Pat Cummins
-
CT 2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. తొలిసారిగా ఆ ఇద్దరు
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీకి పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ఎంపిక చేసినట్లు సోమవారం వెల్లడించింది. అయితే, గాయం కారణంగా దూరమవుతాడనుకున్న ప్యాట్ కమిన్స్(Pat Cummins) సారథ్యంలోనే ఆస్ట్రేలియా ఈ ఈవెంట్లో పాల్గొననుంది.తొలిసారిగా ఆ ఇద్దరికి చోటుఇక బ్యాటర్ మాథ్యూ షార్ట్‌తో పాటు ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీ(Aaron Hardie) తొలిసారిగా ఐసీసీ టోర్నమెంట్లో ఆడే అవకాశం దక్కించుకున్నారు. మరోవైపు.. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించిన నాథన్ ఎల్లిస్ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించాడు. ఇప్పటికే రిటైర్ అయిన డేవిడ్ వార్నర్, గాయం వల్ల జట్టుకు దూరమైన కామెరాన్ గ్రీన్, పేసర్ సీన్ అబాట్ స్థానాల్లో మాథ్యూ, హార్డీ, ఎల్లిస్ ఈ జట్టులోకి వచ్చారు.మోకాలి గాయంకాగా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కమిన్స్ బృందం 3-1తో గెలిచి పదేళ్ల తర్వాత ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, ఈ మెగా సిరీస్ నేపథ్యంలో కెప్టెన్, స్టార్ పేసర్ కమిన్స్ గాయపడినట్లు వార్తలు వచ్చాయి.శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టులు ఆడే జట్టుకు కమిన్స్దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ అతడి గాయాన్ని ధ్రువీకరిస్తూ మోకాలి నొప్పితో కమిన్స్ బాధపడుతున్నట్లు తెలిపాడు. దీంతో అతడు చాంపియన్స్ ట్రోఫీకి దూరం కానున్నాడనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, తాజా ప్రకటనతో అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది.వన్డే ప్రపంచకప్-2023 విజేతఇదిలా ఉంటే.. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్-2023లో ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాను చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే. ఫైనల్లో టీమిండియాను ఓడించి.. కంగారూ జట్టుకు టైటిల్ అందించాడు. ఈ క్రమంలో ఏకంగా ఆరోసారి వన్డే వరల్డ్‌కప్ గెలిచిన ఆస్ట్రేలియా.. మరో వన్డే మెగా టోర్నీ చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది.వరల్డ్‌కప్ ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ కూడా ఈ టోర్నమెంట్లో ఆడేందుకు క్వాలిఫై అయ్యాయి. అయితే, 2017లో చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన పాకిస్తాన్ ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా ఈ ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టింది.గ్రూప్- ‘బి’లోఇదిలా ఉంటే.. వన్డే ఫార్మాట్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించగా... దుబాయ్ వేదికగా రోహిత్ సేన తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా.. అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. ఇక గ్రూప్-‘ఎ’లో భారత్‌తో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఆడనున్నాయి. కాగా ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న లాహోర్ వేదికగా తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుప్యాట్ కమిన్స్(కెప్టెన్), అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, ఆడం జంపా.చదవండి: IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్ మ్యాచ్‌లు ఎక్కడంటే? -
ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం?
‘కెప్టెన్‌గా టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవలేకపోవడమే నాకున్న అతిపెద్ద లోటు.. ఈసారి ఎలాగైనా ఆ పని పూర్తిచేస్తాను’.. భారత్‌తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అనుకున్నట్లుగానే ఈసారి కంగారూ జట్టుకు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని అందించాడు ఈ స్టార్ పేసర్.సుదీర్ఘ నిరీక్షణకు తెరబౌలర్గా, కెప్టెన్‌గా తనదైన వ్యూహాలతో 3-1తో టీమిండియాను ఓడించి.. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. అంతేకాదు.. తన కెప్టెన్సీలో వరుసగా రెండోసారి ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేర్చాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌తో పాటు కమిన్స్‌పై కూడా తీవ్రమైన భారం పడింది.స్కాట్ బోలాండ్, స్టార్క్ నుంచి సహకారం అందినా.. కమిన్స్ కూడా వీలైనన్ని ఎక్కువ ఓవర్లు బౌల్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కమిన్స్ గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు చీలమండ నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. శ్రీలంక పర్యటనకు టెస్టు జట్టును ప్రకటించిన సందర్భంగా ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ ఈ విషయాన్ని వెల్లడించాడు.చీలమండ గాయంకాగా సొంతగడ్డపై టీమిండియాపై టెస్టు సిరీస్ విజయం తర్వాత ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. కమిన్స్ ఈ టూర్‌కు దూరం కాగా.. అతడి డిప్యూటీ స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాల గురించి జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. ‘‘కమిన్స్‌కు వ్యక్తిగతంగా కాస్త పని ఉంది. అయితే, అతడు జట్టుకు దూరం కావడానికి అదొక్కటే కారణం కాదు.అతడు చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. వచ్చే వారం అతడు స్కానింగ్‌కు వెళ్తాడు. వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే గాయంపై పూర్తి స్పష్టత వస్తుంది’’ అని తెలిపాడు. కాగా కమిన్స్ గాయం గనుక తీవ్రతరమైతే ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లే.చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎదురుదెబ్బఎందుకంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ ప్రధాన టోర్నమెంట్ సమీపిస్తోంది. ఫిబ్రవరి 19- మార్చి 9 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. టోర్నీ మొదలయ్యేనాటికి కమిన్స్ పూర్తి ఫిట్‌గా లేనట్లయితే.. ఈ వన్డే వరల్డ్‌కప్-2023 చాంపియన్‌కు కష్టాలు తప్పవు. కాగా భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఆటగాడిగా, కెప్టెన్‌గా సత్తా చాటాడు కమిన్స్. ఫైనల్లో టీమిండియాను ఓడించి ఆసీస్‌ను చాంపియన్‌గా నిలిపాడు.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లతో కలిసి ఆస్ట్రేలియా గ్రూప్-‘బి’లో ఉంది. ఇందులో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో ఆసీస్ లాహోర్ వేదికగా ఫిబ్రవరి 22న ఇంగ్లండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా.. పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్కించుకోగా.. టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతుంది.శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, ట్రవిస్ హెడ్ (వైస్ కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్‌స్వీనీ, టాడ్ మర్పీ, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.చదవండి: ‘చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!’ -
ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్..
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో ఆస్ట్రేలియా తమ ఆఖరి సిరీస్‌కు సిద్దమవుతోంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న ఆసీస్.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 29 నుంచి ఈ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలో లంకతో సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ టూర్‌కు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(Pat cummins) దూరమయ్యాడు. అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో ఈ సిరీస్ నుంచి కమ్మిన్స్ తప్పుకున్నాడు. అతడి స్దానంలో స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith ) ఎంపికయ్యాడు.స్టార్క్‌కు నో రెస్ట్..అదే విధంగా ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడనున్నాడు. తొలుత అతడికి విశ్రాంతి ఇస్తారని వార్తలు వినిపించినప్పటికి, ఆసీస్ సెలక్టర్లు మాత్రం జట్టులో కొనసాగించారు. మరోవైపు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ప్రక్కటెముకుల గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.భారత్‌తో జరిగిన సిరీస్‌లో గాయపడిన హాజిల్‌వుడ్.. ఇంకా కోలుకోవడానికి నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అతడు తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో రానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. ఈ లంక సిరీస్‌కు ఎంపికైన జట్టులో మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్ ఫ్రంట్‌లైన్ పేసర్లగా ఉన్నారు.యువ సంచలనానికి పిలుపు..ఆస్ట్రేలియా అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ కూపర్ కొన్నోలీకి తొలిసారి సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ 16 మంది సభ్యుల జట్టులో కొన్నోలీకి చోటు దక్కింది. దేశీవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. కొన్నోలీ ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్స్కార్చర్స్ తరపున ఆడుతున్నాడు.ఈ 21 ఏళ్ల కొన్నోలీకి బ్యాటింగ్‌తో అద్బుతమైన బౌలింగ్ సిల్క్స్ కూడా ఉన్నాయి. ఇక భారత్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్న స్పిన్నర్లు మాట్ కుహ్నెమాన్, టాడ్ మర్ఫీ తిరిగి జట్టులోకి వచ్చారు. అదేవిధంగా బీజీటీలో అదరగొట్టిన సామ్ కాన్స్టాస్, వెబ్స్టార్లను శ్రీలంక సిరీస్‌కు కూడా ఆసీస్ సెలక్టర్లు కొనసాగించారు.ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్ (వైస్ కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్‌స్వీనీ, టాడ్ మర్ఫీ , మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్చదవండి: 'రోహిత్ నిర్ణయం సరైనది కాదు.. ఇక టెస్టులకు విడ్కోలు పలికితే బెటర్' -
ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయిన పేసు గుర్రం
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. బుమ్రా డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినీగా ఎంపికయ్యాడు. బుమ్రాతో పాటు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్, సౌతాఫ్రికా సీమర్ డేన్ పాటర్సన్ కూడా మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. డిసెంబర్ నెలలో ప్రదర్శనల ఆధారంగా ఐసీసీ ఈ ముగ్గురిని నామినేట్ చేసింది. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ కావడం ఇది వరుసగా రెండో సారి. నవంబర్ నెలలోనూ బుమ్రా ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు. నవంబర్ నెలలో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు.మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ (డిసెంబర్) నామినీస్ విషయానికొస్తే.. ఈ అవార్డుకు పురుషుల నామినీస్ లాగానే భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లకు చెందిన ఆటగాళ్లు ఎంపికయ్యారు. భారత్ నుంచి స్మృతి మంధన, సౌతాఫ్రికా నుంచి నొన్కులులేకో మ్లాబా, ఆస్ట్రేలియా నుంచి అన్నాబెల్ సదర్‌ల్యాండ్ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. డిసెంబర్ నెలలో ఈ ముగ్గురు అద్భుతంగా రాణించారు.జస్ప్రీత్ బుమ్రా: పేసు గుర్రం బుమ్రా డిసెంబర్ నెలలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ నెలలో అతనాడిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో (ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో) 22 వికెట్లు తీశాడు. ఇదే నెలలో బుమ్రా అత్యధిక రేటింగ్ పాయింట్లు (907) సాధించిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.పాట్ కమిన్స్: ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ డిసెంబర్ నెలలో మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనలు నమోదు చేశాడు. కమిన్స్ ఈ నెలలో 17 వికెట్లు తీయడంతో పాటు అత్యతం కీలకమైన 144 పరుగులు తీశాడు. కమిన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనల కారణంగా డిసెంబర్లో జరిగిన మూడు టెస్ట్‌ల్లో ఆసీస్ భారత్‌ను ఓడించింది.డేన్ పాటర్సన్: ఈ సౌతాఫ్రికన్ పేసర్ తొలిసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. డిసెంబర్ నెలలో పాటర్సన్ రెండు టెస్ట్‌ల్లో 13 వికెట్లు తీశాడు. పాటర్సన్ ప్రదర్శనల కారణంగా సౌతాఫ్రికా తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరుకుంది.స్మృతి మంధన: మంధన డిసెంబర్ నెలలో ఆడిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో సూపర్ ఫామ్‌ను కనబర్చి 463 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన వన్డేలో మంధన సూపర్ సెంచరీ చేసింది. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో మంధన వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసింది.మ్లాబా: డిసెంబర్ నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో మ్లాబా చెలరేగిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆమె 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్ రికార్డు సృష్టించింది. ఇదే నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేల్లోనూ మ్లాబా రాణించింది.అన్నాబెల్ సదర్‌ల్యాండ్: 23 ఏళ్ల ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ డిసెంబర్ నెలలో బంతితో, బ్యాట్‌తో అద్బుతంగా రాణించింది. ఈ నెలలో సదర్‌ల్యాండ్ ఏడు వికెట్లు తీయడంతో పాటు రెండు సెంచరీలు (భారత్, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేల్లో) చేసింది. -
గెలుపు జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్..
టీమిండియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా.. ఇప్పుడు మరో రెడ్ బాల్ సిరీస్‌కు సిద్దమైంది. ఆసీస్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించి డబ్ల్యూటీసీ సైకిల్ 2024-25ను విజయంతో ముగించాలని కంగారులు భావిస్తున్నారు.అయితే ఈ టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదరుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌పేసర్ జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా లంక పర్యటనకు దూరమయ్యాడు. ఇటీవల భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన హాజిల్‌వుడ్ ప్రస్తుతం.. ప్రక్కటెముకుల గాయంతో బాధపడుతున్నాడు.ఈ కారణంతోనే బీజీటీ మధ్యలో తప్పుకున్న హాజిల్‌వుడ్.. ఇప్పుడు శ్రీలంక సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తెలిపింది. ఈ సిరీస్‌కు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా దూరం కానున్నాడు.అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో లంక టూర్‌కు దూరంగా ఉండాలని ప్యాట్ నిర్ణయించుకున్నాడు. హాజిల్‌వుడ్ స్ధానంలో జో రిచర్డ్సన్, కమ్మిన్స్ స్ధానంలో మైఖల్ నీసర్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 3-1 తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. జూన్ 11న లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆసీస్ తలపడనుంది.కాగా ఈ నామమాత్రపు సిరీస్‌కు వీరిద్దరితో పాటు స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్‌కు విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ జనవరి 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టును ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.అయితే శ్రీలంకను వారి సొంతగడ్డపై ఓడించడం అసీస్‌కు అంతసులువు కాదు. శ్రీలంకలో టర్నింగ్ వికెట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆసీస్‌తో పోలిస్తే లంక జట్టులోనే అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ప్రభాత్ జయసూర్య వంటి స్పిన్నర్‌ను ఆసీస్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.చదవండి: BGT: ఆస్ట్రేలియా నిజంగానే గొప్పగా ఆడిందా?.. బుమ్రా వేరే గ్రహం నుంచి వచ్చాడా? -
కమిన్స్ డబుల్ సెంచరీ.. చరిత్రలో తొలి ప్లేయర్
ఆస్ట్రేలియా సారధి పాట్ కమిన్స్ (Pat Cummins) ఎవరికీ సాధ్యం కానీ మైలురాయిని అందుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో కమిన్స్ ఈ ఫీట్‌ను సాధించాడు. వాషింగ్టన్ సుందర్ డబ్ల్యూటీసీలో కమిన్స్‌కు 200వ వికెట్.డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ తర్వాతి స్థానాల్లో నాథన్ లియోన్ (196 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (195), మిచెల్ స్టార్క్ (165), జస్ప్రీత్ బుమ్రా (156) ఉన్నారు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను ఆస్ట్రేలియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన ఆసీస్.. రెండు, నాలుగు, ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. తాజాగా ముగిసిన ఐదో టెస్ట్‌లో (సిడ్నీ) ఆసీస్ ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ సిరీస్ ఆధ్యాంతం అద్బుతంగా రాణించిన కమిన్స్ 25 వికెట్లు తీసి ఆసీస్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా 32 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కమిన్స్ ఈ సిరీస్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 19.88 సగటున 159 పరుగులు చేశాడు.బ్యాటింగ్‌లో హెడ్ టాప్తాజాగా ముగిసిన బీజీటీలో ఆసీస్ చిచ్చరపిడుగు ట్రవిస్ హెడ్ అత్యధిక పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన హెడ్ 56 సగటున 448 పరుగులు చేశాడు. భారత యువ కెరటం యశస్వి జైస్వాల్ 10 ఇన్నింగ్స్‌ల్లో 43.44 సగటున 391 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.బీజీటీ 2024-25లో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆటగాళ్లు..ట్రవిస్ హెడ్-448యశస్వి జైస్వాల్-391స్టీవ్ స్మిత్-314నితీశ్ కుమార్ రెడ్డి-298కేఎల్ రాహుల్-276రిషబ్ పంత్-255మార్నస్ లబూషేన్-232అలెక్స్ క్యారీ-216విరాట్ కోహ్లి-190ఉస్మాన్ ఖ్వాజా-184బీజీటీ 2024-25లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు..బుమ్రా-32కమిన్స్-25బోలాండ్-21సిరాజ్-20స్టార్క్-18నాథన్ లియోన్-9జోష్ హాజిల్‌వుడ్-6ప్రసిద్ద్ కృష్ణ-6ఆకాశ్‌దీప్-5నితీశ్ కుమార్ రెడ్డి-5చెలరేగిన బోలాండ్ఐదో టెస్ట్‌లో ఆసీస్ స్పీడ్‌స్టర్ స్కాట్ బోలాండ్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో బోలాండ్ 10 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన బోలాండ్, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. 10 వికెట్ల ప్రదర్శనకు గానూ బోలాండ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆధ్యాంతం ఆసీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన బుమ్రాను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వరించింది.డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్భారత్పై ఐదో టెస్ట్ గెలుపుతో ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆసీస్ రెండో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడతాయి. 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో ఆస్ట్రేలియా మరో రెండు మ్యాచ్‌లు (శ్రీలంకతో) ఆడాల్సి ఉంది. -
చరిత్ర సృష్టించిన ప్యాట్ కమ్మిన్స్.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా తమ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. చివరగా 2014-15లో మైఖల్ క్లార్క్ ఆసీస్‌కు బీజీటీ టైటిల్‌ను అందించగా.. మళ్లీ ఇప్పుడు ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో కంగారుల కలనేరవేరింది.సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియా.. 3-1 తేడాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. బీజీటీతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్‌ను ఆసీస్ ఖారారు చేసుకుంది. కాగా ఈ సిరీస్ విజయంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ది కీలక పాత్ర.సిరీస్ అసాంతం కమ్మిన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 2021లో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కమ్మిన్స్.. తన జట్టును వరుసగా రెండు సార్లు వరల్డ్‌టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేర్చాడు.కమ్మిన్స్ అరుదైన ఘనత..ఈ క్రమంలో ప్యాట్ కమ్మిన్స్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 20 మ్యాచ్‌లు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా డబ్లూటీసీ సైకిల్స్(2021-23, 2023-25)లో కమ్మిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 33 మ్యాచ్‌లు ఆడగా 20 గెలిచింది.కమ్మిన్స్ తర్వాతి స్ధానంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఉన్నాడు. స్టోక్స్ సారథ్యంలో 29 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఆడగా.. 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడో స్ధానంలో 14 విజయాలతో విరాట్ కోహ్లి ఉన్నాడు. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే? స్టార్ ప్లేయర్‌కు ఛాన్స్! -
టీమిండియాతో ఎప్పుడూ సవాలే.. కానీ కలిసికట్టుగా పోరాడం: కమ్మిన్స్
సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 3-1తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా పదేళ్ల తర్వాత తిరిగి బీజీటీని రిటైన్ చేసుకుంది.చివరగా 2014-15లో మైఖల్ క్లార్క్ సారథ్యంలో ఆసీస్ విజేతగా నిలవగా.. మళ్లీ ఇప్పుడు ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీ బీజీటీ టైటిల్‌ను కంగారులు దక్కించుకున్నారు. కాగా ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో సత్తాచాటిన కమ్మిన్స్ సేన.. బ్యాటింగ్‌లో కూడా దుమ్ములేపింది. భారత్ విధించిన 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంతో తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఆస్ట్రేలియా ఖారారు చేసుకుంది. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు."బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తిరిగి చేజిక్కించుకోవడం ఆనందంగా ఉంది. మా జట్టులో చాలా మంది ఇంతవరకు ఈ ట్రోఫీ నెగ్గలేదు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చ లేకపోయాం. ఆ తర్వాత కలిసికట్టుగా రాణించడం బాగుంది.జట్టులోని ప్లేయర్ల మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ సిరీస్ ద్వారానే అరంగేట్రం చేసిన ముగ్గురు కొత్త ఆటగాళ్లు విభిన్న పరిస్థితుల్లో మెరుగైన ఆటతీరు కనబర్చారు. నా కెరీర్లో ఇది చాలా ఇష్టమైన ట్రోఫీ. సిరీస్ కోసం బాగా సన్నద్ధమయ్యా. భారత్ వంటి ప్రత్యర్ధితో తలపడటం ఎప్పుడూ సవాలే" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. -
లంక పర్యటనకు కమిన్స్ దూరం
సిడ్నీ: ఆ్రస్టేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ శ్రీలంక పర్యటనకు దూరం కానున్నాడు. అతని భార్య రెండో కాన్పు సమయంలోనే ఆ టూర్ ఉండటంతో ద్వైపాక్షిక సిరీస్ నుంచి తప్పుకునే అవకాశముందని చెప్పాడు. గతేడాది భారత్ పర్యటనలో ఉండగా కమిన్స్ మాతృమూర్తి మృతి చెందడంతో టూర్ మధ్యలోనే అతను తిరుగుముఖం పట్టాడు. అప్పటి నుంచి తన జీవితంలో కుటుంబ ప్రాధామ్యాలు మారాయని కమిన్స్ చెప్పుకొచ్చాడు.కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఈ నెలాఖర్లో లంక పర్యటనకు బయలుదేరనున్న ఆసీస్ అక్కడ రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొంటుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్ చేరే రెండో జట్టు ఈ సిరీస్ ఫలితంతోనే ఖరారవుతుంది. జనవరి 29 నుంచి తొలి టెస్టు, ఫిబ్రవరి 6 నుంచి రెండో టెస్టు జరగనున్నాయి. కమిన్స్ గైర్హాజరీలోని ఆ్రస్టేలియాకు అనుభవజు్ఞడైన స్టీవ్ స్మిత్ లేదంటే హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్లలో ఒకరు నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. -
ప్యాట్ కమిన్స్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా
మెల్బోర్న్ వేదికగా భారత్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా అద్బుతమైన విజయం సాధించింది. ఆఖరి రోజు వరకు జరిగిన ఈ బాక్సింగ్ డే పోరులో 184 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌కు అడుగు దూరంలో ఆసీస్ నిలిచింది.ఈ విజయంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కమ్మిన్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 90 పరుగులతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఔట్ చేసిన పాట్ కమిన్స్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన కమ్మిన్స్..టెస్ట్ క్రికెట్ చరిత్రలో ప్రత్యర్థి కెప్టెన్‌ను ఎక్కవ సార్లు ఔట్ చేసిన సారథిగా కమిన్స్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో రోహిత్ శర్మను ఇప్పటివరకు కమ్మిన్స్ ఆరు సార్లు ఔట్ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిచీ బెనాడ్ పేరిట ఉండేది. రిచీ బెనాడ్ ఇంగ్లండ్ లెజెండరీ కెప్టెన్ టెడ్ డెక్స్టర్ను 5 సార్లు ఔట్ చేశాడు. తాజా మ్యాచ్‌తో రిచీ బెనాడ్ ఆల్‌టైమ్ రికార్డును కమిన్స్ బ్రేక్ చేశాడు.చదవండి: మానసిక వేదన.. అందుకే ఓడిపోయాం.. నితీశ్ రెడ్డి మాత్రం అద్భుతం: రోహిత్ శర్మ -
అద్భుతమైన టెస్టు.. ఆఖరికి మాదే పైచేయి.. వాళ్లిద్దరు సూపర్: కమిన్స్
మెల్బోర్న్ టెస్టు అద్భుతంగా సాగిందని.. ఆఖరికి తామే పైచేయి సాధించడం పట్ల సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) హర్షం వ్యక్తం చేశాడు. బంతితో పాటు బ్యాట్‌తోనూ తాను రాణించడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. ట్రవిస్ హెడ్‌కు బాల్ ఇవ్వడం వెనుక తమ కోచ్ హస్తం ఉందని.. ఈ విషయంలో క్రెడిట్ ఆయనకే ఇస్తానని కమిన్స్ తెలిపాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా సొంతగడ్డపై టీమిండియా(India vs Australia)తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్ మ్యాచ్‌లో ఓడిన కంగారూ జట్టు.. అడిలైడ్ టెస్టుతో విజయాన్ని రుచిచూసింది. అనంతరం బ్రిస్బేన్ టెస్టు వర్షం వల్ల డ్రా కాగా.. ఇరుజట్లు మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నాలుగో టెస్టు జరిగింది.340 పరుగుల లక్ష్యంఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసిన కంగారూలు.. భారత్‌ను 369 పరుగులకు కట్టడి చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌట్ అయిన కమిన్స్ బృందం.. టీమిండియాకు 340 పరుగుల లక్ష్యాన్ని విధించింది.అయితే, సోమవారం నాటి ఆఖరి రోజు ఆటలో భాగంగా 155 పరుగులకే ఆలౌట్ కావడంతో.. ఆసీస్ 184 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. తద్వారా సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 90(49, 41) పరుగులు చేయడంతో పాటు.. కమిన్స్ ఆరు వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.మాదే పైచేయిఈ క్రమంలో విజయానంతరం కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘అద్భుతమైన టెస్టు మ్యాచ్ ఆడాము. ప్రేక్షకులు కూడా మాకు మద్దతుగా నిలిచారు. వారి నుంచి అద్భుత స్పందన లభించింది. విజయంలో నా పాత్ర కూడా ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను.లబుషేన్(72, 70), స్మిత్(140, 13 ) రాణించడం వల్ల పటిష్ట స్థితిలో నిలిచాం. నిజానికి ఈరోజు తొలి సెషన్లో మాదే పైచేయి. కానీ అనూహ్య రీతిలో వాళ్లు పుంజుకుని.. రెండో సెషన్లో రాణించారు. అయితే, మేము మాత్రం సానుకూల దృక్పథంతోనే ఉన్నాము.ఫీల్డింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక హెడ్‌తో బౌలింగ్ చేయించాలన్నది మా కోచ్ ఆలోచనే. ఆ విషయంలో క్రెడిట్ మొత్తం ఆయనకే ఇస్తాను. జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని పేర్కొన్నాడు. సిడ్నీ టెస్టులోనూ ఇదే తరహా ఫలితం పునరావృతం చేస్తామని కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గా విఫలమైన ట్రవిస్ హెడ్(0, 1) రిషభ్ పంత్(Rishabh Pant-30) రూపంలో కీలక వికెట్ తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పడంలో సహాయం చేశాడు.చదవండి: మానసిక వేదన.. అందుకే ఓడిపోయాం.. నితీశ్ రెడ్డి మాత్రం అద్భుతం: రోహిత్ శర్మ -
‘వర్షం వల్లే డ్రా.. లేదంటే గెలుపు మాదే.. ఆ ఇద్దరు అద్భుతం’
టీమిండియాతో మూడో టెస్టు డ్రాగా ముగియడం పట్ల ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. వర్షం అడ్డుపడకపోయి ఉంటే తాము తప్పక గెలిచేవాళ్లమని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలకపోయినా.. తమ జట్టు సమిష్టిగా రాణించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరు గెలుపు కోసం తమ వంతు కృషి చేయడం ఎంతో బాగుందని సహచర ఆటగాళ్లను కొనియాడాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా సొంతగడ్డపై ఆసీస్.. భారత్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ మ్యాచ్‌లో భారత్ గెలుపొందగా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జయభేరి మోగించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది.పదే పదే అడ్డుపడ్డ వరుణుడుఅయితే, సిరీస్‌లో ఎంతో కీలకమైన మూడో టెస్టు మాత్రం డ్రాగా ముగిసిపోయింది. బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం మొదలైన ఈ టెస్టుకు తొలి రోజు నుంచే వర్షం ఆటంకం కలిగించింది. మరోవైపు.. వెలుతురులేమి వల్ల కూడా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.ఆది నుంచి పటిష్ట స్థితిలోనే ఆసీస్ఈ నేపథ్యంలో బుధవారం నాటి ఐదో రోజు ఆటలో కూడా ఇలాంటి అవాంతరాలు ఎదురుకావడంతో.. అంపైర్ల సూచన మేరకు ఆసీస్- భారత కెప్టెన్లు కమిన్స్, రోహిత్ శర్మ డ్రాకు అంగీకరించారు. నిజానికి గబ్బా టెస్టులో ఆది నుంచి ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలోనే ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్(152), స్టీవ్ స్మిత్(101) శతకాల కారణంగా పైచేయి సాధించింది.భారత్‌కు ఫాలో ఆన్ గండం తప్పిందిభారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగి 445 పరుగులు మేర భారీ స్కోరు సాధించింది. అయితే, ఆసీస్ బ్యాటర్లు చెలరేగిన చోట.. టీమిండియా మాత్రం తడబడింది. కేఎల్ రాహుల్(84), రవీంద్ర జడేజా(77)తో పాటు ఆఖర్లో జస్ప్రీత్ బుమ్రా(10*), ఆకాశ్ దీప్(31) విలువైన ఇన్నింగ్స్ కారణంగా ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 260 పరుగులతో మెరుగైన స్కోరు సాధించింది.ఐదోరోజూ ఆటంకాలుఈ క్రమంలో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఆసీస్.. 89/7 వద్ద స్కోరును డిక్లేర్ చేసింది. తద్వారా భారత్ ముందు 275 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, పదే పదే వర్షం రావడంతో పాటు.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేసి.. ఇరుజట్ల కెప్టెన్లను సంప్రదించారు. భారత్ స్కోరు 8/0 వద్ద ఉండగా.. ఇరువురూ డ్రాకు అంగీకరించారు. నిజానికి ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడపకపోయి ఉంటే ఫలితం వచ్చేదే.2-1తో మేము ఆధిక్యంలో నిలిచేవాళ్లంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘వర్షం పదే పదే అడుడ్డుపడింది. లేదంటే 2-1తో మేము ఆధిక్యంలో నిలిచేవాళ్లం. అయినా, మన చేతుల్లో లేని విషయం గురించి ఆలోచించడం అనవసరం. ఏదేమైనా ఈ టెస్టులో మా జట్టు ప్రదర్శన సంతృప్తినిచ్చింది.మేము భారీ స్కోరు సాధించడంతో పాటు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేశాం. స్టార్క్, నేను బాగానే రాణించాం. కానీ దురదృష్టవశాత్తూ మేము జోష్ హాజిల్‌వుడ్ సేవలు కోల్పోయాం. ఇక ఐదో రోజు ఆటలో కూడా వర్షం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి.ఆ ఇద్దరు అద్భుతంకొత్త బంతిని ఎదుర్కోవడం సవాలుగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో హెడ్, స్మిత్ అద్భుతంగా ఆడారు. అలెక్స్ క్యారీ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. నాథన్ లియోన్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. స్టార్క్ వికెట్లు తీశాడు. ఇలా ప్రతి ఒక్కరు తమ బాధ్యతను చక్కగా నెరవేర్చారు.బాక్సింగ్ డే టెస్టుకు ముందు మాకు ఇలా ఎన్నో సానుకూలాంశాలు ఉండటం సంతోషం’’ అని పేర్కొన్నాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో తదుపరి టెస్టు బరిలో దిగుతామని కమిన్స్ ఈ సందర్భంగా తెలిపాడు. కాగా భారత్- ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 26 నుంచి మెల్బోర్న్లో నాలుగో టెస్టు మొదలుకానుంది.చదవండి: Kohli- Gambhir: వారికి మ్యాచ్ గెలిచినంత సంబరం.. రోహిత్ మాత్రం అలా.. వీడియో -
ట్రావిస్ హెడ్‌కు ప్రమోషన్.. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా!?
భారత్‌తో టెస్టు సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కంగారులు తలపడనున్నారు. అయితే ఈ పర్యటనకు ఆసీస్ రెగ్యూలర్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.ఈ సిరీస్ జనవరి 27 నుంచి ప్రారంభం కానుంది. సరిగ్గా ఇదే సమయంలో కమ్మిన్స్ భార్య బెకీ తమ రెండవ బిడ్డకు జన్మనిచ్చే అవకాశముంది. ఈ క్రమంలోనే కమ్మిన్స్ శ్రీలంకతో సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.తన కొడుకు అల్బీ పుట్టినప్పుడు పక్కనలేని కమ్మిన్స్.. ఈసారి రెండో బిడ్డ విషయంలో మాత్రం ఫ్యామిలీతోనే ఉండాలని భావిస్తున్నడంట. కమ్మిన్స్ ఇప్పటికే తన నిర్ణయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఆసీస్ కెప్టెన్‌గా ట్రావిస్ హెడ్?ఇక స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో సత్తాచాటుతున్న ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌కు ప్రమోషన్ దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంక టూర్‌కు ఒకవేళ కమ్మిన్స్ దూరమైతే, కెప్టెన్సీ బాధ్యతలు హెడ్‌కు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు తెలుస్తోంది.వైస్ కెప్టెన్ స్మిత్ ఉన్నప్పటికి హెడ్ వైపే క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దలు మొగ్గు చూపుతున్నారంట. అయితే హెడ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టెస్టుల్లో కెప్టెన్సీ చేయలేదు. కానీ వైట్ క్రికెట్లో మాత్రం సారథిగా హెడ్‌కు అనుభవం ఉంది. బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌కు కెప్టెన్‌గా హెడ్ వహించాడు. కాగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో హెడ్ ఇప్పటికే రెండు సెంచరీలు సాధించాడు. పింక్‌బాల్ టెస్టులో ఆసీస్ ఘన విజయం సాధించడంలో హెడ్ కీలక పాత్ర పోషించాడు. -
WTC: బుమ్రా అరుదైన రికార్డు.. భారత తొలి బౌలర్‌గా
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో మెరిశాడు. బ్రిస్బేన్‌లో పేస్ దళాన్ని ముందుకు నడిపించిన ఈ స్పీడ్‌స్టర్.. ఆదివారం నాటి ఆటలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(21)ను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ(9)ని కూడా తానే పెవిలియన్‌కు పంపాడు.ఆ ఇద్దరి సెంచరీలుఈ క్రమంలో బుమ్రా స్ఫూర్తితో యువ పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మార్నస్ లబుషేన్(12) ఆట కట్టించాడు. ఫలితంగా 75 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. దీంతో భారత శిబిరంలో ఉత్సాహం నెలకొంది. అయితే, ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.నాలుగో నంబర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు తోడైన ట్రవిస్ హెడ్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 115 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో తన తొమ్మిదవ సెంచరీ నమోదు చేసిన అనంతరం హెడ్.. కొరకరాని కొయ్యగా మారాడు. ఈ క్రమంలో.. ఫామ్‌లోలేని స్మిత్ సైతం హెడ్ ఇచ్చిన జోష్‌లో శతక్కొట్టేశాడు.బుమ్రా విడగొట్టేశాడుఈ మిడిలార్డర్ బ్యాటర్లను విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. అయితే, మరోసారి బుమ్రానే తన అనుభవాన్ని ఉపయోగించి స్మిత్(101)ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కాసేపటికే ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(5) వికెట్‌ను కూడా బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.అనంతరం.. శతకవీరుడు ట్రవిస్ హెడ్(152)ను కూడా అవుట్ చేశాడు బుమ్రా. దీంతో టీమిండియాలో తిరిగి ఉత్సాహం నిండింది. ఇక హెడ్ రూపంలో ఈ ఇన్నింగ్స్‌లో ఐదో వికెట్ దక్కించుకున్న బుమ్రా. తన కెరీర్లో ఓవరాల్‌గా పన్నెండోసారి(Five Wicket Haul) ఈ ఘనత సాధించాడు.Jasprit Bumrah gets Travis Head to bring up his fifth wicket! #AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/2QGUazarZP— cricket.com.au (@cricketcomau) December 15, 2024అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో అతడికి ఇది తొమ్మిదో ఫైవ్ వికెట్ హాల్. అంతేకాదు.. ఆస్ట్రేలియా గడ్డ మీద నాలుగోసారి బుమ్రా ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ క్రమంలో బుమ్రా రెండు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు.కమిన్స్ సరసన.. భారత తొలి బౌలర్‌గా రికార్డుడబ్ల్యూటీసీలో అత్యధికసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన క్రికెటర్‌గా ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ కొనసాగుతున్నాడు. అతడు ఇప్పటికి తొమ్మిదిసార్లు ఈ ఘనత సాధించాడు. తాజా టెస్టుతో బుమ్రా కూడా కమిన్స్ సరసన చేరాడు. ఈ జాబితాలో సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడ(7), ఆసీస్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్(6), న్యూజిలాండ్ ఫాస్ట్‌బౌలర్ టిమ్ సౌథీ(6) వీరి తర్వాతి స్థానాలో ఉన్నారు.కుంబ్లే రికార్డును సమం చేసిన బుమ్రాఇక ఆస్ట్రేలియా గడ్డపై నాలుగుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్‌గా అనిల్ కుంబ్లే కొనసాగుతున్నాడు. బ్రిస్బేన్ టెస్టుతో బుమ్రా కూడా కుంబ్లే రికార్డును సమం చేశాడు. ఇదిలా ఉంటే.. ఓవరాల్‌గా 23సార్లు కపిల్ దేవ్ ఫైవ్ వికెట్ల హాల్ సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ఆసీస్‌దే పైచేయిబ్రిస్బేన్లో గబ్బా మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా టీమిండియాపై పైచేయి సాధించింది. ఆదివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. హెడ్, స్మిత్ సెంచరీలకు తోడు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(45 నాటౌట్) రాణించడం వల్ల ఇది సాధ్యమైంది. ఇక భారత బౌలర్లలో బుమ్రా ఐదు, నితీశ్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో పెర్త్ టెస్టులో భారత్, అడిలైడ్ పింక్‌బాల్ టెస్టులో ఆసీస్ విజయం సాధించాయి. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
‘రోహిత్ శర్మ నిర్ణయం తప్పు.. కమిన్స్ సంతోషించి ఉంటాడు’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయాన్ని ఇంగ్లండ్ మాజీ సారథి, కామెంటేటర్ మైకేల్ వాన్ విమర్శించాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడాన్ని తప్పుబట్టాడు. రోహిత్ నిర్ణయం ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు సంతోషాన్ని మిగిల్చి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.సిరీస్ 1-1తో సమంగాకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో.. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడుతోంది. ఈ క్రమంలో పెర్త్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో 295 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా శనివారం మూడో టెస్టు మొదలైంది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేయడం సులువవుతుందనేఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. వికెట్‌పై కాస్త పచ్చిక ఉన్నట్లు కనిపిస్తోంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. పిచ్ పరిస్థితులు తమకు అనుకూలిస్తాయని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.మ్యాచ్ సాగుతున్న కొద్దీ బ్యాటింగ్ చేయడం సులువవుతుందనే ఉద్దేశంతోనే బౌలింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ శర్మ తెలిపాడు. ఇక ఆసీస్ సారథి కమిన్స్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. కమిన్స్దీ అదే మాటతాను కూడా టాస్ గెలిచి ఉంటే.. తొలుత బౌలింగ్ ఎంచుకునే వాడినన్నాడు. అయితే, ఈ ఇద్దరు కెప్టెన్ల వ్యాఖ్యలకు విరుద్ధంగా మైకేల్ వాన్ కామెంట్ చేయడం విశేషం.రోహిత్ శర్మ నిర్ణయం తప్పు‘‘రోహిత్ శర్మ నిర్ణయంతో ప్యాట్ కమిన్స్ మనసులో గంతులేస్తూ ఉంటాడు. తాను టాస్ ఓడిపోయినందుకు సంతోషపడి ఉంటాడు. గత చరిత్ర ఆధారంగా అతడు బ్యాటింగే ఎంచుకుని ఉండేవాడు. ఏదేమైనా రోహిత్ తొలుత బౌలింగ్ ఎంచుకుని తప్పుచేశాడు’’ అని మైకేల్ వాన్ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు.కొత్త బంతితో నో మ్యాజిక్!కాగా గబ్బా పిచ్‌పై కొత్త బంతితో భారత పేసర్లు పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయారు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లు కూడా రంగంలోకి దిగారు. బుమ్రా ఆరు ఓవర్ల బౌలింగ్‌లో 8, సిరాజ్ నాలుగు ఓవర్లలో 13, ఆకాశ్ దీప్ 3.2 ఓవర్లలో 2 పరుగులు ఇచ్చారు. ఇక ఆసీస్ ఇన్నింగ్స్ 13.2 ఓవర్ల వద్ద ఉన్న సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. అప్పటికి కంగారూ జట్టు వికెట్ నష్టపోకుండా 28 రన్స్ చేసింది. అయితే, ఆ తర్వాత వర్షం తెరిపినివ్వకపోవడంతో తొలిరోజు ఆటను అంతటితో ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. -
Ind vs Aus 3rd Test: వదలని వర్షం.. ముగిసిపోయిన తొలిరోజు ఆట
Ind vs Aus 3rd Test Day 1 Updates: ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య శనివారం మూడో టెస్టు మొదలైంది. బ్రిస్బేన్లోన గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో తొలిరోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే, వర్షం కారణంగా 13.2 ఓవర్ల తర్వాత ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత కూడా ఎడతెరిపి లేకుండా వాన పడటంతో అంపైర్లు తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారుఆటకు వర్షం ఆటంకంబోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య మొదలైన తొలిరోజు ఆటకు వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను ప్రస్తుతానికి నిలిపివేశారు. ఆసీస్ స్కోరు: 28/0 (13.2). ఖవాజా 19, మెక్‌స్వీనీ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.పది ఓవర్లలో ఆసీస్ స్కోరు: 26-0ఖవాజా 18, మెక్‌స్వీనీ మూడు పరుగులతో ఆడుతున్నారు.ఆరు ఓవర్లలో ఆసీస్ స్కోరుభారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత బౌలింగ్ అటాక్ ప్రారంభించాడు. ఇక రోహిత్ సేన ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 23 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా 17, నాథన్ మెక్‌స్వీనీ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. వాళ్లిద్దరిపై వేటుటాస్ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్ దీప్‌ను తీసుకున్నట్లు తెలిపాడు. ఒక మార్పుతో ఆసీస్మరోవైపు.. ఆస్ట్రేలియా సైతం ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పు చేసింది. గాయం నుంచి కోలుకున్న పేసర్ జోష్ హాజిల్‌వుడ్ తిరిగి రావడంతో.. స్కాట్ బోలాండ్‌పై వేటు పడింది.తుదిజట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.ఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ( వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హాజిల్‌వుడ్. -
అవునా.. నాకైతే తెలియదు: కమిన్స్‌కు ఇచ్చిపడేసిన గిల్
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు టీమిండియా సిద్ధమవుతోంది. బ్రిస్బేన్ వేదికగా ఇరుజట్ల మధ్య శనివారం ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.చెరో గెలుపుతో సమంగాకాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఇందుకు ధీటుగా బదులిచ్చిన కంగారూ జట్టు అడిలైడ్‌లో భారత్‌ను పది వికెట్ల తేడాతో ఓడించింది. ఇక ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో తాము షార్ట్ బాల్స్‌తో టీమిండియాను కట్టడి చేశామని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు.అవునా.. నాకైతే తెలియదే!అడిలైడ్ ఓవల్ మైదానంలో షార్ట్ బాల్ వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి.. టీమిండియా బ్యాటర్ల పనిపట్టామని కమిన్స్ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని శుబ్‌మన్ గిల్ దగ్గర విలేకరులు ప్రస్తావించగా.. ‘‘అవునా.. నాకైతే తెలియదే!.. షార్ట్ బాల్‌తో బహుశా వాళ్లు ఒక టెయిలెండర్‌ను లేదంటే లోయర్ ఆర్డర్ బ్యాటర్‌ను మాత్రమే అవుట్ చేశారు.కానీ.. అతడు ఏ షార్ట్‌బాల్‌ను ఉపయోగించి విజయం సాధించామని చెప్తున్నాడో నాకైతే తెలియదు’’ అంటూ కమిన్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. కాగా గాయం వల్ల పెర్త్ టెస్టుకు దూరమైన గిల్.. అడిలైడ్‌లో పింక్ బాల్ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు.ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా మిచెల్ స్టార్క్ గిల్‌ను బౌల్డ్ చేశాడు. ఇక మూడో టెస్టు జరుగనున్న బ్రిస్బేన్ స్టేడియంతో ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు మధురానుభవం ఉంది.నాడు 91 పరుగులతో చెలరేగిన గిల్2021 నాటి టెస్టులో గిల్ 91 పరుగులు చేసిన గిల్.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈసారి కూడా గతంలో మాదిరి ప్రదర్శనను పునరావృతం చేయాలని పట్టుదలగా ఉన్నాడు. మూడో టెస్టునే ఫైనల్ మ్యాచ్‌గా భావించి బరిలోకి దిగుతామన్న గిల్.. గాబాలో గెలిస్తే.. మెల్బోర్న్, సిడ్నీ టెస్టుల్లో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడగలమని పేర్కొన్నాడు. కాగా మూడో టెస్టు కోసం ఇప్పటికే బ్రిస్బేన్ చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ సెషన్లలో తీవ్రంగా శ్రమించింది.చదవండి: IND vs AUS: మూడో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడు వచ్చేశాడుShots fired already? 👀While @patcummins30 claims Australia have succeeded in their short ball ploy, look what @ShubmanGill has to say about it! 😁😅1️⃣ DAY TO GO for #AUSvINDOnStar 3rd Test 👉 SAT 14 DEC, 5.20 AM onwards! #ToughestRivalry pic.twitter.com/vS55v5Qgwz— Star Sports (@StarSportsIndia) December 13, 2024 -
అదే మా కొంపముంచింది.. మరింత బలంగా తిరిగి వస్తాము: ఆసీస్ కెప్టెన్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆతిథ్య ఆస్ట్రేలియా ఓటమితో ఆరంభించింది. పెర్త్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో ఆసీస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 534 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారు జట్టు భారత బౌలర్ల దాటికి 238 పరుగులకు ఆలౌటైంది.భారత బౌలర్లలో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తలా మూడు వికెట్లతో ఆసీస్‌ను దెబ్బతీశారు. వీరిద్దరితో పాటు నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ తలా ఒక వికెట్ పడగొట్టాడు. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(89) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమికి కారణమని తెలిపాడు.అదే మా కొంపముంచింది"ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ మ్యాచ్ కోసం మేము బాగానే సన్నద్దమయ్యాము. జట్టులోని ప్రతీ ఒక్కరూ పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగారు. కానీ మా ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేకపోయాము. కొన్ని మ్యాచ్‌ల్లో మనం ప్లాన్ చేసింది జరగదు. అటువంటి మ్యాచ్‌ల్లో ఇదొకటి. ఇక ఈ ఓటమి నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాము. తర్వాతి మ్యాచ్‌లో మేము తిరిగిపుంజుకుంటామన్న నమ్మకం ఉంది. ఈ ఓటమి గురించి ఎక్కువగా ఆలోచించకూడదని నిర్ణయించుకున్నాము.ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెడతాము. ఈ మ్యాచ్‌లో మాకు ఏదీ కలిసిరాలేదు. తొలి రోజు బౌలర్లు ఇచ్చిన ఆరంభాన్ని మేము అందిపుచ్చుకోలేకపోయాం. మొదటి రోజు బ్యాటింగ్ పరంగా మేము రాణించి ఉంటే పరిస్థితి మరోవిధంగా ఉండేది. రెండో రోజు నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.ఈ మ్యాచ్‌లో తప్పు ఎక్కడ జరిగిందో చర్చించుకుంటాము. అయితే మా జట్టులో చాలా మంది అనుభవం ఉ న్న ఆటగాళ్లు ఉన్నారు. వారికి బలంగా ఎలా తిరిగి రావాలో బాగా తెలుసు. ఆడిలైడ్ టెస్టు కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తాము. రెండో టెస్టులో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తాం" అని పోస్ట్‌మ్యాచ్ ప్రజేంటేషన్లో కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. -
Ind vs Aus 1st Day 2: అదరగొట్టిన భారత ఓపెనర్లు.. రెండో రోజూ మనదే
Australia vs India, 1st Test Day 2 At Perth Updates: అదరగొట్టిన భారత ఓపెనర్లు.. రెండో రోజు మనదేపెర్త్ టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో కూడా భారత జట్టు అదరగొట్టింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్, రాహుల్ అద్బుతంగా ఆడుతున్నారు. జైశ్వాల్(90), రాహుల్(62) ఆజేయంగా నిలిచారు. ప్రస్తుతం టీమిండియా 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ..టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. జైశ్వాల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను రాహుల్ ముందుకు నడిపిస్తున్నాడు. క్రీజులో జైశ్వాల్(74), కేఎల్ రాహుల్(56) పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు- 145/0 (37.4). 191 పరుగుల లీడ్.యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీఆసీస్తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో మెరిశాడు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో జైస్వాల్‌కు ఇది తొమ్మిదో ఫిఫ్టీ. మరోవైపు రాహుల్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. టీమిండియా స్కోరు- 100/0 (37.4). 146 పరుగుల లీడ్.టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 84/0 (26)జైస్వాల్ 42, రాహుల్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. 26 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా ఆధిక్యం 130 పరుగులు.20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 75-0రాహుల్ 29, జైస్వాల్ 38 పరుగులతో ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ప్రస్తుతం 121 పరుగుల మెరుగైన ఆధిక్యంలో ఉంది.నిలకడగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లుటీమిండియా తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ నిలకడగా ఆడుతున్నారు. శనివారం నాటి రెండో రోజు ఆటలో 12 ఓవర్లు ముగిసే సరికి రాహుల్ 29 బంతులు ఎదుర్కొని ఎనిమిది, జైస్వాల్ 43 బంతులు ఎదుర్కొని 16 పరుగులు చేశారు. భారత్ స్కోరు: 30-0(12).ఆస్ట్రేలియా ఆలౌట్.. స్కోరు ఎంతంటే?టీమిండియాతో తొలి టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఆటగాళ్లలో టెయిలెండర్ మిచెల్ స్టార్క్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం.అయితే, స్టార్క్‌ను అవుట్ చేసేందుకు భారత బౌలర్లు సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు హర్షిత్ రాణా అతడిని పెవిలియన్‌కు పంపడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్లో స్టార్క్‌తో పాటు వాళ్లలో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(21) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు.ఇక టీమిండియా బౌలర్లలో ప్రధాన పేసర్ బుమ్రాకు అత్యధికంగా ఐదు వికెట్లు దక్కగా.. హర్షిత్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 46 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా తొలి రోజు ఆటలో భారత్ 150 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆసీస్హర్షిత్ రాణా బౌలింగ్‌లో నాథన్ లియాన్ థర్డ్ స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆసీస్ తొమ్మిదో వికెట్ కోల్పోగా.. హర్షిత్ ఖాతాలో రెండో వికెట్ జమైంది. జోష్ హాజిల్ వుడ్ క్రీజులోకి వచ్చాడు. స్టార్క్ 11 పరుగులతో ఉన్నాడు. ఆసీస్ స్కోరు: 79/9 (33.3).ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టు రెండో రోజు ఆట ఆరంభంలోనే టీమిండియా అదరగొట్టింది. కెప్టెన్ బుమ్రా బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ(21) అవుటయ్యాడు. పంత్‌కు క్యాచ్ ఇచ్చి అతడు పెవిలియన్ చేరాడు. దీంతో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. నాథన్ లియాన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 70-8(29).రెండో రోజు ఆట ఆరంభంఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట ఆరంభమైంది. శనివారం 67/7 ఓవర్ నైట్ స్కోరుతో ఆసీస్ తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ క్రమంలో ఆసీస్‌తో శుక్రవారం తొలి టెస్టు మొదలుపెట్టింది. పెర్త్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఆదుకున్న నితీశ్ రెడ్డి, పంత్టాపార్డర్ కుదేలైన వేళ మిడిలార్డర్ బ్యాటర్ రిషభ్ పంత్(37), లోయర్ ఆర్డర్లో ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(41) రాణించారు. ఫలితంగా టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ పేసర్లలో హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. స్టార్క్, కెప్టెన్ కమిన్స్, మిచెల్ మార్ష్ రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.తొలి రోజు బుమ్రాకు నాలుగు వికెట్లుఈ క్రమంలో తొలిరోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్‌కు భారత పేసర్లు చుక్కలు చూపించారు. బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ సిరాజ్ రెండు, అరంగేట్ర బౌలర్ హర్షిత్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలు కాగా.. తొలి రోజు ఆట ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి కేవలం 67 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(8), అరంగేట్ర బ్యాటర్ నాథన్ మెక్‌స్వీనీ(10), స్టీవ్ స్మిత్(0), ప్యాట్ కమిన్స్(3) వికెట్లను బుమ్రా పడగొట్టగా.. మార్నస్ లబుషేన్(2), మార్ష్(6)ను సిరాజ్ వెనక్కి పంపాడు. హర్షిత్ రాణా ట్రవిస్ హెడ్‌ను అవుట్ చేసి అంతర్జాతీయ క్రికెట్లో తన వికెట్ల ఖాతా తెరిచాడు.తుదిజట్లుటీమిండియాకేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్.ఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్ స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్.చదవండి: ఇది నా డ్రీమ్ ఇన్నింగ్స్ కాదు.. అతడే నా ఆరాధ్య దైవం: నితీశ్ రెడ్డి -
77 ఏళ్లలో ఇదే తొలిసారి.. అరుదైన రికార్డుతో చరిత్ర పుటల్లోకి కమిన్స్, బుమ్రా!
ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య పెర్త్ టెస్టు సందర్భంగా ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఇరుజట్ల కెప్టెన్లు ప్యాట్ కమిన్స్- జస్ప్రీత్ బుమ్రా కలిసి తమ పేర్లను చరిత్ర పుటల్లో లిఖించుకున్నారు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.రోహిత్ శర్మ దూరంప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో టీమిండియాకు ఈ సిరీస్ ఆఖరిది. ఇక ఇందులో కనీసం నాలుగు టెస్టులు గెలిస్తేనే భారత్ ఈసారీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇంతటి కీలకమైన సిరీస్‌లో తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల దృష్ట్యా దూరంగా ఉన్నాడు.బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా పగ్గాలుఈ క్రమంలో రోహిత్ స్థానంలో భారత జట్టు పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. ఇక పెర్త్ వేదికగా టీమిండియా- ఆసీస్ మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ సమయంలో కెప్టెన్లు బుమ్రా- కమిన్స్ కరచాలనం చేసుకున్న దృశ్యాలు క్రికెట్ ప్రేమికులను ఆకర్షించాయి.77 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారిఈ నేపథ్యంలోనే భారత్- ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో నమోదైన ఓ అరుదైన ఫీట్ వెలుగులోకి వచ్చింది. ఇలా ఇరుజట్లకు ఫాస్ట్‌బౌలర్లే సారథ్యం వహించడం 77 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా 2021 ద్వితీయార్థంలోనే ఫాస్ట్ బౌలర్ కమిన్స్ ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ అయ్యాడు.మరోవైపు.. భారత పేసర్ బుమ్రా గతంలో ఇంగ్లండ్‌లో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించినా.. ఆస్ట్రేలియాలో మాత్రం సారథిగా అతడికి ఇదే తొలి అనుభవం. ఇదిలా ఉంటే.. 1947-48లో భారత్- ఆస్ట్రేలియా మధ్య తొలిసారి టెస్టు సిరీస్ జరిగింది. నాడు వీరి సారథ్యంలోనాడు టీమిండియా ఆసీస్ చేతిలో 4-0తో ఓడిపోయింది. అప్పుడు ఆసీస్ జట్టుకు లెజెండరీ బ్యాటర్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ కెప్టెన్‌గా ఉండగా.. టీమిండియాకు ఆల్‌రౌండర్ లాలా అమర్నాథ్ నాయకుడు.ఇక 1985-86లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ కూడా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఇంత వరకు బుమ్రాలా పూర్తిస్థాయిలో ఓ ఫాస్ట్ బౌలర్ ఆసీస్‌తో టెస్టుల్లో టీమిండియాకు సారథ్యం వహించలేదు.పేలవంగా మొదలుకాగా పెర్త్ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత్‌కు మాత్రం శుభారంభం లభించలేదు. శుక్రవారం నాటి తొలిరోజు ఆట భోజన విరామ సమయానికి 25 ఓవర్లలో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 51 పరుగులు చేసింది.చదవండి: Ind vs Aus: ఆ ఇద్దరు డకౌట్.. కోహ్లి మరోసారి విఫలం.. మండిపడుతున్న ఫ్యాన్స్టాలెంటెడ్ కిడ్.. ఇక్కడ కూడా.. : నితీశ్ రెడ్డిపై కమిన్స్ కామెంట్స్🗣️🗣️ 𝙏𝙝𝙚𝙧𝙚'𝙨 𝙣𝙤 𝙜𝙧𝙚𝙖𝙩𝙚𝙧 𝙝𝙤𝙣𝙤𝙪𝙧 𝙩𝙝𝙖𝙣 𝙩𝙝𝙞𝙨.Captain Jasprit Bumrah is charged 🆙 to lead from the front in Perth ⚡️⚡️#TeamIndia | #AUSvIND | @Jaspritbumrah93 pic.twitter.com/0voNU7p014— BCCI (@BCCI) November 21, 2024 -
టాలెంటెడ్ కిడ్.. కానీ.. : నితీశ్ రెడ్డిపై ప్యాట్ కమిన్స్ కామెంట్స్
టీమిండియా యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసలు కురిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడితో కలిసి ఆడిన జ్ఞాపకాలు మధురమైనవని.. ఆట పట్ల నితీశ్ అంకితభావం అమోఘమని కొనియాడాడు. ఆసీస్ గడ్డపై కూడా అతడు బంతిని స్వింగ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు.ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరుజట్లు ఐదు టెస్టుల్లో తలపడబోతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ గురువారం మీడియాతో మాట్లాడాడు.మాకు ఎంతో కీలకంబోర్డర్- గావస్కర్ ట్రోఫీ తమకు ఎంతో కీలకమైన సిరీస్ అన్న కమిన్స్.. టీమిండియా వంటి పటిష్ట జట్టుతో తలపడటం కఠినమైన సవాలు అని పేర్కొన్నాడు. ఇక సొంతగడ్డపై ఆడటం ఎల్లప్పుడూ ఒత్తిడికి గురిచేస్తుందని.. అయితే, తాము అన్ని రకాలుగా ఈ సిరీస్‌కు సిద్ధమయ్యాం కాబట్టి ఆందోళన చెందడం లేదని తెలిపాడు.టాలెంటెడ్ కిడ్ కానీ..ఈ సందర్భంగా నితీశ్ కుమార్ రెడ్డి ప్రస్తావన రాగా.. ‘‘ఎంతో ప్రతిభావంతుడైన కుర్రాడు. కానీ.. సన్‌రైజర్స్ తరఫున అతడికి పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఏదేమైనా అతడు టాలెంటెడ్ కిడ్. తన ఆట తీరుతో నన్ను ఇంప్రెస్ చేశాడు. ఇక్కడ కూడా బంతిని కాస్త స్వింగ్ చేయగలడనే అనుకుంటున్నా’’ అని కమిన్స్ కితాబులిచ్చాడు.సన్‌రైజర్స్ గెలుపులోకాగా ఐపీఎల్-2024లో కమిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. గత వైఫల్యాలను మరిపించేలా జట్టును ఏకంగా ఫైనల్స్‌కు చేర్చాడు. ఇక కమిన్స్ కెప్టెన్సీలో ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.ఈ ఏడాది రైజర్స్ తరఫున 303 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో ఆస్ట్రేలియాతో టెస్టులకు నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. పెర్త్‌లో అతడు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.చదవండి: పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వాలి.. విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా -
విరాట్, రోహిత్ వేరు.. నా స్టైల్ వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా
ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. తనదైన శైలిలో జట్టును ముందుకు నడిపించి విజయపథంలో నిలుపుతానని పేర్కొన్నాడు. పేసర్లు కెప్టెన్సీలో అత్యుత్తమంగా రాణిస్తారన్న బుమ్రా.. అందుకు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ నిదర్శనమని కొనియాడాడు.ఆ పరాభవాన్ని మోసుకురాలేదుఇక న్యూజిలాండ్ చేతిలో పరాభవాన్ని తాము ఆస్ట్రేలియాకు మోసుకురాలేదని.. ఇక్కడ గెలుపే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతామని బుమ్రా పేర్కొన్నాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పెర్త్ వేదికగా ఈ సిరీస్ మొదలుకానుంది.అయితే, వ్యక్తిగత కారణాల వల్ల టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. ప్రధాన పేసర్ బుమ్రా జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో గురువారం మీడియాతో మాట్లాడిన బుమ్రా కెప్టెన్సీ, మొదటి టెస్టులో తొలి టెస్టు కూర్పు తదితర అంశాల గురించి తన మనసులోని భావాలు వెల్లడించాడు.విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు‘‘కెప్టెన్‌గా పనిచేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం. విరాట్, రోహిత్.. భిన్నమైన కెప్టెన్లు. నాకు కూడా నాదైన ప్రత్యేక శైలి ఉంది. నా స్టైల్లో జట్టును ముందుకు నడిపిస్తా. దీనిని నేను భారంగా భావించను. బాధ్యతలు తీసుకోవడం నాకెంతో ఇష్టమైన పని.ఇంతకు ముందు రోహిత్‌తో కూడా మాట్లాడాను. ఇక్కడ ఎలా జట్టును ముందుకు నడిపించాలో నాకు కాస్త స్పష్టత వచ్చింది. పేసర్లను కెప్టెన్లు చేయాలని నేను తరచూ చెబుతూ ఉంటాను. వ్యూహాత్మకంగా వాళ్లెంతో బెటర్. ప్యాట్ సారథిగా అద్భుతంగా రాణిస్తున్నాడు.ఇదొక కొత్త సంప్రదాయానికి తెరతీస్తుందిగతంలో కపిల్ దేవ్‌తో పాటు చాలా మంది పేసర్లు సూపర్‌గా కెప్టెన్సీ చేశారు. ఇదొక కొత్త సంప్రదాయానికి తెరతీస్తుందని నేను భావిస్తున్నా’’ అని బుమ్రా పేర్కొన్నాడు. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టుల్లో క్లీన్‌స్వీప్ కావడం ప్రస్తావనకు రాగా.. ‘‘మనం గెలిచినపుడు సున్నా నుంచి మొదలుపెడతాం. మరి ఓడినపుడు కూడా అలాగే చేయాలి కదా!న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం. అయితే, అక్కడికీ.. ఇక్కడికీ పిచ్ పరిస్థితులు వేరు. ఫలితాలు కూడా వేరుగా ఉంటాయి’’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. తుదిజట్టు ఖరారైంది.. కానీఇక ఇప్పటికే తాము తొలి టెస్టుకు తుదిజట్టును ఖరారు చేశామని.. శుక్రవారం ఉదయమే ఈ విషయం గురించి అందరికీ తెలుస్తుందంటూ బుమ్రా అభిమానులను ఊరించాడు.చదవండి: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: షెడ్యూల్, టైమింగ్స్, జట్లు, పూర్తి వివరాలు -
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: షెడ్యూల్, టైమింగ్స్, జట్లు, పూర్తి వివరాలు
క్రికెట్ ప్రపంచంలో యాషెస్ సిరీస్ తర్వాత అంతే స్థాయిలో అభిమానులను ఆకట్టుకునే రైవలరీ టెస్టు సిరీస్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ). ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకుంటే.. బీజీటీలో టీమిండియాతో తలపడుతుంది. 1996లో మొదలైన ఈ ప్రతిష్టాత్మక సిరీస్.. నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది.బీజీటీలో మనదే పైచేయి.. కానీఇప్పటి వరకు ఈ సిరీస్‌లో టీమిండియాదే పైచేయి. ఇప్పటికి 16 సార్లు జరిగిన బీజీటీలో భారత్ 10 సార్లు ట్రోఫీ కైవసం చేసుకుంది. ఒక్కసారి డ్రాగా ముగియగా.. ఆస్ట్రేలియా ఐదుసార్లు గెలిచింది. ఇక పెర్త్ వేదికగా నవంబరు 22న మరోసారి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీ సమరానికి తెరలేవనుంది. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తాడు. మరి ఈ ప్రతిష్టాత్మక సిరీస్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ తదితర విశేషాలు గమనిద్దాం.ఓవరాల్‌గా టెస్టుల్లో టీమిండియా- ఆస్ట్రేలియా ముఖాముఖి రికార్డులుఇప్పటి వరకు తలపడిన 107 మ్యాచ్‌లలో ఇండియా 32, ఆస్ట్రేలియా 45 గెలవగా.. 29 డ్రాగా ముగిశాయి.అత్యధిక పరుగుల, వికెట్ల వీరుడు ఎవరంటే?టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ కొనసాగుతున్నాడు. 39 మ్యాచ్‌లలో అతడు 3630 రన్స్ సాధించాడు. ఇక ఈ భారత్- ఆసీస్ టెస్టు పోరులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నాథన్ లయన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు టీమిండియాతో 27 మ్యాచ్‌లు ఆడిన ఈ వెటరన్ స్పిన్నర్ 121 వికెట్లు కూల్చాడు.ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా 2024-25షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం👉తొలి టెస్టు👉పెర్త్ స్టేడియం, పెర్త్👉తేదీలు: నవంబర్ 22-26👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 7:50 గంటలకు ఆరంభం👉రెండో టెస్టు👉ఓవల్ మైదానం, అడిలైడ్(డే, నైట్- పింక్‌బాల్ టెస్టు)👉తేదీలు: డిసెంబరు 6- 10👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు ఆరంభంమూడో టెస్టు👉ది గాబా స్టేడియం, బ్రిస్బేన్👉తేదీలు: డిసెంబరు 14- 18👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5.50 నిమిషాలకు ఆరంభంనాలుగో టెస్టు(బాక్సింగ్ డే టెస్టు)👉మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్👉తేదీలు: డిసెంబరు 26- 30👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ఆరంభంఐదో టెస్టు👉సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ👉తేదీలు: జనవరి 3- 7👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ఆరంభంవార్మప్ మ్యాచ్👉నవంబరు 30- డిసెంబరు 1👉ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ వర్సెస్ ఇండియా-‘ఎ’ మధ్య వార్మప్ మ్యాచ్- మనుకా ఓవల్, కాన్బెర్రా.ఎక్కడ వీక్షించవచ్చు?👉టీవీ బ్రాడ్‌కాస్టర్: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్👉లైవ్ స్ట్రీమింగ్: డిస్నీ+హాట్స్టార్జట్లుఆస్ట్రేలియాతో ఐదు టెస్టులకు టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్,ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.ట్రావెలింగ్ రిజర్వ్స్: ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్టీమిండియాతో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.చదవండి: ఆసీస్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు గుడ్‌న్యూస్?! -
కోహ్లి, పంత్ కాదు.. అతడితోనే మాకు డేంజర్: ఆసీస్ కెప్టెన్
టీమిండియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. గత రెండు పర్యాయాలు తమ సొంత గడ్డపై భారత్ చేతిలో సిరీస్ కోల్పోయిన ఆసీస్.. ఈసారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఇరు జట్ల మధ్య నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బ్రాడ్‌కాస్టర్ నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రాకు తనొక బిగ్ ఫ్యాన్ అని కమ్మిన్స్ తెలిపాడు. కాగా బుమ్రాకు ఇది మూడో బీజీటీ ట్రోఫీ కావడం గమనార్హం. ఒకవేళ తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరమైతే బుమ్రానే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. బుమ్రాకు ఆసీస్ గడ్డపై టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 7 టెస్టులు ఆడిన జస్ప్రీత్.. 32 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు."నేను జస్ప్రీత్ బుమ్రాకు పెద్ద అభిమానిని. అతడొక అద్భుతమైన బౌలర్. ఈ సిరీస్‌లో భారత జట్టుకు అతడు కీలకం కానున్నాడు. ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం కూడా బుమ్రాకు ఉంది. అతడితో మా బ్యాటర్లకు ముంపు పొంచి ఉన్నది" అని కమ్మిన్స్ పేర్కొన్నాడు.ఇదే విషయంపై పాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ.. "పుజారా, రహానే జట్టులో లేకపోవడం మాకు కలిసిస్తోంది. వారిద్దరూ గతంలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. పుజారాకు బౌలింగ్ చేయడం నాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమే. అతడితో పోటీ అంటే నాకు ఎంతో ఇష్టం. కొన్ని సార్లు గెలిచాను. మరి కొన్ని సార్లు అతడు నాపై పైయి చేయి సాధించాడు. అతడు ఎప్పుడూ ఓటమని అంగీకరించడు" అని చెప్పుకొచ్చాడు.చదవండి: రెండు భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి.. మరో 458 పరుగులు చేస్తే! -
Aus Vs Pak: 5 వికెట్లతో చెలరేగిన పాక్ పేసర్.. కుప్పకూలిన ఆసీస్! ఇమ్రాన్ రికార్డు బ్రేక్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో పాకిస్తాన్ బౌలర్లు అదరగొట్టారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి కంగారూ జట్టును కోలుకోని దెబ్బకొట్టారు. పాక్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్ల వికెట్లు తీసి శుభారంభం అందించగా.. మరో ఫాస్ట్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. షాహిన్, రవూఫ్ దెబ్బకు కమిన్స్ బృందం కనీసం 200 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా మెల్బోర్న్ వేదికగా సోమవారం తొలి వన్డే జరుగగా.. ఆతిథ్య ఆసీస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో ఆసీస్- పాక్ మధ్య శుక్రవారం నాటి రెండో వన్డేకు అడిలైడ్ వేదికగా మారింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ నమ్మకాన్ని నిలబెడుతూ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్లు మాథ్యూ షార్ట్(19), జేక్ ఫ్రేజర్ మెగర్క్(13)లను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు పంపాడు.ఐదు కీలక వికెట్లు అతడి సొంతంవన్డౌన్లో వచ్చిన స్టీవ్ స్మిత్(35) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. హస్నైన్ అతడిని అవుట్ చేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హ్యారిస్ రవూఫ్ జోస్ ఇంగ్లిస్(18), మార్నస్ లబుషేన్(6), ఆరోన్ హార్డీ(14), గ్లెన్ మాక్స్వెల్(16), ప్యాట్ కమిన్స్(13) రూపంలో ఐదు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. The man of the moment #AUSvPAK pic.twitter.com/t0UJ3iZJLh— cricket.com.au (@cricketcomau) November 8, 2024 మరోవైపు.. టెయిలెండర్లలో మిచెల్ స్టార్క్(1)ను షాహిన్ అవుట్ చేయగా.. ఆడం జంపా (18) కాసేపు పోరాడగా నసీం షా అతడిని బౌల్డ్ చేసి పని పూర్తి చేశాడు.Vintage Smith 👌#AUSvPAK pic.twitter.com/PWKlbk4NgK— cricket.com.au (@cricketcomau) November 8, 2024 ఈ క్రమంలో 35 ఓవర్లకే ఆస్ట్రేలియా కథ ముగిసింది. కేవలం 163 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక ఆసీస్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేదిస్తుందా? లేదంటే తొలి వన్డే మాదిరి ఈసారీ మ్యాచ్‌ను చేజార్చుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్‌తో రెండో వన్డేలో హ్యారిస్ రవూఫ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. షాహిన్ ఆఫ్రిది మూడు, నసీం షా, మహ్మద్ హస్నైన్ ఒక్కో వికెట్ తీశారు.చరిత్ర సృష్టించిన హ్యారిస్ రవూఫ్.. పాక్ తరఫున తొలి పేసర్గాఆసీస్తో రెండో వన్డేలో ఐదు వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అడిలైడ్‌లో వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన మొట్టమొదటి పాకిస్తాన్ పేసర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాక్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రం, ఇమ్రాన్ ఖాన్ పేరిట ఉన్న రికార్డును రవూఫ్ బద్దలు కొట్టాడు.ఇక అడిలైడ్‌లో అంతకు ముందు స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ వన్డేల్లో ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా ఈ పాక్ తరఫున ఈ ఘనత నమోదు చేసిన మొదటి బౌలర్‌గా కొనసాగుతున్నాడు.అడిలైడ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన పాక్ బౌలర్లుహ్యారిస్ రవూఫ్- 5/29*సక్లెయిన్ ముస్తాక్- 5/29ఇజాజ్ ఫాకిహ్- 4/43ఇమ్రాన్ ఖాన్-3/19షాహిన్ ఆఫ్రిది- 2/24.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..