manchu Vishnu
-
ముఖ్యమంత్రిని కలిసిన మంచు మోహన్‌బాబు
టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు (Mohan Babu) తన కుమారుడు విష్ణుతో పాటుగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని (Bhupendra Patel) కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ పేజీలో వారు షేర్ చేశారు. తెలుగు కళాకారుడు రమేశ్ గొరిజాల వేసిన పెయింటింగ్‌ను సీఎం భూపేంద్ర పటేల్‌కు విష్ణు కానుకగా అందించారు. వారితో పాటు శరత్ కుమార్, శ్రీ ముఖేష్ రిషి, వినయ్ మహేశ్వరి ఉన్నారు.గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని కలవడం తమకు చాలా సంతోషంగా ఉందని మోహన్‌బాబు అన్నారు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. అభివృద్ధిలో గుజరాత్ మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసిస్తూనే ఆయన ఎన్నో విజయాలు అందుకోవాలని మోహన్‌బాబు కోరారు. అయితే ఆయన ఏ కారణం వల్ల సీఎంను కలిశారో అనేది మాత్రం తెలుపలేదు.ప్రస్తుతం మోహన్‌బాబు, శరత్‌కుమార్ ఇద్దరూ ‘కన్నప్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు. మంచు విష్ణు కలలప్రాజెక్ట్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌తో ఏప్రిల్ 25న ఈ చిత్రం విడుదల కానుంది.It was a pleasure meeting the Hon’ble Chief Minister of Gujarat, Shri Bhupendra Patel Ji, along with Vishnu Manchu, Mr. Sarath Kumar, Mr. Mukesh Rishi, and Mr. Vinay Maheshwari. I thank him for the warm reception and praise the Almighty for his good health and prosperity. As a… pic.twitter.com/iDdQDh9oLV— Mohan Babu M (@themohanbabu) January 29, 2025 -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ప్రభాస్ ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ అక్షయ్‌కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి పలువురు స్టార్స్ నటిస్తున్నారు. అంతేకాదు మన రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఇందులో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా కన్నప్ప మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రెబల్ స్టార్ ప్రభాస్ లుక్‌ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 3న తేదీన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.టీజర్‌కు ఊహించని రెస్పాన్స్..ఇప్పటికే కన్నప్ప టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్తో కన్నప్ప టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. Here’s a glimpse of the Darling-Rebel Star '𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬' in #Kannappa!🌟 🎬Experience the beginning of an epic journey, and don’t miss the full reveal on 3rd February. Stay tuned for more updates! 🙌 #Prabhas #HarHarMahadevॐ@themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas… pic.twitter.com/ujJMFf93W8— Kannappa The Movie (@kannappamovie) January 27, 2025 -
నాన్న మనసు ముక్కలైంది.. అమ్మ నలిగిపోతోంది: మంచు విష్ణు
అన్నదమ్ముల గొడవ వల్ల మోహన్‌బాబు ఏళ్లతరబడి సంపాదించుకున్న పరువు ప్రతిష్ట అంతా బజారుకెక్కింది. పెదరాయుడిగా అందరి సమస్యలు తీర్చే మోహన్‌బాబు ఇంటి గొడవను చక్కదిద్దలేక డీలా పడిపోయాడు. రోజుకో వివాదం, ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడంతోనే రోజులు గడుస్తున్నాయి. కానీ, ఇంతవరకు వీరి సమస్య ఓ కొలిక్కి వచ్చిందే లేదు.నాన్న మనసు విరిగిందితాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు (Vishnu Manchu) తన ఇంట్లో జరుగుతున్న కలహాలపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. తండ్రిగా మోహన్‌బాబు (Mohanbabu).. మనోజ్‌ను, నన్ను సమానంగా ప్రేమించాడు. మా ఇంటి గొడవ రోడ్డుకెక్కడం వల్ల నాన్నగారి మనసు విరిగిపోయింది. ఆస్తుల గరించి ఒకటి చెప్పాలి. మా నాన్న మమ్మల్ని చదివించారు. తర్వాత ఎవరి కాళ్ల మీద వారు నిలబడాలి. రేప్పొద్దున నా పిల్లలు కూడా నాపై ఆధారపడకుండా వారి కాళ్లపైనే నిలబడాలి. వారే సంపాదించుకోవాలి. ఎవరైనా సరే.. తండ్రి దగ్గరకు వెళ్లి ఆయన ఆస్తి, ఇల్లు అడగకూడదు.అమ్మ కొడుతుందేమో..కుటుంబ విషయాల గురించి ఇంకా ఎక్కువ మాట్లాడితే మా అమ్మ నన్ను కొడుతుందేమోనని భయంగా ఉంది. అమ్మతో పది నిమిషాల పైన మాట్లాడితే చాలు తిట్టడం మొదలుపెడుతుంది. తనతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఈ వివాదంలో ఎక్కువ నలిగిపోయింది అమ్మ. ఏదో ఒకరోజు అమ్మ మా అందర్నీ కొడుతుందేమోననిపిస్తోంది. ఇంటి గొడవ వీధిన పడ్డప్పుడు అందరం బాధపడ్డాం. సినిమా ఇండస్ట్రీలో దగ్గరివాళ్లు ఫోన్ చేసి మాట్లాడారు. ఇతర ఇండస్ట్రీకి చెందిన మోహన్‌లాల్, ప్రభుదేవా.. వంటివారు కూడా ఫోన్లు చేసి బాధపడ్డారు అని చెప్పుకొచ్చాడు.(చదవండి: ఇంటి నుంచి మనోజ్‌ను బయటకు పంపాలంటూ మోహన్‌బాబు ఫిర్యాదు)మనోజ్‌తో కలిసిపోతా..మనోజ్ (Manchu Manoj)కు భయపడి దుబాయ్‌కు షిఫ్ట్ అవుతున్నారా? అన్న ప్రశ్నకు నేను ఎవ్వరికీ భయపడను. ఈ జన్మలో భయపడటమనేదే జరగదు. జీవితంలో ఎవరికీ జంకొద్దనుకునే టైంలో నా భార్యకు భయపడాల్సి వస్తుంది. పిల్లల్ని దుబాయ్‌లో చదివించాలనుకుంటున్నానంతే! అన్నాడు. మనోజ్‌తో కలిసిపోతారా? అన్న ప్రశ్నకు.. అది కచ్చితంగా జరుగుతుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. కాలమే అన్నింటినీ మార్చేస్తుంది. చాలావరకు అన్నీ సద్దుమణిగాయి అన్నాడు. కుటుంబంజెనరేటర్ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. జెనరేటర్లో చక్కెర పోస్తే ఫిల్టర్ ప్రాసెస్‌లోనే ఆగిపోతుంది తప్ప పేలదు. ఇది చాలా సిల్లీ అని నవ్వేశాడు. మోహన్‌బాబు కుటుంబ విషయానికి వస్తే.. ఈయన మొదటగా విద్యాదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు లక్ష్మీ ప్రసన్న, విష్ణు జన్మించారు. విద్యా దేవి మరణించాక ఆమె సోదరి నిర్మలా దేవిని మోహన్‌బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి మనోజ్ పుట్టాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప విశేషాలుకన్నప్ప సినిమా (Kannappa Movie) గురించి మాట్లాడుతూ.. ఏడెనిమిది సంవత్సరాలపాటు దీనిపై అధ్యాయం చేశాను. శివుడి పాత్ర కోసం అక్షయ్ కుమార్‌ను సంప్రదించినప్పుడు ఆయన ఆఫర్ రిజెక్ట్ చేశారు. మూడుసార్లు అడిగినా ఒప్పుకోలేదు. దర్శకురాలు సుధా కొంగరతో మాట్లాడించి తనను ఒప్పించాను. ప్రభాస్ సినిమాలో భాగమవడానికి నాన్నే కారణం అని చెప్పాడు. కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది.చదవండి: సైఫ్‌ను ఆవేశంతో పొడిచాడు.. నా నగల జోలికి వెళ్లలేదు: కరీనా -
ఇంటి నుంచి మనోజ్‌ను బయటకు పంపాలంటూ మోహన్‌బాబు ఫిర్యాదు
మోహన్‌బాబు ఫ్యామిలీ (Manchu Mohan Babu Family) లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల తిరుపతిలో జరిగిన ఘటన మరువక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. తన ఆస్తుల్లో ఉన్న అందర్నీ వెకేట్ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కు మోహన్‌బాబు (Mohan Babu) శనివారం ఫిర్యాదు చేశాడు. జల్పల్లిలో ఉన్న ఆస్తులను కొంతమంది ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన ఇంట్లో ఉన్న వారందరినీ బయటకు పంపించేసి ఆ ఇంటిని తనకు అప్పగించాలని కోరాడు.కాగా గత కొన్ని రోజుల నుంచి మోహన్‌బాబు తిరుపతిలోనే ఉంటున్నాడు. జల్పల్లిలోని ఇంట్లో భార్య, కూతురితో కలిసి మనోజ్ నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్‌బాబు కోరాడు. పోలీసుల దగ్గరి నుంచి మోహన్‌బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్న కలెక్టర్.. జల్పల్లిలోని ఇంట్లో ఉంటున్న మనోజ్‌కు నోటీసులు ఇచ్చారు.మోహన్‌బాబు ఫిర్యాదుతో మనోజ్.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లాడు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను కలిశాడు. జల్పల్లిలోని ఇంటికి అక్రమంగా చొరబడలేదని తెలిపాడు. తమకు ఆస్తి తగాదాలు ఏమీ లేవని, విష్ణు (Manchu Vishnu).. తండ్రిని అడ్డం పెట్టుకుని నాటకాలాడుతున్నాడని ఆరోపించాడు. న్యాయం జరిగేవరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశాడు.గత నెలలో మొదలైన గొడవమోహన్బాబు కుటుంబంలో కలహాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. గత కొద్దిరోజులుగా మనోజ్ (Manchu Manoj), విష్ణు మధ్య వైరం పెరుగుతూనే వస్తోంది. గతేడాది డిసెంబర్ నెలలో మనోజ్ తనపై దాడి జరిగింది. మోహన్‌బాబు ఆదేశాల మేరకు ఆయన ప్రధాన అనుచరుడు, విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ దాడి చేసినట్లుగా మనోజ్ పేరుతో ఓ ప్రకటన వెలువడింది. నడవలేని స్థితిలో మనోజ్ ప్రైవేటు ఆస్పత్రిలో చేరడంతో ఏం జరిగిందన్న ఉత్కంఠ నెలకొంది. అటు మంచు కుటుంబం మాత్రం అలాంటిదేం జరగలేదని ప్రకటించింది.జల్పల్లి నివాసాన్ని స్వాధీనం చేసుకున్న మనోజ్కానీ తర్వాత హైదరాబాద్ శివార్లలోని జల్పల్లిలో ఉన్న మోహన్‌బాబు ఫామ్‌హౌస్‌ను మంచు మనోజ్ స్వాధీనం చేసుకున్నాడు. తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే మోహన్‌బాబు.. అసాంఘిక శక్తుల నుంచి తనకు ప్రాణహాని అని చెప్తూ మనోజ్-మౌనికపై ఫిర్యాదు చేశాడు. జల్పల్లిలోని తన నివాసం నుంచి మనోజ్, మౌనికను బయటకు పంపండి అని కోరాడు.చక్కెర గొడవ.. ర్యాలీతో రభసతర్వాత ఓ రోజు మనోజ్ ఇంట్లో పార్టీ చేసుకుంటే విష్ణు జనరేటర్లో చక్కెర పోశాడని గొడవ చేశాడు. అలాంటిదేం లేదని తల్లి స్వయంగా స్పందించడంతో ఈ గొడవ సద్దుమణిగింది. రెండు రోజుల క్రితం మోహన్‌బాబు యూనివర్సిటీకి 200 మందితో ర్యాలీగా వెళ్లాడు మనోజ్. యూనివర్సిటీ ప్రాంగణంలోకి వెళ్లడానికి అనుమతి లేదంటూ కోర్టు ఉత్తర్వులు చూపించినా మనోజ్ వెనక్కు తగ్గలేదు. ఈ క్రమంలో గొడవ జరగడంతో మనోజ్, మౌనికపై కేసు నమోదు అయింది. అటు మనోజ్ ఫిర్యాదుతో ఎంబీయూ సిబ్బంది, మోహన్‌బాబు బౌన్సర్లపైనా కేసు నమోదైంది.కుక్క తిట్లుఇంతలో శుక్రవారం విష్ణు, మనోజ్ సోషల్ మీడియా వేదికగా తిట్టుకున్నారు. 'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అన్న సినిమా డైలాగ్‌ను విష్ణు ట్వీట్ చేశాడు. దీనికి మనోజ్ స్పందిస్తూ.. కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు అని కౌంటరిచ్చాడు.మాట్లాడుకుందాం.. అంతలోనే ట్విస్ట్ఈ రోజు ఉదయం కలిసి మాట్లాడుకుందాం. నాన్నను, ఇంట్లోని ఆడవారిని, సిబ్బందిని అందర్నీ పక్కన పెట్టి రా. నేనూ ఒంటరిగానే వస్తాను. అన్ని విషయాలు చర్చించుకుందాం అని మనోజ్ ట్వీట్ చేశాడు. ఇంతలోనే మోహన్‌బాబు మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించడం.. మనోజ్ కలెక్టరేట్‌కు వెళ్లి న్యాయం కోసం పోరాడతాననడం జరిగిపోయింది. ఇక ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి!చదవండి: చాలా సిగ్గుపడుతున్నా.. సైఫ్‌కు క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌటేలా -
సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో మళ్లీ వివాదాలు
-
'నువ్వు ఈ జన్మలోనే తెలుసుకుంటావ్'.. మంచు ఫ్యామిలీలో ట్విటర్ వార్!
మంచు వారి ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ దంపతులు వెళ్లగా మరోసారి వివాదం మొదలైంది.మంచు మనోజ్ తన భార్య మౌనిక రెడ్డితో కలిసి తాత, నానమ్మకు నివాళులర్పించేందుకు రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీకి చేరుకున్నారు. అయితే లోపలికి వెళ్లకుండా వారిని సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ అనుచరులు గేటు పైకి ఎక్కి లోనికి దూసుకెళ్లారు. దీంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. గతనెలలో తలెత్తిన వివాదం మరవకముందే మరోసారి గొడవ మొదలైంది.తాజాగా ఈ వివాదం తర్వాత మంచు విష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది. మొదట మంచు విష్ణు ట్వీట్ తన రౌడీ సినిమాలో డైలాగ్‌ను షేర్ చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేశారు. 'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అనే డైలాగ్‌ను పోస్ట్ చేశారు.అయితే దీనికి అదే స్టైల్లో మంచు మనోజ్ కౌంటరిచ్చారు. కన్నప్ప సినిమాలో కృష్ణం రాజులా అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది.. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్' అంటూ కృష్ణం రాజు సినిమాల పోస్టర్లను పంచుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో అన్నదమ్ముల వార్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇన్‌డైరెక్ట్‌గా మంచు విష్ణు తెరకెక్కిస్తోన్న కన్నప్ప మూవీని మంచు మనోజ్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. One of my fav movie and dialogue from #Rowdy. @RGVzoomin is one of my fav and he rocked this movie. Every dialogue in this is a statement. Celebrating #MB50 pic.twitter.com/AZToFJ1eKM— Vishnu Manchu (@iVishnuManchu) January 17, 2025 ఇరువురిపై కేసులు..ఇప్పటికే మనోజ్, మోహన్‌బాబుకు సంబంధించిన ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు కేసులు నమోదు చేశారు. మోహన్‌బాబు పీ.ఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో మంచు మనోజ్ కూడా తనతో పాటుగా భార్య మౌనికపై ఎంబీయూ యూనివర్శిటీ వారు దాడికి ప్రయత్నించారంటూ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోహన్‌బాబు పీఏతో పాటు యూనివర్శిటీ సిబ్బంది 8 మందిపై మనోజ్ ఫిర్యాదు చేశారు.#Kannapa lo #RebelStar Krishnam raju garu laga, Simham avalli ani prathi fraud kukkaki vuntudhi,e vishyam nuvu idhe janamlo telusukuntav. #VisMith (crack this guys) Clue (his Hollywood venture) pic.twitter.com/iJXIdEx59y— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 17, 2025 -
మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం వేళ.. మంచు విష్ణు పోస్ట్ వైరల్
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది. గతంలో జల్పల్లిలోని నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత తలెత్తిన పరిణామాలతో మోహన్ బాబు ఆస్పత్రి పాలయ్యారు. ఓ ప్రైవేట్ చికిత్స తీసుకుని వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఇటీవల సంక్రాంతి వేడుకల్లో కూడా మంచు విష్ణుతో కలిసి మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. అంత బాగుందనుకున్న తరుణంలో మరోసారి వివాదం మొదలైంది.ఈ పండుగ వేళ మంచు మనోజ్, మౌనిక దంపతులు తిరుపతి రంగంపేటలోని మోహన్ బాబుకు యూనివర్సీటికి వెళ్లడంతో మళ్లీ గొడవ మొదలైంది. మనోజ్ దంపతులను లోపలికి అనుమతించక పోవడంతో ఆయన అనుచరులు గేటు పైకి ఎక్కి లోపలికి ప్రవేశించారు. మనోజ్‌కు అనుమతి లేదని వారు చెప్పడంతో ఇరువర్గాల వారు దూషణకు దిగారు. మనోజ్ అనుచరులు గేట్లు దూకడంతో సిబ్బంది, ప్రైవేటు బౌన్సర్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మనోజ్ అనుచరులు వారిపైకి రాళ్లు విసిరారు. ఆపై ఎంబీయూలో పని చేస్తున్న కిరణ్ కుమార్‌పై దాడి చేశారు.మంచు విష్ణు ట్విటర్ పోస్ట్ వైరల్..ఈ గొడవల నేపథ్యంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను నటించిన రౌడీ చిత్రంలోని ఓ డైలాగ్ ఆడియోను ఆయన ట్విటర్లో పంచుకున్నారు. నా ఫేవరేట్ డైలాగ్స్‌లో ఇది ఒకటి.. నా ఫేవరేట్ డైరెక్టర్ ఆర్జీవీ ఈ సినిమాను అందించాడు. ఇందులో ప్రతి డైలాగ్ ఒక స్టేట్మెంట్ అంటూ ఇండస్ట్రీలో మోహన్ బాబు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటో చూసేద్దాం.'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అనే డైలాగ్‌ను మంచు విష్ణు షేర్ చేశారు. అయితే వివాదం కొనసాగుతున్న వేళ ఇలాంటి పోస్ట్ చేయడంపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మంచు మనోజ్‌ను ఉద్దేశించే చేశారా? అనే తెగ చర్చించుకుంటున్నారు. కేసులు నమోదు..ఈ వివాదంతో చంద్రగిరిలో మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదు అయ్యాయి. మనోజ్, మోహన్‌బాబుకు సంబంధించిన ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు కేసులు నమోదు చేశారు. మోహన్‌బాబు పీ.ఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో మంచు మనోజ్ కూడా తనతో పాటుగా భార్య మౌనికపై ఎంబీయూ యూనివర్శిటీ వారు దాడికి ప్రయత్నించారంటూ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోహన్‌బాబు పీఏతో పాటు యూనివర్శిటీ సిబ్బంది 8 మందిపై మనోజ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువురిపై పోలీసులు నమోదు చేశారు.తాత, నానమ్మకు మంచు మనోజ్ దంపతుల నివాళులు..తిరుపతికి వెళ్లిన మంచు మనోజ్.. తన భార్యతో కలిసి తాత, నానమ్మల సమాధుల వద్దకు చేరుకుని నివాళులు అర్పించాడు. శ్రీవిద్యానికేతన్‌లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై ప్రశ్నించడంతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మంచు మనోజ్ చెప్పారు. ఆపై సుమారు 200 మందితో కలిసి ర్యాలీగా శ్రీవిద్యానికేతన్ మీదుగా నారావారిపల్లెకు చేరుకున్న మనోజ్.. అక్కడ మంత్రి నారా లోకేశ్‌తో సుమారు 25 నిమిషాల పాటు భేటీ కావడం విశేషం. One of my fav movie and dialogue from #Rowdy. @RGVzoomin is one of my fav and he rocked this movie. Every dialogue in this is a statement. Celebrating #MB50 pic.twitter.com/AZToFJ1eKM— Vishnu Manchu (@iVishnuManchu) January 17, 2025 -
సంక్రాంతి రభస: మోహన్‌బాబు, విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు
తన అభిమానులపై దాడి చేయించినందుకుగానూ తండ్రి మోహన్‌బాబు (Mohan Babu), సోదరుడు విష్ణుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంచు మనోజ్ (Manchu Manoj) జనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నా కూతురు పుట్టాక వచ్చిన మొదటి పండగకు కూడా ఇంటికి రానివ్వడం లేదు. ఇంట్లోకి వెళ్లనివ్వకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. మా ఇంటి విషయాన్ని ఎవరితో చర్చించడం నాకు ఇష్టం ఉండదు. సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లాను. కానీ మా కుటుంబ విషయాలేవీ ఆయన దృష్టికి తీసుకెళ్లలేదు అన్నారు. మీడియాతో మాట్లాడిన తర్వాత మనోజ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. కడుపులో ఎడమవైపు నొప్పి రావడంతో పోలీస్ స్టేషన్ వెనక కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు.ఏం జరిగిందంటే? మనోజ్, భార్య మౌనికతో కలిసి బుధవారం నాడు తిరుపతికి వెళ్లాడు. నారావారిపల్లెకు వెళ్లి మంత్రి నారా లోకేశ్‌తో 25 నిమిషాలపాటు భేటీ అయ్యాడు. అనంతరం శ్రీవిద్యానికేతన్ స్కూల్‌కు 200 మందితో ర్యాలీగా వెళ్లాడు. అప్పటికే సిబ్బంది గేట్లు మూసివేయగా పోలీసులు భారీగా మెహరించారు. ఆయన స్కూల్ లోపలకు వెళ్లేందుకు అనుమతులు లేవని పోలీసులు కోర్టు ఉత్తర్వులను చూపించారు.సమాధుల వద్దకు కూడా వెళ్లనివ్వరా..?పండుగ పూట తాత, నానమ్మల సమాధుల వద్దకు కూడా వెళ్లనివ్వరా అని మనోజ్ అసహనం వ్యక్తం చేశాడు. తనను అనుమతించకపోతే రోడ్డుపై బైఠాయిస్తానన్నాడు. మోహన్‌బాబు యూనివర్సిటీ సమీపంలోని డెయిరీ వద్దకు భార్యతో కలిసి వెళ్లాడు మనోజ్. అక్కడ అతడి అనుచరులు గేట్లు దూకడంతో సిబ్బంది, ప్రైవేటు బౌన్సర్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మనోజ్ అనుచరులు వారిపైకి రాళ్లు విసరడంతో వారిపై మోహన్‌బాబు బౌన్సర్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ మనోజ్.. భార్యతో కలిసి నానమ్మ, తాతల సమాధుల వద్దకు చేరుకుని నివాళులు అర్పించాడు.చదవండి: మా సినిమాలు అందుకే ఆడట్లేదు: మలయాళ హీరో -
ఏడాదిన్నర క్రితమే తీసుకున్నా.. మీలో స్ఫూర్తి కోసమే చెబుతున్నా: మంచు విష్ణు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు(Manchu Vishnu) అనాథ పిల్లలకు అండగా నిలుస్తున్నారు. తిరుపతి జిల్లాలో ఉన్న మాతృశ్య ఫౌండేషన్‌కు చెందిన 120 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. ఏడాదిన్నర క్రితమే వారిని దత్తత తీసుకున్నట్లు మంచు విష్ణు వెల్లడించారు. ఈ విషయాన్ని సంక్రాంతి సందర్భంగా ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.మంచు విష్ణు తన ట్వీట్లో రాస్తూ..' ఏడాదిన్నర క్రితం తిరుపతిలోని(Tirupati) శ్రీమతి శ్రీదేవి గారు నిర్వహిస్తున్న మాతృశ్య ఫౌండేషన్‌కు వచ్చా. ఇక్కడ ఉన్న 120 మంది పిల్లలను దత్తత తీసుకున్నా. వారి విద్యతో పాటు కొత్త బట్టలు అందిస్తున్నా. మనలాగే వారికి కూడా పండుగలు ఆనందకరమైన క్షణాలుగా ఉండేలా చూసుకుంటున్నా. ఈ విషయాన్ని నేను అందరితో పంచుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ప్రపంచానికి కూడా ఇలాంటి స్టోరీస్ తెలియజేయాలని భావిస్తున్నా. ఇది నేను చేసిన గొప్ప పనేం కాదు.. సమాజానికి ఓ చిన్నసేవ మాత్రమే. ఇది మీకు స్ఫూర్తినిస్తే.. మీ శక్తితో అవసరంలో ఉన్న ఎవరికైనా మద్దతు ఇస్తారని నేను ఆశిస్తున్నా' అని పోస్ట్ చేశారు.సంక్రాంతి సందర్భంగా భోగి పండుగ రోజు పిల్లలను అల్పాహారానికి ఆహ్వానించినట్లు మంచువిష్ణు తెలిపారు. ఈ పండుగ స్ఫూర్తిని నింపుతూ వారితో ఆనందాన్ని పంచుకున్నానని వెల్లడించారు. పిల్లల చిరునవ్వు ఆశీర్వాదం..ఈ చిన్నపిల్లలే భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదిగి.. అవసరంలో ఉన్న ఇతరులకు సహాయం చేస్తారనే నమ్మకముందని మంచు విష్ణు పోస్ట్ చేశారు.కన్నప్పలో మంచు విష్ణు..మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలో కిరాట పాత్రలో మలయాళ స్టార్ నటుడు మోహన్‌లాల్ నటిస్తున్నారు.కన్నప్ప కథేంటంటే..కన్నప్ప సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నదిఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నామని మోహన్‌బాబు వెల్లడించారు.టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్..మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. కన్నప్ప టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా అనిపించింది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులని కట్టిపడేసింది. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. A year and a half ago, I adopted 120 children from Matrusya Foundation, Tirupati, run by Ms. Sridevi garu. I take care of their education, provide them with new clothes, and ensure festivals are moments of joy for them.I wasn’t keen to share this with the world, but I feel the… pic.twitter.com/A80PwnRhR9— Vishnu Manchu (@iVishnuManchu) January 14, 2025 -
120 మంది అనాథలను దత్తత తీసుకున్న మంచు విష్ణు
హీరో మంచు విష్ణు (Manchu Vishnu) గొప్ప మనసు చాటుకున్నాడు. 120 మంది అనాథలను దత్తత తీసుకున్నాడు. ఒక కుటుంబసభ్యుడిలా వారికి అన్ని విషయాల్లోనూ తోడుగా ఉంటానన్నాడు. సంక్రాంతి పండగ సైతం చిన్నారులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. పిల్లలకు నచ్చిన బొమ్మలు కూడా కొనిపెడతానన్నాడు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమను అందరూ కుటుంబసభ్యులతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నా..సాధారణంగా కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదంటారు. కానీ ఈ సంక్రాంతికి నేను చేసిన ఓ చిన్న పని మీ అందరికీ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను చేసిన పనిని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా పక్కన ఉన్నవాళ్లకు సాయం చేస్తారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారాలను నేను చూసుకుంటూ ఉంటాను. ఓ రోజు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా మాతృశ్య అనాథాశ్రమం నిర్వహిస్తున్న శ్రీదేవి పరిచయమయ్యారు. (చదవండి: డాకు మహారాజ్లో నటనతో కట్టిపడేసిన ఈ చిన్నారి ఎవరో తెలుసా?)120 మంది చిన్నారుల బాధ్యత నాదేఒకసారి తన ఆశ్రమానికి రమ్మని ఆహ్వానించారు. ఏ స్వలాభం లేకుండా సహృదయంతో 120 మందికి పైగా చిన్నారుల బాగోగులు చూసుకుంటోంది. ఏడాదిన్నర క్రితం ఆ అనాథాశ్రమానికి వెళ్లాను, పిల్లలందర్నీ దత్తత తీసుకుంటానని చెప్పాను. చెప్పిన మాట ప్రకారం చిన్నారులను దత్తత తీసుకున్నాను. వారికి అప్పుడప్పుడు కొత్త బట్టలు పంపిస్తాం. అలాగే పిల్లలందరి చదువుకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. పండగలకు వారితో కలిసుందామని సంక్రాంతికి ఇక్కడికి వచ్చాను.బర్త్‌డే రోజు అనవసర ఖర్చులు పక్కన పెట్టండివీళ్లంతా నా కుటుంబసభ్యులే.. ఒక అన్నగా, ఇంటిపెద్దగా పిల్లలతో పండగ జరుపుకున్నాను. ఇది మీకూ నచ్చితే ఎవరినైనా దత్తత తీసుకోండి. పుట్టినరోజు అనవసర ఖర్చులు చాలా ఉంటాయి. అవి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అవసరం ఉన్నవారికి సాయపడితే దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు.. కాబట్టి నేను ఇప్పుడు సాయపడగలుగుతున్నాను. రేపు ఈ పిల్లలు పెద్దవాళ్లయ్యాక.. వారు మిగతావారికి సాయపడాలి. అది ఇప్పటినుంచే నేర్పిస్తున్నాను అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.చదవండి: 50 ఏళ్ల వయసులో హీరోయిన్ డేటింగ్? నిజమిదే! -
నిన్న జరిగింది మర్చిపోను.. రేపటి గురించి ఆలోచించను: మోహన్ బాబు
తిరుపతి రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలో (Mohan Babu University) బుధవారం నాడు సంక్రాంతి (Sankranthi) వేడుకలు ఘనంగా జరిగాయి. యూనివర్సిటీ విద్యార్థులు ముగ్గుల పోటీలతో పాటు ఆటల పోటీలు నిర్వహించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అయితే, ఈ సంక్రాంతి వేడుకల్లో యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నటుడు మోహన్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు సినీ డైలాగ్స్‌తో అక్కడి విద్యార్థులను ఆనందపరిచారు. వేదికపై ఆయన మాట్లాడాతూ.. గతం గతః అనే వ్యాఖ్యలు చేశారు.యూనివర్సిటీ వేదికపై మోహన్‌బాబు (Mohan Babu) మాట్లాడుతూ.. తాను నటించిన రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో ఓ డైలాగ్ చెప్పారు. 'నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వెయ్యను, రేపటి గురించి ఆలోచించను' అని మెప్పించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రతి ఏడాది విద్యార్థులతో కలిసి బోగి, సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నామని మోహన్ బాబు అన్నారు. పాశ్చాత్య సంస్కృతిని పక్కన పెట్టి యువత భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. సంక్రాంతి అంటే రైతు అని, రైతు బాగుంటేనే మనంందరం బాగుంటామని ఆయన గుర్తుచేశారు. కాబట్టి సంక్రాంతి అనేది మనందరి పండుగ అన్నారు.ఈ క్రమంలో మోహన్‌బాబును కన్నప్ప సినిమా పనుల గురించి మీడియా వారు ప్రశ్నించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా తెలుగు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉన్నట్లు ఆయన తెలిపారు. 'ఏఫ్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. సినిమాపై నమ్మకంతో మేము ముందుగా అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టాం. శ్రీకాళహస్తీశ్వరుడిపై ఇప్పటివరకూ విడుదలైన సినిమాలన్నీ భారీ విజయాన్ని అందుకున్నాయి. పరమశివుడి వరంతో నేను జన్మించాను.(ఇదీ చదవండి: హనీరోజ్ ఫిర్యాదు.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్ ) అందుకే నా పేరు భక్తవత్సలం అని మా తల్లిదండ్రుల పెట్టారు. కాబట్టి ఆయనే మమ్మల్ని ఆదుకుంటాడు. సినిమా పరిశ్రమలో జయాపజయాలు సహజం. కానీ, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ప్రకృతిని కూడా కోరుకుంటున్నా. ఈ ప్రాజెక్ట్‌పై నా బిడ్డ విష్ణు ఎన్నో కలల కన్నాడు. ఒకరకంగా ఇది అతనికి డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెబుతాను. కాబట్టి అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.' అని ఆయన అన్నారు.మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. -
కన్నప్ప మూవీ.. కాజల్ అగర్వాల్ ఏ పాత్ర చేయనుందంటే?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ కనిపించనున్నారు.ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్ చూస్తే ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను అలరించింది. యూట్యూబ్‌లోనూ ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో పార్వతి దేవి పాత్రలో కాజల్ కనిపించనుంది. ఈ మేరకు నాలుగు భాషల్లో కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. పార్వతి దేవి లుక్‌లో కాజల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మీరు కూడా పోస్టర్‌ను చూసేయండి.కాగా.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటులు పోషిస్తున్న పాత్రలకు పరిచయం చేస్తూ.. వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లతో సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇందులో కంపడు పాత్రలో ముఖేష్ రిషి, గవ్వరాజుగా బ్రహ్మాజీ కనిపించనున్నారు. వారు అత్యంత పురాతన పుళిందుల జాతికి చెందిన అత్యంత భయంకరమైన తెగకు చెందినవారు. సదాశివ కొండలలో జన్మించిన వీరిని భద్రగణం అని కూడా అంటారు. వారు 'వాయులింగానికి వంశపారంపర్య సేవకులు మరియు రక్షకులు. కంపడు నాయకుడిగా ఉంటూనే భద్రగణాన్ని నడిపిస్తాడు. ఈ వంశం త్రిశూలాలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి వున్నవారు. ఈ సినిమాలోని కిరాట పాత్రలో మోహన్‌లాల్ నటిస్తున్నారు. గతంలోనే ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.కన్నప్ప కథేంటంటే..పాన్ ఇండియా ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నాం అన్నారు మోహన్‌బాబు.విజువల్ వండర్‌గా కన్నప్ప..ఈ చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాకు కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కూడా. సినిమాను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని ఇస్తుందని వెల్లడించారు. ఆడియన్స్‌ను మరో ప్రపంచంలోకి వెళ్లిన ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా మేకర్స్ చిత్రాన్ని రెడీ చేస్తున్నట్లు ప్రకటించారు. విష్ణు మంచు కన్నప్ప పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్‌ను పాన్ ఇండియాలో ఈ ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయనున్నారు. 🌟 Divine Grace Personified 🌟Here is the glorious full look of @MsKajalAggarwal as '𝐌𝐀𝐀 𝐏𝐚𝐫𝐯𝐚𝐭𝐢 𝐃𝐞𝐯𝐢'🪷 the divine union with '𝐋𝐨𝐫𝐝 𝐒𝐡𝐢𝐯𝐚'🔱, in #Kannappa🏹. Witness her ethereal beauty and the divine presence, she brings to life in this epic tale of… pic.twitter.com/EvEgx3GDWY— Kannappa The Movie (@kannappamovie) January 6, 2025 -
మంచు విష్ణు ముద్దుల తనయుడు.. బాల కన్నప్ప బర్త్‌డే (ఫోటోలు)
-
మంచు ఫ్యామిలీలో అడవి పంది వివాదం
-
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లాంటి ప్రముఖులంతా కనిపించనున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు క్యారెక్టర్లను రివీల్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె నెమలి అనే రాకుమార్తెగా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ప్రీతి ముకుందన్ తన గ్లామర్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా.. అంతకుముందు ప్రీతి టాలీవుడ్ చిత్రం ఓం భీమ్ బుష్‌లో నటించింది. ఈ మూవీలో జలజ అనే పాత్రలో మెరిసింది.(ఇది చదవండి: 'కన్నప్ప' టీజర్... మూడు కోట్ల మంది చూశారు!) పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న కన్నప్ప చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన'కన్నప్ప' టీజర్ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ సినిమాతో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఆయన కుమార్తెలు కూడా కన్నప్పలో నటిస్తున్నారు. ఇటీవల వారిద్దరి పోస్టర్లను కూడా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.✨ Behold the mesmerizing look of Preity Mukhundhan as Princess 𝐍𝐞𝐦𝐚𝐥𝐢 in #Kannappa 🏹✨ Sharing the screen with @iVishnuManchu, she adds grace and charm to this divine tale. 🌺Experience the magic and splendor of divinity! 🙏 #HarHarMahadevॐ@themohanbabu @Mohanlal… pic.twitter.com/UVgiPVwL4K— Kannappa The Movie (@kannappamovie) December 30, 2024 -
ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది: మంచు విష్ణు
కొద్దిరోజులుగా తెలుగు చిత్రపరిశ్రమలో అనేక సంఘటనలు జరగుతున్నాయి. సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ చిక్కుల్లో పడితే... కుటుంబంలో విభేదాలు రావడంతో మంచు ఫ్యామిలీలో కేసుల వరకు గొడవలు వెళ్లాయి. దీంతో పలువురు చిత్ర పరిశ్రమ నుంచి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షునిగా మంచు విష్ణు అధికారిక ప్రకటన చేశారు.'మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం,సాన్నిహిత్య సంబంధాలతో కలిగి ఉంటారు. సహకారం, సృజనాత్మకత పై ఆధారపడి మన చిత్ర పరిశ్రమ నడుస్తుంది. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల మన ఇండస్ట్రీ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంది. ప్రత్యేకంగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాదులో స్థిరపడటానికి, అప్పటి ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం అత్యంత ముఖ్యమైనది. ఈ విధంగా, ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే వస్తున్నాయి.ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, సభ్యులందరూ సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం గానీ, వివాదాస్పద అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం గానీ నివారించండి.కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి, మరికొన్ని విషాదకరమైనవి, వాటిపై చట్టం తన దారిలో తను న్యాయం చేస్తుంది. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల అది సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, సంబంధిత పక్షాలకు మరింత నష్టం చేస్తుంది. ఈ సమయంలో మనకి సహనం, సానుభూతి, సంఘ ఐక్యత అవసరం. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం అని సంగతి గుర్తించుకుందాం. ఏ సమస్యలు వచ్చినా, మనమంతా కలిసి అవన్నీ ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాను.' అని విష్ణు ఒక ప్రకటన చేశారు. -
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో స్టార్ హీరోహీరోయిన్స్ (ఫొటోలు)
-
మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ.. అన్నపై మనోజ్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మంచు ఫ్యామిలీలో మళ్లీ ముసలం మొదలైంది. మంచు మనోజ్.. తన సోదరుడు మంచు విష్ణుపై పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే మోహన్‌బాబు విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ అనే వ్యక్తిపైనా కంప్లైంట్ చేశాడు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఏడు పేజీల ఫిర్యాదును సోమవారం నాడు పోలీసులకు అందజేశాడు.ఏం జరిగిందంటే?కాగా డిసెంబర్ 8న మోహన్‌బాబు (Mohan Babu) ఇంట్లో హైడ్రామా నడిచింది. మనోజ్‌పై మోహన్‌బాబు దాడి చేశారంటూ ఓ వార్త వైరలవగా.. అంతలోనే నడవలేని పరిస్థితిలో మనోజ్ ఓ ఆస్పత్రిలో చేరాడు. మనోజ్ తనపై దాడి జరిగిందంటూ డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు జల్పల్లిలో ఉన్న మోహన్‌బాబు ఇంటికి వెళ్లారు. అయితే మోహన్‌బాబు, మనోజ్ (Manchu Manoj) ఇది ఇంటి సమస్య అని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు.ఇంతటితో సమస్య సద్దుమణిగిందనుకున్నారు. కానీ డిసెంబర్ 9న రాత్రి మనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడంతో మోహన్‌బాబుపై కేసు నమోదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్‌బాబు.. తనకు ప్రాణహాని ఉందంటూ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుకు ఫిర్యాదు చేశాడు. మనోజ్, అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరాడు. జర్నలిస్ట్‌పై దాడి ఘటనలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇలా నడుస్తున్న సమయంలోనే.. ఇటీవల తన ఇంటి జనరేటర్లో మంచు విష్ణు చక్కెరతో కలిపిన డీజిల్ పోసి ఇబ్బందులకు గురి చేశాడని మనోజ్ ఆరోపించాడు. అయితే ఆ ఆరోపణలో నిజం లేదని మోహన్‌బాబు సతీమణి నిర్మల వివరణ ఇచ్చింది.చదవండి: శ్రీదేవి నాతో ఉన్నట్లే ఉంది.. అప్పుడెంతో ప్రయత్నించా, కానీ..: బోనీ కపూర్ -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఇటీవల కన్నప్ప కామిక్ బుక్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా యానిమేటెడ్ సిరీస్‌కు సంబంధించిన తొలి ఎపిసోడ్‌ను మంచు విష్ణు విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను పంచుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల కానుంది. 🌟 Unveil the saga of '𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚' 🌟Dive into the epic tale of #Kannappa🏹 in our first Animated Comic Book—devotion, bravery, and sacrifice brought to life.Episode 1 is streaming now on YouTube! 🎥✨🔗Telugu: https://t.co/iolkS7zeS3🔗Tamil: https://t.co/sQP4xKrQGG… pic.twitter.com/pqJf9ZXPSm— Vishnu Manchu (@iVishnuManchu) December 23, 2024 -
'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్
ప్రస్తుతం మంచు ఫ్యామిలీ వివాదం నడుస్తోంది. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. మోహన్ బాబు- మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం దగ్గర నుంచి తాజాగా మోహన్ బాబు భార్య నిర్మల.. మనోజ్ చేసిందని తప్పంటూ లేఖ విడుదల చేయడం వరకు వచ్చింది. దీని వల్ల మంచు విష్ణు 'కన్నప్ప' మూవీ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఓ నెటిజన్‌కి ట్వీట్‌కి విష్ణు ఆసక్తికర రిప్లై ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. భర్త గురించి వరలక్ష్మి)మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా 'కన్నప్ప'. విష్ణు, మోహన్ బాబు, విష్ణు కూతుళ్లు-కొడుకు.. వీళ్లతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్.. ఇలా భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇదివరకే టీజర్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు.'కన్నప్ప'లో ప్రభాస్ కూడా అతిథి పాత్ర చేస్తున్నాడు. తాజాగా ఓ నెటిజన్.. విష్ణుని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. 'అన్నా.. మూవీ ఎలా ఉన్నా పర్లేదు. ప్రభాస్ లుక్స్, పాత్ర తేడా రాకుండా చూస్కో. ఐదు సార్లు వెళ్తా మూవీకి' అని రాసుకొచ్చాడు. దీనికి రిప్లై ఇచ్చిన విష్ణు.. '100 శాతం మీకు ప్రభాస్ పాత్ర నచ్చుతుంది బ్రదర్. కాస్త ఓపిగ్గా ఉండు. త్వరలో బోలెడన్ని విషయాలు చెబుతా' అని అన్నాడు. (ఇదీ చదవండి: మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు.. పోలీసులకు లేఖ రాసిన తల్లి నిర్మల)My brother, I am 100% sure you will love my brother #prabhas character and I wish I can tell you more. Exciting to reveal more. Patience please 🙏 🤗🥰 https://t.co/956puAYJ4X— Vishnu Manchu (@iVishnuManchu) December 17, 2024 -
విష్ణు ఎలాంటి గొడవ చేయలేదు : నిర్మల మోహన్ బాబు
-
నా కుమారుడు మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు.. పోలీసులకు లేఖ రాసిన నిర్మల
మంచు మనోజ్ చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని మోహన్ బాబు సతీమణి నిర్మల పహాడీషరీఫ్ పోలీసులకు లేఖ రాశారు. డిసెంబర్ 14న నిర్మల పుట్టినరోజును మనోజ్ సెలబ్రేట్ చేశారు. ఆ సమయంలో విష్ణు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకు అక్కడకు చేరుకున్నారు. అయితే, విష్ణు .. తన ఇంటి వద్ద జనరేటర్లో పంచదార పోయించి, విద్యుత్తు సరఫరా నిలిపివేశారని మనోజ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన గురించి తాజాగా నిర్మల ఒక లేఖ ద్వారా ఆరోజు ఏం జరిగిందో పోలీసులకు తెలిపారు.పహాడీషరీఫ్ పోలీసులకు మంచు నిర్మల ఇలా తెలిపారు. 'డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు విష్ణు కేక్ తీసుకుని జల్పల్లిలోని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్.. ఇంటికి వచ్చిన విష్ణు సీసీ ఫుటేజ్‌ని బయట పెట్టి, ఆపై విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేశాడు. ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చినట్లు తెలిసింది. కానీ, ఆరోజు అలాంటి ఘటన ఏమీ జరగలేదు. కేక్ కట్ చేయడం పూర్తి అయిన తర్వాత విష్ణు తన రూములో ఉన్న సామాను తీసుకున్నాడు. నా చిన్న కుమారుడైన మనోజ్‌కు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో, అలాగే నా పెద్ద కుమారుడు అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. ఆ సమయంలో విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ ఫిర్యాదు చేసిన దానిలో ఎలాంటి నిజం లేదు. ఇంట్లో పని చేసే వాళ్లు కూడా 'మేమిక్కడ పని చేయలేమని' వాళ్లే వెళ్లిపోయారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంతమాత్రం లేదు.' అని తెలుపుతున్నాను అంటూ నిర్మల ఒక లేఖ విడుదల చేశారు.మనోజ్ చేసిన ఫిర్యాదు ఏంటి..?తన తల్లి నిర్మల పుట్టిన రోజున కేక్ నెపంతో శనివారం రాత్రి తన సోదరుడు మంచు విష్ణు, అతని సహచరులు-రాజ్ కొండూరు, కిరణ్ , విజయ్ రెడ్డి బౌన్సర్ల బృందంతో ఇంట్లోకి వచ్చారని మనోజ్ తెలిపారు. ఆ సమయంలో వారు ప్రధాన జనరేటర్ లో చక్కెరతో కలిపిన డీజిల్‌ను పోశారని, దానివల్ల అర్థరాత్రి కరెంట్ పని చేయక ఇబ్బందులకు గురయ్యామని మంచు మనోజ్ ఆరోపించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని, ఆ సమయంలో ఇంట్లో తన తల్లి, తొమ్మిది నెలల పాప, బంధువులు ఉన్నారని, వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని మనోజ్ తెలిపారు. తాను, తన భార్య ఇంట్లో లేని సమయంలో ఇదంతా జరిగినట్లు చెప్పుకొచ్చారు. అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
మంచు ఫ్యామిలీ గొడవపై RGV కామెంట్స్
-
కన్నప్పలో 'కిరాట'గా మలయాళ స్టార్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని కిరాట పాత్రలో మోహన్‌లాల్ నటిస్తున్నారని వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘కన్నప్ప’ సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు మోహన్‌బాబు. -
మంచు విష్ణు కన్నప్ప మూవీ.. మోహన్ లాల్ క్యారెక్టర్ రివీల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు.ఈ చిత్రంలో మోహన్ లాల్ కిరాటా పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ సైతం నటిస్తున్నారు. ఓ యదార్థ కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25,2025లో థియేటర్లలో సందడి చేయనుంది. ‘KIRATA’! The legend Sri. Mohanlal in #Kannappa. I had the honor of sharing the screen space with one of the greatest Actor of our time. This entire sequence will be 💣💣💣💣💣 ! @Mohanlal pic.twitter.com/q9imkDZIxz— Vishnu Manchu (@iVishnuManchu) December 16, 2024