Defeat
-
Champions Trophy: అఫ్గానిస్తాన్ మళ్లీ అదరగొట్టింది
రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్ చేతిలో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఆ రోజు అది ఒక సంచలనంగా కనిపించింది. ఇప్పుడు మరో ఐసీసీ టోర్నీలో మళ్లీ చెలరేగిన అఫ్గానిస్తాన్ అదే తరహా ఆటతో మళ్లీ ఇంగ్లండ్ పని పట్టింది. ఇప్పుడిది సంచలనం కాదు సాధారణమని నిరూపించింది. స్ఫూర్తిదాయక ఆటతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీలో తమ సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోగా... వరుసగా రెండో ఓటమితో ఇంగ్లండ్ నిష్క్రమించింది.చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో ఇబ్రహీమ్ జద్రాన్ తన టీమ్‌కు భారీ స్కోరును అందించగా... బౌలింగ్‌లో ఐదు వికెట్లతో అజ్మతుల్లా టీమ్‌ను నిలబెట్టాడు. ఆరేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ చేసిన జో రూట్ ఎంతో పోరాడినా... విజయానికి 26 బంతుల్లో 39 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుటవ్వడం ఇంగ్లండ్ ఓటమికి కారణమైంది. లాహోర్: చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘బి’లో ఇంకా ఆసక్తికర పోటీ సాగుతోంది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలతో పాటు ఇప్పుడు అఫ్గానిస్తాన్ కూడా సెమీఫైనల్ రేసులోకి వచ్చింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ నిరీ్ణత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇబ్రహీమ్ జద్రాన్ (146 బంతుల్లో 177; 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) భారీ సెంచరీ బాదగా... అజ్మతుల్లా (31 బంతుల్లో 41; 1 ఫోర్, 3 సిక్స్‌లు), మొహమ్మద్ నబీ (24 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ హష్మతుల్లా (67 బంతుల్లో 40; 3 ఫోర్లు) సహకరించారు. అనంతరం ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (111 బంతుల్లో 120; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయగా...అఫ్గాన్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (5/58) ప్రత్యరి్థని దెబ్బ తీశాడు. శుక్రవారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆ్రస్టేలియాతో అఫ్గానిస్తాన్; శనివారం జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ తలపడతాయి. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా 3 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా... అఫ్గానిస్తాన్ ఖాతాలో 2 పాయింట్లున్నాయి. చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ నెగ్గినా ఆ జట్టుకు రెండు పాయింట్లు మాత్రమే లభిస్తాయి. భారీ భాగస్వామ్యాలు... ఇంగ్లండ్ ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అఫ్గాన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఇదే ఒత్తిడిలో జట్టు 26 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో గుర్బాజ్ (6), సాదిఖుల్లా (4)లను అవుట్ చేసిన ఆర్చర్ ఆ తర్వాత రహ్మత్ షా (4)ను కూడా వెనక్కి పంపాడు. తొలి 10 ఓవర్లలో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో అఫ్గాన్ 39 పరుగులే చేసింది. అయితే ఆ తర్వాతి మూడు భాగస్వామ్యాలు అఫ్గాన్‌ను భారీ స్కోరు దిశగా నడిపించాయి. దూకుడైన బ్యాటింగ్‌తో చెలరేగిన ఇబ్రహీమ్ వరుసగా నాలుగు, ఐదు, ఆరో వికెట్లకు హష్మతుల్లాతో 103 పరుగులు, అజ్మతుల్లాతో 72 పరుగులు, నబీతో 111 పరుగులు జోడించాడు. ఒవర్టన్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన ఇబ్రహీమ్...106 బంతుల్లో వన్డేల్లో ఆరో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 40వ ఓవర్ తర్వాత అఫ్గాన్ బ్యాటింగ్ మరింత ధాటిగా సాగింది. ఆర్చర్ ఓవర్లో ఇబ్రహీమ్ 3 ఫోర్లు, సిక్స్ బాదగా... రూట్ ఓవర్లో నబీ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. మెరుపు ప్రదర్శన చేసిన ఇబ్రహీమ్ చివరి ఓవర్ తొలి బంతికి అవుటయ్యాడు. ఆఖరి 10 ఓవర్లలో అఫ్గానిస్తాన్ 113 పరుగులు సాధించడం విశేషం. రూట్ మినహా... సాల్ట్ (12), జేమీ స్మిత్ (9) ఆరంభంలోనే వెనుదిరగడంతో భారీ ఛేదనలో ఇంగ్లండ్‌కు సరైన ఆరంభం లభించలేదు. అయితే రూట్, డకెట్ (45 బంతుల్లో 38; 4 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. ఈ భాగస్వామ్యం తర్వాత బ్రూక్ (25), బట్లర్ (42 బంతుల్లో 38; 2 సిక్స్‌లు) కూడా కొద్దిసేపు రూట్‌కు సహకరించారు. అయితే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సరైన రీతిలో సాగలేదు. రూట్, ఒవర్టన్ (28 బంతుల్లో 32; 3 ఫోర్లు) భాగస్వామ్యం కొద్దిగా ఇంగ్లండ్ విజయంపై ఆశలు రేపింది. 101 బంతుల్లో రూట్ వన్డేల్లో 17వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే చక్కటి బంతితో రూట్‌ను అజ్మతుల్లా బోల్తా కొట్టించిన తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ అఫ్గాన్ వైపు మొగ్గింది.స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (బి) ఆర్చర్ 6; ఇబ్రహీమ్ (సి) ఆర్చర్ (బి) లివింగ్‌స్టోన్ 177; సాదిఖుల్లా (ఎల్బీ) (బి) ఆర్చర్ 4; రహ్మత్ షా (సి) ఆదిల్ రషీద్ (బి) ఆర్చర్ 4; హష్మతుల్లా (బి) రషీద్ 40; అజ్మతుల్లా (సి) (సబ్) బాంటన్ (బి) ఒవర్టన్ 41; నబీ (సి) రూట్ (బి) లివింగ్‌స్టోన్ 40; గుల్బదిన్ (నాటౌట్) 1; రషీద్ ఖాన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 325. వికెట్ల పతనం: 1–11, 2–15, 3–37, 4–140, 5–212, 6–323, 7–324. బౌలింగ్: ఆర్చర్ 10–0–64–3, మార్క్ వుడ్ 8–0–50–0, ఒవర్టన్ 10–0–72–1, ఆదిల్ రషీద్ 10–0–60–1, రూట్ 7–0–47–0, లివింగ్‌స్టోన్ 5–0–28–2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (బి) అజ్మతుల్లా 12; డకెట్ (ఎల్బీ) (బి) రషీద్ 38; స్మిత్ (సి) అజ్మతుల్లా (బి) నబీ 9; రూట్ (సి) గుర్బాజ్ (బి) అజ్మతుల్లా 120; బ్రూక్ (సి అండ్ బి) నబీ 25; బట్లర్ (సి) రహ్మతుల్లా (బి) అజ్మతుల్లా 38; లివింగ్‌స్టోన్ (సి) గుర్బాజ్ (బి) గుల్బదిన్ 10; ఒవర్టన్ (సి) నబీ (బి) అజ్మతుల్లా 32; ఆర్చర్ (సి) నబీ (బి) ఫారుఖీ 14; రషీద్ (సి) ఇబ్రహీమ్ (బి) అజ్మతుల్లా 5; వుడ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 317. వికెట్ల పతనం: 1–19, 2–30, 3–98, 4–133, 5–216, 6–233, 7–287, 8–309, 9–313, 10–317. బౌలింగ్: ఫారుఖీ 10–0–62–1, అజ్మతుల్లా 9.5–0–58–5, నబీ 8–0–57–2, రషీద్ ఖాన్ 10–0–66–1, నూర్ 10–0–51–0, గుల్బదిన్ 2–0–16–1. చాంపియన్స్ ట్రోఫీలో నేడుపాకిస్తాన్ X బంగ్లాదేశ్స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
PAK Vs NZ: పాక్‌కు పరాభవం
కరాచీ: సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగు పెట్టిన పాకిస్తాన్ జట్టు పేలవమైన ఆటను ప్రదర్శించింది. అన్ని రంగాల్లో విఫలమైన ఆ జట్టు చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమిని మూటగట్టుకుంది. ఐదు రోజుల క్రితం ఇదే మైదానంలో ముక్కోణపు టోర్నీ ఫైనల్లో పాక్‌ను మట్టికరిపించిన న్యూజిలాండ్ దానిని పునరావృతం చేసింది. అన్ని రంగాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ టోర్నీలో విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో సాంట్నర్ సారథ్యంలోని కివీస్ 60 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టామ్ లాథమ్ (104 బంతుల్లో 118 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), విల్ యంగ్ (113 బంతుల్లో 107; 12 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగారు. యంగ్, లాథమ్ నాలుగో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. గ్లెన్ ఫిలిప్స్ (39 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. లాథమ్, ఫిలిప్స్ ఐదో వికెట్‌కు 12.2 ఓవర్లలోనే 125 పరుగులు జత చేశారు. చివరి 10 ఓవర్లలో కివీస్ 113 పరుగులు సాధించింది. అనంతరం పాకిస్తాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకే ఆలౌటైంది. ఖుష్దిల్ షా (49 బంతుల్లో 69; 10 ఫోర్లు, 1 సిక్స్), బాబర్ ఆజమ్ (90 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (సి) (సబ్) ఫహీమ్ (బి) నసీమ్ 107; కాన్వే (బి) అబ్రార్ 10; విలియమ్సన్ (సి) రిజ్వాన్ (బి) నసీమ్ 1; మిచెల్ (సి) అఫ్రిది (బి) రవూఫ్ 10; లాథమ్ (నాటౌట్) 118; ఫిలిప్స్ (సి) ఫఖర్ (బి) రవూఫ్ 61; బ్రేస్‌వెల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 320. వికెట్ల పతనం: 1–39, 2–40, 3–73, 4–191, 5–316. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 10–0–68–0, నసీమ్ 10–0–63–2, అబ్రార్ 10– 0–47–1, రవూఫ్ 10–0–83–2, ఖుష్దిల్ 7–0– 40–0, సల్మాన్ 3–0–15–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షకీల్ (సి) హెన్రీ (బి) రూర్కే 6; బాబర్ ఆజమ్ (సి) విలియమ్సన్ (బి) సాంట్నర్ 64; రిజ్వాన్ (సి) ఫిలిప్స్ (బి) రూర్కే 3; ఫఖర్ (బి) బ్రేస్‌వెల్ 24; సల్మాన్ (సి) బ్రేస్‌వెల్ (బి) స్మిత్ 42; తాహిర్ (సి) విలియమ్సన్ (బి) సాంట్నర్ 1; ఖుష్దిల్ (సి) బ్రేస్‌వెల్ (బి) రూర్కే 69; అఫ్రిది (సి) లాథమ్ (సి) లాథమ్ (బి) హెన్రీ 14; నసీమ్ (బి) హెన్రీ 13; రవూఫ్ (సి) మిచెల్ (బి) సాంట్నర్ 19; అబ్రార్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (47.2 ఓవర్లలో ఆలౌట్) 260. వికెట్ల పతనం: 1–8, 2–22, 3–69, 4–127, 5–128, 6–153, 7–200, 8–229, 9–260, 10–260. బౌలింగ్: హెన్రీ 7.2–1–25–2, రూర్కే 9–0–47–3, బ్రేస్‌వెల్ 10–1–38–1, ఫిలిప్స్ 9–0–63–0, సాంట్నర్ 10–0–66–3, స్మిత్ 2–0–20–1. -
స్వయంకృతాపరాధమే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మట్టికరిచింది. హ్యాట్రిక్ కొట్టలేక చతికిలపడింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరాజయం పాలయ్యారు. సీనియర్ నేతలకు సైతం ఓటమి తప్పలేదు. గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు రావడం, ముఖ్యమంత్రి ఆతిశీ నెగ్గడం కొంతలో కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి. ఆప్ ఓటమికి దారితీసిన కారణాలు ఏమిటన్న దానిపై చర్చ మొదలైంది. ఆ పార్టీలోనూ అంతర్మథనం సాగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీలో సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేశామని చెప్పుకున్నప్పటికీ ఓటర్లు కనికరించలేదు. ఆప్ ఓటమికి స్వయం కృతాపరాధమే కారణమన్న వాదన వినిపిస్తోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ స్వయంగా అవినీతిలో కూరుకుపోవడం ప్రజల్లో వెగటు కలిగించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసు కేజ్రీవాల్ పార్టీ కొంపముంచినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్జైలుకు వెళ్లినప్పటికీ జనంలో ఏమాత్రం సానుభూతి లభించలేదు. ఫలించిన బీజేపీ ప్రచారం మద్యం కుంభకోణం వ్యవహారంలో కేజ్రీవాల్‌తోపాటు ఆప్ సీనియర్ నేతలపై కేసులు నమోదయ్యాయి. కొందరు మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ జైలుకెళ్లారు. ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టయ్యారు. ఆప్ నేతల్లో చాలామందిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ నాయకులపై కేసులన్నీ బీజేపీ కుట్రేనని ఆప్ పెద్దలు గగ్గోలు పెట్టినప్పటికీ జనం పట్టించుకోలేదు. ఇక కేజ్రీవాల్ నిర్మించుకున్న అద్దాల మేడ(శీష్ మహల్) దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంలో బీజేపీ విజయవంతమైంది. అద్దాల మేడ వ్యవహారం ఎన్నికల్లో కీలక ప్రచారాంశంగా మారిపోయింది. అవినీతి రహిత, స్వచ్ఛమైన పాలన అందిస్తానంటూ అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. పైకి నిరాడంబరంగా కనిపించే కేజ్రీవాల్ భారీగా ఆస్తులు పోగేసుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు ప్రజలను ఆలోచింపజేశాయి. ‘డబుల్ ఇంజన్’కు ఆమోదం! ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఆప్ ప్రభుత్వం తరచుగా ఘర్షణకు దిగింది. పరిపాలనా సంబంధిత అంశాల్లో ఆయనను వ్యతిరేకించడం, కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నట్లు వ్యవహరించడం జనానికి నచ్చలేదు. పరిపాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని లెఫ్టినెంట్ గవర్నర్‌పై, కేంద్రంపై నిందలు వేసినప్పటికీ ఓటర్లు విశ్వసించలేదు. ఆప్ అంటే ఆపద అని ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేశారు. పచ్చి అవినీతి పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రచారాన్ని ఆప్ నేతలు గట్టిగా తిప్పికొట్టలేకపోయారు. అద్దాల మేడపై ఏం సమాధానం చెప్పాలో వారికి తోచలేదు. ఢిల్లీ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని బీజేపీ నేతలు పదేపదే చెప్పడం ఓటర్లపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే మేలు జరుగుతుందన్న అభిప్రాయం జనంలో నెలకొంది. బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చిచూద్దామన్న నిర్ణయానికి వారు వచ్చారు. ఢిల్లీ ఓటర్లకు ఆప్ పలు ఉచిత హామీల్చింది. అవి కూడా గట్టెక్కించలేదు. బీజేపీకి లాభించిన విపక్షాల అనైక్యత జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, ఆప్ భాగస్వామ్య పక్షాలు. ఢిల్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాల్సిన ఈ రెండు పార్టీలు విడివిడిగా బరిలోకి దిగాయి. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసిన కాంగ్రెస్, ఆప్ ఈ ఎన్నికల్లో పరస్పరం కత్తులు దూసుకున్నాయి. ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆప్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రెండు పార్టీలు మొత్తం 70 స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. బీఎస్పీ, వామపక్షాలు, ఎంఐఎం, ఆజాద్ సమాజ్ పార్టీ, ఎన్సీపీ వంటివి తమకు బలం ఉన్న చోట పోటీ పడ్డాయి. ఫలితంగా బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి. చాలాచోట్ల ఆమ్ ఆద్మీ పార్టీకి రావాల్సిన ఓట్లను కాంగ్రెస్ కొల్లగొట్టినట్లు తెలు స్తోంది. ఇండియా కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా పోటీ చేస్తే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రతిపక్షాల అనైక్యత కారణంగా చివరకు బీజేపీ లబ్ధి పొందింది. మార్పు కోరుకున్న జనంఆప్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. పదేళ్లు పాలనలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చలేదు. నగరంలో అస్తవ్యస్తమైన మారిన డ్రైనేజీ వ్యవస్థ, పెరిగిపోయిన కాలుష్యం, మురికికూపంగా మారిన యమునా నది, స్వచ్ఛమైన తాగునీరు, గాలి లభించకపోవడం ఓటర్లు మనసు మార్చేసింది. అంతేకాకుండా పదేళ్లుగా అధికారంలోకి కొనసాగుతున్న ఆప్‌పై సహజంగానే కొంత ప్రజావ్యతిరేకత ఏర్పడింది. జనం మార్పును కోరుకున్నారు. అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడం, అభివృద్ధి లేకపోవడం కేజ్రీవాల్ విశ్వసనీయతను దిగజార్చాయి. ఈ పరిణామాలను బీజేపీ ఎంచక్కా సొమ్ము చేసుకుంది.స్తంభించిన పాలన కేజ్రీవాల్ అరెస్టు కావడం, జైలుకెళ్లడం, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఆప్ ప్రతిష్టను దారుణంగా దిగజార్చింది. ఆయన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆతిశీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కేజ్రీవాల్ తర్వాత బీజేపీని ఢీకొట్టే స్థాయి కలిగిన బలమైన నాయకులు లేకపోవడం ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రతికూలంగా మారింది. చాలామంది సీనియర్లు ఓడిపోవడంతో ఈ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని చెప్పుకొనే పరిస్థితి లేకుండాపోయింది. కేజ్రీవాల్ అరెస్టు కావడంతో పరిపాలన చాలావరకు స్తంభించింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది మార్చి నెలలో ఆయన అరెస్టయ్యారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయలేదు. కేంద్రం ఎదుట తలవంచబోనని తేల్చిచెప్పారు. ఈ కేసులో బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ప్రజలు ఇచ్చే నిజాయితీ సర్టిఫికెట్తో మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని కేజ్రీవాల్ చెప్పినప్పటికీ అది నెరవేరలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పార్టీలు మారి.. పరాజితులయ్యారు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు కండువాలు మార్చుకుని బరిలోకి దిగిన వారిని ప్రజలు తిరస్కరించారు. పార్టీలు మారి పోటీ చేసిన మొత్తం 25 మంది నాయకుల్లో కేవలం 8 మందిని మాత్రమే ఓటర్లు గెలిపించారు. మిగతా 15 మందికి పరాజయం తప్పలేదు. ఈ ఎన్నికల్లో దాదాపు ప్రతి పార్టీ బయటి పార్టీల నుంచి వచ్చిన వారిని రంగంలోకి దించాయి. ఇతర పార్టీల తిరుగుబాటుదార్లకు ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధికంగా 11 మందికి, బీజేపీ ఏడుగురికి, కాంగ్రెస్ ఐదుగురికి టిక్కెట్లిచ్చాయి. అయితే, ఆప్ తరఫున పోటీ చేసిన 11 మందిలో నలుగురు మాత్రమే గెలవగా.. ఏడుగురు ఓడిపోయారు. బీజేపీ నుంచి పోటీ చేసిన ఏడుగురిలో నలుగురు విజయం సాధించగా, ముగ్గురు ఓటమి చెందారు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరి పోటీకి దిగిన ఐదుగురిలో ఒక్కరు కూడా గెలవలేకపోయారు. -
యూకీ బాంబ్రీ జంట పరాజయం
పారిస్: మోంట్ పెలియర్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీకీ నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ యూకీ బాంబ్రీ–ఇవాన్ డోడిగ్ ద్వయం 4–6, 5–7తో మాన్యుయెల్ గినార్డ్–గ్రెగోరి జాక్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓటమి పాలైంది. 92 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో ఇండో–క్రొయేషియన్ జంట తమ సర్వీస్ ను రెండుసార్లు చేజార్చుకుంది. యూకీ–డోడిగ్ జోడీకి 5,500 యూరోల (రూ. 4 లక్షల 95 వేలు) ప్రైజ్ మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.ముగిసిన భారత్ పోరుబ్యాంకాక్: థాయ్ లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... మహిళల సింగిల్స్ లో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో శ్రీకాంత్ 17–21, 16–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో; శంకర్ ముత్తుస్వామి 21–19, 18–21, 13–21తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో; రక్షిత శ్రీ 21–19, 14–21, 9–21తో థ మోన్ వన్ నితిత్ క్రాయ్ (థాయ్ లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ (భారత్) 19–21, 18–21తో డేనియల్ మార్టిన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
ముగిసిన భారత్ పోరు
బ్యాంకాక్: థాయ్ లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... మహిళల సింగిల్స్ లో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో శ్రీకాంత్ 17–21, 16–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో; శంకర్ ముత్తుస్వామి 21–19, 18–21, 13–21తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో; రక్షిత శ్రీ 21–19, 14–21, 9–21తో థ మోన్ వన్ నితిత్ క్రాయ్ (థాయ్ లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ (భారత్) 19–21, 18–21తో డేనియల్ మార్టిన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
IND Vs ENG: భారత్‌ను ముంచిన బ్యాటర్లు
ఇంగ్లండ్ స్కోరు 7 వద్దే తొలి వికెట్‌ను కోల్పోయింది. కానీ రెండో వికెట్ 83 పరుగుల వద్ద పడింది. అప్పటికి 9 ఓవర్లే ముగిశాయి. ఇలా పుంజుకున్న ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను వరుణ్ చక్రవర్తి (5/24) తిప్పేయడంతో అనూహ్యంగా 127 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. హమ్మయ్య పట్టు సాధించామనుకుంటే... డెత్ ఓవర్లు, మిగతా బౌలర్ల వైఫల్యంతో ఇంగ్లండ్ 170 పైచిలుకు పరుగులు చేసింది. కానీ భారత్ మొదటి వికెట్ 16 పరుగుల వద్ద పడింది. ఆ తర్వాతా పడిపోతూనే 85/5 స్కోరు వద్ద సగం వికెట్లను సమరి్పంచుకొని ఓటమికి స్వాగతం పలికింది. దీంతో తప్పక గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ సత్తా చాటితే... ఈ ఒక్కటి గెలిస్తే సిరీస్ వశమయ్యే మ్యాచ్‌లో నిలువెత్తు నిర్లక్ష్యం భారత్‌ను ముంచింది. రాజ్‌కోట్: సిరీస్‌ను గెలిపించే మ్యాచ్‌ను భారత్ సిరీయస్‌గా తీసుకున్నట్లు లేదు. అందుకే తగిన మూల్యం ఓటమిగా చెల్లించుకుంది. రేసులో నిలవాలనుకున్న ప్రత్యర్థి జట్టు ఇంగ్లండ్... వరుణ్ బిగించిన స్పిన్ ఉచ్చు నుంచి బయటపడి... అనంతరం ఆతిథ్య జట్టును బంతితో ఎక్కడికక్కడ కట్టడి చేసింది. ఫలితంగా సిరీస్ రేసులో నిలిచేందుకు ఇంగ్లండ్ 26 పరుగులతో భారత్‌ను ఓడించి గెలుపు బోణీ కొట్టేసింది. ముందుగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.బెన్ డకెట్ (28 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), లివింగ్‌స్టోన్ (24 బంతుల్లో 43; 1 ఫోర్, 5 సిక్స్‌లు) మెరిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి (5/24) తిప్పేశాడు. హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులే చేసి ఓడింది. హార్దిక్ పాండ్యా (40; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్లు సాల్ట్ (5)ను పాండ్యా త్వరగానే పెవిలియన్ చేర్చాడు. కానీ డకెట్, బట్లర్ (24; 1 ఫోర్, 1 సిక్స్) ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను గాడిన పెడితే వరుణ్ ఉచ్చులో ఇంగ్లండ్ చిక్కుకుంది. బట్లర్ సహా, స్మిత్ (6), ఓవర్టన్ (0), కార్స్ (3), ఆర్చర్ (0)లు వికెట్లు పారేసుకున్నారు. కానీ లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో కూలుతున్న పర్యాటక జట్టు కోలుకుంది. 127/8 నుంచి 171/9 స్కోరుకు చేరుకుంది. లక్ష్యంపై నిర్లక్ష్యం! భారత్ ముందున్నది సాధారణ లక్ష్యం కానేకాదు. ఇలాంటి ఛేదనకు చక్కని శుభారంభం, తదనంతరం మిడిలార్డర్ బాధ్యత ఎంతో ముఖ్యం... కానీ ఈ ఒక్కటీ ఓడితే పోయేదేముంది అన్నట్లు భారత బ్యాటర్ల ఆటతీరు సాగింది. సంజూ సామ్సన్ (3), అభిషేక్ (14 బంతుల్లో 24; 5 ఫోర్లు), కెప్టెన్ సూర్యకుమార్ (14), తిలక్ వర్మ (18), సుందర్ (6), అక్షర్ (15), జురేల్ (2) ఇలా అంతా... మా వల్లకాదంటూ ప్రత్యర్థి బౌలింగ్‌కు తలొగ్గారు. హార్దిక్ చేసిన ఆ మాత్రం స్కోరు భారత్ పరువు నిలిపింది... కానీ ఒడ్డున పడేయలేకపోయింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 5; డకెట్ (సి) అభిషేక్ (బి) అక్షర్ 51; బట్లర్ (సి) సామ్సన్ (బి) వరుణ్ 24; హ్యారీ బ్రూక్ (బి) బిష్ణోయ్ 8; లివింగ్‌స్టోన్ (సి) జురేల్ (బి) పాండ్యా 43; స్మిత్ (సి) జురేల్ (బి) వరుణ్ 6; ఓవర్టన్ (బి) వరుణ్ 0; కార్స్ (సి) తిలక్‌వర్మ (బి) వరుణ్ 3; ఆర్చర్ (బి) వరుణ్ 0; రషీద్ నాటౌట్ 10; మార్క్‌వుడ్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 171.వికెట్ల పతనం: 1–7, 2–83, 3–87, 4–108, 5–115, 6–115, 7–127, 8–127, 9–147. బౌలింగ్: షమీ 3–0–25–0, హార్దిక్ పాండ్యా 4–0–33–2, సుందర్ 1–0–15–0, వరుణ్ 4–0– 24–5, రవి బిష్ణోయ్ 4–0–46–1, అక్షర్ పటేల్ 3–0–19–1, అభిషేక్ 1–0–4–0. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) రషీద్ (బి) ఆర్చర్ 3; అభిషేక్ (సి) ఆర్చర్ (బి) కార్స్ 24; సూర్య (సి) సాల్ట్ (బి) వుడ్ 14; తిలక్ వర్మ (బి) రషీద్ 18; హార్దిక్ పాండ్యా (సి) బట్లర్ (బి) ఓవర్టన్ 40; సుందర్ (సి) బట్లర్ (బి) ఓవర్టన్ 6; అక్షర్ (సి) రషీద్ (బి) ఆర్చర్ 15; జురేల్ (సి) సాల్ట్ (బి) కార్స్ 2; షమీ (సి) బ్రూక్ (బి) ఓవర్టన్ 7; రవి బిష్ణోయ్ నాటౌట్ 4; వరుణ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 145.వికెట్ల పతనం: 1–16, 2–31, 3–48, 4–68, 5–85, 6–123, 7–131, 8–140, 9–140. బౌలింగ్: ఆర్చర్ 4–0–33–2, వుడ్ 3–0–29–1, బ్రైడన్ కార్స్ 4–0–28–2, లివింగ్‌స్టోన్ 1–0–11–0, రషీద్ 4–0–15–1, జేమీ ఓవర్టన్ 4–0–24–3. -
సాత్విక్–చిరాగ్ జోడీ అవుట్
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. సాత్విక్–చిరాగ్ జంట 20–22, 21–23తో కిట్టినపొంగ్ కెడ్రెన్–డెచాపోల్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత నంబర్‌వన్ లక్ష్యసేన్ 16–21, 21–12, 21–23తో నిషిమోటో (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో, మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తనీషా–అశ్విని జోడీలు ఓటమి పాలయ్యాయి. -
సింధుకు షాక్
జకార్తా: ఈ ఏడాది బరిలోకి దిగిన రెండో టోర్నమెంట్లోనూ భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఇండియా ఓపెన్–750 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సింధు... ఇండోనేసియా మాస్టర్స్ –500 టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 32వ ర్యాంకర్ థుయి లిన్ నుయెన్ (వియత్నాం) 22–20, 21–12తో సింధుపై సంచలన విజయం సాధించింది.గతంలో సింధుతో ఆడిన రెండుసార్లూ (2022 సింగపూర్ ఓపెన్, 2023 ఆర్క్టిక్ ఓపెన్) ఓడిపోయిన నుయెన్ మూడో ప్రయత్నంలో గెలుపు రుచి చూసింది. 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో స్కోరు 14–20 వద్ద నుయెన్ ఒక్కసారిగా చెలరేగిపోయింది. వరుసగా 8 పాయింట్లు గెలిచి గేమ్‌ను సొంతం చేసుకుంది. చేజేతులా తొలి గేమ్‌ను చేజార్చుకున్న సింధు రెండో గేమ్‌లో తడబడింది. ఆరంభంలోనే 1–6తో వెనుకబడిన సింధు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. మహిళల సింగిల్స్‌లో పోటీపడ్డ ఇతర భారత క్రీడాకారిణులు ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ్, రక్షిత శ్రీ, తాన్యా హేమంత్ కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయారు. ఆకర్షి 10–21, 13–21తో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో, అనుపమ 12–21, 5–21తో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా) చేతిలో, తాన్యా 14–21, 11–21తో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో, రక్షిత శ్రీ 17–21, 19–21తో టొమోక మియకాజి (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 21–6, 21–14తో ఒర్నిచా–సుకిత్త (థాయ్‌లాండ్) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 9–21, 13–21తో గ్రెగొరీ మేర్స్–జెన్నీ మేర్స్ (ఇంగ్లండ్) జంట చేతిలో ఓడిపోగా... ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం 21–18, 21–14తో అద్నాన్ మౌలానా–ఇందా చాయసారి (ఇండోనేసియా) జోడీపై గెలిచింది. లక్ష్య సేన్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో లక్ష్య సేన్ 21–9, 21–14తో ఒబయాషి (జపాన్)పై నెగ్గాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కిరణ్ జార్జి (భారత్) 12–21, 10–21తో హైక్ జిన్ జియోన్ (కొరియా) చేతిలో, ఆయుశ్ శెట్టి (భారత్) 19–21, 19–21తో షి యుకి (చైనా), ప్రియాన్షు (భారత్) 14–21, 21–13, 18–21తో కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
విశ్వాస పరీక్షలో షోల్జ్ ఓటమి
బెర్లిన్: జర్మనీ చాన్సెలర్ ఒలాఫ్ షోల్జ్ సోమవారం పార్లమెంట్లో విశ్వాస పరీక్షలో ఓటమి పాలయ్యారు. యూరప్‌లోనే అత్యధిక జనాభా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీలో ఫిబ్రవరిలోనే ముందస్తు ఎన్నికలకు ఈ పరిణామం దారి తీయనుంది. మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నవంబర్ 6న కుప్పకూలింది. రాజ్యాంగం ప్రకారం సభలో విశ్వాస పరీక్ష చేపట్టాల్సి ఉంటుంది. మొత్తం 733 మంది సభ్యులుండే దిగువ సభ బుండెస్టాగ్‌లో సోమవారం షోల్జ్‌కు అనుకూలంగా 207 మంది ఓటేశారు. దీంతో, ఆయన సభ విశ్వాసం పొందలేకపోయినట్లు ప్రకటించారు. విశ్వాసంలో గెలవాలంటే మరో 367 ఓట్ల అవసరముంది. ఫిబ్రవరి 23వ తేదీన ఎన్నికలు జరపాలని ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్థిక సాయమందించేందుకు సిద్ధమని ప్రకటిస్తున్న షోల్జ్ ‘సోషల్ డెమోక్రాట్’పార్టీకి వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు తక్కువని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం యూనియన్ బ్లాక్ ముందంజలో ఉందంటున్నారు. -
ముగిసిన గాయత్రి–ట్రెసా జోడీ పోరు
హాంగ్జౌ (చైనా): బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్ నుంచి భారత జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. మొదటిసారి ఈ టోర్నీకి అర్హత సాధించిన గాయత్రి–ట్రెసా జంట సెమీఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం 17–21, 13–21తో ప్రపంచ నాలుగో ర్యాంక్ జంట నామి మసుయామ–చిహారు షిడా (జపాన్) చేతిలో ఓడిపోయింది. గ్రూప్ ‘ఎ’లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా), నామి మసుయామ–చిహారు షిడా (జపాన్) జోడీలు సెమీఫైనల్ చేరుకున్నాయి. మూడో స్థానంలో నిలిచిన గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి 32,500 డాలర్ల (రూ. 27 లక్షల 56 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
పోరాడి ఓడిన గాయత్రి–ట్రెసా జోడీ
హాంగ్జౌ (చైనా): బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో తొలిసారి పోటీపడుతున్న భారత జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ తొలి మ్యాచ్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ నంబర్‌వన్ జంట లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా)తో జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం 22–20, 20–22, 14–21తో పోరాడి ఓడిపోయింది. 82 నిమిషాల సుదీర్ఘ పోరులో గాయత్రి–ట్రెసా వరల్డ్ నంబర్‌వన్ జోడీకి గట్టిపోటీనే ఇచ్చారు. తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న భారత జంట రెండో గేమ్‌లో 14–18తో వెనుకబడింది. ఈ దశలో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి స్కోరును 18–18తో సమం చేసింది. ఆ తర్వాత చైనా జోడీ రెండు పాయింట్లు గెలవగా... ఆ వెంటనే భారత జంట కూడా రెండు పాయింట్లు సాధించింది. దాంతో స్కోరు మళ్లీ 20–20తో సమమైంది. ఈ దశలో చైనా జోడీ రెండు పాయింట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో చైనా జోడీ తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడి గట్టెక్కింది. నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో పియర్లీ టాన్–థీనా మురళీధరన్ (మలేసియా)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే గాయత్రి–ట్రెసా జోడీకి సెమీఫైనల్ చేరుకునే అవకాశాలు సజీవంగా ఉంటాయి. -
ఆంధ్ర అవుట్
బెంగళూరు: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు కథ ముగిసింది. లీగ్ దశలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్న ఆంధ్ర ఈ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. చిన్నస్వామి స్టేడియంలో ఉత్తరప్రదేశ్ జట్టుతో సోమవారం జరిగిన రెండో ప్రిక్వార్టర్ ఫైనల్లో రికీ భుయ్ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆంధ్ర జట్టు నిర్దేశించిన 157 పరుగుల విజయలక్ష్యాన్ని ఉత్తరప్రదేశ్ (యూపీ) జట్టు 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత స్టార్ రింకూ సింగ్ (22 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), విప్రాజ్ నిగమ్ (8 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి ఉత్తరప్రదేశ్ జట్టుకు విజయాన్ని అందించారు. ఒకదశలో ఉత్తరప్రదేశ్ జట్టు విజయానికి 24 బంతుల్లో 48 పరుగులు అవసరమయ్యాయి. ఆంధ్ర మీడియం పేసర్ కేవీ శశికాంత్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రింకూ, విప్రాజ్ 22 పరుగులు పిండుకోవడంతో ఫలితం యూపీ జట్టు వైపునకు మొగ్గింది. చివరి 3 ఓవర్లలో యూపీ విజయానికి 26 పరుగులు అవసరంకాగా... ఆ జట్టు 2 ఓవర్లలోనే 26 పరుగులు సాధించి విజయాన్ని ఖరారు చేసుకుంది. విప్రాజ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆంధ్ర బౌలర్లలో కొడవండ్ల సుదర్శన్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు, త్రిపురాన విజయ్ 21 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. మరో వికెట్ సత్యనారాయణ రాజుకు దక్కింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు సాధించింది. ఎస్డీఎన్వీ ప్రసాద్ (22 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు), కేవీ శశికాంత్ (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు. శ్రీకర్ భరత్ (11 బంతుల్లో 4), అశ్విన్ హెబ్బర్ (11 బంతుల్లో 11; 1 ఫోర్, 1 సిక్స్), షేక్ రషీద్ (14 బంతుల్లో 18; 3 ఫోర్లు), పైలా అవినాశ్ (20 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్), రికీ భుయ్ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు), త్రిపురాన విజయ్ (16 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్) క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో వెనుదిరిగారు. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, విప్రాజ్ నిగమ్ 2 వికెట్ల చొప్పున తీయగా... మొహసిన్ ఖాన్, శివమ్ మావిలకు ఒక్కో వికెట్ లభించింది. అంతకుముందు జరిగిన తొలి ప్రిక్వార్టర్ ఫైనల్లో బెంగాల్ జట్టు మూడు పరుగుల తేడాతో చండీగఢ్‌పై గెలిచింది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో మధ్యప్రదేశ్‌తో సౌరాష్ట్ర; బరోడాతో బెంగాల్; ముంబైతో విదర్భ; ఢిల్లీతో ఉత్తరప్రదేశ్ తలపడతాయి. -
బీజేపీ ‘మహా’ విజయం
మహారాష్ట్రపై కాషాయజెండా నిండుగా రెపరెపలాడింది. హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరులో బీజేపీ సారథ్యంలోని మహాయుతి ఘనవిజయం సాధించింది. ఏకంగా నాలుగింట మూడొంతుల సీట్లు ఒడిసిపట్టింది! అధికార కూటమి దెబ్బకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కకావికలమైంది. ప్రధాన ప్రతిపక్ష హోదాకు కావాల్సిన 29 స్థానాలు విపక్షాల్లో ఏ పార్టీకీ దక్కకపోవడం విశేషం. అయితే, మహారాష్ట్రలో తలబొప్పి కట్టిన విపక్ష ఇండియా కూటమికి జార్ఖండ్ ఫలితాలు ఊరటనిచ్చాయి. జేఎంఎం సారథ్యంలోని ఇండియా కూటమి హోరాహోరీ పోరులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని నిలువరించి అధికారాన్ని నిలబెట్టుకుంది. ముంబై/రాంచీ: మహారాష్ట్రపై కాషాయజెండా నిండుగా రెపరెపలాడింది. హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరులో బీజేపీ సారథ్యంలోని మహాయుతి ఘనవిజయం సాధించింది. ఏకంగా నాలుగింట మూడొంతుల సీట్లు ఒడిసిపట్టింది! శనివారం వెల్లడైన ఫలితాల్లో 288 స్థానాలకు గాను ఏకంగా 233 సీట్లను కైవసం చేసుకుని దుమ్ము రేపింది. అధికార కూటమి దెబ్బకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కకావికలైంది. కేవలం 49 సీట్లకు పరిమితమై ఘోర పరాజయం చవిచూసింది. ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచీ ఆద్యంతం బీజేపీ కూటమి జోరే కొనసాగింది. రౌండు రౌండుకూ ఆధిక్యాన్ని పెంచుకుంటూ మధ్యాహా్ననికల్లా మెజారిటీ మార్కు 145ను, ఆ తర్వాత చూస్తుండగానే 200 స్థానాలనూ దాటేసింది. చివరికి 233 స్థానాలు సొంతం చేసుకుంది. ఇటీవలి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ తాజాగా మహారాష్ట్రలోనూ దక్కిన అఖండ విజయంతో అంతులేని సంబరాల్లో మునిగిపోయింది. ఆ పార్టీ 149 సీట్లలో పోటీ చేయగా ఏకంగా 132 చోట్ల విజయం సాధించడం విశేషం! మహారాష్ట్రలో ఆ పారీ్టకి ఇన్ని అసెంబ్లీ సీట్లు రావడం ఇదే తొలిసారి. బీజేపీ భాగస్వాములైన సీఎం ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 57, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 స్థా నాలు గెలుచుకున్నాయి. మహాయుతి అభ్యర్థుల్లో ఏకంగా 15 మంది లక్షకు పైగా మెజారిటీ సాధించడం విశేషం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ ఫలితాలు బీజేపీకి ఎనలేని ఉత్సాహాన్ని అందించాయి. మరోవైపు 101 సీట్లలో బరిలో దిగిన ఎంవీఏ కూటమి సారథి కాంగ్రెస్ కేవలం 16 సీట్లే నెగ్గింది. పీసీసీ చీఫ్ నానా పటోలే అతి కష్టమ్మీద గట్టెక్కగా పృథీ్వరాజ్ చవాన్, బాలాసాహెబ్ థోరట్ వంటి దిగ్గజాలు ఓటమి చవిచూశారు. ఎంవీఏ భాగస్వాముల్లో 95 స్థానాల్లో పోటీ చేసిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన 20, 86 చోట్ల బరిలో దిగిన రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం 10 చోట్ల విజయం సాధించాయి. ఈ ఫలితాలు ఉద్ధవ్ రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్ధకంగా మార్చడమే గాక శరద్ పవార్‌కు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి తెర దించాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాన ప్రతిపక్ష హోదాకు కావాల్సిన 29 స్థానాలు విపక్షాల్లో ఏ పారీ్టకీ దక్కకపోవడం విశేషం! విపక్షాలకు జార్ఖండ్ ఊరట మహారాష్ట్రలో తల బొప్పి కట్టిన విపక్ష ఇండియా కూటమికి జార్ఖండ్ ఫలితాలు ఊరటనిచ్చాయి. అక్కడ జేఎంఎం సారథ్యంలోని ఇండియా కూటమి హోరాహోరీ పోరులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని నిలువరించి అధికారాన్ని నిలబెట్టుకుంది. 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 56 చోట్ల విజయం సాధించింది. కూటమి సారథి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) దుమ్ము రేపింది. 43 స్థానాల్లో బరిలో దిగిన సీఎం హేమంత్ సోరెన్ పార్టీ ఏకంగా 34 సీట్లలో విజయ కేతనం ఎగరవేయడం విశేషం. దాని భాగస్వాముల్లో 30 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ 16, 6 చోట్ల బరిలో దిగిన ఆర్జేడీ 4, 4 చోట్ల పోటీ చేసిన సీపీఐ (ఎంఎల్–ఎల్) 2 స్థానాలను గెలుచుకున్నాయి. ఎన్డీఏ కూటమి కేవలం 23 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 21 చోట్ల గెలుపొందింది. -
మా ఓటమికి కారణం ఇదే.. కీలక అంశాలు బయటపెట్టిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్
-
US Election Results 2024: ముంచింది బైడెనే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డెమొక్రాట్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై పార్టీ నేతల్లో తీవ్ర అంతర్మథనం జరుగుతోంది. ఓటమికి అధ్యక్షుడు జో బైడెనే ప్రధాన కారణమంటూ వారిలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. అధ్యక్ష రేసు నుంచి ఆయన ఆలస్యంగా తప్పుకోవడం పార్టీ పుట్టి ముంచిందంటూ మండిపడుతున్నారు. హారిస్ తీరునూ పలువురు నేతలు తప్పుబడుతున్నారు. ‘‘ఉపాధ్యక్షురాలిగా బైడెన్ మానసిక సంతులనం సరిగా లేదని ముందే తెలిసి కూడా సకాలంలో బయట పెట్టలేదు. దానికి తోడు బైడెన్ స్థానంలో అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాత కూడా ఆయన నీడ నుంచి బయట పడలేదు’’అంటూ వారు ఆక్షేపిస్తున్నారు. ‘‘దాంతో బైడెన్ విధానాలపై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పదేపదే తీవ్ర విమర్శలు చేసినా సమర్థంగా తిప్పికొట్టలేకపోయారు. వాటిలో లోటుపాట్లను సరిచేసుకుంటామని స్పష్టంగా చెప్పి ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు’’అంటూ వాపోతున్నారు. ఈ దారుణ ఓటమితో డెమొక్రటిక్ పార్టీ భవితపై నీలినీడలు కమ్ముకున్నాయన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. 81 ఏళ్ల బైడెన్ తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తానని 2023 ఏప్రిల్‌లోనే ప్రకటించారు. వయోభారం దృష్ట్యా తప్పుకోవాలని పార్టీ నేతలు చెప్పినా ససేమిరా అన్నారు. పారీ్టలో ట్రంప్‌ను ఓడించగల ఏకైక నేతను తానేనని వాదించారు. మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగే సత్తా తనకుందని, దేవుడు తప్ప ఎవరూ తనను తప్పించలేరని చెప్పుకున్నారు. కానీ ట్రంప్‌తో తొలి డిబేట్లో ఆయన దారుణంగా తడబడటం, ప్రసంగం మధ్యలో ఆగి పదాల కోసం తడుముకోవడం డెమొక్రాట్లను హతాశులను చేసింది. బైడెన్ మానసిక సంతులనంపై అనుమానాలు పెరిగాయి. అభిప్రాయానికి పార్టీ నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో ఎట్టకేలకు జూలైలో పోటీ నుంచి తప్పుకుని హారిస్‌కు దారిచ్చారు. దాంతో ప్రచారానికి ఆమెకు తక్కువ సమయం లభించింది. దానికి తోడు అప్పటికే ట్రంప్ గెలుపు ఖాయమనే తరహా వాతావరణం నెలకొని ఉంది. దాన్ని మార్చేసి ట్రంప్‌ను గట్టిగా ఢీకొట్టేలోపే పోలింగ్ తేదీ ముంచుకొచ్చింది. ఇదంతా ఆయనకు బాగా కలిసొచ్చిందని డెమొక్రాట్లు ఇప్పుడు తీరిగ్గా నిట్టూరుస్తున్నారు.బైడెన్ నీడలోనే... అమెరికాలో గత 70 ఏళ్లలో అత్యంత తక్కువ ప్రజాదరణ పొందిన అధ్యక్షుడు బైడెనేనని గాలప్ పోల్ సర్వే తేల్చింది. ప్రజల మనసులు గెలవలేకపోయిన రిచర్డ్ నిక్సన్, జిమ్మీ కార్టర్ కంటే కూడా ఆయనకు తక్కువ మార్కులు పడ్డాయి. అలాంటి అధ్యక్షుడి నీడ నుంచి హారిస్ బయటపడలేకపోవడం కూడా ఓటమికి గట్టి కారణంగా నిలిచిందని ఆమె సహాయకులే అంటున్నారు. ‘‘ఉపాధ్యక్షురాలిగా బైడెన్ నిర్ణాయల్లో తాను భాగమేనని ఆమె భావించారు. అందుకే బైడెన్ విధానాలపై ట్రంప్ విమర్శలను తిప్పికొట్టడంలో వెనకా ముందయ్యారు. అలాగాక బైడెన్ విధానాల్లో లోటుపాట్లను సమీక్షించి దేశ ప్రయోజనాలకు అనుగుణంగా సవరించుకుంటామని స్పష్టంగా చెప్పి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది’’అని వారంటున్నారు. ఎకానమీ, వలసల వంటి కీలక విధానాలపై ట్రంప్ దూకుడుకు హారిస్ నుంచి గట్టి సమాధానమే లేకపోయిందని గుర్తు చేస్తున్నారు. కనీసం వాటికి దీటైన ఇతర అంశాలను తెరపైకి తేవడంలో కూడా ఆమె విఫలమయ్యారంటున్నారు. అంతేగాక అధ్యక్షుడి మానసిక ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి తెలిసి కూడా ముందే చెప్పకుండా తమను, అమెరికా ప్రజలను హారిస్ మోసగించారని పలువురు డెమొక్రాట్లు ఆక్రోశిస్తున్నారు. పైగా 78 ఏళ్ల ట్రంప్‌తో పోలిస్తే కొత్త ఓటర్లను ఆకట్టుకోవడంలో 60 ఏళ్ల హారిస్ విఫలమయ్యారని వారు విశ్లేషిస్తున్నారు. తమ ప్రచార తీవ్రత చాలలేదని హారిస్ ప్రచార కమిటీ సీనియర్ సలహాదారు డేవిడ్ ప్లోఫ్ అంగీకరించారు. ఇది దారుణమైన ఓటమేనంటూ ఎక్స్‌లో వాపోయారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సహజ పరాజయం
సాక్షి, హైదరాబాద్: అబీర్టో టాంపికో ఓపెన్ డబ్ల్యూటీఏ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్, తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో సహజ పరాజయం పాలైంది. టాప్ సీడ్, ప్రపంచ 97వ ర్యాంకర్ నూరియా పారిజా దియాజ్ (స్పెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 284వ ర్యాంకర్ సహజ 5–7, 4–6తో ఓటమి చవిచూసింది. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. -
ఎంపీగా ఓడిన కొద్ది వారాలకే సీఎం
శ్రీనగర్: జూన్‌లో లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లాలో ఓటమిని చవిచూసిన ఒమర్ అబ్దుల్లా కేవలం కొద్ది వారాల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. గతంలోనూ ఇలాగే 38 ఏళ్ల వయసులో తొలిసారిగా జమ్మూకశ్మీర్ సీఎంగా పగ్గాలు చేపట్టి రికార్డ్ సృష్టించారు. అత్యంత పిన్న వయసులో సీఎం అయి 2009–14 కాలంలో రాష్ట్రాన్ని పాలించారు.స్కాట్లాండ్లోని స్ట్రాత్క్లీడ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేస్తూ చదువును మధ్యలో వదిలేసిన ఒమర్ 1998లో తొలిసారిగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. 28 ఏళ్ల వయసులో 12వ లోక్‌సభకు ఎన్నికై అత్యంత పిన్న వయసులో ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. 1999లోనూ జయకేతనం ఎగరేసి పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. గోధ్రా ఉదంతాన్ని తీవ్రంగా నిరసిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత జమ్మూకశ్మీర్ శాసనసభ సమరంలో అడుగుపెట్టి చతికిలపడ్డారు. 2002లో నేషనల్ కన్ఫెరెన్స్ కంచుకోట గందేర్బల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అనామక ఖాజీ మొహమ్మద్ అఫ్జల్చేతిలో ఓడిపోయారు. తర్వాత 2004లో మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టారు. తర్వాత జమ్మూకశ్మీర్ అటవీప్రాంతాన్ని శ్రీ అమర్నాథ్ ఆలయబోర్డ్కు 2008లో ఇచ్చేందుకు నాటి అటవీమంత్రిగా అఫ్జల్ తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా అసంతృప్తి నెలకొంది. దీన్ని అవకాశంగా మలచుకున్న ఒమర్ ఆందోళనలు లేవనెత్తారు. పార్టీ బలాన్ని పెంచి ఆనాటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచించి ఎన్సీని అతిపెద్ద పార్టీగా అవతరింపజేశారు. దీంతో 38 ఏళ్ల వయసులో ఒమర్ కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 54 ఏళ్ల ఒమర్ ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అబ్దుల్లాల కుటుంబం నుంచి సీఎం అయిన మూడోవ్యక్తి ఒమర్. గతంలో ఈయన తాతా షేక్ అబ్దుల్లా, తండ్రి ఫరూక్ అబ్దుల్లా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. చదవండి: నేనెందుకు అరెస్టయ్యానో మీకు తెలుసా? -
హ్యాట్రిక్ పరాజయం.. రాహులో..రాహులా..!
-
హస్తం అస్తవ్యస్తం
హరియాణాలో ఈసారి కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేయనుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, తీవ్రంగా నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత, ఎలాగూ గెలిచేది మేమేనన్న కాంగ్రెస్ నేతల అతి ఆత్మవిశ్వాసం.. వెరసి హస్తం పార్టీని మరోసారి అధికారానికి దూరంచేశాయి. మోదీ–షా ద్వయం రాజకీయ చతురత ధాటికి కాంగ్రెస్ మూడోసారీ ఓటమిని మూటగట్టుకుంది. స్వీయ తప్పిదాలు సైతం కాంగ్రెస్‌ను విజయానికి ఆమడదూరంలో ఆపేశాయి. కేవలం జాట్ వర్గం పైనే గంపెడాశలు పెట్టుకోవడం, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత భూపీందర్ సింగ్ హూడా అడుగుజాడల్లో నడవడం, కుమారి సెల్జా వంటి దళిత నాయకురాలికి ప్రాధాన్యత తగ్గించడం, అగ్రనేతల మధ్య లోపించిన ఐక్యత వంటి అంశాలు కాంగ్రెస్‌ను పదేళ్ల తర్వాత అధికారం పీఠంపై కూర్చోనివ్వకుండా చేశాయి.ఏకమైన జాట్ వ్యతిరేక ఓట్లుమొదట్నుంచీ రాష్ట్రంలోని జాట్ ఓట్లనే కాంగ్రెస్ నమ్ముకుంది. జాట్యేతర దళితులు, ఓబీసీలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారన్న సంకేతాలను కాంగ్రెస్ పసిగట్టలేకపోయింది. ఇది కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం. బీజేపీ అత్యధిక టికెట్లను ఓబీసీలు, బ్రాహ్మణులకే ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ భూపీందర్ నిర్ణయాలపై ఆధారపడింది. దీన్ని అలుసుగా తీసుకున్న భూపీందర్ కేవలం తన అనుచరగణానికే పెద్దపీట వేశారు. ఎక్కువ మందికి టికెట్లు ఇప్పించుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాలను శాసించే భూపీందర్ పరోక్షంగా పార్టీ ఓటమికి కారణమయ్యారు.గెలుపు గుర్రాలా? కాదా? అనేది చూసుకోకుండా తన అనుచరవర్గానికే అత్యధికంగా పార్టీ టికెట్లు దక్కేలాచేశారు. రాష్ట్రంలో 90 స్థానాలుంటే 72 చోట్ల కాంగ్రెస్ టికెట్ పొందిన వాళ్లు భూపేందర్ మనుషులే. తాను గెలిచి తన వారినీ గెలిపించుకుంటానన్న భూపీందర్ అతివిశ్వాసమే కాంగ్రెస్ పుట్టి ముంచిందని తెలుస్తోంది. కుమారి సెల్జా తన అనుచరుల్లో 9 మందికి టికెట్ దక్కేలా చేశారు. రణ్‌దీప్ సూర్జేవాలా సైతం తన వారికి టికెట్లు ఇప్పించుకున్నారు. దీంతో గెలుపు గుర్రాలను పక్కనబెట్టిన కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంది.దూరంగా ఉండిపోయిన సెల్జాబీజేపీకి దగ్గరవుతున్న దళితులను కాంగ్రెస్ వైపునకు తిప్పే సత్తా ఉన్న దళిత నాయకురాలు కుమారి సెల్జా. అయితే ఈమె ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించలేదు. సిర్సా ఎంపీ అయిన సెల్జాను పార్టీ అధిష్టా నమే హరియాణా ఎన్నికల్లో కలగజేసు కోవద్దని సూచించినట్లు సమాచారం. దీని వెనుక భూపీందర్ హస్తముందని వార్తలొచ్చాయి. పార్టీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలోనూ సెల్జా పాల్గొనలేదు. కీలక ప్రచార ఘట్టాల్లోనూ ఆమె జాడ లేదు. ఒకే పార్టీలో వేర్వేరుగా ప్రచారంరాష్ట్ర నేతలంతా కలిసి ఒకే ప్రచార కార్యక్రమం చేస్తే అది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. అందుకు భిన్నంగా ముఖ్య నేతలు ఎవరికి వారే భిన్న కార్యక్రమాలు చేపట్టి దేనికీ అగ్రతాంబూలం దక్కకుండా చేసుకున్నారు. భూపీందర్ వర్గం విడిగా ‘ఘర్ ఘర్ కాంగ్రెస్’ అంటూ ఇంటింటికీ ప్రచారం మొదలెట్టింది. వీళ్లకు పోటీగా కాంగ్రెస్‌లోనే సెల్జా, రణ్‌దీప్ సూర్జేవాలాలు ‘కాంగ్రెస్ సందేశ్’ యాత్రను మొదలెట్టారు. హరియాణా జనాభాలో 26–28 శాతం మంది జాట్లు ఉంటారు. ఇక్కడ 17 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. మెజారిటీ మార్కును చేరుకోవడానికి అవకాశాలను పెంచే ఈ ఎస్సీ స్థానాలపై కాంగ్రెస్ పెద్దగా దృష్టిపెట్టలేదు. దెబ్బకొట్టిన ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులుప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. దీనిని ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు అవరోధంగా తయారయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్‌తోపాటు ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులకు మళ్లాయి. దీంతో ఎవరికీ సరైన మెజారిటీ రాలేదు. ఇది బీజేపీకి లాభం చేకూర్చింది. చాలా స్థానాల్లో గెలుపు మార్జిన్లు చాలా స్వల్పంగా ఉండటం చూస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బాగా చీలినట్లు అర్థమవుతోంది. బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల తేడా కేవలం 0.85 శాతం కాగా, ఒంటరిగా పోటీ చేసిన ఆప్‌కు 1.79 శాతం ఓట్లు రావడం గమనార్హం.మరోవైపు దళితుల ఓట్లు పెద్దగా కాంగ్రెస్‌కు పడలేదు. జననాయక్ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, ఆజాద్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు ప్రధానంగా దళితుల ఓట్లపై దృష్టిపెట్టాయి. దీంతో దళితులు కేవలం ఒక్క పార్టీకే ఓటేయకుండా వేర్వేరు పార్టీలకు ఓట్లేయడంతో ఓట్లు చీలాయి. ఇవి పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చగా కాంగ్రెస్ నష్టపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ జాట్ల ఆధిపత్యం కొనసాగుతుందన్న భావనతో ఇతర కులాలు, వర్గాలు ఉద్దేశపూర్వకంగానే ఒక్క బీజేపీకే ఓటేశాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. బరిలో నిల్చొని దాదాపు 10 స్థానాల్లో విజయావకాశాలను కాంగ్రెస్ రెబల్స్ దెబ్బతీశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తొలిరౌండ్లో సింధు ఓటమి
పారిస్ ఒలింపిక్స్ తర్వాత పాల్గొన్న తొలి టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తొలి రౌండ్లోనే పరాజయం ఎదురైంది. ఫిన్లాండ్లో మంగళవారం మొదలైన ఆర్క్టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో సింధు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోలేకపోయింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 16వ ర్యాంకర్ సింధు 16–21, 10–21తో ప్రపంచ 32వ ర్యాంకర్ మిచెల్లి లీ (కెనడా) చేతిలో ఓడిపోయింది. గతంలో మిచెల్లి లీపై 10 సార్లు గెలిచిన సింధు నాలుగోసారి ఆమె చేతిలో ఓటమి చవిచూసింది. ఇదే టోర్నీలో ఆడుతున్న భారత రైజింగ్ స్టార్స్ మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రపంచ 23వ ర్యాంకర్ సుంగ్ షువో యున్ (దక్షిణ కొరియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్ మాళవిక 21–19, 24–22తో నెగ్గగా... ప్రపంచ 39వ ర్యాంకర్ వైవోన్ లీ (జర్మనీ)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 41వ ర్యాంకర్ ఆకర్షి 21–19, 21–14తో విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ కిరణ్ జార్జి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో కిరణ్ జార్జి 21–16, 13–21, 21–19తో లుకాస్ క్లియర్»ౌట్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. -
USA Presidential Elections 2024: ట్రంప్ నోట ఓటమి మాట
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో ఓడితే ఇంకెప్పుడూ పోటీ చేయబోనని రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ చేతిలో ఓడితే మళ్లీ పోటీ చేస్తారా అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఈ మేరకు బదులిచ్చారు. అయితే విజయం తనదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ తన ఓటమి గురించి మాట్లాడటం గత నాలుగు రోజుల్లో ఇది రెండోసారి. తాను ఓడటమంటూ జరిగితే యూదు ఓటర్ల వల్లేనని గురువారం ఆయన వ్యాఖ్యానించారు. ‘‘అమెరికాలోని యూదుల్లో 60 శాతం శత్రువుకు మద్దతిస్తున్నారు. ఆ కారణంగా నేనోడితే ఇజ్రాయెల్ ఉనికిలోనే ఉండదు’’అంటూ హెచ్చరించారు. 78 ఏళ్ల ట్రంప్ గత మూడు ఎన్నికల నుంచి వరుసగా పోటీ చేస్తున్నారు. అమెరికా చట్టాల ప్రకారం అధ్యక్షునిగా రెండుసార్లకు మించి పని చేయడానికి వీల్లేదు. కనుక ఈసారి ట్రంప్ గెలిస్తే 2028లో పోటీ చేయలేరు. -
చైనా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో మాళవిక పరాజయం
చాంగ్జౌ: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో భారత్ పోరాటం ముగిసింది. మహిళల విభాగంలో ముందంజ వేసిన ఏకైక భారత ఆశాకిరణం మాళవిక బన్సోద్‌కు క్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. జపాన్ స్టార్, నాలుగో సీడ్ అకానె యామగుచి ధాటికి మాళవిక నిలువలేకపోయింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మాళవిక 10–21, 16–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ యామగుచి జోరుకు వరుస గేమ్‌లలో ఓడిపోయింది. బన్సోద్‌పై యామగుచికి వరుసగా ఇది మూడో విజయం కావడం గమనార్హం.ఈ టో ర్నీలో మిగతా భారత షట్లర్లు ఇదివరకే నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జ్, ప్రియాన్షు రజావత్, మహిళల ఈవెంట్లో ఆకర్శి కశ్యప్, సామియా ఇమాద్లు తొలి రౌండ్ పోటీల్లోనే ఇంటిదారి పట్టారు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–సుమిత్ జోడీలు కూడా తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయాయి. -
Paris Olympics 2024: భారత మహిళల టీటీ జట్టు అవుట్
పారిస్: ఒలింపిక్స్‌లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు పోరాటం ముగిసింది. జర్మనీ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆకుల శ్రీజ, మనిక బత్రా, అర్చనా కామత్‌లతో కూడిన భారత జట్టు 1–3తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో శ్రీజ–అర్చన ద్వయం 5–11, 11–8, 10–12, 6–11తో చైనా సంతతికి చెందిన జర్మనీ జోడీ యువాన్ వాన్–జియోనా షాన్ చేతిలో పరాజయం పాలైంది. రెండో మ్యాచ్‌లో మనిక బత్రా 11–8, 5–11, 7–11, 5–11తో అనెట్ కౌఫమన్ చేతిలో ఓడింది. మూడో మ్యాచ్‌లో అర్చన 19– 17, 1–11, 11–5, 11–9తో జియోనా షాన్‌ను ఓడించింది. అయితే నాలుగో మ్యాచ్‌లో శ్రీజ 6–11, 7–11, 7–11తో అనెట్ చేతిలో ఓడిపోవడంతో భారత కథ ముగిసింది. -
Wimbledon 2024: కోకో గాఫ్ పరాజయం
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నిలో మరో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్) ఇంటిముఖం పట్టగా... తాజాగా ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) కూడా ఈ జాబితాలో చేరింది. గత ఏడాది యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన 20 ఏళ్ల కోకో గాఫ్‌కు వింబుల్డన్ టోర్నీ మరోసారి కలిసిరాలేదు. ఐదో ప్రయత్నంలోనూ ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్‌ను దాటలేదు. అమెరికాకే చెందిన 23 ఏళ్ల ఎమ్మా నవారో ధాటికి కోకో గాఫ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 74 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 17వ ర్యాంకర్ ఎమ్మా నవారో 6–4, 6–3తో కోకో గాఫ్‌ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. నెట్ వద్దకు దూసుకొచి్చన 9 సార్లూ పాయింట్లు నెగ్గిన నవారో ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–3, 3–0తో కలిన్‌స్కాయా (రష్యా; గాయంతో రెండో సెట్ మధ్యలో వైదొలిగింది)పై... 13వ సీడ్ ఒస్టాపెంకో (లాతి్వయా) 6–2, 6–3తో పుతింత్సెవా (కజకిస్తాన్)పై... స్వితోలినా (ఉక్రెయిన్) 6–2, 6–1తో జిన్యు వాంగ్ (చైనా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. నాలుగో సీడ్ జ్వెరెవ్‌కు షాక్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. 13వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 3 గంటల 29 నిమిషాల్లో 4–6, 6–7 (4/7), 6–4, 7–6 (7/3), 6–3తో జ్వెరెవ్‌పై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఎనిమిదో ప్రయత్నంలోనూ జ్వెరెవ్ వింబుల్డన్ టోరీ్నలో ప్రిక్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయాడు. ఇటలీ ప్లేయర్ లొరెంజో ముసెట్టి తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 98 కేజీల బరువున్న పెరికార్డ్ (ఫ్రాన్స్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ముసెట్టి 4–6, 6–3, 6–3, 6–2తో గెలిచాడు. -
‘ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది’.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి చాలా ప్రశాంతంగా ఉన్నానంటూ సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘నేను ఎమ్మెల్యేగా ఒడిపోయినందుకు చాలా ప్రశాంతంగా ఉన్నా. మనస్ఫూర్తిగా చెబుతున్న మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో నేనే రిలాక్స్ అవుతున్నా. నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా నేను ఓడిపోయానని బాధపడొద్దు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి పనులు చేసుకుందామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి ప్రజల కోసం మనం జవాబుదారీగా ఉండాలని సూచించారు.‘‘సంగారెడ్డి ప్రజల కోసం రెండు నెలల తర్వాత ప్రతి సోమవారం సంగారెడ్డిలోని రాంనగర్ లో నా ఇంటి వద్ద అందిబాటులో ఉంటా. కార్యకర్తలు ఎవరు గాంధీ భవన్ కి రావొద్దు...మీరు వస్తే నేను కలవలేను..మాట్లాడలేను. నా కూతురికి పెళ్లి చెయ్యాలి..కొడుకు బిజినెస్ పెడుతా డబ్బులు కావాలంటున్నాడు. అప్పులు తీర్చడానికే నా జీవితం సరిపోతుంది. ఈ 20 ఏళ్లలో సంగారెడ్డిలో బోనాలు, దసరా ఉత్సవాల కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని జగ్గారెడ్డి‘‘ వ్యాఖ్యానించారు. -
Rahul Gandhi: గుజరాత్‌లోనూ మోదీని ఓడిస్తాం
అహ్మదాబాద్: ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య ఉన్న లోక్‌సభ స్థానంలో బీజేపీని ఓడించినట్టే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడించబోతున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. అయోధ్య పరాభవమే అక్కడా ఎదురవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఓడిస్తామన్నారు. ‘‘నేను చెబుతున్నది చాలా పెద్ద విషయం. అయోధ్యలో బీజేపీని మట్టికరిపించడం ద్వారా అద్వానీ ప్రారంభించిన రామ మందిర ఉద్యమాన్ని కూడా ఇండియా కూటమి ఓడించింది’’ అని పేర్కొన్నారు! శనివారం అహ్మదాబాద్‌లోని కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్ మాట్లాడారు. ‘‘కొన్ని రోజుల క్రితం గుజరాత్ బీజేపీ నేతలు మనల్ని బెదిరించారు. మన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. మనం గుజరాత్లో బీజేపీ ప్రభుత్వాన్నే ధ్వంసం చేయబోతున్నాం. బీజేపీని, మోదీని చిత్తుగా ఓడిస్తాం. ఇది రాసి పెట్టుకోవాలి. నూతన ఆరంభం ఇక్కడి నుంచే మొదలవుతుంది. మోదీ విజన్ అనే గాలి బుడగ గుజరాత్లో ఇప్పటికే బద్దలైంది. వారణాసి లోక్‌సభ స్థానంలోనూ మోదీ తక్కువ మెజారీ్టతోనే గెలిచారు. అక్కడ మనం కొన్ని పొరపాట్లు చేశాం. లేదంటే మోదీ కచి్చతంగా ఓడేవారు. తొలుత అయోధ్యలో పోటీ చేయాలని మోదీ భావించారు. అక్కడ గెలిచే అవకాశం లేదని, రాజకీయ కెరీర్‌కే తెర పడవచ్చని బీజేపీ సర్వేయర్లు చెప్పడంతో వారణాసికే పరిమితమయ్యారు’’ అని ఎద్దేవా చేశారు. దైవాంశసంభూతుడైన మోదీకి సామాన్య మానవుల కష్టాలు అర్థం కావడం లేదన్నారు. అయోధ్య ఆలయ నిర్మాణానికి పేదల భూములు లాక్కున్నారని, పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు ‘హస్తం’ ప్రతి మతంలోనూ ప్రముఖంగా కనిపిస్తుందన్నారు. -
Iran election 2024: మతవాద పాలనకు ఎదురుదెబ్బ
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాదులదే పైచేయి అయింది. కరడుగట్టిన మతవాది సయీద్ జలిలిపై మితవాది, సంస్కరణాభిలాషి మసూద్ పెజెష్కియాన్ ఘనవిజయం సాధించారు. జూన్ 28న జరిగిన తొలి విడత ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థుల్లో ఎవరికీ మెజారిటీ రాలేదు. దాంతో విజేతను తేల్చేందుకు తొలి రెండు స్థానాల్లో నిలిచిన జలిలి, పెజెష్కియాన్ మధ్య శుక్రవారం తిరిగి ఎన్నిక అనివార్యమైంది. శనివారం ఫలితాలు వెల్లడయ్యాయి. పోలైన దాదాపు 3 కోట్ల ఓట్లలో పెజెష్కియాన్‌కు 1.64 కోట్లు వచ్చాయి. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అనుచరునిగా పేరుబడ్డ జలిలి 1.35 కోట్ల ఓట్లు మాత్రమే సాధించారు. దేశ తొమ్మిదో అధ్యక్షునిగా పెజెష్కియాన్ ఎన్నికైనట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్‌పై దశాబ్దాలుగా ఆధిపత్యం చలాయిస్తూ వస్తున్న మతవాద కూటమికి ఈ ఫలితాలు గట్టి షాకివ్వడమే గాక సంస్కరణవాదుల్లో జోష్ నింపాయి. నిజానికి ఈసారి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియనే బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన ప్రజలు శుక్రవారం రాత్రి దాకా జరిగిన ఓటింగ్‌లో అనూహ్యంగా భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషం. దాంతో 53 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. తద్వారా ఖమేనీ ఏకపక్ష పోకడలపై ప్రజలు స్పష్టమైన వ్యతిరేకత వ్యక్తం చేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఫలితాల వెల్లడి మొదలవుతూనే రాజధాని టెహ్రాన్, పశి్చమ ఇరాన్‌లోని పెజెష్కియాన్ సొంత నగరం తబ్రీజ్తో పాటు దేశవ్యాప్తంగా ఆయన మద్దతుదారులు, అభిమానులు భారీగా వీధుల్లోకి వచ్చి డ్యాన్సుల సంబరాలు చేసుకున్నారు. దేశాన్ని కాపాడేందుకు ఓటర్లు భారీ సంఖ్యలో బూత్‌లకు తరలారంటూ నినాదాలు చేశారు. పెజెష్కియాన్ ఎన్నికల నినాదమైన ‘సేవ్ ఇరాన్’ సందేశాలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. దేశంలో మెజారిటీలపై మైనారిటీల పెత్తనానికి మొత్తానికి తెర పడ్డట్టేనంటూ సంస్కరణవాదులు సంబరపడుతున్నారు. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మేలో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల ఫలితాలను ఖమేనీ లాంఛనంగా ఆమోదముద్ర వేశాక 30 రోజుల్లో పెజెష్కియాన్ బాధ్యతలు స్వీకరిస్తారు. నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు.పోలింగ్ శాతం పెరగడం వెనక... → నిజానికి ఏళ్లుగా తామెదుర్కొంటున్న పలు కీలక సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఇరానీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. → ఖమేనీ యంత్రాంగం తీరుకు నిరసనగా ఈసారి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను మూకుమ్మడిగా బహిష్కరించారు. దాంతో తొలి రౌండ్లో దేశ చరిత్రలోనే అత్యల్పంగా కేవలం 40 శాతం పోలింగ్ నమోదైంది. → అత్యంత మితవాదిగా పేరొందిన పెజెష్కియాన్ అనూహ్యంగా తుది పోరులో బరిలో నిలవడంతో ఆయనకు మద్దతుగా వారంతా భారీ సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు తరలారు. → పోలింగ్‌కు ముందు నుంచీ పెజెష్కియాన్ ప్రచార సరళికి, ‘సేవ్ ఇరాన్’ నినాదానికి దేశ యువత బాగా ఆకర్షితులయ్యారు. దాంతో ఆయన ర్యాలీలకు, సభలకు జనం పోటెత్తారు. → ఇస్లామిక్ పాలనకు తెర పడాల్సిందేనని యువతతో పాటు విద్యావంతులు కూడా తొలిసారిగా బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కరడుగట్టిన మతవాది అయిన జలిలి ఇరాన్‌ను ఎప్పటికీ ఏకం చేయలేరని మైకుల సాక్షిగా చెప్పుకొచ్చారు. → జలిలిని ఓడించడం ద్వారా నిరంకుశ మతవాద పాలనకు వ్యతిరేకంగా ఇరానీలు స్పష్టమైన తీర్పు వెలువరించారు. → ఖమేనీ మతవాద పాలన, హిజాబ్‌ను తప్పనిసరి వంటి కఠినతరమైన సామాజిక నిబంధనలు, ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలను ఎత్తేసేలా అంతర్జాతీయ సమాజంతో చర్చలకు ముందుకు రాని పోకడలపైనా ప్రజలు తమ వ్యతిరేకతను ఓటు రూపంలో స్పష్టంగా వ్యక్తం చేశారంటున్నారు.హార్ట్ సర్జన్‌పై ఆశలెన్నో...! 69 ఏళ్ల పెజెష్కియాన్‌కు హార్ట్ సర్జన్‌గా దేశవ్యాప్తంగా అపారమైన పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆయన ఇరాక్–ఇరాన్ యుద్ధంలో పాల్గొన్న వార్ వెటరన్ కూడా. 16 ఏళ్లుగా పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా, నాలుగేళ్ల పాటు ఆరోగ్య మంత్రిగా కూడా చేశారు. ఆయన భార్య కారు ప్రమాదంలో చనిపోయారు. మళ్లీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ పేరెంట్‌గా పిల్లలను అన్నీ తానై పెంచారు. మతపరమైన మైనారిటీ అయిన అజెరీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం ఈ ఎన్నికల్లో పెజెష్కియాన్‌కు మరింత కలిసొచి్చంది. ప్రచారం పొడవునా కూతురిని వెంట ఉంచుకోవడం ద్వారా మహిళలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. దాంతో పార్టీలకు అతీతంగా ప్రజలు ఆయనకు భారీగా ఓటేశారు. సవాళ్ల స్వాగతం... లెక్కలేనన్ని సమస్యలు పెజెష్కియాన్‌కు స్వాగతం పలుకుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయంగా ఉంది. ఇరుగుపొరుగుతో సంబంధాలు దారుణంగా దిగజారాయి. యెమన్, లెబనాన్ గుండా ఇజ్రాయెల్‌పై సాయుధ పోరుకు ఇరాన్ అన్నివిధాలా సాయపడుతూ అంతర్జాతీయ సమాజం నుంచి మరింత ఆగ్రహం చవిచూస్తోంది. ఆ క్రమంలో గత ఫిబ్రవరిలో అమెరికాతో, అనంతరం ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం ముంగిటి దాకా వెళ్లొచి్చంది. ఈ రుగ్మతలకు పెజెష్కియాన్ ఎలాంటి వైద్యం చేస్తారో చూడాలి. అయితే ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్నట్టు ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారు. దేశ ప్రగతి కోసం ప్రత్యర్థులతో కూడా కలిసి పని చేస్తానని ఫలితాల అనంతరం ప్రకటించారు. ‘‘ఎన్నికలు ముగిశాయి. ఇది మనమంతా సహకరించుకుంటూ ముందుకు సాగాల్సిన సమయం. నేను మిమ్మల్ని ఏకాకులను చేయను. మీరూ నన్ను ఏకాకిని చేయొద్దు’’ అంటూ పిలుపునిచ్చారు. తద్వారా అందరినీ కలుపుకుని పోతానంటూ అతివాద వర్గానికి స్పష్టమైన సందేశమిచ్చారు. అదే సమయంలో, ‘ఇరాన్ ఇరానీలందరిదీ’ అంటూ పునరుద్ఘాటించడం ద్వారా ప్రజల సంక్షేమానికే ప్రథమ తాంబూలమని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు సర్వం సహా చక్రవర్తి అయిన ఖమేనీతో అధ్యక్షునిగా ఆయన సంబంధాలు ఏ మేరకు సజావుగా సాగుతాయన్నది ఆసక్తికరం. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నా. దేశ ప్రగతి కోసం పెజెష్కియాన్‌కు మనమంతా దన్నుగా నిలవాల్సిన అవసరముంది.– ఫలితాల అనంతరం సయీద్ జలిలి – సాక్షి, నేషనల్ డెస్క్ -
UK Election Result 2024: ఇక స్టార్మర్ శకం
లండన్: అంతా ఊహించిందే జరిగింది. గురువారం జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 స్థానాలకు గాను ఏకంగా 412 సీట్లు కైవసం చేసుకుంది. ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాలతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఏకంగా 252 స్థానాలు కోల్పోయింది! ఇది ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన పరాజయం. లేబర్ పార్టీకి 33.7 శాతం రాగా కన్జర్వేటివ్‌లకు 23.7 శాతమే లభించాయి. శుక్రవారం మధ్యాహా్ననికల్లా ఫలితాలు వెలువడటం, సునాక్ రాజీనామా చేయడం, లేబర్ పార్టీని విజయపథంలో నడిపిన కియర్ స్టార్మర్ దేశ 58వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. దాంతో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెర పడింది. భారత మూలాలున్న తొలి ప్రధాని సునాక్ పాలన కూడా 20 నెలలకే ముగిసింది. రిచ్మండ్–నార్త్ అలెర్టన్ స్థానం నుంచి ఆయన ఘనవిజయం సాధించినా మాజీ ప్రధాని లిజ్ ట్రస్‌తో పాటు గ్రాంట్ షేప్స్, పెన్నీ మోర్డంట్, జాకబ్ రీస్ మాగ్ వంటి పలువురు కన్జర్వేటివ్ హేమాహేమీలు ఓటమి చవిచూశారు. దాంతో ఫలితాల అనంతరం మాట్లాడుతూ 44 ఏళ్ల సునాక్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘లేబర్ పార్టీకి, స్టార్మర్‌కు అభినందనలు. ఘోర ఓటమి చవిచూసిన నా కేబినెట్ సహచరులకు సానుభూతి. నాయకునిగా వారిని గెలిపించుకోలేకపోయినందుకు క్షమాపణలు. ప్రజల అంచనాలు అందుకోలేకపోయినందుకు వారికి కూడా క్షమాపణలు’’ అన్నారు. ఓటమికి బాధ్యత వహిస్తూ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సునాక్ ప్రకటించారు. అయితే ప్రధానిగా తన బాధ్యతలకు నూరు శాతం న్యాయం చేశానన్నారు. ప్రధానిగా కుటుంబంతో కలిసి అధికార నివాసంలో జరుపుకున్న దీపావళి వేడుకలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘మా తాతల కాలంలో చేతిలో పెద్దగా ఏమీ లేకుండా ఇంగ్లండ్ వచి్చన కుటుంబం మాది. అలాంటిది రెండే తరాల్లో నేను ప్రధాని కాగలిగాను. నా పిల్లలు డౌనింగ్ స్ట్రీట్ మెట్లపై దీపావళి ప్రమిదలు వెలిగించగలిగారు. అదీ దేశ గొప్పదనం’’ అంటూ కొనియాడారు. ‘‘నా వారసునిగా అత్యంత సవాళ్లమయమైన బాధ్యతను స్వీకరిస్తున్న నూతన ప్రధానికి 10, డౌనింగ్ స్ట్రీట్‌కు హార్దిక స్వాగతం. నూతన బాధ్యతల్లో ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే ఆయన విజయమే మనందరి విజయం. ప్రచారంలో విమర్శలు గుప్పించుకున్నా స్టార్మర్ చాలా మంచి వ్యక్తి. ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతగానో అభిమానిస్తాను’’ అన్నారు. అనంతరం రాజు చార్లెస్–3కు సునాక్ రాజీనామా సమర్పించారు. తర్వాత భార్య అక్షత, పిల్లలతో కలిసి అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. స్టార్మర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.దేశాన్ని పునర్నిర్మిస్తాం : స్టార్మర్ ప్రజలు మార్పు కోసం నిర్ణాయక రీతిలో ఓటేశారని 61 ఏళ్ల స్టార్మర్ అన్నారు. శుక్రవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఆయన తొలి ప్రసంగం చేశారు. ‘‘ప్రజల త్యాగాలకు, ప్రతిగా వారికందుతున్న సేవలకు మధ్య అంతరం ఈ స్థాయిలో పెరిగితే భవిష్యత్తు పట్ల వారిలో మిగిలేది నిరాశా నిస్పృహలే. ముందు వారిలో విశ్వాసాన్ని పాదుగొల్పాలి. ఇది మాటలతో కాదు. చేతల్లోనే చూపాలి. మనముందు భారీ లక్ష్యాలున్నాయి. కనుక నేటినుంచే పని మొదలవుతుంది’’ అన్నారు. ‘‘సేవే ఏకైక లక్ష్యంగా లేబర్ పార్టీని పునర్ వ్యవస్థీకరించాం. దేశమే ముందు, ఆ తర్వాతే పార్టీ అంటూ సమూలంగా మెరుగుపరిచి ప్రజల ముందుంచాం. అలాగే దేశాన్ని కూడా అన్ని రంగాల్లోనూ బలోపేతం చేసి చూపిస్తాం. ‘సేవల ప్రభుత్వం’గా పని చేస్తాం. లేబర్ పార్టీకి ఓటేయని వారికి కూడా అంతే చిత్తశుద్ధితో సేవ చేస్తాం. ప్రజలందరి నమ్మకాన్నీ నిలబెట్టుకుంటాం. బ్రిటన్ను పూర్తిస్థాయిలో పునర్నరి్మస్తాం’’ అని ప్రకటించారు. సునాక్‌పై ప్రశంసల జల్లు ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారంటూ స్టార్మర్ ప్రశంసలు కురిపించడం విశేషం! 20 నెలల పాలనలో దేశ ప్రగతి కోసం ఆయన చిత్తశుద్ధితో ఎంతగానో కృషి చేశారంటూ కొనియాడారు. ‘‘ఆసియా మూలాలున్న తొలి బ్రిటిష్ ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారు. ఆ ఘనతలను ఏ మాత్రం తక్కువ చేసి చూడలేం. ప్రధానిగా ఆయన పనితీరుకు జోహార్లు’’ అన్నారు. ఫలితాలు వెలువడగానే స్టార్మర్ బకింగ్‌హాం రాజ ప్రాసాదానికి వెళ్లి రాజు చార్లెస్–3తో భేటీ అయ్యారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా స్టార్మర్ను రాజు లాంఛనంగా ఆహ్వానించారు. కేబినెట్లోకి లీసా నందిస్టార్మర్ మంత్రివర్గంలో భారతీయ మూలాలున్న 44 ఏళ్ల లీసా నందికి చోటు దక్కింది. ఆమెను సాంస్కృతిక, క్రీడా, సమాచార ప్రసార మంత్రిగా నియమించారు. విగాన్ నుంచి ఆమె వరుసగా రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. లీసా తండ్రి దీపక్ విద్యావేత్త. 1950ల్లో బ్రిటన్ వెళ్లారు. అక్కడి అమ్మాయిని పెళ్లాడారు. జాతుల సయోధ్యకు బ్రిటన్‌లో గుర్తింపు పొందారు. లీసా 2020లో లేబర్ పార్టీ నాయకత్వం కోసం స్టార్మర్తో పోటీపడి మూడోస్థానంలో నిలిచారు. -
ఫ్రాన్స్ ఎన్నికల తొలి రౌండ్లో విపక్ష కూటమి గెలుపు
పారిస్: ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. దేశాధ్యక్ష ఎన్నికల తొలి రౌండ్లో మేక్రాన్‌కు చెందిన మితవాద సెంట్రిస్ట్ ఎన్‌సింబల్ కూటమి మూడో స్థానంలో సరిపెట్టుకుంది. తొలి దశలో పోలైన 68 శాతం ఓట్లలో అతివాద నేషనల్ ర్యాలీ కూటమి ఏకంగా 33.14 శాతం ఓట్లను ఒడిసిపట్టింది. న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమికి 27.99 శాతం వచ్చాయి. మేక్రాన్ పార్టీ 20.04 శాతంతో సరిపెట్టుకుంది. జూలై 7న రెండో రౌండ్ పోలింగ్ ఉంటుంది. గత నెలలో ఈయూ ఎన్నికల్లో కూడా నేషనల్ ర్యాలీ పార్టీయే విజయం సాధించింది. -
Sonia Gandhi: ఫలితాలు ప్రధానికి నైతిక ఓటమే
న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమికి మెజారిటీ తగ్గిస్తూ తాజా లోక్‌సభ ఎన్నికల్లో వెలువడిన ప్రజాతీర్పు ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ, నైతిక ఓటమికి నిదర్శనమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. ఒక జాతీయ పత్రికలో రాసిన సంపాదకీయంలో మోదీ, ఎన్డీఏ ప్రభుత్వంపై సోనియా విమర్శలు సంధించారు. ‘‘ ఎన్నికల ప్రచారంవేళ తానొక దైవాంశ సంభూతుడిని అన్నట్లు స్వయంగా ప్రకటించుకుని 400 సీట్ల ఖాయమని భ్రమలో గడిపిన ప్రధాని మోదీకి జూన్ 4న వెల్లడైన ఫలితాలు ప్రతికూల సంకేతాలు చూపించాయి. విభజన, విద్వేష రాజకీయాలు, మోదీ పరిపాలనా విధానాలను ప్రజలు తిరస్కరిస్తున్నట్లు నాటి ఫలితాల్లో వెల్లడైంది. ఏకాభిప్రాయం ఉండాలని మోదీ వల్లెవేస్తారుగానీ ఆచరణలో అవేం ఉండవు. స్పీకర్ ఎన్నికలు ఇందుకు తార్కాణం. డెప్యూటీ స్పీకర్ పదవి విషయంలో విపక్షాల సహేతుక విజ్ఞాపనను పట్టించుకుంటే స్పీకర్ ఎన్నిక విషయంలో ప్రభుత్వానికి మేం సంపూర్ణ మద్దతు ఇస్తామని ‘ఇండియా’ కూటమి స్పష్టంచేసింది. అయినాసరే మోదీ వైఖరి మారలేదు. 17వ లోక్‌సభలోనూ డెప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు కేటాయించలేదు’’ అని అన్నారు. అంతటి మెజారిటీ మోదీ సర్కార్‌కు రాలేదు ‘‘రాజ్యాంగంపై ఎన్డీఏ దాడి అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే లోక్‌సభ తొలి సెషన్లోనే ఎమర్జెన్సీ అంశాన్ని మోదీ సర్కార్ పదేపదే ప్రస్తావించింది. పారీ్టలకతీతంగా, పక్షపాతరహితంగా వ్యవహరించాల్సిన స్పీకర్ కూడా అదే బాటలో పయనిస్తూ ‘ఎమర్జెన్సీ’పై తీర్మానం చదవడం దిగ్భ్రాంతికరం. నాటి ఎమర్జెన్సీకి కారణమైన ఇందిరాగాం«దీని ఆనాడు ప్రజలు తిరస్కరించినా తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. భారీ మెజారిటీతో గెలిపించారు. అంతటి మెజారిటీ మోదీ సర్కార్‌కు కూడా రాలేదు’’ అని సోనియా అన్నారు. ఆ మూడు చట్టాల అమలు నిలిపేయాలి ‘‘పార్లమెంట్లో దారుణమైన భద్రతావైఫల్యాన్ని ఎలుగెత్తిచాటినందుకు అక్రమంగా ఇరుసభల్లో 146 మంది విపక్ష సభ్యులను బహిష్కరించారు. వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే కీలకమైన మూడు నూతన నేర బిల్లులను ఎలాంటి చర్చ జరపకుండానే ఏకపక్షంగా చట్టాలుగా ఆమోదింపజేసుకున్నారు. బిల్లులను సంస్కరించాల్సిఉందని, చర్చ జరగాలని ఎందరో న్యాయకోవిదులు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే వీటిపై సమగ్ర చర్చ జరగాలి. అప్పటిదాకా ఈ నేర చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలి’’ అని సోనియా అన్నారు. నీట్ లీకేజీలపై ప్రధాని మాట్లాడరా? ‘‘లక్షలాది మంది యువత భవిష్యత్తును ఛిద్రం చేస్తూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతం వెలుగుచూస్తే మోదీ మాట్లాడరా? పరీక్ష పే చర్చా అంటూ తరచూ విద్యార్థులతో మాట్లాడే మోదీ ఈసారి ఎందుకు అదే విద్యార్థులకు మరోసారి పేపర్ లీక్ కాబోదని భరోసా ఇవ్వలేకపోతున్నారు? దారుణ నిర్లక్ష్యానికి విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలి. ఎన్సీఈఆర్టీ, యూజీసీ, విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు గత పదేళ్లలో ఎంతగా పడిపోయాయో ఇట్టే అర్థమవుతోంది’’ అని అన్నారు. -
బోపన్న జోడీ ఓటమి
సించ్ చాంపియన్‌షిప్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ 6–7 (1/7), 6–7 (3/7)తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)–ఖచనోవ్ (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. బోపన్న–ఎబ్డెన్‌లకు 18,690 పౌండ్ల (రూ. 19 లక్షల 75 వేలు) ప్రైజ్‌మనీ, 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
టీడీపీ నేతల అమానుష చర్చ
-
జగనన్న ఎలా ఓడిపోయాడు..గోదావరిలో దూకి చస్తాం..
-
క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై: వీకే పాండ్యన్
ఒడిశా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేడీ ఘోర ఓటమి చవిచూడటంతో క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు మాజీ అధికారి, ఆ పార్టీ నేత వీకే పాండ్యన్ ప్రకటించారు. బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌కు సాయంగా ఉండేందుకు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన ఆదివారం విడుదల చేసిన ఒక వీడియోలో పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పారు. -
నైతిక, రాజకీయ ఓటమి...
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రధాని నరేంద్ర మోదీకి నైతిక, రాజకీయ ఓటమిగా సోనియాగాంధీ అభివర్ణించారు. ‘‘కనుక మోదీ దేశానికి నాయకత్వం వహించే నైతిక హక్కు కోల్పోయారు. ఎందుకంటే బీజేపీని, భాగస్వామ్య పక్షాలను పూర్తిగా పక్కన పెట్టారు. కేవలం తన పేరుతోనే ప్రజా తీర్పు కోరారు. కనుక ఓటమికి ఆయనే పూర్తి బాధ్యత వహించాలి. కానీ ఆ పని చేయకపోగా మరోసారి గద్దెనెక్కేందుకు సిద్ధపడుతున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సోనియా తిరిగి ఎన్నికయ్యారు. శనివారం సీడబ్ల్యూసీ భేటీ అనంతరం పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలంతా ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఎంపీలనుద్దేశించి ఆమె మాట్లాడారు. ‘‘మోదీ నైజం తెలిసిన వారెవరూ ప్రజా తీర్పును ఆయన గౌరవిస్తారని, పాలన తీరుతెన్నులను మార్చుకుంటారని అనుకోరు. కనుక మోదీ సర్కారు తీరును వేయి కళ్లతో గమనించడం, ప్రజా వ్యతిరేక చర్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం మనందరి బాధ్యత. లౌకిక, ప్రజాస్వామ్య విలువలకు పాతరేసే యత్నాలను అడ్డుకుంటూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి’’ అని ఎంపీలకు ఉద్బోధించారు. ‘‘అయితే లోక్‌సభలో కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది. పార్లమెంటులో మోదీ సర్కారు ఏకపక్ష పోకడలు గత పదేళ్ల మాదిరిగా సాగబోవు. చర్చల్లేకుండా బిల్లుల ఆమోదం, విపక్ష సభ్యులను అవమానించడం, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం వంటివి చెల్లబోవు’’ అన్నారు. మనకు ఏకంగా శ్రద్ధాంజలి ఘటించారు... ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎలాగైనా కుప్పకూల్చేందుకు అధికార పార్టీ చేయని ప్రయత్నం లేదని సోనియా అన్నారు. ‘‘పారీ్టని ఆర్థికంగా కుంగదీశారు. అందరిపైనా కేసులు పెట్టి వేధించారు. చాలామంది కాంగ్రెస్‌కు ఏకంగా శ్రద్ధాంజలే ఘటించారు! కానీ బీజేపీ కుటిల యత్నాలన్నింటినీ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మొక్కవోని దీక్షతో అడ్డుకున్నారు. కలసికట్టుగా శ్రమించి మంచి ఫలితాలు సాధించారు. వారి ధైర్యానికి మా సెల్యూట్. ఈ విజయంలో అధ్యక్షుడు ఖర్గేది కీలక పాత్ర. ఆయన మనందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఖర్గే నుంచి అందరూ ఎంతో నేర్చుకోవాలి. అలాగే చరిత్రాత్మక భారత్ జోడో యాత్రలు చేసిన రాహుల్ ప్రత్యేక అభినందనలకు అర్హుడు’’ అన్నారు. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించకపోవడంపై ఆత్మశోధన జరగాలని ఎంపీలను కోరారు. సీపీపీ చైర్‌పర్సన్‌గా తిరిగి ఎన్నికవడం తనకెంతో భావోద్వేగపూరిత క్షణమని సోనియా అన్నారు. ‘‘మీరంతా నాపై ఎంతో ప్రేమ చూపుతూ వస్తున్నారు. మీ నమ్మకాన్ని కాపాడుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తా’’ అని చెప్పారు. -
వైఎస్సార్సీపీ ఓటమిని తట్టుకోలేక ఆగిన మరో గుండె
ఎస్.రాయవరం (అనకాపల్లి జిల్లా): వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఓటమిని తట్టుకోలేక అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం వెంకటాపురానికి చెందిన ఆ పార్టీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రమణ(49) మనస్తాపంతో నిద్రాహారాలు మానివేశాడు.అప్పటి నుంచి దిగాలుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటివద్ద గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన మృతదేహాన్ని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. -
ఫలితాలపై BRSలో అంతర్మధనం..
-
లోక్ సభ ఎన్నికల్లో జీరోకు పడిపోయిన బీఆర్ఎస్
-
French Open 2024: నాదల్కు షాక్
పారిస్: తరచూ గాయాలబారిన పడటం... పూర్తిస్థాయి ఫిట్నెస్ లేకపోవడం... వెరసి మట్టికోర్టులపై మకుటంలేని మహరాజుగా వెలుగొందిన స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్కు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ఊహించని పరాజయం ఎదురైంది. 2005 నుంచి ఈ టోర్నీలో ఆడుతూ ఏకంగా 14 సార్లు విజేతగా నిలిచిన 37 ఏళ్ల నాదల్ మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రపంచ నాలుగో ర్యాంకర్, గత మూడేళ్లుగా ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ పక్కా ప్రణాళికతో ఆడి నాదల్ ఆట కట్టించాడు. 3 గంటల 5 నిమిషాలపాటు సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో జ్వెరెవ్ 6–3, 7–6 (7/5), 6–3తో నాదల్‌ను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు నాదల్ సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. జ్వెరెవ్ సరీ్వస్‌ను కేవలం రెండుసార్లు బ్రేక్ చేసిన నాదల్ 30 అనవసర తప్పిదాలు కూడా చేశాడు. గాయం కారణంగా గత ఏడాది ఈ టోరీ్నకి దూరంగా ఉన్న నాదల్ తాజా ఓటమితో చివరిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడినట్లు భావించాలి. సుమిత్ నగాల్ ఓటమి ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి ఆడుతున్న భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం మొదటి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 18వ ర్యాంకర్ ఖచనోవ్ (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో సుమిత్ 2–6, 0–6, 6–7 (5/7)తో ఓడిపోయాడు. మరోవైపు ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో సినెర్ 6–3, 6–3, 6–4తో యుబ్యాంక్స్ (అమెరికా)పై గెలిచాడు. స్వియాటెక్ ముందంజ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో స్వియాటెక్ 6–1, 6–2తో లియోలియా జీన్జీన్ (ఫ్రాన్స్)పై గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–1, 6–1తో జూలియా అవ్దీవా (రష్యా)పై, ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీíÙయా) 6–3, 6–2తో సాచియా వికెరీ (అమెరికా)పై, ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–3తో మసరోవా (స్పెయిన్)పై విజయం సాధించారు. 3: ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో నాదల్‌ను ఓడించిన మూడో ప్లేయర్‌గా జ్వెరెవ్ నిలిచాడు. గతంలో సోడెర్లింగ్ (స్వీడన్; 2009లో ప్రిక్వార్టర్స్‌లో) ఒకసారి... జొకోవిచ్ (సెర్బియా; 2015 క్వార్టర్ ఫైనల్లో, 2021 సెమీఫైనల్లో) రెండుసార్లు ఈ టోర్నీ లో నాదల్‌ను ఓడించారు. 2016లో గాయం కారణంగా నాదల్ మూడో రౌండ్ నుంచి వైదొలిగాడు.3: గ్రాండ్‌స్లామ్ టోరీ్నలలో నాదల్ తొలి రౌండ్లో ఓడిపోవడం ఓవరాల్‌గా ఇది మూడోసారి మాత్రమే. ఇంతకుముందు నాదల్ 2016 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో, 2013 వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్లో ఓటమి పాలయ్యాడు. -
Mamata Banerjee: అబద్ధాల వ్యాప్తికి దేవుడు దూతను పంపుతాడా?
కోల్‌కతా: దేవుడు తనను పంపాడని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ధ్వజమెత్తారు. మథురాపూర్‌లో శుక్రవారం ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘ఓటమి తప్పదనే భయంతో.. ఆ ఫోబియాలో బీజేపీ నాయకులు అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ‘ఇప్పుడాయన తనను తాను దేవుడి బిడ్డగా, మనలాగా ఆయనకు తల్లిదండ్రులు లేరని, భగవంతుడు ఆయన్ను పంపాడని చెప్పుకుంటున్నారు. అల్లర్లను ప్రేరేపించడానికి, ప్రకటనల ద్వా రా అబద్ధాలు వ్యాప్తి చేయడానికి, జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) ద్వారా జనాన్ని జైళ్లో వేయడానికి దేవుడు ఎవరినైనా పంపుతాడా అని నేనడుగుతున్నాను. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ద్వారా హింసను ప్రోత్సహించడానికి, ఉపాధి హామీ పథకానికి నిధులు ఆపడానికి, పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి దేవుడు తన దూతను పంపుతాడా?’ అని మమత వ్యంగ్యంగా అన్నారు. పేదల ఖాతాల్లో రూ. 15 లక్షల చొప్పున జమచేస్తాననే హామీపై భగవంతుడు వెనక్కు తగ్గుతాడా అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఒక జాతీయ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. మా అమ్మ బతికున్నంతవరకు నేను సాధారణంగా అందరిలాగే జని్మంచానని అనుకునేవాడిని. ఆమె మరణించాక నా అనుభవాలను పరికించి చూసుకుంటే.. నన్ను దేవుడు పంపాడని నేను నిశి్చతాభిప్రాయానికి వచ్చాను’ అని పే ర్కొన్నారు. ప్రధాని పేరెత్తకుండానే మమత ఆయన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. -
మూడో దశకే అఖిలేష్ ఓటమి మ్యానిఫెస్టో!
లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ ముగిసింది. ఇంకా నాలుగు దశల పోలింగ్ మిగిలి ఉంది. అయితే ఇంతలోనే సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఓటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే ఇది వారి పార్టీకి సంబంధించినది కాదు.. బీజేపీ ఓటమికి సంబంధించినది.అఖిలేష్ ఈ మేనిఫెస్టోను కాలక్రమం ఆధారంగా వివరిస్తూ ట్వీట్ చేశారు. మీ సొంత రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే అక్కడి మీ సహచరులపై ఎందుకు ఆరోపణలు వచ్చాయని అఖిలేష్ బీజేపీ నేతలను ప్రశ్నించారు. బడా పారిశ్రామికవేత్తలు జీఎస్టీ, ఆదాయపు పన్ను, ఇతర రకాల పన్నులను ఎగవేసి ఉంటారు. అందుకే నల్లధనం పుట్టుకొచ్చింది. ప్రభుత్వం దీనిని అనుమతించిందో లేక ఆపలేకపోయిందో గానీ ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పక తప్పదు.గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాలైన నోట్ల రద్దు, జీఎస్టీ తప్పని రుజువైంది. దేశంలో అవినీతి వల్ల తలెత్తుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలకు బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణం. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే బీజేపీ దేశ ప్రతిష్టను దెబ్బతీసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీ నుంచి మన దేశం వైదొలగడానికి కారణం బీజేపీ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం నల్లధనం ఆధారంగా భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా పేర్కొంటున్నదా? అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది.బీజేపీ ప్రభుత్వం ‘ఎలక్టోరల్ బాండ్’ల విషయంలో ఎందుకు మౌనంగా ఉండిపోయింది? బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో పేదల ఖాతాల నుంచి డబ్బులు కొట్టేస్తున్న బీజేపీ ప్రభుత్వం.. దేశ ఆదాయానికి ఏర్పడిన వేల కోట్ల రూపాయల నష్టాన్ని ఎన్నికల విరాళాలతో భర్తీ చేస్తుందా? కరోనా వ్యాక్సిన్ కోసం విరాళాలు తీసుకుంటున్న బీజేపీ ప్రభుత్వం.. రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం ప్రకటించిన ఎన్నికల విరాళాలను నల్లధనంగా ప్రకటిస్తుందా? అని అఖిలేష్ ప్రశ్నించారు.పార్టీలో ఎవరిపైన అయినా ఆరోపణలు వస్తే, వారికి గతంలో ఇచ్చిన కాంట్రాక్టులు, లీజులన్నింటినీ బీజేపీ రద్దు చేస్తుందా? ప్రజల సొమ్ముతో రూపొందించిన ‘పీఎం కేర్ ఫండ్’ ఖాతాలను ప్రజల ముందు బహిరంగపరుస్తుందా? బీజేపీ తదుపరి దశ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేక మూడో దశనే చివరి దశగా భావించి ఓటమిని అంగీకరిస్తుందా? అని అఖిలేష్ తన ట్వీట్లో బీజేపీని ప్రశ్నించారు. -
మహామహులకూ తప్పని... ఓటమి
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ప్రజలు ఎప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తారో, ఏ అనామకున్ని అందలమెక్కిస్తారో, ఏ దిగ్గజాన్ని తిరస్కరిస్తారో అనూహ్యం. తిరుగులేదనుకున్న మహామహ నేతలు ఓటమిపాలైన ఉదంతాలు మన దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నో! అలాంటి పది మంది దిగ్గజ నేతల అనూహ్య ఓటమి చరిత్రను ఓసారి చూద్దాం... – సాక్షి, నేషనల్ డెస్క్బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాతగా యావద్దేశానికీ ప్రాతఃస్మరణీయుడు. అంతటి మహా నాయకుడు కూడా ఎన్నికల్లో ఓడతారని ఊహించగలమా?! కానీ 1951–52లో జరిగిన దేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో అంబేడ్కర్ ఓటమి చవిచూడాల్సి వచి్చంది! నార్త్ బాంబే లోక్‌సభ నుంచి పోటీచేసి ఓడిపోవడమే కాదు, ఏకంగా నాలుగో స్థానంలో నిలిచారాయన! ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విఠల్ బాలకృష్ణ గాంధీ గెలుపొందారు. ఇందిరాగాంధీ దేశ రాజకీయాల్లో అజేయ శక్తిగా వెలిగిపోయిన నాయకురాలు. తొలి, ఏకైక మహిళా ప్రధాని. దశాబ్దానికి పైగా తిరుగులేని అధికారం చలాయించిన ఇందిర 1977 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోయారు. ఎమర్జెన్సీ నిర్ణయం ఆమె ఏకైక ఎన్నికల ఓటమికి బాటలు వేసింది. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానంలో సోషలిస్టు పార్టీ ప్రముఖుడు, రాం మనోహర్ లోహియా సన్నిహితుడు రాజ్ నారాయణ్ చేతిలో ఇందిర ఓటమి చవిచూశారు. ఆయన 1971 లోక్‌సభ ఎన్నికల్లో కూడా సంయుక్త సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఇందిరపై పోటీ చేసి ఓడిపోయారు.కానీ ఇందిర అవినీతికి పాల్పడ్డారని, ఆమె ఎన్నిక చెల్లదని కోర్టుకెక్కారు. ఇది అంతిమంగా ఎమర్జెన్సీ విధింపుకు దారి తీయడం విశేషం! రాజ్‌నారాయణ్ వాదనతో అలహాబాద్ హైకోర్టు ఏకీభవించింది. రాయ్‌బరేలీ నుంచి ఇందిర ఎన్నిక చెల్లదని ప్రకటించింది. అంతేగాక ఆరేళ్ల పాటు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించింది. దాంతో చిర్రెత్తుకొచి్చన ఇందిర 1975లో దేశమంతటా ఎమర్జెన్సీ విధించారు. 1977లో ఎమర్జెన్సీ ఎత్తేసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లి రాజ్‌నారాయణ్ చేతిలో 50 వేల పైగా ఓట్ల తేడాతో ఓడారు. ఇది భారత ఎన్నికల చరిత్రలోనే సంచలనాత్మక ఫలితంగా నిలిచిపోయింది.మినూ మసాని మినోచర్ రుస్తోమ్ మసాని. స్వాతంత్య్ర సమరయోధుడు. స్వతంత్ర పార్టీ అగ్ర నేత. మూడుసార్లు పార్లమెంటు సభ్యుడు, ఇండియన్ లిబరల్ గ్రూప్ థింక్ ట్యాంక్ వ్యవస్థాపకుల్లో ఒకరు. సంపాదకుడు, సామాజిక కార్యకర్త. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. అసమానతలకు వ్యతిరేకంగా బలమైన గొంతుక వినిపించిన మసాని 1971 లోక్‌సభ ఎన్నికల్లో రాజ్‌కోట్ నుంచి ఓటమి చవిచూడాల్సి వచి్చంది. కాంగ్రెస్ నాయకుడు ఘన్‌శ్యామ్ బాయ్ ఓజా చేతిలో 60,000 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు.అటల్ బిహారీ వాజ్‌పేయ్ రాజకీయ దురంధరుడు. భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు. అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న ఆయనకూ ఎన్నికల ఓటమి తప్పలేదు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కీలక కాంగ్రేసేతర నేతల్లో వాజ్‌పేయి ఒకరు. గ్వాలియర్‌లో కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా రెండు లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఆయనపై విజయం సాధించారు.సీకే జాఫర్ షరీఫ్ భారత రైల్వేల్లో స్వర్ణ యుగానికి నాంది పలికిన దార్శనికుడు. కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరు. 2004లో తొలిసారి లోక్‌సభ ఎన్నికల ఎన్నికల బరిలో దిగిన హెచ్‌టీ సాంగ్లియానా చేతిలో ఓటమి చవిచూశారు. అప్పటిదాకా డీజీపీగా ఉన్న సాంగ్లియానా బీజేపీ ఆహా్వనం మేరకు పదవీ విరమణ చేసి పారీ్టలో చేరారు. పాత బెంగళూరు ఉత్తర లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగి షరీఫ్‌పై విజయం సాధించారు.దేవెగౌడఅత్యంత అనుభవజు్ఞడైన నాయకుడు. ప్రధానిగా దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. అనంతరం కర్నాటక రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యారు. ఆయనకు కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. 2004లో కర్నాటకలోని కనకపుర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత తేజస్వినీ గౌడ రమేశ్ చేతిలో లక్ష పై చిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.బిజోయ్ కృష్ణ హండిక్ గొప్ప విద్యావేత్త. కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన తిరుగులేని అస్సామీ నేత. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కేపీ తాసా ఆయనపై లక్ష ఓట్ల పై చిలుకు మెజారిటీతో గెలుపొందారు.సోమనాథ్ ఛటర్జీ సీపీఎం దిగ్గజం. పదిసార్లు లోక్‌సభ సభ్యునిగా గెలిచిన ఎదురులేని నేత. 1971లో తొలిసారి సీపీఎం తరఫున పశి్చమబెంగాల్‌లోని బుర్ద్వాన్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1984లో మాత్రం జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానంలో యువ సంచలనం మమతా బెనర్జీ చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత మాత్రం 1989 నుండి 2004 వరకు సోమనాథ్ విజయ పరంపర సాగింది. సీపీఎం కంచుకోటగా భావించే బోల్పూర్ లోక్‌సభ స్థానం నుంచి 2004లో పదోసారి గెలిచి 14వ లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అరుణ్ జైట్లీపారీ్టలకతీతంగా అందరూ మెచ్చిన నేత. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. కేంద్ర ఆర్థిక మంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలిసారి మోదీ హవా కొనసాగిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో అరుణ్ జైట్లీ మాత్రం ఓటమి చవిచూశారు. అమృత్సర్ లోక్‌సభ స్థానం నుంచి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెపె్టన్ అమరిందర్ సింగ్ లక్ష ఓట్ల పై చిలుకు మెజారిటీతో జైట్లీపై గెలుపొందారు. పీవీ నరసింహారావుపాములపర్తి వేంకట నరసింహారావు. ప్రధాని పదవిని అధిష్టించిన తొలి దక్షిణాది వ్యక్తి. ఒకే ఒక్క తెలుగువాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. కుదేలైన దేశ ఆరి్ధక వ్యవస్థను విప్లవాత్మక సంస్కరణలతో పట్టాలెక్కించి ఆధునిక బాట పట్టించిన దార్శనికుడు. అంతటి నాయకునికి కూడా ప్రధాని కాకమునుపు ఓటమి తప్పలేదు. 1984 ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా గెలిచిన రెండు లోక్‌సభ స్థానాల్లో తెలంగాణలోని హన్మకొండ ఒకటి. బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి అక్కడ పీవీపై విజయం సాధించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పై సానుభూతి వెల్లువెత్తినా ఆ పార్టీ తరఫున పోటీ చేసిన పీవీ మాత్రం ఓటమి చవిచూడటం విశేషం. -
క్వార్టర్ ఫైనల్స్‌లో ముగిసిన భారత్ పోరు
చెంగ్డూ: థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 1–3తో 10 సార్లు చాంపియన్ చైనా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ప్రణయ్ 21–15, 11–21, 14–21తో షి యుకి చేతిలో... రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 15–21, 21–11, 12–21తో లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో ఓడిపోయారు. మూడో మ్యాచ్‌లో లక్ష్య సేన్ 13–21, 21–8, 21–14తో లి షి ఫెంగ్‌పై గెలుపొందాడు. నాలుగో మ్యాచ్‌లో సాయిప్రతీక్–ధ్రువ్ కపిల 10–21, 10–21తో హి జి టింగ్–రెన్ జియాంగ్ యు చేతిలో ఓటమి పాలవ్వడంతో భారత పరాజయం ఖరారైంది. ఉబెర్ కప్ మహిళల టీమ్ క్వార్టర్ ఫైనల్లో ద్వితీయ శ్రేణి క్రీడాకారిణులతో బరిలోకి దిగిన భారత జట్టు 0–3తో జపాన్ చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో అషి్మత 10–21, 22–20, 15–21తో అయా ఒహోరి చేతిలో... ప్రియ–శ్రుతి మిశ్రా 8–21, 9–21తో నామి మత్సుయామ–చిహారు షిదా చేతిలో... ఇషారాణి 15–21, 12–21తో ఒకుహారా చేతిలో ఓడిపోయారు. -
Janata Party: కేంద్రంలో తొలిసారి కాంగ్రెసేతర సర్కారు
ప్రజల హక్కులను కాలరాస్తే, ప్రజాస్వామ్యా నికి పాతరేస్తే ఏమవుతుందో ఆరో లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాం«దీకి అనుభవంలోకి వచి్చంది. ఇందిరకు, కేంద్రంలో కాంగ్రెస్‌కు తొలి ఓటమి రుచి చూపడమే గాక తొలి కాంగ్రెసేతర సర్కారుకు బాటలు పరిచిన ఎన్నికలుగా అవి చరిత్రలో నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ ముసుగులో ప్రతిపక్షాల నేతలందరినీ జైల్లోకి నెట్టిన ఇందిర వారి చేతుల్లోనే మట్టికరిచారు. జనతా పతాకం కింద ప్రధాన విపక్షాలన్నీ ఒక్కటై ‘ఇందిర హటావో, దేశ్ బచావో’ నినాదంతో కాంగ్రెస్‌ను ఓడించాయి... 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 దాకా 21 నెలల కొనసాగిన ఎమర్జెన్సీ దేశ ప్రజలకు పీడకలగా మారింది. పౌర హక్కులను హరించడం మొదలుకుని తీవ్ర నిర్బంధం అమలైంది. పత్రికా స్వేచ్ఛను కాలరాశారు. మగవాళ్లకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వంటి చేష్టలతో ఇందిర సర్కారు బాగా చెడ్డపేరు తెచ్చుకుంది. మొరార్జీ దేశాయ్ మొదలుకుని జయప్రకాశ్ నారాయణ్ దాకా విపక్ష నేతలంతా జైలుపాలయ్యారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విపక్షాల కార్యకర్తలు ఊచలు లెక్కించారు. ఎమర్జెన్సీ అనంతరం ఏడాది ఆలస్యంగా 1977లో ఇందిర ఎన్నికలకు వెళ్లారు. ఆమెను ఢీ కొట్టేందుకు కమ్యూనిస్టేతర ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. భారతీయ జనసంఘ్, భారతీయ లోక్‌దళ్, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ ఫర్ డెమక్రసీతో పాటు కాంగ్రెస్ (వో) కూడా జేపీ స్థాపించిన జనతా పారీ్టలో కలసిపోయాయి. మొరార్జీ దేశాయ్‌ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. జేపీ ‘ఇందిరా హటావో, దేశ్ బచావో’ నినాదం దుమ్మురేపింది. ఎమర్జెన్సీపై జనాగ్రహం ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది. జనతా పార్టీ 41.32 శాతం ఓట్లతో 295 స్థానాలు సాధించింది. మిత్రపక్షాలతో కలిపి జనతా బలం 330కి చేరింది. 492 స్థానాల్లో పోటీ చేసిన ఇందిర కాంగ్రెస్ (ఆర్) కేవలం 154 స్థానాలతో కుదేలైంది. అంతటి ప్రజా వ్యతిరేకతలోనూ దక్షిణాది 92 స్థానాలతో ఇందిరకు అండగా నిలిచింది. వాటిలో 41 ఆంధ్రప్రదేశ్ చలవే. హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది రెండే సీట్లు! రాయ్‌బరేలీలో ఇందిర ఓటమి చవిచూశారు! ఎమర్జెన్సీ వేళ రాజ్యాంగేతర శక్తిగా మారిన చిన్న కొడుకు సంజయ్‌గాంధీ కూడా అమేథీలో పరాజయం పాలయ్యారు. తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మొరార్జీ దేశాయ్ 1977 మార్చి 24న ప్రమాణం చేశారు. అయితే మూడేళ్లకే సర్కారులో లుకలుకలు మొదలయ్యాయి. నేతలు జనతా పార్టీని వీడడంతో లోక్‌సభలో బలం తగ్గింది. దాంతో మొరార్జీ గద్దె దిగాల్సి వచి్చంది. రాజ్ నారాయణ్... జనతాలో ముసలం ఈ సందర్భంగా రాజ్ నారాయణ్ గురించి తప్పక చెప్పుకోవాలి. 1977 ఎన్నికల్లో రాయ్‌బరేలిలో ఇందిరను ఓడించిన ఈయన తదనంతరం జనతాపారీ్టలో ముసలానికీ కారకుడయ్యారు. జనతాను వీడి జేడీ(ఎస్)ను స్థాపించారు. మొరార్జీ రాజీనామాతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాలంటూ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిని అభ్యరి్థంచారు. కానీ ఇందిరా కాంగ్రెస్ సహకారంతో జనతా పార్టీ నేత చౌధరీ చరణ్‌సింగ్ 1979 జూలై 28న ప్రధాని అయ్యారు. అయితే ఇందిర బ్లాక్మెయిల్ రాజకీయాలకు విసిగి నెలలోపే రాజీనామా చేశారు! విశేషాలు... పెరిగిన ఓటింగ్ ► 1977 లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 60.49 శాతానికి పెరిగింది. ► 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ స్థానాలను 542కు పెంచారు. ► 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. ► ఐదు జాతీయ పార్టీలు, 15 రాష్ట్ర పారీ్టలు, 14 రిజిస్టర్డ్ పారీ్టలు లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొన్నాయి. ► ఎమర్జెన్సీ విధింపు పట్ల ఇందిర ఏనాడు పశ్చాత్తాపడలేదు. మరో దారి లేకపోయిందంటూ సమర్థించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం 1976లోనే ఎన్నికలు జరిపి ఉంటే తానే గెలిచేదాన్నని కూడా ఇందిర అభిప్రాయపడటం విశేషం! ఆరో లోక్‌సభలో పారీ్టల బలాబలాలు (మొత్తం స్థానాలు 542) పారీ్ట స్థానాలు జనతా పారీ్ట 295 కాంగ్రెస్ 154 సీపీఎం 22 అన్నాడీఎంకే 18 ఇతరులు 43 స్వతంత్రులు 10 – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత హాకీ జట్టుకు ‘హ్యాట్రిక్’ ఓటమి
ఆ్రస్టేలియా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. పెర్త్‌లో బుధవారం జరిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా 1–2 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున జుగ్రాజ్ సింగ్ (41వ ని.లో) ఏకైక గోల్ చేయగా... ఆస్ట్రేలియా జట్టుకు జెరెమి హేవార్డ్ (44వ, 49వ ని.లో) రెండు గోల్స్ అందించి గెలిపించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 3–0తో ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ రేపు జరుగుతుంది. -
Candidates Chess Tournament: హంపి పరాజయం
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి తొలి పరాజయం ఎదురైంది. నాలుగో రౌండ్లో బల్గేరియా గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ 36వ ర్యాంకర్ న్యుర్గుల్ సలీమోవా 62 ఎత్తుల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హంపిపై సంచలన విజయం సాధించింది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ వైశాలి ఈ టోరీ్నలో రెండో ‘డ్రా’ నమోదు చేసుకుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ అలెగ్జాండ్రా గొర్యాచ్కినా (రష్యా)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను వైశాలి 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఓపెన్ విభాగం నాలుగో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్స్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. విదిత్ సంతోష్ గుజరాతి 44 ఎత్తుల్లో నిపోమ్నియాషి (రష్యా) చేతిలో ఓడిపోయాడు. నకముర (అమెరికా)తో గేమ్‌ను ప్రజ్ఞానంద 24 ఎత్తుల్లో...ఫాబియానో కరువానా (అమెరికా)తో గేమ్‌ను గుకేశ్ 74 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. -
ముంబై ‘మూడు’పోయింది
ముంబై ఇన్నింగ్స్... తొలి 21 బంతుల్లో 20 పరుగులు, 4 వికెట్లు... ఇందులో రోహిత్ శర్మ సహా ముగ్గురు తొలి బంతికే డకౌట్... ముంబై ఇన్నింగ్స్ మొదలవడంతోనే ముగిసినట్లు అనిపించింది... బౌల్ట్ కొట్టిన ఈ దెబ్బ తర్వాత కొంత కోలుకున్నా 125 పరుగుల స్కోరు ఏమాత్రం సరిపోలేదు... రాజస్తాన్ రాయల్స్ అలవోకగా మరో 27 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించేసింది... సొంతగడ్డపై కూడా బోణీ చేయలేకపోయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఇంకా గెలుపు ఖాతా తెరవని ఏకైక జట్టుగా నిలిచింది. అభిమానులు...అదే తీరు! హార్దిక్ పాండ్యాకు ముంబై సొంత మైదానం వాంఖెడేలోనూ ఫ్యాన్స్ నుంచి నిరసన ఎదురైంది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో ఆగ్రహంగా ఉన్న అభిమానులు గత రెండు మ్యాచ్‌ల తరహాలోనే ఈసారి కూడా పాండ్యా పేరు వినిపించినప్పుడల్లా గేలి చేశారు. టాస్కు వచ్చినప్పుడు మాట్లాడకుండా అంతరాయం కలిగించారు. చివరకు వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ‘మర్యాద పాటించండి’ అని చెప్పినా జనం పట్టించుకోలేదు. అనంతరం ముంబై ఫీల్డింగ్ సమయంలో ఒక అభిమాని నేరుగా గ్రౌండ్లో రోహిత్ వద్దకు వెళ్లి కౌగిలించుకోవడం భద్రతా సిబ్బంది వైఫల్యాన్ని చూపించింది. అనూహ్యంగా దూసుకొచి్చన ఫ్యాన్ రోహిత్ కూడా ఒక్కసారిగా భయపడిపోయాడు! ముంబై: ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో పరాజయాల ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓటమి పాలైంది. సోమవారం జరిగిన పోరులో రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ముంబైను ఓడించి విజయాల ‘హ్యాట్రిక్’ సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేసింది. హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 34; 6 ఫోర్లు), తిలక్ వర్మ (29 బంతుల్లో 32; 2 సిక్స్‌లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ (3/22) పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఆరంభంలోనే దెబ్బ తీయగా... చహల్‌కు కూడా 3 వికెట్లు దక్కాయి. అనంతరం రాజస్తాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లకు 127 పరుగులు చేసి గెలిచింది. రియాన్ పరాగ్ (39 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో గెలిపించాడు. టపటపా... రాజస్తాన్ బౌలింగ్ ధాటికి ముంబై బ్యాటింగ్ ఆరంభంలోనే కకావికలమైంది. బౌల్ట్ ధాటికి రోహిత్ శర్మ (0) తొలి బంతికే అవుట్ కాగా, తర్వాతి బంతికే నమన్ ధీర్ (0) వెనుదిరిగాడు. ఐపీఎల్లో అతి ‘తొందరగా’ రెండో ఓవర్లోనే ఇంపాక్ట్ సబ్‌గా వచ్చిన బ్రెవిస్ (0) కూడా తన తొలి బంతికే పెవిలియన్ చేరాడు. మరోవైపు ఇషాన్ కిషన్ (16) వికెట్ బర్గర్ ఖాతాలో పడింది. స్కోరు 20/4కు చేరిన దశలో తిలక్, పాండ్యా కొద్దిసేపు నిలిచి జట్టును ఆదుకున్నారు. బర్గర్ ఓవర్లో 3 ఫోర్లతో పాండ్యా ధాటిని ప్రదర్శించాడు. అయితే ఐదో వికెట్‌కు 36 బంతుల్లో 56 పరుగులు జోడించిన తర్వాత ముంబైని చహల్ దెబ్బ తీశాడు. తక్కువ వ్యవధిలో అతను పాండ్యా, తిలక్లను అవుట్ చేయడంతో ముంబై పరిస్థితి మరింత దిగజారింది. తిలక్ వెనుదిరిగాక జట్టు కోలుకోలేకపోయింది. అతను అవుటైన తర్వాత 40 బంతుల్లో 30 పరుగులే వచ్చాయి. టిమ్ డేవిడ్ (17) కూడా ప్రభావం చూపలేకపోయాడు. రాణించిన పరాగ్... లక్ష్యం చిన్నదే అయినా రాయల్స్ ఇన్నింగ్స్ కాస్త తడబాటుకు లోనైంది. తొలి ఓవర్లోనే యశస్వి (10) వెనుదిరగ్గా... సంజూ సామ్సన్ (12), బట్లర్ (13) కూడా విఫలమయ్యారు. అయితే పరాగ్ జాగ్రత్తగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. అశి్వన్ (16)తో కలిసి అతను ఐదో వికెట్‌కు 40 పరుగులు జత చేశాడు. విజయానికి 15 పరుగులు కావాల్సిన దశలో పరాగ్ వరుసగా 6, 6, 4 బాది ముగించాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) సామ్సన్ (బి) బర్గర్ 16; రోహిత్ (సి) సామ్సన్ (బి) బౌల్ట్ 0; నమన్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 0; బ్రెవిస్ (సి) బర్గర్ (బి) బౌల్ట్ 0; తిలక్ (సి) అశ్విన్ (బి) చహల్ 32; పాండ్యా (సి) (సబ్) పావెల్ (బి) చహల్ 34; చావ్లా (సి) హెట్‌మైర్ (బి) అవేశ్ 3; డేవిడ్ (సి) బౌల్ట్ (బి) బర్గర్ 17; కొయెట్జీ (సి) హెట్‌మైర్ (బి) చహల్ 4; బుమ్రా (నాటౌట్) 8; ఆకాశ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–14, 4–20, 5–76, 6–83, 7–95, 8–111, 9–114. బౌలింగ్: బౌల్ట్ 4–0–22–3, బర్గర్ 4–0–32–2, అవేశ్ ఖాన్ 4–0–30–1, చహల్ 4–0–11–3, అశ్విన్ 4–0–27–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) డేవిడ్ (బి) మఫాకా 10; బట్లర్ (సి) చావ్లా (బి) ఆకాశ్ 13; సామ్సన్ (బి) ఆకాశ్ 12; పరాగ్ (నాటౌట్) 54; అశ్విన్ (సి) తిలక్ (బి) ఆకాశ్ 16; శుభమ్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (15.3 ఓవర్లలో 4 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1–10, 2–42, 3–48, 4–88. బౌలింగ్: మఫాకా 2–0–23–1, బుమ్రా 4–0–26–0, ఆకాశ్ మధ్వాల్ 4–0–20–3, కొయెట్జీ 2.3–0–36–0, పీయూష్ చావ్లా 3–0–18–0. -
పరాజయంతో పునరాగమనం
ప్రపంచ మాజీ నంబర్‌వన్ సిమోనా హలెప్ పరాజయంతో ప్రొఫెషనల్ సర్క్యూట్లో పునరాగమనం చేసింది. మయామి ఓపెన్ టోర్నీలో హలెప్ (రొమేనియా) తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. పౌలా బదోసా (స్పెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో హలెప్ 6–1, 4–6, 3–6తో ఓడిపోయింది. హలెప్ 2022లో డోపింగ్‌లో విఫలమవడంతో నాలుగేళ్ల నిషేధం విధించారు. అయితే ఈ నిషేధంపై ఆమె కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో అప్పీల్ చేసింది. విచారణ తర్వాత హలెప్ నిషేధాన్ని 9 నెలలకు కుదించారు. -
Paris Olympics: బజరంగ్, రవి దహియాలకు షాక్
సోనెపట్ (హరియాణా): టోక్యో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన రవి దహియా... కాంస్య పతకం నెగ్గిన బజరంగ్ పూనియాలకు షాక్! పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోరీ్నల్లో బరిలోకి దిగే భారత జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో బజరంగ్ (65 కేజీలు), రవి (57 కేజీలు) అనూహ్యంగా ఓడిపోయారు. ఆదివారం నిర్వహించిన ట్రయల్స్‌లో సెమీఫైనల్లో బజరంగ్ 1–9తో రోహిత్ చేతిలో ఓడాడు. ఫైనల్లో రోహిత్‌పై సుజీత్ కల్కాల్ గెలుపొంది ఆసియా, వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన 57 కేజీల విభాగంలో తొలి బౌట్లో రవి దహియా 13–14తో అమన్ సెహ్రావత్ చేతిలో... రెండో బౌట్లో 8–10తో ఉదిత్ చేతిలో ఓడిపోయాడు. ఇతర ఒలింపిక్ వెయిట్ కేటగిరీల్లో జైదీప్ (74 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు), దీపక్ నెహ్రా (97 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు) విజేతలుగా నిలిచి భారత జట్టుకు ఎంపికయ్యారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ ఏప్రిల్ 19 నుంచి 21 వరకు కిర్గిస్తాన్‌లో... వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీ మే 9 నుంచి 12 వరకు ఇస్తాంబుల్‌లో జరుగుతాయి. -
USA presidential election 2024: రేసు నుంచి నిక్కీ హేలీ ఔట్
వాషింగ్టన్: మంగళవారం ఒకేసారి 15 రాష్ట్రాల్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నేపథ్యంలో పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం రేసు నుంచి తప్పుకుంటున్నట్లు భారతీయ మూలాలున్న నాయకురాలు నిక్కీ హేలీ బుధవారం ప్రకటించారు. వెర్మాంట్‌లో గెలుపు కాస్తంత ఊరటనిచి్చనా మిగతా అన్ని చోట్ల ఎదురైనా ప్రతికూల ఫలితాలను బేరేజు వేసుకుని ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫలితాల తర్వాత సౌత్ కరోలీనాలో ఆమె మాట్లాడారు. ‘‘నా ప్రచారానికి అర్ధంతరంగా ముగింపు పలకాల్సిన సమయం వచ్చేసింది. అమెరికన్ల గొంతుక గట్టిగా వినిపించాలని భావించా. నా శక్తిమేరకు నేను కృషి చేశా. అనుకున్న కార్యాన్ని పూర్తిచేయలేకపోయా. ఇందులో చింతించాల్సింది ఏమీ లేదు. రేసులో నేను ఉండకపోవచ్చుకానీ నేను నమ్మిన సిద్ధాంతాలను ఇకమీదటా బలంగా వినిపిస్తా’’ అని నిక్కీ హేలీ అన్నారు. -
మంగళగిరిలో రెండోసారి లోకేష్ ఓటమి పక్కా.. ఇదీ లెక్క
మంగళగిరి నియోజకవర్గంలో రెండోసారి ఓడిపోయేందుకు నారా లోకేశం రెడీ అవుతున్నారు. వైనాట్ 175లో మొదటి, రెండవ స్థానాల్లో ఉండేవి కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలే అని వైఎస్సార్సీపీ శ్రేణులు ధీమాగా చెబుతున్నాయి. కుప్పంలో చంద్రబాబును, మంగళగిరిలో లోకేష్‌ను ఓడించి తీరుతామని ఛాలెంజ్ చేసి చెబుతున్నారు. మంగళగిరి పార్టీ సమన్వయకర్తగా మురుగుడు లావణ్యను వైఎస్ జగన్ నియమించారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక మంగళగిరి ముఖం చూడని లోకేష్ ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. ఎన్నికలు ప్రకటించకముందే లోకేష్ ఓటమి ఎందుకు కన్ఫర్మ్ అయిపోయింది? గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండోసారి ఓడిపోవడానికి రెడీ అవుతున్నారనే టాక్ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ సమన్వయకర్తగా మురుగుడు లావణ్యను పార్టీ అధినేత వైఎస్ జగన్ నియమించారు. మంగళగిరి రాజకీయాల్లో రెండు ముఖ్యమైన కుటుంబాలకు వారసురాలైన లావణ్య విజయం ఖాయం అయిపోయిందని పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. లావణ్య తల్లి కాండ్రు కమల, మామయ్య మురుగుడు హనుమంతరావులు గతంలో మంగళగిరి ఎమ్మెల్మేలుగా గెలిచినవారే. మురుగుడు హనుమంతరావు దివంగత నేత వైఎస్సార్ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. హనుమంతరావు, కమల ఇద్దరూ కూడా మంగళగిరి మున్సిపల్ చైర్ పర్సన్స్‌గా కూడా పనిచేశారు. దీంతో వీరిద్దరికి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ, మంగళగిరి పట్టణంలోనూ పూర్తి స్థాయిలో పట్టు ఉంది. పైగా నియోజకవర్గం మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి నుంచి పటిష్టంగా నిర్మాణమైంది. రెండుసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. మంగళగిరిని మున్సిపాలిటీ స్థాయి నుంచి తాడేపల్లితో కలిపి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయడంలో ఆళ్ల కీలకపాత్ర పోషించారు. మంగళగిరిలో చేనేత సామాజికవర్గం బలంగా ఉండటంలో ఈసారి బీసీకి ఇక్కడి సీటు ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ నిర్ణయించారు. నియోజకవర్గంలో దాదాపు లక్ష వరకు చేనేత వర్గం ఓట్లు ఉన్నట్లు అంచనా. ఈ విషయం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ముఖ్యమంత్రి తెలియచేశారు. వైఎస్ జగన్ నిర్ణయంతో కొంత మనస్తాపానికి గురైన ఆళ్ల ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా సమర్పించారు. కేవలం వ్యక్తిగత కారణాలవల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొద్ది రోజులకే ఆయన పరిస్థితులు అర్థం చేసుకుని తిరిగి వైఎస్ జగన్ చెంతకు వచ్చేశారు. మంగళగిరి సీటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున బీసీ అభ్యర్థిని గెలిపిస్తానని ప్రకటించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇదిలా ఉంటే గత డిసెంబర్లో మంగళగిరి సమన్వయకర్తగా ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవిని నియమించారు. కాని చిరంజీవి కంటే మురుగుడు లావణ్య అభ్యర్థిత్వం బెటర్ అని తేలడంతో ఆయనకు నచ్చచెప్పి లావణ్యను సమన్వయకర్తగా ప్రకటించారు. నారా లోకేష్‌ను ఓడించి లావణ్యను గెలిపించి తీరుతామని సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల, ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి ప్రకటించారు. నారా లోకేష్ ఇక మంగళగిరి నుంచి సామాన్లు సర్దుకుని వెళ్లిపోవచ్చంటూ సెటైర్లు పేలుతున్నాయి. రెండుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి నియోజకవర్గంను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆళ్ల ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం నియోజకవర్గం అంతా ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయిన తర్వాత టీడీపీ నేత నారా లోకేష్ ఇటీవల వరకు నియోజకవర్గం ముఖం చూడలేదు. కోవిడ్ సమయంలో లోకేష్ భయపడి హైదరాబాద్‌కు పారిపోయారు. రెండేళ్ల పాటు అసలు మంగళగిరి రానేలేదు. అప్పుడు, ఇప్పుడూ కూడా లోకేష్ ఏనాడూ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే అసంతృప్తి టీడీపీ శ్రేణుల్లో గట్టిగా ఉంది. పైగా తాను లేనపుడు మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ బాధ్యతల్ని తన సామాజికవర్గ నేతలకే అప్పగించారు గాని..నియోజకవర్గంలో బలంగా ఉన్న బీసీ వర్గాలను పట్టించుకోలేదు. కాని కమ్మ నేతలు ఎప్పుడూ బీసీ, ఎస్సీ నేతలను లెక్కచేయరని, వారు కూడా కమ్మ నేతలనే దగ్గరకు రానిస్తారనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు. దీంతో మంగళగిరిలోని టీడీపీ కార్యకర్తల్లో లోకేష్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తాను పోటీ చేయదలచుకున్న నియోజకవర్గం గురించి సీరియస్‌గా లేకపోవడం, బీసీ నేతలకు అందుబాటులో లేకపోవడం, ఇటీవలవరకు అసలు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయించుకోలేకపోవడంతో మంగళగరిలోని టీడీపీ కేడర్ క్రమంగా పార్టీకి దూరం అవుతోంది. కొద్ది రోజుల క్రితమే మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తున్నట్లు టీడీపీ, జనసేన తొలి జాబితా ద్వారా వెల్లడైంది. మరోవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం సభల ఉత్సాహంతో ప్రజల్లో దూసుకుపోతున్నారు. నియోజకవర్గం నలుదిక్కులా పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నారు. తాజా పరిణామాలతో ఇక నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోవడానికి మానసికంగా సిద్ధం కావాలని సూచిస్తున్నారు. -
టార్గెట్ హిమాచల్‌ప్రదేశ్?
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ రాజకీయ పరిణామాలు రసకందాయంలో పడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య ఓటమితో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై సందేహాలు మొదలయ్యాయి. ప్రభుత్వంపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రతిపక్ష బీజేపీ సిద్ధమవుతున్నట్లు ప్రచారం మొదలైంది. లోక్‌సభ ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు కాంగ్రెస్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నష్ట నివారణ కోసం ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని సంకేతాలిచి్చంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముగ్గురు సీనియర్ నేతలు భూపేష్ బఘేల్, భూపీందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్‌ను పార్టీ పరిశీలకులుగా హిమాచల్‌ప్రదేశ్‌కు పంపించారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలుండగా, కాంగ్రెస్‌కు 40 మంది, బీజేపీకి 25 మంది, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ పట్ల అసంతృప్తితో ఉన్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ముగ్గురు స్వతంత్ర సభ్యులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక రాజ్యసభ స్థానానికి మంగళవారం జరిగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌కు తగిన బలం ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆ పార్టీ అభ్యర్థి అభిõÙక్ మనూ సింఘ్వీ ఓడిపోయారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రఎమ్మెల్యేలు బీజేపీ అభ్యరి్థకి ఓటువేశారు. ఈ 9 మంది ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ‘జైశ్రీరామ్, బన్ గయా కామ్’ అని నినదిస్తూ బీజేపీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, హిమాచల్‌ప్రదేశ్ ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు సమరి్పంచానని చెప్పారు. ప్రభుత్వంలో తనకు, తన కుటుంబానికి అవమానాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అసలు ఏం జరుగుతోందో అధిష్టానం తెలుసుకోవాలని కోరారు. తన అనుచరులతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకుంటానని వెల్లడించారు. బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు హిమాచల్‌ప్రదేశ్ శాసనసభలో బుధవారం అనూహ్య పరిణామం చేసుకుంది. 15 మంది ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కులదీప్ సింగ్ పఠానియా సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్ కూడా ఉన్నారు. బీజేపీ సభ్యులు సభలో స్పీకర్‌ను అగౌరవపరుస్తున్నారని, ఇతరులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, సభ సజావుగా సాగాలంటే వారిని సస్పెండ్ చేయాలని కోరుతూ మంత్రి హర్షవర్దన్ చౌహాన్ ప్రవేశపెట్టిన తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందింది. బడ్జెట్‌ను ఆమోదింపజేసుకోవడానికే తమను సస్పెండ్ చేశారని జైరామ్ ఠాకూర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారీ్టలో పడిందని, ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సింగ్ సుఖూ రాజీనామా చేయాలని జైరామ్ ఠాకూర్ అన్నారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందింది. ప్రజా తీర్పును కాపాడుకుంటాం హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రజా తీర్పును కాలరాచే ప్రయత్నాలను సహించబోమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలందరితో మాట్లాడి, త్వరలో సమగ్ర నివేదిక సమరి్పంచాలని కాంగ్రెస్ పరిశీలకులను ఖర్గే ఆదేశించారని తెలిపారు. వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, అదే సమయంలో ప్రజలు ఇచి్చన తీర్పును కాపాడుకోవడం ముఖ్యమని తేలి్చచెప్పారు. హిమాచల్‌లో అధికారంలోకి రావడానికి బీజేపీ తప్పుడు మార్గాలు వెతుకుతోందని ఆరోపించారు. -
US presidential election 2024: సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీ ఓటమి
చార్లెస్టన్: సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీలో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఓటమి పాలయ్యారు. ఆమెకు 39.4% ఓట్లు పడగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 59.9% ఓట్లతో నెగ్గారు. అయినా వెనక్కి తగ్గేది లేదని, సూపర్ ట్యూస్ డేలో గట్టిపోటీ ఇస్తానని హేలీ అన్నారు. వరుసగా నాలుగో విజయంతో రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి ట్రంప్ విజయా వకాశాలు మెరుగయ్యాయి. అందుకు 1,215 మంది డెలిగేట్ల మద్దతు కావాలి. ఇప్పటిదాకా హేలీ 17, ట్రంప్ 92 డెలిగేట్ల మద్దతు గెలుచుకున్నారు. ఓవైపు వరుస కోర్టు కేసులు వేధిస్తున్నా అయోవా, న్యూ హ్యాంప్‌షైర్, నెవడా రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్ ఇప్పటికే విజయం సాధించడం తెలిసిందే. -
ప్రిక్వార్టర్స్‌లో భారత జట్ల ఓటమి
బుసాన్: పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు ఖరారు కావడానికి అవసరమైన విజయాన్ని భారత మహిళల, పురుషుల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లు సాధించలేకపోయాయి. పటిష్ట జట్లతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత జట్లు ఓడిపోయి ప్రపంచ టీటీ టీమ్ చాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించాయి. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు 1–3తో చైనీస్ తైపీ జట్టు చేతిలో... భారత పురుషుల జట్టు 0–3తో దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయాయి. అంతకుముందు జరిగిన నాకౌట్ దశ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 3–0తో ఇటలీపై... భారత పురుషుల జట్టు 3–2తో కజకిస్తాన్‌పై విజయం సాధించాయి. ఈ మెగా ఈవెంట్లో పురుషుల, మహిళల విభాగాల్లో క్వార్టర్ ఫైనల్ చేరిన 8 జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాయి. మార్చి 5న విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–16లో చోటు సంపాదిస్తే భారత జట్లకు పారిస్ ఒలింపిక్ బెర్త్‌లు లభిస్తాయి. ప్రస్తుతం భారత మహిళల జట్టు 17వ ర్యాంక్‌లో, భారత పురుషుల జట్టు 15వ ర్యాంక్‌లో ఉన్నాయి. చైనీస్ తైపీతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ మనిక బత్రా 11–8, 8–11, 4–11, 11–9, 11–9తో ప్రపంచ 10వ ర్యాంకర్ చెన్ జు యుపై సంచలన విజయం సాధించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 6–11, 9–11, 5–11తో చెంగ్ ఐ చింగ్ చేతిలో... మూడో మ్యాచ్‌లో ఐహిక ముఖర్జీ 10–12, 13–15, 11–9, 2–11తో లి యు జున్ చేతిలో... నాలుగో మ్యాచ్‌లో మనిక బత్రా 10–12, 11–5, 9–11, 5–11తో చెంగ్ ఐ చింగ్ చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖరారైంది. కొరియాతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 10–12, 11–13, 7–11తో జాంగ్ వూజిన్ చేతిలో... రెండో మ్యాచ్‌లో ఆచంట శరత్ కమల్ 9–11, 5–11, 11–8, 4–11తో లిమ్ జాంగ్‌హూన్ చేతిలో... మూడో మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 5–11, 8–11, 2–11తో లీ సాంగ్ హు చేతిలో ఓటమి పాలయ్యారు. -
India vs England: ఇంట్లోనే తలవంచారు
సొంతగడ్డపై మ్యాచ్... తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ ఆధిక్యం... ప్రత్యర్థి జట్టులో పెద్దగా గుర్తింపు లేని స్పిన్నర్లు... 231 పరుగుల స్వల్ప లక్ష్యం... అయినా సరే... భారత జట్టు అనూహ్య రీతిలో ఓటమిని ఆహ్వానించింది... ఇంగ్లండ్ బౌలర్లకు తలవంచుతూ పేలవ బ్యాటింగ్‌తో కుప్పకూలింది. నాలుగో రోజు పిచ్‌పై స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు తడబడుతూ మన బ్యాటర్లు డిఫెన్స్ ఆడటం గతంలో ఎన్నడూ చూడనిది. కానీ తొలి టెస్టులో అలాంటి దృశ్యమే కనిపించింది. చివరకు హైదరాబాద్‌లో పరాజయం పలకరించింది. రెండో ఇన్నింగ్స్ ఆడుతూ తొలి ఇన్నింగ్స్ లోటును పూడ్చుకునే లోపే ఐదుగురు బ్యాటర్లు పెవిలియన్‌కు... ఎదురుగా ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ బలగం... వీటన్నింటిని దాటి సాగిన ఒలీ పోప్ అత్యద్భుత ఇన్నింగ్స్ ఇంగ్లండ్‌కు ఆశలు రేపింది. ఆపై భారత్‌ను నిలువరించగలమా అనే సందేహాల మధ్య టామ్ హార్లీ నేనున్నానంటూ వచ్చాడు. తొలి బంతికి సిక్సర్ ఇచ్చి కెరీర్ మొదలు పెట్టిన అతను చివరి వికెట్ సహా 7 వికెట్లు తీసి సూపర్ అనిపించాడు. టెస్టులో రెండు రోజుల పాటు వెనుకబడి కూడా ఆఖరికి అసలైన ఆటతో ఇంగ్లండ్ జట్టు విదేశీ గడ్డపై చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్‌కు ఊహించని విధంగా గట్టి దెబ్బ తగిలింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నాలుగో రోజే ముగిసిన తొలి టెస్టులో టీమిండియాకు ఓటమి ఎదురైంది. పలు మలుపులతో సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 231 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 69.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ రోహిత్ శర్మ (58 బంతుల్లో 39; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి టెస్టు ఆడిన ఎడంచేతి వాటం స్పిన్నర్ టామ్ హార్లీ 62 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టడం విశేషం. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 316/6తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఒలీ పోప్ (278 బంతుల్లో 196; 21 ఫోర్లు) త్రుటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. తాజా ఫలితంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో జరుగుతుంది. చేజారిన డబుల్ సెంచరీ... నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసేందుకు భారత్‌కు ఎక్కువ సమయమే పట్టింది. రేహన్ అహ్మద్ (53 బంతుల్లో 28; 3 ఫోర్లు)ను బుమ్రా వెనక్కి పంపినా... పోప్ జోరు తగ్గలేదు. అతనికి టామ్ హార్లీ (52 బంతుల్లో 34; 4 ఫోర్లు) అండగా నిలవడంతో కీలక భాగస్వామ్యం నమోదైంది. ఈ దశలోనే వీరిద్దరిని నిలువరించడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. పోప్, హార్లీ ఎనిమిదో వికెట్‌కు 80 పరుగులు జోడించడం విశేషం. ఎట్టకేలకు ఒకే స్కోరు వద్ద హార్లీ, వుడ్ (0)లను భారత్ అవుట్ చేయగా... బుమ్రా బౌలింగ్‌లో ర్యాంప్షాట్కు ప్రయత్నించి పోప్ డబుల్ సెంచరీని చేజార్చుకోవడంతో ఇన్నింగ్స్ ముగిసింది. ఆదివారం ఇంగ్లండ్ 25.1 ఓవర్లు ఆడి 104 పరుగులు చేసింది. పేలవ బ్యాటింగ్‌తో... ఛేదనను కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ (15) మెరుగ్గానే ఆరంభించారు. అయితే ఒకే ఓవర్లో యశస్వి, శుబ్‌మన్ గిల్ (0)లను అవుట్ చేసి భారత్‌ను దెబ్బ కొట్టిన హార్లీ... కొద్దిసేపటికే రోహిత్‌ను కూడా వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో భారత్ కష్టాల్లో పడింది. టీ విరామం తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు మరింతగా పట్టు బిగించి టీమిండియా బ్యాటర్లను పూర్తిగా కట్టిపడేశారు. ఫలితంగా 12 పరుగుల వ్యవధిలో అక్షర్ పటేల్ (17), కేఎల్ రాహుల్ (22) వెనుదిరగ్గా, ఒకే స్కోరు వద్ద రవీంద్ర జడేజా (2), శ్రేయస్ అయ్యర్ (13) అవుటయ్యారు. అనవసరపు సింగిల్‌కు ప్రయతి్నంచిన జడేజాను అద్భుతమైన త్రోతో స్టోక్స్ రనౌట్ చేయగా... శ్రేయస్ మళ్లీ చెత్త షాట్‌తో నిష్క్రమించాడు. ఈ దశలోనే భారత్ ఓటమి ఖాయమైనట్లుగా అనిపించింది. అయితే కోన శ్రీకర్ భరత్ (59 బంతుల్లో 28; 3 ఫోర్లు), రవిచంద్రన్ అశి్వన్ (84 బంతుల్లో 28; 2 ఫోర్లు) పట్టుదలగా పోరాడి విజయంపై ఆశలు రేపారు. చివర్లో ఉత్కంఠ... భరత్, అశి్వన్ జత కలిసే సమయానికి భారత్ స్కోరు 119/7... విజయానికి మరో 112 పరుగులు కావాలి. ఈ సమయంలో వీరిద్దరు గట్టిగా నిలబడ్డారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా ఆ తర్వాత ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొంటూ స్వేచ్ఛగా పరుగులు చేశారు. ఒత్తిడి పెరగడంతో ఇంగ్లండ్ బౌలర్లు, ఫీల్డర్లలో తడబాటు కనిపించింది. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 57 పరుగులు జత చేశారు. మరో 55 పరుగులు అవసరం. ఈ స్థితిలో హార్లీ చక్కటి బంతితో భరత్‌ను బౌల్డ్ చేసి భాగస్వామ్యాన్ని విడదీయగా... తప్పనిసరి పరిస్థితుల్లో భారీ షాట్‌కు ప్రయతి్నంచి అశ్విన్ వెనుదిరిగాడు. ఈ వికెట్ పడిన తర్వాత ఫలితం కోసం నిబంధనల ప్రకారం అంపైర్లు అరగంట ఆటను పొడిగించారు. చివరి వికెట్‌కు కొన్ని షాట్లతో సిరాజ్ (12), బుమ్రా (6 నాటౌట్) కూడా 25 పరుగులు జోడించడంతో మరో 29 పరుగులే మిగిలాయి. ఆదివారం మరో ఓవర్ మిగిలి ఉండగా... దీనిని ఆడుకుంటే ఆట చివరి రోజుకు వెళ్లేది. కానీ రెండో బంతికి సిరాజ్ స్టంపౌట్ కావడంతో భారత్ కథ ముగిసింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 246 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: 436 ఆలౌట్; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 420 ఆలౌట్; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) హార్లీ 39; యశస్వి (సి) పోప్ (బి) హార్లీ 15; గిల్ (సి) పోప్ (బి) హార్లీ 0; రాహుల్ (ఎల్బీ) (బి) రూట్ 22; అక్షర్ (సి అండ్ బి) హార్లీ 17; శ్రేయస్ (సి) రూట్ (బి) లీచ్ 13; జడేజా (రనౌట్) 2; భరత్ (బి) హార్లీ 28; అశి్వన్ (స్టంప్డ్) ఫోక్స్ (బి) హార్లీ 28; బుమ్రా (నాటౌట్) 6; సిరాజ్ (స్టంప్డ్) ఫోక్స్ (బి) హార్లీ 12; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (69.2 ఓవర్లలో ఆలౌట్) 202. వికెట్ల పతనం: 1–42, 2–42, 3–63, 4–95, 5–107, 6–119, 7–119, 8–176, 9–177, 10–202. బౌలింగ్: రూట్ 19–3– 41–1, వుడ్ 8–1–15–0 హార్లీ 26.2–5–62–7 లీచ్ 10–1–33–1, రేహన్ 6–0–33–0. -
క్వార్టర్ ఫైనల్లో శ్రీజ పరాజయం
వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన జాతీయ మాజీ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. గోవాలో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీజ 5–11, 11–7, 6–11, 4–11తో చెంగ్ ఐ చింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. శ్రీజకు 2,500 డాలర్ల (రూ. 2 లక్షలు) ప్రైజ్‌మనీ, 105 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
తెలుగు టైటాన్స్ జట్టుకు 14వ పరాజయం
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టుకు 14వ పరాజయం ఎదురైంది. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పవన్ సెహ్రావత్ కెపె్టన్సీలోని తెలుగు టైటాన్స్ 29–54తో తమిళ్ తలైవాస్ చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 35–32తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. బుధవారంతో హైదరాబాద్ అంచె పోటీలు ముగిశాయి. గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం పటా్నలో జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో పట్నా పైరేట్స్; గుజరాత్ జెయింట్స్‌తో యు ముంబా తలపడతాయి. -
తొలి రౌండ్లోనే శ్రీకాంత్ ఓటమి
ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే ఇంటి దారి పట్టగా... లక్ష్య సేన్, ప్రియాన్షుæ, కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. జకార్తాలో బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 21–19, 14–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో... ప్రణయ్ 18–21, 21–19, 10–21తో లో కీన్ యె (సింగపూర్) చేతిలో ఓడిపోయారు. -
IND-W Vs AUS-W 2nd T20I: బ్యాటర్ల వైఫల్యంతో...
నవీ ముంబై: వరుసగా రెండో విజయంతో టి20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఆశించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు నిరాశ ఎదురైంది. బ్యాటర్ల వైఫల్యంతో సాధారణ స్కోరుకే పరిమితమైన హర్మన్‌ప్రీత్ బృందానికి ఓటమి తప్పలేదు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆ్రస్టేలియా ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల టి20ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. సిరీస్ విజేతను తేల్చే నిర్ణాయక మూడో మ్యాచ్ మంగళవారం ఇదే వేదికపై జరుగుతుంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హర్మన్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. టాపార్డర్‌లో షఫాలీ వర్మ (1), స్మృతి మంధాన (23; 2 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (13) సహా కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (6) విఫలమయ్యారు. దీంతో 54 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. ఈ దశలో రిచా ఘోష్ (19 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్); దీప్తి శర్మ (27 బంతుల్లో 30; 5 ఫోర్లు) కాసేపు కుదురుగా ఆడారు. కానీ రిచా అవుటయ్యాక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పూజ వస్త్రకర్ (9), అమన్‌జోత్ కౌర్ (4)లు కూడా విఫలమవడంతో డెత్ ఓవర్లలో పరుగుల వేగం పుంజుకోలేదు. ప్రత్యర్థి బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కిమ్ గార్త్ (2/27), అనాబెల్ సదర్లాండ్ (2/18), జార్జియా వేర్హమ్ (2/17) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు అలీసా హీలీ (21 బంతుల్లో 26; 4 ఫోర్లు), బెత్ మూనీ (29 బంతుల్లో 20; 2 ఫోర్లు) తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించి విజయానికి అవసరమైన పునాది వేశారు. తర్వాత తాలియా మెక్‌గ్రాత్ (19; 3 ఫోర్లు), ఎలైస్ పెరీ (21 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుగైన స్కోరు చేయడంతో ఆ్రస్టేలియా ఒక ఓవర్ మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీయగా, శ్రేయాంక పాటిల్, పూజ చెరో వికెట్ పడగొట్టారు. -
మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా జితూ పట్వారీ
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో పీసీసీ చీఫ్ కమల్ నాథ్‌కు అధిష్టానం ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో జితూ పటా్వరీకి బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ చీఫ్ ఖర్గే శనివారం ఆదేశాలిచ్చారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 163 సీట్లలో విజయం సాధించగా, కాంగ్రెస్‌కు 66 సీట్లే దక్కిన సంగతి తెలిసిందే. -
చంద్రబాబు సెల్ఫ్ గోల్
‘కేసీఆర్ విర్రవీగారు.. అందుకే ఓడిపోయారు’.. చంద్రబాబు చేసిన అసందర్భోచిత వ్యాఖ్యలు అంగన్ వాడీలను గుర్రాలతో తొక్కించింది.. విద్యుత్ ఉద్యమకారులపై కాల్పులు జరిపింది.. .. మరిచావా చంద్రబాబు? దాన్ని కదా విర్రవీగడం అంటారు! విజనరీని అని తరచూ చెప్పుకునే చంద్రబాబులో అసహనం.. అహంకారం.. నోటి దురుసు చాలానే ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో తన వాచాలత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఇదే క్రమంలో తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కేసీఆర్ అహంకారం, విర్రవీగడమే కారణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటన పేరిట ఆయన బహిరంగసభల్లో ఇలా మాట్లాడారు.. విర్రవీగితే తెలంగాణ మాదిరిగా జరుగుతుంది అంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరి చంద్రబాబు రెండుసార్లు ఓడియారు కదా!. అంటే దానర్థం.. అలా విర్రవీగినందుకే ఓడిపోయారనా?.. ఇది ఏమాత్రం ఆయనకు స్ఫురణ లేకపోవడం గమనార్హం. చంద్రబాబు.. ప్రజలమీద, ఇతరనాయకుల మీద ఇలా ఇష్టానుసారం నోరుపారేసుకోవడం ఇది తొలిసారి కాదు.. ఇప్పటికే ఎన్నోసార్లు జరిగింది. ‘‘మాకు వేతనాలు పెంచాలి..’’ అని అడిగేందుకు వచ్చిన విశ్వబ్రాహ్మణులను.. ‘నన్ను డిమాండ్ చేస్తే తోకలు కట్ చేస్తా’ అని గద్దించిన సందర్భం ఒక ఉదాహరణ మాత్రమే. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు విర్రవీగినంతగా దేశంలో మరే నాయకుడూ చెలరేగిపోలేదు. ఇప్పుడేమో బీఆర్ఎస్ విర్రవీగినందుకే ఓడిందంటూ.. అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం బాబుకే చెల్లింది. చంద్రబాబుకు అధికారం ఉన్నపుడు లోకం, కళ్లు కానవచ్చేవి కావని రాజకీయ ప్రత్యర్థులు తిట్టిపోస్తుంటారు. అలాంటి వ్యక్తి.. ఇప్పుడేమో పొరుగురాష్ట్రాల నాయకులను ఇలా చిన్నచూపు చూసి వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. విద్యుత్ ఆందోళనకారులను తుపాకులతో కాల్పులు జరిపి నేల కూల్చడం.. జీతాల కోసం ధర్నాచేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించి హింసించడం.. మరి వీటిని ఏమంటారో? విర్రవీగడం, అధికార మదంతో చేసిన చేష్టలు అని అనకుండా ఉండగలరా?.. ఇవన్నీ మర్చిపోయి మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న ఓ వ్యక్తిపై ఇలా అసందర్బోచిత వ్యాఖ్యలు చేయడం.. సెల్ఫ్ గోల్‌తో విమర్శలు ఎదుర్కోవడం కేవలం చంద్రబాబుకే చెల్లుతుందేమో!. :::సిమ్మాదిరప్పన్న -
ఆ మాట ఇచ్చి నిలబెట్టుకున్నా: కేటీఆర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో ఓటుకు డబ్బులు, మందు పంచనని మాట ఇచ్చి నిలబెట్టుకున్నా.. ప్రజలు కూడా నా విశ్వాసాన్ని నిలబెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఆయన నివాళుర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పోరాటాలు మాకేం కొత్త కాదు.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం ప్రజల గొంతుకై మాట్లాడతాం. పవర్ పాలిటిక్స్‌లో అధికారం రావడం, పోవడం సహజం. నిరాశపడాల్సిన అవసరంలేదు. ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తాం’’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: తెలంగాణలో రేపు కొలువుదీరనున్న కొత్త సర్కార్ -
అవినీతి.. అంతర్గత పోరు
రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలంటే అధికార పార్టీకి ఎప్పుడూ ముచ్చెమటలే. ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని పడగొట్టడం అక్కడి ప్రజలకు అలవాటు. 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ ఇది. అధికార కాంగ్రెస్ ఓడిపోవడంతో ఈసారీ అది కొనసాగింది. కానీ కాంగ్రెస్ ఓటమికి ఆనవాయితీ కంటే అంతర్గత పోరు, అవినీతిని కట్టడి చేయడంలో సీఎం గెహ్లోత్ వైఫల్యమే ముఖ్య కారణాలు. యువ నేత సచిన్ పైలట్‌కు, గెహ్లోత్‌కు మధ్య నెలకొన్న తీవ్ర విభేదాలు తూర్పు రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ను బాగా దెబ్బ తీశాయి. ప్రజాకర్షక పథకాల మైలేజీని మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి తుడిచిపెట్టేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ కొంపముంచిన సిట్టింగులు గత ఐదేళ్లలో రాజస్తాన్‌లో వరుసబెట్టి పలు అవినీతి కుంభకోణాలు జరిగాయి. నిరుద్యోగం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వీలైనన్ని నియామకాలు చేపట్టడం ద్వారా వారిలో అసంతృప్తిని చల్లార్చేందుకు గహ్లోత్ ప్రభుత్వం ప్రయత్నించకపోలేదు. కానీ ఆ క్రమంలో ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా 12 సార్లు పేపర్లు లీకయ్యాయి! వాటికోసం రాత్రింబవళ్లు కష్టపడి సన్నద్ధమైన 50 లక్షల మంది యువతీ యువకులతో పాటు వారి కుటుంబాల్లో ఇది కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. దీనికి తోడు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్రస్థాయిలో అసమ్మతి నెలకొని ఉంది. కాంగ్రెస్ అంతర్గత సర్వే ఈ మేరకు స్పష్టంగా పేర్కొంది. అయినా ఈ కీలకమైన అంశాన్ని విస్మరించి 90 శాతానికి పైగా సిట్టింగులకు గెహ్లోత్ మళ్లీ టికెట్లిచ్చారు. తద్వారా కోలుకోలేని పొరపాటు చేశారు. తీరా ఫలితాలొచ్చాక మంత్రుల్లో ఏకంగా 17 మంది ఓటమిపాలవగా ఎమ్మెల్యేల్లోనూ 31 మంది అదే బాట పట్టారు. పైగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార భారమంతటినీ సమర్థంగా మోసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడంలో కీలకంగా వ్యవహరించిన పైలట్‌ను ఈసారి గెహ్లోత్ పూర్తిగా దూరం పెట్టడం చేటు చేసింది. ఓట్ల తేడా స్వల్పమే! రాజస్తాన్‌లో కాంగ్రెస్ ఓటమి పాలైనా బీజేపీకి పోలైన ఓట్లతో పోలిస్తే అంతరం కేవలం 2.2 శాతమే కావడం గమనార్హం. బీజేపీకి 41.7 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్ 39.5 శాతం దక్కించుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తే ఆ పార్టీ ఓటమికి ప్రధానంగా కారణమైందనేందుకు ఇది మరో నిదర్శనం. ఎందుకంటే... ► మొత్తం 199 స్థానాలకుగాను ఏకంగా 111 చోట్ల కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ కేవలం 66 సీట్లలోనే రెండో స్థానంలో ఉంది. ► 20 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచిన 77 స్థానాల్లో బీజేపీకి 45 దక్కగా కాంగ్రెస్ 22తో సరిపెట్టుకుంది. ► 5 శాతం కంటే తక్కువ మెజారిటీ నమోదైన 66 స్థానాల్లో బీజేపీకి 34, కాంగ్రెస్‌కు 23 దక్కాయి. ► అలాగే 10– 20 శాతం మెజారిటీ వచ్చిన 61 స్థానాల్లోనూ బీజేపీకి 37 వస్తే కాంగ్రెస్‌కు 22 వచ్చాయి. ► మెజారిటీ 20 శాతాన్ని మించిన 19 స్థానాల్లో మాత్రం 11 బీజేపీ ఖాతాలో పడ్డాయి. కాంగ్రెస్ ఆరింటికి పరిమితమైంది. ► అలాగే 5–10 శాతం మెజారిటీ నమోదైన 53 సీట్లలోనూ బీజేపీకి 33 దక్కితే కాంగ్రెస్ 18తో సరిపెట్టుకుంది. -
Madhya Pradesh: దిగ్విజయ్‌కు ఘోర పరాభవం..
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. రాష్ట్రంలో 230 స్థానాలు ఉండగా ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ 163 సీట్లు గెలుచుకుని తిరుగులేని పార్టీగా అవతరించింది. ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ 66 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌కు అయితే ఈ ఎన్నికలు ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులలో చాలా మంది ఓటమిని చవిచూశారు. ఆయన సోదరుడు లక్ష్మణ్ సింగ్, మేనల్లుడు ప్రియవ్రత్ సింగ్ సహా చాలా మంది బంధువులు వారి వారి నియోజకవర్గాల్లో పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఆయన కొడుకు జైవర్ధన్ సింగ్ మాత్రమే రఘోఘర్ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ఇక దిగ్విజయ్ మద్దతుదారులు అనేక మంది ఈ ఎన్నికల్లో మట్టికరిచారు. ముఖ్యంగా లహర్ నియోజకవర్గం నుంచి డాక్టర్ గోవింద్ సింగ్, రౌ నియోజకవర్గం జీతూ పట్వారీ ఓటమిపాలయ్యారు. ఎన్నికల ఫలితాలకు ముందు దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ గెలుపు పట్ల చాలా విశ్వాసంగా కనిపించారు. శివరాజ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఈసారి ఎలాగైనా గణనీయమైన స్థానాలు గెలుచుకుని అధికారాన్ని దక్కించుకోవాలని భావించినా ప్రజలు భిన్న తీర్పు ఇచ్చారు. రాష్ట్రంతోపాటు దేశంలో అత్యంత సీనియర్ నేత, మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్‌కు ప్రస్తుత ఎన్నికలు ఘోర పరాభవాన్ని మిగిల్చాయనే చెప్పుకోవాలి. -
అసెంబ్లీలో 3 నుంచి 8కి పెరిగిన బీజేపీ బలం
-
నెరవేరని హ్యాట్రిక్ కల
-
జనసేనకు ఘోర పరాభవం.. అన్నిచోట్లా డిపాజిట్లు గల్లంతు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బీజేపీతో పొత్తులో భాగంగా 8 సీట్లలో పోటీచేసినా ఆ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్లా ఓడిపోయారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయారు. మొత్తంగా కలిపి కొన్ని వేల ఓట్లు మాత్రమే సాధించగలిగారు. తమ పార్టీకి పట్టు ఉండడంతో పాటు, గెలిచే అవకాశాలున్న స్థానాలను కూడా జనసేన డిమాండ్ చేసి తీసుకుందని సీట్ల సర్దుబాటు సమయంలోనే ఆయా స్థానాల్లోని బీజేపీ నాయకులు విమర్శించారు. ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో సహకరించే పరిస్థితి లేదంటూ కూడా కొందరు స్థానిక నాయకులు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. జనసేన తరఫున కూకట్‌పల్లిలో ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్, తాండూరులో నేమూరి శంకర్‌గౌడ్, కోదాడ నుంచి మేకల సతీశ్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌లో లక్ష్మణ్‌గౌడ్, ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెంలో లక్కినేని సురేందర్‌రావు, వైరాలో డాక్టర్ తేజావత్ సంపత్‌నాయక్, అశ్వారావుపేట నుంచి ముయబోయిన ఉమాదేవి పోటీచేశారు. కూకట్‌పల్లిలో ప్రేమ్‌కుమార్‌కు అత్యధికంగా 39,830 ఓట్లు రాగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ పోటీచేసిన తాండూరులో మూడువేలకు పైగా మాత్రమే వచ్చాయి. కోదాడలో 1,200 ఓట్లు, నాగర్‌కర్నూల్‌లో 1,800 ఓట్లు, ఖమ్మంలో 1,500 ఓట్లు, కొత్తగూడెంలో 1,800, వైరాలో 2,600, అశ్వారావుపేటలో 2,200 ఓట్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులకు వచ్చాయి. తెలంగాణలో అంతగా పట్టు, గుర్తింపు లేని జనసేనకు ఎనిమిది సీట్లు కేటాయించడం వల్ల తమకు రాజకీయంగా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని బీజేపీ నేతలు పెదవి విరుస్తున్నారు. జనసేన రాష్ట్రంలో రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ కాకపోవడంతో ఎన్నికల్లో పోటీకి ‘కామన్స్ సింబల్’దక్కలేదు. ఆ పార్టీకి గతంలో కేటాయించిన గాజు గ్లాస్ సింబల్‌కూడాను ఈసీ కేటాయించకపోవడంతో, అభ్యర్థులంతా ఇండిపెండెంట్లుగానే బరిలో నిలిచారు. జనసేనకు కేటాయించిన ఎనిమిది సీట్లలో తమ పార్టీ నేతలు పోటీచేసి ఉంటే కనీసం రెండు, మూడు అయినా గెలిచే అవకాశాలుండేవని బీజేపీ నాయకులు వాపోతున్నారు. కూకట్పల్లి, తాండూరు, తదితర సీట్లు జనసేనకు కేటాయించడం పట్ల ఆయా చోట్ల బీజేపీ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఇంత చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. -
ఫలితాలపై విస్మయం..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల ఫలితాలు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఆశ్చర్యానికి గురిచేశా యి. పార్టీకి పట్టున్న గ్రేటర్ హైదరాబాద్‌లో పెద్దగా స్థానాలు కైవసం చేసుకోకపోవడం, అంతగా పట్టులేని గ్రామీణంలో సంతృప్తికరమైన ఫలితాలు రాబట్టడం బీజేపీ అధిష్టానాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. పార్టీలో కీలక నేతల ఓటమిని అధినాయకత్వం జీచుకోలేకపోతుంది. ఫలితాలపై మోదీ, నడ్డా, అమిత్ షా సమీక్ష నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మూడు రాష్ట్రాలలో పార్టీ విజయం నేపథ్యంలో ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో అగ్రనేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో పార్టీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు.. తెలంగాణలో మిశ్రమ ఫలితాలపై ప్రధానంగా చర్చించారు. ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు? అనే దానిపై ఆరా తీశారు. ముగ్గురు ఎంపీలు సహా పార్టీలో కీలక నేతల ఓటమి అగ్రనేతలను నిరాశపరిచినట్లు తెలిసింది. ఓటమిపాలైన వారిలో ముగ్గురు ఎంపీలు సహా కీలక నేతలు ఉన్నారు. కరీంనగర్ ఎంపీ, మాజీ రాష్ట్ర అ«ధ్యక్షుడు బండి సంజయ్, కోరుట్ల నుంచి పోటీచేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బోథ్ నుంచి పోటీచేసిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల నుంచి పోటీ చేసిన చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఓటమి పాలవడం బీజేపీ పెద్దలను షాక్‌కు గురిచేసింది. అలాగే.. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎమ్మెల్యే స్థానమైన అంబర్పేట్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ఎమ్మెల్యేగా పనిచేసిన ముషీరాబాద్‌లోనూ ఆ పార్టీ ఓటమిని మూటగట్టుకోవడం అధిష్టానం పెద్దలను అవాక్కయ్యేలా చేసింది. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా 8 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవడం, అందులో సీఎం కేసీఆర్ పోటీచేసిన కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి విజయం, గ్రేటర్ హైదరాబాద్‌లో బలం పుంజుకోవడంతోపాటు, గ్రామీణ ప్రాంతాలలో సైతం పార్టీకి పెరిగిన ఆదరణపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి సమీక్ష జరిపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రజల మద్దతుతో తెలంగాణను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలంటూ ఆదివారం ఆయన ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. కార్యకర్తలు, పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అవిశ్రాంత పోరాటానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
Rajasthan Election Result 2023: గహ్లోత్ మేజిక్కు తెర!
రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఈసారి ‘మేజిక్’ చేయలేకపోయారు. మెజీíÙయన్ల కుటుంబం నుంచి వచి్చన ఆయన, ఈసారి కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించేందుకు శాయశక్తులా ప్రయతి్నంచారు. ఆ క్రమంలో సంక్షేమ, ప్రజాకర్షక పథకాలతో సహా అందుబాటులో ఉన్న ట్రిక్కులన్నీ ప్రయోగించినా లాభం లేకపోయింది. అధికార పార్టీని ప్రజ లు ఇంటికి సాగనంపే 30 ఏళ్ల ఆనవాయితీ అప్రతిహతంగా కొనసాగింది. దాంతో కాంగ్రెస్ పరా జయం చవిచూసింది. ‘‘సీఎం పదవిని వదిలేయా లని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. కానీ సీఎం పదవే నన్ను వదలడం లేదు’’ అని పదేపదే గొప్ప గా చెప్పుకున్న 72 ఏళ్ల గహ్లోత్ చివరికి ఓటమిని అంగీకరించి ఆ పదవిని వీడాల్సి వచ్చింది. ఏ పథకమూ ఆదుకోలేదు... గతేడాది కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలు గహ్లోత్ రాజకీయ జీవితానికి పెద్ద అగి్నపరీక్షగా మారాయి. సీఎంగిరీని విడిచి పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించాలన్న అధిష్టానం ఆదేశాలను ధిక్కరించడం ద్వారా పెను సాహసమే చేశారాయన. ఆ క్రమంలో సోనియా, రాహుల్‌గాంధీ ఆగ్రహానికి గురైనా వెనకాడలేదు. చివరికి అధిష్టానమే వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి కలి్పంచారు. ఈ దృష్ట్యా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎలాగైనా గెలిపించకపోతే తన రాజకీయ జీవితమే ప్రమాదంలో పడుతుందని గ్రహించి దూకుడు ప్రదర్శించారు. అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ వాడుకున్నారు. ఎన్నికలకు ఏడాది ముందునుంచే పుంఖానుపుంఖాలుగా పలు సంక్షేమ, ప్రజాకర్షక పథకాలకు తెర తీశారు. పేదలకు కారుచౌకగా వంట గ్యాస్ మొదలుకుని ప్రజలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా దాకా ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నింటికీ మంచి పేరే వచి్చంది. ఏం చేసినా చివరికి ప్రజల మనసును మార్చలేక, అధికార పార్టీని ఓడించే ‘ఆనవాయితీ’ని తప్పించలేక చతికిలపడ్డారు. దెబ్బ తీసిన విభేదాలు...? యువ నేత సచిన్ పైలట్‌తో విభేదాలు కూడా రాజస్థాన్‌లో కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీశాయనే చెప్పాలి. ముఖ్యంగా 30కి పైగా అసెంబ్లీ స్థానాల్లో నిర్ణాయక శక్తిగా ఉన్న గుజ్జర్లు తమ వర్గానికి చెందిన పైలట్‌కు కాంగ్రెస్‌లో అన్యాయం జరుగుతోందన్న భావనకు వచ్చారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా కూడా పార్టీని దెబ్బ తీసిన అంశాల్లో ఒకటని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికల వేళ గహ్లోత్‌కు పైలట్ నిజానికి పెద్దగా సహాయ నిరాకరణ చేయలేదు. పైపెచ్చు స్నేహ హస్తమే సాచారు. కానీ గహ్లోత్ మాత్రం తానేంటో అధిష్టానానికి నిరూపించుకోవాలన్న ప్రయత్నంలో పైలట్‌కు ప్రాధాన్యం దక్కకుండా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించి కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చిన పైలట్‌ను అలా పక్కన పెట్టడం కూడా పార్టీకి చేటు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బఘెల్‌కు ‘బోనస్’ దక్కలేదు
ఛత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. రెండు పారీ్టలూ అంతే పోటాపోటీగా సంక్షేమ, ప్రజాకర్షక పథకాలను ప్రకటించాయి. వరికి దేశంలోనే అత్యధికంగా అందిస్తూ వస్తున్న బోనస్ తమను గట్టెక్కించి అధికారాన్ని నిలబెడుతుందని ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. మోదీ హామీల పేరుతో బీజేపీ ప్రకటించిన పథకాలకే ప్రజలు జై కొట్టారు. ఎదురుదెబ్బ నేపథ్యంలో.. వరుసగా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండటంతో ప్రజల్లో నెలకొన్న తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గట్టి దెబ్బ కొట్టింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ వెంటనే సీఎం బఘెల్ పలు సంక్షేమ, ప్రజాకర్షక పథకాల అమలు ప్రారంభించారు. రైతులు, గిరిజనులు, పేదలను ఎవరినీ వదలకుండా అందరికీ సాయం అందేలా చూశారు. ముఖ్యంగా వరికి ఆయన అందిస్తున్న బోనస్ సూపర్ హిట్టయింది. మళ్లీ గెలిస్తే పథకాన్ని మరింత విస్తరిస్తామని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. ఇది ఒక దశలో బీజేపీని బాగా కలవరపరిచింది. దీనికి తోడు భూమిలేని కార్మికులకు వార్షిక ఆర్థిక సాయం రూ.10,000కు పెంచుతామని, కేజీ టు పీజీ ఉచిత విద్య, 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ సహా పలు హామీలెన్నో కాంగ్రెస్ ఇచి్చంది. దాంతో ‘మోదీ గ్యారంటీలు’ పేరుతో బీజేపీ దూకుడుగా ఎన్నో పథకాలు ప్రకటించింది. క్వింటాకు రూ.3,100 చొప్పున ఎకరాకు 21 క్వాంటాళ్లను సేకరిస్తామని పేర్కొంది. ప్రతి వివాహితకూ ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, పీఎం ఆవాస్ యోజన కింద 18 లక్షల ఇళ్ల నిర్మాణం, పేదలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, కాలేజీ విద్యార్థులకు ప్రయాణ భత్యం, నిరుపేద కుటుంబంలో పుట్టే ఆడపిల్లకు రూ.1.5 లక్షలు తదితరాలెన్నో ప్రకటించింది. వీటికి తోడు ప్రధాని మోదీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు. డబుల్ ఇంజన్ సర్కారుకు చాన్సిస్తే అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తామని చెప్పుకొచ్చారు. ఇవన్నీ ప్రజలపై బాగా ప్రభావం చూపాయి. చివరికి బఘెల్ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ కొత్త హామీల కంటే బీజేపీ ‘మోదీ గ్యారంటీ’ల వైపే ప్రజలు మొగ్గు చూపారు. ముంచిన ‘మహదేవ్’ ఆరోపణలు... మోదీ గ్యారంటీలకు తోడు, పోలింగ్ సమీపించిన వేళ సీఎం బఘెల్‌పై ముసురుకున్న బెట్టింగ్ యాప్ ముడుపుల ఆరోపణలు కాంగ్రెస్‌కు బాగా చేటు చేశాయి. ఈ ఉదంతంలో ఒక కొరియర్‌ను అరెస్టు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించడం, దుబాయ్‌కి చెందిన మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి బఘెల్‌కు ఏకంగా రూ.508 కోట్ల మేరకు ముడుపులు అందించినట్టు అతడు చెప్పాడని పేర్కొనడం సంచలనం రేపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓడిపోయిన అనుభవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు రాజకీయ దిగ్గజాలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. పలుమార్లు విజేతలైన సీనియర్లకూ పరాభవం తప్పలేదు. తిరుగులేదనుకున్న మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు. ఆఖరుకు సీఎం కేసీఆర్ కూడా కామారెడ్డి ప్రజలు చేదు అనుభవాన్ని మిగిల్చారు. మరోవైపు సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన నేతలు కూడా పరాజయం పాలయ్యారు. ఇలాంటి కొన్ని ఆసక్తికర ఫలితాలను పరిశీలిస్తే... ♦ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా జీవితంతో పెనవేసుకున్న నేత. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వరుసగా రెండుసార్లు సీఎంగా పనిచేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా అపారమైన అనుభవం ఉంది. ఈసారి ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసిన ఆయన గజ్వేల్‌లో గెలిచినా కామారెడ్డిలో మాత్రం ఓడిపోయారు. ♦ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టీడీపీ హయాంలోనే సీనియర్ నేత. ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట, పాలకుర్తి నుంచి ఆరు పర్యాయాలు గెలిచిన నాయకుడు. ఈసారి మాత్రం పిన్న వయస్కురాలు, కొత్తగా రాజకీయ అరంగ్రేటం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని ఆయన్ను ఖంగు తినిపించారు. ♦ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కి తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు రాజకీయ వారసత్వం ఉంది. 2014లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి, 2018లో అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ మంత్రి వర్గంలో కీలక మంత్రి. కానీ ఈసారి తుమ్మల నాగేశ్వరరావు చేతుల్లో ఓటమి ఎదురైంది. ♦ బండి సంజయ్ పరిచయం అక్కర్లేని బీజేపీ నేత. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీకి ఊపు తెచ్చిన వ్యక్తి. కరీనంగర్ ఎంపీగా విజయం సాధించిన నేపథ్యం ఆయనది. కానీ ఈసారి కరీంనగర్ స్థానంలో పరాజయం చవిచూశారు. ఆ పార్టీ మరో ఎంపీ ధర్మపురి అరవింద్దీ ఇదే పరిస్థితి. ♦ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌తో కలిసి పోరాడిన చరిత్ర ఈటల రాజేందర్‌ది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక, వైద్యశాఖ మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్తో వివాదం రావడంతో బీజేపీలో చేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఈసారి మాత్రం ఓటమి తప్పలేదు. ♦ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ స్థానానికి 2014 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున 2014లో గెలిచారు. 2018లోనూ విజయం సాధించారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ గాలికి పరాజయం తప్పలేదు. మరో సీనియర్ నేత జోగు రామన్నదీ ఇదే అనుభవం. ఆదిలాబాద్ స్థానంలో 2009 నుంచి విజయాలను నమోదు చేశారు. 2023 ఎన్నిక ఆయనకు ఓటమిని అందించింది. ♦ ఉమ్మడి నిజామాబాద్‌లోని బాన్సువాడ, ఆర్మూర్, నిజామాబాద్ స్థానాల నుంచి మూడుసార్లు విజయం సాధించిన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా అనుభవం ఈ ఎన్నికల్లో పనిచేయలేదు. -
కాంగ్రెస్ ఓటమికి కమల్‌నాథ్ కారణం.. సంజయ్ రౌత్
Madhya Pradesh Elections results: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ కారణమని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కొన్ని సీట్లను ‘ఇండియా’ (INDIA) కూటమిలోని భాగస్వామ్యులతో పంచుకుని ఉంటే మరోలా ఉండేదన్నారు. మిత్రపక్షాల పట్ల పాత పార్టీ తన వైఖరిని పునరాలోచించాలని కూడా ఆయన సూచించారు. ఎన్నికల సమయంలో సమాజ్‌వాదీ పార్టీతో సీట్లు పంచుకోవాలనే ఆలోచనను కమల్‌నాథ్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ వంటి నేతలు చురుగ్గా ప్రచారం చేసినప్పటికీ మధ్యప్రదేశ్‌లో ఓటమికి కమల్‌నాథ్ కారణమని, విపక్ష కూటమితో కలిసి కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. అఖిలేష్ పార్టీకి (సమాజ్‌వాదీ పార్టీ) కొన్ని ప్రాంతాలలో మంచి మద్దతు ఉందని, ఆ పార్టీకి కంచుకోటలుగా పేరుగాంచిన 10-12 స్థానాలు ఉన్నాయన్నారు. కానీ దీనిని కమల్‌నాథ్ వ్యతిరేకించారన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు విలువైన గుణపాఠం చెబుతాయని, రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి సమిష్టిగా పాల్గొనాలని రౌత్ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ తన వ్యూహాన్ని పునరాలోచించాలని, మిత్రపక్షాల వైపు దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రాహుల్ గాంధీ “పనౌటీ” వ్యాఖ్య మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల ఫలితాలను దెబ్బతీసిందనే ఆరోపణలను రౌత్ తోసిపుచ్చారు. “అలా అయితే, ఆ వ్యాఖ్య తెలంగాణలో ఎందుకు దెబ్బతీయలేదని ప్రశ్నించారు. కాగా డిసెంబరు 6న ఇండియా బ్లాక్ సమావేశానికి పిలుపునిచ్చామని, ఈ సమావేశంలో పలు విషయాలు చర్చిస్తామని రౌత్ తెలిపారు. -
బీఆర్ఎస్ ఓటమిపై హరీష్‌రావు, కవిత రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. బీఆర్ఎస్కు పరాభవం ఎదురైంది. ఈ ఎన్నికల్లో గెలిచే హ్యాట్రిక్ సాధిస్తామని ఆశించిన కేసీఆర్‌కు గట్టి షాకే తగిలింది. రెండు చోట్ల పోటీ చేసిన ఆయన కామారెడ్డిలో ఓటమి చెందారు. బీఆర్ఎస్ ఓటమిపై హరీష్‌రావు స్పందిస్తూ ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. రెండు సార్లు బీఆర్ఎస్కు అవకాశమిచ్చారని, ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించారని హరీష్‌రావు అన్నారు. బీఆర్ఎస్ ఓటమిపై కవిత కూడా స్పందించారు. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల సేవకులమేనని, మనమంతా మన మాతృభూమి కోసం మనస్ఫూర్తిగా కృషి చేద్దామంటూ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు. చదవండి: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి Jai KCR !! Jai BRS !! Dear BRS family, thank you for all the hardwork !! Special thanks to all the social media warriors for the fight you put up !! Let us not forget.. with or without power we are servants of Telangana People. Let us all spiritedly work for our MotherLand.… — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 3, 2023 -
ఓవర్ కాన్ఫిడెన్స్..బీఆర్ఎస్ ఓటమికి కారణం ఇదే..
-
మళ్లీ ఓడిన భారత మహిళలు
మహిళల జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పూల్ ‘సి’ మ్యాచ్‌లో బెల్జియం 3–2 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించింది. భారత్ తరఫున అన్ను 47వ, 51వ నిమిషాల్లో గోల్స్ సాధించింది. బెల్జియం తరఫున నోవా ష్రూయెర్స్ (5వ నిమిషం), ఫ్రాన్స్ డి మాట్ (42వ ని.), అస్ట్రిడ్ బొనామి (52వ ని.) గోల్స్ నమోదు చేశారు. తొలి, మూడో క్వార్టర్లో ఒక్కో గోల్ సాధించి ముందుగా బెల్జియం 2–0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే నాలుగు నిమిషాల వ్యవధిలో అన్ను రెండు గోల్స్ సాధించి స్కోరును సమం చేసింది. అయితే చివర్లో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను సమర్థంగా ఉపయోగించుకున్న బెల్జియం మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో వైపు మంగళవారం మలేసియాలోని కౌలాలంపూర్‌లో జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. అదే రోజు జరిగే తొలి మ్యాచ్‌లో కొరియాతో భారత్ తలపడుతుంది. -
Vijay Hazare Trophy 2023: ఆంధ్ర, హైదరాబాద్ ఓటమి
జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీలో ఆంధ్ర, హైదరాబాద్ జట్లకు పరాజయం ఎదురైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్ 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై గెలుపొందింది. హైదరాబాద్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. రోహిత్ రాయుడు (130 బంతుల్లో 102; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. ఛత్తీస్‌గఢ్ 48.1 ఓవర్లలో 4 వికెట్లకు 273 పరుగులు సాధించింది. రిషభ్ తివారి (65), సంజీత్ దేశాయ్ (47), అశుతోష్ సింగ్ (45 నాటౌట్), ఏక్నాథ్ (43 నాటౌట్) రాణించారు. చండీగఢ్: మరో మ్యాచ్‌లో అస్సాం 5 వికెట్ల తేడాతో ఆంధ్రను ఓడించింది. ఆంధ్ర 31.5 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. అశి్వన్ హెబర్ (68 బంతుల్లో 50; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... హనుమ విహారి (23), రికీ భయ్ (20) విఫలమయ్యారు. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో ఐదుగురు ‘డకౌట్’ కావడం విశేషం. ఆకాశ్ సేన్ గుప్తా (5/20) ఐదు వికెట్లతో ఆంధ్రను దెబ్బ తీశాడు. అస్సాం 24.2 ఓవర్లలో 5 వికెట్లకు 114 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెరీర్లో తొలి వన్డే ఆడిన మాధవ్ రాయుడు (4/36) రాణించాడు. -
టీమిండియా శుభారంభం.. తొలి టీ20లో ఆసీస్‌పై విజయం
సాక్షి, విశాఖపట్నం: పరుగుల వరద పారిన మ్యాచ్‌లో చివరికి భారత జట్టుదే పైచేయిగా నిలిచింది. ఆ్రస్టేలియాతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. గురువారం ఇక్కడి డాక్టర్ వైఎస్ఆర్–ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు రెండు వికెట్ల తేడాతో ఆ్రస్టేలియా జట్టును ఓడించింది. తొలిసారి జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మ్యాచ్‌లో సూర్యకుమార్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు సాధించింది. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... ఓపెనర్‌గా వచ్చిన స్టీవ్ స్మిత్ (41 బంతుల్లో 52; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. ఇన్‌గ్లిస్ 47 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ఆ్రస్టేలియా తరఫున టి20ల్లో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గా ఆరోన్ ఫించ్ (47 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. అనంతరం భారత జట్టు 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు)– అర్ధ సెంచరీలతో అదరగొట్టగా... రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. భారత్ విజయానికి ఆఖరి బంతికి ఒక పరుగు అవసరంకాగా... సీన్ అబాట్ వేసిన బంతిని రింకూ సింగ్ సిక్సర్‌గా మలిచి భారత విజయాన్ని ఖరారు చేశాడు. అయితే టీవీ రీప్లేలో అబాట్ వేసిన బంతి నోబాల్ అని తేలడంతో అక్కడే భారత విజయం ఖాయమైంది. దాంతో రింకూ సింగ్ సిక్స్‌ను లెక్కలోకి తీసుకోలేదు. టి20ల్లో భారత జట్టుకిదే అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. సిరీస్‌లోని రెండో టి20 మ్యాచ్ ఈనెల 26న తిరువనంతపురంలో జరుగుతుంది. సూర్య, ఇషాన్ ధనాధన్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో సమన్వయలోపం కారణంగా మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (0) ఒక్క బంతి ఆడకుండానే తొలి ఓవర్లోనే రనౌటయ్యాడు. అనంతరం మూడో ఓవర్లో యశస్వి భారీ షాట్‌కు యత్నించి నిష్క్రమించాడు. ఈ దశలో ఇషాన్, సూర్యకుమార్ జత కలిశారు. వీరిద్దరు ఎక్కడా తగ్గకుండా ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో భారత్ స్కోరు 4.5 ఓవర్లలో 50 దాటింది. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 2 వికెట్లకు 63 పరుగులు సాధించింది. ఆ తర్వాత కూడా ఇషాన్, సూర్య జోరు కొనసాగించడంతో భారత్ 9.1 ఓవర్లలో 100 పరుగులు చేసింది. ఇషాన్ 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి డీప్ ఎక్స్ట్రా కవర్లో షార్ట్ చేతికి చిక్కడంతో ఇషాన్ ఇన్నింగ్స్ ముగిసింది. తిలక్ వర్మ (10 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. ఈ దశలో సూర్య, రింకూ జతకలిసి ఐదో వికెట్‌కు 40 పరుగులు జోడించడంతో భారత్ 194/4తో విజయానికి చేరువైంది. అయితే ఇదే స్కోరు వద్ద సూర్య అవుటయ్యాడు. అప్పటికి భారత్ విజయానికి చేరువైంది. చివరి ఓవర్ డ్రామా... 12 బంతుల్లో 14 పరుగులు చేయాల్సిన దశలో 19వ ఓవర్లో భారత్ 7 పరుగులు చేసింది. దాంతో చివరి ఓవర్లో భారత్ గెలుపునకు 6 బంతుల్లో 7 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతికే రింకూ ఫోర్ కొట్టాడు. రెండో బంతికి ‘బై’ రూపంలో పరుగు వచ్చింది. 4 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన దశలో భారత్ వరుసగా మూడు బంతుల్లో అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ వికెట్లను కోల్పోయింది. రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో అర్ష్‌దీప్ అవుటయ్యాడు. దాంతో చివరి బంతికి భారత్ విజయానికి ఒక పరుగు అవసరమైంది. ‘సూపర్ ఓవర్’ అవసరం పడుతుందా అనే అనుమానం కలిగిన దశలో అబాట్ వేసిన ఆఖరి బంతిని రింకూ సిక్స్‌గా మలచడంతో భారత్ విజయం ఖరారైంది. అయితే అబాట్ బంతి నోబాల్ అని తేలడంతో రింకూ సిక్స్ షాట్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: స్టీవ్ స్మిత్ (రనౌట్) 52; మాథ్యూ షార్ట్ (బి) రవి బిష్ణోయ్ 13; జోష్ ఇన్‌గ్లిస్ (సి) యశస్వి జైస్వాల్ (బి) ప్రసిధ్ కృష్ణ 110; స్టొయినిస్ (నాటౌట్) 7; టిమ్ డేవిడ్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–31, 2–161, 3–180. బౌలింగ్: అర్ష్‌దీప్ సింగ్ 4–0–41–0, ప్రసిధ్ కృష్ణ 4–0–50–1, అక్షర్ పటేల్ 4–0–32–0, రవి బిష్ణోయ్ 4–0–54–1, ముకేశ్ కుమార్ 4–0–29–0. భారత్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) స్మిత్ (బి) షార్ట్ 21; రుతురాజ్ గైక్వాడ్ (రనౌట్) 0; ఇషాన్ కిషన్ (సి) షార్ట్ (బి) తన్వీర్ 58; సూర్యకుమార్ యాదవ్ (సి) ఆరన్ హార్డి (బి) బెహ్రన్‌డార్ఫ్ 80; తిలక్ వర్మ (సి) స్టొయినిస్ (బి) తన్వీర్ సంఘా 12; రింకూ సింగ్ (నాటౌట్) 22; అక్షర్ పటేల్ (సి అండ్ బి) సీన్ అబాట్ 2; రవి బిష్ణోయ్ (రనౌట్) 0; అర్ష్‌దీప్ సింగ్ (రనౌట్) 0; ముకేశ్ కుమార్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.5 ఓవర్లలో 8 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–11, 2–22, 3–134, 4–154, 5–194, 6–207, 7–207, 8–208. బౌలింగ్: స్టొయినిస్ 3–0–36–0, బెహ్రన్‌డార్ఫ్ 4–1–25–1, షార్ట్ 1–0–13–1, సీన్ అబాట్ 3.5–0–43–1, నాథన్ ఎలిస్ 4–0–44–0, తన్వీర్ సంఘా 4–0–47–2. -
ఆ కథలు నాకు ధైర్యాన్నిచ్చాయి
‘‘నా జీవితంలో విడాకులు, నా సినిమాలు వరుసగా పరాజయం చెందడం.. ఆరోగ్య సమస్యలు (మయోసైటిస్).. ఇలా అన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో ఎంతో కుంగిపోయాను’’ అని సమంత అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విధంగా పేర్కొన్నారు. అదే ఇంటర్వ్యూలో సమంత ఇంకా మాట్లాడుతూ– ‘‘జీవితంలో ఎవరికైనా ముఖ్యమైనది వివాహం. నా వైవాహిక జీవితం విఫలమైంది.. ఆరోగ్యం క్షీణించింది. అదే టైమ్‌లో నా సినిమాలూ ప్రేక్షకులను మెప్పించలేదు. ఈ సమస్యలతో సుమారు రెండేళ్లు జీవితంలో ఎంతో కుంగిపోయాను. అప్పుడు బుక్స్ చదవటం మొదలుపెట్టాను. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని, మళ్లీ సినిమాలు చేసిన నటుల గురించి, జీవితంలో ట్రోలింగ్కి, మానసిక ఒత్తిడికి గురైన వారు ఎలా కోలుకున్నారో తెలుసుకున్నాను. వారి కథలు చదవడం నాకెంతో ఉపయోగపడింది. వారిలా నేనూ చేయగలననే ధైర్యం వచ్చింది. ఈ దేశంలో ఎందరో స్టార్స్ ఉన్నారు. అందరిలో నాక్కూడా గుర్తింపు రావడం గొప్ప అదృష్టం. నా లైఫ్‌లోని ఒడిదుడుకులు బహిర్గతమైనందుకు నాకు బాధ లేదు. ఇక్కడ నాలా ఇబ్బందులు పడేవారు ఎందరో ఉన్నారు. వారందరూ నాలాగే పోరాడాలని ఆశిస్తున్నాను’’ అన్నారు. -
భారత్ ‘పారిస్’ ఆశలు ఆవిరి
తాస్కాంట్: వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు అర్హత సాధించే అవకాశాలకు తెరపడింది. ఇక్కడ జరుగుతున్న ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌లో భారత్ 0–7తో ప్రపంచ మాజీ చాంపియన్ జపాన్ చేతిలో ఓడిపోగా...ఆదివారం జరిగిన గ్రూప్ ‘సి’ రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియాకు 1–3 గోల్స్ తేడాతో వియత్నాం జట్టు చేతిలో పరాజయం ఎదురైంది. లీగ్ దశ తర్వాత మూడు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లతోపాటు రెండో స్థానంలో నిలిచిన ఉత్తమ జట్టు ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. భారత్ తరఫున సంధ్య రంగనాథన్ (80వ ని.లో) ఏకైక గోల్ చేయగా... వియత్నాం తరఫున హున్ ఎన్హు (4వ ని.లో), ట్రాన్ థి హై లిన్ (22వ ని.లో), ఫామ్ హై యెన్ (73వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ ఈ మ్యాచ్‌లో 59 నిమిషాలు ఆడింది. ఆ తర్వాత ఆమె స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా గ్రేస్‌ను బరిలోకి దించారు. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను నవంబర్ 1న ఉజ్బెకిస్తాన్‌తో ఆడుతుంది. -
మళ్లీ మరీన్ చేతిలో...
ఒడెన్స్: పీవీ సింధు, కరోలినా మరీన్ మధ్య మంచి స్నేహం ఉంది. కోర్టులో ప్రత్యర్థులే అయినా కోర్టు బయట తమ సాన్నిహిత్యం గురించి వీరిద్దరు చాలా సార్లు చెప్పుకున్నారు. కానీ శనివారం ఇద్దరి మధ్య జరిగిన హోరాహోరీ పోరు అనూహ్య రీతిలో సాగింది. ఒక దశలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రత్యర్థిపై పైచేయి సాధించే క్రమంలో అరుపులు, కేకలతో పాటు పలు మార్లు ఇద్దరూ అంపైర్ల హెచ్చరికకు కూడా గురయ్యారు. అయితే చివరకు 73 నిమిషాల సమరం తర్వాత భారత షట్లర్ పరాజయం పక్షానే నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు ముఖాముఖీ రికార్డులో సింధు 5–10తో వెనుకబడి ఉండగా, ఇప్పుడు అది 5–11కు చేరింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ డెన్మార్క్ ఓపెన్ సెమీ ఫైనల్లో సింధు ఓటమిపాలైంది. కరోలినా మరీన్ (స్పెయిన్) 21–18, 19–21, 21–7 స్కోరుతో సింధుపై విజయం సాధించింది. ఇద్దరు ప్లేయర్లు తమదైన శైలిలో చెలరేగడంతో తొలి గేమ్ దాదాపు సమంగా సాగింది. విరామ సమయంలో సింధు 11–10తో ఒక పాయింట్ ముందంజలో ఉంది. ఆ తర్వాతా ఇదే కొనసాగి స్కోరు 18–18కి చేరింది. అయితే మరీన్ వరుసగా మూడు పాయింట్లు గెలుచుకొని గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండో గేమ్‌లో మాత్రం సింధు దూసుకుపోయింది. చకచకా పాయింట్లు సాధించిన ఆమె ఎక్కడా ఆధిక్యం తగ్గనీయకుండా 11–3కు చేరింది. అయితే ఆ తర్వాత ప్రతిఘటించిన మరీన్ వరుసగా పాయింట్లు గెలుచుకొని అంతరాన్ని తగ్గించింది. సింధు 20–16తో ముందంజలో నిలిచిన తర్వాత మరీన్ వరుసగా మూడు పాయింట్లు గెలవడంతో 20–19గా మారింది. కానీ స్మాష్‌తో పాయింట్ సాధించి సింధు గేమ్ గెలుచుకుంది. చివరి గేమ్ మాత్రం పూర్తి ఏకపక్షంగా మారిపోయింది. మరీన్ జోరు ముందు భారత షట్లర్ నిలవలేకపోయింది. ముందు 3–0, ఆపై 3–2...ఆ తర్వాత ఆమె జోరు సాగిపోయింది. వరుసగా 11 పాయింట్లు సాధించిన మరీన్ 14–2 దాకా వెళ్లింది. అనంతరం మ్యాచ్‌ను ముగించేందుకు ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు. మరీన్ అరుపులు... సింధు అసహనం పాయింట్లు సాధించినప్పుడు అతిగా భావోద్వేగాలు ప్రదర్శించవద్దని అంపైర్ ఇద్దరినీ పిలిచి మ్యాచ్‌లో పలు మార్లు వారించాడు. అయితే మరీన్ తన అరుపులను ఆపకపోగా, సర్వీస్ అందుకునేందుకు సింధు ఎక్కువ సమయం తీసుకుంది. తొలి గేమ్‌ను మరీన్ను మళ్లీ అంపైర్ హెచ్చరించాడు. మూడో గేమ్‌లో సర్వీస్ ఆలస్యానికి సింధును అంపైర్ ప్రశ్నించగా...‘ఆమె అరిచేందుకు అవకాశమిచ్చారు కదా. ముందు ఆమెను ఆపమని చెబితే నేనూ సిద్ధంగా ఉంటా’ అని సింధు బదులిచ్చింది. మరొకరి కోర్టునుంచి షటిల్ తీసుకోవద్దని ఇద్దరికీ చెప్పాల్సి వచ్చింది. చివరకు అంపైర్ ఇద్దరికీ ‘ఎల్లో కార్డు’లు కూడా చూపించాల్సి వచ్చింది. -
సఫారీ దెబ్బకు ‘కంగారు’
లక్నో: మళ్లీ కంగారే! వన్డే వరల్డ్‌కప్‌లో ‘ఫైవ్ స్టార్’ చాంపియన్ ఆ్రస్టేలియా ఈ కప్‌లో ఓ కూనలా విలవిలలాడుతోంది. పసలేని బౌలింగ్, బాధ్యతలేని బ్యాటింగ్‌తో ఆ్రస్టేలియాకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. బవూమా సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 134 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను బోల్తా కొట్టించి ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డికాక్ (106 బంతుల్లో 109; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) వరుసగా రెండో సెంచరీతో కదంతొక్కాడు. మార్క్రమ్ (44 బంతుల్లో 56; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, మ్యాక్స్‌వెల్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 40.5 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. లబుõÙన్ (74 బంతుల్లో 46; 4 ఫోర్లు) టాప్‌స్కోరర్ కాగా, స్టార్క్ (27; 3 ఫోర్లు), కెపె్టన్ కమిన్స్ (22; 4 ఫోర్లు) 20 పరుగులు మించారంతే! రబడ (3/33) ఆసీస్‌ను చావుదెబ్బ తీయగా, జాన్సెన్, కేశవ్, షమ్సీ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఓపెనర్ జోరు... దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ టాపార్డర్‌తో కలిసి పటిష్టమైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. జట్టు భారీస్కోరుకు బాటవేశాడు. బవుమా (55 బంతుల్లో 35; 2 ఫోర్లు)తో తొలి వికెట్‌కు 108 పరుగులు, డసెన్ (30 బంతుల్లో 26; 2 ఫోర్లు)తో రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. 90 బంతుల్లో సెంచరీ పూర్తయ్యాక డికాక్ జట్టు స్కోరు 197 పరుగుల వద్ద నిష్క్రమించాడు. అనంతరం మార్క్రమ్ అర్ధసెంచరీ సాధించడం, క్లాసెన్ (27 బంతుల్లో 29; 3 ఫోర్లు), జాన్సెన్ (22 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇలా క్రీజులో వచ్చిన వారంత స్కోరు పెరిగేందుకు దోహదం చేయడంతో సఫారీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 300 పైచిలుకు స్కోరు చేసింది. లంకపై తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఏకంగా 428 పరుగులు చేసిన సంగతి తెలిసిందే! కంగారూ... కంగారూ... జోరు మీదున్న ప్రత్యర్థి, కొండంత లక్ష్యం ముందరుంటే ... మిచెల్ మార్ష్ (7), వార్నర్ (13), స్మిత్ (19)...ఆస్ట్రేలియా టాపార్డర్ స్కోరిది! ఇదికాస్తా 10 ఓవర్లలోపే కంగారూ, బేజారు కలగలిసి ఆసీస్ పరాజయానికి బీజం పడేలా చేసింది. రబడ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో అప్పటికే అనుభవజ్జుడైన స్మిత్‌ను అవుట్ చేసి తర్వాత జోష్ ఇంగ్లిస్ (5), స్టొయినిస్ (5)లను పట్టుమని పది పరుగులైనా చేయనివ్వలేదు. దీంతో ఆ్రస్టేలియా 70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. లబుషేన్ నిలబడటంతో ఆస్ట్రేలియా ఆమాత్రం స్కోరు చేసింది. అంతేగానీ గెలిచేందుకు ఏ దశలో ఆడలేదు. భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ ఓడిన ఆ్రస్టేలియా తమ తదుపరి మ్యాచ్‌లో సోమవారం శ్రీలంకతో ఆడుతుంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) మ్యాక్స్‌వెల్ 109; బవుమా (సి) వార్నర్ (బి) మ్యాక్స్‌వెల్ 35; డసెన్ (సి) సబ్–అబాట్ (బి) జంపా 26; మార్క్రమ్ (సి) హాజల్‌వుడ్ (బి) కమిన్స్ 56; క్లాసెన్ (సి) ఇంగ్లిస్ (బి) హాజల్‌వుడ్ 29; మిల్లర్ (బి) స్టార్క్ 17; జాన్సెన్ (సి) వార్నర్ (బి) స్టార్క్ 26; రబడ (నాటౌట్) 0; కేశవ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 311. వికెట్ల పతనం: 1–108, 2–158, 3–197, 4–263, 5–267, 6–310, 7–311. బౌలింగ్: స్టార్క్ 9–1– 53–2, హాజల్‌వుడ్ 9–0–60–1, మ్యాక్స్‌వెల్ 10–1 –34–2, కమిన్స్ 9–0–71–1, జంపా 10–0– 70–1, మార్ష్ 1–0–6–0, స్టొయినిస్ 2–0–11–0. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: మార్ష్ (సి) బవుమా (బి) జాన్సెన్ 7; వార్నర్ (సి) డసెన్ (బి) ఇన్‌గిడి 13; స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రబడ 19; లబుõÙన్ (సి) బవుమా (బి) కేశవ్ 46; ఇంగ్లిస్ (బి) రబడ 5; మ్యాక్స్‌వెల్ (సి అండ్ బి) కేశవ్ 3; స్టొయినిస్ (సి) డికాక్ (బి) రబడ 5; స్టార్క్ (సి) డికాక్ (బి) జాన్సెన్ 27; కమిన్స్ (సి) మిల్లర్ (బి) షమ్సీ 22; జంపా (నాటౌట్) 11; హాజల్‌వుడ్ (సి) రబడ (బి) షమ్సీ 2; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (40.5 ఓవర్లలో ఆలౌట్) 177. వికెట్ల పతనం: 1–27, 2–27, 3–50, 4–56, 5–65, 6–70, 7–139, 8–143, 9–175, 10–177. బౌలింగ్: ఇన్‌గిడి 8–2–18–1, జాన్సెన్ 7–0–54–2, రబడ 8–1–33–3, కేశవ్ 10–0–30–2, షమ్సీ 7.5–0–38–2. ప్రపంచకప్‌లో నేడు న్యూజిలాండ్ X బంగ్లాదేశ్ వేదిక: చెన్నై మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఓటమి నుంచే గాంధీ నేర్చుకున్నారు..
సాక్షి, హైదరాబాద్: ‘‘గెలుపు కన్నా ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం.. గాంధీజీ సైతం అలాగే ఓటమి నుంచే నేర్చుకున్నారు.. అందుకని ఏ రంగంలోనైనా ఓడిపోతే కుంగిపోకూడదు ’’ అని ఒడిశా హైకోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ ఎస్.మురళీధర్ ఉద్బోధించారు. గాంధీ జయంతి నాడు ప్రముఖుల ప్రసంగాలకు పట్టం కట్టే మంథన్ సంవాద్ వార్షిక చర్చాగోష్టిని నగరంలోని శిల్పకళా వేదికలో సోమవారం నిర్వహించింది. కార్యక్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ మురళీధర్ మాట్లాడుతూ రాజకీయా ల్లోకి రాక పూర్వం న్యాయవాదిగా గాంధీజీ ఎదుర్కొన్న వృత్తిపరమైన ఆటుపోట్లు, దక్షిణాఫ్రికా లో రెండు దశాబ్దాల పాటు న్యాయవాద వృత్తిలో పొందిన అనుభవాలను ప్రస్తావించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా, నేర్చుకోవడాన్ని మానకుండా సత్యాన్ని వీడకుండా నిరుపేదలకు అండగా గాంధీజీ న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారని గుర్తు చేశారు. నవతరం న్యాయవాదులు గాంధీజీ న్యాయవాద ప్రస్థానం నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాధికి దోహదం చేయలేని ఆర్ధికాభివృద్ధి: యామినీ అయ్యర్ సిటిజన్ వర్సెస్ లాభార్థి? అంశంపై ఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అధ్యక్షుడు యామినీ అయ్యర్ మాట్లాడారు. దేశంలో పేర్కొంటున్న ఆర్థికాభివృద్ధి లాభదాయకమైన ఉపాధి అవకా శాలకు, ఉద్యోగాలకు దోహదం చేయలేకపోతోందని అభిప్రాయపడ్డారు. నిజమైన సంక్షేమానికి ఇంకా సరైన నిర్వచనాన్ని వెదికే క్రమంలోనే ఉన్నామన్నారు. ది క్వశ్చన్ ఆఫ్ అకడమిక్ ఫ్రీడమ్ అనే అంశంపై లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌కు చెందిన ప్రొఫెసర్ నీరజా గోపాల్ జయాల్ మాట్లాడుతూ విద్యా సంబంధ స్వేచ్ఛ (అకడమిక్ ఫ్రీడమ్) అనేది మన దేశంలో ఇంకా తగిన స్థాయిలో లేదన్నారు. సదస్సులో ‘‘వై ఇండిపెండెంట్ న్యూస్ మీడియా షుడ్ త్రైవ్’’ అనే అంశంపై ది న్యూస్ మినిట్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ధన్యా రాజేంద్రన్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్త అదానీపై వచ్చిన ఆరోపణల విషయంలో మీడియా పూర్తిస్థాయిలో నిష్పక్షపాత్ర పోషించలేకపోయిందన్నారు. ఫైటింగ్ ది ఫేక్ న్యూస్ పాండమిక్ అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో ఫేక్ న్యూస్ ప్రచారం సాగుతోందని ఆరోపించారు. విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ డైరెక్టర్ ఆర్ఘ్యాసేన్గుప్తా ‘ది గ్లోబల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ అనే అంశంపై మాట్లాడారు. సదస్సులో హిందీ కవి,వ్యంగ్యరచయిత సంపత్ సరళ్ పలు కవితలు,వ్యంగ్యరచనలు వినిపించారు. -
IND vs AUS 3rd Odi: ఓటమితో ముగింపు.. సిరీస్ భారత్ సొంతం
ఆ్రస్టేలియాతో చివరి వన్డేలో భారత్ విజయలక్ష్యం 353 పరుగులు... టీమ్ తాజా ఫామ్, పిచ్‌ను బట్టి చూస్తే అసాధ్యమేమీ అనిపించలేదు. అయితే చివరకు భారత్‌కు ప్రతికూల ఫలితమే వచ్చింది. రోహిత్, కోహ్లిలు బరిలోకి దిగి సత్తా చాటినా గెలుపు దక్కలేదు. వరుస విజయాల ఊపులో మరో మ్యాచ్ గెలిచి ఆ్రస్టేలియాపై తొలిసారి వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేద్దామనుకున్న టీమిండియా కోరిక నెరవేరలేదు. ఆ్రస్టేలియా సమష్టి ప్రదర్శనతో విజయాన్ని అందుకొని తమ వరుస ఐదు పరాజయాలకు బ్రేక్ వేసింది. అయితే ఇప్పుడు ఈ వామప్ తరహా మ్యాచ్‌కంటే మరో పది రోజుల తర్వాత జరిగే అసలు పోరుపైనే అందరి దృష్టీ నిలిచింది. అక్టోబర్ 8న భారత్, ఆస్ట్రేలియా వరల్డ్ మ్యాచ్ కోసం ఇక ఎదురు చూడండి. రాజ్‌కోట్: ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా ఆ్రస్టేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2–1తో సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన చివరి మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 66 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. టాప్–4 బ్యాటర్లు అర్ధసెంచరీలు సాధించారు. మిచెల్ మార్ష్ (84 బంతుల్లో 96; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్టీవ్ స్మిత్ (61 బంతుల్లో 74; 8 ఫోర్లు, 1 సిక్స్), లబుõÙన్ (58 బంతుల్లో 72; 9 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక పరుగులు చేశారు. మార్ష్, స్మిత్ రెండో వికెట్‌కు 137 పరుగులు జోడించారు. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (57 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (61 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (43 బంతుల్లో 48; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 4 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. ఓవరాల్‌గా 178 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్ 56; మార్ష్ (సి) ప్రసిధ్ (బి) కుల్దీప్ 96; స్మిత్ (ఎల్బీ) (బి) సిరాజ్ 74; లబుషేన్ (సి) శ్రేయస్ (బి) బుమ్రా 72; క్యారీ (సి) కోహ్లి (బి) బుమ్రా 11; మ్యాక్స్‌వెల్ (బి) బుమ్రా 5; గ్రీన్ (సి) శ్రేయస్ (బి) కుల్దీప్ 9; కమిన్స్ (నాటౌట్) 19; స్టార్క్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 352. వికెట్ల పతనం: 1–78, 2–215, 3–242, 4–267, 5–281, 6–299, 7–345. బౌలింగ్: బుమ్రా 10–0–81–3, సిరాజ్ 9–0–68–1, ప్రసి«ధ్ కృష్ణ 5–0–45–1, జడేజా 10–0–61–0, వాషింగ్టన్ సుందర్ 10–0–48–0, కుల్దీప్ యాదవ్ 6–0–48–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి అండ్ బి) మ్యాక్స్‌వెల్ 81; సుందర్ (సి) లబుõÙన్ (బి) మ్యాక్స్‌వెల్ 18; కోహ్లి (సి) స్మిత్ (బి) మ్యాక్స్‌వెల్ 56; శ్రేయస్ (బి) మ్యాక్స్‌వెల్ 48; కేఎల్ రాహుల్ (సి) క్యారీ (బి) స్టార్క్ 26; సూర్యకుమార్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) హాజల్‌వుడ్ 8; జడేజా (ఎల్బీ) (బి) సంఘా 35; కుల్దీప్ (బి) హాజల్‌వుడ్ 2; బుమ్రా (సి) లబుõÙన్ (బి) కమిన్స్ 5; సిరాజ్ (సి) కమిన్స్ (బి) గ్రీన్ 1; ప్రసిధ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 286. వికెట్ల పతనం: 1–74, 2–144, 3–171, 4–223, 5–233, 6–249, 7–257, 8–270, 9–286, 10–286. బౌలింగ్: స్టార్క్ 7–0–53–1, హాజల్‌వుడ్ 8–0–42–2, కమిన్స్ 8–0–59–1, గ్రీన్ 6.4–0–30–1, మ్యాక్స్‌వెల్ 10–0–40–4, తన్వీర్ సంఘా 10–0–61–1. -
పోరాడి ఓడిన రష్మిక జోడి
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక పోరాటం ముగిసింది. పెర్త్‌లో జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక (భారత్)–మోనిక్ బ్యారీ (న్యూజిలాండ్) ద్వయం 6–3, 1–6, 7–10తో మిసాకి–నాహో (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. సింగిల్స్‌లో రష్మిక తొలి రౌండ్లో 3–6, 3–6తో ఐవా డెస్టానీ (ఆ్రస్టేలియా) చేతిలో ఓటమి పాలైంది. -
ముగిసిన భారత్ పోరు
కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీలు ఓటమి చవిచూశాయి. గాయత్రి–ట్రెసా 8–21, 14–21తో అప్రియాని రహాయు–సితి ఫాదియా (ఇండోనేసియా)ల చేతిలో... అశి్వని–తనీషా 18–21, 7–21తో టాప్ సీడ్ మయు మత్సుమోటో–వకాన నగహారా (జపాన్)ల చేతిలో పరాజయం పాలయ్యారు. గాయత్రి, అశ్విని జోడీలకు 1,575 డాలర్ల (రూ. 1 లక్ష 30 వేలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 3600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత ఫుట్‌బాల్ జట్టుకు నిరాశ
కింగ్స్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టు చివరిదైన నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. థాయ్‌లాండ్‌లో నాలుగు దేశాల మధ్య జరిగిన ఈ టోర్నీలో భారత్‌కు వర్గీకరణ మ్యాచ్‌లోనూ ఓటమి ఎదురైంది. లెబనాన్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సందేశ్ జింగాన్ నాయకత్వంలోని భారత జట్టు 0–1 గోల్ తేడాతో ఓడిపోయింది. లెబనాన్ తరఫున ఆట 77వ నిమిషంలో కాసీమ్ ఎల్ జీన్ గోల్ సాధించాడు. వ్యక్తిగత కారణాలతో రెగ్యులర్ కెపె్టన్ సునీల్ ఛెత్రి ఈ టోరీ్నకి దూరంగా ఉన్నాడు. -
‘షూటౌట్’లో భారత్ ఓటమి
చియాంగ్ మాయ్ (థాయ్‌లాండ్): కింగ్స్ కప్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టు మూడో స్థానం కోసం పోటీపడనుంది. ఇరాక్ జట్టుతో గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ‘పెనాల్టీ షూటౌట్’లో 4–5 గోల్స్ తేడాతో ఓడిపోయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. టోర్నీ నిబంధనల ప్రకారం అదనపు సమయం ఆడించకుండా నేరుగా ‘షూటౌట్’ ద్వారా ఫలితాన్ని నిర్ణయించారు. ‘షూటౌట్’లో తొలి షాట్‌ను భారత ప్లేయర్ బ్రాండన్ ఫెర్నాండెజ్ గోల్ పోస్ట్‌కు కొట్టాడు. ఆ తర్వాత సందేశ్ జింగాన్, సురేశ్, అన్వర్ అలీ, రహీమ్ అలీ గోల్స్ చేశారు. ఇరాక్ తరఫున ఐదుగురు ఆటగాళ్లూ గోల్స్ సాధించడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు భారత్ తరఫున మహేశ్ 16వ నిమిషంలో తొలి గోల్ చేశాడు. 28వ నిమిషంలో కరీమ్ అలీ గోల్‌తో ఇరాక్ స్కోరును 1–1తో సమం చేసింది. 51వ నిమిషంలో ఇరాక్ కెపె్టన్ జలాల్ హసన్ సెల్ఫ్ గోల్‌తో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 79వ నిమిషంలో అయ్‌మెన్ గోల్‌తో ఇరాక్ 2–2తో స్కోరును సమం చేసింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 70వ స్థానంలో ఉన్న ఇరాక్‌పై భారత్ ఏనాడూ గెలవలేదు. ఇప్పటి వరకు రెండు జట్లు ఏడుసార్లు తలపడ్డాయి. ఆరు మ్యాచ్‌ల్లో ఇరాక్ నెగ్గగా, మరో మ్యాచ్ ‘డ్రా’ అయింది. లెబనాన్, థాయ్‌లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ పరాజిత జట్టుతో మూడో స్థానం కోసం భారత్ తలపడుతుంది. -
ఓటమి భయంతోనే బీజేపీ జమిలి ఆలోచనలు
సాక్షి, హైదరాబాద్: ఓటమి భయంతోనే కేంద్రంలోని బీజేపీ జమిలి ఎన్నికల ఆలోచనలు చేస్తోందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు తమదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తాజా సర్వేల్లో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ గెలిచే అవకాశా ల్లేవని పేర్కొన్నారు. డబుల్బెడ్రూమ్ ఇళ్లపంపిణీకి సంబంధించి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలకు సంబంధించి విలే కరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, ఉన్నట్లుండి వేవ్ మార్చితే ఫలితాలు మారతాయని భ్రమ పడుతోందన్నారు. ఎన్నికలు ఎప్పుడైనా కేసీఆర్ సర్కార్ సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను నియమించిన పార్టీ తమదన్నారు. త్వర లో జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ‘వన్ నేషన్– వన్ ఎలక్షన్’బిల్లు పెడతారనే ప్రచారం జరుగుతోందన్నారు. దేశంలో మోదీ క్రేజ్ పడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే నివేదికలు ఆ పార్టీ వద్ద ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ రెంటికీ కలిపి ఎన్నికలు పెడితే తమకేమైనా లాభం కలుగుతుందనే యోచనలో బీజేపీ ఉందన్నారు. జమిలి ఎన్నికలంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. నిర్ణీత షెడ్యూలు మేరకే ఎన్నికలు నిర్వహించాల్సిందిగా తాము ఈసీని కోరతామన్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. -
వచ్చే ఎన్నికల్లో ‘ఇండియా’ బీజేపీని ఓడిస్తుంది: అఖిలేశ్
లక్నో: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’అధికార బీజేపీని ఓడిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తమ పార్టీతోపాటు మిత్ర పక్షాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ‘దేశం మార్పును కోరుకుంటోంది. 2024లో బీజేపీని ఇండియా ఓడించనుంది. సమాజ్‌వాదీ పార్టీ, మిత్రపక్షాలు ఎన్నికలు ముందొచ్చినా, తర్వాత వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి’అని మీడియాతో అన్నారు. -
అంకిత పరాజయం
న్యూయార్క్: భారత టాప్ టెన్నిస్ క్రీడాకారిణి అంకితా రైనా ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంలో విఫలమైంది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో తొలి రెండు నెగ్గిన అంకిత మూడో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో అంకిత వరుస సెట్లలో 2–6, 2–6 స్కోరుతో మిర్జమ్ జొర్క్లండ్ (స్వీడన్) చేతిలో పరాజయంపాలైంది. 1 గంటా 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 154వ ర్యాంకర్ అంకిత తన ప్రత్యర్థి ముందు నిలవలేకపోయింది. జొర్క్లండ్ 3 ఏస్‌లు సంధించగా, అంకిత ఒకే ఒక ఏస్ కొట్టింది. -
కాంస్యంతో సరి
కోపెన్‌హాగెన్ (డెన్మార్క్): అసాధారణ ఆటగాడు అక్సెల్సన్కు సొంతగడ్డపైనే చుక్కలు చూపించిన భారత షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ పోరు సెమీ ఫైనల్లో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్íÙప్లో ఈ కేరళ స్టార్ కాంస్యంతోనే సరిపెట్టుకున్నాడు. క్వార్టర్స్‌లో తొలి గేమ్ కోల్పోయినప్పటికీ వరుస గేమ్‌లను గెలిచి పతకం ఖాయం చేసుకున్న భారత ఆటగాడు చిత్రంగా సెమీస్‌లో తొలి గేమ్ గెలిచి జోరు మీదుండి తర్వాత రెండు గేమ్‌లను గెలువలేక మ్యాచ్ ఓడిపోయా డు. శనివారం 76 నిమిషాల పాటు సాగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో హెచ్.ఎస్. ప్రణయ్ 21–18, 13–21, 14–21తో కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూశాడు. తొలి గేమ్‌లో తెలివైన షాట్లతో ప్రత్యర్థిని కోర్టులో పరుగు పెట్టిస్తూ స్కోరు సాధించాడు. నెట్‌వద్ద చురుగ్గా పాయింట్లు సాధించిన ప్రణయ్ స్మాష్‌లతో చెలరేగి... తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. తర్వాత రెండో గేమ్ కూడా ప్రణయ్ ఆధిపత్యంతోనే మొదలైంది. వరుసగా 4–0తో పైచేయి సాధించాడు.ఈ దశలో చేసిన అనవసర తప్పిదాలతో భారత షట్లర్ పాయింట్లను కోల్పోయాడు. పదే పదే ఇవే తప్పిదాలు కొనసాగించడంతో ఆధిక్యాన్ని, ఆపై గేమ్నే కోల్పోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లోనూ ప్రణయ్ తప్పిదాలనే ఆసరాగా చేసుకొని పుంజుకున్న థాయ్ ప్రత్యర్థి చివరిదాకా ఆధిపత్యాన్ని కొనసాగించాడు. -
సింధుకు చుక్కెదురు
కోపెన్‌హాగెన్ (డెన్మార్క్): ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో ఈ మాజీ చాంపియన్ రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. తొలి రౌండ్లో ఆమెకు ‘బై’ లభించడంతో నేరుగా రెండో రౌండ్లో పోటీపడింది. ప్రతీసారి కనీసం క్వార్టర్ ఫైనలిస్ట్‌గా నిలిచిన ఆమె బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 14–21, 14–21తో నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓడిపోయింది. రెండు గేముల్లో కూడా ఆరంభంలో ప్రత్యర్థికంటే మెరుగ్గా, ప్రత్యర్థికి దీటుగా ఆడిన 16వ సీడ్ సింధు గేమ్ సాగే కొద్దీ డీలా పడటంతో వరుస గేముల్లోనే ఓడింది. రెండో గేమ్‌లో సింధు ఒకదశలో 9–0తో ఆధిక్యంలో నిలిచింది. కానీ జపాన్ షట్లర్ వరుసగా పాయింట్లు నెగ్గుకుంటూ రావడంతో మళ్లీ సింధు ఆధిక్యాన్ని, ఆ తర్వాత మ్యాచ్‌నే కోల్పోయింది. పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్స్ ప్రణయ్, లక్ష్యసేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్లో లక్ష్యసేన్ 21–11, 21–12తో జియోన్ హ్యోక్ (కొరియా)పై, ప్రణయ్ 21–9, 21–14తో చికొ అర వర్డొయో (ఇండోనేసియా)పై గెలుపొందారు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ లో కీన్ యె (సింగపూర్)తో ప్రణయ్; కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)తో లక్ష్య సేన్ తలపడతారు. -
ఓటమి ఒప్పుకున్నకేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం ద్వారా ఈ విషయం స్పష్టమైందని అన్నారు. అభ్యర్థుల ప్రకటన సమయంలో ముఖ్యమంత్రి గొంతులో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందని, ఆయన పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి రెండింటిలో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మొత్తం సిట్టింగులకు సీట్లివ్వాలన్న తన సవాల్‌ను స్వీకరించకుండా కొందరిని మార్చారని అన్నారు. సోమవారం గాందీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనారిటీలను అవమానించడమే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారని తాను మొదటి నుంచి చెప్పిన మాటలు నిజమయ్యాయని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ జాబితా చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేలిపోయిందని, మూడింట రెండొంతుల మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ పారిపోవాలనుకుంటే సిద్దిపేట ఉంది.. సిరిసిల్ల ఉంది..కానీ ఒక మైనారిటీ నేత బరిలో ఉన్న కామారెడ్డికి వెళ్లడం.. మైనారిటీలను అవమానించడమే. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఎనలేని సేవ చేశారు. కాంగ్రెస్ అంతా షబ్బీర్ అలీకి అండగా ఉండి కేసీఆర్ పని పడుతుంది. అసలు కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటకు వెళ్లకుండా కామారెడ్డికి ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలి..’అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఓటమి సూర్యాపేట సభలోనే స్పష్టంగా కనిపించిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం 12.03 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరగగా, ఆ సమయంలో లిక్కర్ షాపుల డ్రా తీశారని ఎద్దేవా చేశారు. దీనిని బట్టి కేసీఆర్ ప్రాధాన్యత ఏంటో తెలంగాణ సమాజం అర్ధం చేసుకోవాలని అన్నారు. రుణమాపీలో రూ.11 వేల కోట్లు మిగుల్చుకున్నారు రుణమాఫీ పేరుతో కేసీఆర్ అతి తెలివితేటలు ప్రదర్శించారని రేవంత్ విమర్శించారు. రూ 99,999 వరకు మాత్రమే రుణమాఫీ చేసి రూ.11 వేల కోట్లు మిగుల్చుకున్నారని ఆరోపించారు. ఒక్క రూపాయే తేడా అని అందరూ అనుకుంటున్నారు కానీ.. దానివల్ల వేలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే పూర్తి రుణమాఫీ జరిగిందని రేవంత్ చెప్పారు. రూ.75 ఉన్న పింఛన్‌ను రూ.200కు పెంచింది కాంగ్రెస్సేనన్నారు. ‘50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది అని కేసీఆర్ అంటున్నారు. నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టులు మీ తాతలు కట్టారా? 12,500 గ్రామ పంచాయతీలకు కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? చింతమడకలో బడి కట్టింది, ముఖ్యమంత్రి ఇంటికి కరెంటు ఇచ్చింది కాంగ్రెస్సే. ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో నిర్మించింది కాంగ్రెస్..’అని స్పష్టం చేశారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో లెక్కలతో సహా చర్చకు సిద్ధమని ప్రకటించారు. కమ్యూనిస్టులను కరివేపాకులా తీసేశారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రూ.4 వేల పెన్షన్ ఇస్తుందని రేవంత్ దీమా వ్యక్తం చేశారు. ఈ విషయం ప్రగతి భవన్ గోడలమీద రాసుకోవాలని సవాల్ విసిరారు. ఏ పెద్ద ఒప్పందం జరిగినా, తర్వాత పది రోజులకు పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తారని విమర్శించారు. సూర్యాపేట సభలో శ్రీకాంత చారి తల్లిని నిలబెట్టి కేసీఆర్ అవమానించారని అన్నారు. కమ్యూనిస్టులను కరివేపాకులా తీసి పారేశారని ధ్వజమెత్తారు. మోసానికి గురైన కమ్యూనిస్టులు కేసీఆర్‌పై తిరుగుబాటు చేయాలని అన్నారు. పార్టీ లో చేరికలు బాన్సువాడ, వర్ధన్నపేట, ముధోల్ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలువురు సోమవారం గాందీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. -
ఆస్తులు అమ్ముకుని వెళ్లిపోయేందుకు కేసీఆర్ ప్లాన్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని సర్వేలు చెప్తున్నాయని, అందుకే ఆస్తులన్నీ అమ్ముకుని విదేశాలకు వెళ్లిపోయేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టడానికి స్థలం లేదంటున్న సీఎం కేసీఆర్.. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఎలా అమ్ముతున్నారని నిలదీశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన అలంపూర్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ ప్రాంతాలకు చెందిన పలు పార్టీల నేతలు సోమవారం గాందీభవన్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు పట్టా భూములిస్తే.. బీఆర్ఎస్ సర్కారు అభివృద్ధి ముసుగులో వాటిని గుంజుకోవాలని చూస్తోందని ఆరోపించారు. నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ప్రజల ఆకాంక్షల కోసమని.. అంతేతప్ప ఔటర్ రింగురోడ్డును, దళితుల భూములను అమ్ముకునేందుకు కాదని పేర్కొన్నారు. వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలి.. ఓటమి భయంతోనే కేసీఆర్ రాష్ట్రంలో అన్నీ అమ్మేస్తున్నారని, పనులు చక్కబెట్టుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. భూములు కొనేవాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ తన సొంత మనుషులకు అప్పగించుకునేందుకే వైన్‌షాపుల టెండర్లను నాలుగు నెలల ముందు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదని రేవంత్ పేర్కొన్నారు. తమ కార్యకర్తలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. కొందరు పోలీసు అధికారులు బీఆర్ఎస్ నేతలకు తొత్తుల్లా పనిచేస్తూ.. కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక అలాంటి పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
వంగలపూడి అనిత వల్లే పార్టీ సర్వనాశనం
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి ఎదురైంది. పాయకరావుపేట మండలానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు అనితకు వ్యతిరేకంగా ఆదివారం సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు సీటు ఇస్తే ఓడిపోవడం ఖాయమని తేల్చిచెప్పారు. అనిత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇళ్ల లబ్ధిదారుల నుంచి రూ.30 వేల చొప్పున, పింఛన్ కావాలని వచ్చేవారి నుంచి రూ.5 వేల చొప్పున వసూళ్లకు పాల్పడ్డారని మండిపడ్డారు. జడ్పీ కోఆప్షన్ సభ్యుడి పదవిని కూడా అమ్ముకున్నారని ఆరోపించారు. అనిత వల్లే పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ సర్వనాశనౖమెందన్నారు.ఆమె వచ్చాకే పార్టీలో ఆరు గ్రూపులు తయారయ్యాయని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనిత, ఆమె అనుచరులు చేసిన అవినీతిని ప్రశ్నించినందుకు తమపై కక్షకట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును తాము కలవడంతో కక్ష గట్టి వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆదేశాలను కూడా అనిత పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆమె మాటలు విని తమను సస్పెండ్ చేసిన అచ్చెన్నాయుడుపైనా నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాయకరావుపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు, తాపీమేస్త్రీల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు, పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు గొర్లె రాజబాబు, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు దేవవరపు ఆనంద్, మాజీ సర్పంచ్‌లు డి.ఆనంద్, కలిగొట్ల శ్రీను, సుంకర సూరిబాబు, గొల్లపల్లి నాగు, తలారి రాజా, భజంత్రీల శివ, చొక్కా శ్రీను, శ్రీనివాసరెడ్డి, కోడూరి నూకరాజు, థామస్, పడాల కోటి, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
కేసీఆర్‌కు ఓటమి భయం
నల్లగొండ రూరల్: సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, ఎన్నికల సమయంలో దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు పథకాలు పెడుతున్నాడని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ‘బంధు’పథకాలతో బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో బంద్ అవుతుందని చెప్పారు. నల్లగొండ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు శనివారం ఆయన కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు ప్రకటించి మాట్లాడారు. భూ మండలం తలకిందులైనా ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్.. నేడు ఎన్నికల కోసం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంటున్నాడని విమర్శించారు. కేసీఆర్ మాట లకు, ఉత్తుత్తి జీవో కాపీలకు మోసపోవద్దని సూచించారు. గ్రామపంచాయతీ కారి్మకులు 30 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పారిశుధ్య పనులు చేపడితే వారికి సమాజం పాదాభివందనం చేసిందని, అలాంటి వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. మీరు పోరాటం ఆపొద్దని సమస్య పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటామని రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కారి్మకులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు కోమటిరెడ్డి చెప్పారు. ఏపీ సీఎం జగన్ అక్కడి ప్రజలకు వైద్యం ఖర్చు రూ.వెయ్యి దా టితే పెద్ద ఆస్పత్రిలో పూర్తి స్థాయి వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నారని కోమటిరెడ్డి చెప్పారు. వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. -
Japan Open 2023 badminton: పోరాడి ఓడిన లక్ష్యసేన్
టోక్యో: బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–750 జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్ లక్ష్య సేన్ ఆట ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో లక్ష్య పోరాడి ఓడాడు. ఈ మ్యాచ్‌లో ఇండోనేసియాకు చెందిన ఐదో సీడ్ జొనాథన్ క్రిస్టీ 21–15, 13–21, 21–16 స్కోరుతో సేన్‌ను ఓడించాడు. 68 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరు తొలి గేమ్‌లో క్రిస్టీ చేసిన పొరపాట్లతో సేన్ 7–4తో ముందంజ వేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా చెలరేగిన క్రిస్టీ 15–12తో ఆధిక్యంలోకి వచ్చేశాడు. రెండో గేమ్‌లో చక్కటి సర్వీస్, ర్యాలీలతో 11–5తో సేన్ ముందంజ వేశాడు. ఆపై పదునైన స్మాష్‌లతో చెలరేగి భారత షట్లర్ రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. చివరి గేమ్‌లో మాత్రం మొదటినుంచి ఆధిక్యం ప్రదర్శించిన క్రిస్టీ చివరి వరకు దానిని నిలబెట్టుకున్నాడు. -
బీజేపీని ఇండియా ఓడించడం ఖాయం
కోల్‌కతా: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్, ఇంక్లూజివ్ అలయెన్స్) కూటమి బీజేపీని తప్పక ఓడిస్తుందని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. అమరుల వార్షిక దినోత్సవ ర్యాలీలో ఆమె ప్రసంగించారు. ‘బీజేపీని ఓడించేందుకు 26 రాజకీయ పార్టీలు ఏకం కావడం సంతోషంగా ఉంది. వారందరికీ ధన్యవాదాలు. ఇకపై బీజేపీ çహారేగా.. భారత్ జీతేగా అనేదే మా నినాదం. మా భవిష్యత్ కార్యక్రమాలన్నీ ఇండియా వేదికగానే జరుగుతాయి’అని ఆమె స్పష్టం చేశారు. కూటమి గెలుపుపైనే తన దృష్టంతా ఉందని, ఏ పదవినీ ఆశించడం లేదని తెలిపారు. దేశంలో శాంతిని, బీజేపీ ఓటమినే తాము కోరుకుంటున్నామన్నారు. ప్రజలు బీజేపీని అధికారం నుంచి తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని మమత తెలిపారు. 2024లోనూ బీజేపీయే మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదన్న విషయం మనందరం గుర్తుంచుకోవాలని చెప్పారు. మణిపూర్ సంక్షోభంపై ఆమె తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘బేటీ బచావో’ మన కూతుళ్లను కాపాడుకుందాం పథకం ఇప్పుడు ‘బేఠీ జలావో’ మన కూతుళ్లను కాల్చివేద్దాంగా మారిందన్నారు. ప్రతిపక్ష కూటమిలోని నేతలంతా మణిపూర్ ప్రజలకు అండగా నిలుస్తారని చెప్పారు. -
దంభోద్భవుడి గర్వభంగం.. అందుకే విర్రవీగకూడదంటారు
పూర్వం దంభోద్భవుడు అనే రాజు ఉండేవాడు. మహా బలశాలి. సమస్త భూమండలాన్నీ పాలించేవాడు. అంతేకాదు, పేరుకు తగినట్లే మహా గర్విష్టి. రాజోచితంగా అలంకరించుకుని సభకు వచ్చి స్వర్ణ సింహాసనంపై ఆసీనుడయ్యేవాడు. ప్రతిరోజూ అతడు సభలోకి అడుగుపెడుతూనే వందిమాగధులు అతడి బలపరాక్రమాలను చిలవలు పలవలుగా పొగుడుతూ కీర్తనలను గానం చేసేవారు. సభాసదులు జయజయ ధ్వానాలు పలికేవారు. దంభోద్భవుడు వీనులవిందుగా వాటిని ఆలకిస్తూ, గర్వాతిశయంతో మీసాలను మెలితిప్పుకొనేవాడు. గుణగానాల ప్రహసనం సద్దుమణిగాక దంభోద్భవుడు గర్వాతిశయంతో సభాసదులను తిలకిస్తూ, స్వోత్కర్ష మొదలు పెట్టేవాడు. ‘ఈ భూమండలంలో నన్ను ఎదిరించి, ఓడించే వీరుడెవడైనా ఉన్నాడా? బాణ ఖడ్గ గదా యుద్ధాల్లో నన్ను మించిన వాడున్నారా? మల్లయుద్ధంలోనైనా నాతో తలపడగల వాడున్నారా? ఎవరైనా ఉంటే చెప్పండి. క్షణాల్లోనే మట్టుబెడతాను’ అంటూ గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగరేసేవాడు. దంభోద్భవుడి మంత్రులు కూడా అతడికి తగిన వారే! రోజూ అతడి బల పరాక్రమాలను పొగుడుతూ కాలక్షేపం చేసేవారు. దంభోద్భవుడికి నానాటికీ అహంకారం పెరగసాగింది. ఒకరోజు కొందరు విప్రులు దంభోద్భవుడిని చూడవచ్చారు. దంభోద్భవుడు వారికి సాదరంగా స్వాగతం పలికి, అతిథి సత్కారాలు చేశాడు. వారి ఎదుట అలవాటు కొద్దీ స్వోత్కర్ష మొదలుపెట్టాడు. పాపం ఆ విప్రులు కిక్కురుమనకుండా అతడి ప్రగల్భాలన్నింటినీ ఓపికగా ఆలకించారు. దంభోద్భవుడు తన ప్రసంగాన్ని ఆపి, ఇక మీరేమంటారు అన్నట్లుగా విప్రులకేసి చూసి కళ్లెగరేశాడు.‘రాజా! నువ్వు మహావీరుడవు, అసామాన్య శూరుడవు, పరాక్రమవంతుడవు, అమిత బలసంపన్నుడవు. భూమ్మీద ఉన్న రాజులెవరూ నిన్ను ఎదిరించి నిలువలేరు. అంతవరకు నిజమే!’ అన్నారు.‘అంతవరకు నిజమే అనడంలో అంతరార్థమేమిటి?’ కనుబొమలు ముడివేస్తూ ప్రశ్నించాడు దంభోద్భవుడు.‘రాజా! గంధమాదన పర్వతంపై నరనారాయణులనే ఇద్దరు రుషిపుంగవులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వారిని జయించగల వీరులు ముల్లోకాలలోనూ లేరని విన్నాం. నీ పరాక్రమాన్ని చాటుకోవాలనే కోరిక ఉంటే, వారితో యుద్ధంచేసి సంగతి తేల్చుకోవచ్చు’ అన్నారు విప్రులు.విప్రులు ఆ మాట అనడంతోనే దంభోద్భవుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. కాలు నేలకేసి బలంగా తాటించాడు. కత్తి తీసి ఝుళిపించాడు. మీసం మెలితిప్పాడు. ‘నన్ను మించిన వీరులా వాళ్లు, ఎంత కావరం?’ అంటూ అప్పటికప్పుడే యుద్ధానికి బయల్దేరమంటూ సైన్యాన్ని ఆదేశించాడు. సాయుధంగా రథం సిద్ధం చేసుకుని, హుటాహుటిన బయలుదేరాడు.దంభోద్భవుడు గంధమాదన పర్వతం వద్దకు చేరుకునే సరికి, కొండ మీద నరనారాయణులు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ కనిపించారు. వారిని చూసి, తొడగొట్టి యుద్ధానికి రమ్మంటూ పిలిచాడు. పిలుపు విని నరనారాయణులు లేచి వచ్చి, అతడికి అతిథి సత్కారాలు చేయబోయారు. ‘ఇవన్నీ నాకు వద్దు. నాకు కావలసింది మీతో యుద్ధం’ అన్నాడు దంభోద్భవుడు.‘నాయనా! మేం మునులం. ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాం. మమ్మల్ని తపస్సు చేసుకోనీ. నువ్వు వచ్చిన దారినే వెనక్కు వెళ్లు’ అన్నారు. దంభోద్భవుడు వినలేదు. వికటాట్టహాసం చేస్తూ యుద్ధం చేయాల్సిందేనంటూ వారిపై సంధించడానికి బాణం తీశాడు. నరనారాయణుల్లోని నరుడు ఒక దర్భపుల్ల తీసుకుని ప్రయోగించాడు. అది దంభోద్భవుడి బాణాన్ని తుంచేసింది. అతడు వరుస బాణాలు కురిపించాడు. అతడి సైన్యం కూడా బాణాలు ప్రయోగించింది. వాటన్నింటినీ ఆ దర్భపుల్ల తుత్తునియలు చేసింది. సైనికులను గాయపరచింది. వారు హాహాకారాలు చేస్తూ పలాయనం చిత్తగించారు. దంభోద్భవుడికి ధైర్యం సడలింది. ఆయుధాలను కిందపెట్టి, నరనారాయణుల పాదాల మీద వాలాడు. ‘మహర్షులారా! నన్ను క్షమించి అనుగ్రహించండి. నా గర్వానికి ప్రాయశ్చిత్తం జరిగింది’ అని ప్రార్థించాడు.‘నాయనా! పరాక్రమం ఉన్నవారు ఇతరుల రక్షణ కోసం ఆ పరాక్రమాన్ని ఉపయోగించాలి. ధనం ఉన్నవారు నిరుపేదలకు దానం చేయడానికి ఉపయోగించాలి. గర్వాతిశయంతో మిడిసిపడటం తగదు. నిస్సహాయులకు సహాయం చేయని జన్మ వ్యర్థం’ అని హితవు పలికారు. గర్వభంగమైన దంభోద్భవుడు వారి నుంచి సెలవు తీసుకుని వెనక్కు మళ్లాడు. -
కెప్టెన్సీ మాకు వద్దు అంటూ ట్రోల్స్ రోహిత్ శర్మ ఏం చేసాడో చూడండి..!
-
ఎన్నికలకు ఫార్ములా రెడీ, ఇక రంగంలోకి దూకడమే..
లక్నో: త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజీపీని ఓడించాలంటే విపక్షాలు ఐక్యంగా పోరాడటమొక్కటే మార్గమన్నారు సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. ఈ సందర్బంగా ఐక్య ప్రతిపక్ష కూటమి విధానాలపై తమ పార్టీ ధృక్కోణాన్ని వివరిస్తూ 80 మందిని ఓడించి, బీజేపీని తరిమికొట్టండని నినదించారు. 2024 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి దారుణ ఓటమి తప్పదని.. బీసీలు, దళితులు, మైనారిటీలే బీజీపీని ఓడిస్తారన్నారు అఖిలేష్ యాదవ్. ఈసారి ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి మా దగ్గరొక ఫార్ములా ఉంది. ఐక్య ప్రతిపక్ష కూటమి నుండి పెద్ద జాతీయ పార్టీలు మాకు మద్దతిస్తే 80 మంది బీజేపీ ఎంపిలను ఓడిస్తాం.. బీజేపీని తరిమికొడతాం. అందుకే యూపీలో "80 గెలుద్దాం, బీజేపీని తరిమేద్దాం.." అన్న నినాదంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నామని అన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఐక్యంగా పోరాడాలన్న సంకల్పంతో ఐక్య ప్రతిపక్ష కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే సమాజ్ వాది పార్టీ గతంలో కూడా కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలతో పొత్తు పెట్టుకున్న ప్రస్తావన తీసుకురాగా తామెప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకున్నా నిజాయతీగానే వ్యవహరించామని ఎప్పుడూ సీట్ల కోసం పట్టుబట్టలేదని గుర్తు చేశారు. ఇది కూడా చదవండి: ఆ అధికారం వారికి లేదు: వెంకయ్య నాయుడు -
బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే.. శరద్ పవార్
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు సీనియర్ నేత శరద్ పవార్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని ఎదుర్కోవడానికి విపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. జూన్ 23న బీహార్‌లో జరగనున్న విపక్షాల సమావేశంలో కూడా తాను ఇదే విషయాన్ని ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవంలో ఆ పార్టీ అధ్యక్షులు శరద్ పవర్ మాట్లాడుతూ పార్టీ వర్గాలకు తమ భవిష్యత్తు కార్యాచరణ గురించి వివరించారు. కేంద్రంలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఐక్యతతో పోరాడాలని ఆకాంక్షించారు. బీజేపీ పార్టీని ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో బీజేపీని వద్దనుకుంటున్నారంటే రేపు కేంద్రంలో కూడా ఆ పార్టీని వద్దనుకునే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సమయంలోనే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి. కలిసికట్టుగా బీజేపీని సాగనంపే ప్రయత్నం చేయాలని అన్నారు. బీజేపీ అధికారంలోకి రావడం కోసం కష్టసాధ్యమైన హామీలిచ్చి ప్రజలను మభ్య పెట్టింది. ప్రజలకు ఆ విషయం తేటతెల్లమైంది. ఇప్పుడు వారు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని బీజేపీయేతర పార్టీలు సమిష్టిగా పోరాడితే ఆ పార్టీని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన తీసుకుని రాగా ఆయన స్పందిస్తూ అన్ని పార్టీలకూ తమ విస్తృతిని ఏ రాష్ట్రంలోనైనా పెంచుకునే అవకాశముంది. కానీ నాకెందుకో అది బీజేపీకి చెందిన తోక పార్టీగా అనిపిస్తోందన్నారు. ఇది కూడా చదవండి: వారితో చేతులు కలపడం దండగ.. -
శ్రీకాంత్, ప్రణయ్ జోరు
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోరీ్నలో భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–17, 22–20తో ప్రపంచ 20వ ర్యాంకర్, భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌ను ఓడించగా... ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 21–18, 21–16తో ప్రపంచ 16వ ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలుపొందాడు. గతంలో లక్ష్య సేన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన శ్రీకాంత్‌కు ఈసారి గట్టిపోటీనే లభించింది. ప్రతి పాయింట్‌కు ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. అయితే కీలకదశలో శ్రీకాంత్ సంయమనంతో ఆడి పైచేయి సాధించాడు. తొలి గేమ్‌లో స్కోరు 17–17తో సమంగా ఉన్నదశలో శ్రీకాంత్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్ 20–14తో విజయానికి పాయింట్ దూరంగా నిలిచాడు. అయితే లక్ష్య సేన్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి స్కోరును 20–20తో సమం చేశాడు. వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయినా శ్రీకాంత్ ఏకాగ్రత కోల్పోకుండా ఆడి వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత యువతార ప్రియాన్షు రజావత్ 22–20, 15–21, 15–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ జిన్‌టింగ్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. మూడో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరి గిన మ్యాచ్‌లో 14వ ర్యాంకర్ సింధు 18–21, 16–21తో ఓడిపోయింది. ఓవరాల్‌గా తై జు యింగ్ చేతిలో సింధుకిది 19వ ఓటమికాగా వరుసగా తొమ్మిదో పరాజయం. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చివరిసారి తై జు యింగ్‌ను ఓడించిన సింధు ఆ తర్వాత వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో ఈ చైనీస్ తైపీ ప్లేయర్ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్‌లో సాత్విక్ జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–17, 21–15తో హి జి టింగ్–జౌ హావో డాంగ్ (చైనా) జంటపై గెలిచింది. -
పోరాడి ఓడిన లక్ష్యసేన్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో భారత పోరాటం ముగిసింది. ఏకైక ఆశాకిరణం లక్ష్యసేన్ కూడా సెమీ ఫైనల్లో ఓడిపోయాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో భారత షట్లర్ లక్ష్యసేన్ 21–13, 17–21, 13–21తో థాయ్‌లాండ్‌కు చెందిన రెండో సీడ్ కున్లావుత్ వితిద్సర్న్ చేతిలో పోరాడి ఓడాడు. గంటా 15 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో 21 ఏళ్ల భారత ఆటగాడు తొలి గేమ్‌లో సీడెడ్ ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచాడు. ఆరంభంలో 11–6 స్కోరు వద్ద పైచేయి సాధించాడు. కానీ థాయ్ ఆటగాడు వరుసగా నాలుగు పాయింట్లు చేశాడు. అయితే దీటుగా ఆడిన లక్ష్యసేన్ వరుసగా ఐదు పాయింట్లు సాధించాడు. అక్కడినుంచి గేమ్ తన నియంత్రణలోనే ముగిసింది. రెండో గేమ్ అయితే నువ్వానేనా అన్నట్లు సాగింది. కున్లావుత్ క్రాస్‌కోర్ట్ స్మాష్‌లతో పదును పెంచగా... దీటుగా ఎదుర్కొన్న భారత ఆటగాడు సుదీర్ఘ ర్యాలీలతో సత్తా చాటుకున్నాడు. స్థానిక షట్లర్ 12–10 వద్ద ఉన్నప్పుడు వరుసగా నాలుగు పాయింట్లు సాధించి జోరు పెంచినా చివరకు గేమ్ ప్రత్యర్థికే దక్కింది. నిర్ణాయక మూడో గేమ్‌లో లక్ష్యసేన్ పోరాడినా... కున్లావుత్ జోరు ముందు సేన్ ఆట ఫలితమివ్వలేదు. -
French Open 2023: గార్సియాకు షాక్
పారిస్: మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన కరోలిన్ గార్సియాకు అనూహ్య ఓటమి ఎదురైంది. సొంతగడ్డపై జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఈ ఫ్రాన్స్ స్టార్ రెండో రౌండ్‌ను దాటి ముందుకెళ్లలేకపోయింది. బుధవారం జరిగిన రెండో రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంకర్, ఐదో సీడ్ గార్సియా 6–4, 3–6, 5–7తో ప్రపంచ 56వ ర్యాంకర్ అనా బ్లింకోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. 2 గంటల 51 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో గార్సియా ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 50 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. వరుసగా నాలుగో ఏడాది ఈ టోర్నీలో ఆడుతున్న బ్లింకోవా ఐదుసార్లు గార్సియా సర్వీస్‌ను బ్రేక్ చేసి రెండోసారి మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. 2017 చాంపియన్, 17వ ర్యాంకర్ ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా) కూడా రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. ఒస్టాపెంకో 3–6, 6–1, 2–6తో పేటన్ స్టెర్న్స్ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 7–5, 6–2తో ఇరీనా షిమనోవిచ్ (బెలారస్)పై, తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా) 6–3, 6–4తో వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)పై, స్వితోలినా (ఉక్రెయిన్) 2–6, 6–3, 6–1తో స్టార్మ్ హంటర్ (ఆస్ట్రేలియా)పై గెలుపొంది మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) తొలి సెట్‌ను 6–2తో గెల్చుకున్నాక ఆమె ప్రత్యర్థి కామిల్లా జియార్జి (ఇటలీ) గాయం కారణంగా వైదొలిగింది. అల్కరాజ్ ముందుకు... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), 11వ సీడ్ ఖచనోవ్ (రష్యా) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. అల్కరాజ్ 6–1, 3–6, 6–1, 6–2తో టారో డానియల్ (జపాన్)పై, సిట్సిపాస్ 6–3, 7–6 (7/4), 6–2తో కార్బెలాస్ బేనా (స్పెయిన్)పై, ఖచనోవ్ 6–3, 6–4, 6–2తో రాడూ అల్బోట్ (మాల్డొవా)పై గెలిచారు. 2015 చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 4 గంటల 38 నిమిషాల పోరులో 6–3, 5–7, 3–6, 7–6 (7/4), 3–6తో కొకినాకిస్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. -
అబ్బాయిని పట్టించుకోవడం మర్చిపోయార్సార్!
హంగ్ వస్తే ఎలా కింగ్‌మేకర్ కావాలో అనే ఆలోచనలోనే ఉండి అబ్బాయిని పట్టించుకోవడం మర్చిపోయార్సార్! -
కుమారస్వామికి భంగపాటు...
-
కర్ణాటకలో మోదీ ప్రచారం ఎందుకు ప్రభావం చూపలేదు ?
-
Karnataka election results 2023: వాడిపోయిన కమలం
సాక్షి, నేషనల్ డెస్క్: కర్ణాటకలో ఆనవాయితీ మారలేదు. అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. శాసనసభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఘోర పరాజయం చవిచూసింది. మొత్తం 224 స్థానాలకు గాను 2018లో 104 స్థానాలు సాధించిన ఆ పార్టీ ఈసారి కేవలం 65 స్థానాలతో సరిపెట్టుకుంది. కనీసం అధికారానికి చేరువగా కూడా రాలేదు. ఈ ఓటమిని బీజేపీ పెద్దలు ఏమాత్రం ఊహించలేకపోయారు. హేమాహేమీలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం లేకుండాపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా కూడా గట్టెక్కించలేదు. రాష్ట్రంలో బీజేపీ పేలవమైన పనితీరుకు ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీని ముందుండి నడిపించడానికి బలమైన నాయకులు లేకుండాపోయారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా.. అంతా అధిష్టానం కనుసన్నల్లోనే సాగింది. ముఖ్యమంత్రి పదవి నుంచి యడియూరప్పను తొలగించి బసవరాజ్ బొమ్మైని గద్దెనెక్కించడం బీజేపీకి నష్టం చేకూర్చింది. ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రజలను ఏమాత్రం మెప్పించలేకపోయారు. బొమ్మై పరిపాలనపై రగిలిన అసంతృప్తి సెగలు బీజేపీ కొంపముంచాయి. ఇతర వర్గాలపై చిన్నచూపు రాష్ట్రంలో లింగాయత్, ఒక్కళిగ వంటి ప్రధాన సామాజిక వర్గాల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా బీజేపీ పలు హామీలు ఇచ్చింది. రిజర్వేషన్ల అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనార్టీలను ఆకట్టుపోవడంలో విఫలమైంది. ఇంతచేసినా లింగాయత్‌లు, ఒక్కళిగలు బీజేపీని ఆదరించలేదు. ముస్లింలు, దళితులు, ఓబీసీలు మాత్రమే కాకుండా లింగాయత్‌లు, ఒక్కళిగలు సైతం కాంగ్రెస్‌కే ఓటేశారు. పెచ్చరిల్లిన అవినీతి.. కమీషన్లు దందా ‘40 శాతం ప్రభుత్వం’అంటూ బీజేపీ సర్కారు కమీషన్ల దందాపై కాంగ్రెస్ చేసి ప్రచారం ప్రజల్లోకి వేగంగా దూసుకెళ్లింది. ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో అవినీతి అంశం ప్రముఖంగా తెరపైకి వచ్చింది. జనంలో విస్తృతంగా చర్చ జరిగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కేఎస్ ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేయడం బీజేపీకి ఇబ్బందికరంగా పరిణమించింది. అవినీతి బాగోతం, కమీషన్ల వ్యవహారంపై కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం ప్రధానికి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. ప్రభుత్వ వ్యతిరేకత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత నానాటికీ పెరిగింది. ఎన్నికల్లో ఓటమికి ఇదో ప్రధాన కారణమని చెప్పొచ్చు. నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతోపాటు బీజేపీ ఇచ్చిన హమీలు అమలు కాకపోవడం జనాన్ని నిరాశపర్చింది. ప్రజా వ్యతిరేకతను తగ్గించుకొనే ప్రయత్నాలేవీ బీజేపీ పెద్దలు చేయలేదు. బీజేపీ ఇంకా అధికారంలో కొనసాగితే ఒరిగేదేమీ లేదన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారు. అందుకే ఇంటికి సాగనంపారు. ప్రధాని మోదీ కర్ణాటకలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రైల్వే ప్రాజెక్టులు, జలవనరుల పథకాలు, రోడ్డు నిర్మాణాలు, ఎక్స్‌ప్రెస్ వే వంటివి చేపట్టినా ప్రజలు పట్టించుకోలేదు. పనిచేయని హిందూత్వ కార్డు హలాల్, హిజాబ్, అజాన్, జై భజరంగబలి, హనుమాన్ చాలీసా.. ఇవన్నీ కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ నమ్ముకున్న ఆయుధాలు. కర్ణాటకలో తలెత్తిన హలాల్, హిజాబ్, అజాన్ వివాదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారా యి. ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ మతాన్ని వాడుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, అవేవీ బీజేపీని కాపాడలేకపోయాయి. బీజేపీ హిందూత్వ కార్డు కర్ణాటకలో ఎంతమాత్రం పనిచేయలేదని స్పష్టంగా తేలిపోయింది. ఫలితాలపై స్పందన వచ్చే లోక్‌సభ ఎన్నికలతో మొదలయ్యే బీజేపీ అంతానికి ఆరంభం ఇది. దారుణ నిరంకుశ, ఆధిపత్య రాజకీయాలను జనం అంతంచేశారు. –తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఇకపై తమ పాచికలు పారవని బీజేపీ ఇకనైనా గుర్తించాలి. –ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. మెరుగైన ఎన్నికల వ్యూహం కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి కావొచ్చు –కర్ణాటక మాజీ సీఎం బొమ్మై ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా కొత్త సానుకూల భారత్ దిశగా ప్రజలిచ్చిన తిరుగులేని తీర్పు – ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడింది. మోదీతో ఏదైనా సాధ్యమనే నినాదాన్ని ప్రజలు తిప్పికొట్టారు. – ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ కాంగ్రెస్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్లో గెలవడమంటే కర్ణాటక రాష్ట్రాభివృద్ధే ముఖ్యమన్న ఆలోచనకు జై కొట్టడమే. దేశాన్ని ఐక్యం చేసే రాజకీయ గెలుపు ఇది. పార్టీ కోసం చెమట చిందించి పనిచేసిన కార్యకర్తలకు ప్రజలు చెల్లించిన మూల్యమిది. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు పార్టీ అవిశ్రాంతంగా పనిచేస్తుంది. రాహుల్ భారత్ జోడో పాదయాత్ర వెంటే విజయం పాదం కదిపింది. – ప్రియాంక గాంధీ -
బీజేపీ ఘోర పరాభవంపై కర్ణాటక సీఎం రియాక్షన్ ఇదే..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవంపై సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. మెజార్టీ సాధిచడంలో విఫలమయ్యామని, ఫలితాలను విశ్లేషిస్తామన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే తమ లోటుపాట్లను అధిగమించి ముందుకెళ్తామని బొమ్మై చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఫలితాలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తామన్నారు. మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప కూడా ఫలితాలపై స్పందించారు. గెలుపు ఓటములు తమకు కొత్తేం కాదన్నారు. కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవవరం లేదన్నారు. పార్టీ ఓటమికి గల కారణాలపై ఆత్మపరీశీలన చేసుకుంటామన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 135 స్థానాలకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతోంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మరోవైపు బీజేపీ కేవలం 65 స్థానాల్లోనే ముందంజలో ఉంది. జేడీఎస్ 22 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైనా 6 మంత్రాలివే.. -
Parenting: ఓడినప్పుడు అండగా నిలవండి
పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. అందరూ గెలవరు. కొందరు ఓడుతారు. గెలవడానికి ఎన్ని కారణాలో ఓడటానికి అన్ని కారణాలు. తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు ఒక క్షణం పిల్లలు తెచ్చిన ఫలితాలతో డిస్ట్రబ్ అయినా దండించే సందర్భం ఇది కాదు. పిల్లల ఓటమిని అర్థం చేసుకోవడమే ఇప్పుడు అవసరం. వారిని గమనించి తిరిగి ముందుకు నడపడమే అవసరం. ఓడిన పిల్లలకు అండగా నిలవండి. కొందరు లెక్కలేని పిల్లలు ఉంటారు. వీరు ఎగ్జామ్స్ బాగానే రాసినా రిజల్ట్స్ తేడాగా వస్తే పట్టించుకోరు. ఫెయిల్ అయితే మరీ కొంపలు మునిగినట్టుగా కూచోరు. నెక్ట్స్ టైమ్ చూసుకుందాం అన్నట్టు ఉంటారు. ఈజీగా ఉంటారు. కాని కొందరు పిల్లలు పరీక్షలు ఎలా రాశారో ఇంట్లో కచ్చిత అంచనాతో చెప్పరు. ఫెయిల్ అవుతామేమోనని భయపడుతూ ఉంటారు. ఫెయిల్ అయితే ఇక పూర్తిగా ముడుచుకుపోతారు. తల్లిదండ్రుల ముందుకు రారు. బంధువుల్లో పరువుపోయిందని బాగా బెంబేలు పడతారు. ఎవరితోనూ కలవరు. ఇక భవిష్యత్తు ముగిసినట్టే భావిస్తారు. వీరితోనే సమస్య. వీరు ఏ క్షణమైనా పేలే బుడగలాంటివారు. ఇలాంటి వారితో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. స్నేహితుల్ని, బంధువుల్ని అప్రమత్తం చేయాలి. ఈ దశ నుంచి వారిని సక్రమంగా బయటపడేయాలి. ఫెయిల్ ఎందుకు? ఈ ప్రశ్న పిల్లల్ని అడిగే ముందు పెద్దలే ప్రశ్నించుకోవాలి. పిల్లల్ని సరైన బడి/కాలేజ్‌లోనే చేర్చారా? అక్కడ పాఠాలు సరిగా జరిగాయా? సిలబస్ పూర్తి చేశారా? నోట్స్ సరిగా ఇచ్చారా? స్టూడెంట్ ఆ సబ్జెక్ట్స్ ఎలా ఫాలో అవుతున్నాడో ఎందులో వీక్ ఉన్నాడో టీచర్లు ఇంటికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారా? పిల్లలకు ట్యూషన్ అవసరమైతే సరైన ట్యూషన్ పెట్టించారా? పిల్లలు చదివే వాతావరణం ఇంట్లో ఉందా? వారు చదువుకునే వీలు లేకుండా అస్తమానం పనులు చెప్తూ, టీవీ మోగిస్తూ, ఇంట్లో నాన్ సీరియస్ వాతావరణం పెట్టారా? పరీక్షల సమయంలో సిలబస్‌ను సరిగా విభజించుకుని చదవగలిగాడా? ఎగ్జామ్‌లో ఇచ్చిన ప్రశ్నలకు టైమ్ మేనేజ్మెంట్ చేయగలిగాడా? ఎగ్జామ్ భయంతో ఏమీ రాయలేకపోయాడా?... ఇవన్నీ ఫెయిల్ అవడానికి కారణాలు. టెన్త్ వరకూ అందరికీ తప్పదు కాని ఇంటర్ విషయానికి వచ్చేసరికి ఇష్టమైన కోర్సులో చేర్చారా? చదవే ఆసక్తి, శక్తి ఉన్న సబ్జెక్ట్స్లోనే చేర్చారా?... ఇవీ ముఖ్యమైన విషయాలే. ఏం చేయకూడదు? పిల్లలు ఫెయిల్ అయ్యారని తెలియగానే ముందు వారికి నొప్పి కలిగే మాట ఏదీ మాట్లాడకూడదు. వారితో మాట్లాడటం మానేయకూడదు. కొట్టడం ఇంకా చెడ్డ చర్య. ఎవరితో పోల్చకూడదు. బాగా మంచి మార్కులతో పాసైన వారిని చూపించి వీరిని హేళన చేయకూడదు. భోజనాల దగ్గర ‘మింగుదూ రా’ లాంటి మాటలు పొరపాట్న కూడా మాట్లాడకూడదు. తోబుట్టువులను ఉసిగొల్పకూడదు. కొంతమంది తల్లిదండ్రులు ఏడ్చి, నెత్తి బాదుకుని భయభ్రాంతం చేస్తారు. ఏమాత్రం కూడదు. ఆడపిల్లైతే ‘పెళ్లి చేసి పారేస్తాం’ అని మగపిల్లలైతే ‘నాలుగు గేదెలు కొనిస్తాం. మేపుకో’ అని అనడం చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఏం చేయాలి? ‘మరో అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మరేం పర్వాలేదు’ అని చెప్పాలి. ‘నీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? ఈ పరీక్షలు పాస్ కావడంలో నీకు ఎదురైన సమస్య ఏమిటి?’ అని తెలుసుకోవాలి. ఒకవేళ పిల్లవాడు బాగా రాశాననే నమ్మకం ఉంటే రీవాల్యుయేషన్‌కు వెళ్లాలి. ప్రతి స్టూడెంట్‌కు ఎవరో ఒక టీచర్/లెక్చరర్ మీద గురి ఉంటుంది. కొంత చనువు ఉంటుంది. అలాంటి వారి దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేయించాలి. ఇది తాత్కాలిక అడ్డంకి అని దీనిని దాటి ముందుకు పోవచ్చని భరోసా ఇవ్వాలి. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధిస్తావ్ అని చెప్పాలి. స్నేహితులతో కూడా ఇవే మాటలు చెప్పించాలి. ఆరోగ్యం, ఆయుష్షు ఉంటే జీవితంలో చాలా సాధించవచ్చని ఆశ కల్పించాలి. ఈ సమయంలో వారిని ఒంటరిగా వదలకూడదు. చదువు ముఖ్యమే కాని చదువు కంటే జీవితం ముఖ్యమనే విషయం బోధపరచాలి. తల్లిదండ్రులు కూడా అదేసంగతి తెలుసుకోవాలి. ‘తక్కువ మార్కులతో పాసైన వారు ఎక్కువ మార్కులతో పాసైనవారిని భవిష్యత్తులో జీతానికి పెట్టుకోవచ్చు’. చెప్పలేం కదా. పిల్లలు ఫెయిల్ అయ్యారని తెలియగానే ముందు వారికి నొప్పి కలిగే మాట ఏదీ మాట్లాడకూడదు. వారితో మాట్లాడటం మానేయకూడదు. కొట్టడం ఇంకా చెడ్డ చర్య. ఎవరితో పోల్చకూడదు. బాగా మంచి మార్కులతో పాసైన వారిని చూపించి వీరిని హేళన చేయకూడదు. భోజనాల దగ్గర ‘మింగుదూ రా’ లాంటి మాటలు పొరపాట్న కూడా మాట్లాడకూడదు. తోబుట్టువులను ఉసిగొల్పకూడదు. -
IPL 2023: తిరుగులేని టైటాన్స్
ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో గురువారం వరకు జరిగిన 47 మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఏ జట్టూ కూడా 18 ఓవర్లలోపు ఆలౌట్ కాలేదు. కానీ శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ పేలవ ఆటతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే కుప్పకూలింది. గుజరాత్ టైటాన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు సొంతగడ్డపై నిలవలేకపోయిన రాయల్స్ భారీ ఓటమిని ఎదుర్కొంది. 119 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఏకంగా 37 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన గుజరాత్... గత మ్యాచ్‌లో తమ వేదికపై రాజస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి ఈ గెలుపుతో లెక్క సరి చేసింది. జైపూర్: డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్లో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టపర్చుకుంది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ 9 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. సంజూ సామ్సన్ (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ (3/14) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం గుజరాత్ 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 119 పరుగులు సాధించి గెలిచింది. వృద్ధిమాన్ సాహా (34 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) శుబ్‌మన్ గిల్ (35 బంతుల్లో 36; 6 ఫోర్లు) గెలిపించారు. సమష్టి వైఫల్యం... పాండ్యా తొలి ఓవర్లోనే బట్లర్ (8) వెనుదిరగ్గా... షమీ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో జోరు ప్రదర్శించిన గత మ్యాచ్ హీరో యశస్వి జైస్వాల్ (14) దురదృష్టవశాత్తూ రనౌట్ కావడంతో జట్టు పతనం మొదలైంది. సామ్సన్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడిన షాట్‌ను అభినవ్ చక్కటి ఫీల్డింగ్‌తో ఆపగా, బంతిని అందుకున్న మోహిత్ నాన్‌స్ట్రయికింగ్ ఎండ్ వైపు విసిరాడు. సింగిల్ కోసం ప్రయత్నించి జైస్వాల్ దూసుకురాగా, సామ్సన్ స్పందించలేదు. ఇద్దరూ ఒకేవైపు ఉండిపోగా, జైస్వాల్ వెనక్కి వెళ్లటంలో విఫలమయ్యాడు. టీమ్‌ను ఆదుకోవాల్సిన సామ్సన్ కూడా తర్వాతి ఓవర్లోనే అవుట్ కావడం రాయల్స్‌ను దెబ్బ తీసింది. ఆ తర్వాత ఏ ఒక్కరూ పట్టుదల ప్రదర్శించకపోవడంతో జట్టు కోలుకోలేకపోయింది. అలవోకగా... స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ ఆడుతూ పాడుతూ అందుకుంది. ఓపెనర్లు సాహా, గిల్ చకచకా పరుగులు సాధించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 9 ఫోర్లతో 49 పరుగులకు చేరింది. తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు గిల్‌ను అవుట్ చేసి రాయల్స్ ఈ జోడీని విడదీసింది. జంపా ఓవర్లో పాండ్యా వరుస బంతుల్లో 6, 4, 6, 6 బాదడం ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (రనౌట్) 14; బట్లర్ (సి) మోహిత్ (బి) పాండ్యా 8; సామ్సన్ (సి) పాండ్యా (బి) లిటిల్ 30; పడిక్కల్ (బి) నూర్ 12; అశ్విన్ (బి) రషీద్ 2; పరాగ్ (ఎల్బీ) (బి) రషీద్ 4; హెట్‌మైర్ (ఎల్బీ) (బి) రషీద్ 7; జురేల్ (ఎల్బీ) (బి) నూర్ 9; బౌల్ట్ (బి) షమీ 15; జంపా (రనౌట్) 7; సందీప్ శర్మ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (17.5 ఓవర్లలో ఆలౌట్) 118. వికెట్ల పతనం: 1–11, 2–47, 3–60, 4–63, 5–69, 6–77, 7–87, 8–96, 9–112, 10–118. బౌలింగ్: షమీ 4–0–27–1, పాండ్యా 2–0–22–1, రషీద్ 4–0–14–3, లిటిల్ 4–0–24–1, నూర్ 3–0–25–2, మోహిత్ 0.5–0–5–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (నాటౌట్) 41; గిల్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 36; పాండ్యా (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 119. వికెట్ల పతనం: 1–71. బౌలింగ్: బౌల్ట్ 3–0–28–0, సందీప్ శర్మ 3–0–19–0, జంపా 3–0–40–0, చహల్ 3.5–0–22–1, అశ్విన్ 1–0–8–0. ఐపీఎల్లో నేడు చెన్నైX ముంబై (మధ్యాహ్నం గం. 3:30 నుంచి) ఢిల్లీ X బెంగళూరు (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2023: కోల్‌కతా ప్రతీకారం
సన్‌రైజర్స్ విజయానికి ఒకదశలో 30 బంతుల్లో 38 పరుగులే కావాలి... చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. కెప్టెన్ మార్క్రమ్ కూడా అప్పుడే జోరు పెంచాడు... సొంత గడ్డపై గెలుపు ఖాయమనిపించింది. కానీ అంతా తలకిందులైంది. ఓటమి దిశగా వెళుతున్న కోల్‌కతా ఒక్కసారిగా పుంజుకుంది. పదునైన బౌలింగ్‌తో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసి చివరి వరకు ఆటను తీసుకొచ్చింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి వేసిన ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా 3 పరుగులే వచ్చాయి. దాంతో నైట్‌రైడర్స్ ఊపిరి పీల్చుకోగా, రైజర్స్ నిరాశలో మునిగింది. సాక్షి, హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్‌లో ఎదురైన పరాజయానికి ఉప్పల్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ప్రతీకారం తీర్చుకుంది. గురువారం జరిగిన ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా 5 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రింకూ సింగ్ (35 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రాణా (31 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేయగలిగింది. మార్క్రమ్ (40 బంతుల్లో 41; 4 ఫోర్లు), క్లాసెన్ (20 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించినా ఫలితం దక్కలేదు. కీలక భాగస్వామ్యం... ఒక్కరూ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడకపోయినా... కీలక ఆటగాళ్లంతా తలా ఓ చేయి వేయడంతో కోల్‌కతా చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. మార్కో జాన్సెన్ తన తొలి ఓవర్లోనే గుర్బాజ్ (0), వెంకటేశ్ అయ్యర్ (7)లను అవుట్ చేసి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. జేసన్ రాయ్ (19 బంతుల్లో 20; 4 ఫోర్లు) కూడా ధాటిగా ఆడటంలో విఫలమయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 43 పరుగులకు చేరింది. ఈ దశలో కెప్టెన్ రాణా, రింకూ కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 40 బంతుల్లో 61 పరుగులు జోడించారు. కార్తీక్ త్యాగి ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 6తో రాణా దూకుడు ప్రదర్శించాడు. అయితే మార్క్రమ్ అద్భుత క్యాచ్‌కు రాణా వెనుదిరగ్గా... ఆండ్రీ రసెల్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ఎక్కువసేపు నిలవలేదు. సన్‌రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఇన్నింగ్స్ చివర్లో కూడా కేకేఆర్ ఆశించినన్ని పరుగులు చేయలేకపోయింది. ఆఖరి 5 ఓవర్లలో ఆ జట్టు 42 పరుగులే సాధించింది. క్లాసెన్ మెరిసినా... ఛేదనలో రైజర్స్ కూడా తడబడింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (18), అభిషేక్ శర్మ (9)లతో పాటు తక్కువ వ్యవధిలో రాహుల్ త్రిపాఠి (9 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్), హ్యారీ బ్రూక్ (0) వికెట్లను జట్టు కోల్పోయింది. అయితే మార్క్రమ్, క్లాసెన్ భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. చక్కటి షాట్లతో, సమన్వయంతో వీరిద్దరు పరుగులు రాబట్టారు. తన తొలి ఫోర్ కొట్టేందుకు మార్క్రమ్ 23 బంతులు తీసుకున్నా... అనుకూల్ రాయ్ ఓవర్లో రెండు సిక్సర్లతో క్లాసెన్ దూకుడు ప్రదర్శించాడు. ఐదో వికెట్‌కు 47 బంతుల్లో 70 పరుగులు జోడించిన అనంతరం క్లాసెన్ వెనుదిరిగాడు. అయితే మార్క్రమ్ క్రీజ్‌లో ఉన్నంత వరకు రైజర్స్ గెలుపుపై ధీమాగానే ఉంది. 20 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన స్థితిలో కెప్టెన్ వెనుదిరిగారు. తర్వాతి బ్యాటర్లు మిగిలిన పనిని పూర్తి చేయలేకపోయారు. సమద్ (18 బంతుల్లో 21; 3 ఫోర్లు) కొంత పోరాడినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) కార్తీక్ త్యాగి 20; గుర్బాజ్ (సి) బ్రూక్ (బి) జాన్సెన్ 0; వెంకటేశ్ అయ్యర్ (సి) క్లాసెన్ (బి) జాన్సెన్ 7; నితీశ్ రాణా (సి అండ్ బి) మార్క్రమ్ 42; రింకూ సింగ్ (సి) సమద్ (బి) నటరాజన్ 46; రసెల్ (సి) నటరాజన్ (బి) మార్కండే 24; నరైన్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) భువనేశ్వర్ 1; శార్దుల్ ఠాకూర్ (సి) సమద్ (బి) నటరాజన్ 8; అనుకూల్ రాయ్ (నాటౌట్) 13; హర్షిత్ (రనౌట్) 0; వైభవ్ అరోరా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–8, 2–16, 3–35, 4–96, 5–127, 6–130, 7–151, 8–168, 9–168. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–1, జాన్సెన్ 3–0–24–2, కార్తీక్ త్యాగి 2–0–30–1, మార్క్రమ్ 3–0–24–1, నటరాజన్ 4–0–30–2, మార్కండే 4–0–29–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) రసెల్ (బి) శార్దుల్ ఠాకూర్ 9; మయాంక్ అగర్వాల్ (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 18; రాహుల్ త్రిపాఠి (సి) వైభవ్ అరోరా (బి) రసెల్ 20; మార్క్రమ్ (సి) రింకూ సింగ్ (బి) వైభవ్ అరోరా 41; హ్యారీ బ్రూక్ (ఎల్బీ) (బి) అనుకూల్ రాయ్ 0; క్లాసెన్ (సి) రసెల్ (బి) శార్దుల్ ఠాకూర్ 36; సమద్ (సి) అనుకూల్ రాయ్ (బి) వరుణ్ చక్రవర్తి 21; జాన్సెన్ (సి) గుర్బాజ్ (బి) వైభవ్ అరోరా 1; భువనేశ్వర్ (నాటౌట్) 5; మార్కండే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–29, 2–37, 3–53, 4–54, 5–124, 6–145, 7–152, 8–165. బౌలింగ్: హర్షిత్ 4–0–27–1, వైభవ్ 3–0–32–2, శార్దుల్ 3–0– 23–2, రసెల్ 1–0–15–1, అనుకూల్ రాయ్ 3–0–26–1, నరైన్ 2–0–16–0, వరుణ్ చక్రవర్తి 4–0–20–1. ఐపీఎల్లో నేడు రాజస్తాన్ X గుజరాత్ (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
ఐపీల్ 2023 నుండి సన్‌రైజర్స్ హైదరాబాద్ అవుట్?
-
IPL2023: రైజర్స్ జోరుకు బ్రేక్....
వరుసగా రెండు విజయాలతో జోరు పెంచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సొంతగడ్డపై అడ్డుకట్ట పడింది. కొంత పోరాటపటిమ కనబర్చినా చివరకు విజయం మాత్రం దక్కలేదు. అన్ని రంగాల్లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ ‘హ్యాట్రిక్’ గెలుపుతో సత్తా చాటింది. కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ విజయంలో కీలకపాత్ర పోషించగా... ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోవడంతో రైజర్స్ ఉప్పల్‌లో చతికిలపడింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ ఖాతాలో మరో ఓటమి చేరింది. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కామెరాన్ గ్రీన్ (40 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, ఇషాన్ కిషన్ (31 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (17 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. అనంతరం హైదరాబాద్ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (41 బంతుల్లో 48; 4 ఫోర్లు,1 సిక్స్), హెన్రిచ్ క్లాసెన్ (16 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సూర్యకుమార్ విఫలం... కెప్టెన్ రోహిత్ శర్మ (18 బంతుల్లో 28; 6 ఫోర్లు) ముంబై ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలు పెట్టాడు. సుందర్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను ఈ క్రమంలో ఐపీఎల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. నటరాజన్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన రోహిత్, అదే ఓవర్లో వెనుదిరిగాడు. పవర్‌ప్లేలో ముంబై 53 పరుగులు చేసింది. అనంతరం రైజర్స్ బౌలింగ్ కట్టుదిట్టంగా సాగడంతో ముంబై స్కోరు వేగం మందగించింది. జాన్సెన్ ఒకే ఓవర్లో కిషన్, సూర్యకుమార్ (7)లను అవుట్ చేసి దెబ్బ కొట్టాడు. ఈ రెండు క్యాచ్‌లను మార్క్రమ్ అద్భుతంగా అందుకున్నాడు. 14 ఓవర్లలో ముంబై 109 పరుగులు చేసింది. అయితే చివరి 6 ఓవర్లలో చెలరేగిన ఆ జట్టు 83 పరుగులు రాబట్టింది. నటరాజన్ వేసిన 18వ ఓవర్లో వరుస బంతుల్లో గ్రీన్ 4, 4, 4, 6 తో చెలరేగడం విశేషం. ఈ క్రమంలో 33 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. భువీ తన చివరి 2 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చినా, ఇతర బౌలర్లు విఫలమయ్యారు. తిలక్ జోరు... సొంతగడ్డపై ప్రత్యర్థి జట్టు హైదరాబాద్‌పై తిలక్ వర్మ సత్తా చాటాడు. తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్‌లో ఉన్న 24 నిమిషాల్లో ఫటాఫట్ బ్యాటింగ్ ప్రదర్శించాడు. జాన్సెన్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన అతను... మర్కండే, భువీ బౌలింగ్‌లో ఒక్కో సిక్సర్ బాదాడు. భువీ బౌలింగ్‌లో మరో షాట్‌కు ప్రయత్నించి కవర్స్‌లో చిక్కడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. సమష్టి వైఫల్యం... ఛేదనలో రైజర్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. గత మ్యాచ్ హీరో బ్రూక్ (9), రాహుల్ త్రిపాఠి (7)లను బెహ్రన్‌డార్ఫ్ తన వరుస ఓవర్లో అవుట్ చేశాడు. మరో ఎండ్‌లో మయాంక్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 6 ఓవర్లలో జట్టు స్కోరు 2 వికెట్లకు 42. మార్క్రమ్ (17 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోగా, అభిషేక్ (1) కూడా వెంటనే అవుటయ్యాడు. రైజర్స్ గెలుపు అవకాశాలు సన్నగిల్లుతున్న దశలో చావ్లా వేసిన 14వ ఓవర్ ఆశలు రేపింది. ఈ ఓవర్లో క్లాసెన్ వరుసగా 4, 6, 6, 4 బాదాడు. అయితే చివరి బంతికి అతను అవుట్ కావడంతో పరిస్థితి మళ్లీ మారిపోయింది. తర్వాతి ఓవర్లో మయాంక్ వెనుదిరిగాక జట్టు ఓటమి లాంఛనమే అయింది. అర్జున్ టెండూల్కర్ తన తొలి ఐపీఎల్ వికెట్‌తో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగించగానే ముంబై సంబరాల్లో మునిగిపోయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మార్క్రమ్ (బి) నటరాజన్ 28; ఇషాన్ కిషన్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 38; గ్రీన్ (నాటౌట్) 64; సూర్యకుమార్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 7; తిలక్ (సి) మయాంక్ (బి) భువనేశ్వర్ 37; డేవిడ్ (రనౌట్) 16; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–41, 2–87, 3–95, 4–151, 5–192. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–31–1, జాన్సెన్ 4–0–43–2, సుందర్ 4–0–33–0, నటరాజన్ 4–0–50–1, మర్కండే 4–0–35–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బ్రూక్ (సి) సూర్యకుమార్ (బి) బెహ్రన్‌డార్ఫ్ 9; మయాంక్ (సి) డేవిడ్ (బి) మెరిడిత్ 48; త్రిపాఠి (సి) ఇషాన్ కిషన్ (బి) బెహ్రన్‌డార్ఫ్ 7; మార్క్రమ్ (సి) షోకీన్ (బి) గ్రీన్ 22; అభిషేక్ (సి) డేవిడ్ (బి) చావ్లా 1; క్లాసెన్ (సి) డేవిడ్ (బి) చావ్లా 36; సమద్ (రనౌట్) 9; జాన్సెన్ (సి) డేవిడ్ (బి) మెరిడిత్ 13; సుందర్ (రనౌట్) 10; భువనేశ్వర్ (సి) రోహిత్ (బి) అర్జున్ 2; మర్కండే (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 178. వికెట్ల పతనం: 1–11, 2–25, 3–71, 4–72, 5–127, 6–132, 7–149, 8–165, 9–174, 10–178. బౌలింగ్: అర్జున్ టెండూల్కర్ 2.5–0–18–1, బెహ్రన్‌డార్ఫ్ 4–0–37–2, మెరిడిత్ 4–0–33–2, షోకీన్ 1–0–12–0, చావ్లా 4–0–43–2, గ్రీన్ 4–0–29–1. -
బెంగళూరు చిన్నబోయింది! పరుగుల వరద పారిన పోరులో ఓడిన ఆర్సీబీ
బెంగళూరు: పరుగుల వరద పారిన పోరు... ఏకంగా 33 సిక్సర్లు నమోదు... చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) భారీ స్కోరు సాధిస్తే మేమేం తక్కువ అన్నట్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కూడా విరుచుకుపడింది. అయితే తుది ఫలితంలో మాత్రం సూపర్ కింగ్స్‌దే పైచేయి అయింది. ఒకదశలో గెలుపు ఖాయమనిపించిన ఆర్సీబీ ఓటమి బాట పట్టడంతో చిన్నస్వామి మైదానంలో అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై 8 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (45 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), శివమ్ దూబే (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీలు సాధించగా, అజింక్య రహానే (20 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులు చేసి ఓడిపోయింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (36 బంతుల్లో 76; 3 ఫోర్లు, 8 సిక్స్‌లు), డుప్లెసిస్ (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 61 బంతుల్లోనే 126 పరుగులు జోడించారు. సమష్టి ప్రదర్శన... సిరాజ్ తొలి ఓవర్లోనే రుతురాజ్ (3) అవుట్ కావడంతో చెన్నైకి సరైన ఆరంభం లభించలేదు. అయితే రహానే, కాన్వే భాగస్వామ్యంలో స్కోరు జోరందుకుంది. వీరిద్దరు పోటీ పడి పరుగులు సాధించడంతో పవర్‌ప్లేలో స్కోరు 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 పరుగులకు చేరింది. హసరంగ తన తొలి ఓవర్లో చక్కటి బంతితో రహానేను బౌల్డ్ చేయడంతో 74 పరుగుల (43 బంతుల్లో) భాగస్వామ్యం ముగిసింది. అయితే ఆ తర్వాత కాన్వే, దూబే మరింత ధాటిగా పరుగులు సాధించారు. వైశాక్ ఓవర్లో కాన్వే 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా, సిరాజ్ ఓవర్లో దూబే ఫోర్, సిక్స్ బాదాడు. వైశాక్ తర్వాతి ఓవర్లో వీరిద్దరు 19 పరుగులు రాబట్టారు. కాన్వే 32 బంతుల్లో, దూబే 25 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్‌కు 80 పరుగులు (37 బంతుల్లో) జోడించిన వీరిద్దరు ఎనిమిది బంతుల వ్యవధిలో వెనుదిరిగినా... చివర్లో అంబటి రాయుడు (6 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్), మొయిన్ అలీ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 సిక్స్‌లు) వేగంగా ఆడి కీలక పరుగులు జోడించారు. దాంతో ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టు 25వసారి 200 అంతకంటే ఎక్కువ స్కోరు చేసింది. శతక భాగస్వామ్యం... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీకి షాక్ తగిలింది. ఆకాశ్ సింగ్ తొలి ఓవర్లోనే కోహ్లి (6) షాట్‌ను వికెట్లపైకి ఆడుకోగా, ఆ వెంటనే లోమ్రోర్ (0) వెనుదిరిగాడు. అయితే డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ అద్భుత భాగస్వామ్యం జట్టును నడిపించింది. వీరిద్దరు చెన్నై బౌలర్లందరిపై విరుచుకుపడి పరుగుల వర్షం కురిపించారు. ‘సున్నా’ వద్ద డుప్లెసిస్ క్యాచ్‌ను ధోని వదిలేయడం కూడా కలిసొచ్చింది. ఆకాశ్ ఓవర్లో మ్యాక్స్‌వెల్ 2 సిక్స్‌లు బాదగా, అతని తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. తుషార్ ఓవర్లో డుప్లెసిస్ వరుస బంతుల్లో 4, 4, 6... తీక్షణ ఓవర్లో మ్యాక్సీ 2 సిక్స్‌లు కొట్టడంతో ఆరు ఓవర్లలోనే స్కోరు 75 పరుగులకు చేరింది. ఈ క్రమంలో డుప్లెసిస్ 23 బంతుల్లో, మ్యాక్స్‌వెల్ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నారు. 12వ ఓవర్ వరకు వీరి ధాటి కొనసాగింది. అయితే వరుస ఓవర్లలో వీరిద్దరిని అవుట్ చేయడంతో చెన్నైకి మళ్లీ పట్టు చిక్కింది. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) గెలిపించేందుకు ప్రయత్నించినా చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఉత్కంఠ క్షణాలను దాటి మ్యాచ్‌ను కాపాడుకుంది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) పార్నెల్ (బి) సిరాజ్ 3; కాన్వే (బి) హర్షల్ 83; రహానే (బి) హసరంగ 37; దూబే (సి) సిరాజ్ (బి) పార్నెల్ 52; రాయుడు (సి) కార్తీక్ (బి) వైశాక్ 14; అలీ (నాటౌట్) 19; జడేజా (సి) (సబ్) ప్రభుదేశాయ్ (బి) మ్యాక్స్‌వెల్ 10; ధోని (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 226. వికెట్ల పతనం: 1–16, 2–90, 3–170, 4–178, 5–198, 6–224. బౌలింగ్: సిరాజ్ 4–0–30–1, పార్నెల్ 4–0–48–1, వైశాక్ 4–0–62–1, మ్యాక్స్‌వెల్ 2.4–0–28–1, హసరంగ 2–0–21–1, హర్షల్ పటేల్ 3.2–0–36–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) ఆకాశ్ 6; డుప్లెసిస్ (సి) ధోని (బి) అలీ 62; లోమ్రోర్ (సి) రుతురాజ్ (బి) తుషార్ 0; మ్యాక్స్‌వెల్ (సి) ధోని (బి) తీక్షణ 76; షహబాజ్ (సి) రుతురాజ్ (బి) పతిరణ 12; కార్తీక్ (సి) తీక్షణ (బి) తుషార్ 28; ప్రభుదేశాయ్ (సి) జడేజా (బి) పతిరణ 19; పార్నెల్ (సి) దూబే (బి) తుషార్ 2; హసరంగ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 218. వికెట్ల పతనం: 1–6, 2–15, 3–141, 4–159, 5–191, 6–192, 7–197, 8–218. బౌలింగ్: ఆకాశ్ సింగ్ 3–0–35–1, తుషార్ దేశ్‌పాండే 4–0–45–3, తీక్షణ 4–0–41–1, జడేజా 4–0–37–0, పతిరణ 4–0–42–2, మొయిన్ అలీ 1–0–13–1. -
కేసీఆర్‌ను గద్దె దించేందుకు అందరూ సిద్ధం: పొంగులేటి
సాక్షి, ఖమ్మం/ఎన్టీఆర్: తెలంగాణలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును గద్దె దించి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో శ్రీతిరుపతమ్మవారిని ఆదివారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కేసీఆర్‌ను గద్దె దించేందుకు ఏ పార్టీ ముందడుగు వేస్తుందో ఆ పారీ్టకే ప్రజల మద్దతు ఉంటుందని, ఆ పార్టీ వైపే తన పయనమని స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయం మేరకు తాను ఏ పార్టీలో చేరాలనే అంశంపై మే నెలలో ప్రణాళిక నిర్ణయిస్తామని తెలిపారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలేవీ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. పొంగులేటి పర్యటనలో మధిర నాయకులు కోట రాంబాబు, ముదిగొండ మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తుల వెంకటరావు, బోనకల్లు సర్పంచ్ సైదా తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఖమ్మంలో 10కి 10 స్థానాలు బీఆర్ఎస్వే.. ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ -
Spain Masters 2023 Final: సింధుకు నిరాశ
మాడ్రిడ్: ఈ ఏడాది ఫైనల్ చేరిన తొలి టోర్నీలో విజేతగా నిలిచి తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా తున్‌జంగ్ (ఇండోనేసియా) కేవలం 29 నిమిషాల్లో 21–8, 21–8తో సింధును ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. గతంలో సింధుతో ఆడిన ఏడుసార్లూ ఓడిపోయిన మరిస్కా ఎనిమిదో ప్రయత్నంలో తొలిసారి గెలుపొందడం విశేషం. ఫైనల్లో సింధు ఏదశలోనూ మరిస్కాకు పోటీనివ్వలేకపోయింది. విన్నర్ మరిస్కాకు 15,750 డాలర్లు (రూ. 12 లక్షల 93 వేలు), రన్నరప్ సింధుకు 7,980 డాలర్లు (రూ. 6 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
క్వార్టర్స్‌లో సాకేత్–యూకీ జోడీ ఓటమి
దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ చాంపియన్‌షిలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 2–6, 2–6తో లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్)–హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్, యూకీ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. నాలుగుసార్లు తమ సర్వీస్‌ను కోల్పోయిన భారత జోడీ ప్రత్యర్థి జంట సర్విస్‌లో మూడుసార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలను వదులుకుంది. క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సాకేత్–యూకీ బాంబ్రీలకు 23,660 డాలర్ల (రూ. 19 లక్షల 52 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. ఇదే టోర్నీలో రామ్‌కుమార్ (భారత్)–ఐజామ్ ఖురేషీ (పాకిస్తాన్) జోడీ తొలి రౌండ్లో 4–6, 6–3, 5–10తో సాండెర్ జిలె–విలెజిన్ (బెల్జియం) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
Indian Super League: హైదరాబాద్ ఎఫ్‌సీ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టుకు అనూహ్య ఓటమి ఎదురైంది. జంషెడ్పూర్ ఎఫ్‌సీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 2–3 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. జంషెడ్పూర్ తరఫున రిత్విక్ దాస్ (22వ ని.లో), జే ఇమ్మాన్యుయెల్ థామస్ (27వ ని.లో), డానియల్ చుక్వు (29వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... హైదరాబాద్ తరఫున ఒగ్బెచె (12వ, 79వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. -
Davis Cup: వరల్డ్ గ్రూప్–2కు పడిపోయిన భారత్
హిలెరాడ్ (డెన్మార్క్): ప్రపంచ పురుషుల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్ డేవిస్ కప్‌లో 2019లో కొత్త ఫార్మాట్ మొదలుపెట్టాక... భారత జట్టు తొలిసారి వరల్డ్ గ్రూప్–2కు పడిపోయింది. డెన్మార్క్ జట్టుతో ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 2–3 తేడాతో ఓడిపోయింది. తొలి రోజు రెండో సింగిల్స్‌లో సుమిత్ నగాల్ 4–6, 6–3, 6–4తో ఆగస్ట్ హోమ్‌గ్రెన్‌ను ఓడించడంతో భారత్ స్కోరున 1–1తో సమం చేసింది. అయితే రెండో రోజు డబుల్స్ మ్యాచ్‌లో హోల్గర్ రూన్–ఇంగిల్డ్‌సెన్ జోడీ 6–2, 6–4తో 65 నిమిషాల్లో రోహన్ బోపన్న–యూకీ బాంబ్రీ ద్వయంపై గెలిచి డెన్మార్క్‌కు 2–1తో ఆధిక్యం అందించింది. నాలుగో మ్యాచ్‌లో హోల్గర్ రూన్ 7–5, 6–3తో సుమిత్ నగాల్‌పై నెగ్గడంతో డెన్మార్క్ 3–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో... నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 6–4, 7–6 (7/1)తో ఎల్మెర్ మోలెర్‌ను ఓడించాడు. -
Thailand Open: పోరాడి ఓడిన సాయిప్రణీత్
థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. భారత్ నుంచి బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. బ్యాంకాక్‌లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన ప్రపంచ 49వ ర్యాంకర్ సాయిప్రణీత్ 17–21, 23–21, 18–21తో ప్రపంచ 23వ ర్యాంకర్, ఆరో సీడ్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో సాయిప్రణీత్ స్కోరు 12–12 వద్ద ఉన్నపుడు తడబడి వరుసగా ఆరు పాయింట్లు సమర్పించుకోవడం టర్నింగ్ పాయింట్ అయింది. సాయిప్రణీత్‌కు 1,260 డాలర్ల (రూ. 1 లక్ష 3 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 3,850 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Davis Cup 2023: తొలి సింగిల్స్‌లో యూకీ బాంబ్రీ ఓటమి
హిలెరాడ్ (డెన్మార్క్): భారత్‌తో జరుగుతున్న డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్స్ తొలి రౌండ్ పోటీలో డెన్మార్క్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హోల్గర్ రూన్ 6–2, 6–2తో యూకీ బాంబ్రీని ఓడించాడు. కేవలం 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 19 ఏళ్ల రూన్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఏటీపీ ప్రొఫెషనల్ సర్క్యూట్లో సింగిల్స్ మ్యాచ్‌లు ఆడటం మానేసిన యూకీ ఈ మ్యాచ్‌లో ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయాడు. నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసిన యూకీ ఒక్కసారి కూడా ప్రత్యర్థి సర్వీస్‌లో బ్రేక్ పాయింట్ అవకాశం సంపాదించలేకపోయాడు. -
మంచి మాట: విజయం ఓటమి తర్వాత వేకువ
ఓటమి ద్వారా వచ్చే విజయం ఉంది! అది ఓటమి నేర్పే పాఠం!! ఓటమి నేర్పే పాఠం ఎంతో ముఖ్యమైంది ఆపై విలువైంది; అది మరేవిధంగానూ రాదు. ఓటమి దెబ్బ బలంగా తగిలినా మనిషి పడిపోకుండా నిలబడి ఆ పాఠాన్ని చదవాలి. ఓటమి నేర్పిన పాఠాన్ని సరిగ్గా చదవగలిగిన మనిషికి భవిష్యత్తులో విజయం అందుతుంది; విజయవంతమైన భవిష్యత్తు అందుతుంది. ఓడిపోయాక శోకిస్తూ ఉండడం సరికాకపోవడమే కాదు హానికరమైంది కూడా. ఓడిపోయాకైనా గెలవాలి అన్న పట్టుదల కలగాలి. ఆ పట్టుదల ఓటమి తరువాతి జీవనంపై పట్టును ఇవ్వాలి. ఓడిపోవడం నేరం కాదు. ఓడిపోయాక తలదించుకోవాల్సిన అగత్యంలేదు. ఓడిపోతే కుంగిపోకూడదు ఓటమికి లొంగిపోకూడదు. ఓడిపోతే వాడిపోకూడదు, వాడిమిని కోల్పోకూడదు. ఓడిపోయాక మనిషి ఎడారిలో ఒంటరివాణ్ణి అయిపోయానని కృశించిపోతూ ఉండిపోకూడదు; ఎందుకూ కొరగాని వాణ్ణి అయిపోయానని నిస్తేజంగా ఉండిపోకూడదు. ఓడిపోతే నిస్ప్పహా ప్రభావానికి మ్రాన్పడి చిల్తై పోకూడదు. ఓడిపోయాక, నిస్పృహ ఆవరించాక నిద్రలోంచి లేచినట్లుగా లేవాలి. ఆపై మెలకువను పొందినట్లుగా సత్స్పృహను పొందాలి. ఓడిపోతే కష్టాలొస్తాయి; ఆ కష్టాలలోనే సత్యాలు తెలుస్తాయి. ఆ సత్యాలు ఎంతో ముఖ్యమైనవి. జీవితం అన్నాక, జీవనం ఉన్నాక ఆశాభంగం తప్పదు. భంగం అయినంత మాత్రాన భాగ్యం భగ్నమైపోదు. ఓడిపోయిన తరువాత నిలదొక్కుకోగలిగిన మనిషి ముందుకు సాగగలడు. కలిగిన ఓటమికి దెబ్బతిన్నాక గెలవడంపై మనిషికి చైతన్యం రావాలి. ఓటమి గురించి చింత, చింతనలను అధిగమించాలంటే మనిషికి గెలవాలి అన్న చైతన్యం కావాలి, రావాలి. ఆ చైతన్యంతో గెలుపును సుసాధ్యం చేసుకోవాలి. ఓటమి కలిగాక దాన్ని అర్థం చేసుకుని అంగీకరించాలి. కలిగిన ఓటమికి మనం సాక్ష్యం మాత్రమే అవ్వాలి. అంతకుమించి మనం ఓటమిలో కూరుకుపోకూడదు. భవిష్యత్తులో విజయంలో విలీనం అవ్వాలంటే కలిగిన ఓటమి నుంచి మనల్ని మనం విడిపించుకోవాలి. విజయం సాధించడం ఎలాంటిదో ఓటమి నుంచి విడివడడం కూడా అలాంటిదే. ప్రపంచంలో విజేతలైనవాళ్లలో ఎక్కువ శాతంమంది ఓటమి నుంచి తమను తాము విడిపించుకున్నవాళ్లే. సూర్యోదయాన్ని పొందుతూ ఉండడం భూమి రోజూ సాధిస్తున్న విజయం. పొంగుతూ, సాగుతూ పారడం నది సాధిస్తున్న విజయం. వీస్తూ ఉండడం గాలికి విజయం. విజయం అనేది ఒక లక్ష్యమా? కాదు. విజయం అనేది లక్షణం. అవును విజయం అనేది మనిషికి లక్ష్యంగా కాదు లక్షణం గా ఉండాలి. ఓటమి చీకటిలా మూగినప్పుడు కాస్తంత ఓపికపడితే విజయం వేకువై వచ్చేస్తుంది. ‘‘వేసవికాలం వెంబడించని చలికాలం లేదు’’ అన్నారు వివేకానంద. ఓటమి అనే చలికి పట్టుబడి గడ్డకట్టుకుపోకుండా ఉండగలగాలి. చలికాలం తరువాత వేసవి వచ్చేస్తుంది. ఓటమి శోకాన్ని కలిగించినా విజయాన్ని సాధించేందుకు కాలం ఉందని, ఉంటుందని తెలుసుకోవాలి. విజయం కోసం ఆశపడితే, ఆకాంక్షిస్తే తప్పకుండా మనిషికి అవకాశాలు ఆసన్నం అవుతాయి. వాటిని సఫలం చేసుకుంటే విజయం వస్తుంది. ఆ విజయానికి చిహ్నంగా మనిషి జీవితం వసంతం అవుతుంది. – రోచిష్మాన్ -
హైదరాబాద్ ఓటమి నం. 5
పుణే: రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు పరాజయాల పరంపర కొనసాగింది. ఈ సీజన్లో అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చిన జట్టు వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. గురువారం మూడో రోజే ముగిసిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో మహారాష్ట్ర 9 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 176/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 192 పరుగులకే ఆలౌటైంది. మహారాష్ట్రకు 193 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దాంతో ఆ జట్టు హైదరాబాద్‌ను ‘ఫాలో ఆన్’ ఆడించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్ వైఫల్యంతో హైదరాబాద్ 219 పరుగులకే కుప్పకూలింది. చందన్ సహాని (59) అర్ధ సెంచరీ సాధించగా...తన్మయ్ అగర్వాల్ (43), రోహిత్ రాయుడు (37) కొన్ని పరుగులు జోడించారు. 27 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 17 బంతుల్లో వికెట్ నష్టానికి 30 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించింది. -
భారత్ పోరాటం ముగిసె...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్ల పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ లక్ష్యసేన్, మహిళల సింగిల్స్‌లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ గాయంతో వైదొలగగా... కృష్ణ ప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీ ఓడిపోయింది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట కూడా నిరాశపరిచింది. గురువారం జరిగిన పోటీల్లో ప్రపంచ 12వ ర్యాంకర్, ఏడో సీడ్ లక్ష్యసేన్ 21–16, 15–21, 18–21తో ప్రపంచ 20వ ర్యాంకర్ రస్మస్ గెమ్కే (డెన్మార్క్) చేతిలో కంగుతిన్నాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సైనా 9–21, 12–21తో ఒలింపిక్ చాంపియన్ చెన్ యు ఫె (చైనా) ధాటికి నిలువలేకపోయింది. మహిళల డబుల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జంట 9–21, 16–21తో ఆరో సీడ్ జాంగ్ షు జియాన్–జెంగ్ యు (చైనా) ద్వయం చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో గరగ కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 14–21, 10–21తో లియాంగ్ వి కెంగ్– వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం చేతిలో ఇంటిదారి పట్టింది. సాత్విక్ సాయిరాజ్ తుంటిగాయం వల్ల చిరాగ్ షెట్టితో కలిసి బరిలోకి దిగలేకపోయాడు. దీంతో చైనాకే చెందిన లియు చెన్–జువాన్ యి జంట వాకోవర్‌తో ముందంజ వేసింది. -
రాఫెల్ నాదల్కు చుక్కెదురు
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ 2022 సంవత్సరాన్ని ఓటమితో ముగించాడు. సిడ్నీలో జరుగుతున్న యునైటెడ్ కప్ మిక్స్డ్ టీమ్ టోర్నీలో భాగంగా శనివారం బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ 0–2తో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో రెండో ర్యాంకర్ నాదల్ 6–3, 3–6, 4–6తో 14వ ర్యాంకర్ కామెరాన్ నోరీ చేతిలో ఓడిపోయాడు. గతంలో నోరీతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో నాదల్ ఈ బ్రిటన్ ప్లేయర్ చేతిలో తొలిసారి ఓడిపోవడం గమనార్హం. -
Qatar FIFA World Cup 2022: క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్
అమెరికాకు తొలి నాకౌట్ దెబ్బ పడింది. నెదర్లాండ్స్ మొదటి క్వార్టర్స్ బెర్తు సాధించింది. ప్రపంచకప్‌లో లీగ్ దశ వెనువెంటనే మొదలైన నాకౌట్ పోరులో మూడుసార్లు రన్నరప్ నెదర్లాండ్స్ 3–1తో అమెరికాపై ఘనవిజయం సాధించింది. డచ్ డిఫెండర్లు ప్రత్యర్థి స్ట్రయికర్లను నిలువరించగా... ఫార్వర్డ్ ఆటగాళ్లు గోల్స్ చేయడంలో సఫలమయ్యారు. దోహా: ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో డచ్ టీమ్ 3–1 గోల్స్ తేడాతో అమెరికాపై జయభేరి మోగించింది. నెదర్లాండ్స్ ఆటగాడు డెంజెల్ డంఫ్రైస్ అసాధారణ ఆటతీరు కనబరిచాడు. డచ్ విజయంలో కీలక భూమిక పోషించాడు. తొలి రెండు గోల్స్‌కు మెరుపు పాస్‌లు అందించిన డెంజెల్... ఆట ముగింపు దశలో స్వయంగా తనే గోల్ చేయడంతో నెదర్లాండ్స్ ఆధిక్యానికి ఎదురేలేకుండా పోయింది. డచ్ తరఫున మెంఫిస్ డిపే (10వ ని.), డెలీ బ్లైండ్ (ఇంజ్యూరి టైమ్ 45+1వ ని.), డంఫ్రైస్ (81వ ని.) గోల్ చేశారు. అమెరికా జట్టులో హజి రైట్ (76వ ని.) గోల్ సాధించాడు. ఆట ఆరంభంలో అమెరికా స్ట్రయికర్లే నెదర్లాండ్స్ గోల్‌పోస్ట్‌పై దాడులు చేశారు. రెండో నిమిషం నుంచే అమెరికా గోల్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫినిషింగ్ లోపాలతో ఏ ఒక్కటి సఫలం కాలేదు. అయితే ఆట పదో నిమిషంలో కళ్లు చెదిరే గోల్‌కు డంఫ్రైస్ కారణమయ్యాడు. ప్రత్యర్థి డి ఏరియాకు సమీపంలో కుడివైపు నుంచి డంఫ్రైస్ దూసుకొస్తూ ఇచ్చిన క్రాస్పాస్ను మెంఫిస్ డిపే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతే మెరుపువేగంతో గోల్‌కీపర్‌కు అవకాశం లేకుండా గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. మళ్లీ తొలి అర్ధభాగం స్టాపేజ్ (ఇంజ్యూరి టైమ్)లో అదే రకమైన క్రాస్ పాస్‌ను డెలీ బ్లైండ్‌కు ఇవ్వగా అతను కూడా చాకచక్యంగా బంతిని లక్ష్యం చేర్చడంలో సఫలమయ్యాడు. ద్వితీయార్ధంలో అమెరికా బృందంలో 67వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ అయిన హజి రైట్ (76వ ని.) వచ్చిన 9 నిమిషాలకే అమెరికాకు గోల్ చేసి పెట్టాడు. డచ్ ఆధిక్యం 2–1కు తగ్గిన కాసేపటికే డంఫ్రైస్ మళ్లీ గర్జించాడు. ఈసారి తానే ఏకంగా గోల్‌పోస్ట్‌పై గురిపెట్టడంతో 81వ నిమిషంలో నెదర్లాండ్స్ ఖాతాలో మూడో గోల్ చేరింది. మ్యాచ్‌లో డచ్‌ను నడిపించిన డెంజెల్ డంఫ్రైస్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. అర్జెంటీనా–ఆస్ట్రేలియా మ్యాచ్ విజేతతో నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్లో తలపడుతుంది. ప్రపంచకప్‌లో నేడు (ప్రిక్వార్టర్ ఫైనల్స్) ఫ్రాన్స్ X పోలాండ్ రాత్రి గం. 8:30 నుంచి ఇంగ్లండ్ X సెనెగల్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డంఫ్రైస్ -
FIFA World Cup Qatar 2022: బెల్జియం అవుట్
దోహా: స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన ప్రపంచ రెండో ర్యాంకర్, గత ప్రపంచకప్‌లో మూడో స్థానం పొందిన బెల్జియం జట్టు తాజా మెగా ఈవెంట్లో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. నాకౌట్ దశ బెర్త్ దక్కాలంటే గత వరల్డ్‌కప్ రన్నరప్ క్రొయేషియా జట్టుపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ను బెల్జియం 0–0తో ‘డ్రా’ చేసుకుంది. బెల్జియంను నిలువరించిన క్రొయేషియా ఐదు పాయింట్లతో గ్రూప్ ‘ఎఫ్’లో రెండో స్థానంలో నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. క్రొయేషియాతో మ్యాచ్‌లో బెల్జియం జట్టు ఓటమి స్వయంకృతమే అని చెప్పాలి. స్టార్ ఫార్వర్డ్ రొమెలు లుకాకుకు ఏకంగా ఐదుసార్లు గోల్ చేసే సువర్ణావకాశాలు వచ్చినా అతను వృథా చేశాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: ఇంగ్లండ్ అజేయంగా...
ఐదున్నర దశాబ్దాలుగా ఊరిస్తున్న రెండో ప్రపంచకప్ టైటిల్‌ను ఈసారైనా సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు తొలి దశను సాఫీగా అధిగమించింది. కనీసం ‘డ్రా’ చేసుకుంటే నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశం ఉన్నా... ఈ మాజీ చాంపియన్ మాత్రం అదరగొట్టే ప్రదర్శనతో భారీ విజయం నమోదు చేసి గ్రూప్ దశను అజేయంగా ముగించి తమ గ్రూప్ ‘బి’లో ‘టాపర్’గా నిలిచింది. అల్ రయ్యాన్ (ఖతర్): ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో 13వసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన గ్రూప్ ‘బి’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో 1966 విశ్వవిజేత ఇంగ్లండ్ 3–0 గోల్స్ తేడాతో వేల్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ తరఫున మార్కస్ రాష్‌ఫోర్డ్ (50వ, 68వ ని.లో) రెండు గోల్స్ చేయగా... ఫిల్ ఫోడెన్ (51వ ని.లో) ఒక గోల్ అందించాడు. 1958లో తొలిసారి ప్రపంచకప్‌లో పాల్గొని క్వార్టర్ ఫైనల్ చేరిన వేల్స్ 64 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు రెండోసారి అర్హత సాధించినా ఈసారి మాత్రం గ్రూప్ దశను దాటలేకపోయింది. వేల్స్‌తో కనీసం ‘డ్రా’ చేసుకున్నా తదుపరి దశకు అర్హత పొందే అవకాశమున్నా ఇంగ్లండ్ మాత్రం విజయమే లక్ష్యంగా ఆడింది. అయితే వేల్స్ డిఫెండర్లు గట్టిగా నిలబడటంతో తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్ ఖాతా తెరువలేకపోయింది. పలువురు స్టార్ ఆటగాళ్లతో నిండిన ఇంగ్లండ్ రెండో అర్ధభాగంలో వ్యూహం మార్చి ఫలితం పొందింది. 18 నిమిషాల వ్యవధిలో ఏకంగా మూడు గోల్స్ సాధించి వేల్స్‌కు కోలుకునే అవకాశం ఇవ్వకుండా చేసింది. 50వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను రాష్‌ఫోర్డ్ నేరుగా వేల్స్ గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. 2020 యూరో ఫైనల్లో ఇటలీపై పెనాల్టీ షూటౌట్లో తన షాట్‌ను గోల్‌గా మలచలేకపోయిన రాష్ఫోర్డ్కు గత రెండేళ్లుగా ఏదీ కలసి రావడంలేదు. నల్ల జాతీయుడు కావడంతో స్వదేశంలో అతనిపై జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే వేల్స్‌పై రాష్‌ఫోర్డ్ రెండు గోల్స్‌తో రాణించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. తొలి గోల్ అయ్యాక నిమిషం వ్యవధిలోనే ఇంగ్లండ్ ఖాతాలో రెండో గోల్ చేరింది. కెప్టెన్ హ్యారీ కేన్ క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న ఫిల్ ఫోడెన్ బంతిని లక్ష్యానికి చేర్చాడు. అనంతరం 68వ నిమిషంలో రాష్‌ఫోర్డ్ గోల్‌తో ఇంగ్లండ్ ఆధిక్యం 3–0కు పెరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేసిన మూడో గోల్ ప్రపంచకప్ చరిత్రలో ఆ జట్టుకు 100వ గోల్ కావడం విశేషం. 92 ఏళ్ల ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో 100 గోల్స్ మైలురాయిని అందుకున్న ఏడో జట్టుగా ఇంగ్లండ్ గుర్తింపు పొందింది. ‘బి’ గ్రూప్ టాపర్‌గా నిలిచిన ఇంగ్లండ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సెనెగల్ జట్టుతో ఆడుతుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: పోర్చుగల్ ముందుకు...
దోహా: అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచకప్ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో ఖతర్‌కు వచ్చిన క్రిస్టియానో రొనాల్డో బృందం తొలి అడ్డంకిని దాటింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘హెచ్’ మ్యాచ్‌లో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు 2–0 గోల్స్ తేడాతో గతంలో రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఉరుగ్వే జట్టుపై గెలిచింది. పోర్చుగల్ తరఫున నమోదైన రెండు గోల్స్‌ను బ్రూనో ఫెర్నాండెజ్ (54వ ని.లో, 90+3వ ని.లో) సాధించాడు. వరుసగా రెండో విజయం సాధించిన పోర్చుగల్ జట్టు ఆరు పాయింట్లతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గత ప్రపంచకప్‌లో ఉరుగ్వే చేతిలో 1–2తో ఓడిపోయిన రొనాల్డో జట్టు ఈసారి ఈ మాజీ విజేత జట్టును తేలిగ్గా తీసుకోలేదు. ముఖ్యంగా రొనాల్డో ముందుండి జట్టును నడిపించాడు. పలుమార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్ దిశగా వెళ్లి లక్ష్యంపై గురి పెట్టాడు. మరోవైపు ఉరుగ్వే కూడా దూకుడుగానే ఆడింది. కానీ ఆ జట్టును కూడా ఫినిషింగ్ లోపం వేధించింది. విరామ సమయం వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. ఎట్టకేలకు 54వ నిమిషంలో బ్రూనో ఫెర్నాండెజ్ సంధించిన క్రాస్ షాట్ నేరుగా ఉరుగ్వే గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లడంతో పోర్చుగల్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బ్రూనో కిక్‌ను గాల్లోకి ఎగిరి రొనాల్డో హెడర్ ద్వారా అందుకునే ప్రయత్నం చేసినా బంతి రొనాల్డో తలకు తగలకుండానే గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. ఉరుగ్వే తరఫున బెంటాన్కర్, గోమెజ్ కొట్టిన షాట్లు గోల్‌పోస్ట్‌కు తగిలి బయటకు వెళ్లాయి. స్టాపేజ్ సమయంలో ‘డి’ ఏరియాలో ఉరుగ్వే ప్లేయర్ జిమినెజ్ చేతికి బంతి తగలడంతో రిఫరీ పోర్చుగల్‌కు పెనాల్టీ కిక్ ఇచ్చాడు. బ్రూనో ఈ పెనాల్టీని గోల్‌గా మలిచాడు. చివరి సెకన్లలో బ్రూనో కొట్టిన షాట్ గోల్‌పోస్ట్‌కు తగిలి బయటకు వెళ్లింది. లేదంటే అతని ఖాతాలో హ్యాట్రిక్ చేరేది. ప్రపంచకప్‌లో నేడు డెన్మార్క్ X ఆస్ట్రేలియా రాత్రి గం. 8:30 నుంచి ఫ్రాన్స్ X ట్యునీషియా రాత్రి గం. 8:30 నుంచి అర్జెంటీనా X పోలాండ్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి మెక్సికో X సౌదీ అరేబియా అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: 20 ఏళ్ల తర్వాత...
దోహా: రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సెనెగల్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో రెండోసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో సెనెగల్ 2–1 గోల్స్ తేడాతో ఈక్వెడార్ జట్టును ఓడించింది. ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందింది. సెనెగల్ తరఫున ఇస్మాయిల్ సార్ (44వ ని.లో), కెప్టెన్ కలిదు కులిబాలి (70వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఈక్వెడార్‌కు మోజెస్ కైసెడో (67వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. మూడోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న సెనెగల్ తొలిసారి బరిలోకి దిగిన 2002లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత వరుసగా మూడు ప్రపంచకప్‌లకు అర్హత పొందలేకపోయింది. మళ్లీ 2018లో రెండో సారి ఈ మెగా ఈవెంట్లో ఆడిన సెనెగల్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈసారి సమష్టిగా రాణించి తొలి అడ్డంకిని అధిగమించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తప్పనిసరిగా గెలిస్తేనే నాకౌట్ దశకు చేరే అవకాశం ఉండటంతో సెనెగల్ ఆటగాళ్లు ఆద్యంతం దూకుడుగా ఆడారు. ‘డ్రా’ చేసుకున్నా నాకౌట్ దశకు చేరే చాన్స్ ఉండటంతో ఈక్వెడార్ కూడా వెనక్కి తగ్గలేదు. సాధ్యమైనంత ఎక్కువసేపు తమ ఆధీనంలో బంతి ఉండేలా ఈక్వెడార్ ఆటగాళ్లు ప్రయత్నించారు. సెనెగల్ ఆటగాళ్లను మొరటుగా అడ్డుకునేందుకు వెనుకాడలేదు. ఈ క్రమంలో 44వ నిమిషంలో ‘డి’ ఏరియాలో సెనెగల్ ప్లేయర్ ఇస్మాయిల్ సార్‌ను ఈక్వెడార్ డిఫెండర్ హిన్కాపి తోసేశాడు. దాంతో రిఫరీ మరో ఆలోచన లేకుండా సెనెగల్‌కు పెనాల్టీ కిక్‌ను ప్రకటించాడు. పెనాల్టీని ఇస్మా యిల్ సార్ గోల్‌గా మలిచాడు. దాంతో విరామ సమయానికి సెనెగల్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో ఈక్వెడార్ స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. 67వ నిమిషంలో లభించిన కార్నర్‌ను ప్లాటా ‘డి’ ఏరియాలోకి కొట్టాడు. దానిని టోరెస్ హెడర్ షాట్‌తో ఒంటరిగా ఉన్న మోజెస్ కైసెడో వద్దకు పంపించగా అతను గోల్‌గా మలిచాడు. దాంతో స్కోరు 1–1తో సమం అయింది. అయితే ఈక్వెడార్‌కు ఈ ఆనందం మూడు నిమిషాల్లోనే ఆవిరైంది. 70వ నిమిషంలో సెనెగల్ జట్టుకు లభించిన కార్నర్‌ను గుయె ‘డి’ ఏరియాలోకి కొట్టగా ఈక్వెడార్ ప్లేయర్ టోరెస్‌కు తగిలి బంతి గాల్లో లేచింది. అక్కడే ఉన్న కెప్టెన్ కులిబాలి బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించి సెనెగల్‌కు 2–1తో ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత సెనెగల్ చివరివరకు ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంది. నెదర్లాండ్స్ 11వసారి... మరోవైపు ఆతిథ్య ఖతర్ జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2–0తో గెలిచి ఏడు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచి 11వసారి ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. నెదర్లాండ్స్ తరఫున కొడి గాప్కో (26వ ని.లో), ఫ్రాంకీ డి జాంగ్ (49వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ టోర్నీలో గాప్కోకిది మూడో గోల్ కావడం విశేషం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి... రూ.2.11 కోట్లు, కారు
రోహ్తక్: ధర్మపాల్ అలియాస్ కాలా.. హరియాణా రాష్ట్రం రోహ్తక్ జిల్లా చిరీ గ్రామ వాస్తవ్యుడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల విజ్ఞప్తి మేరకు పోటీ చేశాడు. కేవలం 66 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. ఈ ఓటమి గ్రామస్తులను కదిలించింది. ఆయనకు మద్దతుగా నిలిచారు. ధర్మపాల్‌ను ఆదుకోవడం తమ బాధ్యతగా భావించారు. అందరూ కలిసి రూ.2.11 కోట్ల విరాళాలు సేకరించారు. గ్రామంలో ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేసి, ధర్మపాల్‌ను ఘనంగా సత్కరించి, రూ.2.11 కోట్ల నగదు అందజేశారు. అంతేకుండా ఖరీదైన స్కార్పియో కారు కూడా బహూకరించారు. ఈ సన్మాన సభలో చిరీలోని అన్ని కులాల పెద్దలు పాల్గొన్నారు. ధర్మపాల్ ఒంటరివాడు కాదని, ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదని తెలియజెప్పడానికే నగదు, కారు అందజేశామని కులపెద్ద భలేరామ్ చెప్పారు. గ్రామస్తుల ఔదార్యాన్ని చూసి ధర్మపాల్ కళ్లు చెమర్చాయి. జనం కోసమే తాను జీవిస్తానని, వారి బాగు కోసం కృషి చేస్తానని చెప్పాడు. ఆయన గతంలో లఖాన్ మాజ్రా బ్లాక్ సమితి చైర్మన్‌గా పనిచేశాడు. -
FIFA World Cup Qatar 2022: వహ్వా! అయ్యో ఆతిథ్య జట్టు...
అట్టహాసంగా ప్రారంభోత్సవం ‘మనల్నందరినీ కలిపే ఈ క్షణం మనందరినీ విడదీసే ఘటనలకంటే ఎంతో గొప్పది... అయితే ఇది ఈ ఒక్క రోజుకు పరిమితం కాకుండా శాశ్వతంగా నిలిచిపోయేందుకు ఏమేం చేయాలి’... హాలీవుడ్ స్టార్ మోర్గన్ ఫ్రీమన్ గంభీర స్వరంతో ప్రేక్షకులను అడిగిన ఈ ప్రశ్నతో విశ్వ సంబరానికి విజిల్ మోగింది. ఖతర్ దేశం అంచనాలకు తగినట్లుగా అద్భుతమైన ప్రారంభోత్సవ వేడుకలతో ప్రపంచ అభిమానుల మనసులు దోచింది. తమ దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించారు. అల్ బైత్ స్టేడియం మధ్యలో ఫ్రీమన్ ఆద్యంతం తన వ్యాఖ్యానంతో రక్తి కట్టిస్తుండగా... భిన్నమైన సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాలు కట్టి పడేశాయి. ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఖతర్ ‘యూ ట్యూబర్’ ఘనిమ్ అల్ ముఫ్తాతో ఫ్రీమన్ సంభాషణ ఆసక్తికరంగా సాగింది. కాడల్ రిగ్రెషన్ సిండ్రోమ్‌తో బాధపడుతూ ఘనిమ్ నడుము కింది భాగం మొత్తం చచ్చుబడిపోయింది. ఈ ప్రపంచంలో ఉన్న భిన్నత్వం గురించి ఫ్రీమన్ అడగ్గా... ఖురాన్‌లోని కొన్ని పంక్తులతో ఘనిమ్ సమాధానమిచ్చాడు. కొరియా ప్రఖ్యాత గాయకుడు జుంగ్ కూక్, ఖతర్ సింగర్ ఫహద్ అల్ కుబైసి కలిసి వరల్డ్ కప్ థీమ్ సాంగ్ ‘డ్రీమర్స్’ను ఆలాపించినప్పుడు 60 వేల సామర్థ్యం గల స్టేడియం దద్దరిల్లింది. సాంప్రదాయ కత్తి నృత్యం ‘అల్ అర్దా’ ప్రదర్శించినప్పుడు కూడా భారీ స్పందన వచ్చింది. వరల్డ్ కప్ మస్కట్ ‘లయీబ్’ను, టోర్నీలో పాల్గొంటున్న 32 దేశాల జెండాలను కూడా ఘనంగా ప్రదర్శించారు. చివరగా...ఖతర్ రాజు తమీమ్ బిన్ హమద్ అల్–థని ‘అరబ్ ప్రపంచం తరఫున అందరికీ ఈ వరల్డ్ కప్‌లో స్వాగతం పలుకుతున్నాం’ అంటూ మెగా టోర్నీ ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించడంతో కార్యక్రమం ముగిసంది. 92 సంవత్సరాల ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు తాము ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోలేదు. విజయం సాధించడం లేదంటే ‘డ్రా’తో సంతృప్తి పడటం జరిగింది. కానీ ఆదివారం ఈ ఆనవాయితీ మారింది. టోర్నీ చరిత్రలో తొలిసారి ఆతిథ్య జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి మూటగట్టుకుంది. ఈ మెగా ఈవెంట్ నిర్వహణ కోసం లక్షల కోట్లు వెచ్చించిన ఖతర్ దేశానికి తొలి మ్యాచ్ మాత్రం నిరాశను మిగల్చగా... నాలుగోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఈక్వెడార్ విజయంతో బోణీ కొట్టి శుభారంభం చేసింది. అల్ ఖోర్: గతంలో ఏనాడూ ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేకపోయిన ఖతర్ జట్టు ఆతిథ్య జట్టు హోదా కారణంగా తొలిసారి బరిలోకి దిగింది. ఈ మెగా టోర్నీకి సన్నాహాలు చాలా ఏళ్ల నుంచి సాగుతున్నా ఆతిథ్య జట్టు మాత్రం మైదానంలో ఆశించినస్థాయిలో మెరిపించలేకపోయింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ 44వ ర్యాంకర్ ఈక్వెడార్ 2–0 గోల్స్‌తో ప్రపంచ 50వ ర్యాంకర్ ఖతర్ జట్టును ఓడించి శుభారంభం చేసింది. ఈక్వెడార్ తరఫున నమోదైన రెండు గోల్స్‌ను ఇనెర్ వాలెన్సియా (16వ నిమిషంలో, 31వ నిమిషంలో) సాధించడం విశేషం. ఈ గెలుపుతో ఈక్వెడార్‌కు మూడు పాయింట్లు లభించాయి. గత ప్రపంచకప్‌నకు అర్హత సాధించడంలో విఫలమైన ఈక్వెడార్ తాజా టోర్నీలో మాత్రం ఖతర్‌పై అదరగొట్టే ప్రదర్శన చేసింది. గతంలో ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరగ్గా... ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించాయి. అయితే ఈసారి మాత్రం ఈక్వెడార్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. పూర్తి సమన్వయంతో కదులుతూ ఖతర్ గోల్‌పోస్ట్‌పై తొలి నిమిషం నుంచే దాడులు చేసింది. ఆట మూడో నిమిషంలోనే ఈక్వెడార్ ఖాతా తెరిచింది. ఫెలిక్స్ టోరెస్ ఆక్రోబాటిక్ కిక్ షాట్ గాల్లోకి లేవగా వాలెన్సియా హెడర్ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. ఈక్వెడార్ జట్టు సంబరంలో మునిగింది. అయితే ఖతర్ జట్టు గోల్‌పై సమీక్ష కోరింది. వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) టీవీ రీప్లేను పరిశీలించగా ‘ఆఫ్ సైడ్’ అని తేలింది. దాంతో రిఫరీ గోల్ ఇవ్వలేదు. అయితే ఈక్వెడార్ పట్టువదలకుండా తమ దాడులకు పదును పెట్టింది. ఫలితంగా ఖతర్ జట్టు ప్రత్యర్థి ఆటగాళ్లను నిలువరించడమే తప్ప ఎదురు దాడులు చేయలేకపోయింది. 16వ నిమిషంలో బంతితో ‘డి’ ఏరియాలోకి వచ్చిన ఈక్వెడార్ ప్లేయర్ వాలెన్సియాను ఖతర్ గోల్ కీపర్ సాద్ అల్ షీబ్ మొరటుగా అడ్డుకోవడంతో వాలెన్సియా పడిపోయాడు. ఫలితంగా రిఫరీ ఈక్వెడార్‌కు పెనాల్టీ కిక్ ప్రకటించగా... వాలెన్సియా ఈ పెనాల్టీని గోల్‌గా మలిచి ఈక్వెడార్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 31వ నిమిషంలో సహచరుడు ఏంజెలో ప్రెసియాడో క్రాస్ షాట్‌ను వాలెన్సియా హెడర్ షాట్‌తో బంతిని లక్ష్యానికి చేర్చాడు. విరామ సమయానికి ఈక్వెడార్ 2–0తో ఆధిక్యంలోకి నిలిచింది. రెండో అర్ధ భాగంలోనూ ఈక్వెడార్ జోరు కొనసాగగా...ఖతర్ జట్టుకు ప్రత్యర్థిని నిలువరించడంలోనే సరిపోయింది. ఈక్వెడార్‌కు మూడో గోల్ ఇవ్వకుండా ఖతర్ మ్యాచ్‌ను ముగించగలిగింది. -
Pro Kabaddi 2022: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం హైదరాబాద్ అంచె మ్యాచ్‌లు మొదలయ్యాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 28–36తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్‌లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ ఒక్క మ్యాచ్‌లో నెగ్గి, 14 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. తొమ్మిది పాయింట్లతో టైటాన్స్ చివరిదైన 12వ స్థానంలో ఉంది. వారియర్స్‌తో మ్యాచ్‌లో టైటాన్స్ తరఫున రెయిడర్లు అభిషేక్ సింగ్ తొమ్మిది పాయింట్లతో, సిద్ధార్థ్ దేశాయ్ ఎనిమిది పాయింట్లతో, పర్మేశ్ ఐదు పాయింట్లతో రాణించారు. వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ 12 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా... శ్రీకాంత్ జాదవ్ ఏడు పాయింట్లు స్కోరు చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్ 41–28తో హరియాణా స్టీలర్స్‌పై, బెంగళూరు బుల్స్ 45–38తో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్; యు ముంబాతో తెలుగు టైటాన్స్; దబంగ్ ఢిల్లీతో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
Vijay Hazare Trophy: తమిళనాడు చేతిలో ఆంధ్ర ఓటమి
ఆలూర్ (కర్ణాటక): విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో తమిళనాడు తొమ్మిది వికెట్ల తేడాతో ఆంధ్ర జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అభిషేక్ రెడ్డి (85; 9 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ శ్రీకర్ భరత్ (51; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. తమిళనాడు బౌలర్లలో సిలాంబరాసన్ మూడు వికెట్లు తీయగా... సందీప్ వారియర్, సాయికిశోర్, సంజయ్ యాదవ్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం తమిళనాడు ధాటిగా ఆడి 32.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి 206 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ జగదీశన్ (114 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు. సాయి సుదర్శన్ (73; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి జగదీశన్ తొలి వికెట్‌కు 177 పరుగులు జత చేశాడు. -
స్వియాటెక్‌కు సబలెంకా షాక్
టెక్సాస్ (అమెరికా): ఈ ఏడాదిని మరో టైటిల్‌తో ముగించాలని ఆశించిన ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)కు నిరాశ ఎదురైంది. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. బెలారస్ ప్లేయర్, ప్రపంచ ఏడో ర్యాంకర్ సబలెంకా 6–2, 2–6, 6–1తో స్వియాటెక్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన స్వియాటెక్ సెమీస్‌లో మాత్రం సబలెంకా ధాటికి తడబడింది. ఈ ఏడాది స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తోపాటు మరో ఆరు టోర్నీలలో విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా ఈ సీజన్లో ఆమె 67 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో సెమీఫైనల్లో కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–3, 6–2తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచి ఫైనల్లో సబలెంకాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. సాకరి కూడా లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి కీలకమైన సెమీఫైనల్లో ఓడిపోవడం గమనార్హం. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 24–42 స్కోరుతో హరియాణా స్టీలర్స్ చేతిలో చిత్తుగా ఓడింది. హరియాణా రెయిడర్ మీతూ శర్మ అదరగొట్టాడు. 18 సార్లు కూతకెళ్లిన మీతూ 13 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో మన్జీత్ (7), కెప్టెన్ నితిన్ రావల్ (4), జైదీప్ దహియా (4) రాణించారు. తెలుగు టైటాన్స్‌లో సిద్ధార్థ్ దేశాయ్ చేసిన 5 పాయింట్లే అత్యధిక స్కోరు. ఆదర్శ్, విజయ్ కుమార్ చెరో 4 పాయింట్లు చేశారు. ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లాడిన టైటాన్స్ ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. -
Syed Mushtaq Ali Trophy: ఓటమితో ఆంధ్ర ముగింపు
ఇండోర్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ ట్రోఫీ టి20 క్రికెట్ టోర్నీని ఆంధ్ర జట్టు ఓటమితో ముగించింది. శనివారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 11 పరుగుల తేడాతో బరోడా చేతిలో ఓడిపోయింది. ఏడు జట్లున్న గ్రూప్ ‘డి’లో ఆంధ్ర రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దాంతో ఆంధ్ర 12 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. కరణ్ షిండే (26 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికీ భుయ్ (26 బంతుల్లో 37; 6 ఫోర్లు) రాణించారు. అంతకుముందు బరోడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు సాధించింది. ఐదు గ్రూపుల్లో ‘టాపర్’గా నిలిచిన ముంబై, పంజాబ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, బెంగాల్ నేరుగా క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాయి. మూడు ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో గెలిచిన మరో మూడు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుతాయి. -
T20 World Cup 2022: ఆస్ట్రేలియా చిత్తు చిత్తుగా...
సిడ్నీ: టి20 ప్రపంచకప్ ‘సూపర్ 12’ పోరు అనూహ్య ఫలితంతో మొదలైంది. సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే భారీ పరాజయం ఎదురైంది. గత వరల్డ్ కప్ ఫైనల్లో తమకు ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంటూ న్యూజిలాండ్ ఆతిథ్య జట్టును 89 పరుగుల తేడాతో ఓడించి షాక్ ఇచ్చింది. 2011 తర్వాత ఆసీస్ గడ్డపై కివీస్‌కు అన్ని ఫార్మాట్లలో కలిపి ఇదే తొలి విజయం కాగా, 15 ఓటముల తర్వాత 16వ మ్యాచ్‌లో గెలుపు దక్కింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డెవాన్ కాన్వే (58 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (16 బంతుల్లో 42; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఇచ్చిన శుభారంభం కూడా కివీస్ భారీ స్కోరుకు కారణమైంది. చివర్లో జేమ్స్ నీషమ్ (13 బంతుల్లో 26 నాటౌట్; 2 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడి స్కోరును 200 పరుగులకు చేర్చాడు. హాజల్‌వుడ్‌కు 2 వికెట్లు దక్కగా, ఐదుగురు ఆసీస్ బౌలర్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం ఆస్ట్రేలియా కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేక, మరో 23 బంతులు మిగిలి ఉండగానే కుప్పకూలిపోవడం విశేషం. కివీస్ బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయిన ఆసీస్ 17.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. మ్యాక్స్‌వెల్ (20 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్), ప్యాట్ కమిన్స్ (18 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం ఫర్వాలేదనిపించారు. సాన్‌ట్నర్‌కు 3 వికెట్లు దక్కగా, 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసిన టిమ్ సౌతీ... అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వికెట్లు (125) తీసిన బౌలర్‌గా నిలిచాడు. -
PKL 2022: పరాజయంతో మొదలు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్‌ను తెలుగు టైటాన్స్ జట్టు పరాజయంతో ప్రారంభించింది. మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌తో శుక్రవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 29–34 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్ తరఫున రెయిడర్లు వినయ్, రజనీశ్ ఏడు పాయింట్ల చొప్పున స్కోరు చేయగా... సిద్ధార్థ్ దేశాయ్ నాలుగు పాయింట్లతో నిరాశపరిచాడు. బెంగళూరు బుల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. నీరజ్ నర్వాల్ (7 పాయింట్లు), భరత్ (5), వికాశ్ కండోలా (5), మహేందర్ సింగ్ (4), సౌరభ్ (4 పాయింట్లు) రాణించి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించారు. శుక్రవారమే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీ 41–27తో యు ముంబాను ఓడించగా... యూపీ యోధాస్ 34–32 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుపై గెలుపొందింది. -
Womens Asia Cup T20: భారత మహిళలకు షాక్
సిల్హెట్ (బంగ్లాదేశ్): ఆసియా కప్ మహిళల టి20 టోర్నీలో జోరుగా దూసుకుపోతున్న భారత బృందానికి బ్రేక్ పడింది. ఫేవరెట్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ సేన పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా పరాజయంపాలై ఆశ్చర్యపర్చింది. శుక్రవారం మ్యాచ్‌కు ముందు టి20ల్లో పాక్‌తో 12 సార్లు తలపడి 10 సార్లు గెలిచిన భారత్... చివరిసారిగా 2016లో ఆ జట్టు చేతిలో ఓడింది. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత పాకిస్తాన్ మన జట్టుపై విజయం సాధించింది. చివరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో పాక్ 13 పరుగుల తేడాతో భారత్‌పై గెలుపొందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా, భారత్ 19.4 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. గురువారం అనూహ్యంగా థాయ్‌లాండ్ చేతిలో ఓడిన పాక్ కోలుకొని ఆసియాకప్ టోర్నీలో తొలి సారి భారత్‌పై విజయాన్ని అందుకోవడం విశేషం. ఓపెనర్లు మునీబా (17; 1 ఫోర్), సిద్రా (11; 1 ఫోర్)తో పాటు ఒమైమా (0) కూడా విఫలం కావడంతో ఆరు ఓవర్ల లోపే 33 పరుగుల వద్ద పాక్ 3 వికెట్లు కోల్పోయింది. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నిదా దార్ (37 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ బిస్మా మారూఫ్ (35 బంతుల్లో 32; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 58 బంతుల్లో 76 పరుగులు జోడించారు. దీప్తి శర్మ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, పూజ వస్త్రకర్ 2 వికెట్లు తీసింది. ఛేదనలో ఓపెనర్లు సబ్బినేని మేఘన (15; 1 ఫోర్, 1 సిక్స్), స్మృతి మంధాన (17; 2 ఫోర్లు), హేమలత (20; 3 ఫోర్లు ) కొన్ని చక్కటి షాట్లు ఆడినా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. ఫామ్‌లో ఉన్న జెమీమా (2) విఫలం కాగా, చెప్పుకోదగ్గ భాగస్వామ్యం ఒక్కటీ లేకపోయింది. బ్యాటింగ్ ఆర్డర్‌ను మారుస్తూ ఏడో స్థానంలో వచ్చిన హర్మన్ ప్రీత్ (12) ప్రయోగం విఫలమైంది. తీవ్ర ఎండ కారణంగా కీపింగ్ వదిలి మధ్యలోనే మైదానం వీడిన రిచా ఘోష్ (13 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. చివరి 3 ఓవర్లలో 43 పరుగులు చేయాల్సి ఉండగా నష్రా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లతో పాటు సాదియా ఓవర్లోనూ వరుసగా 6, 4 కొట్టి రిచా గెలుపుపై ఆశలు రేపింది. అయితే అదే ఓవర్లో ఆమెను సాదియా అవుట్ చేయగా... చివరి ఓవర్లో 18 పరుగులు కావాల్సి ఉండగా, భారత్ 4 పరుగులకే పరిమితమైంది. నష్రా 3 వికెట్లు తీయగా... నిదా, సాదియా చెరో 2 వికెట్లు పడగొట్టారు. నేడు జరిగే ఐదో లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలయ్యే ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
India vs South Africa: సంజూ పోరాటం వృదా.. తొలి వన్డేలో భారత్ ఓటమి
లక్నో: స్టార్లు లేని భారత జట్టు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను ఓటమితో మొదలుపెట్టింది. గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 9 పరుగుల తేడాతో సఫారీ టీమ్ చేతిలో పరాజయం చవిచూసింది. ఆఖరి ఓవర్లో 31 పరుగులు కావాల్సివుండగా, సామ్సన్ వరుసగా 6, 4, 4 బాది ఆశలు పెంచాడు. కానీ తర్వాత 0, 4, 1 రావడంతో ఓటమి తప్పలేదు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. మొదట దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (65 బంతుల్లో 74నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ మిల్లర్ (63 బంతుల్లో 75 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 17.4 ఓవర్లలో అభేద్యంగా 139 పరుగులు జోడించారు. శార్దుల్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 40 ఓవర్లలో 8 వికెట్లకు 240 పరుగులు చేసి ఓడింది. సంజు సామ్సన్ (63 బంతుల్లో 86 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (37 బంతుల్లో 50; 8 ఫోర్లు) మెరిపించారు. ఇన్‌గిడి 3, రబడ 2 వికెట్లు పడగొట్టారు. చెలరేగిన మిల్లర్, క్లాసెన్ టాస్ నెగ్గిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన సఫారీ ఓపెనర్లు డికాక్ (54 బంతుల్లో 48; 5 ఫోర్లు), జేన్‌మన్ మలాన్ (42 బంతుల్లో 22; 3 ఫోర్లు) మంచి ఆరంభాన్నే ఇచ్చారు. 12 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 49 పరుగులు చేసిన దక్షిణాఫ్రికాను శార్దుల్ ఠాకూర్ తొలి దెబ్బ తీశాడు. శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి మలాన్ నిష్క్రమించగా, తర్వాత వచ్చిన బవుమా (8), మార్క్రమ్లను భారత బౌలర్లు క్రీజులో నిలువనీయలేదు. కెప్టెన్ బవుమాను శార్దుల్, మార్క్రమ్ (0) స్పిన్నర్ కుల్దీప్ బౌల్డ్ చేశారు. 71 పరుగుల వద్ద మూడో వికెట్ కూలింది. అడపాదడపా బౌండరీలు కొడుతూ నింపాదిగా ఆడుతున్న డికాక్ జట్టు స్కోరు 100 దాటాక రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత క్లాసెన్‌కు మిల్లర్ జతయ్యాడు. ఇద్దరు మొదట కుదురుగా ఆడారు. తర్వాత పరుగుల వేగం పెంచారు. ఆఖరి 10 ఓవర్లలో ధాటిగా ఆడారు. ఈ క్రమంలో ముందుగా మిల్లర్ 50 బంతుల్లో (4 ఫోర్లు, 1 సిక్స్), రెండు బంతుల వ్యవధిలో క్లాసెన్ 52 బంతుల్లో (4 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. దీంతో జట్టు స్కోరు 200 పరుగుల మైలురాయి దాటింది. ఇవన్నీ అవేశ్ ఖాన్ వేసిన 36వ ఓవర్లోనే జరిగాయి. ఆ ఓవర్లో 12 పరుగులు సమర్పించుకున్న అతని తదుపరి ఓవర్లో (38) మిల్లర్ 4, 6 బాదేయడంతో 16 పరుగులు వచ్చాయి. ఆఖరి 10 ఓవర్లలో ఈ జోడీ 85 పరుగులు జతచేసింది. అబేధ్యమైన ఐదో వికెట్‌కు మిల్లర్, క్లాసెన్ 139 పరుగులు జోడించారు. డెత్ ఓవర్లలో మిల్లర్ క్యాచ్‌ను గైక్వాడ్, క్లాసెన్ క్యాచ్‌ను సిరాజ్ నేలపాలు చేయడం కూడా స్కోరు పెరిగేందుకు దోహదం చేసింది. మెరిపించిన శ్రేయస్, సామ్సన్ భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత టాపార్డర్ నిరాశపరిచింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్ (3), శిఖర్ ధావన్ (4) సహా వన్‌డౌన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (42 బంతుల్లో 19; 1 ఫోర్) వికెట్లను కోల్పోయింది. ఐపీఎల్లో దంచేసే గైక్వాడ్, ఇషాన్ కిషన్ (37 బంతుల్లో 20; 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడటంతో టి20ల మైకంలో ఉన్న భారత ప్రేక్షకుల్ని వన్డే మ్యాచ్ చాలాసేపు బోర్ కొట్టించింది. 3, 4, 5 ఓవర్ల (మెయిడిన్)లో ఒక్క పరుగు రాలేదు. 18వ ఓవర్లో టీమిండియా స్కోరు 50 పరుగులు చేరిందంటే బ్యాటింగ్ ఎంత చప్పగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 51 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయిన దశలో శ్రేయస్ అయ్యర్, సంజూ సామ్సన్ కాసేపు క్రికెట్ మజాను అందించారు. షమ్సీ వేసిన 19వ ఓవర్లో అయ్యర్ 4, సామ్సన్ సిక్సర్ బాదడంతో తొలిసారిగా ఒక ఓవర్లో 15 పరుగులొచ్చాయి. ముఖ్యంగా అయ్యర్ బౌండరీలతో అదరగొట్టాడు. షమ్సీ 21వ ఓవర్లో ‘హ్యాట్రిక్’ ఫోర్లు కొట్టాడు. ఇన్‌గిడి బౌలింగ్‌కు దిగితే అతనికి తన బ్యాటింగ్ సత్తా చూపించాడు. దీంతో 22.3 ఓవర్లో భారత్ 100 చేరింది. అదే జోరుతో శ్రేయస్ 33 బంతుల్లో (8 ఫోర్లు) మెరుపు వేగంతో అర్ధసెంచరీ సాధించాడు. కానీ అదే స్కోరు వద్దే ఇన్‌గిడి అతన్ని బోల్తా కొట్టించాడు. తర్వాత శార్దుల్ ఠాకూర్ వచ్చాక సంజూ వేగం పెంచాడు. 31.1 ఓవర్లో జట్టు స్కోరు 150కి చేరింది. ఇంకా భారత్ విజయానికి 8.5 ఓవర్లలోనే 100 పరుగులు కావాలి. టి20లకు కూడా కష్టమయ్యే చేజింగ్ వన్డేల్లో అసాధ్యం! సామ్సన్, శార్దుల్ (31 బంతుల్లో 33; 5 ఫోర్లు)ధాటిగా ఆడినా కొండంత రన్‌రేట్ కరగలేదు. 49 బంతుల్లో (3 ఫోర్లు, 2 సిక్సర్లు) సంజూ అర్ధసెంచరీ సాధించాడు. శార్దుల్ అవుటయ్యా క స్వల్ప వ్యవధిలో కుల్దీప్ (0), అవేశ్ (3) వికెట్లను కోల్పోయింది. దీంతో ఓటమి ఖాయమైంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మలాన్ (సి) అయ్యర్ (బి) శార్దుల్ 22; డికాక్ (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 48; బవుమా (బి) శార్దుల్ 8; మార్క్రమ్ (బి) కుల్దీప్ 0; క్లాసెన్ నాటౌట్ 74; మిల్లర్ నాటౌట్ 75; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (40 ఓవర్లలో 4 వికెట్లకు) 249. వికెట్ల పతనం: 1–49, 2–70, 3–71, 4–110. బౌలింగ్: సిరాజ్ 8–0–49–0, అవేశ్ 8–0–51–0, శార్దుల్ 8–1–35–2, రవి బిష్ణోయ్ 8–0–69–1, కుల్దీప్ 8–0–39–1. భారత్ ఇన్నింగ్స్: ధావన్ (బి) పార్నెల్ 4; గిల్ (బి) రబడ 3; రుతురాజ్ (స్టంప్డ్) డికాక్ (బి) షమ్సీ 19; ఇషాన్ కిషన్ (సి) మలాన్ (బి) కేశవ్ 20; అయ్యర్ (సి) రబడ (బి) ఇన్‌గిడి 50; సామ్సన్ నాటౌట్ 86; శార్దుల్ (సి) కేశవ్ (బి) ఇన్‌గిడి 33; కుల్దీప్ (సి) బవుమా (బి) ఇన్‌గిడి 0; అవేశ్ (సి) బవుమా (బి) రబడ 3; బిష్ణోయ్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (40 ఓవర్లలో 8 వికెట్లకు) వికెట్ల పతనం: 1–8, 2–8, 3–48, 4–51, 5–118, 6–211, 7–211, 8–215. బౌలింగ్: రబడ 8–2–36–2, పార్నెల్ 8–1–38–1, కేశవ్ 8–1–23–1, ఇన్‌గిడి 8–0–52–3, షమ్సీ 8–0–89–1. -
India Women vs England Women 2022 1st ODI: మెరిసిన స్మృతి, హర్మన్‌ప్రీత్
హోవ్: ఇంగ్లండ్ చేతిలో టి20 సిరీస్‌ను కోల్పోయిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. ముందుగా పదునైన బౌలింగ్‌తో ఆతిథ్య జట్టును కట్టడి చేసిన టీమ్... ఆ తర్వాత ముగ్గురు బ్యాటర్ల అర్ధ సెంచరీలతో అలవోకగా లక్ష్యాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ మహిళలను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 227 పరుగులే చేయగలిగింది. అలైస్ డేవిడ్సన్ (61 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... డానీ వ్యాట్ (43; 3 ఫోర్లు), సోఫీ ఎకెల్‌స్టోన్ (31; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. ఒక దశలో 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఆరో వికెట్ చేజార్చుకునే సమయానికి 128 వద్ద నిలిచింది. అయితే ఏడో వికెట్‌కు వ్యాట్‌తో 50 పరుగులు, ఎనిమిదో వికెట్‌కు ఎకెల్‌స్టోన్‌తో 49 పరుగులు జోడించి అలైస్ తమ జట్టును ఆదుకుంది. ఇన్నింగ్స్‌లో ఎక్కువ భాగం నెమ్మదిగా ఆడిన ఇంగ్లండ్ చివరి 6 ఓవర్లలో మాత్రం 45 పరుగులు సాధించింది. దీప్తి శర్మకు 2 వికెట్లు దక్కగా... జులన్ గోస్వామి, హర్లీన్, రాజేశ్వరి, మేఘన, స్నేహ్ రాణా తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 44.2 ఓవర్లలో 3 వికెట్లకు 232 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (99 బంతుల్లో 91; 10 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (94 బంతుల్లో 74 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (47 బంతుల్లో 50; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. యస్తికతో రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించిన స్మృతి, హర్మన్‌తో మూడో వికెట్‌కు 99 పరుగులు జోడించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లగా, రెండో వన్డే బుధవారం కాంటర్బరీలో జరుగుతుంది. -
World Wrestling Championships: నవీన్‌కు నిరాశ
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో పతకం చేజారింది. పురుషుల ఫ్రీస్టయిల్ 70 కేజీల విభాగంలో నవీన్ త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. ఎర్నాజర్ అక్మతలియెవ్ (కిర్గిజిస్తాన్)తో శుక్రవారం జరిగిన కాంస్య పతక బౌట్లో నవీన్ 1–4 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. తొలి రౌండ్ ఆరంభంలో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన నవీన్ ఆ తర్వాత రెండు పాయింట్లు సమర్పించుకున్నాడు. రెండో రౌండ్లో మరో రెండు పాయింట్లు కోల్పోయిన నవీన్ తేరుకోలేకపోయాడు. ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో 74 కేజీల విభాగంలో పోటీపడిన నవీన్ స్వర్ణ పతకం సాధించాడు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 70 కేజీల విభాగంలో బరిలోకి దిగి తొలి రౌండ్లో 1–6తో తైషి నరుకుని (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. తైషి నరుకుని ఫైనల్ చేరుకోవడంతో ‘రెపిచాజ్’ పద్ధతి ప్రకారం నవీన్‌కు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం లభించింది. ‘రెపిచాజ్’ తొలి రౌండ్లో నవీన్ 11–3తో సిర్బాజ్ తల్గాట్ (కజకిస్తాన్)పై నెగ్గిన నవీన్‌కు రెండో రౌండ్లో ఇలియాస్ బెక్బులతోవ్ (ఉజ్బెకిస్తాన్) నుంచి వాకోవర్ లభించింది. దాంతో నవీన్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. అనూహ్య ఫలితం... మరోవైపు భారత్‌కు కచ్చితంగా పతకం అందిస్తాడని ఆశించిన స్టార్ రెజ్లర్ రవి కుమార్ రిక్త హస్తాలతో స్వదేశానికి రానున్నాడు. ఈ మెగా ఈవెంట్ కోసం రష్యాలో ప్రత్యేక శిక్షణ పొందిన రవి కుమార్ పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు. తొలి రౌండ్లో 10–0తో మరియన్ కొవాక్స్ (రొమేనియా)పై గెలిచిన రవి ప్రిక్వార్టర్ ఫైనల్లో 0–10తో గులామ్జాన్ అబ్దులయెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలోఓడిపోయాడు. అబ్దులయెవ్ ఫైనల్ చేరుకొని ఉంటే ‘రెపిచాజ్’ పద్ధతి ప్రకారం రవి కుమార్‌కు కనీసం కాంస్యం కోసం పోటీపడేందుకు మరో అవకాశం లభించేది. కానీ అబ్దులయెవ్ క్వార్టర్ ఫైనల్లో 2–13తో జెలీమ్ఖాన్ అబకరోవ్ (అల్బేనియా) చేతిలో ఓడిపోవడంతో రవి పతకం ఆశలు ఆవిరయ్యాయి. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన రవి గత ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచాడు. 2020, 2021, 2022 ఆసియా చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడేళ్లు స్వర్ణ పతకాలు నెగ్గిన రవి ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పసిడి పతకం గెలిచాడు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం నిరాశపరిచాడు. 74 కేజీల విభాగంలో సాగర్ జగ్లాన్ క్వార్టర్ ఫైనల్లో 0–5తో కైల్ డగ్లస్ డేక్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. కైల్ ఫైనల్ చేరుకోవడంతో సాగర్ నేడు కాంస్య పతకం కోసం బరిలో నిలిచాడు. రెండు బౌట్లలో సాగర్ గెలిస్తే అతనికి కాంస్యం లభిస్తుంది. -
ఉక్రెయిన్‌దే విజయమా? రష్యా ఓడిపోవడం ఖాయమా?
Battlefield developments unclear, Russian and Ukrainian militaries: ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి యుద్ధంలో చాలా అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. తొలుత రష్యా ధాటికి ఉక్రెయిన్ సైన్యం నేలకొరిగిపోతుందేమో అన్నట్లు భయానకంగా విరుచుకుపడింది. దీంతో ఉక్రెయిన్ గడ్డ ఎటూ చూసిన శవాల దిబ్బలతో హృదయవిదారకంగా మారిపోయింది. రష్యా బలగాలు మొదటగా కీవ్‌ని స్వాధీనం చేసుకునే దిశగా సాగిన దాడులు కాస్త విఫ్లలమయ్యాయి. దీంతో తూర్పు ఉక్రెయిన్ దిశగా బలగాలను మళ్లించి తీవ్రంగా విరుచుకుపడింది రష్యా. ఉక్రెయిన్ వేర్పాటువాదుల ప్రాంతాల నుంచి దాడులు చేసే వ్యూహంతో సాగి క్రమంగా పుంజుకోవడం ప్రారంభంమైంది. వేలాది ఉక్రెయిన్ సైనికులు నేలకొరగడంతో బలగాల కొరత, ఆయుధాల కొరతను ఎదుర్కొంది ఉక్రెయిన్. తదనంతరం పాశ్చాత్యదేశాల సహకారంతో రష్యాతో అలుపెరగని పోరు సాగించింది. అంతేకాదు రష్యా బలగాలు భీకరమైన దాడులతో ఉక్రెయిన్ భూభాగంలో ఐదోవంతును నియంత్రించింది. ఐతే అనుహ్యంగా ఈ నెలలో ఉక్రెయిన్ బలగాలు పుంజుకుంటూ రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి దక్కించుకుంది. తూర్పు డోన్బాస్ని స్వాధీనం చేసుకోవాలనుకున్న రష్యా అధ్యక్షుడు వ్యాదిమర్ పుతిన్ లక్ష్యాన్ని నిర్విర్వం చేసింది ఉక్రెయిన్ సైన్యం. ఏది ఏమైనప్పటికీ ఈ యుద్ధం రెండోవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ చూసిన అతి పెద్ధ సాయుధ సంఘర్షణగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ మేరకు యూఎస్ రక్షణ కార్యదర్శి లియోన్ పనెట్లా ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ...రష్యా ఒకవేళ ఓడుపోయే ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం అత్యంత ప్రమాదకరమైన అణుదాడులను తీవ్రతరం చేసే అవకాశం ఉందన్న భయాందోళలను ఎక్కువ అవుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో లండన్ కింగ్స్ కాలేజ్‌లో యుద్ధ అధ్యయనాల ఎమెరిటస్ ప్రొఫెసర్, సైనిక చరిత్రకారుడు లారెన్స్ ఫ్రీడ్మాన్ మాట్లాడుతూ...ఈ యుద్ధం ఊహించని వాటిని తారుమారు చేస్తుందని చెప్పారు. ఇక రానున్న శీతకాలం యుద్ధ ప్రతిష్టంభనకు గురిచేస్తుందన్న ఊహాగానాలను తోసిపుచ్చుతూ...రష్యా పతనం దిశగా వెళ్లే అవకాశం ఉందన్నారు. రష్యా సైనిక ఓటమిని చవిచూస్తుందన్నారు. అదీగాక దళాల ఆయుధాలకు కీలకమైన ప్రాంతం ఇజియంను రష్యా వదిలివేయడం అదర్నీ ఆశ్చర్యపరిచిందని వాషింగ్టన్ థింక్ ట్యాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ తన నివేదికలో పేర్కొంది. ఐతే ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక ఆపరేషన్ దాని అసలు లక్ష్యాలను సాధించే వరకు దాడి కొనసాగుతుందని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కరాఖండీగా చెప్పడం గమనార్హం. ఖార్కివ్ ఎదురు దాడిలో ఉక్రెయిన్ బలగాలు అనుహ్యంగా దాడులను తిప్పిడుతూ... మొహరించే సామర్థ్యాన్ని పెంపొందించుకుందని రష్యన్ సైనిక నిపుణడు సీఎన్ఏ సెక్యూరిటీ థింక్ ట్యాంక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఈ యుద్ధం రష్యన్ మిలటరీకి అనుకూలమైనది కాదని నర్మగర్భంగా చెప్పాడు. మానవశక్తి, సైనిక కొరత తదితర సమస్యలను రష్యా ఎదరుర్కొంటుందని తెలిపాడు. ఇటీవల రష్యా బలగాల తిరోగమనంతో రష్యా కూడా ఉక్రెయిన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకునే ప్రజాభిప్రేయ సేకరణను నిలిపేసింది. మరోవైపు రష్యా ఈ దాడులను ఉపసంహరించుకోవాలనే రాజకీయ నిర్ణయం తీసుకోకపోతే తామే స్వయంగా వెళ్లి విజ్క్షప్తి చేస్తామని లండన్‌లోని ల్యాండ్ వార్ఫేర్ సీనియర్ రీసెర్చ్ ఫెలో జాక్ వాట్లిగ్ చెబుతుండటం గమనార్హం. ఇదీ చదవండి: చందమామే దిగి వచ్చిందా! -
US Open 2022: గార్సియా గర్జన.. సూపర్ ఫామ్ కంటిన్యూ
న్యూయార్క్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్ కరోలినా గార్సియా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ గార్సియా తన జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గార్సియా 6–3, 6–4తో అమెరికా టీనేజర్, 12వ సీడ్ కోకో గాఫ్‌పై విజయం సాధించింది. ఈ ఏడాది మూడు టైటిల్స్ నెగ్గి సూపర్ ఫామ్‌లో ఉన్న 28 ఏళ్ల గార్సియా యూఎస్ ఓపెన్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సెమీఫైనల్‌కు చేరింది. కోకో గాఫ్‌తో జరిగిన మ్యాచ్‌లో గార్సియా నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 24 విన్సర్స్ కొట్టిన ఆమె ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. నెట్ వద్దకు 16 సార్లు దూసుకొచ్చి 13 సార్లు పాయింట్లు గెలిచింది. 2011లో ప్రొఫెషనల్‌గా మారిన గార్సియా ఇప్పటివరకు 41 సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడింది. 2017లో ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడమే గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఆమె అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. పదోసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న గార్సియా సెమీఫైనల్ చేరడం ద్వారా ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ చేరిన మూడోఫ్రాన్స్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో ఫ్రాన్స్ నుంచి అమెలీ మౌరెస్మో (2002, 2006), మేరీ పియర్స్ (2005) సెమీఫైనల్ చేరారు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా)తో గార్సియా ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో జబర్ 2–0తో గార్సియాపై ఆధిక్యంలో ఉంది. జబర్ జోరు... ఈ ఏడాది 42 విజయాలతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ట్యూనిషియా ప్లేయర్ ఆన్స్ జబర్ క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ క్రీడాకారిణి ఐలా తొమ్లాయనోవిచ్ (ఆస్ట్రేలియా)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. గంటా 41 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో జబర్ 6–4, 7–6 (7/4)తో తొమ్లాయనోవిచ్పై గెలిచింది. ఈ గెలుపుతో గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా జబర్ నిలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో ఆరో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) 6–1, 7–6 (7/4)తో 22వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 82 నిమిషాలపాటు జరి గిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. కిరియోస్ జోరుకు ఖచనోవ్ బ్రేక్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 31వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా) తొలిసారి తన కెరీర్లో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో... ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆస్ట్రేలియా వివాదాస్పద ప్లేయర్, 23వ సీడ్ నిక్ కిరియోస్తో 3 గంటల 39 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఖచనోవ్ 7–5, 4–6, 7–5, 6–7 (3/7), 6–4తో గెలుపొందాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్ ఈ మ్యాచ్‌లో ఏకంగా 30 ఏస్‌లు సంధించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించిన కిరియోస్ 31 ఏస్‌లు సంధించినా 58 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కిరియోస్ కోపంతో తన రెండు రాకెట్లను నేలకేసి కొట్టి విరగొట్టడం గమనార్హం. మరో క్వార్టర్ ఫైనల్లో కాస్పర్ రూడ్ 6–1, 6–4, 7–6 (7/4)తో 13వ సీడ్ మారియో బెరెటిని (ఇటలీ)పై గెలిచాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన రూడ్ సెమీఫైనల్లో ఖచనోవ్‌తో ఆడతాడు. -
నాదల్కు షాక్
న్యూయార్క్: ఈ ఏడాది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్కు నిరాశ ఎదురైంది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. అమెరికా ప్లేయర్ ఫ్రాన్సిస్కో టియాఫో తన కెరీర్లోనే గొప్ప ప్రదర్శనతో ప్రపంచ మూడో ర్యాంకర్ నాదల్‌ను ఓడించి యూఎస్ ఓపెన్ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 22వ సీడ్ టియాఫో 6–4, 4–6, 6–4, 6–3తో రెండో సీడ్ నాదల్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. క్వార్టర్ ఫైనల్లో ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)తో టియాఫో ఆడతాడు. నాదల్‌తో 3 గంటల 34 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో టియాఫో 18 ఏస్‌లు సంధించి నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నాదల్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన టియాఫో 49 విన్నర్స్ కొట్టాడు. మరోవైపు నాదల్ తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు, 26 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో నాదల్‌ను ఓడించిన మూడో అమెరికా ప్లేయర్‌గా టియాఫో ఘనత వహించాడు. గతంలో అమెరికా ప్లేయర్లు ఆండీ రాడిక్ (2004లో), జేమ్స్ బ్లేక్ (2005లో) నాదల్‌ను ఓడించారు. ఈ ఏడాది నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో టైటిల్స్ సాధించి, వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్నాడు. గాయం కారణంగా అతను సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆడకుండా తన ప్రత్యర్థి కిరియోస్ (ఆస్ట్రేలియా)కు వాకోవర్ ఇచ్చాడు. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), 11వ సీడ్ జానిక్ సినెర్ (ఇటలీ) తమ ప్రత్యర్థులను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరారు. 2014 చాంపియన్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో 3 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–4, 3–6, 6–4, 4–6, 6–3తో గెలుపొంది వరుసగా రెండో ఏడాది క్వార్టర్ ఫైనల్ చేరాడు. సినెర్ 6–1, 5–7, 6–2, 4–6, 6–3తో ఇవాష్క (రష్యా)పై గెలిచాడు. క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), ఆరో సీడ్ సబలెంకా (బెలారస్), ఎనిమిదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో స్వియాటెక్ 2–6, 6–4, 6–0తో నీమియెర్ (జర్మనీ)పై, సబలెంకా 3–6, 6–3, 6–2తో డానియెలా కొలిన్స్ (అమెరికా)పై, పెగూలా 6–3, 6–2తో క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై, ప్లిస్కోవా 7–5, 6–7 (5/7), 6–2తో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్)పై గెలిచారు. -
Rishi Sunak: రిషి ఓటమి వెనుక కారణాలివే..
రెడీ ఫర్ రిషి అంటూ బ్రిటన్ ప్రధాని అభ్యర్థి ఎన్నికలో మొదట్లో దూకుడు చూపించిన రిషి సునాక్ ఎందుకు ఓటమి పాలయ్యారు? ఎంపీల మద్దతు పుష్కలంగా ఉన్నా టోరీ సభ్యుల అండదండలు ఎందుకు లభించలేదు? భారత్‌ను వలసరాజ్యంగా మార్చిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక భారతీయుడు పాలించే రోజు వస్తుందన్న ఆశలు ఎందుకు అడియాసలయ్యాయి? దీనిపై బ్రిటిష్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి... ► కోవిడ్–19 పార్టీ గేట్ కుంభకోణంలో ఇరుక్కొన్న ప్రధాని బోరిస్ జాన్సన్‌కు రిషి వెన్నుపోటు పొడిచారన్న అభిప్రాయం కన్జర్వేటివ్ పార్టీలో బలంగా ఏర్పడింది. రాజకీయ గురువని కూడా చూడకుండా జాన్సన్‌కు వ్యతిరేకంగా పని చేసి ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి కల్పించారని టోరీ సభ్యులు విశ్వసించారు. ఆర్థిక మంత్రి పదవికి రిషి రాజీనామా చేయడంతో ఇతర మంత్రులూ అదే బాట పట్టారు. వారికి మద్దతుగా 50 మంది ఎంపీలు కూడా రాజీనామా చేయడంతో ఒత్తిడి పెరిగి జాన్సన్ గద్దె దిగాల్సి వచ్చింది. దీన్ని నమ్మకద్రోహంగానే టోరి సభ్యులు చూశారు. ఆ వెంటనే రెడీ ఫర్ రిషి అంటూ పోటీకి దిగి దూకుడుగా ప్రచారానికి తెర తీయడంతో ప్రధాని పదవి కోసమే అంతా చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. బోరిస్ కూడా రిషికి వ్యతిరేకంగా పని చేశారు. ► ప్రతి మగవాడి విజయం వెనకా ఒక మహిళ ఉంటుందంటారు. కానీ రిషి పరాజయం వెనుక దురదృష్టవశాత్తూ ఆయన భార్య, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షత ఉన్నారు. ఆమె ఎలిజెబెత్ రాణి కంటే సంపన్నురాలన్న ప్రచారముంది. అలాంటి వ్యక్తి పన్నులు ఎగ్గొట్టడానికి నాన్ డొమిసైల్ హోదాను అడ్డం పెట్టుకున్నారన్న ఆరోపణలు కూడా రిషికి ప్రతికూలంగా మారాయి. ► తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ ప్రకటించిన పన్ను రాయితీలను వ్యతిరేకించడం కూడా రిషి కొంప ముంచింది. వాటివల్ల ద్రవ్యోల్బణం పెచ్చరిల్లుతుందన్న రిషి వాదనకు కాకలు తీరిన ఆర్థికవేత్తలు మద్దతిచ్చినా టోరీ సభ్యులు మాత్రం ట్రస్ తక్షణం ఉపశమన చర్యలకే జై కొట్టారు. ► రిషీ అమెరికా గ్రీన్ కార్డు వివాదం కూడా ఆయనకు వ్యతిరేకంగా మారింది. బ్రిటన్‌కు మకాం మార్చాక కూడా గ్రీన్ కార్డును ఆయన అట్టిపెట్టుకున్నారని, ఎప్పటికైనా అమెరికాకు వెళ్లిపోవడానికే ఈ పని చేశారని సోషల్ మిడియాలో బాగా ప్రచారమైంది. ఆర్థిక మంత్రి కాగానే గ్రీన్‌కార్డును వదులుకున్నానని రిషి వివ రణ ఇచ్చినా అప్పటికే నష్టం జరిగిపోయింది. ► రిషి విలాసవంతమైన జీవితం కూడా ఆయనకు కాస్త చేటు చేసింది. ఆయన ఖరీదైన సూటు, బూటు, ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ఫొటో సెషన్లో ఖరీదైన మగ్గుతో ఫోటోలు దిగడం వంటివి పత్రికల్లో పతాక శీర్షికలయ్యాయి. కరువు గుప్పిట్లో చిక్కిన బ్రిటన్‌లో గుక్కెడు నీళ్ల కోసం జనం విలవిల్లాడుతుంటే రిషీ యార్క్‌షైర్‌లోని తన కొత్తింట్లో 4 లక్షల పౌండ్లతో స్విమ్మింగ్ పూల్ నిర్మించడం వివాదాస్పదమైంది. ‘నా ఫ్రెండ్స్ అంతా ధనవంతులే. నా స్నేహితుల్లో సామాన్యులెవరూ లేరు’ అంటూ ఎప్పుడో ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో రిషి అందరివాడు కాదన్న ప్రచారానికి బలం చేకూరింది. – సాక్షి, నేషనల్ డెస్క్