Pregnant
-
కడుపులోనే శిశువు.. కాసేపటికే తల్లి
కోనరావుపేట(వేములవాడ): ఓ గర్భిణిని ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళ్తే.. శిశువు కడుపులోనే చనిపోగా.. పరిస్థితి విషమించి, కాసేపటికే తల్లి మృతిచెందింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెంది సిద్దరవేణి బాబుకు కొండాపూర్ గ్రామానికి చెందిన లాస్యతో ఏడాది క్రితం వివాహం జరిగింది. గర్భిణి అయిన లాస్యను కుటుంబసభ్యులు ప్రసవం నిమిత్తం గురువారం వేములవాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది ఇంజక్షన్ వేయడంతో ఆమెకు ఫిట్స్ వచ్చాయి. దీంతో వారు ఆందోళనకు గురై, కరీంనగర్ తీసుకెళ్లాలని సూచించారు. బాధితులు సిరిసిల్ల ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు కరీంనగర్ వెళ్లాలని చెప్పడంతో వెంటనే అక్కడికి తీసుకెళ్లారు. వైద్యులు లాస్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పి, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడికి చేరుకోగా వైద్యులు ఆపరేషన్ చేసి, మృత శిశువును బయటకు తీశారు. పరిస్థితి విషమించడంతో కాసేపటికే తల్లి లాస్య కూడా మృతిచెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో పల్లిమక్త, కొండాపూర్‌లలో విషాదం నెలకొంది. -
గర్భవతిని చేశాడు.. బాలిక ఉసురు తీశాడు!
కాణిపాకం/పలమనేరు : బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడేవాడు. చివరికి ఆమెను గర్భవతిని చేశాడు. దీంతో ఆ బాలిక తీవ్ర రక్తహీనతకు గురైంది. చివరికి ప్రాణాల మీదికొచ్చింది. వైద్యులు సిజేరియన్ చేసి బాలికను బతికించేందుకు విఫలయత్నం చేశారు. బిడ్డకు జన్మనిచ్చిన ఆ చిన్నారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టీ.ఒడ్డూరు గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక పెంగరగుంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు నెలల కిందట బాలిక కడుపు పెరగడాన్ని గమనించి టీచర్.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు బాలికను బడికి పంపడం మాన్పించారు. శనివారం ఉన్నట్టుండి ఆ బాలికకు ఫిట్స్ రావడంతో తల్లిదండ్రులు బంగారుపాళ్యం ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల గర్భిణీ అయిన ఆ బాలిక రక్తహీనతతో బాధపడుతోందని వైద్యులు నిర్ధారించి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు పరీక్షించి రక్త హీనత కారణంగా బాలిక ఊపిరితిత్తులకు ఉమ్మనీరు చేరిందని, బిడ్డను బయటకు తీస్తే తప్ప తల్లిని బతికించలేమని తేల్చి చెప్పారు. ఈ మేరకు కలెక్టర్, ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి.. వారి ఆదేశాల మేరకు బాలికకు సిజేరియన్ చేశారు. మగబిడ్డను బయటకు తీశారు. తల్లి పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. వెంటిలేటర్ మీద శనివారం రాత్రి 9.30 గంటలకు చిత్తూరు నుంచి తిరుపతికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక ఆదివారం ప్రాణాలు విడిచింది. బిడ్డ ఐసీయూలో చికిత్స పొందుతోంది. పలమనేరు సీఐ నరసింహరాజు పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఓ మాయలేడిని నమ్మి.. ఇదిలా ఉండగా, పాఠశాలకు సెలవు వచ్చినప్పుడల్లా ఓ మాయలేడి ఆ బాలికను ఆవుల మేతకు తీసుకెళ్లేదని, అక్కడ ఓ కామాంధుడి చేతిలో పెట్టేదని తెలిసింది. పూర్తి వివరాలను రెండ్రోజుల్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. -
ఆ అమ్మ సునామీకి జన్మనిచ్చింది!
ఎప్పుడూ చూసే సముద్రమే ఆ రోజు కొత్తగా ఉంది. భయంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే సముద్రం విలయ విధ్వంసానికి సిద్ధంగా ఉంది. ఆరోజు... ఏ రోజూ మరచిపోలేని రోజు. సునామీ విశ్వరూపాన్ని చూపిన రోజు. ఇరవై సంవత్సరాల తరువాత కూడా... నిన్ననే జరిగినట్లు వెన్నులో చలిపుట్టించే రోజు...అండమాన్ నికోబార్‌లోని హట్ బే దీవిలో భీకర అలల ధాటికి నమిత రాయ్ ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. అప్పుడు నమిత వయసు పాతిక సంవత్సరాలు. దిక్కుతోచని పరిస్థితుల్లో పాములకు ప్రసిద్ధి చెందిన అడవిలో ఆశ్రయం పొందారు. ఎటు నుంచి ఏ విషసర్పం వచ్చి ప్రాణం తీస్తుందో తెలియని భయానక పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే ఆ పాముల అడవిలోనే పండంటి పిల్లాడికి జన్మనిచ్చింది నమిత.ఆ పిల్లాడికి ‘సునామీ’ అని పేరు పెట్టారు. రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లింది నమిత రాయ్...‘ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒంట్లో వణుకు పుడుతుంది. అప్పుడు నేను గర్భవతిని. రోజువారీ పనులతో బిజీగా ఉన్నాను. ఉన్నట్టుండి భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. మా తీరం నుండి మైళ్ళ దూరంలో సముద్రం తగ్గుముఖం పట్టడం చూసి షాక్ అయ్యాను. కొన్ని సెకనుల తరువాత మా దీవి వైపు భారీ సముద్రపు అలలు దూసుకొస్తున్నాయి, ఆ తర్వాత బలమైన ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు కేకలు వేస్తూ గుట్ట వైపు పరుగెత్తడం చూశాను. పానిక్ ఎటాక్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాను.కొన్ని గంటల తరువాత స్పృహలోకి వచ్చాను. కొండ అడవిలో వేలాది మంది స్థానికుల మధ్య నేను ఉన్నాను. నా భర్త, పెద్ద కొడుకును చూడగానే ప్రాణం లేచి వచ్చింది. మా ద్వీపంలోని చాలాప్రాంతాలు రాక్షస అలల తాకిడికి నాశనం అయ్యాయి. ఆస్తి అనేది లేకుండా పోయింది.ఒకరోజు రాత్రి పదకొండు గంటల తరువాత నాకు పురిటినొప్పులు వచ్చాయి. కానీ చుట్టుపక్కల డాక్టర్లు ఎవరూ లేరు. నేను ఒక బండరాయిపై పడుకొని సహాయం కోసం ఏడ్చాను. నా భర్త ఎంత ప్రయత్నించినా వైద్యసహాయం అందలేదు. అడవిలో ఆశ్రయం పొందిన కొందరు మహిళలను నా భర్త వేడుకున్నాడు. వారి సాయంతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సునామీకి జన్మనిచ్చాను.తిండి లేదు. సముద్రానికి భయపడి అడవి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో నా బిడ్డ బతుకుతాడా అనే బాధ మొదలైంది. కొబ్బరి నీళ్లే ఆహారమయ్యాయి. లాల్ టిక్రీ హిల్స్‌లో నాలుగు రాత్రులు గడిపిన మమ్మల్ని రక్షణ సిబ్బంది కాపాడారు. చికిత్స కోసం నన్ను పోర్ట్ బ్లెయిర్‌లోని జీబీ పంత్ ఆసుపత్రికి ఓడలో తీసుకువెళ్లారు. హట్ బే నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు 117 కిలోమీటర్ల దూరం. సుమారు ఎనిమిది గంటల సమయం పట్టింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది నమిత.కోవిడ్ మహమ్మారి సమయంలో భర్త లక్ష్మీ నారాయణ మరణించడంతో ఇద్దరు కుమారులు సౌరభ్, సునామీలతో కలిసి పశ్చిమబెంగాల్లోని హుగ్లీలో నివసిస్తుంది నమితా రాయ్.నమిత పెద్ద కుమారుడు సౌరభ్ ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు సునామీ ‘ఓషనోగ్రాఫర్’ కావాలనుకుంటున్నాడు.‘మా అమ్మే నాకు సర్వస్వం. ఆమె ధైర్యశాలి. నాన్న చనిపోయాక మమ్మల్ని పోషించడానికి చాలా కష్టపడింది. ఫుడ్ డెలివరీ సర్వీసును నిర్వహించింది. దానికి సునామీ కిచెన్ అని సగర్వంగా పేరు పెట్టింది’ అంటున్నాడు సునామీ రాయ్.‘2004లో సమర్థవంతమైన హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో పెద్ద ఎత్తున విధ్వంసం,ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.400కు పైగా హెచ్చరిక కేంద్రాలు(వార్నింగ్ స్టేషన్స్) ఉన్నాయి. సునామీ నాటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అంటున్నారు అండామన్ నికోబార్ దీవుల అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారులు. -
ఏరియా ఆస్పత్రిలో గర్భిణి మృతి
నర్సీపట్నం: నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో మంగళవారం పురిటి నొప్పులతో ఓ గర్భిణి ప్రాణాలు విడిచింది. దీనికి వైద్యులు, వైద్య సిబ్బందే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. సయ్యద్ మహాగున్నిషా అలియాస్ దేవి(30), నానాజీది ఎస్.రాయవరం మండలంలోని చిన్నగుమ్ములూరు. వీరిద్దరిది మతాంతర వివాహం. వీరికి మూడేళ్ల పాప ఉంది. దేవికి మొదటి కాన్పు సాధారణంగానే జరిగింది. రెండో కాన్పు కోసం ఏరియా ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం చేరింది. రాత్రి 8 గంటలకు డాక్టర్ వచ్చి పరీక్షించి వెళ్లారు. రాత్రి 12 గంటల సమయంలో వైద్య సిబ్బంది వచ్చి టాబ్లెట్ ఇచ్చారు. విపరీతమైన నొప్పులు రావడంతో ఆపరేషన్ చేయాలని గర్భిణీ ఎంత మొత్తుకున్నా వైద్యులు కానీ, సిబ్బంది కానీ పట్టించుకోలేదని మృతురాలి అత్త లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రిపరేషన్ వార్డులో నైట్ డ్యూటీ సిబ్బంది లేరని, మూడు గంటల సమయంలో లేపి తీసుకొచి్చనా.. ఏం పర్లేదు.. డెలివరీ అయిపోతుందని చెప్పి వెళ్లిపోయారని అత్త, బంధువులు కన్నీళ్లపర్యంతమయ్యారు. ఉదయం 7 గంటల సమయంలో కడుపులో బిడ్డతో సహా గర్భిణి మరణించింది. దీంతో భర్త నానాజీ సొమ్మసిల్లి పడిపోయాడు. గర్భిణి మరణానికి వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఇన్చార్జి సూపరింటెండెంట్ సత్యనారాయణ, స్త్రీ వైద్య నిపుణులు లక్ష్మణ్‌రావు బంధువులకు నచ్చజెప్పేందుకు యత్నిoచారు. అయినా ఫలితం లేదు. దీంతో వైద్యులు, బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది.ఎస్ఐ ఉమామహేశ్వరరావు, సిబ్బందితో ఆస్పత్రికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీనిపై ఇన్చార్జి సూపరింటెండెంట్ సత్యనారాయణను వివరణ కోరగా వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని చెప్పారు. -
విద్యార్థినిని గర్భవతిని చేసిన కెమిస్ట్రీ టీచర్..
అన్నానగర్: కడలూరు జిల్లా సేతియాతోపు పక్కన ఉన్న మంగళం ప్రాంతానికి చెందిన మలర్ సెల్వం (50). ఇతనికి పైళ్లె పిల్లలు కూడా ఉన్నారు. అదే ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ పాఠశాలలో చదువుతున్న ప్లస్–2 విద్యార్థినిని లైంగికంగా వేధించేవాడని తెలుస్తోంది. ఈ విద్యార్థి ప్రస్తుతం చైన్నెలోని ఓ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ స్థితిలో 15వ తేదీన కడుపునొప్పి రావడంతో విద్యార్థిని చికిత్స నిమిత్తం చైన్నెలోని కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అప్పుడు ఆమెకి అబ్బాయి పుట్టాడు. దీంతో విద్యార్థిని విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది చూసిన ఆసుపత్రి సిబ్బంది విద్యార్థిని రక్షించి విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం విద్యార్థిని బంధువులు సెంఽబియం తోప్పు ఆల్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఉపాధ్యాయుడు మలర్ సెల్వంను గురువారం అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ప్రాక్టికల్స్‌లో మార్కులు తగ్గిస్తానని బెదిరించి గతేడాది స్కూల్లో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. -
వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం.. అనంతపురం సర్వజనాస్పత్రిలో తల్లీబిడ్డ మృతి
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో సోమవారం తల్లీబిడ్డ ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. బాత్రూంకు వెళ్లిన గర్భిణి అక్కడ కళ్లు తిరిగి కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గైనిక్ విభాగం వైద్యులు, సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో తల్లి, బిడ్డ ప్రాణాలు దక్కలేదు. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన మంజునాథ్ తన భార్య జ్యోతి (30)ని మూడో కాన్పునకు గత నెల 27న సర్వజనాస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. హైరిస్క్ కేసు కావడంతో వైద్యులు, సిబ్బంది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉన్నా.. ఆ స్థాయిలో పట్టించుకోలేదు. జ్యోతికి సోమవారం ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్ ఇచ్చారు. కాసేపటికి కళ్లు తిరుగుతున్నాయని, బాత్రూంకు వెళ్లాలని చెప్పింది. బాత్రూంకు పంపించడంలో స్టాఫ్‌నర్సులు, ఎఫ్‌ఎన్‌వోల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కుటుంబసభ్యులే జ్యోతిని బాత్రూంకు తీసుకెళ్లారు. అక్కడే ఆమె కింద పడిపోయింది. భర్త మంజునాథ్ తదితరులు గట్టిగా కేకలు వేసినా సిబ్బంది వెంటనే స్పందించలేదు. కొద్దిసేపటి తరువాత వచ్చిన సిబ్బంది జ్యోతిని పరీక్షించి లేబర్ వార్డుకు తరలించి సీపీఆర్ ద్వారా శ్వాసనందించే ప్రయత్నం చేశారు. జ్యోతి పరిస్థితి అర్థంగాక దిక్కుతోచని స్థితిలో ఉన్న మంజనాథ్‌ను బయటకు వెళ్లి ఇంజక్షన్ తీసుకురమ్మని గైనిక్ వైద్యులు, స్టాఫ్‌నర్సులు చెప్పారు. దీంతో అతడు పరుగెత్తుకుంటూ వెళ్లి స్థానిక సప్తగిరి సర్కిల్లోని ఓ ప్రైవేటు మందుల షాపులో రూ.170 వెచ్చించి యాంటీ బయోటిక్ ఇంజెక్షన్ తీసుకొచ్చాడు.తర్వాత జ్యోతికి సిజేరియన్ చేశారు. అప్పటికే ఆడబిడ్డ చనిపోయింది. జ్యోతిని అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ) యూనిట్లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. ఆమె కన్నుమూసింది. తొమ్మిదేళ్ల పాప, ఏడేళ్ల బాబు ఉన్నారని, తల్లి మృతితో వాళ్ల పరిస్థితేంటని మంజునాథ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.తల్లిని బతికించాలని చూశాంజ్యోతికి రక్తహీనత ఉండడంతో రెండు యూనిట్ల రక్తం అందించాం. నెలలు నిండకపోవడంతో పాటు బాత్రూంకు వెళ్లిన సమయంలో కళ్లు తిరిగి పడిందని చెప్పారు. అప్పటికే పల్స్ లేదు. తల్లిని రక్షించాలనే ఉద్దేశంతో సిజేరియన్ చేశాం. కార్డియాక్ అరెస్టు అయి ఆమె మరణించింది. – డాక్టర్ షంషాద్‌బేగం, హెచ్‌వోడీ, గైనిక్ విభాగం, అనంతపురం సర్వజనాస్పత్రి -
రోజంతా ఆ తల్లి నరకయాతన!
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) : పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది.. నొప్పులతో నరక యాతన అనుభవిస్తున్నా.. పాపం ఆ తల్లికి కనీసం ఆస్పత్రిలో వీల్ చైర్ కూడా ఇవ్వలేదు. ఉదయం నుంచి ఆస్పత్రి బయటే ఉంచేశారు. అర్ధరాత్రి వరకూ అదే పరిస్థితి.. ఆ తర్వాత నొప్పులు తీవ్ర మయ్యాయి. ఓ వైపు రక్త స్రావం.. మరో వైపు బిడ్డ తల కూడా బయటికి వచ్చింది.. అయినా సరే ఆస్పత్రి సిబ్బంది కరగలేదు. ఇక చేసేది లేక బయటికి వచ్చిన బిడ్డ తలతోనే ఆ గర్భిణిని తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఏరియా ఆస్పత్రిలో జరిగిన అమానవీయ ఘటన ఇది. సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చిం ది. ప్రాధేయపడ్డా ఫలితం లేదుఅనపర్తికి చెందిన నిండు గర్భిణి వినీత సుఖ ప్రసవం కోసం సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం అనపర్తి ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆమెకు కనీసం వీల్ చైర్ కూడా సిబ్బంది ఏర్పాటు చేయలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆస్పత్రి బయటే ఉంచేశారు. ప్రసూతి వేదన అనుభవిస్తున్న కూతురి బాధను తట్టుకోలేని ఆమె తల్లి.. ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. ఆ రోజు అర్ధరాత్రి వరకూ ఆ గర్భిణి వైద్య సాయం కోసం ఎదురుచూసింది. అదే రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమెకు నొప్పులొచ్చాయి.నొప్పుల సంగతి ఆస్పత్రి సిబ్బందికి తెలియపరచగా.. మత్తు ఇచ్చే డాక్టర్లు లేరంటూ సమాధానం చెప్పారు. అప్పటికే రక్తస్రావం అధికంగా అవడంతో పాటు శిశువు తల బయటికొచ్చి నరకయాతన అనుభవిస్తున్నా.. ఆమె బాధను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆస్పత్రికి వచ్చిన జనం ఈ ఘటన చూసి చలించిపోయారు. దీంతో బయటికి వచ్చిన శిశువు తలతో ఉన్న తన కూతురిని బాధితురాలి తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. ఈ విషయం తెలుసుకున్న బొమ్మూరుకు చెందిన సామాజిక కార్యకర్త దివిలి ప్రభాకరరావు డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణికి సోమవారం ఫిర్యాదు చేశారు. -
ఇంట్లోనే అబార్షన్.. గర్భిణీ మృతి
ముంబై: మహారాష్ట్రలోని పుణెలో విషాదం చోటుచేసుకుంది. గర్భిణికి ఇంట్లోనే అబార్షన్ చేయడం వల్ల 24 ఏళ్ల మహిళ మృతిచెందింది. ఈ కేసులో ఆమె భర్త, మామలను పోలీసులు అరెస్ట్ చేయగా.. అత్తపై కూడా కేసు నమోదు చేశారు. ఇక అబార్షన్ చేసేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకొచి విచారిస్తున్నారు. నాలుగు నెలల పిండాన్ని కుటుంబీకులు పొలంలో పాతిపెట్టినట్లు తేలింది.వివరాలు.. 2017లో యువతికి వివాహం జరిగింది. ఇప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు( ఒక బాలిక, బాలుడు) ఉన్నారు. ఇటీవల ఆమె మూడోసారి గర్భం దాల్చింది. అయితే కడుపులో పెరుగుతుంది ఆడపిల్ల అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. మహిళకు ఇంట్లోనే అబార్షన్ చేయాని ప్లాన్ చేశారు. ఇందుకు ఓ వైద్యుడిని కూడా పిలిపించారు. నాలుగు నెలల గర్బిణీకి ఇంట్లోనే అబార్షన్ చేయించారు. పిండాన్ని కుటుంబీకులు పొలంలో పాతిపెట్టారు. అనంతరం అధిక రక్తస్రావం కారణంగా మహిళ పరిస్థితి విషమంగా మారింది. మరుసటి రోజు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే మరణించింది.మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి ఆమె భర్త, మామలను అరెస్ట్ చేశారు. పొలం నుంచి పిండాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. అబార్షన్ చేసేందుకు పిలిచిన ఓ ప్రైవేట్ వైద్యుడిని కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఇందాపూర్ పోలీసులు పేర్కొన్నారు. -
గర్భంతో ఉన్నాం కదా అని.. అన్నీ లాగించేయకూడదు!
మన ఇంట్లోకి చిన్ని బుజ్జాయి రాబోతోంది అంటే అటు కాబోయే తల్లిదండ్రులతోపాటు, ఇరు కుటుంబాల్లోనూ ఆనందోత్సాహాలు నెలకొంటాయి. అయితే తొమ్మిది నెలలు నిండి, పండంటి బిడ్డ పుట్టేదాకా కొంచెం ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా గర్భం ధరించినమహిళల్లో ఎన్నో తెలియని సందేహాలు, భయాలు ఉంటాయి. ముఖ్యంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం జోలికి వెళ్లకూడదు లాంటి సందేహాలుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే సౌష్టికాహారం, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం, తాజాగా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. శిశువుకు అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు లభించేలా జాగ్రత్త పడాలి. అలాగే వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన సప్లిమెంట్లను వాడుతూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, బిడ్డ ఎదుగుదల, కదలికలు ఎలా ఉన్నాయి అనేది పరిశీలించుకోవడమే పాపాయికి శ్రీరామ రక్ష. అయితే సురక్షితమైన, ఆరోగ్యకరమైన బిడ్డ కావాలంటే మాత్రం కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అంతేకాదు తల్లీ బిడ్డకోసం అంటూ మరీ ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవాలి. మన ఆకలిని బట్టి మాత్రమే తినాలి. లేదంటే అజీర్తి,కడుపు ఉబ్బరం లాంటి సమస్యలొస్తాయి. అలాగే మసాలాలు, ఉప్పు,కారం, పులుపు ఎక్కువగా ఉండే పదార్థాలను కూడా తగ్గించాలి. ఆహారం, జాగ్రత్తలుకోలిఫాం బాక్టీరియా, టాక్సోప్లాస్మోసిస్ , సాల్మొనెల్లా లాంటి హానికరమైన బాక్టీరియా సోకే ప్రమాదం ఉన్నందున గర్భధారణ సమయంలో పచ్చి లేదా, ఉడికీ ఉడకని ఆహారం జోలికి వెళ్ల కూడదు. వీటికి కారణంగా ఒక్కోసారి గర్భస్రావం లేదా అకాల జననం లేదా పుట్టుకతో వచ్చే లోపాలు వంటి సమస్యలకు దారి తీస్తాయి. పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు మంచిది కాదు పాలు, గుడ్లు పౌష్టికాహారం. కానీ పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండవచ్చు. అందుకే పూర్తిగా ఉడికిన గుడ్డు, మరిగించిన పాలను తీసుకోవాలి.శుభ్రం చేయని పండ్లు, కూరగాయలు: తాజాగా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. వీటిని వండేటపుడు, వాటిని శుభ్రంగా కడగాలి. లేదంటే వాటిపై ఉండే పురుగుమందుల అవశేషాలు, రసాయనాలు బిడ్డకు హానికరంగా మారతాయి. కొన్ని రకాలు చేపలు : మెర్క్యురీ ఎక్కువగా ఉండే చేపలకు దూరంగా ఉండాలి. ఇవి శిశువు నాడీ వ్యవస్థకు హాని చేస్తాయి. సొరచేప, కత్తి చేప, కింగ్ మాకేరెల్, టైల్ ఫిష్ వంటి కొన్ని రకాల చేపలలో మెర్క్యురీ ఎక్కువగా ఉంటుంది. సాల్మన్, ట్రౌట్, సార్డినెస్ వంటి తక్కువ మెర్క్యురీ చేపలను పరిమితంగా తినవచ్చు.కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ కూడా తగ్గించాలి. దీనివల్ల బిడ్డ ఎదుగుదలపైప్రభావాన్ని చూపిస్తాయి. ఇంకా మద్యం, ధూమపానాన్ని పూర్తిగా మానివేయాలి. ఓపిక ఉన్నంత వరకు, కనీసం అరగంట వ్యాయామం చేయవచ్చు. నిపుణుల పర్యవేక్షణలో కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు కూడా వేయవచ్చు. -
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గతేడాది పోలీస్ ఆఫీసర్‌తో పెళ్లి (ఫోటోలు)
-
ఆస్పత్రి దరిచేర్చని రోడ్డు.. లోకం చూడకుండానే కన్నుమూసిన పసిగుడ్డు
కాగజ్‌నగర్ రూరల్/పెంచికల్పేట్: రోడ్డంతా బురద.. అడుగుతీసి అడుగు వేయలేని దారిలో సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేని పరిస్థితుల్లో లోకం చూడకుండానే ఓ పసిగుడ్డు తల్లి గర్భంలో కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన సోమవారం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ గ్రామ పంచాయతీ పరిధి మేరగూడ గ్రామానికి చెందిన దుర్గం పోచన్న భార్య పంచపూల నిండు గర్భిణి. సోమవారం వేకువజామున ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. కుటుంబసభ్యులు 108కు సమాచారమిచ్చారు. మేరగూడకు వెళ్లే దారి పూర్తిగా బురదగా మారడంతో సిబ్బంది ఎల్లూర్ వరకు రావాలని సూచించారు. దీంతో తెల్లవారుజామున 4 గంటలకు కుటుంబసభ్యులు పంచపూలను ఎడ్లబండిలో ఎక్కించారు. మేరగూడ నుంచి ఎల్లూర్ వరకు ఐదుకిలోమీటర్ల దూరం వెళ్లడానికి ఆ బురద మార్గంలో రెండు గంటలకుపైగా పట్టింది. అక్కడి నుంచి గర్భిణిని 108లో కాగజ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో గర్భంలోనే శిశువు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆపరేషన్ చేసి ఆడ మృతశిశువును బయటకు తీశారు. ప్రస్తుతం పంచపూలకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. తమ గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడం వల్లే బిడ్డ మృతిచెందిందని పోచన్న కన్నీటిపర్యంతమయ్యాడు. -
ప్రేమ పేరుతో వంచన
హిందూపురం అర్బన్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం గోళ్లాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఓ బాలిక (16)ను ప్రేమ పేరుతో లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోళ్లాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాజేష్ ఇటీవల జరిగిన అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సతీష్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. అతను ఈ కేసులో ప్రస్తుతం జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు. రాజేష్ రిమాండ్‌కు వెళ్లకముందు గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో నమ్మించాడు. శారీరకంగా లొంగదీసుకొని గర్భవతిని చేశాడు.రెండు రోజుల క్రితం బాలిక కడుపునొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో కర్ణాటక రాష్ట్రం గౌరీబిదనూరు ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. వైద్యులు పరీక్షించి ఆమె గర్భవతి అని తేలి్చ.. అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బాలికను అక్కడి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. చిక్‌బళ్లాపుర ఎస్పీ కార్యాలయం నుంచి కేసును సోమవారం హిందూపురం అప్‌గ్రేడ్ పోలీస్‌స్టేషన్‌కు బదలాయించారు. దీంతో అప్‌గ్రేడ్ సీఐ ఆంజనేయులు బాధిత బాలికను గౌరీబిదనూరు నుంచి హిందూపురం తీసుకువచ్చి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆమె గర్భిణి అని నిర్ధారణ కావడంతో రాజే‹Ùపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
ప్రియుడి మోసానికి యువతి బలి
ఒంగోలు టౌన్: ప్రేమ పేరుతో ఓ యువకుడి చేతిలో వంచనకు గురైన యువతి చివరకు ప్రాణాలొదిలింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో నమ్మించడంతో పాటు శారీరకంగా దగ్గరై యువతిని గర్భిణిని చేశాడు. ఆ యువతి ఆరోగ్యం క్షీణించడంతో ఒంగోలు జీజీహెచ్‌లో అడ్మిట్ చేసి పరారయ్యాడు. చికిత్స పొందుతూ యువతి మృతిచెందింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు రాజీవ్‌కాలనీకి చెందిన చప్పిడి రాజేంద్రప్రసాద్, అరుణకుమారి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తున్నారు. తండ్రి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా, తల్లి కూలి పనులకు వెళ్లి పిల్లలను చదివించుకుంటోంది. పెద్ద కూతురు ప్రియ తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. మిగతా ఇద్దరు కూతుళ్లు చీమకుర్తిలో పదో తరగతి చదువుకుంటున్నారు. ప్రియ కూడా 3వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చీమకుర్తి గురుకుల పాఠశాలలో చదివింది. తన క్లాస్మేట్, దూరపు బంధువైన శివకళ్యాణ్తో ఏడాది క్రితం ఆమెకు పరిచయమైంది. సంతనూతలపాడు మండలంలోని తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన శివకళ్యాణ్ పెయింటర్‌గా పనిచేస్తుంటాడు. వారి పరిచయం ప్రేమగా మారింది. ఎస్వీ యూనివర్శిటీలో బీటెక్ చదువుకుంటున్న ప్రియ.. తన తల్లిదండ్రులకు తెలియకుండా తక్కెళ్లపాడు వచ్చి తరచూ ప్రియుడితో కలుస్తుండేది. ఈ క్రమంలో శారీరకంగా కూడా దగ్గరైంది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ప్రియుడు శివకళ్యాణ్కు చెప్పింది. జూలై చివరి వారంలో యూనివర్శిటీ నుంచి వచ్చేసి తక్కెళ్లపాడులో ప్రియుడితో కలిసి జీవిస్తోంది. శుక్రవారం రాత్రి ప్రియ ఆరోగ్యం దెబ్బతింది. ఎగశ్వాస వస్తుండటంతో ఆమెను ఒంగోలులోని జీజీహెచ్‌కి శివకళ్యాణ్ తీసుకొచ్చాడు. హాస్పిటల్లో చేర్పించి ప్రియ తండ్రి రాజేంద్ర ప్రసాద్‌కు గుర్తు తెలియని వ్యక్తిలా ఫోన్ చేశాడు. తిరుపతి నుంచి రైలులో వస్తుండగా మీ అమ్మాయికి ఫిట్స్ వచ్చాయని, ఆమెను ఒంగోలు జీజీహెచ్‌లో జాయిన్ చేశానని చెప్పాడు. ఆందోళనకు గురైన రాజేంద్ర ప్రసాద్ హడావిడిగా జీజీహెచ్‌కి వచ్చాడు. ఆస్పత్రిలో వాకబు చేయగా, మీ కూతురు ఆరో నెల గర్భిణి అని, ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతనూతలపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ప్రియ ప్రియుడు శివకళ్యాణ్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.నా బిడ్డను చంపిన హంతకులను శిక్షించండి సారూ...నా బిడ్డతో రెండు రోజుల క్రితమే మాట్లాడాను. బాగానే మాట్లాడింది. కాస్త దగ్గు వస్తుందని చెప్పింది. ఇంతలో ఇలా చనిపోతుందని అనుకోలేదంటూ ప్రియ తల్లి అరుణకుమారి గుండెలవిసేలా రోదిస్తోంది. తన బిడ్డను మోసం చేసి ఆమె చావుకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని, తన బిడ్డలాగా మరొకరి బిడ్డ బలికాకూడదని కన్నీరు పెట్టింది. ప్రియ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు కోరుతున్నారు. ప్రియ నోటి నుంచి నురగ వస్తుండటంతో ఆమె మరణం సహజ మరణం కాదన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమైపె హత్యా ప్రయత్నం జరిగి ఉండవచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పూర్తిగా విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. -
క్రీడా నైపుణ్యం, మాతృత్వం రెండింటిని ప్రదర్శించిన ఆర్చర్ !
పారిస్ ఒలింపిక్స్‌లో అసమానతలు ధిక్కరించిన అథ్లెట్లలో అజర్బైజాన్ ఆర్చర్ యైలగుల్ రమజనోవా ఒకరు. 35 ఏళ్ల ఈ ఆర్చర్ ఆరు నెలల నిండు గర్భిణి. ప్రతిష్టాత్మకమైన పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని, మాతృత్వం రెండింటిని ప్రదర్శించి అందరిచే ప్రశంసలందుకుంది. బేబీ బంప్ ఉన్నప్పటికీ ప్రతి షాట్‌ని ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో ప్రదర్శించింది. హృదయాన్ని కదిలించే ఆమె గాథ ఏంటో సవివరంగా చూద్దామా..!చరిత్రలో ఒలింపిక్స్‌లో పాల్గొన్న రెండవ ఆర్చర్ యైలగుల్ రమజనోవా . రియో 2016లో ఓల్కా సెన్యుక్ తర్వాత అజర్‌బైజాన్‌కు తొలిసారిగా ప్రాతినిధ్య వహించిన రెండో ఆర్చర్ ఈ 34 ఏళ్ల రమజనోవా. ఆమె మహిళల వ్యక్తిగత ఆర్చరీ ఈవెంట్లో పాల్గొంది. ఆమె ఎలిమినేషన్ రౌండ్ 1/32లో 28వ ర్యాంక్ చైనీస్ ఆర్చర్ ఆన్ క్విక్సువాన్ను ఓడించింది. అయితే ఆ తర్వాత 1/16 రౌండ్లో జర్మనీకి చెందని మిచెల్ క్రోపెన్ చేతిలో నిష్క్రమించింది. గర్భవతిగా ఉన్న ఒలింపియన్‌గా తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అందులో పర్ఫెక్ట్ 10 షూట్ చేయడానికి ముందు తన బేబీ కిక్‌ను అనుభవించిన అనుభవాన్ని వివరించింది. "నేను ఈ చివరి బాణాన్ని వేసే ముందు నా బిడ్డ నన్ను తన్నినట్లు నేను భావించాను, ఆపై నేను 10 షూట్స్ ప్రదర్శించాను. అలాగే ఈ ఒలింపిక్స్ కోసం శిక్షణ సమయంలో నా గర్భంతో నేను అసౌకర్యంగా భావించలేదు. బదులుగా, నేను ఒంటరిగా పోరాడడం లేదని, నా బిడ్డతో కలిసి పోరాడుతున్నానని నాకు అనిపించింది… నా పిల్లవాడికి లేదా ఆమెకు ఆసక్తి ఉంటే నేను విలువిద్య నేర్పిస్తాను, ” అని రమజనోవా ఇన్‌స్టాగ్రాంలో రాసింది. 127వ ర్యాంక్‌లో ఉన్న రమజనోవా ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో పాల్లొన్న తొలి గర్భిణీ క్రీడాకారిణి కాదు. ఈజిప్టుకు చెందిన 26 ఏళ్ల ఫెన్సర్ నాడా హఫీజ్ కూడా ఏడు నెలల గర్భవతిగా పోటీ పడింది. మహిళల సాబర్ పోటీలో హఫీజ్ తన మొదటి రౌండ్ మ్యాచ్‌లో యూఎస్ఏకి చెందిన మాజీ ఎన్సీఏఏ ఛాంపియన్ ఎలిజబెత్ టార్టకోవ్స్కీని ఓడించింది. ఇక్కడ ఈ అద్భుతమైన మహిళలు తమ పుట్టబోయే పిల్లలను మోస్తూనే అత్యున్నత స్థాయిలో పోటీ చేసి అంచనాలను ధిక్కరించి, మాతృత్వపు బలాన్ని ప్రదర్శించారు. గర్భవతులుగా ఒలింపిక్స్‌లో పోటీ పడి స్ఫూర్తిగా నిలవడమేగాక ఈ మహిళలు సంకల్పం, సామర్థ్యానికి హద్దులు లేవని ప్రపంచానికి చాటిచెప్పారు.(చదవండి: ఆన్లైన్లో ఆక్యుపంక్చర్ నేర్చుకుని ఏకంగా ఓ వ్యక్తికి చికిత్స చేసింది..కట్ చేస్తే..!) -
ఈ సమస్యను.. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు! ఇదీ..
నా వయసు 24 సంవత్సరాలు. నాకు ఆరు నెలలుగా వెజైనల్ దురద, పెయిన్, అప్పుడప్పుడు ఫీవర్ వస్తున్నాయి. నాకు ప్రెగ్నెన్సీ కూడా రావట్లేదు. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కంప్లీట్ రిలీఫ్ రావడం లేదు. – అమృత, విజయవాడమీరు చెప్పిన లక్షణాలను బట్టి దాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్. అది వెజైనల్ / యూరిన్‌లో ఉండవచ్చు. భర్త నుంచి వ్యాపించవచ్చు. అందుకే మీరు గైనకాలజిస్ట్‌ను కలసి వెజైనల్, యూరిన్ శాంపిల్స్ తీసుకుని, బ్యాక్టీరియల్ లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా అని నిర్ధారణ చేసి దానికి తగిన యాంటీబయాటిక్స్ ఇస్తారు. మీ భర్తని కూడా యూరాలజిస్ట్‌ని కలసి యురేటరల్ స్వాబ్ తీసుకోమని చెబుతారు.ఇద్దరికీ ట్రీట్మెంట్ చేసిన తరువాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యమని చెప్తారు. ఇన్ఫెక్షన్స్ సరిగ్గా ట్రీట్ చెయ్యనప్పుడు ఫాలోపియన్ ట్యూబ్‌కి ఏ ఇన్ఫెక్షన్ వ్యాపించినా ట్యూబ్స్ బ్లాక్ కావచ్చు. అప్పుడు ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. వచ్చినా ట్యూబ్‌లోనే ప్రెగ్నెన్సీ రావడం.. అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవుతుంది. ఇది ప్రమాదం. గర్భసంచికి కూడా ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశాలు ఉంటాయి. లక్షణాలు మొదలైన రెండుమూడు రోజుల్లో వెంటనే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్‌కి ట్రీట్మెంట్ మొదలుపెడితే ఈ లాంగ్‌టర్మ్ రిస్క్స్ ఏమీ ఉండవు.డాక్టర్ చెప్పిన యాంటీబయాటిక్స్ కూడా సరైన టైమ్‌కి సరైన డోస్, చెప్పినన్ని రోజులు కరెక్ట్‌గా తీసుకోవాలి. వాళ్లకి ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్ రాకుండా ఏడాదికి చెకప్‌కి వెళ్లమని చెప్తారు. ప్రెగ్నెన్సీ ఆలస్యం అవుతుంటే అల్ట్రాసౌండ్ ద్వారా ట్యూబ్స్‌లో బ్లాక్ ఉందా అని చెక్ చేస్తారు. కొన్ని బ్లడ్ టెస్ట్‌ల ద్వారా కూడా ప్రెగ్నెన్సీ ఆలస్యం అవ్వడానికి కారణాలను కనిపెడతారు. సరైన సమయానికి ట్రీట్మెంట్ ఇస్తే, మళ్లీ వెజైనల్∙ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఓ అద్భుతం ఫెన్సర్ ‘నడా హఫేజ్’
ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులు పోటీ పడే విశ్వ క్రీడా వేదిక ప్యారిస్ ఒలింపిక్స్‌లో అద్భుతం చోటు చేసుకుంది. ఏ రంగంలోనైనా రాణించాలంటే మహిళలు మరింత కష్టపడాలి. అయితే తాము అనుకున్నది సాధించే క్రమంలో మహిళలు ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తారు. ఈ మాటలను అక్షరాలా నిజం చేశారు. ఈజిప్ట్ ఫెన్సర్ నడా హఫేజ్. ఆమె ఏడు నెలల గర్భంతో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగారు. ఒలింపిక్ చరిత్రలో ఏడు నెలల గర్భిణి పోటీలో నిలవడం, అదీ టాప్ టెన్‌లో నిలవడం విశేషంగా నిలిచింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా స్వయంగా హఫేజ్ వివరించారు. జీవితం, క్రీడలు ప్రయాణం ఎంత శ్రమతో కూడుకున్నదో వివరించింది. ‘నేను లిటిల్ ఒలింపియన్‌ను మోస్తున్నాను. శారీరకంగా, మానసికంగా ఎదురవుతున్న సవాళ్లలో మా ఇద్దరికీ సమాన వాటా ఉంది. జీవితం, ఆటను బ్యాలెన్స్ చేసేందుకు పోరాడాల్సి వస్తోంది’ అంటూ తొలి రౌండ్ గెలిచిన తర్వాత 26 ఏండ్ల హఫేజ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Nada Hafez (@nada_hafez)పోడియంపై మీకు ఇద్దరు ఆటగాళ్ళుగా కనిపిస్తున్నారు, వారు నిజానికి ఇక్కడ ముగ్గురున్నారు. అది నేను, నా పోటీదారు, నా చిన్న పాప! శారీరక, మానసిక శ్రమ సవాళ్లలో నాతోపాటు, ఆ చిన్నిపాపాయికి కూడా వాటా ఉంది. అంతేకాదు తన ఈ ప్రయాణంలో తన భర్త సహకారం కూడా ఏంతో ఉందని, తన ఫ్యామిలీ తనపై నమ్మకాన్ని ఉంచడం తన అదృష్టమని కూడా తెలిపింది. అలాగే ప్రపంచ 10వ ర్యాంకర్ ఎలిజబెత్ టార్టకోవ్స్కీపై ఓపెనింగ్‌లో ఎలా విజయం సాధించిందో వివరించింది. టార్టకోవ్స్కీతో జరిగిన మహిళల వ్యక్తిగత ఫెన్సింగ్‌లో హఫీజ్ 15-13తేడాతో తన మొదటి బౌట్‌ను గెలుచుకుంది, అయితే పారిస్ గేమ్స్‌లో 16వ రౌండ్లో దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హయోంగ్ చేతిలో ఓడిపోయింది. గతంలో ఈజిప్ట్ తరపున 2016 , 2020 ఒలింపిక్స్‌లో సాబ్రే క్రీడలో పోటీ పడింది. -
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి...!
గాజా నగరం. జనవరి మాసం. రాత్రి 10 గంటలు. ఎముకలు కొరికే చలి. ఇజ్రాయేల్ దాడులతో బాంబుల మోత మోగిపోతోంది. 34 ఏళ్ల ఆలా అల్ నిమర్. అప్పటికే నిండు గర్భిణి. నడిరోడ్డు మీద పురిటినొప్పులు పడుతోంది. నేపథ్యంలో దూరంగా బాంబుల మోతలు. అంబులెన్స్‌కు కాల్ చేయడానికి నెట్వర్క్ లేదు. ట్యాక్సీ కోసం వెళ్లిన భర్త అబ్దుల్లా ఇంకా తిరిగి రాలేదు. ‘ఎలాగైనా నేను ఆస్పత్రికి చేరుకున్నాకే ప్రసవించేలా చూడు తండ్రీ’ అన్న ఆలా వేడుకోళ్లు ఫలించలేదు. దాంతో నిస్సహాయురాలిగా రోడ్డు మీదే ప్రసవించింది. ట్యాక్సీ దొరక్క వెనక్కి పరుగెత్తుకొచ్చిన భర్త నెత్తుటి కూనను చేతుల్లోకి తీసుకున్నాడు. బొడ్డుతాడు కత్తిరించేందుకు కూడా ఏమీ లేదు. సోదరుడు తెచి్చన మెడికల్ కిట్‌లో ఉన్న కత్తెరతో బొడ్డుతాడు కత్తిరించారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ఎట్టకేలకు ఓ కారు దొరికినా పెట్రోల్ అయిపోవడంతో అదీ ఆగిపోయింది. భర్త, సోదరుడు మొబైల్ ఫ్లాష్ లైట్‌తో దారి చూపుతుంటే పసికందును స్వెటర్లో చుట్టుకుని రక్తమోడుతూ గంటసేపు నడిచిందా పచ్చి బాలింత. దారంతా ‘హెల్ప్ హెల్ప్’ అని అరుస్తూనే ఉన్నారంతా. ఎట్టకేలకు ఓ మినీ బస్సు వారిని ఆస్పత్రి చేర్చింది. అప్పటికీ విపరీతమైన ని్రస్తాణతో ఆలా కళ్లు మూతలు పడ్డాయి. తెల్లవారి గానీ స్పృహలోకి రాలేదు. వెంటనే బిడ్డ కోసం తడుముకుంది. పాపాయి ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు చెప్పాక గానీ కుదుట పడలేదు. యుద్ధం మొదలయ్యాక అదే ఆమెకు అత్యంత సంతోషాన్నిచి్చన ఉదయం. పది నెలలు.. పదకొండు దాడులు... ఇది ఒక ఘటన మాత్రమే. గత అక్టోబర్‌లో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టిన నాటినుంచి ఇలాంటి ఘటనలు కోకొల్లలు. బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు. తల్లిదండ్రులను పోగొట్టు్టకుని అనాథలైన పిల్లలు. కళ్లముందే పిల్లలు మరణిస్తుంటే నిస్సహాయంగా చూసిన వృద్ధులు. తను ప్రసవించే నాటికన్నా యుద్ధం ఆగిపోవాలనిదేవుడుని వేడుకుంది ఆలా. అలా జరగకపోయినా నడి రోడ్డుపైనే ఈ లోకంలోకి వచి్చన తన చిన్నారి నిమాకు మాత్రం ఇప్పుడు ఆర్నెల్లు నిండాయి. నిమా ఆమెకు మూడో సంతానం. ముగ్గురు పిల్లలకు సరైన ఆహారాన్ని ఇవ్వలేకపోతున్నాననే బాధ ఆలాను వెంటాడుతోంది. పిల్లలకు రోజుకు కనీసం ఒక్క రొట్టె దొరకడమే గగనంగా ఉంది. పూటకు పావు రొట్టెతో సరిపుచ్చుకుని అర్ధాకలితోనే పడుకుంటున్నారు. యుద్ధం మొదలవగానే గాజాలోని జైటౌన్లో ఉన్న ఆలా ఇంటిపై తొలి దాడి జరిగింది. దాంతో బంధువుల ఇంటికి వెళ్లారు. అదీ బాంబు దాడులకు బలవడంతో పొరుగు వాళ్ల ఇళ్లకు. అలా ఈ పది నెలల్లో ఆలా కుటుంబం ఏకంగా పదకొండు బాంబుదాడులు తప్పించుకుంది. కాకపోతే అన్నిసార్లూ నిరాశ్రయమవుతూ వచి్చంది. ఆలా ఎనిమిది నెలల గర్భవతిగా ఉండగా ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు వారుంటున్న ఇంటిని చుట్టుముట్టాయి. అప్పుడు ఆలా కుటుంబంతో పాటు 25 మంది దాకా ఇంట్లో ఉన్నారు. కేవలం దైవకృప వల్లే ఆ దాడి నుంచి బతికి బట్ట కట్టామని గుర్తు చేసుకున్నారామె. నెలకే మరో బాంబుదాడి ఆమె 26 ఏళ్ల సోదరుడిని పొట్టన పెట్టుకుంది. ‘చీకటి రోజుల్లో మాత్రం ఆశల గానాలు ఉండవా!? ఉంటాయి. కాకపోతే చీకటిరోజుల గురించే ఉంటాయి’ అన్నారో ఫ్రెంచ్ నాటకకర్త. ఇంతటి యుద్ధ మధ్యంలో, అంతులేని విషాదాల పరంపరలో ఆలా కుటుంబాన్ని నడిపిస్తున్నది ఒకే ఒక్కటి.. చిన్నారి నిమా బోసినవ్వులు... 39,324 మంది మృతి... గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటివరకు 39,324 మంది మరణించారు. 90,830 మంది గాయపడ్డారు. గత 24 గంటల్లో ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో 66 మంది మృతి చెందారు. 241 మంది గాయపడ్డారు. అక్టోబ రు 7న హమాస్ నేతృత్వంలోని దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,139 మంది మరణించడం, అది యుద్ధానికి దారితీయడం తెలిసిందే.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఘోరం: గర్భిణి అని కూడా చూడకుండా..
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కట్నం కోసం అత్తమామలు కోడలిని హింసించి, అత్యంత దారుణంగా హతమార్చిన ఉదంతం వెలుగుచూసింది. స్థానికంగా ఈ ఘటన సంచలంగా మారింది.వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో రీనా తన్వర్ అనే 23 ఏళ్ల గర్భిణి దారుణ హత్యకు గురైంది. ఆమె చేతులు, కాళ్లు నరికి, మిగిలిన శరీరానికి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న రీనా పుట్టింటివారు తమ కుమార్తెను ఆమె భర్త మిథున్, అత్తమామలు కట్నం కోసం వేధింపులకు గురిచేసి, హత్య చేశారని ఆరోపించారు.ఈ విషాదకర సంఘటన కలిపిత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాండి ఖుర్ద్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రీనా హత్య గురించి ఆమె కుటుంబసభ్యులకు తెలిపాడు. వెంటనే రీనా తండ్రి రాంప్రసాద్ తన్వర్ పోలీసులతో పాటు తాండి ఖుర్ద్‌కు చేరుకున్నాడు. వీరిని గమనించిన రీనా అత్తమామలు కోడలి చితి దగ్గర నుంచి పారిపోయారు. దీంతో రీనా తండ్రి అక్కడ మండుతున్న చితిని ఆర్పివేసి సగం కాలిన కుమార్తె మృతదేహాన్ని ఒక గుడ్డలో చుట్టారు. అనంతరం పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రీనా తన్వర్‌కు మిథున్ తన్వర్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఏడాదిన్నర వయసున్న కుమార్తె ఉంది. ప్రస్తుతం రీనా నాలుగు నెలల గర్భవతి. రీనా అత్తమామలు అనునిత్యం డబ్బులు డిమాండ్ చేస్తూ, తమ కుమార్తెను వేధిస్తున్నారని ఆమె తండ్రి రాంప్రసాద్ తన్వర్ పోలీసుల ముందు ఆరోపించారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కలిపిత్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రజనీష్ సిరోథియా తెలిపారు. -
మౌత్ అల్సర్‌తో.. పుట్టబోయే బిడ్డకేమైనా ప్రమాదమా?
నాకిప్పుడు మూడవ నెల. మౌత్ అల్సర్స్, మెడ దగ్గర గడ్డలు వచ్చిపోతున్నాయి. ఇంతకుముందు కూడా ఇలాగే వస్తే నాకు, మావారికి ఇద్దరికీ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు. వాడాము. తగ్గాయి. ఇప్పుడు మళ్లీ వస్తున్నాయి. వీటి వల్ల పుట్టబోయే బిడ్డకేమైనా ప్రమాదమా? – ఊరు, పేరు రాయలేదు.మీరు చెప్పినదాన్ని బట్టి ఇది రిపీటెడ్ ఇన్ఫెక్షన్లా ఉంది. నొటిలో లేదా వెజైనా దగ్గర అల్సర్స్ రావడం, మీవారికి కూడా రావడం లాంటివి చాలావరకు సిఫిలిస్ అనే సుఖవ్యాధిలో కనిపిస్తాయి. ఇది గనక ప్రెగ్నెన్సీలో వస్తే తల్లి నుంచి బిడ్డకు వ్యాపిస్తుంది. వెంటనే సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది.ఒకవేళ ట్రీట్మెంట్ అందకపోతే బిడ్డ మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. కొంతమందిలో ఏ సింప్టమ్స్ లేకుండా ఇన్ఫెక్షన్ ఉందని మూడవ నెల తర్వాతే తెలుస్తుంది. అందుకే అల్సర్స్ వచ్చాయనగానే వీడీఆర్ఎల్ టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పుడు గర్భిణీలకు చేసే రొటీన్ టెస్ట్‌లలో భాగంగా వీడీఆర్ఎల్ టెస్ట్‌నూ చేస్తున్నారు. లైంగిక సంపర్కమప్పుడు కండోమ్‌ని వాడితే ఈ ఇన్ఫెక్షన్ రాకుండా నివారించవచ్చు. మీరు వెంటనే మీ దగ్గర్లోని గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి.కొన్ని రకాల రక్తపరీక్షలు, కొన్నిసార్లు ఈ అల్సర్స్ నుంచి స్వాబ్ టెస్ట్, వెజైనల్ స్వాబ్ టెస్ట్‌లు చేస్తారు. ఈ రక్తపరీక్షలన్నిటిని కూడా గర్భిణీలకు మూడవ, ఏడవ, తొమ్మిదవ నెలల్లో రిపీట్ చేసి, ట్రీట్మెంట్ ఇచ్చాక.. క్యూర్ అయిందా లేదా అని కూడా చెక్ చేయాలి. ఇది పెన్సిలిన్ ఇంజెక్షన్‌తో బాగా క్యూర్ అవుతుంది. వీడీఆర్ఎల్ టెస్ట్ పాజిటివ్ ఉన్నవారిలో తర్వాత టెస్ట్ టీపీపీఏ (ఖ్కీ్కఅ), టీపీహెచ్ఏ (ఖ్కీఏఅ) చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పరీక్షల్లో ఏమీ తెలియకపోతే ట్రీట్మెంట్ ఇచ్చి, రెండుమూడు వారాల తర్వాత మళ్లీ శాంపుల్ పంపించాలి.ఎర్లీ సిఫిలిస్ ఇంజెక్షన్ ఇస్తే.. ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్‌తో బాడీ స్కాన్ చేయించుకోవాలి. అయిదవ, ఏడవ నెలల్లో చేసే స్కాన్‌లో ఈ ఇంజెక్షన్ వల్ల పొట్టలోని బిడ్డలో ఏమైనా మార్పులు వచ్చాయా అని చెక్ చేస్తారు. వెజైనల్ ఏరియాలోనూ అల్సర్స్ ఉంటే తొమ్మిదవ నెలలో మళ్లీ టెస్ట్ చేసి.. సిజేరియన్ డెలివరీని రికమెండ్ చేస్తారు. డెలివరీ తర్వాత బిడ్డకు తల్లి పాలివ్వవచ్చు. బ్రెస్ట్ మీద యాక్టివ్ లీజన్స్ లేకపోతే డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్‌ని సజెస్ట్ చేస్తారు. అయితే పిల్లల డాక్టర్‌కి ముందుగానే ఈ టెస్ట్ రిజల్ట్స్ గురించి తెలియజేయాలి. బిడ్డను కూడా మూడవ నెలలో ఒకసారి, ఏడాదిన్నర వయసప్పుడు ఒకసారి టెస్ట్స్ చేస్తారు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ఇవి చదవండి: అందరూ మెచ్చుకుంటున్నా.. లోలోపల అనుమానం!? -
‘అమ్మ’ వద్దంది.. ఆస్పత్రి అమ్మేసింది!
కామారెడ్డి క్రైం: పుట్టబోయే బిడ్డను వదిలించుకోవాలనుకున్న ఓ గర్భిణి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా డెలివరీ చేయడంతోపాటు నవజాత శిశువును విక్రయించిన ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బట్టబయలైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పెళ్లికి ముందే గర్భం దాల్చడంతో.. జిల్లాలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్యకు కామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మహేశ్‌తో ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ఆమెకు మరొకరితో సాన్నిహిత్యం ఉండటంతో ఆ కారణంగా పెళ్లి సమయానికే ఆమె గర్భం దాలి్చంది. పెళ్లయిన నెల రోజులకు భర్తకు ఈ విషయం తెలియడంతో నాటి నుంచి లావణ్య పుట్టింట్లోనే ఉంటోంది. పుట్టబోయే బిడ్డ తనతో లేకపోతే భర్త మళ్లీ చేరదీస్తాడని భావించిన లావణ్య.. ఏప్రిల్‌లో శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సమని్వత ఆస్పత్రిని సంప్రదించింది. గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వైద్యుడు ఇట్టం ప్రవీణ్‌కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు ఈ ఆస్పత్రిని నడుపుతున్నారు. అందుకు అంగీకరించిన వారు మొత్తం రూ. 2 లక్షలకు లావణ్య, ఆమె కుటుంబ సభ్యులతో బేరం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా కాస్త నగదు, ఫోన్ పే ద్వారా రూ. లక్షా 30 వేలను లావణ్య కుటుంబ సభ్యులు చెల్లించారు.ఏప్రిల్ 11న అర్ధరాత్రి లావణ్యకు డెలివరీ చేయగా ఆడపిల్లకు జన్మనిచి్చంది. అప్పటికే రాజంపేటకు చెందిన ఇట్టం బాలకృష్ణ ద్వారా అతని బంధువైన సిరిసిల్లకు చెందిన దేవయ్యతో బిడ్డను కొనే వారితో డాక్టర్, ఆయన తండ్రి ఒప్పందం చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాన గ్రామానికి చెందిన భూపతి అనే వ్యక్తికి పిల్లలు లేకపోవడంతో పసిబిడ్డను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాడు. రూ. 20 వేలు తీసుకుని ఏప్రిల్ 12న పాపను భూపతి దంపతులకు అప్పగించారు. మహేశ్ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి.. విషయం తెలుసుకున్న లావణ్య భర్త మహేశ్ డీసీపీవో స్రవంతికి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యుడు ఇట్టం ప్రవీణ్ కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు, ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, వాచ్‌మన్ బాలరాజుతోపాటు లావణ్య, మధ్యవర్తులు బాలకృష్ణ, దేవయ్య, భూపతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. పసిపాపను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. 2021లో కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నడిపిన డాక్టర్ ప్రవీణ్, ఆయన తండ్రి ఓ గర్భిణికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తేలడంతో సిద్దిరాములుతోపాటు కొందరిని అరెస్టు చేసి ఆస్పత్రిని సీజ్ చేశారు. -
గర్భిణికి సాయం చేసిన ఆర్టీసీ సిబ్బందికి సజ్జనార్ సన్మానం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సిటీ బస్సులో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి సాయం అందించి సుఖ ప్రసవానికి కారకులైన సంస్థ కండక్టర్, డ్రైవర్‌ను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. ఈ మేరకు కండక్టర్ సరోజ, డ్రైవర్ ఎంఎం అలీలను హైదరాబాద్ బస్ భవన్లో శనివారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారి.. తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్‌ను అందిస్తున్నట్లు ప్రకటించారు.ఆర్టీసీ బస్సులు, బస్స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు పుట్టిన రోజు కానుకగా బస్ పాస్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ముషీరాబాద్ డిపోకు చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం ఆరాంఘర్‌లో శ్వేతా రత్నం అనే గర్భిణికి పురిటి నొప్పులు రాగా.. కండక్టర్ ఆర్.సరోజ అప్రమత్తమై మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేయడం తెలిసిందే. గర్భిణి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. సన్మాన కార్యక్రమంలో సీవోవో డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, హైదరాబాద్ ఆర్ఎం వరప్రసాద్, ముషీరాబాద్ డీఎం కిషన్ తదితరులు పాల్గొన్నారు. శిశువుకు బర్త్ సర్టిఫికెట్ఆర్టీసీ బస్సులో ప్రసవించిన మహిళ బిడ్డకు భవిష్యత్‌లో ఇబ్బంది లేకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ అధికారులు జనన ధ్రువపత్రం జారీ చేశారు. ప్రసవం జరిగిన ప్రదేశం జీహెచ్ఎంసీ మూడు సర్కిళ్ల పరిధిలో ఉన్నందున, జనన ధ్రువ పత్రం ఎక్కడ తీసుకోవాలో అన్న అవగాహన లేక భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అధికారులు గుర్తించారు. సంబంధిత బర్త్, రిజిస్ట్రార్ ద్వారా బేబీ ఆఫ్ శ్వేతా రత్నం అని పేర్కొంటూ బర్త్ సర్టిఫికెట్ ఇప్పించారు. -
ప్రసవం కోసం వస్తే ప్రాణాలుపోయాయి!
లబ్బీపేట(విజయవాడతూర్పు): పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణీతోపాటు ఆమె కవల శిశువులు మరణించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పటమటలోని పద్మావతి హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. డాక్టర్ సకాలంలో స్పందించకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా పోరంకికి చెందిన బండ్రపల్లి ప్రశాంత్, మాధవి(25) దంపతులకు ఒక బాబు(2) ఉన్నాడు. మాధవి రెండోసారి గర్భం దాల్చడంతో పటమటలోని పద్మావతి హాస్పిటల్లో రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. సోమవారం రాత్రి మాధవికి పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. మాధవిని పరీక్షించిన డాక్టర్ వెంకటరమణ సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు. తొలుత నార్మల్ డెలివరీలో ఒక శిశువు జన్మించినా, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రెండో శిశువు అడ్డం తిరగడంతో సిజేరియన్ చేశారు. అప్పటికే రెండో శిశువు కూడా మృతిచెందింది. సిజేరియన్ చేసిన అనంతరం మాధవి ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాధవి బుధవారం ఉదయం మృతిచెందారు. ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన తన భార్య, ఇద్దరు శిశువులు మృతిచెందడంతో పద్మావతి ఆస్పత్రి వద్ద మాధవి భర్త ప్రశాంత్‌తోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. తాము ఆస్పత్రికి వచ్చిన వెంటనే డాక్టర్ వెంకటరమణ స్పందించి సిజేరియన్ చేసి ఉంటే తల్లీబిడ్డలు బతికేవాళ్లని, డాక్టర్ నిర్లక్ష్యంవల్లే మరణించారని ప్రశాంత్ ఆవేదన వ్యక్తంచేశారు. డాక్టర్ వెంకటరమణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పటమట పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.వైద్యశాఖ విచారణ తల్లీ, ఇద్దరు బిడ్డలు మృతిచెందడంతో ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని బుధవారం పద్మావతి ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వాస్తవాలను తెలుసుకునేందుకు నిపుణులైన వైద్యులను నియమించాలని విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు.ఈ మేరకు జీజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ హిమబిందు, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పరుచూరి అనిల్‌కుమార్, ఎనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ ఏవీ రావు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఇందిర ఆస్పత్రికి చేరుకుని విచారణ చేశారు.డాక్టర్ వెంకటరమణ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. వైద్య రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే మాధవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నట్లు సమాచారం. పోస్టుమార్టం రిపోర్టు, విచారణ కమిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. -
‘తిక్క తీరింది బిడ్డకు’..! పగలబడి నవ్వుతారు: వైరల్ వీడియో
ప్రయాణాల్లో గర్భంతో ఉన్న మహిళను చూస్తే ఎవరికైనా లేచి సీటు ఇవ్వాలనిపిస్తుంది. నిజానికి అది కనీస ధర్మం కూడా. కానీ చాలామంది యువకులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఆడవాళ్లను, అందులోనూ గర్భిణీలను గౌరవించాలనే కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఒక బస్సులో గర్భిణీ స్వయంగా వచ్చి సీటు అడిగినా ఇవ్వలేదు ఒక యువకుడు. సరికదా... అసభ్యంగా ప్రవర్తించాడు. తన ఒళ్ళో కూచోమన్నట్టుగా సైగ చేశాడు. దీంతో వెనక కూర్చున్న పెద్దాయనకు ఒళ్లు మండింది. వీడికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించు కున్నాడు. ఇక క్షణం ఆలస్యం చేయకుండా..వెంటనే లేచి ఆ మహిళను తన సీట్లో కూర్చోమని చెప్పి, ఠపీమని ఆ పోరగాడి ఓళ్లో కూచున్నాడు. అటు వాడి తిక్క తీరింది. లబోదిబోమన్నాడు. దీంతో ఆ మహిళతో సహా, బస్సులోని వాళ్లందరూ నవ్వుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వేలకొద్దీ కామెంట్లు, రీషేర్లతో నెట్టింట్ వైరల్‌గా మారింది.😂😂pic.twitter.com/yp5QDTfMVc— Figen (@TheFigen_) June 19, 2024 తిక్క తీరింది బిడ్డకు.. లేకపోతే.. ఏంటా యాటిట్యూడ్ అంటూ నెటిజన్లు కమెంట్స్ చేశారు. ‘బుర్రా..బుద్ధీ ఉండాలి కదరా! మారండిరా’ అని మరి కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌లో షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే కోటి 1.30 కోట్లకు పైగా వ్యూస్‌ను దక్కించుఉంది. -
పెళ్లిలో గర్భిణీని అలా చూసి ‘నెత్తికెత్తుకున్నాడు’: తరువాత ఏమైందంటే..!
పెళ్లిళ్లు, జాతర్లు, ఊరేగింపుల్లో బలిష్ఠమైన పురుషులు పెద్ద పెద్ద విద్యుత్తు దీపాలను తలపై పెట్టుకుని మోస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. చాలాసార్లు అలాంటి దృశ్యాలను అలా చూసి వెళ్లిపోతాం. చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్లు ఇలాంటి దీపాల్ని మోస్తున్నపుడు.. మహా అయితే... అయ్యో అనుకుంటాం. కూటి కోసం కోటి విద్యలు అనుకుంటాం. మరుక్షణం ఆ విషయాన్ని మర్చిపోతాం. ఇంతకుమించి పెద్దగా పట్టించుకోం. లేదంటే సాయానికి ముందు కెళ్లదామని అనిపించినా.. ఏదో తెలియని మొహమాటం వెంటాడుతుంది.. కదా. కానీ ఒక వ్యక్తి మాత్రం మానవత్వంతో ఆలోచించి, చురుగ్గా స్పందించారు. అంతేకాదు ఆయన చేసిన పని మరో నలుగురికి ఆదర్శప్రాయమైంది. విషయం ఏమిటంటే..తన స్నేహితుడి కుమారుడి వివాహ వేడుకలో తలపై దీపాన్ని మోస్తున్న గర్భిణీని చూశారు తన్వీర్ మహ్మద్. అది చూడగానే ఆయనకు తల్లి గుర్తొచ్చిందో ఏమో గానీ, వెంటనే స్పందించారు. ఆమె నెత్తిపై ఉన్న దీపాన్ని తన నెత్తిపైకి తీసుకున్నారు.At a wedding event of my friend’s son, I noticed a pregnant lady carrying light on her head. I offered to carry it for her. Inspired by my gesture, my friends also took turns carrying it and gave her three times payment and twice to the group. No heroism greater than Mother. pic.twitter.com/OkWkVJYOnN— Tanveer Ahmed 🇮🇳 (@TheTanveerAhmed) June 18, 2024ఆగండి..ఆగండి..కథ ఇక్కడితో అయిపోలేదు..తన్వీర్‌ను చూసిన ఆయన స్నేహితులు కూడా ముందు కొచ్చారు. వంతుల వారీగా ఆమె బరువును తమ నెత్తికెత్తుకున్నారు.అంతేకాదు స్నేహితులంతా కలిసి ఈ పనికోసం చెల్లించే దానికంటే రెండు రెట్లు ఎక్కువ చెల్లించారట ఆ బృందానికి. ‘తల్లిని మించిన హీరో లేరు’ అంటూ తన్వీర్ ఈ విషయాన్ని వీడియోతోపాటు ఎక్స్‌లో షేర్ చేశారు. దీంతో పలువురు మంచి పని చేశారు భయ్యా అంటూ అభినందించారు. ఆయన ఆలోచనలు, భావాలతో విభేదించేవారు కూడా తన్వీర్ స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపించడం విశేషం. -
నేచురల్‌గానే వచ్చింది! జాగ్రత్తలు ఎలా?
నాకు 42 ఏళ్లు. ప్రెగ్నెంట్‌ని. మూడో నెల. పిల్లల కోసం కొన్నేళ్లు ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు నేచ్యురల్గానే వచ్చింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – ఆకునూరి శైలజ, వైరాఈరోజుల్లో చాలామంది 35 ఏళ్ల తర్వాతే గర్భం దాలుస్తున్నారు. 40 ఏళ్లు దాటినా ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టే అవకాశాలున్నాయి. పౌష్టికాహారం, క్రమం తప్పని వ్యాయామం, సరైన మందులు, చెకప్స్ ఉండాలి. పాజిటివ్‌గా ఉండాలి. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్‌ని డీల్ చేసే ఆసుపత్రిలో చూపించుకోవాలి. ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ద్వారా 40 ఏళ్లు దాటిన వాళ్లకు కూడా ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కలుగుతున్నారు. అయితే ఈ వయసులో గర్భం దాల్చినవాళ్లకు బీపీ, సుగర్, థైరాయిడ్ సమస్యలు ఎక్కువ రావచ్చు.బిడ్డకీ జన్యుపరమైన సమస్యలు, బరువు తక్కువగా ఉండటం, నెలలు నిండకముందే ప్రసవించడం వంటి చాన్సెస్ పెరగొచ్చు. అయితే కరెక్ట్ డయాగ్నసిస్, ట్రీట్మెంట్తో వీటిని మేనేజ్ చేయవచ్చు. ఇది తొలి చూలు అయితే ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్ తక్కువుంటుంది. మలి చూలు అయి.. ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ లేదా గర్భస్రావం అయినా.. 40 ఏళ్ల తర్వాత ఇంకా రిస్క్ పెరుగుతుంది. జెస్టేషనల్ డయాబెటిస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే సుగర్ వ్యాధి రిస్క్ నాలుగు రెట్లు ఎక్కువ. అందుకే ప్రతి చెకప్‌లో యూరిన్‌లో సుగర్ టెస్ట్ చేస్తారు. ఒకవేళ యూరిన్‌లో సుగర్ నిర్ధారణ అయితే అప్పుడు బ్లడ్ సుగర్ టెస్ట్ చేస్తారు. డయాబెటాలజిస్ట్, డైటీషియన్ కన్సల్టేషన్తో మేనేజ్ చేస్తారు.సుగర్ కంట్రోల్ కానప్పుడు మాత్రమే తల్లికి, బిడ్డకి కాంప్లికేషన్స్ వస్తాయి. రెగ్యులర్‌గా బిడ్డ ఎదుగుదలను చెక్ చేస్తే స్కాన్స్‌ని రిఫర్ చేస్తారు. అయితే 40 ఏళ్లు దాటిన గర్భిణీల్లో అయిదవ నెల లోపు గర్భస్రావం అయ్యే రిస్క్ ఎక్కువ. అందుకే 3 నుంచి 5 నెలల్లో డాక్టర్ సూచించిన మందులను తప్పకుండా వాడాలి. శారీరకంగా ఎక్కువ శ్రమ లేకుండా చూసుకోవాలి. 7 వ నెల నుంచి ప్రతి రెండు వారాలకు ఒకసారి చెకప్‌కి వెళ్లాలి. బిడ్డ కదలికలను ఎలా ట్రాక్ చేయాలో వివరిస్తారు. కదలికలు తక్కువగా అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.తొమ్మిదవ నెల నిండుతున్నప్పుడు ప్రసవానికి ప్లాన్ చేస్తారు. సిజేరియన్ డెలివరీ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. బిడ్డ బరువు, తల్లి ఆరోగ్యపరిస్థితిని బట్టి డెలివరీ ప్లాన్ చేస్తారు. బీపీ, సుగర్ ఉన్నవారిలో ప్రసవం తర్వాత బ్లీడింగ్ ఎక్కువ ఉండొచ్చు. దానికి సిద్ధపడే మందులు ఇస్తారు. ప్రెగ్నెన్సీ, ప్రసవం.. ఆరోగ్యంగా.. సుఖంగా జరిగిపోవడానికి బరువును నియంత్రణలో పెట్టుకోవాలి.సమతుల, పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. జంక్, ప్రాసెస్డ్ ఫుడ్ జోలికి వెళ్లకూడదు. నిపుణుల పర్యవేక్షణలో యోగా, వ్యాయామం వంటివి చేయాలి. కాఫీ, ఆల్కహాల్ వంటివి మానెయ్యాలి. ఇన్ఫెక్షన్స్ సోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్‌తో క్రమం తప్పకుండా మూడవ నెల, అయిదవ నెలల్లో స్కాన్స్ చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే ప్రెగ్నెన్సీ రిస్క్‌ని తగ్గించవచ్చు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
Deepika Padukone: ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్ (ఫోటోలు)
-
అవసరానికి మించి సిజేరియన్లు..
గుంటూరు మెడికల్: రాష్ట్రవ్యాప్తంగా అవసరానికి మించి గర్భిణులకు సిజేరియన్లు చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో.. గుంటూరు జిల్లాలోని ఐదు ఆసుపత్రులకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో.. కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నందనా హాస్పిటల్, డీవీసీ హాస్పిటల్, వీ కార్డియాలజీ కేర్ హాస్పిటల్, శ్రీవెంకటేశ్వర హాస్పిటళ్లకు చెందిన వైద్యులు వివరణ ఇవ్వాలంటూ జిల్లా వైద్య అధికారులు ఆదేశాలు జారీచేశారు. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులు సిద్ధంచేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. కాన్పుకు రూ.70 వేల నుంచి రూ.1.50 లక్షలు వసూలు సాధారణ కాన్పు అయ్యేవారికి సైతం సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారనే ఫిర్యాదులు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులపై తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ సాధారణ కాన్పుకు రూ.50 వేల వరకు వసూలుచేస్తున్నారు. సిజేరియన్‌కు రూ.70వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలుచేస్తున్నారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు 10,320 జరుగగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 15,555 కాన్పులు జరిగాయి.ప్రభుత్వాసుపత్రుల్లో సిజేరియన్ డెలివరీలు 4,128 జరగ్గా, ప్రైవేటు ఆసుపత్రుల్లో 9,333 జరిగాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న వారిని సిజేరియన్ల పేరుతో అధిక సంఖ్యలో ఫీజులు వసూలుచేస్తూ ఆరి్థకంగా, ఆరోగ్యపరంగా వారిని ఇబ్బందిపడేలా చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే.. అది కూడా శిశువు లేదా తల్లి ప్రాణాలకు అపాయం వాటిల్లుతుందనుకున్న సమయాల్లో మాత్రమే చేయాల్సిన సిజేరియన్లు ఎడాపెడా చేసేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. అనవసరంగా ఆపరేషన్లు చేస్తే చర్యలు తప్పవు నిబంధనల ప్రకారం చేయాల్సిన దానికంటే ఎక్కువ సిజేరియన్లు చేసిన ఆస్పత్రులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. నూరు శాతం సిజేరియన్లు చేసిన ఐదు ఆస్పత్రులకు నోటీసులు జారీచేశాం. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధంచేశాం. సాధ్యమైనంత మేరకు సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రతి ఒక్కరూ చూడాలి. సాధారణ ప్రసవాలతో బాలింతలు త్వరితగతిన కోలుకుంటారు. – డాక్టర్ కొర్రా విజయలక్షి్మ, డీఎంహెచ్ఓ, గుంటూరు -
మైనర్‌ను గర్భవతిని చేసి నిమ్స్‌లో వదిలేశాడు!
లక్డీకాపూల్ (హైదరాబాద్): నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు.. మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను లోబర్చుకున్నాడు.. ఆమె గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌లోని ‘నిమ్స్ (నిజాం వైద్య విజ్ఞాన సంస్థ)’ఆస్పత్రికి తీసుకువచ్చాడు.. తనకు పరిచయం ఉన్న ఓ ఉద్యోగి సాయంతో నిమ్స్ అధికారిని కలిశాడు.. ఆ అధికారి సహకారంతో మైనర్ గర్భిణిని నిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయించాడు. కానీ ఈ విషయం బయటికి లీకైంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. మూడు రోజులుగా ఆస్పత్రిలో.. నల్లగొండ జిల్లా నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (16 ఏళ్లు) కడుపులో నొప్పితో బాధపడుతోందని చెప్తూ.. ఒక యువకుడు మూడు రోజుల క్రితం నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అప్పటికే ఆమె నాలుగు నెలల గర్భవతి అని, ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే తీసుకువచ్చాడని సమాచారం. ఈ విషయం వెలుగులోకి రాకుండా ఉంచేందుకు నిమ్స్‌లో తనకు తెలిసినవారితో కలసి ప్రయత్నించాడ ని తెలిసింది.వైద్యులు బాలికకు వైద్య పరీక్షలు చేసినప్పుడు.. ఆమె గర్భవతి అని గుర్తించినా, కప్పిపుచ్చే ప్రయ త్నం జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆమెకు చికిత్స ఏదీ అవసరం లేకున్నా.. ఆశ్రయం ఇచ్చే ఉద్దేశంతో మిలీనియం బ్లాక్ రూమ్ నంబర్ 322లో ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నట్టు తెలిసింది. వారు ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ విషయం బయటికి పొక్కింది. విషయం సీరియస్‌గా మారుతోందని గుర్తించిన నిమ్స్ వర్గాలు.. బుధవారం బాలికను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నించాయని సమాచారం. అయితే పోలీసులు నిమ్స్‌కు చేరుకుని బాలికను నల్లగొండకు తరలించినట్టు ప్రచారం జరుగుతోంది. బాలికను మోసం చేసిన సదరు యువకుడు ఆమెకు బావ అవుతాడని ఓవైపు.. ఓ మాజీ ప్రజాప్రతినిధి కుమారుడే కారణమని మరోవైపు ప్రచారం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఈ వ్యవహా రంపై మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మెడికో లీగల్ కేసు కిందే వైద్యం చేశాంసదరు బాలిక కడుపులో నొప్పితో బాధపడుతూ నిమ్స్‌కు వచ్చింది. ఆమెకు వైద్య పరీక్షలు చేయించిన తర్వాతే గర్భవతి అని తేలింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ)గా పరిగణించే, ఆ తరహాలో నమోదు చేశాకే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. – ప్రొఫెసర్ నగరి బీరప్ప, నిమ్స్ డైరెక్టర్ -
భర్త పై పోస్ట్ వైరల్: అమలాపాల్
-
దీపికా పదుకొణె ప్రెగ్నెంట్..ప్రభాస్ 'కల్కి' పరిస్థితి ఏంటి?
-
మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్!
సంస్కరణా కేంద్రాలుగా ఉండాల్సిన జైళ్లో మహిళల పరిస్థితి దారుణంగా మారిన ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దిద్దుబాటు కేంద్రాల్లో మహిళా ఖైదీలు గర్భం దాల్చడం, 196 మంది పిల్లలు జన్మించడంతో మహిళా ఖైదీల దుస్థితికి బాధ్యులెవరు అనే చర్చకు దారి తీసింది. జైళ్లలో ఉన్న కొంతమంది మహిళా ఖైదీలు గర్బం దాల్చిన ఘటన పశ్చిమ బెంగాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై కోలకత్తా హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. రాష్ట్రంలోని వివిధ జైళ్లను పరిశీలించి అమికస్ క్యూరీ గురువారం అందించిన నివేదికపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జైళ్లలో మహిళా ఖైదీలు గర్భం దాల్చి, బిడ్డల్ని కంటున్న ఘటనలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం, జస్టిస్ సుప్రతిమ్ భట్టాచార్యలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం జైలు సంస్కరణలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. మహిళా జైళ్లలోకి పురుష ఉద్యోగుల ప్రవేశాన్ని నిషేధించాలని కోలకత్తా హైకోర్టు కోరింది. అలాగే ఈ విషయాన్ని క్రిమినల్ కేసులు విచారించే బెంచ్‌కు బదిలీ చేయడం సరైందని భావించిన ధర్మాసనం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమస్యను తీవ్రమైందిగా పరిగణిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశాన్ని హైకోర్టులోని మరో డివిజన్ బెంచ్‌కు అప్పగించారు. ఈ కేసులో తదుపరి విచారణ సోమవారం జరగనుంది. ఈ వ్యవహారంలో 2018లో అమికస్ క్యూరీగా ఎంపికైన న్యాయవాది తపస్ కుమార్ భంజా తన నివేదికను కోర్టుకు సమర్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మహిళలకు రాష్ట్రంలో గత ఏడాది నుంచి ఇప్పటివరకు 196 మంది పిల్లలు పుట్టారని అమికస్ క్యూరీ కోర్టుకు వివరించారు. కస్టడీలో ఉండగానే మహిళా ఖైదీలు గర్భం దాల్చి, జైళ్లలోనే ప్రసవించినట్లు గుర్తించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళా ఖైదీలుండే ఎన్క్లోజర్లలో, కరెక్షన్ హోమ్స్‌లో పురుష ఉద్యోగులు, ఇతర పురుషుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలని తపస్ ధర్మాసనాన్ని కోరారు. ఇటీవల తాను దిద్దుబాటు గృహాల ఇన్స్పెక్టర్ జనరల్ (స్పెషల్), జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శితో కలిసి మహిళా దిద్దుబాటు గృహాన్ని సందర్శించాననీ ఈ సమయంలో ఒక గర్భవతిని, దాదాపు15 మంది ఇతర మహిళా ఖైదీలు వారి పిల్లలతో ఉన్నట్టు కోర్టుకు నివేదించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ కరెక్షనల్ సర్వీసెస్‌కు చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఈ ఘటనపై స్పందించారు. శిక్ష పడిన మహిళకు ఆరేళ్ల లోపు వయసున్న పిల్లలు ఉంటే వారిని తల్లితో ఉండేందుకు అనుమతి ఉంమటుందని తెలిపారు. కానీ పశ్చిమ బెంగాల్‌లోని జైలులో మహిళలు గర్భవతులు కావడం తన దృష్టికి రాలేదని, వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
డైరెక్టర్‌తో ప్రేమ పెళ్లి.. తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్!
నువ్విలా చిత్రం ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన భామ యామీ గౌతమ్. ఆ తర్వాత గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ లాంటి చిత్రాల్లో నటించింది. కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, పంజాబీ సినిమాల్లో కనిపించింది. గతేడాది బాలీవుడ్ చిత్రాలతో అలరించిన భామ ప్రస్తుతం ఆర్టికల్ 370 చిత్రంలో నటిస్తోంది. అయితే యూరి: ది సర్జికల్ స్ట్రైక్ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ ఆ మూవీ డైరెక్టర్ ఆదిత్య ధర్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా అభిమానులకు యామీ గౌతమ్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్లు తన భర్తతో కలిసి ఈ విషయాన్ని వెల్లడించింది. ఇవాళ జరిగిన ఆర్టికల్ 370 సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఆమె భర్త ఆదిత్య ధార్ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది మే నెలలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. యామీ ప్రస్తుతం నటించిన ఆర్టికల్ 370 మూవీ ప్రమోషన్లలో పాల్గొనేందుకు రెడీ అవుతోంది. ప్రియమణి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను ఆమె ఆమె భర్త ఆదిత్య ధర్ నిర్మించారు. కాగా.. 2019లో 'యూరి: ది సర్జికల్ స్ట్రైక్' సెట్స్‌లో కలిసిన ఈ జంట రెండేళ్లపాటు డేటింగ్ తర్వాత జూన్ 4, 2021న పెళ్లి చేసుకున్నారు. Yami Gautam, Aditya Dhar expecting their first child#pregnancy#Article370Teaser#entertainment#EntertainmentNews#YamiGautam #AdityaDhar pic.twitter.com/CzpmIRn4F0 — NIYA NIVRITI (@NiyaNivriti) February 8, 2024 -
వలంటీర్ మానవత్వం..
రొంపిచర్ల: ప్రతి లబ్ది దారుని ఇంటికి సంక్షేమ పథకాలు అందాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాన్ని నిండు గర్భిణితో ఉన్న మహిళా వలంటీరు నెరవేర్చింది. నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల క్లస్టర్లో మేకతోటి జయంతి వలంటీర్‌గా పనిచేస్తుంది. రెండేళ్ల కిందట మగ బిడ్డకు జన్మనిచ్చిన జయంతి.. మరోసారి గర్భం దాల్చి నవమాసాలతో మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు నేడో రేపో అనే దశలో ఉంది. తన పరిధిలో నివాసం ఉండే మానసిక వికలాంగుడు సోర ప్రసన్న గత రెండు నెలలుగా తెనాలి సమీపంలోని ఎరుకలపూడిలోని ఆయుర్వేద వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. గత నెలలో అతను ఫించన్ తీసుకోలేదు. ఈ నెల కూడా తీసుకోకుంటే, తనకు సీజేరియన్ ద్వారా ప్రసవం జరిగితే వచ్చే నెల కూడా అతనికి అందజేయగలనో లేదోననే సంచయం ఆమెను వెంటాడింది. వరుసగా మూడు నెలలపాటు పింఛన్ తీసుకోకుంటే లబ్ధిదారునికి పింఛన్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. తొమ్మిదో నెల గర్భిణి అయిన జయంతి.. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఒకటో తేదీనే వెంటనే తన కుటుంబ సభ్యులను ఒప్పించి భర్త సాగర్ సాయంతో బైక్‌పై రొంపిచర్ల నుంచి ఎరుకలపాలెం వెళ్లింది. అక్కడ జయంతిని చూడగానే.. అక్కా.. అక్కా అంటూ ప్రసన్న వడివడిగా పైకి లేచాడు. వేలిముద్ర వేసి రూ.3,000 తీసుకుని ఆనందంతో మా వలంటీర్ అక్క చాలా మంచిది.. అంటూ లోపలికి వెళ్లాడు. అప్పటి వరకు 102 కిలోమీటర్ల దూరం బైక్‌పై వస్తుంటే.. పొత్తి కడుపులో అప్పుడప్పుడూ పుట్టిన నొప్పి సోరన్న చిరునవ్వును చూడగానే మాయమైంది. అదే వాహనంపై తిరిగి 102 కిలోమీటర్ల ప్రయాణించి వచ్చింది. మరుసటి రోజు(ఫిబ్రవరి 2న ) గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి సీజేరియన్ ఆపరేషన్ ద్వారా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. -
జస్ట్ ప్రెగ్నెంట్ చేస్తే చాలు!..ఏకంగా లక్షలు..! షాకింగ్ దందా!
కొన్ని నేరాలు చూస్తే మనుషుల ఆలోచనలు ఎలా ఇంతలా గగుర్పొడేచాలా ఉన్నాయిరా బాబు! అనిపిస్తుంది. అలాంటి దారుణమైన నేరాలు వెలుగోలోకి రానివి ఎన్నో ఉన్నాయి. జాబ్ పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేసిన ఉదంతాలను ఎన్నో చూశాం. అవన్నీ ఒక ఎత్తు అనుకుంటే..ఇప్పుడూ ఏకంగా మానవసంబంధాలకు అర్థమిచ్చే పవిత్రమైన గర్భధారణ కూడా ఒక దందాలా నడిపిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. దీన్ని కూడా ఓ జాబ్ పేరుతో రిక్రూట్మెంట్ అంటే బాబోయ్! ఏంటీదీ? మనం మనుషులమేనా అన్నంత అసహ్యం కలగకమానదు ఈ ఘటన వింటే. కాసులు కోసం ఇంతలా దిగజారిపోతున్నాడా మావనవుడు అన్నంతగా విస్తుపోయాలా ఉంది. అసలేం జరిగిందంటే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బీహార్‌లో మహిళలను గర్భవతులను చేస్తే డబ్బులు ఇస్తామన్న దిగ్బ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. దీన్ని ఓ ముఠా ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ పేరుతో రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలపై పోలీసులు సుమారు 8 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. బీహార్‌లోని నవాడాలో ఆ దుండగలను అదుపులోకి తీసుకున్నారు. వారంతా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ పేరుతో వాట్సాప్, సోషల్ మీడియాల ద్వారా పురుషులను సంప్రదిస్తారు. పైగా ఈ సర్వీస్‌కు ప్రతిఫలంగా లక్షలు కూడా అందిస్తామని చెబుతున్నారు. అందుకోసం ఆ ముఠా ఆసక్తిగల వ్యక్తులను రూ. 799/తో రిజిస్టర్ చేయించుకోమని చెబుతారు. ఆ తర్వాత మహిళల ఫోటోలు పంపిస్తారు. వారు సెలక్ట్ చేసుకున్న అమ్మాయిని బట్టి సుమారు 5 వేల నుంచి 20 వేల వరకు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకుంటారు. ఆ తర్వాత వారు వారు ఎంపిక చేసుకున్న మహిళను గనుక ప్రెగ్నెంట్ చేయగలిగితే రూ. 13 లక్షల వరకు ముట్ట చెబుతారట. ఒకవేళ అలా చేయలేకపోయినా కనీసం రూ. 5లక్షల వరకు చెల్లిస్తామని ముఠా హామీ ఇచ్చిన్టలు పోలీసులు వెల్లడించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గురించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ దందాకు ప్రధాన సూత్రదారితో సహా మిగిలిన నిందుతులను కూడా అదుపులోకి తీసుకుంటామని అధికారులు చెప్పుకొచ్చారు. మొన్నటివరకు అద్దె గర్భాల దందా!. ఇపుడు ఏకంగా మహిళలను ప్రెగ్నెంట్ చేసే దందా!. అసలేంటిది ఏదీ వ్యాపారం, ఏదీ ఉద్యోగం అనే ఇంకితం కూడా లేకుండా ఇంత దారుణమైన నేరాలా!. సమాజం ఎటువైపు పోతుంది. మనం ఎక్కడ ఉన్నాం అనిపిస్తోంది కదా!. టెక్నాలజీ పేరుతో ఎంతో ముందుకు వెళ్లామా లేకా ఆ టెక్నాలజీ ఇంత జుగుప్పకరమైన నేరాలకు పాల్పడేందుకు ఉపయోగపడుతుందనాలా పాలుపోవడం లేదు. నేరం ఎందువల్ల జరిగిందో పక్కనే పెడితే.. అలాంటి రిక్యూట్మెంట్లు దారణమైనవని, నేరమని తెలిసి ఆ బురదలోకి వెళ్లి నూరేళ్ల జీవితాలను బలిచేసుకుంటోంది యువత. దయచేసి సమాజం అన్నక అన్ని రకాల మనుషుల ఉంటారు. అలాగే మనిషి అన్నాక కుటుంబ పరంగా సవాలక్ష సమస్యలు ఉన్నా తప్పు చేసే అవకాశం ఉన్న వెళ్లకుండా ఉన్నవాడే గొప్పోడు. సంపాదించటం కంటే సక్రమంగా ఉండటం అన్నింటి కంటే ముఖ్యమైనది. ఏదైనా గానీ సరైన దారిలో వెళ్లి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం మాత్రం మన చేతిలోనే ఉంటుది. ఆ విషయం మరవద్దు. (చదవండి: పీహెచ్డీ, నాలుగు మాస్టర్ డిగ్రీలు..కానీ బతుకుదెరువు కోసం ఆ వ్యక్తి..) -
భర్త చనిపోయిన రెండేళ్లకు ప్రెగ్నెంట్! ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్న వైద్యులు
పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది ఆ జంట. ఇంతలో కరోనా మహమ్మారి కారణంగా భర్తను కోల్పోయింది. దీంతో ఆమె జీవితం పూర్తి నిరాసక్తతతో కూడిన చీకటి ఆవరించింది. కనీసం పిల్లలైన కలిగిన వారిలో తన భర్తను చూసుకునేదాన్ని కదా! అన్న బాధ ఆమెను తొలిచేసింది. మరోవైపు భర్త దూరమయ్యాక అత్తింటి వారెవ్వరూ ఆమెను చేరదీయలేదు. ఒంటరి జీవితం వెళ్లదీస్తున్న ఆమెకు తన భర్త ఉండగా పిల్లల కోసం తాము ఎంచుకున్న ఐవీఎఫ్ పద్ధతి గుర్తుకొచ్చింది. దీంతో తామప్పుడూ సంప్రదించి వైద్యులను సంప్రదించి తల్లి అయ్యి తన కోరికను నెరవేర్చుకుంది. పైగా ఆమె కారణంగా వైద్య చరిత్రలో మరో అద్భుతం చోటు చేసుకుంది. బెంగాల్‌లోని బీర్భూమ్‌కి చెందిన సంగీతా కేశారి, ఆమె భర్త అరుణ్ ప్రసాద్ కేశారి రెండేళ్లుగా గర్భం దాల్చడంలో పలు సమస్యలు ఎదుర్కొన్నారు. చివరిగా వారు ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా 2021లో భర్త స్పెర్మ్‌ను కోల్‌కతాకు చెందిన ప్రయోగశాలలో నిల్వ చేయడం జరిగింది. అయితే అంతలోనే ఆమె భర్త కరోనా మహమ్మారికి బలైయ్యాడు. దీంతో ఆమె తీవ్ర దుఃఖంలో ఉండిపోయింది. అయినప్పటికీ ఎలాగైన పిల్లలను కనాలి తన భర్త లేని లోటుని భర్తీ చేసుకుని వారి ఆలనపాలనలో గడపాలని గట్టిగా కోరుకుంది. ఒకరకంగా చెప్పాలంటే ఆ పిల్లల్లో తన భర్తను చూసుకోవాలని ఆరాటపడింది. ఎందుకంటే..? ఆమె భర్త దూరమయ్యాక కనీసం అత్తింటి వారు ఆమెను చేరదీయలేదు. దీంతో ఆమె అప్పటి నుంచి ఒంటిరిగానే జీవితం కొనసాగిస్తోంది. తన భర్త నడిపే కిరాణ దుకాణాన్ని ఆమె నడుపుతూ జీవిస్తోంది. సరిగ్గా అప్పడే తన భర్త ఉండగా సంప్రదించిన ఆస్పత్రి గుర్తుకొచ్చింది. అక్కడ భర్త స్పెర్మ్ దాచిన సంగతి జ్ఞప్తికి వచ్చి పిల్లలను కనడం సాధ్యమవుతుందా? తన కోరిక నెరవేర్చుకోగలనా లేదా? అని ఆ ఆస్పత్రి వర్గాలను సంప్రదించి సవివరంగా తెలుసుకుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కనాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అయితే ఆ మహిళకు 48 ఏళ్లు పిల్లలను కనగలిగే సామర్థ్యం తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఆమెకు ఈ పద్ధతి కాస్త రిస్క్ అయినప్పటికీ వెనుకడుగు వేయలేదు. ఆమె సంకల్పానికి తగ్గట్టుగానే ఆ పద్ధతి విజయవంతమై పూర్తి ఆరోగ్యంతో ఉన్న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు వైద్యుడు పలాష్ దాస్ మాట్లాడుతూ..ఆ మహిళ క్లిష్ట పరిస్థితుల్లో తల్లి అయ్యిందని అన్నారు. ఆమె పిల్లలను కనే వయసు ముగిసే సమయానికి ఆమె శుక్రకణాన్ని భద్రపరిచినట్లు తెలిపారు. ఇక్కడ ఆమె తల్లి కావాలనే తాప్రత్రయంతో కనడం అనేది ఆమెకు రిస్క్ అయినా లెక్కచేయకుండా డేర్ చేసిన తీరు ప్రశంసంచదగ్గ విషయమని అన్నారు. నిజంగా ఆమె ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిదేనని అన్నారు. (చదవండి: మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు..మరో రూపంతర వేరియంట్ కలకలం!) -
అత్యంత అరుదైన ఘటన!ఒకేసారి రెండు గర్భాలా..!:
ఒక మహిళలకు రెండు గర్భాశయాలు ఉండటం అనేది అత్యంత అరుదు. ఇలా ఉంటే డెలివరీ టైంలో చాలా రిస్క్ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ ఉన్నా రెండింటిలోనూ శిశువులు పెరగడం అనేది కూడా అరుదే. అలాంటి విచిత్ర ఘటనే అలబామాకు చెందిన మహిళ విషయంలో జరిగింది. అసలేం జరిగిందంటే..దక్షిణ అమెరికాలోని అలాబామాకు చెందిన కెల్సీ హాట్చర్, కాలేబ్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఐతే ఆమె మరోసారి గర్భం దాల్చింది. ఇందులో వింత ఏంటి? అని అనుకోకండి..ఎందుకంటే? ఈసారి ఒకేటైంలో రెండుసార్లు గర్భం దాల్చింది. ఇదేలా సాధ్యం అని వైద్యులు కూడా షాక్ అయ్యారు. ఇక్కడ కెల్సీకి తన ఆరోగ్య గురించి ముందు తెలుసు. దీంతో ఆమె ఈసారి తన కడుపులో ఇద్దరు ఉన్నారని తన భర్తకు చెబుతుంది. ఆటపట్టిస్తున్నావు ఇద్దరెలా ఉంటారని ఆమె భర్త కూడా కొట్టిపడేశాడు కూడా. నిజమే!ఇద్దరు శిశువులు పెరుగుతున్నారని నమ్మకంగా చెప్పింది తన భర్తకి. ఆ మహిళకు రెండు గర్భాశయాలున్నట్లు డాక్టర్లు ఇదివరకే ఆమెకు చెప్పారు. అయితే ఈసారి రెండు గర్భాశయాల్లోనూ శిశువులు పెరుగుతున్నాయి. ఇలా జరగదు. ఏదో ఒక దానిలో గర్భం పెరగడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ రెండు గర్భాశయాలు దేనికది వేరుగా పిండాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఒక గర్భాశయంలో ఇద్దరు ఉంటే కవలలు అని పిలుస్తాం. ఇప్పుడు వేర్వేరు గర్భాశయాల్లో పిండాలు పెరుగుతున్నప్పుడూ కూడా కవలలనే పిలవాలా? అనేది సందేహస్పదమైన ప్రశ్న. ఈ మేరకు ఆమెకు వైద్యం అందిస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేతా పటేల్ మాట్లాడుతూ.. ఇలాంటివి అత్యంత అరుదని అన్నారు. కొంతమందది స్త్రీల్లో పుట్టుకతో ఇలా రెండు గర్భాశయాలు ఉంటాయి. ఈ గర్భాశయాలు రెండు చిన్న గొట్టాలతో ప్రారంభమవుతుంది. ఐతే పిండం పెరుగుతున్నప్పుడూ గొట్టాలు సాధారణంగా పెద్ద బోలు అవయవాన్ని సృష్టించేలా కలుస్తాయి. దీన్నే గర్భాశయం అంటారు. కొన్నిసార్లు ఈ ట్యూబ్‌లు పూర్తిగా చేరవు. బదులుగా దేనికది ప్రత్యేకంగా లేదా వేర్వేరు అవయవంగా అభివృద్ధి చెందుతాయి. డబుల్ గర్భాశయం ఒక యోని ప్రారంభాన్ని కలిగి ఉంటుంది. ఈ ఓపెనింగ్‌ను సర్విక్స్ అంటారు. కొన్ని సందర్భాల్లో ఇలా ప్రతి గర్భాశయం సెపరేట్ గర్భాశయాన్ని కలిగి ఉంటాయన్నారు. నిజానికి రెండు గర్భాశయాలు ఉన్న చాలా వరకు ఒక గర్భాశయంలోనే పిండం పెరుగుతుంది. రెండు గర్భాల్లోనూ పిండం అనేది పెరగదు. సరిగ్గా పిండం ఎదిగే క్రమంలో ఆ రెండు గొట్టాల్లా ఉన్న ట్యూబ్‌లు ఒక్కటిగా అయ్యి పిండం పెరిగేలా ఒకే గర్భాశయంగా మారతాయి. అరుదైన సందర్భాల్లోనే ఇలా వేర్వేరుగానే రెండు గర్భాశయాల్లో పిండాలు అభివృద్ధి చెందడం అనేది జరుగుతుందన్నారు శ్వేతా పటేల్. ఇలా డబుల్ గర్భాశయం ఉన్న స్త్రీలు విజయవంతంగా ప్రెగ్నెంట్ అయినప్పటికీ తరుచుగా గర్భస్రావం లేదా నెలలు నిండకుండానే డెలివరీ అవ్వడం జరుగుతుంటుందని క్లిష్టతర కాన్పుల నిపుణడైన డాక్టర్ రిచర్డ్ డేవిస్ చెబుతున్నారు. ప్రతి వెయ్యి మంది మహిళలల్లో ముగ్గురికి ఇలా డబుల్ గర్భాశయం లేదా డబుల్ గర్భాశయాలు ఉండొచ్చు అని వివరించారు. ప్రస్తుతం తాము సదరు మహిళ కెల్సీని ప్రసవం అయ్యేంత వరకు చాల జాగ్రత్త పర్యవేక్షిస్తూ.. ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. తాము ఇద్దరు శిశువులు బాగున్నారని భరోశ ఇవ్వలేమని పటేల్ చెబుతున్నారు. వైద్య పరంగా ఇది అరుదైన విషయమే అయినా ఆ శిశువులని కవలలని కాకుండా ప్రత్యామ్నాయంగా ఏమని పిలవాలో తెలియాల్సి ఉందన్నారు. (చదవండి: ఆహారం అనేది రుచి కోసం అనుకుంటే అంతే సంగతులు! వైద్యులు స్ట్రాంగ్ వార్నింగ్) -
ఆ టైంలో కూడా గుండె సమస్యలు వస్తాయా?
మలయాళ బుల్లి తెర నటి డాక్టర్ ప్రియా గుండెపోటుతో కుప్పకూలి చనిపోయిన సంగతి తెలిసింది. నిండు గర్భిణి అయిన ఆమె సాధారణ చెకప్ కోసం ఆస్పత్రికి వచ్చినప్పుడే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దీంతో వైద్యులు ఆపరేషన్ చేసి ఆమె కడుపులో ఉన్న శిశువుని బయటకు తీసి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నెలల నిండక మునుపే పుట్టడంతో వైద్యులు ఆ చిన్నారిని అబ్జర్వేషన్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. గర్భంతో ఉన్నప్పుడు మహిళలకు గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయా? ఎందువల్ల ఇలా జరుగుతుంది తదితరాల గురించే ఈ కథనం!. అధిక రక్తపోటు, ధూమపానం తదితరాలే గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకాలు. కానీ నిపుణల అభిప్రాయం ప్రకారం గుండె సంబంధ సమస్యలకు మరో ప్రధాన కారకం ఉంది. అదే గర్భధారణ సమయంలో వచ్చే ప్రీక్లాంప్సియా. ఈ ప్రీక్లాంప్సియా అనేది ప్రమాదకరమైన తీవ్ర రక్తపోటు పరిస్థితి. ఇది మహిళలకు గర్భం దాల్చిన 20 వారం నుంచి మొదలవుతుంది. ఈ ప్రీక్లాంప్సియా చరిత్ర ఉన్న స్త్రీలు గుండెపోటు లేదా స్ట్రోక్‌తో చనిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. గర్భస్రావమైన లేదా నెలలు నిండకుండానే ప్రసవించిన మహిళలకు ఈ ప్రమాదం మరింత ఎక్కువుగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే డెలివరీలలో 8% వరకు క్లిష్టతరం కావడానికి ప్రధానం కారణం ఈ ప్రీక్లాంప్సియానే అని వైద్యలు చెబుతున్నారు. యూఎస్‌లో 15% అకాల ప్రసవాలకు ఈ పరిస్థితి వల్లేనని తెలిపారు వైద్యులు. ప్రీక్లాంప్సియా లక్షణాలు ఎలా ఉంటాయంటే.. తలనొప్పి మబ్బు మబ్బుగా కనిపించడం కంటిలో నల్లటి మచ్చలు కడుపులో కుడివైపు నొప్పి చేతులు, ముఖం వాచి ఉండటం ఊపిరి ఆడకపోవడం గర్భధారణ సమయంలో గుండె పదిలంగా ఉండాలంటే.. రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలి ఆరోగ్యకరమైన, కాలానుగుణ ఆహారాన్ని తినడం వ్యాయామం చేయడం. ఇందులో మోస్తరు నుండి అధిక-తీవ్రత వర్కౌట్లు లేదా యోగా ఉంటాయి అధిక బరువు పెరగకుండా ఉండండి ఒత్తిడికి దూరంగా ఉండండి శరీరంలో సరైన రక్త ప్రసరణ ఉండేలా చూసుకోవడం తదితరాలను పాటిస్తే గర్భధారణ సమస్యలో ఈ గుండె సంబంధిత సమస్యల ఎదురవ్వవు. (చదవండి: తక్కువ వ్యాయామమే మంచి ఫలితాలిస్తుంది!పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
వివాహితపై నలుగురి అత్యాచారం... ప్రస్తుతం 4 నెలల గర్భవతి
ఆదిలాబాద్‌రూరల్: వివాహితపై నలుగురు లైంగికదాడికి పాల్పడిన ఘటన మావల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై విష్ణువర్ధన్ తెలి పిన వివరాల ప్రకారం.. మావల గ్రామంలో నివాసం ఉంటున్న వివాహితకు 2014 లో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. ఈ క్రమంలో వారికి ముగ్గురు సంతానం అయ్యారు. భర్త మూడేళ్ల క్రితం ఆమెను వదిలి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కూలీ పనులు చేసుకుంటూ ఆమె పిల్లలతో పాటు తల్లి, సోదరుడితో కలిసి మావల గ్రామంలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆమెకు మాయమాటలు చెప్పి వేర్వేరు సందర్భాల్లో కొద్ది రోజులుగా లోబర్చుకున్నారు. ప్రస్తుతం ఆమె 4 నెలల గర్భిణి కావడంతో విషయం బయటపడింది. దీంతో ఆమె శనివారం పోలీసులకు తనపై కొంతకాలంగా నలుగురు వేర్వేరుగా లైంగికదాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేయడంతో అర్ధరాత్రి కేసు నమోదైంది. ఆమెను లోబరుచుకున్న నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. త్వరలో వారిని పట్టుకుంటామని ఎస్సై వెల్లడించారు. -
‘అమ్మ’కు అండగా..
సాక్షి, అమరావతి: మాతృత్వం మరో జన్మ. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చేవరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి. రాష్ట్రంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న సీఎం జగన్ ప్రభుత్వం వారికి సకాలంలో వైద్యపరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన మందులు, పౌష్టికాహారం అందిస్తోంది. మరోవైపు ప్రసూతి మరణాలు మరింతగా తగ్గించడంపైనా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హైరిస్క్ గర్భిణులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పింస్తోంది. రాష్ట్రంలో ఏటా 9 లక్షల ప్రసవాలు నమోదవుతుంటాయి. వీరిలో 28 శాతం మంది రక్తహీనత, ఇతరత్రా అనారోగ్య కారణాలతో బాధపడే హైరిస్క్ గర్భిణులు ఉంటారని అధికారులు చెబుతున్నారు. వీరి ఆరోగ్యంపై నిరంతరం వాకబు చేస్తూ, తల్లీబిడ్డ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రసవం జరిగేలా వైద్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. హైరిస్క్ గర్భిణులను డెలివరీ తేదీకి ముందే ఆస్పత్రులకు తరలించి వైద్యుల సంరక్షణలో ఉంచుతున్నారు. దీంతోపాటు తీవ్ర రక్తహీనతతో బా«ధపడే గర్భిణులకు ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్, రక్తమార్పిడి కోసం ఆస్పత్రులకు వెళ్లడానికి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఉచిత రవాణా సేవలు అందుబాటులోకి తెచ్చారు. గుమ్మం వద్దకే వాహనం ఈ ఏడాది ఆగస్టు నుంచి హైరిస్క్ గర్భిణులను ప్రసవం, ఐరన్ సుక్రోజ్, రక్తమార్పిడి కోసం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల్లో తరలించడం ప్రారంభించారు. పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎం, కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్, ఆశా వర్కర్లు తమ పరిధిలో హైరిస్క్ గర్భిణులను ఆస్పత్రికి తరలించాల్సి ఉన్నట్లయితే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ జిల్లా కో–ఆర్డినేటర్‌కు సమాచారం చేరవేస్తారు. సమాచారం అందుకున్న 24 గంటల నుంచి 48 గంటల్లో వాహనం గర్భిణుల స్వగ్రామంలో వారి గుమ్మం వద్ద పికప్ చేసుకుని ఆస్పత్రికి తీసుకువెళ్తుంది. తీవ్ర రక్తహీనతతో బాధపడే గర్భిణులకు ఐరన్ సుక్రోజ్, రక్తమార్పిడి అనంతరం తిరిగి క్షేమంగా ఇంటి వద్దకు చేరుస్తున్నారు. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన వారికి ప్రసవానంతరం తల్లీబిడ్డ ఇద్దరినీ క్షేమంగా ఇంటికి తరలిస్తున్నారు. ఇలా ఆగస్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 3,500 మంది గర్భిణులు సేవలు వినియోగించుకున్నారు. వీరిలో 2,300 మందికిపైగా రక్తహీనత సమస్య ఉండి ఐరన్ సుక్రోజ్, రక్తమార్పిడి కోసం ఆస్పత్రులకు వెళ్లిన వారు ఉన్నారు. గర్భిణులు ఇబ్బంది పడకుండా.. రక్తహీనతతో బాధపడే గర్భిణులు ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్, రక్తమార్పిడి కోసం సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు ఆస్పత్రులకు వెళ్లి రావాలంటే ఆటోలు, బస్సుల్లో ప్రయాణిస్తూ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇక మారు మూల గ్రామాల్లో అయితే ప్రయాణ ఇబ్బందులకు భయపడి గర్భిణులు ఆస్పత్రులకు వెళ్లడం మానేస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గర్భిణులను ఉచితంగా ఆస్పత్రులకు తరలించేందుకు ప్రభుత్వం ఈ సేవలను ప్రవేశపెట్టింది. హైరిస్క్ గర్భిణులు ఈ సేవలు వినియోగించుకోవాలి. – డాక్టర్ అనిల్‌కుమార్, అదనపు సంచాలకులు, వైద్య శాఖ 3.27 లక్షల మంది బాలింతలు క్షేమంగా ఇంటికి.. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి బాలింతలను క్షేమంగా ఇంటికి చేర్చడం కోసం ఏర్పాటుచేసిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి 500 కొత్త ఎయిర్ కండిషన్డ్ వాహనాలను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 3,27,289 మంది బాలింతలను క్షేమంగా ఇంటికి చేర్చింది. ఈ సేవల కోసం ప్రభుత్వం రూ.71 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ప్రతి లక్ష ప్రసవాలకు ప్రసూతి మరణాల రేటు(ఎంఎంఆర్) 45కు తగ్గింది. ఇదే జాతీయ స్థాయిలో పరిశీలించినట్లయితే ఎంఎంఆర్ 76గా ఉంది. -
డోలీ కట్టి.. మూడు కిలోమీటర్లు
ఏటూరు నాగారం: డోలీ కట్టి మూడు కిలోమీటర్ల మేర ఓ గర్భిణిని కుటుంబసభ్యులు మోసుకొచ్చి, అనంతరం 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఏటూరునాగారం మండలం రాయబంధం గొత్తికోయగూడేనికి చెందిన గర్భిణి సోది పోసికి ఆదివారంరాత్రి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గ్రామస్తులు ఆశ కార్యకర్తకు తెలియజేయగా ఆమె 108 సిబ్బందికి సమాచారం ఇచ్చింది. గ్రామానికి సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో అక్కడికి అంబులెన్సు రాదని సిబ్బంది చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంచానికి తాళ్లుకట్టి డోలీగా మార్చి మూడు కిలోమీటర్ల దూరం మోసుకొచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రేమించి పెళ్లి.. గర్భవతైన భార్యను దిండుతో అదిమిపట్టి..
నల్గొండ: మర్రిగూడ మండలం అజ్జలాపురంలో ఇటీవల వెలుగుచూసిన గర్భిణి అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కుటుంబ కలహాలు, క్షణికావేశంతో భర్తే ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అరెస్ట్ చేసిన నిందితుడిని శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మీడియా ఎదుట ప్రవేశపెట్టి ఎస్ఐ రంగారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. మర్రిగూడ మండలం కమ్మగూడేనికి చెందిన సుష్మిత, అజ్జలాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్ ప్రేమించుకుని ఈ ఏడాది జనవరిలో వివాహం చేసుకున్నారు. సుష్మిత ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. దంపతుల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఏర్పడి గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఈ నెల 10వ తేదీన రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. క్షణికావేశానికి గురైన శ్రీకాంత్ దిండుతో సుష్మితను అదిమిపట్టి ఊపిరి ఆడనీయకుండా చేశాడు. అనంతరం మాల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత సుష్మిత మృతదేహాన్ని మర్రిగూడ ఆస్పత్రికి తీసుకొచ్చి అనారోగ్య కారణాలతో మృతిచెందినట్లు చిత్రీకరించాడు. మృతురాలి సోదరి శ్రీకాంత్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. కుటుంబ కలహాలు, క్షణికావేశంలోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన దేవరకొండ కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ వివరించారు. -
సహజ ప్రసవాలకు ‘సీ–సేఫ్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలను తగ్గించి.. సహజ ప్రసవాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే పలు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇదే క్రమంలో ‘సీ–సేఫ్’ అనే మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతానికి మించకూడదు. అయితే, రాష్ట్రంలో మొత్తం ప్రసవాల్లో 45 శాతం సిజేరియన్లు ఉంటున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతానికిపైగా, ప్రభుత్వాస్పత్రుల్లో 32 శాతం మేర ఈ తరహా కాన్పులు ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో కోత కాన్పుల నియంత్రణకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. కాగా, సీ–సేఫ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. నర్సులకు మిడ్వైఫరీ శిక్షణ పూర్తి సహజ ప్రసవాలను పెంపొందించే చర్యల్లో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లోని నర్సులకు ‘నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్వైఫరీ (ఎన్‌పీఎం)’ కోర్సును గత ఏడాది ప్రారంభించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున రెండు బ్యాచ్‌లుగా గుంటూరు, తిరుపతిలలో 18 నెలల శిక్షణ ఇచ్చారు. గర్భధారణ జరిగినప్పటి నుంచి మహిళకు అవసరమైన వైద్య సహాయం, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నవజాత శిశువుకు అందించాల్సిన సేవలు, హైరిస్క్ లో ఉన్న గర్భిణులను ఏ విధంగా గుర్తించాలి వంటి పలు రకాల అంశాలపై నర్సులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం వీరికి నర్సింగ్ బోర్డ్‌లో పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సరి్టఫికెట్లు జారీ చేస్తున్నారు. త్వరలో వీరిని రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా ప్రసవాలు జరిగే 10 ఆస్పత్రుల్లో నియమించనున్నారు. అనవసర కోతల నియంత్రణ యూకేకు చెందిన బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం, యునిసెఫ్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర వైద్య శాఖ సీ–సేఫ్‌ను నిర్వహించనుంది. ప్రభుత్వాస్పత్రుల్లో అనవసర కోత కాన్పులను సాధ్యమైనంత వరకూ నియంత్రించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో సిజేరియన్లను ఎలాంటి పరిస్థితుల్లో నిర్వహించాలి అనే దానిపై ప్రోటోకాల్స్‌ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మన ఆస్పత్రుల్లో అసిస్టెడ్ డెలివరీ ప్రక్రియలను అంతగా వినియోగించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో ఎంపిక చేసిన ఆరు ఆస్పత్రుల్లో గైనిక్ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వ్యాక్యూమ్, ఇతర పరికరాలను ఉపయోగించి సాధారణ ప్రసవాల్ని చేసేలా అసిస్టెడ్ డెలివరీ ప్రక్రియలో నైపుణ్యాలు పెంచనున్నారు. సిజేరియన్ తప్పనిసరి అయిన పరిస్థితుల్లో సురక్షితంగా సర్జరీల నిర్వహణపై మరింత అవగాహన పెంచనున్నారు. రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, తెనాలి, అనకాపల్లి, ఆదోని ఆస్పత్రులను సీ–సేఫ్ కోసం ఎంపిక చేసినట్టు యునిసెఫ్ ప్రతినిధి డాక్టర్ నాగేంద్ర తెలిపారు. ప్రోటోకాల్స్ రూపకల్పన త్వరలో పూర్తి అవుతుందన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మాతృ మరణాల కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఫలితంగా గతంతో పోలిస్తే మరణాలు తగ్గాయి. అదే విధంగా అనవసర సిజేరియన్ కాన్పుల నియంత్రణపై దృష్టి సారించాం. ఈ క్రమంలోనే సీ–సేఫ్‌కు ప్రణాళిక రచించాం. మరొక వైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
నాలాంటివాళ్లు కొత్త కథలే చేయాలి – సోహైల్
‘‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ప్రీమియర్ షో చూశాక చాలా మంది మహిళలు అమ్మ పడే ఇబ్బందులు బాగా చూపించారని కన్నీళ్లు పెట్టుకుని చెప్పా రు. దీంతో మా ప్రయత్నం విజయవంతం అయిందనిపించింది’’ అన్నారు సయ్యద్ సోహైల్ రియాన్. శ్రీనివాస్ వింజనం పాటి దర్శకత్వంలో సయ్యద్ సోహైల్, రూపా కొడవయూర్ జంటగా రూపొందిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా సోహైల్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘స్టార్ హీరో లకు ఫ్యాన్స్ ఉంటారు. కమర్షియల్ సినిమాలు చేసినా వర్కవుట్ అవుతుంది. కానీ, నాలాంటి వాళ్లు కొత్త ప్రయత్నాలు చేస్తేనే ప్రేక్షకులు సినిమాలకు వస్తారని నమ్మాను. అందుకే ‘బిగ్ బాస్’ నుంచి రాగానే ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ వంటి కొత్త జానర్ మూవీ చేశాను. మేల్ ప్రెగ్నెన్సీ నిజంగా సాధ్యమైతే కనీసం 20 శాతం మంది మేల్స్ ప్రెగ్నెన్సీ తీసుకోవడం కోసం రెడీగా ఉన్నారు’’ అన్నారు. -
నా ఏడుపైనా కరిగించలేదా.. అమ్మా?
దేవతకు ప్రతిరూపం..అనురాగం, ఆప్యాయత పంచేది అమ్మ..లోకం నిన్ను ద్వేషించినా నిన్ను ప్రేమించేది అమ్మ.. జన్మజన్మల బంధం అమ్మ.. లోకంలోనే అంతటి గొప్ప పదానికే ఓ తల్లి మచ్చతెస్తే.. పురిట్లోనే పేగు బంధం తెంచేస్తే.. భారం తనకొద్దంటూ కనిపారేస్తే.. ఆ పసిప్రాయం ఎంత విలవిల్లాడి ఉంటుంది.. ఆ హృదయం ఎంత యాతన పడి ఉంటుంది.. ఆ గొంతు ఎంత తడారిపోయి ఉంటుంది.. అమ్మతనానికే మచ్చ తీసుకొచ్చిన హృదయ విదారకర ఘటన చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది. చిత్తూరు రూరల్: ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆ తల్లి మాతృత్వపు మమకారాన్ని సైతం కాదనుకుంది. తల్లి పొత్తిళ్లలో సేద తీరాల్సిన పసికందును చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి బాత్రూమ్లో వదిలి వెళ్లిపోయింది. అటు వైపుగా వెళ్లిన స్వీపర్, సెక్యూరిటీ సిబ్బంది చిన్నారిని చూసి, ఎస్ఎన్సీ యూ డాక్టర్లకు అప్పగించారు. అధికారుల కథనం మేరకు.. 19 ఏళ్ల వయస్సున్న ఓ గర్బిణి కడుపు నొప్పి అంటూ బుధవారం వేకువజామున 4.30 గంటలకు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని ఆశ్రయించింది. అక్కడి డ్యూటీ డాక్టర్లు ఆమైపె అనుమానం రావడంతో.. మీరు గర్భిణినా? అని అడిగారు. కా దంటూ ఆ గర్భిణి, ఆమె వెంట వచ్చిన ఇద్దరు వ్య క్తులు వాదించడంతో చివరకు డాక్టర్ ఆమెకు పరీక్షలు చేయించుకోవాలని టెస్ట్‌లు రాసి ఇచ్చారు. అయితే పురిటినొప్పులు అధికమై గర్భిణి బాత్రూమ్లోకి వెళ్లింది. అక్కడే ఆడబిడ్డకు జన్మనిచ్చిన త ల్లి.. పసికందును బాత్రూమ్లోనే వదిలి పరారైంది. వారి వెంట వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా కనిపించకుండా మాయమయ్యారు. అటూ వైపుగా వెళ్లి న స్వీపర్ మోహనమ్మ, సెక్యూరిటీ సందీప్ పసిగు డ్డు ఏడుపును గుర్తించారు. వెంటనే డాక్టర్లకు సమా చారం అందించి, బిడ్డను ఎస్ఎన్సీయూకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్న బిడ్డను ఆస్పత్రి అధికారులు ఐసీడీఎస్ అధి కారులకు అప్పగించారు. బిడ్డ ఆరోగ్య పరిస్థితిని ఎ ప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే ఆ త ల్లి బాత్రూమ్లో పసికందును ఎందుకు వదిలి వె ళ్లింది? ఆడబిడ్డ అని వదిలేసేరా? మరేమైనా ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో ఆస్పత్రి అధికారులు విచారిస్తున్నారు. సీసీ పుటేజీలను పరిశీలించనున్నారు. తర్వాత పోలీసులను ఆశ్రయిస్తామని సూపరింటెండెంట్ అరుణ్‌కుమార్ వెల్లడించారు. -
జేసీబీలో నిండుగర్భిణి తరలింపు
భీమ్‌గల్: ఓ నిండుగర్భిణి పురిటినొప్పులతో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకుని వెళ్తుండగా దారి మధ్యలో చెరువుకట్ట తెగి నీటి ప్రవాహం పెరిగింది. జేసీబీ సహాయంతో ఆమెను నీటిప్రవాహంలోంచి దాటించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. భీమ్‌గల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన నిండుగర్భిణి అనిలకు గురువారం పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బయలుదేరారు. మార్గమధ్యంలో పిప్రి నుంచి బాచన్పల్లి వెళ్లే దారిలో ఉన్న చెరువుకట్ట తెగిపోయింది. దీంతో ఆమెను జేసీబీలో కూర్చోబెట్టి దాని సహాయంతో నీటి ప్రవాహాన్ని దాటించారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్ ద్వారా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
గర్భిణిపై కూలిన ఇంటిపైకప్పు
మెదక్ మున్సిపాలిటీ: తొలి కాన్పు కోసం పుట్టింటికి వచ్చిన గర్భిణిపై ఇల్లు కూలిన ఘటనలో కడుపులోని గర్భస్థ శిశువు మృతి చెందగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదఘటన మెదక్‌లోని మిలట్రీ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుడైన మహ్మద్ సర్వర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రెండో కూతురు యాస్మిన్ సుల్తానా ఇటీవల కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. 15 రోజుల్లో ఆమెకు ప్రసవం చేయాల్సి ఉంది. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తరుణంలో భారీ వర్షాలకు తడిసిన ఇంటి గోడ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో యాస్మిన్ తీవ్రంగా గాయ పడటంతో వెంటనే మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె కడుపులో గర్భస్థ శిశువు మృతి చెందినట్లు గుర్తించి తొలగించారు. యాస్మిన్‌ను హైదరా బాద్‌కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. కాగా, ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన యాస్మిన్ తల్లి చాంద్ సుల్తానా మెదక్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యాస్మిన్ సుల్తానా కుటుంబాన్ని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గురువా రం పరామర్శించి రూ.లక్ష సాయం అందించారు. -
ప్రెగ్నెంట్‌గా ఉండగానే..మరోసారి ప్రెగ్నెంట్ కాగలరా? ఇది సాధ్యమేనా!
మహిళ ప్రెగ్నెంట్‌గా ఉండగానే మరోసారి ప్రెగ్నెంట్ కాగాలదా? అంటే ఔననే చెబుతోంది సైన్సు. ఏంటిది ఎలా సాధ్య? అసలు ఇలా ఎవరికైనా జరిగిందా? అని పలు సందేహాలు మొదలయ్యాయి కదా. కానీ నిజానికి ఇలాంటి అరుదైన కాసులు చాలనే జరిగాయని అంటున్నారు వైద్యులు. ఇలా గర్భవతిగా ఉండగానే మళ్లీ గర్భం దాల్చడాన్ని సూపర్ఫెటేషన్ అని పిలుస్తారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులో ఆ తల్లికి పుట్టిన పిల్లలు కవలలుగా పరిగణించినప్పటికీ వేర్వురు తేదిల్లో పుడతారట. అరుదైన కేసుల్లో ఒకేసారి పుట్టిన ఆ పిల్లల బరువు, పరిమాణాలు వేర్వేరుగా ఉంటాయని అంటున్నారు. ఆ పిండాల పీరియాడిక్ టైం కూడా వేరుగా ఉంటుంది. ఇది ఒక ఋతుకాలంలోనే విడుదలైన రెండు గుడ్ల ఫలదీకరణాన్ని సూచిస్తుంది. నిజానికి ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడూ ఆమె అండాశయాలు గర్భాశయానికి గుడ్లు విడుదల చేయడం ఆపేస్తాయి. ఎందుకంటే హార్మోన్లు శిశువు పెరగడానికి సిద్ధంగా ఉండేలా శరీరానికి ఒక సంకేతాన్ని పంపుతాయి. అయినప్పటికీ సూపర్ఫెటేషన్ జరిగితే అండాశయాలు మరొక గుడ్డును విడుదల చేస్తాయి. అది కూడా ఫలదీకరణం చెందుతుంది. గతంలో ఇలాంటి ఘటన జరిగిన పలు కేసులు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కేట్ హిల్ అనే మహిళకు ఇలానే జరిగింది. ఆమె కేవలం పది రోజుల్లో రెండుసార్లు గర్భవతి అయ్యింది. ఆమె ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆ పిల్లలు ఇద్దరు ఒకే రోజు జన్మించినప్పటికీ వారి బరువులు, పరిమాణలు భిన్నంగా ఉన్నాయి. అలాగే ఇలాంటి సూపర్ఫెటేషన్ జంతువులలో కూడా జరుగుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎలుకలు, కంగారులు, కుందేళ్లు, పిల్లి జాతులు, గొర్రెలు అన్ని సూపర్ఫెటేషన్కు లోబడి ఉన్నాయని పేర్కొన్నారు. చేపలు కూడా ఇదే విధమైన సామర్థ్యాన్ని ప్రదర్శించాయని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: ఎక్కడికైనా 'లేటే'..టైంకి వచ్చిందే లే!: ఇదేమైనా డిజార్డరా!) -
భర్త వస్తాడనుకుంటే మృతదేహం రావడంతో.. సొమ్మసిల్లిన నిండుగర్భిణి!
ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అహ్మదాబాద్ నుంచి బాందాకు వస్తున్న 25 ఏళ్ల యువకుడు రైలులో మృత్యువాత పడ్డాడు. ఈ విషయం తెలియని అతని భార్య, కుటుంబసభ్యులు.. ఇక కొద్ది సేపటిలో అతను వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఇంతలో వారికి అసలు విషయం తెలిసింది. దీంతో వారి ఇల్లు శోకసంద్రంగా మారిపోయింది. భర్త ఇక రాడనే సంగతి తెలుసుకున్న భార్య సొమ్మసిల్లి పడిపోయింది. ఈ ఉదంతం గురించి బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమారుడు రైలులో విషప్రయోగానికి బలైపోయాడని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారని, తదుపరి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కమాసిన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుజర్ భాన్ అనే యువకుడు అహ్మదాబాద్‌లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. అతని కుటుంబం బాందాలో ఉంటోంది. ఆదివారం బరౌనీ-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి ఇంటికి బయలుదేరాడు. రక్తంతో కూడిన వాంతులు.. మహోబా స్టేషన్ సమీపంలోకి రైలు చేరుకోగానే ఉన్నట్టుండి అతనికి రక్తంతో కూడిన వాంతులు రావడం మొదలయ్యింది. దీనిని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే ఈ విషయాన్ని సీఆర్పీ పోలీసులతో పాటు రైల్వే అధికారులకు తెలియజేశారు. ఇంతలోనే అతని ఆరోగ్యం విషమించింది. వెంటనే జీఆర్పీ పోలీసులు బాధితుడిని రైల్వే వైద్యుల దగ్గకు తీసుకువెళ్లారు. వారు బాధితుడిని పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులకు మృతుని జేబులో అహ్మదాబాద్ నుంచి బాందాకు రైల్ టిక్కెట్ లభ్యమయ్యింది. డాక్యుమెంట్ల ఆధారంగా మృతుడు బాందాకు చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. వెంటనే వారు మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే మృతుని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సూరజ్ భాన్‌కు ఇద్దరు పిల్లలు ఉంటేవారు. వారు మృతిచెందారు. ప్రస్తుతం అతని భార్య నిండుగర్భంతో ఉంది. కొద్దిరోజుల్లో ఆమెకు డెలివరీ జరగనుంది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వేలానికి 121 ఏళ్ల క్యాడ్బరీ చాక్లెట్.. నాటి తీయని వేడుకకు గుర్తుగా.. -
నేను ప్రెగ్నెంట్‌ని..పోలియో, ఆటిజం జన్యుపరమైన జబ్బులా? నా బిడ్డకు..
మా మరిదికి పోలియో, మా బావగారి పాపకు ఆటిజం ఉంది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని.. మూడో నెల. ఈ పోలియో, ఆటిజం ఏమైనా జన్యుపరమైన జబ్బులా? నా బిడ్డకూ వచ్చే ప్రమాదం ఉందా? –కర్నె ఉజ్వల, నాగర్ కర్నూల్ పోలియో అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఫ్లూ లాగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. పోలియో జన్యుపరమైన.. వంశపారంపర్య జబ్బు కాదు. పోలియో వైరస్ బారినపడిన వారికి స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్ పక్షవాతం ఉంటుంది. మెనింజైటిస్ – బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల శాశ్వతమైన వైకల్యం సంభవిస్తుంది. టీకాతో పోలియోను పూర్తిగా నివారించవచ్చు. ఐపీవీ అండ్ ఓపీవీ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. పిల్లలందరికీ ఇప్పుడు నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో పోలియో టీకాను ఇస్తున్నారు. ఇది జన్యుపరమైన అంటే తల్లిదండ్రులు.. బంధువుల నుంచి వ్యాపించదు. మీ మరిదికి పోలియో ఉన్నా.. ఇప్పుడు మీ ప్రెగ్నెన్సీలో మీ బిడ్డకు సోకే ప్రమాదం.. అవకాశం ఏమాత్రం లేదు. ఇక ఆటిజం విషయానికి వస్తే.. ఆటిజం అనేది.. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌లో ఒక భాగం. ఇది డెవలప్మెంటల్ డిజేబులిటీ. బాల్యంలోనే పిల్లల మెదడులో తేడాలను గుర్తించి దీన్ని డయాగ్నసిస్ చేస్తారు. దీనికి తల్లిదండ్రులతో కొంతవరకు జన్యుపరంగా రావచ్చు. కొన్నిసార్లు మామూలు తల్లితండ్రులకూ ఆటిజం ఉన్న బిడ్డ ఉండొచ్చు. ఇది స్పాంటేనియస్ మ్యుటేషన్స్‌తో అవుతుంది. ఎవరికి ఆటిజం ఉంటుంది అని ప్రెగ్నెన్సీలోనే కనిపెట్టడం కష్టం. కానీ కొన్ని జంటలకు జెనెటిక్ కౌన్సెలర్స్ ద్వారా ఇన్వెస్టిగేషన్స్ చేయించి.. కొన్ని కేసెస్‌లో బిడ్డకు వేరే సిండ్రోమ్స్ ఏమైనా వచ్చే చాన్సెస్ ఉంటే.. వాటిల్లో ఆటిజం కూడా ఉంటే మూడో నెల ప్రెగ్నెన్సీలో కొన్ని జెనెటిక్ టెస్ట్‌ల ద్వారా బిడ్డకు ఆ సిండ్రోమ్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. కాబట్టి జెనెటిక్, నాన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ రెండూ ఆటిజానికి కారణాలు కావచ్చు. వంశపారంపర్యంగా వచ్చే చాన్స్ ఉన్న కేసెస్‌లో ముందస్తుగానే అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందే జెనెటిక్ , ఫీటల్ మెడిసిన్ కౌన్సెలింగ్ చేయిస్తే.. ఏ కేసెస్కి వైద్యపరీక్షలు అవసరం అనేది ముందుగానే నిర్ధారించే అవకాశం ఉంటుంది. --డా భావన కాసు గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: నేను ప్రెగ్నెంట్‌ని. ఇప్పుడు మూడో నెల. రక్త హీనత ఉందని నాకు మాత్రలు ఇచ్చారు. దీనివల్ల బిడ్డకు ఏదైనా ప్రమాదం ఉంటుందా?) -
ఇలా చేస్తే ప్రెగ్నెన్సీ రావడం ఖాయం ...
-
నేను ప్రెగ్నెంట్‌ని.. ఆ మాత్రలు వాడుతున్నా? బిడ్డకు ఏదైనా ప్రమాదమా?
నేను ప్రెగ్నెంట్‌ని. ఇప్పుడు మూడో నెల. రక్త హీనత ఉందని నాకు మాత్రలు ఇచ్చారు. దీనివల్ల బిడ్డకు ఏదైనా ప్రమాదం ఉంటుందా? – ప్రమోద, నెల్లూరు హీమోగ్లోబిన్ పదకొండు గ్రాముల కన్నా తక్కువ ఉన్నప్పుడు మొదటి మూడు నెలల్లోనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏడవ నెల నుంచి ప్రసవం వరకు కనీసం 10.5గ్రాములు ఉండాలి. ఇది బ్రిటిష్ కమిటీ ఫర్ స్టాండర్డ్ ఇన్ హెమటాలజీ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రెగ్నెన్సీ.. ప్రసవంలో కూడా ఫాలో కావాలి. ప్రసవం తరువాత పది గ్రాముల కన్నా తక్కువ ఉంటే కచ్చితంగా మాత్రలు ఇవ్వాల్సిందే. రక్తహీనత వల్ల ప్రెగ్నెన్సీ సమయంలోనే కాదు ప్రసవం తర్వాతా చాలా సమస్యలు వస్తాయి. ఓరల్ థెరపీ అంటే ఓరల్ ఐరన్ మాత్రలను ముందుగా రెండువారాల పాటు ఇస్తారు. వాటితో హిమోగ్లోబిన్ కనుక పెరిగితే తర్వాత మాత్రలను వాడాల్సిన అవసరం ఉండదు. ప్రెగ్నెన్సీలో అందరికీ 28 వారాలకు సీబీపీ .. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ రక్త పరీక్ష చేయాలి. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి హీమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫొరీసస్ అనే రక్తపరీక్షనూ తప్పకుండా చేయించాలి. ఈ టెస్ట్ ద్వారా పుట్టుకతో వచ్చే జెనెటిక్ సమస్యలు సికిల్ సెల్ అనీమియా, తలసీమియావంటి వ్యాధులను.. క్యారియర్ స్టేటస్‌ని కనిపెట్టవచ్చు. ఈ వ్యాధులు/క్యారియర్స్‌గా ఉన్నవారికి ఓరల్ థెరపీతో, డైట్‌తోనే మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అలా తీసుకుంటేనే అసిడిటీ సమస్యలు తగ్గుతాయి ఐరన్ పెరగడానికి ఇంజెక్షన్ ఇవ్వకూడదు. అలాచేస్తే వాళ్లకు ఐరన్ ఓవర్‌లోడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే మీకు ఆ బ్లడ్ టెస్ట్ చేసి చికిత్స మొదలుపెట్టటం మంచిది. ఈ వైద్య పరీక్షలో కేవలం ఐరన్ లోపం మాత్రమే ఉందని తేలితే అప్పుడు ఐరన్ స్టడీస్ చేస్తారు. సరైన ప్రిపరేషన్‌తో చికిత్స చేస్తే ఈ ఐరన్ లోపం సమస్య త్వరగా తగ్గిపోతుంది. ఈ ఐరన్ మాత్రలను విటమిన్ సీతో గానీ, సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్‌తో గానీ తీసుకుంటే ఆ మాత్రలను శరీరం త్వరగా గ్రహిస్తుంది. అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. ఐవీ ఐరన్ ఇంజెక్షన్స్ కూడా పనిచేస్తాయి. కొంతమందికి కిడ్నీ పరీక్షలనూ సూచిస్తారు. రేనల్ అనీమియా అనేదాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో హీమోగ్లోబిన్ 8 గ్రాముల కంటే తక్కువగా ఉంటే పేషంట్ పరిస్థితిని బట్టి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇస్తాం. మొదటి మూడునెలల్లో హీమోగ్లోబిన్ పదకొండు గ్రాముల కన్నా తక్కువగా ఉంటే హెమటాలజిస్ట్ / ఫిజీషియన్‌ను సంప్రదించి డైట్, ఐరన్ మాత్రలతో చికిత్స మొదలుపెట్టడం వల్ల ఇటు బిడ్డకు, అటు తల్లికి వచ్చే సమస్యలను నివారించగలుగుతాం. తలనొప్పి, శ్వాస ఆకడపోవడం.. అనీమియాతో బాధపడుతున్న తల్లిలో.. నీరసం, పాల్పిటేషన్స్, తలనొప్పి.. వంటివి ఎక్కువ. శ్వాస ఆడకపోవడం.. కాళ్ల వాపులూ రావచ్చు. బిడ్డ పుట్టిన తరువాత హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండొచ్చు. ప్రసవం తరువాత పాస్ట్పార్టమ్ హేమరేజ్, అబ్రప్షన్ చాన్సెస్ పెరుగుతాయి. అందుకే రక్తహీనతను గుర్తించిన వెంటనే దానికి చికిత్సను అందించాలి. మాత్రలు ఇవ్వాలి. ఒకవేళ దద్దుర్లు వంటి రియాక్షన్ ఏదైనా వస్తే వేరే ప్రిపోజిషన్ని ప్రయత్నించాలి. ఇలా రక్తహీనతకు తగిన చికిత్సతో తల్లి ఆరోగ్యాన్ని కాపాడ్డమే కాదు పండంటి బిడ్డనూ కనొచ్చు. (చదవండి: నేరాలను తగ్గించేలా.. సరికొత్త అత్యాధునిక జైలు) -
కూతురిపై ఉన్న నమ్మకం గెలిచినా!..బయటపడ్డ మరో నిజం ఆ తల్లిని..
పాపం నిండా 15 ఏళ్లు నిండని ఓ టీనేజర్.. శరీరంలో ఏదో మార్పు. అర్థం కాలేదు. విపరీతమైన వెన్ను నొప్పి. కూర్చొలేదు, నుంచోలేదు. ఏం జరుగుతుందో అర్థం కాక వైద్యులను సంప్రదించింది. పలు వైద్య పరీక్షల తర్వాత బయటపడ్డ నిజం విని నమ్మలేకపోయింది. తల్లిదండ్రులు ఏం అంటారో తెలియక తల్లడిల్లింది. వైద్యులు చెప్పింది నిజం కాదని ఆ అమ్మాయి నమ్మకం. కానీ చివరికి పరీక్షలు తర్వాత బయటపడ్డ మరో నిజం మరింత ఘోరంగా, దారుణంగా ఉంది. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం 19 ఏళ్ల వయసున్న హాలీ అనే టీనేజ్ అమ్మాయి 2019 జనవరిలో వెన్ను నొప్పితో తల్లడిల్లింది. దీంతో ఆస్పత్రి వెళ్లింది. పలు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె ప్రెగ్నెంట్ అని తేల్చారు. దీంతో ఆ అమ్మాయికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైయ్యింది. ఆమెకు గట్టి నమ్మకం తాను ప్రెగ్నెంట్ కాదని. ఎందుకంటే ఆమె అప్పుడు 15 ఏళ్ల మాత్రమే. ఈ విషయం విని తన తల్లిదండ్రులు ఏం అనుకుంటారోనని చాలా భయపడింది. ఐతే ఆమె తల్లి దీన్ని నమ్మలేదు. మరోవైపు ఆమె బరువు తగ్గిపోవడం, తలనొప్పి, అలసట వంటి విపరీతమైన సమస్యలను ఎదుర్కొంటోంది. ఆమె తల్లిదండ్రలు జోక్యంతో ఆమెకు మరిన్ని పరీక్షలు నిర్వహించారు వైద్యులు. చివరికి అల్ట్రాసౌండ్ పరీక్షలో ఆమె కడుపులో బిడ్డ లేదని తేలింది. ఐతే రిపోర్ట్ల్లో గుండె పగిలే మరో నిజం బయటపడింది. ఈ నిజం ఆమెను, తల్లిదండ్రులను తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. ఆ వైద్య పరీక్షల్లో ఆమెకు అండాశయ క్యాన్సర్ ఉందని తేలింది. ఆ కణుతులు ఊపిరితిత్తుల వరకు వ్యాపించి..స్టేజ్ 4దశలో ఉన్నట్లు వెల్లడైంది. చివరికి పలు చికిత్సలు అనంతరం ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటోంది హాలీ. (చదవండి: డయాబెటిస్ పేషెంట్స్‌కి ఈ వ్యాధుల ఎటాక్ అయితే..డేంజర్లో ఉన్నారని అర్థం!) -
కొడుకుకు ఉరేసి.. ఆపై ఉరేసుకొని
బంజారాహిల్స్: మూడేళ్ల బిడ్డ ఆలనాపాలన ఓవైపు... కడుపున పెరుగుతున్న శిశువు ఎదుగుదలను చూసుకోవాల్సిన బాధ్యత మరోవైపు. ఈ క్రమంలో అత్తింటి వారి వేధింపులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. మరణమే శరణ్యమని భావించింది. ‘అమ్మా... మా అత్త నన్ను చితకబాదింది... ఏం చేస్తారో అని భయమేస్తోంది... చచ్చిపోవాలనిపిస్తోంది’అంటూ రోదిస్తూ తల్లికి ఫోన్ చేసిన 12 గంటల వ్యవధిలోనే బలవన్మరణానికి పాల్పడింది. తన ఒడిలో పడుకున్న బిడ్డకు ముందుగా ఉరేసి ఆ తర్వాత కడుపున ఉన్న బిడ్డతో సహా తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ ఫిలింనగర్‌లోని వినాయకనగర్ బస్తీలో చోటుచేసుకుంది. పెళ్లయిన నెల నుంచే వేధింపులు... మేడిపల్లికి చెందిన శిరీష (23) వివాహం ఫిలింనగర్‌లోని వినాయకనగర్ బస్తీకి చెందిన కారు డ్రైవర్ కావటి విశ్వనాథ్ (32)తో 2019 జూన్ 9న జరిగింది. వివాహ సమయంలో రూ. 8 లక్షల కట్నంతోపాటు 15 తులాల బంగారం ఇచ్చారు. పెళ్లి జరిగిన నెల రోజులకే అత్త బసవమ్మ, భర్త విశ్వనాథ్ విశ్వరూపం చూపించారు. రోజూ కొట్టడంతోపాటు, అదనపు కట్నం తెమ్మంటూ పుట్టింటికి తరచూ పంపేవారు. పుట్టింటికి వచ్చిన శిరీషకు తల్లి లక్ష్మి అప్పుచేసి ఒక్కోసారి రూ. లక్ష చొప్పున అయిదుసార్లు డబ్బులు ఇచ్చి పంపింది. అయినాసరే కూతురు కాపురం బాగుపడకపోగా రోజురోజుకూ వేధింపులు పెరిగిపోయి అత్తతోపాటు భర్త విశ్వనాథ్ తీవ్రంగా కొట్టేవాడు. ఈ నెల 9న పెళ్లి రోజున కూడా ఆమెను చితకబాదాడు. అదనపు కట్నం తేవాలంటూ పుట్టింటికి పంపించేందుకు యత్నించగా ఈసారి ఆమె కాళ్లావేళ్లాపడింది. అయినాసరే ఆ కర్కశ హృదయాలు కరగలేదు. శుక్రవారం ఉదయం 12 గంటలకు తల్లికి ఫోన్ చేసి అత్త కొట్టిందంటూ చెప్పి భోరుమంది. వాళ్ల కదలికలు చూస్తుంటే తనను ఏదో చేసేలా ఉన్నారంటూ ఫోన్ కట్ చేసింది. ఆ తర్వాత తల్లి లక్ష్మి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ అని వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో అల్లుడు విశ్వనాథ్ అత్త లక్ష్మికి ఫోన్ చేసి మీ కూతురు ఉరేసుకుందంటూ చెప్పాడు. కన్నీరుమున్నీరైన మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బస్తీకి పరిగెత్తుకొచ్చారు. కుమార్తెతోపాటు పక్కనే చిన్నారి మనీష్ విగతజీవిగా కనిపించడంతో గుండెలవిసేలా రోదించారు. తన కూతురు వరకట్న వేధింపులతోనే చనిపోయిందని... ఆమె మృతిపై విచారణ జరపాలని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు భర్త విశ్వనాథ్‌పై ఐపీసీ సెక్షన్ 304 (బీ), 498 (ఏ), 3, 4, వరకట్న నిషేధిత చట్టం, రెడ్‌విత్ 109 కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అత్త బసవమ్మ, మామ రమే‹Ùలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
36 ఏళ్లు పురుషుడు ప్రెగ్నెంట్? 36 ఏళ్లుగా కవలలు కడుపులోనే..!
నాగ్‌పూర్: మహారాష్ట్రకు చెందిన ఓ పురుషుడు ప్రెగ్నెంట్ అయ్యాడు. అతని కడుపులో ఏకంగా కవలలు ఉన్నారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? ఓ అరుదైన వ్యాధి కారణంగా నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి గత 36 ఏళ్లుగా ఇద్దరు కవలలను కడుపులో మోస్తున్నాడు. అతని పేరు భగత్(60). నాగ్‌పూర్‌లో నివాసం ఉంటున్నాడు. జీవన పోషణకు ఏదో పని చేసుకుంటూ ఉండే మధ్యతరగతి వ్యక్తి. కొన్నేళ్ల క్రితం నుంచి అతని కడుపు పెరగడం ప్రారంభించింది. ఎంతగా అంటే శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యేంతలా పెరిగిపోయింది. కడుపు లావుగా ఉండటంతో చుట్టుపక్కల వాళ్లు హేళన చేసేవారు. అందరూ అతన్ని ప్రెగ్నెంట్ మ్యాన్ అంటుండేవారు. భగత్ చివరికి 1999లో ముంబయిలోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. డా. అజయ్ మెహతా ఆ కండీషన్ ట్యూమర్ అనుకున్నారు. కానీ ఆపరేషన్‌లో ఓ పెద్ద క్యాన్సర్ కణితి అని భావించారు. పూర్తిగా చూస్తే అతని కడుపులో మానవ దేహానికి సంబంధించిన భాగాలు ఉండే సరికి షాక్‌కు గురయ్యారు. అయితే.. ఈ కేసులో తాను అనుకోని దృశ్యాలను చూశానని డాక్టర్ మెహతా చెప్పారు. కడుపులో ఎముకలు, వెంట్రుకలు, దవడ వంటి శరీర భాగాలు బయటపడ్డాయని వెల్లడించారు. ఈ వ్యాధిని ఫోయిటస్ ఇన్ ఫోయిటస్(పిండంలో పిండం) అంటారని తెలిపారు. ఫోయిటస్ ఇన్ ఫోయిటస్ అనగా పిండంలో మళ్లీ ఓ పిండం పెరగడం అంటారని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ తెలిపినట్లు పేర్కొన్నారు. ఇది ఓ అరుదైన వ్యాధి అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఇకపై బస్సు డ్రైవర్, కండక్టర్ల ఫోన్లు చెకింగ్.. ఎందుకంటే..? -
నిండు గర్భిణి ఆత్మహత్య
అనకాపల్లి: మండలంలో వెదుళ్ల పాలెం గ్రామానికి చెందిన గర్భిణి కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన ఓరుగంటి శ్రావణి (21)కి పెనుగొల్లుకు చెందిన శివతో మూడు మాసాల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం ఈమె రెండు నెలల గర్భిణి. ఈమె తరచూ కడుపు నొప్పితో బాధపడుతోందని, కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రి కడుపునొప్పి తీవ్రంగా రావడంతో తన గదిలోకి వెళ్లి చీరతో ఉరేసుకుందన్నారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను కిందికి దించి ఆస్పత్రికి తరలించేలోపే మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుమార్తె కడుపునొప్పి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని, ఆమె తల్లి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శిరీష తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పెళ్లికి ముందే అమ్మతనం కోసం ఆరాటపడ్డ హీరోయిన్స్ వీళ్లే
అమ్మ.. ఆ పిలుపు కోసం తపించని వారుంటారా? ఆ స్పర్శ కోరుకోని వారుంటారా? అమ్మ అంటే వేయి ఏనుగుల బలం. అమ్మ అంటే కదిలొచ్చే దేవత. అమ్మ అంటే మమతల కోవెల. ఎంత వర్ణించినా అమ్మ గొప్పతనాన్ని మాటల్లో బందీ చేయలేము. అమ్మ కోసం ఆరాటపడేవారు కొందరైతే అమ్మగా మారాలని తపించేవాళ్లు కొందరు! పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాకే మాతృత్వపు మమకార మాధుర్యం చూడాలని కోరుకోవడం లేదు కొందరు. అలాంటివారి జాబితాలో చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. ప్రేమించినవాడితో పెళ్లి వాయిదా వేశారే కానీ సంతానాన్ని వద్దనుకోలేదు. ఫలితంగా పెళ్లి కాకముందే గర్భం దాల్చినవాళ్లు ఉన్నారు. ఏడడుగులు వేయడానికి ముందే బుడిబుడి అడుగులు వేసే పాపాయితో పందిట్లోకి అడుగుపెట్టినవాళ్లు ఉన్నారు. మదర్స్ డే సందర్భంగా ఓసారి ఆ తల్లులను గుర్తు చేసుకుందాం.. నీనా గుప్తా నీనా గుప్తా పెళ్లి చేసుకోకుండానే వెస్ట్ ఇండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో బిడ్డను కన్నది. అయితే అతడు తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో నీనా సింగిల్ పేరెంట్‌గా మసాబా గుప్తాను పెంచింది. కల్కి కొచ్లిన్ బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్.. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌తో మూడేళ్లు ప్రేమాయణం సాగించి 2011లో పెళ్లి చేసుకుంది. కానీ వీరి వైవాహిక బంధం సజావుగా సాగలేదు. 2013లో విడిపోగా 2015లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హర్ష్‌బెర్గ్‌తో డేటింగ్ చేయగా వీరికి కూతురు పుట్టింది. ఇప్పటికీ వీరు పెళ్లి చేసుకోలేదు. రేణు దేశాయ్.. బద్రి చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ సినిమా సమయంలోనే పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడింది. అతడితో ఏడుగులు వేయడానికే ముందే అకీరా జన్మించాడు. అతడికి ఐదేళ్ల వయసొచ్చాక పెళ్లి చేసుకున్నారు. 12 ఏళ్లు కలిసి మెలిసి ఉన్నా తర్వాత విడిపోయారు. సెలీనా జైట్లీ నటి సెలీనా జైట్లీ దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త పీటర్ హగ్‌తో సహజీవనం చేసిన ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చింది. దీంతో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. సారిక స్టార్ హీరోయిన్గా కొన్నాళ్లు చక్రం తిప్పిన సారిక స్టార్ నటుడు కమల్ హాసన్‌తో ప్రేమాయణం నడిపింది. కొంతకాలం వీరిద్దరూ సహజీవనం చేశారు. ఆ సమయంలో వీరికి శృతి హాసన్ జన్మించింది. తర్వాత రెండేళ్లకు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. గాబ్రియెల్లా మోడల్, నటి గాబ్రియెల్లా డెమట్రేడ్స్ నటుడు అర్జున్ రాంపాల్‌తో డేటింగ్లో ఉంది. త్వరలో ఆమె రెండోసారి తల్లి కాబోతోంది. కానీ ఇప్పటివరకు వీరు పెళ్లి చేసుకోలేదు. మహిహ చౌదరి నటి మహిమ చౌదరి పెళ్లి చేసుకునే సమయానికి ఐదు నెలల గర్భవతి అని అప్పట్లో వార్తలు వచ్చాయి. 2006 మార్చిలో ఆమె బాబీ ముఖర్జీని పెళ్లాడింది. అమృత అరోరా అమృత అరోరా.. షేకలా లడక్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే గర్భం దాల్చింది. బిడ్డ పుట్టాక ప్రియుడిని పెళ్లాడింది. శ్రీదేవి దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. జాన్వీ కపూర్ కడుపులోకి వచ్చాకే ఆమె బోనీకపూర్‌ను పెళ్లాడింది. అప్పటికి ఆమె ఏడు నెలల గర్భిణి. కొంకణ్ సేన్ శర్మ నటుడు రణ్వీర్ షోరేతో ఎంతోకాలం రిలేషన్షిప్ కొనసాగించిన ఈ నటి ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. కానీ అప్పటికే తను గర్భవతి. పెళ్లైన తర్వాత ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. అమీ జాక్సన్ ఐ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అమీ జాక్సన్. ప్రియుడు జార్జ్‌తో ఎంగేజ్మెంట్ జరిగిన మరుక్షణమే తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెల్లడించింది. తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కానీ ఆ ప్రేమ పెళ్లి దాకా రాకుండానే ఆగిపోయింది. నేహా ధూపియా బాలీవుడ్ నటి నేహా ధూపియా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఈ విషయాన్ని నేహా ధూపియా ఆమె ప్రియుడు అంగద్ బేడీ ఇంట్లో చెప్పి ఒప్పించాకే పెళ్లి చేసుకున్నారు. నేహాతో అంగద్ షాదీ జరిగే సమయానికి ఆమె మూడు నెలల గర్భిణి. దియా మీర్జా బాలీవుడ్ నటి దియా మీర్జా వ్యాపారవేత్త వైభవ్ రేఖీని పెళ్లాడింది. అతడిని పెళ్లాడే సమయానికే ఆమె గర్భం దాల్చింది. నటి నటాషా స్టాంకోవిచ్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి ముందే గర్భం దాల్చింది. క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కొంతకాలం పాటు రిలేషన్లో ఉన్న ఆమె ప్రెగ్నెన్సీ వచ్చాక పెళ్లి చేసుకుంది. అలియా భట్ అలియా భట్ కూడా పెళ్లికి ముందే గర్భవతి అయిందంటారు. 2022 ఏప్రిల్ 14న రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లాడింది. జూన్‌లో ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించారు. నవంబర్‌లో రాహాకు జన్మనిచ్చింది ఆలియా. చదవండి: మదర్స్ డే స్పెషల్...కమ్మనైన ఈ అమ్మ పాటలు విన్నారా? మదర్ సెంటిమెంట్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టిన చిత్రాలివే -
ఉపాసన- చెర్రీ దంపతులు.. అడగకుండానే హింట్ ఇచ్చారుగా!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌లో రామ్‌చరణ్- ఉపాసన ఒకరు. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలైలో తమ ఇంటికి పండుగ వాతావరణం ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. గతనెలలో దుబాయ్ వెకేషన్ వెళ్లి ఉపాసన- చెర్రీ సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో బేబీ షవర్ వేడుక చేసుకున్నారు. అనంతరం మాల్దీవుల్లో విహరించి హైదరాబాద్‌కు వచ్చేశారు. అయితే హైదరాబాద్‌లోని చిరంజీవి మరోసారి ఘనంగా సీమంతం వేడుక నిర్వహించారు. ఈ ఫంక్షన్లో అల్లు అర్జున్, సానియా మీర్జాతో పాటు పలువురు తారలు కూడా పాల్గొన్నారు. అయితే తాజాగా మెగా అభిమానుల్లో ఓ చర్చ మొదలైంది. చెర్రీ-ఉపాసనకు పుట్టబోయే బిడ్డ ఎవరన్న దానిపై తెగ చర్చిస్తున్నారు. దీంతో కొందరు అభిమానులు ఈ జంటకు మొదటి పాపే పుడుతుందని అంచనా వేస్తున్నారు. చెర్రీ దంపతులను చూస్తుంటే వారికి అమ్మాయే పుట్టబోతోందని కొందరు చెబుతుండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన సీమంతం వేడుకలో ఉపాసన పింక్ డ్రెస్ ధరించడంతో పాపనే పుడుతుందని చెబుతున్నారు. వీటికి బలం చేకూర్చేలా రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. నోరు జారిన రామ్ చరణ్ రామ్ చరణ్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ..'నా జీవితంలో అత్యంత ఇష్టమైన వారిలో మొదట నా భార్య ఉపాసన.. ఆ తర్వాత పెట్ డాగ్ రైమ్. ఇప్పుడు మా కుటుంబంలో ఆమె(హర్) వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.' అని అన్నారు. దీంతో చెర్రీ ఫ్యాన్స్ పాపనే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. బేబీ షవర్లో ఉపాసన పింక్ డ్రెస్ చిరంజీవి నివాసంలో జరిగిన ఉపాసన బేబీషవర్లో పింక్ డ్రెస్‌లో మెరిసింది. ఈ కలర్ డ్రెస్ ధరించడంతో ఆమెకు ఆడపిల్ల పుట్టబోతోందన్న వార్తలకు మరింత బలం చేకూర్చారు. ఏప్రిల్ 23, 2023న కుటుంబ సభ్యులు, ఈ జంట సన్నిహితులు హాజరయ్యారు. ఈ వేడుకలో ఉపాసన మెరిసే గులాబీ రంగు దుస్తులు అందరినీ ఆకట్టుకున్నాయి. పింక్ రంగు అమ్మాయిల సింబాలిక్ను సూచిస్తుంది కాబట్టి ఉపాసన గులాబీ రంగు దుస్తులు ధరించిందని పేర్కొన్నారు. టాలీవుడ్ జంట త్వరలోనే తమ జీవితంలో పాపను స్వాగతించేందుకు రెడీగా ఉన్నారని అంచనా వేస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు వీరే
చిత్ర పరిశ్రమలో డేటింగ్ అనేది సర్వసాధారణం. ఇద్దరు ఇష్టపడితే చాలు కలిసి సహజీవనం చేస్తుంటారు. వారిలో కొంతమంది మాత్రమే తమ రిలేషన్‌ని పెళ్లి వరకు తీసుకెళ్తున్నారు. మరికొంతమంది హీరోయిన్లు అయితే పెళ్లికి ముందే డేటింగ్ చేసి గర్భం దాల్చుతున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు పెళ్లికి ముందే గర్భంగా దాల్చారు. అలాంటి వారిపై ఓ లుక్కేద్దాం. ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగింది ఇలియానా. ఆ తర్వాత బాలీవుడ్‌కి మకాం మార్చింది. అయితే అక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఇలియానా ఇటీవల షాకింగ్ విషయం తెలిపింది. త్వరలోనే తాను తల్లిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో కొన్నాళ్లు డేటింగ్లో ఉన్న ఇలియానా.. 2019లో అతనితో విడిపోయింది. అప్పటి నుంచి ఆమె సింగిల్‌గానే ఉంటుంది. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. కానీ ఇలియానా మాత్రం ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు సడెన్‌గా తల్లిని కాబోతున్నట్లు వెల్లడించి అందరికి షాకిచ్చింది. త్వరలోనే బిడ్డకి తండ్రి ఎవరో ప్రకటించి, పెళ్లి పీటలేక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ సైతం పెళ్లికి ముందే గర్భం దాల్చింది. హీరో రణబీర్ కపూర్‌తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన అలియా.. 2022 ఏప్రిల్‌లో అతన్ని పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే అలియా ప్రెగ్నెంట్. కానీ వివాహం అయిన రెండు నెలల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. గతేడాది నవంబర్‌లో ఈ జంట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అమీ జాక్సన్ ఎవడు, రోబో 2.O చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి అమీ జాక్సాన్. నటిగా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ జాక్సన్ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. చాలా రోజుల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవిస్తున్నారు. రేణు దేశాయ్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం పెళ్లికి ముందే అకీరా నందన్‌కు జన్మనిచ్చింది. ‘బద్రి’ సినిమాతో ప్రేమలో పడిన ఈ జంట.. కొన్నాళ్ల పాటు సహజీవనం చేసి అకీరా పుట్టాక పెళ్లి చేసుకుంది. మరో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత విడాకులు తీసుకున్నారు. పూర్ణ మలయాళీ బ్యూటీ పూర్ణ సైతం పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ‘సీమ టపాకాయ్’, ‘అవును’చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. గతేడాది అక్టోబర్‌లో దుబాయ్ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ షానిద్ అసిఫ్ అలీని పెళ్లాడింది. ఆరు నెలలు గడవకముందే ఏప్రిల్ 4న ఓ బిడ్డకు జన్మనిచ్చింది. వీరితో పాటు బాలీవుడ్ హీరోయిన్లు దియా మీర్జా కల్కి కొచ్లిన్, నేహా ధూపియా అమృత అరోరా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చారు. -
అత్త కొడుకుతో సన్నిహితం, ఏడు నెలల గర్భం.. బలవంతంగా ప్రసవం
చెన్నై: గర్భం దాల్చిన మైనర్ బాలికకు గుట్టుచప్పుడు కాకుండా ఓ మహిళా డాక్టర్ ప్రసవం చేసింది. దీంతో బాలిక అస్వస్థతకు గురై మృతిచెందింది. విషయం బయటకు పొక్కడంతో డాక్టర్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో సేలం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఇందిరానగర్‌కు చెందిన జగదీశన్ కుమార్తె ఐశ్వర్య (17) అత్త కొడుకుతో సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు వాలప్పాడిలో ఉన్న డాక్టర్ సెల్వంపాల్ రాజ్‌కుమార్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన డాక్టర్ సెల్వం పాల్ ఆమె ఏడు నెలల గర్భవతి అని తెలిపారు. శనివారం ఉదయం ఐశ్వర్యకి ప్రసవం పేరుతో అబార్షన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ అబార్షన్ వీలుకాకపోడంతో బాలికకు ప్రసవం చేశారు. దీంతో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం బాలిక అస్వస్థత ఏర్పడింది. వెంటనే వైద్యం కోసం అంబులెన్స్‌లో సేలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐశ్వర్యను వైద్యులు పరిశీలించి మృతి చెందినట్టు నిర్ధారించారు. పుట్టిన శిశువుకు సేలం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సేలం జిల్లా వైద్య సేవల డైరెక్టర్ వరమతి, ప్రభుత్వ ఆసుపత్రి చీఫ్ డాక్టర్ జయశెల్వి, పేలూరు జిల్లా వైద్యాధికారి నంబలం, ఇతర సభ్యులు డాక్టర్ సెల్వం పాల్‌ను విచారిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వైద్యురాలితోపాటు బాలిక గర్భం దాల్చడానికి కారణమైన బంధువుపై చర్యలు తీసుకోనున్నారు. -
28 ఏళ్లకే తొమ్మిది మందికి జన్మనిచ్చిన మహిళ.. వీడియో వైరల్
మహిళలకు మాతృత్వం ఒక వరం. తమ కుంటూ ఒకరో, ఇద్దరో పిల్లలు ఉండాలనే కోరుకుంటుంది ప్రతి జంట. ఐతే ఏ జంట అయిన తమ ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా తమకు నచ్చిన విధంగా పిలల్లను కనాలని ప్లాన్ చేసుకుంటారు. అది సహజం. కానీ ఇక్కడొక మహిళ ఒకరో ఇద్దరో కాదు ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చింది. అది కూడా కంటిన్యూస్ ప్రతి ఏడాది గర్భం ధరిస్తూ.. పిల్లలను కనింది. వివరాల్లోకెళ్తే..అమెరికాలోని నెవాడా రాష్ట్రానికి చెందిన కోర డ్యూక్ 28 ఏళ్లకే 9 మందికి జన్మనిచ్చింది. ఆమె తొలిసారిగా 17 ఏళ్ల వయసులో తొలి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత నుచి ప్రతి ఏడాది గర్భవతిగా ఉంటూ వచ్చింది. అలా చివరికి 2012లో ఆఖరి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆమెకు 39 ఏళ్లు. ఈ మేరకు డ్యూక్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సంతానం గురించి తెలియజేస్తు వీడియోని షేర్ చేయడంతో అది కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐతే డ్యూక్ తానెప్పుడూ ఇంతమంది పిల్లలను కనాలని అస్సలు అనుకోలేదని చెబుతోంది. సంప్రదాయ గర్భనిరోధక పద్ధతులు విఫలం కావడంతోనే ఇంతమంది సంతానానికి జన్మనిచ్చినట్లు చెప్పింది. ఆమె సంతానం వరసగా ఎలిజా(21), షీనా(20), జాన్(17), కైరో(16), సయా(14), అవీ(13), రోమానీ(12), తాజ్(10) తదితర పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆమె తన భాగస్వామి ఆండ్రి, తన పెద్ద కుటుంబంతో కలిసి జీవిస్తోంది. తొమ్మిదో బిడ్డకు జన్మనిచ్చాక శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Kora Duke 🇮🇳 (@mzkora) (చదవండి: సముద్రాన్నే నివాసంగా..నీటి అడుగున 100 రోజులు జీవించనున్న మనిషి) -
యూట్యూబ్ చూస్తూ ఇంట్లోనే డెలివరీ చేసుకున్న బాలిక.. తల్లి రావడంతో
ముంబై: సోషల్‌మీడియా పరిచయాలు ఊహించని ప్రమాదంలో పడేయడంతో పాటు పలు ఇబ్బందులకు గురి చేసిన ఘటనలు చూస్తునే ఉన్నాం. తెలిసిన వాళ్లే మోసం చేస్తున్న రోజులివి, అలాంటిది కొందరు ఆన్లైన్ స్నేహాలను నమ్మి ఘోరంగా మోసపోతున్నారు. ప్రత్యేకంగా యువత కాలక్షేపం కోసం నెట్టింట్లోకి వెళ్లి బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. ఈ తరహాలోనే 15 ఏళ్ల బాలిక ఇంటర్నెట్లో పరిచయమైన వ్యక్తని నమ్మి గర్భం దాల్చింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా యూట్యూబ్‌లో చూస్తూ ఇంట్లోనే సొంతంగా డెలివరీ చేసుకొంది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. యూట్యూబ్ చూసి... పోలీసుల వివరాల ప్రకారం..నాగ్‌పూర్‌లోని అంబజారీ ప్రాంతానికి చెందిన బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తితో పరిచయమైంది. కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి బాలికకు లైంగికంగా దగ్గరవ్వడంతో ఆమె గర్భం దాల్చింది. ఆ విషయాన్ని బాలిక ఇంట్లో కూడా చెప్పలేదు. ఓ దశలో పొట్ట పెద్దగా ఉందని బాలిక తల్లి ప్రశ్నించగా.. తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అందుకే కడుపు ఉబ్బందని అబద్దం చెప్పింది. అలా బాలిక గర్భవతినన్న విషయాన్ని తన తల్లి నుండి దాచి పెట్టగలిగింది. అనంతరం డెలివరీ ఎలా చేసుకోవాలో యూట్యూబ్ వీడియోలను చూసి తెలుసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును గొంతునులిమి చంపేసి ఇంట్లోనే ఓ బాక్స్‌లో దాచిపెట్టింది. తల్లి ఇంటికి తిరిగి రాగానే బాలిక తీవ్ర అనారోగ్యంతో నీరసంగా కనిపించింది. దీంతో బాలికను గట్టిగా నిలదీయగా విషయాన్ని మొత్తం తల్లికి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శిశువు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. -
గర్భిణీ భార్యను చూసేందుకు సెలవు పెట్టి వచ్చిన జవాన్.. నక్సల్స్ చేతిలో..
రాయ్‌పూర్: గర్భిణీ భార్యను చూసేందుకు సెలవులు పెట్టి ఇంటికి వచ్చిన ఓ జవాన్ మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఛత్తీస్‌గఢ్ కంకేర్ జిల్లా ఉసేలి గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. జవాన్ మృతితో అతని భార్య, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ జవాన్ వయసు 29 ఏళ్లు. గర్భిణీ భార్యను చూసేందుకు వారం రోజులు సెలవుపెట్టి స్వగ్రామం వచ్చాడు. షాపింగ్ చేసేందుకు శనివారం సాయంత్రం గ్రామంలోని మార్కెట్‌కు వెళ్లిన అతడిపై ఇద్దరు మావోయిస్టులు దాడి చేశారు. అతి దగ్గరకు వెళ్లి తుపాకీతో తలపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. జవాన్ సోదరుడితో పాటు గ్రామస్థులంతా చూస్తుండగానే ఈ హత్యకు పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అయితే సాధారణంగా మవోయిస్టులు ఆర్మీ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయరని ఓ విశ్రాంత అధికారి తెలిపారు. సీఆర్పీఎఫ్ లేదా ఇతర సెక్యూరిటీ సంస్థలకు చెందిన జవాన్లపై మాత్రం తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఆర్మీ జవాన్‌ను ఇలా హత్య చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ జవాన్ అనుకునే ఇతడిపై దాడి చేసి ఉంటారని పేర్కొన్నారు. కాగా.. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో గత వారంలోనే ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. చదవండి: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. మూడు గంటల్లోనే సురక్షితంగా బయటకు.. -
గేతో పునర్నవి ప్రెగ్నెంట్ అంటూ పిచ్చిరాతలు.. స్పందించిన నటి
బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఉయ్యాల జంపాల సినిమాలో తొలిసారి కనిపించిన పునర్నవి ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొని యూత్ క్రష్‌గా మారిపోయిందీ బ్యూటీ. ఆ మధ్య వెబ్‌సిరీస్‌లో కనిపించినా ఆ తర్వాత సినిమాలు, సిరీస్‌లకు గుడ్‌బై చెప్పేసి లండన్‌కు వెళ్లిపోయింది. సోషల్ మీడియా ద్వారా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్స్ని షేర్చేసుకునేది. ఈ క్రమంలో రీసెంట్గా పునర్నవి పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఈ మధ్యకాలంలో ఆమె షేర్ చేసిన ఫోటోల్లో పునర్నవి పొట్ట భాగం కాస్త పెద్దదిగా కనిపించడంతో ఈ రూమర్స్‌కి మరింత వైరల్ అయ్యాయి. ఈ విషయం పునర్నవి దాకా చేరడంతో ఆమె కాస్త బోల్డ్‌గానే స్పందించింది. ''నా గే బెస్టీతో ప్రెగ్నెన్సీ వచ్చిందని కొన్ని యూట్యూబ్ చానెల్స్‌లో ఇష్టారీతిన వార్తలు రాసేశారు. ఇది నాన్ సెన్స్. గత నెలలో నేను కాస్త సిక్ అయ్యాయని చెబితే, ప్రాణాపాయం అని రూమర్స్ సృష్టించారు. ఇప్పుడేమో నేను ప్రెగ్నెంట్ అని రాశారు. సోషల్ మీడియాలో చూసి నమ్మేయకండి. ఏది నిజమో, కాదో తెలుసుకోండి. మీరు రాసే పిచ్చిరాతలు అవతలి మనిషిని ఎంతలా ప్రభావితం చేస్తాయో ఆలోచించండి'' అంటూ ఘుటుగానే బదులిచ్చింది. ప్రస్తుతం పునర్నవి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
బిడ్డకు జన్మనివ్వబోతున్న ట్రాన్స్‌మన్.. దేశంలోనే తొలిసారి..
తిరువనంతపురం: కేరళకు చెందిన జియా, జహద్ అనే ట్రాన్స్‌జెండర్ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. మార్చిలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. జియా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. వీరిద్దరూ మూడేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. పుట్టుకతో మగ అయినా జియా.. లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారుతోంది. మరోవైపు అమ్మాయిగా పుట్టిన జహద్ కూడా లింగ మార్పిడి చేయించుకుని అబ్బాయిగా మారుతున్నాడు. అయితే ఈ క్రమంలో గర్భం దాల్చడంతో బిడ్డ కోసం లింగ మార్పిడి ప్రక్రియను నిలిపివేశారు. ఫలితంగా దేశంలోనే గర్బం దాల్చిన తొలి ట్రాన్స్‌మన్‌గా జహద్ నిలిచారు. అయితే అబ్బాయిలా మారాలనుకున్నందున శస్త్రచికిత్సలో భాగంగా జహద్ వక్షోజాలను ఇప్పటికే తొలగించారు. గర్భాశయాన్ని కూడా తొలగించే లోపే జహద్ గర్భందాల్చడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో పుట్టబోటే బిడ్డకు దాతల ద్వారా పాలు సమాకూర్చుకుంటామని ఈ జంట చెబుతోంది. తాను పుట్టుకతో అమ్మాయి కాకపోయినప్పటికీ బిడ్డతో అమ్మ అని పిలుపించుకోవాలని కలలు కనేదాన్నని జియా చెప్పింది. జహద్ కూడా నాన్న కావాలనుకున్నాడని పేర్కొంది. ఎట్టకేలకు తమ కల నేరవేరిందని, మరో నెలలో బిడ్డకు జన్మనిస్తామని ఆనందం వ్యక్తం చేసింది. బిడ్డ దత్తత కోసం ప్రయత్నాలు.. ఈ జంట కొద్దికాలంగా ఓ బిడ్డను దత్తత తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే వీరు ట్రాన్స్‌జెండర్ అయినందున దత్తత ప్రక్రియ సవాల్‌గా మారింది. బయోలాజికల్‌గా జహద్ ఇంకా అమ్మాయే కావడంతో సాధారణ బిడ్డకు జన్మనిచ్చే అవకాశముందని భావించారు. అబ్బాయిగా మారాలనుకున్న జహద్ ఆలోచనను జియా తాత్కాలికంగా వాయిదా వేయించారు. ఇద్దరి ట్రాన్స్‌జెండర్ ప్రక్రియ ఇంకా పూర్తి కానందున పుట్టబోయో బిడ్డకు ఎలాంటి ఇబ్బంది లేదని కోజికోడ్ మెడికల్ కాలేజీ వైద్యులు తెలిపారు. అంతా సాధారణంగానే జరుగుతుందని చెప్పారు. చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగికి షాక్! అటు ఉద్యోగం, ఇటు పెళ్లి చేసుకునే పిల్లా? ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు! -
ఆ శునకం ఎలా గర్భం దాల్చింది? సరిహద్దు భద్రతా దళం దర్యాప్తు!
షిల్లాంగ్: ఏదైనా శునకం గర్భం దాల్చి పిల్లలకు జన్మనిస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, ఆర్మీలోని భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఏకంగా ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టింది. మేఘాలయ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న తమ దళంలోని ఓ స్నైఫర్ డాగ్ మూడు పిల్లలకు జన్మనివ్వడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ అంశంపై డిప్యూటీ కమాండెంట్ ర్యాక్ అధికారి దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు కూడా. మేఘాలయ రాష్ట్ర బీఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్ షిల్లాంగ్ ఇచ్చిన ఆదేశాల కాపీని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ సేకరించింది. స్నైఫర్ డాగ్ గర్భం దాల్చడంపై డిసెంబర్ 19న బీఎస్ఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకు బార్డర్ ఔట్ పోస్టు బాఘ్మారాలో స్నైఫర్ డాగ్ లాల్సీ మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అంశంపై డిప్యూటీ కమాండెంట్ ర్యాక్ అధికారి సమ్మరీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చేయాలని పేర్కొంది. డిసెంబర్ 30, 2022 నాటికి దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు.. శిక్షణ ఇచ్చే బీఎస్ఎఫ్ శునకాలు వాటి సంరక్షకుల పర్యవేక్షణలో భద్రంగా ఉంటాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. రెగ్యులర్‌గా హెల్త్ చెకప్‌లు జరుగుతాయన్నారు. ఈ శునకాలు ఇతర వాటితో ఎప్పుడూ కలవవని, బ్రీడింగ్ చేపడితే అది పశువైద్యుల పర్యవేక్షణలోనే ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం పిల్లలకు జన్మనిచ్చిన స్నైఫర్ డాగ్ లాల్సీ భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కాపలా కాస్తోంది. ఇదీ చదవండి: Cameroon Green: వేలు విరిగిన విషయం తెలియక నాలుగు గంటలు ఓపికగా -
పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత.. తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్
ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి ప్రియ మోహన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్చేస్తూ.. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రెగ్నెంట్. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి అంటూ ఇన్‌స్టాలో పోస్టును షేర్ చేసింది. ఇది చూసిన పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న అట్లీ- ప్రియలు 2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత అట్లీ దంపతులు పేరెంట్స్‌గా ప్రమోట్ కాబోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార, నాజ్రియా, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన రాజారాణి సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు అట్లీ. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో 'జవాన్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
భర్తకు తెలియకుండా అబార్షన్ మాత్ర తీసుకున్న మహిళ.. చివరకు..
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో ప్రీతి కుశ్వాహా అనే 33 ఏళ్ల మహిళ భర్తకు తెలియకుండా అబార్షన్ మాత్రం తీసుకుంది. దీని వల్ల సమస్యలు తలెత్తి తీవ్ర రక్తస్రావమైంది. ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ దంపతులకు 11 నెలల చిన్నారి ఉంది. అయితే ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించగా ప్రీతి మళ్లీ గర్బం దాల్చినట్లు తేలింది. ఇప్పటికే చిన్న పాప ఉన్నందున ఇంత త్వరగా మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె విముఖత వ్యక్తం చేసింది. అబార్షన్ చేయించుకుంటానని భర్తకు చెప్పగా.. అందుకు అతను ఒప్పుకోలేదు. అయితే సోమవారం సాయత్రం భర్త బయటకు వాకింగ్‌కు వెళ్లినప్పుడు ప్రీతి అబార్షన్ మాత్ర తెచ్చుకుని వేసుకుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. భరించలేని కడుపునొప్పితో పాటు రక్తస్రావమైంది. భర్త ఆస్పత్రికి తీసుకెళ్తానంటే ఆమె వద్దంది. కానీ మంగళవారం ఉదయం ప్రీతి స్పృహ తప్పి పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమె భర్త హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. అయితే ప్రీతి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అబార్షన్ మాత్ర వల్లే మహిళ చనిపోయినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. అనుమానాస్పదంగా ఏమీ కన్పించడంలేదని పేర్కొన్నారు. చదవండి: సీబీఐ అధికారులమని చెప్పి రైడ్.. రూ.30 లక్షలు దోచుకెళ్లిన గ్యాంగ్.. -
7 నెలలుగా కోమాలో గర్భిణీ.. పండండి ఆడబిడ్డకు జన్మ
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 7 నెలలుగా అచేతన స్థితిలో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఓ గర్భిణీ(23) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గర్భిణీ యువతి గత వారం బిడ్డకు జన్మనిచ్చినట్లు ఢిల్లీ ఎయిమ్స్ ట్రామాకేర్ విభాగం వైద్యులు తెలిపారు. ఇప్పటికీ ఆ యువతి అచేతన స్థితిలోనే ఉందని, స్వతహాగా ఊపిరి తీసుకోగలుగుతున్నట్లు తెలిపారు. ఒక్కోసారి కళ్లు తెరిచి చూస్తోందని, కొన్ని సంవత్సరాల్లోనే తిరిగి మామూలు మనిషి అయ్యేందుకు 10-15 శాతం అవకాశం ఉందని వెల్లడించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ ఏడాది మార్చి 31న గర్భిణీ మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో భార్యాభర్తలు హెల్మెట్ ధరించలేదు. దీంతో యువతి తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భర్తకు ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవటంతో ఆయన కోలుకున్నారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బూలంద్శహర్లో జరిగింది. తొలుత బాధితురాలికి బులంద్‌శహర్‌లోని అబ్దుల్లా ఆసుపత్రిలో చికిత్స అందించారు. అక్కడి నుంచి ఏప్రిల్ 1న తెల్లవారుజామున ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు మార్చారు. తలకు తీవ్ర గాయాలవగా మెదడులో ఎముక ఉండిపోయినట్ల వైద్యులు గుర్తించారు. ఇప్పటి వరకు 5 రకాల న్యూరోసర్జికల్ ఆపరషన్లు నిర్వహించారు. ఆమె కళ్లు తెరుస్తుందని, కానీ కదల్లేని స్థితిలో ఉందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ‘ప్రమాదం జరిగిన సమయానికి ఆమె 40 రోజుల గర్భిణీ. కడుపులో శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. కుటుంబ సభ్యులు అబార్షన్‌కు ఒప్పుకోలేదు. నెలలు నిండిన ఆమెకు అక్టోబర్ 22న ప్రసవం చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు 2.5 కిలోలు ఉంది. తల్లి అచేతన స్థితిలో ఉండడం వల్ల బిడ్డకు పాలు ఇచ్చే ఆస్కారం లేదు. ప్రస్తుతానికి డబ్బా పాలే అందిస్తున్నాం. ’ అని డాక్టర్లు తెలిపారు. ఇదీ చదవండి: లాటరీలో ఎమ్మెల్యే భార్యకు రూ.కోటి జాక్‌పాట్.. బీజేపీ మనీలాండరింగ్ ఆరోపణ -
ఎయిర్‌లైన్స్‌లో కొత్త రూల్! గర్భిణి క్యాబిన్ సిబ్బంది కూడా...
ఎయిర్‌లైన్స్ గర్భిణి క్యాబిన్ సిబ్బందిని విధుల నుంచి తొలగించనని చెబుతుంది. వారు ఉద్యోగం కొనసాగించేలా ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని కూడా ఇచ్చింది. అంతేగాదు డెలిరీ అయినా తర్వాత కూడా యథావిధిగా ఉద్యోగాన్ని కొనసాగించవచ్చని కూడా స్పష్టం చేసింది. గత కొంతకాలంగా సింగపూర్ ఎయిర్‌లైన్స్‌పై పలు విమర్శులు ఉన్నాయి. లింగ సమానత్వం పాటించడం లేదని గర్భిణి క్యాబిన్ సిబ్బందిని నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. అంతేగాదు వారిని ప్రెగ్నెన్సీ సమయంలో బలవంతంగా వేతనం లేని సెలవుల్లో ఉంచి, తదనంతర డెలివరీ తర్వాత పిల్లల బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వారిని విధుల నుంచి తొలగిస్తుంది. దీనిపై సర్వత్ర విమర్శలు రావడంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఈ కొత్త రూల్‌ని అమలు చేయనుంది. ఇక నుంచి గర్భణి క్యాబిన్ సిబ్బందిని తొలగించమని చెబుతోంది. అంతేగాదు గర్భిణి క్యాబిన్ సిబ్బంది తాత్కాలికంగా గ్రౌండ్ అటాంచ్మెంట్ పని చేసుకోవచ్చని, ప్రశూతి సెలవుల అనంతరం తిరిగి విధులు నిర్వర్తించ వచ్చని పేర్కొంది. ఈ మహమ్మారి కారణంగా సిబ్బంది కొరత సమస్యను ఎదుర్కొనడంతో ఒక కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఈ గర్భిణి సిబ్బంది మూడు నుంచి తొమ్మిది నెలలు గ్రౌండ్ ప్లేస్మెంట్లో విధులు నిర్వర్తించవచ్చు అని తెలిపింది. అలాగే ప్రతిభావంతులైన తమ సిబ్బందిని వదులుకోమని కూడా పేర్కొంది. అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ ఫర్ యాక్షన్ అండ్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొరిన్నా లిమ్ ప్రసవానంతరం తల్లులు విమాన ప్రయాణం చేయకుండా మరైదైన బాధ్యతలు అప్పగించే అవకాశం లేదా అని ప్రశ్నించారు. అంతేగాదు ఈ కొత్త రూల్ కచ్చితంగా అమలవుతుందా అని కూడా ఎయిర్‌లైన్స్‌ని నిలదీశారు. ఐతే సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఈ విషయంపై ఇంకా స్పందించ లేదు. (చదవండి: కొట్టుకువచ్చిన... 500కి పైగా భారీ తిమింగలాలు) -
అబార్షన్ రూల్స్.. ఏ దేశంలో ఎలా?
సరిగ్గా మూడు నెలలు క్రితం అగ్రరాజ్యమైన అమెరికా సుప్రీం కోర్టు అబార్షన్లపై రాజ్యాంగబద్ధంగా మహిళలకు వచ్చిన హక్కుల్ని తోసిపుచ్చుతూ తీర్పు చెప్పడం సంచలనం సృష్టించింది. 1973లో రియో వర్సెస్ వేడ్ కేసు ద్వారా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కుని 50 ఏళ్ల తర్వాత కొట్టేసింది. ఫలితంగా కొన్ని పరిమితుల మధ్య అబార్షన్ చేయించుకునే దేశాల జాబితాలో చేరిపోయింది. అయితే అమెరికాలో రాష్ట్రాలే శక్తిమంతం కావడంతో ఆయా రాష్ట్రాల నిబంధనల ఆధారంగా మహిళలకు అబార్షన్‌పై హక్కులు వస్తాయి. యూరప్ దేశాల్లో అబార్షన్ చేయించుకోవడం అత్యంత సులభమైతే, ఆఫ్రికా దేశాల్లో నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. చైనాలో 1953 నుంచి అబార్షన్ చట్టబద్ధం. జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో 1970 తర్వాత బలవంతపు అబార్షన్లని కూడా ప్రోత్సహించింది. ఇప్పుడు వృద్ధులు పెరిగిపోతూ ఉండడంతో అనవసరంగా అబార్షన్ చేయించుకోవడానికి వీల్లేదంటూ గత ఏడాది ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యూరప్ దేశాల్లో... యూరప్‌లోని అత్యధిక దేశాల్లో మహిళలకు గర్భ విచి్ఛత్తిపై హక్కులున్నాయి. 12–14 వారాల్లోపు అబార్షన్ చేయించుకోవడం పూర్తిగా మహిళల ఇష్టమే. ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్లో 1967లో చట్టం చేశారు. 24 వారాలవరకు అబార్షన్ చేయించుకోవచ్చు. యూకేలో గర్భంలో శిశువు సరిగా ఎదగలేదని తేలితే ఎన్నో నెలలో అయినా గర్భాన్ని తీయించుకునే హక్కు మహిళలకి ఉంది. కెనడాలో గర్భవిచ్ఛిన్నానికి ప్రత్యేకంగా చట్టం లేకపోయినప్పటికీ ఏ దశలోనైనా అబార్షన్ చేయించుకోవచ్చు. యూరప్, లాటిన్ అమెరికా సంప్రదాయ కేథలిక్ దేశాల్లో కూడా మహిళా కార్యకర్తల ఉద్యమాలతో అబార్షన్‌పై హక్కులు కల్పించారు. గత ఏడాది కొలంబియాలో 24 వారాల్లోపు అబార్షన్ చేయించుకోవడం చట్టబద్ధం చేశారు. ఐర్లాండ్‌లో అబార్షన్ చట్టాలకు పరిమితులు విధించడంపై 2018లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మహిళలు తిరస్కరించారు. 12 వారాల్లో ఎప్పుడైనా అబార్షన్ చేయించుకునే హక్కు వారికి ఉంది. న్యూజిలాండ్‌లో 2020లోనే మహిళలకు అబార్షన్లపై హక్కులు వచ్చాయి. 24 దేశాల్లో అబార్షన్ చట్టవిరుద్ధం ప్రపంచంలోని 24 దేశాల్లో అబార్షన్ చేయించుకోవడం చట్టవిరుద్ధం. వీటిలో అత్యధికంగా ఆఫ్రికా దేశాలుంటే ఆసియా, సెంట్రల్ అమెరికా, యూరప్‌కు చెందిన దేశాలు వీటిలో ఉన్నాయి. సెనగల్, మార్షినియా, ఈజిప్టు, లావోస్, ఫిలిప్పైన్స్, ఎల్ సాల్వోడర్, హోండరస్, పోలాండ్, మాల్టాలో మహిళలు చట్టబద్ధంగా అబార్షన్ చేయించుకోలేరు. కొన్ని దేశాల్లో అబార్షన్ చేయించుకుంటే కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. ఎల్ సాల్వేడర్‌లో మహిళలు అబార్షన్ చేయించుకుంటే దోషిగా నిర్ధారించి జైలు శిక్ష కూడా విధిస్తారు. పోలాండ్ గత ఏడాదే అబార్షన్లపై సంపూర్ణ నిషేధాన్ని విధించింది.పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన వయసులో ఉండే ప్రపంచ మహిళా జనాభాలో 5% మంది ఈ 24 దేశాల్లోనే ఉన్నారు. అంటే దాదాపుగా 9 కోట్ల మందికి మహిళలకి అబార్షన్ చేయించుకునే హక్కు లేదని సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ రైట్స్ సంస్థ నివేదికలో వెల్లడైంది. 50 దేశాల్లో పరిమితులతో హక్కులు దాదాపుగా 50 దేశాల్లో అబార్షన్ చేయించుకునే హక్కు ఉన్నప్పటికీ కొన్ని పరిమితులున్నాయి. లిబియా, ఇండోనేసియా, నైజీరియా, ఇరాన్, వెనిజులాలో తల్లి ప్రాణాలు ప్రమాదం ఉంటే మాత్రమే అబార్షన్ చేయించుకోచ్చు. మిగిలిన దేశాల్లో అత్యాచారం, అవాంఛిత గర్భధారణ, గర్భంలో శిశువు ఎదుగుదలలో లోపాలుంటే అబార్షన్ చేయించుకోవడానికి అనుమతినిస్తారు. బ్రెజిల్లో అత్యాచారం వల్ల గర్భం వచి్చనా, గర్భస్థ పిండం ఎదగకపోయినా గర్భస్రావానికి అనుమతిస్తారు కానీ వైద్యులు, వైద్య రంగంలో కనీసం ముగ్గురు అనుమతి తప్పనిసరి. - సాక్షి, నేషనల్ డెస్క్ -
సగం సంపద ఆవిరైంది.. గుడ్‌న్యూస్ చెప్పిన మార్క్ జుకర్‌బర్గ్!
ఫేస్బుక్ వ్యవస్థాపక సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ భారీగా సంపద కోల్పోయి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవల తన సంపద ఊహించిన స్థాయిలో కరిగిపోవడం, కంపెనీ షేర్లు కూడా పతనం వైపు పరుగులు పెట్టడం వంటి ఘటనలతో విచారంలో ఉన్న తనకి ఓ గుడ్ న్యూస్ పలకరిస్తూ ఊరటనిచ్చింది. జుకర్‌బర్గ్ మూడోసారి తండ్రి కాబోతున్నాడు. తన భార్య ప్రిస్సిల్లా చాన్ గర్భవతి అయ్యిందని, ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అందులో.. “లాట్స్ ఆఫ్ లవ్. వచ్చే ఏడాది మాక్స్, ఆగస్ట్‌లకు చెల్లెలిని రాబోతోందని ఈ గుడ్ న్యూస్ పంచుకోవడానికి సంతోషంగా ఉందని” పోస్ట్ చేశారు. మార్క్ జుకర్‌బర్గ్, ప్రిస్సిల్లా చాన్ 2003లో హార్వర్డ్ యూనివర్శిటీ ఫ్రాట్ పార్టీలో కలుసుకున్న తర్వాత డేటింగ్ ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి రిలేషన్లో ఉన్న వీరు 2012లో వివాహం చేసుకున్నారు. ఇటీవలే వారి 10వ వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు- ఆగస్ట్, మాక్సిమా. మెటా’ అభివృద్ధి, రీబ్రాండింగ్‌పై దృష్టిపెట్టడంతో జుకర్‌బర్గ్‌కు సంపద భారీగా క్షీణించిన సంగతి తెలిసిందే. ఫలితంగా కేవలం 55.9 బిలియన్ డాలర్ల నికర విలువతో ఇటీవల ప్రపంచ బిలియనీర్లలో 20వ స్థానంలో నిలిచారు. ఈ పరిణామాలతో మార్క్ సగం సంపద వరకు కోల్పోయాడు. 2014 నుండి ఆయనకిదే అత్యల్ప స్థానం కావడం గమనార్హం. రెండేళ్ల కిందట మార్క్ సంపద 106 బిలియన్ డాలర్లుగా ఉంది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) చదవండి: కరోనా ఎఫెక్ట్: ఆ కేటగిరి అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్.. టూ కాస్ట్లీ గురూ! -
భరోసా ఇవ్వాలి.. బాధ్యతగా ఉండాలి
‘‘నెల నెలా డాక్టర్ దగ్గరకు వెళ్తున్నావా’’ ‘‘న్యూట్రిషనిస్ట్ ఇచ్చిన డైట్ చార్ట్ ప్రకారం తింటున్నావా’’ ‘‘రోజూ వాకింగ్ చేస్తే డెలివరీ సులువవుతుంది’’ ‘‘నీకేం తినాలని ఉందో చెప్పు... చేసి పంపిస్తాను’’ గర్భిణికి ఇలాంటి ఆత్మీయ పలకరింపులెన్నో. ఆత్మీయతలు... ఆనందాలు బయటకు కనిపిస్తాయి. ఆమె మనసు పడే సంఘర్షణ బయటకు కనిపించదు. ఆమె మనసు మౌనంగా మాట్లాడుతుంది. జీవిత భాగస్వామి ఆ మనసు భాషను అర్థం చేసుకోవాలి. తగిన సహకారం అందించాలి. గర్భిణులకు క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ చేసుకోవాలని చెబుతుంటాం. పోషకాహారం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతుంటాం. వ్యాయామం ఎంత అవసరమో సూచిస్తుంటాం. బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఒకమ్మాయి గర్భం దాల్చిందని తెలియగానే ఫోన్ చేసి అభినందనలు చెబుతూ రకరకాల పరామర్శల్లో భాగంగా పై జాగ్రత్తలన్నీ చెబుతుంటాం. మరొక అడుగు ముందుకు వేసి మనసును ప్రశాంతంగా ఉంచుకోమనే ఓ మంచిమాట కూడా. అయితే గర్భంతో ఉన్న మహిళకు ఈ జాగ్రత్తలతోపాటు సైకాలజిస్ట్ కౌన్సెలింగ్ కూడా అవసరమనే సున్నితమైన విషయాన్ని చెప్పేవాళ్లుండరు. ‘సైకాలజిస్ట్‌ను సంప్రదించడం ఎందుకు? ఏ మానసిక సమస్య ఉందని’ అనే ప్రతిస్పందన కొంచెం ఘాటుగా కూడా వినిపిస్తుంటుంది. ‘నిజానికి పై జాగ్రత్తలన్నింటితోపాటు మానసిక విశ్లేషకుల సలహాలు, సూచనలు కూడా అవసరమే. ఆ సూచనలు గర్భంతో ఉన్న మహిళకు మాత్రమే కాదు భర్తకు కూడా’ అంటున్నారు క్లినికల్ సైకాలజిస్ట్ కాంతి. ఇద్దరికీ కౌన్సెలింగ్ ‘‘ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఉండాలి. తల్లి కావాలనే అందమైన ఆకాంక్ష ప్రతి మహిళకూ ఉంటుంది. అలాగే మాతృత్వం గురించిన మధురోహలతోపాటు అనేకానేక భయాలు కూడా వెంటాడుతుంటాయి. ప్రసారమాధ్యమాల్లో వచ్చే అనేక దుర్వార్తల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తన బిడ్డకు అలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయేమోననే భయం వెంటాడుతూ ఉంటుంది. ఆమె తన భయాలను భర్తతో పంచుకున్నప్పుడు వచ్చే ప్రతిస్పందన చాలా కీలకం. నిర్లక్ష్యంగానో, విసుగ్గానో రెస్పాండ్ అయితే గర్భిణి మనసుకయ్యే గాయం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే గర్భిణిలో తలెత్తే శారీరక, మానసికమైన మార్పుల గురించిన అవగాహన భర్తకు ఉండి తీరాలి. అందుకే కౌన్సెలింగ్‌కి ఇద్దరూ రావాలని చెబుతాం. కొంత మంది భర్తలు ప్రెగ్నెంట్ ఉమన్‌తో వాళ్ల తల్లిని లేదా సోదరిని పంపిస్తుంటారు. ఎట్టి పరిస్థితిలోనూ ఇలాంటి రాజీలు ఉండకూడదని చెబుతుంటాం. భార్య మానసిక స్థితిలోని సున్నితత్వం స్థాయులు భర్తకు అర్థమైనప్పుడే అతడు భార్యకు అన్ని వేళల్లోనూ అండగా నిలబడగలుగుతాడు. మెంటల్ వెల్బీయింగ్ గురించిన అవగాహన ఇద్దరిలో ఉన్నప్పుడే పాపాయిని జాగ్రత్తగా చూసుకోవడంలో కూడా పరిణతితో వ్యవహరించగలుగుతారు. మూడో వ్యక్తికి సాదర స్వాగతం సాధారణంగా మన ఇళ్లలో గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెను అందరూ అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. డెలివరీ తర్వాత బాధ్యతలన్నీ ఆమె భుజాల మీద మోపుతూ జాగ్రత్తల పేరుతో ఆమెను కట్టడి చేస్తుంటారు. నిజానికి ఈ దశలో భర్త సపోర్టు చాలా అవసరం. పోస్ట్ పార్టమ్ డిజార్డర్ ఒక్కొక్కరిలో ఒక్కో స్థాయిలో ఉంటుంది. మహిళ తన జీవితం ఒక్కసారిగా స్తంభించి పోయినట్లు భావిస్తుంది. ఒంటరితనం, నెగిటివ్ థాట్స్, ‘అందరూ సంతోషంగా ఉన్నారు... నా జీవితమే ఇలాగైంది, సోషల్ లైఫ్‌కు దూరంగా ఇంట్లో నాలుగ్గోడలకే పరిమితమైపోయింది జీవితం... అని దిగులు పడడం వంటి ఆలోచనలన్నీ వస్తుంటాయి. ఎందుకంటే చాలామంది మగవాళ్లకు తండ్రి అయిన తర్వాత కూడా లైఫ్‌స్టయిల్ ఏమీ మారదు. ఆడవాళ్ల విషయంలో అందుకు పూర్తిగా భిన్నం. అలాంటప్పుడే భర్త పట్టించుకోవడం లేదనే న్యూనత కూడా మొదలవుతుంది. అందుకే పోస్ట్ డెలివరీ ప్రిపరేషన్ గురించి డెలివరీకి ముందే భార్యాభర్తలిద్దరినీ మానసికంగా సిద్ధం చేయడం జరుగుతుంది. మగవాళ్లు తండ్రి అయిన సంతోషాన్ని బయట స్నేహితులతో సెలబ్రేట్ చేసుకోవడం సరికాదు, ఇంట్లోనే స్నేహితులతో గెట్ టు గెదర్ ఏర్పాటు చేసి భార్యను కూడా వేడుకలో భాగస్వామ్యం చేయాలి. పెటర్నిటీ లీవ్ సౌకర్యం ఉంటుంది. ఆ సెలవు తీసుకుంటారు, కానీ భార్యకు సహాయంగా ఉండక ఇతర వ్యాపకాలతో గడిపే వాళ్లూ ఉంటారు. కానీ తమ కుటుంబంలో మూడో వ్యక్తికి స్వాగతం పలికే క్రమంలో ప్రతి దశలోనూ భర్తను భాగస్వామ్యం చేయగలిగితే ఇలాంటి పరిణామాలుండవని నా అభిప్రాయం. డెలివరీ అయిన మహిళలకు దేహాకృతి విషయంలో ఎక్కడ లేని ఆందోళన మొదలవుతుంటుంది. దేహం తిరిగి మామూలు కాదనే భయం వెంటాడుతుంటుంది. మరికొందరు... నా బిడ్డకు నేను చేయాల్సినంత చేయడం లేదేమో, నేను మంచి తల్లిని కాలేనేమో అని బాధపడుతుంటారు. ఒక్కొక్కరైతే తమలో తామే బాధపడుతూ మౌనంగా రోదిస్తుంటారు, పెద్దగా వెక్కి వెక్కి ఏడుస్తారు కూడా. భావోద్వేగ పరమైన అసమతుల్యతకు లోనవుతున్న విషయాన్ని గుర్తించలేకపోతారు. మా కౌన్సెలింగ్‌లో భార్యాభర్తలిద్దరికీ ఇలాంటి విషయాలన్నింటి మీద అవగాహన కల్పిస్తాం. కాబట్టి భార్య మానసికంగా న్యూనతకు లోనయినప్పుడు ఎమోషనల్ సపోర్టు ఇవ్వాలనే విషయం మగవాళ్లకు తెలుస్తుంది. – ఎమ్. కాంతి, క్లినికల్ సైకాలజిస్ట్ హైదరాబాద్ చర్చ కావాలి... వాదన వద్దు! ఇక చంటి బిడ్డను చూడడానికి ఇంటికి వచ్చిన వాళ్లు కూడా ‘ఫలానా ఆమె తన బిడ్డను కింద పెట్టకుండా ఒంటి చేత్తో పెంచుకుంటోంది’ వంటి స్టేట్మెంట్లు అలవోకగా ఇచ్చేస్తుంటారు. ఆ మాటల ప్రభావంతో అన్నీ తనే చూసుకుంటూ సూపర్ మామ్ కావాలనే అవసరం లేని పట్టుదలకు కూడా పోతుంటారు చంటిబిడ్డల తల్లులు. ఇలాంటి కామెంట్లకు ప్రభావితం కాకుండా, విపరీత పరిణామాలకు తావివ్వకుండా ఉండాలి. భార్యాభర్తల మధ్య డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇద్దరికీ అవగాహన ఉంటే చంటిబిడ్డను పెంచడంలో భార్యాభర్తలిద్దరూ సమంగా బాధ్యతలు పంచుకోగలుగుతారు. ప్రతి విషయాన్నీ చక్కగా చర్చించుకోవాల్సిన అవసరాన్ని తెలియచేస్తాం. అలాగే ఇద్దరి మధ్య డిస్కషన్ వాదనకు దారి తీయకూడదనే హెచ్చరిక కూడా చేస్తాం. సామరస్యమైన చర్చ ద్వారా సమస్యలకు పరిష్కారాలు కనిపిస్తాయి. వితండ వాదన వివాదానికి దారి తీస్తుంది. మన సంప్రదాయ పెంపకంలో... మగవాళ్లను అనేక విషయాలకు దూరంగా ఉంచడమే జరిగింది ఇంతవరకు. భార్యకు ఎమోషనల్ సపోర్టు ఇవ్వడం, బిడ్డ పెంపకంలో బాధ్యతను పంచుకుంటూ బాలింతకు విశ్రాంతినివ్వడం వంటివేవీ మగవాళ్లకు తెలియచేయడం ఉండదు. అందుకే ఏ విషయంలోనైనా భర్త తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటే అది అతడికి ఎలా స్పందించాలో తెలియక పోవడం కూడా అయి ఉండవచ్చు. అపోహ పడడానికి ముందు అతడికి తెలియచేసే ప్రయత్నం చేయాలని కూడా మహిళలకు చెబుతుంటాం. భార్యకు ధైర్యం చెప్పి అండగా నిలవాల్సిన బాధ్యతను భర్తకు గుర్తు చేస్తుంటాం’’ అన్నారు కాంతి. – వాకా మంజులారెడ్డి -
రోడ్డున పడిన నిండు గర్భిణి... కనికరం చూపని అంబులెన్స్ డ్రైవర్: వీడియో వైరల్
లక్నో: నడిరోడ్డుపై నిండు చూలాల్ని వదిలి వెళ్లిపోయాడు ఒక అంబులైన్స్ డ్రైవర్. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమిర్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఆ గర్భిణి కుటుంబం అంబులెన్స్ డ్రైవర్ అడిగినంత డబ్బు చెల్లించలేకపోవడంతో అమానుషంగా నడిరోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. ఈ ఘటనను జర్నలిస్ట్ రాజేష్ సాహు వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేస్తూ.... ఉత్తరప్రదేశ్‌లోని అంబులెన్స్ కంపెనీలకు వారి డ్రైవర్ల వైఖరి గురించి తెలియదు అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టాడు. సదరు మహిళ హమీర్‌పూర్‌లోని పండరి గ్రామానికి చెందిన మహిళ అని, ఆమె కుటుంబాన్ని రూ 1000 ఇవ్వాల్సిందిగా అంబులైన్స్ డ్రైవర్ డిమాండ్ చేశాడని వివరించాడు. బాధిత మహిళ కుటుంబం ఇవ్వలేక పోవడంతోనే గర్భిణి రోడ్డున పడిందని ట్విట్టర్లో తెలిపాడు. దీంతో నెటిజన్లు సదరు అంబులెన్స్ డ్రైవర్ని శిక్షించాలని ఒకరు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్ తీసుకుని సదరు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానంటూ మరొకరు కామెంట్లు చేస్తూ... ట్వీట్ చేశారు. यूपी में एंबुलेस कंपनी और उनके ड्राइवरों की बदमाशी कौन नहीं जानता। ये वीडियो हमीरपुर के पंधरी गांव का है। परिवार के पास देने के लिए 1000 नहीं थे इसलिए गर्भवती महिला को सड़क पर ही छोड़ दिया। इतने निर्मम लोगों हैं कि क्या ही कहा जाए। pic.twitter.com/So8OKthLsP — Rajesh Sahu (@askrajeshsahu) September 6, 2022 (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
గర్భిణి మృతి... దెబ్బకు రాజీనామా చేసిన ఆరోగ్యమంత్రి
పోర్చుగల్‌లోని లిస్బన్లో ప్రధాన ఆస్పత్రి శాంటా మారియాలో నియోనాటాలజీ సేవలు లేవు. దీంతో మరొక ఆస్పత్రికి అంబులెన్స్‌లో గర్భిణిని తరలిస్తున్నారు. ఆ సమయంలో గర్భిణి గుండెపోటుకు గురై మృతి చెందింది. ఈ ఘటన పోర్చుగల్ ఆరోగ్యమంత్రి మార్టా టెమిడో రాజీనామ చేసే పరిస్థితికి దారితీసింది. అత్యవసర ప్రసూతి ఆస్పత్రులను తాత్కలికంగా మూసివేయాలని ఆమె తీసుకున్న నిర్ణయమే రాజీనామ చేసేవరకు తీసుకువచ్చింది. వాస్తవానికి గత వేసవి సెలవుల్లో పలు ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులు లేకపోవడంతో వారంతాల్లో ఉండే అ్యతవసర ప్రసూతి సేవలను మూసేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐతే ప్రతిపక్షాలు, మున్సిపాలిటీలు గర్భిణులు ఎమర్జెన్సీ సమయంలో సుదూర ప్రాంతాలకు వెళ్లలేరని, ఇది అతి పెద్ద తప్పుడు నిర్ణయం అంటూ దుమ్మెత్తిపోశాయి. సిబ్బంది కొరత కారణంగా గత్యంతరం లేని స్థితిలో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. టెమిడో 2018లో ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. అంతేకాదు కోవిడ్-19కి వ్యతిరేకంగా విజయవంతమైన వ్యాక్సిన్ ప్రచారాన్ని నిర్వహించింది కూడా. అత్యంత ప్రజాదరణ పొందిన మంత్రుల్లో ఆమె ఒకరు. ఐతే ఆమె ప్రసూతి వైద్యానికి సంబంధించిన విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం తోపాటు తాజాగా సదరు గర్భిణి మహిళ కూడా చనిపోవడం ప్రతిపక్షాల విమర్శలకు ఆజ్యం పోసినట్లయింది. ఈ మేరకు టెమిడో ఆరోగ్య మంత్రిత్వ శాఖ్య ప్రకటనలో తాను ఇక పదవిలో కొనసాగే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదని, అందువల్ల తాను పదవి నుంచి వైదొలగాలని నిర్ణియించుకున్నట్లు వెల్లడించింది. ఐతే దీన్ని పోర్చుగల్ ప్రధాని ఆంటోనియాఓ కోస్టా.. టెమిడో రాజీనామను ఆమోదించడమే కాకుండా ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల ధన్యావాదాలు కూడా తెలిపారు. (చదవండి: వాషింగ్టన్లో కాల్పులు కలకలం...ఇద్దరికి గాయాలు) -
తోపుడు బండిపై ఆసుపత్రికి గర్భిణి.. తీరా వెళ్లాక ట్విస్ట్!
భోపాల్: తన గర్భిణీ భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఓ వ్యక్తి. అంబులెన్స్ రాకపోవటంతో తోపుడు బండిపై స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు లేరు. కనీసం నర్సులు సైతం లేకపోవటంతో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక సంఘటన మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని రానేహ్ ప్రాంతానికి చెందిన కైలాస్ అహిర్వార్ అనే వ్యక్తి భార్య కాజల్ నిండు గర్భిణీ. ఆమెకు మంగళవారం పురిటి నొప్పులు రావడం వల్ల కైలాస్.. అంబులెన్స్‌కు కాల్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అంబులెన్స్రాలేదు. దీంతో చేసేదేం లేక తోపుడు బండిపై ఆమెను పడుకోబెట్టి కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక ఆస్పత్రిలో వైద్యుడు, నర్స్ అందుబాటులో లేరు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండగా.. అక్కడే ఉన్న కొందరు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ రాగా హాటా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. చివరకు జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా మెడికల్ఆఫీసర్ఆర్పీ కోరి సమగ్ర విచారణ చేపడతామని చెప్పారు. Husband of a pregnant woman carried her to hospital on a push-cart for want of ambulance in Damoh, Kailash Ahirwal reached the local government-run Arogya Kendra after 2 kms journey, there was no doctor or nurse there, he alleged @ndtv @ndtvindia pic.twitter.com/cXj94L5oX5 — Anurag Dwary (@Anurag_Dwary) August 31, 2022 ఇదీ చదవండి: ఇదెక్కడి న్యాయం.. ఆ వార్త రాసిన జర్నలిస్టులపై ఐటీ యాక్ట్ కింద కేసులా? -
పోలీసుల నిర్వాకం.. గర్భిణి ఖైదీకి గర్భస్రావం, పరిహారంగా రూ. 3 కోట్లు
Pregnant Inmate Suffered Miscarriage As Cops Stopped At Starbucks: అమెరికాలో ఆరెంజ్ కౌంటీ జైలులో ఉన్న మహిళా ఖైదీకి పోలీసుల నిర్లక్ష్యం కారణంగా గర్భస్రావం అయ్యింది. దీంతో కోర్టు బాధిత మహిళకు పరిహారంగా రూ. 3 కోట్లు చెల్లించమని జైలు అధికారులను ఆదేశించింది. వాస్తవానికి 2016లో సదరు మహిళా ఖైదీ 28 ఏళ్ల సాండ్రా క్వినోన్స్కి కొన్ని షరతులతో కూడిన బెయిల్ పై విడుదలైంది. ఐతే ఆమె ఆ బెయిల్ నియమాలను ఉల్లంఘించడంతో జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది. అదే సమయంలో ఆమె గర్భవతి. ఐతే ఆమెకు ఒక రోజు ఉమ్మనీరు లీకవ్వడంతో తన పరిస్థితి బాగోలేదని ఆస్పత్రికి తీసుకెళ్లండని పోలీసులను వేడుకుంది. కానీ పోలీసులు ఆమె పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకువెళ్లడమే కాకుండా గర్భవతి అని కనికరం లేకుండా ... ఇంతటి ఎమర్జెన్సీ టైంలో ఒక కాఫీ హోటల్ వద్ద కారుని చాలాసేపు ఆపేశారు. కనీసం అంబులెన్స్‌కి కూడా కాల్ చేయలేదు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా... ఆమె తన బిడ్డను కోల్పోవలసి వచ్చింది. దీంతో సదరు మహిళా ఖైదీ తనకు న్యాయం చేయాలంటూ కోర్టు మెట్లెక్కింది. బాధితురాలి తరుఫు న్యాయవాది నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె పట్ల పోలీసులు కావాలనే ఉదాసీనతగా వ్యహరించారని కోర్టుకి తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే అంబులెన్స్‌కి కాల్ చేయలేదని రెండు గంటల ఆలస్యం కారణంగా అత్యంత విలువైన మాతృత్వపు భాగ్యాన్ని పొందలేకపోయిందని చెప్పారు. దీంతో కోర్టు జైలు సూపర్వైజర్స్ని బాధిత ఖైదీ క్వినోన్స్‌కు సుమారు రూ. 3 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. దీనికి జైలు సూపర్ వైజర్లు అంగీరించారు గానీ అందుకు సదరు బాధితురాలు కూడా అంగీకరిస్తేనే ఈ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఖరారు అవుతుందని కూడా స్పష్టం చేసింది. తొలుత సదరు మహిళా ఖైదీ పిటీషన్ని అక్టోబర్ 2020లో ఫెడరల్ కోర్టు కొట్టేసింది, కానీ అప్పీల్ కోర్టు గతేడాది ఈ కేసును తిరిగి పునరుద్ధరించి ఈ తీర్పును వెల్లడించింది. (చదవండి: పాకిస్తాన్లో అత్యవసర పరిస్థితి... 937 మంది మృతి) -
ఆ మమ్మీకి అరుదైన కేన్సర్ ?
వార్సా: రెండు వేల ఏళ్ల క్రితం నాటి ఈజిప్ట్ మమ్మీ అవశేషాల్లో ఒక అరుదైన కేన్సర్ ఆనవాళ్లు కనిపించాయి. 19వ శతాబ్దంలో ఈ మమ్మీని పరిశోధనల కోసం ఈజిప్టు నుంచి పోలండ్‌కు తీసుకువచ్చారు. అప్పుడే శాస్త్రవేత్తలు ఈ మమ్మీ గర్భిణిగా ఉన్నప్పుడే మరణించిందని నిర్ధారించారు. గర్భిణిగా ఉన్న ఒక ఈజిప్టు మమ్మీ లభించడం ప్రపంచంలో అదే తొలిసారి. ఆమెకు 20 ఏళ్ల వయసు ఉంటుందని, మరణించే సమయానికి 28 వారాల గర్భంతో ఉన్నట్టు తేలింది. ఇప్పుడు ఈ అరుదైన కేన్సర్ గురించి వెలుగులోకి వచ్చింది. పోలండ్‌లోని వార్సా మమ్మీ ప్రాజెక్టుకి (డబ్ల్యూఎంపీ) చెందిన శాస్త్రవేత్తలు తాము చేస్తున్న అధ్యయనాల్లో భాగంగా ఆ మమ్మీ పుర్రెకి స్కానింగ్ తీయగా ఎముకల్లో కొన్ని గాయాల గుర్తులు కనిపించాయి. నేజోఫరెంజియో అనే అరుదైన కేన్సర్ సోకే రోగుల ఎముకల్లో ఇలాంటి గురుతులే ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మమ్మీ అదే కేన్సర్‌తో మరణించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది ఒకరకమైన గొంతు కేన్సర్. ముక్కు వెనుక భాగం నుంచి నోటి వెనుక భాగాన్ని కలిపి ఉంచే భాగానికి ఈ కేన్సర్ సోకుతుంది. డబ్ల్యూఎంపీ ఈ పుర్రె భాగానికి చెందిన ఫోటోలను విడుదల చేసింది. అందులో ఎముకలపై కనిపించిన కొన్ని మార్కింగ్‌లను చూస్తే అవి కేన్సర్ వల్ల ఏర్పడినవని భావిస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
నిశ్చితార్థమైంది వదిలేయాలని కోరితే.. సన్నిహిత వీడియోలు కాబోయే భర్తకు పంపిస్తానని
సాక్షి, హైదరాబాద్: ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి మోసం చేసిన యువకుడిపై తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ శ్రవణ్‌కుమార్ బుధవారం వివరాలు వెల్లడించారు. తిరుమలగిరి విలేజ్ దర్గా ప్రాంతానికి చెందిన యువతి లెక్చరర్‌గా పనిచేస్తుంది. 2017లో ఆమెకు అత్తాపూర్ కిషన్ భాగ్ ప్రాతానికి చెందిన దూరపు బంధువు నిహాల్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారి తీసింది. గత ఏడాది జూలై 1న అత్తాపూర్ వెళ్లిన ఆమెను నిహాల్‌సింగ్ టెర్రస్ పైన ఉన్న గదికి రప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా నిహాల్ సింగ్ పలు మార్లు లాడ్జీలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా బాధితురాలు గత డిసెంబర్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పగా నిశ్చితార్థం జరిగినా తాను పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికాడు. గత ఫిబ్రవరిలో ఆమెకు నిశ్చితార్థం జరగడంతో తనను వదిలివేయాలని కోరగా తనతో కలిసి ఉన్న వీడియోలు తీశానని తన కోరిక తీర్చకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమేగాక కాబోయే భర్తకు కూడా పంపిస్తానని బెదిరించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేగాక నిహాల్ సూచన మేరకు పెళ్లి కూడా రద్దు చేసుకుంది. ఇటీవల తాను గర్భం దాల్చినట్లు గుర్తించిన బాధితురాలు పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేయడంతో ఈనెల 6న తల్లితో సహా తిరుమలగిరికి వచ్చిన నిహాల్ సింగ్ ఆమెను పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పడంతో బాధితురాలు మంగళవారం తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటన: బాధితురాలిని ట్రాప్ చేసింది ఎవరంటే.. -
ఇద్దరూ కవలలే.. కానీ బర్త్‌డే ఎవరిది వారిదే.. అదేంటి!
మామూలుగా కవలలు అంటే తల్లి కడుపులో కలిసి పెరిగి, కలిసి పుట్టేవారే. అలాంటివారు కొద్ది నిమిషాల తేడాలో జన్మిస్తుంటారు. అరుదుగా గంటా రెండు గంటలు కూడా తేడా ఉంటుంది. ఒకే పోలికలతో పుట్టేవారి (ఏకరూప కవలల) మధ్య అయితే మాత్రం తేడా నిమిషాల్లో మాత్రమే ఉంటుంది. కానీ అమెరికాలోని అబిలీన్‌లో కార్మెన్ మార్టినెక్స్ అనే మహిళకు తొలి పాప పుట్టిన తర్వాత మూడు రోజులకు రెండో పాప జన్మించింది. నిజానికి మార్చి తొలివారంలో ఆమెకు పురుటి నొప్పులు వచ్చాయి. ఆస్పత్రికి తీసుకెళితే మార్చి 7న ఒక పాపకు జన్మనిచ్చింది. రెండో పాప గర్భంలో అలాగే ఉండిపోయింది. ఆ శిశువు ఆరోగ్యంగానే ఉండటంతో వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచారు. మూడు రోజుల తర్వాత మార్చి 10న మార్టినెక్స్ రెండో పాపకు జన్మనిచ్చింది. మొదటి పాపకు గాబ్రియేలా గ్రేస్ అని, రెండో పాపకు ఇసబెల్లా రోస్ అని పేరుపెట్టారు. ‘‘ఇద్దరికీ ఒకే రోజు ఏంటి? నా స్పెషల్‌డే పార్టీ నాకు ఉండాల్సిందే అనుకుంటూ ఇసబెల్లా లేటుగా పుట్టేసింది. ఏమైనా నా పిల్లలు సమ్‌థింగ్ స్పెషల్’’ అంటూ మార్టినెక్స్ మురిసిపోతోంది. అత్యంత అరుదుగా.. ఇద్దరూ పూర్తిగా ఎదగకముందే కేవలం 24–25 వారాల్లోనే, కేవలం 700 గ్రాముల బరువుతోనే పుట్టడంతో.. మూడు నెలలుగా పిల్లల ఐసీయూ (ఎన్ఐసీ యూ)లో ఉంచారు. అసలు బతుకుతారో లేదో అనే పరిస్థితి నుంచి ఇక ప్రమాదం లేనట్టేననే దశకు చేరాక.. వైద్యులు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఇలా కవలలు మూడు రోజుల తేడాతో జన్మించడం అత్యంత అరుదైన విషయమని ప్రకటించారు. చదవండి: బార్లో బాయ్‌ఫ్రెండ్ నిర్వాకం.. కారుతో తొక్కి చంపేసిన ప్రియురాలు -
పురిటి నొప్పులతో ఆసుపత్రికి.. అమ్మతనం ఆస్వాదించకుండానే..
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: తొలి కాన్పుతో అమ్మతనం ఆస్వాదించాలని ఆమె ఎన్నో కలలు కన్నది. గర్భందాల్చిన నాటి నుంచే పుట్టబోయే బిడ్డను ఊహించుకుంటూ మురిసిపోయింది. నెలనెలా పెరుగుతుంటే తన్మయం పొందింది. నెలలు నిండి పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ వైద్యుల నిర్లక్ష్యంతో కాన్పు కాకుండానే కన్నుమూసింది. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ రిమ్స్‌లో శుక్రవారం జరిగింది. అసలేం జరిగింది.. ఆదిలాబాద్ పట్టణం పుత్లీబౌళి సమీపంలోని కేవీ.నగర్‌కు చెందిన కొర్రి రాజుకు గతేడాది జూలై 1న ఇచ్చోడ మండలం బోరిగామకు చెందిన అక్షిత(22)తో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. గురువారం పురుటినొప్పులు రావడంతో సాయంత్రం 4 గంటలకు కుటుంబ సభ్యులు రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ప్రసవానికి సమయం ఉందని చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో మళ్లీ నొప్పులు రావడంతో ఈ విషయాన్ని సమీపంలోని ఆశ కార్యకర్తకు తెలియజేశారు. దీంతో ఆమె అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆమెకు ఫిట్స్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రిమ్స్‌కు 4 గంట లకు చేరుకున్నారు. ఆ తర్వాత మెటర్నిటీ వార్డుకు తీసుకెళ్లగా వైద్యులు అందుబాటులో లేరు. స్టాఫ్ నర్సులు మాత్రమే ఉన్నారు. వారు అక్షితకు ఇంజెక్షన్ ఇచ్చా రు. ఎలాంటి చికిత్స చేయకపోవడంతో ఉదయం 6 గంటలకు గర్భిణిమృతి చెందింది. మృతదేహంతో ఆందోళన.. వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతిచెందిందని అక్షిత కుటుంబ సభ్యులు, బంధువులు రిమ్స్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒకరోజు ముందుగా ఆస్పత్రికి వచ్చినా చికిత్స చేయకుండా తిరిగి ఇంటికి పంపించారని తెలిపారు. మళ్లీ పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకొస్తే వైద్యులు అందుబాటులో లేక చికిత్స చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు అందుబాటులో ఉండి చికిత్స చేస్తే అక్షిత బతికేదని పేర్కొన్నారు. గర్భిణి మరణ వార్త తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, రాష్ట్ర నాయకురాలు సుహాసినిరెడ్డి రిమ్స్‌కు చేరుకున్నారు. బాధితులతో మాట్లాడారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ విచారణ కమిటీ ఏర్పాటు చే స్తామని తెలిపారు. ముగ్గురు సీనియర్ వైద్యులతో వి చారణ జరిపించి వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే శా ఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తల్లడిల్లుతున్న తల్లులు.. గర్భిణులతోపాటు గర్భంలోనే శిశువులు మృత్యువాత పడుతున్న ఘటనలు జిల్లాలో పెరిగిపోతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ సంఘటనలు జరుగుతున్నాయని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలింతతోపాటు శిశువు మృతిచెందగా, అదే ఆస్పత్రిలో చికిత్స పొందిన ఓ గర్భిణి కడుపులోనే బిడ్డ మృతిచెందింది. రిమ్స్ ఆస్పత్రిలో కూడా ఓ గర్భిణి కడుపులోనే శిశువు మృతిచెందగా కనీసం వైద్యులు బయటకు తీయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రిమ్స్‌లో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతోనే ఇలాంటివి పునరావృతం అవుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే వైద్యులు ఆ స్పత్రిలో ఉంటున్నారు, తర్వాత ఇళ్లకు వెళ్లిపోతున్నారు. అత్యవసరం ఉన్నప్పుడు సిబ్బంది ఫోన్‌చేసి సమాచారం ఇస్తేనే వస్తున్నారు. వారు వచ్చేసరికి గర్భిణులు, శిశులు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని కోరుతున్నారు. -
ఈసెట్ శిక్షణలో సనాతో పరిచయం.. రెండు నెలలు కాపురం చేసి..
సాక్షి, మదనపల్లె టౌన్: భార్య గర్భ స్రావంకు యత్నించిన భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ మురళీక్రిష్ణ తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలు.. నల్గొండ జిల్లా చింతపల్లె మండలం కుడిమేకు గ్రామానికి చెందిన మహమ్మద్సనా(23), 2019లో ఈసెట్ శిక్షణలో ఉన్న సమయంలో మదనపల్లె రూరల్ మండలం దిగువగాండ్లపళ్లెకు చెందిన రమేష్‌తో పరిచయం ప్రేమగా మారి ఈ ఏడాది జనవరి 4న మదనపల్లెలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఎస్టేట్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉండగా రెండు నెలల క్రితం రమేష్ భార్యను వదిలి వెళ్లిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఆమె భర్తను పోలీసులు పట్టుకుని కౌన్సిలింగ్ ఇప్పించారు. సజావుగా సాగిన వారి కాపురంలో మళ్లీ ఘర్షణలు తలెత్తాయి. ఈ క్రమంలో మహ్మద్‌సనా తనకు గర్భస్రావం అయ్యేందుకు తన భర్త మందులు బలవంతంగా మింగించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐ మురళీక్రిష్ణ ఆమె భర్తను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. చదవండి: (సమ్మర్లో స్లిమ్‌గా.. బరువు తగ్గాలనుకునే వారికి వేసవి కాలం వరం) -
బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై పోక్సో కేసు
పెందుర్తి: తనకు కాబోయే భార్య (బాలిక)ను గర్భవతిని చేసి ఆ తర్వాత మొహం చాటేసిన ఓ యువకుడిపై పెందుర్తి పోలీసులు పోక్సో చట్ట ప్రకారం కేసు నమోదు చేశారు. సీఐ కె.అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పసలపూడికి చెందిన ఓ మహిళ పెందుర్తి సమీపంలోని అయ్యప్పనగర్‌కు వలస వచ్చింది. ఆమె కుమార్తె (16)కి స్థానికంగా నివాసం ఉంటున్న టేకు ముత్యాలు అనే యువకుడితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. బాలికకు మైనారిటీ తీరిన తర్వాత వివాహం జరిపించాలని పెద్దల సమక్షంలో అంగీకారం చేసుకున్నారు. అయితే కొన్ని నెలల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై ముత్యాలు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. దీనిపై తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక కుటుంబ సభ్యులు ముత్యాలుపై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బాలికపై అఘాయిత్యానిక పాల్పడ్డ వృద్ధుడు కుమ్మరాపల్లి గ్రామంలో మైనర్ బాలికపై ఇదే గ్రామానికి చెందిన వృద్ధుడు శారీరక వేధింపులకు పాల్పడి అసభ్యకరంగా ప్రవర్తించడంపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.రాజారావు తెలిపారు. ఎస్ వరప్రసాద్ (66) ఇదే గ్రామంలో నివాసం వుంటున్న ఎనిమిదేళ్ల బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. ఎస్పీ గౌతమి శాలి ఆదేశాల మేరకు సీఐ వెంకటరమణ, ఎస్ఐ రాజారావు సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. (చదవండి: భర్తపై ఇద్దరి భార్యల ఫిర్యాదు) -
నిజామాబాద్: గర్భిణి భార్య గొంతులో యాసిడ్ పోసి చంపాడు
సాక్షి, నిజామాబాద్: తల్లిని కాబోతున్నా అనే ఆనందాన్ని లేకుండా చేసిన ఆ మృగం.. అర్ధాంగి జీవితాన్ని అర్ధాంతరంగా చిదిమేసింది. గర్భిణి అని కూడా చూడకుండా భార్య గొంతులో యాసిడ్ పోసి భర్త హత్య చేశాడు ఓ భర్త. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రాజిపేట్‌లో ఈ దారుణం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ మండలం మల్కాపూర్ తండాకు చెందిన కళ్యాణి (24)కి రాజిపేట్‌కు చెందిన తరుణ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఏడాది తరువాత భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తనకు సరైన జోడీ కాదని, రెండో పెళ్లి చేసుకుంటానని తరుణ్ భార్యను తరచూ వేధించేవాడు. వదిలించుకునే ప్రయత్నమూ చేశాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం భర్త తరుణ్, మామ పిర్య, బావ ప్రవీణ్ కలిసి కళ్యాణి నోట్లో బలవంతంగా ఎలుకల మందు కలిపిన యాసిడ్ పోశారు. విషయం గమనించిన చుట్టుపక్కల వారు బాధితురాలిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం మరణించింది. మృతురాలు కళ్యాణి 3 నెలల గర్భిణి. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి బంధువులు తరుణ్ ఇంటిపై దాడిచేసి ఫర్నిచర్, వస్తువులు ధ్వంసం చేశారు. -
మీనా తల్లి కాబోతుందా?.. నెట్టింట వీడియో వైరల్
Actress Meena Is Pregnant Video Goes Viral: ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగువెలిగింది అందాల నటి మీనా. బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె తన అందచందాలతో, చక్కటి అభినయంతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల అరుదైన దుబాయ్ గోల్డెన్ వీసాను కూడా అందుకుంది. అయితే కెరీర్ సరిగా లేని సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త సాగర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఒక పాప నైనిక ఉంది. ఆమె కూడా సినిమాల్లో నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన పోలీసోడు చిత్రంలో అతనికి కూతురుగా యాక్ట్ చేసి మెప్పించింది. కూతురు పుట్టిన తర్వాత కొంతకాలం వరకు సినిమాలు చేయలేదు మీనా. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మీనా.. తల్లి, సోదరి తదితర పాత్రలతో అలరిస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మీనా ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా మీనా పోస్ట్ చేసినా ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మీనా గర్భవతిగా కనిపిస్తుంది. 'చాలా మారిపోయింది. అప్పట్లో ఈ గెటప్ వేయడం చాలా సులభంగా ఉండేది. దీన్ని కవర్ చేసేందుకు హెవీ చీరలు కట్టుకునేదాన్ని. కానీ ప్రస్తుతం ఈ గెటప్‌కు, ఈ పాత్రకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. షిఫాన్ చీరలు కట్టుకున్నా చూడటానికి చాలా నాచురల్‌గా ఉంది.' అంటూ వీడియోకు క్యాప్షన్‌గా రాసుకొచ్చింది. చదవండి: గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ హీరోయిన్ View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) ఈ పోస్ట్‌ను బట్టి చూస్తే మీనా ఓ సనిమాలో గర్భవతిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే మీనా ఈ వీడియోను షేర్ చేసినట్లు సమాచారం. ఈ పోస్ట్‌పై చాలా మంది నెటిజన్లు 'కంగ్రాట్స్' అని, మరికొందరు 'కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్' అని కామెంట్స్ పెడుతున్నారు. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1591342813.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తల్లికాబోతున్న ‘టెన్నిస్ స్టార్’..
రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా అభిమానులతో శుభవార్త పంచుకున్నారు. త్వరలోనే తాను తల్లికాబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు.. ‘‘అమూల్యమైన సరికొత్త ఆరంభాలు!!’’ అంటూ తాను గర్భవతినన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బీచ్‌లో నిల్చుని ఉన్న ఫొటోను షేర్ చేసి తల్లి కాబోతున్న అనుభూతులను పదిలం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా తన కెరీర్లో ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన షరపోవా.. 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ‘‘మరో ఉన్నత శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యాను. విభిన్నమైన మైదానంలో పోటీపడబోతున్నాను. టెన్నిస్‌కు గుడ్‌బై చెబుతున్నా’’ అంటూ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక షరపోవా వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్కెస్‌తో ఆమె రిలేషన్షిప్లో ఉన్నారు. ఇక వీరిద్దరు త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. View this post on Instagram A post shared by Maria Sharapova (@mariasharapova) -
కత్రీనా కైఫ్ ప్రెగ్నెంట్ ? నెట్టింట వీడియో వైరల్..
Is Katrina Kaif Pregnant Rumours On Her Airport Look Video Viral: సోషల్ మీడియాలో నెటిజన్ల ఫోకస్ సాధారణంగానే ఎక్కువ ఉంటుంది. ఇక సినీ తారలపై అయితే వారి ఫోకస్ ఒక్కోసారి సైంటిస్ట్లను తలపించేలా ఉంటుంది. హెయిర్ స్టైల్ నుంచి కాలుకు వేసుకున్న ఫుట్‌వేర్ వరకు నిశితంగా పరిశీలించి ట్రోలింగ్ చేయడమో, బాగుంటే ప్రశంసించడమో చేస్తుంటారు నెటిజన్స్. ఇలా సెలబ్రిటీల మిస్టేక్‌లను కనిపెట్టిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా వీరి ఫోకస్ బాలీవుడ్ హీరోయిన్ కత్రీనా కైఫ్‌పై పడింది. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ఇటీవలే హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న కత్రీనా కైఫ్ పలు వెకేషన్స్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. తమ జీవితంలో జరిగే ప్రతీ చిన్న ఆనందాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటోంది ఈ జంట. తాజాగా కత్రీనా కైఫ్ ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది. ఆమె ఎయిర్‌పోర్టులో కనిపించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కత్రీనా ప్రెగ్నెంట్ అయిందని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. చదవండి: కత్రీనా పెళ్లిపై సల్మాన్ ఖాన్ రియాక్షన్.. కమిటెడ్ అని హింట్ ! నెటిజన్లలో ఒకరు 'ఓరీ దేవుడా.. ఆమె ప్రెగ్నెంట్‌లా ఉంది' మరొకరు 'త్వరలో ఆమె తల్లి కాబోతుంది. కత్రీనా పాపను చూడాలని ఎంతో ఆతృతగా ఉంది', 'కత్రీనా నిజంగా ప్రెగ్నెంటా ? లేకుంటే తను ధరించిన డ్రెస్ వల్ల అలా అనిపిస్తుందా. ఏదైతేనే తను చాలా అందంగా ఉంది' అని ఆ వీడియోకు రిప్లై ఇస్తున్నారు. మరీ ఈ కామెంట్స్‌పై కత్రీనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. చదవండి: కత్రీనా పెళ్లి ఫుటేజ్ కోసం రూ. 100 కోట్లు ఆఫర్.. ఎందుకో తెలుసా ? View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పెళ్లి చేసుకుంటానని లైంగికదాడి.. కేసు నమోదు
రేపల్లె రూరల్: పెళ్లి చేసుకుంటానని చెప్పి, మోసగించి లైంగికదాడి చేసి యువతిని గర్భవతిని చేసిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వి.సూర్యనారాయణ శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రేపల్లె మండలం ఊలుపాలెం గ్రామానికి చెందిన కైతేపల్లి రవి అనే యువకుడు తెనాలిలో గత కొన్ని నెలలుగా కార్పెంటర్ పని చేసుకుంటున్నాడు. అయితే తెనాలి పట్టణానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడి, పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఆ యువతిపై పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు లైంగికదాడి చేశాడు. గర్భందాల్చిన యువతి, తనను వివాహం చేసుకోమని రవిని పలుమార్లు కోరగా తిరస్కరించటంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ప్రేమిస్తున్నానని బాలికను గర్భవతిని చేసి..
నకిరేకల్: ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేశాడు. విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని.. చెబితే తనను, తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. గర్భం పోయేందుకు మందులిచ్చాడు. అవి వికటించి బాలిక మృతిచెందింది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఈ ఘటన జరిగింది. నకిరేకల్ పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన బాలిక(17) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కాలనీకి చెందిన ఏర్పుల భాను(22) ఆ బాలికతో ప్రేమ పేరిట కొంతకాలంగా సఖ్యతగా ఉంటున్నాడు. గత నెల 28న బాలిక తన ఇంట్లో వాంతులు చేసుకుని కిందపడిపోయింది. కుటుంబీకులు ఏమైందని అడగ్గా.. ప్రేమిస్తున్నానని చెప్పి భాను రెండు, మూడు సార్లు లైంగిక దాడి చేశాడని, గర్భం వచ్చిందని చెప్పింది. గర్భాన్ని తొలగించేందుకు బలవంతంగా మందులు వేశాడని తెలిపింది. అదే రోజు రాత్రి బాలికను కుటుంబీకులు నల్లగొండలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు చెప్పగా గత నెల 29న గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ఘటనపై బాలిక కుటుంబీకులు నకిరేకల్ పోలీస్ స్టేషన్లో 30న ఫిర్యాదు చేశారు. ఆరోగ్య పరిస్థితి విషమించి బాలిక గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతదేహంతో పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద, నిందితుడు భాను ఇంటి ముందు కుటుంబీకులు, ప్రజలు ఆందోళనకు దిగారు. పోలీసులు సర్దిచెప్పినా రాత్రి వరకు ఆందోళన చేశారు. భాను కుటుంబీకులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. -
ఆస్పత్రిలో గర్భిణీ మృతి.. అవమానం తట్టుకోలేక మహిళా వైద్యురాలు
జైపూర్: కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. డాక్టర్లు పేషెంట్లను రక్షించాలనే అనుకుంటారు. అయితే ఒక్కోసారి అనూహ్య పరిణామాల వల్ల ఒక పెషంట్ చనిపోతే దానికి వైద్యుడే కారణం అంటూ ఆరోపణలు చేస్తుంటారు. నిజానికి వైద్యుడి నిర్లక్ష్యం ఎంతో ఉందో చెప్పలేం గానీ ఆ సమయంలో పేషెంట్ పరిస్థితి గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి అరుదైన సంఘటన కారణంగా సున్నితమైన వైద్యులు ఈ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు అనేకం. అచ్చం అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు కథనం ప్రకారం...రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఓ ప్రైవేట్ ఫెసిలిటీలో గర్భిణి మృతి చెందింది. ఆ ఆస్పుత్రిని డాక్టర్ అర్చన శర్మ, ఆమె భర్త కలిసి నిర్వహిస్తున్నారు. అయితే గర్భిణి కుటుంబ సభ్యులు మాత్రం వైద్యుల నిర్లక్యంగా కారణంగానే ఆమె చనిపోయిందంటూ గొడవకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు సదరు డాక్టర్ అర్చనపై కేసు నమోదు చేశారు. అంతేగాదు ఆమె పై తక్షణమై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో లాల్సోట్ పోలీస్ స్టేషన్లో ఆ డాక్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన వైద్యురాలు అవమానం తట్టుకోలేక తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: మహేష్ బ్యాంకు హ్యాక్ కేసు.. షాకింగ్ విషయాలు వెల్లడి) -
Health Tips: గర్భవతుల్లో తినగానే కడుపులో ఇబ్బందిగా ఉంటే...
గర్భవతుల్లో... అందునా ఆరు, ఏడు నెలల్లో (28 వారాల సమయంలో) గుండెలో మంట, ఛాతీలో ఇబ్బంది, కడుపులోని ఆహారం పైకి ఎగదన్నుతున్న ఫీలింగ్, అజీర్తి, తేన్పుల బాధ వంటి సమస్యలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇది మామూలే. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడే గ్యాస్ట్రిక్ జ్యూస్... జీర్ణాశయం నుంచి పై వైపునకు అంటే అన్నవాహిక వైపు ఎగజిమ్మడమే ఇందుకు కారణం.గర్భవతుల్లో కండరాలను వదులుగా అయ్యేలా చేయడానికి ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది. పిండం పెరుగుతున్న కొద్దీ గర్భసంచిలో దానికి చోటు కల్పించడం కోసం, అలాగే గర్భసంచి కండరాలు వదులయ్యేలా చేసేందుకు ప్రకృతి చేసిన ఏర్పాటిది. ఈ హార్మోన్ తన సహజ గుణం కొద్దీ కేవలం గర్భసంచిని మాత్రమే వదులు చేయకుండా ఇతర కండరాలను... అంటే... పక్కనే ఉన్న జీర్ణాశయం–అన్నవాహిక మధ్యన ఉండే కవాటం వంటి స్ఫింక్టర్ (లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్) మొదలైన వాటి మీద కూడా తన ప్రభావం చూపుతుంది.అలా ఆ స్ఫింక్టర్ వదులైపోవడంతో తిన్న పదార్థం, దానితో పాటు జీర్ణరసాలు... జీర్ణాశయం నుంచి అన్నవాహికలోకి పైకి ఎగజిమ్ముతాయి. ఒకేసారి ఎక్కువగా కాకుండా చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం, తినగానే పడుకోకుండా, కాస్త వాకింగ్ చేయడం, పడుకున్నప్పుడు తలగడ పెట్టుకోవడం, తినే ఆహారంలో కారం, వేపుళ్లు, మసాలాలు తక్కువ తీసుకోని, మజ్జిగలాంటివి తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని యాంటాసిడ్స్ కూడా వాడాల్సి రావచ్చు. చదవండి: C- Section: మొదటిసారి సిజేరియన్... రెండోసారీ తప్పదా? తల్లి ఎత్తు 135 సెం.మీ. కంటే తక్కువ ఉన్నప్పుడు..Health Benefits of Eating Dates: తీపిగా ఉండే ఖర్జూరాలు తరచుగా తింటున్నారా? ఈ విషయాలు తెలిస్తే! -
11వ బిడ్డకు జన్మనివ్వబోతోన్న ప్రముఖ సింగర్
ప్రముఖ అమెరికన్ సింగర్ కేకే వ్యాట్ మరోసారి తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. పిల్లలు, భర్తతో కలిసి బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసిన వ్యాట్ తను 11వ సారి గర్భం దాల్చినట్లు పేర్కొంది. ఈ ఫొటోలో ఉన్న తన పిల్లలంతా బిగ్ బ్రదర్, బిగ్ సిస్టర్ అనే టీ-షర్ట్‌ను ధరించగా ఆమె భర్త జకారియా డేవిడ్ డారింగ్ ‘హియర్ వీ గో’ అనే టీ-షర్ట్‌ను ధరించాడు. ఇక ఈ పోస్ట్‌కు కేకే వ్యాట్.. ‘నేను నా భర్త జకారియా, మా కుటుంబం మరో వ్యక్తిని వ్యాట్ బంచ్కి ఆహ్వానించబోతున్నామనే విషయం మీతో పంచుకోవడానికి గర్వపడుతున్నాను’ అంటూ #11 అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేసింది. అంతేగాక తమ మరో కుమార్తె కాయ్లాను మిస్ అవుతున్నానని, తను భౌతికంగా తమ మధ్య లేకపోయిన తన ఆలోచనలు, ఆత్మ మాతోనే ఉంటాయని పేర్కొంది. కాగా జాకకారియా డేవిడ్ ఆమె మూడవ భర్త. ఆమె మొదటి భర్త రహ్మత్ మోర్టన్ను 1999లో వివాహం చేసుకోగా వీరికి నలుగురు పిల్లలు సంతానం. వారిలో ఓ కుమార్తె మరణించగా.. కీవర్ వ్యాట్ మోర్టన్(21); రహ్జా కే మోర్టన్(20), కే తార్హ్ విక్టోరియా మోర్టన్(13)లు ఉన్నారు. ఇక రెండో భర్త మైఖేల్ ఫోర్ట్‌తో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది వ్యాట్. అతడితో విడాకుల అనంతరం జకారియా డేవిడ్ డారింగ్ను 2018లో మూడో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానం కాగా ప్రస్తుతం ఆమె మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇది తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంతమంది పిల్లలతో మీరెలా ఆడుకుంటారు’, 'మీరింక ఫుల్స్టాప్ పెట్టరా?' అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Keke Wyatt (@keke_wyatt) -
మగపిల్లాడు పుడతాడని తలలో మేకు దించుకున్న గర్భిణి!
రోజుకో సరికొత్త టెక్నాలజీతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో పలుచోట్ల మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మతున్నారంటే ఆశ్చర్యంగా అనిపించకమానదు. పైగా ఈ మూఢనమ్మకాల మాయలో అత్యంత క్రూరమైన పనులకు ఒడిగడుతున్నారు. అంతేకాదు ఈ మూఢనమ్మకాల మాయలో తమ జీవితాలను బలి చేసుకున్నవాళ్లు ఉన్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ మగపిల్లాడి కోసం భూతవైద్యుడి మాయమాటలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అసలు విషయంలోకెళ్తే... పాకిస్తాన్‌లోని పెషావర్‌లో నివశిస్తున్న ఒక గర్భిణికి ముగ్గురు ఆడపిల్లలు. మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనన్న భయంతో భూతవైద్యుడిని సంప్రదించింది. అయితే ఆ భూతవైద్యుడి మగపిల్లాడు కావాలంటే తలలో మేకు దించుకోవాలని చెప్పాడు. దీంతో ఆ మహిళ మగపిల్లాడి మీద ఆశ కొద్దీ అంగీకరించింది. ఈ మేరకు ఆ భూత వైద్యుడు ఆమె తలపై ఒక సుత్తితో మేకుని దించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయ్యి నొప్పికి తాళలేక పోయింది. పైగా ఆ భూత వైద్యుడు మేకు తీయడానికి ప్రయత్నిస్తే అది తలలోనే ఇరుక్కుపోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ఆస్పత్రిలోని వైద్యులు ఆపరేషన్ చేసి ఆ మేకును తీసేశారు. అంతేకాదు మగపిల్లాడు కోసం తాను ఈ చర్యకు పాల్పడ్డానని, భూతవైద్యుడే సుత్తితో మేకుని తలలోకి దించాడని వైద్యులకు ఆ బాధితురాలు తెలిపింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పెషావర్ పోలీసులు రంగంలోకిదిగి ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. Special team has been made to bring to justice the fake Pir who played with the life of an innocent woman & put a nail in her head, with a false promise of a male child. The team will also investigate why incident was not reported to police by the treating doctor. — Abbas Ahsan (@AbbasAhsan) February 8, 2022 -
యాపిల్ జంబలకిడిపంబ: మగాడికి కడుపొస్తే..
Apple Brings Pregnant Man Emoji Soon To iPhones: టెక్ ప్రపంచంలో రోజూవారీ పనుల్ని తగ్గించేవెన్నో. అందులో సరదాగా మొదలైన ఎమోజీల వ్యవహారం.. ఇప్పుడు ఛాటింగ్ ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. జస్ట్ ఒక ఎమోజీతో బదులు ఇవ్వడమే కాదు.. పెద్ద పెద్ద ఉద్యమాలు సైతం నడుస్తున్న రోజులివి. కొన్నిసార్లు భావోద్వేగాలను మోతాదులో మించి ప్రదర్శిస్తున్నాయి కాబట్టే అంత ఆదరణ ఉంటోంది ఎమోజీలకు. కానీ, ఎమోజీలతో భావోద్వేగాలతో ఆడుకుంటే మాత్రం జనాలు ఊరుకుంటారా? యాపిల్ కంపెనీ కొత్తగా తీసుకొచ్చిన ‘ప్రెగ్నెంట్ మ్యాన్’ ఎమోజీ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. గురువారం అందించిన ఈ అప్డేట్ సడన్ సర్ప్రైజ్తో పాటు సీరియస్ డిస్కషన్‌కు తెర తీసింది ఈ ఎమోజీ. గర్భంతో ఉన్న మగవాడి ఎమోజీ ద్వారా వివక్షకు తెర తీసిందంటూ కొందరు విమర్శిస్తుండగా.. కొందరేమో ఈ ఎమోజీని సరదా కోణంలో ఆస్వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ లింగ వివక్ష, మాతృత్వాన్ని దెబ్బ తీస్తుందన్న విమర్శల కోణంలో ఈ ఎమోజీపై నెగెటివిటీనే చెలరేగుతోంది సోషల్ మీడియాలో. #Pregnant man, pregnant person emoji coming to Apple iPhones. #Apple and #TimCook are you really that stupid. https://t.co/YA88hM4NiW #Pregnantemoji — Michael Osuna (@mlosuna) January 29, 2022 New Apple 'pregnant man' emoji looks like a regular dude with a beer belly to me and that's what i'm going with. pic.twitter.com/4MDN4xp5Fw — Pineapple on Pizza Speculator (@OnSpeculator) January 29, 2022 People in ancient times didn’t have pregnant men symbols because they had common sense #WokeHorseShit #emojis #pregnantman pic.twitter.com/wnClxh3Hra — Terry McNeely Comedian 🎙 (@Mac72Terry) January 29, 2022 ఐవోఎస్ 15.4 తాజా అప్డేట్తో ఐఫోన్లలో కొత్త ఎమోజీలు వచ్చాయి. ప్రెగ్నెంట్ మ్యాన్‌తో పాటు పెదవి కొరికే ఎమోజీ.. మరో 35 ఎమోజీలను ఐఫోన్ తీసుకొచ్చింది. ప్రస్తుతం బేటా వెర్షన్లో ఉన్న ఈ ఎమోజీలు.. త్వరలో పూర్తిస్థాయిలో వాడుకలోకి రానున్నాయి. Men 👏🏼 cannot 👏🏼 get 👏🏼 pregnant! 👏🏼 Why is this so controversial?? @Apple #PregnantManEmoji #Apple #PregnantMan #Impossible — Conservative Goth Girl 🇺🇸❤️ (@ConservativeGG6) January 29, 2022 Stop attacking womanhood #apple #pregnantman — amornesta (@amornesta1) January 29, 2022 కొత్తేం కాదు.. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ఇదే తరహా ఎమోజీను విడుదల చేసి విమర్శలు ఎదుర్కొంది ఎమోజీపీడియా. దీంతో ఆ ఎమోజీని ట్రాన్స్ మెన్, నాన్-బైనరీ పీపుల్, పొట్టి జుట్టు ఉన్న మహిళల కోసం.. ఉపయోగించొచ్చంటూ తప్పించుకునే వివరణ ఇచ్చుకుంది. అయినా విమర్శలు ఆగలేదు. ‘ఫుల్‌గా తిని కడుపు నిండిన మగవాళ్లు కూడా ఈ ఎమోజీని సరదాగా ఉపయోగించొచ్చు అంటూ ఎమోజీపీడియా జేన్ సోలోమన్ ఇచ్చిన స్టేట్మెంట్పై తిట్లు పడగా.. చివరికి తన మాటలకు క్షమాపణలు చెప్పాడు సోలోమన్. మరి విమర్శల నేపథ్యంలో యాపిల్ వెనక్కి తగ్గుతుందా? ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి మరి!. చదవండి: మాస్క్ ఉన్నా ఫేస్ డిటెక్ట్ చేసి.. లాక్ తీసేస్తది! -
ప్రెగ్నెన్సీ పాఠాలు నేర్చుకుంటున్న కాజల్
ఈ ఏడాదిలో కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు తల్లిదండ్రులు కానున్న సంగతి తెలిసిందే. కాజల్ గర్భవతి అని ఇటీవల గౌతమ్ కిచ్లు కన్ఫార్మ్ చేశారు. గర్భవతి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడానికి భార్య కోసం గౌతమ్ కిచ్లు ప్రత్యేకంగా ఓ డాక్టర్‌ను కూడా నియమించారు. ఈ ‘ప్రీ న్యాటల్ క్లాసెస్’కి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా తెలియజేస్తున్నారు కాజల్ అగర్వాల్. డెలివరీ వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డెలివరీ అయ్యాక పాటించాల్సినవి.. ఇవన్నీ కూడా ఈ క్లాసెస్‌లో అడిగి తెలుసుకుంటున్నారట. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండటం కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాజల్ చెల్లెలు నిషాకి ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు. నిషా గర్భం దాల్చినప్పుడు, బాబు పుట్టాక కాజల్ ఎక్కువ సమయం వారితో గడిపారు. ఆ విధంగా మాతృత్వం తాలూకు అనుభూతి ఎలా ఉంటుందో కొంతవరకూ తెలుసుకున్నారు. ఇప్పుడు తనే తల్లి కానుండటం ఎగ్జయిటింగ్‌గా ఉందని అంటున్నారు కాజల్. -
సమంత మరో డేరింగ్ స్టెప్.. తొలిసారి అలాంటి పాత్రలో..
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత కెరీర్ పరంగా దూసుకెళ్తోంది. టాలీవుడ్, బాలీవుడ్,హాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలను ప్రకటిస్తూ.. బిజియెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. ఇటీవల ఈ బ్యూటీ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ లో స్పెషల్ సాంగ్ చేసి ఔరా అనిపించింది. స్పెషల్ సాంగ్ చేయడానికి తొలుత సంకోచించినప్పటికీ.. దర్శకుడు సుకుమార్ బలవంతంగా ఒప్పించి, నటింపంచేశారు. ఇప్పుడు ఆ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. అంతేకాదు సమంతకు బోలెడంత డబ్బుతో పాటు.. ఫేమ్‌ని కూడా తీసుకొచ్చిపెట్టింది. అదే ఉత్సాహంతో సమయంలో మరో డేరింగ్ స్టెప్ వేయబోతుంది. తొలిసారి గర్భవతి పాత్రలో నటించబోతుదంట సామ్. వివరాల్లోకి వెళితే.. సమంత ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘యశోద’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హరి మరియు హరీశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత ప్రెగ్నెంట్‌గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నర్సు అయిన ఓ ప్రెగ్నెంట్ మహిళలకు అనుకోని సమస్యలు ఎదురైనే.. ఆమె ఒక్కతే వాటిని ఎలా అధిగమించింది అనే నేపథ్యంలో ‘యశోద’చిత్రం తెరకెక్కుతుదంట. విడాకుల తర్వాత ఇలా డిఫరెంట్ పాత్రల్లో నటించడంతో సామ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
త్వరలోనే తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' హీరోయిన్
Actress Sanjana Galrani Pregnant Expecting First Child In May 2022: బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సంజనా గల్రానీ అభిమానులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ అని, త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు పేర్కొంది. 'మాతృత్వం అనేది ఓ అందమైన అనుభూతి. ఇప్పుడు నేను 5నెలల గర్భంతో ఉన్నాను. డెలివరి ముందు వరకు కూడా విశ్రాంతి తీసుకోవాలనుకోవట్లేదు. ప్రసవం అయ్యేంతరకు పనిచేయాలనుకుంటున్నా. కొంత మంది మహిళలు డెలివరికి రెండు వారాల వరకు కూడా పని చేస్తారు. వారి లాగే నేను కూడా ఉండాలనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా ఇటీవలె ఆమె భర్తతో విడాకులు తీసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ఘాటుగా స్పందించిన ఆమె తన వైవాహిక జీవితం చాలా బాగుందని, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. గతేడాది శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఈ బ్యూటీ మూడు నెలలు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తన చిరకాల మిత్రుడు, ప్రియుడు డాక్టర్ పాషాను 2021 జనవరిలో రహస్య వివాహం చేసుకుంది. -
పెళ్లి కాకుండానే తల్లైన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..
List Of 10 Popular Actresses Who Got Pregnant Before Marriage: సినిమా ఇండస్ట్రీలో రిలేషన్‌షిప్‌లు కామనే. కొందరు ఈ రిలేషన్‌ను పెళ్లి దాకా కొనసాగిస్తే.. కొన్ని జంటలు మధ్యలోనే బ్రేకప్ చెప్పేసుకొని ఎవరిదారి వారు చూసుకుంటారు. అయితే మరికొంత మంది మాత్రం మాత్రం పెళ్లికి ముందే గర్భం దాల్చి పిల్లలను కన్నారు. ఈ లిస్ట్‌లో ఉన్న టాప్ హీరోయిన్స్ ఎవరో చూసేయండి.. శ్రీదేవి అతిలోక సుందరి శ్రీదేవి పెళ్లి కాకుండానే తల్లైంది. నిర్మాత బోనీ కపూర్‌తో కొన్నాళ్ల పాటు సహజీవనం చేసిన ఆమె కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే గర్భం దాల్చింది. పెళ్లి జరిగే సమయానికి శ్రీదేవి ఏడు నెలల గర్భవతిగా ఉండటం అప్పట్లో పెద్ద చర్చకే దారి తీసింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లుపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. సారిక బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొన్నాళ్ల పాటు చక్రం తిప్పన సారిక విలక్షణ నటుడు కమల్‌హాసన్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ కొన్నాళ్ల పాటు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. అలా పెళ్లి కాకుండానే వీరికి శ్రుతిహాసన్ జన్మించింది. ఆ తర్వాత రెండేళ్లకు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. రేణు దేశాయ్ బద్రీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్ ఆ సినిమా సమయంలోనే పవన్‌కల్యాణ్‌తో ప్రేమలో పడింది. జానీ సినిమా సమయంలో మరింత దగ్గరైన ఈ జంట కొన్నాళ్ల పాటు సహాజీవనం చేశారు. వీరిద్దరికీ 2004 లో అకీరా పుట్టాడు. అకీరా పుట్టిన ఐదేళ్లకు అంటే 2009 లో వీరిద్దరూ పెళ్లి చేసుకుని భార్య భర్తలయ్యారు. దాదాపు 12 ఏళ్ల అనంతరం వీరు విడిపోయారు. అమీ జాక్సన్ ఐ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి అమీ జాక్సన్. బాయ్‌ఫ్రెండ్ జార్జ్‌తో ఎంగేజ్మెంట్ అనంతరం తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించిన అమీ జాక్సన్ పెళ్లకి ముందే తల్లైంది. అయితే ఇప్పటివరకు ఈ జంట ఇంకా పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. నీనా గుప్తా బాలీవుడ్ నటి నీనా గుప్తా వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో డేటింగ్ చేసింది. ఇక ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో అతడి నుంచి విడిపోయింది. రిచర్డ్స్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో ఈ జంట విడిపోయారు. సింగిల్ మథర్గానే మసాబాను పెంచింది నానా గుప్తా. కల్కి కొచ్లిన్ బాలీవుడ్ నటి కల్కి కొక్లెయిన్ తొలుత దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే.. ఆ తర్వాత అతనితో చెడిపోవడంతో విడాకులు తీసుకుంది. తర్వాత హర్ష్ బెర్గ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అతన్ని పెళ్లి చేసుకోకుండానే గర్భవతి అయ్యింది. దియా మీర్జా బాలీవుడ్ భామ దియా మీర్జా వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే గర్భం దాల్చింది. అయితే గర్భవతి కాబట్టే పెళ్లి చేసుకుంది అని అప్పట్లో దియా మీర్జాపై నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. నటాషా బాలీవుడ్ నటి నటాషా క్రికెటర్ హార్దిక్ ప్యాండాతో కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. పెళ్లికి ముందే నటాషా గర్భం దాల్చింది. -
తండ్రి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక
మోమిన్‌పేట: కంటికి రెప్పలా చూసుకోవలసిన కన్నతండ్రి కామాంధుడయ్యాడు. పదిహేనేళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సదరు బాలిక గర్భం దాల్చింది. ఈ సంఘటన మోమిన్‌పేటలో బుధవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఓ కుటుంబం బతుకుతెరువు నిమిత్తం పటాన్‌చెరుకు వెళ్లింది. అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా ఎనిమిదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్న పెద్ద కుమార్తెపై తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. కూతురు కొద్ది రోజులుగా ఇబ్బందు లు పడుతుండటాన్ని గుర్తించిన తల్లి అసలు విషయం తెలియడంతో నిర్ఘాంతపోయింది. బుధవారం మోమిన్‌పేటకు చేరుకుని కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
మైనర్ బాలికకు గర్భం.. యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లోనే డెలివరీ..
కొచ్చి: కేరళలోని మలప్పురంలో ఓ మైనర్ బాలిక తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో శారీరకంగా కలవడంతో గర్భం దాల్చింది. అయితే ఆ విషయం ఇంట్లో తల్లికి కూడా తెలియకుండా జాగ్రత్తపడింది. చివరకు డెలవరీ కూడా యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఆ బాలికే స్వయంగా చేసుకుంది. బాలిక తల్లి పాక్షికంగా అంధురాలు కావడంతో డెలివరీ రోజు ఇంట్లో పసికందు ఏడుపు వినిపించేంతవరకు ఈ విషయాన్ని గ్రహించలేకపోయింది. ఈ నెల 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పాక్షికంగా అంధురాలైన ఓ మహిళ తన 17 ఏళ్ల కూతురితో కలిసి కొట్టకల్లో నివసిస్తోంది. బాలిక తన ఇంటి సమీపంలోని ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ విషయం వారివురి కుటుంబాలకు తెలిసింది. దీంతో బాలిక మైనర్ కావడంతో తనకి 18 ఏళ్లు నిండిన తర్వాత వారిద్దరికి పెళ్లి చేయాలని వారి కుటుంబీకులు నిర్ణయించుకున్నారు. అయితే, ఈ మధ్యలోనే బాలిక తన ప్రియుడితో శారీరకంగా కలవడంతో గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా ఆన్లైన్ తరగతుల పేరుతో ఎక్కువగా తన గదిలోనే ఉంటున్నట్లు తన తల్లిని నమ్మించింది. చివరకు డెలవరీ కూడా యూట్యూబ్ వీడియోలు తన ఇంట్లోనే చేసుకుంది. ఇంట్లో పసికందు ఏడుపు వినపడడంతో బాలిక తల్లికి ఈ విషయం తెలిసింది. డెలివరీ చేస్తుండగా ప్రక్రియలో తనకు ఇన్ఫెక్షన్ సోకడంతో బాలికతో పాటు బిడ్డని మంజేరిలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. దీనంతటికి కారకుడైన 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడితో రిలేషన్షిప్లో ఉన్నందున అతనిపై బాలిక వాంగ్మూలం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. చదవండి: Miss Telangana 2018: లైవ్ వీడియోతో ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ మిస్ తెలంగాణ -
యూట్యూబ్ వీడియోలు చూసి అబార్షన్.. వికటించడంతో..
ముంబై: యూట్యూబ్ వీడియోలను చూస్తూ ఇంట్లోనే స్వయంగా అబార్షన్ చేయడానికి యత్నించిన ఓ యువతికి ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రి పాలైంది. మహారాష్ట్ర నాగపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యశోధర నగర్‌కి చెందిన సోహెబ్ ఖాన్(30), బాధితురాలు 2016 నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఇటీవల తను గర్భం దాల్చడంతో విషయం తెలుసుకున్న ఖాన్ ఆమెను అబార్షన్ చేసుకోవాలని కోరాడు. ఇందుకు అబార్షన్ ఎలా చేస్తారో, లేదా గర్భస్రావం కోసం ఏ మందులు వాడాలో యూట్యూబ్‌లో వీడియోలు ఉంటాయని వాటిని చూసి తెలుసుకోవాలని సోహెబ్ ఆమెకు సూచించాడు. అతని బలవంతం మీద యూట్యూబ్ వీడియోలు చూసి ఆమె సొంతంగా అబార్షన్‌కు యత్నించింది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో సోహెబ్ ఖాన్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. చదవండి: రూటు మార్చిన మోసగాళ్లు.. జర జాగ్రత్త! -
కాజల్ గర్భవతా? సినిమా నుంచి తప్పుకున్న చందమామ!
Jacqueline To Replace Pregnant Kajal Aggarwal: ‘విశేషం ఏమైనా ఉందా?’... పెళ్లయిన అమ్మాయిలను చాలామంది అడిగే ప్రశ్న ఇది. తల్లి కాబోతున్నావా? అనే విషయాన్ని ఇలా అడుగుతుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఏదైనా విశేషాన్ని స్వయంగా చెబుతారేమోనని కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాజల్ పెదవి విప్పడంలేదు కానీ ఆమె గర్భవతి అనే వార్త మాత్రం ప్రచారంలోకొచ్చింది. చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్..ధర తెలిస్తే షాకే గత ఏడాది వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని కాజల్ పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆమె తల్లి కానున్నారనీ, ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న చిత్రాలను పూర్తి చేయాలనుకుంటున్నారనీ, సైన్ చేసి.. ఇంకా సెట్స్‌కి వెళ్లని సినిమాల నుంచి మాత్రం తప్పుకుంటున్నారనీ టాక్. అలా తప్పుకుంటున్న సినిమాల్లో నాగార్జున సరసన అంగీకరించిన ‘ది ఘోస్ట్’ ఒకటని చెప్పుకుంటున్నారు. ఆమె స్థానంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని తీసుకున్నారట. ‘సాహో’లో ప్రభాస్‌తో ‘బ్యాడ్ బాయ్’ ఐటమ్ సాంగ్‌కు జాక్వెలిన్ కాలు కదిపారు. మరి.. తెలుగు తెరపై కథానాయికగా కూడా ఆమె కనిపిస్తారా అంటే.. కాజల్ విశేషం నిజమే అయ్యుంటే, ‘ఘోస్ట్’ యూనిట్ జాక్వెలిన్‌ని తీసుకుని ఉంటే నిజమే అవుతుంది. చదవండి : దయచేసి అందరూ హెల్మెట్ వేసుకొని వెళ్లండి: వైష్ణవ్ తేజ్ -
ప్రసూతి కోసం వచ్చి ఆస్పత్రిలో...
దూద్‌బౌలి: పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ప్రసవానికి వచ్చిన ఓ గర్భిణి సోమవారం రాత్రి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగడంతో ఆస్పత్రి ఆవరణలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను సముదాయించారు. మృతురాలు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బంధువు కావడంతో ఆస్పత్రి వద్ద కొద్దిసేపు నినాదాలు చేశారు. గోషామహల్ ప్రాంతానికి చెందిన సరిత (40)ను ఈ నెల 11న ప్రసవం కోసం పేట్లబురుజు ఆస్పత్రిలో చేర్పించారు. చేర్పించిన నాటి నుంచి వైద్యులు సరితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా సోమవారం రాత్రి సరితకు బీపీ అధికం కావడంతో ప్రసవం కాకుండానే మృతి చెందింది. దీంతో కోపోద్రేక్తులైన కుటుంబ సభ్యులు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంవల్లే సరిత మృతి చెందిందని ఆరోపించారు. ఆస్పత్రి అధికారులు మాత్రం సరిత అధిక బరువు, బీపీ, అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని, ఆమెను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని... ఇందులో తమ పొరపాటు లేదన్నారు. సరిత 20 ఏళ్ల అనంతరం గర్భం దాల్చిందని తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
చేసిన తప్పు సరిదిద్దుకోలేక.. పరువు బజారున పడుతుందని..
సాక్షి, రాయచూరు (కర్ణాటక): చేసిన తప్పును సరిదిద్దుకోలేక, కుటుంబ పరువు బజారున పడుతుందని ఓ యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయగా రిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. తాలూకాలోని జేగరకల్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన శాంతమ్మ (30) ఆత్మహత్య చేసుకుంది. వివరాలు... తిమ్మాపూర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న శాంతమ్మను రమేశ్ అనే వ్యక్తి ప్రేమపేరుతో మభ్యపెట్టాడు. గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని కోరితే గర్భం తొలగించుకోవాలని హెచ్చరించాడు. రూ. 50 వేల నగదు ఇస్తానని ఆశ పెట్టాడు. విషయం బయటకు చెబితే మీ తల్లిదండ్రులను హత్య చేస్తానని బెదిరించాడు. దీంతో గతనెల 27న రాత్రి శాంతమ్మ పరుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది. కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ లక్ష్మీ తెలిపారు. -
కన్న కూతురిపై కిరాతక తండ్రి లైంగిక వాంఛలు
సాక్షి, బంజారాహిల్స్( హైదరాబాద్): కన్న కూతురిపై ఓ కిరాతక తండ్రి లైంగికవాంఛలు తీర్చుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దంపతులు జూబ్లీహిల్స్ రోడ్ నెం.79లోని ఓ అపార్ట్మెంట్ వద్ద వాచ్మెన్లుగా ఉంటున్నారు. ఈ నెల 16వ తేదీన వీరి కూతురు(16) వాంతులు చేసుకుంటుండగా తల్లి నాంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు బాలికను పరీక్షించగా ఆమె నాలుగు నెలల గర్భవతి అని తెలిపారు. దీంతో కంగుతున్న తల్లి ఏం జరిగిందని కూతురిని నిలదీసింది. గత కొంత కాలంగా తల్లి పనికి వెళ్లిన తర్వాత తన తండ్రి(38) నిద్రమాత్రలు భోజనంలో కలిపి కూతురికి తినిపించే వాడని, నిద్రపోయిన తర్వాత కూతురిని అత్యాచారం చేసేవాడని చెప్పింది. కొంత కాలం క్రితం తల్లి కాకినాడకు వెళ్లగా అదే రోజు రాత్రి తండ్రి పీకల దాకా మద్యం సేవించి కూతురిపై అత్యాచారం చేయడమే కాకుండా ఈ విషయం తల్లికి కానీ, ఇంకెవరికైనా చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించాడని చెప్పింది. ఈ విషయాన్ని తన భార్య దృష్టికి కూతురు తీసుకొచ్చిందన్న విషయం తెలిసిన వెంటనే రెండు రోజుల క్రితం తండ్రి పరారయ్యాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376(3), పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి కాబోతున్న సీరియల్ నటి, ఎమోషనల్ పోస్ట్
సీరియల్ నటి చైత్ర రాయ్ అభిమానులతో ఓ శుభవార్తను పంచుకుంది. తను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. "ఎప్పుడైనా సందిగ్ధంలో ఉంటే పిల్లలను ఎంచుకోండి. కెరీర్, పని.. వంటివాటిని ఎంపిక చేసుకునేందుకు మున్ముందు బోలెడంత సమయం ఉంది. కుటుంబం అంటే ముఖ్యమైనదే కాదు సర్వస్వం కూడా! త్వరలో చిన్నారి చైత్ర ప్రసన్న మా ఇంట అడుగు పెట్టబోతోంది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు నేను, నా భర్త ప్రసన్నశెట్టి చాలా సంతోషిస్తున్నాం. మా జీవితంలో ఈ నూతన ఘట్టం మొదలు పెట్టడానికి మీ ప్రేమాభిమానాలు, ఆశీస్సులు కావాలి. నేను నా లైఫ్‌లోనే అత్యంత అందమైన గొప్ప దశను ఆస్వాదిస్తున్నా" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ మేరకు బేబీ బంప్ ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు చైత్ర అర్ధాంతరంగా సీరియల్స్‌కు గుడ్‌బై చెప్పడానికి కారణం ఇదన్నమాట అనుకుంటున్నారు. ఇక అష్టాచెమ్మా సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన చైత్ర పలు సీరియళ్ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇటీవలే అక్కాచెల్లెళ్లు సీరియల్ నుంచి మధ్యలోనే తప్పుకున్న నటి ఇది గుడ్‌బై చెప్పడం కాదని, కేవలం గ్యాప్ తీసుకోవడమేనని చెప్పింది. ఎట్టకేలకు అసలు విషయాన్ని తాజాగా ఫొటోలతో సహా బయట పెట్టింది. త్వరలో తల్లి కాబోతున్న చైత్రకు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Chaithra Rai (@chaithrarai17) చదవండి: ఓటీటీలో ఈ వారం అలరించనున్న కొత్త చిత్రాలు ఇవే.. -
‘అలాంటిదేమీ లేదు. కాజల్ గర్భవతి కాదు’
పెళ్లయ్యేంతవరకూ ‘పెళ్లెప్పుడు’ అనే ప్రశ్న ఎదుర్కొంటుంటారు తారలు. పెళ్లయ్యాక ‘పిల్లలెప్పుడు?’ అనే ప్రశ్న వెంటాడుతుంటుంది. ప్రశ్నలడిగేవారు కొందరైతే, ఊహించుకుని వార్తలు ప్రచారం చేసేవాళ్లు కొందరు ఉంటారు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ గురించి ఓ వార్త ప్రచారంలోకొచ్చింది. ‘కాజల్ గర్భవతి’ అన్నది ఆ వార్త సారాంశం. గత ఏడాది అక్టోబర్‌లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కాజల్ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తున్నారు కాజల్. ప్రస్తుతం చిరంజీవి సరసన ‘ఆచార్య’ చేస్తున్నారు. అలానే ‘ఉమ’ అనే చిత్రం కమిట్ అయ్యారు. కమల్‌హాసన్–శంకర్ కాంబినేషన్ ‘ఇండియన్ 2’ కూడా కాజల్ ఖాతాలో ఉంది. అయితే కొత్త చిత్రాలేవీ కాజల్ అంగీకరించరని, ఎందుకంటే తల్లి కానున్నారనీ ఓ వార్త గుప్పుమంది. ఇటీవల కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ ‘త్వరలో కాజల్ తల్లి కావాలని కోరుకుంటున్నాను. అప్పుడు నా మూడేళ్ల కొడుకుతో ఆడుకోవడానికి ఒకరు తోడుంటారు’ అన్నారు. బహుశా కాజల్ గర్భవతి అనే వార్త ప్రచారంలోకి రావడానికి నిషా మాటలు ఓ కారణం అయ్యుండొచ్చు. అయితే ‘అలాంటిదేమీ లేదు. కాజల్ గర్భవతి కాదు’ అని ఆమె సన్నిహితులు స్పష్టం చేశారు. -
ప్లీజ్.. గర్భవతిని! నా పోర్న్ వీడియోల్ని తీసేయండి
కెరీర్లో ఉన్నంత కాలం అవకాశాల కోసం ప్రయత్నిస్తూ.. రాణిస్తూ, ఆపై ఫేమ్ తెచ్చిన ఇండస్ట్రీపై విమర్శలు చేయడం అడల్ట్ స్టార్లకు అలవాటైన పనే. మియా ఖలీఫా, సన్నీ లియోన్ లాంటి మాజీ పోర్న్ స్టార్స్ వ్యతిరేక కామెంట్లు చేసిన వాళ్లే. ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి చేరింది లానా రోడ్స్. చికాగో ఇల్లినాయిస్లో పుట్టిన పెరిగిన ఈ 25 ఏళ్ల మాజీ అడల్ట్ స్టార్ అసలు పేరు అమరా మాపుల్. టీనేజీలోనే పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి లానా రోడ్స్‌గా ఫేమ్ సంపాదించుకుంది. మొదట మోడలింగ్, యూట్యూబ్, ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సంపాదించుకుంది. 2016 అడల్ట్ సినిమాల్లోకి అడుగుపెట్టి.. రెండేళ్లపాటు స్టార్‌డమ్‌ను కొనసాగించింది. కొంతకాలం క్రితం కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె.. ప్రస్తుతం హ్యారీ జోసే పాడ్‌కాస్ట్ ‘టాప్ ఇన్’లో పని చేస్తోంది. ఇక అప్పటి నుంచి ఇండస్ట్రీపై తరచూ విమర్శలు చేస్తోంది. తాజాగా తాను గర్భవతిని అనే బాంబ్ పేల్చిన లానా.. తన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి వీడియోల్ని తొలగించాలని విజ్ఞప్తి చేస్తోంది. ‘‘ప్రస్తుతం నేను గర్భంతో ఉన్నా. నాకు పుట్టే బిడ్డకు నా గతం గురించి తెలిసినా.. ఆ జ్ఞాపకాలు అందకూడదనే అనుకుంటున్నా. అందుకే నిజాయితీగా కోరుతున్నా. దయచేసి అడల్ట్ వెబ్సైట్లు ఆవీడియోలను తొలగించండి. అవకాశం దొరికితే నేనే కాలంలో వెనక్కి వెళ్తా. అలాంటి పనులకు దూరంగా ఉంటా. నా గౌరవాన్ని నేను కాపాడుకుంటా’’ అని పశ్చాత్తాప పడింది లానా. ఇక అంతేకాదు సెక్స్ వర్కర్స్‌తో ఇంటెరాక్షన్ ద్వారా.. వాళ్ల మానసిక సంఘర్షణను అందరికీ తెలియజేసేలా ప్రోగ్రామ్‌లు చేస్తోందామె. వాళ్లకు(అడల్ట్ వెబ్సైట్లకు) కొంత కాలం అవకాశం ఇవ్వాలనుకంటున్నా.. అవసరమైతే న్యాయపరమైన చర్యల దిశగా ఆలోచిస్తా అని చెప్తోంది లానా. చదవండి: అడల్ట్ సినిమాలతో మియా ఖలీఫా సంపాదనెంతో తెలుసా? ఇంతకీ తండ్రెవరు? మైక్ మజ్లక్ అమెరికన్ నటుడు, పాపులర్ వ్లోగర్. లానా రోడ్స్‌తో చాలాకాలంగా రిలేషన్షిప్ కొనసాగించాడు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. కొన్ని నెలల క్రితం వీళ్లిద్దరూ విడిపోయారు. దీంతో లానా కడుపులో బిడ్డకు తండ్రి అతనేనా? అనే అనుమానం ఆమె అభిమానులకు వ్యక్తం అవుతోంది. అయితే ఈ ప్రశ్నకు ఆమె ‘బిడ్డ పుట్టాక డీఎన్ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంద’ని సరదా సమాధానం ఇచ్చింది. చదవండి: పాక్ చేష్టలపై మియా ఖలీఫా ఫైర్ -
గర్భవతిగా ప్రియమణి.. త్వరలోనే అధికారిక ప్రకటన!
ప్రియమణి ప్రస్తుతం ఫుల్ బిజీగా మారింది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్‌సిరీస్‌తో అలరించిన ఆమె ఓ కన్నడ చిత్రంలో లీడ్ రోల్ పోషించనుంది. గతేడాది కన్నడలో 'యాక్ట్ 1978' అనే చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో యజ్ఞ శెట్టి ప్రధానపాత్ర పోషించింది. మన్సో రే దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి ఆధరణ లభించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారట. నిర్మాత ఠాగూర్ మధు ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రియమణి కథానాయికగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో ప్రియమణి గర్భవతి పాత్రలో కనిపించనుంది. ప్రభుత్వం నుంచి తనకి రావలసిన నష్టపరిహారం కోసం,ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఓ మహిళ పాత్రలో ప్రియమణి నటించనుంది. చివరికి మానవ బాంబుగా మారి ఆఫీసులో ఎవరిని బయటకు వెళ్లకుండా తలుపులు మూసేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే దానిపై ఇంట్రెస్టింగ్గా స్టోరీ తెరకెక్కనుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుంది. ఇప్పటికే ప్రియమణి తెలుగులో విరాటపర్వం, నారప్ప అనే చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది. కరోనా కారణంగా ఈ చిత్రాలు వాయిదా పడ్డాయి. చదవండి : ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది : ప్రియమణి మా మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి! -
ఒకే కాన్పులో పదిమంది: అంతా కట్టుకథ!
ఒకే కాన్పులో పదిమంది పిల్లలకు జన్మనిచ్చానని ప్రకటించుకున్న తల్లి వ్యవహారంలో ఊహించిందే జరిగింది. అనుమానాల్ని పటాపంచల్ చేస్తూ దక్షిణాఫ్రికా ప్రభుత్వం అధికారికంగా ఒక నివేదికను వెల్లడించింది. ఆమె, ఆమె భర్త చెప్పింది పచ్చి అబద్ధమని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు గోసియామె తమార సిత్హోల్(37) అల్లింది కట్టుకథేనని ప్రకటిస్తూ.. ఆమెను మానసిక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించింది. ప్రిటోరియా: దక్షిణాఫ్రికాలో ఒకే కాన్పులో పది మంది బిడ్డలకు ఓ మహిళ జన్మనిచ్చిందన్న ఉదంతం సరికొత్త మలుపు తిరిగింది. అసలు సిత్హోల్ ఈమధ్య కాలంలో గర్భమే దాల్చలేదని అదిరిపోయే ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ మేరకు ఆమెను పరీక్షించిన వైద్యుల నివేదికను టెంబిసా అధికారులు మీడియాకు రిలీజ్ చేశారు. అంతేకాదు ఆమె మానసిక ఆరోగ్యంపై అనుమానం వ్యక్తం చేస్తూ.. మెంటల్ హెల్త్ యాక్ట్ కింద ఆమెను అదుపులోకి తీసుకుని ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. మరోవైపు ఆమె భర్త టెబెహో సోటెట్సిను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని అతితోనే.. జూన్ 7న టెంబిసా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గోసియామె తమార సిత్హోల్ ఒకే కాన్పులో పది మంది పిల్లలకు జన్మనిచ్చిందన్నది వార్త. ప్రిటోరియా న్యూస్ ఎడిటర్ పెయిట్ ర్యామ్‌పెడి అత్యుత్సాహం వల్లే ఈ కథనం ప్రపంచం మొత్తం వైరల్ అయ్యింది. అయితే అప్పటి నుంచి ఆ పిల్లల ఫొటోలు, వీడియోలు వైరల్ కాకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు తమ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని సిత్హోల్, టెబెహో విరాళాలు సేకరించారు. ఒకానొక టైంలో తన భార్యా పిల్లల ఆచూకీ తనకూ తెలియడం లేదని, అప్పటిదాకా విరాళాలు ఇవ్వడం ఆపండని టెబెహో రిక్వెస్ట్ చేశాడు. మరోవైపు గతంలోనూ ముగ్గురు పిల్లలు పుట్టారని సిత్హోల్ ప్రకటించుకుందని, కానీ, అందులో నిజం లేదని బంధువులు చెప్పారు. ఒకానొక టైంలో ఆ భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అనుమానాలు-విమర్శల నేపథ్యంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం దర్యాప్తును ముమ్మరం చేసింది. టెంబిసాలో ఏ ఆస్పత్రిలో ఆమె డెలివరీ కోసం చేరలేదని నిర్ధారించుకుని.. ఆపై ఆమె కట్టుకథను ఆధారాలతో సహా బయటపెట్టారు అధికారులు. ఇక ఇదంతా ఫేక్ అని తేలడంతో.. మాలి దేశంలో మే నెలలో తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చిన హలీమా సిస్సే రికార్డు పదిలంగా ఉందని చెప్పొచ్చు. చదవండి: 7 నెలల 7 రోజులకే.. -
Yoga: డిప్రెషన్‌కు ఔషధ యోగం!
యోగా ఎంత మంచిదో ఇప్పటికీ మనకందరికీ తెలుసు. అంతేకాదు... పరిశోధనలూ, అధ్యయనాలూ జరుగుతున్న కొద్దీ మన యోగా తాలూకు ప్రాముఖ్యం కొత్త కొత్త విషయాలతో మాటిమాటికీ ప్రపంచానికి తెలియవస్తూనే ఉంది. ఇప్పుడు మళ్లీ మరోసారి కొత్తగా పాశ్చాత్యుల పరిశోధనల్లో సైతం యోగా గురించి మరో అంశం తాజాగా వెలుగుచూసింది. గర్భం ధరించిన యువతుల్లో అనేక హార్మోన్ల మార్పుల వల్ల భావోద్వేగాల మార్పులు (మూడ్ స్వింగ్స్) సాధారణం. అయితే ప్రతి ఐదుగురు గర్భవతులను పరిశీలిస్తే... వారిలో ఒకరికి ఈ మార్పులు చాలా తీవ్రంగా కనిపిస్తుంటాయి. ఇటీవల మిషిగాన్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంతో ఈ మూడ్ స్వింగ్స్కు ఒక ఆరోగ్యకరమైన పరిష్కారం కనిపిస్తోంది. గర్భవతుల్లో ఒత్తిడిని ఎంత ఎక్కువగా తగ్గించగలిగితే... మూడ్ స్వింగ్స్ తీవ్రత అంతగా తగ్గుతుందని పరిశోధక బృందం తెలుసుకున్నారు. మూడ్ స్వింగ్స్ కారణంగా కలిగే డిప్రెషన్ లక్షణాల (డిప్రెసివ్ సింప్టమ్స్) ను నివారించేందుకు ఒత్తిడిని తొలగించేలా స్ట్రెస్ బస్టర్ షెడ్యూల్‌ను రూపొందించారు. ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహిస్తున్న మారియా ముజిక్ మాట్లాడుతూ ‘‘భారతీయుల యోగా మంచి స్ట్రెస్ బస్టర్ అని మనం గతంలోనే విని ఉన్నాం. అయితే అప్పట్లో దీన్ని పూర్తి తార్కాణాలతో నిరూపించేలా పరిశోధన ఫలితాలేమీ లేవు. దాంతో వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయాలను రికార్డు చేసే పనిలో పడ్డాం. ఈ పనిలో మాకోవిషయం తెలియవచ్చింది. గర్భవతులు అనుసరించదగిన ఆరోగ్యకరమైన, సురక్షితమైన యోగా ప్రక్రియలతో అటు తల్లికి, ఇటు బిడ్డకు మేలు జరుగుతుందని మా అధ్యయనంలో తేలింది’’ అన్నారు. కొత్తగా తల్లి కాబోయే యువతుల్లో హార్మోన్ల మార్పుల వల్ల మానసిక సమస్యలు రావడం చాలా సాధారణం. అయితే వీటికి చికిత్స చేయకుండా అలాగే వదిలేయడం వల్ల తల్లికీ, బిడ్డకూ హాని చేకూరడానికి అవకాశాలు ఎక్కువ. పైగా ఇలాంటి మహిళల్లో తల్లీ, బిడ్డా బరువు కోల్పోవడం, ప్రీ ఎక్లాంప్సియా, నెలలు నిండకముందే కాన్పు కావడం వంటి దుష్పరిణామాలు సంభవించవచ్చు. అయితే గర్భవతులు పాటించదగిన సురక్షితమైన యోగా ప్రక్రియలు ఇలాంటి దుష్పరిణామాలను నివారించడమే గాక... తల్లికీ, బిడ్డకూ మధ్య మంచి ప్రేమానురాగాలను కూడా మరింత ఇనుమడింపజేస్తాయని మారియా ముజిక్ పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో 1226 మంది గర్భిణులు రోజూ 90 నిమిషాలపాటు యోగా చేయడం వల్ల కడుపులోని పిండం మరింత ఆరోగ్యంగా పెరుగుతున్నట్లు తెలిసింది. యోగా చేసే తల్లులు ఈ మార్పులను సులభంగా గుర్తిస్తున్నట్లుగా కూడా తేలింది. అయితే గర్భవతులు అనుసరించాల్సిన యోగా ప్రక్రియలను కేవలం నిపుణులైన యోగా టీచర్ల సమక్షంలోనే ఆచరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదవండి: ఆమెకు సముద్రమే అన్నం ముద్ద -
బాలిక గర్భంపై ‘సోషల్’ వార్.. ఎమ్మెల్యేకు తలనొప్పి
సాక్షి, రాయికల్(జగిత్యాల): రాయికల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. రాయికల్ మండలంలోని అధికార పార్టీ నేతలు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ విషయం వారంరోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికార పార్టీకి చెందిన ఓ బడా నేత వ్యవహార శైలి ఇదీ అంటూ పేరు ప్రస్తావించకుండా మరోనేత ఫేస్బుక్, వాట్సప్‌లో మెసేజ్ పెడుతున్నారు. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులతోపాటు జనం నవ్వుకుంటున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ స్పందించి సోషల్ మీడియా వార్‌కు ఫుల్స్టాప్ పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు. బాలిక ఫొటో వాట్సప్‌లో పోస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. చదవండి: వృద్ధురాలిపై అత్యాచారం.. కొట్టి చంపిన గ్రామస్తులు -
గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, అమరావతి: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గర్భిణుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో ఏటా 8 లక్షల మంది గర్భిణులు ప్రసవాల నిమిత్తం ఆస్పత్రులకు వెళ్తుండగా.. వీరిలో 3 లక్షల మందికి పైగా ప్రభుత్వాస్పత్రుల్లో పురుడు పోసుకుంటున్న వారే. ప్రస్తుత పరిస్థితుల్లో గర్భిణులు కోవిడ్ బారినపడే అవకాశం ఉండటంతో ప్రసవాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కోవిడ్ బాధితుల కోసం తీసుకునే చర్యల కంటే గర్భిణులకు మరింత జాగ్రత్తగా ఐసొలేషన్ వార్డులు, గదులు, ప్రత్యేక ప్రసవ గదులు, ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయాలని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు వెళ్లాయి. కరోనా పాజిటివ్ బారిన పడిన గర్భిణులకు ప్రత్యేక వైద్యం అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక చర్యలు ఇలా ► కోవిడ్ పాజిటివ్ బారిన పడిన గర్భిణులకు యాంటీనటల్ చెకప్స్ (గర్భిణుల వైద్య పరీక్షలు), పోస్ట్నటల్ చెకప్స్ (ప్రసవం తర్వాత పరీక్షలు) విధిగా చేయాలి. డెలివరీకి 15 రోజుల ముందు ప్రతి గర్భిణికి కోవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయాలి ► ప్రసవానికి ప్రత్యేక గది, ఆపరేషన్ థియేటర్ ఉండాలి. ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రి అయి ఉండాలి. ► ప్రసవానికి మెటర్నిటీ ఆస్పత్రిలో 50, బోధనాస్పత్రిలో 30, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రిలో 20 చొప్పున, సీహెచ్‌సీలో 10, పీహెచ్సీలో 2 చొప్పున పడకలు కేటాయించాలి. ► 104 కాల్ సెంటర్ ద్వారా టెలీ కన్సల్టెన్సీ సేవలు, 108 ద్వారా రవాణా సేవలు నిత్యం అందుబాటులో ఉండాలి. ► కరోనా సోకిన గర్భిణులను కోవిడ్ ప్రొటోకాల్స్ పాటించే విధంగా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించాలి. ► గిరిజన ప్రాంతాల్లో అత్యవసర సేవల్లో భాగంగా ఫీడర్ అంబులెన్సులు అందుబాటులో ఉంచాలి. ► ప్రసవానికి 15 రోజుల ముందే బర్త్ వెయిటింగ్ హోమ్స్‌ను రెడీ చేసి ఉంచాలి. ► అన్ని జిల్లాల్లో వైద్యాధికారులు, జిల్లా ఆరోగ్య సమన్వయకర్తలు (డీసీహెచ్ఎస్), బోధనాస్పత్రుల సూపరింటెండెంట్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. ► రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో గర్భిణుల కోసం 575 పడకలు కేటాయించాలి. -
గర్భిణులకు కాఫీ సేఫేనా?
ఉదయాన్నే కాస్తంత టీ లేదా కాఫీ కడుపులోకి వెళ్లందే మన రోజువారీ దినచర్య మొదలవదంటే అతిశయోక్తి కాదు. అంతలా ఇవి ప్రతి ఇంట్లోనూ భాగమయ్యాయి. కొందరైతే రోజుకు నాలుగైదు సార్లు ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే టీ/కాఫీ సేవిస్తుంటారు. తలనొప్పి అనిపించినా, అలసటగా ఉన్నా కాస్త టీ/కాఫీని సేవిస్తే వాటి నుంచి విముక్తి లభించినట్లుంటుదని భావించడమే దీనికి కారణం. అయితే, ’అతి సర్వత్ర వర్జయేత్’ అనే నానుడి ప్రకారం ఏదయినా సరే మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. ఆ స్థాయి దాటిందంటే సమస్యలు తప్పవు. ఇటీవల కాలంలో చాలామంది దృష్టికి వచ్చిన తాజా పుకారు.. ’’గర్భిణులు కాఫీ తాగకూడదు!’. మరి ఇది నిజమేనా? వైద్య నిపుణులు ఏమంటున్నారు? చూద్దాం.. కాఫీని కొకోవా, కాఫీ చెట్ల గింజల నుంచి తీసిన పొడితో తయారుచేస్తారనే విషయం తెలిసిందే. ఈ విత్తనాల్లో కెఫేన్ అధికంగా ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థ చురుగ్గా వ్యవహరించడంలో తోడ్పడుతుంది. అందువల్లే కాఫీని శక్తిని అందించే, ఉత్తేజపరిచేదిగా భావిస్తారు. కాఫీలోని కెఫేన్ మన ఆహారనాళంలో త్వరగా జీర్ణమై కలసిపోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు వైద్య నిపుణులు కనుగొన్నారు. అయితే, గర్భిణులు కాఫీ తాగినప్పుడు వారిలో కెఫేన్ జీర్ణమవడానికి చాలా సమయం పడుతుంది. ఈ సమయంలోనే అది గర్భస్త శిశువు రక్తప్రవాహంలోకి చేరుతుంది. ఇక్కడ అది విచ్ఛిన్నమవడం అసాధ్యం. ఫలితం గా పుట్టబోయే చిన్నారులు తక్కువ బరువు కలిగిఉండడం, పెరుగుదల లోపించడం, గర్భస్రావం జరగడం, కొన్ని సార్లు చిన్నారులు అసాధారణ బరువు తో పుట్టడం వంటివి సంభవిస్తాయి. నిజానికి గర్భంపై కెఫేన్ వ్యతిరేక ఫలితాలు చూపడానికి ఇతమిత్ధంగా ఇప్పటికీ కారణాలు తెలియదు. అలాగే దీని ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండడమూ వైద్యనిపుణులు గమనించారు. రోజుకు 200 మిల్లీ గ్రాములు.. గర్భిణులు కాఫీ తాగొద్దా అంటే మాత్రం నిస్సందేహంగా తాగొచ్చంటున్నారు ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్ట్రెస్టీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్(ఏసీఓజీ) వైద్యులు. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రోజువారీ కెఫెన్ పరిమాణం 200 మిల్లీగ్రాములకు మించకూడదని చెబుతున్నారు. ఆ స్థాయిని మించితే మాత్రం గర్భంలోని శిశువుపై దుష్పరిణామాలు చూపించే ప్రమాదముందంటున్నారు. సాధారణంగా ఒక కప్పు(240 ఎంఎల్) కాఫీలో 96 మిల్లీగ్రాముల కెఫేన్ ఉంటుంది. దీని ప్రకారం ఎక్కువ నివేదికలు చెప్పేదేంటంటే రోజుకు గర్భిణులు 2 కప్పుల(475 గ్రాముల) కాఫీకి మించి తాగకూడదు. డికాఫ్ కాఫీ ప్రత్యామ్నాయమా? డికాఫ్ కాఫీ అంటే కెఫీన్‌ను తొలగించి చేసిన కాఫీ. అయితే, ఇందులో 100 శాతం కెఫేన్ తొలగింపు సాధ్యం కాదు. 97శాతం వరకు కెఫేన్ తొలగించవచ్చు. ఆ ప్రకారం ఒక కప్పు(240ఎంఎల్) డికాఫ్ కాఫీలో కేవలం 2.4 మిల్లీగ్రాముల కెఫేన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి డికాఫ్ కాఫీని రోజుకు మూడు, నాలుగుసార్లు తాగిన గర్భిణులపై దుష్ప్రభావం చూపదని వైద్య పుణులు అంటున్నారు. అలాగే సాధారణ కాఫీతోపాటు డార్క్ చాకొలెట్, ఎనర్జీ డ్రింక్స్, కోలా, హాట్ చాకొలెట్ వంటి వాటిలో కెఫేన్ పరిమాణం ఎక్కువ కాబట్టి వాటి జోలికి వెళ్లవద్దని సూచిస్తున్నారు. అయితే, వీటన్నింటికీ డికాఫ్ కాఫీ ప్రత్యామ్నాయంగా ఎంచుకునే కంటే గర్భిణులు పూర్తిగా కెఫెన్కు దూరమవడమే మంచిదంటున్నారు. ఇంకా చెప్పాలంటే వారికి గర్భిణులకు సురక్షితమైన హెర్బల్, ఫ్రూట్ టీలు, నిమ్మరసం, తేనె కలిపిన వేడినీరు, పసుపు కలిపిన పాలు తాగడం మేలని సూచిస్తున్నారు. -
8 నెలల నిండు గర్భిణి.. అయితేనేం కరోనా కట్టడికి కదిలింది
సాక్షి,జియ్యమ్మవలస( విజయనగరం): చిత్రంలో కరోనా వ్యాక్సిన్ వేస్తున్నది జియ్యమ్మవలస మండలంలోని రావాడ–రామభద్రపురం పీహెచ్సీలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న అన్నపూర్ణ. ఆమె ప్రస్తుతం 8 నెలల నిండు గర్భిణి. అయితేనేం... కరోనా కట్టడికి ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నారు. సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. కరోనా విధులకు వెళ్లొద్దని వైద్యులు వారిస్తున్నా.. తన పని తాను చేసుకుపోతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ రోగులతో పాటు కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. కరోనా సమయంలో రిస్క్ ఎందుకంటూ ఆమెను ప్రశ్నించిన వారికి.. రోగులకు సేవలందించడంలోనే సంతృప్తి ఉంటుందని చిరునవ్వుతో సమాధానస్తున్నారు. కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు అండగా ఉండటంతో సేవలు సాఫీగా అందించగలుగుతున్నట్టు చెప్పారు. ( చదవండి: కరోనాను జయించిన నవజాత శిశువు ) -
గ్రామంలోకి నో ఎంట్రీ.. నడిచి వెళ్లి, అంబులెన్స్‌లో..
సాక్షి, విశాఖపట్నం : కరోనా వైరస్ భయం మనుషుల్లో విచక్షణ కోల్పోయేలా చేస్తోంది. ప్రాణ భయంతో మంచి,చెడులు మరిచిపోతున్నారు జనం. ప్రాణం మీదకు వచ్చినా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. విశాఖ జిల్లాలో తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణ. పురుటి నొప్పులతో అల్లాడుతున్న ఓ గర్భిణి కోసం వచ్చిన అంబులెన్స్‌ను సైతం ఊర్లోకి రాకుండా అడ్డుకున్నారు గ్రామస్తులు. వివరాలు.. విశాఖ ఏజెన్సీలోని జి.మాడుగుల మండలం పాల మామిడి గ్రామస్తులు.. గ్రామంలోకి వేరే వాళ్లు రాకుండా సరిహద్దు వద్ద గేట్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన పాంగి లలిత అనే మహిళకు పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు కోరిన మేరకు అంబులెన్సు వచ్చింది. కానీ, గ్రామస్తులు గ్రామంలోకి అంబులెన్స్‌ను అనుమతించలేదు. దీంతో ఆ గర్భిణిని నడిపించుకుంటూ గ్రామ శివారులోని అంబులెన్స్ ఎక్కించారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్లేలోగా లలిత బాబుకు జన్మనిచ్చింది. ప్రజలు కరోనా భయంతో అంబులెన్స్‌ను గ్రామంలోకి అనుమతించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
DSP Shilpa Sahu; ‘అమ్మ’ఆన్ డ్యూటీ
అవసరం అయితే తప్ప ఇళ్లలోంచి కదలవద్దని జనానికి చెప్పడానికి.. ఇంట్లో ఉండవలసిన అవసరం ఉన్నప్పటికీ బయటికి వచ్చి ఎర్రటి ఎండలో డ్యూటీ చేస్తున్నారు ఐదు నెలల గర్భిణీ అయిన దంతెవాడ డీఎస్పీ శిల్పా సాహూ!! ‘సురక్షితంగా ఉండండి, మాస్కులు ధరించండి’ అని చెప్పడానికి, నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిని హెచ్చరించడానికి లాఠీ చేతపట్టి.. తన కడుపులోని బిడ్డకు ప్రమాదమేమో అని కూడా తలవకుండా కరోనా సెకండ్ వేవ్ లో, సూర్యుడి భగభగల్లో, మావోయిస్టుల కదలికల నడుమ.. ఆమె తన విధులు నిర్వహిస్తున్నారు! ఎప్పుడూ గుడిలో దర్శనమిచ్చే దంతేశ్వరీ దేవి మంగళవారం మధ్యాహ్నం ఎర్రటి ఎండలో దంతెవాడ పట్టణ ప్రధాన కూడళ్లలో కర్ర పట్టి తిరుగుతూ, ప్రజలు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు చెబుతూ ఉన్నట్లే అనిపించి ఉండవచ్చు అక్కడి వారికి కొందరికైనా! ఆ ‘దంతేశ్వరీ దేవి’ పేరు శిల్పా సాహూ (29). దంతెవాడ డిప్యూటీ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్. దంతెవాడ చత్తీస్‌గఢ్ జిల్లాలో ఉంది. సాధారణంగా మావోయిస్టులను గుర్తుకు తెచ్చే ఈ ప్రాంతం.. కరోనా లాక్డౌన్ విధుల నిర్వహణలో డీఎస్పీ శిల్పా సాహూ చూపిన అంకితభావం కారణంగా ఎవరికైనా శక్తిమాతను గుర్తు తెచ్చి ఉంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. దేశంలోని మొత్తం యాభై రెండు శక్తి పీఠాలలో ఒకటైన దంతేశ్వరీదేవి ఆలయం దంతెవాడలో ఉంది. ఆ తల్లి తన బిడ్డల్ని అదిలించి, కదిలించి, సంరక్షించిన విధంగానే ఇప్పుడు శిల్ప తన పౌరుల్ని కరోనా నిర్లక్ష్యం నుంచి అదిలిస్తూ, త్వరగా చేరమని ఇళ్లకు కదిలించే డ్యూటీలో ఉన్నారు. నిజానికైతే ఆమె కూడా ఇంట్లోనే ఉండిపోవలసిన పరిస్థితే. గాలి సోకితే చాలు కరోనా వచ్చేలా ఉంది. ఎండ ఆవిర్లు వదులుతోంది. మావోయిస్టులు ఎక్కడ మాటువేసి ఎటుగా వస్తోరో తెలియదు. అయినా పోలీస్ డ్యూటీ పోలీస్ డ్యూటీనే. అన్నిటినీ తట్టుకోవాలి. పౌరుల్ని కాపాడాలి. డిఎస్పీ శిల్ప కూడా అదే డ్యూటీ ఉన్నారు కానీ, ఆమె కాస్త ప్రత్యేకమైన పరిస్థితిలో డ్యూటీ చేస్తున్నారు. ఐదవ నెల గర్భిణి ఆమె. ఇక నుంచి ఆమె మరింతగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఆమెకు చెప్పే ఉంటారు. అయితే సెకండ్ వేవ్ కరోనాలో ప్రజలు మరింతగా భద్రంగా ఉండాలని చెప్పడం కోసం ఆమె బయటికి వచ్చారు. లాఠీ పట్టుకుని దంతెవాడ ప్రధాన రహదారులలో డ్యూటీ చేశారు. మాస్క్ వేసుకోని వాళ్లను, అనవసరంగా బయటికి వచ్చినవాళ్లను ఆపి, మందలించారు. కరోనా బారిన పడకుండా, ఇతరులను పడేయకుండా ఉండటానికి జాగ్రత్తలు చెప్పి పంపారు. సాటి మానవులు చెబితే కోపం వస్తుందేమో కానీ, డీఎస్పీ చెబితే వినకుండా ఉంటారా? ఇప్పుడామె చేస్తున్నది బాధ్యతల్ని గుర్తు చేసే డ్యూటీ. ఒకరు గుర్తు చేయాల్సినంతగా నిర్లక్ష్యాన్ని, ఉదాసీనతను ప్రదర్శిస్తున్న పౌరులు.. గర్భిణిగా ఉండి కూడా మిట్ట మధ్యాహ్నపు ఎండలో డ్యూటీ చేయడం చూసి సిగ్గుపడే ఉంటారు. తనకు, కడుపులో ఉన్న తన బిడ్డకు కరోనా సోకుతుందేమోనన్న భయం లేకుండా శిల్ప పౌరుల క్షేమం కోసం పాటు పడటం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవాన్నే పెంచింది. గర్భంతో ఉండి కూడా ఆమె డ్యూటీ చేస్తున్నప్పటి ఫొటోను ఐపీఎస్ ఆఫీసర్, చత్తీస్‌గఢ్ అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దీపాంశు కబ్రా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయగానే ‘డ్యూటీ మైండెడ్’ శిల్పపై గత 48 గంటలుగా ట్విట్టర్లో ధారాపాతంగా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ‘సెల్యూట్ టు డీఎస్పీ శిల్పా సాహూజీ! డీజీపీ శ్రీ అవస్థిగారూ.. ఆమెకు అవార్డు ప్రకటించంది. అలాగే ఆమె కోరుకుంటే కనుక ఆమెను రాయ్‌పుర్ బదలీ చేయండి’ అని ఒకరు, ‘గుడ్ జాబ్ మేమ్, ఐ రిక్వెస్ట్ యు ప్లీజ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ’ అని ఇంకొకరు.. పదులు, వందల్లో ఆమెను అభినందిస్తూ, జాగ్రత్తలు చెబుతున్నారు. రాయ్‌పుర్ చత్తీస్‌గఢ్ రాజధాని. అక్కడికి, దంతెవాడకు ఏడున్నర గంటల ప్రయాణం. రాయ్‌పుర్‌లో అయితే శిల్పకు ఈ సమయంలో సౌకర్యంగా ఉంటుందని కూడా ట్విటిజెన్‌లు ఆలోచిస్తున్నారు. సీఎం ఆమెను ఒక ఆదర్శ మహిళా అధికారిగా కీర్తించారు. ఇంతకంటే కఠిమైన డ్యూటీలనే చేశారు శిల్పి. ఎ.కె.47 ధరించి ‘ఆపరేషన్’లలో పాల్గొన్నారు. దంతేవాడలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటైన ‘దంతేశ్వరి ఫైటర్స్’ (మహిళా కమాండోలు) కు నాయకత్వం వహించారు. వాటికంటే కష్టమైన పని.. కరోనా లాక్డౌన్ నిబంధనల్ని జనం ఉల్లంఘించకుండా చూడటం అని ఇప్పుడామె గ్రహించే ఉంటారు. ‘‘నేను బయట ఉంటేనే.. వాళ్ల లోపల ఉంటారు’’ రోడ్డు మీద వెళుతూ అధాటున చూసిన వారికి మామూలు దుస్తుల్లో ఉన్న శిల్పా సాహు మొదట సాధారణ మహిళగా అనిపించవచ్చు. కానీ, గర్జించే ఆమె స్వరం.. ఆమె పోలీసు అన్న వాస్తవాన్ని ఆ వెంటనే తెలియజేస్తుంది. ‘వాపస్ జావో, ఘర్ జావో’ (వెనక్కు వెళ్లు.. ఇంటికి వెళ్లు) అని గట్టిగా అరచి చెప్పినా వినని వారికి ఆమె చేతిలోని లాఠీ చక్కగా అర్థమయ్యేలా చెప్పేందుకు సిద్ధమౌతుంది. ఏప్రిల్ 18 నుంచి దంతెవాడ జిల్లా (దక్షిణ బస్తర్) లాక్డౌన్లో ఉంది. ఆ రోజు నుంచీ శిల్ప లాక్డౌన్ డ్యూటీలో ఉన్నారు. ‘‘గర్భిణిగా ఉండి మీరు బయటికి రావడం ఎందుకు?’’ అనే ప్రశ్నకు.. ‘‘నేను బయట ఉంటేనే వాళ్లు లోపల ఉంటారు’’ అంటున్నారు శిల్ప. -
5 నెలల గర్భంతో డ్యూటీ చేస్తున్న డీఎస్పీ
-
13 ఏళ్ల బాలికకు పెళ్లి, గర్భం.. భర్తపై కేసు
హోసూరు/బెంగుళూరు: తొమ్మిదవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకొని గర్భవతి చేసిన వ్యక్తిపై డెంకణీకోట మహిళా పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రాయకోట ప్రాంతానికి చెందిన బాలికను ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని చిన్నేగౌండనూరు గ్రామానికి చెందిన దేవరాజ్ (24) జనవరి 13న పెళ్లి చేసుకొన్నాడు. రెండు రోజుల క్రితం ఆ బాలిక ఆరోగ్యం బాగాలేదని డెంకణీకోట సమీపంలోని పంజపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వెళ్లింది. వైద్యులు పరిశీలించగా బాలిక గర్భవతిగా అని ధృవీకరించారు. మైనర్ కావడంతో క్రిష్ణగిరి జిల్లా పిల్లల సంక్షేమ శాఖాధికార్లకు సమాచారమిచ్చారు. చివరకు పోలీసులు వచ్చి మైనర్‌ను పెళ్లి చేసుకున్న నేరంపై భర్త దేవరాజ్‌పై పోక్సో కేసు పెట్టి అరెస్టు చేశారు. (చదవండి: భాగ్యమిత్ర లాటరీ.. సెక్యూరిటీ గార్డు కరోడ్‌పతి) -
హృదయవిదారకం.. రోడ్డుపక్కనే ఇలా
మేడ్చల్ : ఇది అమానవీయం.. సిగ్గుచేటు.. హృదయ విదారకరం.. సర్కారు దవాఖాన అంటేనే ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే పాటను గుర్తుకు తెచ్చే ఘటన. ఒక నిండు గర్భిణి నెలలు నిండి సర్కారు దవాఖానకు వెళితే ఆస్పత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించిన వైద్యులు. చేసేది లేక రోడ్డుపైనే ప్రసవం. పుట్టిన గంటలోనే శిశువు మృతి. ఆ నవజాత శిశువు చేసిన నేరం ఏమిటి?, ఆ మహిళ చేసిన పాపం ఏమిటి?, మానవత్వం కనీసం కూడా కనిపించని ఈ తరహా ఘటనలకు ముగింపు ఎక్కడ? వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ ఆసుపత్రి వెద్యులు పట్టించుకోకపోవటంతో ఓ గర్భిణి రోడ్డు పక్క ప్రసవించిన ఘటన జిల్లాలోని జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. మేడ్చల్‌కు చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం జవహార్ నగర్‌లోని బాలాజీ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. అయితే వైద్యులు ఎవరూ పట్టించుకోకపోవటంతో రోడ్డు పక్కనే ప్రసవించింది. పుట్టిన కొన్ని నిమిషాలకే శిశువు మరణించింది. తల్లిని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఎనిమిదో తరగతి ఫెయిల్: బ్లేడ్‌తో డెలివరీ
లక్నో: అంతులేని నిర్లక్ష్యం ఓ గర్భిణీతో పాటుగా, నవజాత శిశువు ప్రాణాలను బలితీసుకుంది. రిజిస్ట్రేషన్ లేని ఓ నర్సింగ్ హోమ్‌లో ఎనిమిదవ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి గర్భిణీకి డెలివరీ చేయాడానికి ప్రయత్నించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. రేజర్ బ్లేడ్‌తో ఆపరేషన్ చేయడంతో ఇలా జరిగింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ జిల్లాలోని సైనీ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. నిందితుడిని 30 ఏళ్ల రాజేంద్ర శుక్లాగా గుర్తించారు. అతడు 8వ తరగతి వరకు చదివినట్టుగా తేలింది. వివరాలు.. రాజేశ్ సహనీ అనే వ్యక్తి స్థానికంగా మా శార్దా ఆస్పత్రి పేరుతో ఓ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నాడు. దానికి ఎలాంటి అనుమతులు లేవు. పైగా ఇందులో పనిచేసేందుకు ఎనిమిదవ తరగతి ఫెయిల్ అయిన రాజేంద్ర శుక్లా అనే వ్యక్తిని నియమించుకున్నాడు రాజేశ్. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రాజారామ్ అనే వ్యక్తి తన భార్య పూనమ్ పురిటి నొప్పులతో బాధపడుతుంటంతో ఆమెను ఒక మంత్రసాని వద్దకు తీసుకెళ్లాడు. అయితే ఆ మంత్రసాని డెలివరీ చేయడం తన వల్ల కాదని.. వెంటనే ఆమెని ఆరోగ్య కేంద్రానికి తరలించమని సలహా ఇచ్చింది. దాంతో అతడు పూనమ్‌ను రాజేష్‌కు చెందిన నర్సింగ్ హోమ్‌లో చేర్పించారు. అక్కడ అనుభవం లేని రాజేంద్ర శుక్లా పూనమ్‌కు చికిత్స అందించాడు. ఆపరేషన్ చేసేందుకు రేజర్ బ్లేడ్ వాడాడు. దీంతో పూనమ్‌కు గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. అనంతరం ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించమని అక్కడివారు చెప్పారు. అయితే సమీపంలో ఆస్పత్రులు లేకపోవడంతో రాజారామ్ తన భార్యను 140 కిలోమీటర్ల దూరంలో లక్నోలోని కేజీఎంయూ ట్రామా కేంద్రానికి తరలించాడు. అయితే తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆమె అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఇక, ఈ ఘటనపై రాజారామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు రాజేంద్ర శుక్లా, రాజేష్ సాహ్నిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అక్రమ క్లినిక్‌లపై చర్యలు తీసుకోవాలని పోలీసులు ఆరోగ్య కార్యదర్శికి లేఖ రాశారు. చదవండి: నిండు గర్భిణిని కాళ్లతో తొక్కి చంపేశారు.. -
ఏడాదిగా మైనర్ బాలుడిపై అత్యాచారం చేస్తోన్న మహిళ
వాషింగ్టన్: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ఏడాది నుంచి పద్నాలుగేళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడుతోంది. తాజాగా తాను సదురు బాలుడి వల్ల గర్భవతి అయినట్లు తెలిపింది. వివరాలు.. అర్కాన్సాస్ ప్రాంతానికి చెందిన బ్రిట్ని గ్రే అనే మహిళ ఏడాదిగా 14 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం నెరపుతోంది. దీని గురించి గతేడాది సెప్టెంబర్‌లో ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. అంతేకాక బ్రిట్ని మైనర్ బాలుడి వల్ల గర్భవతి అయినట్లు తెలిపాడు. సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు బ్రిట్ని నివాసానికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బ్రిట్ని ఏడాది నుంచి మైనర్ బాలుడితో శారీరక సంబంధం పెట్టుకున్నానని.. ప్రస్తుతం తాను రెండు నెలల గర్భవతిని అని పోలీసులకు వెల్లడించింది. ఈ క్రమంలో పోలీసులు బ్రిట్నిని ఈ నెల 1న అరెస్ట్ చేశారు. అనంతరం 5000 డాలర్ల పూచికత్తు మీద ఆమె విడుదలయ్యింది. ఏప్రిల్ 23న ఆమెని కోర్టు ముందు హాజరు పరచనున్నారు పోలీసులు. చదవండి: నిండు గర్భిణిని కాళ్లతో తొక్కి చంపేశారు.. -
నిండు గర్భిణిని కాళ్లతో తొక్కి చంపేశారు..
దర్శి టౌన్(ప్రకాశం జిల్లా): పిల్లనిచ్చే వారు లేక కులాంతర వివాహం చేసుకున్నాడు. భార్యపై అనుమానం పెంచుకొని గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ముండ్లమూరు మండలం ఉల్లగల్లులో ఈ నెల 21న గర్భిణి అనుమానాస్పద కేసులో భర్త, మామలను నిందితులుగా తేల్చి పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. కేసు పూర్వాపరాలను దర్శి డీఎస్పీ ప్రకాశరావు గురువారం విలేకరుల సమావేశంలో వివరించారు. ఉల్లగల్లు గ్రామానికి చెందిన కొండవీటి గురులింగం కుమారుడు శ్రీనివాసరావు..చిలకలూరి పేటకు చెందిన తన్నీరు వెంకాయమ్మ కుమార్తె శైలజను నాలుగేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి మూడేళ్ల బాబు ఉన్నాడు. ప్రస్తుతం శైలజ మూడు నెలల గర్భిణి. ఈ క్రమంలో నెల రోజులు క్రితం శ్రీనివాసరావు పొలం నుంచి ఇంటికి వచ్చే సమయంలో అదే గ్రామానికి చెందిన ఒక యువకుడు శ్రీనివాసరావు నివాసంలో నుంచి పారిపోవడం గమనించాడు. నాటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చిత్ర హింసలకు గురిచేస్తూ ఉండటంతో ఈ నెల 16న పెద్దల సమక్షంలో భార్య భర్తలకు సర్ది చెప్పారు. అయితే అకస్మాత్తుగా ఈనెల 21న శైలజ పశువుల పాకలో శవమై కనిపించింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమె శరీరంపై ఉన్న గాయాలు, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా విచారించారు. భర్త శ్రీనివాసరావు తహసీల్దార్ ఎదుట లొంగిపోయి నేరాన్ని ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. తన భార్య అక్రమ సంబంధం కారణంగా గ్రామంలో తమ పరువు పోతుందని భావించి నిద్రపోతున్న సమయంలో కాలుతో తొక్కి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ వివరించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చాటిన వారిని డీఎస్పీ అభినందించారు. చదవండి: ఎందుకిలా చేశావు తల్లీ... ! దారుణం: అమ్మానాన్నలే అమ్మేశారు.. -
శుభవార్త చెప్పిన మేఘన్ మార్కెల్
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోకి తొందర్లోనే మరో వారసుడు రానున్నాడు. బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్ మరోసారి తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని బంకింగ్ హమ్ ప్యాలెస్ ప్రతినిధి వాలెంటైన్స్‌డే రోజున ప్రకటించారు. కాగా, 2018 పెళ్లి బంధంతో ఒక్కటైన హ్యారీ, మార్కెల్ దంపతులకు ఇప్పటికే ఆర్చి జన్మించాడు. కాగా, రాజకుటుంబానికి చెందిన కొన్ని ఆంక్షలు, విభేదాల కారణంగా అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఈ జంట ఉత్తర అమెరికాలోని నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ జంట కాలిఫోర్నియాలోని శాంటా బార్బారాలో ఒక ఇల్లును కూడా కొనుగొలు చేశారు. ఇదిలా ఉండగా.. కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా 2020లో మార్కెల్‌కు గర్భస్రావం అయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. తండ్రితో ఉన్న విభేదాల కారణంగా మార్కెల్ తీవ్ర మానసిక సంఘర్షణ ఎదుర్కొన్నారని, ఆ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం దెబ్బతిని గర్భస్రావానికి దారి తీసినట్టు తెలిసింది. -
గర్భిణుల వైద్యపరీక్షలకు ఉచిత రవాణా
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రులకు వైద్యసేవలకు వెళ్లే గర్భిణులు ఇకపై ఆటో కోసమో, బస్సు కోసమో ఎదురు చూడాల్సిన పనిలేదు. వీళ్లకోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఇంటివద్దకే వాహనాన్ని పంపించే ఏర్పాట్లు చేస్తోంది. ఆపదలో ఉన్న వారి కోసం ఇప్పటికే 108 వాహనాలు పనిచేస్తున్నాయి. పల్లెల్లో మందులివ్వడానికి 104 వాహనాలున్నాయి. ప్రసవానంతరం తల్లీబిడ్డలను ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు నడుస్తున్నాయి. అయితే.. గర్భిణులు ప్రసవానికి ముందు ఆస్పత్రులకు వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోవాలంటే రవాణా సౌకర్యం లేదు. దీనికోసం ఇప్పుడు కొత్తగా వాహనాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. తొలిదశలో 170 వాహనాలు గర్భిణులు 9 నెలల కాలంలో విధిగా నాలుగు దఫాలు వైద్యపరీక్షలకు వెళ్లాలి. దీన్నే యాంటీనేటల్ చెకప్స్ అంటారు. ఈ సమయంలో ప్రతి గ్రామంలో ఉన్న గర్భిణులకు ఇంటివద్దకే వాహనాలను పంపిస్తారు. గర్భిణి ఎప్పుడు వైద్యసేవలకు వెళ్లాలో స్థానికంగా ఆశా వర్కర్‌కు, ఏఎన్ఎంకు అవగాహన ఉంటుంది. వీళ్లు ఆ సమయానికి మెడికల్ ఆఫీసర్‌కు ఫోన్‌చేసి, వాహనాన్ని ఇంటివద్దకే రప్పించి దాన్లో ఆస్పత్రికి పంపిస్తారు. వైద్యపరీక్షలు పూర్తయ్యేవరకు వాహనం అక్కడే ఉండి తిరిగి ఇంటివద్దకు చేరుస్తుంది. దీనికోసం తొలుత 5 జిల్లాల్లో 170 వాహనాల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు యత్నిస్తున్నారు. అనంతరం అన్ని జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరిస్తారు. గర్భిణులకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించే వాహనాలు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి ఆధ్వర్యంలో ఉంటాయి. ఏఎన్ఎం లేదా ఆశా కార్యకర్త ఎవరైనా డాక్టరుకు ఫోన్ చేయగానే ఆ గర్భిణి ఇంటివద్దకే వాహనాన్ని పంపిస్తారు. గర్భిణి ప్రయాణానికి వీలుగా ఉండేలా తుపాన్ వాహనాన్ని ఎంపిక చేసినట్టు తెలిసింది. తొలుత ఈ ఐదు జిల్లాల వాహనాలకు కలిపి ఏడాదికి రూ.10 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. 3 లక్షల మంది గర్భిణులకు లబ్ధి రాష్ట్రంలో ఏటా 7 లక్షలకు పైగా ప్రసవాలు జరుగుతుండగా, అందులో 3 లక్షలమంది ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారు. వీళ్లలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారే. రవాణా సౌకర్యం లేక వైద్యపరీక్షలకు వెనుకాడుతున్నారు. ఉచిత రవాణా కల్పిస్తే ప్రతి ఒక్కరు వైద్యపరీక్షలకు వచ్చే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, సమస్యలున్నప్పుడు మందులు తీసుకోవడం వల్ల సుఖప్రసవాలు జరగడమే కాకుండా మాతాశిశు మరణాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. -
శశికళ గర్భవతి కాదు
సాక్షి, చిత్తూరు : తిరుపతి ప్రభుత్వాస్పత్రిలో కలకలం రేపిన శశికళ గర్భవతి వ్యవహారంపై క్లారిటీ వచ్చింది. ఆమె అసలు గర్భం దాల్చలేదని విచారణలో తేలింది. తాను శనివారం బిడ్డకు జన్మనిచ్చానని, శిశువుని వైద్యులు మాయం చేశారంటూ తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కు చెందిన శశికళ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. మహిళ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రసూతి ఆసుపత్రి వైద్యులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కడుపులో గాలి బుడగలను గర్భంగా భావించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శశికళకు ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. తాజాగా వచ్చిన రిపోర్టులో ఆమె గర్భవతి కాదని తేలింది. చదవండి: గర్భంలోని శిశువును మాయం.. మహిళ ఆందోళన -
గర్భంతో పరుగు..
‘గర్భం దాల్చగానే ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటారు. ఆమెకు ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుగా ఉండాలనుకుంటారు. దీంతో గర్భం దాల్చిన స్త్రీ కూడా చాలా సున్నితత్వానికి లోనవుతుంది. దీనివల్ల ప్రసవాలు సులువుగా జరగడం లేదు. గర్భిణీ స్త్రీలు ఎటువంటి మద్దతు లేకుండా తమ పనులన్నీ తాము చేసుకోగలరు, ఇది సమాజం తెలుసుకోవాల’ని అమెరికన్ మహిళ మిల్లెర్ కోరుకుంటున్నది. తొమ్మిది నెలల గర్భవతి మాకేనా మిల్లెర్ 5 నిమిషాల 25 సెకన్లలో 1.6 కిలోమీటర్లు పరిగెత్తి ఈ విషయాన్ని నిరూపించింది. గర్భిణీ స్త్రీల గురించి ప్రజల ఆలోచనను మార్చాలని కోరుకుంది మిల్లెర్. ప్రసవం తర్వాత ఆ స్త్రీ చురుకుదనాన్ని కొనసాగించాలని కూడా మిల్లెర్ కోరుకుంటోంది. తొమ్మిది నెలల గర్భవతి అయిన అమెరికన్ మహిళ 5 నిమిషాల 25 సెకన్లలో 1.6 కి.మీ పరిగెత్తింది. ‘నన్ను ప్రోత్సహించడానికి, 9 నెలల గర్భంతో 8 నిమిషాల్లో మైలు రికార్డును బద్దలు కొడితే నాకు 100 డాలర్లు ఇస్తానని నా భర్త చెప్పాడు’ అని తెలిపింది మిల్లెర్. మిల్లెర్ వీడియోను ఆమె భర్త మైక్ రూపొందించాడు. ఇప్పటివరకు 3.4 మిలియన్ల మంది వీక్షించిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యింది. భర్త మైక్‌తో మాకేనా మిల్లెర్ మిల్లెర్ మాట్లాడుతూ ‘మైక్ నా వీడియో చేసినట్లు ముందు నాకు తెలియదు. ఈ పోటీ జరిగిన తరువాతి రోజు నాకు తెలిసింది’ అని ఆనందంగా తెలిపింది. మిల్లెర్ వీడియోను చూసిన కొంతమంది ‘పుట్టబోయే బిడ్డకు ఏదైనా హాని ఉందా. ఆ బిడ్డ గురించి ఆందోళన చెందుతున్నాం’ అని తమ స్పందనను తెలియజేశారు. దీనికి ప్రతిస్పందనగా మైక్ ‘వైద్య నిపుణుడితో సంప్రదింపులు జరిపే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆందోళన చెందవలసిన అవసరం లేదు’ అని తెలిపాడు. పరిగెత్తే ముందు డాక్టర్ సోనోగ్రఫీ చేసి, శిశువు ఆరోగ్యంగా ఉందని చెప్పారు. దీంతో నేను ఈ పనిని ధైర్యంగా చేయగలిగానని చెబుతోంది మిల్లెర్. -
రెండవ భార్యగా ఒప్పుకోనందుకు..
రొంపిచెర్ల (చిత్తూరు జిల్లా): ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక ఇందిరమ్మ కాలనీలో గురవారం చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి కథనం..కాలనికీ చెందిన అమీర్ 2వ కుమారై రేష్మా(17) ఇంటర్ మీడియట్ పూర్తి చేసింది. అయితే అదే వీధిలోని ఇమ్రాన్(27) రేష్మాకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ఇమ్రాన్‌కు ఇది వరకే వివాహమై ఒక కుమారై కూడా ఉందని తెలుసుకున్న రేష్మా తల్లిదండ్రులు ఇద్దరినీ మందలించారు. అయితే ఇమ్రాన్ తాను రెండో వివాహం చేసుకుంటానని ముందుకొచ్చాడు. అయితే రేష్మా తల్లిదండ్రులు దీనికి ఇష్టపడలేదు. రెండవ భార్యగా వద్దంటూ కుమార్తెకు నచ్చచెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఇంట్లో బెడ్ రూంలో రేష్మా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించి కుటుంబ సభ్యులు హుటాహుటిన రేష్మాను చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రొంపిచెర్ల ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
ఆశ వర్కర్‌కు కరోనా..
తాండూరు: గర్భంతో ఉన్న ఆశ వర్కర్‌కు కరోనా వైరస్ సోకినప్పటికీ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ప్రాణాలకు తెగించి ఆమెకు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలం గంగ్వార్ గ్రామానికి చెందిన లక్ష్మి(30) ఆశ వర్కర్‌గా పనిచేస్తోంది. గర్భంతో ఉన్న లక్ష్మి గ్రామంలో విధులు నిర్వహించడంతో కరోనా వైరస్ సోకింది. శనివారం అర్ధరాత్రి ఆమెకు తీవ్ర కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే సమయంలో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న గైనకాలజిస్ట్ శిరీష లక్ష్మి కడుపులో ఉన్న శిశువు మృతిచెందాడని గుర్తించి ఆస్పత్రి çసూపరింటెండెంట్ ఆనంద్‌కు సమాచారం అందించింది. సూపరింటెండ్ వెంటనే ఆస్పత్రికి చేరుకుని లక్ష్మికి ఆస్పత్రిలోనే చికిత్స అందించాలని నిర్ణయించారు. అనంతరం ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి, విజయవంతంగా ఆపరేషన్ చేసి గర్భాశయంలో ఉన్న పిండాన్ని తొలగించారు. అనంతరం లక్ష్మిని కోవిడ్ వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో కోవిడ్ సేవలు.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సూపరింటెండెంట్ ఆనంద్ తెలిపారు. వార్డులో 20 మందికి ఒకేసారి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వైద్య సేవలను అందించేందుకు వెంటిలేటర్లను సైతం అందుబాటులోకి తీసకొచ్చినట్లు తెలిపారు. ఆస్పత్రిలో వైద్యుల సహకారం అభినందనీయమన్నారు. -
ప్రేమించి.. పెళ్ళాడి.. గర్భవతిని చేసి
షాద్‌నగర్‌రూరల్: నిన్ను ప్రేమిస్తున్నాను.. నువ్వు లేనిదే నేను లేనన్నాడు... నీతో కలిసి ఉంటానంటూ పెళ్లికూడా చేసుకున్నాడు. తీరా 7 నెలల గర్భవతిని చేశాక ఇప్పుడు వదిలేస్తానంటున్నాడంటూ ఓ వక్తి చేతిలో మోసపోయిన యువతి గురువారం షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. వివరాలిలా ఉన్నాయి... షాద్‌నగర్ పట్టణానికి చెందిన వడ్లఅఖిల్, శ్రీవాణి ప్రేమించుకున్నారు. 9నెలల క్రితం పెళ్లి చేసుకుందామని అఖిల్ కోరడంతో పెద్దల ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత అఖిల్ తన అత్త ఇంటికి తీసుకెళ్తాడని శ్రీవాణి భావించింది. కానీ అఖిల్ పెళ్లి తర్వాత శ్రీవాణిని బయట హస్టల్స్లో ఉంచుతూ కాలం గడుపుతూ వచ్చాడు. పెళ్లి తరువాత గర్భం దాల్చిన విషయమై పలుమార్లు ఇరువురు గొడవకు దిగారు. అబార్షన్ చేయించుకోవాలని శ్రీవాణిపై భర్త అఖిల్ ఒత్తిడి తీసుకువచ్చాడు. ఇలా ఎన్ని రోజులు బయట కాపురం పెడతావు, మీ ఇంటికి తీసుకువెళ్లవా అంటూ శ్రీవాణి నిలదీయంతో షాద్‌నగర్‌లో గదిని అద్దెకు తీసుకొని కాపురం పెట్టాడు. గర్భవతినని తెలిసికూడా ఒక్కరోజు ఆస్పత్రికి తీసుకెళ్లలేదని శ్రీవాణి వాపోయింది. నిన్ను నమ్మి వస్తే ఇలా చేస్తావా, మీ ఇంటికి తీసుకుపోవా అని అడిగితే ఎక్కువ మాట్లాడితే నిన్ను వదిలేస్తా అంటూ బెదిరిస్తుŠాన్నడు. ఇంటికి వస్తే చంపేస్తామని కుటుంబ సభ్యులు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం 7 నెలల గర్భవతిని, నన్ను వదిలేస్తే ఎలా బతకాలి. నాకు న్యాయం చేయాలని శ్రీవాణి పోలీసులను ఆశ్రయింది. ఈ విషయమై విచారణ చేపట్టి బాధిత యువతికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు తెలిపారు. -
గర్భిణి నరకయాతన
కర్ణాటక, యశవంతపుర: ప్రసవం కోసం ఓ గర్భిణి ఎనిమిది గంటల పాటు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా బెడ్లు లేవని కారణంతో ఆమెను చేర్చుకోకపోవడంతో చివరకు ఆమె ఆటోలోనే ప్రసవించిన ఘటన బెంగళూరు చోటు చేసుకుంది. వివరాలు... శ్రీరామపురకు గర్భిణికి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆటోలో ఆస్పత్రికి బయలుదేరారు. శ్రీరామపుర ప్రభుత్వ ఆస్పత్రి, విక్టోరియా, వాణి విలాస్‌తో పాటు 10 ఆస్పత్రులకు వెళ్లారు. ఎక్కడికి వెళ్లిన బెడ్‌లేదంటూ చెప్పటంతో కేసీ జనరల్ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ కూడా బెడ్ లేదని చెప్పారు. దీంతో గర్భిణి ఆటోనే ప్రసవించారు. ఆ కొద్ది సేపటికే శిశువు మరణించింది. స్పందించిన ఆస్పత్రి సిబ్బంది అరగంట తరువాత ఆస్పత్రిలో చేరుకున్నారు. ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడంతోనే శిశువు మృతి చెందిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
కాన్పూ కష్టమే!
సాక్షి, హైదరాబాద్: నిండు చూలాలి దయనీయతను ప్రభుత్వాస్పత్రుల్లో చూడాలి! పురిటినొప్పులతో వస్తున్న గర్భిణులకు ఎంత కష్టం.. ఎంత నష్టం! కడుపు పండిందని వస్తే.. వైద్యుల వైఖరి చూస్తే వారికి కడుపుమండుతోంది!. ప్రసవ వేదన తప్పడం లేదు. ప్రతిష్టాత్మక పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిసహా మలక్‌పేట్, కొండాపూర్, సూరజ్‌భాను ఏరియా ఆస్పత్రుల్లో ఓపీ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆయా ఆస్పత్రులకు వచ్చినవారిని సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి సిఫార్సు చేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్తే వారికి చేదు అనుభవమే ఎదురవుతోంది. వైద్యుల నిష్పత్తికి మించి గర్భిణులు వస్తుండటంతో వారు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. తాజాగా శుక్రవారం పలువురు గర్భిణులు ఇదే అంశంపై ఆందోళనకు దిగడం గమనార్హం. గాంధీ ఆస్పత్రి గైనకాలజీ విభాగంలో ఆరు యూనిట్లు ఉండగా, కోవిడ్ బారిన పడిన గర్భిణులకు చికిత్స అందించేందుకు రెండు యూనిట్లను కేటాయించారు. మిగిలిన నాలుగు యూనిట్లను సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి సెంటర్‌కు మార్చారు. కింగ్ కోఠిలోని గైనకాలజీ విభాగాన్ని కూడా ఇక్కడికే మార్చారు. పేట్లబురుజు ఆస్పత్రిలోని సీనియర్ వైద్యులు సహా పీజీలు, ఇతర పారామెడికల్ స్టాఫ్ ఇటీవల కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ఆ ఆస్పత్రిలో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లు సహా పలు సేవలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో గర్భిణులు సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి క్యూ కట్టారు. (కరోనా కేళి.. జేబులు ఖాళీ!) గర్భిణులను చేర్చుకోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి నగర శివారు ప్రాంతాల్లో కాకుండా జిల్లాల నుంచి వచ్చే గర్భిణులు, వారి సంబంధీకులు శుక్రవారం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. కొత్తగా వచ్చే గర్భిణులకు వైద్యం చేసేందుకు వైద్యులు నిరాకరిస్తుండడంతో వైద్యులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం తెలుసుకున్న స్థానిక సుల్తాన్‌బజార్ పోలీసులు చేరుకుని వైద్యులతో మాట్లాడారు. వివిధ ఆసుపత్రుల నుంచి వందల సంఖ్యల్లో కేసులు వస్తుండడంతో తమపై పనిభారం అధికమవుతోందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 9 నెలలు నిండిన గర్భిణులకు మాత్రమే ఇక్కడ వైద్యం చేస్తున్నారు. కొత్తగా వచ్చినవారికి మాతా శిశు సంరక్షణ కార్డు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడంతో ఆందోళన మొదలైంది. ఏ ప్రసూతి ఆస్పత్రిలో ఎంతమంది? పాతబస్తీ శాలిబండ ప్రభుత్వ సూరజ్‌భాను ప్రసూతి ఆస్పత్రిలో ఇప్పటి వరకు 17 మంది వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. ఇక్కడ రోజుకు సగటున రెండు, మూడు ప్రసవాలు జరుగుతుంటాయి. సిబ్బంది అంతా వైరస్ బారిన పడటంతో సాధారణ చెకప్‌లకు వచ్చే కొత్త గర్భిణులకు సేవలు నిలిపివేశారు. ఇప్పటికే కార్డు ఉన్నవారికి మాత్రమే ఇక్కడ చికిత్సలు అందిస్తున్నారు. పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఇప్పటి వరకు 32 మంది వైద్యులు, పీజీలు, ఇతర సిబ్బందికి కరోనా సోకింది. దీంతో అక్కడ కొత్త ఓపీ రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. గతంలో రోజుకు సగటున 50 నుంచి 60 ప్రసవాలు జరిగేవి. ప్రస్తుతం ఇక్కడ 10 నుంచి 15 ప్రసవాలే జరుగుతున్నాయి. మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో సుమారు పదిహేను మంది వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. ఆస్పత్రిలో ఏడుగురు గైనకాలజిస్టులు ఉండగా వీరిలో నలుగురు వైరస్‌తో బాధపడుతున్నారు. దీంతో గైనికి ఓపీ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో ఇప్పటికే డెలివరీకి డేట్ ఇచ్చిన గర్భిణులను మాత్రమే చేర్చుకుంటున్నారు. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో పదిహేను మంది వైద్య సిబ్బందికి వైరస్ సోకడంతో ఓపీ సేవలను నిలిపివేసి సుల్తాన్ బజార్ ప్రసూతి కేంద్రానికి రిఫర్ చేస్తున్నారు. సరూర్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యురాలు ఇప్పటికే కోవిడ్ బారిన పడ్డారు. ఇక్కడ గర్భిణులకే కాదు సాధారణ రోగులకు కూడా చికిత్స అందని దుస్థితి నెలకొంది. చిన్న, చిన్న సాకులు చెప్పి పంపించి వేస్తున్నారు నగర శివారు ప్రాంతమైన కొంగర కలాన్ నుంచి ఎంతో అవస్థలు పడి సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చాను. వైద్యులు నాకు రక్తం లేదని చిన్న చిన్న కారణాలు చెప్పి పంపించి వేస్తున్నారు. కొత్త కార్డులు సైతం ఇవ్వడం లేదు. ఆసుపత్రి వైద్యులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలి. – దివ్య (కొంగర కలాన్) ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పు చేసుకోలేం మాది చాలా పేద కుటుంబం కాన్పు కోసం లక్షల రూపాయలు పెట్టి ప్రవేటు ఆసుపత్రుల్లో కాన్పు చేసుకునే స్తోమత లేదు. అందుకని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వస్తే ఇక్కడి వైద్యులు సైతం వైద్యం చేసేందుకు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వైద్యులపై చర్యలు తీసుకోవాలి. –యాదమ్మ (వనస్థలిపురం) -
గర్బిణీలు,బాలింతలకు వైఎస్ఆర్ అమృత హస్తం
-
భర్త వదిలేస్తాడని: గర్భిణి కడుపు కోసి..
మెక్సికో : గర్భంతో ఉన్న ఓ యువతిని దారుణంగా హత్య చేయటమే కాకుండా.. కడుపులోని శిశువును బయటకు తీసి అతి క్రూరంగా ప్రవర్తించిందో మహిళ. ఈ సంఘటన మెక్సికోలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల క్రితం మెక్సికో, సోలిడరిడాడ్కు చెందిన జునైతా అనే మహిళ అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల గర్భిణిని తన ఇంటికి పిలిచింది. అనంతరం యువతిని బంధించి, బండరాయితో తలను పగులగొట్టింది. ఆ తర్వాత కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపి, కడుపులోని ఏడు నెలల బిడ్డను బయటకు తీసింది. ఆ వెంటనే పసికందును ఆసుపత్రికి తీసుకెళ్లింది. ( వైజాగ్ యువతిది హత్యే! ) ఆ బిడ్డ తన బిడ్డేనని అక్కడి వారికి అబద్ధం చెప్పింది. నెలలు నిండని పసికందు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన వైద్యం అందించి రక్షించారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ బిడ్డ ఆమెది కాదని అనుమానించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. జునైతాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. పిల్లలు పుట్టని తనను భర్త వదిలేస్తాడేమోనన్న భయంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపింది. పోలీసులు హత్యానేరం కింద ఆమెపై కేసు నమోదు చేశారు. -
కరోనా బాధితురాలికి కవల పిల్లలు
దుండిగల్: కరోనాతో బాధపడుతున్న ఓ గర్భిణి బుధవారం కవలలకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. గాజులరామారం ప్రాంతానికి చెందిన ఓ గర్భిణికి ఈ నెల 25న పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే బుధవారం ఆమె ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. పుట్టిన పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా ఆస్బెస్టాస్ కాలనీ నెహ్రునగర్‌కు చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో 16న నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించగా 17న ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే 25న చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో మళ్లీ నిలోఫర్‌కు తరలించగా అనుమానం వచ్చిన వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. చికిత్స పొందుతూ అదే రోజు చిన్నారి మృత్యువాత పడింది.(వారిద్దరూ అమ్మ వారసులే ) బాలింతకు సైతం పాజిటివ్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆమె కుటుంబసభ్యులు 11 మందిని హోం క్వారంటైన్ చేశారు. బుధవారం జగద్గిరిగుట్ట లెనిన్‌నగర్‌కు చెందిన యువకుడు, జీడిమెట్ల నెహ్రునగర్‌కు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేశారు. -
జోతిష్యుడు చెప్పాడని.. భార్య కడుపుపై
చెన్నై,అన్నానగర్: రెండో బిడ్డ పుడితే తన ప్రాణానికి ప్రమాదమని జోత్యుష్యుడు చెప్పడంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. నిండు గర్భిణి అయిన భార్య కడుపుమీద కాలితో తన్ని గర్భస్రావం చేశాడు. వివరాలు.. ఈరోడ్ జిల్లా అమ్మపేట సమీపం ములియనూరికి చెందిన మునుస్వామి (32) భవన నిర్మాణ కార్మికుడు. ఇతని భార్య రమ్య (25). వీరికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. నాలుగేళ్ల ఒక కుమారుడు ఉన్నాడు. ఈ స్థితిలో రమ్య గర్భం దాల్చింది. అనంతరం మునుస్వామి జ్యోతిష్యుని చూడడానికి వెళ్లినప్పుడు, రెండవ బిడ్డ పుడితే తన ప్రాణాలకు ప్రమాదం అని జ్యోతిష్యుడు పలికాడు. దీంతో ఆందోళనకు గురైన మునిస్వామి భార్య రమ్యను అబార్షన్ చేసుకోమని కోరాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. గత 18 వ తేదీ మద్యంలో ఇంటికి వచ్చిన మునిస్వామి మరోసారి భార్యను కొట్టాడు. అంతటితో ఆగకుండా రమ్య కడుపుపై తన్నాడు. నొప్పితో అల్లాడిన రమ్యని స్థానికులు రక్షించి ఆమెను తల్లి ఇంటికి పంపించారు. ఈ స్థితిలో సోమవారం రమ్యకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ఈరోడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ పరిశీలన చేసిన డాక్టర్లు రమ్యకి అబార్షన్ అయినట్లు తెలిసింది. దీంతో రమ్య అమ్మాపేట పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మునిస్వామి కోసం గాలిస్తున్నారు. -
వాటిని అత్యాచారంగా పరిగణించలేం : హైకోర్టు
భువనేశ్వర్ : వయసులో ఉన్న యువతీ, యువకులు ప్రేమలో మునిగితేలడం ఆ తరువాత అమ్మాయి గర్భవతి కావడం మోసం చేశాడంటూ కోర్టుకు ఎక్కడం వంటి కేసులను తరచుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే తాజాగా ఒడిశాలో చోటుచేసుకోగా.. దానిపై ఆ రాష్ట్ర హైకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. పెళ్లి చేసుకుంటానని ప్రలోభ పెట్టి, శారీరక కలయిక అనంతరం యువతి గర్భం దాలిస్తే దానిని రేప్ (ఐపీసీ 376 అత్యాచారం)గా పరిగణించలేమని న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాల ప్రకారం కొరాపుట్ జిల్లా పొట్టంగి పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో ఓ కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్ల పాటు తనతో శారీరక సంబంధం కొనసాగించాడని ఆ యువతి పిటిషన్లో పేర్కొంది. ఈ క్రమంలోనే రెండు సార్లు గర్భందాల్చానని, పెళ్లి చేసుకోమ్మని అడిగితే ముఖం చాటేశాడని ఫిర్యాదులో తెలిపింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని జైలుకు పంపించారు. ఈ క్రమంలోనే నిందితుడు గత ఆరు నెలలుగా జైల్లో ఉంటున్నారు. దీనిపై నిందితుడు హైకోర్టు ఆశ్రయించగా.. శనివారం ఒడిశా హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. న్యాయమూర్తి ఎస్కే పాణిగ్రహి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును చెబుతూ.. ‘ఇటీవల కాలంలో కొంతమంది యువతీ యువకులు ప్రేమలో మునిగితేలుతున్నారు. వారిలో కొందరు యువకులు పెళ్లి చేసుకుంటామని నమ్మించి ప్రియురాళ్ళతో ముందుగానే శారీరక సుఖం పొందుతున్నారు. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో యువతులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇలాంటి వాటిని లైంగిక దాడి కేసులుగా భావించలేం’ అని 12 పేజీల తీర్పులో ప్రతిలో పేర్కొన్నారు. దీంతో జైల్లో ఉన్న యువకుడికి కేసు నుంచి ఉపశమనం కలిగింది. -
బాలికను గర్భవతిని చేసి.. కులం పేరుతో..
రంగారెడ్డి, కొత్తూరు: ప్రేమపేరుతో బాలికను నమ్మించి గర్భవతిని చేసి ఓ యువకుడు వదిలేశాడు. పెళ్లి చేసుకోమంటే కులం తక్కువ అంటూ వదిలేయడంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన కొత్తూరు మండలంలోని మక్తగూడ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహేందర్ (21), బాలిక ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రేమమాయలో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. తీరా పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. దీంతో రెండు రోజుల కిందట కుటుంబసభ్యులు గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. బాలికను వివాహం చేసుకోనని ఆ యువకుడు తేల్చిచెప్పాడు. దీంతో తనకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయమై సీఐ చంద్రబాబును వివరణ కోరగా బాలిక ఫిర్యాదు వాస్తవమేనన్నారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
రాఘవ.. నువ్వు రియల్ హీరోవి
హీరో, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. కరోనాతో బాధపడుతున్న ఓ గర్భిణికి తన వంతు సాయం చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. డెలివరీ స్టేజ్‌లో ఉన్న తన భార్య ఇబ్బందులు పడుతోందని ఆమె భర్త లారెన్స్ సాయం కోరాడు. దీనికి వెంటనే స్పందించిన లారెన్స్ తమిళనాడు ఆరోగ్య మంత్రి పీఏతో మాట్లాడి ఆ గర్భిణికి సాయం చేయమని కోరాడు. వెంటనే రంగంలోకి దిగిన వైద్య సిబ్బంది.. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు. ఆమెకి కరోనా ఉండటంతో వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకొని ఆపరేషన్ చేశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్ననిచ్చింది. ఈ సందర్భంగా గర్భిణికి ఆపరేషన్ చేసి కాపాడిన వైద్యసిబ్బందికి లారెన్స్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. చిన్నారి ఆరోగ్యంగా ఉందని.. తల్లి చికిత్సలో ఉందన్నాడు. ఇక లారెన్స్ సాయానికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. రాఘవ నువ్వు రియల్ హీరోవి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక కరోనా క్రైసిస్‌లో లారెన్స్ రూ. 3కోట్ల భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ‘రిషి కపూర్ చివరి చిత్రం పూర్తిచేస్తాం’ నిఖిల్ పెళ్లి మరోసారి వాయిదా.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మూడోసారి రెండు భాషల్లో...
‘‘ఇక సమంత సినిమాలకు దూరం. ప్రెగ్నెంట్’ అనే వార్త ఫిల్మ్‌నగర్‌లో హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ ఇదే ప్రచారం జరుగుతోంది. అయితే తాజా వార్త ఏంటంటే.. సమంత ఓ సినిమాకి సైన్ చేశారట. ‘గేమ్ ఓవర్’ దర్శకుడు అశ్విన్ శరవణన్ చెప్పిన కథ నచ్చి, ఆమె ఈ సినిమా అంగీకరించారట. ఈ చిత్రకథ సమంత చుట్టూ తిరుగుతుందని టాక్. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ నటించనున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య సమంత చేసిన ‘యు టర్న్’, ‘మజిలీ’, ‘ఓ బేబీ’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ‘జాను’ ఆశించిన ఫలితం సాధించకపోయినా నటిగా సమంతకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ‘యు టర్న్’, ‘ఓ బేబీ’ చిత్రాలతో లేడీ ఓరియంటెడ్ మూవీస్‌ని నడిపించగలిగే సత్తా సమంతకు ఉందని ప్రూవ్ అయింది. ఇప్పుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో అంగీకరించిన సినిమా కూడా కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమానే అని భోగట్టా. ఇప్పటివరకూ సమంత రెండు ద్విభాషా చిత్రాల్లో చేశారు. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ ఇటు తెలుగు అటు తమిళంలో ఒకేసారి రూపొందింది. అలాగే 2018లో వచ్చిన ‘యు టర్న్’ తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. ముచ్చటగా మూడోసారి ద్విభాషా చిత్రం చేయనున్నారామె. వచ్చే నెల ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారట. -
సీరియస్ సమస్యలు వస్తాయా?
గర్భిణులు నెగటివ్ బ్లడ్‌గ్రూప్‌తో, బిడ్డ పాజిటివ్ బ్లడ్ గ్రూప్‌తో ఉంటే సీరియస్ సమస్యలు వస్తాయా? నష్టం జరగకుండా నివారణ చర్యలు తీసుకోవచ్చా? దీని గురించి కాస్త వివరంగా తెలియజేయగలరు. – స్మిత, హైదరాబాద్ గర్భిణులు నెగెటివ్ గ్రూపుతో ఉంటే ‘ఆర్‌హెచ్ నెగెటివ్ ప్రెగ్నెన్సీ’ అంటారు. భర్తకి కూడా నెగెటివ్ గ్రూపు ఉంటే సమస్య ఏమీ ఉండదు. భర్తది పాజిటివ్ గ్రూపు ఉండి, బిడ్డది కూడా పాజిటివ్ గ్రూపు ఉంటే కొందరు పిల్లల్లో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యది నెగెటివ్, భర్తది పాజిటివ్ గ్రూప్ బ్లడ్ ఉన్నా, కొందరి బిడ్డల్లో నెగెటివ్ గ్రూపు వస్తుంది. దీనివల్ల కూడా సమస్యలేవీ ఉండవు. నెగెటివ్ బ్లడ్ గ్రూపు ఉన్న గర్భిణుల్లో బిడ్డ పాజిటివ్ గ్రూపుతో ఉంటే, తల్లి రక్తంలోకి బిడ్డ పాజిటివ్ రక్తకణాలు ప్రవేశిస్తే, బిడ్డ రక్తకణాల మీద ఉన్న ఆర్‌హెచ్ యాంటీజెన్‌కు వ్యతిరేకంగా తల్లిలో ఆర్‌హెచ్ యాంటీబాడీస్ తయారవుతాయి. కొందరిలో కొన్ని రకాల పరిస్థితుల్లో ఆర్‌హెచ్ యాంటీబాడీస్ తల్లి నుంచి మాయ ద్వారా బిడ్డకు చేరి, బిడ్డలో ఉన్న పాజిటివ్ రక్తకణాల మీద దాడిచేసి వాటిని మెల్లగా నశింపజేస్తాయి. దీనివల్ల బిడ్డలో ఎర్ర రక్తకణాలు తగ్గిపోయి, బిడ్డలో కొన్నిసార్లు కడుపులోనే రక్తహీనత, పసిరికలు వంటివి ఏర్పడటం, బిడ్డకు శరీరమంతా నీరు చేరడం, కడుపులోనే చనిపోవడం, పుట్టిన తర్వాత బిడ్డలో రక్తహీనత, తీవ్రమైన పసిరకలు (జాండీస్) వంటి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మొదటగా గర్భ నిర్ధారణ తర్వాత తల్లి బ్లడ్‌గ్రూపు పాజిటివా, నెగెటివా తెలుసుకోవాలి. ఒకవేళ నెగెటివ్ గ్రూపయితే, భర్త గ్రూపు పాజిటివా, నెగెటివా నిర్ధారణ చేసుకోవాలి. భర్తది నెగెటివ్ గ్రూపు అయితే సమస్యలేవీ ఉండవు. భర్తది పాజిటివ్ గ్రూపయితే, బిడ్డకు పాజిటివ్ గ్రూపు రావచ్చు లేదా నెగెటివ్ గ్రూపు రావచ్చు. గర్భంలో ఉన్న బిడ్డ గ్రూపు ముందుగా తెలియదు కాబట్టి, ముందు జాగ్రత్తగా పాజిటివ్ అయితే వచ్చే సమస్యలను పరిగణనలోకి తీసుకుని, తల్లికి అవసరమైతే ఇండైరెక్ట్ కూంబ్ టెస్ట్ (ఐసీటీ) మూడో నెలలోపు ఒకసారి, ఏడో నెలలో ఒకసారి తప్పనిసరిగా చేయించుకోవడం వల్ల ఆర్‌హెచ్ యాంటీబాడీస్ ఏవైనా ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు. ఒకవేళ అవేమీ లేకపోతే, అంటే ఐసీటీ నెగెటివ్ వస్తే, ఏడో నెలలో తల్లికి ‘యాంటీ డీ’ అనే ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది. సాధారణంగా ఏడో నెల నుంచి బిడ్డలోని పాజిటివ్ రక్తకణాలు తల్లిలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఇంజెక్షన్లో ఉండే యాంటీబాడీస్ తల్లిలోకి ప్రవేశించే బిడ్డకు చెందిన పాజిటివ్ రక్తకణాలను నశింపజేస్తాయి. దాని ద్వారా తల్లిలో బిడ్డకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారు కావు. కాబట్టి బిడ్డలో సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అలాగే నెగెటివ్ గ్రూపు తల్లులు గర్భంతో ఉన్నప్పుడు, మధ్యలో బ్లీడింగ్ అయినా, కడుపుకి దెబ్బ తగిలినా ఈ యాంటీ–డి ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది. చాలావరకు మొదటిసారి గర్భం దాల్చిన వారిలో సమస్యలు పెద్దగా రావు. తర్వాతి కాన్పులలో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ తల్లిలో ఇండైరెక్ట్ కూంబ్ టెస్ట్ పాజిటివ్ వస్తే, అంటే తల్లిలో బిడ్డకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉన్నాయని అర్థం. అప్పుడు అవి ఎంత శాతం ఉన్నాయి, అవి బిడ్డ రక్తకణాలను నశింప చేస్తున్నాయా లేదా తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు రక్తపరీక్షలు, డాప్లర్ స్కానింగ్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వీటిలో సమస్య కనిపిస్తే, సమస్య తీవ్రతను బట్టి గర్భంలోని శిశువులో ఎర్రరక్తకణాలు తగ్గిపోయి, రక్తహీనత ఏర్పడతున్నట్లయితే, తల్లి గర్భంలోకే రక్తం ఎక్కించడం జరుగుతుంది. అవసరమనుకుంటే త్వరగా కాన్పు చేయడం జరుగుతుంది. కాన్పు తర్వాత బిడ్డ బ్లడ్ గ్రూపు నిర్ధారణ చేసుకుని, పాజిటివ్ గ్రూపయితే, బిడ్డలో రక్తహీనత, జాండీస్ వంటి ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి సీబీపీ, డైరెక్ట్ కూంబ్ టెస్ట్, బైలురుబిన్ టెస్ట్ వంటి పరీక్షలు జరిపించి, నిర్ధారించుకోవాలి. రక్తహీనత ఎక్కువగా ఉంటే, అవసరమైతే ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా రక్తం ఎక్కించడం జరుగుతుంది. జాండీస్ ఉంటే ‘ఫొటో థెరపీ’ అని బ్లూ లైట్ కింద పెట్టడం జరుగుతుంది. రెండో కాన్పులో బిడ్డకు ఈ సమస్యలు రాకుండా, కాన్పు అయిన 24 గంటల లోపు లేదా గరిష్టంగా 72 గంటల లోపల తల్లి ‘యాంటీ–డి’ ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది. ఈ ఇంజెక్షన్ వల్ల కాన్పు సమయంలో తల్లిలోకి ప్రవేశించే బిడ్డ పాజిటివ్ రక్తకణాలను ఇంజెక్షన్‌లోని యాంటీబాడీస్ నశింపజేస్తాయి. కాబట్టి తల్లిలో బిడ్డకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారు కాకుండా ఉంటాయి. మళ్లీ గర్భం ధరించినప్పుడు తల్లిలో యాంటీబాడీస్ ఉండవు కాబట్టి, కడుపులోని బిడ్డపై దుష్ప్రభావాలు లేకుండా సురక్షితంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ముందు గర్భాలలో అబార్షన్లు ఏవైనా అయి ఉంటే, ఆ సంగతిని గోప్యంగా ఉంచకుండా డాక్టర్‌కు తప్పనిసరిగా వివరించాలి. అబార్షన్ సమయంలో కూడా కొన్నిసార్లు బిడ్డ రక్తకణాలు తల్లిలోకి ప్రవేశించి, తల్లిలో ఆర్‌హెచ్ యాంటీబాడీస్ తయారయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి తర్వాత గర్భం దాల్చినప్పుడు బిడ్డ రక్తకణాలను నశింపజేసి, బిడ్డలో సమస్యలు తలెత్తడానికి కారణమవుతాయి. కాబట్టి అబార్షన్ తర్వాత కూడా 24 గంటలలోగా ‘యాంటీ–డి’ ఇంజెక్షన్ తక్కువ డోసులో తీసుకోవడం మంచిది. -
పదేళ్ల బాలుడి నిర్వాకం.. మైనర్ బాలిక గర్భవతి..!
మాస్కో : ఓ మైనర్ బాలిక, బాలుడి మధ్య ఏర్పడిన సంబంధం వారి బంధువులనే కాక దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ 13 ఏళ్ల బాలికను 11 ఏళ్ల బాలుడు తల్లిని చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఈ ఘటన రష్యాలోని ఓ ముఖ్య పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు... బాలిక గతకొంత కాలంగా కడపు నొప్పి, శారీరక మార్పులతో కనిపించడం చూసిన ఆమె తల్లిదండ్రులు బాలికను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె గర్భవతి అని వైద్యులు నిర్థారించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఈ విషయంపై ఆమెను నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టింది. 11 ఏళ్ల తన ప్రియుడు చేసిన నిర్వాకం కారణంగా తాను గర్భం దాల్చాల్సి వచ్చిందని చెప్పింది. దీంతో వైద్యులతో పాటు స్థానికులు షాక్‌కు గురయ్యారు. 11 ఏళ్ల బాలుడి చర్య వల్ల గర్భం వచ్చే అవకాశం లేదని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బాలుడి బందువులు కూడా స్పందించారు. ఘటనతో తమకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెబుతున్నారు. అవసరమైతే వైద్య పరీక్షలకు సైతం తాను సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు 11 ఏళ్ల బాలుడు ఓ బాలికను గర్భవతిని చేయగలడా అనేది రష్యాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వైద్యుల పరీక్షల అనంతరం అసలు నిజం బయటకురానుంది. -
గర్భం దాల్చిన గిరిజన విద్యార్థిని
శ్రీకాకుళం, మందస: మండలంలోని బుడారిసింగి పంచాయతీ గుడ్డికోల గ్రామానికి చెందిన ఓ 12 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. ఈమె స్వస్థలం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బత్రసాయి సమీపంలోని గౌడు గ్రామం. గుడ్డికోల గ్రామానికి చెందిన యువకుడికి సదరు బాలిక వరుసకు మేనకోడలు. ఈమె తల్లిదండ్రులు మరణించడంతో బాలికను ఒడిశా నుంచి తీసుకువచ్చి యువకుడు వివాహం చేసుకున్నట్టు తెలిసింది. శుక్రవారం జాతీయ బాలికా దినోత్సవం కావడంతో సిరిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గిరిజన బాలికల ఆరోగ్య పరీక్షలు చేస్తుండగా గర్భిణి అనే విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే వైద్యాధికారి డాక్టర్ సీహెచ్ శరత్‌చంద్రశివకుమార్ ఐటీడీఏ(సీతంపేట)కు సమాచారం అందించారు. వైఎస్సార్ క్రాంతి పథం ఏపీఎం ఎ.లలితను గుడ్డికోల గ్రామానికి వెళ్లి పరిస్థితి పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు రావడంతో ఏపీఎంతో పాటు సీసీ ముఖలింగం గ్రామానికి వెళ్లి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. గిరిజన బాలిక రెండు నెలల గర్భిణిగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టేందుకు ఐటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
తల్లికి, బిడ్డకు ఆరోగ్యమస్తు
శ్రీకాకుళం జిల్లా రణస్థలం ప్రాంతానికి చెందిన శ్రీదేవి తొలి కాన్పు కోసం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేరి పండంటి పాపకు జన్మనిచ్చింది. తొలి కాన్పు కావడంతో బిడ్డ సంరక్షణ ఎలాగో ఆమెకు తెలియలేదు. ఇంతలో వైద్యుడు ఎంసీపీ కార్డు ఇచ్చారు. అందులో బిడ్డ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఉన్నాయి. ఆ వివరాలతో శ్రీదేవి తన బిడ్డను చక్కగా చూసుకోగలుగుతోంది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లికి చెందిన ముత్యాల మీనాకుమారి.. గర్భిణి. వైద్యపరీక్షల కోసం సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా అక్కడ ఆమెకు ఎంసీపీ కార్డును ఇచ్చారు. అందులో ఇచ్చిన జాగ్రత్తలను పాటిస్తున్నానని.. తల్లీబిడ్డల ఆరోగ్యంపై చాలా వివరాలు పొందుపరిచారని మీనాకుమారి సంతోషం వ్యక్తం చేస్తోంది. సాక్షి, అమరావతి: గర్భిణిగా నిర్ధారణ అయినప్పటి నుంచి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏయే జాగ్రత్తలు పాటించాలి? ఎప్పుడు ఏయే పరీక్షలు చేయించుకోవాలి? బిడ్డ పుట్టాక ఆరోగ్యంగా ఉండడానికి ఎప్పుడు ఏ టీకాలు వేయించాలి? ఎలాంటి ఆహారం పెట్టాలి? అనారోగ్యంగా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బిడ్డ ఎదుగుదలకు ఏం చేయాలి?.. ఇలా గర్భిణులకు, బాలింతలకు ఎన్నో సందేహాలు. వీటిని నివృత్తి చేయడానికి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రంగంలోకి దిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గర్భిణుల నుంచి బాలింతలు.. బిడ్డల వరకు వారి సంరక్షణే ధ్యేయంగా ఎంసీపీ (మాతా శిశు సంరక్షణ) కార్డులు రూపొందించింది. వీటిని రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల్లోని బోధనాస్పత్రుల వరకు పంపిణీ చేస్తోంది. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి.. బిడ్డ పుట్టాక తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంతో అమూల్యమైన సమాచారం ఎంసీపీ కార్డుల్లో పొందుపరిచింది. ఈ కార్డుల ద్వారా లక్షలాది మంది గర్భిణులు, బాలింతలు ప్రయోజనం పొందుతున్నారు. 9 నెలలు ఇలా.. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి తొమ్మిది నెలలు పూర్తయి ప్రసవం అయ్యే వరకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఎంసీపీ కార్డులో పొందుపరిచారు. గర్భిణి.. మొదటి త్రైమాసికంలో ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి.. గర్భస్థ పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి.. సాధారణ పరీక్షలు అంటే.. రక్తపోటు, మూత్ర పరీక్షలు వంటివి ఎప్పుడు చేయించుకోవాలి.. ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి? వంటి వాటిని వివరించారు. కార్డుల్లో ఇచ్చిన సమాచారం ద్వారా 9 నెలల కాలంలో ఉన్న బరువుకు అదనంగా 10 నుంచి 12 కిలోలు బరువు పెరగాలని, కనీసం 180 ఐరన్ ఫోలిక్ మాత్రలు వాడాలని గర్భిణులు తెలుసుకుంటున్నారు. సుఖప్రసవాలు ఎక్కువ చేయడమే లక్ష్యం రాష్ట్రంలో సుమారు 50 శాతం సిజేరియన్ ప్రసవాలే జరుగుతున్నాయి. దీనివల్ల తల్లికి భవిష్యత్‌లో శారీరక సమస్యలు తలెత్తుతాయి. వీటి నుంచి వారిని బయటపడేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. సుఖప్రసవాలు జరగాలంటే ముందు గర్భిణులకు చక్కటి అవగాహన ఉండాలనే లక్ష్యంతో ఎంసీపీ కార్డులను రూపొందించింది. దీనివల్ల మాతా శిశు మరణాల రేటును కూడా తగ్గించవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి వెయ్యి ప్రసవాలకు 34 మంది శిశువులు, ప్రతి లక్ష ప్రసవాలకు 74 మంది తల్లులు ప్రసవ సమయంలో మృతి చెందుతున్నారు. రానున్న రెండేళ్లలో ఈ మరణాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో ఎంసీపీ కార్డులను ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్యానికి వచ్చే ప్రతి తల్లికీ, గర్భిణికీ అందిస్తోంది. టీకాలే బిడ్డకు రక్షణ కవచం బిడ్డ పుట్టగానే వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది. వీటి బారి నుంచి బిడ్డను రక్షించుకోవాలంటే టీకాలే మార్గం. బిడ్డకు ఏ వయసులో ఏ టీకా వేయించాలో తల్లికి అవగాహన ఉంటే బిడ్డను కాపాడుకోవడం సులువవుతుంది. ప్రభుత్వం అందిస్తున్న ఎంసీపీ కార్డుల్లో బిడ్డ పుట్టినప్పటి నుంచి ఏయే టీకాలు వేయించాలో తెలుపుతూ కాలనిర్ణయ పట్టికను రూపొందించారు. అంతేకాకుండా పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల, అభివృద్ధి దశలతో చిత్రమాలికను రూపొందించడం.. టీకాల సామర్థ్యాలపై వివరణలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు మంచి అవగాహన కల్పిస్తున్నాయి. ఎంసీపీ కార్డులో ఉన్న మరికొన్ని వివరాలు.. - స్థానిక ఏఎన్ఎం (ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫరీ) వద్ద ఏయే సేవలు ఉంటాయో సూచించడం - రొమ్ము సంబంధిత వ్యాధుల లక్షణాలను చెప్పడం - గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ లక్షణాలను వివరించడం - సంచార చికిత్సలో భాగంగా చేసే వైద్య పరీక్షలేవో తెలపడం - మొదటి కాన్పులో తలెత్తిన సమస్యలేవైనా ఉంటే వాటి వివరాలు తీసుకోవడం - గర్భిణిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన పౌష్టికాహారం.. జాగ్రత్తలు - రక్తస్రావం, రక్తహీనత, జ్వరం, మూర్ఛ వంటి ఏవైనా లక్షణాలు ఉంటే గర్భిణి తక్షణమే తీసుకోవాల్సిన జాగ్రత్తలు - తల్లిపాలు ఇస్తే శిశువుకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలపడం - పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల గురించి చిత్రాలతో వివరించడం - ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల ప్రాధాన్యత చెప్పడం - ప్రధానమంత్రి మాతృవందన యోజన, జననీ సురక్ష యోజన, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ వంటి పథకాల ద్వారా ప్రసవం తర్వాత ఇచ్చే నగదు వివరాలు. అవగాహన ఉంటే వైద్యం చేసుకున్నట్టే.. గర్భిణులకు, బాలింతలకు ఆరోగ్యంపై అవగాహన ఉందంటే వైద్యం చేసుకున్నట్టే లెక్క. పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, ప్రసవానంతరం బిడ్డ సంరక్షణకు కావాల్సిన చిట్కాలు.. ఈ మూడూ ప్రధాన అంశాలు. వీటిని తెలుసుకుంటే చాలు తల్లీ, బిడ్డ సురక్షితంగా ఉంటారు. ఈ అంశాలను ఎంసీపీ కార్డులో అర్థమయ్యే విధంగా రూపొందించడం బాగుంది. కార్డులో ఉన్న అంశాలను క్రమం తప్పకుండా పాటిస్తే చాలు. గర్భిణులు జాగ్రత్తలు పాటిస్తే సుఖప్రసవం జరిగి బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది. –డా.వై.మాధవి, గైనకాలజిస్ట్, కడప -
బిడ్డకు రక్తం పంచబోతున్నారా?
మన దేశంలోని మహిళల్లో రక్తహీనత (అనీమియా) చాలా ఎక్కువ. దాదాపు 80 శాతం మందిలో రక్తహీనత ఉందని ఒక అంచనా. ఓ మోస్తరు రక్తహీనత దీర్ఘకాలం కొనసాగినా రకరకాల అనర్థాలు వస్తాయి. అయితే గర్భవతుల్లో రక్తహీనత వల్ల ఇటు కాబోయే తల్లికీ, అటు పుట్టబోయే బిడ్డకూ ప్రమాదమే.కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ అనీమియా కేసులు ఎక్కువే... మరీ ముఖ్యంగా గర్భవతుల్లో. కాబట్టి ఈ రక్తహీనత వల్ల వచ్చే అనర్థాలు, దాన్ని అధిగమించడానికి మార్గాలను తెలుసుకుందాం. రక్తంలోని ఎర్రరక్తకణాలుగాని, దానిలో ఉండే పిగ్మెంట్ అయిన హీమోగ్లోబిన్గాని లేదా రెండూగాని తక్కువ అయితే వచ్చే సమస్యను రక్తహీనత (అనీమియా) అంటారు. కారణాలను బట్టి రక్తహీనతల్లో చాలా రకాలున్నాయి. గర్భిణుల్లో 90 శాతం రక్తహీనత ఐరన్ లోపం వల్ల, 5 శాతం ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల ఏర్పడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాల ప్రకారం రక్తంలో 10 గ్రాముల కంటే తక్కువ హీమోగ్లోబిన్ ఉంటే రక్తహీనత ఉన్నట్లుగా పరిగణించాలి. గర్భిణుల్లో రక్తహీనత ఎందుకు ఏర్పడుతుందంటే? గర్భిణుల్లో మామూలు మహిళల కంటే 40 శాతం (అంటే 1 నుంచి 2 లీటర్లు) ఎక్కువగా రక్తం వృద్ధి అవుతుంటుంది. గర్భంలో ఎదిగే బిడ్డకు ఆహారం, ఆక్సిజన్ సమృద్ధిగా అందడానికి వీలుగా ప్రకృతి ఈ ఏర్పాటు చేసింది. గర్భం ధరించిన నాలుగో నెల నుంచి మహిళల్లో రక్తం వృద్ధి చెందడం మొదలువుతుంది. ఎనిమిదో నెల నిండేసరికి ముందున్న దానికంటే రక్తం 40–50 శాతం పెరుగుతుంది. ఎంత ఆరోగ్యంగా ఉన్న స్త్రీకైనా గర్భం వచ్చిన 5–6 నెలలకి రక్తంలోని ప్లాస్మా పెరగడం వల్ల హీమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది. రక్తం పట్టడానికి తగిన ఆహారం, ఐరన్ మాత్రలు వాడేవారిలో మళ్లీ కొద్దివారాల్లోనే హీమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అలా తీసుకోని వారిలో హీమోగ్లోబిన్ శాతం మరింత తగ్గుతుంది. రుతుస్రావం కూడా మరో కారణం... రుతు సమయంలో సాధారణంగా ఐదు రోజుల పాటు రక్తస్రావం అయ్యే మహిళల్లో నెలకు 45 సి.సి. రక్తం కోల్పోతేæ15 మి.గ్రా. ఐరన్‌ను కోల్పోయినట్లే. అంతకంటే ఎక్కువ బ్లీడింగ్ అయ్యేవారిలో ఇంకా ఎక్కువగా ఐరన్ తగ్గిపోతుంది. వీరు సరిగా ఆహారం తీసుకోకపోతే రక్తహీనత కలగవచ్చు. ఇక అప్పటికే రక్తహీనతతో ఉన్న మహిళ గర్భం ధరిస్తే... అనీమియా తీవ్రత మరింత పెరగవచ్చు. రక్తహీనత నివారణ / చికిత్స... ►21 ఏళ్లకంటే ముందర గర్భం రాకుండా చూసుకోవాలి. ►గర్భం దాల్చిన తర్వాత నాల్గవ నెల నుంచి పౌష్టికాహారంతో పాటు రోజూ ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉన్న మాత్రలు తప్పనిసరిగా తీసుకోవాలి ►నులిపురుగులు, మూత్రంలో ఇన్ఫెక్షన్ వంటివి ఉంటే తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి ►కాన్పుకి, కాన్పుకి మధ్య కనీసం రెండేళ్ల వ్యవధి ఉండేట్లు జాగ్రత్త పడటం వల్ల ఐరన్ నిలువలు పెరిగి మరో కాన్పుకు రక్తహీనత లేకుండా చూసుకోవచ్చు. సవరించడానికి... ►రక్తహీనతకు గల కారణాలను గుర్తించి దాన్ని బట్టి చికిత్స చేయాలి. ►డాక్టర్ సలహా మేరకు ఐరన్ మాత్రలు వాడాలి. బలంగా ఎదిగే పిల్లలతో ఒక ఆరోగ్యకరమైన సమాజం కోసం గర్భవతుల్లో రక్తహీనత సమస్యను తప్పనిసరిగా అధిగమించాల్సిన అవసరం ఉంది. అందుకే మహిళల్లో రక్తహీనతతోపాటు మరీ ముఖ్యంగా గర్భవతుల్లో అనీమియా సమస్యను నివారించడానికి సమాజం మొత్తం ఈ విషయంపై అవగాహన పెంచుకోవడం అవసరం. గర్భవతుల్లో రక్తహీనత లక్షణాలు ►తీవ్రతను బట్టి లక్షణాలు కొద్దిగా మారుతుంటాయి. సాధారణంగా కనిపించేవి... ►అలసట; ►గుండెదడ; ►కళ్లుతిరగడం; ►తలనొప్పి; ►తలబరువుగా ఉన్నట్లు అనిపించడం; ►ఆయాసం; ►కొంచెం పనికే ఊపిరి అందకపోవడం; ►నిద్రపట్టకపోవడం; ►ఆకలిలేకపోవడం; ►కాళ్లూ, చేతులు మంటలు, నొప్పులు; ►నోరు, నాలుకలో నొప్పి, పుండ్లు; ►నీరసం; ►బియ్యం, మట్టి తినాలనిపించడం; ►చర్మం మ్యూకస్‌పొరలు పాలిపోయి ఉండటం; ►కాళ్లవాపు; ►గుండె వేగంగా కొట్టుకోవడం; ►గోళ్లు పలచగా తయారవ్వడం, జుట్టు రాలిపోవడం. రక్తహీనతలో రకాలు స్వల్పరక్తహీనత (మైల్డ్) ... 8.7 గ్రా. నుంచి 10 గ్రా. ఉంటే ఒకమోస్తరు రక్తహీనత (మోడరేట్) ... 6.6 గ్రా. నుంచి 8.6 గ్రా. ఉంటే తీవ్రమైన రక్తహీనత (సివియర్) ... 6.5 గ్రా. కంటే తక్కువ రక్తహీనతకు కారణాలు ►గర్భం వచ్చాక రక్తంలో జరిగే మార్పుల వల్ల హీమోగ్లోబిన్ పరిమాణం తగ్గడం. ►ఆర్థిక, సామాజిక కారణాల వల్ల పౌష్టికాహార లోపం కారణంగా ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 లోపం. ►జంక్‌ఫుడ్ తీసుకోవడం. ►జీర్ణవ్యవస్థలో నులిపురుగులు ఉంటే అవి రక్తాన్ని పీల్చుకోవడం ►జీర్ణకోశంలోని కొన్ని సమస్యల వల్ల ఆహారం నుంచి ఐరన్ సక్రమంగా రక్తంలోకి చేరకపోవడం (కడుపులో అల్సర్లవంటి కారణాల వల్ల కూడా) ►రక్తవిరేచనాలు, మొలలు ►గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవసమయంలో రక్తస్రావం. ►దీర్ఘకాలంగా మలేరియా వ్యాధితో బాధపడుతున్నవారిలో ఎర్రరక్తకణాలు విరిగిపోవడం. ►దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు, లక్షణాలేమీ బయటకు కనపడకుండా మూత్రవ్యవస్థలో బ్యాక్టీరియా చేరడం వల్ల ఎర్రరక్తకణాల ఉత్పత్తి తగ్గడం. ►యువతులు 21 ఏళ్ల లోపు గర్భం ధరిస్తే ఐరన్, ప్రోటీన్స్ వంటివి బాలిక శరీరానికీ, గర్భంలో ఉన్న బిడ్డ పెరుగుదలకూ... ఇలా ఇద్దరికీ అవసరం ఉంటుంది. కాబట్టి అవి సరైన పాళ్లలో అందక రక్తహీనత రావచ్చు. ►పుట్టుకతో వచ్చే థలసీమియా, సికిల్‌సెల్ డిసీజ్ వంటి వాటి కారణంగా. ►అరుదుగా వచ్చే ఎప్లాస్టిక్ అనీమియా, రక్తసంబంధిత వ్యాధుల వల్ల ►కాన్పుకి, కాన్పుకి మధ్య ఎక్కువ వ్యవధి లేకపోవడం వల్ల ►క్షయ, కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్, హైదరాబాద్ -
గర్భవతినయ్యా.. సమాజం కోసం తప్పు చేయను
అమ్మ గెస్టెడ్ ఆఫీసర్, నాన్న బిజినెస్ మెన్. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండటంతో చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచారు. కాలం గడుస్తున్న కొద్ది అమ్మ నాన్నలు వారి పనుల్లో బిజీగా ఉంటడంతో వారితో కనీసం మాట్లాడటానికి కూడా సరిగ్గా సమయం దొరికేది కాదు. ఎదురుపడితే వారి నుంచి వచ్చే మొదటి మాట డబ్బులేమైనా కావాలారా? అంటూ అడిగి పని ఉందంటూ వెళ్లిపోయేవారు. అప్పుడే ఇంటర్మీడియట్ పూర్తయింది. మంచి మార్కులు రావడం, ప్రఖ్యాత యూనివర్సిటీల్లో సీటు రావడంతో మా స్నేహితులందరం ఆస్ట్రేలియాకు సరదాగా వెళ్లాం. ఆస్ట్రేలియా వెళుతుండగా మొదటిసారి విమానంలో చందర్‌ని చూశా. మా ట్రావెల్ ఏజెంట్ ద్వారానే అతను కూడా ఆస్ట్రేలియాకు రావడంతో తిరిగి ఇండియా వచ్చే వరకు అతను మాతోనే ట్రావెల్ అయ్యాడు. ఓ రోజు ఉదయాన్నే సిడ్నిలోని డార్లింగ్ హార్బర్ సమీపంలో ఓ రెస్టారెంట్లో టిఫిన్ చేయడానికి వెళ్లాను. తిరిగి వస్తుండగా అమ్మ దగ్గరి నుంచి ఫోన్ రావడంతో మాట్లాడుతూ.. చూసుకోకుండా నడవడంతో ఫౌంటేయిన్ నీళ్లలో పడిపోయే సమయంలో ఒక్కసారిగా చందర్ చేయిపట్టి లాగాడు. విమానంలోనే తొలిసారి చూపులోనే చందర్‌తో మాట్లాడాలన్న నామదిలోని కోరిక అనుకోకుండా ఇలా నెరవేరింది. ఫౌంటేయిన్ నుంచి పైకి వచ్చే నీటి బిందువుల తుంపరలు మాపై అక్షింతలుగా పడుతున్నట్టు అనిపించింది. జాగ్రత్తగా ఉండాలంటూ అతడు ఏదో చెబుతున్నా, అనంతమైన ఆనందంలో అతడికి బదులివ్వడానికి కూడా స్పందించలేకపోయా. కొద్ది సేపటి తర్వాత తేరుకుని మాట్లాడటం ప్రారంభించా. అతడిది కూడా హైదరాబాద్ అని, అది కూడా మా పక్క కాలనీనే అని తెలుసుకుని సంబరపడిపోయా. ఆ పరిచయం చాలా తక్కువ సమయంలోనే మమ్మల్ని ఎంతో దగ్గర చేసింది. అతడితో మాట్లాడుతున్నంత సేపు వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉండేది. ఆస్ట్రేలియా పర్యటన క్షణాల్లో ముగిసినట్టనిపించింది. హైదరాబాద్ వచ్చాక అతడిని చూడకుండా, మాట్లాడకుండా ఉండలేకపోయేదాన్ని. ఓ రోజు చందర్‌తో నా ఫీలింగ్స్‌ని షేర్ చేసుకున్నా. సరిగ్గా నేనేం చెప్పాలనుకుంటున్నానో దానికి కొనసాగింపుగా చందర్ నుంచి బదులు రావడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కాలేజీ ప్రారంభమవ్వడంతో హైదరాబాద్‌లో అతను, ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌కి నేను వెళ్లాల్సి వచ్చింది. చందర్, నేను చదువుతో కుస్తీ పడుతున్నా రోజూ ఫోన్లో మాట్లాడుకోకుండా ఉండేవాళ్లం కాదు. ఫోన్లో మాట్లాడినా అతడికి దూరంగా ఉన్నాననే బాధ నాలో తీవ్రస్థాయికి చేరుకుంది. సెమిస్టర్ పరీక్షలు పూర్తవ్వగానే రాకెట్ వేగంతో వచ్చి అతడిపై వాలిపోయాను. మా మధ్య ఏర్పడిన దూరాన్ని.. వీలైనంత తక్కువ చేయాలనుకున్నాను. మా ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో చందర్తోనే గడిపేదాన్ని. ఎందుకో స్నేహితులు, తల్లిదండ్రుల దగ్గర కూడా లభించనిస్పేస్ చందర్ దగ్గర దొరికేది. తిరిగి యూనివర్సిటీకి వెళ్లిపోయాక ఓ రోజు ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ని సంప్రదించగా నేను గర్భవతినని తెలిసింది. ఈ విషయాన్ని వెంటనే చందర్కి చెప్పాను. మా ప్రేమకి ప్రతిరూపాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని ఇద్దరం నిశ్చయించుకున్నాం. వివాహం విషయంలో ఇప్పుడేనా అంటూ చందర్ సంశయించినా, పుట్టబోయే చిన్నారి విషయంలో ఎలాంటి సందేహం లేకుండా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఎలా చెప్పాలి? వాళ్లు నా నిర్ణయాన్ని స్వీకరిస్తారా ? లేదా ఒకవేళ వాళ్లు ఓకే చెప్పినా పెళ్లి కాకుండానే తల్లిని అవ్వడాన్ని సమాజం ఎలా చూస్తుంది. జీవితంలో చందర్ నేను ఖచ్చితంగా మంచి పొజీషన్లో సెటిల్ అవ్వుతామనే నమ్మకం ఉంది. ఇప్పటికీ నేను తప్పు చేశాను అనే ఇబ్బంది నాకు అనిపించడం లేదు. కానీ, ఈ సమాజం దృష్టిలో మంచిదాన్ని అని నిరూపించుకోవడానికి నా కడుపులో పెరుగుతున్న చిన్నారిని చిద్రం చేసే తప్పు మాత్రం చేయలేను. అందుకే దృఢంగా నిశ్చయించుకున్నా. ఏది ఏమైనా మా ప్రేమ నిజం. దానికి నిదర్శనమైన పసికందును మాత్రం ఈ సమాజం కోసం బలి ఇవ్వాలనుకోవడం లేదు. అయితే చుట్టుపక్కల వాళ్లు చూసే చూపును, వాళ్ల మేకుల్లాంటి మాటలనుంచి తట్టుకునే శక్తి రావాలని కోరుకుంటున్నాను. అటుపై ఏం జరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి. -
విమానంలో మహిళకు పురిటినొప్పులు
శంషాబాద్: విమాన ప్రయాణంలో ఓ గర్భిణికి పురిటినొప్పులు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసిన ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. సిబు ఫసి పిక్ ఎయిర్‌లైన్స్ విమానం శనివారం ఉదయం దుబాయి నుంచి మనీలా బయలుదేరింది. మార్గమధ్యలో మనీలా దేశానికి చెందిన మన నాయేటా బేబిజీన్ లెడెస్మా (26) అనే ప్రయా ణికురాలికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో పైలట్ శంషాబాద్ ఏటీసీని సంప్రదించి విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దింపారు. సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్టులోని అపోలో ఆస్పత్రి వైద్యసిబ్బంది మహిళను అంబులెన్స్‌లోకి ఎక్కించారు. నొప్పులు తీవ్రమవడంతో వైద్యులు ఆమెకు అక్కడే ప్రసవం చేశారు. మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. -
టీనేజర్ కడుపులో దెయ్యం పిల్ల!
వర్జీనియా దేశంలోని రిచ్మండ్ నగరానికి చెందిన ఐయన్నా కారింగ్టన్ (17) అనే టీనేజర్ తొలిసారి తల్లి కాబోతోంది. కడుపులో ఉన్న 24 వారాల బేబీ ఎలా ఉందో తెలుసుకునేందుకు సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకుంది. స్కానింగ్‌లో కనిపించిన తన బేబీ దశ్యాన్ని చూసి ఆమెకు గుండె ఆగిపోయినంత పనయింది. జుట్టంతా విరబూసుకొని గుడ్లు తెరచి చూస్తున్నట్లు ఉన్న బేబీ స్కానింగ్ చిత్రం అచ్చం దెయ్యం పిల్లలా ఉంది. మిడ్ నర్సు నచ్చచెప్పాక తేరుకున్న ఐయన్నా తన బేబీ స్కానింగ్ చిత్రాన్ని సోషల్ మీడియా మిత్రులకు షేర్ చేసింది. కొందరు ఐయన్నా లాగా భయాందోళనలు వ్యక్తం చేయగా, మిగతా వారు మార్ఫింగ్ ఫొటో అంటూ కొట్టివేశారు. తనకు పుట్టబోతున్న బిడ్డ ఆడో, మగో కూడా తెలియదని ఐయన్నా చెప్పారు. అయితే స్కానింగ్ అప్పుడు ఆమె పక్కనే ఉన్న మిడ్ నర్సు మాత్రం ఆడ శిశువే అని తెలిపింది. సాధారణంగా కడుపులోని శిశువులు కళ్లు మూసుకొని ఉంటారని, కళ్లు తెరచి చూడరని, ఐయన్నా బిడ్డను స్కానింగ్ చేసినప్పుడు ఆపాప కళ్లు బాగా తెరచి కెమేరా వైపు చూడడం వల్ల స్కానింగ్‌లో ఆ పాప దెయ్యంలా కనిపిస్తోందని చెప్పారు. కొందరు గర్భస్త్ర శిశువులు స్కానింగ్ అప్పుడు అలా కనిపిస్తారుగానీ, అందరి పిల్లల్లానే ఉంటారని హెడ్ నర్సు చెప్పడంతో ఐయన్నా స్థిమిత పడింది. అయినా ఏదో కోశాన అనుమానం ఉన్నట్లు ఐయన్నా కాస్త భయపడుతోంది. అయినా మొదటిసారి తల్లి అవుతున్న ఆనందం వేరులే! అంటూ సరదాగానే ఉంటోంది. -
రెజ్లర్ తల్లి కాబోతున్నారు..
రెజ్లర్ గీతాఫొగట్ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్లో ప్రకటించారు. ‘‘జీవితం నీ లోపల్నుంచి వృద్ధి చెందేవరకు జీవితం అంటే ఏంటో నువ్వు గుర్తించలేవు’’ అనే కామెంట్‌కి.. కడుపు కాస్త ఉబ్బెత్తుగా ఉన్న తన ఫొటోను గీత జత చేశారు. ముప్పై ఏళ్ల ఈ హర్యానా క్రీడాకారిణి 2010 కామెన్వెల్త్ గేమ్స్ ఫ్రీ స్టెయిల్ రెజ్లింగ్‌లో భారతదేశానికి తొలి బంగారు పతకం సాధించిపెట్టారు. 2016లో గీత వివాహం అయింది. రెజ్లర్ పవన్ కుమార్ ఆమె భర్త. -
73 ఏళ్ల వయసులో అమ్మ కాబోతున్న బామ్మ
గుంటూరు: తల్లి కావాలన్న ఆమె కల ఎట్టకేలకు నెరవేరే రోజొచ్చింది. 73 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన ఆమెకు గురువారం వైద్యులు సిజేరియన్ చేసి పురుడుపోయనున్నారు. ఐవీఎఫ్ స్పెషాలిటీ వైద్య నిపుణుడు, గుంటూరు అహల్యా హాస్పిటల్ అధినేత డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపూడికి చెందిన యర్రమట్టి రామరాజారావుతో మంగాయమ్మకు 1962లో వివాహమైంది. రైతు కుటుంబానికి చెందిన రామరాజారావు దంపతులు వివాహమైన నాటి నుంచి సంతానం కోసం ప్రయత్నించారు. మంగాయమ్మకు 73 ఏళ్లు రావడంతో పిల్లలు పుట్టడం లేదన్న బాధతో వారు గతేడాది చెన్నై వెళ్లి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ద్వారా సంతానం పొందాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. 2018 నవంబర్‌లో ఆ దంపతులు గుంటూరు అహల్యా ఆస్పత్రిని సంప్రదించగా.. ఐవీఎఫ్ పద్ధతిలో భార్య గర్భం దాల్చింది. దీంతో ఆమెకు ఆస్పత్రిలోనే ప్రత్యేక గదిని ఏర్పాటుచేసి వైద్యసేవలందించారు. బీపీ, షుగర్ లేకపోవడంతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఎదిగింది. గుండె వైద్య నిపుణుడు పీవీ మనోహర్, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణుడు శనక్కాయల ఉదయ్‌శంకర్ పర్యవేక్షణలో రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తల్లి, గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు మంగాయమ్మకు ఆపరేషన్‌చేసి పురుడుపోయనున్నట్లు డాక్టర్ ఉమాశంకర్ చెప్పారు. 73 ఏళ్ల వృద్ధురాలు గర్భం దాల్చడం దేశంలో ఇదే మొదటిసారని వివరించారు. -
గోదావరి వరదలతో గర్భిణుల అవస్థలు
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో వరదల కారణంగా గర్భిణులు తీవ్రంగా ఇబ్బందులకు గురువుతున్నారు. వీఆర్ పురం మండలం వడ్డిగూడెం గ్రామంలోకి అధికంగా వరద నీరు చేరింది. అంతేకాకుండా కల్లేరు గ్రామాన్ని పూర్తిగా వరదనీరు చుట్టుముట్టింది. ఈ నేపథ్యంలో ఓ గర్భిణి చింతూరు ప్రభుత్వ వైద్యశాలలో చేరినా ఇంకా ప్రసవ సమయంల రాలేదని అక్కడి వైద్యులు ఆమెను ఇంటికి పంపించేశారు. నొప్పులు అధికం కావటంతో స్థానిక అంగన్వాడి కార్యకర్త సహాయంతో ప్రసవం చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం లాంచీపై కల్లేరు గ్రామానికి వెళ్లిన వైద్యులు తల్లీబిడ్డను ఆసుపత్రికి తరలించారు. కాగా ఒకవైపు వరదల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతుంటే మరోవైపు దొంగలు రెచ్చిపోయి చోరీలకు పాల్పడుతున్నారు.