనలో మహిళలపై జరిగిన అత్యాచారాలు, అఘాయిత్యాలపై మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలి పారు. అయినా ఏ ఒక్కరోజూ ప్రభుత్వం స్పందించలేదని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు, అధికారులపై దౌర్జన్యాలు అధికమయ్యాయని పేర్కొన్నారు. టీడీపీ నేరపూరిత నిర్లక్ష్యాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఎండగడుతున్నారని తెలిపారు. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు టీడీపీకి చెందిన న లుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు అఫిడవిట్లు ఆధారంగా ఏడీఆర్(జాతీయ ఎన్నికల పరి శీలన స్వచ్ఛంద సంస్థ) నివేదిక ఇచ్చిందని తెలిపారు. దేశవ్యాప్తంగా 45 మంది ఎమ్మెల్యేల్లో రాష్ట్రానికి చెందిన ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండడం వారికి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోందని పేర్కొన్నారు. టీడీపీ వారిని రక్షించుకునేందుకు సీఎం దొడ్డిదారిన జీఓలు విడుదల చేశారని ఆరోపించా రు. ఈ గిమ్మిక్కులను ప్రజలు నమ్మరని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన విదంగా చంద్రబా బుకు బుద్ధి చెబుతారని తెలిపారు. -
దళితుల మనోభావాలకు సమాధి..!
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఓ గ్రామంలోని దళితులకు తీరని మనోవేదనను మిగుల్చుతోంది. స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఉన్న రోడ్డును అధికార పార్టీకి చెందిన నేతకు పట్టాగా రాసి ఇచ్చారు. సీఎం రాక కోసం రాత్రికి రాత్రే శ్మశానాన్ని ఆక్రమించి, శవాలను సైతం పెకలించి తారురోడ్డు వేస్తున్నారు. మనోభావాలు దెబ్బతిన్న దళితులు ఈ నెల 4న సీఎం పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు. తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీలో పట్టణ నిరుపేదల హౌసింగ్ పథకం కింద దాదాపు 1,724 ప్లాట్లను జీ+3 పద్ధతిలో నిర్మించారు. వీటిని ఈ నెల 4న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. దీనికి సర్వే నెం.363లోనే రోడ్డును చూపించారు. ఈ ప్లాట్లకే కాకుండా దళితుల పొలాలకు, పైన ఉన్న దాదాపు 50 ఎకరాల్లో వేసిన 10 వెంచర్లకు సైతం ఈ రోడ్డునే చూపించారు. మట్టిగా ఉన్న ఈ రోడ్డును తారురోడ్డుగా మార్చేందుకు పంచాయతీరాజ్ అధికారులు మంగళవారం ప్రయత్నించారు. అయితే ఈ రోడ్డును తిరుపతికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పట్టాగా మార్చుకున్నాడు. తమ పట్టా భూమిలో రోడ్డు ఎలా వేస్తారని అడ్డుకున్నారు. అందేంటి.. 60 ఏళ్లకు ముందు నుంచే రోడ్డుగా ఉంటే పట్టాగా ఎప్పుడు మార్చారు.. అంటూ అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. అధికార పార్టీ నేతలు హైదరాబాదు స్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు వెనకడుగు వేసినట్లు సమాచారం. దళితుల శ్మశానం ఆక్రమణ... ఈ రోడ్డుకు అనుకునే సర్వే నెం.360లో దాదాపు 25 సెంట్లలో తనపల్లి దళితవాడకు శ్మశానం ఉంది. దాదాపు 100 ఏళ్లకు పైనుంచే ఎవరైనా చనిపోతే ఇక్కడే ఖననం చేసేవారు. పాత రోడ్డు స్థలానికి సంబంధించి టీడీపీ నాయకుడికి పట్టా ఉందని చెప్పడంతో, దళితుల శ్మశానం నుంచి రోడ్డు వేసేందుకు అధికారులు ప్రయత్నించారు. దానిని తనపల్లి దళితులు అడ్డుకున్నారు. పోలీసులతో బెదిరించి, వారిని పక్కకు తప్పించి శ్మశానంలో మూడు అడుగుల మేర మట్టిని తీశారు. ఎముకలు, పుర్రెలు బయటపడ్డాయి. వాటిని తొలగించి రాత్రికి రాత్రే కొత్తగా తారురోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. దీంతో దళితుల శ్మశానం సగానికి పైగా కనుమరుగైంది. మండిపడుతున్న దళిత సంఘాలు శ్మశానాన్ని ఆక్రమించి తారురోడ్డు వేయడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి కోసం దళితుల శవాలపై రోడ్డును వేస్తారా? అని తనపల్లి మాజీ సర్పంచ్ నాగరాజు నిలదీశారు. అధికార పార్టీ నేత కోసమే ఇలా ఎప్పటి నుంచో ఉన్న రోడ్డును పట్టాగా మార్చారని, దళితుల శ్మశానాన్ని ఆక్రమించి పూర్వీకుల జ్ఞాపకాలను సైతం చెరిపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశానాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ముఖ్యమంత్రినే నిలదీస్తామని హెచ్చరించారు. -
టీడీపీ పాలన కుంభకోణాలమయం
ఒంగోలు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం కుంభకోణాల్లో కూరుకుపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. స్థానిక సుందరయ్య భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన మూడున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో ఉపాధి హామీలో కుంభకోణం, బియ్యంలో కుంభకోణం, ఇసుకలో కుంభకోణం, చివరకు కార్పొరేట్ కాలేజీల్లో కుంభకోణం ఇలా వరుసగా ప్రతిదానిలో కుంభకోణాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఉచితంగా లభించే ఇసుకను కూడా అధికారపార్టీ నేతలు వదిలిపెట్టడం లేదన్నారు. రేషన్ బియ్యాన్ని పెద్దఎత్తున పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు డబ్బులు చెల్లించకుండా వారి కడుపులు కొడుతోందన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ కింద రూ.1600కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఒక్క విశాఖ జిల్లాలో రూ.406 కోట్ల పనులు చేస్తే కేవలం రూ.75 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. విశాఖ జిల్లాలో పెద్దఎత్తున అవినీతి జరిగిందన్నారు. రేవంత్‌రెడ్డి వాఖ్యలపై సీఎం నోరుమెదపరే.. ‘రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి తెలంగాణ ప్రభుత్వం రూ.2వేల కోట్ల లబ్ధిచేకూర్చే కాంట్రాక్టు ఇచ్చింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖామంత్రి పరిటాల సునీత కుమారుడికి, అధికారపార్టీకి చెందిన మరో నాయకుడు పయ్యావుల కేశవులు అల్లుడుకు తెలంగాణ ప్రభుత్వం మద్యం, పరిశ్రమలకు సంబంధించిన లైసెన్స్‌లు ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం టీఆర్ఎస్తో అంటకాగుతోంది’ అని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి చెందిన రేవంత్‌రెడ్డి ఘాటైన వ్యాఖ్యలుచేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోరు మెదపడం లేదన్నారు రిలయన్స్‌కు రూ. 3వేల కోట్ల బిజినెస్ రాష్ట్రంలోని రేషన్‌షాపులను రిలయన్స్ కంపెనీకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైందని మధు గుర్తుచేశారు. 26 వేల రేషన్‌దుకాణాలను రిలయన్స్ విలేజ్ మాల్స్ పేరుతో ఆ కంపెనీకి అప్పగించి ఏటా రూ.3వేల కోట్ల బిజినెస్ ఇచ్చేందుకు సిద్ధమైందన్నారు. రేషన్ దుకాణాలను రిలయన్స్‌కు అప్పగిస్తే ప్రజాపంపిణీ వ్యవస్థ కుప్పకూలుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీల వల్ల ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న చిన్న వ్యాపారుల పరిస్థితి రిలయన్స్ విలేజ్ మాల్స్ రాకతో కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ నవంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు అన్ని రేషన్ షాపుల వద్ద ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా వాటా 70టీఎంసీలు రావాలి – పూనాటి జిల్లాకు 70 టీఎంసీల వాటా నీరు రావాల్సి ఉన్నా ప్రభుత్వం విడుదల చేయడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు విమర్శించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉన్నా..జిల్లాకు మాత్రం సరిగా ఇవ్వడం లేదన్నారు. సాగర్ జలాలపై ఆధారపడి జిల్లాలో 4 లక్షల ఎకరాల వరికి అవకాశం ఉందని, ప్రభుత్వం అందుకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 6వ తేదీ లోగా ప్రకటన చేయకుంటే అదేరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా డెంగీ వల్ల 400 నుంచి 500 మంది చనిపోయారన్నారు. డెంగీ మరణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు జాలా అంజయ్య పాల్గొన్నారు. -
రుణమాఫీపై బాబుది పబ్లిసిటీ స్టంట్
-
రుణమాఫీపై బాబుది పబ్లిసిటీ స్టంట్
సాక్షి, గుంటూరు : రుణమాఫీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రైతులకు వేల కోట్లలో నష్టం కలిగించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతుల రుణమాఫీపై చంద్రబాబు వ్యాఖ్యలు పబ్లిసిటీ స్టంటేనని తేల్చేశారు. మూడో విడదల నిధుల విడుదల గురించి చంద్రబాబు ఏదో ఘన కార్యం చేశారని చెబుతున్నారు. సక్రమంగా చేసి ఉంటే రుణాలు తగ్గాలి. కానీ, ఎందుకు పెరిగాయి? అని అంబటి ప్రశ్నించారు. 87 వేల కోట్లున్న రుణాలు.. ప్రస్తుతం లక్ష కోట్లకు చేరాయని ఆయన చెప్పారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం 2014-15 సంవత్సరానికిగానూ ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చిన 2,365 కోట్లను ఇప్పటి వరకు రైతులకు ఎందుకు ఇవ్వలేదంటూ చంద్రబాబును నిలదీశారు. సున్నావడ్డీ, పావలా వడ్డీ రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టడం ద్వారా చంద్రబాబు 66, 365 కోట్లు నష్టం కలిగించారని అంబటి పేర్కొన్నారు. -
సీఎం చంద్రబాబుకు శివాని ఆహ్వానం
విజయవాడ స్పోర్ట్స్ : విలువిద్యలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, ఏషియా బుక్ ఆఫ్ రికార్డు, వరల్డ్ రికార్డు నెలకొల్పేందుకు ఈ నెల 10వ తేదీ చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీలో తాను నిర్వహించే ప్రదర్శనకు ఆర్చరీ కిడ్ డాలీ శివాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించింది. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో తన తల్లిదండ్రులతో కలసి సీఎం చంద్రబాబును కలిసింది. డాలీ శివాని ప్రదర్శించబోయే ఈవెంట్లను తండ్రి చెరుకూరి సత్యనారాయణ సీఎంకు వివరించారు. ఆసక్తిగా విన్న చంద్రబాబు సమయాన్ని బట్టి తాను కూడా కార్యక్రమానికి వచ్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాలీ శివానికి ఆల్ ది బెస్ట్ చెప్పి రికార్డులు సృష్టించాలని ఆశీర్వదించారు. శివానికి అవసరమైన సహకారం అందజేయమని సీఎం అదనపు కార్యదర్శి రాజమౌళికి సూచిం చారు. సీఎంను కలసినవారిలో శివాని తండ్రి చెరుకూరి సత్యనారాయణ, తల్లి కృష్ణకుమారి, ఆర్చరీ అసోసియేషన్ ప్రతినిధి జి.ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఒక్క రోజు ఆఫర్!
ఆర్డినరీ పాసులతో మెట్రో బస్సుల్లో ప్రయాణం సీఎం సభకు బస్సులు పంపుతున్న ఫలితం సాక్షి, విశాఖపట్నం : ప్రయాణికులకు ఆర్టీసీ ఒక్కరోజు ఆఫర్ ప్రకటించింది. బుధవారం ఆర్డినరీ బస్‌పాస్‌లున్న వారు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లోనూ ప్రయాణించేందుకు అనుమతించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలోని కశింకోట మండలం గొబ్బూరులో జరిగే జలసిరి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అక్కడ జరిగే సభకు జనాన్ని తరలించడానికి సుమారు 200 ఆర్టీసీ బస్సులను తీసుకున్నారు. వీటిలో వంద బస్సులు విశాఖ రీజియన్ నుంచి పంపుతున్నారు. అందువల్ల నగరంలో బస్‌పాసులున్న ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మెట్రో బస్సుల్లో ఎక్కినా అదనపు కాంబీ టిక్కెట్టు చార్జీ చెల్లించనవసరం లేకుండా అనుమతించనున్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జి. సుధేష్‌కుమార్ కోరారు. -
అన్యాయం జరిగితే బాబు సంబరాలా?
వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో అంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఏపీకి ఏమిచ్చారని సంబరాలు చెసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రి ఎక్కడా ప్రత్యేక ప్యాకేజీ అనే పదాన్ని వాడలేదని, స్పెషల్ అసిస్టెన్స్ మాత్రమే అన్నారని గుర్తుచేశారు. చంద్రబాబు తీరు మాత్రం ఆఖరి బంతికి పాకిస్తాన్ గెలిస్తే భారతీయుడు సంబరాలు జరుపుకున్నట్లుగా ఉందని మండిపడ్డారు. ‘ఓటుకు కోట్లు’ కేసు తర్వాత రాష్ట్రానికి ఏ అన్యాయం జరిగినా న్యాయం జరిగినట్లుగానే చంద్రబాబు భావిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అని స్పష్టం చేశారు. ప్రత్యేక ప్రత్యేక హోదా కోసం ముందుండి పోరాడాల్సిన చంద్రబాబు వెనక ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన ఆరోపించారు. నారాకాసురుడిపై పోరాటం చేస్తే తప్ప ప్రత్యేక హోదా సాధించుకోలేమని స్పష్టం చేశారు. -
ఏపీకి చైనా పెట్టుబడులు
-
ఏపీకి చైనా పెట్టుబడులు
ముఖ్యమంత్రికి హామీ ఇచ్చిన మెకెన్సీ గ్లోబల్ సంస్థ దావోస్ విశేషాలను విడుదల చేసిన సీఎం కార్యాలయం సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు చైనా పెట్టుబడుల రాకను సులభతరం చేసే బాధ్యతను తాను తీసుకుంటానని మెకెన్సీ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ సంచాలకుడు జోనాథన్ ఓజల్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం చంద్రబాబు పలు సంస్థల ప్రతినిధులతో జరిపిన సమావేశాల వివరాల ను బుధవారం మీడియాకు విడుదల చేసింది. సీఎంతో జరిగిన సమావేశంలో గ్లోబల్ మెకెన్సీ సంచాలకుడు జోనాథన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక వనరులు, పెట్టుబడులు సమకూర్చడంలో మెకెన్సీ గ్లోబల్ ముఖ్య భూమిక పోషించాలని సీఎం కోరారు. జేపీ మోర్గాన్ ఛేస్ వాణిజ్య వ్యూహ విభాగ అధిపతి మాక్స్ న్యూకిర్షెన్‌తో జరిగిన భేటీలో రాష్ట్రంలో ని సహజ వనరులు, పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు.ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ సపోర్టింగ్ షీట్లు తయారు చేసే టీజిన్ లిమిటెడ్ సంస్థ అధ్యక్షుడు జున్ సుజుకీతే సమావేశమై ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవాలని కోరారు. తిరుపతి అభివృద్ధిలో కుమియుమి! కుమియుమి అస్సెట్స్ కంపెనీ అధ్యక్షుడు యసుయో యమజకితో సమావేశమై తిరుపతి నగరం అభివృద్ధిలో పాలుపంచుకోవాలని సీఎం కోరారు. అందుకు సమ్మతించిన యసుయో ఇప్పటికే వారణాసి నగరాభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నామని తెలిపారు. భారత్‌లో తాము ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జనరల్ అట్లాంటిక్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ నాయక్ తెలిపారు. అమరావతి నుంచి జాతీయ, అంతర్జాతీయ ఎయిర్ కనెక్టివిటీపై స్పైస్ జెట్ ఛైర్మన్ అజయ్‌సింగ్‌తో జరిగిన సమావేశంలో చర్చించారు. సిస్కో ఛైర్మన్ జాన్‌తో సమావేశమై దావోస్ సదస్సు విశేషాలను చర్చించారు. జేబీఐసీ ప్రతినిధి తడాషి మెడా, సుజ్లాన్ గ్రూప్ ప్రతినిధులతోనూ సీఎం సమావేశమయ్యారు. ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ పెట్టుబడులు రాష్ట్రంలో 500 పడకల హాస్పిటల్‌ను ఏర్పాటు చేయడానికి బ్రిటన్‌కు చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఆసక్తి చూపింది.అంతకుముందు కెనడా నవకల్పనలు, శాస్త్ర పరిజ్ఞానం, ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి నవదీప్ బెయిన్ సీఎంను కలిసి కెనడా పర్యటనకు రావల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి చర్చలు జరిపిన వారిలో మిత్సుయి గ్లోబల్ ప్రతినిధి టొమోయికి, నోవార్టిస్ ఫార్మా ప్రెసిడెంట్ డాకట్ర్ ఆండ్రే, జనరల్ ఎలక్ట్రిక్ ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థ ప్రతినిధి లోరెంజోలతో పాటు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులున్నారు. -
నారావారి ఇంట సంక్రాంతి సంబరాలు
-
మీ కంటే మందు బాబులే మేలు
-
మీ కంటే మందు బాబులే మేలు
ఐఏఎస్‌లపై సీఎం వ్యాఖ్యలు శాఖాధిపతులతో సీఎం సమీక్ష మీ మైండ్ సెట్ మారాలంటూ చంద్రబాబు క్లాస్ సాక్షి, అమరావతి: ఎవరూ ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకోరు... మురికివాడల్లో పుడితే మురికి ఆలోచనలే వస్తాయి... కొడుకును కంటానంటే ఏ అత్తయినా వద్దంటుందా?... అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తాజాగా ‘మీ కంటే మందు బాబులే బెటర్’ అంటూ ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఆయన గురువారం సచివాలయంలో వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్, సేవలు వంటి వివిధ రంగాలపై శాఖాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ వంటి అధికారుల నుంచి ఆయా శాఖలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నోట్ల రద్దుపై జరిగిన చర్చలో నగదు రహిత లావాదేవీలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సీఎం వివరించారు. మీలో ఎంతమంది నగదు రహిత వ్యవహారాలు నిర్వహిస్తున్నారో చేతులు ఎత్తాలంటూ ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్నవారిలో 20 శాతం మంది మాత్రమే చేతులు ఎత్తడంతో... ‘మీ కంటే మందు బాబులే బెటర్. చేతిలో నగదు లేనందున కార్డుల వినియోగం నేర్చుకోకపోతే సాయంత్రానికి కిక్ ఎక్కదు. అందుకే వారు నగదు రహిత లావాదేవీలవైపు మళ్లారు. ఆన్లైన్, స్వైపింగ్ మెషీన్ల వినియోగాన్ని నేర్చుకున్నారు. మీరు కూడా మైండ్ సెట్ మార్చుకోవాలి. మీరే నగదు రహిత లావాదేవీలు చేయకపోతే ప్రజలకేం నేర్పుతారు?’ అని సీఎం వ్యాఖ్యానించారు. మీడియా లైవ్ నెట్ వర్క్ ఏర్పాటు సచివాలయంలో మీడియాలైవ్ నెట్ వర్క్‌ను ఏర్పాటు చేశారు. బ్లాక్ –1లోని సీఎంలో జరిగిన హెచ్ఓడీ సమావేశాన్ని బ్లాక్–4లో ఏర్పాటు చేసిన పబ్లిసిటీ సెల్‌కు లైవ్ బ్రాడ్ కాస్ట్ చేయడంతో ఆ వివరాలను మీడియా సేకరించుకునే అవకాశం ఏర్పడింది. సీఎం వ్యాఖ్యలపై ఐఏఎస్‌ల ఆవేదన... ముఖ్యమంత్రి తమను మందుబాబులతో పోల్చడంపై సమావేశం తరువాత కొందరు ఐఏఎస్‌లు ఆవేదనతో చర్చించుకోవడం కనిపించింది. చివరకు మా దుస్థితి ఇలా తయారైందంటూ సన్నిహితులకు తెలియజేస్తూ కొందరు వాపోయారు. జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదని ముఖ్యమంత్రి ఎన్నోసార్లు చెప్పారు... మరి ఆయన ఏ వ్యాలెట్ అయినా వాడుతున్నారా? అని ఒక ఉన్నతాధికారి ప్రశ్నించగా.. ప్రతిదీ ప్రభుత్వమే భరించేట ప్పుడు ఆయనకు జేబులో డబ్బులు ఎందుకు? అని మరో అధికారి వ్యాఖ్యానిం చారు. ఆయన వెంట ఉండేది కోట్లున్న , కోట్లు తొడిగిన వారే కదా, ఆయనకు డబ్బెందుకు? వ్యాలెట్ ఎందుకు? అని మరో అధికారి అన్నారు. ఇకపై మనం మీటింగులకు వెళ్లేప్పుడు చెవుల్లో దూది పెట్టుకుని వెళితే సరి... అని మరో ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం విశేషం. -
"నిరుద్యోగులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే’
కళ్యాణదుర్గం రూరల్: నిరుద్యోగులను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండిపర శురాం విమర్శించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట సోమవారం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల ఓట్లు దండుకునేందుకు రూ.2 వేల భృతి ఇస్తామని చంద్రబా బు అసత్య ప్రకటనలు చేశారన్నా రు. ఏటా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించి అమలు చేయాలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనా ర్టీ విద్యార్థులకు సకాలంలో ఫీజు రీ యింబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్షావలీ, తాలుకా అధ్యక్షుడు నవీన్ కుమార్, తాలుకా ప్రధాన కార్యదర్శి మల్లెల రాజేష్, మండలాల అధ్యక్షులు మో హన్ ,అనిల్, కిరణ్, మహాత్మ, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఏడాది పొడవునా వేడుకలు: సీఎం
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రజలందరూ ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలన్న ఆకాంక్షతో రాష్ట్రంలో ఏడాది పొడవునా వేడుకలు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దీపావళి పండుగను పురస్కరించుకొని శనివారం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ పవిత్ర సంగమం వద్ద నరకాసుర వధ కార్యక్రమంతోపాటు అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. ఈ వేడుకలకు సతీసమేతంగా విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పవిత్ర సంగమానికి అఖండ హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం విల్లు ఎక్కుపెట్టి నారిని సంధించి నరకాసురుడి ప్రతిమను వధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పవిత్ర సంగమం వద్ద దీపావళి సంబరాలు జరుపుకోవడం శుభపరిణామమని అన్నారు. భవిష్యత్తులో ఈ పవిత్ర సంగమం వద్ద రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి దీపావళి జరుపుకోవాలని చెప్పారు. అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌కు ఆదరణ ఆనందభరిత వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో అమరావతిలో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించామని చంద్రబాబు అన్నారు. 300 మందికిపైగా వ్యాపారులు ఉత్సాహంగా స్టాళ్లు ఏర్పాటు చేశారని, ప్రజల ఆదరణతో దాదాపు రూ.11 కోట్ల వ్యాపారం జరిగిందని చెప్పారు. సభ అనంతరం అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌కు సంబంధించిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. -
స్వర్ణాల చెరువుకు గోదావరిని తెస్తా
అసాధ్యం అంటున్న పనిని సుసాధ్యం చేస్తా: సీఎం నెల్లూరులో రొట్టెల పండుగలో పాల్గొన్న చంద్రబాబు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘గోదావరి నీటిని నెల్లూరు స్వర్ణాల చెరువుకు మళ్లిస్తా. అందరూ అసాధ్యం అంటున్న ఈ పనిని సాధ్యం చేసి చూపిస్తా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం సాయంత్రం ఇక్కడి బారాషహీద్ దర్గాలో సీఎం ప్రార్థనలు జరిపారు. అనంతరం రొట్టెల పండుగలో పాల్గొన్నారు. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర అభివృద్ధి రొట్టెను ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా స్వర్ణాల చెరువు వద్ద జరిగిన సభలో మాట్లాడారు. గోదావరి నీటిని పెన్నా నదికి అనుసంధానం చేసి సోమశిల రిజర్వాయర్ ద్వారా స్వర్ణాల చెరువుకు నీరు తెస్తానని చెప్పారు. సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో 150 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. రూ.350 కోట్లతో నిర్మిస్తున్న పెన్నా-సంగం బ్యారేజీ నిర్మాణాన్ని మార్చిలోగా పూర్తి చేయిస్తానన్నారు. బకింగ్‌హాం కెనాల్‌ను పునరుద్ధరించి జలరవాణాకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ప్రజలంతా నాకు సహకరించాలి.. రాష్ట్రం అభివృద్ధికోసం తానొక్కడినే కష్టపడుతున్నానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు శ్రమిస్తున్నానన్నారు. ప్రజలంతా తనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభివృద్ధికోసం అందరూ రొట్టెలు పట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, రైతు, డ్వాక్రా రుణమాఫీలతోపాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. డ్వాక్రా మహిళల రుణమాఫీలో భాగంగా ఒక్కొక్కరికీ రూ.3 వేల చొప్పున ఇవ్వడానికి బుధవారం సంతకం చేశానని, ఈ నిధులను డ్వాక్రా మహిళలు వాడుకోవచ్చని ఆయన అన్నారు. -
నల్లధనం సంగతి బాబుకెలా తెలిసింది?
నీతి సూక్తులొద్దు.. మీ అవినీతి, లంచగొండితనం గురించి మాట్లాడండి సీఎం చంద్రబాబుకు పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హితవు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి సూక్తులు చెప్పడం మాని, ఆయన అవినీతి, లంచగొండితనం గురించి మాట్లాడాలని పీఏసీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హితవు పలికారు. చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. బుగ్గన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ రూ.500, రూ.1,000 నోట్ల ముద్రణ నిలిపివేయాలని చంద్రబాబు హఠాత్తుగా ఎందుకు చెబుతున్నారు? తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఓటుకు కోట్లు కేసులో రూ.500, రూ.1,000 నోట్ల నల్లధనం ఇస్తూ దొరికిపోయినందుకా? లేక ఎన్నికల్లో రూ.12 కోట్లు ఖర్చు పెట్టానని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించినందుకా?’’ అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా రూ.65 వేల కోట్ల నల్లధనాన్ని ఐడీఎస్-2016 పథకం కింద పలువురు వెల్లడిస్తే ఏపీ, తెలంగాణలో ఒకే వ్యక్తి రూ.10 వేల కోట్లు ప్రకటించారని చంద్రబాబు అంటున్నారు, అసలు నిగూఢమైన ఈ సమాచారం చంద్రబాబుకు ఎలా వచ్చిందో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ వివ రాలు అత్యంత రహస్యమైనవని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి, పన్నుల అధికారులు చెబుతూ ఉంటే బాబుకు ఎలా తెలిశాయో చెప్పాలని నిలదీశారు. నల్లధనాన్ని ప్రకటించిన వారి జాబితాను వెల్లడించాలని కోరుతున్నామన్నారు. ‘‘చంద్రబాబు పాలనలో ఏపీ అత్యంత అవినీతిమయ రాష్ట్రంగా గణతికెక్కినట్లు ఎన్‌సీఏఈర్ సంస్థ పేర్కొంది. దానికి ముందు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో పట్టిసీమ మొదలు అమరావతి భూముల దాకా అంతా అవినీతిమయమే. రాజధాని శంకుస్థాపన కోసం ఖర్చు పెట్టిన రూ 400 కోట్లు ఎక్కడికి పోయాయి? పట్టిసీమలో రూ.1,600 కోట్లు ఎక్కడికి చేరాయి? గోదావరి, కృష్ణా పుష్కరాలకు ఖర్చు పెట్టామని చెబుతున్న రూ.3,000 కోట్లు ఏవీ? పారిశ్రామికవేత్తల రాయితీల పేరుతో విడుదల చేసిన రూ.2,200 కోట్లు ఏమైపోయాయి?’’అని బుగ్గన సూటిగా ప్రశ్నించారు. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో బాబు జీఎస్డీపీపై తప్పుడు లెక్కలు వెల్లడించారన్నారు. -
నల్లధనాన్ని నిరోధించాలి
• దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నా • సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు • మావాళ్లు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టాలంటున్నారు • అమెరికా ఎన్నికలకు నేను వెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు • వెలగపూడిలో సీఎం కార్యాలయం ప్రారంభం సాక్షి, అమరావతి: ఐదేళ్లు పడుకుని ఎన్నికల్లో నిద్రలేచి రూ.వెయ్యి నోటు ఇస్తే సరిపోతుందనుకుంటున్నారు... కొందరు మొన్న ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టారు, మళ్లీ ఖర్చు పెట్టాలని అనుకుంటున్నారు... అందుకే ఎమ్మెల్యేలు డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టి, అందుకోసం పోటీలు పడుతున్నారు... తమ పార్టీ వాళ్లు కూడా ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టాలంటున్నారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయాన్ని బుధవారం ఉదయం ఆయన శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... బ్లాక్‌మనీ సంపాదించే వారికి రాజకీయం షెల్టర్‌గా మారిపోయిందన్నారు. కొంతమంది బ్లాక్ మనీని సంపాదించి ఎన్నికల్లో పంచుతుండడంతో తమ పరిస్థితి ఏమిటని తమ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని చెప్పారు. తాము ఐదేళ్లు ప్రజలకు కరెంటు, గ్యాస్, పెన్షన్ వంటివన్నీ ఇస్తే చివర్లో ఎన్నికలప్పుడు ఎవరైనా రూ.500 ఇస్తే వారికి ఓట్లేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇటీవల హైదరాబాద్‌లో మొత్తం రూ.13 వేల కోట్ల నల్లధనాన్ని స్వచ్ఛంద ఆదాయం వెల్లడి పథకం కింద తెల్లధనంగా మార్చుకున్నారని, అందులో ఒకే వ్యక్తిది పది వేల కోట్లుందని తెలిపారు. అంత డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెడితే తమ పరిస్థితి ఏమిటని మిగిలిన వాళ్లు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని నివారించాలంటే బ్లాక్‌మనీని నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించేలా నగదు రహిత లావాదేవీలు జరపాలని చెప్పారు. వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మోదీకి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. ప్యాకేజీ తీసుకుంటే తప్పేంటీ? ప్రత్యేక హోదాలో ఉన్నవన్నీ ఇస్తానంటే ప్యాకేజీ ఎందుకు తీసుకోకూడదని చంద్రబాబు ప్రశ్నించారు. అగ్రదేశమైన అమెరికాలోనూ నాయకత్వ లేమి ఉందన్నారు. కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ట్రంప్‌కు నాలుగో భార్య అనుకుంటా అని వ్యాఖ్యానించారు. అమెరికాలో ట్రంప్ మహిళల పట్ల అశ్లీలంగా మాట్లాడాడని విమర్శించారు. అమెరికా ఎన్నికలకు తాను వెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు. చందాలు తీసుకుని రాజకీయాలు..: సచివాలయంలో తన కార్యాలయంలోకి అడుగు పెట్టడంతో నూతక శకం ప్రారంభమైందని బాబు చెప్పారు. డ్వాక్రా మహిళలకు రెండో విడత పెట్టుబడి రాయితీల కింద రూ.2,500 కోట్లు విడుదల చేసే ఫైలుపై తొలి సంతకం చేశానన్నారు. దీనిపై వడ్డీ కూడా రూ.1200 కోట్లు ఇస్తున్నామన్నారు. ఓట్లు, సీట్లు రాకపోయినా.. కొన్ని పార్టీలు చందాలు తీసుకుని రాజకీయాలు చేస్తున్నాయని వామపక్షాలను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. -
హోదాతో ఎక్కువ రాయితీలు రావు
* తప్పులు చేస్తే ఇప్పుడు జనం నోరు తెరవరు.. * ఎన్నికల్లో జడ్జిమెంట్ ఇస్తారు: టీడీపీ వర్క్‌షాపులో చంద్రబాబు సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు ఎక్కువ రాయితీలు వస్తాయనే రీతిలో కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అది వాస్తవం కాదని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా ద్వారా వచ్చే ప్రతి ప్రయోజనాన్నీ ప్యాకేజీ ద్వారా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. రెండేళ్లలో రాష్ట్రంలో 1.47 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం వల్ల 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లైందన్నారు. గురువారం మూడో రోజు నిర్వహించిన టీడీపీ నాయకత్వ-సాధికారత వర్క్‌షాపు ప్రారంభ ఉపన్యాసం చేసిన చంద్రబాబు.. సాయంత్రం ముగింపు కార్యక్రమంలోనూ మాట్లాడారు. అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులుగా తప్పులు చేస్తే జనం ఇప్పుడు నోరు తెరవరు.. కానీ ఎన్నికల్లో సెలైంట్‌గా జడ్జిమెంట్ ఇస్తారు జాగ్రత్త అంటూ పార్టీ నేతలను సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల అంచనాలు ఎక్కువగా ఉంటాయని, ఆశించిన సేవలు అందకపోతే సహించరని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజల్లో 80 శాతం సంతృప్తి, రాజకీయ ఏకీకరణ 80 శాతం, నాయకుల పనితీరు పట్ల 80 శాతం అనుకూలత రావాలన్నారు. పాలనలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఎక్కువైందనే అభిప్రాయం ప్రజల్లో కలిగించవద్దని కోరారు. రాజకీయనేత నైపుణ్యాలు, ఆర్థిక వేత్త నైపుణ్యాలు వేర్వేరు కాబట్టే గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్‌సింగ్‌కు పొలిటికల్ ఇమేజీ రాలేదన్నారు. రాష్ట్రంలో ఏడు గిరిజన నియోజకవర్గాలుంటే గత ఎన్నికల్లో ఒక్క చోట మాత్రమే గెలిచామన్నారు. రెండున్నరేళ్లలో ప్రభుత్వం వారికి చేసిన ప్రయోజనాలు వివరించి పార్టీకి దగ్గరయ్యేలా చూడాలని కోరారు. గోదావరిని పెన్నాకు కూడా అనుసంధానం చేసి సోమశిల వరకు నీటిని తీసుకెళ్తామన్నారు. నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే ఇండియా ఎకనమిక్ సమ్మిట్‌లో బాబు ప్రసంగిస్తారు. సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుంటారు. -
ప్రజెంటేషన్లలో కాదు పనుల్లో అభివృద్ధి చూపండి
-
ప్రజెంటేషన్లలో కాదు పనుల్లో అభివృద్ధి చూపండి
కలెక్టర్లు, మంత్రులపై సీఎం ఆగ్రహం * కలెక్టర్లు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు రావాలి * లక్ష్యాలు సాధించలేదంటూ గంటాపై మండిపాటు * యూనివర్సిటీలకు ర్యాంకులపై వీసీలకు అభినందన సాక్షి, అమరావతి: జిల్లాల్లో అభివృద్ధిని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లలో కాకుండా పనుల్లో చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పరిపాలనపై దృష్టి పెట్టాలని, జిల్లాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో కలెక్టర్లు ముందుకు రావాలని ఆదేశించారు. మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు, కలెక్టర్లు ఉమ్మడిగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించి అమలుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు గురువారం విజయవాడలో జరిగింది. సమావేశంలో జిల్లాల వారీగా ప్రగతిని చంద్రబాబు సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు ఏడేసి నిమిషాలు తమ జిల్లాపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇదే సమావేశంలో విశ్వవిద్యాలయాల ఉప కులపతులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో విడిగా సమావేశమయ్యారు. జిల్లాల్లో మంత్రులు, పార్టీ నేతల మధ్య విభేదాలు నెలకొని అభివృద్ధికి ఆటంకంగా మారితే పరిష్కారానికి చొరవ చూపాలని వారికి సూచించారు. ఆ తర్వాత రాత్రి పొద్దు పోయే వరకూ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించారు. ఆధార్ ఆధారంగా ఇంటినుంచే పౌరసేవలను అందించే యాప్‌ను తయారు చే యించిన పశ్చిమ గోదావరి కలెక్టర్ భాస్కర్‌ను అభినందించారు. మూడేళ్లవుతున్నా ఏం సాధించారు? అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా, వేలకోట్లు బడ్జెట్ ఇస్తున్నా... అనుకున్న లక్ష్యాల్లో ఒక్కటైనా సాధించారా? అంటూ మానవవనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావుపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని సూచించి మూడేళ్లయినా ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోయారని అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని కొన్ని యూనివర్సిటీలకు ప్రపంచస్థాయి ర్యాంకులు రావడంపై వీసీలను, ఉన్నత విద్యాశాఖ అధికారులను అభినందించారు. సైనికులకు వందనం : దేశ సార్వభౌమాధికారానికి ఎవరి నుంచి ఎటునుంచైనా భంగం వాటిల్లితే సమర్థంగా ఎదుర్కొంటామని మరోసారి రుజువు చేసిన సైనికులకు వందనాలు అర్పిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్వాగతించారు. ముఖ్యమంత్రి స్వచ్ఛభారత్‌పై నిర్వహించే సమావేశంలో పాల్గొనే నిమిత్తం శుక్రవారం ఢి ల్లీ వెళ్లనున్నారు. వృద్ధి రేటులో విశాఖ ప్రథమం.. రాష్ట్రంలోని జిల్లాలకు వృద్ధి రేటు ఆధారంగా ఇచ్చిన ర్యాంకింగ్‌లో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లా రెండవ స్థానంలోను, పశ్చిమ గోదావరి జిల్లా మూడో స్థానంలోను నిలిచాయి. వాటి తరువాత నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాలు వరస స్థానాల్లో నిలిచాయి. -
ముమ్మాటికీ మోసమే
హోదా విషయంలో కేంద్రం మోసం చేస్తే...బాబు లొంగిపోయారు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు అనంతపురం అర్బన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేసిందని, ఈ విషయంలో పోరాడాల్సిన చంద్రబాబు ప్రధాని మోదీ దయాదాక్షిణ్యాలు చాలంటూ సాగిలపడ్డారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం అనంతపురం జిల్లాకు విచ్చేసిన ఆయన స్థానిక సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి డి.జగదీశ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేశారని, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నానని పలు సందర్భాల్లో చెప్పిన చంద్రబాబు.. ప్యాకేజీ చాలంటూ మాట మార్చారన్నారు. ఏపీకి ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీ పార్లమెంట్లో చేసిన ప్రకటన విన్న తర్వాత తన రక్తం మరుగుతోందని చెప్పిన చంద్రబాబు ఇపుడు మాత్రం ప్యాకేజీ బాగుందంటూ మురిసిపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అందరికీ తెలుస్తోందన్నారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాష్ట్రంలోని 40 లక్షల మంది నిరుద్యోగులను, లక్షలాది మంది విద్యార్థులను, యువ పారిశ్రామిక వేత్తలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నట్టేట ముంచాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంఘటితమై హోదాకోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సహాయ కార్యదర్శులు జాఫర్, నారాయణస్వామి పాల్గొన్నారు. -
వారిద్దరూ మోదీ చేతిలో బకరాలు
వెంకయ్య,బాబులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు ఇద్దరూ ప్రధాని మోదీ చేతిలో బకరాలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. అధికారం ఉంది కదా అని అబద్ధాలతో కాలం గడుపుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో క లసి నారాయణ విలేకరులతో మాట్లాడారు. వెంకయ్య, చంద్రబాబు హోదా వల్ల ఏం ప్రయోజనం అని మాట్లాడుతున్నారని, ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాల్లో పర్యటించి అభివృద్ధి జరిగిందో లేదో చూద్దామా? అని నారాయణ సవాల్ విసిరారు. -
తెలంగాణ ప్రజలపై పగబట్టిన చంద్రబాబు
ధ్వజమెత్తిన ప్రభుత్వ విప్ సునీత సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రజలపై పగబట్టారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత విమర్శించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టకుండా అడ్డంకులు సృష్టిస్తూ కుట్రలకు పాల్పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అపెక్స్ కమిటీ సమావేశంలో బాబు తాను తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకమని విషంకక్కినా టీటీడీపీ నేతలు నోరు మెదపలేదన్నారు. అందరూ బాగుండాలనేది కేసీఆర్ వ్యక్తిత్వమయితే, అందరూ నాశనమైనా తాను బాగుండాలనే రాక్షసత్వం బాబుదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కొత్త ప్రాజెక్టని బాబు అనడం దారుణమన్నారు. -
ప్రజలు సంతృప్తి చెందేలా పనిచేయండి
ఆర్డీఓలు, డీఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, అమరావతి: ప్రజలంతా ప్రభుత్వం పట్ల సంతృప్తి చెందే విధంగా పరిపాలన సాగించాలని సీఎం చంద్రబాబు ఆర్డీఓలు, డీఎస్పీలకు సూచించారు. వినూత్న ఆలోచనలతో పరిపాలనను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. విజయవాడలో మంగళవారం సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, డీఎస్పీల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రజలు విజ్ఞానం, ఆరోగ్యం, సంపద, సంతోషం పొందేలా అధికారులు పని చేయాలన్నారు. ఇందుకు అవసరమైన పాలనా పరమైన సంస్కరణలను సూచించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేలు సంపాదించేలా ఆర్డీఓలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేయలేదన్నారు. వాటిని అవసరమైన వారు ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. పోలీసు అధికారులు శాంతి భద్రతలను పరిరక్షిస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని అన్నారు. కాగా, ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువులకు ఎన్టీఆర్ సురక్ష కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని చంద్రబాబు ఆర్డీఓలు, డీఎస్సీల సమావేశంలో ప్రారంభించారు. -
అరాచక శక్తుల్ని పెంచి పోషించింది బాబే
* నయీం, జడల నాగరాజులను ప్రోత్సహించిందీ ఆయనే * ‘అనంత’లో జరిగిన 400 హత్యలకు బాబే కారణం * సీఐడీ విచారణ అనంతరం విలేకర్లతో భూమన సాక్షి, గుంటూరు/గుంటూరు రూరల్: సీఎం చంద్రబాబు అరాచక శక్తులకు అక్షయపాత్ర అని, అరాచక, అసాంఘిక శక్తులను పెంచిపోషించింది చంద్రబాబేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. నయీం అనే విషపురుగును, జడల నాగరాజు అనే సంఘవిద్రోహశక్తిని సృష్టించింది చంద్రబాబేనన్నారు. 1984లో నాదెండ్ల భాస్కరరావు ద్వారా ఎన్టీఆర్ పదవీచ్యుతుడైనప్పుడు వాహనాల దహనానికి, అలజడులకు చంద్రబాబే కారణమన్నారు. తన పదేళ్లపాలనలో అనంతపురంలో జరిగిన నమోదు కాని 400 హత్యలకు, పరిటాల రవి చనిపోయినప్పుడు జరిగిన దహనకాండకు ఆయనే కారణమన్నారు. తుని ఘటనకు సంబంధించి సీఐడీ అధికారుల నోటీసుతో మంగళవారం గుంటూరులోని సీఐడీ రీజనల్ కార్యాలయంలో జరిగిన విచారణకు భూమన హాజరయ్యారు. ఉదయం 11.15 గంటలకు వచ్చిన భూమనను సీఐడీ అధికారులు ఏడున్నర గంటలపాటు విచారించారు. సాయంత్రం 6,45 గంటలకు బయటికొచ్చిన భూమన విలేకరులతో మాట్లాడారు. తుని ఘటనకు కారకుల్ని పట్టుకోకుండా తనను వ్యతిరేకించే ప్రత్యర్థి రాజకీయనాయకుల్ని ఈ కుట్రలో భాగస్వాములను చేయాలనే బాబు కుతంత్రం కనిపిస్తోందని మండిపడ్డారు. తుని ఘటనకు జగన్మోహన్రెడ్డి, భూమన కారణమంటూ సంఘటన జరిగినరోజే చంద్రబాబు ప్రకటించారని.. ఆయనకు ఈ సమాచారం ఎలా తెలిసిందో అడగడానికిగాను విచారణ అధికారులు నోటీసులివ్వాలన్నారు. సీఎంకు, తనపై ఆరోపణలు చేసిన హోంమంత్రి చినరాజప్పకు నోటీసులిచ్చి పోలీసులు నిష్పాక్షికతను చాటుకోవాలన్నారు. తనకే సంబంధం లేకపోయినా, ఎటువంటి ఆధారాల్లేనప్పటికీ కేసులో ఇరికించేందుకు ఉద్దేశపూర్వకంగా తనను విచారణకు పిలుస్తున్నారని మండిపడ్డారు. విచారణకు హాజరయ్యేముందు కూడా భూమన వైఎస్సార్సీపీ జిల్లాకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అమావాస్యకు అబ్దుల్ ఖాదర్‌కు.. కోడిగుడ్డుకు గానుగెద్దుకు ఎంత సంబంధం ఉంటుందో.. తునిలో జరిగిన ఘటనకు, తనకు అంతే సంబంధముందన్నారు. ఎవరో దుండగులు రైలును దహనం చేస్తే దాన్ని వైఎస్సార్సీపీకి ఆపాదించి పార్టీని సమూలంగా దహనం చేయాలనే కుటిలప్రయత్నాల్ని చంద్రబాబు చేస్తున్నారన్నారు. ముద్రగడ చేస్తున్న ఉద్యమానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ నైతిక మద్దతు తెలపడాన్ని భరించలేక చంద్రబాబు తనను అరెస్టు చేయించాలని కుటిలయత్నాలకు పాల్పడుతున్నారన్నారు. కాగా, భూమనను అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. దీనికి తగ్గట్టుగా విచారణ ఏడున్నర గంటలపాటు సాగడంతో సీఐడీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే భూమనను అరెస్టు చేయలేదు. భూమన వెంట వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ధర్నా.. తుని ఘటనతో సంబంధం లేని భూమనను విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పార్టీ నేతలతో కలసి గుంటూరు సీఐడీ రీజనల్ కార్యాలయం ఆవరణలో ధర్నాకు దిగారు. దీంతో గుంటూరు అర్బన్ ఏఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు బలవంతంగా అరెస్ట్‌చేసి నగరంపాలెం పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆయనతోపాటు ధర్నాలో పాల్గొన్న మరో 14 మంది వైఎస్సార్సీపీ నేతల్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యానుల్లో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
మట్టికట్టతో కనికట్టు
-
కేంద్రమే పోలవరం ప్రాజెక్టును అప్పగించింది
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయిస్తే త్వరగా పూర్తవుతాయని కేంద్రం తమకు అప్పగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దీనిని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. తాత్కాలిక సచివాలయంలో గురువారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పనులు చేయించమంటే... నేనేదో కాంట్రాక్టర్‌ను నిర్ణయించానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారని ఆక్షేపించారు. దేశంలోనే మొదటిసారిగా అధునాతనమైన యంత్రాల ద్వారా పనులు మొదలు పెట్టినట్లు చెప్పారు. కిలోమీటరు వెడల్పున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 50 లక్షల క్యూసెక్కుల జలాలు వదులుతామని తెలిపారు.ప్రతి సోమవారం ‘పోలవారం’గా మారుతుందని, పనులు పర్యవేక్షించేందుకు తాను ప్రతి సోమవారం వెళతానని ఆయన తెలిపారు. ఏమి లాభమో చెప్పండి? ప్రత్యేక హోదాతో పారిశ్రామిక రాయితీలు వస్తాయనే ప్రచారంలో నిజం లేదని చంద్రబాబు చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌కు ప్రత్యేక రాయితీల కారణంగా పరిశ్రమలు వస్తున్నాయని చెప్పటం వట్టి గాలి మాటలన్నారు. హోదావల్ల ఏమి లాభమో చెప్పండి? అని ప్రశ్నిం చారు. 2015-16 సంవత్సరానికి దేశంలో ఆర్బీఐ 954 బిలియన్ రూపాయల పెట్టుబడులు పెడితే అందులో ఆంధ్రప్రదేశ్‌కు 15.8 శాతం పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దసరాకు తాత్కాలిక సచివాలయంలో తన కార్యాలయం ప్రారంభిస్తానని సీఎం తెలిపారు. డిసెంబరు నాటికి అసెంబ్లీ, శాసన మండలి భవనాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ‘సాక్షి’పై విమర్శలు..: సీఎం చంద్రబాబు గురువారం సాయంత్రం తాత్కాలిక సచివాలయంలో విలేకరులతో మాట్లాడు తూ సాక్షి కథనంపై అక్కసు వెళ్లగక్కారు. ‘నేను అవినీతి పరుడినంట. రూ.52 వేల కోట్లు స్విస్‌చాలెంజ్‌లో తిన్నానంట. తప్పుడు రాతలు రాస్తున్నారు’ అంటూ విమర్శించారు. వెసులుబాటు కోసమే ప్యాకేజీ: సీఎం సాక్షి,విజయవాడ: ప్రత్యేక హోదాకు సమానమైన స్థాయిలో నిధులిస్తామని కేంద్రం చెప్పడంతో.. రాష్ట్రానికి వెసులుబాటు కలుగుతుందన్న భావనతో ప్యాకేజీకి అంగీకరించానని చంద్రబాబు చెప్పారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ), ఆయన కుమారుడు అవినాష్, కాంగ్రెస్ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కడియాలు బుచ్చిబాబులు గురువారం విజయవాడ గుణదల బిషప్ గ్రాసీ స్కూల్ ఆవరణలో నిర్వహించిన సభలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. -
మట్టికట్టతో కనికట్టు
పోలవరం నిర్మాణంలో బాబుగారి కుట్రలెన్నో.. కాఫర్ డ్యామ్‌ను ప్రధాన డ్యామ్‌గా నమ్మించే ఎత్తుగడ సాక్షి, హైదరాబాద్: ‘‘కాఫర్ డ్యామ్ నిర్మించి పోలవరం కాలువలకు నీళ్లిచ్చేద్దాం.. ఇదే పోలవరం తొలిదశ.’’ - మంగళవారంనాడు పోలవరం ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన ఇది. ఈ ప్రకటన చూడగానే ఇంజనీర్లకయితే మూర్ఛవచ్చినంత పనైంది. సాగునీటి శాఖ అధికారులూ సీఎం ప్రకటన చూసి విస్తుపోయారు. అసలు కాఫర్ డ్యామ్ అంటే ఏమిటి? జలాశయం నిర్మించడానికి ముందు ఇది ఎందుకు కడతారు? ప్రధాన డ్యామ్‌కు కాఫర్ డ్యామ్‌కు ఉన్న తేడా ఏమిటి? నిజంగా సీఎం చెబుతున్నట్లు కాఫర్ డ్యామ్ కట్టడం పూర్తయితే పోలవరం తొలిదశ పూర్తయినట్లేనా? అసలు ఈ కాఫర్ డ్యామ్ సీఎం చెబుతున్నట్లు 60 టీఎంసీల నీటి నిల్వకు పనికి వస్తుందా? ఇవన్నీ ప్రజల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. అసలు కేంద్రం నిర్మించాల్సిన జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టును మేమే నిర్మిస్తామంటూ చంద్రబాబు ఎందుకు ఆతృతపడుతున్నారు? కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు? అందులోని మర్మమేమిటి? వంటివి అర్ధం చేసుకోవాలంటే ఇది చదవండి. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం. 2018 నాటికి డయాఫ్రం వాల్ నిర్మించి పోలవరం తొలి దశ పూర్తి చేస్తామని చంద్రబాబు ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇపుడు కాఫర్ డ్యామ్‌నే పోలవరం తొలిదశగా ప్రకటించేశారు. అంతేకాదు 60 టీఎంసీల నిల్వకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. తొలిదశను పూర్తి చేశామని ప్రచారం చేసుకోవడం ద్వారా రాజకీయ లబ్ది పొందడం, మరోపక్క తన అనుయాయుడైన సొంత పార్టీ కాంట్రాక్టరుకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం, ఆ పైన కమీషన్లు కైంకర్యం చేయడం ప్రభుత్వ పెద్దల లక్ష్యాలుగా కనిపిస్తున్నాయని జలవనరుల శాఖ అధికార యంత్రాంగం వ్యాఖ్యానిస్తోంది. కాఫర్‌డ్యామ్ తాత్కాలిక నిర్మాణం మాత్రమే సాధారణంగా ఏదైనా ఆనకట్ట నిర్మించాలంటే తాత్కాలిక మట్టి అడ్డుకట్టతో నీటిని దారి మళ్లించడం తప్పనిసరి. దాన్నే కాఫర్ డ్యామ్ అంటారు. అంటే ప్రధాన డ్యామ్ నిర్మాణానికి ముందు మట్టితో నిర్మించే తాత్కాలిక డ్యామ్ అన్నమాట. జలాశయ నిర్మాణ పనులకు నీళ్లు అడ్డురాకుండా.. ప్రవాహాన్ని మళ్లించడానికి ఏర్పాటు చేసే తాత్కాలిక నిర్మాణమే కాఫర్ డ్యామ్. ఈ డ్యామ్ ఏ మాత్రం పటిష్ఠంగా ఉండదు. శాశ్వతంగా అసలు పనికి రాదు. కానీ పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా కాఫర్ డ్యామ్ నిర్మిస్తున్నట్లు చంద్రబాబు గొప్పగా చెప్పడం పట్ల నీటిపారుదల రంగంపై అవగాహన ఉన్న వారందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాఫర్ డ్యామ్ ద్వారా 60 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపిందని చంద్రబాబు కొత్త వాదన తీసుకురావడం చూసి ఇంజనీరింగ్ అధికారులు నివ్వెరపోతున్నారు. గోదావరికి గరిష్టం గా 30 లక్షల క్యూ సెక్కులు వరద వస్తుంది. కనీసం నాలుగు లక్షల క్యూసెక్కుల వరదని కూడా తట్టుకుని నిలబడే సామర్థ్యం కాఫర్‌డ్యామ్‌కు ఉండదని జలవనరుల శాఖలో పనిచేస్తున్న ఇం జనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. నీటి ప్రవాహాన్ని మళ్లించడానికే తప్ప నీరు నిల్వ చేయడానికి కాఫర్ డ్యామ్ పనికిరాదని ఇంజనీర్లు చెబుతున్నారు. అలాంటి తాత్కాలిక నిర్మాణాన్ని పూర్తిచేసి పోలవరం తొలి దశ పూర్తయిందని చెప్పుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని అధికార యంత్రాంగం అభిప్రాయపడుతోంది. భారీ ఎత్తున వరద వస్తే తట్టుకునే శక్తి ఈ కాఫర్ డ్యామ్‌కు ఉండదని, దా నికి గండి పడితే దిగువ ప్రాంతంలో పెద్దఎత్తున ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. కాఫర్ డ్యామ్‌తో అంత నీటి నిల్వ సాధ్యమైతే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, కాటన్ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ వంటి వాటికి బదులు కాఫర్ డ్యామ్‌లే నిర్మించి.. ఎక్కువ నీటిని నిల్వ చేసి ఉండేవారు కదా అని ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై రూ.20వేల కోట్ల భారం పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదే అయినా కేవలం కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేలా కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ఇందుకు అంగీకరించిన కేంద్రం 2010-11 ఎస్ఎస్ఆర్ ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేందుకు అంగీకరించింది. 2010-11 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.16,010.45 కోట్లు. మార్చి 31, 2014 వరకూ రూ.5135.87 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.562.46 కోట్లను ఏఐబీపీ కింద కేంద్రం విడుదల చేసింది. ఇప్పటివరకూ ఖర్చు చేసిన నిధులు పోను మిగతా సొమ్మును మాత్రమే కేంద్రం ఇచ్చేందుకు అంగీకరించింది. అదీ ప్రాజెక్టు నిర్మాణం, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలకు అయ్యే వ్యయం మాత్రమే. భూసేకరణ, నిర్వాసితుల పునరాసానికి అయ్యే వ్యయాన్ని ఇస్తామని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. ఏప్రిల్ 1, 2014 నుంచి ప్రాజెక్టుకు చేసిన ఖర్చును మాత్రమే చెల్లించేందుకు అంగీకరించింది. తాజా ఎస్ఎస్ఆర్ మేరకు పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.36 వేల కోట్లకుపైగా పెరిగినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కనీసం రూ.20 వేల కోట్ల భారం పడనుంది. కాంట్రాక్టరును కాపాడడం.. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు వీలుగా ఒప్పందం చేసుకోవాలంటూ రెండేళ్ల క్రితమే ముసాయిదా(డ్రాఫ్ట్)ను పీపీఏ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. పీపీఏకి అప్పగిస్తే.. ప్రాజెక్టు నిధుల వ్యయంపై కేంద్రం పర్యవేక్షణ ఉంటుంది. నిధులు కొట్టేసేందుకు వీలుండదు. ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనులు సక్రమంగా చేయడం లేదంటూ టీడీపీ ఎంపీ రాయపాటి కి చెందిన ట్రాన్స్ట్రాయ్పై అనేక సందర్భాల్లో పీపీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈపీసీలో 60సీ నిబంధన కింద కాంట్రాక్టర్‌పై వేటు వేసి.. సమర్థుడైన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని సూచించింది. కానీ.. ఇవేవీ చంద్రబాబు పట్టించుకోలేదు. రాయపాటిని రక్షించడం.. అంచనాలు పెంచేసి కమీషన్లు కొట్టేసేందుకు పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలంటూ కేంద్రానికి విన్నవిస్తూ వచ్చారు. ఫలితంగా జూన్ 2, 2014 నుంచి ఇప్పటివరకూ 232 కోట్ల విలువైన పనులను మాత్రమే కాంట్రాక్టర్ పూర్తి చేశారు. పీపీఏ సిఫారసు మేరకు కాంట్రాక్టర్‌పై వేటు వేసి మళ్లీ టెండర్లు పిలిచి ఉంటే సమర్థుడైన కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసే సౌలభ్యం ఉండేది. ఇనుము, డీజిల్, సిమెంటు వంటి ధరలు తగ్గిన నేపథ్యంలో పోలవరం అంచనా వ్యయమూ తగ్గి ఉండేది. ఆ మేరకు ప్రభుత్వంపై భారం తగ్గేది. ప్రాజెక్టు ఈ పాటికే ఓ కొలిక్కి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం చేతికి దక్కగానే పోలవరం హెడ్ వర్క్స్ పనులను నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించేసి.. కమీషన్లు దండుకుంటున్నారు. పోలవరం కాంట్రాక్టు కోసం.. ‘హోదా’ తాకట్టు ప్రాజెక్టు అంచనాలు పెంచేసి కమీషన్లు దండుకోవడం కోసం ఆ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలంటూ కేంద్రంతో రాయభేరాలు సాగించడానికి కాంట్రాక్టర్లయిన కేంద్ర మంత్రి సుజనా, ఎంపీ సీఎం రమేష్‌లను చంద్రబాబు పంపారు. రాష్ట్ర వినతి మేరకు ఆ ప్రాజెక్టును కేంద్రం రాష్ట్రానికే అప్పగించింది. దాంతో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రం చేతికి చిక్కిన 24 గంటల్లోనే హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.1,482 కోట్లు పెంచేశారు. ఆ మేరకు కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చి కమీషన్లు కొట్టేశారు. 2018 నాటికి పోలవరం పూర్తయ్యేనా? 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ీ చంద్రబాబు చెబుతుంటే.. ఆయన కేబినెట్లోని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి ఇటీవల శాసనమండలిలో మాట్లాడుతూ నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. వీటిని బట్టి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి వెల్లడవుతోంది. క్షేత్ర స్థాయి పరిస్థితులను విశ్లేషించినా.. పీపీఏ భేటీ మినిట్స్‌ను పరిశీలించినా 2018 నాటికి పోలవరం పూర్తవడం అసాధ్యం. దీనికితోడు పీపీఏ సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా మే 13న భేటీలోనూ ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకే కేంద్రమే పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించిందని చంద్రబాబునాయుడు చెబుతోన్న మాటల్లో వీసమెత్తు కూడా వాస్తవం లేదు. ఈనెల 7న అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకే పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు అప్పగిస్తున్నామని చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈనెల 8న కేంద్ర ఆర్థిక శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్లో పెట్టిన ప్రకటనలోనూ ఇదే అంశాన్ని తేటతెల్లం చేశారు. చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదని.. కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. కానీ చంద్రబాబు మాత్రం నీతి ఆయోగ్ సిఫారసు మేరకే పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు పదే పదే చెబుతోండటం గమనార్హం. విభజన చట్టం ప్రకారం పోలవరం బాధ్యత కేంద్రానిదే ♦ ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 90(1) ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ♦ 90(2) ప్రకారం.. ప్రజాభ్యుదయం దృష్ట్యా పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ♦ 90(3) ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రం పూర్తిగా సమ్మతించింది. ♦ 90(4) ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అయ్యే వ్యయం, భూసేకరణ, నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీకి అయ్యే వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. పర్యావరణ, అటవీ తదితర అనుమతులను కేంద్రం తీసుకొస్తుంది. పోలవరం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వమే నిర్మిస్తుంది. అందులో ఎలాంటి సందేహమూ లేదు. పోలవరం ప్రాజెక్టుకుర్తిస్థాయి పునరావాస పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన అన్ని సవరణలను సాధ్యమైనంత త్వరగా చేపడతామని గౌరవసభ్యులకు హామీ ఇస్తున్నాను. - విభజన బిల్లుపై చర్చ సందర్భంగా 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన మహానేత మూడున్నర దశాబ్దాలుగా మూలన పడిపోయిన పోలవరం ప్రాజెక్టును తామే దుమ్ము దులిపి చేపట్టామని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే చెబుతున్నారు. కానీ.. ఈ ప్రకటనల్లో ఏమాత్రం వాస్తవం లేదు. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును సాకారం చేసేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నడుంబిగించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన కేంద్ర ప్రణాళిక సంఘం, కేంద్ర జల సంఘం, అటవీ, పర్యావరణ తదితర అనుమతులన్నీ ఆయనే తెచ్చారు. పోలవరం కుడి కాలువను 145 కిమీల మేర తవ్వి.. పూర్తి స్థాయిలో లైనింగ్ పనులు పూర్తి చేయించారు. ఎడమ కాలువ 134 కిమీల మేర లైనింగ్‌తో సహా పూర్తి చేశారు. పోలవరం హెడ్ వర్క్స్ పనులను శరవేగంగా పూర్తి చేసే దశలో ఆయన హఠన్మరణం చెందారు. వైఎస్ అకాల మరణం పోలవరానికి శాపంగా మారింది. మహానేత వైఎస్ పోలవరం ప్రాజెక్టు పనులను చేపట్టినప్పుడు అప్పటి విపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. డ్యామ్ కట్టకుండా కాలువలు తవ్వడం ప్రపంచంలో వింతంటూ అపహాస్యం చేశారు. కానీ.. ఆ మహానేత తవ్విన పోలవరం కుడి కాలువ మీదుగానే పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలిస్తూ.. అదీ తన ఘనతగా చంద్రబాబు చెప్పుకుంటోండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం చేపడితే జరిగే మేళ్లివీ.. ♦ పోలవరం జాతీయ ప్రాజెక్టు. తాజా ఎస్ఎస్ఆర్ ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.36 వేల కోట్లు. కేంద్రం చేపడితే ఆ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని మొత్తం కేంద్రమే భరిస్తుంది. ♦ ప్రస్తుతం ఒడిశా రాష్ట్రం పోలవరాన్ని వ్యతిరేకిస్తోంది. కేంద్రం చేపడితే సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణల్లో ప్రజాభిప్రాయ సేకరణ సభలు సులభంగా నిర్వహించి.. వివాదం లేకుండా చూస్తుంది. ♦ గోదావరి ట్రిబ్యునల్ తీర్పు మేరకు పోలవరం డిజైన్లు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదం తప్పనిసరి. కేంద్రమే ఆ ప్రాజెక్టును నిర్మించడం వల్ల సీడబ్ల్యూసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. దీని వల్ల ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ♦ సీడబ్ల్యూసీ, ఎన్‌హెచ్‌ఆర్‌ఐ(నేషనల్ హైడ్రాలజీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్), జీఎస్ఐ(జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) వంటి సంస్థల్లో పనిచేసే నిపుణుల పర్యవేక్షణ ఉండటం వల్ల ప్రాజెక్టు పనులు నాణ్యతతో చేస్తారు. ♦ కేంద్ర ప్రభ్వు బడ్జెట్ రూ.20 లక్షల కోట్లు. 2014లోనే కేంద్రానికి ప్రాజెక్టును అప్పగించి ఉంటే ఇప్పటికే ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చేది. మార్చి, 2018 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం వల్ల జరిగే నష్టాలివీ.. ♦ 2010-11 ఎస్ఎస్ఆర్ ప్రకారం రూపొందించిన పోలవరం అంచనా వ్యయంలో కేవలం హెడ్ వర్క్స్, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు(ఇరిగేషన్ కాంపొనెంట్)కు మాత్రమే కేంద్రం నిధులు ఇస్తుంది. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు అవసరమైన నిధులతోపాటూ ప్రాజెక్టు నిర్మాణ పనుల పెరిగిన అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ♦ పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఒడిశా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో కేసు వేసింది. దీని వల్లే ప్రాజెక్టు పనులపై కేంద్రం పర్యావరణ నిషేధం విధించి.. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సడలిస్తూ వస్తోంది. ఒకవేళ కేంద్రమే ఈ ప్రాజెక్టును చేపట్టి ఉంటే.. ఈ వివాదం పరిష్కారమయ్యేది. ♦ పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌కు సంబంధించి వర్కింగ్ డిజైన్లు మినహా.. ఎలాంటి డిజైన్లను సీడబ్ల్యూసీకి పంపలేదు. ఇటీవల కేంద్ర బృందం ఇదే అంశాన్ని లేవనెత్తింది. ♦ భూకంప ప్రభావిత ప్రాంతం(సెస్మిక్ జోన్)లో నిర్మిస్తుండటం వల్ల నిపుణులు అవసరం. కానీ.. రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణులు అందుబాటులో లేరు. ఇటీవల జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు కోసం నర్మద కార్పొరేషన్లో పనిచేసిన డీపీ భార్గవను కన్సల్టెంట్‌గా నియమించింది. ♦ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రస్తుతం జరుగుతున్న రీతిలోనే పనులు సాగితే 2018 నాటికి పూర్తవడం అసాధ్యం. ప్రాజెక్టు పూర్తవడానికి కనీసం 20 నుంచి 30 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. -
హోదా తాకట్టుకు దక్కిన తొలి ‘ప్యాకేజీ’
-
హోదా తాకట్టుకు దక్కిన తొలి ‘ప్యాకేజీ’
టీడీపీ ఎంపీ రాయపాటికి భారీ లబ్ధి చేకూర్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు * పోలవరం హెడ్‌వర్క్స్ అంచనా వ్యయం రూ.1,481 కోట్లు పెంపు * 7న పోలవరం బాధ్యతలు రాష్ట్ర సర్కార్‌కు అప్పగించిన కేంద్రం * 24 గంటలు గడవక ముందే అంచనా వ్యయం పెంచుతూ ఉత్తర్వులు * అంతా పక్కా ప్రణాళికతో నడిపించిన చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: ఐదు కోట్ల మంది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టినందుకు గానూ ఏపీ ప్రభుత్వ పెద్దలకు దక్కిన మొదటి ‘ప్యాకేజీ’ ఇది. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను అప్పగించి 24 గంటలు కూడా గడవక ముందే.. ఆ ప్రాజెక్టు హెడ్‌వర్క్స్(ప్రధాన పనులు) కాంట్రాక్టర్ అయిన టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ఏపీ ప్రభుత్వం రూ.1,481 కోట్ల భారీ లబ్ధి చేకూర్చింది. కేంద్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకుంటే కమీషన్లు కొట్టేసే అవకాశం ఉండదని, అందుకే చంద్రబాబు సర్కారు ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపిందనడానికి ఇదొక నిదర్శనం. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం(7న) రాత్రి ప్యాకేజీ ప్రకటించగానే.. గురువారం(8న) పోలవరం హెడ్‌వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.5,535.41 కోట్లకు పెం చుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు(జీవో 96) జారీ చేసింది. ఐదు కోట్ల మంది ఆంధ్రుల స్వప్నం పోలవరం ప్రాజెక్టు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టు పనులను చేపట్టి, వేగంగా పూర్తి చేసేందుకు రెండేళ్లుగా మొగ్గుచూపని ప్రభుత్వం.. ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి మాత్రం మొదటి నుంచీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పోలవరం హెడవర్క్స్ పనుల అంచనా వ్యయం రూ.4,717 కోట్లు కాగా, టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్.. రష్యా, ఒమన్లకు చెందిన జేఎస్సీ, యూఈఎస్లతో జట్టుకట్టి, 14.05 శాతం తక్కువ ధరలకు అంటే రూ.4,054 కోట్లకు పోలవరం హెడ్ వర్క్స్ పనులు చేజిక్కించుకుంది. ఈ పనులు 60 నెలల్లో పూర్తి చేసేలా 2013, మార్చి 2న కాంట్రాక్టర్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. నాడు తస్మదీయుడు.. నేడు అస్మదీయుడు అయితే పోలవరం హెడ్ వర్క్స్ పనులు చేసే సత్తా ట్రాన్స్ట్రాయ్కు లేదని.. ఆ సంస్థపై అనర్హత వేటు వేయాలని, పనులు అప్పగించొద్దంటూ అప్పట్లో ఎస్ఎస్ఎల్సీ(స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ) నివేదిక ఇచ్చింది. రాయపాటి అప్పట్లో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు. దీంతో పోలవరం హెడ్‌వర్స్ పనులు రాయపాటికి ఎలా అప్పగిస్తారంటూ అప్పటి విపక్ష నేతగా చంద్రబాబు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అనంతరం రాయపాటి సైకిలెక్కారు. దీంతో చంద్రబాబుకు రాయపాటి సన్నిహితుడిగా మారిపోయారు. కేవలం ప్రాజెక్టులు పనులు కొట్టేసేందుకే ఎంపీ రాయపాటి రష్యా, ఒమన్ దేశాలకు చెందిన సంస్థల సహకారం తీసుకోవడంతో క్షేత్రస్థాయిలో ఆ సంస్థల చిరునామా కన్పించలేదు. 2015, అక్టోబర్ 10 వరకూ అంటే.. 32 నెలల్లో కేవలం రూ.232.42 కోట్ల విలువైన పనులే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పనుల ప్రగతిపై పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) పదే పదే అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే కాంట్రాక్టర్‌కు పనులు చేసే సత్తా లేదని, తక్షణమే తొలగించాలని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ కూడా సూచించింది. కానీ ఈ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాయపాటికి భారీ ఎత్తున దోచిపెట్టేందుకు పావులు కదుపుతూ వచ్చారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలంటూ కేంద్రానికి పదే పదే లేఖలు రాస్తూ వచ్చారు. పీపీఏని నామమాత్రంగా మార్చి, రాయపాటితో కలసి నిధులు కొల్లగొట్టాలన్నది ఆ లేఖల ఎత్తుగడగా తెలుస్తోంది. ఏపీకి అప్పగించగానే దోపిడీపర్వం.. పనులు వేగవంతం చేయాలంటే తాజా(2015-16) ఎస్ఎస్ఆర్ మేరకు అంచనా వ్యయాన్ని పెంచాలని, హెడ్‌వర్క్స్ పనులు సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించాలని, వారిని కూడా ప్రధాన కాంట్రాక్టరే ఎంచుకోవచ్చంటూ రాయపాటి సాంబశివరావుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లమాలిన ప్రేమ కురిపించారు. ఆ మేరకు 2015, అక్టోబర్ 10న కేబినెట్‌తో ఆమోదముద్ర వేయించారు. సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించే సమయంలో ఒప్పందం చేసుకోవాలని, ‘ఎస్క్రో’ అకౌంట్‌ను ఏర్పాటు చేసి బిల్లులు చెల్లించాలని కేబినెట్ షరతు విధించింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు అంచనా వ్యయాన్ని పెంచుతూ పోలవరం ఈఎన్సీ ఏప్రిల్ 30న మొదటి సారి, ఆగస్టు 9న రెండో సారి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను తొక్కిపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించగానే వాటిపై ఆమోదముద్ర వేసేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలవరం హెడ్‌వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.5,767.83 కోట్లకు పెంచారు. ఇందులో 2015, అక్టోబర్ 10 వరకు పూర్తి చేసిన పనుల విలువ కేవలం రూ.232.42 కోట్లు కాగా, మిగతా పనుల విలువ రూ.5,535.41 కోట్లు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే హెడ్‌వర్క్స్ అంచనా వ్యయం ఒకేసారి రూ.1,481.41 కోట్లు పెంచినట్లు స్పష్టమవుతోంది. -
‘చాలెంజ్’.. ఇది దోపిడే
-
వాల్‌పోస్టర్లు నిషేధం
సాక్షి, అమరావతి: రాష్ర్టంలోని పట్టణాలు, నగరాల్లో అనుమతి లేకుండా గోడలపై రాతలు రాయటం, పత్రికలు అతికించడాన్ని నిషేధిస్తూ త్వరలో ప్రత్యేక చట్టం తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మొక్కలు, నీటి సంరక్షణ వంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రత్యేకంగా అదనపు మార్కులు కేటాయిస్తామన్నారు. గురువారం దుర్గాఘాట్‌లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన చంద్రబాబు.. అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాస్తవ తనిఖీ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. దీనికోసం రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఓ డ్రోన్ కెమెరా అందిస్తామన్నారు. ఒక్కో డ్రోన్ కెమెరా ఏడు గంటల్లో 150 కిలోమీటర్ల పరిధిలోని వాస్తవ పరిస్థితిని రికార్డు చేస్తుందన్నారు. కైజలా యాప్ ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వం సమాచారం సేకరించి తిరిగి వారికి చేరవేస్తుందన్నారు. కేంద్రం నుంచి 1,700 కోట్లు రావాలి పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకూ జరిగిన, జరగాల్సిన పనుల వివరాలను సీఎం వెల్లడించారు. ప్రాజెక్టు డయాఫ్రం వాల్ పనులను ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది జూన్‌లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ర్టం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ. 1,700 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పూర్తయ్యేలా ఈ ఏడాది రూ. మూడు వేల నుంచి నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రం నిధులు విడుదల చేయాలన్నారు. -
‘చాలెంజ్’.. ఇది దోపిడే
‘స్విస్ చాలెంజ్’ ముసుగులో భారీ కుంభకోణం రైతుల భూములతో రియల్ వ్యాపారం... ♦ సింగపూర్ కంపెనీలతో కలసి రూ.వేల కోట్లు కొట్టేసే వ్యూహం ♦ అంతా రహస్యం... పారదర్శకత మృగ్యం ♦ ప్రభుత్వ వాటా తగ్గించడమే పెద్ద స్కామ్ ♦ సింగపూర్ కన్సార్టియంకు 58శాతం వాటా ♦ రూ. 306 కోట్ల పెట్టుబడికి.. రూ.27,461.84 కోట్ల లాభం ♦ సర్కారు వాటా 42 శాతానికి పరిమితం ♦ రూ.5,721.9 కోట్లు ఖర్చు చేస్తే వచ్చేది రూ.19,886.16 కోట్లే.. ♦ అసెంబ్లీ, సచివాలయం లాంటివీ కట్టరు రాజధాని ప్రకటనకు ముందే లక్ష కోట్లు కొట్టేశారు... అందుకు ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ను ప్రయోగించారు. ఇపుడు మరో లక్ష కోట్లు కొట్టేయబోతున్నారు. ఇందుకు‘స్విస్ ఛాలెంజ్’ను ప్రయోగిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రాజధాని ఎక్కడ వస్తుందో ప్రకటించడానికి ముందు పేద రైతుల భూములు కొట్టేసి లక్ష కోట్ల మేర లబ్దిపొందిన సర్కారు పెద్దలు ఇపుడు ‘స్విస్ చాలెంజ్’ ముసుగులో మరో ఘరానా దోపిడీకి స్కెచ్ వేశారు. రైతుల నుంచి సమీకరించిన భూములను స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కన్సార్టియంకు కట్టబెట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసి మరో లక్ష కోట్లు కొట్టేసే పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రధాన రాజధాని కేంద్రం(సీడ్ కేపిటల్)లో అత్యంత విలువైన 1,691 ఎకరాల్లో చేపట్టిన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును కట్టబెట్టడానికి సింగపూర్ సంస్థల కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన అవగాహనలోని మతలబులన్నీ ఇప్పటికే బట్టబయలయ్యాయి. స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత లేనే లేదని సుప్రీం కోర్టు ఎప్పుడో తెగేసిచెప్పింది.. ఎలాంటి పరిస్థితుల్లోనూ స్విస్ చాలెంజ్ విధానాన్ని ప్రోత్సహించవద్దని గతంలోనే కేల్కర్ కమిటీ ప్రతిపాదించింది. మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు.. ఆర్థిక నిపుణులు వారించినా ముఖ్యమంత్రి చంద్రబాబు స్విస్ చాలెంజ్ విధానంలోనే రాజధాని మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించారు. సింగపూర్ సంస్థలతో కలిసి దోచుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న ప్రయత్నాలన్నిటినీ ‘సాక్షి’ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంది. తాజాగా స్విస్ చాలెంజ్‌పై ప్రభుత్వ వ్యవహారశైలిని ఉమ్మడి హైకోర్టూ తప్పుబట్టింది. అయినా ఈ విధానంపై రాష్ర్ట ప్రభుత్వం ముందుకు పోవడం వెనుక లక్ష కోట్ల దోపిడీ ప్రణాళిక దాగి ఉంది. ఇలా... పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే... పైసా పెట్టుబడి లేకుండా రైతుల భూములతో రాష్ర్టప్రభుత్వం చేస్తున్న పక్కా రియల్ఎస్టేట్ వ్యాపారం ఇది. ప్రధాన రాజధాని కేంద్రంలో చేపట్టే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియంకు కట్టబెట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేలాది కోట్లు కొట్టేయడానికి స్కెచ్ వేశారు. పేరుకు ప్రధాన రాజధాని కేంద్రమైనా అక్కడ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరు. అసెంబ్లీ, సచివాలయం వంటి ముఖ్యమైన నిర్మాణాలేవీ అక్కడ ఉండవు. కేవలం భూమిని అభివృద్ధి చేస్తారంతే. 1,691 ఎకరాల భూమిని చదును చేసి మౌలికసదుపాయాలన్నీ కల్పించి ప్లాట్లు వేసి అమ్మేస్తారు. వాటిని సింగపూర్ కంపెనీలు పాతికేళ్లలో ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. కోర్ కేపిటల్ ప్రాంతం అభివృద్ధి చేస్తే ఆ చుట్టుపక్కల ప్రభుత్వ పెద్దల బినామీల భూములకు మంచి ధర వస్తుంది. వందల ఎకరాలను కైంకర్యం చేసిన సర్కారు పెద్దలు భారీగా లబ్ధిపొందనున్నారు... అదీ ప్లాన్. దీనిని అమలు చేయడానికి భారీ ప్రణాళికే సిద్ధం చేశారు. సింగపూర్ సర్కార్‌తో తనకు ఉన్న సంబంధాల వల్ల.. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ఉచితంగా తయారు చేసి ఇవ్వడానికి ఆ దేశం అంగీకరించిందని సీఎం చెప్పుకొచ్చారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ను రూపొందించడానికి సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐఈ(ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజస్)తో ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ)కి డిసెంబర్ 8, 2014న ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను ప్రైవేటు సంస్థలు సుర్బానా ఇంటర్నేషనల్, జురాంగ్ ఇంటర్నేషనల్ సంస్థలకు సింగపూర్ సర్కార్ కట్టబెట్టింది. రాజధానికి భూసమీకరణ పేరుతో రైతుల నోళ్లు కొట్టి భూములు లాక్కున్న తరహాలోనే.. స్వప్రయోజనాల కోసం రాజధాని నిర్మాణ పనులను సింగపూర్ సంస్థలకు కట్టబెట్టడానికి వ్యూహాత్మకంగా సీఎం చంద్రబాబు ‘స్విస్ చాలెంజ్’ విధానాన్ని తెరపైకి తెచ్చారు. మార్చి 30, 2015న రాజధాని ప్రాంత(కేపిటల్ రీజియన్) మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ సంస్థలు అందించిన సమయంలోనే మాస్టర్ డెవలపర్‌ను స్విస్ చాలెంజ్ విధానంలో ఎంపిక చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ వెంటనే సింగపూర్ మంత్రి ఈశ్వరన్ స్పందిస్తూ.. మాస్టర్ డెవలపర్ కోసం సింగపూర్ సంస్థలు పోటీ పడతాయని చెప్పారు. ముందసు ఒప్పందం మేరకు సింగపూర్ ప్రైవేటు సంస్థలు అసెండాస్, సిన్‌బ్రిడ్జి, సెమ్బ్‌కార్ప్ సంస్థలు విలీనమై కన్సార్టియంగా ఏర్పడ్డాయి. లక్షకోట్లు దాటిపోయే దోపిడీ ప్రణాళిక ఇదీ... ≈ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అమలుకు సింగపూర్ సంస్థల కన్సార్టియం, ప్రభుత్వానికి చెందిన కేపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్(సీసీడీఎంసీఎల్) కలిసి అమరావతి డెవలప్మెంట్ పార్టనర్(ఏడీపీ)ని ఏర్పాటు చేస్తాయి. ఇందులో సీసీడీఎంసీఎల్ వాటా 50 శాతం, తమ వాటా 50 శాతం ఉండేలా అక్టోబరు 30, 2015న సింగపూర్ సంస్థల కన్సార్టియం తొలుత ప్రతిపాదించింది. ≈ కానీ సింగపూర్ కంపెనీల్లో బినామీ సంస్థలుండటంతో సింగపూర్ కంపెనీల వాటాను 58 శాతానికి పెంచాలని, ఏడీపీలో సీసీడీఎంసీఎల్ వాటా 42 శాతానికి తగ్గంచాలని స్వయంగా సీఎం సింగపూర్‌లో ఈ ఏడాది జనవరి 24, 25 తేదీల్లో చర్చల్లో సూచించారు. ఎవరైనా ప్రభుత్వ వాటా పెంచమంటారు గానీ తగ్గించమనడం గమనార్హం. ≈ ఇంతకూ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి ఏడీపీలో సింగపూర్ సంస్థలు పెట్టే పెట్టుబడి ఎంతో తెలుసా? కేవలం రూ.306.4 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం సీసీడీఎంసీఎల్ తరఫున రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఇదీ గాక మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తుంది. పైగా సింగపూర్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే రెవెన్యూ వాటా మాత్రం చెప్పకుండా సీల్డ్ కవర్లో గోప్యంగా ఉంచాలని సింగపూర్ సంస్థలు కోరగా అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ≈ ఏడీపీలో రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం.. రూ.5,721.9 కోట్లు పెట్టుబడి పెట్టే సీసీడీఎంఎల్ వాటా 42 శాతమే. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. సింగపూర్ కంపెనీలకు ఎంత మేలు చేయబోతున్నారో. ≈ రైతుల నుంచి రకరకాల మార్గాలలో సమీకరించిన భూమిలో 1,691 ఎకరాలు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు ఇస్తున్నారు. విజయవాడ బందరు రోడ్డులో గజం భూమి విలువ రూ.రెండు లక్షలకుపైగానే పలుకుతోంది. రాజధానిలో అత్యంత కీలకమైన సీడ్ కేపిటల్లో గజం విలువ హీనపక్షం రూ.లక్ష పలుకుతుందని స్వయంగా చంద్రబాబే చెబుతున్నారు. ≈ ఈ లెక్కన ఎకరా భూమిలో రహదారులు, పార్కులకు కొంత పోయి.. మిగిలే 2,800 గజాల స్థలం విలువ రూ.28 కోట్లు పలుకుతుంది. అంటే.. 1,691 ఎకరాల విలువ రూ.47,348 కోట్లు. ఇందులో సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం. అంటే.. ఆ సంస్థలకు రూ.27,461.84 కోట్లు దక్కుతాయి. రాష్ట్ర ప్రభుత్వానిది 42 శాతమే కాబట్టి దక్కే సొమ్ము రూ.19,886.16 కోట్లే. ≈ అంతే కాదు.. ఈ భూమిని పాతికేళ్లలో ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. అంటే.. పదేళ్ల తర్వాత గజం నాలుగు లక్షలు ఉంటే సింగపూర్ కంపెనీలకు వచ్చే లాభం రూ.లక్ష కోట్లను దాటిపోతుంది. ఇదంతా చూస్తోంటే.. మన భూమి ఇచ్చి మనం ఎక్కువ ఖర్చు పెట్టి సింగపూర్ కంపెనీలకు అత్యధికంగా లాభాలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సింగపూర్ కంపెనీల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఆ తర్వాత ఆ కంపెనీల నుంచి కమీషన్లు పొందేందుకు ప్లాన్ వేసినట్లు అర్ధమౌతోంది. అంతా గోప్యం.. సుప్రీం మార్గదర్శకాలు బేఖాతర్ రాజధాని మాస్టర్ డెవలపర్ ఎంపికలో స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసే క్రమంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వం తుంగలో తొక్కింది. మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్లో గృహాల నిర్మాణానికి డెవలపర్(కాంట్రాక్టర్) ఎంపిక కేసును విచారించిన సుప్రీం కోర్టు మే 11, 2009న తీర్పు ఇచ్చింది. ఆ క్రమంలో స్విస్ చాలెంజ్ విధానం అమలుకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని నిక్చచ్చిగా అమలు చేయాలంటూ అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేష్ జారీ చేసిన ఉత్తర్వులను సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేయడం గమనార్హం. మార్గదర్శకం 1: స్విస్ చాలెంజ్ విధానం కింద ఏ తరహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టాలన్నది ప్రభుత్వం తొలుత గుర్తించి, వాటిపై బహిరంగ ప్రకటన చేయాలి. ఉల్లంఘన: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టే ప్రాజెక్టుల వివరాలను బహిర్గతం చేయలేదు. మార్గదర్శకం 2: ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మాస్టర్ డెవలపర్ ఎంపికకు ప్రభుత్వం ప్రతిపాదనలు ఆహ్వానించవచ్చు. లేదా ఎవరైనా స్వచ్ఛందంగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించవచ్చు. మాస్టర్ డెవలపర్ ఎంపికలో సంస్థలతోగానీ.. కాంట్రాక్టర్లతోగానీ ఎలాంటి ముందస్తు సంప్రదింపులు చేయకూడదు. ఉల్లంఘన: సింగపూర్ సంస్థల కన్సార్టియంతో ముందస్తు సంప్రదింపుల కోసం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈలోగా జూలై 7న సీఎం చంద్రబాబు నేరుగా సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో చర్చలు జరిపారు. దీన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ నేతృత్వంలోని మౌలిక వసతుల కల్పన అథారిటీ నిరసించింది. మార్గదర్శకం 3: ఒరిజినల్ ప్రాజెక్టు ప్రపోజర్(ఓపీపీ) చేసిన ప్రతిపాదనలపై ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయాలి. ఈ వ్యవహారంలో ఎలాంటి గోప్యత ఉండకూడదు. ఉల్లంఘన: స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్ సంస్థలు బహిర్గతం చేయలేదు. వాటిని సీల్డ్ కవర్లో ఉంచినట్లు టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇది కౌంటర్ ప్రతిపాదనలు చేసే సంస్థలకు ప్రతికూలం. మార్గదర్శకం 4: ఓపీపీ కన్నా మెరుగైన ప్రతిపాదనలతో తక్కువ ధరకు ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశాలను అన్వేషించాలి. కౌంటర్ ప్రతిపాదనల దాఖలుకు కనీసం 60 రోజుల సమయం ఇవ్వాలి. ఉల్లంఘన..: కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. మార్గదర్శకం 5: ఓపీపీతోపాటు కౌంటర్ దాఖలు చేసే సంస్థలకూ సమాన అవకాశాలు కల్పించే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. ఉల్లంఘన: కేవలం విదేశాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టిన సంస్థలకే కౌంటర్ ప్రతిపాదనలు దాఖలు చేసే అర్హత కల్పించారు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం ఏడాదికి కనిష్టంగా రూ.150 కోట్ల నుంచి గరిష్టంగా రూ.300 కోట్లు ఖర్చు చేస్తారు. టెండర్లో షెడ్యూలు దాఖలుకు ఏడాదికి కనీసం రూ.రెండు వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలకే అవకాశం కల్పించేలా నిబంధన పెట్టారు. వీటిని పరిశీలిస్తే సింగపూర్ కన్సార్టియంకు లబ్ధి చేకూర్చడానికే సుప్రీం మార్గదర్శకాలను అడ్డగోలుగా ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ వాటా తగ్గించారు... ఏపీఐడీఈ-2001 చట్టం తుంగలో తొక్కారు ఉమ్మడి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ (ఏపీఐడీఈ)-2001 చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ చట్టాన్ని సింగపూర్ సంస్థల కోసం తానే సవరించారు. రాష్ట్రంలో ఏ సంస్థకైనా గరిష్టంగా 33 ఏళ్లకు భూములు లీజుకివ్వాలని ఏపీఐడీఈ చట్టంలోని నిబంధనను.. 99 ఏళ్లకు లీజు లేదా భూమిపై పూర్తి హక్కులు కల్పించేలా మార్పులు చేశారు. ఇక ఆ చట్టాన్ని అడ్డగోలుగా ఉల్లంఘించారు. నిబంధన 1: ఏ ప్రాజెక్టులోనైనా ప్రభుత్వానికి కనిష్టంగా 51 శాతం వాటా ఉండాలి. ఉల్లంఘన: సింగపూర్ సంస్థల కన్సార్టియం స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 50 శాతం.. తనకు 50 శాతం వాటా ఉండేలా అక్టోబరు 30, 2015న ప్రతిపాదించింది. కానీ.. గత జూలై 7న సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో సీఎం నేరుగా చర్చలు జరిపాక ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 48 శాతానికి పరిమితమైంది. సింగపూర్ సంస్థల కన్సార్టియం వాటా 52 శాతానికి పెరిగింది.ఈ మర్మమేమిటన్నది సీఎం చంద్రబాబుకే ఎరుక. నిబంధన 2: ప్రాజెక్టులపై అజమాయిషీ ప్రభుత్వానికే ఉండాలి. ఉల్లంఘన..: ఆరుగురు డెరైక్టర్లతో ఏడీపీ పాలక మండలిని ఏర్పాటు చేయాలని సింగపూర్ సంస్థలు ప్రతిపాదించాయి. ఇందులో నలుగురు సింగపూర్ సంస్థల ప్రతినిధులు.. ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. ఏడీపీ చైర్మన్‌గా తమ సంస్థలకు చెందిన డెరైక్టర్నే నియమించాలని కోరాయి. ఒక్కో డెరైక్టర్‌కు కనిష్ఠంగా 15 శాతం వాటా ఉంటుంది. ఏడాదికి నాలుగు సార్లు బోర్డు సమావేశమవుతుంది. 12 నెలలపాటూ ఒక డెరైక్టర్ బోర్డు సమావేశాలకు గైర్హాజరైతే ఆయన సభ్యత్వం రద్దవుతుంది. ఆ స్థానంలో మరొకరిని ఎంపిక చేస్తారు. ఒప్పందంలో అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఐదేళ్లపాటు ఎవరూ వాటాలను విక్రయించకూడదు. ఆ తర్వాత కూడా ప్రైవేటు సంస్థ వాటా 26 శాతానికి తగ్గకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటాలను విక్రయించాలని భావిస్తే తొలుత సింగపూర్ సంస్థలకే అవకాశం ఇవ్వాలి. సింగపూర్ సంస్థలు కొనేందుకు నిరాకరిస్తేనే ఇతరులకు విక్రయించాలి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీన్ని బట్టి చూస్తే సింగపూర్‌కు ఏ స్థాయిలో రాష్టర ప్రభుత్వం సాగిలబడిందో అర్థం చేసుకోవచ్చు. నిబంధన 3: ప్రాజెక్టుల్లో ఏవైనా వివాదాలు తలెత్తితే హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఇద్దరు నిపుణులు సభ్యులుగా నియమించిన కమిటీ వాటిని పరిష్కరిస్తుంది. ఉల్లంఘన..: సింగపూర్ కన్సార్టియం ఒత్తిళ్లకు తలొగ్గిన సర్కార్.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో వివాదాల పరిష్కారానికి లండన్ కోర్టును వేదికగా ఎంచుకున్నారు. కేల్కర్ కమిటీ ప్రతిపాదనలూ బుట్టదాఖలే.. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు చేపట్టే విధానాలపై అధ్యయనం చేయడానికి విజయ్ కేల్కర్ అధ్యక్షతన 2011లో యూపీఏ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. బీవోటీ(బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్పర్) నుంచి స్విస్ చాలెంజ్ వరకూ అన్ని విధానాలపై సమగ్ర అధ్యయనం చేసిన కేల్కర్ కమిటీ.. దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్విస్ చాలెంజ్ విధానాన్ని అమలు చేయవద్దంటూ నవంబర్, 2015న కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించింది. కానీ.. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయిన సీఎం చంద్రబాబు మాత్రం కేల్కర్ కమిటీ ప్రతిపాదనలను తుంగలోతొక్కి స్విస్ చాలెంజ్ విధానాన్ని అమలు చేస్తోండటం గమనార్హం. -
కేంద్రం హామీలు నిలబెట్టుకోవడంలేదు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోలేదని, తాము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాల (పీటీసీ) మైదానంలో సోమవారం నిర్వహించిన 70వ భారత స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. వందనం చేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘విభజన చట్టంలో కేంద్రం ఎన్నో వాగ్దానాలు చేసింది. పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేకహోదా, రైల్వేజోన్ హామీల జాడలేవు. తొలి ఏడాది రెవెన్యూ లోటు భర్తీ చేయలేదు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా, అందుకు తగ్గట్టుగా నిధులు విడుదల లేదు. రాజధాని నిర్మాణానికి సాయం చేయడంలేదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడంలో చొరవ లేదు. విభజన చట్టం కాగితం ముక్కలాగా మిగిలింది. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని ప్రధానమంత్రిని కోరాను’’ అని కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. తాము చెప్పిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ చేశామన్నారు. నూతన రాష్ట్రంలో తొలి, మలి స్వాతంత్య్రదిన వేడుకలు కర్నూలు, విశాఖలో జరుపుకున్నామని, ఈఏడాది ‘అనంత’లో నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే రెండోస్థానంలో ఉన్నామని, విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో మూడోస్థానంలో ఉన్నామన్నారు. ఫ్రీజోన్‌గా అమరావతి.. మరో రెండు ట్రిపుల్‌ఐటీలు ప్రారంభిస్తున్నామని, ఎయిమ్స్, వ్యవసాయ, ఉర్దూ విశ్వవిద్యాలయాలకు శంకుస్థాపన చేశామని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఈ ఏడాది జనవరిలో విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ద్వారా రూ. 4.75 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామన్నారు. అమరావతిని ఫ్రీజోన్‌గా చేసి అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే నగరంగా రూపొందిస్తామన్నారు. పౌరసరఫరాలకు ప్రథమ బహుమతి ప్రభుత్వ పథకాలపై ప్రదర్శించిన శకటాల్లో పౌరసరఫరాలశాఖ శకటానికి ప్రథమ బహుమతి దక్కింది. ఉద్యాన శాఖ శకటానికి ద్వితీయ, పరిశ్రమలు, విద్యుత్‌శాఖ శకటాలకు సంయుక్తంగా తృతీయ బహుమతులు లభించాయి. ఏపీ సచివాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవాలు సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం సచివాలయంలోని ఎల్ బ్లాక్ వద్ద ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. శాంబాబ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సీఎంవోలోనూ.. సాక్షి, అమరావతి: విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర జాతీయ జెండాను ఎగరేసి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో సీఎం కార్యాలయ కార్యదర్శి జి. సాయిప్రసాద్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. -
సేవచేయండి.... ఆనందం పొందండి
విలేకరుల సమావేశంలో సీఎం సాక్షి, అమరావతి/విజయవాడ: వచ్చే పుష్కరాల నాటికి రాష్ట్రంలోని వాగులు, వంకలు అనుసంధానం కావాలని, ప్రజలు దీన్ని ఒక సంకల్పంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. తను గతేడాది కృష్ణా, గోదావరి అనుసంధానాన్ని సంక్పలంగా తీసుకుని పట్టిసీమ ద్వారా పూర్తి చేశానని, ఈ కృష్ణా పుష్కరాల్లో గోదావరి నీటిని పెన్నాకు తరలించాలని సంకల్పం తీసుకున్నానని, పూర్తి చేస్తానని చెప్పారు. విజయవాడలో ఏర్పాటైన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్లో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. నదీమాతకు ప్రతి ఒక్కరూ తమ తమ ప్రార్థనా మందిరాల్లో పూజలు చేసి రుణం తీర్చుకోవాలన్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు, ముఖ్యంగా విజయవాడ వాసులు నదీజలాలను వినియోగించుకుని ఉన్నత స్థానాల్లోకి వెళ్లి బాగా సంపాదించారని, వారందరూ పుష్కరాల్లో సేవ చేసి ఆనందం, తృప్తి పొందాలన్నారు. దుర్గామాత దర్శనాని కి పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక సమయం కేటాయించనున్నట్లు చెప్పారు. డ్వాక్రా బజార్లను స్టార్టప్‌లుగా మార్చేందుకు మూలధనం.. డ్వాక్రా సంఘాల యూనిట్లను స్టార్టప్(అంకుర) సంస్థలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వ్యవస్థీకృత మూలధనాన్ని అందిస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన డ్వాక్రా బజారు స్టాల్‌ను సీఎం ప్రారంభించారు. మొక్కలు పెంచకుంటే రాయితీలు కట్ ఉద్యోగులు మొక్కలు పెంచకుంటే బదిలీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆదివారం రాత్రి ఇబ్రహీంపట్నం మండలంలోని పవిత్ర సంగమం ఘాట్ వద్ద జరిగిన ‘వనం-మనం’ సదస్సుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మొక్కలు పెంచి పచ్చదనాన్ని కాపాడే వారికోసం ప్రత్యేక పాలసీ, మొక్కల్ని పెంచే విద్యార్థులకు ప్రత్యేకంగా మార్కులు ఇస్తామన్నారు. సీఎం స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. -
ముహూర్తం మంచిదేనా?
సాక్షి, అమరావతి: కృష్ణా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పుష్కర స్నానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పుష్కర స్నాన ముహూర్తంపై చినజీయర్ స్వామిని అడిగితెలుసుకున్నట్లు సమాచారం. తాడేపల్లిలోని చినజీయర్ ఆశ్రమాన్ని గురువారం సీఎం సందర్శించారు. దుర్గాఘాట్‌లో ఉదయం 5.45గంటలకు బాబు పుష్కర స్నానం చేయనున్నారు. ఆ సమయం మంచిదా? కాదా? అని చినజీయర్‌ను అడిగినట్లు తెలిసింది. ఆశ్రమంలో చినజీయర్‌తో పది నిమిషాలు ఏకాంతంగా చర్చించినట్లు సమాచారం. అనంతరం తాడేపల్లిలోని ఆశ్రమాన్ని, వేదవిశ్వవిద్యాలయాన్ని సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి సీఎంను సత్కరించి ఆశీర్వదించి మంగళశాసనాలు అందించారు. 19న లక్షల మందితో సమతాస్నానం.. ఈ నెల 19న చిన జీయర్‌స్వామి లక్ష మంది తో సమతాస్నానం నిర్వహించనున్నారు. దీనికి సీఎం ను ఆహ్వానించినట్లు తెలిసింది. కాగా కృష్ణా జిల్లాలోని అన్ని ఘాట్ల సమాచారం ‘కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్’కు అందుతుందని, అక్కడి నుంచే పుష్కరాలను సమీక్షిస్తామని సీఎం వెల్లడించారు. దుర్గాఘాట్‌లోని మోడల్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. -
కృష్ణమ్మకు హారతులతో పుష్కరుడికి స్వాగతం
* లక్ష ఒత్తుల హారతిచ్చిన చంద్రబాబు * బోయపాటి శ్రీను బృందం లేజర్ షో సాక్షి, విజయవాడ: బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశించే సమయంలో కృష్ణానదికి పుష్కరాలు వస్తాయని పండితులు చెబుతారు. గురువారం రాత్రి 9.30 గంటల శుభముహూర్తంలో పవిత్ర కృష్ణానదిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై నుంచి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అర్చకులు నవహారతులు ఇవ్వడంతో పాటు కృష్ణమ్మను పూజించి పుష్కరుడ్ని ఆహ్వానించారు. అంతకు ముందు తొమ్మిది గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరితో కలసి కృష్ణా-గోదావరి సంగమ ప్రదేశానికి వచ్చారు. అక్కడే ఏర్పాటు చేసిన నమూనా దేవాలయాల్లోని శ్రీ దుర్గమ్మవారితో పాటు ఇతర దేవతామూర్తులు దర్శించుకుని పూజించారు. అక్కడ నుంచి కృష్ణానదీ తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశానికి వచ్చి కృష్ణమ్మకు లక్షఒత్తుల హారతిని ఇచ్చారు. గోదావరి-కృష్ణా సంగమాన్ని సినీదర్శకుడు బోయపాటి శ్రీను బృందం రంగురంగుల బాణసంచాతో, విద్యుత్ దీపాలతో సందర్శకుల్ని ఆకట్టుకునేలా వివరించారు. చంద్రబాబు లక్షఒత్తుల హారతి ఇవ్వగానే ఆకాశంలో మిరమిట్లుగొలిపేలా, రంగురంగుల విద్యుత్ కాంతులతో, అనేక రకాల శబ్దాలతోబాణసంచాను కాల్చారు. కృష్ణానదిపై లేజర్ షోను ప్రదర్శించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు తనయుడు లోకేష్, మంత్రులు పి.మాణిక్యాలరావు, అచ్చెన్నాయుడు, నారాయణ, దేవినేని ఉమా, కొల్లురవీంద్ర, ఎంపీ కేశినేని శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ పాల్గొన్నారు. మొదలైన కృష్ణా పుష్కరాలు సాక్షి, అమరావతి: పుష్కరుడు కృష్ణా నదిలోకి ప్రవేశించాడు. పుణ్యస్నానాలకు కృష్ణవేణి సిద్ధమైంది. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా -గోదావరి సంగమం ప్రాంతంలో గురువారం రాత్రి కృష్ణా హారతి ఆరంభంతో పుష్కర వేడుకలకు ప్రభుత్వం నాంది పలికింది. పిండ ప్రదానం పూజ ధర రూ. 300 కృష్ణా పుష్కరాల సందర్భంగా పిండ ప్రదానం పూజకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 300 ధరను నిర్ణయించింది. పిండ ప్రదానంతో పాటు పుష్కర స్నాన ఘాట్ల వద్ద జరిగే వివి ద రకాల పూజలకు రాష్ట్ర ప్రభుత్వం ధరలను నిర్ణయించింది. ఘాట్ల వద్ద పూజల నిర్వహణకు దేవాదాయ శాఖ ప్రత్యేకంగా పాస్‌లు జారీ చేయడంతోపాటు భక్తుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పూజను బట్టి మహా సంకల్పం, సరిగంగ స్నానం, ప్రాయశ్చితం, గౌరీ పూజ, గంగ పూజ- రూ.150 చొప్పున ధర నిర్ణయించారు. స్వయంపాకం/పోతారు- మూ సివాయనం పూజకు రూ. 200 ధరగా నిర్ణయించారు. పూజా సామగ్రి కిట్లను ఘాట్ల వద్దే చౌక ధరలకు విక్రయించేందుకు ప్రత్యేకంగా డ్వాక్రా బజార్లను ఏర్పాటు చేశారు. -
దుర్గాఘాట్‌లో సీఎం పుష్కర స్నానం
శుక్రవారం ఉదయం 5.45 గంటలకు స్నానం సాక్షి, అమరావతి: కృష్ణా పుష్కరాల ప్రారంభ రోజైన శుక్రవారం ఉదయం 5.45 గంటలకు విజయవాడలోని దుర్గాఘాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర స్నానమాచరిస్తారని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు. బృహస్పతి కన్యారాశిలో గురువారం రాత్రి 9.28 గంటలకు ప్రవేశిస్తాడని.. అయితే సూర్యాస్తమయం తర్వాత పుష్కర స్నానం చేయకూడదనే నియమం ఉండడంతో 12వ తేదీ సూర్యోదయ సమయంలో పుణ్య స్నానాలు ప్రారంభమవుతాయన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పుష్కర స్నానాలు ప్రారంభిస్తారని, అదే సమయంలో సీఎం స్నానం చేస్తారని వెల్లడించారు. 1,120 ప్రాంతాల్లో మొత్తం 62 వేల మంది ఉద్యోగులు పుష్కరాల సేవలందిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర సేవలకోసం విజయవాడలో ఏడు బేస్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. -
అందాల అరకులో నాకో కాటేజ్!
* ఇక్కడి అందాలను చూస్తుంటే ఇల్లు కట్టుకుని ఉండాలనుంది * దత్తత గ్రామం పెదలబుడు గ్రామస్తులతో సీఎం ముఖాముఖి సాక్షి, అరకు: ‘ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నాకెంతో ఇష్టమైన అరకును.. అరకు కాఫీని ఓ మార్కెటింగ్ మేనేజర్లా ప్రమోట్ చేస్తున్నా. టూరిజం హబ్‌గా, ఎడ్యుకేషన్ హబ్‌గా అరకువ్యాలీని తీర్చిదిద్దుతా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖ జిల్లా అరకులో మంగళవారం ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు పలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం స్థానిక ఎన్టీఆర్ గార్డెన్స్‌లో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో మాట్లాడుతూ అరుకులో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, దీన్ని అధిగమించేందుకు యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా పెరల్ పార్కు ఏర్పాటు చేస్తానని చెప్పారు. అరకు అందాలను చూస్తే ఇక్కడే ఒక కాటేజీ కట్టుకుని ఉండాలని అనిపిస్తోందన్నారు. అరకును ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్‌తో పాటు ఇంజనీరింగ్, బీఈడీ, నర్సింగ్ కళాశాలలన్నీ ఏర్పాటు చేస్తానన్నారు. ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు లక్ష ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ కోసం రూ.526 కోట్లతో ప్రాజెక్టు తీసుకున్నామన్నారు. దత్తత పంచాయతీని సందర్శించిన సీఎం అరకును అభివృద్ది చేయాలన్న లక్ష్యంతోనే ఈ మండలంలోని పెదలబుడు పంచాయతీని దత్తత తీసుకున్నానని చంద్రబాబు చెప్పారు. తొలుత పెదలబుడు పంచాయతీకి వెళ్లిన చంద్రబాబు స్థానికులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. -
హోదా కోసం ఢిల్లీకి వెళ్లలేదు
సాక్షి, అమరావతి: తాను రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరేందుకు ఢిల్లీ వెళ్లలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించేందుకే వెళ్లానని తెలిపారు. అదే సందర్భంలో ప్రత్యేకహోదా, తదితర అంశాలను ప్రధాని వద్ద ప్రస్తావించానని చెప్పారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీలు ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసి...రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీనిపై ప్రకటన చేస్తే బాగుంటుందని కోరినట్లు చెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ఆలోచిస్తున్నట్లు మోదీ చెప్పారన్నారు. కాంగ్రెస్ జీఎస్టీ బిల్లుకు ప్రైవేటు బిల్లును లింకు పెట్టి ఉంటే తప్పకుండా పాస్ అయ్యేదని, అలా లింకు పెట్టకుండా అక్కడ బిల్లు పాసయ్యాక ఇక్కడ మళ్లీ అడుగుతున్నారని విమర్శించారు. రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదని, అందుకే అక్కడ కాంగ్రెస్ పెట్టిన బిల్లు నెగ్గితే వాళ్లు రాజీనామా చేయాలి కాబట్టి దాన్ని లోక్‌సభకు పంపారని తెలిపారు. సాంకేతిక సమస్యలు చూపిస్తూ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ రాష్ట్రంతో ఆడుకుంటున్నాయని, ఇద్దరి రాజకీయ ప్రయోగాల్లో రాష్ట్రం నలిగిపోతుందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మద్దతిచ్చిన 11 పార్టీలకు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, లోటు బడ్జెట్‌ను భర్తీ చేయాలని, 2018కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు, రాజధాని నిర్మాణానికి నిధులివ్వాలని, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ల మాదిరిగా పరిశ్రమలకు రాయితీలివ్వాలని, రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని కోరానని సీఎం తెలిపారు. కాంగ్రెస్ ప్రైవేటు బిల్లును లోక్‌సభకు పంపుతున్నట్లు ప్రకటన చేసినప్పుడు టీడీపీకి చెందిన కేంద్రమంత్రి సుజనాచౌదరి చప్పట్లు కొట్టడాన్ని విలేకరులు ప్రశ్నించగా.. ఆయనకు అవగాహన లేక అలా చేశాడని వ్యాఖ్యానించారు. కృష్ణా పుష్కరాలకు ప్రధానితో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, మంత్రులు ప్రకాశ్ జవదేకర్, అనంతరామ్, వెంకయ్యనాయుడు, సురేష్‌ప్రభు, జేపీ నడ్డా, లోక్‌సభ స్పీకర్‌తోపాటు బీజేపీ సీనియర్ నేత అద్వానీలను కలసి ఆహ్వానించినట్లు తెలిపారు. ఏపీకి ప్యాకేజీ ప్రకటించండి సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారని, ఒకవేళ ఆ పరిస్థితే ఉంటే.. ఇక జాప్యం చేయకుండా రాష్ట్రానికి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని ప్రధానిని చంద్రబాబు కోరినట్లు సమాచారం. ఆయన శుక్రవారం ఉదయం ఢిల్లీలో ప్రధానితో పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా పుష్కరాలకు రావాలని కోరుతూ చంద్రబాబు ప్రధానికి ఆహ్వాన పత్రిక అందించారు. ఆ తర్వాత టీడీపీ ఎంపీలు కూడా మోదీని కలిశారు. -
హోదాపై ఆమరణదీక్షకు సిద్ధమా?
సీఎంకు మూడు పేజీల లేఖ రాసిన కాపు ఉద్యమనేత సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘రాష్ట్ర ప్రజలందరికీ ప్రధాన సమస్యగా ఉన్న ప్రత్యేక హోదాకోసం కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధమా? మీతోపాటు మీ కుమారుడు లోకేశ్ కూడా సిద్ధపడతారా... అందుకు మీరు సై అంటే నేను కూడా ఆమరణ దీక్ష చేపడతాను’’ అని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాలు విసిరారు. ఈ మేరకు ముద్రగడ మూడు పేజీల లేఖను గురువారం సీఎంకు పంపించారు. ‘‘నా జాతికి మీరిచ్చిన హామీలు అమలు చేయమంటే కోపమొచ్చి నా కుటుంబాన్ని అవమానించారు. అయినా నాకెటువంటి చింతా లేదు. దీనిపై మీనుంచి సానుభూతి మాటలుగానీ, క్షమాపణగానీ కోరడం లేదు. ఇంకెన్ని అవమానాలు చేసినా, చేయించినా భరిస్తాను. నా జాతికి బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రానికి 9వ షెడ్యూల్లో చేర్చమని అసెంబ్లీలో మీరు చేసే తీర్మానంకోసం ఎదురు చూస్తున్నా’’ అని లేఖలో పేర్కొన్నారు. ‘‘ఆమరణ దీక్ష చేయడానికి మీరూ.. మీ కుమారుడు సిద్ధపడితే నేను కూడా మీతోపాటే మీఇంట్లోనే చోటిస్తే దీక్షలో కూర్చుంటా. ఎవరెన్నిరోజులు చేయగలరో ఆ దీక్షలో పరీక్షకు నిలబడదాం. ఈ దీక్షను సవాలుగా స్వీకరించడంవల్ల ప్రత్యేక హోదాతోపాటు మన శరీర పటుత్వం, పట్టుదల, చిత్తశుద్ధి గురించి ప్రజలు తెలుసుకునే వీలుంటుంది.’’ అని ముద్రగడ తన లేఖలో తెలిపారు. -
హోదా తేకుంటే బాబుకు గుండు కొట్టిస్తారు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్య సాక్షి, అమరావతి: ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో తిరిగి వస్తే సన్మానం చేస్తామని, ఖాళీ చేతులతో వస్తే గుండు కొట్టించి ఊరేగించడానికి కూడా జనం వెనుకాడరని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలసి విజయవాడలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రెండేళ్లు గడిచినా విభజన హామీల్లో ఒక్కటీ అమలు చేయని బీజేపీ, హోదా సాధించలేని టీడీపీ ప్రస్తుతం ప్యాకేజీ అంటూ నాటకాలు ఆడుతున్నాయన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు బాబు, కేసీఆర్ తరచూ ఢిల్లీ వెళ్లి మోదీ చెవుల్లో గుసగుసలు చెప్పివస్తున్నారని, వీళ్లు వెళ్లినప్పుడు ప్రధాని చెవుల్లో దూది పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. -
బాబు ఎంతకైనా తెగిస్తారు: రఘువీరా
గోపాలపట్నం (విశాఖ): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. అధికారంలోకి రావడానికి.. చేసిన తప్పులు, అవినీతి నుంచి బయటపడేందుకు బీజేపీ కొమ్ముకాసి ప్రత్యేక హోదాను పక్కన పెట్టారని మండిపడ్డారు. గోపాలపట్నంలో ఆదివారం ఆయన మీడియాతో మాటాడారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో తమ ఎంపీల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తీసుకురాకుండా, టీడీపీలోకి వలస వచ్చిన ఎమ్మెల్యేల కోసం అసెంబ్లీ సీట్లు పెంచాలని కోరడం సిగ్గుచేటన్నారు. -
ఇంకెంత కాలం మోసం చేస్తారు బాబూ!
వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు మండిపాటు సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు? అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో కుండబద్ధలు కొట్టిన తరువాత తామేదో గట్టిగా పోరాడుతామన్నట్లుగా చంద్రబాబు ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండేళ్లుగా రాష్ట్రమంతటా పర్యటించి ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజెప్పి ఉద్యమ రూపంలోకి తెచ్చాకే ఇప్పుడు చంద్రబాబులో కొంత మార్పు వచ్చిందన్నారు. ఇందుకు తాము సంతోషిస్తున్నామని అన్నారు. కాగా కేవలం రాజకీయ కక్షతోనే విజయవాడలో వైఎస్ విగ్రహాన్ని తొలగించారని, దీనికి వెయ్యి రెట్లు మూల్యం చెల్లించడానికి చంద్రబాబు సిద్ధంగా ఉండాలని చెప్పారు. -
మభ్యపెట్టే మరో డ్రామా!
ప్రత్యేక హోదాపై చంద్రబాబు ద్వంద్వ వైఖరి బట్టబయలు కేంద్రంలో కొనసాగడమంటే జైట్లీ ప్రకటనను సమర్థించినట్లేగా! ≈ ఇంగ్లీషులో మాట్లాడితే ప్రధాని మోదీకి తెలుస్తుందనా..? ≈ కేంద్రంపై, బీజేపీపై పరుష వ్యాఖ్యలూ లేకుండా జాగ్రత్త ≈ సహకరించడం లేదంటూ ప్రతిపక్షంపై బాబు ఎదురుదాడి ≈ విభజన గాయాలను మళ్లీ రేపే ప్రయత్నం.. ≈ ప్రజల దృష్టి మరల్చడమేనని విశ్లేషకుల వ్యాఖ్య ≈ మంత్రులను ఉపసంహరిస్తే బీజేపీపై ఒత్తిడి పెరగదా? ≈ అదే జరిగితే తనకు ఇబ్బంది అనుకుంటున్నారా? సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై కేంద్రంతో గట్టిగా పోరాడతారని, ప్రత్యేక హోదా సాధన దిశగా గట్టి ప్రయత్నాలు చేస్తారని ఆశించిన ఐదుకోట్ల మంది తెలుగు ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. కలసి ఎన్నికల్లో పోటీ చేసి, కలసి అధికారాన్ని అనుభవిస్తున్న చంద్రబాబు ఇపుడు కేంద్రం నుంచి తన మంత్రులను మాత్రం ఉపసంహరించుకోకుండా పూర్తి నెపాన్ని బీజేపీపై నెట్టే ప్రయత్నం చేయడం చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. ప్రత్యేకహోదా ఆకాంక్ష పెరగడం, వ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో దాని నుంచి బైటపడడం కోసం ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులంటున్నారు. తన అసమర్థత బైటపడకుండా కాపాడుకోవడంకోసం ఈ నెపాన్ని బీజేపీపై వేయడానికి అనుకూల మీడియా సహాయంతో వేస్తున్న ఎత్తుగడ అని విశ్లేషకులంటున్నారు. చంద్రబాబుకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి వెంటనే మంత్రులను ఉపసంహరించేవారని వారంటున్నారు. రెండేళ్లుగా రకరకాల ప్రకటనలతో ఏమార్చుతూ వచ్చిన చంద్రబాబు ఈ ఒరవడిని ఇలాగే కొనసాగించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా అసాధ్యమని కేంద్రం స్పష్టం చేసేసిన నేపథ్యంలో ప్రతిపక్షాలు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులంతా ఆగ్రహోదగ్రులవుతున్నారు. పోరాటమే భవిష్యత్ కార్యాచరణగా నిర్దేశించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో పార్టీ ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ఏదో కఠిన నిర్ణయం తీసుకుంటారని అంతా ఆశించారు. కానీ కేంద్రంలో కొనసాగుతూనే బీజేపీపై నెపం మోపడం, విభజన కష్టాలను ఏకరువు పెట్టడం, ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడం, వనరులు లేవంటూ వాపోవడం, నిరసనలను నివారించే ప్రయత్నం చేయడం చూస్తుంటే ప్రత్యేకహోదాపై ప్రజలను మభ్యపెట్టేందుకు మరోమారు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమౌతున్నదని విశ్లేషకులంటున్నారు. అసలు రాష్ర్టవిభజనకు తన లేఖే కారణమన్న సంగతిని దాచిపెట్టి.. రాష్ట్రాన్ని నాడు అడ్డగోలుగా విభజించారంటూ విభజన గాయాలను రేపడం ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడ అని వారంటున్నారు. సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తున్నామనడాన్ని బట్టి చూస్తే కేంద్రంలో తాము పదవులను వదులుకునేది లేదని పరోక్షంగా తేల్చిచెప్పినట్లేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు. బీజేపీని పల్లెత్తుమాట అనకుండా.. నాడు విభజనకు కారణమైన కాంగ్రెస్‌పైనా, ప్రత్యేక హోదా కోసం ఆందోళనకు సిద్ధమౌతున్న ప్రతిపక్షాలపైనా, ప్రశ్నలడుగుతున్న విలేకరులపైనా విరుచుకుపడడం చూస్తుంటే చంద్రబాబు ఈ అంశాన్ని పక్కదారిపట్టించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదని పరిశీలకులంటున్నారు. బీజేపీ చేయడం లేదని ఇంగ్లిషులో చెప్పండి... ప్రత్యేక హోదా రాకపోవడానికి బీజేపీ కారణమని చంద్రబాబు పలుమార్లు వ్యాఖ్యానించడం చూస్తే నెపం పూర్తిగా వారిపైకి నెట్టేయడం ద్వారా ఈ సమస్య నుంచి ప్రజల దృష్టిని మరల్చాలన్నది ఆయన ప్రయత్నంగా కనిపిస్తున్నదని అంటున్నారు. ఒకవైపు వారిపై నెపం నెట్టేస్తూనే బీజేపీపై వ్యక్తిగత విమర్శలకు పోవద్దని నాయకులకు నిర్దేశించడం చంద్రబాబు ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రం ఏమీ చేయడంలేదని తెలుగుమీడియాలో మాట్లాడుతున్న చంద్రబాబు అవే విషయాలను జాతీయమీడియాతో మాత్రం చెప్పకపోవడానికి మోడీకి తెలుస్తుందన్న భయమే కారణమని వారు ప్రస్తావిస్తున్నారు. మభ్యపెట్టడంలో సరిలేరెవ్వరూ.. ప్రత్యేకహోదాపై ఎన్నికల ముందు నుంచి నేటి విలేకరుల సమావేశం వరకు వివిధ సందర్భాలలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన ఎన్నిరకాలుగా మభ్యపెడుతున్నారో తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులంటున్నారు. ప్రత్యేక హోదా కనీసం పదిహేనేళ్లయినా ఉండాలి అనడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అదే చంద్రబాబు ఎన్నికలు అయిపోయిన తర్వాత హోదా సంజీవని కాదనడం, హోదా ఉన్న రాష్ట్రాలకు ఏం ఒరిగింది అని ఎద్దేవా చేయడం, కేంద్రం హోదా ఇస్తానంటే వద్దంటామా..? కోడలు మగబిడ్డను కంటానంటే ఏ అత్తయినా వద్దంటుందా అని వ్యంగ్యంగా ప్రశ్నించడాన్ని పేర్కొంటున్నారు. ఇపుడు ప్రజలు ప్రత్యేక హోదా సంజీవని అని గ్రహించారని, అందుకే తిరగబడుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల్లో కనిపిస్తున్న ఈ చైతన్యం చూసే చంద్రబాబు మళ్లీ స్వరం మార్చారని, హోదా అవసరమే అని ఇపుడు చెబుతున్నారని వారు పేర్కొంటున్నారు. ఈ దశలో వినతిపత్రమా? ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకుంటామని, పార్టీ ఎంపీలతో వినతిపత్రాన్ని పంపిస్తామని చంద్రబాబు చెబుతుండడాన్ని ప్రస్తావిస్తూ... ఇప్పటికి 37 సార్లు ఢిల్లీ వెళ్లారు.. ఒకటో రెండోసార్లు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. ఇపుడు మరోమారు వినతిపత్రం ఇస్తామనడంలో అర్ధమేమిటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో ప్రత్యేకహోదా సాధ్యం కాదని అంత స్పష్టంగా చెప్పినా ఇంకా వినతిపత్రం పంపిస్తామని చంద్రబాబు చెప్పడంలో అర్ధం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. తాను అనుభవజ్ఞుడినని చెప్పుకునే చంద్రబాబు అనుభవం ఇదేనా అని సామాన్యప్రజలకు సందేహం కలుగుతోందని పరిశీలకులంటున్నారు. ఈ దశలో వినతిపత్రం ఇస్తామని చెప్పడం మభ్యపుచ్చడానికి.. ఏమార్చడానికేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నో ఎత్తుగడలు.. ప్రత్యేక హోదాపై కేంద్రం చేసిన ప్రకటనతో తమ మనోభావాలు దెబ్బతినడం, ఉద్యమాలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో తమను మభ్యపుచ్చడం కోసమే చంద్రబాబు రకరకాల వ్యాఖ్యలు చేశారని ప్రజలు భావిస్తున్నారు. విభజన కష్టాలను ఏకరువు పెట్టడం, వనరులు లేవని వాపోవడం వాటిలో భాగమే. అలవిమాలిన దుబారా, ప్రత్యేక విమానాలలో ప్రయాణాలు, అనేక దేశాలకు టూర్లు, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు ప్రకటనలు, అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామన్న వ్యాఖ్యలు చూసినవారెవరైనా వనరులు లేవన్న మాటలు నమ్ముతారా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇక బంద్‌లు, ఆందోళనలు వద్దని, జపాన్ తరహాలో ఎక్కువ పనిచేసి నిరసన తెలపాలని చంద్రబాబు వారించడం కేంద్రంపై వత్తిడి పెరగకుండా చూడడం కోసమేనా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రత్యేకహోదాపై బాధను వ్యక్తంచేస్తూనే నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కేంద్రం పక్కనపెట్టిందని ఆందోళనవ్యక్తం చేయడం ఆయన అసలు ఉద్దేశాన్ని తెలియజేస్తున్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 20మంది ఎమ్మెల్యేలను 30నుంచి 40 కోట్లిచ్చి కొనుగోలు చేసిన చంద్రబాబు వారికి రాజకీయ పునరావాసం కల్పించలేకపోతామే అని బాధపడుతున్నారు తప్ప లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదని విమర్శకులంటున్నారు. కేంద్రంలో కొనసాగడమంటే సమర్థించినట్లేగా..? ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో స్పష్టంగా చెప్పినా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కొనసాగడమంటే ఆ ప్రకటనకు మద్దతిస్తున్నట్లేనని విశ్లేషకులంటున్నారు. అరుణ్‌జైట్లీ ఆర్థికమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వంలో కొనసాగడమంటే ఆ ప్రకటనను సమర్థించినట్లేనని వారంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం మంత్రులను ఉపసంహరించకుండా ఎన్ని చెప్పినా అవన్నీ మభ్యపుచ్చడానికి ఆడుతున్న నాటకాలుగానే భావించాల్సి ఉంటుందని విమర్శకులంటున్నారు. అసలే ‘ఓటుకు కోట్లు’ కేసులోనూ, అనేక అవినీతి ఆరోపణలతోనూ సతమతమవుతున్న చంద్రబాబు ఇపుడు మంత్రులను ఉపసంహరించడంపై బీజేపీ కన్నెర్ర చేస్తే తట్టుకునే స్థితిలో లేరని, అందుకే ఆయన కేంద్రంపై తాను వత్తిడి చేయకపోగా ఎవరూ ఒత్తిడి చేయకూడదని కోరుకుంటున్నారని వారంటున్నారు.ఎల్లోమీడియాలో ఎన్నో ప్రయాసలు.. ఒకవైపు కేంద్రంలో కొనసాగుతూనే, మరోవైపు కేంద్రంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నట్లుగా కనిపించేందుకు చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనుకూల మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం చేయిస్తున్నారు. అరుణ్‌జైట్లీ హోదాపై ప్రకటన చేసిన అరగంటలోపే కేంద్రంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని, ఇపుడో ఇంకాసేపట్లోనో మంత్రులను ఉపసంహరించేస్తారని కథనాలు ప్రసారమయ్యాయి. ఆదివారం విలేకరుల సమావేశం తర్వాత కూడా చంద్రబాబు ఎంపీలపైనా, కేంద్రంలోని తమ పార్టీ ఇద్దరు మంత్రుల పైనా ఆగ్రహం వ్యక్తంచేశారని, ప్రత్యేక హోదాపై మరింత గట్టిగా పోరాడాలని క్లాస్ పీకారని కథనాలు వచ్చాయి. కావాలంటే మంత్రివర్గం నుంచి వైదొలగడానికి సిద్ధమేనని ఇద్దరు మంత్రులు చెప్పినట్లుగా కూడా చానళ్లు చెప్పేస్తున్నాయి. చంద్రబాబులో నిజంగా అలాంటి చిత్తశుద్ది ఉంటే ఈ సమస్య ఇంతవరకు వచ్చేదే కాదని, కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన తర్వాతనైనా వెంటనే మంత్రులను ఉపసంహరిస్తే ప్రజలు నమ్మేవారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. -
హోదా ఇవ్వాలన్న ఆలోచన మోదీకి లేదు
సాధించే సంకల్పం బాబుకు లేదు: భూమన ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎంత మాత్రం లేదని, కేంద్రంపై పోరాడి సాధించాలన్న సంకల్పం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేనేలేదని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామిపాద సన్నిధైన తిరుపతిలో వాగ్దానం చేసిన మోదీ.. ఇప్పుడు ఇవ్వకపోతే కచ్చితంగా నేర స్తుడవుతారన్నారు. పదిహేనేళ్లు కావాలని చెప్పి ప్రత్యేక హోదా సాధించలేని చంద్రబాబుకు.. ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి అర్హత లేదన్నారు. రాష్ట్రాన్ని దారుణంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ శవమై పోయిందని, హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయనని, పోరాడనని చంద్రబాబు చెప్పడం వల్ల టీడీపీ జీవచ్ఛవంలా మారిందని భూమన అన్నారు. బీజేపీ, టీడీపీ మాటలతో మోసపోయామని తెలుసుకున్న రాష్ట్ర ప్రజలు రగిలి పోతున్నారన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని చంద్రబాబు దానిని నీరు గార్చేందుకు ప్రయత్నించారని, ప్రజల్లో ఉద్యమిస్తున్నపుడు మాత్రం హోదా సాధనే లక్ష్యమంటున్నారని ధ్వజమెత్తారు. ఇపుడు రాజ్యసభలో చర్చ పేరుతో కాంగ్రెస్, టీడీపీ నాటకానికి తెరలేపాయన్నారు. అసలు రాజ్యసభలో చర్చ గాని, బిల్లుగాని అవసరం లేదనే విషయం తెలిసి కూడా చంద్రబాబు చర్చకు రెడీ అన్నారని, పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశం ఓటింగ్‌లో నెగ్గక పోతే దానిని సాకుగా చూపి ఇక ఆ అంశాన్ని ముగించాలనే కుట్రతో టీడీపీ ఉందన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఇదంతా అవసరం లేకుండా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటే సరిపోతుందన్నారు. దానికోసం చంద్రబాబు ఒత్తిడి చేయక పోవడం దారుణమన్నారు. -
విదేశీ పెట్టుబడికి దాసోహం
కాకినాడ సిటీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరువురూ విదేశీ పెట్టుబడులకు దాసోహమయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వ శేషుబాబ్జి విమర్శించారు. శుక్రవారం కలెక్టరేట్ వద్ద సీపీఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు ధరలు తగ్గించాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ప్రచారజాతాను ప్రారంభించారు. ఎన్నికల హామీలను నీటిమూటలుగా మార్చేశారని ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని మరో వంద రోజుల్లో విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని రప్పించి ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో రూ.15లక్షలు జమ చేస్తామని గొప్పలు చెప్పి ఆచరణలో నల్లధనం తెల్లగా మారిపోయేందుకు అవకాశం కల్పించారన్నారు. 24 నెలల్లో 22 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయన్నారు. బాబు వస్తే జాబు అనే మాటను ముఖ్యమంత్రి మరచి విదేశీ కంపెనీలకు అవకాశాలు ఇస్తున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం నగర కార్యదర్శి పలివెల వీరబాబు, నాయకులు ఎంవీ రమణ, దుర్గాప్రసాద్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆ లేఖ వెనుక..
కుప్పంరూరల్: మండలంలో కంగుంది పంచాయతీ పరిధిలోని పెద్దవంకలో చెక్‌డ్యామ్ ఎత్తు పెంచడంపై తమిళనాడు సీఎం జయలలిత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు శుక్రవారం లేఖ రాసింది. పాలారు పరివాహక ప్రదేశమైన పెద్దవం క గ్రామంలోని కనకనాశమ్మ దేవాలయం వద్ద చెక్‌డ్యామ్ ఎత్తు పెంచరాదని లేఖలో పేర్కొంది. 1892లో మద్రాసు- మైసూ రు ఒప్పందం ప్రకారం కర్ణాటకలో ప్రా రంభమై ఆంధ్ర మీదుగా తమిళనాడులో ప్రవహించి, సముద్రంలో కలిసే పాలారు నదిపై దిగువ ప్రాంతమైన తమిళనాడు అనుమతి లేకుండా పైభాగంలో చెక్‌డ్యామ్‌లు, ఆనకట్టలు కట్టరాదన్న విషయా న్ని లేఖలో తెలిపింది. ప్రస్తుతం కనకనాశమ్మ దేవాలయం వద్ద ఐదు అడుగుల ఎత్తు చెక్‌డ్యామ్ ఉందని, డ్యామ్ మరో ఐదు అడుగులు ఎత్తు పెంచేందుకు ఆం ధ్ర ప్రభుత్వం కట్టడాలు చేపడుతుందని, ఇది మద్రాసు - మైసూరు ఒప్పందం ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది. జయ లేఖరాయడానికి అసలు కథ.. కంగుంది పంచాయతీ పరిధిలోని పెద్దవంక వద్ద నాలుగు దశాబ్దాల క్రితం కనకనాశమ్మ దేవాలయం వెలిసింది. ఈ దేవాలయం ఆంధ్ర ప్రాంతంలో ఉంది. మొదట్లో ఆంధ్రులే దేవాలయాన్ని ని ర్మాణం చేపట్టారు. తమిళనాడు సరిహద్దుల్లో ఉండడంతో కాలక్రమంలో తమిళులు ఆక్రమించుకుని దేవాలయాన్ని అ భివృద్ధి చేశారు. కానీ దశాబ్దకాలంగా త మిళులకు, పెద్దవంక గ్రామస్తులకు దేవాలయ విషయమై వాదనలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై పలుమార్లు రాష్ట్ర, జిల్లా సర్వేయర్లు ఇరురాష్ట్రాల అధికారుల సమక్షంలో దేవాలయం ఆంధ్రకు దక్కుతుందని తీర్మానించారు. ఈ ఏడు దేవాలయం నిర్వహణ ఆంధ్ర అధికారులు, ప్రజలు చేపట్టి, గురువారం దేవాలయం ఆలయంలో వాహనాల స్టాండు కోసం వేలం పాట సైతం నిర్వహించారు. వీటన్నింటిని జీర్ణించుకోలేని సరిహద్దులోని తిమ్మంపేట తమిళనాడు వాసులు తమిళ నాయకుల ద్వారా సీఎంపై ఒత్తిడి తెచ్చి లేఖ రాయించారు. అంతే తప్పా 0.1 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కూడా లేని చెక్‌డ్యామ్ నిర్మాణంపై కాదని తెలుస్తోంది. -
హామీలన్నీ అమలు చేస్తాం
జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు కర్నూలు (టౌన్): కొత్త రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేరుస్తున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి సాగునీరు, విత్తన సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందిస్తామన్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ 2014 ఆగష్టులో సీఎం చంద్రబాబు రాష్ర్ట ప్రజలకు 17 వరాలు ప్రకటించారని, రెండేళ్ల వ్యవధిలో తొమ్మిదింటిని అమలు చేశారన్నారు. ఎమ్మిగనూరు టెక్స్టైల్స్ పార్కు, ఆవుకు రిజర్వాయర్ వద్ద టూరిస్టు సెంటర్ ఏర్పాటు, బెంగళూరు- చెన్నై కారిడార్, ఓర్వకల్లు వద్ద ఎయిర్‌పోర్టు, కర్నూలు - చిత్తూరు హైవే తదితర అభివృద్ది పనులు మరో 6 నెలల వ్యవధిలో పూర్తవుతాయని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యేలు భూమానాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, బిసి. జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భద్రతకు కోత
► తుళ్లూరుకు మంజూరైన కానిస్టేబుల్ పోస్టుల్లో భారీ తగ్గింపు ► గతంలో మంజూరైన 868 పోస్టులను 398కి తగ్గించిన ఆర్థికశాఖ ► పనిభారంతో పోలీసుల సతమతం ► ఎటూ తేలని పోలీస్ కమిషనరేట్ ► పోస్టుల తగ్గింపుపై పోలీస్ ఉన్నతాధికారుల ఆందోళన పేరుకు రాజధాని నిర్మాణ ప్రాంతం.. భద్రతపై మాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించడం లేదు. తుళ్లూరు మండలంలో రాజధాని నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించి ఏడాదిన్నర దాటుతున్నా నూతన పోలీస్స్టేషన్ల ఏర్పాటు జరగలేదు. తుళ్లూరుకు 868 కానిస్టేబుల్ పోస్టులు మంజూరు చేసిన ప్రభుత్వం తాజాగా వాటిని 398కి పరిమితం చేయడం రాజధాని ప్రాంతంపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం. తుళ్లూరును పోలీస్ సబ్‌డివిజన్‌గా చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసి ఏడాది దాటుతున్నా కార్యరూపం దాల్చలేదు. సాక్షి, గుంటూరు : నిత్యం వీవీఐపీల పర్యటనలు.. ఆందోళనలు.. తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణ పనుల వద్ద వరస సంఘటనల నేపథ్యంలో తుళ్లూరు ప్రాంతంలో పోలీసుల పరిస్థితి గందరగోళంగా మారింది. రాజధాని నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో తుళ్లూరును పోలీస్ సబ్ డివిజన్‌గా మార్చడంతో పాటు, డీఎస్పీ, నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, సిబ్బందిని నియమిస్తామంటూ ఏడాది కిందట జీవో కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి నాలుగు నెలల కిందట తుళ్లూరుకు 868 కానిస్టేబుల్ పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ పోస్టులు తక్కువని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్న తరుణంలో తాజాగా ఆర్థిక శాఖ సగానికి పైగా పోస్టులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాక ముఖ్యమంత్రి చంద్రబాబు సభలు, సమావేశాలు, శంకుస్థాపనల పేరుతో సుమారు 20 సార్లకు పైగా పర్యటించారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాక ఒక్క నెలలోనే సీఎం మూడు సార్లు ఈ ప్రాంతంలో పర్యటించారు. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిత్యం ఇక్కడ పర్యటిస్తూనే ఉన్నారు. అటకెక్కిన ప్రతిపాదనలు ప్రస్తుతం తుళ్లూరులో ఎస్ఐ స్థాయి అధికారితో పాటు, కేవలం 20 మంది కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. జిల్లాలోని మిగతా సబ్ డివిజన్ల నుంచి సుమారు 50మంది సిబ్బందిని నిత్యం తుళ్లూరు ప్రాంతంలో ఉంచుతున్నా రు. ఏఆర్, ఏపీఎస్పీ, స్పెషల్ పార్టీ పోలీసులు సుమారు వంద మంది వరకు అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. రాజధాని ప్రాంతాన్ని ప్రత్యేక పోలీస్ కమిషనరేట్‌గా చేయాలంటూ ఏడాదిన్నర కాలంగా అనేక ప్రతిపాదనలు పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం ముందుంచినా రాజకీయజోక్యం కారణంగా కమిషనరేట్ ఏర్పాటు జరగడం లేదు. నూతన పోలీష్స్టేషన్ల ప్రతిపాదనలన్నీ అటకెక్కాయి. మేలుకోకుంటే మరిన్ని ఇబ్బందులు రాజధాని ప్రాంతం పొలాల్లో రెండు దఫాలుగా జరిగిన పంట దహనం సంఘటనల్లో సైతం అసలు బాధ్యుల ను ఇప్పటి వరకు తేల్చలేకపోయారు. నేరాల దర్యాప్తుపై దృష్టి సారించే స మయం తమకు లేదని, సభలు, స మావేశాలు, పర్యటనలకు బందోబస్తు నిర్వహించేందుకే సరిపోతోందని పోలీసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పోలీసు శాఖ ప్రతిపాదనలపై దృష్టి సారించి భద్రతను కట్టుదిట్టం చేయకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ నిఘా కరువు రాజధానిగా తుళ్లూరును ప్రకటించాక ఈ ప్రాంతంలో ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియాతో పాటు మావోయిస్టుల సంచారం పెరిగిపోయింది. ఏదో సంఘటన జరిగేంత వరకు పోలీసులకు పూర్తి స్థాయి సమాచారం తెలియడం లేదు. ఇటీవల తాళాయపాలెం గ్రామంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు అన్నపూర్ణ అలియాస్ జ్యోతక్కను ఎస్ఐబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ అనేకసార్లు తుళ్లూరు ప్రాంతంలో సంచరించడంతో పాటు, కొంతకాలంగా ఆమె సోదరి ఇంట్లో చికిత్స పొందుతున్నప్పటికీ పోలీసులకు సమాచారం తెలియని పరిస్థితి. ఎస్ఐబీ అధికారులు సమాచారం అందించే వరకు ఇక్కడ ఉన్న పోలీసులకు ఆ జాడే తెలియలేదు. -
ముహూర్తం మారింది
29న 5వ బ్లాక్ గ్రౌండ్‌ఫ్లోర్ ప్రారంభం సాక్షి, అమరావతి: తాత్కాలిక సచివాలయం నుంచి పాలనా కార్యకలాపాల ముహూర్తం మారింది. ఈ నెల 27 నుంచి పాలన ప్రారంభిస్తామని గతంలో చెప్పడం తెలిసిందే. అనుకున్న సమయంలో..పనులు పూర్తి కాకపోవడంతో ముహూర్తాన్ని సీఎం మార్చారు. మరో రెండురోజులు వాయిదా వేశారు. ఈ నెల 29న ఐదవ బ్లాక్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌ను ప్రారంభిస్తామని, అదేరోజు పాలన మొదలుపెడతామని చంద్రబాబు తాజాగా ప్రకటించారు. వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పనుల్ని ఆయన శనివారం పరిశీలించారు. ఐదో బ్లాక్‌ను పరిశీలించి.. పనుల పురోగతి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ జూలై 6న ఐదవ బ్లాక్‌లోని మొదటి అంతస్తు, 15న 2, 3, 4 బ్లాక్ల్లోని గ్రౌండ్‌ఫ్లోర్లు, 21వ తేదీ 2, 3, 4 బ్లాక్ల్లోని మొదటి అంతస్తులను ప్రారంభించి పాలనా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. కుంగిన బ్లాక్‌ను పరిశీలించకుండానే వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం వద్ద రెండో బ్లాక్‌లోని కుంగిన ఫ్లోర్‌ను పరిశీలించకుండానే ముఖ్యమంత్రి అక్కడ నుంచి వెనుదిరిగారు. కుంగిన నిర్మాణంపై ప్రముఖంగా పత్రికలు రాయటం, ప్రసారం చేయడంపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. అయితే దాన్ని తాజాగా ‘‘ఇంతపెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు చిన్నచిన్న పొరబాట్లు సహజం. అదేదో జరిగిందని భూతద్దంలో చూపించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయాలనుకోవటం పొరబాటు. ఏదైనా ఉంటే చెబితే సరిచేసుకుంటాం’’ అని అన్నారు. అలా అంటూనే ఆయన సాక్షిపైన, ప్రతిపక్షపార్టీపైన అక్కసును వెళ్లగక్కారు. శనివారం పనులు పరిశీలించిన సీఎం కుంగిన రెండో బ్లాక్‌లోని ఫ్లోర్‌ను పరిశీలించకుండానే వెనుదిరిగి వెళ్లిపోవటం గమనార్హం. -
పదేళ్లలో అమరావతిలో అద్భుత కట్టడాల నిర్మాణం
యాక్సిస్ రోడ్డు శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు తుళ్లూరు రూరల్: యాక్సిస్ రోడ్డు నిర్మాణాన్ని నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. శనివారం మండలంలోని వెంకటపాలెం నుంచి బోరుపాలెం వరకు 18కి.మీ మేర ఆరు లైన్ల యా క్సిస్ రోడ్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న పదేళ్లలో అమరావతిలో అద్భుతమైన కట్టడాలు నిర్మితమవుతాయని, ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. రోడ్ల నిర్మాణాలను స్థానిక ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం రాజధానిలో రోడ్ల నిర్మాణ చిత్రపటాల నమూనాలను పరిశీలించారు. ఆయన వెంట మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పార్టీ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి ఇతర మంత్రులు ఉన్నారు. అన్న క్యాంటీన్లతో పేదలకు ప్రయోజనం తుళ్లూరు: తాత్కాలిక సచివాలయ సమీపంలో శనివారం సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ అన్న క్యాం టీన్ను ప్రారంభించారు. ఈ క్యాంటీన్లతో పేదలకు ప్రయోజనమన్నారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, పరిటాల సునీత, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ శ్రీధర్ అన్న క్యాంటీన్లో అల్పాహారం తీసుకున్నారు. అనంతరం తాత్కాలిక సచివాలయంలో ఐదో బ్లాకు నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల జాప్యానికి గల కారణాలను ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్రబాబు, మందడం సర్పంచ్ ముప్పవరపు పద్మావతి తదితరులు ఉన్నారు. ప్రాంతాలవారీగా అన్నా క్యాంటీన్లు : మంత్రి సునీత రాష్ట్రంలో ప్రాంతాలవారీగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి సునీత తెలిపారు. అన్న క్యాంటీన్ ప్రారంభం తర్వాత ఆమె విలేకర్లతో మాట్లాడారు. నెలాఖరుకు తుళ్లూరు, యర్రబాలెంలోనూ అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. తమిళనాడులో క్యాంటీన్ల నిర్వహణను పరిశీలించి ఇక్కడా మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు టిఫిన్, మధ్యాహ్నం 11.30 నుంచి 2గంటల వరకు భోజనం ఉంటుందని మంత్రి వెల్లడించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవలు బాగున్నాయని కితాబిచ్చారు. -
సీఎం సీరియస్‌లో మర్మమిదే!
► మంత్రి ప్రత్తిపాటిపై రహస్య నివేదిక తెప్పించుకున్న చంద్రబాబు ► నకిలీ విత్తనాలు, పురుగు మందులను అదుపు చేయలేకపోతున్నారనే విమర్శలు ► సొంత నియోజకవర్గంలో ఆయన సతీమణి చక్రం తిప్పుతుందనే ఆరోపణలు సాక్షి, అమరావతి: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురించి పూర్తిస్థాయి సమాచారం తెప్పించుకున్న తర్వాతే సీఎం చంద్రబాబు తన అసంతృప్తిని వీడియోకాన్ఫరెన్స్లోవెల్లడించినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఉద్యోగుల బదిలీల సమన్వయం సాకుతో మూడు రోజుల కిందట జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పేర్కొంటున్నాయి. నకిలీ పురుగు మందులు, కల్తీ విత్తనాలకు జిల్లా అడ్డగా మారినా అదుపు చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నట్లు చెబుతున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో పూర్తిగా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను కాదని పుల్లారావు భార్యే చక్రం తిప్పుతుందన్న ఆరోపణలూ వెల్లువెత్తుతు న్నాయి. ఏ పని చేయాలన్నా ఆమె అనుమతి తప్పనిసరని కార్యకర్తలు వాపోతున్నారు. మంత్రి పేరు చెప్పి కొందరు అనుచరులు అడ్డంగా దోచుకొంటున్నారని సొంత పార్టీ వారే ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యేలతోనూ సఖ్యత నిల్..: జిల్లాలోని అధికార పార్టీకి చెందిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలతోనూ మంత్రి పుల్లారావుకి సఖ్యత కొరవడినట్లు సమాచారం. పలుచోట్ల ఆయనే ఎమ్మెల్యేల ప్రమేయం లేకుం డా కలుగజేసు కోవడం వల్లే సమస్యలు తలెత్తినట్లు చర్చ సాగుతోంది. గుంటూరు నగరంలో ఎమ్మెల్యే మోదుగుల నియోజకవర్గంలో మంత్రి జోక్యం ఎక్కువైనట్లు తెలిసింది. మార్కెట్ యార్డు చెర్మైన్ పదవి విషయంలో మోదుగుల మాటను మంత్రి పరిగణనలోకి తీసుకోకుండా ఏక పక్షంగా వ్యహరించడంతోనే మార్కెట్ యార్డు చైర్మన్ భర్తీ ఆగిపోయినట్లు సమాచారం. సీసీఐ కుంభకోణంలో ఆరోపణలు.... గత ఏడాది సీసీఐ కొనుగోళ్లలో రూ. 450 కోట్ల కుంభకోణం బహిర్గతమైంది. మార్కెటింగ్ ఉద్యోగులు 15 మంది పైనా సీబీఐ కోర్టు విశాఖపట్నంలో కేసులు దాఖలయ్యాయి. వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సిఫార్సు చేసినా మంత్రి ప్రత్తిపాటి పట్టించుకోలేదు. ఫైలును తొక్కిపెట్టినట్లు అ శాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. సీసీఐ కుంభకోణంలో అప్పట్లో మంత్రి పాత్రపై పలు ఆరోపణలు వినిపించాయి. వ్యవసాయ శాఖలో ఏవోలు, ఏడీలు, ఎంపీఈఓల తదితర ఉద్యోగుల ప్రమోషన్లు ఏడాదిగా ఆగిపోయినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం బదిలీలకూ బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. వివిధ అంశాలపై నిఘా వర్గాల నుంచి సీఎంకు సమాచారం అందడం వల్లే పుల్లారావుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. -
గొంతెమ్మ కోర్కెలు తీర్చలేం : సీఎం
► అభివృద్ధి పనుల కోసం ఇళ్లు తొలగిస్తాం ► నష్టపోయినవారికి పరిహారమిస్తాం ► అవసరమైతే ఇళ్లు తొలగిస్తాం ► రూ.3వేల కోట్లతో అభివృద్ధి పనులు ► దుర్గగుడి అభివృద్ధిలోనూ ఇళ్ల తొలగింపు తప్పనిసరి ► పుష్కర ఘాట్ల పరిశీలనలో సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబునాయుడు గురువారం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనులను, పుష్కర ఘాట్ల నిర్మాణాలను పరిశీలించారు. వీలైతే వారానికోసారి పరిశీలిస్తానని తెలిపారు. సకాలంలో పూర్తికాకుంటే చర్యలు తప్పవని కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. విజయవాడ (కృష్ణలంక) : విజయవాడ రూపురేఖలు మార్చేస్తున్నామని, ఈ నేపథ్యంలో పలుచోట్ల ఇళ్లు తొలగించాల్సి వస్తోందని, ఇళ్లు కోల్పోయినవారు ఇబ్బందిపడకుండా నష్టపరిహారం ఇస్తామే తప్ప వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చలేమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన అనంతరం దుర్గాఘాట్‌లో జరుగుతున్న పనులను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో రూ.3వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఘాట్‌రోడ్డు అభివృద్ధికి ఇళ్లు తొలగించాల్సి ఉందని, అంతా సహకరించాలని కోరారు. కృష్ణా కెనాల్ చెత్తాచెదారంతో నిండి ఉండటాన్ని గమనించి ఇంజినీర్లను ప్రశ్నించారు. వన్‌టౌన్‌లోని డ్రెయినేజీ నీరు కాలువలో కలవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పద్మావతి ఘాట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని కలెక్టర్ బాబు.ఏ, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పద్మావతి ఘాట్‌లో విలేకరులతో మాట్లాడారు. పుష్కరాల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. పుష్కరాల పనులు వీలైతే వారానికోసారి పరిశీలిస్తానని సీఎం పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఎంపీ కేశినేని నాని, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, అసిస్టెంట్ కలెక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనుల పరిశీలన విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గగుడి మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు గురువారం పరిశీలించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయన షాపింగ్ కాంప్లెక్స్, భవానీ దీక్ష మండపం తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. భవనాలను తొలగించిన చోట ఏం ఏర్పాటు చేస్తారంటూ ఇన్చార్జి ఈవో ఆజాద్‌ను అడిగి తెలుసుకున్నారు. కొండపై నుంచి కృత్రిమ జలపాతంతో పాటు కొండ కింద మండపాలను ఏర్పాటుచేసి దుర్గామల్లేశ్వరస్వామికి పూజలు నిర్వహిస్తామన్నారు. భక్తులు తూర్పువైపు నుంచి ఆలయంలోకి ప్రవేశించేలా భవనాన్ని నిర్మించాలని సీఎంగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ నిర్ణయించారని తెలిపారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని గోశాల వద్దకు చేరుకుని సీఎం అక్కడి నుంచి నగరాన్ని తిలకించారు. మహామండపం నుంచి నగరాన్ని తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, హిల్‌వ్యూ ప్రాంతం నుంచి ప్రకాశం బ్యారేజీ, అమరావతి ప్రాంతాలను వీక్షించేందుకు వీలుగా పనులు చేపట్టాలన్నారు. మంత్రి నారాయణ, మేయర్ కోనేరు శ్రీధర్, ఎంపీ నాని, కలెక్టర్ బాబు.ఏ, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, సబ్ కలెక్టర సృజన తదితరులు ఉన్నారు. దుర్గమ్మను దర్శించుకోకుండానే వెనక్కి.. ఇంద్రకీలాద్రి మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించిన సీఎం దుర్గమ్మను దర్శించుకోకుండా వెనుదిరిగారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయన సుమారు పావుగంట సేపు ఆలయ పరిసరాల్లోనే గడిపారు. పనుల పరిశీలన, అధికారులతో మాట్లాడిన తర్వాత నేరుగా కాన్వాయ్‌తో కొండ కిందకు దిగిపోయారు. -
అవి సీఎం చెప్పిన టెండర్లు
* రద్దు చేయడానికి వీల్లేదు * ఆ అవినీతి టెండర్లు రద్దు చేయాల్సిందే * జెన్కో బోర్డు భేటీలో అధికారుల వాడివేడి చర్చ సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ ప్రాజెక్టుల టెండర్ల (బీవోసీ)లో భారీ ఎత్తున అవినీతి ఉన్నందువల్ల ఆ కాంట్రాక్టులను రద్దు చేయాలని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ చెప్పినా.. దానిని ఏపీ జెన్కో ఎండీ విజయానంద్ వ్యతిరేకించారు. ఈ కాంట్రాక్టుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ఆసక్తి ఉన్నందువల్ల రద్దు చేయడం సరికాదంటూ ఆయన టెండర్ల ప్రక్రియను సమర్థించారు. అజయ్‌జైన్ నేతృత్వంలో గురువారం జరిగిన ఏపీ జెన్కో బోర్డు మీటింగ్‌లో ఈ అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. విజయానంద్ వాదనతో బోర్డు సభ్యులు ఆశ్చర్యపోయారు. అవినీతి ఆరోపణలు వచ్చిన కాంట్రాక్టులను రద్దు చేయాల్సిందేనని, టెండర్ అర్హత నిబంధనలను మార్చాలని అజయ్‌జైన్ గట్టిగా అభిప్రాయపడినా.. విజయానంద్ మాత్రం సీఎం అవినీతిని సమర్థించడాన్ని వారు తప్పుపట్టినట్లు తెలిసింది. విజయానంద్ తీరుపై జైన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. టెండర్లలో దాదాపు రూ. 2,860 కోట్లు ఎక్కువ చెల్లింపులు జరుగుతోందన్న విమర్శలొచ్చాయని సమావేశంలో జైన్ ప్రస్తావించారు. ఎల్-1గా నిలిచిన బీజీఆర్, టాటాతో రెండు దఫాలు చర్చలు జరిపామని, వారు కొంతమేర తగ్గించుకునేందుకు ఒప్పుకున్నారని విజయానంద్ సమావేశం దృష్టికి తెచ్చారు. కొద్దిగా తగ్గించుకోవడంపై బోర్డు సభ్యులు ప్రశ్నించడంతో విజయానంద్ మనస్తాపానికి గురైనట్టు సమాచారం.అవినీతి కాంట్రాక్టులైనా సీఎం చెప్పబట్టే ముందుకెళ్లామని, దీన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని సమావేశం తర్వాత ఎండీ.. తన వెంటే ఉన్న ఫైనాన్స్ డెరైక్టర్‌తో చెప్పినట్టు తెలిసింది. ఏపీ జెన్కో కార్యాలయం విజయవాడకు తరలింపుపై చర్చకు వచ్చింది. టీడీపీకి చెందిన ఓ నేత భవనాన్ని చదరపు అడుగు రూ. 70కి ఇవ్వడానికి ముందుకొచ్చారని, ఆరు నెలల్లో అన్ని వసతులు కల్పించేందుకు హామీ ఇచ్చారని ఎండీ విజయానంద్ అన్నట్టు తెలిసింది. దీనికి బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటికి టెండర్లు..: కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నంలో ఒక్కొక్కటీ 800 మెగావాట్ల సామర్థ్యంతో రెండు థర్మల్ ప్రాజెక్టులను నెలకొల్పాలని ఏపీ జెన్కో నిర్ణయించింది. దీనికోసం టెండర్లు పిలిచింది. కొన్ని కంపెనీలు మాత్రమే అర్హత పొందేలా నిబంధనలు పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు ఇతర రాష్ట్రాల్లో తాము కట్టిన ప్రాజెక్టుల కన్నా రూ. 2,860 కోట్ల మేర ఎక్కువ కోట్ చేశాయి. ఇందులో ప్రభుత్వాధినేతకు పెద్ద ఎత్తున ముడుపులు అందాయనే విమర్శలొచ్చాయి. ఈ కుంభకోణాన్ని గతంలో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. -
2గంటలు 2 కోట్లు
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన చెందుతుంటారు. వృథా ఖర్చు తగ్గించి అభివృద్ధికి బాటలు వేయాలని హితబోధ చేస్తారు. అంతేకాదు రాష్ట్రాభివృద్ధికి అందరూ చేయూత నివ్వాలంటూ ఒకడుగు ముందుకేసి చందాలు వసూలు చేస్తారు. కానీ తనుమాత్రం ఆచరించరు. అమరావతి నిర్మాణం కోసం ఒక్కో విద్యార్థి పదిరూపాయలు ఇవ్వాలంటూ చివరకు సెంటిమెంట్‌ను అడ్డుపెట్టి వసూలు చేసిన ఘనత బాబు సర్కార్‌కు దక్కింది. అంతటితో వదలక ఇటుకలు కూడా చందాల రూపంలో సేకరించారు. రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ తలో చేయి వేయాల్సిందే..! కానీ రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్నా చంద్రబాబు మాత్రం వృథా ఖర్చు తగ్గించుకోరు. ఆద్యంతం ఎంత ఖర్చయినా సరే ఆయన పర్యటనల్లో హంగులు, ఆర్భాటం తగ్గకూడదు. ఇదే అదునుగా అధికారులు పోటీలు పడి మరీ బాబు పర్యటనలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తగలేస్తున్నారు. బుధవారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఉంది. రెండో విడత రుణమాఫీ పత్రాల పంపిణీ కోసం ఆయన ఒంగోలు వస్తున్నారు. పట్టుమని రెండు గంటలపాటు సభ. ఇందు కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. సభా వేదిక, ఆవరణలో సైతం పైకప్పు కార్పొరేట్ స్థాయిలో పర్మినెంట్ స్ట్రక్చర్లా నిర్మిస్తున్నారు. ఇందు కోసం అక్షరాలా కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు. హైదరాబాదుకు చెందిన వారికి కాంట్రాక్టు అప్పజెప్పారు. మినీ స్టేడియం ప్రాంతంలో కొత్తరోడ్లు నిర్మిస్తున్నారు. విద్యుత్ సరఫరా కోసం కొత్త ట్రాన్స్ఫార్మర్లతోపాటు పెద్ద జనరేటర్లను సిద్ధం చేశారు. నగరంలో ప్రధాన రోడ్ల డివైడర్ల లో మొక్కలు నాటి వాటికి ట్రీగార్డ్సు ఏర్పాటు చేస్తున్నారు. వాటికి పచ్చరంగులు అద్దారు. ఏడాది క్రితమే డివైడర్లకు రంగులు వేసినా సీఎం పర్యటన సాకుతో మరోమారు పచ్చరంగు వేస్తున్నారు. ఇందు కోసం లక్షల్లో వెచ్చిస్తున్నారు. ఇక జనాల తరలింపునకు వందలాది వాహనాలు ఏర్పాటు చేసి తద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. బాబు రాక ఇక్కడి పచ్చనేతలకు కాసులు కురిపిస్తోంది. మరోవైపు నగరంలో చాలా ప్రాంతాల్లో డ్రైనేజీలు కూడా శుభ్రం చేయక మురికి పేరుకుపోయింది. ప్రజలు దుర్గంధం, దోమలతో అల్లాడుతున్నా పట్టించుకోని కార్పొరేషన్ అధికారులు అన్నీ గాలికి వదలి అయిదు రోజులుగా సీఎం సభ ఏర్పాట్లలో తరిస్తున్నారు. అధికార పార్టీ నేతలు చెప్పిన వారి ఇళ్లు కూలగొట్టడం, పచ్చ చొక్కా నేతలకు నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు కట్టించడం తప్ప ఒంగోలు కార్పొరేషన్ అధికారులు ప్రజల సంగతి గాలికి వదిలారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
చెప్పింది వినాల్సిందే!
► ఆక్వా ఫుడ్ పార్క్‌ను అడ్డుకోవద్దన్న సీఎం చంద్రబాబు ►‘ఏరువాక’లో రైతులకు వాత పెట్టేలా ప్రసంగం ► ప్రజల మనోభావాలకు పాతర ►కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ► పరిశ్రమల్ని అడ్డుకుంటే ఎలాగని నిలదీత సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘రైతన్న సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఏరువాక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తాం. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే వ్యవసాయ హబ్‌గా తీర్చిదిద్దుతాం. రైతులు సాగు ప్రారంభించింది మొదలు పంటలను మార్కెట్లో విక్రయించే వరకూ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది..’ అంటూ రైతులను ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ధాన్యానికి మద్దతు ధర పెంచే విషయంలో మాత్రం నోరు మెదపలేదు. కనీసం మద్దతు ధరపై రాష్ట్రం తరఫున బోనస్ ఇచ్చే అంశాన్ని ప్రస్తావించలేదు. ధాన్యం పంట ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన హామీపై స్పందించలేదు. పైగా తాను చెప్పిందే వేదమన్నట్టు.. ఏది చెబితే అది రైతు లు వినాల్సిందే అన్నట్టు అన్నదాతల నెత్తిన ఆక్వా పార్క్ పిడుగు వేశారు. పంటల్ని మింగేసే ఆక్వా పార్క్ నిర్మాణాన్ని తుందుర్రులో చేపట్టవద్దని.. తప్పదంటే సముద్ర తీరంలో భూములు కేటాయించి అక్కడకు తరలించాలని రైతులు కోరుతుంటే.. ‘తప్పదు భరించాల్సిందే’నంటూ హితబోధ చేశారు. భారీ ఉద్యమం సాగినా.. డెల్టా ప్రాంతంలో భారీ ఉద్యమానికి కారణమైన ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణానికి అనుకూలంగా ముఖ్యమంత్రి మరోసారి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. రూ. 200 కోట్ల వ్యయంతో భీమవరం మండలం తుందుర్రు గ్రామ పరిసరాల్లో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా ఆ ప్రాంత రైతులు, ప్రజలు తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదంటూ గతంలో ఒకసారి ముఖ్యమంత్రి ప్రకటన చేయగా, ఫుడ్‌పార్క్ బాధిత గ్రామాల ప్రజలు మరోసారి ఉద్యమాలకు పూనుకున్నారు. తాత్కాలికంగా పనులు నిలిచిపోవడంతో ప్రజలు కొంత శాంతించారు. ఈ నేపథ్యంలో సోమవారం నరసాపురం మండలం చిట్టవరంలో ఏరువాక కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు మళ్లీ ఫుడ్‌పార్క్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఫుడ్‌పార్క్‌ను అడ్డుకోవద్దని కోరారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ది చెందాలని, పరిశ్రమలు వస్తే అడ్డుకోవడం తగదని హితబోధ చేశారు. ‘కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుందాం. అందులో వచ్చిన నీటిని ప్రాసెసింగ్ చేసి నేరుగా సముద్రంలో కలిసేలా చర్యలు తీసుకుందాం. దీన్ని అడ్డుకోవద్దు’ అని సీఎం కోరారు. లక్షలాది ప్రజలు వ్యతిరేకిస్తున్న ఈ పరిశ్రమపై ముఖ్యమంత్రి అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. జనం ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే.. గ్రామాల మధ్య ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల జల, వాయు కాలుష్యాలు అధికమై తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తుందని భీమవరం, నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం మండలాల రైతులు, ప్రజలు ఏడాది కాలంగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు చేశారు. భీమవరం మండలం తుందుర్రులో సుమారు 70ఎకరాల విస్తీర్ణంలో గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ పనులకు టీడీపీకి చెందిన కొందరు నేతలు గత ఏడాది శ్రీకారం చుట్టారు. ప్రజల జీవనానికి తీవ్ర విఘాతం కల్పించే ఆక్వా ఫుడ్‌పార్క్‌ను నిలిపివేయాలని, గ్రామాలకు దూరంగా దీనిని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రజల డిమాండ్‌ను పార్క్ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో తుందుర్రుతోపాటు జొన్నలగరువు, కె.బేతపూడి గ్రామాల ప్రజలతోపాటు భీమవరం, నరసాపు రం, మొగల్తూరు, వీరవాసరం మండలాల్లోని సుమారు 40గ్రామాల ప్రజలు పనులు నిలిపివేయాలంటూ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చారు. పార్క్ అవసరాలకు నీటిని విపరీతంగా వినియోగిం చడం వల్ల పరిసర ప్రాంతాల్లో సాగునీటికి ఇబ్బంది ఎదురవుతుందని, రొయ్యల శుభ్రతకు ఉపయోగించే కలుషిత నీరు డ్రెయిన్స్‌లో కలవడం వల్ల అందులో ఉండే చేపలు చనిపోయి మత్య్సకారులకు ఇబ్బందులు ఏర్పడతాయనేది వారి ఆందోళన. ఫుడ్ పార్క్‌లో నిత్యం టన్నులకొద్దీ అమోనియా వాడతారని, దానిని నీటిలోకి వదలడం వల్ల జల వనరులు ఎందుకూ పనికిరావని ఆ ప్రాంత ప్రజ లు చెబుతున్నారు. దీనిపై హైదరాబాద్‌కు చెందిన ప్రేరణ ఫౌండేషన్ మాన వ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిం చింది. దీనిని ఆపడం కోసం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు గతంలో సీఎంను కలిసి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మాధవనాయుడి నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు ఫుడ్‌పార్క్‌ను అడ్డుకోవద్దని కోరడం చర్చనీయాంశం అయ్యింది. -
టీడీపీలోకి పలమనేరు ఎమ్మెల్యే
సుభాష్ చంద్రబోస్‌కు నామినేటెడ్ పదవి ఇస్తానని సీఎం హామీ? తాడేపల్లి రూరల్: చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి గురువారం రాత్రి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం సీఎం నివాసం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీలో చేరినట్లు తెలిపారు. ఎన్నికల్లో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరానని, తిరిగి సొంతగూటికి వచ్చానన్నారు. ఇదిలాఉంటే 2014లో పలమనేరు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన సుభాష్ చంద్రబోస్, మరికొందరు టీడీపీ నాయకులను బుధవారమే చంద్రబాబు విజయవాడకు పిలిపించారు.అమర్నాథ్రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సుభాష్‌కు నామినేటెడ్ పోస్టు ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
కాపులపై విషం చిమ్ముతున్న ముఖ్యమంత్రి
♦ దాసరి, చిరంజీవి, పల్లంరాజు, బొత్స తదితరుల మండిపాటు ♦ కాపు మంత్రులతో పూటకో మాట మాట్లాడిస్తున్నారని ధ్వజం ♦ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కాపు వర్గీయుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విషపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆ వర్గానికి చెందిన ప్రముఖ నాయకులు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్షను కూడా తప్పుదారి పట్టించే రీతిలో మంత్రుల చేత తప్పుడు విమర్శలు, ఆరోపణలు, విభిన్న ప్రకటనలు చేయిస్తున్నారని కాపు సామాజికవర్గ ప్రముఖులు దాసరి నారాయణరావు, కొణిదల చిరంజీవి, ఎం.పల్లంరాజు, బొత్స సత్యనారాయణ, సి.రామచంద్రయ్య, తోట చంద్రశేఖర్, అంబటి రాంబాబు, కె.కన్నబాబు, ఎం.వి.కృష్ణారావు, గంగయ్యనాయుడులు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటన లో ఖండించారు. ముద్రగడకు ఇచ్చిన హామీ ల విషయంలో కలెక్టర్, డీఐజీ ఇచ్చిన వివరణకు భిన్నంగా ముగ్గురు కాపు మంత్రులు చేసిన ప్రకటనల పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు మంత్రులు మాట్లాడక ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారని, ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్, డీఐజీల వివరణకు భిన్నంగా ప్రకటనలు చేశారన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు విషపూరిత చర్యగా అనుమానం వ్యక్తం చేశారు. ఇంతగా అవమానిస్తారా..: ముద్రగడ కుటుంబీకులను ముఖ్యంగా కుమారుడిని పైశాచికంగా తరిమి కొట్టిన విధానాన్ని, ముద్రగడ కోడలిపై ఉచ్చరించడానికి వీలుగాని పరుష పదజాలం ఉపయోగించి ఆ కుటుంబాన్ని అవమానించిన తీరును తప్పుపట్టారు. ఈ అవమానం ఆయన కుటుంబానికి జరిగినది కాదని, మొత్తం కాపు జాతికి జరిగిందిగా భావిస్తున్నామన్నారు. గతంలో దీక్ష విరమింప చేయడానికి కిర్లంపూడిలో మధ్యవర్తులైన మంత్రులు ఇచ్చిన హామీలను, అమలు పరచకుండా మోసం చేసినట్టుగానే ఇప్పుడూ మోసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముద్రగడ సమక్షంలో కలెక్టర్, డీఐజీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. కాగా, ముద్రగడ దీక్షను సమర్థిస్తూ ఈ నెల 13న కాపు ప్రముఖులు సమావేశమై ప్రభుత్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించి, దీక్షను విరమించే ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేసి ముద్రగడ ప్రాణాలు కాపాడాలని చేసిన డిమాండ్‌కు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఒత్తిడితోనే ప్రభుత్వం స్పందించిందన్నారు. తామంతా ముద్రగడ దీక్షపై చర్చించేందుకు గురువారం విజయవాడ వెళ్లాల్సి ఉండిందని, అయితే బుధవారం రాత్రి దీక్షపై కలెక్టర్, డీఐజీల ప్రకటన వెలువడిన నేపథ్యంలో పర్యటనను విరమించుకున్నామన్నారు. -
ముద్రగడ దీక్ష సమంజసం కాదు: సీఎం
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రం కష్టాల్లో ఉంది, అందరూ చేయూతనివ్వాల్సిన తరుణమిది.. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష చేయడం సమంజసం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కడప ఆర్అండ్బీ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సమాజం లో ఇష్టానుసారం ప్రవర్తించకూడదన్నారు. గతంలో ముద్రగడ దీక్ష చేస్తుంటే మరోవైపు రైలు కాల్చారని, రైలేం చేసిందన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఈ సంస్కృతి లేదని, బయటి వ్యక్తులే తగలబెట్టారన్నారు. కష్టాల్లో ఉన్నాం సమస్యలు సృష్టించడం సరి కాదని ముద్రగడకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. నదుల అనుసంధానంద్వారా మెట్టప్రాంతాలకు సాగునీరివ్వడమే లక్ష్యమని సీఎం చెప్పారు. పట్టిసీమ ద్వారా 100 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు చేర్చి, శ్రీశైలం నీటిని నిల్వచేసి రాయలసీమలోని మెట్టప్రాంతానికి ఉపయోగిస్తామన్నారు. -
తాగుడు మాన్పిస్తే జనం పిచ్చివాళ్లవుతారు
నవనిర్మాణ వారోత్సవాల్లో చంద్రబాబు సాక్షి, అమరావతి: మద్యపానం అలవాటును మాన్పిస్తే ప్రజలకు పిచ్చిపడుతుందని సీఎం చంద్రబాబుఅన్నారు. నవనిర్మాణ వారోత్సవాల్లో భాగంగా విజయవాడ ఏ కన్వెన్షన్‌లో మూడో రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. బెల్టు షాపుల వల్ల ఎక్కువ తాగుతున్నారని, తామంతా కలిసి వీటిని తొలగించినా మరో చోటికి వెళ్లి తాగొస్తున్నారని డ్వాక్రా సంఘ సభ్యురాలు చంద్రావతి సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన బాబు తాగుడు మాన్పిస్తే ప్రజలు పిచ్చివాళ్లవుతారన్నారు. అంతలోనే సర్దుకుని ఒక్కసారిగా కాకుండా క్రమేపీ మాన్పించాలన్నారు. ఈ భేటీలో బాబు విద్యాధికులపైనా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర జనాభా వృద్ధి తగ్గిపోయిందని, ఇదే విధంగా జరిగితే జపాన్ మాదిరిగా రోబోలతో పనులు చేయించుకోవాల్సి వస్తుందన్నారు. చదువుకున్న వాళ్లలో స్వార్థం పెరిగి పిల్లలు వద్దనుకోవడమే ఇందుకు కారణమన్నారు. నా స్ఫూర్తితోనే.. తాను ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహించడం వల్లే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారని సీఎం చెప్పారు. తన స్ఫూర్తితోనే ఆయన ఈ స్థాయికి ఎదిగారన్నారు. ‘రాజధాని’కి దేశీయ ఆర్కిటెక్ట్‌ల డిజైన్లు సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానిలో ప్రభుత్వ భవన సముదాయాలకు సంబంధించి దేశీయ ఆర్కిటెక్ట్‌లు రూపొందించిన డిజైన్లను బాబు పరిశీలించారు.ఆర్కిటెక్ట్ సంస్థలతో సీఆర్డీఏ ఉన్నతాధికారులు ఓ హోటల్లో సమావేశమయ్యారు. హఫీజ్ కాంట్రాక్టర్, సిక్ అసోసియేట్స్ తదితర సంస్థలు డిజైన్లను సమర్పించాయి. వాటిలో ఉత్తమమైదాన్ని ఎంపిక చేయాలని బాబు సీఆర్డీఏకు సూచించారు. -
పేదల భూములకు పరిహారం ఇవ్వరా?
♦ వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం ♦ ఎన్పీ కుంటలో భూ బాధితులతో ముఖాముఖి సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘అన్నదాతల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. పేదల భూములను లాక్కొని పరిహారం ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారు. నిజంగా ఆయనకు బుద్ధి, జ్ఞానం ఉందా? పేదవారి భూములంటే చంద్రబాబుకు ఎందుకంత కోపం? భూమిలేని నిరుపేదలను ఆదుకోవడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టాలిచ్చారు. సోలార్ ప్లాంట్ కోసం ఈ భూములను చంద్రబాబు ఎన్టీపీసీకి అప్పగించారు. సాగునీటి వసతి ఉన్న భూములను లాక్కోవడమే కాకుండా వారికి పరిహారం మంజూరులోనూ పక్షపాతం చూపిస్తున్నారు. పేదల భూములేమైనా మీ అత్తగారి సొత్తా?’’ అని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా శనివారం ఆయన కదిరి నియోజకవర్గంలోని నంబులపూల కుంట(ఎన్పీ కుంట)లో పర్యటించారు. సోలార్ ప్లాంట్ కోసం భూములను కోల్పోయిన బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. పట్టా భూములున్న వారికి ఎంత పరిహారం ఇచ్చారో అసైన్డ్, సాగుదారులకూ అంతే ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. ‘ఏళ్ల తరబడి ఆలస్యం చేస్తే ఒప్పుకునేది లేదు. వెంటనే ఇవ్వాలి. చంద్రబాబు చర్మం మందం కాబట్టి, ఆయన మనసు కరగదు. రెండేళ్లలో వచ్చేది మన ప్రభుత్వమే. అప్పుడు అందరికీ చెక్కులు ఇచ్చి తోడుగా ఉంటాం’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ముఖాముఖి అనంతరం సోలార్ ప్లాంట్‌ను పరిశీలించేందుకు జగన్ బయల్దేరగా పోలీసులు అనుమతి నిరాకరించి అడ్డుకున్నారు. -
చచ్చాక ఇస్తారా?
► కొత్త పింఛన్ల మంజూరులో జాప్యం ► ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినవి 10,725 ► ఎదురు చూస్తున్న 52 వేల మంది దరఖాస్తుదారులు ఇతని పేరు గంగయ్య. లేపాక్షి మండలం కుర్లపల్లి. వయసు 70 ఏళ్లకు పైబడి ఉంది. పింఛను కోసం గత ఏడాది జనవరి 12న మొదటి సారిగా అధికారులకు అర్జీ (నంబర్ 129878) ఇచ్చాడు. అప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాడు. ముసలి వయసులో ఏ పనీ చేయలేని తనకు కనీసం పింఛ నైనా వస్తే ఆసరాగా ఉంటుందని గంగయ్య చెబుతున్నాడు. ఈమె పేరు పెద్దక్క. పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు. ఒక క న్ను పూర్తిగా కనిపించదు. వికలాంగ సర్టిఫికెట్ ఉంటే పింఛన్ ఇస్తామని అధికారులు చెప్పారు. పెద్దాస్పత్రికి వెళ్లి సదరం క్యాంపులో 40 శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ తెచ్చుకుంది. ఏడాదిన్నర గడిచింది. పింఛన్ గురించి అడిగితే నీ పేరు జాబితాలో ఉందని చెబుతున్నారే తప్ప ఇవ్వడం లేదు. అనంతపురం అర్బన్ :పేదల సంక్షేమమే ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు రాష్ట్ర మంత్రులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు వేదికలెక్కి ఊదరగొడుతున్నారు. వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా సామాజిక భద్రత పథకం కింద అందించే పింఛన్లు పేదల దరికి చేరడం లేదు. వీటి కోసంవృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. గతంలో అర్హులైన వారందరికీ పింఛన్లు అందేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. జన్మభూమి కమిటీ సిఫారసు చేసినవారికే దక్కుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన పింఛన్లు జిల్లాలో 10,725 ఉన్నాయి. ఇక దరఖాస్తు చేసుకుని ఆన్లైన్లో అప్లోడ్ జరిగినవి 52 వేల వరకు ఉన్నాయి. వీరంతా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఉన్నవి తొలగించారు.. : ీడీపీ అధికారం చేపట్టిన తరువాత పింఛన్ మొత్తాన్ని రూ.వెయ్యి చేసింది. అప్పటి వరకు జిల్లాలో 4.12 లక్షల మంది పింఛన్ అందుకునే వారు. మొత్తాన్ని పెంచిన తర్వాత ప్రభుత్వం విచారణ చేయించి 1.30 లక్షల పింఛన్లను తొలగించింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య 2.82 లక్షలకు తగ్గిపోయింది. ఆ తరువాత విడతలవారీగా 1.05 లక్షల పింఛన్లు మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లాలో మొత్తమ్మీద 3,87,654 మంది పింఛన్ అందుకుంటున్నారు. జన్మభూమి కమిటీల నిర్వాకం జిల్లాలో జన్మభూమి కమిటీల నిర్వాకంతో వేలాది మంది పేదలు పింఛన్‌కు దూరమయ్యారు. బత్తలపల్లి మండల కేంద్రంలోనే దాదాపు 200 మంది వృద్ధులు, వికలాంగుల పింఛన్లు రద్దయ్యాయి. వీరంతా మూడు నెలల క్రితం కలెక్టరేట్‌కు తరలివచ్చి జాయింట్ కలెక్టర్-2 సయ్యద్ ఖాజా మొిహ ద్దీన్ వద్ద గోడు వెల్లబోసుకున్నారు. కొత్త పింఛన్ల ఊసేలేదు గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా కొత్తగా పింఛన్లు మంజూరయ్యేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవరైనా మరణి ంచినా, వరుసగా కొన్ని నెలలు తీసుకోకున్నా.. అలాంటి వారి పేర్లను తొలగిస్తామని, వారి స్థానంలో కొత్తవాటికి మంజూరు చేస్తామని ఒక అధికారి చెప్పారు. -
ప్రజల్ని రెచ్చగొట్టాలని యత్నించారు
సీఎం ‘నవ దీక్ష’ ప్రసంగంపై వాసిరెడ్డి పద్మ ధ్వజం సాక్షి, హైదరాబాద్: నవనిర్మాణ దీక్ష పేరుతో చేసిన ప్రసంగంతో సీఎం చంద్రబాబు ప్రజల్లో భావోద్వేగాల్ని రెచ్చగొట్టే యత్నం చేశారని, రెండేళ్ల పాలనలో తాను చేసిందేమిటో చెప్పుకోలేక అబద్ధాలాడి.. విభజన సమయంలో ఏపీ ప్రజలకు జరిగిన గాయాన్ని ఇంకా రేకెత్తించే యత్నం చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ చంద్రబాబు తన ప్రసంగంలో ఎక్కడా రెండేళ్లలో ఏపీ ప్రజలను ఇలా ముందుకు తీసుకెళ్లగలిగానని చెప్పుకోలేకపోయారన్నారు. ఈ దీక్షకోసం విడుదల చేసిన జీవోలో ‘ఏపీ పౌరులు’ అని పేర్కొనడమే దారుణమైన తప్పన్నారు. మనమంతా భారత పౌరులమేతప్ప రాష్ట్రాలకు పౌరసత్వం ఉండదన్నారు. జీవో జారీ చేసిన ఐఏఎస్‌లు శిక్షణ పొందింది ముస్సోరిలోనా... ఎన్టీఆర్ భవన్‌లోనా? అని ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు ‘ఓటుకు కోట్లు’ అవినీతి కేసులో ఇరుక్కోక పోయినట్లైతే ఆదరాబాదరా తట్టాబుట్టా సర్దుకుని తనతోపాటు ఉద్యోగులంతా వెళ్లిపోవాల్సి వచ్చేదా? ’’ అని ఆమె ప్రశ్నించారు. -
అందరి గుట్టు నా ‘గుప్పిట్లో’: సీఎం
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ): ‘మనుషులు మోసం చేస్తారేమో కానీ.. టెక్నాలజీ మోసం చేయదు. అందుకే నేను టెక్నాలజీని నమ్ముకున్నా. ఏడాదిలో అందరి గుట్టూ నా చిన్న ఫోన్లో ఉంటుంది..’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ హాలులో గురువారం టీడీపీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వచ్చే జూలై కల్లా ఫైబర్ కనెక్షన్ పూర్తవుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు సీఎం సమక్షంలో టీడీపీలో చేరారు. అమరావతి మెడికల్ హబ్‌గా రూపుదిద్దుకోనుందని బాబు అన్నారు.పీఎంఎస్ఎస్వై ద్వారా విడుదల చేసిన రూ.150 కోట్లతో విజయవాడ ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌కు చంద్రబాబు భూమిపూజ నిర్వహించారు. -
అధికారమే ధ్యాస.. అక్రమాలే శ్వాస
► సీఎం తీరుపై ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు ఎద్దేవా ► గద్దె దింపితేనే ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అని విమర్శ కర్నూలు(ఓల్డ్‌సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారమే ధ్యాస, అక్రమాలే శ్వాసగా కొనసాగుతున్నారని ఎమ్మెల్సీ ఎం.సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శుక్ర, శనివారాల్లో జరిగిన మహానాడును ప్రస్తావిస్తూ నిజంగా ఎన్టీఆర్‌ను ప్రేమించే వారైతే ఆ సభలకు వెళ్లకూడదని అభిప్రాయపడ్డారు. పార్టీ తనదంటూ వ్యవస్థాపకుడినే బహిష్కరించిన ఘనత చంద్రబాబుదన్నారు. ఎన్టీఆర్‌కు చేసిన అవమానం మరిచిపోయారా అంటూ మహానాడుకు వెళ్లిన వారిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఎన్టీఆర్ చావుకు నూటికి నూరుపాళ్లు చంద్రబాబే కారణమని ఆరోపించారు. ఆయన చనిపోయినప్పుడు ఫతే మైదాన్‌లో అడుగుపెట్టే ధైర్యం చాలక బయటే ఉండిపోయారని గుర్తు చేశారు. తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన హరికృష్ణ లోపలికి పిలుచుకువచ్చారన్నారు. అన్నా క్యాంటీన్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టి నవ్వులపాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన్ను గద్దె దింపితేనే ఎన్టీరామారావుకు అసలైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, పీసీసీ కార్యదర్శి సర్దార్ బుచ్చిబాబు, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు సలాం, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చివర్లో సిక్కోలు!
జిల్లాను అభివృద్ధి చేసేస్తున్నారంటూ మంత్రి అచ్చెన్నాయుడుకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకు 7. కానీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీడీడీజీ) ప్రకారం ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన ర్యాంకులు అన్నీ అట్టడుగునే ఉన్నాయి. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో సిక్కోలే చివరి స్థానంలో ఉండటం జరిగిన అభివృద్ధి ఏమిటో కళ్లకు కడుతోంది. ఒక్క సేవా రంగంలోనే పొరుగునున్న విజయనగరం జిల్లా కన్నా కాస్త మెరుగనిపించి అడుగు నుంచి రెండో స్థానంలో సిక్కోలు నిలిచింది. ఇక జిల్లా ఆర్థిక పరిస్థితిని చాటిచెప్పే తలసరి ఆదాయం విషయంలోనూ చివరి స్థానమే దక్కింది. టీడీపీ ప్రభుత్వం జిల్లా మంత్రికి, ఎమ్మెల్యేలకు ఇస్తున్న ర్యాంకులకు, ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన గణాంకాల ప్రకారం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధికి సంబంధం లేకపోవడంతో గందరగోళానికి దారితీస్తోంది. * అభివృద్ధిలో మంత్రి అచ్చెన్నకు ఏడో ర్యాంకు! * ప్రభుత్వ గణాంకాలతో గందరగోళం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రెండేళ్ల కాలంలో ఏడుసార్లు జిల్లాలో పర్యటించారు. వచ్చినప్పుడల్లా జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానానికి తీసుకెళ్తానని పలు హామీలు గుప్పించారు. ఇప్పటివరకూ జిల్లాలో ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా ఏర్పాటు కాలేదు. వ్యవసాయాధారిత జిల్లాగా గుర్తింపు ఉందని, ఆ రంగంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పినా ఆ దిశగా అడుగులు పడలేదు. పర్యాటకపరంగానూ జిల్లాకు పలు ప్రాజెక్టులు ప్రకటించినప్పటికీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. వాస్తవానికి జిల్లా స్థూల ఉత్పత్తిలో మెరుగవ్వాలంటే మంత్రులకు ర్యాంకులు ఇవ్వడం గాకుండా వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో జిల్లా వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హామీలు నెరవేర్చాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రకటించిన గణాంకాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. స్థూల ఉత్పత్తి గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 6,03,376 కోట్లు ఉంది. దీనిలో రూ.72,219 కోట్ల భాగస్వామ్యంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, రూ.22,707 కోట్లతో సిక్కోలు చివరి స్థానంతో సరిపెట్టుకుంది. కృష్ణా జీడీడీపీతో పోల్చితే జిల్లా భాగస్వామ్యం మూడో వంతు కూడా లేకపోవడం గమనార్హం. పొరుగునున్న విజయనగరం జిల్లా రూ.22,924 కోట్లతో 12వ ర్యాంకు దక్కించుకొని శ్రీకాకుళం కన్నా మెరుగనిపించింది. తలసరి ఆదాయం... ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి తలసరి ఆదాయమే ప్రధాన సూచిక. ఈ విషయంలోనూ సిక్కోలు చివరి స్థానానికే పరిమితమైంది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,07,532 ఉంటే జిల్లాది రూ.74,638 ఉంది. ఉత్తరాంధ్రలోనే ఒకటైన విశాఖ జిల్లా రూ.1,40,628తో ప్రథమ స్థానం దక్కించుకుంది. ఈలెక్కన ఒక విశాఖ వాసి సగటు ఆదాయంలో సిక్కోలు జిల్లా నివాసి ఆదాయం సగం మాత్రమే. విజయనగరం కూడా రూ.86,223 తలసరి ఆదాయం పొంది 12వ ర్యాంకుతో జిల్లా కన్నా మెరుగనిపించింది. వ్యవసాయ రంగం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా రూ.1,64,086 కోట్లు ఉండగా దానిలో రూ.22,697 కోట్ల భాగస్వామ్యంతో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. శ్రీకాకుళం మాత్రం కేవలం రూ.5,015 కోట్లతో చివరి స్థానానికి పరిమితమైంది. పశ్చిమ గోదావరి జిల్లాతో పోల్చితే ఈ రంగంలో సిక్కోలు వాటా నాలుగో వంతు కూడా లేదు. విజయనగరం జిల్లా రూ.5,894 కోట్లతో 12వ స్థానంతో జిల్లా కన్నా మెరుగ్గా ఉంది. పారిశ్రామిక రంగం అన్ని వనరులున్న శ్రీకాకుళం జిల్లాను పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చేస్తామని రెండేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే హామీలు ఇచ్చినా ఆచరణలో కానరావట్లేదు. ఈ ప్రభావం జిల్లా జీడీపీపై స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర జీడీడీజీలో పారిశ్రామిక రంగం వాటా రూ.1,31,643 కోట్లు కాగా దానిలో రూ.24,532 కోట్లతో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ రంగంలో కూడా రూ.4,400 కోట్లతో సిక్కోలుకు చివరి స్థానమే దక్కింది. విశాఖతో పోల్చితే ఆరో వంతు కూడా లేకపోవడం గమనార్హం. విజయనగరం రూ.4,493 కోట్లతో కాస్త మెరుగైన స్థానంలో ఉంది. సేవా రంగం రాష్ట్ర జీడీడీపీలో సేవారంగం వాటా రూ.2,61,917 కోట్లు కాగా, దానిలో రూ.32,593 కోట్లతో విశాఖ జిల్లా ప్రథమ స్థానం దక్కించుకుంది. సిక్కోలు మాత్రం రూ.11,571 కోట్లతో 12వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో మాత్రం విజయనగరం (రూ.10,800)ను వెనక్కు నెట్టగలిగింది. విశాఖ జిల్లాతో పోల్చితే సిక్కోలుది మూడో వంతు ఉంది. -
రైతుల సొమ్ము రాజధాని పాలు
సొమ్మొకరిది.. సోకొకరిది.. అన్న చందంగా ఉంది కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి (విజయ డెయిరీ) పెద్దల తీరు. సంస్థకు వచ్చిన లాభాల్లో రైతులకు చెల్లించే పాల సేకరణ ధర అర్ధ రూపాయి పెంచాలని కోరినా అంగీకరించని పాలకవర్గం రాజధాని నిర్మాణం కోసం మరో రూ.5 కోట్లు విరాళం సమర్పించింది. గతంలో ఇచ్చిన రూ.5.80 కోట్లకు ఈ మొత్తం అదనం. పాలకవర్గంలో ముఖ్యులు టీడీపీకి చెందినవారు కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పాడి రైతులు విమర్శిస్తున్నారు. సాక్షి, విజయవాడ : నూతనంగా నిర్మిస్తున్న రాజధానికి విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునివ్వడంతో కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గంలో కొంతమంది ఎక్కువగా స్పందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో తొలి విడత రూ.2 కోట్లు, మరోసారి రూ.2 కోట్లు, పాల సహకార సంఘాల నుంచి రూ.1.80 కోట్లు వసూలు చేసి మొత్తం రూ.5.80 కోట్లు రాజధానికి విరాళంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఇది చాలదన్నట్టు తాజాగా మరో రూ.5 కోట్లు ఇచ్చారు. నిబంధనలకు నీళ్లొదిలి... వాస్తవంగా విరాళం ఇవ్వాలంటే యూనియన్ బోర్డులో ముందుగా ఆమోదం పొందాలి. ఆ తరువాత దానిని జనరల్ బాడీలో ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకోవాలి. అయితే రాజధాని నిర్మాణానికి రూ.5 కోట్లు ఇస్తున్న విషయం బోర్డు సమావేశంలో కాకుండా గత నెల 18న జరిగిన జనరల్ బాడీలో ప్రవేశపెట్టారు. జనరల్ బాడీ మీటింగ్‌లోనూ చాకచక్యంగా వ్యవహరించారు. సమావేశం జరిగే హాలులోకి వెళ్లాలంటే బయట ఉన్న రిజిస్టర్లో పాల సహకార సంఘాల అధ్యక్షులు సంతకం చేయాలి. ఈ సంతకాలనే అడ్డుపెట్టుకుని రూ.5 కోట్ల విరాళం ఇచ్చేందుకు జరనల్ బాడీ ఆమోదించినట్లు మినిట్స్‌లో రాసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమావేశంలో ఏం జరిగిందంటే... జిల్లాలో 427 పాల సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల ద్వారా జిల్లాలోని రైతుల నుంచి లక్షా 70 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. 427 సంఘాల అధ్యక్షులకు జనరల్ బాడీలో ఓటు వేసే హక్కు, రైతుల సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. జనల్బాడీలో పాల్గొన్న సహకార సంఘాల అధ్యక్షుల్లో కొంతమంది రాజధాని నిర్మాణానికి రూ.5 కోట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకించారని, గతంలో రూ.5.80 కోట్లు ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారని సమాచారం. తాము వ్యతిరేకిస్తున్నట్లు మినిట్స్‌లో నమోదు చేయాలంటూ 11 సంఘాల అధ్యక్షులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొని జనరల్‌బాడీ సమావేశం వాయిదా పడింది. మినిట్స్‌లో మాత్రం రూ.5 కోట్ల విరాళానికి ఆమోదం లభించినట్లు రాసేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు అర్ధ రూపాయి పెంచమంటే... ఎండలు తీవ్రంగా ఉండి నీటిఎద్దడి ఏర్పడటంతో గ్రామాల్లో నీరు, పచ్చగడ్డి, ఎండుగడ్డి లభించక పాడి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాల దిగుబడి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో యూనియన్ లీటర్ పాలకు చెల్లిస్తున్న ధర రూ.58ని రూ.60కి పెంచాలని రైతులు కోరారు. గత నెల 18న జరిగిన జనరల్‌బాడీలో రెండు రూపాయలు కాకపోయినా రైతుల కోరిక మేరకు కనీసం అర్ధ రూపాయి పెంచాలని అన్ని సంఘాల అధ్యక్షులు పట్టుబట్టారు. దీనిని పాలకవర్గంలో ముఖ్యులు, అధికారులు తోసిపుచ్చారు. తరువాత సొసైటీలకు బోసస్ ఇస్తామని సర్దిచెప్పారు. వాస్తవంగా బోసస్ ఇవ్వడం వల్ల సహకార సంఘానికి, పాల రేటు పెంచితే రైతులకు ఉపయోగమని పాలసంఘాల అధ్యక్షులు చెబుతున్నారు. తెర వెనుక కథ ఇదీ యూనియన్ పాలకవర్గానికి వచ్చే సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. యూనియన్ పాలకవర్గమంతా అధికార తెలుగుదేశం పార్టీ నేతల చేతుల్లోనే ఉంది. యూనియన్ కీలక పదవుల్లో ఉన్నవారు ముఖ్యమంత్రిని ఆకర్షించి తిరిగి తమ పదవులను కాపాడుకునేందుకు రూ.11 కోట్ల విరాళాలు ఇచ్చారని విజయ డెయిరీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రైతులకు తక్షణం బోసస్ ఇవ్వకుండా ఆగస్టులో ప్రకటించి తద్వారా రైతుల ప్రాపకం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. రైతుల కష్టం నుంచి వచ్చిన సొమ్మును రాజధానికి ధారాదత్తం చేయడంపై రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు... ప్రస్తుతం రాజధాని నిర్మాణానికి రూ.5 కోట్లు ఇవ్వడం వెనుక పెద్ద పథకమే ఉందని యూనియన్‌లోని కొంతమంది సభ్యులు ఆరోపిస్తున్నారు. పాల డెయిరీలో సుదీర్ఘకాలం పాతుకుపోయి కీలకమైన పోస్టులో ఉన్న ఒక ముఖ్య నేత తిరిగి ఆ పదవి పొం దేందుకు ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. దీంతో పాటు ఆయన మనుమడికి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ)లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ రెండు అంశాల్లోనూ లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రికి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారని కోర్టుకు వెళ్లొచ్చు రాజధానికి విరాళం ఇవ్వటాన్ని 12 మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. రైతుల డబ్బేమీ ఇవ్వలేదు. రైతుల వాటా రైతులకు పంచేస్తున్నాం. యూనియన్‌కు వచ్చే నగదులోనే ఇస్తున్నాం. ఇప్పటికే రూ.200 కోట్లు రైతులకు బోనస్ రూపంలో చెల్లిస్తున్నాం. మిగిలిన డెయిరీలతో పోలిస్తే మేమే రైతులకు ఎక్కువ ధర ఇస్తున్నాం. అంతా చట్టప్రకారమే చేస్తున్నాం. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లొచ్చు. - మండవ జానకిరామయ్య, చైర్మన్, కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి -
ప్రత్యేక హోదా సాధించే దమ్ము చంద్రబాబుకు లేదు
డీసీసీ అధ్యక్షుడు పనబాక కోట: కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దమ్ము, ధైర్యం సీఎం చంద్రబాబుకు లేవని డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య ధ్వజమెత్తారు. బుధవారం ఆయన కోటలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీస్తే తర్వాత జరిగే పరిణామాలేమిటో చంద్రబాబుకు తెలుసన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఐదు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ఇప్పుడు మాటమార్చి తెలుగు ప్రజలకు ద్రోహం చేశారని విమర్శించారు. చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా ప్రయోజనముండదన్నారు. ఉద్యమాల ద్వారానే కేంద్రంపై ఒత్తిడి పెంచి ప్రత్యేకహోదా సాధించవచ్చన్నారు. కాంగ్రెస్ అందుకు సమాయత్తమవుతోందన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులతో భవిష్యత్తులో ఏపీకి సాగు,తాగు నీటి ఇబ్బందులు తప్పవన్నారు. ఓటు కు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం నోరు విప్పడం లేదన్నారు. పలువురికి పదవులు కోట, వాకాడు, చిట్టమూరు మండలాల బ్లాక్ కాం గ్రెస్ అధ్యక్షుడిగా చిట్టమూరు మండలానికి చెందిన దువ్వూరు మధుసూవన్రెడ్డిని నియమించారు. వెంకన్నపాళేనికి చెందిన గుర్రం అశోక్‌ను జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా, కోటకు చెందిన తీగల సురేష్‌ను జిల్లా బీసీ సెల్ కార్యదర్శిగా నియమించినట్లు కృష్ణ య్య ప్రకటించారు. సమావేశంలో దువ్వూరు శ్రీనివాసులురెడ్డి, మల్లికార్జున్‌రావు, తాజుద్దీన్ పాల్గొన్నారు. -
గ్రామాల్లో తిరగనివ్వం
చంద్రబాబుకు ఎమ్మార్పీఎస్ హెచ్చరిక గుడివాడ టౌన్: వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబును గ్రామాల్లో తిరగనివ్వమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ హెచ్చరించారు. స్థానిక ఎస్పీఎస్ హైస్కూల్లో మాదిగల ఆత్మగౌరవ సదస్సు శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాదిగలను విస్మరించినందుకే కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని అన్నారు. ఎంతకాలం మాయమాటలు చెప్పి మాదిగలను మోసం చేస్తారని ప్రశ్నించారు. చర్యలు తీసుకోకుంటే 18 ఉపకులాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగపోతురాజు, జిల్లా నాయకులు కంచర్ల సుధాకర్, నాగబాబు, యు.ఆశీర్వాదం, జిల్లా మహిళా ప్రతినిధి జె.ప్రశాంతి పాల్గొన్నారు. -
టీడీపీలో చిచ్చు
► విజ్ఞానయాత్రతో కుమ్ములాటలు బట్టబయలు ► మేయర్ చైర్‌ను టార్గెట్ చేస్తున్న కార్పొరేటర్లు ► తలపట్టుకుంటున్న అధిష్టానం విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ టీడీపీలో విజ్ఞానయాత్ర చిచ్చు రేపుతోంది. మేయర్ కోనేరు శ్రీధర్ తీరుపై ఆ పార్టీ కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. పుణే ఘటనకు సంబంధించి పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ మేయర్ కనీసం ఖండించకపోవడంపై కస్సుబుస్సులాడుతున్నారు. టూర్లో ఉండగా చండీఘర్‌లో పలువురు కార్పొరేటర్లు భేటీ అయి మేయర్ చైర్‌కు ఎసరు పెట్టేందుకు వ్యూహరచన చేసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న మేయర్ కావాలనే తమను టూర్‌కు పంపించి అల్లరి చేస్తున్నారని పలువురు కార్పొరేటర్లు అభిప్రాయపడ్డట్లు భోగట్టా. మేయర్ వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నగరాభివృద్ధిలో తమను భాగస్వాముల్ని చేయడం లేదని, పుణే, సిమ్లా, అమృత్‌సర్‌లో పాలన గురించి తెలుసుకున్న తమకు నగరంలో ఏం జరుగుతోందీ తెలియకుండా మేయర్ గుట్టుగా ఉంచుతున్నారని పలువురు మహిళా కార్పొరేటర్లు ఆరోపణలు గుప్పించినట్లు సమాచారం. నగరానికి చేరుకోగానే అత్యవసర భేటీ నిర్వహించాలని కార్పొరేటర్లు తీర్మానం చేసుకున్నారు. అనూహ్య రీతిలో ఉమ్మడి చంటి ఘటన తెరపైకి రావడంతో మేయర్‌పై అసమ్మతిని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు సమాచారం. పెరుగుతున్న దూరం : గత కొంతకాలంగా మేయర్‌కు, పార్టీ కార్పొరేటర్లకు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. మేయర్ చైర్‌ను ఆశిస్తున్న ఓ సీనియర్ కార్పొరేటర్ తెరచాటు మంత్రాంగం నడుపుతున్నారు. సామాజిక వర్గ బలాన్ని సమీకరించేందుకు సన్నాహాలు చేశారు. మేయర్‌ను అర్ధంతరంగా మార్చాల్సి వస్తే సామాజిక సమీకరణలు మారతాయని, ఓసీ లేదా బీసీల్లో వేరే సామాజిక వర్గాలకు పదవి దక్కే అవకాశం ఉంటుందని, కాబట్టి ఇప్పటికి స్తబ్దుగా ఉండాలని ఆయన సామాజిక వర్గ పెద్దలు సూచించినట్లు సమాచారం. గతంలో శ్రీ కనకదుర్గా లే అవుట్ సొసైటీ వ్యవహారంలో మేయర్ చైర్‌ను టార్గెట్ చేసిన విషయం విదితమే. తాజా పరిణామాల నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తున్న మేయర్ సీనియర్ కార్పొరేటర్ల పేరుతో ఒక వర్గాన్ని దగ్గర చేసుకున్నారు. ఈ క్రమంలో సీనియర్, జూనియర్ కార్పొరేటర్లు అంటూ రెండు వర్గాలుగా చీలిపోయారు. విజ్ఞాన యాత్రకు వెళ్లాలనే ప్రతిపాదన వచ్చిన సందర్భంలో మేయర్ దానిని వ్యతిరేకించారు. మంత్రి పి.నారాయణ సైతం పుష్కరాలు వెళ్లే వరకు వద్దని వారించారు. అయినప్పటికీ కార్పొరేటర్లు పట్టుబట్టి మరీ టూర్‌కు వెళ్లి అల్లరయ్యారు. తాము అల్లరవడం వెనుక మేయర్ హస్తం ఉందన్నది పలువురు కార్పొరేటర్ల వాదన. శనివారం నాటి ప్రెస్‌మీట్‌కు తొలుత మేయర్ దూరంగా ఉన్నారు. పార్టీలోని విభేదాలపై విలేకరులు ప్రశ్నించడంతో నాటకీయ పరిణామాల నేపథ్యంలో 40 నిమిషాల తరువాత మేయర్ ప్రెస్మీట్లో ప్రత్యక్షమయ్యారు. ‘మా కార్పొరేటర్లు ఏ తప్పు చేయలేదు.. మేమంతా ఒక్కటే..’ అంటూ సర్దిచెప్పుకొచ్చారు. టూర్‌కు వెళ్లిన వారిలో దుష్టబుద్ధి ఉన్న కార్పొరేటర్ ఎవరైనా పత్రికలకు తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చంటూ కొసమెరుపు ఇచ్చారు. హైకమాండ్ సీరియస్ : విజ్ఞాన యాత్రలో అపశృతులపై టీడీపీ అధిష్టానం దృష్టిసారించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్, మునిసిపల్ మంత్రి పి.నారాయణ పార్టీ కార్పొరేటర్ల నుంచి వివరాలడిగి తెలుసుకున్నారు. మద్యం, మహిళల వివాదాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోకిరీ వేషాలు పార్టీ పరువును దిగజార్చాయంటూ మందలిస్తూనే తప్పు చేసిన వారిని రక్షించుకొనే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. పార్టీలో గ్రూపులుగా విడిపోతే నష్టపోతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఏతావాతా విజ్ఞానయాత్ర టీడీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. -
రెండేళ్లలో బాబు అన్నిటా విఫలం
ఒర్లాండ్లో ప్రవాసాంధ్రులతో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో అన్ని రంగాల్లో విఫలమయ్యారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఎన్ఆర్ఐలకు వివరించారు. సీఎం అవినీతికి పాల్పడిన అంశాలపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ‘చంద్రబాబు- అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని పార్టీ ఎన్నారై విభాగం అమెరికాలో శుక్రవారం ఆవిష్కరించింది. అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఫ్లోరిడా రాష్ట్రం ఒర్లాండ్ నగరంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజధాని పేరుతో విలువైన భూములను సీఎం చంద్రబాబు తన అనుయాయులకు కట్టబెడుతున్నారని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూనే విదేశీ పర్యటనల పేరుతో రూ. కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఎన్నారై ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ సాధించడంలోనూ సీఎంగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఎన్నారై పార్టీ సభ్యత్వం స్వీకరించారు. కార్యక్రమంలో అమెరికా దక్షిణ ఎన్నారై విభాగం పార్టీ ఇన్చార్జి నలిపిరెడ్డి వాసుదేవరెడ్డి, కొండా మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సుజనా చౌదరికి చెక్ !
మరోసారి రాజ్యసభ అవకాశం లేనట్లే సాక్షి, హైదరాబాద్: కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై.సుజనా చౌదరికి చెక్ పెట్టాలని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. సుజనా చౌదరి రాజ్యసభ సభ్యత్వం వచ్చే నెల 21తో ముగియనుంది. ఆయనతోపాటు రాష్ర్టం నుంచి మరో ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. దీంతో టీ డీపీలోని ఆశావహులు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. తన రాజ్యసభ సభ్యత్వాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లోనూ పునరుద్ధరిస్తారని సుజనా చౌదరి ధీమాతో ఉన్నారు. అయితే, ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వొద్దని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సుజనా కొంతకాలంగా బ్యాంకులను మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోర్టు వారెంట్ జారీ చేయడం, ఆయన కోర్టులకు హాజరు కావడం, ఆయన కంపెనీల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ పార్టీ నేతలు, ఇతరులు ప్రధానితోపాటు పలు సంస్థలకు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. ఫిర్యాదులు, కేసుల దృష్ట్యా సుజనాకు ఈసారి అవకాశం లేనట్లేనని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
హోదా సంజీవని కాదని బాబే అన్నారు కదా!
సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ సీఎం చంద్రబాబే అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారని.. ఆయనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదనే సంకేతాలు కేంద్రానికి ఇచ్చి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఇక్కడికి వచ్చినపుడు కూడా ప్రత్యేక హోదా గురించి బాబు అడగలేదని గుర్తుచేశారు. ఒకవైపు రాష్ట్రంలో ‘లోటు’లో ఉందంటూ మరోవైపు చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో షికార్లు చేస్తారా? అని ప్రశ్నించారు. ఆ నిధులకు రాష్ట్రాభివృద్ధికి వెచ్చిస్తే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. ఈ దుబారా ఖర్చులను కేంద్రం నిధులు భరించదన్నారు. గురువారం బీజేపీ నగర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నేరుగా మాట్లాడకుండా లీకులిస్తూ టీడీపీ చోటా నాయకులతో బీజేపీని, ప్రధాని మోదీని తిట్టిస్తూ నీచరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు ప్రజల గొంతు వినిపించాల్సిన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను అనైతికంగా కొనుగోలు చేస్తూ ఆ పార్టీని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకపార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి అధికార దాహంతో వెళ్లడం నీచమన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు.. వ్యవసాయ రుణమాఫీ, రైతులకు తొమ్మిది గంటల విద్యుత్, డ్వాక్రా రుణమాఫీ, బెల్ట్‌షాపుల రద్దు, మహిళలకు భద్రత, నిరుద్యోగభృతి వీటిలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసీ ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో లేక్వ్యూగెస్ట్హౌస్, సెక్రటేరియట్, ఇక్కడ క్యాంపు కార్యాలయాల మరమత్తులకు రూ.కోట్లు దుబారా చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు, మోదీకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.1,41,800 కోట్లు ఇచ్చిందంటూ ఆ వివరాలు పత్రికలకు విడుదల చేశారు. -
బాక్సైట్ కోసమే గిరిజన ఎమ్మెల్యేల కొనుగోలు
మాజీ స్పీకర్ మనోహర్ చింతపల్లి: మన్యంలో బాక్సైట్ తవ్వకాల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నార మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలోనే మన్యం ఖనిజ సంపదపై కన్నేశారన్నారు. విదేశీ కంపెనీలతో తవ్వకాలకు ఒప్పందం కుదుర్చుకుని బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నిచడంతో గిరిజనులు, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయని, దీంతో చంద్రబాబు వెనక్కు తగ్గారని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారని, అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాలకు తెరలేపారని విమర్శించారు. గిరిజనులు ఆందోళన చేయడంతో పాత జీవోలను రద్దుచేసిన చంద్రబాబు, కొత్త జీవో రద్దు చేయకుండా ఇంతకాలం గిరిజనులను మభ్యపెట్టారని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు ప్రకటనతో అసలు రూపం బయట పడిందని చెప్పారు. గిరినాభివృద్ధికి బాక్సైట్ తవ్వకాలు చేపట్టాల్సిన అవసరం లేదని, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా వినియోగిస్తే గిరిజన ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేల కొనుగోలు తాను మచ్చలేని వ్యక్తినని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెపుతుంటారని, విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కోట్లాది రూపాయలు ఎక్కడ నుంచి వస్తున్నాయని మనోహర్ ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే సంతల్లో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని నీతులు వల్లించిన చంద్రబాబు, ఇక్కడ ఫిరాయింపులను ప్రోత్సహించడం దారుణమన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఉగ్రంగి లక్ష్మణరావు, సర్పంచ్‌లు సాగిన దేవుడమ్మ, అప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బాబు పునరాలోచించాలి
►గుంటూరు, విజయవాడ మధ్య ప్రజారాజధాని నిర్మించాలి ► బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.గంగాధర్ గాంధీనగర్ : రాజధాని విషయంలో సీఎం చంద్రబాబు పునరాలోచించాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.గంగాధర్ అన్నారు. స్థానిక జనసభ రాష్ర్ట కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మకి కంపెనీ డిజైన్ విషయంలోనే కాదు, రాజధాని విషయంలోనే పునఃసమీక్ష జరపాలని కోరారు. రాజధాని విషయంలో ప్రతిపక్షాలు, నిపుణు లు, ప్రజాసంఘాలు ఎవరెంత చెప్పినా సీఎం చంద్రబాబు తన వ్యక్తిగత, బంధుమిత్రగణ స్వార్థ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ మూ ర్ఖంగా నిర్ణయాలు చేయడం సరికాదన్నారు. విభజనతో నష్టపోయిన అవశేషాంధ్రప్రదేశ్ను చంద్రబాబు తన నిర్ణయాలతో మరింత సంక్షో భం, అగాథంలోకి నెట్టివేస్తున్నారని, ఆయనను భావితరాలు క్షమించవన్నారు. ప్రపంచ స్థాయి రాజధాని పేరుతో తాను కలల్లో తేలిపోతూ ప్రజల్ని త్రిశంకు స్వర్గంలో ముంచి తేలుస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వీరబ్రహ్మం, చప్పిడి కృష్ణమోహన్, రాష్ర్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ జక్కా శ్రీనివాసరావు, పటాకుల నరసింహారావు, మరీదు ప్రసాద్ పాల్గొన్నారు. -
వందేళ్లలో ఇలాంటి నీటి కరువు రాలేదు
విజయవాడ సెంట్రల్ : గడిచిన వందేళ్లలో ఇలాంటి నీటి కరువు రాలేదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ప్రకాశం బ్యారేజ్, దుర్గాఘాట్, భవానీద్వీపం ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ గతేడాది ఇదే రోజున బ్యారేజ్‌లో 10.7 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. నీటి నిర్వహణపై ప్రభుత్వానికి సరైన అవగాహన లేకపోవడం వల్లే దుర్భర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ తెలంగాణలో అక్రమంగా నిర్మాణం చేస్తున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల్ని అడ్డుకోవడంలో రాష్ట్రప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సమస్యను ఎపెక్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఓటుకు -నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారన్నారు. ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, పార్టీ నాయకులు ఎల్.ఈశ్వరరావు, ఎం.కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
బాబు తాటాకు చప్పుళ్లకు భయపడం
సీఎం చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ కిర్లంపూడి (తూర్పుగోదావరి): ముఖ్యమంత్రి చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు కాపుజాతి భయపడబోదని, తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఓపిక ఉన్నంత వరకే కాదు.. ఊపిరి ఉన్నంత వరకూ పోరాడతామని మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికల ప్రచారంలో కాపు జాతికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని తాను రోడ్డెక్కిన తరువాతే మంజునాథ కమిషన్ వేశారన్నారు. అయినప్పటికీ ఆ కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సమాచారం లేదని, వెంటనే కమిషన్ కార్యకలాపాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తమకు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకూ జైల్లో పెట్టి నిర్బంధించినా, కేసులు పెట్టి భయపెట్టినా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. తమ డిమాండ్లతో బాబుకు లేఖ రాసినట్లు ముద్రగడ తెలిపారు. -
‘హోదా’ సంజీవని కాదన్నది నువ్వే..
చంద్రబాబుపై బీజేపీ మండిపాటు సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా? అని స్వయంగా అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అదే అంశాన్ని అడ్డంపెట్టుకొని రాష్ట్రంలో తమ పార్టీని, ప్రధాని నరేంద్ర మోదీని దోషిగా చూపడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ మండిపడింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నేతలు కపిలేశ్వరయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కోటేశ్వరరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మంచి జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో, చెడు జరిగితే నరేంద్ర మోదీ ఖాతాలో వేయాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గుర్తించాలని సురేష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించి, మోదీ ఏపీకి ఏమీ చేయడం లేదంటూ గోబెల్స్ ప్రచారం ప్రారంభించారని మండిపడ్డారు. ‘‘ఏపీలో ఎక్కడ చూసినా ప్రభుత్వ నిధులు దుబారా అవుతున్నాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మీ(టీడీపీ) ఇష్టానుసారం పరిపాలన సాగిస్తే కుదరదు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల ఖర్చుపై శ్వేతప్రతం విడుదల చేయాలి. జమా ఖర్చులు లెక్కచెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీపై అపనిందలు వేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం’’ అని సురేష్‌రెడ్డి స్పష్టం చేశారు. బుద్ధా వెంకన్న, బుచ్చయ్యచౌదరి లాంటివాళ్లతో తిట్టాల్సిందంతా తిట్టించి మరోవైపు బీజేపీపై విమర్శలు చేయవద్దని ఊరడింపు మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మిమ్మల్ని ఎవరు మాతో కలిసి రమ్మన్నారు.. ఎవరు పొమ్మంటున్నారు? అని ప్రశ్నించారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తే, అదంతా గాలికి వదిలేసి ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను రూ.16 వేల కోట్ల నుంచి రూ.31 వేల కోట్లకు పెంచేశారని సురేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. పారదర్శక పాలన అందించాలన్న మోదీ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం అందిస్తున్నా... అమరావతికి కేంద్రం అన్యాయం చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో కూడా మోదీ ఫొటో పెట్టలేదని విమర్శించారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో రోడ్లు వేయిస్తూ ముఖ్యమంత్రి ‘చంద్రన్నబాట’ అంటూ తన సొంత పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. -
దమ్ముంటే ఢిల్లీలో పోరాడదాం రా
♦ చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సవాల్ ♦ చేతకానితనం నీదా, మాదా? సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని, కేంద్రంతో పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. చంద్రబాబు తన తప్పుల్ని, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విపక్షాల మీద ఎదురు దాడికి దిగడం విజ్ఞత కాదని హితవుపలికారు. సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ హోదా సాధనకు వామపక్షాల ఆధ్వర్యంలో ఇప్పటికే ఆదివారం నుంచి అనంతపురంలో దీక్షలు ప్రారంభించామని, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు ఇచ్చిందని చెప్పారు. హోదా కోసం తాము ఢిల్లీలో చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబు ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ప్రత్యేక హోదాపై ఢిల్లీలో పోరాడడానికి తాము సిద్ధమేనని, ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే అన్ని పార్టీలతో కలసి రావాలని సవాల్ చేశారు. ప్రత్యేక హోదాపై నానా యాగీ చేసిన వెంకయ్యనాయుడికి ఇప్పుడు నోరు పెగలడం లేదని, ఆయన్ను రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదే జరిగితే నల్లజెండాలతో ఊరూరా నిరసన తెలుపుతామన్నారు. ఏపీ నుంచి నామినేషన్ వేసే నైతిక హక్కు వెంకయ్యకు లేదన్నారు. కృష్ణా జలాలపై ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోవాలని సూచించారు. -
చంద్రబాబు తీరుతోనే ‘హోదా’ పట్ల నిర్లక్ష్యం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు తీరుతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు పట్ల నిర్లక్ష్యం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల నిర్మాణాల నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల ప్రజలను గందరగోళానికి గురిచేయడం మానుకోవాలని చంద్రబాబు, కేసీఆర్‌లకు హితవు పలికారు. కృష్ణా నీటి పంపిణీపై బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుల ఆధారంగా ఇరు రాష్ట్రాలలోని పాలమూరు ప్రాంతం, రాయలసీమ,ప్రకాశం జిల్లా నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని చర్చించి పరిష్కరించుకోవాలన్నారు.చర్చల ద్వారా నీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సీఎంలను రామకృష్ణ కోరారు. -
మోదీ, చంద్రబాబుది నమ్మక ద్రోహం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ (కృష్ణలంక) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు రాష్ట్రప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. రామవరప్పాడు సెంటర్లో సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి భారీగా కాగడాలతో ప్రదర్శన చేశారు. అనంతరం బాబూజగ్జీవన్‌రామ్ విగ్ర హం సమీపంలో జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలను విస్మరించి రెండేళ్లుగా ప్రజలను మోసగిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక హోదా కావాలో, బీజేపీతో సంబంధాలు కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ మోదీపై నమ్మక ద్రోహం కేసులు పెట్టాలన్నారు. ప్రత్యేక హోదా కోసం శనివారం నుంచి మూడు రోజులపాటు అనంతపురంలో పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు శివాజీ, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు ఆసుల రంగనాయకులు, నేతలు జి.కోటే శ్వరరావు, లంక దుర్గారావు, మహిళ సమాఖ్య నాయకులు ఓర్సు భారతి పాల్గొన్నారు. -
ప్రాజెక్టులను అడ్డుకుంటే ఊర్కోం
► భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ► తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అవుతోంది ► తెలంగాణను సస్యశ్యామలం చేసి చూపిస్తాం ► చర్చలంటే ఆంధ్రా మంత్రి ముఖం చాటేస్తున్నారు ► తెలంగాణ టీడీపీ నేతలారా.. ఇప్పటికైనా తేల్చుకోండి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘ఎవరెన్ని అడ్డంకులు కల్పించాలని చూసినా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం ఆగదు.. మన తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అవుతుంది.. ఏపీ సీఎం చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా.. జగన్, బాబు ఎన్ని దీక్షలు చేసినా ఆపలేరు..’’ అని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ‘‘మన సీఎం కేసీఆర్ మాత్రం మహా మొండిఘటం. తెలంగాణ తెస్తానన్నాడు.. తెచ్చిండు. కచ్చితంగా కాళేశ్వరం పూర్తి చేస్తాం... నిజాంసాగర్‌కు నీళ్లు తెచ్చి తీరుతాం.. ప్రాజెక్టులతో తెలంగాణను సస్యశ్యామలం చేసి తీరుతాం.. ఇందులో ఎవరికీ అనుమానాలు అవసరం లేదని’’ మంత్రి పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలసి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్కూరు, బాన్సువాడలలో హరీశ్ మాట్లాడారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం గోదావరిలో మన నీటి వాటా 954 టీఎంసీలనీ, అయితే మనం 200 టీఎంసీలు కూడా వాడుకుంటలేమన్నారు. హక్కు ప్రకా రం సముద్రంలో కలసిపోతున్న 700 టీఎం సీల నీళ్లను ప్రాజెక్టులు కట్టుకుని రైతులను బతికించు కుంటామంటే ఆంధ్రబాబు ఓరుస్తలేడన్నారు. తెలంగాణ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులకు అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమకు పలుమార్లు ఫోన్‌చేసి మాట్లాడు కుందామంటే రానేరావడం లేదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం, ప్రాణహిత చేవెళ్ల, దిండి ప్రాజెక్టులకోసం జీవోలు విడుదలయ్యాయని, ఎవరెన్ని అడ్డంకులు కల్పించాలని చూసినా.. ప్రాజెక్టులు కట్టితీరుతామని హరీశ్‌రావు స్పష్టంచేశారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఉన్న పైప్ ఇరిగేషన్ పద్ధతి మనరాష్ట్రంలో కూడా అమలు చేస్తామన్నారు. జగన్ దీక్ష నుంచి దృష్టి మరల్చేందుకే బాబు నాటకం ఆంధ్రప్రదేశ్‌లో దినదినానికి దిగజారి పోతున్న టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టను కాపాడుకోవడానికి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపడుతున్న దీక్ష నుంచి ఆ ప్రాంత ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు కొత్త నాటకానికి తెర తీశాడని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘ఏపీ క్యాబినెట్లో తీర్మానం చేసి.. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని ఢిల్లీకి ఉత్తరం రాసిండు, రేపు సుప్రీంకోర్టుకు పోతడంటా.. మా బతుకును మేం బతకనీయకుండా నోటికాడి బువ్వను లాగేయాలని చూస్తున్న చంద్రబాబును ఇంకా ఈప్రాంత టీడీపీ నాయకులు అనుసరిస్తుండటం బాధాకరం. తెలంగాణ తెలుగుదేశం నాయకులారా... మీరు తెలంగాణ ద్రోహి చంద్రబాబు పక్షమా..? తెలంగాణ ప్రజల పక్షమా.. నిండిన కడు పులున్న ఆంధ్రా పక్షమా...? కాలిన కడుపులతో నీళ్లకోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజల పక్షం ఉంటారో తేల్చుకోండి’’ అని టీడీపీ నేతలనుద్దేశించి అన్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు చంద్రబాబు పక్షమే ఉంటామంటే.. ఈప్రాంత ప్రజలు మిమ్మల్ని అదే చంద్రబాబు ఉండే విజయవాడ వరకు తరిమి కొడతారని హరీశ్ హెచ్చరించారు. -
తెలంగాణ పాలిట విషనాగు చంద్రబాబు
తెలంగాణ బీసీ ఫోరం అధ్యక్షులు ఆంజనేయగౌడ్ ఉస్మానియా యూనివర్సిటీ: ఏపీ సీఎం చంద్రబాబు పగబట్టిన విషనాగులా మారి తెలంగాణ అభివృద్ధిని, ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని రాష్ట్ర బీసీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆంజనేయగౌడ్ ధ్వజమెత్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ బీసీ ఫోరం, తెలంగాణ పరిరక్షణ ఫోరం, ఓయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టుల వివాదంపై గురువారం చర్చ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులను అడ్డుకుంటే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌ను కూల్చివేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారన్నారు. తెలంగాణలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ తీర్మానాన్ని కేంద్రప్రభుత్వం తిరస్కరించాలని కోరారు. చంద్రబాబు తన బుద్ధి మార్చుకోకుంటే ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్మాణాల కోసం నిరంతరం పోరాడుతామని భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 8న బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు-ఏపీ ప్రభుత్వ దుశ్చర్యలు’ అనే అంశం పై రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కిరణ్‌గౌడ్, శ్రావణ్, తెలంగాణ పరిరక్షణ సమితి నేతలు అశోక్, రాజేష్, వెంకట్‌యాదవ్, నర్సింగ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదాపై అవగాహన లేని సీఎం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ విజయవాడ(భవానీపురం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి కీలకమైన ప్రత్యేక హోదాపై అవగాహన లేని అసమర్ధ ముఖ్యమంత్రి చంద్రబాబని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కోట్లాది రూపాయలతో కొనుగోలు చేయటంపై ఉన్న శ్రద్ధ ప్రత్యేక హోదాపై లేదని పేర్కొన్నారు. మాట్లాడితే ప్రత్యేక హోదాపై ప్రధానిని 20 సార్లు కలిశానని చెప్పుకొస్తున్న చంద్రబాబు సాధించింది మాత్రం శూన్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సంజీవిని కాదని ఒకసారి, ప్రత్యేక హోదా సాధిస్తామని మరోసారి చెబుతూ ప్రజలను మాయ మాటలతో మోసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీపై ఒత్తిడి తీసుకురావడం చేతగాని చంద్రబాబు, దమ్ముంటే టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించి బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నాడు పార్లమెంట్లో ఏపీకి 5 ఏళ్లు కాదు, 10 ఏళ్లపాటు ప్రతేక హోదా కావాలని అన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ప్రత్యేక హోదా తీసుకురావడం చేతగాని చంద్రబాబులు ఏ శిక్షకైనా అర్హులేనని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ప్రత్యేక హోదా తెస్తాం..అది ఆంధ్రుల హక్కని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు హోదాపై పోరాటం వద్దు, ప్రస్తుత పరిస్ధితుల్లో పోరాటం చేయలేమని మంత్రివర్గ సమావేశంలో అనడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ వారిని ఉపసంహరించుకోలేని చంద్రబాబు ప్రధానిపై ఎలా ఒత్తిడి తీసుకురాగలరని ప్రశ్నించారు .ప్రధానిని ఇప్పటికే 20 సార్లు కలిశానని చెబుతున్న చంద్రబాబు ఇంకా ఎన్నిసార్లు కలుస్తారని, ఎన్ని వినతి పత్రాలు, విజ్ఞప్తులు చేస్తారని ఎద్దేవా చేశారు. సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనటం, పార్టీ ఫిరాయింపుదారులు, ఆయా నియోజకవర్గాలలోగల సీనియర్ టీడీపీ నాయకుల మధ్య పంచాయితీలతోనే కాలం వెళ్లబుచ్చుతున్న చంద్రబాబుకు ప్రత్యేక హోదా సాధనపై పోరాడేందుకు సమయం ఎక్కడిదని ప్రశ్నించారు. హోదాపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో తాడోపేడో తేల్చుకుని ప్రజలకు హోదా తీసుకురావాలని సూచించారు. -
ఒట్టి మాటలే
► ప్రత్యేక హోదా ఇవ్వబోమని స్పష్టం చేసిన కేంద్రం ► జిల్లా ప్రజల్లో కట్టలు తెంచుకున్న ఆక్రోశం ► మోదీ, చంద్రబాబుకు శాపనార్థాలు పెట్టిన జనం ► జిల్లా ప్ర‘గతి’ ఇంతేనని ఆవేదన ఎట్టకేలకు బీజేపీ బండారం బయటపడింది. చంద్రబాబు చెప్పేవి ఒట్టి మాటలేనని తేలింది. ఆయన చేతలు ఓటి కుండలేనని రుజువైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో జిల్లా ప్రజానీకం భగ్గుమంటోంది. అనుభవజ్ఞుడని నమ్మి ఓటేస్తే.. చేతకాని తనంతో నిండా ముంచాడని వాపోతోంది. ఆయనొస్తే బాగుం టుందని భావిస్తే రాష్ట్రాన్ని అథోగతి పాల్జేస్తున్నారని యువత మండిపడుతోంది. ఆయనొస్తే కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తే.. స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ ఆశలు అడియాశలయ్యాయని ఆందోళన చెందుతోంది. - సాక్షి నెట్వర్క్ అనుకున్నదే అయ్యింది.. భయపడిందే నిజమైంది. అవును.. నమ్మించి ముంచడంలో చంద్రబాబునాయుడుని మించిన వారు లేదని మరోసారి నిజమైంది. తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి కేంద్రం ముందు తలొంచిన ఏపీ సీఎం అలసత్వాన్ని మోదీ ప్రభుత్వం అక్షరాల క్యాష్ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా.. తేల్చేసింది. ఎంత మంది ఎన్ని విధాలుగా ఒత్తిడి తెచ్చినా తాము తొలగ్గబోమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా పార్లమెంట్లో కుండబద్దలు కొట్టారు. దీంతో హోదాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లావాసులు భగ్గుమన్నారు. త మ ప్ర‘గతి’ ఇంతేనని అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఈ దుస్థితి కారణమైన చంద్రబాబుకు శాపనార్థాలు పెట్టారు. ఇకపై కొత్త పరిశ్రమలు, పెట్టుబడిదారులు జిల్లాకు వచ్చే అవకాశం లేదని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతామని హెచ్చరించారు. బాబు అసమర్థతే.. ఎన్నికల సమయంలో శ్రీవారి సన్నిధిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని గుప్పిచ్చిన హామీలు ఏమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చిచెప్పిడంలో చంద్రబాబు అసమర్థత బట్టబయలైంది. ఓటుకు-నోటు కేసులో జైలుకు పంపుతారన్న భయంతో చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేలేదన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్బాగ్యమే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేని చంద్రబాబు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలి. -భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రత్యేక హోదా సంజీవని లాంటిది రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని లాంటిది. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం బాగు పడుతుంది. ఈ విషయం తెలిసినా సీఎం చంద్ర బాబు ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఓటుకు నోటుతోపాటు పలు అవినీతి కుంబకోణాల్లో చంద్రబాబు చిక్కుకు పోవడం వల్ల కేంద్రంపై ఒత్తిడి తేలేకున్నారు. స్వార్థ కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్డారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారు. ఇలాంటి సీఎం ఉండటం తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టం. రాష్ట్ర విభజన ముందు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అడగలేక విభజించు పాలించు అన్నధోరణిలో బాబు రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. టీడీపీ, బీజేపీ దొందూ దొందే. రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాయి. --డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, ఎమ్మెల్యే మదనపల్లె. హోదా కోసం ఆందోళన ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినందున టీడీపీ, బీజేపీతో పొత్తును విరమించుకోవాలి. రాష్ట్రానికి హోదా లేకుంటే ఆశించినంత అభివృద్ధి ఉండదు. చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయకపోవడం వల్ల రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చింది. దీనిపై ప్రతి పక్షమైన వైఎస్సార్ సీపీ ప్రజలతో కలసి ఆందోళనకు దిగుతుంది.-చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే, పీలేరు -
తెలంగాణ ప్రాజెక్టులను ఆపండి
♦ కృష్ణా, గోదావరి అపెక్స్ కమిటీలను వెంటనే సమావేశపరచండి ♦ లేఖ ద్వారా కేంద్రాన్ని కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం ♦ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలుగెత్తాక స్పందించిన సర్కారు ♦ విభజన హామీల అమలుపైనా ప్రధానికి లేఖ ♦ రుణమాఫీ మొత్తాలపై రైతులకు 10 శాతం వడ్డీ ♦ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల ఏపీకి అన్యాయం జరుగుతుందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలుగెత్తి చాటిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర జలవనరుల శాఖకు లేఖ రాయాలని నిర్ణయించింది. విజయవాడ క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాకు వెల్లడించారు. కేబినెట్ నిర్ణయాలివీ.... ♦ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, గోదావరిపై జీ-5, జీ-9, జీ-10 ఎత్తిపోతల పథకాలను వెంటనే నిలిపివేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. రెండు బోర్డుల అపెక్స్ కమిటీ సమావేశాలను వెంటనే ఏర్పాటు చేశాలి. పునర్విభజన చట్టా న్ని తెలంగాణ ఉల్లంఘిస్తున్న తీరుపై చర్చిం చాలి. అప్పటివరకూ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ కేంద్ర జలవనరుల శాఖకు లేఖ రాయాలి. రెండు నదులపై ఎగువన ఇష్టానుసారం ప్రాజెక్టులు కట్టడం వల్ల దిగువనున్న ఏపీ తీవ్రం గా నష్టపోతుందనే విషయా న్ని లేఖలో పేర్కొనాలి. అవసరమైతే దీనిపై కోర్టుకైనా వెళ్లాలని నిర్ణయం. ♦ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ అంశాలను కేంద్రం ఇంకా తేల్చని నేపథ్యంలో విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి మరో లేఖ రాయాలి. ♦ రెండో విడత రుణమాఫీ కింద 35.41 లక్షల మంది రైతులకు ఈ నెలలో రూ.3,331 కోట్లు చెల్లించేందుకు నిధులు విడుదల. ఈ మొత్తంపై రైతులకు పది శాతం వడ్డీ చెల్లింపు. రుణమాఫీ పథకం ప్రకటించినప్పటి నుంచి ఈ వడ్డీ ఇవ్వాలని నిర్ణయం. 1.6లక్షల ఉద్యా న రైతులకు రూ.384.47 కోట్లు విడుదల. ♦ రాష్ట్రంలోని 110 మున్సిపాల్టీల్లో నిధుల సమీకరణకు తమిళనాడు, గుజరాత్ తరహాలో ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపీయూఐఏఎంఎల్) ఏర్పాటు. ♦ రాష్ట్రంలో ఎంసెట్ ద్వారానే మెడికల్ సీట్లు భర్తీ చేయాలని సుప్రీంకోర్టును కోరాలి. ‘నీట్’ నుంచి ఏపీకి మినహాయింపునిచ్చే విషయంపై సుప్రీంకోర్టులో వాదించేందుకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి. ♦ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో క్రమశిక్షణను పెంచేందుకు యోగా, కూచిపూడిని ప్రవేశపెట్టాలి. విద్యార్థులు తమకు ఇష్టమైన దాంట్లో చేరేందుకు అవకాశం ఇవ్వాలి. ♦ భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం రూ.854 కోట్ల హడ్కో రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి. భూసేకరణ తర్వాత ఈ పోర్టును పీపీపీ విధానంలో నిర్మించాలి. నెల్లూరు జిల్లా దగదుర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రూ.200 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వ గ్యారంటీ. ♦ యూనివర్సిటీల్లో స్టార్టప్స్ ఏర్పాటుకు అనుగుణంగా ఐటీ విధానం. విశ్వవిద్యాలయాల్లో ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుకు అవకాశం. -
జిల్లాలో కరువు కన్పించలేదా.. బాబూ!
►నేడు మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రంలలో ధర్నాలు ► ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మదనపల్లె సిటీ: జిల్లాలో కరువుతో రైతులు అల్లాడిపోతుంటే వారి కష్టాలు కన్పించడం లేదని, ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నావని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. మదనపల్లెలో ఆదివారం వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. రుణమాఫీని పక్కనపెట్టి ప్రజాధనం తో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సిగ్గులేదా అని తెలిపారు. కరువుతో రైతులు అల్లాడిపోతున్నారని కనీసం పశువుల కోసం గడ్డికేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. రాయలసీమ ప్రాజెక్టులనీళ్లు తెలంగాణ దోచుకుంటే చంద్రబాబు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. కరువు పరిస్థితులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉదయం 10 గంటలకు ధర్నా చేస్తామన్నారు. నిమ్మనపల్లె, రామసముద్రంలలో కూడా ఆందోళన చేస్తామన్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు జన్నే రాజేంద్రనాయుడు, మల్లికార్జుననాయుడు, వెంకటరమణ పాల్గొన్నారు. -
పరిశ్రమల ఏర్పాటుకు సహకరించండి
► ఐటీసీ సంస్థ చైర్మన్‌ను కోరిన ► సీఎం చంద్రబాబు కొరిటెపాడు(గుంటూరు): రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఐటీసీ సంస్థ సహకారించాలని సీఎం చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. రింగ్‌రోడ్డులో ఐటీసీ సంస్థ నూతనంగా రూ.145 కోట్లతో నిర్మించనున్న మై ఫార్చ్యూన్ హోటల్‌కు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. 1996లో రూ.5 వేల కోట్ల వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్న ఐటీసీ కంపెనీ, 2014 నాటికి రూ.46 వేల కోట్ల టర్నోవర్‌కు తీసుకురావటంలో సంస్థ సీఈవో వైసీ దేవేశ్వర్ కృషి దాగి ఉందని చెప్పారు. పొగాకు ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలపై ఐటీసీ కంపెనీ దృష్టి సారించిందని, 32 వేల మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. తిరుపతిని సిటీ ఆఫ్ లేక్స్‌గా గుర్తిస్తున్నారని, తిరుమలలో బాలాజీని కింగ్ ఆఫ్ గాడ్స్‌గా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలోనే రొయ్యల ఎగుమతుల్లో ఏపీని ప్రథమ స్థానంలో నిలబెట్టాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గుంటూరు జిల్లాలో టెక్స్టైల్, సిమెంట్ రంగాలకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. లండన్‌లోని బ్రిటీష్ మ్యూజియంలో అమరావతి విశిష్టతను ప్రతిబింబించే వందల శిల్పాలు ఉన్నాయన్నారు. ఐటీసీ సంస్థ చైర్మన్ వైసీ దేవేశ్వర్ మాట్లాడుతూ నవ్యాంధ్రలో పెట్టుడులకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మిరపలో ఫెస్టిసైడ్స్, కెమికల్స్ అధిక శాతం ఉన్నట్లు గుర్తించామన్నారు. రొయ్యల ఎగుమతికి సంస్థ ప్రాధాన్యమిస్తోందని వెల్లడించారు. సంస్థ వివిధ రంగాల్లో 40 బిలియన్ డాలర్లు మార్కెట్లో పెట్టుబడులు పెట్టిందని వెల్లడించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మైఫార్చ్యూన్ హోటల్ శంస్థాపన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్, రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్, ఎమ్మెల్సీ రామకృష్ణ, జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే, ఐటీసీ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు విఫలం
► ఆయనొక అసమర్థ సీఎం ► మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ విజయవాడ (మధురానగర్) : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేయాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ డిమాండ్ చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రమంత్రి హెచ్‌బీ చౌదరి పార్లమెంట్ ఆవరణలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని నీతి ఆయోగ్ చెప్పిందని పేర్కొనడం తెలుగు ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రంపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలని, కేంద్ర మంత్రివర్గం నుంచి తమ మంత్రులను ఉపసంహరించుకోవాలని కోరారు. తాను 22 సార్లు ఢిల్లీ వెళ్లానని, ప్రత్యేక హోదాపై కేంద్రం సానుకూలంగా ఉందంటూ సీఎం ప్రజలను మాయ చేస్తున్నారన్నారు. హెచ్‌బీ చౌదరి ప్రకటనతో సీఎం చంద్రబాబు అసమర్థ ముఖ్యమంత్రిగా నిలిచిపోయారన్నారు. సీఎం, కేంద్ర మంత్రులు సుజనాచౌదరి, అశోక్ గజపతిరాజు, ఎంపీలు కనీసం ప్రత్యేక హోదా కావాలంటూ అడగలేని దుస్థితిలో ఉన్నారని జోగి రమేష్ పేర్కొన్నారు. తాను ప్రత్యేక హోదాపై పోరాడలేని దద్దమ్మను అని సీఎం ఒప్పుకుంటే.. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో అఖిలపక్షంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవసరమైతే ప్రాణత్యాగం చేసైనా ప్రత్యేక హోదా సాధించటానికి తాము సిద్ధమేనని జోగి రమేష్ చెప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ తెలుగు ప్రజల వాడీవేడిని కేంద్రానికి చూపిస్తామన్నారు. హోదాపై వెంకయ్యనాయుడు నోరు మెదపకపోవటం విచారకరమన్నారు. అమరావతి నిర్మిస్తున్నామంటూ నగరంలోనే మకాం వేసిన సీఎం రాజకీయ వ్యభిచారం చేస్తూ రోజుకో ఎమ్మెల్యేలను కొంటూ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం అంటే ప్రజలు అని, ఎంతమంది ఎమ్మెల్యేలను కొన్నా ప్రజల మనస్సుగెలవలేరని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు పదేళ్లపాటు హైదరాబాద్‌పై హక్కు ఉన్నప్పటికీ కేసీఆర్‌కు భయపడి ఆరునెలలకే పారిపోయి ఇక్కడికి మకాం మార్చారన్నారు. చైనా, జపాన్, సింగపూర్ తదితర దేశాల నాయకులను ప్రాధేయపడుతున్న చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తే వారే మన వద్దకు వచ్చి పెట్టుబడులు పెడతారని జోగి రమేష్ చెప్పారు. ప్రత్యేక హోదాపై ఇప్పటికే వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్ష చేశారని, రాష్ట్రంలోని యువతను జాగృతం చేశారని, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. -
సీఎం మాటలు నీటి మూటలేనా..?
► రూరల్ కార్యాలయ హామీకి తిలోదకాలు ► ఆందోళనలో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు వరంగల్ క్రైం : కానిస్టేబుళ్ల సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకుని హన్మకొండ హెడ్‌క్వార్టర్స్‌లోనే రూరల్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీకి పోలీస్ ఉన్నతాధికారులు తూట్లు పొడుస్తున్నారు. మళ్లీ రూరల్ కార్యాలయం తరలింపునకు యత్నాలు జరుగుతుండడంతో కానిస్టేబుళ్లు ఆందోళన చెందుతున్నారు. గతంలో సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా నందనగార్డెన్స్‌లో ఏర్పాటు చేసి న సమావేశంలో రూరల్‌పోలీస్ కార్యాలయం హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటుచేస్తామని, కమిషనరేట్, డీఐజీ కార్యాలయం కోసం ప్రస్తుతం డీఐజీ కార్యాలయం ఉన్న ప్రాంగణంలో బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే ముఖ్యమం త్రి ప్రకటనను కాదని మళ్లీ పోలీసు అధికారులు రూరల్ పోలీసు కార్యాలయం మామునూరుకు తరలించే య త్నాలు చేస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని పక్కకు పెట్టి కార్యాలయ తరలింపునకు కసరత్తు చేయడంపై పోలీసు కుటుంబ సభ్యు లు ఆందోళన చెందుతున్నారు. గతంలో కానిస్టేబుళ్లతోపాటు వారి కుటుంబ సభ్యుల పోరాటాల ఫలితంగా రూరల్ కార్యాలయం నగర సమీప ప్రాంతాలకు తరలిపోకుండా ఇక్కడే ఉండే పరిస్థితి ఏర్పడింది. చివరికి స్పందించిన ముఖ్యమంత్రి వారికి హెడ్‌క్వార్టర్స్‌లోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ రూరల్ కార్యాలయం తరలింపునకు యత్నాలు జరుగుతుండడంతో కానిస్టేబుళ్ల కుటుంబా లు ఆందోళనకు గురవుతున్నాయి. మళ్లీ హెడ్‌క్వార్టర్స్‌లోనే రూర ల్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చేవరకు ఆందోళన చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. స్వయంగా ముఖ్యమం త్రి హామీని బేఖాతరు చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ క ష్టాలను దృష్టిలో ఉంచుకుని హెడ్‌క్వార్టర్స్‌లోనే రూరల్కార్యాలయం ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. -
సీఎం పర్యటనకు బందోబస్తు.
గుంటూరు (పట్నంబజారు) : సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం గుంటూరు పర్యటనలో భాగంగా అర్బన్ జిల్లా పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 500 మంది సిబ్బందితో సన్నిద్ధి కల్యాణ మండపం, ఐటీసీ, ఐబీ వద్ద భారీ బందోస్తు ఏర్పాటు చేయనున్నారు. ఉదయం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హెలికాప్టర్ దిగి వివిధ ప్రాంతాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. 8 మంది డీఎస్పీలు, 15 సీఐలు, 23 మంది ఎస్సైలు, 77 మంది ఏఎస్సైలు, 260 మంది కానిస్టేబుళ్లు, నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన మరో 70 మంది కానిస్టేబుళ్లు ఈ బందోబస్తు నిర్వహించనున్నారు. బందోబస్తులో భాగంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గురువారం అధికారులతో సమీక్షించారు. -
చంద్రబాబు అవినీతిపై పోరాటం ఆగదు
► ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ► ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పుస్తకం ఆవిష్కరణ బంగారుపాళ్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలు, చేస్తున్న అవినీతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ తెలిపారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలపై రూపొందించిన ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’పుస్తకాన్ని బంగారుపాళ్యం మం డలంలోని పాలేరు గ్రామంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారం చేపట్టి రెండేళ్లయినా రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. రాజధాని, ప్రాజెక్టు నిర్మాణాల పేరుతో లక్ష కోట్ల రూపాయలు అక్రమంగా వెనకేసుకున్నారని ఆరోపించా రు. ఆ అవినీతి సొమ్ముతోనే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే లేరని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించడంలో విఫలమయ్యారని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మ్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారన్నారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు అవినీతి పై రూపొందించిన పుస్తకాన్ని త్వరలోనే తెలుగులోకి అనువదించి ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. వైఎస్సార్సీపీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని సూచించారు. మాజీ జెడ్పీ చైర్మన్ కుమార్‌రాజా మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి బడుగుబలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. ప్రజలు వైఎస్సార్సీపీ పక్షాన ఉన్నారనీ, రాను న్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
రాష్ర్టమే ఓ స్టార్టప్ కంపెనీ :సీఎం చంద్రబాబు
♦ రాష్ర్టంలో మెరుగైన ఉపాధి అవకాశాలు వస్తాయి ♦ జాబ్స్‌డైలాగ్ ఉద్యోగరథం ప్రారంభం విజయవాడ (గుణదల): ఆంధ్రప్రదేశే ఓ స్టార్టప్ కంపెనీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రానున్న రోజుల్లో దేశంలోనే ఉపాధి అవకాశాల కల్పనలో రాష్ర్టం ముందువరుసలో ఉంటుందన్నారు. గురువారం విజయవాడలోని సిద్ధార్థ కళాపీఠంలో టీఎంఐ గ్రూప్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్స్‌డైలాగ్ ఉద్యోగరథాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టంలో ఎంస్ఎంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రెన్యూర్స్) రంగంలో మెరుగైన ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. దేశంలోనే తొలిసారిగా చౌకగా ఇంటర్నెట్ అందిస్తున్న రాష్ర్టం ఏపీ అని, దీనిపై పేటెంట్ రైట్స్‌కి దరఖాస్తు చేశామని తెలిపారు. టీఎంఐ గ్రూప్స్ సంస్థ చైర్మన్ టి.మురళీధరన్ ఉద్యోగరథం గురించి వివరించారు. క్యాండిడేట్ మేనేజ్మెంట్ టీం, క్లైంట్ మేనేజ్మెంట్ టీం ఉంటాయని, అభ్యర్థి ఇంటి ముంగిటకు వెళ్లి వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకుని వారికి సరిపోయే ఉద్యోగాల వివరాలను, కావాల్సిన నైపుణ్యాలను అందింస్తుందన్నారు. క్లైంట్ మేనేజ్మెంట్ టీం ద్వారా వివిధ సంస్థల్లో ఉన్న ఉపాధి అవకాశాలు, వారికి ఎలాంటి నైపుణ్యం కలిగిన అభ్యర్థులు కావాలో వంటి వివరాలను సేకరిస్తుందని చెప్పారు. కాగా మరో రెండు నిమిషాల్లో సీఎం వస్తారనగా వేదిక వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. పోలీస్ సిబ్బంది వైర్లు తప్పించబోతుండగా స్వల్పంగా మంటలంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇవ్వలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి విజయవాడలోను, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోను గురువారం టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. కాగా కిడారి చేరికను వ్యతిరేకిస్తూ అరకులో వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. రిటైర్డ్ టీచర్లకు ఇళ్లు : పదవీ విరమణ చేసిన ప్రభుత్వ టీచర్లకు వారు కోరుకున్నచోట సొంతిళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.దీనిపై పథకాన్ని రూపొందిస్తామన్నారు. విజయవాడలో గురువారం జరిగిన పీఆర్టీయూ రాష్ట్ర ద్వితీయ కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. -
శ్రీసిటీకి సీఎం వరాలు
సత్యవేడు: శ్రీసిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. బుధవారం శ్రీసిటీలోని ఇసుజు కార్ల కంపెనీ ప్రారంభోత్సవాన్నికి హాజరైన ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. శ్రీసిటీలో ప్రస్తుతం ఉన్న పోలీస్ ఔట్ పోస్టు స్థాయిని పెంచి డీఎస్స్పీ ఆధ్వర్యంలో పనిచేసేట్లు పూర్తిస్థాయి పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేస్తామని తెలిపారు. కార్మికులకు నివాస సముదాయాలు, గ్రామీణ యువతకు వివిధ వృత్తుల్లో నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు ఒక శిక్షణా సంస్థ ఏర్పాటు చేస్తామని వరాలు ఇచ్చారు. ఇసుజులో 2వేల మందికి ఉపాధి శ్రీ సిటీలో నెలకొల్పిన ఇసుజు కంపెనీ వల్ల 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. శ్రీ ఇసుజు కంపెనీని 107 ఎకరాల స్థలంలో రూ.3వేల కోట్లు పెట్టుబడితో నిర్మించారని ఆయన తెలిపారు. ఏడాదికి 1.2 లక్షల ఇసుజు వాహనాలు ఉత్పత్తి చేస్తారని వివరించారు. ఇసుజూ కంపెనీ ప్రారంభించడం వల్ల ఆ కంపెనీకి వివిధ విడి భాగాలను సరఫరా చేసే అనుబంధ సంస్థలు కూడా త్వరలో శ్రీసిటీకి రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామమోహనరావు, రాష్ర్టముఖ్య మంత్రులు గోపాల కృష్ణారెడ్డి, నారాయణ, ఎమ్మెల్యే ఆదిత, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ తదితరులుపాల్గొన్నారు. -
తాత్కాలిక సచివాలయం ప్రారంభం
► తాత్కాలిక సచివాలయంలోని ఒక గదిలోకి సీఎం ► తెల్లవారుజామున సభలో మంత్రుల పొగడ్తల హంగామా ► తొలి సంతకం ఫైలు పైనా హడావుడి తాత్కాలిక సచివాలయ శిలాఫలకాన్ని ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో స్పీకర్ కోడెల, మంత్రులు చిన రాజప్ప, నారాయణ, ప్రత్తిపాటి, రఘునాథ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, చీఫ్ సెక్రటరీ ఎస్.పి.టక్కర్, ఉద్యోగ సంఘ నేత అశోక్‌బాబు తదితరులు సచివాలయానికి ముందస్తు ప్రారంభోత్సవం సాక్షి, విజయవాడ బ్యూరో : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తెల్లవారుజామున శాస్త్రోక్తంగా ప్రారంభోత్సవం చేశారు. ఎల్ అండ్ టీ నిర్మిస్తున్న నాలుగో బ్లాకులోని ఒక గదిలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నెల తర్వాత ఆరు నెలల దాకా ముహూర్తాలు లేవనే కారణంతో నిర్మాణం సగంలో ఉండగానే ఈ ముందస్తు ప్రారంభోత్సవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆఘమేఘాల మీద సిద్ధం చేసిన గదిలోకి శాస్త్రోక్తంగా పూజలు జరిపి ముఖ్యమంత్రి ప్రవేశించారు. ఆ గదిలో ఉత్తరాభిముఖంగా ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చుని మంత్రులు, ఉన్నతాధికారులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన్ని పలువురు శాలువాలు, పూల బొకేలతో అభినందించారు. సీఎం ఒక్కరే హాజరు... ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సతీసమేతంగా వస్తారని అందరూ భావించినా ఆయన ఒక్కరే రావడం విశేషం. గృహ ప్రవేశం కార్యక్రమాలను దంపతులు కలిసి నిర్వహించాల్సివుండగా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే ఆ పని పూర్తి చేశారు. ప్రారంభోత్సవం తర్వాత జరిగిన సభలో రైతుల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల వరకు అందరితోనూ చంద్రబాబు మాట్లాడించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే సభకు అధ్యక్షత వహించగా రాజధానికి భూములిచ్చిన ఇద్దరు రైతులు, స్థానిక ఎంపీపీ పద్మలత, సీఆర్డీఏ కార్యదర్శి అజయ్‌జైన్, కమిషనర్ శ్రీకాంత్, ఎన్జీఓల సంఘం నేత అశోక్‌బాబు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడారు. మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, రావెల కిషోర్‌బాబు, పుల్లారావు చంద్రబాబును ఆకాశానికెత్తే రీతిలో పొగడ్తలతో ముంచెత్తేశారు. పల్లె రఘునాథ్‌రెడ్డి ఏకంగా చంద్రబాబును ఇంద్రుడితో పోల్చుతూ అప్పట్లో దేవుడైన ఇంద్రుడు అమరావతిని నిర్మించగా ఇప్పుడు చంద్రబాబు ఈ అమరావతిని నిర్మిస్తున్నాడని ఆకాశానికెత్తేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ సైతం చంద్రబాబును పొగడటానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు సభ జరిగింది. తెల్లవారుజామున సభ పెట్టడమే విచిత్రమైతే అందులోనూ మంత్రులు, అధికారుల పొగడ్తలు మరీ శృతిమించడంతో హాజరైన రైతులు విసుగు చెందారు. తొలి ఫైలు.. హైరానా! సచివాలయంలో ప్రవేశించిన తర్వాత ముఖ్యమంత్రితో తొలి ఫైలుపై సంతకం చేసే విషయంలో అధికారులు హైరానా పడ్డారు. తొలుత ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాద్ ఒక ఫైలును తీసుకురాగా దాన్ని చదివిన ముఖ్యమంత్రి సంతకం చేయడానికి నిరాకరించారు. దీంతో ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేష్, ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి రాజమౌళి రెండో విడత రుణమాఫీ సొమ్ము రూ.3,200 కోట్లు విడుదల చేసే దస్త్రాన్ని అప్పటికప్పుడు స్వదస్తూరితో సిద్ధం చేశారు. అందులోనూ ముఖ్యమంత్రి మళ్లీ మార్పులు చేయడంతో రాజమౌళి మళ్లీ స్వదస్తూరితో మరో కాగితాన్ని సిద్ధం చేసి తీసుకురాగా దానిపై చంద్రబాబు సంతకం చేశారు. -
శ్రీసిటీలో క్యాడ్బరీ ఉత్పత్తి షురూ
♦ తొలిదశను ప్రారంభించిన సీఎం చంద్రబాబు ♦ 19 కోట్ల డాలర్ల పెట్టుబడి; 60వేల టన్నుల ఉత్పత్తి ♦ 2020 నాటికి 2.5 లక్షల టన్నులకు చేరనున్న ఉత్పత్తి సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో క్యాడ్బరీ డైరీమిల్క్ చాకొలెట్ల ఉత్పత్తి ఆరంభమయింది. అమెరికాకు చెందిన మాండలెజ్ ఇంటర్నేషనల్‌లో భాగమైన మాండలెజ్ ఇండియా... శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన తన అతిపెద్ద ప్లాంటులో తొలిదశ ఉత్పత్తిని సోమవారం ఆరంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉత్పత్తిని స్విచ్ ఆన్ చేయటం ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఫుడ్ దిగ్గజాల్లో ఒకటైన మాండలెజ్ సంస్థ... శ్రీ సిటీలో తన ప్లాంటును ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ టెక్నాలజీ, తయారీ సామర్థ్యాన్ని తీసుకు రావటంతో పాటు ఉద్యోగ అవకాశాలనూ కల్పిస్తోందని ప్రశంసించారు. ‘‘క్యాడ్బరీ సంస్థ కోకో సాగుకు సం బంధించి రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రైతులతో కలసి పనిచేస్తోంది. స్థానికులకు తగిన శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించటం అభినందనీయం. సరైన శిక్షణ పొందితే మన గ్రామీణులు అంతర్జాతీయ స్థాయికి తీసిపోకుండా పనిచేయగలరు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్థానిక పరిశ్రమల ఉద్యోగులంతా అక్కడే ఉండేందుకు వీలుగా ఆరు నెలల్లో 5 వేల గృహాలను నిర్మించాలని శ్రీసిటీ ప్రతినిధులకు సూచించారు. శ్రీ సిటీ ప్రతి నిధులు శ్రీనిరాజు, రవి సన్నారెడ్డిలను ఈ సందర్భంగా సీఎం ప్రత్యేకంగా అభినందించారు. 2020 నాటికి 1,600 మందికి ఉద్యోగాలు మాండలెజ్ సంస్థ ఇంటిగ్రేటెడ్ సప్లయ్ చెయిన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డానియల్ మైర్స్ మాట్లాడుతూ ప్రస్తుత, రేపటి వినియోగదారుల అవసరాలను తీర్చగలిగేలా అంతర్జాతీయ స్థాయి తయారీ కేంద్రాన్ని శ్రీ సిటీలో నెలకొల్పుతున్నామన్నారు. తాము ప్రపంచవ్యాప్తంగా అత్యంత సామర్థ్యం ఉన్న తయారీ టెక్నాలజీపై పెట్టుబడి పెడుతున్నట్లు తెలియజేశారు. శ్రీ సిటీ ప్లాంటును తమ పవర్ బ్రాండ్ల వృద్ధికి వీలుగా ఏర్పాటు చేస్తున్న భవిష్యత్ తయారీ కేంద్రంగా అభివర్ణించారు. తొలి దశ ఉత్పత్తిని ఆరంభించిన ఈ ప్లాంటు... 2020 నాటికి 2.5 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంటుందని అంచనా. తద్వారా 1,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం ఈ ప్లాంటుపై సంస్థ 19 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. ప్రస్తుత సామర్థ్యం 60వేల టన్నులు మాండలేజ్ ఇండియా ఎండీచంద్రమౌళి వెంకటేశ్ మాట్లాడుతూ... 2015లో సంస్థ నికర ఆదా యం 30 బిలియన్ డాలర్లుగా చెప్పారు. 165 దేశాల్లో వ్యాపారం చేస్తున్నామని, పలు ఉత్పత్తుల్లో అగ్రగాములుగా ఉన్నామని చెప్పారు. తొలిదశలో శ్రీ సిటీ ప్లాంటు ద్వారా ఏటా 60,000 టన్నుల చాకొలెట్లు ఉత్పత్తి చేస్తామని తెలియజేశారు. మాండలేజ్ ప్రతినిధులతో పాటు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎపీఐఐసీ చెర్మైన్ కృష్ణయ్య, పలువురు ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మల్లవల్లిలో ప్లాస్టిక్ పార్క్
► రూ.1000 కోట్లతో ఏర్పాటుకు కేంద్ర మంత్రి హామీ ► 250 ఎకరాలు కేటాయిస్తున్నామన్న సీఎం చంద్రబాబు ► మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీరపనేనిగూడెంలో 25 ఎకరాలు ► సూరంపల్లిలో ‘సిపెట్’ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన ► విజయవాడను ప్లాస్టిక్ హబ్‌గా మారుస్తామని కేంద్ర మంత్రి వెల్లడి గన్నవరం రూరల్ : బాపులపాడు మండలం మల్లవల్లిలో రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో వ్యవసాయ అనుబంధ ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రోత్సహించే అగ్రి ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ ప్రకటించారు. గన్నవరం మండలం సూరంపల్లిలో కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) నిర్మాణ పనులకు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు అనంత్‌కుమార్, వెంకయ్యనాయుడు, హన్స్‌రాజ్ గంగారాం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్రమంత్రి అనంత్‌కుమార్ దీనిపై ప్రకటన చేశారు. 200 నుంచి 250 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే అగ్రి ప్లాస్టిక్ పార్క్‌ను నిర్మించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసే సిపెట్ ద్వారా ఏడాదికి మూడువేల మందికి వివిధ రకాల కోర్సుల్లో శిక్షణ అందించనున్నామన్నారు. అగ్రికల్చర్ ప్లాస్టిక్ ఇంజనీర్లు, టెక్నీషియన్లను విజయవాడ సిపెట్ నుంచే తయారు చేసుకోవాల్సి ఉందన్నారు. విజయవాడ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశంలో పేరున్న ప్లాస్టిక్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తామని కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హామీ ఇచ్చారు. మల్లవల్లిలో 250 ఎకరాలు... ఈ సభలో సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ అగ్రి పార్కు కోసం మల్లవల్లిలో 250 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తున్నామన్నారు. వ్యవసాయ అనుబంధ ప్లాస్టిక్ వినియోగంపై విస్తృత పరిశోధనలు అవసరమన్నారు. ప్లాస్టిక్ మైక్రాన్స్ పెంచి రీసైక్లింగ్ చేయాల్సి ఉందని, పర్యావరణం, ప్లాస్టిక్ వినియోగాన్ని సమతుల్యం చేసుకోవాలని చెప్పారు. సూరంపల్లిలో ఉన్న అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఏపీ (ఎలీప్) అభ్యర్థన మేరకు వీరపనేనిగూడెంలో మహిళా పారిశ్రామికవేత్తల నూతన యూనిట్ల కోసం 25 ఎకరాలు కేటాయిస్తున్నామని సీఎం ప్రకటించారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన సిపెట్ కేంద్రాన్ని తన నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందకరమన్నారు. కేంద్ర మంత్రులు అనంత్‌కుమార్, హన్స్‌రాజ్ గంగారాం, వెంకయ్యనాయుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా సిపెట్ డెరైక్టర్ జనరల్ ఎస్కే నాయక్, వినయ్‌కుమార్ పాండే, విజయవాడ సిపెట్ చీఫ్ మేనేజర్ శ్రీనివాసులు తదితరులు అతిథులను సత్కరించారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, కలెక్టర్ బాబు.ఎ, కెమికల్స్ శాఖ కార్యదర్శి విజయశంకర్ పాండే, ముఖ్య నిర్వాహకులు బి.శ్రీనివాసులు, నాయర్, జోషి, కృష్ణ, ఎంపీపీ కవిత, సూరంపల్లి సర్పంచ్ దేవరపల్లి కోటేశ్వరరావు, జేసీ గంధం చంద్రుడు, నూజివీడు, విజయవాడ సబ్ కలెక్టర్లు లక్ష్మీశ, సృజన తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య పరిరక్షణకు.. పోరుబాట
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి దిగింది. ‘సేవ్ డెమోక్రసీ (ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి)’ అంటూ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులన్నీ శనివారం కాకినాడకు కదిలిరానున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును పరిహసించేలా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఫిరాయింపునకు ప్రోత్సహిస్తున్న చంద్రబాబు తీరును ఎండగట్టనున్నాయి. చట్టాలు చేయాల్సిన ప్రభుత్వాధినేతే ఉన్న చట్టాలకు స్వయంగా తూట్లు పొడవడాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వెల్లడించారు. తొలుత కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు సమీపంలోని కోకిల సెంటర్లోనున్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నాయకులు నివాళి అర్పించనున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ కోకిల సెంటర్ నుంచి భానుగుడి జంక్షన్ వరకూ కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తామన్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా కమిటీల నాయకులు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు కూడా భారీ ఎత్తున పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. టీడీపీ నాయకులది భ్రమే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటపటిమలను మెచ్చే ప్రజలు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని కన్నబాబు అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. పది మంది ఎమ్మెల్యేలను లాక్కొన్నంత మాత్రాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనమవుతుందని టీడీపీ నాయకులు భావిస్తున్నారని, వారిది కేవలం భ్రమ మాత్రమేనని అన్నారు. కానీ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ పొరుగు రాష్ట్రాల దృష్టిలో రాష్ట్రాన్ని చులకన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రకరకాలుగా ప్రలోభపెట్టి లాక్కొని తన బలంగా చూపించుకోవడానికి చంద్రబాబు పడుతున్న పాట్లు చూసి ఇతర రాష్ట్రాల నాయకులంతా నవ్వుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా నియోజకవర్గ అభివృద్ధి ముసుగులో పార్టీ ఫిరాయిస్తున్న నాయకులు కూడా ప్రజల్లో చులకనైపోయారని వ్యాఖ్యానించారు. ప్రజలంతా ప్రజాస్వామ్య పరిరక్షణకు సమష్టిగా పోరాడాలని కన్నబాబు పిలుపునిచ్చారు. -
పిలుపు వస్తే టీడీపీ కార్యాలయానికి వెళ్తా
► మంత్రి నారాయణ అడ్మినిస్టేటర్, నాయకుడు కాదు ► టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి నెల్లూరు, సిటీ: టీడీపీ కార్యాలయం నుంచి తనకు పిలుపు రాలేదని, ఎవరైనా తనను బాధ్యతాయుతంగా పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఏసీ సెంటర్లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు జన్మదినం ఈ ఏడాది ప్రత్యేకమైందన్నారు. కొత్త రాజధాని నిర్మిస్తున్నారన్నారు. అందరూ రాజకీయాలు పక్కనపెట్టాలన్నారు. టీడీపీ కార్యాలయానికి ఎందుకు వెళ్లడం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి రంగనాయకులపేట వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమానికి పిలవడంతో వెళ్లడం జరిగింది. మంత్రి నారాయణ రాజకీయనాయుడు కాదని, అడ్మినిస్ట్రేటర్ మాత్రమేనన్నారు. ఇటీవల వచ్చిన మంత్రుల ర్యాంకుల్లో నారాయణకు చివరి ర్యాంకు రావడంపై ఆనం స్పందిస్తూ అందరిలాగా రాజకీయ వ్యక్తి కాదన్నారు. రాజధాని నిర్మాణంలో సృష్టి కర్త చంద్రబాబు అయితే అమలు చేసేది నారాయణ అని తెలిపారు. మరో రెండు సంవత్సరాలు గడిస్తే పూర్తిస్థాయి రాజకీయ నేతగా ఎదుగుతారన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎర్రంరెడ్డి మాధవ్‌రెడ్డి, గిరి, శ్రీగిరిచక్రవర్తి, రంగమయూర్‌రెడ్డి, నజీర్, మునాఫ్, పేరారెడ్డి, ఇలియాజ్, రాధాకృష్ణారెడ్డి, ముజీర్ పాల్గొన్నారు. -
కృష్ణ..కృష్ణా..!
► డబ్బుల్లేవ్..అంచనాలు తగ్గించండి ► పుష్కర పనులపై అధికారుల అంతర్గత ఆదేశాలు ► ఆహ్వానించిన టెండర్ల రద్దుకు చర్యలు ► స్నానఘాట్లలో భక్తులకు తప్పని ఇక్కట్లు చరిత్రలో నిలిచిపోయేలా కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ ఓ వైపు ప్రకటనలు చేస్తుంటే, మరో వైపు ఉన్నతాధికారులు పుష్కర పనుల అంచనాలనుతగ్గిస్తున్నారు. చిన్నపాటి మరమ్మతులతో పాత ఘాట్లను పూర్తి చేసి, అత్యవసర పనులనుచేయాలంటున్నారు. ఇప్పటి వరకు చేసిన అంచనాల మొత్తాలను 80 శాతం తగ్గించాలని, ఆహ్వానించిన టెండర్లను రద్దు చేయాలని అంతర్గత ఆదేశాలు ఇస్తున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు : గోదావరి పుష్కరాల కంటే వైభవంగా కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఆ మేరకు రూ.1500 కోట్ల వరకు నిధులు కేటాయిస్తామన్నారు. దీంతో వివిధ శాఖల ఇంజినీర్లు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి పాత స్నానఘాట్లను పరిశీలించారు. అవసరమనుకున్న ప్రాంతంలో కొత్త ఘాట్ల నిర్మాణాలకు అంచనాలు తయారు చేశారు. ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పడేసి పాత ఘాట్లకు తాత్కాలిక మరమ్మతులు చేయడానికి అంచనాలు తయారు చేయాలని, ఘాట్ల వద్ద భక్తులు పడిపోకుండా గ్రిప్ టైల్స్ ఏర్పాటుకు అంచనాలు తయారు చేస్తే, అవేమీ అక్కర్లేదు పాడైపోయిన ఘాట్లకు సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చేయాలని, గ్రిప్ టైల్స్ వేయకుండా ఘాట్లకు రెడాక్సైడ్ రంగు వేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. కృష్ణా నదిలో నీటిమట్టం గరిష్టంగా పడిపోయిన నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ దిగువన భక్తులు స్నానమాచరించడానికి నదిలో ఒక పాయను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను నిలిపివేసి, జల్లు స్నానంకు అంచనాలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నెల 12న విజయవాడ నీటిపారుదల సర్కిల్ కార్యాలయం, విజయవాడ కేసీ డివిజన్ ఇంజినీర్లు ప్రకాశం బ్యారేజి దిగువనున్న 33 పుష్కర ఘాట్ల మర్మమతులకు టెండర్లు ఆహ్వానించారు. సుమారు రూ.20 కోట్ల విలువైన పనులకు సంబంధించిన సమాచారాన్ని ఈ ప్రొక్యూర్మెంట్ మార్కెట్ ప్లేస్‌లో ఏర్పాటు చేశామని వివిధ దినపత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ మేరకు ఒక్క విజయవాడ పరిధిలోనే పుష్కర ఘాట్లకు రూ.20 కోట్లకుపైగా నిధులు కేటాయింపు జరిగినట్టు ఆ నోటిఫికేషన్ ద్వారా సమాచారం తెలుసుకున్న కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత కృష్ణాజిల్లా కలెక్టర్ ఆ అంచనాల మొత్తాలను 80 శాతం తగ్గించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో ఆ శాఖ ఇంజినీర్లు బిత్తరపోవడమే కాకుండా పుష్కర ఘాట్లకు గ్రిప్టైల్స్ వేయకుండా మరమ్మతులు చేస్తే భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉందంటున్నారు. అదే అభిప్రాయాన్ని వెల్లడించినా, టైల్స్ అవసరం లేదు. రెడ్ ఆక్సైడ్ వేయండంటూ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇలా అంచనాల మొత్తాలను పూర్తిగా తగ్గించాలని ఆదేశాలు జారీ చేయడంతో సాగునీటిశాఖ అధికారులు పనులు ఎలా పూర్తి చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారు. గుంటూరు జిల్లాలోనూ ఇంతే... గుంటూరు జిల్లాలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. వివిధ శాఖల అధికారులు చేసిన అంచనాలకు భిన్నంగా అరకొరగా నిధులు మంజూరు చేయడంతో ముఖ్యమైన పనుల జాబితాలను తయారు చేసే పనిలో అధికారులున్నారు. పుష్కర ఘాట్లకు రూ.150 కోట్లతో అంచనాలు తయారు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.65 కోట్లను మంజూరు చేసింది. సీతానగరం ఘాట్‌లో 3 పనులకు రూ.20 కోట్లతో అంచనాలు తయారు చేస్తే రూ.15 కోట్లకు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని మొత్తం అన్ని శాఖలు రూ.485 కోట్లతో అంచనాలు తయారు చేస్తే ఇప్పటి వరకు రూ.360 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అంచనాలను భారీ ఎత్తున రూపొందించినప్పటికీ, ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉండడంతో వాటిలో కోత విధిస్తోంది. ఆగస్టులో జరగనున్న ఈ పుష్కరాలకు ఇంకా ప్రతిపాదనలు దశ పూర్తికాకపోవడం, టెండర్లు ఆహ్వానించే దశలోనే అధికారులు ఉండడంతో పనులపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
సీఎంగారు నడవలేరని.. పాఠశాల గోడను కూలగొట్టేశారు
చింతూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు చింతూరు పర్యటన నేపథ్యంలో ఉపాధిహామీ అధికారులు టీచర్ల అవతారమెత్తారు. ఉపాధిహామీలో భాగంగా నిర్మించిన ఊటకుంటను సందర్శించిన అనంతరం సీఎం ఉపాధి కూలీలతో ఇష్టాగోష్టి నిర్వహించునున్న నేపథ్యంలో ఆయనతో ఎలా మాట్లాడాలనే దానిపై అధికారులు మంగళవారం కూలీలకు పాఠాలు నేర్పారు. ‘వేసవిలో ప్రభుత్వం ద్వారా రూ.ఏడుకు కూలీలకు ఇస్తున్న మజ్జిగ అందుతుందా, లేదా అని సీఎం అడిగితే ఇస్తున్నారని చెప్పాలి. కూలీలు పనిచేస్తున్న ప్రదేశంలోఫస్ట్‌ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంటుందా అని సీఎం అడిగితే, ఉంటుందని చెప్పాలి. వేతనాలు సక్రమంగా ఇస్తున్నారా, పనికి తగ్గ వేతనం అందుతుందా అని అడిగితే, అవునని చెప్పాలి’ అంటూ కూలీలకు గంటపాటు శిక్షణ ఇచ్చారు. ఆయా విషయాలు ఏమాత్రం తడబడకుండా సీఎంకు చెప్పాలని, లేకుంటే అధికారులకు చెడ్డపేరు వస్తుందంటూ కూలీలను ప్రాథేయపడడం కనిపించింది. సీఎంగారు నడవలేరని.. ముఖ్యమంత్రి ఎక్కువ దూరం నడవాల్సి వస్తుందని గురుకుల పాఠశాల గోడనే కూలగొట్టేశారు అధికారులు. ఐటీడీఏ భవనం, ట్రెజరీ కార్యాలయం ప్రారంభోత్సవాల అనంతరం సీఎం పక్కనున్న సభా ప్రాంగణానికి చేరుకోవాలి. కాగా ఈ కార్యాలయాల నుంచి బయలుదేరిన సీఎం పాఠశాల మెయిన్ గేటు మీదుగా సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉన్నా, ఆయనను అంతదూరం నడపడం బాగుండదేమో అని అధికారులు అనుకున్నట్టున్నారు. దీంతో ట్రెజరీ కార్యాలయం ఎదురుగా రహదారి పక్కనే ఉన్న పాఠశాల ప్రహరీని పొక్లెయిన్‌తో కూల్చివేసి, నేరుగా సభాస్థలికి దారి ఏర్పాటు చేశారు. -
‘విలీన’ సమస్యల పరిష్కారానికే సీఎం పర్యటన
చింతూరు : విలీన మండలాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే ముఖ్యమంత్రి చింతూరు పర్యటన ముఖ్యోద్దేశమని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన చింతూరులో విలేకరులతో మాట్లాడుతూ విలీన మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారని, ఉపాధిహామీ పనులపై ఆరాతీస్తారని వివరించారు. ఐటీడీఏ, ట్రెజరీ కార్యాలయాలు ప్రారంభించడంతో పాటు విలీన మండలాల ప్రజలనుద్దేశించి బహిరంగ సభలో ప్రసంగిస్తారని చెప్పారు. వైద్యం, విద్య వంటి అపరిష్కృత సమస్యలపై ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు. నివేదికలతో సిద్ధం కండి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులంతా తమ శాఖల అభివృద్ధి నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. చింతూరు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విలీన మండలాల్లో నిర్మాణంలో ఉన్న రహదారులు, కొత్తగా చేపట్టబోయేవి వంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. సొంత భవనాలు లేని అంగన్వాడీ కేంద్రాలపై నివేదిక తయారు చేయాలని, విలీన మండలాల్లో ముఖ్యమంత్రి స్థాయిలో పరిష్కారం కాగల సమస్యలపై నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన రోజున ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. అనంతరం గ్రీవెన్స్‌లో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఐటీడీఏ పీఓ కేవీఎన్ చక్రధరబాబు, సబ్ కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్ల పరిశీలన చింతూరు : చింతూరులో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. హెలిప్యాడ్ స్థలాన్ని సందర్శించారు. నిమ్మలగూడెంలో ముఖ్యమంత్రి ప్రారంభించే సీసీ రహదారి, పరిశీలించే అంగన్వాడీ కేంద్రం, ఉపాధిహామీ ఊటకుంటను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఐటీడీఏ భవనం, ట్రెజరీ కార్యాలయం, బహిరంగ సభ ప్రాంతాన్ని సందర్శించారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్, రంపచోడవరం ఎస్పీ నయీం అస్మీ ఉన్నారు. హెలిప్యాడ్ స్థలం మార్పు ముఖ్యమంత్రి రాక సందర్భంగా తొలుత నిర్దేశించిన హెలిప్యాడ్ స్థలాన్ని సోమవారం ఆగమేఘాలపై మరోచోటికి మార్చారు. తొలుత శబరి వంతెన సమీపంలో సంత ప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీని సమీపంలో పూరిళ్లు ఉండడంతో, హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో అవి ఎగిరిపోతాయని భావించిన అధికారులు.. హుటాహుటిన హెలిప్యాడ్‌ను వీఆర్ పురం రహదారిలోని పొలాల్లోకి మార్చారు. అలాగే నిమ్మలగూడెంలో ముఖ్యమంత్రి పరిశీలించాల్సిన ఊటకుంట ప్రదేశానికి భద్రతా కారణాల రీత్యా పోలీసు శాఖ అభ్యంతరం తెలపడంతో, రహదారి పక్కనే మరో ఊటకుంట నిర్మాణాన్ని చేపట్టారు. మూడంచెల భద్రత : జిల్లా ఎస్పీ చింతూరు : ముఖ్యమంత్రి పర్యటనకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. సోమవారం ఆయన చింతూరులో విలేకరులతో మాట్లాడుతూ సరిహద్దుల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండడంతో, భద్రత కోసం పలు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే 8 కంపెనీల గ్రేహౌండ్స్ బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయని, మరో 10 కంపెనీల స్పెషల్‌పార్టీ పోలీసులు కూడా కూంబింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. 30 కంపెనీల రోడ్ ఓపెనింగ్ పార్టీలు, సీఆర్పీఎఫ్, ఆర్మడ్ స్పెషల్‌ఫోర్స్, క్యాట్ పార్టీలతో పాటు వెయ్యి మంది సాయుధ పోలీసులు నిరంతర పహారా కాస్తున్నట్టు తెలిపారు. భద్రాచలం నుంచి కాకినాడ వరకు రహదారులు, అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని, హెలిప్యాడ్ నుంచి మూడు కి.మీ. వరకూ అన్ని ప్రాంతాల్లో ఆర్మ్డ్ గార్డ్స్‌ను మోహరించామని, కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఇటీవల మావోయిస్టు నాయకుడు అనారోగ్యంతో మరణించిన విషయాన్ని ఇతర మావోయిస్టు నాయకులు గ్రహించి, జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. ఆయుధాలు వీడి సమాజాభివృద్ధికి పాటుపడాలని కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు నాయకులెవరైనా ఉంటే తమను నేరుగా కానీ, మధ్యవర్తుల ద్వారా కానీ సంప్రదిస్తే.. వారికి వైద్యం చేయిస్తామని చెప్పారు. లొంగిపోయిన అనంతరం కేసులు నమోదు చేయకుండా, ప్రభుత్వం ద్వారా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. -
రేపు సీఎం చంద్రబాబు జిల్లాకు రాక
కాకినాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 13న జిల్లాకు రానున్నారు. జిల్లాలోని నిమ్మలగూడేనికి హెలికాఫ్టర్‌లో వచ్చి, ఉదయం 10.35 నుంచి 11 వరకు ఉపాధిహామీ పనులు పరిశీలిస్తారు. అంగన్వాడీ సెంటర్‌ను తనిఖీ చేస్తారు. అనంతరం చింతూరులోని ఎర్రంపేటకు 11 గంటలకు వెళ్లి సబ్ ట్రెజరీని ప్రారంభిస్తారు. జీసీసీ పెట్రోలు బంక్, ఎల్పీజీ గోడౌన్‌కు శంకుస్థాపన చేస్తారు. ఐటీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించి, పీఓ, స్టాఫ్ క్వార్టర్లకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కూనవరం, చింతూరు సీహెచ్‌సీ భవనాలకు, చింతూరు-వీఆర్ పురం, నెల్లిపాక-పోచవరం ఆర్అండ్బీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆర్డబ్ల్యూఎస్ పనులకు, ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన చేసి, అనంతరం ఏపీ రెసిడెన్షియల్(గిరిజన సంక్షేమ) జూనియర్ కళాశాలలో ఎగ్జిబిషన్ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. 17 వేల ప్రిమ్ టు ట్రైబల్ గ్రూపు కుటుంబాలకు చంద్రన్న పౌష్టికాహార కానుక ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు, దీపం కనెక్షన్లు, ఉపకరణాలు పంపిణీ చేస్తారు. -
అంబేడ్కర్ జయంతి జరిపే హక్కు బాబుకు లేదు
► వైఎస్సార్సీసీ రాష్ట్ర నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున తెనాలి : ఎస్సీల సంక్షేమాన్ని నీరుగారుస్తూ, ఎస్టీ, ఎస్టీ చట్టాలను అపహాస్యం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బీఆర్ అంబేడ్కర్ జయంతి జరిపే అర్హత కోల్పోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున విమర్శించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారన్నారు. అదే మార్గంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ ఆలోచనా విధానంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం తెనాలిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డాక్టర్ నాగార్జున మాట్లాడుతూ.. ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఎస్సీ ఎస్టీ చట్టాలను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన సాగిస్తున్నాయన్నారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్విహ స్తున్నామని అన్నారు. నాయకులు రాపర్ల నరేంద్ర, గాదె శివరామకృష్ణారెడ్డి, పెరికల కాంతారావు, సుద్దపల్లి నాగరాజు, బూరెల దుర్గా, విష్ణుమొలకల రెడ్డియ్య, ఉయ్యూరు అప్పిరెడ్డి, కరాఠపు రాజమోహన్, అక్కిదాసు కిరణ్‌కుమార్, సయ్యద్ గ్యాస్సుభాని పాల్గొన్నారు. -
ఇసుక చిచ్చు!
► అధికార పార్టీలో వర్గ విభేదాలు ► ఉచిత ఇసుకను పక్కదారి పట్టిస్తున్న నేతలు ► సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు జిల్లాలోని ఇసుక వ్యాపారం టీడీపీలో వర్గ విభేదాలు పెంచుతోంది. కొందరు నేతలు ఉచిత ఇసుక విధానాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇసుక తవ్వకాలకు సహకరించిన డ్వాక్రా గ్రూపుల మొత్తాలను ఎగవేయడం.. సరిహద్దు నియోజకవర్గాల్లో హల్చల్ చేయడం వంటి సంఘటనలు నేతల మధ్య విభేదాలు పెంచుతున్నాయి. అన్యాయానికి గురైన ద్వితీయశ్రేణి నాయకులు కొందరు సీనియర్ల సహకారంతో విషయాన్ని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళుతున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు : టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేతలు వర్గాలు, గ్రూపులుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన నేతల అక్రమాలను అవకాశం వచ్చిన సమయంలో సీఎం దృష్టికి తీసుకువెళ్లడం నేతలకు పరిపాటిగా మారింది. మరికొన్నింటి వివరాలు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపుతున్నారు. రానున్న మంత్రివర్గ విస్తరణలో మంత్రి పుల్లారావు శాఖలను కొన్నింటినైనా తగ్గించేలా చేయాలని ఒక వర్గం ప్రయత్నిస్తుంటే, పుల్లారావు తన వ్యతిరేక వర్గ పరపతిని తగ్గించేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే యత్నం చేస్తున్నారు. ఉగాది పర్వదినాన జరిగిన సంఘటనను ఇందుకు ఉదాహరణగా పార్టీ నేతలు చెబుతున్నారు. గణాంకాలతో సహా ఫిర్యాదు.. ఉగాది పర్వదినాన తాడేపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు దండమూడి శైలజారాణి మండలంలో ఇసుక తవ్వకాల్లో జరుగుతున్న అవినీతిని సీఎంకు వివరించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇసుక రీచ్‌ల్లోని ఇసుకను పొన్నూరు నియోజకవర్గ నేతలు ఎక్కువుగా అమ్ముకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన అమ్మకాల కారణంగా ప్రభుత్వం కోల్పోయిన ఆదాయ వివరాలను గణాంకాలతో సహా వివరించినట్టు తెలుస్తోంది. ఏడాది కాలంలో ఇసుక తవ్వకాలకు సహకరించిన డ్వాక్రా గ్రూపు సభ్యులకు, మత్స్యకారులకు చెల్లింపులు చేయకుండా, వారిపై బెదిరింపులకు దిగుతున్నట్టు ఆమె ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీని కొందరు నేతలు అపహాస్యం చేస్తున్నారని, అధికారులను అడ్డుపెట్టుకుని తమ సొంత అవసరాలకు, బడా కంపెనీలకు ఇసుక ఎలా అందిస్తున్నారో వివరించారు. రాజధాని నిర్మాణానికి ఇసుక తోలుతున్నామని చెబుతూ వేరే సొసైటీ సభ్యులు ఎవరినీ అక్కడకు రానీయకుండా అధికారులతో, పోలీసులతో ఎలా బెదిరిస్తున్నారో.. తదితర విషయాలు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు టీడీపీ వర్గాల సమాచారం. మంత్రి పుల్లారావు సమక్షంలోనే ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై మరికొన్ని వివరాలను సీఎం పుల్లారావు, ఇతర వర్గాల ద్వారా సేకరించినట్టు తెలుస్తోంది. ఆమె ఫిర్యాదు సమయంలో మంత్రి పుల్లారావు అక్కడే ఉండటం కాకతాళీయంగా జరగలేదని, వ్యూహాత్మకంగానే పొన్నూరు నేతలపై మంత్రి ఫిర్యాదు ఇప్పించారనే అభిప్రాయం కూడా పార్టీలో లేకపోలేదు. పొక్లెయిన్లన్నీ వారివే.. ఉచిత ఇసుక విధానాన్ని టీడీపీ నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. ప్రతి రీచ్‌లోనూ రెండుమూడు పొక్లెయిన్లు ఏర్పాటు చేసుకోడానికి అధికారులు అనుమతి ఇస్తున్నారు. రీచ్‌లలో ఎవరైనా పొక్లెయిన్లు ఏ ర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొన్నా టీ డీపీ నేతలే వీటిని ఏర్పాటు చేసి నిబంధనలకు వి రుద్ధం గా లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను నింపుతున్నారు. రోజుకు సంపాదన రూ.లక్ష.. ట్రాక్టరు ట్రక్కులో ఇసుక లోడ్ చేయడానికి రూ.300 నుంచి రూ.500 వరకూ, లారీకి రూ.1000 వరకూ టీడీపీ నేతలు వసూలు చేస్తున్నారు. ఒక పొక్లెయిన్ ద్వారా రోజుకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వర కూ టీడీపీ నేతలు సంపాదిస్తున్నారు. గతం కంటే ఈ విధానమే బాగుందని, 210 సామర్థ్యం కలిగిన పొక్లెయిన్‌ను కొనుగోలు చేయడం లేదా అద్దెకు తీసుకుని టీడీపీ నేతలు ఈ వ్యాపారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. అన్ని రీచ్‌లలోనూ ముఖ్యనేతలకు చెందిన పొక్లెయిన్లే ఉండటంతో మిగిలిన నేతలు వీటిపైనా ఫిర్యాదు చేస్తున్నారు. -
ప్రజా సంక్షేమం మరచిన బాబు
► విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం ► ఎమ్మెల్యే పీఆర్కే మాచర్ల (దుర్గి) : నీతిమాలిన రాజకీయాలతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమాన్ని మరిచారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ధర్మవరంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొనేందుకు వచ్చేశారు. స్థానిక నాయకులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఎంతో బాధ కలిగిస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు పాలన ప్రజలకు శనిగా దాపురించిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు డబ్బు ఎర చూపి తనవైపునకు లాక్కోవటం ఎంత దిగజారిన రాజకీయమో అర్థం చేసుకోవచ్చన్నారు. కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. విద్యుత్ చార్జీలను పెంచటం దారుణమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమ పాలనను ప్రజలు ఎన్నటికీ మరువలేరని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించే శక్తి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్ర మే ఉందని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఉన్నం వెంకటేశ్వర్లు, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు లింగా మల్లయ్య, వెలిదండి ఉమాగోపాల్, నేతలు బాలశ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి, అంబారావు, అంజి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అంతా భ్రాంతియేనా!
► నీటి మూటలవుతున్న జిల్లా మంత్రుల మాటలు ► శంకుస్థాపనతో సరిపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ► ప్రకటనకే పరిమితమైన నిధుల కేటాయింపు ► ముందుకు సాగని గోరు చిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ పనులు ► సన్నగిల్లుతున్న రైతుల ఆశలు కనగానపల్లి : కరువు జిల్లా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు శంకుస్థాపనకే పరిమితమయ్యాయి. నిధుల కేటాయింపులో ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల ఈ పనులు ముందుకు సాగడం లేదు. అతి తక్కువ వర్షపాతం నమోదవుతున్న అనంతపురం జిల్లాలో వేరుశనగకు ప్రత్యామ్నాయ పంటగా గోరు చిక్కుడు సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మూడేళ్లుగా ఈ విషయంపై రైతులు చైతన్యం తీసుకువచ్చారు. దీంతో చాలా మంది రైతులు గోరుచిక్కుడు పంట సాగుకు ఉత్సాహం కనబరిచారు. అయితే పంటకు సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు వెనుకడుగు వేశారు. విషయాన్ని గుర్తించిన అధికారులు, మంత్రులు దీనిపై ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి, జిల్లాలో గోరుచిక్కుడు మార్కెటింగ్, ప్రాసెసింగ్ యూనిట్ పెడితే కరువు రైతులను ఆదుకునేందుకు వీలవుతుందని తీర్మానించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే జిల్లాలో గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభిస్తున్నట్లు జిల్లా మంత్రులు ఆర్భాటంగా ప్రకటించారు. ఇందు కోసం కనగానపల్లి మండలం దాదులూరు సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న సర్వే 498-2బిలో ఐదు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి, 2014 సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా కళ్యాణదుర్గం పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించారు. అందులో ఈ యూనిట్ కూడా ఒకటి. పునాదులు కూడా వేయని అధికారులు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం అదే ఏడాది అక్టోబర్ 25న జిల్లా మంత్రి పరిటాల సునీత, అప్పటి జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, జిల్లా వ్యవసాయాధికారులతో కలిసి దాదులూరులో పర్యటించారు. గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని, ప్రభుత్వం రూ. 8 కోట్లు నిధులు కూడా కేటాయించినట్లు గొప్పగా చెప్పుకున్నారు. తొలిదశలో రూ. 3 కోట్లు విడుదల చేసి గోదాముల నిర్మాణం చేపట్టనున్నట్లు నమ్మబలికారు. రైతులు ధైర్యంగా పంట సాగు చేపట్టాలని భరోసానిచ్చారు. ఈ ప్రకటన చేసి 17 నెలలు దాటినా ఇంత వరకూ అక్కడ పునాది రాయి కూడా వేయకపోవడం గమనార్హం. మంత్రి, అధికారుల మాటలు నమ్మి పంట సాగు చేపట్టి ఉంటే తమ బతుకులు మరింత దుర్భరమై ఉండేవని ఈ సందర్భంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో కనిపించని ప్రస్తావన తమ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పేర్కొంటున్న జిల్లా మంత్రులు.. అదే రైతుల తరుఫున ఏనాడూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇందుకు గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ పనులు అద్దం పడుతున్నాయి. ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 8 కోట్ల నిధుల కేటాయింపులపై ఎలాంటి ఊసే లేదు. కనీసం బడ్జెట్ సమావేశాల్లోనైనా దీనిపై ప్రస్తావన లేవనెత్తడంలో జిల్లా మంత్రులు విఫలమయ్యారు. ఫలితంగా యూనిట్ స్థాపన ప్రశ్నార్థకమవుతోంది. త్వరలో పనులు ప్రారంభిస్తాం గోరు చిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు జిల్లా మార్క్‌ఫెడ్ డీఎం బాల భాస్కర్ తెలిపారు. ఇందు కోసం దాదులూరు వద్ద ఐదు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారని, తొలి విడత కిం ద రూ. 3 కోట్లు నిధులు వచ్చాయని, టెండర్లను ఆహ్వానించడంలో జాప్యం చోటు చేసుకుంటోందని అన్నారు. ఆర్కేవైఎస్ కింద కేంద్ర ప్రభుత్వమే ఈ పరిశ్రమ స్థాపనకు నిధులు కేటాయిస్తుందని ఆయన వివరించారు. -
సీఎంగారి మనవడి బర్త్‌డేకి రారండోయ్..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ జన్మదిన వేడుకల నిర్వహణకు కలెక్టర్లు సహా అధికార యంత్రాగాన్ని వాడుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. విజయవాడలోని కస్తూరి గార్డెన్స్‌లో శుక్రవారం సాయంత్రం దేవాన్ష్ మొదటి జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. అయితే టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, టీడీపీ నేతలకు రెవెన్యూ అధికారులే స్వయంగా ఆహ్వాన పత్రికలు పంపిణీ చేస్తున్నారు. మనవడి పుట్టినరోజు వేడుకలను చంద్రబాబు కుటుంబం, టీడీపీ ఘనంగా చేసుకోవడం లో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ అదేదో రాష్ట్ర పండుగలా వేడుకల బాధ్యత అధికారులకు అప్పగించారు. ఇది విజయవాడలోని అధికారుల వరకే పరిమితం కాలేదు. జిల్లాల్లో ఉన్న టీడీపీ ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నేతలకు ఆహ్వాన పత్రికలు పంపాలని నిర్ణయించి.. ఆ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించడం విస్మయపరుస్తోంది. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆహ్వాన పత్రికల పార్సిళ్లు అందాయి. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే స్థాయి నేతలకు ఆర్డీవో స్థాయి అధికారి, స్థానిక ప్రజాప్రతినిధులకు తహశీల్దార్లు, ఎంపీడీవో స్థాయి అధికారులు స్వయంగా ఆహ్వాన పత్రికలు తీసుకువెళ్లి అందజేయాలని స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ స్థాయి నేతలకు కలెక్టర్లు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించాలని ఆదేశించారు. ఈ సమాచారంతో కలెక్టర్లతోపాటు యావత్ అధికార యంత్రాంగం అవాక్కయ్యింది. చేసేదేమీ లేక గురువారం ఉదయం నుంచి ఆహ్వాన పత్రికలు పంపిణీ చేసే పనిలో పడ్డారు. విశాఖ, శ్రీకాకుళం, కృష్ణా తదితర జిల్లాల్లో ఆర్డీవోలు స్వయంగా ఆహ్వాన పత్రికలు అందజేసినట్లు తెలిసింది. ఆధునిక పోకడలతో విద్యుత్ ఆదా: సీఎం విజయవాడ : ఆధునిక పోకడలతోనే ఇంధన పొదుపు సాధ్యమని సీఎం చంద్రబాబు ఉద్భోదించారు. విజయవాడలో ఇంధన పొదుపు సదస్సును సీఎం గురువారం ప్రారంభించి ప్రసంగించారు. రైతులకు ఇంధన సామర్థ్య పంపుసెట్లు రైతుల కోసం ఇంధన సామర్థ్య పంపుసెట్లు అందుబాటులోకి వచ్చాయి. సెల్‌ఫోన్‌ను రిమోట్‌గా ఉపయోగించి ఇంటి నుంచే పొలంలోని మోటార్‌ను ఆన్, ఆఫ్ చేసుకునే టెక్నాలజీతో వీటిని తయారు చేశారు. గురువారం జరిగిన అంతర్జాతీయ ఇంధన పొదుపు సదస్సుకు హాజరైన సీఎం వీటిని లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలో సీఎం సెల్‌ఫోన్ బటన్ నొక్కగానే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం ఈస్ట్మానుగూడెం గ్రామరైతు పొలంలోని పంపుసెట్ ఆన్ అయ్యింది. -
దోచుకోవడం, దాచుకోవడమే ‘బాబు’ ప్రణాళిక
అనంతపురం అర్బన్: రాష్ట్రాన్ని దోచుకుంటూ, దాచుకునేందుకే సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళిక రూపొందించుకుని పాలన సాగిస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు శివశంకర్ అధ్యక్షతన చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్ష శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించి ప్రజలు మోసం చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను లాక్కోవడం, ఇసుక ద్వారా రూ. కోట్లు దోచుకోవడం తప్ప ఈ రెండేళ్లలో సీఎం చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఇంటింటి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు శైలజానాథ్ సూచించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు దాదాగాంధీ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, ఎన్ ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు లోకేశ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
వారి కోసం ఏం చేశారు?
సీఎం చంద్రబాబుపై మండిపడ్డ రఘువీరారెడ్డి అనంతపురం సెంట్రల్: అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. దళితులకు, గిరిజనులకు, మైనార్టీ ప్రజలకు ఏమైనా చేశావా? అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. గిరిజనులు, మైనార్టీ వర్గాల వారికి మంత్రి పదవులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దళిత, ఆదివాసీ, బీసీ, మైనార్టీల సామాజిక న్యాయ సాధికారిత యాత్ర (బస్సుయాత్ర) ఆదివారం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా నగరంలో స్థానిక కేఎస్ఆర్ బాలికల కళాశాల ఎదుట బహిరంగసభ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఓటు బ్యాంకు కోసం పెద్ద మాదిగను నేనవుతా అంటూ చెప్పిన సీఎం చంద్రబాబు ఏం చే శాడని ప్రశ్నించారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ భావిస్తే బీజేపీ దాని అనుబంధ ఆర్ఎస్ఎస్ కోర్టుకు పోయి రద్దు పరిచాయని వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి దళిత, గిరిజనుల, మైనార్టీల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని, సంచులతో డబ్బులు మోస్తాడని నారాయణకు, వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి ఆర్థిక నేరగాడుగా ముద్రపడిన సుజనాచౌదరికి మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జేడీ శీలం, పీసీసీ ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్, డీసీసీ అధ్యక్షులు కోటా సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు సుధాకర్, నాగరాజరెడ్డి, ఎస్టీసెల్ రాష్ర్ట అధ్యక్షులు సుధాకర్‌బాబు, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు, మైనార్టీ సెల్ రాష్ట అధ్యక్షులు అలీఖాన్, డీసీసీ నగర అధ్యక్షులు దాదాగాంధీ తదితరులు పాల్గొన్నారు. -
పతిపక్ష ఎమ్మెల్యేలపై బాబు సవతి ప్రేమ
► నిధులు ఇవ్వకుండా వివక్షచూపుతున్నాడు ► ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మదనపల్లె రూరల్: ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సవతి ప్రేమ చూపుతున్నారని, నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నాడని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మదనపల్లె నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పానన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో అవకతవకలు, శానిటేషన్‌పై కాగ్ నివేదిక బహిర్గతం చేసిన అంశాలను నివేదించానన్నారు. వైద్య, ఆరోగ్య, తాగునీటి సమస్యలపై చర్చించానని తెలిపారు. బీటీ కళాశాలను యూనివర్సిటీ చేయాలన్న అంశంపై, ప్రభుత్వ మహిళ డిగ్రీ, జూనియర్ కళాశాలలో ఆదనపు భవనాల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాన్నారు. హంద్రీ-నీవా, కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేసి సమ్మర్‌స్టోరేజ్ పనులను కూడా వేగవంతం చేయాలని మాట్లాడినట్టు తెలిపారు. విరామ సమయంలో పూర్తి నివేదికలతో మంత్రుల వద్దకు వెళ్లి వ్యవసాయ మార్కెట్, మోడలైజేషన్, ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్, 200 పడకల ఆసుపత్రిగా మార్చాలనే అంశాలపై చర్చించానన్నారు. ముఖ్యంగా మదనపల్లె మున్సిపాలిటీలో జనాభా ప్రాతిపదికన తాగునీరు సరఫరా చేయడంలో అధికారుల విఫలమైన విషయాన్ని కాగ్ బహిర్గతం చేసిందన్నారు. అండర్‌డ్రైనేజీ వ్యవస్థను తీసుకు రావాలని మంత్రులతో మాట్లాడానన్నారు. ఈ సమావేశంలో నాయకులు దేశాయ్ జయదేవరెడ్డి, సర్పంచ్ శరత్‌రెడ్డి, హైదర్‌ఖాన్, అంబేడ్కర్ చంద్రశేఖర్, బీసీ నాయకులు పాల్ బాలాజా, బాలక్రిష్ణారెడ్డి ఉన్నారు. -
దళితులపై సీఎం చంద్రబాబుది కపట ప్రేమ
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కైలే జ్ఞానమణి హనుమాన్‌జంక్షన్ రూరల్ : దళితుల అభ్యున్నతిపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదనే విషయం కాగ్ నివేదికతో మారోమారు స్పష్టమైందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, బాపులపాడు జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి అన్నారు. స్థానిక విలేకరులతో గురువారం ఆమె మాట్లాడారు. కాగ్ విడుదల చేసిన తాజా నివేదికలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు తేల్చిచెప్పటం సీఎం చంద్రబాబు అసమర్ధతకు అద్దం పడుతోందని విమర్శించారు. సబ్‌ప్లాన్‌లో కేటాయించిన నిధుల్లో ఎస్సీలకు కేవలం 31 శాతం నిధులను మాత్రమే ఖర్చు పెట్టినట్లు కాగ్ నివేదించటంపై తెలుగుదేశం ప్రభుత్వం దళితులకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వాస్తవానికి సబ్‌ప్లాన్ ద్వారా ఎస్సీలకు కేటాయించాల్సిన నిధుల కంటే తక్కువ మొత్తాన్ని తెలుగుదేశం ప్రభుత్వం గత ఏడాది కేటాయించిందని, అయినప్పటికీ ఆ నిధులను కూడా ఖర్చు చేయకుండా దళితులకు తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో దళిత జాతి అధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిందనే కక్షతోనే సీఎం చంద్రబాబు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారని జ్ఞానమణి ఆరోపించారు. -
చిన్న చిన్న డబ్బాల్లా స్కూళ్లు
► నారాయణ, చైతన్య స్కూళ్లే నిదర్శనం ► ఆత్మహత్యలకు వ్యాయామ విద్య లేకపోవడమే కారణం ► అరగంట సమయం ఇస్తే నిరూపిస్తా ► అసెంబ్లీలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ చాలెంజ్ నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : ‘కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలు చిన్న చిన్న డబ్బాలాంటి అపార్ట్‌మెంట్స్‌లో నిర్వహిస్తున్నారు. వ్యాయామ విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో వి ద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదే విధం గా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అరగంట సమయం ఇస్తే ఆధారాలతో నిరూపిస్తా. సీఎం చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలోనే 40 పాఠశాలల ఫొటోలను సైతం తెప్పిస్తా’ అని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ సవాల్ చేశారు. అసెం బ్లీలో సోమవారం ఇంటర్మీడియట్ విద్యా సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌యాదవ్ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థల నిర్వహణపై విరుచుకుపడ్డారు. ఇంటర్‌తో పాటు ప్రైవేటు స్కూళ్ల నిర్వహణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అన్ని పాఠశాలలకు మైదానాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని పాఠశాలలు చిన్న చిన్న బిల్డింగ్‌లలో విద్యార్థులను పెట్టి ఒత్తిడికి గురిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారనే మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మాటలను తప్పుబట్టారు. ముఖ్యమంత్రి 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిద్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంత అధ్వానంగా ఉన్నాయో పరిశీలించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం మంత్రి నారాయణ నెల్లూరులో ఓ స్కూలును విజిట్ చేశారని, అక్కడ ఓ విద్యార్థిని బేసిక్స్ లేకుండా కార్పొరేట్ విద్యను ఎలా అందిస్తామని మంత్రిని ప్రశ్నించారని గుర్తుచేశారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులకల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
ఆయకట్టు బీడే!
► హంద్రీ-నీవా అసలు ఉద్దేశాన్ని మార్చేస్తున్న సర్కార్ ► డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేసి కుప్పంకు నీటిని తరలించడమే లక్ష్యం ► ఇప్పుడు ఆయకట్టును పూర్తిగా డిజైన్ నుంచి తొలగిస్తున్న వైనం ► ఉద్యమానికి సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు సాక్షి ప్రతినిధి, అనంతపురం వర్షాలు లేక... సాగునీళ్లు ‘కరువై’ పంట పండించలేక లక్షలమంది ‘అనంత’లో వలసలు పోతున్నారు. ఈ రెండేళ్లలో 154 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా సీఎం చంద్రబాబుకు రైతులపై కాసింత కనికరం కూడా కలగలేదు. నీళ్లిచ్చి పంట పొలాలను...పంటలు పండించి రైతులను ఆదుకుందామనే ఆలోచన రాలేదు. చిత్తూరు, కుప్పంకు నీళ్ల తరలించడమే లక్ష్యంగా హంద్రీ-నీవా పనులు చేయిస్తున్నారు. జిల్లాలో గతేడాది 4 లక్షల మంది రైతులు వలస వెళ్లారంటే జిల్లాలో కరువు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితులన్నీ కేవలం సాగునీటి వనరులు లేక తలెత్తుతున్నావే. 2003 ముందు కూడా ‘అనంత’ పరిస్థితులు దుర్భరంగానే ఉండేవి. ఈ నేపథ్యంలో 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. 2014లోపు 85 శాతం పనులు పూర్తయ్యాయి. 2012లోనే హంద్రీ-నీవా ద్వారా జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయి. జీడిపల్లి రిజర్వాయర్‌లో తొణికిసలాడుతున్న కృష్ణమ్మను చూసి ‘అనంత’ రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ‘అనంత’ రాత మారుతుందని ఆశపడ్డారు. రిజర్వాయర్ నుంచి ఇక బీడు భూములకు పారడమే తరువాయి అని భావించారు. ఆశలు అడియాసలు! హంద్రీ-నీవా ద్వారా జిల్లాలో 3.45 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో ఫేజ్-1 ద్వారా 1.18 లక్షలు, ఫేజ్-2 ద్వారా 2.27 లక్షల ఎకరాలు నీరు అందించాలి. ఫేజ్-1లో జీడిపల్లి రిజర్వాయర్ వరకూ ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయి. అక్కడి నుండి గొల్లపల్లి రిజర్వాయర్‌కు కాలువ పనులు జరుగుతున్నాయి. అయితే ఆయకట్టు పనులు చేయవద్దని ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరి 23న జీవో 22 జారీ చేసింది. ఇప్పుడు తాజాగా ఆయకట్టును ప్రాజెక్టు నుంచి తొలగిస్తోంది. 2, 3, 4, 5. 7. 25, 1 ప్యాకేజీల నుంచి 85 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలి. అలాగే 36వ ప్యాకేజి పరిధిలోని బ్రహ్మసముద్రం, జీడిపల్లి, ఉరవకొండ, బెళుగుప్ప, కణేకల్లు, గుమ్మఘట్ట, రాయదుర్గం పరిధిలోని ఆయకట్టుకు నీళ్లివ్వాలి. ఈ ప్యాకేజీలన్నింటికీ పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు ఆహ్వానించి పనులు చేయిస్తున్నారు. అయితే 36వ ప్యాకేజి పనులు ఎవరికీ కేటాయించలేదు. దీనికి భూసేకరణ సమస్యను సాకుగా చూపారు. వీటిలో ఆయకట్టుకు సంబంధించిన పనులు లేవు. ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు డిస్ట్రిబ్యూటరీకి ఎకరాకు రూ.4,700 కాంట్రాక్టర్‌కు ఇచ్చేందుకు ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఈ ధర తెలంగాణలో రూ.12 వేల వరకూ ఉంది. దీంతో జీవో నెంబరు 22ను అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లు తాము డిస్ట్రిబ్యూటరీ పనులు చేయలేమని ప్రభుత్వానికి నివేదించారు. అయితే ఇదంతా బూటకమని తెలుస్తోంది. ఎకరాకు రూ.9 వేలకు పెంచుతూ గతంలో జీవో 63 జారీ చేసినా, దాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థకు అన్ని విధాలా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. అసలు ఉద్దేశం ఇదే అసలు ఆయకట్టుకు నీరిస్తే చిత్తూరు వరకూ నీళ్లు తీసుకెళ్లే అవకాశాలు తక్కువ. 40 టీఎంసీల నీళ్లు ఎత్తి పోయడం అంతసులువు కాదు. పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు డెల్టాకు ఇచ్చి, శ్రీశైలం నీళ్లు మొత్తం సీమకు ఇస్తామని చెబుతున్నా, అన్ని నీళ్లు ఎత్తిపోసే అవకాశం తక్కువగా ఉండటంతోనే ఆయకట్టుకు బ్రేక్ వేశారు. మొదట కుప్పం నీళ్లు తీసుకెళ్లి కాలువ పరిధిలోని ప్రాంతాల్లో చెరువులకు నీళ్లిచ్చేందుకు సిద్ధమయ్యారు. తర్వాత నీటి లభ్యతను బట్టి ఆలోచించొచ్చని భావిస్తున్నారు. దీనికి తోడు కరెంటు బిల్లులు సాకుగా చూపి మెయింటెనెన్స్ ఎక్కువగా వస్తుందని ఆయకట్టుకు నీరిచ్చే ప్రక్రియకూ బ్రేక్ వేశారు. దీంతో కేవలం చెరువులకు నీళ్లిచ్చే ప్రాజెక్టుగానే హంద్రీ-నీవా మిగిలే పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వ వైఖరిని నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయపార్టీల నేతలు, రైతు, ప్రజాసంఘాల ప్రతినిధులు ‘అనంత’కు జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టారు. హక్కుగా దక్కాల్సిన జలాలను దక్కించుకునేందుకు పోరుకు సిద్ధమయ్యారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీతో పాటు సీపీఎం, సీపీఐ పోరుకు సిద్ధమయ్యాయి. ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం జిల్లాకు సాగునీరందించేందుకు గత ప్రభుత్వ హయూంలో హంద్రీ-నీవా ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. 40 టీఎంసీలో 23 టీఎంసీలు జిల్లాకు కేటాయించారు. తద్వారా జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు, కొన్ని పట్టణాలకు తాగునీరు అందించాలనేది ఉద్దేశం. అయితే చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం జీవో 22ని విడుదల చేసి తూట్లు పొడిచింది. కేవలం చెరువులకు అడపాదడపా నీరు ఇస్తే సరిపోతుందనే ఉద్దేశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. నిర్దేశించిన విధంగా 3.50 లక్షల ఎకరాలకు, జిల్లాలోని అన్ని చెరువులకు నీరివ్వాలి. లేకపోతే ప్రతిపక్ష పార్టీలను, ప్రజాసంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్మిస్తాం. -డి.జగదీశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి పోరాటం సాగిస్తాం గత ప్రభుత్వం నిర్ణయించిన విధంగా హంద్రీ-నీవా ద్వారా జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. ఆయకట్టును తొలగించడం అంటే జిల్లా రైతాంగానికి తీరని ద్రోహం చేయడమే అవుతుంది. హంద్రీ-నీవా ప్రాజెక్టు ఉద్దేశానికి తూట్లు పొడిచి మొక్కుబడిగా కొద్ది చెరువులకు నీరిస్తే సరిపోతుందనే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లుగా కనిపిస్తోంది. జిల్లా అభివృద్ధే ధ్యేయమని చంద్రబాబు పదేపదే చెప్పే మాటలకు చేతలకు పొంతన ఇసుమంతైనా కనిపించడం లేదు. హంద్రీ-నీవా కింద నిర్దేశించిన ఆయకట్టుకు కచ్చితంగా నీరు ఇవ్వాల్సిందే. లేని పక్షంలో ఈ ప్రభుత్వంపై ప్రజా పోరాటం సాగిస్తాము. వి.రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి -
సున్నిపెంట ఇక నగర పంచాయతీ
సీఎం సమావేశంలో నిర్ణయం? సాక్షి ప్రతినిధి, కర్నూలు: సున్నిపెంట ఏకంగా నగర పంచాయతీ కానుంది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అంతేకాకుండా శ్రీశైలంను తిరుమల తరహాలో అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో సున్నిపెంటను తిరుపతి తరహాలో మార్చాలని కూడా ఈ సమావేశంలో ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చింది. సున్నిపెంటలోనే శ్రీశైలంలో పనిచేసే ఉద్యోగులతో పాటు అందరికీ నివాసాలు, వీఐపీలకు కాటేజీలు నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలో సున్నిపెంటను పంచాయతీగా కాకుండా ఏకంగా నగర పంచాయతీగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఁసాక్షి*కి తెలిపారు. ఇందుకు అనుగుణంగా త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నట్టు సమాచారం. పంచాయతీ నుంచి నగర పంచాయతీకి.. ఇప్పటికే సున్నిపెంట జనాభా 40వేలు దాటింది. సున్నిపెంటను పంచాయతీగా గుర్తించాలని అనేక రోజులుగా ఇక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. వాస్తవానికి ఇప్పటికే సున్నిపెంటను గ్రామపంచాయతీగా మార్చాలని ప్రభుత్వానికి కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ నివేదిక సమర్పించారు. అయితే, శ్రీశైలంతో పాటు సున్నిపెంటను కూడా తిరుమల, తిరుపతి తరహాలో అభివృద్ధి చేయడంతో పాటు శ్రీశైలంలోని సిబ్బందికి మొత్తం సున్నిపెంటలోనే నివాస ఏర్పాట్లు చేయాలనే ఆలోచన ఉంది. ఈ పరిస్థితుల్లో ఏకంగా సున్నిపెంటను నగర పంచాయతీగా గుర్తించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. -
ప్రాజెక్టుల వ్యయంపై మాట్లాడితే బ్రేకులే..
♦ పతిపక్షనేత ప్రసంగానికి పదేపదే బ్రేకులు ♦ పది నిమిషాలు కూడా అవకాశమివ్వని సభాపతి సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులు, వాటికి పెట్టిన వ్యయాలు, ఆయకట్టు వివరాలు.. వీటిపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి మాట్లాడితే చాలు మైక్ కట్ అయిపోతుంది. మంగళవారం అసెంబ్లీలో ఇదే సీన్ చోటు చేసుకుంది. అంతర్జాతీయ జలదినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు సుమారు గంటసేపు సుదీర్ఘంగా ప్రసంగించారు. పోలవరం, పట్టిసీమ, గాలేరు-నగరి తదితర ప్రాజెక్టులపై మాట్లాడారు. అనంతరం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాట్లాడే అవకాశమివ్వడంతో ఆయన తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రాజెక్టులపై చేసిన వ్యయం, వైఎస్ హయాంలో ప్రాజెక్టులకు చేసిన వ్యయం, ఆయన మరణానంతరం ఎంత వ్యయం చేశారన్నది అధికారిక లెక్కలతోసహా చదివి వినిపించారు. దీంతో అధికారపక్షం ఉలిక్కిపడింది. పదేపదే ఆయన ప్రసంగానికి అడ్డుతగిలింది. ఈ నేపథ్యంలో పదేపదే ఆయన మైక్ కట్ అయింది. 25 నిమిషాల ప్రసంగంలో దాదాపు 12 నిమిషాలు అంతరాయానికే సరిపోయింది. జగన్ ప్రసంగం చేపట్టిన మూడు నిమిషాలకే స్పీకర్ మైక్ కట్ చేసి జలవనరులమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు అవకాశమిచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు పదేపదే మైక్ కట్ చేయడమేంటని ప్రశ్నించారు.ఆ వెంటనే చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులుకు అవకాశమిచ్చారు. అనంతరం జగన్‌కు అవకాశమివ్వగా... రెండు నిమిషాలు మాట్లాడారో లేదో మైక్ కట్ చేసి మళ్లీ దేవినేనికి మైకిచ్చారు. మళ్లీ జగన్‌కు అవకాశమిచ్చినట్టే ఇచ్చి.. వెనువెంటనే మైక్ కట్‌చేసి బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజుకు మాట్లాడే చాన్సిచ్చారు. ఆ తర్వాత స్పీకర్ కోడెల కలుగజేసుకుంటూ.. ప్రస్తుతం ప్రాజెక్టుల మీద చర్చ జరగట్లేదని, సబ్జెక్టుపరంగా వెళ్లాలని.. డీవియేట్ కాకూడదని.. ఇలా వెళితే ప్రజలకు రాంగ్ మెసేజ్ వెళుతుందని జగన్‌కు సలహా ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకు స్పీకర్ అవకాశమిచ్చారు. ఆయన ప్రసంగానంతరం జగన్‌కు అవకాశమిచ్చిన నిమిషంలోపలే స్పీకర్ కలగజేసుకుంటూ... సభలో సీఎం స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చినప్పుడు చర్చ ఉండదని, మీరు ప్రాజెక్టులపై చర్చకు వెళ్లాలనుకుంటే వేరేమార్గంలో వెళ్లవచ్చునని, ఇప్పుడు అంతర్జాతీయ జలదినోత్సవం అంశం వరకే మాట్లాడాలన్నారు. వెంటనే జగన్‌కు మైక్ ఇచ్చిన స్పీకర్.. మళ్లీ కట్ చేసి జలదినోత్సవంపై ప్రతిజ్ఞకు వెళ్లారు. జలదినోత్సవంపై సభలో ప్రతిజ్ఞ అంతర్జాతీయ జలదినోత్సవం సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు మంగళవారం అసెంబ్లీలో సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. శనగ రైతులకు ఇంత అన్యాయమా? వైఎస్సార్ జిల్లాలో 2012లో శనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పంటల బీమా సొమ్ము ఇవ్వ కపోవడం దారుణమని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 55 వేలమంది రైతులు పంటల బీమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. మంగళవారం అసెంబ్లీ జీరో అవర్‌లో ఆయనీ అంశాన్ని ప్రస్తావించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘2012లో రైతులు శనగ పంట వేసి నష్టపోయారు. 2013 పోయింది.. 2014 పోయిం ది.. 2015వ సంవత్సరం కూడా పోయింది. పంట నష్టపోయిన మూడున్నరేళ్ల తర్వాత కూడా రైతులకు బీమా సొమ్ము ఇవ్వకపోవడం, దీనిగురించి ఇప్పుడు మాట్లాడాల్సి రావడం బాధాకరం. అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఏఐసీ) వారితో గట్టిగా మాట్లాడాక 25 వేల మంది రైతులకు రూ.132 కోట్లు విడుదల చేశారు. ఇంకా రూ.37 కోట్లు రైతుల ఖాతాల్లో జమకాలేదు. మిగిలిన రైతుల పరిస్థితి దయనీయం. నాటి తప్పులు ఇప్పుడు చూపిస్తారా? పంటల బీమాకోసం రైతులు ప్రీమియం చెల్లించే సమయంలోనే తప్పులుంటే సరిది ద్దాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే నిర్దిష్ట కాలంలో(ఒక నెలలోనో, రెండు నెలల్లోనో) సవరించాలి. 2012 రబీలో రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లించారు. ఇప్పుడు ఏఐసీ తప్పు లు చూపిస్తోంది. ఇది ఎంతవరకు ధర్మం. వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో పంటల బీమా అందని రైతుల దుస్థితి ఇది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని బాధిత అన్నదాతలకు త్వ రగా పంటల బీమా సొమ్ము అందేలా చూడాలని మనవి చేస్తున్నా’’ అని ఆయన కోరారు. -
చంద్రబాబు దళిత ద్రోహి
► ఉచితంగా భూములిస్తామని దళితులు, గిరిజనులకు మొండిచేయి ► వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కొడవలూరు: సీఎం చంద్రబాబు నాయుడు దళిత ద్రోహని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం జరిగిన పార్టీ గ్రామ కమిటీ సమావేశంలో మాట్లాడారు. భూమి లేని షెడ్యూల్ కులాల వారికి భూమి కొనుగోలు పథకం ద్వారాభూములు ఇస్తానని ఎన్నికల మెనిఫెస్టోలో చెప్పారని, ఎన్నికల్లో గట్టెక్కాక ఆ భూమి ధర రూ.5 లక్షలకు మించకూడదని కొర్రీ పెట్టారన్నారు. ప్రస్తుతం భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, రూ.ఐదు లక్షలకు ఎకరా భూమి ఎక్కడా రాదన్నారు. డబ్బుతో ముడిపెట్టకుండా భూమిలేని దళితులకు కొనుగోలు చేసి ఎకరా వంతున ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువత పరిశ్రమలు పెట్టుకునేందుకు రూ.5 కోట్ల వడ్డీ లేని రుణమిస్తానన్న బాబు ఈ రెండేళ్లలో ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సాధారణంగా మంజూరు చేసే రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ దళిత యువకులు కార్పొరేషన్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదన్నారు. ఇది దళిత యువతను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.38 వేల మందికి రూ.171 కోట్ల రుణం ఇవ్వాల్సి ఉండగా, ఈ ఫిబ్రవరి 17 నాటికి కేవలం 2,717 మందికి రూ.16 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. క్రైస్తవ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 2,400 మందికి రూ.12 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 360 మందికి రూ.2.72 కోట్లు ఇచ్చారన్నారు. గిరిజనులకూ ద్రోహం: గిరిజనులకు సైతం ద్రోహం చేశారన్నారు. భూమిలేని గిరిజన కుటుంబాలకు ట్రైకార్ సంస్థ రెండెకరాల భూమిని కొనుగోలు చేయించి ఇస్తానని చెప్పారని, ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ఎంత మందికి ఇచ్చారో చెప్పాలన్నారు. గిరిజన యువతులకు వివాహం కుదిరితే రూ.50 వేలు ఇస్తానని చెప్పిన హామీ అమలు కాలేదన్నారు. ప్రతి జిల్లాలో గిరిజన భవన్, గిరిజన యువతకు రూ.5 లక్షల పూచీకత్తు లేని రుణం, రాష్ట్రంలో ప్రత్యేక గిరిజన యూనివర్శిటీ, గిరిజన పిల్లలకు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య, ఆలయాల పూజారులకు రూ.5 వేల గౌరవ వేతనం హామీలు గాల్లో కలిసాయన్నారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లక్షా 41 వేల మందికి రూ.206 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 2,670 మందికి రూ.24 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, జిల్లా కార్యదర్శి నాపా వెంకటేశ్వర్లునాయుడు, మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, సర్పంచ్ నాగిరెడ్డి రమేష్ పాల్గొన్నారు. -
ఆంధ్రాకు అందలం.. సీమకు అంధకారమా?
ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బెరైడ్డి నగరంలో సీమ జనచైతన్యయాత్ర కర్నూలు (న్యూసిటి): రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు ఆంధ్రాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ రాయలసీమను అంధకారంలోకి నెడుతున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ చైతన్య యాత్రలో భాగంగా బెరైడ్డి బుధవారం నగరంలో పర్యటించారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధిపై సీఎం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్ కేటాయింపులో కూడా సీమకు మొండి చేయి చూపారన్నారు. ఒకప్పుడు కర్నూలు కేంద్రంగా ఉన్నా రాజధానిని హైదరాబాద్‌కు త రలించారని, విభజన కారణంగా రాజధాని ఏర్పాటు అనివార్యమైనా కర్నూలును విస్మరించారన్నారు. రాయలసీమ వాసులను అంటరాని వాళ్లుగా చూస్తున్నారని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆరుగాలం శ్రమించి పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణా జిల్లాకు నీరు అందుతుంది తప్ప రాయలసీమ ప్రాంతానికి కాదని, ఈ విషయాన్ని సీమ వాసులు గుర్తుంచుకోవాలన్నారు. ప్రత్యేక రాయలసీమ తప్ప ఈ ప్రాంత వాసులకు వేరే మార్గం లేదని, ఇందుకోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. -
ఇళ్ల బిల్లుల చెల్లింపునకు సీఎం ససేమిరా!
* సగంలో ఆగిన ఇళ్లకు బిల్లులు చెల్లించాలని కోరిన ఎమ్మెల్యేలు * కొత్త ఇళ్లు మంజూరు చేద్దామన్న సీఎం..లబ్ధిదారులపైనే 4,000 కోట్ల భారం! సాక్షి, హైదరాబాద్: గతంలో మంజూరు చేసి సగంలో నిర్మాణం ఆగిపోయిన ఇళ్లకు బిల్లులు చెల్లించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ఇళ్లను మంజూరు చేసి వాటిని వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. మంగళవారం టీడీపీ శాసనసభాపక్ష సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. నిర్మాణం ఆగిపోయిన ఇళ్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరగా.. ఇందుకు సీఎం ససేమిరా అన్నారు. వాటి ప్రస్తావన ఇప్పుడొద్దంటూనే.. గతంలో నిర్మాణం ప్రారంభించి మధ్యలోనే నిలిచిపోయిన ఇళ్లకు ప్రస్తుతానికి బిల్లులు చెల్లించలేమని చెప్పారు. కొత్త ఇళ్లను మంజూరు చేసి వాటిని వేగంగా పూర్తి చేద్దామని, ఈ విషయమై రెండు మూడురోజుల్లో ఓ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తానని చెప్పారు. తాజాగా ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఇంటి బిల్లులను చెల్లించకూడదని దాదాపుగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రూ.4,000 కోట్ల భారం లబ్ధిదారులపైనే పడే అవకాశం ఉంది. అదే దూకుడు కొనసాగించండి: శాసనసభలో అదే దూకుడు కొనసాగించాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వంపై, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాల సందర్భంగా చర్చలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. అదే సమయంలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందని, వైఎస్ జగన్ సమర్ధవంతంగా ఆయన వాణిని వినిపించలేకపోయారంటూ ప్రజల్లో ప్రచారం చేయాలని సూచించారు. సభలో పలు అంశాలపై చర్చ సందర్భంగా ఒకరిద్దరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారని, ఇక నుంచి వారు సంయమనంతో వ్యవహరించాలని చెప్పారు. బీజేపీపై విమర్శలొద్దు: ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీపై పార్టీ నేతలు విమర్శలూ చేయొద్దని బాబు చెప్పారు. రాష్ట్రానికి రాబట్టాల్సిన నిధుల విషయంలో కేంద్రం నుంచి, ముఖ్యంగా బీజేపీ సహకారం అవసరమని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ నేతలు వ్యవహరించాలన్నారు. మరోవైపు రాష్ర్టంలోని బీసీ లు, కాపులు పార్టీకి అండగా ఉంటేనే వచ్చే సాధారణ ఎన్నికల్లో నెగ్గుకు రాగలమని చంద్రబాబు చెప్పారు. -
ప్చ్.. ఏం మంత్రులో
► ‘అనంత’ అభివృద్ధిని పూర్తిగావిస్మరిస్తోన్న ప్రభుత్వం ► 22 నెలల్లో ఒక్క అభివృద్ధికార్యక్రమానికీ శ్రీకారం చుట్టని వైనం ► ఇంత అన్యాయం జరుగుతున్నా ► సీఎం వద్ద నోరెత్తని మంత్రులు ► సొంత వ్యవహారాలుచక్కబెట్టుకోవడంలో బిజీ ‘అనంత’ అభివృద్ధి కోసమంటూ అసెంబ్లీ సాక్షిగా 21 వరాలను సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఒక్కటీ ఆచరణలో పెట్టలేకపోయారు. ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండే ళ్లు కావస్తున్నా.. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. జిల్లా మంత్రులు కూడా ‘రెండేళ్లలో ఒక్క పనీ చేయించుకోలేపోయాం.. ‘అనంత’ అభివృద్ధిపై ఇప్పటికైనా మీరు చొరవ చూపాల’ని సీఎంను అడిగే స్థితిలో లేరు. కనీసం ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితిలో కూడా లేరు. వీరి తీరు చూస్తుంటే భవిష్యత్తులోనూ ‘అనంత’ అభివృద్ధి అంగుళం కూడా కదిలే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఆవశ్యకత ఏర్పడింది. చేతులెత్తేసిన మంత్రులు జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపుతోందన్న విషయాన్ని నిశితంగా పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు అప్రమత్తమై జిల్లాను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మంత్రులపై ఉంటుంది. ఆ తర్వాత బాధ్యత ఎమ్మెల్యేలది. రాయలసీమలో టీడీపీ అధిక స్థానాలు గెలిచిన జిల్లాల్లో ‘అనంత’ది మొదటిస్థానం. ఇద్దరు ఎంపీలతో పాటు 12మంది ఎమ్మెల్యేలను జిల్లా వాసులు ఆ పార్టీ తరఫున గెలిపించారు. పల్లెరఘునాథరెడ్డి, పరిటాల సునీత మంత్రులుగా కొనసాగుతున్నారు. కాలవ శ్రీనివాసులు ప్రభుత్వ చీఫ్‌విప్‌గా ఉన్నారు. ఈ ముగ్గురూ మైకుల ముందు బీరాలు పలకడం మినహా జిల్లా అభివృద్ధి కోసం ఒక్క ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందు ఉంచలేకపోతున్నారు. పల్లె పరిస్థితి చూస్తే మంత్రి అని చెప్పుకోవడం మినహా ప్రభుత్వంలో ఏమాత్రమూ పలుకుబడి లేదని ప్రజలు సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఈయన సిఫారసులను తోటి మంత్రులు కూడా పరిగణనలోకి తీసుకోరని తెలుస్తోంది. తన సత్తా గ్రహించిన పల్లె సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడంపైనే దృష్టి పెట్టారని, మరొక ఆలోచన చేయడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. మరో మంత్రి పరిటాల సునీత జిల్లా అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు. తన కుమారుణ్ని రాబోయే ఎన్నికల్లో ఏదో ఒకస్థానం నుంచి అసెంబ్లీ బరిలోకి దించాలనే శ్రద్ధలో ఒక శాతం కూడా జిల్లా అభివృద్ధిపై లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక కాలవ శ్రీనివాసులు‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే రీతిలో ఆర్థికంగా ఎదగడంపైనే ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఈ ముగ్గురి వైఖరి జిల్లాకు శాపంగా మారింది. కనీసం కీలక అంశాలపై కూడా దృష్టి సారించడం లేదు. 2013కు సంబంధించి రూ.643 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని చంద్రబాబు ఎగ్గొట్టినా, 2014కు సంబంధించి హక్కుగా రావాల్సిన రూ.వంద కోట్లు ఎగవేస్తున్నా ఇదేంటని ప్రశ్నించలేకపోతున్నారు. హంద్రీ-నీవా డిస్ట్రిబ్యూటరీ పనులు చేయొద్దని జీవో జారీ చేసినా.. ‘మూడేళ్ల నుంచి నీళ్లు వృథాగా పోతున్నాయి, మా జిల్లాలో డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయండ’ని గట్టిగా అడగలేకపోతున్నారు. ప్రభుత్వ మోసపూరిత వైఖరితో జిల్లాలో 153మంది ైరె తులు ఆత్మహత్యలకు తెగించగా...వారి కుటుంబాలకు పూర్తిస్థాయిలో పరిహారం ఇప్పించలేకపోతున్నారు. 21 వ రాలు ప్రకటించారు.. కనీసం ఒక్కటీ చేయలేకపోతున్నారని అడగలేకపోతున్నారు. 12మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీల బలమున్నా పెదవి విప్పలేకపోతున్నారు. గతంలో జిల్లా నుంచి చాలామంది మంత్రులు ప్రాతినిథ్యం వహించినా, ఇంతటి నిస్సహాయస్థితిలో ఎవ్వరూ లేరని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికైనా వీరు అభివృద్ధివైపు చూస్తారో..నిస్సహాయులుగానే కాలం వెల్లదీస్తారో వేచిచూడాలి. ‘కంచుకోట’పై కనికరం ఏదీ? చంద్రబాబు 2014 జూన్‌లో సీఎం పీఠమెక్కారు. జిల్లాకు వచ్చిన ప్రతిసారి ‘అనంత’పై తనకు అమితమైన ప్రేమ ఉందని, కలలో కూడా ఈ జిల్లా గుర్తొస్తుంటుందని చె ప్పుకొచ్చారు. ఆయన మాటల్లోని ప్రేమ..చేతల్లో లేదని గడిచిన 22 నెలల కాలం చెబుతోంది. ఏడాదిలో హంద్రీ-నీవా ద్వారా ఆయకట్టుకు నీళ్లిస్తామని చెప్పారు. నిధుల కేటాయింపు, పనుల పురోగతి చూస్తుంటే మరో మూడేళ్లయినా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితులు క న్పించడం లేదు. ‘అనంత’ స్మార్ట్‌సిటీ, జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ అనుబంధ కేంద్రం, టైక్స్‌టైల్‌పార్క్, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ క్లస్టర్ హామీలు కూడా అలాగే ఉండిపోయాయి. ఇప్పటి వరకూ భూసేకరణకు కూడా ఉపక్రమించలేదు. పుట్టపర్తిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో విమానాశ్రయంతో పాటు విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఇదీ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే 22 నెలల్లో ‘చేశాం’ అని చెప్పుకునేందుకు ఒక్కపనీ లేదు. -
లండన్‌లో అమరావతి ఆఫీస్
* రెండో రోజు నగరంలో పర్యటించిన చంద్రబాబు బృందం * బ్రిటిష్ మ్యూజియంలోని అమరావతి పెవిలియన్ సందర్శన * వివిధ సంస్థలు, పెట్టుబడిదారులతో సమావేశం సాక్షి, హైదరాబాద్: లండన్ నగరంలో అమరావతి కార్యాలయం శనివారం నుంచి పనిచేయనుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మండలి ద్వారా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు సీఎం ప్రకటించారని శనివారం ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం హైదరాబాద్‌లో వెల్లడించింది. బ్రిటన్‌కు చెందిన సంస్థలు, పెట్టుబడిదారులు అమరావతితో పాటు, ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై మండలి కార్యనిర్వాహణాధికారి జె.కృష్ణకిషోర్ సమన్వయం చేస్తారు. కాగా, రెండో రోజు తన లండన్ పర్యటనలో చంద్రబాబు స్థానిక పార్లమెంటు సభ్యుడు బిల్లీ మోరియా, స్థానిక పెట్టుబడిదారులు, ఆరోగ్య రంగ నిపుణులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న వనరులు, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, పెట్టుబడులకు గల అవకాశాలను ఆయన వివరించారు. లండన్‌లో భారత హై కమిషనర్ అజయ్ జైన్, పార్లమెంటు సభ్యుడు అలోక్ శర్మ, యూకే డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ, యుకేఐబీసీ సీఈవో రిచర్డ్ తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అనంతరం స్థానికంగా ఉన్న బ్రిటిష్ మ్యూజియంలోని 33ఏ గదిలో ఉన్న అమరావతి పెవిలియన్‌ను చంద్రబాబు సందర్శించారు. అమరావతి చరిత్ర, ఇతర వస్తువులను ఆయన పరిశీలించారు. మ్యూజియంలోని వస్తువులు అక్కడికి ఎలా చేరుకున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత క్లైమెట్ బాండ్స్ ఇనిషియేటివ్(సీబీఐ) ముఖ్య కార్యనిర్వహణాధికారి, సహ వ్యవస్థాపకుడు సీన్ కిడ్నేతో చంద్రబాబు సమావేశమయ్యారు. వాతావరణ కాలుష్య పరిష్కారాలకు పెట్టుబడులు సమీకరిస్తున్న అంతర్జాతీయ స్వచ్చంద సంస్థగా సీబీఐకి పేరుంది. లండన్ పర్యటన ముగించుకుని చంద్రబాబు బృందం ఆదివారం ఉదయం ఢిల్లీ చేరుకోనుంది. రాత్రికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పండిట్ రవిశంకర్ నిర్వహిస్తున్న సాంస్కృతిక ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. బిజినెస్ సిటీ ప్రతినిధులతో చర్చలు ఫలప్రదం: సీఎం క్యానరీవార్ఫ్లోని బిజినెస్ సిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ సమావేశాలు ఫలప్రదమయ్యాయని, అమరావతిలో పెట్టుబడులు పెట్టి, అభివృదికి సహకరించేందుకు ఆయా సంస్థలు ఆసక్తి కనబరిచినట్లు తెలిపారు. లండన్‌లో ఉన్న ప్రవాసులు కూడా రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని తెలిపారన్నారు. దాదాపు 600 మంది ఏపీ ప్రవాసులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం పేర్కొంది. -
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
కళ్లకు గంతలు కట్టుకొని ఎంఆర్పీఎస్ నిరసన కర్నూలు(అర్బన్): ఎస్సీ వర్గీకరణ సాధన కోసం చేస్తున్న పోరాటంలో నాయకులను అరెస్టు చేసి ఉద్యమాలను ఆపాలేరని ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కమతం పరశురాం మాదిగ అన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణమాదిగ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ శుక్రవారం ఆ సమితి పట్టణ ఇన్చార్జ్ రవి మాదిగ అధ్యక్షతన నేతలు, కార్యకర్తలు స్థానిక పాతబస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణ సాధనకు ప్రాణ త్యాగాలకైనా సిద్ధమన్నారు. కొందరు మాదిగ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి రావెల కిశోర్‌బాబుతో ప్యాకేజీలు కుదుర్చుకుని వర్గీకరణకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు సుభాష్ చంద్రమాదిగ మాట్లాడుతు వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యాన్ని ఎండగడతామన్నారు. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు రామకృష్ణమాదిగ, బీవీ రమణ మాదిగ, రమణమ్మ, సత్యమ్మ, లక్ష్మమ్మ, తిమోతి, ప్రభుదాసు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మంద కృష్ణను విమర్శించే అర్హత లేదు మందకృష్ణమాదిగను విమర్శించే అర్హత మాల విద్యార్థి సంఘం నాయకులకు లేదని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ పరమేశ్మాదిగ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్యాకేజీలు ఎవరు మాట్లాడుకున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. మాల మాదిగ -
పోయాం... మోసం...
* నిరుద్యోగ భృతిపై మాటమార్చిన సర్కారుపై మండిపాటు * నమ్మి నిలువునా మోసపోయామంటున్న యువత * ఉపాధి లేదు సరికదా... భృతికూడా లేదనడం దారుణం... ఉద్యోగం రాకున్నా... భృతిపై ఆశపడ్డా... బాడంగికి చెందిన ఈమె పేరు అనకాపల్లి ఇందిర. గుంటూరులో ఈమె బీపీఈడీని 2015లో పూర్తి చేశారు. దురదృష్టం పీఈటీల నియామకాన్ని ఈ సర్కారు నిలిపేసింది. ఇక చేసేది లేక కానిస్టేబుల్ ఉద్యోగంకోసం యత్నిస్తున్నారు. ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీ నిజమే అనుకున్నారు. అసలు విషయం తెలుసుకుని ఇప్పుడు బాధపడుతున్నారు. ఆమె సాక్షితో మాట్లాడుతూ ఉద్యోగం రాకపోయినా కనీసం నెలకు 2వేలు భృతి వస్తుందని నమ్మాననీ, దానితోనైనా ఏవైనా ప్రయత్నాలు చేసుకోవచ్చని భావించాననీ... ఇప్పటికీ ప్రతీదానికీ తల్లితండ్రులపైనే అధారపడాల్సి వస్తోందనీ వాపోయారు. ‘ఇంటికో ఉద్యోగం రావాలంటే బాబు రావాలి. ఉద్యోగం ఇవ్వలేక పోయినా... మీరు ఏమీ చదువుకోక పోయినా... నెలకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి కావాలంటే బాబు రావాలి.’ - ఎన్నికల్లో వాడవాడలా టీడీపీ నేతలు చేసిన ప్రచారం. ‘నిరుద్యోగ భృతి పథకమే లేదు... మరి అలాంటపుడు ఎంత భృతి చెల్లించామన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు.’ - నిండు సభలో మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ. పరస్పర విరుద్ధమైన ఈ రెండు ప్రకటనలూ జిల్లాలో కలకలం సృష్టించాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ... నెరవేర్చకపోగా... అలాంటిదేమీ లేదని మంత్రి చెప్పడాన్ని అంతా తప్పుపడుతున్నారు. నిలువునా మోసపోయామని వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: సర్కారు మోసం మరోసారి బట్టబయలైంది. నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేసిన వైనం తేటతెల్లమైపోయింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామనీ... నిరుద్యోగ భృతి కల్పిస్తామని చేసిన వాగ్దానాలు నమ్మిన జిల్లాలోని 5లక్షల85వేల కుటుంబాలు, 3లక్షల మంది నిరుద్యోగులు మోసపోయామంటూ ఆవేదన చెందుతున్నారు. కొత్త ఉద్యోగాలిస్తానని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఆవ్వలేదు సరికదా ఉన్న ఉద్యోగుల్ని ఊడపీకారు. రైతులకు ఎంతో సేవలందించిన ఆదర్శరైతులను అర్ధంతరంగా తొలగించారు. ఉపాధి వేతనదారులకు పని చూపించిన క్షేత్ర సహాయకులను అకారణంగా తీసేశారు. ఇంజినీర్లతో కలిసి పనిచేసిన వర్క్ ఇన్స్పెక్టర్లను రోడ్డున పడేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులనైతే ఉన్నపళంగా ఆపేశారు. వారంతా ఇప్పుడు కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా, సెక్యూరిటీ గార్డులుగా మారి దయనీయంగా బతుకుతున్నారు. నిరుద్యోగ భృతిపై మాటమార్చిన సర్కారు ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించారు. ఒక్కొక్కరికీ రూ. 2వేలు చొప్పున నెలకు భృతి అందిస్తామని ఆశ చూపారు. ప్రజలను భ్రమల్లోకి తీసుకెళ్లి ఓట్లేయించుకున్నారు. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా పీఠమెక్కాక ఉద్యోగం లేదు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. ఇదేమంటే అసలు ఆ పథకమే లేదని మంత్రి అడ్డంగా బొంకేశారు. ప్రస్తుతం జిల్లాలో 5లక్షల 85వేల కుటుంబాలు ఉండగా అందులో 2లక్షల మంది వరకు నిరుద్యోగులున్నారు. వారంతా ఉద్యోగాల్లేక నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డున పడ్డ 55వేల మంది కార్మికులు కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కనీసం వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికుల బతుకులకూ భరోసానివ్వడంలేదు. ప్రభుత్వ విధానాలతో జిల్లాలోని పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10జూట్‌మిల్లులు ఇప్పటికే మూతపడటంతో 20వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పిల్లల్ని పోషించలేక, చదివించుకోలేక కొందరు కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు ఆందోళనకు గురై హఠాన్మరణం చెందుతున్నారు. ఇక, ఫెర్రో పరిశ్రమలు పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 12పరిశ్రమలు మూతపడ్డాయి. 25వేల మంది పనిలేక అలమటిస్తున్నారు. చిన్న చితకా పరిశ్రమలు మరో 20వరకు మూతపడ్డాయి. వీటిలో పనిచేసిన 10వేల మంది పనిలేక అవస్థలు పడుతున్నారు.దయనీయంగా బతుకుతున్నారు. మోసపోయిన నిరుద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కల్పిస్తారన్న ఆశతో గతంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నవారు గణనీయంగా పెరిగారు. దాదాపు 54వేల మంది జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో ఉన్నారు. కొత్త రిక్రూట్మెంట్ల కోసం వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రభుత్వం ఒక్క ఉద్యోగం తీయలేదు. నిరుద్యోగ భృతికి సంబంధించి కనీసం మాట్లాటలేదు. ఎందుకింత మోసమని నిరుద్యోగులంతా మండిపడు తున్నారు. -
సర్కార్ దగా !
‘ఇంటికో ఉద్యోగం రావాలంటే బాబు రావాలి. ఉద్యోగం ఇవ్వలేక పోయినా.. మీరు ఏమీ చదువుకోపోయినా నెలకు రూ. రెండు వేలు నిరుద్యోగ భృతి రావాలంటే బాబు రావాలి’. తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా’..ఇదీ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు పలికిన చిలక పలుకులు. జాబు రావాలంటే బాబు రావాలి అంటూ ఎక్కడ చూసినా ప్రకటనలు.. టీవీల్లో ఒకటే హోరు.. గోడలపై రాతలు.. ఈ రకమైన ప్రచారంతో ఊదరగొట్టి జనం ఓట్లు పోగేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏలుబడి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఇంటికో ఉద్యోగం ఊసే లేదు. ఉద్యోగం ఇవ్వక పోయినా నెలకు రూ.రెండు వేలు భృతి అయినా అందుతుందని ఆశపడిన నిరుద్యోగులకు బాబు తనదైన శైలిలో ఝలక్ ఇచ్చారు. రాష్ర్టంలో నిరుద్యోగ భృతి అనే పథకమే లేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పించారు. దీంతో నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు. ఉద్యోగం లేదు..కనీసం భృతి అయినా ఇస్తారేమోనని కుటుంబసభ్యులు ఆశపడ్డారు. ఆ ఆశని సర్కార్ వమ్ము చేసింది. చంద్రబాబు ఎన్నికల హామీలు నమ్మిన జిల్లా నిరుద్యోగులు తక్షణమే ఆయన గద్దె దిగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. * నిరుద్యోగులకు నెలకు రూ.2 వేలు భృతి అంటూ హామీ * ఎన్నికల సమయంలో వాగ్దానం * అసెంబ్లీ సాక్షిగా మాటమార్చిన మంత్రి * పోరాటం తప్పదని హెచ్చరిక * జిల్లాలో 1.50 లక్షల నిరుద్యోగులు * మండిపడుతున్న నిరుద్యోగులు * నిరుద్యోగ భృతిపై మోసపూరిత ప్రకటన సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నిరుద్యోగ భృతిపై మాటమార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా నయవంచనకు పాల్పడడం ఎంతవరకూ సమంజసమని నిలదీస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో లక్షన్నర మందికిపైగా నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్లు విడుదలవుతాయేమోనని కళ్లల్లో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు. తమ పిల్లలకు ఉద్యోగాలొస్తే బతుకులు బాగుపడుతాయని సుమారు మూడు లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. కనీసం భృతి కల్పిస్తే కొంతయినా ఆదుకున్నట్టు ఉంటుందని నిరుద్యోగుల తల్లిదండ్రులంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గురువారం సాక్ష్యాత్తూ జిల్లా మంత్రే నిరుద్యోగ భృతిపై మాట మార్చడంపై తాము పూర్తిగా మోసపోయామని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఇవిగో ఉదాహారణ జిల్లా ఉపాధి కల్పన, శిక్షణ కార్యాలయంలో ఉన్న గణాంకాలు చూస్తుంటే నివ్వెరపోక తప్పదు. ఎంప్లాయీమెంట్ ఎక్స్ఛేంజీలో సర్టిఫికెట్లు రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య గత ఫిబ్రవరి నాటికి 51,946 మంది ఉన్నారు. ఇందులో ఎస్సీలు 9,200 మంది కాగా బీసీలు 36,738, మహిళలు 13,609మంది. 38 వేల మందికి పైగా పురుష నిరుద్యోగులున్నారు. మూడేళ్ల తరువాత రెన్యూవల్ చేయించుకోకపోతే వారి వివరాలు మరికనిపించవు. అలాంటివారు వేలల్లో ఉన్నారు. పీజీ పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి వివరాలు ఇక్కడ లభ్యం కావు. విశాఖలోని ఏయూలో ఎంప్లాయీమెంట్ గెడైన్స్ బ్యూరోలో పొందుపర్చారు. ఇక్కడ కేవలం డిగ్రీ, డిప్లమో, ఐటీఐ, బీఈడీ, డీఈడీ సహా ఇతర టెక్నికల్ అభ్యర్థుల వివరాలే నమోదయ్యాయి. 2014లో 13,252 మంది, 2015లో 9,011 మంది, 2016లో ఇప్పటివరకు 2048 మంది పేర్లు నమోదు చేయించుకున్నారు. ఏటికేడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నవాళ్ల సంఖ్య పెరుగుతోందని అధికారులే చెబుతున్నారు. ఇవి కాకుండా జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో మరెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో లెక్కే లేదు. జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వలస పోతున్నవారి సంఖ్య ఏటా లక్షమంది అని సాక్ష్యాత్తూ జిల్లా యంత్రాంగమే ప్రకటించింది. ఉద్యోగం లేకపోవడంతో గుజరాత్ తీర ప్రాంతానికి బోట్లలో పనిచేసేందుకు ఎంతోమంది వెళ్లిపోతున్నారు. పదోతరగతి తరువాత.. జిల్లాలో పదోతరగతి పూర్తిచేసి ఉపాధికల్పనాశాఖ కార్యాలయంలో నమోదు చేసుకున్న వారి సంఖ్యే 13,323 మంది ఉన్నారు. ఇంటర్ 11,916, డిగ్రీ 7,361, స్టెనోగ్రాఫర్లు 341, టైపిస్టు 1474, బీఈడీ 2,722, డీఈడీ 678, అన్ని వర్గాల డిప్లమో పూర్తిచేసిన వాళ్లు 1679, ఏఎన్ఎం, స్టాఫ్‌నర్స్‌లు 1060, ఐటీఐ 5,713, ఎంఎల్జే తరహా 1145, అన్‌స్కిల్డ్ (పదోతరగతి లోపు) 4537 మంది అభ్యర్థులు తాము ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నామని, ఏదైనా అవకాశం వస్తే తెలియజేయాలని రిజిస్ట్రేషన్ ద్వారా విన్నవించుకున్నారు. వీరంతా ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా ఇటు ఉద్యోగమూ లేక, అటు నిరుద్యోగ భృతీ అందక అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చడంపై ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. అవగాహనా లేదు జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడే ఉపాధి కల్పన, కార్మికశాఖ మంత్రిగా ఉన్నారు. రెండేళ్లవుతున్నా నిరుద్యోగులకు ఆయన ఒక్క హామీ ఇవ్వలేకపోయారు. జిల్లా పరిస్థితులపై అవగాహన ఉండి పోరాడాల్సిన వ్యక్తే అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడంపై ప్రజలు మండిపడుతున్నారు. జిల్లాలో తాము చదువు పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నామని పదేళ్ల నుంచీ రిజిస్టర్ చేయించుకున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వీరి గూర్చి ఆలోచించలేకపోయిన మంత్రి మోసపూరిత ప్రకటన చేయకపోవడంపై నిరుద్యోగులు ధ్వజమెత్తుతున్నారు. బాబు గద్దె దిగాలి నిరుద్యోగుల ఓట్లతో అధికారం తెచ్చుకున్న చంద్రబాబు తక్షణమే గద్దె దిగాలి. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేనివాళ్లకు నెలకు రూ.2వేల భృతి అంటూ ఎన్నికల సమయంలో వాగ్ధానాలిచ్చి ఇప్పుడు ఆ పథకమే లేదంటారా? అసెంబ్లీలో ఆర్థికమంత్రి యనమల ప్రకటించిన బడ్జెట్లో కూడా నిరుద్యోగులకు భరోసా కల్పించలేకపోయారు. జిల్లాలో లక్షలకు పైగా నిరుద్యోగులున్నారు.టీడీపీ సర్కార్ గద్దె దిగేవరకు పోరాటం చేస్తాం. - తలసముద్రం సూర్యం, ఏపీ నిరుద్యోగ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు. చంద్రబాబు దయతో రోడ్డునపడి తిరుగుతున్నాం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగభృతి ఇస్తాడని ఆశతో గెలిపిం చాం. ఉద్యోగం లేదు. నిరుద్యోగ భృతి లేదు. నేను డిగ్రీ పూర్తి చేసి ఏడేళ్లయింది అప్పటి నుంచి కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు ప్రిపేరవుతున్నా. కరెక్టుగా అన్ని విభాగాల్లోను సరైన శిక్షణ పొందానన్న సమయంలో చంద్రబాబు అధికారం చేపట్టడంతో ఉద్యోగాలు తీయక రోడ్డున పడి ఉపాధి కోసం తిరగాల్సి వస్తోంది. - ఎం.శ్రీనివాసరావు, నిరుద్యోగి, గుజరాతీపేట నూతన పరిశ్రమల జాడే లేదు రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేస్తున్నామని చంద్రబాబు బూట కపు మాటలు చెబుతున్నారే తప్పా ఎక్కడా పరిశ్రమలు రాలేదు. దీంతో ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. బీటెక్ పట్టాలు పెట్టెలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికైనా బాబు కళ్లు తెరిచి ఉద్యోగాలు ఇవ్వడానికి చొరవ చూపిస్తే బాగుంటుంది. - ఆర్.శివ, బిటెక్ విద్యార్థి, శ్రీకాకుళం. బాబు వైఖరి తెలియనిది కాదు చంద్రబాబు ద్వంద్వవైఖరి తెలియనిది కాదు. తొమ్మిదేళ్లు పా లించి ప్రజలను హింసపెట్టా రు. ఇటీవల ఎన్నికల ముందు పూర్తిగా మారిపోయానని, ప్రజా సంక్షేమమే ధ్యేయమని నమ్మబలి కారు. గద్దెనెక్కాక మళ్లీ అదే బాటలో నడుస్తున్నారు. - కర్నేన గౌరినాయుడు, నిరుద్యోగి, రాజాం -
లండన్‌లో వాణిజ్య, వ్యాపారవేత్తలతో చంద్రబాబు భేటీ
లండన్ : లండన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. మూడురోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు బృందం శుక్రవారం అక్కడి వాణిజ్య, వ్యాపారవేత్తలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీ గురించి సీఈవో నికిల్ రాఠీ ...చంద్రబాబు బృందానికి వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు మౌలికి సదుపాయాల కల్పనపై ఈ భేటీలో చర్చ జరిగింది. అంతకుముందు చంద్రబాబు బృందం లండన్‌లోని థేమ్స్ నది ఒడ్డున ఉన్న 'లండన్ ఐ'ని సందర్శించింది. చంద్రబాబు 13వ తేదీ వరకూ అక్కడే ఉండి అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో పాల్గొంటారు. ముఖ్యమంత్రి వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఉన్నారు. -
అవినీతిపై ప్రశ్నిస్తే ఎదురుదాడా?
సీఎం చంద్రబాబుపై మండలిలో విపక్షనేత రామచంద్రయ్య ధ్వజం సాక్షి, హైదరాబాద్: రూ.75 లక్షల కుంభకోణంపై పత్రికలో వచ్చిన వార్తకు అప్పటి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా కోరిన బాబు.. ప్రస్తుతం రాజధానిలో వేల కోట్ల భూ కుంభ కోణాలపై పత్రికల్లో వస్తున్న వార్తలపైనా అలాగే స్పందించి వాటితో సంబంధమున్న మంత్రు లతో రాజీనామా కోరాలని మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. గురు వారం శాసనమండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ అవినీతిపై సభలో ప్రశ్నిస్తే ఆధా రాలివ్వండంటూ విపక్ష సభ్యులపై ఎదురుదాడి చేయడం సమంజసం కాదన్నారు. ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తే వాటికి సంబంధించిన ఆధారాలు అధికారులు సేకరిస్తారన్నారు. కాగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం రక్షిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, గోవిందరెడ్డి ఆరోపించారు. రాజమండ్రి బ్రిడ్జి లంక సొసైటీలో అక్రమాలు జరిగినట్లు గుర్తించినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. -
మాదిగలను మోసం చేస్తున్న చంద్రబాబు
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ మాదిగ ఏపీ సీఎం దిష్టిబొమ్మ దహనం హన్మకొండ : ఏపీ సీఎం చంద్రబాబు నాయు డు మాదిగలను మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొయ్యడ మల్లేష్ మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి తిప్పారపు లక్ష్మణ్ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ గురువారం హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్, మహా జన సోషలిస్ట్ పార్టీ (ఎంఎస్పీ) ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. సుబేదారి పోలీసులు చేరుకొని దిష్టిబొమ్మ కాలుతుండగానే లాక్కెళ్లారు. అరుునా ఆందోళనకారులు శాంతించకుండా రోడ్డుపై నిరసన తెలిపా రు. చివరకు పోలీసులు వారికి సర్దిచెప్పి పంపేశారు. ఈ సందర్భంగా మల్లేశ్ మాదిగ, లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ నారావారిపల్లె నుంచి చేపట్టే పాదయూత్రను అడ్డుకోవడానికి పోలీసులు మిర్యాలగూడలో మంద కృష్ణను అరెస్ట్ చేశారని తెలిపారు. మంద కృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయూలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జాతీయ అధికార ప్రతినిధి తీగల ప్రదీప్‌గౌడ్, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు వేల్పుల సూరన్న, గోవింద్ నరేష్, బుర్రి సతీష్, దామెర కరుణ, బండారి సురేందర్, వెంకటస్వామి, పుట్ట బిక్షపతి, బొర్ర బిక్షపతి, చాతల్ల శివ, రాగల్ల ఉపేందర్, సుకుమార్, కిష్టఫర్, స్వాతి పాల్గొన్నారు. -
అట్టడుగున ఉన్నాం.. ఆదుకోండి
పెట్టబడుల కోసమే లండన్ వెళుతున్నా: ఏపీ సీఎం సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సూచికల్లో వెనకబడి ఉందని, వాటితో సమాన బలం వచ్చేంతవరకు కేంద్రం చేయూతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి మరోసారి విన్నవించారు. పెట్టుబడులపై చర్చల కోసం లండన్ ప్రయాణమైన చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ చేరుకుని కేంద్ర హోం మంతి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశాల అనంతరం ఆయన రాత్రి 10.15కు ఏపీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘గతంలో ప్రధాన మంత్రిని, ఆర్థిక మంత్రిని కలిసి రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని వివరించాను. మళ్లీ ఈరోజు వివరించాను. విభజన వల్ల దక్షిణ భారతదేశంలో ఏపీ అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉంది. 2014-15 తలసరి ఆదాయం లెక్కలు చూస్తే దక్షిణాదిన ఉన్న పొరుగు రాష్ట్రాల కంటే దాదాపు రూ.35 వేలు తక్కువగా ఉంది. తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగుళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నాయి. కానీ ఏపీకి రాజధాని లేదు. విభజన బిల్లులో ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ జోన్, పన్ను ప్రోత్సాహకాలు, పోలవరం పూర్తి తదితర హామీలు పొందుపరిచారు. స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం వంటివి పెట్టారు. రాజ్యసభకు వచ్చినప్పుడు స్పెషల్ స్టేటస్‌పై ఆనాటి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు..’’ అని చెప్పారు. వీటన్నింటినీ త్వరితంగా పూర్తిచేయాలని కోరినట్లు తెలిపారు. రాజధానిపై రాజకీయం చేస్తున్నారు రాజధానిపై అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్షాన్ని చంద్రబాబు విమర్శించారు పెట్టుబడులు కోరేందుకు లండన్ వెళుతున్నట్లు చెప్పారు. కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఆ నమ్మకంతోనే గెలిచాం.. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఏ తప్పూ చేయకపోయినా విభజనవల్ల నష్టపోయారని చంద్రబాబు చెప్పారు. ‘‘ఆనాటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్యాయం చేసింది, ఫలితం అనుభవించింది. ఎన్డీయే ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ప్రజలు నమ్మి గెలిపించారు. ఈ విషయమే ఆర్థిక మంత్రికి వివరించా. తొందర్లోనే న్యాయం చేస్తారని ఆశాభావం ఉంది. 2018 నాటికి పోలవరం పూర్తిచేస్తామన్నారు. పట్టిసీమపై కొందరు గందరగోళం చేస్తున్నారు. పోలవరం వచ్చే వరకు అదే కెనాల్‌ను వినియోగించుకుని పట్టిసీమ ద్వారా నీటిని రాయలసీమకు ఇస్తాం’’ అని తెలిపారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో విలీనం చేయడం చెల్లదని, దానిపై న్యాయపోరాటం చేస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై డేగకన్ను
జిల్లా వ్యాప్తంగా 200 మందికిపైగా బైండోవర్ సీఎం స్వగ్రామం కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకట్ట అయినా వెళ్లేందుకు కొందరు నేతల యత్నం ప్రజాస్వామ్యం ఖూనీ :బ్రహ్మయ్య మాదిగ ఒంగోలు క్రైం : ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణ కోసం సీఎం చంద్రబాబు స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సమరభేరి మోగించాలనుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ ఈ నెల 10న సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ముట్టడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రెండు రోజులుగా పోలీసు యంత్రాంగం ఎమ్మార్పీఎస్ నాయకుల కదలికలపై డేగ కన్ను వేసింది. శనివారం, ఆదివారాల్లో మొత్తం 200 మందికిపైగా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంది. ఒక్క ఒంగోలు నగరంలోనే దాదాపు 50 మందికిపైగా నాయకులు, కార్యకర్తలను బైండోవర్ చేయించుకున్నారు. కొన్ని చోట్ల నేరుగా పోలీసుస్టేషన్లలోనే బైండోవర్ చేయగా జిల్లాలోని మరికొన్ని చోట్ల తహసీల్దార్ల ముందు హాజరు పరిచి బైండోవర్ చేయించుకున్నారు. నారావారిపల్లెకు వె ళ్తే నాన్ బెయిల్‌బుల్ కేసులు పెడతామన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. చంద్రబాబు గత ప్రభుత్వంలోనే ఎస్సీలను వర్గీకరిస్తామని చెప్పి మోసం చేశాడంటూ ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ కొన్నేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. రథయూత్రకు బ్రేకులు అందులో భాగంగా వర్గీకరణ సాధించుకునేందుకు చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె నుంచి రథయాత్ర చేపట్టాలని ఎమ్మెర్పీఎస్ నేతలు తీర్మానించారు. అందుకు ఈ నెల 10న ముహూర్తంగా నిర్ణయించారు. ఆ కార్యక్రమానికి వెళ్లకుండా కార్యకర్తలను అడ్డుకోవాలని పోలీసులపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. జిల్లా నుంచి ఒక్క కార్యకర్త కూడా నారావారిపల్లెకు వెళ్లకూడదని డీఎస్పీలను ఆదేశించింది. పోలీసుస్టేషన్లవారీగా ఎవరెవరు రథయాత్రకు వెళుతున్నారన్న సమాచారాన్ని నిఘా వ్యవస్థ ద్వారా సమాచారం తెప్పించుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం.. అన్ని పోలీసుస్టేషన్ల హెచ్ఎస్ఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా ఎమ్మార్పీఎస్‌లో చురుకుగా పనిచేసే కార్యకర్తలు, నాయకులను లక్ష్యంగా చేసుకొని రెండు రోజులుగా వారి కదలికలపై నిఘా ఉంచింది. కొంతమంది ఏ విధంగానైనా నారావారిపల్లెకు చేరుకోవాలని నిర్ణయించుకొని ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయటమేనని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఇక కర్నూలుకు కన్నీళ్లే!
► తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం తెరపైకి ► 3 నెలల్లో సర్వేకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ► గుండ్రేవుల ప్రతిపాదనలు పంపితే... కలిసి ముందుకు వెళ్దామని సూచన ► ఏడాది కాలంగా కనీసం పట్టించుకోని ఏపీ ప్రభుత్వం ► తుమ్మిళ్ల వస్తే... సుంకేసులకు నీరు డౌటే ! ► కేసీ ఆయకట్టుకూ తిప్పలే.. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు నగరం ఇక నుంచి దాహంతో అలమటించాల్సిందేనా? వర్షాకాలంలో మినహా మిగిలిన సమయంలో కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు చుక్కనీరు లభించే పరిస్థితి లేకుండా పోనుందా? సుంకేసుల ప్రాజెక్టు నీళ్లు లేకుండా నోరెళ్లబెట్టనుందా? గుండ్రేవుల ప్రాజెక్టు కూడా మూలకు పడనుందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే సుంకేసులకు ఎగువన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఆదేశాలతో జిల్లాకు కన్నీళ్లే తప్పవనే అభిప్రాయం సాగునీటి నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించేందుకు కలిసి వస్తే ముందుకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉంచిన గుండ్రేవుల వెంటనే అనుమతి ఇవ్వాలని కర్నూలుకు సీఎం వస్తున్న సందర్భంగా సాగునీటిరంగ నిపుణులు కోరుతున్నారు. దీనిపై ప్రజా ప్రతినిధులు కూడా సీఎంను ఒప్పించాలని వీరు విన్నవిస్తున్నారు. తుమ్మిళ్ల వస్తే తిప్పలే...! సుంకేసుల పైభాగం నుంచి 8 నుంచి 10 టీఎంసీల నీటిని లిఫ్టు ఇరిగేషన్ (ఎత్తిపోతల) ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలోని గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం తుమ్మిల్ల ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏడాది మొత్తం తాగునీటి అవసరాల పేరుతో నీటిని తీసుకెళ్లేందుకు ఈ పథకాన్ని అక్కడి ప్రభుత్వం చేపట్టింది. కేవలం మూడు నెలల్లో సర్వే పూర్తి చేయాలని... ఇందుకోసం రూ.29.50 లక్షలను కూడా విడుదల చేసింది. ఎత్తిపోతల పథకం నిర్మిస్తే సుంకేసుల నీళ్లు లేక నోరెళ్లబెట్టాల్సిన దుస్థితి ఏర్పడనుంది. ఫలితంగా కర్నూలు నగరానికి చుక్కనీరు కూడా దక్కే అవకాశం లేదు. అంతేకాకుండా కేసీ కెనాల్‌కు కూడా నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గుండ్రేవుల నిర్మాణానికి ఇప్పటికే తెలంగాణ సానుకూలంగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ముందుకు రావాలని సాగునీటిరంగ నిపుణులు కోరుతున్నారు. -
రాజధాని పేరుతో ‘రియల్’ వ్యాపారం
ఆర్పీఎస్ అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్ రెడ్డి మద్దికెర: రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రసాధనే లక్ష్యంగా చేపట్టిన బస్సుయాత్ర సోమవారం మండల కేంద్రమైన మద్దికెరకు చేరుకుంది. ఈ సందర్భంగా బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబునాయుడు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారన్నారు. సంతలో పశువులను కొన్నట్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. సీమలో ఫ్యాక్టరీలు లేవని, ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు బేల్దారి, ఉపాధి పనులుకు వెళతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాన్ని విడిచి పెట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన కోస్తాను రాజధానిగా ఎంపిక చేయడం దారుణం అన్నారు. కృష్ణా, తుంగభద్రా, పెన్నా నదుల నీటిని కోస్తాకు తరలిస్తున్నారని ఆరోపించారు. అత్యంత వెనకబడిన ఆఫ్రికాలో సోమాలియాలో జనాభా పెరుగుతుంటే రాయలసీమలో జనాభా తగ్గుతుండడంతో ఆందోళన కలిగిస్తోందన్నారు. ఉపముఖ్యమంత్రి నియోజకవర్గం పత్తికొండలో.. బిందె నీటి కోసం మహిళలు పనులు వదులుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రాయలసీమ 68 వేల చదరపు కిలో మీటర్ల వైశాల్యంలో ఉందని.. ప్రత్యేక రాష్ట్రం చేస్తే దేశంలోని 13 రాష్ట్రాల కంటే పెద్దదవుతుందన్నారు. సీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలంటే ఉద్యమబాట పట్టాల్సిందేనని పిలుపునిచ్చారు. -
10న లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు రోజులపాటు లండన్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 10వ తేదీన శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి లండన్ బయలుదేరనున్నారు. 13వ తేదీ వరకూ అక్కడే ఉండి అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో పాల్గొంటారని శనివారం ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెళ్లనున్నారు. -
ప్రధాని బూట్ల దుమ్ము తుడుస్తున్న బాబు
వామపక్షాల మండిపాటు సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు సీఎం చంద్రబాబు విఫలమయ్యారని ఉభయకమ్యూనిస్టు పార్టీలు మండిపడ్డాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విభజన చట్టంలోని అన్ని హామీలు అమలవుతాయని పొత్తు పెట్టుకున్నామన్న చంద్రబాబు.. ఇప్పుడు ఆ హామీ లు అమలవకపోతున్నా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని మండిపడ్డాయి. ఇప్పుడు ప్రధాని బూట్ల మీద దుమ్ము తుడిచే పనిలో చంద్రబాబు ఉన్నారని ఘాటుగా విమర్శించాయి. తిరుపతిలో ప్రారంభమైన వామపక్షాల బస్సు యాత్ర కర్నూలులో శనివారం ముగిసింది. తమ పోరాటం కర్నూలు నుంచే ప్రారంభం అవుతుందని సీపీఐ, సీపీఎం ప్రకటించాయి. బహిరంగసభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ప్రసంగించారు. -
కాపు జాతిని విడదీసే కుట్ర
* ముఖ్యమంత్రి చంద్రబాబుపై ముద్రగడ మండిపాటు * మాల, మాదిగల మధ్య బాబు పెట్టిన చిచ్చు రగులుతూనే ఉందని వ్యాఖ్య కిర్లంపూడి: కాపు జాతిని విడదీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గతంలో అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉన్న మాల, మాదిగల మధ్య చంద్రబాబు పెట్టిన చిచ్చు ఇప్పటికీ రగులుతోందన్నారు. అలాగే తన దీక్షా సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయకుండా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాపు నాయకులతో తనపై ఎదురుదాడి చేయించి, బండబూతులు తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు తక్ష ణం విడుదల, దరఖాస్తు చేసుకున్న ఒక్కో అభ్యర్థికి రూ.2 లక్షల రుణం ఇస్తామని హామీలు ఇచ్చారని తెలిపారు. వాటిని అమలు చేస్తారని నమ్మి దీక్ష విరమించానని చెప్పారు. అయితే, రూ.500 కోట్లు విడుదల చేయకపోగా రుణాన్ని రూ.40 వేలకు కుదించారని తెలి పారు. ఈ స్వల్ప మొత్తంతో కాపులు ఏ వ్యాపా రం చేస్తారని ప్రశ్నించారు. కాపు ఐక్యగర్జనకు ముందు పట్టు వదలకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, కాపుల గౌరవం పెంచాలని తనకు సూచించిన టీడీపీ మంత్రు లు, ఎమ్మెల్యేలు ఇప్పుడు సీఎం మాటలు విని ఎదురుదాడి చేయడం సిగ్గుచేటన్నారు. మంత్రివర్గంలో ఉన్నా కాపు ప్రజాప్రతినిధులను పురుగుల్లా చూస్తున్నారని కొంతమంది తన వద్ద వాపోయారన్నారు. తాను నోరు విప్పితే వారి పదవులు పోతాయని చెప్పారు. చంద్రబాబు అధికార దాహంతో ఎవరిని మోసం చేయటానికైనా వెనకాడరని దుయ్యబట్టారు. కాపుజాతిని అణగదొక్కేందుకు కాపు నాయకుల్నే పావులుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. చివరి రక్తపు బొట్టు వరకూ జాతి సంక్షేమానికి పాటు పడతానని స్పష్టం చేశారు. వంద కోట్లో, రెండొందల కోట్లో ఇచ్చి మంత్రి పదవిని కొనుక్కున్న అపర కోటీశ్వరుడు నారాయణకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ముద్రగడ జవాబిచ్చారు. రాజధాని పేరుతో రైతుల నోట్లో మట్టికొట్టి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్నారని ఆయన ఆరోపించారు. -
ఏపీ సీఎం అవినీతిని అసెంబ్లీలో ఎండగడతాం
* వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం ప్రకటన * ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు * విభజనతో నష్టపోయిన ఏపీకి బాబు పాలనతో మరింత నష్టం * బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతాం * పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తాం * పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి, మోసపూరిత పాలనను శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఎండగడతామని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం ప్రకటించింది. పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శుక్రవారం పార్టీ కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన వందల హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రాజధాని ప్రకటన చేసినరోజు ప్రతి జిల్లాకూ ఏవేవో చేస్తానని మాటలు చెప్పారని, కానీ ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. పట్టిసీమ, రాజధాని, ఇసుక ఇలా ప్రతిదాంట్లోనూ ప్రభుత్వ అవినీతి కనిపిస్తోందన్నా రు. చంద్రబాబుకు శంకుస్థాపనలు చేయడమేతప్ప పూర్తిచేసే అలవాటు లేదన్నారు. విభజనతో నష్టపోయిన ఏపీ ఇప్పుడు చంద్రబాబు పాలనతో మరింత నష్టపోతోందన్నారు. ఈ నేపథ్యంలో తమ అధినేత జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పార్టీ ఎమ్మెల్యేలమంతా సమష్టిగా అసెంబ్లీలో ప్రజాసమస్యల్ని ప్రస్తావించడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడతామని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఖాయమన్నారు. గవర్నర్ ప్రసంగం తరువాత ఏరోజు ఇవ్వాలన్న దానిపై పార్టీలో చర్చించుకుంటున్నామని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఒకట్రెండు రోజుల్లో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఉపయోగపడే పని ఒక్కటైనా చేశారా? సీఎం రోజూ విలేకరుల సమావేశాలు పెట్టి ఆ ప్రాంతానికి అది చేశా, ఇది చేశానని ప్రకటనలు చేయడమేతప్ప.. ఈ రెండేళ్లలో ప్రజలకుపయోగపడే పని ఏ ఒక్కటైనా పూర్తిచేశారా? అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎంస్థాయి వ్యక్తి అక్రమ భవనంలో ఉంటే రాష్ట్రంలో మంచిపాలనకు ఇంకేమి అవకాశముంటుందన్నారు. పట్టిసీమ కట్టేసా.. రాయలసీమకు నీళ్లొస్తాయని ప్రచారం చేశారు.. ఇప్పటికి సీమకు చుక్కనీరైనా ఇచ్చారా? అని నిలదీశారు. పట్టిసీమ పేరుతో రాయలసీమకు నీళ్లిస్తానని మోసం చేసిన చంద్రబాబు తక్షణమే సీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. విజయవాడలో మంత్రులతో నిర్వహిస్తున్న సమావేశాలు ఏవి మంత్రివర్గ సమావేశాలో.. ఏవి పార్టీ సమావేశాలో కూడా అర్థంకాని తీరున జరుగుతున్నాయన్నారు. మంత్రివర్గ సమావేశాల్ని పార్టీ సమావేశాల మాదిరిగా నిర్వహించడం రాష్ట్రచరిత్రలో మునుపెన్నడూ జరగలేదన్నారు. అమెజాన్, గూగుల్ సంస్థలు తమ బ్రాంచీలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాయని, మైక్రోస్టాఫ్ రెండో సంస్థను అక్కడే ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. అయితే ప్రపంచమంతా తనవైపే చూస్తోందంటూ చంద్రబాబు సదస్సుల పేరుతో వందలకోట్లు ఖర్చు పెడుతున్నారుగానీ.. ఒక్క ప్రాజెక్టూ రాష్ట్రానికి రావట్లేదని విమర్శించారు. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల చేరికల్ని ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. ఇంకో సీఎం అయితే రాజీనామా చేసేవారు రాజధాని భూదందాలో సీఎం, ఆయన బినామీలు, ఆయన కుమారుడు, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేల బాగోతం సాక్ష్యాధారాలతో బట్టబయలయ్యాక మరొకరైతే ఇప్పటికే సీఎం పదవికి రాజీనామా చేసివుండేవారని శ్రీధర్‌రెడ్డి అన్నారు. కానీ చంద్రబాబులాంటి వ్యక్తి నుంచి రాజీనామా ఆశించడం ఆడియాసే అవుతుందని.. కనీసం విచారణకైనా ఆయన సిద్ధపడాలని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు బయటకు పొక్కనీయమని సీఎం, మంత్రులుగా ప్రమాణం చేసి.. రాజధాని ప్రకటనకు మూడు నెలలముందే కొందరు ముఖ్యులు, వారి బినామీలతో రాజధాని ప్రాంతంలో భూములు కొనిపించడం నేరం కాదా? అని ప్రశ్నించారు. -
కాపులకు రిజర్వేషన్ కల్పిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి నరసరావుపేట రూరల్/నరసరావుపేట వెస్ట్: బీసీలకు ఒక్క శాతం కూడా అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గుంటూరు జిల్లా కోటప్పకొండలో శ్రీకృష్ణదేవరాయ అన్నదాన సత్రంలో రూ.కోటి వ్యయంతో నిర్మించిన కల్యాణ మండపాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాపులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ఏర్పాటు చేసిన మంజునాథ కమిటీ తొమ్మిది నెలల్లో నివేదిక ఇస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి కాపు కార్పోరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయిస్తామన్నారు. కోటప్పకొండ పుణ్యక్షేత్రానికి ఎంతో చరిత్ర ఉందని, దీనిని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. కోటప్పకొండను పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ‘సాక్షి’పై ముఖ్యమంత్రి అక్కసు : రాజధానిలో భూకుంభకోణంపై సాక్షి పత్రికలో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు యథావిధిగా తమ అక్కసు వెళ్లగక్కారు. గుంటూరు జిల్లా కోటప్పకొండలో శుక్రవారం వివిధ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ పలు విమర్శలు చేశారు. ముద్రగడ రమ్మంటేనే చర్చలకు వెళ్లాం: సీఎం బాబు సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చాలని నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న సమయంలో ముద్రగడ పద్మనాభం ఆహ్వానిస్తేనే ప్రభుత్వం తరపున ప్రతినిధులు వెళ్లి దీక్షను విరమింప చేశారని సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం ఆయన పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ముద్రగడ తాజా ప్రకటనలపై చర్చించారు. ఈసారి ఉద్యమం చేస్తే పార్టీ నేతలు, కాపులు ఎవ్వరూ వెళ్లాల్సిన అవసరం లేదని, ఆయనతో పాటు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని కాపు ద్రోహులుగా ప్రచారం చేసి ప్రజలను నమ్మించాలని చంద్రబాబు సూచించారు. -
ఫిరాయింపులే చంద్రబాబు క్యారెక్టరా?
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర ధ్వజం సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపులు ప్రోత్సహించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు క్యారెక్టరా? అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. తన వ్యక్తిత్వం, అనుభవం గురించి ప్రతి రోజూ గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించడం ఎంత వరకు సమంజసమన్నారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఫిరాయింపుల నిరోధక చట్టానికి విరుద్ధంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం ఘనత అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించడం విడ్డూరమన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సింది తమ వాడైన స్పీకరే కనుక ఇబ్బంది లేదని, ఎవరూ రాజీనామాలు చేయవద్దని వారికి చెప్పడం చట్టవిరుద్ధమన్నారు. అధికారబలంతో ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడితే.. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ప్రతిపక్షంగా మారతారన్నారు. వారు సభ్యత్వాలు కోల్పోతారు: ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఇపుడు పార్టీ మారిన వారు సభ్యత్వాలను కోల్పోతారని రాజేంద్ర వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బ తినకూడదనే ఉద్దేశంతో 1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చారని, సవరణల తర్వాత 2003లో దానిని పకడ్బందీగా రూపొందించారన్నారు. అనర్హతపై స్పీకర్ దే పూర్తి అధికారం అని న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పదో షెడ్యూలులోని 7వ పేరాలో ఉందని చెబుతున్నారని, ఈ వాదన సరికాదని బుగ్గన అన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు కూడా చేస్తామని చెప్పారు. -
అవినీతిలో చంద్రబాబుకు అంతర్జాతీయ ఖ్యాతి
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి వెంకటాచలం(మనుబోలు): ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిలో మాత్రం అంతర్జాతీయ ఖ్యాతి సాధిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన వెంకటాచలం మండల పరిషత్ కార్యాలయం విశ్రాంతి మందిరంలో విలేకరులతో మాట్లాడారు. రెండు రోజులుగా రాజధాని నిర్మాణం పేరుతో మంత్రులు, వారి బినామీలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు కాజేశారో, ప్రస్తుతం వాటి విలువెంతో పత్రికల్లో వార్తలొస్తుంటే ప్రజలు నివ్వెరపోతున్నారన్నారు. ప్రభుత్వంలో పెత్తనం చెలాయించే వారు, ప్రభుత్వానికి అండదండగా ఉంటున్న వారు రాజధాని నిర్మాణంలో కోట్లు పోగేసుకుంటున్నారన్నారు. పేద రైతుల నుంచి తక్కువ ధరకు భూములు లాక్కున్నారన్నారు. ఆ భూముల్లో కోర్ క్యాపిటల్ అని చెప్పి వ్యాపారానికి అనుగుణంగా ఉండే విధంగా వాటిని నమోదు చేయించారన్నారు. మిగిలిన వాటిని మాత్రం గ్రీన్ జోన్ అని చెప్పి వ్యాపారం చేయడం ఇంత కన్నా ఘోరం ఉండదన్నారు. చంద్రబాబు లాంటి అవినీతిపరుడ్ని చరిత్రలో చూడలేదన్నారు. జిల్లాకు చెందిన మంత్రి నారాయణ రాజధాని ప్రాంతంలో బినామీల పేరుతో వేల కోట్లు పోగేసుకుంటున్నారన్నారు. అగ్రిగోల్డ్‌ను న్యాయస్థానాలే తప్పుపట్టినా దోషులను శిక్షించడంతో ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందని ప్రశ్నించారు. వారికి చెందిన హాయ్‌ల్యాండ్‌ను చినబాబు లోకేష్ నొక్కేయడంతో వారిపై ఈగ వాలనీయడం లేదన్నారు. ప్రజలను, రైతులను మోసం చేసి రాజధాని నిర్మాణం పేరుతో వేల ఎకరాలు కాజేసి వాటితో వ్యాపారం చేయడం దుర్మార్గమన్నారు. అభివృద్ధి ముసుగులో ఇంత దారుణమైన దోపిడీని ఎక్కడా చూడలేదన్నారు. రైతులను మోసం చేసిన వారు ఎవరూ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని సం పాదించుకున్న దాఖలాల్లేవన్నారు. దీనికి చంద్రబాబు అతీతుడు కాదన్నారు. తాను నిప్పునని, తనంత నీతిమంతుడు లేడని డబ్బా కొట్టుకునే చంద్రబాబు వేల కోట్ల అవినీతిలో చిక్కుకున్నారు కాబట్టి నిజాయతీని నిరూపించుకోవాలన్నారు. బాబు నిజాయితీపరుడైతే రాజధాని భూకుంభ కోణంపై సుప్రీం కోర్టు జడ్జి, సీబీఐలచేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వెంకటాచలం జెడ్పీటీసీ సభ్యుడు వెంకటశేషయ్య, ఎంపీపీ అరుణమ్మ, నాయకులు చెంచుకృష్ణయ్య, శ్రీధర్‌నాయుడు, రజనీకాంత్‌రెడ్డి, కోదండరామిరెడ్డి పాల్గొన్నారు. -
హామీలను విస్మరించిన సీఎం
కర్నూలు(అర్బన్) : తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలను విస్మరించారని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కైలాస్‌నాయక్ అన్నారు. స్థానిక సంక్షేమభవన్‌లో గురువారం నిర్వహించిన గిరిజన యువతీ, యువకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు కెతావత్ లక్ష్మానాయక్, వెహైచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎరుకలి రాజు, నాయకులు ఈశ్వర్ నాయక్, నేనావత్ రాము నాయక్, ఇంద్రానాయక్ పాల్గొన్నారు. -
బాబు నమ్మకాన్ని వమ్ము చేయరు
టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు కొరిటెపాడు (గుంటూరు) : ప్రజలు చంద్రబాబుపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయరని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే సగానికిపైగా అమలు చేయటం జరిగిందని తెలిపారు. ప్రజాప్రయోజనాల కోసమే ఉచితంగా ఇసుక విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధికి సహకరించకపోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రజా రాజధానిని నిర్మించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు ఎస్ఎం జియావుద్దీన్, దాసరి రాజామాస్టారు, శనక్కాయల అరుణ, మన్నవ సుబ్బారావు, ఇక్కుర్తి సాంబశివరావు, చంద్రగిరి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. -
పశువుల్లా ఎమ్మెల్యేల కొనుగోలు
ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి ధ్వజం కోడుమూరు రూరల్: సంతలో పశువుల బేరం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రలోబాలకు గురిచేసి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్)వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో డబ్బున్నోడిదే రాజ్యమైందని చెప్పారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట సాధనే లక్ష్యంగా చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా బెరైడ్డి రాజశేఖరరెడ్డి మంగళవారం కోడుమూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సమర్థమైన పాలన అందించలేక ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, కోట్లరూపాయాలు ఎరగా వేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వ్యవహర తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఏదో ఓ రోజు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజా పాలన మరిచి రాజధాని పేరుతో ఇప్పటికే కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారన్నారు. రుణమాఫీ హామీని బాబు నెరవేర్చకపోవడంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరగిపోయాయన్నారు. విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాద్ నుంచి పాలన సాగించాలని ఉన్నా, రియల్ఎస్టేట్ వ్యాపారం కోసం బాబు రాజధానిని అమరావతికి మార్చరన్నారు. ప్రత్యేక రాయలసీమతోనే అభివృద్ధి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రంతోనే సీమ అభివృద్ధి సాధ్యమని ఆర్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరెడ్డి అన్నారు. చైతన్య యాత్రలో భాగంగా బైరెడ్డి బస్సు యాత్ర మంగళవారం మండలంలోని ప్యాలకుర్తి, కొత్తూరు గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ అన్ని విభాగాల్లో రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందన్నారు. చెంతనే నీరున్నా వినియోగించుకోలేని దురదృష్టం మనదన్నారు. దీనికంతంటికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. కార్యక్రమంలో రాయలసీమ పోరాట సమితి అధ్యక్షుడు కృష్ణయ్య, సుంకన్న తదితరులు పాల్గొన్నారు. -
మోసగించడమే బాబు నైజం
* ఊపిరి ఉన్నంతవరకు జగనన్న వెన్నంటే ఉంటా * వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల సమావేశంలో గుమ్మనూరు జయరాం చిప్పగిరి: అధికారం కోసం రైతులకు, డ్వాక్రామహిళలకు, వివిధ వర్గాల ప్రజలకు ఎన్నికల ముందు కలబొల్లి మాటలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేశారని, రాజకీయాల్లో అది ఆయన నైజమని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విమర్శించారు. మంగళవారం మండల పరిధిలోని నేమకల్ గ్రామంలో వైఎస్సార్సీపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ మండల కన్వీనర్ బెల్డోణ ఓబులేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు పోతుంటే నోరుమెదపడం లేదన్నారు. పార్టీని బతికించుకునేందుకు ప్రస్తుతం చంద్రబాబునాయుడు దిగుడుజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఎరచూపి చేర్పించుకుంటున్నారని ఆరోపించారు. బాబు ప్రలోభాలకు తాను లొంగనని ఊపిరి ఉన్నంతవరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నంటే ఉంటానని ఎమ్మెల్యే చెప్పారు. ఈ విషయంలో కార్యకర్తలు, నాయకులు ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దన్నారు. అంతకుముందు డేగులపాడు గ్రామం నుంచి నేమకల్ వరకు వైఎస్సార్సీపీ యువనాయకులు గుమ్మనూరు నారాయణ, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు విక్రాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు శ్రీను, సర్పంచులు సురేష్‌రెడ్డి, నాగేంద్ర, కొండాదేవికాశేఖర్, రోహిణి, మల్లమ్మ, వైసీపీ మండల కన్వీనర్లు చిన్నఈరన్న, భీమప్పచౌదరి, లుముం బా, దొరబాబు, ఓబులేష్, మండల నాయకులు డేగులపాడు మాజీ సర్పంచు మల్లికార్జున, వీరాంజనేయులు, ఇందుశేఖర్‌రెడ్డి, భీమిరెడ్డి, మారయ్య, ధనుంజయ, గుమ్మనూరు నారాయణ, సుధ, నారి, కో-కన్వీనర్ లోకనాథ్, దౌల్తాపురం చిన్నబాబు, సాబాల గోవిందు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు విలువలు లేవు
మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజం రాయదుర్గం : ముఖ్యమంత్రి చంద్రబాబుకు విలువలు లేవని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చిన చంద్రబాబు.. గద్దెనెక్కిన తర్వాత వాటిని తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ఇతరులకు శ్రీరంగనీతులు చెప్పడం, తాను మాత్రం వాటిని మరచి ప్రవర్తించడం బాబుకు అలవాటేనన్నారు.‘టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ప్రభుత్వం సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తోందని హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో బాబు వాపోయారు. ఒక పార్టీ నుంచి గెలిచిన వారిని రాజ్యాంగానికి విరుద్ధంగా కొనుగోలు చేయడం ధర్మమా అంటూ ప్రశ్నించారు. మరి అలాంటి వ్యక్తి ఏపీలో చేస్తున్నదేంట’ని నిలదీశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకోవడాన్ని ఏమనాలన్నారు. రీచ్‌ల్లో దోచుకోవడం, దాచుకోవడం ముగిసిన తర్వాత ఇసుక విధానాన్ని మార్చడం శోచనీయమన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల అంచనాలు పెంచి రూ.6వేల కోట్ల నిధులను ప్రభుత్వ కార్యదర్శుల సంతకాలు లేకుండా విడుదల చేయడం దోచుకోవడానికి కాదా అని ప్రశ్నించారు. అవినీతి బురదలో దొర్లుతూ మచ్చలేని నాయకుడిగా తనకు తాను కితాబిచ్చుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. కార్యక్రమంలో కణేకల్లు మాజీ ఎంపీపీ రాజగోపాల్ రెడ్డి, స్విస్ అధినేత గుంతకల్లు ఓంకారప్ప తదితరులు పాల్గొన్నారు. -
అభయం!
భూమా-శిల్పా మధ్య ముసలం ఉద్యోగుల బదిలీ తప్పదనే ప్రచారం ధైర్యం చెప్పే ప్రయత్నంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూమాకు మంత్రి పదవి రాకుండా మోకాలడ్డు నంద్యాల, ఆళ్లగడ్డల్లోని అధికారుల్లో గందరగోళం సమన్వయం’ ఎన్నటికో... సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో భూమా-శిల్పాల మధ్య రేగిన ముసలం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే మంత్రి పదవి విషయంలో వివాదం రాజుకుంటుండగానే.. తాజాగా అధికారుల బదిలీల విషయంలో కొత్త సమస్య తెరమీదకొచ్చింది. అన్నకు మంత్రి పదవి రాగానే అధికారులపై వేటు తప్పదనే ప్రచారం ఇప్పటికే అటు ఆళ్లగడ్డ, ఇటు నంద్యాలలో జోరందుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని.. ఏ ఒక్కరిపై బదిలీ వేటు పడకుండా చూస్తానని అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి ధైర్యం చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు అసలు మంత్రి పదవి ఆయనకు వచ్చే అవకాశమే లేదని కూడా చెబుతుండటం గమనార్హం. డీఎస్పీపై వేటు తప్పదు నంద్యాల డీఎస్పీని బదిలీ చేస్తారనే ప్రచారం ఇప్పటికే సాగుతోంది. ఈ విషయమై నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును భూమా కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన వ్యక్తిగత పనుల మీద కొన్ని రోజుల పాటు సెలవులో వెళ్లారు. ఇదే సందర్భంలో అధికార పార్టీ నేతలు మాత్రం ఆయన బదిలీ అయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అధికారుల బదిలీలపై ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి హామీ లభించలేదని.. కేవలం నియోజకవర్గ ఇన్చార్జీల మాటే చెల్లుబాటు అవుతుందని ఇప్పటికే శిల్పా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆళ్లగడ్డలోనూ వార్ షురూ ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనూ ఇదే తరహా యుద్ధానికి తెరలేసింది. నియోజకవర్గంలో గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా పలువురు అధికారులను నియమించుకున్నారు. వీరందరిపైనా ఇప్పుడు వేటు తప్పదనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా నియోజకవర్గంలోని ఒక మండలంలో రెగ్యులర్ తహశీల్దారును కాదని.. డిప్యూటీ తహశీల్దారునే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈయన స్థానానికి కూడా ఎసరు తప్పదనే ప్రచారం ఉంది. ఇదే జరిగితే తాడోపేడో తేల్చుకుంటామని గంగుల వర్గీయులు సవాల్ విసురుతున్నారు. తాజా చేరికలతో జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరుతోంది. కమిటీ వచ్చేదెన్నడో.. పార్టీలో విపక్ష ఎమ్మెల్యేల చేరిక నేపథ్యంలో పాత నేతలు, కొత్త నేతలకు మధ్య సమన్వయం చేసేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి, డిప్యూటీ సీఎం కేఈ, జిల్లా అధ్యక్షులతో కూడిన కమిటీని పార్టీ నియమించింది. అయితే, ఈ కమిటీ ఇప్పటివరకు కనీసం ఇరువురితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. కమిటీ వచ్చెదెన్నడో.. నేతల మధ్య సమన్వయం సాధించేదెన్నడో అనే చర్చ అధికారపార్టీలో జరుగుతోంది. -
పయ్యావులకు ‘పవర్’ కట్ !
మంత్రి పదవిపై ఏడాదిగా ఎమ్మెల్సీ కేశవ్ ఆశలు పల్లె, పరిటాలలో ఒకరిని తప్పించి మంత్రి మండలిలో చేరే ఎత్తుగడ ఆయన ఆశలపై నీళ్లు చల్లిన చంద్రబాబు భూమాకు మంత్రి పదవికట్టబెట్టే యోచనతోనే అడ్డంకులు సాక్షిప్రతినిధి, అనంతపురం మంత్రి పదవిపై ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ పెట్టుకున్న ఆశలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నీళ్లు చల్లారా? మంత్రివర్గ విస్తరణలో కేశవ్‌ను కాదని భూమా నాగిరెడ్డి లేదా అఖిల ప్రియకు పదవి కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారా? ఇప్పుడు మంత్రి కాలేకపోతే జీవితకాలంలో మరెప్పుడూ కాలేరని పయ్యావుల అనుచరులు ఇటీవల బాహాటంగా చేస్తున్న వ్యాఖ్యలే నిజమవుతున్నాయా?... తెలుగుదేశం పార్టీలో తాజా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది. జిల్లా టీడీపీ సీనియర్ నేతల్లో పయ్యావుల కేశవ్ ఒకరు. రాష్ట్రస్థాయి నేతగా ఎదిగే క్రమంలో జిల్లా రాజకీయాలను పెద్దగా పట్టించుకోలేదు. ఉరవకొండ నియోజకవర్గాన్ని, అక్కడి ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే 2014 ఎన్నికల్లో ఓడిపోయారని ఆ పార్టీ అధిష్టానం కూడా భావించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే కచ్చితంగా మంత్రిని అయ్యేవాడినని, పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో గెలవలేకపోయానని కేశవ్ పలు సందర్భాల్లో సన్నిహితుల వద్ద వేదనపడినట్లు తెలిసింది. పల్లె ర ఘునాథరెడ్డి, పరిటాల సునీతకు జిల్లా నుంచి కేబినెట్లో చోటు దక్కడంతో కేశవ్ గత 20 నెలలుగా జిల్లా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మినహా మరే కార్యక్రమంలోనూ కన్పించలేదు. ఇదిలావుండగా.. ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని కేశవ్ వ్యూహరచన చేశారు. జిల్లా మంత్రులు పల్లె, పరిటాలలో ఎవరినో ఒకరిని కేబినెట్ నుంచి తప్పించి, తాను వెళ్లాలని చాపకింద నీరులా ప్రయత్నాలు సాగించారని తెలుస్తోంది. దీనికితోడు ముఖ్యమంత్రి వద్దనున్న విద్యుత్ శాఖను అనధికారికంగా కేశవ్ ఇన్నాళ్లూ పర్యవేక్షించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. బడ్జెట్ సమావేశాల అనంతరం ఉండే మంత్రివర్గ విస్తరణలో మంత్రి కాబోతున్నానని, పోర్టుపోలియో ‘పవర్’ అని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు ఓ టీడీపీ ఎమ్మెల్యే ‘సాక్షి’కి తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేశవ్ ఎత్తులు చిత్తయ్యాయని తెలుస్తోంది. కేశవ్‌పై చంద్రబాబుకు సన్నగిల్లిన నమ్మకం పయ్యావుల కేశవ్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన తర్వాత కూడా నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే నిర్ణయానికి సీఎం వచ్చినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఇటీవల భూమా నాగిరెడ్డిని పార్టీలోకి చేర్చుకునే సందర్భంలో మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. భూమా కూడా పార్టీలోకి చేరుతున్న సందర్భంలో విద్యుత్‌శాఖను డిమాండ్ చేయడం, దానికి సీఎం అంగీకారం తెలిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలిసి కేశవ్ నేరుగా చంద్రబాబును కలిసి తన మంత్రి పదవిపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘పార్టీ బలోపేతం కోసం కొన్ని త్యాగాలు తప్పవు. ఎమ్మెల్యేగా ఓడిపోయావు. ఎమ్మెల్సీ ఇచ్చాం. ఈ ‘సారి’కి అంతటితో తృప్తి పడు’ అని కుండబద్ధలు కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో కేశవ్ మంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని ‘అనంత’ టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. -
చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మనుబోలు: తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. మనుబోలులో పార్టీ నాయకుడు దేశిరెడ్డి హరనాథ్‌రెడ్డి నివాసంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ప్రజాస్వామ్య వాదులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. చంద్రబాబు తన కుర్చీని కాపాడుకునేందుకు ఎంతకైనా దిగజారుతారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు చిన్నతనం నుంచే కులపిచ్చి ఉందని, వర్సిటీ స్థాయిలోనే రౌడీ రాజకీయాలు చేసిన ఘనత ఆయనదని ఎద్దేవా చేశారు. తెలంగాణ లో టీడీపీ తుడిచిపెట్టుకుపోవడంతో దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఏపీలో తమ పార్టీ నాయకులను ప్రలోభపెట్టి చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ లో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్తే సంతలో పశువుల్లా బేరమాడుతున్నారని కేసీఆర్‌ను దుమ్మెత్తిపోసిన సీఎం చంద్రబాబు, ఇప్పుడు ఏపీలో చేసిన దానికి ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు. 2009లో తనను కాంగ్రెస్‌లోకి రమ్మని ఎవరూ పిలవలేదని, వైఎస్సార్ పరిపాలన నచ్చి తానే వెళ్లానని గుర్తుచేశారు. తాను రూ.10 కోట్లకు అమ్ముడుపోయి కాంగ్రెస్‌లో చేరానని గోబెల్స్ ప్రచారం చేసిన టీడీపీ నాయకులు కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని తాను సవాల్ విసరడంతో తోకముడిచారన్నారు. ఇప్పుడు పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలను జగన్మోహన్రెడ్డి ఎంతో గౌరవించారని, వారు చేసిన పని సరికాదన్నారు. వైఎస్సార్, జగన్మోహన్రెడ్డి బొమ్మలు పెట్టుకొని గెలిచిన వీరు దమ్ముంటే రాజీనామా చేసి టీడీపీ తరఫున గెలవాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఇచ్చే డబ్బు, పదవులకు ఆశపడి వారు పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. 22 నెలల పాలనలో చంద్రబాబు చేసింది శూన్యమని, ప్రజల దృష్టిని మరల్చేందుకే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. టీడీపీ పతనం మొదలైందని, అందుకే చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పార్టీ నాయకులు దండు చంద్రశేఖర్‌రెడ్డి, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, భాస్కర్ గౌడ్, అంకయ్య గౌడ్ పాల్గొన్నారు. -
చంద్రబాబు అవినీతికి అడ్డూఅదుపులేదు
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి కర్నూలు(ఓల్డ్‌సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి విమర్శించారు. అవినీతికి అడ్డొచ్చిన అధికారులను స్థానభ్రంశం కల్పిస్తున్నారని, ఇందుకు తాజాగా నగరాభివృద్ధి, యాజమాన్యసంస్థ చైర్మన్ అజయజైన్పై వేటు వేయడమే ఉదాహరణ అన్నారు. సింగపూర్ సంస్థల ప్రతిపాదనలకు లొంగి ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్‌కు సిద్ధమవ్వడం సబబు కాదని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సబ్‌ప్లాన్ అమలు విషయంలో ఎస్సీలకు అన్యాయం జరుగుతు ం దని, కొన్ని శాఖల్లో ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. -
రాయలసీమ అభివృద్ధికి సమరశీల పోరాటం
కర్నూలు(అర్బన్): అధికార పార్టీ దగాకోరు విధానాలకు వ్యతిరేకంగా రాయలసీమ అభివృద్ధికకి సమరశీల పోరాటం నిర్వహిద్దామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు కె. రామాంజనేయులు, కె. ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అభివృద్ధిని అడ్డుకుంటే సహించమన్నారని, అయితే వారు చేసిన అభివృద్ధి ఏమిటీ? ఎవరు అడ్డుకున్నారో తెలియజేయాలని సవాల్ విసిరారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలులో నిర్వహించిన ఆగష్టు 15 వేడుకల్లో ఇచ్చిన హామీలను ఏనాడైనా ఆయనను అడిగే ప్రయత్నం చేశారా? అని గఫూర్ కేఈని ప్రశ్నించారు. ఇప్పటి వరకు గుండ్రేవుల, పాలహంద్రీ, వేదావతి, హంద్రీనీవా తదితర నీటి ప్రాజెక్టుల ఊసే లేదన్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఎయిమ్స్ తరహాలో తీర్చిదిద్దుతామని, కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. అభివృద్ధి మొత్తాన్ని అమరావతిలో కేంద్రీకరిస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదని సీమప్రాంతానికి చెందిన అధికారపార్టీ నాయకులను ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధికి బీజేపీ, టీడీపీ ప్రస్తుతం రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించి, నేటి వరకు ఒక్క పైసా ఖర్చు చేయలేదన్నారు. ప్రజల అవసరాలకు కాకుండా పాలకుల ఆడంబరాలకు నిధులను వాడుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి రూ.12 కోట్లు ఖర్చు చేసి, ఉపయోగించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం తాత్కాలిక రాజధానికి మరో రూ.300 కోట్లు ఖర్చుచేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర నాయకులు బీమలింగప్ప మాట్లాడుతూ ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో సీమ సమాగ్రాభివృద్ధికి ఈ నెల 20 నుంచి మార్చి 5వ తేదీ వరకు బస్సు యాత్రను నిర్వహిస్తున్నామన్నారు. ఈ యాత్ర 5న కర్నూలుకు చేరుకుంటుందన్నారు. అదే రోజు ముగింపు సభ జరగనుందని, ఈ సభకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి హాజరవుతున్నట్లు చెప్పారు. సమావేశంలో నాయకులు టి. షడ్రక్, గౌస్‌దేశాయ్, రమేష్‌కుమార్, రాధాకృష్ణ, ఎస్ మునెప్ప, లెనిన్‌బాబు, రామాంజనేయులు, సాయిబాబా, రాముడు, అంజిబాబు, ఆనంద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.